Biopic
-
ఓటీటీలోకి ‘విశ్వదర్శనం’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!
కళా తపస్వి కె.విశ్వనాథ్(K Viswanath).. తెలుగు సీనీ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని పేరు ఇది. శంకరాభరణం, సిరిసిరి మువ్వ, సిరివెన్నెల, స్వాతి ముత్యం, శుభసంకల్పం.. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం ఆయన. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన సినిమాలు ఎప్పుడూ మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ఇలాంటి గొప్ప దర్శకుడి జీవిత చరిత్రను వెబ్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. జనార్దన మహర్షి దర్శకత్వం వహించిన ఈ డాక్యూమెంటరీకి ‘విశ్వదర్శనం’( Viswadharshanam )అనే టైటిల్‌ని ఖరారు చేశారు.తాజాగా ‘విశ్వదర్శనం’ ప్రోమోని విడుదల చేశారు. అందులో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కె.విశ్వనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని వివరించనున్నారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా ఇది రిలీజ్ కానున్నట్లు నిర్మాణసంస్థ వెల్లడించింది. ‘వెండి’తెర చెప్పిన ‘బంగారు’ దర్శకుడి కథ.. అంటూ దీన్ని ప్రకటించింది.కాగా,తెలుగు ప్రేక్షకులకు గొప్ప సందేశాత్మక చిత్రాలను అందించిన విశ్వనాథ్(92).. అనారోగ్యంతో గతేడాది ఫిబ్రవరిలో మరణించారు. 1930 ఫిబ్రవరి 19న జని్మంచిన విశ్వనాథ్..51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఇళయరాజా బయోపిక్ కు బ్రేక్ పడిందా ?
-
గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు..?
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ జీవిత కథ వెండితెరపై ఆవిష్కృతం కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని హిందీలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో తొలుత బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్లో నటిస్తాడిని ప్రచారం జరిగింది. అయితే డేట్స్ కుదరక ఖురానా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. 🚨 RAJKUMAR RAO AS GANGULY. 🚨- Rajkumar Rao likely to play Sourav Ganguly in Dada's biopic. (Sumit Ghosh). pic.twitter.com/zReuoMSp4h— Mufaddal Vohra (@mufaddal_vohra) January 24, 2025తాజాగా గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ పోషిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ (లవ్ ఫిల్మ్స్) ఇప్పటివరకు స్పందించలేదు.కాగా, గంగూలీ బయోపిక్‌లో లీడ్ రోల్ కోసం తొలుత ఓ ప్రముఖ బెంగాలీ నటుడిని కూడా సంప్రదించారని తెలుస్తుంది. గంగూలీ స్నేహితుడైన ప్రొసేన్‌జిత్ ఛటర్జీని బయోపిక్‌లో నటించమని దర్శక, నిర్మాతలు కోరారట. ఇందుకు ప్రొసేన్‌జిత్ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ప్రొసేన్‌జిత్ సైడ్ అయిపోయి కొత్తగా రాజ్‌కుమార్ రావు తెరపైకి వచ్చాడు.గంగూలీ క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. టీమిండియా గొప్ప కెప్టెన్లలో గంగూలీ ఒకడు. భారత క్రికెట్‌కు గంగూలీ దూకుడు నేర్పాడు. గంగూలీ సారథ్యంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. గంగూలీ నేతృత్వంలో భారత్ 146 వన్డేల్లో 76 విజయాలు.. 49 టెస్ట్‌ల్లో 21 విజయాలు సాధించింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం గంగూలీ బీసీసీఐ అథ్యక్షుడిగా పని చేశాడు. ప్రస్తుతం గంగూలీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. -
అమ్మ బయోపిక్ రూపొందించాలన్నది నా డ్రీమ్: వీకే నరేశ్
‘‘సినీ పరిశ్రమలో విజయవంతంగా 52 ఏళ్లు పూర్తి చేసుకోవడం హ్యాపీగా ఉంది. వృత్తిపట్ల అంకితభావం, క్రమశిక్షణ, ప్రేక్షకాదరణ వల్లే ఇది సాధ్యపడింది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలకు, ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని సీనియర్ నటుడు వీకే నరేశ్ అన్నారు. జనవరి 20న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది రిలీజైన ‘గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు వందకోట్ల కలెక్షన్స్‌ను దాటడం మన సక్సెస్. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రూ. 300 కోట్లను దాటుతుందని విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.ఇందులో నేను చేసిన ముఖ్యమంత్రి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషంగా ఉంది. నా కెరీర్లో 2025 బిజీయస్ట్ ఇయర్. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నాను. వీటిలో‘బ్యూటీ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఈ ఏడాది రెండు పెద్ద కార్యక్రమాలనూ తీసుకున్నాను. ‘సినిమా మ్యూజియమ్ అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్’ అనే కార్యక్రమాన్ని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవిగారి పేరుతోప్రారంభించాం. అందులో విజయకృష్ణ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. నేను, పవిత్ర దీనిని ఓ మిషన్లా తీసుకుని కళాకారుల ఐక్య వేదిక సంస్థ పేరుపై ఏర్పాటు చేశాం.జంధ్యాల, కృష్ణ, విజయ నిర్మలగార్లు నా గురువులు. నాకు సినిమాల్లో ఓనమాలు నేర్పించిన జంధ్యాలగారిని చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని ఆయన పేరుతో డబ్బింగ్,పోస్ట్ ప్రోడక్షన్ థియేటర్నుప్రారంభించాం. రైటర్ సాయినాథ్గారి సహకారంతో ఆయనపై తయారు చేసిన పుస్తకాన్ని అమ్మగారి (దివంగత ప్రముఖ నటి– దర్శకురాలు విజయ నిర్మల) బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 20న లాంచ్ చేస్తాం. ఈ ఏడాది ప్రతిష్టాత్మక విజయకృష్ణ అవార్డ్స్‌ని ఫ్యాన్స్ సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం. అమ్మ విజయ నిర్మలగారి బయోపిక్ చేయాలనే డ్రీమ్ ఉంది. అది నేనే రాయగలను. ఇక ‘చిత్రం భళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రాలకు పార్టు 2 చేయాలని ఉంది’’ అని అన్నారు. -
రజనీకాంత్ బయోపిక్.. శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్.. ఏ ఓటీటీలో చూడాలంటే?
భారత మాజీ ప్రధానమంత్రి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. మనదేశానికి ఆర్థికమంత్రిగా, ప్రధానిగా ఎన్నో ఏళ్లపాటు సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోదీతో సహా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల సీఎంలు మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.అయితే ఆర్థిక చాణక్యుడిగా పేరున్న మన్మోహన్ తన జీవితంలో ఎన్నో గొప్ప అవార్డులు సాధించారు. పద్మ విభూషణ్ లాంటి పురస్కారానికి ఎంపికయ్యారు. తన హయాంలో సమాచారం హక్కు చట్టంతో పాటు పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యావత్ భారతావని మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకుంటోంది.మన్మోహన్ సింగ్ బయోపిక్..అయితే మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర గురించి ఓ సినిమాను కూడా తెరకెక్కించారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ మూవీ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. 2019లో విడుదలైన ఈ సినిమా పలు వివాదాల తర్వాత విడుదలైంది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రం 2019లో జనవరి 11న రిలీజైంది. "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్" పుస్తకంలోని పలు సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి విజయ్ రత్నాకర్ గుట్టే దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్‌గా బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ నటించారు. ఈ సినిమాను రుద్ర ప్రొడక్షన్స్ , పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇందులో 13వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 మధ్య గల సంఘటనలను చూపించారు.ఓటీటీలో స్ట్రీమింగ్..ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతం ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాపై మీరు కూడా ఓ లుక్కేయండి. -
ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తల్లిదండ్రులిద్దరూ డాక్టర్స్.. వారి కోరిక మేరకు సైన్స్ చదివాడు కార్తీక్ ఆర్యన్. కానీ మనసు యాక్టింగ్ వైపు పరుగులు తీస్తుండటంతో క్లాసులు ఎగ్గొట్టి మరీ ఆడిషన్స్‌కు వెళ్లేవాడు. అలా మోడలింగ్‌లోనూ అడుగుపెట్టాడు. తొలి సినిమాకు సంతకం చేశాక ఇంట్లో చెప్పి ఒప్పించాడు. అలా ప్యార్ కా పంచనామా సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు. ఓటీటీలోకి వచ్చేసిన బయోపిక్ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈయన ఈ ఏడాది చందు ఛాంపియన్ సినిమాతో అలరించాడు. మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. రెంట్ పద్ధతిలో..అమెజాన్ ప్రైమ్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడప్పుడే ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు. రూ.199 చెల్లించి రెంట్ పద్ధతిలో చూసేయొచ్చు. ఈ మూవీలో మనసును మెలిపెట్టే సీన్స్ చాలానే ఉన్నాయట! ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను ఉచితంగానే చూడాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే! #ChanduChampion now available on Amazon Prime ❤️ #KartikAaryan https://t.co/qLfCy75KVm pic.twitter.com/DqtfsuxtVB— Chiji 🐣 (@StanningKartik) July 25, 2024 చదవండి: ఎన్టీఆర్‌కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్ -
ఆవిడ బయోపిక్‌లో నటించాలని..!
మాతృభాష కన్నడంలో నటిగా రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ అగ్రనటిగా రాణిస్తున్నారు రషి్మక మందన్నా. తెలుగులో రష్మిక మందన్న కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం గీతాగోవిందం కాగా పాన్ ఇండియా నటిని చేసిన చిత్రం పుష్ప. ఇక హిందీలో యానిమల్ చిత్రంతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తమిళంలోనే రెండు చిత్రాల్లో నటించినా, సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక మందన్న దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలనే కోరికను వ్యక్తం చేశారు. నటి సౌందర్య కూడా కన్నడ భామ అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె తెలుగు, తమిళం భాషల్లోనే ఎక్కువ చిత్రాల్లో నటించి స్టార్‌డమ్‌ను అందుకున్నారు. 1992లో బానన్నా ప్రీతీసు అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నటి సౌందర్య. ఆ తరువాత తెలుగు, తమిళం, మలమాళం, హిందీ భాషల్లో నటించి అగ్రనటిగా రాణించారు. నటిగా ఈమె వయసు పుష్కరమే. అయినా భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి సౌందర్య బయోపిక్‌లో నటించాన్న కోరికను నటి రష్మిక మందన్నా ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేశారు. అందులో ఆమె పేర్కొంటూ ప్రత్యేక పాత్రల్లో నటించాలన్న కోరిక అందరు నటీమణులకు ఉంటుందన్నారు. అదేవిధంగా తనకూ దివంగత నటి సౌందర్య జీవిత చరిత్రను ఎవరైన తెరపై ఆవిష్కరించే ఆమె పాత్రలో నటించాలని కోరుకుంటున్నానన్నారు. అది తన కల కూడా అని అన్నారు. తాను సినీరంగ ప్రవేశానికి ముందే నటి సౌందర్యకు వీరాభిమానినని చెప్పారు. ఆమె నటించిన చిత్రాలు ఒక్కటి కూడా వదలకుండా చూసేదాన్నని చెప్పారు. సౌందర్య నటించిన చిత్రాలు చూసి ఎదిగిన తాను ప్రముఖ కథానాయకి అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇకపోతే తనలో నటి సౌందర్య పోలికలు ఉన్నాయని పలువురు అంటుంటారన్నారు. అందుకే ఆమె బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నాననీ, అలాంటి అవకాశం వస్తే తాను నటించడానికి సిద్ధం అని రషి్మక ప్రకటించారు. -
ఇళయరాజా ముందు ధనుష్ భారీ డిమాండ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితమే ప్రారంభించారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే, ఈ సినిమాకు హీరో ధనుష్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' చిత్రం పట్ల భిన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ సినిమాపై మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే, ధనుష్ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించకుండా మరింత పెంచాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమా ఒకటి ఆయన తీస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో 'కుబేర' కోసం నాగార్జున, ధనుష్ కలిసి ఇందులో నటిస్తున్నారు. ఇదే వరుసలో రాయన్, ఇళయరాజా బయోపిక్ ఉంది. అయితే, ధనుష్ రెమ్యునరేషన్ భారీగా పెంచాడని తెలుస్తోంది. ఇళయరాజా సినిమా కోసం రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ అడిగారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. అయితే, సినిమా కోసం కేవలం 50 రోజులకు మించి కాల్షిట్స్ ఇవ్వలేనని కూడా ఆయన ముందే చెప్పారట. ధనుష్ పారితోషికం రోజుకు కోటి రూపాయలకు పెరిగిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులు 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే వారు ఒక్కో సినిమాకు కనీసం 70 రోజులకు పైగా కేటాయిస్తారని టాక్ ఉంది. -
దానికి నేను సరైన వ్యక్తి కాదు.. వాళ్లయితేనే: శ్రుతి హాసన్
కమల్ హాసన్ పేరు చెప్పగానే విలక్షణ నటుడు అనే పదం మాత్రమే గుర్తొస్తుంది. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గీత రచయిత.. ఇలా కమల్‌కి చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇతడి కూడా కూతురు శ్రుతి హాసన్ కూడా తక్కువేం కాదు. నటి, సంగీత దర్శకురాలు, గాయని, గీత రచయితగా గుర్తింపు సంపాదించింది. ఈమె ఇటీవల ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం రాసిన ఇంగ్లీష్ పాటని తండ్రి కమలహాసన్ తమిళంలో అనువదించాడు. 'ఇనిమేల్' పేరుతో రూపొందిన ఈ ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్)ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రుతిహాసన్.. రీసెంట్గా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. మీ తండ్రి కమలహాసన్ బయోపిక్‌ని మీరు తీస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. దానికి అవకాశమే లేదని బదిలిచ్చింది. తన తండ్రి జీవిత చరిత్రని సినిమాగా తీయడానికి తాను సరైన వ్యక్తి కాదని పేర్కొంది.ఇక్కడ ఎందరో మంచి దర్శకులు ఉన్నారని, తన తండ్రి కమలహాసన్ బయోపిక్ వాళ్లయితే అద్భుతంగా తీయగలరని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇక శ్రుతి సినిమాల విషయానికొస్తే.. గతేడాది చివర్లో 'సలార్'లో నటించి హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: గుండు గీయించుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?) -
వెండితెరపై కిరణ్ బేడీ బయోపిక్.. టైటిల్ ఇదే!
భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి జీవితం వెండితెరపైకి రానుంది. ‘బేడి: ది నేమ్ యు నో.. ది స్టోరీ యూ డోన్ట్’ అనే టైటిల్‌తో ఆమె బయోపిక్ తెరకెక్కనుంది. ‘వన్ వే, అనదర్ టైమ్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు అందుకున్న దర్శక–నిర్మాత, రచయిత కుశాల్ చావ్లా ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ స్లేట్ పిక్చర్స్ పతాకంపై గౌరవ్ చావ్లా ఈ సినిమాను నిర్మించనున్నారని, వచ్చే ఏడాది ఈ సినిమా విడుదయ్యేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ‘‘కిరణ్ బేడీగారు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాత్రమే కాదు... ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక 1966లో జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌గా వార్తల్లో నిలిచారు కిరణ్ బేడీ. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎన్నో సంస్కరణలు చేశారు. ‘పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. అలాగే రామన్ మెగసెసే అవార్డ్స్‌తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు కిరణ్ బేడీ. ఇక వెండితెరపై ఆమె పాత్రను ఎవరు చేస్తారు? అనేది చిత్రబృందం ప్రకటించలేదు. -
మహేశ్- రాజమౌళి సినిమాలో కట్టప్ప.. స్పందించిన నటుడు!
తమిళ నటుడు తెలుగువారికి సైతం సత్యరాజ్ పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలిలో కట్టప్పగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాజాగా వెపన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తారన్న వార్తలపై ఆయన మరోసారి స్పందించారు. నాపై వస్తున్నవన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ బయోపిక్‌లో తాను నటించడం లేదని మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. భవిష్యత్‌లో మోదీ బయోపిక్ కోసం ఎవరైనా నన్ను సంప్రదించినా చేయనని తేల్చిచెప్పారు.డైరెక్టర్ రాజమౌళికి తాను ఎప్పుడు రుణపడి ఉంటానని సత్యరాజ్ అన్నారు. ఆయన వల్లే ఇండియా వైడ్‌గా కట్టప్పగా ఫేమస్ అయ్యానని తెలిపారు. నా డార్లింగ్ ప్రభాస్ సినిమా కల్కి రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మహేశ్, రాజమౌళి సినిమాలో తాను నటించడం లేదని వెల్లడించారు. ఒకవేళ నటించే అవకాశం వస్తే.. ఛాన్స్ వదులుకోనని సత్యరాజ్ అన్నారు. కాగా.. గతంలో మోదీ జీవితంపై ఓ సినిమాను తెరకెక్కించారు. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. -
బయోపిక్‌లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
కేన్స్ ఫిల్స్ ఫెస్టివల్ 2024లో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రముఖ వ్యాపారదిగ్గజం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ ‘ది అప్రెంటైస్’ అందుకు కారణం. సినిమా మట్టుకు అద్భుతంగా ఉందంటూ 8 నిమిషాలపాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కినప్పటికీ.. ట్రంప్ పర్సనల్ లైఫ్‌లోని కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తన మాజీ భార్య ఇవానా(దివంగత)పై ట్రంప్ అత్యాచారం చేసినట్లు ఈ చిత్రంలో ఒక సీన్ ఉంది. ఆ సన్నివేశం కేన్స్ ఆడియొన్స్‌ను ఒక్కసారిగా బిత్తరపోయేలా చేసింది. అంతేకాదు.. ఈ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలియని ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని చూపించిందని చిత్రాన్ని వీక్షించిన విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా కేవలం 70, 80 దశకాల్లో కేవలం ట్రంప్ వ్యాపార జీవితాన్నే ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. ట్రంప్ టవర్ వేదికగా జరిగిన కొన్ని చీకటి విషయాల్ని చూపించిందని అంటున్నారు. దావాకు రెడీమరోవైపు ఈ చిత్రం తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించిన ట్రంప్‌కు.. పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఈ చిత్రంపై దావా వేసేందుకు సిద్ధం అయ్యారాయన. ‘‘ ఈ చిత్రం(ది అప్రెంటైస్) ఒక చెత్త. కల్పిత కథనాలతో సంచలనంగా.. చర్చనీయాంశంగా మారడానికి ప్రయత్నించారు. ఈ చిత్రంపై దావా వేయబోతున్నాం’’ అని ట్రంప్ టీం ఒక అధికారిక ప్రకటక విడుదల చేసింది.ట్రంప్ ఆశ్చర్యపోతారేమో: డైరెక్టర్ అబ్బాసీఅయితే ట్రంప్ టీం దావా బెదిరింపులపైనా చిత్ర డైరెక్టర్ అలీ అబ్బాసీ స్పందించారు. డొనాల్డ్ టీం తప్పకుండా ఈ చిత్రం చూడాలని. ఆ తర్వాతే దావా వేయడం గురించి మాట్లాడాలని అంటున్నారు. అంతేకాదు ట్రంప్ సైతం ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోతారే తప్ప నచ్చకపోవడం లాంటిది జరగకపోవచ్చు ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతీ ఒక్కరూ ఆయన ఫలానా వాళ్ల మీద దావా వేస్తున్నారనే చర్చ జరుపుతుంటారు. కానీ, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు? వ్యాపారంలో ఆ స్థాయికి ఎలా ఎదిగారన్నది పట్టించుకోరు. ఈ చిత్రం చూస్తే వాళ్లకే అర్థమవుతుంది. బహుశా ట్రంప్ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకోవచ్చు’’ అని అబ్బాసీ అన్నారు.ది అప్రెంటిస్ చిత్రంలో ట్రంప్ పాత్రను నటుడు సెబాస్టియన్ స్టాన్(మార్వెల్ చిత్రాల ఫేమ్) పోషించగా.. ట్రంప్ వ్యక్తిగత లాయర్ జెర్మీ స్ట్రాంగ్ పాత్రలో రోయ్ కోన్, ఇవానా ట్రంప్ రోల్లో మరియా బాకాలోవా నటించారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మే 20వ తేదీన చిత్రాన్ని ప్రదర్శించారు. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. -
బాలీవుడ్లో తెలుగువాడి బయోపిక్.. ఎవరీ శ్రీకాంత్ బొల్లా?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ‘శ్రీకాంత్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు హీరోగా నటించగా, జ్యోతిక, శరత్ కేల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్..తనకున్న లోపాన్ని దీటుగా ఎదుర్కొన్ని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్ బాల్యం సీన్‌తో బాల్యం సీన్‌తో ట్రైలర్ ప్రారంభం అయింది. బాల్యంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనకున్న లోపాన్ని అదిగమించి పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు? బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను ఎలా స్థాపించాడు? తదితర అంశాలలో చాలా ఎమోషనల్‌గా ట్రైలర్ సాగింది. శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ రావు ఒదిగిపోయాడు. . టీ సీరిస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, నిధి పర్మార్ హీరానందానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవరీ శ్రీకాంత్? శ్రీకాంత్ బొల్లా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం. 1991లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే అంధుడు. చూపు లేకపోవడంతో చిన్నప్పుడే అతన్ని వదిలించుకోవాలని తల్లిదండ్రలకు కొంతమంది బంధువులు సలహా ఇచ్చారట. కానీ వాళ్లు మాత్రం తమ కొడుకును పట్టుదలతో చదివించారు. తనకున్న లోపాన్ని అనుకూలంగా మార్చుకొని కష్టపడి చదివాడు శ్రీకాంత్. ఆరేళ్ల వయసులో ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులో అంధ విద్యార్ధులు చదువుకునే బోర్డింగ్ స్కూలులో సీటు లభించింది. దీంతో శ్రీకాంత్ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాడు. ఇంజనీర్ కావాలన్నది ఆయన కల. అది జరగాలంటే సైన్స్, మ్యాథ్స్ చదవాలి. కానీ, ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి ఆయనకు అర్హత లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. ఈ విషయంపై కోర్టుకెక్కాడు ఆయన. ఆరు నెలల విచారణ తర్వాత ఆయన సైన్స్ సబ్జెక్ట్ చదివేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటర్మీడియట్లో 98 శాతంతో క్లాస్‌లో టాపర్‌గా ఆయన నిలిచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదవాలనుకున్నా.. అంధుడైన కారణంగా ఆ అడ్మిషన్ దక్కలేదు. దీంతో అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఐదు యూనివర్సిటీల నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చాయి. మసాచుసెట్స్‌లోని ఎంఐటీని ఆయన ఎంచుకున్నారు. అక్కడ సీటు పొందిన మొట్టమొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి శ్రీకాంత్. ఎంఐటీలో మేనేజ్మెంట్ సైన్స్‌లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్ కూడా వచ్చింది. కానీ తాను మాత్రం ఇండియాలోనే పని చేయాలనుకున్నాడు. 2012లో తిరిగి హైదరాబాద్‌కి వచ్చాడు. బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించాడు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ, తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇందులో ఎక్కువమంది వికలాంగులే పని చేస్తున్నారు. 2017లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రచురించిన ‘ 30 ఏళ్లలోపు 30 మంది’ జాబితాలో శ్రీకాంత్ బొల్లాకు చోటు దక్కింది. 2022లో స్వాతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఈ జంట ఓ బిడ్డకు జన్మనిచ్చారు. -
మన తెలుగువాడి బయోపిక్
చూపు లేకపోయినా అంట్రప్రెన్యూర్‌గా విజయం సాధించిన మన తెలుగువాడు శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఫస్ట్‌లుక్ వైరల్ అయ్యింది. రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. పుట్టుకతో అంధత్వం వెంటాడినా విజయాలు అందుకోవడానికి అది అడ్డుకాదని నిరూపించిన తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ‘శ్రీకాంత్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. మంచి నటుడిగా పేరు గడించిన రాజ్‌కుమార్ రావు శ్రీకాంత్ పాత్రను పోషిస్తుండటం విశేషం. మచిలీపట్నంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదువు విషయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. అంధుడైన కారణాన ఐఐటీలో సీటు ΄÷ందలేకపోయాడు. అయితే పట్టుదలతో మసాచూసెట్స్ యూనివర్సిటీలో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా దఖలయ్యి చదువుకున్నాడు. భారత్‌కు తిరిగి వచ్చి పారిశ్రామిక రంగంలో కీర్తి గడించాడు. బొల్లా జీవితం ఇప్పటికే ఎందరికో ఆదర్శం అయ్యింది. వెండితెర మీద ఆయన జీవితం చూసి మరెందరో స్ఫూర్తి ΄÷ందుతారు. తుషార్ హీరానందాని ఈ సినిమా దర్శకుడు. -
Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో
సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్‌లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్ వతన్ మేరే వతన్’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా సీక్రెట్ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు? ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... ఈ అనౌన్స్మెంట్ బ్రిటిష్ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్‌ని, దాని నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్‌వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా. గాంధీ పిలుపు విని... ఉషా మెహతా గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఉన్న సారస్ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్‌లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది. డూ ఆర్ డై 1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్ దాస్ ఖాకడ్, చంద్రకాంత్ ఝావేరీ, బాబూభాయ్ ఠక్కర్‌లతో కలిసి ఆ మీటింగ్‌కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది. రహస్య కాంగ్రెస్ రేడియో బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్‌మిషన్‌ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్మిటర్ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్‌గా మలిచింది. ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... అంటూ స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు. మూడు నెలలు రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్ చిరునామా చెప్పేశాడు. నవంబర్ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్ హోమ్ మినస్టర్గా ఉండగా ఆమె విడుదల జరిగింది. కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1980లో రిటైర్ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘అయ్ వతన్ మేరే వతన్’ అమేజాన్‌లో మార్చి 21న విడుదలైంది. -
Ilaiyaraaja Biopic:వెండితెరకి ఇళయరాజా జీవితం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి వస్తోంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో రూ΄÷ందుతున్న ‘ఇళయరాజా’ షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకి ఇళయరాజా, హీరోలు కమల్‌హాసన్, ధనుష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇళయరాజాతో తమకున్న అనుబంధాన్ని కమల్‌హాసన్, ధనుష్ పంచుకున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తారని కోలీవుడ్ టాక్. -
ఓటీటీకి మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న బయోపిక్ మెయిన్ అటల్ హూన్. రవి జాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ మూవీ హక్కులను ఇప్పటికే సొంతం చేసుకున్న జీ5 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈనెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఇందులో పంకజ్ త్రిపాఠి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆయన పర్సనల్ లైఫ్, రాజకీయ జీవితం గురించి చూపించారు. ఈ చిత్రంలో పీయూష్ మిశ్రా, దయా శంకర్ పాండే, రాజా సేవక్, ఏక్తా కౌల్ పలువురు నటించారు. జనవరి 19, 2024న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రెండు నెలల్లోపే ఓటీటీకి వచ్చేస్తోంది. Shuru karo taiyaari, aa rahe hain Atal Bihari! #MainAtalHoon premieres on 14th March, only on #ZEE5#AtalOnZEE5#MainAtalHoon@TripathiiPankaj @meranamravi @vinodbhanu @thisissandeeps #KamleshBhanushali @thewriteinsaan #BhaveshBhanushali @directorsamkhan @BSL_Films… pic.twitter.com/so934WIZOu — ZEE5 (@ZEE5India) March 10, 2024 -
‘యాత్ర 2’ ట్విటర్ రివ్యూ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ‘యాత్ర 2’. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇందులో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. (చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!) ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు నేడు(ఫిబ్రవరి 8) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఇప్పటికే ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యాత్ర 2 మూవీ ఎలా ఉంది? వైఎస్ జగన్‌గా జీవా ఎలా నటించాడు? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. యాత్ర 2 చిత్రానికి ఎక్స్‌లో పాజిటివ్ స్పందన వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్ అని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయంటూ పలువురు నెటిజన్స్ ఎక్స్‌లో కామెంట్ చేస్తున్నారు. #Yatra2 The best biopic ever in all the industries u will feel goosebumps right from the start @MahiVraghav just remember this name. Had a little hatred towards jagan but now it’s love ❤️ @JiivaOfficial 💥 Antis ki kuda goosebumps vache moments unnay ⭐️⭐️⭐️⭐️/5 Rating :-4/5 pic.twitter.com/Tggn0vieAr — Film Buff 🍿🎬 (@SsmbWorshipper) February 7, 2024 ‘యాత్ర 2’ బెస్ట్ బయోపిక్. సినిమా స్టార్టింగ్ నుంచే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు మహి వి. రాఘవ్. ఇంతకు ముందు జగన్‌పై కొంచెం ద్వేషం ఉండే..సినిమా చూశాక అది ప్రేమలా మారింది. వైఎస్ జగన్‌ని ద్వేషించేవారికి కూడా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయంటూ ఓ నెటిజన్ 4/5 రేటింగ్ ఇచ్చాడు. Honestly chepthuna one of the best biopics ever made in Telugu #Yatra2 🔥🔥🔥🔥 Blockbuster movie 👌🏻👌🏻👌🏻#Yatra2 Bomma Blockbuster 🔥💙#YSJaganAgain @ysjagan @JiivaOfficial @mammukka pic.twitter.com/YhYNZnV46B — Sri Surya Movie Creations (@SSMCOfficial) February 8, 2024 నిజాయితీగా చెబుతున్న..తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్. బ్లాక్ బస్టర్ మూవీ. బొమ్మ అదిరింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు.. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుంది -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి #BlockbusterYatra2#Yatra2#CMYSJagan pic.twitter.com/kKzp63OOgv — YSR Congress Party (@YSRCParty) February 7, 2024 యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుందని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. Emotional n Gusebumps Stuff 🔥🔥🔥🔥#Yatra2 Blockbuster Reports pic.twitter.com/WBaUpCbNp6 — Jani Journalist (@shaik_jani8) February 8, 2024 @DrPradeepChinta అన్న రేటింగ్ 5 స్టార్ అంటే.... #Yatra2Movie కి తిరిగే ఉండదిక.... 👏👏👏👏 https://t.co/8J3g3dCOTd — #Siddham for 2024 🦾💪🇮🇳 (@bhojaraju99) February 8, 2024 First half completed! Edipinchesav @MahiVraghav ! pure emotions and YSJagan mass high! Trailer is jujubi.#Yatra2 #Yatra2JourneyBegins #Yatra2Movie #Yatra2OnFeb8th https://t.co/8xpua0Epg0 — Pavan_GR (@pavan_gr) February 7, 2024 Emotional n Gusebumps Stuff 🔥🔥🔥🔥#Yatra2 Blockbuster Reports pic.twitter.com/WBaUpCbNp6 — Jani Journalist (@shaik_jani8) February 8, 2024 Last Ki @ysjagan sir cameo 🔥 Pillini teesukuni velli adavilo vadileste adi pille, kani akkada undi puli adavilo Unna bonu lo Unna gargistundi. Deii em cinema Ra Babu HYD vadini Kuda vachi meeku vote veyali ani undi Jai Jagan#Yatra2#Yatra2OnFeb8th #Yatra2Premier pic.twitter.com/RS25F9xmp9 — UK DEVARA 🌊⚓ (@MGRajKumar9999) February 7, 2024 అధ్బుతమైన స్పందనతో, యూరోప్‌లో ముగిసిన యాత్ర -2 ప్రీమియర్ షో#Yatra2Movie #Yatra2 #JaitraYatra pic.twitter.com/3yOE48IhX0 — AP360 (@andhraa360) February 7, 2024 #Yatra2 #Yatra2Movie వైఎస్ఆర్ మరణం, తదనంతర పరిణామాలు,తన తండ్రి మరణంతో నష్టపోయిన వారిని ఓదార్చేందుకు జగన్ ఓదార్పు యాత్రను ఎలా ప్రారంభించాడో, ఆయన నిర్ణయం వల్ల ఎదుర్కొన్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించారు — @Team Basireddy (@BasireddyLokes1) February 7, 2024 ప్రతీ అభిమాని గుండె చప్పుడిలో పెద్దాయన ఉంటారు 🥹🥹#Yatra2#Yatra2JourneyBegins#JaitraYatrapic.twitter.com/IdzOCiCkZ1 — Vikas 🎯🎯 (@VikasRonanki) February 8, 2024 Yatra -2 movie is an inspiration 👌👌👌👌👌@MahiVraghav @mammukka @JiivaOfficial @ysjagan @YSRCParty @JaganannaCNCTS @SajjalaBhargava Please watch it 🔥🔥https://t.co/DSvqpvfiEs pic.twitter.com/1gFEvtBqTX — Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) February 8, 2024 అధ్బుతమైన స్పందనతో, యూరోప్‌లో ముగిసిన యాత్ర -2 ప్రీమియర్ షో#Yatra2Movie #Yatra2 #JaitraYatra pic.twitter.com/3yOE48IhX0 — AP360 (@andhraa360) February 7, 2024 Finally blockbuster kottisamu anna.. 🥹❤️🔥🙏 Tnq @MahiVraghav Anna Great inspirational movie ichavu... 🧎♂️ Jai Jagan anna.. 🇸🇱🙏 @ysjagan #Yatra2Movie #Yatra2 #YSJaganAgainIn2024 pic.twitter.com/IB16sF6fa8 — ᴀʟʟᴜ sᴀɴᴊᴜ ʀᴇᴅᴅʏ™🪓🐉 (@AlluSanjuReddy) February 8, 2024 @MahiVraghav ఎవడ్రా నువ్వు మా జగనన్నకు మాకన్నా పెద్ద ఫ్యాన్ లా ఉన్నావ్🔥 Thanks Mahi anna 🥰 pic.twitter.com/dGJY6pV6Ge — Manager (@thinkpad8gen) February 8, 2024 -
మహారాణి బయోపిక్.. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నిర్మాత కూతురు!
బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన భారతదేశ మొట్టమొదటి రాణి వీరమంగై వేలు నాచ్చియార్ జీవిత చరిత్ర సినిమాగా రానుంది. వేలు నాచ్చియార్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ పతాకంపై జేఎం.బషీర్ నిర్మిస్తున్నారు. ఆర్.అరవింద్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో టైటిల్ పాత్రను నటి ఆయిషా పోషిస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. దీనికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించడం విశేషం. కాగా ఇందులో పెరియమరుద అనే ముఖ్య పాత్రను ఈ చిత్ర నిర్మాత, నటుడు జేఎం.బషీర్ పోషిస్తున్నారు. ఈ చిత్ర పరిచయ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని దేవర్ మహల్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జేఎం.బషీర్ మాట్లాడుతూ.. వేలు నాచ్చియార్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడం గర్వంగా ఉందన్నారు. ఇందులో టైటిల్ పాత్రను తన కుమార్తె ఆయిషా పోషించడం ఇంకా సంతోషంగా ఉందన్నారు. మన దేశం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన తొలి మహిళారాణి గురించి ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్న సదుద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. తాను నటించిన దేశీయ తలైవర్ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని, ఆ తరువాత వేలు నాచ్చియార్ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి జె.శ్రీధర్ చాయాగ్రహణం అందించనున్నారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జేఎం.బషీర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: ప్రభాస్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అలా జరగడంతో! -
సిల్క్ స్మిత మరో బయోపిక్.. హీరోయిన్ ఎవరంటే..?
సిల్క్ స్మిత.. సినీ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయే పేరు ఇది. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఉర్రుతలూగించింది. చనిపోయి పాతికేళ్లు దాటినా..ఇప్పటికే సిల్క్ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతూనే ఉంది. ఇప్పటికే ఈ శృంగార తారపై బాలీవుడ్లో డర్టీ పిక్చర్ అనే సినిమా వచ్చింది. తాజాగా మరో సిల్క్ జీవితం ఆధారంగా మరో చిత్రం రాబోతుంది. చంద్రికా రవి ప్రధాన పాత్రలో నటిస్తోన ఈ చిత్రాన్ని జయరామ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. (చదవండి: ఊహించని పేరు, డబ్బు.. చివరి క్షణాల్లో నరకం.. ‘ఐటమ్ గర్ల్’ విషాద గాథ) సిల్క్ స్మిత- ది అన్‌టోల్డ్ స్టోరీ అనే టైటిల్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శనివారం(డిసెంబర్ 2) సిల్క్ స్మిత జయంతిని పురస్కరించుకొని ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఇందులో చంద్రిక..అచ్చం స్మితలా కనిపించింది. ఎవరీ రవి చంద్రికా! భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ మోడల్, నటి చంద్రికా రవి. ‘చీకటి గదిలో చితకొట్టుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో 'మా మనోభావాలు దెబ్బ తిన్నాయి'పాటకు బాలయ్యతో కలిసి స్టెప్పులేసింది. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. సిల్క్ పాత్రలో రవి చంద్రికా ఒదిగిపోయినట్లు కనిపిస్తుంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్లో డర్టీ పిక్చర్ వచ్చింది. అందులో స్మిత జీవితం మొత్తాన్ని చూపించారు. అంతకు మించి ఈ చిత్రంలో కొత్తగా ఏం చూపిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) -
సామ్ బహదూర్ టీజర్ రిలీజ్.. చాలా కష్టపడ్డానంటున్న హీరో
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సామ్ బహదూర్. భారతీయ మొట్ట మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. 'యుద్ధంలో చనిపోవడమే సైనికుడి పని అని ఇందిరా గాంధీ అంటే.. ప్రత్యర్థి వైపున్న జవాన్లను అంతమొందించడమే సైనికుడి అసలైన కర్తవ్యం', 'నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, ఆర్మీయే నా ప్రాణం' అని విక్కీ కౌశల్ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధానికి సామ్ మానెక్షా ఏ విధంగా సారథ్యం వహించారు? సైనికులకు ఎలాంటి శిక్షణ అందించాడనేది ఈ చిత్రంలో చూపించారు. తాజాగా విక్కీ కౌశల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 'సామ్ మానెక్షా అని రాసి ఉన్న ఆర్మీ యునిఫామ్ ధరించడమే పెద్ద బాధ్యత. ఈ విషయంలో నేను ఏడీజీపీఐ(అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్)కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారిని కలిసినప్పుడల్లా ఈ పాత్రను సమర్థవంతంగా పోషించాలని చెప్పేవారు. కాబట్టి సినిమా చేస్తున్నంతసేపూ ఆ ఒత్తిడి నాపై ఉంది. నాకు సాధ్యమైనంతవరకు బాగా చేయడానికే ప్రయత్నించాను. చిత్రయూనిట్ అంతా కష్టపడ్డాం. నిజానికి సామ్ యుక్తవయసులో ఎలా ఉన్నాడో తెలుసుకునేందుకు అతడి మనవడిని అనేకసార్లు కలిశాం. చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాం. దీనిద్వారా ఆయన మాట్లాడే తీరు, నడకతీరు తెలుసుకుని దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించాను' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. చదవండి: బిగ్‌బాస్ షాకింగ్ నిర్ణయం.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్ ఫోన్స్! -
వ్యక్తుల సంఘర్షణే వ్యూహం
‘‘నాకు టీడీపీ గురించి తెలియదు. వైసీపీ గురించి తెలియదు. నేను రాజకీయాలు ఫాలో కాను. ఈ ‘వ్యూహం’ చిత్రానికి పార్టీలకు, ప్రభుత్వాలకు సంబంధం లేదు. ఇది కేవలం వ్యక్తుల మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ)’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రధారులుగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా పోలిటికల్ చిత్రం ‘వ్యూహం’. ఈ సినిమా రెండో భాగం ‘శపథం’. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ‘వ్యూహం’ సినిమా నవంబరు 10న, ‘శపథం’ చిత్రం జనవరి 25న విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘వ్యూహం’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘వాస్తవ సంఘటనలు, వాటి తాలూకు పాత్రల పట్ల నాకు ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే ఉంటుంది. నా దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో దాదాపు 80 శాతం వరకు ఏదో ఒక సంఘటన నుంచి స్ఫూర్తి ΄పొందినవే ఉంటాయి’’ అన్నారు. దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ –‘‘ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ అంశాలను ΄పొందుపరిచి ఓ సందేశంగా.. సినిమాగా చెప్పాలనిపించి, సమయానుకూలంగా ‘వ్యూహం’ని ఇప్పుడు నిర్మించి, విడుదల చేస్తున్నాం. ఇది బయోపిక్ కాదు. ఈ సినిమాని చాలా పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఐదు లక్షల మందితో నవంబరు 5న ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
'ఆంధ్రావాలా' నటి జీవితంపై వెబ్ సిరీస్.. తనే డైరెక్ట్ చేస్తుందట!
ఎవరిదైనా బయోపిక్‌ను తెరకెక్కించాలంటే అందుకు తగిన ఘన చరిత్ర ఉండాలి. ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే సంఘటనలు ఉండాలి. అలాంటి పలు చిత్రాలు తెరకెక్కి సక్సెస్ అయ్యాయి కూడా. ఇందిరాగాంధీ, క్రీడాకారుడు ఎంఎస్.ధోని వంటివి అలా రూపొందిన చిత్రాలే. కాగా తాజాగా శృంగార తారగా ముద్రపడ్డ నటి సోనా బయోపిక్‌ను వెబ్ సిరీస్‌గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కుశేలన్ చిత్రంలో వడివేలుకు భార్యగా నటించి గుర్తింపు పొందిన బోల్డ్ లేడీ సోనా. అదే విధంగా గురు ఎన్ ఆళు, అళగర్ మలై, ఒంబదుల గురు, జిత్తన్– 2 మొదలగు పలు తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆంధ్రావాలా, కథానాయకుడు, విలన్, ఆయుధం వంటి సినిమాలు చేసింది. తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళం, కన్నడ భాషల్లోనూ నటించి గుర్తింపు పొందిన సోనా నిర్మాతగానూ మారి అమ్మా క్రియేషన్స్ టీ.శివతో కలిసి కనిమోళి అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా మరో చిత్రాన్ని కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో నిర్మించ తలపెట్టినా అది పలు సమస్యల కారణంగా తెరకెక్కలేదు. అలాంటిది తాజాగా తన జీవిత చరిత్రలోని ఒక భాగాన్ని వెబ్ సిరీస్‌గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సోనానే దర్శకత్వం వహించనున్నారట. దీనికి స్మోక్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇందులో తను నటించకుండా మరో నటిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. చదవండి: 'భోళా శంకర్' దెబ్బతో రూట్ మార్చిన మెహర్ రమేష్ -
ఇళయరాజా బయోపిక్.. ఛాన్స్ కొట్టేసిన ఆ స్టార్ హీరో
ఇళయరాజా.. ఈ పేరు సంగీతానికి చిరునామా. చాలా భాషల్లో పనిచేసిన సంగీతజ్ఞాని. ఈయనలో అద్భుత గాయకుడు, గీతరచయిత ఉన్నారు. మాస్ట్రో ఇళయరాజాది సంగీతంలో సింపోని చేసిన ఘనత. ఇప్పటికే 1400 చిత్రాలకు పైగా పనిచేసి చరిత్ర సృష్టించారు. అలాంటిది ఈయన జీవిత చరిత్రని సినిమా తీస్తే.. అవును మీరు విన్నది నిజమే. ఇప్పుడీ ఈ ఆలోచన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడికి వచ్చింది. (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) హిందీలో పలు చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని అలరిస్తున్న డైరెక్టర్ బాల్కీ.. ఇప్పటికే హీరో ధనుష్‌తో 'షమితాబ్' సినిమా తీశారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్ కూడా నటించారు. అలానే బాల్కీతో నటుడు ధనుష్‌కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు ఇళయరాజాగా ధనుష్‌ని చూడాలని బాల్కీ ఆశపడుతున్నారు. ఇళయరాజా బయోపిక్ తీయాలనుకుంటున్నా, ఇది తన డ్రీమ్ అని రీసెంట్గా ఓ మీటింగ్‌లో చెప్పుకొచ్చారు. ఇందులో ఇళయరాజాగా నటుడు ధనుష్‌తో యాక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ధనుష్ కూడా మంచి సింగర్, లిరిక్ రైటర్, డైరెక్టర్, నిర్మాత అన్న విషయం తెలిసిందే. అలానే ఇళయరాజాగా నటించేందుకు ధనుష్ ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) -
సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వెర్సటైల్ యాక్టర్ అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా మాత్రమే చేస్తా, లేదంటే లేదు అని మడికట్టుకుని కూర్చోలేదు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ రోల్.. ఇలా తనకు నచ్చిన ప్రతిదీ చేసుకుని పోయాడు. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల్ని సంపాదించుకుంటున్నాడు. అలాంటి ఈ నటుడు ఇప్పుడు ఏకంగా సీఎం బయోపిక్‌లో ఛాన్స్ కొట్టేశాడట. సీఎం బయోపిక్ అనగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే 'యాత్ర 2'లో ముఖ్యమంత్రి పాత్ర కోసం తమిళ నటుడు జీవా పేరు పరిశీలనలో ఉంది. బయటకు చెప్పట్లేదు కానీ దాదాపు ఇదే కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇక విజయ్ సేతుపతి చేయబోయేది కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బయోపిక్‌లో అని టాక్. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) ఓ సామాన్యుడిలా మొదలైన సిద్ధరామయ్య ప్రయాణం.. ముఖ్యమంత్రి పీఠం వరకు ఎలా చేరింది అనేది రెండు భాగాల సినిమాగా తీయనున్నారు. అయితే హీరోగా దక్షిణాది నటుల్లో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యాడట. లాయర్, రాజకీయ జీవితంతోపాటు సిద్ధరామయ్య బ్రేకప్ స్టోరీ కూడా ఇందులో చూపించబోతున్నారట. ఈ బయోపిక్‌ని ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే విధంగా తీయబోతున్నారట. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ చిత్రానికి 'లీడర్ రామయ్య' పేరు ఖరారు చేశారు. కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళంలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన 'జవాన్' వచ్చే నెలలో రిలీజ్ కానుంది. హిందీలో ఒకటి, తమిళంలో ఐదు సినిమాల్లో హీరోగా నటిస్తూ విజయ్ బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) -
Meena Kumari biopic: విషాద నటి బయోపిక్ నిజమే
హిందీ చిత్రసీమలో విషాద పాత్రల్లో మెప్పించిన అలనాటి నటి ఎవరు అంటే? ‘మీనా కుమారి’ పేరు చెబుతారు. తన అందం, అభినయంతో నాటి తరం ప్రేక్షకులను అలరించారు మీనా కుమారి. ప్రస్తుతం ఆమె బయోపిక్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ బయోపిక్ గురించి మనీషా మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘ఏ చిత్రానికైనా కథే కీలకం. బయోపిక్‌లకి మరీను. మీనా కుమారి మీద వచ్చిన పుస్తకాల ఆధారంగా కథ తయారు చేస్తున్నా’’ అన్నారు. ఇటీవల రిలీజైన∙‘ఆది పురుష్’లో సీత పాత్ర చేసిన కృతీ సనన్ ‘మీనా కుమారి’ బయోపిక్‌లో టైటిల్ రోల్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మీనా కుమారి బయోపిక్ తీయడానికి ఆమె కుటుంబ సభ్యులు సుముఖంగా లేరని భోగట్టా. -
యాత్ర 2 నుంచి అదిరిపోయే అప్డేట్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా వచ్చిన యాత్ర సినిమా 2019లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి.రాఘవ్ దానికి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. నిజానికి ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్డేట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. అంతటితో ఆగలేదు, జూలై 8న అసలు సిసలు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు పేర్కొంది. శనివారం ఉదయం 11.35 గంటలకు యాత్ర 2 మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే వి.సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్ మొదలవుతుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. చదవండి: ఆదిపురుష్ నిర్మాత సతీమణి ఇంట తీవ్ర విషాదం -
Yatra 2 Update: ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అంటూ ‘యాత్ర 2’ సినిమా పోస్టర్ని విడుదల చేసింది చిత్రయూనిట్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ (2019) సినిమా మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ కి సీక్వెల్‌గా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర 2’ ఉంటుందని మహీ వి.రాఘవ్ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్డేట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో వి.సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మించనున్న ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ని విడుదల చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. ఇందులో జగన్ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్ మొదలవుతుంది. -
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్లో ఏం జరిగిందో చూడండి..!
-
కొత్త అవతారం లో హీరో ధనుష్ దాని కొససామేనా..!
-
మరో శాస్త్రవేత్త బయోపిక్‌లో మాధవన్
తమిళసినిమా: వైవిధ్య భరిత కథా పాత్రపై ఆసక్తి చూపే నటుడు మాధవన్. మొదట్లో లవర్‌బాయ్‌గా అలరించిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనూ తన సత్తా చాటుకుంటున్నారు. అలా ఇటీవలే ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్ జీవిత చరిత్రను రాకెట్రీ నంబి ఎఫెక్ట్ పేరుతో స్వీయ దర్శకత్వంలో నిర్మించి టైటిల్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా మరో తమిళ ప్రముఖ శాస్త్రవేత్త జీడీ నాయుడు బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నారు. ఈ చిత్రాన్ని మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. అందులోభాగంగా జీడీ నాయుడు పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా సంఘాలతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు మాధవన్ ప్రస్తుతం యారడీ నీ మోహిని, తిరుచిట్రంఫలం చిత్రాల ఫేమ్ మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఆయన జీడీ నాయుడు బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతారని సమాచారం. -
విరాట్ కోహ్లి బయోపిక్‌లో రామ్‌చరణ్..? పోలికలు కూడా దగ్గరగా ఉన్నాయి..!
తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన చెర్రీ.. స్పోర్ట్స్ బయోపిక్‌లో నటించాలని తనకు చాలకాలంగా కోరిక ఉందని అన్నాడు. అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించేందుకు ఇష్టపడతానని తెలిపాడు. క్రీడా జగత్తులో విరాట్ కోహ్లి ఓ అద్భుతమని, అతనిదో స్ఫూర్తిదాయకమైన క్యారెక్టరని పొగడ్తలతో ముంచెత్తిన చరణ్.. కోహ్లి రోల్ ప్లే చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకునేది లేదని తన మనసులోని మాటను బయటపెట్టాడు. లుక్స్ పరంగా కూడా తాను కోహ్లికి దగ్గరగా ఉంటానని, ఇది తనకు అదనపు అడ్వాంటేజ్ అని తెలిపాడు. వెండితెరపై ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలను పోషించి సక్సెస్ సాధించిన చరణ్.. స్పోర్ట్స్ బయోపిక్ చేయాలన్న సాహసోపేతమైన కోరిక కలిగి ఉండటం సినీ జనాలకు ఆకట్టుకుంటుంది. కాంక్లేవ్ సందర్భంగా చరణ్.. ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాటకు స్టెప్పులేసి అలరించాడు. #ViratKohli this is crazy 🕺🕺🕺 He is doing #NaatuNaatu #rrr #RamCharan #jrntr #INDvAUS @imVkohli @ImRo45 @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/2bm6FL6iAT — Telugu Box office (@TCinemaFun) March 17, 2023 ఓ పక్క చరణ్.. కోహ్లి బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టగా, మరో పక్క కోహ్లి.. ఆసీస్‌తో తొలి వన్డే సందర్భంగా మైదానంలో నాటు నాటు పాటకు స్టెప్పులేసి పరోక్షంగా చరణ్ ప్రపోజల్‌కు అంగీకారం తెలిపాడు. కాగా, నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న తర్వాత అమెరికా నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన రామ్ చరణ్.. తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశాడు. చరణ్ పాల్గొన్న కాంక్లేవ్‌లోనే పాల్గొన్న అమిత్ షా.. సదస్సు అనంతరం అదే హోటల్లో బస చేస్తున్న చరణ్ రూమ్ కి వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు గానూ అమిత్‌షా అభినందించి చరణ్‌ను శాలువాతో సత్కరించారు. భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు @KChiruTweets మరియు @AlwaysRamCharan లను కలవడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది. నాటు-నాటు పాటకు ఆస్కార్ మరియు RRR చిత్రం అద్భుత విజయం సాధించినందుకు రాంచరణ్ ను అభినందించారు. pic.twitter.com/eyLWuq3xmM — Amit Shah (@AmitShah) March 17, 2023 అనంతరం ట్వీట్ చేసిన కేంద్రమంత్రి అమిత్ షా భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్ చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ.. భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. -
తెరపైకి తమిళనాడు తొలి సూపర్‌స్టార్ బయోపిక్
తమిళసినిమా: సినిమా అనుభవం ఉన్న ఎవరైనా తొలి తమిళ సినీ సూపర్‌స్టార్ ఎవరంటే పేరు టక్కున చెప్పే పేరు ఎం.కె త్యాగరాజ భాగవతార్. ఆయన్ని ఇండస్ట్రీలో ఎంకేటీ అని పిలిచేవారు. త్యాగరాజ భాగవతర్ నటించిన హరిదాసు చిత్రం 1944లో దీపావళి సందర్భంగా విడుదలై మూడేళ్ల పాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఆ కాలంలో ప్రఖ్యాతి గాంచిన నటుడు త్యాగరాజ భాగవతార్. అలాంటి గొప్ప నటుడు తన 49వ ఏటనే అంటే 1959వ లో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత బుధవారం త్యాగరాజ భాగవతర్ 114వ జయంతి. ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు పార్థిబన్ ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన పేర్కొంటూ.. ‘తమిళనాడు తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొంది రాజభోగాలు అనుభవించిన నటుడు త్యాగరాజ భాగవతార్. పన్నీరుతో స్నానమాడి, కన్నీళ్లతో ముఖం తుడుచుకున్న నటుడు. చివరి దశలో దుర్భర జీవితం అనుభవించారు. ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించడానికి కథా, కథనాలను కూడా సిద్ధం చేశాను‘ అని తెలిపారు. త్యాగరాజ భాగవతార్ బయో పిక్‌ను ఎప్పుడు తీస్తారు? అన్న ప్రశ్నకు పార్థిబన్ బదులిస్తూ కథ, స్క్రీన్‌ప్లే కూడా సిద్ధం చేశానని, అయితే బయోపిక్‌లను, పిరియడ్ కథా చిత్రాలను సాధారణ బడ్జెట్‌తో రూపొందించడం సాధ్యం కాదని, భారీ బడ్జెట్ అవసరం అవుతుందన్నారు. అలాంటి నిర్మాత లభించినప్పుడు త్యాగ రాజ భాగవతర్ బయోపిక్‌ను కచ్చితంగా తెరకెక్కిస్తానని స్పష్టం చేశారు. -
ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రణ్‌బీర్ కపూర్
‘భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ బయోపిక్‌లో నేను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు’ అన్నారు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. డైరెక్టర్ లవ్ రంజన్ తెరకెక్కించిన తాజా హిందీ చిత్రం ‘తూ ఝూటీ మై మక్కార్’. రణ్‌బీర్ కపూర్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 3న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రణ్‌బీర్ కపూర్. ‘‘గంగూలీగారికి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన బయోపిక్ అంటే అది అందరికీ స్పెషలే. కానీ ఆయన బయోపిక్‌లో నటించాలనే అవకాశం నాకు రాలేదు. నాకు తెలిసి ఈ బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రముఖ గాయకులు, నటులు కిషోర్ కుమార్‌గారి బయోపిక్ కోసం 11ఏళ్లుగా వర్క్ జరుగుతోంది. దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ బసు ఈ స్క్రిప్ట్ వర్క్‌లో భాగస్వామిగా ఉన్నారు. నేను చేయబోయే నెక్ట్స్ బయోపిక్ కిషోర్ కుమార్గారిదే అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యాని మల్’ చేస్తున్నారు రణ్‌బీర్ కపూర్. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ కానుంది. -
త్వరలో పట్టాలెక్కనున్న సౌరవ్ గంగూలీ బయోపిక్.. హీరో అతనే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ బయోపిక్ అతి త్వరలో పట్టాలెక్కేందుకు రెడీ ఉందని తెలుస్తోంది. ఈ బయోపిక్‌లో దాదా పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నటించడం దాదాపుగా ఖరారైందని సమాచారం. ఈ విషయాన్ని గంగూలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి రివీల్ చేశాడని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ ప్రచారం జరిగినప్పటికీ.. గంగూలీ, రణ్‌బీర్‌లకు సంబంధించిన వారెవ్వరూ నోరు మెదపలేదు. తాజాగా గంగూలీకి అతి దగ్గరగా ఉండే ఓ వ్యక్తి ఈ విషయాన్ని ధృవీకరించాడు. దాదా బయోపిక్కు సంబంధించి గతంలో ఇరు వర్గాలు చాలాసార్లు సిట్టింగ్ చేసినప్పటికీ.. రణ్‌బీర్ డేట్స్ కుదరక ఎలాంటి ఒప్పందం జరగలేదని, ప్రస్తుతం రణ్‌బీర్ డేట్స్ కుదరడంతో డీల్ ఓకే అయ్యిందని, గంగూలీ గురించి లోతైన సమాచారం తెలుసుకునేందుకు మరో ముఖ్యమైన వ్యక్తితో (దర్శకుడు) కలిసి రణ్‌బీర్ త్వరలోనే కోల్‌కతాకు వెళ్లనున్నాడని సదరు వ్యక్తి మీడియాకు ఉప్పందించాడు. అయితే దర్శకుడు ఎవరనే విషయాన్ని వెల్లడించేందుకు ఆ వ్యక్తి నిరాకరించినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పర్యటనలో రణ్‌బీర్.. ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని, క్యాబ్ అఫీస్ను అలాగే గంగూలీ ఇంటిని సందర్శించనున్నట్లు సమాచారం. కాగా, దాదా ప్రస్తుతం క్రికెట్‌కు సంబంధించి ఏ అధికారిక పదవిలో లేకపోగా.. రణ్‌బీర్ మాత్రం 'తూ ఝూటీ మై మక్కర్' అనే చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. తన బయోపిక్‌లో నటించేందుకు హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రాలను గంగూలీ గతంలో సంప్రదించినట్లు టాక్ నడిచిన విషయం తెలిసిందే. -
తెరపైకి జాక్సన్ జీవితం
పాప్ సంగీత సామ్రాజ్యానికి రాజుగా వెలిగిన మైఖేల్ జాక్సన్ జీవితంతో ‘మైఖేల్’ పేరుతో బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకుడు. మైఖేల్‌గా ఆయన సోదరుడు జెర్మైన్ కుమారుడు జాఫర్ జాక్సన్ నటించనున్నారు. వెండితెరపై యాక్టర్‌గా జాఫర్‌కు ఇదే తొలి చిత్రం. ‘‘మా అంకుల్ కథలో నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు జాఫర్. ‘‘మైఖేల్ జాక్సన్ లక్షణాలు జాఫర్లో చాలా ఉన్నాయి. మైఖేల్‌గా నటించగల ఒకే ఒక్క వ్యక్తి జాఫర్ అని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన గ్రాహం. ఇక 1958 ఆగస్టు 29న పుట్టిన మైఖేల్ జాక్సన్ 2009 జూన్ 25న మరణించిన విషయం తెలిసిందే. -
జమున బయోపిక్‌లో స్టార్ హీరోయిన్!
దివంగత ప్రఖ్యాత నటీమణి జమున బయోపిక్‌లో మిల్కీబ్యూటీ తమన్న నటించనున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్‌లో అలాంటి అవకాశం ఉందనే సమాధానం వస్తోంది. ప్రఖ్యాత నటీమణుల జీవిత చరిత్రతో చిత్రాలు తెరకెక్కించడం సాధారణ విషయమే. ఇంతకుముందు నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన మహానటి చిత్రంలో కీర్తిసురేశ్ టైటిల్ పాత్రను పోషించారు. సావిత్రి పాత్ర పోషించిన కీర్తీసురేశ్‌కు సినీ ప్రముఖుల అభినందనలు దక్కడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అదేవిధంగా ప్రముఖ శృంగార తార సిల్క్‌స్మిత బయోపిక్ హిందీలో ది డర్టీ పిక్చర్స్ పేరుతో రూపొందించారు. సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే ప్రఖ్యాత నటి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన తలైవి చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ టైటిల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత నటీమణి జమున జీవిత చరిత్రను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటి జమున తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 190 చిత్రాలకు పైగా నటించారు. ఈ బయోపిక్‌లో హీరోయిన్ తమన్నా జమున పాత్రను పోషించనుందట. కథ విన్న వెంటనే ఆమె అంగీకరించినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
వెండితెరపై మైఖేల్ జాక్సన్ బయోపిక్!
పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఓ సంచలనం.ఆయన ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు గడిచిపోయింది. అయినా కూడా క్రేజ్ తగ్గలేదు సరికదా, ఏ తరానికి చెందినవారికైనా మైఖెల్ వదిలి వెళ్లిన స్టెప్పులు, స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. స్టేజ్ పై అతను కనిపించే తీరు, వీడియోస్ అతని స్టైల్, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అభిమానుల్ని సంపాదించి పెట్టింది. తన కెరీర్ లోనే ఎన్నో కళ్లు చెదిరే స్టెప్పులు వేశాడు. వాటిల్లో మూన్ వాక్ అతనికి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే మైఖేల్ వ్యక్తిగత జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇటు స్టార్ డమ్, అటు కాంట్రవర్సీస్ వీటన్నిటినీ ఇప్పుడు తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హాలీవుడ్ కు చెందిన లయన్స్ గేట్ ఎంటర్ టైన్ మెంట్ కార్పోరేషన్ ఇప్పుడు మైఖెల్ జాక్సన్ జీవితం పై బయోపిక్ తెరకెక్కించబోతోంది. మైఖెల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అమెరికన్ ఫిల్మ్ మేకర్ ఆంటోనీ తెరకెక్కించనున్నాడు. 1998 నుంచి ఇతను సినిమాలు తీస్తూ వస్తున్నాడు. 2001లో వచ్చిన ట్రైనింగ్ డే సినిమా ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు పాప్ కింగ్ లైఫ్ ను వెండితెరకెక్కించాలనుకుంటున్నాడు. మైఖెల్ జాక్సన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. -
వెండితెరపై కరుడు గట్టిన విలన్ లైఫ్ స్టోరీ!
గొప్ప గొప్పోల్ల జీవిత చరిత్రలు వెండితెర మీద మెరిసిపోతున్నాయి. మంచి పనులు చేసి..పేరు తెచ్చుకున్న వ్యక్తులు..ఏరంగానికి చెందిన వారయినా..బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సారి మాత్రం..కరుడు గట్టిన విలన్ లైఫ్ స్టోరీ ..సినిమాగా రాబోతుంది. ఇండియన్ స్క్రీన్ మీద విలన్ పేరు చెప్తే..ఏ మాత్రం డౌట్ లేకుండా మొదటిగా గుర్తుకు వచ్చే పేరు అమ్రిష్ పురి. ఈయన విలన్ వేశాలు వేస్తే..తిట్టని ప్రేక్షకుడు ఉండడు.కోపగించుకోని ఆడియన్ లేడు.అంతగా అసహ్యంచుకునేలా ..అభినయం చూపిస్తాడు అమ్రిష్ పురి. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి..విలనిజానికి కూడా ట్రెండ్ మార్కు తీసుకొచ్చాడు ఈ మాంత్రికుడు. బాలీవుడ్ జనాలను భయపెట్టిన అమ్రీష్ పురి.. సౌత్ ఆడియన్స్ ను కూడా జడిపించాడు. ఇండియాన జోన్స్ లాంటి హాలీవుడ్ చిత్రంలో కూడా నటించి మెప్పించాడు. విలనిజం పాత్రలతో పాటు...ఇంపార్టెంట్ రోల్స్ లో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇంట్లో పెద్దరికం చూపించే క్యారెక్టర్లలో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఈ వెండితెర విలన్ రియల్ లైఫ్ వెండితెర మీదికి రాబోతుంది.సిల్వర్ స్క్రీన్ మీద భయపెట్టే అమ్రిష్ పురి..అందుకు భిన్నంగా..నిజజీవితంలో ఉంటాడు. పరిశ్రమలో..మంచి వ్యక్తిత్వం కలిగిన పర్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన మనవడు వర్దన్ పూరీ ఈయన బయోపిక్ కు శ్రీకారం చుట్టాడు. జాతీయ అవార్డు విన్నర్ శంతను అనంత్ తంబే దర్శకత్వం చేస్తున్నాడు. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ కాబోతుంది. -
పాన్ ఇండియా చిత్రంగా ప్రముఖ వ్యాపారవేత్త బయోపిక్
తమిళ సినిమా: సినిమా ఎల్లలు దాటి చాలాకాలం అయ్యింది. అలాగే బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలా స్వసక్తితో ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక వ్యాపారవేత్త బయోపిక్‌తో రపొందిన చిత్రం విజయానంద్. కర్ణాటకలో ఒక మారుమూల గ్రామానికి చెందిన విజయ్ సంగేశ్వర అనే వ్యక్తి చిన్న ట్రక్కుతో తన జీవిత పయనాన్ని ప్రారంభించి 4300 వాహనాలకు అధిపతిగా దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన జీవిత చరిత్రతో రపొందించిన చిత్రం విజయానంద్. దర్శకుడు రిషికా శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో టైటిల్ పాత్రను నటుడు నిహాల్ పోషించా రు. ఆయనతోపాటు అనంతనాగ్, రవిచంద్రన్, భారత్ బొపన్న, ప్రకాశ్ బొల్లాడి, శ్రీ ప్రహ్లాద్, వినయ ప్రసాద్, అర్చన, హనీష్ గురివిల్ల తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కీర్తన పూజారి చాయాగ్రహణం, గోపీ సుందర్ సంగీతాన్ని అందింన ఈ బారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, డిసెంబర్ 9వ తేదీన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. భావితరాల్లో నమ్మకాన్ని పెంచే గొప్ప సాధికుడి పాత్రలో మరణించడం గర్వంగా భావిస్తున్నట్లు నటుడు నిహాల్ పేర్కొన్నారు. ఎంత సాధించిన వాళ్లైనా విశ్రాంతి తీసుకుంటారని, అయితే ఆయన అవిశ్రాంతంగా శ్రమించారని పేర్కొన్నారు. ఆయన జీవితం విజయం సాధించాలనే వారందరికీ ఒక పాఠమని పేర్కొన్నారు. -
కేసీఆర్ బయోపిక్ తీస్తా : రామ్ గోపాల్ వర్మ
పదేళ్లకు ఒకసారి యూత్ జనరేషన్ మారుతుంది. అందుకే రీ రిలీజ్ సినిమాలకు విశేషమైన స్పందన లభిస్తోంది’’ అని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ అన్నారు. నితిన్, ప్రియాంక కొఠారి జంటగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అడవి’. విశాఖ టాకీస్‌పై నట్టి కువర్ నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘తరం మారుతున్న ప్రతీసారి గతంలో వచ్చిన కొన్ని సినిమాలు చూడాలని మారుతున్న యూత్ కోరుకుంటుంటారు. ‘అడవి’లో ఫారెస్ట్ ఫొటోగ్రఫీ, సాంగ్స్, సౌండ్ వంటివి హైలైట్‌గా ఉంటాయి. గతంలో నేను తీసిన పలు హిట్ సినిమాలను ఆయా నిర్మాతలతో మాట్లాడి రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. కేసీఆర్‌గారి బÄñæపిక్ చేసే ఆలోచన ఉంది’’ అన్నారు. నట్టి కుమార్ మాట్లాడుతూ– ‘‘అడవి’ సినిమాను దాదాపు వంద థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నాం. అలాగే ప్రభాస్ ‘రెబల్’ను ఈ నెల 15న, 22న ‘వర్షం’ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నాను. రామ్‌గోపాల్ వర్మగారు, నేను పాతికేళ్లుగా మంచి స్నేహితులం. కొద్దికాలం క్రితం మా మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు సమసి పోయాయి. మా కాంబినేషన్లో మళ్లీ సినిమాలు చేస్తాం’’ అన్నారు. -
Biopics: మహిళలపై బయోపిక్స్.. తారల విశేషాలు
బాలీవుడ్లో కొంతకాలంగా బయోపిక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అయితే ఈ ట్రెండ్ పట్ల హీరోయిన్స్ కూడా మొగ్గు చూపుతుండటం విశేషం. ఇటీవల ‘సైనా’, ‘తలైవి’, ‘గంగూభాయి కతియావాడి’, ‘శభాష్ మిథూ’ వంటి బయోపిక్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా మరికొందరు మహిళల బయోపిక్‌లు రూపొందుతున్నాయి. అందులో నటించే తారలు, ఇతర విశేషాలపై ఓ లుక్కేద్దాం... భారతదేశ దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా బాలీవుడ్లో రూపొందుతున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. ప్రధానంగా ఎమర్జెన్సీ టైమ్‌లో 1975-1977లో జరిగిన సంఘటనలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ మూవీలో ఇందిరాగాంధీ పాత్రలో నటించడంతో పాటు, డైరెక్షన్ చేస్తున్నారు కంగనా రనౌత్. అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ఘాటింగ్ మొదలైంది. అలాగే ‘దంగల్’ ఫేమ్ ఫాతిమా సనా షేక్ కూడా వెండితెరపై ఇందిరా గాంధీగా కనిపించనున్నారు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దివంగత ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితం ఆధారంగా ‘శామ్‌బహదూర్’ అనే చిత్రం రూపొందుతోంది. విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో నటిస్తుండగా, ఇందిరాగాంధీ పాత్రని ఫాతిమా చేస్తున్నారు. అదేవిధంగా భారత మాజీ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ కూడా తెరపైకి రానుంది. ఆమె పాత్రలో అనుష్క శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘చెక్దా ఎక్స్‌ప్రెస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ బెనర్జీ కథ, స్క్రీన్ ప్లే అందించారు. జులన్ గోస్వామి పాత్ర కోసం ఇంగ్లాండ్‌లో క్రికెట్‌కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు అనుష్కా శర్మ. నెట్‌ఫ్లిక్స్‌లో ‘చెక్దా ఎక్స్‌ప్రెస్’ స్ట్రీమింగ్ కానుంది. అలాగే 2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత అనుష్కా శర్మ ఓకే చెప్పిన ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. మరోవైపు రీసెంట్ టైమ్స్‌లో విభిన్నరకాలైన వంటకాలు వండారు హీరోయిన్ హ్యూమా ఖురేషీ. ఎందుకంటే ‘తర్లా’ బయోపిక్ కోసం. దివంగత చెఫ్, వంటల పుస్తకాల రచయిత, వ్యాఖ్యాత తర్లా దలాల్ జీవితం ‘తర్లా’గా రానుంది. ‘చిఛోరే’, ‘దంగల్’ లకు రచనా విభాగంలో పనిచేసిన పీయూష్ గుప్తా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హ్యూమా ఖురేషీ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. రిలీజ్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇక బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ నీనా గుప్తా బయోపిక్ తెరపైకి రానుంది. ‘నా బయోపిక్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు’ అని రీసెంట్గా ఓ సందర్భంలో నీనా గుప్తా వెల్లడించారు. ఆమె పాత్రలో ఎవరు నటిస్తారు? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా 2000 సంవత్సరం మార్చిలో హత్య చేయబడ్డారు హీరోయిన్ ప్రియా రాజ్ వంశ్. ఆమె జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు వెండితెరపైకి రానున్నాయి. లీడ్ రోల్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనున్నారని సమాచారం. దివంగత దర్శక–నిర్మాత, నటుడు చేతన్ ఆనంద్, ప్రియా రాజ్ వంశ్ మధ్య నెలకొన్న సంఘటనలతో ఈ సినిమా ఉంటుందట. ప్రదీప్ సర్కార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తారు. వీరే కాదు.. ఈ తరహా బయోపిక్స్‌లో నటించేందుకు మరికొందరు హీరోయిన్స్ రెడీ అవుతున్నారని టాక్. -
ఆ స్టార్ క్రికెటర్ బయోపిక్ చేయాలనుంది: విజయ్
విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలైన ఈ చిత్రం దారుణంగా పరాజయం పొందింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ విజయ్ ఏమాత్రం తడబడకుండ తన తదుపరి చిత్రాల షూటింగ్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం విజయ్ జన గణ మన, ఖషి చిత్రాల షూటింగ్‌ల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఇడియా-పాకిస్తాన్ మ్యాచ్‌ను విక్షించిన విజయ్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు.. భారీగా నష్టపోయిన మేకర్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు కామెంటర్స్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, వసీం అక్రమ్‌తో కలిసి స్టేడియంలో అడుగుపెట్టిన విజయ్ క్రికెట్ ఆటతో తనకున్న అనుభవాలను పంచుకున్నాడు. ప్రీ మ్యాచ్ షోలో అవకాశం వస్తే ఏ క్రికెటర్ బయోపిక్‌లో నటించాలనుందని కామెంటర్స్ అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ ఇలా సమాధానం ఇచ్చాడు. ‘ధోని భాయ్ బయోపిక్ చేయాలని ఉండే. కానీ ఆయన బయోపిక్‌ను సుశాంత్ సింగ్ చేశాడు. ధోనీ కాకుండా కోహ్లి అన్న బయోపిక్‌లో నటించాలనుంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. కోహ్లీ పాత్రకు నేను అయితే కరెక్ట్ సూట్ అవుతాను అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా కాగా ప్రపంచవ్యాప్తంగా.. సమకాలీన క్రికెటర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 70 సెంచరీలు సాధించాడు. అయితే, ఇటీవలి కాలంలో నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన కోహ్లి.. ఆసియా కప్-2022 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో 35 పరుగులు(34 బంతులు), హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో 59 పరుగులు(44 బంతుల్లో- నాటౌట్) సాధించాడు. -
Bapatla MP: తెరపై బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ బయోపిక్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఇప్పుడు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ చేరారు. ఆయన జీవిత కథ ఆధారంగా ‘బాపట్ల ఎంపీ’అనే సినిమా తెరకెక్కుతుంది. అగస్త్య , నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేఖ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందిగం వెంకట్ నిర్మిస్తున్నారు. నానాజీ మిరియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల ఎంపీ నందిగగం సురేశ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ఈ చిత్ర నిర్మాతల కుమారులు దేవన్, ప్రిన్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. (చదవండి: సెప్టెంబర్‌లో ఇన్ని చిత్రాలా?.. వీటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అవుతాయో?) అనంతరం నిర్మాత నందిగం వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తమ్ముడు(నందిగం సురేశ్) నాతో చేసిన జర్నీ, తరువాత యూత్ ప్రెసిడెంట్ గా ఎదిగిన వైనం.. కొన్ని దుష్టశక్తులు కలిసి చేయలేని, చేయకూడని సంఘటనలో ఇరికించాని చూడడం, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మద్దతుగా నిలవడం, ఆయన సపోర్ట్‌తో ఎలా ఎంపీ ఆయ్యాడనేదే ఈ సినిమా కథాంశం అన్నారు. ఈ కథ చెప్పడం కంటే తెరపై చూస్తేనే బాగుంటుంది అని అన్నారు. చిత్ర దర్శకుడు నానాజీ మిరియాల మాట్లాడుతూ.. ఇది బాపట్ల ఎం పి నందిగం సురేష్ లైఫ్ స్టోరీ. అరిటాకులు కొసుకొని బ్రతికే ఒక సామాన్య వ్యక్తి తన నిజాయితీ ని నమ్ముకొని, తను నమ్మిన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ నిజాయితీగా ఉంటే. కొందరు వ్యక్తులు ఇతను చెయ్యని తప్పును ఇతను మీద రుద్దుతూ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బంది పెట్టినపుడు వైఎస్ జగన్ గారు చేరదీసీ, ఆయన సిద్దాంతాలు నచ్చి ఒక గొప్ప నాయకుడగా తీర్చిదిద్దారు. సురేష్ అనే ఒక సామాన్య వ్యక్తికి వైఎస్ జగన్ ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు?. ఈ వ్యక్తి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ పడ్డాడు అనేదే ఈ కథ.ప్రతి సామాన్యుడు చూడాల్సిన సినిమా ఇది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే కచ్చితంగా ఎదుగుతాడు అనేది ఇందులో చూపించడం జరిగింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు. ‘ఈ సినిమా కథను నానాజీ చెప్పినప్పుడు పొలిటికల్ స్టోరీ అని బయపడ్డాను. అయితే ఇందులో అదేమీ లేకుండా సామాన్యుడు అయిన తను ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు అనే స్టోరీ నాకు నచ్చింది’అని హీరో అగస్త్య అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని హరోయిన్ నక్షత్ర అన్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. -
పాన్ ఇండియా మూవీగా విజయ్ శంకేశ్వర్ బయోపిక్, టీజర్ అవుట్
సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి, వీఆర్ఎల్ అనే లాజిస్టిక్ కంపెనీకి అధినేతగా ఎదిగిన డా. విజయ్ శంకేశ్వర్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘విజయానంద్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘ట్రంక్’ మూవీ ఫేమ్ రిషికా శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటిస్తున్నారు. ఆనంద్ శంకేశ్వర్ సమర్పణలో వి.ఆర్.ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. చదవండి: డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. విజయ్ శంకేశ్వర్ సొంత తెలివితేటలతో లారీల వ్యాపారంలోకి ప్రవేశించి ఎలా సక్సెస్ అయ్యారు? అనేది టీజర్లో చూపించారు. అనంత్ నాగ్, వినయ ప్రసాద్, వి. రవిచంద్రన్, ప్రకాష్ బెలవాడి, అనీష్ కురివిల్లా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం దర్శకుడిగా పనిచేస్తున్నారు. -
టైగర్ నాగేశ్వరరావు బయోపిక్: రవితేజ సినిమాలో అనుపమ్
ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. రవితేజ టైటిల్ రోల్లో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కశ్మీరీ ఫైల్స్’లో అనుపమ్ చేసిన పుష్కర్ నాథ్ పండిట్ పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మళ్లీ అభిషేక్ నిర్మాణంలో మరో సినిమా చేయనుండటం పట్ల అనుపమ్ ఆనందం వ్యక్తం చేశారు. స్టువర్ట్పురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా 1970 నేపథ్యంలో రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే కాదు.. నిఖిల్ ‘కార్తికేయ 2’లోనూ అనుపమ్ కీలక పాత్ర చేస్తున్నారు. -
Shoaib Akhtar: పట్టాలెక్కనున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్
పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని అక్తరే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఈ చిత్రానికి ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అనే పేరును ఖరారు చేస్తూ.. 'రన్నింగ్ అగెయిన్స్ట్ ది ఆడ్స్' అంటూ టైటిల్ క్యాప్షన్‌ను జోడించాడు. అందమైన ప్రయాణానికి ఇది ప్రారంభం.. ఈ సినిమా ద్వారా ఇప్పటివరకు వెళ్లని రైడ్‌కు మీరు వెళ్లనున్నారు.. పాకిస్తాన్ క్రీడాకారునికి సంబంధించి ఇది తొలి విదేశీ చిత్రం.. వివాదాస్పదంగా మీ షోయబ్ అక్తర్ అంటూ అక్తర్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. Beginning of this beautiful journey. Announcing the launch of my story, my life, my Biopic, "RAWALPINDI EXPRESS - Running against the odds" You're in for a ride you've never taken before. First foreign film about a Pakistani Sportsman. Controversially yours, Shoaib Akhtar pic.twitter.com/3tIgBLvTZn — Shoaib Akhtar (@shoaib100mph) July 24, 2022 బయోపిక్కు సంబంధించిన గ్లింప్స్‌ను అక్తర్ ట్విటర్ ద్వారా విడుదల చేస్తూ.. 2023 నవంబర్ 16న సినిమా విడుదల అవుతుందని స్ఫష్టం చేశాడు. పాక్ దర్శకుడు ముహమ్మద్ ఫరాజ్ కైజర్ ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు. ఈ బయోపిక్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతానికి చెందిన అక్తర్ తన క్రికెట్, క్రికెటేతర జీవితంలోని అనుభవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో భారత క్రికెటర్లు సచిన్, ధోని, మిథాలీ రాజ్, ప్రవీణ్ తాంబేల బయోపిక్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. 1997లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అక్తర్.. 13 ఏళ్ల కెరీర్లో 46 టెస్ట్‌లు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడి ఓవరాల్‌గా 444 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Ind Vs WI: మీ అత్యుత్తమ స్పిన్నర్ ఎవరో తెలియదా? అతడి విషయంలో ఎందుకిలా? -
చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ
1994 నవంబర్ 30.. అప్పటి వరకు ఆయన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. యావత్ భారత్ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఆయన కనిపెట్టిన ‘వికాస్’ ఇంజన్ అద్భుతమైనదని ప్రపంచమంతా కొనియాడింది. కానీ ఒకే ఒక ఘటనతో ఆయన జీవితం తలకిందులైపోయింది. దేశం కోసం అహర్నిశలు శ్రమించిన ఆయనను ‘దేశద్రోహి’ అన్నారు. చేయని తప్పుకు 50 రోజులు జైలులో పెట్టి నరకం చూపించారు. చివరకు నిర్థోషిగా బయటకు రావడమే కాకుండా.. దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్నారు. ఆయనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. విలక్షణ నటుడు మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నంబి నారాయణన్ గురించి.. నాసా ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించి.. నంబి నారాయణన్ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. 1941 డిసెంబర్ 12న తమిళనాడులో జన్మించారు. ఆయన తల్లిదంద్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు. ఐదుగురి బాలికల తర్వాత ఆయన పుట్టాడు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన నారాయణన్.. చదువులో మాత్రం బాగా రాణించేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక.. కొంతకాలం స్థానికంగా ఉండే చక్కెర కర్మాగారంలో పనిచేశారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. 1966లో నంబి నారాయణన్ నాసాలో ఉద్యోగ అవకాశం లభించినా.. దేశం కోసం సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇస్రోలో చేరారు. అక్కడ విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో నారాయణన్ కీలక పాత్ర పోషించారు. ప్యూయల్ టెక్నాలజీని ఇస్రోకు అందించాలనుకున్నాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే క్రయోజెనిక్ ఇంజిన్స్. ఈ టెక్నాలజీ అప్పట్లో మనకు అందుబాటులో లేదు. దీంతో రష్యాతో రూ.235 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. ఈమేరకు సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఆ సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చేయని తప్పుకు నంబి నారాయణన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది? 1994 నవంబర్ 30న నంబిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు నెల రోజుల ముందు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదా, ఫయూజియ్యా హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ మహిళలిద్దరు భారత రాకెట్ సాంకేతిక విషయాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని తేలింది. అంతేకాదు వీరికి ఇస్త్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని మీడియాతో వార్తలు వచ్చాయి. ఆ మహిళలు వేసిన వలలో నంబి నారాయణన్ కూడా ఉన్నారని కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టి విచారణ పేరుతో నరకం చూపించారు. దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ అని కొనియాడిన మీడియానే ఆయన్ను ‘దేశద్రోహి’గా చూపించింది. గూఢచారి, దేశద్రోహి అంటూ అనేకమంది ఆయనను నిందించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే ఆయన ఇంటిపై దాడి చేశారు. న్యాయమే గెలిచింది దేశం కోసం నాసా ఆఫర్‌ని తిరస్కరించిన నంబి నారాయణన్‌కు.. అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మొదట్లో అర్థం కాలేదు. పోలీసులు ఎంత హింసించిన నేరం ఒప్పుకోలేదు. అరెస్టయిన నెల రోజుల తర్వాత ఈ కేసు కేరళ ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయింది. 1995 జనవరి 19న ఆయనకు బెయిల్ వచ్చింది. సీబీఐ విచారణలో నంబి నారాయణన్ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. సీబీఐ తమ నివేదికను 1996 ఏప్రిల్‌లో కేరళ హైకోర్టుకు సమర్పించింది. ఇస్రోకు చెందిన సమాచారం పాకిస్తాన్‌కు వెళ్లినట్లు ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో నంబి నారాయణన్ తిరిగి ఇస్రోలో చేరారు. సీబీఐ ఈ కేసును మూసివేసినా.. అప్పటి కేరళ ప్రభుత్వం మళ్లీ తెరిచేందుకు ప్రయత్నించింది. ఈ కేసుని మళ్లీ విచారించాలని కోరుతూ..1998లో సుప్రీకోర్టు మెట్లు ఎక్కింది. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును తిరస్కరించింది. తనపై అక్రమంగా కేసును బనాయించి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డాక్టర్ నారాయణన్ కేసు వేశారు. నారాయణన్‌కు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. అంతేకాదు తప్పుడు కేసు బనాయించడంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. తన తప్పును తెలుసుకున్న కేరళ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు అదనంగా ఇస్తామని 2019లో ప్రకటించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్ని ‘పద్మభూషణ్’తో సత్కరించింది. నారాయణన్‌పై కుట్ర పన్నిందెవరనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. గుఢచార్యం కేసు వెనుక అమెరికా హస్తం ఉందని కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్ అనుమానం వ్యక్తం చేశారు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తెరపైకి ‘కెఫె కాఫీ డే’ ఫౌండర్ వీజీ సిద్ధార్థ బయోపిక్
‘కెఫె కాఫీ డే’ ఫౌండర్ వీజీ సిద్ధార్థ్ జీవితం త్వరలోనే తెరపైకి రానుంది. ఆయన బయోపిక్‌ను రూపొందించనున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్, ఆల్మైటీ మోషన్ పిక్చర్, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్లు శుక్రవారం ప్రకటించాయి. ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్టులు రుక్మిణీ బీఆర్, ప్రోసెంజీత్ దత్తా రాసిన కాఫీ కింగ్ పుస్తకంగా ఆధారం ఆయన బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు స్పస్టం చేశారు. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య కాగా నిన్న సదరు నిర్మాణ సంస్థలు మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని తెలిపాయి. ఈ సందర్భంగా ‘కాఫీ మనందరి జీవితంలో భాగం చేసి వీజీ సిద్ధార్థ్ వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు సాధించారు. అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడం షాకింగ్ ఘటన. సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ అయిన వీజీ సిద్ధార్థ్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, ఒడిదుడుకులకు సంబంధించి లోతైన పరిశీలనతో రాసిన పుస్తకమే ‘కాఫీ కింగ్: ది స్వీఫ్ట్ రైజ్ అండ్ సడెన్ డేత్ ఆఫ్ కెఫె కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్’. ఇది వెండితెరపై ఆవిష్కరించాల్సిన కథ. చదవండి: Sai Pallavi: ఆ వీడియో బయటకు రావడంతో దారుణంగా ట్రోల్ చేశారు, ఇక అప్పడే.. అందుకే ఆయన బయోపిక్ హక్కులను తీసుకున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తాం’ అని టీ-సీరిస్ చైర్మన్ భూషన్ కూమార్ తెలిపాడు. కెఫె కాఫీ డే ఫౌండర్‌గా వీజీ సిద్ధార్థ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆనతి కాలంగో గొప్ప వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. అలాంటి వీజీ సిద్ధార్థ్ 2019 జూలైలో ఆకస్మాత్తుగా కర్ణాటకలోనే ఓ నది శవమై తేలారు. అప్పటికి ఆయనకు 59 ఏళ్లు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలేంటో ఇప్పటికి తెలియదు. సిద్ధార్థ మరణాంతరం ఆయన భార్య మళవిక హెగ్డే కెఫె కాఫీ డే బాధ్యతలు చేపట్టారు. చదవండి: భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తున్న కేఫ్ కాఫీ డే మాళవిక హెగ్డే..! -
అలా అన్నందుకు సందీప్ తండ్రి చాలా సీరియస్ అయ్యారు : ‘మేజర్’ నిర్మాతలు
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో 'మేజర్' చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. (చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్) అయితే ఇది సందీప్ బయోపిక్ కాబట్టి.. ఆయన తల్లిదండ్రులు రాయల్టీ కింద డబ్బులు తీసుకొవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై తాజాగా చిత్ర నిర్మాతలు అనురాగ్, శరత్ క్లారిటీ ఇచ్చారు. రాయల్టీ ఇస్తామని అంటే.. తన కొడుకు జీవితాన్ని వెలకట్టుకునే దీనస్థితిలో లేమని వారు చెప్పారన్నారు. ‘సాధారణంగా ఇలాంటి బయోపిక్‌లు తీస్తే..రాయల్టీ ఇవ్వాల్సి వస్తుంది. మేము కూడా సందీప్ పేరెంట్స్‌కు రాయల్టీ ఇస్తామని ముందుగానే చెప్పాం.అది వినగానే ‘గెటౌట్ ఫ్రమ్ మై హౌస్’ అంటూ సందీప్ తండ్రి మాపై ఫైర్ అయ్యారు. కొడుకు జీవితానికి వెలకట్టుకునే దీనస్థితిలో లేమని చెప్పారు. సందీప్ తల్లిదండ్రులు చాలా నిజాయితీ మనుషులు.సందీప్ చనిపోయాక..వచ్చిన ఎల్ఐసీ డబ్బులను కూడా వారు తీసుకోలేదు. సన్నిహితులకు ఆ డబ్బును పంచేశారు. అంత నిజాయితీపరులు వాళ్లు. అందుకే వారితో ఓ విషయం చెప్పాం. సైన్యంలో చేరాలనుకునే యువతకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పౌండేషన్ ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే మేం సందీప్ తల్లిదండ్రుకు ఇచ్చే రాయల్టీ’అని నిర్మాతలు చెప్పుకొచ్చారు. -
కేసీఆర్ బయోపిక్‌పై ఆలోచన ఉంది.. కానీ: రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma About KCR Biopic In Kondaa Movie Trailer Launch 2022: ‘‘నేను విజయవాడలో చదువుకున్నాను. విజయవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం మీద సినిమాలు చేశాను. అయితే తెలంగాణ గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ కొండా మురళి, కొండా సురేఖల గురించి తెలుసుకున్నప్పుడు వీరిపై సినిమా తీయాలనిపించి వారిని అడిగాను. తన తల్లిదండ్రుల జీవితాల ఆధారంగా సినిమా కాబట్టి నిర్మాతగా ఉంటానని సుష్మిత అడిగారు. కొండా మురళి, కొండా సురేఖల జీవితాల్లో చాలా విషయాలు ఉన్నప్పటికీ కొంత భాగాన్ని మాత్రమే నేను సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను. నేను ఏ బయోపిక్ తీసినా ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపించను. ‘కొండా’ (Kondaa Movie) రెస్పాన్స్‌ను బట్టి ప్రీక్వెల్, సీక్వెల్ ప్లాన్ చేస్తాను. కేసీఆర్‌గారి బయోపిక్ (KCR Biopic) ఆలోచన ఉంది కానీ ఎప్పుడో చెప్పలేను’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొండా’. కొండా మురళి పాత్రలో త్రిగుణ్ (అదిత్ అరుణ్), కొండా సురేఖ పాత్రలో ఐరా మోర్ నటించారు. కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం కొండా సుష్మిత మాట్లాడుతూ.. ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం ‘కొండా’ సినిమా తీయలేదు. సినిమా తీస్తేనే గెలుస్తారని లేదు. అమ్మానాన్నల (కొండా మురళి, కొండా సురేఖ) ప్రస్థానాలు అంత ఈజీగా సాగలేదు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వీరి కథ అందరికీ తెలియాలనే కొండా సినిమాను నిర్మించాను. అలాగే యువత రాజకీయాల్లోకి రావాలన్నది మరో కారణం’’ అని తెలిపారు. చదవండి: ఈసారి కొట్టా.. చంపేస్తా.. ఆసక్తిగా 'కొండా' రెండో ట్రైలర్.. ‘‘నేను హైదరాబాద్‌లో పెరిగాను. కానీ వరంగల్ గురించి, అక్కడి రాజకీయాల గురించి తెలీదు. ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. ఇప్పటివరకు 17 సినిమాలు చేశాను. అన్ని సినిమాలు డబ్బులు తీసుకువచ్చాయి’’ అని త్రిగుణ్ పేర్కొన్నాడు. ‘‘సురేఖగారి పాత్రలో నటించగలనని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అని ఐరా మోర్ తెలిపింది. -
తాతయ్య బయోపిక్ తీస్తా: అజిత
స్వర్గీయ భారత ప్రధాని పీవీ నరసింహరావుగారి బయోపిక్ తీస్తానని ఆయన మనవరాలు అజిత అన్నారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం, అసాధారణ రాజకీయ చాతుర్యంతోపాటు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలను ఈ బయోపిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బయోపిక్ కోసం తన తల్లి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, నేటి యువతకు స్పూర్తి నింపేలా చిత్రాన్ని తెరకెక్కిస్తామని చెప్పారు. పీవీ నరసింహారావుతో అజిత(పాత ఫోటో) ఇక తమ ఫిల్మ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ.. ‘త్వరలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. మా దగ్గరున్న గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ యూనిట్ లను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా సినిమా రంగానికి మావంతు సేవలందించాలని భావిస్తున్నాం. అలాగే ఈ ప్రాంగణంలో షూటింగ్స్ మరియు ఓపెనింగ్, ఆడియో రిలీజ్ వంటి ఫంక్షన్స్ చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నాము’అని అన్నారు. -
వెండితెర మీద వంటల రాణి
తర్లా దలాల్ 2013లో మరణించింది. కాని వంట అనేసరికి టీవీ చెఫ్‌గా ఇప్పటికీ ఆమె పేరే గుర్తుకు వస్తుంది. వంటల మీద తర్లా దలాల్ రాసిన 100 పుస్తకాలు దాదాపుకోటి కాపీలు అమ్ముడుపోయాయి. భారతదేశంలో కోటి ఇళ్లల్లో ఆమె రెసిపీలు ఉపయోగించారని అంచనా. వీరుల, ధీరుల బయోపిక్‌లు తయారవుతున్న రోజుల్లో ఒక గొప్ప వంటగత్తె కథ బయోపిక్‌గా రావడం చాలా పెద్ద విషయం. తర్లాగా తెర మీద హ్యూమా ఖురేషి కనిపించనుంది. ఈ సందర్భంగా తర్లా దలాల్ ఘన గతం గురించి కథనం. జీవితంలో ‘రుచి’ కనిపెట్టడం ఒక అదృష్టమే. డబ్బున్నా లేకపోయినా ‘ఆ... ఏదో ఒకటి వండుకుంటే సరిపోదా’ అనుకునేవారికి ఈ కథనం పనికి రాదు. ‘ఏదైనా ఒకటి వండి చూద్దాం’ అనుకునేవారు తర్లా దలాల్‌తో ఇన్‌స్పయిర్ అవుతారు. మన దేశంలో స్త్రీలు కట్టెల పొయ్యిలతో, ఊదుడు గొట్టాలతో ఆ పూట వంటతో సతమతమవుతూ ఉన్న రోజుల్లో అమెరికాలో కొత్త కొత్త వంటలు నేర్చుకుంది తర్లా దలాల్. ఆ తర్వాత ఇండియాకు వచ్చి ఏకంగా వంట పాఠాలే చెప్పింది. అందరూ వంట చేస్తారు. కాని ‘సరిగ్గా’ చేయడం ఎలాగో చెప్పడం ద్వారా ఆమె దేశాన్నే జయించగలిగింది. అందుకే ఆమె కథ ఇప్పుడు సినిమాగా వస్తోంది. చిన్నారి వంట మాస్టర్ తర్లా దలాల్‌కు చిన్నప్పటి నుంచి వంటంటే ఇష్టం. పూణెలో చదువుకునేటప్పుడు 12 ఏళ్ల వయసు నుంచి తల్లికి రోజూ వంటలో సాయం చేసేది. 1956లో ఆమె బిఏ పూర్తి చేసి నళిన్ దలాల్‌ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లే ఆమె భవిష్యత్తును నిర్దేశించింది. నళిన్ అమెరికాలో ఎం.ఎస్. చేస్తుండటం వల్ల కాపురం అక్కడే పెట్టాల్సి వచ్చింది. కొత్త దేశం. కావలసినంత సమయం. నళిన్ భోజనప్రియుడు కనుక ఏవైనా కొత్త వంటకాలు ట్రై చేయరాదా అని ఆమెను ఎంకరేజ్ చేశాడు. దాంతో తర్లా రోజుకు రెండు మూడు కొత్త వంటకాలు చేసి భర్తకు పెట్టేది. అతడు పర్ఫెక్షనిస్ట్. అంత సరిగా రాలేదు అని చెప్తే తర్లా మళ్లీ అదే వంటను చేసేది. అనుకున్నది అనుకున్నట్టుగా వండటమే వంట ప్రావీణ్యం అని ఆమె గ్రహించింది. కాని నళిన్ ఆమెను పూర్తిగా మెచ్చుకోవడానికి 9 ఏళ్లు పట్టింది. 9 ఏళ్ల తర్వాత ‘మాస్టర్ ఆఫ్ ఆల్ కూజిన్స్’ అని బిరుదు ఇచ్చాడు. ముంబైలో వంట క్లాసులు ఇండియాకు తిరిగి వచ్చాక 1966లో ముంబైలో వంట క్లాసులు మొదలెట్టింది తర్లా. ఆ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లి కావాలంటే వంట వచ్చి ఉండటం ఒక అవసరంగా భావించేవారు. అందుకని తర్లా క్లాసులకు డిమాండ్ పెరిగింది. ఒక దశలో ‘తర్లా దగ్గర వంట నేర్చుకున్న అమ్మాయికి వెంటనే పెళ్లి జరిగిపోతుంది’ అన్నంత పేరు ఆమెకు వచ్చింది. అదే సమయంలో వంటల పుస్తకాల మీద భర్త దృష్టి మళ్లించాడు. 1974లో ‘ప్లెజెర్స్ వెజిటేరియన్ కుకింగ్’ పేరుతో తర్లా తెచ్చిన పుస్తకం పెద్ద హిట్ అయ్యింది. 1987 నాటికి దేశంలో తర్లా అతి పెద్ద వంటల రచయితగా ఎదిగింది. ఆమె తన పుస్తకాల రాబడి మీద పెద్ద ఆఫీస్ కొనుక్కుంది. ఆ పుస్తకాలు అనేక భాషల్లో ట్రాన్స్‌లేట్ చేసి పబ్లిష్ చేయడానికి సిబ్బందిని పెట్టుకుంది. తర్లా వంటల పుస్తకాలు డచ్, రష్యన్ వంటి విదేశీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. 100 పుస్తకాలు రాసి చరిత్ర సృష్టించింది తర్లా. టీవీ చెఫ్‌గా దేశానికి ఎక్కువగా తెలిసిన పేరు కూడా ఆమెదే. శాకాహారానికి ప్రచారకర్త తర్లా రాసిన పుస్తకాలన్నీ శాకాహారానికి సంబంధించినవే. ఒక రకంగా ఆమె శాకాహారాన్ని ప్రచారం చేసిందని చెప్పాలి. దేశంలో ఎన్నో కుటుంబాలు తర్లా చేసిన శాకాహార వంటకాలను ట్రై చేసి రుచిని పొందాయి. 1988లోనే ఆమె ‘తర్లాదలాల్డాట్కామ్’ వెబ్‌సైట్‌ను తెరిస్తే నెలకు మూడు లక్షల మంది ఆ సైట్‌ను చూడటం రికార్డ్. ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న భారతీయులు ఆ వెబ్సైట్ ద్వారా తర్లా రెసిపీలు చూసి వంటలు చేసుకునేవారు. ఈ మొత్తం కృషికి తర్లాకు 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది. మన దేశీయులకు స్వాదిష్టకరమైన భోజనాన్ని ప్రచారం చేస్తూ 2013లో మరణించింది తర్లా. సినిమా రిలీజప్పుడు మరోసారి తర్లాను తలుచుకుందాం. బాలీవుడ్ సినిమా ఇంటింటికీ తెలిసిన ఈ వంటగత్తెను ఇప్పుడు సినిమాగా ఇంటింటికీ తేనున్నారు బాలీవుడ్లో. హుమా ఖురేషీ తర్లా దలాల్‌గా ‘తర్లా’ అనే సినిమా తర్లా దలాల్ బయోపిక్‌గా మొదలైంది. రోనీ స్క్రూవాలా నిర్మాత. దంగల్, చిచోరే సినిమాలకు రచయితగా పని చేసిన పీయుష్ గుప్తా దర్శకుడు. ‘చిన్నప్పుడు మా ఇంట్లో వంట గదిలో తర్లా దలాల్ పుస్తకం ఉండేది. ఆమె పుస్తకంలో ఉండే మాంగో ఐస్‌క్రీమ్ రెసెపీని చూసి అమ్మ మాకు తయారు చేసి ఇచ్చేది. ఈ సినిమా చేయమని నాకు ఆఫర్ వచ్చినప్పుడు అది గుర్తుకు వచ్చింది. తర్లా పాత్ర చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అంది నటి హుమా ఖురేషీ. -
ఐపీఎల్ వ్యవస్థాపకుడి బయోపిక్‌ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ జీవితంపై స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ 'మవెరిక్ కమిషనర్' ద ఐపీఎల్- లలిత్ మోడీ సాగా అనే పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పుస్తకం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. బాలయ్య సినిమాల సహా నిర్మాత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన విష్ణువర్ధన్ ఇందూరి లలిత్ మోడీ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. Winning the 83 World Cup was the tip of the iceberg. The book "Maverick Commissioner" by sports journalist @BoriaMajumdar is a fascinating account of the IPL and the Man behind it Lalit Modi. Elated to announce that we are adapting this book into a feature film. @SimonSchusterIN pic.twitter.com/tLEGGCkkxn — Vishnu Vardhan Induri (@vishinduri) April 18, 2022 విష్ణువర్ధన్ ఇందూరి.. తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితంపై తలైవీ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలాగే స్పోర్ట్స్ డ్రామా 83 సినిమాకు కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరించాడు. ఐపీఎల్ ప్రారంభమై నేటికి 15 సంవత్సరాలు (ఏప్రిల్ 18, 2008) అయిన సందర్భంగా విష్ణువర్ధన్ ఇందూరి లలిత్ మోడీ బయోపిక్ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈ బయోపిక్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ఉమ్రాన్ మాలిక్ స్పీడ్‌కు ఫిదా అయిన కేటీఆర్ -
త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తా : ఆర్జీవీ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అవుతుంది. అయినా ఇవేవి పట్టించుకోని వర్మ తనకు నచ్చిందే చేస్తాడు. వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆయన తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌ను త్వరలోనే తీస్తానని ప్రకటించారు. డేంజరస్ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆర్జీవీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలపై చర్చించారు. ఏపీ టికెట్ రేట్ల విషయంలో తనకు ఇబ్బంది లేదని అలాగే తన సినిమాను ఓటీటీ, థియేటర్ రెండింటిలోనూ విడుదల చేస్తామన్నారు. అలాగే తనకు 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం బాగా నచ్చిందని, త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తానని వెల్లడించాడు. దీనికి సంబంధించిన త్వరలోనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈ పిల్లలు మన పిల్లలు కాదా?
మన పిల్లలు స్కూళ్లకు వెళతారు. ఆపై ఉద్యోగాలకు వెళతారు. ఆపై జీవితాల్లో స్థిరపడతారు. కాని సమాజం ఒక కుటుంబం అనుకుంటే ఇవన్నీ దక్కని పిల్లలున్న భారతదేశం ఒకటి ఉంది. అది మురికివాడల భారతదేశం. ‘వాళ్లూ మన పిల్లలే. వాళ్లను ఇలాగే వదిలేస్తామా?’ అంటాడు అమితాబ్ ‘ఝండ్’లో. వ్యసనాలతో బాధ పడుతూ నేరాలు చేస్తూ జైళ్ల పాలవుతూ వీరు పడే సలపరింతకు సమాజానిదే బాధ్యత. వారి కోసం పట్టించుకుందాం అని గట్టిగా చెప్పిన ఝండ్ ఈవారం సండే సినిమా. ‘ప్రపంచ మురికివాడల సాకర్ కప్’కి ఇండియా టీమ్‌కు ఆహ్వానం అందుతుంది. ఆ టీమ్‌లో ఉన్నది ఎవరు? చెత్త ఏరుకుని జీవించే మురికివాడల పిల్లలు, తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం వల్ల చదువుకోలేకపోయిన ఆడపిల్లలు, కుటుంబ కష్టాల్లో ఉన్న మైనారిటీలు, రైళ్లలో బొగ్గు దొంగతనం చేసే దొంగలు, సారాయి బానిసలు, వైటనర్‌ను పీల్చే వ్యసనపరులు... వీళ్లంతా మహా అయితే 20 ఏళ్ల లోపు వారు. ఒక రకంగా వారి జీవితం నాశనమైపోయింది. కాని వారికి ఒక్క చాన్స్ ఇవ్వదలిస్తే? ఆ ఒక్క చాన్సే ‘వరల్డ్ హోమ్‌లెస్ సాకర్ కప్’లో పాల్గొనడమే అయితే... ఆహ్వానం అందింది కాని మరి అందుకు పాస్‌పోర్ట్‌లు? పాస్‌పోర్ట్ పొందడం ఈ దేశంలో కొంతమందికి ఎంత కష్టమో దర్శకుడు ఈ సినిమా లో వివరంగా చూపిస్తాడు. కొందరి దగ్గర పాస్‌పోర్ట్‌కు అప్లై చేయడానికి ఏ కాగితమూ ఉండదు. ఒకడికి పాస్‌పోర్ట్ ఇవ్వడానికి వాడి మీద ఉండే పోలీస్కేసు అడ్డంకిగా మారుతుంది. ఆ వంకతో వాడికి పాస్‌పోర్ట్ ఇవ్వడం మానేస్తే వాడు సమాజం మీద మరింత ద్వేషం పెంచుకుంటాడు. తనను తాను మరింతగా ధ్వంసం చేసుకుంటాడు. అందుకే వాడికి పా‹స్పోర్ట్ ఇప్పించేందుకు తానే జడ్జి ముందు మొరపెట్టుకుంటాడు ఫుట్‌బాల్ కోచ్ అయిన అమితాబ్. ‘మన కళ్లెదురుగా ఉన్నదే మనకు తెలిసిన భారతదేశం కాదు. మనం చూడని భారతదేశం ఒకటి ఉంది. దానిని చూడకుండా మన కళ్లకు అడ్డుగా ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడ అవతల ఎంతోమంది బాల బాలికలు దీనమైన బతుకులు బతుకుతున్నారు. సమాజం పట్టించుకోకపోవడం వల్ల అరాచకంగా మారి సమాజం దృష్టిలో మరింత చెడ్డ అవుతున్నారు. ఈ పిల్లలు అద్భుతంగా ఫుట్‌బాల్ ఆడుతున్నారు. వీరు ఇలాంటి ఆటల్లో పడితే, వ్యసనాల నుంచి బయటపడి ఒక అర్థవంతమైన బతుకు బతుకుతారు’ అంటాడు అమితాబ్. ఝండ్ (గొడ్ల గుంపు. స్లమ్ పిల్లల ఫుట్‌బాల్ టీమ్‌ను కనీసం టీమ్ అనైనా పిలవకుండా గొడ్లగుంపు అని పిలుస్తారు డబ్బున్నవాళ్లు ఈ సినిమాలో) మార్చి 4న విడుదలైంది. అమితాబ్ ప్రధాన పాత్రలో నటించాడు. మిగిలిన వాళ్లలో చాలామంది స్లమ్ కుర్రాళ్లు నటించారు. మరాఠీలో ‘సైరాట్’ తీసి భారీ పేరు గడించిన దర్శకుడు నాగరాజ్ మంజులే ఈ సినిమాతో కూడా ప్రశంస లు అందుకుంటున్నాడు. ఈ సినిమాను నాగ్‌పూర్‌కు చెందిన విజయ్ బర్సే అనే టీచర్ జీవితం ఆధారంగా తీశారు. ఆ పాత్రనే అమితాబ్ పోషించాడు. నాగ్‌పూర్‌లో ఒక కాలేజ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసిన విజయ్ బర్సే ఆ పక్కనే ఉండే మురికివాడల్లోని పిల్లలు అద్భుతంగా ఫుట్‌బాల్ ఆడటం చూసి వారికోసం ‘స్లమ్ సాకర్ క్లబ్’లను స్థాపించాడు. వారికి కొత్త జీవితం ప్రసాదించాడు. అందుకు తగ్గట్టుగా ‘ఝండ్’ మొత్తం సినిమాను నాగ్‌పూర్‌లో తీశారు. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఇది నాగ్‌పూర్‌కు చెందినది మాత్రమే కాదని, దేశంలో ఉన్న ఏ మురికివాడకు చెందిన కథేనేమోనని అనిపిస్తుంది. ముఖ్యంగా పాత్రలను మురికివాడల నుంచే తీసుకోవడం వల్ల వారి బతుకు తీవ్రమైన వేదన కలిగిస్తుంది. మర్యాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న మధ్యతరగతి, ధనిక వర్గాలతో పోలిస్తే వారి జీవితంఘోరంగా ఉంటుంది. సమాజపు ఫలాలకు వారూ హక్కుదారులే. వారూ దేశం బిడ్డలే. వారూ అందరిలాంటి పిల్లలే. వారి కోసం ఎందుకు సమాజం ఆలోచించదు? ఎందుకు వారిని ఈసడించుకుని పదే పదే వారిని మరింత నిరాశలోకి తిరుగుబాటులోకి నెడుతుంది అనిపిస్తుంది. ఈ కథలో నాగ్‌పూర్‌లోని ఒక మధ్యతరగతి కాలనీని ఆనుకుని ఉండే మురికివాడలోని పిల్లలకు ఆ మధ్యతరగతి కాలనీలో నివసించే అమితాబ్ దగ్గర అవుతాడు. అప్పటికే వాళ్లు అరాచకంగా ఉంటారు. వారికి జీవితం మీద ఏ ఆశా లేదు. వారికి ఫుట్‌బాల్ ఆడితే డబ్బు ఇస్తూ ఆ ఆట మీద మోజు కలిగిస్తాడు. మెల్లమెల్లగా వారికి ఆ ఆట నిజమైన నషాగా మారుతుంది. అందరూ ఆటగాళ్లు అవుతారు. అప్పుడు అమితాబ్ తన కాలేజీలో దేశంలోని అన్ని మురికివాడల టీమ్‌లను పిలిపించి జాతీయ టోర్నమెంట్ ఆడిస్తాడు. ఆ తర్వాత ఈ టీమ్లన్నింటి నుంచి ఒక టీమ్ తయారు చేసి వరల్డ్‌కప్‌కు తీసుకువెళతాడు. అయితే ఆ మొదలు నుంచి ఈ చివరకు మధ్య ఎన్నో బరువెక్కే సన్నివేశాలు. కన్నీటి గాధలు. నిస్సహాయ క్షణాలు. సామాజిక చైతన్యం కలిగించే ఇటువంటి కథలకు హిందీలో పెద్ద పెద్ద స్టార్లు మద్దతు ఇస్తున్నారు. రణ్వీర్ సింగ్ ‘గల్లీ బాయ్’ చేశాడు. అమితాబ్ ‘ఝండ్’ చేశాడు. దక్షిణాదిలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లలు బిచ్చమెత్తుతూ కనిపిస్తే తప్పక ‘ఝండ్’ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే అది చూపే ప్రభావం అలా ఉంటుంది. చూడండి. -
రీల్ మీదకు రానున్న ‘రియల్ హీరో’ల బయోపిక్స్
కంటి నిండా నిదుర ఉండదు.. సేద తీరే తీరిక ఉండదు. కుటుంబంతో గడిపే సమయం ఉండదు... ఒక్కటే ఉంటుంది.. ‘దేశం మీద ప్రేమ’ ఉంటుంది. అందుకే నిదుర లేకుండా కాపలా కాస్తారు. చల్లగాలికీ సేద తీరరు. దేశమే కుటుంబం అనుకుంటారు. దేశం కోసం ప్రాణాలు వదులుతారు. అందుకే ‘సెల్యూట్ సైనికా’. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి, పోరాడిన వీర జవాన్లను ‘గణతంత్ర దినోత్సవం’ సందర్భంగా స్మరించుకుందాం. రీల్ మీదకు రానున్న ఈ ‘రియల్ హీరో’ల బయోపిక్స్ గురించి తెలుసుకుందాం. బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులోనూ దేశం కోసం పోరాడిన సైనికుల జీవిత చిత్రాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. చరిత్ర చెప్పే ఈ చిత్రాలు చలన చిత్ర చరిత్రలోనూ ఓ చరిత్రగా మిగిలిపోతాయి. దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను అడివి శేష్ చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 11న విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. సందీప్ పోరాటం ఈ తరానికి తెలుసు. ఇక ముందు తరానికి చెందినవారిలో 1971 భారత్–పాక్ యుద్ధం గురించి తెలియనివారు ఉండరు. ఈ యుద్ధంలో పోరాడిన వీరుల నేపథ్యంలో మూడు నాలుగు చిత్రాలు నిర్మాణంలో ఉండటం విశేషం. భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన సాహసోపేత సైనికుడు ‘సామ్ మానెక్ షా’ (పూర్తి పేరు సామ్ హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా) ఒకరు. ఈ యుద్ధంలో ఆర్మీ చీఫ్‌గా భారత్‌కు పెద్ద విజయాన్ని సాధించిపెట్టిన ఘనత మానెక్ షాది. మొత్తం ఐదు యుద్ధాల్లో పాల్గొన్న వీరుడు మానెక్ షా. ఆయన జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సామ్ బహదూర్’. అలాగే 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన ఓ వీర జవాను బ్రిగేడియర్ బల్‌రామ్‌సింగ్ మెహతా. ఈ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి తూర్పు వైపున పోరాడారు మెహతా. ఆయన జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చౌఫిస్’ (2016) పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి బల్రామ్ సింగ్ మోహతాను కూడా చిత్రబృందం ఆహ్వానించింది. 1971 యుద్ధంలోనే పోరాడిన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. యుద్ధంలో వీరమరణం పొందారు ఖేతర్పాల్. పరమవీర చక్ర సాధించిన యువసైనికుడు ఆయన. ఈ సైన్యాధికారి పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. ఇక కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ కూడా యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమే. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్‌గా చేస్తున్నారు. దేశభక్తి సినిమా కాదు కానీ... ‘‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు. స్నేహం మీద ఆధారపడిన సినిమా. దేశభక్తి అంతర్లీనంగా కనిపిస్తూ, స్నేహం గురించి చెప్పిన కథే ఈ సినిమా’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? అనే కల్పిత కథతో ఈ సినిమా తీశారు. అయితే అంతర్లీనంగా దేశభక్తి కనిపించే సినిమా కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై అందరి దృష్టి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ‘‘దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ ఉన్నట్లయితే మా సినిమాను ఈ ఏడాది మార్చి 18న విడుదల చేస్తాం. లేకపోతే ఈ ఏడాది ఏప్రిల్ 28న చిత్రం విడుదలవుతుంది’’ అని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. మొత్తం 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు వెండితెరకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరహా చిత్రాలు ఎన్ని వస్తే అంత మంచిది. ఎందుకంటే సినిమా శక్తిమంతమైన మాధ్యమం కాబట్టి చరిత్ర సులువుగా యువతరానికి చేరుతుంది. -
అడివి శేష్.. మేజర్ వాయిదా
అడివి శేష్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘‘దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొన్ని చోట్ల కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ‘మేజర్’ విడుదల వాయిదా వేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
బొల్లాంట్ ఇండస్ట్రీస్ శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు
‘‘శ్రీకాంత్ బొల్లా ఎందరికో ఆదర్శప్రాయుడు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఆయన పాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. కెమెరా ముందు శ్రీకాంత్‌లా నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్. బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. అంధుడైనప్పటికీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఉన్నత స్థాయికి ఎదిగారు శ్రీకాంత్. గురువారం ఆయన జీవిత చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్ ఓ నిర్మాత. భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘పుట్టిన దగ్గర్నుంచి ఎదురైన సవాళ్లను ఎదుర్కొని తన కలలను నిజం చేసుకున్నారు శ్రీకాంత్. పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఎందరికో ఉపాధి కల్పించిన ఆయన జీవితం ఆదర్శనీయం’’ అన్నారు. దివ్యాంగులకు ఉపాధి: ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్ ఆటంకాలను అధిగమించి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించారు. హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి, 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. 3 వేల మంది దివ్యాంగులను ఉచితంగా చదివిస్తున్నారు. -
ఆ ఇద్దరి బయోపిక్స్‌లో నటిస్తా: ధనుష్
అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఆత్రంగి రే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రముఖ హిందీ షోలో పాల్గొన్న ధనుష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోన్న ఈ సమయంలో మీరు ఎవరు బయోపిక్స్‌లో నటిస్తారు?’ అనే ప్రశ్నకు ధనుష్ బదులిస్తూ– ‘‘రజనీకాంత్, ఇళయరాజగార్లంటే ఎంతో ఇష్టం.. ఎనలేని అభిమానం. అవకాశం వస్తే వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలని ఉంది’’ అని పేర్కొన్నారు. తమిళంలో దాదాపు అరడజను సినిమాలకు కమిటైన ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో నటించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. -
ఆ పాత్ర చేయడం గర్వంగా ఉంది: శ్రీకాంత్
‘‘తెలంగాణ దేవుడు’ చిత్రంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్ర చేయడం గర్వంగా ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్ లీడ్ రోల్లో, జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హరీష్ వడత్యా మాట్లాడుతూ– ‘‘తెలంగాణ దేవుడు’ వంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన జాకీర్ ఉస్మాన్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘సీయం కేసీఆర్‌గారి బయోపిక్‌గా మా చిత్రం రూపొందింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనే అంశాలను చూపించాం’’ అన్నారు మొహ్మద్ జాకీర్ ఉస్మాన్. జిషాన్ ఉస్మాన్, మ్యాక్ ల్యాబ్ సీఈఓ మొహ్మద్ ఇంతెహాజ్ అహ్మద్, లైన్ ప్రొడ్యూసర్ మహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
బాలీవుడ్లో మరో స్టార్ క్రికెటర్ బయోపిక్.. డైరెక్ట్ చేయనున్న కరణ్ జోహార్..?
Karan Johar To Direct Yuvraj Singh Biopic: ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. అందులోనూ క్రీడాకారుల బయోపిక్‌లకు ఎనలేని ఆదరణ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన భారత క్రికెటర్ల బయోపిక్స్ మాత్రం తెరకెక్కింది మూడు మాత్రమే. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ల నిజ జీవితాల ఆధారంగా ఈ చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా మరో మాజీ క్రికెటర్ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నట్లు బీటౌన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దంగా ఉన్నాడని, ఈ మేరకు యువరాజ్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని తెలుస్తోంది. కరణ్ ప్రతిపాదనకు యువీ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని బీటౌన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్ హీరోలను కాదని కరణ్.. కొత్త ముఖం వైపు మొగ్గు చూపుతున్నాడని సమాచారం. యువీ గతంలో హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్‌లలో ఎవరో ఒకరు తన బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని చెప్పినప్పటికీ.. కరణ్ కొత్త కుర్రాడు సిద్ధార్థ్ చతుర్వేదిని పరిచయం చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. సిద్ధార్థ్.. యువీతో దగ్గరి పోలికలు కలిగి ఉంటాడని, అందుకే యువీని ఒప్పించి మరీ అతన్ని ఎంపిక చేశాడని టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేసి.. గంగూలీ బయోపిక్ కంటే ముందే రిలీజ్ చేయాలని కరణ్ ప్లాన్ చేస్తున్నాడట. చదవండి: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..! -
ఆ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలని నా కోరిక: రష్మిక
ప్రతీ ఒక్కరికీ ఓ కల ఉంటుంది అలానే తనకంటూ ఓ కల ఉందని అంటోంది శాండిల్‌వుడ్ బ్యూటీ రష్మిక మందన. తెలుగుతెరపై అగ్రనటిగా ఎదిగిన దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించడం తన కోరికని తెలిపింది రష్మిక. కర్ణాటకలో జన్మించిన సౌందర్య తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలంపాటు తన హవా కొనసాగించిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందింది. ఇటీవల బాలీవుడ్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సౌందర్య తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ నటి అని రష్మిక పేర్కొంది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్‌లు తాజా ట్రెండ్ అని ఈ తరుణంలో తనకి అవకాశం వస్తే సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని, అది తన కోరిక కూడా అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తనకు స్ఫూర్తి అని రష్మిక పేర్కొన్నారు. రష్మిక 'మిషన్ మజ్ను' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ నటి తెలుగు, హిందీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. వరుసగా హీందిలో ఆఫర్ల రావడంతో ఈ ముద్దు గుమ్మ తన మకాంను ముంబైకి మార్చేసింది. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న ‘పుష్ఫ’లో కథానాయికగా నటిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌందర్య బయోపిక్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. సౌందర్యకు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఎందుకో ఈమె బయోపిక్‌కి అడుగులు ముందు పడడం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు కూడా సౌందర్య సొంతం చేసుకుంది. చదవండి: Bigg Boss 5 Telugu: దీప్తి సునయన స్థానంపై కన్నేసిన హమీదా, షణ్నూకు ఆఫర్ -
‘ఆమె పాత్ర పోషించడాన్ని అవమానంగా భావించారు’
రాను మండల్.. ఈ పేరు ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్. బెంగాల్‌లోని రణఘాట్ వీధుల్లో పాడిన పాట ఓ అనామకురాలిలా ఉన్న ఈమెను ఓవర్‌నైట్ స్టార్‌ని చేసింది. ఎంతలా అంటే ఆమెపై బయోపిక్ తీసేంతలా. ప్రముఖ డైరెక్టర్ హృషికేశ్ మోండల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పేరు మిస్ రాను మరియా. ఆమెకు మొదటిసారి బాలీవుడ్ ఫిల్మ్‌లో పాడే అవకాశం ఇచ్చిన హిమేష్ రేష్మియా ఈ చిత్రానికి పని చేయనున్నారు. బెంగాలీ నటి ఈషికా డే ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ బయోపిక్‌లో నటించడానికి తొలుత వేరే నటులను అనుకున్నామని, కానీ వాళ్లు రాను మండల్ పాత్ర పోషించడాన్ని అవమానకరంగా భావించారని డైరెక్టర్ హృషికేశ్ మోండల్ తెలిపాడు అయితే ఆ నటీమణుల పేర్లను మాత్రం బహిర్గతం చేయకపోవడం గమనార్హం. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ పాత్ర కోసం మొదట బెంగాలీ మూవీ ‘బరివాలి’తో ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్న సుదీప్త చక్రబర్తిని సంప్రదించాం. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఆమె ఎంతో కోరుకున్నారు. అయితే ఇంతకుముందు కమిట్ అయిన సినిమాల వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేక మా ఆఫర్‌ను వదులుకున్నారు’ చివరకు ‘పుర్బా పశీమ్ దక్షిణ్’ ఫేమ్ ఈషికాను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పారు’అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. మొదట బెంగాలీలో మాత్రమే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్న మేకర్స్ అనంతరం హిందీలోనూ తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ మూవీలో రాను మొండల్ జీవితంలో ఎదురొన్న సమస్యలను చూపించనున్నారు.కాగా ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించనున్న ఈషికా డే సేక్రెడ్ గేమ్స్, గోల్పర్ మాయజల్, లాల్ కప్తాన్ వంటి వెబ్ సీరిస్, సినిమాలతో గుర్తింపు పొందారు. ఆమె ప్రస్తుతం మొండల్ బయోపిక్‌తో పాటు సినిస్తాన్ మూవీలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. -
Neeraj Chopra: నా బయోపిక్‌లో ఆ ఇద్దరిలో ఎవరైనా ఓకే..!
న్యూఢిలీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించి రాత్రికిరాత్రి హీరోగా మారిపోయిన నీరజ్ చోప్రా.. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించిన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2018 ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. నా బయోపిక్ తీయాలనే ప్రతిపాదన గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఒక వేళ ఇది సాధ్యపడితే.. అందులో మా రాష్ట్రానికి(హరియాణా) చెందిన బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా లేదా బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్‌లలో ఎవరు నటించినా బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు. It’s a GOLD 🥇Heartiest Congratulations @Neeraj_chopra1 on creating history. You’re responsible for a billion tears of joy! Well done #NeerajChopra! #Tokyo2020 pic.twitter.com/EQToUJ6j6C — Akshay Kumar (@akshaykumar) August 7, 2021 దాదాపు మూడేళ్ల క్రితం అతను అన్న ఈ మాటలపై ప్రస్తుతం నెట్టింట చర్చ మొదలైంది. పలానా పలానా హీరో అయితే బాగుంటుందంటూ నెటిజన్లు పోటీ పడి సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, టోక్యోలో స్వర్ణం సాధించిన అనంతరం ఈ హీరోలిద్దరూ నీరజ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేయడం విశేషం. వీటిలో అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అక్షయ్‌కు మరో కొత్త సినిమా దొరికేసిందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తు్న్నారు. ఈమేరకు గతంలో అక్షయ్ కుమార్ బల్లెంతో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. నీరజ్ చోప్రా బయోపిక్ సెట్స్ నుంచి లీకైన ఫొటోలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఒలింపిక్స్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలోపే ఉన్న అతని ఫాలోవర్లు.. స్వర్ణం గెలిచిన కొద్ది గంటల్లోనే అమాంతం 30లక్షలకు పెరిగారు. అథ్లెట్‌గా స్వర్ణం సాధించాడనే విషయమే కాకుండా అతని స్టైల్‌కి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
గుమ్మడి నర్సయ్య’బయోపిక్: టైటిల్ లోగో వచ్చేసింది
ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య. శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. టైటిల్ లోగో విడుదల చేసిన అనంతరం దర్శకుడు సుకుమార్ చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈతరంతో పాటు రాబోయే తరాల ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలిసేలా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ఉండబోతోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. -
గంగూలీ బయోపిక్కు గ్రీన్ సిగ్నల్.. హీరోగా చాక్లెట్ బాయ్
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్కు రంగం సిద్దమైంది. గత కొన్నేళ్లుగా బయోపిక్కు ససేమిరా అంటున్న దాదా.. తాజాగా ఈ విషయంపై స్పందించాడు. తన బయోపిక్ తెరకెక్కించేందుకు తనవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాను రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారని ప్రకటించాడు. ప్రస్తుతానికి ఈ బయోపిక్ హిందీలో మాత్రమే తెరకెక్కబోతుందని వెల్లడించిన దాదా.. లీడ్ రోల్లో బాలీవుడ్ స్టార్ హీరో, చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా నటించనున్నాడని స్వయంగా వెల్లడించాడు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా తన బయోపిక్కు సంబంధించిన విశేషాలను ప్రస్తావించాడు. హీరో విషయంలో క్లారిటీ ఇచ్చిన దాదా, డైరెక్టర్ ఎవరన్నది ఇప్పుడే చెప్పలేనని మాట దాటవేశాడు. బయోపిక్కు సంబంధించిన విశేషాలపై అధికారిక ప్రకటన రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపాడు. కాగా, బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం దాదా బయోపిక్కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా నడుస్తుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాణ సంస్థ పలుమార్లు దాదాతో సంప్రదింపులు జరిపి మరీ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఒప్పించిందని సమాచారం. ఈ బయోపిక్‌లో యువ క్రికెటర్‌గా దాదా ప్రస్తానం, లార్డ్స్‌లో అతను సాధించిన చారిత్రక విజయంతో పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేవరకు దాదా జీవితంలో అన్నీ కోణాలు చూపిస్తారని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో మాజీ హీరోయిన్ నగ్మాతో ప్రేమాయణం, బ్రేకప్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు చేశాయి. -
యుద్దంలో కాళ్లు కోల్పోయిన సైనికుడిగా నాని!
నేచురల్ స్టార్ నాని-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వచ్చిన ‘జర్సీ’ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనునున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దీనిని నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఓ రియల్ హీరో జీవిత కథ ఆధారంగా బయోపిక్కు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేస్తున్నాడట. యుద్దంలో కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి నిజ జీవిత చరిత్ర ఆధారంగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందట. పాన్ ఇండియా రేంజ్లో ఈ బయోపిక్‌ను డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అంతేగాక దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌ను కూడా ప్రారంభించినట్లు సిని వర్గాల నుంచి సమాచారం. కాగా ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘టక్ జగదీశ్, శ్యామ్ సింగరాయ, అంటే సుందరానికి’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే గౌతమ్ తిన్ననూరితో ఈ బయోపిక్ ప్రారంభించేందుకు నాని ప్లాన్ చేస్తున్నాడట. -
దాసరి బయోపిక్.. దాసరి అవార్డులు
దివంగత దర్శకులు దాసరి నారాయణరావు జీవితం తెరపైకి రానుంది. ఇమేజ్ ఫిల్మ్స్ అధినేత తాటివాక రమేష్ నాయుడు ‘దర్శకరత్న’ పేరుతో ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు ధవళ సత్యం దర్శకత్వం వహించనున్నారు. అంతేకాదు దాసరి జ్ఞాపకార్థం ‘దాసరి నారాయణరావు ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డ్స్’ కూడా ప్రదానం చేసేందుకు తాడివాక రమేష్ నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘నా గురువు, దైవం అయిన దాసరిగారి పేరుతో ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాం. ఇందుకోసం ఇప్పటికే ‘దాసరి నారాయణరావు మెమోరియల్ కల్చరల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశాం. పలు భాషలకు చెందిన కళాకారులు–సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు కూడా ఇవ్వనున్నాం. అలాగే ధవళ సత్యంగారు ‘దర్శకరత్న’ స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో దాసరి పాత్రలో నటించనున్నారు’’ అన్నారు. -
తెరపైకి ఆమె డ్యాన్స్ కహానీ
బాలీవుడ్ దివంగత ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితం వెండితెరపైకి రానుంది. సరోజ్ ఖాన్ బయోపిక్‌ను నిర్మించనున్నట్లు నిర్మాత భూషణ్ కుమార్ శనివారం వెల్లడించారు. సరోజ్‌ఖాన్ తొలి వర్ధంతి (జూలై 3) సందర్భంగా ఈ బయోపిక్‌ని ప్రకటించారు. ‘‘సరోజ్‌ఖాన్ తన డ్యాన్స్ మూమెంట్స్‌తో హిందీ సినిమాలో ఓ విప్లవాన్నే తీసుకువచ్చారు. ఆమె కంపోజ్ చేసిన స్టెప్స్‌లో తమ అభిమాన తారల డ్యాన్స్‌ను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. సరోజ్ బయోపిక్కు ఆమె కుమారుడు రాజు ఖాన్, సుఖైనా ఖాన్ సహకరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత భూషణ్ కుమార్. ‘‘మా అమ్మగారి బాటలోనే నేను కొరియోగ్రఫీ చేస్తున్నాను. చిన్నతనం నుంచే అమ్మ ఎన్ని కష్టాలు పడి, ఇండస్ట్రీలో ఎంత ఉన్నత స్థానం సంపాదించిందో నాకు తెలుసు. అమ్మ బయోపిక్ తెరపైకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు రాజు ఖాన్. ‘‘ఈ బయోపిక్‌లో అమ్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా చూపించనున్నాం’’ అన్నారు సుఖైనా ఖాన్. సరోజ్ ఖాన్ పాత్రను ఎవరు చేస్తారనేది త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు భూషణ్ కుమార్. దాదాపు 3 వేల పాటలకు పైగా కొరియోగ్రఫీ చేసిన సరోజ్ ఖాన్ మూడు సార్లు జాతీయ అవార్డు సాధించారు. 2020 జూలై 3న గుండెపోటుతో ఆమె మరణించారు. -
బ్రిటీష్ రాజుతో పోరాడిన లెజెండ్‌పై సినిమా
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ జీవితం వెండితెరకు రానుంది. ‘ది ఆన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ శంకరన్ నాయర్’ బయోపిక్కు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించనున్నారు. ‘‘జలియన్ వాలాబాగ్ మారణకాండ’ వెనకాల దాగి ఉన్న నిజాలను దాచాలనుకున్న ఓ బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడిన లెజెండ్ శంకరన్ నాయర్ జీవితంతో సినిమా తీయడం గౌరవంగా భావిస్తున్నాను. శంకరన్ మనుమడు రఘు, అతని భార్య పుష్ప కలిసి రాసిన ‘ది కేస్ దట్ షూక్ ద ఎంపైర్’ బుక్ ఆధారంగా ఈ చిత్ర కథనం ఉంటుంది. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాత కరణ్ జోహార్. చదవండి: Narappa: వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ -
మాజీ ప్రధాని పీవీ బయోగ్రఫీ, ఆయనే డైరెక్టర్!
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితం తెరపైకి రానుంది. గతంలో శ్రీహరి హీరోగా ‘శ్రీశైలం’ చిత్రాన్ని నిర్మించిన తాడివాక రమేశ్ నాయుడు ఎన్టీఆర్ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రముఖ సీనియర్ దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సోమవారం పీవీ జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘జాతీయ స్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడితో పీవీ నరసింహారావుగారి పాత్రను ధరింపజేస్తున్నాం. తెలుగు–హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తాం. అతి త్వరలో సెట్స్‌కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 28న పీవీ జయంతి నాటికి విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. చదవండి: రసవత్తర పోరు.. 'మా' అధ్యక్ష బరిలోకి మరొకరు! -
బయోపిక్: మనసులో మాట బయటపెట్టిన సురేశ్ రైనా
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వచ్చిన మహనటి సావిత్రి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమల్లో కూడా ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బయోపిక్‌పై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో హిందీలో భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్య్వూలో సురేశ్ రైనాకు తన బయోపిక్‌పై ఓ ప్రశ్న ఎదురైంది. సౌత్‌లో మీ బయోపిక్ తీస్తే అందులో ఏ నటుడు నటించాలని అనుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించగా వెంటనే రైనా స్పందిస్తూ.. హీరో సూర్య నటిస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు. అంతేగాక సూర్య నటన బాగుంటుందని, పాత్రలకు అనుగుణంగా తన శైలిని మార్చుకుంటూ తనదైన నటనను కనబరుస్తాడని, అందుకే ఈ బయోపిక్‌లో సూర్య అయితే తన పాత్రకు కరెక్ట్‌గా సరిపోతాడంటూ రైనా చెప్పుకొచ్చాడు. కాగా టిమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సారధ్యంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన రైనా టీమిండియా తరపున 18 టెస్టుల్లో 768 పరుగులు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించి తొలి భారత ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు. ఇక సూర్య విషయానికి వస్తే ఇటీవల అతడు నటించిన ఆకాశం నీహద్దురా సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. కొంతకాలంగా సక్సెస్ లేని సూర్యకు ఈ మూవీ ఘనవిజయాన్ని అందించింది. ప్రస్తుతం సూర్య సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య 40వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ మూవీలో సూర్యకు జోడీగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు తెలుగు నేరుగా ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సూర్య సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై తెలుగు అగ్ర దర్శకులతో సూర్య చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. " If my biopic is made, someone from south may be my favorite @Suriya_offl can do the role" - @ImRaina 💙#Suriya40 | #VaadiVaasal | #Suriya pic.twitter.com/bWUqTHBoN2 — Trends Suriya™ (@Trendz_Suriya) June 24, 2021 చదవండి: టాలీవుడ్ ఎంట్రీకి సూర్య రెడీ.. ఆ దర్శకుడుతో సెట్ అయ్యేనా! -
Sushant Singh Rajput: సుశాంత్ తండ్రికి దక్కని ఊరట
న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సుశాంత్ జీవితం ఆధారంగా ఎవరినీ సినిమాలు తియ్యనీయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుశాంత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. గురువారం అందులోని వివరణను పరిశీలించిన కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితం, మరణం గురించి దాదాపుగా అన్ని మీడియా హౌజ్‌ల ద్వారా జనాలకు తెలిసిపోయింది. ఈ తరుణంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అనే ప్రస్తావన ఉండకపోవచ్చనే జస్టిస్ సంజీవ్ నరులా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు తన కొడుకు విషయంలో కిషోర్ సింగ్ ప్రస్తావించిన ‘ పబ్లిసిటీ రైట్’ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఆ హక్కు సెలబ్రిటీ చనిపోయాక ఉంటుందా? ఉండదా? అనే విషయంపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని, అంతమాత్రాన సినిమా తీస్తే ప్రైవసీకి భంగం కలిగించినట్లు కాదని బెంచ్ వ్యాఖ్యానించింది. రిలీజ్ తర్వాత రండి ఇదిలా ఉండగా సుశాంత్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘న్యాయ్ ది జస్టిస్’ ఇవాళ(శుక్రవారం) రిలీజ్ కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే కృష్ణ కిషోర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు సుశాంత్ లైఫ్ ఆధారంగానే ‘సూసైడ్ ఆర్ మర్డర్’, ‘ఎ స్టార్ వాజ్ లాస్ట్’, ‘శశాంక్’, క్రౌడ్‌ఫండ్‌తో తీస్తున్న మరో సినిమా.. ఇలా వరుసగా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న తన కొడుకు జీవితాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దర్శకనిర్మాతలు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారని కృష్ణ కిషోర్ సింగ్ వాదిస్తున్నాడు. అయితే ‘సినిమా స్వేచ్ఛ’ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు నిర్మాతలకు నష్టం కలిగించే ఈ అంశంపై త్వరగతిన నిర్ణయం తీసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమను ఆశ్రయించవచ్చని కోర్టు సుశాంత్ తండ్రికి సూచించింది. చదవండి: సుశాంత్ గురించి నవీన్ పొలిశెట్టి.. -
కాబోయే భార్య బయోపిక్ తీస్తాను: హీరో
తమిళ సినిమా: ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని యువ నటుడు విష్ణు విశాల్ తెలిపారు. కోలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న ఈయన తాజాగా నటించిన చిత్రాల్లో కాడన్ చిత్రం ఒకటి. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం ఈనెల 26వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్ సోమవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఈ ఏడాది తాను నటించిన 4 చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయని తెలిపారు. అందులో తాను సొంతంగా నిర్మించి, కథానాయకుడిగా నటిస్తున్న ఎఫ్ఐఆర్, మోహన్ దాస్ చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా త్వరలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాలాను పెళ్లాడబోతున్నట్లు తెలిపారు. ఇది ప్రేమ వివాహం కాదన్నారు. ఇంతకుముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చిందన్నారు. అందు వల్ల తాను, జ్వాలా ఒకరికొకరం అర్థం చేసుకుని గౌరవించుకుని చేసుకుంటున్న పెళ్లి ఇది అని చెప్పారు. గుత్తా జ్వాలా ఒలింపిక్‌లో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్న విషయం తెలిసిందేన్నారు. ఆమె తన గురించి పలు అనుభవాలను తనతో పంచుకున్నారని, ఆమె బయోపిక్‌ను చిత్రంగా నిర్మించాలని ఆలోచన తనకు ఉందని పేర్కొన్నారు. కాడన్ చిత్రంలో నటించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. చదవండి: తెరపైకి గుమ్మడి నర్సయ్య బయోపిక్.. అడవిలోనే 25 ఏళ్లు.. -
తెరపైకి గుమ్మడి నర్సయ్య బయోపిక్..
బాలీవుడ్లో కొన్నేళ్లుగా బయోపిక్‌ల హవా నడుస్తోంది.. తెలుగులో కూడా ఈ సంస్కృతి ఈమధ్య ఊపందుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఈ తరహాలోనే ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈమధ్య అందరి మాటల్లో చర్చకు వస్తున్న ఓ విషయం ఆసక్తిని రేపుతోంది. అదే ప్రముఖ రాజకీయ నాయకుడు, అవినీతి మచ్చలేని వ్యక్తి, 5 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి దోపిడీ దౌర్జన్యాలకి పాల్పడకుండా కేవలం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసి సాదా సీదా జీవితం సాగిస్తున్న ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం గురించి ఒక బయోపిక్ వస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. గత ఆరు నెలలుగా ఈ కథకి సంబంధించిన అధ్యయనం జరుగుతుందని ఈ సినిమాని పరమేశ్వర్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ప్రజలతో పాటు ఈ తరం మరియు రాబోయే తరాల రాజకీయ నాయకులకు కూడా తెలిసే అవకాశం ఉందిదీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. చదవండి: ‘రాధేశ్యామ్’ మరో రొమాంటిక్ లుక్, ఫ్యాన్స్ ఫిదా -
సిల్క్ స్మిత బయోపిక్‌లో శ్రీరెడ్డి
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. దివంగత నటి సిల్క్‌స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో శ్రీరెడ్డి లీడ్ రోల్ పోషించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా గుడ్‌న్యూస్ చెబుతానంటూ ఊరిస్తున్న శ్రీరెడ్డి ఎట్టకేలకు సన్సెస్‌ను రివీల్ చేసింది. దిగ్గజ నటి సిల్క్ స్మిత బయోపిక్ చేస్తున్నానని, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని శ్రీరెడ్డి తెలిపింది. ఇక టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌తో తీవ్ర దుమారాన్ని రేపిన శ్రీరెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో చెన్నైకి మకాం మార్చింది. (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి) సిల్క్ స్మితతో తనను తాను పోల్చకుంటూ ఓ ఫోటోను కూడా విడుదల చేసింది. అయితే ఈ బయోపిక్‌లో శ్రీరెడ్డి నటించడం పట్ల కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదట సిల్క్ స్మిత బయోపిక్‌లో యంకర్ అనసూయ నటించనున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు గుప్పుమనడంతో ఈ పుకార్లకు అనసూయ చెక్ పెట్టారు. సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించడం లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా పలు భాషల్లో బయోపిక్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో 2011లో డర్టీ పిక్చర్ పేరుతో విడుదలైన సిల్క్ స్మిత బయోపిక్‌లో నటి విద్యాబాలన్ నటించింది. ఈ సినిమాలో ఆమె అభినయానికి గానూ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. (కంగనా సవాల్.. నా కంటే గొప్ప నటిని చూపించగలరా?) -
అది నా అదృష్టం
మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ‘శభాష్ మిథు’ అనే చిత్రం తెరకెక్కనుంది. తాప్సీ టైటిల్ రోల్లో కనిపిస్తారు. ‘ఈ సినిమా చేయడం నా అదృష్టంలా భావిస్తున్నాను’ అన్నారు తాప్సీ. ‘శభాష్ మిథు’ చేయడం గురించి తాప్సీ మాట్లాడుతూ– ‘ఈ సినిమా చేయడంలో రెండు రకాల సవాళ్లు ఉన్నాయి. మొదటిది క్రికెట్. నాకు క్రికెట్ ఆడటం రాదు. ప్రొఫెషనల్ ప్లేయర్లా ఆడటం నేర్చుకోవాలి. రెండవది మిథాలీ రాజ్‌లా స్క్రీన్ మీద కనిపించాలి. మిథాలీ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం పూర్తిగా భిన్నమైనవి. ఆమె చాలా నెమ్మదస్తురాలు. ఏ మాట అయినా ఆమె ఆలోచించే మాట్లాడతారు. నేను అందుకు పూర్తి విరుద్ధం. మహిళా క్రికెట్లో మిథాలీ ఒక ఐకాన్. ఆమె పాత్రను స్క్రీన్ మీద పోషించే అవకాశం రావడం అదృష్టం. కేవలం క్రీడాకారిణిగానే కాదు.. ఒక వ్యక్తిగా మిథాలీ అంటే నాకెంతో గౌరవం’’ అన్నారు తాప్సీ. ‘స్పోర్ట్స్ పర్సన్‌గా నటించడానికి మీ బాయ్‌ఫ్రెండ్ (మాథ్యూస్ బో, బ్యాడ్మింటన్ ప్లేయర్) నుంచి ఏదైనా టిప్స్ తీసుకున్నారా? అనే ప్రశ్నకు– ‘‘మెదడు ఆపరేషన్ చేసేవాళ్లు, హృదయానికి సంబంధించిన వాళ్లు ఏం చేయాలో చెప్పకూడదు కదా. రెండూ వేరు వేరు స్పోర్ట్స్. అలానే పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను విడివిడిగా ఉంచడానికి ఇష్టపడతాం’’ అని సమాధానమిచ్చారు. -
సుమలత బయోపిక్
తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ... ఇలా అన్ని భాషల్లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా నటి, ఎంపీ సుమలత జీవితం తెరపైకి రానుందని టాక్. భర్త అంబరీష్ మృతి తర్వాత కర్నాటక రాష్ట్రంలోని మాండ్య నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యురాలిగా విజయం సాధించారామె. తాజాగా సుమలత బయోపిక్ తెరకెక్కించేందుకు కన్నడలో సన్నాహాలు జరుగుతున్నాయట. దర్శక–నిర్మాత గురుదేశ్ పాండే ఇటీవల సుమలతని కలిసి బయోపిక్ గురించి చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె నట జీవితంతో పాటు రాజకీయ జీవిత ప్రయాణాన్ని ఈ ప్రాజెక్టులో చూపించనున్నారట. 2019లో జరిగిన మాండ్య ఎన్నికల్లో సుమలత ఎంపీగా గెలిచిన దాన్ని హైలైట్‌గా చూపించాలనుకుంటున్నారట. 10 నుంచి 15 ఎపిసోడ్స్‌తో గరుదేశ్ పాండే ఓ వెబ్ సిరీస్‌గా సుమలత బయోపిక్‌ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే సినిమాగా లేదా ఓ డాక్యుమెంటరీగానూ చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం. -
తలైవర్‌ని గుర్తు చేసుకుంటూ..
ప్రముఖ నటుడు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి యంజీ రామచంద్రన్ (యంజీఆర్) వర్ధంతి గురువారం. ఈ సందర్భంగా ‘తలైవి’ సినిమా నుంచి అరవింద్ స్వామి చేసిన యంజీఆర్ పాత్ర లుక్‌ను విడుదల చేశారు. జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో యంజీఆర్‌గా చేయడం గురించి అరవింద్ స్వామి మాట్లాడుతూ – ‘‘పురట్చి తలైవర్ (విప్లవ నాయకుడు) యంజీఆర్ పాత్రను చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంలా భావిస్తున్నాను. అలానే పెద్ద బాధ్యతలా భావించాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. తలైవర్‌ను గుర్తు చేసుకుంటూ ఈ ఫొటోలను షేర్ చేస్తున్నాను’’ అన్నారు. -
హీరో ఎవరో తెలియదు.. నా కథ అనిపిస్తే చాలు
న్యూఢిల్లీ: భారత చెస్ దిక్సూచి విశ్వనాథన్ ఆనంద్. చదరంగంలో ఎవరూ ఊహించలేని ఎత్తులు పైఎత్తులతో అద్భుత విజయాలు సాధించిన ఆనంద్ భారత చెస్ ప్రపంచానికి ‘కింగ్’. అంకిత భావం, క్రమశిక్షణతో మెలిగే విషీ అందరికీ ప్రపంచ చాంపియన్‌గా, మేటి చెస్ క్రీడాకారుడిగానే తెలుసు. ఆట తప్ప మరో లోకం లేని ఆనంద్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నడూ మాట్లాడింది లేదు. అయితే ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆనంద్ గురించి తెలుసుకోవాలనేది అభిమానులందరి ఆశ. అందుకే మనకెవరికీ తెలియని ఈ దిగ్గజ క్రీడాకారుడి వ్యక్తిగత జీవితం, సరదాలు, సంతోషాలు, ప్రొఫెషనల్ కెరీర్ గురించి త్వరలోనే సినిమా రాబోతుంది. ఈ బయోపిక్ ‘తనూ వెడ్స్ మనూ’ సినిమా తీసిన డైరెక్టర్ అనంద్ రాయ్ దర్శకత్వంలో రానుంది. ఈ సందర్భంగా తన బయోపిక్ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలనుకుంటున్నాడో స్వయంగా ఆనంద్ మాటల్లోనే... 25 శాతం మాత్రమే తెలుసు... నాణ్యమైన చిత్రబృందం ఈ బయోపిక్‌ను తెరకెక్కించనుంది. కెమెరాతో వారు సృష్టించే అద్భుతాలను కనీసం నేను ఊహించలేను. అందుకే సినిమా గురించి పూర్తిగా వారికే వదిలేశా. సినిమా ఎలా ఉండబోతోంది అనే అంశంపై నాకున్న అవగాహన కేవలం 25 శాతం మాత్రమే. తెరపై చూసినప్పుడు ఇది నా కథ అనే భావన నాకు కలిగితే చాలు. కాస్త వినోదాత్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ సినిమాను అభిమానులు ఎలా ఆదరిస్తారో అని తలుచుకుంటే ఆనందంగా ఉంటుంది. నా బయోపిక్ చెస్‌ను సరళమైన ఆటగా చూపించాలి కానీ ఆటలోని తీవ్రతను తీసేయకూడదు అని అనుకుంటున్నా. మేం ఏలియన్స్ కాదు.. సాధారణ వ్యక్తులమే... సినిమాలో నా వ్యక్తిగత జీవితాన్ని చూసినప్పుడు ప్రేక్షకులకు నేను కొత్తగా కనిపించవచ్చు. ఎందుకంటే సాధారణంగా నేనెప్పుడూ దాని గురించి బయటికి మాట్లాడలేదు. సినీ, క్రీడా తారలు, రాజకీయ ప్రముఖుల గురించి మనకు అంతా తెలుసు అని ప్రజలు అనుకుంటారు. నిజానికి వారి గురించి బయటివారికి ఏమీ తెలిసుండదు. చెస్ నాకెంత ముఖ్యమో తెలిసినవారంతా... నేను నిరంతరం ఆట గురించే ఆలోచిస్తా అని అనుకుంటారు. క్రీడాకారుడిగా నన్ను గమనించే వారికి వ్యక్తిగా నేనేంటో తెలియదు. ఈ చిత్రం చూశాక చెస్ ప్లేయర్లు ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) కాదు సాధారణ వ్యక్తులే అనే భావనకు వస్తారు. గ్రాండ్‌మాస్టర్ జీవితాన్ని ఆవిష్కరించాలి... భారీ ప్రేక్షక గణాన్ని దృష్టిలో పెట్టుకొని సినీ నిర్మాతలు సినిమాలు చేస్తారు. దర్శకుడి ప్రతిభపై నమ్మకంతో ప్రేక్షకులు సినిమా చూస్తారు. కానీ నేను సినిమా ఎలా ఉండాలనుకుంటున్నానంటే.. సినిమా చూశాక ‘హా ఇదే కదా నేనూ అనుభవించింది’ అని నా మనసుకు అనిపించాలి. ప్రేక్షకుడికి చెస్ ప్రామాణికత, ఆటలోని తీవ్రత కచ్చితత్వంతో తెలిసేలా ఉండాలి. ఏకాగ్రత అనేది ఒక పోరాటం. అందరూ అందులో ప్రావీణ్యం సంపాదించలేరు. చెస్ ఆటగాడు బోర్డు ముందు కూర్చున్నప్పుడు అతను నిశ్శబ్ధంగా చేసే పోరాటాన్ని ప్రేక్షకుడు గ్రహించేలా సినిమా ఉండాలి. హీరో ఎవరో మరి! ఇప్పటికీ నా పాత్రను పోషించే నటుడెవరో తెలియదు. మిగతా తారాగణం, షూటింగ్ షెడ్యూల్ గురించి తెలియదు. రాయ్ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా పూర్తిగా చూసింది లేదు. నిజానికి అతని సినిమాలు చూసి, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఉంది. సాధారణంగా సినిమాలు పెద్దగా చూడను. వంటలకు సంబంధించిన కార్యక్రమాలకు నేను అభిమానిని. డేవిడ్ అటెన్బారో డాక్యుమెంటరీలు చూస్తా. ఈ మధ్య బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ డాక్యుమెంటరీ ‘ద లాస్ట్ డ్యాన్స్’, చెస్ వెబ్ సిరీస్ ‘ద క్వీన్స్ గాంబిట్’ వీక్షించా. (చదవండి: నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..) -
భారత హాకీ దిగ్గజంపై సినిమా
ముంబై : క్రికెటర్లు ధోని, సచిన్ టెండూల్కర్... అథ్లెట్ మిల్కా సింగ్... బాక్సర్ మేరీకోమ్... హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌లపై ఇప్పటికే బయోపిక్‌లు వచ్చా యి. మైదానంలో ఆడిన ఆట మలీ్టప్లెక్స్, సినిమా తెరలపై కూడా ఆడింది. కానీ వీరందరికంటే ముందు అసాధారణ ఆటతో భారత్‌ను గెలిపించి, మువ్వన్నెలను మురిపించి, నియంతలనే మెప్పించిన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ ‘షో’ వెండితెరపై వెనుకబడింది. అయితే ఇప్పుడు ఆ ముచ్చట కూడా త్వరలోనే తీరనుంది. బాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ చౌబే భారత హాకీ లెజెండ్‌పై బయోపిక్ రూపొందించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. అన్నట్లు ఈ చిత్రం పేరు మన లెజెండ్ హీరో పేరే... ‘ధ్యాన్‌చంద్’. ఆర్ఎస్వీపీ మూవీస్, బ్లూ మంకీ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రనిర్మాణం చేపట్టినట్లు దర్శకుడు తెలిపారు. వచ్చే ఏడాది సెట్స్‌పై లైట్స్... కెమెరా... యాక్షన్... అంటూ రూపుదిద్దుకోనుంది. 2022లో విడుదల కానుంది. భారత హాకీ చరిత్రనే ‘స్వర్ణ’ అక్షరాలతో లిఖించిన మూడు ఒలింపిక్స్ (1928–అమ్‌స్టర్‌డామ్), (1932 –లాస్ఏంజెలిస్), (1936– బెర్లిన్) ప్రదర్శనలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అయితే తెరపై ఎవరా ‘ధ్యాన్‌చంద్’ అంటే కొన్నాళ్లు నిరీక్షించాలి. స్టార్ హీరోతోనే ఈ చిత్రం ఉంటుందని సమాచారం. -
బై చెప్పడం బాధాకరమే!
కొన్ని పాత్రలు చేసినప్పుడు సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా ఆ పాత్రల్లోంచి బయటకు రాలేరు కొందరు నటీనటులు. ఇప్పుడు కంగనా రనౌత్ పరిస్థితి అదే. దివంగత నటి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా తీసిన ‘తలైవి’ (నాయకురాలు)లో ఆమె టైటిల్ రోల్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ‘‘ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన మా ‘తలైవి’ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. తలైవి.. ఓ విప్లవ నాయకురాలు. ఇలాంటి పాత్రలు చేసే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ పాత్రను ఎంతో ప్రేమించి చేశాను. అందుకే సినిమా చివరి రోజు ఈ క్యారెక్టర్‌కి బై చెప్పడానికి బాధపడ్డాను’’ అన్నారు కంగనా రనౌత్. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు. -
శ్రుతి బయోపిక్ జ్వాలాముఖి
మీ బయోపిక్‌కి ఏం టైటిల్ పెడతారు? అని అడిగితే, ‘జ్వాలాముఖి’ అన్నారు శ్రుతీహాసన్. అంటే... భవిష్యత్తులో శ్రుతి జీవితాన్ని వెండితెరపై చూసే అవకాశం ఉందని ఊహించవచ్చు. వారాంతంలో అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్ చాట్ చేశారు శ్రుతీహాసన్. అప్పుడు ఓ ఫ్యాన్ ‘మీ బయోపిక్ టైటిల్ ఏంటి’ అంటే, ‘జ్వాలాముఖి’ అన్నారామె. ఇంతకీ ఈ బ్యూటీ జీవితంలో ఓ బయోపిక్‌కి కావాల్సినంత మసాలా ఉందా? అంటే.. విలక్షణ నటుడు కమల్‌హాసన్, నటి సారికల కూతురిగా శ్రుతీది గోల్డెన్ స్పూన్ అయినప్పటికీ, తల్లిదండ్రులకు ఉన్న పేరు వల్ల చిన్నప్పుడు స్వేచ్ఛ కోల్పోయారు. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో కమల్‌లా మంచి యాక్టరేనా? అనే కామెంట్లు ఒకటి. సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి శ్రుతి ప్రతి పాత్రనూ సవాల్‌గా తీసుకుని చేసి, అనుకున్నది సాధించారు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ‘ఐరన్ లెగ్’ అన్నారు కొందరు. అలానే లవ్, బ్రేకప్ వంటివి కూడా ఉన్నాయి. నటిగా, గాయనిగా, సంగీతదర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. భవిష్యత్తులో శ్రుతి బయోపిక్ తీస్తే అప్పటి విశేషాలు, ఇప్పటివరకూ జరిగినవి కలిపితే ఓ మంచి సినిమా తయారవుతుందని ఊహించవచ్చు. -
రతన్ టాటా బయోపిక్.. అది నేను కాదు..
పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పేరుతో రానున్న బయోపిక్‌లో తను నటించడం లేదని హీరో మాధవన్ స్పష్టం చేశారు. రతన్ టాటా జీవిత కథ నేపథ్యంలో త్వరలో ఓ బయోపిక్ తెరకెక్కనుందని, ఇందులో ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్ నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన ఓ పోస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తపై తాజాగా మాధవన్ స్పందిస్తూ శనివారం ఓ ట్వీట్ చేశారు. ‘హే దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు. కొంతమంది అభిమానుల తమ కోరిక మేరకు ఈ పోస్ట్‌ను సృష్టించి వైరల్ చేస్తున్నట్టున్నారు. అంతే తప్పా ఇందులో ఏమాత్రం నిజం లేదు. దీనికి సంబంధించి ఏ ప్రాజెక్ట్ ఇంతవరకు నా దగ్గరికి రాలేదు.. కనీసం చర్చ కూడా జరగలేదు’ అంటూ మాధవన్ ట్వీట్ చేశారు. (చదవండి: మాధవన్ టెన్త్ మార్కులు తెలుసా!) Hey unfortunately it’s not true. It was just a wish at some fans will made the poster. No such project is even on the pipeline or being discussed. https://t.co/z6dZfvOQmO — Ranganathan Madhavan (@ActorMadhavan) December 11, 2020 అయితే దర్శకురాలు సుధ కొంగర పారిశ్రామిక వేత్త రతన్ టాటా జీవిత కథ ఆధారం ఓ బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె రతన్ టాటా బయోపిక్‌ను లైకా ప్రోడక్షన్లో నిర్మిస్తున్నారని, ఈ చిత్రంలో 2021లో షూటింగ్‌ను కూడా జరుపుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మాధవన్ ఫొటో ఉన్న ఓ పోస్టర్‌పై రతన్ టాటా అని రాసి ఉన్న ఓ పోస్ట్ నెట్టింటా హల్చల్ చేస్తోంది. కాగా ఇటీవల మాధవన్, స్వీటీ అనుష్కలు జంటగా నటించిన ‘నిశ్శబ్ధం’ మూవీ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క మాటలు రాని, వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా నటించారు. (చదవండి: ఆ విషాదంపై రతన్ టాటా భావోద్వేగం) -
సిల్క్ స్మిత బయోపిక్ చేయడం లేదు
బుల్లితెర, వెండితెర ఏదైనా అనసూయకు కొట్టిన పిండే. యాంకర్‌గా అలరిస్తూనే నటిగా మెప్పిస్తున్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసి దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు. అలా రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. తాజాగా ఆమె ఓ కొత్త సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. మరో మంచి కథ.. కొత్త ఆరంభం, కోలీవుడ్ అనే క్యాప్షన్‌తో అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ ఫొటోకు రిఫరెన్స్ సిల్క్ స్మితగారు అని ఆమె పేరును ట్యాగ్ చేశారు. (చదవండి: అనసూయ కోలీవుడ్ చిత్రం.. సిల్క్ స్మిత బయోపిక్!) దీంతో ఆమె కోలీవుడ్‌లో తెరకెక్కనున్న సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ బయోపిక్ షూటింగ్ కోసం ఆమె చెన్నైకు కూడా వెళ్లొచ్చినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పుకార్లకు అనసూయ చెక్ పెట్టారు. సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించడం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. కాగా అనసూయ ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య', అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ వంశీ సినిమా 'రంగమార్తాండ'లోనూ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అంతేకాక రవితేజ 'ఖిలాడీ' చిత్రంలో ప్రముఖ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాక స్పెషల్ సాంగ్‌లో హీరోతో కలిసి చిందులేయనున్నారట. (చదవండి: వెయ్యి మంది... వంద రోజులు!) -
ఇన్స్పెక్టర్ అవినాష్
ప్రముఖ పోలీసాఫీసర్ అవినాష్ మిశ్రా జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్ సిరీస్‌లో టైటిల్ రోల్లో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటించనున్నారు. ఈ సిరీస్ ద్వారా వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు రణ్‌దీప్. నీరజ్ పతాక్ దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్‌కు ‘ఇన్స్పెక్టర్ అవినాష్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో చిత్రీకరణ జరగనుంది. ‘‘ఇదో స్ఫూర్తివంతమైన కథ. ఇలాంటి సూపర్ పోలీస్ కథను అందరికీ చెప్పడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు రణ్‌దీప్ హుడా. -
తలైవా కథ తయారా?
బస్ కండక్టర్ నుంచి ఇండియన్ సూపర్‌స్టార్‌గా రజనీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. పక్కా కమర్షియల్ కథలాంటి జర్నీ. ఇప్పుడు ఈయన ప్రయాణం ఓ సినిమా కాబోతోందని కోలీవుడ్ టాక్. రజనీ జీవిత కథను బయోపిక్‌గా తీసుకురావాలని తమిళ దర్శకుడు లింగుస్వామి ప్లాన్ చేస్తున్నారట. లింగుస్వామి తమిళంలో తెరకెక్కించిన ‘సండై కోళి’, ‘పయ్యా’ (తెలుగులో ‘పందెం కోడి, ఆవారా’) వంటి సినిమాలు తెలుగులోనూ బాగా ఆడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సందర్భంలో ‘రజనీ బయోపిక్ చేయాలనుంది. రజనీ పాత్రలో ధనుష్ యాక్ట్ చేస్తే బావుంటుంది’ అని పేర్కొన్నారు లింగుస్వామి. రెండేళ్లుగా లింగుస్వామి కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. తలైవా (నాయకుడా అని అర్థం. రజనీని చాలామంది అలానే పిలుస్తారు) రజనీ బయోపిక్‌కి సంబంధించిన కథ మీదే వర్క్ జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. -
తప్పుకున్న సేతుపతి
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి టైటిల్ రోల్ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. అయితే తమిళ నాట ఈ సినిమా విషయంలో వివాదం మొదలైంది. శ్రీలంక ఆటగాడు అయినప్పటికీ మురళీధరన్‌కు తమిళ మూలాలున్నాయి. అయితే తమిళ ఉద్యమానికి సంబంధించిన విషయాల్లో మురళీధర న్ తమిళుల వైపు ఎప్పుడూ నిలబడలేదనే వివాదం తెరమీదకొచ్చింది. అందుకే విజయ్ సేతుపతి ఈ సినిమా చేయకూడదని సోషల్ మీడియాలో పలువురు హల్చల్ చేశారు. కొందరు తమిళ సినీ ప్రముఖులు కూడా విజయ్ సేతుపతి ఈ సినిమా చేయడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. అందులో సీనియర్ దర్శకులు భారతీరాజా, చేరన్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నారు. ఈ విషయాన్ని మురళీధరన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘నా వల్ల నీలాంటి గొప్ప నటుడు ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు. ఎటువంటివంటి ఇబ్బందులు పడొద్దు’ అని ఓ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు ‘ధన్యవాదాలు’ అని సమాధానమిచ్చారు విజయ్ సేతుపతి. ఇప్పుడు విజయ సేతుపతి స్థానంలో ఎవరొస్తారో చూడాలి. -
విమర్శలకు చెక్: విజయ్ అనూహ్య నిర్ణయం
సాక్షి, చెన్నై : గతకొన్ని రోజులుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన శ్రీలంక మాజీ స్పినర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌పై వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరుస వివాదాలు, విమర్శల నేపథ్యంలో మురళీధరన్ బయోపిక్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించి.. విమర్శలకు చెక్‌పెట్టారు. వివరాల ప్రకారం.. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో 800 పేరుతో మురళీధరన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మురళీధరన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. (వివాదంలో 800: స్పందించిన మురళీధరన్) ఈ నేపథ్యంలో శ్రీలంక మతవాదానికి పూర్తిగా మద్దతు పలికిన నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు సైతం విజయ్‌కు సూచించారు. బడా నిర్మాతలు, దర్శకుల నుంచి విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. మురళీధరన్ బయోపిక్‌పై తమిళ సంఘాలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. శ్రీలంకలో తమిళులను ఊచకోతకోసిన 2009 ఏడాది తనక అత్యంత సంతోషకరమైనది వ్యాఖ్యానించిన తమిళుల వ్యతిరేకి చిత్రంలో నటించవద్దని నిరసన వ్యక్తం చేశాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బయోపిక్కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. తమిళుల తీరును తప్పుబడ్డారు. దీంతో వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో 800 బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. ముత్తయ్య లేఖ.. తాజా వివాదం నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. 2009 అల్లర్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. ఎంతోకష్టపడి అంతర్జాతీయ క్రికెట్లో 800కు పైగా వికెట్స్ సాధించిన తన చిత్రాన్ని అడ్డుకోవడం సరైనది కాదని తమిళలు తీరును ఖండించారు. శ్రీలంకలో పుట్టడమే తాను చేసిన తప్పా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రపూరితంగానే కొన్ని రాజకీయ శక్తులు ప్రజలను ఉసిగొళ్పాయని లేఖలో పేర్కొన్నారు. అమాయక ప్రజలకు చంపడం ఎవరికీ సంతోషకరమైన విషయం కాదని, ఆ ఏడాది యుద్ధం యుగియడంతో ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. -
వివాదంలో 800: స్పందించిన మురళీధరన్
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం '800' పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే కొన్ని తమిళ సంఘాలు, సంస్థలు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక జాతీయ జట్టుకు ఆడి మురళీధరన్ తమిళ జాతికి ద్రోహం చేశారని అవి ప్రచారం చేస్తున్నాయి. మురళీధరన్ పాత్రలో నటిస్తున్నందుకు విజయ్ సేతుపతిపై మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై మురళీధరన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ జీవితంలో నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నా వ్యక్తిగత జీవితం, క్రికెట్ జీవితం గురించి చాలా మంది మాటలన్నారు. ఇప్పుడు '800' చిత్రం కూడా నా జీవితం గురించే చర్చిస్తుంది కాబట్టి, దీనిపైనా విమర్శలు వస్తాయి. అయితే, నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను’ అన్నారు ‘ఈ చిత్రాన్ని కొందరు వివిధ కారణాలతో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. నేను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపిస్తున్నారు. గత ఏడాది నేను 2009 నాకు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అయితే కొందరు దీన్ని వక్రీకరించి 'శ్రీలంకలో తమిళులను పెద్ద సంఖ్యలో చంపిన ఏడాది మురళీధరన్‌కు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరమట' అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఓ సామాన్యుడి కోణంలో ఆలోచించండి. దేశంలో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో 2009లో యుద్ధం సమాప్తమైంది. ఓ సామాన్యుడిగా సురక్షితంగా ఉన్నామన్న భావన నాకు కలిగింది. పదేళ్లుగా ఇరువైపులా మరణాలు లేవు. అందుకే, 2009ని నేను అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అమాయకులను చంపడాన్ని నేను ఎప్పుడూ సమర్థించలేదు. సమర్థించబోను’ అని మురళీధరన్ స్పష్టం చేశారు. (చదవండి: ‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?!) అంతేకాక ‘నా జీవిత కథను సినిమాగా తీస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినప్పుడు మొదట నేను తటపటాయించా. కానీ, ఆ విషయం గురించి ఆలోచించన తర్వాత, మురళీధరన్‌గా నేను సాధించిన విజయాలు నా ఒక్కడివే కాదనిపించింది. నా తల్లిదండ్రుల సహకారం ఇందులో ఎంతో ఉంది. నా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు అందరూ నా వెనుక ఉన్నారు. సినిమాతో వాళ్లకు గుర్తింపు వచ్చినట్లవుతుందని అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను’ అని తెలిపారు. ఇక "శ్రీలంక తమిళులు చనిపోతున్నప్పుడు ముత్తయ్య ఫిడేలు వాయించారు. తన సొంత ప్రజలు చనిపోయినప్పుడు అతను ఆనందించారు. అలాంటి వ్యక్తి క్రీడాకారుడిగా ఎంత సాధించినా ఉపయోగం ఏమిటి? మనకు సంబంధించినంతవరకు, ముత్తయ్య నమ్మకద్రోహం చేసాడు" అని ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా విమర్శించారు. (చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు! ) పీఎంకే చీఫ్ డాక్టర్ పి రామదాస్ మాట్లాడుతూ, "విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతాడు" అని తెలిపారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు, డార్ మోషన్ పిక్చర్స్, ఈ సినిమా "పూర్తిగా స్పోర్ట్స్ బయోగ్రఫీ" అని, దీనిలో శ్రీలంకలో తమిళుల పోరాటాలను తక్కువ చేసే సన్నివేశాలను చూపించమని చెప్పారు. ఈ వివాదాలపై విజయ్ సేతుపతి ఇంకా స్వయంగా స్పందించలేదు. 2017లో నటుడు, రాజకీయ నాయకుడు రజనీకాంత్ తన 2.0 చిత్రం నిర్మాతలు ఏర్పాటు చేసిన శ్రీలంక కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. నిరాశ్రయులైన తమిళులకు ఇళ్లను పంపిణీ చేయడానికి నిర్ణయించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. దీని ద్వారా తమిళులు పునరావాసం పొందారని అంతర్జాతీయ సమాజానికి తప్పుడు ప్రచారం చేయడానికి శ్రీలంక తన పర్యటనను ఉపయోగించుకోవచ్చని రజనీని హెచ్చరించాయి. -
‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?!
చెన్నై: హీరో విజయ్ సేతుపతి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’లో నటించవద్దంటూ నిరసనలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ విజయ్ సేతుపతికి మద్దతుగా నిలిచారు. నమ్మక ద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంలో నటించొద్దని విజయ్ సేతుపతికి దర్శకుడు భారతీరాజా సూచించిన విషయం తెలిసిందే. అంతేగాక పలు తమిళ సంఘాలు కూడా దేశద్రోహి సినిమాలో నటించవద్దంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రాధిక శుక్రవారం వరుస ట్వీట్లు చేస్తూ విజయ్ సేతుపతికి, చిత్ర పరిశ్రమకు సంఘీభావం తెలిపారు. రాజకీయాలను, వినోదాన్ని కలపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు!) రాధిక ట్వీట్ చేస్తూ.. ‘జనాలకు ఏం పని లేదా.. ఒక నటుడిని, క్రికెటర్‌ను కలపడం అర్థం లేని వివాదం. ముత్తయ్య మురళీధరన్‌ను కోచ్‌గా నియమించిన ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు’ అన్నారు. అలాగే ‘‘సన్‌రైజర్స్, సన్ టెలివిజన్ ఛానెల్‌కు బలమైన రాజకీయ అనుబంధం ఉంది. అయినప్పటికి రాజకీయాలను, క్రికెట్‌ను, వినోదాన్ని వృత్తిపరంగా తగిన మార్గంలో స్ఫష్టంగా నిర్వహిస్తోంది. అలాంటప్పుడు రాజకీయాలకు దూరంగా చిత్ర పరిశ్రమను, వినోదాన్నేందుకు చూడకూడదు’’ అని ప్రశ్నించారు. అయితే తను ఈ విషయాన్ని వివాదం చేయాలనుకోవడం లేదన్నారు. కేవలం సినీ పరిశ్రమకు, నటులకు న్యాయపరమైన మద్దతునిచ్చే ప్రయత్నంలో తటస్థతకు, పక్షపాతరహితానికి సాక్ష్యం ఇచ్చేందుకే సన్‌రైజర్స్ పేరును వాడాను అంటూ రాధిక మరో ట్వీట్లో స్పష్టం చేశారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్) #muthaiyamuralitharan biopic &asking @VijaySethuOffl not to act😡do these people hav no work??why not ask @SunRisers why he is the head coach, team belongs to a Tamilian with political affiliations?VSP is an actor, and do not curb an actor. VSP&cricket both don’t warrant nonsense — Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020 అయితే ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో 800 పేరుతో శ్రీలంక క్రికెటర్ మురళీధరన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మురళీధరన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీలంక మతవాదానికి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య అని అలాంటి నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ దర్శకుడు భారతీరాజు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అంతేగాక 800కు వ్యతిరేకంగా పలు తమిళ సంఘాలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దర్శకుడు శీను రామస్వామి, చేరన్ కూడా ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్) my intention of that tweet was not to create any room for controversies but was to support the film industry and the connected artists within prejudices. That's why I brought in #Sunrisers name as a testimony of non biased, neutral and professional approach — Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020 -
పాత సినిమాలు... కొత్త సందడి
నేటి నుంచి థియేటర్స్ తెరుచుకుంటున్నాయి. థియేటర్స్‌ను నమ్ముకున్నవాళ్లకు సందడి మొదలుకానుంది. అయితే థియేటర్స్‌కి ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వస్తారా? కొత్త సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారా? ప్రస్తుతానికి ప్రశ్నలే. పరిస్థితిని బట్టి సమాధానాలు దొరుకుతాయి. అయితే థియేటర్స్ తిరిగి ఓపెన్ అవుతున్న సందర్భంలో పాత సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్లో రీ–రిలీజ్ కాబోతున్న చిత్రాల విశేషాలు. ఆ సినిమాలను ప్రదర్శించం లాక్డౌన్ సమయంలో పలు సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాయి. థియేట్రికల్ విడుదల కాకుండా ఓటీటీలో విడుదలయిన సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించం అని ప్రకటించాయి పలు మల్టీప్లెక్స్ సంస్థలు. ఆ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పుడే మల్టీప్లెక్స్ సంస్థలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఆ సినిమాలను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, విద్యాబాలన్ ‘శకుంతలా దేవి’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’, జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’, ‘సడక్ 2’ వంటి సినిమాలను తమ థియేటర్స్‌లో ప్రదర్శించేది లేదని ఐనాక్స్, పీవీఆర్, సినీపోలీస్, కార్నివాల్ వంటి మల్టీప్లెక్స్ అధినేతలు నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీయం మోదీ’. వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించారు. 2019లో విడుదలైన ఈ సినిమా నేడు మళ్లీ థియేటర్స్‌లోకి రానుంది. ‘ఈ సినిమా మరింత మందికి చేరువ అవ్వడానికి ఇదో మంచి అవకాశం’ అని అన్నారు చిత్రనిర్మాతలు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ చిత్రం ‘వార్’. గత ఏడాది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు భారీగా సాధించింది. ఈ సినిమాను మళ్లీ థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు నిర్మాతలు. అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘తన్హాజీ’, ఆయుష్మాన్ ఖురానా నటించిన సందేశాత్మక చిత్రం ‘శుభమంగళ్ సావధాన్’, తాప్సీ లీడ్ రోల్ చేసిన ‘థప్పడ్’, ఆదిత్యా రాయ్ కపూర్, దిశా పటానీ నటించిన ‘మలంగ్’ సినిమాలు కూడా మళ్లీ విడుదల కానున్నాయి. వీటికి తోడు ఇటీవలే ‘పే ఫర్ వ్యూ’ (డబ్బుకట్టి సినిమా చూడటం) పద్ధతిలో విడుదలయిన హిందీ చిత్రం ‘ఖాలీ పీలీ’, తమిళ చిత్రం ‘కాపే రణసింగం’ అక్టోబర్ 16 నుంచి థియేటర్స్‌లోకి రానున్నాయి. -
వివాదంలో విజయ్ సేతుపతి చిత్రం
తమిళ హీరో విజయ్ సేతుపతికి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు, సినిమాలతో తన అభిమానులను అలరిస్తుంటారు. ఇక ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. తాజాగా విజయ్ సేతుపతి శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలయిన మోషన్ పిక్చర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇక మురళీధరన్‌గా విజయ్ సేతుపతి లుక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సేతుపతిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #షేమ్ఆన్ విజయ్‌సేతుపతి అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ ప్రారంభించారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివిక్ష చూపించే దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ పాత్రలో మీరు నటిస్తారా.. ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ ప్రశ్నిస్తున్నారు. (చదవండి: సవాల్‌కి సై) మరి కొందరు మీరు చేసేది పూర్తిగా తప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మూవీ మేకర్స్ మాత్రం ఈ బయోపిక్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని.. నిజాల్ని నిర్భయంగా చూపిస్తామని ప్రకటించారు. ముత్తయ్య మురళీధరన్ జీవితంలో కనిపించని అనేక కోణాలు తెర మీదకు వస్తాయని తెలుపుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. -
మురళీధరన్‌గా విజయ్ సేతుపతి
చెన్నై: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుంది. ఎంఎస్ శ్రీపతి దీనికి దర్శకత్వం వహించనుండగా...మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తాయి. ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ సేతుపతి దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ పాత్రలో కనిపిస్తాడు. మురళీధరన్ టెస్టుల్లో తీసిన 800 వికెట్లను గుర్తు చేసే విధంగా సినిమా టైటిల్ కూడా ‘800’ అని పెట్టారు. వన్డేల్లో కూడా మురళీధరన్ 534 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నేడు జరిగే చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌కు ముందు ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. మురళీ బయోపిక్కు ప్రధానంగా తమిళంలో రూపొందించి ఇతర భారతీయ భాషలతో పాటు సింహళీస్లో కూడా అనువదిస్తారు. భారత్‌తో పాటు శ్రీలంక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో సినిమాను షూట్ చేస్తారు. -
అన్నీ మారాయి... అవి తప్ప!
‘కరోనా తర్వాత చాలా విషయాలు మారాయి. కానీ దర్శకుడు యాక్షన్ అని చెప్పి, మళ్లీ కట్ చెప్పడం, షూటింగ్... ఇవి మాత్రం ఏమీ మారలేదు’ అంటున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘తలైవి’. దివంగత నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే చెన్నైలో ప్రారంభించారు. అసెంబ్లీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ ముగిసింది. షూటింగ్‌కి సంబంధించి కొన్ని స్టిల్స్ షేర్ చేసి, ‘జయ అమ్మ ఆశీర్వాదాలతో మరో షెడ్యూల్‌ను పూర్తి చేశాం’ అని ట్వీట్ చేశారు కంగనా రనౌత్. -
సవాల్‌కి సై
విభిన్న సినిమాలు, విభిన్న పాత్రలతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఆయన భాగమయ్యే ప్రతీ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రముఖ శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధర న్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను విజయ్ సేతుపతి పోషించనున్నారు. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్, థార్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించనున్నాయి. దర్శకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారో ఇంకా ప్రకటించలేదు. ‘ఈ చిత్రంలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాత్ర నాకో చాలెంజ్ లాంటిది. ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీధరన్గారు కూడా ఈ ప్రాజెక్ట్‌లో మాకు తోడుగా ఉండటం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు విజయ్ సేతుపతి. -
‘ప్యాసా’గా గురుదత్ మళ్లీ మన ముందుకు
సాక్షి, న్యూఢిల్లీ : దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా త్రిపాత్రాభినయంతో బాలీవుడ్‌పై చెరగని ముద్రవేసి చిరు ప్రాయంలోనే (39 ఏళ్లు) నిజ జీవిత చిత్రం నుంచి తెరమరుగైన గురు దత్‌ను ఇప్పటికీ గుర్తు చేసుకునే వారు ఉంటారంటే ఏం ఆశ్చర్యం కలుగదు. అలాంటి కోవకు చెందిన వారే అభ్యుదయ చిత్ర దర్శకులు భావనా తల్వార్. ఆమె గురు దత్‌ను గుర్తు చేసుకోవడమే కాకుండా నేటి తరం ప్రేక్షకులకు ఆయనను పరిచయడంతోపాటు నాటి తరం ప్రేక్షకులకు సినీ కళా తపస్సీ గురు దత్, తన సినిమా జీవితంతో ముడివడిన నిజ జీవితంలో ఎదుర్కొన్న ఒడి దుడుకులను, కష్ట నష్టాలను తెలియజేయడం కోసం ఆయన ‘బయోపిక్’తో మనముందుకు వస్తున్నారు. ‘ధర్మ్ (2007)’ సినిమాతో బాలీవుడ్‌లోకి దర్శకురాలిగా రంగ ప్రవేశం చేసిన భావనా తల్వార్, గురు దత్ బయోపిక్ నిర్మాణం కోసం స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. (గురుదత్ బయోపిక్) దానికి 1957లో విడుదలైన గురుదత్ మాస్టర్ పీస్ ‘ప్యాసా’ పేరే పెట్టారు. అంతకుముందు ఆయన ఆర్‌పార్, మిస్టర్ అండ్ మిసెస్ 55 లాంటి ఆరు చిత్రాలను నిర్మించినప్పటికీ ‘ప్యాసా (దాహార్తి)’ సినిమాతో ఆయన పేరు బాలీవుడ్ చరిత్రలో దిగంతాలను తాకింది. ఆకట్టుకునే అందమైన లొకేషన్లు, హద్యమైన సన్నివేశాలు. కథానుగత సందర్భాలు, సందోర్భోచిత డైలాగులు, వీనుల విందైన పాటలు...అన్ని రకాలుగా ఆ సినిమా ప్రేక్షకుల మనసులను దోచుకుంది. గురు దత్తే ‘ప్యాసా’ చిత్రం మొత్తాన్ని భుజాన మోసుకొని తీసినట్లు కనిపిస్తుంది కనుక గురు దత్ బయోపిక్ ‘గురు దత్స్ ప్యాసా’ అని నామకరణం చేస్తేనే బాగుంటుందేమో! గురుదత్‌పై తాను తీస్తున్న సినిమా 2021లో సెట్స్ పైకి వెళుతుందని, గురుదత్‌గా, ఆయన బార్య గాయని గీతాదత్గా నటించేందుకు ఎవరిని ఎంపిక చేశారో ఇప్పడే వెళ్లడించేందుకు భావనా తల్వార్ నిరాకరించారు. చలనచిత్ర రంగానికి గురుదత్ను పరిచేయడంతోపాటు ఆయన సినీ విశ్వంలో తనదైన పాత్రను పోషించిన వహిదా రెహమాన్ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తున్నారనే ప్రశ్నకు కూడా ఆమె వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. వాస్తవానికి తాను గురుదత్, గీతాదత్‌ల ఏకైక సంతానమైన నీనా అనుమతి తీసుకోవాల్సి ఉందని తల్వార్ తెలిపారు. గురుదత్ బయోపిక్‌ను తీసేందుకు గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. ‘ఇన్ సర్చ్ ఆఫ్ గురుదత్’ పేరిట 1989లో డాక్యుమెంటరీ తీయడమే కాకుండా 1996లో ‘ది డిఫినిటివ్ బయోగ్రఫీ గురుదత్ : ఏ లైఫ్ ఇన్ సినిమా’ పేరిట పుస్తకం రాసిన నస్రీన్ మున్నీ కబీర్ ప్రయత్నించారు. పదేళ్ల క్రితమే తాను స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రాకేశ్ మెహ్రాతోని చర్చించానని, సంజయ్ లీలా బన్సాలీ కూడా ఉత్సాహం చూపారని కబీర్ తెలిపారు. గురుదత్లా మెప్పించే నటుడు దొరకడం కష్టం అవడమే కాకుండా ఆయనతో పరిచయమున్న నిజమైన పాత్రలను ఎలా పరిచయం చేయాలో, అందుకు వారు అనుమతిస్తారనే నమ్మకం లేకపోవడం తదితర కారణాల వల్ల ఆయన బయోపిక్‌ను తీయడాన్ని పక్కన పడేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. 2008లో యూటీవీ మూవీస్ కోసం గురుదత్ బయోపిక్‌ను తీసేందుకు శివేంద్ర సింగ్ దుంగార్పూర్ ప్రయత్నించారు. ఆయన అందుకు కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. అనురాగ్ కాశ్యప్ నుంచి స్క్రిప్టు సహకారం తీసుకున్నారు. గురుదత్‌గా ఆయన ఆమీర్ ఖాన్‌ను తీసుకోవాలనుకున్నారు. పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడు సినిమా షూటింగ్కన్నా, పాత్రల ఖరారు కన్నా గురుదత్ బయోపిక్‌ను తాను తీస్తున్నట్లు ముందుగానే చెప్పడానికి కారణం ఎంతో మంది పాతతరం నటీ నటులు, వారి వారసుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండడమేనని తల్వార్ వివరించారు. -
మొదలైన వర్మ బయోపిక్ షూటింగ్
సాక్షి, హైదరాబాద్: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఎన్నో బయోపిక్స్‌ను తెరకెక్కించి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన బయోపిక్‌ను తెరమీద చూపించడానికి శ్రీకారం చుట్టారు. రామ్‌గోపాల్ వర్మ జీవితాన్ని మొత్తం మూడు భాగాలుగా సినిమా తీయనున్నారు. మూడు పార్ట్‌లలో ముగ్గురు వేరువేరు వ్యక్తులు రామ్‌గోపాల్‌వర్మ స్థానంలో కనిపించనున్నారు. అయితే మూడో పార్ట్‌లో మాత్రం రామ్ గోపాల్ వర్మే నటించనున్నారు. DORASAI TEJA apart from acting as me in my college days is also directing the film..He is just 20 years old #RgvBiopic pic.twitter.com/LVxpDBrfcw — Ram Gopal Varma (@RGVzoomin) September 16, 2020 ఇందుకు సంబంధించిన మొదటి పార్ట్ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. దీనికి ‘రాము’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో దొరసాయి తేజ అనే అతను నటిస్తున్నాడు. ఫస్ట్ షాట్‌కు రామ్ గోపాల్ వర్మ సోదరి క్లాప్ కొట్టిందని వర్మ ట్విట్టర్ ద్వారా ఆ ఫోటోలను పంచుకున్నారు. అదే విధంగా తేజ తన తల్లి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నాడని వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. తేజకు కేవలం 20 ఏళ్లు మాత్రమేనని వర్మ తెలిపారు. వర్మ బయోపిక్‌ను బొమ్మా మురళి నిర్మిస్తుండగా, వర్మ పర్యవేక్షణలో దొరసాయి తేజ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పార్ట్ 1లో రామ్ గోపాల్ కాలేజ్ డేస్ చూపించనున్నారు. My sister Vijaya gave clap today for the first shot of my biopic part 1 titled RAMU ..Produced by BOMMAKU MURALI and directed by DORASAI TEJA #RgvBiopic pic.twitter.com/mBbDH7BA0C — Ram Gopal Varma (@RGVzoomin) September 16, 2020 చదవండి: తెరకెక్కనున్న రామ్ గోపాల్ వర్మ బయోపిక్ -
తెరకెక్కనున్న రామ్ గోపాల్ వర్మ బయోపిక్
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంటేనే సంచలనం. ఇప్పటి వరకు రకరకాల బయోపిక్‌లు, రియల్ స్టోరీలను తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా రామ్‌గోపాల్ వర్మ తన జీవితాన్నే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ తెరకెక్కిస్తుంది. ఈ విషయాన్ని రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాను మూడు భాగాలుగా, మూడు చిత్రాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని దొరసాయి తేజ అనే ఒక నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.ఇందుకు సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుందని వర్మ తెలిపారు. ప్రతి పార్ట్ రెండు గంటల పాటు ఉండబోతున్నట్లు వర్మ తెలిపారు. దీని గురించి వర్మ చెబుతూ, ‘ 3 పార్టుల్లో ,ఒక్కొక్క పార్టు నా వేరు వేరు వయసుల్లో వేరు వేరు అంశాలను చూపెట్టబోతోంది. పార్ట్ 1లో నా 20 ఏళ్ళప్పటి రోల్లో ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో నేనే నాలా గా నటించబోతున్నా’ అని తెలిపారు. రామ్ గోపాల్ వర్మను ఎంతో మంది ఫాలో అవుతుంటారు. వాళ్లందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 1 పేరు రాము అని పెట్టనున్నారు. ఈ పార్ట్‌లో రామ్ గోపాల్ వర్మ కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నారన్నది చూపించబోతున్నట్లు వర్మ చెప్పారు. ఇక రెండవ భాగం పేరు ‘రామ్ గోపాల్ వర్’ గా నిర్ణయించారు. ఇందులో రామ్ గోపాల్ వర్మ అండర్ వరల్డ్ ప్రేమాయణం గురించి చూపించనున్నారు. ఇందులో వర్మకు ముంబై జీవితంలో సంబంధం ఉన్న అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి చూపించవున్నారు. ఇక పార్ట్ 3లో ‘ఆర్జీవీ’ —ది ఇంటెలిజెంట్ ఇడియట్ పేరుతో తెరకెక్కనుంది. దీనిలో వర్మ ఫెయిల్యూర్స్, వివాదాలు, దేవుళ్ల పట్ల, సెక్స్ పట్ల, సమాజం పట్ల తనకున్న విపరీత వైఖరుల గురించి చూపించనున్నారు. చదవండి: వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు -
కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్
ప్రస్తుతం బయోపిక్ ట్రెండు నడుస్తోంది. పలువురు ప్రముఖుల బయోపిక్‌లతో పొందిన చిత్రాలు ప్రజాదరణ పొందుతున్నాయి. జయలలిత జీవిత చరిత్రతో తలైవీ, ది ఐరన్ లేడీ చిత్రాలు నిర్మాణాల్లో ఉన్నాయి. త్వరలో మరో ప్రముఖ క్రీడాకారిణి జీవిత చరిత్ర సినిమాగా రూపొందబోతోంది. వెయిట్ లిఫ్ట్‌లో ప్రపంచ స్థాయిలో కాంస్యం పథకాన్ని సాధించిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందనుందని సమాచారం. (నటి జ్యోతిక రూ. 25 లక్షల విరాళం) కాగా ఈ చిత్రంలో కరణం మల్లేశ్వరి పాత్రలో అందాల నటి రకుల్ ప్రీత్‌సింగ్ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రకుల్ ప్రీత్‌సింగ్ ఇండియన్– 2 చిత్రంలో కమల్ హాసన్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మినహా ఈ అమ్మడికి మరో అవకాశం లేదు. ఇలాంటి సమయంలో కరణం మల్లేశ్వరి బయోపిక్‌లో ఎంపిక అయితే ఈ అమ్మడు కంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరని చెప్పవచ్చు. కాగా ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
సుశాంత్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల
ముంబై: బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోపిక్‌లో వస్తున్న ‘సూసైడ్ ఆర్ మర్డర్’ చిత్రం ఫస్ట్ం లుక్‌ను దర్శకుడు శేఖర్ గుప్తా మంగళవారం సోషల్ మీడియాలో విడుదల చేశాడు. టిక్‌టాక్ స్టార్ సచిన్ తివారీ లీడ్రోల్లో పోషిస్తున్నాడు. టిక్‌టాక్‌లో సచిన్ తివారి వీడియోస్ చూసిన సుశాంత్ అభిమానులు అచ్చం సుశాంత్‌లా ఉన్నాడంటూ అతడిని ఫాలో అవడంతో సచిన్‌కు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. దర్శకుడు శేఖర్ గుప్తా సచిన్ తివారితో సుశాంత్ బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ షేర్ చేస్తూ ఓ ప్రకటన చేశారు. ‘ఒక చిన్న పట్టణానికి చెందిన వ్యక్తి చిత్ర పరిశ్రమలో షైనింగ్ స్టార్ అయ్యాడు. ఇది అతని ప్రయాణం. ఈ సినిమాతో సచిన్ తివారిని సినిమాలకు పరిచయం చేస్తున్నాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ను విడుదల చేశాడు. (చదవండి: సుశాంత్ కేసు: స్టేట్మెంట్ ఇచ్చిన చోప్రా) View this post on Instagram A boy from small town became a Shining Star in the film industry. This is his journey. Introducing @officialtiwarisachin _ as 'The Outsider' in #SuicideOrMurder @vsgbinge @VijayShekhar9 @shamikmaullik @shraddhapandit @vsgmusic #bollywood #nepotismbollywood @abpnewstv @zeenews @aajtak @republicbharatofficial @ndtvindia A post shared by VIJAY SHEKHAR GUPTA (@iamvijayshekhar) on Jul 19, 2020 at 3:57pm PDT ఈ చిత్రం గురించి ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో గుప్తా మాట్లాడుతూ.. ‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య మనందరికీ షాక్ ఇచ్చింది. కానీ ఇది కొత్త విషయమేమీ కాదు. చిత్ర పరిశ్రమలో ఎదగాలని వచ్చిన చాలా మంది నటులకు అవకాశాలు దొరకడం లేదు. చాలామంది ఈ మార్గంలో వెళతారు. మరికొందరు తమ జీవితమంతా కష్టపడుతూనే ఉంటారు. అందుకే బాలీవుడ్లో గాడ్ ఫాదర్స్ లేకుండా వచ్చే వారి జీవితం ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకుంటున్నా’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. గత నెల జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘రాబ్తా’, ‘కేదార్నాథ్’ వంటి చిత్రాల్లో సుశాంత్ నటించాడు. ఆ తర్వాత నటించిన ‘ఎమ్మెస్ ధోనీ’ బయోపిక్ మాత్రం సుశాంత్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత చిచోరే కూడా సుశాంత్ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. -
ఆ మైనస్సులే నాకు ప్లస్సులు
ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద బయోపిక్ కూడా తెరపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం గురించి జయప్రద మాట్లాడుతూ –‘‘నా జీవితంలో నేను చాలా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఈ విషయాలన్నింటినీ చెబుతూ నా బయోగ్రఫీ రాయాలనుకుంటున్నాను. ఆ తర్వాత నా బయోపిక్‌ను తెరకెక్కించే ఆలోచన కూడా ఉంది. ఇందులో నేనే నటించవచ్చు కూడా. అంకితభావం, పట్టుదల, మొండితనం.. ఈ మూడు లక్షణాలు స్త్రీకి ఉండకూడదంటారు. మైనస్ అంటారు. నాలో ఈ మూడు లక్షణాలూ ఉన్నాయి. అవి నాకు ప్లస్సే కానీ మైనస్‌గా భావించడంలేదు. ఎందుకంటే ఈ మూడు లక్షణాలూ నన్ను స్ట్రాంగ్ ఉమెన్‌ని చేశాయి. వీటిని నాకు ప్రసాదించిన ఆ దేవుడికి ధన్యవాదాలు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ –‘‘ఇటీవలే ఓ మారాఠీ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. అలాగే ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేశాను. మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను’’ అన్నారు జయప్రద. -
ప్రతి భారతీయుడు గర్వపడతాడు
‘‘ఆధునిక భారతీయ ఫుట్‌బాల్‌కి ఆద్యుడు సయ్యద్ అబ్దుల్ రహీం గొప్పతనం గురించి మా ‘మైదాన్’ సినిమాలో చూపించబోతున్నాం. ఫుట్‌బాల్ కోచ్‌గా 1950లో ఆయన ప్రస్థానం ప్రారంభమయింది. అప్పటినుండి 1963లో చనిపోయేంత వరకు ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరించారు’’ అన్నారు అజయ్ దేవగన్. సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా రూపొందిన ‘మైదాన్’లో అజయ్ దేవగన్ సయ్యద్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి అజయ్ దేవగన్ మాట్లాడుతూ– ‘‘వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ వారాన్ని గుర్తు పెట్టుకోండి. ఒక రియల్ హీరో స్టోరీని భారతీయులందరూ గర్వపడేలా తీస్తున్నాం. ఆగస్టు 13న ‘మైదాన్’ను విడుదల చేస్తాం’’ అన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాలి. ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించటానికి 16 ఎకరాల విస్తీర్ణంలో ఓ సెట్‌ను మేలో నిర్మించారు. కరోనా కారణంగా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత వర్షాలకి ఈ సెట్ పాడయిపోయింది. మళ్లీ ఆ సెట్‌ను నిర్మించాలంటే రెండు నెలలు పడుతుంది. ఆ సెట్ పూర్తి చేసి, సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి ‘బదాయి హో’ ఫేం రవీంద్రనా«థ్ శర్మ దర్శకుడు. ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్ సహకారంతో బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, అరునవ్ సేన్ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. -
నేను ములాయం సింగ్
సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ జీవితం ఆధారంగా ‘మై ములాయం సింగ్ యాదవ్’ (నేను ములాయం సింగ్ యాదవ్) అనే సినిమా తెరకెక్కుతోంది. సువేందు రాజ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ములాయం పాత్రలో అమిత్ సేథి నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్ని విడుదల చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా సువేందు రాజ్ ఘోష్ మాట్లాడుతూ– ‘‘ములాయం సింగ్ యాదవ్ అనే పేరే ఎంతో శక్తివంతమైంది. ఒక రైతు కొడుకు ముఖ్యమంత్రిగా, అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగారు. భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల కోసం ఆయన ఎంతో చేశారు. అలాంటి వ్యక్తి జీవితం గురించి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నా’’ అన్నారు. -
సుశాంత్‌కు గొప్ప నివాళి
బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్ జీవితం ఆధారంగా నిఖిల్ ఆనంద్ ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ విధానంలో ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఈ సినిమా గురించి నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ – ‘‘సుశాంత్ మన మధ్య లేరనే నిజాన్ని ఒప్పుకోవడం చాలా బాధగా ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా రాణించాలనుకునే ప్రతి సాధారణ వ్యక్తికి సుశాంత్ ఓ స్ఫూర్తి. సుశాంత్ కేవలం మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి మానవతావాది కూడా. నేను తీయబోయే సుశాంత్ బయోపిక్ అతనికి ఓ గొప్ప నివాళి. యాక్టర్స్‌గా కెరీర్‌ను ప్రారంభించాలనుకునే చాలామంది యువతీయువకులకు ఈ బయోపిక్ ఓ ప్రేరణలా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ప్రతిభావంతులైన అవుటర్స్కు మంచి అవకాశాలు వచ్చేలా బాలీవుడ్లో మార్పు రావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు నిఖిల్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను 2022లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. సుశాంత్ జీవితం ఆధారంగా ‘సూసైడ్ ఆర్ మర్డర్?: ఏ స్టార్ వాజ్ లాస్ట్’ అనే చిత్రం కూడా బాలీవుడ్లో రూపొందనుంది. షామిక్ మౌలిక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను విజయ్ శేఖర్ గుప్తా నిర్మించనున్నారు. -
డయానా పోలికలు
ప్రిన్సెస్ డయానా పుట్టిన ముప్పైఏళ్లకు జన్మించిన క్రిస్టెన్ స్టెవార్ట్ ఇప్పుడు తన ముప్పై ఏళ్ల వయసులో డయానా ముప్పై ఏళ్ల వయసులోని పాత్రను పోషించబోతున్నారు. ఈ విషయాన్ని ఇంతకన్నా సరళంగా చెప్పాలంటే... ప్రిన్స్చార్లెస్తో తన దాంపత్యం సవ్యంగా లేదని డయానా గ్రహించిన ఒకనాటి వీకెండ్ చుట్టూ కథను నిర్మించుకుని చిలీ దర్శకుడు పాబ్లో లారెయిన్ తీస్తున్న ‘స్పెన్సర్’ అనే చిత్రంలో క్రిస్టెన్ కథానాయికగా నటిస్తున్నారు. 20 ఏళ్ల వయసులో ప్రిన్స్ చార్లెస్‌తో డయానాకు పెళ్లయింది. తర్వాత పదేళ్ల కన్నా తక్కువ కాలంలోనే భర్తతో మానసికంగా ఆమె బంధం తెగిపోయింది. తెగిందని రూఢీ అయిన ఆ శని, ఆది వారాలలో డయానా మానసిక స్థితిని ఈ సినిమాలో క్రిస్టెన్ ప్రతిఫలింప జేయబోతున్నారు. బ్రిటన్ యువరాణిగా అభినయించనున్న ఈ అమెరికన్ నటి తన అత్యద్భుతమైన ప్రదర్శనను అలవోకగా ఇవ్వగలదని లారెయిన్ నమ్ముతున్నారు. బహుశా ఆ నమ్మకం రెండు కారణాల వల్ల ఆయనకు కలిగి వుండొచ్చు. ఒకటి స్టీవెన్ నైట్ స్క్రిప్టు ఇంకోటి క్రిస్టెన్ నవ్వు. ఆమె నవ్వితే అచ్చు నవ్వీనవ్వకుండా డయానా నవ్వినట్లే ఉంటుంది. -
వెండితెర సరోజిని
స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ తెరకెక్కనుంది. ఈ బయోపిక్కు ‘సరోజిని’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీలో ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి, ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోన్న దీపికా చిఖలియా టైటిల్ రోల్ చేయనున్నారు. ఆకాష్ నాయక్, ధీరజ్ మిశ్రా ద్వయం ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాయల్ ఫిల్మ్ మీడియా సమర్పణలో కాను భాయ్ పటేల్ నిర్మించనున్నారు. గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు దీపిక. ‘‘సరోజినీ నాయుడుగా మీ లుక్ బాగుంది’’ అంటూ దీపికను చాలామంది అభినందించారు. లాక్డౌన్ పూర్తయ్యాక ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. -
మరో బయోపిక్‌లో..?
అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించి, అందరి మెప్పు పొందారు కథానాయిక కీర్తీ సురేష్. ‘మహానటి’లో కీర్తి నటనకు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్ మరో బయోపిక్‌లో నటించనున్నారన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. సూపర్‌స్టార్ కృష్ణ భార్య, ప్రముఖ నటి, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన విజయ నిర్మల బయోపిక్ తెరకెక్కనుందట. ఇందులో విజయ నిర్మల పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించారట. మరి మరో బయోపిక్‌లో కీర్తి కనబడతారా? వెయిట్ అండ్ సీ. -
మిసెస్ శివాజీ
కెరీర్లో మంచి సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమించి పెళ్లాడారామె. వివాహం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ రితేష్ దేశ్‌ముఖ్ నటించి, నిర్మించే సినిమాల్లో సరదాగా అతిథి పాత్రల్లో మెరుస్తుంటారు. రితేష్ నటించిన ‘లాయి బహారీ, మౌళి’ సినిమాల్లో తళుక్కున మెరిశారు జెనీలియా. ప్రస్తుతం ఓ పూర్తి స్థాయి పాత్రతో తన కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రితేష్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాలో శివాజీ భార్య పాత్రలో కనిపించనున్నారట జెనీలియా. నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది. -
నా బయోపిక్‌లో ఆయనే హీరో: యువరాజ్
సినిమాల్లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంటుంది. ప్రస్తుతం సినిమాల్లో నడుస్తున్న ట్రెండ్ బయోపిక్స్. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇప్పుడు ఈ ట్రెండే నడుస్తుంది. ఫేమస్ పర్సనాలిటీల లైఫ్ స్టోరీలను తెరమీదకు తీసుకురావడానికి పోటీపడుతున్నారు. సినిమా స్టార్, బిజినెస్ మాన్, పొలిటీషియన్లతో పాటు క్రికెటర్ల లైఫ్ స్టోరీస్ కూడా బయోపిక్‌ల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ల బయోపిక్‌లు తెరకెక్కగా, ఇప్పుడు ఇండియన్ గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా రూపొందిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ కూడా తన బయోపిక్‌లో నటించే హీరో ఎవరో తెలియజేశారు. చదవండి: యువ కోచ్‌ను కబలించిన కరోనా ఈ మధ్య ఓ ఇంటర్యూలో యువీ కూడా బయోపిక్‌పై మాట్లాడుతూ.. ‘వాస్తవానికి నా బయోపిక్‌లో నేనే నటిస్తాను. కానీ దీన్ని బాలీవుడ్ చిత్రంగా తెరకెక్కిస్తారు కనుక హీరోను డైరెక్టర్ సెలెక్ట్ చేస్తారు. నాకైతే సిద్దాంత్ చతుర్వేది మంచి ఆప్షన్. ‘గల్లీబాయ్' చిత్రంలో అతను చేసిన షేర్ పాత్ర అద్భుతంగా ఉంది. ఆ చిత్రంలో అతన్ని అలా చూడటం బాగా నచ్చింది' అని యువీ తెలిపారు. తన జీవితాన్ని తెరపై చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ‘గల్లీ బాయ్' చిత్రంతో సిద్ధాంత్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఐపీఎల్ నేపథ్యంలో తెరకెక్కిన ఇన్సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్‌లో కూడా సిద్దాంత్ నటించారు. ఈ సిరీస్‌లో టీమిండియా వెటరన్ బౌలర్ శ్రీశాంత్‌ను పోలి ఉండే ప్రశాంత్ కనుజ పాత్ర పోషించారు. ఇది కూడా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా.. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో ధోని సేన టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించారు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. అనంతరం ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన యువరాజ్.. మళ్లీ బ్యాట్ పట్టి మెరుపులు మెరిపించారు. ఇలా భారత్ క్రికెట్లో తన ఆటతో అభిమానుల గుండెల్లో చెరుగని ముద్రవేసుకొని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. చదవండి: ప్రేక్షకులు లేకుండానే గ్రాండ్‌ప్రి ఈవెంట్లు -
‘రేవతి’ కథతో జాన్ అబ్రహం సినిమా
రేవతీ రాయ్ ఎవరో చాలామందికి తెలుసు. అయినా చెప్పుకోవాలి. అప్పుల బాధ, అనారోగ్యంపాలైన భర్త, ముగ్గురు పిల్లల ఆలనాపాలనా... ఇలా రేవతి జీవితం కష్టాలకు కేరాఫ్ అడ్రస్ అనే పరిస్థితి. చివరికి భర్త కూడా చనిపోతాడు. ఇక ముగ్గురు పిల్లల బాధ్యత తన మీదే. ఒంటరి మహిళ. ఉద్యోగం కోసం వెతికితే ఎవరూ ఇవ్వలేదు. అప్పుడు వచ్చిన ఆలోచనే ‘ఫర్ షీ’. తనకు తెలిసిన డ్రైవింగ్‌నే ఉపాధిగా ఎంచుకున్నారు రేవతి. క్యాబ్ డ్రైవర్‌గా మారారు. తనలా కష్టపడే వారి కోసం ‘ఫర్ షీ’ అనే క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసి, ఉపాధి కల్పించారు. ఆ తర్వాత ఒక్క ఫోన్ కొట్టి, మందులు, నిత్యావసర వస్తువులు కావాలని చెబితే, తక్కువ సమయంలో మహిళా సిబ్బంది అందజేసేలా ‘హే దీదీ’ పేరుతో డెలివరీ సర్వీస్ ప్రారంభించారామె. ముంబైకి చెందిన రేవతీ రాయ్ జీవితంలో ఒక సినిమాకి సరిపోయే కథ ఉంది. మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఆమె జీవితంతో హిందీ నటుడు జాన్ అబ్రహామ్ సినిమా నిర్మించనున్నారు. ఈ బయోపిక్‌ని జాన్‌తో కలిసి మరో ఇద్దరు నిర్మాతలు నిర్మిస్తారు. రాబ్బీ గ్రేవాల్ దర్శకుడు. ‘‘ఎన్నో కష్టనష్టాలను తట్టుకుని నిలబడి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన రేవతి జీవితాన్ని సినిమాగా తీస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జాన్. ‘‘ఇది నా కథ మాత్రమే కాదు. ఇతర మహిళలకు ఓ బాట చూపించిన మహిళలందరి కథ కూడా. పుట్టుకతోనే పోరాట యోధులుగా పుడతారు మహిళలు. వారికి ఒక్క అవకాశం ఇస్తే వృథా కాదు’’ అన్నారు రేవతీ రాయ్. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
ఛత్రపతి శివాజీగా రితేష్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి బుధవారం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శివాజీ జీవితం ఆధారంగా మూడు భాగాల సినిమాను ప్రకటించారు బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్. మరాఠీ చిత్రం ‘సైరాట్’ ఫేమ్ నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అజయ్–అతుల్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. మొదటి భాగానికి ‘శివాజీ’, రెండో భాగానికి ‘రాజా శివాజీ’, మూడో భాగానికి ‘ఛత్రపతి శివాజీ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. మొదటి భాగం 2021లో విడుదల కానుంది. ‘‘శివాజీ జయంతికి ఈ సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు చిత్రబృందం. సుమారు నాలుగైదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
వెండితెరకు కాళోజీ జీవితం
ప్రజాకవి, ప్రముఖ రచయిత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత స్వర్గీయ కాళోజీ నారాయణరావు జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ ‘ప్రజాకవి–కాళోజీ’ పేరుతో ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ‘‘కాళోజీగారి జీవితమంతా పోరాటమే. ఆ పోరాటాన్ని ‘ప్రజాకవి– కాళోజీ’గా తెరకెక్కిస్తున్నాం. కాళోజీ పాత్రలో శ్రీ మూలవిరాట్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారి పాత్రను వారి తమ్ముడు మనోహర రావుగారు పోషిస్తున్నారు. కాళోజీ భార్యగా విజయలక్ష్మీ జైనీ కనిపిస్తారు. ఈ సినిమాకు ఎస్ఎస్. ఆత్రేయ సంగీతదర్శకుడు’’ అని చిత్రబృందం తెలిపింది. కాళోజీ ఫౌండేషన్ సభ్యులు అంపశయ్య నవీన్, నాగిళ్ళ రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, పొట్టపల్లి శ్రీనివాసరావు, కవి అన్వర్ పాల్గొన్నారు. -
స్టైలిష్ షాట్ కొడుతూ.. 'శభాష్ మిథు' ఫస్ట్ లుక్
ప్రస్తుతం దేశంలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే ధోని, సచిన్ ఇలా ఎందరో క్రీడాకారుల జీవితాలపై సినిమాలు రూపొందిన సంగతి తెల్సిందే. వారి దారిలోనే మహిళా ప్రపంచ క్రికెట్లో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్. భారత్ క్రికెట్‌కి ఎనలేని సేవలందించిన ఆమె జీవిత నేపథ్యంలో తాజాగా ఓ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వయాకామ్ 18 సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. మిథాలీ బయోపిక్‌లో ఆ నటి.. ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తోంది. షారుఖ్ ఖాన్‌తో ‘రాయీస్’ మూవీ రూపొందించిన రాహుల్ డోలాకియా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘శభాష్ మిథు’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. కాగా నేడు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో తాప్సీ మిథాలీ పాత్రలో ఒదిగిపోయి.. స్టైలిష్ షాట్ కొడుతున్నట్టుగా కనిపిస్తోంది. 2021 ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. “I have always been asked who’s your favourite male cricketer but you should ask them who their favourite female cricketer is.” The statement that made every cricket lover pause n introspect that do they love the game or the gender playing it.@M_Raj03 you are a ‘Game Changer’ pic.twitter.com/2VlxYpXmSM — taapsee pannu (@taapsee) January 29, 2020 -
అబ్దుల్ కలాం ఫిక్స్
దేశం గర్వించే శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథను తెరమీదకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో కలాం పాత్రను పోషిస్తున్నట్టు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రకటించారు. ‘కలాం పాత్రలో నటించడం నా అదృష్టం’ అని ట్వీట్ చేశారాయన. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో అనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. -
‘ఆ సినిమాలకు’ తొలగిన అడ్డంకులు
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పలు చిత్రాల నిర్మాణాలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ క్వీన్‌కు, నటి కంగనా రనౌత్ తలైవికి, నిత్యా మీనన్ ది ఐరన్ లేడీ చిత్రాలకు ఆటంకాలు తొలిగిపోయాయి. వీటి నిర్మాణాలను నిర్భయంగా జరుపుకోవచ్చు. అందుకు స్వయంగా మద్రాసు హైకోర్టునే పచ్చజెండా ఊపింది. దర్శకుడు విజయ్... జయలలిత బయోపిక్‌ను తలైవి పేరుతో నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం, అందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా మహిళా దర్శకురాలు ప్రియదర్శిని దీ ఐరన్ లేడీ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో జయలలితగా నటి నిత్యామీనన్ నటించనున్న సంగతి విదితమే. ఇకపోతే దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత జీవిత చరిత్రను నటి రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో క్వీన్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కాగా వీటిని తన అనుమతి లేకుండా రూపొందించడాన్ని నిషేధించాలని జయలలిత సోదరుడి కుమార్తె దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే ఒకసారి విచారణ జరిగింది. దీప పిటిషన్‌కు సమాధానం ఇస్తూ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు, విజయ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. గురువారం న్యాయమూర్తులు సెంథిల్‌కుమార్, రామమూర్తిల సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తులు జయలలిత బయోపిక్‌ను చిత్రాలుగా తెరకెక్కించడాన్ని నిషేధించలేం అని తీర్పునిచ్చారు. అయితే దర్శక నిర్మాతలు ఇది కల్పిత సన్నివేశాలతో రూపొందించినట్లు టైటిల్ కార్డులో ప్రకటించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే పూర్తి అయిన రమ్యకృష్ణ నటించిన వెబ్ సిరీస్ క్వీన్ శనివారం నుంచి ఆన్లైన్లో ప్రసారం కానుంది. -
శశికళ పాత్రలో ప్రియమణి !
హైదరాబాద్ : కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ తలైవిలో జయలలిత సన్నిహితురాలు శశికళ పాత్రలో ప్రముఖ నటి ప్రియమణి కనిపించనున్నట్టు సమాచారం. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో మూడు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీలో శశికళ పాత్ర ఎవరికి దక్కుతుందనేది మొదటి నుంచీ ఆసక్తికరంగా మారింది. శశికళ పాత్రకు ప్రియమణి సరిగ్గా సరిపోతారని భావించిన దర్శకుడు విజయ్ ఆమెను ఒప్పించినట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న తలైవిలో పాన్ ఇండియా అప్పీల్‌ను తీసుకువచ్చేందుకు ప్రియమణి ఎంట్రీ కలిసివస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. జయలలిత జీవితాన్ని శశికళ అధికంగా ప్రభావితం చేయడంతో మూవీలో ఈ పాత్ర కీలకంగా మారింది. కాగా ప్రియమణి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉండగా, ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సిరివెన్నెల మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..
సాక్షి, హైదరాబాద్ : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో టైటిల్ పాత్ర పోషిస్తున్నట్టు హీరోయిన తాప్సీ నిర్ధారించారు. మిథాలీ బర్త్‌డే సందర్భంగా తాప్సీ ఈ విషయం వెల్లడించారు. శభాష్ మితు పేరిట తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో దిగ్గజ మహిళా క్రికెటర్ పాత్రలో తాప్సీ ఒదిగిపోనున్నారు. హ్యాపీ బర్త్‌డే కెప్టెప్ మిథాలీరాజ్ అంటూ సోషల్ మీడియాలో తాప్సీ ఈ వివరాలు పోస్ట్ చేశారు.మహిళా క్రికెటర్‌గా మిథాలీ ప్రస్ధానాన్ని తాను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసే అవకాశం రావడం గర్వకారణమని, శభాష్మిథులో మిథాలీ తనను తాను సరైన రీతిలో చూసుకునేలా నటిస్తానని తాప్సీ చెప్పుకొచ్చారు. చివరిగా తాను కవర్‌డ్రైవ్ ఎలా ఆడాలో నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తాప్సీ పేర్కొన్నారు. -
వెండితెరకు ద్యుతీ జీవితం
బాక్సాఫీస్ వద్ద స్పోర్ట్స్ పర్సనాలిటీస్ బయోపిక్స్‌కు మంచి వసూళ్లు ఉంటాయి. ‘భాగ్ మిల్కా భాగ్ (2013), మేరీకోమ్ (2014), దంగల్ (2016)’ వంటి చిత్రాల రికార్డు కలెక్షన్లే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ పేరుతో తెరకెక్కుతోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్స్‌పై ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అథ్లెట్ ద్యుతీ చంద్ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డుగ్రహీత హిమాన్షు ఖతువా దర్శకత్వం వహిస్తారు. ‘‘ఎన్నో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు నా బయోపిక్‌ను నిర్మించడానికి సంప్రదింపులు జరిపాయి. కానీ, నేను ఎవరికీ హక్కులు ఇవ్వలేదు. హిమాన్షుగారి ప్రతిభ గురించి నాకు తెలుసు. నా కథకు న్యాయం చేయగలరనే నమ్మకం ఉంది. ఈ బయోపిక్‌ను కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌గానే కాదు.. చూసినవారు కూడా స్ఫూర్తి పొందేలా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు ద్యుతీ చంద్. ‘‘ఫస్ట్ డ్రాఫ్ట్ స్కిప్ట్ర్ వర్క్ పూర్తయింది. ద్యుతి చిన్నతనం నుంచి ఆమె జీవితంలోని ఎత్తుపల్లాలను కూడా సినిమాలో చూపిస్తాం. ద్యుతీగా ఎవరు నటించబోతున్నారనే విషయంపై త్వరలో చెబుతాం’’ అని పేర్కొన్నారు హిమాన్షు. -
జాక్సన్ జీవిత కథ
‘కింగ్ ఆఫ్ పాప్’ అంటారు పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ను. పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఓ సంచలనం. డ్యాన్స్ చేయడంలో ఓ బెంచ్ మార్క్. జాక్సన్ జీవితంలో కేవలం సంగీతం, డ్యాన్స్ మాత్రమే కాదు ఎన్నో మిస్టరీలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ స్క్రీన్ మీదకు బయోపిక్‌గా తీసుకురావాలని చాలా మంది హాలీవుడ్ దర్శక–నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ మైఖేల్ జాక్సన్ ఫ్యామిలీకి చెందిన వాళ్లు లీగల్‌గా పెట్టే షరతులను దాటలేకపోయారు. తాజాగా హాలీవుడ్ నిర్మాత గ్రహమ్ కింగ్.. మైఖేల్ జాక్సన్‌పై సినిమా తీసే హక్కులను దక్కించుకున్నారు. గత ఏడాది ‘బొహేమియన్ రాప్సోడి’ చిత్రాన్ని నిర్మించారు గ్రహమ్ కింగ్. అది సంగీత కళాకారుడు ఫ్రెడ్డీ మెర్కూరీ బయోపిక్ కావడం విశేషం. నాలుగు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా. జాక్సన్ సినిమా విషయానికి వస్తే.. ‘గ్లాడియేటర్, హ్యూగో, ద ఏవియేటర్’ వంటి సినిమాలకు కథను అందించిన జాన్ లోగాన్ ఈ చిత్రానికి కథను సమకూరుస్తారు. ప్రస్తుతం మైఖేల్ జాక్సన్ పాత్రను పోషించే నటుడి ఎంపిక జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. -
ఉదయ్ కిరణ్ బయోపిక్.. స్పందించిన సందీప్
ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దివంగత హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కుతుందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో హీరో సందీప్ కిషన్ నటిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలను సందీప్ ఖండించారు. ఉదయ్‌కిరణ్ బయోపిక్ గురించి తనను ఎవరు సంప్రదించలేదని సందీప్ స్పష్టం చేశారు. ఇప్పట్లో తనకు బయోపిక్‌లు చేసే ఉద్దేశం లేదని వెల్లడించారు. కాగా, చిన్న వయసులోనే హీరోగా ఓ వెలుగు వెలిగిన ఉదయ్‌కిరణ్.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. గతంలో కూడా దర్శకుడు తేజ.. ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తేజ వాటిని ఖండించారు. -
అదిరిపోయిన ‘తలైవి’ ఫస్ట్‌లుక్
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఎమ్జీఆర్ పాత్రలో అరవింద్ స్వామిగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కంగనా రనౌత్ శనివారం విడుదల చేసింది. తన ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అదిరిపోయింది. ముదురు ఆచుపచ్చ రంగు కేప్ ధరించి ఉన్న కంగనా భారీ కటౌట్.. ‘అమ్మ’ను తలపించేలా ఉంది. ‘అమ్మ’గా మారడానికి కంగనా పడిన కష్టం ఫస్ట్‌లుక్‌లో తెలుస్తోంది. జయ పాత్ర కోసం అమెరికాలో మేకప్ టెస్ట్ చేయించుకున్న ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా పొందారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకున్నారు. ఇక ‘తలైవి’ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా తమిళం,తెలుగు, హిందీ మూడు భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2020 జూన్ 26న విడుదల చేయనున్నారు. The legend we know, but the story that is yet to be told! Presenting #KanganaRanaut, in & as #Thalaivi. A film by #Vijay, arriving in cinemas on 26th June, 2020@KanganaTeam @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @KarmaMediaEnt @TSeries @vibri_media pic.twitter.com/lTLtcq0bsd — Team Kangana Ranaut (@KanganaTeam) November 23, 2019 -
హారర్ బ్రదర్స్ బయోపిక్
బాలీవుడ్లో హారర్ చిత్రాలను పాపులర్ చేసింది దర్శకులు రామ్సే బ్రదర్స్ అంటారు. వీరిని హారర్ బ్రదర్స్ అని కూడా పిలుస్తారు. ‘వీరానా, పురానీ హవేలీ, బంద్ దర్వాజా’ వంటి హారర్ చిత్రాలతో 1980ల కాలంలో ప్రేక్షకులను భయపెట్టారు రామ్సే బ్రదర్స్. ఇప్పుడు వాళ్ల కథే స్క్రీన్ మీదకు రాబోతోంది. ఈ బయోపిక్‌ను నటుడు అజయ్ దేవగన్ నిర్మిస్తారు. రామ్సే బ్రదర్స్ జీవితకథను సినిమాకు అనుగుణంగా మలిచే హక్కులను అజయ్ తీసుకున్నారు. రితేష్ షా ఈ కథను రచిస్తున్నారు. మూడు తరాల రామ్సే ఫ్యామిలీ కథ, వాళ్ల కెరీర్లో ఎదుర్కొన్న కష్టాలన్నీ ఈ సినిమాలో చూపించనున్నారట. ఇందులో అజయ్ దేవగన్ యాక్ట్ చేయరని తెలిసింది. ఇంతకీ రామ్సే బ్రదర్స్ అంటే ఇద్దరే అనుకుంటారేమో. వీళ్లు మొత్తం ఏడుగురు. కుమార్ రామ్సే, కేషు రామ్సే, తులసీ రామ్సే, కరణ్ రామ్సే, శ్యామ్ రామ్సే, గంగూ రామ్సే, అర్జున్ రామ్సే. వీళ్లు దర్శకులు, నిర్మాతలు, ఎడిటర్లుగా వ్యవహరించారు. ఇటీవలే శ్యామ్ రామ్సే చనిపోయారు. ఈయన్ని ‘హారర్ సినిమాలకు బాద్షా’ అని అంటారు. రామ్సే బ్రదర్స్‌లో మరో సోదరుడు తులసీ రామ్సే గత ఏడాది కన్నుమూశారు. -
రాజీ పడేది లేదు
నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వెండితెరపైకి రాబోతున్న సినిమాల్లో ‘ది ఐరన్ లేడీ’ కూడా ఒకటి. ఇందులో జయలలితగా నిత్యామీనన్ నటించనున్నారు. దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఏవీ రాక పోవడంతో సెట్స్‌పైకి వెళ్తుందా? అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందిస్తూ ప్రియదర్శిని ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ది ఐరన్ లేడీ’ సినిమా కోసం ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించి ఆరు భాషలు మాట్లాడగల, భరత నాట్యంలో ప్రావీణ్యత ఉన్న నిత్యామీనన్‌ను ఎంచుకున్నాం. బయోపిక్‌ను తెరకె క్కించాలంటే చాలా అంశాల గురించి ఆలోచించాలి. ఇదొక చాలెంజ్ లాంటిది. ఎంతో బాధ్యత మాపై ఉంటుంది. విమర్శలు, వివాదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలను రాజీ పడకుండా చేస్తున్నాం’’ అన్నది ఆ లేఖ సారాంశం. ‘‘ది ఐరన్ లేడీ’ సినిమా కోసం నాకు ప్రత్యేకమైన శిక్షణ ఏం అవసరం లేదు. నాకు భరతనాట్యం వచ్చు. తమిళంలో స్పష్టంగా మాట్లాడగలను. బయోపిక్ తీయడం అంత ఈజీ కాదు’’ అన్నారు నిత్యామీనన్. -
విద్యార్థి నేత జీవితం
‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘జార్జ్ రెడ్డి’ బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్‌తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. జీవన్ రెడ్డి ఈ సినిమాను రియలిస్టిక్‌గా తీశాడు. బయోపిక్ అయినా అన్ని వాణిజ్య అంశాలు ఇందులో ఉంటాయి. వ్యాపార పరంగా కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. మా చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు. సినిమా విజ యంపై చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి. -
జయలలిత.. నేనూ సేమ్ : హీరోయిన్
తమిళసినిమా: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తనకు సారూప్యత ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటున్నారు. సంచలన నటిగా తరచూ వార్తల్లో ఉండే కంగనా చాలాకాలం తరువాత కోలీవుడ్‌లో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. మొదట్లో జయంరవికి జంటగా ‘ధామ్ ధూమ్’ చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ తరువాత బాలీవుడ్లో బిజీ అయి.. అక్కడ టాప్ హీరోయిన్గా రాణిస్తున్నారు. ఇటీవల చారిత్రాత్మిక చిత్రం ‘మణికర్ణిక’లో ఝాన్సీరాణిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. త్వరలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో ఆమె నటించబోతున్నారు. ‘తలైవి’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై ప్రారంభానికి ముందే నుంచే బోలెడంత హైప్ క్రియేట్ అయింది. కారణం జయలలిత పాత్రలో కంగనా నటించనుండటమే. ఈ చిత్రంలో ‘అమ్మ’గా మారడానికి కంగనా కూడా బగానే కష్టపడుతున్నారు. జయ పాత్ర కోసం ఇటీవల అమెరికాలో మేకప్ టెస్ట్ చేయించుకున్న ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా పొందుతున్నారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకుంటున్నారు. మా మధ్య స్వారూప్యం చాలానే ఉంది ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కోవై వచ్చిన కంగనా మీడియాతో కాసేపు ముచ్చటించారు. తాను నటిస్తున్న జయలలిత బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఆమె తెలిపారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, యుక్త వయసులోనే సినీరంగప్రవేశం చేసిన జయలలిత.. సిని ఇండస్ట్రీలో పురుషాధిక్యతను ఎదుర్కొని పలు విజయాలను అందుకున్నారని చెప్పారు. తానూ ఆమె మాదిరేనని, కాబట్టి తమ మధ్య స్వారూప్యం చాలానే ఉందని తెలిపారు. జయలలిత విజయవంతమైన రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా చాలా శక్తిమంతమైన మహిళగా జీవించారని ప్రశంసించారు. భాషలో పరిణితి, భరతనాట్యం వంటి పలు విషయాల్లో ప్రతిభావంతురాలైన జయలలిత పాత్రలో నిజాయితీగా నటించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. అందుకోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటున్నట్లు కంగనా వెల్లడించారు. రాజకీయ నేపథ్యంతో ఉన్న చిత్రాల్లో నటిస్తున్నా.. నిజజీవితంలో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని కంగనా రనౌత్ స్పష్టం చేశారు. -
తలైవికి తలైవర్ రెడీ
తమిళసినిమా: తలైవికి తలైవర్ రెడీ అయిపోయారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె జీవిత చరిత్రతో ఆధారంగా దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన వెబ్ సిరీస్ నిర్మాణం పూర్తయింది. కానీ, విడుదలలోనే ఇది సమస్యలను ఎదుర్కొంటోంది. మరోవైపు నవ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నిత్యామీనన్ నటించబోతున్నారు. ఇంకోవైపు దర్శకుడు విజయ్ కూడా అమ్మ జీవితకథను ప్రతిష్టాత్మకంగా తెరపై ఆవిష్కరించబోతున్నారు. దీనికి తలైవి అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఇందులో జయలలితగా బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ నటించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ‘మక్కళ్తిలగం’ ఎంజీఆర్ పాత్రను నటుడు అరవిందస్వామి పోషించబోతున్నారు. ఈ మేరకు చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సో తలైవిగా కంగనా, తలైవర్‌గా అరవిందస్వామి నటించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దీనికి బాహుబలి చిత్రం ఫేమ్ విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేస్తుండగా.. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు ఇందూరి, సైలేశ్లు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్లో గానీ, 2020 ప్రథమార్ధంలో గానీ సెట్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం కంగనా భారతనాట్యం కూడా నేర్చుకుంటున్నారు. -
గణిత ఘనాపాటి
ఏదైనా లెక్క కట్టాలంటే వెంటనే కబోర్డ్‌లో ఉన్న క్యాలిక్యులేటర్‌ని వెతుకుతాం. కానీ శకుంతలా దేవికి క్యాలిక్యులేటర్ అక్కర్లేదు. వేళ్లతోనే ఎంత పెద్ద లెక్కైనా వేసేస్తారు. అందుకే ఆమెను గణిత ఘనాపాటి అంటుంటారు. హ్యూమన్ కంప్యూటర్ అన్నట్టు. మ్యాథ్స్ జీనియస్ శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విద్యా బాలన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. బాబ్డ్ హెయిర్ కట్‌తో విద్యాబాలన్ కనిపిస్తున్నారు. కంప్యూటర్, క్యాలిక్యులేటర్‌తో జరిగిన రేస్‌లోనూ శకుంతలా దేవియే ఫస్ట్ వచ్చిందనే కాన్సెప్ట్‌తో ఈ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
అందుకే నటించేందుకు ఒప్పుకున్నా
కోటి.. పరిచయం అక్కర్లేని సంగీత దర్శకుడు. ఇప్పటి వరకూ తన చేతులతో స్వరాలు సమకూర్చిన ఆయన తొలిసారి లాఠీ పట్టి పోలీస్ పవర్ ఏంటో చూపిస్తానంటున్నారు. దేవినేని నెహ్రూగా తారకరత్న నటిస్తున్న ‘దేవినేని’ సినిమాలో కోటి పవర్ ఫుల్ ఎస్పీ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. వంగవీటి రాధ పాత్రలో బెనర్జీ, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్ నటిస్తున్నారు. 1983 విజయవాడ తొలి పవర్ఫుల్ ఎస్పీ కెఎస్ వ్యాస్‌గారి పాత్రను కోటి పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. కోటి మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఇది సెకండ్ ఫేజ్. సంగీత దర్శకుడిగా 20 సంవత్సరాలు రాణించాను. శివనాగు వచ్చి ఎస్పీ పాత్ర చేయాలి అనగానే, ‘మా నాన్నగారు నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలి’ అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983తో రాజ్ కోటిగా నా కెరీర్ స్టార్ట్ అయింది. కెఎస్ వ్యాస్‌గారి పాత్ర చేయడం అరుదైన సంఘటన. నా పాత్రని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. నర్రా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరి పేట హైవేలో భారీగా చిత్రకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. . ‘‘1977లో దేవినేని నెహ్రూ స్టూడెంట్ లైఫ్ నుంచి మా సినిమా ప్రారంభం అవుతుంది. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల షూటింగ్ జరుపుతున్నాం’’ అన్నారు రాము రాథోడ్. -
నాలుగు దశలు.. నాలుగు గెటప్పులు
తమిళ తలైవి (నాయకురాలు) జయలలిత పాత్రలోకి వెళ్లడానికి తయారవుతున్నారు కంగనా రనౌత్. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ పాత్ర కోసం క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు కంగనా. తాజాగా ఈ సినిమాలో కంగనా నాలుగు విభిన్న గెటప్పుల్లో కనిపిస్తారని తెలిసింది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి నిర్మిస్తారు. ఈ సినిమాలో కంగనా మేకప్ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ జాసన్ కోలిన్స్ వర్క్ చేయనున్నారు. జాసన్ ఇది వరకు ‘బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మార్వెల్, హంగర్ గేమ్స్’ వంటి హాలీవుడ్ సినిమాలకు మేకప్ వర్క్ చేశారు. దీపావళి తర్వాత ‘తలైవి’ రెగ్యులర్ షూట్ ఆరంభం కానుందని సమాచారం. కంగనా నాలుగు గెటప్పుల్లో కనిపిస్తారంటే జయ జీవితాన్ని నాలుగు దశలుగా చూపిస్తారనుకోవచ్చు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. -
రాత్రులు నిద్రపట్టేది కాదు
‘‘ఒక వ్యక్తి తప్పు చేశాడా? లేదా అని నిర్ధారణ కాకముందే తుది నిర్ణయానికి రాకూడదు. తప్పొప్పులు తేలే వరకూ ఒక వ్యక్తి పని కోల్పోవడమే కాకుండా ఏ పని దొరక్కుండా ఖాళీగా ఉండాలా? నా నిర్ణయం ఒకరికి జీవనోపాధి కోల్పోయేలా చేసింది అనే ఆలోచన నాకు చాలా రాత్రులు నిద్రపట్టకుండా చేసింది’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. సంగీత దర్శకుడు గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా ‘మొఘల్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. సుభాష్ కపూర్ దర్శకుడు. అయితే ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా సుభాష్ కపూర్‌ౖపై వేధింపుల ఆరోపణలు (గీతికా త్యాగీ ఆరోపించారు) రావడంతో ‘మొఘల్’ నుంచి ఆమిర్ తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్‌లో భాగమైనట్టు ప్రకటించారు. ‘‘గతంలో నేను తీసుకున్న నిర్ణయం ఆ సమయానికి సరైనది అనిపించింది. ఇప్పుడు మరోలా అనిపిస్తోంది. నా మనస్సాక్షిని నమ్మి వెళ్తున్నాను. కొందరికి ఈ నిర్ణయం కరెక్ట్‌గా అనిపించకపోవచ్చు. మొన్న మే నెలలో ‘ఐఎఫ్‌టీడీఏ’ (ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్) నుంచి నాకో లేఖ వచ్చింది. ‘సుభాష్ కపూర్ కేస్ ప్రస్తుతం కోర్ట్‌లో నడుస్తోంది. అప్పుడే అతను దోషి అని ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. మీ ఆలోచనను మరోసారి సమీక్షించుకోండి’ అన్నది దాని సారాంశం. సుభాష్‌తో పని చేసిన కొందరు మహిళా అసిస్టెంట్ డైరెక్టర్స్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‌వాళ్లతో నేను, నా భార్య కిరణ్ తన తీరు గురించి మాట్లాడి తెలుసుకున్నాం. వాళ్లు తన గురించి మంచిగా మాట్లాడారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తనెప్పుడూ స్త్రీలతో తప్పుగా ప్రవర్తించి ఉండడు అని చెప్పదలచుకోలేదు. అయినా తన మీద వచ్చిన ఆరోపణలు పని ప్రదేశంలో జరిగినవి కావు. అందుకే ఈ సినిమాలో మళ్లీ భాగమయ్యాను’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఆమిర్ ఖాన్. ఆమిర్ నన్ను సంప్రదించలేదు: గీతికా 2014లో సుభాష్ కపూర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు నటి గీతికా త్యాగీ. ఆమిర్ తీసుకున్న తాజా నిర్ణయం గురించి త్యాగీ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది ఆమిర్ తీసుకున్న నిర్ణయం (సినిమా నుంచి తప్పుకోవడం) అభినందించదగ్గది. కానీ ఇప్పుడు సుభాష్ గురించి ఆరా తీసినప్పుడు ఆమిర్ ఖాన్‌గారు నన్ను సంప్రదించలేదు. సంప్రదించే ప్రయత్నం చేశారని నా వరకూ రాలేదు. మీరు (ఆమిర్) అంత జాలి చూపించాలనుకున్నప్పుడు రెండువైపుల కథను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆమిర్ మార్చుకున్న నిర్ణయం వల్ల వేధింపుల గురించి మాట్లాడటానికి ఎవరు ముందుకు వస్తారు? ఆరోపణలు చేసిన తర్వాత నేను కోల్పోయిన పని, పడ్డ బాధ ఎవరికి తెలుసు? మన రూల్స్ మగవాళ్లను కాపాడేందుకు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ పోరాటాన్ని ఆపను’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయి వేధింపులకు గురైనప్పుడు బాలీవుడ్లో ఒక్కరికీ నిద్రపట్టని రాత్రులు ఉండవు ఎందుకో? (ఆమిర్ కామెంట్‌ను ఉద్దేశించి). సుభాష్‌కి మళ్లీ పని కల్పించినప్పుడు బాధితురాలిని ఎవ్వరూ పట్టించుకోరు ఎందుకో? బాలీవుడ్లో వేధించినవారికి సానుభూతి దొరుకుతుంది కానీ అమ్మాయిలకు మాత్రం ఎప్పుడూ దొరకదేంటో.. అర్థం కావడంలేదు’’ అంటూ వ్యంగ్య ధోరణిలో తనుశ్రీ దత్తా విమర్శనాస్త్రాలు సంధించారు. గీతికా త్యాగీ , తనుశ్రీ దత్తా -
రాజకీయ రాణి
రాజకీయ నాయకురాలిగా మారారు రమ్యకృష్ణ. నాయకురాలిగా ఆమె ఆడిన రాజకీయ చదరంగం ఎలా ఉంటుందో చూడటానికి సమయం ఆసన్నమైంది. నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇందులో రమ్యకృష్ణ పాత్ర పేరు శక్తి అని టాక్. ఈ చిత్రంలో ఎమ్జీఆర్గా నటుడు ఇంద్రజిత్ కనిపిస్తారట. అలాగే యంగ్ జయలలిత పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్ అనిఖ నటించారని కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళం, హిందీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్‌లేడీ’ అనే రెండు బయోపిక్స్ వెండితెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తారు. ఇక దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్ లేడీ’లో జయలిలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తారు. -
‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రంలో సింధు పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై విపరీతమైన చర్చ జరుగుతుంది. సింధు పాత్రకు సంబంధించి పలువురు నటీమణుల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ప్రముఖ నటి సమంత తెరపై సింధుగా కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మీ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందని జాతీయ మీడియా సింధును ప్రశ్నించింది. దీనికి సమాధానం ఇచ్చిన సింధు బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ పేరు చెప్పింది. తన పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తే బాగుంటుందని పేర్కొంది. దీపికా బ్యాడ్మింటన్ బాగా ఆడుతుందని.. మంచి నటి కూడా అని కితాబిచ్చాంది. కానీ నిర్మాతలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. తాను వారి నిర్ణయానికి గౌరవమిస్తానని తెలిపింది. ప్రస్తుతం దీపికా కబీర్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తుంది. ఈ చిత్రంలో జనవరి 2020లో ప్రేక్షకులు మందుకు రానుంది. కాగా, దీపికా తండ్రి ప్రకాశ్ పదుకోన్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. దీపికా కూడా టీనేజీలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రాణించింది. ఆ తర్వాత బ్యాడ్మింటన్‌కు గుడ్ బై చెప్పి సినీ రంగంలోకి ప్రవేశించింది. -
టెన్నిస్ ఆడతా!
‘సాహో’ సినిమాతో సౌత్ ఇండియాకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు శ్రద్ధాకపూర్. మొన్నామధ్య ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ నుంచి శ్రద్ధాకపూర్ తప్పుకున్న విషయం తెలిసిందే. ‘సైనా’లో ఇప్పుడు పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తప్పుకున్నందుకు ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా? అనే ప్రశ్నను శ్రద్ధాకపూర్ ముందు ఉంచితే... ‘‘నా జీవితంలో నేను దేని గురించీ రిగ్రెట్ ఫీలవ్వను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. దురదృష్టవశాత్తు ‘సైనా’ ఫస్ట్ డే షూటింగ్‌లోనే నేను అనారోగ్యానికి గురయ్యాను. దాంతో షూటింగ్ కాస్త వాయిదా పడింది. ఆ లోపు ‘ఏబీసీడీ 3’లో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. ‘ఏబీసీడీ 2’ సినిమా నా కెరీర్లో మంచి హిట్. అలాంటప్పుడు ‘ఏబీసీడీ 3’ సినిమాకు నో చెప్పాలనుకోలేదు. అప్పటికే నేను ‘చిచ్చోరే’, ‘సాహో’ సినిమాలతో బిజీగా ఉన్నా. అందుకే ‘సైనా’ చిత్రానికి తిరిగి డేట్స్ కేటాయించలేకపోయాను. ఫలితంగా ఆ ప్రాజెక్ట్ చేజారింది’’ అని చెప్పారు. ఒక బయోపిక్‌ని మిస్సయిన మీకు ఇప్పుడు ఎవరి బయోపిక్‌లో అయినా నటించాలని ఉందా? అనే ప్రశ్నను శ్రద్ధా ముందు ఉంచితే – ‘‘సానియా మీర్జా (ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి) బయోపిక్ ఆలోచన ఉంది. ఆమెది గ్రేట్ జర్నీ. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. రోనీ స్క్రూవాలా దగ్గర సానియా మీర్జా బయోపిక్ హక్కులు ఉన్న సంగతి తెలిసిందే. మరి.. శ్రద్ధాని రోనీ నాయికగా తీసుకుంటారా? అనేది కాలమే చెప్పాలి. -
విద్యావంతురాలు
విద్యాబాలన్ ఈ మధ్య వరుసగా విద్యావంతురాలి పాత్రల్లోనే కనిపిస్తున్నారు. ‘మిషన్ మంగళ్’లో ఇస్రో శాస్త్రవేత్తగా కనిపించిన విద్యా, ప్రస్తుతం ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే పేరు పొందిన గణిత ప్రావీణురాలు శకుంతలా దేవి బయోపిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అను మీనన్ దర్శకురాలు. ఈ సినిమాలో తన లుక్ గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ– ‘‘ఈ పాత్రలో బాబ్డ్ హెయిర్ కట్లో కనిపిస్తాను. నా సౌతిండియన్ ఫేస్ కట్ ఈ మ్యాథ్స్ జీనియస్‌కు బాగా మ్యాచ్ అవుతుందనుకుంటున్నాను. శకుంతలగారి 20 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వయసు వరకు అన్ని లుక్స్‌లో కనిపిస్తాను’’ అన్నారు. ఇదే కాకుండా ఇందిరాగాంధీ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు విద్యా. -
అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు
చెన్నై : భారతీయ సినిమాలో సంచలన నటి ఎవరన్నా ఉన్నారంటే అందులో నటి కంగనా రనౌత్ పేరు కచ్చితంగా నమోదవుతుంది. అంతే కాదు ఇప్పుడు అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న కథానాయకిగానూ ఎదిగిపోయింది. కాగా అప్పుడెప్పుడో తమిళంలో ధామ్ ధూమ్ అనే చిత్రంతో పరిచయమైంది. ఆ తరువాత ఇక్కడ మళ్లీ కనిపించలేదు. బాలీవుడ్లో అగ్రనాయకిగా రాణిస్తున్న కంగనారనౌత్‌ను దర్శకుడు విజయ్ తాజాగా కోలీవుడ్‌కు తీసుకొస్తున్నారు. ఈయన తెరకెక్కించనున్న జయలలిత బయోపిక్‌లో టైటిల్ రోల్లో నటించడానికి నటి కంగనారనౌత్‌ను ఎంచుకున్నారు. తలైవి పేరుతో ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. త్వరలోనే తలైవి చిత్ర షూటింగ్ సెట్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో నటించనుండడం గురించి నటి కంగనారనౌత్ మాట్లాడుతూ జయలలిత పాత్రలో నటించనుండడం ఘనంగా ఉందని చెప్పింది. ఇందు కోసం జయలలిత ప్రచారాల వీడియోలను తెప్పించుకుని వింటున్నానని తెలిపింది. ఆమెకు తగ్గట్టుగా తన శారీరక భాషను మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. కష్టాలను అధిగమించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని చెప్పింది. అలాంటి జయలలిత పాత్రలో తాను నటించనుండడంసంతోషకరంగా పేర్కొంది. మహిళలు కష్టాలను అధిగమించి ఎదగవచ్చునన్నందుకు జయలలిత ఉదాహరణ అని అంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న తలైవి చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని చెప్పింది. జయలలిత చదువును పక్కన పెట్టి నటించడానికి ఆసక్తి చూపిన కాలం నుంచి తలైవి చిత్ర కథ మొదలవుతుందని చెప్పింది. ఆ చిత్ర కథకు విజయేంద్రప్రసాద్, అజిత్ ఆరోరా స్క్రీన్‌ప్లేను రాస్తున్నట్లు తెలిపింది. తాను ఇతర చిత్రాలన్నింటినీ పక్కన పెట్టేసి ఈ చిత్రం కోసం 100 శాతం శ్రమించడానికి సిద్ధం అవుతున్నట్లు నటి కంగనారనౌత్ చెప్పింది. -
భార్య, భర్త మధ్యలో ఆమె!
ప్రపంచంలో ఏడే కథలు ఉంటాయట.. సప్త సముద్రాల్లానే. ఆ సముద్రంలోని చేప ఈ సముద్రంలోకి.. ఈ సముద్రంలోని చేప ఆ సముద్రంలోకి సాధారణంగా పోదు.. పోలేదు.కానీ ముంబై మహా తీరానికి అన్ని సముద్రాల చేపలూ కొట్టుకొస్తున్నాయి. బాలీవుడ్ మరి! అదొక రీమేక్ కథాసాగరం. గత ఏడాదంతా బాలీవుడ్ సిల్వర్‌స్క్రీన్‌పై ఎక్కువగా బయోపిక్‌ల హవా నడిచింది. ఈ ఏడాది రీమేక్‌ల హవా. సల్మాన్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, సంజయ్‌దత్, అక్షయ్‌కుమార్ వంటి స్టార్ యాక్టర్స్ రీమేక్ సినిమాల వైపు దృష్టి పెట్టారు. ఇతర భాషల్లో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో కింగ్‌లా నిలిచిన హిట్ సినిమాల రిమేక్స్తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ‘రీ’మేకింగ్ చిత్రాల్లో నటించబోయే, నటిస్తున్న బాలీవుడ్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. మరో కొరియన్ కొరియన్ హిట్ సినిమాలపై ఓ కన్నేసినట్లున్నారు కండల వీరుడు సల్మాన్‌ఖాన్. ఈ ఏడాది ‘ఓడ్ టు మై ఫాదర్’ అనే సౌత్ కొరియన్ మూవీ హిందీ రీమేక్ ‘భారత్’లో నటించిన సల్మాన్... వెంటనే మరో సౌత్ కొరియన్ చిత్రం ‘వెటరన్’ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సల్మాన్ ఆశించిన విజయాన్ని ‘భారత్’ అందించకపోయినప్పటిMీ ‘వెటరన్’ చిత్రం రీమేక్‌కు సల్లూ భాయ్ సై అనడం విశేషం. నటుడు, నిర్మాత, దర్శకుడు అతుల్ అగ్నిహోత్రి ‘వెటరన్’ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. హిందీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి, వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారట. లాల్‌సింగ్ ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తొలిసారి కలిసి నటించిన 300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. దీంతో ఆమిర్ ఆలోచనలు ఒక్కసారిగా ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’ వైపు తిరిగాయి. ‘లాల్‌సింగ్ చద్దా’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ రీమేక్ కోసం ఆమిర్ దాదాపు 20 కిలోల బరువు తగ్గారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఆమిర్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం. డబుల్ ధమాకా ఏడాదికి కనీసం నాలుగు సినిమాలనైనా ప్రేక్షకుల ముందకు తీసుకురావడం అక్షయ్ కుమార్ స్టైల్. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అక్షయ్ సినిమాల్లో ప్రస్తుతానికి రెండు సౌత్ రీమేక్స్ ఉన్నాయి. లారెన్స్ ‘కాంచన’, అజిత్ ‘వీరమ్’ చిత్రాల హిందీ రీమేక్స్ ‘లక్ష్మీబాంబ్’, ‘బచ్చన్‌పాండే’ల్లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ‘లక్ష్మీ బాంబ్’ చిత్రానికి రాఘవ లారెన్స్, ‘బచ్చన్‌పాండే’కు ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నిర్మాతలు తనకు సరైన గౌరవం ఇవ్వలేదని లారెన్స్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి మొదట తప్పుకున్నారు. అక్షయ్ జోక్యంతో తిరిగి మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇక అక్షయ్ నటించిన ‘మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూస్’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. రాజకీయ ప్రస్థానం రాజకీయ నాయకుడిగా ‘ప్రస్థానం’ మొదలుపెట్టారు బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్‌దత్. ఇది వెండితెర పార్టీ. 2010లో దేవకట్టా దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘ప్రస్థానం’ చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చేప్పక్కర్లేదు. ఈ సినిమాను దేవాకట్టాయే ప్రస్తుతం హిందీలో ‘ప్రస్థానం’ అనే టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో సాయికుమార్ చేసిన పాత్రను హిందీలో సంజయ్‌దత్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మనీషా కొయిరాల, అలీ ఫజల్, జాకీష్రాఫ్, అమైరా దస్తూర్, చుంకీ పాండే కీలక పాత్రధారులు. కొత్త కూలీ తొలిసారి నిర్మాతగా మారి కూలీ చేస్తున్నారు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. 1995లో వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘కూలీ నం 1’ అప్పట్లో మంచి విజయం సాధించింది. గోవింద, కరిష్మా కపూర్ నటించారు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్లో అదే టైటిల్‌తో రీమేక్ అవుతోంది. వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. నాటి ‘కూలీ నం 1’కు దర్శకత్వం వహించిన డేవిడ్ ధావనే ఈ సినిమాకూ దర్శకుడు. వచ్చే ఏడాది కార్మికుల దినోత్సవానికి (మే 1) ఈ కూలీ నం 1 వెండితెరపైకి రానున్నారు. రంగు మారెనే! త్వరలో రైలు ప్రయాణం చేయడానికి జుట్టు రంగు మార్చుకున్నారు హీరోయిన్ పరిణీతీ చోప్రా. హాలీవుడ్ మూవీ ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ రీమేక్ కోసం అలా మేకోవర్ అయ్యారు పరిణీతి. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ హాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిందీ రీమేక్ రిభూ దాస్‌గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనుండగా పరిణీతీ చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. క్యాన్సర్ బాధితుడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ క్యాన్సర్‌తో బాధపడే వ్యక్తిగా కనిపించనున్న చిత్రం ‘దిల్ బచారే’. ఐదేళ్ల క్రితం హాలీవుడ్లో వచ్చిన ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ చిత్రం హిందీలో ‘దిల్ బచారే’గా రీమేక్ అవుతోంది. సుశాంత్ సింగ్, సంజనా సాంఘీ హీరో హీరోయిన్లు. ముఖేష్ చబ్రా దర్శకుడు. ఇంకా... మలయాళ హిట్ ‘ఎజ్రా’ సేమ్ టైటిల్‌తో హిందీలో రీమేక్ అవుతోంది. నటుడు ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. 1971లో వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ సినిమా సోల్‌ను ప్రేరణగా తీసుకుని అదే టైటిల్‌తో హిందీలో సినిమా చేస్తున్నారు రానా. ఈ సినిమాకు తెలుగులో అరణ్య, తమిళంలో ‘కాడన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘ఆర్ఎక్స్ 100’ హిందీ రీమేక్‌లో అహన్ శెట్టి హీరోగా నటించనున్నారు. మరోవైపు 1994లో వచ్చిన హిందీ హిట్ ‘అందాజ్ అప్నా అప్నా’ లేటెస్ట్ రీమేక్‌లో రణ్వీర్ సింగ్, వరుణ్‌ధావన్ కలిసి నటించబోతున్నారని టాక్. ‘ఓ కౌన్ తీ?’ (1964) ‘రాత్ ఔర్ దిన్’ (1967) తాజా రీమేక్స్‌లో ఐశ్యర్యారాయ్ నటించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. హీరోలు కావలెను! కొన్ని సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఆ సినిమాల్లో ఎవరు హీరోలుగా నటించబోతున్నారు అనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. ఇప్పుడు ఈ రీమేక్స్‌లో నటించడానికి బాలీవుడ్లో హీరోలు కావాలి. తెలుగు చిత్రాలు ‘జెర్సీ’, ‘ఓ బేబి’, ‘ఎఫ్ 2’, ‘డియర్ కామ్రేడ్’, ‘ఎవడు’తో పాటు తమిళ చిత్రాలు ‘వేదాలం’, ‘కత్తి’, ‘విక్రమ్ వేదా’, ‘పితామగన్’, ‘జిగర్తండా’ హిందీలో రీమేక్ కానున్నాయి. కానీ ఈ చిత్రాల్లో ఎవరు హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారనే అంశంపై బాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో షాహిద్‌కపూర్, ‘ఎఫ్ 2’లో ఒక హీరోగా అర్జున్ కపూర్, ‘ఓ బేబీ’ హీరోయిన్గా ఆలియా భట్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా ‘జిగర్తండా’ హిందీ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావు, సైఫ్ అలీఖాన్ నటించనున్నారని తాజా బీ టౌన్ టాక్. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా ఆయా రీమేక్ చిత్రాల్లో పైన పేర్కొన్న నటీనటులు నటిస్తారా? లేక కొత్తవారు ఎవరైనా వస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వెయిట్ చేయాల్సిందే. కోట్ల క్లబ్లో హిట్ ఫార్ములా బడా బడా స్టార్స్ రీమేక్ సినిమాలవైపు ఆసక్తి చూపడానికి బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే.. అమితాబ్ బచ్చన్, తాప్సీ కలిసి నటించిన ‘బద్లా’ మూవీ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. స్పానిష్ థ్రిల్లర్ ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. రణ్వీర్ సింగ్ నటించిన ‘సింబా’ (తెలుగు హిట్ ‘టెంపర్’ రీమేక్) బీటౌన్ బాక్సాఫీస్ వద్ద రెండువందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’లో షాహిద్‌కపూర్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 300కోట్ల రూపాయల వసూళ్లవైపు పరుగులు తీస్తోంది. ఇలా స్ట్రయిట్ చిత్రాలకు దీటుగా రీమేక్ చిత్రాల వసూళ్లు ఉండటంతో ఆల్రెడీ హిట్ అయిన సినిమా మీద నమ్మకం ఉంచి, రీమేక్‌కి సై అంటున్నారని ఊహించవచ్చు. భార్య, భర్త మధ్యలో ఆమె! ‘సోనూ కి టిట్టు కి స్వీటీ’ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా వందకోట్ల క్లబ్లో చేరడంతో కార్తీక్ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న చిత్రాల్లో ‘పతీ పత్నీ ఔర్ ఓ’ సినిమా ఒకటి. ఈ సినిమా టైటిల్ ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. అవును.. 1978లో బీఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘పతీ పత్నీ ఔర్ ఓ’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్, భూమి ఫడ్నేకర్, అనన్య పాండే హీరో హీరోయిన్లు. ముదస్సార్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ♦ ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది బాలీవుడ్లో దాదాపు 25 రీమేక్ సినిమాలు నిర్మాణంలో ఉండటం విశేషం. కథల కొరతా? అంటే.. అదొక కారణం అయ్యుండొచ్చు. హిట్ ఫార్ములాతో సేఫ్ గేమ్ ఆడొచ్చనే కారణం కూడా ఇన్ని రీమేక్స్‌కి కారణం అయ్యుండొచ్చు.– ముసిమి శివాంజనేయులు -
విజయ్ @ 800
క్రికెట్ ప్రపంచంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరు తెలియనివారు ఉండకపోవచ్చు. టెస్ట్, వన్ డే క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత ముత్తయ్య పేరు మీదనే ఉంది. ఇటీవల క్రీడాకారుల జీవితాలు వెండితెరపైకి వస్తున్న నేపథ్యంలో తాజాగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరపైకి వచ్చింది. ఈ బయోపిక్‌లో ముత్తయ్యగా విజయ్ సేతుపతి నటించబోతున్నారు. ఈ సినిమాకు శ్రీపతి రంగస్వామి దర్శకుడు. ‘‘ముత్తయ్య మురళీధరన్ తమిళ సంతతికి చెందిన సూపర్ స్పోర్ట్స్ పర్సన్. స్పిన్నర్‌గా ప్రపంచఖ్యాతి గడించారు. అతని పాత్రలో నటించడం నాకు సవాల్ లాంటిది. ముత్తయ్య మురళీధరన్గారు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, స్వయంగా నాకు క్రికెట్ టిప్స్ చెప్పడం సంతోషంగా ఉంది. నన్ను నమ్మిన మురళీధరన్‌కు, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విజయ్ సేతుపతి. ‘‘విజయ్ సేతుపతి వంటి నటుడు నా పాత్రలో నటించడం హ్యాపీ’’ అన్నారు మురళీధరన్. టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లు తీసిన బౌలర్ రికార్డు మురళీధరన్ సొంతం. సో.. ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట టీమ్. ఈ చిత్రాన్ని థార్ మోషన్ పిక్చర్స్ నిర్మించనుంది. -
కెప్టెన్ మిథాలీ
కెరీర్లో టాప్ ఫామ్‌లో ఉన్నారు తాప్సీ. హిందీ–తెలుగు–తమిళ భాషల్లో ఆమె ఎంచుకుంటున్న సినిమాలు భిన్నంగా ఉంటున్నాయి. సక్సెస్‌లు తెచ్చిపెడుతున్నాయి. లేటెస్ట్గా స్పోర్ట్స్ బయోపిక్‌లో తాప్సీ కనిపించబోతున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో మిథాలీ పాత్రను తాప్సీ చేయనున్నారని సమాచారం. కెప్టెన్‌గా పలు విజయాలు అందించడంతో పాటు ఇండియా తరఫున ఎక్కువ పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ రికార్డ్ సాధించారు. ఆమె బయోపిక్‌ను వయాకామ్18 సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు దర్శకుడు, మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. బ్యాట్‌తో బంతిని బౌండరీకు ఎలా పంపాలో ట్రైనింగ్ తీసుకోనున్నారు తాప్సీ. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇదివరకు తాప్సీ ‘సూర్మ’లో హాకీ ప్లేయర్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
మోదీ బయోపిక్‌పై సల్మాన్ తీవ్ర అసంతృప్తి
ముంబై : ఇటీవలి కాలంలో ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌లో వివేక్ ఒబేరాయ్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు విమర్శలను ఎదుర్కొంది. చిత్రం విడుదల కూడా వాయిదా పడి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాలో పాటలు రాసినట్టు ప్రముఖ పాటల రచయితలు జావేద్ అక్తర్ , సమీర్ల పేర్లను టైటిల్స్‌లో వేసి క్రెడిట్స్ ఇచ్చారు. తమకు తెలియకుండా ఇలా చేయడంపై వారు ఒకింత షాక్ గురయ్యారు. ‘ఈశ్వర్ అల్లాహ్’ పాటను ‘1947: ఎర్త్’ చిత్రం నుంచి.. ‘సునో గౌర్ సే దునియా వాలో’ పాటను ‘దస్’ మూవీ నుంచి తీసుకున్నట్లు ఈ చిత్ర నిర్మాత సందీప్ సింగ్ వెల్లడించారు. ‘సునో గౌర్ సే దునియా వలో’ పాటను నరేంద్రమోదీ బయోపిక్‌లో చేర్చడం పట్ల సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందిచారు. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రవీనా టండన్, శిల్పాశెట్టీలు కలిసి నటించిన ‘దస్’ సినిమాలో ఆ పాట ఉంది. అయితే, ఈ చిత్ర దర్శకుడు ముకుల్ ఆనంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ‘దస్’ మువీ నిర్మాణం అసంపూర్తిగా జరిగి విడుదలకు నోచుకోలేదు. ఈ క్రమంలో సల్మాన్ తీవ్రంగా స్పందించారు. నిజానికి సల్మాన్‌కు, వివేక్ ఒబేరాయ్‌కి మధ్య చాలాకాలంగా సఖ్యత లేదు. అప్పట్లో ఐశ్వర్యా రాయ్‌తో తాను సన్నిహితంగా వ్యవహరిస్తుండటంతో తనను చంపేస్తానని సల్మాన్ తాగి బెదిరించాడని వివేక్ మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించాడు. దీంతో 15 ఏళ్లుగా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ నటించిన సినిమాలో తన సినిమా పాటను వాడుకోవడంపై సల్మాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు భావిస్తున్నారు. -
కేఏ పాల్ బయోపిక్.. హీరోగా కామెడీ స్టార్!
ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. అద్భుత విజయాలు సాధించిన ఎంతో మంది జీవితాలతో పాటు విచిత్ర వ్యక్తితాలు వింత ప్రవర్తనలు కలిగిన వ్యక్తుల కథలను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరికీ నవ్వులు పంచిన కేఏ పాల్ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుందట. ఓ కొత్త దర్శకుడు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పాల్ పాత్రలో హాస్య నటుడు సునీల్‌ను నటింపచేయాలని ప్రయత్నిస్తున్నారట. అయితే ఈ విషయంపై సునీల్ గానీ, ఇతర యూనిట్ సభ్యులు గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
కపిల్ ‘లెజెండరీ ఇన్నింగ్స్’ను మళ్లీ చూడొచ్చు!!
ముంబై: భారత క్రికెట్ అభిమానుల మదిలో మరుపురాని ఇన్నింగ్స్.. 1983 నాటి ప్రపంచకప్‌లో జింబాంబ్వేపై అప్పటి టీమిండియా సారథి కపిల్‌దేవ్ చేసిన 175 పరుగుల ‘లెజండరీ ఇన్నింగ్స్’.. నిజానికి ఆ ఇన్నింగ్స్‌ను చాలామంది కళ్లారా వీక్షించలేకపోయారు. అప్పట్లో బీబీసీ సమ్మె చేయడంతో ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయలేదు. అంతేకాదు.. ఈ మ్యాచ్‌ను రికార్డు కూడా చేయలేదు. దీంతో తర్వాత కూడా ఆ ‘లెజండరీ ఇన్నింగ్స్’చూసే భాగ్యం భారతీయులకు దక్కలేదు. అయితే, ఆ ఇన్నింగ్స్‌ను వెండితెరపై పునర్ ఆవిష్కరిస్తున్నామని, కపిల్ నాడు చేసిన 175 పరుగుల వీరోచిత బ్యాటింగ్‌ను తమ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నామంటుంది ‘83’ చిత్ర యూనిట్. భారత్ గెలిచిన తొలి ప్రపంచకప్ నేపథ్యంతో కపిల్ దేవ్ బయోపిక్‌గా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘83’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 36 ఏళ్ల క్రితం క్రికెట్ చర్రితలో కపిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారని.. 1983 ప్రపంచ కప్‌లో జింబాంబ్వేపై ఆయన ఆడిన ఇన్నింగ్స్ ఓ అద్భుతమని, ఆ మరిచిపోలేని ఘట్టాన్ని తమ సినిమాలో పునర్ ఆవిష్కరిస్తున్నామని ఈ సినిమాలో కపిల్ దేవ్‌గా నటిస్తున్న రణ్వీర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి పాత ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. కపిల్ ‘లెజండరీ ఇన్నింగ్స్’ పై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. బీబీసీ టీవీ సిబ్బంది సమ్మె చేయడం వల్ల నాటి కపిల్ లెజండరీ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను బీబీసీ ప్రసారం చేయలేకపోయిందని తెలిపారు. -
త్వరలో కేసీఆర్, జయలిలత బయోపిక్‌లు
సాక్షి బెంగళూరు: ‘రామ్‌గోపాల్‌వర్మ ఉన్నది ఉన్నట్లుగా సినిమాల్లో చూపించే వ్యక్తి. సినిమాల్లో వాస్తవాలు చూపించడంలో తనకు తానే సాటి. త్వరలోనే కేసీఆర్, జయలలిత జీవిత చరిత్రల ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సినిమాలు సిద్ధం చేస్తాం’ అని లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి అన్నారు. ప్రేక్షకులు ఆనందంతో ఇంటికి వెళ్లాలి.. కానీ అసంతృప్తిగా కాదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన రాకేశ్‌రెడ్డి వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. పలమనేరు నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పని చేశారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారాల్లో ఉన్నారు. రెండు పడవల ప్రయాణం వద్దని వ్యాపారాల మీద దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. వివరాలు.. చిన్ననాటి నుంచే ఆసక్తి ♦ బాల్యం నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది. ఆరంభంలోనే అదిరిపోయే సినిమా నిర్మించాలని భావించాను. ఈ క్రమంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వాస్తవాలను జనాలను చూపిస్తే బాగుంటుంది అనిపించింది. ఫలితంగా పాత పరిచయాల నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మతో కలిసి లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ గురించి చర్చించాం. వాస్తవాలను తెరకెక్కించాలంటే రామ్‌గోపాల్‌వర్మతోనే సాధ్యం. ♦ నిర్మాతలతో చాలా చక్కగా ప్రవర్తించే వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ. నిర్మాతల బాధలను అర్థం చేసుకునే వ్యక్తి వర్మ. మా బ్యానర్లో వచ్చే మరో రెండు సినిమాలు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలోనే కొనసాగిస్తాం. తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథలను ఎంచుకున్నాం. ♦ ట్రైలర్ విడుదల సమయంలోనే ఆదరించారు. బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. అదే తరహాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా హైప్ క్రియేట్ అయింది. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. -
ఆమె బయోపిక్‌లో నటించాలని ఉంది
నటిగా తమన్నాకు రెండే రెండు కోరికలు ఉన్నాయట. అయితే ఇవి బాలీవుడ్‌కి సంబంధించినవి. ఒకటి ప్రముఖ నటి శ్రీదేవి జీవిత చరిత్రలో నటించాలన్న కోరిక. మరోటి హిందీలో పూర్తి స్థాయి డ్యాన్స్ బేస్డ్ మూవీలో నటించాలని కోరిక. ఇవి ఎప్పుడు తీరుతాయో చూడాలి. ఆ సంగతలా ఉంచితే.. శ్రీదేవి జీవిత చరిత్రలో తమన్నా ఎందుకు నటించాలనుకుంటున్నారంటే.. చిన్నప్పటి నుంచి ఆమె సినిమాలనూ చూస్తూ పెరిగానని, ఆమె అందం, నటన అద్భుతం అనీ తమన్నా అంటున్నారు. శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం మరోటి లేదని కూడా పేర్కొన్నారు తమన్నా. అయితే గతంలో శ్రీదేవి నటించిన ‘హిమ్మత్వాలా’ రీమేక్‌లో తమన్నా నటించారు. ఆ సినిమా అపజయం పాలైంది. అది వేరే విషయం. చిన్నప్పటి నుంచి ఆరాధించిన మనిషి తిరిగి రాని లోకాలకు వెళ్లడం చాలా బాధాకరం అని కూడా తెలిపారు. ఇవన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. అదే ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించిన ప్రస్తావన వచ్చింది. ఈ యంగ్ రెబల్ స్టార్ సరసన తమన్నా ‘రెబల్’, ‘బాహుబలి’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ చాలా సాఫ్ట్ అని, దయాగుణం ఉన్నవాడని తమన్నా చెప్పారు. అది మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లాడాలనుకుంటున్నారని ఈ మిల్కీబ్యూటీ చెప్పడం విశేషం. -
‘ఆ బయోపిక్‌లో నటించాలనుంది’
ఆమె అంటే తనకెంత ఇష్టమో అంటున్నారు నటి తమన్నా. 15 ఏళ్ల ప్రాయంలోనే నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ నటిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దశాబ్దంన్నరగా కథనాయకిగా, అదీ చెక్కు చెదరని అందాలతో అగ్రనాయకిగా రాణిస్తున్న అతి కొద్ది మంది నటీమణుల్లో తమన్నా ఒకరు. మొదట్లో అందాలనే నమ్ముకుని నిలదొక్కుకున్న ఈ మిల్కీబ్యూటీకి బాహుబలి చిత్రం నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె ప్రభుదేవాతో రెండోసారి నటించిన దేవి–2 చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇక మూడోసారి అదే నటుడితో జత కట్టిన హిందీ చిత్రం ఖామోషి త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ఆయనతో రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల ఒక భేటీలో తమన్నా పేర్కొంటూ నటి శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఆమె బయోపిక్‌లో నటించాలన్న కోరిక ఉందని తెలిపారు. ఈ మధ్య బయోపిక్‌ల కాలం నడుస్తున్న విషయం తెలిసిందే. అలా తెరకెక్కిన చాలా చిత్రాలు సక్సెస్ అయి కాసుల వర్షం కురిపించాయి కూడా. ఉదాహరణకు క్రికెట్ క్రీడాకారుడు ధోనీ జీవిత చరిత్రతో తెరకెక్కిన ఎంఎస్.ధోని, దివంగత శృంగార తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ది దర్టీపిక్చర్, నటుడు సంజయ్‌దత్ బయోపిక్‌గా తెరకెక్కిన సంజూ, నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి వంటి చిత్రాలు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను పొందిన విషయం తెలిసిందే. తాజాగా దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవిత చరిత్రను ఇద్దరు దర్శకులు ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఒక చిత్రంలో జయలలిత పాత్రలో తలైవిగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, మరో చిత్రంలో నిత్యామీనన్ ది ఐరన్ లేడీగా నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి తమన్నాకు బయోపిక్ చిత్రంపై కన్ను పడినట్లుంది. గత ఏడాది దుబాయిలో అకాల మరణం పొందిన అందాల నటి శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త, నిర్మాత బోనీకపూర్ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుందో, ఏమోగానీ నటి తమన్నా ఆ చిత్రంలో అవకాశం కొట్టేయాలనుకుని చెప్పిందో కాదో గానీ, నటి శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టం అని, ఆమె బయోపిక్‌లో నటించాలన్న కోరిక చాలా కాలంగా ఉందని చెప్పారు. తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ నేమ్, ఫేమ్ ఉన్న తమన్నాకు అలాంటి అవకాశం ఇచ్చే విషయమై బోనీకపూర్ ఆలోచిస్తారో లేదో చూడాలి. ఆయన ఇప్పటికే మలయాళీ చిన్నది కీర్తీ సురేశ్‌ను ముంబైకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. నటుడు అజిత్‌ను హిందీలోకి తీసుకెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారు కూడా. కాబట్టి తదుపరి తమన్నాపై కూడా కాస్త దృష్టి పెడితే ఆమె కోరిక తీరుతుంది. -
వయసు తగ్గింది
సౌత్ ఇండస్ట్రీల్లోని హ్యాండ్సమ్ హీరోల్లో మాధవన్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అటువంటి ఆయన తాజాగా మరో పదేళ్లు వెనక్కివెళ్లిపోయారు అంటున్నారు ఆయన ఫ్యాన్స్. మాధవన్ ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ బయోపిక్‌తో బిజీబిజీగా ఉన్నారు. ఆ సినిమాలో నారాయణ్ యువకుడిగా ఉన్నప్పటి సన్నివేశాలు చిత్రీకరించడానికి క్లీన్ షేవ్ చేసుకున్నారు మాధవన్. ఆ ఫొటో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే.. ‘భలే యంగైపోయారే!’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ యంగ్ లుక్ గురించి మాధవన్ మాట్లాడుతూ– ‘‘అమ్మ రెండేళ్ల నుంచి క్లీన్షేవ్ చేసుకోమని పోరుపెడుతోంది. నంబీ నారాయణ్ కోసం చేయాల్సి వచ్చింది. నంబీ యంగ్ ఎపిసోడ్‌ను ఫ్రాన్స్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. -
మోదీ బయోపిక్ రిలీజ్ డేట్ ఖరారు
ఎన్నికల వేడిలో రాజకీయ నాయకుల జీవిత చిత్రాలను వెండితెరపై ప్రదర్శించడం కాసింత కష్టమే. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్, ఏపిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, మమతా బెనర్జీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఈసీ పలుమార్లు బ్రేకులు వేసింది. ఎట్టకేలకు ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్రబృందం విడుదల తేదీని ఖరారు చేసింది. ఇప్పటికే చాలాసార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను మే 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో మోదీ పాత్రలో వివేక్ ఒబేరాయ్ నటించగా.. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. -
జయలలిత ఎప్పటికీ బతికే ఉంటారు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో పలు చిత్రాలు తయారవుతున్నాయి. లేటెస్ట్గా దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘శశిలలిత’ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయలలితగా కాజోల్ దేవగన్, శశికళగా అమలాపాల్ నటిస్తారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ టైటిల్‌ను శనివారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా మొత్తం దక్షిణాదిలో అభిమానులను సొంతం చేసుకున్నారు జయలలిత. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందారామె. ‘శశిలలిత’ చిత్రం రూపొందించడం అభినందనీయం. వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘జయలలిత ఎప్పటికీ ప్రజల గుండెల్లో బతికే ఉంటారు. ఆమె బాల్యం, సినీనటిగా ఎదగడం, ప్రేమ విఫలం, రాజకీయ నాయకురాలిగా ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఆమె మరణం వెనుక ఉన్న కారణం, 75 రోజులు ఆసుపత్రిలో ఉన్న సంఘటనలు ఈ సినిమాలో ప్రస్తావిస్తాం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి. కో–డైరెక్టర్ శివకుమార్, రైటర్ వెంకట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.