bhumana karunakar reddy
-
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
సాక్షి,తిరుపతి: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. 1978 నుండి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ భౌతిక దేహానికి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాళులర్పించారు. అంనతరం భూమన మాట్లాడుతూ.. ఆయనకు మరణం వేంకటేశ్వర స్వామి భక్తులకు తీరని లోటు. అన్నమయ్య కీర్తనలను గానం చేసి నేటి తరం భక్తులకు అందించిన మహనీయుడు గరిమెళ్ళ బాలకృష్ణ మరణించడం దురదృష్టకరమని అన్నారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర,పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చిన గరిమెళ్ళ సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. -
నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ ద్రోహం: భూమన
సాక్షి, తిరుపతి జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘యువత పోరు’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్‌రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను, ప్రజలను అడ్డగోలుగా మోసగించారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ యువతకు, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చిన ప్రతి హామిని నేరవేర్చారని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. -
మీరు మనుషులేనా ?.. ఆరోగ్యం బాగాలేకపోతే నీచ రాజకీయాలా
-
పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు.. పచ్చ మీడియా సిగ్గుపడాలి: భూమన
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు భూమక కరుణాకర్ రెడ్డి. అలాగే, సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు రాస్తున్న ఎల్లో మీడియా సిగ్గు పడాలని చురకలు అంటించారు.చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి కూటమి నేతలు ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో కోతలు పెట్టారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసే లేదు. హామీలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదు. సంక్షేమం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. మీరు ప్రజల్లోకి వెళ్తే పేదలు కష్టాలు తెలుస్తాయి.ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. 2లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి వైఎస్ జగన్. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్‌కు 40 శాతం ఓట్లు వచ్చాయి. మంచి చేశాం కాబట్టే వైఎస్సార్సీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది అంటూ పచ్చమీడియాలో వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం పట్ల టీడీపీ సానుభూతిపరుల్లోనే వ్యతిరేకత ఉంది. కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.కుట్రలతో పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు పెట్టారు. ప్రతీకార కక్షతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. పోసాని ఆరోగ్య పరిస్థితిపై నాటకాలు అంటూ విష ప్రచారం చేస్తున్న పచ్చ పత్రికలు సిగ్గుపడాలి. ఆయన ఆసుపత్రిలో ఉన్నా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఆయనపై ఎల్లో మీడియా ఎందుకు విషపు రాతలు రాస్తోంది. పోసానికి వచ్చిన పరిస్థితి మీకు ఎదురైతే ఇలానే ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. -
పక్కనే ఉండి మోసం చేసారు భూమన ఎమోషనల్..
-
అభినయ్ ఓటమి కంటే.. అదే ఎక్కువ బాధించింది: భూమన
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో పేదల కోసం పాటుపడే వ్యక్తి వైఎస్ జగన్ అయితే, పేదల ఓట్లు వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో అధికారం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కుతారా? అని ప్రశ్నించారు. కుట్రలకు తెరలేపిన వాళ్ళను జైలుకు పంపిస్తాం. న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం చేస్తాం అని హెచ్చరికలు జారీ చేశారు.తిరుపతి ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీనియర్ నాయకులు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, కూటమి సర్కార్ పాలనపై వైఎస్సార్పీ నేతలు మండిపడ్డారు.తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘జగనన్నను గెలిపించుకోవాలని పేద ప్రజలు అందరూ భావిస్తున్నారు. మనం పోగొట్టుకున్నాం అనే భావన వారిలో ఉంది. జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియ సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. వారిని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని సమాచారం తెలుసుకుని జన ప్రవాహం తరలివచ్చింది. నిన్న విజయవాడలో వంశీని పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా ప్రజలకు చేసిందేమీ లేదు. పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్ అయితే, పేదల ఓట్లు వాడుకునే వ్యక్తి చంద్రబాబు. నేను కార్యకర్తలు కోసమే పనిచేస్తాను అని చాలా స్పష్టంగా జగన్ చెప్పారు. ఆయన అనుచరులుగా, శిష్యులుగా మేము గర్వపడుతున్నాము. డిప్యూటి మేయర్ ఎన్నిక సందర్భంగా నమ్మకద్రోహం చేసిన వాళ్లం చూశాం. నా కొడుకు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు బాధ కంటే, నేను నమ్మిన నాయకులు డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వెళ్ళిపోయినప్పుడు బాధ పడ్డాను. అధికారం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కుతారా?. నెత్తిన పైసా పెడితే మారని వ్యక్తుల్ని నాయకుల్ని చేశాను. రాజారెడ్డి సింహం లాంటి వ్యక్తితో నడిచా, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి యుద్ధ వీరుడుతో పనిచేశా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుడితో పని చేస్తున్నాను. మేయర్ పదవి కోసం అవిశ్వాసం పెడితే త్యాగం చేసైనా కాపాడుకుంటాం. అవసరమైతే జగన్‌ను తిరుపతికి రప్పిస్తాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం చేసేంత వరకు కష్టపడి పనిచేస్తామన్నారు.భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు తుని మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న అరాచకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ పోరాటానికి తిరుపతి పార్టీ నేతలే స్పూర్తి. స్థానిక సమస్యలపైన రానున్న రోజుల్లో మరింత ఉద్యమం చేస్తాం. మీ పాలనలో తిరుపతి టౌన్ బ్యాంక్ అప్పుల్లో కూరుకు పోయింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలపై జరిగిన దాడి ఘటనపై ప్రధాని, హ్యూమన్ రైట్స్, కేంద్ర ఎన్నికలు సంఘం, లోక్‌సభలో ప్రివిలేజ్ మోషన్ కింద పెడతామన్నారు.తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు గడిపేలా తిరుపతి నుంచి కరుణాకరరెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన మరింత పోరాటం చేస్తాం. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా పోలీసులు, రౌడీలు కలిసి పోయి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి చేశారు. కుట్రలు తెరలేపిన వాళ్లను జైలుకు పంపిస్తాం. న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్య వేదికలు, రాజ్యాంగ హక్కుల వేదికల దృష్టికి తీసుకు వెళ్తాం. కుట్రలో భాగస్వామ్యం అయిన వారు అందరికీ బుద్ధి చెబుతాం. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని అన్నారు.తిరుపతి మేయర్ శిరీష మాట్లాడుతూ.. కూటమి పాలనలో ఎవరిని అరెస్ట్ చేస్తారు అనే చర్చ జరుగుతోంది. సంక్షేమం, అభివృద్ధి అనేది రాష్ట్రంలో చర్చ లేదు. ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలి.. ఎలా వేధించాలి అనేది చర్చ జరుగుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది: భూమన
-
ప్రతీకారంతో అరెస్టులు.. వల్లభనేని వంశీ అరెస్ట్ పై భూమన రియాక్షన్
-
పవన్.. కల్తీ మీ బుర్రలో జరిగింది: భూమన
తిరుపతి, సాక్షి: సనాతన ధర్మంకు విఘాతం కలిగితే తాను ముందు ఉంటానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో ఓ ప్రైవేట్ హోటల్‌కు అనుమతులివ్వడంపై హిందూ సంఘాలు పోరాటం చేస్తున్నా.. పవన్ మౌనంగా ఉండడంపై భూమన మండిపడ్డారు. అలాగే కేరళలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. తిరుపతిలో గురువారం ఉదయం భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కిందటి ఏడాది సెప్టెంబర్ 20 తేదీన తిరుమలడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే.. నిర్ధారణ కాకుండా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ రిపోర్ట్‌లో ఎక్కడా ‘నిర్ధారణ’ అనే విషయం ప్రస్తావించలేదు. .. తిరుమల పవిత్రతకు భంగం కలిగింది ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇచ్చారు. సనాతన ధర్మంకు విఘాతం కలిగిన ముందు ఉంటాను అని చెప్పిన పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్.. అది వ్యక్తిగతం, రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ పర్యటనల్లో రాజకీయ విమర్శలు ఎలా చేస్తారు?కేరళకు వెళ్లి.. తిరుమల లడ్డూ గురించి తప్పుగా మాట్లాడారు. ఇది మాపై వేస్తున్న నింద కాదు.. స్వయంగా వెంకటేశ్వర స్వామి మీద వేస్తున్న నింద. మా హయాంలో అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలు కల్తీ నెయ్యితో చేసినవని పవన్ అన్నారు. లడ్డూలో కాదు.. కల్తీ మీ బుర్రలో జరిగింది. సౌరవ్ బోరా అనే ప్రస్తుత పాలక మండలి సభ్యుడు రూ. 30 లక్షలు ఖర్చు చేసి లక్ష లడ్డూలు తయారు చేయించారు. ఇప్పుడు ఆయన్ని కూడా అరెస్టు చేయించండి. .. పవన్ ఒకప్పుడు సూడో హిందువును, నేను బాప్టిజం తీసుకున్నా అన్నారు.. తన భార్య క్రిస్టియన్ , పిల్లలు క్రిస్టియన్ అన్నారు. ఆపై కాషాయం కట్టి సనాతన ధర్మం అంటూ ఊగిపోయారు. సనాతన ముసుగులో రాజకీయం చేసి, ప్రత్యర్థులు పార్టీలను నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ ముసుగులోనే తిరుమల పవిత్రతను పవన్ దిగజార్చుతున్నారు అని భూమన మండిపడ్డారు. తిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ అమరణ నిరాహార దీక్ష కు మద్దతు ఇవ్వండి అని పవన్‌కు భూమన సూచించారు. -
‘చంద్రబాబు, లోకేష్ ప్రతీకారంలో భాగమే వంశీ అరెస్ట్’
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ పాలనలో ప్రతీకారంతోనే వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని కోరారు. మరోవైపు.. ఏపీలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విశాఖ: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై బొత్స స్పందించారు. ఈ క్రమంలో బొత్స..‘వంశీ అరెస్టును ఖండిస్తున్నాము. ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి?. కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు. మరోసారి పునరావృతం కాకూడదు’ అంటూ హెచ్చరించారు.తిరుపతి: వంశీ అరెస్ట్‌పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నా. కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారు. చంద్రబాబు, లోకేష్ ప్రతీకారంతోనే అరెస్ట్‌లు చేస్తున్నారు. వంశీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సంతోషపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలందరిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలని కోరారు.తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అన్యాయంగా అరెస్టు చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 30 మంది పోలీసులు ఇంటికెళ్లి మరీ బెదిరించారు. చట్టాన్ని చేతిలో తీసుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది. పౌర హక్కులను హరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తే విత్ డ్రా చేసుకుంటే మళ్లీ కేసు పెట్టడమేంటి?. అసలు ఏపీలో ఏం జరుగుతోంది?. న్యాయవ్యవస్థను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలో ఉండదని పోలీసు అధికారులు గుర్తించాలి. డీజీపీని కోర్టుకు పిలిపిస్తామని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటేనే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మానవ హక్కులను పోలీసులను ఉల్లంఘిస్తున్నారు. విశాఖ: కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు. కేసు విత్ డ్రా చేసుకున్న తరవాత అరెస్టులు చేయడమేంటి?.విశాఖ: ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ.. వంశీ అరెస్టు అనాగిరిక చర్య. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. బెయిల్‌పై ఉన్న వ్యక్తిని ఏ విధంగా అరెస్టు చేస్తారు?. వైఎస్సార్సీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేయాలని చంద్రబాబు సర్కార్ చూస్తోంది.చిత్తూరు: చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ విజయనందరెడ్డి మాట్లాడుతూ..‘గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు ఖండిస్తున్నా. వంశీ అరెస్టు అప్రజాస్వామికం, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగము అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.విజయవాడ: దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కక్షపూరితంగా వంశీని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కోర్టు వ్యాఖ్యలను కూడా కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే ఇలా ఇబ్బందులు పెడుతున్నారు. తప్పుడు కేసులపై కోర్టులు న్యాయం చేయాలి. భవిష్యత్ కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఎవరైన తప్పుడు కేసులు పెట్టారో వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. వారికి శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. -
శ్రీవారి లడ్డూలో కాదు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లోనే ఉంది కల్తీ
సాక్షి,తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సిట్ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్ రిపోర్టుల్లో ఎక్కడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు పేర్కొనలేదని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియా.. నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి, ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపకపోతే దేవదేవుని ఆగ్రహానికి గురవడం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు, ఆలోచనల్లోనే కల్తీ కొవ్వు ఉందని.. లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ జరిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.ప్రెస్మీట్లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:ఆ విషయం రిమాండ్ రిపోర్టులో లేదు: నిందితుల రిమాండ్ రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ చెప్పలేదు. అయినా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియాలో మాత్రం నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీ చేసిన తప్పులపై మాత్రమే సిట్ విచారణ జరిపి రిమాండ్ బాధ్యులను రిమాండ్‌కి తరలించింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఎక్కడా నెయ్యి కల్తీపై మాట్లాడలేదు. టెండర్ల అవకతవకలపై మాత్రమే విచారణ జరుగుతోంది. దానికి సంబంధించే నలుగురిని అరెస్టు చేశారు.అయినా నిస్సిగ్గుగా దుష్ప్రచారం:కానీ, చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ మీద నిందలు మోపడానికి లడ్డూ తయారీ కోసం పంది కొవ్వును ఉపయోగించారని ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచారు. పవన్ కళ్యాణ్ మరింత ముందుకెళ్లి సనాతన ధర్మ పరిరక్షణ కోసం తానే ఆవిర్భవించినట్టు వేషం కట్టి బిల్డప్ ఇచ్చాడు. తిరుపతిలో పవన్ ముందుకు వెళ్లి పవానంద స్వామి వేషంలో సనాతనధర్మం కోసం నడుం బిగించాను అని, తిరుపతిలో లడ్డూను నీచులు అపవిత్రం చేశారు అని మాట్లాడారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలే పంపారని డిప్యూటీ సీఎం పవనానంద స్వామి తీవ్రమైన నిరాధార ఆరోపణలు చేశారు..నిజానికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిన లక్ష లడ్డూల తయారీకి కావాల్సిన నెయ్యిని చంద్రబాబు నియమించిన టీటీడీ బోర్డులోనే సభ్యుడిగా ఉన్న ముంబైకి చెందిన సౌరభ్ బోరా అనే వ్యక్తి సరఫరా చేశాడు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ముందుగా ఆ సౌరభ్ బోరాను అరెస్ట్ చేయాలి.కల్తీ నెయ్యి వినియోగించే ఛాన్స్ లేనేలేదు:చంద్రబాబు తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా క్షుద్ర రాజకీయాల కోసం అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని కూడా వాడుకున్నాడు. నెయ్యి నాణ్యతను నిర్ధారించే పటిష్టమైన వ్యవస్థ టీటీడీలో దశాబ్దాలుగా ఉంది. గత మా వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య నాణ్యత పరీక్షల్లో విఫలమైన 18 ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగింది. అంతకుముందు కూడా ఇదే విధంగా చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య 15 ట్యాంకర్లు తిప్పి పంపించడం జరిగింది. నెయ్యి నాణ్యత టెస్టుల్లో ఫెయిలైతే ట్యాంకర్లను వెనక్కి పంపడమే తప్ప వాడటం అనేది జరగదు.టీటీడీ ఈఓ కూడా ఏమన్నారు?:తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని ఈవో శ్యామలరావు చెప్పారు. జూన్ 12, 20, 25, జూలై4న వచ్చిన నెయ్యిని పరిశీలించి టెస్టులు పాసయ్యాక వినియోగానికి పంపించామని, గత సెప్టెంబరు 20న టీటీడీ ఈవో శ్యామలారావు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా జూలై 6, 12న ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్ల శాంపిల్స్ పరీక్షించగా,వనస్పతి ఆయిల్ కలిసిన ఆనవాళ్లు తేలడంతో, ఆ ట్యాంకర్లు వెనక్కి పంపామని చెప్పారు. కాబట్టి, లడ్డూల తయారీలో ఎక్కడా కల్తీ నెయ్యి వాడలేదని స్పష్టంగా తేలిపోయింది. పెరిగిన నెయ్యి నాణ్యత:2019కి పూర్వం నెయ్యి నాణ్యత నిర్ధారణకు హెల్త్ ఆఫీసర్ మాత్రమే ఉండేవాడు. తిరుమల నెయ్యి నాణ్యతను మరింత పెంచడంలో భాగంగా వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే రిటైర్డ్ సైంటిస్టుని సీఎఫ్టీఆర్టీఐ నుంచి టీటీడీ ల్యాబరేటరీకి తీసుకురావడం జరిగింది. ఆయనతో పాటు మరో 12 మందిని ల్యాబ్ టెక్నీషియన్లను కూడా నియమించడం జరిగింది. దీంతో పాటు రకరకాల ప్రాంతాల్లో ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ సేకరణ విధానాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. ల్యాబ్ అప్‌గ్రేడేషన్ చేయడం కోసం కమలవర్థన్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి సూచనలు తీసుకోవడం జరిగింది. ఎన్డీడీబీ సాయంతో రూ.46 కోట్లతో ల్యాబ్ ఆధునికీకరణ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.8 కోట్ల పనులకు టెండర్లు పిలవడం జరిగింది. కానీ ఒకే కంపెనీ ముందుకుడరావడంతో టెండరింగ్ ఆలస్యమైంది.నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం:‘మేం ఆరోపణలు చేస్తాం.. వైఎస్సార్సీపీ తుడుచుకోవాలి’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అనేలా తొందర్లోనే చంద్రబాబుకి వినాశనం తప్పదు. సర్వం ఎరిగిన స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీరి పీఠాలే కదిలిపోతాయని గుర్తుంచుకోవాలి. వైఎస్సార్సీపీ మీద దాడి చేయడానికి, వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల స్వామి వారిని వాడుకోవడం అన్నది చాలా దారుణమైన విషయం. నెయ్యిలో కల్తీ జరిగిందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. ఆవులు తినే ఆహారాన్ని బట్టి రిపోర్టుల్లో తేడాలు రావొచ్చని, మా నివేదిక నూటికి నూరుపాళ్లు ప్రామాణికం కాదని ఎన్డీడీబీ కూడా తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇకనైనా ఎల్లో మీడియా దేవదేవుని విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలని భూమన కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు. -
Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..
-
‘ప్రజాదరణ కల్గిన నేత కాబట్టే టార్గెట్ చేసి విషం చిమ్ముతున్నారు’
తిరుపతి వైఎస్సార్సీపీలో కీలక నాయకుడిగా ఉన్న పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)పై ఈనాడు పత్రిక పనిగట్టుకుని విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పడి ఏడ్వటం ఈనాడుకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.డి.పట్టాభూములు,ప్రీహోల్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తప్పుడు కథనాలు రాయడం ఈనాడు పత్రిక పనిగా పెట్టుకుందన్నారు. ఏడు నెలల క్రితం మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టారు అంటూ ప్రచురించిన ఈనాడు.. ఇప్పుడు తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విషం చిమ్ముతున్నారన్నారు. పచ్చి అబద్ధాలతో కూడిన వార్తలు రాస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు బాకా ఊదడం కోసమే పార్టీ పత్రికగా ఈనాడు మిగిలిపోయిందని భూమన విమర్శించారు.‘ఈ కేసు విషయంలో డీజీపీని మదనపల్లెకు పంపించి మరీ విచారణ జరిపించారు. నివేదిక ఇచ్చారు. ఈనాడు మళ్లీ బురద చల్లడానికే ఈ వార్తలు ప్రచురిస్తున్నారు. ఫైల్స్ దహనం కేసులో ఏ సంబంధం లేకపోయినా పనికట్టుకుని ఇరికించాలని చూస్తోంది. ప్రజాధరణ కల్గిన నాయకుడు కనుక ఆయన్ని బద్నాం చేయాలని చూస్తోంది. వైఎస్సార్సీపీ(YSRCP)ని బలహీన పర్చాలని కుట్రలు చేస్తున్నారు.ఆయన ఏ తప్పు చేయలేదని ప్రజలు అందరికీ తెలుసు. ఎన్ని విచారణలు చేసినా, చేయించినా ఏ తప్పు చేయలేదన్నదే తేలుతుంది’ అని భూమన స్పష్టం చేశారు. -
క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది ‘కూటమి’
తిరుపతి మంగళం: ‘మంగళ మేళాలతో ప్రశాంతంగా నిద్రలేవాల్సిన ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గత వారం రోజులుగా జరుగుతున్న విధ్వంసకాండను చూసి క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైనది టీడీపీ నేతృత్వంలోని కూటమి అని ప్రజలకు అర్థమైంది. ఎన్నికల్లో రౌడీయిజం, దౌర్జన్యాలతో గెలవడం కూడా ఒక గెలుపేనా..? డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం దేశంలోనే తొలిసారి తిరుపతిలో జరిగింది.’ అని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అ«ధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో భూమన మంగళవారం మీడియాతో మాట్లాడారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా సార్వత్రిక ఎన్నికలను తలదన్నే విధంగా కూటమి కుట్రలకు పాల్పడిందన్నారు. ‘ఈ ఎన్నిక ప్రక్రియలో మేము ఓడినా.. పోరాడే శక్తినిచ్చింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లదే నైతిక విజయం. కూటమికి బలం లేకపోయినా కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్‌ను పెట్టుకుని దురాలోచనతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను అత్యంత దారుణంగా బెదిరించి, భయపెట్టి లోబరుచుకున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం శాసనమండలి సభ్యుడు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంను కిడ్నాప్ చేసి బెదిరించి ఓటింగ్‌కు రాకుండా చేసిన ఘనత చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కే దక్కుతుంది.తిరుపతిలో వారం రోజులుగా జరుగుతున్న విధ్వంసకాండతో పిల్లలు, పెద్దలు భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీవారి పాదాల చెంత ఇంత అరాచకం జరగడం గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లను పశువులుగా భావించిన కూటమి నేతలను సమాజం క్షమించదు. వారికి కాలమే సమాధానం చెబుతుంది.’ అని భూమన ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీకి చెందిన మేయర్ డాక్టర్ శిరీషను తమవైపు తిప్పుకొనేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారని భూమన చెప్పారు.కానీ, కూటమి నేతల బెదిరింపులకు బెదరకుండా వీరోచితంగా పోరాటం చేసిన మేయర్ అభినందనీయులని పేర్కొన్నారు. తమ పార్టీ మహిళా కార్పొరేటర్లు సైతం డిప్యూటీ మేయర్ ఎన్నికలో చూపిన తెగువ చాలా గొప్పదని ఆయన ప్రశంసించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి కార్పొరేటర్లకు అండగా నిలిచి ధైర్యం చెప్పిన తీరు హర్షణీయమని అన్నారు. ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
భూమనను పట్టుకొని ఏడ్చేసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు
-
తప్పయింది క్షమించండి.. భూమన కాళ్ల మీద పడ్డ కార్పొరేటర్లు
సాక్షి, తిరుపతి జిల్లా: ఉత్కంఠభరితంగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ (Tirupati Deputy Mayor) పదవి ఎన్నికల్లో కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారంటూ నలుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి, భూమన కరుణాకర్‌రెడ్డి (bhumana karunakar reddy) కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైఎస్సార్సీపీ (ysrcp corporators) కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నలుగురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. పశ్చాత్తాపంతో తమను క్షమించమని వేడుకుంటూ భూమన కరుణాకరరెడ్డిని మేం నలుగురం (కార్పొరేటర్లు) అనీష్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్, అమరనాథ్ రెడ్డిలు ప్రాధేయపడ్డాం. తామంతా వైఎస్సార్సీపీ అధినతే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోరుకునే వాళ్ళమని, మమ్మల్ని భయపెట్టి, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారు.వాళ్ళకి భయపడి ఓటు వేయాల్సి వచ్చింది, తప్పు జరిగి పోయింది క్షమించమని కరుణాకర్ రెడ్డిని వేడుకుంటున్నాం: అనీష్ రాయల్ ఎత్తుకెళ్లి మాపై భౌతికంగా దాడి చేసి, ఇబ్బందులు పెట్టారు. ఓటు వేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు..భయపెట్టారు: అనీష్ రాయల్ , అనిల్, మోహన్ కృష్ణ యాదవ్నన్ను ఎంతగా భయపెట్టినా టీడీపీకు అనుకూలంగా ఓటు వేయను అని స్పష్టం చేశాను. భయపెట్టి, బెదిరింపులకు పాల్పడ్డారు. నేను ఎవరికీ ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నాను.నేను వైఎస్సార్సీపీలో గెలిచాను, ఆ పార్టీలోనే చివరి వరకు కొనసాగుతా. జరిగిన పరిస్థితులు అర్థం చేసుకుంటారని, పశ్చాత్తాపంతో కరుణాకర్ రెడ్డి వద్దకు వచ్చాను: 5వ డివిజన్ కార్పొరేటర్ అమరనాథ్ రెడ్డి -
భూమన కరుణాకరరెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు
-
మహిళా కార్పొరేటర్ల నిర్బంధంపై భూమన ఫైర్
-
లోకేష్, అనగాని సత్యప్రసాద్ పై భూమన సంచలన వ్యాఖ్యలు
-
ఇంత అరాచకమా?.. ‘కూటమి’ మితిమీరిపోతుంది: భూమన
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సర్కార్ అరాచకాలు పెరిగిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శేఖర్‌రెడ్డి భవనం కూల్చి లోబరుచుకున్నారు. కార్పొరేటర్ డాక్టర్ అనీష్ రాయల్‌ను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్ మునిరామిరెడ్డిని బిల్డింగ్ కూల్చి వేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు.‘‘మంత్రి అనగాని సత్య ప్రసాద్ నీచ రాజకీయాలు చేస్తున్నారు. లోకేష్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తోందంటూ మంత్రి అనగాని కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. సనాతన ధర్మం కాపాడతానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ ఉన్నారు?. తిరుపతి రాజకీయాలు పవిత్రంగా ఉండటం మీకు ఇష్టం లేదా?. మీ కూటమి నాయకులే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలన ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు...చంపడం ఒక్కటే మిగిలింది.. కార్పొరేటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులను కూడా బెదిరిస్తున్నారు. విప్ జారీ చేశాం. విప్ ధిక్కరిస్తే పదవులు కూడా కోల్పోతారు. ఆర్థికపరంగా దెబ్బతీస్తూ.. కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. విప్‌ను ధిక్కరిస్తే కచ్చితంగా కార్పొరేటర్లు పదవులు కోల్పోతారు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తాం. హౌస్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా..వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీసు భద్రత కల్పించాలని కోరాం’’ అని భూమన తెలిపారు. -
కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధుల్లేవు: భూమన
సాక్షి,తిరుపతి:కూటమి సర్కార్ ఆదేశాలతో అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం(ఫిబ్రవరి1) తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. ‘అధికారులు కూటమి నేతల డైరెక్షన్లో పనిచేస్తున్నారు. సుప్రీం నిబంధనలను అధికారులు పాటించాలి. తిరుపతి పట్టణంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధులు లేకుండా పోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్‌రెడ్డిని ప్రకటిస్తే అతడి ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరిస్తూ మేయర్ చూస్తుండగానే కట్టడాలు కూల్చి వేశారు. డిప్యూటి మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని లొంగి పోయేలా చేశారు. మీకు సత్తా లేక, మెజారిటీ లేక, మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కొనుగోలు చేశారు. గపూర్, లక్ష్మన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇళ్లు ధ్వంసం చేశారు. తిరుమలలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వ్యాపార సముదాయాలు బెదిరింపులకు పాల్పడ్డారు. మా పాలనలో ఏ రోజు విధ్వంసం చేయలేదు. ప్రత్యర్థుల ఆస్తులు విధ్వంసానికి పాల్పడటం అనే సంస్కృతి కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అదేశాలు సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కూల్చివేతలకు 45 రోజుల ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, కలెక్టర్‌కు మెయిల్ చేయాలి.కూల్చివేతలకు మూడు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. 15 రోజుల ముందు అప్పీలు నోటీసులు ఇవ్వాలి. కూల్చివేతల వీడియో, ఫొటోలు తీయాలి. నగర ప్రథమ మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ అంశంపై మేయర్ సుప్రీంకోర్టుకు వెళ్తారు, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై పోరాటం చేస్తాం. బీజేపీ నాయకులు, టీడీపీ నేతల అక్రమ కట్టడాల జోలికి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేఖర్ రెడ్డి పోటీ నుంచి విరమించుకుంటే లడ్డు భాస్కర్‌రెడ్డి డిప్యూటి మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. తిరుపతి వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు 70 మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఇలాంటి దుశ్చర్యలు చేస్తే మీకు తగిన బుద్ధి చెబుతాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనికి పదింతలు బదులు తీర్చుకుంటాం. గత పదేళ్ళలో ఏ రోజు మేం కూటమి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేయలేదు. చంద్రబాబు దాష్టిక పాలనపై ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారు. ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీని పాతాళానికి తొక్కివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’అని భూమన అన్నారు. -
కూటమి నేతల దౌర్జన్యాలకు తగిన గుణపాఠం చెబుతాం: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి నేతల ఉడత బెదిరింపులకు వైఎస్సార్సీపీ బెదిరే అవకాశమే లేదని హెచ్చరించారు పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి. కూటమి నాయకుల బెదిరింపులకు, దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని కౌంటరిచ్చారు. నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో శేఖర్ రెడ్డి సునాయాసంగా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మున్సిపల్ డిప్యూటీ మేయర్లు, చైర్మన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఫిబ్రవరి మూడో తేదీన తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి శేఖర్ రెడ్డిని వైఎస్సార్సీపీ తరపున బరిలో దింపుతాం. సౌమ్యుడైన శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే స్థానిక కూటమి నాయకులు ఫోన్లు చేసి బెదిరించారు. మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఎలా పోటీ చేస్తావ్ నీ అంతు చూస్తాం అని శేఖర్ రెడ్డిని బెదిరిస్తున్నారు.ఇలాంటి ఉడత బెదిరింపులకు వైఎస్సార్సీపీ బెదిరే అవకాశమే లేదు. కూటమి నాయకుల బెదిరింపులకు, దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం. నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో శేఖర్ రెడ్డి సునాయాసంగా గెలుస్తారు. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. మీరు భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు తిరుపతిలోనే ఉంటారు. ఆ సునామీని మీరు తట్టుకోలేరు’ అంటూ హెచ్చరించారు.మరోవైపు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని చంద్రబాబుపై కుప్పం వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందజేశారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఎన్నికల్లో ప్రజలను మోసం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో గ్రామ సచివాలయాలను నిర్మించారు, గ్రామ స్వరాజ్య పాలన సాగించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ వైఎస్ జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
పెద్దిరెడ్డిపై ఎల్లో మీడియా విషపు రాతలు.. భూమన స్ట్రాంగ్ కౌంటర్
-
విలువల్లేని ఎల్లో మీడియా.. వివరణ ఇచ్చినా విషం చిమ్ముతూనే ఉంది!
తిరుపతి, సాక్షి: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టీడీపీ అనుకూల మీడియా ఇస్తున్న కథనాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పని గట్టుకుని ఈ విష ప్రచారం చేయిస్తోందని ఆరోపించారాయన. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని ఎల్లో మీడియా ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విష ప్రచారం చేస్తోంది. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించక పోయినా ఉద్దేశ్య పూర్వకంగా మీ రాసిన చెల్లుతుంది విషం చిమ్ముతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన పనిగట్టుకుని అసత్య కథనాలు రాస్తున్నారు. తప్పుడు కథనలుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ కూడా విసిరారు. ఈ అసత్య ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(peddireddy ramachandra reddy) కడిగిన ముత్యంలా బయట పడతారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చకుండా మాపై విషం చిమ్ముతున్నారు. ఎల్లో మీడియా పత్రికలు కనీసం వివరణ ఇచ్చినా పత్రిక విలువలు పాటించడం లేదు. కూటమి ప్రభుత్వం పై మా పోరాటం చేస్తూనే ఉంటాం , ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది అనేది స్పష్టం అవుతోంది అని భూమన అన్నారు. -
సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు మాటమారుస్తున్నారు
-
బాబు అబద్ధాల బుద్ధుడు.. లోకేష్ కోసమే సంపద సృష్టి: భూమన
తిరుపతి, సాక్షి: సూపర్ సిక్స్ హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలపై బాబు యూటర్న్ ప్రకటనపై మంగళవారం ఉదయం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు.‘‘చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాజకీయమంతా లాక్కోవడమే. అధికారంలోకి వచ్చాక ప్రజాద్రోహమే చంద్రబాబు నైజం. ఏమాత్రం ప్రజల సంక్షేమం పట్టించుకోరాయన. అలాగే ఇప్పుడూ చంద్రబాబు కోట్లాది మందిని మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్‌పై నిందలు వేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతూ ఆచరణ సాధ్యం కాదని చెబుతూ కపట నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు ప్రజా ద్రోహం, ప్రజలకు పొడిచే వెన్నుపోటు ఎలా ఉంటుందో నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ అమలుకు పరిస్థితి లేదు అని, వృద్ధి రేటు 15% పెంచిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పడం దారుణం. .. చంద్రబాబు మోసపు హామీలు ఒంటి కన్ను నక్క కథ గుర్తుకు వస్తోంది. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు. కరోనా సమయంలో కూడా దేశంలో ఆదర్శంగా పాలన సాగించారు. కానీ, చంద్రబాబు మాత్రం ఒంటి కన్ను నక్కలా ఇప్పుడు హామీల గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఐదు లక్షల ఫించన్లు కట్ చేశారు. విధ్యుత్ చార్జీలు పెంచము అని చెప్పి రూ. 19 వేల కోట్లు ప్రజలు పై విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారు. తల్లికి వందనం కాస్త.. తల్లికి తద్దినంగా మారిపోయింది. అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది. ఆడబిడ్డ నిధి పథకం ఆడబిడ్డ ఏడుపు పథకంగా మారిపోయింది. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది.సంప్రదాయ దుస్తుల నిబంధన ఏమైంది?కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు, 4 సార్లు కొండపై ఎర్రచందనం దొరికింది. వీఐపీ దర్శన సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళాలి అనే నిబంధన గాలికి వదిలేశారు. విజిలెన్స్ వ్యవస్థ నిద్ర పోతోంది. అదనపు ఈవో వెంకన్న చౌదరి ఏం చేస్తున్నారు?. సనాతన ధర్మ ఉద్యమ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ దీనిపై మాట్లాడాలి.లోకేష్ కోసమే సంపద సృష్టి:రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలన సాగుతోంది. ఆయన ఈ ఏడు నెలల పాలనంతా వంచన, మోసం, దోపిడీతోనే సాగింది. తాను సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెబితే, అది లోకేష్ కోసమని జనం గుర్తించలేకపోయారు. బాబు మాటలను గుడ్డిగా నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు ప్రజల్లో చంద్రబాబు మీద తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ చరిత్రలో ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజల ముందుకు వెళ్లే ధైర్యముందా?. .. చంద్రబాబును మోసిన పవనాందుల వారు ఏం చేస్తున్నారు?. పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారు. చంద్రబాబు అబద్ధాల బుద్ధుడు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజల కోపాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కాకతప్పదు’’ అని భూమన అన్నారు. -
తిరుమల ఆలయ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా సంఘటనలు జరుగుతున్నాయి
-
‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’
తిరుపతి, సాక్షి: తిరుమలలో వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. రాత్రికిరాత్రే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) స్పందించారు. ‘‘అధికారంలోకి వచ్చాక తిరుమలపై పాప ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan kalyan) చెప్పారు. అయితే ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకొక పోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది. వరుస ఘటనలపై నిగ్గు తేల్చేందుకు అధికారిని కేంద్రం పంపుతామంది. కానీ, విజయవాడకు వచ్చిన అమిత్ షాను చంద్రబాబు, పవన్ బతిమిలాడారు. రాత్రికి రాత్రే నిర్ణయాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. హడావుడిగా ఇచ్చిన జీవోలో అధికారుల సంతకాలు లేవు’’ అని భూమన ఆరోపించారు. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం ఏదో ఒకటి జరుగుతోంది. అధికారుల అలసత్వంతో.. అవినీతితో విచ్చలవిడితనం కనిపిస్తోంది. బ్రహ్మాండనాయకుడి కొండపై మద్యం, బిర్యానీలు లభ్యమవుతున్నాయి. మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు అంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోంది. తిరుమలలో ఈ మధ్యకాలంలో నాలుగుసార్లు ఎర్రచందనం దొరికింది. మిమ్మల్ని చూసుకుని సప్లై చేస్తున్న దొంగలు ఎవరు? అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ ఏం చేస్తున్నారు?. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై కొండపై అరాచకాలు పెరిగిపోయాయి. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన(Jana Sena) నాయకులు టికెట్లు అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారు. ఇది దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు. సర్వ సాక్షి అయిన వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదు. ఆరుగురి మరణానికి కారకులెవరూ?‘‘క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామలయానికి పంపిన ఘనత మాది. మీ పాలనలో టీటీడీ పరువు తీశారు. వైకుంఠ దర్శనానికి వచ్చిన భక్తులను పశువుల దొడ్డిలో పడేశారు. తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరం. ఆ మరణాలకు బాధ్యులు ఎవరు?. ప్రమాదానికి కారకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్‌పై చర్యలు తీసుకోకుండా.. తూతూమంత్రంగా ఎస్పీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. పైగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. వైకుంఠ ఏకాదశి కు సునీత గౌడ అనే కర్ణాటక భక్తురాలు 70 లక్షలు ఖర్చు చేసి పుష్ప అలంకరణ చేస్తే బయట పెట్టేశారు. అక్షర మాయకు ఆ దేవుడే బదులిస్తాడుచంద్రబాబు పాపలపుట్ట కొండగా మారుతోంది. ఒక న్యూస్ చానల్ అధినేత బీఆర్ నాయుడు(BR Naidu)కు చైర్మన్ పదవి ఒక్కటే ప్రామాణికం కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ అసత్య ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీపై బురద జల్లాలని ప్రయత్నించారు. లడ్డూ వ్యవహారంలో సిట్ ఏం తేల్చింది?. ఇప్పుడు నెపాన్ని మా మీద నెట్టేసే పరిస్థితులు కూడా దాటిపోయాయి. ఈ అపచారాలకు భగవంతుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. చంద్రబాబు ఎల్లో మీడియా అక్షర మాయతో మాపై బురద చల్లితే.. విష్ణు మాయ ముందు చంద్రమాయ భస్మం కాక తప్పదు’’ అని భూమన అన్నారు. -
తిరుమలలో మద్యం, మాంసం
-
బాబు, పవన్.. తిరుమలలో ఏం జరుగుతోంది?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి సర్కార్ అధికారంలో ఉండగా జరుగుతున్నదేమిటి? అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందన్న భూమన.. చంద్రబాబు పాలనలో మద్యం, మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయని దుయ్యబట్టారు.‘‘శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యాని పట్టుబడిందంటే.. టీటీడీ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. మారణాయుధాలలతో వచ్చిన పట్టించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేశారు. టీడీపీ నాయకులు సేవలో టీటీడీ చైర్మన్ పని చేస్తున్నారు, భక్తులను పట్టించుకోవడం లేదు...తిరుమల కొండపై ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ 4సార్లు పట్టు బడ్డారు. 40 సార్లు పట్టుబడకుండా తప్పించుకు తిరిగి ఉంటారు. లడ్డూ ప్రసాదం విషయంలో మాపై నింద మోపారు. మాపై నేరారోపణలు చేశారు. సనాతన హిందూ ధర్మం కోసం పీఠాధిపతులు, హిందుత్వ సంఘాలు.. పవన్ కల్యాణ్, చంద్రబాబును ప్రశ్నించాలని కోరుతున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. -
YSRCP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయపోరాటం
గుంటూరు, సాక్షి: తిరుపతిలో పాలనాపరమైన వైఫల్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణిస్తే.. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టింది. ఈ పరిణామంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. ఈ విషయంలో ప్రభుత్వంపై న్యాయపోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. క్రౌడ్ మేనేజ్మెంట్లో ఘోర వైఫల్యానికి ముఖ్య కారణం ఎస్పీ సుబ్బారాయుడు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కోసం వేలమంది వస్తారని తెలిసి కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు. పైగా నిర్లక్ష్యంగా కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించి పక్కకు తప్పుకున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటారేమోనని అంతా అనుకున్నారు. అయితే.. తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన ఎస్పీ సుబ్బరాయుడును కేవలం ట్రాన్స్‌ఫర్‌తోనే సరిపెట్టింది ప్రభుత్వం. దీంతో.. ప్రభుత్వ వైఖరిపై న్యాయపోరాటం చేయాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఈ పోరాటంపై పార్టీ నుంచి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అవి పచ్చి అబద్ధాలు: భూమనహైందవ భక్తులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మాపై ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలు అన్ని పచ్చి అబద్ధాలు అని గుర్తించాలి. భక్తులు ప్రాణాలు కోల్పోతే లెక్కలేనితంగా ఈరోజు టీటీడీ వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ పై చర్యలు తీసుకోకుండా నామ మాత్రంగా బదిలీ చేసి. ప్రభుత్వం జాప్యం చేస్తోంది. టీటీడీ ఈవ, అడిషనల్ ఈవో, తిరుపతి జిల్లా ఎస్పీలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
బాబు బినామీలు బ్రోకర్ పనులు.. టీటీడీ అడిషనల్ ఈవోపై భూమన ఫైర్
-
నిజమైతే నిరూపించండి.. మంత్రి ఆనంకు భూమన సవాల్
సాక్షి, తిరుపతి: తిరుపతి తొక్కిసలాట(tirupati stampede)లో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సందర్భంగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) చేసిన అర్థం లేని ఆరోపణలపై వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) వీడియో ద్వారా ధీటుగా బదులిచ్చారు.భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే..:‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాపై చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయి. నిజానికి మీ నిర్వాకం వల్ల ఆరుగురు మరణిస్తే, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, జగన్‌పై ఆరోపణలు చేశారు. ఇది కచ్చితంగా మీరు స్థాయి దిగజారి మాట్లాడటమే. ఇంత హీనంగా మాట్లాడగలనని మీకు మీరు నిరూపించుకున్నారు. మీ మాటలతో తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులు, క్షతగాత్రులను దారుణంగా అవమానించారు’.‘తొక్కిసలాట బాధితులపై సానుభూతి చూపాల్సింది పోయి, పరామర్శించి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. మేం డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నామనడం రాజకీయం కాదా?. దీన్ని బట్టే ఎవరు రాజకీయం చేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. మీకు క్షతగ్రాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదని అర్థమవుతోంది. వారు మీ గురించి మాట్లాడలేదని మీరు ఇలా మాట్లాడుతారా? మీ అస్తిత్వానికి ఇబ్బంది వస్తుందని ఇలా ఆరోపణలు చేస్తారా?’.‘మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకోవడం దారుణం కాదా?. కనీస భధ్రత ఇవ్వాలని కూడా తెలియదా?. జగన్ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంతసేపు అక్కడెందుకు ఉన్నారు?. అది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా?. జగన్ ఆసుపత్రికి రాకుండా కుట్ర చేసిన మాట నిజం కాదా?’.ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా!‘మిమ్మల్ని తిట్టించడం కోసం మేం ఆస్పత్రిలో డబ్బులిచ్చామన్నది సీసీ కెమెరాలో రికార్డయిందని అంటున్నారు కదా?. ఆనం రామనారాయణ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. తొక్కిసలాట క్షతగాత్రులతో మిమ్మల్ని తిట్టించడం కోసమే మేము వారికి డబ్బులు ఇచ్చామంటున్నారు కదా!. ఒకవేళ అది నిజమైతే, మీకు నిజంగా దేవుడిపై భక్తి కలిగి ఉంటే మేం కేవలం మిమ్మల్ని తిట్టించడం కోసమే తొక్కిసలాట క్షతగాత్రులకు డబ్బులిచ్చినట్లు మీరు నిరూపించాలి. ఆ పని చేయలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి’.‘నిజానికి జగన్ వచ్చేవరకు మమ్మల్ని ఆసుపత్రి వైపు మీ పోలీసులు, అధికార గణం వెళ్లనీయలేదు. ఆ విషయం గుర్తుంచుకొండి. చంద్రబాబు పాలనపై ప్రజలకు ఏ అభిప్రాయం ఉందో ఇప్పటికే అందరికీ అర్థమవుతోంది. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా.. మీ పార్టీలో ఎవరూ గుర్తించడం లేదనే మీరు, ఇలా ఆరోపణలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది’’ అని భూమన పేర్కొన్నారు. -
మంత్రి ఆనంకు భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్
-
నిన్న తొక్కిసలాట సమయంలో 10 మంది పోలీసులు కూడా లేరు
-
తొక్కిసలాటకు చంద్రబాబుదే బాధ్యత: భూమన
తిరుపతి, సాక్షి: పోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) అన్నారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.నెలరోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు, పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ.ఇవాళ ఆయన పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ, నిన్న తొక్కిసలాట సమయంలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరు. తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలి... తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అనే వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడంతోనే తొక్కిసలాట జరిగింది. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం. తమిళనాడు శ్రీరంగం తరహాలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని.. రెండు రోజులు నుంచి పది రోజులకు పెంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. భక్తులకు మేలైన నిర్ణయాలే తీసుకున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అద్భుతంగా నిర్వహించాం. తిరుమల పవిత్రతను మేము కాపాడినట్లు ఇంతదాకా ఎవరు కాపాడలేరు. కానీ, టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయక్రీడా మైదానంగా మార్చేశారు. భక్తులకు నీళ్లు, ఆహారం లేవు.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మీరు చేస్తున్న తప్పులకు, భక్తులకు కష్టాలు పడుతున్నారు. పశువులను మందలో తోసినట్లు భక్తులను క్యూ లైన్లలో తోసిపారేశారు. ఇది ప్రభుత్వ తప్పిదం కారణంగా జరిగిన ఘటన. ప్రభుత్వం చేసిన హత్యలే. అందుకే మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. క్షతగాత్రులకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్(Pawan kalyan) ఇప్పుడేం మాట్లాడతారు?. లడ్డూ విషయంలో వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేశారు. గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో ఇద్దరు అభిమానులు చనిపోతే , రోడ్డు బాలేదని మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలకు, చేసే చేతలకు పొంతన లేదు. తిరుమలను, దేవుడిని చంద్రబాబు తన రాజకీయాల కోసం పావుగా వాడుకుంటున్నారు.దేవుడితో పెట్టుకుంటే ఆయనే చూస్తాడు అంటూ చంద్రబాబు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది, లడ్డు ప్రసాదంతో రాజకీయ ఆటలు ఆడితే స్వామి చూశారు. టీటీడీ చైర్మన్ ను కనీసం ఈవో, అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి కు చంద్రబాబు సేవ తప్పా, భక్తులు సేవ లేదు. బ్రేక్ దర్శనాలు 7 వేలకు పైగా ఇస్తున్నారు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి కూడా ఘటనకు బాధ్యత వహించాలి. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయిలో పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరిలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ను ఏవిధంగా అరెస్టు చేయించాలి అనే కుట్రలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి పై ఏడుపే తప్ప, పాలన లేదు. తిరుపతి తొక్కిసలాట ఘటన.. ప్రభుత్వం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం’’ అని భూమన అన్నారు.ఇదీ చదవండి: ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం! -
మళ్లీ జగన్‌ను సీఎం చేయడమే నా లక్ష్యం!
-
వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాడి.. భూమన సీరియస్ వార్నింగ్..
-
వైఎస్సార్సీపీకి ఓటేస్తే దాడులు చేస్తారా?: భూమన
సాక్షి, తిరుపతి: ఏపీలో వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దళితుల ఇళ్లపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేయాడం అమానుషమని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదన్నారు. బాబు అధికారంలో ఉన్న ప్రతీసారీ ఇదే జరుగుతోందన్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘నగరి మండలం తడుకుపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దళితులు ఇళ్లపై దాడి, వాహనాలు ధ్వంసం అమానుషం. చుండూరు, కారంచేడు ఘటనల్ని తలపించేలా తడుకుపేట ఘటన జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులపై కూడా ఇదే తరహాలో దాడులు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదు’ అంటూ బాబు సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు, తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘తడుకుపేట దళితులపై దాడి ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టి కు తీసుకువెళ్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువ అయ్యాయి. దళిత హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబూ.. అప్పులేనా నీ సంపద సృష్టి: రోజా
సాక్షి, తిరుపతి: సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని కామెంట్స్ చేశారు.నేడు నగరిలో వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి రోజా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డప్ప, సహా పలువురు పార్టీ నేతలు, కార్తకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నగరి నియోజకవర్గంలో భవిష్యత్తు కార్యచరణపై సమావేశంలో చర్చించారు. అనంతరం, నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘మా గురువు కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన నగరి మరింత నూతన ఉత్తేజం కలిగిస్తుంది. కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్ల వైఎస్సార్సీపీ ఓడిపోయింది. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపారు. ఆరు నెలలకే నరకం చూపిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయి.సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారు. ప్రజలు వైఎస్సార్సీపీ కావాలని నేడు బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసింది. పచ్చ బట్టలేసుకుని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. నేడు నరకం చూపిస్తుంది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ నాడు-నేడు ద్వారా స్కూల్స్ అద్భుతంగా మార్చారు. కానీ కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేసింది. రాష్ట్రాన్ని మద్యంధ్రప్రదేశ్గా చేసింది. వైఎస్ జగన్‌ను ఓడించాలని ఉద్యోగులు కంకణం కట్టుకున్నారు. నేడు ఎందుకు చంద్రబాబును గెలిపించామా? అంటు బాధపడుతున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి అందరికి అండగా ఉన్నారు. నియోజకవర్గంలో నేను, జిల్లాలో కరుణాకర్ రెడ్డి, రాష్ట్రంలో వైఎస్ జగన్ మనకు అండగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం భయబ్రాంతులకు భయపడకండి.. రాబోయేది మన ప్రభుత్వమే. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో.. వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. విద్యుత్ బిల్లుపై రేపు నిరసన ఉంటుంది. జనవరిలో విద్యార్థులకు అండగా పోరాడాలి. పచ్చ చానల్స్ అబద్దాలు చెప్పడం తప్ప ఇంకొకటి ఉండదు. ప్రజల సమస్యలు, మహిళల సమస్యలు అందరికీ తెలియజేయాలన్నారు.భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వం, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నేడు మొదటి సర్వసభ్య సమావేశం ఇది. రోజా నగరికి రాజా లాంటి వ్యక్తి. రోజా కొమ్మకే కాదు, పువ్వులు కూడా ముళ్లు ఉంటాయి. రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న నాయకురాలు. వైఎస్ జగన్ మనసులో చెల్లిగా స్థిరపడ్డారు రోజా. అత్యధిక మెజారిటీతో రోజాను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. నగరి అభివృద్ధి చేసిన వ్యక్తి రోజా.. అందుకే గెలిపించాలని కోరుతున్నాను. ప్రపంచంలో వైఎస్ జగన్ వంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఆయనో గొప్ప వ్యక్తి. ఎవరో పనికిమాలిన వారి కింద పని చేయడం కంటే.. ఉద్యమాల నుండి పుట్టిన వైఎస్సార్సీపీలో ఉండటమే ఎంతో మేలు. ఏ ఒక్క కార్యకర్తలో చిన్న భయం ఉన్నా తొలగించుకోండి. కూటమి, తెలుగుదేశం పార్టీకి ఇక మనుగడ లేదు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి.. నెరవేర్చని మోసపు ప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెలికిస్తాం అంటూ కామెంట్స్ చేశారు.ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి బెదిరింపులకు బెదిరేది లేదు. వైఎస్ జగన్ కోసం పోరాడే వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం, ప్రాధాన్యత ఉంటుంది. మనమందరం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఏ ఒక్కరికి కష్టం ఇచ్చినా కరుణాకర్ రెడ్డి, మేము అండగా ఉంటామన్నారు.మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ..‘భూమన కరుణాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమ నాయకుడు. టీటీడీ చైర్మన్‌గా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ప్రజల అందరు పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈవీఎంల స్కామ్ వల్లే కూటమి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ఈవీఎంల స్కామ్ చేశారు. అందుకే వైఎస్సార్సీపీకి ఓటమి ఎదురైంది. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. అప్పుల మీద అప్పులు చేస్తోంది. నగరిలో రోజాను గెలిపించండి. మీకు మేము అండగా ఉంటాం’ అని కామెంట్స్ చేశారు. -
పవన్ పై భూమన ఫైర్
-
భూమన గూస్బంప్స్ స్పీచ్ దద్ధరిల్లిన తిరుపతి
-
YSRCP నేతలే లక్ష్యంగా దాడులు
-
చంద్రబాబు కళ్ళుమూసుకోవడం వల్లే.. తిరుపతిలో పబ్‌ల తలుపులు తెరుస్తున్నారు..
-
కూటమి ప్రభుత్వంలో లుకలుకలు.. పవన్ దెబ్బ.. తగ్గిన బాబు
-
రైతుల తరపున పోరాడతాం: భూమన
సాక్షి,తిరుపతి:కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తామని చెప్పి మోసం చేసిందని, చంద్రబాబు మొదటి నుంచి రైతు వ్యతిరేకి అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.‘అన్నదాతకు అండగా’ పేరుతో ఈ నెల 13 నుంచి వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాల పోస్టర్‌ను భూమన మంగళవారం(డిసెంబర్10) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం చేస్తామని,వరికి మద్దతు ధర ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలయినా రైతులను పట్టించుకోక పోవడం దారుణం.20 ఏళ్ల క్రితమే చంద్రబాబు రైతు వ్యతిరేకి, ఉచిత కరెంటు ఇస్తామని ఆనాడు వైఎస్సార్ చెబితే హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు.రూ.86 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని 2014లో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఈనెల 13న తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముందు నేతలు ఆర్కే రోజా, అభినయ్,మోహిత్,రాజేష్,మధుసుధన్‌రెడ్డితో కలిసి నేను నిరసనలో పాల్గొంటా. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పూతలపట్టు పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్,విజయానందారెడ్డి కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. విద్యుత్ చార్జీలు పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిరసన కార్యక్రమాలు చేపడతాం. డిస్కంల ఎదుట ఆందోళన చేస్తాం’అని భూమన తెలిపారు. -
కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది : భూమన
-
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా తప్పుడు కేసులు: భూమన
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారని తెలిపారు. బాధితురాలిని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు.ఆపదలో ఉంటే చెవిరెడ్డే ఆదుకున్నారు: బాధితురాలి తండ్రి మేము చెవిరెడ్డిపై ఎలాంటి పోక్సో, ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టలేదని.. తనకు చదువు రాదని కాగితాలపై పోలీసులే సంతకాలు పెట్టించుకున్నారని బాధితురాలి తండ్రి తెలిపారు.ఆపదలో ఉంటే చెవిరెడ్డే మమ్మల్ని ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఆదుకున్నవారిపై మేము కేసు పెడితే మహాపాపం అని బాధితురాలి తండ్రి అన్నారు. -
‘ఐ-టీడీపీతో లోకేష్ చేయిస్తున్న పనే ఇదంతా’
సాక్షి, తిరుపతి: ఏపీలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ-టీడీపీ నీచపు పోస్టులు చేసిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తోంది. కూటమి కార్యకర్తలు, మద్దతుదారులు.. మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌పై, నాయకులపై అసహ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఐ-టీడీపీ ద్వారా వాళ్లే సృష్టించి, అది మాపై నెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా అమాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఐ-టీడీపీ ద్వారానే చాలా పోస్టులు వచ్చాయి. వాటిపైనే ఫిర్యాదు చేశాం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారికి రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి. కానీ, ఇవ్వకుండా మాతో దారుణంగా వ్యవహరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలించినట్లు ఉంది. చంద్రబాబు, పవన్ పాలనలో అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. వైఎస్సార్సీపీ హయాంలో వేల సంఖ్యలో మహిళలు, యువకులు మిస్ అయ్యారని అబద్ధపు ప్రచారం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. కేవలం 36 మందే అని తేలింది. ఇది హోంమంత్రే బయటకు చెప్పారు.చంద్రబాబు తప్పు చేసి ఎదుటివారిపై రుద్దుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు.. మీరెంత?. తప్పు చేయని వారిని వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌తో నెట్టుకొస్తున్నారు. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు. మేము ఫిర్యాదు చేస్తే రిసీవ్డ్ కాపీ ఇవ్వడానికి వందసార్లు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. పోలీసులు.. మీ నెత్తిపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చెసే విధంగా ప్రవర్తించండి’ అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘మేం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు గంటల కొద్ది నిలబెట్టి ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడారు. మాకు ఉన్న ప్రోటోకాల్‌ను విస్మరిస్తే కచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేస్తామని హెచ్చరిస్తున్నాను. ప్రజా గొంతుకలను నొక్కే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం తప్పదు.మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. మేము ఐ-టీడీపీపై ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు కేసు తీసుకోవడం లేదు. ఇంతటి దారుణమైన పోస్టులు పెడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోరా?. అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఐ-టీడీపీ పోస్టులు పెడుతున్నా చర్యలు లేవు. ఏపీలో రాజ్యాంగ హక్కులు కాలరాశారు. పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. మేం ఎలాంటి బెదిరింపులకు లొంగ. చంద్రబాబు మీ కూటమి పార్టీల పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు త్వరలో ఉంది అని హెచ్చరించారు. -
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో సీఎం చంద్రబాబు దిట్టా
-
చంద్రబాబు తీరే అంత.. : భూమన
తిరుపతి, సాక్షి: సొంత డబ్బా కొట్టుకోవడంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు దిట్ట అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఓవైపు ప్రజలను మోసం చేస్తూనే.. వైఎస్సార్సీపీకి సానుభూతిపరులెవరూ ఉండకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారాయన.సాధ్యంకాని హామీలిచ్చి టీడీపీ-జనసేన కూటమి ప్రజలను మోసం చేసింది. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ చెప్పిందే సత్యమని ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్‌పై విమర్శలు చేస్తున్నారు.ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ఒక చరిత్ర.. కొన్ని నిజాలు పుస్తకం నుంచి చంద్రబాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను భూమన మీడియాకు చదివి వినిపించారు. -
శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ కూడా..
-
ఏపీలో రోజుకో అఘాయిత్యం.. ఆడపిల్లలకు రక్షణ ఏదీ?: భూమన
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు భద్రత కరువైందని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో రోజుకో అఘాయిత్యం వెలుగులోకి వస్తున్నాయన్నారు. మెటర్నిటి ఆసుపత్రి బాధితురాలిని పరామర్శించేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదన్నారు.కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులు నడిపిన పల్సర్ వాహనంపై పవన్ కళ్యాణ్ స్టిక్కర్ ఉంది. దీనిపై కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలి. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ద్వారా ఏరులై పారుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోండి. ప్రతిపక్షాల పార్టీలు పై విమర్శలు చేయడం మానుకోండి. శాంతి భద్రతలు కాపాడండి’’ అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు.ఇదీ చదవండి: మరో బాలికపై అఘాయిత్యం!కాగా, తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై హత్యాచార ఘటనను మరువకముందే.. సోమవారం మరో బాలికపై దారుణం జరిగిందిన సంగతి తెలిసిందే. గాయాల పాలై ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో మూలుగుతున్న బాలికను గుర్తించిన తండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక సమీపంలోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. -
కలిసికట్టుగా ఉద్యమిద్దాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఏపీలో మాఫియా రాజ్యమేలుతోంది. ఈ రాక్షస పాలనలో ప్రజలకు అండగా నిలబడదాం. కలిసికట్టుగా ఉద్యమిద్దాం. కూటమి అరాచకాలపై తిరుపతి నుంచే తిరుగుబాటు చేద్దాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ హామీలని చెప్పి చంద్రబాబు మోసం చేస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతోందని, మద్యం దుకాణాలు తెరవక ముందే టీడీపీ నేతలు దుకాణాలు తెరిచారని విమర్శించారు.ప్రజలు బంగారు పళ్లెంలో పెట్టి మనకు తిరిగి అధికారం ఇస్తారన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే సహించనని చెప్పిన పవన్‌కళ్యాణ్ ఈరోజు ఎక్కడ ఉన్నారని ప్రశి్నంచారు. ఇది ‘ఈవీఎం’ ప్రొడక్షన్స్ వారి సీబీఎన్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా భూమన కరుణాకరరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు: విజయసాయిరాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం కాదని అన్నారు. ప్రజలకు సేవచేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు భూమన అని అన్నారు. తిరుపతి నగరం గత ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందని.. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని.. 2027 ఆఖర్లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించేందుకు భూమన కృషి చేస్తారని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలకు సంక్షేమం దూరమైంది: వైవీ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించారని గుర్తుచేశారు. నేడు ప్రజలు సంక్షేమ పథకాలు అందడంలేదని.. అభివృద్ధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మరింత గుర్తింపు ఇస్తామని, 2027లోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయన్నారు. మళ్లీ జగన్‌ను సీఎం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. తొలిరోజు నుంచే అరాచకాలు: సజ్జల చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నాటి నుంచే రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఓ మాఫియా రాజ్యం ఏలుతోందని.. అభివృద్ధి సంక్షేమం ఎక్కడా కనిపించడంలేదన్నారు. 4 నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.వైఎస్ జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోషపడ్డారని.. అయితే వాటిని జగన్ విలాసం కోసం కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో సీఎం చంద్రబాబు రూ.53వేల కోట్లు అప్పుచేశారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయని ప్రశి్నంచారు. ఇకపోతే.. బలమైన కార్యకర్తల పారీ్టగా ఈసారి అధికారంలోకి వస్తున్నామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కష్టాల్లోనే వైఎస్ కుటుంబానికి మరింత అండగా.. : భూమన చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భూమన మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలు చేసే సమయంలో తాను తుపాకి కాల్పుల వరకు వెళ్లి వచ్చిన వాడినని, చంద్రబాబుని ఢీకొనడం అంటే బెండుతో ఢీకొనడడం లాంటిదేనన్నారు. వైఎస్సార్ కుటుంబం అధికారంలో ఉన్నప్పటి కంటే.. కష్టాల్లో ఉన్నప్పుడు మరింత అండగా నిలబడతానని భూమన స్పష్టంచేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 25 ఏళ్ల యువకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఓడించడానికి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు చంద్రగిరిలో రంగంలోకి దించారని.. లోకేశ్ 6 రోజులు పాదయాత్ర చేసి మోహిత్ ఓటమి కోసం పనిచేశారని గుర్తుచేశారు. -
EVM ప్రొడక్షన్ వారి CBN ప్రభుత్వం: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు పాలనలో పవన్ కల్యాణ్ నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడా?. ప్రశ్నిస్తాను అంటూ బిల్డప్ ఇచ్చిన పవన్ ఇప్పుడు ఏమైపోయాడని ప్రశ్నించారు. తొక్కి నారతీస్తామని చెప్పిన పవన్‌కు ప్రజలే నొక్కి తాట తీస్తారని వార్నింగ్ ఇచ్చారు.చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఈ జిల్లా వ్యక్తి అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నాం. సూపర్ సిక్స్ కాదు, సూపర్ చీటింగ్ చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనం అండగా నిలవాలి. కూటమి ప్రభుత్వం మెడలు వంచాలి. తప్పుడు ప్రచారం వల్ల మనం ఓడిపోయాం. సూపర్ సిక్స్ అమలు కావడం లేదు. సంక్షేమ పథకాలు లేవుచంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఏవీఎం బ్యానర్లో ఎన్నో పెద్ద పెద్ద హిట్ సినిమాలు తీశారు. రాష్ట్రంలో ఈవీఎం ప్రొడక్షన్ వారి సీబీఎన్ ప్రభుత్వం కొనసాగుతోంది. సూటిగా ప్రశ్నిస్తున్న.. రెడ్ బుక్ అంటూ మీ కొడుకు ఏవిధంగా వేధిస్తున్నాడో చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. విజయవాడ నగరం నీట ముంచేశారు. పులిహోర పొట్లాలకు 360 కోట్లు ఖర్చు చేశారు. దాని పేరుతో డబ్బులు దోచుకున్నారు.ప్రశ్నించే పార్టీ అని చెప్పిన పవన్ ఇప్పుడేం చేస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు?. దారుణాలపై ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు. తొక్కి నారతీస్తామన్న పవన్‌ను ప్రజలే నొక్కి తాట తీస్తారు. ఈ రాక్షస పాలన అంతం చేయాలి. ఈరోజు నుంచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకువెళ్దాం. మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి కృషి చేయాలి. కుల మతాలకు అతీతంగా వైఎస్ జగన్ కృషి చేశారు. -
ఏపీపై చంద్రబాబుకు ఏమాత్రం మమకారం లేదు: సజ్జల
సాక్షి, తిరుపతి: ఏపీ మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. రుషికొండపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టించిన భవనం చూసి చంద్రబాబు సంతోషపడ్డారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రుషికొండపై ఉన్న భవనం వైఎస్ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండి అని కామెంట్స్ చేశారు.చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయి. ఒక మాఫీయ రాజ్యం ఏలుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తున్నారు. పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నాలుగు నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. మనం చూస్తూనే ఉన్నాం. అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఏదో రాద్దాంతం చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారువైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ కట్టడాలు చేయలేదు. కరకట్ట అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారు. వైఎస్ జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోపడ్డారు. వైఎస్ జగన్ విలాసం కోసం కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రుషికొండపై ఉన్న భవనం వైఎస్ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండి. ఇప్పటికైనా చంద్రబాబు తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. అసెంబ్లీ భవనాలు చూస్తే నీ పాలన అర్థం అవుతుంది. వైఎస్ జగన్ చేసిన వేల కోట్ల సంక్షేమంతో నీవు పోల్చుకోగలవా చంద్రబాబు?. సూపర్ సిక్స్ ఎక్కడా అమలు లేదు. ఈ ఐదు నెలల్లో 53వేల కోట్లు అప్పు చేశాడు. చంద్రబాబు ప్రతీరోజు అప్పు చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి. వైఎస్ జగన్ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయి.ఈ నేలపై చంద్రబాబుకు ఏ రోజు మమకారం లేదు. ఎన్నికలు కూడా త్వరగా వచ్చేట్లు ఉన్నాయి. పటిష్టమైన కార్యకర్తలతో పార్టీని సిద్ధం చేస్తున్నాం. ఇదే మా తొలిఅడుగు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో మరింత బలోపేతం చేస్తాం. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం అని చెప్పారు. -
Watch Live: జిల్లాల అధ్యక్షునిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
-
వచ్చే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం సాధిస్తాం : ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,తిరుపతి : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొ న్నారు. ఇవాళ(ఆదివారం) చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు, ప్రజలకు సేవలు చేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలం ప్రజలకు తీసుకువెళ్ళిన నాయకుడు భూమన కరుణాకరరెడ్డి.తిరుపతి నగరం గత ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. ‘2027 చివరిలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం సాధిస్తాం. ఆ ఎన్నికల్లో భూమన కరుణాకరరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపిస్తారు’ అని అన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది : సజ్జల రామకృష్ణ రెడ్డిచంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయిఒక మాఫీయ రాజ్యం ఏలుతున్నారుఅభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదురాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తున్నారుపార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు4 నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. మనం చూస్తూనే ఉన్నాంఅడ్డంగా దోచుకుని జేబులు నింపు కుంటున్నారువ్యక్తిత్వ హననం చేస్తున్నారుమదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఏదో రాద్దాంతం చేశారుతిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారువైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్రమ కట్టడాలు చేయలేదు. కరకట్ట అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారువైఎస్ జగన్ కట్టించిన ఋషి కొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోపడ్డాడుఅసెంబ్లీ భవనాలు చూస్తే నీ పాలన అర్థం అవుతుందివైఎస్ జగన్ చేసిన వేల కోట్ల సంక్షేమంతో నీవు పోల్చుకోగలవా చంద్రబాబుసూపర్ సిక్స్ ఎక్కడా అమలు లేదుఈ ఐదు నెలల్లో 53వేల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబురోజు అప్పు చేస్తున్నాడు చంద్రబాబు, ఏమై పోతున్నాయివైఎస్ జగన్ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయిపార్టీ బలోపేతానికి,జవసత్వాలు పార్టీ నిర్మాణం చేస్తాంబలమైన పార్టీ కార్యకర్తలు పార్టీగా ఈసారి అధికారంలోకి రాగానే చేస్తాంఈ నేలపై చంద్రబాబుకు ఏ రోజు మమకారం లేదు ఎన్నికలు కూడా త్వరగా వచ్చేట్లు ఉన్నాయిపటిష్టమైన కార్యకర్తలతో పార్టీని సిద్ధం చేస్తున్నాం. ఇదే మా తొలిఅడుగుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో మరింత బలోపేతం చేస్తాంరానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయంరాబోయే రోజుల్లో అన్ని స్థానాలు గెలిచి తీరుతాం : ఎంపీ వైవీ సుబ్బారెడ్డివైఎస్ జగన్ ఎన్నో అభిృవృద్ధి చారిత్రాత్మక కార్యక్రమాలు చేశారుఈరోజు ప్రజలు కు సంక్షేమం దూరం అయిందిసిక్స్ ప్యాక్ హామీలు అని చెప్పి మోసం చేశారు చంద్రబాబుడైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబుదేవుడును కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకున్నారో చూశాంవిశాఖకు వెళ్ళి ఋషి కొండ నిర్మాణలు చూస్తున్నారుసంపద సృష్టిస్తున్నాం అంటూనే..16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంపద సృష్టిస్తే , ప్రవేట్ పరం చేస్తున్నారు చంద్రబాబురాష్ర్ట వ్యాప్తంగా 4 పోర్టులు నిర్మాణము చేస్తే చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారురాబోయే రోజుల్లో కార్యకర్తలు మరింత గుర్తింపు ఇస్తాం2027 లోనే జమీలి ఎన్నికలు రాబోతున్నాయిమళ్ళీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం. తిరుపతి నగరం ఎంతో అభివృద్ధి చేసిన ఘనత భూమన దేదివంగత నేత వైఎస్సార్‌తో పాదయాత్రలో పాలు పంచుకున్న నేతలు ఈ స్టేజిపై భూమన కరుణాకరరెడ్డి, అంబటి రాంబాబుభూమన కరుణాకరరెడ్డి జీవితం అంతా వైఎస్ఆర్ కుటుంబం తోనే..ఆయనలో ఉన్న నాయకత్వ పటిమ రాబోయే...రోజుల్లో అన్ని స్థానాలు గెలిచి తీరుతాంప్రజా ఉద్యమం తిరుపతి నుంచే ప్రారంభమైంది : తిరుపతి ఎంపీ గురుమూర్తి,క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ప్రజా ఉద్యమం తిరుపతి నుంచే ప్రారంభం అయ్యిందిరెడ్ బుక్ పాలన, చాప్టర్ 1, చాప్టర్ 2, 3 పేరుతో ప్రజలను , వైఎస్సార్సీపీ శ్రేణులును ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నాంభూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలో అన్ని స్థానాలు గెలిచి తీరుతాంప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం: చెవిరెడ్డి మోహిత్ రెడ్డిభూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో మరింత ఐక్యంగా పనిచేస్తాంకూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాంఆదర్శ నగరంగా తిరుపతి : విజయనంద రెడ్డి, చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జిపార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేస్తాంభూమన కరుణాకరరెడ్డి తిరుపతి నగరం అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపారుఐక్యమే మన బలం, మన ఆయుధం: అంబటి రాంబాబుభూమన కరుణాకరరెడ్డి అద్బుత పుస్తక పఠన శక్తి ఉన్న నాయకుడుఉమ్మడి చిత్తూరు జిల్లా లో అన్ని స్థానాలు గెలుపుకు కృషి చేస్తారుదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డిప్రజాస్వామ్య దేశం లో గెలుపు ఓటములు సహజంఐక్యమే మన బలం, మన ఆయుధంప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతుందిమద్యం దుకాణాలు తెరవక ముందే టిడిపి నేతలు దుకాణాలు తెరిచారువీటి అన్నింటినీ ప్రజలు దృష్టికి తీసుకువెళ్లాలి.. ప్రజలు బంగారు పళ్ళెంలో పెట్టీ మనకు అధికారం ఇస్తారుపవన్ కళ్యాణ్ మహిళలకు అన్యాయం జరిగితే సంహించను చెప్పిన వ్యక్తి ఈరోజు ఎక్కడరోజుకో హత్య , అత్యాచారం జరుగుతోందిచంద్రబాబు పాలనలో ఏమి జరిగినా ప్రశ్నించరా.. మీ నోటికి ప్లాస్టర్ తీయండిమీ బాధ్యత గుర్తు చేస్తున్నాంసీపీఐ, సీపీఎంతో పవన్ పొత్తు పెడితే చేగువేరా గుర్తుకు వస్తాదిబిజెపితో పొత్తు లో భాగంగా సనాతన ధర్మం గుర్తుకు వస్తుందిచంద్రబాబు ఋషి కొండ భవనాలు చూసి ఆశ్చర్య పోతున్నదుచంద్రబాబు ఈ భవనాలు చూసి సిగ్గు పడాలిజగన్ మోహన్ రెడ్డి ఈరోజు కాలర్ ఎగరేసుకుని చెప్పండి రుషికొండ అద్భుత భవనాలు కట్టాడు అని చెప్పండిఋషి కొండ లో ప్రభుత్వ భవనాలు కడితే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారుశర వేగంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతోందిరెడ్ బుక్ కు మా కుక్క కూడా భయ పడదుయువతరం ఈరోజు ముందుకు వచ్చిందిచంద్రబాబు సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని స్థానాలు గెలుస్తుందిఐక్యత మన ఆయుధం, విజయమే మన లక్ష్యంరాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి25 ఏళ్ల చిన్న వయస్సు యువకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ను ఓడించడానికి అన్ని పార్టీలు కృషి చేశారు25 ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రగిరిలో చంద్రబాబు రంగంలోకి దించారుఆరు రోజులు లోకేష్ పాదయాత్ర చేసి మోహిత్ ఓటమికోసం పనిచేశాడుచిన్న యువకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ను ఓడించడానికి ఇన్ని కుట్రలు చేశారుచంద్రగిరి నియోజకవర్గం లో ఈరోజు 25 మంది ఎమ్మెల్యేలు పాలిస్తున్నారు విద్యార్థి దశ నుంచే భూమన నాయకత్వం పటిమ చూపారు: డాక్టర్ శిరీష, మేయర్ తిరుపతికరోనా సమయంలో మూడు సార్లు కరోనా బారిన పడ్డా వెనకడు వేయలేదుకరోనా సమయంలో అనాథ శవాలను దహనం చేసారు, సాక్షాత్తు దేశ ప్రధాని మోది నుంచి ప్రశంశలు అందుకున్నారు భూమన కరుణాకరరెడ్డిమేయర్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించారుజిల్లా అధ్యక్షుడు గా ఆయన నాయకత్వం లో పనిచేస్తాంకోరుముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కామెంట్స్..జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి కుటుంబం ఆలోచన చేస్తోందికష్టకాలంలో అండగా నిలిచే వ్యక్తి భూమన కరుణాకరరెడ్డికేటీఆర్ నాతో ఒక మాట అన్నారు.. దేశంలో 40 శాతం ఓటు వచ్చి ఓటమి చెందడం బాధగా ఉంది అన్నారు40 శాతం ఓటింగ్ వచ్చిన నాయకుడు జగన్మోహన్రెడ్డిరాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏవిధంగా ఉందో ప్రజలు అందరికీ తెలుసు: నారాయణస్వామిసజ్జలు రామకృష్ణా రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారుజగన్ మోహన్ రెడ్డి ఒక్కరే పార్టీచంద్రబాబు బీసీ లకు ఎప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వలేదు, జగన్ మోహన్ రెడ్డి రాజ్య సభ సీటు ఇచ్చారుఈరోజు వాళ్ళు అమ్ముడు పోయారుకార్యకర్తలు మనోభావాలు దెబ్బతీయొద్దుచంద్రబాబు ఎదిరించే వాళ్ళు లేరు అంటున్నారు ఎల్లో మీడియా..ఎన్టీఆర్ లాంటి వాళ్ళనే నిలువునా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబుమేనేజ్ మెంట్ లో దిట్ట చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ, బిజెపి, విజయమ్మ, షర్మిలమ్మ ను మేనేజ్ చేస్తున్నాడుసారాయి ఇస్తాను అని చెప్పి, వీధి వీధి కు అమ్మకం చేస్తున్నారు చంద్రబాబుదేశంలో 51 శాతం ఓటు వచ్చి గెలిచిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి, 40 శాతం ఓట్లు వచ్చి ఓడిన ప్రజలు వెన్నంటే ఉన్నారుసర్వేలు చేయొద్దు , పేద వాడికోసం పాటుపడుతున్న జగన్ మోహన్ రెడ్డి కు అండగా నిలుద్దాంసనాతన ధర్మం గురించి మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఎంతో అధ్బుతంగా చెప్పారు, యూట్యూబ్ లో చూడండిసనాతన ధర్మం అంటే ఏమిటి అనేది పవన్ కళ్యాణ్‌కు పూర్తిగా తెలీదు చంద్రబాబు ఈ జిల్లా వాడని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాం: ఆర్కే రోజాసూపర్ సిక్స్ కాదు, సూపర్ చీటింగ్ చేస్తున్నాడుజగన్ అన్న మనకు అండగా నిలవాలికూటమి ప్రభుత్వం మెడలు వంచాలితప్పుడు ప్రచారం వల్ల మనం ఓడి పోయాముచంద్రబాబు చెప్పిన ఉచితం లో ఉచితం లేదు..చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టాడు అంటే జిల్లా ప్రజలు సిగ్గు పడాలిసూటిగా ప్రశ్నిస్తున్న.. రెడ్ బుక్ అంటూ మీ కొడుకు ఏవిధంగా వేధిస్తున్నడో చూస్తున్నాంచంద్రబాబు పాలనలో నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్సూపర్ సిక్స్ అమలు కావడం లేదుసంక్షేమ పథకాలు లేవురాష్ట్రంలో మహిళలు , చిన్నారులు పై అత్యాచారాలు జరుగుతున్నాయివిజయవాడ నగరం నీట ముంచేశారు చంద్రబాబుపులిహోర పొట్లాలు కు 360 కోట్లు ఖర్చు చేశారు అని దోచుకున్నారుచంద్రబాబు విష ప్రచారం వల్లనే ఓటమి చెందాము,ఈ రాక్షస పాలన అంతం చేయాలిఈరోజు నుంచి రెట్టించిన ఉత్సాహం దూసుకు వెళ్దాంప్రశ్నించే పార్టీ అని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారుతొక్కి నారతీస్త మని చెప్పిన పవన్ కళ్యాణ్ కు ప్రజలే నొక్కి తాట తీస్తారుజగన్ మోహన్ రెడ్డి ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి కృషి చేయాలికుల మతాలకు అతీతంగా జగన్మోహన్రెడ్డి కృషి చేశారునేను కార్యకర్తలు మనిషిని: భూమన కరుణాకరరెడ్డిచంద్రబాబు నాయుడుతో ఢీ కొట్టడము అంటే ఎప్పుడు సిద్ధమేకార్యకర్తలు కోసమే నిలబడతానునేను గ్రూపులు కట్టడానికి రాలేదు.. ఒక నేతగా కాదు.. కార్యకర్తలకు అండగా నిలుస్తానునియోజకవ్గంలో ఇన్చార్జి కు అనుగుణముగా పనిచేస్తావైఎస్.రాజారెడ్డి శిష్యుడిగా .. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నడిచిన వాడిని, వైఎస్ జగన్మోహన్రెడ్డితో పనిచేస్తున్న వాడినిఅహంకారంతో పనిచేయను అని ప్రమాణం చేస్తున్నావైఎస్ఆర్ కుటుంబం తో 49 ఏళ్లుగా పనిచేస్తున్నావయసు సడలుతున్నా.. మొక్కవోని ధైర్యంతో పనిచేస్తాజగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సిఎంగా పని చేస్తాపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలు, సలహాలు, పాటిస్తూ మందుకు వెళ్తానుఅనివార్య కారణాల వల్ల ఈ సమావేశం కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూరంగా ఉన్నారు.. ఆయన ఒక సందేశం పంపించారుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యారాయణ సందేశంలను చదివి వినిపించిన భూమన కరుణాకరరెడ్డిఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఒక సందేశం పంపించారుఎల్లో మీడియా దీనిపై విష ప్రచారం చేస్తోందిరాజకీయమే నాకు ఊపిరినేను కార్యకర్తగా ఉంటాను, పార్టీ పటిష్ఠం వేగవంతం చేయడానికి పనిచేస్తాజగన్ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా -
తిరుపతి, చిత్తూరు జిల్లాల YSRCP అధ్యక్షుడిగా భూమన బాధ్యతలు
-
అసమర్ధ ప్రభుత్వం వల్లే ఇలాంటి దారుణాలు..
-
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది: ఆర్కేరోజా
సాక్షి,తిరుపతిజిల్లా: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు,చిన్నారులపై దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఎంఆర్పురంలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని శనివారం(నవంబర్ 2) పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డితో కలిసి రోజా పరామర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. నిందితుడు గంజాయి,మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాష్ట్రంలో గంజాయి మత్తులో పెట్రేగి పోతున్నారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. గత ప్రభుత్వం లో తీసుకు వచ్చిన దిశ యాప్‌ను పటిష్టం చేయాలి’అని రోజా డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం -
ఏ కొంపలో నీలాంటి చెల్లి ఉండదు
-
చంద్రబాబుతో కలసి సొంత అన్నపైనే షర్మిల కుట్ర చేస్తున్నారు
-
అందుకే షర్మిలను ప్రజలు నమ్మలేదు: భూమన
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్‌లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్వం వదులుకున్న వ్యక్తి అని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ అధిస్టానాన్ని సైతం వైఎస్ జగన్ ధిక్కరించారు. కుట్రతో తప్పుడు కేసులు పెట్టినా ఆయన వీరుడిలా పోరాడారన్నారు.‘‘వైఎస్ జగన్‌పై షర్మిల అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్ అనే వ్యక్తి ఒక యుద్ధ వీరుడు. అందుకే పార్టీ ఓడిపోయినా కోట్లాది మంది జగన్ వెంటే ఉన్నారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చే వ్యక్తి జగన్ మాత్రమే. అందుకే ఆయనను ప్రజలు నమ్మారు. తెలంగాణ మెట్టినిల్లు అంటూ షర్మిల అక్కడ రాజకీయాలు చేశారు. మళ్లీ చాపచుట్టేసి తిరిగి ఏపీకి వచ్చారు.. చంద్రబాబుకు నేరుగా మద్దతు పలుకుతున్నారు. షర్మిలను తెలంగాణ, ఏపీ ప్రజలు నమ్మలేదు. చంద్రబాబుతో కలసి సొంత అన్నపైనే షర్మిల కుట్ర చేస్తున్నారు. మీ లాంటి చెల్లి వైఎస్ జగన్‌కు ఉండటం బాధగా ఉంది. వైఎస్ జగన్ చిన్న తప్పు కూడా చేయలేదు.’’ అని భూమన చెప్పారు.‘‘షర్మిల రాసిన లేఖలు టీడీపీ వెబ్సైట్లలో ఎలా వస్తున్నాయి?. చంద్రబాబుతో కలిసి అన్నపై కుట్ర చేయడం మీకు తగునా?. కేవలం రెండున్నర ఎకరాల చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు.. అందులో తమ్ముడి, సోదరీమణులకు ఎంత ఆస్తి పంచి ఇచ్చారు.’’ అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. -
షర్మిలను తెలంగాణ ప్రజలు నమ్మలేదు.. ఏపీ ప్రజలు నమ్మలేదు
-
బాబు ఢిల్లీ పర్యటనపై భూమన సంచలన వ్యాఖ్యలు
-
‘సుప్రీం’ హెచ్చరించినా తీరు మారదా చంద్రబాబూ?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తన ప్రాణాలు కాపాడిన పరమాత్ముడితో పరాచికాలు ఆడితే ఆ పైశాచిక చేష్టలకు ఫలితం ఎలా ఉంటుందో ఆ దేవదేవుడే నిర్ణయిస్తాడని సీఎం చంద్రబాబునుద్దేశించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారి లడ్డూపై పదేపదే ఆయన చేస్తున్న ఆరోపణలను భగవంతుడు క్షమించడన్నారు. తాజాగా ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. బుధవారం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు. సుప్రీం స్పష్టంగా ఆదేశించినా..తిరుమల లడ్డూపై ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా సీఎం చంద్రబాబు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం ప్రధానిని కలుస్తానని వెళ్లిన చంద్రబాబు తిరుపతి లడ్డూ అందచేశారు. ఇది కల్తీ లడ్డూ కాదు సార్... స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిందని చెబితే బాబు చమత్కారానికి మోదీ విరగబడి నవ్వారట. దీనిపై చంద్రబాబును మందలిస్తే బాగుండేది. కల్తీ నెయ్యి ఆరోపణలపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరపనున్న నేపథ్యంలో ప్రధానితో పాటు సీబీఐని ప్రభావితం చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. సిట్ నివేదిక తనకు అనుకూలంగా తెచ్చుకునేలా కుట్ర చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా తప్పు జరగలేదు. తిరుమల వైభవానికి భంగం వాటిల్లలేదు. దీనిపై పీఠాధిపతులతో చర్చకు సిద్ధంగా ఉన్నా. చంద్రబాబుకు దమ్ముంటే నా సవాల్‌పై స్పందించాలి. కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీక్ష, జిల్లా యువత విభాగం అధ్యక్షుడు అజయ్‌కుమార్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బొమ్మగుంట రవి తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నాం
-
పవన్ కళ్యాణ్ పై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్
-
సుప్రీం వ్యాఖ్యలు బాబుకు చెంపపెట్టు
తిరుపతి మంగళం: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచ రాజకీయాలు చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి ఉందని పెదవి జారి అబద్ధాలను నిజం చేయాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చంద్రబాబూ అని హెచ్చరించారు. భూమన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. చంద్రబాబు స్వార్థ, కుటిల, కుతంత్ర రాజకీయాలతో మహా ప్రసాదానికి మలినం అంటించాలని చూస్తే దేవదేవుడు చూస్తూ ఊరుకోరని చెప్పారు. సాక్షాత్తు శ్రీవారే సుప్రీం కోర్టు ధర్మాసనంతో చంద్రబాబుకు చెంప పెట్టులాంటి మాటలు పలికించారని అన్నారు.టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పిన మాటలకు భిన్నంగా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. సత్యాన్ని అసత్యంగా మార్చాలన్నదే చంద్రబాబు దురాలోచన అని మండిపడ్డారు. చంద్రబాబు సిట్ అంటే కూర్చునే అధికారులను సిట్‌లో నియమించి విచారణ జరిపిస్తే ఆ రిపోర్ట్ ఎలా ఉంటుందో అందరికి తెలుసునన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలపలేదు కాబట్టే తాము సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. ప్రసాదంలో కల్తీ చేసి ఉంటే తాము సర్వనాశనం అయిపోవాలని, రక్తం కక్కుకుని చనిపోవాలని శ్రీవారి సన్నిధిలోని కోనేటిలో స్నానమాచరించి, అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి వేడుకొన్నామన్నారు.తప్పు చేసి ఉంటే నిజంగా ఆ దేవదేవుడు తమకు శిక్ష విధించేవారని అన్నారు. నిజంగా తాము తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత్త దీక్షలు చేపట్టి దుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేశారని, పాపాలు చేసిన వారే ప్రాయిశ్చిత్తం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచ రాజకీయాలు చేసిన చంద్రబాబు, పవన్‌ను, వారికి వంతపాడుతున్న ఎల్లో మీడియాను ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా ఛీకొడుతున్నారని చెప్పారు. -
‘‘చంద్రబాబూ.. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పు’’
తాడేపల్లి, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ప్రచారంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ కల్తీ జరిగిందన్న ఆధారాల్లేకుండా.. పైగా దర్యాప్తు ఇంకా మొదలుకాకముందే మీడియా ముందుకు వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని? నిలదీసింది. దేవుడ్ని రాజకీయంలోకి లాగొద్దంటూ చురకలంటించింది. ఈ తాజా పరిణామాలపై వైఎస్సార్సీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.. పదవీ ఉందని పెదవి జారితే..అబద్ధాని నిజం చేయాలని చూస్తే.. భక్త ద్రోహం చేయాలని చూస్తే ఇలానే ఉంటుందిమహాప్రసాదం కు మలినం అంటగట్టాలని చూస్తే సుప్రీం కోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారుమొత్తం ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వ సంఘాలు ఆందోళనకు గురయ్యాయి.సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు శ్రీవారి ప్రసాదం పై బాధించిందిఈవో చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడుతూ.. జంతువులు కొవ్వు వాడారు అని ఎలా చెబుతారుతప్పు జరిగింది అంటూ ఎల్లో మీడియా విష ప్రచారం చేశారుమహా ప్రసాదం.. మహా మాలిన్యం అయింది అంటూ ప్రచారం చేశారుస్వామి ప్రతిష్ఠ కు భంగం వాటిల్లే విధంగా లడ్డు ప్రసాదం విషయంలో అసత్యాలు ప్రచారం చేశారుదేవుడ్ని వివాదాల్లో తీసుకుని రాకండని ఎంత చెప్పినా వినలేదుకేసు పెట్టకుండా,విచారణ జరపకుండా చంద్రబాబు మాట్లాడాడు.సీఎం హోదాలో ఉంటూ అసత్య లు మాట్లారు..సుప్రీంకోర్టు సరైనా విధంగా ప్రశ్నించింది... దేవుడే సుప్రీంకోర్టుతో మాటలు పలికించారు..నిజం ఎప్పటికి గెలుస్తుంది.. తప్ప చేయాలేదు కాబట్టే దైర్యం మేము విచారణ కోరాంస్వామీవారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారుబాబు, పవన్ లను హిందువులందరూ ఛీ కోడుతున్నారు:::భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ చంద్రబాబు ఇప్పటికైనా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలికోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారుసుప్రీంకోర్టు కూడా చంద్రబాబు మాటలను తప్పుపట్టిందిచంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్‌తో విచారణ చేస్తే వాస్తవాలు వెల్లడి కావుస్వతంత్ర సంస్థతో విచారణ జరపాలిచంద్రబాబును కూడా ఆ విచారణ సంస్థ ప్రశ్నించాలిసుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనేది మా డిమాండ్తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభవాలతో ఆడుకోవద్దని చంద్రబాబు, పవన్ ను కోరుతున్నానుNDDB రిపోర్ట్ టీడీపీ కార్యాలయంలో విడుదల చేయటంపై విచారణ జరగాలిసుప్రీం కోర్టు విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నాయిరాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదుచంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా కల్తీ జరిగిందనే ఆరోపణలు ఉన్న నెయ్యిని వాడలేదని కోర్టులో చెప్పారుసీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారుసిట్ వేయాల్సిన అవసరం ఏంటి, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించిందిమూడో తారీఖున జరిగే విచారణలో నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నానుతిరుమల శ్రీవారితో రాజకీయాలు చేయవద్దని చంద్రబాబును కోరుతున్నానుసుప్రీంకోర్టు విచారణ ద్వారా అనేక అనుమానాలు తొలిగాయి::: వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని స్వాగతిస్తున్నా. చంద్రబాబు కనుసైగల్లో సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అంటూ వ్యవహరించే టీమ్ పై తమని ఏమాత్రం నమ్మకం లేదు. ఈ కేసులో సుప్రీం కోర్టు కలగజేసుకోవాలి ..::: ఆర్కే రోజా, మాజీ మంత్రి -
చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్
-
జగన్ ని ఎలా అడ్డుకుంటారో చూస్తాం.. టీడీపీకి వార్నింగ్
-
మీ చేత హిందువులని చెప్పించుకోవడానికి సిగ్గుపడతాం ...
-
‘జగన్ తిరుమలకొస్తే ఆంక్షలా? ఎందుకంత భయం బాబూ’
సాక్షి, తిరుపతి: ఆలయాలకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది హిందూ ధర్మం. అలాంటిది.. ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకోవాలని చూస్తారా?. జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.‘‘మా పార్టీ నేతలందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జగన్ అంటే చంద్రబాబుకు ఎంత భయమో దీని బట్టి చూస్తే అర్థమవుతోంది. వైఎస్ జగన్‌పై నీచాతినీచంగా రాజకీయ దాడికి దిగుతున్నారు. దేవుడిపై భక్తి లేని వారు జగన్‌ను కట్టడి చేయాలని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. వైఎస్ జగన్‌పై గతంలో లేని ఆంక్షలు ఇప్పుడెందుకు? అంటూ భూమన ప్రశ్నించారు.‘‘చంద్రబాబూ.. ఇకనైనా మీ రాజకీయాలు ఆపండి. మీరు ఎంత నిర్బంధానికి గురిచేస్తే అంతగా పైకి లేస్తాం. మీ పాపపు పాలనపై ప్రజా పోరాటం చేస్తాం. వేదమూర్తి ప్రసాదం మీద వెయ్యి నాలుకలతో మాట్లాడకండి. చంద్రబాబు మీరు చాలా పాపం చేశారు. చంద్రబాబూ మీరొక మాట.. పవన్ మరో మాట మాట్లాడతారు. చంద్రబాబు శిష్యులు జగన్‌ను రానివ్వం అంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. బీజేపీ నేతలు డిక్లేరేషన్ కోసం భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు’’ అంటూ కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలు‘‘వైఎస్ జగన్ ఒక భక్తుడిగా శ్రీవారి దర్శనానికి వస్తున్న సమయంలో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందంటూ రాయలసీమ వ్యాప్తంగా హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. జగన్‌ను చూస్తే చంద్రబాబుకు భయం వేస్తుంది. ర్యాలీలు అంటే మీకు భయం, 10 వేల మందిని సమీకరిస్తున్నారంటూ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. మేము ఎక్కడ జన సమీకరణ చేయడం లేదు. మీరు చేసిన పనికి డిఫెన్స్‌లో పడిపోయారు...వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూజలు చేయడానికి అర్హత లేదా?. వైఎస్ జగన్ వెంట ఎవరు రాకూడదని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. చంద్రబాబు నిరంకుశ విధానాలు వ్యతిరేకిస్తాం. ప్రజా గొంతుక వినిపిస్తాం. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు ఎంతకైనంతెగిస్తారు చంద్రబాబు. సనాతన హిందూ పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు వైఎస్సార్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఈవో శ్యామలరావును ఒకటే అడుగుతున్నాం.. ఇప్పటి వరకు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లు వివరాలు చెప్పాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. -
లడ్డూ వివాదం.. తిరుమలలో భూమన కరుణాకర రెడ్డి ప్రమాణం (ఫొటోలు)
-
లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణం చేసిన భూమన
-
లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణానికి భూమన సిద్ధం
సాక్షి, తిరుమల: తిరుమల లడ్డూ విషయంలో శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేసేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 3:30గంటలకు ఆలయం వద్ద భూమన ప్రమాణం చేయనున్నారు.తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేయడానికి భూమన తిరుమల వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన తిరుమల వెళ్లి పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించనున్నారు. అనంతరం, స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేయనున్నారు. మరోవైపు.. తన వ్యాఖ్యలపై శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని వైస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విసిరిన చాలెంజ్‌కు చంద్రబాబు ఇంతదాకా స్పందించకపోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: ‘బాబూ.. భక్తుల మనోభావాలతో ఆడుకుంటావా?’ -
బాబు చేసే పాపాలకు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష...
-
సీబీఐ లేదా ‘సుప్రీం’ జడ్జితో విచారణ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమే అయితే.. లడ్డూలో కల్తీ నెయ్యి కారకులు రక్తం కక్కుకుని చావాలి. మేం తప్పుచేసి ఉంటే కూడా రక్తం కక్కుకుని చావాలని స్వామిని కోరుతున్నా. ఆరోపణలు అబద్ధమైతే చంద్రబాబుని శ్రీ వేంకటేశ్వరస్వామే శిక్షిస్తారు’.. అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపించడానికి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై భూమన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సాక్షాత్తు శ్రీవారి మహాప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి తప్పు చేశారన్నారు. ఆయనింకా ఏమన్నారంటే.. నెయ్యి కాదు.. బాబే కల్తీ హత్యా రాజకీయాలు కంటే ఘోరమైన ఆరోపణ చంద్రబాబు చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి. టీటీడీ ఈఓ శ్యామలరావు మొదట నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ప్రకటించారు. సీఎం చంద్రబాబు బెదిరించిన తరువాత ఈఓ మాట మార్చారు. నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనె ఉన్నాయన్నారు. మీ పాలనలో అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా ఎలా జరిగిందో మీకు తెలీదా? మీ పాలనలో సరఫరా చేసిన నెయ్యి కంపెనీలే కదా మా హయాంలోనూ సరఫరా చేసింది వాస్తవం కాదా? నిజానికి.. కలుíÙతం అయ్యింది నెయ్యి కాదు చంద్రబాబే. అసలు మైసూరులో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు? బాబూ.. మీ పాలనలో ఏం చేశారో తెలుసా? మీ పాలనలో తిరుమలలోని మద్రాస్ నల్లి స్టోర్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌లో వ్యభిచార గృహాన్ని నడిపారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన వేయికాళ్ల మండపాన్ని నేలమట్టం చేసి ఆనవాళ్లు లేకుండా చేసింది మీ హయాంలోనే. అన్నమయ్య నివాసాన్ని కూల్చివేసి కనీసం ఆ మహానుభావుని జ్ఞాపకాలు లేకుండా చేసింది మీ పాలనలో కాదా? ఇక చంద్రబాబు చేసిన ఆరోపణలు ప్రాయశి్చత్తం చేసుకోవడానికి ఆలయ శుద్ధి అంటున్నారు. అసలు ఆలయ శుద్ధి గురించి ఆయనెలా చెబుతారు? ఆగమ పండితులు చెప్పాలి. తిరుమలలో శ్రీ వైష్ణవులు చేతితో లడ్డూలు తయారుచేస్తారు, ఏమాత్రం తప్పిదం జరిగినా వారు ఉపేక్షించరు. ధర్మప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టింది మేమే.. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో కనీవినీ ఎరుగని రీతిలో అనేకానేక ధర్మప్రచార కార్యక్రమాలను మేం చేపట్టాం.. ఉదా.. ⇒ ఎస్వీబీసీ ఛానెల్ ప్రారంభించింది మేమే. దళిత గోవిందం పేరుతో శ్రీవారిని దళితవాడలకు తీసుకెళ్లి విప్లవాత్మక కార్యక్రమం చేపట్టాం. మత్స్య గోవిందం, గిరిజన గోవిందం కార్యక్రమాలూ నిర్వహించాం. ⇒ వేద విశ్వవిద్యాలయం స్థాపించిందీ.. వేద అధ్యయనాన్ని ప్రోత్సహించేందుకు విద్యార్థులకు రూ.2 లక్షలు డిపాజిట్ చేసింది మేమే. ⇒ శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించింది మా పాలనలోనే. దళిత , బలహీనవర్గాల పెళ్లిళ్లు చేశాం. 36 వేల పేద జంటలకు తాళిబొట్లు తయారుచేయించి వాటిని స్వామివారి పాదాల చెంత పెట్టి వాటిని ఆ జంటలకు ఇచ్చాం. ⇒ అన్నమయ్య ఉత్సవాలు.. 75 మంది వేద పండితులతో విద్వత్ సదస్సు నిర్వహించిందీ మేమే. చిన్న పిల్లల్లో దైవభక్తి పెంచేందుకు గోవింద కోటి, రామకోటి పెట్టి స్వామి దర్శన భాగ్యం కల్పించింది మేమే. .. కానీ, మీ పాలనలో ఏ రోజైనా ఏమైనా చేశావా చంద్రబాబూ? -
శకుని బతికుంటే చంద్రబాబును చూసి ఏడ్చేవారు: భూమన
సాక్షి, తిరుపతి: రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సాక్షాత్తూ శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.శ్రీవారి మహా ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసి చంద్రబాబు తప్పు చేశారు. నీచ రాజకీయాలు చేసేందుకు కూడా చంద్రబాబు వెనుకాడ లేదు. సీబీఐ, సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమేనా?. శ్రీవారికి కళంకం అంటగడుతున్నారు. జగన్‌ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు.’’ అని కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు...లడ్డూ వ్యవహారంపై ప్రధాని కూడా స్పందించాలి. నీచమైన రాజకీయం కోసం ఆరోపణలు చేస్తే అంతా శ్రీవారే చూసుకుంటారు. చంద్రబాబు ఆరోపణలు నిజమైతే.. లడ్డూలో కల్తీ నెయ్యి కారకులు రక్తం కుక్కుకుని చనిపోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. శకుని బతికుంటే చంద్రబాబును చూసి ఏడ్చేవారు. నెయ్యిలో వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని గతంలో టీటీడీ ఈవో చెప్పలేదా?. చంద్రబాబు బెదిరించిన తర్వాత ఈవో మాట మార్చారు.’’ భూమన నిలదీశారు. -
వైఎస్ జగన్ పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు
-
ఏ విచారణకైనా మేం సిద్ధం.. బాబూ ఇదే నా ఛాలెంజ్
-
హిందూ జాతికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే: భూమన
తిరుపతి, సాక్షి: తిరుమల స్వామివారి లడ్డూను వాడుకుని రాజకీయం చేద్దామనుకున్న నారా చంద్రబాబు నాయుడి ప్రయత్నం బెడిసి కొట్టిందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తమపై వేసిన అపవాదుకు ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని ప్రకటించారాయన. జూలై 17 టీటీడీ ఈవో శ్యామల రావు చాలా స్పష్టంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎడిడబుల్ ఆయిల్ ఉంది అని స్పష్టంగా చెప్పారు. అయినా.. కేవలం ప్రత్యర్ధి పార్టీను దెబ్బ తీయాలని ఉద్దేశంతో చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు మరింత రెచ్చిపోయి.. ఎన్డీడీబీ(National Dairy Development Board) ఫేక్ రిపోర్ట్ ఇచ్చి జాతీయ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు . ఈ ఆరోపణలపై అధికారులు కాకుండా స్వయంగా చంద్రబాబే ఎందుకు మాట్లాడుతున్నారు?. చంద్రబాబు సర్కార్‌కు మేం చాలెంజ్ చేస్తున్నాం. మా మీద పడిన అపవాదుపై విచారణకు సిద్ధంగా ఉన్నాం. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. అవసరమైతే.. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.టీటీడీ ప్రతిష్ఠ ను దిగజార్చడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. మీ అసలు విష స్వరూపం బయట పడింది. హిందువులందరినీ చంద్రబాబు అవమానించారు. ఆయన తక్షణమే హిందూ జాతికు క్షమాపణ చెప్పాలి.చంద్రబాబు జీవితం అంతా అబద్ధపు హామీలే. రాజకీయంగా ఎదగడానికి ఎన్నో కుయుక్తులు, కుట్రలు చేశారు.. ఇంకా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అడ్డు పెట్టుకుని.. జగన్ మోహన్ రెడ్డిని బద్నాం చేయాలన్న ప్రయత్నం వికటించింది. స్వామి ప్రతిష్ఠకు భంగం కలుగుతుందనే బాధతో మేం ఉన్నాం. ఆ భగవంతుడే మీకు తగిన బుద్ధి చెప్తాడు చంద్రబాబూ.. అని భూమన అన్నారు. ఇదీ చదవండి: ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి! -
పవిత్రమైన ప్రసాదంపై బాబు విష ప్రచారం...
-
తిరుమల విశిష్టత దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
-
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు దుర్మార్గం
-
బాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు గురించి విష ప్రచారం చేస్తే స్వామి వారే వారికి శిక్ష విధిస్తారు అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా భూమన మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట. తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేస్తే స్వామి వారే వారికి శిక్ష విధిస్తారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి విష ప్రచారం తగదు చంద్రబాబు. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారికి శ్రీ వైష్ణవులు ఎంతో శుద్ధిగా వాటిని తయారు చేస్తారు. లడ్డూ ప్రసాదం తయారీకి ప్రత్యేకమైన దిట్టం ఉంది. దాని ప్రకారమే ప్రసాదాలు తయారు అవుతాయి. వీటిలో ఎవరి జోక్యం ఉండదు.1999-2003 చంద్రబాబు పాలనలో గతంలో పోటు వర్కర్లు ఆందోళనకు దిగారు. 2014-19 టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన కంపెనీలే 2019-24 లోనూ మెజారిటీ సంస్థలు నెయ్యి సరఫరా చేశాయి. అప్పటి నాణ్యత మా ప్రభుత్వం పాలనలో లేదని చెప్పడం అంటే ఇది చంద్రబాబు నీచ రాజకీయాలకు ఉదాహరణ. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలు దృష్టి మరల్చడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు జీవితం అంత విష ప్రచారం, నీచ రాజకీయాలు చేయడమే. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. కనీసం ఇంట్లో ఉన్న వేంకటేశ్వర స్వామి చిత్ర పటం ముందుకు వెళ్లి అయినా క్షమాపణ కోరి, పశ్చాతాపం చేసుకో చంద్రబాబు అంటూ భూమన ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: సూపర్ సిక్స్-నారావారి వంచన ఫిక్స్.. జనం ఏమంటున్నారంటే.. -
తెలుగు జాతిని నడిపించిన మహోన్నత నేత వైఎస్సార్: భూమన
-
ఘనంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మ జాతర తొలి రోజు బైరాగి వేషంతో భక్తుల సందడి (ఫొటోలు)
-
Fact check: రామోజీ శాసిస్తే... టీటీడీ శిరసావహించాలట!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఈనాడు రామోజీ తన బూటకపు కథనాలతో శాసిస్తున్నారు. తిరుమల కొండపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఆ దేవస్థానానికి పెరిగిన ఆదాయం, భక్తులకు సమకూరిన సౌకర్యాలు, సామాన్య భక్తులకు శీఘ్రంగా సర్వదర్శనం చేయించడంలోనూ వచ్చిన విశేష మార్పులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా లభిస్తున్న ఆదాయంతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి... వంటివాటిని పక్కనబెట్టి లేనిపోని వక్రభాష్యాలతో మంగళవారం ‘వడ్డీకాసుల వాడికి వంచన సేవ’ ...శీర్షికన ఈనాడులో ఓ దౌర్భాగ్య కథనాన్ని అచ్చేశారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ కొనసాగింపు గురించి, సేవా టికెట్లలో అక్రమాలు జరిగిపోతున్నాయని, టీటీడీ సభ్యుల్లో నేరచరితులున్నారని, శ్రీ వాణి ట్రస్టులో పారదర్శకత లేదని... ఇలా మతిలేని గ్రాఫిక్స్ జోడించి మరీ పైత్యాన్ని రంగరించి కథనాన్ని రాశారు. ఈ అబద్ధాల కథనం వెనుక రామోజీ దురాలోచనను బట్టబయలు చేయడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్.రామోజీ తాపత్రయమంతా టీడీపీ కోసమే... తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హిందువుల ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చేయాలని రామోజీరావు తెగతాపత్రయపడిపోతున్నారు. గత ఆరు నెలలుగా టీటీడీ మీద రాజకీయ దాడి ప్రారంభించిన ఈ అక్షర అష్టావక్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈనాడులో పనికిమాలిన, అవాస్తవ కథనాలను రాయడం... టీడీపీ నాయకులు దాన్నే మళ్లీ ప్రెస్మీట్లో చర్విత చరణంగా చెప్పడం, రెండు మూడు రోజుల పాటు ఈ డ్రామా నడపడం ఈ పత్రికకు నిత్యకృత్యమైంది. ఎన్నికలు దగ్గర పడటంతో గత రెండు నెలలుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై రాజకీయ ఆరోపణలు చేస్తూ, లేనిది ఉన్నట్లు అభూత కల్పనల కథనాలను రాసిందే రాస్తున్నారు. బాబు హయాంలో ఇద్దరిని సుదీర్ఘంగా కొనసాగిస్తే రామోజీకి కనిపించలేదా?...చంద్రబాబు నాయుడి హయాంలో తిరుమల జేఈవోగా పి.బాలసుబ్రమణ్యం తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మొదలు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పదే పదే మొర పెట్టుకున్నా చంద్రబాబు ఆయన్ను ఎందుకు బదిలీ చేయలేదో ఈనాడు బదులివ్వగలదా? పైగా బాలసుబ్రమణ్యం తిరుమల జేఈవోగానే రిటైరయ్యేలా చంద్రబాబు ఎందుకు అవకాశం కల్పించారో రామోజీ చెప్పగలరా? టీటీడీపై అంత ప్రేమ ఉంటే ఈ విషయాన్ని ఆ రోజు ఈనాడు ఎందుకు రాయలేదు? అంతేకాదు... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తిరుమల జేఈవోగా నియమితులైన మరో అధికారి శ్రీనివాసరాజు. ఆయన లాబీయింగ్, అధికార పారీ్టకి వీరవిధేయత వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కొనసాగించారు. దాదాపు పదేళ్ల పాటు తిరుమల జేఈవోగా శ్రీనివాసరాజు పనిచేశారు. అప్పుడూ చంద్రబాబును ఈనాడు ప్రశి్నంచలేదు. శ్రీనివాసరాజు అధికార పారీ్టకి అనుకూలంగా దేశ, విదేశాల్లో సైతం లాబీయింగ్ చేస్తున్నారని రామోజీరావు ఎందుకు నిలదీయలేదో చెప్పగలరా?ధర్మారెడ్డి కొనసాగింపు కేవలం భక్తుల సౌకర్యార్థమే ప్రస్తుత టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాలసుబ్రమణ్యం, శ్రీనివాసరాజుల్లాగా వరుసగా తొమ్మిదేళ్లు పని చేయలేదు. వేసవిలో వరుస సెలవుల కారణంగా తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి సమర్థుడైన అధికారి అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డికి మరో 8 వారాల పొడిగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదేదో మహా అపచారమన్నట్లు ఈనాడు రాసింది. కథనం రాశాం కాబట్టి ధర్మారెడ్డికి పొడిగింపు రాదని భ్రమపడింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని, తిరుమలలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి మరో 8 వారాలు టీటీడీలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని రామోజీరావు ‘వారికి నో.. వీరికి ఎస్’ అంటూ తన కడుపుమంట కథనాన్ని ప్రచురించారు. ధర్మారెడ్డికి డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఆక్రోశం, ఆందోళన, కోపం, బాధ కలగలిపి పనికిమాలిన కథనాన్ని అచ్చేశారు.బోర్డు సభ్యుల నియామకాలపైనా వక్రపూరిత రాతలుతన రాజకీయ, ఆర్థిక, కార్పొరేట్ ప్రయోజనాల కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను పెంచిందే చంద్రబాబు. ఈ నిజాన్ని ఈనాడు పొరపాటున రాయదు. తన అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు నాయుడు ఈ పనిచేస్తే రామోజీరావు దృష్టిలో తప్పుకాదు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో మొదట నియమించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఆయనను చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్‌గా నియమిస్తే దాన్ని ఘోరంగా అభివర్ణిస్తూ ఆ కథనంలో ఈనాడు పేర్కొందిశ్రీవాణి ట్రస్టు ఆదాయమంతా ఆలయాల అభివృద్ధికే... శ్రీవాణి ట్రస్టు ఆదాయ, వ్యయాల గురించి సుమారు ఏడాది కిందటే టీటీడీ శ్వేత పత్రం ప్రకటించింది. ఈనాడు ఈ విషయాన్నీ గతంలో ప్రచురించింది. ఈ ట్రస్టుపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో మతాంతీకరణలను నిరోధించడానికి టీటీడీ సుమారు 3 వేల ఆలయాలను నిర్మించింది. అనేక పురాతన ఆలయాల జీర్ణిద్ధరణకు నిధులు ఇచ్చింది. కేవలం వైఎస్సార్సీపీ నేతలున్న గ్రామాల్లోనే ఈ ఆలయాలు నిర్మించారని ఈనాడు ఆ కథనంలో అసత్యాలను రాసేసింది. ఈ ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాల కోసం టీటీడీ ప్రతినెలా రూ. 5 వేలను అందిస్తున్న వాస్తవాన్ని ఈనాడు దాచి పెట్టింది. సేవా టికెట్లపైనా అవాస్తవాలు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉండగా, సిఫారసు లేఖల మీద జారీచేసే సేవా టికెట్ల ధరలు పెంచి తద్వారా వీటి డిమాండ్ తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో సేవా టికెట్లు జారీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఈనాడు దీన్నీ వక్రీకరించి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలు, వేల సంఖ్యలో టికెట్లు హోల్‌సేల్‌గా విక్రయించడంతో అనేక కేసులు నమోదయ్యాయి. వసతి సముదాయాల నిర్మాణాలపై అభూతకల్పనలుతిరుపతిలో ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి భావించింది. ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో ఆ భవనాల పటుత్వంపై అధ్యయనం చేయించింది. యాత్రికుల వసతికి ఎక్కువ కాలం ఈ భవనాలు పనికి రావని నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే అచ్యుతం, శ్రీ పథం పేర్లతో కొత్త వసతి సముదాయాలను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వసతి సముదాయంలో 1,800 మందికి మాత్రమే ఉన్న వసతి 8,200 మందికి పెంచి అధునాతన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.600 కోట్లుగా ఉన్న ఈ నిర్మాణాల అంచనాలను రూ.460 కోట్లకు కుదించి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. టెండర్ల ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జ్యుడీషియల్ కమిషన్ అనుమతీ తీసుకుంది. ఈనాడు తన కథనంలో ఈ వాస్తవాలను దాచి 10% కమీషన్లు తీసుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీద ఆరోపణలు చేసింది. మూడేళ్లలో పూర్తయ్యే పనికి ముందే కమీషన్లు తీసుకునే విద్య రామోజీరావుకు మాత్రమే తెలిసినట్లు ఉంది. -
10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)
-
సీఎం జగన్ పై దాడిని ఖండించిన భూమన కరుణాకర్ రెడ్డి
-
చంద్రబాబు మాయమాటలను నమ్మొద్దు
-
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఫొటోలు)
-
తిరుమల: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుమల: టీటీడీ ఉద్యోగులకు మరో తీపి కబురు తెలిపారు పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి. నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా బోర్డు తీర్మానం ద్వారా ఎంపికైన వారిని కూడా రెగ్యూలైజ్ చేయాలని నిర్ణయించారు. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్‌గా పరిగణనలోకి తీసుకొని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీఓ వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా వేలాదిమంది ఉద్యోగుల మేలు జరుగుతుందని పేర్కొన్నారు. టీటీడీ పాలకమండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నిర్ణయాలను టీటీడీ పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. స్విమ్స్ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 479 నర్సు పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ విద్యాసంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లకు, నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. చదవండి: మాటలు కావవి.. ప్రతిపక్షాలకు గుచ్చే బాణాలు రూ. 1.88 కోట్లతో పీఏసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు, యాత్రికుల వసతి సముదాయాలలో లిప్ట్ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల చుట్టూ రూ. 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటకు ఆమోదం తెలిపారు. రూ. 14 కోట్లతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలోని భాస్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థ సారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు అభరణాల బంగారు పూతకు ఆమోదించారు. టీటీడీ ఐటీ సేవల కోసం టెక్ రీప్లేస్ మెంట్ కోసం ఐదేళ్ల పాటు నిర్వహణ కోసం రూ. 12 కోట్లు నిధులు కేటాయించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆద్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులకు చెయ్యాలని ఆమోదం తెలిపింది పాలకమండలి. ఇటీవల ఘాట్ రోడ్డులో మరణించిన శ్రీవారి ఆలయ అర్చకుడు యతిరాజు నరసింహులు కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించడం కుదరదని కేంద్ర విమానాయన మంత్రిత్వశాఖ తెలిపిందని భూమన చెప్పారు. -
పాలకమండలి నిర్ణయాలను వివరించిన టీటీడీ ఛైర్మన్ భూమన
-
ఘనంగా శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభం
తిరుమల: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 5 వరకు ఈ సదస్సు జరుగనుంది. తొలి రోజు సదస్సులో 25 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయగా..ఈవో ఏవీ ధర్మారెడ్డి కార్యక్రమ సందర్భ పరిచయం చేశారు. టీటీడీ ధార్మిక కార్యక్రమాలపై ఎస్వీబీసీ రూపొందించిన 40 నిమిషాల ఆడియో విజువల్‌ను ప్రదర్శించారు. తిరుమల పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి, విద్యాశ్రీషతీర్థ (బెంగళూరు), సిద్ధేశ్వరానంద భారతి (కుర్తాళం), మాతృశ్రీ రమ్యానంద (తిరుపతి), సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి (విజయవాడ), రామచంద్ర రామానుజ జీయర్ స్వామి (భీమవరం), స్వస్వరూపానందగిరి స్వామి (శ్రీనివాసమంగాపురం), పరిపూర్ణానందగిరి స్వామి(ఏర్పేడు), విద్యాప్రసన్న తీర్థ (కర్ణాటక), విరజానంద స్వామి (కడప), విశ్వయోగి విశ్వంజి (గుంటూరు), సచ్చిదానంద సరస్వతి (తుని), హరితీర్థ స్వామీజీ (నెల్లూరు), ప్రకాశానంద సరస్వతి (విజయవాడ), మాతా శివానంద సరస్వతి, మాతా సుశ్రుశానంద (తేనెపల్లి), శివ దర్శనం మాతాజీ (ప్రొద్దుటూరు), స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామి (ఉత్తరకాశీ), సత్యానంద భారతి (విజయవాడ), శ్రీ శివ స్వామి (గుంటూరు), దేవనాథ రామానుజ జీయర్ స్వామి (హైదరాబాద్), విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అనుగ్రహణ భాషణం చేశారు. మరింత గొప్పగా ధర్మ ప్రచారం: భూమన మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు భూమన తెలిపారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తామన్నారు. స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని చెప్పారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్త శుద్ధితో ప్రజలకు చేరువ చేస్తోన్న టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి జరుగుతోందన్నారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
టీటీడీపై దుష్ప్రచారాలు చేస్తున్నారు..సరికాదు: టీటీడీ ఛైర్మన్
-
సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి ప్రజలు ఓటు వేయాలి: టీడీపీ చైర్మన్
-
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5,141.74 కోట్లు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వార్షిక బడ్జెట్‌తోపాటు పలు కీలక నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్లు భూమన వెల్లడించారు. దాదాపు 30ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నవారికి, శిల్పులకు వేతనాలు, వేదపారాయణదారులకు పెన్షన్, కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకులు, వేద పాఠశాలల్లోని సంభావన అధ్యాపకుల వేతనాలను, క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు సంభావనలు పెంచినట్లు వివరించారు. టీటీడీ నిర్వహిస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో 515 పోస్టులు సృష్టించేందుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ రూ.1,167 కోట్లు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,611 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.600 కోట్లు, దర్శనం ద్వారా రూ.338 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. అదేవిధంగా పరికరాల కొనుగోలు కోసం రూ.751కోట్లు, కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.750 కోట్లను బడ్జెట్లో కేటాయించామని, మానవ వనరుల ఖర్చు రూ.1,733 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి రూ.108.50కోట్లు కేటాయించినట్లు భూమన వివరించారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు టెండరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, పలువురు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మహిళలకు శ్రీవారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాల(తాళిబొట్లు)ను మహిళలకు అందించాలని టీడీపీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి మంగళసూత్రాలు తయారు చేయిస్తారు. ఆ మంగళసూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ, నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. ఇప్పటికే వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘసుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం. భూమన కరుణాకరరెడ్డి గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణమస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు. -
2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం.. కీలక నిర్ణయాలివే
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమలలో స్థానిక అన్నమయ్య భవన్లో సోమవారం నిర్వహించిన పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో నిర్ణయాలను వెల్లడించారు. టీటీడీ ప్రత్యేకంగా మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే తరహాలో లక్ష్మీ కాసులను కూడా విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ కార్మికులను గుర్తించమని…వారి జీతాన్ని 15 వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి లేఖ రాసినట్లు చెప్పారు.గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు, నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయింపుకు ఆమోద ముద్ర వేశామన్నారు. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు. ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజీల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించామన్నారు. చదవండి: నారాయణ విద్యా సంస్థలపై ఈసీకి ఫిర్యాదు వాటర్ వర్క్స్. అన్నప్రసాదం, వేదపాఠశాలలో ఉద్యోగులు, టీటీడీ స్టోర్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు భూమన తెలదిపారు. వేదపండితుల పేన్షన్ 10 వేలు నుంచి 12 వేలుకు పెంచారన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతామన్నారు. 56 వేదపారాయణదారులు పోస్టులు నియామకానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు సహకరించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతు తీర్మానం చేశామన్నారు. అటవిశాఖ ఉద్యోగుల సమస్య గురించి మంగళవారం కార్మికులుతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తారని టీటీడీ చైర్మన్ తెలిపారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం పట్ల పాలకమండలి సానుకూలంగా ఉందన్నారు. పిబ్రవరి 3 నుంచి 5వ తేది వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తూన్నామని, దీనికి 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సుకు హజరవుతారని తెలిపారు. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలు,స లహాలను టీటీడీ తూచా తప్పకూండా అమలు చేస్తామన్నారు. హుండి ద్వారా 1611 కోట్లు, వడ్డి ద్వారా 1,167 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లు,దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు వస్తూందని అంచనా వేశామన్నారు. జీతాలు చెల్లింపుకు 1.733 కోట్లు, ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు, కార్పస్ ఫండ్‌కుకి 750 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. -
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ దే
-
తిరుపతిలో 2 వసతి సముదాయాలు
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో రెండు వసతి సముదాయాలను నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం జీఎస్టీ కాకుండా రూ.419.30 కోట్లతో టెండర్లను టీటీడీ పాలకమండలి ఆమోదించినట్లు తెలిపారు. తిరుమలలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి సత్రం (రెండోసత్రం) స్థానంలో జీఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీకోదండరామస్వామి సత్రం (మూడోసత్రం) స్థానంలో జీఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లను ఆమోదించినట్లు వివరించారు. రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు పాలకమండలి తీసుకున్న ముఖ్య నిర్ణయాలు.. ♦ టీటీడీ ఉద్యోగులకు సంబంధించి మొదటిదఫా డిసెంబరు 28న 3,518 మందికి, రెండోదఫా జనవరి మొదటి వారంలో 1,500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ. ♦ మూడోదఫా ఫిబ్రవరిలో 5 వేల మందికి లబ్ధి చేకూరేలా ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాల భూమి సేకరణకు కలెక్టర్‌కు ప్రతిపాదన. ♦ ఇళ్లస్థలాలను ప్రభుత్వం నుంచి టీటీడీ కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు. æ శ్రీవారి పోటు కార్మికులకు వేతనం మరో రూ.10 వేలు పెంపు ♦ వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి తగిన వేతనం పెంపు. ♦ టీటీడీలోని పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంపు. ♦ ఇప్పటికే స్కిల్డ్ కార్మికులకు రూ.15 వేల నుంచి రూ.18,500 , సెమీస్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు, అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.10,340 నుంచి రూ.15 వేలకు పెంపు. ♦ కల్యాణకట్టలో విధులు నిర్వర్తిస్తున్న పీస్‌రేట్ క్షురకులకు నెలకు రూ.20 వేల కనీస వేతనం. ♦ ఫిబ్రవరిలో తిరుమలలో పీఠాధిపతులు, మఠాధిపతుల సదస్సు ♦ వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయ అర్చక కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న పెద్దజీయర్ మఠానికి రూ.60 లక్షలు, చిన్నజీయర్ మఠానికి రూ.40 లక్షల ఆర్థిక సహకారం పెంపు. భగవద్గీత, గోవింద కోటి పుస్తకాల ఆవిష్కరణ శ్రీ భగవద్గీత, స్థానిక ఆలయాల క్యాలెండర్లు, గోవింద కోటి పుస్తకాలను టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సనాతన ధర్మం పట్ల, మానవీయ, నైతిక విలువల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా 20 పేజీలతో కూడిన భగవద్గీత లక్ష పుస్తకాలను టీటీడీ ముద్రించింది. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లిష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 వేల పుస్తకాల వంతున ముద్రించిన భగవద్గీతను ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వనున్నారు. -
తిరుపతిలోని 23వ డివిజన్ లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం
-
భూమన సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరికలు
-
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
-
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, తిరుమల: కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ భూమన మీడియాకు వెల్లడించారు. ►అలిపిరి గోశాల శ్రీనివాస హోమం ఈ నెల 23 నుంచి ప్రారంభం ►టీటీడీ ఉద్యోగాలకు ఇంటి స్థల కేటాయించే ప్రాంతాలలో 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మాణం ►15 కోట్లుతో అదనపు రోడ్డు నిర్మాణం ►టీటీడీ ఉద్యోగులు అందరికి ఇంటిస్థలాలు ఇస్తాం, మరిన్ని ఎకరాలు సేకరిస్తున్నాం ►తిరుపతి రాం నగర్ క్యాట్రస్‌లో అభివృద్ధి పనులకు 6.15 కోట్లు ►టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం, శాశ్వత ఉద్యోగులకు 14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6850 ►తిరుమల ఆరోగ్య విభాగంలో 650 ఉద్యోగులను మరో ఏడాది పొడిగింపు, 3.40 లక్షలు కేటాయింపు ►మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయింపు ►రేణిగుంట రోడ్డు నుంచి తిరుచానూరు వరకు 3.11 లక్షలతో అభివృద్ధి ►4.89 లక్షలతో పుదిపట్ల నుంచి వకులమాత ఆలయం అలయం వరకు రూ. 21 కోట్లు ►తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి నూతన టిబీవార్డు నిర్మాణానికి ఆమోదం ►స్వీమ్స్ వద్ద రోగులకు విశ్రాంతి భవనానికి 3.35 లక్షలతో కేటాయింపు ►స్వీమ్స్ వైద్య సదుపాయాలు పెంపునకు కార్డియోకు నూతన భవనం ►స్విమ్స్ ఆసుపత్రి భవనాన్ని ఆధునీకరణకు 197 కోట్లు కేటాయింపు ►తిరుపతి డిఎఫ్ఓ ఆధ్వర్యంలో 3.50 లక్షలతో నూతన కెమారాలు, బోన్లు కొనుగోలుకు నిర్ణయం ►కరీంనగర్లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆమోదం ►సాంప్రదాయ కళల అభివృద్ధికి టీటీడీ ప్రాథమిక శిక్షణ.. కలంకారీ, శిల్పకళ శిక్షణ ఇవ్వనున్న టీటీడీ -
చంద్రబాబుకు బిగ్ షాక్..వైఎస్సార్సీపీలోకి చేరిన టీడీపీ నేతలు
-
సకల జనుల సంక్షేమమే సీఎం జగన్ అజెండా
సాక్షి, తిరుపతి: సకల జనుల సంక్షేమమే అజెండాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా నిలిచి, వారికి రాజ్యాధికారాన్ని ఇచ్చిన నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చరిత్రలో నిలిచిపోతారని టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని, బలహీన వర్గాలకు అధికారం ఇచ్చిన పార్టీగా వైఎస్సార్సీపీ చరిత్ర తిరగరాసిందని అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన సామాజిక సాధికారత యాత్ర సభలో కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. పైరవీలతో కాకుండా సీఎం జగన్ ఫైటర్‌గా రాజకీయాల్లో గెలిచారన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటూ బడుగు వర్గాలను అక్కున చేర్చుకున్న సీఎం జగన్ అని చెప్పారు. ఏ ప్రభుత్వంలో జరగనంత సంక్షేమం ఈ నాలుగున్నరేళ్లలో జరిగిందని తెలిపారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధితో 38 వేల ఎకరాలను అందుబాటులోకి తెచ్చారని, గత 40 ఏళ్లలో ఎక్కడా లేని అభివృద్ధి తిరుపతిలో చేసి చూపించారని వివరించారు. సీఎం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలతో పేద వారిని అభివృద్ధిలోకి తెచ్చారని, బడుగులు తలెత్తుకొనేలా చేశారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చెప్పారు. అందుకే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా సీఎం జగన్‌ను దేవుడిగా పూజిస్తున్నారని తెలిపారు. పెత్తందారులపై యుద్ధంలో పేదలంతా జగనన్నకు తోడు: ఎంపీ గురుమూర్తి పెత్తందారులకు, పేదవారికి జరిగే ఈ యుద్ధంలో పేదలంతా వైఎస్ జగన్‌కి అండగా ఉన్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలుగన్న సమాజాన్ని వైఎస్ జగన్ నిర్మిస్తున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, రాజ్యాధికారం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం జగన్‌కు మనమంతా అండగా నిలవాలన్నారు. బీసీలకు జగన్ పెద్దపీట : ఎమ్మెల్యే అనిల్ సీఎం వైఎస్ జగన్ పాలనలో బీసీలకు పెద్దపీట వేశారని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చెప్పారు. డిప్యూటీ సీఎం పదవులతో పాటు కార్పోరేషన్, మార్కెట్ కమిటీలు ఇతర నామినేషన్ పదవుల్లో 60 శాతం పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని చెప్పారు. స్టేజీ ఎక్కి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పే దమ్ము ఒక్క సీఎం జగన్‌కే ఉందన్నారు. అందరి అభ్యున్నతికి సీఎం జగన్ కృషి : భూమన అభినయ్ ఓ పార్టీ అణగారిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకొంటే.. అన్ని వర్గాలను సొంత వారిలా భావించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్ అని తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చెప్పారు. అట్టడుగున ఉన్న వారికి క్రియాశీలక రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్ అని వివరించారు. వైఎస్ జగన్ మైనార్టీలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు మైనార్టీలను సీఎం జగన్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా చెప్పారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తే, సీఎం జగన్ ఇచ్చిన హామీలకు అదనంగా మంచి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తెచ్చింది సామాజిక విప్లవం మరో 25 ఏళ్లు జగనే సీఎం వైఎస్సార్‌సీపీతోనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేసింది శూన్యం వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చారని రాజ్యసభ సభ్యుడు, దక్షిణ కోస్తా జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డే మరో 25 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని తెలిపారు. రెండో రోజు సామాజిక సాధికార యాత్రలో భాగంగా శుక్రవారం విజయసాయిరెడ్డి తిరుపతిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ , బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. తాము చేపట్టింది సాధికారత బస్సు యాత్ర మాత్రమే కాదని, సాధికారత విప్లవ యాత్ర అని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పారు. -
రాజకీయాలు అంటే వ్యాపారం కాదు: భూమాన కరుణాకర్‌రెడ్డి
-
YSRCP: రెండో రోజు సామాజిక సాధికారిత యాత్ర ఇలా..
సాక్షి, తిరుపతి: ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమలలో తొలి రోజు వైఎస్సార్సీపీ బస్సు యాత్ర ఘనంగా ప్రారంభమైంది. బహిరంగ సభలకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. నేడు రెండో రోజు గజపతినగరం, నరసాపురం, తిరుపతిలో యాత్ర జరగనుంది. తిరుపతిలో శుక్రవారం ఉదయం వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సు యాత్ర ప్రారంభమైంది. బాలాజి కాలనీ సర్కిల్ పూలే విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం టౌన్ క్లబ్ మీదుగా జ్యోతి టాకీస్ రోడ్, రుయా హాస్పిటల్, భవాని నగర్ మీదుగా నగరంలో అన్ని డివిజన్లు కలుపుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర సాగుతోంది. సాయంత్రం 4 గంటలకు గ్రూప్ థియేటర్స్ ఎదుట బహిరంగ సభ నిర్వహించనున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధు సూదన్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల నాయకులు పాల్గొన్నారు. విజయనగరం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. సీఎం జగన్ పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు వివరించనున్నారు. గజపతినగరంలో మధ్యాహ్నాం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు సెంటర్లో మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మొగల్తూరు నుంచి రామన్నపాలెం, ఎల్బీ చర్ల మీదుగా యాత్ర నరసాపురం పట్టణం చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు నరసాపురంలోని ప్రకాశం రోడ్డు రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. చదవండి: వెల్లివిరిసిన సామాజిక చైతన్యం -
‘సమిష్టి కృషి, సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం’
సాక్షి, తిరుపతి: సమిష్టి కృషి, సమన్వయంతో శ్రీవారి సాలకట్ల మరియు నవరాత్రి రెండు బ్రహ్మోత్సవాలు విజయవంతమైనట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం స్థానిక అన్నమయ్య భవనంలో భూమన కరుణాకరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు..శ్రీవారి కృపతోనే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేశామని... భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వాహన సేవల్లో ఉత్సవాలు చేసిన భక్తులు మధురానుభూతి పొందారన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లోనే టీటీడీ ఉద్యోగుల కల నెరవేరిందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగులకు ఇంటి స్టలాలను అందాజేశామన్నారువాహన సేవల ముందు కళ బృందాలు గొప్పగా తమ ప్రదర్శనలు చేశాయని,15 రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక కళా బృందాలు భక్తులను అలరించాయన్నారు. ఉత్సవాలు ఘన విజయం కావడానికి శ్రమించిన ప్రతిఒక్కరికి చైర్మన్ అభినందనలు తెలియజేశారు. హిందూ ధార్మిక వ్యాప్తి, హైందవ ప్రజాహితం కోసం టీటీడీ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
తిరుపతి నగరపాలక పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులు
-
తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ.. టీటీడీ సూచనలివి
సాక్షి, తిరుపతి: తిరుమలలో రద్దీ కొనసాగుతోందని, రద్దీ కారణంగా, భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. సోమవారం ఉదయం టీటీ అధికారులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, శిలాతోరణం మార్గంలో గల క్యూలైన్స్, గోగర్భం డ్యాం వరకూ ఉన్న క్యూలైన్స్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం క్యూలైన్స్ వద్ద భక్తులకు అందుతున్న సౌఖర్యాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌఖర్యాలపై టీటీడీ అధికారులకు భూమన కరుణాకర్ రెడ్డి సలహాలు, సూచనలు చేసారు. టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ..పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని, స్వామీ వారి సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుందన్నారు. భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని తెలిపారు. క్యూలైన్స్‌లో ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు రేయింబవళ్ళు కష్టపడి సౌఖర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు దగ్గరుండి సౌకర్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవ టికెట్ల దర్శనాల్లో నియంత్రణ చేశామని భుమన తెలిపారు. నారాయణవనంలోని షెడ్లు దాటి ఐదు కిలో మీటర్ల దూరం మేర భక్తులు క్యూలైన్స్‌లో వేచి ఉన్నారని, లైన్లో ఉన్న భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పించడమే ధ్యేయంగా టీటీడీ అధికార యంత్రంగం పని చేస్తుందన్నారు. భక్తులకు ప్రాథమిక అవసరమైన ఆహారం, నీరును నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పారు. భక్తుల భధ్రత, సౌఖర్యాల పట్ల టీటీడీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పని చేస్తుందన్నారు. గత మూడు రోజులుగా అధిక రద్దీ కొనసాగుతుందని, అయితే వర్షంలో కూడా యాత్రికుల సౌలభ్యం కోసం ఆలయ అధికారులు పని చేశారని, ఇది అభినందించ విషయమన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలపై ఉన్న నియంత్రణ పూర్తిగా తొలగించామని, నడిచి వెళ్ళే భక్తులకు మరింత భధ్రత కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అపాయం లేదని అటవీ శాఖా అధికారులు చెప్పే వరకూ నడక మార్గంలో ఆంక్షలను అలానే కొనసాగిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. -
తిరుపతి నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది: కరుణాకర్ రెడ్డి
-
చిరుతలను పట్టుకునే చర్యలు నిరంతరంగా సాగుతుంది: భూమన కరుణాకర్ రెడ్డి
-
‘టీటీడీ చేపట్టిన చర్యల కారణంగానే ఆరవ చిరుతను బంధించాము’
తిరుమల: తిరుమల: తిరుమల నడకదారిలో బుధవారం ఉదయం మరో చిరుత చిక్కింది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన తర్వాత మరింత అప్రమత్తమైన టీటీడీ.. చిరుతల దాడిని నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఆ చర్యలు సత్ఫలితాల్ని ఇవ్వడంతో తిరుమల నడకదారిలో ఆరవ చిరుతను బంధించారు. ఈ మేరకు చిరుత చిక్కిన ప్రాంతానికి వచ్చిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘చిన్నారి లక్షిత పై దాడి చేసాక టీటీడీ అనేక చర్యలు చేపట్టింది. నడకదారి భక్తులకు భద్రత కట్టుదిట్టం చేశాం. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సూచనలు అన్ని అమలు చేస్తున్నాం. నడకదారిలో భక్తులకు కర్రలు అందించాము. భవిష్యత్తులో మరింత భద్రత కల్పిస్తాము. నడకదారిలో కంచె వెయ్యడామా.. లేక జంతువుల సంచారానికి మార్గం సుగమం చెయ్యడానికి ఏర్పాటు చేస్తాము. విమర్శలు చేసే వారికి కనువిప్పు కలగాలి. టీటీడీ చేపట్టిన చర్యల కారణంగానే ఆరవ చిరుతను బంధించాము. క్రూరమృగాల సంచారం పై నిరంతరం అధ్యయనం జరుగుతుంది’ అని అన్నారు. కాగా, నడకదారిలో చిక్కిన చిరుతను అటవశాఖ అధికారులు జూపార్క్‌కి తరలించారు. దీనిపై డీఎఫ్‌వో మాట్లాడుతూ.. ‘ వేకుమజామున చిరుత బోన్లో చిక్కింది. సుమారు నాలుగు సంవత్సరాల వయస్సు ఉంటుంది. వైద్య పరీక్షల అనంతరం చిరుతను సుదూర అటవీప్రాంతంలో వదలాలా లేదా అన్నది నిర్ణయిస్తాము. బోన్ లో చిక్కిన ఆరు చిరుతలలో రెండు మూడు చిరుతలకు దంతాలు సరిగ్గలేవు. వాటికి వేటడే శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వాటిని జూపార్క్ సంరక్షణ చేస్తాం’ అని తెలిపారు. -
సీఎం జగన్‌కు టీటీడీ ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు: భూమన
-
TTD: నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్: భూమన
తిరుపతి: టీటీడీ ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ చారిత్రక నిర్ణయం అని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.ఇవాళ్టి ఇళ్ల పట్టాల పంపిణీతో టీటీడీ ఉద్యోగుల 60 ఏళ్ల కల సాకారమైందని భూమన అన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారని గుర్తు చేసిన భూమన.. సీఎం జగన్ ఇప్పుడు దాన్ని పూర్తి చేశారని అన్నారు. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పూర్తి చేయడం సీఎం జగన్ వల్లే సాధ్యమయిందని చెప్పారు. పేదల పట్ల గౌరవం ఉన్న ముఖ్యమంత్రి ఒక్క జగనే అని భూమన కొనియాడారు. దాదాపు మూడు వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయి.. మిగిలిన వారికి కూడా త్వరలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు భూమన వెల్లడించారు. సీఎం జగన్ హయాంలో ఇంత అభివృద్ధిలో భాగం అయినందుకు భూమన సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్ని వందల ఎకరాల భూమిని టీటీడీ ఉద్యోగుల ఇళ్ల కోసం కేటాయిస్తూ సీఎం జగన్ మహత్తర కార్యక్రమం చేపడుతున్నారని భూమన అన్నారు. వైయస్ఆర్ హయాంలో తాను టీటీడీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించినట్లు భూమన పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల ఇంత అభిమానం ఉన్న సీఎం జగన్‌ను ఉద్యోగస్థులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ఇదీ చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలు: తిరుమలకు సీఎం జగన్.. అప్డేట్స్ -
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వాహనసేవ వీక్షణకు టీటీడీ చర్యలు
సాక్షి, తిరుమల: తిరుమలలో బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. భక్తులు వాహనసేవ వీక్షించడానికి మాడవీధులను పరిశీలించినట్టు చెప్పారు. కాగా, ఈవో ధర్మారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 18వ తేదీన రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గరుడోత్సవం రోజు దగ్గరంగా వాహనసేవను వీక్షించడానికి మాడవీధులను పరిశీలించామన్నారు. గ్యాలరీలలో 2 లక్షల మంది భక్తులు వాహనసేవలు వీక్షిస్తారు. అందరూ వాహనసేవలు వీక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. మరోవైపు.. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల నిమిత్తం అదనంగా మరో 100 ఎకరాల భూమి కేటాయింపుపై మంత్రి రోజాతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చర్చించారు. పాధిరేడు అరణ్యం వద్ద గతంలో 300 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో నగరిలోని తన నివాసం వద్ద భూమనను మంత్రి రోజా సత్కరించారు. ఇది కూడా చదవండి: ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ -
జైల్లో బాబుకు భద్రత లేదనడం హాస్యాస్పదం: భూమన
సాక్షి, తిరుపతి: చంద్రబాబు జీవితమంతా రక్తసిక్తమేనని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ మండిపడ్డారు. ‘‘జైల్లో బాబుకు భద్రత లేదని కుటుంబసభ్యులనడం హాస్యాస్పదం. చట్టాలకు ఎవరూ అతీతులు కారు. చట్టానికి అందరూ లోబడి ప్రవర్తించాల్సిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదు’’ అని భూమన పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతిపై మిగిలిన కేసులన్నీ వేగవంతం చేయాలి. రాజధాని ఇన్నర్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం, సాగునీటి ప్రాజెక్టులు స్కాం, ఈఎస్ఐ స్కాం అన్నింటిలో విచారణ వేగవంతం చేయాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. చదవండి: బాబు, పవన్ ఫెవికాల్ బంధం.. ఎవరేమైతే మాకేంటి? -
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం వైఎస్ జగన్‌కు ఆహ్వానం
-
బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. -
సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
పలు అభివృద్ధి పనులతో తిరుపతి నగరానికి సరికొత్త రూపు
-
ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు.. శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. భూమన కరుణాకర రెడ్డికి అర్చకులు సంప్రదాయంగా తలపాగా చుట్టారు. గోపూజ, గోప్రదర్శనం చేసుకున్న తర్వాత పాలుపితికి, గోవులకు దాణా అందించారు టీటీడీ చైనర్మన్. అనంతరం శ్రీ వేంకటేశ్వర దివ్య మహావృత స్థూపం వద్ద నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. టీటీడీ తరఫున చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలందరికీ గోకులాష్టమి శుభాభినందనలు తెలియశారు. పరమ పూజ్యమైన పండగ గోకులాష్టమి రోజున టీటీడీ గో సంరక్షణ శాలలో గోకులాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని తెలిపారు. గోకులాష్టమి వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోందన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా సాహ్నివాల్ జాతి గోవును టీటీడీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల ముందే 40 కోట్ల రూపాయల గ్రాంట్‌ను గోశాలకు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. చదవండి: తిరుమల ఆలయంపై విమాన సంచారం.. టీటీడీ సీరియస్ సనాతన భారతదేశంలో గాటికి ఆవు లేని ఇల్లు లేనేలేదు. అంతటి పరమ పవిత్రంగా కొలిచే హిందువులకు గోకులాష్టమి అత్యంత ముఖ్యమైనది. గోవులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. నేను గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు వందేగోమాతరం పేరిట జాతీయ స్థాయిలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది. దానికి ఇద్దరు నోబుల్ లారెన్స్ కూడా రావడం జరిగింది. గోవులను రక్షించుకోవాలని, గోవులు ఉత్పత్తి చేసేపదార్థాల ద్వారా మన ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపతాయని వంటి అనేక రకాలుగా సెమినార్ అభిప్రాయాలు, సూచానలు వెల్లువెత్తాయి. రెండు రోజుల పాటు జరిగిన సెమినార్లో మేధావులంతా పెద్ద ఎత్తున చర్చించిన కారణంగా మంచి అవుట్ పుట్ వచ్చింది. ఆ తరహా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగిస్తాం. గోవు మనదరికీ పూజ్యనీయమైన తల్లి లాంటిది.’ అని భూమన పేర్కొన్నారు. -
విమర్శలకు భయపడం.. భక్తుల భద్రతే ముఖ్యం: టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రెండు నెలల కాలంలో 5 చిరుతలను పట్టుకున్నామని తెలిపారు. నడక దారిలో ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. విమర్శలకు భయపడమని, చిత్తశుద్ధితో భక్తులకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. చిరుత చిక్కుకున్న ప్రదేశానికి టీటీడీ చైర్మన్ భూమన చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ చిరుత కొనసాతుందని పేర్కొన్నారు. రాత్రి పన్నెండు.. ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని, తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని భూమన అన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని, ఈ కారణంగానే నేడు అయిదో చిరుతను పట్టుకున్నట్లు చెప్పారుజ నడక దారిలో వస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించాలని, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో చుక్కెదురు భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం వారికి చేతి కర్రలు కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు. కర్రలు ఇస్తామని ప్రకటించగానే దానిమీద ఇష్టం వచ్చినట్టుగా తమ ఎన్నో అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని విమర్శించారు. కర్రలు ఇస్తామని చెప్పిన తర్వాత నాలుగు చిరుతలు దొరికాయని, అంతకు ముందు ఒక చిరుత బోనులో చిక్కిందని గుర్తు చేశారు. భక్తుల భద్రత విషయంలో టీటీడీ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో తెలియజేసేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే అని చైర్మన్ పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారి అధికారుల పర్యవేక్షణలో రెండు మూడు వందల మంది సిబ్బంది అధునాతన బోనులతో ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారని తెలిపారు. విమర్శలకు, జడిసి.. ఆపరేషన్ చిరుతను ఆపేసే ప్రసక్తి లేదని విమర్శకులను హెచ్చరించారు. కాగా తిరుమలలో కాలిబాటన వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా మరో చిరుతపులిని బంధించారు అధికారులు. తిరుమల ఘాట్ రోడ్డు నరసింహ స్వామి ఆలయం ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. వేకువజామున 12 నుంచి 1 గంట మధ్యలో బోన్లో చిక్కుకున్నట్లు అటవీశాఖ అధికారుల చెప్పారు. గత వారం రోజులుగా ఈ చిరుత సంచారం గుర్తించిన అధికారులు పట్టుకోవడానికి బోన్ పెట్టగా.. నేడు చిక్కుకుంది. దానిని ఎస్వీ జూపార్క్ తరలించారు. -
భక్తుల భద్రతే మాకు ముఖ్యం: భూమన
-
భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: భూమన
-
భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే చేతి కర్రలు: టీటీడీ చైర్మన్
తిరుపతి కల్చరల్: అలిపిరి నడక మార్గంలో క్రూరమృగాల సంచారం నేపథ్యంలో అనేక భద్రతా చర్యలు తీసుకున్నామని, ఇందులో ఓ చర్యగా భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి చేతి కర్రలు అందజేస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అలిపిరి పాదాల మండపం వద్ద టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయన బుధవారం భక్తులకు చేతి కర్రలను అందజేశారు. మీడియాతో భూమన మాట్లాడుతూ.. చేతి కర్రలతో భక్తులు క్రూరమృగాలతో పోరాడతారని కాదని, చేతిలో కర్ర ఉంటే ఏ జంతువైనా వెనకాడుతుందని శాస్త్రీయ పరిశీలన ద్వారా రుజు వైందని చెప్పారు. వేల ఏళ్ల నుంచి గ్రామాల్లో ప్రజలు పొలాలకు, అడవులకు వెళ్లేటప్పుడు చేతి కర్రలను ఆసరాగా తీసుకెళుతుంటారని గుర్తుచేశారు. కర్రల పంపిణీకి సంబంధించి విమర్శలు చేస్తున్న వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. చేతి కర్రలను భక్తులకు ఉచితంగా అందిస్తామని, వీటిని అలిపిరిలో అందజేసి శ్రీనరసింహస్వామి వారి ఆలయం వద్ద తిరిగి తీసుకుంటామని తెలిపారు. టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం తిరుమల శిలాతోరణం వద్ద, ఏడో మైలు వద్ద చిరుతల సంచారాన్ని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో గాలిగోపురం నుంచి వంద మంది భక్తులను గుంపులుగా గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్లోనున్న అలిపిరి నడక మార్గంలో ఇనుప కంచె వేయడానికి కేంద్ర అటవీ శాఖకు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపామని, వారు తగిన డిజైన్లతో అంగీకారం తెలిపితే కంచె నిర్మిస్తామన్నారు. చేతి కర్రల కోసం అడవిని నాశనం చేయడం లేదని, పది వేల కర్రలు మాత్రమే తీసుకున్నామని, ఇందు కోసం రూ.45,000 ఖర్చయిందని తెలిపారు. -
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్ భూమన
సాక్షి, తిరుపతి: గోవిందా అని కోటిమార్లు వ్రాస్తే వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ పాలకమండలి ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం పట్ల అవగాహన పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానం అని చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి, కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్న కరుణాకర్‌రెడ్డి.. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని హెచ్చరించారు. కాగా, టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. గోవింద కోటి రాయించాలని నిర్ణయించామని, చిన్నపిల్లల నుండి 25 సంవత్సరాల లోపు పిల్లలు గోవిందా కోటిని రాస్తారో వారి కుటుంబానికి విఐపీ దర్శనం కల్పిస్తామన్నారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలు.. ►ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భగవద్గీత పుస్తకాల పంపిణీ ►సెప్టెంబరు 18 నుండి 26 సాలకట్ల బ్రహ్మోత్సవాలు ►అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ►సెప్టెంబరు18 ధ్వజరోహణం సందర్భంగా సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారు ►టీటీడీ క్యాలండరలు, డైరీలు సీఎం ప్రారంభిస్తారు ►ముంబాయిలోని బంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచారకేంద్రం నిర్మాణానికి నిర్ణయం ►29 స్పెషల్ డాక్టర్లు, 15 డాక్టర్లతో పాటు.. చిన్నపిల్లల ఆసుపత్రిలో 300 ఉద్యోగుల నియామకాలకు అమోదం ►2 కోట్ల 16 లక్షలతో మెడికల్, 47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలకు ఆమోదం. ►1700 టీటీడీ క్యూట్రాస్ ఆధునీకరణకి రూ.15 కోట్లు మంజూరు. ►టీటీడీలో 413 పోస్టులు ప్రభుత్వ అనుమతికి పంపాము. ►47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలు ఆమోదం. ►కేశవాయన గంటా, బైరాగిపట్టడి ప్రాంతాలలో రోడ్లు ఆధునీకరణకి రూ.135కోట్లతో నిర్మాణం. ►తిరుపతిలో 1,2,3 సత్రాలు 1950లో నిర్మించారు. 2,3 సత్రాలను తొలగించి, అధునాతనమైన రెండు వసతి సముదాయాలు నిర్మాణం, అఛ్యతం, శ్రీ పధం అని పేరు ఒక్కో అతిధిగృహం 300 కోట్లతో నిర్మాణం. ►రెండు రూ.600 కోట్లతో నిర్మాణం చేపట్టాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. -
కచ్చపి ఆడిటోరియంను ప్రారంభించిన భూమన
సాక్షి, తిరుపతి: నూతనంగా నిర్మించిన కచ్చపి ఆడిటోరియంను ఆదివారం ప్రారంభించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. రూ. 41 కోట్లతో నూతనంగా కచ్చపి ఆడిటోరియంను నిర్మించారు. ఈ ఆడిటోరియంను ప్రారంభించిన తర్వాత భూమన మాట్లాడుతూ.. కళాక్షేత్రంకు కచ్చపి అని పేరు పెట్టడం వెనుక ఒక చరిత్ర ఉంది. సరస్వతిదేవి వీణలో తీగ పేరు కచ్చపి. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లతో మరో తిరుపతిని అభివృద్ధి చేసి చూపించాం. భక్తితో పాటు సాహిత్యం, సంగీతం కార్యక్రమాలతో కచ్చపి కళాక్షేత్రం కళకళలాడుతూ ఉండాలి’ అని పేర్కొన్నారు. -
సెప్టెంబర్ 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి ప్రారంభం కానున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆలయం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ చైర్మన్ విడుదల చేశారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరధం, 25న రధోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజా అవరోహనం నిర్వహిస్తామన్నారు. చదవండి: జగ్గంపేట : నూతన వధువరులకు సీఎం జగన్ ఆశీర్వాదం బ్రహ్మోత్సవాల సమయంలో అధిక రద్దీ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నమని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏడు రోజులు ఏటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా, సాంప్రదాయంగా టీటీడీ సిబ్బందితో పాటుగా, అన్ని విభాగాల సమన్వయంతో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నమని భూమన కరుణాకర్ పేర్కొన్నారు. భక్తులకు భద్రత విషయంతో ఎటువంటి లోటు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలిరావాలని కోరారు. -
పోరాటాలు చేసి వచ్చా.. భయపడే ప్రసక్తే లేదు: భూమన కౌంటర్
సాక్షి, తిరుమల: టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై భూమన స్పందించారు. ఈ క్రమంలో తాను విమర్శలకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు. విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాజాగా భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను నాస్తికుడని విమర్శలు చేసే వారికి ఇదే నా సమాధానం. 17 సంవత్సరాల క్రితమే నేను టీటీడీ ఛైర్మన్ అయిన వ్యక్తిని. 30వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించాను. తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్ల కూడదని నిర్ణయం తీసుకుంది నేనే. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు జరిపించింది కూడా నేనే. దళితవాడల్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం చేయించింది నేనే. నేనే క్రిస్టియన్ అని, నాస్తికుడని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడిని, ఇలాంటి వాటికి భయపడను’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు, ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: సినిమా రేంజ్లో సీన్లు పండించిన పవన్.. ప్లాన్ బెడిసికొట్టింది! -
భగవంతుడు ఎల్లప్పుడూ సామాన్య భక్తుల పక్షాన ఉంటారు: భూమన
-
‘కాలినడకన వచ్చే భక్తుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం’
తిరుపతి: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే కాలినడక భక్తుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. తమిళనాడు హోసూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 300 కి.మీ కాలి నడకన వచ్చిన భక్తులను కలిసిన క్రమంలో వారితో భూమన మాట్లాడారు. శ్రీనివాస మంగాపురం శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులతో భూమన మాట్లాడారు. భగవంతుడు ఎల్లప్పుడూసామాన్య భక్తుల పక్షాన ఉంటారన్నారు. కాలినడక భక్తుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని భూమన తెలిపారు. -
తిరుమల: ‘చిన్నారిపై దాడి చేసిన చిరుతను జూపార్క్‌లోనే ఉంచుతాం’
సాక్షి, తిరుమల: తిరుమల నడకదారిలో గురువారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దే చిరుత బోనులో చిక్కింది. ఇక, మూడు రోజుల క్రితమే ఇక్కడ మరో చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, 50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించారు. పట్టుబడిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం: భూమన ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అర్ధరాత్రి 1.30 గంటలకు చిరుత బోనులో చిక్కింది. బోనులో చిక్కిన చిరుతను మగ చిరుతగా అధికారులు నిర్ధారించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు నడకదారిలో భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అటవీశాఖ అధికారుల సూచనలతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం. మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తాం’ అని స్పష్టం చేశారు. టీటీడీపై ట్రోల్ చేయడం సరికాదు: ధర్మారెడ్డి టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ‘చిరుతలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నాం. శ్రీశైలం నుంచి నిపుణుల బృందాన్ని తిరుమలకు పిలిపించాం. భక్తులకు కర్రలు ఇవ్వడంతో వారికి సహాయంగా ఉంటుంది. వందలాది మంది భక్తులు కర్రలతో పాదయాత్ర చేయడంతో జంతువులు దరిచేరవు. సోషల్ మీడియాలో టీటీడీపై ట్రోల్ చేయడం సరికాదు’ అని అన్నారు. చిరుతల కోసం మరో ఆరు బోన్లు.. ఈ సందర్బంగా సీసీఎఫ్ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టుబడ్డ చిరుతకు ఐదేళ్ల వయసు ఉంటుంది. చిరుతకు జూపార్క్‌లో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తాం. చిక్కిన చిరుతల్లో చిన్నారిపై దాడి చేసిన చిరుతను గుర్తించాలి. చిన్నారిపై దాడి చేసిన చిరుతను జూపార్క్‌లో ఉంచుతాం. మరో చిరుతను ఎక్కడ ఉంచాలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. చిరుతలను ట్రాప్ చేయడానికి మరో ఆరు నూతన బోన్లు కొనుగోలు చేస్తున్నాం. నడక దారిలో ఏర్పాటు చేసిన కెమెరాలను ప్రతీరోజు పరిశీలిస్తున్నాం. క్రూర మృగాలు సంచారం ఉన్న ప్రదేశాల్లో ట్రాప్ కేజ్ ఏర్పాటు చేస్తాం. ఎలుగుబంటి కదలికలు కూడా గుర్తించాం. ఎలుగుబంటిని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం’ అని వెల్లడించారు. ఇది కూడా చదవండి: భక్తులకు కర్రలు కాకుండా.. తుపాకులివ్వాలా!.. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవు! -
కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదు
-
భక్తుల రక్షణే ప్రధాన ధ్యేయం
తిరుపతి సిటీ: తిరుమల వచ్చే శ్రీవారి భక్తుల ప్రాణరక్షణే తమ ప్రధాన ధ్యేయమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గతంలో కౌషిక్ గాయపడటం, ఇటీవల చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అప్రమత్తమై అటవీ శాఖ అధికారులు, పోలీసులతో కలసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో 12 ఏళ్ల వయసులోపు పిల్లలతో వచ్చే భక్తులకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పెద్దలను మాత్రం రాత్రి 10 వరకు అనుమతిస్తామని తెలిపారు. నడక దారిలో వెళ్లే ప్రతి భక్తునికి సహకారం కోసం ఊత కర్ర అందిస్తామన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. భక్తులను గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తూ.. ముందు వెనుక అటవీశాఖ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తామన్నారు.. అటవీశాఖ అధికారులు నిపుణులైన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని సూచించామని.. వారి వేతనాలు టీటీడీయే భరిస్తుందన్నారు. జంతువులకు ఆహారం అందించడం నిషేధం నడక దారిలో వెళ్లే భక్తులు సాధు జంతువులకు ఆహారం అందించడం నిషేదించామని, అలా అందించే వారిపై చర్యలు తప్పవని కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నడక దారిలోని దుకాణదారులు, హాటళ్ల యజమానులు వ్యర్థాలను బయట వేయరాదని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి నుంచి తిరుమల వరకు నడకమార్గంలో సుమారు 500 కెమెరాలను అమర్చనున్నామని, అవసరమైతే డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. వైల్డ్‌లైఫ్ అవుట్ పోస్టులు 24 గంటలు పనిచేస్తాయని, డాక్టర్లు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దారి పొడవునా సుమారు 30 అడుగుల వరకు వెలుతురు ఉండేలా ఫోకస్ లైట్లు అమర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద 15వేల దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, మధ్యలో వీటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గాన సైతం వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ అధికారులతో చర్చించామని.. కేంద్ర అటవీశాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయం చేసిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. -
తిరుమల: టీటీడీ ఛైర్మన్ అధ్యక్షతన హైలెవల్ కమిటీ సమావేశం
-
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సీఎం జగన్ పథకాలు
-
ఫెన్సింగ్ ప్రతిపాదన పెట్టాం: టీటీడీ చైర్మన్ భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో వన్యప్రాణుల సంచారం.. భక్తుల భద్రతపై ఆందోళన నెలకొన్న దరిమిలా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు తెలియజేశారు. కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన లక్షిత చిన్నారిని చిరుత చంపేసింది. నడకదారిలో వెళ్లే భక్తులకు అపాయం లేకుండా చూడటానికి అటవీశాఖ, పోలీసులతో ఈ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించాము. సమావేశంలో అటవీశాఖ టీటీడీకి అనే సూచనలు చేసింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ► భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అందుకోసం ఎంత ఖర్చైనా చేస్తాం. ► కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి ఒక ఊతకర్రను ఇవ్వనున్నాం. కర్రే ఇక భక్తులకు ప్రధాన ఆయుధం. ► అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గంలో ఉదయం 5 గం. నుంచి మధ్యాహ్నం 2గం. వరకే పిల్లలకు అనుమతి. కాలిబాటలో రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్లకు అనుమతి. ఘాట్రోడ్లో వెళ్లే టూవీలర్స్‌కు సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి. అలాగే భక్తులను గుంపులుగా పంపాలని నిర్ణయించాం. ► నడకదారిలో సాధుజంతువులకు కూడా ఎలాంటి ఆహారం ఇవ్వొద్దు. ఇస్తే చర్యలు తీసుకుంటాం. ► ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో పిల్లను అనుమతించం. ► భద్రత కోసం డ్రోన్లు కూడా వాడాలని నిర్ణయించాం. తిరుపతి నుంచి తిరుమల మధ్య 500 కెమెరాల ఏర్పాటు. అవసరమైన చోట్ల డ్రోన్ కెమెరాలు కూడా వాడతాం. ► భక్తులపై చిరుత దాడుల గురించి చర్చించాం. భక్తుల భద్రతలకు నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని నియమిస్తాం. ► నడకదారిలో ఇరువైపులా లైటింగ్ ఏర్పాటు చేస్తాం. బేస్ క్యాంప్‌తో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ► నడకదారి లో ప్రమాదాలపై భక్తులకు అప్రమత్తం చేసేలా సైన్‌బోర్డ్స్ ఏర్పాటు. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తాం. భద్రతపై భక్తులకు అవగాహన కల్పిస్తాం. ► ఫెన్సింగ్ ప్రతిపాదన పెట్టాం. అధ్యయనం చేయాలని అటవీశాఖ అంటోంది. ఆ తర్వాతే ఫెన్సింగ్ గురించి నిర్ణయం తీసుకుంటాం. ► తిరుమలలో దుకాణాలు వ్యర్థాలు పడేయరాదు. బయటే వదిలేసే షాపులపై చర్యలు తీసుకుంటాం. ► కాలినడకన వెళ్లే వారికి గతంలో నేను చైర్మన్ గా ఉన్న సందర్భంగా దర్శన టికెట్లు కేటాయించాం. 15 వేల మందికి ప్రస్తుతం నడకదారి భక్తులకు టోకెన్లు ఇస్తున్నాము, వాటిని గాలిగోపురం వద్ద చెక్ చేసుకోవాలి. ఇకపై భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దర్శన టికెట్లు గాలిగోపురం వద్ద చెకింగ్ అవసరం లేదు. ► అటవీశాఖ నిబంధనలు ప్రకారమే నిర్ణయాలు తీసుకొన్నాము. గతంలో టీటీడీ సంరక్షణలో పునుగు పిల్లిని అటవీశాఖ అధికారుల అదేశంతో జూ పార్క్ తరలించాము. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌజ్‌లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన క్రూరమృగాల సంచారం.. నడకదారిలో భక్తుల భద్రతపై చర్చ ప్రధానాశంగా జరిగిన ఈ భేటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు అటవీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: లక్షితను చంపింది చిరుతేనా? -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలు, శ్రీవారి ఫొటో, నమామి గోవిందం కిట్, అగర్బత్తీలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన స్వామివారి ఫొటోను టీటీడీ చైర్మన్ అందజేశారు. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు సీజే శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పూజలు చేశారు. తిరుచానూరులో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వీరికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ఠాకూర్కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతకుముందు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల శ్రీవారిని ఆదివారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. -
తిరుమలలో రెండు ఎస్వీ మ్యూజియంల ఆధునీకరణ : టీటీడీ ఛైర్మన్ భూమన
-
శ్రీహరి సేవలో..!
-
స్వామివారి అనుగ్రహం వల్లే టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించాను
-
సామాన్య భక్తులకే ప్రాధాన్యం
సాక్షి, తిరుపతి/తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి.. భూమన కరుణాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ స్వామి సేవకులకు సేవకుడిగా పనిచేస్తానన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి దయ, ఆశీస్సులతో తనకు రెండోసారి టీటీడీ చైర్మన్‌గా సేవచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సనాతన హిందూధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా తమ ధర్మకర్తల మండలి పనిచేస్తుందని చెప్పారు. స్వామి వైభవాన్ని ప్రజల హృదయాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామని, స్వామిని భక్తుల దగ్గరికే తీసుకెళ్లి భక్తిప్రసాదం పంచుతామని తెలిపారు. దేశవిదేశాల్లోని హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా టీటీడీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. తాను 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సనాతన హిందూధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశామని, సామాన్య భక్తులకు అవసరమైన వసతులు కల్పించటమేగాక సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఆర్.కె.రోజా, అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Bhumana Karunakar Reddy Photos: టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి (ఫొటోలు)