birthday
-
సతీమణి బర్త్ డే.. భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ స్టార్
కేజీఎఫ్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ఈ మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో యశ్ మెప్పించనున్నారు.అయితే నటి రాధిక పండిట్‌ను యశ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2016లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఇటీవల మార్చి 7న యశ్ భార్య రాధిక పండిట్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో హీరో యశ్ సతీమణికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రొమాంటిక్ సాంగ్‌ను ఆలపించాడు. 1981లో వచ్చిన కన్నడ మూవీలోని పాటను పాడి సతీమణికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రాధిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే కేజీఎఫ్ స్టార్ యశ్ చివరిసారిగా కేజీఎఫ్-2లో కనిపించారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
Birthday special: జాన్వీ కపూర్ క్యూట్ ఫొటోస్
-
డెంటిస్ట్ నుంచి రూ.300 కోట్ల హీరోయిన్ వరకు.. మీనాక్షి గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
మంచి మనసు చాటుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ (ఫొటోలు)
-
హనుమాన్ నటి బర్త్ డే.. గొప్ప మనసు చాటుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్
హనుమాన్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో చోటు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్‌కుమార్. టాలీవుడ్లో బాలయ్య మూవీ వీరసింహారెడ్డిలోనూ తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ నెల 5న ఆమె పుట్టినరోజు కావడంతో తన గొప్ప మనసును చాటుకున్నారు.వరలక్ష్మి తన బర్త్ డే సందర్భంగా అనాథ చిన్నారుల్లో సంతోషం నింపారు. హైదరాబాద్‌లోని లెప్రా సోసైటీ అనాథాశ్రమానికి వెళ్లిన వరలక్ష్మీ తన భర్త నికోలయ్ సచ్దేవ్తో పాటు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందించారు. అంతేకాకుండా ఆశ్రమానికి తనవంతుగా ఆర్థికసాయం అందజేశారు. సెలబ్రిటీలు వస్తే అనాథాశ్రమం గురించి ప్రజలకు తెలుస్తుందనే మంచి ఉద్దేశంతోనే వచ్చానని వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. -
హీరోయినే కానీ ఎప్పుడూ రూమర్స్, వివాదాలతోనే సావాసం (ఫొటోలు)
-
భారత్- పాక్ మ్యాచ్.. ఊర్వశి రౌతేలా క్రేజీ రికార్డ్!
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఐదేళ్ల కుర్రాడి నుంచి డెబ్బై ఏళ్ల ముసలోళ్లు కూడా వదిలిపెట్టరు. మ్యాచ్ ఎప్పుడు మొదలతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రపంచ క్రికెట్లోనే అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇండియా- పాకిస్తాన్ పోరు మాత్రమే. ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్‌లు లేనందువల్ల అప్పుడప్పుడు వచ్చే ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నారు దాయాది జట్లు. మరి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చే ఈ మ్యాచ్ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు క్రీడా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక మ్యాచ్ లైవ్‌లో చూసేవారికి ఆ థ్రిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఏంటా స్పెషల్? అనేది తెలియాలంటే మీరు లుక్కేసేయండి మరి.తాజాగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. ఇటీవల డాకు మహారాజ్‌తో ఫ్యాన్స్‌ను అలరించిన ముద్దుగుమ్మ సడన్‌గా మ్యాచ్‌లో దర్శనమిచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా డైరెక్టర్ సుకుమార్, పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ మ్యాచ్ లైవ్‌లో అభిమానులు వీక్షించారు.అయితే చాలా మంది సెలబ్రిటీలు ఈ మ్యాచ్‌కు హాజరైనప్పటికీ అందరి కళ్లు ఊర్వశి రౌతేలాపైనే ఉన్నాయి. ఈ బాలీవుడ్ భామ దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. టీమిండియా- పాక్ మ్యాచ్‌లో ఏకంగా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫిల్మ్ ఫేర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తొలి సెలబ్రిటీ అంటూ..భారత్- పాక్ మ్యాచ్‌లో పుట్టినరోజు జరుపుకున్న తొలి సెలబ్రిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో రికార్డ్ సృష్టిస్తే.. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఊర్వశి తొలిసారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని అంటున్నారు. మరికొందరైతే ఊర్వశి రౌతేలాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఖరికి ఫిల్మ్ ఫేర్ వాళ్లు కూడా ఊర్వశిపై జోకులు వేస్తున్నారని మరికొందరు రాసుకొచ్చారు. కొందరు రిషబ్ పంత్ పేరును కూడా కామెంట్స్‌లో ప్రస్తావిస్తున్నారు. అయితే ఆమెపై ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ.. చివరికీ బాలీవుడ్ భామ మాత్రం ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అందర దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఇటీవల టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఊర్వశి రౌతేలా బర్త్ డే ఈనెల 25న కాగా.. ముందుగానే స్టేడియంలో సెలబ్రేట్ చేసుకుని హైలెట్‌గా నిలిచింది. #ViratKohli broke several records during the India vs Pakistan match yesterday but #UrvashiRautela became the first actress to celebrate her birthday during an #IndvsPak cricket match. 🤣#Trending #indvspak #indiavspakistan #iccchampionstrophy pic.twitter.com/OLjHILtvgh— Filmfare (@filmfare) February 24, 2025 -
ఉద్యోగి బర్త్‌డే సెలబ్రేట్ చేసిన అనంత్, రాధికా అంబానీ (ఫోటోలు)
-
అనుపమ బర్త్ డే.. పరదా టీమ్ స్పెషల్ విషెస్
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్)ఇవాళ అనుపమ బర్త్ డే కావడంతో ఓ వీడియోను విడుదల చేశారు. దాదాపు 20 సెకన్లపాటు ఉన్న మూవీ క్లిప్‌ను షేర్ చేస్తూ అనుపమకు పుట్టినరోజ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నమైన సోషియో ఫాంటసీ కథగా రానున్న ఈ చిత్రంలో అనుపమ సుబ్బు అనే పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'అమరన్' హీరో శివ కార్తీకేయన్ బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
పెళ్లైన తర్వాత బ్యాడ్మింటన్ స్టార్ తొలి బర్త్‌డే.. ఫొటోలు చూశారా?
-
జేడీ వాన్స్ కుమారుని బర్త్‌డే వేడుకలకు ప్రధాని మోదీ
పారిస్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుమారుని పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జేడీ వాన్స్, భారత సంతతికి చెందిన అతని భార్య ఉషలతో సమావేశమయ్యారు. జేడీ వాన్స్ కుమారుడు వివేక్‌కు మోదీ పుట్టినరోజు బహుమతులను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో వాన్స్‌తో పాటు అతని భార్య ఉష, కుమారులు ఇవాన్, వివేక్‌లు కూడా ఉన్నారు.ప్రధాని మోదీ తన ట్వీట్లో.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్నాను. వివిధ అంశాలపై మేము మాట్లాడుకున్నాం. వాన్స్ కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకకు హాజరు కావడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. కాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ చాలా మంచి మనసు కలిగిన వ్యక్తి అని, ఆయన మా పిల్లలకు ఇచ్చిన బహుమతులను చూసి వారు చాలా ఆనందించారన్నారు. ఆయనకు కృతజ్ఞతలు అని జేడీ వాన్స్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. Had a wonderful meeting with US @VP @JDVance and his family. We had a great conversation on various subjects. Delighted to join them in celebrating the joyous birthday of their son, Vivek! pic.twitter.com/gZpmt1jg5M— Narendra Modi (@narendramodi) February 11, 2025కాగా ప్రధాని మోదీ, జేడీ వాన్స్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) షేర్ చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు తన ప్రసంగంలో సమ్మిట్‌కు సహ అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ కృత్రిమ మేధస్సుపై చూపిన సానుకూల వైఖరిని స్వాగతించారు. ఏఐ ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందిస్తుందని, ఉత్పాదకతను మరింతగా పెంచుతుందన్నారు. అయితే ఇది మనుషుల మేథను ఎప్పటికీ భర్తీ చేయలేదని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నేడు రాష్ట్రపతి భవన్లో తొలి పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికంటే.. -
ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. ఫోటోలు
-
బాయ్‌ఫ్రెండ్‌కు బర్త్ డే విషెస్.. పాయల్ రాజ్‌పుత్ పోస్ట్!
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు.'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరినీ తన గ్లామర్‌తో అలరించిన ఈ బ్యూటీ.. 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాతో విభిన్నమైన పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ చేసింది. అతనితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది మంగళవారం భామ.పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను అర్థం చేసుకునే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ దయ, మద్దతు నా జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు. అన్ని వేళల్లో మీ మార్గదర్శకత్వం, ప్రేమను అందిస్తూ మీరు నా కోసం ఉన్నందుకు చాలా కృతజ్ఞతతో ఉన్నా. ఈ ప్రత్యేకమైన రోజున ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో కనిపించనుంది. ఈ చిత్రానికిముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభమైంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయమని డైరెక్టర్ ముని అన్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మహేశ్‌బాబుతో చివరి సినిమా..'లండన్ బ్యూటీ' బర్త్‌డే వేడుకలు (ఫోటోలు)
-
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
భర్తకు విషెస్ చెప్పిన ఐశ్వర్య రాయ్.. ఎప్పటిలాగే ఆలస్యంగా!
బాలీవుడ్ అత్యంత క్రేజ్ ఉన్న జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇవాళ అభిషేక్ తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తాజాగా తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. అభిషేక్ బచ్చన్ చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. మీకు ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యం, ప్రేమతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే అభిషేక్ బచ్చన్.. గతేడాది ఐ వాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. షూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో అభిషేక్ విభిన్నమైన పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది.ఐశ్వర్య రాయ్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది. ఇందులో చియాన్ విక్రమ్, రవి మోహన్, శోభితా ధూళిపాల, త్రిష కృష్ణన్, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.ఐశ్వర్య- అభిషేక్‌పై రూమర్స్..కాగా.. గతేడాది అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో జంటగా కనిపించారు. ఇద్దరూ విడివిడిగా వేడుకలో కనిపించడంతో ఈ జంట విడిపోతున్నారంటూ పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతకుముందు కూతురు ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో అభిషేక్ కనిపించకపోవడంతో డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ జంట ఈ వార్తలపై స్పందించలేదు.జంటగా పార్టీకి హాజరుబాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతేడాదిలో మరింత బలపడ్డాయి. కానీ వీరిద్దరు ఓ పార్టీలో ఫ్రెండ్స్‌తో కలిసి సెల్ఫీలు దిగారు. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. దీంతో విడాకుల రూమర్స్‌కు చెక్ పడింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
బర్త్‌డే స్పెషల్..అభిషేక్ బచ్చన్ గురించి ఈ విషయాలు తెలుసా?
-
రామ్ లక్ష్మణ్.. హ్యాపీ బర్త్ డే
కవలలుగా పుట్టిన రామ్ లక్ష్మణ్ లకు ఆ గ్రామంలో గురువారం మొదటి పుట్టిన రోజు (Birthday) వేడుక ఘనంగా జరిపారు. చప్పట్ల మధ్య పెద్ద కేక్ కట్ చేసి తినిపించారు. బంధుమిత్ర సపరివారంగా ఆ చిన్నారులను ఆశీర్వదించి, చివరిగా విందారగించారు. ఈ హడావుడి చూసి ఇదేదో చిన్న పిల్లల జన్మదిన వేడుక అనుకుంటున్నారేమో! ఇదంతా ఓ కుటుంబం సొంత బిడ్డల్లా సాకుతున్న దూడల జన్మదిన వేడుక. కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలోని మిరియాల వెంకట్రాజు ఇల్లు ఈ వేడుకకు వేదిక అయ్యింది. వెంకట్రాజుకు చెందిన ఆవు (Cow) ఏడాది కిందట సరిగ్గా ఇదే తేదీన రెండు కవల దూడలకు జన్మనిచ్చింది. వాటికి రామ్, లక్ష్మణ్ (Ram Laxman) అని పేర్లు పెట్టారు. అవి పుట్టి ఏడాది పూర్తి కావడంతో ఘనంగా జన్మదిన వేడుక జరిపారు. – ప్రత్తిపాడుకిలో మీటరు మేర డోలీ మోత గిరిజన ప్రాంతంలో గర్భిణులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేక గిరి బిడ్డలు నానా అవస్థలు పడుతున్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి కిలోమీటరు వరకు రహదారి సౌకర్యం లేదు. ఎటువంటి వాహనాలు రాలేని పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక వనిత భర్త మోహన్‌రావు, కుటుంబ సభ్యుల సహాయంతో డోలీ కట్టి రహదారి సౌకర్యం ఉన్న బొడ్డగొంది గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి సంతోష్, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా చెరువువీధి గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామానికి రహదారి ఉండేదని, భూ సమస్య కారణంగా ఒక వ్యక్తి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రహదారి సమస్య పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితంలేకుండాపోతోందని వాపోయారు. – ముంచంగిపుట్టుచివరి మజిలీలో ‘దారి’ చిక్కులుతిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, జింగిలిపాళెం దళితవాడకు చెందిన వెంకటేశ్ (34) మృతి చెందడంతో గురువారం ఆయన అంతిమ యాత్రకు చిక్కులు ఎదురయ్యాయి. రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్ మృతి చెందడంతో బంధువులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. అయితే దారి లేకపోవడంతో నానా అగచాట్లు పడుతూ పంట పొలాల గట్లు మీద నడుచుకుంటూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియలు అవస్థల మధ్య జరగడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. – రేణిగుంటవిశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రెండు ఎద్దులు అధిపత్యం కోసం పోరాడాయి. వీటి మధ్య జరిగిన పోరును స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఓ దశలో ఇవి వారివైపునకు రాగా... స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఒకవైపు పెట్రోలింగ్‌కు వాహనాలు లేవని చెబుతున్న పోలీసులు..చిన్న మరమ్మతులైన వాటినీ రిపేర్ చేయించకుండా మూలన పడేస్తున్నారు. దానికి ఈ చిత్రమే నిదర్శనం. విశాఖలోని మద్దిలపాలెం అవుట్‌పోస్ట్ వద్ద మరమ్మతులకు గురైన పోలీస్ పెట్రోలింగ్ బైక్‌ను నెలల తరబడి ఇలాగే వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఇది తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్. లడ్డూలు లేకపోవడంతో ఇలా నో స్టాక్ బోర్డును టీటీడీ ఏర్పాటు చేసింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు లడ్డు ప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరిగారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, తిరుపతిచదవండి: సర్పమా.. మేఘమా! -
హీరోయిన్ శృతి హాసన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అంజనమ్మ బర్త్ డే వేడుక.. మెగాస్టార్ ఎమోషనల్ నోట్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన మాతృమూర్తి అంజనమ్మకు (Anjana Devi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్, మెగాస్టార్ దగ్గరుండి అంజనమ్మతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి.చిరు తన ఇన్‌స్టాలో రాస్తూ..'అమ్మా! ఈ ప్రత్యేకమైన రోజున మాటల్లో చెప్పలేనంతగా ప్రేమను అందుకున్నారు. మీరు ఊహించలేనంతగా గౌరవం అందించిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. మా ప్రియమైన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబానికి హృదయం లాంటి మీ స్వచ్ఛమైన, నిస్వార్థ ప్రేమకు కృతజ్ఞతలు. నీ పాదాలకి నమస్కరిస్తూ.. పుణ్యం చేసుకొన్న నీ సంతతి.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. అంతకుముందే ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. అంజనమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నాయనమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఇన్‌స్టా వేదికగా విషెస్ తెలిపింది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావడంతో వాయిదా వేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
'ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం'.. ఉపాసన స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి మెగా కోడలు శుభాకాంక్షలు తెలిపింది. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పింది. అంజనా దేవితో ఉన్న ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా అభిమానులు సైతం అంజనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ..'అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నాయనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో పాటు కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్ పూర్తయ్యాక మా ఫేస్‌లో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్సవదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తిదాయకం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ పోస్టులు పెడుతున్నారు.(ఇది చదవండి: అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్)ఇక ఉపాసన విషయానికొస్తే వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, దేవరభామ జాన్వీ కపూర్ చెర్రీ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆర్సీ16 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
పుట్టిన రోజే కబళించిన మృత్యువు
ఆరిలోవ: ఉద్యోగ సాధనలో విజయం సాధించి సాయంత్రం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్న ఆ యువకుడి జీవనయానం హఠాత్తుగా ముగిసింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం జరిగిన పరుగు పోటీలో పాల్గొన్న ఆ యవకుడు అనూహ్యంగా తనువు చాలించాడు. ఓ దశ పరుగు పందెం నెగ్గి, రెండో దశ కోసం వేచి ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విశాఖ నగరంలోని కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. గురువారమే అతని పుట్టిన రోజు కూడా. కానిస్టేబుల్ నియామక పరీక్షలకు వెళ్లి వచ్చి సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న యువకుడి ఆశల్ని మృత్యువు చిదిమేసింది. పోలీసులు, బంధువు కథనం ప్రకారం.. విశాఖ నగరం పదో వార్డు రవీంద్రనగర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కె.ఎ.శ్రావణ్‌కుమార్ (24) పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో జరుగుతన్న దేహదారుఢ్య పరీక్షలకు శ్రావణ్‌కుమార్ గురువారం హాజరయ్యాడు. మొదట జరిగిన 1,600 మీటర్ల పరుగులో పాల్గొన్నాడు. 8 నిమిషాలలో పూర్తి చేయాల్సిన పరుగును 7.1 నిముషాల్లోనే పూర్తి చేసి తదుపరి పరీక్షలకు అర్హత సాధించాడు. మరికొద్ది సమయంలో తదుపరి పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంతలో కూర్చున్న చోటే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి, అపస్మారకస్థితికి చేరాడు. దీన్ని గమనించిన పోలీసులు అంబులెన్స్‌లో విమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అపోలో అస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న శ్రావణ్‌కుమార్ తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు అస్పత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. శ్రావణ్‌కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 8 నెలల క్రితం తండ్రి మృతి శ్రావణ్‌కుమార్ తండ్రి కె.అర్జునరావు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఆయన 8 నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ కుటుంబానికి ఇంజినీరింగ్ చదువుతున్న శ్రవణ్కుమారే పెద్దదిక్కుగా నిలుస్తాడని తల్లి కనకమహాలక్ష్మి ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు అతను కూడా మరణించడంతో తల్లి, చెల్లికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. -
పార్టీ ఇచ్చిన ఖుష్బూ.. హాజరైన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే.. పవిత్రా లోకేశ్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ మరో ఏడాది పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో ఆయన జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నరేశ్‌పై ప్రశంసలు కురిపించారు పవిత్రా లోకేశ్.పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' నరేశ్ గారి బర్త్ డేను అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం శుభ పరిణామం. ఆయన వేసుకున్న షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను. పెద్దల ఆశీర్వాదం ఆయనకు ఎప్పుడు ఉంటుంది. నరేశ్ గారికి ఇద్దరు గురువులు. వారిలో ఒకరు జంధ్యాల అయితే.. మరొకరు విజయనిర్మల. ప్రతి రోజు గురువుగారిని తలచుకుంటారు. తన కుటుంబాన్ని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. దాదాపు 10 మందికి ఉండే ఎనర్జీ నరేశ్ గారికి ఉంటుంది. ఏపని చేసినా చాలా సిస్టమాటిక్‌గా చేస్తారు. యంగ్ డైరెక్టర్స్‌కు చాలా టైమ్ ఇస్తారు. వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. గతంలో వీరిద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీ చాలా వివాదానికి దారి తీసింది. అప్పట్లో నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం టాలీవుడ్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.Latest Visuals of Actor #VKNaresh along with #PavitraLokesh pic.twitter.com/39UnKTPV4e— Telugu Film Producers Council (@tfpcin) January 19, 2025#TFNExclusive: Visuals of Actor @ItsActorNaresh's birthday celebrations in Hyderabad!!🎊#Naresh #PavitraLokesh #TeluguFilmNagar pic.twitter.com/2kXbVEmaWr— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
బోల్డ్ కన్నన్
బోల్డ్ కన్నన్‌గా మారిపోయారు హీరో విజయ్ సేతుపతి. ఆయన హీరోగా నటిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘ఏస్’. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో యోగిబాబు, బీఎస్ అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ ఇతర లీడ్ రోల్స్æచేస్తున్నారు. జనవరి 16న విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇంకా విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న మరో మూవీ ‘ట్రైన్’ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కేఎస్ రవికుమార్, శ్రుతీహాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇలా బర్త్ డేకి డబుల్ ధమాకా ఇచ్చారు విజయ్ సేతుపతి. -
Rakesh Sharma Birthday: రాకేష్‌శర్మ అంతరిక్షంలో ఎన్ని రోజులున్నారు?
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పుట్టినరోజు నేడు(జనవరి 13). ఆయన 1949 జనవరి 13న జన్మించారు. భారతదేశ చరిత్రలో తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సాగించిన అంతరిక్ష ప్రయాణం దేశానికి గర్వకారణంగా నిలిచింది.1949, జనవరి 13న పంజాబ్‌లోని పటియాలాలో జన్మించిన రాకేష్ శర్మ(Rakesh Sharma), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)మాజీ పైలట్, వ్యోమగామి. రాకేశ్‌శర్మ 1984లో 7 రోజుల, 21 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్ష యాత్ర చేశారు. 1984లో సోవియట్ అంతరిక్ష నౌక సోయుజ్ టీ-11లో ఆయన చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఆయనను జాతీయ హీరోగా చేయడమే కాకుండా, అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ వేదికపై భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది.నాటి అంతరిక్ష మిషన్ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉందని శర్మను అడిగినప్పుడు ఆయన ‘సారే జహాన్ సే అచ్ఛా" (ప్రపంచమంతటి కంటే మెరుగ్గా) అని సమాధానమిచ్చారు. ఈ దేశభక్తి భావన లక్షలాది మంది భారతీయులతో ప్రతిధ్వనించింది.దేశ సమిష్టి జ్ఞాపకంలో శాశ్వతంగా నిలిచిపోయింది.రాకేష్ శర్మ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత, శర్మ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఏరోస్పేస్ అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేశారు. రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్ తరాల కలలను సాకారం చేసేందుకు, సైన్స్, అంతరిక్ష పరిశోధనలలో మరింత ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలిచింది.ఇది కూడా చదవండి: కెనడా అమ్మకానికేం లేదు!.. ట్రంప్‌కు ఘాటు హెచ్చరిక -
చిరంజీవితో తొలి సినిమా.. సుకుమార్ బర్త్‌డే విశేషాలు (ఫోటోలు)
-
పుష్ప స్టైల్లో తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పిన ఐకాన్ స్టార్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. నాన్న అల్లు అరవింద్‌తో బన్నీ స్వయంగా కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలో బన్నీ భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్ కేక్ కట్ చేసిన ఫోటోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు బన్నీ. తాజాగా అలలు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.పుష్ప కా బాప్ అంటూ..ఈ పోస్ట్‌లో పుష్ప కా బాప్ అని రాసిన ఉన్న కేక్ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ కేక్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 జోరు..గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్‌పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈనెల 17 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..అయితే తాజాగా ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పుష్ప-2 ది రూల్ రీ లోడింగ్ వర్షన్ తేదీని మార్చారు. ముందుగా ఈనెల 11 నుంచే వస్తుందని ప్రకటించారు. కానీ ఆ డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల 11న పుష్ప-2 ఎక్స్ట్రా ఫైర్ చూడాలనుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. దంగల్ రికార్డ్‌పై గురి..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2', కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. ఈ లెక్కన చూస్కతే అమిర్ ఖాన్ దంగల్ మూవీ మాత్రమే పుష్ప-2 కంటే ముందుంది. ఈ మూవీ అదనపు సీన్స్ యాడ్ చేయడం చూస్తే దంగల్ రికార్డ్‌పైనే గురి పెట్టినట్లు తెలుస్తోంది.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. Happy Birthday Dad . Thank you for making our lives soo special with your gracious presence . pic.twitter.com/CgWYsbk2eF— Allu Arjun (@alluarjun) January 10, 2025 -
దీప్తి సునయన బర్త్‌డే స్పెషల్... (ఫోటోలు)
-
నవిష్క బర్త్‌డే.. కూతురి కోసం కల్యాణ్ దేవ్ సర్ప్రైజ్(ఫోటోలు)
-
మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ..
కొందరిని చూస్తుంటే వారేవా అని అనకుండా ఉండలేం. దానికి వారిలోని గొప్పదనం, వారు చేసే పనులు కారణమై ఉంటాయి. దీనికితోడు వారి క్రమశిక్షణ, దైనందిన జీవితం కూడా తోడయివుంటుంది. 107 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉంటూ, అందరికీ స్ఫూర్తినిస్తున్న రోమెల్ సింగ్ పఠానియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దేశంలో సైనికరంగం ఏర్పడక ముందే ఆజాద్ హింద్ ఫౌజ్(Azad Hind Fauj)లో సభ్యునిగా చేరి, దేశం కోసం మూడు యుద్ధాలు చేసిన కెప్టెన్ రోమెల్ సింగ్ పఠానీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వయసులో కూడా కళ్లద్దాలు పెట్టుకోకుండా న్యూస్ పేపర్లు చదివే సామర్థ్యం కలిగిన రోమెల్ సింగ్ పఠానియా ఎవరి సాయం లేకుండా తానే స్వయంగా స్కూటర్ నడుపుతుంటారు. కెప్టెన్ పఠానియా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చెందిన ఫతేపూర్‌లోని బరోహ్ గ్రామ నివాసి.ఆజాద్ హింద్ ఫౌజ్‌లో సభ్యుడైన రోమెల్ సింగ్ పఠానియా(Romel Singh Pathania) 1939-45లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటీష్ పాలనలో పఠానియా 1945లో బజిరెస్తాన్ యుద్ధంలో కూడా భాగస్వామ్యం వహించారు. దేశ విభజన సమయంలో పలువురి ప్రాణాలు కాపాడారు. 1962 నాటి చైనా యుద్ధం, 1965, 1971లలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొని దేశ సేవ చేశారు. తాను భారత సైన్యంలోని 16వ డోగ్రా రెజిమెంట్‌లో సుమారు 31 ఏళ్లపాటు పనిచేశానని రోమెల్ సింగ్ పఠానియా తెలిపారు.పాష్టో, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో తనకు పూర్తి పరిజ్ఞానం ఉందని రోమెల్ సింగ్ మీడియాకు చెప్పారు. తాను శాకాహారం మాత్రమే తీసుకుంటానని, తన జీవితంలో ఏనాడూ బీడీ, సిగరెట్, మద్యం, మాంసం, చేపలు ముట్టలేదని పేర్కొన్నారు. శారీరకంగా తాను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నానని, మోకాళ్ల నొప్పులు కూడా లేవని తెలిపారు.కంటి చూపు, జ్ఞాపకశక్తి కోల్పోలేదని చెప్పారు. ఉదయం 4 గంటలకే నిద్ర నుంచి లేస్తానని, భగవంతుని ప్రార్థనతో తనకు రోజు ప్రారంభమవుతుందన్నారు. ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న రోమెల్ సింగ్ పఠానియాకు శుభాకాంక్షలు(Greetings) చెబుతూ, మీ వయస్సు ఎంత అని మీడియా అడిగిప్పుడు నవ్వుతూ తనకు ఏడేళ్లు అని చెప్పారు. తరువాత తన వయసు 107 అని తెలిపారు. ఇది కూడా చదవండి: మద్యపానం క్యాన్సర్‌కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక -
మహామేధావికి రెండు జననమరణాలు!
ఐజాక్ న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళశాస్త్రాల్లో మహనీయునిగా పేరొందారు. ఆయన ప్రపంచానికి అందించిన పలు ఆవిష్కరణలు కొత్తదారులను చూపాయి. న్యూటన్ జననమరణాలకు సంబంధించిన అంశాలు ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తాయి.బహుముఖ ప్రజ్ఞాశీలిగా..ఐజాక్ న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. యాపిల్ కిందనే పడటానికి న్యూటన్ చెప్పిన కారణం, ఆయన అందించిన చలన నియమాల గురించి చాలా మందికి తెలుసు. కానీ న్యూటన్ ప్రపంచానికి అనేక ఇతర ఆవిష్కరణలను కూడా అందించారు. గణిత శాస్త్రజ్ఞునిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా న్యూటన్ ప్రపంచానికి సుపరిచితమే. న్యూటన్ అందించిన ఆవిష్కరణలు కొన్నిరంగాల్లో సమూల మార్పులను తీసుకువచ్చాయి.రెండు పుట్టినరోజులున్యూటన్కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, అతనికి రెండు పుట్టినరోజులున్నాయి. న్యూటన్ జీవించివున్న కాలంలో వినియోగంలో ఉన్న క్యాలెండర్ల కారణంగా అతని పుట్టిన తేదీలలో పది రోజుల వ్యత్యాసం కనిపిస్తుంది. న్యూటన్ పుట్టినరోజు జనవరి 4 అని కొందరు పరిణిస్తుండగా, డిసెంబర్ 25న అతని పుట్టినరోజును జరుపుకునేవారున్నారు. నిజానికి న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్‌లో జరుపుకున్నారు. అయితే ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4న చేసుకుంటారు.అధికారిక జన్మదినంన్యూటన్ ఇంగ్లాండ్‌లోని వూల్స్టోర్ప్లోని మనోర్ హౌస్‌లో జన్మించారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్‌ను ఇంగ్లాండ్‌లో ఉపయోగించేవారు. ఇది యూరప్‌కు భిన్నంగా ఉండేది. దీని ప్రకారం చూస్తే న్యూటన్ 1642, డిసెంబర్ 25న జన్మించారు. అయితే అదే కాలంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్‌కు ఆమోదం లభించింది. ఇదే నేడు అందరూ ఉపయోగిస్తున్న క్యాలెండర్. దీని ప్రకారం చూసుకుంటే న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. ఇదే తరువాతి కాలంలో న్యూటన్ అధికారిక పుట్టిన తేదీగా పరిగణించారు.కెమిస్ట్రీలో అమితమైన ఆసక్తిగురుత్వాకర్షణ భావన న్యూటన్ సిద్ధాంతానికి ముందే ఉన్నప్పటికీ, న్యూటన్ అందించిన సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపధ్యంలో న్యూటన్ సైన్స్‌లో కొత్త శకాన్ని ప్రారంభించారని అంటారు. ఆయన కాలిక్యులస్ని కనిపెట్టడం ద్వారా గణితానికి కొత్త శాఖను అందించారు. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్‌ను తయారు చేసిన మహనీయునిగానూ న్యూటన్ పేరొందారు. ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది అయిన ప్రిజం ద్వారా తెల్లని కాంతితో కూడిన రంగుల వర్ణపటాన్ని మొదటిసారి న్యూటన్ ప్రపంచానికి చూపించారు. న్యూటన్‌కు కెమిస్ట్రీలో ఎంతో ఆసక్తి ఉంది. ఆయన రసాయన శాస్త్రంపై పలు రచనలను సాగించారు. రచయితగానూ పేరొందారు.ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలుజూలియన్ క్యాలెండర్ క్యాలెండర్ ప్రకారం న్యూటన్ 1727, మార్చి 20న మరణించారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అదే ఏడాది మార్చి 31న న్యూటన్ కన్నుమూశారు. న్యూటన్ నిద్రలో మరణించారని చెబుతారు. అతని మరణం తరువాత అతని శరీరంలో పెద్దమొత్తంలో పాదరసం కనుగొన్నారని అంటారు. న్యూటన్ తన జీవితంలోని తుదిదశలో మానసిక ఆరోగ్యంతో బాధపడ్డారు. నిరాశా నిస్పృహలకు గురయ్యారు. చుట్టుపక్కలవారిని కలుసుకోవడం మానేశారు. న్యూటన్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగాయి.ఇది కూడా చదవండి: టెన్త్ అర్హతతో 10 మెడికల్ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం -
మంచు విష్ణు ముద్దుల తనయుడు.. బాల కన్నప్ప బర్త్‌డే (ఫోటోలు)
-
బర్త్ డే వేడుకల్లో విషాదం.. అభిమానులకు కేజీఎఫ్ హీరో విజ్ఞప్తి
కేజీఎఫ్ హీరో, కన్నడ సూపర్ స్టార్ యశ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన బర్త్ డే వేడుకల కోసం ఎవరూ కూడా హోమ్‌టౌన్‌కు రావద్దని కోరారు. ఎన్నో ఏళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్‌కు సూచించారు. గతంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి యశ్ పోస్ట్ చేశారు.కాగా.. యశ్ తన పుట్టిన రోజును జవనరి 8న సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని.. పుట్టిన రోజు అందుబాటులో ఉండనని తెలిపారు. అయినప్పటికీ మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉంటాయని ఎక్స్ వేదికగా యశ్ లేఖను విడుదల చేశారు. మీరు సురక్షితంగా ఉండడమే నాకు ఇచ్చే గొప్ప బహుమతి అని.. మీ అందరికీ 2025 శుభాకాంక్షలు అంటూ యశ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఈ ఏడాది విషాదం..ఈ ఏడాది జనవరి 8న యశ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా విషాద ఘటన జరిగింది. ఆయన బ్యానర్‌ను కడుతూ ముగ్గురు అభిమానులు విద్యాదాఘాతంలో మృతిచెందారు. కర్ణాటకలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 8న 38వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) ఉన్నారు.మరో ముగ్గురికి గాయాలు..ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వారిని తరలించారు. యశ్ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్ధరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్ తన పుట్టినరోజును అభిమానులతో జరుపుకోలేదు. కరోనా సంక్షోభానికి ముందు, అతను ఒకప్పుడు తన అభిమానులతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఈ ఏడాది కూడా అభిమానులతో కలిసి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని లేఖ ద్వారా అభిమానులకు తెలియజేశారు. 🙏 pic.twitter.com/lmTH0lqiDx— Yash (@TheNameIsYash) December 30, 2024 -
రాజకీయ కవిసార్వభౌముడు
అది 1984 డిసెంబర్ 30. ముంబైలోని శివాజీ పార్కు. బీజేపీ సదస్సులో అటల్ ప్రసంగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా విని్పంచేంతటి నిశ్శబ్దం నడుమ అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ‘‘చీకట్లు విడిపోతాయి. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారాయన. అప్పట్లో అంతా పెదవి విరిచినా, మరో పుష్కరం తిరక్కుండానే హస్తిన కోటపై కాషాయ జెండా ఎగరేసి చూపించారు. ప్రాణమిత్రుడు ఆడ్వాణీతో కలిసి బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి కేంద్రంలో అధికార పీఠం దాకా ఒక్కొక్క మెట్టూ ఎక్కించారు. ఒకప్పుడు రాజకీయాల్లో అంటరానిదిగా పరిగణన పొందిన బీజేపీని వాజ్‌పేయీ ప్రబల శక్తిగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలో ఎదురైన ఆటుపోట్లను ఏమాత్రమూ చలించని నిబ్బరంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. అంతకుముందు లోక్‌సభలో విపక్ష నేతగానూ పార్టీలకతీతంగా మన్ననలూ అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పొరుగు దేశం కుట్రలను పటాపంచలు చేసి దేశ వైఖరిని ప్రస్ఫుటంగా చాటారు. నెహ్రూ తనకిష్టమైన నేత అని చెప్పినా, పాక్ పీచమణిచి బంగ్లాను విముక్తం చేసిన ఇందిరను విజయేందిరగా కొనియాడినా వాజ్‌పేయికే చెల్లింది. తర్వాత కొన్నేళ్లకే ఎమర్జెన్సీ వేళ అదే ఇందరి నియంతృత్వాన్ని ఆయన అంతే నిస్సంకోచంగా కడిగిపారేశారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాల కంటే దేశమే ముందని, ముఖ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మడమే గాక దాన్ని ఆచరణలోనూ చూపారు. పలు సందర్భాల్లో మాతృ సంస్థ ఆరెస్సెస్ విధానాలతోనే విభేదించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పార్టీ వైఖరికి భిన్న స్వరం వినిపించేందుకు కూడా వెనకాడలేదు. అంతేనా...? తొలిసారి ప్రధాని పదవి తనకు 13 రోజుల ముచ్చటగానే ముగిశాక నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు ఏకంగా కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా ముందుకొచి్చన దేశ ప్రేమికుడు వాజ్‌పేయి. ఇలా బహుముఖీనమైన వ్యక్తిత్వంతో పార్టీలకతీతంగా చెరగని అభిమానం సంపాదించుకున్నారు వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయారు. ఆయన జయంతి డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం సముచిత నిర్ణయమే తీసుకుంది. ఆదర్శ నాయకుడు 1984 సార్వత్రిక ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంది. వాజ్‌పేయి నేతృత్వంలో 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాల సాయంతో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ రూపంలో జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రయోగాలకు వాజ్‌పేయి ఆద్యునిగా నిలిచారు. పదో ప్రధానిగా ప్రమాణం చేశారు. 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చినా 1998లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 13 నెలల అనంతరం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయినా చలించలేదు. ఆ వెంటనే వచి్చన ఎన్నికల్లో నెగ్గి ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి పూర్తికాలం పదవిలో కొనసాగారు. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచిపోయారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దశాబ్దాల విభేదాలకు, ఉద్రిక్తతలకు శాంతిచర్చలే విరుగుడంటూ సాహసోపేతంగా సంప్రదింపులకు తెర తీశారు. నాటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సరీ్వసును ప్రారంభించారు. పాక్ కపట బుద్ధి కార్గిల్ యుద్ధానికి దారి తీసినా ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. 2003లో ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా సైనిక సాయం కోరితే నిష్కర్షగా తిరస్కరించిన ధీశాలి వాజ్‌పేయి. డజన్ల కొద్దీ దేశాలు అమెరికా పక్షం వహించినా, అదే బాటన నడుద్దామని సొంత మంత్రివర్గ సభ్యులే ఒత్తిడి తెచి్చనా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అదే మేలని మీడియా సలహాలిచి్చనా ససేమిరా అన్నారు. ఇరాక్‌పై అమెరికా యుద్ధంలో పాల్గొనేది లేదని పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన కీలక ఘట్టంగా మిగిలిపోయింది.కీలక సంస్కరణలు మూడోసారి ప్రధానిగా కీలక ఆర్థిక సంస్కరణలకు వాజ్‌పేయి బాటలు వేశారు. పీవీ బాటన సాగుతూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని, సరళీకృత విధానాలను, విదేశీ పెట్టుబడులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. హైవేల అభివృద్ధి, ప్రధాని గ్రామసడక్ పథకాలతో దేశ రవాణా రూపురేఖలనే మార్చేశారు. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేశారు. నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1998లో పోఖ్రాన్లో రెండో అణు పరీక్షల ద్వారా భారత అణ్వస్త్ర పాటవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలో టెలికాం విప్లవానికి బాటలు పరిచిందీ వాజ్పేయే. ఆయన హయాం సుపరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం వాజ్‌పేయీ క్రమంగా రాజకీయ రంగం నుంచి తప్పుకున్నారు. 2006లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ తర్వాత చివరిసారిగా మీడియాతో మాట్లాడారు వాజ్‌పేయి. ఈ సందర్భంగానే నాయకత్వ బాధ్యతలను ఆడ్వాణీకి అప్పగించారు. క్షీణించిన ఆరోగ్యానికి నిదర్శనంగా అప్పటికే చేతికర్ర సాయం తీసుకున్నారు. 2007లో చివరిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత 2018 ఆగస్టు 16న కన్నుమూసేదాకా దాదాపు పుష్కర కాలం వాజ్‌పేయి ఏకాంత జీవితమే గడిపారని చెప్పాలి. ఆ గళం.. అనితరసాధ్యంవాజ్పేయి అద్భుత వక్త. హిందీ, ఇంగ్లీష్ ల్లో తిరుగులేని వాగ్ధాటి ఆయన సొంతం. 1957లో పార్లమెంటేరియన్‌గా తొలి ప్రసంగంతోనే నాటి ప్రధాని నెహ్రూతో సహా అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రధాని అవుతాడంటూ నెహ్రూ ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా అయినా, ప్రధానిగా హోదాలోనూ ఆయన మాట్లాడేందుకు లేచారంటే సభ్యులంతా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యం, చమత్కారాలు, అక్కడక్కడా అవసరమైన మేరకు వ్యంగ్యం మేళవిస్తూ కవితాత్మకంగా సాగే వాజ్‌పేయి ప్రసంగాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి. హిందీ అంతగా అర్థం కాని తమిళ దిగ్గజం సీఎన్ అన్నాదురైని కూడా ఆకట్టుకున్న ఘనత ఆయన ప్రసంగాలకు దక్కింది! 1994లో జెనీవా వేదికపై కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఏరికోరి వాజ్‌పేయినే ఎంచుకున్నారు. ఏ అంశంపై అయినా సమగ్ర కసరత్తు చేశాకే మాట్లాడేవారు. గణాంకాలు తదితరాలను తప్పకుండా ప్రస్తావించేవారు. అందుకే పార్లమెంటులో ఆయన వాదనలను తిప్పికొట్టలేక ప్రత్యర్థి పక్షాల్లోని మహామహులైన నేతలు కూడా చేష్టలుడిగేవారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన క్షణాలు తనకు మరపురానివని గుర్తు చేసుకునేవారు. వాజ్‌పేయి కొంతకాలం జర్నలిస్టుగా కూడా రాణించారు.సినీ ప్రియుడు వాజ్‌పేయి సినీ ప్రియుడు. పాత హిందీ సినిమాలు బాగా చూసేవారు. తీస్రీ కసమ్, దేవదాస్, బందినీ వంటివి ఆయన ఆల్‌టైం ఫేవరెట్ హిందీ సినిమాల్లో కొన్ని. లతా మంగేష్కర్, ముకేశ్, ఆయన అభిమాన గాయనీ గాయకులు. ‘మీకూ నాకూ ఎన్నో పోలికలు. ఇద్దరమూ ఒంటరితనమే. ఇంగ్లీష్ లో నా పేరు (అటల్)ను తిరగేస్తే మీ పేరు (లత) వస్తుంది’ అంటూ ఓసారి లతా మంగేష్కర్తో చమత్కరించారట! అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా బాగా ఇష్టపడేవారు. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వై తనకిష్టమైన సినిమా అని తరచూ చెప్పేవారు. అలాగే బార్న్ ఫ్రీ, గాంధీ సినిమాలు కూడా. వాజ్‌పేయి కవితలకు పలువురు గాయకులు ప్రాణం పోయడం మరో విశేషం. ఆయన రాసిన ‘క్యా ఖోయా, క్యా పాయా’, ‘దూర్ కహీ కోయీ రోతా హై’, ‘ఝుకీ న ఆంఖే’ వంటి వేదనాభరిత కవితలను గజల్ సమ్రాట్ జగ్జీత్సింగ్ తన గళంతో అజరామరం చేశారు. శరత్, ప్రేమ్‌చంద్ సాహిత్యమన్నా వాజ్‌పేయికి ప్రాణం. ఎమర్జెన్సీ వేళ జైల్లోనూ కవితా రచన చేసిన కళాపిపాసి వాజ్‌పేయీ. అడ్వాణీ ఆయనకు ఆజన్మాంతం ప్రియమిత్రుడు. తనతో కలిసి ఢిల్లీ వీధుల్లో స్కూటర్‌పై చక్కర్లు కొట్టేవారు. పానీపూరీ, చాట్ వాజ్‌పేయి ఎంతో ఇష్టంగా తినేవారని అడ్వాణీ చెబుతారు. ఆయన చేయి తిరిగిన వంటగాడే గాక మంచి భోజనప్రియుడు కూడా.చావు అయుష్షెంత, రెండు క్షణాలేగా! మరి జీవితమేమో ప్రగతిశీలం, ఒకటీ రెండు నాళ్లలో ముగిసేది కాదు ప్రధానిగా ఒకనాటికి మాజీని అవుతానేమో. మాజీ కవిని మాత్రం ఎప్పటికీ కాలేను మిత్రులను మార్చగలం గానీ పొరుగువారిని మార్చుకోలేం భారతీయులుగా మనమంతా ఉత్కృష్ట నాగరికతకు వారసులం. శాంతే మన జీవిత గీతిక అధికారం కోసం పార్టీని చీల్చాల్సి, కొత్త గ్రూపులు కట్టాల్సే వస్తే అలాంటి అధికారాన్ని తాకనైనా తాకను పేదరికం బహుముఖీనం. దాన్ని కేవలం డబ్బు, ఆదాయం, విద్య, ఆరోగ్య పరామితుల్లో కొలవలేం పుడమి వయసు లక్షల ఏళ్లు. మనిషివి అంతులేని జీవన గాథలు. కానీ మన దేహానికి హద్దులున్నాయి.శత శరత్కాలాల వాణిని విన్నాం. అది చిట్టచివరిసారి తట్టినపుడైనా మనసు తలుపు తెరుద్దాంపాలిటిక్స్తో విసిగిపోయా. వాటిని వదిలేద్దామనుకుంటున్నాను. కానీ అవి నన్ను వదిలేలా లేవుస్వేచ్ఛకు సంకెళ్లు వేద్దామనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. నిప్పుతో చెలగాటాలొద్దు. పక్కింటికి నిప్పుపెడితే ఆ దావాగ్ని మీ ఇంటినీ కాల్చేస్తుంది–వాజ్‌పేయి -
పుట్టిన రోజు వేడుకలకని పిలిచి... అవమానించడంతో బాలుడి ఆత్మహత్య
బస్తీ (యూపీ): పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించారు. వచ్చిన బాలుడి బట్టలిప్పించారు. మీద మూత్ర విసర్జన చేశారు. ఆ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. వీడియోను ఫోన్ నుంచి తీసేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వినిపించుకోలేదు. ఫిర్యాదు చేస్తే పోలీసులూ పట్టించుకోలేదు. అవమానం భరించలేక 17ఏళ్ల దళిత బాలుడు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగింది. సంత్ కబీర్‌నగర్ జిల్లాకు చెందిన బాలుడు బస్తీ జిల్లాలోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ రాత్రి గ్రామస్తులు కొందరు బర్త్ డే పారీ్టకి బాలుడిని ఆహా్వనించారు. అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు అతడిని బట్టలు విప్పి, చితకబాదారు. మూత్ర విసర్జన చేసి అవమానించారు. అంతేకాదు ఉమ్మివేసి నాకాలని బలవంతం చేశారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియోలో బంధించారు. జరిగిన అవమానాన్ని బాలుడు ఇంట్లో చెప్పాడు. వీడియోను డిలీట్ చేయాలని కుటుంబ సభ్యులు వారిని కోరినా వినలేదు. దీంతో వారిపై కెపె్టన్గంజ్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎస్హెచ్ఓ నిరాకరించారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అవమానాన్ని భరించలేక సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాధితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో ఎస్పీ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కెపె్టన్గంజ్ ఎస్హెచ్ఓ దీపక్‌కుమార్ దూబేను సస్పెండ్ చేశారు. బాలుడి మేనమామ ఫిర్యాదు మేరకు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. -
సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!
-
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
పులివెందులలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
నగరిలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
-
జిల్లాల వారీగా ఘనంగా YS జగన్ పుట్టినరోజు వేడుకలు
-
వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
-
కర్నూలులో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
#HBDYSJAGAN ఎన్ఆర్ఐల గ్రాండ్ సెలబ్రేషన్స్
-
HBDYSJAGAN: వైఎస్ జగన్ బర్త్‌డే వేడుక ఫొటోలు
-
సిస్టర్‌కు విషెస్ తెలిపిన గ్లోబల్ స్టార్.. సోషల్ మీడియాలో పోస్ట్!
మెగా హీరో రామ్ చరణ్ తన చెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మెగా డాటర్ నిహారిక కొణిదెల బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విష్ చేశారు. హ్యాపీ బర్త్ డే నిహారిక.. వచ్చే ఏడాదిలో నువ్వు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ చెర్రీ ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. తనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు.కాగా.. మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కనుంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. Happy birthday to dearest Niharika. Wishing you more success in the coming year.!! pic.twitter.com/IxfMfmf1kr— Ram Charan (@AlwaysRamCharan) December 18, 2024 -
నీలి కళ్ల పోలిక.. ఈ హీరోయిన్ కెరీర్ కొంపముంచింది! (ఫొటోలు)
-
మెగా కోడలు లావణ్య త్రిపాఠి బర్త్ డే.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? (ఫొటోలు)
-
వివాదాలకు దూరం.. విక్టరీ వెంకటేశ్ ఎందుకంత స్పెషల్? (ఫొటోలు)
-
హీరోలతో రిలేషన్ రూమర్స్.. 'మ్యాగీ' కాంట్రవర్సీ.. రెజీనా ఇప్పుడేం చేస్తోంది? (ఫొటోలు)
-
స్టయిలిష్‌గా...
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా గురువారం (డిసెంబరు 12) వెంకటేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఆయన స్టయిలిష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలోని రెండో పాట ‘మీనూ... ప్రోమోను నేడు రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. -
15 ఏళ్లకే పెళ్లి.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు.. సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న నటి!
-
Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ నేటితో (2024 డిసెంబర్ 12) 84 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శరద్ పవార్ 1940, డిసెంబర్ 12న జన్మించారు. ఆయన తన రాజీకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అయితే కాంగ్రెస్‌ను వీడి సొంతంగా పార్టీ వ్యవస్థాపించడం ఆయన జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది. ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే పుస్తకంలో ఆయన జీవితానికి సంబంధించిన పలు అంశాలు కనిపిస్తాయి. నాడు 12వ లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఫ్రంట్‌లో గందరగోళం ఏర్పడిందని ప్రముఖ రచయిత రాజ్‌కమల్ ప్రకాశన్ ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని వివరాల ప్రకారం.. అప్పటికేప్పటికే పవార్, సోనియా గాంధీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పవార్ లోక్‌సభలో పార్టీ నేతగా ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కోసం పవార్ స్వయంగా సోనియా గాంధీతో చర్చించి, ఆమె ఆమోదం తీసుకున్నారు. జాబితాను లోక్‌సభ స్పీకర్‌కు పంపారు. మర్నాడు నాటి స్పీకర్ జిఎంసీ బాలయోగి.. పవార్‌కు ఫోన్ చేసి.. ‘నాకు ఇప్పుడొక సమస్య ఏర్పడింది. మీ పార్టీ నుంచి నాకు రెండు జాబితాలు అందాయి. కాంగ్రెస్ చీఫ్ డైరెక్టర్ పీజే కురియన్ నాకు మరో జాబితా పంపారు. ఈ రెండు జాబితాల్లోనూ పేర్లు వేర్వేరుగా ఉన్నాయి’ అని అన్నారు.లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకునిగా ఉన్నందున, కమిటీ సభ్యుల జాబితాను స్పీకర్‌కు సమర్పించడంపై శరద్ పవార్‌కు హక్కు ఉంది. అయితే దీనిని అతిక్రమిస్తూ మరో జాబితా విడుదలైంది. రెండో జాబితా ఫోటోకాపీ అందిన తర్వాత పవార్ వివరాలు తెలుసుకునేందుకు కురియన్ను సంప్రదించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి సూచనల మేరకే రెండో జాబితాను సిద్ధం చేసినట్లు వారి మాటల్లో వెల్లడైంది. వెంటనే పవార్ స్వయంగా సోనియాను కలిశారు. సోనియాతో మీరు రూపొందించిన జాబితాను ఉపసంహరించుకోవాలని పవార్‌ను కోరారు.1999 మే 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆమె విదేశీయురాలనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమావేశంలో అర్జున్ సింగ్, ఏకే ఆంటోనీ, గులామ్‌నబీ ఆజాద్, అంబికా సోనీ తదితరులు సోనియాపట్ల తమ విధేయతను ప్రకటించారు. అయితే పీఏ సంగ్మా ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. సంగ్మాకు శరద్ పవార్, తారిఖ్ అన్వర్ మద్దతు పలికారు. కొద్దిరోజుల తరువాత పార్టీ ఈ ముగ్గురినీ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. అనంతరం ఈ ముగ్గురూ మరికొందరు నేతల సహాయంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు.ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి -
ఎవర్గ్రీన్ స్టైలిష్ స్టార్.. తలైవా రజినీని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
దేశం కోసం క్యాన్సర్‌ను లెక్కచేయని యోధుడు.. హ్యాపీ బర్త్‌డే యువీ (ఫోటోలు)
-
Pranab Mukherjee: 13 అశుభం.. ఆ మాజీ రాష్ట్రపతికి అత్యంత శుభం?
ఈరోజు డిసెంబరు 11.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జన్మదినం. ఆయన 1935, డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా మిరాటి గ్రామంలో జన్మించారు. 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు. 2020 ఆగస్టులో కన్నుమూసిన ప్రణబ్ ముఖర్జీ జీవితంలో 13వ నంబరుకు ప్రత్యేక స్థానముంది.చాలామంది 13వ నంబరును అశుభ సంఖ్యగా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో 13వ నంబరుపై ఉండే భయాన్ని ట్రిస్కైడెకాఫోబియా అంటారు. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలలోని ప్రజలు 13 సంఖ్యను అశుభ సూచికగా చెబుతారు. దీనివెనుక పలు కారణాలను కూడా చెబుతుంటారు. అయితే ఇదే 13వ సంబరు ప్రణబ్ ముఖర్జీ జీవితంలో అదృష్ట సంఖ్యగా మారింది. ఆయన జీవితంలోని అన్ని ముఖ్యమైన సంఘటనలు 13వ నంబర్‌తో ముడిపడి ఉన్నాయి.ప్రణబ్ ముఖర్జీ వివాహందివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వైవాహిక జీవితం 13వ సంఖ్యతో ప్రారంభమైంది. ఆయన 1957, జూలై 13న వివాహం చేసుకున్నారు.రాజ్యసభకు..ప్రణబ్ ముఖర్జీ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి సన్నిహితునిగా పేరొందారు. ఆమె ప్రణబ్ ముఖర్జీని 1969లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు పంపారు. ప్రణబ్ ముఖర్జీ మొదటిసారిగా 1969 జూలై 13న పార్లమెంటులో ప్రవేశించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా..యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ప్రణబ్ ముఖర్జీ పేరు తెరపైకి వచ్చిన తేదీ కూడా 13 కావడం విశేషం. 2012, జూన్ 13న యూపీఏ ముందుకు రెండు పేర్లు వచ్చాయి. ఒకరు ప్రణబ్ ముఖర్జీ. మరొకరు హమీద్ అన్సారీ. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ పేర్లను మమతా బెనర్జీ అందరి ముందుకు తీసుకువచ్చారు.13వ రాష్ట్రపతిగా..ప్రణబ్ ముఖర్జీ దేశ 13వ రాష్ట్రపతి అయ్యారు. ఈ సమయంలో ఆయనకు ప్రభుత్వం 13వ నంబరు బంగ్లాను కేటాయించింది. ప్రణబ్ ముఖర్జీ 1996 నుండి 2012 వరకు ఢిల్లీలోని తల్కటోరిలోని 13వ నంబర్ బంగ్లాలో నివసించారు. 13వ నంబర్‌తో ప్రణబ్ ముఖర్జీకి ఉన్న అనుబంధం ఆయన జీవితంలోని చిరస్మరణీయ క్షణాలుగా మారాయి. ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
మా ఇంటిదేవతకు హ్యాపీ బర్త్‌డే : బాలీవుడ్ బ్యూటీ సంబరాలు (ఫొటోలు)
-
ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది – బెల్లంకొండ సురేష్
‘‘శ్రీహరి హీరోగా నటించిన ‘సాంబయ్య’ (1999) సినిమాతో నిర్మాతగా నా ప్రయాణం ప్రారంభమైంది. ప్రొడ్యూసర్‌గా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్నేళ్లలో 38 సినిమాలు చేశాను. ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది. డబ్బు, పేరు, హోదా అన్నీ ఇక్కడే సంపాదించుకున్నాను. ఈ ప్రయాణం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు, నేడు (డిసెంబర్ 5) తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం బెల్లంకొండ సురేష్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో మోహన్‌బాబుగారు నాకు గాడ్ ఫాదర్. నాకు ఎవరూ సపోర్ట్ లేనప్పుడు ఆయన తన సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్ని చేశారు. శ్రీహరిగారితో తీసిన ‘సాంబయ్య’ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే శ్రీహరిగారు, ఆ సినిమా డైరెక్టర్ కేఎస్ నాగేశ్వర రావుగారు మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. శ్రీహరిగారు మంచి నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. ఒక ఫ్రెండ్‌గా ఆయన పిల్లల భవిష్యత్‌కి నా వంతు బాధ్యతగా అవసరమైనప్పుడు చేయూతనిస్తాను. 2015లో వచ్చిన ‘గంగ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాటు సినిమా నిర్మించలేదు నేను. మా అబ్బాయిలు సాయి శ్రీనివాస్, సాయి గణేశ్ బయట బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు... అందుకే ఇన్నేళ్లు విరామం ఇవ్వాల్సి వచ్చింది. శ్రీనివాస్ కెరీర్ సెట్ అయ్యింది. పెళ్లి కూడా కుదిరింది. వచ్చే ఏడాది చేసుకుంటాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. గణేశ్ తన కెరీర్ సెట్ చేసుకుంటున్నాడు. రెండు మంచి ప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నాయి. నా రీ ఎంట్రీలో భాగంగా మా అబ్బాయిలతోనే ఫిబ్రవరి, ఏప్రిల్‌లో రెండు కొత్త ప్రాజెక్ట్స్ప్రారంభిస్తాను. ఈ రెండు సినిమాలతో కొత్త దర్శకులని పరిచయం చేస్తున్నాను. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ని 4కే క్వాలిటీలో సిద్ధం చేశాను. రవితేజ బర్త్‌డేకి (జనవరి 26) రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
మంచువారి అమ్మాయిలు..అరీ & వివీ హ్యాపీ బర్త్‌డే: తాతను మించిపోతారా!(పోటోలు)
-
ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్.. ఆ వీడియోలతో చెక్ పెట్టిన దంపతులు!
సినీ సెలబ్రిటీలపై రూమర్స్ రావడం ఈ రోజుల్లో అయితే సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా డేటింగ్, డివోర్స్ గురించి ఎక్కువగా వింటుంటాం. ఈ సోషల్ మీడియా యుగంలో రూమర్స్ రాకెట్ వేగంతో నెట్టింట వైరలవుతున్నాయి. అలా గత కొన్ని నెలలుగా పలువురు సినీతారలపై కూడా ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ జంట ఐశ్వర్వరాయ్- అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు.వీరిద్దరిపై గత కొన్ని నెలలుగా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. పెళ్లి, బర్త్ డే వేడుకల్లో ఐశ్వర్య సింగిల్‌గా కనిపించడంతో అవీ మరింత బలపడ్డాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. తమపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ కూడా ఇవ్వలేదు.అయితే గతనెల ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు 13వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ పార్టీకి డెకరేషన్ చేసిన జతిన్, నీలంలకు కృతజ్ఞతలు చెబుతూ కనిపించార ఐశ్వర్య-అభిషేక్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఆరాధ్య పుట్టిన రోజు వేడుకలో అభిషేక్ కనిపించడంతో వీరిద్దరి విడాకుల వార్తలకు ఇక చెక్ పడినట్లైంది. కాగా.. అభిషేక్ ఇటీవల ఐ వాంట్ టు టాక్ అనే చిత్రంలో కనిపించారు.భార్య మాట వినాలంటూ సలహా..తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల ఈవెంట్‌కు హాజరైన అభిషేక్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకున్న పురుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెళ్లి అయిన ప్రతి వ్యక్తి తన భార్య మాటే వినాలని గుర్తు చేశారు. ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతుంటా.. నా భార్య ఏం చెప్పినా వింటా అంటూ ముంబయిలో జరిగిన ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో సరదాగా కామెంట్స్ చేశారు.అంతేకాకుండా తన కూతురు ఆరాధ్యను సంతోషంగా పెంచినందుకు ఐశ్వర్యకు అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. నేను బయటకు వెళ్లి సినిమాలు చేయడం కూడా నా అదృష్టం.. ఎందుకంటే ఆరాధ్యతో పాటు ఇంట్లోనే ఉండి ఐశ్వర్య చూసుకుంటుందని నాకు తెలుసని అన్నారు. ఈ విషయంలో ఐశ్వర్యకు నా కృతజ్ఞతలు.. మన పిల్లలు ఎప్పటికీ మనల్ని వారి జీవితంలో మొదటి వ్యక్తిగానే చూస్తారని అభిషేక్ తెలిపారు. View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) -
హ్యాపీయెస్ట్ బర్త్‌డే మై బడ్డీ : గాయని బర్త్‌డే విషెస్ వైరల్ (ఫోటోలు)
-
కాశీలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న రాశీఖన్నా (ఫొటోలు)
-
మాటల్లో వర్ణించలేను: బుమ్రా భావోద్వేగం.. రోహిత్ శర్మ భార్య రితికా రిప్లై వైరల్(ఫొటోలు)
-
CSK లెజెండ్ సురేష్ రైనా ఫ్యామిలీ ఫొటోస్..మీరు ఒక్క లుక్ వేయండి
-
అనుకోని తప్పటడుగులు.. లేదంటే ఓ రేంజ్ హీరో అయ్యేవాడేమో! (ఫొటోలు)
-
ఇద్దరు దిగ్గజాల ముద్దుల మనవడు.. త్వరలో మళ్లీ పెళ్లి.. చైతూ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
కుమారుడి బర్త్ డే.. వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తండ్రి, కుమారుల కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ణ జోడీగా హీరోయిన్గా నటించింది. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా సుధీర్ బాబు తన కుమారుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఆయన కుమారుడు చరిత్ మానస్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఈ రోజు నాకు ప్రత్యేకమంటూ కుమారుడిపై ప్రేమను చాటుకున్నారు. చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా, సోదరి మంజుల కూడా సందడి చేశారు.కాగా.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి కుమార్తె ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని బర్త్ డే వేడుకల్లో సుధీర్ బాబు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసింది. On your special day, I want you to know how much I love and cherish you. You're growing up to be an incredible individual! Happy birthday, cherry ❤️ @Just_Charith pic.twitter.com/7HGrRdno55— Sudheer Babu (@isudheerbabu) November 22, 2024 -
ఓకే ఫ్రేమ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీ.. చాలా రోజుల తర్వాత ఇలా! (ఫోటోలు)
-
ఐశ్వర్యారాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య బర్త్ డే స్పెషల్.. అరుదైన ఫోటోలు
-
బాయ్ ఫ్రెండ్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన హాట్ బ్యూటీ
-
బన్నీ ముద్దుల కూతురు అల్లు అర్హ బర్త్ డే.. స్పెషల్ పిక్స్ (ఫోటోలు)
-
అల్లు అర్హ బర్త్ డే.. ముద్దుల కూతురికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహరెడ్డి గారాలపట్టి అల్లు అర్హ ఇటీవల రియాలిటీ షోలో కనిపించింది. తండ్రితో కలిసి పాల్గొన్న అర్హ అచ్చ తెలుగులో పద్యం చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇవాళ బన్నీ ముద్దుల కూతురు అర్హ తన ఎనిమిదో పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఫ్యాన్స్ అభిమాన హీరో కూతురికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.అయితే అల్లు అర్జున్ తన కూతురి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 8 సంవత్సరాల స్వచ్ఛమైన ఆనందం.. నా లిటిల్ అర్హ నా జీవితాన్ని మధురంగా మార్చింది.. నీపై అనంతమైన ప్రేమతో మీ నాన్న అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అల్లు స్నేహరెడ్డి తన గారాలపట్టికి బర్త్ డే విషెస్ తెలిపింది. అర్హకు సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై క్యూటెస్ట్, స్వీటెస్ట్ బేబీ..మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం అర్హ' అంటూ పోస్ట్ చేసింది. మా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన రోజు అంటూ తమ ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
డేటింగ్లో ఆదిపురుష్ భామ.. బాయ్‌ఫ్రెండ్‌కు స్పెషల్ విషెస్
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. ఈ ఏడాది క్రూ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల దో పట్టి మూవీలోనూ కనిపించింది. అయితే ఇటీవల విదేశాల్లో వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన బర్త్ డే వేడుకలు సైతం విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఆ పార్టీలో ఆమె బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా కూడా ఫోటోల్లో కనిపించారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.తాజాగా ఇవాళ కబీర్ బహియా బర్త్ డే సందర్భంగా అతనికి విషెస్ తెలిపింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. హ్యాపియస్ట్ బర్త్ డే అంటూ లవ్ సింబల్‌ను జోడించింది. ఈ పోస్ట్ చూస్తే వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ జంట డేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. కబీర్ బహియా యూకేలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం.అంతేకాకుండా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, ఆమె ప్రియుడు స్టెబిన్ బెన్ సైతం కబీర్ దహియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా కబీర్, కృతి కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా.. కృతి చివరిసారిగా నటించిన దో పట్టి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో కాజోల్, షాహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
ఘనంగా రోజా పుట్టిన రోజు వేడుకలు
-
కూతురు బర్త్ డే.. తెగ మురిసిపోతున్నహీరోయిన్ (ఫొటోలు)
-
నేనెంతో అదృష్టవంతురాలిని మమ్మా: సానియా మీర్జా బర్త్‌డే స్పెషల్(ఫొటోలు)
-
50 వేల పాటలు పాడిన సుశీలకు ఇప్పటికీ ఆ పాట విషయంలో బాధే (ఫొటోలు)
-
స్ఫూర్తిమంతమైన విజయపథంలో... సీఎం రేవంత్ రెడ్డి
ప్రత్యర్థులు ఎన్ని అవరోధాలు కల్పించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు అనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంత స్తబ్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో రేవంత్ పాత్ర అంతా ఇంతా కాదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక దూకుడుగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. ఈ సమయంలో పార్టీలో సీనియర్లు, జూనియర్లనే భేదం లేకుండా అందరినీ కలుపుకు పోయారు. కేసీఆర్‌ను గద్దెదించుతానని శపథం చేసి నిజంగానే ఆయన్నిఇంటికి పంపారు. 2023, డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ పదవీ ప్రమాణం స్వీకారం చేసి ప్రజా పాలనను ప్రారంభించారు.రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా) వంగూర్ మండలం కొండారెడ్డి పల్లెలో జన్మించారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్ పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ అయ్యారు. 2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు.మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభ జన తర్వాత... అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా, మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా అత్యుత్తమ పని తీరును కనబరిచారు. దీంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో 2021లో రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది.అన్నీతానై 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తిచూపారు. వారి అవినీతిని బయట పెట్టారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కింద వైద్య చికిత్సకు పది లక్షల వరకు సాయం పెంచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. గత 11 నెలల్లో తెలంగాణలో మహిళలు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ ట్రిప్స్ ఉపయోగించు కున్నారు. దీని వల్ల మహిళలకు 3,433 కోట్ల రూపా యలు ఆదా అయ్యాయి. రుణమాఫీని బీఆర్ఎస్ పదేళ్లలో సక్రమంగా అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని కేవలం 8 నెలల్లోనే అమలు చేసింది కాంగ్రెస్. 22 లక్షల 22 వేల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. పేద లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ను ఇస్తోంది.చదవండి: పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?కేవలం 11 నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో వేల కొలది ఉద్యోగాలను భర్తీ చేశారు. మూసీ నది పునరుజ్జీవానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూని వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నారు. 11 నెలల కాలంలోనే బీఆర్ఎస్ పాలనలోని చీకట్లను రేవంత్ రెడ్డి పారదోలి తెలంగాణను అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చేస్తున్నారు. అటువంటి ప్రియ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు!- వెలిచాల రాజేందర్రావు (Velichala Rajender Rao)కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి(నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం) -
నా చందమామ.. నా చిన్నికన్నా.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ (ఫొటోలు)
-
కోహ్లికి స్పెషల్ విషెస్: అక్క, అన్న పిల్లలతో విరాట్ రేర్ ఫొటోలు
-
Nita Ambani birthday: దీపాలతో వేడుక : ఉత్సాహంగా చిన్న కోడలు
రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ వ్యాపారవేత్త ,పరోపకారి, నీతా అంబానీ 60వ పుట్టిన రోజు (నవంబరు 1). ఈ సందర్భంగా కొత్తకోడలు, నీతా చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, రాధిక మర్చంట్, కంపెనీ సిబ్బంది ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్ఎంఏసీసీ కూడా నీతా అంబానీకి స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసింది. Paltan, join us in wishing Mrs. Nita Ambani, a very Happy Birthday! 💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/MQlPXKqLGx— Mumbai Indians (@mipaltan) November 1, 2024అలాగే పలువురు సెలబ్రిటీలు నీతా అంబానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. ఐపీఎల్టీం ముంబై ఇండియన్స్ కూడా ఎక్స్ ద్వారా విషెస్ తెలిపింది. Today, on the birthday of our Founder and Chairperson, Mrs. Nita Ambani, we celebrate her passion for the arts! pic.twitter.com/Sq47Fpg55r— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2024నీతా బర్త్‌డేను కంపెనీ సిబ్బంది దీపాలతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేశారు. దీపాలను వెలిగించిన పళ్లెంతో ఆమెకు హారతి ఇచ్చారు. హ్యాపీ బర్త్‌డే పాటను ఆలపించారు. దీంతో నీతా అంబానీ ఆనందంతో మెరిసి పోయింది. ఈ వేడుకలో చిన్నకోడలు రాధిక మర్చంట్ ఉత్సాహంగా పాల్గొంది. పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గులాబీ రంగు చీరలో మెరిసారు. మెడలో మూడు పేటల ముత్యాల హారం, మ్యాచింగ్ చెవిపోగులు, రింగుల జుట్టుతో మరింత అందంగా కనపించారు. అత్తగారికి తగ్గట్టుగా చోటి బహు, రాధిక మర్చంట్ కూడా గులాబీ రంగు పూల దుస్తుల్లో మెరిసింది. -
ప్రియుడితో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు
-
నం.1 నెపోటిజం బాధితురాలు.. ప్రతిసారి విమర్శలే.. బ్యాడ్ లక్ హీరోయిన్! (ఫొటోలు)
-
అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది!
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగువారికి సుపరిచితమే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది అనన్య పాండే. ఇవాళ తన 26 పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల సీటీఆర్ఎల్ మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కాల్ మీ బే సీజన్-2లో నటిస్తోంది.అంబానీ పెళ్లిలో సందడి..ఇదిలా ఉండగా.. గతంలో అంబానీ పెళ్లిలో అనన్య పాండే సందడి చేసింది. ఆ సమయంలో మోడల్ వాకర్ బ్లాంకోతో కలిసి హాజరైంది. దీంతో వీరిద్దరిపై అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ పోస్టులు పెట్టారు. అయితే డేటింగ్‌పై అనన్య ఇప్పటివరకు స్పందించలేదు.ఐ లవ్ యూ అంటూ పోస్ట్అయితే ఇవాళ అనన్య పాండే బర్త్ డే కావడంతో వాకర్ బ్లాంకో విషెస్ తెలిపారు. ఇన్‌స్టా స్టోరీస్‌లో అనన్య ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు. 'హ్యాపీ బర్త్ డే బ్యూటీ.. యూ ఆర్ సో స్పెషల్.. ఐ లవ్ యూ అనీ' అంటూ రొమాంటిక్‌గా విష్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరు డేటింగ్ రూమర్స్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తాజా పోస్ట్‌తో ఈ జంట ప్రేమలో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది.తొలిసారిగా ఆ పెళ్లిలోనేకాగా.. అనన్య, వాకర్లు మొదటిసారిగా జూలైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహంలో జంటగా కనిపించారు. ఈ పెళ్లిలో వాకర్ని తన భాగస్వామిగా పరిచయం చేసింది. ఈ వేడుకల్లో ఓ సాంగ్‌కు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. అంతకుముందు బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ జంట ఇద్దరూ విడిపోయారు. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఎక్కడా కూడా స్పందించలేదు. -
పవన్, చరణ్‌తో సినిమాలు కలిసిరాలేదు.. ఇప్పుడేమో పెళ్లి చేసుకుని! (ఫొటోలు)
-
రియల్ హీరోకు కేరాఫ్ అడ్రస్ మీరే.. బర్త్ డే రోజు ఏం చేశారంటే?
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం ఓ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో నటిస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్‌పై కోనేరు సత్యానారాయణ నిర్మించనున్నారు. ఇందులో రాఘవ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే. అయితే రాఘవ లారెన్స్ సినిమాల్లో మాత్రమే హీరో కాదు.. రియల్ లైఫ్‌లోనే హీరోనే. ఇప్పటికే ఆయన తన మాత్రం ఫౌండేషన్ ద్వారా పేదలు, రైతులకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు వికలాంగులు, రైతులు అవసరమైన ట్రాక్టర్లు, త్రీవీలర్స్ అందజేశారు. ఇవాళ తన బర్త్ డే కావడంతో పేద వితంతు మహిళలకు అండగా నిలిచారు. వారికి కుట్టు మిషన్స్ అందించి వారి కళ్లలో ఆనందం నింపారు. ఈ విధంగా సాయం అందించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు రాఘవ లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. Hi friends and fans, During my Mataram journey many widowed women requested for a stitching machine as it would give them an opportunity to work and fulfill their daily needs. As a new venture for my birthday tomorrow. I provided Tailoring machines to widowed women. I need all… pic.twitter.com/1vHBCcE1GQ— Raghava Lawrence (@offl_Lawrence) October 28, 2024 -
ఈ ‘టీమిండియా క్రికెటర్’ ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ అల్లుడు (ఫొటోలు)
-
తెలుగమ్మాయే కానీ తమిళంలో ఫేమస్.. రీసెంట్గా ప్రియుడితో పెళ్లి (ఫొటోలు)
-
బన్నీకి అభిమాని రిక్వెస్ట్.. వెంటనే రిప్లై ఇచ్చేశాడు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప-2 కౌంట్‌డౌన్ స్టార్ అయిపోయింది. మరో కొద్ది రోజుల్లో థియేటర్లలో పుష్పరాజ్ సందడి చేయనున్నాడు. డిసెంబర్ 6న థియేటర్లతో పాటు పలు రికార్డులు బద్దలు కానున్నాయి. ప్రస్తుతం పుష్ప టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.ఈ సంగతి పక్కన పెడితే బన్నీకి ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియానే మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇటీవల ఓ అభిమాని ఏకంగా యూపీ నుంచి సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. బన్నీని కలిసి ఆనందం వ్యక్తం చేశారు.(ఇది చదవండి: నేడు మీడియా ముందుకు 'పుష్ప2' యూనిట్)తాజాగా ఓ అభిమాని తన బర్త్ డే కావడంతో ఎక్స్ వేదికగా ఓ రిక్వెస్ట్ పెట్టాడు. మీకు చిన్నప్పటి నుంచి అభిమానిని.. ఇవాళ నా పుట్టినరోజు.. మీ నుంచి విషెస్ వస్తే నాకదే సంతోషం అంటూ అల్లు అర్జున్ను ట్యాగ్ చేశాడు. ఇది చూసిన బన్నీ వెంటనే అతనికి రిప్లై ఇచ్చాడు. హ్యాపీ బర్త్ డే అంటూ తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇది చూసిన అతను లవ్ యూ అన్న.. థ్యాంక్యూ సో మంచ్ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఏదేమైనా పాన్ ఇండియా హీరో ఫ్యాన్ ట్వీట్‌కు స్పందించడం అంటే బన్నీ సింప్లిసిటీ ఏంటో అర్థమవుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Happy Birthday 🖤— Allu Arjun (@alluarjun) October 24, 2024 -
ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేశారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ మరెవరో కాదు.. కల్కి మూవీలో బుజ్జిగా అలరించిన కారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. బుజ్జి పేరుతో ఉన్న ట్విటర్లో హ్యాండిల్లో వీడియోను పోస్ట్ చేసింది కల్కి టీమ్.కాగా.. ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో బుజ్జి పేరుతో ఉన్న కారుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రిలీజ్‌కు ముందు పలు నగరాల్లో బుజ్జి సందడి చేసింది. ఈ సినిమాలో బుజ్జి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. కాగా.. బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.Happy Birthday BHAIRAVA - from your best friend #Bujji ❤️#Prabhas #Kalki2898AD pic.twitter.com/szhxo0xLqH— Bujji (@BelikeBujji) October 23, 2024 -
'అతను ఒక పవర్‌హౌస్'.. మంచువిష్ణు స్పెషల్ విషెస్!
రెబల్ స్టార్ ప్రభాస్‌కు మా అధ్యక్షుడు మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. భారతీయ సినిమాకు ప్రభాస్ ఒక పవర్‌హౌస్ లాంటివాడని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నాడని కొనియాడారు. నా సోదరుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని మంచు విష్ణు ట్విటర్లో రాసుకొచ్చారు.కాగా.. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ సైతం కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ డిఫరెంట్ స్టైల్లో విషెస్ తెలిపారు.(ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. మారుతి డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాల పాటు ఉన్న వీడియో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Wishing the powerhouse of Indian cinema, my brother #Prabhas, a very happy birthday! #Prabhas continues to conquer hearts and screens worldwide with his unmatched talent and dedication. Here’s to many more years of greatness! 🏆 #HappyBirthdayPrabhas pic.twitter.com/xX3Z26pApw— Vishnu Manchu (@iVishnuManchu) October 23, 2024 -
టాలీవుడ్ నే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక స్టార్ ప్రభాస్
-
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ట్విన్స్, ఐకాన్ ఇషా, ఆకాశ్ అంబానీ రేర్పిక్స్
-
బాక్సాఫీస్ బాహుబలి, మిస్టర్ ఫర్ఫెక్ట్, రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
కొడాలి నాని పుట్టిన రోజు.. ఫ్లెక్సీలను అడ్డుకున్న పోలీసులు
-
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. బర్త్ డే రోజే వచ్చేస్తున్నాడు!
రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న చిత్రం ది రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని తెగ ఆరా తీస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం ది రాజాసాబ్ టీమ్ అప్డేట్తో ముందుకొచ్చింది. మరో రెండు రోజుల్లో డార్లింగ్ బర్త్ డే కావడంతో డైరెక్టర్ మారుతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈనెల 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు బ్లాస్టింగ్ ఖాయమని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే అదే రోజున టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు ది రాజాసాబ్ టీమ్ రాయల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో రెబల్ స్టార్ న్యూ లుక్‌లో అదిరిపోయేలా కనిపించాడు.(ఇది చదవండి: ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్.. అది రెబల్ స్టార్ క్రేజ్!)ఇప్పటికే ది రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Swag turned up to the MAX 😎&Now….your Celebrations will go off in STYLE 😉 A ROYAL TREAT AWAITS on 23rd Oct 💥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/wEu31XSGFW— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024 -
యూనివర్సిటీ టాపర్.. అనుకోకుండా సినిమాల్లోకి.. ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ (ఫొటోలు)
-
బాలీవుడ్ హీరో తెలుగు సినిమా.. 100 కేజీల కేక్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్! (ఫొటోలు)
-
అలీరెజా కూతురు ఎంత క్యూట్‌గా ఉందో.. బర్త్‌డే పిక్స్ వైరల్
-
జపాన్‌లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా
పాన్ ఇండియా పుణ్యమా అని మన హీరోలకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ బోలెడంత మంది అభిమానులు ఉంటున్నారు. 'బాహుబలి'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కి మన దేశంతో పాటు జపాన్‌లోనూ లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇప్పుడు డార్లింగ్ ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజున రాజా సాబ్, కల్కి 2, సలార్ 2 సినిమాలకు సంబంధించి అప్డేట్స్ రావొచ్చని టాక్. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలుచోట్ల 'సలార్' రీ రిలీజ్ చేశారు. మిస్టర్ ఫెర్ఫెక్ట్, ఈశ్వర్, రెబల్ చిత్రాల్ని కూడా రీ రిలీజ్ చేస్తారు.ఇప్పుడు జపాన్‌లోనూ ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడంతో పాటు 'రాధేశ్యామ్' మూవీని రీ రిలీజ్ చేశారు. లేడీ ఫ్యాన్స్ చాలామంది ఈ సినిమాని చూసి ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ కావడంతో ఇక్కడి డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)I’m overjoyed to see our darling #Prabhas fans in Japan celebrating his birthday in Tokyo! They sent their heartfelt wishes to our Rebel Star ♥️😍#HappyBirthdayPrabhas pic.twitter.com/yEBj9FSbMY— Prasad Bhimanadham (@Prasad_Darling) October 19, 2024 -
అందమైన ఇంపాక్ట్ ప్లేయర్: భార్యకు టీమిండియా క్రికెటర్ బర్త్‌డే విషెస్ (ఫొటోలు)
-
రాధికా మర్చంట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
స్టార్ హీరోయిన్ చెల్లి.. తెలుగులో హిట్ సినిమాలు.. చివరకు పెళ్లి చేసుకుని! (ఫొటోలు)
-
దుబాయ్‌లో చిల్ అవుతున్న బర్త్‌డే గాళ్ (ఫొటోలు)
-
HBD ‘మహానటి’ : చీరకే వన్నె తెచ్చే దసరా బ్యూటీ (ఫోటోలు)
-
రజినీతో బంధుత్వం.. సినిమాకు రూ.10 కోట్లు.. అనిరుధ్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
ఫేట్ మార్చిన రజనీ, ధనుష్ సినిమాలు.. అదృష్టమంటే ఈ డస్కీ బ్యూటీదే (ఫొటోలు)
-
ఫ్యాన్స్ కి ఊహించని ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ మళ్ళి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడా!
-
ఊహించని స్టార్డమ్.. అంతే స్పీడ్‌గా డౌన్ ఫాల్.. పూజా హెగ్డే ఇప్పుడేం చేస్తోంది? (ఫొటోలు)
-
'హ్యాపీ బర్త్ డే అశ్వత్థామ'.. కల్కి టీమ్ స్పెషల్ వీడియో!
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా విడుదలైన రజినీకాంత్ వేట్టయాన్ మూవీలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన హిందీలో మాత్రమే ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బిగ్‌బీ ఇవాళ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.అమితాబ్ బర్త్ డే కావడంతో కల్కి టీమ్ స్పెషల్‌గా విషెస్ తెలిపింది. ఆయన కల్కి మూవీలోని సీన్స్‌తో వీడియోను రూపొందించింది. కల్కి షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో మెప్పించారు. హ్యాపీ బర్త్‌డే అశ్వత్థామ.. త్వరలోనే సెట్స్‌లో కలుసుకుందాం అంటూ బిగ్ బీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. అమితాబ్ కల్కి-2 మూవీలోనూ నటించనున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. Team #Kalki2898AD shares a special BTS video of @SrBachchan wishing him a very happy birthday!!🔥#HBDAmitabhBachchan@ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/FEj0xS2YAD— Telugu FilmNagar (@telugufilmnagar) October 11, 2024 -
రెండు చేతులతో రాత.. రాజీవ్ గాంధీతో చదువు.. అమితాబ్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
డైరెక్టర్ వి.వి.వినాయక్ బర్త్‌డే.. విషెస్ చెప్పిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
'సుమోలు' అనగానే గుర్తొచ్చేది వివి వినాయక్.. ఇప్పుడేం చేస్తున్నారు? (ఫొటోలు)
-
నా జీవితంలో నువ్వే ఇన్స్పిరేషన్: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాదిలో తండ్రిగా ప్రమోషన్ కొట్టేశాడు కూడా. హీరో మంచు మనోజ్- మౌనిక దంపతులకు పండంటి కూతురు జన్మించింది. ఏప్రిల్‌లో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.(ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)తాజాగా తన భార్య మౌనిక పుట్టిన రోజు కావడంతో మంచు మనోజ్ విషెస్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తన భాగస్వామికి బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా జీవితంలో సూపర్ వుమెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నాకు ప్రేరణగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు. పిల్లల కోసం నువ్వు రూపొందించిన ఎడ్యుకేషన్ గేమింగ్ యాప్ లాంఛ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మంచు మనోజ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మౌనికకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సంతోషాలు నింపావ్: మంచు లక్ష్మిమంచు మనోజ్ భార్య భూమా మౌనికకు నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. హ్యపీ బర్త్ డే మౌనిక.. మా జీవితాల్లో చాలా సంతోషాన్ని తీసుకొచ్చావ్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. మౌనికతో పాటు దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. కాగా.. మనోజ్- మౌనికల వివాహా వేడుక మంచు లక్ష్మి ఇంట్లోనే గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. అన్నీ తానై ముందుండి వారి పెళ్లిని జరిపించింది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
టీమిండియా స్టార్ క్రికెటర్ బర్త్‌డే.. లవ్ యూ అంటూ అక్క విషెస్! (ఫొటోలు)
-
గోవాలో ఫ్యామిలీతో అల్లు స్నేహ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Disha Patani: నా జీవితంలో ఆనందాన్ని నింపావ్.. కల్కి హీరోయిన్ ఎమోషనల్ (ఫోటోలు)
-
‘మరో ఏడాది.. మరింత అద్భుతంగా’: భార్యకు భారత క్రికెటర్ విషెస్(ఫొటోలు)
-
బ్యూటిఫుల్ ఐలాండ్‌లో సుకుమార్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
విఘ్నేశ్ శివన్ బర్త్ డే.. బుర్జ్ ఖలీఫా వద్ద సెలబ్రేషన్స్!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం దుబాయ్‌లో చిల్ అవుతోంది. సైమా వేడుకలకు హాజరైన ముద్దుగుమ్మ తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా భర్త బర్త్ డే వేడుకను దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ముందు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద విఘ్నేష్ శివన్ కోసం బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, నటుడు కవిన్ కూడా హాజరయ్యారు. కాగా.. అంతుకుముందు భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. నా జీవితంలో అన్ని నువ్వే అంటూ నయన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల జరిగిన సైమా- 2024 వేడుకల్లో నయనతార ఉత్తమ నటి అవార్డ్‌ను గెలుచుకుంది. విఘ్నేష్ శివన్ సైతం ఉత్తమ లిరిసిస్ట్ అవార్డ్ దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే నయనతార టెస్ట్ అనే చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా 'మన్నంగట్టి 1960' మూవీలో నటిస్తోంది. ఆ తర్వాత మూకుతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్ చిత్రాల్లో నటించనుంది. మరోవైపు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీక చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. -
హీరోయిన్ మీనా బర్త్ డే వేడుకల్లో శరత్‌కుమార్.. ఫోటోలు వైరల్
-
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
గుంటూరు, సాక్షి: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ ఖాతాలో జగన్ ఓ సందేశం ఉంచారు. Happy Birthday to Hon. PM Shri @narendramodi ji! May you lead a long, healthy and blessed life.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2024 ఇదీ చదవండి: మోదీ@74.. ఎవరేమన్నారంటే.. -
టీ20 వరల్డ్‌కప్ హీరో.. హ్యాపీ బర్త్‌డే సూర్య (ఫోటోలు)
-
కుమారుడి బర్త్ డే.. బాలీవుడ్ స్టార్ కపుల్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ మోస్ట్ ఫేమ్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. వీరిద్దరికీ ఓ కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం ఉన్నారు. ఇవాళ కుమారుడు యుగ్ తన 14వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అజయ్, కాజోల్ కుమారుడికి జన్మిదిన శుభాకాంక్షలు తెలిపారు. కొడుకుతో దిగన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. దీనికి సంబంధింటిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతుంటారు ఈ జంట. తమ పిల్లలతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే అజయ్ దేవగణ్ ఈ ఏడాది ప్రారంభంలో మైదాన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సింగం ఏగైన్, దే దే ప్యార్ దే-2 చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు కాజోల్ ప్రభుదేవా సరసన మహారాగ్ని అనే చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. కాగా..కాజోల్, అజయ్ 1994లోనే డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత వీరిద్దరు 1999లో వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
మా లిటిల్ సూపర్ హీరో.. అప్పుడే ఏడాది నిండింది!! (ఫొటోలు)
-
పుట్టినరోజు విషెస్.. 'సీతారామం' హీరో భార్యని చూశారా? (ఫొటోలు)
-
పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఇటీవల చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకుని బన్నీ విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే.అయితే కొద్ది రోజులుగా బన్నీ, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల మారుతీనగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన కామెంట్స్‌తో మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. తనకు నచ్చితే, తాను ఇష్టపడితే, అండగా నిల్చోవడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి తాను వెనుకాడను అని చెప్పాడు. ఎప్పుడైతే 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ స్టేట్ మెంట్ ఇచ్చాడో అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంది. తాజాగా బన్నీ.. పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతోనైనా ఈ ఫ్యాన్స్ వార్‌కు తెరపడుతుందేమో వేచి చూడాల్సిందే. బన్నీపై నోరు పారేసుకున్న జనసేన నేతలు..బన్నీ చేసిన కామెంట్స్‌పై ఏపీకి చెందిన కొందరు జనసేన నేతలు నోరు పారేసుకున్నారు. నీ సినిమాలు ఏపీలో ఎలా ఆడతాయో చూస్తామంటూ బహిరంగంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో అది కాస్తా బన్నీ, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్‌కు దారితీసింది. దీంతో తనను నమ్మినవారి కోసం ఎక్కడి వరకైనా వస్తానంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఫుష్ప-2 మూవీతో బిజీ..ఇకపోతే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశలో ఉంది. ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన చిత్రం.. నెల రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu— Allu Arjun (@alluarjun) September 2, 2024 -
మహేశ్ బాబు కుమారుడి బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన నమ్రత
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ బర్త్ డే వేడులకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రిన్స్ ఫ్యామిలీ గౌతమ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలను నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ గౌతమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. ప్రస్తుతం మహేశ్‌బాబు దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించునున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను అందించారు. ఈ మూవీ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించినున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
పుట్టిన రోజుకు కొత్త బట్టలు తెచ్చా లే నాన్నా!
ఉరవకొండ: ‘ఆజీం లే నాన్నా.. ఈ రోజు నీ పుట్టిన రోజు.. కొత్త బట్టలు తెచ్చాం. నీ స్నేహితులు, టీచర్లకు చాక్లెట్లు పంచిపెట్టాలి’ అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. పుట్టిన దినం రోజే ఓ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఉరవకొండ పట్టణంలో జరిగింది. వివరాలు.. స్థానిక పాత మార్కెట్ సమీపంలో చాపదేవుని గుడి వద్ద నివాసముంటున్న అయ్యర్ బాబా ఫకృద్దీన్ ఉరవకొండ పోలీసు స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు భార్య హుమేరా ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఆజీంబాషా (14) సంతానం. బాలుడు ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రయివేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ఉరవకొండలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఈ క్రమంలోనే రక్త కణాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో అత్యవసరంగా అనంతపురంలోని కార్పొరేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స ఫలించక బుధవారం ఉదయం అజీంబాషా కన్నుమూశాడు. శోకసంద్రం.. : బుధవారం అజీంబాషా జన్మదినం. కుమారుడి పుట్టినరోజును ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఇప్పటికే తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. కుమా రుడికి కొత్త దుస్తులు కూడా తెచ్చారు. సంతోషంగా ఉన్న సమయంలో ఆజీంబాషా మృతితో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ఎంతో ఉల్లాసంగా, అందరితో కలివిడిగా ఉండే ఆజీంబాషా మృతితో పాత మార్కెట్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉరవకొండ రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఏఎస్ఐ గురికాల శివ, కానిస్టేబుళ్లు కులశేఖర్‌రెడ్డి, ఓబుళేసు తదితరులు సంతాపం తెలిపారు. -
హనుమాన్ హీరో యాక్షన్ అడ్వెంచర్.. రిలీజ్ డేట్ ఇదే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద రాణించింది. అయితే తేజ సజ్జా ప్రస్తుతం మరో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం మిరాయి. ఇవాళ తేజ బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఘట్టంనేని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిరాయి గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ మూవీని ఎనిమిది భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, రితికా నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. Strap in for an adrenaline ride 😎The #SuperYodha is born 🥷⚡Team #MIRAI ⚔️ wishes the SUPER HERO, @tejasajja123 a very splendid birthday ❤️🔥Get ready to experience the Action-Adventure in cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥#HBDTejaSajja @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/DXvScUy0DP— People Media Factory (@peoplemediafcy) August 23, 2024 -
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్.. బన్నీ ట్వీట్‌కు స్పందించిన మెగాస్టార్!
ప్రస్తుతం టాలీవుడ్ అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్యన వార్ నడుస్తోంది. ఇటీవల మారుతీనగర్ సుబ్రమణ్యం ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో మళ్లీ ఫ్యాన్స్ రచ్చ నడుస్తోంది. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను ఉద్దేశించే బన్నీ అలా మాట్లాడారంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం మెగా ఫ్యాన్స్‌పై మండిపడుతున్నారు. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్‌గా మారిపోయింది.అయితే ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డేను పురస్కరించుకుని అల్లు అర్జున్ విషెస్ తెలిపారు. మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు. తాజాగా బన్నీ చేసిన పోస్ట్‌కు మెగాస్టార్ చిరంజీవి సైతం రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ డియర్ బన్నీ అంటూ చిరు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇక్కడితోనైనా ఫ్యాన్స్ మధ్య నెట్టింట వార్‌కు ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి. అసలు బన్నీ ఏమన్నారంటే...హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల వల్లే తాను హీరో అయ్యానని ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ బన్నీ మాట్లాడారు. అది ఫ్రెండైనా, బంధువైనా, నా అభిమానులైనా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అది కాస్తా బన్నీ, మెగా ఫ్యాన్స్‌కు మధ్య వార్‌కు దారితీసింది. గతంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైకాపా అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లగా.. మెగా ఫ్యాన్స్ విమర్శలు చేశారు. అందుకు కౌంటర్‌గానే ఇప్పుడు బన్నీ మాట్లాడారంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసారం ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు బన్నీ పుష్ప-2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. Thank you dear Bunny.— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024 -
Chiranjeevi Birthday: సుప్రీమ్ హీరో.. మెగాస్టార్‌గా ఎప్పుడు అయ్యారో తెలుసా..?
చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థాయి వేరు.. మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ‘స్వయంకృషి’తో నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విజయాలతో పాటు ఆపజయాలను కూడా చవిచూశారు. పరిశ్రమలో ఆయనకు ఎదురైన అవమానాలను కూడా నవ్వుతూనే హూందాగా తీసుకున్నారు. అందుకే ఆయన్ను మెగాస్టార్ అంటారు. చిరంజీవి అంటేనే ఒక శిఖరం అని ఆయన అభిమానులు కీర్తిస్తుంటారు. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మరిన్ని విషయాలు మీకోసం..సినిమా అభిమానుల్లో ఎప్పుడూ ఒక వార్ నడుస్తూనే ఉంటుంది. వారందరూ కూడా మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకుంటూ సోషల్‌మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తుంటారు. వారికి ఈ విషయం తెలియకపోవచ్చు వాళ్ల హీరోలకు కూడా ఫేవరేట్ హీరో చిరంజీవే అని.. మా హీరో రికార్టులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు ఆ రికార్డులను క్రియేట్ చేసిందే చిరంజీవి అని. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్ వరకు.. అప్పుడే సినిమాలు చూడటం మొదలుపెట్టిన 10 ఏళ్ల బుడ్డోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ల దాక అందరూ ఆయన ఫ్యాన్సే.. నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర..కోట్లాదిమందికి అతనొక ఆరాధ్య నటుడు అయ్యాడు.పునాదిరాళ్ళతో కొణిదెల కోటచెన్నైలోని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో 'పునాది రాళ్లు' సినిమాలో తొలిసారి నటించాడు. కానీ 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదల అయ్యింది. తొలి సినిమానే ప్లాప్ అయింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించారు. తర్వాత బాపు దర్శకత్వంలో 'మన వూరి పాండవులు' సినిమాలో చిరంజీవికి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు చిరుకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది.ఈ సినిమాలే మెగాస్టార్‌గా మార్చాయి.పునాదిరాళ్లుతో సినీ కెరీర్ ప్రారంభించిన చిరంజీవి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 80, 90వ దశకంలో వచ్చిన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ముఖ్యంగా ఖైదీ,శుభలేఖ,ఛాలెంజ్,దొంగ,అడవిదొంగ,పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోక సుందరి, అల్లుడా మజాకా,ముగ్గురు మొనగాళ్ళు,ముఠామేస్త్రి,ఘరానా మొగుడు, స్వయంకృషి, వేట, రుద్రవీణ, చంటబ్బాయి, కొండవీటి దొంగ, , ఆపద్భాందవుడు, హిట్లర్, స్నేహం కోసం లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు.చూడాలని ఉంది, బావగారూ బాగున్నారా, ఇంద్ర,ఠాగూర్,స్టాలిన్,శంకర్ దాదా సినిమాలతో మాస్ ఆడియన్స్‌ను మెప్పించాయి. రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి.. సినిమాలకు విరామం ఇచ్చారు. అనంతరం 2017లో 'ఖైదీ నెంబర్ 150'తో 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టారు. ఆ తర్వాత వచ్చిన 'సైరా నరసింహారెడ్డి'తో చిరు నటవిశ్వరూపం చూపించారు. వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేశాడు. త్వరలో విశ్వంభరతో మరోసారి తన సత్తా ఏంటో చూపించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు.డైరెక్టర్ సెలక్షన్ ఇలాచిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నేడు తన కొత్త సినిమా విశ్వంభర నుంచి టీజర్ విడుదల కానున్నట్లు సమాచారం. భోళా శంకర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత చిరు చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పూరీ చెప్పిన ఆటోజానీ కథలో సెకండ్ హాఫ్ తనకు నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తెలిపాడు. కథను బట్టే డైరెక్టర్ తప్ప.. దర్శకుడిని బట్టి కథ కాదన్నారు.సుప్రీమ్‌గా చివరి సినిమా, మెగాస్టార్‌గా మెదటి సినిమా ఇదేఇండస్ట్రీలో ఒక హీరోకు రెండు బిరుదులు ఉండటం చాలా తక్కువని చెప్పవచ్చు. మొదట 'సుప్రీమ్ హీరో'గా గుర్తింపు పొందిన చిరంజీవి.. ఆపై మెగాస్టార్‌గా ఎదిగాడు. 1988లో విడుదలైన 'మరణ మృదంగం' సినిమాతో చిరంజీవి.. మెగాస్టార్ అయ్యారు. ఈ సినిమా నుంచే టైటిల్స్‌లలో మెగాస్టార్ అని వెండితెరపై కనిపిస్తుంది. అయితే, ఈ సినిమాకు ముందు సుప్రీమ్ హీరో అనే ఉండేది. ఈ బిరుదు 'ఖైదీ' సినిమా వరకు ఉండేది. అలా చిరుకు సుప్రీమ్ హీరో, మెగాస్టార్ అనే ట్యాగ్ లైన్స్ ఉన్నాయి.సత్కారాలు2006 జనవరిలో భారత ప్రభుత్వం తరఫున అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి పద్మభూషణ్ పురస్కారం.. అదే ఏడాది నవంబర్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. 1998, అక్టోబర్ 2న 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న సేవా సౌకర్యాలు. నాలుగేళ్లు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను అందుకొన్నాయి. అనంతరం చిరంజీవికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించగా.. మే 10న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అందుకున్నారు.చిన్న సినిమాల ఈవెంట్లకు చిరు ఎందుకు వెళ్తారంటే..టాలీవుడ్ నుంచి ఆహ్వానం అందటమే ఆలస్యం. ఆయన ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా సినిమా ఈవెంట్లకు అతిథిగా వచ్చేస్తారు. అలా ఇతర హీరోల సినిమాల వేడుకలో పాల్గొన్ని మరింత క్రేజ్ తీసుకొస్తాడు. ముఖ్యంగా చిన్న సినిమాల ఈవెంట్‌కే చిరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయం గురించి మెగస్టార్ ఇలా చెప్పుకొచ్చారు. ' ఇలా వేడుకల్లో నేను ముఖ్య అతిథిగా పాల్గొనడం నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా నన్ను ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటాను. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహం ఇవ్వాలని ఆలోచిస్తా.' అని చిరంజీవి తెలిపారు.చిరు గురించి ఆసక్తికరమైన విషయాలు‘రుద్రవీణ’లోని పాటలు చిరంజీవికి చాలా ఇష్టమట. చిరుకే కాదు ఆయన సతీమణి సురేఖకు కూడా ఈ పాటలే ఇష్టమట. ఈ సినిమాలోని ‘నమ్మకు నమ్మకు ఈరేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని’అనే పాట అంటే తనకు చాలా ఇష్టమని గతంలో చిరంజీవి తెలిపారు.చిరంజీవి చేతి రాత అస్సలు బాగుండదట. ఆయన రాసిన దాన్ని ఆయనే మళ్లీ చదవలేకపోతాడట. సమయం దొరికినప్పుడల్లా చేతి రాతను మళ్లీ ప్రాక్టీస్ చేస్తుంటానని గతంలో చిరంజీవి చెప్పారు.చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయాను. సినిమాల్లోకి వచ్చిన తరువాత నాకు తెలియకుండానే అదొక హాబీగా మారిపోయింది’అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరు చెప్పారు.‘అంజి’ సినిమా కోసం ఓ షర్ట్‌ని రెండేళ్ల పాటు ఉతకకుండా వేసుకున్నాడట. ఈ సినిమా క్లైమాక్స్‌ని దాదాపు రెండేళ్ల పాటు తీశాడు దర్శకుడు కోడి రామకృష్ణ. క్లైమాక్స్‌లో చిరంజీవి వేసుకునే చొక్కా రెండేళ్ల పాటు అలాగే ఉతకకుండా ఉంచాల్సి వచ్చిందని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా తనకు, చిరంజీవికి మరుపురాని చిత్రమని చెప్పాడు .‘పసివాడి ప్రాణం' చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది.చిరంజీవి డాన్సులకే కాకుండా ఫైట్స్ కు కూడా పెట్టింది పేరు. ఆయన ఫైట్స్ శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. డూప్ లేకుండానే రిస్క్ తీసుకుంటారు.చిరంజీవి నటనకు అవార్డులు క్యూ కట్టాయి. తొమ్మిది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో పాటు నాలుగు నంది అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి.తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీలోనూ నటించిన చిరంజీవి హీరోగా ఓ హాలీవుడ్ మూవీ ఖరారైనా, అది కార్యరూపం దాల్చలేదు.పర్సనల్ వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడు చిరంజీవి అని తెలుసా..? ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే https://www.kchiranjeevi.com/ క్లిక్ చేయండి.ప్రపంచ సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ‘ఆస్కార్’. ఆ వేడుకలో (1987) అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా చిరంజీవి ఘనత సాధించారు.రష్యన్లోకి డబ్ అయిన తొలి తెలుగు సినిమా కూడా చిరంజీవి నటించిన ‘స్వయంకృషి’ కావడం విశేషం. -
క్లాస్ అయినా మాస్ అయినా.. వన్ అండ్ ఓన్లీ బాస్.. హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు
మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. తన సతీమణి సురేఖతో పాటు గురువారం తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు మెగాస్టార్‌కు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం చిరు దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రే రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. చిరు దంపతులతో పాటు సతీమణి సురేఖ, తల్లి అంజనా దేవి, కుమార్తె శ్రీజ, మనవరాలు ఉన్నారు. -
తిరుమల చేరుకున్న మెగాస్టార్ ఫ్యామిలీ.. వీడియో వైరల్!
మెగాస్టార్ చిరంజీవి మరో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈనెల 22న మెగాస్టార్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి నెలకొంది. ఆయన బర్త్ డే సందర్భంగా మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు సైతం చేపట్టనున్నారు. అంతేకాకుండా బ్లాక్‌బస్టర్ మూవీ దాదాపు 22 ఏళ్ల తర్వాత రీ రిలీజవుతోంది. ఇప్పటికే టికెట్స్ కూడా అమ్ముడైపోయాయి.చిరంజీవి తన జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బయలుదేరి వెళ్లారు. తన కుటుంబసభ్యులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. మెగాస్టార్‌తో పాటు భార్య సురేఖ, అమ్మ అంజనాదేవి కూడా ఉన్నారు. అక్కడే చిరంజీవి తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ కనిపించారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.రేపు చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్న కుటుంబ సభ్యులు💐😍🤗#MEGASTAR #MegastarChiranjeevi #Chiranjeevi #HappyBirthdayMegastar #Tirumala @KChiruTweets @JspBVMNaresh pic.twitter.com/x7xUQXYfAp— uppalapati Ram varma (@uppaalapatiRam) August 21, 2024 -
నిధి అగర్వాల్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన ‘రాజాసాబ్’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
భార్యను సర్ప్రైజ్ చేసిన భువీ (ఫోటోలు)
-
తెలుగులో తొలి సినిమా.. తమిళ హీరోతో పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరంటే? (ఫొటోలు)
-
మహేశ్ బాబు బర్త్ డే.. అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన ప్రిన్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈనెల 9న 50 వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రిన్స్ పుట్టినరోజు కావడంతో సినీతారలు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. అంతేకాకుండా అదే రోజు మురారి రీ రిలీజ్ కావడంతో థియేటర్ల వద్దఫ్యాన్స్ హడావుడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మహేశ్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.మహేశ్ బాబు తన ట్వట్‌లో రాస్తూ.. 'నా పుట్టినరోజున లభించిన ప్రేమ, సందేశాలు, ఆశీర్వాదాలతో ఉప్పొంగిపోయాను. మీలో ప్రతి ఒక్కరూ నా రోజును మరింత ప్రత్యేకంగా, ఎప్పటికీ గుర్తుండేలా మార్చారు. ఎల్లప్పుడూ మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. లవ్ యూ ఆల్' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ ఏడాది గుంటూరు కారం మూవీతో అలరించిన మహేశ్ బాబు.. మరో సినిమాకు రెడీ అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆయన నటించనున్నారు. ఇప్పటికే కథ సిద్ధం కాగా.. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి మహారాజ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. Overwhelmed with all the love, messages, and blessings I received yesterday on my birthday. Each one of you made my day extra special and memorable. For all the love and support you've always shown me, year after year... A big, big thank you 🙏 Love you all ♥️♥️♥️— Mahesh Babu (@urstrulyMahesh) August 10, 2024 -
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 49వ పుట్టినరోజు ఈరోజు (ఆగస్టు 10). ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా హేమంత్ సోరెన్ తన ఎక్స్ హ్యాండిల్లో ఒక చిత్రాన్ని షేర్ చేశారు. దానిలో పాటు హేమంత్ సోరెన్ ఇలా రాశారు.. ‘నా పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది నాటి ఒక జ్ఞాపకం నా మదిలో మెదిలింది. అదే ఈ ఖైదీ గుర్తు.. ఇది జైలు నుండి విడుదలైనప్పుడు నాపై ముద్రించారు. ఈ గుర్తు నాది మాత్రమే కాదు.ప్రజలు ఎన్నుకొన్న ముఖ్యమంత్రిని ఎటువంటి ఆధారాలు లేకుండా 150 రోజులు జైలులో ఉంచారు. అందుకే ఈ గుర్తు సామాన్య గిరిజనులకు, అణగారిన వారికి చెందినది. దోపిడీకి గురవుతున్నవారి విషయంలో ఏమేమి జరుగుతుంటాయో ఎవరికీ చెప్పనవసరం లేదు. అందుకే ఈ రోజు నేను మరింత దృఢంగా నిశ్చయించుకున్నాను.. దోపిడీకి గురవుతున్న అణగారిన, దళిత, వెనుకబడిన, గిరిజన, ఆదివాసీలకు మద్దతుగా పోరాడాలనే నా సంకల్పాన్ని బలపరుచుకుంటున్నాను.హింసకు గురవుతూ, న్యాయం అందని ప్రతి వ్యక్తికి, సమాజానికి మద్దతుగా నేను నా గొంతును విప్పుతాను. చట్టం అందరికీ సమానమే. అధికార దుర్వినియోగం లేని సమాజాన్ని మనం నిర్మించాలి. అయితే ఈ మార్గం అంత సులభం కాదు. ఇందుకోసం మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మనమంతా కలిస్తే ఈ సవాళ్లను అధిగమించగలమనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మన దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వమే మన బలం’ అని అన్నారు. आज अपने जन्मदिन के मौक़े पर बीते एक साल की स्मृति मेरे मन में अंकित है - वह है यह कैदी का निशान - जो जेल से रिहा होते वक्त मुझे लगाया गया। यह निशान केवल मेरा नहीं, बल्कि हमारे लोकतंत्र की वर्तमान चुनौतियों का प्रतीक है।जब एक चुने हुए मुख्यमंत्री को बिना किसी सबूत, बिना कोई… pic.twitter.com/TsKovjS1HY— Hemant Soren (@HemantSorenJMM) August 10, 2024 -
బ్లాక్‌బస్టర్ హిట్ 'మురారి' రీ రిలీజ్.. అస్సలు పట్టించుకోని హీరోయిన్!
టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో హంగామా చేస్తున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే కావడం.. సూపర్ హిట్ మూవీ మురారి రీ రిలీజ్ చేయడం అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. 2001లో కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ భామ సోనాలి బింద్రే హీరోయిన్గా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పెళ్లి సీన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇవాళ రీ రిలీజ్ కావడంతో కొందరైతే ఏకంగా థియేటర్లనే పెళ్లి చేసుకోవడం చూస్తే ప్రిన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతోంది.రీ రిలీజ్‌పై స్పందించని హీరోయిన్..అయితే మురారిలో హీరోయిన్గా మెప్పించిన ముంబయి ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఆ తర్వాత ఇంద్ర, మన్మధుడు లాంటి హిట్ సినిమాల్లోనూ కనిపించింది. ఆమె మురారి సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాతే చిరంజీవి, నాగార్జున సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇవాళ మురారి రీ రిలీజ్ అయినప్పటికీ ఎక్కడా కూడా ఈ సినిమా గురించి పోస్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు. తనకు సూపర్ హిట్ అందించిన మురారి చిత్రంపై కనీసం ఇన్‌స్టా వేదికగా స్పందించకపోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఏది ఏమైనా సోనాలి తొలి టాలీవుడ్ గురించి రియాక్ట్ అయి ఉంటే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. అయితే 2002లో నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీ బెల్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. గతంలో క్యాన్సర్ బారిన పడిన భామ.. ఆ తర్వాత కోలుకుంది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవలే ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) -
దైవం మహేష్ రూపేణ.. వారి కోసం 'మహేశ్' ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా..?
మహేశ్‌బాబు అనగానే టక్కున గురొచ్చేది రాజకుమారుడు లాంటి అందం. ఐదుపదుల వయసు దగ్గరపడుతున్నా కూడా తన గ్లామర్‌తో చూపు తిప్పుకోనివ్వడు. నలుగురికి నచ్చింది ఆయనకు నచ్చదు. అందుకే టక్కరిదొంగలా అభిమానుల మనసు దోచేశాడు. నాన్న నుంచి నేర్చుకున్న పాఠాలతో ఒక్కడే తన జీవితానికి బంగారు బాటలు వేసుకున్నాడు. పేద చిన్నారులకు సాయం చేస్తూ వాళ్లింటి వాకిట్లో సిరిమల్లె చెట్టులా కనిపించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపించే మహేశ్ బాబు నేడు ఆగష్టు 9న తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..మహేశ్.. 1975 ఆగస్టు 9న మద్రాసులో జన్మించాడు. ఇతడు పుట్టే నాటికే తండ్రి కృష్ణ 100 సినిమాలకు పైగా పూర్తి చేసి, ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఆరేళ్ల వయసులో మహేశ్ తన అన్నయ్య అయిన రమేశ్‌తో కలిసి విజయవాడ వెళ్లారు. అప్పట్లో దాసరి దర్శకత్వంలో 'నీడ' సినిమా రమేశ్ చేస్తున్నారు. అందులో ఓ కీలక పాత్రని మహేశ్‌కి తెలియకుండానే ఆయనపై తీశారు దాసరి. అలా బాల నటుడిగా మహేశ్ తెరంగేట్రం ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది. అప్పుడు మహేశ్ వయసు ఆరేళ్లు మాత్రమే.. తర్వాత నాన్న కృష్ణతో 'పోరాటం' సినిమాలో మహేశ్ నటించి, మెప్పించారు. అలా స్కూల్ హాలీడేస్ రాగానే షూటింగ్స్‌లో మహేశ్ పాల్గొనేవాడు. ఈ క్రమంలో బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం వంటి సినిమాల్లో ఆయన నటించారు. తర్వాత మహేశ్ స్కూల్‌కు వెళ్లడం తగ్గించాడు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అనే భయంతో ఇకపై సినిమాలు వద్దని, బుద్ధిగా చదువుకోవాలని ప్రిన్స్‌కు కృష్ణ చెప్పడంతో మళ్లీ చదువుపై ఫోకస్ పెట్టాడు. అలా లయోలా డిగ్రీ కాలేజీలో బీకామ్ వరకు చదువు పూర్తిచేసిన ప్రిన్స్ ఆపై మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్.. 'రాజకుమారుడు' సినిమాతో మహేశ్‌ను హీరోగా పరిచయం చేశారు. దైవం మహేశ్ రూపేణ'దైవం మానుష రూపేణ'.. అంటే దైవం ఎక్కడో లేదు.. 'మనిషి' రూపంలో మన దగ్గరే ఉందని అర్థం. ఎలాంటి లాభేక్ష లేకుండా చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేపిస్తూ వారికి మరో జన్మ కల్పిస్తున్నారు మహేశ్. చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు. అలాంటి చిన్నపిల్లలకే పెద్ద సమస్య వస్తే.. వారిని కాపాడుకోవడానికి పేదరికం అడ్డొస్తే.. ఆ తల్లిదండ్రులు వేదన ఎలా ఉంటుందో ఊహించుకోలేం. ఆ బాధను గుర్తించిన మహేశ్ కష్టాల్లో ఉన్నవారికి దేవుడిలా సాయం చేయడంలో వెనకాడడు. అందుకే దైవం మహేశ్ రూపేణ అని ఆ తల్లిదండ్రులు అంటారు. పలు సేవా కార్యక్రమాల కోసం మహేశ్ తన సంపాదనలో ఏడాదికి 30 శాతం ఖర్చు చేస్తున్నారు. ఆ మొత్తం సుమారు రూ. 50 కోట్లకు పైమాటే ఉండొచ్చన అంచనా ఉంది.చిన్నపిల్లలకు అండగా మహేశ్.. కారణం ఇదేకుటుంబానికే మహేశ్ బాబు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మహేశ్‌కు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఈ విషయంలో బయటి వారి పిల్లలు అయినా సరే.. వారికి ఏదైనా కష్టం వస్తే చూస్తూ ఉండే వ్యక్తి కాదు. ఆ మంచి మనసే ఎన్నో చిట్టి ‘గుండె’లకు ప్రాణం పోసింది. ఈ క్రమంలో సుమారు 3వేల మంది చిన్నారుల గుండెకు సంబంధించిన ఆపరేషన్స్‌ను ఉచితంగానే చేపించాడు. అందుకు ప్రధాన కారణం కూడా ఉంది. మహేశ్ తనయుడు గౌతమ్.. డెలివరీ సమయం కంటే ఆరువారాలు ముందే పుట్టడంతో పలు సమస్యలు ఎదుర్కొన్నాడు. అందుకు అవసరమైన చికిత్సను మహేశ్ చేయించారు. దాదాపు మూడు నెలలకి గౌతమ్ మామూలయ్యాడు. ఆయన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటన నేడు ఎంతోమంది చిన్నారుల జీవితాలను కాపాడుతుంది. తన వద్ద డబ్బు ఉంది కాబట్టి ఎంతైనా ఖర్చుపెట్టి పిల్లాడిని రక్షించుకున్నామని ఆయన తెలిపారు. అదే లేనివాళ్లకి ఇలా జరిగితే వారి పరిస్థితి ఏంటీ..? అని మహేశ్ బాధపడేవారు. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో మహేశ్ పంచుకున్నారు. పుట్టుకతో వచ్చే ఆ సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించాలని నమ్రతతో కలిసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇంకేముంది వెంటనే ఆ నిర్ణయానికి నమ్రత రూపకల్పన చేశారు. మహేశ్ బాబు ఫౌండేషన్‌ను స్థాపించి ఇప్పటి వరకు సుమారు 3వేల మందికి పైగానే కోట్ల రూపాయాలు ఖర్చు చేసి వారికి మరో జన్మనిచ్చాడు. అలాంటి పిల్లలకు హైదరాబాద్, విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రులలో వైద్యం అందిస్తున్నారు.ఆ పుస్తకమే సిగరెట్ మాన్పించిందిమహేశ్కు తరచూ పుస్తకాలు చదువుతూ ఉంటారు.. ఆపై బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా కాలక్షేపం కోసం చూస్తుంటారు. అయితే, ప్రతి దాని నుంచి కొంత స్ఫూర్తిపొందుతుంటారు. గతంలో మహేశ్ బాగా సిగరెట్ తాగే అలవాటు ఉండేదని దానిని మానేద్దామంటే కుదరలేదని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఎలెన్ కార్ రాసిన 'ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్' అనే పుస్తకం చదివాక సిగరెట్‌ని మాత్రం ముట్టుకోలేదని ఓ ఇంటర్వ్యూలో మహేశ్ చెప్పారు. తన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటానని కూడా ఆయన తెలిపారు. ఎట్టిపరిస్థితిల్లోనూ చెక్కర పదార్థాలు తీసుకోనని ఆయన పేర్కొన్నారు.టాలీవుడ్లో తిరుగులేని రికార్డ్స్మహేశ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాల్లో నటించలేదు. ఆయన సినిమాలు కనీసం రెండు మూడు భాషల్లో కూడా విడుదల కాలేదు. కేవలం తెలుగులోనే విడుదలయ్యాయి. ఈ క్రమంలో కేవలం టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగేసి ఆయన రికార్డ్స్‌ను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ భాషా చిత్రాలుగా పాన్ ఇండియా చిత్రాల సరసన నిలబడ్డాయి. మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ తెలుగులోనే విడుదలై రూ. 214 కోట్ల వసూళ్లను సాధించింది. సరిలేరు నీకెవ్వరు రూ. 260 కోట్లు, మహర్షి రూ. 170 కోట్లు, గుంటూరు కారం రూ. 200 కోట్లు, భరత్ అనే నేను రూ. 187 కోట్లు రాబట్టింది. ఒక్క భాషలోనే విడుదల అయితేనే ఇలాంటి కలెక్షన్లతో సత్తా చాటితే అదే పాన్ ఇండియా రేంజ్లో బొమ్మ పడితే ఎలా ఉంటుందో ఊహకే వదలేయ వచ్చు అని చెప్పవచ్చు.ఈ ప్రత్యేకతలే మహేశ్‌ను అభిమానించేలా చేస్తాయిమొదటి సినిమా రాజకుమారుడుతోనే ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డ్‌ను అందుకున్నారు.ఉత్తమ నటుడిగా నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు చిత్రాలకు నంది పురస్కారాలు గెలుచుకున్నారు.వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వారి మైనపు విగ్రహాలు 'మేడమ్ టుస్సాడ్స్'లో కొలువుదీరుతాయనే విషయం తెలిసిందే. ఈ గౌరవం దక్కించుకున్న వారి జాబితాలో మహేశ్ ఒకరు.సుమారు 25 ఏళ్లుగా సినీ పరిశ్రమలో మహేశ్ ఉన్నారు. ఇన్నేళ్లలో ఆయన ఒక్క రీమేక్ చిత్రంలోనూ నటించకపోవడం రికార్డ్.గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్‌ను మహేశ్ పరిచయం చేశారు. 'శ్రీమంతుడు'ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు.మోపిదేవి పెదప్రోలులో కాకర్లపూడి రాజేష్ అని అభిమాని పిల్లలను దత్తత తీసుకున్న మహేశ్.. వారి పేర్లు కూడా అర్జున్, అతిథి, ఆగడు ఇలా మహేశ్ సినిమా పేర్లనే ఆ అభిమాని పెట్టుకోవడం విశేషం.మహేశ్ బాబుకు వచ్చే సంపాదనలో 30 శాతం డొనేషన్స్కే ఉపయోగిస్తారు . pic.twitter.com/ApOAaJwb1d#HBDSuperStarMahesh#CelebrateSSMB #MaheshBabu𓃵— lucky (@lucky_dhfm7) August 8, 2024Happy Birthday Super Star @urstrulyMahesh Anna 🛐🫶🏻A Man With Golden Heart 🙇🏻💓#HBDSuperStarMahesh pic.twitter.com/E9ok0opj1o— లోకేష్ ™ 🐆 (@LokEshDidS) August 8, 2024 -
Mahesh Babu Birthday Special Pics: హ్యాపీ బర్త్ డే అవర్ సూపర్ స్టార్.. స్పెషల్ ఫోటోలు
-
బన్వర్ సింగ్ షేకావత్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ఆవైటేడ్ చిత్రం 'పుష్ప-2 : ది రూల్'. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. పార్ట్-1లో తనదైన నటనతో మెప్పించిన మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇవాళ ఫాహద్ ఫాజిల్ బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. బన్వర్ సింగ్ షేకావత్.. ఐపీఎస్.. బిగ్స్క్రీన్పై మరోసారి అభిమానులను అలరించనున్నారంటూ పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. పుష్పలో ఐపీఎస్ పాత్రలో టాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. పార్ట్-2లోనూ ఆయన రోల్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో గన్, గొడ్డలి చేతులతో పట్టుకుని క్రేజీ లుక్‌లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.Team #Pushpa2TheRule wishes the stellar actor #FahadhFaasil a very Happy Birthday ❤🔥Bhanwar Singh Shekhawat IPS will be back with a bang on the big screens 💥💥#Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024.Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP… pic.twitter.com/L5iBu5WwUj— Pushpa (@PushpaMovie) August 8, 2024 -
హీరో మంచు మనోజ్, మౌనిక కుమారుడు ధైరవ్ పుట్టినరోజు (ఫొటోలు)
-
అప్పటిదాకా ఎవరో కూడా తెలీదు.. ఒక్క మూవీతో దశ తిరిగిపోయింది! (ఫోటోలు)
-
సినిమాల్లో ఒకలా.. బయట మరోలా.. మృణాల్ గురించి ఇది తెలుసా? (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ భామ బర్త్ డే.. భర్త స్పెషల్ పోస్ట్!
బాలీవుడ్ నటి కియారా అద్వానీ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ కియారా బర్త్ డే కావడంతో పలువురు సినీతారలు, ఫ్యాన్స్ విషెస్ తెలిపారు.తాజాగా ఆమె భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భార్యకు స్పెషల్‌గా విష్ చేశారు. కియారా ఫోటోను షేర్ చేస్తూ రొమాంటిక్ నోట్ రాసుకొచ్చారు. హ్యాపీ బర్త్ డే మై లవ్.. యూ ఆర్ మై సోల్‌మేట్.. ఇక్కడ మరెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి." అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా.. కియారా, సిద్ధార్థ్ ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో వివాహం చేసుకున్నారు.కాగా.. 2014లో 'ఫగ్లీ' అనే కామెడీ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన కియారా అద్వానీ.. ఆ తర్వాత స్పోర్ట్స్ బయోపిక్ 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలోనూ కనిపించింది. అంతేకాకుండా భరత్ అనే నేను, వినయ విధేయ రామ, లస్ట్ స్టోరీస్, గుడ్ న్యూజ్, భూల్ భూలయ్యా 2, సత్యప్రేమ్ కి కథ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌తో పాటు వార్- 2 చిత్రంలోనూ నటిస్తోంది.కియారా తదుపరి తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్', ఎస్. శంకర్ దర్శకత్వం వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆమె కిట్టిలో 'వార్ 2' కూడా ఉంది. మరోవైపు సిద్ధార్థ్ చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ 'యోధ'లో కనిపించాడు. అంతేకాకుండా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో కూడా నటించాడు. View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra)