Bharat
-
ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..
ఇంటిగ్రేటివ్ లైఫ్‌స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో ‘భారత్ డిష్'ని ఆవిష్కరించారు. దీన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ప్రతిష్టాత్మక NXT కాన్క్లేవ్ 2025లో ప్రారంభించారు. ఇది స్వదేశీ ఆహార పదార్థాల ఆరోగ్య ప్రయోజనాలను హైలెట్ చేసేలా లైఫ్‌స్టైల్ నిపుణుడు రూపొందించారు. ఇది భారతదేశ గొప్ప పాకకళ వారసత్వానికి నివాళి. భారతదేశ ఆహార సంస్కృతిలో పాతుకుపోయిన పోషకాహారాలు, వాటి రుచి సమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఈ ‘భారత్ డిష్'. అంతేగాదు రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాన్ని భాగం చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తుందని చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో . దీన్ని అగ్రశ్రేణి చెఫ్‌లచే రూపొందించినట్లు తెలిపారు. మరి ఇంతకీ అందులో ఎలాంటి ఆహార పదార్థాలు, వంటకాలు ఉంటాయంటే..ప్రధాని మోదీ క్రమశిక్షణా జీవనశైలిని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించానని అన్నారు ల్యూక్ కౌటిన్హో. ఇందులో ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే సత్తు, సాంప్రదాయ మఖానా, రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, తాజా శీతాకాలపు ఆకుకూరలు, స్థానికంగా లభించే, కాలానుగుణ పదార్థాలు తదితరాలు ఉంటాయి. అంతేగాదు భారతీయ వంటకాలు సమతుల్యతకు పెద్దపీట వేసేలా కాలనుగుణంగా ఉంటాయని చెబుతున్నారు జీవనశైలి నిపుణుడు. కలిగే లాభాలు..పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తయారు చేస్తారు. ఇవి దీర్ఘాయువుని, ఆరోగ్య ప్రయోజనాలని అందించే పదార్థాలు. ఆరోగ్యకరమైన భోజనాన్ని హైలెట్ చేయడమే గాక, అతిగా తినడం, బరువు సమస్యలకు చెక్‌పెట్టేలా ఉంటుందట. భారతీయ ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా మనసులో భావోద్వేగాలకు కూడా ఔషధమేనట. దీన్ని ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ప్రజలు అనారోగ్య సమస్యలతో పోరాటాన్ని నివారించడమేనట. ఇక ఈ భారత్డిష్ అనేది పూర్వీకులు చేసినట్లు కాలనుగుణంగా ఉండటమేగాక, ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునేలా ప్రోత్సహిస్తుందట.ప్రధాని మోదీ చెప్పినట్లుగా వంట నూనెల వాడకం తగ్గించి, ఏ2 నెయ్యి, కోల్డ్-ప్రెస్డ్ నూనెలు, నట్స్ వంటివి మాత్రమే ఉంటాయట.చివరిగా ఇది శాకాహారులైన, మాంసాహారులైన బరువుని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన వంటకాలే ఉంటాయట ఇందులో.At the NXT Conclave 2025, I had the honor of unveiling The Bharat Dish & Lifestyle Tips, inspired by Hon. Prime Minister Narendra Modi Ji’s disciplined lifestyle and health practices.This is more than just a dish—it’s a celebration of India’s rich culinary wisdom and the power… pic.twitter.com/OR8PzeGV8b— Luke Coutinho (@LukeCoutinho17) March 1, 2025 ఈ మేరకు జీవనశైలి నిపుణుడు ల్యూక్ కౌటిన్హో మాట్లాడుతూ..ప్రపంచ నాయకులు భాగస్వామ్యం అయ్యే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత్ డిష్‌ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. భారతీయ వెల్నెస్ జ్ఞానాన్ని ప్రపంచవేదికపై తీసుకువెళ్లేందుకు ఉపకరించిన అద్భుత అవకాశం అని అన్నారు. ఈ 'భారత్ డిష్' అనేది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించే ఒక ఉద్యమం, ప్రభావంతమైన మార్పుకి నాంది. ఇది ఇక్కడితో ఆగదు. ప్రతి కుటుంబం, పాఠశాలు, ఇతర సంఘాలకు చేరకునేలా చేసే ఒక గొప్ప చొరవ. అంతేగాదు ఆరోగ్య స్ప్రుహతో కూడిన సాధికారతకు మార్గం వేస్తుందని కూడా చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో.#StopObesity | Today, Mr. @LukeCoutinho17, Co-Founder, Luke Coutinho Holistic Healing Systems while visiting an Anganwadi Centre in New Delhi stressed on the importance of tackling obesity to build a healthier India. Highlighting Prime Minister Shri @narendramodi’s vision for a… pic.twitter.com/WgNqoM1pzk— Ministry of Health (@MoHFW_INDIA) February 28, 2025(చదవండి: కశ్మీర్ వివాదాస్పద ఫ్యాషన్ షో: నిర్వహించింది ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్..ఆ డిజైనర్లు ఎవరంటే..?) -
Bangladesh: షేక్ హసీనా మాయం.. భారత్ సహకారం తుడిచివేత
ఢాకా: బంగ్లాదేశ్ ప్రభుత్వం(Government of Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాపై తీవ్ర వివక్ష చూపింది. దేశంలోని పాఠ్యపుస్తకాలలో ఆమె పేరును తొలగించింది. పాఠశాల పాఠ్యపుస్తకాలలో ప్రధాన మార్పులు చేసిన దరిమిలా ఈ వివరాలు వెలుగు చూశాయి. ఇదేవిధంగా పాకిస్తాన్ భారతదేశానికి లొంగిపోతున్నట్లు కనిపించే ఒక చారిత్రక ఫోటోను కూడా పాఠ్యాంశాల నుంచి తొలగించారు.గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పలు అల్లర్ల దరిమిలా షేక్ హసీనా(Sheikh Hasina) బంగ్లాదేశ్ ప్రధానికి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడ ఏర్పడిన నూతన ప్రభుత్వం పాఠశాల పుస్తకాలలో పలు మార్పులు చేసింది. వాటిలో భారతదేశానికి సంబంధించిన వివరాలలో కూడా మార్పులు చేసింది. షేక్ హసీనాకు సంబంధించిన అన్ని చిత్రాలు, అధ్యాయాలను పాఠ్య పుస్తకాల నుంచి పూర్తిగా తొలగించారు. ఇదేవిధంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో భారతదేశం పాత్రను తొలగించనప్పటికీ, నాటి ప్రధాని ఇందిరా గాంధీతో పాటు ముజిబురహ్మాన్ ఉన్న ఫోటోలను తొలగించారు.పుస్తకాల వెనుక కవర్ పేజీపై షేక్ హసీనా విద్యార్థుల కోసం అందించిన సందేశాన్ని తొలగించారు. హసీనాపై తిరుగుబాటు జూలై 2024లో ప్రారంభమైంది. ఈ తిరుగుబాటుకు సంబంధించిన ఫొటోలను నూతన పాఠ్యపుస్తకాల వెనుక కవర్ పేజీపై ముద్రించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ మార్పులను నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్‌బుక్ బోర్డ్ (ఎన్‌సీటీబీ)చేసింది. ఇందుకోసం బంగ్లాదేశ్ విద్యా మంత్రిత్వ శాఖ 57 మందికి పైగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు చెందిన 441 పుస్తకాలలో ఈ విధమైన మార్పులు చేశారు. 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలు ఇప్పటికే ముద్రితమయ్యాయి.డిసెంబర్ 1971లో భారత్, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యింది. దీనిని వివరిస్తూ ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఒక అధ్యాయం ఉంది. దీనిలో ఒక చారిత్రక ఛాయాచిత్రం ఉంది. చిత్రంలో పాకిస్తాన్.. భారత్‌కు లొంగిపోవడాన్ని చూపుతుంది. పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ తమ లొంగుబాటు పత్రాన్ని భారత సైన్యం లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు అందిస్తున్నట్లుంది. అయితే ఈ ఫోటోను ఇప్పుడు పాఠ్య పుస్తకాల నుంచి తొలగించారు.ఆరో తరగతి ఇంగ్లీష్ పుస్తకంలో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, బంగ్లా ప్రధాని ముజిబురాహ్మాన్ సంయుక్తంగా ఉన్న ఫొటోను తొలగించారు. ఈ ఫొటో ఫిబ్రవరి 6, 1972 నాటిది. ఇంతేకాకుండా బంగ్లా జాతీయ జెండా, జాతీయ గీతాన్ని పుస్తకాల మొదటి పేజీ నుండి తొలగించి వెనుక భాగంలో ముద్రించారు. నిపుణుల బృందం పుస్తకాలలో జాతీయ జెండా, గీతం అవసరం లేదని భావించింది. వీటిని పూర్తిగా తొలగించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని విద్యాశాఖాదికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. -
ఏటా రూ.9 లక్షల కోట్ల వస్త్ర ఎగుమతులు
న్యూఢిల్లీ: ఇండియా నుంచి ప్రతిఏటా రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 2030ని డెడ్‌లైన్‌గా విధించింది. అయితే, గడువు కంటే ముందే అనుకున్న లక్ష్యం సాధిస్తామన్న విశ్వాసం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం ‘భారత్ టెక్స్–2025’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వస్త్రాల ఎగుమతిలో ప్రస్తుతం మన దేశంలో ప్రపంచంలో ఆరో స్థానంలో ఉందని తెలిపారు. మనం ప్రతిఏటా రూ.3 లక్షల కోట్ల విలువైన వస్త్రాలు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. దీన్ని మూడు రెట్లు పెంచాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలతో వస్త్ర టెక్స్టైల్ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. మనం ఇలాగే కష్టపడి పనిచేస్తే గడువు కంటే ముందే ఏటా రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేయగలమని స్పస్టంచేశారు. టెక్స్‌టైట్ రంగంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.75 కోట్లు అవసరమని, దీంతో 2,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ రంగంలో అడుగుపెడుతున్న ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పించాలని బ్యాంక్‌లకు సూచించారు. వస్త్ర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 5ఎఫ్ విజన్‌ను ప్రధానమంత్రి ప్రతిపాదించారు. ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. ఈ విజన్‌తో రైతులకు, నేత కార్మికులకు, డిజైనర్లకు, వ్యాపారులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఉద్ఘాటించారు. వస్త్ర పరిశ్రమకు కావాల్సిన నూతన పరికరాల తయారీ కోసం ఐఐటీల వంటి విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని వ్యాపారులకు సూచించారు. భారత్ టెక్స్ ఇప్పుడు అంతర్జాతీయ కార్యక్రమంగా మారిందన్నారు. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. హై–గ్రేడ్ కార్బన్, ఫైబర్ తయారీ దిశగా మన దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. -
ఒక రియల్ హీరోకి రీల్ హీరోకి తేడా.. ఆ రోజు పవన్ కళ్యాణ్ కళ్లారా చూసాడు
-
ఆర్థిక సంక్షోభంలో మాల్దీవులు.. స్పందించిన భారత్
మాల్దీవులు భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా ఉండబోతోంది. మాల్దీవులలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నామని భారత్ తెలిపింది. రుణ సంక్షోభం కారణంగా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది.భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాల్దీవులలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ దేశంలో నెలకొన్న పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. మాల్దీవుల ప్రభుత్వం ఇటీవల భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి కూడా జైస్వాల్ ప్రస్తావించారు. మాల్దీవుల ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత్‌కు ఆదాయ నష్టం జరుగుతున్నదని, ఇది ఆందోళన కలిగించే అంశమని జైస్వాల్ పేర్కొన్నారు.బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)మధ్య జరగనున్న చర్చల గురించి జైస్వాల్ మాట్లాడుతూ పరస్పర అంగీకారంతో కూడిన ఈ ఒప్పందాలను గౌరవించాలని భారత్ భావిస్తున్నదన్నారు. ఫిబ్రవరి 17 నుండి 20 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్- బీజేబీ మధ్య డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇవి సరిహద్దు భద్రతా దళాల మధ్య సయోధ్య పరిస్థితులకు సహకరిస్తాయి. భద్రత, వాణిజ్య మౌలిక సదుపాయాల కల్పనను సులభతరం చేయనున్నాయి.ఇది కూడా చదవండి: నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్ జీవితం మారిందిలా.. -
ఆర్మీ నేపథ్యంలో...
భరత్ చౌదరి, ప్రియాంక నాంది జంటగా జె. మోహన్ కాంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిషన్ 007’. మహంకాళీ పిక్చర్స్ పతాకంపై మహంకాళీ నాగ మహేశ్ నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌లో మోహన్ కాంత్ మాట్లాడుతూ–‘‘యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన చిత్రం ‘మిషన్ 007’. మా నిర్మాత నాగమహేశ్గారికి ఇది తొలి సినిమా. బడ్జెట్ చెప్పిన దానికన్నా ఎక్కువ అయినా ఎక్కడా రాజీ పడలేదు.. అందరికీ నచ్చే మూవీ ఇది’’ అన్నారు. నాగమహేశ్ మాట్లాడుతూ– ‘‘యూనిట్ మొత్తం తమ సొంత సినిమాలా భావించి పనిచేశారు.మా చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. మాకు అన్ని విధాలా సహకరించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని చెప్పారు. ‘‘మోహన్ గారు కథ చెప్పినప్పుడు ఆర్మీ నేపథ్యం అనగానే భయం వేసింది. కానీ, ఆయన నమ్మకం చూసి ధైర్యంగా నటించాను’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘వాణిజ్య అంశాలతో పాటు దేశభక్తి కూడా ఉండటం మా సినిమాకు గర్వకారణం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంక నాంది. -
‘భారత్ మొబిలిటీ ఎక్స్పో’ ప్రారంభం.. కొత్త కార్లు, బైక్‌లతో సందడే సందడి (ఫొటోలు)
-
పెంకుటింటికి భారీగా బిల్లు
సాక్షి, పాడేరు: అల్లూరు జిల్లా పాత పాడేరులో ఓ పేద గిరిజన కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్ కొట్టింది. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటికి ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది. గత నెలలో మైనస్ రూ.1,496 విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ నెలకు కూడా మైనస్ విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు జారీ అయింది. పెంకుటింట్లో కేవలం రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు టేబుల్ ఫ్యాన్ వినియోగిస్తారు. ప్రతి నెల 100 యూనిట్ల లోపే మైనస్ బిల్లు వస్తోంది. కిల్లు బాబూరావు మరణించినా, ఆయన పేరుతోనే విద్యుత్ మీటరు ఉంది. ఆయన కుమారుడు భరత్ ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 113 యూనిట్ల విద్యుత్ వినియోగం చూపి రూ.1,496 మైనస్ బిల్లు ఇచ్చారని, ఈ నెలలో 349 యూనిట్ల రీడింగ్ చూపి, రూ.69,314 బిల్లు ఇవ్వడం అన్యాయమని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల వ్యవధిలోనే పెంకుటింటికి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ పాడేరు ఏడీ మురళీ దృష్టికి ‘సాక్షి’ తీసుకు వెళ్లింది. గతంలో వినియోగదారుడి విద్యుత్ వినియోగాన్ని, మీటరును పరిశీలిస్తామని తెలిపారు. -
బైడెన్ గుడ్ న్యూస్.. ట్రంప్ బ్యాడ్ న్యూస్
-
భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్ వైఖరి?
న్యూఢిల్లీ: ఒకప్పుడు భారత్‌తో మంచి మిత్రత్వం కలిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కు బద్ధ శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణచూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం మొదలుపెట్టింది.మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టాక..బంగ్లాదేశ్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ఆ దేశం ఛాందసవాద మార్గంలో ప్రయాణిస్తోంది. అక్కడి ముస్లింలు ఇప్పుడు భారతీయులతో స్నేహ భావాన్ని మరిచిపోయారు. హిందువులపై నిరంతరం దాడులకు పాల్పడుతున్నారు. హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు. విగ్రహాలను తగులబెడుతున్నారు. ఇంతేకాదు హిందువులను నరికివేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు.హిందువులకు బెదిరింపులుబంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆలయాన్ని, భక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. హిందువులను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఒక ఛాందసవాదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఇస్కాన్‌పై నిషేధం విధించాలని ఆ వీడియోలో బహిరంగంగా డిమాండ్ చేశాడు. ప్రభుత్వం అలా చేయని పక్షంలో హింసాత్మక దాడులకు దిగుతామని బెదించాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ మాట్లాడుతూ ఈ ప్రసంగం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, బంగ్లాదేశ్ అంతటా ఈ తరహా విద్వేషాలే చెలరేగుతున్నాయన్నారు. ఇలాంటివారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఢాకా వీధుల్లో ప్రదర్శనబంగ్లాదేశ్లోని ముస్లింలు తాజాగా ఢాకా వీధుల్లో భారత్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల రక్షణలో ఆందోళనకారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు చెందిన మిలిటెంట్లు ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శించారు. అక్కడి భారత పౌరులను చంపేస్తామంటూ నినదించారు. ఈ నేపధ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బీటింగ్ రిట్రీట్ను నిలిపివేశారు.పరాకాష్టకు మత అసహనంబంగ్లాదేశ్లోని ఛాందసవాదులు ఇస్కాన్ దేవాలయాలను ఒకదాని తర్వాత ఒకటిగా కూల్చివేసి, విగ్రహాలను దహనం చేస్తున్నారు. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ సెంటర్‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ మత అసహన ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ ప్రతిష్టను ప్రభావితం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ డిసెంబరు 9న ఢాకాలో పర్యటిస్తారని తెలిపారు.పాక్‌కు చేరువవుతున్న బంగ్లాదేశ్ ఒకవైపు భారత్- బంగ్లాదేశ్ మధ్య పరస్పరం సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పాకిస్తాన్- బంగ్లాదేశ్‌లు ఇరు దేశాల పౌరులకు వీసా నిబంధనలలో వివిధ సడలింపులను ఇచ్చాయి. అలాగే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా, కరాచీ నుండి ఒక కార్గో షిప్ గత నెలలో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య తొలిసారిగా సముద్ర రవాణా సంబంధాల ఏర్పడ్దాయి. వచ్చే ఏడాది నుంచి ఇస్లామాబాద్- ఢాకా మధ్య ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రారంభమవుతుందని బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ సమయ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.క్షీణించిన భారత్- బంగ్లా సంబంధాలుషేక్ హసీనాను అధికారం నుండి తొలగించి, మొహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని హిందువులతో సహా ఇతర మైనారిటీల భద్రతపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ ఆందోళనలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. భారతదేశంతో బంగ్లాదేశ్‌కు సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చి చదువుకుంటుంటారు. గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశానికి వచ్చేందుకు సులభంగా వీసా పొందేవారు. అయితే గత ఆగస్టు నుండి బంగ్లాదేశ్‌లో వీసా విషయంలో నిబంధనలు పెరిగాయి.ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు -
లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ
సాక్షి, సిటీబ్యూరో: గుడ్ మార్నింగ్ లండన్.. మీరు వింటున్నారు 98.8 స్పైస్ ఎఫ్ఎం.. అంటూ ఓ గొంతు ఉదయమే అందరినీ పలకరిస్తుంటుంది. గొప్ప వ్యక్తుల జీవితాలను పరిచయం చేస్తూ స్ఫూర్తిని నింపుతుంది. ప్రపంచ దేశాల్లోని శ్రోతలకు ఆ గొంతు ఒక వ్యసనం.. ఆ గొంతు విననిదే చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఎందుకు చెప్పుకోవడమంటే ఆ గొంతు మన తెలుగు అబ్బాయిది కాబట్టి.. అదీ మన హైదరాబాదీ గొంతు కాబట్టి. ఆ గొంతుక పేరే భరత్ కల్యాణ్. ఉప్పల్‌కు చెందిన భరత్ పేరు యూకే, యూఎస్, కెనడా, భారత్‌తో పాటు అనేక దేశాల్లో రేడియో శ్రోతలకు వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. వారం మొత్తం జాబ్ చేసుకుని.. వారాంతాల్లో ఫ్రెండ్స్‌తో జాలీగా ఎంజాయ్ చేయకుండా.. శనివారం అక్కడి స్పైస్ ఎఫ్ఎంలో ది కల్యాణ్ క్రానికల్స్ విత్ భరత్ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మందికి చేరువయ్యాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లి.. అందరు యువకుల్లాగే విదేశాలకు వెళ్లి ఎంఎస్ చేయాలనేది తన కోరిక. ఎలాగోలా యూకేలోని న్యూక్యాసిల్ వెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్‌గా మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే ప్రజలతో మమేకం కావడమంటే చిన్నప్పటి నుంచి మనోడికి ఇష్టం. ఉద్యోగరీత్యా అది సాధ్యం కాదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఓ ఆన్లైన్ ఎఫ్ఎం స్టేషన్లో రేడియో జాకీ ఉద్యోగం ఉందని ప్రకటన చూసి దరఖాస్తు చేసుకోవడం.. మనోడి స్కిల్స్ చూసి సెలెక్ట్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో సక్సెస్ అయిన వారి జీవిత విశేషాలు, సక్సెస్ జర్నీని శ్రోతలకు పరిచయం చేస్తూ స్ఫూర్తి నింపుతున్నాడు. అలా మన తెలుగు వారిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. 2014 యూపీఎస్సీ టాపర్ ఇరా సింఘాల్ ఇంటర్వ్యూ ఎంతో ఇష్టమని భరత్ చెప్పాడు. గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు పది మందితో పంచుకుంటుంటే.. ఎంతో మంది తనకు ఫోన్ చేసి మెచ్చుకుంటుంటే ఆ తృప్తే వేరని పేర్కొంటున్నాడు. ఇక, తాను పనిచేసే ఎఫ్ఎం దక్షిణాసియా దేశాలకు చెందిన వారు నడుపుతున్నారని, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఎంతో సోదరభావంతో పనిచేస్తుంటామని, ఎలాంటి బేధాలు లేకుండా చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుందని వివరించాడు. -
ప్రభుత్వ విప్ గణబాబుకు అవమానం
సాక్షి,విశాఖపట్నం : ప్రభుత్వ విప్ గణబాబుకు అవమానం జరిగింది. ప్రధాని మోదీ పర్యటన రివ్యూ మీటింగ్‌లో గణబాబుకు గౌరవం దక్కలేదు. గణబాబుకు బదులుగా మంత్రి నారా లోకేష్ తొడల్లుడు ఎంపీ భరత్‌కు అందలం ఎక్కించారు. విప్ గణబాబు కుర్చీలో ఎంపీ భరత్‌కు అవకాశం కల్పించారు. సాధారణ ఎమ్మెల్యేలా గణబాబును అధికారులు ట్రీట్ చేశారు. దీంతో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గణబాబు అసహనం వ్యక్తం చేశారు. -
భరత్, విహారి పోరాడినా...
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు నాలుగో మ్యాచ్‌లోనూ అది దక్కలేదు. ఊరించే లక్ష్య ఛేదనలో మిడిలార్డర్ రాణించినా... కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బ కొట్టింది. మొత్తానికి పరాజయాల హ్యాట్రిక్ అనంతరం తాజా సీజన్లో ఆంధ్ర జట్టు ఓటమినుంచి తప్పించుకుంటూ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. 321 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 8/1తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు... చివరకు 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (90 బంతుల్లో 92; 12 ఫోర్లు, ఒక సిక్సర్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా... హనుమ విహారి (189 బంతుల్లో 66; 6 ఫోర్లు, ఒక సిక్సర్), కరణ్ షిండే (171 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. ఓపెనర్లు అభిషేక్ రెడ్డి (6), మారంరెడ్డి హేమంత్ రెడ్డి (2) త్వరగానే ఔటవడంతో ఆంధ్ర జట్టుకు మరో ఓటమి తప్పదనిపించినా... కెపె్టన్ షేక్ రషీద్ (31; 4 ఫోర్లు) కాసేపు పోరాడాడు. అతడు వెనుదిరిగిన తర్వాత కరణ్ షిండే , హనుమవిహారి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. విహారి అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆలరించగా.. శ్రీకర్ భరత్ ఎడాపెడా బౌండ్రీలతో మైదానాన్ని హోరెత్తించాడు. అతడున్నంతసేపు ఆంధ్ర జట్టు విజయం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా... అతడు పెవిలియన్ చేరడంతో ఆంధ్ర జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ ధాపోలా 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఉత్తరాఖండ్ ఓపెనర్ ప్రియాన్షు ఖండూరికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ 338; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 146; ఉత్తరాఖండ్ రెండో ఇన్నింగ్స్ 128/9 డిక్లేర్డ్; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (బి) దీపక్ ధాపోలా 6; హేమంత్ రెడ్డి (ఎల్బీ) (బి) దీపక్ ధాపోలా 2; షేక్ రషీద్ (ఎల్బీ) (బి) దీపక్ ధాపోలా 31; కరణ్ షిండే (సి) అవనీశ్ సుధ (బి) దీపక్ ధాపోలా 65; హనుమ విహారి (బి) దీపక్ ధాపోలా 66; శ్రీకర్ భరత్ (సి) ఆదిత్య తారె (బి) దేవేంద్ర సింగ్ బోరా 92; శశికాంత్ (నాటౌట్) 7; విజయ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 16, మొత్తం (93 ఓవర్లలో 6 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–56, 4–140, 5–276, 6–282, బౌలింగ్: దీపక్ ధాపోలా 21–3–75–5, మయాంక్ మిశ్రా 16–5–34–0; స్వప్నిల్ సింగ్ 19–3–52–0, అభయ్ నేగీ 17–4–57–0, దేవేంద్ర సింగ్ బోరా 14–2–46–1, అవనీశ్ సుధ 5–1–6–0, రవికుమార్ సమర్థ్ 1–0–1–0. -
పెరిగిన డాలర్ విలువ: ఆసియా దేశాలపై ఎఫెక్ట్!
యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తరువాత అమెరికా డాలర్ విలువ పెరుగుదల దిశగా పయనిస్తోంది.. గ్లోబల్ కరెన్సీలు పతనమవుతున్నాయి. ఈ ప్రభావం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల మీద ప్రభావం చూపుతోంది. అనేక ఆసియా దేశాలు ఈ ప్రభావానికి తీవ్రంగా లోనైనప్పటికీ.. భారతదేశం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని తెలుస్తోంది.గత దశాబ్ద కాలంలో.. భారత్ వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. ఇతర ఆసియా దేశాలతో పాటు చైనా ఆర్ధిక వ్యవస్థ మందగిస్తే.. ఆ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్ మీద కూడా పడుతుంది. రూపాయి విలువ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. దీనిని నిపుణులు 'ఎఫ్ఎక్స్ యుద్ధం' అని సంబోధించారు.గ్లోబల్ కరెన్సీ విలువల తగ్గుదల అనేది.. రాబోయే సంవత్సరాల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ (FX) మార్కెట్లలో ప్రపంచ అస్థిరతను రేకెత్తించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ డాలర్ బలపడటం అనేది ప్రపంచ కరెన్సీ మార్కెట్లో సవాళ్లను పెంచుతుందని చెబుతున్నారు.డాలర్ పెరుగుదలకు కారణం కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. సెప్టెంబరులో బేసిస్ పాయింట్ రేటు తగ్గింపుకు సంబంధించిన ఫెడ్ వ్యూహాత్మక పునరాలోచన అని కూడా తెలుస్తోంది. డాలర్ విలువ పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు కూడా దీనివైపు ఆకర్షితులవుతున్నారు.ట్రంప్ విజయం డాలర్‌కు అందించిన స్వల్పకాలిక మద్దతు మాత్రమే. కానీ ప్రపంచ కరెన్సీ మార్కెట్ సంక్లిష్టమైన స్థితిలో ఉంది. ముఖ్యంగా ఆసియా అంతటా.. చైనాతో సహా ఆర్థిక ఒత్తిళ్లకు గురవుతున్నాయి. ఎఫ్ఎక్స్ యుద్ధం తీవ్రతరం కావడం వల్ల వచ్చే నష్టాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రవిభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
కశ్మీర్‌పై మళ్లీ విషం చిమ్మిన పాక్.. తిప్పికొట్టిన భారత్
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో మరోమారు కశ్మీర్ అంశంపై విషం చిమ్మింది. ఈ నేపధ్యంలో కశ్మీర్ విషయంలో పాక్ ఐక్యరాజ్యసమితిలో అసత్యాలను ప్రచారం చేస్తూ, ఈ ప్రపంచ వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ ఆరోపించింది.అబద్ధాలు ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్యసమితి వేదికను పాక్ ఉపయోగించుకుంటోందని భారత్ పొరుగుదేశం పాక్‌పై దుమ్మెత్తి పోసింది. పాక్ ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగించినా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మారబోవని భారత్ పేర్కొంది. సమాచార సంబంధిత ప్రశ్నలపై యూఎన్ జనరల్ అసెంబ్లీకి చెందిన నాల్గవ కమిటీ సాధారణ చర్చలో రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా ప్రసంగించారు. ఒక పాకిస్తానీ ప్రతినిధి బృందం మరోసారి అబద్ధాలను వ్యాప్తి చేయడానికి ఈ ప్రతిష్టాత్మక వేదికను ఉపయోగించుకున్నదని ఆయన ఆరోపించారు.దుష్ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం ఈ ప్రతినిధి బృందానికి అలవాటైందని రాజీవ్ శుక్లా ఆరోపించారు. ఐక్యారాజ్య సమితిలో పాకిస్తాన్.. జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దరిమిలా శుక్లా పాక్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. పాక్ ఎన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చినా వాస్తవాలు మారవన్నారు. ఈ ఫోరమ్ (పాక్) రాజకీయ ఎజెండా కోసం కాకుండా నిర్మాణాత్మకంగా చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా, విశ్వసనీయ సమాచారం అందిస్తూ ప్రజలను సాధికారతపరచడానికి భారత్ కృషి చేస్తున్నదన్నారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో నిరసనలు -
అమెరికా ‘ఫలితాలు’ ఎలా ఉన్నా భారత్‌తో వీడని బంధం
కాన్బెర్రా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా అధ్యక్షపీఠం అధిరోహించిన ఐదుగురు అధ్యక్షుల పాలనాకాలంలో భారత్.. అమెరికాతో సంబంధాల విషయంలో స్థిరమైన పురోగతిని చూసిందని అన్నారు.ప్రస్తుత అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ యుఎస్ఏతో భారత్ సంబంధాలు బలంగా ఉంటాయని జైశంకర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో భారత విదేశాంగ మంత్రి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీవాంగ్లో సంయుక్త విలేకరుల సమావేశంలో జైశంకర్ ఒక ప్రశ్నకు ప్రతిస్పందనగా యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్‌తో సహా క్వాడ్ దేశాలతో భారత్ సంబంధాలు బలంగా ఉంటాయన్నారు.రిపబ్లికన్ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలవడంపై ఏమైనా ఆందోళన ఉందా? దీనికారణంగా క్వాడ్‌పై ఏ మేరకు ప్రభావం ఉండబోతుందని విలేకరులు అడగగా జైశంకర్ సమాధానమిస్తూ గత ఐదుగురు అధ్యక్షుల పదవీకాలంలో యూఎస్‌తో భారత్ సంబంధాలలో స్థిరమైన పురోగతిని చూశాం. దీనిలో డోనల్ట్ ట్రంప్ అధ్యక్షుని పదవీకాలం కూడా ఉన్నదన్నారు. అందుకే అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా భారత్‌తో సంబంధాలు బలంగా ఉంటాయని నమ్ముతున్నామన్నారు.ఇక క్వాడ్ విషయానికొస్తే 2017లో ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు క్వాడ్ పునరుద్ధరణ జరిగిందన్నారు. అప్పుడు అది శాశ్వత కార్యదర్శి స్థాయి నుండి మంత్రి స్థాయికి బదిలీ అయ్యిందన్నారు. యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలు 2017లో ఇండో-పసిఫిక్ భూ భాగంలో చైనా దూకుడును ఎదుర్కొనేందుకు ప్రణాళికను రూపొందించాయన్నారు. ఇది కూడా చదవండి: డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు..! -
రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్
అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు.. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రెండవ దశ భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించింది. ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయాలు జరగనున్నాయి.భారత్ బ్రాండ్ కింద కేజీ గోధుమ పిండి ధర రూ. 30 కాగా.. బియ్యం రూ. 34వద్ద అందుబాటులో ఉన్నాయి. గతంలో గోధుమ పిండిని రూ. 27.5కు, బియ్యాన్ని రూ. 29కే విక్రయించారు. అయితే ఇప్పుడు ఈ ధరలు కొంత పెరిగాయి. అయితే ప్రభుత్వం లక్ష్యం వ్యాపారం కాదని, మార్కెట్ ధరల కంటే తక్కువకు అందించడమే అని, ఫేజ్-2 ప్రారంభించిన సమయంలో కేంద్ర మంత్రి 'ప్రహ్లాద్ జోషి' తెలిపారు.గోధుమ పిండి, బియ్యం రెండూ కూడా 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో లభిస్తాయి. తక్కువ ధరకే గోధుమ పిండి, బియ్యాన్ని సరఫరా చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి 3.69 లక్షల టన్నుల గోధుమ, 2.91 లక్షల బియ్యాన్ని సేకరించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ స్టాక్ ఉన్నంత వరకు విక్రయాలు జరుగుతాయి, అవసరమైతే ఇంకా ఎక్కువ కేటాయిస్తామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలుప్రజలు కోరుకుంటే గోధుమ పిండి, బియ్యాన్ని మరింత చిన్న ప్యాకెట్ల రూపంలో కూడా అందించడానికి సిద్ధమని ప్రహ్లాద్ జోషి అన్నారు. మునుపటి దశలో కేంద్రం.. 15.20 లక్షల టన్నుల గోధుమ పిండిని, 14.58 లక్షల టన్నుల బియ్యం (అక్టోబర్ 2023 నుంచి జూన్ 30, 2024 వరకు) పంపిణీ చేసినట్లు సమాచారం.A Step Towards Food Affordability: Bharat Atta & Bharat Rice at Subsidized RatesDelighted to launch Phase II of 'Bharat Atta' & 'Bharat Rice' sales from Krishi Bhawan, New Delhi today.This latest initiative by the @narendramodi Govt aims to support consumers by providing… pic.twitter.com/iaQpUfnjjA— Pralhad Joshi (@JoshiPralhad) November 5, 2024 -
ఇప్పటికీ పాకిస్తాన్ నుంచే రాక్ సాల్ట్ దిగుమతి.. ఎందుకో తెలుసా?
మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఒక్క రోజు ముందు పాకిస్తాన్ ఏర్పడింది. అప్పటి వరకు ఇండియాలో భాగమైన పాకిస్తాన్.. ఆ తరువాత భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న అనేక ఉగ్రవాద సంస్థలకు మద్దతు పలికింది. అనేక యుద్దాలు తరువాత కూడా రెండు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగింది. 2019లో ఈ దిగుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ.. రాక్ సాల్ట్ కోసం భారత్ పాకిస్తాన్ మీదనే ఆధారపడాల్సి వస్తోంది.భారతదేశంలో హిందూ మతపరమైన వేడుకలకు కావలసిన రాతి ఉప్పును పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ రాతి ఉప్పునే.. రాక్ సాల్ట్, సంధవ్ సాల్ట్, లాహోరీ సాల్ట్, పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. సముద్రపు లేదా సరస్సులలోని ఉప్పునీరు ఆవిరై సోడియం క్లోరైడ్‌గా మారినప్పుడు రాక్ సాల్ట్ ఏర్పడింది. పాకిస్తాన్లో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఖేవ్రా ఉప్పు గని.. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉప్పు గనిగా పేరుగాంచింది. ఇక్కడ ప్రతి ఏటా సుమారు 4,50,000 టన్నుల రాక్ సాల్ట్ ఉత్పత్తి అవుతుందని సమాచారం. ప్రస్తుతం భారత్ 99.7 శాతం రాక్ సాల్ట్‌ను పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. మిగిలిన 0.3 శాతం ఇరాన్, మలేషియా, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..రాక్ సాల్ట్ ధర పాకిస్తాన్లో రూ. 2 నుంచి రూ. 3 మాత్రమే. కానీ భారతదేశంలో దీని ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్యలో ఉంది. ఇక్కడ చాలామంది ఈ ఉప్పును వాడుతున్నారు. ఈ కారణంగానే దీని ధర సాధారణ సాల్ట్ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది.రాక్ సాల్ట్ వల్ల ప్రయోజనాలురాక్ సాల్ట్ పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఎలక్ట్రోలైట్స్ వంటివి ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఉపవాసం సమయాన్ని బీపీని కంట్రోల్ చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా రాక్ సాల్ట్ ఉపయోగపడుతుంది. ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా అందం కోసం కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తారు. -
Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి
హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా రాబిన్ ఊతప్ప సేనకు ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది.కాగా 1992లో మొదటిసారిగా హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీ నిర్వహించగా.. 2017 వరకు కొనసాగింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల 2023 వరకు బ్రేక్ పడగా.. ఈ ఏడాది తిరిగి మళ్లీ మొదలైంది. ఇండియా, సౌతాఫ్రికా, ఆతిథ్య హాంగ్‌కాంగ్, న్యూజిలాండ్, నేపాల్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్ తదితర 12 జట్లు ఈసారి పోటీలో దిగాయి.భారత బ్యాటర్ల విధ్వంసంఈ క్రమంలో శుక్రవారం టోర్నీ ఆరంభం కాగా.. ఇండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలోని భారత జట్టు.. నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ ఊతప్పతో పాటు.. భరత్ చిప్లీ రాణించాడు. ఊతప్ప ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేయగా.. భరత్ చిప్లీ 16 బంతుల్లోనే 53 రన్స్ చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నందున నిబంధనల ప్రకారం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.తప్పని ఓటమిఅయితే, టీమిండియా విధించిన లక్ష్యాన్ని పాకిస్తాన్ సులువుగానే ఛేదించింది. ఆసిఫ్ అలీ 14 బంతుల్లో 55 పరుగులు చేయగా.. మహ్మద్ అఖ్లాక్ 12 బంతుల్లోనే 40 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరికి తోడుగా కెప్టెన్ ఫహిమ్ ఆష్రఫ్ 5 బంతుల్లోనే 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఎక్స్ట్రా రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ భారత జట్టుపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.భారత్: రాబిన్ ఊతప్ప (కెప్టెన్), కేదార్ జాదవ్, మనోజ్ తివారీ, స్టువర్ట్ బిన్నీ, శ్రీవత్స్ గోస్వామి, భరత్ చిప్లీ, షాబాజ్ నదీమ్.పాకిస్తాన్:ఫహీమ్ అష్రఫ్ (కెప్టెన్), మహ్మద్ అఖ్లాక్, ఆసిఫ్ అలీ, డానిష్ అజీజ్, హుస్సేన్ తలాత్, అమీర్ యామిన్, షహబ్ ఖాన్.స్కోర్లు: భారత్- 119/2పాకిస్తాన్- 121/0ఫలితం: భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో పాక్ విజయం Bharat Chipli chipped in with a cracking 53 off 16 before he had to retire out according to the #HongKongSixes rules. 💪#HongKongSixesonFanCode #ItsRainingSixes pic.twitter.com/IlePJhuPbP— FanCode (@FanCode) November 1, 2024Simply Sublime by Robin Uthappa 🤌Captain Robin got Team India off to a flying start, scoring 31 off 8 balls!#HongKongSixesonFanCode #ItsRainingSixes pic.twitter.com/BZVA5KUuP5— FanCode (@FanCode) November 1, 2024 -
అంతర్జాతీయంగా ‘భారత్ బ్రాండ్’కు గుర్తింపు
న్యూఢిల్లీ: ‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్‌తో అంతర్జాతీయంగా భారత్ బ్రాండ్‌కు ప్రచారం తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒక పథకం ప్రకటించే అవకాశం ఉందని, దీనిపై అత్యున్నత స్థాయి కమిటీ పనిచేస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. మేడ్ ఇన్ జపాన్, స్విట్జర్లాండ్ మాదిరే మేడ్ ఇన్ ఇండియాకు బలమైన బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలన్నది ఇందులోని ఉద్దేశమ్యని తెలిపారు. ‘‘స్విట్జర్లాండ్ గురించి చెప్పగానే వాచీలు, చాక్లెట్లు, బ్యాంకింగ్ రంగం గుర్తుకొస్తుంది. ఇదే మాదిరిగా మనం ఏమి చేయగలం అన్న దానిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మనకు మెరుగైన సామర్థ్యాలు కలిగిన టెక్స్టైల్స్ తదితర కొన్ని రంగాలకే ఈ పథకాన్ని పరిమితం చేయాలా? తదతర అంశాలపై దృష్టి సారించాం’’అని ఆ అధికారి తెలిపారు. భారత్ బ్రాండ్‌కు ప్రచారం కల్పించే విషయంలో నాణ్యత కీలక అంశంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలో ‘ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్’ (ఐబీఈఎఫ్) ఈ దిశగానే పనిచేస్తోంది. భారత ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయంగా అవగాహన, ప్రచారం కల్పించడం కోసం కృషి చేస్తుండడం గమనార్హం. ఇప్పుడు భారత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చే లక్ష్యంతో పథకంపై సమాలోచనలు చేస్తోంది. నాణ్యతే ప్రామాణికంగా ఉండాలి.. ‘‘భారత బ్రాండ్ బలోపేతానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. నాణ్యతలో నిలకడ, మన్నిక ప్రాధాన్యంగా ఉండాలి. ఉదాహరణకు అధిక నాణ్యతతో కూడిన జనరిక్ ఔషధాల తయారీతో భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అంతర్జాతీయంగా మంచి నమ్మకాన్ని గెలుచుకుంది’’అని స్వతంత్ర పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) పేర్కొంది. భారత్ ప్రతిష్ట కాపాడుకునేందుకు నాణ్యతలేని ఉత్పత్తుల సరఫరాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. -
సమాఖ్యకు ‘జమిలి’ సవాళ్లు!
జమిలి ఎన్నికల వల్ల దేశానికీ, ప్రజాస్వామ్యానికీ ఎంతవరకు ఉపయుక్తం అనే దానిపై చర్చ జరుగుతోంది. లోక్‌సభ నుంచి అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు అనుకూలంగా ఎన్ని వాదనలున్నాయో, వ్యతిరేకంగా అన్ని వాదనలున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికల ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది. కానీ అలా పొదుపు చేసే మొత్తం భారత్ లాంటి పెద్ద దేశానికి ఒక లెక్కలోకే వస్తుందా? అలాంటి ఎన్నికల వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించదా? బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు.నాకు తెలిసిన చాలామంది లాగే మీరు కూడా ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ను అర్థం చేసుకోవటానికి తన్నుకులాడుతుంటే కనుక మీకు సహాయం చేయటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే భావనను ప్రతిపాదించినవారు, దానిని వ్యతిరేకిస్తున్నవారు తమ అనుకూల, ప్రతికూల వాదనలతో మనల్ని ముంచెత్తారు. కానీ లాభ నష్టాల నడుమ దీనిపై మనమెలా ఒక తీర్పుకు రాగలం? ఈ వాదోపవాదాలన్నీ సముచితమైనవేనా? లేదా కొన్ని మాత్రమే మిగతా వాటి కంటే ప్రాముఖ్యమైనవా? ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే ఈ భావనకు మద్దతు లభించటానికి గల కారణాలతో విషయాన్ని ప్రారంభిద్దాం. మొదటిది – డబ్బు ఖర్చు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికలకు అయ్యే ఖర్చు కంటే తక్కువగా ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే అలా పొదుపు చేసే మొత్తం ఏడాదికి రూ. 5000 కోట్ల కన్నా తక్కువేనన్నది శశి థరూర్, ప్రవీణ్ చక్రవర్తిల వాదన. ఇండియా వంటి భారీ ఆర్థిక వ్యవస్థకు ఇదేమంత తేడా చూపే మొత్తం అవుతుందని?రెండవ కారణం – ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆంక్షలు పరిమిత కాలానికి మాత్రమే వర్తింపులో ఉంటాయి కనుక రాజకీయ నాయకులు తమను తాము పాలనా వ్యవహారాలలో నిమగ్నం చేసు కోవచ్చు. అయితే ప్రవర్తనా నియమావళి అన్నది జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే అమలులో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అదొక పెద్ద విషయమే అవదు. మళ్లీ ప్రశ్న, ఇదేమంత ముఖ్యమైన కారణం అవుతుందని?నిజమేమిటంటే, పై రెండూ కూడా చెప్పుకోదగిన కారణాలు కావు. ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన వ్యక్తీకరణ... ఎన్నికలు. వాటి నిర్వహణకు అయ్యే వ్యయాన్ని బట్టి, లేదా అవి సజావుగా జరిగేందుకు అవసరమైన నియమావళిని బట్టి ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని లాభనష్టాలను చర్చించకూడదు. ఇప్పుడు మనం వ్యతిరేక వాదనల్లోకి వద్దాం. మొదటిది – ఇది మన దేశ విలక్షణతకు విరుద్ధం అవుతుందా? మనది ఒకే దేశం–ఒకే మతం కాదు. ఒకే దేశం–ఒకే భాష కాదు. ఒకే దేశం–ఒకే సంస్కృతి కాదు. ఒకే దేశం–ఒకే విధమైన మరేదీ కాదు. మన వ్యత్యాసాలనే మన సంపదలుగా మలుచుకున్న రాష్ట్రాల సమాఖ్య మన దేశం. ఆ వ్యత్యాసాలు, సంపదలే మనల్ని ప్రత్యేకంగా ఉంచుతాయి. మనకు ప్రాముఖ్యం కల్పిస్తాయి. మరి ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ప్రత్యేకతలు, ప్రాముఖ్యాల నుంచి మన దేశాన్ని దూరం చేయదా? దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. రెండవది – ఒకే దేశం–ఒకే ఎన్నిక వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించే ప్రమాదంఉంటుందా? అలా జరిగితే – జరుగుతుందనే నా అనుమానం – అది దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఏకీకృత వ్యవస్థగా మార్చే ధోరణి కలిగి ఉండదా? వెంటనే కాకపోయినా, కాలక్రమేణా అలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల చిన్న రాష్ట్రాల ప్రాంతీయ ఆందోళనలు కేంద్రస్థాయి జాతీయ డిమాండ్లలో కొట్టుకుని పోతాయి. గోవా, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల నిరసన గళాలు ఢిల్లీ రణగొణ ధ్వనుల్లో తేలిపోతాయి. మూడవది – పార్లమెంటరీ ఎన్నికలు క్రమంగా అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారినప్పుడు ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ధోరణిని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం లేదా? అదే జరిగితే, అది మన బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇది అర్థవంతమైన భయమే అయితే దీనిని తేలిగ్గా తీసుకోవలసిన అవసరం లేదు. ఇదంతా కూడా మన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘనకు గురి చేయగలిగినదే. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని పర్యవసానాలపై ఆధారపడి ఉంది. అయితే మరొక విషయం కూడా ఉంది. మనం మన ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతంగా, వేళ్లూను కునేలా చేసుకోవలసిన అవసరం అది. నిజానికి 50 ఏళ్ల క్రితమే అటల్ బిహారి వాజ్‌పేయి ‘రైట్ టు రీకాల్’ (పదవుల్లో ఉన్నవారిని తొలగించే హక్కు)ను కోరు కున్నారు. దానికి పూర్తి భిన్నమైనది ఈ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’. ఓటు వేసే అవకాశాన్ని పరిమితం చేయటం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇది కురచబారుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే, వెళ్లవలసిన మార్గాన్ని వెనక్కి తిప్పుతుంది.ఇంకొక సమస్య ఉంది. వాస్తవంలో ఎదురుకాగల సమస్య అది. ఒకవేళ ప్రభుత్వం ఐదేళ్ల కాల పరిమితి కంటే ముందు గానే తన మెజారిటీని కోల్పోతే ఏం జరుగుతుంది? మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచిస్తోంది. కానీ అది ఐదేళ్ల కాలానికి ఓటరు ఇచ్చిన తీర్పును పలుచబార్చదా? కొన్నిసార్లు వాళ్లు ఐదేళ్ల ప్రభుత్వానికి ఓటు వేస్తారు. మరికొన్ని సార్లు ఒకటీ లేదా రెండేళ్ల ప్రభుత్వానికి ఓటేస్తారు. ఈ విధంగా మనం ఓటు విలువను యథేచ్ఛగా తగ్గించటం లేదా?ఉప ఎన్నిక అవసరమైన ప్రతిసారీ నిస్సందేహంగా ఇలాగే జరుగుతుంది కానీ... వ్యక్తికి ఓటేయటానికి, మొత్తం అసెంబ్లీకో, పార్లమెంటుకో ఓటేయటానికి తేడా లేదా? ఆలోచించదగిన ప్రశ్నే ఇది. నిజానికి, మధ్యంతర ఎన్నికలకు కారణమయ్యేవి ఏవీ లేకుండా పోవు. ఇంకా అనేక కారణాల వల్ల కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఈ విధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు వీలుగా తక్కువ కాల పరిమితిని కలిగి ఉంటాయి. ఈ కోణంలోంచి చూస్తే ‘ఒకే దేశం–ఒకే’ ఎన్నిక వల్ల ఏం తేడా కనిపిస్తున్నట్లు? చెప్పాలంటే మనం మరిన్ని ఎన్నికలకు వెళ్లటం అవుతుంది తప్ప, తక్కువ ఎన్నికలకేం కాదు. కనుక, అంతిమంగా నేను చెబుతున్నదేమిటి? అది మీతో చెప్ప టానికి సంకోచిస్తున్నాను. ఏమైనా, నా అభ్యంతరాలన్నీ ఇక్కడ స్పష్టంగానే వ్యక్తం అయ్యాయి. మీరు నా మార్గదర్శకత్వాన్ని కోరుకుంటే కనుక అందుకు చాలినంతగానే రాసేశాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సంక్షోభ లంకపై నెలవంక!
దాదాపు రెండున్నరేళ్లక్రితం విదేశీ రుణాల చెల్లింపులు అసాధ్యమై దివాలా తీసింది మొదలు వరస సంక్షోభాలను చవిచూస్తున్న శ్రీలంకలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నూతన అధ్యక్షుడిగా సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించిన అనూర కుమార దిస్సనాయకే వర్తమాన సంక్షోభ పరంపర నుంచి దేశాన్ని గట్టెక్కిస్తారన్న ఆశలు జనంలో దండిగానే ఉన్నాయి. కనుకనే వారసులవైపే మొగ్గే అలవాటున్న ప్రజానీకం ఈసారి మార్క్సిస్టు అయిన దిస్సనాయకేను ఎంపిక చేసుకున్నారు. 2022లో నిత్యావసరాల కొరత, అధిక ధరలు, పన్నుల మోతతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై ఆగ్రహోదగ్రులైన ప్రజలు అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై దాడిచేయటం, నాటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన పరివారం దేశం విడిచి పరారుకావటం ప్రపంచాన్ని దిగ్భ్రమపరి చాయి. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మూడేళ్లలోపే రాజపక్సకు ఈ దుర్గతి పట్టింది. అందుకే దిస్సనాయకే అత్యంత జాగరూకతతో పాలన సాగించి దేశాన్ని ఒడ్డున పడేయాల్సి వుంటుంది. గతంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసి ఉండొచ్చుగానీ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న దేశానికి సారథ్యం స్వీకరించటం సామాన్యం కాదు. రనిల్ విక్రమసింఘే ప్రభుత్వం పెను ఆర్థిక విపత్తు నుంచి గట్టెక్కడానికి ఐఎంఎఫ్‌ను ఆశ్రయించినప్పుడు 290 కోట్ల డాలర్ల రుణం మంజూరుచేస్తూ కఠినమైన షరతులు పెట్టింది. పర్యవసానంగా పొదుపు చర్యల పేరుతో జీతాలు, పెన్షన్లు కోత పడ్డాయి. సంక్షేమ పథకాలు అటకెక్కాయి. ప్రజలు అర్ధాకలితో వెళ్లదీస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకుడిగా భావసారూప్య పార్టీలతో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పేరిట కూటమి ఏర్పరిచి ఘనవిజయం సాధించటం దిస్సనాయకే ఘనత. గత ఎన్నికల్లో కేవలం నాలుగు శాతం ఓట్లతో, పార్లమెంటులో మూడంటే మూడే స్థానాలు గెల్చుకున్న పార్టీ ఈ స్థాయిలో దూసుకురావటం అసాధారణం. కోతలను సరళం చేస్తామన్న ఎన్పీపీ హామీ వోటర్లను విశేషంగా ఆకట్టుకుంది. దానికి తోడు సంప్రదాయపక్షాలు, అవి ఇచ్చే అబద్ధపు హామీలతో జనం విసిగిపోయారు. అందుకే కావొచ్చు... ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని దిస్సనాయకే అన్నారు. 2022 నాటి ‘అరగల్య’ (పోరాటం) ఉద్యమంలో జనం సమీకృతులు కావటం వెనక వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తితో పాటు జేవీపీ తెర వెనక కృషి కూడా ఉంది. జనాగ్రహాన్ని నిర్మాణాత్మకంగా మలచటంలో, అరాచకం ప్రబలకుండా చూడటంలో ఆ పార్టీ విజయం సాధించింది. అందుకే ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాల వంటివి అక్కడ జరగలేదు. బంగ్లాలో ఇస్లామిక్ తీవ్రవాదుల ఆధిపత్యం పెరగటం, బురఖా ధరించని మహిళలను బహిరంగ ప్రదేశాల్లో కొట్టి హింసించటం పరిపాటైంది. అంతేగాదు... దేశావిర్భావానికి మూల కారణమైన భాష, ప్రాంతం వంటి అస్తిత్వ అంశాలు సైతం బుట్టదాఖలా అవుతున్నాయి. ఆ పరిస్థితి లంకలో తలెత్తకపోవటం, సంక్షోభంలో సైతం రనిల్ ప్రభుత్వం సజావుగా సాగటంలో జేవీపీ పాత్ర కాదనలేనిది.అయితే జేవీపీ చరిత్రలో నెత్తుటి అధ్యాయాలు తక్కువేం కాదు. దాదాపు అరవైయ్యేళ్ల క్రితం ఆవిర్భవించి 70, 80 దశకాల్లో దేశంలో హింసాకాండను ప్రేరేపించిన జేవీపీని తుడిచిపెట్టడానికి ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నామని మావో, హోచి మిన్, చేగువేరా తమకు ఆదర్శమంటూనే సింహళ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి వేలాదిమంది లంక తమిళులను ఊచకోత కోయటం, వారికి అనుకూలంగా మాట్లాడే వందలాదిమందిని హత మార్చటం జేవీపీ చరిత్రలో మాయని మచ్చ. తమ వైఖరిని వ్యతిరేకించే పాత్రికేయులను సైతం ఆ పార్టీ కాల్చి చంపింది. ప్రేమదాస హయాంలో ఉత్తర తూర్పు ప్రాంతంలో తమిళ టైగర్లనూ, ఉత్తరాన జేవీపీ మిలిటెంట్లనూ ఆయన ప్రభుత్వం అణిచేసింది. పొలిట్ బ్యూరోలో ఒక సభ్యుడు మినహా జేవీపీ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసింది. అయితే కనుమరుగైందనుకున్న జేవీపీ క్రమేపీ మళ్లీ బలం పుంజుకున్నా ఎప్పటిలాగే దాన్ని అంతర్గత సంక్షోభాలు చుట్టుముట్టాయి. చివరకు పార్లమెంటరీ పంథాకు మెజారిటీ వర్గం మొగ్గుచూపి భారత–శ్రీలంక సైనిక ఒప్పందాన్ని వ్యతిరేకించిన చంద్రికా కుమారతుంగకు మద్దతునిచ్చింది. ఆమె ప్రభుత్వంలో భాగస్వామి అయింది.చుట్టూతా ఒక్కో దేశమే చైనా ప్రభావంలో పడి భారత వ్యతిరేక రాగం అందుకుంటున్న వర్త మానంలో దిస్సనాయకే గెలుపు మన ప్రభుత్వానికి ఒక రకంగా సమస్యాత్మకమే. మైనారిటీలుగా ఉన్న లంక తమిళులకు స్వయంపాలన ఇచ్చే 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మన దేశం చాన్నాళ్లుగా కోరుతోంది. కానీ రాజపక్స దాన్ని బేఖాతరు చేశారు. దిస్సనాయకే వైఖరి సైతం అదే. అదానీల 450 మెగావాట్ల పవన విద్యుత్ కాంట్రాక్టును రద్దు చేస్తామని ఎన్నికల సభల్లో ఆయన చెప్పాడు. దానికితోడు భావజాలం రీత్యా చైనాకు సన్నిహితుడు. ఆ దేశం ఇచ్చిన అప్పులే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయని దిస్సనాయకేకు తెలియంది కాదు. 2022 సంక్షోభం అనంతరం మన దేశం లంకకు 400 కోట్ల డాలర్ల అత్యవసర రుణం మంజూరు చేయటంతోపాటు ఐఎంఎఫ్ రుణం రావటంలో కీలకపాత్ర పోషించింది. పదునైన దౌత్యం పరమ శత్రువులను సైతం గెల్చుకోగలదు. మొదట్లో తీవ్ర స్థాయి భారత వ్యతిరేక వైఖరి తీసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమద్ మియిజూ ఇందుకు ఉదాహరణ. అందువల్ల అసాధ్యం కానిదేదీ లేదు. ఇంతవరకూ దిస్సనాయకే ఎత్తుగడలు గమనిస్తే ఆయన సవ్యంగా అడుగులు వేస్తారని అంచనా వేయొచ్చు. -
భారత్.. భూటాన్ మధ్య ఒప్పందం: ఎందుకంటే?
దేశ రాజధానిలో జరిగిన గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ సందర్భంగా.. భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (BFDA)తో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్, భూటాన్ మధ్య ఆహార భద్రత అమలుకు సంబంధించిన ఒప్పందం జరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం.. ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఎఫ్డీఏ మధ్య సాంకేతిక సహకారం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఆహార భద్రత, వాణిజ్య సౌలభ్యం విషయంలో భూటాన్‌తో మా భాగస్వామ్యంలో కీలకమైన అభివృద్ధిని సూచిస్తుందని.. ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ జీ కమల వర్ధనరావు పేర్కొన్నారు. బీఎఫ్డీఏతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా రెండు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే బలమైన, సమర్థవంతమైన ఆహార భద్రత ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాలను నెలకొల్పడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నాయకత్వాన్ని అంగీకరించామని బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా (Gyem Bidha) పేర్కొన్నారు. భారత్, భూటాన్ మధ్య సురక్షితమైన ఆహార వాణిజ్యాన్ని సులభతరం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని అన్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఈ సమావేశానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో భూటాన్ దేశానికీ చెందిన బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా, బీఎఫ్డీఏ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ విభాగానికి చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు. భారత్ నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ సీనియర్ అధికారులు హాజరయ్యారు.India and Bhutan Deepen Cooperation on Food Safety and Regulatory StandardsThis Agreement underscores a mutual commitment to enhance food safety, aligning regulatory frameworks, simplifying the Food Import Procedure and fostering technical collaborationRead here:…— PIB India (@PIB_India) September 22, 2024 -
స్టార్టప్‌ల కోసం ‘భాస్కర్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్‌గా ఉపయోగపడే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (BHASKAR) ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. స్టార్టప్‌లు, మదుపరులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖలు పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ఇందులో రిజిస్టర్ చేసుకునేవారికి ప్రత్యేకంగా భాస్కర్ (BHASKAR) ఐడీ కేటాయిస్తారు. వనరులు, భాగస్వాములు, అవకాశాల వివరాలను యూజర్లు సులువుగా పొందేందుకు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేలా ఇందులో సెర్చ్ ఫీచరును శక్తిమంతంగా తీర్చిదిద్దారు. స్టార్టప్ ఇండియా కింద చేపట్టే అన్ని కార్యక్రమాలు, సంస్థలను ఒకే గొడుగు కిందికి తెచ్చే విధంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్షరహిత కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా తరహాలో పరిశ్రమ వర్గాల పర్యవేక్షణలోనే ఉండే ఈ సంస్థలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు, భాస్కర్ పోర్టల్‌ను మరింత పటిష్టంగా మార్చేందుకు పరిశ్రమవర్గాలన్నీ ముందుకు రావాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 1,46,000 పైచిలుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాలు ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య 50 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 16 నాటికి దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టార్టప్ ఉంటుందని భాటియా చెప్పారు. -
'నేను విశ్వసిస్తున్నాను.. భారత్ సాధిస్తుంది'
భారతీయ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధికి తయారీ రంగం కీలకమని రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి పేర్కొన్నారు. అంతే కాకుండా భారత్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఎగుమతి చేసే స్థితికి చేరుకుంటుందని.. న్యూఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) 64వ సదస్సులో నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.ఇప్పటికే భారత్ ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వేగంగా ముందుకు సాగుతోంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఇండియా.. లిథియం అయాన్ బ్యాటరీలను ఎగుమతి చేయగలదని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో, అల్యూమినియం, ఐరోనిక్ ఆయిల్, వివిధ రకాల రసాయన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇది దేశంలో మంచి మార్కెట్ అని గడ్కరీ అన్నారు.కొన్ని కంపెనీలు ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీ తయారీలోకి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా భారత్ వీటిని ఎగుమతి చేయగలదు. కరోనా మహమ్మారి సమయంలో సెమికండక్టర్ల కొరత వల్ల ఆటోమొబైల్ రంగం కొంత డీలా పడింది. ఆ తరువాత మనదేశంలోని కంపెనీలు సెమికండక్టర్లను తయారు చేయడానికి పూనుకున్నాయి. మరో రెండేళ్లలో సెమీకండక్టర్ల తయారీలో మనమే నెంబర్‌వన్‌గా ఉంటామని గడ్కరీ అన్నారు.దేశంలో ఈవీ మార్కెట్ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తిలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో 2030 నాటికి కోటి యూనిట్ల వార్షిక విక్రయాలు సాధ్యమవుతుంది. ఇందులో ఐదు కోట్ల ఉద్యోగాలు రానున్నాయి. ఎగుమతులు కూడా పెరగాలని, దీనివైపుగా కంపెనీలు కృషి చేయాలని గడ్కరీ సూచించారు.ఇదీ చదవండి: హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానం!.. నితిన్ గడ్కరీవాహన తయారీకి సంబంధించి మెరుగైన పరిశోధన, పరీక్షల కోసం టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం సీఐఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రూ. 450 కోట్లతో పూణేలో ప్రారంభమవుతుంది. మరోవైపు స్క్రాపేజ్ విధానానికి కంపెనీలు సహకరించాలని ఆయన అన్నారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం, ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేయడంలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. -
దివ్యమైన రికార్డు
పది రోజుల క్రీడా సంరంభానికి తెర పడింది. ప్యారిస్‌లో వేసవి ఒలింపిక్స్ ముగిసిన వెంటనే కొద్ది రోజులకే ఆరంభమైన పారాలింపిక్స్ ఆదివారం పూర్తయ్యేసరికి భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. కనివిని ఎరుగని రీతిలో 29 పతకాలు (7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు) సాధించి సత్తా చాటింది. వెంట్రుక వాసిలో తప్పిపోయిన పతకాలను కూడా సాధించి ఉంటే, ఈ స్కోర్ 30 దాటిపోయేది. సాధారణ ఒలింపిక్స్‌లో ఇప్పటికీ రెండంకెల స్కోరును సాధించలేకపోయిన మన దేశం, దివ్యాంగులైన క్రీడాకారులతో సాగే పారాలింపిక్స్‌లో మాత్రం వరుసగా రెండుసార్లు ఆ ఘనత సాధించడం విశేషం. త్రుటిలో తప్పిన పతకాలతో ఈ ఏటి ప్యారిస్ సాధారణ ఒలింపిక్స్ మిశ్రమ ఫలితాలు అందిస్తే, ఈ పారాలింపిక్స్ మాత్రం మరిన్ని పతకాలతో ఉత్సాహం పెంచాయి. పైగా, ఆ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ క్రీడా మహోత్సవంలో అయిదు రెట్లు ఎక్కువ పతకాలు సాధించడం గమనార్హం. మొత్తం 549 పతకాలకు జరిగే ఈ పోటీల్లో 23 క్రీడాంశాలకు గాను 12 అంశాల్లోనే పాల్గొన్న మన బృందం ఈసారి పతకాల పట్టికలో టాప్ 20లో నిలవడం చిరస్మరణీయం.మూడేళ్ళ క్రితం 2021 టోక్యో పారాలింపిక్స్‌లో మనం 19 పతకాలు గెలిచి చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు అంతకన్నా మరో 10 ఎక్కువ సాధించి, సంచలనం రేపాం. నిజానికి, 1972లో మురళీకాంత్ పేట్కర్ భారత్ పక్షాన తొట్టతొలి పారాలింపిక్ పతక విజేత. 1984లో మాలతీ కృష్ణమూర్తి హొల్లా భారత్ పక్షాన తొలి మహిళా పారాలింపియన్. అయితే, 2016 వరకు మన మహిళలెవ్వరూ పతకాలు సాధించలేదు. అప్పటి నుంచి పారాలింపిక్స్‌లో భారత్ పక్షాన కేవలం ముగ్గురంటే ముగ్గురు మహిళలే (దీపా మాలిక్ – 2016లో రజతం, అవనీ లేఖరా – 2020లో స్వర్ణం – కాంస్యం, భావినా పటేల్ – 2020లో రజతం) విజేతలుగా నిలిచారు. అలాంటిది ఈసారి భారత్ పక్షాన పతకాలు సాధించినవారిలో 10 మంది మహిళలే. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో స్వర్ణంతో ఇప్పటికి 2 పారాలింపిక్ స్వర్ణాలు గెలిచిన అవని మినహా మిగతా తొమ్మిది మందీ సరికొత్త విజేతలే. మన మహిళా అథ్లెట్లకు పారాలింపిక్స్‌లో ఇది అసాధారణ విజయం. ఎవరికి వారు ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ, అంచనాల ఒత్తిడిని తట్టుకొని ఈ ఘనత సాధించారు. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ. ముఖ్యంగా తెలుగు బిడ్డ దీప్తి జీవాంజి లాంటివారి కథ మనసుకు హత్తుకుంటుంది. దివ్యాంగురాలైన ఆమె ఆటల్లో పైకి వచ్చి, పతకాల కల నెరవేర్చేందుకు తల్లితండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి వరంగల్‌లోని తమ భూమి కూడా అమ్మేశారు. దీప్తి తాజా పారాలింపిక్స్‌లోనూ పతకం సాధించడమే కాక, తనను వదిలేయకుండా ఇంత పైకి తీసుకొచ్చిన కన్నవారి కోసం అదే స్థలాన్ని తిరిగి కొని బహూకరించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే మానవీయ గాథ. ఇలాంటి కథలు ఇంకా అనేకం. ఇక, పేరున్న క్రీడా తారలైన జావలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్, హైజంపర్ మారియప్పన్ తంగవేలు లాంటి వారే కాక అంతగా ప్రసిద్ధులు కాని అథ్లెట్లు సైతం ఈసారి పతకాల విజేతలుగా నిలవడం విశేషం. పతకాలు సాధించడమే కాక, పలువురు భారతీయ అథ్లెట్లు సరికొత్త మైలురాళ్ళను చేరుకొని, చరిత్ర సృష్టించడం గమనార్హం. క్రీడాసంఘాలను రాజకీయ పునారావాస కేంద్రాలుగా మార్చి, వాటిని అవినీతి, ఆశ్రిత పక్షపాతాలకు నెలవుగా మారిస్తే జరిగే అనర్థాలు అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం. రెజ్లింగ్ సంఘం లాంటి చోట్ల గత రెండేళ్ళలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అలాంటివాటి వల్ల ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ వేదికలపై పతకాలు పోగొట్టుకున్నాం. పారాలింపిక్స్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చూపగలిగామంటే ఆ జాడ్యాలు ఇక్కడ దాకా పాకలేదని సంతోషించాలి. కేంద్రం, కార్పొరేట్ సంస్థలు అందించిన తోడ్పాటు ఈ దివ్యాంగ క్రీడాకారులకు ఊతమైందని విశ్లేషకుల మాట. గడచిన టోక్యో గేమ్స్‌కు రూ. 26 కోట్లు, 45 మంది కోచ్‌లతో సన్నాహాలు సాగించిన ప్రభుత్వం ఈసారి రూ. 74 కోట్లు ఖర్చు చేసి, 77 మంది కోచ్‌లతో తీర్చిదిద్దడం ఫలితాలిచ్చింది. వివిధ దేశాల నుంచి దాదాపు 4400 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా సమరంలో మన దేశం నుంచి ఎన్నడూ లేనంతగా ఈసారి 84 మంది పాల్గొన్నారు. ఈ ప్రపంచ పోటీలకు దాదాపు 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం, రోజూ ఈ జీవన విజేతల విన్యాసాలు చూసేందుకు స్టేడియమ్ నిండుగా జనం తరలిరావడం చెప్పుకోదగ్గ విషయం. మరి, చెదరని పోరాటపటిమతో శారీరక, సామాజిక అవరోధాలన్నిటినీ అధిగమిస్తున్న దివ్యాంగులకు మన దేశంలో పాలకులు చేయవలసినంత చేస్తున్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ‘దివ్యాంగుల హక్కుల చట్టం– 2016’ లాంటివి ఉన్నా, ఇవాళ్టికీ మనదేశంలో మహానగరాల్లో సైతం పాఠశాలల్లో, ప్రయాణ సాధనాల్లో, కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వారికి కావాల్సిన కనీస వసతులు మృగ్యం. అయిదేళ్ళలో ఆ పని చేయాలని చట్టపరమైన సంకల్పం చెప్పుకున్నా, ఆచరణలో జరిగింది అతి తక్కువన్నది నిష్ఠురసత్యం. చివరకు చట్టం కింద చేపట్టాల్సిన పథకాలకూ కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు పెట్టడం విషాదం. ఈ పరిస్థితి మారాలి. సమాజంలోనూ, సర్కార్పరంగానూ ఆలోచన తీరూ మారాలి. ఆ రకమైన ప్రోత్సాహంతో దివ్యాంగులు మరింత పురోగమించ గలరు. తాజా విజయాల రీత్యా మనవాళ్ళకు మరింత అండగా నిలిస్తే, విశ్వవేదికపై వారు భారత ఖ్యాతిని ఇనుమడింపజేయగలరు. అలా చూసినప్పుడు ప్యారిస్ పారాలింపిక్స్ విజయాలు ఆరంభం మాత్రమే. వచ్చే 2028 నాటి లాస్ ఏంజెల్స్ గేమ్స్‌కు అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, పారా అథ్లెట్స్ ప్రతిభ తోడై ఇదే దూకుడు కొనసాగిస్తే అద్భుతాలూ జరుగుతాయి. -
యువతి ఫొటోలు మార్ఫింగ్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/తెనాలి రూరల్: ఒకవైపు కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం మీద దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది. మరోవైపు మహిళలకు రక్షణ కల్పిస్తామని, వేధింపులను అరికడతామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత రోజుకొక ప్రకటన చేస్తున్నారు. కానీ, వైద్య రంగంలోనే ఉన్న ఓ యువతి ఫొటోలను టీడీపీ నాయకుడి తమ్ముడు, మరో ఇద్దరు కలిసి మార్ఫింగ్ చేసి బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... తెనాలికి చెందిన ఓ యువతి వైద్య రంగంలో స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్‌గా చేస్తున్నారు. ఆమె ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేశారు. వాటిని కొరియర్ ద్వారా ఆమెకు పంపి బెదిరించారు. దీంతో బాధితురాలు రెండు వారాల కిందట తెనాలి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి సోదరుడు అబ్దుల్ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్, గుంటూరులోని గోరంట్లకు చెందిన భరత్‌ను ఐదు రోజులు కిందట అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కానీ, హార్డ్‌వేర్ ఇంజినీర్ అయిన భరత్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరినీ గుట్టుగా తమ స్వస్థలాలకు పంపినట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు ఇద్దరు నిందితులను వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ లింక్‌పై విచారణ ఏదీ? అబ్దుల్ సత్తార్, కరుణాకర్, భరత్ హైదరాబాద్ కేంద్రంగా కొన్నేళ్ల నుంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. తెనాలి పోలీసుల విచారణలో వీరి వద్ద అనేకమంది యువతులు, మహిళల నగ్న చిత్రాలు లభించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకరు ఆమెతో సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుల ప్రమేయంతోనే పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే నిందితులను వదిలిపెట్టినట్లు సామాజిక మధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.కేసు దర్యాప్తు పూర్తి కాలేదు ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కేసులో ఎవరినీ వదిలిపెట్టలేదు. ప్రధాన నిందితుడిని మాత్రమే అరెస్టు చేశాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మరింతమంది నిందితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో సున్నితమైన అంశాలు ఉండడంతో పూర్తి వివరాలను అప్పుడే వెల్లడించే అవకాశం లేదు. – ఎ.సుధాకర్, తెనాలి టూ టౌన్ సీఐ -
రాజకీయ కక్షతోనే కేసు.. అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు: ఎమ్మెల్సీ భరత్
సాక్షి, కుప్పం: తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని అన్నారు వైఎస్సార్సీపీ కుప్పం ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. తాను ఒక బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, తన తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అని తెలిపారు. ఉన్నత విలువలతో బతికే వ్యక్తినని చెప్పారు.తన వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్ఓ ఎవరూ లేరని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదని అన్నారు భరత్. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడం, అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానన్న కక్షతోనే తనపై కేసులు నమోదు చేసి అప్రతిష్టపాలు జేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనపై జరుగుతున్న కుట్రలను కచ్చితంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. అసలు తనపై ఫిర్యాదు చేసిన వారెవరు? పోలీసులు కేసులో రాసిన వాళ్లు ఎవరు? అవన్నీ ఆరా తీస్తానని చెప్పారు. పూర్తి వివరాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తానని తన వీడియో సందేశంలో తెలిపారాయన. -
మా పరిస్థితి ఏంటీ భరత్?
మహరాణిపేట: ‘‘ఎంపీ సార్.. మీరు కండువా కప్పేశారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. పార్టీని వార్డుల్లో నిలబెట్టేందుకు ఎన్నో అష్టకష్టాలు పడ్డాం. ఇప్పుడు మళ్లీ ఆ కార్పొరేటర్లే వార్డులో పెత్తనం చెలాయిస్తారు. అధికారంలో ఉన్నా.. మా పరిస్థితి అగమ్య గోచరమేనా. మా భవిష్యత్తు ఆలోచించరా.?’’ అంటూ టీడీపీ కార్యాలయంలో ఎంపీ భరత్‌ను వివిధ వార్డులకు చెందిన టీడీపీ కార్పొరేటర్లు నిలదీశారు. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశం ఉత్కంఠగా సాగింది. పార్టీ నాయకులు,ఎమ్మెల్యేలు,ఎంపీ సమక్షంలో పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఆవరణలో కొంత మంది తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నిరసన గళం విప్పారు. తమ అభిప్రాయాలు కనీసం తెలుసుకోకుండా.. కార్పొరేటర్లకు కండువా కప్పడంపై ఆయా వార్డులకు చెందిన అధ్యక్షులు, సీనియర్ లీడర్లు అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లే తమ వార్డుల్లో పెత్తనం సాగించారని, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా.. వాళ్లే ముందు వరసలో ఉండేందుకే పార్టీలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తమ వ్యవహారాలు చక్కపెట్టుకోడానికే తప్ప.. పార్టీ మీద గౌరవంతో రాలేదని వ్యాఖ్యానించారు. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకొని ఉన్నాం. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటే వాళ్లు ఇప్పడు కూడా మాపై పెత్తనం చేస్తారని.. ఇప్పుడు మేమేం చెయ్యాలంటూ 30వ వార్డుకు చెందిన టీడీపీ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ పోలిపల్లి జ్యోతి ఎంపీ భరత్‌ను నిలదీశారు. వాళ్లంతా శత్రువులు వారిని ఎలా చేర్చుకుంటారని వివిధ వార్డులకు చెందిన మహిళా కార్యకర్తలు భరత్‌ను చుట్టుముట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ భరత్ వారిని వారించి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఎవ్వరికీ అన్యాయం చెయ్యమని వెళ్లిపోడానికి ప్రయత్నించిన ఎంపీ భరత్‌కు కార్యాలయం ఆవరణలోనూ అడ్డుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారు.టీడీపీలో చేరిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లుడాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆదివారం టీడీపీ పంచన చేరారు. జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోక్‌తో పాటు కార్పొరేటర్లు కోడూరు అప్పలరత్నం, సారిపల్లి గోవింద్, బొడ్డు నరసింహప్రసాద్, ఇల్లపు వరలక్ష్మీ, లొడగల అప్పారావు, రాజాన రామారావు చేరారు. వీరంతా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు.వ్యక్తిగత కారణాలతోనే..సీతమ్మధార: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరడంపై ఉత్తర నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కేకేరాజు స్పందించారు. వైఎస్సార్సీపీ టికెట్లు ఇచ్చి గెలిపించిందని, గెలిచిన కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడారన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు.గాజువాకలోనూ లుకలుకలు..!మరోవైపు గాజువాక నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు సైతం జిల్లా పార్టీ పెద్దల వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్లు బొడ్డు నర్సింహపాత్రుడు, ఇల్లపు లక్ష్మి, రాజన రామారావు టీడీపీలోకి చేరడంతో నియోజకవర్గంలో రచ్చ మొదలైంది. వారిని ఎలా చేర్చుకుంటారంటూ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నిలదియ్యాలని నిర్ణయించుకున్నారు. ఆయన వస్తే గాజువాక పార్టీ కార్యాలయంలో పంచాయితీ పెడతామని నియోజకవర్గంలోని నేతలు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వైఎస్సార్సీపీ నుంచి కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారన్న సమాచారం రావడంతో వారిని చేర్చుకోవద్దంటూ కొందరు టీడీపీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి లేఖలు రాశారు. అయితే కార్పొరేటర్ల రాకతో అసంతృప్తితో ఉన్న టీడీపీ వార్డు స్థాయి నేతలను బుజ్జగించే పనిలో ఎమ్మెల్యేలున్నారు. ఇదిలా ఉండగా టీడీపీలో చేర్చుకోమని చెప్పిన వారంతా జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
షేరుకు మరో షేరు ఫ్రీ.. ! ప్రభుత్వ కంపెనీ బంపర్ ఆఫర్
-
పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తాం
సాక్షి, అమరావతి: పారిశ్రామిక వృద్ధిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోను పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గుజరాత్ తరహాలో మన రాష్ట్రంలో కూడా గిఫ్ట్ సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆయన గురువారం సచివాలయంలో రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలివచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్ఆర్ఐల సహకారంతో యువతకు ఉపాధిరాష్ట్ర చిన్న, మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ గురువారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఎన్ఆర్ఐల సహకారంతో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి, డ్వాక్రా గ్రూప్ మహిళలు పారిశ్రామికంగా ఎదుగుదలకు ఒక రోడ్ మ్యాప్‌ను త్వరలోనే రూపొందిస్తామని వివరించారు. తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం 20 ఆదర్శ మండలాలకు రూ.10లక్షలు చొప్పున నిధులు, ఎస్సీ, ఎస్టీ ఎస్‌హెచ్‌జీలకు అందుబాటులో ఉన్న నిధులతో వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ రెండు ఫైళ్లపై సంతకాలు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ చెప్పారు.బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించనున్నట్టు బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రి సంజీవిరెడ్డిగారి సవిత తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకంపై మొదటి, ద్వితీయ సంతకాలు చేశారు. వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్‌పై తొలి సంతకం చేసినట్టు సవిత తెలిపారు. 2014–19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సవిత ముఖ్య కార్యదర్శి సునీతతో కలిసి మూడో బ్లాకులోని లేపాక్షి ఎంపోరియంను సందర్శించారు. -
కుప్పంలో ఓటమిపై MLC భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలోకి వచ్చిన మరీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేయబోతుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. తేదీ మాత్రం కన్ఫర్మ్ అని అంటున్నారు. తమిళంలో రెండేళ్ల క్రితమే వచ్చిన ఈ మూవీ.. తాజాగా తెలుగులో రిలీజైంది. ఇప్పుడు మూవీ లవర్స్ కోసం డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేయనుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'మిరల్'. 2022 నవంబరులో తమిళంలో రిలీజైంది. ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత అంటే గత నెల 17న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైంది. హడావుడి లేకుండా వచ్చి అంతే ఫాస్ట్‌గా వెళ్లిపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేయబోతుంది.తమిళ వెర్షన్ ఇదివరకే ఆహాలో అందుబాటులో ఉంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా ఇదే ఓటీటీలోకి జూన్ 7 నుంచి అందుబాటులోకి రానుందని సమాచారం. అదే రోజు హన్సిక నటించిన '105 మినిట్స్' మూవీ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై క్లారిటీ వస్తే ఈ వీకెండ్ మూవీ లవర్స్ టైమ్ పాస్ చేసేయొచ్చు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా) -
కుప్పం మాదే చంద్రబాబు ఇంటికే.
-
కాన్స్ ఉత్సవాల్లో తొలిసారి భారత్ పర్వ్
ఫ్రాన్స్‌లో ఈ నెల 14 నుంచి 25 వరకు జరగనున్న 77వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారతదేశం ప్రాతినిధ్యం ఉంటుందని భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని విభిన్నమైన సంస్కృతులు–సంప్రదాయాలను సెలబ్రేట్ చేసేలా ‘భారత్ పర్వ్’ పేరిట భారత పర్యాటక శాఖ దేశంలో వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ నిర్వహించనున్నారు.‘భారత్ పర్వ్’ పేరిట కాన్స్ చిత్రోత్సవాల్లో ఓ విభాగం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఈ చిత్రోత్సవాల్లో భారత్ పెవిలియన్ పేరిట ఓ స్టాల్‌ను ఏర్పాటు చేస్తారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ) ఈ స్టాల్‌ను నిర్వహిస్తాయి. అలాగే ఈ ఏడాది గోవాలో నవంబరు 20 నుంచి నవంబరు 28 వరకు జరగనున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) విశేషాలు, ఈ వేడుకల్లో జరగనున్న వరల్డ్ ఆడియో–విజువల్ అండ్ ఎంటర్టైన్ మెంట్ సమ్మిట్ గురించిన వివరాలను కూడా ‘భారత పర్వ్’ సెలబ్రేషన్స్‌లో భాగంగా వెల్లడించనున్నామని భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార శాఖ పేర్కొంది.భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. దేశానికి చెందిన ప్రతిభ గల ఫిల్మ్ మేకర్స్ ఈ వేడుకలను ఓ వారిధిగా చేసుకుని ప్రపంచ ఫిల్మ్ మేకర్స్‌కు ‘భారత్ పర్వ్’లో తమప్రాజెక్ట్స్ను, తమను మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది. ఇందుకోసం భారత పెవిలియన్ స్టాల్లో భారతీయ సినీ సమాఖ్య ప్రతినిధులు ఉంటారు. కాన్స్ వేదికపై భారత్ హవా... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ప్రతిష్టాత్మక విభాగం ఫామ్ డి ఓర్లో భారత్‌కు చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ పోటీ పడుతోంది. అలాగే అన్ సర్టైన్ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ పోటీలో ఉంది. డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ విభాగంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్ కరణ్ గంధారి తీసిన ‘సిస్టర్ మిడ్నైట్’, అసోసియేషన్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా విభాగంలో మైసమ్ అలీ తీసిన ‘ఇన్ రీట్రీట్’ ఉన్నాయి.అలాగే ‘ది ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ ‘సన్ ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ పోటీలో ఉంది. జాతీయ అవార్డుగ్రహీత, కెమెరామేన్ సంతోష్ శివన్ ఈ చిత్రోత్సవాల్లో ‘పియర్ ఏంజెనీ’ అవార్డు అందుకోనున్నారు. దివంగత ప్రముఖ ఫిల్మ్ మేకర్ శ్యామ్ బెనెగల్ తీసిన ‘మంథన్’ (1976) చిత్రం ప్రదర్శితం కానుంది. ఇలా ఈ ఏడాది కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారత్ హవా బాగానే ఉంది. కాన్స్‌లో భారతీయ మెరుపులు... కాన్స్ చిత్రోత్సవాలంటే గుర్తొచ్చే విషయాల్లో ‘రెడ్ కార్పెట్’పై తళుకులీనుతూ నటీమణులు అందంగా చేసే క్యాట్ వాక్ ఒకటి. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి పలువురు కథానాయికలు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. 2000వ సంవత్సరం నుంచి ఐశ్వర్యా రాయ్ హాజరవుతున్నారు. ఈసారి కూడా ఆమె కాన్స్ ఎర్ర తివాచీపై మెరవనున్నారు. అలాగే 2022లో జరిగిన చిత్రోత్సవాల్లో పాల్గొన్న అదితీ రావు హైదరి ఈసారీ హాజరవుతున్నారు. తెలుగు అమ్మాయి శోభితా దూళిపాళ కూడా పాల్గొంటారని టాక్. ఇటీవలే ఈ బ్యూటీ ‘మంకీ మేన్’ చిత్రం ద్వారా హాలీవుడ్‌కి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఐశ్వర్య, అదితి, శోభిత... ఈ ముగ్గురూ కాకుండా ఇంకా ఏయే భారతీయ తారలు కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారనే విషయం తెలియాల్సి ఉంది. -
విశాఖకే జై కొట్టిన టిడిపి
-
ఏపీ కూటమి: ఉత్తరాంధ్రలో ఒకలా.. బెజవాడలో మరోలా!
సాక్షి, అమరావతి: ఏ ఎండకు ఆ గొడుగు!.. ఏ రోటికాడ ఆ రోటి పాట! ఏరు దాటాక తెప్ప తగలేయడమే తన ఆనవాయితీ అని టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మరోసారి విస్పష్టంగా చెప్పింది! ప్రజాక్షేత్రంలో మరోసారి ఘోర పరాజయం ఖాయమని నిర్ధారణకు రావడంతో ఉనికి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కో డ్రామాలాడుతోంది. రాజధానిపై బుధవారం దినపత్రికల్లో కూటమి ఇచ్చిన ప్రకటనలే ఇందుకు తార్కాణం. ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందేందుకు రాజధానిపై ప్రాంతాల వారీగా రెండు రకాల ప్రకటనలు ఇచ్చే స్థాయికి దిగజారింది. సాధ్యం కాదన్న బాలయ్య అల్లుడువిశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్ ఓట్ల కోసం విశాఖే రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కాదని స్పష్టం చేస్తూ.. అమరావతిని అభివృద్ధి చేయాలంటే చాలా పెట్టుబడి అవసరమని ఓ ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇండర్వ్యూలో భరత్ తేల్చి చెప్పారు. అన్ని డబ్బులు వెచ్చించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. అదే విశాఖ అయితే వేగంగా అభివృద్ధి చెందుతుందని, గ్రోత్ ఇంజన్ ఏమిటనేది చూడాలని వ్యాఖ్యానించారు. గ్రోత్ ఇంజన్ విశాఖతో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందంటూ ఓట్ల కోసం రెండు నాలుకల ధోరణితో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రూ.వేల కోట్లు పెట్టుబడి పెట్టే స్థితిలో లేదని భరత్ చెప్పారు. అమరావతి అనేది 20 సంవత్సరాల తరువాత మాట అని, అదే విశాఖ మనకు వెంటనే గ్రోత్ ఇంజన్ లాంటిదని బాలకృష్ణ అల్లుడు భరత్ తెలిపారు. టీడీపీతో పాటు బీజేపీ, పవన్ అమరావతే రాజధాని అని చెబుతుండగా విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్ మాత్రం విశాఖ రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొనటాన్ని బట్టి కూటమి లక్ష్యం ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందడమేనని స్పష్టమవుతోంది. రెండు ప్రాంతాలు.. రెండు నాలుకలు!తాజాగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా విజయవాడ, విశాఖ ఎడిషన్లలో ఆయా ప్రాంతాల ప్రజలను మభ్యపుచ్చేలా కూటమి వేర్వేరు ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఈమేరకు విజయవాడ, విశాఖలో ఈనాడు, హిందూ దినపత్రికల తొలి పేజీల్లో కూటమి ప్రచార ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ప్రధాని మోదీతో పాటు బాబు, పవన్ ఫొటోలున్నాయి. విజయవాడ ఎడిషన్‌లో మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి అంటూ పత్రికల్లో ప్రకటన ఇవ్వగా విశాఖలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికాసం కోసం అంటూ ముగ్గురి ఫొటోలతో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఓ విధానం లేకుండా..జాతీయస్థాయిలో ఎనీడీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న పార్టీలు రాజధాని విషయంలో ఒక విధానం లేకుండా ప్రాంతానికో రకంగా వ్యవహరించడం అంటే ఓటర్లను మోసం చేయడమేనని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓటమి భయంతోనే ప్రాంతాలవారీగా మభ్యపెడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతిని రాజధాని చేయాలంటే రూ.లక్షల కోట్లు అవసరమని, అంత ఖర్చు చేసినా చాలా ఏళ్లు పడుతుందని తొలి నుంచీ వైఎస్సార్సీపీ వాస్తవిక దృక్పథంతో చెబుతోంది. అదే విషయాన్ని ఇప్పుడు ఓట్ల కోసం భరత్ వల్లె వేయడం గమనార్హం. రాజధాని అమరావతి సాధ్యం కాదని పేర్కొనడం విశేషం. రాష్ట్రంలో విజయవాడ భాగమైనప్పటికీ ఉత్తరాంధ్ర ఎడిషన్లలో మాత్రం అమరావతి ప్రస్తావన లేకుండా ప్రచార ప్రకటనలు జారీ చేయటాన్ని బట్టి ఇదంతా ఓట్ల రాజకీయమేనని స్పష్టమవుతోంది. -
అవ్వాతాతలకు వందనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్ర రాజకీయాలకు అవ్వాతాతలు బలైపోతున్నారు. పింఛన్ కోసం మండుటెండల్లో రోడ్లపై సొమ్మసిల్లి పడిపోతున్నారు. నాలుగున్నరేళ్లకు పైగా సూర్యోదయానికి ముందే వలంటీర్ ఇంటికే వచి్చన పింఛన్.. ఒక్కసారిగా నిలిచిపోవడంతో దిక్కుతోచక విలవిల్లాడుతున్నారు. రెండు నెలలుగా పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు కష్టాలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు రాజకీయ అరాచకత్వానికి ఇదొక నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికీ తీసుకెళ్తూ ప్రజాభిమానం పొందిన వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆదినుంచీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన బినామీ, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌తో కోర్టుల్లో కేసులు వేయించి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారు. ఫలితంగా ఎన్నికల సంఘం వలంటీర్లతో ఇంటింటికీ పింఛన్ పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు అవ్వాతాతలు అనుభవిస్తున్న దుస్థితికి ముమ్మాటికి చంద్రబాబే కారణమంటూ విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు ‘అవ్వాతాతలకు వందనం’ అంటూ భరోసా కల్పిస్తున్నారు. బాబు చేసిన అన్యాయాన్ని చెబుతూనే.. జూన్ 4వ తేదీ తర్వాత సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్లీ వలంటీర్ వచ్చి ఇంటికే పింఛన్ అందిస్తారని ధైర్యాన్ని ఇస్తున్నారు. గడపగడపకూ వెళ్తూ సీఎం జగన్ వచ్చిన వెంటే ఈ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. శనివారం కుప్పంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్, శింగనమలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు అవ్వాతాతల పాదాలు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. బాబు చేసిన ఘోర పాపానికి ఓటుతో తగిని బుద్ధి చెప్పాలని వినమ్రంగా అభ్యర్థించారు. -
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
ఎక్కడైనా కుటుంబంలో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు..వీళ్లేంటిరా.. కుటుంబం మొత్తం తేడాయేనా...అని సందేహం వ్యక్తపరుస్తాడు ఓ సినిమాలో హాస్యనటుడు...అలాంటి పోలికను విశాఖలోనూ చూడొచ్చు...తాత భూ కబ్జాదారు..తండ్రి బ్యాంకు డిఫాల్టర్...మనవడు..వీరి అక్రమాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు...తాత ఎంవీవీఎస్ మూర్తి ఉరఫ్ గోల్డ్‌స్పాట్ మూర్తి, గీతం వ్యవస్థాపకుడు. తండ్రి పట్టాభిరామారావు రుణాల ఎగవేతదారు..పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ...సినీ నటుడు..ఆడవాళ్ల గురించి అసభ్య నిర్వచనం ఇచ్చే ప్రవచనకర్త.. వీరి వారసుడు భరత్ గీతం యూనివర్సిటీ ప్రస్తుత అధ్యక్షుడు, టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్.. వెరసి అక్రమాల్లో గుగ్గురువు చంద్రబాబు బంధుగణంలోని ముఖ్యుడు.భరత్ కబ్జాకు నాటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబూ తనవంతు సహకారం అందించారు...ఇదంతా చూసిన తర్వాత...కబ్జాలు చేయడం, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టడమే ఎన్నికల్లో పోటీకి అర్హతగా నేటి రాజకీయాలు మారిపోయాయని విశాఖ వాసులు నవ్విపోతున్నారు...విద్య వినయం, సౌశీల్యం నేర్పుతుందంటారు.. ఈ భరతుడికి మాత్రం తాత, తండ్రి అక్రమాల వారసత్వాన్ని నేరి్పంది...ప్రభుత్వ భూమినే వరకట్న కానుకగా పొందిన ఈ కబ్జాదారుకు గత ఎన్నికలు ఓటమి గుణపాఠం నేర్పినా...ఆ పాఠాన్ని మరిచి మళ్లీ విశాఖ బరిలో టీడీపీ ఎంపీ అభ్యరి్థగా రంగంలోకి దిగుతున్నారు.సాక్షి, విశాఖపట్నం: తాత ఎంవీవీఎస్ మూర్తి ఉరఫ్ గోల్డ్‌స్పాట్ మూర్తి వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే.. దానిపై అక్రమాల అంతస్తులు కట్టేశాడో భరతుడు. తాతకు మించి నాలుగాకుల అక్రమాలు ఎక్కువే చదివాడు...బ్యాంకుల ఉదారత ఎలాంటిదంటే రుణా లు ఎగ్గొట్టే పెద్దోళ్లకే పిలిచి మరీ రుణాలిస్తుంటాయి.. గీతం సంస్థ పేరుతో బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టేందుకు భరత్ ప్రయత్నించారు. తాత కబ్జా వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చిన భరత్ నిజస్వరూపం తెలుసుకుని ఓసారి విశాఖపట్నం ప్రజలు తిరస్కరించినా.. ఇప్పుడు మళ్లీ ఏ మాత్రం సిగ్గుపడకుండా ఓట్లడిగేందుకు సిద్ధమయ్యారు... విశాఖపట్నం ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్న భరత్ అసలు స్వరూపమిదీ.అక్రమాల పునాదులపై ‘గీతం’.! గోల్డ్ స్పాట్ మూర్తి గీతం ప్రైవేటు కళాశాలను పెట్టి.. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తూట్లు పొడిచి.. గీతం విద్యాసంస్థను వర్సిటీగా విస్తరించారు. రెండుసార్లు ఎంపీగా పూర్తి పదవీకాలం పని చేసిన మూర్తి.. కేవలం సొంత గీతం కళాశాలకు, రక్తసంబం«దీకులైన బంధుగణానికి తప్పించి.. విశాఖ నగరానికి ఈ మంచి పని చేశాను.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చాను.. అనే ఒక్క పనీ చేయలేదనేది కళ్లెదుటే కనిపించే పచ్చి నిజం. తెలుగుదేశం పాలనలో ఆయన గీతం కళాశాల, తదనంతరం డీమ్డ్ యూనివర్శిటీ పేరిట చేసిన భూ ఆక్రమణల వ్యవహారాలు ఇప్పటికీ కోర్టుల్లో నలుగుతున్నాయి. ఆయన మనుమడు, టీడీపీ ఎంపీ అభ్యర్థి, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ అదే బాటలో వెళ్తున్నారు. ‘ఎల్కేజీ నుంచి పీజీ వరకు శ్రీలంక యూనివర్సిటీ 25 ఎకరాల్లోనే ఉంది. విశాఖలోని గీతం (గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్) యూనివర్సిటీకి వందల ఎకరాలు కావాలా? అని ఆ పారీ్టకి చెందిన అప్పటి రాష్ట్ర మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు గతంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. తొలుత పాతిక ఎకరాల్లో ఏర్పాటైన ఈ విద్యాసంస్థ ఆ తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటూ 110 ఎకరాల విస్తీర్ణంలో డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరింది. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం ఆనక ఎలినేషన్ చేసుకుంటూ వాటిని సొంతం చేసుకోవడం గీతం యాజమాన్యానికే చెల్లింది. సంస్థ ఆధీనంలో ఉన్న 35 ఎకరాల భూములను లీగల్‌గా కైవసం చేసుకునేందుకు అప్పటి కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ద్వారా 2012 మే 28న ఎలినేషన్ ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనను రెండేళ్ల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. అప్పట్లో సీసీఎల్ఏ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ ప్రతిపాదనను నిర్ద్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో ఉన్న ఈ భూములను అప్పటికే వివిధ అవసరాల నిమిత్తం భూములు కావాలని కోరిన ఆరు ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దళిత విద్యార్థుల కళాశాల, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నిర్మాణం, బలహీన వర్గాల గృహనిర్మాణం, అధికారులకు రెసిడెన్షియల్ క్వార్టర్స్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ ఇలా వివిధ ప్రభుత్వ అవసరాల కోసం ఈ భూములు కేటాయించారు. గీతం మూర్తి వాటినీ వదల్లేదు. వీటికి అదనంగా తమ అ«దీనంలో ఉన్న మరో 7.52 ఎకరాలను కలిపి తమ సంస్థకు కేటాయించాలని, ఈ మేరకు సిఫార్సు చేయాలని 2016లో జిల్లా కలెక్టర్ యువరాజ్‌పై ఒత్తిడి తెచ్చారు. యువరాజ్ బదిలీ అయిన తర్వాత గత కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు రావడమే తరువాయి వివిధ శాఖలకు కేటాయిస్తూ గత సీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆ భూములను గీతం సంస్థకే కట్టబెట్టేందుకు వీలుగా బాబు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ గజం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన ఎలినేషన్ ప్రతిపాదనలు పంపిన 42.52 ఎకరాల భూముల విలువ అక్షరాల రూ.514 కోట్ల పైమాటే. వీటన్నింటి గురించీ భరత్‌కు తెలుసు. అవి ఆక్రమిత భూములనీ తెలుç Üు. అయినా.. ఆ భూముల్ని తన కబంధ హస్తాల్లో ఉంచేసి.. కొత్తగా భవనాలు నిరి్మంచేందుకు పక్కా ప్లాన్ వేసి.. స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వా«దీనం చేసుకుంది. సర్వే నంబర్ 10, 17, ,30, 15, 16, 19, 20లో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణ వలయం ఏర్పాటు చేశారు. లేదంటే.. ఈ భరతుడు హాంఫట్ చేసేందుకు రెడీగా ఉన్నారు.కారు చౌకగా.. రూ.2 వేల కోట్ల భూమి... అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా.. అధికారం చేతిలో ఉంది కదా అని పెళ్లి కోసం ప్రభుత్వ స్థలాన్ని కట్నంగా కొట్టేసిన వరుడిగా భరత్ గుర్తింపు పొందారు. రూ.2 వేల కోట్ల విలువ చేసే భూమితో పాటు కట్నం కింద ఎంపీ టికెట్‌నూ పొందిన అల్లుడీయన. చంద్రబాబు, బాలకృష్ణ సహకారంతో భరత్.. ఈ దోపిడీని ఎంత పకడ్బందీగా చేశారంటే.. అధికారాన్ని అడ్డంగా ఉపయోగిస్తూ దందాను అధికారికంగానే సాగించేశారు. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో సర్వే నెంబర్ 93లో ఉన్న 498.9 ఎకరాల ప్రభుత్వ భూమిని భరత్‌కు చెందిన ఏబీసీ అనే ఫెర్టిలైజర్స్ కంపెనీకి కేవలం నామమాత్ర ధరకి కట్టబెట్టారు. ఎకరం రూ.80 వేల చొప్పున మొత్తం 500 ఎకరాలు కూడా కేవలం రూ.4 కోట్లకి కట్టబెట్టారు. జయంతిపురంలో భరత్‌కు ఇచి్చన 500 ఎకరాలకు డిమాండ్ పెంచడానికి ఏకంగా ఆ ప్రాంతం మొత్తాన్ని రాజధాని ఏపీసీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబర్లో చంద్రబాబు ఏకంగా జీవోనే జారీ చేసేశారు. భరత్ సంస్థకు భూముల్ని కట్టబెట్టిన కేవలం నెల రోజుల్లోనే జీవో. 207 తీసుకొచ్చి జయంతిపురంలో ఇచ్చిన స్థలం మొత్తాన్ని ఈ జీవో ద్వారా సీఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. కేవలం ఎకరం రూ.80 వేలకు కట్టబెట్టిన స్థలం సీఆర్డీఏ పుణ్యాన ఈ రోజు ఎకరం రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ పెరిగిపోయింది. ప్రస్తుత మార్కెట్ విలువ 500 ఎకరాలకు గాను రూ.2 వేల కోట్ల పై చిలుకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.బ్యాంకులకీ కన్నం వేసేద్దామని.! విద్యావంతుడిగా బిల్డప్ ఇచ్చే భరత్.. రుణాలు ఎగ్గొట్టడంలోనూ సిద్ధహస్తుడే. రుణాల బకాయిలు ఎగవేసిన కారణంగా భరత్ తండ్రి పట్టాభి రామారావు సహా ఇతర కుటుంబీకుల ఆస్తుల జప్తునకు హైదరాబాద్ అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంకు 2020 ఫిబ్రవరిలో నోటీసులు జారీ చేసింది. టెక్నో యూనిక్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న పట్టాభిరామారావుతో పాటు ఆయన తండ్రి, గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎంవీవీఎస్ మూర్తి కుటుంబీకులు తీసుకున్న రుణం అసలు, వడ్డీ కలిపి రూ.124,39,21,000గా తేల్చింది. జనవరి 21, 2020లోగా చెల్లించాలని బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు వారు స్పందించకపోవడంతో రుణం కోసం విశాఖ జిల్లా గాజువాక మండలం, భీమిలి మండలంలో తాకట్టు పెట్టిన భూములను, విశాఖ నగరం దొండపర్తి ప్రాంతంలోని ఆస్తులను స్వా«దీనం చేసుకుని వేలం వేస్తామంటూ జప్తు నోటీసులు జారీ చేసింది. 2019 అక్టోబర్‌లో భరత్ సహా 11 మంది ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు విశాఖ నగరంలోని ఆంధ్రా బ్యాంకు సీతమ్మధార బ్రాంచ్ డిఫాల్టర్ నోటీసు జారీ చేసింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద మెసర్స్ వీబీసీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం తీసుకున్న రుణం ఎగవేయడంతో అప్పట్లో ఆంధ్రాబ్యాంక్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. భరత్‌కు చెందిన సంస్థ మొత్తం రూ.13,65,69,000 బాకీ పడిందని పేర్కొంది. ఇలా బ్యాంకుల డిఫాల్టర్ భరత్.. విశాఖ ఎంపీ విషయంలోనూ డిఫాల్టరే... అంటూ 2019లో ప్రజలు తీర్పునిచ్చారు.ఏం మొహం పెట్టుకుని ఓట్లడుగుతావ్ భరత్..?2019లో కట్నం కింద విశాఖ ఎంపీ టికెట్ దక్కించుకున్న భరత్.. నిజస్వరూపాన్ని ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ ప్రజలు గమనించారు. ఎన్నికల ముందే తన తాత పవిత్రమైన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని దయ్యాల కొంప అంటూ పొగరుతో మాట్లాడినప్పుడు విద్యావేత్తగా చెప్పుకునే భరత్ కనీసం నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది. ఎందరో మహానుభావుల్ని అందించిన విశ్వవిద్యాలయాన్ని నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేసినా స్పందించని భరత్ ఒక విద్యావంతుడా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం ఖండించని భరత్‌ని విశాఖ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ‘గీతం’ కే పరిమితం చేసేశారు. రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్న చంద్రబాబు అండ్ కో బ్యాచ్‌తో మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి ఎంపీగా గెలిచి.. ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న రూ.వందల కోట్ల భూముల్ని తిరిగి కబ్జా చేసుకోవాలన్న కుట్రతో భరత్ ప్రయతి్నస్తున్నారు. ఇలాంటి దోపీడీ దారులకు ఓటు వేస్తే.. విశాఖ భవిష్యత్తు నాశనం చేసి.. ఉన్న భూములన్నీ మనవడి పేరున, మనవరాలి కట్నం కోసం ధారాదత్తం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వైజాగ్‌వాసులు దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం విశాఖ ప్రజల్ని దోచుకోవడానికే ఈ కుటుంబం పుట్టిందన్నట్లుగా దోపిడీ పర్వం సాగుతోందని భరత్ వ్యవహారశైలిపై పలువురు విమర్శిస్తున్నారు.భరత్‌పై కేసులు భరత్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోని గీతం క్యాంపస్‌లో విద్యార్థుల భద్రతపై సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే తన కుమారుడు బ్రహ్మసాయిరెడ్డి ఆరో అంతస్తుపై నుంచి పడి మృతి చెందాడనీ.. దీనికి కారణం గీతం అధినేత భరత్ నిర్లక్ష్యమేనని దాసరి వెంకట శివారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై 2024లో బెంగళూరులోని దొడబళ్లాపుర పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 304(ఏ) కింద భరత్‌పై కేసు నమోదైంది. అదేవిధంగా.. బెంగళూరు గీతం క్యాంపస్ నిర్మాణం పూర్తయినా డబ్బులు చెల్లించడం లేదంటూ ఎంఎస్ రామయ్యా ప్రై.లిమిటెడ్‌సంస్థ భరత్‌పై దొడబళ్లాపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భరత్‌పై 506, 379,380, 420,448, 323, 506(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేశారు. -
రజతం నెగ్గిన రాధిక
బిషె్కక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. రాధిక (68 కేజీలు) రజత పతకం సొంతం చేసుకోగా... శివాని పవార్ (50 కేజీలు), ప్రియా (76 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 68 కేజీల విభాగం ఫైనల్లో రాధిక 2–15తో నొనోకా ఒజాకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకాల బౌట్లలో శివాని 9–7తో ఒట్గాన్‌జర్గాల్ డొల్గొర్‌జవ్ (మంగోలియా)పై, ప్రియా 4–2తో ఎల్మీరా సిద్జికోవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. 59 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ పుష్పా యాదవ్ 8–11తో డయానా కయుమోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
భారతదేశంలోని ప్రముఖ మసీదులివే..
దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. మనదేశంలో ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని మసీదులు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ మసీదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జామా మసీదు, ఢిల్లీ జామా మసీదు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రసిద్ధ మసీదులలో ఒకటి. 1956లో షాజహాన్ నిర్మించిన ఈ మసీదులో సుమారు 25 వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేయవచ్చు. ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో నిర్మితమైన ఈ మసీదు మీనార్ 135 అడుగుల ఎత్తు కలిగివుంది. మక్కా మసీదు, హైదరాబాద్ దేశంలోని పురాతన, అతిపెద్ద మసీదులలో ఇది ఒకటి. మక్కా మసీదు 1694లో మక్కా నుండి తెచ్చిన మట్టి, ఇటుకలతో నిర్మితమయ్యింది. 75 అడుగుల ఎత్తైన ఈ మసీదులో ఒకేసారి 10 వేల మంది కూర్చునే అవకాశం ఉంది. ఈ మసీదు చౌమహల్లా ప్యాలెస్, లాడ్ బజార్, చార్మినార్ తదితర చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉంది. తాజ్-ఉల్-మసీదు, భోపాల్ తాజ్-ఉల్-మసీదు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద, అందమైన మసీదుగా పేరుగాంచింది. ఈ మసీదును ‘మసీదుల కిరీటం’ అని కూడా పిలుస్తారు. లక్ష మందికి పైగా జనం ఈ మసీదులో కూర్చుని ప్రార్థనలు చేయవచ్చు. జామియా మసీదు, శ్రీనగర్ శ్రీనగర్‌లో ఉన్న జామియా మసీదు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటి. దీనిలో ఒకేసారి 33 వేల మంది ప్రార్థనలు సాగించవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లోని పాత శ్రీనగర్‌లో ఈ మసీదు ఉంది. బడా ఇమాంబర, లక్నో 1784లో అవధ్ నవాబ్ నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి మూడు లక్షల మందికి పైగా జనం ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మసీదుగా గుర్తింపు పొందింది. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. జామా మసీదు, ఆగ్రా యూపీలోని ఆగ్రా కోటకు ఎదురుగా ఉన్న ఈ జామా మసీదు దేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటిగా పేరొందింది. దీనిని ఫ్రైడే మసీదు అని కూడా పిలుస్తారు. ఈ మసీదు ఎర్ర ఇసుకరాయి, తెల్లని పాలరాయితో నిర్మించారు. -
భారత్‌లో ‘మినీ లండన్’? వేసవి విడిది ఎందుకయ్యింది?
‘మెక్‌క్లస్కీగంజ్’.. భారత్‌లోని ‘మినీ లండన్’గా పేరుగాంచింది. పచ్చని చెట్లు, అందమైన పర్వతాల నడుమ ఈ ప్రాంతం ఉంది. వేసవిలో పర్యాటకులు సేదతీరేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుంది? దీనికి ‘మినీ లండన్’ అనే పేరు ఎందుకు వచ్చిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జార్ఖండ్ రాజధాని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో పర్వతాలపై ‘లండన్ గ్రామం’గా పేరొందిన మెక్‌క్లస్కీగంజ్ ఉంది. దీనిని ‘ఇంగ్లీష్ గ్రామం’ అని కూడా పిలుస్తారు. పచ్చదనంతో పాటు ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. వేసవిలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరినప్పుడు దేశంలోని పలువురు పర్యాటకులు మెక్‌క్లస్కీగంజ్ వచ్చి సేదతీరుతుంటారు. ఇక్కడి సహజ వాతావరణం పర్యాటకులకు ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడకు చేరుకోవడానికి వంకరగా ఉండే రోడ్లు దూరం నుంచి అద్భుతంగా కనిపిస్తాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మరో లోకానికి తీసుకువెళుతుంది. ఇక్కడ డేగా డేగి నది ఉంది. ఈ నది ఒడ్డున పర్యాటకులు యోగాను అభ్యసిస్తుంటారు. మెక్‌క్లస్కీగంజ్ నాడు బ్రిటిష్ వారి వేసవి విడిది. బ్రిటీష్ పాలకులు ఇక్కడ బంగ్లాలు నిర్మించారు. ఇప్పుడివి శిథిలావస్థలో ఉన్నాయి. పర్వతాలతో కూడిన ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాక మళ్లీమళ్లీ ఇక్కడకు రావాలని అనిపిస్తుందని పలువురు పర్యాటకులు చెబుతుంటారు. నేటికీ కొందరు ఆంగ్లో-ఇండియన్లు మెక్‌క్లస్కీగంజ్‌లో నివసిస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులతో తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ‘లిటిల్ ఇంగ్లాండ్ ఆఫ్ ఇండియా’ పర్యాటకులు మెచ్చిన ప్రాంతంగా పేరొందింది. -
బంధు ప్రీతితోనే ఎంపీ సీటు కేటాయించిన చంద్రబాబు
-
రాజమండ్రిలో వైద్యసేవలందించేందుకు సిద్ధమవుతోన్న ESI హాస్పిటల్
-
బాబు పరువు తీసిన మోడీ మార్గాన్ని భరత్ కామెంట్స్
-
ఇటానగర్‌లో వీక్షిత్ భారత్ వీక్షిత్ నార్త్ ఈస్ట్ ప్రోగ్రామ్
-
ప్రగతి మైదానం ఇకపై ‘భారత్ మండపం’
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ను ఇకపై ‘భారత్ మండపం’గా పిలువనున్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) ఈ కాంప్లెక్స్‌కు ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టింది. ‘భారత్ మండపం’ పేరుతో జీ-20 శిఖరాగ్ర సమావేశం గతంలో ఇక్కడ జరిగింది. దీనిని అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలకు కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రగతి మైదాన్‌ను ‘భారత్ మండపం’ అని పేర్కొంటూ ఐటీపీఓ తన వెబ్సైట్లోనే కాకుండా ప్రవేశ ద్వారాల వద్ద కూడా ఈ రాయించింది. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి ప్రగతి మైదాన్ అని నామకరణం చేశారు. అదే సంవత్సరం ఇందిరా గాంధీ ప్రారంభించిన ఆసియా- 72 ప్రదర్శన ఇక్కడ జరిగింది. అప్పటి నుండి ప్రగతి మైదాన్ జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మారింది. ఐటీపీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రగతి మైదాన్ క్యాంపస్‌కు భారత్ మండపం అని నామకరణం చేశామన్నారు. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్. మరొకటి వివిధ ఎగ్జిబిషన్ హాల్స్. ఈ పేరు మార్పు 38వ అంతర్జాతీయ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్-2024తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు, ఆహ్వాన పత్రికలు, టిక్కెట్లు, పాస్‌లు ఇలా ప్రతిదానిలో ప్రగతి మైదాన్ అని కాకుండా భారత్ మండపం అని ముద్రించారు. -
దస్తగిరి చెప్పేవన్ని అబద్ధాలే
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి చెప్పేవన్ని పూర్తి అవాస్తవాలని.. హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌యాదవ్ సమీప బంధువు భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెబుతూ రౌడీయిజం, గూండాయిజం, సెటిల్మెంట్లు ఎలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అతను చేసిన దుర్మార్గపు పనిని గొప్పగా చెప్పుకుంటూ సమాజంలో రౌడీయిజంతో హల్చల్ చేస్తున్నాడన్నారు. ఉన్నతమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ అబద్ధపు మాటలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. నిజాన్ని కప్పిపుచ్చి దస్తగిరితో వెనుక ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. గతంలో సునీల్‌యాదవ్, దస్తగిరిలు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో తనను సంప్రదించేవారని.. అప్పట్లో ఐస్ బండి వ్యాపారం చేస్తూ అప్పులతో ఉన్న దస్తగిరి ఇప్పుడు విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నాడని భరత్‌యాదవ్ ప్రశ్నించారు. తనకు కూడా డబ్బులు బాకీ ఉన్న దస్తగిరి తననూ దూషించాడన్నారు. వివేకా రెండో భార్య అయిన షమీమ్‌కు ఆస్తి పోతుందనే ఈ హత్య జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఈ హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించాడన్నారు. అతను వెనుక ఉండి ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిల ద్వారా హత్య చేయించాడన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే అసలు విషయాలు వెల్లడి.. ఈ హత్యలో ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే పూర్తి విషయాలు బయటపడతాయని భరత్‌యాదవ్ చెప్పారు. తనకు సునీల్‌యాదవ్ రూ.16 లక్షలు ఇవ్వాలని, అప్పట్లో తాను డబ్బుల విషయం అడిగితే రాజశేఖర్ సార్ ఇవ్వాలని, డబ్బులు వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పేవాడన్నారు. అలాగే, డబ్బుల విషయమై ఒకసారి ఎర్రగంగిరెడ్డి కూడా నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడికీ పోవు, త్వరలోనే వస్తాయని తనతో చెప్పేవాడన్నారు. దస్తగిరి, దస్తగిరి భార్య ఎవరితో మాట్లాడుతున్నారో వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భరత్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. అసలు సునీతమ్మ తన తండ్రిని చంపిన దస్తగిరి కోసం ఎందుకు ఆరాటపడుతోందో ఆమెకే తెలియాలన్నారు. గతంలో తనను సీబీఐ ఎంక్వైరీకి పిలిచినప్పుడు అన్ని విషయాలు వారికి తెలిపానని, అయినా కూడా వారు తాను చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే ఈ కేసులో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్ర బయటపడుతుందని భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. -
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. భవిష్యత్ వెల్లడించిన మోదీ
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ఫిబ్రవరి 1 మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టిన సమయంలో వికసిత భారత్ గురించి ప్రస్తావించారు. ఇవాళ జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సంబంధించిన విజన్ ఇండియా డాక్యుమెంట్‌ను మోదీ సమర్పించినట్లు సమాచారం. ప్రణాళికలు పౌరులకు సాధికారత కల్పించడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడంపై ఆధారపడి ఉంటుంది. 25 ఏళ్ల ప్రణాళికలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా టెక్నాలజీ, ఆవిష్కరణల పరంగా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. 2021 డిసెంబర్ నుంచి జనవరి 2024 వరకు మంత్రిత్వ శాఖలలో జరిగిన సమావేశాల తర్వాత విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మంత్రులు, శాఖల కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాని గంటపాటు మాట్లాడారు. భవిష్యత్ సాంకేతికతల కోసం బడ్జెట్లో ఒక లక్ష కోట్లు కేటాయించడం, ఆవిష్కరణలో భారతదేశం ముందుంటుందనే ఆలోచనలు కూడా ఇందులో ప్రధానమని తెలుస్తోంది. వికసిత్ భారత్ సెమినార్లను ప్రతి శాఖ ఎజెండాలో చేర్చాలని, అంతే కాకుండా తమ ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ వంటి వ్యాపార సంస్థలు కూడా దీనిపై చర్చలు ప్రారంభించాలని కోరారు. -
ఢిల్లీలో భారత్ టెక్స్టైల్ ఎక్స్పో 2024
-
చంద్రబాబు తీరును తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 850 ఎకరాలు.. కారుచౌక ధరకు.. అదీ హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతం గచ్చిబౌలో.. ఒక్క రోజులో చకచకా అనుమతులిచ్చేశారు. కంపెనీ ఏర్పాటైన 5 రోజులకే రూ.వేల కోట్ల విలువైన భూమి అప్పగించేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)’కు 850 ఎకరాలు కేటాయించేలా చంద్రబాబు సర్కారు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. వెంటనే 400 ఎకరాలను సేల్‌డీడ్ ద్వారా ధారాదత్తం చేసేసింది. క్రీడా మౌలిక వసతుల కల్పన కోసం అంటూ 2003లో నాటి చంద్రబాబు నాయుడి సర్కారు చేసిన నిర్వాకంలో... ప్రభుత్వ పెద్దల తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఏకపక్షంగా అంత భూమిని అప్పగించడంలో ప్రభుత్వంలోనూ దోషులున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2006లో సేల్‌డీడ్‌ను రద్దు చేయటాన్ని కోర్టు ప్రస్తావిస్తూ... భూములను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దీనికి కారకులైన అధికారులు, నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నాడు ప్రభుత్వం భూముల కేటాయింపును రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ 2006లో బిల్లీరావు వేసిన పిటిషన్, ఇతర పిటిషన్లపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఏ.సుదర్శన్‌రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. 5 రోజులకే 850 ఎకరాలు... ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర(చంద్రబాబు) ప్రభుత్వం 2003 ఆగస్టు 9న 850 ఎకరాలు కేటాయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది. విచిత్రమేంటంటే.. అంతకు కేవలం 5 రోజుల ముందే 2003, ఆగస్టు 5న కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి ఎలాంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండా బంజారాహిల్స్ నుంచి శిల్పారామం మార్గంలోని మాదాపూర్ పరిధిలోకి వచ్చే రూ.వేల కోట్ల విలువైన ప్రజల భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది. యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు నాటి ముఖ్యమంత్రి(చంద్రబాబు)తో కలిపి 6 దశల ఐఎంజీబీ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒక్కరోజులోనే అన్ని అనుమతులు జారీ చేశారు. 2003, నవంబర్ 14న అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయడం గమనార్హం (అంటే.. అసెంబ్లీ రద్దుకు 3 నెలల ముందు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు). 2004, ఫిబ్రవరి 10న 400 ఎకరాల భూమిని ఐఎంజీబీకి అప్పగిస్తూ సేల్ డీడ్ చేశారు. అయితే ఏ అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేని ఐఎంజీ భారత్‌కు రూ.వేల కోట్ల భూముల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం 2006లో కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఐఎంజీ భారత్‌తో ఎంవోయూను, సేల్‌డీడ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది’ అని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. -
గంటా ఉన్నా లేకున్నా నేనుంటా.: భరత్
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల సంచార జీవి.. కనీసం ఏనాడైనా ప్రజలకు ముఖం చూపించాడా?.. ఈ కామెంట్లు బయట జనాలు కాదు.. సొంత పార్టీ టీడీపీలోనే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, గంటాను తీవ్రంగా అవమానించాడనే చర్చ నడుస్తోంది. అదీ నారా లోకేష్ సమక్షంలోనే కావడం గమనార్హం!. విశాఖ పర్యటనలో భాగంగా శంఖారావం సభ సాక్షిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తీవ్ర అవమానం ఎదురైంది. టీడీపీ నాయకుడు నారా లోకేష్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బిర్లా జంక్షన్ వద్ద సోమవారం నిర్వహించిన శంఖారావం సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సభలో టీడీపీ విశాఖ పార్లమెంట్ ఇన్చార్జి, లోకేష్ తోడల్లుడు భరత్ .. గంటాపై ప్రత్యక్షంగానే విమర్శలు గుప్పించారు. ఇక్కడ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీకు అందుబాటులో లేకపోయినా మేం అండగా ఉంటామని చెప్పారు. ప్రజల సమస్యలను తీర్చుతామంటూ వేదికపైనే గంటా సమక్షంలోనే వ్యాఖ్యలు చేశారు. దీంతో గంటా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వేదికపై ఉన్న నేతలతో పాటు కార్యకర్తలు సైతం భరత్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ, ఉత్తర నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలు మాత్రం భరత్ వ్యాఖ్యలు సమంజసమైనవేనని చర్చించుకోవడం కొసమెరుపు. ఇప్పటికే క్యాడర్లో గంటాపై పూర్తిగా విశ్వాసం పోయింది. మరోవైపు ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జిగా తమకు బాధ్యతలు అప్పగించాలంటూ ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత స్వయంగా గంటాకే వినతిపత్రం అందించారు. ఈ వ్యవహారం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పరిణామాలన్నీ చూస్తుంటే.. గంటాపై ఉత్తర నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం గుర్రుగా ఉన్నట్లు అర్థమవుతోంది. -
ఎల్పీజీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి?
దేశంలోని దాదాపు ప్రతి ఇంటిలోనూ వంటగ్యాస్ అంటే ఎల్పీజీ కనెక్షన్ ఉంది. గ్రామాల్లో కూడా మట్టి పొయ్యిలకు బదులు గ్యాస్ స్టవ్‌లు వినియోగిస్తున్నారు. అయితే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించిన తర్వాత వంటగ్యాస్ వినియోగం మరింతగా పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య 32 కోట్లకు పైగా పెరిగింది. గత ఐదేళ్లలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి నాలుగు శాతం పెరిగింది. అయితే వినియోగం 22 శాతం మేరకు పెరిగింది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్యాస్‌ను ప్రభుత్వం దిగుమతి చేస్తోంది. గత ఐదేళ్లలో ఎల్పీజీ దిగుమతులు 60 శాతం మేరకు పెరిగాయి. భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ నుండి గ్యాస్ సరఫరా అవుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అందించిన డేటా ప్రకారం గత కొన్నేళ్లుగా భారత్.. అమెరికా నుంచి కూడా గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. ఇలా ఎల్పీజీ దిగుమతులు పెరిగిన కారణంగానే వాటి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. భారతదేశంలో 90 శాతం ఎల్పీజీ గృహ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. మిగిలిన మొత్తం పారిశ్రామిక, వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారు. దేశంలో ఎల్పీజీ వినియోగంలో 13 శాతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఇది మహారాష్ట్రలో 12 శాతం మేరకు ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. -
జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు
రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. -
పుల్వామా దాడికి ఐదేళ్లు... ఆ రోజు ఏం జరిగింది?
2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్‌పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 14న పాక్ ఎటువంటి దాడికి పాల్పడిందో, దానికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇప్పుడొకసారి గుర్తుచేసుకుందాం. ఐదేళ్ల క్రితం ఇదేరోజున సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్‌లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. 2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్తాన్ సైన్యం దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సైనికులు ‘మిగ్-21’ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్నారు. 2019, మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ అప్పటివరకూ పాక్‌తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు మనీలాండరింగ్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)ను కూడా భారత ప్రభుత్వం కోరింది. -
ఏడాదిలో భారత్- యూఏఈ బంధం ఎలా బలపడింది?
ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం(ఫిబ్రవరి 13) యూఏఈ చేరుకోనున్నారు. ఫిబ్రవరి 14న అబుదాబిలో నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. కాగా గత ఏడాది కాలంలో భారతదేశం- యూఎఈ మధ్య సంబంధాలలో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. అనేక అంశాల్లో కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. గడచిన ఏడాదిలో రెండు దేశాల మధ్య ఐదు ఉన్నత స్థాయి పర్యటనలు జరిగాయి. ప్రధాని మోదీ జూలై 2023లో ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం యూఏఈ వెళ్లి, అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను అబుదాబిలో కలిశారు. దుబాయ్‌లో కాప్-28లో పాల్గొంటున్నప్పుడు కూడా అంటే గత ఏడాది నవంబరు 30 ప్రధాని మోదీ యూఏఈ సందర్శించారు. అప్పుడు ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, వైస్ ప్రెసిడెంట్‌ను కలుసుకున్నారు. భారతదేశ మద్దతుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్‌లో సభ్యదేశంగా చేరింది. వాణిజ్య రంగంలో కూడా ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊపందుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం రూపాయి, దిర్హమ్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ భారతదేశంలో 3.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించింది. 2024, జనవరి 10న యూఎఈ అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ గుజరాత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. 2026-39 వరకు అంటే 14 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం కింద 1.2 ఎంఎంటీ ఎల్ఎన్జీ కొనుగోలు చేయడానికి ఐఓసీఎల్, ఏడీఎన్ఓసీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇది భారత్, యూఏఈ మధ్య కుదిరిన మొదటి దీర్ఘకాలిక ఒప్పందం. తాజాగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ) గ్యాస్ గెయిల్ ఇండియాకు సంవత్సరానికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు 10 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో గత ఏడాది కాలంలో రెండు దేశాల మధ్య ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. 2024 జనవరిలో భారత్-యూఎఈల ద్వైపాక్షిక సైనిక కసరత్తు రాజస్థాన్‌లో జరిగింది. 2024, జనవరి 21న భారత్- యూఏఈ, ఫ్రాన్స్‌ల వైమానిక దళాలతో కూడిన ఎక్సర్సైజ్ డెసర్ట్ నైట్ యూఏఈలోని అల్ దఫ్రా విమానాశ్రయంలో జరిగింది. ఇటీవల ఎడ్జ్, హెచ్‌ఏఎల్‌లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం క్షిపణి వ్యవస్థల ఉమ్మడి రూపకల్పన, అభివృద్ధితో సహా సహకార రంగాలలో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోనున్నాయి. -
‘అక్కడి నుంచి బయటపడండి’ మయన్మార్‌లోని భారతీయులకు హెచ్చరిక!
మయన్మార్‌లోని రఖైన్ ప్రావిన్స్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితిలో అక్కడున్న భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు అక్కడి నుండి బయటపడాలని భారత్ కోరింది. రఖైన్ ప్రావిన్స్ సురక్షితంగా లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, ల్యాండ్లైన్లతో సహా టెలికమ్యూనికేషన్‌కు అంతరాయం, నిత్యావసర వస్తువుల కొరత తదితర కారణాల దృష్ట్యా భారతీయ పౌరులెవరూ రఖైన్ రాష్ట్రానికి వెళ్లవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయ పౌరులు వెంటనే ఆ రాష్ట్రం విడిచి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. 2021, ఫిబ్రవరి ఒకటి నుంచి మయన్మార్‌లో అస్థిరత నెలకొంది. సైనిక తిరుగుబాటులో దేశ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పలు హింసాత్మక నిరసనలు జరిగాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మయన్మార్‌లో నెలకొన్న అస్థిరత మన దేశంపై ప్రభావం చూపబోతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మయన్మార్ మన పొరుగు దేశం కావడంతో అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నామన్నారు. భారతదేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులు మయన్మార్‌తో అనుసంధానమై ఉన్నాయి. భారతదేశం, మయన్మార్లు దాదాపు 1,640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. -
నేటి నుంచి మార్కెట్లోకి ‘భారత్ రైస్’
కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్‌ను ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. బియ్యం ధరల తగ్గింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలలో గణనీయమైన తగ్గింపు లేదు. నిత్యావసరాల ధరలు ప్రస్తుతం 14.5 శాతం మేరకు పెరిగాయి. భారత్ రైస్ నేటి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని చైన్ రిటైల్‌లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో రూ.29కి లభ్యమయ్యే భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల బస్తాలలో లభించనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తొలుత భారత్ బ్రాండ్ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ను 2023, నవంబరు 6న ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బయటి మార్కెట్లో కిలో రూ. 35 ఉండగా, ప్రభుత్వం రూ.27.50కే అందిస్తోంది. అదే సమయంలో పప్పులు కిలో రూ.60కి అందుబాటులోకి వచ్చాయి. -
పాక్, ఇరాన్ దోస్తీ ఎందుకు చెడింది? భారత్‌కు ఏం దక్కింది?
పాకిస్తాన్, ఇరాన్‌లు స్నేహపూర్వక సంబంధాలు కలిగిన దేశాలు. ఈ రెండూ ముస్లిం దేశాలు కావడంతో ఈ సంబంధం మరింత బలపడింది. 1965, 71లో భారత్-పాక్ యుద్ధ సమయంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు పూర్తి సాయం అందించింది. పలు అంతర్జాతీయ ఫోరమ్‌లలో కూడా, ఇరాన్.. భారత్‌ను వ్యతిరేకించి, పాకిస్తాన్‌కు మద్దతునిచ్చింది. ఇప్పుడు ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారడానికి కారణం ఏమిటి? పాకిస్తాన్‌పై ఇరాన్ వైమానిక దాడి నేపధ్యంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడటానికి కారణమేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే సమయంలో పాకిస్తాన్‌కు మిత్రదేశంగా ఉన్న ఇరాన్.. భారత్‌తో ఎందుకు సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది? 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగినప్పుడు పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య స్నేహంలో చీలిక ఏర్పడింది. దీని తరువాత ఆఫ్ఘన్ జిహాద్ సమయంలో పాకిస్తాన్ సౌదీ ప్రేరణతో వహాబీ ఇస్లాం వైపు మొగ్గు చూపింది. ఇక్కడి నుంచే ఇరు దేశాల మధ్య అపార్థాలు పెరగడం మొదలైంది. పాకిస్తాన్ జనాభాలో అధికశాతంలో సున్నీ ముస్లింలు ఉన్నారు. ఇరాన్లో షియా ముస్లింల సంఖ్య అధికంగా ఉంది. షియా.. సున్నీ గ్రూపులు రెండూ ముస్లిం మతానికే చెందినవైనప్పటికీ వారి నమ్మకాలు, సిద్ధాంతాలలో తేడా ఉంది. సాధారణంగా సున్నీలను ఫండమెంటలిస్టులుగా పరిగణిస్తారు. షియా ముస్లింలను మితవాదులని అంటారు. కొన్ని శతాబ్దాల క్రితం ఇస్లాం స్థాపకుడు ప్రవక్త మహమ్మద్‌ను షియా ముస్లింలు హత్య చేసిన దరిమిలా షియా.. సున్నీ ముస్లింల మధ్య వివాదం మొదలైంది. విభజన సమయంలో.. 1947 ఆగస్టు 14న భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్‌ను ఒక దేశంగా గుర్తించిన మొదటి దేశం ఇరాన్. ఈ రెండు దేశాలు భౌగోళికంగా దగ్గరి అనుసంధానంతో 990 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. 1947 తరువాత ఇరాన్, పాకిస్తాన్ మధ్య పలు స్నేహపూర్వక ఒప్పందాలు కుదిరాయి. ఇరాన్లో పాకిస్తాన్ తన తొలి రాయబార కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. భారత్- పాక్ యుద్ధ సమయంలో.. 1965లో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ అనేక బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ సామగ్రిని పాకిస్తాన్‌కు అందించింది. ఈ ఉదంతాన్ని చూస్తే పాకిస్తాన్, ఇరాన్ మధ్య స్నేహాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు పూర్తిస్థాయిలో దౌత్య, సైనిక మద్దతు ఇచ్చింది. అంతే కాదు బలూచ్‌లు పాకిస్తాన్‌పై తిరుగుబాటును ప్రారంభించినప్పుడు, బలూచ్‌ల నిరసనను అణచివేయడంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు సహాయం చేసింది. ప్రతిఫలంగా పాకిస్తాన్ అణు శాస్త్రవేత్తలు ఇరాన్లో అణు కార్యక్రమాలను అభివృద్ధి చేయడంలో సహకరించారు. షియా, సున్నీల అంతర్గత పోరు 1990వ దశకంలో పాకిస్తాన్లో షియా, సున్నీల మధ్య అంతర్గత పోరు ఊపందుకున్నప్పుడు, ఇరాన్ షియాలను రెచ్చగొడుతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మొదలైంది. దీనికితోడు లాహోర్‌లో ఇరాన్ దౌత్యవేత్త సాదిక్ గంజి హత్య, 1990లో పాకిస్తాన్-ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను దారుణంగా హతమార్చడం వంటివి ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్, ఇరాన్‌ల వైరుధ్య విధానాలు కూడా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణంగా నిలిచాయి. పాకిస్తాన్ నిరంతరం తాలిబాన్‌కు మద్దతు పలుకుతుంటుంది. ఈ నేపధ్యంలో ఇరాన్.. పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014లో ఐదుగురు ఇరాన్ సైనికులను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఉల్-అద్ల్ కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఇరాన్.. పాక్‌పై సైనిక చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఉద్రిక్తంగా పాక్- ఇరాన్ సంబంధం నిపుణుల అభిప్రాయం ప్రకారం 2021 నుండి పాకిస్తాన్-ఇరాన్ సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పలు ఒప్పందాలు, సంయుక్త సైనిక విన్యాసాలపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యం కూడా పెరగడం ప్రారంభమైంది. దీనికితోడు ఈ రెండు దేశాలు విద్యుత్ పంపిణీ లైన్‌ను ప్రారంభించాయి. 2023లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటించారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులపై పట్టు బిగించలేకపోయింది. అయితే ఇటీవల ఇరాన్లో జరిగిన ఉగ్రదాడిలో పాక్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో పాకిస్తాన్‌పై ఇరాన్ ఆకస్మిక దాడి చేసింది. దీంతో పాకిస్తాన్-ఇరాన్ సంబంధాలు తిరిగి ఉద్రిక్తంగా మారాయి. బలపడిన భారత్- ఇరాన్ బంధం పాకిస్తాన్, ఇరాన్ మధ్య సంబంధాలు క్షీణించిన తరువాత, భారత్, ఇరాన్ మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. 2001లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇరాన్లో పర్యటించి, పలు కీలక ఒప్పందాలు చేసుకున్న దరిమిలా భారత్-ఇరాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. అటల్ తరహాలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2016లో ఇరాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో 12కి పైగా కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాత 2018లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ భారత్‌కు వచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలో ధృడత్వం ఏర్పడింది. 2022 సంవత్సరంలో మొదటిసారిగా సమర్కండ్లో ప్రధాని మోదీ..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కలుసుకున్నప్పుడు భారత్-ఇరాన్ సంబంధాల బలోపేతాన్ని అన్ని దేశాలు చూశాయి. -
100 శాతం ముస్లింలున్న దేశం ఏది?
ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న మతం ఇస్లాం . 2070 నాటికి ఇస్లాంను అనుసరించే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉండనున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2015తో పోలిస్తే 2060 నాటికి, మొత్తం ప్రపంచ ముస్లింల జనాభా 70 శాతం మేరకు పెరగనుంది. భారతదేశానికి పక్కనే ఉన్న మాల్దీవుల జనాభాలో 100 శాతం ముస్లింలు ఉన్నారు. అదే విధంగా ఆఫ్రికన్ దేశమైన మారిషస్‌లో 100 శాతం ముస్లిం జనాభా ఉంది. ట్యునీషియా మొత్తం జనాభాలో 99.8 శాతం మంది ముస్లింలు. సోమాలియా జనాభాలో 99 శాతం మంది ముస్లింను అనుసరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో కూడా 99 శాతం మంది ఇస్లాంను అనుసరిస్తున్నారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశాల విషయానికొస్తే ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. మాల్దీవులను పన్నెండవ శతాబ్దం వరకు హిందూ రాజులు పరిపాలించారు. తరువాతి కాలంలో ఇది బౌద్ధమతానికి కేంద్రంగా మారింది. తమిళ చోళ రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత మెల్లగా మాల్దీవులు ముస్లిం దేశంగా మారడం మొదలైంది. మాల్దీవుల అధికారిక మతం ఇస్లాం. ముస్లిమేతరులు ఎవరూ మాల్దీవులలో పౌరసత్వం పొందలేరు. ముస్లిం జనాభాలో ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ముస్లింల సంఖ్య 23 కోట్లకు పైగా ఉంది. గత జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభా 18,68,90,601 కాగా, అందులో 18 కోట్ల 25 లక్షల 92 వేల మంది ముస్లింలు. పాకిస్తాన్లో హిందువుల సంఖ్య దాదాపు 22,10,000 కాగా, 74 వేలకు పైగా సిక్కులు ఉన్నారు. క్రైస్తవులు దాదాపు 18 లక్షల 73 వేలు, అహ్మదీలు 1,88,340. పార్సీలు దాదాపు 4000 మంది ఉన్నారు. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్‌లో ముస్లింల జనాభా 20 కోట్లకు పైగానే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 17.22 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో 14.2 శాతం. ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్న దేశాలలో భారత్ ఒకటి. బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ ముస్లిం జనాభా 15 కోట్లకు పైగానే ఉంది. ఆఫ్రికన్ దేశం నైజీరియా ఐదవ స్థానంలో ఉంది. ఇస్లాం మతాన్ని అనుసరించే 11 కోట్ల మందికి పైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దీని తర్వాత ఈజిప్ట్ (11 కోట్లు), ఇరాక్, టర్కీ ఉన్నాయి. -
భారత్‌కు నెల.. అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
అగ్రరాజ్యం అమెరికా మూడు సంవత్సరాల్లో చేసే నగదు రహిత (క్యాష్ లెస్) లావాదేవీలు.. భారతదేశంలో కేవలం నెల రోజుల్లోనే జరుగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఇటీవల నైజీరియాలోని భారతీయ కమ్యూనిటీ ప్రజలతో సంభాషిస్తున్న సందర్భంగా జైశంకర్ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం భారతదేశంలో పౌరుల జీవనం చాలా సులభతరమైందని, దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ పెరగటమే అనే జైశంకర్ అన్నారు. ఈ రోజుల్లో చాలా తక్కువమంది మాత్రమే నగదు చెల్లించడం లేదా స్వీకరించడం చేస్తున్నారు. ఎక్కువమంది చిన్న వస్తువు కొనే దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేసే వరకు ఆన్లైన్లోనే పే చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే డిజిటల్ పేమెంట్ ఎక్కువైంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి చిరు వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ క్యాష్ లెస్ లావాదేవీలను అంగీకరిస్తున్నారని మంత్రి తెలిపారు. అంతే కాకుండా భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందని, దేశంలో పెట్టుబడులు పెట్టడానైకి కూడా పారిశ్రామిక వేత్తలు సుముఖత చూపిస్తున్నారని వెల్లడించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లు, మెట్రో, విమానాశ్రయాల నిర్మాణం వేగంగా జరుగుతోందని, కొత్త రైళ్లు.. రైల్వే స్టేషన్స్ వస్తున్నాయని చెబుతూ.. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్ సదుపాయం, మంచినీటి సరఫరా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఆధార్ కార్డు రద్దు చేసుకునే అవకాశం - ఎప్పుడు.. ఎలా? ఇండియాలో కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు.. వ్యవహరించిన తీరుని ప్రపంచ దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను విరివిగా తయారు చేసి.. కేవలం దేశ ప్రజలకు మాత్రమే కాకుండా అనేక దేశాలకు ఎగుమతి చేసే భళా భారత్ అనిపించుకుంది. -
‘భారత్’ బ్రాండ్ శనగపప్పుకి డిమాండ్
న్యూఢిల్లీ: ధరల కట్టడి వ్యూహంలో భాగంగా కేంద్రం ‘భారత్’ బ్రాండ్ కింద విక్రయిస్తున్న శనగపప్పుకి గణనీయంగా ఆదరణ లభిస్తోంది. ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మార్కెట్లో పావు వంతు వాటా దక్కించుకుంది. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే రేటు తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడుతోందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. భారత్ బ్రాండ్ శనగపప్పు ధర కిలోకి రూ. 60గా ఉండగా, ఇతర బ్రాండ్స్ రేటు సుమారు రూ. 80 వరకు ఉంటోందని పేర్కొన్నారు. 2023 అక్టోబర్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ బ్రాండ్ శనగపప్పు 2.28 లక్షల టన్నుల మేర అమ్ముడైందని, నెలకు సగటున 45,000 టన్నుల అమ్మకాలు నమోదవుతున్నాయని సింగ్ చెప్పారు. ప్రాథమికంగా 100 రిటైల్ పాయింట్స్‌తో మొదలుపెట్టి నేడు 21 రాష్ట్రాల్లోని 139 నగరాల్లో 13,000 పైచిలుకు మొబైల్, ఫిక్సిడ్ రిటైల్ అవుట్‌లెట్స్ స్థాయికి ఇది విస్తరించిందని ఆయన చెప్పారు. నాఫెడ్, కేంద్రీయ భండార్ వంటి సంస్థల ద్వారా ప్రభుత్వం శనగపప్పు విక్రయాలు చేపట్టడం ఇదే ప్రథమం. ఈ ఏజెన్సీలు శనగలను సబ్సిడీ రేటుపై కేజీకి రూ. 47.83 చొప్పున కొనుగోలు చేసి వాటిని మిల్లు పట్టి, పాలిష్ చేసి కేజీకి రూ. 60 చొప్పున భారత్ బ్రాండ్ కింద విక్రయిస్తాయి. కేంద్రం ఇప్పటికే భారత్ బ్రాండ్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోధుమ పిండిని విక్రయిస్తుండగా, బియ్యం విక్రయాలు కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. -
పేదల ప్రగతితో బలమైన భారత్
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత సాధిస్తే దేశం శక్తివంతంగా మారుతుందని, బలమైన భారత్ ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కేవలం ప్రభుత్వ యాత్రగానే కాదు, దేశ యాత్రగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలు నిర్లక్ష్యానికి గురయ్యారని, అప్పట్లో ప్రభుత్వ వ్యవసాయ విధానాలు కేవలం ఉత్పత్తి, అమ్మకానికే పరిమితం అయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నదాతల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఇప్పటిదాకా రూ.30,000 బదిలీ చేశామని తెలిపారు. వ్యవసాయ సహకార సంఘాలను, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేశామని అన్నారు. గోదాములు నిర్మించామని, పంటల నిల్వ సామర్థ్యాలను పెంచామని, ఆహార శుద్ధి పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించామని గుర్తుచేశారు. ‘‘కంది పప్పును ఆన్లైన్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి విక్రయించే సదుపాయాన్ని కలి్పంచాం. వారికి మార్కెట్ రేటు కంటే మెరుగైన ధర చెల్లిస్తున్నాం. పప్పుల కొనుగోలు కోసం విదేశాలకు చెల్లించే సొమ్ము మన రైతుల చేతికే అందాలన్నది మా ఉద్దేశం’’ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రతి మూలకూ ‘మోదీ గ్యారంటీ’ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నారు. అర్హులకు సక్రమంగా, సంతృప్త స్థాయిలో పథకాలు అందితేనే ‘అభివృద్ధి చెందిన భారత్’ సాధ్యమని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబి్ధదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్ర ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుందని, దేశమంతటా 11 కోట్ల మంది ప్రజలతో నేరుగా అనుసంధానమైందని హర్షం వ్యక్తం చేశారు. ‘మోదీ కీ గ్యారంటీవాలీ గాడీ’ దేశంలో ప్రతి మూలకూ వెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూసే పేదలు ఇప్పుడు ఒక అర్థవంతమైన మార్పును చూస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు అర్హుల గడప వద్దకే వెళ్తున్నాయన్నారు. ప్రస్తుత, భావి తరాల యువత గత తరాల కంటే మెరుగైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. -
2023లో భారత్- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి?
భారత్‌లోని తూర్పు లడఖ్‌లో 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత కూడా చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మోహరించిన అదనపు దళాలను పూర్తిగా ఉపసంహరించుకోలేదు. ఈ విషయంలో చైనా అనుసరించిన వైఖరి కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 2023లో కూడా సాధారణ స్థాయికి రాలేదు. ఈ నేపధ్యంలో జరిగిన పలు దౌత్య, సైనిక చర్చల ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా దళాలతో గతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణల్లో నలుగురు చైనా సైనికులు మరణించారు. ఈ ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో అప్పటికే కొనసాగుతున్న ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి, లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా వేలాది మంది సైనికులను మోహరించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య రెండు అనధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. పాంగోంగ్ లేక్ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో 2020, మే 5 నుంచి ప్రతిష్టంభన నెలకొంది. 2020, జూన్‌లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారత్, చైనా సైనికుల మధ్య మూడేళ్లకు పైగా ప్రతిష్టంభన నెలకొంది. చైనా-భారత్ సంబంధాల ప్రస్తుత స్థితికి సంబంధించి చైనాలోని మాజీ భారత రాయబారి అశోక్ కాంత్ మాట్లాడుతూ 2020 నుండి నాలుగు సంవత్సరాలుగా రెండు వైపులా మోహరించిన అదనపు దళాల ఉపసంహరణకు సంబంధించి గణనీయమైన పురోగతి కనిపించలేదు. చైనా చేపట్టిన ఏకపక్ష చర్య కారణంగా, తూర్పు లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉంది. ఇరు దేశాల సంబంధాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారతదేశం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరస్పర ఆమోదయోగ్యమైన, వేగవంతమైన పరిష్కారం కోసం భారతదేశం, చైనాలు 20 రౌండ్ల చర్చలు జరిపాయి. ఈ చర్చల ద్వారా ఐదు సంఘర్షణ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకున్నట్లు కాంత్ తెలిపారు. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పితే తప్ప చైనాతో సంబంధాలు సాధారణ స్థాయికి చేరవని భారత్ చెబుతోంది. అయితే ద్వైపాక్షిక సంబంధాలను పక్కనపెట్టి, సరిహద్దుల్లోని పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలని చైనా.. భారత్‌పై ఒత్తిడి తెస్తోంది. ఇది కూడా చదవండి: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు! -
జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాయని బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ అరుణ్‌కుమార్ మిశ్రా సమక్షంలో గురువారం ఆమె బాధ్యతలు చేపట్టారు. న్యాయవాది, సామాజికవేత్త అయిన విజయభారతిని ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలిగా నియమిస్తూ ఈ నెల 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తా నని విజయభారతి పేర్కొన్నారు. -
జియో భారత్ జీపీటీ రెడీ.. కీలక విషయాలు చెప్పిన ఆకాశ్ అంబానీ
ముంబై: దేశీయంగా ‘భారత్ జీపీటీ’ ప్రోగ్రామ్‌ను రూపొందించడంపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబేతో (ఐఐటీ–బీ) జట్టు కట్టింది. ఐఐటీ–బీ వార్షిక టెక్‌ఫెస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ విషయాలు తెలిపారు. టెలివిజన్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారీ ల్యాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేథ) వంటి సాంకేతికతలను పైపైనే చూస్తున్నామని, వచ్చే దశాబ్దంలో ఇవి విస్తృతంగా వినియోగంలోకి వస్తాయని ఆకాశ్ చెప్పారు. ఉత్పత్తులు, సర్వీసులను ఏఐ సమూలంగా మార్చేయగలదని ఆయన వివరించారు. సోదరుడు అనంత్ అంబానీ వివాహం జరగనుండటంతో వచ్చే ఏడాది (2024) తమ కుటుంబానికి ప్రత్యేకంగా ఉండగలదని ఆకాశ్ పేర్కొన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. రూ.25కే కిలో బియ్యం?
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని రాయితీ కింద రూ. 25కే ఇవ్వాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పలుజాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పెరుగుతున్న నిత్యావసర ఆహార పదార్థాల ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర రూ. 43గా ఉంది. ఇది కిందటి ఏడాదితో పోలిస్తే 14.1శాతం పెరిగింది. దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం.. ‘భారత్ రైస్’ను తీసుకురానున్నట్లు వినికిడి. రాయితీ ధరతో అందించనున్న బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ అవుట్లెట్, మొబైల్ వ్యాన్లు వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేశంలో ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్’ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని రాయితీ ధరలకు విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో గోధుమ పిండిని రూ. 27.50, కిలో శనగ పప్పును . 60 చొప్పున వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఉత్పత్తులు 2,000 కంటే ఎక్కువ రిటైల్ పాయింట్లలో పంపిణీ చేస్తున్నారు. వీటిలాగే ‘భారత్ రైస్’ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా.. దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యంపైనా ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టన్ను ధర 1200 డాలర్లకంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించింది. -
ఈ ఏడాది భారత్‌కు వెరీ బిగ్ ఇయర్
2023.. భారత్‌కు వెరీ బిగ్ ఇయర్. ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రపంచం జైకొట్టిన ఏడాది. విశ్వగురువుగా అవతరించిన ఏడాది. దేశానికి కొత్త ప్రజాస్వామ్య సౌధాన్ని అందించింది 2023. సొరంగం నుంచి యుద్ధభూమి వరకు.. భారతీయుడు కష్టంలో ఉంటే.. కేంద్రం కాపాడుతుందనే భరోసా ఇచ్చింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హెడ్‌లైన్స్, కీలక విషయాలను ఒకసారి చూద్దాం.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల కూటమి G20 శిఖరాగ్ర సదస్సుకు.. 2023 సెప్టెంబర్‌లో భారత్ ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ సౌత్‌కు లీడర్‌గా ఆవిర్భవించిన భారత్.. G20 అధ్యక్ష హోదాలో తన ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ అంశంతో కూడిన తీర్మానానికి ఏకాభిప్రాయం సాధించి.. విశ్వగురువుగా అవతరించింది. G20 కూటమి సందర్భంగా ఇండియా స్థానంలో మన దేశం పేరును కేంద్రం భారత్‌గా పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. 2023 జూన్‌లో అగ్రరాజ్యం అమెరికాకు అధికారిక పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. వైట్‌హౌస్ వేదికగా ప్రధానికి అఫీషియల్ డిన్నర్ ఇచ్చారు బైడెన్ దంపతులు. ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసిందీ పర్యటన. 2023లో దేశ రాజకీయాల్లో తన సుప్రిమసీని మరింత పెంచుకుంది బీజేపీ. హిందీ హార్ట్‌ల్యాండ్‌లోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో జెండా ఎగరేయడమే కాకుండా.. మిజోరంలోనూ సత్తా చాటింది. అంతకుముందు మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడంతోపాటు నాగాలాండ్, మేఘాలయలోనూ సంకీర్ణ సర్కార్‌లో చేరింది. ప్రస్తుతం సొంతంగా 12 రాష్ట్రాల్లో.. కూటమి భాగస్వామిగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారం చెలాయిస్తోంది కమలదళం. ఓవైపు బీజేపీ జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్‌కు మాత్రం కష్టకాలమే నడిచింది. 2023లోనూ హస్తరేఖలు మారలేదు. మోదీ ఇంటి పేరును కించపరిచిన పరువునష్టం కేసులో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిని కోల్పోవడం 2023 బిగ్ హెడ్‌లైన్స్‌లో ఒకటి. సూరత్ కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధించడంతో.. మార్చి 23న లోక్‌సభ నుంచి అనర్హతకు గురయ్యారు రాహుల్. ఆగస్టు 7న ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది లోక్‌సభ సెక్రటేరియట్. 2023లో కీలకమైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి.. కర్ణాటక, తెలంగాణ విజయాలు స్వల్ప ఊరటనిచ్చాయి. 2023లో భారత రాజకీయాల్లో మరో కొత్త కూటమి ఆవిర్భవించింది. ప్రధాని మోదీని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా 28 ప్రతిపక్ష పార్టీలు ఒకటయ్యాయి. ఈ కూటమికి ఇండియా నామకరణం చేశారు. I.N.D.I.A అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇక్లూజివ్ అలయెన్స్. ఇండియ కూటమి ఏర్పాటుతో యూపీఏ కాలగర్భంలో కలిసిపోయింది. 2023 ఏప్రిల్‌లో చైనాను వెనక్కి నెట్టి... జనాభాపరంగా ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని అందుకుంది భారత్. 142.86 కోట్లమందితో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. వృద్ధ జానాభాతో చైనా ఇబ్బందులు పడుతుంటే.. యువజనంతో భారత్ ముందడుగు వేస్తోందని పేర్కొంది ఐక్యరాజ్యసమితి జనాభా ఫండ్ నివేదిక. 2023 మే 28న భారత నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరిగింది. దేశ సంస్కృతి సంప్రదాయాలు, ఘనమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ.. సరికొత్త ప్రజాస్వామ్య సౌధం కొలువుతీరింది. లోక్‌సభ స్పీకర్ పోడియం పక్కనే చారిత్రక సెంగోల్‌ను ప్రతిష్ఠించడం 2023కే బిగ్గెస్ట్ హైలైట్.ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో.. 41మంది నిర్మాణ కార్మికులు సొరంగంలో చిక్కుకుపోవడం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. 2023 నవంబర్ 12న ఈ ప్రమాదం జరగ్గా.. అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా.. 16 రోజుల తర్వాత టన్నెల్ నుంచి కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఫైనల్ మిషన్‌ను లైవ్‌లో చూసిన ప్రధాని మోదీ.. బయటకు వచ్చిన కూలీలతో ఫోన్లో మాట్లాడారు. 2023లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన మరో అంశం.. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీపార్టీ కీలక నేతల అరెస్ట్. ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కస్టడీలోకి తీసుకుంది. ఈ ఇద్దరు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీయర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రెండుసార్లు సమన్లు జారీచేసింది ఈడీ. రెండు కీలక సంఘటనలకు 2023 ఏప్రిల్ నెల సాక్ష్యంగా నిలిచింది. ఏప్రిల్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు, మీడియా సమక్షంలో.. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఇద్దరినీ పాయింట్‌బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే, ఏప్రిల్ 23న ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ భద్రతాదళాలకు చిక్కాడు. బింద్రెన్వాలా 2.0గా ప్రచారం చేసుకుంటూ.. సిక్కు యువతను రాడికలిజంవైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్న అమృత్‌పాల్ కోసం నెలరోజులపాటు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పంజాబ్ పోలీసులు. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 850 మందికి పైగా గాయపడ్డారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణంగా భావిస్తుండగా. కుట్రకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.2023లో దేశాన్ని కుదిపేసిన మరో సంఘటన మణిపూర్ అల్లర్లు. కుకీ-మైతేయీ జాతుల మధ్య వైరంతో రాష్ట్రం అట్టుడికింది. కుకీ-జోమి కమ్యూనిటీకి ఓ మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించగా.. ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నలు సంధించాయి విపక్షాలు. 2023 మాన్సూన్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాలు.. భారీ వర్షాలు వరదలతో విలవిల్లాడాయి. ఆకస్మిక వరదలు. కొండచరియలు విరిగిపడిన ఘటనలతో హిమాచల్ కకావికలమైంది. వందలమంది ప్రాణాలు కోల్పోగా..12వేలకోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా. ఇక యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని ఢిల్లీ 3రోజులపాటు వరద ముంపులో చిక్కుకుంది. 45ఏళ్ల తర్వాత డేంజర్ మార్క్ దాటి ప్రవహించింది యమునా నది. ఏడాది చివర్లో మిగ్జామ్ ఎఫెక్ట్‌తో కురిసిన భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమైంది. చివరగా డిసెంబర్ 13న దేశం ఉలిక్కిపడే ఘటన కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు లోక్‌సభలో అలజడి సృష్టించారు. పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి.. కలర్‌స్మోక్ వెదజల్లారు. పార్లమెంట్‌పై దాడి ఘటన 22వ వార్షికోత్సవం రోజు ఈ ఘటన జరగడం.. దేశాన్ని షాక్‌కు గురిచేసింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు డిమాండ్ చేశాయి ఇండియా కూటమి పార్టీలు. సభా మర్యాదను పాటించనందుకు.. అసాధారణ రీతిలో..ఉభయసభల నుంచి 143మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఢిల్లీ వేదికగా భారత్ అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు జూన్21-23 మధ్య ప్రధాని మోదీ అమెరికా స్టేట్ విజిట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కమలవికాసం ఈశాన్య భారతంలో మరింత బలం పెంచుకున్న బీజేపీ 2023లోనూ కాంగ్రెస్ పార్టీకి కష్టాలే మార్చి 23న రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం NDAకు పోటీగా కూటమి కట్టిన 28 ప్రతిపక్ష పార్టీలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ 2023 మే 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం 41 మంది కార్మికులు.. 16 రోజుల మెగా రెస్క్యూ ఆపరేషన్ ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియా అరెస్ట్ అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ ఏప్రిల్ 15న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ లైవ్ మర్డర్ ఏప్రిల్ 23న ఖలిస్థానీ నేత అమృతపాల్ సింగ్ అరెస్ట్ 2023 జూన్ 2న బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జాతుల మధ్య వైరంతో మణిపూర్‌లో మారణకాండ ప్రకృతి ప్రకోపానికి హిమాచల్ విలవిల యమున ఉప్పొంగడంతో నీటమునిగిన ఢిల్లీ లోక్‌సభలో అలజడి సృష్టించిన ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ నుంచి 143మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ -
నేడు ప్రధాని మోదీ వారణాసి రాక..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) యూపీలోని వారణాసికి రానున్నారు. ఆది, సోమవారాలలో ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉంటారు. డిసెంబర్ 17న తన కాశీ పర్యటనలో మొదటి రోజున ప్రధాని మోదీ.. నాడేసర్‌లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రారంభిస్తారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 18న విహంగం యోగాకు చెందిన స్వర్వేద మహామందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తరువాత బర్కిలో జరిగే బహిరంగ సభలో మిషన్-2024కు శంఖనాదం చేసిన అనంతరం ప్రసంగించనున్నారు. అలాగే కాశీ సంసద్ స్పోర్ట్స్ కాంపిటీషన్ విజేతలను కలుసుకోనున్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా తన పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేశారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. బార్కి నుంచి ఢిల్లీ-వారణాసి వందే భారత్‌తో సహా ఐదు రైళ్లను ప్రారంభించనున్నారు. దీనితోపాటు రూ.19,150 కోట్ల విలువైన 37 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కటింగ్ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాని మోదీ.. పీఎం ఆవాస్, పీఎం స్వనిధి, పీఎం ఉజ్వల తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఇది కూడా చదవండి: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. కేరళలో జేఎన్.1 కేసు నమోదు! -
ఉజ్వల భవిత వైపు దిశానిర్దేశం
భారత్ జీ20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించే నాటికి ప్రపంచం అనేక సమస్యలనెదుర్కొంటోంది. ఈ పరిస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యామ్నాయం చూపాలని భారత్ నేతృత్వంలోని జీ20 నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జీడీపీ కేంద్రక ప్రగతి నుంచి మానవ–కేంద్రక పురోగమనం వైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మన మధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏది ఏకం చేయగలదో దాని గురించి గుర్తుచేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు పరిణామశీలమై– కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు. భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నేటితో 365 రోజులు పూర్తయ్యాయి. ‘వసుధైవ కుటుంబకం’...అంటే– ‘ఒకే భూమి–ఒకే కుటుంబం–ఒకే భవి ష్యత్తు’ స్ఫూర్తిని చాటేలా పునరంకితమవుతూ... పునరుజ్జీవనానికి బీజం వేసిన క్షణమది.మనం నిరుడు ఈ బాధ్యత స్వీకరించే నాటికి యావత్ ప్రపంచం బహుముఖ సవాళ్లతో సతమతం అవుతోంది. బహుళ దేశాలు పాల్గొనే విధానం (మల్టీ లేటరలిజం) క్షీణించే తరుణంలో కోవిడ్–19 మహ మ్మారి దుష్ప్రభావం నుంచి కోలుకోవడం, నానాటికీ పెరుగుతున్న వాతావరణ మార్పు సమస్యలూ, ఆర్థిక అస్థిరత, వర్ధమాన దేశాల్లో రుణభారం తదితరాలన్నీ చోటు చేసుకున్నాయి. అలాగే ఘర్షణలూ, వివాదాలూ, స్పర్థాత్మకతల మధ్య ప్రగతి సంబంధిత సహకార భావన దెబ్బతిని, పురోగమనం కుంటుపడింది. ఈ నేపథ్యంలో జీ20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన భారత దేశం ఆనాటి దుఃస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యా మ్నాయం చూపాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జీడీపీ కేంద్రక ప్రగతి నుంచి మానవ–కేంద్రక పురోగమనం వైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మన మధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏది ఏకం చేయగలదో దాని గురించి గుర్తుచేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు పరిణామశీలమై– కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు. అయితే, ఇందుకోసం ముఖ్యంగా చేయాల్సిందల్లా బహుళ దేశాలు పాల్గొనే విధాన మూలాల నుంచి సంస్కరణలు తేవడం. ‘సార్వజనీనత, ఆకాంక్షాత్మకత, కార్యాచరణాత్మకత, నిర్ణయాత్మ కత’ అనే నాలుగు పదాలు జీ20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో మన విధానమేమిటో సుస్పష్టంగా నిర్వచించాయి. అటుపైన జీ20 సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించిన ‘న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం’ (ఎన్డీఎల్డీ) ఈ సూత్రాల అమలులో మన నిబద్ధతను ప్రస్ఫుటం చేసింది. సార్వజనీనత అన్నది మన అధ్యక్ష పదవికి ఆత్మ వంటిది. దీనికి అనుగుణంగా ఆఫ్రికా సమాఖ్య (ఏయూ)కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా 55 ఆఫ్రికా దేశాలను ఈ వేదిక మీదకు చేర్చాం. దీంతో ప్రపంచ జనాభాలో 80 శాతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా జీ20 విస్తరించింది. తద్వారా అంతర్జాతీయ సవాళ్లు –అవకాశాలపై మరింత సమగ్ర చర్చలను ఈ క్రియాశీల వైఖరి ప్రోత్సహించింది. ఇక ‘దక్షిణార్ధ గోళ దేశాల గళం’ పేరిట భారతదేశం తొలిసారి రెండు దఫాలుగా నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు మల్టీలేటరలిజం నవోదయానికి శుభారంభం పలికింది. ఆ విధంగా దక్షిణార్ధ గోళ దేశాల సమస్యలను భారతదేశం అంతర్జాతీయ చర్చల ప్రధాన స్రవంతిలోకి తెచ్చింది. సార్వజనీనత అన్నది భారత దేశీయ విధాన ఉత్తేజాన్ని జీ20కి వ్యాపింపజేసింది. ఆ మేరకు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి తగినట్లుగా జీ20కి భారత నాయకత్వం ప్రజా ధ్యక్షతగా రూపొందింది. కీలకమైన 2030 ఎజెండా మధ్యలో జీ20 కార్యాచరణ ప్రణాళికను సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)ను వేగవంతం చేయడంతోపాటు ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ సమ తౌల్యం, పరస్పర అనుసంధానిత సమస్యల పరిష్కారం కోసం విస్తృత కార్యాచరణ–ఆధారిత విధానాన్ని భారత్ రూపొందించింది. ఈ ప్రగతి ప్రణాళిక పురోగమనానికి జనహిత మౌలిక సదుపాయాలు (డీపీఐ) అత్యంత కీలకం. ఆ మేరకు ‘ఆధార్, యూపీఐ, డిజీలాకర్’ వంటి డిజిటల్ ఆవిష్కరణల విప్లవాత్మక ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసిన భారత్ తనవంతుగా నిర్ణయాత్మక సిఫారసులు చేసింది. జీ20 ద్వారా మనం జనహిత మౌలిక సదుపాయాల భాండాగారం ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేశాం. దీన్ని ప్రపంచ సాంకేతిక సహ కారంలో గణనీయ పురోగమనంగా పేర్కొనవచ్చు. ఈ భాండాగారంలో 16 దేశాల నుంచి 50కి పైగా దేశాల ‘డీపీఐ’లున్నాయి. మన భూగోళం కోసం తక్షణ, శాశ్వత, సమాన మార్పు సృష్టి లక్ష్యంగా ప్రతిష్ఠాత్మక, సమగ్రమైన లక్ష్యాలను అనుసరిస్తున్నాం. భూగోళ పరిరక్షణ, పేదరిక నిర్మూలన నడుమ మన ఎంపి కకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడం ఎలాగో ‘ఎన్డీఎల్డీ’ నిర్దేశిత ‘హరిత ప్రగతి ఒప్పందం’ వివరిస్తుంది. ఇక 2030 నాటికి ప్రపంచ పునరు త్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రతిష్ఠాత్మక రీతిలో మూడు రెట్లు పెంచాలని కూడా జీ20 తీర్మానం పిలుపునిచ్చింది. మరోవైపు ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటూ, హరిత ఉదజని కోసం సమష్టి కృషీ... పరిశుభ్ర, హరిత ప్రపంచ నిర్మాణంపై జీ20 ఆదర్శాలు కాదనలేని నిజాలు. భారత్ అనాదిగా అనుసరిస్తున్న విలువలు ఇవే. ఉత్తరార్ధ గోళ దేశాల నుంచి గణనీయ ఆర్థిక సహాయంతోపాటు సాంకేతిక చేయూతను కోరడం ద్వారా వాతావరణ న్యాయం–సమా నత్వం విషయంలో మన నిబద్ధతను కూడా ‘ఎన్డీఎల్డీ’ నొక్కి చెప్పింది. కాగా, అభివృద్ధికి ఆర్థిక చేయూత పరిమాణంలో తొలిసారిగా ఆశించిన మేర రెట్టింపు పెరుగుదల నమోదైంది. ఆ మేరకు ఈ సాయం బిలియన్ల డాలర్ల స్థాయి నుంచి ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వర్ధమాన దేశాలు 2030 నాటికి తమ దేశీయ ప్రగతి లక్ష్యాల (ఎన్డీసీ)ను సాధించడానికి 5.9 ట్రిలియన్ డాలర్లు అవసరమని జీ20 అంగీకరించింది. న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం లింగ సమానత్వానికీ పెద్దపీట వేసింది. ఆ మేరకు ఇది వచ్చే ఏడాదికల్లా మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటు అవసరాన్ని నొక్కిచెప్పింది. ‘భారత మహిళా రిజర్వేషన్ బిల్లు–2023’ ద్వారా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటా యించడం ద్వారా మహిళా చోదక ప్రగతిపై భారత్ నిబద్ధతను జీ20 ప్రతిబింబించింది. విధానపరమైన సమన్వయం, విశ్వసనీయ వాణిజ్యం, ప్రతిష్ఠాత్మక వాతావరణ కార్యాచరణపై దృష్టి సారిస్తూ ఈ కీలక ప్రాధాన్యాలన్నిటా పరస్పర సహకార స్ఫూర్తిని ‘ఎన్డీఎల్డీ’ చాటిచెప్పింది. మన అధ్యక్షత సమయంలో జీ20 ద్వారా 87 నిర్ణ యాలు తీసుకోవడంతోపాటు 118 పత్రాలకు ఆమోదం సాధించడం గర్వించదగిన అంశం. మన జీ20 అధ్యక్షత సమయంలో భౌగోళిక–రాజకీయాంశాలు, ఆర్థికవృద్ధి–ప్రగతిపై వాటి ప్రభావం వగైరాల పైనా చర్చలకు భారత్ నాయకత్వం వహించింది. ఉగ్రవాదం, విచక్షణ రహితంగా పౌరుల ప్రాణాలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించడమనే విధానంతోనే ఈ బెడదను నిర్మూలించడం సాధ్యమని స్పష్టం చేసింది. మనం శత్రుత్వం స్థానంలో మానవత్వాన్ని స్వీకరించాలి. ఆ మేరకు ఇది యుద్ధ యుగం కాదనే వాస్తవాన్ని పునరుద్ఘాటించాలి. జీ20 అధ్యక్ష బాధ్యతల సమయంలో భారత్ అసాధారణ విజయాలు సాధించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది: ఇది మల్టీలేటరిజాన్ని పునరుజ్జీవింపజేసింది. దక్షిణార్ధ గోళ దేశాల గళాన్ని మరింతగా వినిపించింది. ప్రగతి సాధనకు ప్రాముఖ్యమిచ్చింది. అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారత కోసం పోరాడింది.ఈ నేపథ్యంలో భూగోళం పచ్చగా పరిఢవిల్లడంతోపాటు ప్రపంచ ప్రజానీకానికి శాంతి–శ్రేయస్సు దిశగా ఇప్పటివరకూ మనం సమష్టిగా చేసిన కృషి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని విశ్వసిస్తూ జీ20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ దేశానికి అప్పగిస్తున్నాం. నరేంద్ర మోదీ భారత ప్రధాని -
భారత్ పొరుగు దేశాల్లో మరోమారు భూ ప్రకంపనలు
భారత్ పొరుగు దేశాల్లో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈసారి ఏకకాలంలో మూడు దేశాల్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్, చైనా, పాపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యాయి. భూకంపం వచ్చిన వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఈ మూడు దేశాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పాపువా న్యూ గినియాలో అత్యధిక తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, పాకిస్థాన్‌లో ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున 03:38 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదయ్యింది. పాకిస్థాన్‌లో భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం చైనాలోని జిజాంగ్‌లో నేటి తెల్లవారుజామున 03:45 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే సమయంలో పాపువా న్యూ గినియాలోని న్యూ గినియా ఉత్తర తీరంలో తెల్లవారుజామున 03:16 గంటలకు 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ఈ మూడు చోట్లా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇది కూడా చదవండి: జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి సెలవులు రద్దు! -
సహకార ‘భారత్ ఆర్గానిక్స్’!
సహకార రంగంలో పాల ఉత్పత్తులకు కొండగుర్తుగా మారిన ‘అమూల్’ బ్రాండ్ మాదిరిగానే ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయానికి ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌ను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఇటీవల ఆవిష్కరించింది. ప్రకృతి /సేంద్రియ వ్యవసాయదారులు దేశవ్యాప్తంగా పండిస్తున్న ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులకు ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్ ఇక చిరునామాగా మారనుంది. ఇందుకోసం రూ. 500 కోట్ల అధీకృత మూలధనంతో ‘నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్)’ పేరిట ఓ మెగా మల్టీస్టేట్ కోఆపరేటివ్ ఏర్పాటైంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓల) నుంచి పంట దిగుబడులను ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తుంది. వాటిని శుద్ధి చేసి, విలువను జోడిస్తుంది. ఆ సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ పేరిట దేశవిదేశాల్లో విక్రయిస్తుంది. ప్రస్తుతం బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, బెల్లం, రాజ్మా అమూల్ నెట్వర్క్ ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యాయి. 2024 జనవరి నుంచి మరో 14 రకాలు కూడా అమ్ముతారు. లాభాల్లో 50%ను రైతులకు తిరిగి చెల్లించనున్న ఈ మెగా ఆర్గానిక్ మార్కెటింగ్ కోఆపరేటివ్ గురించి కథనం.. సేంద్రియ / ప్రకృతి సేద్యంలో పండించిన రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయక ఆహారోత్పత్తుల ప్రాధాన్యాన్ని ప్రపంచం అర్థం చేసుకుంటోంది. 27 లక్షల హెక్టార్లలో సేంద్రియ/ప్రకృతి సాగుతో ప్రపంచంలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మంది సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులలో 16 లక్షల మంది మన దేశీయులే. అయినప్పటికీ, విశ్వ విపణిలో మన సేంద్రియ ఉత్పత్తుల వాటా మాత్రం 2.7% మాత్రమే. సేంద్రియ ఉత్పత్తులు పండించే రైతులు, సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓ) నుంచి ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించి, కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, మార్కెట్ చేయడానికి దేశంలో తగినన్ని ప్రభుత్వ /సహకార రంగంలో సదుపాయాలు లేకపోవటం ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. రసాయనిక అవశేషాల్లేని పంటలు పండించే రైతుల్లో చాలా మందికి ఆ పంట దిగుబడులను మంచి ధరకు అమ్ముకోవటం సమస్యగా మారింది. అదేమాదిరిగా, పూర్తిగా నమ్మదగిన సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయించే దేశవ్యాప్త వ్యవస్థ కూడా ఇన్నాళ్లూ కొరవడింది. ఇప్పుడు ఆ కొరత తీరనుంది. రూ.500 కోట్ల అథీకృత మూలధనం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు మూడు అతిపెద్ద మల్టీస్టేట్ కోఆపరేటివ్‌లను కేంద్ర సహకార శాఖ ఇటీవల నెలకొల్పింది. సర్టిఫైడ్ విత్తనాలు/దేశీ వంగడాల పరిరక్షణ, సరఫరా కోసం ఒకటి.. సహకార కళాకృతులు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరొకటి.. ఈ కోవలోనిదే ‘నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్)’ కూడా. రూ.500 కోట్ల అథీకృత మూలధనంతో ఎన్‌సిఓఎల్ ఏర్పాటైంది. మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 కింద నమైదైంది. దేశంలోని 5 ప్రధాన సహకార సంఘాలు, సంస్థలు సేంద్రియ/ప్రకృతి రైతులకు సౌలభ్యకరమైన, ఆధారపడదగిన, శక్తివంతమైన, సహకార మార్కెటింగ్ వ్యవస్థను అందించటంతో పాటు.. దేశంలోనే కాదు విదేశాల్లోని వినియోగదారులకు విశ్వసనీయతతో కూడిన సేంద్రియ సహకార ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తేవటమే ఎన్‌సిఓఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రీయ రైతు ఉత్పత్తి సంస్థలకు మార్కెట్లోకి ప్రత్యక్ష ప్రవేశం కల్పించడం ద్వారా ఉత్పత్తులపై రాబడిని పెంచడం ఎన్‌సిఓఎల్ లక్ష్యం. బలమైన బ్రాండ్‌తో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించటం ద్వారా సహకార సంఘాల్లో సభ్యులైన రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులకు మెరుగైన రాబడిని పొందుతారు. సంబంధిత మంత్రిత్వ శాఖల సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాలు, సంబంధిత సంస్థలు ఉత్పత్తి చేసే సేంద్రియ ఉత్పత్తుల మొత్తం సరఫరా గొలుసును నిర్వహించడం ద్వారా ఎన్‌సిఓఎల్ ఒక గొడుగు సంస్థగా పనిచేస్తుంది. దక్షిణాది తొలి సభ్యత్వం ఏదైనా సహకార సంఘం లేదా వ్యక్తుల సంఘం (సెంట్రల్ రిజిస్ట్రార్ అనుమతించిన విధంగా) ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం పొందవచ్చు. దాదాపు 2,000 సహకార సంఘాలు ఇప్పటికే ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వాన్ని పొందిన ఘనత ఎఎస్ఆర్ జిల్లాకు చెందిన ‘ఎం.నిట్టపుట్టు గిరిజన రైతు సేవా మరియు ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ’కి దక్కింది. ఎన్‌సిఓఎల్ మెంబర్షిప్ సర్టిఫికెట్‌ను అమిత్‌షా నుంచి సొసైటీ సీఈవో పి. గంగరాజు అందుకున్నారు. సభ్యత్వ ధృవీకరణ అందుకున్న తొలి ఐదుగురిలో ఈయన ఒకరు కావటం విశేషం. అతిపెద్ద బ్రాండ్ కానున్న ‘భారత్ ఆర్గానిక్స్’ రానున్న పదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్గానిక్ ఫుడ్ బ్రాండ్‌గా ‘భారత్ ఆర్గానిక్స్’ రూపుదాల్చుతుందని ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్ ఆవిర్భావ సభలో కేంద్ర సహకార మంత్రి అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. భూసారం, సేంద్రియ ఆహారోత్పత్తుల పరీక్షల కోసం ప్రతి జిల్లా, తహసీల్‌లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్(ఎన్‌పిఓపి) గుర్తింపు పొందిన లేబరేటరీలు ఏర్పాటు కానుండటం విశేషం. ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్) ఆవిర్భావంతో సర్టిఫైడ్ ఆర్గానిక్ ఆహారోత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థ జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతం అవుతుండటం ఆనందదాయకం. మార్కెటింగ్ సదుపాయం పెరిగితే ప్రకృతి సేద్య విస్తీర్ణం మరింత పెరగటానికి వీలవుతుంది. ఎన్‌సిఓఎల్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏపీ రైతు సాధికార సంస్థ నోడల్ ఏజన్సీగా పనిచేస్తోంది. ఎన్‌సిఓఎల్‌లో వ్యక్తిగతంగా రైతులు సభ్యులుగా చేరలేరు. 1964 సహకార చట్టం, 1995 మాక్స్ చట్టం కింద రిజిస్టరైన ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘాలు, ఎఫ్పిఓలు (కంపెనీ చట్టం కింద నమోదైన ఎఫ్పిఓలు అర్హులు కాదు), మండల మహిళా సమాఖ్యలు ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరొచ్చు. కనీస మద్దతు ధర లేదా మార్కెట్ ధరలో ఏది ఎక్కువ ఉంటే దాని మీద అదనంగా 10–15 శాతం ప్రీమియం చెల్లించి ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తుంది. లాభాల్లో 50% సభ్యులకు తిరిగి చెల్లిస్తుంది. ఏపీలో ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్పిఓలు /సహకార సంఘాలు /మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్చుతున్నాం. ప్రస్తుతానికి ప్రాసెసింగ్ చేసిన బియ్యం, బెల్లం, కందిపప్పు, పెసరపప్పు,శనగపప్పు, రాజ్మా గింజలను ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తున్నది. వచ్చే జనవరి నుంచి 20 రకాల సేంద్రియ ఆహారోత్పత్తుల్ని కొనుగోలు చేస్తుంది. చిత్తూరు జిల్లాలోని అమూల్ సంస్థ ఆవరణలో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎన్‌సిఓఎల్ నెలకొల్పనుంది. అమూల్ ఆర్గానిక్స్ బ్రాండ్‌తో ఈ ఉత్పత్తులు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ ఉత్పత్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఉత్తరాదిలో సఫల్, మదర్ డెయిరీ, అమూల్ రిటైల్ ఔట్లెట్లలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయం ప్రారంభమైంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్ ఆవిర్భావ సభలో ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్ నుంచి వచ్చిన 55 మంది ప్రతినిధులం పాల్గొన్నాం. ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్పిఓలు, సహకార సంఘాలు, మాక్స్ చట్టం కింద నమోదైన మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం విస్తారంగా జరుగుతున్న ఏపీ నుంచే ఎక్కువ సభ్యులు చేరే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఎన్‌సిఓఎల్‌లో చేరదలచిన సంస్థలు మమ్మల్ని సంప్రదించవచ్చు. – బొడ్డు ప్రభాకర్ (97714 63539), మార్కెటింగ్ హెడ్, రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. prabhakar@ryss.ap.gov. త్వరలో ఆన్లైన్ విక్రయాలు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయోత్పత్తులను సహకార సంఘాలు, ఎఫ్పిఓల నుంచి కనీస మద్దతు ధరకన్నా కొంత అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. ఎన్‌సిఓఎల్ పొందే నికర లాభాల్లో 50 శాతం మొత్తాన్ని రైతులకు తిరిగి చెల్లిస్తాం. ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌తో ప్రజలకు రిటైల్‌గా ఆన్లైన్లో విక్రయించే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి. ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరదలచిన సహకార సంఘాలు, ఎఫ్పిఓలు, మండల సమాఖ్యలు ఏ రాష్ట్రం వారైనప్పటికీ ఈ కింది మెయిల్ ఐడి ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. – కోదండపాణి, మేనేజింగ్ డైరెక్టర్, నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్), న్యూఢిల్లీ. cooporganics@gmail.com వినియోగదారుల సందేహాలకు తావుండదు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తులను కొనేటప్పుడు వినియోగదారులు వీటిని ఎవరు, ఎక్కడ పండించారు? నిజంగా ఆర్గానిక్గానే పండించారా అనే సందేహాలు వస్తుంటాయి. ఎన్‌సిఓఎల్ ద్వారా ‘భారత్ ఆర్గానిక్స్’ సేంద్రియ ఆహారోత్పత్తులు మార్కెట్లో అందుబాటులోకి వస్తే ప్రజలకు ఈ సందేహాలు తీరిపోతాయి. మా గిరిజన సహకార సంఘం దక్షిణాది నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వం పొందటం ఆనందంగా ఉంది. గతంలో ఉన్న మార్కెటింగ్ సమస్యలు తీరిపోతాయి. ఎఎస్ఆర్ లల్లా జి. మాడుగుల మండలంలో 3683 మంది గిరిజన రైతులు మా సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో 2012 మంది సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతులు. కాఫీ, మిరియాలు, పిప్పళ్లు, పసుపు, అల్లం, రాజ్మా ఎగుమతుల కోసం విక్రయిస్తున్నాం. ఇతర పంట దిగుబడులను స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నాం. ప్రభుత్వ ధరకన్నా ఎక్కువ ధరనే రైతులకు చెల్లిస్తున్నాం. గత ఏడాది రూ. 4 కోట్ల కాఫీ, మిరియాలు విక్రయించాం. ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్, ఉద్యానశాఖ తోడ్పాటుతో 10 టన్నుల గోదాములు నిర్మించాం. ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరిన మా రైతులు 20 మంది మేఘాలయ వెళ్లి అక్కడి రైతులకు ప్రకృతి సేద్యం నేర్పిస్తున్నారు. గత ఏడాది మా సొసైటీకి జాతీయ జైవిక్ ఇండియా పురస్కారం కూడా లభించింది. ఎన్‌సిఓఎల్ ద్వారా రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. – పి. గంగరాజు (63018 76177), సీఈఓ, ఎం.నిట్టపుట్టు గిరిజన రైతుల సొసైటీ, అరకు, ఎఎస్ఆర్ జిల్లా – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా) -
భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ!
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య పోరు ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. యూపీలోని అమేథీకి చెందిన ఒక చిరు తినుబండారాల వ్యాపారి ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే తాను స్థానికులకు చాట్ ఉచితంగా పంచుతానని ప్రకటించాడు. దీనిని సంబంధించిన ప్రకటనను కూడా దుకాణం వద్ద అతికించాడు. అమేథీలోని గౌరీగంజ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర గుప్తాకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. క్రికెట్లో రాణిస్తూ జిల్లా స్థాయిలో వివిధ టోర్నమెంట్లలో కూడా ఆడాడు. సురేంద్ర తన దుకాణం వద్ద ఒక పోస్టర్ అతికించాడు. భారత్ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచిన తర్వాత సోమవారం ఉదయం 10 గంటల నుంచి తన వద్ద సరుకు ఉన్నంతవరకు, కస్టమర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చాట్ ఉచితంగా పంపిణీ చేస్తానని ప్రకటించాడు. ఇది కూడా చదవండి: పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది? -
చైనాకు చుక్కలు చూపించిన మేజర్ షైతాన్ సింగ్
శత్రువు చేతికి చిక్కిన ఆ యోధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. కాలితోనే శత్రువులపైకి తుపాకీ తూటాలు పేల్చాడు. శత్రువులను మట్టికరిపించి, భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. అనంతరం అమరుడయ్యాడు. చైనాకు చుక్కలు చూపించిన భారత అమరవీరుని కథ ఇది. 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది. అయితే 1962, నవంబరు 18న, అంటే యుద్ధం మధ్యలో మరొక చిన్న యుద్ధం జరిగింది. దీనిని రెజాంగ్ లా యుద్ధం అని చెబుతారు. ఈ యుద్ధంలో మేజర్ షైతాన్ సింగ్ విజయం సాధించి, అమరవీరుడు అయ్యాడు. మరణానంతరం పరమవీర చక్రను అందుకున్నాడు. 1962లో భారత్‌పై చైనా దాడి చేసింది. ఈ సమయంలో కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన 13వ బెటాలియన్ లేహ్-లడఖ్‌లోని చుషుల్ సెక్టార్లో మోహరించింది. దీనిలోని సీ కంపెనీ సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల (16 వేల అడుగులు) ఎత్తులో రెజాంగ్ లా వద్ద ఉన్న పోస్ట్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. 1962 నవంబరు 18న ఉదయం చైనా దళాలు ఈ పోస్ట్‌పై దాడి చేశాయి. తేలికపాటి మెషిన్ గన్లు, రైఫిల్స్, మోర్టార్లు, గ్రెనేడ్లతో దాడి జరిగింది. ఆ సమయంలో ఎముకలు కొరికే చలి సైనికులను చుట్టుముట్టింది దాదాపు 1300 మంది చైనా సైనికులతో 120 మంది భారత సైనికులు పోరాడుతున్నారు. మేజర్ షైతాన్ సింగ్.. రెజిమెంట్‌లోని చార్లీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ యుద్ధంలో పోరాడేందుకు తక్కువ సైనిక బలగం, తక్కువ ఆయుధాలు ఉన్నాయని గ్రహించిన ఆయన ఒక వ్యూహాన్ని రూపొందించారు. సైనికులు ఫైరింగ్ పరిధిలోకి రాగానే శత్రువుపై కాల్పులు జరపాలని ఆదేశించారు. ఒక్క బుల్లెట్‌తో ఒక్కో చైనా సైనికుడిని చంపేయాలని కోరాడు. ఈ వ్యూహంతో భారత సైనికులు దాదాపు 18 గంటల పాటు శత్రువులను ఎదుర్కొని విజయం సాధించారు. అయితే అప్పటికే 114 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కుయుక్తులకు దిగి, దాడి చేయడంతో ఈ యుద్ధంలో గెలిచింది. భారత సైన్యానికి చెందిన మూడు బంకర్లు ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన మేజర్ షైతాన్ సింగ్ శత్రువులతో పోరాడుతూనే ఉన్నాడు. కాలికి మెషిన్ గన్ కట్టుకుని, కాలి వేళ్లతో ట్రిగ్గర్ నొక్కుతూ బుల్లెట్లు కురిపించాడు. అయితే మేజర్ షైతాన్ సింగ్‌కు అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. సుబేదార్ రామచంద్ర యాదవ్ అతనిని తన వీపునకు కట్టుకుని చాలా దూరం వరకూ తీసుకెళ్లి, అక్కడ పడుకోబెట్టారు. కొద్దిసేపటికే మేజర్ షైతాన్ సింగ్ అమరుడయ్యాడు. ఈ ఘటన 1962 నవంబరు 18 జరిగింది. ఇది కూడా చదవండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు! Major Shaitan Singh Param Vir Chakra Kumaon Regiment 18 November 1962 Major Shaitan Singh displayed undaunted courage and exemplary leadership in the face of the enemy. Awarded #ParamVirChakra (Posthumous). We pay our tribute. https://t.co/i8AOme3gYH pic.twitter.com/AGoSAKYD9e — ADG PI - INDIAN ARMY (@adgpi) November 18, 2023 -
కొత్త రూపంలో కోవిడ్-19.. భారత్‌కూ తప్పని ముప్పు?
కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను తీసుకుంటోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఉత్పరివర్తనమై బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూకేలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. రుచి లేదా వాసన కోల్పోవడం కోవిడ్-19 ప్రధాన లక్షణం అయితే, పిరోలా లేదా బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి. పిరోలా సోకినప్పుడు ముందుగా దాని ప్రభావం ముఖంపైనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయని, ఈ వ్యాధి శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్ఎస్ఏ) తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త వైరస్‌కు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కాగా ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు టీకాల ప్రచారాన్ని యూకేహెచ్ఎస్ఏ ముమ్మరం చేసింది. వృద్ధులు, పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగినవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే ఈ డోస్ తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలో ఉండేటప్పుడు కూడా మాస్క్ ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు. కాగా బీఏ.2.86 కేసులు తొలిసారి గత జూలైలో కనిపించాయి. ఇది కూడా చూడండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు! -
భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి అమిత్ షా నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్)– ’భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. రాబోయే సంవత్సరాల్లో ఇది భారత్ అలాగే విదేశాలలో అత్యంత ‘‘విశ్వసనీయ’’ బ్రాండ్‌గా ఉద్భవించనుందని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా, జాతీయ వృక్ష సంరక్షణ సంస్థ (ఎన్‌పీపీఓ) ఆమోదించిన ప్రస్తుత 34 ల్యాబ్‌ల సంఖ్యను దేశవ్యాప్తంగా మరింత పెంచనున్నట్లు వివరించారు. ప్రారంభంలో ఎన్‌సీఓఎల్ భారతదేశంలో ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తుందని, అటు తర్వాత ఇతర దేశాల్లోకి విక్రయాలను విస్తరిస్తుందని అమిత్ షా తెలిపారు. ‘సహకార సంస్థల ద్వారా ఆర్గానిక్ ప్రొడక్టుల ప్రమోషన్’ అన్న అంశంపై ఎన్‌సీఓఎల్ న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక సిపోజియంలో ఎన్‌సీఓఎల్ లోగో, వెబ్సైట్, బ్రోచర్, కొన్ని ఉత్పత్తులను కూడా షా ఆవిష్కరించారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) సేంద్రీయ ఎరువును కూడా ఆయన ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. ఐదు సహకార సంఘాలకు ఎన్‌సీఓఎల్ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ)చీఫ్ ప్రమోటర్‌గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద ఈ ఏడాది జనవరి 25న ఎన్‌సీఓల్ రిజిస్టర్ అయ్యింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మూడు కొత్త సహకార సంస్థలలో ఎన్‌సీఓఎల్ ఒకటి. మిగిలిన రెండు సహకార సంఘాలు విత్తనాలు– ఎగుమతుల రంగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు ఉండగా వీటిలో మొత్తం 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. -
నడుస్తున్న చరిత్ర!
పాత చరిత్రను కొత్తగా లిఖించే మరోప్రయత్నం మొదలైంది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో ప్రస్తుతం ఉన్న ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘సంప్రదాయ (క్లాసికల్) చరిత్ర’ను ప్రవేశపెట్టనున్నారు. అంటే, ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ బ్రిటీషు వారు చేసిన చరిత్ర విభజన ఇక చెరిగిపోనుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వేసిన ఉన్నత స్థాయి సంఘం చేసిన ఈ సిఫార్సు చర్చ రేపుతోంది. అలాగే, ఇకపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ను తీసుకురావాలని సైతం సదరు కమిటీ సిఫార్సు చేసిందన్న వార్త తేనెతుట్టెను కదిలించింది. భారతదేశపు గతానికి సంబంధించిన కథనాలను ‘సరిచేసేందుకు’ ఈ మార్పులు తీసుకు వస్తున్నామన్నది ఎన్సీఈఆర్టీ కమిటీ మాట. ఇండియా స్థానంలో భారత్ అనే సిఫార్సును అంగీకరించలేదని ఎన్సీఈఆర్టీ వివరణనిచ్చినా, కమిటీ చేసిన ఇతర ప్రతిపాదనలపైనా అనుమానాలు, చర్చోపచర్చలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. 2020 నాటి జాతీయ విద్యా విధానంలో భాగంగా సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేర్పులు సూచించడం కోసం రిటైర్డ్ చరిత్ర ప్రొఫెసర్ అయిన సీఐ ఐజాక్ సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని 2022లో ఎన్సీఈఆర్టీ నియమించింది. పాఠ్యప్రణాళికలో భాగంగా పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టుల్లోనూ ‘భారతీయ విజ్ఞాన వ్యవస్థ’ (ఐకేఎస్)ను ప్రవేశపెట్టాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. ‘ప్రాచీన చరిత్ర’ బదులు ‘సంప్రదాయ చరిత్ర’ను పెట్టాలనే ప్రతిపాదనకు తనదైన సమర్థనను వినిపించింది. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాలనే పేర్కొన్నారనీ, మొఘలులు, సుల్తానులపై మన విజయాలను చెప్పలేదనీ, కాబట్టి యుద్ధాలలో ‘హిందూ విజయాల’పై దృష్టి పెడుతూ పాఠ్యపుస్తకాలు మార్చాలనీ ఐజాక్ బృందపు వాదన. చరిత్రను చరిత్రగా చెప్పాల్సిందే! అందులో లోటుపాట్లను సవరించడమూ తప్పు కాదు. కానీ, సాక్ష్యాధారాలతో సాగాల్సిన ఆ చరిత్ర రచనను మతప్రాతిపదికనో, మరో ప్రాతిపదికనో మార్చాలనుకోవడమే సమస్య. ‘ఇండియా’ అంటూ ప్రతిపక్ష కూటమి తమకు తాము నామకరణం చేసుకున్న తరువాత నుంచి ఈ ‘ఇండియా’ వర్సెస్ ‘భారత్’ రచ్చ నడుస్తూనే ఉంది. భారత రాజ్యాంగం ‘ఇండియా... దటీజ్ భారత్’ అని పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం కొన్నాళ్ళుగా ఈ ‘భారత’ నామంపై కొత్త ప్రేమ కనబరు స్తోంది. ఆ మధ్య జీ–20 వేళ రాష్ట్రపతి అధికారిక విందు ఆహ్వానంలో సైతం ‘భారత్’ అనే పదాన్నే వాడడం వివాదం రేపింది. అసలు ‘ఇండియా’ అనే పేరే వలసవాద ఆలోచనకు ప్రతీక అన్నది అధికార పక్షం వాదన. ఏడువేల ఏళ్ళ నాటి విష్ణుపురాణం తదితర ప్రాచీన గ్రంథాల్లో ‘భారత్’ అని ఉపయోగించినందున ఆ పేరును వాడాలనేది ఐజాక్ కమిటీ సూచన. అయితే, ఇన్నేళ్ళుగా ‘ఇండియా’, ‘భారత్’లను పరస్పర పర్యాయపదాలుగానే వాడుతున్న దేశంలో ‘ఇండియా’ అని ఉన్నచోటల్లా పాఠ్యపుస్తకాల్లో ‘భారత్’ అని మార్చేయమని సిఫార్సు చేయడమే అర్థరహితం. ప్రభుత్వం తమనేమీ ప్రభావితం చేయలేదని ప్రొఫెసర్ ఐజాక్ అంటున్నారు కానీ, హిందూత్వ భావజాలం వైపు ఆయన మొగ్గు జగమెరిగిన సత్యం. పాలక పక్షపు ప్రాపకం కోసం చేసే ఇలాంటి ప్రతిపాదనలు, సిఫార్సులు గాలిలో నుంచి వాటంతట అవి ఊడిపడతాయని అనుకోలేం. అలా అనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే, 2018లోనే ప్రాచీన చరిత్రను తిరగరాసేందుకు తోడ్పడే నివేదికను సమర్పించాల్సిందిగా కేఎన్ దీక్షిత్ సారథ్యంలోని కమిటీని కోరారు. దీక్షిత్ సాక్షాత్తూ ఇండియన్ ఆర్కియలాజికల్ సొసైటీకి ఛైర్మన్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు మాజీ జాయింట్ డైరెక్టర్ జనరల్. తాజా సిఫార్సులు వచ్చే విద్యా సంవత్సరానికల్లా అమలులోకి రావచ్చట. పిల్లల పాఠ్యపుస్తకాల్లోనే కాక, విద్యావిషయక పరిశోధనలోనూ ఈ కమిటీ సిఫార్సులు చోటుచేసుకుంటాయని 2018లో సంస్కృతీశాఖ మంత్రిగా చేసిన మహేశ్‌శర్మ తదితరులు ఆశాభావంతో ఉన్నారు. అసలింతకీ కొత్తగా చేర్చదలచిన ఈ ‘సంప్రదాయ చరిత్ర’ అంటే ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశాన్ని పాలించిన రాజవంశాలన్నిటికీ పాఠ్యగ్రంథాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఐజాక్ కమిటీ ప్రతిపాదించింది. ఈ సమప్రాతినిధ్యం ప్రాంతాల ప్రాతిపదికన, చరిత్రలో ఆ వంశాల ప్రాధాన్యం ప్రాతిపదికనైతే ఫరవాలేదు. అలా జరుగుతుందా అన్నది ప్రశ్న. సంగీతం, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం, వాణిజ్యం, భక్తి ఉద్యమాల్లో ఎంతో భాగమున్న దక్షిణాది రాజవంశాలను ఎన్సీఈఆర్టీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతకాలం ఉత్తర భారత దృక్కోణంలోనే నడుస్తున్న వారి పుస్తకాల్లో దక్షిణ భారత రాజవంశాలకూ తగినంత చోటిస్తారా? అది ఓ బేతాళప్రశ్న. అయితే, దేశంలో నిత్యం జరిగే చారిత్రక, పురావస్తు అధ్యయనాల్లో కొత్తగా బయటపడుతున్న అంశాలను సైతం పాఠ్యప్రణాళికలో చేర్చాలన్న కమిటీ సిఫార్సును తప్పక స్వాగతించాలి. చరిత్ర జడపదార్థం కాదు. దొరికిన సరికొత్త సాక్ష్యాధారాలతో ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చు కోవాలి. సమకాలీన అంశాలనూ చేర్చుకోవాలి. కానీ, కొత్త మార్పుల పేరిట పాలకపక్ష భావజాలా నికి అనుకూలంగానో, అన్నీ పురాణాల్లోనే ఉన్నాయిష అనో చరిత్రను మార్చాలని చూడడమే దుస్స హనీయం. అసలు సిసలు భారత్‌కు తామే ప్రతినిధులమని పిల్లలకు పాఠాలతో ఎక్కించి, రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అంత కన్నా ఘోరం లేదు. చంద్రయాన్–3, నారీ శక్తి వందన్, కోవిడ్ నిర్వహణ లాంటి అంశాలకూ చోటిచ్చేలా ఎన్సీఈఆర్టీ ప్రణాళికా రచన చేసినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి, పరిశోధన చేసి, పిల్లల వయసుకు తగిన పాఠాలతో ముందుకు రావడం ఎన్సీఈఆర్టీ పని. ఆ బాధ్యత వదిలేసి, అధికార పార్టీ రాజకీయ ఆలోచనలకు తగ్గట్టు, లేదా ఒక పక్షం విజయాలనే కీర్తిస్తున్నట్టు పాఠ్యాంశాలనే మార్చాలనుకుంటే అది సమగ్ర చరిత్ర కాదు. సమర్థనీయం కానే కాదు! -
ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో భారత్
న్యూఢిల్లీ: అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్థానంలో భారత్ పదాన్ని ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) భావిస్తోంది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పుచేర్పుల కోసం ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘క్లాసికల్ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్టు కమిటీ చైర్పర్సన్ సి.ఇసాక్ తెలిపారు. ‘ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్‌గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఎందుకంటే భారత్ అనే పేరు చాలా పురాతనమైన పేరు. విష్ణుపురాణం వంటి 7 వేల ఏళ్ల నాటి పురాతన గ్రంథాల్లోనే భారత్ పేరును ప్రస్తావించా’ అని ఆయన వివరించారు. అయితే ప్యానల్ సిఫార్సుల అమలుపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేశ్ సక్లానీ స్పష్టం చేశారు. అనంతరం ఈ మేరకు సంస్థ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొత్త ప్రతిపాదనలను డొమైన్ నిపుణులు తదితరులకు ఎప్పటికప్పుడు తెలియపరిచి వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. అందుకే ఈ అంశంపై ఇప్పుడే ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా అది తొందరపాటు చర్య అవుతుంది’ అని అందులో పేర్కొంది. ‘ఇండియా’ కూటమికి భయపడే: విపక్షాలు కమిటీ సిఫార్సులను విపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ‘చివరికి పాఠ్య పుస్తకాల్లో, సిలబస్‌లో కూడా దేశ చరిత్రను బీజేపీ ఎలా వక్రీకరించాలని చూస్తోందో దీనిని బట్టి మరోసారి రుజువైంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తమ దృష్టిలో ఇండియా, భారత్ పేర్లు రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడం ప్రధాని మోదీని విపరీతంగా భయపెడుతోందనేందుకు ఇది ప్రబల నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. ఎన్డీఏ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కార్ ఇలా పేర్ల మారి్పడి పరంపర కొనసాగిస్తోందని డీఎంకే ఆరోపించింది. ఆర్జేడీ తదితర పార్టీలు కమిటీ సిఫార్సులను తప్పుబట్టాయి. ‘‘విపక్షాలు తమ కూటమి పేరున ‘ఇండియా’ బదులు భారత్‌గా ఇప్పడు మార్చేస్తే మోదీ సర్కార్ వెంటనే దేశం పేరును ‘భారత్’కు బదులు జంబూదీ్వపం అనో మరేదైనా పేరో పెట్టే స్తారా ?’’ అని ఎంపీ మనోజ్ ఝా ఎద్దేవా చేశారు. జీ20 శిఖరాగ్రంతో మొదలు భారత్ పేరు తొలుత ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ఆహ్వాన పత్రికల్లో ప్రత్యక్షమవడం విదితమే. రాష్ట్రపతిని అప్పటిదాకా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’గా సంబోధిస్తుండగా కొత్తగా దానికి బదు లు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఆ ఆహ్వాన పత్రికల్లో మోదీ ప్రభుత్వం పేర్కొంది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ సీటు ముందు ఉంచిన నేమ్‌ప్లేట్‌పై ఇండియా బదులు భారత్ అనే రాసి ఉండటం తెల్సిందే. కమిటీ ఏం చెప్పిందంటే... ఎన్సీఈఆర్టీ ఉన్నత స్థాయి కమిటీ చైర్పర్సన్ ఇసాక్ సంఘ్ పరివార్‌కు సన్నిహితుడు. దాని తాలూకు అతివాద సంస్థ అయిన భారతీయ విచార కేంద్రం ఉపాధ్యక్షునిగా ఆయన పని చేశారు. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) సభ్యుడు కూడా. ఎన్సీఈఆర్టీకి కమిటీ చేసిన సిఫార్సులను ఆయన సవివరంగా పేర్కొన్నారు. అవేమిటంటే... ► బ్రిటిషర్లు భారత చరిత్రను ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ మూడు దశలుగా విభజించారు. వీలైనంత వరకూ భారత్ ఘనతలను, సాధించిన ప్రగతిని, శాస్త్రీయ విజయాలను మరుగునపడేశారు. వాటిని తక్కువ చేసి చూపించారు. అందుకే పాఠశాలల్లో మధ్య యుగ, ఆధునిక భారత చరిత్రతో పాటు క్లాసికల్ పీరియడ్ గురించి ఇకమీదట బోధించాలి. ► ప్రస్తుత పాఠ్య పుస్తకాల్లో హిందూ వైఫల్యాలను మాత్రమే ప్రముఖంగా పేర్కొన్నారు. కానీ మొగలులు తదితర సుల్తాన్లపై హిందూ రాజులు సాధించిన విజయాలను మాత్రం ప్రస్తావించలేదు. ► అందుకే మన చరిత్రలో పలు యుద్ధాల్లో హిందూ రాజులు సాధించిన విజయాలకు పాఠ్య పుస్తకాల్లో మరింతగా చోటు కలి్పంచాలి. ► అన్ని పాఠ్యపుస్తకాల్లోనూ ఇండియన్ నాలెడ్జ్ సిస్టం (ఎన్‌కేఎస్)ను కొత్తగా ప్రవేశపెట్టాలి. ► కమిటీలో ఐసీహెచ్ఆర్ చైర్పర్సన్ రఘువేంద్ర తన్వర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ వందనా మిశ్రా, వసంత్ షిందే, మమతా యాదవ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
NCERT: పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్!
ఢిల్లీ: దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి NCERT ప్యానెల్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని కోరుతూ మండలికి సిఫార్సు చేయనుంది. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, కొత్త సిలబస్, మార్పులు చేర్పులు, 2020 పాలసీకి సవరణలు, ఇతర ప్రణాళికల్ని ఖరారు చేసేందుకు 25 మందితో కూడిన ప్రత్యేక కమిటీ ఒక ఏర్పాటైంది. అయితే.. ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు NCERT ప్యానెల్ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ బుధవారం వెల్లడించారు. కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ ఉంటుందని స్పష్టం చేశారాయన. చాలాకాలంగా ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. తాజాగా ఏకగ్రీవంగా సభ్యులంతా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారాయన. ఎన్సీఈఆర్టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు రాబోతుందని ప్యానెల్ ఆశిస్తున్నట్లు తెలిపారాయన. అలాగే.. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కూడా ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు.. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా మన ఓటముల ప్రస్తావనే ఉంది. కానీ, మొఘలుల మీద, సుల్తానుల మీద మన విజయాల గురించి ప్రస్తావన లేదు అని అంటున్నారాయన. అయితే ఢిల్లీ ఎన్సీఈఆర్టీ ప్రధాన కార్యాలయానికి ఈ ప్రతిపాదన మాత్రమే వెళ్లిందని.. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఈ దశలో ఈ పరిణామంపై స్పందించడం అవసరమని ఎన్సీఈఆర్టీ అంటోంది. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టంచేశారు. -
ఆంధ్రను గెలిపించిన భరత్, అశ్విన్
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. గుజరాత్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 19.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఆర్య దేశాయ్ (35 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లు స్టీఫెన్ (3/25), కావూరి సాయితేజ (2/45), కేవీ శశికాంత్ (2/22), మనీశ్ (2/47) గుజరాత్ జట్టును దెబ్బ తీశారు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెపె్టన్ కోన శ్రీకర్‌భరత్ (41 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అశి్వన్ హెబ్బర్ (36 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక విహారి (16 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (13 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆంధ్ర జట్టును విజయతీరానికి చేర్చారు. నేడు జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో మణిపూర్ జట్టుతో ఆంధ్ర ఆడుతుంది. -
భారత్ చర్యతో లక్షల మంది జీవితాలు దుర్భరం: ట్రూడో
కెనడా దౌత్యవేత్తలకు రక్షణ కల్పించడాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. 41 మంది కెనడా దౌత్యవేత్తలపై భారత్ అనుసరించిన వైఖరి ఈ రెండు దేశాల్లోని లక్షలాది మంది జీవితాల్ని దుర్భరం చేస్తున్నదని ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ నుంచి కెనడాకు చెందిన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పంపిస్తున్నన్నట్టు భారత్ ప్రకటించిన నేపధ్యంలో జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కెనడా దౌత్యవేత్తల అధికారిక హోదాను ఏకపక్షంగా రద్దు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందని ఆయన ఆరోపించారు. భారత్ చర్య కారణంగా కెనడా, భారతదేశంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు సాధారణ జీవితాన్ని భారత ప్రభుత్వం కష్టతరం చేసిందని ట్రూడో పేర్కొన్నారు. ఇది దౌత్య విధానంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని అన్నారు. భారత్‌లో ఉంటున్న కెనడియన్ల సంక్షేమంపై తనలో ఆందోళన నెలకొన్నదన్నారు. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కెనడా చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించింది. భారతదేశంలోని కెనడియన్ దౌత్యవేత్తలకు సంబంధించి కెనడా ప్రభుత్వం అక్టోబర్ 19న చేసిన ప్రకటనను గమనించామని, ఇరు దేశాల్లోని దౌత్యవేత్తల సంఖ్యలో సమానత్వం గురించి చర్చించామని పేర్కొంది. భారతదేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్య అధికంగా ఉందని, అందుకే భారతదేశ అంతర్గత వ్యవహారాల్లోనూ కెనడా జోక్యం పెరిగిపోయిందని భారత ప్రభుత్వం ఆరోపించింది. కెనడియన్ దౌత్యవేత్తలు వెనక్కి రావడం గురించి కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ .. అక్టోబర్ 20 తర్వాత 21 మంది కెనడియన్ దౌత్యవేత్తలు మినహా మిగిలిన దౌత్యవేత్తల దౌత్యపరమైన అధికారాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని భారతదేశం తెలియజేసిందని అన్నారు. ఈ మేరకే తాము దౌత్యవేత్తలందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారిని భారతదేశం నుండి సురక్షితంగా వెనక్కి పిలిపించామన్నారు. భారత్ చేపట్టిన ఈ చర్యను తాము ఊహించలేదని అన్నారు. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని, ఏ దేశంలోనైనా దౌత్యవేత్తల అధికారాలను ఏకపక్షంగా రద్దు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. ఇటువంటి చర్య కారణంగా ఏ దౌత్యవేత్త అయినా భారత్‌లో పనిచేయడం కష్టమని అన్నారు. అయితే దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, గత నెల రోజులుగా ఈ అంశంపై కెనడా ప్రభుత్వంతో కలిసి భారత ప్రభుత్వం చర్చిస్తున్నదని తెలిపింది. ఈ నిర్ణయాలు వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1కు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. దౌత్యవేత్తల విషయంలో సమానత్వాన్ని అమలు చేయాలనే నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగా భారత్ పరిగణించదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: కాన్సులేట్ సేవలు నిలిపేసిన కెనడా -
‘నమో భారత్’కు ప్రధాని మోదీ పచ్చజెండా
సాహిబాబాద్: దేశంలో మొట్టమొదటి నమో భారత్ రైలు(ర్యాపిడ్ రైలు సర్వీసు)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్)లో 17 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. ఈ 17 కిలోమీటర్ల కారిడార్‌తోపాటు ఇదే మార్గంలో ‘నమో భారత్’ రైలును మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ నుంచి దుహాయి డిపో వరకు ఆయన నమో భారత్ రైలులో ప్రయాణించారు. రైలులో పాఠశాల విద్యార్థులు, రైల్వే సిబ్బందితో మాట్లాడారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ ఆర్ఆర్టీఎస్ మొత్తం పొడవు 82.15 కిలోమీటర్లు. మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుందని, దాన్ని తానే ప్రారంభిస్తానని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తోపాటు హరియాణా, రాజస్తాన్‌లో నగరాలు, పట్టణాలను అనుసంధానించేలా మరికొన్ని నమో భారత్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈస్ట్–వెస్ట్ కారిడార్, బెంగళూరు మెట్రో రైలును కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. -
విడాకులు తీసుకున్న కూతుర్ని మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి
అత్తారింట్లో కూతురికి ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు. కానీ సమాజం, చుట్టాలు ఏమనుకుంటారో అన్న భయంతో ఏదైనా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయిపోమ్మని సలహా ఇస్తుంటారు. కానీ ఈ తండ్రి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. అత్తింట్లో కూతురి కష్టాలు చూడలేక విడాకులు తీసుకుంటానన్న ఆమె నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా దీన్ని ఒక వేడుకలా నిర్వహించి ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లంటే నూరేళ్ల పండుగ. కానీ అందరి జీవితాల్లో అది నిజం కాదు. పెళ్లితో మరింత అందంగా మారిపోతుందనుకున్న జీవితం తలకిందులైతే? ఆ బాధ వర్ణణాతీతం.మరోవైపు కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించిన ఆ తండ్రికి అత్తగారింట్లో కూతురు ఆనందంగా లేదని తెలిసి తల్లడిల్లిపోయాడు. అయితే అప్పటికే భర్తతో ఇక కలిసి ఉండలేనంటూ కూతురు తీసుకున్న విడాకుల నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా ఘనంగా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు. వివాహం సమయంలో నిర్వహించిన ఊరేగింపు మాదిరిగానే బ్యాండు బాజాలు, టపాసుల చప్పుళ్ల మధ్య ఆమెకు స్వాగతం పలికారు. బాణసంచా సందడి మధ్య ఆమెను పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సంఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..రాంచీలో కైలాశ్‌నగర్ కుమ్హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి.. గతేడాది ఏప్రిల్ 28న తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశారు.ఝార్ఖండ్ విద్యుత్ పంపిణీ సంస్థలో అతడు అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని,అంతేకాకుండా అతడికి ముందే వివాహం అయినట్లు తెలిసి షాక్ అయ్యామని ప్రేమ్ గుప్తా పేర్కొన్నారు. అయినప్పటికీ పెద్దల సమక్షంలో అతడితోనే బంధం కొనసాగించాలని కూతురికి సర్దిచెప్పామని, అయినా అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో భర్త నుంచి విడిపోవాలని తన కూతురు నిర్ణయం తీసుకుందని, దీన్ని తాము కూడా అంగీకరించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే సాక్షిని తిరిగి పుట్టింటికి తీసుకొచ్చేందుకు బరాత్ మాదిరిగా ఊరేగింపు చేశామని అన్నారు. ప్రస్తుతం విడాకుల ఊరేగింపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. -
భారత్‌ను మాల్దీవులు వదులుకోగలదా?
దక్షిణాసియాలో చిట్టచివరగా బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్య్రం పొందిన దేశం మాల్దీవులు. 1965లో స్వతంత్ర దేశంగా అవతరించినప్పటి నుండి ఆర్థిక, శాస్త్రీయ–సాంకేతిక అభివృద్ధిలో, సముద్ర భద్రతా విషయాల్లో మాల్దీవులకు భారత్ చేయూత అందించింది. 1988లో ఆపరేషన్ కాక్టస్ ద్వారా ప్రభుత్వాన్ని తీవ్రవాదుల చెర నుండి కాపాడింది. అయినా కొన్నేళ్లుగా భారత్ ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రెండు మూడేళ్లుగా ఏకంగా ‘ఇండియా అవుట్’ ప్రచారానికి కేంద్రం అయింది. దీని వెనక ఐఎస్ఐ, చైనా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అలాగని అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్‌ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలిక కాదు. మాల్దీవుల్లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో భారత వ్యతిరేక రాజకీయాలు నెరిపిన మొహమ్మద్ ముయిజ్యూ సుమారు 54 శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఇరు దేశాల సంబంధాలు ఎలా వుండబోతున్నాయో అంచనా వేసే ముందు, భారత్ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. మాల్దీవ్స్‌లో 12వ శతాబ్దంలో ఇస్లాం అడుగుపెట్టినప్పటికీ అది స్థానిక సంప్రదాయాలు, ఆచారాల సమ్మిళితంతో ఉదారవాదంగా ఉండేది. 1970ల్లో ఉదార మత విధానాలను అవలంబించిన మాల్దీ వులు, క్రమంగా గల్ఫ్ దేశాల ప్రభావానికి లోనయ్యింది. చమురు ఉత్పాదిత గల్ఫ్ దేశాలు అరబ్, ముస్లిం ప్రపంచంలో ముఖ్యమైన భూమికను పోషించడం మొదలుపెట్టాయి. సున్నీ ముస్లిం వహాబీజం పాటించే గల్ఫ్ దేశాలు సంప్రదాయవాదాన్ని బలంగా ప్రచారం చేయడం, మొహమ్మద్ అబ్దుల్ గయూమ్ నేతృత్వంలోని ప్రభుత్వం 1980, 90ల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మతాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవడం, గల్ఫ్ దేశాల నుండి వచ్చే చమురు, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు సాంప్రదాయవాదాన్ని, ఇస్లామిక్ షరియా చట్టాల్ని ప్రవేశపెట్టడం వరుసగా జరిగాయి. ఆఫ్గనిస్తాన్‌ను సోవియట్ ఆక్రమించడంతో దానికి వ్యతిరేకంగా సంప్రదాయవాద వర్గాల ఏకీకరణ జరిగింది. ఇరవై ఒక్కటవ శతాబ్దం మొదట్లో జరిగిన ప్రపంచ పరిణామాల ప్రభావం మాల్దీవుల యువత మీద తీవ్రంగా పడింది. ఆ దేశంలోని చాలామంది యువత అల్–ఖాయిదాలో చేరినట్టుగా వార్తలు వచ్చాయి. 2007లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు ప్రమాద ఘంటికలు మోగించాయి. 2008లో మాల్దీవులు ఏక పార్టీ వ్యవస్థ నుండి బహుళ పార్టీ వ్యవస్థగా రూపాంతరం చెందింది. మతపరమైన సాంప్రదాయ పార్టీలు ఏర్పాటు కావడానికీ, అవి మత రాజకీయాలు నెరప డానికీ ఇది దారి తీసింది. 2012లో షరియా చట్టాల అమలు కోసం అనేక ఉద్యమాలు ఈ పార్టీలు చేపట్టాయి. చాలామంది యువత ‘ఐసిస్’లో చేరడానికి సిరియా వెళ్లినట్టు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ఇస్లామిక్ ఛాందసవాదాన్ని ఎగదోయడంలో, ముఖ్యంగా భారత్ పట్ల వ్యతిరేకతను పెంచడంలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పాత్ర చాలా ఉంది. 1990ల్లో జరిగిన ఇస్రో ‘హనీ ట్రాప్’ కేసులో మాల్దీవులకు చెందినవారు ఉన్నట్టుగా బయట పడటం ఆ దేశంలో వేళ్లూనుకున్న ఐఎస్ఐ పాత్రకు ఒక ఉదాహరణ మాత్రమే. 1978 నుండి 2008 వరకు సుమారు ముప్పయ్యేళ్లు మాల్దీవులను ఏకధాటిగా పాలించిన మౌమూన్ అబ్దుల్ గయూమ్, అయన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, 2018లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం సోలీహ్ భారత్ పట్ల సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. కానీ 2013 నుండి 2018 మధ్యకాలంలో అధికారంలో ఉన్న అబ్దుల్లా యామీన్ ప్రభుత్వం భారత్ వ్యతిరేక విధానాలను అనుసరించింది. తాజాగా ఆయన వారసుడిగా మొహమ్మద్ ముయిజ్యూ భారత్ పట్ల అంతే తీవ్ర వ్యతిరేక ప్రచారాలతో ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. యామీన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మాల్దీవ్స్‌లో చైనా కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. 2014లో చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో మాల్దీవ్స్ చేరడమే కాకుండా అనేక మౌలిక వసతుల నిర్మాణ బాధ్యతలను చైనీస్ కంపెనీలకు అప్పగించింది. మాలె, హుల్హులే, హుల్హుమాలే దీవులను కలిపే సినిమాలే బ్రిడ్జితో పాటు, వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం, హుల్హులే ద్వీపంలోని నివాస సముదాయ నిర్మాణాలు, టూరిజం, ఎనర్జీ తదితర రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. మాల్దీవుల ఆర్థిక శాఖ అంచనా ప్రకారం, 2022 చివరికల్లా ఆ దేశ అప్పులు జీడీపీలో 110 శాతం. అందులో చైనా వాటా సుమారు 70 శాతం. ప్రతి సంవత్సరం చైనాకు చెల్లించే వడ్డీలు సుమారు 92 మిలియన్ల అమెరికన్ డాలర్లు. మాల్దీవుల వార్షిక బడ్జెట్లో ఇది సుమారు 10 శాతం. యామీన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం, విదేశీయులు ఆ దేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు. దీని ఆసరాగా చైనీస్ కంపెనీలు ఫెయిదూ ఫింహులు ద్వీపాన్ని 50 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాయి. ఈ లెక్కలు చైనా ప్రభావం మాల్దీవుల పైన ఎంతవుందో, చైనా అప్పుల ఊబిలో ఎంతగా చిక్కుకుందో తెలియజేస్తాయి. చైనా ఈ పరిస్థితులను భారత వ్యతిరేక శక్తులను పెంచడానికి ఉప యోగించుకుంది. చైనా అనుసరిస్తున్న వైఖరిని గ్రహించిన ఇబ్రహీం సోలీహ్ ప్రభుత్వం ‘ఇండియా ఫస్ట్’ విధానాన్ని పాటించింది. అయితే భారత వ్యతిరేక శక్తులు ఒక క్రమ పద్ధతిలో ప్రచారాన్ని సాగించాయి. ఆ దేశంలో ఉన్న నిరుద్యోగానికి ముఖ్య కారణం, భారతీయులు టూరిజం తదితర రంగాల్లో ఉద్యోగాలు ఎగరేసుకు పోవడమేననీ, భారత్‌లో ముస్లింల పట్ల అణచివేతకు పాల్పడుతున్నా రనీ, భారత్ తన సైనిక కార్యక్రమాలు సాగిస్తూ మాల్దీవుల సార్వభౌ మత్వాన్ని ఉల్లంఘిస్తోందనీ, ఇబ్రహీం సోలీహ్ ప్రభుత్వం దేశ సంపదను భారత్‌కు ధారాదత్తం చేస్తోందనీ ఇలా అనేక రకాలుగా విష ప్రచారం చేశాయి. ఇదే రకమైన రాడికలైజేషన్, యువతలో భారత వ్యతిరేక భావజాల వ్యాప్తి బంగ్లాదేశ్‌లోనూ గమనించవచ్చు. ఈ ప్రచారం వెనక అటు ఐఎస్ఐ, ఇటు చైనా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని భారత వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగించకుండా చేయడం, విదేశాంగ విధానానికి ఒక సవాలు. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో మయాన్మార్ నుండి జిబౌటి వరకు తన ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్న చైనాను కట్టడి చేయడం అంత తేలిక కాదు. భారత్, చైనా మధ్య ఈ ప్రాంతంలో నెలకొన్న పోటీలో మాల్దీవులు ముఖ్య భూమికను పోషిస్తాయి, 2013లో అమెరికా మాల్దీవులతో సైనిక ఒప్పందాలు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను, భారత్ అడ్డుకుంది. దక్షిణాసియాలో ప్రాంతీయేతర శక్తుల ప్రభావాన్ని అడ్డు కోవడం భారత విదేశీ విధానంలో ముఖ్య భాగం. కానీ అది క్రమంగా మారడం గమనించవచ్చు. 2020లో కుదిరిన అమెరికా, మాల్దీవుల సైనిక ఒప్పందానికి భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. మాల్దీవులకు సుమారు 1,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గరిసియ అమెరికా మిలిటరీ స్థావరాన్ని గతంలో వ్యతిరేకించిన భారత్ ప్రస్తుత పరిస్థి తుల్లో తన స్వరం మార్చింది. ఈ ఒప్పందాలు చైనా ప్రభావాన్ని నిలువరించడంలో సహాయపడతాయని భావిస్తోంది. భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడబోతున్నందుకు మరీ ఆందోళన చెందకుండా ఇదివరకే ఆ దేశంతో కుదిరిన అనేక ఒప్పందాలు, ముఖ్యంగా 500 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన థిలమలే సముద్ర వంతెన ప్రాజెక్ట్, తాగునీరు పైపులైన్ ప్రాజెక్ట్, విద్య, అరోగ్య సేవల వసతుల నిర్మాణ ప్రాజెక్టులు, వివిధ ఇతర పనులకు సంబంధించిన దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు కొనసా గించాలి. ఇవి మాల్దీవులకు చాలా ముఖ్యమైనవి. ఇవి కొనసాగించేందుకు నూతన ప్రభుత్వాన్ని ఒప్పించడం, భారత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తక్షణ కర్తవ్యాలు. అభివృద్ధి చెందు తున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్‌ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలిక కాదు. ‘ఇండియా అవుట్’ ప్రచారం అక్కడి భారత సైనిక బలగాలకు వ్యతి రేకంగానో, భావోద్వేగ రాజకీయాల కోసమో తప్ప, పూర్తిగా భారత్‌ను ఆ దేశానికి దూరం చేయాలని కాదని మనం అనుకోవలసి ఉంటుంది. డా‘‘ గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన విభాగం, ఎస్ఐఎస్, జేఎన్‌యూ -
బలమైన ప్రభుత్వం ఓ అపోహే!
ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనేది అపోహ. సంకీర్ణ ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ ఈ అపోహ జనాన్ని నమ్మేలా చేస్తుంది. కానీ చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత లేదా సంకీర్ణ ప్రభుత్వాల మధ్య ఎటువంటి తేడా లేదని చరిత్ర చెబుతోంది. అమెరికాలో మహా మాంద్యం తర్వాత, ‘న్యూ డీల్’(1933)లో భాగంగా సంక్షేమ విధానాలను అమలు చేశారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగింది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. భారత్ వంటి విశాలమైన దేశానికి ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనే అపోహ ఆధారంగా, ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనను తిరిగి ఎన్నుకోవడం అనే ప్రబలమైన కథనం ఆధారపడి ఉంది. ‘బలమైన ప్రభుత్వం’ అనే ఈ అపోహ– బహుళ పార్టీ, సంకీర్ణ ఆధారిత ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ లేదా చట్టాలను ఆమోదించలేవనీ నమ్మేలా చేస్తుంది. అయితే, రాజనీతి శాస్త్ర రంగంలోని పరిశోధనలు మనకు భిన్నమైన చిత్రణను చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రధానంగా మూడు రకాల ప్రజా స్వామ్య ప్రభుత్వాలు ఉనికిలో ఉన్నాయి. అవి: అధ్యక్ష తరహా, పార్ల మెంటరీ, సంఘటిత (కాన్సోషియేషనల్) ప్రభుత్వాలు. ఈ ప్రతి ప్రభుత్వ రూపంలోనూ, బహుళ పార్టీ ప్రభుత్వాలు లేదా సంకీర్ణ ప్రభు త్వాలు స్థిరంగా ఉండటమే కాకుండా పౌరుల సంక్షేమం విషయంలో కూడా మెరుగ్గా ఉన్నాయని సాక్ష్యాధారాలు చూపుతున్నాయి. అమెరికా, అధ్యక్ష వ్యవస్థను అనుసరిస్తుంది. ఈ వ్యవస్థలో అధ్య క్షుడిని నేరుగా కార్యనిర్వాహక అధిపతిగా ఎన్నుకుంటారు. అయితే పన్నులు పెంచడం, డబ్బు ఖర్చు చేయగల సామర్థ్యం అనే ఖజానా అధికారాలను ప్రతినిధుల సభకు కట్టబెట్టారు. డేవిడ్ మేహ్యూ రాసిన ‘డివైడెడ్ వియ్ గవర్న్: పార్టీ కంట్రోల్, లా మేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, 1946–2002’ అనే పుస్తకంలో, ఒకే రాజకీయ పార్టీ అటు అధ్యక్ష పదవినీ, ఇటు కాంగ్రెస్‌నీ నియంత్రించినప్పుడు మాత్రమే అమెరికన్ జాతీయ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనే సాధారణ అపోహను తొలగించారు. చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత పార్టీ లేదా వివిధ పార్టీల మధ్య ఎటువంటి తేడా లేదని ఈ పుస్తకం వెల్లడిస్తుంది. నిజానికి, మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) తర్వాత, అంటే 1933లో కొత్త ఒప్పందం (న్యూ డీల్)లో భాగంగా సంక్షేమ ఆధారిత విధానాలు అమలు చేశారు. అలాగే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో ఇటీవలే తీసుకొచ్చిన ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, 2022 వంటి సంక్షేమ ఆధారిత విధానాల్లో భాగంగానే ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడం, మందుల ధరలను తగ్గించడం, క్లీన్ ఎనర్జీకి మద్దతు ఇవ్వడం వంటివాటిని ఆమోదించారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాల హయాంలోనే ఇవి ఆమోదం పొందాయి. దీనికి విరుద్ధంగా, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ) లేదా ఒబామా కేర్ చట్టంగా ప్రసిద్ధి చెందిన యాక్ట్‌ను, 2009లో డెమొక్రాటిక్ పార్టీ అటు అధ్యక్ష పదవినీ నిర్వహిస్తూ, ఇటు ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ మెజారిటీని కలిగి ఉన్నప్పుడు ఆమోదించారు. అయినా ఈ చట్టాన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు, గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా దానిని రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అటువంటి చట్టంలో భాగం కాలేనప్పుడు, తమ నియోజకవర్గాలకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఉంటాయని తెలిసినప్పటికీ, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని ఇది సూచిస్తోంది. పశ్చిమ ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం వంటి పార్ల మెంటరీ ప్రజాస్వామ్యాలను ఎక్కువగా వామపక్ష లేదా సంప్రదాయ వాద పార్టీల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తుంటాయి. 1945 నుండి జర్మనీని రైట్ వింగ్ లేదా ఉదారవాద సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ‘క్రిస్టియన్ డెమో క్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ’ మితవాద పక్షానికీ, ‘సోషల్ డెమో క్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ’ మధ్యస్థ–వామపక్ష ప్రభుత్వానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక ‘సంఘటిత’ ప్రభుత్వాలను పార్లమెంటరీ విధానంలోని ఉప విభాగంగా చూడవచ్చు. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలను మాత్రమే కలిగి ఉంటాయి. ఇటలీ, లెబనాన్, ఇథియోపియా వంటి దేశాలలో, వివిధ రకాలైన జాతి, మత, భాషా సమూహాలు సహజీవనం చేయవలసి వస్తోంది. సంఘటిత ప్రభుత్వాలు ఈ సమూహాలలోని అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో ఏర్పడతాయి. వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక సమూహం ఏదైనా విషయంపై మరొకరిని అడ్డుకుంటే,రెండోది ప్రతిగా ఆ సమూహాన్ని నిరోధించే అవకాశం ఉంటుంది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. అలాగే దేశ అణ్వాయుధ ప్రయోగాల సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించారు. 2004 నుండి 2014 వరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అనేక పౌరుల, హక్కుల ఆధారిత చట్టాలను రూపొందించింది. వీటిలో 2005లోని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), 2006లోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, 2009లోని విద్యా హక్కు చట్టంతో పాటు, 2013లో తెచ్చిన ఆహార హక్కు చట్టం; భూ సేకరణ, పునరా వాసం, రీసెటిల్మెంట్ (ఎల్ఏఆర్ఆర్) చట్టం ఉన్నాయి. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి... బలహీ నమైన, కీలుబొమ్మ ప్రభుత్వం అనే అపోహను ప్రచారం చేయడంతో అది 2014లో బీజేపీ విజయానికి దారితీసింది. అయితే, 2014 నుండి ‘బలమైన నాయకత్వం’ మనకు ఏమి అందించిందో చూద్దాం. హక్కుల ఆధారిత చట్టాలు వేటినీ ఈ ప్రభుత్వం ఆమోదించలేదు. పాలనా పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించి ఏ ఆధారాలూ లేవు. బదులుగా మోదీ ప్రభుత్వం ప్రజలను జవాబుదారీగా ఉంచాలనుకుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా మీ డబ్బును నాకు చూపించమంది; జీఎస్టీ ద్వారా మీ పన్నులు నాకు చెల్లించమంది. ఇంకా ఆర్టికల్ 370 రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టాన్ని తేవడం వంటివి జరిగాయి. నిరసనల తర్వాత మాత్రమే 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దయినాయి. గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం లేదా స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించడం వంటివి అమలులో ఉన్న సంక్షేమ విధానాలకు పొడిగింపు మాత్రమే. ఏ కొత్త ఆవిష్కరణా లేదా కొత్త దిశనూ ఈ ప్రభుత్వం చూపలేదు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన సుమారు 50 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఆర్థిక సేవలను అందిస్తుంది. అయితే ఇందులో 4.12 కోట్ల మంది జూలై 2023 నాటికి జీరో బ్యాలెన్స్ కలిగి ఉన్నారు. కాగా, జనవరి 2018 నుండి 6 కోట్ల ఖాతాల్లో ఎటువంటి లావాదేవీలు జరగలేదు. హక్కుల ఆధారిత చట్టాలు ఈ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమయ్యాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు తగ్గాయి. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరచడం ద్వారా ప్రభుత్వం తనను సూక్ష్మశోధనకు అతీతంగా ఉంచుకుంది. వివిధ పథకాలు లేదా ప్రభుత్వ వైఖరి సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి కాదు. ఒక రకమైన భూస్వామ్య పరాధీనతను సృష్టించడంలో భాగమే. అన్ని గ్యాస్ స్టేషన్లపై, మనందరి కోవిడ్ టీకా సర్టిఫికేట్లపై భూస్వామ్య ప్రభువైన ప్రధాని స్వయంగా కనిపిస్తుంటారు. ఏకవ్యక్తి ప్రభుత్వం వర్సెస్ సంకీర్ణ ప్రభుత్వం గురించి చరిత్ర పొడవునా సమీక్షించినప్పుడు, బలమైన నాయకుల అహంకారం వారి ప్రజలకు ఎల్లప్పుడూ మంచిది కాదని మనకు అర్థమవుతుంది. ఇస్లా మిక్ చట్టంలో ఇజ్మా అనే భావన ఉంటుంది. అంటే ఏకాభిప్రాయం. అతి పెద్ద సమాజం తరపున నిర్ణయాలు తీసుకోవడానికి పండితుల సంఘం కలిసి వస్తుందనే అవగాహనపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ రూపంలో మనం ఒక సంభా వ్యతకు సాక్ష్యులుగా ఉన్నాం. భారత దేశంలోని భిన్న సమూహాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం కల్పించడం కోసం అనేక పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్లకు ఓటర్లు ఒక అవకాశం ఇస్తారని ఆశించవచ్చు. డాక్టర్ రాజ్‌దీప్ పాకనాటి వ్యాసకర్త ‘జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్’ ప్రొఫెసర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ -
సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న సమరా.. రిలీజ్ డేట్ ఫిక్స్!
రెహ్మాన్, భరత్ కలిసి నటించిన తాజా చిత్రం సమరా. పీకాక్ ఆర్ట్ హౌస్ పతాకంపై ఎంకే.సుభాకరన్, అనూస్ వర్గీస్ విల్యాడత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి చార్లెస్ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. బజరంగీ భాయిజాన్, జాలి ఎల్ఎల్బీ 2, విశ్వరూపం -2 చిత్రాలతో ఫేమస్ అయిన నటుడు మీర్ సర్వార్ ప్రతి నాయకుడిగా నటించారు. చిత్ర పురాణం దర్శకుడు మాట్లాడుతూ.. రెహ్మాన్ వైవిధ్య కథ పాత్రలను ఎంచుకొని నటిస్తున్నారని కొనియాడారు. అలా ఆయన నటించిన తాజా చిత్రమే సమరా అని పేర్కొన్నారు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందించిన ఇందులో రెహ్మాన్ పాత్ర అన్ని వర్గాలను అలరిస్తుందని అన్నారు. ఈచిత్రానికి శీను శతాబ్దం, దీపక్ వారియర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని గోపిసుందర్ అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో ఇంతకుముందు లాక్ డౌన్ నైట్స్ చిత్రాన్ని నిర్మించిన 2 ఎం సినిమా సంస్థ అధినేత వినోద్ శబరీస్ విడుదల చేస్తున్నారని చెప్పారు. ఈ చిత్రంలో టామ్ కాడ్ బిజాల్ ప్రసన్న, కేనల్ మ్యాథ్వీ జార్జ్, సోనాలి సుడన్, టీనీజ్ విల్యా, శ్రీలా లక్ష్మి, శీను సిద్ధార్థ సంజన దీపు రాహుల్ ముఖ్యపాత్రలు పోషించారు. -
బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇంజినీరు భరత్‌రెడ్డి మృతి
కర్ణాటక: ఓవర్టేక్కి తోడు బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక యువకుడు నిండు ప్రాణం పోగొట్టుకున్న సంఘటన యలహంక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సివిల్ ఇంజినీరు కమ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న భరత్‌రెడ్డి (26) మృతుడు. బుధవారం సాయంత్రం భరత్‌రెడ్డి అట్టూరు వైపు నుంచి స్కూటర్‌పై వెళ్తూ ముందు వెళ్తున్న బీఎంటీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సును ఢీకొని కిందపడిపోయాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా భరత్‌రెడ్డి మీద నుంచి బస్సును పోనివ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తల పూర్తిగా ఛిద్రమైపోయింది. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ బస్సు వదిలి పరారయ్యాడు. రోడ్డు ఇరుకుగా ఉండడం కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. యలహంక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భరత్‌రెడ్డి స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా కాగా, బెంగళూరులోనే కత్రిగుప్పెలో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌ను శిక్షించాలని డిమాండ్ భరత్‌రెడ్డి మృతితో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బీఎంటీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని, అతన్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుని చిన్నాన్న నారాయణరెడ్డి మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు యలహంకలో జరుగుతున్న ఒక నిర్మాణ పని చూడడానికి వెళ్లాడు. బస్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడుపుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు అని ఆయన వాపోయారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సొంతూరికి తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం యలహంక పోలీసులు గాలింపు చేపట్టారు. -
నేపాల్‌లో ‘డ్రాగన్’ ఆటలకు భారత్ ఎలా చెక్ పెట్టింది?
చైనా రుణంతో నేపాల్‌లోని లుంబినీ, పోఖ్రాలలో నిర్మితమైన రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉపయోగంలో లేనివిగా మారాయి. ఈ రెండు విమానాశ్రయాల్లో టెర్మినల్ భవనం నుంచి రన్‌వే వరకు నిర్మాణం చాలా కాలం క్రితమే పూర్తయింది. ప్రతిరోజూ ఒకటోరెండో దేశీయ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతున్నాయి. అయితే ఈ విమానాశ్రయాలు ఇప్పటికీ అంతర్జాతీయ విమానాల రాక కోసం వేచి చూస్తున్నాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని చూసి వ్యాపార దృష్టితో పెద్దఎత్తున అప్పులు చేసి, భూములు కొని, విలాసవంతమైన హోటళ్లను నిర్మించినవారు ఇప్పుడు ఆదాయం లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఈ హోటళ్లు నిత్యం ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది బౌద్ధ పర్యాటకులు లుంబినీని సందర్శిస్తారు. అయితే వారిలో ఎక్కువ మంది ఖాట్మండు నుండి దేశీయ విమానాల ద్వారా నగరానికి చేరుకుంటారు. పోఖ్రాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అటు లుంబినీ, ఇటు పోఖ్రాలో పర్యాటకులు ఎందుకు పెరగడం లేదు? లుంబినీ, పోఖ్రాలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించినా పర్యాటకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే కారణమని నేపాల్ అభిప్రాయపడింది. లుంబినీ డెవలప్మెంట్ ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 2022లో నేపాల్ ప్రభుత్వం చైనా రుణంతో గౌతమబుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 76 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వెచ్చించింది. గత ఏడాది మేలో ఈ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించింది. లుంబినీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భైరహవా విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయం కారణంగా పర్యాటకులు రాజధాని ఖాట్మండు నుండి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించే బదులు నేరుగా లుంబినీకి చేరుకోవచ్చు. అయినప్పటికీ పర్యాటకుల సంఖ్యలో ఊహించిన పెరుగుదల కనిపించడం లేదు. లుంబినీ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు క్రమం తప్పకుండా నడిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని విమానయాన, పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ తన గగనతలం గుండా విమానాలు పశ్చిమ దిశగా వెళ్లేందుకు నిరాకరించిందని నేపాలీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే గౌతమ బుద్ధ విమానాశ్రయానికి చేరుకోవడానికి విమానాలేవీ భారతదేశం మీదుగా ప్రయాణించలేవు. చిన్న విమానాలకు మాత్రమే మినహాయింపు ఉంది. గత ఏడాది డిసెంబర్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. గౌతమబుద్ధ విమానాశ్రయం ట్రాఫిక్ కోసం తెరిచిన ఏడు నెలలకే ఈ ఘటన జరిగింది. 2020లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్- చైనాల మధ్య ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఇందులో 20 మంది భారతీయ ఆర్మీ సైనికులు అమరులయ్యారు. ఆ సమయంలో చైనా సైనికులు రెట్టింపు ప్రాణనష్టాన్ని చవిచూశారు. కాగా ఖాట్మండు విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 2015లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా దీనిని కొంతకాలం మూసివేశారు. పోఖ్రాలోని మూడో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లుంబినీ తరహా సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది. పోఖ్రాలో అన్నపూర్ణ పర్వతాల అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. వీటిని చూసేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది జనవరిలో కొత్తగా నియమితులైన నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ‘ఓం’ పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? -
భారత్‌లో మైనార్టీలు భద్రంగా లేరా?
భారతదేశంలో మైనార్టీల హక్కులకు భంగం కలుగుతోందని అమెరికా ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్’ (యూఎస్సీ ఐఆర్ఎఫ్) భారత దేశ సార్వభౌమాధికా రానికి వ్యతిరేకంగా రిపోర్టులను తయారు చేసిన విషయం ఈ దేశ ప్రజలలో చాలా మందికి తెలియదు. అమెరికా మత, రాజ కీయ ప్రయోజనాలను కాపాడడం కోసం 1998లో అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఒక సలహా సంస్థే ఈ యూఎస్సీఐఆర్ఎఫ్. అమెరికా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, ఆగమేఘాలపై రిపోర్టులను తయారు చేసి, ఐక్యరాజ్యసమితి ముందు ప్రవేశపెట్టి, ప్రపంచంలోని సార్వభౌమాధికార దేశాలను ఇబ్బంది పెట్టడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఈ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, భారత దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తదితర మైనార్టీ మతాలవారు అనేక ఇబ్బందు లను ఎదుర్కొంటున్నారనీ, వారి కనీస హక్కులకు భంగం కలిగించేలా భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అమెరికా ఆయిల్, ఫార్మా, డిఫెన్స్ లాబీయింగ్ యధేచ్ఛగా నిర్వహించి, తన దేశ ప్రయో జనాలను నెరవేర్చుకునేది. మోదీ ప్రభుత్వంలో ఇవి సాగడం లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని భారతదేశం తనకు అనుకూలంగా మలుచుకుని, తక్కువ ధరలకు రష్యా నుండి ఆయిల్‌ను సమ కూర్చుకోవడం, తక్కువ ధరలకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను తూర్పు ఆసియా దేశాలకు అమ్మడం, కరోనా టీకాను ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు ప్రవేశపెట్టడం ఇత్యాది విషయాలన్నీ అమెరికాకు కోపం తెప్పించేవే. నిజంగా భారతదేశంలో మైనార్టీలు భద్రంగా లేరా అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మొదట ముస్లింల సంగతి చూద్దాం. ప్రపంచంలో ఏ దేశంలో లేని భద్రత భారతదేశంలోని ముస్లింలకు ఉంది. వారి ఓటు బ్యాంకు కోసం అన్ని రాజకీయ పార్టీలూ సాగిలపడడం మనం చూస్తూనే ఉన్నాం! ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ముస్లింలకు భద్రత కరువైందని చెప్పడం ఒక దుష్ప్రచారం. వక్రబుద్ధితో కూడిన విష ప్రచారం. ఈ దేశంలో భద్రత లేకపోతే బర్మా, బంగ్లాదేశ్‌ల నుండి లక్షల సంఖ్యలో ముస్లింల అక్రమ వలసలు ఎందుకు జరుగుతున్నట్టు? 1947లో మతం ప్రాతి పదికగా ముస్లింలకు పాకిస్తాన్ ఏర్పాట య్యింది అనేది వాస్తవం కాదా? అటువంటి పాకిస్తాన్లో మైనారిటీలైన హిందు వుల పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి తెలియని విషయమేమీ కాదు. ఇక క్రైస్తవుల విషయానికొస్తే – ఈశాన్య రాష్ట్రా లైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలు క్రైస్తవ మెజార్టీ రాష్ట్రాలుగా ఎలా రూపుదిద్దుకున్నాయి? ఇక మోదీ ప్రభుత్వం ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో మతపరమైన వివక్షతలను ఎక్కడా చూపడం లేదనే విషయం స్పష్టం. కాశ్మీరు లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమి వేయడం, అనేక మందిని హత్య చేయడం వంటి విషయాలను ఏనాడు ప్రశ్నించని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ నిప్పు లేకుండానే పొగ ఎందుకు పెట్టింది అనే మర్మాన్ని ఈ దేశ ప్రజలు త్వరలోనే గ్రహిస్తారు. ఉల్లి బాల రంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
'మీ కూతురితో నాకు పెళ్లి ఒక్కటే కాలేదు..' ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!
భరత్, విషికా లక్ష్మణ్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను కూడా చూపించబోతోన్నట్లు తెలుస్తోంది. తాజాగా హీరో శ్రీకాంత్ చేతులు మీదుగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ బాగుంది. కొత్త టీం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా.. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, గ్లింప్స్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రేమ పంచాయితీ
భరత్, విషికా లక్ష్మణ్ జంటగా టి. గంగాధర దర్శకత్వంలో తెరకెక్కిన విలేజ్ లవ్ ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘ఏందిరా ఈ పంచాయితీ’. ఎం.ప్రదీప్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ బాగుంది.. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘సాక్ష్యాలు ఉన్నవన్నీ నిజం కావు.. ఆధారాలు లేనివి అబద్ధాలు కావు’, ‘కొన్ని ప్రేమలు పెళ్లితో మొదలవుతాయి, కొన్ని పెళ్లికి ముందే ఆగిపోతాయి.. ఆగిపోయిన ప్రేమను వద్దనుకుంటే.. పెళ్లితో మొదలయ్యే ప్రేమను నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
రేపు ‘భారత్ దాల్’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయంగా శనగపప్పు (చనా) వినియోగాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార, ప్రజాపంపిణీ సంస్థ ‘భారత్ దాల్‘ బ్రాండ్ పేరుతో ప్యాక్ అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం వద్ద ఉన్న శనగపప్పు స్టాక్‌లో 20 శాతం రిటైల్ సరఫరాగా మార్చి సబ్సిడీ ధరలకు అందించనుంది. ఈ మేరకు వన్ నేషన్ వన్ ప్రైస్ ధరలను అమలు చేస్తోంది. కిలో కేజీ శనగపప్పు ప్యాకెట్ రూ.60, 30 కిలోల ప్యాకెట్‌కు కిలోకు రూ.55 చొప్పున రూ.1,650కి అందించనున్నారు. హాకాకు 50 వేల టన్నులు.. ఇక దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలో ‘భారత్ దాల్‘ బ్రాండ్ శనగపప్పు పంపిణీ బాధ్యతలను రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు అప్పగించింది. రిటైలర్లు, హోల్‌సేల్ వ్యాపారులకు, ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్), మెట్రో, రిలయన్స్, టాటా రిటైల్ చైన్ హైపర్ మార్కెట్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ వంటి ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు హాకా నేరుగా సరఫరా చేయనుంది. రేపు అధికారికంగా ప్రారంభం హాకా పంపిణీ చేసే శనగపప్పు భారత్ దాల్ బ్రాండ్‌ను ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. నెక్లెస్‌రోడ్‌లో ని అంబేడ్కర్ విగ్రహం వద్ద హాకాచైర్మన్ మచ్చా శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ పాల్గొననున్నారు. -
నాణ్యతతోనే ఉన్నత స్థానానికి
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అత్యుత్తమ నాణ్యతా ఉత్పత్తులు, సేవలు సాయపడతాయని కేంద్ర వాణిజ్య, ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రమాణాలు అనేవి పటిష్టమైన వ్యవస్థకు మద్దతుగా నిలవాలన్నారు. వీటిని భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల తర్వాతే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వర్క్‌షాప్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశ వాణిజ్యం, ఎగుమతులకు ప్రమాణాలు అనేవి మూలస్తంభంగా పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సామర్థ్యం జాతీయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయన్నారు. సుస్థిరత, నకిలీ ఉత్పత్తుల కట్టడి, ఎంఎస్ఎంఈలకు మద్దతు, స్టార్టప్‌లు మరింత పోటీనిచ్చేందుకు వీలుగా.. ప్రమాణాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత బీఐఎస్ సాంకేతిక కమిటీ సభ్యులపై ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉండేలా చూడాలని కోరారు. అప్పుడే ప్రపంచానికి తయారీ కేంద్రంగా, స్వావలంబన భారత్‌గా మారాలన్న స్వప్నం సాకారమవుతుందన్నారు. బీఐఎస్‌లో 400 స్టాండింగ్ కమిటీలు భారత ప్రమాణాల రూపకల్పన బాధ్యతను చూస్తుంటాయి. -
‘ఏందిరా ఈ పంచాయితీ’ ఎప్పుడంటే..?
గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. భరత్, విషికా లక్ష్మణ్ జంటగా టి. గంగాధర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఎం. ప్రదీప్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 6న విడుదల కానుంది. ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కు, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ స్వరకర్త. -
ఆచితూచి వ్యవహరించాల్సిందే!
కెనడాలోని ఒక సిక్కు నాయకుడి హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. రాజకీయంగా తన ప్రాచుర్యం క్రమేపీ తగ్గిపోతున్న నేపథ్యంలో, ఖలిస్తాన్ అనుకూలురు ఉన్న ‘ఎన్డీపీ’ తన సంకీర్ణంలో కొనసాగేందుకు ట్రూడో ఈ పని చేసుండాలి. 2018 నాటి భారత పర్యటనలో తనను పట్టించుకోలేదన్న ట్రూడో అసంతృప్తి కూడా మరో కారణం కావొచ్చు. ఏమైనా ఈ వ్యవహార ప్రభావం అమెరికా, ఇతర జీ–7 దేశాల సంబంధాలపై పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా, ఖలిస్తాన్‌కు మద్దతునివ్వని ప్రపంచవ్యాప్త సిక్కుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈమధ్య పెద్ద దుమారమే లేపారు. ఈ ఏడాది జూన్ 18న కెనడాలోని గురుద్వారా వెలుపల జరిగిన కెనడా సిక్కు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందనేందుకు తమ వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందన్న ట్రూడో ప్రకటన ఇరు దేశాల మధ్య వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. అయితే హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత ప్రభుత్వం చాలా కాలం క్రితమే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలకు నగదు బహుమతి కూడా ప్రకటించింది. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉండి ఉంటే అది అసాధారణమైన విషయమే అవుతుంది. కాకపోతే పరిస్థితులను గమనించినప్పుడు నిజ్జర్ హత్య పక్కా గ్యాంగ్ వార్‌ను పోలుతుంది. నిజ్జర్ పూర్వాపరాలను గమనించినా హత్యకు గ్యాంగ్ వారే కారణమని అనిపించడం ఖాయం. సత్యం ఏమైనప్పటికీ ట్రూడో ఆరోపణల పుణ్యమా అని ఇప్పుడు భారత్ పరువుకు కొంత భంగం కలిగింది. అది కూడా జీ–20 సమావేశాలను అధ్యక్ష స్థానంలో ఉంటూ విజయవంతంగా పూర్తి చేసిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఇబ్బందికరమైంది. కామన్ వెల్త్ దేశమైన, భారతీయ సంతతివారు ఎక్కువ సంఖ్యలో ఉన్న, ఇండో–పసిఫిక్ వ్యూహంలో కీలకమైన కెనడాతో భారత్ సంబంధాలిప్పుడు అట్టడుగు స్థాయికి చేరాయి. అయితే ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది: చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే భారత్ సాయం కచ్చితంగా అవసరమని అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, పశ్చిమ యూరప్, జపాన్ భావిస్తున్నాయి. ఈ భాగస్వామ్యానికి కొన్ని పరిమితులు లేకపోలేదు. అదే సమయంలో నాటో, జీ–7 దేశాల సభ్య దేశాలతో వ్యవహరించే సందర్భంలో వ్యవహారం మారిపోయేందుకు అవకాశా లెక్కువ. అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సుల్లివాన్ చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టమవుతుంది: ‘‘ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు ప్రత్యేకమైన మినహాయింపులు ఎవరికీ ఉండవు. దేశం ఏదైనా సరే, మా ప్రాథమిక నైతిక సిద్ధాంతాల రక్షణ కోసం నిలబడతాం. అలాగే దగ్గరి భాగస్వామి అయిన కెనడా లాంటి దేశాలతో సంప్రదింపులు జరిపి చట్టాన్ని పరిరక్షించేందుకు వారు చేసే ప్రయత్నాల్లోనూ, దౌత్యపరమైన ప్రక్రియల్లోనూ సహకరించుకుంటాం’’ అన్నారు ఆయన. తిరస్కరించిన భారత్ కెనడాలో ఓ సిక్కు నేత హత్య వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందన్న విషయాన్ని భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. అర్థం లేని, దురుద్దేశపూరిత ఆరోపణలుగా కొట్టి పారేసింది. అయితే ఇంతటితో కథ ముగిసిపోయిందని అనుకునేందుకు వీల్లేదు. వట్టి తిరస్కా రాలతోనో, ఉగ్రవాదంపై చర్యల విషయంలో ట్రూడో నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టడంతోనో సమస్య సమసిపోదు. కెనడాలోని కొంతమంది సిక్కులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం వెనుక చాలా చరిత్రే ఉంది. అయితే ప్రస్తుతం నిజ్జర్ లాంటివాళ్లు చేస్తున్న క్రిమినల్ కార్యకలాపాలపై భారత్ ఎక్కువగా దృష్టి పెట్టాలి. నిజ్జర్ రాజ కీయాలు, ఉగ్రవాద, హింసాత్మక కార్యక్రమాల్లో ఆయన ప్రమేయం వంటివి ఎత్తి చూపడం ఆయన హత్యను సమర్థించినట్లు కనిపించవచ్చు. మరీ ముఖ్యంగా మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాల్లో ఈ రకమైన ఆలోచన బలపడవచ్చు. కానీ నిజ్జర్ కార్యకలాపాలపై ఉన్న సమాచారం మొత్తాన్ని భారతీయ నిఘా సంస్థలు కెనడా, ఇతర పాశ్చాత్య దేశాలతో పంచుకోవడం మేలు. ట్రూడో ఆరోపణలను గట్టిగా తిరస్కరించడం ద్వారా భారత్ సరైన పనే చేసింది. భారతీయ దౌత్యవేత్తను కెనడా తిప్పి పంపడంతో భారత్ కూడా అదే పని చేయడమూ తగిన ప్రతిచర్యే. కానీ, పరిస్థి తులు మరింత దిగజారకుండా ఉండటం ఇరు దేశాలతోపాటు భారత్‌తో మరింత ఎక్కువ సంబంధాలు కోరుకుంటన్న పాశ్చాత్య మిత్రులకూ అత్యవసరం. కెనడాతో మనకున్న సంబంధాలు కాస్తా అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల మైత్రిపై ప్రభావం చూపరాదు. అదే జరిగితే ఈ అంశాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకునేందుకు చైనా, పాకిస్తాన్ కాచుకు కూర్చున్నాయన్న విషయం మరవరాదు. కెనడా రాజకీయాలూ చూడాలి... ప్రస్తుత దౌత్య సమస్యకు కెనడాలోని స్థానిక రాజకీయ పరి స్థితులూ కారణం కావచ్చు. ట్రూడో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం ఉగ్రవాదులను సమర్థిస్తున్నారన్న నెపంపై కెనడా లోని కొంత మంది సిక్కులపై విమర్శలు చేయడం కూడా తగదు. దీనివల్ల కెనడాలోని మెజారిటీ సిక్కులు, ఇతర దేశాల వారు, మరీ ముఖ్యంగా భారతీయ సిక్కులను దూరం పెట్టినట్టుగా ఉండకూడదు. ఖలిస్థాన్ డిమాండ్‌కు వీరందరూ దూరమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖలిస్తాన్ భయాన్ని ఎత్తిచూపాలన్న ఉబలాటం ఉండొచ్చు, కానీ ఇది ఉద్దేశించని నష్టం కలిగించే ప్రమాదం ఉంది. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రూడో విమర్శలకు దిగడం వెనుక ఆయనకున్న వ్యక్తిగత ఆసక్తి ఏమిటన్నది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కెనడా రాజకీయాల్లో విదేశాల ప్రమేయంపై ఇప్పటికే విచారణ సాగుతోంది. దేశంలో చైనా కార్యకలాపాలపై చెక్ పెట్టలేకపోయారన్న అంశం ట్రూడోకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి, ఈ అంశం దాన్ని పక్కదోవ పట్టించగలదు. ట్రూడో ప్రభుత్వం మనుగడ కోసం సిక్కు రాజకీయ పార్టీ, ఖలిస్థాన్ ఉద్యమ అనుకూలురు ఎక్కువగా ఉన్న న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) మద్దతు అవసరం. ఇందుకోసమే ట్రూడో భారత్‌పై ఈ రకమైన విమర్శలకు దిగి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. సిక్కుల మనోభావాలు దెబ్బతినకుండా... 2018లో భారత పర్యటన సందర్భంగా తనను అంతగా పట్టించుకోలేదని ట్రూడో భావించడం కూడా ప్రస్తుత పరిస్థితికి ఒక కారణం కావచ్చు. ‘అన్ని పర్యటనలను అంతం చేసే పర్యటన’ అని ట్రూడో అప్పట్లోనే ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వ్యక్తిగతమైన భారత వ్యతిరేక భావన ఇప్పుడు ఇలా అనాలోచిత తప్పుడు ఆరోపణలకు దారితీసి ఉండవచ్చు. వ్యక్తిగా ట్రూడోతో ఉన్న సంబంధాలు ఇరు దేశాల మధ్య సంబంధాలను నిర్ణయించే పరిస్థితి ఉండరాదు. రాజకీయంగా, వ్యూహాత్మకంగా, ఆర్థిక అంశాల పరంగానూ ఇరు దేశాల మధ్య సఖ్యత ఎంతో అవసరం. భారత్ – కెనడా సంబంధాల ప్రభావం అమెరికా, ఇతర జీ–7 దేశాలతో మనకున్న సంబంధాలపై కూడా ఉండవచ్చు. ట్రూడోతో మన గొడవ కాస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను దెబ్బతీయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. పంజా బ్లో ఇప్పటికే ఈ అంశంపై అసంతృప్తి రగులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రూడో ప్రభుత్వంపై భారత్‌కు ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కేందుకు సిక్కు కుటుంబాలు తమ స్వస్థలాలకు రావడాన్ని అడ్డుకోవడం మార్గం కాదు. ఏమైనా, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారకుండా ఉండాలని ఆశిద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అమెరికా ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు
న్యూయార్క్: కెనడాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అమెరికాలోని ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఖలిస్థానీ నేతల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియనందున జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు అమెరికా ఖలిస్థానీ నేతలు చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సుర్రే గురుద్వారాలో ఉండగా.. కాల్పులు జరిపి నిజ్జర్‌ను హత్య చేశారు. ఈ కేసులో భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే.. నిజ్జర్ హత్య తర్వాత ఎఫ్‌బీఐ అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించింది. నిజ్జర్ హత్య తర్వాత ఇద్దరు ఎఫ్‌బీఐ అధికారులు తనను కలిసినట్లు అమెరికన్ సిక్కుల కోఆర్డినేటర్ ప్రతిపాల్ సింగ్ తెలిపారు. ప్రమాదం పొంచి ఉందని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు. తనతోపాటు మరో ఇద్దరు సిక్కు నేతలను కూడా ఎఫ్‌బీఐ అధికారులు కలిశారు. నిజ్జర్ హత్యకు ముందే హెచ్చరికలు.. నిజ్జర్ హత్యకంటే ముందే కెనడాలో సిక్కు నేతలను నిఘా వర్గాలు హెచ్చరించాయంట. ఈ విషయాన్ని బ్రిటీష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ప్రతినిధి మోనిందర్ సింగ్ తెలిపారు. సిక్కు నేతల ప్రాణాలకు ముప్పు ఉందని అంతకంటే ముందే సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఎన్ఐఏ అప్పట్లో కేసులు నమోదు చేసింది. అతనిపై రూ.10 లక్షల రివార్డ్‌ను కూడా ప్రకటించింది. మోహాలీలోని కోర్టులో అతనిపై ఛార్జీషీటు దాఖలు చేసింది. అయితే.. ఆయన్ను జూన్ 18న దుండగులు హత్య చేశారు. ఈ కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్థానీ మరో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. పన్నూన్ 'జస్టిస్ ఫర్ సిక్' అనే అమెరికా ఆధారిత సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. చంఢీగర్, అమృత్సర్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నడిచాయి. ఉపా చట్టం కింద భారత్ అతన్ని ఉగ్రవాదిగా గుర్తించింది. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
గురుపత్వంత్ సింగ్ ఎవరు? భారత్- కెనడాల మధ్య ఎలా చిచ్చుపెడుతున్నాడు?
భారతదేశం-కెనడాల మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్నాయి. కెనడా ప్రభుత్వం తమ దేశంలో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలను అరికట్టకపోవడమే ఇందుకు కారణం. ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ-20 సదస్సులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై పీఎం నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించలేదు. ఈ కఠినమైన ప్రవర్తనకు స్పందనగా ట్రూడో తమ దేశంలోని సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) గ్రూప్‌తో సంబంధం ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించింది. అలాగే ఒక అగ్రశ్రేణి భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కెనడావి నిరాధార ఆరోపణలు కెనడా ఆరోపణలను అసంబద్ధమని, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా భారత్ అభివర్ణించింది. కెనడాలో రక్షణ పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చేందుకే కెనడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పేర్కొంది. భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఖలిస్తాన్ మద్దతుదారులపై అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కెనడాలో ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదుల భారత వ్యతిరేక నిరసనల సంఖ్య పెరిగింది. ఆ భారత దౌత్యవేత్తలను హత్య చేయాలంటూ.. ఈ ఘటనల్లో నిషేధిత ఖలిస్థానీ అనుకూల గ్రూప్ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) హస్తం ఉన్నట్లు తేలింది.ఈ సంఘంతో సంబంధం ఉన్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల కెనడాలో నివసిస్తున్న హిందువులను దేశం విడిచి వెళ్లాలని కోరింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ అమృత్సర్ జిల్లాలోని ఖాన్కోట్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పంజాబ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డులో ఉద్యోగి. పంజాబ్ యూనివర్శిటీ, చండీగఢ్‌లో న్యాయ పట్టా పొందిన పన్నూ.. సిక్ ఫర్ జస్టిస్‌కు న్యాయ ప్రతినిధి. అతనికి కెనడాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. భారత్‌ను వదిలి విదేశాలకు వెళ్లిన పన్నూ తొలుత అక్కడ డ్రైవర్‌గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. జులై 2023లో ఒక వీడియోను విడుదల చేసిన పన్నూ.. ఉత్తర అమెరికా, యూరప్‌లోని భారతీయ దౌత్యవేత్తలను హత్య చేయాలని పిలుపునిస్తూ పోస్టర్లను ముద్రించాడు. భారత ప్రభుత్వం గురుపత్వంత్ సింగ్ పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్ సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నదంటూ.. కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయించడమే కాకుండా పన్నూ మరో వీడియోలో ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కూడా బెదిరించాడు. పన్నూపై భారత్‌లో దేశద్రోహ కేసుతో సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఖలిస్తాన్‌కు మద్దతుగా పన్నూ అమెరికా, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాడు. భారతదేశం సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందనే ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అతనిపై అంతర్జాతీయ స్థాయిలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత్ కోరినప్పటికీ ఇంటర్‌పోల్ ఇంకా నోటీసు జారీ చేయలేదు. కెనడా క్యాబినెట్లో నలుగురు సిక్కు మంత్రులు కెనడాలో సిక్కు జనాభా గణనీయంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ విధానం చాలా ఉదారంగా ఉన్న పాశ్చాత్య దేశాలలో కెనడా ఒకటని చెబుతారు. కెనడాలో గణనీయమైన సంఖ్యలో భారత సంతతికి చెందినవారు ఉన్నారు. అందులో ముఖ్యంగా సిక్కులు అధికంగా ఉన్నారు. కెనడాలో ఏడున్నర లక్షల మందికి పైగా సిక్కులు నివసిస్తున్నారు. అక్కడ వారు వ్యాపార రంగం మొదలుకొని రాజకీయ రంగం వరకూ ప్రభావవంతంగా ఉన్నారు. ఈ నేపద్యంలో ఈ సిక్కు ఓటు బ్యాంకుకు ట్రూడో కాపాడుకుంటూ వస్తున్నారు. ట్రూడో తన మొదటి టర్మ్‌లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిక్కులకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన క్యాబినెట్లో నలుగురు సిక్కు మంత్రులు ఉన్నారు. అందుకే ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోకూడదని ట్రూడో భావిస్తున్నారని విశ్లేషకుల వాదన. అయితే కెనడాలోని చాలా మంది సిక్కులు అతని భావజాలానికి మద్దతునివ్వడం లేదని సమాచారం. ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి 1980 నుండి భారతదేశం- కెనడా మధ్య అగాధం పెరిగింది. 1985లో కెనడాకు చెందిన ఖలిస్తానీ వేర్పాటువాద బృందం ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి చేయడంతో ఇది మొదలయ్యింది. ఈ పేలుడులో విమానంలోని మొత్తం 329 మంది చనిపోయారు. ఈ బాంబు పేలుడుపై జరిగిన దర్యాప్తులో ఇంకా ఖచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. కాగా కొన్ని నెలల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన పరేడ్‌లో మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ చిత్రం రక్తంతో తడిసిన చీరలో కనిపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. గత కొన్ని నెలలుగా కెనడాలో భారత వ్యతిరేక నిరసనలు తరచూ కనిపిస్తున్నాయి. కెనడా ప్రభుత్వం వాటిని నియంత్రించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు వేరు చేయాలంటున్నారు? -
ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు విడదీయాలంటున్నారు?
గత కొద్ది రోజులుగా ఖలిస్తాన్ పేరు చర్చలలోకి వస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెన్సీల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ నేపధ్యంలో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో ఖలిస్తాన్ ఉదంతం ఏమిటో తెలుసుకోవాలనే అసక్తి అందరిలో పెరిగింది. ఈ ఉద్యమం ఏమిటో? అది ఎలా మొదలైందో తెలియని వారు గూగుల్ సాయంతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. అందుకే ఖలిస్తాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఖలిస్తాన్ అంటే ఏమిటి? భారతదేశంలో ఖలిస్తాన్ ఉద్యమ మూలాలు ఎప్పుడో అంతరించిపోయాయి. అయితే ఆ తర్వాత కొందరు విదేశాల్లో ఉంటూ ఖలిస్తాన్ పేరిట అనేక ఉద్యమాలు సృష్టిస్తున్నారు. భారత్‌పై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు వారు నిరంతరం కృషిచేస్తున్నారు. వారు భారతదేశం నుండి పంజాబ్‌ను వేరు చేయాలనే ఉద్యమానికి ఖలిస్తాన్ ఉద్యమం అని పేరు పెట్టారు. ఖలిస్తాన్ అనే పేరు ఎలా వచ్చింది? ఖలిస్తాన్ అనేది ఖలీస్ అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది. ఖలిస్తాన్ అంటే ఖల్సాకు చెందిన భూమి. అంటే సిక్కులు మాత్రమే నివసించే ప్రదేశం. 1940లో లాహోర్ డిక్లరేషన్‌కు ప్రతిస్పందనగా డాక్టర్ వీర్ సింగ్ భట్టి ఒక కరపత్రాన్ని ప్రచురించినప్పుడు ఈ పదాన్ని తొలిసారి ఉపయోగించారు. సిక్కుల కోసం ప్రత్యేక దేశం అనే డిమాండ్ 1929 నుండి మొదలయ్యింది. కాంగ్రెస్ సమావేశంలో మాస్టర్ తారా సింగ్ ఈ డిమాండ్‌ను తొలిసారి లేవనెత్తారు. ఖలిస్తానీ ఉద్యమ నాంది.. 70వ దశకంలో చరణ్ సింగ్ పంక్షి, డాక్టర్ జగదీత్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఖలిస్తాన్ కోసం డిమాండ్ మరింత తీవ్రమైంది. దీని తరువాత 1980లో ఖలిస్తాన్ నేషనల్ కౌన్సిల్ కూడా ఏర్పాటయ్యింది. అనంతరకాలంలో పంజాబ్‌లోని కొంతమంది యువకులు దాల్ ఖల్సా అనే సంస్థను స్థాపించారు. ఇదిలావుండగా ఉగ్రవాదులను అంతం చేసేందుకు 1984లో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ను నిర్వహించారు. దీని తరువాత ఖలిస్తానీ ఉద్యమ మూలాలు భారతదేశం నుండి దూరమయ్యాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, బ్రిటన్‌తో సహా అనేక దేశాలలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా తరచూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో ఉంటూ, భారత గడ్డపై అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? ఎన్వలప్లో ఓటు ఎందుకు ప్యాక్ చేస్తారు? -
చరిత్ర అంటే బోర్డు మీది రాతా?
చరిత్ర అనేది బోర్డ్ మీద చాక్‌పీస్‌తో రాసిన రాత కాదు. ఎలా అంటే అలా చెరపడం, కొత్తది రాయడం కుదరదు. చరిత్ర తెలియనివాళ్లే ఇప్పుడు ‘ఇండియా’ స్థానంలోకి ‘భారత్’ను తెస్తున్నారు. నిజానికి భారత్ అనే పదం ప్రాచీనమైనది కాదు. ప్రసిద్ద చరిత్రకారులు తాము రాసిన చరిత్రకు ‘ఇండియన్ హిస్టరీ’ అనే పేరు పెట్టారు. వేదాల మీద ఆధారపడి చరిత్రను, సంస్కృతిని నిర్మించాలనుకునేవాళ్లు కేవలం వేదాల దగ్గరే ఇండియన్ హిస్టరీ ఉందనుకుంటున్నారు. అందువల్లే వారు భారతదేశ చరిత్రను కుదించాలని చూస్తున్నారు. అనేక భాషలు, సంస్కృతులు, జాతులు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ బద్ధమైన ‘ఇండియా’ నామవాచకాన్ని మార్చడం అహేతుకం. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని సంస్కృతీకరణకు గురి చేస్తోంది. దీనికి కారణం పాలకులకు భారతదేశ చరిత్ర తెలియకపోవడమే. నిజానికి భారత్ అనే పదం ప్రాచీనమైనది కాదు. ప్రసిద్ద చరిత్రకారులు డి.డి. కోశాంబి, రొమిల్లా థాఫర్, ఆర్.ఎస్. శర్మా, ఝూ, బి.ఎస్.ఎల్.హనుమంతరావు వంటి వారంతా తాము రాసిన చరిత్రకు ‘ఇండియన్ హిస్టరీ’ అనే పేరు పెట్టారు. మనం ఒకసారి ప్రపంచ దేశాలలో ఉన్న లైబ్రరీలను వీక్షిస్తే... ముఖ్యంగా లండన్ మ్యూజియం లైబ్రరీలో హిస్టరీ మీద ఒక శాఖ ఉంటుంది. కన్నెమెరా లైబ్రరీ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ దేశాల నుండి పరిశోధకులందరూ అక్కడికి వస్తారు. అక్కడ ఇండియా అంటేనే స్పందిస్తారు. ‘భారత్’ శబ్దం ఎక్కడా కనపడదు. యక్షులు, కింపురుషులు, గంధర్వులు భారతదేశంలో ప్రాచీన జాతులు. ఈనాటి దళితులు వారి వారసులే. వారు నదీ దేవతలను సృష్టించారు. వెన్నెలను ఆరాధించారు. ఆర్యులు అంతకుముందు ఉన్నటువంటి జాతుల మొత్తం వారసత్వాన్ని తమదిగా చెప్పు కొన్నారు. దళితులకు సంబంధించిన అనేక చారిత్రక అంశాలను ఆర్యులు సొంతం చేసుకున్నారు. మనది ‘సింధూ నాగరికత’ అంటారు. సింధూ శబ్దం అతి ప్రాచీనమైనది. ఇండియాలో మానవ జాతి పరిణామానికి సంబంధించిన ప్రాచీన పరిణామ దశలన్నీ దళితుల్లో కనిపిస్తున్నాయి. మోర్గాన్ చెప్పినట్టు మానవజాతి పరిణా మంలో జీవనోపాధి, ఆహారం, పాలనాంగం, ప్రభుత్వం, భాష, కుటుంబం, మతం, గృహనిర్మాణం, సంపద కీలకపాత్ర వహిస్తాయి. ఈ దశలన్నీ దళితుల జీవన విధానంలో ఉండడం వలన, బి.ఆర్.అంబేడ్కర్ నిర్వచించినట్లుగా వీరు ఇండియన్స్ అనేది నిర్ధారణ అవుతుంది. హిందువుల మత సాహిత్యంలో వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్య కాలు, ఉపనిషత్తులు, సూత్రాలు, ఇతిహాసాలు, స్మృతులు, పురాణాలు ఉన్నాయి. వేద బ్రాహ్మణులు వేదాలకూ, ఇతర రకాల మత సాహిత్యానికీ మధ్య ప్రత్యేకత చూపాలని అభిప్రాయపడ్డారు. వేదాలను ఉన్నతమైనవిగా మాత్రమే కాకుండా పవిత్రమైనవిగా, తిరుగులేనివిగా చేశారు. చరిత్రకు మూలమైన శాసనాలు, వ్రాత ప్రతుల వంటి వాటిని పేర్కొనకుండా కేవలం వేదాల మీద ఆధారపడి చరిత్రను, సంస్కృతిని నిర్మించాలనుకునే సనాతన భావజాలకర్తలు కేవలం వేదాల దగ్గరే ఇండియన్ హిస్టరీ ఉందనుకుంటున్నారు. అందువల్లే వారు భారతదేశ చరిత్రను కుదించాలని చూస్తున్నారు. దక్షిణ భారత భాషల్లో ఏ భాషలోనూ భారత శబ్దం లేదు.ఇండియన్ లాంగ్వేజెస్ పుట్టు పూర్వోత్తరాల మీద కృషి చేసిన వారెవ్వరూ భారత్ శబ్దాన్ని పేర్కొనలేదు. నిజానికి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రావిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధి చెందాయి. వాఙ్మయ దృష్టితో కాకుండా, భాషా చారిత్రక దృష్టితో చూస్తే మధ్య ద్రావిడ ప్రాచీనమైనది. తెలుగు భాష ప్రభావం ఇప్పటికీ తెలుగు తెగలమీద ఉండటాన్ని గమనించాలి. ముఖ్యంగా కోయ భాషలో ఎన్నో తెలుగు పదాలున్నాయి. కోయ భాషమీద పరిశోధన చేసిన జె.కాయన్ ఈ విషయాన్ని చెప్పారు. కోయ జాతి అతి ప్రాచీనమైనదని సామాజిక శాస్త్ర చరిత్ర చెప్తున్న సత్యం. ఈ కోయ భాషలో విశేషంగా తెలుగు ఉండడం వల్ల రాతలేని తెలుగు అతి పురాతన కాలంలోనే ఉందని మనకు అర్థమౌతుంది. తెలుగు భాష ప్రాచీనతను తెలుసుకోవాలంటే, మనం తెలుగులో అతి ప్రాచీనులైన తెగలను పరిశీలించవలసిందే. ఇకపోతే ఆంధ్రజాతిని నాగులుగా పిలవడం, నాగజాతికీ, ఆర్య జాతికీ ఉన్న వైరుధ్యం భారతంలో వర్ణించబడింది. ప్రసిద్ధ చరిత్ర కారులు బి.ఎస్.ఎల్. హనుమంతరావు తన ఆంధ్రుల చరిత్రలో ఆంధ్రులు ఋగ్వేద కాలం నాటివారనీ, వారు నాగులుగా ఆర్యులతో పోరాడారనీ, ఖాండవ వన దహనం, సర్పయాగం తరువాత వింధ్య పర్వతాల ఇవతలికి వచ్చారనీ, వారే ఆంధ్రులుగా పిలువబడ్డారనీ రాశారు. నాగులకు, ఆర్యులకు జరిగిన తీవ్ర సంఘర్షణలో ‘ఖాండవ దహనం’, జనమేజయుడి ‘సర్పయాగం’ రెండు ముఖ్య ఘట్టాలు. ఈ ప్రమాదం నుండి తప్పించుకొన్న నాగులు దక్షిణంగా వలసవచ్చి కృష్ణా ముఖద్వారంలో స్థిరపడి ఉంటారు. అమరావతీ శిల్పాలలోని రాజులకు, రాణులకున్న సర్ప కిరీటాలు వారి జాతీయతకు చిహ్నాలే. ఈ చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే, భారత్ కంటే ‘ఇండియా’యే పురాతనమైనది. భారత్ శబ్దం వలన ఇండియా తన ఐడెంటి టీని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది మనకు చాలా నష్టం. భారత దేశం, హిందూదేశం, ఇండియా... ఈ మూడు పేర్లలో జాతి, మత, లింగ, కుల, వర్ణ, ప్రాంతాలకు అతీతమైన పేరు ఇండియా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్ ఈ దృక్పథంతోనే తమ గ్రంథాలు రాశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇండియాను వెనక్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది వారికి కూడా నష్టమే. అందరికీ నష్టమే. చరిత్ర అనేది బోర్డ్ మీద చాక్‌పీస్‌తో రాసిన రాత కాదు.ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తున్నా, సంస్కృతీకరణ ద్వారా దేశీయ ప్రజలను అవమానిస్తున్నారు. అనేక భాషలు, సంస్కృతులు, జాతులు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ బద్ధమైన ‘ఇండియా’ నామ వాచకాన్ని మార్చడం అహేతుకం. దేశంలోని ప్రజా స్వామ్య, లౌకికవాద, సామ్యవాద శక్తులందరూ ఇండియాను బలపరు స్తున్నారు. అధిక జనుల అభిప్రాయమే చారిత్రక సత్యం. పేర్లు మార్చడం ద్వారా చరిత్ర మారదు. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
కెనడా వక్రబుద్ధి
దశాబ్దాలుగా సక్రమంగా లేని భారత్–కెనడా దౌత్య సంబంధాల్లో మరోసారి పెను తుపాను రేగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా కెనడా ప్రవర్తనే ఈ పొరపొచ్చాలకు కారణమైంది. ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను మొన్న జూన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఉదంతంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులో ఆరోపించారు. అంతేకాక ఈ విషయంలో భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక అధికారిని ఆ దేశం బహిష్కరించింది. దీనికి ప్రతిచర్యగా మన దేశం కూడా ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌లో పనిచేస్తున్న సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచివెళ్లాలని ఆదేశించింది. ట్రూడో ఆరోపణలు దురుద్దేశపూర్వకం, నిరాధారం అని కొట్టిపారేసింది. పనిలో పనిగా ఇరు దేశాలూ తమ తమ పౌరు లకు హెచ్చరికలు జారీ చేశాయి. భారత్ వెళ్లే కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తే, కెనడా సందర్శించే భారత్ పౌరులపై ఉగ్రవాదుల దాడులు జరిగే ప్రమాదం ఉన్నదని మన దేశం హెచ్చరించింది. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకోవటం వంటి ఉదంతాలు మనకు పాకిస్తాన్, చైనాలతోనే ఎక్కువ. 2013లో అమెరికాలోని న్యూయార్క్‌లో భారత్ డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రగడే పట్ల అనుచితంగా ప్రవర్తించి సంకెళ్లు వేసి నిర్బంధించిన ఉదంతం తర్వాత మన దేశం అమెరికా దౌత్యవేత్తలకు అంతవరకూ ఉండే ప్రత్యేక సదుపాయాలను ఉపసంహరించింది. గత కొంతకాలంగా కెనడాలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రోద్బలంతో ఖలిస్తానీ ఉద్యమకారులు రెచ్చిపోతున్నారు. ఇదిలా కొనసాగితే ఇరు దేశాల దౌత్యసంబంధాలూ దెబ్బతినే ప్రమాదం ఉన్నదని దౌత్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒక్క కెనడాయే కాదు... బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో కూడా ఖలిస్తానీ ఉద్యమకారుల పోకడలు ఆందోళనకరంగానే ఉంటున్నాయి. భారత కార్యాలయాలపై, దేవాలయాలపై దాడులు, మన పౌరులను గాయపరచటం వంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. హింసాత్మక ఘటనలకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని మన దేశం కోరుతున్నా అక్కడి ప్రభుత్వాల స్పందన అంతంతమాత్రం. ఉద్యమకారులపై చర్యలు తీసు కోవటం మాట అటుంచి ఏకంగా మన ప్రభుత్వంపైనే కెనడా నిందారోపణలకు దిగింది. పాశ్చాత్య దేశాలు తమకు ముప్పు ముంచుకొచ్చినప్పుడు తప్ప ఇతర సమయాల్లో ప్రజాస్వామ్యం గురించి ప్రవచిస్తుంటాయి. 2001లో ఉగ్రవాదులు తమ దేశంలో పెనువిధ్వంసం సృష్టించి, వందలాది మంది మరణానికి కారకులయ్యాక అమెరికా గ్వాంటనామో బేలో శత్రు దుర్భేద్యమైన జైలు నిర్మించి కేవలం ఉగ్రవాదులన్న అనుమానంతో దశాబ్దాల తరబడి ఎందరినో ఏకాంతవాసంలో నిర్బంధించింది. ఇప్పటికీ ఆ జైల్లో ఎలాంటి విచారణ లేకుండా ఎందరో మగ్గిపోతున్నారు. అలాంటి దేశాలు భారత్‌కు సూక్తులు చెబుతున్నాయి. నిఘా వ్యవస్థల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లు గతంలోనే ‘ఫైవ్ అయిస్’ (పంచ నేత్రాలు) పేరిట ఒక ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఖలిస్తానీ ఉద్యమకారుల ఆగడాల గురించి ఈ వ్యవస్థ వద్ద ఎలాంటి సమాచారం ఉందో తెలియదుగానీ... తాజాగా కెనడా చేసిన ఆరోపణలపై మాత్రం అందులోని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు ‘ఆందోళన’ వ్యక్తం చేశాయి. ఈమధ్యే న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు నిజ్జార్ ఉదంతాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చానని ట్రూడో అంటున్నారు. మోదీ సైతం ఖలిస్తానీ వాదుల ఆగడాలపై ఆయనను ప్రశ్నించారు. నిజ్జార్ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. ఈలోగానే ట్రూడో అంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడారన్నది ఆశ్చర్యకరం. మొదటినుంచీ కెనడా అంతర్గత రాజకీయాలు భారత్–కెనడా సంబంధాలను శాసిస్తున్నాయి. కెనడాలో భారతీయుల సంఖ్య దాదాపు 14 లక్షలు. ఇది కెనడా జనాభాలో 3.7 శాతం. అందులో సగం మంది సిక్కులు. కొన్ని నియోజకవర్గాల్లో సిక్కు ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం, వారిపై ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం ఉండటం కెనడా రాజకీయాల్లో వారి ప్రాబల్యాన్ని పెంచింది. అందుకే కావొచ్చు...పంజాబ్‌లో 90వ దశకంలోనే అంతరించిన ఖలిస్తానీ ఉద్యమం ఇంకా అక్కడ సజీవంగా మనుగడలో ఉంది. 2021 ఎన్నికల్లో ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ మెజారిటీ సాధించలేక సిక్కు నేత జగ్మీత్సింగ్ నేతృత్వంలోని న్యూ డెమాక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచీ ఖలిస్తాన్ ఉద్యమకారుల విషయంలో కెనడా మరింత మెతకగా ఉంటోంది. కొత్తగా అమెరికా కనుసన్నల్లో ఏర్పాటైన ఇండో–పసిఫిక్ కూటమి తర్వాత భారత్‌తో భాగస్వామ్యం కోసం కెనడా తహతహలాడటం మొదలుపెట్టినా, ఖలిస్తానీ వాదులు ఆ ప్రయత్నాలను వమ్ము చేసేందుకు ఏదో ఒక ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పుడు హత్యకు గురైన నిజ్జార్ వివాదరహితుడేమీ కాదు. 2007లో పంజాబ్‌లోని ఒక సినిమా హాల్లో బాంబు దాడి మొదలుకొని ఇంతవరకూ 20 కేసుల్లో నిందితుడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్. ఇతగాడే కాదు...అనేకమంది మాఫియా ముఠాల నేతలు కెనడాలో ఆశ్రయం తీసుకుంటూ భారత్‌లో నేరాలకు దిగుతున్నారు. వీరిని అప్పగించమని మన దేశం కోరుతున్నా కెనడా పెడచెవిన పెడుతోంది. కెనడా తీరుతెన్నులపై మన దేశం దౌత్య యుద్ధం సాగించాలి. జరుగుతున్నదేమిటో ప్రపంచ దేశాలకు వివరించాలి. కెనడాలో చదువులకూ, ఉపాధికీ వెళ్లిన మన పౌరుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. -
ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.. ధైర్యముంటే పేరు మార్చండి..
రాయ్‌పూర్: త్వరలో జరుగనున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశం పేరు మార్పు విషయమై సొంత నిర్ణయాలేంటని ప్రశ్నిస్తూనే ఇటీవల అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భద్రతా దళాలు మృతిచెందినా స్పందించకపోవడంపై ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే పేరు మార్చండి.. ఛత్తీస్‌గఢ్‌లోని లాల్‌బాఘ్ మైదానంలో జరిగిన బహిరంగసభలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇండియా మీ నాన్నగారిది అనుకుంటున్నారా? ఇండియా 140 కోట్ల భారతీయులది. ఇండియా భారతీయుల గుండెల్లో ఉంది. హిందుస్థాన్ భారతీయుల గుండెల్లో ఉందని ధైర్యముంటే దేశం పేరు మార్చి చూడమని సవాల్ విసిరారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వం గతేడాది ఇండియా పేరుమీద అనేక కార్యక్రమాలను జరిపిందని గుర్తుచేశారు. ये 140 करोड़ लोगों का INDIA🇮🇳 है हम सबका INDIA है भारत, इंडिया, हिंदुस्तान - किसी की हिम्मत नहीं कि हमारे देश का नाम बदले। pic.twitter.com/c2gtVTgOJU — Arvind Kejriwal (@ArvindKejriwal) September 16, 2023 నోరు విప్పరేం? ఇక అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత సైనికులు మృతిచెందారు. వారి కుటుంబాన్ని చూసి యావత్ దేశమంతా తల్లడిల్లింది కానీ భారత ప్రధానికి కొంచెమైనా బాధ కలగలేదా అని ప్రశ్నించారు. వారు చనిపోయి నాలుగు రోజులు కావస్తున్నా ఇంతవరకు నోరువిప్పలేదే అని ప్రశ్నించారు. शर्मनाक ‼️ ◆ जब हमारे Army Officers शहीद हुए तब PM, गृहमंत्री और रक्षा मंत्री जश्न मना रहे थे ◆ उनको शहीद हुए 4 दिन हो गए लेकिन PM ने उनके दुख में 2 शब्द नहीं बोले ◆ हर बात पर ट्वीट करने वाले PM और गृह मंत्री इस पर चुप क्यों हैं? क्या आपको दुख नहीं होता?@ArvindKejriwal pic.twitter.com/eOn69skBbT — Ghanendra Bhardwaj🇮🇳 (@GhanendraB) September 16, 2023 విద్యకే ప్రాధాన్యత.. ఛత్తీస్‌గఢ్‌లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే మా ప్రధాన లక్ష్యమని చెబుతూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా విద్య గురించి మాట్లాడింది లేదు. కానీ మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించి పేదరికాన్ని నిర్మూలించడమే మా సంకల్పమని అన్నారు. VIDEO | "Since 75 years of independence, no party or government has ever come and asked for votes to build schools and hospitals. Even after the AAP came into existence, they still don't say this. They have a bad intent," says Delhi CM @ArvindKejriwal addressing a rally in… pic.twitter.com/Z49xoqpqHd — Press Trust of India (@PTI_News) September 13, 2023 300 యూనిట్లు ఫ్రీ.. అంతకుముందు రాయ్‌పూర్‌లో జరిగిన బహిరంగసభలో ఛత్తీస్‌గఢ్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నగరాల్లోనూ గ్రామాల్లోనూ 24 గంటలూ విద్యుత్ అందిస్తామని హామీనిచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఇది కూడా చదవండి: 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్! -
లాహోర్ భారత్‌లో భాగం.. అయినా పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు?
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయితే దీనికిముందే భారత్, పాకిస్తాన్ విభజనకు సన్నాహాలు మొదలయ్యాయి. 1937, ఆగష్టు 3న లార్డ్ మౌంట్ బాటన్ స్వాతంత్ర్య ప్రణాళికను సమర్పిస్తూ, భారతదేశం స్వతంత్ర దేశం కానున్నదని, అలాగే దేశం రెండు భాగాలుగా విడిపోతుందని స్పష్టంగా తెలిపారు. లార్డ్ మౌంట్ బాటన్ అందించిన ప్రణాళికను జవహర్ లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా అంగీకరించారు. అయితే విభజనను అమలు చేయడం అంత సులభం కాలేదు. విభజన అంత సులభం కాలేదు భారతదేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే, దేశంలోని ఏ భాగాన్ని భారతదేశంలో ఉంచాలి? పాకిస్తాన్‌కు ఏ ప్రాంతం ఇవ్వాలో నిర్ణయించడం కష్టంగా మారింది. పలు తర్జనభర్జనల తర్వాత మత ప్రాతిపదికన విభజన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ హిందూ-ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉన్న అనేక ప్రాంతాల విషయంలో విభజన అంత సులభం కాలేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ విభజన బాధ్యతను సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు అప్పగించింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే సిరిల్ రాడ్‌క్లిఫ్ గతంలో భారతదేశాన్ని సందర్శించలేదు. అలాగే భారతదేశలోని విభిన్న జనాభా గురించి అతనికి తెలియదు. సిరిల్ రాడ్‌క్లిఫ్ ఎవరు? రాడ్‌క్లిఫ్ వృత్తిరీత్యా న్యాయవాది. బ్రిటన్‌లోని వేల్స్ నివాసి. అతని తండ్రి ఆర్మీ కెప్టెన్. రాడ్‌క్లిఫ్ బ్రిటన్‌లోని హాలీ బెర్రీ కాలేజీలో చదువుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువును పూర్తి చేసిన తర్వాత న్యాయవాదిగా స్థిరపడ్డాడు. ప్రముఖ కేసులను చేపట్టడం వలన బ్రిటన్‌లో పాపులర్ అయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అతను సమాచార మంత్రిత్వ శాఖలో చేరాడు. 1941లో డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యాడు. 1945లో తిరిగి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. విభజన రేఖ ఎలా గీశారు? భారత స్వాతంత్ర్య చట్టం ఆమోదం పొందిన తరువాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య విభజనకు రేఖ గీసే బాధ్యత సిరిల్ రాడ్‌క్లిఫ్ చేతికి వచ్చింది. అతను రెండు సరిహద్దు కమిషన్లకు చైర్మన్‌గా నియమితుడయ్యాడు. అతనికి ఇద్దరు హిందువులు, ఇద్దరు ముస్లిం లాయర్లు సహాయం అందించారు. 1947, జూలై 8 న సిరిల్ రాడ్‌క్లిఫ్ భారతదేశానికి చేరుకున్నాడు. 5 వారాల్లో విభజన రేఖను గీసే బాధ్యత అతనికి అప్పగించారు. జనాభా పరంగా బెంగాల్, పంజాబ్‌లను విభజించడం అంత సులభం కాలేదు. రెండు చోట్లా హిందూ-ముస్లిం జనాభా సమానంగా ఉండేది. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ రాడ్‌క్లిఫ్ తన పనిని 12 ఆగస్టు 1947న పూర్తి చేశాడు. ఈ విభజన రేఖను అధికారికంగా 1947, ఆగస్టు 17న బహిరంగపరిచారు. దీనికి రాడ్‌క్లిఫ్ లైన్ అని పేరు పెట్టారు. లాహోర్‌ను పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు? హిందూ జనాభా ఎక్కువగా ఉన్న లాహోర్‌ను పాకిస్తాన్‌కు ఇస్తారా లేదా అనే దానిపై చర్చ జరిగింది. ఒక ఇంటర్వ్యూలో సిరిల్ రాడ్‌క్లిఫ్ మాట్లాడుతూ విభజనకు సన్నాహక సమయంలో తాను లాహోర్‌ను భారతదేశంలోనే చేర్చానని, అయితే పాకిస్తాన్లో పెద్ద నగరం లేదని గమనించి, లాహోర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ విధంగా లాహోర్ స్వాతంత్ర్యం వచ్చిన రెండు రోజుల వరకూ భారతదేశంలో భాగంగా ఉంది. తరువాత అధికారిక ప్రకటనతో అది పాకిస్తాన్లో చేరింది. సరిహద్దును పరిష్కరించిన తర్వాత వలసలు ప్రారంభమయ్యాయి. భారతదేశం నుండి పాకిస్తాన్‌కు, పాకిస్తాన్ నుండి భారతదేశానికి కోట్ల మంది ప్రజలు తరలివెళ్లారు. విభజన తర్వాత రాడ్‌క్లిఫ్ బ్రిటన్‌కు వెళ్లిపోయారు. ఆ తరువాత ఎప్పుడూ భారతదేశానికి రాలేదు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
బలమైన ప్రభుత్వం ఓ అపోహే!
ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనేది అపోహ. సంకీర్ణ ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ ఈ అపోహ జనాన్ని నమ్మేలా చేస్తుంది. కానీ చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత లేదా సంకీర్ణ ప్రభుత్వాల మధ్య ఎటువంటి తేడా లేదని చరిత్ర చెబుతోంది. అమెరికాలో మహా మాంద్యం తర్వాత, ‘న్యూ డీల్’(1933)లో భాగంగా సంక్షేమ విధానాలను అమలు చేశారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగింది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. భారత్ వంటి విశాలమైన దేశానికి ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనే అపోహ ఆధారంగా, ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనను తిరిగి ఎన్నుకోవడం అనే ప్రబలమైన కథనం ఆధారపడి ఉంది. ‘బలమైన ప్రభుత్వం’ అనే ఈ అపోహ– బహుళ పార్టీ, సంకీర్ణ ఆధారిత ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ లేదా చట్టాలను ఆమోదించలేవనీ నమ్మేలా చేస్తుంది. అయితే, రాజనీతి శాస్త్ర రంగంలోని పరిశోధనలు మనకు భిన్నమైన చిత్రణను చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రధానంగా మూడు రకాల ప్రజా స్వామ్య ప్రభుత్వాలు ఉనికిలో ఉన్నాయి. అవి: అధ్యక్ష తరహా, పార్ల మెంటరీ, సంఘటిత (కాన్సోషియేషనల్) ప్రభుత్వాలు. ఈ ప్రతి ప్రభుత్వ రూపంలోనూ, బహుళ పార్టీ ప్రభుత్వాలు లేదా సంకీర్ణ ప్రభు త్వాలు స్థిరంగా ఉండటమే కాకుండా పౌరుల సంక్షేమం విషయంలో కూడా మెరుగ్గా ఉన్నాయని సాక్ష్యాధారాలు చూపుతున్నాయి. అమెరికా, అధ్యక్ష వ్యవస్థను అనుసరిస్తుంది. ఈ వ్యవస్థలో అధ్య క్షుడిని నేరుగా కార్యనిర్వాహక అధిపతిగా ఎన్నుకుంటారు. అయితే పన్నులు పెంచడం, డబ్బు ఖర్చు చేయగల సామర్థ్యం అనే ఖజానా అధికారాలను ప్రతినిధుల సభకు కట్టబెట్టారు. డేవిడ్ మేహ్యూ రాసిన ‘డివైడెడ్ వియ్ గవర్న్: పార్టీ కంట్రోల్, లా మేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, 1946–2002’ అనే పుస్తకంలో, ఒకే రాజకీయ పార్టీ అటు అధ్యక్ష పదవినీ, ఇటు కాంగ్రెస్‌నీ నియంత్రించినప్పుడు మాత్రమే అమెరికన్ జాతీయ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనే సాధారణ అపోహను తొలగించారు. చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత పార్టీ లేదా వివిధ పార్టీల మధ్య ఎటువంటి తేడా లేదని ఈ పుస్తకం వెల్లడిస్తుంది. నిజానికి, మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) తర్వాత, అంటే 1933లో కొత్త ఒప్పందం (న్యూ డీల్)లో భాగంగా సంక్షేమ ఆధారిత విధానాలు అమలు చేశారు. అలాగే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో ఇటీవలే తీసుకొచ్చిన ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, 2022 వంటి సంక్షేమ ఆధారిత విధానాల్లో భాగంగానే ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడం, మందుల ధరలను తగ్గించడం, క్లీన్ ఎనర్జీకి మద్దతు ఇవ్వడం వంటివాటిని ఆమోదించారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాల హయాంలోనే ఇవి ఆమోదం పొందాయి. దీనికి విరుద్ధంగా, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ) లేదా ఒబామా కేర్ చట్టంగా ప్రసిద్ధి చెందిన యాక్ట్‌ను, 2009లో డెమొక్రాటిక్ పార్టీ అటు అధ్యక్ష పదవినీ నిర్వహిస్తూ, ఇటు ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ మెజారిటీని కలిగి ఉన్నప్పుడు ఆమోదించారు. అయినా ఈ చట్టాన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు, గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా దానిని రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అటువంటి చట్టంలో భాగం కాలేనప్పుడు, తమ నియోజకవర్గాలకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఉంటాయని తెలిసినప్పటికీ, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని ఇది సూచిస్తోంది. పశ్చిమ ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం వంటి పార్ల మెంటరీ ప్రజాస్వామ్యాలను ఎక్కువగా వామపక్ష లేదా సంప్రదాయ వాద పార్టీల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తుంటాయి. 1945 నుండి జర్మనీని రైట్ వింగ్ లేదా ఉదారవాద సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ‘క్రిస్టియన్ డెమో క్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ’ మితవాద పక్షానికీ, ‘సోషల్ డెమో క్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ’ మధ్యస్థ–వామపక్ష ప్రభుత్వానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక ‘సంఘటిత’ ప్రభుత్వాలను పార్లమెంటరీ విధానంలోని ఉప విభాగంగా చూడవచ్చు. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలను మాత్రమే కలిగి ఉంటాయి. ఇటలీ, లెబనాన్, ఇథియోపియా వంటి దేశాలలో, వివిధ రకాలైన జాతి, మత, భాషా సమూహాలు సహజీవనం చేయవలసి వస్తోంది. సంఘటిత ప్రభుత్వాలు ఈ సమూహాలలోని అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో ఏర్పడతాయి. వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక సమూహం ఏదైనా విషయంపై మరొకరిని అడ్డుకుంటే,రెండోది ప్రతిగా ఆ సమూహాన్ని నిరోధించే అవకాశం ఉంటుంది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. అలాగే దేశ అణ్వాయుధ ప్రయోగాల సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించారు. 2004 నుండి 2014 వరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అనేక పౌరుల, హక్కుల ఆధారిత చట్టాలను రూపొందించింది. వీటిలో 2005లోని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), 2006లోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, 2009లోని విద్యా హక్కు చట్టంతో పాటు, 2013లో తెచ్చిన ఆహార హక్కు చట్టం; భూ సేకరణ, పునరా వాసం, రీసెటిల్మెంట్ (ఎల్ఏఆర్ఆర్) చట్టం ఉన్నాయి. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి... బలహీ నమైన, కీలుబొమ్మ ప్రభుత్వం అనే అపోహను ప్రచారం చేయడంతో అది 2014లో బీజేపీ విజయానికి దారితీసింది. అయితే, 2014 నుండి ‘బలమైన నాయకత్వం’ మనకు ఏమి అందించిందో చూద్దాం. హక్కుల ఆధారిత చట్టాలు వేటినీ ఈ ప్రభుత్వం ఆమోదించలేదు. పాలనా పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించి ఏ ఆధారాలూ లేవు. బదులుగా మోదీ ప్రభుత్వం ప్రజలను జవాబుదారీగా ఉంచాలనుకుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా మీ డబ్బును నాకు చూపించమంది; జీఎస్టీ ద్వారా మీ పన్నులు నాకు చెల్లించమంది. ఇంకా ఆర్టికల్ 370 రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టాన్ని తేవడం వంటివి జరిగాయి. నిరసనల తర్వాత మాత్రమే 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దయినాయి. గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం లేదా స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించడం వంటివి అమలులో ఉన్న సంక్షేమ విధానాలకు పొడిగింపు మాత్రమే. ఏ కొత్త ఆవిష్కరణా లేదా కొత్త దిశనూ ఈ ప్రభుత్వం చూపలేదు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన సుమారు 50 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఆర్థిక సేవలను అందిస్తుంది. అయితే ఇందులో 4.12 కోట్ల మంది జూలై 2023 నాటికి జీరో బ్యాలెన్స్ కలిగి ఉన్నారు. కాగా, జనవరి 2018 నుండి 6 కోట్ల ఖాతాల్లో ఎటువంటి లావాదేవీలు జరగలేదు. హక్కుల ఆధారిత చట్టాలు ఈ ప్రభుత్వ హయాంలో నిర్వీర్య మయ్యాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు తగ్గాయి. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరచడం ద్వారా ప్రభుత్వం తనను సూక్ష్మశోధనకు అతీతంగా ఉంచుకుంది. వివిధ పథకాలు లేదా ప్రభుత్వ వైఖరి సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి కాదు. ఒక రకమైన భూస్వామ్య పరాధీనతను సృష్టించడంలో భాగమే. అన్ని గ్యాస్ స్టేషన్లపై, మనందరి కోవిడ్ టీకా సర్టిఫికేట్లపై భూస్వామ్య ప్రభువైన ప్రధాని స్వయంగా కనిపిస్తుంటారు. ఏకవ్యక్తి ప్రభుత్వం వర్సెస్ సంకీర్ణ ప్రభుత్వం గురించి చరిత్ర పొడవునా సమీక్షించినప్పుడు, బలమైన నాయకుల అహంకారం వారి ప్రజలకు ఎల్లప్పుడూ మంచిది కాదని మనకు అర్థమవుతుంది. ఇస్లా మిక్ చట్టంలో ఇజ్మా అనే భావన ఉంటుంది. అంటే ఏకాభిప్రాయం. అతి పెద్ద సమాజం తరపున నిర్ణయాలు తీసుకోవడానికి పండితుల సంఘం కలిసి వస్తుందనే అవగాహనపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ రూపంలో మనం ఒక సంభా వ్యతకు సాక్ష్యులుగా ఉన్నాం. భారత దేశంలోని భిన్న సమూహాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం కల్పించడం కోసం అనేక పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్లకు ఓటర్లు ఒక అవకాశం ఇస్తారని ఆశించవచ్చు. డాక్టర్ రాజ్‌దీప్ పాకనాటి వ్యాసకర్త ‘జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్’ ప్రొఫెసర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ -
భారతదేశం మీ తాతల సొత్తు కాదు
న్యూఢిల్లీ: కొద్దిరోజుల క్రితం డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి రాజకీయా దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసందే. ఈ వ్యాఖ్యలు ఇండియాకూటమి చేసినా వ్యాఖ్యలుగా భావంచకూడదని ఏవి ఒక పార్టేకి చెందిన చిన్న నేత చేసినవని అన్నారు ఆప్ నేత రాఘవ్ చద్దా. ఎవరో చిన్న నేత.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి ఇండియా కూటమి భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని. ఇటువంటి వ్యాఖ్యలకు అందరూ దూరంగా ఉండాలి. మనం అన్ని మతాలను గౌరవించాలన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరో ఒక పార్టీకి చెందిన చిన్ననేత చేసిన వ్యాఖ్యలని ఇండియా కూటమి అధికారికంగా చేసినవి కాదని అన్నారు. అదే మా ప్రణాళిక.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి చేసిందన్నట్లుగా బీజేపీ పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశం ఇంతకంటే పెద్ద సమస్యలను ఎదుర్కుంటోందని ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి మేము లేవనెత్తాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ఇక ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి ప్రస్తావించగా ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు ఒక్కో రీతిగా ఉంటాయని వాటిప్రకారం ఎన్నికల ప్రణాళికను రూపొందించే విషయమై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి అవసరాన్ని బట్టి ఆయా పార్టీలు కొన్ని త్యాగాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆ సీన్ రిపీట్ అవుతుంది.. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి గురించి ప్రశ్నించగా మేము కూటమిలో నమ్మకమైన సైనికుడిగా ఉన్నామని ప్రధాని అభ్యర్థి గురించి కూటమి కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వానికి అర్హులైన చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారని ఎన్డీయే కూటమిలోలా ఒక్కరి పేరు చెప్పుకుని ఎన్నికల్లోకి వెళ్ళమని అన్నారు. 1977లో కూడా ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పడిందని అప్పుడు కూడా ప్రధాని అభ్యర్థిని ముందుగా నిర్ణయించలేదని కానీ ఆ కూటమి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని గుర్తు చేస్తూ 2024లో కూడాఅదే కథ పునరావృతమవుతుందని అన్నారు. భయం మొదలైంది.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా ఇండియా కూటమి నాలుగింట విజయం సాధించగా ఎన్డీయే కూటమి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింద అక్కడ కూడా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కిందన్నారు. ఇండియా బలమైన కూటమని ఎన్డీయే సిద్ధాంతాలు చెప్పే కూటమని అన్నారు. ఇప్పటికే వారిలో భయం పుట్టుకుందని అందుకే ఏకంగా దేశం పేరు మార్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలచుకున్నాను. ఇండియా వారి తాతల సొత్తు కాదు. 135 కోట్ల భారతీయులదని అన్నారు. త్వరలో జరుగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి చెబుతూ ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలకు కూడా మాట్లాడే అవకాశమివ్వాలని అజెండా లేకుండా సమావేశాలు ఏమిటో నాకర్ధం కావడం లేదని అసలు ఈ సమావేశాల ఎజెండా ఏమిటో ఒకరిద్దరు బీజేపీ నేతలకు మినహాయిస్తే ఎవ్వరికి తెలియదని అన్నారు. ఇది కూడా చదవండి: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం.. -
నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం..
న్యూఢిల్లీ: అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు తొలిసారి భేటీ కానుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా బీజేపీ పార్టీకి వత్యతిరేకంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ఒక్కటే ఎజెండా.. ముంబై వేదికగా ఇండియా కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో సమావేశం కానుంది. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీకి వ్యతిరేకంగా ప్రతి స్థానంలోనూ ప్రతిపక్ష కూటమిలోని పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఇటువంటి కార్యాచరణను అవలంబిస్తున్నప్పుడు పార్టీలో ఈగోలను పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరముందని ఇదివరకే ప్రతిపాదించింది కూటమి. ఇదే సమావేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు సంబంధించిన అంశంపై కూడా చర్చలు నిర్వహించనున్నారు. అక్కడే అసలు సమస్య.. అసలే ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వీలైనంత తొందరగా ఈ జాబితాను సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటీకే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు పూర్తయినట్లేనని ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ వినతి ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థుల కేటాయింపే జటిలం కనుందని విపక్ష కూటమి వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు ముందు ప్యానెల్ సభ్యుడైన రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఆచరించాల్సిన విధానాలు, సమైక్య ర్యాలీలను నిర్వహించేందుకు ప్రణాళికలు, డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల గురించి ఎన్నికలకు సంబంధించిన ఇతర కార్యాచరణ గురించి చర్చిస్తారని తెలిపారు. కూటమి విజయవంతం కావాలంటే అన్ని పార్టీలు మహత్వాకాంక్ష, మతభేదం,మనోభేదం మూడు అంశాలను పక్కన పెట్టాలని అన్నారు. కమిటీలో ఎవరెవరంటే.. ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన పద్నాలుగు మంది నేతలతో ఏర్పాటైన సమన్వయ కమిటీలో కె సి వేణుగోపాల్ (కాంగ్రెస్), టి ఆర్ బాలు (డిఎంకె), హేమంత్ సోరెన్ (జెఎంఎం), సంజయ్ రౌత్ (శివసేన-యుబిటి), తేజస్వి యాదవ్ (ఆర్జెడి), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పి), లాలన్ సింగ్ (జెడియు), డి రాజా (సిపిఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పిడిపి), అభిషేక్ బెనర్జీ (టిఎంసి) తోపాటు సీపీఐ(ఎం) ఒక అభ్యర్థి(ఖరారు కాలేదు) సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ సమన్వయ కమిటీ కూటమిలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా కూడా పని చేస్తోంది. ఇది కూడా చదవండి: కేంద్రమంత్రిని గదిలో బంధించిన బీజేపీ కార్యకర్తలు -
అంతర్జాతీయ యవనికపై మెరిసిపోతూ...
భారతదేశం సార్వభౌమ దేశంగా అన్ని రంగాలలో సుస్థిర అభివృద్ధి సాధించిన దేశంగా స్వాతంత్య్ర అమృతోత్సవ ముగింపు సంబరాల్లో ఉంది. కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు సైతం కుదేలైనాయి. కానీ భారత్ మాత్రం అన్ని రంగాలలో సుస్థిర అభివృద్ధిని సాధిస్తూ 3.7 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ముదావహం. ఇదే సమయంలో అంత ర్జాతీయంగా దేశ ప్రాముఖ్యం పైపైకి దూసుకుపోతుండడమూ గర్వించదగిన సంగతి. ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2045 సంవత్సరానికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భ వించనున్నది. గడిచిన తొమ్మిదేండ్లలో కేంద్రం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని ప్రవేశపెట్టడం, ద్రవ్యోల్భణాన్ని అరికట్టడం; ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’లను ప్రవేశ పెట్టడం; వ్యవసాయిక, పారిశ్రామిక విధానాలలో మార్పుల వంటి విప్లవాత్మక నిర్ణయాల వలన అభివృద్ధి సాధ్యమయింది. 2014 మే నెలలో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్య తలు చేపట్టిన నాటి నుండి విదేశీ విధాన రూపకల్పనలో అనేక మార్పులను తీసుకువచ్చారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలో ‘సార్క్’ (దక్షిణా సియా) దేశాలతో సంబంధాలను మెరుగు పరచటానికి చర్యలు తీసుకున్నారు. చైనా అక్రమ సైనిక చొరబాట్లను ఎప్పటికప్పుడు ఆయన నాయకత్వంలో దేశం తిప్పి కొట్టింది. ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించటం ద్వారా పాకి స్తాన్‌లోని తీవ్రవాదుల స్థావరాలను కూల్చివేసింది. తదుపరి పశ్చి మాసియా దేశాలతో సంబంధాలను పటిష్ట పరచడానికి మోదీ ప్రయత్నించారు. ముఖ్యంగా యూఏఈతో చేసుకున్న ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం – 2022’ ఇరుదేశాల ఆర్థికాభివృద్ధికి మెరుగైన బాటలు వేసింది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాలతో భారత్ సంబంధాలను మెరుగు పరచటంలో మోదీ ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలికింది. అమెరికా అధ్యక్షులు ఒబామా, ట్రంప్‌ల కాలంలోనూ, ఇప్పటి బైడెన్ హయాంలోనూ అమెరికాకు భారత్ ‘వ్యూహాత్మక భాగస్వామి’గా చాలా దగ్గరయింది. మెక్సికో, కెనడా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాలతోనూ మోది నాయకత్వంలో భారత్ ఎనర్జీ, అంతరిక్ష పరిశోధన, రక్షణ, సైబర్ సెక్యూరిటీ, స్కిల్ డెవలప్మెంట్, రైల్వేస్ తదితర రంగాలకు సంబందించి ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్‌లో ఆగస్టు 22 నుండి 24 వరకు నిర్వహించిన ‘బ్రిక్స్’ సదస్సులోనూ సభ్య దేశా లయిన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో అనేక వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంది భారత్. రష్యా, జపాన్, జర్మనీ, ఇటలీ, తదితర దేశాలతో భారత్ మొదటి నుంచి అవినాభావ సంబంధాలు కల్గి వుంది. అవి ఇప్పుడు మరింత బలపడ్డాయి. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ యవని కపై తనదైన ముద్రవేసింది. 2023లో జీ20కి భారత్ అధ్యక్షత్వాన్ని ప్రధాని మోదీ ‘ప్రజల అధ్యక్ష పదవి’గా అభివర్ణించారు. జీ20 అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా సహకార సమాఖ్య వాదాన్ని భారత్ విభిన్న నమూనా లలో ప్రదర్శించింది. సదస్సులో పాల్గొన్న అన్ని సభ్య దేశాలూ వివిధ అంశాలకు సంబంధించి ‘న్యూఢిల్లీ సంయుక్త లీడర్స్ డిక్లరేషన్’ పేరుతో ప్రకటన చేశాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించటం, శిలాజ, ఇంధనాల వాడకం తగ్గింపు, అవినీతిపై పోరు, వాణిజ్య సంబంధాల బలోపేతం, ‘భారత్–గల్ఫ్– యూరప్– మహారైల్ పోర్ట్ కారిడార్ నిర్మాణం’ వంటివి ఆ ప్రకటనలో భాగంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ ఛైర్మన్ విజ్ఞప్తి మేరకు భారత్ ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వం తీసుకుంది. ఈ సందర్భంగా భారత్, అమెరికా అధినే తలు మోదీ, జోబైడెన్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరి గింది. అలాగే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అనేక దేశాల మద్దతును కూడగట్టింది. ఈ వేదిక ద్వారా అమెరికా, బ్రిటన్లు భారత్‌కు ఐరాసలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించటం గర్వించదగిన విషయం. ఇటీవలి ‘చంద్రయాన్–3’, ‘ఆదిత్య ఎల్–1’ ప్రయోగాలు కూడా శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ శక్తి సామ ర్థ్యాలను ప్రపంచానికి మరోసారి వెల్లడించాయి. దేశానికి అంతర్జాతీయంగా మరింత గౌరవం ఇనుమడించింది. డా‘‘ పెద్దిరెడ్డి నరేందర్ రెడ్డి వ్యాసకర్త ఓయూలో పోస్ట్ డాక్టోరల్ ఫెలో -
‘భారత్ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా?
ఇటీవలే రాజధాని ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. దీనికి ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ భారత్ మండపాన్ని భవిష్యత్‌లో ఎందుకు వినియోగించనున్నారు? గత కొన్నేళ్లుగా వాణిజ్య ఉత్సవాలను ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్నారు. ఇలీవలి కాలంలో ప్రగతి మైదాన్ రూపాన్ని మార్చారు. జీ-20 సదస్సు కోసం ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడి కన్వెన్షన్ సెంటర్‌కు గ్రాండ్ లుక్‌ను అందించడంతోపాటు పలు నూతన భవనాలు నిర్మించారు. ప్రస్తుతం ‘భారత్ మండపం’ ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. జీ-20 సదస్సు తర్వాత ‘భారత్ మండపం’ అనేక ప్రపంచ స్థాయి ఈవెంట్లకు వేదికగా మారనుంది. గతంలో దీనిని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ అని పిలిచేవారు. ఇదే ఇప్పుడు ‘భారత్ మండపం’గా మారింది. ఇకపై ఇక్కడ పెద్ద కార్పొరేట్ కంపెనీల ఈవెంట్లు, పుస్తక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇంతే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. అయితే ప్రయివేటు సంస్థల మాదిరిగానే ప్రభుత్వం కూడా తగిన రుసుము చెల్లించి ‘భారత్ మండపం’ బుక్ చేసుకోవచ్చు. ‘భారత్ మండపం’ను ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షించనుంది. ఈ సంస్థను సంప్రదించి ఈ కన్వెన్షన్ సెంటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేక ఆలయాలు కూడా నిర్మితమయ్యాయి. వేలాది మంది కూర్చొనేందుకు అనువైన ఏర్పాట్ల ఉన్నాయి. 5 వేలకు పైగా వాహనాలు పార్క్ చేసేందుకు అవకాశముంది. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం ‘భారత్ మండపం’ రాబోయే మూడు నెలల వరకూ ప్రభుత్వ కార్యక్రమాల కోసం బుక్ చేశారు. ఇది కూడా చదవండి: ఆయన వాదిస్తే మరణశిక్ష కూడా యావజ్జీవం! -
'భారత్' 'ఇండియా' ఏ పేరైనా పర్వాలేదు
పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ యూనివర్సిటీలోని కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అక్కడి విద్యార్థులు ఇండియా పేరును భారత్ గా మార్చడంపై ప్రశ్నించగా రాహుల్ దీనిపై సానుకూలంగా స్పందించారు. రెండిటిలో ఏ పేరైనా తనకు ఆమోదయోగ్యమేనని అన్నారు. ఏదైనా ఓకే.. ఐరోపా రాజకీయ నాయకులతోనూ ప్రవాస భారతీయ నేతలతోనూ సమావేశమయ్యేందుకు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ పారిస్‌లోని పీవో యూనివర్సిటీ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును 'భారత్'గా మార్చడంపై ఆయన అభిప్రాయం కోరగా రాజ్యాంగంలో ఆ రెండు పేర్లను ప్రస్తావించారు.. ఇండియాగా పిలవబడే భారత్ రాష్ట్రాల సమూహమని అందులో పేర్కొన్నారు కాబట్టి తనకు ఆ రెండిటిలో ఏ పేరు పెట్టినా ఆమోదయోగ్యమేనని తెలిపారు. दिलचस्प बात है, हम जब भी अडानी पर सवाल उठाते हैं, मोदी जी एक नया ‘distraction’ ले आते हैं। 'INDIA या भारत' भी एक ऐसा ही मुद्दा है। pic.twitter.com/zZDxuavXOV — Rahul Gandhi (@RahulGandhi) September 8, 2023 'భారత్' జోడో? అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమికి ఇండియా అని పేరు పెట్టి బహుశా వారికి విసుగు తెప్పించి ఉంటాము. అందుకే వారు ఇండియా పేరునే మార్చేందుకు సిద్ధమయ్యారన్నారు. మా కూటమికి మేము వేరే పేరును పెట్టేవారమే కానీ దానివలన ప్రయోజనమేమి ఉండదు. కానీ అదేంటో మనుషులు చాలా విచిత్రంగా వ్యవహరిస్తుంటారని అన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాద యాత్రకు 'భారత్ జోడో' అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. మార్చాల్సిన అవసరమేంటి? ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు సందర్బంగా భారత రాష్ట్రపతి అతిధులకు పంపిన డిన్నర్ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ముద్రించడంతో దేశం పేరు మారుస్తున్నారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఒక్కసారిగా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వారంతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించగా రాహుల్ మాత్రం పేరు మార్పుపై అయిష్టాన్ని తెలుపుతూనే పేరు ఆమోదయోగ్యమన్నారు. The BJP government seems to be irritated with the name of our coalition. Now, they've decided to change the name of the country. People act in strange ways. : Shri @RahulGandhi 📍Sciences PO University, Paris Watch the full video here: https://t.co/uuqbjyPGMy pic.twitter.com/vlkXdBq5Yv — Congress (@INCIndia) September 10, 2023 'ఇండియా' కూటమి కాదు.. ఇక ఇండియా కూటమి పేరుపై సాక్షాత్తు ప్రధానమంత్రే అనేక సందర్భాల్లో విమర్శించిన విషయం తెలిసిందే. ఆ కూటమిని 'ఇండియా' అని కాకుండా 'ఘామండియా'(అంటే మూర్ఖులు) అని పిలవమన్నారు. ఇది కూడా చదవండి: మమతా బెనర్జీపై కాంగ్రెస్ అసంతృప్తి -
ఈవీ ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత డబ్బు వసూలు చేస్తుంది? వివరాలు
పెట్రోల్, డీజిల్ వాహనాలకంటే ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కొంత తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కావున ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విరివిగా పెరుగుతోంది. ఈవీలు పనిచేయాలంటే ఛార్జింగ్ అవసరం. ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత వసూలు చేస్తుంది, భారత్ ఈ జాబితాలో ఏ స్థానంలో ఉందనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల కోసం వసూలు చేసే చార్జీలు డెన్మార్క్ అండ్ ఇటలీలో గరిష్టంగా రూ. 1823 వరకు ఉంది. అయితే తక్కువ వసూలు చేసే దేశాల జాబితాలో అర్జెంటీనా (రూ. 113), మలేషియా (157) తరువాత భారత్ ఉండటం గమనార్హం. మన దేశంలో ఈవీ ఛార్జ్ రూ. 231 మాత్రమే. ప్రపంచంలోని 50 దేశాల మీద జరిగిన పరిశోధనలో కొత్త హ్యుందాయ్ కోనా ఈవీ 100 కిమీ ప్రయాణించడానికి కావలసిన ఛార్జ్ చేసుకోవడానికి ఎంత వసూలు చేస్తారనేదానిని ప్రామాణికంగా తీసుకుని ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇతర వాహనాలతో పోలిస్తే ఎంత తక్కువ ఖర్చు అవుంతుందనేది కూడా దీని ద్వారా బేరీజు వేసుకోవచ్చు. ప్రపంచంలో మూడవ స్థానంలో భారత్.. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుని పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఇండియాలో రూ. 231 వసూలు చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేసుకోవడానికి యూరప్ దేశాల్లో ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇదీ చదవండి: రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ! భారతదేశంలో ఎలక్ట్రిక్ కారు 100 కిమీ ప్రయాణించడానికయ్యే ఖర్చు రూ. 76 మాత్రమే అని కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. కానీ డీజిల్ లేదా పెట్రోల్ కారు ప్రయాణించాలంటే సుమారు రూ. 500 కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం. ఉదాహరణకు ఇంధన ధరలు లీటరుకు రూ. 100 అనుకుంటే.. 20కిమీ/లీ అందించే కారు 100 కిమీ ప్రయాణించడానికి రూ. 500 ఖర్చవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ కారు వినియోగం వల్ల ఎంత ఆదా చేయవచ్చనేది ఇట్టే అర్థమవుతుంది. -
దేశ విభజనకు మౌంట్ బాటన్ కారకుడా? సరిహద్దులు ప్రకటించినప్పుడు ఏం జరిగింది?
1947లో భారతదేశ స్వాతంత్ర్య ప్రక్రియలో మనదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కీలకపాత్ర పోషించారు. బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి, జూన్ 1948 లోపు ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చేలా దేశంలో అధికార మార్పిడి ప్రక్రియను నిర్ధారించడానికి 1947 ఫిబ్రవరిలో లార్డ్ మౌంట్ బాటన్‌ను భారతదేశానికి పంపించారు. ఈ నేపధ్యంలో దేశ విభజన కోసం మౌంట్ బాటన్ ప్రణాళికను రూపొందించారు. అయితే దేశ విభజనకు లార్డ్ మౌంట్ బాటన్ ఎంతవరకు కారణమనే ప్రశ్న కొందరు మేథావులలో తలెత్తెతుంటుంది. మౌంట్‌బాటన్ భారత దేశానికి రాకముందే.. మౌంట్‌బాటన్ 1900, జూన్ 25న విండ్సర్‌లో జన్మించారు. బ్రిటీష్ నావికాదళంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. అతనికి బ్రిటిష్ రాజకుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. మౌంట్‌బాటన్ భారత దేశానికి రాకముందే భారతదేశ విభజనకు పునాది పడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు భారీ నష్టాలను చవిచూశారు. యుద్ధం ముగిసే సమయానికి వారు భారతదేశాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అనేక ప్రణాళికలు రూపొందించారు. వీటిలో వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్లు భారతదేశంలో తిరస్కరణకు గురయ్యాయి. భారతదేశంలో హిందూ-ముస్లిం విభజన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే తీవ్రమైంది. ఢిల్లీ, ముంబై, రావల్పిండిలో మతకల్లోలాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండ్‌లోని నూతన బ్రిటిష్ ప్రభుత్వం 1947, ఫిబ్రవరి 20న లార్డ్ మౌంట్ బాటన్‌ను భారతదేశానికి కొత్త వైస్రాయ్గా నియమించింది. విభజనను వీలైనంత వరకు అడ్డుకోవాలని మౌంట్ బాటన్‌కు బ్రిటీష్ ప్రభుత్వం సూచించింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసే స్వేచ్ఛ కూడా అతనికి అప్పగించారు. అయితే 1948 జూన్ నాటికి, బ్రిటిష్ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశాన్ని విడిచిపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మౌంట్ బాటన్ 1947, మార్చి 22న భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీ, ముంబై, రావల్పిండిలో మతకల్లోలాలు తలెత్తాయి. భారత్‌లో ఉన్నామా?.. పాకిస్తాన్లో ఉన్నామా? పరిస్థితులకు అనుగుణంగా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం జరిగితే, అంతర్యుద్ధం చెలరేగవచ్చునని మౌంట్ బాటన్ గ్రహించారు. విభజన లేకుండా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని తొలుత మౌంట్ బాటన్ అనుకున్నారు. కానీ ముస్లిం లీగ్ పట్టుదల కారణంగా మౌంట్ బాటన్ విభజన నిబంధనతో 1047 జూన్ 3 ప్రణాళికను సమర్పించవలసి వచ్చింది. బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టడానికి తొందరపడ్డారని, ఇందుకు మౌంట్ బాటన్ ఉద్దేశాలు కారణమని చెబుతుంటారు. మౌంట్ బాటన్ ప్రతిపాదన ప్రకారం, బ్రిటీష్ పార్లమెంట్ 1947 జూలై 4న భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా ఆగస్టు 15ని నిర్ణయించింది. దీనితోపాటు భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించి, ఆగస్టు 17న లైన్ ప్రకటించారు. అప్పటి వరకు సరిహద్దుకు ఇరువైపున గల ప్రజలు భారత్‌లో ఉన్నామా, లేక పాకిస్తాన్లో ఉన్నామా అనేది తెలియని స్థితిలో ఉన్నారు. ఈ కారణంగా తలెత్తిన అల్లర్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదిఏమైనప్పటికీ మౌంట్‌బాటన్ విభజన విషాదాన్ని తగ్గించారా లేదా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇది కూడా చదవండి: చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది? -
శాంతి, సౌభాగ్యం
న్యూఢిల్లీ: ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20 కూటమికి ఈ ఏడాది సారథ్యం వహిస్తున్న భారత్‌కు ప్రశంసనీయమైన విజయం దక్కింది. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సదస్సులో, ప్రపంచ శాంతి, సౌభాగ్యమే ధ్యేయంగా వివిధ కీలక అంశాలతో కూడిన ‘న్యూఢిల్లీ జీ20 సమ్మిట్ లీడర్స్ డిక్లరేషన్’కు కూటమి సభ్యదేశాల ఆమోదం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. డిక్లరేషన్‌పై కూటమి దేశాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైందని, వెంటనే ఆమోదం పొందిందని వెల్లడించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో దేశాల మధ్యనున్న భేదాభిప్రాయాలను అధిగమించి మరీ డిక్లరేషన్‌పై ఆమోద ముద్ర పడడం గమనార్హం. డిక్లరేషన్ ఆమోదం పొందడానికి కృషి చేసిన జీ20 దేశాల మంత్రులు, అధికార ప్రతినిధులు(òÙర్పాలు), అధికారులకు నరేంద్ర మోదీ కృతజ్ఞ తలు తెలిపారు. వారంతా ప్రశంసలకు అర్హులని పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో శనివారం ఢిల్లీలో అట్టహాసంగా ఆరంభమైంది. భారత ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తదితరులు పాల్గొన్నారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కాలేదు. ఉక్రెయిన్‌లో సంఘర్షణ, ఉగ్రవాదం, అవినీతి, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక ప్రగతి, విద్య, నైపుణ్యాల వృద్ధి, పునరుత్పాదక ఇంధనాల వినియోగం తదితర కీలక అంశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్‌లో శాంతికి పాటుపడాలి ఉక్రెయిన్‌లో నెలకొన్న సంఘర్షణపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నేటి యుగం యుద్ధాల యుగం కాదని తేలి్చచెప్పింది. ప్రాదేశిక సమగ్రత, సార్వ¿ౌమత్వంతో కూడిన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని పేర్కొంది. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని వెల్లడించింది. శాంతియుత చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. శాంతి తీర్మానం ముఖ్యమని తెలిపింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, సాధారణ సభలో చేసి న తీర్మానాలకు కట్టుబడి ఉండాలని, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను అన్ని దేశాలు పాటించాలని వెల్లడించింది. ఇతర దేశాల భూభాగా లను ఆక్రమించుకోవడం, అందుకోసం బెదిరింపులకు దిగడం లేదా బలప్రయోగానికి పాల్పడ డం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడం లేదా ప్రయోగించడం ఆక్షేపణీయమని పేర్కొంది. ఉక్రెయిన్‌లో సుస్థిర శాంతి కోసం అన్ని దేశాలూ చొరవ తీసుకోవాలని పిలుపునిచి్చంది. ‘‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే ఖండించాల్సిందే. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు ఉగ్రవాదం తీవ్రమైన ముప్పుగా మారింది. మతం, జాతి పేరిట ప్రజల మధ్య చిచ్చు రేపడం క్షమార్షం కాదు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలి. ఆయుధాల అక్రమ రవాణా కూడా ఆందోళనకరంగా మారింది. ఈ అవాంఛనీయ ధోరణిని అరికట్టాల్సిందే. ఆయుధాల ఎగుమతులు, దిగుమతులపై అన్ని దేశాలు గట్టి నిఘా పెట్టాలి’’అని డిక్లరేషన్ సూచించింది. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ప్రపంచంలో అందరికీ సమాన స్థాయిలో, నాణ్య మైన విద్య, నైపుణ్య శిక్షణను అందించాల్సిన ఆవశ్యకతను న్యూఢిల్లీ డిక్లరేషన్ నొక్కిచెప్పింది. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధా న్యం ఇవ్వాలని సూచించింది. ప్రజల మధ్య డిజి టల్ అంతరాలను తొలగించడానికి డిజిటిల్ సాంకేతికలను సమర్థంగా ఉపయోగించుకోవా లని జీ20 దేశాలు తమ డిక్లరేషన్‌లో తీర్మానించు కున్నాయి. కృత్రిమ మేధ సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొనేలా విద్యాసంస్థలకు, టీచర్లకు సహకరించాలని నిర్ణయించుకున్నాయి. విద్యార్థులు, నిపుణులు, పరిశోధకులు, సైంటిస్టులు పరిశో« దనా సంస్థలతో, ఉన్నత విద్యా సంస్థలతో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారికి సైతం సమగ్ర, సమాన, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉన్నత విద్య, ఉద్యోగాల సాధనకు ఫౌండేషనల్ లెరి్నంగ్ ప్రాముఖ్యతను తాము గుర్తించామని పేర్కొన్నారు. హై–క్వాలిటీ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(టీవీఈటీ)ని డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. స్వేచ్ఛాయుత, పారదర్శక వాణిజ్యం ప్రపంచమంతటా నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయం, ఆహారం, ఎరువుల రంగంలో స్వేచ్ఛాయుత, పారదర్శక, నిబంధనల ఆధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో పేర్కొ న్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు అనుగుణంగా ఎగుమతులపై నిషేధం విధించరాదని ఉద్ఘాటించారు. ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలకు, వాటి సామర్థ్యాలకు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం చౌకగా అందేలా కలిసి పని చేయాలని నిర్ణయించారు. చాలినంత ఆహారం అనేది అందరి హక్కు అని పేర్కొన్నారు. ప్రపంచ ఆహార భద్రతను మరింత పెంచడానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలాగే అగ్రికల్చరల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ(ఏఎంఐఎస్)లోకి ఎరువులు, వెజిటబుల్ ఆయిల్స్‌ను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఆహార ధరల్లో హెచ్చుతగ్గులను అరికట్టడానికి గ్రూప్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్స్ గ్లోబల్ అగ్రికల్చరల్ మానిటరింగ్(జియోగ్లామ్) వ్యవస్థను తీసుకురానున్నారు. ఏఎంఐఎస్ పరిధిలో ప్రస్తుతం బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయా ఉన్నాయి. మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మహిళా ఆహార భద్రత, పౌష్టికాహారం ప్రాధాన్యతను డిక్లరేషన్ వివరించింది. నైపుణ్యాల అంతరాలను తొలగించాలి ప్రపంచవ్యాప్తంగా జనంలో నైపణ్యాల అంతరాలను తొలగించి, నిపుణులను తయారు చేయడానికి కార్యాచరణ చేపట్టాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో కూటమి నేతలు ప్రతిన బూనారు. సమీకృత సామాజిక రక్షణ విధానాలను అందరికీ వర్తింపజేయాలని తీర్మానించారు. సామాజిక భద్రత ప్రయోజనాలను ద్వైపాక్షిక, బహుముఖీన ఒప్పందాల ద్వారా అర్హులకు అందించేందుకు అంగీకరించారు. బాల కారి్మక వ్యవస్థను, వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. సమగ్ర ఆర్థిక ప్రగతి కోసం గ్లోబల్ స్కిల్స్ పెంచడం చాలా ముఖ్యమంత్రి డిక్లరేషన్ తేలి్చచెప్పింది. డిజిటల్ అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని సూచించింది. గిగ్, ప్లాట్‌ఫామ్ కారి్మకులకు సామాజిక పరిరక్షణ పథకాలు, మెరుగైన పని వసతులు కల్పించాలన్న ప్రతిపాదనను కూటమి నేతలు ఆమోదించారు. అవినీతిపై యుద్ధమే అవినీతి సహించడానికి ఎంతమాత్రం వీల్లేదని జీ20 నేతలు తీర్మానించారు. అవినీతికి యుద్ధం సాగించాలని డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. ఈ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవాలని నిర్ణయానికొచ్చారు. అవినీతిని ఎదుర్కొనే దిశగా ఆస్తులను స్వా«దీనం చేసుకొనే యంత్రాంగాలను బలోపేతం చేయాలన్నారు. అవినీతిపై పోరాడే బాధ్యతలను నిర్వర్తించే ప్రభుత్వ సంస్థలు, అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని తీర్మానంలో పేర్కొన్నారు. అవినీతిని అరికట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రయత్నాలకు మద్దతు ఇస్తామన్నారు. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకుందాం పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకాన్ని దశల వారీగా తగ్గించుకొనే ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలంటూ న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు. అలాగే 2009లో పిట్స్‌బర్గ్‌లో చేసిన ప్రతిజ్ఞ ప్రకారం శిలాజ ఇంధనాలపై సబ్సిడీలను హేతుబద్దీకరించాలని నిర్ణయించారు. అతితక్కువ ఉద్గారాలతో కూడిన ఇంధన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడానికి టెక్నాలజీని వాడుకోవాలని పేర్కొన్నారు. కాలుష్య రహిత, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లేలా పేద దేశాలకు సహకరించాలని తీర్మానించారు. వాతావరణ మార్పుల నియంత్రణ లక్ష్యాల సాధనకు శుద్ధ ఇంధనాల వాడకాన్ని పెంచుకోవాలని, ఇందుకోసం ఉమ్మడి ప్రయత్నాలు కొనసాగించాలని జీ20 నాయకులు డిక్లరేషన్‌ను ఆమోదించారు. నవీన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా, టెక్నాలజీ ప్రయోజనాలను పరస్పరం పంచుకొనేలా సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలని తీర్మానించారు. ఇంధన భద్రతను, మార్కెట్ స్థిరత్వాన్ని పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ప్రజలకు సేవలు అందించడానికి, నూతన ఆవిష్కరణలకు భద్రమైన, నమ్మకమైన, పారదర్శకతతో కూడిన సమగ్ర డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల(డీపీఐ) అవసరాన్ని జీ20 నేతలు గుర్తించారు. ‘ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఫర్ ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అంతర్జాతీయ స్థాయిలో పరస్పరం సహకరించుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం జీ20 ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న సూచనను డిక్లరేషన్ స్వాగతించింది. గౌరవప్రదమైన మానవ హక్కులు, వ్యక్తిగత డేటా, గోప్యత, మేధో సంపత్తి హక్కుల గురించి కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, భద్రతను పెంపొందించాలని తెలిపారు. ‘మంచి కోసం, అందరి కోసం’అనే నినాదంతో కృత్రిమ మేధ(ఏఐ)ను వాడుకోవాలన్నారు. ఏఐతో లాభాలు అందరికీ సమానంగా దక్కాలని, రిస్‌్కను సైతం సమానంగా పంచుకోవాలని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్పిరేటరీ(జీడీపీఐఆర్) ఏర్పాటు చేస్తామన్న భారత్ ప్రకటన పట్ల డిక్లరేషన్ సానుకూలంగా స్పందించింది. మలీ్టలేటరల్ డెవలప్మెట్ బ్యాంకులు అవసరమని తెలియజేసింది. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ కావాలి ప్రపంచ ఆర్థిక రంగానికి ఎదురవుతున్న సవాళ్లు, నెలకొన్న సంక్షోభాలపై జీ20 డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక వృద్ధిలో దేశాల మధ్య అసమానతలను తగ్గించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ఆర్థిక సహకార విధానాలు, నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించాలని పేర్కొంది. ధరల్లో స్థిరత్వం కోసం సెంట్రల్ బ్యాంకులు సహకరించాలని పేర్కొంది. దీర్ఘకాలిక వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలంటే సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ, నిర్మాణాత్మక ప్రభుత్వ విధానాలు అవసరమని ఉద్ఘాటించింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు(ఎఫ్ఎస్బీ) తీసుకున్న చర్యలను డిక్లరేషన్ ప్రశంసించింది. పాలసీ క్రెడిబిలిటీని కొనసాగించాలంటే సెంట్రల్ బ్యాంకులకు స్వతంత్ర ప్రతిపత్తి చాలా అవసరమని అభిప్రాయపడింది. దేశాల అభివృద్ధిలో స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈల పాత్ర చాలా కీలకమని స్పష్టం చేసింది. -
G20 Summit Budget: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు!
G20 New Delhi summit 2023: ప్రపంచ దేశాలు నేడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ రోజు, రేపు (2023 సెప్టెంబర్ 9, 10) జీ20 సమావేశాలు (G20 Summit) దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతాయనే విషయం అందరికి తెలుసు. ఈ సమావేశాలకు 30 మంది దేశాధినేతలతో పాటు 14 మంది అంతర్జాతీయ సంస్థల అధినేతలు హాజరుకానున్నారు. దీని కోసం కేంద్రం ఎంత ఖర్చు చేసిందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్రం జీ20 సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కావున న భూతో న భవిష్యత్ అనే రీతిలో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బంగ్లాదేశ్ ప్రధానితో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరవుతున్నారు. మొత్తం ఖర్చు.. కొన్ని నివేదికల ప్రకారం.. జీ20 సమ్మిట్ కోసం కేంద్రం రూ. 4100 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు సమాచారం. రోడ్లు, సెక్యూరిటీ, ఫుట్‌పాత్‌లు, లైటింగ్‌తో పాటు ఇతర పనుల కోసం ఈ డబ్బును ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. మేక్ఓవర్ ప్రక్రియలో భాగంగా దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాలలో అనేక శిల్పాలు కూడా ఏర్పాటు చేశారు. జరుగుతున్న ఈవెంట్‌కు సంబంధించిన ఇతర ఖర్చులు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: రూ.20 వేలతో మొదలై ప్రపంచ స్థాయికి.. వావ్ అనిపించే 'వందన' ప్రస్థానం! జీ20 శిఖరాగ్ర సమావేశాల కోసం గతంలో ఇతర దేశాలు కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశాయి. 2018లో బ్యూనస్ ఎయిర్స్ సమ్మిట్ ఖర్చు $112 మిలియన్స్ కాగా.. 2010 టొరంటోలో జరిగిన సమ్మిట్ కోసం కెనడా CAD 715 మిలియన్స్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. 2024 జీ20 సమావేశాలు బ్రెజిల్ నగరంలో జరగనున్నట్లు సమాచారం. -
జీ20 సమ్మిట్: ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై 'భారత్' పేరు
ఢిల్లీ:దేశం పేరుమార్పుపై ప్రస్తుతం రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీ20 వేదికలో ప్రధాని నరేంద్ర మోదీ నేమ్‌ప్లేట్‌పై దేశం పేరును భారత్ అనే పేర్కొన్నారు. దీంతో దేశం పేరును మారుస్తున్నారనే వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది. జీ20 డిన్నర్ మీటింగ్‌కి ఆహ్వానాలు పంపిన క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన జీ20 బుక్‌లెట్‌లోనూ భారత్, మధర్ ఆఫ్ డెమోక్రసీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగానే దేశం అధికారిక పేరు భారత్ అని బుక్‌లెట్‌లో స్పష్టం చేశారు. రాష్ట్రపతికి పంపిన ఆహ్వాన బుక్‌లెట్‌లో భారత్ అని పేర్కొనడంతో దేశం పేరు మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈనెల 18-23 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నందున.. దేశం పేరు మార్పు బిల్లును ప్రవేశపెట్టనున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు సందించాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఇండియా కూటమి మండిపడింది. ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ కూడా ధీటుగానే స్పందించింది. ఇండియా కూటమిని దేశ వ్యతిరేకుల కూటమిగా అభివర్ణించింది. ఇండియా పేరు వలసవాద స్వభావాన్ని సూచిస్తోందని, భారత్ పేరు సరైనదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ఈ భేటీ జీ20 కుటుంబానికి మైలురాయి.. ఎందుకంటే.. -
G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం
► జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందింది. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని భారత్ సాధించింది. ప్రధాని మోదీ ఈ అంశాన్ని జీ20 వేదికగా వెల్లడించారు. డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరేలా కృషి చేసిన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9 — ANI (@ANI) September 9, 2023 ►సదస్సు మధ్యలో ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యూకే ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ కానున్నారు. ►‘15 సంవత్సరాల క్రితం ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడానికి తొలిసారి జీ20 నేతలు కలిసి మందుకువచ్చాం. అపారమైన సవాళ్ల సమయంలో కలిసాం. జీ20 నాయకత్వాన్ని అందించేందుకు ప్రపంచం మరోసారి చూస్తోంది. మనమంతా కలిసి ఈ సవాళ్లను పరిష్కరించగలమని నేను నుమ్ముతున్నాను’ అని| బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ట్వీట్ చేశారు. G 20 in India | UK Prime Minister Rishi Sunak tweets, "15 years ago, #G20 leaders came together for the first time to restore global growth after the financial crisis. We meet at a time of enormous challenges – the world is looking to the G20 once again to provide leadership.… pic.twitter.com/SDsQ350kWH — ANI (@ANI) September 9, 2023 ►జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. పలు కీలక ఒప్పందాలపై ప్రపంచ నేతలు చర్చలు జరుపుతున్నారు. అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, భారత్ మధ్య మెగా రైల్-పోర్టు కనెక్టివిటీ డీల్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. G 20 in India | President of South Africa Cyril Ramaphosa tweets, "We are delighted that the G20 has accepted the African Union as a member of the G20..." pic.twitter.com/IhvmBOedfr — ANI (@ANI) September 9, 2023 ►G20లో శాశ్వత సభ్యదేశంగా మారినందుకు ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజలీ అసోమానిని ప్రధాని మోదీ హత్తుకున్నారు. ఆఫ్రికన్ యూనియన్ అధినేతకు మోదీ అభినందనలు తెలిపారు. Honoured to welcome the African Union as a permanent member of the G20 Family. This will strengthen the G20 and also strengthen the voice of the Global South. pic.twitter.com/fQQvNEA17o — Narendra Modi (@narendramodi) September 9, 2023 G 20 in India | Prime Minister Narendra Modi and other Heads of State/Government and Heads of international organisations participate in Session 1 of the G20 Summit at Bharat Mandapam in Delhi. pic.twitter.com/2CFr1iatYq — ANI (@ANI) September 9, 2023 ►జీ20 రౌండ్టేబుల్పై ప్రధాని మోదీ కూర్చున్న చైర్ వద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌పై ఇండియా అని కాకుండా భారత్ అని రాసి ఉంది. అలాగే మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. భారత్ మిమ్మల్ని స్వాగతిస్తోందన్నారు. G20 Summit in New Delhi admits African Union as permanent member Read @ANI Story | https://t.co/WDp55u7O54#G20India2023 #G20SummitDelhi #PMModi #AfricanUnion pic.twitter.com/r3S8L89nkF — ANI Digital (@ani_digital) September 9, 2023 ►గత కొన్ని రోజుల నుంచి ఇండియా పేరు మార్పు విషయంలో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా భారత్‌ను ఇండియాగా గుర్తించే వారు. ఇప్పుడు తొలిసారి ఓ అంతర్జాతీయ సమావేశంలో ఇండియాను భారత్‌గా గుర్తిస్తూ.. రౌండ్టేబుల్పై దేశం నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. #WATCH | G 20 in India | Prime Minister Narendra Modi says, "India's G20 presidency has become a symbol of inclusion, of 'sabka saath' both inside and outside the country. This has become people's G20 in India. Crores of Indians are connected to this. In more than 60 cities of… https://t.co/rc2iIO2IGf pic.twitter.com/SgE8r2Nojk — ANI (@ANI) September 9, 2023 ►జీ20 సదస్సులో తొలి సెషన్ ప్రారంభమైంది. వన్-ఎర్త్‌పై ప్రపంచ నేతలు చర్చలు సాగిస్తున్నారు. ►భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సదస్సు ‘సాబ్‌కా సాథ్’ చేరికలకు చిహ్నంగా మారిందన్నారు. ఇది భారత్‌లో ప్రజల జీ20గా మారిందని తెలిపారు. కోట్లాది మంది భారతీయులు దీనికి కనెక్ట్ అయ్యారని 60కి పైగా నగరాల్లో 200 కంటే ఎక్కువ సమావేశాలు జరిగాయని పేర్కొన్నారు. 'సబ్కా సాథ్' భావనతో ఆఫ్రికన్ యూనియన్‌కు G20 శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయాలని భారత్ ప్రతిపాదించిందని తెలిపారు. ►ప్రపంచానికి కొత్త దిశను చూపించడానికి 21వ శతాబ్దం ఒక ముఖ్యమైన సమయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాత సమస్యల నుంచి కొత్త సవాళ్లను కోరుతున్న సమయంలో మనం మన బాధ్యతలను మానవతావాదిగా నిర్వర్తిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కోవిడ్ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందని.. యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందన్నారు. కొవిడ్‌ను ఓడిస్తే ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించవచ్చని తెలిపారు. అ #WATCH | G 20 in India | PM Modi at the G 20 Summit says "Today, as the president of G 20, India calls upon the world together to transform the global trust deficit into one of trust and reliance. This is the time for all of us to move together. In this time, the mantra of 'Sabka… pic.twitter.com/vMWd9ph5nY — ANI (@ANI) September 9, 2023 ►జీ 20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభోపన్యాసం చేస్తూ మనమందరం కలిసి కదలాల్సిన సమయం ఇదని తెలిపారు. ఈ సందర్భంగా 'సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' మనకు టార్చ్ బేరర్‌గా పనిచేస్తుంది. భవిష్యత్తు తరాలకు సంబంధించి ఆహారం, ఇంధన నిర్వహణ, ఉగ్రవాదం, సైబర్ భద్రత, ఆరోగ్యం, శక్తి , నీటి భద్రత వంటి విషయాల్లో పరిష్కారాన్ని కనుగొనాలి. ► జీ20 శాశ్వత సభ్య దేశంగా కొత్తగా చేరిన యూనియన్ ఆఫ్ కొమొరోస్, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్పర్సన్ అజలీ అసోమనిని మోదీ గ్రూప్‌లోకి స్వాగతించారు. ఆయనను అభినందించి సభ్య దేశాలకు కేటాయించిన కుర్చులీ కూర్చోబెట్టారు. #WATCH | G 20 in India | President of the Union of Comoros and Chairperson of the African Union (AU), Azali Assoumani takes his seat as the Union becomes a permanent member of the G20. pic.twitter.com/Sm25SD80n9 — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India | Prime Minister Narendra Modi invites the Head of the African Union to take his seat, as a permanent member of the G20 as the first session of the Summit begins. pic.twitter.com/ueCe7pwNLS — ANI (@ANI) September 9, 2023 ► జీ20 సదస్సు ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ముందుగా మోరాకో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రకృతి విలయంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు సాధ్యమైన సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ20 సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది. ముందుగా జీ20 దేశాధినేతలు ఒక్కొక్కరిగా భారత మండపానికి చేరుకున్నారు. దేశాధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఉదయం 10:30కు ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జీ20 సదస్సు ప్రారంభం అయ్యింది. #WATCH | G 20 in India | PM Modi at the G 20 Summit says "Before we start the proceedings of G20, I want to express my condolences over the loss of lives due to an earthquake in Morocco. We pray that all injured recover at the earliest. India is ready to offer all possible… pic.twitter.com/ZTqcg11cKI — ANI (@ANI) September 9, 2023 ►అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, సౌదీ అరేబియా ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ జీ20 సదస్సు వేదిక అయిన ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపానికి చేరుకున్నారు. #WATCH | G 20 in India: US President Joe Biden arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/jrGkcgJ4Rz — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: Crown Prince of Saudi Arabia Muhammed Bin Salman arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/NNyI9CmSy3 — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: United Kingdom PM Rishi Sunak arrives at Bharat Mandapam, arrives at the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/EUVAtTTBIm — ANI (@ANI) September 9, 2023 ►బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్, దక్షిణాఫికా అధ్యక్షుడు సిరిల్ రమసోఫా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని జీ20 సదస్సు వేదిక భారత్ మండపానికి చేరుకున్నారు. #WATCH | G 20 in India: Premier of the People's Republic of China Li Qiang arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/Fs6715qUzn — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: President of South Africa Cyril Ramaphosa arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/OM5J5KCGWV — ANI (@ANI) September 9, 2023 ► ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ, జపాన్ ప్రధాని కిషిదా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రగతి మైదాన్‌లోని జీ20 సదస్సు వేదిక భారత్ మండపానికి చేరుకున్నారు. #WATCH | G 20 in India: President of the European Commission, Ursula von der Leyen arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/TqBlOiFysj — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: Prime Minister of Italy Giorgia Meloni arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/jSIhNZcAzU — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: Japanese PM Fumio Kishida arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/V2pkp7VlJK — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: Indonesian President Joko Widodo arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/qyIYG4rhFw — ANI (@ANI) September 9, 2023 ► చైనా మంత్రి లీ కియాంగ్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకున్నారు. భారత్ మండపానికి చేరుకున్నారు. #WATCH | G-20 in India: German Chancellor Olaf Scholz arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/PkBvhCKWEO — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: Japanese PM Fumio Kishida arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/V2pkp7VlJK — ANI (@ANI) September 9, 2023 బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్ జీ 20 సమ్మిట్‌కు వేదికైన భారత్ మండపానికి చేరుకున్నారు. #WATCH | G 20 in India: President of Brazil Luiz Inacio arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/y32cs8XEho — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: President of Turkey, Recep Tayyip Erdogan arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/e8IxFZPsgq — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: President of South Korea Yoon Suk Yeol arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/7q5wGgxqR6 — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: President of the European Council Charles Michel arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/VWxAtsclEK — ANI (@ANI) September 9, 2023 జీ20 సదస్సులో భాగంగా ఇవాళ.. పదిన్నర నుంచి ఒకటిన్నర మధ్యలో వన్ ఎర్త్ సమ్మిట్ జరగనుంది. ఆపై 1.30గం నుంచి 3.00 మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. మ.3- మ.4.45 మధ్య సెషన్ 2లో భాగంగా.. వన్ ఫ్యామిలీ సమ్మిట్ జరుగుతుంది. ఇక రాత్రి 7గం - 8గం మధ్య జీ20 దేశాధినేతలు గ్రూప్ ఫోటో దిగుతారు. రా.8గం 9.15గం సమయంలో జీ20 దేశాధినేతల డిన్నర్ మీటింగ్ ఉంటుంది. #WATCH | G 20 in India | Visuals from Bharat Mandapam the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/1It0LslPBV — ANI (@ANI) September 9, 2023 అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే జీ20 సదస్సు ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపం వేదికగా రెండు రోజులపాటు(ఇవాళ, రేపు) సాగనుంది. వసుదైక కుటుంబం పేరుతో ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు నినాదంగా భారత్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరిష్కారం చూపుతూ.. భౌగోళికంగా ముక్కలైన రాజకీయ వాతావరణానికి చికిత్స చేసే సమ్మిళిత వృద్ధి దిశగా ప్రపంచాన్ని పరుగులు పెట్టించడంపై ఈ సదస్సు దృష్టి పెట్టబోతోంది. . 1. -
అది శత్రువును నిలువునా చీల్చే శివాజీ ఆయుధం.. త్వరలో లండన్ నుంచి భారత్‌కు..
ఛత్రపతి శివాజీ మహారాజ్ వినియోగించిన ఆయుధం ‘బాఘ్ నఖ్’(పులి గోరు) వందల ఏళ్ల తరువాత తిరిగి భారత్ చేరుకోనున్నది. శివాజీ 1659లో బీజాపూర్ సుల్తానేట్ కమాండర్ అఫ్జల్ ఖాన్‌ను అంతమెందించడానికి ఈ ఆయుధాన్ని వినియోగించారు. అనంతర కాలంలో బ్రిటిష్ అధికారి దానిని బహుమతిగా బ్రిటన్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ ఆయుధాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ అంగీకరించినట్లు సమాచారం. మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ సెప్టెంబరు 2023 చివరిలో లండన్‌ను సందర్శించనున్నారు. అప్పుడు ఈ ఆయుధాన్ని భారత్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఈ ఆయుధం ఈ మ్యూజియంలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే ‘బాఘ్ నఖ్’ భారత్ చేరుకోనుంది. మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ మీడియాతో మాట్లాడుతూ బ్రిటీష్ అధికారుల నుంచి తమకు లేఖ వచ్చిందని, ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు చెందిన ‘వాఘ్‌నఖ్’ను తిరిగి ఇవ్వడానికి వారు అంగీకరించారని తెలిపారు. తాము యుకె వెళ్లాక అక్కడ ప్రదర్శనలో ఉన్న శివాజీ జగదాంబ ఖడ్గం తదితర వస్తువులను తీసుకువచ్చేందుకు కూడా పరిశీలిస్తామన్నారు. 1659 నవంబర్ 10న అఫ్జల్ ఖాన్ హత్య గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా చూస్తే అఫ్జల్ ఖాన్ హత్య 1659 నవంబర్ 10న జరిగిందని సుధీర్ తెలిపారు. కాగా ఛత్రపతి శివాజీ మహరాజ్ వినియోగించిన బాఘ్ నఖ్ చరిత్రలో అమూల్యమైన నిధి అని, రాష్ట్ర ప్రజల మనోభావాలు దీనితో ముడిపడి ఉన్నాయని సుధీర్ పేర్కొన్నారు. కాగా మంత్రి ముంగంటివార్‌తో పాటు సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ వికాస్ ఖర్గే, స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డైరెక్టర్ డాక్టర్ తేజస్ గార్గే లండన్‌కు వెళ్లనున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది. ఈ ముగ్గురు సభ్యుల బృందం సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు ఆరు రోజుల పర్యటన కోసం బ్రిటన్‌కు వెళ్లనుంది. ఆయుధాన్ని తీసుకెళ్లిన బ్రిటీష్ అధికారి ఉక్కుతో తయారైన ఈ ఆయుధానికి నాలుగు గోళ్లు ఉన్నాయి. మహారాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వాఘ్ నఖ్ పిడికిలితో పట్టుకునే బాకు. సింహం, పులి, చిరుత గోళ్లను పోలినట్టు వీటిని తయారు చేశారు. ఇది శత్రువు చర్మం, కండరాలను చీల్చివేయడానికి రూపొందించారు. ఈ పులి గోరు శివాజీ వారసుల వద్ద ఉండేది. 1818లో దీనిని బ్రిటిష్ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ బహుమతిగా అందుకున్నాడు. ఆ సమయంలో డఫ్‌ను సతారా రాష్ట్ర రెసిడెంట్ పొలిటికల్ ఏజెంట్‌గా ఈస్ట్ ఇండియా కంపెనీ పంపింది. అతను 1818 నుండి 1824 వరకు సతారాలో పనిచేశాడు. ఆయన ఆ పులి పంజా ఆయుధాన్ని తనతో పాటు బ్రిటన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతని వారసులు దానిని ఆల్బర్ట్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చారు. ఇది కూడా చదవండి: మేరీ మిల్బెన్ ఎవరు? ఆమె ప్రధాని మోదీకి ఎందుకు మద్దతు పలికారు? -
G20 summit: ఏకాభిప్రాయం సాధిస్తాం
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని భారత్ ప్రకటించింది. ‘ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ దిశగా సంప్రదింపులు ముమ్మరంగా జరుగుతున్నాయి’ అని భారత్ ప్రకటించింది. సదస్సుకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటి అంశాల్లో సమ్మతి సాధ్యమయ్యేనా అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఆయన చెప్పలేదు. ‘ ఆఫ్రికా యూనియన్‌కు జీ20 కూటమిలో సభ్యత్వం ఇవ్వాలా వద్దా అనే అంశంపై శనివారం జరిగే సదస్సులో నిర్ణయం తీసుకోవచ్చు’ అని క్వాత్రా తెలిపారు. ‘ప్రధాని మోదీకి గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రగాఢ విశ్వాసముంది. అందుకే ఆఫ్రికా యూనియన్ను కలుపుకుందామని జీ20 సభ్యదేశాలకు రాతపూర్వకంగా మోదీ విన్నవించుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ అనేది గ్లోబల్ సౌత్‌కు, అభివృద్ధి దేశాలకు గొంతుకగా ఉంటుంది. జీ20కి భారత సారథ్యం సమ్మిళితంగా, లక్ష్య సాధకంగా, క్రియాశీలకంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు ’ అని జీ20 షెర్పా అయిన అమితాబ్ కాంత్ చెప్పారు. ‘ భారత వైవిధ్య, సమాఖ్య నిర్మాణానికి గుర్తుగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 60 నగరాలు, పట్టణాల్లో 220కిపైగా జీ20 సంబంధ సమావేశాలు జరిగాయని అమితాబ్‌కాంత్ పేర్కొన్నారు. అగ్ర నేతలు పాల్గొనే సెషన్స్‌లు మూడు విడిగా జరుగుతాయి. వీటికి ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అని నామకరణం చేశారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అగ్రనేతల గౌరవార్ధం విందు ఇవ్వనున్నారు. జీ20 నేతలంతా రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీకి ఘన నివాళులు అర్పించనున్నారు. ప్రపంచ రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, సమ్మిళిత వృద్ధి, ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణంలో పెను మార్పులు, గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర కీలక అంశాలు నేతల మధ్య భేటీలో చర్చకు రానున్నాయి. మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్ సహా ఇతర దేశాల నేతలు, ఈయూ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఓఈసీడీ, ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు హాజరుకానున్నారు. -
యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్‌కు రిషి
-
ఇప్పుడెలా? ‘ఇండియా’ పేరు భారత్‌గా మార్చుకుందామా?!
ఇప్పుడెలా? ‘ఇండియా’ పేరు భారత్‌గా మార్చుకుందామా?! -
‘ఇండియా దటీజ్ భారత్’.. ఇంత జరిగిందా?
ఒకే దేశం– ఒకే పన్ను విధానం తర్వాత ఒకే దేశం–ఒకే ఎన్నిక దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేగంగా కదులుతున్నారు. ఇప్పుడు.. ఎవరూ ఊహించని విధంగా ఒకే దేశం – ఒకే పేరుపైనా నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు ఇండియా దటీజ్ భారత్ అని రాజ్యాంగంలోని ఒకటవ అధికరణంలో పొందుపర్చారు. ఒక దేశానికి రెండురకాల పేర్లు పెట్టారు. అసలు దేశానికి రెండు పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది...దాని వెనుక జరిగిందేమిటి ? ఇండియా దటీజ్ భారత్ అని మన రాజ్యాంగం చెపుతోంది. ఒకటో అధికరణం ప్రకారం దేశానికి రెండు పేర్లు పెట్టారు. ఇలా రెండు పేర్లు పెట్టడం వెనుక రాజ్యాంగ సభలో రెండురోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. మన దేశ చారిత్రక వారసత్వానికి అనుగుణంగా భారత్ అని పేరు పెట్టాలని రాజ్యాంగసభ సభ్యులు సేత్ గోవింద్‌దాస్, హరి విష్ణు కామత్ వాదించారు. అంతేకాదు ఇండియా అనే ఆంగ్లపదం ఆంగ్లేయుల పాలనను సూచిస్తుందన్నారు. మరోవైపు హరిగోవింద్పంత్ భారత్వర్షగా దేశం పెట్టాలని సూచించారు. మరికొందరు సభ్యులు చైనా యాత్రీకుడు హ్యుయాన్ త్సాంగ్ తన రచనల్లో దేశం పేరును భారత్ పేర్కొన్నారని ఉదహరించారు. ఇండియా పేరు వలసరాజ్యానికి, పాశ్చాత్యుల ఆధిపత్యానికి గుర్తుగా ఉంటుందని వాదించారు. అయితే ఇండియా పేరు ఎలా చేర్చారు ? చారిత్రకంగా చూస్తే ఇండస్ నది (సింధు నది)కి ఇవతల ఉండే భూభాగాన్ని విదేశీయులు ఇండియాగా పిలిచారు. కాలక్రమంలో అది కొనసాగుతూ వచ్చింది. నిజానికి ఆంగ్లేయుల పాలనా కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసుకువచ్చారు. మన రాజ్యాంగంలో చాలా అంశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచే తీసుకున్నారు. ఆ తర్వాత 1947లో దేశ విభజన సమయంలో పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. పాకిస్తాన్లో ఉన్న హిందువులు భారత్ వైపు, ఇక్కడున్న ముస్లింలు పాకిస్తాన్‌వైపు వెళ్లే ప్రయత్నంలో భారీ ఊచకోత జరిగింది. వేలాదిమంది చనిపోయారు. మైనార్టీలలో తీవ్రమైన ఆందోళనలు చెలరేగాయి. ఈ విభజన గాయాల నేపథ్యం రాజ్యాంగ సభ Constituent Assembly సభ్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. భారత్ అనే పేరు హిందుత్వాన్ని మాత్రమే సూచిస్తుందనే ఉద్దేశంతో, దేశంలోని ఉన్న భిన్న మతాలు, సంస్కృతుల నేపథ్యంలో ఇండియా పేరును కూడా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఇండియా పేరుపై నిర్వహించిన ఓటింగ్లోఅనుకూలంగా 51, వ్యతిరేకంగా 38 ఓట్లు వచ్చాయి. అటు భారత్, ఇండియా మధ్య సమన్వయం కోసం ఇండియా దటీజ్ భారత్ అని రెండు పేర్లను రాజ్యాంగంలోని మొదటి అధికరణంలో చేర్చారు. అయితే ఈ అంశంపై రాజ్యాంగసభలో వాడీవేడీ చర్చ జరిగిన సమయంలో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, పేర్లపైనా ఘర్షణపూరిత చర్చ కంటే, చేయాల్సిన అసలు పని చాలా ఉందని దానిపైనే దృష్టి పెట్టాలని కోరి ఈ చర్చకు ముగింపు పలికారు. ఇదీ చదవండి: భారత్ అనే పేరు ఎలా పుట్టిందంటే.. ఒకే దేశం–ఒకే పేరు ఒకే దేశం – ఒకే పన్ను, ఒకే దేశం – ఒకే ఎన్నిక, ఒకే దేశం– ఒకే చట్టం (ఉమ్మడి పౌరస్మృతి) అనే పాలసీని అమలు చేస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం త్వరలోనే ఒకే దేశం–ఒకే పేరు తో రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, దేశానికున్న రెండు పేర్లలో ఒకటి తొలగించి, భారత్‌ను శాశ్వతం చేయనున్నారు. :::నాగిళ్ల వెంకటేష్, డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్, సాక్షిటీవీ -
ఇండియా పేరు 'భారత్'గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే?
గత కొన్ని రోజుల నుంచి ఇండియా పేరుని భారత్‌గా మార్చాలనే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీని కోసం 2023 సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగస్టు 31న ప్రకటించారు. అయితే ఇండియా పేరు భారత్‌గా మారిస్తే.. ఎలాంటి ఆర్థిక పరిణామాలు ఎదురవుతాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఔట్లుక్ బిజినెస్ నివేదికల ప్రకారం, ఇండియా భారత్‌గా మారాలంటే ఏకంగా రూ. 14 వేలకోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కొన్ని దేశాలు పేర్లు మార్చుకోవడం వల్ల ఎంత ఖర్చయింది అనే వివరాల ఆధారంగా ఇంత పెద్ద మొత్తం ఖర్చు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2018లో ఆఫ్రికాలోని స్వాజిల్యాండ్ దేశం పేరుని ఎస్వంటిని (Eswantini)గా మార్చడానికి సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చయినట్లు ప్రముఖ న్యాయవాది 'డారెన్ అలివర్' గణాంకాలు వెల్లడించాయి. అంతే కాకుండా ఈయన ప్రకారం ఒక పెద్ద దేశం సగటు మార్కెటింగ్ బడ్జెట్ దాని మొత్తం ఆదాయంలో దాదాపు 6 శాతం వరకు ఉంటుంది. కాగా రీబ్రాండింగ్ కోసం మొత్తం మార్కెటింగ్ బడ్జెట్లో 10 శాతం వరకు ఖర్చవుతుంది. అలివర్ సూత్రం ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆదాయం మొత్తం రూ.23.84 లక్షల కోట్లు. కావున అలివర్ (Oliver) సూత్రం ప్రకారం రూ. 23.84 లక్షల కోట్లు × 0.006 = రూ. 14,304 కోట్లు (రీబ్రాండింగ్ మొత్తం). ఈ విధంగా భారత్ పేరుగా ఇండియా స్థిరపడాలంటే వేలకోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇండియా అన్న పేరుని భారత్‌గా మార్చితే.. ఇండియా పేరు ఉన్న ప్రతి చోటా (కరెన్సీ నోట్ల మీద, ఆధార్, పాన్, ప్రభుత్వ సంస్థలు ఇలా) భారత్ అనే పదం చేర్చాలి వస్తుందని, ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఇలా అయితే ఎలా గురూ.. కేవలం 48 గంటల్లో అన్నీ బుక్కయిపోయాయ్! ఇప్పటికే భారతదేశంలోని కొన్ని నగరాల పేర్లు కూడా మార్చడం జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం ఛత్రపతి శంభాజీనగర్‌గా.. హోషంగాబాద్ 2021లో నర్మదాపురంగా, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నగరం 2018లో ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్చింది. అలహాబాద్ పేరు మార్చడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 300 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు ఇండియా టుడే గతంలో నివేదించింది. ఈ లెక్క ప్రకారం ఇండియా.. భారత్‌గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చు అవుతుందో ఊహించవచ్చు. -
కొత్త విశ్వ వ్యవస్థకు ఆశాదీపం
భారతదేశం సహజంగానే తన డీఎన్ఏలో ప్రతిభా భాండాగారాన్ని కలిగి ఉంది. ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞుల అద్భుతమైన కృషి ఆధునిక పరిశోధనలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశ పురోగమనం, ఎదుగుదల కేవలం దాని సొంత ప్రజల కోసమే కాకుండా, మనం ‘ప్రపంచ కల్యాణం’ అని దేన్నయితే పిలుస్తామో అటువంటి ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడాలి. భారతదేశ అధ్యక్షతన జి–20 ఇతివృత్తం అయిన ‘ఒక భూమి – ఒక కుటుంబం – ఒక భవిష్యత్తు’, మన ప్రాచీన విలువ ‘వసుధైవ కుటుంబం’తో ముడిపడి ఉంది. జ్ఞాన నాగరికతగా, భారతదేశం సహజంగానే తన డీఎన్ఏలో ప్రతిభ భాండాగారాన్ని కలిగి ఉంది. భారతదేశ చరిత్ర చూస్తే– గణితం, ఖగోళ శాస్త్రం,వైద్యం, తత్వశాస్త్రం, సాహిత్యంతో సహా వివిధ విజ్ఞాన రంగాల్లో గణనీయమైన కృషి చేసిన ప్రస్థానమే గోచరిస్తుంది. ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుల సంఖ్యా సిద్ధాంతం, గణిత విశ్లేషణలో అద్భుతమైన కృషి ఆధునిక పరిశోధనలను కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. జ్ఞాన నాగరికతగా భారతదేశ చరిత్ర దాని సమకాలీన విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఇది ప్రపంచ శ్రేయస్సుకు గణనీయమైన సహకారిగా నిలిచింది. విశ్వ శ్రేయస్సుకు జి–20 జి–20 అధ్యక్షతలో భారతదేశం మొత్తం వర్కింగ్ గ్రూపులు లేదా మంత్రుల సమావేశాలలో జరిగిన అన్ని చర్చలను కూడా గొప్ప ప్రపంచ శ్రేయస్సు అనే బంధంతో అనుసంధానం చేసింది. ‘‘ఒక భూమి – ఒక కుటుంబం – ఒక భవిష్యత్తు’’ అనే జి–20 ఇతివృత్తం, మన ప్రాచీన విలువలైన ‘వసుధైవ కుటుంబం’తో ముడిపడి ఉంది. భారతదేశ పురోగమనం, ఎదుగుదల కేవలం దాని సొంత ప్రజల కోసమే కాకుండా, మనం ‘ప్రపంచ కల్యాణం’ అని దేన్నయితే పిలు స్తామో అటువంటి ప్రపంచ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగ పడాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దాని సహజసిద్ధమైన బలం, సామర్థ్యాలను ప్రపంచం స్పష్టంగా విశ్లేషించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ‘ప్రకాశవంతమైన ప్రదేశం’గా గుర్తించింది. భారతదేశ స్థూల ఆర్థిక మూలాధారాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పవనాలు ఎదురవుతున్నప్పటికే , భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశం ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అతి తక్కువ సమయంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఆదర్శాలతో కూడిన విద్య విజ్ఞానం, నైపుణ్యం ద్వారా మానవ మూలధనాన్ని పెంచడం అనేది భారతదేశ సామర్థ్యానికి కీలకం. విద్య అనేది వృద్ధి, ప్రేరణలను నడిపించే, నిలబెట్టే ‘మదర్–షిప్’(కేంద్రం). విద్య అనేది పౌరులను శక్తిమంతం చేసే మాతృశక్తి. దానికి అనుగుణంగా రూపొందించిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అన్నింటికీ మూల పత్రం. సమగ్ర జాతీయ విద్యా విధానం–2020, భారత్‌లో విద్యను సమగ్రంగా, భవిష్యత్తు మార్గదర్శకంగా, ప్రగతి శీలంగా ఒక ముందు చూపు ఉండేలా సంపూర్ణంగా రూపొందించడం జరిగింది. బలమైన విషయ అవగాహన, స్పష్టతను నిర్ధారించడం కోసం మాతృభాషలో నేర్చుకోవడానికి నూతన విద్యా విధానంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే మాతృభాషలో విద్య అనుసంధాన భాషలను భర్తీ చేయదు, కానీ వాటికి అనుబంధంగా ఉంటుంది. ఇది జ్ఞానపరంగా తక్కువ సమస్యలను అధిగమించే విద్యార్థులతోపాటు సజావుగా చదువుకొనే విద్యార్థులకు కూడా చక్కటి విద్యా మార్గాలను అందిస్తుంది. ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ ఇప్పుడు ప్రాధాన్యతను సంత రించుకుంది. ఎన్ఈపీ–2020, భారతదేశాన్ని అత్యుత్తమ అధ్యయన గమ్యస్థానంగా మార్చడానికిగానూ, అధ్యాపకులు/ విద్యార్థుల మార్పిడి, పరిశోధన, బోధనా భాగస్వామ్యాలు, విదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన ఎంఓయూలపై సంతకాలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఐఐటీ– మద్రాస్, ఐఐటీ– ఢిల్లీ ఇప్పటికే తమ విదేశీ క్యాంపస్‌లను వరుసగా జాంజిబార్–టాంజానియా, అబుదాబి– యూఏఈలలో ఏర్పాటు చేయడానికి అవగాహనా ఒప్పందాలను కుదర్చుకున్నాయి. విదేశాలతో విద్యా భాగస్వామ్యం పరిశోధనను ప్రోత్సహించడానికి పరిశ్రమ–అకాడెమియా సహ కారం అనేది ఎన్ఈపీలో చేర్చిన మరొక ప్రాధాన్యత అంశం. అకడమిక్ ఇన్ స్టిట్యూషన్ ్సలో తొలి అడుగు నుండి పరిశోధనల వరకు సులభతరం చేయడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు అవుతోంది. భారతదేశాన్ని పరిశోధన–అభివృద్ధి హబ్‌గా మార్చ డంపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. సులభతర వ్యాపారం మాత్రమే కాకుండా సులభతర పరిశోధన కూడా ఉండేలా ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా, ప్రధాన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యూరప్ దేశాలతో భారతదేశం విద్యా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ భారతదేశ ప్రతిభను గుర్తించి, దృష్టిలో ఉంచుకుంటారు. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసెట్), క్వాడ్ ఫెలోషిప్ కింద హై–టెక్నాలజీ రంగాలలో మెరుగైన సహకారాన్ని ప్రోత్సహించడం జరగుతుంది. భారతీయ విద్యను ప్రపంచ విద్యతో సమలేఖనం చేయడంలో ప్రామాణీకరణ సహాయ పడుతుంది. జాతీయ విద్యా విదానం కింద, పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ విడుదల చేయడమైనది. ఇది నిర్దిష్ట అభ్యాస ప్రమాణాలు, కంటెంట్, బోధనాశాస్త్రం, మూల్యాంకనాలకు ప్రమాణాలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా, విభిన్న విద్యావేత్తల అభ్యాసాన్ని అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ పరిధిలోకి తీసుకు రావడానికి నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ పనిచేస్తుంది. గొప్ప శ్రామిక శక్తి భారతదేశంలో ఇప్పుడు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల 60 కోట్ల జనాభా ఉంది. 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు. బహుళ–క్రమశిక్షణ, బహుళ–నైపుణ్యం కలిగిన, విమర్శనాత్మకంగా ఆలోచించే, యువకులు, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామికశక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. భారతదేశం ఇప్పుడు మూడవ అతిపెద్ద స్టార్ట్–అప్ పర్యావరణ వ్యవస్థ. 100 కంటే ఎక్కువ యునికార్న్‌లతో నైపుణ్యం, వ్యవస్థాపక తకు ప్రతీకగా నిలిచింది. మెట్రో నగరాల్లో మాత్రమే కాదు, భారతదేశ ఆవిష్కరణలు, స్టార్టప్‌లు టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల ద్వారా కూడా ఆవిష్కారం అవుతున్నాయి. 6వ తరగతి నుండి పాఠశాల విద్యలో నైపుణ్యం ఏకీకృతం అయింది. సాంకేతికతతో నడిచే పారిశ్రామిక వాతావరణంలో నిల దొక్కుకోవడానికిగానూ పాఠశాల స్థాయి నుండే నైపుణ్యం కలిగిన మానవ శక్తిని రూపొందించడానికి సింగపూర్ స్కిల్ ఫ్రేమ్‌వర్క్ అనుసరించదగినది. అభివృద్ధి చెందుతున్న కొత్త క్రమంలో మానవ మూలవనరుల ప్రధాన పాత్రను భారతదేశం గుర్తించింది. విద్య, నైపుణ్యంతో కూడిన వ్యక్తులు నేటి జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మాత్రమే విజ్ఞాన సరిహద్దును విస్తరించడం, ఆర్థిక వృద్ధికి ఊత మివ్వడంతో పాటు, అద్భుతమైన ఆవిష్కరణలు అందించగలరు; శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా దేశ నిర్మాణానికి అసాధారణమైన సహకారాన్ని అందించగలరు. ప్రపంచ ప్రయోజనాల కోసం ఇప్పుడు భారత దేశం ఒక పెద్ద ప్రయోగశాల. జ్ఞాన శతాబ్దం అయిన 21వ శతాబ్దంలో కొత్త సాంకేతి కతలు కొత్త క్రమానికి నాంది పలుకుతాయి. భారతదేశం తన విస్తారమైన నైపుణ్య గనిని ఏర్పరచడంలో, కొత్త క్రమాన్ని రూపొందించడంలో ముందంజలో ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాసకర్త కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపకత మంత్రి -
పార్లమెంట్ ‘ప్రత్యేక’ రహస్యం
ప్రత్యేకం అంటేనే సాధారణమైన దానికి భిన్నమైనది, వేరైనది అని నిఘంటవుల అర్థం. మాటలోనే ఉన్నట్టుగా ఈ నెల 18 నుంచి 22 దాకా జరగనున్న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశాలు అనేక రకాలుగా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగిసి, 3 వారాలైన కాక ముందే ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేక భేటీ ప్రకటన చేయడం ఒక ప్రత్యేకతైతే... హఠాత్తుగా ఈ భేటీ ఎందుకు జరుపుతున్నదీ అజెండా చెప్పకపోవడం మరో ప్రత్యేకత. ఉమ్మడి పౌరస్మృతి, ‘ఒకే దేశం – ఒకేసారి ఎన్నికల’ చట్టం, దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చడం, మహిళా రిజర్వేషన్లు... ఇలా పలు ఊహాగానాలు వినిపిస్తున్నా పాలకపక్షం నోరు మెదపక ప్రతిపక్షాలను ఊహల్లో, అనుమానాల్లో పెట్టడం మరింత ప్రత్యేకత. ఇది అన్యాయమని విపక్షాలు ఆక్రోశిస్తున్నాయి. ఆగస్ట్ 31నే ప్రత్యేక భేటీ ప్రకటన చేసిన ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నేత తాజాగా లేఖ రాసినా, రాజకీయాలు చేస్తున్నారంటోంది. వెరసి ప్రత్యేక భేటీ దేనికనే ఉత్కంఠ పెరుగుతోంది. గతంలో 2019 ఆగస్ట్‌లో వర్షాకాల సమావేశాల్లో అజెండాలో లేకుండానే హఠాత్తుగా ఆర్టికల్ 370 రద్దును సభలో తెర మీదకు తెచ్చి, ప్రతిపక్షాల చేష్టలుడిగేలా చేసిన చరిత మోదీ సర్కార్‌ది. మరి ఈ సారి ఎలాంటి రాజకీయ గూగ్లీ విసిరి, వచ్చే 2024 ఎన్నికలకు కొత్త కథనంతో ముందుకు వస్తారన్నది ఆసక్తి రేపుతోంది. సహజంగానే విపక్షాల్లో ఆందోళన పెంచుతోంది. ప్రత్యేక సమావేశా లనే మాటే రాజ్యాంగ నిబంధనల్లో లేదు గనక, వాటి అజెండా ఏమిటన్నది ముందుగా చెప్పాలన్న రూలూ కనిపించదు. కానీ, గతంలో పార్లమెంట్ ప్రత్యేక భేటీని ప్రకటించినప్పుడల్లా ఆ రోజునే సమావేశాల అజెండానూ ప్రకటించడం ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు దాన్ని కూడా పాలకపక్షం తుంగలో తొక్కుతోందన్నది ప్రధాన ఆరోపణ. ఇలా జరగడం ఇదే తొలిసారని రాజ్యాంగ నిపుణులూ నిర్ధరించారు. అయితే, సమస్త పార్లమెంటరీ సంప్రదాయా లకూ తిలోదకాలిస్తున్న పాలకులు గద్దె మీదకు వస్తున్న కాలంలో విచారపడి ఉపయోగం లేదు. ప్రత్యేక సమావేశాల్ని నిర్వహించే అధికారం ప్రభుత్వానికి లేదని ఎవరూ అనలేరు, అనరు. కానీ, ప్రజాస్వామ్య దేశంలో అందుకు అనుసరిస్తున్న విధానం మీదే రచ్చ. నిజానికి, నిర్ణీత తేదీల్లోనే పార్లమెంట్ సమావేశం కావాలంటూ మన దేశంలో కచ్చితమైన పార్లమెంటరీ క్యాలెండరంటూ ఏమీ లేదు. ఏటా 12 నెలల వ్యవధిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్ భేటీ కావాలి. జనవరి చివర్నించి మే వరకు బడ్జెట్ సమావేశాలు, జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల భేటీ, నవంబర్ – డిసెంబర్లలో శీతకాల సమావేశాలంటూ ఏటా 3 సమావేశాలన్నది చిరకాల సంప్రదాయం. అయితే, తొలి రెండు దశాబ్దాల పార్లమెంట్ చరిత్రలో లోక్‌సభ ఏటా సగటున 120 రోజుల పైచిలుకు సమావేశమైతే, గత దశాబ్ద కాలంలో అది 70 రోజులకు పడిపోవడం విషాదం. సాధారణ సమావేశాల సంగతే అలా ఉంటే, అసాధారణ భేటీతో ఒరిగేదేంటో చెప్పలేం. ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ సభ్యుల చర్చ లాంటివి లేని ఈ భేటీ మే 28న మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంలో జరగనుందట. చారిత్రక సంఘటనలు, మైలురాళ్ళ జ్ఞాపకార్థం భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగడం కొత్తేమీ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడూ, ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమ స్వర్ణోత్సవం (1992), భారత స్వాతంత్య్ర రజతోత్సవం (1972), స్వర్ణోత్సవం (1997) వేళ అర్ధ రాత్రి భేటీలు జరిగాయి. ఒక చట్టం చేయడానికంటూ ప్రత్యేక సమావేశం జరిగింది మాత్రం 2017 లోనే! అదీ మోదీ హయాంలోనే! నాటి సర్కార్ ఉభయ సభల అర్ధరాత్రి భేటీలో జీఎస్టీ తెచ్చింది. మళ్ళీ ఇప్పుడు అజెండా వెల్లడించకుండా బుల్డోజర్ ధోరణిలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ జరపాల నుకోవడమే రచ్చకు దారి తీస్తోంది. అజెండాను ప్రతిపక్షాలకు చెప్పడం ప్రోటోకాలన్నది పక్కన పెడితే, చివరకు అధికారపక్ష నేతలకూ అజెండా అస్పష్టం, దేవరహస్యంగానే మిగలడం విడ్డూరం. ప్రజాస్వామ్యంలో పాలకులు సర్వంసహా చక్రవర్తులు కాదని గుర్తించాలి. అలా ప్రవర్తించడాన్ని ప్రజలూ హర్షించరని గ్రహించాలి. అదే సమయంలో ‘వీటిపై చర్చించండి’ అంటూ నిన్న గాక మొన్న వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించిన అంశాలపైనే లేఖలో రాయడమూ కాంగ్రెస్ తదితర విపక్షాల మేధాశూన్యతకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఎలాంటి అంశాన్ని తెరపైకి తెచ్చినా, దాన్ని సమర్థంగా చర్చించగల సన్నద్ధత లేకుంటే అది ప్రతిపక్షాల అసమర్థతే. మొన్నటి అవిశ్వాస తీర్మానంపై చర్చలోనూ విపక్షాల్లో ఆ బలహీనత బయటపడిందన్నది నిష్ఠురసత్యం. అయితే, శాసన నిర్మాణంలో అధికార, విపక్షాలు సమన్వయంతో సాగితేనే ప్రజాస్వామ్య రథం సజావుగా సాగుతుంది. ఒకరిపై మరొకరు అపనమ్మకంతో, అన్నిటికీ అనుమానంతో ఉంటే అది ఎన్నటికీ ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. ఆ వాస్తవాన్ని ఇరుపక్షాలూ గౌరవించాలి. ఇప్పటికే ప్రస్తుత 17వ లోక్‌సభ చరిత్రలో మునుపెన్నడూ లేనట్టు అతి తక్కువ రోజులు సమావేశమై, అధిక భాగం వాయిదాలకే పరిమితమైన అపకీర్తిని మూటగట్టుకుంది. ఈ ప్రత్యేక సమావేశాలు అయినా అందుకు మినహాయింపు కావాలని ఆశిద్దాం. అత్యాశ అనుకున్నా అది అభిలషణీయమే. అదే జరిగితే ఇవి అక్షరాలా ‘ప్రత్యేక సమావేశాలు’గా గుర్తుండిపోతాయి. అయితే అందుకు రహస్య అజెండాలు, దాపరికాలు మాత్రం ఉపకరించవు. ఈ లోక్‌సభకు ఇవే ఆఖరి సమావేశాలు కావచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ... కనీసం ఇప్పుడైనా అధికార, విపక్షాల్లో ఉన్న పార్టీలు ఆపాటి హుందాతనం చూపుతాయా అన్నది ప్రధానమైన పశ్న. -
ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?
ఢిల్లీ: భారత్- ఇండియా పేరు మార్పు వివాదానికి దూరంగా ఉండాలని మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. జీ20తో సహా పలు అంశాలపై జరిపిన చర్చలో ప్రధాని మోదీ.. ఈ మేరకు కేంద్ర మంత్రులకు సూచనలు ఇచ్చారు. దేశం పేరు మార్పు అంశంపై ఎలాంటి కామెంట్ చేయకూడదని చెప్పారట. గత రెండు రోజులుగా పేరుమార్పుపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతుండగా.. ప్రధాని మోదీ మాట్లాడటం ఇదే మొదటిసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. జమిలీ ఎన్నికలు, ఇండియా-భారత్ పేరు మార్పు, ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగంగా ప్రతిపక్షాలు భావించాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను పేర్కొనాలని కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధానంగా తొమ్మిది అంశాలను పేర్కొంటూ వాటిపై చర్చలు జరపాలని కోరారు. దీనిపై స్పందించిన అధికార పార్టీ.. సమావేశాల ముందు అజెండాను తెలపడం సాంప్రదాయానికి విరుద్ధమని చెప్పారు. సభకు అన్ని పార్టీలకు ఆహ్వానం ఉంటుంది. ప్రజల సమస్యలను అక్కడే చర్చించుకోవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. జీ20 డిన్నర్ మీటింగ్‌కి పంపిన ఆహ్వాన ప్రకటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంతో విపక్షాలు ఒక్కసారిగా విమర్శలను ఎక్కుపెట్టాయి. సాంప్రదాయం ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటామని, దేశం పేరును మార్చబోతున్నారని ఆరోపణలు ప్రారంభం అయ్యాయి. దేశంలో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించాయి. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి -
పరస్పర సహకారంతో ప్రగతి పథంలో దూసుకెళ్దాం: మోదీ
-
ఇండియా పేరు మార్పుపై ఐరాస స్పందన
న్యూయార్క్: కేంద్ర ప్రభుత్వం.. ఇండియా అనే పేరును భారత్‌గా మారబోతోందన్న ఊహాగానాలపై విస్త్రృత స్థాయిలో చర్చ నడుస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి స్పందించింది. అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ దాకా వస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని తెలిపింది. దేశాలు తమ తమ పేర్లను మార్చుకునే క్రమంలో.. ప్రపంచ దేశాల సమాఖ్య ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తులు పంపుతుంటాయి కూడా. ఐరాస గనుక ఆ విజ్ఞప్తిని అధికారికంగా అంగీకరిస్తే.. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని కొత్త పేరుతోనే పిలుస్తుంటారు. ఇదే విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఉపప్రతినిధి ఫర్హాన్ హక్ ప్రస్తావించారు. ‘‘ చివరిసారిగా.. టర్కీ దేశం కూడా తుర్కీయేగా తమ పేరును మార్చాలని ఐరాసకు విజ్ఞప్తి పెట్టుకుంది. అలా ఇండియా కూడా అలాంటి విజ్ఞప్తి ఏదైనా చేస్తే.. తప్పక పరిశీలిస్తాం. ఇండియా మాత్రమే కాదు ఏ దేశం అలా రిక్వెస్ట్ పంపినా పరిశీలిస్తాం’’ అని తెలిపారు. కిందటి ఏడాది టర్కీ తుర్కీయేగా తమ దేశం పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో పేరు మార్పు అంశం రాజకీయదుమారానికి తెర తీసింది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ President of Bharat అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతోంది. బీజేపీ ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తోంది. అయితే.. విపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు భారత్ అనే పేరు మార్పుపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. మరోవైపు ప్రధాని మోదీ ఈ విషయంలో కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పేరు మార్పు విషయంలో వివాదాలకు దూరంగా ఉండాలని మంత్రులను కోరారాయన. -
‘సిటీ ఆఫ్ డోర్స్’ అంటే ఏమిటి? మనదేశంలోని ఆ నగరానికి ఎందుకంత ప్రత్యేకత?
మనం ఎప్పటికీ గుర్తుంచుకునే కథలు కొన్ని ఉంటాయి. అవి కాలక్రమేణా మరుగుపడుతుంటాయి. అయితే మన దేశ చరిత్రకు సంబంధించిన విషయం అయినప్పుడు దానిని తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాం. అలాంటి ఒక అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని ఆ నగరంలోకి ప్రవేశించాలంటే ఎవరైనా 52 తలుపులు దాటాలి. ఈ నగరానికున్న చరిత్ర చాలా పురాతనమైనది. ఈ నగరంలో అసాధారణ రీతిలో తలుపులు ఉన్నాయి. ఇంతకీ ఆ నగరం ఎక్కడుందో, ఆ నగరానికి సంబంధించిన విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ‘సిటీ ఆఫ్ డోర్స్’ పేరుతో ప్రసిద్ధి ఇతర నగరాల కంటే భిన్నంగా ఉన్నప్పుడు ఆ నగరానికి ప్రత్యేకమైన పేరు ఏర్పడుతుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరాన్ని ‘తలుపుల నగరం’ అని అంటారు. ఈ నగరం తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది. ఈ నగరంలోకి ప్రవేశించాలంటే 52 తలుపులు దాటుకుంటూ రావాలి. ఈ సమాచారం ఔరంగాబాద్ జిల్లా ప్రభుత్వ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ నగరంలోని తలుపులు, వాటికి సంబంధించిన కథలు ఎంతో ప్రసిద్ధిపొందాయి. 500 సంవత్సరాల చరిత్ర ఔరంగాబాద్ నగర చరిత్రను పరిశీలిస్తే ఈ నగరం 500 సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఔరంగాబాద్‌లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియాన్ని చూడవచ్చు. దీనిలో శివాజీ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు కనిపిస్తాయి. అలాగే అప్పట్లో యుద్ధంలో ఉపయోగించిన 500 ఏళ్ల క్రితంనాటి దుస్తులు కూడా కనిపిస్తాయి. మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన స్వహస్తాలతో రాసిన ఖురాన్ కాపీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ నగరం పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా భాసిల్లుతోంది ఔరంగాబాద్ మీదుగా వెళుతున్నవారు ఈ నగరాన్ని చూస్తే వినూత్న అనుభూతికి లోనవుతారు. నగరం అంతటా పురాతన తలుపులు కనిపిస్తాయి. ఇది ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది కూడా చదవండి: India vs Bharat: తెగ నవ్విస్తున్న మీమ్స్! -
‘భారత్’గా మారిన అక్షయ్ కొత్త సినిమా పేరు
ముంబై: భారతదేశం పేరును అధికారికంగా ఇండియా నుంచి భారత్‌కు మార్చాలన్న ప్రతిపాదనలు, వివాదాల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కొత్త సినిమా పేరు మారింది. ‘మిషన్ రాణీగంజ్: ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ’ పేరులోని ఇండియా పదాన్ని తొలగించి భారత్ పదాన్ని చేర్చారు. దీంతో సినిమా పేరు ‘మిషన్ రాణీగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ’గా మారింది. ఈ రోజే(గురువారం) ఈ సినిమా థియేటర్లలో విడుదలకాబోతోంది. 1989 నవంబర్‌లో పశి్చమబెంగాల్‌లోని రాణిగంజ్‌లో వరదమయమైన బొగ్గు గనిలో చిక్కుకున్న వారిని సాహసోపేతంగా రక్షించిన సహాయక బృందానికి సారథ్యం వహించిన మైనింగ్ ఇంజనీర్ దివంగత జస్వంత్ సింగ్ గిల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. -
జీ20: ఎందుకు.. ఏమిటి!
ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశాల కూటమిగా ఖ్యాతికెక్కిన జీ20 సదస్సుకు హస్తిన ముస్తాబైంది. ఈనెల 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగు తున్నాయి. జీ20కి భారత సారథ్య బాధ్యతలు త్వరలో ముగుస్తున్న తరుణంలో ఢిల్లీలో జరిగే సదస్సులో విప్లవాత్మక తీర్మానా లు జరిగే అవకాశముంది. వర్కింగ్ గ్రూప్ సెషన్స్‌లో తీసుకున్న నిర్ణయాలు, వివిధ శాఖల జీ20 మంత్రుల విడివిడి సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఈ శిఖరాగ్ర సదస్సు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో జీ20 గురించి కొన్ని విషయాలను గుర్తుచేసుకుందాం. ఈసారి ఇతివృత్తమేంటి ? వసుధైక కుటుంబం అనేది ఈ ఏడాదికి జీ20 సదస్సు ఇతివృత్తం. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే భావనను స్ఫూర్తిగా తీసుకున్నారు. మహా ఉపనిషత్తులోని సంస్కృత రచనల్లో పేర్కొన్నట్లు సూక్షజీవులు మొదలు మనుషులు, జంతుజాలం అంతా ఈ భూమిపైనే ఒకే కుటుంబం జీవిస్తూ ఉమ్మడి భవిష్యత్తుతో ముందుగు సాగుతాయనేది ‘వసుధైక కుటుంబం’ అంతరార్థం. భూమిపై మనగడ సాగిస్తున్న జీవజాలం మధ్య అంతర్గత బంధాలు, సంపూర్ణ సమన్వయ వ్యవస్థల సహాహారమే వసుధైక కుటుంబం అని చాటిచెపుతూ దీనిని జీ20 సదస్సుకు ఇతివృత్తంగా తీసుకున్నారు. లైఫ్(లైఫ్ స్టైల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్).. అంటే పర్యావరణహిత జీవన విధానాన్ని అవలంభించాలని సదస్సు ద్వారా జీ20 దేశాలు ప్రపంచానికి పిలుపునిచ్చాయి. వ్యక్తిగత స్థాయిలోనే కాదు దేశాల స్థాయిల్లో ఇదే విధానాన్ని కొనసాగించాలని జీ20 సదస్సు అభిలషిస్తోంది. ‘లైఫ్’తోనే శుద్ధ, పర్యావరణ హిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి సాధ్యమని జీ20 కూటమి భావిస్తోంది. జీ20 సారథ్య బాధ్యతలను ఎలా నిర్ణయిస్తారు? 19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమే జీ20. ప్రపంచం స్థూల వస్తూత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ20 దేశాల్లోనే ఉంది. జీ20లో అంతర్గతంగా ఐదు గ్రూప్‌లు ఉన్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి ఒక దేశం జీ20 సారథ్యం కోసం పోటీపడొచ్చు. ప్రతి సంవత్సరం రొటేషన్ పద్ధతిలో ఒక గ్రూప్‌కు సారథ్య బాధ్యతల అవకాశం దక్కుతుంది. తమ గ్రూప్ తరఫున సారథ్య అవకాశం వచ్చినపుడు ఆ గ్రూప్ నుంచి ఎవరు ప్రెసిడెన్సీకి పోటీ పడాలనేది అంతర్గతంగా ఆ దేశాలు విస్తృతంగా చర్చించుకుని నిర్ణయించుకుని ఉమ్మడి నిర్ణయం ప్రకటిస్తాయి. అలా తదుపరి సారథి ఎవరో నిర్ణయమైపోతుంది. సారథ్యం వహించే దేశం అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. జీ20 అజెండా ఖరారు, శిఖరాగ్ర సదస్సుసహా మంత్రిత్వ శాఖల స్థాయిలో విడివిడిగా జీ20 గ్రూప్ సమావేశాలను వేర్వేరు పట్టణాల్లో నిర్వహించాలి. సమావేశాల తాలూకు అన్ని రకాల నిర్వహణ ఖర్చులు, సిబ్బంది తరలింపు బాధ్యత సారథ్య దేశానిదే. శాశ్వత సచివాలయం లేని సందర్భాల్లో జీ20 సదస్సు సంబంధ వ్యవహారాలనూ అతిథ్య దేశమే చూసుకోవాలి. తొలి సదస్సు ఎక్కడ ? 2008 నాటి ఆర్థిక సంక్షోభం కారణంగా జీ20 ఉద్భవించింది. ఆనాడు యురోపియన్ యూని యన్‌కు సారథ్యం వహిస్తున్న ఫ్రాన్స్.. ప్రపంచం ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కి ఆర్థికవ్యవస్థ మళ్లీ ఉరకలెత్తాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు నిచ్చింది. అప్పటికే జీ8 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, బ్రిటన్, అమెరికాలు పరిస్థితిని చక్కదిద్దలేకపోయాయి. దీంతో మరిన్ని దేశాలతో కలిపి జీ20ని కొత్తగా ఏర్పాటుచేశారు. ‘ఫైనాన్షియల్ మార్కెట్లు– ప్రపంచ ఆర్థికవ్యవస్థ’ ఇతివృత్తంతో తొలి జీ20 సదస్సు 2008 నవంబర్‌లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఈసారి సదస్సుకు ఎవరెవరు వస్తున్నారు? అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యావరణ మార్పులను అడ్డుకుంటూ శుద్ధ ఇంథనం వైపు ప్రపంచ దేశాలను ఎలా నడిపించాలనే అంశంపై ప్రసంగించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. బహుళజాతి అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యం పెంపుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక అంశాలపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాన్ని సమీక్షించనున్నారు. చైనా తరఫున లీ కియాంగ్ ఈసారి సదస్సులో చైనా తరఫున ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ రావట్లేదు. ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నారు. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ భారత్–బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్యం లక్ష్యంగా బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. మోదీతో విడిగా భేటీ కానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఢిల్లీలోని క్లారిడ్జ్ హోటల్లో ఈయన బస చేయనున్నారు. కెనడా ప్రధాని ట్రూడో రష్యాతో యుద్ధంలో తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు ఈ అంతర్జాతీయ వేదికపై ఈయన ప్రకటన చేయనున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లోనూ పర్యటిస్తూ ఈయన భారత్‌లో జీ20లో పాల్గొననున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలూ సదస్సులో పాల్గొంటారు. రానివారెవ్వరు ? ఆహ్వానం అందని కారణంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రావట్లేదు. సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, జపాన్, ఇటలీ, జర్మనీ, ఇండోనేసియా, బ్రెజిల్, అర్జెంటీనాల అగ్రనేతలు సదస్సుకు రావట్లేదు. అతిథులు వస్తున్నారు.. అతిథి హోదాలో కొన్ని దేశాల నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. నెదర్లాండ్స్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), ఒమన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నైజీరియా ఈ జాబితాలో ఉన్నాయి. శి ఖరాగ్ర సదస్సు మొదలవగానే ఈ భేటీలో అగ్రరాజ్యాధినేతలు ఏమేం నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎలాంటి తీర్మానాలు చేస్తారు ? ఏం వాగ్దానాలు చేస్తారు? అని ప్రపంచ దేశాలు ఉత్సకతతో ఎదురుచూడటం ఖాయం. పెను వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు ఉక్రెయిన్ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి. సదస్సులో భాగంగా విచ్చేసే దేశాధినేతలు విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు, ఉమ్మడి ప్రణాళికలు చేసుకునేందుకు చక్కని అవకాశం దక్కనుంది. ఇది ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతో దోహదపడనుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘భారత్’గా పేరు మార్పు రాజ్యాంగబద్ధమే!
సాక్షి, హైదరాబాద్: దేశం పేరును ‘భారత్’గా మార్చడమనేది రాజ్యాంగబద్ధమేనని రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యా నించారు. భారత్ అనేది ఈ దేశం అసలు (ఒరిజినల్) పేరు అని స్పష్టం చేశారు. బుధవారం జవదేకర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోనూ ఇదే రాసి ఉందని దానికి లోబడే పేరు మార్పు జరుగుతోందన్నారు. శతాబ్దాలుగా ఎవరు ముందుగా దేశాలను ఆక్రమించినా వాటి పేర్లను మార్చడం జరిగిందనీ, సుదీర్ఘ చరిత్ర ఉన్న అమెరికాలోనూ ఇది చోటుచేసుకుందని చెప్పారు. ఇక్కడికి బ్రిటీషర్లు వచ్చాక తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు...కోల్‌కతా పేరును కలకత్తాగా, చెన్నైను మద్రాస్‌గా, తిరువనంతరం పేరును ట్రివేండ్రం, ముంబైను బాంబేగా మార్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు గతంలోని వలసవాద భావజాలం నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పేరు మార్పునకు, ఎన్నికలకు సంబంధం లేదు దేశం పేరుమార్పు అంశానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని జవదేకర్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో సనాతన ధర్మాన్నే కాకుండా దేశ ప్రజలను, అన్ని ధర్మాలను అవమానించిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని జవదేకర్ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కూడా ఎందుకు మౌనం వహించారో చెప్పాలని నిలదీశారు. ఈ విధంగా సనాతన ధర్మాన్ని అవమానించడం కాంగ్రెస్ పార్టీకి ఆమోదమేనా అని ప్రశ్నించారు. -
అవనిని తోడ్కొని ఆఖరి మైలు వరకు!
వసుధైక కుటుంబం! ఈ రెండు పదాల్లో యావత్ ప్రపంచాన్నీ ఏకం చేసే లోతైన తాత్త్వికత దాగి ఉంది. ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అన్నదే ఈ రెండు మాటలు బోధించే విశాల భావన. ప్రాదేశిక సరిహద్దులు, భాషలు, భావజాలాలకు అతీతంగా మనమంతా ఒకే సార్వజనీన కుటుంబంగా పురోగమించేలా మనల్ని ప్రోత్సహిస్తూ అందరినీ ప్రపంచ ప్రజానీకంతో మమేకం చేసే విశ్వ దృక్పథమిది. భారత్ జి–20 అధ్యక్షతన ఈ దృక్పథం ప్రాతిపదికగానే మానవ కేంద్రీకృత పురోగమనం అనే భావన ఒక పిలుపుగా రూపొందింది. ఒక భూమిపై నివసించేవారిగా మన గ్రహాన్ని తీర్చిదిద్దుకోవడానికి మనమంతా ఏకమౌదాం. ఒకే కుటుంబంగా... అభివృద్ధి సాధనలో పరస్పరం మద్దతిచ్చుకుందాం. సమష్టి భవిష్యత్తే ఏకైక భవిష్యత్తు అన్నది ఈ పరస్పర అనుసంధాన యుగంలో తోసిపుచ్చలేని వాస్తవం. మహమ్మారి అనంతర ప్రపంచ క్రమం అంతకు ముందున్న ప్రపంచానికి ఎంతో భిన్నమైనది. ఈ మేరకు సంభవించిన మార్పులలో ముఖ్యమైనవి మూడు ఉన్నాయి: మొదటిది, ప్రపంచ జీడీపీ కేంద్రీకృత దృక్పథం నుంచి మానవ కేంద్రీకృత దృక్పథానికి మారడం అవసరమనే అవగాహన పెరగడం. రెండవది, వస్తూత్పత్తి సరఫరా, పంపిణీల క్రమంలో ఒడిదుడుకులను తట్టుకుని కోలుకునే సామర్థ్యాన్ని, నమ్మకమైన నిలకడల ప్రాముఖ్యాన్ని ప్రపంచం గుర్తిస్తుండటం. మూడవది, అంతర్జాతీయ వ్యవస్థలలో సంస్కరణల ద్వారా బహుపాక్షికతకు ఉత్తేజమిచ్చే దిశగా సామూహిక గళం వినిపిస్తుండటం. ఈ మూడు రకాల మార్పులకు సంబంధించి జి–20కి భారత అధ్యక్షత ఉత్ప్రేరక పాత్రను పోషించింది. ఈ మేరకు ఇండోనేషియా నుంచి 2022 డిసెంబరులో మనం అధ్యక్ష బాధ్యతను స్వీకరించిన వేళ ప్రపంచ ఆలోచనా వైఖరులలో మార్పులకు జి–20 ఉత్ప్రేరకం కావాల్సి ఉంటుందని నేనొక వ్యాసంలో రాశాను. వర్ధ మాన, దక్షిణార్ధ గోళ దేశాలు సహా ఆఫ్రికా ఖండంలోని బడుగు దేశాల ఆకాంక్షలను ప్రధాన స్రవంతిలో చేర్చాల్సిన నేపథ్యంలో ఇదొక ప్రత్యేక అవసరం. ఈ మేరకు జి–20కి మన అధ్యక్షతన తొలి కార్యాచరణలో భాగంగా దక్షిణార్ధ గోళ దేశాల గళం వినిపించేందుకు నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో 125 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణార్ధ గోళ దేశాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడంలో అదొక కీలక కసరత్తు. అంతేకాకుండా మన అధ్యక్షత సమయాన ఆఫ్రికా దేశాలనుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు పాల్గొనడంతోపాటు ఆఫ్రికా సమాఖ్యకు జి–20 శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదన కూడా వచ్చింది. పరస్పర సంధానిత ప్రపంచమంటే వివిధ రంగాల్లో మన సవాళ్లు కూడా పరస్పరం ముడిపడి ఉంటాయి. ఇక 2030 గడువుతో సాధించాల్సిన లక్ష్యాలకుగాను మనమిప్పుడు మధ్య కాలంలో ఉన్నాం. అయినప్పటికీ సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్.డి.జి.) దిశగా పురోగమనం లేదన్న ఆందోళన చాలా దేశాల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎస్.డి.జి. ప్రగతిని వేగిరం చేయడంపై జి–20 కూటమి 2023 కార్యాచరణ ప్రణాళిక అన్ని దేశాలనూ భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ప్రకృతితో సామరస్యపూరిత జీవనశైలి భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్నదే. అదే సమయంలో ఈ ఆధునిక యుగంలోనూ వాతావరణ కార్యాచరణకు మన వంతు సహకారం అందిస్తున్నాం. ప్రగతికి సంబంధించి దక్షిణార్ధ గోళంలోని అనేక దేశాలు వివిధ దశలలో ఉన్నాయి. అందువల్ల వాతావరణ కార్యా చరణ కావడం తప్పనిసరి. లక్ష్యసాధన ఆకాంక్షలు నెరవేరాలంటే ఇందుకు తగినట్లు వాతావరణ నిధుల సమీకరణ, సాంకేతికత బదిలీ కూడా అవశ్యం. ‘పరిస్థితి చక్కబడాలంటే మనం ఏం చేయకూడదు?’ అనే నిర్బంధాత్మక ధోరణి నుంచి మనం పూర్తిగా బయట పడాలన్నది మన దృఢ విశ్వాసం. అలాంటి ధోరణికి భిన్నంగా వాతావరణ మార్పుల పోరాటంపై చేయాల్సింది ఏమిటనే దిశగా నిర్మాణాత్మక ఆలోచనలపై మనం దృష్టి సారించాలి. సుస్థిర, నిలకడ గల నీలి ఆర్థిక వ్యవస్థ కోసం చెన్నై ‘హెచ్ఎల్పీ’లు మన మహా సముద్రాలను ఆరోగ్య కరంగా ఉంచడంపై దృష్టి పెట్టాలి. హరిత ఉదజని ఆవిష్కరణ కేంద్రంతోపాటు పరిశుభ్ర హరిత ఉదజని కోసం అంతర్జాతీయ పర్యా వరణ వ్యవస్థ మన జి–20 అధ్యక్షత నుంచి ఆవిష్కృతమౌతుంది. 2015లో మనం అంతర్జాతీయ సౌర కూటమికి నాంది పలికాం. నేడు ప్రపంచ జీవ ఇంధన కూటమి ద్వారా, వర్తుల ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు తగినట్లు ఇంధన పరివర్తనకు శ్రీకారం చుట్టడంలో ప్రపంచానికే మనం ఆసరా అవుతున్నాం. వాతావరణ ఉద్యమానికి ఊపునివ్వడంలో వాతావరణ కార్యాచరణను ప్రజాస్వామ్యీకరించడం ఉత్తమ మార్గం. వ్యక్తులు తమ దీర్ఘకాలిక ఆరోగ్యం ప్రాతిపదికగా రోజువారీ నిర్ణయాలు తీసుకున్న రీతిలోనే మన భూమి దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం ప్రాతిపదికగా జీవనశైలిపై నిర్ణయాలు తీసు కోవచ్చు. మానవ శ్రేయస్సుకు యోగాభ్యాసం ఒక అంతర్జాతీయ ఉద్యమంగా రూపొందిన తరహాలోనే మనం కూడా ‘సుస్థిర పర్యావ రణం కోసం జీవనశైలి’(లైఫ్)తో ప్రపంచవ్యాప్తంగా కదలిక తెచ్చాం. వాతావరణ మార్పుల ప్రభావం నేపథ్యంలో ఆహారం–పౌష్టి కతల భద్రతకు హామీ ఇవ్వడం ఎంతో కీలకం. ఈ హామీతో పాటు వాతావరణ అనుకూల వ్యవసాయ వృద్ధికి చిరుధాన్యాలు లేదా ‘శ్రీ అన్న’ కూడా తోడ్పడతాయి. ప్రస్తుత అంతర్జాతీయ చిరుధాన్య సంవ త్సర నేపథ్యంలో మనం చిరుధాన్యాలను అంతర్జాతీయ ప్రజానీకం కంచాల్లోకి తీసుకెళ్లగలిగాం ఆహార భద్రత–పౌష్టికతపై దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలు కూడా ఇందుకు సాయపడతాయి. సాంకేతిక పరిజ్ఞానంలో పరివర్తన సర్వసాధారణమే. అదే సమ యంలో అది సార్వజనీనం కూడా కావాలి. లోగడ సాంకేతిక పురోగ మన ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అంద లేదు. అయితే, అసమానతల విస్తరణలోగాక తొలగింపులో సాంకే తి కత వినియోగం ఎంత ప్రయోజనకరమో కొన్నేళ్లుగా భారత్ ససా క్ష్యంగా నిరూపించింది. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగాబ్యాంకింగ్ సదుపాయం లేదా డిజిటల్ గుర్తింపు లేని కోట్లాది ప్రజలకు డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు (డి.పి.ఐ.) కల్పించడం ద్వారా ఆర్థిక సార్వజనీనతలో వారిని భాగస్వాములను చేయవచ్చు. ఈ మేరకు డి.పి.ఐ. ఆధారిత పరిష్కారాలకు నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్ధమాన దేశాలు సార్వజనీన వృద్ధి సాధనలో డి.పి.ఐ. ని స్వీకరించి, తమకు తగిన స్థాయిలో వాటిని రూపొందించుకునేలా మనం చేయూతనిస్తాం. భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం యాదృచ్ఛికమేమీ కాదు. బలహీన/అట్టడుగు వర్గాలు మన పురోగమన పయనాన్ని నడిపించగలిగేలా మనం అమలు చేసిన సరళ, అనుసరణీయ, సుస్థిర పరిష్కారాలు శక్తినిచ్చాయి. అంతరిక్షం నుంచి క్రీడారంగం వరకు; ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఔత్సాహి కత దాకా భారత మహిళలు వివిధ రంగాల్లో ముందంజ వేశారు. మహిళల నేతృత్వంలో ప్రగతికి వారు సరికొత్త అర్థం చెప్పారు. ఈ విధంగా లింగపరంగా డిజిటల్ విభజన తొలగింపు, శ్రామిక శక్తి పరంగా అంతరం తగ్గింపు సహా నాయకత్వం–నిర్ణయాత్మకతలో మహిళలు కీలక పాత్ర పోషించేలా ఇవి ప్రోత్సహిస్తున్నాయి. భారత్‌కు జి–20 అధ్యక్షత ఉన్నతస్థాయి దౌత్య కర్తవ్యం మాత్రమే కాదు; ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా, వైవిధ్యానికి నమూనాగా యావత్ ప్రపంచం మన అనుభవాలను పంచుకునేందుకు ద్వారాలు తెరిచాం. వివిధ అంశాల్లో విజయసాధన అన్నది నేడు భారతదేశ సహజ లక్షణంగా మారింది. ఇందుకు జి–20 అధ్యక్ష బాధ్యత మినహాయింపు కాబోదు. ఇప్పుడీ బాధ్యత ప్రజాచోదక ఉద్యమంగా రూపొందటమే ఇందుకు కారణం. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 60 నగరాల్లో 200కు పైగా సమావేశాలు, సదస్సులు నిర్వహించాం. వీటితోపాటు మన అధ్యక్ష బాధ్యతలు ముగిసేలోగా వీటిలో పాలుపంచుకున్న 125 దేశాలకు చెందిన 1,00,000 మందికిపైగా ప్రతినిధులకు మన ఆతిథ్యం రుచి చూపాం. ఇప్పటిదాకా ఏ దేశమూ ఇంత భౌగోళిక వైవిధ్యంతో జి–20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది లేదు. భారతదేశ జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం, ప్రగతిపై ఇతరుల నుంచి ప్రశంసలు వినడం ఒక అంశమైతే, అంతకన్నా ముందే వాటిని ప్రత్యక్షంగా అనుభవించడం పూర్తిగా భిన్నం. మన జి–20 ప్రతినిధులు దీనికి ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. మన జి–20 అధ్యక్షత ప్రధానంగా విభజన రేఖల తుడిచివేతకు, అడ్డంకుల ఛేదనకు, విభేదాలకు భిన్నంగా ప్రపంచంలో సామరస్యం దిశగా సహకార బీజాలు వేయడానికి కృషి చేస్తుంది. ‘ఎవరికివారే యమునాతీరే’ అనే పరిస్థితికన్నా ఉమ్మడి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడమే మన లక్ష్యం. ఆ దిశగా ప్రతి స్వరం వినిపించేలా, ప్రతి దేశం సహకరించేలా అంతర్జాతీయ వేదిక విస్తరణకు మనం శపథం చేశాం. తదనుగుణంగా మన కార్యాచరణ, ఫలితాలు చెట్టాపట్టాలతో సాగుతున్నాయని నేను ఘంటాపథంగా చెప్పగలను. నరేంద్ర మోదీ భారత ప్రధాని (సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జి–20 న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశం జరగనుంది.) -
జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి
హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు భారత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అలా కాకుండా తరచుగా ఎన్నికలు జరుగుతూ ఉంటే దానివలన దేశప్రగతికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును భారత్ అని మార్చడంలో కూడా తప్పులేదని అన్నారు. ప్రయోజనకరమే.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తరచుగా ఎన్నికలు జరగడం వలన ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుందని, ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఖజానాపై ఖర్చు భారం తగ్గుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్, లా కమిషన్, పార్లమెంట్ ష్టాండింగ్ కమిటీ అభిప్రాయాలు సిఫారసుల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నికల సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం మంచిదని అన్నారు. 1971 వరకు దేశంలో ఒకే ఎన్నికలు ఉండేవని తర్వాతి కాలంలో వివిధ కారణాల వలన ఈ ప్రక్రియకు తెరపడిందన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి.. ప్రజాస్వామ్యంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. కానీ చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించుకుని ముందుకు సాగాలని అన్నారు. చట్టసభ్యులు పార్టీలను ఫిరాయించడంపై ఆయన మాట్లాడుతూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలని అన్నారు. తరచూ ఎన్నికలు జరగడం వలన ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నిరనలు తీసుకోలేవని తెలిపారు. ఇక ఇండియా పేరును భారత్‌గా మార్చడంపై అందులో తప్పేమీ లేదని ఆ పేరు ఎప్పటినుంచో వాడకంలోనే ఉందని అన్నారు. ఇది కూడా చదవండి: మీరు వద్దనుకుంటే పాకిస్తాన్‌కు ఇండియా పేరు పెట్టుకుంటాం -
India vs Bharat : ఒకే దేశం, ఒకే పేరు ?
ఇండియా పేరు శాశ్వతంగా భారత్‌గా మార్చనున్నారా ? నిజానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇప్పటికే ఇండియా దటీజ్ భారత్ అని రాసి ఉంది. ఇండియా అంటే భారత్ అని అర్థం. ఇండియా, భారత్ రెండు పేర్ల బదులుగా ఒకే పేరు తీసుకువచ్చే ఆలోచనలో మోదీ ప్రభుత్వం కనిపిస్తోంది. వలసవాద గుర్తులను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో పిలుపునిస్తూ వస్తున్నారు. మరుగున పడిఉన్న దేశ సంస్కృతిని మళ్లీ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెపుతున్నారు. అదే క్రమంలో 75 ఏళ్లుగా ఇండియాగా పిలవబడుతున్న దేశానికి ఒకే పేరు శాశ్వతంగా ఉండేలా అడుగులు వేస్తున్నారు. జి–20 సదస్సుకు తరలివస్తున్న ప్రపంచదేశాధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందుకు ఇన్విటేషన్ పంపారు. ఈ ఇన్విటేషన్ ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగరాల పేర్లనుంచి ...దేశం పేరు మార్పు వరకు నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక నగరాల పేర్లను మార్చారు. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్ గా, గుర్గావ్ను గురుగ్రామ్ గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చారు. త్వరలోనే లక్నో పేరును కూడా లక్ష్మణ నగరిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఈ నగరాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతుండగానే, దేశం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. వలసవాద చిహ్నలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఇండియా పేరుకు చరమగీతం పాడాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి బిజెపి, సంఘ్ పరివార్నుంచి వస్తోంది. వేద కాలం నుంచే ఈ ప్రాంతానికి భారత్ పేరు.. భారత్‌పేరు రుగ్వేద కాలం నుంచి వస్తోంది. వేద తెగ భరతుల పేరు నుంచి భారత్ అనే పేరు ఉద్భవించిందని చెపుతుంటారు. రుగ్వేదంలోని ఆర్యవర్తన తెగలవారని కూడా చరిత్ర చెపుతోంది. మహాభారత కాలంలోని శకుంతల–దుష్యంతుడు కుమారుడి పేరు కూడా భరతుడే. అలాగే భరతుడు పాలించిన ప్రాంతాన్ని భరత దేశంగా పిలుస్తుండేవారు. ఇలా ప్రాచీన కాలం నుంచి ఈ ప్రాంతానికి భారత్ అనే పేరు కొనసాగుతూ వస్తోంది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలోని హతిగుంఫా శాసనంలో కూడా భారత్ ప్రస్తావన ఉంది. దీని ప్రకారం అయితే గంగా, మగద కు పశ్చిమాన ఉన్నభాగాన్నే భారత్ గా శాసనాలో ఉంది. దక్షిణభారతం, దక్కన్ పీఠభూమి దీని నుంచి మినహాయించారు. గ్రీకుల కాలంలో ఇండియా పేరు ఇక ఇండియా పేరు గ్రీకుల కాలం నుంచి కొనసాగింది. సింధు నదిని ఇంగ్లీష్‌లో ఇండస్ రివర్‌గా పిలుస్తుంటారు. ఇండస్ రివర్‌కు అవతల ఉండేవారిని ఇండియా అని, ఇండియాన్స్ అనే పిలవడం మొదలుపెట్టారు. 17వ శతాబ్దంలోకి ఇది బాగా వాడుకలోకి వచ్చింది. లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనా ప్రభావంతో ఇండియా అనే పేరు స్థిరపడింది. ఇండియా పేరు ఎలా మారుస్తారంటే? రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ఉపయోగించి ఏవైనా సవరణలు చేయడానికి పూర్తి వెసులుబాటు ఉంది. స్వయంగా రాజ్యాంగ సభ ఈ అవకాశం కల్పించింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం ఉంది. అయితే రాజ్యాంగంలో చేసే మార్పులకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1కి సవరణ ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుగానీ, తీర్మానం గానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్టికల్ 1 ప్రకారం ఈ ప్రాంతాన్ని ఇండియా, భారత్‌గా పిలుచుకునే అధికారం ఉంది. ఇండియా పేరును పూర్తిగా తొలగించి కేవలం భారత్ ఉండేలా బిల్లు పెట్టే అవకాశముంది. నాగిళ్ల వెంకటేష్, సాక్షిటీవీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ -
మీరు వద్దనుకుంటే పాకిస్తాన్‌కు ఇండియా పేరు పెట్టుకుంటాం
న్యూఢిల్లీ: రెండురోజులుగా ఇండియా పేరుని భారత్‌గా మార్చే విషయమై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంటే సోషల్ మీడియాలో మరో వార్త దావానలంలా వ్యాపించింది. ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో అధికారికంగా వదులుకుంటే పాకిస్తాన్ ఆ పేరుని చేజిక్కించుకోవాలని అనుకుంటోందట. ఇదిలా ఉండగా దేశం పేరు మార్పుపై కేంద్రం నుంచైతే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆహ్వానంతో మొదలైంది.. భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి భావం నుంచి అతిధులకు చేరిన ప్రత్యేక డిన్నర్ ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది కేంద్రం. ఈ నేపథ్యంలో సౌత్ ఏషియా ఇండెక్స్ అనే ఒక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి ప్రత్యక్షమైంది. మాకే హక్కుంది.. ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో మార్చుకుని భారత్ అని నామకరణం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తే పాకిస్తాన్ దేశం తమ దేశానికి ఇండియా అని పేరు పెట్టుకోవచ్చని స్థానిక మీడియా తెలిపినట్లు రాశారు. చాలాకాలంగా పాకిస్తాన్ జాతీయవాదులు ఇండియా అనేది సింధు ప్రాంతాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ పేరు మీద తమకే ఎక్కువ హక్కులు ఉన్నాయని చెబుతూ వస్తోంది. అక్కడ ఊరే లేదు.. ఇక ఈ పోస్టుపై సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా పేరు పెట్టుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పేరు పెట్టుకుంటుంది. అపుడు రష్యా ఆఫ్ఘనిస్తాన్ పేరును పెట్టుకోవచ్చంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారొక యూజర్. మరో వ్యక్తి అయితే పెరు మారినా పాకిస్తాన్ తలరాత మాత్రం మారదులే అని రాశారు. ఇక భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఈ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. అక్కడ గ్రామమే లేదు అంతలోనే దాన్ని దోచుకోవడానికి దొంగలు తయారయ్యారని రాశారు. Just IN:— Pakistan may lay claim on name "India" if India derecongnises it officially at UN level. - local media — Nationalists in Pakistan have long argued that Pakistan has rights on the name as it refers to Indus region in 🇵🇰. — South Asia Index (@SouthAsiaIndex) September 5, 2023 Gaaon basa nahin aur …. https://t.co/g5Zfe4GUHV — Virender Sehwag (@virendersehwag) September 5, 2023 ఇది కూడా చదవండి: అమెరికాలో అసలేం జరుగుతుంది?బాంబుల్లా పేలుతున్న పుచ్చకాయలు -
ఒక దేశం రెండు పేర్లు.."భారత్" అనే పేరు ఎలా వచ్చిందంటే..
జీ20 డిన్నర్లో "ప్రెసిడెంట్ ఆఫ్ భారత్" అన్న పదం రేపిని చిచ్చు మామాలుగా లేదు. అటు రాజకీయ పరంగా ప్రతిపక్షాల మధ్య, సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోనూ ఈ అంశం ఓ చర్చనీయాంశంగా మారింది. మన రాజ్యాంగం సైతం ఇండియా అంటే భారత్ అని అర్థం. అని చెబుతున్నా.. ఎందుకిలా చాలమంది ఇండియా అనే పేరు వద్దనుకుంటున్నారు. భారతదేశం అనే పదాన్నీ తమ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసేదిగా 'గర్వంగా ఫీల్వడానికి కారణం ఏంటీ? అసలు భారతదేశాని ఆ పేరు ఎలా వచ్చింది? మన పురాణాల్లో ముఖ్యంగా మన ఋగ్వేదం ఏం చెబుతుంది తదితరాల గురించే ఈ కథనం. భారతదేశం అంటేనే వివిధ మతాల, సంస్కృతుల, ఆచారాల వారసత్వ కలయిక. ఒకరకంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతికగా చెబుతుంటారు చరిత్రకారులు. వైవిధ్యాన్ని స్వీకరించే మహోన్నత దేశంగా కీర్తిస్తారు. ప్రాచీన కాలంలో మన దేశాన్ని సంస్కృతంలో "భారత్" లేదా "భరతఖండం" అని పిలిచేవారు. దీని గురించి మన చరిత్రకారులు వివరించి విభిన్న కథలు భారతదేశానికి భారత్ అనే పేరు ఎలా వచ్చిందో సవివరంగా చెబుతున్నాయి. అవేంటో చూద్దాం!. ఋగ్వేదం ప్రకారం... ఋగ్వేదం భారత్‌ని ఏడు నదుల భూమిగా పేర్కొంది. ఋగ్వేదం 18వ శ్లోకం దశరాజ్ఞ లేదా పదిమంది రాజుల భయంకరమైన యుద్ధం కారణంగా "భారతదేశం" అనే పేరు వచ్చిందని చెబుతోంది. ఇంతకీ ఏంటా పదిమంది రాజుల యుద్ధం అంటే..తృత్స రాజవంశంలో భరత తెగకు చెందిన సుదాసు రాజుని పడగొట్టాలని సుమారు పదిమంది రాజులు పన్నాగం పన్నారు. ఫలితంగా పంజాబ్‌లోని రావి నదిపై సుదాసు, ఆ పదిమంది రాజుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుదాసు రాజు విజయకేతనం ఎగురవేయడంతో .. సుదాసు రాజుకి అమితమైన ప్రజాధరణ లభించింది. ఇదే చివరికి ప్రజలు తమను తాము భరత తెగకు చెందినవారిగా గొప్పగా చెప్పుకునేలా చేసింది. "భరత" అనే పేరు ప్రజల్లో నోళ్లలో స్థిరంగా నిలిచిపోయింది. చివరికి భరత వర్ష అనే పేరుగా మారింది. అనగా..భరతభూమి అని అర్థం. మహాభారతం ప్రకారం.. మహాభారతం ప్రకారం, భరత చక్రవర్తి అనే రాజు పేరు మీద భారతదేశాన్ని భరతవర్ష అని పిలుస్తారని అని మరో కథనం ఉంది. భరత రాజ వంశ స్థాపకుడు అయిన భరతుడు పాండవులు, కౌరవుల పూర్వీకుడు. హస్తినాపుర రాజు దుష్యంతుడు, శకుంతల కుమారుడు కూడా. భరతడు భారతదేశం మొత్తాన్ని జయించాడని అందువల్లే అతని పేరు మీదగా భరతవర్ష లేదా భరత భూమి అని పిలుస్తారని చెబుతారు. అలాగే విష్షుపురాణం ప్రకారం..భరతడుకి రాజ్యాన్ని అప్పగించి అతడి తండ్రి సన్యాసించేందుకు అడువులకు వెళ్లాడని అప్పటిని నుంచే భరతవర్ష అని పిలుస్తారని కూడా అంటారు. భారతదేశం అని ఎలా వచ్చిందో వివరించే పద్యం.. ఉత్తరం యత్సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణాం వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః ॥ ఈ పద్యం భావం చూస్తే..ఉత్తరంగా సముద్రం, దక్షిణంగా హిమాలయాలు ఉన్న భూమిని భరత భూమి అని అక్కడ నివశించేవారు భరతడు వారసులని అర్థం. దీన్ని పరిశీలిస్తే భారతదేశం అనే పేరు ప్రాచీన గ్రంథాల నుంచి ఉద్భవించిందని క్లియర్‌గా తెలుస్తోంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పూర్వం భారత సామ్రాజ్యం అంటే ప్రసుత పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తుర్క్మెనిస్తాన్, నార్త్-వెస్ట్ టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్‌లు కలిగి ఉన్న దేశం అని అర్థమట. ఇక భరత అనే పదం సంస్కృత పదం. దీని అర్థం అగ్ని. భర అనగా మోసుకెళ్లడం లేదా జ్ఞాన కోసం నిమగ్నమైన వ్యక్తి అని అర్థం అంటే.. జ్ఞానాన్ని సముపార్జించే వాళ్లు అని అర్థం. జైన కథనం ప్రకారం.. మొదటి జైన తీర్థంకరడు పెద్ద కుమారుడు భరత చక్రవర్తి పేరు మీదగా భారతదేశం అని పిలుస్తారని మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. జైనమతం భారత దేశ నాగరికతకు మూలంగా కూడా చెబుతారు చరిత్రకారులు. భారతదేశానికి వివిధ పేర్లు వచ్చిన తీరు.. ఇక సింధు అనే సంస్కృత పదాన్ని ఆంగ్లంలో ఇండస్‌గా వ్యవహరించారు. సింధు పరివాహక ప్రాంతంలో నివశించేవారు కాబట్టి భారతీయులను ఇండియన్స్‌గా పిలవడం ప్రారంభించారు. అలా ఇండియా అని ఏర్పడింది. అలాగే వలసపాలకులు బ్రిటీష్ వారికి ఇలా పిలవడం సులభంగా అనిపించడంతో ఇండియా అనిపేరు స్థిరపడిందని అంటారు. ఇక పర్షియన్ పదం హిందూస్తాన్ అనే పేరుతో కూడా భారతదేశాన్ని పిలిచేవారు. దీని అర్థం హిందువుల భూమి, హైందవ దేశం అని అర్థం. మన దేశం అన్ని మతాలను గౌరవిస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరుగా ఓ గొప్ప మహోన్నత దేశంగా అలరారుతోంది. (చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!) -
దేశాన్ని మాతృ భాషలో పిలవడం మంచిదే: మంత్రి రోజా
-
ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్
పాట్నా: సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు నేపథ్యంలో రాష్ట్రపతి భావం నుంచి అందిన డిన్నర్ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి ప్రతిపక్షాలు. కానీ చాలా సంవత్సరాల క్రితమే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇండియా, భారత్ మధ్య వ్యత్యాసమేమిటో చెప్పారు. ఇండియాను భారత్‌గా మారుస్తూ కేంద్రం చేస్తోన్న ప్రయత్నాన్ని ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో విభేదిస్తోంది. కానీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలం క్రితమే ఇండియా భారత్ మధ్య తేడా ఏమిటో వివరిస్తూ.. ఒక రకంగా ఇండియా కంటే 'భారత్' మేలని అన్నారు. ఒక మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇండియా భారత్ వివాదం తాజాగా రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేయడంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ వేపపుల్లతో పండ్లు తోముకుంటూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధి 'ఢిల్లీలో వేపపుల్లలు దొరుకుతాయా? అనడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఢిల్లీ ఇండియాలో భాగమని.. ఇండియాలో వేప పుల్లలు దొరకవు.. కానీ బీహార్ భారత్ కిందకు వస్తుందని భారత్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ అన్నీ దొరుకుతాయని అన్నారు. INDIA और भारत में अंतर लालू यादव मोदी जी के फूल सपोर्ट में pic.twitter.com/YPnVNKuGJ7 — Raja Babu (@GaurangBhardwa1) September 6, 2023 ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటే తప్పేంటి? సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు సరికావన్నారు తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్ని ధర్మాలను సంరక్షించాలి కానీ అవమానించకూడదన్నారు. ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, ఖర్గేలు స్పందించాలన్నారు. భారత్ పేరుపై అంత రాద్దాంత ఎందుకు? అని ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటే వచ్చిన నష్టం ఏంటి అని, ఎప్పట్నుంచో భారత్ మాతాకీ జై అంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ కొత్త భవనంలోనే ప్రత్యేక సమావేశాలు -
ఇండియా పేరు మార్చాలన్న సెహ్వాగ్.. ఏం ఉపయోగమంటూ హీరో కౌంటర్
ఇండియా.. భారత్‌గా మారబోతుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే త్వరలోనే అది నిజం కానున్నట్లు కనిపిస్తోంది. అయితే చాలామంది పేరు మార్పును సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేరు మార్పును సమర్థించే లిస్ట్‌లో ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ముందు వరుసలో ఉన్నారు. భారత్‌గా పేరు మార్చాలి 'మనకు గర్వకారణంగా అనిపించే పేరు ఒకటి ఉండాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మనమంతా భారతీయులం. ఇండియా అనే పేరు బ్రిటీష్ వాళ్లు ఇచ్చారు. దాన్ని త్యజించాల్సిన సమయం వచ్చింది. మన దేశానికి భారత్ అనే పేరును ఖరారు చేయాలి. అలాగే వరల్డ్ కప్‌లో ఆడే క్రికెటర్ల షర్ట్‌లపై కూడా ఇండియాకు బదులు భారత్ అన్న పేరు ఉండేలా చర్యలు తీసుకోవలి' అంటూ బీసీసీఐని కోరారు. ఈ ట్వీట్‌కు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కౌంటరిచ్చాడు. 'సర్.. మీకు ఇన్నేళ్లుగా ఇండియా అనే పదం గర్వంగా అనిపించలేదా?' అని ప్రశ్నించాడు. దేనికి ఉపయోగం? మరో ట్వీట్లో షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. 'అసలు ఈ పేరు మార్పు దేనికి? మన దేశ ఉన్నతికి, ఆర్థిక వ్యవస్థకు ఇది ఏమేరకు ఉపయోగపడుతుంది? ఈ మధ్యకాలంలో నేను చూసిన వింతవార్త ఇదే.. ఇండియా అంటే భారత్.. మన దేశాన్ని ఇండియా, భారత్‌గా.. ఇలా రెండు పేర్లతో పిల్చుకుంటూ వచ్చాం.. కానీ ఉన్నట్లుండి భారత్ అనే పదాన్ని ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారు?' అని ప్రశ్నించాడు. నీ గట్స్‌కు హ్యాట్సాఫ్ కేరళను కేరళంగా మార్చితే లేనిది.. ఇండియాను భారత్‌గా మార్చితే మాత్రం తప్పవుతుందా? అని నిలదీస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరేమో.. ప్రతిపక్షం ఇండియా అనే కూటమిగా ఏర్పడింది కాబట్టే ప్రభుత్వం తట్టుకోలేక భారత్ అని పేరు మారుస్తోందంటున్నారు. ఏదేమైనా ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా గళం వినిపించావంటే నువ్వు గ్రేట్ అని కొనియాడుతున్నారు అభిమానులు. Thinking deep from this shoot location… Wat ?????? name change ???? But why????? How does this help our country’s progress and its economy? This is the strangest news ive come accross in recent times… India was always bharat… We always knew our country as INDIA AND… pic.twitter.com/4X6Y8XbrL6 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) September 5, 2023 Sir with due respect… The name INDIA didn instill pride in you all these years?? https://t.co/ibm68uZ7e8 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) September 5, 2023 చదవండి: అడల్ట్ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్ -
‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్’ తెగ నవ్విస్తున్న మీమ్స్!
త్వరలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక సమావేశంలో ఇండియా పేరును పూర్తిగా తొలగిస్తూ, దేశానికి ‘భారత్’ పేరు స్ధిరపరిచే ప్రస్తావన రానున్నదని అంటున్నారు. opposition named their alliance I.N.D.I.A government changes India's name to Bharat Opposition : pic.twitter.com/cTaigawSaF — coincasm | Meme Creator (@coincasmin) September 5, 2023 ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున రాష్ట్రపతి భవనం అధికారులు జీ-20 సమావేశాలకు దేశంలోని నేతలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని ఉండే చోటున ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉంది. #Bharat The names are like BIM, ABIMS,BIT,NBT pic.twitter.com/C4ioOR0sTk — Ashish (2nd edition) (@brb_memes17) September 5, 2023 దీనిని చూస్తుంటే దేశానికి ‘భారత్’ పేరును ఖాయం చేయనున్నారని వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో #Bharat ట్రెండ్ నడుస్తోంది. దీనిలో నెటిజన్లు వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. Opposition names their alliance I.N.D.I.A Government proposes to change India's name to Bharat Opposition : pic.twitter.com/YsT9OCUrLo — SwatKat💃 (@swatic12) September 5, 2023 -
ఆర్యవర్త, భరతవర్ష, ఇండియా.. ఈ పేర్లు ఎలా వచ్చాయి? ‘సిం’ని ‘హిం’ అని ఎవరన్నారు?
మన దేశాన్ని ఇండియా అని పిలవాలా లేక భారతదేశం అనాలా అనే విషయంపై అటు రాజకీయ పార్టీల మధ్య, ఇటు ప్రజల మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మన రాజ్యాంగంలో ‘ఇండియా దట్ ఈజ్ భారత్’ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, వివిధ క్రీడలు, ప్రపంచ వేదికలపై ఇండియా అనే పేరు ప్రబలంగా ఉంది. అయితే మన దేశాన్ని వివిధ కాలాల్లో పలు పేర్లతో సంబోధించేవారనే విషయం మీకు తెలుసా? వీటిలో జంబూద్వీపం, ఆర్యవర్త, భరతవర్ష, హింద్, హిందుస్థాన్ మొదలైనవి అత్యంత ప్రాచుర్యం పొందిన పేర్లు. ఈ పేర్లు ఎప్పుడు వచ్చాయి? ఈ పేర్ల వెనుక ఉన్న అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్యవర్త ఆర్యులు మన దేశాన్ని స్థాపించారని చెబుతారు. ఆర్య అంటే ఉత్తమమైనది. ఈ ప్రాంతంలో ఆర్యుల నివాసం ఏర్పరుచుకున్న కారణంగా మన దేశానికి ఆర్యవర్త అని పేరు వచ్చింది. ఆర్యవర్త సరిహద్దులు కాబూల్‌లోని కుంభా నది నుండి భారతదేశంలోని గంగా నది వరకు, అలానే కశ్మీర్ మైదానాల నుండి నర్మదా నది ఆవలి వైపు వరకు విస్తరించి ఉన్నాయి. ఆర్యుల నివాసానికి సంబంధించి పలువురు చరిత్రకారులలో ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జంబూద్వీపం మన దేశాన్ని పూర్వకాలంలో జంబూద్వీపం అని కూడా పిలిచేవారు. భారతదేశంలో జామున్(నేరేడు) చెట్లు అధికంగా ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని చాలా మంది చరిత్రకారులు భావిస్తున్నారు. అదేవిధంగా జంబూ చెట్టు.. ఏనుగంత పరిమాణంలో భారీ ఫలాలను ఇస్తుందనే నమ్మకాలు ఉన్నాయి. ఈ పండ్లు పర్వతం మీద పడినప్పుడు వాటి రసం నుండి నది ఏర్పడిందని చెబుతారు. ఈ నది ఒడ్డున ఉన్న భూమిని జంబూద్వీపం అని పిలవసాగారు. భరతవర్ష మన భూభాగం పేరు ఎంతో ప్రజాదరణ పొందింది. మహారాజు దుష్యంతుడు, శకుంతల దంపతుల కుమారుడైన భరతుని పేరు మీదుగా దేశానికి భారత్ అనే పేరు వచ్చిందని చెబుతారు. అదేవిధంగా గురువు రిషభదేవుడు తన రాజ్యాన్ని తన కొడుకు భరతునికి అప్పగించాడని, అందుకే మన దేశానికి భరతవర్ష అని పేరు వచ్చిందని అంటారు. దశరథుని కుమారుడు, శ్రీరాముని సోదరుడు భరతుని ప్రస్తావన కూడా ఇదేవిధంగా కనిపిస్తుంది. అలాగే నాట్యశాస్త్రంలో కూడా భరతముని ప్రస్తావన ఉంది. దేశానికి ఆయన పేరు పెట్టారని కూడా అంటారు. పురాణాలలో కూడా భారతదేశ సరిహద్దులు సముద్రానికి ఉత్తరం నుండి హిమాలయాల దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. హిందుస్థాన్ పురాతన కాలంలో భారతదేశంలోని సింధు లోయ నాగరికత ఇరాన్, ఈజిప్ట్‌తో వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉంది. ఇరానియన్లో ‘సిం’ని ‘హిం’ అని సంబోధించారట. ఫలితంగా సింధు కాస్తా హిందూగా మారిందని అంటారు. తరువాతి కాలంలో ఈ భూమి హింద్ పేరుతో ప్రసిద్ధి చెంది, చివరికి హిందువులుంటున్న ప్రదేశం కనుక హిందుస్థాన్ అయ్యిందని చెబుతారు. భారతదేశం మన దేశానికి ఈ పేరు బ్రిటిష్ వారు పెట్టారని అంటారు. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు సింధు లోయను తొలుత ఇండస్ వ్యాలీ అని పిలిచేవారు. దీనితో పాటు భారత్ లేదా హిందుస్థాన్ అనే పదానికి బదులుగా ఇండియా అనే పదాన్ని ఉపయోగించసాగారు. అది వారికి పలికేందుకు చాలా సులభంగా అనిపించిందట. చాలామంది ఇండియా అనేది బ్రిటిష్ యుగానికి చిహ్నమని, అందుకే ఈ పేరులో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తుంటారు. ఇది కూడా చదవండి: దేశంలో అతిపెద్ద జిల్లా ఏది? -
మరో వివాదం.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు
ఢిల్లీ: జీ-20 డిన్నర్ మీటింగ్ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పేర్కొనడం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ప్రధాని మోదీని కూడా 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని పేర్కొన్నారు. ఏసియన్-ఇండియా సమ్మిట్, 'ఈస్ట్ ఏసియా సమ్మిట్' లకు ప్రధాని మోదీ బుధవారం, గురువారం వరుసగా హాజరుకావాల్సి ఉండగా.. ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో భారత ప్రధానిని 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని పేర్కొనడంతో పేరు మార్పు వివాదం మరింత ముదిరింది. 20వ 'ఏసియన్-ఇండియా సమ్మిట్', 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా' రెండు పదాలను ఒకే ప్రకటనలో విడుదల చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతటి గందరగోళంలో ఉందో ఈ విషయంతో స్పష్టమవుతోందని వెల్లడించింది. ఇండియా పేరుతో ప్రతిపక్షాలు ఏకమవ్వడంతోనే బీజేపీ నాయకులు ఈ డ్రామా క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. ‘The Prime Minister Of Bharat’ pic.twitter.com/lHozUHSoC4 — Sambit Patra (@sambitswaraj) September 5, 2023 అయితే.. జీ-20 డిన్నర్ మీటింగ్‌కి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి అధికారిక ఆహ్వానాన్ని పంపారు అధికారులు. ఇందులో సాంప్రదాయంగా ఉపయోగించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులు ప్రిసెడెంట్ ఆఫ్ భారత్ అని సంభోదించారు. దీంతో ఇండియా పేరును రానున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్లో భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వచ్చాయి. బీజేపీని ఓడించడానికి దేశంలో ప్రధానంగా 28 ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. విపక్ష కూటమి పేరు ఇండియా ఉండటం బీజేపీకి నచ్చనందునే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అటు.. తమ కూటమి పేరును త్వరలో భారత్‌గా నామకరణం చేస్తామని కూడా పలువురు నాయకులు చెప్పారు. Look at how confused the Modi government is! The Prime Minister of Bharat at the 20th ASEAN-India summit. All this drama just because the Opposition got together and called itself INDIA 🤦🏾♂️ pic.twitter.com/AbT1Ax8wrO — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 దేశం పేరును భారత్‌గా పిలవడం స్వాగతిస్తున్నామని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇది దేశానికి గర్వకారణం అని అన్నారు. అటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు -
దేశం పేరు మార్పుపై అమితాబ్ ఆసక్తికర ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా సంబోధిస్తూ ముద్రించిన ఆహ్వాన పత్రికలను జీ20 దేశాల అధినేతలకు రాష్ట్రపతి భవన్ పంపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన పేరు మార్పు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ నటుడు, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘భారత్ మాతాకీ జై’అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీనికి భారత దేశ జాతీయ పతాకం మువ్వన్నెల జెండాను జత చేశారు. అమితాబ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అబితాబ్‌కి మద్దతుగా ట్వీట్ చేస్తే.. మరికొంతమంది వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారు. ‘జయా జీ అంటే మీకు భయం లేదా?’ అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. (చదవండి: ప్రభాస్‌తో ఎప్పటికీ అలానే ఉంటాను: అనుష్క) ఇక అమితాబ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కీ 2898’చిత్రంలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా దిపికా పదుకొణె నటిస్తోంది. T 4759 - 🇮🇳 भारत माता की जय 🚩 — Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023 -
తెరపైకి భారత్..!
న్యూఢిల్లీ: భారతదేశం, హిందుస్తాన్, ఇండియా.. ఇవన్నీ ఒకే దేశం పేర్లు. భారతదేశం ప్రపంచ దేశాలకు ‘ఇండియా’గానే తెలుసు. అధికారికంగా అమల్లో ఉన్న పేర్లలో ‘ఇండియా’కూడా ఒకటి. అయితే, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా సంబోధిస్తూ ముద్రించిన ఆహ్వాన పత్రికలను ఆమె తరఫున జీ20 దేశాల అధినేతలకు రాష్ట్రపతి భవన్ పంపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దేశం పేరును మార్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జీ20 శిఖరాగ్ర సదస్సు వేదిక అయిన ‘భారత్ మండపం’లో ఈ నెల 9న రాత్రి జరిగే విందుకు హాజరు కావాలని కోరుతూ ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’తరఫున రాష్ట్రపతి భవన్ ఆహ్వానాలు పంపించింది. ఈ ఆహ్వాన పత్రికను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘జనగణమన అధినాయక జయహే, భారత భాగ్య విధాత’అనే వ్యాఖ్యను సైతం జోడించారు. జయహో అంటూ ముక్తాయించారు. ఈ పత్రిక సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశం పేరును ‘భారత్’గా మార్చడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 18 నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్లు ప్రచారం మొదలైంది. తమ కూటమి పేరు ‘ఇండియా’ను చూసి మోదీ సర్కారు భయపడుతోందని, అందుకే దేశం పేరును మార్చేసే కుతంత్రానికి పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. భారత్ అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, అదే పేరును ఉపయోగిస్తే తప్పేమిటని అధికార బీజేపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు: శరద్ పవార్ మనకు ఇండియా అంటే భారత్, ప్రపంచదేశాలకు మన దేశం కేవలం ఇండియాగానే తెలుసని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ పేర్కొన్నాను. కేవలం భారత్ అనే పేరును వాడాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు ఏమొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీయేతర పార్టీల కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం బీజేపీకి మింగుడు పడడం లేదని, అందుకే దేశం పేరును భారత్ మార్చాలని కోరుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆక్షేపించారు. ఇండియాను మార్చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ తొమ్మిదేళ్ల తర్వాత చేస్తున్నది కేవలం పేరు మార్చడమేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ‘ఇండియా’ఓడిస్తుందన్నారు. ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి తమ పేరును ‘భారత్’గా మార్చుకుంటే, ఆ పేరును కూడా బీజేపీ మార్చేస్తుందా? ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ప్రశ్నించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తేల్చిచెప్పారు. ‘‘భారత్.. అంటే ఇండియా. రాష్ట్రాల సమాహారమే ఇండియా అని రాజ్యాగంలోని ఆర్టికల్ 1 చెబుతోంది. అలాంటి రాష్ట్రాల సమాహారంపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోంది. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, న్యూ ఇండియా అనే పేర్లను బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇండియా షైనింగ్ అంటూ గతంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరిస్తున్నారు. దేశాన్ని విభజిస్తున్నారు. దేశం పేరును మార్చాలనుకుంటే కచ్చితంగా అడ్డుకుంటాం’’కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ హెచ్చరించారు. ‘ఇండియా’పేరుకు లెక్కగట్టలేనంత బ్రాండ్ విలువ ఉందని, దేశం పేరును మార్చే పిచ్చి పనిని బీజేపీ చేయదని తాను భావిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. భారత్ కాకుండా ఇంకెలా పిలవాలి?: రాజీవ్ చంద్రశేఖర్ మన దేశం పేరు భారత్ అయినప్పుడు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’అని పేర్కొంటే తప్పేమిటని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిలదీశారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. భారత్‌ను భారత్ అని కాకుండా ఇంకేలా పిలవాలని ప్రశ్నించారు. ప్రాచీన కాలం నుంచి భారత్ అనే పేరు వాడుకలో ఉందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గుర్తుచేశారు. భారతమాత, వందేమాతరం మన రక్తంలోనే ఉన్నాయని చెప్పారు. భారత్ అనే పేరును తుడిచిపెట్టేయడానికి కొత్త ఖిల్జీలు, కొత్త మొఘల్ రాజులు పుట్టుకొచ్చారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. మన దేశం ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉద్ఘాటించారు. మన నాగరికత అమృతకాలం వైపు సాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ‘భారత్’ను ఓడించడానికే ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’అనే పేరు పెట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి భారత్ అంటే నచ్చదని చెప్పారు. -
'భారత్' అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారతదేశం ఆతిధ్యమిస్తున్న ప్రతిష్టాత్మక జీ20 సదస్సు ప్రారంభానికి ప్రధాని మోదీ ఒక డిజిటల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు జీ20లో భాగస్వాములు కానీ దేశాల ప్రయోజనాల కోసం సైతం భారతదేశం తాపత్రయ పడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలతో పాటు జీ20లో భాగస్వాములు కాని వెనబడిన ఆఫ్రికా దేశాల ప్రయోజనాలను కూడా భారతదేశం ముందుకు తీసుకు వెళ్తుందని అన్నారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల కారణంగా ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో జీ20 సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని వినిపించడానికి భారత్, ఇండోనేషియా, భారత్, బ్రెజిల్ త్రయం సిద్ధమైందని అన్నారు. ఈ జీ20 త్రయం గతేడాది సమావేశాలకు ఆతిధ్యమిచ్చిన ఇండోనేషియా, ఇప్పుడు ఆతిధ్యమిస్తున్న భారత్ వచ్చే ఏడాది ఆతిధ్యమివ్వనున్న బ్రెజిల్ దేశాలను సూచిస్తుందన్నారు. మా తొమ్మిదేళ్లుగా పాలనలో ‘సబ్కా సాథ్' 'సబ్కా వికాస్' 'సబ్కా విశ్వాస్' 'సబ్కా ప్రయాస్’ విధానాలను అనుసరించాము. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా అమలు చేయాలనుకుంటున్నామన్నారు. మేము జీ20 కోసం ఇదే మా ఎజెండా అని తెలిపినప్పుడు ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయన్నారు ప్రధాన మంత్రి. జీ20 సమాఖ్యలో ఆఫ్రికా దేశాల సభ్యత్వం విషయంలో ప్రధాని మోదీ ఎంతో చొరవ చూపించారు. ఆఫ్రికా దేశాలకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కోరుతూ ఆయన జీ20 నాయకులకు లేఖ కూడా రాశారు. జులైలో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ముసాయిదా ప్రకటనలో ఈ ప్రతిపాదనను కూడా చేర్చారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో జరిగే సమావేశాల్లో దీనిపై తుదినిర్ణయం వెలువడే అవకాశముంది. మొత్తం 19 దేశాలు పాల్గొనే జీ20 సమావేశాల్లో ప్రధానంగా వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితుల్లో ఆయా దేశాలకు రుణ సహాయం, క్రిప్టోకరెన్సీ నియమాలు, బ్యాంకు సంస్కరణలతోపాటు నల్ల సముద్రం గుండా ఉక్రెయిన్‌కు బియ్యం ఎగుమతి.. తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇది కూడా చదవండి: ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలి -
‘భారత్’గా మారనున్న ఇండియా?.. ఆ హక్కు ఎవరికీ లేదు: శరద్ పవార్
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు జరగనున్న తరుణంలో.. ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చనున్నారనే అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. సదస్సులో పాల్గొనే అతిథులు, ఇతర ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందుకు పంపిన ‘ఆహ్వానం’మే కారణమైంది. ఆహ్వానంపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడంపై రాజకీయ పార్టీలు, నేతలు, ప్రముఖులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ఇచ్చిన ఆహ్వాన లేఖలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని మాత్రమే పేర్కొనడంతో.. ఇండియా పేరును ‘భారత్’గా మార్చనున్నారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిని ప్రతిపక్షాలు సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘ఇండియా, ఇది భారత్; రాష్ట్రాల సమాఖ్య’ అని ఉంటుందని, ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే పదం కూడా దాడికి గురవుతోందని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. చదవండి: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం నేషనలిస్టు కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ తాజాగా స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో మీడియా సమావేశంలో పవార్ పాల్గొని మాట్లాడుతూ.. ‘దేశానికి సంబంధించిన పేరుపై అధికార పార్టీ ఎందుకు అంత కలవరపడుతోందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే ‘రాజ్యాంగంలో ఇండియాను పేరు మార్చేందుకు అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదు’ అంటూ బదులిచ్చారు. ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీల అధినేతల సమావేశం బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతోందని తెలిపారు. ఈ సమావేశంలో దేశం పేరు మార్పుపై చర్చ ఉంటుందని తెలిపారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ పేరు మార్చలేరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఇండియా పేరును మార్చే ప్రతిపాదనను పార్లమెంట్ సభ్యుల ముందుంచనుందని తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్‌గా మార్చే ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు -
Bharat vs India: ‘ఇండియా’ కూటమి పేరు మార్చితే ఏం చేస్తారు?
ఇండియా పేరు మార్పు వివాదం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశం కేంద్రలోని అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య పరస్పర తీవ్ర ఆరోపణలకు కేంద్రబిందువుగా మారింది. జీ20 సదస్సు కోసం విచ్చేస్తున్నదేశ, విదేశీ నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన ఆహ్వాన పత్రాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరు’ అని ముంద్రించి ఉండటంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. After Non-BJP forces united to dethrone the fascist BJP regime and aptly named their alliance #INDIA, now the BJP wants to change 'India' for 'Bharat.' BJP promised to TRANSFORM India, but all we got is a name change after 9 years! Seems like the BJP is rattled by a single term… — M.K.Stalin (@mkstalin) September 5, 2023 ఇప్పటికే ఇండియా పేరును మార్చాలంటూ కొన్ని రోజులుగా ఓ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పరిణామంతో త్వరలోనే కేంద్రం దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశానికి భారత్ పేరు పెట్టే కీలక బిల్లులకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు మోదీ సర్కార్ యోచిస్తోంది. అయితే ఇండియా కూటమికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ప్రతిపక్షాల విమర్శలు.. ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్‌ను ఓడించే లక్ష్యంతో ఏర్పడిన ఈ కూటమిలో 28 పార్టీలు ఉన్నాయి. దీంతో . ఇండియాను భారత్‌గా మార్చడాన్ని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పేరు మార్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. విపక్ష కూటమికి భయపడి, కేవలం ఎన్నికల స్టంట్ కోసమే మోదీ సర్కార్ దేశం పేరు మార్చేందకు ప్రయత్నిస్తుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. కూటమికి మోదీ భయపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇండియాపేరు భారత్‌గా అని మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. విపక్షాలన్నీ కలిసి ఏర్పడిన కూటమికి ఇండియా అని పేరును పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ భయపడ్డారని విమర్శించారు. ఈ క్రమంలోనే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అదే ఒక వేళ.. విపక్ష కూటమి పేరును ఇండియా నుంచి భారత్ అని మార్చితే అప్పుడు ఇండియా పేరును బీజేపీగా మారుస్తుందని సెటైర్లు వేశారు. చదవండి: ఇండియా పేరు మార్పుపై సోషల్ మీడియాలో రచ్చ.. బిగ్‌బీ, సెహ్వాగ్, మమతా ట్వీట్లు ఇండియా కూటమి పేరు భారత్‌గా మార్చితే? ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశం పేరును మార్చుతున్నట్లు తమకు అధికారిక సమాచారం లేదని అన్నారు. బీజేపీని వ్యతిరేచించే చాలా ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి ‘ఇండియా’గా పేరు పెట్టుకున్నందుకు కేంద్రం దేశం పేరును మార్చుతోందా అని ప్రశ్నించారు. దేశం 140 కోట్ల ప్రజలదని, ఒక పార్టీకి సంబంధించినది కాదని అన్నారు. ఒకవేళ విపక్ష కూటమి పేరును భారత్‌గా మారితే.. దేశం పేరును భారత్ నుంచి బీజేపీగా మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష కూటమి పేరును ఇండియా అని పెట్టుకోవడంతో బీజేపీ ఆందోళనలో ఉందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశం పేరు మార్చడం ద్రోహమని మండిపడ్డారు. విపక్ష కూటమి వల్ల బీజేపీలో ఏదో తెలియని కలవరం నెలకొందని.. అందుకే ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. -
ఇండియా బదులుగా భారత్ అని ముద్రించిన కేంద్రం
-
Hyderabad : వర్షం దెబ్బకు హైదరాబాద్ ఏమయిందంటే.?
హైదరాబాద్ : జంట నగరాల్లో వానలు దంచికొడుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురిస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొన్ని పాంత్రాల్లో కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షంతో హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురవడంతో.. రోడ్లు, లోతట్టు నీట మునిగాయి. అక్కడక్కడా పిడుగులు పడటంతో ప్రజలు వణికిపోయారు. షేక్ పేటలో పరిస్థితిని ఓ సిటిజన్ ఇలా వీడియోతో రిపోర్ట్ చేశాడు. Shaikpet 😦 #HyderabadRains @Director_EVDM pic.twitter.com/TTO7wP1Quv — @Coreena Enet Suares (@CoreenaSuares2) September 5, 2023 భూపాలపల్లి జిల్లాలో పిడుగుల బీభత్సం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాటారం మండలం దామెరకుంటలో పిడుగుపడి రైతు గూడూరు రాజేశ్వర్ రావు (46) మృతి చెందారు. పొలంలో కలుపు తీస్తుండగా రైతు పిడుగుపాటుకు గురయ్యారు. చిట్యాల మండలం శాంతినగర్‌లో మిరప నారు నాటుతుండగా పిడుగుపడి ఇద్దరు మహిళా కూలీలు చెలివేరు సరిత(30), నెరిపటి మమత(32) మరణించారు. మరో ఇద్దరు మహిళలు అరెపల్లి కొమురమ్మ, మైదం ఉమకు గాయాలయ్యాయి. వారిని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన ఇద్దరు మహిళల స్వగ్రామం చిట్యాలగా గుర్తించారు. ఇక పిడుగుల వర్షంతో గ్రామీణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చాలా చోట్ల అడుగు తీసి అడుగు వేయలేనంతగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసుల ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా...మ్యాన్‌హోల్స్, నాలాలు పొంగిపోర్లుతున్నాయి. టోలిచౌకిలో దాదాపు కాలనీ అంతా నీళ్లు చేరాయి. This is Tolichowki a regular spot for floods from years. KTR as a minister what change have you brought to control this rain water on to roads. You have been Minister from 9 years and the situation is same from last 9 years. #HyderabadRains pic.twitter.com/0cME1UuEL2 — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) September 5, 2023 ట్రాఫిక్.. నరకయాతన కుండపోత వర్షంతో నగరమంతా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్దీ రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ పోలీసులు వీలైనంత వరకు వాహనదారుల్ని అలర్ట్ చేస్తూ కనిపించారు. #HYDTPinfo Commuters are requested to drive carefully in #Rain.@HYDTP officers for your assistance at all Junctions.#Rainfall #HyderabadRains @AddlCPTrfHyd pic.twitter.com/giuKMi269d — Hyderabad Traffic Police (@HYDTP) September 5, 2023 ప్రధానంగా పంజగుట్ట నిమ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్, పెద్దమ్మతల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్ రోడ్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, అబిడ్స్, నాంపల్లి, అసెంబ్లీ, ఖైరతాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆఫీసులకు వెళ్లే టైంలో భారీవర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రశాంత్ నగర్ లో రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది. At prashanth nagar Going to exam Jntuh ( St Mary's College) Jntuh oka boat isthe Easy ga reach avtham center ki#HyderabadRains #Hyderabad @examupdt @balaji25_t pic.twitter.com/mPotVP3HC7 — venky (@venky46799918) September 5, 2023 క్షేత్రస్థాయిలో అధికారులు నగరంలో వర్షం కురుస్తున్నందున మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డీఆర్ఎఫ్ టీమ్స్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితి చక్కదిద్దుతున్నారని GHMC తెలిపింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 191 వద్ద పరిస్థితి ఇలా ఉంది. Heavy rainfall in several places of #Hyderabad today. Situation at the favourite place of #Waterlogging , at the pillar no.191, under PVNR Expressway at #Upperpally near Attapur area, traffic interrupts. GHMC at work.#HyderabadRains #HeavyRains pic.twitter.com/DZDOpQFlBx — Surya Reddy (@jsuryareddy) September 5, 2023 బీ అలర్ట్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొంది. ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన ప్రజలకు చుక్కలు కనిపించాయి. #TrafficAlert : Today's situation at the Moosapet area in Hyderabad, traffic moves at snail's pace, as roads were marooned after heavy rains. The IMD issued an #OrangeAlert warning for Hyderabad, today.#HyderabadRains #TrafficJam #Hyderabad #Moosapet pic.twitter.com/kokSpgWlm9 — Surya Reddy (@jsuryareddy) September 5, 2023 వరద నష్టం వరద ఒక్కసారిగా పోటెత్తడంతో భారీ ఆస్తినష్టం జరిగిందని పలువురు సిటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరి వాహనాలు కొట్టుకుపోతే.. మరికొందరి వాహనాలు నీట మునిగాయి. ఇంకొందరి ఇళ్లలో నీళ్లు చేరాయి. #HyderabadRains vs Two-Wheelers pic.twitter.com/tX7kxjcAUr — Donita Jose (@DonitaJose) September 5, 2023 వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు DRF టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. వరదలు, చెట్లు కూలడం తదితర సమస్యల నుంచి రక్షణకు ప్రజలు 040–21111111 లేదా 9000113667 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని పేర్కొంది. 👉ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో@metcentrehyd శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.#HyderabadRains #rains #Hyderabad pic.twitter.com/XRhxtD0JTL — DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 5, 2023 -
ఇండియా Vs భారత్.. సెహ్వాగ్, బిగ్ బీ, ప్రముఖుల స్పందన ఇదే..
ఇండియా పేరు మార్పుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. మన దేశం పేరు ‘భారత్’ లేక ‘ఇండియా’ అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇండియా పేరు మార్పుపై ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది ‘భారత్’ పేరును సమర్ధిస్తుంటే.. ఇండియాను భారత్‌గా మార్చడాన్ని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పేరు మార్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమికి భయపడి, కేవలం ఎన్నికల స్టంట్ కోసమే కేంద్రలోని బీజేపీపేరు మార్చేందకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. తాజాగా ఇండియా పేరు మార్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘ఇండియా పేరును భారత్‌గా మార్చబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జీ 20 సదస్సు కోసం ప్రెసిడెంట్ డిన్నర్ ఆహ్వాన పత్రికపై భారత్ అని ముద్రించారు. ఇందులో కొత్త ఏముంది. మనం తరుచుగా భారత్ అనే పదాన్ని ఉచ్చరిస్తుంటాం. భారత రాజ్యంగం లేదా భారత్ కా సంవిధాన్ అనే పదాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. ప్రపంచానికి దేశం పేరు ఇండియాగానే తెలుసు. ఇంత అత్యవసరంగా దేశం పేరు మార్చాలని అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. సంబంధిత వార్త: ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్పు దిశగా కేంద్రం West Bengal CM @MamataOfficial reacts on ‘Bharat’ replacing ‘India’. “I heard they are now changing the name of #India. The President’s dinner invite for #G20 mentions #Bharat. What is new here? We always use Bharat. We say India’s constitution or Bharat ka Sanvidhan.… pic.twitter.com/Pq3Z3ZBvbJ — Mahua Moitra Fans (@MahuaMoitraFans) September 5, 2023 కాంగ్రెస్ నేత జయరామ్ రమేశ్ స్పందింస్తూ.. ఈ పరిణామం వెనుక కొంతైనా నిజం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి భవన్ సెప్టెంబరు 9న విందుకు ఆహ్వానాన్ని పంపిందని, అందులో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అని కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది. కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే పదం కూడా ఇప్పుడు దాడికి గురవుతోంది" అని ఆయన ఆరోపించారు. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరిస్తూ, దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని జైరామ్ రమేశ్ విమర్శించారు. ఇది భారతదేశం. రాష్ట్రాల యూనియన్. ఇండియా పార్టీల లక్ష్యం కూడా( Bharat- Bring Harmony, Amity, Reconciliation And Trust) సామరస్యం, స్నేహం, సయోధ్య , నమ్మకాన్ని తీసుకురావడమే. జూడేగా భారత్.. జీతేగా ఇండియా! అని పేర్కొన్నారు. మరోవైపు విపక్షాల కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. I have always believed a name should be one which instills pride in us. We are Bhartiyas ,India is a name given by the British & it has been long overdue to get our original name ‘Bharat’ back officially. I urge the @BCCI @JayShah to ensure that this World Cup our players have… https://t.co/R4Tbi9AQgA — Virender Sehwag (@virendersehwag) September 5, 2023 ఇక బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చాన్ దేశం పేరు మార్పును సమర్ధించారు. ఈ మేరకు ‘ భారత్ మాతాకీ జై’ అంటూ ట్వీట్ చేశారు. ఇండియాను భారత్‌గా మార్చాడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీట్ చేశారు. జెర్సీపై కూడా భారత్ అని ముంద్రించాలని కోరారు. T 4759 - 🇮🇳 भारत माता की जय 🚩 — Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023 కాగా సార్వత్రిక ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో మనదేశం పేరు మారనుంది. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం యోచిస్తోంది. దేశానికి భారత్ పేరు పెట్టే కీలక బిల్లులకు సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు.. ఆహ్వాన పత్రాల్లోప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా కేంద్రం ముద్రించింది. REPUBLIC OF BHARAT - happy and proud that our civilisation is marching ahead boldly towards AMRIT KAAL — Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023 మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. కాగా ఇండియా పేరును మార్చాలని కొన్ని రోజులుగా ఓ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దేశం పేరును ఇండియానుంచి భారత్‌గా మార్చాలని తక్షణమే భారత రాజ్యాంగంల నుంచి దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియా అనే పదాన్ని బ్రిటిష్ వారు ఉపయోగించేవారని,.. ‘భారత్’ అనే పదం మన దేశ సంస్కృతికి ప్రతీక అని వాదిస్తున్నారు. అంతేగాక దేశం పేరును ఇండియా అని కూకుండా భారత్ అని పిలవాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. అదే విధంగా ఇటీవల ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో తలపడాలని యోచిస్తున్న 28 పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. -
ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్చే దిశగా కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలబెట్టిన జీ20 సదస్సు ఊహించని పరిణామానికి దారి తీసింది. రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడ్డ G20 డిన్నర్ ఆహ్వాన పత్రికతో సంచలన విషయం తెరమీదికి వచ్చింది. ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది రాష్ట్రపతి భవన్. దీంతో దేశం పేరును ఆంగ్లంలో ఇండియా నుంచి భారత్‌కు మార్చే ప్రయత్నాల్లో కేంద్రం ఉందనే చర్చ ఊపందుకుంది. జీ20 సదస్సులో భాగంగా.. సెప్టెంబర్ 9వ తేదీన వివిధ దేశాల అధినేతలకు, ప్రతినిధులకు విందు ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇందుకోసం విదేశీ అధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతోనే ఆహ్వానాలు పంపింది రాష్ట్రపతి . ఇదే ఇప్పుడు రాజకీయ అభ్యంతరాలకు దారి తీసింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా.. రిపబ్లిక్ ఆఫ్ భారత్‌గా మారబోతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. REPUBLIC OF BHARAT - happy and proud that our civilisation is marching ahead boldly towards AMRIT KAAL — Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023 ఇంకోవైపు కాంగ్రెస్ ఈ పరిణామంపై మండిపడుతోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్న యూనియన్ స్టేట్స్పై ముమ్మాటికీ దాడేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ.. దేశాన్ని విభజిస్తూ.. మోదీ ముందుకు సాగుతున్నారంటూ మండిపడ్డారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ‘‘దేశ గౌరవానికి, గర్వానికి సంబంధించిన ప్రతి విషయంపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత అభ్యంతరం? వ్యక్తం చేస్తోంది. భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేసిన వాళ్లు.. భారత్ మాతా కీ జై అనే ప్రకటనను ఎందుకు ద్వేషిస్తున్నారు. కాంగ్రెస్‌కు దేశంపైనా, దేశ రాజ్యాంగంపైనా, రాజ్యాంగ సంస్థలపైనా గౌరవం లేదని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి దేశం మొత్తానికి బాగా తెలుసు అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. कांग्रेस को देश के सम्मान एवं गौरव से जुड़े हर विषय से इतनी आपत्ति क्यों है? भारत जोड़ो के नाम पर राजनीतिक यात्रा करने वालों को “भारत माता की जय” के उद्घोष से नफरत क्यों है? स्पष्ट है कि कांग्रेस के मन में न देश के प्रति सम्मान है, न देश के संविधान के प्रति और न ही संवैधानिक… — Jagat Prakash Nadda (@JPNadda) September 5, 2023 కొత్త భవనంలోనేనా? ఆంగ్లంలో ఇండియా(India)గా ఉచ్చరించే పేరును.. భారత్(Bharat)గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు.. 18 నుంచి 22వ తేదీలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలను కేంద్రం వేదికగా చేసుకుంటుందా? అనే దానిపై ఒక స్పష్టత మాత్రం రావాలి. తొలి రెండు రోజులు పాత పార్లమెంట్ భవనంలో.. తర్వాతి మూడు రోజులు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయి. కొత్త పార్లమెంట్ భవనంలోనే.. పేరుపై తీర్మానంతో పాటు జమిలి ఎన్నికలు, బ్రిటిష్‌కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకురాబోయే కొత్త చట్టాలను చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. So the news is indeed true. Rashtrapati Bhawan has sent out an invite for a G20 dinner on Sept 9th in the name of 'President of Bharat' instead of the usual 'President of India'. Now, Article 1 in the Constitution can read: “Bharat, that was India, shall be a Union of States.”… — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపిన ఆహ్వానం వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షాల కూటమి ఇండియా పేరును పెట్టుకున్న తర్వాత దేశం పేరును ఇండియా అని పిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వర్సెస్ మోదీ లాంటి నినాదాలు చర్చలను తీవ్రతరం చేశాయి. ఇదీ చదవండి: ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..?