birthday celebrations
-
అప్పుడే రెండేళ్లు అయిపోయాయా కన్నమ్మా.. లాస్య ఎమోషనల్ (ఫోటోలు)
-
హీరోయిన్ తృప్తి దిమ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ జాతిపిత కేసీఆర్. నా ఒక్కడికే కాదు అందరికీ ఆయన బాపు. తెలంగాణ జాతికి, నాలుగు కోట్ల ప్రజలకు హీరో. సమైక్య పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన మహానుభావుడు. కారణ జన్ముడు ఆయన. కేసీఆర్ కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు 71వ జన్మదినం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ధన, కుల, మీడియా బలం లేకున్నా.. 25 ఏళ్ల క్రితం జనబలం, గుండె బలంతో పార్టీని ఏర్పాటు చేసి అవమానాలు, ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని తెలంగాణ కలను సాకారం చేశారు’అని అన్నారు. తెలంగాణలోని ఏ మూలకు వెళ్లి పలకరించినా అన్ని వర్గాలు.. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ‘తెలంగాణ అనే పసిగుడ్డును తిరిగి ఆయన చేతిలో పెట్టడమే కేసీఆర్‌కు మనం ఇచ్చే బహుమానం. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా 60 లక్షల మంది గులాబీ సైనికులు పనిచేయాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం: హరీశ్‌రావు ‘కేసీఆర్ ఒక వ్యక్తి కాదు. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం. ఆయనకు తెలంగాణతో ఉన్న బంధం, తల్లీబిడ్డల పేగుబంధం లాంటిది. గతంలో తెలుగుదేశంలో పనిచేసినా కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించారు. కేసీఆర్ మొండి పట్టుదల వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. తెచి్చన తెలంగాణను కన్నబిడ్డలా చూసుకుని, పదేళ్లలో అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశానికే రోల్‌మోడల్‌గా చేశారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణలో సీఎం రేవంత్ 20–20 మ్యాచ్‌లు అంటూ.. డబ్బుల కోసం తొండి మ్యాచ్ ఆడుతున్నారు.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని రేవంత్ తాపత్రయపడుతున్నారు. అన్ని వర్గాలూ.. రేవంత్ పాలన బాగోలేదంటూ, కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా కోరుకుంటున్నాయి. భవిష్యత్తులో మరో మూడు టర్ములు బీఆర్ఎస్ గెలుపొందడానికి కృషి జరుగుతోంది’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘రేవంత్ ఒక పిల్ల కాకి. కేసీఆర్ కళ్లు తెరిస్తే ఆయన పని ఖతమవుతుంది’అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. తెలంగాణభవన్‌లో ఘనంగా వేడుకలు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు కలసి కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. కేసీఆర్ రాజకీయ నేపథ్యం, తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా రూపొందించిన ఫొటోలు, వీడియోను ప్రదర్శించారు.పార్టీ నేతలు కవిత, బండ ప్రకాశ్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, రవిచంద్ర, తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాలేరు వెంకటేశ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు సహా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో కేసీఆర్‌ను కలసి శుభాకాంక్షలు చెప్పేందుకు ఎర్రవల్లికి బయలుదేరి వెళ్లారు. కార్యకర్తలు, అభిమానులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కేసీఆర్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జీవితానికి సరిపడే స్ఫూర్తిని ఇచ్చారు‘ప్రతీ కొడుకు నాన్నే తనకు హీరో అని చెప్తాడు. కానీ మా నాన్న నాకే కాదు తెలంగాణకే హీరో. మీ పోరాటంతో సాధించిన ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో మీ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రతీక్షణం పనిచేస్తానని హామీ ఇస్తున్నా. జీవితకాలానికి సరిపడా మీరు అందించిన స్ఫూర్తికి కృతజ్ఞతలు. నాన్నా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు’. –‘ఎక్స్’లో కేటీఆర్హ్యాపీ బర్త్‌డే డాడీ: కవితహ్యాపీ బర్త్‌డే డాడీ.. అంటూ కేసీఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, యుద్ధ నినాదం‘మీరు నా తలనిమిరే తల్లిప్రేమ. నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ. నాకు రాజకీయ చైతన్యాన్ని నేరి్పంచి, నాలో ప్రజాసేవా సంస్కారాన్ని రంగరించి ఉద్యమ కార్యాచరణలో నడిపించారు. కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, ఉద్రేకం, స్వాభిమానం, యుద్ధ నినాదం, ప్రజాగళం, ఆత్మగౌరవ రణం, తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం’. –‘ఎక్స్’లో హరీశ్‌రావు -
నేడు కేసీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు 71వ జన్మదిన వేడుకలు సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భాగంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్ చేస్తారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని వివరించేలా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. డప్పు కళాకారులు, గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.తెలంగాణ భవన్లో జరిగే కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా పండ్ల పంపిణీ, అన్నదానం, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు, దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారని తలసాని వెల్లడించారు.మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు. కాగా, కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘వృక్షార్చన’లో భాగంగా పంజగుట్టలోని జలగం వెంగళరావు పార్కులో 40 మంది మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినిపల్లి సంతోష్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. -
వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఫ్యామిలీతో 40వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న 'మన్మధుడు' హీరోయిన్ అన్షు (ఫోటోలు)
-
బుల్లితెర కమెడియన్ బర్త్‌డే.. ఈసారి ఎంతో స్పెషల్ అంటున్న స్టెల్లా (ఫోటోలు)
-
అమ్మ అంజనాదేవితో కేక్ కట్ చేయించిన మెగాస్టార్ (ఫోటోలు)
-
బర్త్ డే రోజున లోకేష్ కు ఘోర అవమానం
-
టీడీపీలో నారా లోకేష్ బర్త్‌డే చిచ్చు!
అన్నమయ్య, సాక్షి: టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు ఆ పార్టీలో చిచ్చురాజేసింది. తంబళ్లపల్లె టీడీపీలో ఇప్పటికే వర్గపోరు నడుస్తుండగా.. లోకేష్ బర్త్‌డేతో అది రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, సీఎం అంటూ లోకేష్‌పై సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిచ్చును మరింత రాజేశాయి. ఈ క్రమంలో నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఉన్న ఫ్లెక్సీలను చించిపాడేసింది మరో వర్గం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోగా.. కేసు నమోదైంది.ఏం జరిగిందంటే.. తంబళ్లపల్లె టీడీపీలో మాజీ ఎమ్మెల్యే శంకర్(Shankar) వర్సెస్ ఇంఛార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి(dasaripalli Jai Chandrareddy) వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తోంది. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆకర్షించే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బుధవారం రాత్రి శంకర్ వర్గీయులు పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శంకర్ ప్రధాన అనుచరుడు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో..ఇంఛార్జి జైచంద్రారెడ్డి విడిగా తన అనుచరులతో లోకేష్ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అందులో శంకర్‌కు చోటు లేకుండా చూసుకున్నారు కూడా!. అయితే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. చంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది చంద్రారెడ్డి వర్గీయుల పనిగా పురుషోత్తం అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. -
శోభా శెట్టి బర్త్‌డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన బిగ్‌బాస్ ఫ్రెండ్స్ (ఫోటోలు)
-
న్యూజెర్సీలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
న్యూజిలాండ్ లో ఘనంగా జననేత జగనన్న జన్మదిన వేడుకలు
-
కైకలూరులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
నగరిలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
-
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
ఏపీ అంతటా ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
#HBDYSJAGAN: మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది: వైఎస్ జగన్
నమ్మినవారికి అండగా నిలిచే జన హృదయ నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తోంది ఆ పార్టీ.. -
ఆస్ట్రేలియాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
-
తుళ్లూరులో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
-
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
YS జగన్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు
-
Ayesha Takia: కుమారుడి బర్త్‌డే.. ఇలా అందంగా ప్లాన్ చేసిన సూపర్ హీరోయిన్ (ఫోటోలు)
-
మహేష్ బాబు మేనల్లుడి పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
ఘనంగా రోజా పుట్టిన రోజు వేడుకలు
-
ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెం.11లో ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ డీసీసీ ఉపాధ్యక్షుడు కొప్పిసెట్టి గోవింద్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణా సంచా కాల్చి, భారీ కేక్‌ను కట్ చేశారు.అనంతరం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శులు ముంజగళ్ళ విజయ్‌కుమార్, మచ్చ విజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ దిగ్విజయంగా జరిగిందన్నారు. పుట్టిన రోజు నాడు కూడా సీఎం ప్రజాక్షేత్రంలోనే ఉండాలలనే సంకల్పంతో మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తుండటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు భీమ్రావు, నజీర్, రమణ, అప్పారావు, పూల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
కొడుకు పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సానియా మీర్జా.. వారం తర్వాత ఇలా (ఫొటోలు)
-
శ్రీదేవి ముద్దుల కూతురి బర్త్ డే.. ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
లైగర్ బ్యూటీ బర్త్‌డే.. ఇక్కడికీ వచ్చేశాడ్రా బాబూ! (ఫోటోలు)
-
మంత్రి పొంగులేటి ఫ్యాన్ అదిరిపోయే గిఫ్ట్
-
Laya Gorty : నటి లయ బర్త్ డే సెలబ్రేషన్స్ బీచ్‌లో రొమాంటిక్‌గా.. ఫోటోలు చూశారా..? (ఫోటోలు)
-
దినేశ్ కార్తిక్- దీపికా ట్విన్స్ మూడో బర్త్‌డే.. కనిపించని డీకే (ఫొటోలు)
-
ముంబయిలో మంచు లక్ష్మి బర్త్ డే బాష్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
-
గోవాలో ఫ్యామిలీతో అల్లు స్నేహ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Shalini Pandey: సింపుల్‌గా అర్జున్ రెడ్డి హీరోయిన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
యాంకర్ రవి బర్త్ డే పార్టీ.. సందడి చేసిన అనసూయ (ఫొటోలు)
-
యూట్యూబర్ నిఖిల్ బర్త్‌డే.. డిఫరెంట్ గెటప్‌లో తారలు (ఫోటోలు)
-
టిక్‌టాక్ నుంచి హీరోయిన్గా.. అపర్ణదాస్ బర్త్‌డే వేడుకలు (ఫోటోలు)
-
రెండో ప్రపంచయుద్ధవీరుడికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు
రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న సైనికుడు, ప్రతిష్టాత్మక ‘బర్మా స్టార్ అవార్డ్’ గ్రహీత రిటైర్డ్ లాన్స్ నాయక్ చరణ్ సింగ్ 100వ పుట్టినరోజు వేడుకలను భారత సైన్యం ఘనంగా నిర్వహించింది. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని స్వగృహంలో ఆయనతో కేక్ కట్చేయించి జన్మదిన వేడుకలను ఆరంభించారు. ఆర్మీ తరఫున సైతం బ్రిగేడియర్ అధికారి, సైనికులు పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా మారింది. 1924 సెపె్టంబర్ ఏడో తేదీన జన్మించిన చరణ్‌సింగ్ 1942 ఆగస్ట్ 26వ తేదీన భారత్‌లో బ్రిటిష్ సైన్యం ఫిరోజ్పూŠ కంటోన్మెంట్ యూనిట్లో చేరారు. రెండో ప్రపంచయుద్ధంలో వీరోచితంగా పోరాడారు. సింగపూర్ నుంచి లాహోర్ దాకా పలు దేశాల్లో యుద్ధక్షేత్రాల్లో తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లోని యోల్ కంటోన్మెంట్‌లోనూ పనిచేశారు. ‘‘ 17 ఏళ్లపాటు సైన్యంలో చూపిన ప్రతిభకు బర్మా స్టార్ అవార్డ్‌ను, ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్‌ను ఆయన పొందారు. 1959 మే 17న పదవీవిరమణ చేశారు. తర్వాత ప్రస్తుతం తన శేషజీవితాన్ని రోపార్ జిల్లాలోని దేక్వాలా గ్రామంలో గడుపుతున్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సొంతింట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో బ్రిగేడియన్ అధికారి, సైనికులు పాల్గొన్నారు. దేశసేవలో తరించిన మాజీ సైనికులను గుర్తుపెట్టుకుని వారిని తగు సందర్భంలో గౌరవిస్తూ భారతసైన్యం పలు కార్యక్రమాలు చేస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగానే శనివారం చరణ్‌సింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు సైన్యాధికారి ఒకరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ దశాబ్దాల క్రితం సైన్యంలో పనిచేసినా సరే ఆర్మీ దృష్టిలో అతను ఎప్పటికీ సైనికుడే. సైన్యంలో భాగమే. సైన్యానికి, పౌరులకు స్ఫూర్తిప్రదాతలుగా వారిని సదా స్మరించుకోవాలి. వారి నుంచి నేటి సైనికులు ఎంతో నేర్చుకోవాలి’ అని సైన్యం పేర్కొంది. – న్యూఢిల్లీ -
Anchor Lasya: యాంకర్ లాస్య బర్త్ డే.. సందడి చేసిన బుల్లితెర తారలు (ఫోటోలు)
-
సాఫ్ట్వేర్ వ్యక్తి కంటే లారీ డ్రైవర్ ఎక్కువ సంపాదిస్తున్నాడా?
-
MLA ప్రత్తిపాటి భార్య బర్త్ డే వేడుకల్లో పోలీసుల హడావుడి
-
బలగం బ్యూటీ బర్త్ డే పార్టీ..కావ్య కళ్యాణ్ రామ్ (ఫొటోలు)
-
'తొలిప్రేమ' వాసుకి పుట్టినరోజు.. భర్తతో సింపుల్‌గా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సితార బర్త్‌డే.. మరోసారి మంచి మనసు చాటుకున్న మహేశ్‌బాబు (ఫోటోలు)
-
బుల్లితెర నటి అంజలి కూతురు చందమామ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మనుమడు హిమాన్షు పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
ప్రజల సొమ్ముతో పంచకర్ల పుట్టినరోజు!
పెందుర్తి: ‘ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.1000 చొప్పున ఇవ్వాలి. లేదంటే తర్వాత ఇబ్బందులకు గురవుతారు. మీ కాలనీకి రోడ్లు ఉండవు. ఇతర సౌకర్యాలు రావు’అంటూ జనసేన నాయకులు వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈ నెల 13న జరిగిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు జనసేన నాయకులు ఊర్ల మీద పడ్డారు. జీవీఎంసీ పరిధి పలు వార్డుల్లోని అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్‌లతో పాటు వ్యాపారులు, ఇతర వర్గాలకు చెందిన ప్రజల నుంచి నలుగురైదుగురు జనసేన నాయకులు గుంపుగా వెళ్లి వసూళ్లు చేశారు. ఎమ్మెల్యే పుట్టిన రోజుకు మేమేందుకు డబ్బులు ఇవ్వాలని ప్రజలు అనేసరికి బెదిరింపులకు దిగారు. మీ ప్రాంతానికి సౌకర్యాలు లేకుండా చేస్తామని హెచ్చరికలు చేయడంతో చేసేది లేక ప్రజలు డబ్బులు ఇచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచకర్ల పుట్టినరోజు వేడుకల పేరు చెప్పుకుని ఆయా నాయకులు దాదాపు రూ.15 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో సగం కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ల జేబుల్లోనే వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేగా అధికారికంగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకముందే పంచకర్ల అనుచరులు చెలరేగిపోతుండడం గమనార్హం. రానున్న రోజుల్లో జనసేన నాయకుల ఆగడాలు మరెన్ని చూడాలో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ వసూళ్ల పర్వం ఎమ్మెల్యే పంచకర్లకు తెలిసి జరిగిందా.. తెలియకుండా జరిగిందా అన్నదే ప్రశ్నార్థకం. -
Hamida: నటి బర్త్‌డే పార్టీలో బిగ్‌బాస్ సెలబ్రిటీల హంగామా (ఫోటోలు)
-
మహిళా వలంటీర్లపై గూండాగిరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులందరినీ గుండాలు, రౌడీలంటూ నోరు పారేసుకుంటుంటారు. కానీ, ఆయన పార్టీ అభ్యర్థులు, నాయకులు మహిళా వలంటీర్ల పైన కూడా దౌర్జన్యానికి దిగి, గృహ నిర్బంధానికి పాల్పడ్డారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సహా ఆ పార్టీ నాయకులు గురువారం సాగించిన గూండాగిరీతో మహిళా వలంటీర్లు బెంబేలెత్తిపోయారు. ఓ మహిళా వలంటీరు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటుండగా ఆ భవనంలోకి చొరబడటమే కాకుండా, ఆమెతో పాటు వేడుకలకు వచ్చిన మిగతా మహిళా వలంటీర్లపై దౌర్జన్యం చేసి, కుర్చిలు విరగ్గొట్టి, వారిని గృహ నిర్బంధం చేసి భయభ్రాంతులకు గురి చేశారు. భయంతో మహిళలు కేకలు వేసినా, గర్భిణి ఉందని మొత్తుకున్నా ఖాతరు చేయలేదు. గంటన్నర పాటు మహిళలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణ భయంతో పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ మహిళలను విడిపించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహిళా వలంటీరు మొయ్యా దుర్గా భవాని కాకినాడ రూరల్ నియోజకవర్గం వినాయక కేఫ్ సమీపంలోని ఓ భవనంలో గురువారం ముందస్తు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకలకు ఆమె స్నేహితురాళ్లైన పలువురు మహిళా వలంటీర్లు హాజరయ్యారు. పుట్టిన రోజు కేకు, కూల్ డ్రింక్‌లు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే హఠాత్తుగా 30 మందిని వెంట బెట్టుకుని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) అక్కడకు వచ్చారు. ఇక్కడ పార్టీ సమావేశం పెట్టుకుంటున్నారంటూ పెద్దగా కేకలు వేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నామని చెబుతున్నా వినకుండా తలుపులు తన్నుకుంటూ లోపలకు వెళ్లి వీరంగం సృష్టించారు. దీంతో మహిళా వలంటీర్లు భయాందోళనలకు గురయ్యారు. తమతో పాటు గర్భిణి ఉన్నారని, ఆమె భయపడిపోతున్నారని, కేకలు వేయవద్దని బతిమిలాడారు. అయినా వారు వినలేదు. నానా రచ్చ చేసి, వలంటీర్లు కూర్చున్న కుర్చిలను ధ్వంసం చేశారు. మహిళా వలంటీర్లు లోపల ఉండగానే నానాజీ కనుసైగలతో ఆ పార్టీ కార్యకర్తలు గది తలుపులు మూసేసి గొళ్లేలు పెట్టేసి, భవనం కింది భాగంలోకి వెళ్లిపోయారు. మహిళా వలంటీర్లు కిటికీల వద్దకు వచ్చి తలుపులు తీయాలని, ఊపిరి ఆడటంలేదని ఎంతసేపు అర్థించినా వినిపించుకోలేదు. జనసేన నాయకుల విధ్వంసంతో గర్భిణి నున్న చిట్టమ్మ గదిలోనే సొమ్మసిల్లి పడిపోవడంతో అంతా భయకంపితులయ్యారు. వారిలో ఒక వలంటీరు తన మొబైల్ ఫోను ద్వారా కాకినాడ డీఎస్పీ హనుమంతరావుకు సమాచారం అందించింది. దీంతో సర్పవరం సీఐ వైఆర్‌కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్నాయి. పోలీసులు తలుపులు తెరిచి మహిళా వలంటీర్లను విడిపించారు. అక్కడ రాజకీయ పార్టీ సమావేశం జరుగుతోందంటూ పంతం నానాజీ పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ కార్యాలయంలో రాజకీయ పార్టీకి సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవని ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి బీబీబీ రాజు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశామని, అన్ని వివరాలు రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్‌కు నివేదిస్తామని రాజు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు జనసేన నాయకుల దాడిపై రమణయ్యపేట కూరగాయల మార్కెట్ వీధికి చెందిన బాధిత వలంటీరు దుర్గాభవాని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు పలువురిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మహిళల గృహ నిర్బంధం, భయభ్రాంతులకు గురి చేయడం, మూకుమ్మడిగా వచ్చి దౌర్జన్యం చేశారనే అభియోగాలపై ఐపీసీ 143, 452, 341, 342, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. భయంతో వణికిపోయాం ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి పడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నాకు ఏడో నెల. గర్భిణి అని కూడా కనీసం జాలి, కరుణ కూడా లేకుండా గదిలో నిర్బంధించి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోయాం. తీవ్ర ఆందోళనతో సొమ్మసిల్లి పడిపోయాను. – నున్న చిట్టమ్మ, రమణయ్యపేట మహిళలని కూడా చూడలేదు జనసేన నాయకులు, కార్యకర్తలు అమానుషంగా ప్రవర్తించారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న వారు మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కుర్చీలు విరగ్గొట్టేశారు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే దౌర్జన్యం చేసి, తలుపు గడియ పెట్టేసి వెళ్లిపోయారు. ఏ రాజకీయ పార్టీ సమావేశం పెట్టుకోవడంలేదని ఎంత చెప్పినా వినలేదు. – కుసనం శాంతకుమారి, రమణయ్యపేట పుట్టిన రోజు చేసుకుంటుంటే నిర్బంధించారు నా పుట్టిన రోజు శుక్రవారం అయినప్పటికీ స్నేహితులందరూ అందుబాటులో ఉండరని చెప్పడంతో గురువారమే వేడుకలు చేసుకునేందుకు వారందరినీ ఆహా్వనించాను. కేకు తెచ్చుకొని పార్టీ సిద్ధమవుతుండగా ఒకేసారి గుంపుగా వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మా కార్యాలయం గది తలుపులు మూసేసి, గడియ పెట్టి నిర్బంధించారు. ఎంత వేడుకున్నా తలుపులు తీయలేదు. – మొయ్యా దుర్గాభవాని, రమణయ్యపేట, కాకినాడ రూరల్ -
Natarajan Birthday Photos: నటరాజన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. కేక్ తినిపించిన అజిత్ (ఫోటోలు)
-
హీరో శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు
-
Chiranjeevi Srikanth Latest Photos: శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మరీ కేక్ కట్ చేయించిన మెగాస్టార్ (ఫోటోలు)
-
యాంకర్ లాస్య రెండో కుమారుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ బర్త్ డే (ఫొటోలు)
-
Sree Vishnu: నాలుగేళ్లకోసారి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్న కుర్ర హీరో (ఫోటోలు)
-
బిర్యానీ కోసం వెళ్లి.. ముగ్గురు మృతి
గద్వాల క్రైం: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి కుమార్తె జన్మదిన వేడుకలను సిబ్బంది సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. అనంతరం సిబ్బంది బిర్యానీ తినేందుకు వైద్యుడి కారులో హోటల్‌కు వెళ్లారు. అయితే డ్రైవర్ అత్యు త్సాహంతో అతి వేగంగా కారును నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల మండలం జమ్మిచేడ్ వద్ద శనివారం తెల్లవారుజమున చోటు చేసు కుంది. ప్రత్యక్ష సాక్షులు, గద్వాల సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు.. గద్వాలలోని అనంత ఆస్పత్రిలో స్థానిక చింతల్‌పేటకు చెందిన ఆంజనేయులు (50) సెక్యూరిటీగా పనిచేస్తుండగా, వనపర్తిజిల్లా పెబ్బేరుకు చెందిన పవన్ (28), మల్దకల్ మండలానికి చెందిన నరేశ్ (23), పాల్వా యి గ్రామానికి చెందిన నవీన్, కేటీదొడ్డి మండలం మైల గడ్డకు చెందిన గోవర్ధన్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా రు. వైద్యుడు వెంకటేశ్ కూతురు పుట్టినరోజు ఉండటంతో శుక్ర వారం అర్ధరాత్రి సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వ హించారు. ఆ తర్వాత ఆరుగురు సిబ్బంది బిర్యానీ తింటా మని చెప్పడంతో వెంకటేశ్ వారికి రూ.5వేలు ఇచ్చారు. డ్రైవర్ మ హబూబ్‌తో కలిసి ఆరుగురు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి జమ్మిచేడ్ శివారులో కల్వర్టు వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోఎగిరి 100 మీ టర్ల వరకు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలోనే కారు పైభాగం (సన్‌రూఫ్) తెరుచుకోవడంతో ఆంజనేయులు, పవన్, నరేశ్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ మహబూబ్, నవీ న్, గోవర్ధన్‌లను అనంత ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న నవీన్‌ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు ఆంజనేయులు కుమారుడు నవీన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో నిక్-ప్రియాంక (ఫొటోలు)
-
రోహిత్ శర్మ సొంత తమ్ముడి కవల పిల్లల బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Navishka Birthday Celebrations Pics: మెగాస్టార్ మనవరాలు నవిష్క బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Samaira Birthday Celebrations: రోహిత్ శర్మ గారాల పట్టి సమైరా బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కూతురితో కలిసి చిన్నపిల్లాడిలా రోహిత్ శర్మ ఆటలు.. వీడియో
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారాల పట్టి సమైరా శర్మ ఐదో పుట్టినరోజు నేడు(డిసెంబరు 30). ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ తన చిన్నారి కూతురు కోసం తానూ చిన్నపిల్లాడిలా మారిపోయాడు. తన ముద్దుల కుమార్తెతో కలిసి టాయ్ ట్రైన్లో విహరిస్తూ సందడి చేశాడు. ఆమెతో కలిసి అల్లరి చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యుల సమక్షంలో సమైరా బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేశాడు. భార్య రితికా సజ్దేతో కలిసి సమైరాతో కేక్ కట్ చేయించాడు. ‘సమైరా పోనివిల్లే థీమ్’ పేరిట నిర్వహించిన ఈ పార్టీకి సంబంధించిన వీడియోను రితిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. రోహిత్ శర్మ సైతం.. ‘‘నీ ఎదుగులను చూస్తూ మురిసిపోవడమే మా జీవితానికి సార్ధకత’’ అంటూ ఉద్వేగపూరిత శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ నేపథ్యంలో సమైరాకు హిట్‌మ్యాన్ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన రోహిత్ శర్మ డిసెంబరు 13, 2015లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు డిసెంబరు 30, 2018లో కుమార్తె జన్మించగా ఆమెకు సమైరాగా నామకరణం చేశారు. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత.. రోహిత్ శర్మ సారథ్యంలో.. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి టీమిండియా అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లోనూ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేక బోల్తా పడ్డ రోహిత్ సేన.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైన భారత ఆటగాళ్లు భారమైన హృదయాలతో మైదానాన్ని వీడారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ జట్టుతో చేరాడు. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా సత్తా చాటాలని భావించాడు. కానీ అతడి కల నెరవేరలేదు. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ బాక్సింగ్ డే టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన ప్రొటిస్.. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మొత్తంగా కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఆటగాడిగానూ విఫలమయ్యాడు. ఇక సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి ఆరంభం కానుంది. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
లండన్ లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
UAE: దుబాయ్‌లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు
యూఏఈలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. దుబాయ్‌లోని కరమా పార్క్‌లో వైఎస్ జగన్ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో యూఏఈ కన్వీనర్ సయ్యద్ అక్రం, ఇర్షాద్, చక్రి, అబ్దుల్లా, ఖాజా అబ్దుల్ , విజయ భాస్కర్ రెడ్డి ,సిరాజ్‌లతో పాటు వందలాది అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగన్ అన్న మీద ఉన్న అభిమానం దేశాలు దాటి ఇలా విస్తరించడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రజల దీవెనలతో జగన్ అన్న శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని వారు ఆకాంక్షించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని యూఏఈ కన్వీనర్ సయ్యద్ అక్రం మహిళలకు చీరలు పంచిపెట్టారు. అనంతరం ప్రతి ఒక్కరికి విందు ఏర్పాటు చేసి వైభవంగా జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. -
ఊరూరా సంబరాలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: సీఎం జగన్ పుట్టిన రోజును పురిష్కరించుకుని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పేదలు, అనాథలకు వస్త్రదానం చేశారు. భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్, తదితర దేశాల్లోనూ సీఎం జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం వరకు దారిపొడవునా వైఎస్సార్సీపీ నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి.. సీఎం జగన్ చిత్రాలతో ఏర్పాటు చేసిన జెండాలు, ప్లెక్సీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, మహేశ్‌బాబు ఎక్స్ (ట్విటర్) ద్వారా సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సీఎం మరిన్ని విజయాలు సాధించాలని, నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. వీరికి సీఎం జగన్ కూడా ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పండుగలా జన్మదిన వేడుకలు ► చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా ఓ పెద్ద పండుగలా జరిగింది. తిరుపతిలో టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకరరెడ్డి ఆ«ధ్వర్యంలో 115 మంది వైఎస్సార్సీపీ శ్రేణులు రక్తదానం చేశారు. రుయాలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. చంద్రగిరిలో తుడా చైర్మెన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో 338 మంది రక్తదానం చేశారు. కేసీ పేటలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు ఆధ్వర్యంలో వంద మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, తట్టలో పూలు విక్రయించే వంద మందికి గొడుగులు, 15 మందికి బంకులు, 50 మంది నాయి బ్రాహ్మణులకు కిట్లు, 100 మందికి జంగమదేవర కిట్లు పంపిణీ చేశారు. వడమాలపేట మండలం అప్పళాయగుంట నుంచి నగరి వరకు మంత్రి రోజా పార్టీ శ్రేణులతో కలసి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పుత్తూరు ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు శిక్షణ పొందడానికి రూ.2.05 లక్షల విలువగల కుట్టుమిషన్లు అందించారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ఎస్ఆర్ఐటీ కళాశాలలో 430 మంది, తాడిపత్రిలో 100 మంది రక్తదానం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో చిత్రావతి నదిలో బోట్లపై వైఎస్సార్ సీపీ జెండాలు ఎగురవేస్తూ సీఎం జగన్ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో ఎంజీఎం పాఠశాల విద్యార్థులు ‘హ్యాపీ బర్త్‌డే జగన్ మామయ్యా’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి రక్తదానం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, మాచర్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మంత్రి అంబటి సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో రక్తదానం చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి రక్తదానం చేశారు. వేమూరు సమీపంలోని ఓ చెరువు మధ్యలో జగన్ అభిమాని కారుమూరు వెంకటరెడ్డి ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ అంటూ ఏర్పాటు చేసిన అక్షరాల ఆకృతి ఆకట్టుకుంది. ► ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. విజయవాడ తూర్పు, పశ్చిమలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరై జగన్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు సంబరాలు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నులపండుగగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల కరతళధ్వానాలు, జై జగన్ నినాదాల మధ్య పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్‌ను కట్ చేశారు. అంతకుముందు మహానేత వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. మత గురువులు సర్వమత ప్రార్థనలు జరిపి సీఎం జగన్‌ను ఆశీర్వదించారు. పేదలకు దుస్తులు, కుట్టుమిషన్లు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్ అందజేశారు. పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే తిప్పేస్వామి, తెలుగు అకాడమి చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, పార్టీ నేతలు జూపూడి ప్రభాకరరావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధు, ఎన్. పద్మజ, నారాయణమూర్తి, రవిచంద్రారెడ్డి, కాకుమాను రాజశేఖర్, ఎన్ఆర్ఐ పండుగాయల రత్నాకర్, కనకరావు మాదిగ, మనోహర్‌రెడ్డి, పానుగంటి చైతన్య, బందెల కిరణ్, నాగదేవి రవికుమార్, పాల్గొన్నారు. తెలంగాణలోనూ సంబరాలు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను తెలంగాణాలోనూ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ, మూసాపేట, మోతీనగర్, బాలానగర్, ఫతేనగర్ తదితర ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేశారు. కేపీహెచ్‌బీకాలనీలోని రమ్యా గ్రౌండ్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రమ్యా గ్రౌండ్స్‌లో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ఆర్సీపీ ఐటి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాక్షి ఫైనాన్షియల్ డైరెక్టర్ వై.వి.ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, సినీ నటుడు కృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు. భరత్‌నగర్ కాలనీ పోచమ్మ గ్రౌండ్లో అభిమానులు కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. వెయ్యి ఇళ్లల్లో గృహప్రవేశం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అన్న, రక్తదాన, దుప్పట్లు, దుస్తుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన కళాకారుడు దేశెట్టి శ్రీనివాసులు తన రక్తంతో ముఖ్యమంత్రి చిత్రాన్ని గీశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో అన్నదాన, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్ బాబు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అవయవదానానికి హామీ పత్రం ఇచ్చారు. రామేశ్వరం జగనన్న కాలనీలో 1000 ఇళ్లలో గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. పులివెందుల్లో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రక్తదానం చేశారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్థానిక వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో కేక్ కట్ చేశారు. మదనపల్లెలో మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల పవన్‌కుమార్ ఆధ్వర్యంలో 5 వేల మంది ఆటో కార్మికులకు యూనిఫారాలు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రూ.7 కోట్ల విలువైన కానుకలు పంపిణీ చిత్తూరు అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరులో ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎం.సి.విజయానందరెడ్డి మహిళలకు భారీగా కానుకలను పంపిణీ చేశారు. దాదాపు రూ.7 కోట్ల విలువ చేసే నూతన వస్త్రాలను అందజేశారు. రూ.1,300 విలువ చేసే కిట్లను చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, మేయర్ అముద చేతుల మీదుగా 44 వేల మంది మహిళలకు అందచేశారు. ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ బలమే మహిళలని, వారి ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురేస్తామని, చిత్తూరు నియోజకవర్గ నుంచి తొలి విజయాన్ని అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం గుడిపాల మండలంలో జరిగిన కార్యక్రమంలో 10 వేల మంది మహిళలకు సైతం ఈ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీకాంత్, సహదేవ, ఇందు, కోఆప్షన్ సభ్యులు చందు, అను, పలువురు సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉప్పలపాడులో బజరంగ్ సేవా తత్పరత పెదకాకాని: గుంటూరు జిల్లా ఉప్పలపాడులో బజరంగ్ ఫౌండేషన్ పౌండేషన్ వ్యవస్థాపకుడు అంబటి మురళీకృష్ణ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. వైద్య శిబిరంలో 1,211 మంది కంటి, గుండె పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 35 మందికి వైద్యులు యాంజియోగ్రాం సూచించగా, వారిని శనివారం ప్రత్యేక వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లనున్నారు. ఏడుగురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ఇద్దరికి జైపూర్ కాళ్లు, వెస్ట్రన్ కమోడ్లు అందజేశారు. మురళీకృష్ణ మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పాలనలో పేదల ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొనియాడారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని బజరంగ్ ఫౌండేషన్ అంకిత భావంతో ప్రజా సేవను కొనసాగిస్తోందన్నారు. గత సంవత్సర కాలంగా ‘బజరంగ్ జగన్నామ సంక్షేమ సంవత్సరం’లో కంటి సమస్యల నివారణకు నేత్రజ్యోతి ద్వారా ఉచిత నేత్ర వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఏడు పనిదినాల్లో కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో పెద్దేటమ్మ తల్లి పీఠం వద్ద కేక్ కట్ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పేదవాడి గుండె చప్పుడు సీఎం జగన్
-
పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్: సజ్జల
-
తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు సీఎం జగన్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్‌దేనన్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చి.. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. ‘‘తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన అందిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా సంక్షేమం పథకాలు అందించిన ఘనత జగన్‌దే. అవినీతికి తావులేకుండా, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘తండ్రికి మించిన తనయుడుగా జగన్ పేరు తెచ్చుకున్నారు. పేదల చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు ఇలా అన్నీ అందుబాటులోకి తెచ్చారు. అన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు. జగన్ పాలన పారదర్శకంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం మారీచశక్తులు మళ్లీ ఏకం అయ్యాయి. గతంలో మోసం తప్ప ప్రజలకు ఇంకేమీ చేయలేదు. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు చూశానని లోకేష్ అంటున్నారు. మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనపడలేదా?. అధికారంలో ఉన్న మిమ్మల్ని ప్రజలు ఈడ్చి కొట్టారు. అయినాసరే మళ్ళీ ప్రజలను నమ్మించేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో సీఎం జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఇదీ చదవండి: జయహో జననేతా..ఏ దైవం పంపించాడో! -
సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ వైఎస్సార్సీపీ స్పెషల్ వీడియో
-
సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి రోజా స్పెషల్ గిఫ్ట్
-
హైదరాబాద్ లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు
-
53 వేల కుటుంబాలకు మందికి బట్టల పంపిణీ కార్యక్రమం
-
అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
Lion Kiran: ఇంద్రలోక్ థీమ్‌తో బర్త్‌డే సెలబ్రేషన్స్.. సినీతారల హడావుడి (ఫోటోలు)
-
Payal Rajput: అదిరిపోయిన మంగళవారం హీరోయిన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడలేదని, డిసెంబర్ 7న ఎల్బీ స్డేడియంలో సోనియా గాంధీ వచ్చినప్పుడు తెలంగాణ తల్లి అంటే ఈ రూపంలో ఉంటుందని ప్రజలందరూ భావించారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలోకి సోనియా గాంధీ ప్రవేశించిన సమయంలో లక్షలాదిమంది తెలంగాణ బిడ్డలు లేచి స్వాగతం పలికారని, ఆ క్షణం ఆమె మొఖంలో కనిపించిన సంతోషం, సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తెలంగాణకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కాంగ్రెస్ అండగా ఉంటుందని సోనియా ఓ తల్లిలా భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి అని ఆయన అభివర్ణించారు. శనివారం గాం«దీభవన్‌లో జరిగిన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో మంత్రులతో కలసి సీఎం ముఖ్యఅతి«థిగా పాల్గొన్నారు. సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలసి 78 కిలోల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం సోనియా ఆరు గ్యారంటీలను ఇచ్చి మరింత భరోసా కvచారన్నారు. పాలకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తనదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్లే తాము పదవుల్లో కూర్చున్నామని చెప్పారు. పదేళ్లు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కొన్నారని.. కార్యకర్తలకు మాట ఇస్తున్నానని.. ఈ ప్రభుత్వం కార్యకర్తలదేనని ప్రకటించారు. సీఎంకు సేవాదళ్ గౌరవ వందనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వచ్చిన డిసెంబర్ 9 చరిత్రాత్మకమైన రోజని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నా రు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీత క్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహే‹శ్ కుమార్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, పీసీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. సీఎం హోదాలో గాందీభవన్‌కు వచ్చి న రేవంత్ సేవాదళ్ కార్యకర్తల గౌరవ వందనం స్వీకరించారు. -
Sharmila Tagore Celebrates 79th Birthday: హీరో సైఫ్ అలీ ఖాన్ తల్లి 79వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
గ్రాండ్‌గా ఇషా అంబానీ ట్విన్స్ పుట్టినరోజు వేడుకలు.. హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
మంత్రి ఆర్కే రోజా అదిరిపోయే స్పీచ్..
-
8ఏళ్ల పిల్లాడు,జీవితంలో మొదటిసారి.. క్లాస్‌టీచర్ చేసిన పనికి ఎమోషనల్
జీవితంలో ప్రతి ఒక్కరికి తమ బర్త్‌డేను స్పెషల్‌గా జరుపుకోవాలని కోరిక ఉంటుంది. పుట్టినరోజు వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే హడావిడి ఉంటుంది. కానీ ఆ పిల్లాడి లైఫ్‌లో మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ పుట్టినరోజుని జరుపుకునే అదృష్టం రాలేదు. విషయం తెలిసి, క్లాస్ టీచర్ అందించిన సర్‌ప్రైజ్‌కి ఆ బాలుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ క్లాస్ టీచర్ ఏం చేసిందంటే.. కొలంబియాకు చెందిన ఏంజెల్ డేవిడ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు జీవితంలో ఇప్పటివరకు పుట్టినరోజును జరుపుకోలేదు. అతని కుటుంబం ఆర్థిక పరిస్థితుల రీత్యా అతని తల్లి డేవిడ్ బర్త్‌డే వేడుకలను ఇంత వరకు సెలబ్రేట్ చేయలేకపోయింది. తండ్రి లేకపోవడం, ఏంజెల్ డేవిడ్ సహా నలుగురు పిల్లల బాధ్యత ఆమె ఒంటరిగా చూసుకునేది. దీంతో పేదరికం కారణంగా డేవిడ్‌కు ఎనిమిదేళ్లు వచ్చినా ఇంతవరకు పుట్టినరోజును నిర్వహించలేకపోయింది. విషయం తెలిసిన డేవిడ్ క్లాస్ టీచర్ అతని బర్త్‌డేను పెద్ద వేడుకలా చేయాలని నిర్ణయించుకుంది. దీంతో కేక్, డెకరేషన్తో క్లాస్ రూమ్‌లోనే డేవిడ్‌కు తెలియకుండా సర్ప్రైజ్గా బర్త్‌డే వేడుకలను ఏర్పాటు చేసింది. క్లాస్‌లోకి డేవిడ్ అడుగుపెట్టగానే క్లాస్ టీచర్ సహా అతని క్లాస్మేట్స్ అందరూ హ్యాపీ బర్త్‌డే అంటూ సాంగ్స్ పాడుతూ అతన్ని క్లాస్‌రూంలోకి వెల్కమ్ చెప్పారు. ఊహించిన ఈ సర్ప్రైజ్తో డేవిడ్ ఆనందంతో ఏడ్చేశాడు. దీంతో పిల్లలంతా ఒక్కచోట చేరి డేవిడ్‌ను కౌగిలించుకొని బర్త్‌డే విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Hear Her Stories 📣 (@hearherstories) -
ఆస్ట్రేలియాలో కాకాని జన్మదిన వేడుకలు
-
ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కాకాని జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి.. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన సేవలను వారు కొనియాడారు. కాకాని రాజకీయ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని,ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి మరిన్ని అవకాశాలు రావాలని ప్రవాసులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జై జగన్, జై కాకాని అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, భరత్, బ్రహ్మా రెడ్డి, రామాంజి, నాగార్జున, మణిదీప్, తదితరులు పాల్గొన్నారు. -
Nita Ambani 60th Birthday: పుట్టినరోజు వేడుకల్లో నీతా అంబానీ (ఫొటోలు)
-
జపాన్ లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
Haritha-Jackie: బుల్లితెర నటి హరిత కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Anchor Ravi Daughter Viya Birthday Celebrations: పడవలో యాంకర్ రవి కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Ali Birthday Celebrations : కమెడియన్ అలీ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
వీణావాణీలకు శుభాకాంక్షలు
హైదరాబాద్: అవిభక్త కవలలైన వీణావాణీ సోమవారం 20వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలోని మహిళా శిశుసంక్షేమ శాఖ బాలసదన్‌లో వీరు ఆశ్రమం పొందుతున్నారు. మురళీ–నాగలక్ష్మి దంపతులకు జని్మంచిన ఈ కవలల తలలు అతుక్కుని జని్మంచిన వీరిని ఎన్ని ఆసుపత్రులకు చూపించినా వారిని విడదీయడం సాధ్యం కాలేదు. దాంతో వారిని చిన్నతనం నుంచే తల్లిదండ్రులు స్టేట్‌హోంలోని శిశువిహార్‌లో ఉంచారు. నాటి నుంచి నేటి వరకు కూడా వారు అక్కడే ఆశ్రయం పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. పది, ఇంటర్‌లోనూ ఇరువురు మంచి మార్కులు సాధించారు. భవిష్యత్‌లో సీఏ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం ఆంధ్రా మహిళా సభ కళాశాలలో బీ.కాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సోమవారం వీరి జన్మదిన వేడుకలు బాలసదన్‌లో తల్లిదండ్రులు, అధికారుల సమక్షంలో నిర్వహించారు. -
Lakshmi Manchu 46th Birthday Celebrations: మంచు లక్ష్మి బర్త్‌డే పార్టీ.. బాలీవుడ్ స్టార్స్ సందడి (ఫోటోలు)
-
ఏ రైల్వే స్టేషన్ ఎప్పుడు పుట్టిందో?
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట్,వరంగల్, ఖమ్మం.... ఇలాంటి ప్రముఖ రైల్వే స్టేషన్లు ఎప్పుడు స్థాపించారు.. ఎలా ఆవిర్భవించాయి ?.. వాటి పుట్టుకలో కీలక భూమిక ఎవరిది..?.. నాటి ఏ పరిస్థితి వల్ల అక్కడ స్టేషన్ ఏర్పాటైంది? –ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఇలాంటి వివరాల సేకరణలో తలమునకలై ఉన్నారు. ప్రత్యేకంగా కొంతమందిని ఇందుకోసం పురమాయించారు. సదరు సిబ్బంది ఆ వివరాల సేకరణకు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. ఏ స్టేషన్ ఎప్పుడు ఏర్పడిందో వివరాలు తెలిస్తే.. వాటి పుట్టిన రోజు (ఆవిర్భావ దినోత్సవం) వేడుకలు నిర్వహిస్తారట. మోదీ చేసినప్రస్తావనే ఆదేశంగా భావిస్తూ.. ఇటీవల దేశవ్యాప్తంగా తొమ్మిది వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ పట్టాలెక్కించింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన, ప్రజలను రైల్వేకు మరింత చేరువ చేసే క్రమంలో రైల్వే స్టేషన్లకు పుట్టినరోజు వేడుకలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తమిళనాడులోకి కోయంబత్తూరు, ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్ల భవనాలకు ఇటీవల స్థానిక రైల్వే అధికారులు ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. వీటిని ఉదహరించిన మోదీ, మిగతా వాటికి కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కానీ, విధానపరంగా అలాంటి నిర్ణయం ఇప్పటి వరకు లేదని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి ప్రధాని స్వయంగా పేర్కొనేసరికి, వెంటనే కొన్ని స్టేషన్ భవనాలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని, ఆయా స్టేషన్లతో అనుబంధం ఉన్న ప్రముఖులు, సాధారణ ప్రయాణికులను పెద్ద సంఖ్యలో పిలిపించి అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో, సమీపంలో ఏయే స్టేషన్ల ఆవిర్భావ రోజులున్నాయో గుర్తించే పనిలో పడ్డారు. వివరాలు సేకరిస్తున్నాం ‘‘రెండు స్టేషన్ల పుట్టినరోజు వేడుకలను ప్రధాని స్వయంగా ప్రస్తావించారు. కానీ, ఇప్పటి వరకు మాకు అలాంటి నిర్ణయంపై సమాచారం లేదు. ప్రధాని స్వయంగా చెప్పారంటే, ఆదేశాలతో సంబంధం లేకుండా మేం నిర్వహించాల్సిందే. అందుకే వివరాలు సేకరిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. -
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అన్నపూర్ణ స్టూడియోలో ANR శత జయంతి ఉత్సవాలు
-
పుట్టినరోజున ప్రజాసేవలో నిమగ్నమైన ప్రధాని మోదీ
-
కువైట్‌లో ఘనంగా వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. కువైట్ వైఎస్ అవినాష్ రెడ్డి యూత్ అసోషియేషన్ నాయకులు, ముల్లా జిలాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు కువైట్ వైఎస్ఆర్ సిపీ నాయకులు సహా అవినాష్ అభిమానులు బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అవినాష్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రవాసాంధ్రులంటే ప్రత్యేక అభిమానమని, వాళ్ల సమస్యలు ఏవైనా ఆయన దృష్టికి వెళితే వెంటనే స్పందించి పరిష్కరించడానికి కృషి చేస్తారని గోవిందు నాగరాజు పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో గల్ఫ్ లో ఉన్న ప్రవాసాంధ్రులను ఆదుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి మైనార్టీ నాయకులు షేక్ రహమతుల్లా కొనియాడారు. -
మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డి కుమారుని బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
Ayra Vidya Birthday Celebrations: మంచు విష్ణు గారాలపట్టి ఐరా బర్త్‌డే.. లిటిల్ ఏంజెల్ క్యూట్ ఫోటోలు
-
Hansika Birthday Photos: హీరోయిన్ హన్సిక పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
కమెడియన్ రచ్చ రవి బర్త్‌డే.. సినీ సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
Sakshi Agarwal Photos: హీరోయిన్ సాక్షి అగర్వాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలు
-
బర్త్‌డే స్పెషల్.. సితార చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేరు
-
'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్‌డే గిఫ్ట్ నువ్వే మాకు ఇవ్వాలి'
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ జూలై 18న(మంగళవారం) పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇషాన్ కిషన్ వెస్టిండీస్ టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా ప్రస్తుతం విండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతుంది. తొలి టెస్టులో ఇషాన్ కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అతడు క్రీజులోకి వచ్చిన కాసేపటికే రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఆ మ్యాచ్ లో ఇండియా ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు వెస్టిండీస్ తో రెండో టెస్ట్ బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లికి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇషాన్ బర్త్ డే సందర్భంగా టీమిండియా క్రికెటర్లు అతనికి బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్‌ను.. బర్త్‌డే బాయ్ ఇషాన్‌కు ఏం గిఫ్ట్ ఇస్తారు అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించాడు. "ఏం బర్త్ డే గిఫ్ట్ కావాలట అతనికి? నీకేం కావాలి భాయ్? నీ దగ్గర అన్నీ ఉన్నాయ్. దీని గురించి టీమ్‌ను అడగాలి. టీమ్ అంతా కలిసి ఇస్తుంది. నువ్వే సెంచరీ కొట్టి మాకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలి" అని రోహిత్ శర్మ అనడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A day in the life of birthday boy - @ishankishan51 👏📷 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦 - A 𝙎𝙋𝙀𝘾𝙄𝘼𝙇 appearance from #TeamIndia captain @ImRo45 #WIvIND pic.twitter.com/aHfW1SpYL2 — BCCI (@BCCI) July 18, 2023 చదవండి: Asian Games 2023: వినేశ్ ఫొగాట్, భజరంగ్‌ల వ్యవహారంపై హైకోర్టుకు అమిత్ పంఘల్ -
ఆస్ట్రేలియాలో ఘనంగా మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
ధోని బర్త్‌డే.. ఆకాశమంత కటౌట్, సినీ హీరోలను మించేలా!
జూలై 7(శుక్రవారం).. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 42వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. అందునా సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో ధోనిపై ప్రేమ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రోజున ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరో తొమ్మిది నెలల తర్వాత తాను ఐపీఎల్ ఆడేది లేనిది చెప్తానంటూ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఫిట్‌గా ఉంటే ధోనిని వచ్చే ఐపీఎల్ సీజన్లో చూసే అవకాశం ఉంది. ఇక రేపు(జూలై 7న) ధోని బర్త్‌డే వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అతని అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోని పుట్టినరోజు పురస్కరించుకొని భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ధోనికి పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు. ధోనీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో 52 అడుగుల పొడవైన కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. టీమిండియా జెర్సీ, బ్యాట్ పట్టుకొని ఉన్న ధోనీ ఉన్న కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 77 అడుగుల పొడవు ఉన్న ధోనీ కటౌట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఏపీలోని నందిగామలో ఈ కటౌట్ పెట్టినట్లు సమాచారం. సినీ హీరోలకు తీసిపోని విధంగా ధోనికి కటౌట్ ఏర్పాటు చేయడం అతని క్రేజ్ ఏంటనేది తెలుపుతోంది. ఇక క్రికెటర్లకు ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన వాటిలో ఇదే అది పెద్ద కటౌట్ అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్‌లో ధోనీ ఉన్నట్టుగా ఈ కటౌట్ ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధోనీ కటౌట్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధోనీ క్రేజ్ మాములుగా లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ‘మిస్టర్ కూల్’ ధోనీ సారథ్యంలో టీమిండియా 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలిచింది. మూడు ఐసీసీ టైటిళ్లను సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా కీర్తి సాధించాడు. 2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. 77 feet cut-out for MS Dhoni in Andra Pradesh. Biggest cutout for any cricketer..❤️ The craze for MS Dhoni is insane!🔥🐐 pic.twitter.com/CWZ2YPyxxp — 𝐒 𝐰 𝐚 𝐫 𝐚 (@SwaraMSDian) July 6, 2023 1st Cutout ✅ 52 feet for Dhoni at Telangana 😎 77ft Biggest Cutout loading ⏳🔥#WhistlePodu #Yellove @MSDhoni pic.twitter.com/Ylj2bbzYZV — CSK Fans Army™ (@CSKFansArmy) July 6, 2023 MS Dhoni Turns 42 Tomorrow !🥳 Watch 42 Sixes Of Him In 42 Seconds .!😉🥁#MSDhoni || @msdhoni || #HappyBirthdayDhoni MSD ICON OF WORLD CRICKET pic.twitter.com/VKqHIwTqer — One Best Shot of MS Dhoni Daily (@MSDVids07) July 6, 2023 చదవండి: #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ -
109వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్న బామ్మ.. ఆరోగ్య రహస్యమిదేనట
ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు మెరైన్ హ్యూస్. చూడ్డానికి డెభై, ఎనభై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తుంది కానీ, వయసు వందేళ్ల పైనే! ఇప్పటికీ చేతికర్ర లేకుండా నడుస్తుంది. స్వయంగా వంట వండుతుంది. ఇంటి పనుల్లో ఇతరులకు సహాయం కూడా చేస్తుంది. ఇక అప్పుడప్పుడు చాలా సంతోషం వస్తే పాట పాడుతూ డాన్స్ ఆడుతుంది.} రచయిత్రి అయిన ఈమె ఇప్పటికీ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తోంది. ఈ మధ్యనే అమెరికాలోని తన స్వగృహంలో కుంటుంబ సభ్యులందరితో కలసి తన 109వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో అందరినీ నవ్వుతూ పలకరించి, కేక్ కట్ చేసి, అందరికీ తానే తినిపించడంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యం ఉండటం వెనుక అసలు రహస్యం ఏమిటని ఆమె మనవళ్లు, మనవరాళ్లు అడిగితే ‘నాకు ఏం చేయాలని అనిపిస్తే అది చేస్తా. ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించను. మంచి సంగీతం వింటా. ఆహారం విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోను. కానీ, తినే ఆహారంలో నాకిష్టమైన పదార్థాలే ఎక్కువగా ఉండేలా చూసుకుంటా. ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని నేను నమ్ముతా’ అని చెప్పింది. -
చిన్నారులతో మంచు మనోజ్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
Anchor Anasuya: కుటుంబ సభ్యులతో కలిసి యాంకర్ అనసూయ పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
ఊరు పేరు భైరవకోన టీజర్ లాంచ్.. సందీప్ కిషన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ కార్యకర్తల వాగ్వాదం
-
Akhil Akkineni: ఘనంగా అక్కినేని అఖిల్ పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
హీరో నితిన్ బర్త్ డే .. అభిమానం చాటుకున్న ఫ్యాన్స్ (ఫొటోలు)
-
గ్రాండ్‌గా గ్లోబల్ స్టార్ బర్త్ డే వేడుకలు.. హాజరైన సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
అమెరికాలో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్‌లో రామ్ చరణ్ అభిమానులు.. సర్ ప్రైజ్ గ్రీటింగ్స్ తెలిపారు. ప్రపంచ సినిమా స్టూడియోలకు ప్రసిద్ది అయిన హాలీవుడ్ సైన్ పై.. ఎయిర్ ప్లేన్ బ్యానర్ ఎగురవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారి.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేసినందుకు.. వినూత్నంగా విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కి గ్రీటింగ్స్ తెలియజేస్తూ USA మెగా కన్వీనర్ విజయ్ రేపల్లె ఈ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. రామ్ చరణ్ పై అభిమానంతో ఇలా ఎయిర్ ప్లేన్ బ్యానర్ ను ఆకాశంలో ప్రదర్శించినట్లు తెలిపారు. ఇక అమెరికా వ్యాప్తంగా అభిమానులు కేక్ కట్ చేసి.. చెర్రీకీ విషెస్ తెలిపారు. -
గ్రాండ్‌గా రామ్‌చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రామ్ చరణ్‌కు ఆర్సీ15 టీం సర్ప్రైజ్.. సెట్లో ఘనంగా బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
RC15 సెట్స్‌లో అదిరిపోయిన రామ్‌చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సెస్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. ఇక రేపు(సోమవారం)రామ్‌చరణ్ పుట్టినరోజు కావడంతో ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి.RC15 సెట్స్‌లో యూనిట్ సభ్యుల మధ్య రామ్‌చరణ్ తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. చరణ్ ఎంట్రీ కాగానే అతనిపై గులాబీల వర్షం కురిపించారు. అనంతరం కేక్‌కట్ చేయించారు. ఈ వేడకలో శంకర్, దిల్‌రాజు, కియారాలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by ram charan. RC (@rc_15_love_) Global star @AlwaysRamCharan birthday celebrations begins #RC15 #GlobalStarRamCharan #Ramcharan pic.twitter.com/CqnpfZeBuJ — SivaCherry (@sivacherry9) March 25, 2023 -
మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?
విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు బర్త్‌డేను ఆదివారం కుటుంబ సభ్యులు మధ్య జరుపుకున్నారు. మార్చి 19న మోహన్ బాబు పుట్టిన రోజు. ఆదివారంతో ఆయన 71వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆయన పుట్టిన రోజును వేడుకగా జరిపించిచారు. అంతేకాదు కొత్త కొడలు, మంచు మనోజ్ భార్య భూమా మౌనిక దగ్గర ఉండి సెలబ్రెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో అన్ని తానై సందడి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. చదవండి: నటి మాధవి ఇప్పుడు ఎలా ఉందో చూశారా? షాక్ అవుతున్న ఫ్యాన్స్ మోహన్ బాబుతో పాటు భార్య నిర్మలాదేవి, కూతురు లక్ష్మి మంచు, మనవరాలు, కొడుకు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. అయితే మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ మాత్రం మిస్ అయ్యారు. మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఇవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లంత మంచు విష్ణు ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తండ్రి బర్త్‌డే సందర్భంగా మనోజ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా... లవ్ యూ...!’ అంటూ తండ్రికి విషెస్ తెలిపాడు. అలాగే కూతురు మంచు లక్ష్మి, మంచు విష్ణు నుంచి మనవరాలు, మనవడు ఇలా అందరు సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
నాన్న పుట్టినరోజు.. అమ్మవారికి బంగారు ఆభరణాలు
-
Birthday Politics: ఆ బర్త్‌డే వేడుకల వెనుక రహస్యం ఏంటి?
ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పొలిటికల్ బర్త్‌డే పార్టీలు జోరందుకున్నాయి. రెండు పార్టీలు..ఇద్దరు గిరిజన నేతలు..మరో బీసీ నేత పుట్టిన రోజు వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించుకున్నారు. గిరిజన నేతలిద్దరూ స్వపక్షంలోనే ప్రతిపక్షంలా మారిపోయారు. సొంత పార్టీలోని ప్రత్యర్థులపై పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు గజమాలల బర్త్‌డే వేడుకల వెనుక రహస్యం ఏంటి? మానుకోటలో ఏం జరిగింది? పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లులో పార్టీల మధ్య..ఒకే పార్టీలోని ప్రత్యర్థుల మధ్య పోరు తీవ్రమవుతోంది. అంతర్గత విభేదాలతో రగిలిపోతున్న కొందరు నేతలు రాజకీయంగా పంతం నెగ్గించుకునేందుకు.. ఎదుటివారిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ సత్తా చాటేందుకు సరికొత్త వ్యూహాలతో జనంలోకి వెళ్తున్నారు. అవకాశం దొరికితే చాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు బర్త్ డే వేడుకలను వేదికగా చేసుకొని బలనిరూపణకు దిగుతున్నారు. మానుకోటలో అధికార పార్టీ ఎంపీ మాలోతు కవిత, ములుగు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య నిర్వహించిన బర్త్ డే వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇద్దరు నేతలు సృష్టించిన హంగామా చర్చనీయాంశంగా మారింది. చదవండి: (TS: కాంగ్రెస్‌లో ఎవరిగోల వారిదే.. ఠాక్రే ముందున్న సవాళ్లేంటీ?) గజమాల వెనక రాజకీయం పోటాపోటీ కార్యక్రమాలకు అధికార, విపక్ష పార్టీలనే తేడా లేదు. కొత్త సంవత్సరం తొలిరోజున మహబూబాబాద్ ఎంపీ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత పుట్టినరోజు. ఆరోజు కవిత, ఆమె అనుచరులు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. భారీ క్రేన్ సహాయంతో గజమాల వేసుకుని మానుకోటలో జనసందోహంతో ఊరేగింపు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అనుచరులతో రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. కవిత ఆమె అనుచరులు సృష్టించిన హంగామా వెనుక అసలు రాజకీయం వేరే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న కవిత సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే బర్త్ డే వేడుకలతో సత్తా చాటే ప్రయత్నం చేశారని ప్రచారం సాగుతోంది. రైతు దీక్ష, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎంపీ కవిత నుంచి మైక్ లాక్కుని అవమానపరిచేలా వ్యవహరించారు. ఈ వ్యవహారంతో రగిలిపోతున్న కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. నేనూ లైన్లో ఉన్నాను..! రాజకీయాల్లోకి వచ్చాక ఏనాడూ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోని భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ లో జనవరి 2న బర్త్ డే వేడుకలతో హంగామా చేశారు. భారీ క్రేన్ సహాయంతో గజమాల ధరించి వెంకటాపూర్‌లో ఊరేగింపు మొదలుపెట్టి నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో పర్యటించారు. పోదెం వీరయ్య పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన నిర్వహించుకున్న బర్త్‌డే వేడుకలు జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తున్నాయని అంటున్నారు. వీరయ్య హస్తానికి హ్మాండిచ్చి కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కారు ఎక్కడానికి సిద్ధమవుతున్న వీరయ్య, అక్కడా ఉంటా.. ఇక్కడ ఉంటా అంటున్నారట. భద్రాచలం, ములుగు రెండు నియోజకవర్గాలు తనవే అని నిరూపించుకునేందుకు బల ప్రదర్శన నిర్వహించినట్లు ప్రచారం సాగుతుంది. వీరయ్య వ్యూహమేంటీ? ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీతక్కకు చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన పోదెం వీరయ్యకు గులాబీ పార్టీ గాలం వేసినట్లు తెలుస్తుంది. ముందుగా సీతక్కనే గులాబీ గూటిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు యత్నించినప్పటికీ రేవంత్ రెడ్డి నమ్మిన బంటులా ఉన్న సీతక్క పార్టీ మారేందుకు ససేమిరా అనడంతో పోదెం వీరయ్యతో సీతక్కకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే వీరయ్య గులాబీ బాస్ ముందు కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్లో చేరి ములుగులో తాను పోటీలో నిలిచినా.. భద్రాచలంలో మాత్రం తాను సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నడు లేని విధంగా బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో ములుగు నియోజకవర్గంలో భారీ ఊరేగింపు నిర్వహించి అక్కడా ఉంటా.. ఇక్కడ ఉంటానని చాటి చెప్పినట్లు జనం భావిస్తున్నారు. వీరయ్య వ్యూహం జనానికి అవగతం అవుతున్నా.. గులాబీ బాస్ మదిలో ఏముందో తేట తెల్లం కావాలంటే మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. తగ్గేదేలే..! బర్త్ డే రాజకీయం ములుగు, మహబూబాబాద్‌లోనే కాదు అటు భూపాలపల్లిలో సైతం సాగుతోంది. మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బర్త్ డే సందర్భంగా ఇటీవల గ్రాండ్ గా వేడుకలు నిర్వహించి అనుచరుల్లో కొత్త ఊపును తీసుకొచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడమే లక్ష్యంగా చారీ సాబ్ బర్త్ డే పార్టీతో సత్తా చాటే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బర్త్ డే వేడుకలు.. విందు భోజనాలతో రాజకీయాలను మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓరుగల్లు నేతలు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఎన్నికల ఎత్తుగడలతో నాయకులంతా ముందుకు సాగుతున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఘనంగా దిల్ రాజు మనవరాలి పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
దుబాయ్‌లో గ్రాండ్ గా ‘జోర్దార్’ సుజాత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
జగనన్న బర్త్‌డే వేడుకలు నిర్వహించిన పుష్ప శ్రీవాణి (ఫొటోలు)
-
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
CM Jagan Birthday: శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పండగల జననేత జగనన్న జన్మదిన వేడుకలు
-
CM YS Jagan Birthday: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బర్త్‌డే వేడుకలు
-
ఢిల్లీ: ఏపీ భవన్ లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
అనంతపురంలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
వైఎస్సార్ సర్కిల్ వద్ద అభిమానులు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
విజయవాడ గోల్లపూడిలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
ఏపీ వ్యాప్తంగా సీఎం జగన్ బర్త్ డే వేడుకలు
-
తొలి రోజు ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
సాక్షి, విశాఖపట్నం/రేణిగుంట/సూళ్లూరుపేట: ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మూడురోజులపాటు నిర్వహిస్తున్న వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహింరు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు ప్రారంభించారు. అలాగే వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కోకో, త్రోబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిప్పలనాగిరెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాస్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్‌కుమార్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని పంచకర్ల రమేష్‌బాబు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ‘నవరత్నాలు– సంక్షేమపథకాలు’ పేరిట విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో కబడ్డీ, హాకీ పోటీలను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పలుచోట్ల క్రీడా పోటీలు జరిగాయి. వీటిని ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కె.భాగ్యలక్ష్మి, నాగులాపల్లి ధనలక్ష్మి ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ మధురపూడి విమానాశ్రయంలో కేక్ కట్ చేశారు. అనపర్తి, గోపాలపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు క్రీడా పోటీలను నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వందమంది చిరు వ్యాపారులకు తోపుడుబండ్లను అందజేశారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముగ్గులతో సీఎం జగన్ చిత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. నేడు, రేపు పలు కార్యక్రమాలు సాక్షి, అమరావతి: ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 20న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, కుల సంఘాల ప్రతినిధులతో ‘జగనన్న పరిపాలన.. రాష్ట్ర సంక్షేమం–అభివృద్ధి’పై చర్చ ఉంటుంది. ఇదే రోజు ముందస్తు జన్మదిన వేడుకలు కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను పార్టీ నిర్వహించనుంది. అనాథ, వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. అలాగే మహిళలకు పలు అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. పుట్టినరోజు వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ముఖ్యంగా మహిళలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయనున్నారు. ఇప్పటికే సీఎం జన్మదిన వేడుకలు సోమవారం ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రారంభమయ్యాయి. గతేడాది సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా 38 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. ఇది ఎందరినో అత్యవసర సమయాల్లో ఆదుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించనున్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని భద్రపరిచి అవసరమైన రోగులకు అందిస్తారు. అలాగే రక్తదాతల నుంచి ప్లెడ్జ్ ఫామ్స్ సేకరించి రోగులకు అత్యవసరమైన సందర్భాల్లో రక్తం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ‘టేక్ ద ప్లెడ్జ్.. సేవ్ ఏ లైఫ్’ అనే నినాదంతో.. రక్తదానం చేయడానికి సుముఖంగా ఉన్నవారిని ysrcpblooddonation.comలో నమోదు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు. డ్వాక్రా, మహిళా, కుల, ప్రజాసంఘాలు, మేధావులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను భాగస్వాములను చేస్తూ సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. -
అనాథాశ్రమంలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న స్టార్ హీరో
తమిళ సినిమా: నటుడు అరుణ్ విజయ్ శనివారం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు అన్నదానం, రక్తదా నం భారీ ఎత్తున నిర్వహించారు. పోరాడి కథానా యకుడుగా ఉన్నత స్థాయికి చేరుకున్న నటుడు అరుణ్ విజయ్. తమిళంతోపాటు తెలుగు తదితర భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవ ల ఈయన కథానాయకుడిగా నటింన చిత్రాలు వరుసగా మం విజయాన్ని అందుకున్నాయి. తా జాగా తమిళ్ రాకర్స్ అనే సిరీస్‌తో వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. కాగా ఆయన శనివారం తన పుట్టినరోజు వేడుకలను చెన్నైలోని ఉదవుమ్ కరంగల్ అనాథ ఆశ్రమంలో అనాథ బాలల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఆ శ్రమంలో బాలలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమాన సంఘం నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అభిమానులు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో రక్తదానం చేశారు. కాగా ప్రస్తుతం అరుణ్ విజయ్ అచ్చం ఎన్బదు ఇల్లయే అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర యూనిట్ అరుణ్ విజయ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన కేక్ కట్ చేసి, యూనిట్ సభ్యులకు పంపిణీ చేశారు. -
సెట్లో పూజా బర్త్‌డే సెలబ్రెట్ చేసిన స్టార్ హీరోలు, వీడియో వైరల్
పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో టాలీవుడ్ హీరో విక్టరి వెంకటేశ్, విలక్షణ నటుడు జగపతి బాబులు కీ రోల్ పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు పూజా బర్త్‌డే. ఈ సందర్భంగా సెట్లో సల్మాన్ ఖాన్, వెంకటేశ్‌లు ఆమె బర్త్‌డే సెలబ్రెట్ చేశారు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన బిగ్‌బాస్ దివి.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా పూజా ‘నేను ఎక్కువ ప్రేమించేది నా పనిని, షూటింగ్‌ని. అలాంటి షూటింగ్ సెట్లోనే నేను కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషకంగా ఉంది. ఇది నాకు ఓ మధుర జ్ఞాపకం. ఆన్ సెట్స్‌లో బర్త్ డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని ఆమె పేర్కొంది. Wishing the gorgeous @hegdepooja a very Happy Birthday from the team of #KisiKaBhaiKisiKiJaan@BeingSalmanKhan @VenkyMama @TheRaghav_Juyal @siddnigam_off @jassiegill @ishehnaaz_gill @palaktiwarii @farhad_samji pic.twitter.com/b4YGToUgH2 — Salman Khan Films (@SKFilmsOfficial) October 13, 2022 -
బిగ్‌బాస్ బ్యూటీ నందిని బర్త్‌డే సెలబ్రేషన్స్, టాలీవుడ్ తారల సందడి
బిగ్‌బాస్ ఫేం, హీరోయిన్ నందిని రాయ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ మధ్య ఆమె బర్త్‌డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనిష్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా నందిని రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి హిట్ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్‌బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్‌లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
‘బిగ్‌బాస్ 2’ ఫేం నందిని రాయ్ బర్త్‌డే వేడుకలు..
-
అలనాటి హీరోయిన్ల మధ్య మీనా బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ మీనా తాజాగా తన 46వ పుట్టిన రోజును సెలబ్రెటీ స్నేహితులు మధ్య జరుపుకున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 16న) మీనా బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె తన ఇండస్ట్రీ స్నేహితులు, అలనాటి స్టార్ హీరోయిన్లు సంగీత, సంఘవి, రంభలతో కలిసి పుట్టిన రోజును జరుపుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీనాకు ఇండస్ట్రీలో చాలామంది సన్నిహితులు ఉన్నారు. సంగీత, రమ్యకృష్ణ, సంఘవి, శ్రీదేవి విజయ్ కుమార్, రంభ, స్నేహ ఇలా చాలామంది తనకు ఆప్తమిత్రులని మీనా పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల భర్తను కొల్పోయి విషాదంలో ఉన్న మీనాకు వారంతా అండగా నిలుస్తున్నారు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. సందర్భం వచ్చినప్పుడల్లా వారంత మీనాను కలిసి కాసేపు ఆమెతో గడుపుతున్నారు. ఈ క్రమంలో నిన్న తన పుట్టిన రోజు కావడంతో రంభ, సంగీత, సంఘవిలు కలిసి ఆమె బర్త్‌డేను సెలబ్రెట్ చేశారు. మీనాతో కేక్ కట్ చేయించి తనతో కాసేపు సరదగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను మీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాటి కఠిన సమయంలో మీనాకు అండగా నిలుస్తున్న ఈ తారలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ‘నిజమైన స్నేహం అంటే మీది’, ‘మీనా గారు ఇండస్ట్రీలో మంచి స్నేహితులను పొందారు’ అంటూ ఆమె పోస్ట్‌పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
అషురెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఆర్జీవీ రచ్చ..
బిగ్‌బాస్ ఫేం అషురెడ్డి పుట్టిన రోజు వేడుకలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సందడి చేశాడు. గురువారం(సెప్టెంబర్ 15) బోల్డ్ బ్యూటీ అషురెడ్డి బర్త్‌డే. ఈ సందర్భంగా నిన్న రాత్రి ఆమె బర్త్‌డే సెలబ్రెషన్స్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు టాలీవుడ్ నటీనటులతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా హజరయ్యాడు. ఈ నేపథ్యంలో అషురెడ్డితో ఆర్జీవీ కేక్ కట్ చేయిస్తూ రచ్చ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్యయంగా అషు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి ఈ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ మెహబూబ్ దిల్సే, హరితేజ, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. కాగా ఆ మధ్య ఆర్జీవీని అషు ఓ ఇంటర్య్వూ చేసిన సంగతి తెలిసిందే. బోల్డ్‌గా సాగిన ఈ ఇంటర్య్వూలో నీ థైయ్స్ బాగున్నాయంటూ అషుపై ఆర్జీవీ చేసిన కామెంట్స్ ఆ మధ్య హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇదిలా కూతురు బర్త్‌డే సందర్భంగా ఆమె తండ్రి ఖరీదైన బెంచ్ కారు బహుమతిగా ఇచ్చాడు. మెర్సిడెజ్ బెంజ్ కంపెనికి చెందిన C200D మోడల్ కారును కూతురికి కానుగా ఇచ్చి ఆమె సర్ప్రైజ్ చేశాడు. ఈ కారు ధర దాదాపు రూ. 70లక్షలు ఉంటుందని అంచనా. -
ప్రత్యేక జెట్‌లో నిక్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ప్రియాంక చోప్రా గ్రాండ్ విషెష్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ బర్త్‌డేకు సర్ప్రైజ్ ఇచ్చింది. అతని పుట్టినరోజు వేడుకలను ఏకంగా ప్రత్యేక జెట్‌లో ప్లాన్ చేసింది. ఇవాళ నిక్ 30వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బర్త్‌డే వేడుకల కోసం ప్రైవేట్ జెట్‌ను వేదికగా మార్చింది. ఈ సందర్భంగా సింగర్ నిక్ జోనాస్ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రియాంక చోప్రా స్పెషల్ జెట్‌లో కూర్చొని భర్తకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. అయితే ఈ వేడుక ఎక్కడ నిర్వహించారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. వేడుకలకు ముందు ప్రియాంక తన హ్యాండిల్‌పై ఫోటోను కూడా పంచుకుంది. (చదవండి: Priyanka Chopra: క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది) కాగా నిక్, ప్రియాంక 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఓ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం కూడా చేశారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) -
హాస్య నటుడు వడివేలు పుట్టినరోజు వేడుక ( ఫొటోలు)
-
ఘనంగా ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు
కేవీపల్లె : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలను కేవీపల్లెలో ముందస్తుగా నిర్వహించారు. శనివారం జెడ్పీటీసీ సభ్యురాలు గజ్జెల శృతి ఆధ్వర్యంలో కేక్ ఏర్పాటు చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ ఇక్బాల్ అహ్మద్‌కు తినిపించారు. పీలేరు నియోజకవర్గం నుంచే గాక, రాయచోటి, పుంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు నాయకులు, కార్యకర్తలు మిథున్‌రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్లు హరీష్‌రెడ్డి, కారపాకుల భాస్కర్‌నాయుడు, ఏఎంసీ ఛైర్మన్ కడప గిరిధర్‌రెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ, జెడ్పీటీసీ గజ్జెల శృతి, నాయకులు గజ్జెల శీన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, పి. ద్వారకనాథరెడ్డి, ఆనందరెడ్డి, జయరామచంద్రయ్య, రామ్ప్రసాద్నాయుడు, సి.కె. యర్రమరెడ్డి, సిరి, సైఫుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ అభిమానుల బీభత్సం
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - మెగా స్టార్ చిరంజీవి
-
సింగర్ గీతా మాధురి కూతుర్ని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..
సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన పాటలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న గీతా ప్రస్తుతం కెరీర్లోనూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోకు మెంటర్‌గానూ అలరిస్తున్న గీతా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన కూతురు దాక్షాయణి ప్రకృతి మూడవ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ఆ పాపకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. కాగా 2014 ఫిబ్రవరి 9న నటుడు నందుతో గీతా మాధురి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) -
విశాఖలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
-
ఢిల్లీ రైల్వే స్టేషన్లో గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కీర్తినగర్ మెట్రో స్టేషన్లో దారుణం జరిగింది. ఇద్దరు రైల్వే ఉద్యోగులు ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు వారికి సహకరించారు. మొత్తం నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త నుంచి వేరుగా ఉంటున్న ఓ ఒంటరి మహిళను ఉద్యోగం ఇప్పిస్తానంటూ రైల్వే ఉద్యోగి ఒకరు నమ్మించాడు. తన కుమారుడి బర్త్‌డే వేడుకకు రావాలంటూ ఆహ్వానించాడు. ఈనెల 21వ తేదీన కీర్తినగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్న ఆమెను రాత్రి 10.30 గంటల సమయంలో ఆ ఆవరణలోనే ఉన్న రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది గదికి తీసుకెళ్లాడు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లి, మరో ఫ్రెండ్‌ను తీసుకొచ్చాడు. బయట మరో ఇద్దరు సహోద్యోగులు కాపలా కాస్తుండగా వీరు ఆమెపై అత్యాచారం చేశారు. శనివారం ఉదయం బాధితురాలు రైల్వే అధికారులకు తన ఆవేదనను వివరించింది. అధికారుల ఆదేశాల మేరకు, పోలీసులు బాధ్యులైన నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అస్ట్రేలియా రాజధాని కెన్బెర్రాలో రవి సాయల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రవి సాయల మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా మెల్బోర్న్లో కల్వకుంట్ల సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు ఝాన్సీ నోముల , గాయత్రి అరిగెల, రాకేష్ లక్కరసు , సిద్దు గొర్ల , రమేష్ కైల రుద్ర కొట్టు , వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మాలియా సిటీలో వైఎస్ఆర్ 73వ జయంతి వేడుకలు