Birth anniversary
-
'భవతారిణి చివరి కోరిక ఇదే'.. జయంతి రోజున ఇళయ రాజా ఎమోషనల్
వెండితెరపై సంగీత విద్వాంసుడిగా ఇళయరాజా (Ilayaraja) గొప్ప పేరు సాధించారు. 1976లో అన్నకిలి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో 1500 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అంతే కాదు దాదాపు 7 వేలకు పైగా పాటలు రాసిన ఘనత ఆయనదే. ఇప్పటికీ ఆయన సంగీతానికి ఫిదా అవ్వాల్సిందే. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కుమార్తె భవతారిణి సింగర్‌గా రాణించారు. తమిళంతో పాటు తెలుగు చిత్రాలకు సైతం తన గాత్రం అందించారు. అయితే గతేడాదిలో ఆమె క్యాన్సర్‌తో కన్నుమూశారు.అయితే ఈ ఏడాది భవతారిణి (Bhavatharini) జయంతి సందర్భంగా ఆమె తండ్రి ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు. ఆల్-గర్ల్స్ ఆర్కెస్ట్రా పేరుతో ఈవెంట్‌ను నిర్వహించాలన్నది తన కుమార్తె చివరి కోరిక అని ఇళయ రాజా వెల్లడించారు. తాను మరణించే ముందు తనను చివరి కోరిక కోరిందని ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి ఇళయరాజాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కుమారుడు కార్తీక్ రాజా, సోదరుడు గంగై అమరెన్, దర్శకుడు వెంకట్ ప్రభు కూడా హాజరయ్యారు. తన జయంతి రోజు ఫిబ్రవరి 12న స్మరించుకోవడానికి ఒక ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తానని కూడా ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడుతూ.. "బాలికలతో ఒక పెద్ద ఆర్కెస్ట్రాను ప్రారంభించాలనుకుంటున్నానని భవతారిణి నాకు చెప్పింది. అదే ఆమె చివరి కోరిక కూడా. రెండు రోజుల క్రితమే నేను మలేషియాలో ఉన్నప్పుడు నా ముందు ప్రదర్శన ఇచ్చిన యువతులతో కూడిన అనేక బృందాలను కలిశాను. వారిని చూసినప్పుడు నాకు భవతారిణి చివరి కోరిక గుర్తుకు వచ్చింది. అందుకే తన పేరుతో ఒక ఆర్కెస్ట్రాను ప్రారంభించబోతున్నా. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు ఆర్కెస్ట్రాలో భాగమవుతారు" వెల్లడించారు.అనంతరం మాట్లాడుతూ.." ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సరైన సమయంలోనే ఈ విషయంపై ప్రకటన చేస్తాను. యువతులు ఆర్కెస్ట్రాలో భాగం కావడానికి నమోదు చేసుకుని ఆడిషన్ ఇవ్వవచ్చు. ఆర్కెస్ట్రా భవతారి వారసత్వాన్ని నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహాన్ని వ్యాపింపజేయాలని నేను కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకట్ ప్రభు, భవతారిణి అన్నయ్య కార్తీక్ రాజా తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ ప్రభు భవతారిణిని గుర్తు చేసుకున్నారు. అప్పడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నా.. పుట్టినరోజు శుభాకాంక్షలు తంగచి అంటూ ఎమోషనల్ నోట్ రాశారు. కాగా.. జాతీయ అవార్డు గెలుచుకున్న నేపథ్య గాయని, స్వరకర్త భవతారిణి . ఆమె తమిళ చిత్రం భారతిలోని మయిల్ పోలా పొన్ను ఒన్ను పాట ద్వారా ఫేమ్ పొందింది. క్యాన్సర్‌తో పోరాడిన తర్వాత భవతారిణి జనవరి 25, 2024న 47 ఏళ్ల వయసులోనే మరణించింది. భవతారిణికి ఇద్దరు సోదరులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా ఉన్నారు. Can’t believe it’s one year already 💔 💔 💔 happy bday thangachi #bhavatharini https://t.co/YSBPUWPQlE— venkat prabhu (@vp_offl) February 12, 2025 -
Punjab Kesari Lala Lajpat Rai స్వతంత్ర సంగ్రామ సింహం
లాలా లజపతిరాయ్ స్వతంత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వదిలిన అమర జీవి. మొదట్లో దయానంద సరస్వతి ఏర్పాటుచేసిన ఆర్య సమాజ్ భావాల పట్ల ఆకర్షితులై అందులో చేరి సమాజ సేవ చేశారు. ఆయన మీద ఇటాలియన్ విప్లవకారుడైన జోసెఫ్ మ్యాజినీ ప్రభావం కూడా ఉంది. న్యాయవాద వృత్తిని విడిచి స్వాతంత్య్ర పోరాటంపై దృష్టి సారించారు. ఒకపక్క స్వాతంత్య్రోద్యమంలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మా గాంధీ ‘హరిజన సేవక్ సంఘ్’ బ్యానర్ కింద పని ప్రారంభించారు. ప్రపంచంలోని ఇతర ముఖ్యమైన ఉద్యమాల మాదిరిగానే ఈ సామాజిక సంస్కరణ కూడా జాతీయ ఆమోదం కోసం గొప్ప పోరాటం చేయాల్సి ఉందని ఆయన ప్రకటించారు. లాలాజీ సేకరించిన కరువు నిధిలో కొంత భాగాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించారు. కొన్ని ప్రాథమిక పాఠశాలలు కూడా ఈ ఫండ్ నుండి నిధులు అందు కున్నాయి. అనాథ పిల్లల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించారు.భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి 1928లో బ్రిటన్ నుంచి వచ్చిన సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పంజాబ్‌లోని లాహోర్‌లో జరిగిన ఆందోళనకు లజపతిరాయ్ నాయకత్వం వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఈ ‘పంజాబ్ కేసరి’కి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఆ సందర్భంగా ‘ఈ రోజు నా మీద పడిన దెబ్బలు, బ్రిటిష్ సామ్రాజ్య వాదం శవపేటికకు వేసిన చివరి మేకులు’ అని బ్రిటిష్ పోలీసులను హెచ్చరించారు. ఆ దెబ్బలతోనే చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతి స్వాతంత్య్రోద్యమం తీవ్రమవ్వడానికి దారితీసింది.– డా. ఎ. శంకర్, రాజనీతిశాస్త్ర ఉపన్యాసకులు, హైదరాబాద్(నేడు లాలా లజపతిరాయ్ జయంతి) -
దేశాన్ని అణుశక్తిగా మార్చిన మేధ
దేశభక్తి, సంస్కృతీ సంప్ర దాయాల పట్ల గౌరవం, సంగీత సాహిత్యాల పట్ల ప్రేమ, సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచా లన్న తపన కలిగిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న. ఆయన 1925 జనవరి 28న సంప్రదాయ మైసూర్ అయ్యంగార్ కుటుంబంలో కర్ణాటకలో పుట్టారు. సంగీతంపై ఉన్న అభిమానంతో సంగీత కళాశాలలో చేరాలనుకున్న రాజా రామన్న, సర్సి.వి. రామన్ పరిచయ ప్రభావం వల్ల వైజ్ఞానిక రంగంలోకి ప్రవేశించారు. ఆరేళ్ళ వయసులోనే పియానో నేర్చుకోవడం ప్రారంభించారు.పన్నెండో ఏట మైసూర్ మహారాజు ఎదుట పియానో వాయించి ప్రశంసలందుకున్నారు. 1949లో టాటా గ్రూపు– స్కాలర్‌షిప్‌పై లండన్ వెళ్ళి, అక్కడి ‘కింగ్స్ కాలేజి’ నుండి ‘న్యూక్లియర్ ఫిజిక్స్’లో డాక్టరేట్ తీసుకుని స్వదేశం తిరిగి వచ్చారు. డా‘‘ హోమీ భాభా ఆధ్వర్యంలో పని చేయడానికి 1952లో– టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో చేరారు. బొంబాయి, ట్రాంబేలోని ఆ సంస్థ పేరు తరువాత కాలంలో భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీ: బార్క్)గా మారింది. 1960లలో అణ్వాయుధా లను తయారు చేయడం, వాటిని అభివృద్ధి చేయ డంలో సాంకేతిక పరిశోధన చేపట్టారు. అప్పుడే మన దేశంలో అణుబాంబుకు రూపకల్పన జరిగింది. 1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు–అణుపరికరాల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ కొనసాగింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే 75 మంది శాస్త్రవేత్తల బృందానికి రాజా రామన్న నాయకత్వం వహించారు. బార్క్‌లో ‘పూర్ణిమ’ అనే పేరుతో ప్లుటోనియం ఇంధనంతో నడిచే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్థాపించడానికి కార కులయ్యారు. 1974 మే నెలలో అతి రహస్యంగా అణు పరీక్షను నిర్వహించారు. 1978లో అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, డా‘‘ రామ న్నను బార్క్ నుండి తీసు కొచ్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియమించారు. రక్షణ పరిశోధన కార్యదర్శిగా, డీఆర్డీఓ డైరెక్టర్ జన రల్‌గా కూడా నియమించారు. అప్పుడే ఒక విచి త్రమైన సంఘటన జరి గింది. ఈయన నేపథ్యం తెలుసుకుని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అణుబాంబుల తయారీలో రామన్న సహాయం అర్థించాడు. పరిస్థితి విషమించేట్టుగా ఉందను కుని, దేశభక్తుడయిన రాజా రామన్న చెప్పా పెట్ట కుండా ఇండియా విమానం పట్టుకుని హుటా హుటిన తిరిగొచ్చారు. నిబద్ధత గల దేశభక్తుల చర్యలు అలా ఉంటాయి. వారు వేటికీ లొంగరు.చదవండి: ఈశ్వరాజ్ఞ హోమీ జె. భాభా అకాల మరణం తర్వాత, ఆయన నిర్దేశించిన మార్గంలోనే రాజా రామన్న పరిశోధనలు కొనసాగించి, ఆణుశక్తి పరిశోధనల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. ఆయన న్యూక్లి యర్ ఫిషన్ రంగంలో కూడా కృషి చేశారు. బరువైన కేంద్రకాలను విభజించి, శక్తిమంతమైన న్యూక్లియన్ రేడియేషన్‌ను ఉత్పత్తి చేయవచ్చని– ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం అణుపరిశోధనా రంగానికి, తద్వారా దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది. 1980లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా తిరిగి రావడంతో అణు కార్యక్రమం ఊపందుకుంది. ఆమె రామన్నను మళ్ళీ బార్క్‌కు డైరెక్టర్‌గా నియమించారు. పైగా అణుపరీక్షల కోసం అయనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వంలో రామన్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్‌లతో పాటు అనేక పురస్కారాలు, పతకాలు, డాక్ట రేట్లు పొందారు.రాజా రామన్న శత జయంతి (28 జనవరి 1925 – 28 జనవరి 2025) సందర్భంలో మనం ఉన్నాం. మంచి మనిషిగా, అత్యున్నత స్థాయికి ఎదిగిన వైజ్ఞానికుడిగా, పియానో వాద్యకారుడిగా – ఎవరికి తోచిన విధంగా వారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు డా. రాజా రామన్న శతజయంతి)-డా. దేవరాజు మహారాజు -
బోస్ పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయన నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2025 -
Jaya B: దర్శకురాలిగా టాలీవుడ్లో తనదైన ముద్ర
టాలీవుడ్లో దర్శకత్వ శాఖలో పని చేసే మహిళలు చాలా తక్కువ మందే ఉన్నారు. తమదైన టాలెంట్‌తో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన మహిళలను వెళ్లపై లెక్కించొచ్చు. అలాంటి వారిలో బి.జయ ఒకరు. జర్నలిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించి.. దర్శకురాలిగా మారి చంటిగాడు,గుండమ్మగారి మనవడు, లవ్లీ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బి. జయ జయంతి నేడు(జనవరి 11). ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు బి.జయ(1964). చెన్నయ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.(ఇంగ్లీష్ లిటరేచర్), జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు. అంతేకాదు, అన్నామలై విశ్వవిదాలయంలో ఎం.ఎ.(సైకాలజీ) అభ్యసించారు. చదువు పూర్తి కాగానే సినిమా జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. పత్రికా రంగంలో కొన్నేళ్లపాటు కొనసాగిన తర్వాత సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ శాఖలో చేరి కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు.అదే సమయంలో ఫిల్మ్ జర్నలిస్ట్‌గా, పి.ఆర్.ఓ.గా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న బి.ఎ.రాజును వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ పూర్తి అంకితభావంతో తమ బాధ్యతలను నిర్వర్తించేవారు.సినిమా రంగంతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అనుబంధం, దర్శకత్వంపై తనకు ఉన్న ప్యాషన్ కారణంగా దర్శకత్వం వైపు జయ దృష్టి సారించారు. దానికి భర్త బి.ఎ.రాజు కూడా పూర్తి సహకారం అందించడంతో సూపర్‌హిట్ ఫ్రెండ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటి ప్రయత్నంగా ‘ప్రేమలో పావని కళ్యాణ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి బి.జయ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ తర్వాత ‘చంటిగాడు’ చిత్రంతో దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు జయ. ఈ సినిమా 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలను రూపొందించి భానుమతి, విజయనిర్మల తర్వాత అంతటి సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు బి.జయ.బి.ఎ.రాజు, బి.జయ దంపతులకు సినిమా రంగంతో విశేష అనుబంధం ఉండేది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరికీ వీరంటే ప్రత్యేక అభిమానం. ఇక తోటి జర్నలిస్టులతో ఈ దంపతులకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవించేవారు. ఆ కారణంగానే సినిమా జర్నలిస్టులందరూ వారిని ఆత్మీయులుగా భావించేవారు. 2018లో బి.జయ మరణం అందర్నీ కలచివేసింది. తమ కుటుంబ సభ్యురాలు దూరమైందని సినీ పాత్రికేయులంతా భావించారు. బి.జయతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె జయంతి సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్టులంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు. -
అంధుల అక్షర శిల్పి
అంధులు సైతం సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందేనన్న ఆశయంతో వారి విద్యార్జన కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన అక్షర శిల్పి లూయీ బ్రెయిలీ. ఫ్రాన్స్‌లో ఒక మారుమూల గ్రామమైన కూప్వ్రేలో సైమన్, మోనిక్ దంపతులకు 1809 జనవరి 4న ఆయన జన్మించాడు. నలుగురు సంతానంలో చివరివాడు బ్రెయిలీ. ఆయన తల్లిదండ్రులు వృత్తి రీత్యా చర్మకారులు. లూయీ తన తండ్రితో కలిసి ఒక రోజు గుర్రపు జీన్లు తయారు చేసే దుకాణానికి వెళ్లాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుకరిస్తూ ఉండగా చువ్వ ఎగిరి వచ్చి లూయీ కంటిలో గుచ్చుకుంది. పేదరికం కారణంగా మంచి వైద్యం అందించలేక పోవటంతో కంటిచూపు మొత్తం పోయింది. తర్వాత కొంతకాలానికే ఇన్ఫెక్షన్ ఎక్కువై రెండవ కంటిచూపు కూడా పోయింది. అప్పుడు పిల్లాడి వయసు ఐదేళ్లు. అయితే అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు తమ పెద్ద పిల్లలతో పాటుగా లూయీని గ్రామంలో ఉన్న పాఠశాలకు పంపించారు. అక్కడ కొడుకు కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తండ్రి... చెక్కపై మేకులను అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా అక్షర జ్ఞానం కలిగించాడు. అతడిలోని చదువుకోవాలనే పట్టుదలను, తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి లోనయ్యేవారు.1821లో చార్లెస్ బార్బియర్ అనే సైన్యాధికారి తన సైనికులకు 12 చుక్కలతో నిగూఢ లిపిలో శిక్షణ ఇచ్చేవాడు. దాన్ని లూయీ అభ్యసించాడు. దానితో సంతృప్తి చెందకుండా ఆ లిపిపై పరిశోధనలు ప్రారంభించాడు. దాదాపు 11 సంవత్సరాల కృషి అనంతరం 1832లో సరళమైన విధానంలో చుక్కల లిపిని కనుగొన్నాడు. దానికి ఆయన పేరుమీదనే తర్వాత బ్రెయిలీ లిపి అని పేరొచ్చింది. ఇది ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా ఆనాడే రూపొందిందంటే ఆయన ముందుచూపు ఎంతో అర్థమవుతుంది. బ్రెయిలీని క్షయ మహమ్మారి పట్టి పీడించటంతో నాలుగు పదుల వయసులోనే 1852 జనవరి 6న కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన లిపి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎంతోమంది అంధ వికలాంగులను విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, పత్రికాధిపతులుగా, సంగీత కళాకారులుగా, చిత్ర కారులుగా అనేక రంగాల్లో బ్రెయిలీ లిపితో అగ్రభాగాన నిలిచేట్లు చేసిన లూయీ బ్రెయిలీ అంధుల అక్షర ప్రదాతగా ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటారు.– పి. రాజశేఖర్ ‘ ఆలిండియా జనరల్ సెక్రెటరీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (నేడు లూయీ బ్రెయిలీ జయంతి; జనవరి 6న వర్ధంతి) -
Savitribai Phule Birth Anniversary : మహిళా చైతన్య దీప్తి
మన దేశంలో ఆడపిల్లల చదువు, వారి అభ్యున్నతి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగాగుర్తుకు వచ్చేది సావిత్రిబాయి ఫూలే కృషేనని చెప్పవచ్చు. మహిళల అభివృద్ధికి పాటు పడిన మొట్ట మొదటి బహుజన మహిళ ఆమె. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు. మహారాష్ట్ర, సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న ఒక సామాన్య రైతు కుటుంబంలో సావిత్రిబాయి (Savitribai Phules) మహిళా చైతన్య దీప్తి జన్మించారు. నిరక్షరాస్య అమాయక బాల్యంలో జీవిస్తున్న ఆమెకు 9వ యేటనే 12 సంవత్సరాల జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. సావిత్రిబాయి, భర్త ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలై, అహ్మద్‌నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. అనంతరం బాలికా విద్య ఉద్య మానికి పునాది వేశారు.విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన సావిత్రిబాయి 1848లో భర్తతో కలిసి బాలికల కోసం పుణెలో మొట్ట మొదటి పాఠశాలను నెలకొల్పి, చదువు చెప్పటం ప్రారంభించారు. మహిళా హక్కులే మానవ హక్కులని నినదించి అనేక సామాజిక సమస్యలపై కూడా అలుపెరుగని పోరాటం చేశారు. స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో ‘మహిళా సేవా మండల్‘ అనే మహిళా సంఘాన్ని స్థాపించారు. లింగ వివక్ష, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. సామాజిక అణిచివేతలను, మూఢత్వాన్ని పారద్రోలి సత్యాన్ని శోధించడానికి 1873లో భర్తతో కలిసి సత్య శోధక సమాజాన్ని ప్రారంభించారు. భర్త మరణంతో అంతులేని దుఃఖసాగరంలో ఉండి కూడా ఆయన చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. పుణె నగరాన్ని అతలాకుతలం చేసిన తీవ్ర కరువులో ప్లేగు వ్యాధి గ్రస్తులకు సావిత్రిబాయి అసమాన సేవలు అందించారు. చివరకు ఆమె కూడా అదే వ్యాధి బారినపడి 1897 మార్చి10న తుది శ్వాస విడిచారు. 1997లో భారత ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. పుణె విశ్వవిద్యాలయానికి ఆమె పేరే పెట్టారు. సావిత్రిబాయి ఫూలే అక్షర ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఆమె జయంతి రోజున గతేడాదే ‘ధర్మ టీచర్ యూనియన్’ ఏర్పాటైంది. సావిత్రి బాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి. ఇదే ఆమెకు ఇవ్వగలిగిన ఘన నివాళి.– సంపతి రమేశ్ మహారాజ్ ‘ ధర్మ టీచర్ యూనియన్ తెలం -
YS Jagan: సావిత్రీబాయి ఫూలేకి వైఎస్ జగన్ ఘన నివాళి
-
విలన్ని కూడా ఇష్టపడేలా చేశాడు.. ఈయన గొంతుకే సెపరేట్ ఫ్యాన్స్ (ఫొటోలు)
-
తెలుగు తెరపై చెరిగిపోని జ్ఞాపకం మహానటి 'సావిత్రి' (ఫోటోలు)
-
కలలూ కన్నీళ్ళ కలబోతలో పూలూ ముళ్ళూ!
ఆవంత్స సోమసుందర్ స్వీయ చరిత్ర ‘కలలు–కన్నీళ్ళు’ తెలుగు సాహిత్యంలో విశిష్టమైన రచన. ఎనిమిది దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యంతో మమేకమైన ఒక మహాకవి మనసుతో వ్యక్తీకరిం చిన అరుదైన ఆత్మకథ. స్వాతంత్య్రోద్యమ పూర్వం నాటి పరిస్థి తులు మొదలుకొని ఆధునిక కాలంలో వెల్లువెత్తిన అనేక అభ్యుదయ ఉద్యమాలకు సోమసుందర్ ప్రత్యక్ష సాక్షి. అందుకేనేమో వజ్రాయుధ కవిగానే కాక విలక్షణమైన విమర్శకుడిగా, ‘కళాకేళి’ పత్రికా స్థాపకునిగా, కమ్యూనిస్టు ఉద్యమశీలిగా, అన్నింటినీ మించి నిరంతర స్వాప్నికుడిగా కలకాలం జీవించారు.కవులు జీవిత చరిత్రలు రాసి మెప్పించడం అరుదు. తెలుగులో ఆ సంఖ్య మరీ తక్కువ. అలాంటిది రెండు భాగాలుగా ఆత్మకథను రాసి... ముఖ్యంగా మొదటి భాగంలో అసాధారణ రచనా కౌశలాన్ని చూపిన ఘనత సోమసుందర్కే చెల్లుతుంది. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 2005లో ‘కళాకేళి’ తరపున ప్రచురించిన ‘కలలు – కన్నీళ్ళు’ తెలుగు సాహిత్యంలో నిస్సందేహంగా ఒక అద్భుతమైన అక్షర కళా శిల్పం.‘నాకంటూ ఒక జీవితం ఏర్పడ్డాక... మొదటి జ్ఞాపకం మా అమ్మ... మలి జ్ఞాపకమూ మా అమ్మే. అందుకే మాతృవందనంతోనే దీన్ని ప్రారంభిస్తున్నాను. మా అమ్మే నిరంతర స్మృతి వీచిక... మా అమ్మ నన్ను విడిచి వెళ్ళకముందే నేను మా అమ్మను విడిచి వెళ్ళిపోయాను; దూరంగా... అనంతంగా... సుదీర్ఘమైన ఎడబాటుగా. బాట మారింది. ఉనికి మారింది. ఆశ్రయం మారింది. అమ్మా మారింది...’1924 నవంబరు 18న శంఖవరంలో పుట్టినప్పటికీ, బాల్యంలోనే దత్తునిగా పిఠాపురానికి వలస వచ్చిన పసి జ్ఞాపకాల్ని స్పృశిస్తూ ఆత్మకథలో సోమసుందర్ రాసిన ఆరంభ వాక్యాలు ఇవి. నాలుగేళ్ళ ప్రాయంలోనే తల్లి ఎడబాటుకు లోనైన పసి హృదయం బహుశా ఆనాడే కార్చిన కన్నీటి ధారల్ని కవితా పంక్తులుగా మార్చే ప్రక్రియను అభ్యసించి ఉంటుంది. భవిష్యత్తులో శ్రామిక వర్గం తరఫున ప్రాతి నిధ్యం వహించే బలమైన వజ్రా యుధ కలం ఆవిర్భావానికి అంకురార్పణ ఆనాడే జరిగిందేమో!మూడొందల పుటల ‘కలలు–కన్నీళ్ళు’ ఆత్మకథ అంతా ఒకెత్తయితే, దీనికి సో.సు. రాసిన ఐదు పుటల ముందుమాట ఒకటీ ఒకెత్తు. రూసో మహాశయుడి మాట, ‘రెక్కల చేప కథ విప్పింది’అంటూ ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ కవులు, రచయి తలు, మేధావుల ఆత్మ కథలను స్థూలంగా పాఠకుడికి పరిచయం చేశారు. అలా చేస్తూనే స్వీయచరిత్ర రాయటం ఎంత కష్టమో వివరించారు. గాంధీ, నెహ్రూ వంటి నేతలు మొదలు వర్జీనియా ఉల్ఫ్, జీన్‌పాల్ సార్త్రే వంటి పాశ్చాత్య మేధావుల స్వీయ చరిత్రల్ని గురించి చెబుతారు. అవి కాక, ఏనుగుల వీరాస్వామి, కందుకూరి వీరేశలింగం, చలం వంటి వారి ఆత్మకథల గురించి కూడా తడుముతారు. ఇన్నింటిలోకీ సో.సు.ను ప్రభావితం చేసింది మాత్రం డామ్ మోరీస్ రాసిన ‘మై సన్స్ ఫాదర్’ అనే ఆత్మకథ. సోమసుందర్ అనితర సాధ్యమైన అధ్యయనశీలతకి ఈ మున్నుడే ఒక ప్రతీక. ముందు మాటకి ముగింపుగా సో.సు, ‘నా చేతిలోని లేఖినిని మృత్యువు తప్ప వేరెవ్వరూ అపహరించలేరని’ అంటారు. అలా అన్న మాటల్ని నిలుపుకొని 2016 ఆగష్టు 16న చివరి శ్వాస వరకూ విస్తృతమైన సారస్వత సేవ కావించిన అరుదైన ప్రజాకవి సోమసుందర్.అల్లూరి సీతారామరాజుకి ఆశ్రయం ఇచ్చిన కుటుంబ నేపథ్యం నుండీ అల్లారు ముద్దుగా సంస్కృత శ్లోకాలు, సంగీత కచేరీలు, నాటకాలు, సినిమాలు, కౌమార ప్రేమ కలాపాలు... ఇలా ఒకటేమిటి ఎన్నో వర్ణాలు మనకి సో.సు. జీవితంలో కనబడతాయి. హైస్కూల్ విద్యార్థిగా స్టూడెంట్ యూనియన్ సభలకని కోల్ కతా వెళ్ళినప్పుడు హౌరా బ్రిడ్జి మీద చూసిన జీవచ్ఛవానికి కలత చెంది నవ యువకుడు పట్టిన కలం, కట్టిన కవిత తెలుగు నేలమీద దశాబ్దాల పాటు వెల్లువలా సాగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నినాదమై రగిలింది. ‘హే నిజాం పాదుషా, ఖబడ్దార్ !’ అని హెచ్చరించింది. నిషేధానికి గురై చరిత్ర సృష్టించింది.చదవండి: గల్ఫ్ వలస జీవిత సారం‘కవిత్వమూ, కమ్యూనిజమూ తప్ప మరే ధ్యాసా నాకు లేదు’ అని తన ఆత్మకథలో ప్రకటించుకున్న సో.సు. జీవితాన్ని ఆ రెంటికే అంకితం చేశారు. సుమారు ముప్పై మూడు భాగాల్లో ఎన్నెన్నో అపురూప విషయాల్ని నమోదు చేశారు. పిఠాపురం సంస్థానంలో సాహిత్య వాతావరణం మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన అభ్యుదయ కవిత్వోద్యమం వరకూ ఎంతో హృద్యంగా చెప్పారు. హైదరాబాదు కవి మిత్రుల నుండీ మద్రాసు మేధాసాంస్కృతిక స్రవంతి దాక, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ వంటి వారితో అనుభవాలు, మిత్రులతో చేసిన ఉత్తర భారత యాత్రా విశేషాలు... ఒక్కటేమిటి తన జీవన చిత్రంలోని గాఢమైన రంగులన్నిటినీ ఆత్మకథ రూపంలో పాఠక లోకానికి అందించారు సో.సు. అయితే, ఎందుకనో తెలీదు కానీ సోమసుందర్ స్వీయచరిత్రకి రావాల్సిన గుర్తింపు సాహితీ లోకంలో సైతం రాలేదు.చదవండి: వెనక్కి నడవమంటున్నారా?విశాలమైన పచ్చిక బయళ్ళ పైన పిండార బోసినట్లు ‘నా జీవితంలో మంచిపనులు ఎన్ని చేశానో అంతకు మించిన చెడ్డ పనులు చేశాను. అందుకే మంచి పనులు సవిస్తరంగా ఏకరువు పెట్టలేదు. చెడ్డపనులు మచ్చుకు కొన్నే చెప్పకుండా విడిచిపెట్టనూలేదు. అసలు జీవితం అంటే ఏమిటి? చెడ్డ పనులు రహస్యంగా చేసు కుంటూ పోవడం. మంచి పనులు తక్కువే అయినా బహి రంగంగా చేయడం...’ అని చెప్పుకున్న సోమసుందర్ ధైర్యాన్ని, పారదర్శకతను చదివి అంగీకరించి, స్వీకరించేందుకు కూడా కొంత సాహసం కావాలేమో అనిపిస్తుంది. బహుశా అందుకనే వృద్ధాప్యంలో డిక్టేట్ చేసి రాయించిన సో.సు. స్వీయచరిత్ర రెండో భాగం ‘పూలు, ముళ్ళు’ అంతగా కదిలించదు. ఏదో భారంగా రాసినట్టు సాగుతుంది. ఇదంతా ఒకెత్తయితే ఏకకాలంలో కవిగా, కార్య కర్తగా కూడా మసిలిన ఆయన కార్యదీక్ష ఒక్కటీ ఒకెత్తు. స్వాతంత్య్రం వచ్చే నాటికి జైల్లో శిక్ష అనుభవిస్తూ కూడా ఈ దేశంలో సోషలిజం కోసం నిబద్ధతతో కృషి చేసిన సో.సు. తర్వాత కాలంలో పూర్తిస్థాయి సాహితీవేత్తగా మారారు.ప్రజా చైతన్యమే లక్ష్యంగా సకల సాహితీ ప్రక్రియలను ప్రయోగించారు. లిటరరీ ట్రస్ట్ స్థాపించి ఎందరో యువకవుల్నీ, రచయితల్నీ పురస్కారాలతో ప్రోత్సహించారు. శతాధిక గ్రంథాల్ని రచించి తెలుగులో ఎన్నదగిన అభ్యుదయ దిక్సూచిగా భాసించారు. ఆయన స్పూర్తిని అందుకుని కొనసాగించగలగడమే మహాకవి ఆవంత్స సోమసుందర్‌కు మనం ఇచ్చే అర్థవంతమైన ఆత్మీయ నివాళి.- గౌరవ్ సామాజిక కార్యకర్త (నేడు ఆవంత్స సోమసుందర్ శతజయంతి) -
జన్ జాతీయ గౌరవ్ దివస్.. విస్మృత పోరాట యోధుడి జయంతి
గత రెండేళ్ల క్రితం నుంచి నవంబర్ 15 నాడు బిర్సా ముండా జయంతిని ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’గా పాటిస్తున్నాం. ఇన్నేళ్లకైనా విస్మృత పోరాట యోధుణ్ణి స్మరించుకోవడం ఆనందదాయకం. ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వీరుడు బిర్సా ముండా. నాటి బెంగాల్ ప్రావిన్స్‌లోని బిహార్ (నేటి జార్ఖండ్)లో ఆదివాసీల రాజ్యాన్ని తేవటానికి సమరశంఖం పూరించాడు. ఆయన తన ఆదివాసీ ప్రజలకు ‘రాణి రాజ్యానికి అంతం పలుకుదాం–మన రాజ్యాన్ని స్థాపిద్దాం’ అనే నినాదం ఇచ్చాడు. ఈ నినాదం ప్రజలను తిరుగుబాటు వైపుకు నడిపించింది.ముండా తెగకు చెందిన సుగుణ, కార్మిహాలు దంపతులకు 1875 నవంబర్ 15న ఛోటానాగపూర్ సమీప చెల్కడ ప్రాంతంలోని బాబా గ్రామంలో ఆయన జన్మించాడు. ప్రాథమిక విద్యను కొద్దికాలం అభ్యసించిన తర్వాత ఒక జర్మన్ మిషనరీ స్కూల్లో చేరాడు. ఆ పాఠశాలలో చేరాలంటే క్రైస్తవుడై ఉండాలన్న నిబంధన ఉండడం వల్ల ఆయన మత మార్పిడి చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లలోనే స్కూల్ నుంచి బయటికి వచ్చి క్రైస్తవాన్ని త్యజించి తన సొంత ఆదివాసీ ఆచారాలనే ఆచరించడం ప్రారంభించాడు. ఆదివాసీలందరినీ స్థానిక విశ్వాసాలనే అనుసరించమని బోధించాడు. తాను తన జాతీయులను ఉద్ధరించడానికి అవతరించినట్లు ప్రకటించాడు. ఆయన బోధనలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ముండా ప్రజలు ఆయన్ని దేవునిగా భావించి ‘భగవాన్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే బిర్సా ముండాను అనుసరించనివారు ఊచకోతకు గురవుతారనే గాలివార్త ప్రచారంలోకి రావడంతో ఆయన్ని బ్రిటిష్‌వాళ్లు ఛోటానాగపూర్ ప్రాంతంలో 1895 ఆగస్టులో అరెస్ట్ చేసి రెండేళ్లకు పైగా జైల్లో ఉంచారు. దీంతో ఆయన విడుదల కోరుతూ జాతీయోద్యమకారులు పెద్దఎత్తున బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం ఎట్టకేలకు 1897 నవంబర్‌లో బిర్సాని విడుదల చేసింది.ఆ రోజుల్లో బ్రిటిష్‌వాళ్లు, వాళ్ల తాబేదార్లు ఆదివాసీల సాగు భూములపై పన్నులు విధిస్తూ... వాటిని కట్టకపోతే ఆ భూములను జమీందారీ భూములుగా మార్చేవారు. దీంతో చాలా మంది ప్రజలు అస్సాంలోని తేయాకు తోటల్లో కూలి పనుల కోసం వలస వెళ్లేవారు. దీన్ని గమనించిన బిర్సా... వన జీవులందరినీ సమావేశపరిచి, బ్రిటిష్‌వాళ్లకు కప్పాలు కట్టవద్దనీ, వాళ్లను తరిమి కొట్టాలనీ పిలుపునిచ్చాడు. అనుచరులతో కలిసి బాణాలు ధరించి 1899 డిసెంబర్లో భారీ ‘ఉల్’ గులాన్’ (తిరుగుబాటు ర్యాలీ) నిర్వహించాడు.చదవండి: ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్ని 1900 ఫిబ్రవరి 3న బంధించి రాంచీ జైలుకు తరలించింది. కేసు విచారణలో ఉన్న కాలంలో జూన్ 9న జైల్లోనే ఆయన తుది శ్వాస విడిచాడు. చివరికి 1908లో బిటిష్ ప్రభుత్వం ఆదివాసీల భూములను ఆదివాసీలు కానివారికి బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ ‘ది ఛోటానాగపూర్ టెనెన్సీ యాక్ట్’ను తీసుకువచ్చింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితో ముండా, ఒరియాన్, సంతాల్ తెగలు తమ హక్కులను సాధించుకున్నాయి.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ (2024, నవంబర్ 15న బిర్సాముండా 150వ జయంతి ప్రారంభం) -
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: భారతరత్న, డాక్టర్ మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా తన నివాళి ప్రకటించారు.స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతకు ముందు..స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/2OoYBxEPB4— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2024 తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అజాద్ జయంతి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రేగ మత్స్యలింగం, విశ్వేసరరాజు, విరూపాక్షి హాజరయ్యారు. -
వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అహ్మాదాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. జాతీయ ఐక్యతా దినోత్సవంతోపాటు దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ ప్రసంగించారు.‘‘దీపావళి పండగ.. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం వైట్‌హౌస్‌లో 600 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లతో దీపావళిని జరుపుకున్నారు. అనేక దేశాల్లో దీపావళి జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు. ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’ త్వరలో సాకారమవుతుంది. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్వహించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు త్వరలో లైన్ క్లియర్ అవుతుంది. ఈ ప్రతిపాదనకు ఈ ఏడాది ప్రారంభంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన సమర్పించనున్నాం.#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "...We are now working towards One Nation One Election, which will strengthen India's democracy, give optimum outcome of India's resources and the country will gain new momentum in achieving the dream of a… pic.twitter.com/vUku6ZCnVv— ANI (@ANI) October 31, 2024 మేం ప్రస్తుతం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశ వనరుల సరైన ఫలితాన్ని ఇస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించడంలో సాయపడుతుంది. భారతదేశం.. నేషన్ వన్ సివిల్ కోడ్, సెక్యులర్ సివిల్ కోడ్ కలిగి దేవంగా అవతరించనుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. దానిని శాశ్వతంగా పాతిపెట్టాం. రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేవారే ఎక్కువగా అవమానిస్తున్నారు’’ అని అన్నారు. -
మానవతకు ప్రతిరూపం
మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వివేకా నందుడి బోధనలకు ప్రభావితమై హిందూ (ధర్మం) మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐర్లాండులో ఆమె 1867 అక్టోబర్ 28న జన్మించారు. ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గ రెట్ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె... వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్ వచ్చింది. ఆమెకు వివేకానంద ‘నివేదిత’ అని నామకరణం చేశారు. నివే దిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ పుస్తకంలో వివరించారు. ఇతరుల పట్ల దయతో మెలిగే ఆమె మంచి అభిరుచి గల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఆమె 1898 నవంబరులో కలకత్తాలోని బాగ్ బజారులో పాఠశాలను ప్రారంభించారు. కనీస విద్య లేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. 1899 మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగువ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించీ, ఆచార వ్యవహారాల గురించీ న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్‌లో మరణించిన సిస్టర్ నివేదిత తలపెట్టిన పనులను విస్తరించడమే మనం ఆమెకు ఇవ్వగల నివాళి.– సాకి ‘ 99511 72002(నేడు సిస్టర్ నివేదిత జయంతి) -
#NimratKaur 30 ఏళ్ల కల నెరవేరింది : నటి నిమ్రత్ కౌర్ (ఫొటోలు)
-
చిరంజీవిని గుర్తు చేసుకున్న భార్య.. ఎమోషనల్ పోస్ట్!
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి సర్జా. నాలుగేళ్ల క్రితం ఆయన ఆకస్మిక మరణంతో శాండల్‌వుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో ఆయన భార్య ఐదు నెలల గర్భవతి కావడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా కన్నడ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.అయితే ఇవాళ చిరంజీవి సర్జా జయంతి కావడంతో ఆయన భార్య మేఘన భర్తను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వే మార్గదర్శకమని భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆయన సోదరుడు ధృవ సర్జా నటించిన మార్టిన్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. విడుదల సమయంలో అన్నకు ప్రత్యేకంగా నివాళి అర్పించాడు.కాగా.. 2009లో సినిమారంగంలోకి ప్రవేశించిన స్టార్ హీరో చిరంజీవి సర్జా దాదాపు 22 చిత్రాల్లో నటించారు. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా నటించిన చివరి చిత్రం 'రాజమార్తాండ'. అయితే ఊహించని విధంగా ఈ కన్నడ స్టార్ జూన్ 7, 2020న 39 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు కూడా సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆయన మరణం తర్వాత తమ్ముడు ధృవ సర్జా అన్న పాత్రకు డబ్బింగ్ చెప్పారు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
కలాం జయంతి: నివాళులర్పించిన వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం శాస్త్రవేత్త, రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘అబ్దుల్ కలాం వినయం, ముందుచూపు, విజ్ఞానం, విద్య మీద ఉన్న అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింది. కలాం జీ వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని అన్నారు.Remembering Dr. A.P.J. Abdul Kalam Ji on his birthday! A scientist and a revered President his humility, vision, wisdom and unwavering dedication to education have left an indelible mark in the hearts of millions . Kalam Ji’s legacy continues to be a beacon of hope for humanity…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2024 చదవండి: మీరే కదా బాబూ.. లిక్కర్ మాఫియా సూత్రధారి, పాత్రధారి: వైఎస్ జగన్ -
ఆ మహాకవికి నా నివాళి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నవయుగ కవిచక్రవర్తి, మహాకవి గుర్రం జాషువా జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు ఆయన్ని స్మరించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. తన కవితల ద్వారా గుర్రం జాషువా మూఢాచారాలను ప్రశ్నించారని, దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా కావ్యాలు రాశారని అన్నారు . తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుంటాయన్న వైఎస్ జగన్.. ఆ మహాకవి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు అని ఎక్స్‌లో ఓ సందేశం ఉంచారు.అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారు. దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా ఆయన రాసిన ఎన్నో కావ్యాల్లో ``గబ్బిలం ``ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆ మహాకవి జయంతి సందర్భంగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2024 YSRCP కేంద్ర కార్యాలయంలో.. మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. జాషువా విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు కొమ్మూరి కనకారావు, అడపా శేషు, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయాలపై సాహిత్య ఉద్యమం ఆరంభించిన నవయుగ కవి చక్రవర్తిగా, అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవిగా తనదైన ముద్ర వేసుకున్న గుర్రం జాషువాను ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. -
భారత విప్లవ ప్రతీక!
భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్ సింగ్. నేటి పాకిస్తాన్లో ఉన్నపంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 27న జన్మించాడు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ... పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.గాంధీ, నెహ్రుల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్ సింగ్‌కు స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను, హిందు స్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్‌గా మార్చాడు.బ్రిటిష్ వాళ్లు సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా నినదించే గొంతులు ఈ దేశంలో ఉన్నాయని తెలియచేసేందుకు కేంద్ర శాసనసభలో బాంబువేసి పారిపోకుండా ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లా ల’నే నినాదాలను చేశాడు భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్, చౌరీచౌరా ఘటనలు భగత్ సింగ్‌లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే; సైమన్ కమిషన్ పర్యటన సమయంలో దెబ్బలు తిన్న కారణంగా లాలా లజపతిరాయ్ మరణించడం ప్రతీకారేచ్ఛను కలిగించింది.భగత్ సింగ్‌ను బ్రిటిష్‌వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే విశ్వాసం తనదనీ, అందువల్ల బ్రిటిష్ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు భగత్. అదీ ఆ వీరుని దేశభక్తి! – జి. పవన్ కుమార్, బిజ్వార్ఇవి చదవండి: సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం -
అక్కినేని తర్వాతే ఎవరైనా.. ఏ తెలుగు హీరోకి సాధ్యం కాని ఘనత
ఆ హీరో సినిమాకు వచ్చిన వసూళ్లని ఈ హీరో అధిగమించాడు. అతడి కంటే ఇతడు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇప్పుడంతా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు వింటుంటాం. కానీ ఒకప్పుడు రికార్డులు అంటే వేరే ఉండేవి. అంతెందుకు అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించాడు. ఆయన 100వ జయంతి సందర్భంగా అలాంటి ఓ రెండింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.ట్రాజెడీ కింగ్ ఏఎన్నార్ఫైట్స్ ఎవరైనా చేస్తారు గానీ ప్రేక్షకుడు గుండెలు కరిగాలే యాక్టింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో ఏఎన్నార్ సిద్ధహస్తుడనే చెప్పాలి. ఎందుకంటే విషాదాంత ప్రేమకథలంటే తెలుగులో ఎప్పటికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు అక్కినేని నాగేశ్వరరావు. ట్రాజెడీ ప్రేమకథలంటే లైలా-మజ్ను, సలీమ్-అనార్కలీ, దేవదాసు-పార్వతి కథలు గుర్తొస్తాయి. ఈ మూడింటిలోనూ ఏఎన్నార్ నటనతో అదరగొట్టేశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)ఎప్పటికీ గుర్తుండిపోయే..లైలా-మజ్ను సినిమాలో అక్కినేని భగ్న ప్రేమికుడిగా బాధపడుతుంటే ప్రేక్షకులు కూడా అంతే ఎమోషనల్ అయ్యారు. ఇది రిలీజైన నాలుగేళ్లకు 'దేవదాసు' చేశారు. ఇది ఏఎన్నార్ కెరీర్లోనే సాహసోపోతమైన మైల్ స్టోన్ మూవీ. ఎందుకంటే అప్పటికే 'దేవదాసు' నవల చదివినోళ్లు.. అదే కథతో తీసిన హిందీ, బెంగాలీ సినిమాలు చూసిన వాళ్లు.. 'దేవదాసు'గా ఏఎన్నార్ ఆకట్టుకోవడం అసాధ్యం అన్నారు. కానీ ఈ మూవీ తన నటజీవితానికి సవాలుగా భావించారు. 'జగమే మాయ..', 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..' అని పాడుతూ మహానటుడు అనిపించుకున్నారు. తనని విమర్శించిన ప్రతి ఒక్కరి నోరు మూయించేశారు.ఆ రెండింటిలోనూపై రెండే కాదు 'అనార్కలి' సినిమాలోని సలీమ్గానూ అక్కినేని యాక్టింగ్ అద్భుతం. దీనితో పాటు పెళ్లి కానుక, సుమంగళి చిత్రాల్లోనూ భగ్న ప్రేమికుడు, త్యాగమూర్తిగా ఆహా అనేలా నటించారు. బాటసారి, మూగమనసులు, రావణుడే రావణుడైతే తదితర సినిమాల్లోనూ ఏఎన్నార్ అదరగొట్టేశారు. 'ప్రేమాభిషేకం' లాంటి విషాదంత ప్రేమకథ అయితే ఎప్పటికీ రాదేమో? అలా టాలీవుడ్ చరిత్రలో ట్రాజెడీ కింగ్‌గా నిలిచిపోయారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)నవలా నాయకుడుఇప్పుడంటే రీమేక్ కథలని మన హీరోలు వెంటపడుతున్నారు. వాటిలోనూ మెప్పించలేకపోతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం చాలామంది చదివేసిన నవలల్ని సినిమాలుగా తీస్తే ఏఎన్నార్ తనదైన మార్క్ యాక్టింగ్‌తో మైమరిపించారు. దేవదాసు, అర్ధాంగి, చరణదాసి, డాక్టర్ చక్రవర్తి, బంగారు కలలు, చదువుకున్న అమ్మాయిలు, విచిత్రబంధం, తోడికోడళ్లు, మాంగల్య బలం, విచిత్ర బంధం, భార్య భర్తలు, పునర్జన్మ, బాటసారి, వాగ్దానం, ఆరాధన, పూజాఫలం, ప్రేమలు-పెళ్లిళ్లు, ప్రేమనగర్, సెక్రటరీ.. ఇలా ఏఎన్నార్ కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమాలన్నీ నవలలే కావడం విశేషం.అటు విషాదాంత ప్రేమకథలైనా.. ఇటు నవలా చిత్రాలైనా సరే అక్కినేని నాగేశ్వరరావు తన మార్క్ చూపించారు. ఈ రెండు విషయాల్లోనూ ఏఎన్నార్‌ని దాటే హీరో తెలుగులో ఎప్పటికీ రాడు, రాలేడు!(ఇదీ చదవండి: అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!) -
అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!
అక్కినేని డ్యూయెట్స్ 50విజిల్ వేయండి.. పజిల్ విప్పండిఅక్కినేని నాగేశ్వరరావు మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య నటుడు. ముఖ్యంగా గృహిణులు ఏఎన్ఆర్ సినిమా కోసం ఎదురు చూసేవారు. దానికి తగ్గట్టే ఏఎన్ఆర్ సినిమాల కథాంశాలుండేవి. సావిత్రి, జమున ఆ తర్వాతి కాలంలో వాణిశ్రీ అక్కినేనికి సరిజోడుగా నటించి మెప్పు పొందారు. ఆయన సినిమాల్లో అందమైన యుగళ గీతాలుండేవి. అలాంటి 100 యుగళగీతాలను తలుచుకుందాం. అక్కినేని వల్ల మన జీవితంలో వచ్చిన ఆనందగీతాలను ఆస్వాదిద్దాం. ఈ తొలి పది పాటల్లో సైకిల్ మీద వెళుతూ బి.సరోజాదేవితో పాడే పాట ఏదో గుర్తుపట్టండి. అలాగే తర్వాతి రోజుల్లో కమెడియన్‌గా మారిన గిరిజతో ఎంతో మంచి డ్యూయెట్టు ఉంది. అది ఏది?1. ఓ దేవదా చదువు ఇదేనా (దేవదాసు)2. రాజశేఖరా నీపై మోజు తీర లేదురా (అనార్కలి)3. చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా (దొంగరాముడు)4. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము (మాయాబజార్)5. చెట్టులెక్కగలవా ఓ నరహరి (చెంచులక్ష్మి)6. ఆకాశ వీధిలో అందాల జాబిలి (మాంగల్యబలం)7. నేడు శ్రీవారికి మేమంటే పరాకా (ఇల్లరికం)8. వాడుక మరచెదవేల (పెళ్లికానుక)9. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి (వెలుగు నీడలు)10. మధురం మధురం ఈ సమయం (భార్యాభర్తలు)అక్కినేనికి కవి దాశరథి తన గ్రంథాన్ని అంకితమిచ్చారు. అందుకు కృతజ్ఞతగా అక్కినేని ఆయనకు పాటలు రాసే అవకాశం ఇచ్చాడు. దిగువ ఉన్న పది పాటల్లో దాశరథి రాసినవి ఉన్నాయి.. గుర్తు పట్టండి. అలాగే తెలుగు సినిమాల్లో తొలి వాన పాట కూడా ఉంది. బెంగళూరులో పాట ఏం రాయాలో తోచక కారులో తిరుగుతున్న ఆత్రేయకు అప్పుడే మొదలైన వాన ఆ పాటను రాయించి నేటికీ మనం తడిసేలా చేస్తోంది.11. పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక (ఇద్దరు మిత్రులు)12. నన్ను వదిలి నీవు పోలేవులే (మంచి మనసులు)13. ప్రేమయాత్రలకు బృందావనము (గుండమ్మ కథ)14. వినిపించని రాగాలే కనిపించని అందాలే (చదువుకున్న అమ్మాయిలు)15. చిటపట చినుకులు పడుతూ ఉంటే (ఆత్మబలం)16. నా పాట నీ నోట పలకాల సిలక (మూగమనసులు)17. నిలువుమా నిలువుమా నీలవేణి (అమరశిల్పి జక్కన)18. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా (డాక్టర్ చక్రవర్తి)19. కనులు కనులతో కలబడితే (సుమంగళి)20. పగడాల జాబిలి చూడు (మూగనోము)21. కన్నులు నీవే కావాలి (సుమంగళి)22. నువ్వంటే నాకెందుకో అంత ఇది (అంతస్తులు)23. అది ఒక ఇదిలే అతనికి తగులే (ప్రేమించి చూడు)24. సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా (మనుషులు మమతలు)25. ఒక పూలబాణం తగిలింది మదిలో (ఆత్మగౌరవం)26. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి (పూలరంగడు)27. విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు)28. విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియ (బందిపోటు దొంగలు)29. ఓ చామంతి ఏమిటే ఈ వింత (ఆత్మీయులు)30. కళ్లలో పెళ్లిపందిరి కనపడసాగే (ఆత్మీయులు)‘దసరా బుల్లోడు’తో అక్కినేని కలర్ పాటలు. స్టెప్పులు చూసే వీలు ప్రేక్షకులకు కలిగింది. ఘంటసాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఆయన స్థానంలో వి.రామకృష్ణను వినేందుకు కూడా సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పాటల్లో లక్ష్మితో మంచి డ్యూయెట్ ఉంది. చూడండి.31. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా (దసరా బుల్లోడు)32. నీ కోసం వెలసింది ప్రేమమందిరం (ప్రేమ్ నగర్)33. ఆకులు పోకలు ఇవ్వొద్దు (భార్యాబిడ్డలు)34. మనసులు మురిసే సమయమిది (ప్రేమలు పెళ్లిళ్లు)35. వయసే ఒక పూలతోట (విచిత్ర బంధం)36. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు)37. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా (బంగారు కలలు)38. జాబిల్లి చూసేను నిన్ను నన్ను (మహాకవి క్షేత్రయ్య)39. ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని భావాలో (మహాత్ముడు)40. మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు (సెక్రటరీ)1980ల తర్వాత పూర్తిగా అక్కినేని కొత్తతరం హీరోయిన్లతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గళంలో హుషారు పాటలతో కొనసాగారు. జయసుధ, జయప్రద, శ్రీదేవి, సుజాత వీరంతా ఎక్కువగా ఆయన పక్కన నటించారు. అక్కినేని హీరోగా రిటైర్ అయ్యే వరకు ఎన్నో హిట్లు ఉన్నా ఒక పది పాటలు చెప్పుకుందాం. ఈ లిస్ట్‌లోని చివరిపాటను మోహన్‌లాల్‌తో డ్యూయెట్గా అభినయించారు అక్కినేని. ఆ సినిమా సంగీత దర్శకుడు ఎవరు?41. నేల మీది జాబిలి నింగిలోన సిరిమల్లి (రాజా రమేష్)42. నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని (ప్రేమాభిషేకం)43. ఒక లైలా కోసం తిరిగాను దేశం (రాముడు కాదు కృష్ణుడు)44. మల్లెపూలు గొల్లుమన్నవి (అనుబంధం)45. మధురం జీవన సంగీతం (వసంత గీతం)46. చందమామ దిగి వచ్చే లోన (జస్టిస్ చక్రవర్తి)47. ఇది మేఘ సందేశమో (ఏడంతస్తుల మేడ)48. ఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచింది (అండమాన్ అమ్మాయి)49. తామరపువ్వంటి తమ్ముడు కావాలా (బంగారు కానుక)50. గోరువంక వాలగానే గోకులానికి (గాండీవం) – కూర్పు : కె -
ఎంఎస్ సుబ్బులక్ష్మి దిగి వచ్చినట్టున్న విద్యాబాలన్ ఫోటో ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
మదర్ థెరీసా జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు శాంతిదూత మదర్ థెరీసా జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసా అని కొనియాడారు.ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అని ప్రశంసించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ్ భవన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ భవనం కాంప్లెక్స్‌ను ఆరోజు తాను ప్రారంభించండం సంతోషంగా ఉందని తెలిపారు. నేడు భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసాగారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసాగారు. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు… pic.twitter.com/KFVYHYaXOQ— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2024 -
'నువ్వు నేర్పించిన విలువలతోనే బతుకుతున్నా'.. సోనూ సూద్ ఎమోషనల్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎమోషనలయ్యారు. తన తల్లి సరోజ్ సూద్ జయంతి కావడంతో ఆమెను తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె ఫోటోను షేర్ చేస్తూ నోట్ రాసుకొచ్చారు.సోనూ సూద్ ట్వీట్లో రాస్తూ..'హ్యాపీ బర్త్‌డే అమ్మా. నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు. నువ్వు నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలుతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. నిన్ను చాలా ప్రేమిస్తున్నా అమ్మా. ఒక్కసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలనుంది. నువ్వు చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటా. లవ్ యూ సో మచ్' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. అరుంధతి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్ పలు చిత్రాల్లో నటించారు. నటన మాత్రమే కాదు.. తనవంతుగా సమాజసేవలో దూసుకెళ్తున్నారు. సోనూ సూద్ అనే ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన తల్లి సరోజ్ సూద్ పేరుతో స్కాలర్షిప్లు అందింస్తున్నారు. పేదరికంలో ఉన్న ఎందరో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు ఓ విద్యార్థికి సాయం అందించారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల ద్వారా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. Happy Birthday Maa. World without you is not that beautiful but somehow surviving with the principles and morals you taught me. I love u so much mom💔 wish I could hug you tight and tell you how much I miss you. Will always follow the path you showed me. Keep smiling till I see… pic.twitter.com/Bl1g5XNG3S— sonu sood (@SonuSood) July 21, 2024 -
న్యూజెర్సీలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
-
సంక్షేమానికి మారుపేరు వైఎస్
సాక్షి,హైదరాబాద్: దేశంలో సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే పేరు వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కొనియాడారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వై.ఎస్. చేసిన సంక్షేమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని గాంధీ భవన్లో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమంపై వై.ఎస్. చెరగని ముద్ర వేశారన్నారు.ఆయన హయాంలో జరిగిన అభివద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ఉపయోగపడుతోందని చెప్పారు. ఎన్నికల్లో ఇచి్చన ఆరు గ్యారంటీల హామీలకు స్ఫూర్తి రాజశేఖరరెడ్డేనని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్, గోదావరి, కష్ణా జలాల వినియోగం, హైదరాబాద్‌లో పెట్టుబడులకు కూడా ఆయనే స్ఫూర్తి అని రేవంత్ కొనియాడారు. వై.ఎస్. స్ఫూర్తి ని తమ ప్రభుత్వం, పార్టీ కొనసాగిస్తుందన్నారు. ఆయన చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తినిచి్చందన్నారు. 2009లో రెండోసారి సీఎం అయ్యాక రాహుల్ గాం«దీని ప్రధానిని చేయాలని వై.ఎస్. చెప్పారని.. కానీ రాహుల్ ప్రధాని కాకుండానే ఆయన దూరమయ్యారని విచారం వ్యక్తం చేశారు. వై.ఎస్. స్ఫూర్తి తో దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కొట్లాడి రాహుల్‌ను ప్రధాని చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఆయన అభిమానులంతా కాంగ్రెస్‌లోకి రావాలని కోరారు.వైఎస్ స్థానం సుస్థిరం: డిప్యూటీ సీఎం భట్టిఅభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రజల హదయాల్లో వై.ఎస్. స్థానం సుస్థిరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే నేడు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రజానీకానికి మేలు జరుగుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రతిష్టాత్మక పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలను వై.ఎస్. ఆదుకున్నారని చెప్పారు. తెలంగాణ వడివడిగా అభివద్ధివైపు అడుగులు వేయడానికి వై.ఎస్. వేసిన పునాదులే కారణమన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నేడుహైదరాబాద్ను ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. గాం«దీభవన్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ప్రజాభవన్‌లో వైఎస్సార్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం లక్డీకాపూల్/పంజగుట్ట/బంజారాహిల్స్: మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వై.ఎస్. భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బతికే ఉంటుందన్నారు. వై.ఎస్. 75వ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన జీవిత విశేషాలను తెలియజేస్తూ సోమవారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రేవంత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వై.ఎస్. ఫొటోలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం పంజగుట్ట కూడలిలోని వై.ఎస్. విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులరి్పంచారు. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1/10లోని సిటీ సెంటర్ వద్ద ఉన్న వై.ఎస్. విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, వై.ఎస్. ఆప్తమిత్రుడు కేవీపీ, మేయర్ విజయలక్షి్మ, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘన నివాళులు అర్పించారు. -
వైఎస్ఆర్ పై అంతులేని అభిమానం
-
నాన్నా.. మీ 75వ పుట్టిన రోజు మా అందరికీ పండుగ రోజు
-
"వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రం మరోలా ఉండేది"
-
వ్యవసాయమంటే ప్రత్యేకమైన ప్రేమను చూపిన వైఎస్సార్
-
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
KSR Live Show: YSR సంక్షేమ ముద్ర.. రాజ ముద్ర..
-
ఆ జ్ఞాపకం.. నా జీవితంలో మర్చిపోలేను..
-
ప్రజా సంక్షేమానికి డైరెక్షన్ వైఎస్ఆర్..
-
శత్రువులు కూడా అభినందించే గొప్ప నాయకుడు వైఎస్సార్
-
Watch Live: జన నేతకు వైఎస్ జగన్ నివాళి
-
YSR Jayanthi: ఇడుపులపాయకు వైఎస్ జగన్
-
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఓటమి ఎరుగని ధీరుడు..
-
రైతన్నల గుండెల్లో రాజముద్ర
ప్రకృతి కన్నెర్ర చేసింది. పాలకుల కరుణ కరువైంది. వరుణుడు పత్తా లేకుండా పోయాడు.వర్షాలు లేక, పంటలు పండక 1993 నుంచి 2004 మధ్య కాలంలో కరువు రక్కసి కబంధ హస్తాల్లో ‘అనంత’ రైతన్న చిక్కుకున్నారు. అలాంటి తరుణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశాకిరణంగా కనిపించారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి అన్నదాత దిక్కులు చూస్తున్న సమయంలో అపర భగీరథుడిగా నిలిచారు. చేతిలో చిల్లిగవ్వ లేక పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న కూలీలు, పేదల ఇంటికి పెద్ద కొడుకయ్యారు. పుట్టెడు అప్పులతో పిల్లల్ని చదివించలేక, ఆత్మాభిమానం చంపుకోలేక అర్ధంతరంగా అసువులు బాసిన రైతుల కుటుంబాలతో పాటు, పేదలకు అండగా నిలిచారు. అన్ని వర్గాలకూ అందరి బంధువయ్యారు. అందుకే ఆయన తనువు చాలించి 15 యేళ్లు కావస్తున్నా నేటికీ అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు మహానేత వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.అనంతపురం అగ్రికల్చర్: 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదికపై ఉచిత కరెంటు, విద్యుత్ బిల్లుల మాఫీ చేస్తూ తొలి సంతకంతోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఊపిరిపోశారు. ఆ ఒక్క సంతకంతో ఉమ్మడి జిల్లా రైతులకు చెందిన రూ.70.65 కోట్ల విద్యుత్ బిల్లులు మాఫీ అయ్యాయి. ఐదేళ్లూ 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ.వందల కోట్ల విలువ చేసే కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. ఖరీఫ్‌లో పంట రుణాల పంపిణీ రూ.6,594 కోట్లకు చేర్చారు. పావలా వడ్డీ కింద రూ.44 కోట్లు ఇచ్చారు.పంటల బీమాతో ధీమా..అప్పట్లో చంద్రబాబు హయాంలో అమలవుతున్న పంటల బీమా పథకాన్ని మార్పు చేసి రైతులకు ఎనలేని ధీమా కల్పించారు. 2004–2009 మధ్య వైఎస్ హయాంలో వేరుశనగ రైతులకు పంట కోత ఫలితాల ఆధారంగా బీమా కింద ఏకంగా రూ.1,138 కోట్ల పరిహారం దక్కింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.100 కోట్లు అందింది.ఒకే విడతగా రుణమాఫీ..2008లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో వైఎస్సార్ 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్ల రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాల కింద 3,61,269 మందికి రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద రుణమాఫీ, ప్రోత్సాహకాల కింద ఒకే విడతగా 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్ల లబ్ధి చేకూర్చారు.రాయితీతో విత్తనాలు..ఖరీఫ్, రబీలో రైతులకు లక్షల క్వింటాళ్ల వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు రాయితీతో ఇచ్చారు. 2004– 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్ల వేరుశనగ అందజేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు.అనుబంధ రంగాలకూ ప్రాధాన్యత..వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటలు, డ్రిప్, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూత అందించారు. రూ.25 కోట్ల రాయితీ ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీర విప్లవానికి నాంది పలికారు. 40 వేల హెక్టార్ల పండ్లతోటల విస్తరణకు రూ.80 కోట్ల సబ్సిడీ అందజేశారు. దీంతో అప్పట్లోనే ‘ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరొచ్చింది. బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో అందజేశారు. సూక్ష్మసేద్యం విస్తరణకు రూ.280 కోట్ల రాయితీ ఇవ్వడంతో 1.13 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇలా వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఏకంగా రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు.అంతకు మించి..తండ్రి వైఎస్సార్‌కు తగ్గ తనయుడిగా గత ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అంతకు మించి అన్నట్లుగా అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచింది. కరోనా కాలంలో ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలకు ప్రోత్సాహం లాంటివే కాకుండా కేవలం రైతు సంక్షేమానికి ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వెచ్చించారు. దేశంలో తొలిసారిగా ఊరూరా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థతో వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా ఇన్పుట్స్ కోసం గ్రామం దాటి వెళ్లకుండా 867 ఆర్బీకేలను నిర్మించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరిశీలనకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్‌లతో పాటు పశుసంపద, జీవాల రక్షణకు వెటర్నరీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 108 మాదిరిగా 1962 కింద మొబైల్ వెటర్నరీ అంబులెన్సులు తెచ్చారు. రైతు గ్రూపులకు ప్రతి ఆర్బీకే పరిధిలో రూ.15 లక్షలు వెచ్చించి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ) కింద ట్రాక్టర్లు, ఇతర అధునాతన యంత్ర పరికరాలు అందించారు. ఇన్పుట్ సబ్సిడీ, ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఏటా మూడు విడతల్లో రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.13,500 పెట్టుబడి సాయం ఇచ్చారు. ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా ‘ఈ–క్రాప్’, ఈ–కేవైసీ పారదర్శకంగా చేపట్టారు. రాయితీతో డ్రిప్, స్ప్రింక్లర్లు అందించారు. ఇలా వ్యవసాయ, అనుబంధ రంగాల పురోభివృద్ధికి అడుగడుగునా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం అందజేశారు. -
రాజువయ్యా.. మహరాజువయ్యా..
ప్రతి అడుగులో ఆలోచన..ముఖంలో చిరు మందహాసంతో కూడిన దర్పం..ఆహార్యంలో రాజసం..నమ్మిన ప్రజలకు దిక్సూచి.. అభాగ్యులకు ఆపన్నహస్తం..అన్నార్తులకు భరోసా..అభివృద్ధికి చిరునామా..అనారోగ్య బాధితులకు ఆరోగ్య శ్రీ, 108, 104 సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు జలయజ్ఞం, పేదవాడికి గూడు ఈ మాటలన్నీ ఎవరి నోట వినిపించినా ఠక్కున గుర్తొచ్చే పేరు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తన పరిపాలన కాలంలో ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన నాటికీ..నేటికీ ప్రజల గుండెల్లో మహారాజులా కొలువై ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఆయన పాలన కాలంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు అందించిన సేవలు ఒకసారి మననం చేసుకుంటే..సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరువు, పేదరికం, కటిక సమస్యలు తాళలేక పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం వలసపోయే జనం..ఇదీ సరిగ్గా ఇరవయ్యేళ్ల క్రితం వరకూ ఉమ్మడి విజయనగరం జిల్లా ముఖచిత్రం! అలాంటి నేపథ్యంలో 2003లో ప్రతిపక్షనేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర కీలక మలుపు. ఇక్కడి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. 2004 మే నెలలో తాను అధికారం చేపట్టింది మొదలు 2009 సెప్టెంబరులో అకాల మరణం వరకూ ముఖ్యమంత్రిగా ప్రతి పథకంలోనూ, అభివృద్ధి పనుల్లోనూ ఈ ప్రాంతానికి పెద్దపీట వేస్తూనే ఉన్నారు. నాటి ఆయన కృషి తాలూకా ఫలాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయి. తదుపరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా మళ్లీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అదే పంథాను కొనసాగించారు. ఇప్పుడు ఖరీఫ్ వచ్చేసరికి సాగునీరు అందుతోంది. ప్రగతిపథం వైపు ఉమ్మడి విజయనగరం జిల్లా వడివడిగా అడుగులు వేస్తోంది. వలసలు దాదాపుగా తగ్గిపోయాయి. బయటి ప్రాంతాలవారే ఇక్కడికొచ్చి స్థిరపడేలా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కలను సాకారం చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన తుది శ్వాస వరకూ ప్రజాసేవలోనే గడిపిన ఆ మహామనిషి జయంతి నేడు (సోమవారం, జూలై 8). ఆయనను స్మరించుకోవడానికి ఊరూవాడా ప్రజలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ రీజినల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ క్యాడర్‌ను కోరారు.జేఎన్టీయూ వైఎస్సార్ పుణ్యమే...ఉమ్మడి విజయనగరం జిల్లాలో నేడు సాంకేతిక విద్యకు దిక్సూచిగా ఉన్న జేఎన్టీయూ–జీవీ విశ్వవిద్యాలయానికి పునాదిరాయి వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. 2007లో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. దీన్ని ఎప్పటికై నా యూనివర్సిటీని చేయాలనే ముందుచూపుతోనే 80 ఎకరాల విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది.మాతాశిశుసంరక్షణకు ప్రాధాన్యం..డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బొబ్బిలి సీహెచ్‌సీలో రూ.44.30 లక్షలతో సీమాంక్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆయన ప్రారంభించిన భవనంలోనే నాటి నుంచి గర్భిణులు, బాలింతలకు వైద్యసేవలు అందుతున్నాయి.ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పునాది....విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, వంగర మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు లైనింగ్ పనులు, పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ ప్రాజెక్టు, నాగావళి ఉపనది జంఝావతి నుంచి రాష్ట్రానికి వచ్చే 4 టీఎంసీల వాటా నీరు వినియోగించుకునేందుకు వీలుగా 1976వ సంవత్సరంలో జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం వంటి ఎన్నో పనులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాలోపూర్తయినవే.వైఎస్సార్‌కు స్మృతివనం..పాలకొండ మండలం ఎం.సింగుపురం గ్రామ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం చూపించిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒక దైవంలా ఆరాధిస్తున్నారు. 2006లో ముఖ్యమంత్రి హాదాలో ఇక్కడ ప్రజాపఽథం కార్యక్రమానికి వైఎస్సార్ వచ్చారు. ఆయన మరణానంతరం ఇక్కడ వైఎస్సార్ స్మృతివనాన్ని గ్రామస్తులు నిర్మించారు.చీపురుపల్లి అభివృద్ధికి ఆద్యుడుచీపురుపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాంది పలికారు. ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చొరవతో రూ.83 కోట్లతో ఇందిరమ్మ సుజలధార పథకం చేపట్టడం ద్వారా తాగునీటి ఇబ్బందులు తొలగించారు. చీపురుపల్లికి ఆ మహానేత వైఎస్సార్ హయాంలో మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేడు ఆదర్శ డిగ్రీ కళాశాలగా కొనసాగుతోంది.‘గిరి’జన గ్రామాల్లో వెలుగువేపాడ మండలం కరకవలస పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామమైన మారిక గ్రామానికి తొలిసారిగా 2006లో విద్యుత్ సదుపాయం కల్పించిందీ నాటి రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆ గ్రామానికి బీటీ రోడ్డుకు నిధులు కేటాయించిందీ ఆయనే. జామి మండలంలో మూతపడి ఉన్న భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి చెరుకు రైతుల జీవితాల్లో తీపి నింపారు. రాజన్న మరణానంతరం మళ్లీ ఆ ఫ్యాక్టరీ మూతపడింది.తోటపల్లితో మూడు జిల్లాల్లో ప్రగతి...విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రగతికి మూలకారకంగా తోటపల్లి ప్రాజెక్టు ఉంది. వాస్తవానికి ఇప్పుడు ప్రాజెక్టు ఉన్న తోటపల్లి ప్రాంతానికి దిగువన నాగావళి నదిపై బ్యారేజీ ఉండేది. 64 వేల ఎకరాలకు సాగునీరు అందించే దీన్ని బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాజెక్టును నిర్మిస్తానంటూ 2003 సంవత్సరంలో చంద్రబాబు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసేశారు. తర్వాత దాని ఊసే తేలేదు. 2004వ సంవత్సరంలో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా అనుమతులు ఇచ్చారు. దాదాపు 2 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించే ఈప్రాజెక్టు నిర్మాణానికి రూ.450.23 కోట్లు నిధులు మంజూరు చేశారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా 2004 అక్టోబరు 17వ తేదీన ఆయనే స్వయంగా వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆయన హయాంలోనే భూసేకరణ, పునరావాసం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు పనులు కూడా 81 శాతం అయిపోయాయి. ఆయన అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రులైన వారెవ్వరూ పెండింగ్ పనులపై దృష్టిపెట్టలేదు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండింగ్ పనుల్లో కదలిక వచ్చింది. ఆధునికీకరణకు, హెడ్ వర్క్‌లను పూర్తి చేయడానికి నిధులు కేటాయించారు. -
వైద్యరంగంలో రాజముద్ర
-
‘వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం’
తాడేపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘వైఎస్సార్ 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నాం, రక్తదానం, పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని క్యాడర్ కి పిలుపునిస్తున్నాం.పార్టీ క్యాడర్ అంతా జులై 8న వీటిని నిర్వహించాలని కోరుతున్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి. వైఎస్సార్ మీద భక్తి ఉన్న వారంతా జయంతి కార్యక్రమాలు చేయొచ్చు. ఆ మహనీయుడిని స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టాలని జగన్ ఆదేశించారు. ఆ మేరకు క్యాడర్ అంతా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి. వైఎస్సార్ ఆశయాలు, విధానాలతోనే వైఎస్సార్సీపీ ఏర్పడింది. వైఎస్ఆర్ ఆలోచనా విధానంతోనే ముందుకు సాగుతున్నాం’ అని పేర్ని నాని పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం.. ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ, సాక్షి: తెలుగు చలన చిత్ర నట దిగ్గజం, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్మరించుకున్నారు. ‘‘ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన.. ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ధరించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను ప్రజలు ఇప్పటికీ తలచుకుంటారు. ఎన్టీఆర్ కలలుగన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు .…— Narendra Modi (@narendramodi) May 28, 2024 -
అంబేడ్కర్ అన్నివర్గాలకు ఆదర్శమూర్తి : మంత్రి పొన్నం
కరీంనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయనకు నివాళి అర్పించారు. అంబేడ్కర్ అన్నివర్గాలకు ఆదర్శమూర్తి అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులఉమ, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్ వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీవో కే.మహేశ్వర్, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నతానియల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అంధులపై ఎందుకీ బ్రహ్మాస్త్రం! అసలేం జరిగింది? -
డా. బీఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికే కాదు, దేశానికీ తలమానికం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల… pic.twitter.com/Da4B5jWmQo — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2024 -
సున్నితమైన గానానికి ఉన్నతి తలత్
గాయకుడు తలత్ మహ్మూద్ శత జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుందాం రండి - మృదువైన, మెత్తని గాత్రంతో, గానంతోమనదేశంలో తలత్ మహ్మూద్ తొలి crooner! మన దేశ లలిత, సినిమా, గజల్ పరంగా మేలైన, మెరుగైన గానం (fine singing) తలత్ Silky smooth and velvet voiceతో మొదలయింది. గాన లాలిత్యం మనదేశంలో తలత్వల్ల సాకారమైంది. భారతదేశ లలిత, సినిమా, గజల్ గానానికి మార్గదర్శకుడు తలత్. అత్యున్నతమైన గాయకుడు మొహమ్మద్ రఫీ కూడా తలత్ ప్రభావంతో తనను తాను తీర్చి దిద్దుకున్నారు. దులారీ సినిమాలోని "సుహానీ రాత్ డల్ చుకీ..." పాట మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. గజల్ గాయకుడు మెహ్‌దీహసన్‌కు కూడా తొలిదశలో తలత్ స్ఫూర్తి. 1950ల ప్రథమార్ధంలో తలత్ ప్రభావంతో మెహ్దీహసన్ చేసిన ఒక గజల్ కచేరీలో ప్రేక్షకుల నుంచి కానుకలుగా 15,000 రూపాయల నోట్లు మెహ్దీహసన్పై పడ్డాయి. తలత్ పాడిన "అసర్, ఉస్కో జరా నహీన్ హో...", "వో జాతేన్ హేన్..." వంటి గజళ్లు వింటే మెహ్దీహసన్ గానంపై తలత్ గాన ప్రభావం తెలియవస్తుంది. 1941-44 మధ్య కాలంలో తపన్ కుమార్ పేరుతో తలత్ కలకత్తాలో కొన్ని బెంగాలీ పాటలు పాడారు. 1945లో కలకత్తాలో నిర్మితమైన రాజలక్ష్మీ హిందీ సినిమాలో నటుడు-గాయకుడుగా రాబిన్ చటర్జీ సంగీతంలో తలత్ తన మెదటి సినిమా పాట " ఇస్ జగ్ సే కుఛ్ ఆస్ నహీన్ ..." పాడారు. అనిల్ బిస్వాస్ సంగీతంలో 1951లో వచ్చిన తరానా సినిమాలో పాడిన "సీనేమే సులగ్తే హైన్ అర్మా ..." పాట తలత్ తొలి సినిమా హిట్ పాట. అంతకు ముందు 1950లో అనిల్ బిస్వాస్ సంగీతంలో వచ్చిన ఆర్జూ సినిమాలోని "ఏ దిల్ ముఝే ఏసీ జగ్హ లే ..." పాటా, 1950లోనే నౌషాద్ సంగీతంలో వచ్చిన బాబుల్ సినిమాలోని " మేరా జీవన్ సాథీ భిఛడ్ గయా..." పాటా చెప్పుకోతగ్గవి. సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో వచ్చిన సంగ్దిల్ సినిమాలో తలత్ పాడిన ఏ హవా, ఏ రాత్, ఏ చాందినీ..." పాట మన దేశంలొ వచ్చిన ఒక ప్రశస్తమైన పాటగా నిలిచిపోయింది. ఆ సంగ్దిల్ సినిమాలోనే తలత్ "కహాన్ హో కహాన్ మేరే జీవన్ సహారే..." అంటూ మరో గొప్ప పాట పాడారు. శంకర్-జైకిషన్ సంగీతంలో తలత్ పాడిన "ఏ మేరే దిల్ కహీన్ ఔర్ చల్..." (సినిమా: దాగ్) పాట దేశం మొత్తాన్నీ ఊపేసింది. అటు తరువాత తలత్ పాడిన "తస్వీర్ బనాతా హున్ ..." (సినిమా: బారాదరీ, సంగీతం: నాషాద్) "షామే గమ్ కీ కసమ్.." (సినిమా: ఫుట్ పాత్, సంగీతం: ఖయ్యామ్), "ఏ గమే దిల్ క్యా కరూన్ ..." (సినిమా: ఠోకర్, సంగీతం: సర్దార్ మాలిక్), "జిందగీ దేనే వాలే సున్..." (సినిమా: దిల్ - ఎ - నాదాన్, సంగీతం: గులామ్ మొహమ్మద్), "మై దిల్ హూన్ ఇక్ అర్మాన్ భరా..." ( సినిమా: అన్హోనీ, సంగీతం: రోషన్), "మొహబ్బత్ హీ న జో సమ్ఝొ వో జాలిమ్ ప్యార్ క్యా జానే..." (సినిమా: పర్ఛాయిన్, సంగీతం: సి. రామ్‌చంద్ర), "ముఝేదేఖో హస్రత్ కీ తస్వీర్ ..." (సినిమా: బాజ్, సంగీతం: ఒ.పి. నయ్యర్), "జాయేన్ తో జాయేన్ కహాన్..." (సినిమా: టాక్సీ డ్రైవర్, సంగీతం: ఎస్.డి. బర్మన్), "రాత్ నే క్యా క్యా ఖ్వాబ్ దిఖాయే..." ( సినిమా: ఏక్ గావ్ కీ కహానీ; సంగీతం: సలిల్ చౌధరీ) పాటలూ, ఈ స్థాయి ఇంకొన్ని పాటలూ భారతదేశ సినిమా గానంలో కాలాలు ప్రశంసించేవయ్యాయి. హిందీ సినిమా పాటల్లో పెద్ద పల్లవి పాట, మనదేశ సినిమాల్లో రెండో పెద్ద పల్లవి పాట (ఈ పాటకన్నా పెద్ద పల్లవితో ఒక తమిళ్ష్ పాట ఉంది) సలిల్ చౌధరీ సంగీతంలో ఉస్నే కహా థా సినిమాలోని "ఆహా రిమ్ జిమ్ కే యే ప్యారే ప్యారే గీత్ లియే..." తలత్ పాడారు. గాయకుడు సైగల్ గానాన్ని మరపిస్తూ తలత్ crooning (లాలిత్యమైన గానం) ఒక్కసారిగా దేశ గాన విధానాన్ని మార్చేసింది. తలత్ 15 ఏళ్లకే గాయకుడు! 1944లో తలత్ పాడిన "తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్లాన సకే గీ" (సంగీతం: కమల్‌దాస్ గుప్తా; రచన: ఫైయాజ్ హష్మి) గజల్ (78 ఆర్.పి.ఎమ్) రికార్డ్ విడుదలయింది. విడుదలయిన నెల రోజుల్లోనే లక్షన్నరకు పైగా ప్రతులు అమ్ముడయింది అది. ఆ గానం ఆదర్శమై దేశ సినిమా, లలిత, గజల్ గాన పరిణామానికి, పరిణతికి, ప్రగతికి మార్గదర్శకమైంది. తలత్ 1941లో "సబ్ దిన్ ఏక్ సమాన్ నహీన్ థా..." గజల్‌ను రికార్డ్‌పై విడుదల చేశారు. 1939లో తన 15యేళ్ల వయసులో తలత్ 2 గజళ్లను పాడి విడుదల చేశారు. "1943లో చాంద్ మేరే చాంద్ తేరే.." గజల్ రికార్డ్ విడుదలైంది. తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్లాన సకే గీ గజల్ తరువాత తలత్ మహ్మూద్ గజళ్ల గానానికి ఊపు వచ్చింది. ఆ తరువాత "గమ్ -ఎ-జిందగీ కా యారబ్ న మిలా కోఈ కినారా..." (1947; సంగీతం: చిట్టారాయ్), "సోయే హువే హేన్ చాంద్ ఔర్ తారేన్ (1947), "ఇన్ భీగీ భీగీ రాతోన్ మేన్ ..."(1947), "దిల్ కీ దునియా బసా గయా ..."(1948) వంటి గజళ్లతో సాగుతూ 1950వ దశాబ్దిలో "రోరో బీతా జీవన్ సారా..." (రచన: ఖన్వర్ జమాన్; సంగీతం: ఖయ్యామ్), "ఆగయీ ఫిర్ సే బహారేన్ ..." (రచన: ఖన్వర్ జమాన్; సంగీతం: ఖయ్యామ్), "మేరా ప్యార్ ముఝే లోటా దో ..." (రచన: సజ్జన్; సంగీతం: వి. బల్సారా), "చన్ద్ లమ్హేన్ తేరీ మెహఫిల్ మేన్ ..." (రచన: షకీల్ బదాయూనీ; సంగీతం: తలత్ మహ్మూద్) వంటి గజళ్లతో రాణించి రాజిల్లింది. సి.హెచ్. ఆత్మ, ముఖేశ్ వంటి గాయకులతో జంటగా కూడా తలత్ గజళ్లు పాడారు. బేగం అఖ్తర్ గజల్ ఫణితికి అతీతంగా ప్రపంచ గజల్ గానం పరివర్తనానికి, పరిఢవిల్లడానికి ప్రేరణ తలత్. తలత్ మహ్మూద్ గజల్ (గాన)రాజు అయ్యారు. నౌషాద్ సైతం తలత్‌ను 'గజల్ రాజు' అన్నారు. గైర్-ఫిల్మీ (సినిమా పాటలు కాని) గానంగా తలత్ కృష్ణ భజన్లు, దుర్గా ఆర్తి, నాత్‌లు, గీత్‌లు, చెప్పకోతగ్గట్టుగా పాడారు. నిప్పులాంటి మనిషి సినిమాలోని "స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం..." పాట మనకు తెలిసిందే. ఈ పాట హిందీ జంజీర్ సినిమాలో మన్నాడే పాడిన "యారీ హైన్ ఇమాన్ మేరా యార్ మేరీ జందగీ..." పాటకు నకలు. ఆ హిందీ పాటకు కొంత మేరకు ఆధారం ముబారక్ బేగమ్తో కలిసి తలత్ పాడిన "హమ్ సునాతే హైన్ మొహమ్మద్ ముస్తఫా కీ దాస్తాన్..." అన్న నాత్. అమృత సినిమాలో ఎ.ఆర్. రహ్మాన్ చేసిన "ఏ దేవి వరము నీవు..." పాట పల్లవి తలత్ పాడిన గజల్ "రాతేన్ గుజర్ దీ హైన్ ..." కు దగ్గరగా ఉంటుంది. తలత్ మహ్మూద్ 1959లో విడుదలైన మనోరమ తెలుగు సినిమాలో రమేష్ నాయుడు సంగీతంలో"అందాల సీమ సుధా నిలయం ...", "గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి బాబయా...", "మరిచిపోయేవేమో ..." మూడు పాటలు పాడారు. ఏ మాత్రమూ తెలుగు తెలియని తలత్‌కు గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఉచ్చారణ తర్ఫీదు నిచ్చారు. ఆ సందర్భంలో ఒక చోట చా, వు శబ్దాలు తలత్‌కు సరిగ్గా రాకపోతూండడాన్ని గమనించి మీకు 'చావు' రాకూడదు అన్నారు పి.బి. శ్రీనివాస్ (ఈ వ్యాస రచయితతో పి.బి. శ్రీనివాస్ చెప్పిన మాట). రమేష్ నాయుడు సంగీతంలో పాడడానికి ముందే తలత్ తెలుగువారైన ఈమని శంకరశాస్త్రి సంగీతంలో 1951లో సంసార్ హిందీ సినిమాలో "మిట్ నహీన్ సక్తా కభీ లిఖా...", "యే సంసార్ యే సంసార్ ప్రీత్ భరా సంసార్..." పాటలూ, 1952లో వచ్చిన మిస్టర్ సంపత్ సినిమాలో "ఓ మృగనయనీ...", "హే భగవాన్..." పాటలూ పాడారు. హిందీలోకి డబ్ ఐన తెలుగు సినిమాలు పాతాళభైరవి, చండీరాణి సినిమాలలో ఎన్.టి. రామారావుకు తలత్ పాడారు. 1964లో వచ్చిన జహాన్ ఆరా సినిమాలోని "ఫిర్ వోహీ షామ్..." పాట తరువాత తలత్ చెప్పుకోతగ్గ పాటలు పాడలేదు. ఆ తరువాత 20లోపు సినిమా పాటలు మాత్రమే పాడుంటారు. అంతకు ముందు 1963లో సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో రుస్తమ్ సొహరాబ్ సినిమాలో తలత్ "మాజన్దరాన్ మాజన్దరాన్..." అంటూ ఒక విశేషమైన పాట పాడారు. తలత్ పాడిన చివరి గొప్ప సినిమా పాట అది. 290 పైచిలుకు సినిమాల్లోని పాటలూ, గైర్ - ఫిల్మీ గీత్ (సినిమా కాని పాటలు) అన్నీ కలుపుకుని తలత్ మొత్తం 747 పాటలు పాడారు. 16 సినిమాల్లో నటించారు. పలు పురస్కారాలతో పాటు 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు తలత్. 24/2/1924న పుట్టిన తలత్ 9/5/1998న పరమపదించారు. 1944 నుంచి 50 వరకూ పాడిన కడుకొద్ది గజళ్లు, గీత్లతోనే మొత్తం భారతదేశ సినిమా, లలిత, గజల్ గానానికి దిశా నిర్దేశం చేశారు తలత్! భారతదేశ సినిమా, లలిత, గజల్ గానం తలత్‌కు ముందు తలత్‌కు తరువాత అని పరిగణించబడతాయి. మనదేశంలో సినిమా, లలిత, గజల్ గాన పరివర్తన కర్త తలత్ మహ్మూద్. Talat Mahmood, a transitional icon of Indian non-classical singing. తలత్ గాత్రంలో స్వాభావికంగా వణుకు ఉంటుంది. Tremulous voice ఆయంది. తలత్ గొంతులోని వణుకుపై బాపు ఒక కార్టూన్ వేశారు. ఆ కార్టూన్లో భార్య రేడియో పెట్టగానే రేడియో లోంచి 'గజగజ' అని వస్తుంది. అప్పుడు భర్త "ఆ గొంతు తలత్ మహమ్మద్ది కదే" అంటాడు. తలత్ గొంతుపై చలోక్తులుగా "అసలే తలత్ కచేరీ అదీ ఉటీలో" వంటివి (గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఈ వ్యాస రచయితకు ఈ మాట చెప్పారు) ప్రచారంలో ఉండేవి.తొలి రోజుల్లో తలత్ తన గొంతులోని tremoloను నియంత్రించుకోవడానికి ప్రయత్నించగా సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ ఆ tremoloతోనే పాడమని పట్టుబట్టారు. గొంతులోని వణుకు కూడా తలత్‌కు గుర్తింపు అయిపోయింది. తలత్ crooningను దక్షిణ భారతదేశంలో పి. బి. శ్రీనివాస్ అర్థం చేసుకుని అందుకుని అమలు చేశారు. పి.బి. శ్రీనివాస్ నుండి అది కె.జె. ఏసుదాస్‌కు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు, వారి తరువాత కొనసాగింపుగా ఇతరులకూ చేరింది. మనదేశంలో crooning ఉంది అంటే అది తలత్ మహ్మూద్వల్ల వచ్చింది అన్నది చారిత్రికం. 1968లో అమేరిక టైమ్స్ స్క్వేర్‌లో ఉన్న ఒక స్ట్యూడియోలో టాక్ షోకు ఆహ్వానించి ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు ఫ్రాంక్ సినాట్రాతో పోల్చి తలత్‌ను "Frank Sinatra of India" అని అన్నారు. తలత్‌కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులుండే వారు. మరే గాయకుడికీ లేనంతగా ఆయనకు ఆ రోజుల్లోనే పెద్ద సంఖ్యలో మాహిళాభిమానులుండే వారు. ఇవాళ్టికీ దేశ వ్యాప్తంగా తలత్ పాటలు పదేపదే వినిపిస్తూనే ఉన్నాయి; ఎప్పటికీ మన దేశంలో తలత్ గానం వినిపిస్తూనే ఉంటుంది. ఒక మెత్తని పాటలా తలత్ ఈ మట్టిపై వీస్తూనే ఉంటారు. సున్నితమైన గానానికి ఉన్నతి తలత్. -రోచిష్మాన్ 9444012279 -
నన్ను హీరోయిన్గా పరిచయం చేసింది ఆమెనే: విజయశాంతి
తెలుగు చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న నటి విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. 1946, 20 ఫిబ్రవరిలో తమిళనాడులో జన్మించిన విజయ నిర్మల సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్రవేశారు. అయితే ఇవాళ ఆమె జయంతి సందర్భంగా సినీయర్ హీరోయిన్ విజయశాంతి ట్వీట్ చేశారు. తనను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేసిన విజయ నిర్మలను గుర్తు చేసుకుంది. నన్ను కళాకారిణిగా విశ్వసించి.. సూపర్ స్టార్ కృష్ణతో హీరోయిన్గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి.. నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మలపై అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనని ట్విటర్ రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆ సినిమా సెట్లో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న రాములమ్మ చివరిసారిగా మహేశ్ బాబు నటింతిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కనిపించింది. నన్ను కళాకారిణిగా విశ్వసించి సూపర్ స్టార్ కృష్ణ గారితో హీరోయిన్ గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి, నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మల గారు... మీ పై ఆ అభిమానం ఆ గౌరవం, ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుగా ఉంచుకునే జ్ఞాపకం తో... జన్మదిన శుభాకాంక్షలతో...💐 మీ… pic.twitter.com/Cicx5jWKUI — VIJAYASHANTHI (@vijayashanthi_m) February 20, 2024 -
National Women's Day ఎపుడు జరుపుకుంటారో తెలుసా?
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సమాజసేవకురాలు, దేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. "నైటింగేల్ ఆఫ్ ఇండియా" ‘‘భారత కోకిల’’గాపేరొందిన సరోజినీ నాయుడు పుట్టిన రోజు నేడు (ఫిబ్రవరి 13). మహిళా దినోత్సవంగా అనగానే సాధారణంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 వతేదీ గుర్తొస్తోంది. కానీ మన దేశంలో మహిళల సాధికారత, సమస్యలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సరోజినీ నాయుడు పుట్టిన రోజును జాతీయ మహిళా దినోత్సవంగా పాటిస్తారు. ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలు మాత్రమే కాదు మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక సరోజినీ నాయుడు. మహిళల అభివృద్ధిలో భారతీయ సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా ఆమె పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినంగా 2014లో ప్రకటించింది. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13 న బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ప్రతీక. కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే కావడంతో సరోజినీ నాయుడుకు కూడా 12 ఏళ్లకే మద్రాసు యూనివర్శిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేసి రికార్డు నెలకొల్పారు. అంతేకాదు 13 ఏళ్ల వయసులోనే ఆమె "లేక్ గర్ల్" అనే కవితను రాసింది.13వ ఏటనే రచయితగా మారిన సరోజినీ రాసిన 'లేడీ ఆఫ్ ది లేక్' కవిత చదివిన నిజాం నవాబు ఆమెను ప్రోత్సహించారు. ఉపకారం వేతనం ఇచ్చి వివిధ రంగాల్లో పరిశోధనలు చేయాలంటూ ఇంగ్లాండు పంపారు. లండన్ కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1905లో అతని తొలి కవితా సంకలనం 'గోల్డెన్ థ్రెషోల్డ్' చూసి ముగ్ధుడైన మహాత్మా గాంధీ ఆమెకు 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' బిరుదును ఇచ్చారు. గోపాల కృష్ణ గోఖలే సూచనలతో 1905లో కాంగ్రెస్ సభ్యురాలిగా చేరిన సరోజినీ నాయుడు, యుకెలో 1915లో తొలిసారి గాంధీజీని కలుసుకున్నారు. అలా జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1925లో ఇండియన్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ రెండో మహిళా అధ్యక్షురాలయ్యారు. 1932లో కాంగ్రెస్ ప్రతినిధిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 1928లో ఇండియా వ్యాపించిన ప్లేగు వ్యాధి కట్టడిలో చేసిన సేవలకు ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం కైజర్-ఐ-హింద్ అవార్డుతో సత్కరించింది. జాతీయ పోరాటంలో, గాంధీజీతో కలిసి జైలుకు కూడా వెళ్లారు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం సరోజినీని 21 నెలలు జైలులో పెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ఆమె చరిత్రకెక్కారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే సాహిత్యరంగంలో ఆమె కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సరోజినీ నాయుడు. ‘బర్డ్ ఆఫ్ ది టైం’, ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్’, ‘ది బ్రోకెన్ వింగ్స్’, ‘దిఫెదర్ ఆఫ్ డాన్’ ‘గిఫ్ట్ ఆఫ్ ఇండియా’, ‘పాల్కీ క్యారియర్స్’ లాంచి రచనలు ఎందరినో ఆకట్టుకున్నాయి. అలాగే ‘ఫీస్ట్ ఆఫ్ యూత్, ది మ్యాజిక్ ట్రీ, ది విజార్డ్ మాస్క్, ఎ ట్రెజరీ ఆఫ్ పొయెం’లు సరోజినీ నాయుడు ఆంగ్ల సాహిత్యానికి మచ్చుతునకలు. పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా వినసొంపుగా పాడేవారట అందుకే ఆమెను ‘భారత కోకిల’ అన్నారు. 1949 మార్చి 2న లక్నోలోని తన కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. -
నేతాజీ జయంతి.. స్వాతంత్ర్య సమరయోధుడికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ శుభాష్ చంద్రబోస్ 127వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఘన నివాళులు ఆర్పించారు. నేతాజీ దేశ సేవను, ధైర్య సాహసాలను సీఎం జగన్ ప్రశంసించారు. స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. యువతలో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారని అన్నారు. .నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. చదవండి: CM Jagan: వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభం స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. యువతలో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/Qoztfg3awD— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2024 -
Yogi Vemana: సీఎం జగన్ పుష్పాంజలి
సాక్షి, గుంటూరు: సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘసంస్కర్త, కవి మహాయోగి వేమన. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
వాజ్ పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని
-
ప్రేమ పేరుతో స్టార్ హీరో మోసం.. చివరి క్షణాల్లో నరకం.. ‘గ్లామర్ క్వీన్’ విషాద గాథ
సిల్క్ స్మిత.. దక్షిణాదిలో ఈ పేరు తెలియని సీనీ ప్రేమికులు ఉండరు. తన అందచందాలతో ఓ తరం కుర్రకారును ఉర్రూతలూగించిన నటి ఆమె. ఓ దశలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే.. సిల్క్‌తో పాట లేకుండా శుభం కార్డు పడేది కాదు. వెండితెర శృంగార తారగా నిలిచిపోయిన సిల్క్ స్మిత.. కాలే కడుపుతో రంగుల ప్రపంచంలోకి అడుపెట్టింది. ఊహించని పేరు, డబ్బు, హోదా సంపాదించి.. 36 ఏళ్ల వయసులోనే ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది. నేడు(డిసెంబర్ 2) సిల్క్ స్మిత జయంతి. ఈ సందర్భంగా ఆమె గురించి.. పదేళ్లకే చదువుకు స్వస్తి సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు చెందిన ఓ పేద కుటుంబంలో 1960 డిసెంబర్ 2న జన్మించింది. ఆమె బాల్యమంతా కష్టాల్లోనే గడిచింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగో తరగతిలోనే చదువు ఆపేసింది. చిన్నవయసులోనే పెళ్లి జరిగింది. అయితే అక్కడ కూడా తనకు సుఖం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అత్తమామల ఇంటిని వదిలి చెన్నైకి వచ్చింది. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మేకప్ చేస్తూనే ... ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సిల్క్ స్మిత నటీమణులకు మేకప్ వేయడం ప్రారంభించింది. తర్వాత ఆమెకు నటి కావాలనే కోరిక మొదలైంది. 1979లో వచ్చిన 'పండిచక్రమ్' తమిళ చిత్రం విజయలక్ష్మి పేరునే కాదు... ఆమె జీవనగమనాన్నే మార్చేసింది. ఆ సినిమాలో విజయలక్ష్మి పాత్ర పేరు సిల్క్. ఆ పేరు బాగా పాపులర్ కావడంతో ఆమె పేరు సిల్క్ స్మితగా మార్చుకుంది. తన 17 ఏళ్ల కెరీర్లో 450పైగా సినిమాల్లో నటించి, తన అందచందాలతో మెప్పించింది. చాలా సినిమాల్లో ఆమె ప్రత్యేక గీతాల్లో నటించింది. సిల్క్ కోసమే దర్శకనిర్మాతలు ఐటమ్ సాంగ్స్ పెట్టేవారు. ఆమె చూడడానికే ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చేశారు. హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం.. ఐటమ్ సాంగ్స్‌కి పెట్టింది పేరుగా సిల్క్ స్మిత వెలుగొందింది. తన అందచందాలతో యువతను ఉర్రూతలూగించింది. అభిమానుల చేత ‘ఇండియన్ మార్లిన్ మన్రో’గా జేజేలు కొట్టించుకుంది. ఒకానొక సమయంలో కథానాయికల కంటే కూడా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఏ హీరో సినిమా అయినా సరే..అందులో సిల్క్ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. సిల్క్ ఉంటే చాలు సినిమా హిట్టే అనేంతలా పేరు సంపాదించుకుంది.అందుకే కొన్ని సినిమాలకు హీరోయిన్లకు మించిన పారితోషికం సిల్క్‌కు అందించారు. ఇలా గ్లామర్ వరల్డ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ జీవితం అర్థాంతరంగా ఆగిపోయింది. 36 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచింది.. హీరోయిన్ అవుదామని వచ్చిన సిల్క్..ఇండస్ట్రీలో ‘ఐటమ్‌గర్ల్’గా మిగిలిపోయింది. అద్భుతమైన నటనతో మెప్పించినా.. నటిగా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. 90ల్లో స్మిత హవ కాస్త తగ్గింది. అవకాశాలు తగ్గడంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తీవ్రంగా నష్టపోయింది. అలాగే వ్యక్తిగతంగా లవ్ ఫెయిల్యూరూ ఆమెను కుంగదీసింది. ఒకవైపు అప్పులు, ఇంకోవైపు ప్రేమతాలూకు మానసిక క్షోభతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయి1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఓ స్టార్ హీరో ప్రేమ పేరుతో మోసం చేయడం తట్టుకోలేకనే స్మిత చనిపోయిందని కొంతమంది అటే.. ఆర్థిక నష్టాల వల్లే ఆత్మహత్య చేసుకుందని మరికొంతమంది అంటారు. నేటికి స్మిత ఆత్మహత్య వెనుకగల కారణాలపై స్పష్టత లేదు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్లో డర్జీ పిక్చర్ అనే సినిమా వచ్చింది. విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పిల్లల కోసం ఎంతో చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే ప్రపంచస్థాయి విద్యకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పీట వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఎక్స్ ద్వారా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులూ అర్పించారు. ‘‘మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ.. ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం’’ అని సందేశంలో సీఎం జగన తెలియజేశారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపిన సీఎం జగన్.. రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2023 -
మౌలానా ఆజాద్ జయంతి వేడుకలకు సీఎం జగన్
సాక్షి, ఎన్టీఆర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శనివారం) విజయవాడకు రానున్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి.. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. నగరంలోని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు జరగనుండగా.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా,ఎమ్మెల్సీలు తలశిల రఘురాం,రుహుల్లా,ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితిసింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏటా నవంబర్ 11వ తేదీని.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని దేశం మొత్తం జాతీయ విద్యా దినంగా, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తుంటారు. -
ఆ పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: భారత దేశ మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, మాజీ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా గుర్తు చేశారాయాయన. 'జై జవాన్, జై కిసాన్' అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన తీసుకున్న ఎన్నోవిప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని శిఖరాగ్రాన నిలిపాయి. నేడు లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి సందర్భంగా నివాళులు అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, మాజీ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ‘జై జవాన్, జై కిసాన్’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన తీసుకున్న ఎన్నోవిప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని శిఖరాగ్రాన నిలిపాయి. నేడు లాల్ బ… pic.twitter.com/VOOEccVdnM — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2023 -
ఇద్దరూ మహాత్ములే! ఆఖరికి ఆ ఇద్దరి..
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడుగా విశ్వ ప్రసిద్ధుడయ్యారు. లాల్ బహుదూర్ శాస్త్రి కూడా మహాత్ముడే. ఇద్దరు గొప్పవాళ్ళు పుట్టినతేదీ ఒకటే కావడం ఆశ్చర్యకరం, పరమానందకరం. ఇద్దరూ అక్టోబర్ 2వ తేదీనాడు జన్మించారు. భారతనేతగా గాంధీ, భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా లాల్ బహుదూర్ శాస్త్రి చరిత్రకు చెప్పలేనంత గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆధునిక నాయకులు. ఇద్దరి ముగింపు విషాదాంతమైంది. గాంధీ తుపాకీ కాల్పులకు గురియై మరణించారు.లాల్ బహుదూర్ మరణం అనుమానాస్పదం. హత్యకు గురిఅయ్యారనే భావనే ఎక్కువమందిలో ఉంది. లాల్ బహుదూర్ శాస్త్రి చాలా గొప్పవాడైనా, గాంధీ-నెహ్రూ ప్రాభవం మధ్య చరిత్రలో, లోకంలో రావాల్సినంత పేరు రాలేదని చరిత్రకారుల అభిప్రాయం. గాంధీ భారతీయ ఆత్మ. ఆత్మాభిమానం రూపం దాల్చుకుంటే అది లాల్ బహుదూర్. ఇంత ఆదర్శవంతమైన లాల్ బహుదూర్ శాస్త్రి.. జవహర్ లాల్ నెహ్రూకు, గాంధీకి ప్రియ శిష్యుడు. మహాత్మాగాంధీ జీవితం ఒక ప్రయోగశాల. కేవలం భారతదేశానికే కాదు, ఎల్ల ప్రపంచనాయకులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహానాయకుడు గాంధీ. సత్యాగ్రహం,అహింస అనేవి గాంధీ నిర్మించిన రెండు గొప్ప సిద్ధాంతాలు. ధర్మాగ్రహంతో,న్యాయాగ్రహంతో సత్యాగ్రహంతో అహింసా మార్గంలో నడిచి,భారతదేశానికి బ్రిటిష్ శృంఖలాల నుంచి విముక్తి కలిగించి, స్వేచ్ఛను ప్రసాదించాడు. భగవద్గీతను ఆశ్రయించాడు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించాడు, న్యాయపోరాటంలో గాంధీ జాతికి జయాన్ని కానుకగా ప్రసాదించాడు.భారతదేశ చరిత్రలో ఆధునిక కాలంలో,స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారత్ కు తొలి విజయాన్ని అందించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. 1965లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో దేశాన్ని నడిపించి, గెలిపించిన ధీరుడు లాల్ బహుదూర్ శాస్త్రి. 20వ శతాబ్దంలో ప్రపంచమానవాళిని ప్రభావితం చేసినవారిలో మహాత్మాగాంధీదే అగ్రస్థానం.సత్యాగ్రహం, సహాయనిరాకరణ గాంధీ ఎంచుకున్న శక్తిమంతమైన ఆయుధాలు.వీటి విలువను ప్రపంచదేశాలు అర్ధం చేసుకోడానికి చాలా కాలం పట్టింది.ఇప్పటికీ చాలా దేశాలకు అసలు అర్ధమే అవ్వలేదు.హిందూ-ముస్లింల మత సామరస్యానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆ అంశమే అతన్ని బలితీసుకుంది. టాల్ స్టాయ్ ను గాంధీ గురువుగా భావించాడు.సామ్రాజ్యవాదం, హింసా విధానాలపై వ్యతిరేకత వీరిద్దరినీ మానసికంగా కలిపింది. గాంధీ జీవితం మొత్తం సత్యశోధనకు అంకితం చేశారు. తను చేసిన తప్పులను తెలుసుకోవడం,వాటి నుంచి నేర్చుకోవడం మార్గంగా సాగారు. అందుకే గాంధీ ఆత్మకథకు 'సత్యశోధన' అని పేరు పెట్టుకున్నారు. సత్యంతో చేసిన ప్రయోగాలే అతని జీవితం. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తిగా నిలిచినవాడు మహాత్మాగాంధీ.ఇటువంటి వ్యక్తి నిజంగా మన మధ్యనే జీవించాడంటే? తర్వాత తరాలవారు నమ్మలేరని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చేసిన వ్యాఖ్య అజరామరం. జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరించాడని మరో మహానేత మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు.నా జీవితమే సందేశం,అని గాంధీయే అన్నాడు. ఇంతటి గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగి దేశభక్తి,నిజాయితీ, ప్రయోగాలు,పవిత్రత,సత్యం, ఆత్మాభిమానం ఉఛ్వాసనిశ్వాసలుగా జీవించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నో నూత్న ప్రయోగాలు ఆవిష్కరించాడు. జవానులను, రైతులను సమానంగా భావించాడు. ఒకరు యుద్ధక్షేత్రంలో ఉంటారు. ఇంకొకరు వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు.జై జవాన్-జై కిసాన్ నినాదం తీసుకువచ్చినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. వ్యవసాయ విప్లవానికి (గ్రీన్ రెవల్యూషన్) కు బాటలు వేసింది కూడా ఈయనే. పంటకు ఎంత విలువ ఇచ్చాడో, పాడికి కూడా అంతే విలువ ఇచ్చాడు.శ్వేతవిప్లవం ఈయన తెచ్చిందే.సోవియట్ యూనియన్, శ్రీలంకతో ఒప్పందాలు కుదుర్చుకొని బంధాలను గట్టి పరచి, విదేశీ విధానంలోనూ తన ముద్ర వేసుకున్నాడు.నెహ్రు క్యాబినెట్ లో మొట్టమొదటి రైల్వే మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి. దేశంలో జరిగిన ఒక రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.అన్నేళ్లు కేంద్ర మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయనకు చివరకు సొంత ఇల్లు కూడా లేదు.కుటుంబ సభ్యుల ఒత్తిడితో అప్పుచేసి కారు కొనుక్కున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే? మహాత్మాగాంధీ , జవహర్ లాల్ నెహ్రు విధానాలకు లాల్ బహుదూర్ శాస్త్రి ఆత్మీయమైన అసలు సిసలు వారసుడు.ఆర్ధిక విధానాలలో నెహ్రును కూడా దాటి ముందుకు వెళ్లారు.మరో గాంధీ పుట్టడు, మరో లాల్ బహుదూర్ శాస్త్రి పుట్టడు.వీరి సిద్ధాంతాలు, ఆచరించిన మార్గాలు ప్రస్తుత కాలంలో ఆచరించడానికి కష్టమైనా,ఏదో ఒక రోజు వీరిని తప్పక అనుసరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ మహానేతలు సర్వకాలీనులు. వీరి సిద్ధాంతులు ఎప్పటికీ అవసరంగానే నిలుస్తాయి. -మాశర్మ సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా! మళ్లీ ఆయన..) -
గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా! మళ్లీ ఆయన..
మహాత్ముడి అవసరం పెరిగిందిగాంధీజీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. తన సిద్ధాంత బలంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనది. అహింస అనే ఆయుధంతో, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం ‘డూ ఆర్ డై’ ఎందరినో ఉత్తేజితులను చేసింది. ‘విజయమో, వీర స్వర్గమో’ అనే నినాదంతో యావత్ దేశ ప్రజలు ముందుకురికి భారత గడ్డ మీద నుంచి బ్రిటిష్ వారిని తరిమేశారు. మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరం తిరగకుండానే 1948 జనవరి 30న ఆయన హత్యకు గురై దేశాన్ని శోకసంద్రంలో ముంచారు. ఆయన ఘనత ప్రపంచ మంతా గుర్తించింది. అయితే భారతదేశంలో ఆయన్ని మెల్లగా మరచిపోతున్న ధోరణి కనిపించడం బాధాకరం. గాంధీజీ జయంతి సందర్బంగా ఆయన ఆశ యాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేసుకోవ లసిన అవసరం ఉంది. ‘అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్లు ఎప్పుడైతే క్షేమంగా వెళతారో ఆరోజే నా దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని ప్రకటించారు గాంధీ. గాంధీ సహించనివి– మగువలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, హత్యలు, కక్షలు, వైషమ్యాలు. కానీ ఇవే ఎక్కువైన ఈ సమాజంలో ఆయన ఆదర్శం గాలికి కొట్టుకుపోయిందని చెప్పక తప్పదు. మతసామరస్యాన్ని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. కానీ ఇవాళ మత అసహనం పెచ్చరిల్లుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి చంపేసే దృశ్యాలు అనేకం చూస్తున్నాం. నేడు అంతటా, అన్ని రంగాలలో అవినీతి పెచ్చరిల్లింది. గాంధీజీ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా గ్రామాలు స్వయం పోషకత్వం సాధించి ఏ గ్రామానికది ‘స్వరాజ్యం’గా అభివృద్ధి చెందాలనుకున్నారు. మరి ఆయన కలలను మన పాలకులు ఎంతవరకు నెరవేర్చారో సమీక్షించుకోవాలి. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు, తాడిపత్రి ‘ 93915 23027 (చదవండి: తెలంగాణ పోరాట స్ఫూర్తి!) -
తెలుగు సినీ దిగ్గజం.. అక్కినేనికిదే శతజయంతి నివాళి!
తెలుగు సినిమా దిగ్గజం, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లాలో పుట్టి సినీ ప్రపంచంలోనే తనకంటూ ఓ సామ్రాజ్యం ఏర్పరచుకున్న ఏకైక నటుడు మన అక్కినేని. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. దాదాపు 250కి పైగా చిత్రాల్లో కళామతల్లి ఒడిలో ఒదిగిపోయారు. ఆయన శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. (ఇది చదవండి: భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్) అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ తారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు, సుమంత్, నాగచైతన్య, అమల, అఖిల్ ఆయనకు నివాళులర్పించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, శ్రీకాంత్, జగపతిబాబు, రానా, మంచు విష్ణు, నాని, దిల్ రాజు, మోహన్ బాబు, రామ్ చరణ్, మహేశ్ బాబు, సుమ కనకాల, టాలీవుడ్ సినీ పెద్దలు పాల్గొన్నారు. A moment of joy and pride for the fans of #AkkineniNageswaraRao Garu ✨💫 Former Vice President of India Shri. @MVenkaiahNaidu Garu unveils the statue of #ANR garu at @AnnapurnaStdios marking the centenary birthday ❤️ Watch ANR 100 Birthday Celebrations live now! -… pic.twitter.com/5ajMSNFiM1 — Annapurna Studios (@AnnapurnaStdios) September 20, 2023 -
భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్
టాలీవుడ్ దిగ్గజం, వెండితెరపై చెరదని ముద్ర వేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తన సినీ జీవితంలో దాదాపు 250కు పైగా చిత్రాలతో ఏడు దశాబ్దాల కాలం పాటు వెండితెరపై అలరించిన నటుడు బహుదూరపు బాటసారి ఆయన. 16 ఏళ్ల వయసులోనే పుల్లయ్య చిత్రం ధర్మపత్నిలో చిన్నవేషం వేసినా.. అక్కినేని సినీ యాత్ర మొదలైంది మాత్రం 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాతోనే. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన శతజయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!) మెగాస్టార్ ట్వీట్లో రాస్తూ.. 'శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి , నా సోదరుడు నాగార్జునకు, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు !!' శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా పేరొందిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఈ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. 🙏🙏 ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని… pic.twitter.com/yrAxhk7pgb — Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2023 -
భాషోద్యమంలో పిడుగు గిడుగు!
"దేహబలమున కోడి రామమూర్తి- బుధ్ధిబలమున గిడుగు రామమూర్తి" అంటూ అభివర్ణించిన ఓ కవి మాటలు ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నాయి. నేడే (ఆగష్టు 29) గిడుగు వెంకటరామమూర్తి జయంతి. ఆ మహనీయుని యశఃకాయానికి 160 ఏళ్ళు నిండుతున్న పండుగ వేళలో మనమున్నాం.ఇప్పటికే వారోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి.ప్రతి ఆగస్టు 29వ తేదీ గిడుగు స్మృతికి నివాళిగా 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. సరే! కొందరు మొక్కుబడిగా చేస్తారు. మరికొందరు భాషానురక్తితో మొక్కుగా భక్తితో చేస్తారు. ఈరోజు మనం రాసే భాష వెనకాల ఆయన స్వేదం ఉంది. నిత్యం తలచుకోవాల్సిన మాననీయుడు గిడుగు. తెలుగు వెలుగు గిడుగు ఆధునిక తెలుగు మానవుడు ఎలా చదవాలి, ఎలా రాయాలి,ఎలా అర్ధం చేసుకోవాలి,భాషామయమైన ప్రయాణం ఎలా చెయ్యాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు. ఈరోజు మనం రాసే భాష,చదివే భాష,పుస్తకాల్లో,పత్రికల్లో, ఉపన్యాసాల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న భాష,మనల్ని కదిలిస్తున్న భాష గిడుగు చేసిన త్యాగాలు,వేసిన మూలాల ఫలమేనని విశ్వసించాలి. గిడుగు వెంకటరామమూర్తి ఎప్పుడో 160ఏళ్ళ నాటి వాడు. ఎటు చూసినా పండితులు, కవులు, వారికి మాత్రమే అర్ధమయ్యే గ్రాంథిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగినవాడు. ఈ విధానం ఇదే రీతిలో సాగితే, సామాన్యుడికి ఆ జ్ఞాన ఫలాలు ఎప్పుడు అందాలి,భాష ఎప్పుడు వికాసం చెందాలి, జనబాహుళ్యం ఆ భాషకు ఎన్నడు దగ్గరవ్వాలని మదనపడి మనకోసం అలోచించిన మనమనీషి. Warm wishes on #TeluguLanguage Day! The KMC team pays homage to Gidugu Venkata Ramamurthy, whose ideas and literary work for social reform endure, leaving an indelible mark on generations. pic.twitter.com/bnErRj3wmV — Commissioner Kadapa (@KadapaComsr) August 29, 2023 ఆధునిక భాషా మహోద్యమంలో తొలి అడుగు వేసినవాడు గిడుగు. భాషాసాహిత్యాలు,చరిత్ర పుష్కలంగా,క్షుణ్ణంగా చదువుకొని,ముందుగా తను జ్ఞాన స్వరూపుడిగా తయారై, సామాన్యుడి చెంతకు భాషను చేర్చాలని రంగంలోకి దిగిన చిచ్చరపిడుగు గిడుగు. ఇటు వ్యావహారిక భాష - అటు సవర భాష కోసం జీవితమంతా అంకితమయ్యాడు. ఆరోగ్యం కోల్పోయాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. గిరిజనులను ఇంట్లోనే ఉంచుకొని భోజనం పెట్టి పాఠాలు చెప్పాడు. కొండలు కోనలు తిరిగి భాషను సామాన్యుడికి చేర్చిన అసామాన్యుడు గిడుగు. అందరికీ అర్ధమవ్వాలానే తపన తప్ప,గ్రాంథిక భాషను ఎన్నడూ వ్యతిరేకించలేదు. పద్యాలను, కావ్యాలను, వ్యాకరణాలను,ఛందస్సును పండితులను,కవులను ఎప్పుడూ తూలనాడలేదు.సంప్రదాయమైన సర్వ వ్యవస్థలనూ గౌరవించి, అధ్యయనం చేసి, భవ్య మార్గాన్ని పట్టిన నవ్య ప్రయోగశీలి గిడుగు వెంకటరామమూర్తి. అడవుల్లో జీవించేవారు మాట్లాడుకునే 'సవర' భాషకు వ్యాకరణం రూపకల్పన చేసి, శాస్త్రీయత తీసుకువచ్చిన ఘనుడు. అధ్యాపకుడిగా, జ్ఞాన సముపార్జన కోసం విద్యార్థులు పడే కష్టాన్ని అర్ధం చేసుకున్నాడు. తమ భావాలకు అక్షరరూపం ఇవ్వడానికి సామాన్యులు పడే తపనను తెలుసుకున్నాడు. గ్రాంథిక భాషా బంధనాల నుంచి విద్యా విధానాన్ని తెంచి, ప్రజలభాషలోకి తెచ్చాడు.దాని వల్ల చదివేవారి సంఖ్య,చదువరుల సంఖ్య పెరిగింది.తద్వారా, తెలుగునేలపై అక్షరాస్యత పెరిగింది. ఆలోచన పెరిగింది. ఆలోచనను వ్యక్తీకరించే శక్తి పెరిగింది.వాడుకభాష అవసరాన్ని చెబుతూ వీధివీధులా తిరిగాడు. The Governor said the Telugu Language Day marks the birth anniversary of eminent Telugu linguist, poet and visionary Sri Gidugu Venkata Ramamurthy.#Telugulanguageday #giduguvenkataramamurthy — governorap (@governorap) August 29, 2023 పండితులతో గొడవలు పడ్డాడు. ఇంటినే బడిగా మార్చాడు. సొంతంగా 'తెలుగు' అనే పేరుతో ఒక పత్రికను నడిపాడు. గురజాడ,కందుకూరి వీరేశిలింగం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి,తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి,పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైనవారు గిడుగుకు అండగా నిలిచారు.ఆయనతోకలిసి, వాడుకభాషా ఉద్యమంలో నడిచారు. బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియొ చెల్లకో, జండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని మొదలైన వాడుక భాషా పదాలతో తిరుపతి వేంకటకవులు 'పాండవ ఉద్యోగ విజయాలు' పేరుతో పద్యనాటకాలు రాయడానికి ప్రేరకుడు గిడుగు. దానికి కారకుడు,పోషకుడు పోలవరం జమీందారు రాజా కొచ్చెర్లకోట వెంకటకృష్ణారావు. వాడుకభాష కోసం ఉద్యమించే గిడుగు వ్యాకరణానికి,ఛందస్సుకు ఎవరైనా గౌరవం ఇవ్వకపోయినా, వ్యాకరణపరమైన తప్పులు జరిగినా ఊరుకునేవాడు కాడు. ఎంతటి పండితుడినైనా చీల్చి చెండాడేవాడు. మీసాలపై తిరుపతి వేంకటకవులు చెప్పిన పద్యం తెలుగులోకంలో సుప్రసిద్ధం. మీసం పెంచడం సంగతి తర్వాత... ముందు..ఆ పద్యంలో ఉన్న దోషం సంగతి చూడు...అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి గిడుగు మొట్టికాయలు వేశాడు. గెల్చితిరేని అని ఉండాలి.నువ్వు గెల్చిరేని అని రాశావు,ఇది తప్పు,సరిదిద్దుకో... అంటూ తిరుపతి వేంకటకవులను నిలదీశాడు. ఆమ్మో! గిడుగు పిడుగే అంటూ చెళ్ళపిళ్ళ సర్దుకున్నాడు. #TeluguLanguageDay Gidugu Venkata Ramamurthy, born on 29 August 1863, was a Telugu writer and one of the earliest modern #Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a #language comprehensible to the common man #philately pic.twitter.com/15sG2jw4Q1 — South India Philatelists' Association, Chennai (@SIPA_chennai) August 29, 2023 అంతటితో ఆగక 'గిడుగు పిడుగే' అని ప్రత్యేక వ్యాసం కూడా రాశాడు. 'పాండవ ఉద్యోగవిజయాలు' వంటి పద్యకృతులతో పాటు,చెళ్ళపిళ్ళ ఎన్నో వచన రచనలు చేశారు. ఇవన్నీ వ్యావహారిక భాషలోనే రాశారు. ఇలా,తిరుపతి వేంకటకవుల వంటి సంప్రదాయ పద్యకవులను కూడా వాడుక భాషవైపు మళ్లించిన ఘటికుడు గిడుగు. ముఖ్యంగా చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి ఆ బాటలో నడిచారు. స్వయంకృషితో శాసనాల భాషను అర్ధం చేసుకోవడం నేర్చుకున్న పట్టుదల గిడుగు సొంతం.ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు పర్లాకిమిడి వంటి తెలుగుప్రాంతాలు కూడా ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్లిపోయాయి. ఈ విధానాన్ని గిడుగు తీవ్రంగా వ్యతిరేకించడమేకాక, తెలుగునేలపైనే జీవించాలనే సంకల్పంతో,తన సొంతవూరు పర్లాకిమిడిని వదిలి రాజమండ్రికి తరలి వచ్చేశాడు. గిడుగుకు తెలుగుభాష,గాలి,నేలపై ఉండే భక్తికి,ప్రేమకు అది గొప్ప ఉదాహరణ.1937లో తాపీ ధర్మారావు సంపాదకుడిగా 'జనవాణి'అనే పత్రికను స్థాపించారు.కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయడం మొదలుపెట్టారు.అదంతా కూడా గిడుగు ప్రభావమే.గిడుగు,గురజాడ ఇద్దరూ విజయనగరంలో సహాధ్యాయులు. ఇద్దరూ వాడుకభాషకోసం ఉద్యమించినవారే కావడం విశేషం. సంస్కృతం, ఇంగ్లిష్,చరిత్ర ముఖ్య విషయాలుగా గిడుగు బి.ఏ పూర్తి చేశారు. సంస్కృతం,ఇంగ్లిష్,తెలుగు బాగా చదువుకున్నారు. సామాన్యులకు అర్ధం కావడం కోసం తన భాషాపాండిత్యాన్ని కుదించుకొని,వాడుకభాషలో రచనలు చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజలను చైతన్య పరిచారు,జ్ఞానాన్ని సామాన్యుడి చెంతకు చేర్చారు. కావ్యాలను, ప్రబంధాలను,గ్రాంథికభాషను, అలంకారశాస్త్రాలను గౌరవిస్తూనే, ఆధునిక భాషాయానం చేసిన అత్యాధునికుడు,దార్శనికుడు, ఆదర్శప్రాయుడు గిడుగు. భాషను సామాన్యుడికి చేర్చమని చెప్పాడు కానీ,భాషాపాండిత్యాలు, అధ్యయనాల స్థాయిని దిగజార్చమని ఎప్పుడూ చెప్పలేదు. ఛందస్సు,వ్యాకరణం,పద్యాలు, ప్రబంధాలను వదిలివెయ్యమని గిడుగు ఏనాడూ అనలేదు. భాషకోసమే శ్రమించి,సామాన్యుడి కోసమే తపించి జీవించిన పుణ్యమూర్తి గిడుగు రామమూర్తి. విద్యార్థికి ప్రతి దశలో తెలుగు భాషను అందించాలి. కనీసం 10ఏళ్ళ వయస్సు వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.… pic.twitter.com/Ie0WoIsL0z — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2023 తెలుగుభాషా,సాహిత్యాలు చదువుకున్నవారికి ప్రోత్సాహంలో, ఉపాధిలో, ఉద్యోగాలలలో పెద్దపీట వెయ్యాలి. తెలుగు చదువుకున్నవారు ఆత్మన్యూనతకు గురయ్యే పరిస్థితులు కల్పించరాదు. 'పద్యం' మన ఆస్తి, 'అవధానం' మన సంతకం. ఆధునికత పేరుతో వ్యాకరణం, ఛందస్సులను దూరం చేస్తే? కొన్నాళ్ళకు మనవైన పద్యాలు, అవధానాలు కానరాకుండా పోతాయి. మన భాషా భవనాల పునాదులు కదిలిపోతాయి.మెల్లగా మనదైన సంస్కృతి మృగ్యమైపోతుంది. తెలుగును వెలిగించడం, ఆ వెలుగులో జీవించడమే గిడుగు వంటి తెలుగు వెలుగులకు మనమిచ్చే అచ్చమైన నివాళి. భాష,సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడమే నిజమైన వేడుక. మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి! నేడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి) -
Telugu Language Day: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి!
గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి వ్యవహారిక భాష అనగానే మన మదిలో మెదిలేది గిడుగు వేంకట రామమూర్తి పంతులు. నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషో ద్యమం కోసం గ్రాంథిక వాదులతో అలు పెరగని పోరాటం చేశారు. వారు సలిపిన భాషోద్యమం అచ్చంగా అభ్యుదయ సమాజం కోసమే అని చెప్పాలి. నోటి మాటకు, చేతిరాతకు సంధానం కుదిరినప్పుడే భాష పోషకంగా ఉంటుందని భావించారు. పండితులకే పరిమితమైన భాషను, కొద్దిమంది మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉన్న విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటు లోకి తేవాలని ఆయన పరితపించారు. శిష్ట వ్యవహారిక భాషకు పట్టం కట్టినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన సంప్రదాయ భాషా వాదులపై సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే సంప్రదాయ భాషా వాదులు ఆయన వాదనను బలంగా తిరస్కరించారు, అయినా గిడుగు వారు ఉద్యమించారు. ప్రజల భావాలకు అనుగుణంగా భాష ఉండాలనీ, వాళ్ళ భావాలను అందరికీ అర్థ మయ్యే రీతిలో రాయగలగాలనీ, అందుకే వాడుక భాష చాలా అవసరం అని గిడుగు వారు వాదించారు. సంప్రదాయ సాహిత్య వాదులు, కవులు అయిన తిరుపతి వేంకట కవులు కూడా భాషలో మార్పుల్ని సమర్థించారు. ప్రారంభంలో కందు కూరి వారు సంప్రదాయ సాహిత్య పక్షాన నిలి చినా తదనంతరం గిడుగు వారి ఉద్యమ దీక్షలో సత్యాన్ని గ్రహించి ఆయన కూడా వ్యవహారిక భాషోద్యమానికి బాసటగా నిలిచారు. ఫలితంగా గిడుగు వారి ఉద్యమం మరింత బలపడింది. గురజాడ, గిడుగు ఇద్దరూ అభ్యుదయవాదులు మాత్రమే కాదు, అద్భుతమైన భావజాలాలను కలబోసుకున్న మిత్రులు. విజయనగరంలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఎంతో కష్టపడి సవరభాష నేర్చుకొని అదే భాషలో పుస్తకాలు రాసి, సొంతడబ్బుతో బడులు ఏర్పాటు చేసి, సవరలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు గిడుగు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో ‘రావు బహదూర్‘ బిరుదు ఇచ్చారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్నీ, 1936లో ‘సవర–ఇంగ్లీషు కోశా’న్నీ తయారు చేశారు. ప్రభుత్వం ఆయనకు ‘కైజర్–ఇ–హింద్’ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1919–20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాస పత్రిక నడిపారు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ సభలో నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేశారు గిడుగు. ‘సాహితీ సమితి’, ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వంటి సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి. గిడుగు రామ మూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించారు. ఆ క్రమంలో విశ్వవిద్యాలయాలన్నీ వ్యవ హారిక భాషకు పట్టం కట్టడం ప్రారంభించాయి. కాగా మరోవైపు గిడుగు వారి అనుంగు శిష్యుడైన తాపీ ధర్మారావు సంపాదకీయాలతో ప్రారంభ మైన వ్యవహారిక భాష... పత్రికల్లోనూ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వ తాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు అలు పెరుగని వ్యవహారిక భాషోద్యమం చేస్తూ జనవరి 1940 జనవరి 22న కన్ను మూశారు. భాషను పరిపుష్టం చేయడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. భాషాభి మానులందరూ కూడా ఇందులో మమేకం కావాలి. తెలుగువారు తెలుగుతో పాటుగా ఇంగ్లీషు వంటి అంతర్జాతీయ భాషలలో పట్టు సాధించగలిగితే మన సాహిత్య అనువాదాలు ప్రపంచవ్యాప్తమవుతాయి తెలుగు వారు ఉన్నత స్థితిలో నిలిచినప్పుడు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అదే స్థాయిలో నిలబెట్ట గలుగుతారన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే మనకోసం, మన పాలనావసరాల కోసం, ‘మన సంస్కృతి–సంప్రదాయాల కోసం, తెలుగు భాష... భవిష్యత్తు అవసరాల కోసం ఇంగ్లీష్ భాష’ అనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భాషావాదులు కువిమర్శలు పట్టించు కోకుండా వాస్తవాలను గ్రహించగలిగితే, తెలుగు భాష అజంతం, అజరామరం అనేదానికి సార్థకత ఉంటుంది. ప్రపంచ పటంలో తెలుగు కీర్తి రెపరెప లాడుతుంది. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (చదవండి: ''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..'') -
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలలోనూ రాజకీయాలా ?
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చర్చలు జరపడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగేళ్లుగా కమలనాధుల కటాక్షం కోసం పరితపిస్తున్న చంద్రబాబు తాజాగా ఎన్టీఆర్ కార్యక్రమాన్ని తన రాజకీయాలకు వేదికగా చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం తన భార్య సోదరి పురందేశ్వరి ఉపయోగించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి చంద్రబాబు ముందుగానే చేరుకున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి వచ్చారు. అదే అదనుగా భావించి చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట కలిపారు. ఓ వైపు కార్యక్రమం నడుస్తుండగానే చంద్రబాబు వంగిమరి జేపీ నడ్డా చెవిలో గుసగుసలు కొనసాగించారు. ఆ తర్వాత కార్యక్రమం ముగియగానే తేనేటి విందు జరిగింది. అక్కడ జేపీ నడ్డాతో పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చర్చిస్తుండగా చంద్రబాబు మరోసారి చేరుకున్నారు. టీ తాగి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనంతరం చంద్రబాబు రెండో విడత చర్చలు నడ్డాతో మొదలు పెట్టారు. ఈసారి పురంధేశ్వరి సైతం చర్చల మధ్యలో ఉన్నారు. వీరు ముగ్గురు దాదాపు పది నిమిషాలు రాజకీయ అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. ఓ వైపు పవన్, నాదెండ్ల మనోహర్ ద్వారా బీజేపీ పొత్తు కోసం లాబీ చేస్తున్న బాబు , ఈ సారి పురంధేశ్వరి ద్వారా బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారట. ఇందుకోసం తాజాగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు చేతిలో తన తండ్రికి, తన భర్తకి జరిగిన అన్యాయాన్ని పురంధేశ్వరి మరిచి బాబు స్వార్థ రాజకీయాలకు సహకరించడం పై ఇంటా, బయట విమర్శలు వస్తున్నాయి. అయితే, చంద్రబాబు స్వభావం తెలిసిన కమలనాథులు ఇప్పటికే బాబుకి ఇవ్వాల్సిన సందేశం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు ఆయన వల్ల రాజకీయాలలో ఎదిగిన బాబు, ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని తన రాజకీయాలకు వాడుకోవడం విషాదం. దానికి పురందేశ్వరి లాంటి వారు సైతం సహకరించడం సరైంది కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మనిషి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలని అడుగుతున్నా మామకే వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ నుంచి సీఎం కుర్చీని లాగేసుకున్న వ్యక్తి చంద్రబాబని సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. సోమవారం నగరిలో విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని మండిపడ్డారు. ‘ఎన్టీ రామారావును సీఎం కుర్చీని వీళ్లే లాగేసుకున్నారు. వెన్ను పోటు పొడిచారు. పార్టీని లాగేసుకున్నారు. ఎన్టీఆర్ చావుకు వీళ్లే కారణం అయ్యారు. ఇదే దుర్మార్గుడు ఇదే ఎన్టీఆర్ చనిపోగానే శవాన్ని లాక్కుకుంటారు. ఫొటోలకు దండలేస్తారు. ఫొటో ముందు ప్రతి రోజూ దండం పెడుతూ తిరుగుతారు. ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు ఇదే చంద్రబాబు. ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలని అడుగుతున్నా’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. చదవండి: నన్ను పిలవకపోవడం దుర్మార్గం.. అసలు విలన్ పురంధరేశ్వరి: లక్ష్మీపార్వతి ‘పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!’ -
ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య
నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని ఆయన అలరించారు. ఆపై రాజకీయాల్లో రానించాలనే ఆలచనతో తొలి అడుగు కూడా వేశారు. కానీ చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. సుమారు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో వెంటిలేటర్‌పైనే తారకరత్నకు చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు. ఇదే ఏడాది ఫిబ్రవరి 18న ఆయన మరణించారు. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ సంఘటన చూసిన వారందరి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన భర్త మరణ వార్తను జీర్ణించుకోలేని అలేఖ్యను ఓదార్చడం ఆ సమయంలో ఎవరి వల్ల కాలేదు. తాజాగ వారి పిల్లల పుట్టినరోజు సందర్భంగా తారకరత్నను అలేఖ్యరెడ్డి గుర్తుచేసుకున్నారు. నేడు తారకరత్న కవలపిల్లులు అయిన తాన్యారామ్, రేయాల పుట్టినరోజు. దీంతో అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ చేశారు. అంతేకాకుండా తారకరత్నతో వారికున్న తీపిగుర్తులకు సంబంధించిన ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేశారు. మొదట వారి పెద్ద కూతురు అయిన నిష్క తారకరత్న ఫోటోకు పువ్వులు పెడుతుండగా ఇద్దరు ట్విన్స్ ఆమెకు సాయిం చేస్తున్నారు. (ఇదీ చదవండి: పూజా హెగ్డేకు సర్జరీ.. అసలు కారణం ఇదే!) ఇలా ఆ ఫోటోలు చూస్తూ.. తారకరత్నను మరోసారి గుర్తుచేసుకున్న ఎవరైనా కూడా భావోద్వేగానికి గురికాక తప్పదు. ఆ వీడియోతో పాటు తారకరత్న గురించి అలేఖ్య రెడ్డి ఇలా రాసుకొచ్చారు. తాన్యారామ్, రేయాలకు ఎంత ప్రయత్నించినా, ఎంత ఆలోచించినా వారిద్దరికీ పుట్టునరోజు శుభాకాంక్షలను ఆనందంగా చెప్పలేకపోతున్నానని తారకరత్నను ఆలేఖ్య గుర్తుచేసుకున్నారు. 'ఇలాంటి ఆనంద సమయంలో మీరు లేరు. కానీ పిల్లల మొఖంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. అలా మాతోనే ఉంటావ్. వర్షం కురిసే రోజు ఇంద్రధనుస్సు కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, పొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నావు. ఓబు (తారకరత్న), మమ్ము, ఎన్ నిష్క.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీరు ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను రెట్టింపు చేయాలని, వేడుకలను రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు.' అని ఆలేఖ్య తెలిపారు. పిల్లల పేర్లలో ఎన్టీఆర్ మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో తన భర్త రాజకీయ జీవితం అత్యంత క్రూరంగా ముగిసిందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్బంగా వీర్ భూమిలో ఆయనకు నివాళులర్పించి ఢిల్లీలోని జవహర్ భవన్లో జరిగిన జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు సోనియా గాంధీ. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, మరికొంత మంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 25వ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ.. నా భర్త రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం చాలా తొందరగా అత్యంత కిరాతకంగా ముగిసినప్పటికీ ఆయన ఈ కొంత కాలంలోనే ఎవ్వరికి సాధ్యం కాయాన్ని ఎన్నో ఘనతలు సాధించారన్నారు. ఆయనకు దొరికిన కొద్దిపాటి సమయంలోనే దేశం కోసం, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఎంతో చేశారని జ్ఞాపకము చేశారు. రాజీవ్ గాంధీ ముందుచూపుతో వ్యవహరించడం వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా పంచాయతీల్లోనూ, మున్సిపల్ కార్యవర్గాల్లోనూ మహిళలు సుమారు 15 లక్షల మంది ఉన్నారన్నారు. ఇదంతా ఆనాడు రాజీవ్ గాంధీ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడో వంతు స్థానం కల్పించడానికి చేసిన కృషి ఫలితమేనన్నారు. అలాగే ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు కుదించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా సోనియా గాంధీ ప్రస్తుత పరిస్థితుల గురించి వివరిస్తూ మత సామరస్యాన్ని చెడగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టడమే ప్రధాన ఎజెండాగా చేసుకుంటున్నారు. వీరికి మరికొంత మంది మద్దతు తెలపడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు. రాజీవ్ గాంధీ మత, జాతి, భాష, సంస్కృతులను సున్నితమైన అంశాలుగా చెబుతూ వీటిని అందరం కలిసి పండగలా నిర్వహించుకుంటేనే జాతి ఐక్యత సాధ్యమని నమ్మేవారన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం 40 ఏళ్ల వయసులో ప్రధాన మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1989 డిసెంబర్ 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1944, ఆగస్టు 24న జన్మించిన ఆయన ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో 1991, మే 21న మృతి చెందారు. ఈ జాతీయ సద్భావనా అవార్డు 2021-22 సంవత్సరానికి గాను రాజస్థాన్ లోని గురుకుల పాఠశాల బానస్థలి విద్యాపీఠ్ మహిళల గురుకుల సంస్థకు అందజేశారు. ఆ సంస్థ తరపున సిద్దార్ధ శాస్త్రి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఇది కూడా చదవండి: ‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’ -
'సౌందర్య చనిపోలేదు.. ఆ రూపంలో ఇంకా బతికే ఉంది'
సినిమాల్లో గొప్ప పేరు సంపాదించుకున్న నటీనటులు చాలా తక్కువ మందే ఉంటారు. కొందరికి ఫేమ్ వచ్చినా దాన్ని ఎక్కువకాలం కొనసాగించాలంటే అంతా ఈజీ కాదు. అప్పట్లోనే మంచి గుర్తింపు సాధించుకున్న నటీమణులు కొందరు ఊహించని పరిణామాలతో మనకు దూరమయ్యారు. అందంతో తెరపై ఆకట్టుకున్న కొందరు హీరోయిన్లు చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దురదృష్టవశాత్తు సినీ ఇండస్ట్రీ కోల్పోయిన ఆ స్టార్ హీరోయిన్ గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: చనిపోయే రోజు సౌందర్య ఏం కోరిందో తెలుసా?) సౌందర్య పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి తనదైన నటనతో మెప్పించింది. ప్రధానంగా వెంకటేశ్ జోడీగా సూపర్ హిట్ చిత్రాల్లో చేసింది. రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు లాంటి విజయవంతమైన జోడీగా నిలిచారు. అంతే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించారు. కాగా.. 1971 జూలై 18న కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగల్ గ్రామంలో జన్మించిన సౌందర్య విమాన ప్రమాదంలో మరణించారు. 2004లో ఏప్రిల్ 17న ఎన్నికల ప్రచారానికి వెళ్తండగా ఆమె ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనతో సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. జూలై 18న మంగళవారం ఆమె 19వ జయంతి సందర్భంగా సౌందర్యను ఓసారి స్మరించుకుందాం. పెళ్లై ఏడాది కాకముందే.. సౌందర్యం తన మేనమామ, బాల్య స్నేహితుడైన జీఎస్ రఘును 2003 ఏప్రిల్ 27న పెళ్లి చేసుకున్నారు. సామాజిక సేవలో ముందుండే సౌందర్య ప్రజల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేపట్టింది. తన స్వగ్రామమైన ముళబాగల్ తాలూకాలోని గంగికుంటను అభివృద్ధి పరచారు. అయితే సౌందర్య, తన తమ్ముడు అమర్నాథ్ ప్రమాదంలో చనిపోయాక వారి కుటుంబ సభ్యులు నేరవేర్చారు. అమర సాత్విక సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' పేరుతో అమర సౌందర్య ఫౌండేషన్ స్కూల్‌ను బెంగళూరులో స్థాపించారు. ఈ పాఠశాల ద్వారా మానసికంగా ఎదుగుదల లేని(ఆటిజం) పిల్లలకు విద్యనందిస్తున్నారు. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకున్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఎంతో మంది విద్యార్థుల గుండెల్లో ఇంకా బతికే ఉంది. చివరి కోరిక తీరకుండానే! ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు తన వదినను కాటన్ చీర, కుంకుమ తీసుకురమ్మని అడిగిందట.! అప్పుడు తన దగ్గర కాటన్ చీర లేకపోవడంతో ఒకటి కొని తీసుకురమ్మని కోరిందట. అప్పటికే ఆమె బీజేపీలో చేరడంతో ఆ చీర కట్టుకుని ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకుంది సౌందర్య. తనకు కుంకుమ ధరించడం అలవాటు, కాబట్టి దాన్ని కూడా తెమ్మని చెప్పింది. కానీ ఇంతలోనే సమయం కావస్తోందని విమానం ఎక్కేయడం, అది కూలిపోవడంతో సౌందర్య అక్కడికక్కడే మరణించడం తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది సౌందర్య వదిన. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు ) -
కాంగ్రెస్ VS బీజేపీ: పీవీ జయంతి చుట్టూ రాజకీయాలు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102 వ జయంతి సందర్భంగా జాతీయ నేతలతోపాటు తెలుగు రాష్ట్రాల నేతలు ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం నెక్లెస్‌రోడ్డులోని పీవీ ఘాట్‌కు వెళ్లి పలువురు నేతలు ఆయన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. దేశానికి పీవీ చేసిన సేవలను సర్మించుకున్నారు. పీవీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశాన్ని ట్విటర్లో పంచుకున్నారు. భారతదేశ అభివృద్ధికి అతని దూరదృష్టి గల నాయకత్వం, నిబద్ధత ఎంతో గొప్పదని, మన దేశ ప్రగతికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను గౌరవిస్తున్నామంటూ పీవీని ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. Remembering Shri PV Narasimha Rao Ji on his birth anniversary. His far-sighted leadership and commitment to India’s development was noteworthy. We honor his invaluable contributions to our nation's progress. — Narendra Modi (@narendramodi) June 28, 2023 అదే విధంగా పీవీకి కాంగ్రెస్ నివాళులు అర్పించింది. పీవీ నరసింహారావు భారత ఆర్థిక వ్యవస్థకు అనేక ఉదారవాద సంస్కరణలను అందించారని పేర్కొంది. నేడు స్వదేశంలో, విదేశాలలో భారతదేశాన్ని పునర్నిర్మించిన విశిష్ట రాజనీతిజ్ఞుడు పీవీకి తాము వినయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నామని ట్విటర్ ద్వారా తెలిపింది. On his birth anniversary, we remember the former PM of India, P.V. Narasimha Rao, who introduced some noteworthy liberal reforms to the Indian economy. Today, we pay a humble tribute to Mr. Rao, a distinguished statesman who reinvented India, both at home & abroad. pic.twitter.com/Cb0YPKbGjw — Congress (@INCIndia) June 28, 2023 అయితే, కాంగ్రెస్‌పై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్‌కు పీవీ నరసింహారావు ఇప్పుడు గుర్తొచ్చారా? అని బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వీయా ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ట్వీట్లు చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్ అవమానించిందని గుర్తుచేశారు. పీవీ మరణించిన సమయంలోనూ సోనియా గాంధీ ఆ గొప్ప వ్యక్తిని గౌరవించలేదని మండిపడ్డారు. మాజీ ప్రధాని భౌతిక కాయాన్ని డీల్లీ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంచేందుకు కూడా అనుమంతిచలేదనే విషయం మర్చిపోకూడదన్నారు. చదవండి: గవర్నర్‌పై మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు After disparaging former Prime Minister and Congress President PV Narasimha Rao for decades, Congress suddenly remembers him on his birth anniversary because Telangana elections are round the corner. Lets not forget that Sonia Gandhi denied him dignity even death. His mortal… pic.twitter.com/nCY93YjSRt — Amit Malviya (@amitmalviya) June 28, 2023 ‘పీవీ అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఢిల్లీలో స్థలం, స్మారక చిహ్నాన్ని ఇవ్వాలని అతని కుటుంబం కోరింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీవీ దేశ సరళీకరణ, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అయినప్పటికీ కాంగ్రెస్ అతన్ని అవమానించింది. అతని వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలనూ విడిచిపెట్టలేదు. కానీ ఆయన మరణించిన 10 సంవత్సరాల తర్వాత మోదీ ప్రభుత్వంలో మాజీ ప్రధాని పీవీకి ఢిల్లీలోని ‘రాష్ట్రీయ స్మృతి’లో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ కూడా తన భారత్ జోడో యాత్రలో హైదరాబాద్‌లోని నరసింహారావు స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించడం సముచితమని భావించలేదు. ఎందుకంటే అతను ప్రయాణించిన మార్గంలో రాళ్లు విసిరారు.’ అని అమిత్ మాల్వీయా పేర్కొన్నారు. 'తెలంగాణ ఠీవి... మన పీవీ' ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో విధానపరమైన సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన, ఇనుమడింపజేసిన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి! pic.twitter.com/PSNXFdKZAM — Telangana CMO (@TelanganaCMO) June 28, 2023 కాగా, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా పీవీ నరసింహారావు నిలిచారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1991 నుంచి 1996 వరకు ప్రధానమంత్రి పదవిలో ఐదేళ్లపాటు దిగ్విజయంగా కొనసాగారు. బహుభాషా కోవిదుడుగా ప్రసిద్ధిగాంచారు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి, కుంటుబడ్డ భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనుడు. -
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్!
దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్మైదానంలో శనివారం సాయంత్రం 5గంటలకు ఈ సభ జరగనుంది. (చదవండి: గ్లోబల్ స్టార్ NTR గురించి మీకు తెలియని విషయాలు! ) ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు. అయితే తన 40వ పుట్టినరోజు (మే 20) కూడా ఇదే రోజు కావడంతో.. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగానే శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు కావడం లేదని ఆయన టీమ్ మీడియాకు తెలియజేసింది. ఆహ్వాన సమయంలోనే ఆర్గనైజింగ్ కమిటీకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. -
సినీ దిగ్గజాల సమక్షంలో దాసరి ఫిల్మ్ అవార్డ్స్
దివంగత దర్శకరత్నం డాక్టర్ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో దాసరి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభ పలువురు సినీ దిగ్గజాల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, ముత్యాల సుబ్బయ్య, వి.వి.వినాయక్, సి.కల్యాణ్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, అలి, టి ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెం రెడ్డి, డా: రఘునాధ్ బాబు.(దాసరి గారి అల్లుడు) రైటర్ రాజేంద్ర కుమార్, తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో... ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, హీరో శ్రీకాంత్, డాక్టర్ బ్రహ్మానందం, బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి, వంశీ రామరాజు, కళా జనార్దన్. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్, దివాకర్. పబ్లిసిటీ డిజైనర్ రాంబాబు, వి.ఎఫ్.ఎక్స్ చందు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ, కవిరత్న చింతల శ్రీనివాస్ తదితరులు దాసరి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ - వాసవి ఫిల్మ్ అవార్డ్స్ వ్యవస్థాపకులు కొత్త వెంకటేశ్వరరావు, మడిపడిగె రాజు, ముఖ్య సలహాదారులు బండారు సుబ్బారావు. పబ్బతి వెంకట రవి కుమార్ సారథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ వేడుకలో ఆంధ్ర, తెలంగాణలో పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులకు కూడా ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. (చదవండి: జేడీ చక్రవర్తి కి అంతర్జాతీయ అవార్డు) అలీ మాట్లాడుతూ "ఉత్తమ హీరోకి తన వంతుగా 50,000 పారితోషకం ఇస్తాను" అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ "దాసరి గారి పేరు మీద జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఉంటాను" అన్నారు. వి వి వినాయక్ మాట్లాడుతూ "రామ సత్యనారాయణ దాసరి గారి మీద ఉండే అభిమానంతో ప్రతి ఏటా ఇలా చేయటం అభినందనీయం" అన్నారు. సి కళ్యాణ్ మాట్లాడుతూ "మా తమ్ముడు రామ సత్యనారాయణ దాసరి గారిని గుర్తుంచుకుని ప్రతిభావంతులకి అవార్డ్స్ ఇవ్వటం చాలా ఆనందకరం" అన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్
వెండితెరపై సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేసిన కృష్ణ నటించిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. 52 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్' పోస్టర్ ఇప్పుడీ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా 4k టెక్నాలజీతో సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆది శేషగిరిరావు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..''పద్మాలయ సంస్థకు ఫౌండేషన్ మోసగాళ్లకు మోసగాడు. మా బ్యానర్లో ఎన్ని సినిమాలు వవచ్చినా ఈ సినిమా చాలా ప్రత్యేకం. కృష్ణ గారి బర్త్‌డేకి నివాళిగా, అభిమానుల కోరిక మేరకు సినిమాను రీరిలీజ్ చేస్తున్నాం. బర్త్‌డే రోజున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు(సోమవారం)అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయ్యి 48 సంవత్సరాలు కావడంతో ఈరోజున ప్రెస్‌మీట్ పెట్టాము. కృష్ణ గారి మెమోరియల్‌గా మ్యూజియం కట్టడానికి ఇక్కడ ప్రభుత్వం స్థలం కేటాయిస్తామన్నారు. అయితే ఇక్కడే ఉన్న మా సొంత స్థలంలో పనులు చేయిస్తున్నాము'' అని ఆది శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్ ఖుష్ అయిన డైరెక్టర్ -
Vijayawada: ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభ (ఫొటోలు)
-
Rajinikanth : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభ.. విజయవాడలో రజనీ కాంత్ (ఫొటోలు)
-
జగ్జీవన్ రామ్ జయంతికి సీఎం జగన్ నివాళి
సాక్షి, గుంటూరు: నేడు స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్. హాజరైన మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, అధికారులు pic.twitter.com/IEMfIuzX3e — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 5, 2023 -
పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులు అర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి పాల్గొన్నారు. -
పునీత్ జయంతి రోజునే ఉపేంద్ర సుదీప్‌ల కబ్జా రిలీజ్
తమిళసినిమా: కేజీఎఫ్ పార్టు–1, పార్టు–2, కాంతార, 777 చార్లీ, విక్రాంత్ రోమా వంటి కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి భారతీయ సినిమానే తమ వైపు తిప్పుకున్నాయి. తాజాగా అదే బాణీలో రూపొందిన కన్నడ చిత్రం కబ్జా. బహు భాషా నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటించిన ఇందులో నటి శ్రియ కథానాయకిగా నటించారు. మురళి శర్మ, సుధ ముఖ్యపాత్రలు పోషించారు. శిద్దేశ్వరా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఆర్.చంద్రశేఖర్ నిర్మించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 7 భాషల్లో కన్నడ చిత్ర పరిశ్రమ అప్పు అని అభిమానంతో పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలకు సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం కబ్జా అని తెలిపారు. 1947 ప్రాంతంలో ఒక స్వాతంత్య్ర సమరయోధుడు వేధింపులకు గురవుతాడన్నారు. ఆయన కుమారుడు గ్యాంగ్‌స్టర్ ముఠాలో చిక్కుకుంటాడని ఆ తర్వాత జరిగే కథే ఈ కబ్జా చిత్రం అని చెప్పారు. -
Vemana: లోకకవి మన వేమన!
వానకు తడవని వారూ, ఒక్క వేమన పద్యం కూడా వినని తెలుగువారూ ఉండరని లోకోక్తి. అలతి పదాలతో సమాజంలోని రుగ్మతలను తూర్పార బట్టిన మనో వైజ్ఞానికుడు వేమన. సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘసంస్కర్త, విప్లవకారుడు వేమన. 1839లో తొలిసారిగా బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అనేకమంది ఆయనపై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో వేమన జీవిత చరిత్రను 14 భాషలలోకి అనువదించడానికి కారకులయ్యారు. ఆంగ్ల, ఐరోపా భాషల్లోకీ; అన్ని ద్రవిడ భాషల్లోకీ వేమన పద్యాలు అనువాదమయ్యాయి. సి.ఇ. గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన సాహిత్యానికి ముగ్ధులై ఆయనను లోక కవిగా కీర్తించారు. వేమన 1602–1730 మధ్య కాలానికి చెందిన వాడనీ కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వాడనీ అంటారు. జనబాహుళ్యంలో ఉన్న వివరాల ప్రకారం, వేమన అసలు పేరు బెధమ కోమటి చినవేమారెడ్డి. ఈయన అన్న పేరు బెధమ కోమటి పెదవేమారెడ్డి. వేమన జన్మించిన ప్రాంతంపై అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ చివ రిగా ఆయన అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న కటారు పల్లె ప్రాంతానికి చెందిన వారని నిర్ధారించారు. అందుకే ఆ ప్రాంతంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించుకుంది. వేమన భోగలాలసుడుగా తిరుగుతూ ఒకానొక దశకు వచ్చేటప్పటికి ఓ సాధువు ద్వారా ఆత్మ జ్ఞానం పొంది అన్నింటినీ త్యజించి యోగిలా మారిపోయాడని అంటారు. సంసార బాధలనుండి ఉపశమనం పొందడానికి తనను ఆశ్రయించే అభాగ్యులకు తన పద్యాల ద్వారా తత్వాన్ని బోధించడం మొదలు పెట్టాడు. తన మాటల ద్వారా తనలో జ్ఞానజ్యోతిని మొట్ట మొదటగా వెలిగించిన తన ప్రేయసి విశ్వద పేరును, తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రుడు అభిరాముడి పేరును తన పద్యాలకు మకుటంలో చేర్చి వారికి శాశ్వత కీర్తిని ప్రసాదించాడు వేమన అనేది కొందరి అభిప్రాయం. అయితే అసలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలనీ... వేమన చిన్న నాటి నుంచే జ్ఞానశీలి అనీ, తదనంతరం స్నేహితుల ప్రభావంవల్ల దారితప్పి, ఆపై పరివర్తన వచ్చి యోగిగా మారాడనీ అంటారు. ఆయన పద్యమకుటానికి ‘సృష్టి కర్తకు ప్రియమైన వేమా వినుము’ అని పండితులు మరో అర్థాన్ని చెప్పారు. బ్రౌన్ ఈ అర్థాన్నే తీసుకొని వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక రీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన కవిత్వంలో స్పృశించని అంశమే లేదు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు; మతం పేరిట జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, విగ్రహారాధనలోని మౌఢ్యం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు... ఒకటే మిటి? కనిపించిన ప్రతి సామాజిక రుగ్మత మీద వేమన తనకలం ఝుళిపించాడు. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకునేట్లు వారికి పరిచితమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా శక్తిమంతంగా వ్యక్తీకరించారు. వేమన పద్యా లన్నీ ఆటవెలది చందస్సులోనే చెప్పాడు. కవిత్రయం అంటే తిక్కన, వేమన, గుర జాడ అంటాడు శ్రీశ్రీ. ‘వేమన కవిత్వం గాయానికి మందు రాసినట్లు కాక, ఆ గాయం చేసిన కత్తికే ముందు మందు పూసినట్లుంటుంది’ అంటారు రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ. తన పద్యాలలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఎప్పుడో ఎలిగెత్తి చాటిన సామ్యవాద ప్రజా కవి వేమన. (క్లిక్ చేయండి: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట) - పి. విజయబాబు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ (జనవరి 19 వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా) -
యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: యోగి వేమన జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కాగా, యోగి వేమన జయంతిని ప్రతి ఏటా జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జీవో కూడా జారీ చేసింది. చదవండి: (ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న) -
Vemana: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట
‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన మహాకవి యోగి వేమనకు సొంత రాష్ట్రంలో తగిన గౌరవం దక్కటం లేదనే భావన ఇక తొలగిపోనుంది. యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనవరి 19న అధికారికంగా జరపనుంది. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 164 జీవోను గత నెల 30న విడుదల చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల వేమన అభిమానులు ఆనందించే విషయమిది. – గుంటూరు డెస్క్ తెలుగువారికి ఎంతో సారస్వత సేవ చేసిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్తోనే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయేలా పద్యాలు చెప్పి, మెప్పించిన కవి వేమన. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంత విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు వేమన. యవ్వనంలో వేశ్యాలోలుడిగా వ్యవహరించినా, కొంతకాలానికి విరక్తి చెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరకు కడప దగ్గరి పామూరు కొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామనవమి నాడు సమాధి చెందారు. కదిరి తాలూకాలోని కటారుపల్లెలోని వేమన సమాధి ప్రసిద్ధి చెందినది. వేమన జీవితకాలం 1652–1730గా పరిశోధకులు పేర్కొన్నారు. సామాజిక చైతన్య గీతాలు ఆ పద్యాలు... వేమన పద్యాలు లోక నీతులు. పద్యాలన్నిటినీ ఆటవెలది చంధస్సులోనే చెప్పాడు. సామాజిక చైతన్యం ఆ పద్యాల లక్షణం. సమాజంలో ఆయన సృజించని అంశం లేదు. అన్ని సమస్యలను భిన్న కోణాల్లోంచి దర్శించి, ఆ దర్శన వైశిష్ట్యాన్ని తన పద్యాలలో ప్రదర్శించారు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట దోపిడీలను ఎలుగెత్తటమే కాకుండా విగ్రహారాధనను నిరసించారు. కుహనా గురువులు, దొంగ సన్యాసుల దోపిడీలు...ఒకటేమిటి? ప్రతి సామాజిక అస్తవ్యస్తతపైన తన కలాన్ని ఝళిపించారాయన. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోనూ నీతిని ప్రతిపాదించి మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపాడు. ‘అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను/సజ్జనుండు పలుకు చల్లగాను/కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా/ విశ్వదాభిరామ వినుర వేమ’ అని చాటారు. మరో పద్యంలో ‘విద్యలేనివాడు విద్వాంసు చేరువ/నుండగానె పండింతుండు కాడు/కొలది హంసల కడ కొక్కెరలున్నట్లు/ విశ్వదాభి రామ వినుర వేమ!’అన్నారు. కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తర్వాత నీతిని చెప్పాడు. అందుకు ‘అనగననగరాగ మతిశయించునుండు/తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/విశ్వదాభిరామ వినుర వేమ’ ఉదాహరణ. పద్యంలో నాలుగో పాదం ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటం. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము–అని ఈ మకుటానికి అర్థం చెప్పారు పండితులు. బ్రౌను మహాశయుడు ఇదే అర్థంతో వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. వేమన కీర్తిని అజరామరం చేశారు... తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయటానికి కృషి చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాల ఏర్పాటును సాధించారు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. ఆరుద్ర ‘మన వేమన’ పుస్తకాన్ని రచించారు. డాక్టర్ ఎన్.గోపి, బంగోరె వంటి కవులు, రచయితలు వేమన రచనలపై పరిశోధనలు చేశారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుచే కేంద్ర సాహిత్య అకాడమీ వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేసింది. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువాదమయ్యాయి. వేమనకు లభించిన గౌరవం మరే తెలుగు కవికీ లభించలేదు. ఐక్యరాజ్యసమితి–యునెస్కో విభాగం, ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని, ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. వేమన జీవిచరిత్ర, యోగి వేమన (1947), యోగి వేమన (1988), శ్రీవేమన చరిత్ర (1986) పేర్లతో సినిమాలుగా ప్రజలను ఆలరించాయి. పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన ‘యోగి వేమన’ సీరియల్ టీవీ ఛానల్లో ప్రసారమైంది. ఇంతటి కీర్తిని పొందిన వేమన జయంతికి పొరుగునున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా తగిన నిధులను కేటాయిస్తూ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. మైసూర్ మహారాజ సంస్థాన్ ఏనాడో వేమన ప్రాశస్త్యాన్ని గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వేమనకు, ఆయన సాహిత్యానికి తగిన ప్రచారం, గౌరవాన్ని కల్పించటం లేదనేది నిష్ఠురసత్యం. దీనిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై 1929 నుంచి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న తెనాలి సమీపంలోని మోదుకూరు గ్రామంలోని వేమన జయంతి ఉత్సవ కమిటీ హర్షం తెలియజేసింది. నాడే సాహసోపేత హేతువాది... ఆ కాలం పరిస్థితుల ప్రకారం వేమనను గొప్ప హేతువాదిగా ప్రశసించింది సాహితీలోకం. సమాజంలో ప్రబలంగా పాతుకుపోయిన ఆచారాలు, మూఢనమ్మకాలను ఆ రోజుల్లో అంత నిశితంగా ఎత్తిచూపటానికి ఎంతటి ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి. విగ్రహారాధనను విమర్శిస్తూ...‘పలుగు రాళ్లు దెచ్చి/ పరగ గుడులు కట్టి/ చెలగి శిలల సేవ జేయనేల?/ శిలల సేవ జేయ ఫలమేమి కలుగురా?’అని ప్రశ్నించారు. కుల విచక్షణలోని డొల్లతనం గురించి... ‘మాలవానినంటి/ మరి నీట మునిగితే/ కాటికేగునపుడు కాల్చు మాల/ అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?...’ అనడిగారు. వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాలేదు. కేవలం సామాన్యుల నాల్కలపైనే నడయాడుతూ వచ్చాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకుల భావన. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తర్వాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్‌లు వేమన పద్యాలెన్నింటినో సేకరించారు. తాను వేమనను కనుగొన్నాని బ్రౌన్ సాధికారికంగా ప్రకటించుకొన్నారు. వందలాది పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించారు. అలాగే హెన్నీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1920), జీయూ పోప్, సీఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు, వేమనను లోకకవిగా కీర్తించారు. మహాకవి పేరిట విశ్వవిద్యాలయం.. ఆ మహాకవి పేరిట దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని నిర్మించి అనేక కోర్సులతో విద్యను అందించడంతోపాటు వేమన జీవితం మరుగున పడకుండా భావితరాలకు అందించడం గమనార్హం. -
‘ఆయన రచనలు చదవడంతో.. వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది’
‘ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకున్న వివేకానంద అనే ఆ మహ నీయుని చిత్తరువు ఎప్పటికీ చెరిగిపోదు’ అన్నారు ఓ రష్యన్ చింతనాశీలి. జీవితంలో సమస్యలనేవి ప్రతీ వ్యక్తికీ ఉండేవే. ఆ వ్యక్తి విద్యార్థి కావచ్చు, కార్మికుడు కావచ్చు, రైతు కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, గృహిణి కావచ్చు, మరెవరైనా కావచ్చు. సమస్యలనేవి సర్వసాధారణమైతే, సమ స్యను అవగాహన చేసుకొనే ప్రయత్నం చేయడానికి కావలసిన సామర్థ్యం పెంచుకుంటే సమస్యలు పరిష్కరించడం పెద్ద విశేషం కాదని వివేకానందుడు అన్న మాటలు సదా స్మరణీయం. ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి చెప్పిన వాక్యాలు విన్నా ఆలోచింపజేస్తాయి. కాని స్వామి వివేకానందుడు చెప్పిన అమృత వాక్యాలు మాత్రం యువతను ప్రేరేపించి, ఆచరింపజేస్తున్నాయి. ఇద్దరు వ్యక్తుల ఆదర్శాలు ఒకేలా ఉండకపోవచ్చు. కాని ఆ ఇద్దరు వ్యక్తులు ఒకే వ్యక్తి ఆదర్శాన్ని స్వీకరించి గొప్ప నేతలుగా ఎదగవచ్చనేది మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌లు నిరూపించారు. ఆ ఒక్క వ్యక్తి వివేకానందుడే నని వేరే చెప్పనవసరం లేదు. గాంధీజీ, బోస్బాబులు విభిన్న వ్యక్తిత్వాలు, భిన్న ఆదర్శాలు కలిగి ఉన్నవారని చరిత్రకారుల వాదనల సారాంశం. ‘నేను స్వామి వివేకానందుడి రచనలు చదవడం ద్వారా నాలో వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది’ అని గాంధీజీ అంటే... సుభాష్ చంద్రబోస్ ‘స్వామి వివేకానందుని రచనలు చదువుతుంటే నా ఒంట్లో రక్తం ఉప్పొంగుతుంది కదా! ఆయనను విన్నవారు ఇంక ఎంత అనుభూతిని పొంది ఉంటారో? ఆయన బ్రతికి ఉన్నట్లయితే పాదాల చెంత కూర్చొని ఆయన ఏమి చెబితే అది చేసేవాణ్ణి’ అన్నారు. ఈ మహానేతలు వివేకానందుని మాటలకు ఎంతగా ప్రభావితులు అయ్యారో ఈ మాటలే తెలియజేస్తాయి. ఇవ్వాళ దేశానికి కావలసింది ఇలాంటి ప్రభావ వంతమైన స్ఫూర్తి ప్రదాతలే. విద్య పట్ల వివేకానందుని అభిప్రాయాలు అత్యున్నతమైనవి. విద్యా వ్యవస్థను ఆయన భావాలకు అనుగుణంగా రూపొందించగలిగితే కాబోయే భారత పౌరులందరూ జాతి రత్నాలుగానే భాసిస్తారు. అప్పుడు తాము పుట్టిన ఊరినే కాదు, దేశాన్నీ, ప్రపంచాన్నీ ఉద్దరించగల మహానుభావులు ప్రపంచానికి అందుతారు. (క్లిక్ చేయండి: ఆదివాసుల హృదయ దీపాలు) – డాక్టర్ నెమలిపురి సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనవరి 12 వివేకానందుని జయంతి, జాతీయ యువజన దినోత్సవం) -
Pingali Lakshmikantham: ఆయన జయంతి, వర్ధంతి.. ఒకేరోజు
ఆధునికాంధ్ర సాహిత్యంలో సుప్రసిద్ధ కవి, ఆచార్యుడు, నటుడు, విమర్శకుడు, ఆకాశవాణి కార్యక్రమాల సలహాదారు ఆయన. అష్టదిగ్గజ కవుల్లో పింగళి సూరన వంశానికి చెందిన పింగళి లక్ష్మీకాంతం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 1894 జనవరి 10వ తేదీన కృష్ణాజిల్లా అర్తమూరులో జన్మించారు. పాఠశాల విద్య మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. అప్పుడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అక్కడ తెలుగు పండితుడుగా ఉన్నారు. పింగళి, విశ్వనాథ వంటి వారంతా చెళ్లపిళ్ల వారి శిష్యులే. బందర్ నోబుల్ హైస్కూల్లో తెలుగు పండితుడిగా పింగళి కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత మద్రాస్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడిగా పనిచేశారు. 1931లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్ కోర్సు ప్రారంభించి పాఠ్య ప్రణాళికను రూపొందించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు అదే ప్రామాణికమైన పాఠ్యప్రణాళిక. ఆయన ప్రియమిత్రుడు, సహాధ్యాయి కాటూరి వెంకటేశ్వరరావుతో కలసి తొలి రోజుల్లో శతావధానాలు చేశారు. ఇద్దరూ జంట కవులుగా రచించిన ‘సౌందర నందం’ కావ్యాన్ని తమ గురు వైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రికి అంకితం ఇచ్చారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యుడిగా 1961–65 మధ్య పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 18 సంవత్సరాలు పనిచేసి 1949లో పదవీ విర మణ చేశారు. ఆయన బోధనల నోట్సులు ఆంధ్ర సాహిత్య చరిత్ర, విమర్శకు ప్రామాణి కాలు. తర్వాత వాటిని ఆంధ్ర సాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్షలుగా ఆయనే ప్రచురించారు. అవి ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఆయన రూపొందించిన సంస్కృత ‘కుమార వ్యాకరణం’ ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథంగా ఉంది. ఆయన రేడియో ప్రసంగాలు, గౌతమ వ్యాసాలు విమ ర్శకు నిలువెత్తు నిదర్శనాలు. ఆయన రచించిన మధుర పండితరాజం, గంగాలహరి, తేజోలహరి ప్రసిద్ధి పొందాయి. ఆయన గౌతమ నిఘంటువు (ఇంగ్లీషు–తెలుగు) ప్రామాణికమైంది. పింగళి 1954 నుండి 1961వరకు విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారుడిగా గొప్ప కార్యక్రమాలు రూపొందించారు. నటుడిగా పాండవోద్యగ విజయాల్లో ధర్మరాజుగా, ముద్రారాక్షసం నాటకంలో రాక్షస మంత్రిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. పింగళివారు 1972 జనవరి 10 తేదీన పరమదించారు. సాహితీ ప్రియుల హృదయాల్లో ఆయన చిరస్మర ణీయులు. – డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు (జనవరి 10 పింగళి లక్ష్మీకాంతం జయంతి, వర్ధంతి) -
Savitribai Phule: మహిళా విద్యా ప్రదాత
విద్య ద్వారా సమాజంలో ఉన్న అసమానతలను చదును చేయాలని... 18వ శతాబ్దంలోనే మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు ప్రయత్నించారు. మొక్కవోని వారి దీక్ష వల్ల అప్పటి సమాజంలో హీన స్థితిలో ఉన్న స్త్రీల జీవితాలకు అండ దొరికింది. భర్త జ్యోతిబా ఫూలే ప్రోత్సాహంతో స్వయంగా చదువుకున్న సావిత్రీబాయి దేశంలో మహిళా విద్యకు దారిదీపం అయింది. 1840లో 9 ఏళ్ల సావిత్రీబాయి వివాహం 13 ఏళ్ల జ్యోతిబా ఫూలేతో జరిగింది. స్త్రీలకు విద్య చాలా అవసరం అని గ్రహించి ముందు తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పాడు జ్యోతిబా. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్ట మొదట ప్రవేశపెట్టిన వాడు జ్యోతిబాఫూలే. తన పొలం దగ్గర మామిడి చెట్టు నీడలో మొట్ట మొదటి పాఠశాల పెట్టాడు. ఆ పాఠశాలలో ఆయన అక్క సుగుణబాయి, భార్య సావిత్రీ బాయి విద్యార్థులు! స్త్రీ విద్యా ప్రయోగశాలగా ఆ పాఠశాల చరిత్రలో మిగిలిపోయింది. 1848లో ఓ భవంతిలో స్త్రీల కోసం పాఠశాలను ఏర్పాటు చేశాడు ఫూలే. చదువు నేర్చుకునే క్రమంలో సావిత్రీబాయి ఎన్నో పుస్తకాలు చదివి స్త్రీ ఎంత దారుణ స్థితిలో ఉందో అర్థం చేసుకుంది. అదే సమయంలో అమెరికా నల్లజాతి వివక్ష వ్యతిరేక పోరాట నాయకులు థామస్ క్లార్క్ జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొందింది. బ్రాహ్మణ స్త్రీలతోపాటూ బహు జన స్త్రీ జనోద్ధరణకు భర్తతో పాటూ నడుం బిగించింది. స్త్రీ జనోద్ధరణకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకూ ఆమే ఇన్చార్జ్గా వ్యవహరించింది. 1851లో పూణేలో అమ్మాయిల కోసం మరో స్కూలు ప్రారంభించారు. మెల్లమెల్లగా పూలే దంప తులు 18 పాఠశాలలను స్థాపించారు. అయితే నాటి ఛాందసవాదులు సావిత్రీబాయి మామగారిని... ఆయన కొడుకూ, కోడలూ శ్రాస్త విరుద్ధంగా వ్యవహ రిస్తున్నారని రెచ్చగొట్టారు. దీంతో ఫూలే దంపతులను మామగారు ఇంటి నుండి వెళ్లగొట్టారు. అయినా ఆ దంప తులు తమ మార్గాన్ని మార్చు కోలేదు. ఆత్మహత్య చేసుకోబోతున్న కాశీ బాయి అనే గర్భవతి అయిన బ్రాహ్మణ వితంతు మహిళను కాపాడి ఆమె కన్న పిల్లవాడిని దత్తత తీసుకుని ‘యశ్వంతరావు’ అని పేరు పెట్టుకొని పెంచి పెద్ద చేశారు. 1876–77లో మహా రాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చి జనాలు ఆకలితో అలమటిస్తుంటే తమ ‘సత్య శోధక సమాజ్’ ద్వారా ఆహార సేకరణ చేసి ఆదుకున్నారు. ఆమె మంచి ఉపాధ్యాయురాలే కాదు, కవయిత్రి కూడా. ఆమె రచించినటువంటి ‘కావ్య పుష్పాలు’ అనే సంపుటి చాలా గొప్పది. ప్లేగు వ్యాధి గ్రస్థులకు సేవ చేస్తూ ఆ వ్యాధికే బలై 1897 మార్చి 10వ తేదీన తుది శ్వాసవిడిచి ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహనీయురాలు సావిత్రీబాయి. (క్లిక్ చేయండి: ‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!) – తండ సదానందం, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ (జనవరి 3 సావిత్రిబాయి ఫూలే జయంతి) -
Bapu: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము
‘నేనయితే కింద సంతకం లేకపోయినా సరే! బాపు బొమ్మని గుర్తుపడతాను’ అని కొంతమంది అమాయకంగా అమాయకమై పోతుంటారు. అలా అవనవసరం లేదు. రేఖ పండిన చిత్రకారులకి సంతకం అవసరం లేదు. వారి బొమ్మే సంతకం అవుతుంది. మరి బాపు గొప్పతనమంతా సంతకంలో కాక మరెక్కడుంది అని మీరెవరైనా అడిగితే నేను ఇలా చెబుతాను. అనగనగా అనేక కథలు మన సాహిత్యానికి ఉన్నాయి. ఒకానొక బంగారు కాలంలో ఆ కథలన్నిటికీ అరచేయంత కొలత దగ్గరి నుండి, రెండు పేజీల వరకు వ్యాపించిన డబుల్ డమ్మీ ఇలస్ట్రేషన్లను బాపు బొమ్మలు కట్టేరు. తన క్రియేటివిటీతో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని అమరం చేశారు. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశాన్ని అడుగుతాడు ‘ఏమి వాయ్! క్రియేషన్ అనగానేమీ?’ దానికి వెంకటేశం ఏమి చెప్పాడో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు మాత్రం నేను చెప్పేది వినండి. క్రియేషన్ అనగా తెల్లని కాగితంపై మూడు అక్షరాల నల్లని అచ్చుగా మాత్రమే ఉండిన గిరీశం అనే ఒక పేరుకి ‘ఇదిగో ఇంత ఎత్తు, ఇది నుదురు, ఇలా పంచె అని కట్టి, చేతిలో చుట్ట పెట్టి మన మెవ్వరమూ ఎప్పటికీ ఊహించలేని ఒక ఊహకు రూపం ఇచ్చి మనకు పరిచయం చేయడమన్నది బాపు చేసిన క్రియేషన్. గిరీశం కానీ, మధురవాణి కానీ, సౌజన్యరావు పంతులు కానీ, బుచ్చమ్మ కానీ ఇలా ఉంటారు అని ఆ గురజాడ అప్పారావు తమ పుస్తకంలో ఎక్కడా వర్ణన చేయలేదు. కానీ బాపు వారందరికీ ఒక రంగూ, ఒక రూపం, ఒక లక్షణం, ఒక ధోరణి, ఒక రీతి ఇచ్చి వారిని బొమ్మలుగా మలిచి మనకు మప్పారు. ఒకసారి బాపు బొమ్మల్లో వారిని చూశాక... వారు అలా కాక మరి ఇంకోలా ఉండటానికి మన ఇమాజినేషన్లో కుదరదు. బాపు బొమ్మ అంటే ఒక సంతకం కాదు. పేరు కాదు. కాసింత కాగితం, కలం మాత్రమే కలిసి దిద్దిన కల్పన కాదు. అంత కాక మరెంత? అనడిగితే, అదీ చెబుతా. తొంబైల నాటి తరం మాది. మేము చదువుకున్న కథా సాహిత్యమంతా కొకు కథా సంపుటాలు, శ్రీపాద కథా సంపుటాలు, రావిశాస్త్రి కథా సంపు టాలు. మా తరానికి ఆ కథలు తొలినాళ్లల్లో అచ్చ యిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, యువ, జ్యోతి లాంటి అనేకానేక పుస్తక పుటలు తిరగేయడం కుదరలేదు. తరవాత్తరువాత ఆ పాత పుస్తకాలు, అందులో వాటికి వేసిన బొమ్మలు చూసే అవకాశం దొరికినపుడు, ఒకోసారి ఇంటర్నెట్లో పైన కథ పేరు కూడా లేని చాలా బాపు బొమ్మలను చూసినపుడు... నా కళ్ళకు కనపడింది బొమ్మ కాదు అచ్చంగా కథలే. చలపతి, దాసూ పూర్వాశ్రమంలో సహధ్యాయులు, వారిద్దరి మధ్య పెద్ద స్నేహమేం ఏర్పడలేదు. చదువుల అనంతరం ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా చలపతికి దాసు కనపడతాడు. చలపతికి పెళ్ళి కావాల్సిన రాజ్యం అనే చెల్లెలు ఉంది. చలపతి దాసూని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంట్లో చలపతి, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు, రాజ్యం ఉంటారు. అ చదువుకున్న మధ్యతరగతి ఇల్లు, ఈ దంపతులు, ఆ పిల్లలు, వంటగదిలోంచి రెండు లోటాలతో కాఫీ తెస్తున్న రాజ్యం, కుర్చీలో కూచుని బుగ్గన సొట్టతో నవ్వుతున్న దాసు. ఈ బొమ్మని, వీటితో పాటూ అదే కథకు బాపు చిత్రించిన మరికొన్ని బొమ్మలని చూసిన నాకు ఒక్కసారిగా ఆ కథ మొత్తం నోటికి తగిలింది. బొమ్మ బొమ్మలో వెంకమ్మ, భాగ్యమ్మ, గోపీ, సత్యం అనే అందరినీ గుర్తు పట్టగలిగాను. ఈ కథే కాదు. బాపు వేసిన ఎన్నో బొమ్మల్లో ఆ కథలనూ, అందులోని మనుష్యులనూ గుర్తుపట్టి థ్రిల్లవుతూ వారిని చేయి పట్టి ఊపి షేక్ హాండ్ ఇచ్చిన అనుభవాలు నాకు కొల్లలు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) దీనిని మించిన మరో అద్భుత సంఘటనను మీకు చెబుతా. భారత దేశానికి గాలిబ్ కవితా, తాజమహలూ మరవరాని అందాలు అని ఒక మహానుభావుడు అన్నాడుట. మరి గాలిబ్ కవితకు ఏమిటి అందం? ఏ చేతులది చందం? అని వెదుక్కుంటూ బంగారం వంటి కవి దాశరథి, గొప్ప పబ్లిషర్ ఎంఎన్ రావు బాపును కలిశారు, ఆయనకు గాలిబ్ గీతాల అనువాదం ఇచ్చారు. వాటన్నిటికీ బాపు బొమ్మలు వేశారు. ఆ తరువాత ఆ పుస్తకం సాధించిన ఘన కీర్తి, తెలుగు వారి హృదయాలలో సంపాదించుకున్న సుస్థిర యశస్సు అందరికీ తెలిసినదే. అయితే చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం, బాపు బొమ్మకే అందిన అందలం ఏమిటంటే, దాశరథి గాలిబ్ గీతాల తెలుగు అనువాదం పుచ్చుకుని ఒక్క తెలుగు అక్షరం కూడా ఎరుగని ఎక్కడెక్కడి ఉర్దూ కవులూ కేవలం బాపు బొమ్మల్ని చూసి గాలిబ్ ఉరుదూ మూలం చదివేవారుట. ఇంతకూ చెప్పదలుచుకున్నదేమిటంటే... ‘ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, మరియొకడు బాపుయగుట ఎంతో దుష్కరమ్ము సుమ్ము.’ – అన్వర్ (డిసెంబర్ 16న బాపు జయంతి; తెలుగు యూనివర్సిటీలో బాపు–రమణ పురస్కారాల ప్రదానం) -
ఘంటసాల జీవితం వడ్డించిన విస్తరి కాదు.. ఆయన పారితోషికం ఎంతో తెలుసా?
ఆ స్వరం వింటే చాలు తెలుగు వారు పులకించి పోతారు. ఆ పేరు విన్నా.. తలచినా.. పాట మురిసి పోతుంది. పద్యం పరవశించి పోతుంది. జానపదాల నుంచి జావళీల దాకా భక్తి గీతాల నుంచి అష్టపదుల దాకా ఆయన ముద్ర కనిపిస్తుంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు కృష్టాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో పుట్టిన ఒక సామాన్యమైన వ్యక్తి తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారంటే స్వరస్వతీ దేవి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాయబట్టే. ఆయనే తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే ఘంటసాల వెంకటేశ్వరరావు. డిశంబరు 4 ఆయన శతజయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో 1922 డిసెంబరు 4 వ తేదీన సామాన్య కుటుంబంలో జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం వడ్డించిన విస్తరి కాదు. బాల్యంలో బాలారిష్టాలతో గడిచింది. 1936లో తన 14వ ఏట తన దగ్గరున్న బంగారు ఉంగరాన్ని అమ్మి సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం చేరుకున్నారు. విజయనగరం రాజులు కళా పోషకులు కావడంతో అనేక విద్యాలయాలను ప్రారంభించారు. వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రోత్సాహంతో పాట్రాయని సీతారామశాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతం అధ్యయనం చేశారు. 1941లో విద్వాన్ పట్టాతో కళాశాల నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 1944లో మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం మద్రాసు ప్రయాణమైన ఘంటసాల సినీ ప్రస్థానం 1974 పిబ్రవరి 11న ముగిసింది. సినీ ప్రస్ధానం: ఘంటసాల మాస్టారి సమీప బంధువైన సినీరంగ ప్రముఖుడు సముద్రాల రాఘవాచారి ఆశీస్సులతో 1944లో మద్రాసు చేరుకున్నారు. అవకాశాల కోసం ఏడాది పాటు ఎదురు చూశారు. 1945లో తొలిసారిగా ఆయన స్వరం గాజులపిల్ల పాట(స్వర్గసీమ) ద్వారా తెలుగు వారికి పరిచయమైంది. ఇక ఆయన వెనక్కు తిరిగి చూసుకునే అవసరం లేక పోయింది. వేలాది గీతాలు పాడారు. భక్తి గీతాలు, విషాద గీతాలు. సోలో ఇలా... పాట ఏదైనా మాస్టారి పాటలకు మంత్రముగ్ధులు కాని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఘంటసాల కేవలం సినీ గాయకుడే కాదు...స్వాతంత్య్ర సమరయోధుడు, సినీ నిర్మాత, సంగీత దర్శకుడు. పలు భాషల్లోని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తన జీవిత చరమాంకంలో ఘంటసాల గానం చేసిన భగవద్గీత ఆయనకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టింది. విదేశాలలో సహితం అక్కడున్న తెలుగువారికి గాన విందు పంచి పెట్టారు ఘంటసాల. సినిమాలో ఆయన తొలి పారితోషికం 116 రూపాయలు. అప్పటి సినీ నేపథ్యగాయకులు, గాయనీమణులు దాదాపుగా ఆయనతో కలసి పాటలు పాడారు. హెచ్ఎంవీ సంస్థ తొలి దశలో ఆయన స్వరం రికార్డులకు పనికి రాదంది. తరువాత వారే ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఘంటసాల పేరుతో పోస్టల్ స్టాంప్ ఘంటశాల మరణానంతరం 2003లో ఆయన పేరుతో తపాలా శాఖ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసి ఆయన పట్ల తన భక్తిని చాటుకుంది. అభిమానులు ఊరూరా ఘంటసాల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని తమ అభిమానం చాటుకున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డిసెంబరు నాలుగవ తేదీన ఘంటసాల శత జయంతి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. 1970 లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.1972లో రవీంద్రభారతిలో కచేరీ నిర్వహిస్తూ ఉండగా ఆయనకు తొలిసారిగా గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు.1974లో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అదే ఏడాది ఫిబ్రవరి 11న మద్రాస్‌లోని విజయా హాస్పిటల్లో తెలుగు ప్రేక్షకుల హృదయాలను విడిచి ఆయన గంధర్వలోకానికి తరలిపోయారు. టేకుపల్లిలో 4న ఘంటసాల కళామండపానికి శంకుస్థాపన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూర్యనారాయణ స్వగ్రామం కృష్ణాజిల్లా మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామం. ఘంటసాల గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో మేనమామ ర్యాలీ పిచ్చిరామయ్య ఇంటి వద్ద జన్మించారు. తండ్రి సూర్యనారాయణ స్థానిక రామేశ్వరస్వామివారి ఆలయంలో పూజారిగా ఉండేవారు. పేదరికం వల్ల తండ్రి మృదంగం వీపున కట్టుకుని, గ్రామాల్లో భగవత్ కీర్తనలు ఆలపిస్తుండగా ఘంటసాల నృత్యం చేస్తుండేవారు. 11వ ఏటనే తండ్రిని కోల్పోవడంతో చౌటపల్లిలో మేనమామ వద్దనే పెరిగారు. ఘంటసాల స్వగ్రామమైన టేకుపల్లిలో ఆయన శత జయంతి సందర్భంగా ఈ నెల 4వ తేదీన ఘంటసాల పేరుతో కళా మండపానికి శంకుస్థాపన చేయనున్నారు. ఘంటసాల పాటల చరిత్ర భావితరాలకు అందాలి అమరగాయకుడు ఘంటసాల గాన చరిత్ర భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఘంటసాల పాటలను సేకరించడం మొదలు పెట్టాను. వందలాది పాటలతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చాను. నేను సేకరించిన ఘంటసాల సంపూర్ణ తెలుగు పాటలను శతవర్ష ఘంటసాల పేరుతో వచ్చిన పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. –చల్లా సుబ్బారాయుడు ఘంటసాల పాటల సేవకుడు -
పుట్టపర్తి వైభవం.. ఖండాంతరం!
పుట్టపర్తి అర్బన్: నాలుగు దశాబ్దాల క్రితం పది పూరి గుడిసెలతో ఉన్న కుగ్రామం నేడు బహుళ అంతస్తులకు కేంద్రీకృతమైంది. ఒకప్పడు రోడ్డు పక్కన కర్ణాటకలోని బాగేపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు కోసం గంటల తరబడి వేచి చూసిన జనం.. నేడు కేవలం గంటల వ్యవధిలోనే ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా విమానంలో చేరుకునేలా ఏర్పాటైన విమానాశ్రయాన్ని చూస్తున్నారు. కుగ్రామం నుంచి జిల్లా కేంద్రంగా ఎదిగిన పుట్టపర్తి ప్రస్థానంపై సత్యసాయి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నాటి గొల్లపల్లే.. నేటి పుట్టపర్తి.. పుట్టపర్తి ఆవిర్భావం వెనుక పురాణ కథను స్థానికులు నేటికీ గుర్తు చేస్తుంటారు. ‘కులాలు, వర్ణాల వారీగా కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, కర్ణాటక నుంచి వచ్చి చిత్రావతి నది ఒడ్డున స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రాంతంలో పది ఇళ్లు మాత్రమే ఉండేవి. గొల్ల సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతానికి గొల్లపల్లి అని పిలుచుకునేవారు. జీవనం కోసం ఎక్కువగా గోవులను పెంచేవారు. ఓ ఆవు పాలు ఇవ్వకుండా మొరాయిస్తుండడంతో దాని యజమాని నిఘా ఉంచాడు. ఓ మధ్యాహ్న సమయంలో ఆవు పుట్ట వద్దకెళ్లి నిల్చోన్నప్పుడు పొదుగు నుంచి పాలు పుట్టలోకి ధారాపాతంగా కారుతుండడం గమనించాడు. ఇది గమనించిన యజమాని బండరాయితో ఆవును కొట్టబోగా అది తప్పించుకుంది. అదే సమయంలో పుట్టలోని నుంచి వెలుపలకు వచ్చిన పాముకు బండరాయి తగిలి చనిపోతూ గొల్లపల్లి పుట్టల మయంగా మారుతుందని, పాడి పశువులు కనుమరుగవుతాయని శపించింది. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు శాప విమోచనం కోసం పుట్ట ఉన్న ప్రాంతంలో పూజలు నిర్వహించి వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు’. అలా గొల్లపల్లి కాస్త పుట్టపర్తిగా రూపాంతరం చెందింది. సత్యసాయి ఆవిర్భావంతో మహర్దశ.. గొల్లపల్లిలో 1926 నవంబర్ 23వ తేదీన పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ.. 1940 అక్టోబర్‌లో అవతార ప్రకటనతో సత్యసాయిగా మారారు. ఎన్నో అద్భుతాలు ప్రదర్శిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం 1948లో ప్రశాంతి నిలయానికి సత్యసాయి శంకుస్థాపన చేశారు. 1950 నవంబర్ 23 నాటికి ప్రశాంతి నిలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అక్కడే పూర్ణచంద్ర ఆడిటోరియం నిర్మించి అన్ని కార్యకలాపాలు నిర్వహించేవారు. సత్యసాయిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులు మారాయి. వచ్చే భక్తులకు విడిది, ఇతర సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామ పరిధి విస్తరించింది. దీంతో 1964లో పంచాయతీగా పుట్టపర్తి మారింది. అనంతరం పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలను కలుపుతూ 1980 నవంబర్‌లో సత్యసాయి తాలూకాను ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాభివృద్ధి కోసం 1981లో డీమ్డ్ యూనివర్సిటీని స్థాపించారు. 1984లో నిర్మాణ పనులు చేపట్టి 1991లో అన్ని రకాల సదుపాయాలతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 1990లో ఆర్టీసీ బస్టాండ్, 1991 నవంబర్‌లో సత్యసాయి విమానాశ్రయం, 2000 నవంబర్‌లో ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. 1995 జూలైలో సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించి అప్పట్లో 771 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేశారు. 1995 జూలైలో సాయికుల్వంత్ మంటపాన్ని నిర్మించారు. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పంచాయతీని 1980లో సమితిగాను, 2006 ఆగస్టులో మేజర్ పంచాయతీగా, 2011 ఆగస్టులో నగర పంచాయతీగా, 1991లో పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్(పుడా)గా అనంతరం 2009లో అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. (చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష) -
Birsa Munda: ఆదివాసీల ఆరాధ్యదైవం
ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా. ఆయనను తన జాతి ప్రజలు దేవునిగా కొలిచారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875 నవం బర్ 15న సుగుణ ముండా, కర్మిహాట్ దంపతులకు బిర్సా ముండా జన్మించాడు. ‘సాల్గా’ గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతం చయిబాసాలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు బిర్సా డేవిడ్ గా మారింది. అందులో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్‌వాళ్ల బాధలు పడ లేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగి చ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా తెల్ల దొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న బిర్సా వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించి, ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనాడు. బ్రిటిషర్ల వల్ల ముండా, సంథాల్, ఓరియన్, కోల్ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమా దంలో పడే అవకాశం ఉందని భావించిన బిర్సా ప్రత్యేకంగా ‘బిర్సాయిత్’ మతాన్ని స్థాపించాడు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించే వాడు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాడు. ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసీలను కాపాడాడు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను ధర్తీలబా(దేవుడు)గా కొలిచేవారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్లో ఉల్ గులాన్ (తిరుగుబాటు) పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో 7,000 మంది పాల్గొన్నారు. బిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాడులకు దిగేవారు బ్రిటిష్‌వాళ్లు. వీటిని సహించని ఆయన అనుచరులు 1900 జనవరి 5న ఎట్కేడీ ప్రాంతంలో ఇద్దరు పోలీసులను చంపేశారు. దీనితో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించి చివరికి 1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించారు. ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. ఇప్పటికీ ఆయన్ని జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు ‘భగవాన్ బిర్సా ముండా’గా పూజిస్తున్నారు. చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఆయన ఉద్యమ ఫలితంగానే 1908లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఛోటా నాగపూర్ కౌలుదారుల హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. (క్లిక్ చేయండి: నిజంగా భక్తులేనా? పైకి మాత్రమేనా?) – చింత ఎల్లస్వామి ఏబీవీపీ రాష్ట్ర పూర్వ సంయుక్త కార్యదర్శి (నవంబర్ 15న బిర్సా ముండా జయంతి) -
నేతాజీ జయంతికి సెలవు.. పిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: స్వాతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్‌ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని.. సెలవు దినంగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇలాంటి వ్యవహారాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్‌ని మందలించింది న్యాయస్థానం. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. 1897 జనవరి 23వ తేదీన కటక్‌లో జన్మించారు. అయితే.. ఆయన జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. తద్వారా ఆ మహనీయుడికి ఓ గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సెలవు ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిల్లో అభ్యర్థించారు పిటిషనర్ కె కె రమేష్. అయితే.. దేశానికి ఆయన(నేతాజీ) చేసిన సేవలను గుర్తించడానికి ఉత్తమ మార్గం.. కష్టపడి పని చేయడమేనని, అంతేకానీ, ఇలా జయంతికి సెలవులను జోడించడం కాదు అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అయినా ఇది పూర్తిగా భారత ప్రభుత్వ పరిధిలోని అంశమని, న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాదని పేర్కొంటూ ఆ పిల్‌ను డిస్మిస్ చేశారాయన. ఇదీ చదవండి: గూగుల్ పోటీలో నెగ్గిన మన కుర్రాడు -
CP Brown: తెలుగు సాహితికి వెలుగు సూరీడు
తెలుగు భాష సాహిత్యం ఈరోజు బతికి బట్టకడుతుందంటే సీపీ బ్రౌన్ నిర్విరామ కృషి, సమర్పణ, తపన, త్యాగం, అంకిత భావమే కారణం. బ్రిటిష్ దంపతులైన డేవిడ్ బ్రౌన్, కౌలీలకు కలకత్తాలో 1798 నవంబర్ 10న బ్రౌన్ జన్మించారు. తండ్రి మతాధికారి. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో బహు భాషాపండితుడు. తండ్రి వద్దే హీబ్రూ, అరబిక్, పర్షియన్, హిందుస్థానీ, సిరియక్, గ్రీకు భాషలు నేర్చారు. బాల్యంలో తండ్రి సేకరించే దేశీయ పుస్తకాలను పరిష్కరించి, శుద్ధ ప్రతులు తయారుచేయటంలో సహాయం చేసేవారు. అది ఉత్తరోత్తరా తెలుగు సాహిత్య ప్రచురణకు దోహదం అయింది. 1817లో మద్రాస్ సివిల్ సర్వీసులో చేరేవరకు ఆయనకు తెలుగు భాష ఒకటి ఉందనే విషయం తెలియదు. మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కళాశాలలో వెలగపూడి కోదండరామ పంతులు దగ్గర అక్షరాభ్యాసం చేశారు. ఫ్రెంచ్ కాథలిక్ మతగురువు అబెదుబె రాసిన ‘హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెర్మనీస్’ అనే పుస్తకంలో వేమనను గురించిన వివ రాలు తెలుసుకున్నారు. వేమన పద్యంలోని భాష, భావం, వేగం, తీవ్రత, మూఢవిశ్యాసాల వ్యతిరేకత... అన్నీ కలగలిసిన గొప్ప కవి అని బ్రౌన్కు అర్థమైంది. అనంతరం వేమన పద్యాలు 2500 వరకు సేకరించారు. వాటిల్లో ఉత్తమమైన 693 పద్యాలను ఎంపికచేసి పరిష్కరించి, ఇంగ్లిష్‌లోకి అనువదించి ‘వెర్సేస్ ఆఫ్ వేమన’ పేరుతో 1829లో ప్రచురించారు. ఆపై తెలుగులో ఉన్న భారత, భాగవత, రామాయణాలు, కావ్యాలు, చరిత్రలు, జానపద కథలు, శతకాలు మొదలైనవన్నీ సేకరించారు. పరిష్కరణ, శుద్ధప్రతులు తయారు చేయటంకోసం పండితులను, లేఖకులను తన స్వంత డబ్బులతో నియమించుకున్నారు. కడపలో కలెక్టర్‌గా పనిచేసే రోజుల్లో తన బంగళాలోనే తెలుగు గ్రంథ పరిశోధన, పరిష్కరణ చేశారు. అందుకే దాన్ని ‘బ్రౌన్ కాలేజి’ అని పిలిచేవారు. బ్రౌన్ గ్రంథ రచనల్లో తోడ్పడిన పండితుల్లో జూలూరి అప్పయ్య, వఠ్యం అద్వైత బ్రహ్మయ్య, మన్నెం కనకయ్య, గరిమెళ్ల వెంకయ్య, వారణాసి వీరాస్వామి, తిరుపతి తాతాచార్యులు వంటి వారున్నారు. కడప, గుంటూరు, మచిలీ పట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో బ్రౌన్ వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలోనే పేదపిల్లలు కోసం ధర్మబడు లను ప్రారంభించారు. 1821లో కడపలో రెండు, 1823లో మచి లీపట్నంలో రెండు, 1844లో మద్రాస్‌లో ఒకటి చొప్పున ధర్మ బడులను తెరచి, కేవలం పేద విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ నేర్చుకునేలా చేశారు. బ్రౌన్ సేకరించిన గ్రంథాల్లో సంస్కృతం, తెలుగు, హిందీ, కన్నడం, మరాఠి, తమిళ భాషలకు సంబంధించిన మొత్తం 5,751 గ్రంథాలున్నాయి. వీటిలో కేవలం తెలుగు భాషకు చెందినవి 2,440 ఉన్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం, కావ్యాలు, శతకాలు, వ్యాకరణం, తెలుగు–ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులు (బ్రౌణ్య నిఘంటువు) అచ్చువేసి తెలుగు భాష సాహిత్యాన్ని సుస్థిరం చేశారు. భాషలో కొన్ని మార్పులూ చేశారు. సాధు–శకట రేఫల వినియోగం, క్రావడి, వట్రుసుడి, ‘చ, జ’ల మార్పులు వంటివి ప్రధా నంగా ఉన్నాయి. తెలుగు భాషలో అంతకుముందు లేని విరామ చిహ్నాలు, పేరాల విభజన, పుటల సంఖ్యలను ప్రవేశపెట్టారు. తెలుగు బైబిలు అనువాదంలో కూడా బ్రౌన్ ముద్ర ఉంది. బాప్టిజం, ఆమెన్, హల్లెలూయ, సబ్బాతు వంటి పదాల ధార్మికార్థం చెడకుండా యథాతథంగా, తత్సమాలుగా చేశారు. అలాగే వైన్ అనేది క్రైస్తవులకు పవిత్రమైనది. అది కేవలం పులియని ద్రాక్షరసం. అందుకే ద్రాక్షరసం అని గౌరవపదంగా అనువదించారు. తెలుగు, బైబిల్ లోనూ క్రైస్తవుల వ్యావహారికంలోనూ పలికే సిలువ, పరిశుద్ధాత్మ, స్తోత్రం, స్తుతి, సువార్త, సన్నుతి, కలుగునుగాక, ప్రభువు నామమునకు, నీకు స్తోత్రం లాంటి పదాలు నేటికీ ప్రామాణికంగా నిలిచాయి. తెలుగు బైబిలు అనువదించి, పరిశీలనార్థం లండన్‌కు పంపించారు. ఆ గ్రంథాన్ని గోర్టిన్, ప్రిబెట్ అనేవాళ్లు 1857లోనూ, వార్ట్లా, జాన్హే అనేవాళ్లు 1860లో తమ పేర్లతో ముద్రించుకున్నారు. ఎక్కడా బ్రౌన్ పేరును ప్రస్తావించనే లేదు. భారతదేశంలో ఉన్న నలభై ఏళ్లలో తాను పరిష్కరించి, ప్రచురించిన పుస్తకాలను బ్రౌన్ మద్రాస్ గ్రంథాలయానికి ఇచ్చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం లండన్‌లో కొంతకాలం తెలుగు ఆచార్యుడిగా పని చేసిన కాలంలోనూ పరిష్కరించిన గ్రంథాలను ఇండియా ఆఫీస్ లైబ్రరీకి బహూకరించారు. బ్రౌన్ రచనలన్నీ రెవరెండ్ టైలర్ 1857, 1860, 1862 సంవత్సరాల్లో మూడు సంపుటాలుగా తయారుచేసి, ఫోర్ట్ సెయింట్ జార్జ్ గెజిట్ ప్రెస్‌లో ముద్రించారు. ఈ తెలుగు వెలుగుల సూరీడు 1884 డిసెంబరు 12న వెస్ట్‌బార్న్ గ్రోవ్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన జన్మించి నేటికి 225 సంవత్సరాలు. ఆయన ఒక్క చేతిమీదుగా తెలుగు సాహిత్య సంపద అంతా రెక్కలు విప్పి విహరించింది... మనకు కీర్తిప్రతిష్ఠలను తీసుకొచ్చింది. తెలుగు ప్రజలకు ఆయన ప్రాతఃస్మరణీయులు. (క్లిక్ చేయండి: రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక..) - ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ప్రముఖ సాహితీ పరిశోధకులు (సీపీ బ్రౌన్ 225వ జయంతి సంవత్సరం) -
పోరుబాటలో ఆయనది ఉక్కు సంకల్పం
స్వాతంత్య్రోద్యమంలో గర్జించిన గుంటూరు పోరాట కీర్తి.. పొట్టిశ్రీరాములు కంటే ముందే ఆంధ్రరాష్ట్రం కోసం గళమెత్తిన అమృతమూర్తి.. విశాఖ ఉక్కు కోసం పిడికిలెత్తిన ఉద్యమస్ఫూర్తి.. మహోజ్వలిత తేజం తమనంపల్లి అమృతరావు. ఆయన జీవితం ఆద్యంతం ఆదర్శనీయం. అక్టోబర్ 21న మహనీయుని జయంత్యుత్సవం సందర్భంగా ఆయన సేవా ప్రస్థానం స్మరణీయం.. గుంటూరు: అమృతరావు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదల గ్రామంలో 1920 అక్టోబర్ 21న పేద దళిత కుటుంబంలో జన్మించారు. పేదరికం వల్ల విద్యను మధ్యలోనే ఆపేశారు. సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. మహాత్మా గాంధీ పిలుపుతో 1940 దశకంలో స్వాతంత్య్రసమరంలోకి అడుగుపెట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. గుంటూరులోని కొండా వెంకటప్పయ్య పంతులు ఇంటికి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ అమృతరావును ప్రత్యేకంగా పిలిపించుకుని గంటకుపైగా మాట్లాడారట. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారట. అమృతరావు కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, వింజమూరి భావనాచార్యులు, నడింపల్లి తదితరులతో కలిసి బ్రిటిష్ సేనలపై వీరోచితంగా పోరాడారు. ఆంధ్రరాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది పొట్టి శ్రీరాములుకంటే ముందే అమృతరావు ఆంధ్రరాష్ట్ర సాధనకు నడుంకట్టారు. 1952 ఆగస్ట్ 2న మద్రాసు సెక్రటేరియెట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో స్పందించిన ప్రకాశం పంతులు ఇంత చిన్నవయసులో ఇంత పెద్ద ఉద్యమం వద్దని హితవు పలికి దీక్షను విరమింపజేశారు. ఆ తర్వాత 1952 అక్టోబర్‌లో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష ప్రారంభించి ప్రాణత్యాగం చేశారు. అనంతరం మహాత్ముని సిద్ధాంతాల ప్రచారానికి అమృతరావు 1959లో గాంధీ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. విశాఖ ఉద్యమంలో కీలకంగా.. 1964లో కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ముందు ప్రకటించి ఆ తర్వాత వెనక్కుతగ్గింది. దీంతో అమృతరావు విశాఖపట్నం కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ పేరుతో 21 రోజులపాటు దీక్షను నడపడం విశేషం. ఇది మహోద్యమంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారపత్రం అందజేశారు. ► అనంతరం 1978–83 వరకు తాడికొండ నియోజకవర్గం నుంచి అమృతరావు శాసన సభ్యుడిగా పనిచేశారు. ► అప్పట్లో జిల్లా కలెక్టర్ అమృతరావుకు ఇచ్చిన సుమారు 15 ఎకరాల భూమిని ఆయన పేదలకు పంచి పెట్టారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు నగర్ ప్రాంతం అదే. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం ఇచ్చిన పింఛన్నూ తిరస్కరించిన నిజమైన దేశభక్తుడు అమృతరావు. ఆఖరుకు పేదరికంతోనే 1989 ఏప్రిల్ 27న ఆయన నెల్లూరులో కన్నుమూశారు. విశాఖలో విగ్రహం ఏర్పాటుచేసిన వైఎస్సార్ అమృతరావు సేవలకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుత గుర్తింపునిచ్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.78 లక్షలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణలో అమృతరావు కాంస్య విగ్రహంతోపాటు ఆయన పేరుతో పార్క్‌నూ ఏర్పాటు చేశారు. 2008లో గుంటూరులోనూ అమృతరావు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. వైఎస్సార్ రుణం తీర్చుకోలేనిది తాతగారి ఉద్యమాలను, గొప్పదనాన్ని గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ రుణం తీర్చుకోలేనిది. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తూ స్వాతంత్య్ర ఉద్యమకారులను గుర్తిస్తున్నారు. గుంటూరులోని సోషల్ వెల్ఫేర్ భవనానికి అమృతరావు పేరును పెట్టాలని కోరుతున్నాం. – తమనంపల్లి మోహన్ గాంధీ గాంధీ మిషన్ అధ్యక్షులు (అమృతరావు మనవడు) గొప్ప నేతతో నా సాంగత్యం అమృతరావుతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ రోజుల్లో ఆయన నిస్వార్థ ప్రజా సేవ ఎనలేనిది. ఆయన జ్ఞాపకార్థం 2008లో స్థానిక అమరావతి రోడ్డులో అమృతరావు విగ్రహాన్ని వైఎస్సార్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమృతరావును స్మరించుకోవడం సంతోషంగా ఉంది. – వింజమూరి రాజగోపాలాచారి (బాబు), సీనియర్ న్యాయవాది -
Vempati Chinna Satyam: కూచిపూడి విదుషీ ధీమణి
శాస్త్రీయ నృత్య రూపకాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిలో కూచిపూడి ఒకటి. ఇది తెలుగు నేల నుంచి ప్రస్థానం ప్రారంభించి యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది. ఆంధ్ర రాష్ట్ర అధికారిక నృత్యం కూచిపూడి. అందులో అత్యద్భుతమైన నాట్యాచార్యులు ‘పద్మభూషణ్’ వెంపటి చిన సత్యం. 1929 అక్టోబర్ 15న కృష్ణా జిల్లా కూచిపూడిలో వెంపటి జన్మించారు. తమిళనాడులో భరతనాట్యం విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని అక్కడి కళాభిమానులకు పరిచయం చేసి, దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు. కూచిపూడి నాట్యంలో సరికొత్త ప్రయోగాలు చేయడానికి తన జీవితమంతా అంకితం చేసిన విదుషీ ధీమణి వెంపటి. రకరకాల జతులనీ, నాట్య ప్రక్రియలనీ విస్పష్టంగా వర్గీకరించి, సనాతన నాట్యశాస్త్ర సమగ్ర విధివిధానాలతో మేళవించి, ఎన్నెన్నో జతి స్వరాలూ, తిల్లానాలూ, వర్ణాలూ సృజించిన నాట్య పరమేష్టి ఆయన. కూచిపూడి నృత్య నాటికలను ఎన్నింటినో రూపొందించి వాటికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేశారు. శ్రీకృష్ణ పారిజాతం, చండాలిక, మేనకా విశ్వామిత్ర, రుక్మిణీ కల్యాణం, కిరాతార్జునీయం, క్షీరసాగర మథనం, పద్మావతీ శ్రీనివాసం, హరవిలాసం లాంటివి పేరెన్నిక గన్నవి. 1947లో మద్రాసుకు చేరుకున్న చిన సత్యం తన సోదరుడు వెంపటి పెద సత్యం వద్ద సినిమాలకు నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. 1984లో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన కూచిపూడి నృత్యానికి గిన్నిస్ రికార్డు వచ్చింది. 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాపించారు. దీని ద్వారా వైజయంతిమాల, ప్రభ, పద్మామీనన్, వాణిశ్రీ, శోభానాయుడు లాంటివారికి కూచిపూడి నేర్పించారు. హేమమాలిని, మంజుభార్గవి, చంద్రకళ, రత్నపాప వంటి వారంతా ఆయన శిష్యులే. 2012 జూలై 29న మరణించిన వెంపటి జన్మదినమైన అక్టోబర్ 15న ప్రపంచ కూచిపూడి దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఆయన పేరిట 5 లక్షల రూపాయల స్మారక పురస్కారాన్ని ‘యక్షగాన సార్వభౌమ’ చింత సీతారామాంజనేయులుకు ప్రకటించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు ఆర్కే రోజా దీన్ని ప్రదానం చేస్తారు. – రేగుళ్ళ మల్లికార్జునరావు, సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ (అక్టోబర్ 15న వెంపటి చిన సత్యం జయంతి) -
Allu Ramalingaiah: హాస్య దళానికి కులపతి అల్లు రామలింగయ్య
తెలుగు సినిమా చరిత్రలో భావి తరాల వారిని ప్రభావితం చేయగలిగిన నటీనటులు వేళ్ళమీద లెక్క పెడితే అందులో తప్పనిసరిగా నిలిచే పేరు అల్లు రామలింగయ్య. హాస్యంలోంచి విలనీ, విలనీ లోంచి హాస్యం సాధించిన విశిష్ట నటుడు. 1953లో తొలిచిత్రం పుట్టిల్లులో పోషించిన శాస్త్రులు, వద్దంటే డబ్బులో టీచరు, దొంగరాముడులో హాస్టలు వార్డెను పాత్రల్ని పునాదులుగా చేసుకుని భాగ్యరేఖ, మాయాబజార్ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 2004 నాటికి 1,000కి పైగా చిత్రాల్లో విలక్షణ భూమికల్ని పోషించారు. ‘పుట్టిల్లు’, ‘మాయాబజార్’లలోని శాస్త్రులు పాత్ర ఆకట్టు కుంది. అందుకే ఆ తర్వాత అనేక చిత్రాల్లో శాస్త్రి పాత్ర ఆయన్నే వరిచింది. ఒక్కో చిత్రంలో ‘శాస్త్రి’ పాత్ర ఒక్కోలా ఉండడమే అల్లు సాధించిన పరిపూర్ణత. ఆ పాత్రకు తాను నిజ జీవితంలో చూసిన సూరి భొట్ల నారాయణమూర్తి స్ఫూర్తి అనీ, అయితే ఆయా చిత్రాల్లో పాత్రౌచిత్యాన్ని బట్టి రసాల కూర్పు చేసుకునే వాడిననీ ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అలాగే హాస్య పాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడల్లా మునిమాణిక్యం నర సింహరావు, భమిడిపాటి కామేశ్వరరావు వంటి వారి రచనలు చదివి స్ఫూర్తి చెందేవాడిననీ, ఆ ఇద్దరూ తన అభిమాన రచయితలనీ అల్లు పేర్కొన్నారు. ఎప్పుడో దొంగ రాముడు షూటింగ్ సమయంలో అల్లు అప్రయత్నంగా డైలాగ్ మరిచి పోవడం వలన వెలువడిన ’ఆమ్యామ్యా’ని, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, అందాల రాముడు చిత్రాల్లో చెప్పగా చెప్పగా ‘ఆమ్యామ్యా’ కాస్తా తెలుగు నాట లంచానికి పర్యాయపదంగా స్థిరపడిపోయి, దినపత్రికల్లో పతాక శీర్షిక అయ్యింది. ముళ్ళపూడి వెంకట రమణని ఓ జర్నలిస్ట్ ‘ఆమ్యామ్యా’ సృష్టికర్త మీరే కదా?! అని ప్రశ్నస్తే ‘ఆమ్యామ్యా సృష్టికర్త అల్లు రామలింగయ్య గారు, ఆమ్యామ్యా మీద పేటెంట్ హక్కులన్నీ వారివే’ అని ధృవీకరించారు. మూగమనసులు సినిమా చేసేనాటికి వెయ్యి రూపాయలు పారితోషికం కాస్తా రెండువేల ఐదొందలు అయ్యింది. అల్లు 2003 నాటికి గానీ అత్యధిక పారితోషికం లక్ష రూపాయలు అందుకోలేదు. పాలకొల్లులో నాటకాలాడటం, స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని జైలు శిక్షలను అభవించడం, ప్రజా నాట్యమండలితో అనుబంధం వంటి అనేక దశలు రామలింగయ్య జీవితంలో ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. అల్లు జననీ జనకులు అల్లు వెంకయ్య, సత్తెమ్మ. మొత్తం ఏడుగురు సంతానం. క్షీరా రామలింగేశ్వరుడి పేరు ఆయనకు పెట్టారు. ఆ రోజుల్లో అధికారులు 40 ఏళ్ళని బర్త్ సర్టిఫికెట్ తీసుకువస్తే ప్రవేశ పరీక్ష రాయక్కర్లేదని ఆర్ఎంపీ సర్టిఫికెట్ ఇస్తామని చెబితే... ‘లేదు నాకు 39 ఏళ్ళే, నేను పరీక్ష రాస్తా’నని చెప్పి పరీక్ష రాసి ఉత్తీర్ణుడై హోమియోపతి డాక్టరుగా అల్లు సాధించిన కీర్తి ఇంతా అంతా కాదు. అల్లు నుండి వైద్యసేవలు అందుకున్నవారిలో నందమూరి బసవతారకంతో పాటు నూతన నటీనటుల వరకూ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. రాజ మండ్రిలో బోడా వెంకటరత్నం, చింతవారి జానకి రామయ్య తదితర ప్రముఖులతో స్థాపించబడిన హోమియో కళాశాల ఆర్థిక అస్థిర పరిస్థితుల్లో ఉంటే అల్లు రామలింగయ్య కృషితో ఆంధ్ర దేశంలో పేరెన్నిక గన్న కళాశాలగా ఎదిగింది. ప్రతి కార్యక్రమానికీ అర్ధాంగి అల్లు కనక రత్నం, పెద్ద కుమార్తె అల్లు నవ భారతీదేవి తప్పని సరిగా వచ్చేవారు, జాతీ యోద్యమంలో నూలు వడకడంలో జిల్లాలోనే మొదటి బహు మతి పొందిన కారణంగా కనకరత్నంని కోరి మరీ పెళ్ళా డారు రామలింగయ్య. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక కలిగిన సంతానం కావడంతో తమ కుమార్తెకు నవభారతి అని పేరు పెట్టుకున్నారంటే ఆయన దేశభక్తి ఏమిటో అర్థమవుతుంది. అల్లు అరవింద్ అగ్ర నిర్మాతగా అవతరించాక ‘నాన్నగారూ కొంచెం మీరు విశ్రాంతి తీసుకోవచ్చు కదా! ఇంకా నటించడం ఎందుకండి, సంవత్సరంలో మీరెంత సంపాదిస్తారో అంతా మీకు ఒక్కసారిగా నేనిచ్చేస్తాను’ అంటే... ‘నటించడంలోనే నా తృప్తి, సరదా, సంతోషం అన్నీ ఉన్నాయి, కాబట్టి ఓపిక నశించే వరకూ నటిస్తా. ఊపిరి ఉండే వరకూ నటిస్తా. మరణించాక కూడా నటిస్తా అన్నారు అల్లు రామలింగయ్య. ‘మరణించాక నటిస్తారా? అదెలాగ నాన్నగారూ?’ అన్నారు అరవింద్. ‘నేను పోయాక నన్ను పాడెమీద పడుకో బెట్టాక నువ్వా దృశ్యాలన్నిటినీ కెమెరాతో షూట్ చేయిస్తావని నాకు తెలుసు, అంటే నేను పోయాక కూడా నటిస్తున్నాననే కదా!’ అన్నారు రామలింగయ్య. ఇంత చెప్పీ అల్లు రామలింగయ్య బాల్యం నుండే అస్పృశ్యత, అంటరానితనంపై పోరాడారని చెప్పకపోతే తప్పే అవుతుంది. ‘కుక్కను జూచి గురుతర భక్తితో భైరవుండని ప్రేమ బరగుచుండి/ పాముని జూచి సుబ్బారాయుడని మ్రొక్కి పాలు పోసి పెంతురు భక్తి గల్గి/గద్దను జూచి విష్ణు వాహనం బనుచు కడు ముదముతో వినుతి జేసి/కోతి హనుమంతుడనుచు కూర్మి మీర తాకెదరు గాదె మమ్మేల తాకరయ్యా?! జంతువుల కన్నా అధముడా సాటి నరుడు’ అనే పద్యంతో ధ్వజమెత్తిన అల్లు రామలింగయ్య జీవిత పర్యంతమూ ఈ సిద్ధాంతానికే కట్టుబడిన మహర్షి! – చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్, రచయిత -
అయోధ్యలో లతామంగేష్కర్ పేరు మీద చౌక్...7.9 కోట్లతో భారీ వీణ ఏర్పాటు..
అయోధ్య: లెజండరీ సింగర్ దివగంత లతామంగేష్కర్ 93వ జయంతి పురస్కరించుకుని ఆమె పేరు మీద అయోధ్యలో ఒక కూడలిని ఏర్పాటు చేశారు. దీన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. ఈమేరకు సరయు నది వద్ద ఉన్న కూడలిలో దాదాపు రూ. 7.9 కోట్ల వ్యయంతో భారీ వీణను ఏర్పాటు చేశారు. ఈ వీణ దాదాపు 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తులో 14 టన్నుల బరువు ఉంటుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వట్టర్లో...లతా దీదీ జయంతి సందర్భంగా ఆమెని స్మరించుకోవడమే గాక ఆమె తనపై చూపిన ఆప్యాయతను మరువలేనిదన్నారు. ఈ రోజు అయోధ్యలోని చౌక్‌కి ఆమె పేరు పెట్టడం అనేది భారతీయ దిగ్గజాలలో ఒకరిగా పేరుగాంచిని లతా దీదీకి దక్కిన తగిన నివాళి అని అన్నారు. ఈ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ సంగీత వాయిద్యం సంగీత ప్రియులకు గొప్ప ఆకర్షణగా ఉండటమే గాక ఇంత బారీ సంగీత పరికరాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రధమమని అధికారులు తెలిపారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఈ ప్రాజెక్టుకి సుమారు 7.9 కోట్లు ఖర్చు అయ్యిందని తెలిపారు. ఈ భారీ సంగీత వీణను పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ తయారు చేశారని, సుమారు రెండు నెలల సమయం పట్టిందని తెలిపారు. అందంగా తీర్చిదిద్దిన ఈ వీణపై సరస్వతి చిత్రం కూడా చెక్కబడి ఉందని అన్నారు. (చదవండి: రాహుల్‌ని చూసి భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చిన యువతి: వీడియో వైరల్) -
గుర్రం జాషువాకు సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అమరావతి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి శ్రీ గుర్రం జాషువా. వడగాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది జాషువా. మహాకవి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి శ్రీ గుర్రం జాషువా. వడగాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది జాషువా. మహాకవి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2022 -
Gurram Jashuva: మనువును జయించిన విశ్వనరుడు
‘‘కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి / పంజరాన గట్టువడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’’ అంటూ విశ్వమానవతను ప్రకటించాడు తన కవిత్వం ద్వారా జాషువా మహాకవి. తాను నమ్మిన విలువల్ని, సిద్ధాంతాల్ని తన రచనల ద్వారా నిక్కచ్చిగా ప్రకటించాడు. తన సాహితీ ప్రస్థానంలో సామాజికంగా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా వెనుదిరగలేదు. కులమతాల దాడులకు వెరవక తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. ‘పలుకాకుల మూకలు అసూయ చేత నన్ను ఏవిధంగా దూషించిన నా సాహితీ సౌరభం మాయమై పోద’నీ, ‘నన్ను వరించిన శారద లేచి పోవునే’ అని అన్నాడు. ‘ప్రపంచం ఎట్లా నిర్ణయించిన నాకు కొదవలేదు నేను విశ్వనరుడను’ అని ప్రకటించాడు. కసరి బుసగొడుతున్న నాగరాజుల వైపు కవితా దివిటీలను విసిరాడు. కేవలం విశ్వమానవతను ప్రకటించడమే కాకుండా తన కవితా ప్రస్థానమంతటా జాగరూకుడై కవిత్వమై ప్రతి స్పందించాడు. జాతీయోద్యమ కాలంలో జాతి జనుల్లో భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక విషయాలను తన కవిత్వంలో పొందుపరచాడు. సింధు గంగా నదులు జీవజల క్షీరాన్ని నిరంతరాయంగా ప్రవహింపజేస్తూ తమ సంతానాన్ని పోషించుకుంటున్నదని పచ్చి బాలింతరాలుగా కన్న దేశాన్ని కీర్తించాడు. తద్వారా ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పాడు. దేశాన్ని గతంలో పాలించిన రాజుల వైభవాన్నీ, తాత్విక మార్గదర్శకులుగా ఉండిన మహనీయుల గురించీ, విశ్వవిఖ్యాతి చెందిన వారి ఘనతను గురించీ ప్రజలకు కనువిప్పు కలిగించే విధంగా, జాతీయభావాలు ఉప్పొంగేలా కవిత్వం రాసిన పద్యాల పరుసవేది జాషువా. బుద్ధుని తాత్విక చింతనలోని సారాంశాన్ని వర్ణిస్తూ... ‘రెండు వేల ఐదువందల ఏళ్ళు గడిచినా నీ కమనీయ బోధలకు నిగ్గు రవ్వంత కూడ తగ్గలేదు’ అంటాడు. అశోకుని వంటి మహా చక్రవర్తుల గుండెలను సైతం బౌద్ధం పెళ్ళగించి అహింసా సిద్ధాంతం వైపు మళ్ళించిందని పేర్కొన్నాడు. మరో సందర్భంలో భారతీయ సంస్కృతీ ఔన్నత్యాన్ని విశ్వసభల్లో చాటిన మహనీయుడు స్వామి వివేకానంద గొప్పదనం గురించి ‘వివేకానంద’ అనే ఖండికలో వివరించాడు. పేదరికం, అవమానాలతో కుంగిపోక ధీరోదాత్తునిలా ఎదుర్కొని విశ్వనరుడి స్థాయికి ఎదిగాడు. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తినొందాడు. తెలుగుదనాన్ని తన పద్యంలో జాలువార్చి స్వచ్ఛమైన తెలుగుభాషకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అటు సంప్రదాయ సాహిత్య సంస్కారాన్నీ, ఇటు ఆధుని కతనూ మేళవించి తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిం చాడు. కావుననే జాషువా పద్యం జానపదుల నాలుకలపై జీవించి వుంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన కవి తెలుగు భాషలో అరుదని చెప్పొచ్చు. జాషువా సాహిత్యంలో భారత పురాణ పురుషులే గాక, ప్రపంచ శాంతికి సత్యం, అహింస వంటి ఆయుధాలను అందించిన గౌతమ బుద్ధుడు, అహింసామూర్తి గాంధీ, సామాజిక తత్వవేత్త అంబేడ్కర్ వంటి మహానీయులు అందరూ దర్శనమిస్తారు. బుద్ధుని బోధనల్లోని అహింసా తత్వాన్నీ, విశ్వమానవ ప్రేమనూ, ఏసుక్రీస్తు బోధనల్లోని శాంతి, కరుణ, సత్యం, సౌశీల్యాన్నీ ఆయన ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పేవిగా పేర్కొన్నాడు. ఆయన దృష్టిలో జాతీయత అంటే అన్ని మతాలు సహనంతో కలగలసి జీవించడం. ఏసుక్రీస్తు చెప్పినట్లు ‘నీవలే నీ పొరుగువారిని ప్రేమించడం’. సామాజిక సమానత, సంక్షేమం కోసం కవిత్వం రాశాడు. ‘కాందిశీకుడు’ రచనలో ‘కపాలం’ ద్వారా మాట్లాడుతూ సమాజంలోని అసమానతలు తొలగిపోయి విశ్వ సమానతా భావం, విశ్వ సోదరభావం పెంపొందినపుడే జాతీ యతా భావం ఆవిర్భావం జరుగుతుందని చెబుతాడు. నా జాతి నాయూరు నాదేశమని పొంగు స్వాభీ మానము శూన్యమయిన దాక విశ్వసౌభ్రాత్రంబు వెలయించునైక్య సం ఘావ్యాప్తిదిశల పెంపారు దాక... అంటాడు. మహాత్ముడి అకాల మరణానికి దిగ్భ్రాంతికి గురయిన జాషువా ‘బాపూజీ’ లఘు కావ్యాన్ని రచించాడు. గాంధీజీ అహింసా సిద్ధాంతాల పట్ల అత్యంత ప్రేమాదరణను కన బరచిన ఆయన ఈ కావ్యానికి ముందు మాటగా ‘వినతి’ని రాస్తూ ‘ప్రపంచ చరిత్రలో నెట్టివాడు నీయుగమున గడింపని కీర్తి నతడార్జించి, అనుంగు బిడ్డలగు భారతీయుల కంకిత మొనర్చినాడు. ప్రతిఫలముగా తనకు లభించినది బలవన్మరణము. భస్మస్వరూపము. అది తలంపరాని విషమ ఘడియ’. ‘నాడు రాలిన యశ్రు కణములే ఈ కావ్యము’ అంటాడు. బాపూజీ కావ్యంలో జాషువా హృదిలో ముద్రించుకున్న చిత్రం దృశ్యమానంగా కళ్ళకు కట్టి కనిపిస్తుంది. అహింసావాదిగా కరుణా మూర్తిగా, సంఘ సంస్కర్తగా, హిందూ ముస్లిం సమైక్యతావాదిగా గాంధీజీని చిత్రించాడు. గోచిపాత గట్టుకొని జాతి మానంబు నిలిపినట్టి ఖదరు నేతగాడు విశ్వసామరస్య విజ్ఞాన సంధాత కామిత ప్రదాత గాంధితాత’’ అంటాడు. గాంధీ సైద్ధాంతిక నిష్టను, నైతికతను మనఃపూర్వకంగా ఒప్పు కున్నాడు. ఆచరింప దగినవిగా భావించాడు. ఈ నేపథ్యంలో ఆయన ‘నివసించుటకొక నిలయము తప్ప గడన చేయుటకు ఆశపడను’ అన్నాడు. ‘ఆలు బిడ్డలకు ఆస్తి పాస్తులు గూర్చ పెడత్రోవలో కాలు పెట్టను’ అన్నాడు. ఈ నైతిక, సామాజిక నిష్ఠను గాంధీజీ దృక్పథం నుండి జాషువా గ్రహించాడు. ఆయన దృష్టిలో దేశభక్తి, విశ్వమానవత ప్రాధాన్యాలు. నిత్యం అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొన్నా, తాను మాత్రం జాతీయతా దృక్పథంతోనూ, విశ్వమానవ తత్పరతతోనూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. మహాకవి దృష్టిలో దేశభక్తీ, విశ్వమానవతా రెండూ నాణేనికి రెండు వైపుల వంటివి. జీవించినంత కాలం ఈ సైద్ధాంతిక భూమికకు కట్టుబడే పనిచేశాడు. కాబట్టే బుద్ధుడు, మహాత్ముడు తనకు ఆరాధ్యులుగా భావించాడు. - డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏపీ ప్రభుత్వ విప్, మాజీమంత్రి (జాషువా జయంతి వారోత్సవాలు నేటి నుంచి ఈ నెల 28 వరకు గుంటూరులో జరుగుతున్న సందర్భంగా) -
Ronanki Appalaswamy: నడిచే బహు భాషాకోవిదుడు
కళింగాంధ్రలో జన్మించి రచయితగా, బోధకుడిగా, అనువాదుకుడిగా, సాహితీ విమర్శకుడిగా, అభ్యుదయవాదిగా ఆచార్య రోణంకి అప్పలస్వామి చేసిన పయనం తరగని స్ఫూర్తిని పంచింది. ఆయన 1909 సెప్టెంబరు 15వ తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఇజ్జవరం గ్రామంలో జన్మించారు. మూడో ఫారం చదువుతుండగానే పోతన భాగవతంలోని ఘట్టాలను కంఠస్థం చేసిన అప్పలస్వామి, తర్వాత కాలంలో ప్రపంచమే నివ్వరపోయేటంత భాషావేత్తగా ఎదిగారు. విజయనగరం ఎంఆర్ కళాశాలలో ఆంగ్ల బోధకుడిగా 1934లో కెరీర్ ప్రారం భించారు. ఒక వైపు ఆంగ్ల అధ్యాపకునిగా ఉంటూనే ఫ్రెంచ్, స్పానిష్, గ్రీకు, హీబ్రూ, ఇటాలియన్ వంటి యూరోపియన్ భాష లను ఆధ్యయనం చేశారు. ఆయా భాషల్లో కవితలు, రచనలు చేయడమేకాక అను వాదాలూ చేశారు. గ్రామఫోన్ ప్లేట్లు పెట్టుకొని జర్మన్, లాటిన్ లాంటి భాషల్లో నైపుణ్యం సంపా దించారు. హిందీ, ఒడియా, కన్నడం, బెంగాలీ వంటి భార తీయ భాషల్లో సైతం అసర్గళంగా మాట్లాడే శక్తి సొంతం చేసుకున్నారు. విజయనగరంలో వున్న తొలినాళ్లలో ‘సాంగ్స్ అండ్ లిరిక్స్’ పేరిట తొలికవితా సంపుటిని 1935లో వెలువ రించారు. అల్లసాని పెద్దన, క్షేత్రయ్య రచనలను ఆంగ్లీకరిం చారు. మేకియవెల్లి ఇటాలియన్ భాషలో రాసిన ‘ప్రిన్స్’ గ్రంథాన్ని, ‘రాజనీతి’ పేరుతో తెలుగులోకి సరళంగా అనువదించారు. మహాకవి గురజాడ కలం నుంచి జాలువారిన ‘పూర్ణమ్మ’, ‘తోకచుక్క’లను ఇంగ్లీష్‌లోకి అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, నారాయణ బాబు, విశ్వ సుందరమ్మ, చాకలి బంగారమ్మ వంటివారిని ప్రపంచ కవితా ప్రియులకు పరిచయం చేసింది రోణంకి వారే. ఆకాశవాణిలో కొన్ని సంవత్సరాలు ప్రసంగాలు చేశారు. ఆంగ్లభాషలో ఉత్తమ బోధకుడిగా, పలు భాషల్లో నిష్టాతుడిగా ఖ్యాతిగాంచిన రోణంకి అప్పలస్వామిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధన చేయమని ఆహ్వానం లభిం చింది. యూజీసీ ఎమెచ్యూర్ ప్రొఫెసర్‌గా నియమించింది. చాగంటి సోమయాజులు (చాసో), శ్రీరంగం నారాయణబాబు, చిర్రావూరి సర్వేశ్వర శర్మలు రోణంకికి మంచి స్నేహితులు. ప్రముఖ చిత్రకారుడు అంట్యాకుల పైడి రాజు ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. (క్లిక్ చేయండి: ఉత్తమ కథల సంకలనంలో ‘వేంపల్లె’ కథ) ప్రముఖ రచయిత ఆరుద్ర, రోణంకి మాష్టారుకు శిష్యుడే. అందుకే తన తొలి కావ్యం ‘త్వమేవాహం’ను అప్పల స్వామికి అంకితం చేశారు. డాక్టర్ మానేపల్లి తన తొలి కవితా సంపుటి ‘వెలిగించే దీపాలు’ను రోణంకి గారికే అంకితమిచ్చి మాష్టారు రుణం తీర్చుకున్నారు. పీవీ నరసింహారావు, పుట్టపర్తి నారాయణా చార్యుల వంటి వారితో సమాన ప్రతిభా పాటవాలు కలిగిన ఆచార్య అప్పలస్వామి జీవిత చరిత్రను, రచనలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. - డాక్టర్ జి. లీలావరప్రసాదరావు వ్యాసకర్త అసిస్టెంట్ ఫ్రొఫెసర్, బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం (సెప్టెంబరు 15నఆచార్య రోణంకి అప్పలస్వామి జయంతి) -
62 ఏళ్లపాటు అలరించిన అమృత గానం ఆయనది
ట్రెండింగ్.. ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?. పైన హార్మోనియం వాయిస్తున్నట్లు ఓ చిత్రం కనిపించిందా?. ఆ చిత్రంలో ఉంది ఎవరో కాదు.. భారత దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత విద్వాంసుడు.. భూపేన్ హజారికా. ఇవాళ ఆయన జయంతి. అందుకే గూగుల్ అలా డూడుల్‌తో గౌరవించింది. భూపేన్ హజారికా.. సుధాకాంత(కోకిల)గా పాపులర్ అయిన ప్రముఖ సంగీత దర్శకుడు. ఆరు దశాబ్దాలపాటు తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరించారాయన. వందల కొద్దీ పాటలు పాడి గాయకుడిగానే కాకుండా ఫిల్మ్‌మేకర్‌గా, రచయితగా కూడా సాహిత్య లోకానికి సేవలందించారు. మరోవైపు ఎమ్మెల్యేగానూ ఆయన రాజకీయ రంగంలో రాణించారు. అంతేనా.. నటుడిగా కూడా వందల చిత్రాల్లో అస్సామీ ఆడియెన్స్‌ను అలరించారు ఆయన. ఇద్దరూ గానకోకిలలే.. లతా మంగేష్కర్తో హజారికా (పాత చిత్రం) ► హజారికా.. సెప్టెంబర్ 8, 1926లో అస్సాంలో జన్మించారు. బ్రహ్మపుత్ర తీరం వెంట ఆయన బాల్యం గడిచింది. ఆ తీరం వెంటే జానపద కథలు, గేయాలు వినుకుంటూ పెరిగారాయన. విశేషం ఏంటంటే.. హజారికా తన పదేళ్ల వయసులోనే తొలి పాటను రికార్డ్ చేశారు. ► అస్సాంకు చెందిన ప్రముఖ రచయిత జ్యోతిప్రసాద్ అగర్వాల ప్రోత్సాహంతో హజారికా రాటుదేలారు. ► 1946లో బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంఏ పూర్తి చేశారు. న్యూయార్క్‌లో కొంతకాలం జీవించిన ఆయన.. 1952 కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్లో పీహెచ్డీ అందుకున్నారు. ► హజారికా గాన ప్రస్థానం గువాహతి ఆల్ఇండియా రేడియో నుంచి మొదలైంది. బెంగాలీ పాటలను హిందీలోకి అనువదించి.. గాత్రం అందించారు. ► ఆయన అందించిన సాహిత్యం.. గాత్రంలో నవరసాలు పండేవి. ► రుడాలి, మిల్ గయి మాంజిల్ ముఝే, సాజ్, దార్మియారీ, గజగామిని, దామన్, క్యూన్ తదితర చిత్రాల్లో ఆయన పాడిన సూపర్ హిట్ సాంగ్స్ కల్ట్ క్లాసిక్‌గా మిగిలాయి. ► ఈశాన్య భారతం నుంచి.. అస్సాం జానపద సాహిత్యాన్ని యావత్ దేశానికి పరిచయం చేసింది ఈయనే. ► రాజకీయాల మీద ఆసక్తితో ఆయన అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు 1967లో పోటీ చేశారు. నౌబోయిచా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే.. తిరిగి 2004లోనూ లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తరపు నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ► సంగీతానికి, సంప్రదాయానికి ఆయన అందించిన సేవలకుగానూ.. సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు దాదాసాహెబ్ పాల్కే అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ► 1998 నుంచి ఐదేళ్లపాటు సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా ఆయన పని చేశారు. ► 2011లో అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఐదు నెలలపాటు చికిత్స పొందుతూ.. చివరికి అవయవాల పని ఆగిపోవడంతో నవంబర్ 5వ తేదీన కన్నుమూశారు. అస్సాంకు గౌరవం తీసుకొచ్చిన ఆయన అంత్యక్రియలకు లక్షల మంది హాజరయ్యారు. ► మరణాంతరం.. 2012లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ► 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న గౌరవం ఆయనకు దక్కింది. ► అస్సామీ భాషలో మానవత్వం, సోదరభావం పెంపొందించేలా ఆయన పాటలు రాసి.. పాడారు. ► తన జీవితంలో తొలినాళ్లలో.. కోయిబర్టా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని సంగీత విద్వాంసుడిగా అంగీకరించని అగ్రవర్ణ కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడారు ఆయన. అయితే ఈ చర్యకు బదులుగా.. ఆయన ప్రేమించిన బ్రహ్మణ యువతిని ఆయనకు దూరం చేశారు. చివరికి.. కుల-వ్యతిరేక సమాజంపై ఆయన ప్రతీకారం తీరింది. అదెలాగంటే.. ఓ బ్రహ్మణ యువతిని వివాహం చేసుకోవడం ద్వారానే!. ► ముంబైకి చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ రుతుజా మాలి, హజారికా 96వ జయంతి సందర్భంగా ఈ డూడుల్‌ను క్రియేట్ చేశారు. -
BP Mandal: మండల్ దన్నుతో ఉద్యమించాలి!
ఇండియా జనాభాలో సగాని కన్నా ఎక్కువ ఉన్న వెనుక బడిన తరగతులవారు (బీసీలు)... తరతరాలుగా భారతీయ సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ వారు మాత్రం అన్ని రంగాల్లో వెనక బడే ఉన్నారు. అందుకే బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం 1953 జనవరిలో కాకా కలేల్కర్ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం నియమించింది. 1955 మార్చిలో కమిషన్ నివేదిక సమర్పించి బీసీల అభివృద్ధికి పలు సూచనలు చేసింది. ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక... కాక కలేల్కర్ కమిషన్ నివేదిక సమర్పించి చాలా ఏండ్లు అయిందని... కొత్త కమిషన్‌ను 1978 డిసెంబర్లో నియమించింది. దీనికి బిహార్ మాజీ ముఖ్య మంత్రి బీపీ మండల్ సారధ్యం వహించారు. మండల్ 1980 డిసెంబర్ 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ దాని సూచనలు అమలుకు నోచుకోలేదు. దీంతో బీసీలంతా ఉద్యమించారు. బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమానికి అండగా నిలిచింది. చివరికి అప్పటి ప్రధాని వీపీ సింగ్ 1990 ఆగస్టు 7న మండల్ నివేదికను అమలు పరుస్తానని ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనతో దేశవ్యాప్తంగా ఆధిపత్య కులాలు ఆందోళనకు దిగాయి. అన్ని పార్టీలు మండల్ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బయట నుండి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీజేపీ తన మద్దతును ఉపసంహరించి తానెవరి వైపో తేల్చి చెప్పింది. మండల్ కమిషన్‌ను అమలు చేయరాదని ఆధిపత్య కులాల వారు కోర్టును ఆశ్రయించారు. చివరకు 1993లో మండల్ నివేదిక అమలుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో, సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. కేంద్ర రిజర్వేషన్ సౌకర్యం పొందే బీసీలను ‘అదర్ బ్యాక్వార్డ్ క్లాసెస్’ (ఓబీసీలు)గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద మండల్ కమిషన్ బీసీల అభివృద్ధికి 40 సూచనలు చేయగా అందులో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మాత్రమే అమలుచేసి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బీసీల అభ్యున్నతికి విలువైన సూచనలు చేసిన బీపీ మండల్ బీసీల మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన 1918 ఆగస్టు 25న బిహార్ మధేపూర్ జిల్లా మోరో గ్రామంలో... రాస్ బీహారీ లాల్ మండల్ జమీందారీ కుటుంబంలో జన్మించారు. 1952 మొదటి సారిగా శాసనసభకు ఎన్నికైన మండల్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో పనిచేసిన మండల్ 1967 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. దీంతో 1968 ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. (క్లిక్: వారి విడుదల దేనికి సంకేతం?) బయట నుండి మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిపై విచారణ జరిగితే... ఆ విచారణ నివేదికను బుట్టదాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల్‌పై ఒత్తిడి చేసింది. అయినా నిజాయితీగా కాంగ్రెస్ అవినీతి నాయకులపై చర్య తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. నీతి కోసం నిలబడిన గొప్ప నాయకుడు బీపీ మండల్. 1974లో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 1977లో జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు. కులాలుగా చీలిపోయి ఉన్న బీసీలు ఏకమై... పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఐక్యమై బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన స్థైర్యంతో ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - సాయిని నరేందర్ బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ (ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి) -
ఆయన వేసిన పునాదులు విశేషమైనవి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర సమరయోధులు, ధీశాలి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్. స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2022 -
Anna Mani: నాన్నా.. నేనెందుకు చదువుకోకూడదు?!
ఒకప్పటి పరిస్థితులు వేరే!. పురుషాధిక్య సమాజంలో పలు రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. అయితే అలాంటి తారతమ్యాలను నిలదీసి.. తాను ఎందులోనూ ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నారు అన్నా మణి. విచిత్రమేంటంటే.. ఆమె పోరాటం మొదలైంది ఇంటి నుంచే!. అన్నా మణి.. భారత వాతావరణ సూచన తల్లి mother of Indian weather forecast గా పేర్కొంటారు. 1918 కేరళ పీర్మేడ్లో సిరియన్-క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారామె. చాలా ఉన్నత కుటుంబం, విద్యావంతుల కుటుంబం ఆమెది. కానీ, ఆడబిడ్డలు వివాహానికే పరిమితం కావాలనే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పే పోరాటం చేసింది అన్నా మణి. తాను చదువుకోవాలని.. చదువు తన హక్కుగా పేర్కొంటూ తండ్రిని ఒప్పించి.. స్కూల్లో చేరింది. బాల మేధావిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఉపన్యాసకురాలిగా, వాతావరణ నిపుణురాలిగా.. అన్నింటికి మించి భారత వాతావరణ శాఖకు ఆమె అందించిన సేవలు.. ఈనాటికీ చిరస్మరణీయం. అన్నా మణి జయంతి నేడు(ఆగస్టు 23). ఈ 104వ జయంతి ఉత్సవాల సందర్భంగా.. భారత వాతావరణ సూచన తల్లికి గౌరవార్థం గూగుల్ డూడుల్ రిలీజ్ చేసింది గూగుల్. ► తన ఎనిమిదవ పుట్టినరోజుకు ఇంట్లో వాళ్లు డైమండ్ ఇయర్ రింగ్స్ కానుకగా ఇచ్చారు. కానీ, అన్నా మణి మాత్రం వాటిని తీసుకోలేదు. వాటికి బదులు.. Encyclopædia Britannica కావాలని ఆమె పెద్ద గొడవే చేసిందట. ► పబ్లిక్ లైబ్రరీలో పుస్తకాలను పన్నెండేళ్ల వయసులోనే తిరగేసింది. బాల మేధావిగా గుర్తింపు. ► మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నారు. నారీ శక్తికి ఉదాహరణగా.. దేశభక్తిని ప్రదర్శించింది. ► చెన్నైలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారామె. ► ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో.. రీసెర్చ్ స్కాలర్షిప్ గెల్చుకుంది. ► లండన్ ఇంపీరియల్ కళాశాలలో ఫిజిక్స్ అభ్యసించింది. కానీ, ఆ తర్వాత వాతావరణ శాస్త్రం పట్ల ఆసక్తికనబర్చింది. ► పీహెచ్డీ కల మాత్రం కలగానే మిగిలిపోయింది అన్నా మణికి. ► డబ్యూసీసీలో ఉపన్యాసకురాలిగా పని చేయడంతో పాటు.. సీవీ రామన్ దగ్గర ఐఐఎస్‌లో స్పెక్ట్రోస్కోపీ అభ్యసించారామె. ► 1948లో భారత్‌ను తిరిగొచ్చిన ఆమె.. ఆమె భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 వాతావరణ పరికరాలను ప్రామాణికం చేసింది. ► వాయు వేగం, సోలార్ ఎనర్జీ కొలమానం కోసం పరికరాలను తయారు చేసి.. వాటితో ఒక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. ► పురుషాధిక్య సమాజం.. రంగంలోనూ ఆమె తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ► భారత వాతావరణ శాఖ ఐఎండీకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఆమె విధులు నిర్వహించారు. ► 1987లో ఐఎన్ఎస్ఏ కేఆర్ రామనాథన్ మెడల్‌తో ఆమెను సత్కరించింది ప్రభుత్వం. ► గుండె సంబంధిత సమస్యలతో.. 2001, ఆగస్టు 16న ఆమె కన్నుమూశారు. ► సోలార్ రేడియేషన్, ఓజోన్, విండ్ ఎనర్జీ కొలమానం కోసం ఎన్నో పరిశోధనలు చేసి.. వ్యాసాలు రాశారు. ► కేవలం తన విద్యా-విజ్ఞాన సుముపార్జన, ఆసక్తి ఉన్న రంగంపైనే దృష్టి పెట్టిన ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. ► ప్రపంచ వాతావరణ సంస్థ 100వ జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంది మరియు అన్నా ఇంటర్వ్యూతో పాటు ఆమె జీవిత ప్రొఫైల్‌ను ప్రచురించింది. -
Kothapalli Jayashankar: తెలంగాణ ఆచార్య!
తెలంగాణ జాతిపిత, సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగస్టు 6న వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో జన్మించారు. 1952లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం నుంచి ఆయన కన్నుమూసే వరకూ సాగిన తెలంగాణ అస్తిత్వ పోరాటాలన్నిం టికీ ఆయన ప్రత్యక్ష సాక్షి. జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో తెలం గాణ వాదాన్ని బలంగా వినిపించారు. విద్యావేత్తగా, మేధావిగా, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఆయన ఎన్నో పదవులను అలంకరించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్ ముందు తెలంగాణ ప్రజల మనసులోని సందేహాలను, అనుమానాలను ధైర్యంగా తెలియజేశారు. తెలంగాణ ప్రాంత భవిష్యత్ సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని ఆయన గట్టిగా వాదించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపితే నీళ్ళు, నిధులు, సమస్యలు తలెత్తుతాయని ఆ కమిషన్ ముందు వాదించారు. ఆయన వెలిబుచ్చిన భయ సందేహాలు తర్వాత కాలంలో నిజమయ్యాయి. నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భవానికీ తెలం గాణ ఉద్యమం ఊపందుకోవడానికీ ఇవే కారణాలయ్యాయి. ఉమ్మడి రాష్టంలో తెలంగాణ దోపిడీకి గురవ్వడంతో అన్ని రాజకీయ పార్టీలు చివరికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించే పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యమానికి అగ్రభాగాన నిలిచారు జయశంకర్. తాను కన్న కల నెరవేరకుండానే 2011 జూన్ 21న గొంతు కేన్సర్‌తో తుది శ్వాస విడిచారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను యాభై ఏళ్ళుగా బతికించి విజయ తీరాలకు తీసుకుపోయిన తెలంగాణ సేనాని ఆయన. – కొలనుపాక కుమారస్వామి, వరంగల్ (ఆగస్టు 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి) -
గుంటూరు జిల్లాతో పింగళికి ప్రత్యేకానుబంధం
మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. జాతీయోద్యమంలో గళమెత్తిన మన ప్రాంతవాసులెందరో.. వీరిలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఒకరు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో ఆ మహానుభావునికి ప్రత్యేక అనుబంధం ఉంది. నేడు ఆయన జయంత్యుత్సవం సందర్భంగా మహనీయుని మధుర స్మృతులను ఓసారి మననం చేసుకుందాం. సాక్షి, టూరు: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జాతీయ జెండా రూపకర్త, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంత్యుత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో స్థిరపడిన పింగళి కుటుంబం పింగళికి ఉమ్మడి గుంటూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధముంది. 1913 బాపట్లలో సర్ బయ్యా నరసింహేశ్వర శర్మ అధ్యక్షతన జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభలో పింగళి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఆ తర్వాత పలుమార్లు జిల్లాను సందర్శించి ఇక్కడి నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య పంతులు, పావులూరి శివరామ కృష్ణయ్య తదితర ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పింగళి కుటుంబ సభ్యులు 50 ఏళ్ళ క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో స్థిరపడ్డారు. జెండా రూపకల్పనకు బీజం పడింది ఇలా.. అది 1906. కోల్‌కతా మహానగరంలో కాంగ్రెస్ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భం. అప్పటి వరకు ఏ సభలు జరిగినా బ్రిటిషు జెండా ఆవిష్కరణ, వారి జాతీయ గీతం ఆలాపన ఆనవాయితీగా ఉండేది. ఆ సభలోనూ అదే తంతు జరగడం పింగళి వెంకయ్యకు నచ్చలేదు. ఇదే విషయాన్ని తన గురువు బాలగంగాధర్ తిలక్ వద్ద ప్రస్తావించారు. మనం స్వాతంత్య్రం సాధిస్తే మనకూ ఓ కొత్త జెండా వస్తోంది అని తిలక్ అన్న మాటలు పింగళి మనస్సులో బలంగా నాటుకున్నాయి. దీంతో ఆయన జాతీయ జెండా రూపకల్పనపై దృష్టిసారించారు. వివిధ దేశాల జెండాలను పరిశీలించి సుమారు 30 నమూనాలను తయారు చేశారు. ఈ క్రమంలోనే మరి కొందరు దేశ భక్తులూ జాతీయ జెండా నమూనాలు తయారు చేసే యత్నం చేశారు. పింగళి 1916లో ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ (భారత దేశానికి ఒక జాతీయ పతాకం) పుస్తకాన్ని రచించారు. ఇందులోని ప్రధాన అంశాలు ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అప్పటి ప్రముఖ స్వాత్రంత్య్ర సమరయోధులు దాదాబాయ్ నౌరోజీ, బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తదితరులు ఈ పుస్తకాన్ని కొనియాడారు. ఫలితంగా ఈ పుస్తకం గాంధీ మహాత్ముడి దృష్టిలో పడింది. మహాత్ముని సూచనల మేరకు 1921లో విజయవాడలో జాతీయ కాంగ్రెస్ మహా సభ జరుగుతున్న సమయంలో పింగళి మహాత్మా గాంధీని కలిశారు. ఆయన అభీష్టం మేరకు తొలుత కేవలం పచ్చ, ఎరుపు రంగులతో జాతీయ జెండాను రూపొందించారు. ఆ తర్వాత మహాత్ముడి సూచనలు, సలహాల మేరకు త్రివర్ణ పతాకం రూపొందింది. మొదట్లో మధ్యలో రాట్నం గుర్తు ఉండేది. ఆ తర్వాత అనేక మార్పులు జరిగి 1947లో స్వాతంత్య్రం సిద్ధించే నాటికి మువ్వన్నెల జెండా మధ్యలో అశోక చక్రంతో దేశ ప్రజల ముందు ఆవిష్కృతమైంది. జాతీయ జెండా రూపకల్పనలో పింగళి కృషిని మహాత్మా గాంధీ ‘ది యంగ్ ఇండియా’ పత్రికలో రాసిన వ్యాసంలో ప్రత్యేకంగా కొనియాడడం విశేషం. పింగళి కుటుంబానికి సీఎం సముచిత గౌరవం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది మార్చి 12న మాచర్లలో పింగళి కుమార్తె సీతా మహాలక్ష్మిని సముచితంగా సత్కరించారు. రూ.75 లక్షల చెక్కు, మెమెంటో అందజేశారు. ఇటీవల సీతామహాలక్ష్మి మరణిస్తే ఆమె అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఈనెల 1 నుంచి 15 వరకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పింగళి జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్లో పింగళి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పింగళి కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రి ఔదార్యాన్ని ప్రశంసించడం, ఆయనకు ధన్యవాదాలు తెలపడం గమనార్హం. తాత జ్ఞాపకాలు అజరామరం జాతీయ జెండా రూపకల్పన చేసిన మా తాత పింగళి వెంకయ్యను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా కీర్తించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మా కుటుంబంపై చూపుతున్న ప్రత్యేకాదరణకు ధన్యవాదాలు. నాకు పదిహేడేళ్ల వయస్సులో తాత మరణించారు. ఆయనతో నాకున్న కొద్దిపాటి జ్ఞాపకాలు ఎప్పటికీ అజరామరమే. – జి.వి.ఎన్.నరసింహం, పింగళి వెంకయ్య మనవడు, పింగళి జీవిత చరిత్ర రచయిత పింగళికి భారతరత్న ఇవ్వాలి కేవలం జాతీయ జెండా రూపకల్పన మాత్రమే కాకుండా దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన బహుముఖ ప్రజ్జాశాలి, బహు భాషా కోవిధుడు పింగళి వెంకయ్యకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రధాని మోదీకి పలుమార్లు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పింగళికి తగిన గౌరవం ఇవ్వడంతో సర్కారు సహకారంతో ముందుకెళ్తాం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పింగళిని స్మరించుకోవడం సంతోషం. – స్వామి జ్ఞానప్రసన్న, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు -
పింగళి 146వ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ (ఫోటోలు)
-
పింగళి వెంకయ్య 146వ జయంతి.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, అమరావతి: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి దేశ ప్రజలందరూ గర్వపడేలా చేశారని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా. pic.twitter.com/tcYgSK5Ep3 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2022 కాగా ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అలాగే పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ ప్రేమను, వాత్సల్యాన్ని మిస్ అవుతున్నా: రతన్ టాటా భావోద్వేగం
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపార వేత్త, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా తన గురువు జేఆర్డీ టాటా (జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా)ను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. జేఆర్డీ టాటా 118వ జయంతి సందర్భంగా టాటాసన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. తాను ‘జే’ అని పిలుచుకునే జేఆర్డీ టాటా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తామిద్దరూ కలిసి జీవించిన కాలంలో ఆయన తన మీద అపారమైన ప్రభావాన్ని మిగిల్చి వెళ్లారని, ఇద్దరి మధ్య చాలా సారూప్యతలుండేవని పేర్కొన్నారు. ఆయన ప్రేమను, అభిమానాన్ని మిస్ అవుతున్నానంటూ రాశారు. ఈ రోజు జే మన మధ్య లేకపోయినా ఆయన గొప్పతనం, వారసత్వం కొనసాగుతుందని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జేఆర్డీ టాటా ఫోటోను షేర్ చేశారు. దీంతో కొన్న గంటల వ్యవధిలోనే లక్షల లైక్‌లతో వైరల్‌గా మారింది. గత ఏడాది కూడా పూణే ప్లాంట్‌లో టాటా ఎస్టేట్ లాంచ్ వేడుకలో తీసుకున్న ఫోటోనొకదాన్ని షేర్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: Gold Demand Up: ఆభరణాలు తెగ కొనేశారుగా..!) View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) దేశంలోని ఉత్తమ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్‌టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ప్రస్తానం ఎందరో యువ పారిశ్రామిక వేత్తలకు, వ్యాపార వేత్తలకు పుస్తకం లాంటిది. భారత్‌లో పురాతన కాలం నాటి అతిపెద్ద వ్యాపార, పారిశ్రామిక సంస్థ టాటా సన్స్ సారధిగా సంస్థను ఎన్నో విజయ తీరాలకు చేర్చారు. అంతేకాదు వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా, సామాజిక సేవలు, దాతృత్వంలోనూ తన ప్రత్యేకతను చాటు కున్నారు. కాగా రతన్ టాటా జీవిత చరిత్ర ‘ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ’ పేరుతో ఈ ఏడాది నవంబరులో రానుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ టాటా జీవిత చరిత్ర పుస్తక ప్రచురణ హక్కులను భారత్‌కు చెందిన హార్పర్ కాలిన్స్ సొంతం చేసుకుంది. -
మహానేత మెమోరియల్‌కు మహానగరంలో చోటేదీ?
సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించుకోడానికి ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక మెమోరియల్‌ను కూడా ఏర్పాటు చేయలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శుక్రవారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్సార్ 73వ జయంతి, వైఎస్సార్టీపీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఎగుర వేసి కేక్ కట్ చేశారు. అనంతరం షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ స్మారకార్థం హైదరాబాద్‌లో స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ ఘాట్ కోసం ప్రసాద్ ఐమాక్స్ పక్కన 20 ఎకరాల భూమి కేటాయించామన్నారు. ఏడాదిలోగా పను లు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ భూమిని వెనక్కి తీసుకుని అన్యాయం చేశారు’అని అన్నారు. 2004లో వైఎస్సారే కేసీఆర్‌ను కేంద్రమంత్రిగా, హరీశ్‌రావును రాష్ట్రమంత్రిగా చేశా రని గుర్తుచేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రతి పథకంలోనూ తెలంగాణకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని షర్మిల స్పష్టం చేశారు. రైతు సమస్యలపై రైతు ఆవేదన యాత్ర, రైతుగోస దీక్షలు చేపట్టామని చెప్పారు. పోడు పట్టాల కోసం, దళితులు బీసీల కోసం తమ పార్టీ పోరాడిందని, ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున నిలబడ్డ ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ అని అన్నారు. నిరుద్యోగుల కోసం 31 నిరాహార దీక్షలు చేశామని, ఇంకా చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పోరాటం వల్లే కేసీఆర్‌కు సోయి వచ్చి 80 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ పేరు కోసం పనిచేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెబుతున్న దొంగమాటలు నమ్మే వారు ఇక్కడ లేరన్నారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధులు తూడి దేవేందర్, పిట్టా రాంరెడ్డి, వాడుక రాజగోపాల్ పాల్గొన్నారు. వైఎస్సార్‌కు నివాళి పంజగుట్ట: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి పురస్కరించుకుని ఆయన కుమార్తె, వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల పంజగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
మనసున్న మారాజు
-
అచంచల దేశభక్తునికి జాతి నీరాజనాలు
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను జూలై 4వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ దేశభక్తుడి జయంత్యుత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని సంకల్పించడం తెలుగు ప్రజల ఆకాం క్షను గౌరవించడమే! మన్నెం వీరుని పోరుగడ్డను అల్లూరి సీతా రామరాజు జిల్లాగా ప్రకటించి ఆ మహనీయుడికి నివాళులర్పించి, మన్నెం వాసుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలో ఈ విప్లవ జ్యోతి పురిటిగడ్డలో 30 అడుగుల భారీ కాంస్య విగ్రహం నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం ముదావహం. బ్రిటిష్ వారిపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రకి గ్రామంలో జన్మించిన సీతా రామరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని మోగల్లు గ్రామం. చిన్నప్పటి నుంచీ ఆయనకు దైవభక్తీ, దేశభక్తీ మెండుగా ఉండేవి. విశాఖ, గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధం చేశాడు. శత్రువుల కదలికలను పసిగట్టేందుకు పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేయటం, శత్రువుల ఆయుధ సంపత్తిని కొల్లగొట్టడం, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయడం వంటి యుద్ధవ్యూహాలు... బ్రిటీష్ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాను చేయదలుచుకున్న దాడి గురించి ముందుగానే మిరపకాయ టపా ద్వారా శత్రువుకు సమాచారం పంపించే వాడు సీతారామరాజు. ఆ టపాలో చెప్పినట్టు సరిగ్గా అదే రోజు, అదే సమయానికి దాడి చేసి లక్ష్యాన్ని నెరవేర్చుకునేవాడు. బ్రిటిష్ సైన్యాన్ని సమర్థంగా ఎదిరించి పోరాడా లంటే అల్లూరి విప్లవ సైన్యానికి తుపాకులు సమకూర్చు కోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకు తొలిగా మన్యంలోని చింతపల్లి పోలీసు స్టేషన్‌ను ఎంచుకున్నాడు. 1922 ఆగస్టు 19వ తేదీన అల్లూరి సాయుధ విప్లవంలో మహోజ్వల ఘట్టం చోటు చేసుకున్నది. కత్తులు, బల్లేలు, సాంప్రదాయ విల్లంబులు ధరించిన దాదాపు 300 మంది అనుచరులు వెంటరాగా అల్లూరి చింతపల్లి పోలీసు స్టేషన్లో అడుగుపెట్టాడు. అక్కడి పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండి పోయారు. ఆయుధ సంపత్తినంతటినీ స్వాధీనం చేసుకొని వాటి వివరాలన్నింటినీ స్టేషన్ డైరీలో నమోదు చేసి అల్లూరి స్వయంగా సంతకం చేశారు. తరువాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. మరుసటి రోజు రాజవొమ్మంగి పోలీసు స్టేషన్‌పైనా దండెత్తాడు. ఈ విధంగా వరుసగా 3 రోజుల్లో 3 పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధ సంపత్తిని దోచుకోవటం బ్రిటిష్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. మరోవైపు ఈ సమాచారం దేశమంతా వ్యాప్తిచెంది దేశ భక్తుల రక్తం ఉప్పొంగేలా చేసింది. 1922 నుంచి యుద్ధసన్నాహాలలో పూర్తిగా నిమగ్నమై గంటందొర, మల్లుదొర వంటి యోధులతో దళాలను ఏర్పాటు చేసి 200 మందితో విప్లవ సైన్యాన్ని రామరాజు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యుద్ధ సన్నాహాలను ఆలస్యంగా గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ రూథర్‌ఫర్డ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పంపిన 700 మంది సాయుధ పోలీసులు పలు ప్రాంతాలను జల్లెడ పట్టసాగారు. 1922 సెప్టెంబర్ 3వ తేదీన నర్సీపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంజేరి కొండవాలుల్లో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న బ్రిటిష్ పోలీసులపై దాడిచేసి తరిమి వేసింది అల్లూరి సైన్యం. మరుసటి ఏడాది సైన్యాధికారి స్కాట్ కవర్ట్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. కవర్ట్లాంటి వారు ఈ యుద్ధంలో మరణించారు. అల్లూరిని నిలువరించేందుకు విప్లవ సైన్యాన్ని బలహీనపరిచే కుయుక్తులకు బ్రిటిష్ సైన్యం తెరతీసింది. విప్లవ కారులను, వారికి సహాయపడే వారిని అణ చివేసేందుకు, సహాయ నిరాకరణ చేసే వారిని శిక్షించేందుకు విశాఖలో ప్రత్యేక ట్రిబ్యు నల్ ఏర్పాటు చేశారు. విప్లవకారులకు సహకరించారనే మిషతో ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో అమాయక గిరిజనులను తీసుకెళ్లి... ట్రిబ్యునల్‌లో క్రూరమైన శిక్షలు విధించడం నిత్యకృత్యమైంది. తన కారణంగా ప్రజలు నరకయాతన పడటానికి ఇష్టపడని రాజు చివరికి లొంగిపోవాలనుకున్నాడు. ఈ దశలో మే 6వ తేదీన మంప గ్రామంలో జమేదారు కుంచుమీనన్ తన సాయుధ బలగంతో వెళ్లి అల్లూరిని నిర్బంధించాడు. 1924 మే నెల 7వ తేదీన సీతారామరాజును బ్రిటిష్‌వాళ్లు కయ్యూరులో కాల్చి చంపారు. విప్లవ జ్యోతి ఆరిపోయింది. సీతారామరాజు శౌర్యపరాక్రమాలు, త్యాగనిరతి భారతజాతికి ఆదర్శనీయం. (చదవండి: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...) - పెన్మెత్స శ్రీహరిరాజు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి) -
Alluri Sitarama Raju: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...
సన్యసించి విప్లవకారులుగా మారిన ఇద్దరే ఇద్దరు యోధులు భారతీయ స్వాతంత్య్ర సమరంలో కనిపిస్తారు. అందులో ఒకరు అరవింద్ ఘోష్ అయితే, మరొకరు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. అమాయకులైన ఆదివాసీలపై బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు చేస్తున్న దోపిడీ రాజును కదిలించింది. ఇల్లు వదలి సన్యాసిలా దేశాటన చేసి వచ్చిన సీతారామరాజు చివరికి మన్యంలో విప్లవ శంఖాన్ని పూరించిన వైనం అపూర్వం. అటువంటి వీరుని 125 జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్నారు. ఇదే సందర్భంలో భీమవరంలో 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని స్వహస్తాలతో ఆవిష్కరించి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గొప్ప దేశభక్తుడు. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్‌ల కోవకు చెందిన మహావీరుడు. అమాయకులు, విద్యా విహీనులైన కొండ జాతి ప్రజ లను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికి కృషి చేయ డమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్ ఘోష్, అల్లూరి సీతారామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు. నేడు సీతా రామరాజు 125వ జయంతి. ఈ సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి నేడు ఆవిష్కరిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు గ్రామ వాస్తవ్యులు అల్లూరి వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ మొదటి సంతానంగా 1897 జూలై 4వ తేదీన రాజు జన్మించారు. ఈయన అసలుపేరు శ్రీరామరాజు. ఆయన తండ్రి రాజమండ్రిలో ఫొటోగ్రాఫర్‌గా స్థిర పడ్డారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు జరుగుతున్న సమ యంలో 1908లో ఆయన కలరా వ్యాధితో మరణించాడు. అప్పటి నుంచి సీతారామరాజు తాసీల్దారైన పినతండ్రి రామకృష్ణంరాజు సంరక్షణలో పెరిగాడు. చదువుపై కన్నా ఆయనకు సన్యాసం, ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందుకే పినతండ్రి మందలించాడు. దీంతో ఆయన ఇల్లు వదలి వెళ్లిపోయాడు. పలువురిని ఆశ్రయించి జ్యోతిషం, వాస్తు శాస్త్రం అభ్యసించాడు. సంస్కృత భాషపై పట్టు సాధించాడు. ఇచ్ఛాపురం నుండి కాలినడకన కలకత్తా చేరాడు. కలకత్తా వీధుల్లో వెళుతుండగా అప్పటి అగ్ర స్వాతంత్య్ర సమర యోధుల్లో ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ నిత్యార్చన చేసి, తనతో సహపంక్తి భోజనం చేసే ఒక అతిథి కొరకు ఇంటి బయటికి వచ్చి వెతుకుతుండగా ఎదురుగా రాజు కనిపించాడు. సీతారామరాజును భోజనానికి ఆహ్వానించాడు. అక్కడే 10 రోజులు బెనర్జీ కోరిక మేరకు రాజు ఉండిపోయాడు. ఆ సమయంలో బెనర్జీ ఇంటికి వచ్చిన మోతీలాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకులతో రాజు దేశ పరిస్థితుల గురించి చర్చించాడు. అక్కడినుండి కాశీ, హరిద్వార్, రుషీకేశ్, బద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాలు దర్శించి 1917 జూలై 24న విశాఖ జిల్లా కృష్ణదేవిపేట చేరాడు. దారకొండపై తపస్సుకు వెళ్తున్న రాజును చిటికెల భాస్కరుడు అనే గ్రామ పెద్ద చూసి, విషయం తెలుసుకుని తపస్సుకు ఆ గ్రామంలోనే అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రజలకు జ్యోతిషం, పురాణాలు, ఆయుర్వేద వైద్యంతో దగ్గరయ్యాడు. అధికారుల దోపిడీని ఎదుర్కొనమని వారిని ప్రోత్సహిం చాడు. వారిలో జాతీయతాభావం రగుల్కొలిపి, ప్రభుత్వ కోర్టులకు పోవద్దనీ, పంచాయతీ కోర్టులు ఏర్పాటు చేసి అక్కడే తగవులు తీర్చుకోమనీ; మద్యం సేవించరాదనీ, ఖద్దరు బట్టలనే ధరించమనీ బోధించాడు. డిప్యూటీ తాసీల్దారు బాస్టియన్, ఓవర్సీరు సంతానం పిళ్ళై చేస్తున్న అరాచకాలను పై అధికారులకు మహజర్ల రూపంలో పంపేవాడు. ఈ మన్య ప్రాంతంలో గతంలో కొన్ని పితూరీలు, దోపిడీలు జరిగాయి. దానితో ప్రభుత్వానికి రాజుపై అను మానం కలిగి డివిజనల్ మేజిస్ట్రేట్ ఫజులుల్లా ఖాన్‌ను ఎంక్వయిరీ చేయమని పంపారు. రాజు పినతండ్రికి ఖాన్ సహోద్యోగి. సీతారామరాజును నర్సీపట్నం తీసుకుని వెళ్లి తాసీల్దారు ఇంటిలో పెట్టి కృష్ణదేవిపేట వెళ్లవద్దని సలహా ఇచ్చాడు. ఉద్యోగం గానీ, వ్యవసాయ భూమి గానీ తీసుకోమని ఒత్తిడి చేశాడు. సీతారామరాజు ప్రభుత్వ దృష్టిని మళ్ళించటానికి ‘పైడిపుట్ట’లో ఇచ్చిన భూమిని తీసుకున్నాడు. ప్రజల సమస్యలు తీర్చటానికి తిరుగుబాటే ఏకైక మార్గమని భావించి దానికి రహస్యంగా తగిన ఏర్పాట్లు చేయసాగాడు. ప్రభు త్వంపై తిరుగుబాటుకు ఉత్సాహం చూపించిన సుమారు 200 మంది యువకులను 1922 ఆగస్టు 15న శరభన్నపాలెంలో సమావేశపరచి వారిచే ప్రమాణం చేయించాడు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడితో ప్రారంభమైన విప్లవం 1924 మే నెల వరకు అనేక విజయాలతో, బహుకొద్ది అపజయాలతో కొనసాగింది. ప్రభుత్వం 20 మంది యూరోపియన్ ఉన్నతాధికారులను, 1,500 మంది పైగా ఈస్ట్ కోస్ట్ స్పెషల్ పోలీసు, మలబారు స్పెషల్ పోలీసులను నియ మించి ఉద్య మాన్ని అణచే ప్రయత్నం చేసింది. ఆనాడు జిల్లా యంత్రాంగం– మద్రాస్ ప్రభుత్వం – ఢిల్లీకి మధ్య జరిగిన రహస్య తంతివార్తలు కొన్ని గమనిస్తే విప్లవం గురించి ప్రభుత్వం చెందిన ఆందోళన తెలుస్తుంది. ఢిల్లీ హోమ్ సెక్రటరీకి మద్రాస్ చీఫ్ సెక్రటరీ రాస్తూ, ‘‘రాజు నాయకత్వాన ప్రారంభమైన విప్లవం 18 నెలలు జరిగినా... అనేక రిజర్వు దళాలను పంపి కూడా అణచలేక పోయాం. సమీపంలో అంతమవుతుందని నమ్మకం లేదు. ఉన్నత న్యాయస్థానం కూడా దీనిని బ్రిటిష్ చక్రవర్తిపై యుద్ధంగానే గుర్తిం చింది’’ అని వాపోయాడు. ఏజెన్సీ కమిషనర్ స్టీవర్ట్ 1922 అక్టోబర్ 24న మద్రాస్‌కు తంతి పంపుతూ, ‘‘సీతారామరాజు గూఢచర్య చర్యలు అమోఘం. మన దళం బయలుదేరిన వెంటనే ఆ సమాచారం అతనికి చేరుతోంది. మనకు అందే సమాచారమంతా మనల్ని తప్పుదోవ పట్టించడానికి రాజు పంపుతున్న వార్తలే’’ అని పేర్కొన్నాడు. మద్రాస్ స్టాఫ్ కెప్టెన్ బిషప్, ఢిల్లీ హోం సెక్రటరీకి రాస్తూ... ‘‘రెండేళ్ల నుంచి విప్లవం నిరా ఘాటంగా సాగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా పదేళ్లయినా కొనసాగుతుంది. అకస్మాత్తుగా అనుకోని పరిస్థితులు విప్లవకారులకు ఎదురైతే తప్ప ఈ విప్లవం ఆగడం కలలోని మాట. అందువల్ల వెంటనే మార్షల్ లా గానీ, గవర్నర్ జనరల్ ఆర్డినెన్స్ గానీ ప్రకటిం చాలి’’ అని చెప్పాడు. ఈ విధంగా ప్రభుత్వం ఆందోళన చెందుతున్న సమయంలో రూథర్‌ఫర్డ్ అనే నరరూప రాక్షసుడిని ఏజెన్సీ కమిషనర్‌గా నియ మించారు. అతను రాజుకు సహాయం చేస్తున్న వారిని అనుమానించి 58 మంది గ్రామ మునసబులనూ, ముఠాదారులనూ అరెస్టు చేసి రుషికొండ జైలులో బంధించాడు. రాజు ఆచూకీ తెలపండని స్త్రీలను, పిల్లలను చిత్రహింసలు పెట్టించాడు. 1924 మే మొదటి వారంలో కృష్ణదేవి పేటలో రూథర్‌ఫర్డ్ మీటింగ్ పెట్టి పరిసర గ్రామ పెద్దలను హెచ్చరిస్తూ, వారం రోజులలో రాజు దళాన్ని పట్టి ఇవ్వకపోతే కృష్ణ దేవిపేటతోపాటు అనేక గ్రామాలను తగులబెడు తామనీ, చిటికెల భాస్కరుడితో సహా, పెద్దలను జైళ్లలో వేస్తామనీ హెచ్చరించాడు. రాజుకు కృష్ణదేవిపేట అన్నా, చిటికెల భాస్కర్ కుటుంబం అన్నా ఎన లేని అభిమానం అని రూథర్‌ఫర్డ్‌కు తెలిసే ఈ హెచ్చరిక చేశాడు. ప్రభుత్వం తనను ఎదుర్కొనలేక, ప్రజలను పెడుతున్న బాధలను చూసి రాజు బాధపడ్డాడు. అందుకే 1924 మే7వ తేదీన కుంచు మీనన్ నాయకత్వంలోని స్పెషల్ పోలీసు దళానికి ఒక బాలుని ద్వారా కబురు పంపి ‘మంప’ గ్రామంలో లొంగి పోయాడు. సీతారామరాజును బంధించి కొయ్యూరులో ఉన్న మేజర్ గుడాల్ దగ్గరకు తీసుకువెళ్లారు. రాజుతో గూడాల్ ఘర్షణపడి రాజును తుపాకీతో కాల్చి చంపాడు. ఆ విధంగా ఒక మహోద్యమం పరిసమాప్తం అయింది. సీతారామరాజు దేశభక్తి, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ జాతిని మేల్కొలుపుతూనే ఉంటుంది. వ్యాసకర్త: జి. కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకామాత్యులు -
అల్లూరి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు వచ్చేనెల 4న భీమవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. భీమవరంలో సభా ప్రాంగణం ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే స్పెషల్ ఎస్పీజీ, ఏఐజీ హిమాన్షుగుప్త, కేంద్ర కల్చరల్ డైరెక్టర్ అతుల్‌మిశ్రాలు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా పరమైన ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. బుధవారం సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, జీఐడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్‌లు సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్‌ను పరిశీ లించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 14 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభావేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రధాని సభావేదిక, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీతోపాటు ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాని పర్యటన ఖరారైన నేపథ్యంలో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. భీమవరంలో ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రాంతాలపైనా అధికారులు దృష్టి పెట్టారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండి నియోజకవర్గ గడపగడపకు మన ప్రభుత్వం ఇన్చార్జి, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు ఏర్పాట్లను పరిశీలించారు. భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం భీమవరం ఏఎస్ఆర్ నగర్‌లోని మున్సిపల్ పార్కు లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగనుంది. వచ్చేనెల 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని, ముఖ్యమంత్రి చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించి పార్కులో ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు సాక్షి, భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జీఏడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన సమావేశమై ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. అధికారులు, నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి పీఎంఓ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభాస్థలికి వెళ్లే మార్గాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి ప్యాకెట్లు, అల్పాహారం, బయో టాయిలెట్స్ ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత భార్గవ్‌తో కలిసి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. -
ఎందుకో?.. నేను పుట్టినప్పుడు పూలవాన కురవలేదు..
సీటీఆర్ (రాజమహేంద్రవరం): పాత్రికేయునిగా, కథా రచయితగా, సినీ రచయితగా, నిర్మాతగా తెలుగువారి గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న ముళ్లపూడి వెంకట రమణ ధవళేశ్వరంలో 1931 జూన్ 28న జన్మించారు.. తన జన్మదినం గురించే ఆయన స్వీయచరిత్రలో విసిరిన చమక్కులను ముందుగా చూద్దాం...‘జ్యేష్ఠా నక్షత్రం, వృశ్చికరాశిలో పుట్టాను. అంటే జూన్ 28 తెల్లవారు జామున, 1931లో. పీవీగారు కూడా జూన్ ఇరవైయ్యెనిమిదే, 1921లో. అంటే నా కన్నా పదేళ్ల చిన్న. ఈ మాటంటే ఆయన పకాపకా నవ్వారు. ఎందుకో?... రాజమండ్రి, ధవళేశ్వరాల మధ్యనున్న ఆల్కాట్ గార్డెన్స్ ఆసుపత్రిలో పుట్టాను. నేను పుట్టినప్పుడు దేవదుందుభులు మోగలేదు. అచ్చరలాడలేదు. గంధర్వులు పాడలేదు. పూలవాన కురవలేదు.’’ కష్టాలతో చెలిమి... పట్టుమని పదేళ్లు రానివయసులోనే ముళ్లపూడి తండ్రిని కోల్పోయారు. కుటుంబానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పొట్ట చేతపట్టుకుని మద్రాసు మహానగరానికి వెళ్లారు. ఒక మెట్టగదిలో ముళ్లపూడి, ఆయన సోదరుడు, తల్లి కాపురం. తల్లి విస్తర్లు కుట్టి, ప్రెస్సులో కంపోజింగ్ పనులు చేసి సంసార నౌకను నడిపారు. మధ్యలో 7,8 తరగతులు చదువుకోవడానికి ముళ్లపూడి తల్లి, సోదరుడితో కలసి రాజమండ్రి వచ్చి, ఇన్నీసుపేటలోని కందుకూరి వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో చదివారు. తిరిగి మద్రాసు చేరుకున్నారు. ఎస్సెల్సీ వరకు చదువు కొనసాగింది. పూలేకాదు, ముళ్ళూ... పాత్రికేయ జీవితంలో అందుకున్న సన్మానాలు, పొందిన బిరుదుల, మెళ్లో వేసిన శాలువాలూ, పూలదండలే కాదు, పొందిన అవమానాలు, అగచాట్లు, డబ్బు చిక్కులూ, ఛీత్కారాలు అన్నిటినీ ముళ్లపూడి తన స్వీయచరిత్రలో చెప్పుకొచ్చారు. పొలిటికల్ కాలమిస్టుగా పనిచేస్తున్నప్పుడు నీలం సంజీవరెడ్డి గారు క్లబ్‌కు తీసుకువెళ్లి నా పేరు చెప్పి భోజనం లాగించెయ్. .అన్నారు..అప్పటికే ఆకలి ‘రుచి’పూర్తిగా తెలిసిన ముళ్లపూడి డైనింగ్ హాలులోకి వెళ్లి బేరర్‌కు చెప్పారు. ‘డ్రైవర్సుకీ, బోయెస్కీ బాక్ సైడ్ షెడ్లో ఇరికప్పా, పిన్నాలే పో’ అన్నాడు వాడు. సంజీవరెడ్డిగారికి ఏదో అనుమానం వచ్చి, హాలులోకి వచ్చి బేరర్‌ను చివాట్లు పెట్టారు. సినీ రిపోర్టరుగా ఉండగా గుచ్చుకున్న మరో ముల్లు.. సినీ స్టూడియోలో ఓ సారి ఎస్వీ రంగారావుగారు ఎదురయ్యారు. రమణని పిలిచి చెంప ఛెళ్లు మనిపించారు..‘‘చూడు రమణా! పత్రికకూ, నీ ఆఫీసుకూ ఓ స్టేటస్ ఉంది. స్టార్‌గా నాకో దర్జా ఉంది. నువ్విలా మాసిన గడ్డంతో, కాల్చిన చిలకడదుంపలా రావడం ఇన్సల్టు. మీకు డబ్బు లేకపోయినా శుభ్రంగా ఉండవచ్చును గదా’’ అన్నారు ఎస్వీఆర్.. ఇలాంటి అనుభవమే ఒకసారి అక్కినేనితో ఎదురయింది. ఆయన ఏదో కబుర్లు చెబుతూ...‘రమణగారూ. కొన్ని తత్వాలే అంత. ఫరెగ్జాంపుల్, మిమ్మల్ని మార్చడం మీ దేవుడి తరం కాదు, మీకు కోటి రూపాయలిచ్చినా ఈ మురికి బట్టలే వేసుకుంటారు..’ రమణ కోపంతో రిటార్ట్ ఇచ్చారు..‘‘సార్. ఇవి నలిగిన బట్టలు కావచ్చుకాని, మురికివి మాత్రం కావు. నేను ఒకసారి కట్టివిడిచిన బట్టను ఉతికి ఆరేస్తేకాని కట్టను. మీరు మీ ప్యాంట్లూ, సిల్కు చొక్కాలూ తొడిగి విప్పాక, చిలక్కొయ్యకేస్తారు. పదేసి రోజులు అదే వాడుతారు. నాకున్నది ఒకటే జత. కాని ప్రతిరాత్రి ఉతికారేసుకుంటాను. తువ్వాలు కట్టుకుని పడుకుంటాను. నాకు సిగ్గులేదు కాని, పొగరుంది...’ నిరుద్యోగ విజయాలు, పాత్రికేయునిగా ఉద్యోగం రెండేళ్ల ‘నిరుద్యోగ విజయాలు’ తరువాత నాటి ప్రముఖ ఆంధ్రపత్రికలో పాత్రికేయునిగా ఉద్యోగం ముళ్లపూడిని వరించింది. పాత్రికేయునిగా తనదైన ముద్ర వేస్తూనే, కథారచయితగా ముళ్లపూడి తన సత్తా చూపారు. రెండుజెళ్ల సీతలూ, సీగానపెసూనాంబలు, బుడుగులూ, అప్పారావులూ ఆయన కలం నుంచి వెలువడ్డాయి. గురజాడ గిరీశం, చిలకమర్తి గణపతి, మొక్కపాటి బారిస్టర్ పార్వతీశంలాగా, పానుగంటి జంఘాల శాస్త్రిలాగా ముళ్లపూడి సృష్టించిన అప్పారావు పుస్తకాల పుటల నుంచి వచ్చి, తెలుగువారి జీవితంలోకి చొరబడ్డాడు. (చదవండి: వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ?) తాగింది కావేరి జలాలు, ఉపాసించింది గోదావరి జలాలు తుది వరకు మద్రాసులోనే జీవించినా, ఆయన ధ్యాస, యాస, శ్వాస గోదావరి చుట్టుతానే తిరిగింది. తన 14 ఏటా నుంచి నేస్తం అయిన బాపుతో కలసి నిర్మించిన సాక్షి, అందాలరాముడు, ముత్యాలముగ్గు, స్నేహం, బుద్ధిమంతుడు మొదలైన సినిమాలు ఈ గడ్డనే పురుడు పోసుకున్నాయి. ఈ మాండలికమే ఆ పాత్రలు మాట్లాడాయి.. ఆరుద్ర చెప్పినట్లు ‘‘హాస్యం ముళ్లపూడి వాడి, వేడి తాకిడికి ఈ డేరింది’’ అనడంలో అతిశయోక్తి లేదు. (చదవండి: పిల్లనగ్రోవికి ఒళ్లంతా గేయాలే) -
నిష్కర్ష విమర్శకుడు!
నేను అనే స్వోత్కర్షలేని సాదాతనం; మాటల్లోనూ, చేతల్లోనూ ద్వంద్వాలు లేని వ్యక్తిత్వం; జీవితంలోనూ, బోధనలోనూ ఉన్నత ప్రమాణాలను లక్ష్యించి ఆచరించిన ఆదర్శం; ఏది చదివినా, రాసినా లోనారసి పరిశీలనం; వివేచనం పరిశోధనం; వీటన్నిటి మూర్తిమత్వం ప్రస్ఫుటించిన ఆచార్యులు కేకే రంగనాథాచార్యులు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా, తెలుగు శాఖాధిపతిగా, మానవీయ విభాగం డీన్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి, ఆరుద్రలను దగ్గరగా ఎరిగి, దిగంబర, విప్లవ కవులతో సన్నిహితంగా ఉండి, వారి తాత్విక దృక్పథాలను తనదైన చూపుతో విశ్లేషించారు. 2021 మే 15 దాకా నిశ్చలంగా భాషా సాహిత్యాల గురించి బహుముఖీన ఆలోచనలు చేస్తూనే తనువు చాలించారు. మార్క్సిస్ట్ సామాజిక దృక్పథంతో పురాణయుగం నుంచి స్త్రీవాద, దళిత సాహిత్య దశల వరకూ చారిత్రక భూమికని పట్టి చూపిన విమర్శకుడు. హేతువాద, ప్రజాస్వామిక సంస్కృతిని ఆచరించి చూపిన ఆచరణవాది. ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యంపై ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వేదికపై దశాబ్ద కాలానికి పైగా సమావేశాలు నిర్వహించి ప్రముఖులచే ప్రసంగాలు చేయించి, వాటిని సంకలనాలుగా తెచ్చిన రంగనాథాచార్యుల కృషి మరువరానిది. (క్లిక్: తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్) ‘తెలుగు సాహిత్యం– మరోచూపు’, ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’, ‘తెలుగు సాహిత్య వికాసం’, ‘తెలుగు సాహిత్యం–చారిత్రక భూమిక’, ‘సామయిక వ్యాసాలు’, ‘బహుముఖం’, ‘తెలుగు భాష సంగ్రహ స్వరూపం వంటి రచనలు ఆయన పరిశోధన పరిశ్రమను చూపిస్తాయి. ఆయా గ్రంథాలకు ఆయన రాసిన విపుల పీఠికలు విమర్శకులకు, పరిశోధకులకు కరదీపికల వంటివి. ఏ ధోరణినైనా ఏ ఉద్యమాన్నైనా సమగ్ర దృష్టితో దర్శించడం, తులనాత్మకంగా పరిశీలించడం, చారిత్రక పరిణామ దృక్పథంతో వివేచించడం, అంచనా వేయడం అనే విమర్శన కృత్యాన్ని నిరంతరం నిర్వహించారు. ఆయన ఏది మాట్లాడినా, బోధించినా, రాసినా అర్థం పరమార్థం ఉంటుంది. ఆయన ఉపన్యాసాలు, రచనలు ఆలోచనాత్మకాలు, విజ్ఞాన సర్వస్వాలు! – కొల్లు వెంకటేశ్వరరావు, ఖమ్మం (జూన్ 14న కేకే రంగనాథాచార్యుల జయంతి) -
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. ఘనంగా ఏర్పాట్లు
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. సినిమా రంగమైనా,రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు.ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆయన స్వగ్రామం నిమ్మకూరులో బాలకృష్ణ చేతుల మీదుగా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభం కాన్నునాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వర్గీయ తారక రామారావుశత జయంతి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. -
నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి
స్త్రీ పాత్రలు లేని ప్రదర్శన యోగ్యమైన నాటికల కోసం ఆంధ్రనాటక రంగం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ లోటు పూడ్చిన ఘనత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావుది. 1950–80 మధ్య దశాబ్దాల్లో తెలుగు నాటక రంగాన్ని ఆయన సుసంపన్నం చేశారు. 110కి పైగా నాటికలు, నాటకాలు రాసి ‘శతాధిక నాటక రచయిత’గా ఖ్యాతి గడించారు. వృత్తిరీత్యా వైద్యుడైన కొర్రపాటి 1922 మే 10న బందరులో జన్మించారు. అభ్యుదయ భావాలతో, సంస్కరణాభిలాషతో, సమసమాజ స్థాపనా ధ్యేయంతో ఆయన రాసిన నాటికలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఆసక్తిదాయకంగా ప్రేక్షకుల హృదయాలలో పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. గంభీరమైన సన్నివేశాల మధ్య కూడా ఒక సునిశితమైన హాస్య సంఘటనను చొప్పించి నాటకాలను రంజింపజేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ‘యథా ప్రజా తథా రాజా’, ‘పెండింగ్ ఫైలు’, ‘తెరలో తెర’, ‘కమల’, ‘ఆరని పారాణి’, ‘తారా బలం’, ‘తెలుగు కోపం’, ‘కొత్త చిగురు’, ‘లోక సంగ్రహం’ వంటివి వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. కొర్రపాటి గొప్ప నటుడు కూడా! చిన్నతనం నుండి నాటకాలు వేసేవారు. అందరూ ఆయన్ని ‘రంగబ్బాయి’ అని పిలిచేవారు. 14 ఏళ్ల వయసులోనే ‘హతవిధీ’ అనే నాటిక రాసి ఆడారు. ప్రధానంగా స్త్రీ పాత్రలు వేసేవారు. ‘విడాకులా’ అనే నాటికలో ఆయన స్త్రీ పాత్ర నటన పలువురి ప్రశంసలు పొందింది. స్వాతంత్రోద్యమ కాలంలో ‘నా దేశం’ నాటకంలో ‘కామ్రేడ్’ పాత్రను పోషించారు. తర్వాతి కాలంలో సినీరచయితగా, నవలా రచయితగా కూడా పేరు గడించారు కొర్రపాటి. ‘ఇద్దరు మిత్రులు’, ‘మాయని మమత’ వంటి చిత్రాలకు మాటలు రాశారు. ఇవిగాక షాడోరైటర్గా కూడా ఇంకా చాలా సినిమాలకు మాటలు రాశారు. కొర్రపాటి సుమారు పది నవలలు రాశారు. వాటిలో ‘లంబాడోళ్ళ రాందాసు’, ‘గృహ దహనం’, ‘ధంసా’ అధిక ప్రాచుర్యాన్ని పొందాయి. ఆంధ్ర నాటక కళా పరిషత్ నుండి అసంఖ్యాకంగా బహుమతులు పొందారు. ‘రంగరచనా ప్రవీణ’ అనే బిరుదాన్ని పొందారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలలో సభ్యుడిగా నియమితులైనారు. ( చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం) ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడానికి కొర్రపాటి నాటక శిక్షణాలయాన్ని కూడా నడిపారు. ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, గరికపాటి రాజారావు, పినిశెట్టి, రామచంద్ర కాశ్యప, పృథ్వీ రాజ్ కపూర్ వంటి వారితో కొర్రపాటికి సాన్నిహిత్యం ఉండేది. సినీనటులు పి.ఎల్.నారాయణ, చంద్రమోహన్, నూతన ప్రసాద్, కె.ఎస్.టి. సాయి వంటివారు ఆయన శిష్యవర్గంగా ఉండేవారు. కొర్రపాటి మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్యంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత బాపట్లలో వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. గొప్ప హస్తవాసి కలవారని పేరుండేది. ఆయన సౌమ్యులు, మితభాషి, అభ్యుదయవాది, హాస్యప్రియులు. 1986 జనవరి 27న బాపట్లలో తనువు చాలించారు. – డాక్టర్ పి.సి. సాయిబాబు, రీడర్ ఇన్ కామర్స్(విశ్రాంత) (మే 10న కొర్రపాటి గంగాధరరావు శతజయంతి) -
గోడలు కూలిపోయే రోజు కోసం...
ఇవాళ రవీంద్రుడి పుట్టిన రోజు. ఆయన ఎక్కడ పుట్టారో, ఎప్పుడు పుట్టారో సులభంగా మనం తెలుసుకునే అవకాశం ఉంది. కానీ రవీంద్రుడి సాహిత్యాన్నీ, ఆ సాహిత్యం ఇచ్చే సంస్కారాన్నీ తెలుసుకోవడం ఇప్పటి తరానికి ఎంతైనా అవసరం. రవీంద్రుడి బాల్యం చిత్రంగా గడిచింది. అతను నాలుగు గోడల్ని బద్దలు కొట్టడం నేర్చుకున్నారు. ప్రకృతిని గొప్ప పాఠశాలగా భావించారు. పరిశీలన, ప్రకృతితో మమేకం కావడం ద్వారా ఆయన జ్ఞానవంతుడయ్యారు. ‘ప్రపంచ రహస్యాన్ని’ తెలుసుకునే క్రమంలో విజయం సాధించారు. ప్రకృతిని ఆస్వాదించే హృదయాన్ని పొందిన టాగూర్, అక్కడినుండే సాహిత్యాన్ని సృష్టించడం మొదలు పెట్టారు. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. సంస్కృత కావ్యాలు చదివారు. ఆంగ్ల సాహిత్యాన్ని పరిశీలించారు. బాల్యంలోనే ‘సంధ్యాగీత’ ప్రకటించారు. అది అందరి మన్ననలు పొందింది. రవీంద్రుని ప్రసిద్ధ గేయం ఊరకే అతని హృదయం నుండి రాలేదు. (Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు) ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో/ఎక్కడ మాన వుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో/ ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో’’ అంటూ ఒక స్వేచ్ఛా స్వర్గంలోకి, తన దేశాన్ని మేలుకునేట్లు చేయమని ప్రార్థించారు. ఈ వాక్యాలు ఇప్పటికీ నెర వేరలేదు. రవీంద్రుడు విశ్వమానవ వాదాన్ని కోరుకున్నారు. పరిశుభ్ర ప్రపంచాన్ని ఆశించారు. ఆధునిక వచన కవితలో తన భావాల్ని పొందు పరిచారు. ‘గీతాంజలి’లో ఎంత గొప్ప కవిత్వం అందించారో వేరే చెప్పాల్సిన పని లేదు. గీతాంజలి దేశ హద్దుల్ని దాటి, ప్రపంచం అంతా వినిపించింది. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) తన సాహిత్యం ద్వారా టాగూర్ ఈ దేశంలో కుల, మత, వర్గాలకు అతీతంగా మానవుడు తయారుకావాలని అభిలషించారు. మతం మనిషిని విభజించరాదని తెలియజేశారు. తన ఎనభై ఏళ్ళ జీవిత ప్రస్థానంలో అనేక నవలలు, నాటికలు, కవితా సంపుటాలు, గేయాలు రచించి సంపూర్ణ సాహిత్యకారుడిగా ఆవిష్కరించుకున్నారు. ‘విశ్వకవి’ అందించిన భావాలను పాడటమో, చదవ టమో కాదు. వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే రవీంద్రుని ఆశయం నెరవేరినట్టు! – డాక్టర్ సుంకర గోపాల్ తెలుగు శాఖాధిపతి, డీఆర్జీ ప్రభుత్వ కళాశాల, తాడేపల్లిగూడెం (మే 7న టాగూర్ జయంతి) -
Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు
‘‘ఏమున్నది సార్ గీ సిన్మాల అంతా మా వూరు లెక్కనే వున్నది... మా బతుకులే వున్నయి...’’ సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసిన తర్వాత కరీంనగర్ జిల్లా ‘పోరండ్ల’ గ్రామ రైతు స్పందన ఇది. ఒక నిజాయతీ కలిగిన వాస్తవిక సినిమాకు ప్రపంచంలో ఎక్కడయినా ఇలాంటి స్పందనే వస్తుందన్నది నిజం. భారతీయ సినిమాకు కళాత్మకతనూ, మానవీయ స్పందనలనూ అందించిన దర్శకుడు రే. తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన ‘పథేర్ పాంచాలి’ నుంచి ‘ఆగంతుక్’ వరకు ముప్పై పూర్తి నిడివి సినిమాలు, అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీశారు. ఈ రోజుల్లో లాగా ఎలాంటి ఆధునిక ప్రసార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ లేని ఆ కాలంలో రే కు ప్రపంచ ఖ్యాతి లభించింది. 1921లో మే 2న జన్మించిన సత్యజిత్ రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీ రంగంలోనే గడిపినప్పటికీ ఆయన... రచయితగా, చిత్రకారుడిగా, టైపోగ్రాఫర్గా, బాల సాహిత్య సృష్టి కర్తగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా తనదైన ముద్రతో సృజన రంగంలో పని చేశారు. సినిమా రంగంలో కూడా దర్శకత్వంతో పాటు సంగీతం, సినిమా టోగ్రఫీ, స్క్రిప్ట్, మాటల రచన తానే నిర్వహించారు. మొదట రవిశంకర్ లాంటి వాళ్ళతో సంగీతం చేయించుకున్నా తర్వాత తానే తన సినిమాలన్నింటికీ సంగీతం సమకూర్చుకున్నారు. ఇంకా సన్నివేశాలకు సంబంధించి సంపూర్ణ స్కెచెస్ వేసుకొని, చిత్రీకరణ జరిపేవారు. సాహిత్యానికీ సినిమాకూ వారధిలా నిలిచి భారతీయ సినిమాను పరిపుష్టం చేశారు. టాగూర్, బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ్, తారాశంకర్ బంధోపాధ్యాయ్, ప్రేమ్ చంద్, నరేంద్రనాథ్ లాంటి మహా రచయితల రచనల్ని తెరపైకి ఎక్కించారు రే. అంతేకాదు, పలు సినిమాలకు తన స్వీయ రచనల్ని కూడా ఉపయోగించుకున్నారు. (చదవండి: ఆదర్శ కమ్యూనిస్టుకు జోహార్లు!) 1956లో ‘పథేర్ పాంచాలి’ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్’ అవా ర్డును గెలుచుకొని భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. తర్వాత ‘దేవి’, ‘కాంచన్ జంగా’, ‘చారులత’, ‘తీన్ కన్య’ ‘ఘరె బైరె’, ‘ఆగంతుక్’ లాంటి అనేక విశ్వ విఖ్యాత సిని మాల్ని రూపొందించారు. బహుశా ఆయన సినిమాల్ని ప్రదర్శించని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రపంచంలో లేవు. ఆయన అందుకోని అవార్డులూ లేవు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’, దాదా సాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘లెజియన్ ఆఫ్ ఆనర్’, అలాగే ‘ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారం’ లాంటి లెక్కలేనన్ని అంతర్జాతీయ పురస్కారాలూ అందుకున్నారు. భారతీయ సినిమాకు నవ్యచిత్ర వైతాళికుడిగా నిలిచిన సత్యజిత్ రే 1992 ఏప్రిల్ 23న కలకత్తాలోని బెల్లెవీ నర్సింగ్ హోమ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన చరిత్ర చిత్రసీమకు మణిహారం. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) – వారాల ఆనంద్ (మే 2న సత్యజిత్ రే జయంతి) -
కథాకథన చక్రవర్తి
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిది ఓ విశిష్ట రచనా వైదుష్యం. ఆయన రచనల్లో ‘సంభాషణలు’ కథను వి(క)నిపి స్తాయి. దృశ్యమానమైన భాషాపర బంధాలు ఆయన ప్రత్యేకత. బహు గ్రంథ చదువరి. తెలుగు సాహిత్య జగత్తులో ‘శ్రీపాద’ ఏ వర్గా నికి ‘సరిపడని’ వారు. మతం, వైదికత, సమాజం, జాతీయత వంటి వాటిని మిగిలినవారు విడివిడిగా తీసుకొని తమ రచనా అజెండాలుగా చేసుకున్నారు. కానీ... శ్రీపాద వాటిని విడివిడిగా చూడలేదు. వేదగిరి రాంబాబు ‘తెలుగు జాతి, భాషల పట్ల అభిమానంతో సాహిత్య సహకారంతో, విశిష్ట సేవల్ని అందించిన అద్వితీయమూర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి’ అంటారు. శ్రీపాద 20వ శతాబ్దపు తెలుగు కథకుల్లో విశిష్టమైన వ్యక్తి. 1891 ఏప్రిల్ 23న తూర్పు గోదావరి అనపర్తి మండలం పొలమూరులో జన్మించారు. 1961 ఫిబ్రవరి 25న రాజమండ్రిలో మరణించారు. తన అత్త కూతురునే వివాహం చేసుకున్నారు. ఆమె పేరు ‘సీత’. తండ్రి లక్ష్మీపతి సోమయాజులు, తల్లి ‘మహాలక్ష్మి సోదెమ్మ’. వైదిక విద్యలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి, స్మార్తం పూర్తి చేసి, తన పెద్దన్న దగ్గర రఘువంశ పాఠం నేర్చారు. తర్వాత సంస్కృత పాఠం కోసం గుంటూరు సీతారామశాస్త్రి దగ్గరకు ఊరు విడిచి ‘వల్లూరు’ వెళ్ళారు. ‘తెనుగులో మంచి పాండిత్యం సంపాదించాలి’ అని నిశ్చయించుకొన్న శ్రీపాద పట్టుదల తెలుగు అభిమానులకు షడ్రసోపేత సాహితి విందును అందించింది. ఆయన తన కథల్లో వినిపించే ‘సంస్కరణవాదం’ తెలుగు కథకు సువాసన లద్దింది. ఆయన కథల్లో శ్రీశ్రీ, చలం, విశ్వనాథ వంటివారి ‘వాదాల’ను పాఠకులు చూస్తారు. శ్రీపాద కథల్లో వివిధ సందర్భాల్లోని సంభాషణలు గమనిస్తే ఆయన స్త్రీల విషయంలో ఎంత బలీయమైన అభి ప్రాయంతో తన రచనల్లో ఆయా పాత్రలను చిత్రించారో అర్థమవుతుంది. శ్రీపాద రాసిన 75 చిన్న కథల్లో ప్రతీదీ సమాజ దర్పణంగానే నిలిచింది. ‘కలుపు మొక్కలు’, ‘గులాబి అత్తరు’, ‘అరికాళ్ళ క్రింద మంటలు’, ‘ఇలాంటి తవ్వాయి వస్తే’, ‘గుర్రప్పందేలు’, ‘గూడు మారిన కొత్తరికం’, ‘విమానం ఎక్కబోతూనూ’, ‘తాపి మేస్త్రీ’, ‘రామదీక్షితులు బి.ఎ.’, ‘పుల్లంపేట జరీచీర’, ‘జూనియర్ కాదు’, ‘అల్లుడు’, ‘రామలక్ష్మి’ ఇలా ప్రతీ కథకూ దాని గొప్పతనం దానిదే అని చెప్పాలి. ఇవన్నీ చదివితే పాఠకుల మనుసు, మెదడు విశాలమవుతాయి. మల్లాది రామకృష్ణశాస్త్రి ‘తెలుగు వాళ్ళకి మాత్రమే శ్రీపాద వారి కథలు చదివే అదృష్ట ముంద’న్నారు. గొప్ప సత్యమిది. ‘వైదిక పరిభాష’, ‘ఆయుర్వేద యోగ వైద్య ముక్తావళి’ లాంటి వైద్య గ్రంథాలు; భాషకి సంబంధించిన ఎన్నో వ్యాసాలు రాశారు. ‘ప్రేమపాశం’, ‘నిగళ బంధనం’, ‘రాజ రాజు’, ‘కలం పోటు’ వంటి నాటకాలు, నాటికలు రాసారు. రామాయణం, మహాభారతాలను సహితం తనదైన దృక్కోణం నుంచి రస్మాతకంగా తీర్చిది ద్దారు. ఎన్నెన్నో కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఆయన తన అత్మ కథను ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’గా రాశారు. ఇదో అద్భుత కావ్యమనే చెప్పాలి. ‘ప్రబుద్ధాంధ్ర’ పత్రికను నిర్వహించారు. ‘గిడుగు’ లాగానే భాషావాది. అనేక ‘అష్టా వధానాలు’ చేశారు. 1956లో కనకాభిషేకం కూడా అందుకున్నారు. (క్లిక్: ప్రపంచానికి దిక్సూచి.. పుస్తకం) ‘మనసు ఫౌండేషన్’ వారు శ్రీపాద వారి సర్వ లభ్య రచలనూ నాలుగు సంపుటాలుగా వెలువరించి తెలుగు పాఠకలోకానికి మేలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. - భమిడిపాటి గౌరీశంకర్ వ్యాసకర్త కథా రచయిత (ఏప్రిల్ 23న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి) -
ఆయనే ఒక చరిత్ర
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఎంవీ రమణారెడ్డి (ఎంవీఆర్) పేరు వింటున్నాను. మా ఊరు ప్రొద్దుటూరుకు పక్కనే ఉండటంతో రమణారెడ్డి గురించి ప్రచారమయ్యే ప్రతి విషయం నాకూ తెలిసేది. ప్రొద్దుటూరులోని షావుకార్లకు, మిల్లుల యజమానులు ఆయనంటే భయపడేవారు. బీదలకు, కార్మికులకైతే ఆయన దేవుడు. రాయలసీమ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. దాన్ని కష్టాల నుంచి విమోచనం చేయడానికి ఉద్యమించాడు. ముల్కీ ఉద్యమం 1968లో మర్రి చెన్నారెడ్డి వల్ల తెలంగాణా ఏర్పాటు ఉద్యమంగా ఊపందుకున్నప్పుడు, దాన్ని పలుచన చేసేందుకు అప్పటి కాంగ్రెస్ నేతలు ప్రొద్దుటూరులో ‘రాయలసీమ మహాసభలు’ నిర్వహిం చారు. ఆనాటి సభల్లోనే యువకుడైన ఎంవీఆర్ మైకును స్వాధీనం చేసుకొని– ‘రాయలసీమ అభివృద్ధి కోసం నిర్దిష్ట ప్రతిపాదనలతో పదవులను వదులుకొని ఉద్యమం చేయగలరా?’ అంటూ పెద్దలను ప్రశ్నించాడు. ఆ పెద్దల నోట మాటలేదు. 1983లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో ఉన్నా, ఆయన పదవులకోసం తన లక్ష్యాన్ని వదులుకోలేదు. ‘తెలుగు గంగ’ ప్రాజెక్టు రాయలసీమ నేలకు చుక్క నీరివ్వదని తెలుసుకున్న వెంటనే ఎన్టీఆర్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత ఎదిరించాడు. ‘రాయలసీమ విమోచన సమితిని’ స్థాపించి రాయలసీమ కోసం నాలుగు జిల్లాలూ తిరుగుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు. వంచనతో ఆ దీక్షను ముఖ్యమంత్రి వివరమింపజేయడంతో, తెలుగుదేశం పార్టీని వీడి ‘రాయలసీమ విమోచన సంస్థ ’ అభ్యర్థిగా 1985 శాసనసభ ఎన్నికల్లో పోటీచేశాడు. ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఓడిపోవడానికి, ప్రజాభిమానం లేని నాయకుడు గెలవడానికి ఈ ప్రజాస్వామ్యంలో ఎంత అవకాశం వుందో చూపడానికి 1985 ఎన్నికల నాటి ప్రొద్దుటూరు ఎన్నిక ఒక కొండగుర్తు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా, ఆ తరువాత ఆయన గానీ, ఆయన భార్య గానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ప్రతి ఎన్నికలో 25 వేల ఓటు బ్యాంక్ తనకుందని నిరూపించుకున్నారు. ఓడిపోయాక కూడా ఆయన రాయలసీమపై తనకున్న ప్రేమను చంపుకోలేదు. రాయలసీమ అభివృద్ధి కోసం ఏ పార్టీలు, ఏ ప్రజాసంఘాలు ఉద్యమించినా తను ప్రోత్సహించేవాడు. చిన్నాపెద్ద చూడకుండా ఆ నిరసనలలో పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైనప్పడు... ఆంధ్ర, రాయలసీమల్లో జరిగిన ‘సమైక్యాంధ్ర’ ఉద్యమాన్ని ఆయన వ్యతిరేకించాడు. దాన్ని నడిపిస్తున్న శక్తులెవరో, రాయలసీమకు మరెంతగా అన్యాయం జరుగుతుందో వివరించాడు. (చదవండి: గ్రహణం పట్టిన భాస్కరుడు) రాజధాని కర్నూలు కావాలనీ, గుంతకల్లు రైల్వేజోన్ చేయాలనీ ప్రజాసంఘాలు చేసిన నిరసనల వెనుక వెన్నుదన్నుగా ఉండటమే కాకుండా, ఆరోగ్యం సహకరించకపోయినా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థాపన, రైల్వే డబ్లింగ్ పనులు వంటి ఒకటి రెండు మినహా, ఎంవీ రమణారెడ్డి ఎప్పుడో గుర్తించిన రాయలసీమ సమస్యలు దాదాపు అన్నీ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రాజెక్టులు కొన్ని పూర్తయినా నీటి కేటాయింపులు లేవు. (చదవండి: ఒక తరపు పోరాట గాథ) తొలినాళ్ళలో తీవ్రవాద మావోయిస్టు – లెనినిస్టు పార్టీతో ఎంవీఆర్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత కాలంలో మార్టిన్ లూథర్ కింగ్ అహింసా పోరాటాన్ని ‘ఆయుధం పట్టని యోధుడు’ పేరుతో మనకందించడం చూస్తే ఆయనలో వచ్చిన సైద్ధాంతిక మార్పు తెలుస్తుంది. రాయలసీమ కన్నీటిగాథపై ఆయన రాజేసిపోయిన నిప్పు ఆయన లేకపోయినా రాజుకుంటూనే ఉంటుంది. - పాలగిరి విశ్వప్రసాద్ వ్యాసకర్త కథా రచయిత (ఏప్రిల్ 4న ఎంవీ రమణారెడ్డి జయంతి) -
బహుజన బాంధవుడు కాన్షీరామ్
బహుజనులను రాజ్యాధికారానికి దగ్గర చేసినవారు కాన్షీరామ్. 1934 మార్చి 15న పంజాబ్ రాష్ట్రం రోపడ్ జిల్లా కావాస్పూర్ గ్రామంలో జన్మించారు. బీఎస్సీ చదివి రక్షణ శాఖలో చేరారు. 1965లో అంబేడ్కర్ జయంతినాడు సెలవు ప్రకటించాలని చేపట్టిన ఆందోళనతో ఆయన ఉద్యమ జీవితం ప్రారంభమైంది. అంబేడ్కర్ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకం స్ఫూర్తితో పీడిత వర్గాల జీవితాల్ని రాజ్యాధికారం దిశగా తన నాయకత్వంలో ముందుకు నడిపారు. గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, నారాయణ గురు, పెరియార్ లాంటి వారిని గురువులుగా భావించారు. వారి ప్రభావంతోనే 1971లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. తదనంతరం 1978లో బ్యాక్వార్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బామ్ సెఫ్)ను స్థాపించి అణగారిన వర్గాలలో ఎదిగినవారు తమ వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా కృషి చేశారు. ‘రాజ్యాధికారమే మాస్టర్ కీ’ అన్న అంబేడ్కర్ మాటలను ఆదర్శంగా తీసుకొని 1984లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించారు. బహుజన సమాజాన్ని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అంబేడ్కర్ చెప్పిన విధంగా ‘బోధించు, సమీకరించు, పోరాడు’ సిద్ధాంతానికి అనుగుణంగా 1983 మార్చి 15న ఢిల్లీ నుండి బయలుదేరి ఏడు రాష్ట్రాల మీదుగా 100 సైకిళ్ళతో 40 రోజులలో 4,200 కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను బహుజన ఉద్యమం వైపు మరల్చిన గొప్ప వ్యక్తి కాన్షీరాం. ఆయన అలుపెరగని పోరాటంతో ఉత్తరప్రదేశ్‌లో బహుజనులు కొన్ని సార్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే కాక... దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ గణనీయమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. – డాక్టర్ మొగిలి దేవప్రసాద్, సామాజిక విశ్లేషకులు, ఒంగోలు మార్చి 15న కాన్షీరామ్ జయంతి -
జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా.. మీరే మాకు స్పూర్తి!
టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటాకు రతన్ టాటా నివాళులర్పించారు. 29 ఏళ్లకే ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించి దేశంలో పరిశ్రమల స్థాపనకు ఆధ్యుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జమ్షెడ్జీ టాటా జన్మదినం సందర్భంగా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా గౌరవం, జీవనోపాధిని అందించిన మీరే స్ఫూర్తి, నీతి ,విలువలు, అతని , నిస్వార్థ సేవతో జామ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా మనకు అందించారు. వ్యవస్థాపకుడి జయంతి సందర్భంగా అన్ని టాటా గ్రూప్ కంపెనీలు, ఉద్యోగులు, వారి కుటుంబాలకు నా శుభాకాంక్షలు' అని టాటా ట్రస్ట్ ఛైర్మన్ జమ్ షెడ్జీ శిల్పం పక్కన నిలబడి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'లెజెండ్ లైవ్స్ ఆన్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో జమ్ షెడ్జీ ట్యాగ్‌తో ప్రత్యేకంగా ఆయన సేవల్ని గుర్తు చేస్తూ పోస్ట్‌లను ప్రత్యేకంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
కిమ్ దురాగతం.. గడ్డకట్టే చలిలో అరగంట సేపు నిలబెట్టి..
North Korea’s Kim Jong-un uses hidden heaters: క్రూరమైన పాలనకు పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ ఎప్పుడు ఏదోఒక విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూనే ఉంటారు. ఆయన తీసుకునే వింతవింత నిర్ణయాలతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాలా చేసి వివాదాస్పద నాయకుడిగా పేరుగాంచాడు. ఇదిలా ఉండగా తాజగా కిమ్ దురాగతం మరోసారి బయటపడింది. వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి 80వ జయంతి సందర్భంగా సంజియోన్ నగరంలోని ఆరుబయట గడ్డకట్టే చలిలో తన తండ్రి విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో వేలాది ప్రజలను గడ్డకట్టే చలిలో బ్లౌజులు, టోపీలు ధరించకుండా నిలబడి తన తండ్రికి సంబంధించిన ప్రసంగం వినేలా చేశాడు. అయితే జోన్ తన అధికారులతో పాటు కూర్చొన్న డెస్క్ వద్ద హీటర్లు వినియోగించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాదు అక్కడ ఉన్న రెడ్ కార్పెట్ వద్ద ఉన్న వైర్ల గుంపును బట్టి అంచనా వేయొచ్చని మీడియా ప్రతినిధులు అన్నారు. అంతేకాదు కిమ్ ఇంతకుముందు డిసెంబర్ 2019లో కూడా గడ్డకట్టే చలిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడూ కూడా హీటర్ల వినియోగించినట్లు బయటపడింది. 2011లో కిమ్ జోంగ్-ఇల్ మరణానంతరం అధికారం చేపట్టిన కిమ్ జోంగ్-ఉన్ తన దివంగత తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 'డే ఆఫ్ షైనింగ్ స్టార్' కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏది ఏమైన కిమ్ ప్రజలను బాధించేలా తీసుకునే క్రూరమైన చర్యలు కారణంగానే ఆయన తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. (చదవండి: యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు) -
శతవసంత స్వరమాధురి
ఇరవయ్యో శతాబ్దంలో భారతీయ సంగీత సామ్రాజ్యంలో ‘భీమ్ సేన్ గురురాజ్ జోషీ’ది అగ్రగణ్య స్థానమని చెప్పాలి. హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో మేరునగ ధీరునిగా పేరుగాంచిన ఆయన 1922 ఫిబ్రవరి 4న కర్ణాటక రాష్ట్రం, గదగ్ జిల్లాలోని రాన్ ప్రాంతంలో జన్మించారు. ‘పండిట్ భీమ్ సేన్ జోషీ’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన తన చిన్నతనంలో పదకొండవ ఏటనే అబ్దుల్ కరీంఖాన్ గానం విని తన్మయుడై ఆయన స్వరానికి ఉత్తేజం చెంది తానూ సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును వెతుక్కొంటూ ఇల్లు వదలి గ్వాలియర్ చేరుకొని ఓ సంగీత పాఠశాలలో చేరి, ఆ తరువాత మంచి గురువు కోసం అనేక చోట్ల తిరిగి తిరిగి చివరకి 1936లో ‘సవాయిగంధర్వ’ వారి వద్ద శిష్యునిగా చేరారు. ఇక అప్పటి నుండి 24 జనవరి 2011న తన 88వ ఏట ఈలోకం వీడి వెళ్లేంత వరకు తన గంధర్వ గానంతో ‘హిందుస్తానీ సంగీతాన్ని’ అజరామరం చేస్తూనే ఉన్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, మహారాష్ట్ర భూషణ్, కర్ణాటకరత్న లాంటి గౌరవ పురస్కారాలతో పాటు... భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ కూడా పండిట్ భీమ్ సేన్ జోషీని వరించింది. (సకిన రామచంద్రయ్య: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ఆలాపనలే కాక ఆయన కన్నడ భజనలు, మరాఠీ అభంగులు, ‘బసంత్ బహార్, తాన్ సేన్’ లాంటి చలన చిత్రాల్లో పాటలు తనకు తానే సాటి అన్నట్టుగా గానం చేశారు. భీమ్ సేన్ జోషీ కర్నాటకకు చెందిన పురందర దాసు కృతులు కూడా ఆలపించటం విశేషం. కర్ణాటక సంగీతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణతో ఆయన కలిసి చేసిన ‘జుగల్ బందీ’ కచేరీలు సంగీతాభిమానులకు మరచిపోలేని అనుభూతులు. కర్ణాటక సంగీతంలో ‘సంగీత సామ్రాజ్ఞి’ ‘భారతరత్న’ అవార్డు గ్రహీత ఎమ్మెస్ సుబ్బులక్ష్మితో కలసి కూడా భీమ్ సేన్ జోషీ సంగీత కచ్చేరీలు చేశారు. ‘కిరానా ఘరానా’ స్వరశైలిలో ప్రఖ్యాతి గాంచిన భీమ్ సేన్ జోషీ హిందూస్తానీ సంగీతంలో ఓ ధ్రువ తారలా వెలిగారు. శుద్ధ కళ్యాణ్, పురియా కళ్యాణ్, పురియా, ముత్ లానీ, మారు బిహాగ్, తోడి లాంటి హిందుస్తానీ రాగాల్లో ఆయన సంగీత రసజ్ఞత ఆపూర్వం. ‘మిలేసుర్ మేరా తుమ్హారా’, అంటూ 1980 దశకంలో దూరదర్శన్ వీడియో కోసం ఆయన పాడిన పాట వినని వారుండరు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) సంగీతం సార్వత్రికమైనది. దానికి భాషా భేదాలు లేవు. అందునా భారతీయ సంగీతం వేదకాలం నుండి ప్రఖ్యాతమైంది. అటువంటి భారతీయ సంగీత సౌరభాన్ని ఈ ప్రపంచానికి పంచిపెట్టిన మహా విద్వాంసుడు ‘భారతరత్న పండిట్ భీమ్ సేన్ జోషీ’ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరోసారి ఆ మహనీయునికి శ్రద్ధాంజలి. – డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ జర్నలిస్టు (ఫిబ్రవరి 4న పండిట్ భీమ్సేన్ జోషీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా) -
కొత్త విలనీకి పెట్టింది పేరుగా...
హీరో గానూ, ప్రతినాయ కుడిగానూ 200కు పైగా సినిమాల్లో నటించి ఒక నటుడిగా భారతీయ సినీ చరిత్రలో తన స్థానాన్ని నిలుపుకొన్న నటుడు అజిత్. మొదట హీరోగా నటించి, తర్వాత ఆధునిక పాశ్చాత్య ఆహార్యంతో ఆయన విలన్ పాత్రలకు గొప్ప హుందాతనాన్ని తెచ్చాడు. ఆయన అసలు పేరు అజిత్ హమీద్ అలీఖాన్. 1922 జనవరి 27న గోలకొండలో జన్మించాడు. ఆయన తండ్రి బషీర్ అలీ ఖాన్ పఠాన్ నిజామ్ సైన్యంలోనూ, పరిపాలనా విభాగంలోనూ పని చేశాడు. అజిత్ వరంగల్ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో... అతడి ప్రతిభను గుర్తించిన తోటి విద్యార్థులు, టీచర్లు ఆయనను సినిమాల్లో చేరమని ప్రోత్సహించడంతో అటువైపు ఆలోచిం చాడు. కానీ తండ్రికి అజిత్ సినిమాల్లో చేరడం అంతగా ఇష్టం ఉండేది కాదు. అయినా అజిత్ ఒక రోజు తన పుస్తకాలు అమ్మేసి 1943లో బొంబాయి రైలెక్కేశాడు. తన వెంట హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కవి షాహిద్ సిద్దికీ బోంబేలో ప్రముఖ దర్శకుడు రఫీక్ ఘజ్నవీకి రాసిన ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళాడు. బోంబే వెళ్ళగానే రఫీక్ ఘజ్నవీని కలిసి పరిచయం చేసు కున్నాడు అజిత్. కానీ అప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రఫీక్ తాను సినిమాలు తీయడం లేదని చెప్పడంతో ఇక ఎక్స్ట్రా వేశాలు వేస్తూ మూడేళ్లు గడిపాడు. 1946లో ఇన్ఫర్మేషన్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్మించే డాక్యుమెంటరీ సినిమాలల్లో పనిచేసే అవకాశం అతడికి వచ్చింది. ఒక్కో ఫిల్మ్‌కు అజిత్‌కు 125 రూపాయల పారితోషికం లభించేది. అలా అజిత్ వేస్తున్న పాత్రలు, అతనిలోని ప్రతిభ కొంతమంది సినీ నిర్మాతలు, దర్శకుల దృష్టిలో పడ్డాయి. క్రమంగా అవకాశాలు పెరిగిపోయాయి. 1946లో గీతా బాలి హీరోయిన్గా అజిత్ హీరోగా ‘షా–ఏ–మిశ్రా’ సినిమా రూపొందింది. అలా అజిత్ సినీ ప్రస్థానం హీరోగా మొదలయింది. తర్వాత హాతిమ్ తాయి (1947), పతంగా, జీవన్ సాథీ (1949), బేకసూర్ (1950) తదితర సినిమాలతో అజిత్ క్రమంగా నటుడిగా స్థిరపడ్డాడు. 1945లో వచ్చిన ‘నాస్తిక్’ సినిమా ఆర్థికంగా గొప్ప విజయం సాధించడంతో అజిత్ బొంబేలో నటుడిగానూ, అటు ఆర్థికంగానూ స్థిరపడ్డాడు. 1955లో విడుదల అయిన ‘మరైన్ డ్రైవ్’ సినిమా 50 వారాలు ఆడి సాధించిన విజయం అజిత్‌లో నూతనో త్సాహాన్ని నింపింది. అందులో బీనా రాయ్ హీరో యిన్. తర్వాత ‘26 జనవరి’ 1956లో విడుదల అయింది. అందులో నళినీ జయంత్ నాయకి. అజిత్ హీరోగా నళిని జహాంత్తోనే అధిక సినిమాల్లో నటించాడు. హిందీ సినిమా రంగానికి సంబంధించి నటన, నిర్మాణ, దర్శకత్వ తదితర అన్నీ రంగాల్లో ప్రధాన భూమికను పోషించిన ‘కపూర్’ వంశంతో అజిత్‌కు మంచి సంబంధాలు ఉండేవి. 1966లో రాజేంద్ర కుమార్ హీరోగా వచ్చిన ‘సూరజ్’లో విలన్‌గా నటించి తన నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు అజిత్. అప్పటికే విలన్లుగా పలువురు నటులు స్థిరపడి ఉన్నప్పటికీ అజిత్ తనదైన ప్రత్యేకతతో ‘ప్రిన్స్’ లాంటి పలు సినిమాలతో విలన్‌గా నిలదొక్కుకో గలిగాడు. 1973లో వచ్చిన ‘జంజీర్’ ఆయన విలనీ పాత్రలకు స్థిరమైన స్థానాన్ని ఇచ్చింది. అలా అజిత్ 57కు పైగా సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించాడు. అలా విలన్‌గా కెరీర్ కొనసాగుతూ ఉండగానే అజిత్ 1985లో సినిమాల్ని మానుకుని కుటుంబంతో సహా హైదరాబాద్ చేరుకున్నాడు. 1998 అక్టోబర్ 21న తన 76వ ఏట తాను అమితంగా ఇష్టపడే హైదరబాద్ నగరంలోనే తుది శ్వాస విడిచాడు. - వారాల ఆనంద్ సినీ విమర్శకుడు (‘దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్’ తరఫున అజిత్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా...) -
ఆమె జీవితం కాంతి పుంజం
యాభై ఐదేళ్ల ఏళ్ల గౌరీ లంకేష్, సీనియర్ జర్నలిస్టు, హక్కుల ఉద్యమ కార్య కర్త. ఐదేళ్ల కిందట బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో 2017, సెప్టెంబర్ 5న హత్యకు గురైనారు. అంధత్వాన్ని, మూఢత్వాన్ని నింపు కున్న ముష్కరులు గౌరీ లంకేష్ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఆమె హత్య వెనుక హిందుత్వ శక్తులూ, ఆధిపత్య రాజకీయాలూ ఉన్నాయి. సమానత్వాన్ని కోరుకుంటూ, లౌకిక వాదానికి కట్టుబడిన ఆమెను భౌతికంగా నిర్మూ లించడం ద్వారా లంకేష్‌లాంటి వారిని హెచ్చ రించాలనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు. కానీ ఆమె హత్య తర్వాత దేశ వ్యాప్తంగా తలెత్తిన తీవ్ర ఆందోళనలు సంప్రదాయ మతతత్వ శక్తు లకు సరైన సంకేతాలనే పంపాయి. ప్రగతివాదు లను అణిచివేయడం సంఘ్ పరివార్ శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువైంది. ఆ శక్తుల పాశవిక ధోరణికి గౌరీ లంకేశ్ హత్య మరో ఉదాహరణ మాత్రమే. మూడున్నర దశాబ్దాలపాటు ప్రజాజీవితంలో కొనసాగారు గౌరీ లంకేష్. ఇంగ్లిష్, కన్నడంలో అనేక స్ఫూర్తివంతమైన రచనలను చేశారు. తండ్రి పేరుతో ‘లంకేష్’ పత్రికను కూడా నడిపి మతవాద శక్తులను దును మాడారు. అందుకే మానవ హక్కుల హననానికి పాల్పడే మనువాదులు కుట్ర చేసి గౌరీ లంకేశ్ ప్రాణాలను హరించారు. గౌరీ లంకేశ్ హత్యకు ముందు ఆగస్టు 20, 2013న నరేంద్ర దబోల్కర్, 2015 ఫిబ్రవరి 20న గోవింద్ పన్సారే, అదే సంవత్సరం ఆగస్టు 30న ఎంఎం కల్బుర్గితో పాటు పదుల సంఖ్యలో దేశవ్యాప్తంగా కవులు, జర్నలిస్టులు హిందుత్వ శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యారు. వెలుగులోకి వచ్చినవి కొన్నే, బయటకు తెలియనివి ఎన్నో! – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, పాలకుర్తి (నేడు గౌరీ లంకేష్ జయంతి) -
నిరాటంకంగా ఘంటసాల స్వర రాగ మహాయాగం
అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకలు నిరాటకంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ‘‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’’ కార్యక్రమం 50వ రోజు పూర్తి చేసుకుంది. ‘‘ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్’’, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ వేడుకల్ని. 2021 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ బృహత్ కార్యక్రమంలో.. ఇప్పటికే భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఖతార్, బహరైన్, ఒమాన్, అమెరికా మొదలైన దేశాలనుండి గాయనీగాయకులు పాల్గొన్నారు. మధురగాయకుడు ఘంటసాల గీతాలను ఆలపించారు. ఇక 50వ రోజు సందర్భంగా శిరోమణి డా. వంశీ రామరాజు ఘంటసాల మందిరంలో దీపారాధన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విజయనగరం నుండి లలితా అలమేలు మంగ, జడ్చర్ల నుండి శైలజామూర్తి ఘంటసాల వారి చక్కటి వైవిధ్యభరితమైన పాటలను ఎన్నుకుని ఆలపించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా , సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్ అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షిస్తున్నారు. చదవండి: ‘శత వసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ -
సుశాంత్.. నిన్ను చాలా మిస్ అవుతున్నా: రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట టీవీ సీరియల్స్‌లో ప్రారంభమైన అతని కెరీర్ ఆ తర్వాత స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగింది. ఎంఎస్ ధోనీ, చిచోరే వంటి చిత్రాలతో మరింత పాపులర్ అయ్యాడు. స్టార్ స్టేటస్‌తో కేరీర్లో దూసుకుపోతున్న సమయంలోనే అర్థాంతరంగా తనువు చాలించాడు. సుశాంత్ మనకు దూరమై రెండేళ్లయినా ఇంకా అతని మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు(శుక్రవారం) సుశాంత్ 36వ జయంతి. ఈ సందర్భంగా అభిమానులు సహా పలువురు సోషల్ మీడియా వేదికగా సుశాంత్‌కు నివాళులు అర్పిస్తున్నారు. సుశాంత్ మరణించే సమయంలో ప్రియురాలుగా ఉన్న రియా చక్రవర్తి సైతం సుశాంత్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. జిమ్‌లో ఇద్దరూ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. మిస్ యూ సో మచ్ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా సుశాంత్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సైతం ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ లవ్ ఎమోజీని జతచేసింది. ప్రస్తుతం రియా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
నువ్వు లేవు.. నీ డ్రీమ్స్ అలాగే ఉన్నాయ్!
Sushant Singh Rajput Birth Anniversary: చెదరని చిరునవ్వు, భవిష్యత్తంతా ఈ కుర్రాడిదే అన్నంత అద్భత నటన. అతని టాలెంట్ చూసి పెద్ద స్టార్ అవుతాడు అనుకున్నారు అంతా. కానీ అంతలోనే అనూహ్యంగా ఆ చుక్కల్లో కలిసిపోయాడు. అతడే బాలీవుడ్ విలక్షణ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. కరియర్లో ఎదుగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రపంచానికి గుడ్ బై చెప్పేశాడు. రెండేళ్ల క్రితం సుశాంత్ అకాలమరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జనవరి 21 సుశాంత్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పుట్టినరోజు. సుశాంత్ ఈ లోకంలో ఉండి ఉండే ఈ రోజు తన 36వ బర్త్‌డేను సోదరీమణులు, అభిమానుల మధ్య గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవాడు. బట్..అన్నీ మనం అనుకున్నట్టు జరగవు మిస్ యూ బ్రో అంటూ అభిమానులు సుశాంత్‌ను గుర్తు చేసుకుంటున్నారు. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలి..హ్యాపీ బర్త్‌డే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటున్నారు. సుశాంత్ కలగన్న ఆ 50 డ్రీమ్స్ తమకు స్పూర్తి అని కమెంట్ చేస్తున్నారు. 1986 జనవరి 21 న పాట్నాలో కృష్ణ కుమార్ సింగ్, ఉషా సింగ్ దంపతులకు పుట్టాడు సుశాంత్ సింగ్. నటన అంటే మక్కువతో మోడల్‌గా రాణించాడు. ఆ తరువాత కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే టీవీ సీరియల్‌తో 2008లో టీవీ నటుడిగా బుల్లితెరకు పరిచయమయ్యాడు. అలా 2013లో కోటి ఆశలతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. తొలి మూవీ ‘కై పో చే’ లో నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. అలా తనకంటూ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా, పెద్దోళ్ల అండ లేకపోయినా స్వశక్తితో ఎదిగాడు. బుల్లితెర మీద తిరుగులేని స్టార్ ఇమేజ్ అందుకున్న యువ నటుడు బిగ్ స్క్రీన్‌పై కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, డిటెక్టివ్ బ్యోమ్కేష్ భక్షి, ‘పీకే’, ‘ఎం.ఎస్. ధోని : ద అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రాబ్తా’, ‘కేదార్ నాథ్’, ‘చిచ్చోరే’, ‘దిల్ బెచారా’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుశాంత్. చదువుకునే రోజుల్లో జీనియస్ అని పేరు తెచ్చుకుని జాతీయ స్థాయి ఒలింపియాడ్ ఫిజిక్స్‌లో విజేతగా నిలిచాడు. సుశాంత్ కేవలం హీరోగానే కాదు, డ్యాన్సర్‌గా, దాతగా పేరు తెచ్చుకున్నాడు. A place where WWW was invented. A place that discovered the God (damn:) particle. A place of numerous divine collisions. A place where Matter matters. 😉 A big thanks to #CERN for being so welcoming and making my dream come true. —Dream 17/50 ✅ #livingMyDreams#lovingMyDreams pic.twitter.com/LEnwdSmwSw — Sushant Singh Rajput (@itsSSR) October 15, 2019 కమర్షియల్‌గా సక్సెస్‌ను సాధిస్తూ కరియర్ అలా సాగుతున్నతరుణంలో నెపోటిజమో, మానసిక ఒత్తిడో, ధైర్యాన్ని కోల్పోయాడో తెలియదు కానీ 2020 జూన్ 14 న శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ముంబైలోని అతని అపార్ట్మెంట్లో ఉరివేసుకుని చనిపోవడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, ప్రకృతి, క్రికెట్, విమానాన్ని నడపడం, అంతరిక్షం, మొక్కలు నాటడం, సిక్స్ ప్యాక్ బాడీ, ఒక పుస్తకం రాయడం,లాంబోర్గిని కారు ఇలాంటి 50 కలల్ని రాసిపెట్టుకున్న సుశాంత్ అర్థాంతరంగా తనువు చాలించడం ఒక మిస్టరీ. ఆత్మహత్యే అని పోలీసులు చెప్పినా, చిచ్చోరే సినిమాద్వారా ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని సందేశం ఇచ్చిన హీరో సుశాంత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. Like the shadow I am and I am not... ~ Jalaluddin Rumi ❤️ pic.twitter.com/Ejj1X6LSyV — Sushant Singh Rajput (@itsSSR) October 26, 2019 -
అణచివేతను ధిక్కరించిన అరుణపతాక
అణగారిన కులాలపై పెత్తందార్ల అణచివేత పోకడలను ధిక్కరించిన అరుణపతాక చండ్ర పుల్లారెడ్డి. 1917 జనవరి 19న కర్నూలు జిల్లాలో జన్మించారు. ఇంజనీరింగ్ చదువు కోసం చెన్నై వెళ్ళిన పుల్లారెడ్డి కమ్యూ నిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్యతో పరిచయం ఏర్పడటంతో కమ్యూనిస్ట్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. ఆ రోజుల్లో తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న సాయుధ పోరాటంలో పాల్గొనేందుకు వెళుతుండగా నిర్బంధానికి గురయ్యారు. జైల్లో ఉన్నపుడు సాయుధ పోరాటాన్ని విరమించాలన్న పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. (చదవండి: సమసమాజ విప్లవ తపస్వి.. జ్వాలాముఖి) 1952 ఎన్నికల్లో కర్నూలు జిల్లా నంది కొట్కూరు అంసెంబ్లీ నియోజకవర్గం నుండి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలు పొందారు. 1964లో పార్టీ చీలిక సందర్భంలో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో మార్క్సిస్టు పార్టీలో చేరారు. ఇండో–చైనా యుద్ధ సమయంలో చైనాకు అనుకూలంగా మాట్లాడారని నాటి ప్రభుత్వం ఆయనను నిర్బంధించింది. తర్వాత బెంగాల్లో చారు మజుందార్ ప్రభావంతో సాయుధ పోరాటం వైపు మళ్లారు. ఆయన రాసిన ‘వీర తెలంగాణ విప్లవ పోరాటాలు–పర్య వసానాలు’ కార్యకర్తలను ఎంతో చైతన్యపరచింది. (చదవండి: సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త) 1970లో అంటరాని తనం తీవ్రంగా ఉన్నపుడు... అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో దళితుల పక్షాన అగ్రవర్ణాలు భూస్వాములతో రాజీలేని పోరాటం చేశారు. దళితులు చెప్పులు వేసుకోరాదని, 2 గ్లాసుల పద్ధతిని విధించిన భూస్వాముల ఆంక్షలను నిరసించారు. దీంతో ప్రభుత్వం వెట్టిచాకిరీని రద్దు చేస్తూ, చట్టాన్ని తెచ్చింది. నిరంతరం సమరశీల ఉద్యమాలను నిర్మిస్తూ, పీడిత వర్గాల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన ఈ అరుణ పతాక 1984 నవంబర్ 9వ తేదీన అజ్ఞాతంలో తనువు చాలించారు. (చదవండి: పారిశ్రామిక విప్లవానికి పునాది) – డా. ఎస్ బాబూరావు, సీనియర్ జర్నలిస్ట్, కావలి -
వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ‘అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం జగన్ యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం.#NationalYouthDay — YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2022 -
సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త
బరువైన వస్తువు, తేలికైన వస్తువు కన్నా వేగంగా కిందకి పడుతుందని అరిస్టాటిల్ (క్రీ.పూ. 384–332) భావిం చాడు. అది నిజమేనని నమ్ముతూ సాగింది యావత్తు ప్రపంచం సుమారు 20 శతాబ్దాల పాటు! దీన్ని కొందరు విభేదించినా, అరిస్టాటిల్ ప్రతిష్ఠ కారణంగా ఆ అభిప్రాయం చలామణి అవుతూ వచ్చింది – గెలీలియో రంగ ప్రవేశం దాకా! ఇటలీ లోని వాలిన పీసా గోపురం నుంచి వేర్వేరు బరువులున్న వస్తువులను పడవేసి, అరిస్టాటిల్ చెప్పిన భావన తప్పు అని రుజువు చేశాడు గెలీలియో గెలీలి. ఈ వృత్తాంతం జరిగిందనే ఆధారాలు లేకపోయినా – విరివిగా నేటికీ గిరికీలు కొడుతోంది. గెలీలియోతో ఆధునిక విజ్ఞానం మొదలైందని పరిగణిస్తూ క్రీ.శ. 1550ను ప్రారంభంగా సూచిస్తాం. ఆయనను ఆధునిక వైజ్ఞానిక పితామహుడిగా పరిగ ణించాలని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి వారు పేర్కొంటారు. కటకాలను ఉపయోగించి దూరపు వస్తువులను తలకిందులుగా చూడగలుగు తున్నారని తెలియగానే ఆరునెలల్లో టెలిస్కోపు నిర్మించుకున్నారు గెలీలియో. దీనితో పాలపుంత విషయాలు, జూపిటర్ గ్రహానికుండే చంద్రుళ్ళు, శని గ్రహపు వలయాలు– ఇలా చాలా సంగతులు చూపించి సైన్స్ ఏమిటో వివరించిన తొలి ప్రాయోజిక శాస్త్రవేత్త. తన టెలిస్కోపును తనే తయారుచేసుకున్న ఇంజనీరు కూడా! వైద్యుడు కావాలనుకున్నా గణితం మీద ఇష్టంతో గణితాచార్యుడై ప్రకృతి నియమాలు గణితాత్మకమని ప్రతిపాదించారు. సూర్యుడు, చంద్రుడు మొదలైనవి భూమి చుట్టూ తిరుగుతున్నాయనే నమ్మకం పుస్తకాలలో చేరి మతభావనలలో అంతర్భాగమైంది. కోపర్నికస్ (1473–1543) దీన్ని కాదని సూర్యుని చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతున్నాయనే ‘సూర్య కేంద్రక సిద్ధాంతం’ ప్రతిపాదించి, విశ్వాసాలతో ఇబ్బందులు పడి, అలాగే మరణించాడు. కానీ గెలీలియో టెలిస్కోపుతో ఏది ఏమిటో విప్పిచూపాడు. భూకేంద్రక సిద్ధాంతం కంటే సూర్యకేంద్రక సిద్ధాంతం అర్థవంతమని వివరించాడు. ఫలితంగా అది మత పెద్దలకు కంటగింపుగా మారింది. అయినా పట్టు వదలక ఈ విషయాలను నాటకంగా రాసి, మరింతగా జనాల్లోకి తీసుకెళ్లిన సృజనశీలి గెలీలియో. ఈ సాహసగుణమే ఉద్యోగానికి ఎసరుపెట్టింది. చివరికి గృహఖైదులో కనుమూసేలా చేసింది. గెలీలియో ప్రతిపాదనను గుర్తించినట్టు 1992 అక్టోబర్ 31న వాటికన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్థిరపడిన విషయాన్ని ప్రశ్నించే తత్వాన్ని తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న గెలీలియోకు కవిత్వం, సంగీతం, కళా విమర్శ అంటే కూడా ఆసక్తికరమైన అంశాలు. నిజానికి అప్పటికి మతం, ఫిలాసఫీ, సైన్స్ మూడూ ఒకటే అనే తీరులో సాగేవి. ఈయన గొప్పతనం ఏమిటంటే – మతం నుంచి సైన్సును వేరుచేశాడు. తర్వాత ఫిలాసఫీ నుంచి సైన్సును వింగడించి పరిపుష్టం చేశాడు. గెలీలియో చేసిన మరో గొప్ప పని ఏమిటంటే – గణితాన్ని విజ్ఞాన శాస్త్రంలో ప్రవేశపెట్టడం. గణితం రాకతో విజ్ఞాన శాస్త్రానికి కచ్చితత్వం ఒనగూడింది. ఆయన ఎంత సూక్ష్మగ్రాహి అంటే – చర్చిలో ఊగే దీపాన్ని పరిశీలించి – వేగం తగ్గినా, కదిలే దూరం మారినా, చలనానికి పట్టే వ్యవధి మారదని గుర్తించారు. ఎలా సాధ్యమైందిది? నాడిని కొలిచి ఈ విషయం చెప్పారు. పరోక్షంగా ‘పల్సో మీటర్’ భావనను ఆయన ఇచ్చారు. 1564 ఫిబ్రవరి 15న జన్మించిన గెలీలియో 1642 జనవరి 8న కనుమూశారు. అదే సంవత్సరంలో ఐజాక్ న్యూటన్ జన్మించడం విశేషం! విశ్వాసాలను పరీక్షకు పెట్టడమే కాదు, పరిశీలనతో తనను తాను సవరించుకునే సైన్స్ టెంపర్ కలిగిన గొప్ప సాహసి అయిన శాస్త్రవేత్త గెలీలియో గెలీలి. - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
Irrfan Khan Birth Anniversary: ఆ పాత్రలు ఎలా మర్చిపోగలం?
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రపంచం మరచిపోలేని నటుడు, నిర్మాత ఇర్ఫాన్ ఖాన్. ఆయన ఎంచుకున్న పాత్రలన్నీ దేనికదే ప్రత్యేకం. స్క్రీన్ మీద ఆ పాత్రలు తప్ప ఇర్ఫాన్ కనిపించడు. అంతటి విలక్షణమైన ప్రతిభ నటన ఆయన సొంతం. అలాంటి గొప్ప కళాకారుడి అకాల మరణం దురదృష్టకరం. కానీ వెండితెరపై ఆయన ఆవిష్కరించిన అద్భుత పాత్రలు ఎప్పటికీ సజీవమే. ఇర్ఫాన్ 55వ జయంతి (జనవరి,7) సందర్భంగా ‘సాక్షి’ డిజిటల్ నివాళులర్పిస్తోంది. జనవరి 7, 1967న రాజస్థాన్ లోని జైపూర్‌లో ఇర్ఫాన్ ఖాన్ జన్మించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కరియర్లో ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించినప్పటికీ, పలు హాలీవుడ్, ఇతర భారతీయ భాషల్లో కూడా నటించారు. సహజమైన నటన, వైవిధ్య భరిత పాత్రలకు ఆయన పెట్టింది పేరు. 1988లో సలామ్ బాంబే సినిమాలో తొలిసారిగా నటించిన ఇర్ఫాన్, ది నేమ్‌సేక్, కమలాకీ మౌత్, జజీరే, దృష్టి, ఏక్ డాక్టర్ కీ మౌత్ లాంటి సినిమాలతో పాటు.. తెలుగులో మహేష్ హీరోగా నటించిన సైనికుడు మూవీలో నటించారు. హాలీవుడ్లో స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి ఉత్తమ చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించారు. పాన్ సింగ్ తోమర్ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ముఖ్యంగా లైఫ్ ఆఫ్ పై సినిమాతో పాపులర్ అయిన ఇర్ఫాన్ ఖాన్ సినీ కరియర్లో ప్రతీ సినిమా ఒక మైలురాయి లాంటిదనే చెప్పాలి. పాన్ సింగ్ తోమర్, లంచ్ బాక్స్, హైదర్, తల్వార్, మఖ్బూల్, పీకూ, ఇంగ్లీష్ మీడియం ఇటీవల ఓటీటీలో రిలీజ్ మర్డర్ ఎట్ తీసరీ మంజిల్ 302 లాంటి చిత్రాల్లో ఇర్ఫాన్ నటన అద్భుతం. పీకూ మూవీలో అమితాబ్‌కు పోటీపడి నటించి మెప్పించారు. అలాగే ఇర్ఫాన్ ఖాన్ అనగానే తల్వార్ మూవీలో సీబీఐ ఆఫీసర్ పాత్ర, కార్వాన్ లో షౌకత్ పాత్రను గుర్తు రాకమానవు. ఒక్కసారి ఆయన మూవీ చూస్తే ఆ పాత్ర ప్రేక్షకుడిని చాన్నాళ్లు వెంటాడుతుంది. కాలర్ పట్టి నిలదీస్తుంది. అలా నటనలో జీవితాన్ని ఆవిష్కరించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు ఇర్ఫాన్. అసామాన్య ప్రతిభతో రాణిస్తున్న ఇర్ఫాన్‌ను కేన్సర్ బలితీసుకుంది. 2020, ఏప్రిల్‌లో ఆయన కన్నుమూశారు. తల్లి చనిపోయిన కొన్ని రోజులకే ఆయన కూడా తల్లి ఒడికి చేరిపోవడం అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇర్ఫాన్ ఖాన్ పెద్ద కుమారుడు బాబిల్ ఖాన్ మూవీల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనికి సంబంధించి ఫోటోషూట్ కూడా చేశాడు. కాగా కళా రంగంలో కృషి చేసినందుకు గాను భారత ప్రభుత్వం ఇర్ఫాన్ ఖాన్‌కు 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. -
మనకు తెలియని యోధురాలు.. ఆమె ఎవరు?
చరిత్ర కూడా చాలా చమత్కారమైనది. అది కొందరిని ముందుకు తెస్తుంది. కొందరిపై మసక తెర వేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి తెలిసినట్టుగా వేలు నాచ్చియార్ తెలియదు. ఒకరు ఉత్తర భారతదేశం అయితే ఒకరు దక్షిణ భారతదేశం. ఇద్దరూ బ్రిటిష్ వారిపై పోరాడారు. తమిళనాడుకు చెందిన రాణి వేలూ నాచ్చియార్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమె జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించడంతో వేలూ నాచ్చియార్ ఎవరు అని కుతూహలం ఏర్పడింది. ఆమె ఎవరు? జనవరి 3 ‘రాణి వేలూ నాచ్చియార్’ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆమెను తలుచుకున్నారు. ‘నారీ శక్తికి ఆమె సంకేతం’ అని ట్విటర్ ద్వారా శ్లాఘించారు. సోషల్ మీడియాలో ఆ వెంటనే రాణి వేలూ నాచ్చియార్ వర్ణ చిత్రాలు ఫ్లో అయ్యాయి. అచ్చు ఝాన్సీ లక్ష్మీ బాయిలా గుర్రం మీద కూచుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న వేలూ నాచ్చియార్ గురించి దేశానికి తెలిసింది ఎంత అనే సందేహం వచ్చింది నెటిజన్లకు. ఝాన్సీ లక్ష్మీ బాయి కంటే యాభై అరవై ఏళ్లకు పూర్వమే బ్రిటిష్ వారిపై పోరాడి విజయం సాధించిన తొలి రాణి అయినప్పటికీ ఆమె ఘన చరిత్ర బయటకు రాకుండా బ్రిటిష్ వాళ్లు జాగ్రత్త పడ్డారన్నది ఒక కథనం. దానికి కారణం ఆమె చేతిలో వారు ఓడిపోవడమే. చరిత్రలో తొలి మానవ బాంబును ప్రయోగించిన ఘనత కూడా వేలూ నాచ్చియార్దే కావడం విశేషం. శివగంగ రాణి నేటి రామనాథపురంలో 18 వ శతాబ్దంలో నెలకొన్న రామనాథ రాజ్యపు యువరాణి వేలూ నాచ్చియార్. 1730 జనవరి 3న జన్మించింది. ఆమె ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ఆమెకు అన్ని విద్యలు నేర్పించారు. తమిళం మాతృభాష అయినప్పటికీ నాచ్చియార్ ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు 16 ఏళ్లు వచ్చాక 1746లో– గతంలో రామనాథ రాజ్యం నుంచి విడిపోయి మరొక రాజ్యంగా ఏర్పడిన శివగంగ రాజ్యానికి కోడలుగా వెళ్లింది. శివగంగ రాజ్య యువరాజు వడుగనాథ దేవర్ ఆమెకు భర్త అయ్యాడు. వాళ్లకు వెళ్లాచ్చి అనే కూతురు పుట్టింది. ఆ విధంగా రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం హాయిగా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తూ ఉండగా బ్రిటిష్‌వారు ఊడిపడ్డారు. బ్రిటిష్ దాడి అప్పటికే దేశం లోపలి రాజ్యాల నడుమ ఉన్న లుకలుకలను ఉపయోగించుకుని తమ పెత్తనాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు దక్షిణాదిలో తమ విస్తరణ కోసం ఆర్కాట్ నవాబుతో చేయి కలిపారు. అప్పటికి ఆర్కాట్ నవాబు మధురై నాయక రాజ్యాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. అతనికి రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం కప్పం కట్టడానికి అంగీకరించలేదు. దాంతో బ్రిటిష్ వారు అతనిని రెచ్చగొట్టి ఆ రాజ్యాలను హస్తగతం చేసుకోవాలనుకున్నారు. అది 1772వ సంవత్సరం. శివగంగ ఆలయానికి దర్శనానికి నిరాయుధునిగా వెళ్లిన వడుగనాథ దేవర్పైన బ్రిటిష్ వారు హటాత్తుగా దాడి చేసి చంపేశారు. అంతేకాదు ఆలయాన్ని లూటీ చేసి 50 వేల బంగారు నాణేలు తీసుకెళ్లారు. ఆలయంలో భర్తను చంపారన్న వార్త విని వేలూ నాచ్చియార్ హతాశురాలైంది. వెంటనే ఒక మంత్రి సహాయం రాగా కుమార్తెను తీసుకుని విరూపాక్షికి వెళ్లిపోయింది. అయితే బ్రిటిష్ వారు ఆమె నమ్మినబంటు ఉడయాళ్ను పట్టుకుని ఆమె ఆచూకి కోసం నిలదీశారు. అతను చెప్పకపోయేసరికి చంపేశారు. ఈ వార్త విన్నాక వేలూ నాచ్చియార్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘బ్రిటిష్‌వారిని ఓడించి నా రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాను’ అని శపథం చేసింది. 8 ఏళ్ల అజ్ఞాత వాసం వేలూ నాచ్చియర్ 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసింది. ఆమె నమ్మినబంట్లు మెల్లమెల్లగా ఆమెను చేరుకున్నారు. బ్రిటిష్ వారిని ఓడించాలన్న తలంపుతో ఆమె మాస్టర్ ప్లాన్ వేసి మహిళా దళాన్ని తయారు చేసింది. దానికి తన నమ్మినబంటైన ఉడయాళ్ పేరు పెట్టింది. ‘కుయిలీ’ అనే మహిళ దానికి నాయకురాలు. శివగంగ రాణి ఇలా బ్రిటిష్ వారిపై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తున్నదని విన్న మైసూర్ నవాబు హైదర్ అలీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. ఆమె తన సైన్యం నిర్మించుకోవడానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాడు. వేలూ నాచ్చియార్ తన పదాతి దళం, అశ్వదళం, మహిళా దళంతో పూర్తిగా దాడికి సిద్ధమైంది. అయితే ఆమె దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి చాలా తక్కువ. బ్రిటిష్ వారి దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. దానికి విరుగుడు? మానవబాంబు. ప్రతిదాడి అది 1780. విజయదశమి రోజు. ఆ రోజున కోట గోడలు తెరిచి సామాన్యజనాన్ని ఆహ్వానిస్తారు శివగంగ రాజ్యంలో. వేలూ నాచియార్ తయారు చేసిన మహిళా దళం సభ్యులు ఆయుధాలను చీర కొంగుల్లో దాచుకుని సామాన్య మహిళలుగా కోటలోకి ప్రవేశించారు. అదను చూసి నాయకురాలు కుయిలీ ఆదేశం అందుకుని బ్రిటిష్ వారిపై ఊచకోత సాగించారు. బ్రిటిష్‌వారు ఆయుధగారంలోకి వెళ్లి ఆయుధాలు తీసే లోపు ఒక మానవబాంబు ఒళ్లంతా నెయ్యి పూసుకుని ఆయుధగారంలోకి వెళ్లి మంట పెట్టుకుంది. అంతే. ఆయుధగారం పేలి ఆయుధాలు వృధా అయిపోయాయి. మరోవైపు వేలూ నాచ్చియార్ తన దళంలో ఊడిపడి బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తన రాజ్యం తిరిగి దక్కించుకుంది. అవమానకరమైన ఈ ఓటమిని బ్రిటిష్ వారు చరిత్ర పుటల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికి ఆమెకు 50 ఏళ్లు. ఆ తర్వాత మరో 16 ఏళ్లు జీవించి హృద్రోగంతో 1796లో కన్నుమూసింది వేలూ నాచ్చియార్. ఆమెను తమిళనాడులో ‘వీరనారి’ అని పిలుచుకుంటారు. -
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
-
జులై 4న ఢిల్లీలో అల్లూరి జయంతి వేడుకలు
-
భాషకు వన్నెతెచ్చిన గురుశ్రేష్ఠుడు
భాషా శాస్త్ర రంగంలో పరిశోధనపై దృష్టి కేంద్రీకరించి తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన కోరాడ మహాదేవ శాస్త్రి శత జయంతి సంవత్సరం ఇది. ఆర్థిక శాస్త్రంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేసి సిమ్లాలోని లేబర్ ఇన్వెస్టిగేషన్ కమిషన్, భారతీయ వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఫిక్కీ)లలో ఆర్థికవేత్తగా పనిచేసినా భాషాశాస్త్రంలో విశ్వ విఖ్యాతి పొందిన ప్రొఫెసర్ సునీతి కుమార్ ఛటర్జీ పిలుపుతో చేస్తున్న ఉద్యోగం వదిలి కలకత్తా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో చేరి, ఎంఏ పట్టా పొందారు. తమిళనాడు చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్ర అధ్యాపకుడుగా పనిచేసి ఆ తర్వాత తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (1960–68), అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుడిగా ఉన్నారు. తెలుగు భాషలో ఎన్నో పరిశోధనా గ్రంథాలు వెలువరించడమే కాదు, సంస్కృత, ఆంగ్లభాషలతోపాటు ప్రాకృతం, హిందీ, భోజ్‌పురి, బెంగాలీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు భాషా సాహిత్య రంగాలు రెండిటా విశేష కృషి చేసి, తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతులపై పలు రచనలు చేశారు. 1969లో వెలువరించిన ‘హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు’ అనే గ్రంథంలో భాషలోని వ్యాకరణాంశాలు కాలక్రమాన ఏవిధంగా మారుతూ వచ్చాయో వివరించారు. సాహిత్యంలోని భాష నిర్దిష్టమైన పద్ధతిలో ఉంటుంది. కానీ శాసనాలలో ఉపయోగించే భాష ఆయా కాలాల వ్యవహారిక భాషకు దగ్గరగా ఉంటుంది. ఆరవ శతాబ్దం మొదలుకొని వివిధ కాలాల్లోని వందలాది శాసనాలు పరిశోధించి రూపొందించిన గ్రంథమిది. మహాదేవ శాస్త్రి పరిశోధన పర్యవసానంగా శాసనాలను అర్థం చేసుకోవడం తేలికైంది. ఈ గ్రంథం ఆధారంగానే ఐరావతం మహదేవన్ అనే తమిళ పండితుడు సింధు నాగరికత కాలంనాటి శాసనాలలో కనబడే బాణం గుర్తు తెలుగు పదాల చివర ఉండే అంబు ప్రత్యయానికి చిహ్నమని గుర్తించారు. అంటే సింధు నాగరికత కాలం నాటికే తెలుగు భాషా రూపం ఉందని, ఈ భాష ప్రాచీన తకు అది తార్కాణమని పండితులు నిర్ధరించారు. (చదవండి: చక్కని బొమ్మల చుక్కాని.. బాపు) జర్మనీ లోని కొలోన్ విశ్వవిద్యాలయం ఆహ్వానంపై 1976లో అక్కడికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్లినప్పుడు ఆధునిక తెలుగు భాషా స్వరూపాన్ని వివరిస్తూ, విదేశీయులు తెలుగు నేర్చుకునేందుకు అనువుగా ‘డిస్క్రిప్టివ్ గ్రామర్ అండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ మాడర్న్ తెలుగు’ అనే గ్రంథం రాశారు. అలాగే ద్రావిడ విశ్వద్యాలయం అభ్యర్థన మేరకు తెలుగు దేశ్య వ్యుత్పత్తి నిఘంటువును 2003లో రచించారు. బాల ప్రౌఢ వ్యాకరణ దీపికను 1987లో, ఆంధ్ర వాంఙ్మయ పరిచయాన్ని 1985లో ఆయన రచించారు. సంస్కృత, ప్రాకృతాల నుంచి తెలుగు భాషలోనికి వచ్చి చేరిన పదాలు, దేశ్య పదాల పుట్టుపూర్వోత్తరాలను, భాషలో కొన్ని ప్రత్యేకార్థాలను స్ఫురింపజేసే ధ్వనులనూ విపులంగా చర్చించే ‘భాష–సంస్కృతి’ అనే గ్రంథాన్ని 2014లో వెలువరించారు. తెలుగులో మాదిరిగానే ఆంగ్లంలో సైతం ప్రవాహ వేగంతో సాగే ఆయన ప్రసంగాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునేవి. ఈ విషయంలో ఆయనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తి. (చదవండి: సమసమాజ విప్లవ తపస్వి.. జ్వాలాముఖి) తెలుగు భాష పట్ల ఆసక్తి, అనురక్తి పుష్కలంగా ఉన్న విద్యార్థులను కులమతాలకు అతీతంగా చేరదీసి, వారిని భాషా శాస్త్రంలో నిపుణులుగా తీర్చిదిద్దారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు, దేశాలలో భాషా సాహిత్య రంగాల్లో సేవలందిస్తున్న ఆయన శిష్యులే తార్కాణం. 1921 డిసెంబర్ 29న మచిలీపట్నంలో జన్మించిన మహాదేవ శాస్త్రి 2016లో తమ 94వ ఏట తిరుపతిలో కన్నుమూశారు. శత జయంతి సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు. (చదవండి: అజ్ఞాత మహనీయుడు.. డాక్టర్ ఎల్లాప్రగడ) - డాక్టర్ కోరాడ వెంకటరమణ వ్యాసకర్త కెమికల్ టెక్నాలజీ నిపుణులు (కోరాడ మహాదేవ శాస్త్రి శతజయంతి) -
వాజ్‌పేయికి ఘన నివాళులు అర్పించిన...బిశ్వభూషణ్ హరిచందన్
-
పారిశ్రామిక విప్లవానికి పునాది
నిజానికి శాస్త్రవేత్త అంటే న్యూటన్ మాత్రమే అనేంత ప్రచారం ఉంది! చెట్టు మీద నుంచి ఆపిల్ పడటం అనే కథకుండే ఆకర్షణ కారణంగా న్యూటన్‌కు అంత గ్లామర్ నడుస్తోంది. కేంబ్రిడ్జిలో జరిగిందని చెప్పే ఈ వృత్తాంతం గురించి న్యూటన్ మహాశయుడు ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం. అయితే ఆయన కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడే జోహన్నెస్ కెప్లర్ వివరించిన సూర్యుడు, భూమి గమనాల గురించి లోతయిన విషయాలు అవగతం చేసుకున్నారు. అంటే గురుత్వాకర్షణ భావనను పూర్తిగా పట్టుకున్నది కేంబ్రిడ్జిలోనే. కనుక ఈ ‘ఊహాత్మక యాపిల్’ వ్యవహారం దీనితో ముడిపడిందేమో! 1642 క్రిస్మస్ రోజున అర్ధరాత్రి తర్వాత ఐజాక్ న్యూటన్ ఇంగ్లాండులో జన్మించారు. అదే సంవత్సరంలో నెలల క్రితమే ప్రాయోగిక విజ్ఞానానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్త గెలీ లియో గెలీలి చనిపోవడం ఒక చారిత్రక విశేషం. గెలీలియో, న్యూటన్ కృషి అవిభాజ్యమైనదిగా పరిగణించారు అల్బర్ట్ ఐన్‌స్టీన్. ఎవరు ఎలా పరిగణించినా తను మాత్రం విజ్ఞాన సముద్రం చెంత ఇసుకలో బుల్లిగవ్వలు, ముచ్చటైన శంఖాలు ఏరుకొనే పిల్లవాడినని న్యూటన్ మరో సందర్భంలో చెప్పడం గమనించాలి. గెలీలియో వంటి వారు ప్రతిపాదించిన భావనలను ఎంతో ప్రతిభావంతంగా ‘మెకా నిక్స్’ అనే ఫిజిక్స్ చట్రంలో తన సూత్రీకరణతో అమర్చిన సూక్ష్మమేధావి, ఆలోచనాశీలి న్యూటన్. కాంతి, ఉష్ణం, దృశా శాస్త్రం, కలనగణితం, గురుత్వాకర్షణ సిద్ధాంతం ఇలా విస్తృత మైన కృషి చేసినవారు న్యూటన్. బాలుడిగా చాలా పరికరాలతో ఆడుకుంటూ, కొత్తవి తయారు చేస్తూ ఉండేవాడు. చదువులో పెద్దగా ప్రతిభా వంతుడిగా చిన్నతనంలో కనిపించకపోయినా తర్వాత దశలో ఆశ్చర్యకరంగా ఎదిగి 26 సంవత్సరాలకే గణితశాస్త్ర ఆచార్యు డయ్యాడు. ధనాగారం అధిపతిగా సేవలందించి, శాస్త్ర పరి జ్ఞానంతో దొంగలను పట్టారు. 1703లో రాయల్ సంస్థకు అధ్యక్షుడుగా ఎన్నికయి, చివరివరకు ఆ పదవిలో కొన సాగారు. 1668లో మెర్కర్ రాసిన సంగతులన్నీ తను అంతకు ముందే కనుగొన్నట్టు న్యూటన్‌కు అనిపించింది. గ్రంథకర్త అయిన తన పేరు లేకుండా తన గణితశాస్త్ర పరిశీలనలను రాసి లండన్, యూరప్ ప్రముఖులకు పంపారు. వారి ఆమోదం పొందాక ఆ పరిశీలనలు పుస్తకంగా వెలువడి, మంచి పేరు తెచ్చాయి. కటకాల గురించి ఆయన చేసిన పరిశోధనలు కళ్ళ జోళ్ళు, దూరదర్శినులు మెరుగు కావడానికి తోడ్పడ్డాయి. రాయల్ సొసైటీలో చేరిన తర్వాత మరో శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ బెడద ఎక్కువయ్యింది. అతని నోరు మూయిం చడానికి 1686 ఏప్రిల్ 28న ప్రఖ్యాతమైన పుస్తకం ‘ప్రిన్సిపియా మేథమెటికా’ వెలువడింది. తన కాంతి కణ సిద్ధాంతాన్ని విభేదించి హెగెన్స్ ‘తరంగ సిద్ధాంతం’ వచ్చినా అది ప్రాచుర్యంలోకి రాలేదు. 1727 మార్చి 20న కనుమూసిన న్యూటన్ కృషి కారణంగానే ఓడల ప్రయాణం, వంతెనల నిర్మాణం సులువు కావడమే కాదు; పారిశ్రామిక విప్లవానికి తెరలేచింది. న్యూటన్ వల్లనే వంద సంవత్సరాల లోపు జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం ఆవిష్కరించగలిగారు! - డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
జాతి మరువని విరాణ్మూర్తి
నేడు క్రిస్మస్ పర్వదినం. సమానత్వం, శాంతియుత సహజీవనాలకు నిజమైన ఛాంపియన్ అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం కూడా నేడే కావడం విశేషం. జాతీయవాద లక్ష్యం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. తన ప్రత్యర్థులను సైతం ప్రశంసించే ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. ఆయన హయాంలో తాము కూడా ప్రభుత్వంలో భాగమై ఉంటున్నామని ప్రతిపక్షాలు భావించేవి. మౌలిక వసతుల వ్యవస్థ నవీకరణ, రహదారులు, రైళ్ళు, విమానయాన అనుసంధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. సర్వశిక్షా అభియాన్, నదుల అనుసంధానం, స్వర్ణచతుర్భుజి, ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన వంటివి ఆయన మానస పుత్రికలు. వాజ్‌పేయి దార్శనికతను సర్వవేళలా అనుసరించడమే ఆయనకు మనమందించే నివాళి. నేడు క్రిస్మస్. మానవులందరికీ ప్రేమ, కారుణ్యం, మానవీయతా సందేశాన్ని అందించే పర్వదినమిది. బహుముఖ రాజకీయ వ్యక్తిత్వం కలిగిన విశిష్టమూర్తి, కవి, జర్నలిస్టు, రాజనీతిజ్ఞుడు, న్యాయం, సమానత్వం, శాంతియుత సహజీవనాలకు నిజమైన ఛాంపియన్ అయిన భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం కూడా నేడే కావడం విశేషం. ఆయన జాతీయవాద లక్ష్యం కోసం మనస్ఫూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశారు. తనకుతానుగా ఆయన ఒక సంస్థ. అయస్కాంత సదృశమైన మూర్తిమత్వంతో దేశ ప్రజల హృదయాలను ఆయన ఆకర్షించారు. అసమానమైన అనురక్తితో ఆయన ప్రజల హృదయ సామ్రాట్ అయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే వాజ్‌పేయి భారతీయ అజాతశత్రువు. ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదిగా, వాజ్‌పేయి అందరికీ సన్నిహితుడు. రాజకీయాల్లో అయనకు శత్రువులు లేరు. ఆయన జాతీయవాద స్ఫూర్తి, దేశభక్తి అందరికీ ప్రేరణ కలిగిస్తాయి. ఆయన వాగ్దాటి, భావ వ్యక్తీకరణా శైలి అత్యంత సహజంగానూ, స్వతస్సిద్ధంగానూ ఉంటాయి. రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇష్టపడేవారు. తన ప్రత్యర్థులను సైతం ప్రశంసించే ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాల్లో తనపై విమర్శలను కూడా ఆయన నమ్రతతో ఆమోదించేవారు. పారదర్శకతను ఆయన ఎంతో దృఢంగా విశ్వసించేవారు. సుపరిపాలన లక్ష్యాన్ని ఆయన మనసారా ఆకాంక్షించేవారు. అందుకే ఆయన జయంతిని మనం సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. బంగ్లాదేశ్ విముక్తికి దారితీసిన పాకిస్తాన్‌తో భారత్ యుద్ధ కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీని వాజ్‌పేయి ప్రశంసించారు. ఆమె తండ్రి భారతదేశ ప్రప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూని వాజ్‌పేయి గొప్పగా ప్రశంసించేవారు. దేశాన్ని దేవాలయంగా భావించే వాజ్‌పేయిని భవిష్యత్తు దార్శనిక నేతగా నెహ్రూ ఆనాడే దర్శించారు. అన్నిటికంటే దేశం ముందు అనేది వాజ్‌పేయి జీవితాంతం పాటించిన ఆదర్శం. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. లక్షలాదిమంది కార్యకర్తలనూ, ఇతరులనూ అది ప్రభావితం చేయడమే కాకుండా వారిలో జాతీయవాద బీజాలను నాటింది. పార్టీ, రాజకీయాలు, పదవులు, హోదాలు ఏవీ శాశ్వతం కాదనే విషయంపై ఆయన ఎంతో స్పష్టతతో ఉండేవారు. దేశం, ప్రజాస్వామ్యం ఆయనకు అత్యంత ప్రధానమైన అంశాలు. పార్లమెంట్ ఒక చర్చా, సంభాషణా స్థలమే తప్ప పోరాట స్థలం కానీ సవాళ్లు విసిరే స్థలం కానీ కాదని ఆయన నమ్మకం. కులం, రంగు, మతం, ప్రాంతంకి సంబంధించిన సంకుచిత భావాలకు అతీతంగా ఆయన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఉన్నత స్థాయిలో నిలిపారు. రాజకీయాల ప్రధాన దృష్టి దేశంపైనా, అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోయే దేశాభివృద్ధిపైన మాత్రమే ఉండాలని ఆయన అభిప్రాయం. రాజకీయ పాలన పట్ల వాజ్‌పేయి వైఖరి ఎంత సమ్మిళితంగా ఉండేదంటే, ప్రతిపక్షాలు తాము కూడా ప్రభుత్వంలో భాగమై ఉంటున్నామని భావించేవి. అన్నాడీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీయూ, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ వంటి 23 పార్టీలతో కూడిన నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే)ని ఆయన ఎంతో విజయవంతంగా నిర్వ హించారు. ఆయన పాలనా కాలం భారత రాజకీయాల్లో ఒక చారిత్రక ప్రయోగం. రాజకీయాల్లో కలిసి పనిచేయడంలో విజయవంతమైన, విశిష్టమైన ప్రయోగం అది. జనతా పార్టీ ప్రభుత్వంలో వాజ్‌పేయి భారత విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. అన్నిటికంటే దేశం ముందు అనే ఆయన రాజకీయ విశ్వాసంతో ప్రభావితుడైన నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతినిధి బృందంలో వాజ్‌పేయిని చేర్చారు. దౌత్య, విదేశీ వ్యవహారాలపై ఆయన సాధికారత మహత్తరమైనది. 1998లో పోఖ్రాన్–2 అణుపరీక్షలు నిర్వహించినప్పుడు అమెరికా, తదితర దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించినప్పటికీ వాజ్‌పేయి చెక్కుచెదరలేదంటే ఇదే కారణం. చైనాతో సరిహద్దు వివాదాలను తగ్గించుకుని వాణిజ్య బంధాలను మెరుగుపర్చుకున్నారు. మూడు తరాల చైనా నాయకత్వంతో (మావో సేటుంగ్, డెంగ్ జియావోపింగ్, హూ జింటావో) వాజ్‌పేయి వ్యవహరించారు. అలాగే పెర్వేజ్ ముషారఫ్‌ని ఆగ్రా సదస్సుకు ఆహ్వానించడం ద్వారా పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి కూడా ఆయన సాహసించారు. ప్రధానమంత్రిగా వాజ్‌పేయి మౌలిక వసతుల వ్యవస్థ నవీకరణ, రహదారులు, రైళ్ళు, విమానయాన అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. టెలికాం రంగంలో పలు సంస్కరణలను మొదలెట్టడం ద్వారా ఆయన మొబైల్, ఫోన్ అనుసంధానతను విప్లవీకరించారు. 1999లో కార్గిల్ ఘర్షణ వంటి ఘటనలతో 1998–2004 మధ్య కాలంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, 1999–2000 మధ్య రెండు తుఫానులు, 2002–2003లో కరువుతో, చమురు సంక్షోభంతో దేశం విలవిల్లాడిపోయినప్పటికీ వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం 8 శాతం వృద్ధితో స్థిరమైన ఆర్థిక ప్రగతిని కొనసాగించింది. దేశంలో 6–14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందించే సర్వ శిక్షా అభియాన్ పథకం ప్రారంభించడానికి వాజ్‌పేయి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ప్రారంభంతో బడి మధ్యలోనే మానేస్తున్న పిల్లల సంఖ్య 60 శాతానికి పడిపోయింది. నదుల అనుసంధాన ప్రాజెక్టు అనేది వాజ్‌పేయి చిరకాల స్వప్నాల్లో ఒకటి. అదేవిధంగా స్వర్ణ చతుర్భుజి పథకం ద్వారా రహదారుల మౌలిక వసతుల కల్పనకు ఆయిన భారీగా ప్రోత్సాహం అందించారు. ఇకపోతే ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన్ పథకం ద్వారా ఇవాళ మన గ్రామాలు సర్వకాలాల్లోను ఉపయోగంలో ఉండే రహదారులతో అనుసంధానమైన విషయం కూడా మనకు తెలుసు. ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన ద్వారా ఉద్యోగాల కల్పనకు ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతిలో రిజర్వేషన్ కల్పించే నిబంధనను పునరుద్ధరించారు. ఆనాడు వాజ్‌పేయి ప్రదర్శించిన దార్శనికతను నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తార్కిక ముగింపువైపు తీసుకుపోతున్నారు. అందరికీ హితం చేకూర్చే పరిపాలన ద్వారా దేశంలో ఏ ఒక్కరినీ వెనకబడకుండా పురోగమించేలా చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనే స్వప్నాన్ని వీలైనంత త్వరగా ఫలింప చేశారు. జన్‌ధన్–ఆధార్–మొబైల్ త్రయం దేశ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి కాలంలో దాని ప్రభావానికి గురైన ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే పంపించింది. సమాజంలోని పేదల్లో కెల్లా నిరుపేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. ప్రత్యేకించి పేదలు, అధోజగత్ సహోదరుల్లో ఏ ఒక్కరినీ పక్కన పెట్టకుండా వారిని అభివృద్ధిలో భాగం చేయాలనే ఆయన కల నేడు నెరవేరుతుండటం సంతోషకరం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో అనురాగాన్నీ, సమ్మిళితత్వాన్నీ, పారదర్శకతనూ ప్రోత్సహించడం ద్వారా సుపరిపాలనను అందించాలనే వాజ్‌పేయి దార్శనికతను సర్వవేళలా అనుసరించడమే ఆయనకు మనమందించే నివాళి. కోవిడ్–19 మహమ్మారి ద్వారా అనేకరంగాల్లో మనకు ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో పునర్మిర్మాణ ప్రక్రియను ఇప్పుడు చేపడుతున్నాం. అందరికీ నాణ్యమైన సౌకర్యాలను, అవకాశాలను కల్పించేందుకు మనం తీవ్రమైన ప్రయత్నాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాజ్‌పేయితో 1980నుంచి మొదలుకుని దశాబ్దాలపాటు పనిచేయగలిగినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేశాను. మనమంతా కష్టపడి పనిచేసి భారత్‌ను విశ్వగురువుగా మారుద్దాం. అదొక్కటే మన మహానేతకు మనం అర్పించే నిజమైన నివాళి. సర్వకాలాల్లో వాజ్‌పేయి ఆదర్శవంతమైన నాయకుడిగా నా మదిలో నిలిచి ఉంటారు. -బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా గవర్నర్ (నేడు అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి, సుపరిపాలనా దినోత్సవం) -
మహానటి సావిత్రి.. చదువులమ్మ..
ఒంటి నిండా నగలు ధరించిన ఒక మహిళ ప్రధానమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ప్రధానిని కలిసిన అనంతరం వీరజవాన్ల సంక్షేమ నిధికి ఏదైనా ఇద్దామని పర్సు వంక చూశారు. పర్సులో పెద్దమొత్తం నగదు ఉన్నా.. వారి త్యాగాలకు ఇవి సరిపోవనిపించింది. వెంటనే తన ఒంటిమీద నగలన్నింటిని వలిచి ఇచ్చేసి, ఇంటికి వచ్చేశారు. ఆమే మహానటి సావిత్రి.. నటనలో మేటిగా మహోన్నత శిఖరం అధిరోహించగా.. దాతృత్వంలోనూ తన సాటి ఎవరూరారని నిరూపించారు సావిత్రి. మహానటిగా దేశవ్యాప్తంగా పేరుప్రాఖ్యాతలు సంపాదించిన సావిత్రి రేపల్లె మండలంలో పాఠశాల ప్రారంభించి, విద్యాభివృద్ధికి కృషి చేశారు. నేడు ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. రేపల్లె: మల్లెలు, వర్షమంటే మక్కువ.. ఎడమచేతివాటం.. క్రికెట్, చదరంగం ఆటలంటే మహాప్రీతి.. మాటల్లో చమత్కారం.. ఇతరులను అనుకరించటంలోనే దిట్ట.. ఇన్ని ఉన్నా దానధర్మాలు చేయటంలో ఆమెకు సాటిలేరు.. సాయం చేయటలో ఎముకలేని చెయ్యి అనటానికి నిదర్శనం. ఆమె మరెవరో కాదు వెండి తెర సామ్రాజ్ఞి, నడిగర్ తిలగమ్ మహానటి సావిత్రి. తీరంతో సావిత్రమ్మకున్న అనుబంధం... అమ్మ సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గమ్మలది గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని వడ్డివారిపాలెం గ్రామమే. దీంతో గ్రామంపై మమకారం పెంచుకున్న సావిత్రి తన పెద్దమ్మ దుర్గమ్మ కోరికతో పాఠశాల స్థాపించటం, గ్రామాన్ని పలుమార్లు పర్యటించడం ఆ గ్రామంపై ఆమెకున్న మమకారాన్ని తెలుపుతోంది. సావిత్రిని సావిత్రమ్మగా ఈ ప్రాంత ప్రజలు పిలుస్తుంటే ఆమె మనస్సు ఆనందంతో నిండిపోయేదని ఇక్కడి ప్రజలు అంటుంటారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సావిత్రి విగ్రహం గ్రామంలో పాఠశాల ఏర్పాటు కుగ్రామమైన వడ్డివారిపాలెంలో మహానటి సావిత్రి గ్రామీణులైన పేద విద్యార్థులకు విద్యను అందించాలని వారి అభ్యున్నతికై సంకల్పించుకుని 1962 సంవత్సరంలో పాఠశాల స్థాపించారు. పాఠశాల స్థాపించిన సమయంలో గ్రామస్తులే కాకుండా పాఠశాల ప్రారంభోత్సవానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ఆ రోజుల్లోనే వేల సంఖ్యలో రావటం విశేషం. ప్రస్తుతం శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది. విద్య, క్రీడ, సాంస్కృతిక తదితర అన్ని రంగాలలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తూ పలువురిని మన్ననలు పొందుతోంది. గత పదకొండు సంవత్సరాలుగా నూరుశాతం ఫలితాలు, పలు క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు పొందటం, పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగటం విశేషం. వడ్డివారిపాలెంలోమహానటి సావిత్రి కట్టించిన పాఠశాల సావిత్రమ్మకు తోడుగా... పాఠశాలకు అండగా... పాఠశాల స్థాపన నాటి నుంచి సావిత్రమ్మ సంకల్పానికి గ్రామప్రజలు తోడుగా నిలిచారు. సావిత్రి స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలను నిర్మాణం చేసి ఆలనా పాలనా చూసేవారు. కొంత మంది గ్రామస్తులు వడ్డి మాధవరావు, వడ్డి పెద్ద వెంకటేశ్వరరావు, వడ్డి నరసింహారావు, వడ్డి సుబ్బారావు, కొల్లాల బసవయ్య, కోట నాగేశ్వరరావు, కొట్టి దేవేంద్రరావు, వడ్డి చినవెంకటేశ్వరరావులతో పాటు మరికొందరు పాఠశాల ఆలనా పాలనకై తమ పొలాన్ని పాఠశాలకు అందజేసి దీనిపై వచ్చే ఆదాయాన్ని పాఠశాలకు అవసరమైన వ్యయాలను భరించేవారు. దీంతో పాఠశాలకు కొంత వరకు వ్యయభారాలకు తగ్గాయి. తరు వాత ప్రభుత్వం పా ఠశాలను గుర్తించింది. అయితే ఒక సందర్భంగా ప్రభుత్వ గ్రాంటు రాకపోవటంతో ఆరు నెలలపాటు ఉపాధ్యాయులకు వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న సావిత్రి రూ.1,04,000లు అందజేసి పాఠశాలకు అండగా నిలిచారు. ఈ మొత్తం ప్రస్తుత విలువ ప్రకారం కోటి రూపాయల పైమాటే. సావిత్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కించిన మహానటి చిత్ర నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్, దర్శకుడు నాగ్ అశ్విన్‌లు సైతం పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఒక బస్సును అందజేశారు. ‘నాడు–నేడు’తో మరింత అభివృద్ధి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా వడ్డీవారిపాలెం సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నపాఠశాల నాడు–నేడు కార్యక్రమానికి ఎంపికైంది. నాడు–నేడులో భాగంగా రూ.42లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేశారు. నిధులతో తరగతి గదుల మరమ్మతులు, విద్యుద్ధీకరణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి ఏర్పాటు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు తదితర పనులు నిర్వహించగా వీటిని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ప్రారంభించారు. -
Silk Smitha: సిల్క్‌స్మిత మరణం.. ఇప్పటికీ ఓ మిస్టరీనే!
Silk Smitha Death Mystery In Telugu: Still Continues After 25 Years: సిల్క్ స్మిత..గ్లామర్ ప్రపంచంలో ఈ పేరు ఓ సెన్సేషన్. మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కి హాట్ ఇమేజ్ అద్దిన అందమైన స్వప్నం సిల్క్ స్మిత. అప్పటివరకు ఉన్న కమర్షియల్ హంగులను మార్చేసి తన పేరుకే సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారామే. వ్యాంప్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్టార్డంను సొంతం చేసుకుంది. తన అందచందాలతో మత్తెక్కించిన సిల్క్..నిజజీవితం మాత్రం అంతుచిక్కని కథలానే మిగిలిపోయింది. రంగుల ప్రపంచంలో అమాయకపు చిరునవ్వుల్ని మిగిల్చి తనను తాను అంతం చేసుకుంది. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మీ. తొలి సినిమా బండి చక్రంలో తాను పోషించిన సిల్క్ పాత్రనే తన ఇంటి పేరుగా మార్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పట్లో సిల్క్ డ్యాన్స్ బీట్ లేనిదే స్టార్ హీరోల సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. అంతలా క్రేజ్ సంపాదిచుకున్న ఆమె స్టార్ హీరోలకు సరిసమానంగా పారితోషికం తీసుకునేది. కెరీర్ పీక్ టైంలో ఉండగానే ఓ హీరోతో ప్రేమ విఫలం కావడం, సినిమాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవడం ఆమెను మరింత కుంగదీసిందని అంటుంటారు. తన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవాలని భావించిన స్మిత.. ఎందుకో కొన్నాళ్లు గ్యాప్ కూడా తీసుకుంది. ఆ సమయంలోనే మద్యాపానానికి అలవాటు అయ్యింది. అయితే ఏమైందో తెలియదు కానీ 1996 సెప్టెంబరు 23న తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో సిల్క్ స్మిత సూసైడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Silk Smitha: సిల్క్ స్మిత గురించి ఈ విషయాలు తెలుసా? -
అచ్చమైన భావకవుల్లో చిట్టచివరివాడు
తిలక్ పద్యం గురించి ఎక్కువగా మాట్లాడు కోలేదు సాహిత్య లోకం. కుందుర్తి, సినారె వంటి అప్పటి కొంతమంది కవుల లాగా కాక వచన కవితకు సమాంతరంగా చివరి వరకూ పద్యకవిత కూడా రాస్తూనే ఉన్నాడు. 1966 అంటే తిలక్ చనిపోయిన సంవత్సరం మార్చి నెల భారతిలోకూడా ‘అమృత భావము’(!) అని ఒక పద్యకవితా ఖండిక వచ్చింది. ఆయన పద్యకవిత్వం ‘ప్రభాతము సంధ్య,’ ‘గోరువంకలు’ అని రెండు సంపుటాలుగా అచ్చయింది. ఇవికాక ‘మండోదరి’ అని మూడువందల పద్యాల రచన ఒకటి చేశాడనీ, దాన్ని పోగొట్టుకున్నాడనీ, అందులో 3 పద్యాలు మాత్రం మిగిలాయనీ ఆయన యువమిత్రులు చెబుతున్నారు. తిలక్‌కి సాహిత్యోహ వచ్చేనాటికి అంటే సుమారుగా 1933 ప్రాంతాలలో తెలుగునాట బలంగా ఉన్న కవిత్వం భావకవిత్వం. ‘ప్రభాతము సంధ్య’ భావకవిత్వం కన్నబిడ్డ. ‘‘ఇప్పుడు దాన్ని చూస్తే నవ్వు వస్తుంది. ప్రతిపంక్తిలోనూ కృష్ణశాస్త్రి ప్రభావం కనిపిస్తుంది’’ అని మిత్రులతో అన్నాడట తిలక్ ఆ పుస్తకాన్ని ఉద్దేశించి. కానీ ఒక పదహారు పదిహేడేళ్ళ కుర్రాడు భావకవిత్వంలో ఆ స్థాయిని అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందులో పద్యఖండికలు 24. వీటిలో వస్తువు ఏమిటి అంటే ఆర్తి, దుఃఖం, దిగులు, పట్టరాని ఆనందం, ప్రేమ, ఆరాధన... యువ తిలక్ చేసిన కొన్ని ఊహలు, ఆలోచనలు ఆశ్చర్యాన్ని కలగ జేస్తాయి. గృహలక్ష్మి అనే ఖండికలో ఒక పద్యం చూడండి. బాలింతరాలు అయిన భార్యతో అంటు న్నాడు యువభర్త. పసుపు మోమున నగవు నివాళులెత్త కక్షమందున పసికందు కలకలమ్ము మహిత మాతృరాగోజ్వల మండితోరు ఫాలసీమ నీవు తొలిచూలుకే జగజ్జనని వైతి వమ్మ బిడ్డతో ఉన్న భార్యను చూసి, ‘నువ్వు తొలి చూలుకే జగజ్జనని వయ్యావు’ అనడం విశాలోదా త్తమైన ఊహ. భార్యని, ఒకానొక బాలింతను మించి చూస్తున్నాడు కవి. ‘ఆహుతి’ ఖండికలో ‘‘స్వామి! అవ్యయ బాష్ప స్రవంతి బతుకు నుప్పగిలచేసె’’ అంటాడు. జీవితం కన్నీళ్ళ వల్ల ఉప్పగా ఉందట. ‘ప్రభాతము సంధ్య’ సంపుటిలో ఉన్నవన్నీ పద్యాలు మాత్రమే కాదు. గేయాలూ, ‘అపద్యాలూ’ కూడా ఉన్నాయి. పై రెండూ అపద్యాలే. భావం పూర్తికాగానే పద్యాన్ని పాదం మధ్యలోనే ఆపేసిన సందర్భాలూ, యతి ప్రాసలు విడిచి పెట్టి రాసిన పద్యాలూ కూడా ఉన్నాయి కానీ అపద్యాలు అని అంటున్నవి వాటిని కాదు. ఇవి పద్యాలలాగా కని పించే పద్యేతర రచనలు. వీటిలో యతి, ప్రాస, గణం ఏమీ లేవు. కానీ రచనా మర్యాద మాత్రం పూర్తిగా పద్యరచనా మర్యాదే. కవి అపరిణతి కారణం అనడానికి వీలులేదు. చక్కగా రాసిన పద్యాలు అనేకం ఉన్నాయి కనక. 1940 తర్వాత రాసిన పద్యాలు తిలక్ మరణానంతరం ‘గోరువంకలు’ అనే సంపుటిగా వచ్చాయి. ఇందులో వృత్త పద్యాలెక్కువ. తిలక్ పద్యం ప్రాచీన పద్యం కాదు. ప్రాచీన పద్యంలాగా భావకవిత్వ పద్యం ప్రతిపదార్థ తాత్ప ర్యాలకు లొంగదన్న విషయం తెలిసిందే. ప్రాచీన పద్యం కవి వ్యక్త చేతనలో పుడుతుంది. బహిఃప్రపంచాన్ని ఆవి ష్కరిస్తుంది. ఎన్ని కల్పనలు, ఊహలు చేసినా ప్రాచీ నకవి ఒక సరళతర్కం పరిధిలో చేస్తాడు. భావ కవిత్వంలో అలాకాదు. దృశ్యానికి శబ్దంతో పోలిక, శబ్దానికి పరిమళంతో, పరిమళానికి స్పర్శతో పోలిక ఇలా. అందుకు కారణం భావకవిత్వంలో అవ్యక్త చేతన జోక్యం హెచ్చు. జాలి, వేదన, స్వప్నం వంటి కొన్ని మాటలు తిలక్‌కి ఇష్టం. మాటలు ఎప్పుడూ మాటలు కావు. కాన్సెప్ట్స్. ‘‘ఒక్క జాలిమాట ఒక్క నిడుద యూర్పు, విడువడేల నరుడు వింత లోభి, కరకు గుండెకన్న ఇరుకు గుండె అవని, దుఃఖ కారణమ్ము దుర్భరమ్ము ’’అన్నాడు. ఆరుద్ర అన్నట్టు తిలక్ ఉత్త దయామయుడు. తిలక్ పద్యం అతని వచన కవితా శైలిని ప్రభా వితం చేసింది. తిలక్ వచనకవిత్వం నోటికి రావడానికి ముఖ్యమైన కారణా లలో ఇదొకటి. ‘ఏకాంత కుంతని హతమ్ము రసైక మద్భావనా శకుంతమ్ము.’ ‘హేమంత సమీర పోతమేమింతగా క్రొవ్వి నన్న లయించును.’ ఇటువంటి పంక్తులు వచన కవి రాయడు. అయితే తిలక్ పద్యం మీద వచన కవిత ప్రభావం కన బడదు. దశాబ్దాల తర్వాత కూడా కవుల్ని ప్రభావితం చెయ్యగలి గిన వచనకవిత్వం రాసిన తిలక్, తన పద్య కవిత్వం మీద దాని ముద్ర పడకుండా రాయడం విచిత్రం. వస్తు సంవిధానంలో తిలక్ వచన కవితలు కొన్ని ఆ ప్రక్రియకు ఒక కొత్త మెలకువను మప్పాయి. ప్రకటన, సీఐడీ రిపోర్టు, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, నిన్న రాత్రి, సైనికుడి ఉత్తరం... ఇలాంటి కవితలు స్థల, కాల, పాత్ర సంఘటనల్ని కూడా నింపుకుని కథాచ్ఛాయతో విశిష్టంగా నడు స్తాయి. ఆలోచనలుగా, సందేశాలుగా, ఊహలుగా నడుస్తున్న వచన కవిత్వానికి కథాస్పర్శ ఇవ్వగలిగిన తిలక్ పద్యాన్ని అబ్స్ట్రాక్ట్గా వదిలివెయ్యడం విచిత్రం. వచన కవిత్వంలో యుద్ధం ‘ఒక అనాగరకత’ అన్న తిలక్, ‘ఏ దేశ సంస్కృతి అయినా కాదొక స్థిర బిందువు నైక నదీ నదాలు కలిసిన అంతస్సింధువు’ అన్న తిలక్, పావెల్ శవాన్ని చూపి ‘ప్రతి ఒక్కడూ దీనికి బాధ్యుడు’ అన్న తిలక్, ‘దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుంచి, పతివ్రతల నుంచి’ అన్న తిలక్... ఇలాంటి సారవంతాలయిన కొత్త ఆలోచ నల్ని పద్యంలో చూపించలేదు. పద్యానికి కొత్త రక్తాన్ని ఎక్కించగల సమర్థత ఉండికూడా ఆ పని చెయ్యలేదనిపిస్తుంది. వచన కవిత్వాన్ని ప్రపం చంతో పంచుకుని పద్యకవిత్వాన్ని తనకోసం ఒక ప్రత్యేక ప్రపంచంగా మలుచుకున్నట్టు కనిపిస్తుంది. ‘తనలో తానొక ఏకాంతం రచించుకున్న స్వాప్ని కుడు’ అన్న రాచమల్లు రామచంద్రారెడ్డి వాక్యం తిలక్ పద్యకవిత్వానికి నిస్సందిగ్ధంగా వర్తిస్తుంది. తిలక్ వచన కవిత్వం రాయకుండా పద్యకవిత్వం మాత్రమే రాసి ఉంటే తిలక్ పద్యం గురించి ఇంత కంటే ఎక్కువగా మాట్లాడుకుని ఉండేది సాహిత్య లోకం. బహుశా అచ్చమైన భావకవుల్లో చిట్టచివరి వాడుగా లెక్కవేసి ఉండేది చరిత్ర. -రెంటాల శ్రీవెంకటేశ్వరరావు వ్యాసకర్త సాహిత్య విమర్శకుడు మొబైల్: 77991 11456 (సాహిత్య అకాడెమీ; తిలక్ వేదిక, తణుకు సంయుక్త నిర్వహణలో బాలగంగాధర తిలక్ శతజయంతి సభ నేడు తణుకు ఐఎంఏ హాల్లో) -
రాజమండ్రిలో పర్యటించిన చిరంజీవి
-
అల్లు రామలింగయ్య నాకు కూడా వైద్యం చేశారు: చిరంజీవి
Chiranjeevi At Allu Ramalingaiah Statue Unveiling : అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రిలో పర్యటించారు. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రితో తనకు అనుబంధం ఉందని, అసలు మేకప్ వేసుకుందే రాజమండ్రిలో అని పేర్కొన్నారు. 'అల్లు రామలింగయ్యకు, నాకు గురు శిష్యుల అనుబంధం ఉంది. అల్లు రామలింగయ్య బహుముఖ ప్రఙ్ఞాశాలి. నటుడిగా కొనసాగుతూనే ఆయన హోమియోపతిపై పట్టు సాధించారు. నిత్య విద్యార్థిలానే అల్లు రామలింగయ్య ఎంతో కష్టపడ్డారు. ఎంతో మంది సేవ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్ వంటి సినీ ప్రముఖులు సహా ఎంతోమందికి ఆయన చికిత్స అందించారు. ఓసారి నేను కడుపునొప్పితో బాధపడుతుంటే ఆయన హోమియోపతి చికిత్సతో దాన్ని పూర్తిగా నయం చేశారు. ఇంతవరకు నాకు మళ్లీ ఆ సమస్య ఎదురుకాలేదు.ఇప్పటికీ నాతో పాటు నా పిల్లలు, వాళ్ల పిల్లలు కూడా హోమియోపతిని ఫాలో అవుతున్నాం' అని చిరంజీవి పేర్కొన్నారు. చదవండి: అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్ -
గుర్రం జాషువాకు సీఎం వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా గారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి ఆయన. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలను అందించిన జాషువా గారి జయంతి సందర్భంగా ఘన నివాళి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా గారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి ఆయన. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలను అందించిన జాషువా గారి జయంతి సందర్భంగా ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2021 చదవండి: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ -
Engineers Day: మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. భారత ఇంజనీరింగ్ రత్నం
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యని భారతీయ ఇంజనీరింగ్ రంగానికి పితామహుడుగా అభివర్ణించవచ్చు. తన నైపుణ్యాలతో, ఇంజనీరింగ్ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధివైపు అడుగులు వేయిస్తూ దేశానికి సారథ్యం వహిం చారు. విశ్వేశ్వరయ్య గారు కర్ణాటకలోని మైసూర్ దగ్గర ముడినేహల్లి అనే కుగ్రామంలో 1861లో జన్మించారు. అనేక కష్టనష్టాలకు సైతం ఓర్చుకొని విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ట్యూషన్లు చెప్పుకుంటూ ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసి మొదటి ర్యాంకు సాధించారు. చదువు పూర్తయిన వెంటనే మహరాష్ట్రలోని నాసిక్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం పొందాడు. దేశానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం, పరిశ్రమలే అవసరమని గుర్తించి వాటిని వృద్ధిలోకి తీసుకురావడం ద్వారా అనేక సేవలు చేశాడు. 101 సంవత్సరాల తన జీవితంలో దాదాపుగా 80 ఏళ్లు దేశం కోసం అహర్నిశలు పని చేశాడు. విశ్వేశ్వరయ్య చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1955లో భారతరత్న ప్రదానం చేసి సత్కరించింది. విశ్వేశ్వరయ్య ఈ దేశానికి చేసిన సేవలకు గాను 1968లో తన పుట్టినరోజును జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో 1908లో మూసీ నదికి వరదలు వచ్చాయి. నాటి అల్లకల్లోలమైన పరిస్థితుల్లో అనేక వంతెనలు నిర్మించి మూసీ నదికే ముక్కుతాడు వేసిన ఇంజనీర్ విశ్వేశ్వరయ్య. నాసిక్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా సింధూ నది నీటిని సుక్కూరు ప్రాంతానికి అంటే దాదాపుగా 480 కిలోమీటర్లు తీసుకురావడం కోసం విశ్వేశ్వరయ్య చేసిన యోచన చూసి మిగతా ఇంజనీర్లు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తర్వాత నీటిపారుదలపై మహరాష్ట్రలో పలు కమిటీలు వేసినప్పుడు విశ్వేశ్వరయ్య సలహాలు విని బ్రిటిష్ అధికారులు సైతం అవాక్కయ్యారు. ఇరిగేషన్లో బ్లాక్ సిస్టమ్ అనే నూతన విధానాలను తీసుకువచ్చి వ్యర్ధమైన నీటిని నిల్వ చేసి మరల వాడేవారు. 1952లో అంటే 91 సంవత్సరాల వయసులో గంగానది మీద బ్రిడ్జి కట్టడానికి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తన జీవితమంతా తన నైపుణ్యాన్ని దేశ నిర్మాణానికి వినియోగించారు. తన దార్శనికత వల్లే నేటికీ కర్ణాటక మైసూర్ బలంగా, సుసంపన్నంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నేటి భారతీయ సమాజంలో ఉన్న నవ యువ ఇంజనీర్లమైన మనం సమాజంలో ఉన్న సమస్యలకు ఇంజనీరింగ్ రంగం ద్వారా పరిష్కారం వెతికి దేశం ముందుంచాలి. అప్పుడే విశ్వేశ్వరయ్య ఆశయాలు, కలలు సాకారమవుతాయి. – జవ్వాజి దిలీప్, జేఎన్టీయూ ‘ 78010 09838 (నేడు ఇంజనీర్స్ డే – విశ్వేశ్వరయ్య జయంతి) -
ఘనంగా నటి రాజసులోచన జయంతి
కొరుక్కుపేట: అలనాటి నటి, నృత్యకారిణి, కళైమామణి రాజసులోచన 87వ జయంతిని చెన్నై టి.నగర్‌లోని పింక్ లోటస్ వేదికగా ఆదివారం రాత్రి ఎన్.జి.ఎల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ నటి సి.ఐ.డి శకుంతల పాల్గొని రాజసులోచన చిత్ర పటానికి నివాళులర్పించారు. కాగా నటి రాజసులోచన కుమార్తె దేవీకృష్ణ స్పాట్ లైట్ విత్ దేవి పేరుతో ఏర్పాటు చేసిన వినోద భరిత యూట్యూబ్ చానల్‌ను సి.ఐ.డి శకుంతల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అలనాటి నటీమణులు జయమాలిని, జయ మాల, సుచరిత, రేవతి తదితరులు పాల్గొని రాజసులోచన సేవల్ని కొనియాడారు. -
తొలి మహిళా సత్యాగ్రాహి.. సుభద్రా కీ కహానీ
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశం కోసం సేవ చేసిన త్యాగధనులు మరోసారి స్మరణకు వస్తున్నారు. తొలి మహిళా సత్యాగ్రాహి, జైలుకు వెళ్లిన తొలి మహిళా కాంగ్రెస్ కార్యకర్త, గొప్ప కవయిత్రి సుభద్ర కుమారి చౌహాన్‌ను ఆమె 117వ జయంతి సందర్భంగా ‘డూడుల్’తో గూగుల్ గౌరవించింది. స్ఫూర్తివంతమైన ఆమె జీవితాన్ని గుర్తుకు తెచ్చింది. ఆడపిల్లల్ని ఇప్పుడు కూడా ‘అటు వెళ్లొద్దు... అది చేయొద్దు’ అనే పెద్దలున్న రోజుల్లో దాదాపు 110 ఏళ్ల క్రితం 9 ఏళ్ల వయసులో కవిత్వం రాసింది సుభద్ర కుమారి చౌహాన్. రాయడమే కాదు... దానిని పత్రికలకు పంపింది. పంపితే అది అచ్చయ్యింది. సుభద్ర కుమారి చౌహాన్ కొన్ని పనులు చేయడానికి ఈ భూమ్మీదకు వచ్చింది. కొన్ని పనులు చేసి తరలి వెళ్లిపోయింది. భారత స్వాతంత్రోద్యమం ఆమెను తప్పక తలచుకుంటూ ఉంటుంది. హిందీ సాహిత్య సమాజం ఆమెను తలుచుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు రంగాలలో ఆమె గొప్ప ముద్రను వదిలి వెళ్లింది. తొమ్మిది మంది సంతానంలో సుభద్ర కుమారి అలహాబాద్‌లో 1904లో జన్మించింది. నలుగురు అన్నదమ్ములు, ఐదుమంది అక్కచెల్లెళ్లలో ఆమె ఒకతి. తండ్రి, ఇతర అన్నయ్యలు ఆడపిల్లలను ఆడపిల్లల్లానే ఉంచాలని అనుకున్నా చివరి అన్నయ్య రాజ్ బహదూర్ సింగ్ మాత్రం తన తోబుట్టువులను ముఖ్యంగా సుభద్రను ప్రోత్సహించేవాడు. ‘చేయాల్సిన అల్లరి చేయండి’ అని వాళ్లకు రక్షణ గా నిలిచేవాడు. ఆ అన్న అండతో సుభద్ర కవిత్వం రాసింది. 1913లో ఆమె రాసిన తొలి కవిత ‘నీమ్’ (వేపచెట్టు) ‘మర్యాద’ అనే పత్రిక లో అచ్చయ్యింది. ఆడపిల్లలకు చదువేంటి అనే ఆ రోజుల్లో ఆమె అలహాబాద్‌లోని ‘లేడీ సుందర్‌లాల్ హాస్టల్’లో ఉండి చదువుకుంది. ఆ సమయంలో ఎన్నో కవితలు రాసింది. అక్కడే చదువుకుంటున్న తర్వాతి రోజుల్లో ప్రఖ్యాతి చెందిన కవయిత్రి మహాదేవి వర్మతో కలిసి ఆమె కవిత్వం ఉద్యమంలా కొనసాగించింది. 1919లో కవి, పత్రికా రచయిత అయిన లక్ష్మణ్ సింగ్‌తో వివాహం జరిగినప్పుడు కట్నం ప్రస్తావన గాని, తల మీద కొంగు కప్పుకుని వధువు ముఖం దాచుకునే సంప్రదాయం కాని పాటించకుండా చాలా సరళంగా వివాహం జరుపుకుంది. ఆ రోజుల్లో ఇది పెద్ద వార్త. ఝాన్సీ కీ రాణి సుభద్ర కుమారి చౌహాన్ కవితలు దేశభక్తిని కలిగించేలా ఉండేవి. బ్రిటిష్ వారిని పారదోలేందుకు ఝాన్సీ లక్ష్మిని స్ఫూర్తిగా తీసుకోమని సుభద్ర రాసిన ‘ఝాన్సీ కీ రాణి’ ఉత్తర భారతదేశంలో ప్రతి విద్యార్థి నేటికీ ఏదో ఒక తరగతిలో చదువుతూనే ఉంటాడు. ‘ఝాన్సీ కీ రాణి’ కవిత వేదిక మీద వేలసార్లు చదవబడింది. 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్‌వాలాబాగ్‌లో మీటింగ్ జరుగుతుంటే డయ్యర్ చేసిన ఘాతుకానికి సుభద్ర కదిలిపోయింది. ‘జలియన్‌వాలాబాగ్‌లో వసంతం’ పేర ఒక కవిత రాసింది. అంతే కాదు ఆ మరుసటి సంవత్సరమే భర్తతో కలిసి పూర్తిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తగా మారిపోయింది. తొలి మహిళా సత్యాగ్రాహి సుభద్ర ఇప్పుడు భర్తతో కలిసి జబల్పూర్ (మధ్యప్రదేశ్)ను తన కార్యక్షేత్రం చేసుకుంది. భర్త పత్రిక నడుపుతుంటే సుభద్ర సైకిల్ మీద రోజూ 14 కిలోమీటర్లు తిరుగుతూ ప్రజలకు స్వాతంత్రోద్యమ అవసరం తెలియచేసేది. అంటరానితనంకు వ్యతిరేకంగా ప్రచారం చేసేది. 1922లో ‘జెండా సత్యాగ్రహం’ జబల్పూర్లో ఉధృతంగా జరిగింది. ప్రయివేటు, పబ్లిక్ స్థలాల్లో దేశ జెండాను ఎగురవేయడం ఆ కార్యక్రమం. ఆ సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న తొలి ధీర మహిళగా సుభద్ర కుమారి చౌహాన్ చరిత్రకెక్కింది. ఆ తర్వాత ఆమె ఉపన్యాసాలకు జనం విరగపడసాగారు. ఆమె తన ఉపన్యాసాల మధ్య ‘ఝాన్సీ కీ రాణి’ కవితను ఉత్తేజపూర్వకంగా చదువుతూ ఉందని బ్రిటిష్ ప్రభుత్వం ఆ కవితను నిషేధించింది. అంతే కాదు.. 1923లో నాగపూర్‌లో జెండా సత్యాగ్రహంలో పాల్గొనడానికి వెళ్లిన సుభద్రను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. దేశంలో అలా అరెస్ట్ అయిన తొలి మహిళా సత్యాగ్రాహి ఆమె. జైల్లో ఉండి ఆమె కవిత్వం రాసింది. ‘లాంతరులో చమురు లేదు. అది ప్రాణం విడిచేలోపు నాలుగు పంక్తులు రాసుకుంటాను’ అని రాసిందామె. చిన్న వయసులో మరణం సుభద్ర కుమారికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురిలో తన బాల్యం చూసుకుంటూ ఆమె అద్భుతమైన కవిత్వం రాసింది. స్వాతంత్య్రం సిద్ధించాక ఆమె ఇంకా ఉత్సాహంగా పని చేస్తూ నాగ్‌పూర్‌లో ఒక ఉపన్యాసం ఇచ్చి జబల్పూర్కు తిరిగి వస్తుండగా 1948లో కారు యాక్సిడెంట్ లో మరణించింది. అప్పటికి ఆమె వయసు 43 సంవత్సరాలు. సుభద్ర కుమారి చౌహాన్ పేరిట ఎన్నో సాహిత్య పురస్కారాలు ఉన్నాయి. ఒక కోస్ట్‌గార్డ్ నౌకకు ఆమె పేరు పెట్టారు. జబల్పూర్లో ప్రభుత్వం ఆమె విగ్రహం పెట్టింది. ప్రస్తుతం అమృతోత్సవాల సందర్భంగా ఆమె 117వ జయంతి రావడంతో గూగుల్ ఆమె స్మరణగా డూడుల్ చేసి గౌరవాన్ని ప్రకటించింది. ‘ఆమె స్ఫూర్తి గొప్పది’ అని గూగుల్ వ్యాఖ్యానించింది. -
అజాత శత్రువు... అరుదైన జర్నలిస్టు
ప్రముఖ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు 10న తుర్లపాటి సుందర రామారావు, శేషమాంబ దంపతులకు విజయవాడలో జన్మించారు. హైస్కూల్ విద్యాభ్యాసం గన్నవరంలో, ఆ తరువాత విజయవాడలో కొనసాగించారు. 1946లో 14వ ఏట జర్నలిజంలోకి ప్రవేశించారు. 1951లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ‘ప్రజా పత్రిక’ దినపత్రికలో చేరి కొంత కాలం ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణ కుమారిని ప్రేమించి 1959లో వివాహమాడారు. వీరి పిల్లలు ప్రేమజ్యోతి, జవహర్లాల్ నెహ్రూ. నార్ల వెంకటేశ్వరరావుకి ఏకలవ్య శిష్యునిగా ఒక దినపత్రికలో 1959లో సహాయ సంపాదకుడిగా ఉద్యోగంలో చేరారు. ‘వార్తల్లోని వ్యక్తి’ అనే శీర్షికను వివిధ దినపత్రికల్లో మొత్తం 50 ఏళ్లపాటు కొనసాగించారు. ‘ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ను స్థాపించి రాష్ట్రంలోని 42 బ్రాంచిలతో ప్రతిఏటా ఉత్తమ నటుడు, నటీమణులు, ఇతరులకు అవార్డులిచ్చి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ‘నంది’ అవార్డులు ప్రవేశ పెట్టడానికి కారణం వీరే. నేషనల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా, నంది అవార్డ్స్ కమిటీ సభ్యుడిగా, నేషనల్ ఫిల్మ్ సలహాదారుగా, కేంద్ర సాహిత్య అకాడమీ మెంబర్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌గా, వివిధ హోదాలలో తుర్లపాటి పనిచేసారు. ‘మహా నాయకులు’, ‘జాతి నిర్మాతలు’, ‘1857 విప్లవ వీరులు’, ‘నా కలం, గళం’ లాంటి గొప్ప పుస్తకాలను రాసి స్ఫూర్తినిచ్చారు. గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, స్వాతంత్య్ర సమరయోధులు ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్, తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటి ప్రధాని నరేంద్రమోదీ, మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు ఎప్పటికప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిన నేర్పరి తుర్లపాటి. ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, జగ్జీవన్ రాం లాంటి ఉద్దండుల ఇంగ్లిష్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువాదించేవారు. ఇప్పటివరకు దాదాపు 18,000 ఉపన్యాసాలు ఇచ్చి గిన్నీస్ బుక్ వారి ప్రత్యేక ప్రశంస పొందిన ఘనాపాటి తుర్లపాటి. సభాధ్యక్షుడిగా సభలను నడిపించటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు ‘ఉపన్యాస కేసరి’ ‘దశ సహస్ర సభా కేసరి’ అనే బిరుదులతో పాటు, ఏయూ వారి ‘కళా ప్రపూర్ణ‘, తొలి తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్’ అవార్డ్, ముట్నూరి కృష్ణారావు ఉత్తమ జర్నలిస్ట్ లాంటి ఎన్నో అవార్డులు సాధించారు. తెలుగు భాషకు అధికార హోదా రావడానికి అనితర సాధ్యమైన ప్రయత్నం చేశారు తుర్లపాటి. 2002లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అందుకున్న ఏకైక తెలుగు జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు పనిచేసిన 18 మంది ముఖ్యమంత్రులతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి 75 ఏళ్ల చరిత్రకు సజీవ ‘సాక్షి’గా నిలిచిన గొప్ప వ్యక్తి తుర్లపాటి. ఏ రోజు కూడా ఆయన వారి వద్ద ఏమీ ఆశించకుండా నీతి, నిజాయితీగా ఉంటూ చివరకు కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా వెళ్లిపోయారు. 1978,1980లో ఆయనను ఎమ్మెల్సీ చేయాలని అప్పటి సీఎం ప్రయత్నించినా అది తృటిలో తప్పిపోయింది. 2007లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆయనను గవర్నర్ నామినేషన్ ద్వారా ఎమ్మెల్సీని చేయాలని మరోసారి ప్రయత్నం చేసినా అదికూడా అనివార్య కారణాల వల్ల తప్పిపోయింది. వైఎస్సార్ మీద 64 వ్యాసాలు, ఎన్నో పుస్తకాలు రాశారు. జర్నలిజంలో 75 ఏళ్ల అనుభవం ఉండి, అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగిన అజాతశత్రువు తుర్లపాటి. తెలుగు జర్నలిజంలో మకుటం లేని మహారాజుగా నీతి నిజాయితీలతో, అత్యున్నత విలువలతో తన వద్దకు సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారు. విజయవాడను, ఆంధ్రప్రదేశ్‌ను ఎన్నెన్నో అవార్డులు, రివార్డుల ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లి ఇంతమంది ప్రేమాభిమానాలు పొంది తన జన్మసార్థకం చేసుకున్న ధన్యజీవి తుర్లపాటి 89 ఏళ్ల వయస్సులో కాలం చేశారు. తుర్లపాటి జీవితం భావితరాలందరికీ ఆదర్శం, అనుసరణీయం. - తుర్లపాటి కృష్ణ కుమార్ వ్యాసకర్త తుర్లపాటి కుటుంబరావు మనవడు -
జక్కంపూడి రామ్మోహన్రావు కు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
Yamini Saraswathi: యామినీ విలాసం
కాస్త పొట్టి ఆకారం! తెల్లగా మెరిసిపోయే బిళ్లంచు ఖద్దరు ధోవతి; నాజూగ్గా కట్టుకున్న తీరు.అంతే తెల్లని జుబ్బా, రింగులు తిరిగిన ముంగురులు. ముఖానికే అందమిచ్చే కళ్ల జోడు. మనిషి అసలే అందగాడు. ఆహార్యం ఇంకా అందాన్ని రెట్టింపు చేస్తుంటుంది. భుజాల మీద కప్పుకున్న పండిత శాలువా, అదీ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల్లోవే. నడక లోనూ నాజూకుతనం. మాటలో సుకుమార్యం. సౌహార్దం, కాసింత సున్నిత హాస్యం అప్పుడప్పుడూ పండిత కవి మిత్రులతోనైతే వ్యంగ్యా స్త్రాలు సంధించే నైజం. డిగ్రీలో గణితమే ప్రధానాంశమైనా, తాత్కాలిత గణిత ఉపాధ్యాయుడిగా అక్కడ క్కడే కొలువు చేసినా, ఆయన అభిమాన మంతా తెలుగు సాహిత్యం మీదే. అందుకే ప్రాచీన నవీన రచనలెన్నింటినో ఆపోశన పట్టారు. ఊరక చదివింది కాదు, వాటిలోని ప్రశస్తమైన పద్యగద్యాలు, ఆసక్తికర సన్ని వేశాలు, సంభాషణలు, పద్యాలు చలోక్తులూ వంటివెన్నింటినో పుక్కిట బట్టారు. సందర్భాలకు తగినట్టుగా వాటిని ప్రయోగించేవారు. అలాగే ఆధునిక కవులనూ, రచయితలనూ, రచనలనూ తన మనోమందిరంలో నిక్షిప్తం చేసుకున్నాడు. ఈ ‘సాహిత్య వ్యసనం’ ఎంతగా మారిపోయిందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ మూల సాహిత్య సభ జరిగినా తన హాజరు ఆవశ్యం ఉండేలా చూసుకునేవారు. ఆ రీతిగా ఎందరో కవులు, పండితులు, రచయితలు, రచయిత్రులతో పరిచయం పెంచుకున్నారు. ప్రాచీనులలో కవిత్రయము, శ్రీనాథ పోతనలు, ప్రబంధ కవులూ మిక్కిలి అభి మానం. పదకర్తలంటే ప్రత్యేక గౌరవం. మొదట్లో శతకం వంటి రచనలు చేసినా తర్వాత వచనరచయితగా, రూపాంతరం చెందారు. అతివ–అభిజాత్యం నవలతో మొదలైన ఆయన రచనా ప్రస్థానం స్వతంత్ర నవలలు, పలు పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలలు ముద్రణ పొందడంతో యావదాంధ్రలో ఆయన పేరుపొందారు. ఆయనే యామినీ సరస్వతి. ఇది కలంపేరు. సరస్వతి ఆయన భార్యపేరు. ఆయన అసలు పేరు డీవీ సుబ్బారావు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ ఫిర్కాలోని జిల్లేళ్ల గ్రామం స్వస్థలం. ఆగస్టు 3, 1941న జన్మించారు. కానీ సాహిత్య సంచారానికీ, రచనా రంగానికీ నంద్యాలనే ఆవాసం చేసు కున్నారు. నండూరు రామకృష్ణమాచార్య, గుంటూరు శేషేంద్రశర్మ, కొండవీటి వెంకట కవి, బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ సినారె వంటి ప్రముఖులెందరితోనే పరిచయం ఏర్పర్చుకుని నిత్య చర్చలు జరిపేవారు. నంద్యాల నూతన సారస్వత సంఘం కార్యదర్శిగా పని చేశారు. దాదాపు యాబై పైగా నవలలు, వంద కుపైగా కథలు రాశారు. తన రచనా వ్యాసం గంతోనే కొండవీటి వెంకటకవికి, దాసరి నారాయణరావుకు సహరచయితగా మారారు. సినీ, టీవీ రచయితగా పేరొందారు. టీవీలో విశ్వామిత్ర సీరియల్‌కి, సినిమాకు రచయితగా, తాండ్రపాపారాయుడు, విశ్వనాథనాయకుడు సినిమాలకు సహరచయితగా పనిచేశారు. సాహిత్యారాధన కోసం స్వగ్రామంలో తనకున్న ఆస్తులను కరిగించేశారు. 2004 సెప్టెంబర్ 5న ఆప్తులను, ఆత్మీయులను, హిత మిత్రులను వదిలి కీర్తిశేషులయ్యారు. రాయల సీమలో పేరెన్నికగన్న నవలా రచయితల్లో యామిని ఒకరు. కానీ రచనా రంగంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల కంటే కర్నూలు వెనుకబడినందున కాబోలు ఆయనకు రావలసినంత పేరు రాలేదనే చెప్పాలి. సాహిత్యరంగంలో ఒకరికి పేరు రావడానికీ, మరొకరికి పేరు రాకపోవడానికీ మధ్య నడిచే బోలెడు కథల బాగోతంలో చిక్కిన బడుగు రచయితల్లో యామిని కూడా ఒకరయ్యారని చెప్పడం సబబు. - దినకర్, విశ్రాంత తెలుగు పండితుల -
పింగళి వెంకయ్య సేవలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సీఎం జగన్ ‘‘భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన.. పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్ర్య సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి’’ అంటూ ట్వీట్ చేశారు. భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి. #PingaliVenkayya — YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2021