Bollywood
-
రికార్డు సృష్టించిన డాకు బ్యూటీ.. ఆ కారు కొన్న మొట్టమొదటి నటిగా..
బాసూ.. వేర్ ఈజ్ ద పార్టీ.. అంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఐటం సాంగ్స్‌కు పెట్టింది పేరైన ఈ బ్యూటీ ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది. ఇటీవలే డాకు మహారాజ్ మూవీలో కీలక పాత్రలో నటించడంతో పాటు దబిడి దిబిడి పాటతో సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఊర్వశి ఖరీదైన కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కారు విలువ అన్ని కోట్లా?భారత్‌లో ఏ నటికి సాధ్యం కాని రీతిలో ఏకంగా రూ.12 కోట్లు పెట్టి రోల్స్ రాయిస్ కులినన్ను కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే ఈ కారు సొంతం చేసుకున్న మొట్టమొదటి నటిగా ఊర్వశి రికార్డుకెక్కనుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లోనూ స్థానం దక్కించుకున్నట్లు భోగట్టా! ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో వెల్కమ్ టు ద జంగిల్, కసూర్ 2 చిత్రాలున్నాయి. ఊర్వశి ఇటు సినిమాల్లో యాక్ట్ చేస్తూ, స్పెషల్ సాంగ్స్ చేయడమే కాకుండా ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది.విమర్శలపాలైన ఊర్వశిడాకు మహారాజ్ సినిమా రూ.100 కోట్లపైనే వసూళ్లు రాబట్టినప్పుడు ఊర్వశి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. తన సినిమా సెంచరీ దాటిందని గర్వపడిపోయింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి గురించి స్పందించమన్నప్పుడు కూడా డాకు మహారాజ్ సినిమా గురించి చెప్తూ సొంత డబ్బా కొట్టుకుంది. ఈ సినిమా విజయం తర్వాత తనకు తల్లి డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిందని చూపించింది. ఇలాంటివి చేతికి ధరించి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని కామెంట్స్ చేసింది. సైఫ్‌పై సానుభూతి చూపించకుండా తన బహుమతులను చూపిస్తూ షోఆఫ్ చేయడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె తన తప్పిదం తెలుసుకుని సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. సైఫ్‌పై దాడి తీవ్రత తెలియకుండా మాట్లాడినందుకు క్షమించమని కోరింది.చదవండి: చిల్లిగవ్వ లేదు.. ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పని చేశాం: హీరోయిన్ -
చాన్నాళ్లకు మళ్లీ జాన్వీ కపూర్ గ్లామరస్ లుక్ (ఫొటోలు)
-
యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. నిజమేనా?
ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. 2023-24లో వరస తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కాస్త గ్యాప్ తీసుకుంది. త్వరలో 'రాబిన్ హుడ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇది కాకుండా మరో హిందీ మూవీలోనూ నటిస్తోంది. ఇదంతా పక్కనబెడితే శ్రీలీలపై ఇప్పుడు డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి.తెలుగమ్మాయి అయిన శ్రీలీల.. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేస్తోంది. అయితే బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఈమె డేటింగ్ లో ఉందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత)ప్రస్తుతం శ్రీలీల-కార్తిక్ ఆర్యన్.. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సరే ఈ విషయం పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం కార్తిక్ ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ చేసుకుంటే శ్రీలీల అక్కడ కనిపించింది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకల్లో కార్తిక్ తల్లి కూడా వచ్చింది. ఎలాంటి కోడలు మీకు కావాలి అనే ప్రశ్నకు.. డాక్టర్ కోడలు అని చెప్పారు. ఈ క్రమంలోనే కార్తిక్ ఆర్యన్ తల్లి చెప్పిన కామెంట్, శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఉండటాన్ని లింక్ చేసి శ్రీలీల-కార్తిక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారని అనేస్తున్నారు. ఇది నిజమా అంటే చెప్పలేం. ఎందుకంటే బాలీవుడ్ ఇలాంటి గాసిప్స్ కావాలనే పుట్టిస్తారేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. శ్రీలీలది కూడా బహుశా ఇలాంటి రూమరే అయ్యిండొచ్చేమో?(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
సంతాన ప్రాప్తి కోసం కత్రినా కైఫ్ భక్తి మార్గం!
దేవుడు, పూజలు అనేవి చాలా పవిత్రమైనవి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎప్పుడో ఓసారి భక్తి మార్గంలోకి వెళ్తారు. అలా కొన్నాళ్లపాటు దేవాలయాలు, పూజలు అని చాలా బిజీ అయిపోతారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా అలానే చేస్తోంది.'ఛావా'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్కీ కౌశల్ ని.. కత్రినా కైఫ్ 2021లో పెళ్లి చేసుకుంది. వయసులో తన కంటే చిన్నవాడైనప్పటికీ కత్రినా అతడితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లి తర్వాత ఒకటి రెండు మూవీస్ చేసింది గానీ ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)కొన్నాళ్ల క్రితం కుంభమేళాలో పాల్గొన్న కత్రినా కైఫ్.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించింది. భక్తులకు ప్రసాదం కూడా పంచిపెట్టింది. ఇది జరిగిన ఎన్నిరోజులు కాలేదు ఇప్పుడు కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయంలో దర్శనమిచ్చింది. కుటుంబంతో కలిసి సర్ప సంస్కార పూజలో పాల్గొంది.అయితే కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతలు త్వరలో ఓ ఇంటివారవుతారని, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయించడం లాంటివి చూస్తుంటే పిల్లల కోసం గుళ్లు, గోపురాలు తిరిగేస్తూ భక్తి మార్గంలోకి వెళ్లిపోయిందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?) -
సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం: ఆమిర్ ఖాన్
‘‘గతంలో ఏ సినిమా చూడాలనుకున్నా థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ఎందుకంటే మూవీస్ చూసేందుకు నాకు మరో చాయిస్ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాలు విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీల్లో రిలీజ్ చేసి, మన సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం’’ అని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan) ఆగ్రహావేదన వ్యక్తం చేశారు.ఈ నెల 14న ఆమిర్ ఖాన్ బర్త్ డేని పురస్కరించుకుని ‘పీవీఆర్ ఐనాక్స్’ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ‘ఆమిర్ ఖాన్: సినిమా కా జాదూగర్’ పేరుతో ఆయన హిట్ సినిమాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమిర్ ఖాన్, రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ‘‘గతంతో పోలిస్తే ప్రస్తుతం హిందీ చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం లేని దక్షిణాది నటుల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 600 నుంచి 700 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయి. మన సినిమాలను కూడా దక్షిణాది దర్శకులు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?’’ అంటూ ఆమిర్ ఖాన్‌ను ప్రశ్నించారు జావేద్ అక్తర్. ఇందుకు ఆమిర్ స్పందిస్తూ– ‘‘దక్షిణాది, ఉత్తరాది చిత్రాలు అనే విషయం సమస్యే కాదు... దర్శకులప్రాంతీయ నేపథ్యం కూడా అప్రస్తుతం.సినిమా విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీలో ఎన్నిసార్లయినా ఫ్రీగా చూసే వీలుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఒక సినిమాని రెండు సార్లు ఎలా అమ్మాలో నాకు తెలియడం లేదు. థియేటర్లలో విడుదలైన మూడు లేదా నాలుగు నెలల తర్వాత ఓటీటీల్లో రిలీజ్ చేయాలి.అప్పుడే థియేట్రికల్ బిజినెస్ బాగుంటుంది. ప్రేమ, కోపం, పగ వంటి ఎమోషన్స్ మీద బాలీవుడ్ రచయితలు, డైరెక్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. కేవలం వినో దానికే పెద్ద పీట వేస్తున్నారు. పైగా మూలాలను మర్చిపోతున్నారు. దక్షిణాది చిత్రాల్లాగా భావోద్వేగాలను మిళితం చేయలేపోతున్నారు’’ అని పేర్కొన్నారు. -
ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ 'దేవర'తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో నటిస్తోంది.తాజాగా తాను నటించిన రూహి సినిమాకు నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా ఈ మూవీలో 'నదియో పార్' పాట చిత్రీకరణ అనుభవాల్ని పంచుకుంది. దీని షూటింగ్ టైంలో తాను చాలా టెన్షన్ పడ్డాడని, మూడు రోజులు నిద్రపోలేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)'రూహి సినిమా తీసే సమయానికి నటిగా నాకున్న అనుభవం చాలా తక్కువ. దీంతో నదియో పార్ పాట విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. భారీ లైట్స్ వెలుగులో కళ్లు తెరిచి చూడలేకపోయేదాన్ని. ఓవైపు 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ లో పాల్గొంటూనే ఈ పాట రిహార్సల్స్ చేసేదాన్ని. పటియాలాలో రాత్రంతా షూట్ చేసి.. పేకప్ తర్వాత ప్రయాణం చేసొచ్చి పాట షూటింగ్ లో పాల్గొనేదాన్ని.''నిద్రలేకపోయినా 7 గంటల్లో ఆ పాట పూర్తిచేయగలిగాను. మళ్లీ వెంటనే గుడ్ లక్ జెర్రీ షూటింగ్ కి వెళ్లేదాన్ని. అలా మూడురోజుల పాట నిద్రపోలేకపోయాను. కానీ కెమెరా ముందుకొచ్చేసరికి మాత్రం ఎనర్జీ వచ్చేసేది' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ప్రముఖ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. కర్ణాటకలోని ప్రముఖ కుక్కే శ్రీ సుబ్రమణ్య ఆలయాన్ని సందర్శించారు. ఇటీవలే కుంభమేళాలోనూ కత్రినా కైఫ్ పుణ్యస్నానమాచరించారు. తాజాగా శ్రీ సుబ్రమణ్య ప్రత్యేకమైన పూజులు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. తెలుగులో వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. 2023లో మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె భర్త విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఛావాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవలే తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టిస్తోంది.కాగా... కత్రినా కైఫ్ ఇటీవల ఐఫా అవార్డ్స్- 2025 వేడుకలో మెరిసింది. జైపూర్‌లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ అగ్రతారలు పాల్గొని సందడి చేశారు. ఈ అవార్డ్స్‌లో కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీతారలు షారూఖ్ ఖాన్, రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. -
బాలీవుడ్లో దక్షిణాది సినిమాల హవా.. అసలేం జరుగుతోందన్న జావేద్ అక్తర్
బాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ సంచలన కామెంట్స్ చేశారు. హిందీ సినిమాల్లో ఏ మాత్రం కొత్తదనం కనిపించడం లేదని అన్నారు. తాజాగా ఓ డిబేట్‌కు హాజరైన ఆయన అమీర్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీపై మాట్లాడారు. హిందీ సినిమాల్లో నాణ్యత రోజు రోజుకు పూర్తిగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులతో అన్ని సంబంధాలను కోల్పోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.ముఖ్యంగా దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలు బాలీవుడ్లో సత్తా చాటుతున్నాయని జావేద్ అక్తర్ తెలిపారు. కనీసం ప్రేక్షకులకు తెలియని నటులతో తీసిన దక్షిణ భారత చిత్రాలు హిందీలో విడుదలై రూ. 600 నుంచి 700 కోట్ల వ్యాపారం చేస్తున్నాయని వెల్లడించారు. చివరికి మన సినిమాలను సైతం సౌత్ డైరెక్టర్స్ తీస్తున్నారని పేర్కొన్నారు. అసలు బాలీవుడ్‌కు ఏమైంది? అని జావేద్ అక్తర్ ప్రశ్నించారు.అయితే జావేద్ అక్తర్ కామెంట్స్‌పై ఇదే డిబేట్లో పాల్గొన్న అమిర్ ఖాన్ స్పందించారు. ఇక్కడ సమస్య ఉత్తరాది, దక్షిణాది కాదని అన్నారు. మనం ఎదుర్కొంటున్న సమస్య వేరే విషయమని తెలిపారు. దయచేసి మా సినిమాని చూడండి అని ప్రేక్షకులను అభ్యర్థించే ఏకైక ఇండస్ట్రీ మనదే.. లేదంటే ఎనిమిది వారాల్లో మీ ఇంట్లోనే ఓటీటీలో చూసే అవకాశం కల్పిస్తాం.. ఇదే బాలీవుడ్ బిజినెస్ మోడల్ అని అమీర్ ఖాన్ అన్నారు. ఓటీటీకి ఒకసారి సబ్స్క్రిప్షన్ చెల్లిస్తే చాలు సినిమాను ఎన్నిసార్లైనా వీక్షించవచ్చని తెలిపారు. ఒకే ఉత్పత్తిని రెండుసార్లు ఎలా అమ్మాలో నాకు తెలియదంటూ మాట్లాడారు. గతంలో ఓటీటీలు లేకపోవడం వల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు మనం ఎక్కడైనా సినిమాలు చూడవచ్చని తెలిపారు. ఇప్పుడు థియేటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు.. మన సొంత వ్యాపార నమూనాతో మన సినిమాలను చంపుకుంటున్నామని అమిర్ ఖాన్ అన్నారు.హిందీ సినిమా రచయితలు, దర్శకులు ఒత్తిడికి గురికాకుండా కంటెంట్‌పై దృష్టి పెట్టాలని అమిర్ ఖాన్ సూచించారు. వారు తమ మూలాలను, ప్రాథమిక భావోద్వేగాలను మరచిపోయారని అన్నారు. నాలో నుంచి వచ్చేదాన్ని మాత్రమే నేను చేయగలను.. అది హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని నేను ఆలోచించనని అమీర్ అన్నారు. కాగా.. ఇటీవల హన్సల్ మెహతా, వివేక్ అగ్నిహోత్రి కూడా హిందీ సినిమా ప్రస్తుత స్థితిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బాలీవుడ్ గ్రాఫ్ పడిపోతోందని అగ్నిహోత్రి వ్యాఖ్యానించగా.. హిందీ చిత్ర పరిశ్రమకు రీసెట్ అవసరమని మెహతా మాట్లాడారు. -
ఆ సీన్స్ చేయకపోవడానికి కారణమిదే: కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది సింగం ఏగైన్, క్రూ, ది బకింగ్హమ్ మర్డర్స్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది. ది బకింగ్‌హామ్ మర్డర్స్ మూవీలో పోలీసు పాత్రలో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అలాంటి సన్నివేశాలను చేయడం తనకు ఎప్పుడూ సౌకర్యంగా అనిపించలేదని తన 25 ఏళ్ల సినీ కెరీర్ గురించి మాట్లాడింది.కరీనా కపూర్ మాట్లాడుతూ.. "ఇది మొత్తం మనం చూసే ఆలోచన విధానంపై ఆధారపడి ఉంది. లైంగికతను మానవ అనుభవంగా మనం చూడం. ఇలాంటి సీన్స్ తెరపై ఉంచే ముందు మనం దానిని మరింతగా లోతుగా చూడటం, గౌరవించడం ప్రారంభించాలి. ఇదే నా నమ్మకం," అని ఆమె అన్నారు. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి మీరెందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించగా.. కరీనా కపూర్ స్పందించింది. కథను అలా ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం కాదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా.. కథ పరంగా అయితే అది తప్పనిసరి అని నేను నమ్మను.. ఎందుకంటే అలా చేయడం సౌకర్యంగా ఉండదని నాకు తెలుసు. నేను ఎప్పుడూ అలా చేయలేదు' అని తెలిపింది.(ఇది చదవండి: సీక్రెట్‌గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి!)కాగా.. కరీనా కపూర్ తన 25 ఏళ్ల సినీ కెరీర్లో తెరపై ఎప్పుడూ లైంగిక సన్నివేశాల్లో నటించలేదు. 2003లో వచ్చిన 'చమేలి' సినిమాలో కపూర్ ఒక సెక్స్ వర్కర్ పాత్ర మాత్రమే పోషించింది. ఈ సినిమాలో నటించడంపై కరీనా మాట్లాడుతూ..ఈ సినిమా ద్వారా నేను చాలా విషయాలను గ్రహించానని తెలిపింది. స్త్రీ తత్వం, అందంగా ఉండటం వంటి సాంప్రదాయ భావనలకు అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదని అనిపించింది. ఈ సినిమా నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అని వివరించింది. అది చిన్న వయసులో నా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. ఆ పాత్ర పోషించినందుకు నేను సంతోషంగా అనిపించిందని తెలిపింది. కాగా.. కరీనా కపూర్ కభీ ఖుషీ కభీ ఘమ్, ఐత్రాజ్, చుప్ చుప్ కే, గోల్మాన్ రిటర్న్స్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. -
అమ్మాయితో కనిపించిన చాహల్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య ధనశ్రీ వర్మ!
భారత స్టార్ క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆట కంటే వ్యక్తిగత విషయాలతో చాహల్ మరింత ఫేమస్ అవుతున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇంతకీ ఆమె ఎవరా అని ఆరా తీస్తే ఆర్జే మహ్వాష్గా గుర్తించారు. ఇంకేముంది ఆమెతో మనోడు పీకల్లోతు డేటింగ్లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే.. యుజ్వేంద్ర చాహల్ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త చాహల్ దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో రీ లోడ్ చేసింది. అతనితో ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా అన్ని ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ దర్శనమిచ్చాయి. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరలయ్యాయి. తాజాగా చాహల్ ఫోటోలు రీ లోడ్ చేయడంతో వీరిద్దరు విడాకుల రూమర్స్‌కు చెక్ పడే అవకాశముంది. వాటిని ఫుల్స్టాప్ పెట్టేందుకే ఇచ్చేందుకే ధనశ్రీ వర్మ ఫోటోలన్నింటినీ రీ స్టోర్ చేసినట్లు తెలుస్తోంది.కాగా.. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేసినట్లు తెలుస్తోది. ఇటీవల ధనశ్రీ న్యాయవాది అదితి మోహోని ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోవైపు ధనశ్రీ వర్మ రూ. 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆమె కుటుంబం ఖండించింది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
తన పేరెత్తితేనే కన్నీళ్లు.. ఈ క్యాన్సర్ పోరాటంలో..: బుల్లితెర నటి ఎమోషనల్
సంతోషాన్ని అందరూ పంచుకుంటారు, కానీ కష్టాన్ని కూడా పంచుకున్నవారే అసలైన ఆప్తులు. ఈ విషయంలో తాను చాలా లక్కీ అంటోంది బుల్లితెర నటి హీనా ఖాన్ (Hina Khan). క్యాన్సర్‌తో పోరాడుతున్న తనను ప్రియుడు రాకీ జైస్వాల్ (Rocky Jaiswal) చంటిపాపలా చూసుకుంటున్నాడని చెప్తోంది. తినిపించడం, టాబ్లెట్స్ వేయడం, నడిపించడం.. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాడంది. ఇలాంటి ప్రేమికుడు దొరికినందుకు పొంగిపోతోంది.మాటలు సరిపోవురొమ్ము క్యాన్సర్ (స్టేజ్ 3)తో పోరాడుతున్న హీనా ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. అతడి పేరెత్తినప్పుడు తన గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. నాకోసం ఎంతో చేశాడు. ఎల్లప్పుడూ చేయి పట్టుకునే నడిపించాడు. తనెప్పుడూ అంతే.. నాకోసమే ఆలోచిస్తాడు. ఎంత మంచి మనిషో కదా! తనను తలుచుకుంటేనే సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ప్రతి అమ్మాయికి ఇలాంటి అబ్బాయి దొరకాలి.అతడు ప్రేమించినంతగా నేను ప్రేమించలేనురాకీ నాకు 12 ఏళ్లుగా తెలుసు. నా ఫస్ట్ షోలో తొలిసారి అతడిని కలిశాను. ఏడునెలలపాటు ఫ్రెండ్స్‌గా ఉన్నాం. తర్వాత మాది స్నేహం కాదని ప్రేమని తెలుసుకున్నాం. మేము ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు. కానీ ఓ రోజు ఆత్మీయంగా హగ్ ఇచ్చుకున్నప్పుడు మా మధ్య ఉన్న బంధం బలపడిందని అర్థం చేసుకున్నాం. మేము జంటగా ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాళ్లం. నా క్యాన్సర్ అతడిని ఎంతో బాధించింది. నేనెప్పుడూ అతడికి ఒకటే చెప్తుంటాను.. నువ్వు ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేను అని! దానికి అతడు గర్వంగా ఫీలవడు, కనీసం అవునని కూడా ఒప్పుకోడు. నేను ఎక్కువగా ఏం చేశానని? అని అమాయకంగా అడుగుతుంటాడు అని హీనా ఖాన్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)చదవండి: ఆటోఇమ్యూన్ వ్యాధి.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా: టాలీవుడ్ నటి -
అవతార్ సినిమాలో ఛాన్స్.. కోట్లు ఇస్తానన్నా 'నో' చెప్పా: గోవిందా
ప్రపంచాన్నే అబ్బురపరిచిన సినిమాల్లో అవతార్ (Avatar Movie) ఒకటి. వేల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాలో ఆఫర్ వస్తే చేయనని చెప్పేశాడట బాలీవుడ్ నటుడు గోవిందా (Actor Govinda). అసలు అవతార్ సినిమా ఛాన్స్ తనకెలా వచ్చింది? ఎందుకు రిజెక్ట్ చేశాడు? వంటి విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గోవిందా మాట్లాడుతూ.. అమెరికాలో నేనొక సర్దార్‌ను కలిశాను. ఆయనకు నేనిచ్చిన బిజినెస్ ఐడియా బాగా వర్కవుట్ అయింది. అవతార్ టైటిల్ నేనే ఇచ్చా..కొన్నేళ్ల తర్వాత ఆయన నన్ను జేమ్స్ కామెరూన్‌కు పరిచయం చేశాడు. జేమ్స్‌తో కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. సరేనని తనను డిన్నర్‌కు పిలిచి సినిమా గురించి మాట్లాడాం. ఆయన చెప్పిన కథ విని దానికి అవతార్ అన్న టైటిల్ పెడితే బాగుంటుందని చెప్పాను. సినిమాలో హీరో దివ్యాంగుడు అని చెప్పాడు. వెంటనే నేను చేయనని చెప్పేశాను. రూ.18 కోట్లు ఇస్తానన్నా వద్దన్నాను.శరీరానికి రంగు పూసుకోవడం..దాదాపు 410 రోజులు ఆయన సినిమాకే కేటాయించాలి. అది పర్వాలేదు కానీ నా శరీరానికి రంగు పూసుకునే ఉండాలి. అలా చేస్తే నేను ఆస్పత్రిపాలవుతాను. నటుడిగా నాకు శరీరం అనేది చాలా అవసరం. పెయింట్ పూసుకోవడం వల్ల ఏవైనా దుష్ఫలితాలు ఎదురైతే జీవితాంతం బాధను అనుభవించాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి మంచి సినిమాలకు నో చెప్తే అందరూ లైట్ తీసుకోలేరు. వారు దగ్గరివారైనా సరే ఇగో చూపిస్తారు. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా అవతార్అలాంటప్పుడు ఏళ్ల తరబడి క్షమాపణలు చెప్తూనే ఉండాలి అని చెప్పుకొచ్చాడు. జేమ్స్ కామెరూన్ తీసిన అద్భుత చిత్రాల్లో అవతార్ ఒకటి. 2009లో రిలీజైన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తర్వాత దీనికి కొనసాగింపుగా 2022లో అవతార్: ద వే ఆఫ్ వాటర్ రిలీజైంది. గోవిందా విషయానికి వస్తే ఆయన నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఇటీవల అతడే స్వయంగా ఓ షోలో వెల్లడించాడు.చదవండి: ఎన్నో దారుణమైన సౌత్ సినిమాలకంటే కంగువా బెటర్: జ్యోతిక -
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా.. అల్లుడిపై మామ ప్రశంసలు
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో భారత స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. ఒక వైపు వికెట్స్ పడుతున్నా 34 పరుగుతులతో నాటౌట్‌గా నిలిచి విజయ తీరాలకు చేర్చాడు. దీంతో పాకిస్తాన్ హోస్ట్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది.అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలవడంపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన అల్లుడు కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రాహుల్ ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాకి విష్.. రాహుల్ కమాండ్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సునీల్ శెట్టిని ప్రశంసిస్తున్నారు. అల్లుడికి మామ సపోర్ట్ చేయడాన్ని చూసి నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ అన్నా రాక్‌స్టార్.. టీమిండియాకు కాబోయే కెప్టెన్ అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. 2027లో కేఎల్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ గెలుస్తామంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. అల్లుడికి మామ సపోర్ట్ చేయడం గొప్ప విషయం.. మా నాన్న కూడా నాకు సపోర్ట్ చేయడు అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా సునీల్ శెట్టి ట్వీట్‌కు స్పందించాడు. అతియాను పెళ్లాడిన కేఎల్ రాహుల్..బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని కేఎల్ రాహుల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అతియా శెట్టి గర్భంతో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు. సునీల్ శెట్టి తాతగా ప్రమోట్ కానున్నారు. ఏప్రిల్‌లో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. 🇮🇳 INDIA’S WISH !!!! Rahul’s COMMAND …… pic.twitter.com/SbllRkbUgP— Suniel Shetty (@SunielVShetty) March 9, 2025 -
శ్రీదేవి చివరి చిత్రానికి సీక్వెల్.. ఖుషీ కపూర్‌పై నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ అగ్రనిర్మాత, డైరెక్టర్ బోనీ కపూర్ తాజాగా ఓ సినిమాను ప్రకటించారు. తన భార్య, దివంగత నటి శ్రీదేవి నటించిన చివరి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించునున్నట్లు వెల్లడించారు. 2017లో వచ్చిన మామ్ మూవీకి కొనసాగింపుగా తాజాగా ఉండనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో తన చిన్న కూతురైన ఖుషీ కపూర్ సైతం నటిస్తున్నట్లు తెలిపారు. ఐఐఎఫ్ఏ-2025 అవార్డుల వేడుకకు హాజరైన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.అయితే శ్రీదేవి సీక్వెల్ మూవీలో ఖుషీ కపూర్‌ను ఎంపిక చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీదేవి స్థానంలో ఖుషీ చేయడమేంటి? ఇది చూస్తుంటే పెద్ద జోక్‌గా ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదే నిజమైతే డిజాస్టర్ ఖాయమని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దయచేసి ఈ సినిమాకు జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని ఓ నెటిజన్ కోరాడు. వీలైతే యామీ గౌతమ్, కంగనా రనౌత్, బిపాసా బసుని తీసుకోండి కానీ.. ఖుషీ కపూర్‌కు నటనా నైపుణ్యాలు లేవని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.నటన విషయానికొస్తే ఖుషీ కపూర్ చివరిసారిగా ఇబ్రహీం అలీ ఖాన్‌తో నాదానియన్లో కనిపించింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా బోనీ కపూర్ చేసిన ప్రకటనతో నెటిజన్స్ తీవ్ర నిరాశకు గురువుతున్నారు. శ్రీదేవీ మూవీ సీక్వెల్లో మాత్రం ఖుషీ కపూర్ వద్దని తెగేసి చెబుతున్నారు. మామ్ సీక్వెల్ కోసం ఖుషీని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహించారు. 2018లో ఆమె మరణానికి ముందు నటించిన చివరి చిత్రమిదే. శ్రీదేవి కెరీర్లో 300వ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, పాకిస్థానీ నటులు సజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీదేవి మరణానంతరం 65వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మామ్ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. -
భారత్‌లో తొలి ఏఐ సినిమా.. హీరోహీరోయిన్లు కూడా..
AI (Artificial intelligence) తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అంతెందుకు ఎంచక్కా సినిమా కూడా తీసిపెట్టగలదు. హీరోహీరోయిన్లను కూడా తనే సృష్టించగలదు. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇటువంటి ప్రయోగాలు ఆల్రెడీ జరిగిపోయాయి. ఏఐ సినిమాలు వచ్చేశాయి. ఇంతకీ భారత్‌లో ఏఐ తీసిన తొలి సినిమా ఏంటో తెలుసా? నైషా. వివేక్ అంచలియా ఏఐ సాయంతో దీన్ని డైరెక్ట్ చేశాడు. ఏఐ సాయంతో సినిమారోజూవారీ దినచర్యలో టెక్నాలజీ ఎంతగా భాగమైంది? భవిష్యత్తులో ఏఐ ఇంకెంత విస్తరించనుంది? మానవ సంబంధాలు ఎలా మారనున్నాయి? అనే అంశాలను నైషా సినిమాలో చూపించారు. సంగీతాన్ని కూడా ఏఐ సాయంతోనే సృష్టించారు. డేనియల్ బి జార్జ్, ప్రోటిజ్యోతి జియోష్, ఉజ్వల్ కశ్యప్ వంటి సంగీతకారులు కొన్ని మ్యూజిక్ బిట్స్ ఇస్తే దాని ఆధారంగా వారికి నచ్చిన సౌండ్‌ట్రాక్ రెడీ చేసేసింది. ఏఐ అడ్వాన్స్డ్ టూల్స్‌తో విజువల్స్ కూడా అద్భుతంగా వచ్చేలా చేశారు. ఇంతకీ హీరోహీరోయిన్లు ఎవరనుకుంటున్నారు? జైన్ కపూర్, నైషా బోస్.. వీరిని కూడా టెక్నాలజీయే సృష్టించింది.మేలో రిలీజ్ఏఐ స్టూడియో సాయంతో పోరి భుయాన్, శ్వేత వర్మ, జోసెఫ్ నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాది మేలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎమోషన్స్‌ను టెక్నాలజీ రక్తికట్టించగలిగిందా? లేదా? అని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఏఐ చొచ్చుకుని పోతే భవిష్యత్తులో ఎటువంటి ఛాలెంజ్‌లు ఎదురవుతాయన్న చర్చకు సైతం నైషా నాంది పలకనుంది.విదేశాల్లో కొన్ని సినిమాలకు ఇదివరకే ఏఐ టెక్నాలజీని వాడుకున్నారు. అవేంటో కింద చూసేద్దాం..సన్స్పింగ్ (Sunspring): 2016లో వచ్చిన ఈ చిత్రానికి ఏఐ స్క్రిప్ట్ అందించింది.జోన్ అవుట్ (Zone Out): కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం ఏఐ విజువల్స్ వాడుకున్నారు. ఇది 2020లో రిలీజైంది.ద నెక్స్ట్ రెంబ్రాండ్ (The Next Rembrandt): 2016లో వచ్చిన ఈ సినిమాలో ఏఐ సాయంతో పెయింటింగ్స్ వేస్తారు.మోర్గాన్ (Morgan): సినిమా ట్రైలర్ రెడీ చేసేందుకు ఏఐ వాడారు.ఏఐ: మోర్ ద హ్యూమన్ (AI: More Than Human): సమాజంలో ఏఐ ఎలాంటి ప్రభావం చూపుతుందని డాక్యుమెంటరీ ద్వారా చక్కగా చూపించారు.ద సేఫ్ జోన్ (The Safe Zone): ఏఐ కథ రాసుకుని, డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఇది.ద ఫ్రోస్ట్ (The Frost): ఏఐ టూల్స్ ఉపయోగించి తీసిన షార్ట్ ఫిలిం.క్రిటర్జ్ (Critterz): ఏఐ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం.ప్లానెట్ జెబులాన్ ఫైవ్ (Planet Zebulon Five): ఏఐ ప్రకృతిపై తీసిన డాక్యుమెంటరీ.థాంక్యూ ఫర్ నాట్ ఆన్సరింగ్ (Thank You for Not Answering): షార్ట్ యానిమేటెడ్ ఫిలిం. చదవండి: హీరోయిన్ అంజలితో రిలేషన్? కోన వెంకట్ ఆన్సరిదే.. -
IIFA Awards 2025: 'లాపతా లేడీస్' చిత్రానికి 10 అవార్డ్స్
'ఐఫా' అవార్డ్స్ 2025 జైపూర్‌లో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్ అవార్డుల ప్రదానం చేయగా.. రెండో రోజు చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. అయితే, ఈ బాలీవుడ్ చిత్రం 'లాపతా లేడీస్' ఉత్తమ చిత్రంతో పాటు ఏకంగా పది విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం బాలీవుడ్ స్టార్స్ చాలామంది హాజరయ్యారు. ఈ వేడుకల్లో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్, శ్రేయా ఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్ ఐఫా వేదికపై సందడి చేశారు.అవార్డ్స్ జాబితాఉత్తమ చిత్రం: లాపతా లేడీస్ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)ఉత్తమ నటి: నితాన్షి గోయల్ (లాపతా లేడీస్)ఉత్తమ దర్శకులు: కిరణ్ రావు (లాపతా లేడీస్)ఉత్తమ సహాయనటుడు: రవి కిషన్ (లాపతా లేడీస్)ఉత్తమ సహాయనటి: జాకీ బోడివాలా (షైతాన్)ఉత్తమ నటుడు (తొలి పరిచయం): లక్ష్య లాల్వాని ( కిల్)ఉత్తమ నటి (తొలి పరిచయం): ప్రతిభా (లాపతా లేడీస్)ఉత్తమ విలన్: రాఘవ్ జాయల్ (కిల్)ఉత్తమ సంగీత డైరెక్టర్: రామ్ సంపత్(లాపతా లేడీస్)ఉత్తమ సింగర్ -మేల్: జుబిన్ నౌటియల్ (ఆర్టికల్ 370)ఉత్తమ సింగర్ - ఫిమేల్: శ్రేయా ఘోషల్ (భూల్ భూలయ్య 3)ఉత్తమ కథ (ఒరిజినల్): బిప్లాబ్ గోస్వామి (లాపతా లేడీస్)ఉత్తమ ఎడిటింగ్: జాబిన్ మార్చంట్ (లాపతా లేడీస్)ఉత్తమ స్క్రీన్‌ప్లే : స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)ఉత్తమ సాహిత్యం: ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్) -
బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ అనన్య పాండే ఫోజులు (ఫోటోలు)
-
ఐఫా 2025 అవార్డ్స్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
'బాలీవుడ్ నుంచి గెంటేయాలని చూశారు'.. గోవిందా సంచలన ఆరోపణలు
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా బాలీవుడ్‌పై విమర్శలు చేశారు. బాలీవుడ్లో తనపై కుట్ర చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. నన్ను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపేందుకు కొందరు ప్రయత్నించారని వెల్లడించారు. తాను పెద్దగా చదువుకోలేదని.. వారంతా చదువుకున్న వారు కావడంతోనే నాతో ఆడుకున్నారని తెలిపారు. కేవలం నా నటన వల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని వెల్లడించారు. నన్ను టార్గెట్ చేసిన వారి పేర్లను వెల్లడించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా.. ముఖేష్ ఖన్నా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందా ఈ వ్యాఖ్యలు చేశారు.పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన గోవిందా ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన చివరిసారిగా 2019 విడుదలైన రంగీలా రాజాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. నటుడు తన కెరీర్లో 100 కోట్ల ప్రాజెక్ట్‌లను చేయలేకపోయినట్లు వెల్లడించారు. నిజం చెప్పాలంటే తాను రూ. 100 కోట్ల చిత్రాలను తిరస్కరించానని తెలిపారు. వాటిని వద్దనుకున్నప్పుడు అద్దంలో చూసుకుని నన్ను చెంపదెబ్బ కొట్టుకునేవాడినని పేర్కొన్నారు.విడాకుల రూమర్స్..గత కొద్ది కాలంగా గోవిందాపై విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తన భార్య సునీతా అహుజాతో విడిపోతున్నారని వార్తలు తెగ వైరలవుతున్నాయి. వీటిపై ఇటీవలే ఆయన భార్య కూడా స్పందించింది. గోవిందను... తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు. -
ఫిట్‌నెస్‌పై రూమర్స్.. కరణ్ జోహార్ క్లారిటీ!
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో మెరిశారు. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఇటీవల తన ఫిట్నెస్ గురించి వస్తున్న వార్తలపై తాజా ఈవెంట్లో స్పందించారు. స్లిమ్‌గా కనిపించడానికి గల కారణాలను వివరించాడు. తన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణం అలవాట్లేనని కరణ్ జోహార్ వెల్లడించారు. సరైన టైమ్‌కి తినడం, వ్యాయామం చేయడం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఫిట్‌నెస్‌కు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని డైరెక్టర్ సలహా ఇచ్చాడు. దీంతో కరణ్ బరువు తగ్గడంపై వస్తున్న వార్తలకు ఆయన చెక్‌పెట్టారు.(ఇది చదవండి: 'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా)కరణ్ జోహార్ బరువు తగ్గేందుకు ఓజెంపిక్ వంటి డయాబెటిక్ మందుల వాడుతున్నారని రూమర్స్ వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన సన్నిహిత మిత్రుడు మహీప్ కపూర్ వ్యాఖ్యల తర్వాత ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్లో మహీప్ కపూర్ ఈ విషయంపై మాట్లాడారు. తాజాగా కరణ్ క్లారిటీ ఇవ్వడంతో ఇకపై ఆ వార్తలకు చెక్ పడనుంది. కాగా.. గతంలో స్లిమ్‌గా ఉంటూ తన ఫిట్నెస్ పట్ల నిబద్ధతను చాటుకున్నారు కరణ్ జోహార్. -
అందరూ ధనశ్రీని టార్గెట్ చేస్తే నేను సపోర్ట్ చేశా.. అప్పుడు..: ఉర్ఫీ
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోతున్నారంటూ ఈ ఏడాది ఆరంభం నుంచి పుకార్లు ఊపందుకున్నాయి. చివరకు ఆ పుకార్లను నిజం చేస్తూ ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఇటీవలే వీరికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ జంట డివోర్స్ తీసుకోనుంది అన్నప్పటినుంచి చాలామంది ధనశ్రీని టార్గెట్ చేశారు.ప్రతిసారి అమ్మాయిదే తప్పా?చాహల్‌ను ఒంటరిని చేసిందని, ధనశ్రీ ఏదో తప్పు చేసుంటుందని.. రకరకాలుగా విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో సోషల్ మీడియా సెన్సేషన్, నటి ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) ధనశ్రీకి మద్దతుగా నిలిచింది. చాహల్ జీవితాన్ని ధనశ్రీ నాశనం చేసిందన్న పోస్టుపై ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రికెటర్ బ్రేకప్ చెప్పినప్పుడు, విడాకులు తీసుకుంటున్నప్పుడల్లా అమ్మాయిదే తప్పని ముద్ర వేస్తారు. ఆమెపైనే నిందలేస్తారు. ఎందుకంటే మనకు క్రికెటర్ అంటే హీరో కదా! మీకు గుర్తుందా?నిజంగా ఆ జంటల మధ్య ఏం జరిగిందనేది మనకెవరికీ తెలియదు. విరాట్ సరిగా ఆడకపోయినా కూడా అనుష్కదే తప్పన్నారు. మీకు గుర్తుందో, లేదో మరి! అంటే అక్కడ మగవాడు ఏం చేసినా అందుకు మహిళలే కారణం.. ఈ అబ్బాయిలేం చిన్నపిల్లలు కాదు. వాళ్లేం చేస్తున్నారో వారికి అన్నీ బాగా తెలుసు అని రాసుకొచ్చింది.ధనశ్రీకి సపోర్ట్ చేశానని..ఈ పోస్ట్ చూసిన ధనశ్రీ తనకు థాంక్స్ చెప్పిందంటోంది ఉర్ఫీ జావెద్. తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఈ విడాకుల వ్యవహారంలో ధనశ్రీని దారుణంగా చిత్రీకరించారు. అప్పుడామెకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశాను. అప్పటికే బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ఆమె అది చూసి నాకు కృతజ్ఞతలు తెలియజేసింది అని తెలిపింది.చదవండి: దారి తెలీక ఆగిపోయా.. అప్పుడు సమంత సాయం చేయడం వల్లే..: నటుడు -
అమిర్ ఖాన్‌తో పెళ్లి.. మా పేరేంట్స్ షాకయ్యారు: కిరణ్ రావు
దర్శకనిర్మాత కిరణ్‌రావు గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే. 2005లో ఆమిర్.. కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. దాదాపు 16 ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యా, భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. గతేడాది లపతా లేడీస్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు కిరణ్ రావు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమీర్‌ఖాన్‌తో పెళ్లి విషయం గురించి మా తల్లిదండ్రులతో చెప్పితే వారంతా షాక్‌కు గురయ్యారని తెలిపింది. నా పేరేంట్స్ ఆందోళన చెందారని వివరించింది. అంతేకాదు తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని చెప్పారని వెల్లడించింది. అమీర్ గొప్ప నటుడని.. అతనికున్న పేరు, ప్రతిష్టలతో నీపై ఒత్తిడి ఉంటుందని సూచించారు. అయినప్పటికీ అమిర్ ఖాన్‌ను పెళ్లాడేందుకు నిర్ణయించుకున్నట్లు కిరణ్ రావు తెలిపారు. అమిర్ గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. కాగా.. గతేడాది అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లికి కిరణ్ రావు హాజరయ్యారు. -
దారి తెలీక ఆగిపోయా.. అప్పుడు సమంత సాయం చేయడం వల్లే..: నటుడు
ఆదర్శ్ గౌరవ్ (Adarsh Gourav).. సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను అలరించాడు. ద వైట్ టైగర్ సినిమాతో విశేష ఆదరణ సంపాదించుకున్న ఇతడు హిందీలో దాదాపు 9 సినిమాలవరకు చేశాడు. హాస్టల్ డేజ్, గన్స్ అండ్ గులాబ్స్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ మెప్పించాడు. తెలుగు వెండితెరకు పరిచయం కావాలని చాలాకాలంగా కలలు కంటున్నాడు. కానీ దారి తెలియక బాలీవుడ్లోనే ఆగిపోయాడు.టాలీవుడ్లో కనిపించాలన్నది ఆశఅలాంటి సమయంలో సమంత సాయం చేసిందని, తన ఒత్తిడి వల్లే తెలుగులో ప్రయత్నాలు చేసి ప్రాజెక్ట్ దక్కించుకున్నానంటున్నాడు. ఆదర్శ్ గౌరవ్ మాట్లాడుతూ.. నా మాతృ భాష తెలుగు. తెలుగు సినిమాల్లో (Tollywood) పని చేయాలని ఎంతోకాలంగా అనుకుంటున్నాను. కానీ ఎవర్ని సంప్రదించాలి? ఎలా అవకాశాలు తెచ్చుకోవాలన్నది నాకేమీ తెలియదు. ఈ విషయంలో నేను సమంతకు థాంక్స్ చెప్పుకోవాల్సిందే! సమంత సాయంతో..సిటాడెల్ సిరీస్ పూర్తయ్యాక ఆ యూనిట్ సెలబ్రేట్ చేసుకున్న పార్టీకి నేనూ వెళ్లాను. అప్పుడు నాకు తెలుగులో పని చేయాలనుందని సమంత (Samantha Ruth Prabhu)కు చెప్పాను. సరే, అలాగైతే టాలీవుడ్లో జరిగే ఆడిషన్స్‌కు వెళ్లు అని నొక్కి చెప్పింది. కావాలంటే కొన్ని మీటింగ్స్‌కు నన్ను తీసుకెళ్లేందుకు సాయం చేస్తానంది. తన మేనేజర్ సాయంతో తెలుగులో చాలామందిని కలిశాను. పలువురితో చర్చలు కూడా జరిగాయి.(చదవండి: కన్నడ స్టార్ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి)అవన్నీ నిజ జీవితంలో..అలా ఓ దర్శకుడు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్నాను. ఇది సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. నేను ఎక్కువగా అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానె, దిబాకర్ బెనర్జీ, జోయా అక్తర్ సినిమాలే ఎక్కువగా చూశాను. అందులో వారు చూపించే పాత్రలు నిజ జీవితంలో నాకు తారసపడినట్లే కనిపిస్తాయి. ఇకపోతే నా చిన్నతనంలో మా ఇంట్లో ఓ కఠిన నియమం ఉండేది. అదేంటంటే.. బయట ఏ భాష అయినా మాట్లాడు, కానీ ఇంట్లోకి వచ్చాక మాత్రం తెలుగు మాత్రమే మాట్లాడాలన్న నిబంధన ఉండేది.ఇప్పుడర్థమవుతోందిఅప్పుడు నాకర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకెంతగానో ఉపయోగపడుతోంది. నాకు చిన్నప్పటినుంచి తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఈ ఇండస్ట్రీకి నేను కొత్త, ఇక్కడికి వచ్చి కొన్నాళ్లే అవుతున్నా ఏదో దగ్గరి సంబంధం ఉన్న అనుభూతి వస్తుంది. నాకు ఎవరూ తెలియకపోయినా భాష వల్ల అంతా ఒక్కటే అన్న ఫీలింగ్ వస్తోంది అని చెప్పుకొచ్చాడు. తన తెలుగు సినిమా టైటిల్, దర్శకుడెవరు? వంటి వివరాలు మాత్రం చెప్పలేదు.చదవండి: 'డ్రాగన్' నా లైఫ్‌లో జరిగిందే.. మనీ అడగాలంటే సిగ్గనిపించింది: డైరెక్టర్ -
ఆమ్లెట్ ఇలా కూడా వేస్తారా? ఆశ్చర్యపోతూనే ఆరగించిన నటుడు
నటుడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) భోజన ప్రియుడు. ఎక్కడ ఏ వంటకాలు బాగుంటాయని ఇట్టే చెప్పేస్తాడు. ఫుడ్ వ్లాగింగ్ పేరుతో దేశంలోని ప్రసిద్ధ వంటకాలను అన్వేషించి వాటిని అభిమానులకు పరిచం చేస్తూ ఉంటాడు. తాజాగా అతడు ఓ సరదా వీడియో షేర్ చేశాడు. సినిమా సెట్లో ఆశిష్ కోసం నటుడు నానా పటేకర్ వంటమనిషిగా మారిపోయాడు.ఆమ్లెట్ విరిగిపోకుండా ఎలా తిప్పాడంటే?ఆశిష్‌కు దగ్గరుండి ఆమ్లెట్ వేసిచ్చాడు. అయితే ఒకవైపు కాలిన ఆమ్లెట్‌ను రెండోవైపు తిప్పడానికి ప్లేటు సాయం తీసుకున్నాడు. మొదటగా పాన్‌లో ఆమ్లెట్ వేసి.. ఒకవైపు కాలిన తర్వాత దాన్ని ప్లేటుపై వేశాడు. తర్వాత ఆ ప్లేటుపై ఉన్నదాన్ని తిరిగి పాన్‌లో వేశాడు. ఆమ్లెట్ ముక్కలుగా విరిగిపోకుండా ఈ టెక్నిక్ ఉపయోగించాడన్నమాట. అది చూసి ఆశిష్ ఆశ్చర్యపోయాడు. మొదట ఇది తప్పు పద్ధతి అనుకున్నా, కానీ ఇది యునిక్ టెక్నిక్ అని కొనియాడాడు. నీ ప్రేమకు పొంగిపోయా..నానా పటేకర్ వేసిచ్చిన ఆమ్లెట్ చాలా బాగుందంటూ లొట్టలేసుకుని తిన్నాడు. ఆయన ప్రేమకు పొంగిపోయానని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఆశిష్.. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆయన తెలుగులో ఛత్రపతి, గుడుంబా శంకర్, పోకిరి, అన్నవరం, చిరుత, తులసి, అతిథి, అదుర్స్, అలా మొదలైంది, బాద్షా, ఆగడు, కిక్ 2, జనతా గ్యారేజ్.. ఇలా అనేక సినిమాల్లో నటించాడు. చివరగా కిల్ అనే హిందీ చిత్రంలో కనిపించాడు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) చదవండి: ఈ ఫీలింగ్ ఎంత బాగుందో.. నమ్రత నోట కూడా అదే: శిల్ప శిరోద్కర్ -
'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా
కొన్నిసార్లు రాంగ్ టైంలో రిలీజ్ అవుతుండటం వల్ల కొన్నికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. అలా 'పుష్ప 2'(Pushpa 2 Movie) తెగ ఆడేస్తున్నప్పుడు థియేటర్లలో విడుదలైన ఓ హిందీ మూవీ.. దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?దిగ్గజ నటుడు నానా పాటేకర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'వనవాస్'.(Vanvaas Movie) గదర్, గదర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన అనిల్ శర్మ దీనికి దర్శకుడు. మంచి ఫిలాసఫీ, ఎమోషనల్ కంటెంట్ తో తీశారు కానీ పుష్ప 2 ఉత్తరాదిలో మంచి జోష్ లో ఆడేస్తున్నప్పుడు అంటే డిసెంబరు 20న థియేటర్లలో రిలీజ్ చేశారు. దీంతో పెద్దగా వసూళ్లు రాలేదు.(ఇదీ చదవండి: నానా పాటేకర్ పై హీరోయిన్ పెట్టిన మీటూ కేసు కొట్టేసిన హైకోర్ట్)దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు 'వనవాస్' మూవీ ఓటీటీ (Vanvaas OTT) తేదీ ఖరారు చేసుకుంది. మార్చి 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ, ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు.'వనవాస్' విషయానికొస్తే.. ప్రతాప్ (నానా పాటేకర్)కి మతిమరుపు సమస్య. ఇతడి ముగ్గురు కొడుకులు ఆస్తి పంచుకునే విషయంలో గొడవ పడుతూ ఉంటారు. తండ్రి అడ్డొస్తున్నాడని చెప్పి అతడిని కాశీలో వదిలి వచ్చేస్తారు. అక్కడ ఈయనకు వీర్(ఉత్కర్ష్) పరిచయమవుతాడు. మరి ప్రతాప్ ని వీర్ ఇంటికి చేర్చాడా? చివరకు ఏమైందనదే స్టోరీ?(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్)Jo paraye bhi na kare, agar vo apne kar jaayein, toh apnon se bada paraya kaun?#Vanvaas premieres 14th March, only on #ZEE5. #ZEE5Global #VanvaasOnZEE5@nanagpatekar @khushsundar @Anilsharma_dir @1020_suman @iutkarsharma @rajpalofficial #SimratKaur @hemantgkher… pic.twitter.com/OXwXXh5aLf— ZEE5 Global (@ZEE5Global) March 9, 2025 -
ఈ ఫీలింగ్ ఎంత బాగుందో.. నమ్రత నోట కూడా అదే: శిల్ప శిరోద్కర్
బిగ్‌బాస్ షోకు వెళ్లడం వల్ల తనకు మంచే జరిగిందంటోంది నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar). పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గిపోయానని చెప్తోంది. ఆమె లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నాజూకుగా మారిపోయారని కామెంట్లు చేస్తున్నారు. శిల్పా మట్లాడుతూ.. బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)లో ఎక్కువ ఆహారం అందుబాటులో ఉండదు. దీనివల్ల మితంగానే తినేదాన్ని. ఫలితంగా 11 కిలోలు తగ్గిపోయాను. బయటకు వచ్చాక మరో రెండు కిలోలు తగ్గాను.జీవితంలోనే మొదటిసారి..మొత్తంగా 13 కిలోల పైన బరువు తగ్గాను. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు చాలా సన్నబడిపోయావ్, నీ వయసు తగ్గిపోతుందేంటి అన్న ప్రశంసలు నా జీవితంలోనే మొదటిసారి వింటున్నాను. అవి వింటుంటే నాకు మరింత ఎనర్జీ వస్తోంది. బిగ్‌బాస్‌లో మూడు, నాలుగు నెలలపాటు ఉన్నాను. బయటకు రాగానే తొలిసారి నమ్రత (Namrata Shirodkar)ను కలిసినప్పుడు నన్ను చూసి షాకైంది. చాలా సన్నబడిపోయావ్ అంది. నన్ను చూసి నా కుటుంబం ఎంతగానో గర్విస్తోంది.మంచి డైట్..ఇప్పుడు మంచి డైట్ ఫాలో అవుతున్నాను. ఇంకాస్త బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎందుకంటే స్క్రీన్‌పై మనం ఉన్నదానికంటే కాస్త బొద్దుగానే కనిపిస్తాం. కాబట్టి నాకు నేను కఠిన నియమాలు పెట్టుకుంటున్నాను. రోజుకు ఒకటీ లేదా రెండు సార్లు మాత్రమే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాను. గతంలో నేను లావుగా ఉన్నానని చయ్యా చయ్యా పాటకు నన్ను రిజెక్ట్ చేశారు. నాకోసం కష్టపడుతున్నా..అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్ణయించుకున్నాను. నాకోసం నేను కష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. శిల్ప.. ఖుదా గవా, ఏక్ ముత్తి ఆస్మాన్, త్రినేత్ర, ప్రతీక్ష, పెచాన్, ఆంఖెన్.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో బ్రహ్మ అనే సినిమాలో నటించింది. హీరో మహేశ్‌బాబుకు శిల్ప శిరోద్కర్ మరదలు అవుతుంది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73)చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా -
'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా
నోరా ఫతేహి (Nora Fatehi).. ఐటం సాంగ్ డ్యాన్సరే కాదు, నటి కూడా! కానీ ఆమెకు ఎక్కువగా డ్యాన్సర్‌గానే గుర్తింపు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అభిషేక్ బచ్చన్ సరసన బి హ్యాపీ అనే సినిమాలో నటిస్తోంది. అయితే తనను ప్రతిసారి ఎవరో ఒకరితో పోల్చడం నచ్చదంటోందీ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ.. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. దాన్ని అందరూ తలపొగరు అనుకుంటారు. ఐటం సాంగ్స్, యాక్టింగ్..స్పెషల్ సాంగ్స్‌లో కనిపించనంతమాత్రాన హీరోయిన్గా చేయొద్దని ఎక్కడా లేదే! ప్రతి ఒక్కరూ ఐటం సాంగ్స్ (Item Songs) చేయొచ్చు, కావాలనుకుంటే నటించనూవచ్చు. ఈ విషయంలో అందరికీ ఒకేవిధమైన న్యాయం ఉండాలి. స్పెషల్ సాంగ్స్ చూసినప్పుడు నేను ఏమని ఫీలవుతానో తెలుసా? అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేశారు.. అందంగా కనబడుతూనే ఇలాంటి పాటల్లో కనిపించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని సంతోషపడతాను. నాతో పోల్చుకుంటున్నారుకానీ నచ్చని విషయం ఏంటంటే.. వారి సాంగ్ ప్రమోషన్‌కు నా పేరును వాడుకోవడం! ఏదైనా పాటను జనాల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు నా పేరును లాగుతున్నారు. నోరాతో పోల్చితే చాలనుకుంటున్నారు. అన్ని పీఆర్ ఏజెన్సీ (PR campaigns)లు ఇదే పని చేస్తున్నాయి. కొత్త పాట రిలీజైనప్పుడల్లా నోరా కెరీర్ ముగిసినట్లే.. ఈ కొత్త బ్యూటీ నోరా కంటే 100 రెట్లు నయం.. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు. ఎవరినీ కిందకు లాగనుఇందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో కూడా బాగా తెలుసు. సేమ్, ఇలాగే అవతలివారిని కిందకు లాగుతూ ప్రచారం చేద్దామని కొన్ని పీఆర్ ఏజెన్సీలు నన్ను సంప్రదించాయి. కానీ నేనందుకు ఒప్పుకోలేదు. నన్ను నేను ఎవరితోనూ పోల్చుకోలేను. ఎవరినీ కిందకు లాగడం నాకిష్టం లేదు. నా పాట రిలీజైనప్పుడు నా పనితనం, డ్యాన్స్, ఎఫర్ట్స్.. ఇవి చూసి మాత్రమే జనాలు నన్ను మెచ్చుకోవాలి అని చెప్పుకొచ్చింది.శ్రీలీల వంటి హీరోయిన్ల రాకతో..ఈ మధ్య శార్వరి, శ్రీలీల (Sreeleela), రాషా వంటి పలువురు యంగ్ హీరోయిన్లను నోరాతో పోల్చారు. అంతేకాదు వారి రాకతో నోరా కెరీర్ ఖతమైపోయిందన్న కామెంట్లు కూడా చూశాం అంటున్నారు నెటిజన్లు. నోరా ప్రధాన పాత్రలో నటించిన బి హ్యాపీ సినిమా విషయానికి వస్తే. ఈ మూవీ మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.చదవండి: రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు -
'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా
'ఐఫా' అవార్డ్స్ 2025 జైపూర్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్ అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్, శ్రేయా ఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్ ఐఫా వేదికపై సందడి చేశారు. జైపుర్‌లో రెండు రోజుల పాటు జరగనున్న ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలు శనివారం మొదలయ్యాయి. చిత్రసీమకు చెందిన చాలామంది నటీమణులు ‘ది జర్నీ ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమా’ పేరుతో జరిగిన చర్చలో తమ వాయిస్‌ను వినిపించారు. పరిశ్రమలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. సినిమాకు సంబంధించి హీరోల్లాగే తాము కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నామని వారు తెలిపారు. ఇక్కడ అందరం సమానంగా పనిచేసినప్పటికీ పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంలో నటులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని వారు ఆశించారు. ‘స్త్రీ2’ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అలాంటప్పుడు ఆ సినిమాలో నటించిన హీరోయిన్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలిసిందే అంటూ బాలీవుడ్ కథానాయకులు తమ గళాన్ని వినిపించారు.సినిమా విభాగంఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చంకిలాఉత్తమ నటి: కృతి సనన్ (దో పట్టి)ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకిలా)ఉత్తమ సహాయ నటి : అనుప్రియ గోయెంకా (బెర్లిన్)ఉత్తమ సహాయ నటుడు: దీపక్ దోబ్రియాల్ (సెక్టార్ 36)ఉత్తమ కథ ఒరిజినల్: కనికా ధిల్లాన్ (దో పట్టి)వెబ్ సిరీస్ విభాగంఉత్తమ సిరీస్: పంచాయత్ సీజన్- 3ఉత్తమ నటి (సిరీస్): శ్రేయ చౌదరి (బాండిష్ బాండిట్స్ సీజన్ 2)ఉత్తమ నటుడు (సిరీస్): జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ దర్శకుడు (సిరీస్): దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ సహాయ నటి (సిరీస్): సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)ఉత్తమ సహాయ నటుడు (సిరీస్): ఫైసల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 View this post on Instagram A post shared by IIFA Awards (@iifa) -
తెలుగు హీరో... హిందీ విలన్
తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్ల హవా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేసేందుకే బాలీవుడ్ యాక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తొలిసారిగా తెలుగు తెరపై విలన్‌గా కనిపించనున్న కొందరు బాలీవుడ్ యాక్టర్స్, వారు ఓకే చేసిన సినిమాలు వివరాలు ఇలా ఉన్నాయి.మల్టీ మిలియనీర్‘నీర్జా, పద్మావత్, సంజు, గంగుభాయి కతియావాడి’ వంటి చిత్రాలతో నటుడిగా బాలీవుడ్లో నిరూపించుకున్నారు జిమ్ సర్భ్. ఈ నటుడికి టాలీవుడ్ ఎంట్రీ చాన్స్ లభించింది. నాగార్జున–ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ మల్టీ మిలియనీర్ పాత్రను జిమ్ సర్భ్ చేస్తున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హైప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ భిక్షగాడిగా కనిపిస్తారని, ఓ ఆఫీసర్‌గా నాగార్జున, మల్టీ మిలియనీర్ పాత్రలో జిమ్ సర్భ్ కనిపిస్తారని తెలిసింది. ఓ బలమైన సామాజిక అంశం, డబ్బు ప్రధానాంశాలుగా ‘కుబేర’ కథనం సాగుతుందని సమాచారం.ఇటు ఓజీ... అటు జీ2‘మర్డర్, గ్యాంగ్‌స్టర్, ముంబై సాగ, టైగర్ 3, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇమ్రాన్ హష్మి గురించి తెలుగు ఆడియన్స్‌కు తెలిసిందే. ఈ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఖరారైంది. ప్రజెంట్ రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మి. పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ – ప్రచారంలో ఉన్న టైటిల్)లో ఇమ్రాన్ హష్మీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓమి భావ్ అనే పాత్రలో హష్మి కనిపించనున్నట్లుగా తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ΄్లాన్ చేస్తోంది. మరోవైపు అడివి శేష్ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. కాగా ‘జీ 2’ సినిమా షూటింగ్లో ఆల్రెడీ ఇమ్రాన్ హష్మీ జాయిన్ అయ్యారు. గత ఏడాది అక్టోబరులో ‘జీ 2’ కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఇమ్రాన్ గాయపడ్డారు. కానీ ఆ తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘జీ 2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తూ, డబుల్ విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇమ్రాన్ హష్మి.ఇన్స్పెక్టర్ స్వామిఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం విజయ్ సేతుపతి ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘రైఫిల్ క్లబ్’ వంటి చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అనురాగ్ కశ్యప్ యాక్టర్‌గా తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని కొందరు తెలుగు ఆడియన్స్ ఆశపడ్డారు. వారి ఆశ నిజమైంది. అడివి శేష్ హీరోగా ‘డెకాయిట్: ఓ ప్రేమకథ’ అనే సినిమా రూపొందుతోంది.ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఇన్స్పెక్టర్ స్వామి అనే కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ఉంటుందని తెలిసింది. కథ రీత్యా... ఇద్దరు ప్రేమికులు బ్రేకప్ చెప్పుకుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారికి ఇష్టం లేకపోయినా... వీరిద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి ఉంటుంది.ఈ క్రైమ్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత ఇన్స్పెక్టర్ స్వామిది. మరి... క్రిమినల్స్ అయిన ఈ ప్రేమికులను పోలీసాఫీసర్‌గా ఇన్స్పెక్టర్ స్వామి పట్టుకున్నాడా? అనేది ‘డెకాయిట్’ సినిమా చూసి తెలుసుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగం వంటి అంశాల మేళవింపుతో రూపొందుతున్న ‘డెకాయిట్’ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు నటుడిగానే కాదు... ‘పాంచ్, బాంబే టాకీస్, అగ్లీ, మ్యాడ్లీ, దో బార’ వంటి హిందీ చిత్రాలతో అనురాగ్ కశ్యప్ బాలీవుడ్లో దర్శకుడిగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగానూ, రైటర్‌గానూ ఆయన రాణిస్తున్న విషయం కూడా విదితమే.అర్జున్‌కు విలన్‌గా...స్క్రీన్‌పై నందమూరి కల్యాణ్‌రామ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు విజయశాంతి. ఇక ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు సోహైల్ ఖాన్. ‘పార్ట్నర్, వీర్, దబాంగ్ 3’ వంటి చిత్రాల్లో నటుడిగా అభినందనలు అందుకున్న సోహైల్ ఖాన్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాకీ పార్టు పూర్తయింది. రామ్‌చరణ్‌కు విలన్‌గా...రామ్‌చరణ్‌కు విలన్‌గా కనిపించనున్నారు బాలీవుడ్ యంగ్ హీరో దివ్యేందు. హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలోప్రారంభం కానుందని తెలిసింది.కాగా ఈ మల్టీ స్పోర్ట్స్ (క్రికెట్, కుస్తీ తదితర క్రీడలు) డ్రామాలో దివ్యేందు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ దివ్యేందు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు విలన్‌గా కనిపిస్తారట దివ్యేందు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావొచ్చని, దీపావళికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందనీ సమాచారం. మరోవైపు ‘ప్యార్‌కా పంచనామా, టాయిలెట్: ఏక్ ప్రేమకథ, ఓల్డ్ కపుల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటుడిగా రాణించారు దివ్యేందు. కాగా ‘మిర్జాపూర్, సాల్ట్ సిటీ, ది రైల్వే మెన్’ వంటి వెబ్ సిరీస్‌లతో దివ్యేందు మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. కొందరు బాలీవుడ్ యాక్టర్స్ ఆల్రెడీ తెలుగులో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా చేసిన ‘భగవంత్ సింగ్ కేసరి’లో అర్జున్ రామ్‌పాల్, ‘డాకు మహారాజ్’లో బాబీ డియోల్ విలన్స్‌గా నటించారు. కాగా పవన్ కల్యాణ్ ‘హరిహరవీర మల్లు’ చిత్రంలో ఎంతో కీలకమైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర 2’ చిత్రంలోనూ బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. గత ఏడాది విడుదలైన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేశారు సంజయ్ దత్. ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాల్లోనూ లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలిసింది. అలాగే ప్రభాస్ ‘ఫౌజి’ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లీడ్ యాక్టర్స్‌గా చేస్తున్నారు. నాగార్జున–నానీల ‘దేవదాసు’ (2018)లో విలన్‌గా యాక్ట్ చేసిన కునాల్ కపూర్ ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో మళ్లీ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్ ‘కల్కి’లో అమితాబ్ బచ్చన్ ఎంతటి బలమైన రోల్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కల్కి 2’లోనూ అమితాబ్ బచ్చన్ రోల్ కొనసాగుతుందని తెలిసిందే... ఇలా విలన్స్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ మరికొందరు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు -
మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు..
మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor), హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఒకరికొకరు తారసపడటంతో ఆత్మీయంగా హగ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఇన్నాళ్లకు మీరిద్దరూ మెచ్యూర్డ్‌గా ప్రవర్తించారు. ఇలా మీ ఇద్దర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.గతంలో ప్రేమజంటకాగా కరీనా, షాహిద్లు గతంలో ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఫిదా, చుప్ చుప్ కే, జబ్ వి మెట్ వంటి చిత్రాల్లో జంటగా నటించారు. ఆన్‌స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ జోడీగానే కనిపించేవారు. జబ్ వి మెట్ సినిమా షూటింగ్‌కు ముందు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో విడిపోక తప్పలేదు. అనంతరం కరీనా.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు సంతానం. షాహిద్ కపూర్.. మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడగా వీరికి ఓ కుమారుడు, కూతురు జన్మించారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కుమారుడు -
తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌పై మనసు పారేసుకున్నారు. వరుసగా స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కల్కి 2989 ఏడీ సినిమాతో దీపికా పదుకొణె, దేవరతో జాన్వీ కపూర్, లైగర్‌తో అనన్య పాండే.. ఇలా అక్కడి బ్యూటీలందరూ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా సోనాక్షి సిన్హ (Sonakshi Sinha) సైతం టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మహిళా దినోత్సవం సందర్భంగా..సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమా (Jatadhara Movie)లో ముఖ్య పాత్రలో నటిస్తోంది. నేడు (మార్చి 8న) మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో ఆగ్రహంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.అనంత పద్మనాభస్వామి ఆలయం నేపథ్యంలో..ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. జటాధర సినిమా కథ అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమా కోసం బాడీని పెంచే పనిలో ఉన్న సుధీర్‌బాబు అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Zee Studios (@zeestudiosofficial) చదవండి: అది కూడా తప్పేనా? నాకు స్టార్‌గా ఉండాలని లేదు: అక్షయ్ కుమార్ -
అది కూడా తప్పేనా? నాకు స్టార్‌గా ఉండాలని లేదు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తనను స్టార్ అని పిలిస్తే నచ్చదంటున్నాడు. స్టార్లా ఉండటం తనకిష్టం లేదని చెప్తున్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. నాకు స్టార్ (నక్షత్రం)గా ఉండాలని లేదు. ఎందుకంటే నక్షత్రాలు ఎప్పుడూ రాత్రివేళలో మాత్రమే ప్రకాశిస్తాయి. నాకు ఉదయం, రోజంతా కూడా ప్రకాశించాలని ఉంది. అందుకే స్టార్‌ను కాదల్చుకోలేదు అన్నాడు.స్కూల్లో క్రమశిక్షణ..క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ.. మనమందరం స్కూల్లో ఎంతో క్రమశిక్షణతో మెదులుకునేవాళ్లం. కానీ పెరిగేకొద్దీ ఆ క్రమశిక్షణను నెమ్మదిగా కోల్పోతున్నాం. నేను త్వరగా పడుకుని అంతే త్వరగా నిద్రలేస్తాను. అది చూసి చాలామంది ఎందుకలా త్వరగా నిద్రపోతావ్? అని అడుగుతారు. డిసిప్లిన్‌గా ఉంటే కూడా ప్రశ్నిస్తారా? అన్నాడు.సినిమాఅక్షయ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది బడే మియా చోటే మియా, సర్ఫిరా, ఖేల్ ఖేల్ మే, స్త్రీ 2, సింగం అగైన్ వంటి చిత్రాల్లో కనిపించాడు. ఈ ఏడాది స్కై ఫోర్స్ మూవీతో అలరించాడు. ప్రస్తుతం కేసరి చాప్టర్ 2, జాలీ ఎల్ఎల్బీ 3, హౌస్‌ఫుల్ 5, కన్నప్ప(తెలుగు), భూత్ బంగ్లా, వెల్కమ్ టు ద జంగిల్, హీరా ఫెరి 3 వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి: తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ -
ఐఫా అవార్డ్స్‌కు అంతా సిద్ధం.. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards) అవార్డుల కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. భారత్‌లోని జైపూర్ వేదికగా ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డులు 2000 సంవత్సరంలో మొదటిసారి ప్రకటించారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ రంగాలలో మెప్పించిన నటీనటులు, చిత్రాలను గుర్తించి అవార్డ్స్ అందిస్తారు. ఈసారి హోస్ట్‌లుగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో పాటు నిర్మాత కరణ్ జోహార్ వ్యవహరించనున్నారు.మార్చి 8,9 తేదీల్లో జైపుర్ వేదికగా ఐఫా వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే భారీగా నటీనటులు అక్కడకు చేరుకున్నారు. ఐఫా అవార్డ్స్ కార్యక్రమాన్ని భారత్‌లో జరపడం ఇది రెండోసారి. సుమారు ఐదేళ్ల క్రితం ముంబైలో నిర్వహించారు. ప్రతి ఏడాది అబుదాబి, సింగపూర్,మలేషియా, అమెరికా వంటి దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అయితే, ఐఫా అవార్డ్స్ ప్రయాణానికి 25 ఏళ్లు పూర్తి కావడంతో ఈసారి భారత్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్,కరీనా కపూర్, శ్రేయా ఘోషల్ వంటి స్టార్స్ ఐఫా వేదిక మీద తమ డ్యాన్సులతో మెప్పించనున్నారు. View this post on Instagram A post shared by IIFA Awards (@iifa) -
మన దేశంలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా
పేరుకే హిందీ నటి గానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం మహేశ్ బాబు-రాజమౌళి సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఓవైపు మూవీ చేస్తూనే మరోవైపు ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్మేస్తోంది. రీసెంట్ గా అలా కోట్ల రూపాయల డీల్ జరిగినట్లు ఇండెక్స్ ట్యాప్ తెలిపింది.ముంబైలోని అంధేరిలో ఉన్న ఒబెరాయ్ స్క్రై గార్డెన్ లో ప్రియాంకకు నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటినే ఏకంగా రూ.16.17 కోట్లకు విక్రయించింది. 18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్, 19వ అంతస్తులో ఉన్న జోడీ యూనిట్ విక్రయించిన వాటిలో ఉన్నాయి.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))గతంలోనూ ప్రియాంక.. మన దేశంలోని ఆస్తుల్ని విక్రయించింది. 2021లో వెర్సోవాలోని రెండు ఇళ్లను, 2023లో లోఖండ్ వాలాలోని రెండు పెంట్ హౌసులని అమ్మేసింది. ప్రస్తుతం ఈమెకు గోవా, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ లో సొంత భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం కూతురు, భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్ లో ఉంటోంది.ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. హాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. కొన్నాళ్ల క్రితం 'సిటాడెల్' అమెరికన్ వెర్షన్ లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం రాజమౌళి మూవీలో ప్రతినాయక పాత్రలో నటిస్తోందని సమాచారం. దీని షూటింగ్ ఇప్పుడు ఒడిశాలో జరుగుతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
పద్మ విభూషణ్ గ్రహీత, సీనియర్ నటిపై మరణ వార్తలు.. కుమారుడు క్లారిటీ
అలనాటి నటి, పద్మ విభూషణ్ వైజయంతి మాల పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1955లో బాలీవుడ్లో దిలీప్ కుమార్ నటించిన దేవదాస్ చిత్రం హీరోయిన్గా కనిపించారు. అంతేకాకుండా నయా దౌర్, మధుమతి, జ్యువెల్ థీఫ్, సంగం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు గానూ పద్మ శ్రీ, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా ఆమెను అభిమానులు ముద్దుగా డ్యాన్సింగ్ క్వీన్ అని పిలుచుకుంటారు.తాజాగా ఈ సీనియర్ నటి వైజయంతిమాల చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరలయ్యాయి. దీంతో ఆమె కుమారుడు స్పందించారు. ఆమె మరణించారన్న వార్తలను వైజయంతిమాల కుమారుడు సుచింద్ర బాలి ఖండించారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. ఆమె మరణ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఆమె వయస్సు 91 ఏళ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.డాక్టర్ వైజయంతిమాల బాలి ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆ వార్తలు షేర్ చేసే ముందు ఒకసారి ధృవీకరించుకోవాలని ఆమె కుమారుడు సుచింద్ర బాలి హితవు పలికారు. కాగా.. ఇటీవలే జనవరిలో చెన్నైలోని కళా ప్రదర్శినిలో వైజయంతిమాల భరతనాట్యం ప్రదర్శించారు. ఆమె ఆరోగ్యంగానే కనిపించారు. వైజయంతిమాల తన నటనకు గాను పద్మభూషణ్ అవార్డ్‌ను దక్కించుకుంది. -
సింగిల్‌గా కంటే ప్రేమలో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నా..: తమన్నా
హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia), నటుడు విజయ్ వర్మ (Vijay Varma) మొన్నటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. త్వరలోనే పెళ్లి చేసుకుని జంటగా ఒక్కటవుతారనుకుంటే అంతలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారని తెలుస్తోంది. ప్రేమికులుగా కాకుండా ఇకపై స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు ఈ బ్రేకప్ రూమర్స్ తమన్నా, విజయ్ ఎవరూ స్పందించనేలేదు.రిలేషన్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దుతాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన తమన్నా ప్రేమ గురించి మాట్లాడింది. ప్రేమకు ఎలాంటి షరతులు ఉండకూడదు. ఇది కేవలం ప్రేమజంటకే కాదు, పేరెంట్స్, ఫ్రెండ్స్, మన పెంపుడు జంతువులు.. ఇలా అన్నింటికీ వర్తిస్తుంది. నీ పార్ట్‌నర్‌పై నువ్వు అంచనాలు పెట్టుకోవడం ప్రారంభించావడంటే అప్పుడా బంధం బిజినెస్‌గా మారుతుంది. నేనిలా అనుకుంటే నువ్విలా చేశావ్.. నేను చెప్పినవాటిలో కొన్నే చేశావ్.. ఇలా లిస్టు తయారుచేసుకోవాల్సి వస్తుంది.వ్యాపార లావాదేవిగా మార్చొద్దుప్రేమకు, రిలేషన్‌కు మధ్య తేడా ఉంది. ప్రేమ పుట్టాకే రిలేషన్షిప్ మొదలవుతుంది. ఆ ప్రేమ షరతులు లేకుండా ఉండాలి. కొన్నిసార్లు అది ఏకపక్షం కూడా కావచ్చు. అయితే నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఆశిస్తే అది కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే! నేను ఎవరినైనా ప్రేమిస్తే వారిని స్వేచ్ఛగా వదిలేస్తాను. వారికి నచ్చినట్లుగా బతకనిస్తాను.తెలివిగా ఆలోచించండిసింగిల్గా ఉన్నప్పటి కంటే రిలేషన్లో ఉన్నప్పుడే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. ఒక తోడు దొరికితే అంతకుమించిన సంతోషం ఏముంటుంది. కానీ ఎవర్ని ఎంచుకుంటున్నావన్నది ముఖ్యం.. ఎందుకంటే వారు నీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తెలివిగా ఆలోచించి ముందడుగు వేయండి అని చెప్పుకొచ్చింది.చదవండి: ఓటీటీలో తండేల్.. ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్ -
మ్యారేజ్ కి నో చెప్పిన వర్మ.. బ్రేకప్ చెప్పేసిన తమన్నా..!
-
బంగారాన్ని బహుమతిగా ఇచ్చేసిన నటి.. నోరెళ్లబెట్టిన కూతురు
ఎవరైనా మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయనో, బ్యాగు బాగుందనో, నెక్లెస్ బాగుందనో చెప్తే థాంక్స్ అంటూ సంతోషిస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటి మాత్రం బంగారు దిద్దులు బాగున్నాయన్నందుకు ఏకంగా వాటినే తీసి బహుమతిగా ఇచ్చేసింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ఒకప్పటి హీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon). రవీనా తన కూతురు రాషా తడానీతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో బుధవారం సాయంత్రం ప్రత్యక్షమైంది. ఆమె కనిపించగానే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తనను వెంబడిస్తూ కెమెరాలో రికార్డు చేస్తున్నారు.బంగారు కమ్మ బహుమతిగా..వారిలో ఒకరు రవీనాను తన చెవిదిద్దులు బాగున్నాయని పొగిడాడు. దాంతో రవీనా ఏ కమ్మ బాగుందని అడుగుతూ దాన్ని తీసేసింది. తనకు కాంప్లిమెంట్ ఇచ్చిన వ్యక్తిని ఆ బంగారు దిద్దును బహుమతిగా ఇచ్చేసింది. ఇదంతా చూసిన రాహా.. తల్లి చేసిన పనికి నోరెళ్లబెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవీనా మనసు బంగారం.. ఈ రోజుల్లో బంగారాన్ని దానం చేసే మహానుభావులు ఎవరున్నారు? వావ్, మంచి మనసున్నవాళ్లకే ఇలాంటివి సాధ్యమవుతాయి.. తను నిజంగా గ్రేట్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.రెండు గాజులు గిఫ్ట్‌గా..రవీనా ఇలా తన ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ఓ పెళ్లికి హాజరైన ఆమె పెళ్లికూతురికి తన గాజుల్ని గిఫ్ట్‌గా ఇచ్చింది. అవి సాధారణ బ్యాంగిల్స్ కావు. వాటిపై రవీనా పేరుతో పాటు ఆమె భర్త అనిల్ పేరు కూడా రాసి ఉంది. అయినా అవేమీ పట్టించుకోకుండా వాటిని కొత్త జంటకు కానుకగా ఇచ్చేసింది. ఆమె సినిమాల విషయానికి వస్తే వెల్కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. అనీస్ బజ్మీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఆ డైరెక్టర్ వల్ల బతకొద్దనుకున్నా.. సింగపూర్‌లో 13 ఏళ్లు టీచర్‌గా..: హిట్లర్ నటి -
బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి సౌత్ ఇండస్ట్రీకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్
హిందీ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) బాలీవుడ్ సినిమాలకు గుడ్‌బై చెప్పేశాడు. హిందీ చిత్ర పరిశ్రమను వీడుతున్నట్లు ఆయన ప్రకటించాడు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. హిందీ ఇండస్ట్రీ చాలా విషపూరితంగా మారిపోయిందని ఆయన అసహనం వ్యక్తంచేశాడు. ఇక్కడ మేకర్స్ ఆలోచనలు చూసి పిచ్చెక్కుతోందని, ముంబైని వదిలేసి సౌత్ ఇండస్ట్రీలో సెటిలైపోతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. దక్షిణాది చిత్రపరిశ్రమ(South Industry)ని చూసి అసూయ చెందుతున్నానని, సౌత్ ఇండస్ట్రీలాగా ఇక్కడ (బాలీవుడ్లో) ప్రయోగాలు చేయడం కష్టమని ఆయన చెప్పాడు.బాలీవుడ్‌ను వదిలేసిన అనురాగ్ కశ్యప్ తాజాగా బెంగళూరుకు వచ్చేశాడు. ఈ క్రమంలో ఆయన ఇలా చెప్పాడు. 'నేను బాలీవుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొనే ఇక్కడకు (బెంగళూరు) వచ్చాను. బాలీవుడ్ చిత్రపరిశ్రమ చాలా దారుణంగా తయారైంది. సినిమా ప్రారంభం నుంచీ వ్యాపారం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎలా అమ్ముదాం, మనకెంతొస్తుంది..? ఇదే చర్చ.. దీనివల్ల సినిమా తీసేటప్పుడు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాను. హిందీలో ప్రతిఒక్కరూ సాధ్యం కాని టార్గెట్లతో సినిమాను ప్రారంభిస్తున్నారు. రూ.500 కోట్లు, రూ.800 కోట్లు వచ్చే సినిమాలను మాత్రమే తీయాలని ఎక్కువగా ప్లాన్ చేస్తుంటారు. దీంతో అక్కడ ప్రతిభ, కొత్తదనానికి ఛాన్స్ లేకుండా పోయింది.' అని ఆయన తెలిపాడు. ఇక నుంచి తాను పూర్తిగా సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లోనే ఉంటానని ఆయన చెప్పాడు.అనురాగ్ చివరగా రైఫిల్ క్లబ్, విడుదలై 2 సినిమాల్లో నటించాడు. ఇప్పటివరకు దాదాపు 18 సినిమాలు డైరెక్ట్ చేయగా అందులో మొట్ట మొదటి చిత్రం పాంచ్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. రెండు దశాబ్దాల తర్వాత పాంచ్‌ను ఎట్టకేలకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది పాంచ్ ప్రేక్షకుల ముందుకురావచ్చు. ప్రస్తుతం ‘డకాయిట్’లో ఆయన నటిస్తున్నాడు. అడివిశేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో షానీల్ డియో దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. -
చున్నీ లేదేంటి? నీకు బుర్ఖా వేయాల్సిందే.. హీరోయిన్‌పై ట్రోలింగ్
హీరోయిన్ సనా ఖాన్ (Sana Khan) సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది. యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేయడంతోపాటు రంజాన్ స్పెషల్ పాడ్‌క్యాస్ట్ కూడా చేస్తోంది. సనా చేసే ఈ పాడ్‌కాస్ట్‌లోని ఓ ఎపిసోడ్లో నటి సంభావన సేత్ (Sambhavna Seth) కూడా భాగం కానుంది. ఈ ఎపిసోడ్ షూట్ చేయడానికి ముందు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దెబ్బలు పడ్తాయ్అందులో సనా.. నీ డ్రెస్ మార్చుకుంటావా? అని అడగ్గా సంభావన లేదని చెప్పింది. అందుకామె నీ సల్వార్ కమీజ్ ఏమీ బాగోలేదు.. చెప్పింది వినకపోతే నీకు దెబ్బలు పడ్తాయి.. చున్నీ ఎక్కడుంది? ఎవరైనా బుర్ఖా తీసుకురండి. సంభావనకు బుర్ఖా వేయండి అని నవ్వుతూ చెప్పింది. అందుకు సంభావన.. నాకిప్పుడు ఏ డ్రెస్ కూడా పట్టదు. నేను చాలా బరువు పెరిగాను. దాదాపు 15 కిలోలు పెరిగుంటాను. అయినా జనాలు (పాడ్‌కాస్ట్‌లో) మనం ఏం మాట్లాడామన్నదే చూస్తారు కానీ మన దుస్తులు కాదు. మనం సహజంగా ఉంటేనే జనాలు ఇష్టపడతారు అని పేర్కొంది.ఎందుకు ఒత్తిడి చేస్తున్నావ్?వీళ్లు సరదాగా మాట్లాడుకున్నప్పటికీ జనాలకు సనా వైఖరి ఏమాత్రం నచ్చలేదు. అవతలివారు మీ వేషధారణను, పద్ధతులను గౌరవించాలంటే ముందుగా సనా కూడా అవతలివారిని గౌరవించాలి. సనా తన ఆలోచనలను, పద్ధతులను సంభావనపై రుద్దాలని చూడటం దారుణం.. ఎవరికి నచ్చినట్లు వారిని బతకనివ్వండి, ఆమె సల్వార్ ధరించలేదు, చున్నీ వేసుకోలేదు.. ఎందుకిదంతా.. ఆమెను బలవంతం చేయడానికి సనాకు ఏం హక్కు ఉంది? అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.మజాక్ చేసిందంతే..ఈ ట్రోలింగ్‌పై సంభావన స్పందిస్తూ.. సనా తన ఫ్రెండ్ అని, తను సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని సూచించింది. ఇద్దరు ఫ్రెండ్స్ అన్నాక.. సరదాగా వంద మాట్లాడుకుంటామని దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. తనను బుర్ఖా వేసుకోమని సనా ఏమీ బలవంతం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. దయచేసి సనాను విమర్శించడం ఆపేయండని కోరింది.సినిమాసనా ఖాన్.. కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు చిత్రాలతో పాటు మలయాళ, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. కొన్ని మూవీస్‌లో ఐటం సాంగ్‌లోనూ మెరిసింది. తర్వాత సడన్‌గా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. 2020 నవంబర్‌లో అనాస్‌ను పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన సోషల్ మీడియా నుంచి గ్లామరస్ ఫోటోలు, ట్రిప్పులకెళ్లిన వీడియోలు అన్నింటినీ డిలీట్ చేసింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో సెలబ్రిటీల రంజాన్ అనుభవాలు తెలియజేస్తూ యూట్యూబ్‌లో ప్రత్యేక పాడ్‌కాస్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by BollywoodTalks (@bolywoodtalks) చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు -
ఐటం సాంగ్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ సోదరి (ఫోటోలు)
-
వెస్ట్రన్ దుస్తులు వేసుకోనివ్వడు, నాకు కన్యాదానం చేస్తానన్నాడు: అమీషా
అమీషా పటేల్ (Ameesha Patel).. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో బద్రి, నాని, నరసింహుడు, పరమవీరచక్ర చిత్రాల్లో నటించింది. ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్న ఆమె గదర్ 2తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాది తాబ తెర జల్వ సినిమాలో మెప్పించింది. తాజాగా ఆమె బాలీవుడ్ హీరో కమ్ విలన్ సంజయ్‌దత్ (Sanjay Dutt)తో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది. ఆయన ఇంట్లో కురచ దుస్తులు నిషిద్ధంఅమీషా పటేల్ మాట్లాడుతూ.. సంజయ్ ఇంటికి నేను సల్వార్, చుడీదార్ వేసుకునే వెళ్లాలి. పొట్టి బట్టలు, వెస్ట్రన్ దుస్తులు వేసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. నాపై ఎంతో అభిమానం కురిపించేవాడు. నువ్వు చాలా అమాయకురాలివి, ఈ సినీపరిశ్రమలో ఎలా ఉంటావో.. ఏంటో.. అని పదేపదే అంటుండేవాడు. అంతేకాదు నాకోసం మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తానన్నాడు, కన్యాదానం కూడా అతడే చేస్తానని చెప్పాడు.నేనంటే వల్లమాలిన ప్రేమఆయనకు నేనంటే చాలా ఇష్టం. నన్నెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేవాడు. నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. చాలాసార్లు సంజు ఇంట్లోనే నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. అమీషాకు ఇప్పుడు 49 ఏళ్లుకాగా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. సంజయ్ దత్-అమీషా పటేల్.. తథాస్తు, చతుర్ సింగ్ టు స్టార్ సినిమాల్లో కలిసి నటించారు. సంజయ్ దత్ విషయానికి వస్తే.. ఆయన చివరగా డబుల్ ఇస్మార్ట్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ద భూతిని అనే హారర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు -
ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు
సీరియల్స్, సినిమాల్లో మనం చూసేదంతా నటన అని తెలిసినా కొందరు అందులో లీనమైపోతారు. విలన్లను ద్వేషిస్తారు.. హీరోలను ఆరాధిస్తారు.. హీరోయిన్లను ఇష్టపడతారు. వారికి నచ్చిన పాత్రను ఎవరైనా ఏమైనా అన్నా, హేళన చేసినా అసలు తట్టుకోలేరు. ఇది తనకు అనుభవమైందంటున్నాడు నటుడు నిశాంత్ దహియా. సన్యా మల్హోత్రా, నిశాంత్ దహియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిసెస్ (Mrs Movie). మలయాళంలో వచ్చిన ద గ్రేట్ ఇండియన్ కిచెన్ (The Great Indian Kitchen)కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. అంచనాలను మించిపోయిన Mrsజీ5లో రిలీజైన ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా రెస్పాన్స్ గురించి నిశాంత్ (Nishant Dahiya) మాట్లాడుతూ.. ఇంత ఆదరణ లభిస్తుందని అస్సలు ఊహించలేదు. ఎంతోమంది జనాలకు మా సినిమా చేరువైంది. ఒకరు సినిమా తెరకెక్కించేటప్పుడు ఇది కచ్చితంగా జనాలకు చేరాలన్న ఆశతోనే తమ పని కొనసాగిస్తారు. మిసెస్ నా అంచనాలను మించిపోయింది. నాకే కాదు ఈ సినిమాకు పనిచేసిన అందరి అభిప్రాయం కూడా బహుశా ఇదే అయి ఉంటుంది.ముందే చెప్పాలిగా!ఎక్కడెక్కడినుంచో నాకు మెసేజ్‌లు వచ్చేవి, అందుకు నేను చాలా గర్విస్తున్నాను. కేవలం యాక్షన్, అడ్వెంచర్ సినిమాలు చూసేవారు కూడా నాకు కాల్ చేసి మాట్లాడటంతో ఆశ్చర్యపోయాను. మీ భార్యలతో మాత్రం సినిమా చూడొద్దని ఒక్క ముందుమాట వేయాల్సిందని నా ఫ్రెండ్స్ అన్నారు. నేను పోషించిన దివాకర్ పాత్ర వల్ల ప్రేమ, ద్వేషం అన్నీ పొందాను. ఆడవాళ్లు నా రోల్‌ను ద్వేషిస్తున్నామంటూనే నా పనితనాన్ని మెచ్చుకున్నారు. కానీ మగవాళ్లు చాలా కోపంగా మెసేజ్‌లు చేశారు. బండబూతులు తిట్టారుమూర్ఖుడా.. వెళ్లి ఎలుకల మందు తిను, నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. చావలేదా? అని ఆగ్రహించారు. ఇలాంటి అమ్మాయిలు మెసేజ్ చేసుంటే అర్థం చేసుకునేవాడిని. నా పాత్రను ద్వేషించారు.. అది వారి మనసుని బాధపెట్టడం వల్లే ఇలా మాట్లాడుండొచ్చు అనుకుంటున్నాను. ఇంకొకరైతే నేను నటుడిగా పనికిరానన్నారు. ఇలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవడం దగ్గరే నా వైఫల్యం కనిపించిందన్నారు. ఎలాంటి రోల్స్ సెలక్ట్ చేసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? అని విమర్శించారు.అదే పెద్ద సమస్యకానీ రియాలిటీకి వస్తే.. మన చుట్టూ ఉన్న సమాజంలో 95% మంది మగవాళ్లు దివాకర్లాగే ఉన్నారు. ఇదే నిజం. చాలామందికి వారేం చేస్తున్నారో కూడా తెలీదు. మిసెస్ సినిమాలో రిచా వెళ్లిపోయాక దివాకర్ రెండో పెళ్లి చేసుకుంటాడు. అంటే దివాకర్‌కు, అతడి కుటుంబానికి సమస్య ఏంటో అర్థం కాలేదు. అదే అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లమ్. గ్రేట్ ఇండియన్ కిచెన్ చూసినప్పుడు హీరోయిన్ భర్త పాత్రను ద్వేషించాను. చివరకు అది మిసెస్ రూపంలో మళ్లీ నా దగ్గరకే వచ్చింది. మొదట ఒప్పుకోలేదు. కానీ తర్వాత అంగీకరించాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ సినిమా చేసేందుకు సౌత్ హీరోలు ముందుకురావట్లేదు: దర్శకుడు -
బాలీవుడ్ హీరో ఫ్యామిలీ ఈవెంట్లో శ్రీలీల.. అప్పుడే డేటింగ్ రూమర్స్!
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఉగాది కానుకగా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమైంది శ్రీలీల. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఈవెంట్లో మెరిసింది. హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు కార్తీక్ ఆర్యన్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సోదరి కృతిక తివారీ కోసం ఈ వేడుక ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన నెటిజన్స్ డేటింగ్లో ఉన్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కార్తీక్ ఆర్యన్ గతేడాది సూపర్‌హిట్ చిత్రం భూల్ భూలైయా- 3లో కనిపించాడు. మరోవైపు శ్రీలీల పుష్ప-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెప్పించింది. Sreeleela at kartik aaryan's sister celebrationbyu/Medium_Bicycle_1004 inBollyBlindsNGossip -
ఈ పాపని గుర్తుపట్టారా? ప్రభాస్ హీరోయిన్.. ఆ రికార్డ్ కూడా
ఈమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్. తండ్రి విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఒకేఒక్క పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేసింది. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. 2010 నుంచి హీరోయిన్ గా వరస సినిమాలు చేస్తోంది. తొలుత గ్లామరస్ రోల్స్ చేసింది. 'ఆషికి 2' మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో'లో హీరోయిన్ ఈమెనే. కాకపోతే పెద్ద హిట్ కాకపోవడంతో మరో తెలుగు మూవీలో చేయలేదు.రీసెంట్ టైంలో 'స్త్రీ 2' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ మూవీలో నటించింది. ఇదేమో ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు నెలకొల్పింది. 'పుష్ప 2'లోని కిస్సిక్ పాట కోసం ఈమెనే తొలుత సంప్రదించారు గానీ రెమ్యునరేషన్ సమస్యలతో నో చెప్పేసింది.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు)ప్రస్తుతానికైతే ఈమె కొత్తగా ఏ మూవీ చేస్తున్నట్లు లేదు. గానీ ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ అయిన 'వార్ 2'లో శ్రద్ధా కపూర్.. ఐటమ్ సాంగ్ చేస్తుందనే రూమర్స్ వస్తున్నాయి. మరి అవి నిజమో కాదో చూడాలి.సినిమాల సంగతి పక్కనబెడితే 38 ఏళ్ల శ్రద్ధా పెళ్లి గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. హీరో ఆదిత్య రాయ్ కపూర్, ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ ఇలా చాలా పేర్లు వినిపించాయి. ప్రస్తుతం రైటర్ రాహుల్ మోదీతో డేటింగ్ వార్తలు వస్తున్నాయి. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
సికందర్ సాంగ్.. రష్మిక డ్యాన్స్‌తో అదరగొట్టేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్. ఈ చిత్రంలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రంజాన్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.సికందర్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. జోహ్ర జబీన్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రష్మిక మందన్నా, సల్మాన్ ఖాన్ కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని సాజిద్నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్- 3లో కనిపించారు. -
పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్
మిల్కీ బ్యూటీ, హీరోయిన్ తమన్నాకి బ్రేకప్ అయిందట. గత కొన్నేళ్లుగా సహనటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని రహస్యంగా ఏం ఉంచలేదు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కలిసి సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోయారని తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.ముంబై ముద్దుగుమ్మ తమన్నా.. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. హ్యాపీడేస్, ఆవారా, 100% లవ్, బాహుబలి తదితర చిత్రాల్లో నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా హిందీలోనూ మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)అలా 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ చేస్తున్న టైంలో తమన్నా-విజయ్ వర్మ మధ్య ఏదో ఉందనే రూమర్స్ వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా గోవాలో ఓ న్యూఇయర్ పార్టీలో వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ సిరీస్ లో కెమిస్ట్రీ కూడా తెగ వర్కౌట్ అయింది.ఆ తర్వాత నుంచి గత రెండు మూడేళ్లుగా జంట పక్షుల్లా తమన్నా-విజయ్ వర్మ ఎక్కడపడితే అక్కడ కనిపించారు. అలాంటిది కొన్నివారాల క్రితం వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడేమో బ్రేకప్ అని షాకిచ్చారు. రీసెంట్ టైంలో తమన్నా బయట ఒంటరిగానే కనిపిస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ బ్రేకప్ వార్త నిజమేనేమో అనే సందేహం వస్తోంది. అలానే విడిపోవడానికి కారణం కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు) -
ఎవరికీ చెప్పకుండా చేయించుకున్నా: సెక్రేడ్ గేమ్స్ నటి
సేక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కుబ్రా సైత్. ఇటీవలే షాహిద్‌కపూర్ హీరోగా నటించిన దేవా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కుబ్రా సైత్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. గతంలో తనకు అబార్షన్ జరిగినప్పుడు ఎదురైన ఇబ్బందులను వివరించింది. ఆ సమయంలో తాను ధైర్యం కోల్పోయినట్లు వెల్లడించింది. అది తన జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేదని తెలిపింది.ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ మాట్లాడుతూ.. 'నేను అబార్షన్‌కు వెళ్లినప్పుడు బలంగా ఉన్నట్లు అనిపించలేదు. ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నా. అలా చేయకుంటే బతుకుతానని చెప్పే ధైర్యం, శక్తి నాకు లేవు. ఆ సమయంలో నేను చాలా బలహీనంగా భావించా. నాకు ఏదో వెలితిగా అనిపించింది. అస్సలు విలువ ఉండదేమో అనుకున్నా. కానీ దాని నుంచి బయటపడేందుకు చాలా కాలం పట్టింది. నా కోసం ఒక నిర్ణయం తీసుకున్నా. అది కూడా నా సొంత ఆలోచనలకు కట్టుబడి నిర్ణయించుకున్నా. ఇక్కడ నేను సామాజిక నిబంధనలను ఉల్లంఘించాను అనడానికి ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేనే స్వయంగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నా. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు' అని వెల్లడించింది. ఓసారి తన స్నేహితురాలతో కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్‌తో ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. ఆ సమయంలో తన కళ్లలో నీళ్లు వచ్చాయని వెల్లడించింది. -
కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ప్రభాస్ సరసన 'సాహో'లో హీరోయిన్ గా చేసింది. అయితే శ్రద్ధా ఎంతో ప్రేమతో బహుమతిగా ఇచ్చిన ఇంటి ఈమె తండ్రి ఏకంగా కోట్ల రూపాయలకు అమ్మేశాడు. బాలీవుడ్ సర్కిల్ లో ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: దిగ్గజ హీరో శివాజీ గణేశన్ ఇల్లు జప్తు.. హైకోర్ట్ సంచలన ఆదేశం)బాలీవుడ్ సెలబ్రిటీలు ఓవైపు నటిస్తూనే రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. అంటే ఓ బంగ్లా లేదంటే అపార్ట్ మెంట్ కొనడం, కొన్నిరోజుల తర్వాత దాన్ని లక్షలు లేదంటే కోట్ల రూపాయల లాభానికి అమ్మడం లాంటివి చేస్తుంటారు. అమితాబ్ ఈ విషయంలో ముందుంటాడు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడేమో?ఎందుకంటే కొన్నాళ్ల క్రితం శ్రద్ధా కపూర్.. ముంబైలోని జుహూ ప్రాంతంలో సిల్వర్ బీచ్ హెవెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓ అపార్ట్ మెంట్ ని బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు దీన్నే రూ.6.11 కోట్లకు శక్తి కపూర్ విక్రయించారట. మూడు నెలల క్రితమే అంటే డిసెంబరులోనే ఈ డీల్ జరిగిపోయింది. ఇది జరిగిన కొన్నిరోజులకే పిరమాల్ మహాలక్ష్మి సౌత్ టవర్ లో మరో అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. మరి ఇదెప్పుడో అమ్మేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
హెచ్‌టీ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల వేడుకలో తారల సందడి (ఫొటోలు)
-
బాధ్యత లేదుగానీ ఒంటి నిండా విషమే..: సింగర్‌పై బిపాసా ఫైర్
సింగర్ మికా సింగ్ (Mika Singh) బాలీవుడ్ జంట కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover)- బిపాసా బసు వల్ల దాదాపు రూ.10 కోట్లమేర నష్టపోయానన్నాడు. చిత్రవిచిత్రమైన డిమాండ్లతోపాటు తనకు ఏమాత్రం సహకరించలేదని ఆగ్రహించాడు. ముఖ్యంగా బిపాసా చేసిన డ్రామా వల్ల ఇంకోసారి నిర్మాణరంగంలోకే అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తనను అంతలా టార్చర్ పెట్టారు కాబట్టే ఇండస్ట్రీలో లేకుండా పోయారని సెటైర్లు వేశాడు.తాజాగా ఈ విమర్శలపై బిపాసా బసు (Bipasha Basu) స్పందించింది. ఒంటినిండా విషం నింపుకున్న కొందరు ఎప్పుడూ గొడవలు సృష్టించడానికే ఇష్టపడుతుంటారు. అవతలివారిని వేలెత్తి చూపుతుంటారు, నిందలు మోపుతారు. బాధ్యతగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు. ఇలాంటి నెగెటివిటీకి, ద్వేషభావజాలానికి దూరంగా ఉంటే మంచిది. ఆ దేవుడు అందరినీ ఆశీర్వదించుగాక అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. మికా సింగ్‌ను ఉద్దేశించే బిపాసా ఈ పోస్ట్ పెట్టిందని తెలుస్తోంది.చదవండి: ధనుష్‌ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్ -
అమ్మాయితో చాటింగ్ వైరల్.. తన ఉద్దేశం అది కాదన్న హీరో
నేను ఏ తప్పూ చేయలేదు, మీరు అనవసరంగా పొరబడుతున్నారు అంటున్నాడు హీరో మాధవన్ (R Madhavan). ఇటీవల ఆయన అమ్మాయితో చేసిన చాటింగ్ స్క్రీన్‌షాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో యువతి కిస్ ఎమోజీలతో చేసిన మెసేజ్‌కు మాధవన్ రిప్లై ఇవ్వడంతో చాలామంది ఆయన క్యారెక్టర్‌నే అనుమానించారు. ఈయనేంటి, అలాంటి మెసేజ్‌లకు స్పందిస్తున్నారని కొంత అసహనం వ్యక్తం చేశారు.ఓ అమ్మాయి మెసేజ్..తాజాగా అతడు సోషల్ మీడియా (Social Media)లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడుతూ తన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. 'పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. మీకో ఉదాహరణ చెప్తా.. నేను ఒక నటుడిని. ఇన్స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల ద్వారా నాకు జనాలు మెసేజ్‌లు చేస్తూ ఉంటారు. అలా ఓ అమ్మాయి.. మీ సినిమా చూశాను, చాలా బాగా నచ్చింది. మీరు నిజంగా గొప్ప యాక్టర్. మీరు నన్ను ఇన్స్పైర్ చేశారు అని మెసేజ్ చేసింది. కానీ చివర్లో హార్ట్, లవ్ సింబల్స్ పెట్టింది.రిప్లై ఇచ్చిన పాపానికి..నా గురించి అంత గొప్పగా రాసినందుకు ఆమెకు రిప్లై ఇవ్వాలా? వద్దా? సాధారణంగా.. థాంక్యూ సో మచ్, గాడ్ బ్లెస్ యు.. ఇలాంటి రిప్లైలే ఎక్కువగా ఇస్తుంటాను. తనకూ అదే రిప్లై ఇచ్చాను. వెంటనే ఆమె దాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. జనాలు ఆమె పెట్టిన హార్ట్, కిస్, లవ్ ఎమోజీలను మాత్రమే చూశారు. వాటికే నేను రిప్లై ఇచ్చానని ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ నా ఉద్దేశం అది కాదు.. కేవలం తన మెసేజ్‌కు స్పందించాను. అందుకే భయంమీరేమో మ్యాడీ అమ్మాయిలతో ఇలా చాట్ చేస్తాడా? అని ఏవేవో ఊహించుకున్నారు. అందుకే ఆ భయంతోనే సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్ పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాను. మరి నాలాగా అనుభవం లేనివారు ఎన్ని ఇబ్బందుల్లో పడతారో ఊహించారా? అని ప్రశ్నించాడు. మాధవన్ చివరగా హిసాబ్ బరాబర్ సినిమా (Hisaab Barabar Movie)లో కనిపించాడు. తమిళంలో అధిర్శ్తసాలి, టెస్ట్ సినిమాలు చేస్తున్నాడు. హిందీలో అమీర్కీ పండిత్, దేదే ప్యార్ దే 2, కేసరి చాప్టర్ 2, ధురంధర్ మూవీస్‌లో కనిపించనున్నాడు.చదవండి: ధనుష్‌ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్ -
విజయ్‌తో సినిమా.. నా కూతురు అసలు ఒప్పుకోలేదు: స్టార్ హీరోయిన్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియాలో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల తన సోదరుడి పెళ్లిలో మెరిసిన ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో నటించనుంది. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కించబోతున్న ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక కనిపించనుంది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ విచ్చేసిన ముద్దుగుమ్మ చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సందర్శించింది. ఈ బిగ్ ప్రాజెక్ట్ కోసమే భాగ్యనగరానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి.అయితే ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా తన కూతురి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మధు చోప్రా తన కూతురి సినీ కెరీర్ గురించి మాట్లాడింది. గతంలో దళపతి విజయ్ సరసన ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. విజయ్‌కు జంటగా తమిజాన్ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ప్రియాంక చోప్రా నో చెప్పిందని ఆమె తెలిపింది. అయితే మూవీ మేకర్స్ నా భర్తను కలిసి మాట్లాడారని వెల్లడించారు. దీంతో ఆయన మాట కాదనలేక ప్రియాంక నటించిందని అసలు విషయం చెప్పింది మధు చోప్రా.మధు చోప్రా తమిజన్ సినిమా గురించి మాట్లాడుతూ.. 'ప్రియాంక మొదట ఆ ప్రాజెక్ట్‌కి నో చెప్పింది. కానీ వారు ప్రియాంక సోదరుడిని కలిశారు. ఆ తర్వాత ఆమె తండ్రిని కలిసి మాట్లాడారు. కేవలం రెండు నెలల పాటు వేసవి సెలవుల్లో మా మూవీ షూట్‌కు సమయవివ్వండి అని అడిగారు. వారి మాట కాదనలేక ప్రియాంక చోప్రా ఫాదర్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత తన తండ్రి మాట కోసం ప్రియాంక చోప్రా నటించింది" అని తెలిపింది.విజయ్ అంటే ప్రియాంకకు చాలా గౌరవం ఉందని మధు చోప్రా తెలిపింది. విజయ్ చాలా ఓపికతో ప్రియాంకకు సెట్స్‌లో సాయం చేశాడని చెప్పుకొచ్చింది. ప్రభుదేవా బ్రదర్ రాజు సుందరం కొరియోగ్రాఫీలో స్టెప్పులు చాలా కఠినంగా ఉన్నాయి.. విజయ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్.. అతనితో ప్రియాంక డ్యాన్స్ చేసేందుకు చాలా కష్టపడిందని పేర్కొంది. అలాగే కొత్త భాష నేర్చుకోవడం, డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్ చేయడంలో విజయ్ సాయం సాయం చేశాడని మధు చోప్రా గుర్తు చేసుకుంది. ఇకపోతే ప్రియాంక చోప్రా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ హెడ్స్ ఆఫ్ స్టేట్‌లోనూ కనిపించనుంది. -
డైరెక్టర్ కొడుకు పెళ్లిలో బుట్టబొమ్మ పూజాహెగ్డే (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
హీరోయిన్ పవిత్ర స్నానం చేస్తుంటే.. నవ్వులాటగా ఉందా?
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు జనాలు ఎగబడిపోతున్నారు. కుదిరితే సెల్ఫీలు దిగుతున్నారు. లేదంటే తమ కెమెరాల్లో వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ పరితపించిపోతున్నారు. సమయం, సందర్భం కూడా లెక్క చేయకపోవడం శోచనీయం. హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) ఇటీవల మహాకుంభమేళాకు వెళ్లి స్నానమాచరించింది.కత్రినా పవిత్ర స్నానం చేస్తుండగా వీడియో..అయితే ఆమె కనబడగానే అందరు ఆమె చుట్టూ మూగారు. వీఐపీ ఘాట్ వద్ద పవిత్రస్నానం చేస్తుంటే వెంటనే ఫోన్లు తీసి వీడియోలు చిత్రీకరించడం మొదలుపెట్టారు. తనకంటూ ప్రైవసీ ఇవ్వకుండా చుట్టూ నిలబడి కత్రినాను తమ ఫోన్లలో చిత్రికరించారు. ఓ వ్యక్తి అయితే.. నేను, నా సోదరుడుతో పాటు ఎవరున్నారో చూడండి అంటూ కత్రినా కైఫ్ పవిత్ర స్నానం చేస్తుండగా ఆమెను తన వీడియోలో చూపించాడు. కుంభమేళా దర్శనాన్ని కత్రినా దర్శనంగా మార్చేశామని ఏదో గొప్ప పని చేసినట్లుగా తెగ నవ్వుతున్నారు. నవ్వులాటగా ఉందా?ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె కూడా మనిషేనని, తనను ఎందుకలా వేధిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. ఇదేమీ సరదాగా లేదని ఫైర్ అవుతున్నారు. నటి రవీనా టండన్ (Raveena Tandon) సైతం దీనిపై స్పందించింది. ఇది చాలా అసహ్యకరంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా చేసుకునే పనుల్ని ఇలాంటి జనాలు చెడగొడుతుంటారు అని మండిపడింది. -
రెండో పెళ్లి.. ఊహిస్తేనే భయంగా ఉంది: పూనమ్ పాండే
పెళ్లి మాట ఎత్తితేనే భయపడుతోంది బోల్డ్ బ్యూటీ, నటి పూనమ్ పాండే (Poonam Pandey). విడాకుల తర్వాత తన జీవితం సంతోషంగా సాగుతోందని, మళ్లీ ఎవర్నైనా నమ్మాలంటే భయంగా ఉందని చెప్తోంది. పూనమ్ పాండే 2020లో ప్రియుడు సామ్ బాంబేను పెళ్లి చేసుకుంది. అతడితో గోవాకు హనీమూన్‌కు కూడా వెళ్లింది. ఆ సమయంలో సామ్ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్టు కూడా చేశారు. అదే సమయంలో పూనమ్ కళ్లు, ముఖంపై గాయాలతో ఆస్పత్రిలో చేరింది.రెండేళ్లుగా ఒంటరిగానే..అవన్నీ గుర్తు చేసుకుంటేనే భయపడిపోతోంది పూనమ్ పాండే. రెండేళ్లుగా ఒంటరిగా ఉన్నాను. ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నాను. వైవాహిక జీవితం నాకు కలిసిరాదేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడైతే హాయిగా జీవిస్తున్నాను. నాకు అందమైన కుటుంబం, మంచి కెరీర్ ఉంది. ఈ రెండింటితో నేను సంతృప్తిగా ఉన్నాను. మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉందని. ఎవరేంటో తెలుసుకోలేకపోతున్నాను. ఎవర్నీ నమ్మలేకున్నాను అని చెప్పుకొచ్చింది.వివాదాలతో సావాసం..గతేడాది గర్భాయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఏకంగా తాను చనిపోయినట్లు ప్రచారం చేసుకుంది. ఆ వార్తలు వైరలయ్యాక తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకే అలాంటి ప్రాంక్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. 2011లో వరల్డ్‌కప్‌లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద నూలుపోగులేకుండా తిరుగుతానని ప్రకటించింది. ఇలాంటి సంచలన కామెంట్లు, డ్రామాలతోనే పూనమ్ ఎక్కువ పాపులర్ అయింది.చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
ఆ వీడియోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు: విద్యా బాలన్
బాలీవుడ్ విద్యా బాలన్ గతేడాది భూల్ భూలయ్యా-3 మూవీతో అభిమానులను అలరించింది. ఈ హారర్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రల్లో మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్‌లో వచ్చిన ఈ మూడో చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే విద్యా బాలన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆన్లైన్లో పెద్దఎత్తున తనకు సంబంధించిన వీడియోలపై ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అవన్నీ ఫేక్ అనీ.. కేవలం ఏఐ సాయంతో రూపొందించారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తప్పుదారి పట్టించేలా ఉన్న వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా అని తెలిపింది.విద్యాబాలన్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'నేను మీకు ఇష్టమైన విద్యాబాలన్. ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సాప్‌లో అనేక వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాకుండా అవీ నన్ను టార్గెట్ చేసేలా ఉన్నాయి. అయితే ఆ వీడియోలు ఏఐ సాయంతో రూపొందించినవి. అవన్నీ ఫేక్ అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. వాటిని క్రియేట్ చేయడం, వ్యాప్తి చేయడంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి కంటెంట్‌ను నేను ఏ విధంగానూ ఆమోదించను. వీడియోలలో చేసిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇలాంటివీ నా అభిప్రాయాలు, నా పనిని ప్రభావితం చేయలేవు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్ చేసేముందు ధృవీకరించుకోండి. ఎందుకంటే ఏఐ సాయంతో రూపొందించిన కంటెంట్ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఇలాంటివాటితో జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.' అని రాసుకొచ్చింది. కాగా.. గతంలో విద్యాబాలన్ కంటేముందే రష్మిక మందన్న, దీపికా పదుకొణె, అలియా భట్, కత్రినా కైఫ్, రణ్వీర్ సింగ్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ సైతం డీప్‌ఫేక్ వీడియోల బారిన పడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) -
OTT: మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిన అదితిరావు
బాలీవుడ్లో ‘జబ్ వియ్ మెట్, రాక్‌స్టార్, హైవే, లవ్ ఆజ్ కల్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఇంతియాజ్ అలీ. తాజాగా ఈ దర్శకుడు ‘ఓ సాథీ రే’ అనే వెబ్ సిరీస్‌తో అసోసియేట్ అయ్యారు. కానీ దర్శకుడిగా కాదు. రైటర్, షో రన్నర్‌గా చేస్తున్నారు. ఈ సిరీస్‌కు అరిఫ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, హ్యూమన్ ఎమోషన్స్ ప్రధానాంశాలుగా ఉన్న ఈ సిరీస్‌లో అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), అర్జున్ రాంపాల్, అవినాష్ తివారీ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ‘‘ఈ రోజుల్లో అప్పటి వింటేజ్ లవ్ ఫీల్‌ని ఈ సిరీస్‌తో వీక్షకులు అనుభూతి చెందుతారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హీరో సిద్దార్థ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అదితిరావు ఒప్పుకున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే! ప్రస్తుతం అదితి.. ఓ సాథిరే సిరీస్‌తో పాటు హీరామండి 2 వెబ్ సిరీస్, లయనెన్స్ అనే హాలీవుడ్ సినిమా చేస్తోంది. అదితిరావు- సిద్దార్థ్ 2024లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: దేవుడు చూస్తున్నాడు.. అందుకే ఆ హీరోయిన్ పత్తా లేకుండా పోయింది -
దేవుడు చూస్తున్నాడు.. అందుకే ఆ హీరోయిన్ పత్తా లేకుండా పోయింది: సింగర్
టాప్ సింగర్ మికా సింగ్ (Mika Singh) ఆ మధ్య నిర్మాతగా తన లక్ పరీక్షించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా డేంజరస్ అనే వెబ్ సిరీస్ నిర్మించాడు. కానీ ఆ సీరిస్ షూటింగ్లో కరణ్ సింగ్ గ్రోవర్- బిపాసా బసు (Bipasha Basu)ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక, వారి డిమాండ్లు కాదనలేక, ఆ ఇద్దరి డ్రామా, యాటిట్యూడ్ చూడలేక తలపట్టుకున్నాడు. ఇంకోసారి నిర్మాణరంగంలోకే రాకూడదని శపథం చేసుకున్నాడు.రూ.4 కోట్లు అనుకుంటే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మికా సింగ్ మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ (కరణ్-బిపాసా) ప్రాజెక్టులు లేక ఖాళీగా ఉంటున్నారు. ఎందుకో తెలుసా? పైన దేవుడన్నీ చూస్తున్నాడు. నిజానికి కరణ్ అంటే నాకిష్టం. తనను హీరోగా పెట్టి రూ.4 కోట్లతో ఓ సినిమా తీయాలనుకున్నాను. హీరోయిన్గా ఎవరైనా కొత్తవారిని తీసుకుందామనుకున్నాను. కానీ కరణ్ భార్య, నటి బిపాసా బసు తనే చేస్తానని పట్టుపట్టింది. లండన్‌లో షూటింగ్ చేశాం. బడ్జెట్ రూ.4 కోట్ల నుంచి రూ.14 కోట్లకు ఎగబాకింది. మూడు చెరువుల నీళ్లు తాగించారుబిపాసా చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. అనవసరంగా నిర్మాణ రంగంలోకి వచ్చానేంట్రా దేవుడా అని ఎంతో బాధపడ్డాను. భార్యాభర్తలిద్దరూ ఓ కిస్ సీన్లో నటించాలన్నాను. ఆమె తిట్లదండకం అందుకుంది. అలాంటివి నేనెందుకు చేస్తా? చేయనుగాక చేయను అని రాద్ధాంతం చేసింది. ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టినా వారి పారితోషికం మాత్రం ఆలస్యం చేయకుండా సమయానికి ఇచ్చేశాను. అయినా సరే డబ్బింగ్ చెప్పడానికి కూడా నాతో మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒకసారి బిపాసా తన గొంతు బాలేదంటుంది. మరోసారి కరణ్ తన ఆరోగ్యం బాగోలేదంటాడు. ఇలా ఇద్దరూ నాతో ఆడుకున్నారు అని చెప్పుకొచ్చాడు. వెండితెరపై కనిపించని బిపాసాకరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసు 2015లో ఎలోన్ సినిమా షూటింగ్లో కలుసుకున్నారు. 2016లో పెళ్లి చేసుకోగా 2022లో వీరికి దేవి అనే కూతురు జన్మించింది. టక్కరిదొంగ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన బిపాసా బసు హిందీలో అనేక సినిమాలు చేసింది. పూర్తిస్థాయిలో నటించిన చివరి చిత్రం ఎలోన్. 2018లో వచ్చిన వెల్కమ్ టు న్యూయార్క్ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనేలేదు. 2020లో డేంజరస్ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో మెరిసింది.చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
చెఫ్ అవతారంలో సోనూసూద్..
-
సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా
తీసింది తక్కువ సినిమాలే అయినా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఆయన సినిమా తీస్తే హిట్టు కాదు ఏకంగా బ్లాక్‌బస్టర్ అవ్వాల్సిందే అన్న పేరు తెచ్చేసుకున్నాడు. తనను విమర్శించినా ఊరుకుంటాడేమో కానీ తన సినిమాల జోలికి వస్తే మాత్రం అస్సలు సహించడు. అవతలి వ్యక్తి ఎవరైనా సరే ఇచ్చిపడేస్తాడు. ఓ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి (IAS Vikas Divyakirti).. సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమాపై గతేడాది విమర్శలు గుప్పించారు. యానిమల్ సినిమాలు ఎందుకు తీస్తారో!యానిమల్ (Animal Movie) వంటి చిత్రాలు మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఇలాంటి సినిమాలు రూపుదిద్దుకోకూడదు. మీ సినిమాలో హీరో జంతువులా ప్రవర్తిస్తాడని చూపించారు. దీనివల్ల మీకు డబ్బు వచ్చి ఉండొచ్చు. కానీ కేవలం డబ్బు కోణంలోనే ఆలోచిస్తే ఎలా? సామాజిక విలువలు కాస్తైనా ఉండాల్సిన పని లేదా? అని విమర్శించారు. వికాస్.. 12th ఫెయిల్ సినిమా (12th Fail Movie)లో యూపీఎస్సీ ప్రొఫెసర్‌గా యాక్ట్ చేశాడు.అవనసరంగా విమర్శిస్తే..ఈ విమర్శలపై తాజాగా సందీప్‌రెడ్డి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఓ ఐఏఎస్ అధికారి యానిమల్ వంటి చిత్రాలు రాకూడదన్నారు. ఆయన చెప్పింది వింటే నేనేదో పెద్ద నేరం చేసినట్లుగా అనిపించింది. 'ఒకవైపు 12th ఫెయిల్ వంటి సినిమాలు తీస్తుంటే మరోవైపు యానిమల్ వంటివి తీసి సమాజాన్ని వెనక్కుతీసుకెళ్తున్నారు' అని వ్యాఖ్యానించారు. ఇలా ఎవరైనా అనవసరంగా నా సినిమాపై దాడి చేస్తే నాకు కచ్చితంగా కోపం వస్తుంది. ఆయన బాగా చదువుకుని ఐఏఎస్ అయ్యారు. యానిమల్ హీరోతో సందీప్ రెడ్డి వంగా, ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తిఎవరైనా ఐఏఎస్ అయిపోవచ్చునాకేమనిపిస్తోందంటే ఢిల్లీ వెళ్లి, ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి రెండుమూడేళ్ల జీవితాన్ని అక్కడే గడిపితే కచ్చితంగా ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవుతారు. పైగా అందుకోసం చదవాల్సిన పుస్తకాలు కూడా వేలకొద్దీ ఉండవు. 1500 పుస్తకాలు చదివితే ఐఏఎస్ అయిపోతారు. కానీ సినిమాలో అలా కాదు.. మీరు దర్శకరచయితలు అయ్యేందుకు ప్రత్యేకంగా ఏ కోర్సు ఉండదు.. ఏ టీచర్ కూడా మిమ్మల్ని దర్శకుడిగా, రచయితలుగా తీర్చిదిద్దలేరు అన్నాడు.సినిమాసందీప్రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ 2023లో రిలీజైంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది.చదవండి: హీరోయిన్ కియారా ప్రెగ్నెన్సీ.. వాళ్లకు టెన్షన్ -
హీరోయిన్ కియారా ప్రెగ్నెన్సీ.. వాళ్లకు టెన్షన్
సాధారణంగా హీరోయిన్లు.. కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి-పిల్లల విషయంలో కాస్త ప్లానింగ్ తోనే ఉంటారు. కియారా అడ్వాణీ కూడా బహుశా ప్లానింగ్ తోనే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ఆ మూవీ టీమ్ కి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏంటా సంగతి?హీరోయిన్ కియారా అడ్వాణీ.. రెండు రోజుల క్రితం తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించింది. ఇది జరిగి రోజైన కాలేదు అప్పుడే షూటింగ్ కి కూడా హాజరైంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో 'వార్ 2'లో ఒకటి. ఇదివరకే ఈమె పార్ట్ షూటింగ్ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు కేజీఎఫ్ ఫేమ్ యష్ కొత్త సినిమా 'టాక్సిక్'లోనూ ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)తాజాగా కియారా అడ్వాణీ ప్రెగ్నెంట్ అని బయటపెట్టడంతో మూవీ టీమ్ కి టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఈమెకు బేబీ బంప్ కనిపించేలోపు కియారా పార్ట్ షూటింగ్ అంతా పూర్తి చేసుకోవాలి. లేదంటే తర్వాత సినిమా లేట్ అయ్యే అవకాశముంది. దీంతో ఈ ఒకటి రెండు నెలల్లో 'టాక్సిక్'లో కియారా పార్ట్ పూర్తవుతుంది. తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుంటారని తెలుస్తోంది.గతంలో 'కల్కి' షూటింగ్ జరుగుతున్న టైంలో దీపికా పదుకొణెకి కూడా ప్రెగ్నెన్సీతోనే షూటింగ్ అంతా పూర్తి చేసింది. తర్వాత ప్రమోషన్లలో మాత్రం కనిపించడం కుదరలేదు. దీపికలా ప్లానింగ్ తో చేసేసుకుంటే కియారాకి ఇబ్బందేం ఉండకపోవచ్చు. లేదంటే మాత్రం 'టాక్సిక్'కి తిప్పలు తప్పవు.(ఇదీ చదవండి: బన్నీ నెక్స్ట్ మూవీకి ఏంటి సమస్య?) -
నా కూతుర్ని షూటింగ్‌కు పంపిస్తా.. ఏదైనా జరిగితే మాత్రం?: మహేష్ హీరోయిన్ తల్లి
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగిన భారతీయ నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తున్న చిత్రంలోనూ ప్రియాంక నటిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి అందాల సుందరి కిరీటం అందుకున్నవారిలో ప్రియాంక చోప్రా స్థాయిలో తారా పధానికి చేరుకున్నవారు లేరనే చెప్పాలి. ఇంతింతై ఎదిగిన ఆమె విజయాల వెనుక ఆమె కష్టం ఎంత ఉందో...ఆమె తల్లి మధు చోప్రా కష్టం కూడా అంతే ఉందని అంటుంటారు బాలీవుడ్ జనాలు.సినిమా రంగంలో ప్రియాంక అడుగుపెట్టిన దగ్గర్నుంచీ ఆమెని అనుక్షణం కంటికి రెప్పలా కాచుకున్నారు ఆమె తల్లి మధుచోప్రా. అందంతో పాటు ప్రతిభ కూడా ఉన్న తన కూతురు టాప్ హీరోయిన్ కావాలనే లక్ష్యంతో కష్టపడ్డారు. మధ్యలో కొందరి వల్ల ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనైనప్పుడు కూడా కూతురికి అండా దండా తానై ప్రియాంక కృంగిపోకుండా వెన్నంటి ఉన్నారు. సినీ హీరోయిన్లను వారి తల్లులు నీడలా అనుసరించడం కొత్త విషయం కాకపోయినా... ప్రియాంక తల్లి మధుచోప్రా.. అంతకు మించి అన్నట్టుగా వ్యవహరించారు. తన కష్టం ఫలించి అంతర్జాతీయ స్థాయిలో తన కూతురు పేరు తెచ్చుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవడంతో మధు చోప్రా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు.ఈ నేపధ్యంలో ఇటీవల పలు ఇంటర్వ్యూల సందర్భంగా ప్రియాంక సినిమా కెరీర్ గురించి మధుచోప్రా పంచుకున్నారు. అదే సమయంలో దోస్తానీ (ప్రియాంక నటించిన బాలీవుడ్ చిత్రం) దర్శకుడు తరుణ్ మన్షుఖానీ అప్పట్లో ఎలా ప్రవర్శించారో కూడా గుర్తు చేసుకున్నారు. దోస్తానా చిత్రంలో ప్రియాంక తరుణ్‌తో కలిసి పనిచేసినప్పుడు కొన్ని కారణాల వల్ల వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని మధు చోప్రా చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఒక రోజు ప్రియాంక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిందని, జ్వరంతో వణికిపోయిందని గుర్తుచేసుకున్నారు. తాను ఆమెకు మందులు ఇచ్చానని, అయితే మాత్రలు వేసుకున్న తర్వాత సినిమా షూటింగ్‌కు వెళదామని ప్రియాంక ప్రయత్నించగా తాను వారించానని చెప్పారు. కాస్త సమయం తీసుకో అని చెప్పానని, గంట తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడంతో ప్రియాంక సూచనల మేరకు తాను దర్శకుడు తరుణ్‌కి ఫోన్ చేశానని వెల్లడించారు. తరుణ్‌కి ఫోన్ చేసి ప్రియాంకకు హై టెంపరేచర్ ఉన్నందున ఆ రోజు షూటింగ్‌కు రావడం కుదరదని చెప్పగా, ‘‘ మీ అమ్మాయి ఎంత సౌకర్యంగా ఉందో చెప్పండి’’ అని తరుణ్ వ్యంగ్యంగా బదులిచ్చాడని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పుడు తనకు తీవ్రమైన ఆగ్రహం వచ్చిందని దాంతో తాను అతనికి చాలా పరుషంగా మాట్లాడానని వెల్లడించారు. ‘‘ఆమె మీ షూటింగ్ సెట్లో చనిపోవాలని మీరు కోరుకుంటే, సరే... నేను ఆమెను పంపుతాను. కానీ ఆమెకు ఏదైనా జరిగితే, దానికి మీరే బాధ్యులవుతారు’’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించానన్నారు. ఇదంతా గుర్తు చేసుకున్న మధుచోప్రా... అయితే అదంతా గతమని తరుణ్, తాను ఇప్పుడు మంచి స్నేహితులమని, ఇప్పటికీ తాను తరుణ్‌ని కలిసినప్పుడల్లా అప్పటి నా కోపాన్ని గుర్తు చేస్తూ తనను ఆటపట్టిస్తుంటాడంటూ మధుచోప్రా చెప్పారు. -
తండ్రితో పోటీపడిన బుడ్డోడు.. ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?!
ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ (Sonu Nigam) కుమారుడు నీవన్ (Neevan Nigam) గుర్తున్నాడా? తండ్రితో పాటు అనేక వేదికలపై, స్టూడియోలలో ముద్దుముద్దుగా పాడుతూ ఆకట్టుకునేవాడు. ఆన్లైన్ కన్సర్ట్‌లో తండ్రితో కలిసి షో కూడా చేశాడు. ఇప్పుడీ పిల్లవాడు చాలా పెద్దోడయ్యాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టాడు. ఫస్ట్ పోస్ట్‌తోనే అందరినీ ఇన్స్పైర్ చేశాడు.తన రెండేళ్ల ఫిట్నెస్ జర్నీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. అందులో మొదట బొద్దుగా, పొట్టతో ఉన్న నివాన్ ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో కనిపించాడు. రెండేళ్లలో నా జీవితాన్నే మార్చేసుకున్నా అని దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన సోనూ నిగమ్.. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టి ఫస్ట్ పోస్ట్ పెట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని కామెంట్ చేశాడు. హీరో టైగర్ ష్రాఫ్.. గ్రేట్ వర్క్ బ్రో అని ఫైర్ ఎమోజీతో కామెంట్ పెట్టాడు. అతడి అంకితభావాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.చదవండి: నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్ -
గోవిందాతో విడాకులు.. అలాంటి వాళ్లు నా ముందుకు రండి: సునీత అహుజా
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడు గోవింద పేరు తెలియని వారు ఉండరు. ఇటీవల ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పనున్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. దీంతో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు కూడా. కొద్దిరోజుల కిందట తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు.అయితే తమపై వస్తున్న విడాకుల వార్తలపై గోవింద భార్య సునీతా అహుజా కూడా స్పందించారు. గోవిందా, తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది.ఎందుకంటే మేమంతా ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్‌లు ధరించి తిరుగుతూ ఉంటాం.. ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆఫీస్ కూడా తీసుకున్నారని పేర్కొంది. ఈ ప్రపంచంలో నన్ను, గోవిందాను విడదీయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే నా ముందుకు రండి అంటూ నవ్వుతూ మాట్లాడింది సునీత అహుజా. గతంలోనూ తామిద్దరం వేర్వేరు ఇళ్లలోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. మాకు రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయని.. ఆయనకు మీటింగ్స్ ఉండటం వల్ల మా ఇంటి ఎదురుగా ఉన్న బంగ్లాలోనే ఉంటారని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు. -
ముగ్గురికి ఖరీదైన బహుమతులిచ్చా.. కానీ షారూఖ్ మాత్రం: సింగర్ మికా సింగ్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్ బీటౌన్‌లో దాదాపు పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతేకాదు మన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు వీరాభిమానిని కూడా. బాలీవుడ్లో ఫేమస్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న మికా సింగ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన అభిమాన హీరో షారూఖ్ ఖాన్‌కు రూ. 50 లక్షల విలువైన డైమండ్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ రింగ్‌ను షారూఖ్ నాకు తిరిగి ఇచ్చారని వెల్లడించారు. అంతే కాదు షారూఖ్ తన లగ్జరీ కారును మూడు నెలల పాటు వాడుకున్నారని మికా సింగ్ తెలిపారు.ఇంటర్వ్యూలో మికా మాట్లాడుతూ.. ' బాలీవుడ్ ఉత్తమ నటులలో షారూఖ్ ఒకరు. అంతేకాదు పెద్ద మనిషి కూడా. ఆయన నాకు తిరిగిచ్చిన ఉంగరాన్ని ఎల్లప్పుడూ ధరిస్తా. ఎందుకంటే దీని విలువ దాదాపు రూ.50 లక్షలు. ఇలాంటి రింగ్స్ నేను అమితాబ్ బచ్చన్, గురుదాస్ మాన్లకు కూడా బహుమతిగా ఇచ్చాను. అయితే దీన్ని మొదటిసారి బహుమతిగా షారూఖ్ ఖాన్‌కే ఇచ్చా. ఎందుకంటే ఈ ముగ్గురి కోసం నేను ఏదైనా చేయాలని అనుకున్నా. అయితే మరుసటి రోజు షారూఖ్ కాల్ చేసి.. దయచేసి ఈ ఉంగరాన్ని వెనక్కి తీసుకోండి.. ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది అని నాతో అన్నారు. అయితే ఒకసారి ఆయన కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అదే సమయంలో నా కారు ఇచ్చి ఆయనను ఇంటికి పంపించా. ఆ తర్వాత నా కారు షారూఖ్‌కు నచ్చడంతో దాదాపు మూడు నెలలపాటు తన వద్దే ఉంచుకుని వాడుకున్నారని' మికా పంచుకున్నారు.ఇటీవల హృతిక్ రోషన్ బర్త్ డే పార్టీలో తాను షారుఖ్ ఖాన్‌తో సరదాగా గడిపామని మికా సింగ్ వెల్లడించారు. ఈ పార్టీకి హీరో రణ్వీర్ సింగ్ కూడా హాజరయ్యాడని చెప్పాడు. పార్టీ అయిపోయిన తర్వాత అంతా కలిసి ఓకే కారులో వెళ్లామని వివరించారు. షారూఖ్ వినియాగించిన కారు తన వద్దే ఉంచుకున్నానని మికా తెలిపారు. -
సంజయ్-నమ్రత సినిమా.. రెండు పెగ్గులేసి వెళ్లా: డైరెక్టర్
తొలి సినిమా హిట్టు కొడితే ఆ కిక్కే వేరు. మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) వాస్తవ్ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా కథను సంజయ్ దత్‌కు చెప్పడానికి ముందు మద్యం తాగాడట! ఈ విషయాన్ని తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ముందుగా రెండు పెగ్గులేసి..'వాస్తవ్ కథను సంజయ్ దత్ (Sanjay Dutt)కు చెప్పడం కోసం ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన్ను కలవడానికి ముందు ఓ రెస్టారెంట్‌కు వెళ్లి రెండు పెగ్గులేశాను. వెయిటర్ దగ్గరున్న నోట్‌ప్యాడ్ తీసుకుని అందులో కథలో కీలకమైన అంశాలు రాసుకున్నాను. ఆల్రెడీ కథంతా నా మెదడులో ఉంది కాబట్టి కొన్ని పాయింట్స్ రాశాక సంజయ్ దగ్గరకు వెళ్లాను. దుష్మన్ సినిమా సెట్లో ఆయన్ను కలిశాను. ఆయన ఓ డైరెక్టర్‌తో మాట్లాడుతుండగా వెనకాల నిల్చున్నాను. ఇక్కడేం చేస్తున్నావ్?సడన్‌గా నన్ను చూసి నువ్విక్కడేం చేస్తున్నావ్? అన్నాడు. కచ్చితంగా తిడతాడేమో అనుకున్నాను. అక్కడున్నవారెవరికీ నేను తెలియదు. నన్ను కూర్చోమని కూడా ఎవరూ చెప్పలేదు. అంత పెద్ద సినిమా సెట్‌కు వెళ్లడం అదే నాకు మొదటిసారి. సంజయ్ విరామం లేకుండా షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నాడు. ఛాన్స్ మిస్ అయితే మళ్లీ దొరకదన్న భయంతో ఆయన వెనకాలే తిరుగుతున్నాను. నన్ను గమనించి.. నీకు కథ చెప్పడానికి ఎంత సమయం పడుతుంది? అన్నాడు. పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదని బదులిచ్చాను. పదినిమిషాలు కాస్తా గంటగా..అలా అతడి గదిలోకి వెళ్లి వాస్తవ్ కథ (Vaastav: The Reality Movie) చెప్పడం మొదలుపెట్టా.. ఐదు నిమిషాలయ్యాక గదిలో ఉన్న మిగతా అందర్నీ బయటకు వెళ్లమన్నాడు. గంటన్నరపాటు కథ చెప్పాను. ఆయనకు చాలా నచ్చింది. షూటింగ్ మొదలైంది.. అయితే వారానికి ఒకరోజు సంజయ్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేసింది. ఆ రోజు చేయాల్సిన షూటింగ్‌ను అర్ధరాత్రైనా సరే పూర్తి చేసేవాళ్లం. 35% షూటింగ్ అయ్యాక నిర్మాత తన దగ్గర డబ్బు లేదని చేతులెత్తేశాడు. అప్పటివరకు షూటింగ్ చేసిన సీన్స్ ఎలా వచ్చాయోనని రష్ చూశాను. ఏమీ బాగోలేదు. షూటింగ్ ముందుకు సాగలేదు.సినిమా రైట్స్ అమ్మిన డబ్బుతో..ఏడాదిపాటు ఎలాంటి ముందడుగు లేకపోవడంతో సినిమా అటకెక్కిందన్న ప్రచారం జరిగింది. ఒక రోజు నిర్మాత శ్యామ్ ష్రాఫ్.. సినిమా రష్ చూసి బాగుందన్నాడు. రూ.50 లక్షలు పెట్టి బాంబే హక్కులు కొనుగోలు చేశాడు. అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు చేతిలో పెట్టాడు. దీంతో షూటింగ్ పునఃప్రారంభించాం. ఆ డబ్బు అయిపోయాక మిగతాచోట్ల రైట్స్ అమ్మాం.. ఈ పద్ధతిని ఫాలో అవుతూ వాస్తవ్ పూర్తి చేశాం. సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు' మహేశ్ అని చెప్పుకొచ్చాడు.వాస్తవ్ విశేషాలువాస్తవ్ సినిమా విషయానికి వస్తే.. సంజయ్‌దత్, నమ్రత శిరోద్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. పరేశ్ రావల్, దీపక్, సంజయ్ నర్వేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ 1999 అక్టోబర్‌లో విడుదలైంది. వాస్తవ్ హిట్టవడంతో దర్శకుడు మహేశ్ దీనికి సీక్వెల్‌గా హత్యార్ తీశాడు. ఇందులోనూ సంజయ్ దత్ హీరోగా నటించాడు.చదవండి:కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే! -
విపరీతంగా ఏడ్చేదాన్ని.. అందుకే నిజం దాచిపెట్టా: దీపిక
కొన్నేళ్ల ముందు వరకు సినీ తారలు తమ అనారోగ్య సమస్యల గురించి పెద్దగా బయటపెట్టేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. మానసిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు. తమ అనుభవాల్ని కూడా చెబుతున్నారు. 'కల్కి' ఫేమ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా తన మానసిక కుంగుబాటు గురించి మరోసారి ఓపెన్ అయింది.'2014లో కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నా. సినిమాలు చేస్తూ నచ్చినట్లు బతుకున్నా. ఓరోజు ఎందుకో బాగా అలసట అనిపించింది. పనివల్ల ఇలా జరుగుంటుంది అనుకున్నా కానీ ఓ రోజు కళ్లుతిరిగి పడిపోయాను. అనవసరమైన వాటికి విపరీతంగా ఏడ్చేదాన్ని. నేను నాలా ఉండలేకపోయాను. అమ్మతో కలిసి థెరపిస్ట్ దగ్గరికే వెళ్తే నాకు డిప్రెషన్ ఉన్నట్లు అర్థమైంది'(ఇదీ చదవండి: కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే!)'అయితే థెరపిస్ట్ దగ్గరకు వెళ్లినా దాని గురించి ఎవరికీ చెప్పాలనుకోలేదు. అందుకే సీక్రెట్ గా థెరపీ చేయించుకున్నా. కోలుకుంటున్నప్పుడు మాత్రం మానసిక ఆరోగ్యం గురించి అందరికీ చెప్పాలనుకున్నాను. అలా నా సమస్య గురించి బయటపెట్టాను' అని దీపిక పదుకొణె చెప్పింది.రీసెంట్ గా ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్న దీపికా.. మానసిక ఆరోగ్యం గురించి విద్యార్థులకు చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది కల్కి, సింగం ఎగైన్ మూవీస్ చేసింది. కూతురు పుట్టడంతో ఆమె ఆలనాపాలనా చూసుకుంటోంది.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు') -
కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt)లాగే ఆమె కూతురు రాహా (Raha) కూడా అంతే అందంగా, క్యూట్‌గా ఉంటుంది. కూతురి ఫోటోల్ని, తనతో గడిపే సంతోకర క్షణాలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఆలియా. అయితే సడన్‌గా ఆ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పలువురూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కూతురి ముఖం కనిపించేలా ఉన్న ఫోటోలను హీరోయిన్ తొలగించిందని పేర్కొంటున్నారు. రాహా ముఖం కనిపించకుండా ఉన్న ఒకటీ రెండు పిక్స్ మాత్రం అలాగే ఉంచిందని చెప్తున్నారు. అయితే ఇందుకుగల కారణం మాత్రం తెలియాల్సి ఉంది.ఇదే మంచి పని!పిల్లల ప్రైవసీ కాపాడేందుకే ఇలా చేసి ఉంటుందని టాక్! 'అయినా పేరెంట్స్‌గా ఏం చేయాలన్నది వారిష్టం.. నిజం చెప్పాలంటే ఇది మంచి నిర్ణయమే.. రాహాను ఈ పబ్లిసిటీకి దూరంగా ఉంచడం చాలా మంచి పని..', 'ఈ పిచ్చి జనాలు రాహా నిష్కల్మషమైన నవ్వును, తను అందరికీ హాయ్ చెప్పడాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆమెకు అటెన్షన్ డిజార్డ్ ఉందని ఏవేవో వ్యాధులు అంటగడుతున్నారు. ఇలాంటివాటి నుంచి ఆమెను కాపాడటం చాలా అవసరం' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆలియా భట్ - రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) దంపతులకు 2022 నవంబర్‌లో రాహా జన్మించింది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) చదవండి: సౌత్‌లో ఇదే పెద్ద సమస్య.. ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి: జ్యోతిక -
సల్మాన్ 'సికందర్' టీజర్ చూశారా?
-
గొప్ప బహుమతి
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు శుభవార్త చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన భర్త సిద్ధార్థ్‌తో కలిసి బేబీ సాక్స్‌ను చేతిలో పట్టుకున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘మా జీవితాల్లో గొప్ప బహుమతి.. త్వరలోనే రాబోతోంది’ అని వెల్లడించారు కియారా.విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన ‘షేర్షా’(2021) సినిమాలో తొలిసారి కలిసి నటించారు సిద్ధార్థ్ – కియారా. ఆ మూవీ షూటింగ్లో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారడంతో 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు కాబోతున్న కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలకు సమంత, రాశీఖన్నా, అతియా శెట్టి వంటి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉంటే .. తెలుగులో మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్’ సినిమాల్లో నటించారు కియారా అద్వానీ. -
తల్లి కాబోతున్న కియారా : తొలి మెటర్నిటీ ఫ్యాషన్ లుక్ అదుర్స్!
హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మా జీవితాల్లో అత్యంతవిలువైన బహుమతి రాబోతోంది అనే క్యాప్షన్‌తో ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన కియారా త్వరలోనే ఒక బిడ్డకు జన్వనివ్వబోతోందన్న వార్త ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కియారా భర్త సిద్దార్థ్ (Sidharth Malhotra)కూడా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కియారా అద్వానీ ఫ్యాషన్ మాస్ట్రో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రకటన చేయడానికి ముందు ఫ్యాషన్‌షోలో బాలెన్సియాగా బ్లాక్ దుస్తులను ప్రదర్శించింది. అది ట్రెడిషనల్ దుస్తులైనా, లేదా హై-ఫ్యాషన్ వెస్ట్రన్ అయినా ఆమె లుక్ స్పెషల్‌గా ఉంటుంది. ఇటీవల, తీరా ఈవెంట్లో, కియారా క్లాసిక్ బ్లాక్ దుస్తులు, బంగార ఆభరణాలతో ఒక బోల్డ్ స్టేట్మెంట్ లుక్‌తో అదరగొట్టింది. బ్రాండ్ సిగ్నేచర్ లోగోను పోలీ ఉన్న లూజ్‌గా ఉండేశాటిన్ జాక్వర్డ్ టాప్ ఎంచుకుంది బాలెన్సియాటూ-పీసెస్ ఎటైర్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆమె తొలి పబ్లిక్ మెటర్నిటీ ఫ్యాషన్ లుక్. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే చోకర్ ,ఆకర్షించే సింహం పంజా పెండెంట్‌తో సహా చంకీ స్టేట్మెంట్ నెక్లెస్‌లను ధరించింది కియారా. భారీ చెవిపోగులు, ఉంగరాలు బ్రాస్లెట్ల స్టాక్‌ను కూడా జోడించింది. అంతేకాదు లౌబౌటిన్ హీల్స్‌లో అసలే పొడగరి అయిన కియారా మరింత సొగసరిలా అందర్నీ మెస్మరైజ్ చేసింది. -
శుభవార్త చెప్పిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. ఓ మై గాడ్ అంటూ సామ్ రియాక్షన్
గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తన భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి బేబీ సాక్స్‌ను చేతిలో పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "మా జీవితాల్లో గొప్ప బహుమతి.. త్వరలోనే రాబోతోంది" అని వెల్లడించింది. ఈ పోస్ట్ కింద రాశీఖన్నా, అతియా శెట్టి వంటి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత.. ఓ మైగాడ్, కంగ్రాచ్యులేషన్స్ అని కామెంట్ చేసింది.ప్రేమ.. పెళ్లికియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. లస్ట్ స్టోరీస్ (2018) సినిమా ముగింపు సమయంలో నిర్వహించిన పార్టీలో వీరిద్దరూ కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరూ జంటగా షేర్షా సినిమాలో నటించారు. రోమ్ నగరంలో సిద్దార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని కియారా.. కాఫీ విత్ కరణ్ షోలో వెల్లడించింది. సినిమాకియారా అద్వానీ ఫగ్లీ సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. ఎమ్మెస్ ధోని, మెషిన్, లస్ట్ స్టోరీస్, గుడ్ న్యూస్, కబీర్ సింగ్, ఇందూ కి జవానీ, భూల్ భులయ్యా 2, గోవిందా నామ్ మేరా, సత్యప్రేమ్ కీ కథ చిత్రాల్లో నటించింది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం యష్ టాక్సిక్ మూవీతో పాటు హిందీ వార్ 2లో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా.. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, కపూర్ అండ్ సన్స్, ఎ జెంటిల్మెన్, మర్జావాన్, షేర్షా, థాంక్ గాడ్, మిషన్ మజ్ను, యోధ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) చదవండి: రాహుల్ గాంధీపై కేసు? ప్రీతి జింటా ఏమందంటే? -
రాహుల్ గాంధీపై కేసు? ప్రీతి జింటా ఏమందంటే?
ఒకరు చేసిన పనికి మరొకర్ని నిందించడం సరికాదంటోంది హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta). కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు తనపై ఆరోపణలు గుప్పించినందుకుగానూ రాహుల్‌గాంధీపై ప్రతీకారం తీర్చుకోవడం తనకిష్టం లేదని చెప్తోంది. తాజాగా ప్రీతి జింటా సోషల్ మీడియాలో చిట్‌చాట్ (ఆస్క్ మీ ఎనీథింగ్) నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది.రాహుల్ తప్పు లేదుఈ క్రమంలోనే ఓ వ్యక్తి రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేసు పెడుతున్నావా? అని అడిగాడు. అందుకు ప్రీతి.. ఇతరులు చేసిన పనికి ఆయనను దూషించడం సరికాదు. ఎవరో చేసిన పనికి రాహుల్ గాంధీ బాధ్యుడెలా అవుతారు? ఏదైనా సమస్యను నేరుగా పరిష్కరించడానికే ప్రయత్నిస్తాను తప్ప పరోక్ష యుద్ధాల ద్వారా కాదు. రాహుల్ గాంధీతో నాకు ఎటువంటి సమస్య లేదు. కాబట్టి ఆయనను ప్రశాంతంగా బతకనిద్దాం. అలాగే నేనూ శాంతియుతంగా జీవిస్తాను అని చెప్పుకొచ్చింది.బీజేపీతో దోస్తీ అంటూ ఆరోపణలుకాగా ఇటీవల కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రీతిజింటాపై తీవ్ర ఆరోపణలు చేసింది. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి నటి తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాఫీ చేసిందని ఆరోపించింది. అందుకుగానూ ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని ఆరోపించింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని ఆమె ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ప్రీతి లేదని బదులిచ్చింది. చాలా ఏళ్లుగా కొన్ని పార్టీలు టికెట్లు ఆఫర్ చేస్తున్నాయని, కానీ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. కంగనాను నమ్ముతున్నానుఅలాగే మన దేశంలోని సోషల్ మీడియా చాలా విషపూరితంగా మారిపోయిందని పేర్కొంది. ఏ చిన్న కామెంట్ చేసినా దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారంది. తనకు రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేదని నొక్కి చెప్పింది. కంగనా (Kangana Ranaut) గురించి చెప్తూ.. ఆమె ఒక అద్భుతమైన నటి.. అలాగే ఫ్యాషన్ ఐకాన్. ఇప్పటివరకు డైరెక్టర్‌గా తను చేసిన పనిని చూడలేదు. కానీ మంచి దర్శకురాలు కాగలదని నమ్ముతున్నాను. రాజకీయ నాయకురాలిగా తన ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. హిమాచల్ ప్రదేశ్వాసులకు అంతా మంచే చేస్తుందని నమ్ముతున్నాను అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చింది. I don’t think it’s fair to vilify anyone like that, as he is not responsible for someone else’s actions. I believe in handling problems or issues directly & not through proxy battles. I also have no problem with Rahul Gandhi, so let him live in peace & I will live in peace too 😀 https://t.co/LAAGOdOJri— Preity G Zinta (@realpreityzinta) February 27, 2025 చదవండి: సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్ ఆన్సర్‌కు ఆశ్చర్యపోయిన నటి -
సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్ ఆన్సర్‌కు ఆశ్చర్యపోయిన నటి
సెలబ్రిటీలు సోషల్ మీడియానే కాదు యూట్యూబ్‌నూ నమ్ముకుంటున్నారు. పర్సనల్ విషయాలను, ఫన్నీ సంఘటనలను, బాధాకర విషయాలను, కొత్త ప్రాజెక్టులను.. ఇలా ప్రతీది యూట్యూబ్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అలా బుల్లితెర నటి అర్చన పూరన్ సింగ్ (Archana Puran Singh)కు సైతం యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ మధ్య ఆమె ఓ వీడియో వదిలింది. అందులో తన కుటుంబంతో కలిసి ముంబైలో తమకిష్టమైన దోస హోటల్స్ వద్దకు వెళ్దామంది.ఫ్యామిలీతో ఫుడ్ వ్లాగ్అర్చన భర్త పర్మీత్.. చిన్నతనంలో జుహు బీచ్‌లో దొరికే దోస తన ఫేవరెట్ అన్నాడు. అర్చన శివనగర్‌లోని ఓ హోటల్ పేరు చెప్పగా.. కుమారులు ఆర్యమన్, ఆయుష్మాన్ ఇద్దరూ మిథిబాయి కాలేజ్ దగ్గర దొరికే దోస అలాగే అమర్ జ్యూస్ సెంటర్లో దిరకే జ్యూస్ అద్భుతంగా ఉంటాయన్నారు. అలా మొదటగా మిథిబాయి కాలేజీ సమీపంలోని దోసల్ని కుటుంబమంతా ట్రై చేసింది. అక్కడ పనిచేసే చెఫ్ నేపాలీవాసి. దీంతో అర్చన.. మసాలా దోసలో ఎక్కువ కారం దట్టించకు.. నేను చెప్పింది చేయకపోతే నిన్ను నేపాల్ పంపించేస్తా అని సరదాగా వ్యాఖ్యానించింది. చివరగా భర్తకు ఇష్టమైన చోట..తర్వాత కుటుంబమంతా శివ్ నగర్‌కు వెళ్లి అక్కడ దోసను తిన్నారు. అనంతరం అమర్ జ్యూస్ సెంటర్లో ఫేమస్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగారు. చివరగా భర్తకు ఇష్టమైన దోస కోసం జుహు బీచ్‌కు వెళ్లారు. అక్కడ తనకు ఇష్టమైన హోటల్‌ను వెతకడానికి కాస్తంత సమయం పట్టింది. చివరకు అది ఎట్టకేలకు కనిపించడంతో పర్మీత్ ఎగిరి గంతేశాడు. వాళ్లు దోసను ఆస్వాదిస్తుంటే అక్కడున్న జనాలు అర్చనతో ఫోటో దిగేందుకు ఎగబడ్డారు. దీంతో ఆమెకు ఓ ఐడియా తట్టింది. నా సెల్ఫీ రూ.100 కూడా విలువ చేయదా?మాకు దోస వేసిచ్చినందుకు బదులుగా నీకు సెల్ఫీ ఇస్తాను అంది. ఆమె ఐడియా అతడికి ఏమాత్రం నచ్చలేదు. తనకు డబ్బులే కావాలన్నాడు. అందుకు షాకైన అర్చన.. నా సెల్ఫీ రూ.100 కూడా విలువ చేయదా? అని అడిగింది. ఆ హోటల్ వ్యక్తి.. సెల్ఫీ కావాలి, అలాగే డబ్బు కూడా కావాలన్నాడు. సరే, భయపడకులే.. నేను డబ్బివ్వకుండా ఎక్కడికీ పారిపోను అని చెప్పింది. ఇక అందరికీ ఈ చివరి స్టాల్‌లోని దోసెనే నచ్చింది.చదవండి: కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్? -
సింపుల్ లుక్‌లో మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
-
తెలుగులో ఛావా.. వర్కౌట్ అవుతుందా..!
-
బ్లాక్ లుక్.. కియారా అద్వానీ జిగేల్! (ఫొటోలు)
-
ముంబైలో 'కన్నప్ప' టీజర్ లాంచ్ హాజరైన అక్షయ్ కుమార్ (ఫొటోలు)
-
ఓటీటీకి ఓకే
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతీ చోప్రా డిజిటల్ ఎంట్రీ ఖరారైపోయింది. హిందీలో ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారామె. తాహిర్ రాజ్ బాసిన్, అనూప్ సోనీ, జెన్నిఫర్ వింగెట్, చైతన్య చౌదరి ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.‘రంగ్ దే బసంతి, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి సినిమాలకు రైటర్‌గా, ‘కుర్భాన్, అంగ్లీ’ సినిమాలకు దర్శకుడిగా పని చేసిన రెన్సిల్ డి. సిల్వా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా, సప్నా మల్హోత్రా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. సిమ్లా నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ‘‘నా తొలి వెబ్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పరిణీతి. -
సల్మాన్ ఖాన్ యాక్షన్ చిత్రం.. టీజర్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'సికందర్'. ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ సరసన పుష్ప భామ రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ గతేడాది సింగం ఎగైన్, బేబీ జాన్ చిత్రాల్లోనూ కనిపించారు. అయితే అంతకుముందు 2023లో టైగర్-3 మూవీతో ప్రేక్షకులను అలరించాడు సల్మాన్ ఖాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ విఫలం కావడంతో సికందర్పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఈద్ కానుకగా మార్చి 28న థియేటర్లలోకి రానుంది. Jo dilon par karta hai raj woh aaj kehlata hai Sikandarhttps://t.co/Bn5NdtKN2z #SajidNadiadwala’s #Sikandar Directed by @ARMurugadoss @iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna #AyanKhan @DOP_Tirru…— Salman Khan (@BeingSalmanKhan) February 27, 2025 -
లావుగా ఉన్నానని హీరోయిన్గా పక్కనపెట్టేశారు: సోనాక్షి
తమ శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడానికి సెలబ్రిటీలు నిత్యం వర్కవుట్లు చేస్తూ ఉంటారు. ఏమాత్రం బొద్దుగా తయారైనా ఆఫర్లు అందుకోవడం గగనమే అవుతుంది. కొందరైతే బరువు తగ్గడానికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి షార్ట్కట్లు కూడా వెతుకుతారు. ఎందుకంటే వాళ్లకు నచ్చినట్లుగా ఉంటే ఆఫర్లు రావడం అంత ఈజీ కాదు. తన విషయంలోనూ ఓసారి ఇదే జరిగిందంటోంది హీరోయిన్ సోనాక్షి సిన్హ (Sonakshi Sinha). తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి మాట్లాడుతూ.. ఓసారి ఏమైందంటే నేను లావుగా ఉన్నానని రిజెక్ట్ చేశారు.అత్త ఒడిలో తలపెట్టి ఏడ్చా..అప్పుడు నా మనసు ముక్కలైంది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాను. కాస్త లావయ్యానని కథానాయిక పాత్రకు నన్ను తిరస్కరించారు. ఆ పాత్రలో నేను బాగోనని, కావాలంటే ఏదైనా చిన్నాచితకా పాత్రలు చేసుకోమని సలహా ఇచ్చారు. నాకు చాలా బాధేసింది. నేను ఇంటికి వెళ్లేసరికి మా అత్త అక్కడే ఉంది. దేవుడు నన్నెందుకిలా పుట్టించాడు? నాకెందుకిలా చేస్తున్నాడు? అంటూ నాకు నేనే ప్రశ్నలు వేసుకుంటూ అత్త ఒడిలో తలపెట్టి ఏడ్చాను. బాధపోయేవరకు ఏడుస్తూనే ఉన్నాను. మరుసటి రోజే మళ్లీ మామూలు మనిషయ్యాను అని చెప్పుకొచ్చింది.సినిమాసోనాక్షి చివరగా కకుడా (Kakuda Movie) అనే హారర్ చిత్రంలో కనిపించింది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన హీరామండి: ద డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. ప్రస్తుతం హీరామండి రెండో సీజన్లో యాక్ట్ చేస్తోంది. గతేడాది సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది.చదవండి: ఓటీటీలో 'షకీలా' బయోపిక్ స్ట్రీమింగ్.. అలాంటి కంటెంట్ కావడంతో.. -
మోనాలిసా మోసపోయిందా
-
క్రికెట్ స్టేడియంలో ఊర్వశీ దబిడిదిబిడి.. ఓరీ ఎంత పనిచేశావ్..!
-
సినిమాలు కాపీ కొట్టడం బాలీవుడ్‌కు వెన్నతో పెట్టిన విద్య: నటుడు
ఒకచోట సినిమా హిట్టయిందంటే దాన్ని వెంటనే మరో భాషలోకి తర్జుమా చేస్తారు. లేదంటే రీమేక్ చేస్తారు. ఇవేవీ కాదని కొందరు సులువుగా కాపీ కొడుతుంటారు. 1980-90 ప్రాంతంలో బాలీవుడ్ ఇదే పని చేసేదన్న విమర్శలున్నాయి. ప్రాంతీయ చిత్రాలతో పాటు హాలీవుడ్ నుంచి కొన్ని కథలను తస్కరించేదన్న ఆరోపణలున్నాయి. నటుడు పరేశ్ రావల్ (Paresh Rawal) సైతం ఇదే నిజమంటున్నాడు.కాపీ కొట్టేవారుతాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ (Bollywood) కాపీ కొట్టడం మొదట్లో నేనూ చూశాను. దర్శకుడి దగ్గరకు వెళ్లి సినిమా తీయాలనుందని చెప్పారనుకో.. మీకో దుమ్ముపట్టిన క్యాసెట్ ఇస్తాడు. నువ్వు ఈ సినిమా చూడు.. నేను ఇంకోటి చూస్తాను. రెండూ మిక్స్ చేద్దాం అంటాడు. కానీ ఒకానొక దశలో ఏం జరిగేదంటే హాలీవుడ్ స్టూడియోలు ఇండియాలోకి ప్రవేశించాయి. హాలీవుడ్ చిత్రాలను కాపీ కొట్టాలంటే వారికి డబ్బు చెల్లించాలి. చివరకు సినిమా ఆడకపోతే నష్టాల్లో కూరుకుపోవాలి. ఇదంతా ఎందుకని దర్శకులు సొంతంగా కథలు రాసుకోవడం మొదలుపెట్టారు. లేకపోతే ఇంకా వారి కథల్ని దొంగిలిస్తూనే ఉండేవాళ్లం. ఇడియట్స్‌కు అప్పుడర్థమైంది!ఎంతైనా మనం మంచి దొంగలం కదా! మనకు ఫారిన్వే నచ్చుతాయి. హాలీవుడ్ (Hollywood).. వారి కార్యాలయాలను ప్రారంభించి మంచి పనే చేసింది. దానివల్లే మనవాళ్లు వెనక్కు తగ్గారు. వీరి కథల్ని తీసుకున్నందుకుగానూ ఎక్కువ మొత్తం వారికే ఇస్తే మనకేం మిగులుతుందని ఆలోచించారు. సొంతంగా కథలు సృష్టించి విజయాలు అందుకున్నాడు. అప్పుడే ఈ తెలివితక్కువవాళ్లకు మన కథల్లోని శక్తి తెలిసొచ్చింది. మన కథలు ఎంత కొత్తగా, బలంగా, నాటకీయంగా ఉంటాయో అర్థం చేసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. సినిమాఇకపోతే ఆమిర్ దిల్ హై మాంత నహీ సినిమా హాలీవుడ్ క్లాసిక్ ఇట్ హాపెండ్ వన్ నైట్ నుంచే పుట్టిందే! సెవన్ బ్రైడ్స్ ఫర్ సెవన్ బ్రదర్స్ అనే ఇంగ్లీష్ సినిమా నుంచే అమితాబ్ సత్తే పే సత్తా రూపొందించింది. ఇలా హాలీవుడ్ రీమేక్స్ హిందీలో చాలానే ఉన్నాయి. బాలీవుడ్లో బోలెడన్ని సినిమాలు చేసిన పరేశ్ రావల్ తెలుగులోనూ అనేక చిత్రాల్లో మెరిశాడు. క్షణ క్షణం, మనీ, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్‌దాదా ఎంబీబీఎస్, తీన్మార్ వంటి చిత్రాలతో మెప్పించాడు.చదవండి: సొంతిల్లు ఖాళీ చేయనున్న హీరో.. కుటుంబంతో అద్దె ఇంట్లోకి! -
సొంతిల్లు ఖాళీ చేయనున్న హీరో.. కుటుంబంతో అద్దె ఇంట్లోకి!
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన సొంతిల్లు మన్నత్‌ను వీడనున్నాడు. మన్నత్ (Mannat)ను వదిలేసి అద్దె ఇంట్లోకి షిఫ్ట్ కానున్నాడు. 25 ఏళ్లుగా కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. మన్నత్ బంగ్లాను రెనోవేషన్ చేయనున్నారట. ఆ పనులు పూర్తయ్యేవరకు షారూఖ్ అద్దె అపార్ట్మెంట్లో ఉండనున్నారట!అద్దెకు నాలుగంతస్తులుతన కుటుంబంతోపాటు సిబ్బంది, సెక్యురిటీ.. ఇలా అందరికోసం బాంద్రాకు సమీపంలోని పూజా కాసా అపార్ట్మెంట్లో నాలుగంతస్తులను రెంట్‌కు మాట్లాడుకున్నారట! దీనికిగానూ నెలకు రూ.24లక్షలు అద్దె చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మన్నత్ బంగ్లా పునరుద్ధరణ పనులు మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఆ బంగ్లా మళ్లీ కొత్తగా తయారవ్వడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది.మూడేళ్లపాటు లీజుకుఇక షారూఖ్‌కు అపార్ట్మెంట్ అద్దెకిస్తోంది మరెవరో కాదు నిర్మాత వాసు భగ్నానీ. వాసు తనయుడు జాకీ భగ్నానీ (రకుల్ ప్రీత్ సింగ్ భర్త), కూతురు దీప్శిక దేశ్‌ముఖ్‌లు.. నాలుగు అంతస్తులను షారూఖ్‌కు మూడేళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేయించుకున్నారట! అయితే అంతకాలంపాటు షారూఖ్ అక్కడే ఉంటారా? అన్నది ప్రశ్నార్థకమే! షారూఖ్ చివరగా 2023లో 'పఠాన్', 'జవాన్', 'డంకీ' సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో అతిథి పాత్రలో మెరిశాడు.చదవండి: తొమ్మిదేళ్ల బంధం.. విడాకులు కావాలన్న నటి! -
తొమ్మిదేళ్ల బంధం.. విడాకులు కావాలన్న నటి!
బాలీవుడ్ నటుడు అమన్ వర్మ (Aman Verma)- వందన లల్వానీ (Vandana Lalwani) విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. తొమ్మిదేళ్ల బంధానికి ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించుకోలేక విడిపోవడానికే నిర్ణయించుకున్నట్లు భోగట్టా! 'నిజానికి వీరు పిల్లల్ని కని కుటుంబాన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ కొన్ని విషయాల్లో బేధాభిప్రాయలు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో వందన విడాకుల కోసం దరఖాస్తు చేసింది' అని బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. 2016లో వివాహందీని గురించి నటుడు అమన్‌ను ప్రశ్నించగా సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు తన లాయర్ చెప్తాడన్నారు. దీంతో దంపతుల విడాకుల వ్యవహారం నిజమేనని తేలిపోయింది. అమన్- వందన 2014లో హమ్ నే లి హై: శపథ్ అనే టీవీ సిరీస్‌లో తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలోనే పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2015లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2016లో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఒంటరిగా..పెళ్లి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో అమన్ మాట్లాడుతూ.. పెళ్లి నన్ను ఎంతగానో మార్చేసింది. ఒకప్పుడు చిన్నవిషయాలకే కోపం వచ్చేది. కానీ ఇప్పుడు చాలామటుకు సైలెంట్ అయిపోయాను. అలాగే ఎన్నో ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాను. మంచి భాగస్వామి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలా వందన కనిపించాక తనను పెళ్లాడాను. మేము చాలా సంతోషంగా ఉన్నాను. ఒకరిపై ఒకరికి ఎలాంటి ఫిర్యాదులు లేవు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడేమో 53 ఏళ్ల వయసులో విడాకులకు సిద్ధమయ్యాడు.బుల్లితెర.. వెండితెరఅమన్ వర్మ.. పచ్‌పన్ ఖంబే లాల్ దీవారేన్, మహాభారత్ కథ (కర్ణుడి కుమారుడు), క్యూంకీ సాస్ భీ కభీ బహూ తీ, కెహతా హై దిల్, కుంకుమ్.. ఇలా అనేక సీరియల్స్ చేశాడు. సంఘర్ష్, జానీ దుష్మన్, అండాజ్, దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్, కచ్చీ సడక్, జనని, జాన్-ఇ-మన్, ఈఎమ్ఐ, తీస్ మార్ ఖాన్. చికెన్ కర్రీ లా, ద యూపీ ఫైల్స్ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించాడు. వందన లల్వానీ సైతం సీరియల్స్‌తో పాటు సినిమాలు చేసింది.చదవండి: కలర్ ఫోటో చేతులారా వదిలేసుకున్నా..: హీరోయిన్ -
రూ.500 కోట్లకు చేరువలో ఛావా.. తెలుగు వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా ఏది? అంటే క్షణం ఆలోచించకుండా ఛావా (Chhaava Movie) అని చెప్తున్నారు సినీప్రియులు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ జనాల్ని థియేటర్‌కు రప్పిస్తూనే ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీయే కాదు ఆయన తనయుడు శంభాజీ (Chhatrapati Sambhaji Maharaj) కూడా పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, త్యాగశీలి అని చరిత్రను చాటిచెప్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.483 కోట్లు రాబట్టింది. రేపో మాపో రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది.తెలుగు ప్రేక్షకుల డిమాండ్సినిమాను విపరీతంగా ప్రేమించే తెలుగు ప్రేక్షకులు ఛావా తెలుగు డబ్బింగ్ (Chhaava Telugu Version) కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్లో ఛావా రిలీజైతే ఇక్కడ మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప సినిమాను టాలీవుడ్ ఆడియన్స్‌కు అందించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భావించారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఛావా తెలుగు డబ్బింగ్ పనులను ఇదివరకే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా గీతా ఆర్ట్స్.. మార్చి 7న ఛావా తెలుగు వర్షన్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఛావావిక్కీ కౌశల్ పోషించిన శంభాజీ పాత్రకు ఏ హీరో డబ్బింగ్ చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు ప్రాణం పోస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ఏ హీరో డబ్బింగ్ చెప్పాడన్నది వారం రోజుల్లో తెలియనుంది. ఛావా సినిమా విషయానికి వస్తే.. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. The epic tale of India’s courageous son, #Chhaava is now all set to roar in Telugu by popular demand⚔️❤️🔥Witness the biggest spectacle #Chhaava in Telugu from March 7th💥👑#ChhaavaTelugu Grand Release by #GeethaArtsDistributions 🔥@vickykaushal09 @iamRashmika #AkshayeKhanna… pic.twitter.com/awm4MAq4J6— Geetha Arts (@GeethaArts) February 26, 2025 చదవండి: ఆ సమయంలో నా తండ్రి పేరు చెప్పుకోలేదు: శృతిహాసన్ -
బాక్సాఫీస్ విన్నర్ ఎవరు?
-
ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే: గోవిందా మేనేజర్
బాలీవుడ్ పాపులర్ జోడీ గోవింద, సునీత అహుజా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 37ఏళ్ల వీరి వైవాహిక బంధం బీటలు వారిందని, విడాకులు తీసుకోనున్నారని కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, తాజాగా ఈ విషయంపై నటుడు గోవిందా రియాక్ట్ అయ్యారు.తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో గోవిందాకు విడాకుల ప్రశ్న ఎదురైంది. కొద్దిరోజుల నుంచి తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు. అయితే, ఇదే సమయంలో ఆయన మేనేజర్ ఇలా చెప్పాడు. 'ఫ్యామిలీలో కొంతమంది చేసిన కామెంట్ల వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయి. వారి మధ్య విభేదాలు నిజమే. అయితే, విడాకులు తీసుకునేంత పెద్దవి మాత్రం కాదు. ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే.. అవి వారిద్దరే పరిష్కరించుకుంటారు.' అని ఆయన పేర్కొన్నారు.కొద్దిరోజుల క్రితం గోవిందా సతీమణి సునీత అహుజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గోవింద, తాను వేర్వేరుగా ఉంటున్నామని చెప్పారు. ఆపై తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నామని చెప్పడంతో విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. వచ్చే జన్మ ఉంటే ఆయనకు భార్యగా ఉండాలని కోరుకోవడం లేదని ఆమె చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా తన జీవితాన్ని పనికే అంకితం చేశారని ఆమె అన్నారు. గోవింద, సునీతలకు 1987లో వివాహం అయింది. వీరికి టీనా అహుజా, యశోవర్ధన్ అహుజా పిల్లలు ఉన్నారు. 37 ఏళ్ల తర్వాత వారిద్దరు విడిపోతున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. -
పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న ఓటీటీ నటి
ఓటీటీలో 'మిస్ మ్యాచ్డ్' సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి కమ్ యూట్యూబర్ పెళ్లి చేసుకుంది. దాదాపు పదకొండేళ్లుగా ప్రేమలో ఉన్న వాడితోనే ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు సమక్షంలో మంగళవారం ఈ పెళ్లి వేడుక జరిగింది.(ఇదీ చదవండి: ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?)2015లో యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రజక్త కోలీ.. మోస్ట్లీ సేన్ పేరుతో అందరికీ పరిచయమే. యూట్యూబ్ లో ఎంతో పేరు తెచ్చుకున్న ఈమె.. జగ్ జగ్ జీవో, నియాత్ సినిమాల్లో నటించింది. కానీ నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన 'మిస్ మ్యాచ్ డ్' వెబ్ సిరీస్ తో హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ఈ సిరీస్ నుంచి మూడో సీజన్ కూడా రిలీజైంది.మరోవైపు యూట్యూబర్ కాకముందే వృషాంక్ అనే కుర్రాడితో ప్రేమలో ఉంది. దాదాపు 11 ఏళ్లపాటు వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ బంధంలో ఎన్ని ఇబ్బందులొచ్చినా సరే నిలబడుతూ వచ్చాయని ప్రజక్త చెప్పుకొచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలోని కర్తాజ్ లోని ఓ ఫామ్ హౌసులో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ప్రియుడితో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు అందరూ విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: శివరాత్రికి జాగారమా? ఈ సినిమాలు చూస్తూ భక్తి పారవశ్యం) View this post on Instagram A post shared by Prajakta Koli (@mostlysane) -
38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!
ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు అనేది చాలా కామన్. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా ఏళ్ల పాటు కలిసున్న కొందరు స్టార్ కపుల్స్ విడిపోతున్నారు. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాశ్, హీరో జయం రవి.. ఇలా తదితరులు ఏళ్లకు ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో సీనియర్ నటుడు చేరినట్లు తెలుస్తోంది.అప్పట్లో బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్న గోవిందా.. ప్రస్తుతం పెద్దగా లైమ్ లైట్ లో లేడు. ఇతడే తన 38 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడట. గోవిందా, ఇతడి భార్య సునీత అహుజా.. గత కొన్ని రోజుల నుంచి వేర్వురుగా ఉంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)కొంతకాలంగా గోవిందా దంపతుల మధ్య విబేధాలు నడుస్తున్నాయని, దీంతో ఇక విడాకులు తప్పనిసరి అనుకున్నారని తెలుస్తోంది. మరోవైపు గోవిందా.. ఓ మరాఠీ నటితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని, భార్య నుంచి విడిగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. ఇప్పటివరకైతే ఈ జంట.. విడాకుల అంశంపై స్పందించలేదు. కానీ మీడియాలో మాత్రం టాక్ గట్టిగా వినిపిస్తోంది.కొన్నాళ్ల క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత కూడా.. భర్త గోవిందాతో మాట్లాడి చాలా రోజులైందని చెప్పింది. ప్రస్తుతం తన కూతురు, కొడుకుతో కలిసి మాత్రమే ఉంటున్నానని పేర్కొంది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే విడిగా ఉంటున్నారని అర్థమైంది. త్వరలో విడాకుల విషయాన్ని అధికారికంగ ప్రకటిస్తారేమో చూడాలి. 1987లో వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోగా.. 1988లో కూతురు పుట్టిన తర్వాతే పెళ్లి విషయాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్.. లేటు వయసులో లేని పోని చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటికి మొన్న ఓ ప్రోగ్రామ్ లో పాట పాడుతూ మహిళా అభిమానికి లిప్ కిస్ ఇచ్చి కాంట్రవర్సీకి కారణమయ్యాడు. ఇప్పుడు మొదటి భార్య వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఏమైందంటే?(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?)తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఎన్నో హిట్ పాటలు పాడిన ఉదిత్ నారాయణ్.. 69 ఏళ్లొచ్చినా ఇంకా తనదైన శైలిలో అలరిస్తూనే ఉన్నారు. సినిమా సాంగ్స్ కూడా పాడుతున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఈయన మొదటి భార్య రాంజన ఇప్పుడు ఈయనపై కోర్టులో కేసు వేసింది. ఉదిత్ నారయణ్.. తనకు సంబంధించిన భూమిని తనకు చెప్పకుండా అమ్మేశాడని, అందులో తనకు దక్కాల్సిన రూ.11 లక్షల్ని తీసేసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి తనకు ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇందులో భాగంగానే ఉదిత్.. ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)ఉదిత్ వ్యక్తిగత విషయానికొస్తే.. 1985లో దీప అనే సింగర్ ని పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలైపోయాడు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. దీపని పెళ్లి చేసుకోవడానికి ముందే ఉదిత్.. తనని పెళ్లి చేసుకున్నాడని రాంజన అనే మహిళ బయటకొచ్చింది. తొలుత బుకాయించాడు గానీఆమె, కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకొన్నాడు. అదే ఏడాది న్యాయబద్ధంగా ఉదిత్-రాంజన విడాకులు కూడా తీసుకున్నారు.విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద.. ఇల్లు, కొంత బంగారం, నెలకు రూ.15 వేల మొత్తాన్ని రాంజనకు ఇచ్చేలా బిహార్ మహిళా కమిషన్ ముందు ఉదిత్ ఒప్పుకొన్నాడు. అవి చెల్లిస్తున్నాడు కూడా. తాజాగా రాంజన మరోసారి కోర్టు మెట్లక్కెడంతో ఉదిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?) -
'అలాంటి వ్యక్తి దొరకాలి.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటా': సుస్మితా సేన్
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్(Sushmita Sen) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిసారిగా తాలీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకుముందు ఆర్య వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది ఈ 49 ఏళ్లు బాలీవుడ్ భామ. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా దానిపై స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా? అని వెల్లడించింది.తన అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరిగదు కదా. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది సుస్మితా సేన్. కాగా.. గతంలో నటుడు రోహ్మన్ షాల్‌తో ప్రేమాయణం కొనసాగించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు)దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. -
'మీ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను'.. అమిర్ ఖాన్‌తో డ్రాగన్ హీరో
జీవితం ఊహించలేనిది.. ఇలా అన్నది ఎవరో తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందుగా యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాలి. ఈయన కోమాలి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టారు. ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అందురూ ఎదురు చూశారు. అలాంటిది హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తరువాత ఈయనకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.అలా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఓ మై గాడ్ చిత్రం ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ నెల 21వ తేదీన తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం వైపు పరుగులు తీస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను కలవడం ఆసక్తిగా మారింది. ప్రదీప్ రంగనాథన్ తమిళంలో నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. దీనికి ప్రదీప్ రంగనాథన్ సహ నిర్మాత కావడం గమనార్హం. అందులో అమీర్‌ఖాన్ వారసుడు జునైత్ ఖాన్, శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదన్నది గమనార్హం.ఇలాంటి పరిస్థితిలో ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను చెన్నైలో కలవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ డ్రాగన్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనతో ఆయన్ని కలిశారా? లేక మరోదైన విషయం కోసం కలిశారా? అన్న చర్చ జరుగుతోంది. అయితే అమీర్‌ఖాన్ ప్రస్తుతం నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.అదే విధంగా అనారోగ్యానికి గురైన ఆయన తల్లి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను పరామర్శించడానికి ప్రదీప్ రంగనాథన్ వెళ్లారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా అమీర్‌ఖాన్‌తో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసిన ప్రదీప్ రంగనాథన్ అందులో.. జీవితం ఊహించలేనిది అని నేను ఎప్పుడూ చెబుతాను.. మీ అద్భుతమైన మాటలకు ధన్యవాదాలు అమిర్ ఖాన్ సార్.. జీవితాంతం దాన్ని గుర్తుంచుకుంటాను అని పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈయన విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంలో నటిస్తున్నారు. Life is unpredictable as i always say :) Thankyou for your wonderful words #aamirkhan sir . Will cherish it for life ❤️ pic.twitter.com/HPjpJLvDN2— Pradeep Ranganathan (@pradeeponelife) February 23, 2025 -
చరిత్రలో మరిచిపోలేని జలియన్ వాలాబాగ్ ఉదంతం.. ట్రైలర్ చూశారా?
భారతీయుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని దారుణ ఉదంతం జలియాన్ వాలాబాగ్ ఊచకోత. అప్పటి బ్రిటీశ్ పరిపాలన కాలంలో 1919 ఏప్రిల్ 13న ఈ మారణహోమం జరిగింది. ఈ అత్యంత పాశవిక ఘటన ఆధారంగా వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ది వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ పేరుతో రామ్ మాద్వానీ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.తారుక్ రైనా, నిఖితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ వచ్చేనెల మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. యధార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Find out the conspiracy behind the Jallianwala Bagh massacre, as a nation awakens. Creator | Director Ram Madhvani brings to you a show inspired by true events #TheWakingOfANation, Streaming on 7th March on Sony LIV pic.twitter.com/Q5qM8ZN8Cn— Sony LIV (@SonyLIV) February 24, 2025 -
'26 ఏళ్లుగా ఈ ట్రెండ్‌ను అధిగమిస్తున్నాం'.. భార్యకు అజయ్ దేవగణ్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. తాజాగా ఈ జంట తమ 26వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు అజయ్ దేవగణ్ మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో దిగిన పాత ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '26 ఏళ్లుగా ఈ ట్రెండ్‌ను అధిగమిస్తున్నాం.. మనిద్దరికీ హ్యాపీ యానివర్సరీ' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు స్టార్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మొదట వీరిద్దరు 1995లో వచ్చిన హల్చల్ అనే మూవీ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో జంటగా కనిపించారు. అదేక్రమంలోనే అజయ్, కాజోల్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 1999లో ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు ఇష్క్, ప్యార్ తో హోనా హి థా, యు మే ఔర్ హమ్, తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్ లాంచి చిత్రాలలో జంటగా నటించారు. వీరిద్దరి నైసా దేవగణ్, యుగ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే కాజోల్ చివరిసారిగా దో పట్టిలో కనిపించింది. మరోవైపు అజయ్ దేవగణ్ చివరిసారిగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం ఎగైన్‌లో కనిపించారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?
కొన్ని కథలు వినోదాన్ని పంచితే మరికొన్ని హృదయాలను బరువెక్కిస్తాయి. కొన్ని మాత్రమే మన రక్తం మరిగేలా చేస్తూనే కన్నీళ్ల వరద పారిస్తాయి. అలాంటి సినిమాయే ఛావా (Chhaava Movie). బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీగా నటించాడు. ఆయన భార్య ఏసుబాయిగా హీరోయిన్ రష్మిక మందన్నా యాక్ట్ చేసింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.ద్రోహులుగా చిత్రీకరించారుఇక ఈ సినిమాలో తన పూర్వీకులను తప్పుగా చూపించారంటూ మరాఠా యోధులు గానోజీ, కాన్హోజి షిర్కే వారసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను ఉటంకిస్తూ తమ పూర్వీకులను శంభాజీ మహారాజ్‌కు ద్రోహం చేసినవారిగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఆయా సన్నివేశాల ద్వారా తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకుగానూ చిత్రయూనిట్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)కు నోటీసులు పంపించారు.అసౌకర్యానికి గురైతే క్షమించండిఈ వివాదంపై డైరెక్టర్ లక్ష్మణ్ స్పందిస్తూ ఛావాలో గానోజి, కన్హోజీల పేర్లు మాత్రమే ఉపయోగించామన్నాడు. వారి ఇంటిపేరు, ఏ ప్రాంతానికి చెందినవారు వంటి వివరాలను వెల్లడించలేదన్నాడు. షిర్కే కుటుంబసభ్యుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. ఛావా వల్ల వారు అసౌకర్యానికి గురైతే తనను క్షమించాల్సిందిగా కోరాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
భారత్- పాక్ మ్యాచ్.. ఊర్వశి రౌతేలా క్రేజీ రికార్డ్!
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఐదేళ్ల కుర్రాడి నుంచి డెబ్బై ఏళ్ల ముసలోళ్లు కూడా వదిలిపెట్టరు. మ్యాచ్ ఎప్పుడు మొదలతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రపంచ క్రికెట్లోనే అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇండియా- పాకిస్తాన్ పోరు మాత్రమే. ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్‌లు లేనందువల్ల అప్పుడప్పుడు వచ్చే ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నారు దాయాది జట్లు. మరి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చే ఈ మ్యాచ్ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు క్రీడా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక మ్యాచ్ లైవ్‌లో చూసేవారికి ఆ థ్రిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఏంటా స్పెషల్? అనేది తెలియాలంటే మీరు లుక్కేసేయండి మరి.తాజాగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. ఇటీవల డాకు మహారాజ్‌తో ఫ్యాన్స్‌ను అలరించిన ముద్దుగుమ్మ సడన్‌గా మ్యాచ్‌లో దర్శనమిచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా డైరెక్టర్ సుకుమార్, పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ మ్యాచ్ లైవ్‌లో అభిమానులు వీక్షించారు.అయితే చాలా మంది సెలబ్రిటీలు ఈ మ్యాచ్‌కు హాజరైనప్పటికీ అందరి కళ్లు ఊర్వశి రౌతేలాపైనే ఉన్నాయి. ఈ బాలీవుడ్ భామ దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. టీమిండియా- పాక్ మ్యాచ్‌లో ఏకంగా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫిల్మ్ ఫేర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తొలి సెలబ్రిటీ అంటూ..భారత్- పాక్ మ్యాచ్‌లో పుట్టినరోజు జరుపుకున్న తొలి సెలబ్రిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో రికార్డ్ సృష్టిస్తే.. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఊర్వశి తొలిసారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని అంటున్నారు. మరికొందరైతే ఊర్వశి రౌతేలాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఖరికి ఫిల్మ్ ఫేర్ వాళ్లు కూడా ఊర్వశిపై జోకులు వేస్తున్నారని మరికొందరు రాసుకొచ్చారు. కొందరు రిషబ్ పంత్ పేరును కూడా కామెంట్స్‌లో ప్రస్తావిస్తున్నారు. అయితే ఆమెపై ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ.. చివరికీ బాలీవుడ్ భామ మాత్రం ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అందర దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఇటీవల టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఊర్వశి రౌతేలా బర్త్ డే ఈనెల 25న కాగా.. ముందుగానే స్టేడియంలో సెలబ్రేట్ చేసుకుని హైలెట్‌గా నిలిచింది. #ViratKohli broke several records during the India vs Pakistan match yesterday but #UrvashiRautela became the first actress to celebrate her birthday during an #IndvsPak cricket match. 🤣#Trending #indvspak #indiavspakistan #iccchampionstrophy pic.twitter.com/OLjHILtvgh— Filmfare (@filmfare) February 24, 2025 -
ఆడవారి కష్టానికి అద్దం ఈ సినిమా..
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం మిసెస్(Mrs) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ సమాజంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రతి రోజూ బాధ్యతతో కష్టపడుతున్న వారెవరైనా ఉన్నారు అంటే వారు మన ఇంటి ఆడవారు. 365 రోజులు ఏ సెలవు లేకుండా ఇంట్లో ఉన్న ఆరు నుండి అరవై ఏళ్ల వాళ్ల బాగోగులు ప్రతి నిత్యం అలుపెరగకుండా చూసుకునేవారే ఆడవారు. మరి ఇంతలా కష్టపడుతున్న వారికి కొన్ని బాధలు ఉంటాయి కదా. వాటి గురించి విచారించేదెవరు... ఆ కోణంలో ఆలోచింపజేసేదే ఈ ‘మిసెస్’ చిత్రం.2021లో విడుదలైన మలయాళ సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’కి హిందీ రీమేక్‌గా ‘మిసెస్’ రూపొందింది. ఆరతి కడావ్ దీనికి దర్శకురాలు. బాలీవుడ్లో విలక్షణ నటిగా పేరొందిన సాన్యా మల్హోత్రా(Sanya Malhotra) ఈ సినిమాలోని ప్రధాన పాత్ర పొషించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కనీసం ఓ క్షణమైనా తమ ఇంటి ఆడవారి కష్టం గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచింపజేయడమే లక్ష్యంగా దర్శకురాలు ఈ సినిమాని రూపొందించారు. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం... రీచా ఓ చదువుకున్న ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి. మంచి డ్యాన్స్ టీచర్ కూడా.తనకు సొంతంగా డ్యాన్స్ టీమ్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉంటుంది. ఈ లోపల తల్లిదండ్రులు నిశ్చయించిన సంబంధంతో పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా దివాకర్‌తో పెళ్లవుతుంది. దివాకర్ ఓ డాక్టర్. దివాకర్ది మరీ ఛాందస భావాలు కలిగిన కుటుంబం. ఇంటికి వచ్చిన కోడలితో ఇంటెడు చాకిరీ చేయించుకోవడమే కాక ఓ బానిస కన్నా చాలా హీనంగా చూస్తుంటారు. ప్రతి రోజూ అలారం పెట్టుకొని లేచి ఇంట్లో ఉన్న వాళ్లందరికీ వండి రాత్రి మళ్లీ నిద్రపొయేంతవరకు కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకురాలు. ఇంట్లో కనీసం వాసన కూడా భరించలేని ఓ ప్రదేశాన్ని తాను ఎంత నరకయాతన అనుభవిస్తూ శుభ్రం చేసిందో చూస్తే చూసిన ప్రేక్షకులకు గుండె బరువెక్కుతుంది.ఇంటి పెద్ద అయిన దివాకర్ తండ్రి బయటకు వెళ్లాలంటే ఆయన చెప్పులు కూడా చేత్తో తీసి, ముందు పెడితే తాపీగా వేసుకుని వెళతాడు. అటువంటి ఘోరమైన భావజాలమున్న ఈ కుటుంబంలోకి వచ్చిన రీచా ఎలా మనగలుగుతుంది? అలాగే తన డ్యాన్స్ డ్రీమ్ నెరవేర్చుకుంటుందా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాలోని కథాంశం సమాజంలో ఉన్న ప్రతి గృహిణిది. ప్రతి రోజూ మీ కోసం కష్టపడుతున్న మీ వారి కోసం ఈ సినిమా చూడండి. ఆమె కష్టమేంటో మీ మనస్సుతో పాటు కళ్లకు కూడా తెలుస్తుంది. వర్త్‌ఫుల్ వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
రష్మికపైనే విమర్శలా? ఆమె ట్రాక్ రికార్డ్ చూశారా?: ఛావా నటి
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ (Chhatrapati Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా (Chhaava Movie). బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ శంభాజీగా, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా నటించారు. విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రష్మిక పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.రష్మిక కళ్లతోనే నటించగలదుఈ ట్రోలింగ్‌పై నటి దివ్య దత్త (Divya Dutta) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమె ఛావా చిత్రంలో రాజమాత సోయరబాయిగా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివ్య మాట్లాడుతూ.. సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు, నాకు మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ తను గొప్ప నటి అని నా విశ్వాసం. కొన్ని సీన్స్‌లో తన కళ్లను చూడండి.. అవి మిమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఆమె ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిందన్న విషయం మర్చిపోవద్దు. ట్రాక్ రికార్డ్ చూశారా?ప్రేక్షకుల కోసం ఆమె ఎంతలా తపన పడుతుందో ఆమె ట్రాక్ రికార్డ్ చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. నాకు తెలిసిందల్లా రష్మిక మంచి అమ్మాయి మాత్రమే కాదు, ఎంతో కష్టపడే వ్యక్తి. ఆమె అంటే నాకెంతో ఇష్టం. మిగతావాళ్లేమనుకుంటారో నాకనవసరం. ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. నీ పాత్ర నిడివి ఇంకాస్త ఎక్కువుంటే బాగుండేదని కొందరు అద్భుతంగా యాక్ట్ చేశావని మరికొందరు చెప్తుంటారు. నేనైనా, రష్మిక అయినా మా పాత్రల కోసం బెస్ట్ ఇచ్చాం. అందుకు సంతోషిద్దాం..మిగతావాళ్లు కూడా వారి పాత్రల పరిధి మేర నటించారు. ఇప్పుడు ప్రేక్షకులు వారి పని నిర్వర్తిస్తున్నారు. సినిమాను ఆదరిస్తున్నారు. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలబెడుతున్నారు. అందుకు మనం సంతోషిద్దాం అని పేర్కొంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదలకాగా ఇప్పటివరకు రూ.300 కోట్లు రాబట్టింది. రష్మిక.. యానిమల్, పుష్ప 2తో వరుసగా భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ బ్యూటీ సికందర్, ద గర్ల్‌ఫ్రెండ్, కుబేర, థామ సినిమాలు చేస్తోంది.చదవండి: ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?! -
ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?!
ఎక్కడ చూసినా ఛావా (Chhaava Movie) ప్రభంజనమే! ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన కుమారుడు శంబాజీ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఆయన చరిత్రను అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో తెరకెక్కిన సినిమా ఛావా. ఓపక్క ప్రేక్షకుల రక్తం మరిగేలా చేస్తూ మరోపక్క వారిని సీట్లకు కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తోందీ మూవీ.పుష్ప 2 Vs ఛావా అయ్యేది!ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజైంది. నిజానికి గతేడాది డిసెంబర్ 6న ఛావాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) కూడా సరిగ్గా అప్పుడే వస్తున్నట్లు తెలిసి ఆలోచనలో పడ్డారు. అప్పటికే పుష్ప 1 బ్లాక్‌బస్టర్. దానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2ను పాన్ ఇండియావైడ్‌గా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఇలాంటి సమయంలో పుష్పరాజ్‌కు పోటీగా వెళ్తే రెండు సినిమాల కలెక్షన్స్ దెబ్బతినే అవకాశం ఉందని ఛావా మేకర్స్ వెనక్కు తగ్గారు.పుష్పరాజ్‌కు దారిచ్చిన ఛావాపుష్పరాజ్కు దారిస్తూ కొత్త డేట్ వెతుక్కున్నారు. అందుకుగానూ అల్లు అర్జున్ (Allu Arjun) ఛావా యూనిట్‌కు స్పెషల్‌గా థాంక్స్ కూడా చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రెండు సినిమాలు లాభపడ్డాయి. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1850 కోట్లు సాధించింది. ఇప్పుడు ఛావాకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించడం విశేషం. (చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో)ఇద్దరి కెరీర్లో మైలురాయి..అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప ఎలాగో విక్కీ కౌశల్ కెరీర్లో ఛావా అంతే ప్రత్యకంగా నిలిచిపోనుంది. ఛావా సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఛావా అన్నిచోట్లా ఆదరణ పొందుతోంది. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల వల్ల శంభాజీ వీరత్వాన్ని సినిమాగా పరిచయం చేయడానికి వీలైంది అన్నారు.మోదీ ప్రశంసలుఇందుకు సంబంధించిన వీడియోను విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ ఛావాను ప్రశంసించడం, ఛత్రపతి శంభాజీ మహారాజ్ త్యాగాన్ని కీర్తించినందుకు గర్వంగా ఉంది. ఆనందంతో మనసు ఉప్పొంగుతోంది అని రాసుకొచ్చాడు. ఛావాలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా రాబట్టింది.చదవండి: అయ్య బాబోయ్.. కిచ్చ సుదీప్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా? -
దుబాయ్‌లో సోనాక్షి సిన్హా ఫోజులు.. నెట్టింట ఫోటోలు వైరల్
-
పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రభాస్ హీరోయిన్
-
మహిళల ప్రీమియర్ లీగ్‌లో డ్యాన్స్ తో అదరగొట్టిన శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'హరిహర వీరమల్లు' హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా టోనీ బేగ్ అనే వ్యాపారవేత్తతో ఆమె డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. ‘రాక్‌స్టార్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నర్గీస్ ఫక్రీ మద్రాస్ కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్–3...మొదలైన సినిమాలతో అలరించింది. హాలీవుడ్ సినిమా ‘స్పై’లోనూ నటించింది. ‘అమావాస్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమైంది. పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లులో కూడా ఈ బ్యూటీ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ‘రాక్‌స్టార్ యాక్ట్రెస్’గా పిలుచుకునే నర్గీస్ ఫక్రీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.లాస్ ఏంజెల్స్‌లోని ఒక స్టార్ హోటల్లో నర్గీస్ ఫక్రీ, టోనీ బేగ్‌ల వివాహం జరిగింది. కానీ, పెళ్లి చేసుకున్న విషయాన్ని వారిద్దరూ అధికారికంగా వెల్లడించలేదు. అయతే, పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కేక్‌తో పాటు స్విట్జర్లాండ్‌కు సంబంధించిన టూర్ ఫొటోలను ఆమె షేర్ చేసింది. అమెరికాలో పెళ్లి చేసుకున్న వారిద్దరూ అక్కడినుంచే స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. టోనీ బేగ్ కశ్మీర్ కుటుంబానికి చెందిన ఒక వ్యాపారవేత్త అని తెలుస్తోంది. అయితే, చాలా ఏళ్ల క్రితమే వారి కుటంబం అమెరికాలో స్థరపడింది. వారిద్దరు డేటింగ్లో ఉన్నట్లు ఆమె గతంలో పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Nargis Fakhri (@nargisfakhri) -
హాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్లో స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్(Salman Khan), సంజయ్ దత్(Sanjay Dutt) హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. లూయిస్ మచిన్, ఎవా బియాంకో, పౌలా లుస్సీ ప్రధాన పాత్రల్లో రోడ్రిగో గెర్రెరో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్ డాగ్స్’. 2021లో అర్జెంటీనాలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.ఈ రీమేక్‌లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. సల్మాన్, సంజయ్‌లపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ వీడియో క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సల్మాన్ ఖాకీ చొక్కా వేసుకుని ఆటో డ్రైవర్ వేషంలో ఉండగా... సంజయ్ సూటు ధరించి ఉన్నారు.మిడిల్ ఈస్ట్‌లో జరిగే అమెరికన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందట. మిడిల్ ఈస్ట్‌లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సినిమాలకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ రీమేక్‌లో నటింపజేస్తున్నారట హాలీవుడ్ మేకర్స్. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను అధికారికంగా వెల్లడించలేదు. -
అమ్మానాన్న విడిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నా: నటి
పేరెంట్స్ విడాకుల వల్ల తను సంతోషంగానే ఉన్నానంటోంది నటి కావేరి కపూర్ (Kaveri Kapur). కాకపోతే అది తర్వాతి కాలంలో తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెప్తోంది. డైరెక్టర్ శేఖర్ కపూర్- నటి, సింగర్ సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi)ల కూతురే కావేరి. బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ అనే హిందీ సినిమాతో వెండితెరకు నటిగా పరిచయమైంది.విడాకులు తీసుకున్నప్పుడు హ్యాపీనేతాజాగా ఓ ఇంటర్వ్యూలో కావేరి మాట్లాడుతూ.. అమ్మానాన్న విడిపోయినప్పుడు నేనంతగా బాధపడలేదు. వాళ్లు విడాకులు తీసుకున్నప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ రానురానూ తేడా గమనించాను. పేరెంట్స్ విడాకులు నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించాయి. పెద్దయ్యే కొద్దీ మానసికంగా చాలా ఇబ్బందిపడ్డాను.ఇప్పటికీ మానసికంగా..ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. ఇదొక ప్రక్రియలా కొనసాగుతోంది. అలాగే నాకు ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉంది. ప్రస్తుతం వీటన్నింటి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను. పూర్తిగా బయటపడేందుకు ఇంకాస్త సమయం పడుతుందని భావిస్తున్నాను. శేఖర్ కపూర్- సుచిత్ర కృష్ణమూర్తి 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2001లో కావేరి జన్మించింది. 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2007లో విడాకులు తీసుకున్నారు.చదవండి: ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి -
హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో.. ఆటో డ్రైవర్‌గా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెవెన్ డాగ్స్ అనే అర్జెంటీనా సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలోముఖ్య పాత్ర కోసం సల్లూ భాయ్‌ను సంప్రదించగా ఆయన పచ్చజెండా ఊపారట! ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.దుబాయ్‌లో షూటింగ్!ఇందుకోసం సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితమే దుబాయ్ పయనమయ్యాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లకు సంబంధించిన సన్నివేశాలపై చిత్రీకరణ జరుపుతున్నారంటూ కొన్ని వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో సల్మాన్ ఆటో డ్రైవర్ వేషంలో ఉన్నాడు. ఆటో దగ్గర సల్మాన్ నిల్చోగా అతడి పక్కనే సంజయ్ దత్ సూటూబూటు వేసుకుని ఠీవీగా కనిపిస్తున్నాడు. సల్మాన్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సినిమాకాగా సల్మాన్ ఖాన్ చివరగా టైగర్ 3 సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సికందర్ మూవీ చేస్తున్నాడు. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రంజాన్ పండగకు విడుదల కానుంది. Bhai and Baba are in Saudi Arabia to shoot cameo for a Hollywood movie 🎥... #Salmankhan #Sanjaydutt #Sikandar pic.twitter.com/ZoTZ6mNae4— Adil Hashmi👁🗨 (@X4SALMAN) February 19, 2025MEGASTAR SALMAN KHAN in Saudi Arabia today #Sikandar #SalmanKhan pic.twitter.com/pUVl8WMvoc— Lokendra Kumar (@rasafi24365) February 19, 2025చదవండి: ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్‌గా డేట్ చెప్పేసిన కంగనా -
ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్‌గా డేట్ చెప్పేసిన కంగనా
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని కంగనా సింపుల్‌గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. ఎమర్జెన్సీ మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో మిస్ అయినవారు ఎమర్జెన్సీ చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి.ఎమర్జెన్సీ కథఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ వంటి సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కంగనా.. ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ సహా దివంగత నటుడు సతీశ్ కౌశిక్ ముఖ్య పాత్రలు పోషించారు. కంగనా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించింది.చదవండి: ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ -
సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో కనిపించే స్టార్ ఎవరంటే..?
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ బయోపిక్‌పై ప్రకటన వచ్చేసింది. ఇదే విషయాన్ని తాజాగా గంగూలీ ప్రకటించారు. తన పాత్రలో కనిపించనున్న నటుడు ఎవరో కూడా ఆయన రివీల్ చేశారు. అయితే, ఈ బయోపిక్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఈ మూవీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా గురించి గంగూలీనే స్వయంగా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ పేరు తప్పక చరిత్రలో ఉంటుంది. ఇండియా తరఫున 113 టెస్టులు, 311 వన్డేలలో రాణించిన ఆయన అన్ని విభాగాల్లో కలిపి 18575 రన్స్ చేశారు. ఆయన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని వెండితెరపై ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని చూపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మీడియాతో మాట్లాడిన గంగూలీ పలు విషయాలు పంచుకున్నారు. ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నట్లు సౌరవ్ గంగూలీ తెలిపారు. తనకు తెలిసిన సమాచారం ఆయనే తన పాత్రలో నటిస్తున్నారని సౌరవ్ చెప్పుకొచ్చారు. కానీ, ఆయన షెడ్యూల్స్ బిజీగా ఉండటం వల్ల సరైన తేదీలు ఇంకా సెట్ కాలేదన్నారు. దీంతో ఈ సినిమా కోసం మరో ఏడాది పాటు ఆగాల్సి ఉంటుందని గంగూలీ అన్నారు.రాజ్ కుమార్ రావ్ బాలీవుడ్లో ప్రస్తుతం ఓ బిజీ స్టార్‌గా ఉన్నారు. రీసెంట్గా స్త్రీ2 సినిమాతో ఆయన మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం భూల్ చూక్ మాఫ్, టోస్టర్,మాలిక్ వంటి చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. గంగూలీ బయోపిక్‌లో ప్రముఖ బెంగాలీ నటుడిని కూడా చిత్ర యూనిట్ సంప్రదించారని తెలుస్తుంది. గంగూలీ స్నేహితుడైన ప్రొసేన్‌జిత్ ఛటర్జీని బయోపిక్‌లో నటించమని దర్శక, నిర్మాతలు కోరారట. ఇందుకు ప్రొసేన్‌జిత్ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ప్రొసేన్‌జిత్ సైడ్ అయిపోయి కొత్తగా రాజ్‌కుమార్ రావు తెరపైకి వచ్చాడు. -
మరింత యంగ్‌గా మాధురీ దీక్షిత్.. 57 ఏళ్లు అంటే నమ్ముతారా..? (ఫోటోలు)
-
ఆయుష్మాన్ కు జోడీగా...
హిందీలో ‘మైనే ప్యార్ కియా, హమ్ అప్ కే హై కౌన్, ఊంచాయీ’ వంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీసిన ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya) మరో కథను రెడీ చేశారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana) హీరోగా నటించనున్నారు.కాగా ఈ మూవీలో హీరోయిన్గా శార్వరీ(Sharvari)ని తీసుకోవాలనుకుంటున్నారట. సూరజ్ బర్జాత్యా వంటి సీనియర్ దర్శకుడి సినిమా కావడంతో శార్వరీ వెంటనే ఓకే చెప్పారని బాలీవుడ్ భోగట్టా. ఈ వేసవిలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
డాకు మహారాజ్ బ్యూటీకి అన్యాయం? ఓటీటీలో ఆమె సీన్స్ కట్!
సంక్రాంతి హిట్ బొమ్మ డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి రానుంది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. థియేటర్లో అదరగొట్టిన ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 21న) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. అయితే ఇటీవల ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్లో ఊర్వశి రౌతేలాను మిస్ చేయడంతో ఫ్యాన్స్ ఫైరయ్యారు. దీంతో మరో పోస్ట్‌లో ఊర్వశి రౌతేలా సహా డాకు మహారాజ్ మూవీలో నటించిన ప్రధాన పాత్రలు అందరూ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు.ఊర్వశికి అన్యాయం?ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈ మూవీలో కేవలం ఐటం సాంగ్‌లో ఆడిపాడటమే కాకుండా ఓ కీలక పాత్రలోనూ నటించింది. ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌కూ హాజరైంది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆమెకు మరోసారి భంగపాటు ఎదురుకానుందట! ఆమె నటించిన సీన్లు ఓటీటీలో కనిపించవంటూ ప్రచారం జరుగుతోంది. ఊర్వశి నటించిన సన్నివేశాలను నెట్‌ఫ్లిక్స్ నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోందని రూమర్లు వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడిందని, ప్రతి ప్రమోషన్‌కు హాజరైందని, అలాంటి తనకు ఎందుకింత అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. డాకు మహారాజ్అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. థియేటర్లో ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని యథాతథంగా ఓటీటీలోనూ విడుదల చేస్తున్నారట. అంటే ఊర్వశితో బాలయ్య నటించిన సన్నివేశాలు, డ్యాన్స్ స్టెప్పులు ఓటీటీలోనూ చూడొచ్చన్నమాట! డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు.చదవండి: 19 ఏళ్ల వయసులో బట్టతల.. భరించలేకపోయా: ఛావా నటుడు -
19 ఏళ్ల వయసులో బట్టతల.. భరించలేకపోయా: ఛావా నటుడు
జుట్టు రాలిపోవడం ఎంత పెద్ద సమస్య అనేది అనుభవించినవారికే తెలుస్తుంది. అందులోనూ చిన్నవయసులోనే జుట్టు రాలిపోతుంటే దాన్ని అరికట్టలేక, కవర్ చేయలేక నానాతంటాలు పడేవారు చాలామంది ఉంటారు. ఈ ఇబ్బందులు తానూ పడ్డానంటున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna). ఛావా సినిమా (Chhaava Movie)లో ఔరంగజేబుగా నటించి విశేష గుర్తింపు సంపాదించుకున్న ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హెయిర్ ఫాల్ గురించి మాట్లాడాడు. ఆ బాధ నాకు తెలుసు'చిన్న వయసులోనే తలపై వెంట్రుకలు ఊడిపోతే (Early Balding) ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చేతి వేళ్లను కోల్పోయినంత బాధగా, కష్టంగా ఉండేది. నాకది పెద్ద సమస్యలాగే కనిపించేది. 19 ఏళ్ల వయసులోనే జుట్టు ఊడిపోతుంటే భరించలేకపోయాను. అది మానసికంగా, వృత్తిపరంగా నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. నటుడిగా కొనసాగాలనుకునే వ్యక్తికి జుట్టు చాలా అవసరం. సడన్‌గా కంటిచూపు మందగిస్తే ఎలా ఉంటుంది?మనకు తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయన్నదాన్ని బట్టే ఎలాంటి ఆఫర్స్ వస్తాయనేవి ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జుట్టు రాలడాన్ని మనం తగ్గించలేం అన్న నిజాన్ని జీర్ణించుకునేవరకు తిప్పలు తప్పవు. కానీ చిన్న వయసులో జుట్టు కోల్పోవడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలాగే వయసు పెరిగేకొద్దీ కంటిచూపు సైతం మందగిస్తుంది. సడన్‌గా ఒక రోజు ఉదయం పేపర్ తిరగేద్దామంటే అక్షరాలు మసకబారినట్లు కనిపిస్తున్నాయనుకోండి. ఎలా ఉంటుంది? భయపడ్డా.. ఫోకస్ చేశాఅదేంటి నా కంటిచూపుకేమైంది? ఇకమీదట అద్దాలు పెట్టుకుంటే మాత్రమే కనిపిస్తాయా? అని ఆందోళన చెందుతాం కదా.. ఈ బట్టతల కూడా అలాంటిదే! దీనివల్ల నాకు సినిమా అవకాశాలు ఏమైనా తగ్గిపోతాయేమోనని భయపడ్డాను. కానీ తర్వాత నా లుక్స్ కంటే కూడా యాక్టింగ్ స్కిల్స్‌పైనే ఎక్కువ ఫోకస్ చేశాను. అందువల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను' అని అక్షయ్ ఖన్నా చెప్పుకొచ్చాడు.చదవండి: భార్యకు విడాకులిచ్చి హీరోయిన్‌తో ప్రేమాయణం?.. స్పందించిన హీరో -
'ఛావా'తో భారీ పాపులారిటీ.. ఏకంగా రెహమాన్‌తో కలిసి.. ఎవరీ వైశాలి?
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న చిత్రం 'ఛావా(Chhaava)'. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ మూవీ రూ.200 కోట్ల మార్క్‌ను దాటేందుకు సిద్ధమైంది.ఛావా కోసం కష్టపడ్డ హీరోమరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఈ చిత్రాన్ని రూపొందించాడు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ కత్తి సాము నేర్చుకోవడమే కాకుండా 100 కిలోల బరువు పెరిగి మరీ సాహసం చేశాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదలైన "ఆయా రే తూఫాన్" పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట పాడిందెవరో తెలుసా?ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటను పాడింది ఎవరో కాదు మరాఠీ సింగర్ వైశాలి సామంత్ (Vaishali Samant). ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆమె ఆయా రే తుఫాన్ సాంగ్‌తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఈ పాటను ఆలపించాడు. ఇర్షాధ్ కమిల్, క్షతిజ్ పట్వర్దన్ రచించారు.మిలియన్ల వ్యూస్ఈ పాట విన్న ఆడియన్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 37 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇదే విషయంపై వైశాలి మాట్లాడుతూ.."ఏ ఆర్ రెహమాన్ తో పాడే అవకాశం వచ్చినందుకు ఎప్పటికీ నేను కృతజ్ఞురాలినై ఉంటాను. ఛావా సినిమాలోని ఈ పాట నా సంగీత ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనది. ఆయన నా గానం పై నమ్మకం ఉంచి నాకు అవకాశాన్ని కల్పించారు. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియో లాంచ్ సందర్భంగా ఏఆర్ రెహమాన్‌తో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఒక గొప్ప అవకాశం. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని తెలిపింది. చదవండి: కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే? -
కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే?
సంజయ్‌దత్ (Sanjay Dutt) జీవితంలో ఆకాశమంత విజయాల్ని చూశాడు. జైలు జీవితం, డ్రగ్స్‌కు బానిసవడంతో తన పతనాన్నీ చూశాడు. క్యాన్సర్‌తో పోరాడి వారియర్‌గా గెలిచాడు. వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. మొదటి భార్య రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించగా రెండో భార్య రియా పిల్లైతో ఎంతోకాలం కలిసుండలేకపోయాడు. ప్రస్తుతం మూడో భార్య మాన్యతతో కలిసి జీవిస్తున్నాడు.గర్భంతో భార్య.. జైలుకు సంజయ్అయితే మాన్యత (Maanayata) గర్భం దాల్చినప్పుడు సంజయ్ చిక్కుల్లో పడ్డాడు. 1993 ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుల నుంచి అక్రమంగా ఆయుధాలను తీసుకున్న కేసులో సంజయ్ దత్ దోషిగా తేలాడు. దీంతో ఐదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించి 2016లో రిలీజయ్యాడు. అయితే సంజయ్ జైల్లో ఉన్నప్పుడు మాన్యత ప్రెగ్నెంట్. అలాంటి సమయంలో ఆమెను ఒంటరిగా వదిలేయాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని తన బెస్ట్ ఫ్రెండ్, నటి షీబా ఆకాశ్‌దీప్ (Sheeba Akashdeep)ను ఆదేశించాడు. సంజయ్ దత్-మాన్యత, షీబా ఆకాశ్దీప్ఫ్రెండ్ సాయం కోరిన నటుడుఈ విషయాన్ని షీబా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. జైలుకు వెళ్లేముందు సంజు నాతో మాట్లాడాడు. మాన్యత ఒంటరిగా ఉంది. తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే! అని నాపై భారం వేశాడు. సంతోషంగా అంగీకరించాను. ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్లేదాన్ని. తనతో కూర్చుని మాట్లాడేదాన్ని. ఒంటరితనం ఫీలవకూడదని నావంతు ప్రయత్నించాను. సంజూ బయటకు వచ్చేంతవరకు నేను తనతోనే ఉన్నాను. తొమ్మిది నెలలపాటు మాన్యతకే సమయం కేటాయించాను అని చెప్పుకొచ్చింది. తప్పదని తెలిశాక..2010 అక్టోబర్‌లో మాన్యత కవలపిల్లలకు జన్మనిచ్చింది. జైలు జీవితం గురించి సంజయ్‌దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను మొదటిసారి థానే జైలుకు వెళ్లినప్పుడు అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్.. ఇలా అందరూ వచ్చారు. జైలు బయట వీరు నాతో మాట్లాడిన ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి. జైలు జీవితం నుంచి తప్పించుకోలేను అని తెలిసినప్పుడు దాని గురించి అతిగా ఆలోచించడం దేనికనుకున్నాను. ఎంతో నేర్చుకున్నా..అన్నింటికీ సిద్ధంగా ఉండాలనుకున్నాను. ఏం జరిగినా స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. ఐదేళ్ల జైలు జీవితంలో ఎంతో నేర్చుకున్నాను. ఆ సమయంలో వంట చేయడం కూడా నేర్చుకున్నాను. వర్కవుట్స్ కూడా చేసేవాడిని అని పేర్కొన్నాడు. సంజయ్ జీవిత కథ ఆధారంగా సంజు అనే సినిమా తెరకెక్కింది. బాలీవుడ్లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం విలన్‌గా అలరిస్తున్నాడు. కేజీఎఫ్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.చదవండి: ప్రేమించిన వ్యక్తి కోసం సారిక చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది: నటుడు -
ప్రేమించిన వ్యక్తి కోసం సారిక చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది: నటుడు
మిసెస్ సినిమా (Mrs Movie)లో తన నటనతో ప్రశంసలు అందుకుంటున్నాడు సీనియర్ నటుడు కన్వల్జిత్ సింగ్ (Kanwaljit Singh). తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడు గతంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. కన్వల్జిత్ మాట్లాడుతూ.. 1985లో ఛప్టే ఛప్టే సీరియల్ చేశాను. సారిక (Sarika) నాతో జోడీ కట్టింది. కానీ అప్పుడు తను మద్రాస్‌లో ఉన్న ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడి కోసం షూటింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది. మళ్లీ సెట్‌కు రానేలేదు.ఆమె వెళ్లిపోవడం వల్ల..దానివల్ల ఒకరకంగా మంచే జరిగిందనుకుంటాను. సారిక స్థానంలో నటి అనురాధ పటేల్‌ను తీసుకున్నారు. అనురాధ నాకు జంటగా నటించింది. సీరియల్ షూటింగ్ సమయంలో మేము బాగా క్లోజ్ అయ్యాం. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్ (Kamal Haasan) కోసమే సారిక సీరియల్ వదిలేసుకుని మరీ వెళ్లిపోయింది. అప్పటికే కమల్‌కు వాణి గణపతితో పెళ్లవగా.. 1984లో ఆమెకు విడాకులిచ్చేశాడు. కమల్ రిలేషన్స్..1988లో సారికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2004లో విడాకులు తీసుకున్నారు. అనంతరం కమల్.. నటి గౌతమిని ప్రేమించాడు. కానీ పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడానికి ఇష్టపడ్డారు. అలా 2005-2016 వరకు కలిసున్నారు. తర్వాత బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.చదవండి: ‘హాలీవుడ్ రిపోర్టర్’పై అల్లు అర్జున్.. అరుదైన ఘనత -
రవీనా టాండన్ కూతురు రాషా థడానీ బ్యూటిఫుల్ (ఫొటోలు)
-
బాలీవుడ్ బులాయా
నార్త్ నుంచి సౌత్‌కి వచ్చే కథానాయికల సంఖ్య ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అయితే సీన్ మారింది. ఇప్పుడు దక్షిణాదిన పాపులర్ అయిన కథానాయికలను బాలీవుడ్ బులాయా (బాలీవుడ్ పిలిచింది). అలా ఇక్కడ సక్సెస్ అయి, బాలీవుడ్‌కి పరిచయం కానున్న కథానాయికలు కొందరు ఉన్నారు. ఆ తారలు హిందీలో చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. డబుల్ ధమాకా దక్షిణాదిలోని అగ్ర కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. అందం, అభినయం పరంగా ఇక్కడ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె హిందీలో రెండు సినిమాలు అంగీకరించారు. ఆ చిత్రాలు ‘రామాయణ’, ‘ఏక్ దిన్’. రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ’ మూవీ రూ΄÷ందుతోంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, లక్ష్మణుడి పాత్రలో రవి దుబే నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ కనిపిస్తారని బాలీవుడ్ సమాచారం. యశ్‌తో కలిసి నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. 2026 దీపావళికి తొలి భాగాన్ని, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అలాగే ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హిందీలో ‘ఏక్ దిన్’ (వర్కింగ్ టైటిల్) అనే మూవీ చేశారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అయితే ‘రామాయణ, ఏక్ దిన్’ చిత్రాల్లో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన రాలేదు. ఆ సంగతలా ఉంచితే... ‘ఏక్ దిన్’ ముందుగా రిలీజవుతుందని, ఈ మూవీతోనే సాయిపల్లవి బాలీవుడ్ ఫస్ట్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని టాక్. లవ్ ఫిల్మ్‌తో... తెలుగులో సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించారు హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ ఇప్పుడు హిందీలో నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు. బాలీవుడ్ నుంచి తనకు మంచి స్వాగతమే దక్కినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి రెండు ఆఫర్లు అందుకున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్షన్‌లోని ఓ లవ్ ఫిల్మ్‌లో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందట. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అనురాగ్ బసు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాయే కాకుండా సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నిర్మాత దినేష్ విజన్ ఓ మూవీని ΄్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా చర్చల్లో కూడా ఆమె పాల్గొన్నారు. క్వీన్ ఆఫ్ క్వీన్స్ ‘బింబిసార, విరూపాక్ష, డెవిల్: ది సీక్రెట్ ఏజెంట్’ వంటి తెలుగు హిట్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించారు హీరోయిన్ సంయుక్త. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకోనున్నారీ బ్యూటీ. కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా లీడ్ రోల్స్ చేస్తున్న హిందీ చిత్రం ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’లో సంయుక్త ఓ లీడ్ రోల్ చేస్తు న్నారు. చరణ్ ఉప్పలపాటి దర్శకత్వంలో వెంకట అనీష్, హర్మాన్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. తెలుగు హీరోయిన్ అనన్యా నాగళ్ల, కన్నడ హీరోయిన్ తన్వీ వంటి మరికొందరు తారల బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైందని సమాచారం. -
మొదటి ఆడిషన్.. ఆంటీ మాటలతో ఇబ్బందిగా ఫీలయ్యా: హీరోయిన్
బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి ప్రస్తుతం సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సిరీస్‌లో శ్వేతా బసు ప్రసాద్, జావేద్ జాఫేరి ఐమీ ఐలా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ సిరీస్‌గా 'ఊప్స్ అబ్ క్యా'ను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాల్ కులకర్ణి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సంఘటనలను వివరించింది. మొదటిసారి సినిమా ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నారు.సోనాలి కులకర్ణి మాట్లాడుతూ.. ' ఓ సినిమా ఆడిషన్ కోసం తన వద్ద ఉన్న ఏకైక పంజాబీ సూట్‌ను ధరించా. నాతో పాటు ఆడిషన్‌కు మరో 25 మంది అమ్మాయిలు హాజరయ్యారు. అయితే అప్పుడు డైరెక్టర్ గిరీష్ కర్నాడ్‌ను కలుస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. నేను లోపలికి వెళ్లగానే అక్కడ నా స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరిద్దరు నాకంటే పెద్దవాళ్లు కూడా ఉన్నారు. సిటీలో పేరున్న ఒకామె 'ఎందుకు వచ్చావ్' అని అడిగింది. ఆమె ప్రశ్నలోని వ్యంగ్యం నాకు అర్థం కాలేదు. అందిరిలాగే వర్క్‌షాప్‌కు వచ్చానని సమాధానం ఇచ్చా. కానీ ఆమె (ఆంటీ) నన్ను చూస్తూ కెమెరాలో ముదురుగా ఉండే అమ్మాయిలు చాలా బాగా కనిపించరని మీకు తెలియదా? అన్నారు. ఆ సమయంలో నాకు 16 ఏళ్ల వయసు. ఆమె మాటలతో చాలా ఇబ్బంది పడ్డా. చాలా డిస్టర్బ్ అయ్యా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపించింది.' అని వెల్లడించారు.ఆ తర్వాత జరిగిన ఆడిషన్లో డైరెక్టర్ గిరీశ్ కర్నాడ్ అందరినీ పలకరించాడు. ఆయన వచ్చాక నన్ను నేను పరిచయం చేసుకున్నా.. గిరీశ్ కర్నాడ్‌తో మాట్లాడిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. అంతకుముందు జరిగిన అవమానాన్ని మరిచిపోయేలా చేసింది. తాను 12వ తరగతి చదువుతున్నానని.. అంతేకాకుండా నాటకాల్లో చేస్తున్నట్లు డైరెక్టర్‌తో చెప్పినట్లు గుర్తు చేసుకుంది సోనాలి కులకర్ణి. -
జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి
ఈ వెబ్ సిరీస్‌లో నటి జ్యోతిక (Jyotika)ను తీసుకోవాలనుకోలేదు. ఆమెను తీసేసి తన స్థానంలో మరొకరిని పెడితే బాగుంటుందనుకున్నా అంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ (Shabana Azmi). షబానా, షాలిని పాండే, జ్యోతిక, సాయి తంహంకర్, గజ్రాజ్ రావు, జిస్సు సేన్‌గుప్తా, అంజలి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ (Dabba Cartel). ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో షబానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.జ్యోతికను తీసేయాలనుకున్నా..ఆమె మాట్లాడుతూ.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ సిరీస్‌లో ఇద్దరు నటీమణుల్ని తీసేయాలనుకున్నాను. అందులో జ్యోతిక కూడా ఉంది. ఆమెకు ఈ విషయం తెలియదు. తర్వాత నేనే జరిగింది చెప్పాను. అయితే జ్యోతికను తీసేయమని చెప్తే నా మాట వినలేదు. నీకేది నచ్చితే అది చేసుకో.. కానీ జ్యోతికను మాత్రం వదులుకోము అన్నారు. కట్ చేస్తే జ్యోతిక చాలా బాగా నటించింది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. జ్యోతిక, షబానా అజ్మీనా తప్పే..తనను తీసేయాలనుకోవడం ముమ్మాటికీ నా తప్పే. అదే జరుగుంటే నీతో కలిసి పనిచేసే ఛాన్స్ మిస్సయ్యేదాన్ని. ఈ సిరీస్‌ను నా కొడుకు(సవతి కుమారుడు), కోడలు నిర్మించినందున నేనేమీ ఆలోచించకుండా నటించాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. హితేశ్ భాటియా దర్శకత్వం వహించిన డబ్బా కార్టెల్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే? -
సికందర్ సర్ప్రైజ్ సిద్ధం
సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’(Sikandar). రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. కాగా మంగళవారం (ఫిబ్రవరి 18) సాజిద్ బర్త్ డే సందర్భంగా ‘సికందర్’ సినిమా నుంచి సల్మాన్ ఖాన్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నెల 27న ఈ చిత్రానికి సంబందించి, ఓ సర్ప్రైజ్ కూడా ఉందని పేర్కొన్నారు. ఆ రోజు ఈ సినిమా టీజర్ లేదా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఉండొచ్చని టాక్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలో ఉన్నారని సమాచారం.ఓ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారని, ఈ మూవీ కోసమే ఆయన సౌదీ వెళ్లారని, అలాగే సల్మాన్ ఖాన్‌తో పాటు సంజయ్ దత్ కూడా ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. -
కమాన్.. ఉదిత్ జీ.. ముద్దు పెట్టు... సానియామీర్జా, ఫరాఖాన్ సందడి!
ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్,బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకురాలు కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన వినోదాత్మక వ్లాగ్లకూ పేరొందారు. ఇక మాజీ టెన్నిస్ ప్లేయర్ హైదరాబాదీ సానియా మీర్జా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సన్నిహితులైన వీరిద్దరూ ఇటీవలే ఫరాఖాన్ ఇంటిలో కలిశారు. ఆమెతో పాటు ఆమె సోదరి అనమ్ మీర్జా కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా ఫరాతో కలిసి కిచెన్‌లో సందడి చేశారు. ఆమెతో పాటు వంట సెషన్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సానియా క్లాసిక్ హైదరాబాదీ–శైలి చికెన్ 65 వంటకాన్ని తయారు చేశారు, అదనపు సాస్‌లతో తన స్వంత సృజనాత్మక ట్విస్ట్‌ను ఫరా దానికి జోడించింది. ఇలా కిచెన్ లో వంటలో దినుసులు కలపడంతో పాటు హాస్యం పంచడంలో కూడా ఇద్దరు స్నేహితులు పోటీ పడడంతో ఈ ఎపిసోడ్ అంతా నవ్వులు, సరదాలతో నిండిపోయింది. సానియా ప్రతిభ టెన్నిస్ కోర్ట్‌కు మించి విస్తరించిందో లేదో చూడండి అంటూ ఫరా తన యూట్యూబ్ ఛానెల్లో తమ కిచెన్‌లో షూట్ చేసిన వీడియోను పంచుకుంది.తద్వారా వీక్షకులకు నిజమైన హైదరాబాదీ చికెన్ 65 రెసిపీని నేర్చుకునే అవకాశాన్ని కూడా వీరు అందించారు, ఇది ఏ సందర్భానికైనా సరిపోయే క్రిస్పీ ఫ్లేవర్ఫుల్ డిష్ గా వర్ణించారు. ఇదంతా ఒకెత్తయితే... ఈ సందర్భంగా ఫరా చూపిన హాస్య చతురత వీక్షుకులకు నవ్వుల్ని పంచింది. హాస్య స్వభావానికి పేరొందిన ఫరా... సానియా కుమారుడిని ముద్దు పెట్టమని ఉల్లాసంగా అడిగే విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. తన ఇంట్లో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న ఆ కుర్రాడి నుంచి బంతిని తీసుకున్న ఫరా, ఇజాన్ తన బంతిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ‘‘నీ నుంచి కొన్ని బ్రౌనీ పాయింట్లు సంపాదించడానికి నేను మీకు బంతిని తిరిగి ఇవ్వవలసి ఉంది‘ అని చెప్పారు. బంతిని ఇవ్వాలంటే ఓ షరతు కూడా విధించారు. అదేమిటంటే... ‘‘మొదట నన్ను నువ్వు ముద్దు పెట్టుకోవాలి, అదెలాగో నీకు తెలుసు. కమాన్... ముద్దివ్వండి ఉదిత్ జీలా ’’ అంటూ ఆ బాలుడ్ని అడగడం నవ్వుల్తో ముంచెత్తింది. ఈ వీడియోను చూసిన నెటిజనులు కూడా ఫరా హాస్య చతురతను కొనియాడుతున్నారు.ఇటీవల ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ ముద్దు ఉదంతం నెట్టింట సంచలనం సృష్టించింది. ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఉదిత్ నారాయణ్... తన పాటలతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు. అదే జోరులో ఆయన టిప్ టిప్ బర్సా పానీ పాట పాడుతూండగా పలువురు అభిమానులు ఆయన వేదికకు బాగా దగ్గరగా వచ్చేశారు. అలా పాట పాడుతూనే వేదిక మీద నుంచే ఒక అభిమానికి ఉదిత్ దగ్గరగా జరిగినప్పుడు ఆ యువతి ఆయనకు బుగ్గ మీద ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆయన ఏకంగా ఆమె పెదాల మీదే ముద్దు పెట్టేశారు. దీంతో ఈ ఉదంతం నెట్టింట ఉదిత్‌పై తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తడానికి దారి తీసింది. ఈ నేపధ్యంలోనే ఫరా... సానియా మీర్జా కుమారుడితో ‘‘నాకు ముద్దివ్వు ఉదిత్ జీ అవ్వు.. అంటూ అనడం నెటిజన్లను ఆకర్షించింది. -
జ్యోతిక ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్.. ఏ ఓటీటీలో చూడాలంటే?
షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో వస్తోన్న వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్' (Dabba Cartel Web Series). ఈ సిరీస్‌ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ వెబ్ సిరీస్‌ను క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్ డబ్బాల్లో లంచ్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్ రూపొందించారు. ఈ సిరీస్‌లో అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. They're cooking. And it's criminally good 👀 💸 Watch Dabba Cartel, out 28 February, only on Netflix. pic.twitter.com/ujxywmjaeW— Netflix India (@NetflixIndia) February 18, 2025 -
ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ సింగర్.. భార్య పేరును మాత్రం దాచిపెట్టాడు!
ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కొత్త ఏడాదిలో కొత్త బంధంలోకి పలువురు సినీతారలు అడుగుపెడుతున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. బాలీవుడ్ గేయ రచయిత, సింగర్ అనుప్ జైన్ ఓ ఇంటివాడయ్యారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు చెబతున్నారు.ప్రముఖ సింగర్ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో నూతన వధూవరులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న 2025న ఢిల్లీలో జరిగింది. కాగా.. అనువ్ జైన్ తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలైన హృది నారంగ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అనువ్ తన భార్య పేరును మాత్రం ఫోటోల్లో వెల్లడించలేదు. అయితే ఓ అభిమాని మాత్రం ఆమె పేరును కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేశాడు. ఇక నుంచి అనుప్ జైన్ వివాహం చేసుకున్నందున బ్రేకప్ సాంగ్స్ పాడటం ఆపేస్తాడని కొందరు నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేశారు.కాగా.. సెప్టెంబర్ 2022లో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనువ్ జైన్.. తాను రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. అనువ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి చాలా దూరంగా ఉంటరు. బాలీవుడ్ పలు చిత్రాలు పాటలు ఆలపించిన అనువ్.. ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా బారిషేన్, గుల్, అలాగ్ ఆస్మాన్ వంటి పాటలు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. -
'తుంబాడ్' మేకర్స్ క్రేజీ సినిమా ట్రైలర్ చూశారా..?
భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇదే సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన చిత్రం 'తుంబాడ్'.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు క్రేజీ (Crazxy Movie) అనే మూవీని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గిరీశ్ కోహ్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సోహుమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సోహుమ్ షాతో పాటు ముకేశ్ షా, అమిత్ సురేశ్, ఆదేశ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న రానుంది. తుంబాడ్ (2018) విషయానికి వస్తే.. హారర్ జానర్లో సెన్సేషన్ హిట్ అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. -
ఈ గుండు పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. బాల్యంలో మన చిలిపి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఎంతలా అంటే వాటిని చూసినప్పుడు.. అసలు అక్కడ నేనేనా అన్నంతలా ఉంటాయి. ఒక్కసారి ఆ బాల్యంలోకి తిరిగి వెళ్తే బాగుంటుందని అనుకోరు ఉండరేమో. ఆ చిన్ననాటి రోజులే బాగుండేవి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేవాళ్లమని ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటూనే ఉంటాం. అంతటి అద్భుతమైన క్షణాలు ఆ బాల్యపు రోజులు. ఆ రోజులనే మరోసారి గుర్తు చేసుకుంది మన స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆ తీపి గుర్తులను మీరు కూడా చూసేయండి.బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 1983 నుంచి 2008 వరకు తన జీవితంలో తీపి క్షణాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రియాంక చోప్రా ఎంతో క్యూట్‌గా కనిపించింది. చిన్నప్పటి తాను ఎంతలా మారిపోయిందో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.. మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ చేసింది. ఇవీ చూసిన కొందరు అచ్చం మీ కూతురు మాల్టీని తలపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్
వాలంటైన్స్ వీక్ అయిపోయింది. ఎన్నో ప్రేమ చిత్రాలు అటు థియేటర్లో, ఇటు ఓటీటీ (OTT)లో అలరించాయి. ఈ వారం కూడా అదే జోష్ కొనసాగేలా ఉంది. తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజవుతున్న సినిమాలు..బాపు - ఫిబ్రవరి 21రామం రాఘవం - ఫిబ్రవరి 21రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ - ఫిబ్రవరి 21జాబిలమ్మ నీకు అంత కోపమా - ఫిబ్రవరి 21ఓటీటీ రిలీజెస్..జీ5క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21 జియో హాట్స్టార్ది వైట్ లోటస్: సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 17విన్ ఆర్ లూజ్ - ఫిబ్రవరి 19ఊప్స్! అబ్ క్యా? - ఫిబ్రవరి 20ఆఫీస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21నెట్ఫ్లిక్స్అమెరికన్ మర్డర్: గాబీ పెటిటో (డాక్యు సిరీస్) - ఫిబ్రవరి 17కోర్ట్ ఆఫ్ గోల్డ్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 18జీరో డే (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20డాకు మహారాజ్ - ఫిబ్రవరి 20 అమెజాన్ ప్రైమ్రీచర్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆపిల్ టీవీ ప్లస్సర్ఫేస్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21హోయ్చోయ్చాల్చిత్రో: ద ఫ్రేమ్ ఫాటల్ - ఫిబ్రవరి 21చదవండి: ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్ -
లాజిక్ లేకపోయినా రాజమౌళి సినిమాలు సూపర్‌హిట్టు: కరణ్ జోహార్
కొన్ని సినిమాలకు లాజిక్‌తో పని లేదంటున్నాడు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar). కథపై నమ్మకం ఉంటే చాలు అవి హిట్టవుతాయంటున్నాడు. తాజాగా కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మనం ఎంచుకున్న కథను నమ్మడం అన్నింటికన్నా ముఖ్యమైనది. కొందరు ఉత్తమ దర్శకులనే ఉదాహరణగా తీసుకోండి.. వారు లాజిక్స్‌ను పట్టించుకోకుండా కథను నమ్మడం వల్లే పెద్ద విజయాలు అందుకున్నారు.లాజిక్ లేకపోయినా..సినిమా నచ్చితే లాజిక్‌ను ఎవరూ పట్టించుకోరు. ఉదాహరణకు రాజమౌళి (SS Rajamouli) సర్ సినిమాలే తీసుకోండి. ఆయన తీసిన సినిమాల్లో లాజిక్స్ గురించి జనాలు మాట్లాడుకుంటారా? లేదు కదా.. ఆయనకు కథపై పూర్తి నమ్మకం ఉంటుంది. ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కించగలరు. యానిమల్, ఆర్ఆర్ఆర్, గదర్.. ఈ సినిమాలన్నింటికీ ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ప్రేక్షకులు నమ్మారుఒక వ్యక్తి సింగిల్ హ్యాండ్‌తో వెయ్యిమందిని కొడుతున్నట్లు చూపించినప్పుడు అది ఎలా సాధ్యం? అని ఎవరూ లెక్కలు వేయరు. సన్నీ డియోల్ (Sunny Deol)కు వెయ్యి మందిని ఓడించే శక్తి ఉందని అనిల్ శర్మ నమ్మాడు. అదే వెండితెరపై చూపించాడు. ప్రేక్షకులూ అదే విశ్వసించారు. అందుకే గదర్ 2 అంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దర్శకులు తమ కథను నమ్మినప్పుడే విజయాలు సాధించగలరు. చేసే పనిని సందేహించినా, ఆడియన్స్ ఏమనుకుంటారోనని లాజిక్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినా సమస్యలు చుట్టుముట్టడం ఖాయం' అని చెప్పుకొచ్చాడు.నిర్మాతగా ఫుల్ బిజీకరణ్ జోహార్ ప్రస్తుతం 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా నిర్మిస్తున్నాడు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్య మల్హోత్రా, రోహిత్ శరఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కరణ్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో అక్షయ్‌కుమార్- మాధవన్‌ల కేసరి: చాప్టర్ 2తో పాటు కార్తీక్ ఆర్యన్‌తో మరో సినిమా చేస్తున్నాడు.చదవండి: ఓటీటీ సెన్సేషన్.. జాన్వీ కపూర్ కంటే గొప్ప నటి.. అయినా పట్టించుకోరే? -
ఓటీటీ సెన్సేషన్.. జాన్వీ కపూర్ కంటే గొప్ప నటి.. అయినా పట్టించుకోరే?
ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్న సినిమా మిసెస్ (Mrs). మలయాళంలో వచ్చిన 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమా (The Great Indian Kitchen Movie)కి ఇది హిందీ రీమేక్. సన్యా మల్హోత్రా (Sanya Malhotra) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జీ5లో అందుబాటులో ఉంది. జీ5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌తో పాటు గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాగా మిసెస్ రికార్డు సృష్టించింది. ఓటీటీలో సూపర్ హిట్ సినిమాగా మిసెస్పెళ్లి తర్వాత ఎంతోమంది అమ్మాయిల జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ మూవీలో సన్యా.. రిచా పాత్రలో జీవించేసింది. ఇంతకుముందు కూడా ఆమె విభిన్నరకాల పాత్రలు పోషించింది. దంగల్, హిట్: ద పస్ట్ కేస్ (హిందీ), కాథల్, పాగ్లైట్ (Pagglait) వంటి పలు చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అయినప్పటికీ ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఇంకా సెకండ్ హీరోయిన్ ఏంటి?'ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దమవుతోంది. తొమ్మిదేళ్లకాలంలో ఆమె హీరోయిన్గా చేసిన రెండే రెండు సినిమాలు థియేటర్లో రిలీజయ్యాయి. ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా చేస్తోంది. అందులో జాన్వీ (Janhvi Kapoor) ఫస్ట్ హీరోయిన్ అయితే సన్యా సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది' అని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. జనాలకు ఏం కావాలో బాలీవుడ్ అస్సలు పట్టించుకోదు. జాన్వీ కంటే కూడా సన్యా చాలా గొప్ప నటి, పెద్ద సినిమాల్లో తనకు కథానాయికగా అవకాశాలివ్వొచ్చుగా అంటున్నారు. ఇలాంటివారు దొరకడమే అరుదు'దర్శకుల కంటికి ఈమె ఎందుకు కనిపించడం లేదో అర్థం కావట్లేదు. తను నటించగలదు, అద్భుతంగా డ్యాన్స్ కూడా చేయగలదు. ఈ జనరేషన్లో ఇలాంటి రెండు లక్షణాలున్నవారు దొరకడం చాలా అరుదు. పైగా తను ఎలాంటి జానర్లోనైనా ఇట్టే ఇమడగలదు', 'ఇప్పుడు ఇండస్ట్రీలో సన్యా ఉత్తమ నటి. కానీ తనకు మంచి అవకాశాలు రావడం లేదు' అని కామెంట్లు చేస్తున్నారు. మిసెస్ సినిమా విషయానికి వస్తే.. దీనికి అరతి కడవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నిశాంత్ దహియా, కన్వల్జిత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Cinematic Syndicate (@cinematic.syndicate) చదవండి: తెలుగు సినిమా సెట్లో పదేపదే ఇబ్బంది పెట్టారు: శ్వేతా బసు ప్రసాద్ -
'ది రోషన్స్' సిరీస్ పార్టీ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
నటుడు చేసిన పనికి ఏడ్చేసిన అత్త.. గ్రేట్ అంటూ ప్రశంసలు!
బుల్లితెర నటుడు షోయబ్ ఇబ్రహీం (Shoaib Ibrahim) చేసిన పనికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత మంచి భర్త దొరికిన ఆ ఇల్లాలు ఎంతటి అదృష్టవంతురాలంటూ నటి దీపిక కకర్ను (Dipika Kakar) మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరీ షోయబ్? అందరూ మెచ్చేలా ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే! షోయబ్ ఇబ్రహీం బుల్లితెర నటుడు. రెహ్నా హై తేరీ పాల్కన్ కీ ఛావో మే సీరియల్‌తో తన ప్రయాణం ప్రారంభించాడు. 'సాసురాల్ సిమర్ కా' ధారావాహికలో ప్రధాన పాత్ర పోషించి మెప్పించాడు. ఇందులో యాక్ట్ చేసిన నటి దీపికతో ప్రేమలోనూ పడ్డాడు. ఆమెతో కలిసి నాచ్ బలియే ఎనిమిదో సీజన్లో పార్టిసిపేట్ చేశాడు. షోయబ్ నటించిన ఏకైక మూవీ బెటాలియన్ 609. 2018లో దీపిక- షోయబ్ పెళ్లి జరిగింది. వీరికి 2023లో బాబు రుహాన్ పుట్టాడు. ఇదీ ఆయన పర్సనల్ స్టోరీ.ఇంతకీ షోయబ్ ఏం చేశాడంటే?పెళ్లయ్యాక అమ్మాయిలకు అత్తారిల్లే సర్వస్వం అంటారు. కానీ అదే మాట అబ్బాయి చెప్తే ఎలా ఉంటుంది? సర్వస్వం అని కాకపోయినా తన భార్య పుట్టిల్లు బాధ్యత కూడా భుజాన వేసుకుంటే ఎలా ఉంటుంది? అదే పని చేశాడు షోయబ్. అత్తగారికి ఇల్లు కొనిచ్చాడు. ఎప్పుడూ మాకోసమే ఆలోచించే తన కోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఇంటిని బహుమతిగా ఇచ్చానంటున్నాడు. భర్త చేసిన పనికి దీపిక సంతోషంతో ఉప్పొంగిపోతోంది.తన యూట్యూబ్ ఛానల్లో దీపిక మాట్లాడుతూ.. జీవితంలో అతి పెద్ద వరం ఏంటో తెలుసా? ఇల్లు. నువ్వు నీ తల్లి కోసం ఇదివరకే ఇంటిని బహుమతిగా ఇచ్చావు. ఇప్పుడు నీ అత్తగారికి ఇంటిని వరంగా అందించావు అని ఎమోషనలైంది. కొత్తింటి పత్రాలను షోయబ్ దంపతులు.. దీపిక తల్లికి అందించారు. వాటిని చేతిలోకి తీసుకున్న ఆమె సొంత కుటుంబం తనకు ఏదీ ఇవ్వకపోయినా నా కూతురు దీపిక ఫ్యామిలీ మాత్రం నాకు ఎన్నో చేస్తోంది అంటూ సంతోషంతో ఏడ్చేసింది.చదవండి: Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ? -
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. హీరోగా ఎవరంటే?
-
48 ఏళ్ల వయసులో నటుడి రెండో పెళ్లి.. వయసుతో సంబంధం లేదంటూ..
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan).. 48 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కాడు. ఫిబ్రవరి 9న ప్రియురాలు మిలేనా అలెగ్జాండ్ర (22)ను వివాహం చేసుకున్నాడు. ఫైనల్లీ నా బేబీతో పెళ్లి జరిగిందంటూ పలు ఫోటోలను సాహిల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నటుడికి ఇది రెండో పెళ్లి కాగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ఈ వేడుకకు వేదికగా మారింది. ఈ దంపతుల మధ్య వయసు వ్యత్యాసం 26 ఏళ్లు ఉండటం గమనార్హం!పరిచయంఏజ్ గ్యాప్‌తో పాటు, తన ప్రేమకథ గురించి సాహిల్ మాట్లాడుతూ.. ఒక రెస్టారెంట్‌కు నా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాను. అక్కడ అలెగ్జాండ్ర (Milena Alexandra)ను చూశాను. ఆమె తన తల్లితో కలిసి డిన్నర్ చేస్తోంది. తనను చూడగానే ఫిదా అయిపోయిన నేను మోడలింగ్ కోసం ఫోటోషూట్ చేస్తావా? అని అడిగాను. అందుకామె తనకు ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించింది.26 ఏళ్ల ఏజ్ గ్యాప్తను మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నానంది. పెళ్లి, పిల్లలతో కుటుంబజీవితం గడపాలనుందని చెప్పింది. తన నిజాయితీ, సింప్లిసిటీ నన్ను మరింత ఆకట్టుకున్నాయి. అప్పుడే తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా రెస్టారెంట్లో మా ప్రయాణం మొదలైంది. నాకంటే తను 26 ఏళ్లు చిన్నది. కానీ ప్రేమకు వయసుతో సంబంధం లేదు. తను కూడా అదే నమ్మింది.అప్పుడు 21 ఏళ్లు మాత్రమేప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. కలిసి ముందుకు సాగడం. నాకు తను పరిచయమైనప్పుడు ఆమ వయసు 21 ఏళ్లు మాత్రమే! కానీ చాలా విషయాల్లో ఆమె ఎంతో హుందాగా ఆలోచిస్తుంది. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తుంది అని చెప్పుకొచ్చాడు. కాగా సాహిల్.. స్టైల్, ఎక్స్‌క్యూజ్‌మీ, అల్లావుద్దీన్, రామా: ద సేవియర్ వంటి చిత్రాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Sahil Khan (@sahilkhan) View this post on Instagram A post shared by Sahil Khan (@sahilkhan) View this post on Instagram A post shared by Sahil Khan (@sahilkhan) చదవండి: పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన పుష్ప విలన్ జాలిరెడ్డి.. హాజరైన సుకుమార్ -
ప్రభాస్ ఫౌజిలో యువరాణి?
ప్రభాస్(Prabhas) హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) ఓ కీలక పాత్రలో అతిథిగా మెరవనున్నారనే టాక్ వినిపిస్తోంది.పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా ఓ యువరాణి పాత్ర చేయనున్నారని భోగట్టా. సినిమాలో కీలకంగా ఉండే ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ ఆమెను సంప్రదించగా, ఆమె కూడా పచ్చజెండా ఊపారని బాలీవుడ్ టాక్. మరి ‘ఫౌజి’లో ఆలియా భట్ అతిథి పాత్రలో నటిస్తారా? లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (2022) చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక జయప్రద, మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఫౌజి’కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. -
చాలా భయంగా ఉంది.. వివాదం తర్వాత ఏం జరిగిందంటే?: యూట్యూబర్
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) ప్రస్తుతం ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ యావత్‌దేశం అతడిని దుమ్మెత్తిపోసింది. అది నోరా? డ్రైనేజీనా? అంటూ తిట్లదండకం అందుకుంది. ఇతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి.ఫోన్ స్విచ్ఛాఫ్?అయితే అల్హాబాదియా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నాడని, అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడని రూమర్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై అతడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నేను, నా టీమ్ పోలీసులకు సహకరిస్తున్నాం. వారికి నేను అందుబాటులోనే ఉన్నాను. తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశాను, వారిని అవమానించాను. అందుకు నన్ను క్షమించండి. ఈ విషయంలో నేను కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సింది.నా తల్లి క్లినిక్‌పై దాడిచాలామంది నన్ను చంపుతానని బెదిరిపిస్తున్నారు. నాతో సహా నా కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బెదిరిస్తున్నారు. కొందరైతే రోగులుగా నటిస్తూ మా అమ్మగారి క్లినిక్‌కు వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించారు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. పోలీసులపై, భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని రణ్వీర్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Ranveer Allahbadia (@beerbiceps) చదవండి: జీవితంలో పెళ్లే చేసుకోనన్న జాలిరెడ్డి.. ఇప్పుడేకంగా లవ్ మ్యారేజ్ -
పెళ్లి, పిల్లలు వద్దంటేనే సినిమా ఛాన్స్..: హీరోయిన్
'పెళ్లి, ప్రెగ్నెన్సీకి దూరంగా ఉంటేనే సినిమా ఛాన్స్' అని హీరోయిన్లతో నిర్మాతలు ఒకప్పుడు బలవంతంగా సంతకం చేయించుకునేవారట. ఎవరిదాకానో ఎందుకు? తనతోనూ అలాంటి అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకున్నారంటోంది సీనియర్ హీరోయిన్ షీబా ఆకాశ్‌దీప్ (Sheeba Akashdeep Sabir). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు టాప్ హీరోయిన్లందరూ స్టార్ హీరోలతో జత కడుతున్నారు. పెద్దగా తారతమ్యాలు లేవు.హీరోయిన్గా కొంతకాలమే..అయితే అప్పటికీ, ఇప్పటికీ హీరోలు దశాబ్దాలతరబడి కథానాయకులుగానే కొనసాగుతున్నారు. కానీ మాకు ఆ అవకాశం లేదు. హీరోయిన్గా చేయడానికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. అది అయిపోయాక ఇదిగో నాలా క్యారెక్టర్ రోల్స్ చేయాల్సిందే! గతంలో ఓ భయంకరమైన కండీషన్ ఉండేది. మా తరంవారికి ఎవరికైనా బాయ్‌ఫ్రెండ్ ఉంటే అది బయటకు చెప్పాలంటేనే భయపడేవాళ్లం. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్ అంటే సింగిల్‌గానే ఉండాలన్న రూల్ ఉండేది. భయంకరమైన కాంట్రాక్ట్ప్రేమలో ఉన్నామని తెలిస్తే ఏవేవో పుకార్లు పుట్టుకొచ్చేవి. పెళ్లయిందంటే ఏకంగా ప్యాకప్ చెప్పాల్సిందే! అందుకనే నిర్మాతలు మాతో ముందుగానే ఓ అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకునేవారు. మేము పెళ్లి చేసుకోము, పిల్లల్ని కనము అని అందులో రాసుండేది. ఇది అత్యంత భయంకరమైన కాంట్రాక్ట్. అని చెప్పుకొచ్చింది. షీబా ఆకాశ్‌దీప్.. యే ఆగ్ కబ్ బుజేగి (1991) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. నచ్నేవాలే గానేవాలె, సూర్యవంశీ, హమ్ ఐ కమాల్ కె, ప్యార్ కా రోగ్, సురక్ష, కాలియా, మిస్ 420, కాలా సామ్రాజ్య, దమ్ వంటి చిత్రాలు చేసింది. చివరగా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని సినిమాలో మెరిసింది.చదవండి: బాక్సాఫీస్‌పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్! -
బాలీవుడ్ కు తిరిగొస్తున్న కిక్కోడు
-
బిజీ అయిపోయిన మోనాలిసా.. అప్పుడే గెటప్ మార్చేసిందిగా!
కుంభమేళాతో మోనాలిసా (Monalisha Bhosle) దశ తిరిగిపోయింది. పూసలమ్ముకునేందుకు కుంభమేళాకు వచ్చిన ఆమె తన అందమైన తేనెకళ్ల కారణంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. సోషల్ మీడియా ఆమెకు దాసోహమైపోయింది. ఇంత అందాలరాశి ఇన్నాళ్లూ ఏమైపోయిందన్నట్లుగా కుప్పలుతెప్పలుగా కామెంట్లు.. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ కూడా!విమానం ఎక్కిన మోనాలిసాబాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు 'ది డైరీ ఆఫ్ మణిపూర్' (The Diary of Manipur) సినిమాలో అవకాశం ఇచ్చాడు. అంతేకాదు, నిరక్షరాస్యురాలైన ఆమెకు చదువు నేర్పించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఇప్పుడు ముఖానికి మేకప్ వేసి అందంగా ముస్తాబవడాన్ని కూడా నేర్పించాడు. కేరళలో ఓ షాప్ ఓపెనింగ్ కోసం ఆమెను దగ్గరుండి తీసుకెళ్లాడు. అది కూడా విమానంలో! విమానం ఎక్కడం మొదటిసారి కావడంతో మోనాలిసా కొంత భయం, మరికొంత సంతోషానికి లోనైంది. లుక్ మార్చేసిన బ్యూటీఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇక షాప్ ఓపెనింగ్‌లో మోనాలిసా తన గెటపే మార్చేసింది. తన జుట్టును చిన్నగా కత్తిరించుకుని దాన్ని స్టైల్ చేసింది. రెడ్ కలర్ గాగ్రా డ్రెస్‌లో మెరిసింది. తన లుక్‌ను చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు మరింత అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఒక్క కుంభమేళా తన జీవితాన్నే మార్చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by monalisha Bhosle💫 (@monalisa__bhosle) View this post on Instagram A post shared by monalisha Bhosle💫 (@monalisa__bhosle) చదవండి: నేను హీరో అనగానే చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు: లవ్‌టుడే హీరో -
'ఛావా' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ఛావా (Chhaava Movie). ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj) జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. లక్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ శంభాజీ మహారాజ్‌గా, అతడి భార్య మహారాణి ఏసుబాయిగా రష్మికా మందన్నా నటించారు.భారీ బడ్జెట్‌తో దినేష్ విజన్ నిర్మించిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి సినిమాకు వస్తున్న స్పందన ఏంటో తెలియాలంటే ఎక్స్ (ట్విటర్) రివ్యూ చూసేయండి..'విక్కీ కౌశల్.. గొప్ప నటుడు అని ఛావాతో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు ఈ సినిమా ఒక నివాళి' అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు.#ChhaavaInCinemasEvery frame & every tear is a tribute to the #ChhatrapatiSambhajiMaharaj 🔥Every Hindu should watch #Chhaava#VickyKaushal has proven he is one of the best Actor in Bollywood, way ahead of Khans pic.twitter.com/D0SOlTQHMN— Hemir Desai (@hemirdesai) February 14, 2025 ఛావా చాలా బాగుంది. క్లైమాక్స్‌లో ఫుల్ ఎమోషనల్ అయ్యా అని ఓ తెలుగు యూజర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.#chhaava movie chala bagundi 🔥Full Emotional ayya climax lo 🥺😔Jai Sambhu Raje 🚩— 𝐒𝐫𝐢𝐤𝐚𝐧𝐭𝐡 𝐏𝐒𝐏𝐊™🚩 (@Srikanth_OG) February 14, 2025నిజమైన సూపర్ హీరో ఎవరనేది ప్రపంచానికి చూపించిన లక్ష్మణ్ ఉటేకర్ సర్‌కు ధన్యవాదాలు. పాత్రకు ప్రాణం పోసిన విక్కీ కౌశల్‌కు థాంక్స్. షేర్ శంభాజీ మన మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటాడు అని మరో యూజర్ పేర్కొన్నాడు.Thank you Laxman Utekar sir✨You showed world about the real superhero.Thank you @vickykaushal09 for the justice to the role.Sher sambhaji lives on✨ #Jagdamb💖#Chhaava #ChhatrapatiSambhajiMaharaj— Manifest For Good 💫 (@SHUBHAMGAIKAR14) February 14, 2025 Kindness & valour were Chhatrapati Sambhaji Maharaj's strongest virtues. #VickyKaushal knew all that & more thus raising the bar once more with precision & accuracy. To see this guy mould into something which only could’ve read & heard about is beyond awards & ratings.#Chhaava pic.twitter.com/De7eQ5JuEo— Amar Singh Rathore (@amarsr_1990) February 14, 2025Real Bollywood magic!Vicky Kaushal's performance is mind-blowing, giving pure goosebumps. Housefull at 5:45 AM show🎥🔥#Chhaava #ChhaavaInCinemas #ChhaavaOn14Feb pic.twitter.com/mpRkGabPr0— Mr. Perfect (@DS24IN) February 14, 2025The film is good, but Vicky is EXCEPTIONAL!!! What a performance! The end will leave you numb. Took me a while to get up from my seat when the credits rolled. Please watch it in theatres! Phone, laptop, tv pe wo feel nahi ayegi. ⭐️⭐️⭐️⭐️ Detailed review soon! #Chhaava… pic.twitter.com/VZgZT5grpj— OCD Times (@ocdtimes) February 14, 2025#VickyKaushal shines in #Chhaava, but other actors are just okay. The film feels long, and the BGM doesn’t fit the era. Still, it’s decent. The last 20 minutes hit hard & stay with you. 💔 Highly recommend watching in theaters! 🎬🔥 #ChhaavaReview pic.twitter.com/TLEu3kxteP— Movies Talk Official (@moviestalkhindi) February 14, 2025My Final Verdict: Chhaava is a gripping, performance-driven historical drama that shines through its stellar cast. The second half takes the intensity to another level. Vicky Kaushal delivers a career-defining act while Akshaye Khanna as Aurangzeb is chillingly ruthless#Chhaava pic.twitter.com/pURGeZfBkf— Cinema Fable (@cinemafable1) February 14, 2025Chhaava is blockbuster 😊vicky is absolute charm born to play this role, rashmika brings best out of her, akshay khanna take a bow man , maddcok films is the top production house in india they should enter into south for sure. 🎶 & direction super #Chhaava #VickyKaushal pic.twitter.com/cYDbY4SbWI— @Politics& Popcorn 📖 (@Political_star1) February 14, 2025ChhaavaInCinemas #Chhaava Every frame & every tear is a tribute to the Maratha pride🫡💥#VickyKaushal fierce portrayal makes u feel his pain, power, & unbreakable will🙏🏻😍@iamRashmika is heartbeat of the story😍 Animal, Pushpa & now this. #Chhaava pic.twitter.com/AixrmULfw5— 🖤⃝ 𝐑𝐚𝐯𝐚𝐧😂🖤🫀 (@RavanDJ1210) February 14, 2025 -
‘చావా’ మూవీ ప్రీమీయర్ షోలో రష్మిక సందడి (ఫొటోలు)
-
భార్య వేధింపులు తాళలేక సింగర్ ఆత్మహత్య
భార్య మానసికంగా చిత్రహింసలు పెడుతుంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితి. చెప్పినా ఎవరూ పట్టించుకోని దుస్థితి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, నరక కుంపటి నుంచి బయటపడే ఆలోచనలో ఆత్మాహుతి చేసుకుంటున్న భార్యాబాధితులెందరో! ఈ మధ్య అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కర్ణాకటలో కానిస్టేబుల్ తిప్పన్న, రాజస్తాన్‌లో డాక్టర్ అజయ్‌కుమార్, ఢిల్లీలో పునీత్ ఖురానా.. ఇలా రోజుకో ఉదంతం బయటకు వచ్చింది. విషం తాగి..తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సింగర్, ర్యాపర్ (Odia Rapper) అభినవ్ సింగ్ (Abhinav Singh) చేరినట్లు తెలుస్తోంది.. ఒడిశాకు చెందిన ర్యాపర్ అభినవ్ సింగ్ (32) బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబసభ్యులే కారణమంటూ సింగర్ తండ్రి బిజయ్ నందా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య వేధింపుల వల్లే?దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి అభినవ్.. భార్య వేధింపుల వల్లే ప్రాణాలు తీసుకున్నాడా? వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. కాగా అభినవ్ ఒడియా ర్యాప్ సాంగ్స్‌తో ఫేమస్ అయ్యాడు. కథక్ ఆంథెమ్ సాంగ్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ఇతడు అర్బన్ లోఫర్ అనే మొదటి హిప్ హాప్ లేబుల్‌ను స్థాపించాడు.చదవండి: డిజాస్టర్ దిశగా అజిత్ పట్టుదల.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే? -
ప్రభాస్ చిత్రంలో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు.. డైరెక్టర్ ఎవరంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది కల్కి 2898తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ మారుతి డైరెక్షన్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు.ది రాజాసాబ్‌లో ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో పని చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, డైరెక్టర్‌తో హను రాఘవపూడితో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా.. అనుపమ్ ఖేర్ బాలీవుడ్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో మరింత ఫేమస్ అయ్యారు. ANNOUNCEMENT: Delighted to announce my 544th untitled film with the #Bahubali of #IndianCinema, the one and only #Prabhas ! The film is directed by the very talented @hanurpudi ! And produced by wonderful team of producers of @MythriOfficial ! My very dear friend and brilliant… pic.twitter.com/sBIXCS98t6— Anupam Kher (@AnupamPKher) February 13, 2025 -
మూడు లగ్జరీ ఫ్లాట్స్ కొన్న బిగ్‌బాస్ విన్నర్.. ధర ఎన్ని కోట్లంటే?
గౌహర్ ఖాన్.. బాలీవుడ్లో ఆమె పేరు చాలా పాపులర్. బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్, టీవీ స్టార్,మోడల్,హీరోయిన్ ఇలా పలు రంగాల్లో రాణించింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో తెలుగు వారికి గౌహర్ ఖాన్ సుపరిచయమే. ఇందులో 'నాపేరే కాంచనమాల' అనే స్పెషల్ సాంగ్‌తో అభిమానులను ఓ రేంజ్లో అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్ భామ.అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబయిలో ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వర్సోవా ప్రాంతంలో దాదాపు రూ.10 కోట్లకు పైగా విలువ చేసే మూడు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. వీటిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుంది. కాగా.. 2013లో బిగ్ బాస్ సీజన్- 7 టైటిల్ గెలిచిన గౌహర్ ఖాన్, మోడలింగ్‌తో పాటు హిందీ చిత్రాల్లో నటించింది.18 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ ఆరంభించిన గౌహర్‌ఖాన్ పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె పలు సీరియల్స్‌లోనూ నటించారు. గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాలతో పాటు తాండవ్ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరును తెచ్చాయి. 2020లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్(25)ను పెళ్లాడింది. ఆమె కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో విమర్శలొచ్చాయి. -
నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో పట్టించుకోను: ఆర్ మాధవన్
హీరో మాధవన్ (R Madhavan) తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ పలు సినిమాల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో 3 ఇడియట్స్ మూవీ చేశాడు. అప్పట్లో ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇటీవల హిసాబ్ బార్బార్ మూవీతో అభిమానులను పలకరించాడు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది.అయితే తాజాగా హీరో మాధవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ఆర్థిక క్రమశిక్షణ, జీవనశైలి గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎప్పుడు ఆలోచించలేదని ఆయన అన్నారు. నా బ్యాంక్ ఖాతా పట్ల నేను అభద్రతా భావంతో ఉంటానని తెలిపారు. నా దగ్గర ఎంత ఉందో నాకు తెలియదు.. కానీ ప్రతిసారీ నేను బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు ఇష్టపడను అన్నారు. ఎందుకంటే అలా చేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు కానీ.. నేను ఎంత సంపాదిస్తున్నానో.. ఎంత ఖర్చు పెడుతున్నానో నాకు కచ్చితమైన అవగాహన అయితే ఉంది' అని వెల్లడించారు.కెప్టెన్ లైసెన్స్ ఉంది..తన కొత్త నైవుణ్యం గురించి మాధవన్ మాట్లాడుతూ.. "నా దగ్గర ఒక సాధారణమైన చిన్న పడవ ఉంది. అది నా కుటుంబానికి సరిపోతుంది. కొవిడ్ సమయంలో నేను నేర్చుకున్న కొత్త నైపుణ్యం నా కెప్టెన్ లైసెన్స్ పొందడమే. బోట్లో నావిగేట్ చేయడం నేర్చుకున్నా. ఇదేమీ కష్టమైన పని కాదు. మీరు కూడా 10-15 రోజులు నేర్చుకుంటే లైసెన్స్ వచ్చేస్తుందని' సలహా ఇచ్చారు.మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హిసాబ్ బరాబర్ . అశ్వని ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అతను ఫాతిమా సనా షేక్‌తో కలిసి ఆప్ జైసా కోయిలో చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
చిలుకతో వర్మ హీరోయిన్ పోటీ.. అరుణాచలంలో బిగ్‌బాస్ బ్యూటీ
బ్లూ డ్రెస్‌లో రీతూ చౌదరిజ్ఞాపకాలు పంచుకున్న హీరోయిన్ అన్షుడీప్ నెక్ టాప్‌ను ఇలా ఫిక్స్ చేయండంటోన్న అన్షులా కపూర్రామచిలుకతో పోటీపడుతున్న ఆరాధ్య దేవిఅరుణాచల శివుడిని దర్శించుకున్న బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ, యాంకర్ లాస్య View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor) View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
నా భార్య వంట చేస్తే నేను బోళ్లు తోముతా: హీరో
కష్టసుఖాల్నే కాదు, ఇంటిపనినీ సమంగా పంచుకుంటే భార్యాభర్తల మధ్య ఏ గొడవా ఉండదంటున్నాడు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao). మరో రెండు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం వస్తోంది. ఈ సందర్భంగా ప్రేమజంటలకు, పెళ్లి జంటలకు రాజ్‌కుమార్ రావు- పాత్రలేఖ (Patralekhaa) దంపతులు కొన్ని సూచనలిస్తున్నారు. ముందుగా పాత్రలేఖ మాట్లాడుతూ.. మా బంధంలో ఎవరి ఆధిపత్యం ఉండకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాం. బాగా సర్దుతాడుచిన్నదైనా, పెద్దదైనా ప్రతీ విషయాన్ని, పనిని షేర్ చేసుకోవాలని నియమంగా పెట్టుకున్నాం. తను అన్నింటినీ చక్కగా సర్దుతాడు. ఏది ఎక్కడుందన్నది ఇట్టే చెప్పగలడు. నేను వంట చేస్తే తను పాత్రలు కడుగుతాడు. ఇలాంటి చిన్నచిన్న పనులు బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఇద్దరం సమానమే అన్న భావనను మరింత పెంపొందిస్తాయి అని చెప్పుకొచ్చింది. (చదవండి: అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్)నేను బోళ్లు తోముతా..దీని గురించి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. మా వైవాహిక జీవితంలో చిన్నచిన్న పనులు, సాయాలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. నా భార్య వంట చేసిన తర్వాత ఎంతో ఇష్టంగా సింక్‌లోని పాత్రలు శుభ్రం చేస్తాను. ఆమె ఇంట్లో లేనప్పుడు కూడా ఈ పనులన్నీ చేస్తాను. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమంటే మన జీవితాల్ని సులభతరం చేసుకోవడమే! అని చెప్పుకొచ్చాడు. కాగా రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ సుమారు దశాబ్దకాలంపాటు ప్రేమించుకున్నారు. 2021 నవంబర్ 15న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ సిటీలైట్స్ (Citylights) మూవీ, బోస్:డెడ్/అలైవ్ వెబ్‌సిరీస్ సహా పలు ప్రాజెక్టుల్లో కలిసి పని చేశారు.చదవండి: పెళ్లికి సిద్ధమైన జాలిరెడ్డి.. గ్రాండ్‌గా వెడ్డింగ్ ప్లాన్ -
బాలీవుడ్ వెళ్తున్న రామ్ చరణ్