bsnl
-
ఆరేళ్లలో ఆస్తులమ్మి రూ.12,985 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 2019 నుంచి ఆస్తుల మానిటైజేషన్ ద్వారా దాదాపు రూ.12,985 కోట్లు సమకూర్చుకున్నాయి. ఆస్తుల జాబితాలో భూములు, భవంతులు, టవర్లు, ఫైబర్ తదితరాలున్నట్లు కమ్యూనికేషన్ల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్లో వెల్లడించారు.లోక్‌సభకు మంత్రి నివేదించిన వివరాల ప్రకారం 2025 జనవరి వరకూ భూములు, భవంతుల ద్వారా బీఎస్ఎన్ఎల్ రూ.2,388 కోట్లు సమీకరించగా.. ఎంటీఎన్ఎల్ రూ.2,135 కోట్లు అందుకుంది. సమీప భవిష్యత్‌లో సొంత అవసరాలకు వినియోగించని, యాజమాన్య బదిలీ హక్కులు కలిగిన భూములు, భవంతులను మాత్రమే మానిటైజ్ చేసినట్లు రాతపూర్వక సమాధానంలో చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇక టవర్లు, ఫైబర్ ఆస్తుల ద్వారా బీఎస్ఎన్ఎల్ రూ.8,204 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.258 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు.దీర్ఘకాలిక ప్రభావాలు ఇలా..టెలికాం పీఎస్‌యూల ఆస్తుల మానిటైజేషన్ ద్వారా దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం ఈ ఆస్తుల మానిటైజేషన్ రుణాల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి కంపెనీలకు లిక్విడిటీని అందిస్తుంది. నాన్ కోర్ ఆస్తులను విక్రయించడం ద్వారా ప్రాథమిక టెలికాం సేవలపై దృష్టి పెట్టవచ్చు. మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో పెట్టుబడి పెట్టవచ్చు. అదనపు నిధులతో సర్వీస్ నాణ్యతను మెరుగుపరచడం, మార్కెట్ ఉనికిని విస్తరించడం ద్వారా పీఎస్‌యూలు ప్రైవేట్ సంస్థలతో పోటీపడే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్షోసవాళ్లు ఇలా..ఆస్తుల మానిటైజేషన్ స్వల్పకాలిక ఆర్థిక ఉపశమనాన్ని అందించినప్పటికీ చందాదారులు పెంపును, అధిక నిర్వహణ ఖర్చులు వంటి అంతర్లీన సమస్యలను ఇది పరిష్కరించకపోవచ్చు. అసెట్ మానిటైజేషన్ చేస్తున్నా ప్రైవేట్ టెలికాం దిగ్గజాల నుంచి తీవ్రమైన పోటీ కారణంగా పీఎస్‌యూలు తమ మార్కెట్ వాటాను తిరిగి పొందడానికి సవాళ్లు ఎదుర్కోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ టెలికాం ఆదాయం క్షీణించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఈ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. -
ఒక్క రీఛార్జ్.. 425 రోజుల వ్యాలిడిటీ: BSNL కొత్త ప్లాన్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) హోలీకి ముందు అద్భుతమైన ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాన్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ చెల్లుబాటుతో అపరిమిత కాల్‌లను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్.. ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు అందించే టాప్ ప్లాన్లకు గట్టి పోటీని ఇస్తుంది.హోలీ ధమాకా ఆఫర్ పేరుతో తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ధర రూ. 2399. ఇది 425 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేరుకుంటే అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు చేసుకోవచ్చు. కొంత తక్కువ ఖర్చుతో.. ఎక్కువ రోజుల ప్లాన్ కోసం వేచి చూసేవారికి బెస్ట్ ఆప్షన్ అని తెలుస్తోంది.బీఎస్ఎన్ఎల్ ఇతర ప్లాన్స్➤రూ. 1999 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 600 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.1499 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 24 జీబీ డేటా మరియు, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.1198 ప్లాన్: 300 నిమిషాల వాయిస్ కాల్స్, నెలకు 3 జీబీ డేటా మరియు నెలకు 30 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.997 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తుంది. వాలిడిటీ 160 రోజులు. ➤రూ. 897 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 90 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తుంది. వాలిడిటీ 180 రోజులు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్లిమిటెడ్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చవక ధరలో దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లతో ప్రైవేట్ టెల్కోలకు సవాలు విసురుతోంది. ప్రైవేట్ ఆపరేటర్లు ఇటీవల ధరలను పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ప్లాన్లు దాని వినియోగదారుల సంఖ్య పెరగడానికి దారితీశాయి. గత కొన్ని నెలల్లో మిలియన్ల మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కి మారారు.బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 70 రోజులు, 90 రోజులు, 150 రోజులు, 160 రోజులు, 336 రోజులు, 365 రోజులు, 425 రోజుల ఎంపికలతో సహా కొన్ని సుదీర్ఘ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ఇప్పుడు 180 రోజుల ప్లాన్ ప్రవేశపెట్టింది. తరచూ రీచార్జ్ చేసుకునే ఇబ్బందిని తొలగించే లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ కొత్త ఆరు నెలల ప్లాన్ అత్యంత అనువుగా ఉంటుంది.రూ.897 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ కొత్త రూ .897 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్‌తో పూర్తి ఆరు నెలలు (180 రోజులు) వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులు ఇకపై నెలవారీ రీఛార్జ్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మార్కెట్లో అత్యంత చౌకైన ప్లాన్లలో ఒకటి. ఇక మిగతా ప్రయోజనాల విషయానికి వస్తే మొత్తంగా 90 జీబీ లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. -
ఈ లాభం ఎలా వచ్చింది?
బీఎస్ఎన్ఎల్కి చివరగా 2009–2010 ఆర్థిక సంవత్సరంలో 581 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అది కూడా అప్పటికి దానికి ఉన్న డిపాజిట్ల మీద వచ్చిన వడ్డీ తప్ప వాణిజ్యపరమైన లాభాల వల్ల కాదు. వాణిజ్య పరంగా దానికి లాభాలు 2007–2008 ఆర్థిక సంవత్సరంలో చివరగా వచ్చాయి. భారత ప్రభుత్వం ‘సావరిన్ గ్యారెంటీ’తో రూ. 8,500 కోట్ల రుణం బాండ్ల రూపంలో తీసుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 2020 సెప్టెబర్ 28న బీఎస్ఎన్ఎల్ లిస్ట్ అయింది. దానితో ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ ఆర్థిక ఫలితాలను సెబీకి ఇవ్వవలసి ఉంటుంది. ఈ రకంగా ప్రతి మూడు నెలలకు ఆ సంస్థ తన ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తోంది. డిసెంబర్ 2024తో ముగిసిన మూడు నెలల కాలానికి బీఎస్ఎన్ఎల్కు నికరంగా 262 కోట్ల లాభం 17 ఏళ్ల తర్వాత వచ్చింది. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలానికి మొత్తంగా చూస్తే ఇంకా నష్టాలలోనే ఉన్నా, ఒక త్రైమాసికంలో లాభాలు ఆర్జించడం దాదాపు 17 ఏళ్లలో ఇదే తొలిసారి. అయితే ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు చూద్దాం.రెవెన్యూ పరంగా చూస్తే కేవలం 131 కోట్లు మాత్రమే ఆదాయం పెరిగింది. సాధారణంగా మూడు, నాలుగు త్రైమాసికాల్లో టెలికం కంపెనీల ఆదాయాలు పెరుగు తాయి కనుక ఆ ఆదాయం పెరుగుదల లెక్కలోకి రాదు. కానీ ఇతర ఆదాయంలో 336 కోట్ల పెరుగుదల, ఉద్యో గుల జీతభత్యాల ఖర్చులో 336 కోట్లు తగ్గటం, డిప్రిసి యేషన్, ఋణమాఫీ వంటి అంశాలలో 766 కోట్లు తగ్గుదల వల్ల ఈ లాభం ఆర్జించడం సాధ్యమయింది. అంటే ఆర్థిక ఫలితాల లెక్కలు కట్టడంలో ఈ 2024–25 నుండి బీఎస్ఎన్ఎల్ చేసిన మార్పుల వల్ల ఇది సాధ్యం అయింది.లెక్కలు కట్టడంలో చేసిన మార్పులు ఏమిటి?ఉద్యోగుల జీతభత్యాలను ఆ యా ప్రాజెక్టుల వారీగా విడగొట్టి చూపడం వల్ల రూ. 337 కోట్లు ఖర్చు ఆదా అయింది. అలాగే డిప్రిసియేషన్, పారు బకాయిల రద్దు వంటి చర్యలను ఆ యా సర్కిళ్లకు ప్రత్యేకంగా లెక్క కట్టడం ద్వారా 766 కోట్లు తక్కువ చూపించగలిగారు. గతంలో ఈ మొత్తాలను సర్కిల్ వారీగా కాకుండా మొత్తం మీద చూపించేవారు. ఏతావతా స్పెక్ట్రం మీద కట్టే మొత్తం డబ్బులను విడగొట్టి ఆయా సర్కిళ్లలో చూపడం, తగ్గుదలను ప్రాజెక్టు వారీగా చూపడం వల్ల ఆదాయం గణనీయంగా పెరగక పోయినా ఈ త్రైమాసికంలో 262 కోట్ల లాభం వచ్చింది. నాల్గవ త్రైమాసికంలో ఏడాదికి కట్టే మొత్తాలు ఉండటం మూలంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.చదవండి: భావోద్వేగాల డిజిటల్ బందిఖానా!స్థూలంగా చూస్తే ప్రయివేటు టెలికాం కంపెనీలు రేట్లు పెంచితే కేవలం నాలుగు నెలల్లో 65 లక్షల మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు వస్తే ఆ తరువాత నెలలో మళ్లీ 4 లక్షల మంది వినియోగదారులు వెళ్లిపోయారు. అంతకుముందు కేవలం ఏడాదిన్నరలో బీఎస్ఎన్ఎల్ రెండు కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. ఇందుకు కారణం విశ్లేషిస్తే నెట్వర్క్ నాణ్యతా లోపం ప్రధాన కారణం. ప్రయివేటు టెలికాం కంపెనీలు 5జీ నెట్వర్క్ అందిస్తుంటే ఇంకా 3జీలోనే బీఎస్ఎన్ఎల్ (BSNL) ఉండటం, భారతీయ సాంకేతికతతో కూడిన 4జీ సేవలు అందుబాటులో రావడానికి గత నాలుగేళ్లుగా ఆలస్యం కావడం, ఇప్పుడిప్పుడే టవర్ల అప్‌గ్రెడేషన్ పూర్తి అవుతున్నా కొన్ని సాంకేతిక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండటం... వంటి కారణాల వల్ల బీఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్‌ను పెంచుకోలేక పోతోంది.4జీ సేవలు అందుబాటులోకి త్వరలో పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. దానిని 5జీ లోకి మార్చుకునే అవకాశాలు ఉండటం, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు విదేశీ కంపెనీతో అనుసంధానం కానుండటంతోనైనా బీఎస్ఎన్ఎల్ తన ఆదాయాలు మరింత పెంచుకుని లాభాలు పూర్తి స్థాయిలో పొందాలని కోరుకుందాం.– తారానాథ్ మురాల టెలికామ్ రంగ విశ్లేషకులు -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు.. ఇక నో వ్యాలిడిటీ టెన్షన్!
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు తన పోర్ట్‌ఫోలియోలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (prepaid plans) జోడిస్తోంది. ఈ క్రమంలోనే మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక వాలిడిటీతో వస్తాయి.150 రోజుల ప్లాన్బీఎస్ఎన్ఎల్ 150 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ .397. ఇది అపరిమిత కాలింగ్ 2 జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్లు అందిస్తుంది. అయితే ప్రయోజనాలన్నీ మొదటి 30 రోజులు మాత్రమే ఉంటాయి. మిగిలిన 120 రోజులకు నంబర్‌కు వ్యాలిడిటీ అందుబాటులో ఉంటుంది. కాలింగ్, డేటా ప్రయోజనాల కన్నా ఇన్ కమింగ్ కాల్స్, సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవడం ముఖ్యం అనేకునేవారికి ఈ ప్లాన్ సరిపోతుంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్ బెస్ట్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..160 రోజుల ప్లాన్160 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ ధర రూ.997. ఈ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి అపరిమిత కాలింగ్, 2 జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందిస్తుంది. కాలింగ్, డేటాతో లాంగ్ టర్మ్ వాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ మరింత అనుకూలంగా ఉంటుంది.180 రోజుల ప్లాన్ఇది ఆరు నెలల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. దీని ధర రూ .897. ఈ ప్లాన్ ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, 180 రోజుల పాటు 90 జీబీ మొత్తం డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రోజువారీ కోటా గురించి ఆందోళన చెందకుండా ఒకేసారి ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువైనది. -
బీఎస్ఎన్ఎల్ లాభాల రింగ్‌టోన్
కాళ్లూ, చేతులు కట్టేసి పరుగుపందెంలో ఉసేన్ బోల్ట్‌తో పోటీపడమంటే అయ్యేపనేనా.. కానీ బీఎస్ఎన్ఎల్ పరిస్థితి అలాగే ఉండేది. బ్యూరోక్రసీ బంధనాలతోపాటు స్వయంకృతాపరాధాలు కూడా తోడు కావడంతో కంపెనీ నడక కుంటుపడింది. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు 3జీ, 4జీ, కొత్త ఆవిష్కరణలు, సరళతరమైన టారిఫ్‌లతో దూసుకెళ్తుంటే బీఎస్ఎన్ఎల్ వెనుకబడిపోయింది. లాభాల మాట దేవుడెరుగు.. అప్పులు, నష్టాల్లో కూరుకుపోయి మనుగడ కోసం నానాఅవస్థలు పడింది. అలాంటిది.. దశాబ్దంన్నర తర్వాత మళ్లీ బీఎస్ఎన్ఎల్ లాభాల రింగ్ టోన్ మోగింది. కంపెనీ మళ్లీ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సాక్షి, బిజినెస్ డెస్క్: ప్రభుత్వ టెలికం విభాగం సర్వీసులను కార్పొరేటీకరించడంతో 2000లో ఏర్పాటైన బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్).. ల్యాండ్‌లైన్, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులతో మారుమూల ప్రాంతాలకూ టెలికం సర్వీసులను విస్తరించింది. 2000–2010 మధ్య నాటికి అత్యధిక యూజర్లతో మార్కెట్లో ఆధిపత్యాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత నుంచి యూనినార్, ఎయిర్టెల్, రిలయన్స్, వొడాఫోన్ లాంటి ప్రైవేట్ దిగ్గజాలు ఉత్తమ కస్టమర్ సర్వీసులను అందిస్తూ, దూకుడుగా వ్యూహాలను అమలు చేస్తుండటంతో పరిశ్రమపై కంపెనీ పట్టు సడలింది. కాలం చెల్లిన టెక్నాలజీ, ప్రైవేట్ కంపెనీలతో దీటుగా పోటీపడేందుకు అవసరమైన సాంకేతికత, పరికరాలను సమకూర్చుకోలేకపోవడం, సకాలంలో స్పందించలేని నిస్సహాయ స్థితి.. ఇలాంటి ఎన్నో కారణాలతో కంపెనీ కుదేలైంది. 2006–07లో 31 శాతంగా ఉన్న మార్కెట్ వాటా 2009 నాటికి 16 శాతానికి పడిపోయింది. 2016లో రిలయన్స్ జియో.. ఉచిత వాయిస్ కాల్స్, అత్యంత చౌకగా డేటా సేవలతో ఎంట్రీ ఇవ్వడమనేది మార్కెట్ పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది. ఇతర ప్రైవేట్ టెల్కోలతోపాటు బీఎస్ఎన్ఎల్ను కూడా గట్టిగా దెబ్బతీసింది. పెరిగిపోతున్న నష్టా లు, సరైన సమయంలో 4జీ సేవలను తేలేకపోవ డం, ఉద్యోగుల జీతాల భారం పెరిగిపోవడంలాంటి సవాళ్లతో కంపెనీ సతమతమైపోయింది. 2019 నాటికి దాదాపు కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ మద్దతు.. సవాళ్లెన్ని ఉన్నప్పటికీ గ్రామీణ, వ్యూహాత్మక ప్రాంతాల్లో టెలికం సేవలను విస్తరించడంలో కీలకంగా ఉన్న బీఎస్ఎన్ఎల్కి జవసత్వాలివ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. 2019 నుంచి 2022 వరకు మూడు విడతలుగా దాదాపు రూ.3.22 లక్షల కోట్ల విలువ చేసే ప్యాకేజీలిచ్చింది. కేవలం ప్యాకేజీ ఇచ్చి ఊరుకోకుండా సంస్కరణలు కూడా చేపట్టేలా చర్యలు తీసుకుంది. వ్యయ నియంత్రణ, భారీ స్థాయిలో ఉన్న సిబ్బందిని క్రమబద్దీకరించుకోవడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లాంటి సంస్కరణలు అమలయ్యేలా చూసింది. వ్యయాలను తగ్గించుకునేందుకు 2020లో స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును కంపెనీ అమలు చేసింది. అప్పట్లో ఏకంగా 80,000 మంది వీఆర్ఎస్ తీసుకున్నారు. దీనితో ప్రతి నెలా జీతాల బిల్లుల భారం రూ. 600 కోట్ల వరకు తగ్గుతుందని కంపెనీ అప్పట్లో తెలిపింది. పూర్వ వైభవం దిశగా.. బీఎస్ఎన్ఎల్లో చేపట్టిన సంస్కరణల ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 16,811 కోట్ల నుంచి రూ.19,130 కోట్లకు పెరిగింది. నష్టాలు రూ. 8,161 కోట్ల నుంచి రూ. 5,367 కోట్లకు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో, 2007 తర్వాత.. అంటే 17 ఏళ్ల అనంతరం కంపెనీ తొలిసారిగా లాభాలు చూసింది. రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. పోటీ సంస్థల కన్నా చౌకగా, సరళతరమైన ప్యాకేజీలు ఇస్తుండటంతో వినియోగదారులు ప్రైవేట్ కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్ బాట పడుతున్నారు. కార్యకలాపాల విస్తరణ, వ్యయ నియంత్రణ చర్యలతో నాలుగో త్రైమాసికంలోనూ ఇదే జోరు కొనసాగిస్తామని కంపెనీ ధీమాతో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం 20 శాతం ఆదాయ వృద్ధిని అంచనా వేస్తోంది. 2025 ఆఖరు నాటికి 25 శాతం మార్కెట్ వాటాను నిర్దేశించుకుంది. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో.. హై–స్పీడ్ ఇంటర్నెట్కి డిమాండ్ పెరగడంతో బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతూ ఫైబర్–టు–ది–హోమ్ సేవలను వేగంగా విస్తరించింది. కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 500 లైవ్ టీవీ చానల్స్ లభించేలా ఫైబర్ ఆధారిత టీవీ సర్వీస్, స్పామ్ ఫ్రీ నెట్‌వర్క్‌లాంటి వినూత్న సేవలు అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు65,000 దేశవ్యాప్తంగా ఉన్న టవర్లు1,00,000 జూన్‌నాటికి లక్ష్యం(నాలుగు మెట్రో నగరాలు, దాదాపు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో 4జీ సర్వీసులున్నాయి) 5జీ సర్వీసుల విస్తరణ ప్రస్తుతం వైర్లెస్ విభాగంలో 9 కోట్ల పైచిలుకు యూజర్లతో దాదాపు 8 శాతం, బ్రాడ్‌బ్యాండ్‌లో సుమారు 43 లక్షల కనెక్షన్లతో 17% మేర మార్కెట్ వాటా ఉంది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. 54 రోజులు..
ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఎప్పటికప్పుడు చౌక రీచార్జ్ ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఉచిత ఎస్ఎంఎస్ వంటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.కొత్త ప్లాన్ ప్రయోజనాలురూ. 347 ధరతో బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ వినియోగదారులకు ఢిల్లీ, ముంబైలోని ఎంటీఎన్ఎల్ (MTNL) ప్రాంతాలతో సహా దేశం అంతటా ఉచిత అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్‌ను అందిస్తుంది. అదనంగా, రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను యూజర్లు ఆనందించవచ్చు.ఈ ప్లాన్ 54 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదనపు బోనస్‌గా బీఐటీవీ (BiTV)కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంటారు. ఇది 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు, వివిధ రకాల OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా సేవలను మెరుగుపరచడంపై బీఎస్ఎన్ఎల్ దృష్టి సారిస్తోంది. కంపెనీ 65,000 కొత్త 4జీ టవర్లను విజయవంతంగా అమలులోకి తెచ్చింది. దేశం అంతటా తమ వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు ఈ సంఖ్యను త్వరలో లక్షకు పెంచాలని యోచిస్తోంది.ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో, మెరుగైన సర్వీస్ డెలివరీని లక్ష్యంగా చేసుకుని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల రూ. 6,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది.బీఎస్ఎన్ఎల్కు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే విస్తృత ప్రయత్నంలో ఇది భాగం. ఇటీవలి సంవత్సరాల్లో బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్ల సాయాన్ని ప్రకటించింది. 2007 తర్వాత మొదటిసారిగా బీఎస్ఎన్ఎల్ లాభాల్లోకి వచ్చింది. 2025 ఆర్థిక సంవ్సతరం మూడవ త్రైమాసికంలో రూ.262 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. -
బీఎస్ఎన్ఎల్ లాభాల సిగ్నల్
న్యూఢిల్లీ: టెలికం రంగ ప్రభుత్వ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి సుమారు 17 ఏళ్ల తదుపరి తిరిగి లాభాల్లోకి ప్రవేశించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలియజేశారు. ఇది ప్రస్తావించదగ్గ కీలక మలుపు అంటూ వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్ ఇంతక్రితం 2007లో మాత్రమే త్రైమాసికవారీగా లాభాలు ఆర్జించడం గమనార్హం! కంపెనీకిది అతిముఖ్యమైన రోజుగా సింధియా పేర్కొన్నారు. కంపెనీ కొంతకాలంగా సరీ్వసులను విస్తరించడంతోపాటు వినియోగదారులను పెంచుకోవడంపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. బీఎస్ఎన్ఎల్ మొబిలిటీ, ఫైబర్ టు హోమ్(ఎఫ్టీటీహెచ్), లీజ్డ్ లైన్ సరీ్వసులలో 14–18 శాతం వృద్ధిని సాధించినట్లు సిందియా తెలిపారు. మరోవైపు సబ్స్క్రయిబర్ల సంఖ్య సైతం 2024 డిసెంబర్లో 9 కోట్లకు ఎగసినట్లు వెల్లడించారు. జూన్‌లో ఈ సంఖ్య 8.4 కోట్లు మాత్రమే. -
రోజూ 2 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. సంస్థ యూజర్లకు దీర్ఘకాలిక సర్వీసు అందించే లక్ష్యంతో 365 రోజుల వ్యాలిడిటీతో ఆకర్షణీయమైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రోజూ 2 జీబీ డేటాను అందించే ఈ ప్యాక్ సంవత్సరం పొడవునా ఇంటర్నెట్ అవసరమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.కొత్త ప్లాన్ వివరాలు..వాలిడిటీ: ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అంటే వినియోగదారులు ఒకసారి రీఛార్జ్‌తో ఏడాది పొడవునా నిరంతరాయ సేవలను పొందవచ్చు.రోజువారీ డేటా: వినియోగదారులకు రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.ధర: ఈ ప్లాన్ ధర రూ.1515.వాయిస్ కాల్స్ ఉండవు..ఈ ప్లాన్‌లో ప్రధానంగా డేటాపై దృష్టి సారించారు. ఇందులో ఉచిత వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు ఉండవు. అయితే బీఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ వంటి అదనపు ప్రయోజనాలతో ఇతర ప్లాన్లను అందిస్తోంది. ఏడాది పొడవునా స్థిరమైన ఇంటర్నెట్ అవసరమయ్యే విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ ప్రవేశపెట్టినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.ఇదీ చదవండి: ఐపీఎల్ స్పాన్సర్షిప్ డీల్ దక్కించుకున్న రిలయన్స్బీఎస్ఎన్ఎల్ విభిన్న ప్రయోజనాలతో ఇతర ప్లాన్లను కూడా అందిస్తుంది. రూ.1198 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీ ఉంటుంది. నెలకు 300 నిమిషాల ఉచిత కాల్స్, 3 జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్లు, ఉచిత రోమింగ్ అందిస్తుంది. వినియోగదారులకు ఈ ప్లాన్ కోసం నెలకు రూ.100 వరకు ఖర్చు అవుతుంది. డేటా, వాయిస్ సర్వీసులు కావాలనుకునే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. -
BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. 365 రోజులు.. రోజుకు రూ. 3 మాత్రమే
మొబైల్ ఫోను వినియోగదారుల కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. 365 రోజుల పాటు చెల్లుబాటయ్యే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎంతో చౌకైనది కూడా. ఈ ప్లాన్ తీసుకునే వినియోగదారులకు రోజుకు రూ. 3 మాత్రమే ఖర్చవుతుంది. 4జీ నెట్వర్క్పైపు వేగంగా అడుగులు వేస్తున్న బీఎస్ఎన్ల్ అందిస్తున్న ఈ ప్లాన్ మొబైల్ ఫోను వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.1,198. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా ఉపయోగించే వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి నెలా రూ. 100 వరకూ ఖర్చవుతుంది.ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కైనా కాల్ చేయడానికి ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు అందుబాటులో ఉంటాయి. అలాగే వినియోగదారులు ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటా ప్రయోజనాన్ని అందుకుంటారు. ప్రతి నెలా 30 ఉచిత SMSల ప్రయోజనం పొందుతారు. ఉచిత జాతీయ రోమింగ్ కూడా ఈ ప్లాన్‌లో ఉంది. భారతదేశం అంతటా రోమింగ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు ఉచిత ఇన్కమింగ్ కాల్స్‌ను అందుకోవచ్చు.కాగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ కోసం ప్రభుత్వం రూ.6,000 కోట్ల ప్రోత్సాహాన్ని అందించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్- ఎంటీఎన్ఎల్ల 4జీ సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ అదనపు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలో ఈ రెండు టెలికాం కంపెనీల వినియోగదారులు పూర్తిస్థాయిలో 4జీ సేవలను అందుకోనున్నారు.ఇది కూడా చదవండి: Nepal: 23 మంది భారతీయులు అరెస్ట్.. కారణం ఇదే.. -
బీఎస్ఎన్ఎల్కు రూ.6,000 కోట్లు.. ఏం చేస్తారంటే..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 4జీ విస్తరణ ప్రణాళికలకు ఊతమిచ్చేందుకు రూ.6,000 కోట్ల అదనపు నిధుల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయంలో లోటును పరిష్కరించడం, దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.దిల్లీ, ముంబయిల్లో మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) కార్యకలాపాలను సైతం నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్కు దేశవ్యాప్తంగా 4జీ సేవలు లేకపోవడం, అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కొరవడడంతో సవాళ్లు ఎదుర్కొంటోంది. దానివల్ల బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు 4జీ కవరేజీని అందించే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు మారుతున్నారు. ప్రైవేట్ కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కోవడానికి సంస్థ 2023లో 1,00,000 4జీ సైట్ల కోసం రూ.19,000 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ప్రభుత్వ రంగ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఐటీఐ(ITI)కి సుమారు రూ.13,000 కోట్ల అడ్వాన్స్ పర్ఛేజ్ ఆర్డర్‌ను అప్పగించింది. ఈ సంస్థలు కంపెనీకి కావాల్సిన 4జీ మౌలిక సదుపాయాలను సిద్ధం చేసి అందించాల్సి ఉంటుంది. తాజాగా మరో రూ.6,000 కోట్లు అందించేందుకు కేబినెట్ ఆమోదించింది.ఇదీ చదవండి: రేట్ల కోతతో తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు2019 నుంచి ప్రభుత్వం మూడు వేర్వేరు పునరుద్ధరణ ప్యాకేజీల ద్వారా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో సుమారు రూ.3.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఉద్యోగుల వ్యయాలను తగ్గించడం, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు, రుణ పునర్వ్యవస్థీకరణ, ఆస్తులను మానిటైజ్ చేయడం వంటి చర్యలు ఈ ప్యాకేజీల్లో ఉన్నాయి. ఫలితంగా 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి.భవిష్యత్తు ప్రణాళికలు..తాజాగా ఆమోదం పొందిన నిధులతో దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తేవాలని, కస్టమర్ల అట్రిషన్(ఇతర టెలికాం కంపెనీలకు మారడం)ను తగ్గించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని కూడా కంపెనీ యోచిస్తోంది. ఈ ప్రణాళికలు టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని, ప్రైవేట్ సంస్థలతో మరింత సమర్థవంతంగా పోటీ పడటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. -
5జీ కోసం బీఎస్ఎన్ఎల్ ప్లాన్: జియోకు పోటీ!?
భారతదేశంలో జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం ఆపరేటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి గట్టి పోటీ ఇవ్వడానికి, యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) సిద్ధమైంది.దేశంలో నాల్గవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్.. 'బీఎస్ఎన్ఎల్' దేశవ్యాప్తంగా మెరుగైన సేవలను అందించడానికి తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే 65,000 4జీ సైట్లను ఏర్పాటు చేసింది. ఇటీవల కేరళలో కూడా 5,000 కొత్త సైట్లను జోడించింది. కంపెనీ దేశం అంతటా మొత్తం ఒక లక్ష 4G సైట్లను చేరుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తోంది.బీఎస్ఎన్ఎల్ ప్రపంచంలోనే అత్యంత సరసమైన 4G టారిఫ్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందింది. అయితే కనెక్టివిటీని మెరుగుపరచడానికి, కంపెనీ వివిధ ప్రాంతాలలో కొత్త సైట్ ఇన్స్టాలేషన్లను చురుకుగా ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఒక లక్ష 4జీ సైట్ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత.. 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేయడానికి.. 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) సహకరిస్తోంది. కంపెనీ తన ప్రస్తుత 4జీ మౌలిక సదుపాయాలను సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా 5జీగా మార్చాలని యోచిస్తోంది. ఎయిర్టెల్ మాదిరిగానే కంపెనీ భారతదేశం అంతటా 5జీ నాన్ స్టాండలోన్ (NSA) టెక్నాలజీని కూడా విడుదల చేయడానికి యోచిస్తోంది.ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోందిబీఎస్ఎన్ఎల్ 5జీ స్టాండలోన్ (SA) టెక్నాలజీని పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో 5G SA టెస్టింగ్ జరుగుతోంది. ఇవన్నీ సవ్యంగా జరిగితే.. ఇంటర్నెట్ సేవలు మరింత చౌకగా లభిస్తాయి. ఇదే జరిగితే జియో, ఎయిర్టెల్ యూజర్లు కూడా బీఎస్ఎన్ఎల్ వైపు తిరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కంపెనీ తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా వినియోగదారులకు వేగవంతమైన కనెక్టివిటీని తీసుకురావడానికి కృషి చేస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒకసారి రీఛార్జ్ చేస్తే 12 నెలల పాటు సర్వీసులు పొందేలా కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. తరచూ రీఛార్జ్‌లు, ఇతర టెలికాం ప్రొవైడర్ల నుంచి పెరుగుతున్న ఖర్చుల భారంతో సతమతమవుతున్న వినియోగదారులకు ఊరటనిచ్చేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.సూపర్ రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఆఫర్ కేవలం రూ.1,999కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 12 నెలలు. నెలవారీ రీఛార్జ్‌ల ఇబ్బంది లేకుండా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.అన్ లిమిటెడ్ కాలింగ్: యూజర్లు అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లపై అపరిమిత ఉచిత కాలింగ్‌ను వినియోగించుకోవచ్చు.600 జీబీ డేటా: ఈ ప్లాన్‌లో రోజువారీ వినియోగ పరిమితులు లేకుండా మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. యూజర్లు ఏడాది పొడవునా తమ సౌలభ్యం మేరకు ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు.రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు: నిరంతరాయంగా కమ్యూనికేషన్ కోసం రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్లు, దీర్ఘకాలిక వాలిడిటీ ఆఫర్లను అందిస్తుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇటీవల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు చౌక రీఛార్జ్ ధరల కోసం బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త సూపర్ రీఛార్జ్ ప్లాన్ మరింత మంది యూజర్లను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: రైల్వే అంతటా ‘కవచ్’ అమలుఇతర ప్రొవైడర్లు ఇలా..ఇతర టెలికాం ప్రొవైడర్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉదాహరణకు, జియో పైన తెలిపిన సర్వీసులతో వార్షిక ప్లాన్‌ను రూ.3,599కు అందిస్తుంది. ఇందులో 2.5 జీబీ రోజువారీ పరిమితితో 912.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఉన్నాయి. ఎక్కువ డేటాను అందిస్తుండడంతో జియో ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కంటే ఖరీదుగా ఉంది. అయితే అందుకోసం కొన్ని సర్వీసులు అదనంగా ఇస్తుంది. యూజర్లు నిజంగా ఈ సర్వీసులను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తేనే ఆ ప్లాన్ మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలోనూ ఇలా బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే అదనంగానే వసూలు చేస్తున్నాయి. -
కొత్త ఫీచర్.. ఇక సిగ్నల్ లేకపోయినా 4జీ సేవలు
మొబైల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే దిశగా భారత ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ (ICR) ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీంతో బీఎస్ఎన్ఎల్ (BSNL), జియో (Jio), ఎయిర్టెల్ (Airtel) ఇలా నెట్వర్క్ ఏదైనా వినియోగదారులు వారి ప్రాథమిక ప్రొవైడర్‌కు సిగ్నల్ కవరేజ్ లేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఏదైనా నెట్వర్క్ని ఉపయోగించి 4జీ (4G) సేవలను పొందే ఆస్కారం ఉంటుంది.ఏమిటీ ఇంటర్ సర్కిల్ రోమింగ్?ఇంటర్-సర్కిల్ రోమింగ్ (Inter-Circle Roaming) అనేది నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పంచుకోవడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (TSP) ఎనేబుల్ చేసే ఒక అద్భుతమైన ఫీచర్. డిజిటల్ భారత్ నిధి (DBN)-నిధులతో కూడిన మొబైల్ టవర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ సర్వీస్, తమ నెట్వర్క్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చే టవర్ల ద్వారా 4జీ సేవలను ఉపయోగించుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పిస్తుంది.ఇంతకుముందు డిజిటల్ భారత్ నిధి టవర్లు వాటి ఇన్‌స్టాలేషన్‌కు బాధ్యత వహించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే మద్దతిచ్చేవి. అంటే ఒకే ప్రొవైడర్‌కు మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ ఫీచర్‌తో వినియోగదారులు ఇప్పుడు భాగస్వామ్య నెట్‌వర్క్‌లను వినియోగించుకుని అంతరాయం లేని మొబైల్ సేవలు పొందవచ్చు.గ్రామీణ కనెక్టివిటీ మెరుగుఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ప్రాథమిక లక్ష్యాలలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ అంతరాన్ని తగ్గించడం ఒకటి. 35,400 గ్రామాలకు విశ్వసనీయమైన 4జీ సేవలు అందించడానికి ప్రభుత్వం సుమారు 27,000 మొబైల్ టవర్లకు నిధులు సమకూర్చింది. ఈ విధానం విస్తృతమైన కవరేజీని అందించడంలో భాగంగా అనవసరమైన మౌలిక సదుపాయాల కొరతను తగ్గిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత నెట్వర్క్ కారణంగా తరచుగా సిగ్నల్ లభ్యతకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతుంటాయి. దీంతో వినియోగదారులు అవసరమైన సేవలు అందుకోలేకపోతున్నారు. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మధ్య సహకారం ద్వారా ఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ఈ సవాళ్లను పరిష్కరిస్తుంది. మరింత ఎక్కువమంది 4G కనెక్టివిటీని పొందేలా చేస్తుంది.మెరుగైన సేవలకు సహకారంఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ విజయవంతం కావడం అనేది బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో వంటి దేశంలోని ప్రధాన టెలికాం సంస్థల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప్రొవైడర్లు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, తక్కువ సేవలందే ప్రాంతాల్లో స్థిరమైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సింధియా ఈ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 27,836 సైట్లను కవర్ చేస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగదారులకు కనెక్టివిటీ అవకాశాలను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉమ్మడి ప్రయత్నం దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో టెలికాం రంగ నిబద్ధతను తెలియజేస్తుంది. -
ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండి
గతంలో రీఛార్జ్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ అయినా వచ్చేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి రీఛార్జ్ ముగిసిన తరువాత తప్పకుండా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అయితే కొందరు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాలంటే కొంత కష్టమనుకుంటారు, అలాంటి వారు ఆరు నెలలకు లేదా ఏడాదికి రీఛార్జ్ చేసుకుంటారు. ఈ కథనంలో 84 రోజుల ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..జియో (Jio)రిలయన్స్ జియో అందిస్తున్న అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.799 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా (మొత్తం 126 జీబీ), రోజులు 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్స్ వంటివి లభిస్తాయి. రోజువారీ డేటా పూర్తయిన తరువాత 64 kbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. జియో టీవీ, జిఓ సినిమా, జిఓ క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.బీఎస్ఎన్ఎల్ (BSNL)బీఎస్ఎన్ఎల్ 84 రోజుల ప్లాన్ ధర రూ. 628 మాత్రమే. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 40 kbpsకు తగ్గుతుంది.ఎయిర్టెల్ (Airtel)ఎయిర్టెల్ 84 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 509. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుడు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా (84 రోజులకు) లభిస్తుంది. ఈ డేటా పూర్తయిపోతే.. ఒక ఎంబీకి 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారు.. అన్లిమిటెడ్ 5జీ డేటాకు అనర్హులు. ఇందులో ఫ్రీ హలోట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్, అపోలో 24/7, స్పామ్ కాల్స్ వంటివి ఉన్నాయి.వీఐ (వొడాఫోన్ ఐడియా)వొడాఫోన్ ఐడియా అందించే అతి చౌకైన ప్లాన్‌లో రూ. 509 కూడా ఒకటి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనిని రీఛార్జ్ చేసుకున్న యూజర్లు అన్లిమిటెడ్ కాల్స్, 1000 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా వంటివి పొందుతారు. ఎస్ఎమ్ఎస్లు, డేటా అనేది మొత్తం ప్యాక్‌కు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి అది ఖాళీ అయితే మళ్ళీ వాటి కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అదనపు ప్రయోజనాలు కూడా ఏమీ లభించవు. -
ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తున్నాయి. అంతే కాకుండా అవి టారిఫ్‌లను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరలకు సూపర్ ప్లాన్లను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల 14 నెలల వ్యాలిడిటీతో ఓ ప్లాన్ అందించడం ప్రారంభించింది.14 నెలల ప్లాన్ప్రైవేట్ టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందిస్తున్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4జీ సేవలను ప్రారంభించనే లేదు. అయితే ప్రస్తుతం చాలామంది బీఎస్ఎన్ఎల్ సేవలకు మారిపోవడానికి ప్రధాన కారణం తక్కువ ధరకే ప్లాన్స్ అందించడం.ఇప్పుడు పరిచయం చేసిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ 14 నెలల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. నిజానికి ఈ ప్లాన్ కేవలం 13 నెలలు లేదా 395 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేది. ఇప్పుడు దీనిని ఒక నెల పెంచి 14 నెలల వ్యాలిడిటీకి మార్చారు. అంటే ఒక్కసారి ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 425 రోజులు చెల్లుబాటు అవుతుందన్నమాట.ప్రయోజనాలురూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా లోకల్, రోమింగ్ కాల్స్‌తో సహా అపరిమిత కాల్‌లను ఆస్వాదించవచ్చు. 425రోజులు రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అంటే వినియోగదారుడు మొత్తం 850 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 2జీబీ డేటా పూర్తయిపోయినప్పటికీ.. 4kbps వేగంతో అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు ఉచితం.జియో, ఎయిర్టెల్ (Airtel) వంటి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించిన తరువాత.. చాలామంది బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారిపోయారు. ఆ తరువాత రీఛార్జ్ ప్లాన్స్ ధరలను కొంత తగ్గించడంతో.. కొందరు మళ్ళీ జియో, ఎయిర్టెల్ వైపు తిరిగారు. ప్రస్తుతం జియో కూడా వార్షిక ప్లాన్స్ రూ. 3,599 ధరతో అందిస్తోంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.8000 కోట్లు ఉన్నాయి.. ఏం చేయాలో తెలియట్లేదు!జియో (Jio) వార్షిక ప్లాన్ (రూ.3599)తో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్ (రూ. 2399) చాలా తక్కువ. కాబట్టి ధరలను దృష్టిలో ఉంచుకుని యూజర్లు తమకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 14 నెలల ప్లాన్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
తిరుగులేని రీఛార్జ్ ప్లాన్.. హాఫ్‌డే ఇష్టమొచ్చినంత డేటా
నష్టాల్లో ఉన్న ప్రైవేట్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా పోటీని తట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏడాది కాలపరిమితితో కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను (Vi SuperHero) ప్రవేశపెట్టింది. కస్టమర్లు అర్ధరాత్రి 12 నుండి మధ్యాహ్నం 12 వరకు అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు.దీనికితోడు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితం. ఈ ప్రీ–పెయిడ్ ప్లాన్స్ ధర ర.3,599 నుంచి ర.3,799 వరకు ఉంది. ప్రస్తుతానికి ఇవి మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానాకు పరిమితం.వీఐ సూపర్‌హీరో ప్లాన్ల ప్రయోజనాలు⇒ అపరిమిత డేటా: ప్రతి రోజు హాఫ్-డే (అర్ధరాత్రి 12 నుండి మధ్యాహ్నం 12 వరకు) అపరిమిత డేటా.⇒ రోజువారీ డేటా కోటా: మిగిలిన గంటలలో ( మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి 12 వరకు) 2 GB హై-స్పీడ్ డేటా.⇒ వారాంతపు డేటా రోల్ఓవర్: వినియోగదారులు ఉపయోగించని వారాంతపు డేటాను ఫార్వార్డ్ చేయవచ్చు. వారాంతంలో దాన్ని ⇒ ఉపయోగించుకోవచ్చు.⇒ ఓటీటీ (OTT) ప్రయోజనాలు: రూ.3,699 ప్లాన్ ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. అదే రూ.3,799 ప్లాన్‌లో యితే ఒక సంవత్సరం అమేజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) సబ్స్క్రిప్షన్ ఉంటుంది.ఓవైపు వొడాఫోన్ ఐడియా తన 4G నెట్‌వర్క్‌లో దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉండగా పోటీ సంస్థలు జియో, ఎయిర్టెల్ ఇప్పటికే తమ కస్టమర్ల కోసం అపరిమిత 5G డేటా ప్లాన్లను రూపొందించాయి. ఈ కొత్త "సూపర్‌హీరో" ప్లాన్లతో వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) దాని సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకోవడానికి, కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య తన మార్కెట్ ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది.అదే సమయంలో వోడాఫోన్ ఐడియా 19.77 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. గడిచిన సెప్టెంబర్ నెలలో 15.5 లక్షల మంది యూజర్లను చేజార్చుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల విడుదల చేసిన అప్డేట్ ప్రకారం.. వోడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 18.30% వద్ద ఉంది. రిలయన్స్ జియో 39.9% వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉంది. భారతి ఎయిర్టెల్ 33.5% వాటాతో రెండవ స్థానంలో ఉంది.ఇక కంపెనీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో విక్రయిస్తున్న వార్షిక ప్లాన్స్‌లో భాగంగా రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు అపరిమిత డేటా అందుకోవచ్చు. అలాగే రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు.బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ప్రత్యేక వార్షిన్ ప్లాన్ తీసుకొచ్చింది. న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్. -
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్.. 425 రోజులు అన్లిమిటెడ్..
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) ప్రత్యేక న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది.ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్. అన్ని ఇతర కంపెనీలు గరిష్టంగా 365 రోజుల వ్యాలిడిటీతో వార్షిక ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి బీఎస్ఎన్ఎల్ ప్లాన్లతో పోలిస్తే ఖరీదైనవి. గత సంవత్సరం ద్వితీయార్థంలో బీఎస్ఎన్ఎల్ సేవలను పొందేందుకు లక్షలాది మంది వినియోగదారులు తమ నంబర్లను పోర్ట్ చేసుకున్నారు. గత ఏడాది ఇతర కంపెనీలు టారిఫ్‌లు పెంచేయడంతో బీఎస్ఎన్ఎల్ మంచి ఎంపికగా నిలిచింది.Get 2GB/Day Data & Unlimited Calls for 425 Days – all for just ₹2399/-! Hurry, offer valid till 16th Jan 2025 – don’t let this deal slip away! Stay ahead. Stay connected. Stay with BSNL!#BSNLIndia #UnlimitedCalls #2GBData #StayConnected pic.twitter.com/23lkFS3phH— BSNL India (@BSNLCorporate) January 2, 2025 -
మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?
దేశంలోని టెలికం ఆపరేటర్లు డిజిటల్ మౌలిక వసతుల్లో చేసిన భారీ పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందాలంటే పన్నుల తగ్గింపు, టారిఫ్‌ల పెంపు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి తరం 5జీ సేవల కవరేజీని విస్తరించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు టెలికం మౌలిక సదుపాయాలు, రేడియోవేవ్స్ కోసం 2024లో సుమారు రూ.70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 18 కోట్ల 2జీ కస్టమర్లను కనెక్ట్ చేయడం, సమ్మిళిత వృద్ధి కోసం 4జీకి మళ్లేలా వారిని ప్రోత్సహించడం సవాలుగా మారింది.‘టెలికం రంగంలో పన్నులను హేతుబద్ధీకరించాలి. భారత్‌లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టారిఫ్‌లు అత్యల్పంగా ఉన్నాయి. అధిక వినియోగ కస్టమర్లు ఎక్కువ చెల్లించడం, ఎంట్రీ లెవల్ డేటా వినియోగదారులు తక్కువ చెల్లించేలా మార్పులు రావొచ్చు. టెలికం సంస్థలు చేసిన పెట్టుబడులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. దీని ద్వారా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మొత్తం లాభపడింది. పన్నుల హేతుబద్ధీకరణ, టారిఫ్‌ల పెంపు ద్వారా పెట్టుబడులపై రాబడిని పొందే సమయం ఆసన్నమైంది’ అని ఈవై ఇండియా మార్కెట్స్, టెలికం లీడర్ ప్రశాంత్ సింఘాల్ అన్నారు. ఏఆర్పీయూ రూ.300 స్థాయికి..భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) రూ.300 స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. గతేడాది జులైలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల పెంపు తర్వాత వొడాఫోన్ ఐడియా ఏఆర్పీయూ ఏప్రిల్–జూన్‌లో రూ.154 నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.8 శాతం పెరిగి రూ.166కి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ రూ.211 నుంచి 10.4 శాతం వృద్ధితో రూ.233కి, రిలయన్స్ జియో రూ.181.7 నుంచి రూ.195.1కి దూసుకెళ్లింది. అయితే టారిఫ్‌ల పెంపు ఈ సంస్థలకు షాక్ తగిలింది. దాదాపు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు తమ కనెక్షన్లను వదులుకున్నారు. 10–26 శాతం ధరల పెంపు కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంయుక్తంగా 2.6 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయాయి.మౌలికంలో పెట్టుబడులు..మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో నికరంగా భారీ స్థాయిలో జోడించింది. రిలయన్స్ జియో మెట్రోలు, ప్రధాన సర్కిల్స్‌లో చందాదారులను పొందింది. చిన్న సర్కిల్స్‌లో కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా నుంచి అక్టోబర్‌లో భారీగా వినియోగదార్లు దూరమయ్యారు. 5జీ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం 2022–2027 మధ్య రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేయనున్నట్టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (డీఐపీఏ) డైరెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. భారతీ ఎయిర్టెల్ రెండో త్రైమాసిక పనితీరుపై జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం టారిఫ్ పెంపులు మరింత తరచుగా జరిగే అవకాశం ఉంది. 5జీలో భారీ పెట్టుబడులు, ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నందున జియోకు అధిక ఏఆర్పీయూ అవసరం.ఇదీ చదవండి: గూగుల్ పే, ఫోన్‌పేకి ఎన్పీసీఐ ఊరటబీఎస్ఎన్ఎల్కు మార్పుధరల పెంపుదలకు దూరంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు దాదాపు 68 లక్షల మంది కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పటికీ పాత తరం 3జీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారతీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో సబ్‌స్క్రైబర్ వృద్ధి ఈ రంగానికి కొంత ఆశను కలిగించింది. సేవలను అందించడంలో బీఎస్ఎన్ఎల్ అసమర్థత ఈ వృద్ధికి కారణంగా కొంతమంది విశ్లేషకులు పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో వైర్లెస్ విభాగంలో 19.28 లక్షల మంది వినియోగదారులను జోడించింది. క్రియాశీల చందాదారులు దా దాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. యాక్టివ్ సబ్స్రైబర్ బేస్ దాదాపు 7.23 లక్షలు తగ్గింది. రిలయన్స్ జియో వైర్లెస్ కస్టమర్ల సంఖ్య అక్టోబర్‌లో మొత్తం 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లు నమోదైంది. క్రియాశీల వినియోగదారుల సంఖ్య బలపడింది. -
BSNL Layoffs: 19,000 మంది ఉద్యోగులకు గండం
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL)వేలాది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొత్త స్వచ్ఛంద పదవీ విరమణ ప్రణాళిక.. వీఆర్ఎస్ 2.0ని (VRS 2.o) ప్రతిపాదించింది. సంస్థ ఆర్థిక సమతుల్యతను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపును (Layoff) ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ తొలగింపులు దాదాపు 18,000 నుండి 19,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని తెలుస్తోంది.దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలలో 4జీ, 5జీ వంటి అధునాతన నెట్వర్క్ టెక్నాలజీలను ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ ఖర్చులను తగ్గించుకోవడంపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగుల కొత్త స్వచ్ఛంద పదవీ విరమణ ప్రణాళిక (VRS)ను ప్రతిపాదించింది ఖర్చులను తగ్గించుకోవడానికి శ్రామిక శక్తి తగ్గింపు కోసం టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) ఆమోదాన్ని కోరింది. వీఆర్ఎస్ 2.0 కోసం రూ.1,500 కోట్లను ఆమోదించాలని కోరింది.తాజా తొలగింపులు బీఎస్ఎన్ఎల్ వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్పై ప్రభుత్వ ఖర్చులో 38% వరకు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియలో బ్యాలెన్స్ షీట్ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ శ్రామిక శక్తిని నిర్వహణ కోసం సుమారు రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ప్రతిపాదన కంపెనీ సంవత్సరానికి రూ.5,000 కోట్ల వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఎస్ఎన్ఎల్ లేఆఫ్ అభ్యర్థనకు కేబినెట్, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అనుమతి రావాల్సి ఉంది.2024 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎస్ఎల్ ఆదాయం రూ.21,302 కోట్లుగా ఉంది. గత సంవత్సరం రూ.20,699 కోట్లతో పోలిస్తే ఇది కాస్త మెరుగు. ప్రస్తుతం సంస్థలో మొత్తం 55,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 25,000 మంది ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు కాగా 30,000 మంది నాన్ ఎగ్జిక్యూటివ్‌లు. 2019లో భారత ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ (MTNL) ఉద్యోగుల కోసం రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్రణాళికను ఆమోదించింది. -
బీఎస్ఎన్ఎల్ ఉచిత సర్వీసులు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పుదుచ్చేరిలోని తన వినియోగదారులకు ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తన యూజర్లకు డిజిటల్, వినోద సేవలను మరింత చేరువ చేసేందుకు మూడు కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది.మొబైల్ కోసం ఇంట్రానెట్ టీవీ (బీఐ టీవీ)ఓటీటీప్లే సహకారంతో బీఎస్ఎన్ఎల్ ప్రీమియం కంటెంట్‌తో సహా 300 లైవ్ టీవీ ఛానళ్లను మొబైల్ వినియోగదారులకు ఉచితంగా అందిస్తుంది. ఈ సర్వీసు స్థిరంగా స్ట్రీమింగ్ అయ్యేందుకు, ఎలాంటి అవాంతరాలు కలుగకుండా ఉండేందుకు బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఇంట్రానెట్‌ను ఉపయోగిస్తుంది.నేషనల్ వై-ఫై రోమింగ్బీఎస్ఎన్ఎల్ మనడిపట్టు గ్రామంలో వై-ఫై రోమింగ్‌ను ప్రారంభించింది. ఈ గ్రామం భారతదేశంలో రెండో పూర్తి వై-ఫై వినియోగిస్తున్న గ్రామంగా ప్రసిద్ధి. బీఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ చందాదారులు దేశవ్యాప్తంగా ఏదైనా బీఎస్ఎన్ఎల్ వై-ఫై హాట్‌స్పాట్ లేదా ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ నుంచి ఇంటర్నెట్ను యాక్సెస్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ (ఐఎఫ్ టీవీ)బీఎస్ఎన్ఎల్ కొత్త ఐఎఫ్ టీవీ సర్వీస్‌ను పుదుచ్చేరిలో అందిస్తుంది. ఎఫ్టీటీహెచ్ చందాదారులకు 500కి పైగా లైవ్ టెలివిజన్ ఛానళ్లను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ ఛానళ్లు నిరంతరంగా, హై క్వాలిటీలో స్ట్రీమింగ్ అయ్యేలా సంస్థ చర్యలు తీసుకుంటుంది. -
జియో.. ఎయిర్టెల్ పోటాపోటీ
ఎయిర్టెల్ కంటే రిలయన్స్ జియో అక్టోబర్ 2024లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను పెంచుకున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. అయితే ఇదే సమయంలో ఎయిర్టెల్ మాత్రం అధికంగా చెల్లింపులు చేసే 4జీ/ 5జీ యూజర్లను పెంచుకున్నట్లు పేర్కొంది.ఇప్పటివరకు ఉన్న మొత్తం యాక్టివ్ యూజర్ల విషయంలో జియోనే అధికంగా వినియోగదారులకు కలిగి ఉంది. ఇన్-యాక్టివ్ యూజర్ల తొలగింపు కారణంగా అక్టోబర్ నెలలో జియో సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు తెలిసింది. ఎయిర్టెల్ మాత్రం తన 4జీ/ 5జీ యూజర్ బేస్‌లో వృద్ధిని సాధించింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా 3జీ/ 4జీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. కాగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం స్వల్పంగా యూజర్లను పెంచుకుంది.ఇదీ చదవండి: పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. నెట్టింట చర్చజులైలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదల ఉండబోదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి గతంలో స్పష్టం చేశారు. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్ఎన్ఎల్ ఇటీవల స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్, డైరెక్ట్–టు–డివైస్ తదితర సేవలను ప్రారంభించింది. -
రూ.4.09 లక్షల కోట్లు: అప్పుల్లో టెలికాం కంపెనీలు
2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని నాలుగు ప్రధాన టెలికాం ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని లోక్‌సభలో సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ వెల్లడించారు.ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ (BSNL) అప్పు.. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే తక్కువని తెలుస్తోంది. మార్చి 31 నాటికి వొడాఫోన్ ఐడియా రూ.2.07 లక్షల కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.1.25 లక్షల కోట్లు, జియో రూ.52,740 కోట్ల రుణాలుగా తీసుకున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ (BSNL) అప్పు రూ. 40,400 కోట్లు. అయితే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీతో సంస్థ లోన్ రూ. 28,092 కోట్లకు తగ్గిందని పెమ్మసాని చంద్ర శేఖర్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. రూ.89,000 కోట్లతో బీఎస్ఎన్ఎల్కు 4జీ/5జీ స్పెక్ట్రమ్ కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. సమీప భవిష్యత్తులో టారిఫ్ రేట్లను పెంచబోమని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరుగుతున్న నేపథ్యంలో స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్‌లు, డైరెక్ట్-టు-డివైస్ సేవలు వంటి కొత్త ఆఫర్లను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలుపుకోవడంతోపాటు కొత్తవారిని ఆకర్షించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతాయని చెప్పారు.సెప్టెంబర్ 2024లో బీఎస్ఎన్ఎల్ ఊహించని విధంగా 8.5 లక్షల మంది సబ్స్క్రైబర్లను పొందింది. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలకు ఈమేరకు కస్టమర్లు తగ్గుతున్నారు. జులైలో ప్రైవేట్ టెలికాం సంస్థలు 10 శాతం నుంచి 27 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు మళ్లుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల కాలంతో దాదాపు కోటి మంది చందాదారులను కోల్పోయాయి. జియో ఒక్కటే 79.69 లక్షల మంది సబ్స్క్రైబర్లను నష్టపోయింది.ఇదీ చదవండి: రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!మెరుగైన సేవలందిస్తే మేలు..ప్రస్తుతం జియో 46.37 కోట్లు, ఎయిర్టెల్ 38.34 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 9.18 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. బీఎన్ఎన్ఎల్కు సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పోటీదారులతో పోల్చితే 4జీ, 5జీ సేవలందించడంతో చాలా వెనకబడి ఉంది. వినియోగదారుల పెంపును ఆసరాగా చేసుకుని విభిన్న విభాగాల్లో మెరుగైన సేవలందిస్తే మరింత మంది సబ్స్రైబర్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
బీఎస్ఎన్ఎల్కు కొత్తగా 8.5 లక్షల మంది..
న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా 2024 సెప్టెంబర్‌లో కోటి మందికిపైగా వైర్లెస్ చందాదారులను కోల్పోయాయి. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సుమారు 8.5 లక్షల మంది కొత్త కస్టమర్లను దక్కించుకుంది. ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్ మాసంలో రిలయన్స్ జియోకు 79.69 లక్షల మంది, భారతీ ఎయిర్టెల్ 14.34 లక్షలు, వొడాఫోన్ ఐడియాకు 15.53 లక్షల మంది దూరమయ్యారు. సెప్టెంబర్ చివరినాటికి మొత్తం వైర్లెస్ చందాదార్ల సంఖ్య 0.87 శాతం పడిపోయి 115.37 కోట్లకు వచ్చి చేరింది. ఇందులో రిలయన్స్ జియోకు 46.37 కోట్లు, భారతీ ఎయిర్టెల్ 38.34 కోట్లు, వొడాఫోన్ ఐడియా 21.24 కోట్లు, బీఎస్ఎన్ఎల్కు 9.18 కోట్ల మంది ఉన్నారు. వైర్లెస్ వినియోగదార్లు నగరాల్లో 0.80 శాతం, గ్రామాల్లో 0.95 శాతం తగ్గారు. వైర్డ్, వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ చందాదార్ల సంఖ్య 0.51% క్షీణించి 94.44 కోట్లు నమోదైంది. ఇందులో రిలయన్స్ జియోకు 47.7 కోట్లు, భారతీ ఎయిర్టెల్ 28.5 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.6 కోట్లు, బీఎస్ఎన్ఎల్కు 3.7 కోట్ల మంది ఉన్నారు. మార్కెట్ వాటా పొందేందుకు.. జూలైలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదలని ఉండబోదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి గత నెలలో స్పష్టం చేయడం గమనార్హం. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్ఎన్ఎల్ ఇటీవల స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్‌్క, డైరెక్ట్–టు–డివైస్ తదితర సేవలను ప్రారంభించింది. -
రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. తన చవక రీచార్జ్ ప్లాన్లతో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈసారి రోజుకు రూ. 6 ఖర్చుతోనే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటాను అందించే అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. అది ఏ ప్లాన్.. ఎన్ని రోజులు వ్యాలిడిటీ.. బెనిఫిట్స్ ఏంటి అన్నవి ఇక్కడ తెలుసుకుందాం…ఇటీవల, ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కానీ ప్రభుత్వ టెల్కో అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ప్లాన్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఖరీదైన టారిఫ్ ప్లాన్లను భరించలేని లక్షల మంది వినియోగదారులు ఆయా కంపెనీలను వీడి బీఎస్ఎన్ఎల్కి మారుతున్నారు.కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, పాత యూజర్లను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రోజుకు 6 రూపాయల కంటే తక్కువ ధరతో అపరిమిత కాలింగ్, 2GB డేటా, ఇతర అనేక ప్రయోజనాలను అందించే ప్లాన్ అందిస్తోంది. ఇది ఏడాదికిపైగా సుదీర్ఘ వ్యాలిడిటీని అందిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేసే టెన్షన్‌ను తొలగిస్తుంది.ప్లాన్ వివరాలుఈ ప్లాన్ ధర రూ. 2399. దీని వ్యాలిడిటీ 395 రోజులు. రోజు ప్రకారం చూస్తే రూ. 6 కంటే తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. బడ్జెట్ విభాగంలో ఈ ప్లాన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజువారీ 2GB డేటా, 100 ఎస్ఎంఎస్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్క సారి రీఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్ ఇంటర్నెట్, కాలింగ్‌ని ఆస్వాదించవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా..
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన తర్వాత చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది యూజర్లను ఆకట్టుకునేందుకు ఏడాదిపాటు ప్రయోజనాలు అందించే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.చౌకైన రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198. ఈ రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. ఇక ఇతరర ప్రయోజనాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు లభిస్తాయి. అలాగే ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాదు.. ఈ ప్లాన్‌లో ప్రతి నెలా 30 ఉచిత SMSల సౌకర్యాన్ని కూడా ఆనందివచ్చు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బీఎస్ఎన్ఎల్.. మరో మైలురాయి!ధర తగ్గిన మరో ప్లాన్ కొత్త ప్లాన్‌ను ప్రారంభించడంతోపాటు బీఎస్ఎన్ఎల్ తన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్లలో మరొకదాని ధరను కూడా తగ్గించింది. రూ. 1999 ప్లాన్ ధరను రూ. 100 తగ్గించి ఇప్పుడు రూ. 1899కే అందిస్తోంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 600GB డేటా, ప్రతిరోజూ 100 ఉచిత SMS వంటి ఉన్నాయి. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..
ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు నెలలో వీరి సంఖ్య అధికమైనట్లు కంపెనీ తెలిపింది. టెలికాం రంగంలో సేవలందిస్తున్న జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్ల కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గిపోతుండడం గమనార్హం. ఇందుకు ఇటీవల ప్రైవేట్ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం ఆగస్టులో బీఎస్ఎన్ఎల్ 2.5 మిలియన్ల (25 లక్షలు) వినియోగదారులను చేర్చుకుంది. దాంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 91 మిలియన్ల(9.1 కోట్లు)కు చేరింది. బీఎస్ఎన్ఎల్ ఈ నెలలో కూడా యాక్టివ్ యూజర్లను చేర్చుకుంది. రిలయన్స్ జియో 4 మిలియన్ల(40 లక్షలు), భారతీ ఎయిర్టెల్ 2.4 మిలియన్ల(24 లక్షలు), వొడాఫోన్ ఐడియా 1.9 మిలియన్ల(19 లక్షలు) వినియోగదారులను కోల్పోయాయి. గత రెండున్నరేళ్లలో అత్యధికంగా జియో ఆగస్టులో సబ్స్క్రైబర్లను కోల్పోయింది.ఆగస్టు చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 471.7 మిలియన్లు(47.17 కోట్లు), ఎయిర్టెల్ 384.9 మిలియన్లు(38.49 కోట్లు), వొడాఫోన్ ఐడియా 214 మిలియన్లు(21.4 కోట్లు)గా ఉంది. ఆగస్టు చివరి నాటికి దేశంలో మొత్తం వినియోగదారుల సంఖ్య 5.7 మిలియన్లు(57 లక్షలు) తగ్గి 116.3 కోట్లకు చేరుకుంది. ఇటీవల సంస్థలు పెంచిన టారిఫ్‌ల వల్ల చాలామంది రెండు కంటే ఎక్కువ సిమ్ కార్డులున్నవారు తమ సర్వీసును ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల మార్కెట్లో జియో 40.5% వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ 33.1%, వొడాఫోన్ ఐడియా 18.4%, బీఎస్ఎన్ఎల్ 7.8% వద్ద ఉన్నాయి. ఆగస్టులో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం ట్రాయ్‌కు మొత్తం 14.6 మిలియన్(1.46 కోట్లు) అభ్యర్థనలు వచ్చాయి.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?జియో జులై నెల ప్రారంభంలో టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ప్లాన్ రేట్లను సుమారు 20-30 శాతం పెంచాయి. దాంతో వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కొంత ఆకర్షణీయంగా కనిపించింది. ఆ సంస్థ ప్రైవేట్ కంపెనీల్లాగా దేశం అంతటా 5జీ సర్వీసులు విస్తరించకపోయినా కస్టమర్లు ఎక్కువగా దానివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. -
మారిన బీఎస్ఎన్ఎల్ లోగో: కొత్తగా ఏడు సర్వీసులు
ప్రభుత్వ రంగ నెట్వర్క్ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) కొత్త లోగోను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ఆవిష్కరించారు. కొత్త లోగో విశ్వాసం, బలం, దేశవ్యాప్తంగా చేరువ కావడానికి ప్రాతినిధ్యం వహిస్తుందని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.కొత్త లోగోమారిన కొత్త బీఎస్ఎన్ఎల్ లోగో గమనించినట్లయితే.. కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారతదేశ చిత్రపటం ఉండటం గమనించవచ్చు. దానిపైన తెలుగు, ఆకుపచ్చ రంగులో కనెక్టివిటీ సింబల్స్ ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అనేది నీలి రంగులో ఉంది. దానికి కింద కెనెక్టింగ్ భారత్ అనేది కూడా కాషాయ రంగులోనే ఉంది.ఏడు కొత్త సర్వీసులుస్పామ్-రహిత నెట్వర్క్: ఈ కొత్త సర్వీస్ వినియోగదారులను అవాంఛిత కాల్లు, మెసేజ్‌ల నుంచి బయటపడేస్తుంది. క్లీన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించడానికి దీనిని పరిచయం చేయడం జరిగింది.బీఎస్ఎన్ఎల్ వైఫై నేషనల్ రోమింగ్: వినియోగదారులు అదనపు ఛార్జీల గురించి చింతించకుండా దేశవ్యాప్తంగా వైఫై యాక్సెస్‌ని ఆస్వాదించవచ్చు. ప్రయాణ సమయంలో కనెక్ట్ అయి ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్టీవీ: ఈ సర్వీస్ ఫైబర్ టు ది హోమ్ (FTTH) కనెక్షన్లతో వినియోగదారుల కోసం 500 ప్రీమియం ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. తద్వారా యూజర్ మంచి ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు.ఎనీ టైమ్ సిమ్ కియోస్క్: ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. దీనికోసం ప్రత్యేక కేంద్రాలను యెఫ్తాను చేయనున్నారు.డైరెక్ట్-టు-డివైస్ సర్వీస్ (D2D): ఈ సర్వీస్ ద్వారా శాటిలైట్ టు డివైజ్ కనెక్టివిటీ పొందవచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఎస్ఎంఎస్ సేవలను ఆస్వాదించవచ్చు.పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్: బిఎస్ఎన్ఎల్ అత్యవసర సమయంలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి కమ్యూనికేషన్, పబ్లిక్ సేఫ్టీ ఫీచర్లతో భద్రతమైన నెట్‌వర్క్‌ను అందిస్తుంది.గనులలో ప్రైవేట్ 5జీ: ఈ సర్వీస్ ద్వారా బీఎస్ఎన్ఎల్ మైనింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన 5జీ కనెక్టివిటీను అందిస్తుంది. రిమోట్ లొకేషన్లలోని కార్మికులకు కమ్యూనికేషన్ మరియు భద్రతను మెరుగుపరుస్తుంది.Today at #BSNL HQ, New Delhi, Hon'ble MoC Shri @JM_Scindia Ji, along with Hon'ble MoSC Shri @PemmasaniOnX Ji and Secretary DoT Shri @neerajmittalias Ji, unveiled BSNL’s new logo, reflecting our unwavering mission of "Connecting Bharat – Securely, Affordably, and Reliably." pic.twitter.com/EFvYbVASGx— BSNL India (@BSNLCorporate) October 22, 2024 -
బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2D
శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వయాశాట్ (Viasat), ప్రభుత్వ టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) సహకారంతో భారతదేశంలో మొదటిసారిగా డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.బీఎస్ఎన్ఎల్తో కలిసి వయాశాట్ ఇంజనీర్లు ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఉపగ్రహ ఆధారిత టూ-వే మెసేజింగ్ సేవలను ప్రదర్శించారు. డీటుడీ కనెక్టివిటీ ద్వారా మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి సాధారణంగా ఉపయోగించే పరికరాలు లేదా కార్లు, పారిశ్రామిక యంత్రాలు, రవాణా సాధనాలను ఎటువంటి ప్రత్యేక హార్డ్‌వేర్ అవసరం లేకుండానే శాటిలైట్ నెట్‌వర్క్‌కు అనుసంధానించవచ్చు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’"ఈ ట్రయల్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి నాన్-టెరెస్ట్రియల్ నెట్వర్క్ (NTN) కనెక్టివిటీ కోసం వయాసాట్ టూ-వే మెసేజింగ్, ఎస్ఓఎస్ మెసేజింగ్‌ను ప్రదర్శించింది .దాదాపు 36,000 కి.మీల దూరంలోని వయాశాట్ జియోస్టేషనరీ ఎల్-బ్యాండ్ శాటిలైట్‌కు ఈ సందేశాలు చేరాయి. వయాశాట్ శాటిలైట్ నెట్వర్క్ని ఉపయోగించి సెల్ ఫోన్ కనెక్టివిటీకి శాటిలైట్ సేవలు అందించడం సాంకేతికంగా సాధ్యమవుతుందని ఈ ట్రయల్ ఫలితం రుజువు చేసింది" అని వయాశాట్ ఒక ప్రకటనలో తెలిపింది.ఏమిటీ D2D?డైరెక్ట్ -టు - డివైస్ (D2D) అనేది సాధారణ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి పరికరాలను ఎటువంటి అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌లకు అనుసంధానించే టెక్నాలజీ. సాంప్రదాయ ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలు, ఇంటర్నెట్ అంతంత మాత్రమే ఉండే ప్రాంతాల్లో ఈ సాంకేతికత అవాంతరాలు లేని కనెక్టివిటీని అందిస్తుంది.ప్రయోజనాలివే.. » సాంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని అందిస్తుంది» వినియోగదారులు తమ లొకేషన్‌తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సేవలు, కమ్యూనికేషన్ సాధనాలను యాక్సెస్ చేయగలరు.» సాంప్రదాయ శాటిలైట్ కమ్యూనికేషన్ పద్ధతులతో పోలిస్తే తక్కువ జాప్యంతో వేగవంతమైన డేటా ప్రసారానికి దారితీస్తుంది.» అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తోడ్పడుతుంది. మొత్తం నెట్వర్క్ పనితీరును మెరుగుపరుస్తుంది» అదనపు హార్డ్‌వేర్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది కనెక్టివిటీకి మరింత తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారంగా మారుతుంది .» అత్యవసర సేవలు , సముద్రయానం , విమానయానం వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవలకు డేట్ ఫిక్స్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వచ్చే ఏడాది జూన్ నాటికి 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మే నాటికి లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరిస్తామన్నారు. ‘యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్’ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘4జీ టెక్నాలజీకి సంబంధించి భారతదేశం ప్రపంచాన్ని అనుసరించింది. ప్రపంచంతో కలిసి 5జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. కానీ 6జీ టెక్నాలజీలో మాత్రం ఇండియా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది మే నాటికి ఒక లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరించనున్నాం. జూన్ నాటికి 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇప్పటివరకు 38,300 సైట్లను ఎంపిక చేశాం. ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ కంపెనీలకు చెందిన కీలక పరికరాలను ఉపయోగించబోదు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీఎస్ఎన్ఎల్ వద్ద పూర్తిస్థాయిలో పనిచేసే రేడియో యాక్సెస్ నెట్వర్క్ ఉంది. పదేళ్ల క్రితం వాయిస్ కాల్ ఖరీదు 50 పైసలు. కానీ దాని విలువ మూడు పైసలకు చేరింది. వాయిస్ ధర 96 శాతం తగ్గింది. గతంలో ఒక జీబీ డేటా ధర రూ.289.10గా ఉండేది. దాని విలువా గణనీయంగా పడిపోయింది. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు‘బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీ-డాట్, దేశీయ ఐటీ కంపెనీ టీసీఎస్ కన్సార్టియం అభివృద్ధి చేసిన 4జీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. పదేళ్ల క్రితం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య ఆరు కోట్లుగా ఉంది. ప్రస్తుతం అది 94 కోట్లకు పెరిగింది. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మెరుగవుతున్నాయి. ఈమేరకు చాలా రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. అమెరికాలో రక్షణ రంగానికి అవసరమయ్యే చిప్‌లను సరఫరా చేసే ఫ్యాబ్ (చిప్ ప్లాంట్)ను భారత్‌లో ఏర్పాటు చేయబోతున్నాం’ అని మంత్రి తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ మొబైల్ టారిఫ్‌లను 15 శాతం వరకు పెంచాయి. ఈ ధరల పెంపు చాలా మంది వినియోగదారులను బీఎస్ఎన్ఎల్కి మారడానికి ప్రేరేపించింది. పెరుగుతున్న ఈ ఆసక్తికి అనుగుణంగా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించే ప్రైవేటు టెలికాం కంపెనీలకు పోటీగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను కూడా మెరుగుపరుస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల తన చవకైన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై స్పీడ్ లిమిట్స్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కంపెనీ తన రూ.249, రూ.299, రూ.329 ప్లాన్లలో వేగాన్ని పెంచింది.రూ. 249 ప్లాన్ఈ ప్లాన్‌లో గతంలో 10 Mbps వేగంతో నెట్ వచ్చేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద 10 GB నెట్‌ను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. దీని తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కొత్త సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్.. 105 రోజులు అన్లిమిటెడ్రూ. 299 ప్లాన్ఇందులోనూ నెట్ స్పీడ్ 10 Mbps నుండి 25 Mbpsకి పెరిగింది. పరిమితిని చేరుకున్న తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీ 20జీబీ నెట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కొత్త వినియోగదారులకు మాత్రమే.రూ. 329 ప్లాన్ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో మామూలుగా 20 Mbps నెట్ స్పీడ్ ఉండేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఇక 1000 జీబీ గణనీయమైన ఎఫ్‌యూపీని అందిస్తుంది. ఆ తర్వాత వేగం 4 Mbpsకి తగ్గుతుంది. ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్.. 105 రోజులు అన్లిమిటెడ్
రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ చివరి రోజు దగ్గర పడుతున్నకొద్దీ కస్టమర్లు టెన్షన్ పడుతూ ఉంటారు. అధిక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు రీచార్జ్ చేసుకుందామంటే ధర ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వారి కోసం ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్లను పరిచయం చేస్తోంది.ప్రైవేట్ టెలికాం సంస్థలు దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్లాన్ల కోసం అధిక ఛార్జీలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. లక్షల మంది వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ తన ఆఫర్లలో అనేక దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్లను చేర్చింది. తాజాగా 105 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది.105 రోజుల వ్యాలిడిటీ ప్లాన్బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు అధిక వ్యాలిడిటీని అందిస్తూ రూ. 666 ధరతో అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 105 రోజుల పాటు ఏదైనా నెట్వర్క్కి అపరిమిత కాలింగ్ ఉంటుంది. అదనంగా ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా చెల్లుబాటు వ్యవధికి మొత్తం 210 జీబీ డేటాను అందిస్తోంది. అంటే రోజువారీ 2జీబీ హై-స్పీడ్ డేటాకు సమానం. ఈ ధరతో ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీల్లో విస్తృతమైన వ్యాలిడిటీ ప్లాన్లు లేవు. -
ఆ మూడు కంపెనీల్లో లేని కొత్త ఫీచర్.. బీఎస్ఎన్ఎల్లో..
స్పామ్, ఫిషింగ్ వంటి చర్యలతో పెరుగుతున్న ముప్పును అరికట్టడానికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చొరవ తీసుకుంది. కస్టమర్లకు మెరుగైన భద్రతకు భరోసానిస్తూ తన మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన మోసపూరిత ఎస్ఎంఎస్ సందేశాలపై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు.ఈ కొత్త భద్రతా ఫీచర్‌తో హానికరమైన సందేశాల నుండి వినియోగదారులను రక్షించడానికి, వారి మొత్తం మొబైల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బీఎస్ఎన్ఎల్ చురుకైన చర్యలు తీసుకుంటోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లలో గణనీయమైన పెరుగుదల వచ్చింది.కొత్తగా వస్తున్న వినియోగదారులతోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లను నిలుపుకునేందుకు బీఎస్ఎన్ఎల్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులు అవాంఛిత సందేశాలను నివేదించడానికి సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. పెరుగుతున్న స్పామ్, అన్‌సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ (UCC) సమస్యను పరిష్కరిస్తోంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ.. బీఎస్ఎన్ఎల్ యూసీసీ కంప్లయింట్ సర్వీస్ ద్వారా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌లో మోసపూరిత ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్స్‌ను నివేదించవచ్చు. ఈ ఫీచర్ బీఎస్ఎన్ఎల్ మాత్రమే ప్రత్యేకంగా అందిస్తోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ఏవీ ఇలాంటి ఫీచర్‌ను అందించడం లేదు.కంప్లయింట్ ఇలా ఫైల్ చేయండి» బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ను తెరవండి.» హోమ్ పేజీ ఎగువ ఎడమ మూలలో ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» కిందికి స్క్రోల్ చేసి 'కంప్లయింట్ అండ్ ప్రిఫరెన్స్' ఆప్షన్‌ను ఎంచుకోండి.» తదుపరి పేజీలో కుడి వైపున ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» అందుబాటులో ఉన్న ఎంపికల నుండి 'కంప్లయింట్స్' ఎంచుకోండి.» 'న్యూ కంప్లయింట్'పై నొక్కండి.» మీ కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి 'SMS' లేదా 'వాయిస్' ఎంచుకోండి.» అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి మీ కంప్లయింట్‌ను సబ్మిట్ చేయండి. -
తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్!
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది. నెలకు రూ. 200 కంటే తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లతో ఆనందించవచ్చు. దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూసే వారు ఈ వీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఒక లుక్కేయండి..రూ. 997 ప్లాన్బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డైలీ 2జీబీ హై స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. అక్టోబర్ 24వ తేదీ లోపుగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు 24 రోజుల చెల్లుబాటు కలిగిన 24GB ల అదనపు డేటా లభిస్తుంది.రూ. 1,198 ప్లాన్బీఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్ ఏడాది అంటే 365 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ ప్రయోజనాలు నెలవారీగా అందుతాయి. ఈ ప్లాన్ తో నెలకు 300 మినిట్స్ కాలింగ్, 3జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్ల చొప్పున 12 నెలలపాటు లభిస్తాయి. ప్లాన్‌ను అక్టోబర్ 24వ తేదీ లోపు రీఛార్జ్ చేసుకునే వారు 24 రోజుల వ్యాలిడిటీ కలిగిన 24జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ నుంచి 4జీ ఫోన్.. ఇక అంతా చవకే!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సొంత 4జీ మొబైల్ ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కార్బన్ మొబైల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇతర టెలికాం సంస్థల కంటే చౌకగా ఉండే కొత్త ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను పెంచడంతో మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. బీఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ ప్లాన్లు చవగ్గా ఉండటమే ఇందుకు కారణం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. అంతటితో ఆగకుండా టైర్ 2, టైర్ 3 నగరాల్లోని వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ఈ చవకైన 4జీ ఫోన్‌ను ప్రవేశపెడుతోంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ..దేశంలోని ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని తీసుకురావడానికి బీఎస్ఎన్ఎల్, కార్బన్ మొబైల్స్ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశ "4జీ సాథీ పాలసీ" కింద ప్రత్యేక సిమ్ హ్యాండ్సెట్ బండ్లింగ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నాయి. దేశవ్యాప్తంగా సరసమైన 4జీ కనెక్టివిటీని అందించడమే తమ లక్ష్యమని బీఎస్ఎన్ఎల్ ఒక పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఫోన్ బీఎస్ఎన్ఎల్ సిమ్‌తో వస్తుంది. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ.. అక్టోబర్ నుంచి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పామ్ కాల్స్ కట్టడికి ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/మెషీన్ లెర్నింగ్ ఆధారిత సాంకేతికతను త్వరలో వినియోగించనుంది. ‘ఈ టెక్నాలజీ తుది దశలో ఉంది. స్పామ్లు మిమ్మల్ని చేరుకోవడానికి ముందే వాటిని గుర్తించి, తటస్థీకరించి, తొలగించడానికి ఇది రూపొందింది’ అని ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ట్వీట్ చేసింది.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అక్టోబర్ 15–18 మధ్య జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఈ పరిష్కారాన్ని బీఎస్ఎన్ఎల్ పరిచయం చేయనుంది. స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను నిలువరించే టెక్నాలజీని ఈ నెల 25న ఎయిర్టెల్ ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. పెరుగుతున్న అయాచిత వాణిజ్య సమాచార మార్పిడి ముప్పును అరికట్టడానికి టెల్కోలు కఠిన చర్యలు తీసుకోవాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
బీఎస్ఎన్ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు చార్జీలు పెంచేయడంతో చాలామంది ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే గణనీయంగా యూజర్లు ఇతర కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్లో చేరారు. వినియోగదారుల డిమాండ్‌కు తగ్గుట్టుగానే ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ 4జీ సేవలను విస్తృతం చేస్తోంది. అయితే బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కొత్త సమస్య వచ్చింది. అదేంటంటే..4జీ రోల్అవుట్ కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల కారణంగా, బీఎస్ఎన్ఎల్ (BSNL) కస్టమర్లు 4జీ సేవలను ఉపయోగించడానికి 5జీ-అనుకూల ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి రావచ్చు. 4G సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ 2,100 MHz, 700 MHz అనే రెండు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను ఉపయోగిస్తోంది. వీటిలో 700 MHz బ్యాండ్ సాధారణంగా 5జీ సేవలకు సంబంధించిదైనా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలకు కూడా వినియోగిస్తోంది.ఇతర టెలికాం ఆపరేట్లకు ఇచ్చినట్లే ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కి కూడా 700 MHz బ్యాండ్‌ని కేటాయించింది. అయితే జియో వంటి వాణిజ్య ఆపరేటర్లు తమ స్వంత 5జీ నెట్వర్క్ కోసం దీనిని ఇంకా ఉపయోగించడం లేదు. ఈ బ్యాండ్ 5జీ సేవల కోసం ఇంకా పూర్తిగా స్థాపితం కాలేదు.దీంతో 2,100 MHz ఫ్రీక్వెన్సీ మాత్రమే సరిపోదన్న ఉద్దేశంతో బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్‌ని కూడా 4జీ సేవలు అందించడానికి ఉపయోగిస్తోంది.ఇదీ చదవండి: జియోలో అత్యంత చవకైన ప్లాన్ ఇదే..ఈ సమస్య గురించి తెలిసిన ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్ (B28)తో పని చేసేలా 4జీ ఫోన్లను తయారు చేయాలని తయారీ కంపెనీలను కోరింది. రాబోయే హ్యాండ్సెట్లు 700 MHz బ్యాండ్‌లో 4జీ, 5జీ రెండింటికి సపోర్ట్ చేసేలా చూసేందుకు బీఎస్ఎన్ఎల్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో సమన్వయంతో పనిచేస్తోంది. బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్‌తో పనిచేసే ఫోన్లు ప్రస్తుతం 1,000 మాత్రమే ఉన్నాయి. -
బీఎస్ఎన్ఎల్ ఐదు నెలల ప్లాన్: ప్రయోజనాలెన్నో..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 150 రోజుల వ్యాలిడిటీతో రూ.397 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ కొత్తది కాదు, కానీ ప్రయోజనాలలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.రూ.397లతో రీఛార్జ్ చేస్తే.. ఐదు నెలల (150 రోజులు) వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ప్లాన్ 180 రోజుల వరకు చెల్లుబాటు అయ్యేది. రోజుకి 2జీబీ డేటా.. 60 రోజులపాటు అపరిమిత ఫోన్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభించేవి. అయితే ఇవన్నీ ఇప్పుడు 30 రోజులకు పరిమితం చేశారు. కానీ వినియోగదారుడు 150 రోజుల పాటు ఉచిత ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని పొందవచ్చు.ఇన్కమింగ్ కాల్స్ కోసం చూసేవారికి ఇది ఉత్తమ ఆప్షన్. అయితే 30 రోజుల తరువాత డేటా, ఎస్ఎమ్ఎస్ ఆప్షన్స్ వంటివి లభించవు. కేవలం ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే. సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.జియో, ఎయిర్టెల్ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన తరువాత.. బీఎస్ఎన్ఎల్ పుంజుకుంటోంది. ఈ తరుణంలో బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే పనిలో నిమగ్నమై ఉంది. కంపెనీ 4జీ సర్వీసును కూడా 2025 మార్చి నాటికి దేశ్య వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. -
ఒకేసారి రీచార్జ్.. ఏడాదంతా డైలీ 3జీబీ డేటా
దీర్ఘకాలం వ్యాలిడిటీతో రోజూ ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో తక్కువ ధరకే డైలీ 3జీబీ డేటాను ఆస్వాదించవచ్చు. ఇలాంటి ప్లాన్లు ఇతర ప్రైవేటు టెలికం కంపెనీల్లో లేకపోవడం గమనార్హం.365 రోజులు వ్యాలిడిటీ 365 రోజులు వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ. 2,999. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదంతా అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఆనందించవచ్చు. ప్రతిరోజూ 3జీబీ హై స్పీడ్ డేటా పొందవచ్చు. ఈ వార్షిక ప్లాన్‌లో కస్టమర్లకు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.సినిమాల స్ట్రీమింగ్, గేమింగ్ కోసం ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఏడాదిపాటు ప్రతిరోజూ 3జీబీ డేటా అందించే ప్లాన్లు ఇతర ప్రైవేట్ టెలికం కంపెనీల్లో లేవు. గరిష్టంగా 84 రోజుల వ్యాలిడిటీతో ఇలాంటి ప్లాన్ జియోలో రూ.1799లకు, ఎయిర్‌టెల్‌లో రూ.1798లకు అందుబాటులో ఉంది. -
తక్కువ ధరకు బీఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్
ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరల పెంచడంతో చాలా మంది యూజర్లు ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL)కు మారుతున్నారు. దీంతోపాటు 4జీ సేవలు పెరగడం, 5జీ నెట్ వర్క్ కూడా అందుబాటులోకి రానుండటం, అందుబాటు ధరల్లో రీచార్జ్ ప్లాన్లు అందించడంతో బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ అనేక ఆకర్షణీయ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. ఇతర ప్రైవేటు టెలికాం సంస్థల ప్లాన్ లతో పోలిస్తే తక్కువ ధరకే సేవలు అందిస్తోంది. ఇటీవల 30 రోజుల వ్యాలిడిటీతో రూ.229 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ రూ.229 ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMSలు అందిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అంటే ప్లాన్ వ్యాలిడిటీలో 60GB డేటాను పొందవచ్చు. 2GB డేటాతో, 30 రోజుల వ్యాలిడిటీని కేవలం తక్కువ ధరకే BSNL అందిస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనా
జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఊపందుకుంది. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి చేరారు. తమ యూజర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించడానికి.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో 4G, 5G రెడీ సిమ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి రీవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల వెల్లడించింది.ఈ విషయాన్ని డాట్ ఇండియా తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. 4G, 5G సర్వీస్ అనేది భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపాటబుల్ ఓవర్ ది ఎయిర్ (OTA), యూనివర్సల్ సిమ్ (U SIM) ప్లాట్‌ఫారమ్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. దీని ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్లను ఎంచుకోవచ్చు. దీనికి ఎలాంటి భౌగోళిక పరిమితులు లేవు.గత సంవత్సరం.. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం మొత్తం రూ. 89,047 కోట్లతో బీఎస్ఎన్ఎల్ కోసం మూడవ పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ వ్యూహంలో భాగంగా ఈ ప్యాకేజ్ ప్రకటించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 4G/5G స్పెక్ట్రమ్ కేటాయింపులు కూడా ఉన్నాయి.BSNL ready. Bharat ready.#ComingSoon pic.twitter.com/BpWz0gW4by— DoT India (@DoT_India) August 10, 2024 -
దూసుకెళ్తున్న బీఎస్ఎన్ఎల్.. ‘4జీ’లో మరో మైలురాయి
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 4జీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ తాజాగా మరింత ప్రగతి సాధించింది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.దేశవ్యాప్తంగా 4జీ సర్వీస్‌ను విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా 5జీ టెక్నాలజీని పరీక్షించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వినియోగదారులకు 5జీ సిమ్ కార్డ్‌లను కూడా అందిస్తోంది. తాజగా 4జీ సర్వీస్‌లో మరింత పురోగతి సాధించింది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు 15 వేల మైలురాయికి చేరుకున్నాయి.ఈ టవర్లను 'ఆత్మనిర్భర్ భారత్' పథకం కింద నిర్మించామని, దేశవ్యాప్తంగా అంతరాయం లేని ఇంటర్నెట్ను అందిస్తామని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బీఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ పూర్తిగా భారతీయ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో అమర్చిన పరికరాలన్నీ భారత్‌లోనే తయారయ్యాయి.అక్టోబరు చివరి నాటికి 80,000 టవర్లను ఏర్పాటు చేస్తామని, మిగిలిన 21,000 టవర్లను వచ్చే ఏడాది మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అంటే 2025 మార్చి నాటికి మొత్తం లక్ష టవర్లు 4జీ నెట్‌వర్క్‌కు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల డౌన్లోడ్ స్పీడ్ పెరుగుతుందని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బీఎస్ఎన్ఎల్కు మారుతున్నారా?.. నచ్చిన నెంబర్ ఎంచుకోండిలా
జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ నెట్వర్క్స్ అన్నీ కూడా రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత.. అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపు పడింది. దీంతో ఇప్పటికే చాలామంది తమ నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్ఎల్కు మార్చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం తక్కువ ధరలోనే అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది.ఎక్కువమంది బీఎస్ఎన్ఎల్కు మారుతున్న తరుణంలో సంస్థ కూడా తన నెట్‌వర్క్‌ను విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తోంది. తమ నెట్‌వర్క్‌కు మారాలనుకునే వారికోసం బీఎస్ఎన్ఎల్ నచ్చిన నెంబర్ ఎందుకుని వెసులుబాటు కూడా కల్పించింది. ఆన్లైన్లో యూజర్ ఇప్పుడు ఫేవరేట్ నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.ఆన్లైన్లో నెంబర్ ఎంచుకోవడం ఎలా?గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్‌లో BSNL Choose Your Mobile Number అని సెర్చ్ చేయాలి.ఇలా సెర్చ్ చేసిన వెంటనే BSNL CYMN అనేది కనిపిస్తుంది. దీనిపైనా క్లిక్ చేయగా మరో పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ అని నాలు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీ జోన్ సెలక్ట్ చేసుకుని రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.ఇలా ఎందుకున్న తరువాత ఛాయిస్ నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. కావాల్సిన ఆప్షన్ ఎందుకున్న తరువాత నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.నచ్చిన నెంబర్ ఎంచుకున్న తరువాత రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.ప్రక్రియ పూర్తయ్యాక సమీపంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లి సీఎం తెచ్చుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. -
బీఎస్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదల
బీఎస్ఎన్ఎల్ కొన్ని రాష్ట్రాల్లో ‘5జీ-రెడీ సిమ్ కార్డ్’లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇవి రాబోయే నెట్వర్క్ అప్‌గ్రేడ్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. కొత్త సిమ్ కార్డులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో 3జీ సదుపాయాన్నే అందిస్తోంది. కొన్ని టైర్1, టైల్ 2 నగరాలతోపాటు ఇతర టౌన్‌ల్లో మాత్రమే 4జీ సేవలను ప్రారంభించింది. ఇటీవల జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా..వంటి ప్రైవేట్ నెట్వర్క్ ఆపరేటర్లు తమ రీఛార్జ్ ప్లాన్లను సవరించాయి. వాటిని గతంలో కంటే దాదాపు 20-30 శాతం పెంచుతున్నట్లు ప్రకటించాయి. దాంతో ఆ నెట్వర్క్ వినియోగదారులు మార్కెట్లో చౌకగా రీచార్జ్ ప్లాన్లు అందించే బీఎస్ఎన్ఎల్వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ ఇందులో 4జీ సర్వీసే కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. దాంతో కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇది గమనించిన బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు 4జీ సదుపాయాన్ని వేగంగా విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. భవిష్యత్తులో రాబోయే 5జీ నెట్వర్క్ కోసం ప్రత్యేకంగా సిమ్‌కార్డులను తీసుకునే అవసరం లేకుండా ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’లను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వివరించింది.ఈ సిమ్‌కార్డును ఆధునిక స్మార్ట్ఫోన్లతోపాటు ఫీచర్ఫోన్లలో వాడుకునేందుకు వీలుగా రెగ్యులర్, మైక్రో, నానో వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ఎయిర్టెల్, జియో మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ 4జీ వినియోగదారులు 5జీ కనెక్టివిటీని యాక్సెస్ చేయడానికి కొత్త సిమ్ కార్డ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5జీ-రెడీ సిమ్‌నే వాడుకోవచ్చని సంస్థ పేర్కొంది. వినియోగదారులకు మరింత మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీని అందించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది.ఇదీ చదవండి: తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ!ఇదిలాఉండగా, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్లకు రూ.లక్ష కోట్ల పైనే కేటాయించడం విశేషం. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్లో సాంకేతిక మెరుగుదల, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లను కేటాయించారు. తాజాగా బీఎస్ఎన్ఎల్ 5జీ సేవల ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవల్ని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరీక్షించారు. -
గుడ్‌న్యూస్.. బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం
BSNL 5G: ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ దేశంలో తన 5జీ సేవల ట్రయల్స్ నిర్వహించడం ప్రారంభించింది. దీనికి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు."బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌తో ఫోన్ కాల్ ప్రయత్నించాను" అని సింధియా రాసుకొచ్చారు. ఈ మేరకు సి-డాట్ క్యాంపస్‌లో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు. మంత్రి పోస్ట్ చేసిన వీడియోలో ఆయన బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు.ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ. 82 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. టెలికం సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, దేశంలో పూర్తిగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ సాంకేతికతను సులభతరం చేయడానికి ఈ నిధులు ఉపయోగించనున్నారు. ఈ చర్య భవిష్యత్తులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పెద్ద సవాలుగా మారవచ్చు.Connecting India! Tried @BSNLCorporate ‘s #5G enabled phone call. 📍C-DoT Campus pic.twitter.com/UUuTuDNTqT— Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 2, 2024 -
4జీ వేగంతో 5జీ దిశగా.. దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్
సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రైవేటు రంగ సంస్థలకు గట్టి పోటీనిస్తోంది. ఆకర్షణీయమైన రీచార్జి ప్యాకేజీలకు తోడు, మెరుగైన సర్వీసులు అందిస్తుండటంతో వినియోగదారులు క్రమేపీ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుతున్నారు. బీఎస్ఎన్ఎల్ దేశీంగా అభివృద్ధి చేసిన 4జీ సేవలను రాష్ట్రంలోకి అందుబాటులోకి తెస్తుండటంతో వినియోగదారులకు హైస్పీడ్ డేటాతో పాటు అంతరాయాలు లేకుండా కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటు కలుగుతోంది. దీంతో ఇతర ప్రైవేటు మొబైల్ ఆపరేటర్ల నుంచి వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపునకు మారుతున్నారు.తక్కువ టారిఫ్ రాష్ట్రంలో ఇప్పటికే విజయవాడలో 4జీ సేవలను అందుబాటులోకి రావడంతో గడిచిన 20 రోజుల్లోనే 600 మందికి పైగా ఇతర ఆపరేటర్ల నుంచి బీఎస్ఎన్ఎల్లోకి మారినట్లు విజయవాడ బీఎస్ఎన్ఎల్ జీఎం రమణ తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో రూ.229 రీచార్జికి 30 రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2 జీబీ డేటా అందిస్తుంటే.. ఇవే ప్రయోజనాలు పొందాలంటే ప్రైవేటు సంస్థల్లో రూ.349 నుంచి రూ.379 వరకు చెల్లించాల్సి వస్తోంది.తక్కువ రేటుకే బీఎస్ఎన్ఎల్ మొబైల్ సరీ్వసులు అందిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ డేటా వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి మొబైల్ వినియోగదారుడు సగటున 24 జీబీ డేటాను వినియోగిస్తుంటే.. రాష్ట్రంలో గ్రామీణ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు మాత్రం 70 జీబీ పైనే వినియోగిస్తుండటం గమనార్హం.త్వరలో 5జీ సేవలు రాష్ట్రంలోని 4,500 ప్రాంతాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీ బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం తెలిపారు. ఒక్కసారి 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాక ఆరు నెలల్లోనే సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా 5జీ సేవలు అందుబాటులోకొస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్య 1.50 లక్షలు దాటగా, మొబైల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య 50 లక్షలు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఏడీఎస్ఎల్ బ్రాడ్ బ్యాండ్ 25,000, ఫైబర్ టు హోమ్ కనెక్షన్ల సంఖ్య 1.9 లక్షలకు పైనే ఉన్నాయి. రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మేరకు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. 2022–23లో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.700 కోట్లకు చేరుకోగా.. అది 2023–24లో రూ.1,000 కోట్ల మార్కుకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో వీఆర్ఎస్ ద్వారా ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో పాటు మిగులు స్థలాలను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 27 చోట్ల బీఎస్ఎన్ఎల్కు ఉన్న అదనపు ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే విజయవాడ, తాడేపల్లిగూడెం, తుని, పాలకొల్లు, కొండపల్లిలో స్థలాలను విక్రయించడం ద్వారా రూ.80 కోట్ల నిధులను సమకూర్చుకుంది.1.5లక్షలు ప్రస్తుతం రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్య రూ.700కోట్లు 2022–23లో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం50లక్షలు రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ సెల్‌ఫోన్ కనెక్షన్ల సంఖ్య రూ.1,000కోట్లు 2023–24లో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం(అంచనా) -
బీఎస్ఎన్ఎల్కి వెళ్తుంటే ఇది తెలుసుకోండి..
తక్కువ ధరకు టెలికం సేవలు అందించే ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కి మారాలనుకుంటున్నారా..? సిగ్నల్స్ ఎలా ఉంటాయోనని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు దగ్గరలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం..పలు ప్రైవేటు టెలికాం కంపెనీలు టారిఫ్‌లు పెంచడంతో అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్లు ఉన్న ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వైపు చాలా మంది వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇది ఇప్పుడు తన 4G సేవలను చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల జూలై 21న తన 4G సంతృప్త ప్రాజెక్ట్ కింద 1000 టవర్ల ఏర్పాటు లక్ష్యాన్ని సాధించింది.ఈ నేపథ్యంలో మీరు బీఎస్ఎన్ఎల్కి మారాలని ప్లాన్ చేస్తుంటే, మీరు నివసిస్తున్న ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. మీ మొబైల్ ఫోన్లో చిన్న రేడియో ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ సిగ్నల్‌లను పంపుతుంది. రిసీవర్ ఇతర ఫోన్ల నుంచి సిగ్నల్‌లను అందుకుంటుంది. ఈ సిగ్నల్స్ బలహీనంగా ఉంటాయి. తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలవు. అందుకే సమీపంలో మొబైల్ టవర్లు ఉన్నప్పుడు మీ ఫోన్లో సిగ్నల్స్ ఉంటాయి.సమీపంలో టవర్ ఉందో లేదో తెలుసుకోండి ఇలా..ముందుగా https://tarangsanchar.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండిపేజీని కిందికి స్క్రోల్ చేసి, ‘మై లొకేషన్’పై క్లిక్ చేయండి.తదుపరి పేజీలో, మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి.Send me a mail with OTP బటన్ పై క్లిక్ చేయండి.మీ ఈమెయిల్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.తర్వాతి పేజీలో, మీ చుట్టూ ఉన్న అన్ని మొబైల్ టవర్లను చూపించే మ్యాప్ మీకు కనిపిస్తుంది.ఏదైనా టవర్‌పై క్లిక్ చేస్తే సిగ్నల్ రకం (2G/3G/4G/5G), అది ఏ కంపెనీ టవర్ అనేది మీకు సమాచారం అందుతుంది. -
బీఎస్ఎన్ఎల్ తగ్గిన నష్టాలు.. పెరిగిన ఆదాయాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ బకాయిల ముందు ఆదాయాలు లేదా ఎబిటా (స్థూల ఆదాయం) 2023–24 ఆర్థిక సంవత్సరానికి 38.8 శాతం పురోగతితో రూ. 2,164 కోట్లకు చేరిందని కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ బుధవారం పార్లమెంటుకు తెలియజేశారు. నష్టాలు రూ. 5,371 కోట్లకు తగ్గాయని వివరించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.8,161 కోట్లు కావడం గమనార్హం. ఆయా అంశాలపై పెమ్మసాని లిఖిత పూర్వకంగా ఇచి్చన సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు.. డేటా ఉల్లంఘనలు జరగలేదు... బీఎస్ఎన్ఎల్ డేటా ఉల్లంఘన విషయానికి వస్తే, బీఎస్ఎన్లో చొరబాటు డేటా ఉల్లంఘన జరగవచ్చని ఈ ఏడాది మే 20న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) నివేదించింది. దీనిని విశ్లేíÙంచడం జరిగింది. ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ (ఎఫ్టీపీ) సర్వర్‌లో సీఈఆర్టీ–ఇన్ షేర్ చేసిన నమూనా డేటాకు సమానమైన డేటా ఉందని కనగొనడం జరిగింది. టెలికం నెట్వర్క్ హోమ్ లొకేషన్ రిజిస్టర్ (హెచ్ఎల్ఆర్)లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టమైంది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో సేవలో అంతరాయం కలుగలేదు. అయినప్పటికీ, ఎటువంటి డేటా ఉల్లంఘనలూ జరక్కుడా బీఎస్ఎన్ఎల్ చర్యలు నిరంతరం తీసుకుంటోంది. అన్ని ఎఫ్టీపీ సర్వర్లకు యాక్సెస్ పాస్‌వర్డ్‌ల మార్పులు జరిగాయి. టెలికం నెట్‌వర్క్‌ల ఆడిట్ నిర్వహించడానికి అలాగే టెలికం నెట్‌వర్క్‌లలో డేటా ఉల్లంఘనల నివారణకు పరిష్కార చర్యలను సూచించడానికి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ)ని ఏర్పాటు చేయడం జరిగింది.→ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు, చర్యల ఫలితంగా 2020–21 ఆర్థిక సంవత్సరం నుండి బీఎస్ఎన్ఎల్ అలాగే ఎంటీఎన్ఎల్ నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి. → ఆత్మనిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ దేశీయ 4జీ సాంకేతికత విస్తరణ కోసం లక్ష 4జీ సైట్ల కోసం కొనుగోలు ఆర్డర్ చేయడం జరిగింది. ఈ పరికరాలను 5జీకి అప్‌గ్రేడ్ కూడా చేయవచ్చు. → బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2019లో దాదాపు రూ. 69,000 కోట్ల మొదటి పునరుద్ధరణ ప్యాకేజీ... బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నిర్వహణ ఖర్చులను తగ్గించింది. → 2022లో దాదాపు రూ. 1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ మంజూరు జరిగింది. తాజా మూలధనాన్ని చొప్పించడం, రుణాన్ని పునరి్నరి్మంచడం, గ్రామీణ టెలి ఫోనీకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దీని ఈ ప్యాకేజీ లక్ష్యం. → 2023లో మొత్తం రూ.89,000 కోట్లతో బీఎస్ఎన్ఎల్కు 4జీ అలాగే 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపును ప్రభుత్వం ఆమోదించింది. -
ఇక బీఎస్ఎన్ఎల్కు తిరుగుండదు!!
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ పునర్వైభవాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు టెలికం సంస్థలు టారిఫ్‌లను పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. దీనికితోడు కేంద్ర బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించడంతో మరింత వినియోగదారులు ఇటువైపు వస్తారని ఇక తిరుగుండదని భావిస్తున్నారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికాం ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపులో సింహభాగం నిధులు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంబంధిత ఖర్చుల కోసమే కేటాయించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లు కేటాయించడం విశేషం.“బడ్జెట్ అంచనా 2024-25లో ఈ డిమాండ్ కోసం మొత్తం నికర కేటాయింపు రూ.1,28,915.43 కోట్లు ( రూ.1,11,915.43 కోట్లు, మరో రూ.17,000 కోట్లతో కలిపి). ఇందలో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద లభించే నిల్వల నుంచి రూ.17,000 కోట్ల అదనపు కేటాయింపు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు పరిహారం, భారత్‌నెట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి పథకాలకు ఉద్దేశించినది” అని బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు.ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్స్టాల్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న బీఎస్ఎన్ఎల్కు బడ్జెట్ కేటాయింపులు మరింత ఊపును ఇవ్వనున్నాయి. -
బీఎస్ఎన్ఎల్కు వెళ్తున్న వారికి గుడ్‌న్యూస్..
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెల్కోలు ఇటీవల తమ టారీఫ్‌లను పెంచడంతో చాలా మంది ఇపుడు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ 1 2వేల వరకు సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ టీసీఎస్, తేజస్ నెట్వర్క్, ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రైవేట్ టెల్కోలు టారిఫ్‌లు పెంచినప్పటి నుంచి 2.5 లక్షల మందికిపైగా బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యారు. -
జియోకి భారీ డామేజ్ 25 లక్షల మంది BSNLకి పోర్ట్?
-
రీఛార్జ్ ప్లాన్స్ ఎఫెక్ట్.. ఇప్పుడు అందరి చూపు దానివైపే..
ఇటీవల జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం దిగ్గజాలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా యూజర్లను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో యూజర్ల చూపు గవర్నమెంట్ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు పడింది.రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరగడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారుతున్న యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ చార్జీలు తక్కువగా ఉండటమే. డేటా కోసం కాకుండా.. కేవలం కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించేవారు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.2024 జులై 3, 4 తేదీల నుంచి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల టారిఫ్ ధరలు 15 శాతం నుంచి 20 శాతం పెరిగాయి. ధరలు పెరిగిన వారం రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది బీఎస్ఎన్ఎల్కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్లు తెలుస్తోంది. మరో 25 లక్షల మంది కొత్త బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం. -
టాటా కొత్త డీల్.. జియోకి గట్టి పోటీ తప్పదా?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. దీని వల్ల చాలా మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ (BSNL)కి మారారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ధోరణి మరింతగా పెరుగుతోంది. అనేకమంది ఎయిర్టెల్ (Airtel), జియో (Jio) వినియోగదారులు తమ మొబైల్ నంబర్లను బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసుకుంటున్నారు.ఈ రెండు తమ ప్లాన్ ధరలను విపరీతంగా పెంచడంపై సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), బీఎస్ఎన్ఎల్ మధ్య ఇటీవల రూ.15,000 కోట్ల డీల్ కుదిరింది. ఇందులో భాగంగా టీసీఎస్, బీఎస్ఎన్ఎల్ కలిసి దేశం అంతటా 1,000 గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. ఇది సమీప భవిష్యత్తులో వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తుంది.ప్రస్తుతం 4జీ ఇంటర్నెట్ సర్వీస్ మార్కెట్లో జియో, ఎయిర్టెల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే బీఎస్ఎన్ఎల్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటే అది జియో, ఎయిర్‌టెల్‌లకు గణనీయమైన సవాలుగా మారవచ్చు. టాటా దేశం అంతటా నాలుగు ప్రాంతాలలో డేటా సెంటర్లను కూడా నిర్మిస్తోంది. ఇది దేశంలో 4జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుంది.గత నెలలో జియో తమ రీఛార్జ్ ప్లాన్లలో ధరల పెంపును ప్రకటించింది. ఆ తర్వాత ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా ఇలాంటి ప్రకటనలు చేశాయి. వీటిలో జియో ధరల పెరుగుదల అత్యధికం. ఇది 12% నుంచి 25% వరకు ఉంది. ఎయిర్టెల్ ధరలు 11% నుంచి 21%, వొడాఫోన్ ధరలు 10% నుంచి 21% వరకు పెరిగాయి. కాగా సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు జియోపైనే ఉన్నాయి. చాలా మంది జియో యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. -
4జీ, 5జీ సర్వీసులు లేకుంటే కష్టమే.!
న్యూఢిల్లీ: 4జీ, 5జీ సర్వీసులు లేకపోవడం వల్లే ప్రైవేట్ టెల్కోలతో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ పోటీపడలేకపోతోందంటూ ఆ సంస్థ ఉద్యోగుల యూనియన్ వ్యాఖ్యానించింది. గతంలో బీఎస్ఎన్ఎల్ నుంచి పోటీ వల్ల ప్రైవేట్ సంస్థలు టారిఫ్‌లను అడ్డగోలుగా పెంచకుండా కాస్త సంయమనం పా టించేవని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని తెలిపింది. అవి లాభాల్లోనే ఉన్నప్పటికీ తాజాగా రేట్లను పెంచడం సరికాదని పేర్కొంది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యూనియన్ ఈ మేరకు లేఖ రాసింది. మూడు టెల్కోలు – రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా – టారిఫ్‌లను 10–27 శాతం మేర పెంచిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీ యూ) తక్కువగా ఉండటం వల్లే టారిఫ్‌లను పెంచాల్సి వచి్చందంటూ ప్రైవేట్ టెల్కోలు తప్పుదారి పట్టిస్తున్నాయని యూనియన్ ఆరోపించింది. 2023–24లో జియో రూ. 20,607 కోట్లు, ఎయిర్‌టె ల్ రూ. 7,467 కోట్ల లాభాలు ఆర్జించాయని, ఈ నే పథ్యంలో సామాన్యులపై భారం పడేలా టారి ఫ్లను పెంచడం సరికాదని పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సత్వరం తగు చర్యలు తీసుకోవాలని, సామా న్యుల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది. -
ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను సగానికి తగ్గించిన ప్రభుత్వ సంస్థ
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దాదాపు చాలా టెలికాం కంపెనీలు ప్రత్యేకంగా ఓటీటీ సేవలందిస్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తమ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్లకు అందించే సినిమాప్లస్ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను సంస్థ తగ్గించింది.ఈ ప్రారంభ ప్యాక్ ధర గతంలో నెలకు రూ.99గా ఉండేది. దాన్ని రూ.49కు తగ్గిస్తూ కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఇందులో లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా, ఎపిక్ ఆన్ ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించవచ్చు. దీంతోపాటు బీఎస్ఎన్ఎల్ మరో రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు రూ.199 సబ్‌స్క్రిప్షన్‌తో జీ5, సోనీలివ్, యప్‌టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన ఫుల్ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ అందిస్తోంది.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలునెలకు రూ.249 చెల్లిస్తే బీఎస్ఎన్ఎల్ ప్రీమియం ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావచ్చని సంస్థ తెలిపింది. ఇందులో జీ5, సోనీ లివ్, డిస్నీ+ హాట్‌స్టార్, యప్‌టీవీ, లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా, వంటి ఓటీటీలను ఫ్రీగా చేసేయొచ్చు. -
BSNL Plan: అదిరిపోయే ఆఫర్ నెలకు రూ.66
-
రూ. 1,127 కోట్ల ఆర్డర్.. పెద్ద ప్రయత్నమే చేస్తున్న బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్రయత్నమే చేస్తోంది. తమ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ (OTN) ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా మార్చేయబోతోంది. ఇందుకోసం హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ (HFCL) అనే కంపెనీకి భారీ ఆర్డర్ ఇచ్చింది. ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ మార్పు కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నుంచి రూ. 1,127 కోట్ల ఆర్డర్‌ను పొందినట్లు హెచ్ఎఫ్సీఎల్ తాజాగా తెలిపింది. ఈ సంస్థ చేపట్టే సమగ్ర నెట్వర్క్ అప్‌గ్రేడ్ కేవలం కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సేవల అవసరాలను తీర్చడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో మెరుగైన 4జీ సేవలను అందించడంతోపాటు 5జీ సర్వీస్‌పైనా దృష్టి పెట్టే స్థాయిలో బీఎస్ఎన్ఎల్ను నిలుపుతుందని భావిస్తున్నారు. సంక్లిష్ట వ్యవస్థలను ఏకీకృతం చేయడంలో తమ అసమానమైన నైపుణ్యంతో అత్యాధునిక ఆప్టికల్ టెక్నాలజీని అమలు చేయడానికి నోకియా (NOKIA) నెట్‌వర్క్‌తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు హెచ్ఎఫ్సీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ కమ్యూనికేషన్.. కారణం ఇదేనా..
దేశసరిహద్దుల్లో సేవలందిస్తున్న జవానులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొండ ప్రాంతాలు, లోయలు ఉండడంతో వారికి నెట్వర్క్ కనెక్టవిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు 2020లో చైనాతో జరిగిన సరిహద్దు వివాదం నేపథ్యంలో అక్కడి బలగాలతో మరింత కనెక్టివిటీ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో కొన్ని సాయుధ దళాలకు చెందిన ఇంటెలిజెన్స్ పోస్టులు కూడా ఉండనున్నాయి. అయితే ఇందుకు దాదాపు రూ.1,545 కోట్లు అవసరం అవుతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ, హోంశాఖ, బీఎస్ఎన్ఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్ ప్రాజెక్టులో భాగంగా లద్దాఖ్‌లో మొత్తం 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటిల్లో తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 34 చోట్ల ప్రారంభమయ్యాయి. మయన్మార్‌తో 2.4 కి.మీ, పాక్‌తో ఉన్న 18 కి.మీ సరిహద్దులో గతేడాది ఫెన్సింగ్ పని కూడా పూర్తి చేశారు. 2023లో చైనా సరిహద్దుల్లో కొత్తగా 48.03 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. దీంతోపాటు నాలుగు ఔట్ పోస్టులు, మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. చైనాతో భారత్‌కు దాదాపు 3,488 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది. ఇదీ చదవండి: నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే.. భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో కారణంగా ఇరుదేశాల సైనికులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంటోంది. అక్కడి ప్రాంతాల పేర్లను మారుస్తూ చైనా వివాదాలకు తెర తీస్తోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న ఆ దేశం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక, సైనిక వసతుల కల్పనకు పెద్దయెత్తున నిధులు వెచ్చిస్తోంది. సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారానే డ్రాగన్ దూకుడుకు ముకుతాడు వేయవచ్చని ఇండియా బలంగా విశ్వసిస్తోంది. అందులో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. -
డార్క్‌వెబ్‌లో ‘బీఎస్ఎన్ఎల్’ యూజర్ల డేటా
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారుల సమాచారాన్ని చోరీచేసిన ఓ హ్యాకర్ ఆ వివరాలను ఆన్లైన్లో విక్రయానికి పెట్టాడు. దీంతో ఆయా కస్టమర్ల గోప్యతకు విఘాతం కలిగింది. తనను ‘పెరిల్’గా పేర్కొన్న ఓ హ్యాకర్.. డార్క్‌వెబ్‌లో ఆ సమస్త వివరాలను పొందుపరిచాడు. దీంతో యూజర్ల గుర్తింపు బహిర్గతమవడంతోపాటు వారి సమాచారం సాయంతో మరో ఆర్థిక మోసం, ఆన్లైన్మోసానికి ఆస్కారం ఏర్పడింది. దాదాపు 29 లక్షల వరుసల డేటాను సంపాదించానని హ్యాకర్ తన డార్క్‌వెబ్ పేజీలో పేర్కొన్నాడు. శాంపిల్‌గా మొదట 32,000 లైన్ల డేటాను అందరికీ కనిపించేలా పెట్టాడు. ఆయా బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్‌లైన్ యూజర్ల పేరు, ఈమెయిల్ ఐడీ, బిల్లుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత డేటాను వెబ్సైట్లో విక్రయానికి పెట్టాడు. కస్టమర్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ వివరాలు, ఆర్డర్లు, హిస్టరీ అందులో ఉన్నాయి. డేటా చోరీతో వెంటనే అప్రమత్తమై తమ యూజర్ల డేటా రక్షణకు బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. ‘ ఇది బీఎస్ఎన్ఎల్కు, దాని వినియోగదారులపై విస్తృతస్థాయిలో దు్రష్పరిణామాలు చూపిస్తుంది’ అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కనిష్క్ గౌర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా.. అదిరిపోయే ఆఫర్!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ దీపావళి సందర్భంగా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లకు ప్రస్తుతం ఉన్న రీచార్జ్ ప్లాన్లపై 3జీబీ అదనపు డేటాను అందిస్తున్నట్లు వెల్లడించింది. అదనపు డేటా ఆఫర్ ప్రస్తుతం ఉన్న రూ. 251 రీఛార్జ్ ప్లాన్‌తోపాటు రూ. 400 లోపు ఉన్న ఇతర రీఛార్జ్ ప్లాన్లపైనా వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్లో రూ. 400 లోపు ప్రస్తుతం మూడు రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అవి రూ. 251, రూ. 299 రూ. 398. దీపావళి బొనాంజాలో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక డేటా ఆఫర్ గురించి ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా పోస్ట్‌ల అధికారికంగా ప్రకటిచింది. అదనపు డేటాను పొందండిలా.. బీఎస్ఎన్ఎల్ అధికారిక పోర్టల్‌తోపాటు సెల్ఫ్-కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే అదనపు డేటా ప్రయోజనం పొందవచ్చు. రూ. 251 రీచార్జ్‌పై అదనంగా 3జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. దీంతోపాటు ప్లాన్‌లో భాగంగా 70జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే రూ. 299 ప్లాన్‌పైనా 3జీబీ ఉచిత డేటాను ప్రకటించింది. ఈ ప్లాన్ ఇప్పటికే రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాలింగ్‌తో వస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక రూ. 398 రీచార్జ్ ప్లాన్‌కు కూడా 3జీబీ అదనపు డేటా వర్తిస్తుంది. ఈ ప్లాన్‌పై రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత ఎస్టీడీ, లోకల్ వాయిస్ కాలింగ్‌తో పాటు 120 జీబీ డేటా వస్తుంది. 30 రోజులు చెల్లుబాటు ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. Celebrate Diwali with #BSNLSelfCareApp and get 3GB extra data for voucher ₹299. Enjoy unlimited browsing, streaming, and sharing this #FestiveSeason.#RechargeNow: https://t.co/KUu7rPO1F5 (For NZ, EZ& WZ), https://t.co/5AAj1chxOo (For SZ)#BSNL #BSNLDiwaliBonanza #G20India pic.twitter.com/i0Zda4tbHA — BSNL India (@BSNLCorporate) November 3, 2023 -
డిసెంబర్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది డిసెంబర్లో 4జీ సేవలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ముందుగా పరిమిత స్థాయిలో మొదలుపెట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు తెలిపారు. జూన్ తర్వాత 4జీ సర్వీసులను 5జీకి అప్‌గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. ‘డిసెంబర్లో పంజాబ్‌లో 4జీ సేవల ను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధంగా ఉంది. 200 సైట్లలో నెట్వర్క్ సిద్ధంగా ఉంది. 3,000 సైట్లను ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో ఉన్నాం‘ అని పుర్వార్ చెప్పారు. నెట్‌వర్క్‌ను క్రమంగా నెలకు 6,000 సైట్లతో మొదలుపెట్టి ఆ తర్వాత 15,000 సైట్ల వరకు పెంచుకోనున్నట్లు తెలిపారు. మొత్తం మీద 2024 జూన్ నాటికి 4జీ విస్తరణ పూర్తి చే యాలని నిర్దేశించుకున్నట్లు పుర్వార్ పేర్కొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం లక్ష్యం రూ.1,000 కోట్లు
అల్లిపురం (విశాఖ దక్షిణ): బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం ప్రస్తుతం రూ.700 కోట్లు ఉందని, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 10% అధికమని ఏపీ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) ఎం.శేషాచలం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1000 కోట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. డాబాగార్డెన్స్‌లో గల సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మనిర్బర్ భారత్ కింద స్వదేశీ 4జీ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ను ఆదేశించిందని, ఇప్పటికే పాన్ ఇండియాలో టీసీఎస్, ఐటీఐ కంపెనీలకు లక్ష సైట్లు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని, ఏడాదిలో ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది జూలైలో పంజాబ్‌లో బీటా లాంచ్ పూర్తయిందని, దీని ద్వారా 4జీ పరికరాలు 5జీకి అప్‌గ్రేడ్ అయినట్టు తెలిపారు. ఏపీ సర్కిల్లో 4300 సైట్లలో 4జీ పరికరాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విశాఖ సర్కిల్లో 463 సైట్లు 4జీగా ఇప్పటికే సేవలందిస్తున్నాయన్నారు. అంత్యోదయ మిషన్ కింద మారుమూల గ్రామాలకూ కనెక్టివిటీ అందిస్తున్నామని, డిసెంబర్ నాటికి ఆ పనులు పూర్తవుతాయని, వాటికి సోలార్ పవర్‌తో కనెక్షన్ ఇస్తామన్నారు. ఏపీలో 4జీ సేవలు 3800 గ్రామాల్లో అందుబాటులోకొస్తాయని వెల్లడించారు. 2026 నాటికి సంస్థ లాభాల బాటలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని, ప్రభుత్వ శాఖలన్నీ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు వాడేలా మార్కెటింగ్ విభాగాన్ని పటిష్టం చేస్తామని శేషాచలం వివరించారు. సమావేశంలో విశాఖ జిల్లా జనరల్ మేనేజర్ పి.పాల్ విలియమ్స్, జి.ఆడం, మొబైల్స్ విభాగం హెడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గుడ్‌న్యూస్: తక్కువ ధరకు 5 నెలల వ్యాలిడిటీ.. సూపర్ రీచార్జ్ ప్లాన్
తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీని అందించే సూపర్ రీచార్జ్ ప్లాన్ (Recharge Plan) ను ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తీసుకొచ్చింది. 150 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ. 397 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ రూ. 397 ప్లాన్ కొత్తది కాదు. ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ గతంలోనే అందించింది. అయితే ప్రస్తుతం పెట్టిన ప్లాన్‌లో మాత్రం కొన్ని ప్రయోజనాలు మారాయి. ఇంతకుముందు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 180 రోజులు ఉండగా ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులకు తగ్గింది. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత ఫోన్ కాల్స్ వంటి ప్రయోజనాలు ఉన్నా ఇవన్నీ 30 రోజుల్లోనే ముగుస్తాయి. పాత ప్లాన్‌లో ఈ ప్రయోజనాలన్నీ 60 రోజులపాటు ఉండేవి. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ మళ్లీ ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: అతి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్.. నెలంతా అన్లిమిటెడ్! -
అతి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్.. నెలంతా అన్లిమిటెడ్!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, ఎయిర్ టెల్ వంటి బడా కంపెనీలకు పోటీగా తమ వినియోగదారులకు తక్కువ ధరలోనే డేటా, కాల్స్, ఎస్ఎంఎస్లను అందిస్తోంది. నెలంతా కేవలం రూ. 200 కంటే తక్కువ ధరలతో రీఛార్జ్ ప్లాన్స్ బీఎస్ఎన్ఎల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్పెషల్ ప్లాన్స్ వివరాలేంటో తెలుసుకుందాం.. రూ. 184 ప్లాన్ బీఎస్ఎన్ఎల్ రూ . 184 ప్లాన్ కింద కస్టమర్లకు నెలంతా అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు 1జీబీ రోజువారీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. తక్కువ సంఖ్యలో నెట్ వినియోగించే కస్టమర్లకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. రూ. 185 ప్లాన్ రూ.184 ప్లాన్ ప్రయోజనాలనే రూ. 185 ప్లాన్ కూడా అందిస్తోంది. రోజూ 1జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలు ఉంటాయి. అయితే రోజువారీ డేటా ఉపయోగించిన తర్వాత ఈ ప్లాన్ కింద కస్టమర్లకు 40Kbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. రూ. 186 ప్లాన్ రోజూ ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి ఈ రూ. 186 ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 1జీబీ రోజువారీ డేటా, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. ఇదీ చదవండి: GST On X: ట్విటర్ నుంచి డబ్బులు వస్తున్నాయా? జీఎస్టీ తప్పదు! -
BSNL: కావాలనే దివాలా తీయిస్తున్నారు!
ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) లను దివాళా తీయించి కార్పొరేట్ సంస్థలకు లాభార్జనలో అడ్డులేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేయదగినదంతా చేస్తోంది. దీనికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం నిలువెత్తు నిదర్శనం. ఈ సంస్థకు ఒకవైపు నష్టాలు వచ్చేలా పరిస్థి తులను సృష్టిస్తున్నది ప్రభుత్వమే. అదే సమయంలో నష్టాల నుంచి బయట పడేయడానికి పున రుద్ధరణ (రివైవల్) ప్యాకేజీలు పేరిట మాయ చేస్తున్నదీ ప్రభుత్వమే. ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చే క్రమంలో ముందు తన సంస్థలకు ఇచ్చి, తర్వాత ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం సహజం. కాదంటే ఎటువంటి వివక్షా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రెండింటికీ అనుమతులు జారీ చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కు 3జీ సర్వీ సులు ఇవ్వడానికి కావాల్సిన స్పెక్ట్రమ్ ఇచ్చే సమయంలో కానీ, 4జీ సర్వీసులు ఇవ్వడానికి కావాల్సిన స్పెక్ట్రమ్ ఇచ్చేందుకు కానీ అనేక అడ్డంకులు సృష్టించింది. కానీ ఇదే సమయంలో ప్రయివేటు టెలికాం కంపెనీలకు 4జీ సేవల అనుమతుల విషయంలో ఉదారంగా వ్యవహరించింది. ప్రపంచ వ్యాప్తంగా టెలికాం సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతి చేసే దేశాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. భారత దేశానికి మూడేళ్ళ వరకు ఆ పరిజ్ఞానం లేదు. చాలామంది పెట్టుబడి దారుల ఒత్తిడితో భారత ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ కేవలం మన దేశంలో తయారైన 4జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వాడుకుని 4జీ సర్వీసులు ఇవ్వాలని నిబంధనలు పెట్టింది. అంటే విదేశాల నుంచి ఈ టెక్నాలజీని ఇది దిగుమతి చేసుకోకూడదన్నమాట. అయితే ప్రైవేటు టెలికాం కంపెనీ లకు మాత్రం ఈ నిబంధన విధించలేదు. దీంతో ప్రైవేట్ సంస్థలు 4జీ సేవలు అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతుంటే.. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం కోసం మూడేళ్లు బీఎస్ఎన్ఎల్ ఎదురు చూడాల్సి వచ్చింది. ఈలోపు దాని ఖాతాదారులు చేజారిపోయారన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఇక నష్టాలు వచ్చాయంటే రావా? చివరకు 4జీ సర్వీ సులు ప్రారంభించడానికి అయ్యే ఖర్చులు, బీఎస్ఎన్ ఎల్‌కు ఉన్న అప్పులు, నష్టాలు, ఉద్యోగుల కోసం అయ్యే ఖర్చులు పరిశీలించి మొదటి రివైవల్ ప్యాకేజీని సెప్టెంబర్ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో 90,000 మంది ఉద్యోగుల వాలంటరీ రిటైర్మెంట్ పథకం అమలైతే చెల్లించాల్సిన డబ్బూ భాగమన్న విషయం గుర్తుంచుకోవాలి. దాదాపు 74,000 కోట్ల రివైవల్ ప్యాకేజీని సెప్టెంబర్ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 20,140 కోట్లు 4జీ స్పెక్ట్రమ్ కోసం కాగా, రూ. 3,674 కోట్లు బీఎస్ ఎన్ఎల్ కేంద్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ చార్జీలు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల వాలంటరీ రిటైర్మెంట్ పథకం ఖర్చు దాదాపు రూ. 29,935 కోట్లు. ఈ వీఆర్ఎస్ పథకంలో ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ లాంటి ఆర్థిక ప్రయోజనాలను వాయిదా వేసి, ప్రభుత్వం మోసం చేసిందనుకోండి. బీఎస్ఎన్ఎల్ 4జీ స్పెక్ట్రమ్‌పై చెల్లించాల్సిన రూ. 3,674 కోట్ల జీఎస్టీపై కూడా ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు సమయంలో ఆ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న సేవలకు గాను కొంత నగదు తిరిగి చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా 2010 వరకు మాత్రమే ఈ రకమైన చెల్లింపు చేసి ఆ తర్వాత ఈ వెసులుబాటును ఆపేసింది. భారత దేశంలో తయారైన సాంకే తిక పరిజ్ఞానం వాడుకుని 4జీ సేవలు ప్రారంభించడానికి అయ్యే ఖర్చును ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రోగ్రాంలో భాగంగా భరిస్తామని పేర్కొని, తర్వాత దాన్ని క్యాపిటల్ ఇన్ఫ్యూజన్, ఈక్విటీ ఇన్ఫ్యూజన్గా సర్దుబాటు చేసింది ప్రభుత్వం. ఇన్ఫ్యూజన్ అంటే నికరంగా నగదు రూపంలో ఇవ్వకుండా పెట్టుబడులు లేదా షేర్ల రూపంలో లేదా ఇతర మార్గాలలో సర్దుబాటు చేసి చూపడం. నిజానికి ప్రయివేటు టెలికం కంపెనీలు గత నాలు గేళ్లుగా వాణిజ్య పరంగా లాభాలు వచ్చే పట్టణ ప్రాంతా ల్లోనే 4జీ సర్వీసులు ఇస్తున్నాయి. అంతగా ఆదాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో 4జీ సర్వీసులు ఇవ్వాలంటే బీఎస్ ఎన్ఎల్ అవసరం. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల కిలో మీటర్ల ఓఎఫ్సీ కేబుల్ కలిగిన ‘భారత్ బ్రాడ్ బాండ్ నెట్వర్క్ లిమిటెడ్’ (బీబీఎన్ఎల్)ను బీఎస్ ఎన్ఎల్లో కేంద్ర ప్రభుత్వం విలీనం చేసింది. తాజాగా ఈ జూన్‌లో మూడవ రివైవల్ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 4జీ/5జీ స్పెక్ట్రమ్ కోసం 46,339 కోట్లు కేటా యించారు. మిగతాది అప్పులు తీర్చడం కోసం ఇచ్చారు. అయితే నికరంగా ఈ ప్యాకేజీలో నగదు సర్దు బాటు చేసింది రూ. 531 కోట్లు మాత్రమే. మొత్తంగా బీఎస్ఎన్ఎల్కు మూడు విడతల్లో ప్రకటించిన రూ. 3.23 లక్షల కోట్ల ప్యాకేజీలో నికరంగా నగదు రూపంలో 15,000 కోట్లు మాత్రమే సర్దుబాటు చేశారు. అది కూడా దశాబ్దాల తర్వాత పునరుద్ధరణ చేసిన గ్రామీణ సేవల సర్వీసులకు చేసిన చెల్లింపుగానే దీన్ని ఇచ్చారు. బుక్‌లో సర్దుబాటు చేసే మొత్తానికి ప్యాకేజీ అనే పేరు పెట్టడం వెసులుబాటు ఎలా అవుతుంది?. టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రజా సేవలు అందించే సంస్థ లేకపోతే ప్రయివేటు టెలికాం కంపెనీలు ప్రజ లను టారిఫ్‌ల పేరుతో దోచుకుంటాయని గమనించాలి. తారానాథ్ మురాల, వ్యాసకర్త టెలికాం రంగ నిపుణులు -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మరింత మెరుగ్గా బ్రాడ్‌బ్యాండ్ సేవలు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. భారత్‌ఫైబర్ పేరిట అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన కస్టమర్ల కోసం నిరంతర టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భారత్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం 1800 4444 నెంబర్‌తో 24/7 నిరంతర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు ట్విటర్ ద్వారా బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి ఏ సమస్య ఉన్నా కస్టమర్లు ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. కాగా భారత్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా జీ5, డిస్నీప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్ వంటి ఓటీటీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. #BSNL has launched its 24/7 toll-free no. 1800-4444 for #BharatFibre Broadband customers.#G20India pic.twitter.com/T2yV1jyNpu — BSNL India (@BSNLCorporate) June 15, 2023 -
బీఎస్ఎన్ఎల్కు రూ.89,047 కోట్ల ప్యాకేజీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీలకు దీటుగా దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవల ప్రారంభించేందుకు కీలక అడుగు పడింది. స్పెక్ట్రమ్ కేటాయింపులతో కూడిన రూ.89,047 కోట్ల విలువ చేసే మరో పునరుద్ధరణ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈక్విటీ రూపంలో బీఎస్ఎన్ఎల్కు 4జీ, 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది. రూ.46,338 కోట్లు విలువ చేసే 700 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, 3300 మెగాహెర్జ్ బ్యాండ్‌లో 70 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ (రూ.26,184 కోట్లు), 26 గిగాహెర్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ (రూ.6,565 కోట్లు), 2500 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ (రూ.9,428 కోట్లు) కేటాయించనుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ అధీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2,10,000 కోట్లకు పెరగనుంది. ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులతో బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2019లో మొదటిసారి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు రూ.69,000 కోట్ల విలువ చేసే ప్యాకేజీ ప్రకటించింది. 2022లో మరో రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. కేంద్రం సాయంతో బీఎస్ఎన్ఎల్ రుణ భారం రూ.22,289 కోట్లకు దిగొచ్చింది. -
అంత సీన్ లేదు! బీఎస్ఎన్ఎల్ కూడా ఉంటుంది..
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఒకటి, రెండు సంస్థల గుత్తాధిపత్యానికి అవకాశం లేదని ఆ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ స్థిరమైన కంపెనీగా అవతరించనుందని చెప్పారు. వొడాఫోన్ ఐడియా సంస్థ కస్టమర్లను కోల్పోతూ, ఆర్థికంగా బలహీనపడుతుండడంతో, టెలికం రంగం ఇక ద్విఛత్రాధిపత్యం (డ్యుయోపలీ) కిందకు వెళుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతుండడంతో మంత్రి స్పందించారు. ఈ ఆందోళలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం టెలికం మార్కెట్లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతోపాటు, ప్రభుత్వరంగం నుంచి బీఎస్ఎన్ఎల్ ఉన్న విషయం తెలిసిందే. నిర్వహణ పరంగా బీఎస్ఎన్ఎల్ నిలదొక్కుకుంటున్నట్టు మంత్రి వైష్ణవ్ చెప్పారు. ‘‘బీఎస్ఎన్ఎల్ నిర్వహణ లాభాలను ప్రస్తుతం ఆర్జిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ది టర్న్అరౌండ్ స్టోరీ (పరిస్థితి మారిపోవడం). బీఎస్ఎన్ఎల్ భారత 4జీ, 5జీ టెక్నాలజీని వినియోగించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తరహా సాంకేతిక పరిజ్ఞానాల కంటే మెరుగైనవి’’అని మంత్రి వివరించారు. నాలుగు సంస్థలు వర్ధిల్లుతాయా లేక మూడు రాణిస్తూ, ఒకటి సమస్యలను ఎదుర్కొంటుందా? అన్న ప్రశ్నకు మార్కెట్ నిర్ణయిస్తుందన్నారు. సరైన ఏర్పాట్లు, వసతులు ఉంటే వచ్చే ఐదేళ్లలో భారత్ అతిపెద్ద సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా అవతరిస్తుందంటూ, ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
టీసీఎస్ కన్సార్షియంకు బీఎస్ఎన్ఎల్ 4జీ కాంట్రాక్ట్
ముంబై: ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కు 4జీ నెట్వర్క్ ఏర్పాటు చేసే కాంట్రాక్టును ఐటీ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) సారథ్యంలోని కన్సార్షియం దక్కించుకుంది. దీని విలువ రూ. 15,000 కోట్లు. దీనికి సంబంధించి బీఎస్ఎన్ఎల్ నుంచి అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్‌ను అందుకున్నట్లు టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో కొద్ది నెలలుగా దీనిపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ కాంట్రాక్టు గురించి ప్రకటించినప్పటి నుంచి టీసీఎస్ కంపెనీయే ముందు వరుసలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ముంబై, న్యూఢిల్లీ మినహా బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఫిక్స్డ్ లైన్, వైర్లెస్, డేటా సర్వీసులను అందిస్తోంది. మరోవైపు టెలికం పరికరాల తయారీ సంస్థ ఐటీఐకి కూడా బీఎస్ఎన్ఎల్ రూ. 3,889 కోట్ల విలువ చేసే ఆర్డరు ఇచ్చింది. దీని ప్రకారం 18–24 నెలల వ్యవధిలో 23,633 సైట్ల కోసం 4జీ పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుందని ఐటీఐ వివరించింది. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కేంద్రం శుభవార్త, త్వరలో..
న్యూఢిల్లీ: 4జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ (బీఎస్ఎన్ఎల్) ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. పూర్తి దేశీ సాంకేతికతను ఉపయోగించాలని నిర్దేశించుకున్నందున ఇందుకు కాస్త సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ సంతృప్తికర స్థాయిలోనే జరుగుతోందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం 800 పైగా జిల్లాల్లో 5జీ సర్వీసులు ఉన్నాయని, ఇతరత్రా ఏ దేశంలోనూ ఇంత వేగంగా సేవల విస్తరణ జరగలేదని ఆయన పేర్కొన్నారు. లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి ఇండియా పోస్ట్, సీఏఐటీ, తృప్తా టెక్నాలజీస్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌహాన్ ఈ విషయాలు చెప్పారు. ఇండియా పోస్ట్‌కి ఉన్న విస్తృత నెట్వర్క్ సాయంతో చిన్న వ్యాపారాలకు డెలివరీ సేవలను అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని వివరించారు. లాజిస్టిక్స్ సర్వీసుల ను అందించేందుకు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో కూడా చేతులు కలపాలని ఇండియా పోస్ట్ యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
బీఎస్ఎన్ఎల్ ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీలు ఆరంభం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ నెట్వర్క్ ఒక్కటే కాదు.. క్రీడల్లోనూ రాణిస్తామని నిరూపించుకునేందుకు బ్యాడ్మింటన్ కోర్టులో దిగారు బీఎస్ఎన్ఎల్(BSNL) ఉద్యోగులు. ఏటా జరిగే ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈసారి సికింద్రాబాద్ రైల్వే నిలయం స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ పోటీలను అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా... ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, అలాగే శారీరకంగా ధృడంగా ఉంచుతాయన్నారు జ్వాల. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్(BSNL) సీజీఎం చాగంటి శ్రీనివాస్, హెచ్ఆర్ జనరల్ మేనేజర్ మహేంద్ర భాస్కర్, పీజీఎంఎస్ కేవీకే ప్రసాద్ రావు, ఎన్ మురళి, శ్రీమతి సుజాత, డీజీఎం చంద్రశేఖర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: PC Vs PR: ఆదుకున్న బట్లర్.. ఓడినా సెమీస్‌కు దూసుకెళ్లిన రాయల్స్! టాప్-4లో సన్‌రైజర్స్ కూడా.. Ajinkya Rahane: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో -
దేశంలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు.. ఎప్పట్నించి ప్రారంభం అంటే
భువనేశ్వర్: ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 2024 నుంచి 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 4జీ నెట్వర్క్ ఏర్పాటు కోసం టీసీఎస్, సీ–డీవోటీ సారథ్యంలోని కన్సార్షియంను బీఎస్ఎన్ఎల్ షార్ట్‌లిస్ట్ చేసిందని ఆయన చెప్పారు. దీన్ని ఏడాది వ్యవధిలో 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఒడిషాలో జియో, ఎయిర్టెల్ 5జీ సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి వివరించారు. ఒడిషాలో టెలికం కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు కేంద్రం రూ. 5,600 కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. మరోవైపు, రుణ సంక్షోభంలో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకు (వీఐఎల్) నిధులు సహా వివిధ అవసరాలు ఉన్నాయని వైష్ణవ్ తెలిపారు. ఎంత మేర పెట్టుబడులు కావాలి, ఎవరు ఎన్ని నిధులను సమకూర్చాలనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. వీఐఎల్‌కు రూ. 2 లక్షల కోట్ల పైగా రుణ భారం ఉంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 16,000 కోట్ల వడ్డీని ఈక్విటీ కింద మార్చే ఆప్షన్‌ను వినియోగించుకోవాలని వీఐఎల్ నిర్ణయించుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 33 శాతం వాటా లభిస్తుండగా, ప్రమోటర్ల హోల్డింగ్ 74.99 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుంది. -
దేశంలో 5జీ సేవలు.. ఎన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయంటే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో, 50 పట్టణాల్లో 5జీ సేవలు నవంబర్ 26 నాటికి అందుబాటులోకి వచ్చాయని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవసిన్హ చౌహాన్ రాజ్యసభకు తెలిపా రు. అక్టోబర్ 1 నుంచి 5జీ సేవలను టెలికం కంపెనీలు ప్రారంభించినట్టు చెప్పారు. 5జీ టెలికం సేవలు వేగంగా విస్తరించేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఒక లక్ష 4జీ సైట్ల కోసం అక్టోబర్‌లో టెండర్ విడుదల చేసినట్టు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కోసం 5జీ స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేసి ఉంచినట్టు పేర్కొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీని 5–7 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 1.35 లక్షల టెలికం టవర్ల ద్వారా ఈ సర్వీసులు అందుబాటులోకి రాగలవని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇతర టెలికం సంస్థలు ఇంకా పూర్తిగా కవర్ చేయని అనేక గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ సర్వీసులు ఉన్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న టెల్కోలకు గట్టి పోటీనివ్వడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో టెలికం సేవలకు బీఎస్ఎన్ఎల్ కీలకంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా టెలికం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏటా రూ. 500 కోట్ల నుంచి రూ. 4,000 కోట్లకు పెంచే యోచన ఉన్నట్లు ఆయన వివరించారు. నవకల్పనలు, అంకుర సంస్థల వ్యవస్థను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వేస్, రక్షణ శాఖ తగు తోడ్పాటు అందిస్తున్నాయని వైష్ణవ్ చెప్పారు. రైల్వేస్ ఇప్పటికే 800 స్టార్టప్‌లతో, రక్షణ శాఖ 2,000 పైచిలుకు స్టార్టప్స్‌తో కలిసి పని చేస్తున్నాయని వివరించారు. -
ఏపీ, తెలంగాణలోని బీఎస్ఎన్ఎల్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ఐదు రాష్ట్రాల పరిధిలో తనకున్న ఖరీదైన 13 ప్రాపర్టీలను ఎంఎస్టీసీ సహకారంతో డిసెంబర్ 5న వేలం వేయనుంది. ఈ ఆస్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ మొత్తం 14 ప్రాపర్టీలను వేలానికి గుర్తించగా, వీటి విలువ రూ.20,160 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం, కొండపల్లి, తెలంగాణలోని పటాన్చెరులో ఉన్న ఆస్తులు కూడా వేలానికి రానున్నాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
జియో జోరు..బీఎస్ఎన్ఎల్కు ఎదురుదెబ్బ
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు ప్రైవేట్ టెలికం రంగ సంస్థ జియో భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో జియో అతిపెద్ద ల్యాండ్‌లైన్ సర్వీసుల్ని వినియోగించే సంస్థల జాబితాలో చేరింది. దేశంలో టెలికాం సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారిగా వైర్‌లైన్ విభాగంలో ఓ ప్రైవేట్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. టెలికం రెగ్యులేటరీ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం జియో ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ జియో ఫైబర్ వినియోగదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. దీంతో జియో ఫైబర్ అగ్రస్థానానికి చేరింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 71.32 లక్షలుగా ఉన్నారు. వైర్లెస్ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల జాబితాలో జియో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్టులో జియోకు కొత్తగా 32.8 లక్షల వినియోగదారులు చేరడంతో, తన మొత్తం కస్టమర్ బేస్ 41.92 కోట్లకు పెంచుకుంది. -
ఫిక్సిడ్ లైన్లలో జియో టాప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఫిక్సిడ్ లైన్ల విభాగంలోనూ హవా కొనసాగిస్తోంది. తాజాగా ఆగస్టులో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను తోసిరాజని అగ్రస్థానం దక్కించుకుంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జియో వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 71.32 లక్షలుగా ఉన్నారు. మొత్తం వైర్‌లైన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య జూలైలో 2.56 కోట్లుగా ఉండగా ఆగస్టులో 2.59 కోట్లకు పెరిగింది. బీఎస్ఎన్ఎల్ 15,734 మంది యూజర్లు, ఎంటీఎన్ఎల్ 13,395 మంది కస్టమర్లను కోల్పోయాయి. జియోకు 2.62 లక్షలు, భారతి ఎయిర్‌టెల్‌కు 1.19 లక్షలు, వొడాఫోన్ ఐడియాకు (వీఐ) 4,202, టాటా టెలీ సర్వీసెస్‌కు 3,769 మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. ఇక దేశవ్యాప్తంగా మొత్తం టెలికం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య స్వల్పంగా 117.36 కోట్ల నుంచి 117.5 కోట్లకు పెరిగింది. జియోకు కొత్తగా 32.81 లక్షలు, ఎయిర్‌టెల్‌కు 3.26 లక్షల మంది మొబైల్ యూజర్లు జతయ్యారు. వీఐ 19.58 లక్షలు, బీఎస్ఎన్ఎల్ 5.67 లక్షలు, ఎంటీఎన్ఎల్ 470 మంది యూజర్లను కోల్పోయాయి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల విషయానికొస్తే 80.74 కోట్ల నుంచి 81.39 కోట్లకు చేరాయి. జియోకు అత్యధికంగా 42.58 కోట్ల మంది, ఎయిర్‌టెల్‌కు 22.39 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. చదవండి: ట్రైన్ జర్నీ క్యాన్సిల్ అయ్యిందా? రైల్వే ప్రయాణికులకు శుభవార్త -
నవంబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నవంబర్ నుంచి తమ 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి క్రమంగా దాన్ని 5జీకి అప్‌గ్రేడ్ చేసుకోనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా బీఎస్ఎన్ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు తెలిపారు. 18 నెలల్లో 1.25 లక్షలకు పైగా 4జీ మొబైల్ సైట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు. దేశీ 4జీ టెక్నాలజీని వినియోగించేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్, ప్రభుత్వ రంగ టెలికం పరిశోధన సంస్థ సీ–డాట్ సారథ్యంలోని కన్సార్షియంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. 2023 ఆగస్టు 15 నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ కార్యకలాపాలు ప్రారంభించాలంటూ టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్దేశించారని, తదనుగుణంగా కృషి చేస్తున్నామని పుర్వార్ పేర్కొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే!
BSNL Rs.275 Broadband Plan: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day 2022) సందర్భంగా తమ కస్టమర్ల కోసం అదరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం చవకైన ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు యూజర్లకు కలిగే విధంగా ఈ ప్లాన్‌ని ప్రకటించింది. అయితే ఈ ప్లాన్ పరిమిత కాలమే ఉంటుందన్న బీఎస్ఎన్ఎల్ తాజాగా ఆ ఆఫర్ చివరి తేదీని వెల్లడించింది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ రూ. 275 బీఎస్ఎన్ఎల్(BSNL) తన ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ రూ.275ను ప్రకటించింది. ప్రత్యేకంగా ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 60 Mbps స్పీడ్‌తో 3300జీబీ (3.3TB) వరకు డేటా లభిస్తుంది. అయితే ఇది ప్రమోషనల్ ప్లాన్ కాబట్టి, ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక ప్లాన్‌ను అక్టోబర్ 13వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రకటించింది. అంటే ఈ రూ.275 ప్లాన్ బెనిఫిట్స్ పొందాలంటే అక్టోబర్ 13వ తేదీలోగా రీచార్జ్ చేసుకోవాలి. కొత్త కస్టమర్లు, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్న కస్టమర్లు కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. రూ.275 భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వివరాలు ఇవే బీఎస్ఎన్ఎల్ రూ.275 ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఆఫర్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఆఫ్షన్లకు కూడా వ్యాలిడిటీ మాత్రం 75 రోజులు ఉంటుంది. డేటా కూడా 3.3టీబీ(3.3TB) అంటే 3,300జీబీ వరకు డేటా లభిస్తుంది. అయితే ఇందులో ఓ ఆప్షన్‌కి 30Mbps, మరో ఆప్షన్‌కి 60Mbps స్పీడ్ లభిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌లో తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డేటా కోటా పూర్తవగానే 2Mbps స్పీడ్‌తో ఇంటర్నెట్ వస్తుంది. చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
ఒకప్పటి స్టేటస్ సింబల్.. నేడు మ్యూజియంలో వస్తువుగా..
ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా): ట్రింగ్ ట్రింగ్... ట్రింగ్ ట్రింగ్.. అంటూ మార్మోగిన ల్యాండ్‌లైన్ ఫోన్ క్రమక్రమంగా అదృశ్యమవుతోంది. రెండు దశాబ్దాల క్రితం స్టేటస్ సింబల్‌గా పిలుచుకునే టెలిఫోన్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా డెడ్ కాగా.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాస్త తన ఉనికిని కాపాడుకునేందుకు ఊగిసలాడుతోంది. కాలగమనంలో అరచేతిలోకి సెల్‌ఫోన్ వచ్చి చేరడంతో ల్యాండ్‌లైన్‌కు ఆదరణ కరువైంది. ఒకప్పుడు ఇళ్లల్లో రాజసానికి సింబాలిక్‌గా నిలిచిన ‘ల్యాండ్‌లైన్ ఫోన్’.. సెల్‌ఫోన్ సునామీతో నేడు మ్యూజియంలో వస్తువుగా మారింది. చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి.. కాలం గడుస్తున్నకొద్దీ మనం రోజూ వాడే వస్తువులకు కూడా కాలం చెల్లుతుంది. సేవలు కూడా కనుమరుగైపోతాయి. శతాబ్దాలుగా పట్టణాలకే పరిమితమైన టెలిఫోన్ సౌకర్యం 1988లో మండలాలు, పెద్దపెద్ద గ్రామ పంచాయతీలకు వచ్చింది. ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే పోస్టాఫీసుకు వెళ్లి ట్రంక్ కాల్ బుక్ చేసుకుని గంటల తరబడి కూర్చొని మాట్లాడి వచ్చేవారు. 2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ సేవలు ఏటికేటికీ తగ్గుముఖం పడుతూ 2006 సంవత్సరం నుంచి తన ఉనికిని పూర్తిగా కోల్పోవడం మొదలు పెట్టింది. 2009లో మొబైల్ ఫోన్‌కు 3జీ సెక్టార్ రావడంతో ఎక్కడి నుంచైనా మాట్లాడుకునే సౌకర్యం ఉండటం, మెసేజ్‌లు పంపుకునే వీలు కలగడంతో దాదాపు అందరూ అటువైపు మొగ్గు చూపారు. అంతవరకు కాస్తో కూస్తో ఉన్న ల్యాండ్‌లైన్ కనెక్షన్లను 2015లో వచ్చిన జియో బాగా దెబ్బతీసింది. గ్రామగ్రామానా జియో టవర్లు ఏర్పాటు చేయడంతో పాటు సుమారు రెండు సంవత్సరాలు జియో 4జి సేవలు పూర్తి ఉచితంగా అందించడంతో ఆ సునామీలో ల్యాండ్‌లైన్ నిలువలేక పోయింది. 2000 సంవత్సరం వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 1.5 లక్షల బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 7,500 పడిపోయింది. అది ఒకప్పటి స్టేటస్ సింబల్ సుమారు మూడు దశాబ్దాల క్రితం ఏదైనా గ్రామంలో టెలిఫోన్ ఎక్సేంజి ఉందంటే అది పెద్ద వ్యాపార లావాదేవీలు ఉన్న గ్రామంగా గుర్తించేవారు. ఎవరింట్లోనైనా టెలిఫోన్ ఉందంటే వారిని భూస్వాములుగానో, రాజకీయ నాయకులుగానో,పెద్ద వ్యాపారవేత్తలుగానో చెప్పుకునేవారు. వారిని ఆ ఊరంతా సంపన్నులుగా భావించేవారు. ఆ ఊర్లో వాళ్లకు వారి బంధువులు ఏమైనా శుభవార్త అయినా.. అశుభ వార్త అయినా ఈ ఫోన్‌కు కాల్ చేసి చెబితే వారు పిలిపించి మాట్లాడించేవారు. అందుకే ఫోన్ ఇంట్లో ఉన్న వారితో ఇరుగు పొరుగు అంతా బాగా కలిసి ఉండేవారు. కొంత కాలానికి ల్యాండ్‌లైన్ ఫోన్ మధ్యతరగతి వారి ఇళ్లకూ చేరింది. తమ పిల్లలు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలంటే ఫోన్ తప్పసరి కావడంతో ల్యాండ్‌ఫోన్ పెట్టించుకునేవారు. అయితే కాలగమనంలో అతి తక్కువ ధరకు సెల్ఫోన్లు రావడంతో పాటు ఇంట్లో ఉన్న వారు ఫోన్ మాట్లాడేందుకు ఎవరికి వారు ప్రైవసీకి అలవాటు పడటంతో ల్యాండ్‌లైన్ ఫోన్లు ఆదరణ కోల్పోయాయి. ఉపాధికి కేరాఫ్‌గా ఎస్టీడీ బూత్‌లు ఓ 20 సంవత్సరాల క్రితం చదువుకుని ఉద్యోగం రాని నిరుద్యోగ యువత పట్టణాల్లో ఎస్టీడీ బూత్‌లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేవారు. వీటిలో షిఫ్ట్‌ల పద్ధతిలో వేలాది మంది పనిచేసేవారు. కాలక్రమేణా ల్యాండ్‌లైన్ స్థానంలో కాయిన్‌బాక్స్‌లు రావడంతో పట్టణం నుంచి పల్లెల్లో వీధివీధినా ముఖ్యంగా దుకాణాల దగ్గర ఎక్కడ చూసినా రూపాయి కాయిన్ బాక్స్ ఉండేవి. అంతే స్పీడుగా స్మార్ట్ ఫోన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆ సేవలన్నీ కనిపించకుండా పోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణాల్లోనే.. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌ఫోన్ల సంఖ్య భారీగా తగ్గింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2006 వరకు సుమారు 1.5 లక్షల కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 7,500కు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ల్యాండ్‌లైన్ కనుమరుగు అవగా పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాలైన విద్యుత్, పోలీస్, రెవెన్యూ, హాస్పిటల్, బ్యాంకులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థల్లో మాత్రమే ల్యాండ్ఫోన్లు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగై పోవడంతో ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2015 నుంచి డౌన్‌ఫాల్ 2000 సంవత్సరం నుంచి బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడికి ల్యాండ్‌ఫోన్ ఉచితంగా ఇవ్వడం మానేసింది. డబ్బులిచ్చి ఫోన్ కొనుక్కోవాలి. ల్యాండ్‌ఫోన్ కనెక్షన్‌కు డిపాజిట్ కట్టి ఫోన్ కొనుగోలు చేసే సొమ్ముకు సెల్ ఫోన్ వస్తుండటంతో అందరూ అటువైపు మొగ్గుచూపారు. దీనికి తోడు 2015లో జియో 4జి రావడం.. ఒకటి, రెండేళ్లు ఉచితంగా అపరిమిత సేవలు అందించడంతో ప్రజలు మొత్తం సునామీలా అందులోకి డైవర్ట్ అయ్యారు. అప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లకు డౌన్‌ఫాల్ మొదలైంది. – రామాంజనేయరెడ్డి, ఎస్‌డీఓటీ, ఆళ్లగడ్డ అందరూ ప్రైవసీకి అలవాటు పడ్డారు ల్యాండ్‌ఫోన్ ఖర్చుతో పోల్చితే మొబైల్ ఖర్చు చాలా తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ల్యాండ్‌ఫోన్ ఓ చోట ఉంటే అందరూ అక్కడికి వచ్చి అందరి ముందు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రైవసీకి అలవాటు పడ్డారు. మొబైల్ అయితే వారికి అనువుగా ఉన్నచోట కూర్చొని రహస్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ల్యాండ్‌లైన్ ఫోన్లు ఎవరూ ఇష్ట పడ్డం లేదు. – రమణ, అహోబిలం -
‘బీఎస్ఎన్ఎల్కు వ్యతిరేకంగా..ప్రైవేటుకు అండగా కేంద్ర ప్రభుత్వం’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపరిమిత డేటా.. అదీ ఎటువంటి స్పీడ్ నియంత్రణ లేకుండా. అదనంగా అపరిమిత కాల్స్. 30 రోజుల కాల పరిమితి గల ఈ ట్రూలీ అన్లిమిటెడ్ ప్యాక్ కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రూ.398 చార్జీ చేస్తోంది. అపరిమిత డేటాతో రూ.98 నుంచి ప్యాక్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ సేవలు 3జీ సాంకేతికతపైనే. భారత టెలికం రంగంలో చవక ధరలతో సేవలు అందించడమేగాక పారదర్శక సంస్థగా పేరున్న బీఎస్ఎన్ఎల్.. కేంద్ర ప్రభుత్వం అందించిన పునరుద్ధరణ ప్యాకేజీని ఆసరాగా చేసుకుని 4జీ, 5జీ సర్వీసుల్లోనూ ఇదే స్థాయిలో గనక చార్జీలను నిర్ణయిస్తే మార్కెట్లో సంచలనమే అని చెప్పవచ్చు. ప్రైవేట్ సంస్థలకు సవాల్ విసరడమేగాక అధిక చార్జీలకు కట్టడి పడడం ఖాయం. ఇదే జరిగితే బీఎస్ఎన్ఎల్ కొత్త వైభవాన్ని సంతరించుకోవడం ఎంతో దూరంలో లేదు. అంతేకాదు సామాన్యులకూ నూతన సాంకేతికత చేరువ అవుతుంది. వచ్చే రెండేళ్లలో బీఎస్ఎన్ఎల్ కనీసం 20 కోట్ల 4జీ, 5జీ కస్టమర్లను సొంతం చేసుకుంటుందని కేంద్రం భావిస్తోంది. 5జీ సేవలూ అందించవచ్చు.. బీఎస్ఎన్ఎల్కు ఊతమిచ్చేందుకు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ జూలైలో ఆమోదించింది. ఇందులో రూ.43,964 కోట్లు నగదు రూపంలో, రూ.1.2 లక్షల కోట్లు నగదుయేతర రూపంలో నాలుగేళ్ల వ్యవధిలో కేంద్రం అందించనుంది. 4జీ సర్వీసులకై 900, 1800 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీలో రూ.44,993 కోట్ల విలువైన స్పెక్ట్రంను బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం కేటాయించనుంది. 900, 1800 మెగాహెట్జ్ స్పెక్ట్రంతో 5జీ సేవలనూ అందించవచ్చు. అత్యంత మారుమూలన ఉన్న 24,680 గ్రామాలకు 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చే రూ.26,316 కోట్ల ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. మరోవైపు బీఎస్ఎన్ఎల్కు సిబ్బంది బలమూ ఉంది. ప్రస్తుతం సంస్థలో సుమారు 62,000 మంది పనిచేస్తున్నారు. ప్రధాన పోటీ సంస్థల మొత్తం ఉద్యోగుల కంటే బీఎస్ఎన్ఎల్ సిబ్బంది సంఖ్యా బలం ఎక్కువ. ఈ స్థాయి ఉద్యోగులతో వినియోగదార్లను గణనీయంగా పెంచుకోవచ్చు. జియో వద్ద 18,000, ఎయిర్టెల్ 20,000, వొడాఫోన్ ఐడియా వద్ద 13,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. ప్రైవేటుకు అండగా.. ప్రభుత్వ పోకడలే సంస్థ ప్రస్తుత పరిస్థితికి కారణమని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ స్పష్టం చేసింది. టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈ మేరకు ఘాటుగా లేఖ రాసింది. ‘బీఎస్ఎన్ఎల్కు వ్యతిరేకంగా, ప్రైవేటుకు అండగా ప్రభుత్వం వ్యవహరించింది. 2019 అక్టోబర్ 23న కేంద్రం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో బీఎస్ఎన్ఎల్కు 4జీ స్పెక్ట్రం కేటాయింపు కూడా ఉంది. ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల కారణంగా స్పెక్ట్రం ప్రయోజనాన్ని బీఎస్ఎన్ఎల్ అందుకోలేకపోయింది. 49,300 టవర్లను అప్‌గ్రేడ్ చేసి ఉంటే రెండేళ్ల క్రితమే 4జీ సేవలు ప్రారంభం అయ్యేది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇది బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు తీవ్ర ఆటంకం కలిగించింది. 50,000ల 4జీ టవర్ల కొనుగోలుకై 2020 మార్చిలో టెండర్లను ఆహ్వానించింది. టెలికం ఎక్విప్మెంట్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫిర్యాదుతో టెండర్ రద్దు అయింది. పైగా దేశీయ కంపెనీల నుంచే పరికరాలను కొనుగోలు చేయాలన్న నిబంధన పెట్టారు. ప్రైవేట్ కంపెనీలు విదేశీ సంస్థలైన ఎరిక్సన్, నోకియా, సామ్సంగ్ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్కు మాత్రమే ఎందుకీ నిబంధన? ఆలస్యం అయినప్పటికీ లాభా లు అందించే దక్షిణ, పశ్చిమ ప్రాంతంలో రూ.500 కోట్లతో నోకియా సహకారంతో 19,000 టవర్లను అప్‌గ్రేడ్ చేసి ఇప్పటికైనా 4జీ అందించవచ్చు’ అని ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి పి.అభిమన్యు మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది కంపెనీ స్థానం ట్రాయ్ ప్రకారం 2022 మే 31 నాటికి 114.5 కోట్ల వైర్లెస్ సబ్స్క్రైబర్లలో జియోకు 35.69%, ఎయిర్టెల్ 31.62%, వొడాఐడియా 22.56% వాటా ఉంటే వెనుకంజలో ఉన్న బీఎస్ఎన్ఎల్ 9.85% వాటాకు పరిమితమైంది. మేలో జియో 30 లక్షలు, ఎయిర్టెల్ 10 లక్షల మంది యూజర్లను కొత్తగా సొంతం చేసుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 5.3 లక్షల మందిని కోల్పోయింది. దేశంలో వైర్‌లైన్ కస్టమర్లు 2.52 కోట్ల మంది ఉన్నారు. ఇందులో అగ్ర స్థానంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ వాటా 28.67%. జియోకు 26.7%, ఎయిర్‌టెల్‌కు 23.66% వాటా ఉంది. మొత్తం 79.4 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లలో జియో 52.18% వాటాతో 41.4 కోట్లు, ఎయిర్టెల్ 27.32%తో 21.7 కోట్లు, వొడాఫోన్ ఐడియా 15.51%తో 12.3 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 3.21% వాటాతో 2.55 కోట్ల మంది ఉన్నారు. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో జియోకు 58.9 లక్షలు, ఎయిర్టెల్ 47.4 లక్షలు, బీఎస్ఎన్ఎల్కు 47.4 లక్షల మంది యూజర్లు ఉన్నారు. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఆగస్టు 31 వరకు మాత్రమే!
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) కస్టమర్ల బంపరాఫర్ ప్రకటించింది. తమ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. ‘ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ ప్లాన్ 2022’ లో భాగంగా రూ.2022తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని, అయితే ఈ ఆఫర్ ఆగస్టు 31 లోపు రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఏముంది ఈ ప్లాన్‌లో.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌లో.. రూ.2022తో రీచార్జ్ చేసుకుంటే 300 రోజులు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. దీంతో పాటు నెలకు 75GB డేటా కూడా లభిస్తుంది. ఒకవేళ నెలలోపు మీ డేటా పరిమితి నెలలోపు పూర్తయితే స్పీడ్ 40kbps పడిపోతుంది. అలాగే రూ 2399, రూ 2,999 ప్లాన్‌పై అదనంగా మరో 75 జీబీ డేటా ఇస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. కాగా బీఎస్ఎన్ఎల్కు ఊపరి పోసేందుకు ఇటీవలే కేంద్రం కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించడంతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ ప్యాకేజీతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కేంద్రం ఆదేశిస్తూ లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. చదవండి: అలర్ట్: మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు, 75శాతం డిస్కౌంట్.. ఈరోజే లాస్ట్! -
బీఎస్ఎన్ఎల్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్.. 62 వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్కు కేంద్రం ఈమధ్యే కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఇకపై బీఎస్ఎన్ఎల్ మెరుగైన ప్రదర్శన కనబర్చాలని.. ఒకవేళ పని చేతకాకుంటే ఇళ్లకు వెళ్లిపోవాలని, లేకుంటే పంపించేయాల్సి ఉంటుందని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఇదేం చిన్నకేటాయింపు కాదు. పునరుద్ధరణ ప్యాకేజీని రూపొందించిన విధానం.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నంత భారీ రిస్క్ ప్రపంచంలో మరే ప్రభుత్వం చేపట్టలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ► ప్రతీ నెలా పనికి సంబంధించి నేనే సమీక్ష నిర్వహిస్తా. పని చేయనివాళ్లు, చేతకానీ వాళ్లు స్వచ్చందంగా విరమణ తీసుకుని ఇళ్లకు వెళ్లిపోండి. లేదంటే.. రైల్వేలో జరిగినట్లుగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందేలా చేస్తాం. ► BSNL ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే కేంద్ర కేబినెట్ భారీ ప్యాకేజీని ప్రకటించింది. మేము చేయవలసింది చేశాం. ఇక ఇప్పుడు చేయాల్సింది మీరే. పని చేయండి లేదంటే వెళ్లిపోండి. ► ఈ పోటీ పరిశ్రమలో మీ పనితీరు మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. నేను రాబోయే 24 నెలల్లో మంచి ఫలితాలను చూడాలనుకుంటున్నా. నేనే మీ పనితీరుపై నెలవారీ నివేదిక చూస్తా అంటూ ఆయన మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. గురువారం బీఎస్ఎన్ఎల్ సీనియర్ మేనేజ్మెంట్తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ సందర్భంగా అక్కడ జరిగిన భేటీకి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు లీక్ అయ్యింది. అయితే ఆ ఐదు నిమిషాల క్లిప్ ఒరిజినల్‌దే అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. అదనంగా.. ఇదిలా ఉంటే.. భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (BBNL)ని BSNLతో విలీనం చేసే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ విలీనం ద్వారా, BSNL దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 5.67 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌ను అదనంగా పొందుతుంది. ప్రస్తుతం, బీఎస్ఎన్ఎల్కు 6.83 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉంది. ఇదీ చదవండి: ఈ ప్యాకేజీలో ఇచ్చిందేమిటి? వచ్చిందేమిటి? -
ఈ ప్యాకేజీలో ఇచ్చిందేమిటి? వచ్చిందేమిటి?
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి ఒక వర్గం... ప్రభుత్వ రంగ సంస్థ బాగు కోసం ఇది అవసరం అంటుండగా, మరో వర్గం పన్నులు కట్టే ప్రజల డబ్బులు ఇలా వృథా చేస్తారా? అని విమర్శిస్తోంది. ఇందులో నిజానిజాలేమిటో పరిశీలిద్దాం. 2019 అక్టోబర్ 23న మొదటి రివైవల్ ప్యాకేజీ బీఎస్ఎన్ఎల్కి కేంద్రం ప్రకటించింది. ఇందులో బీఎస్ఎన్ఎల్కు 4జీ సర్వీసుల కోసం స్పెక్ట్రమ్ ఇస్తామనీ, 4జీ సాంకేతిక అభివృద్ధి కోసం ఖర్చు కూడా భరిస్తామనీ చెప్పారు. సంస్థ ఉద్యోగులకు వాలంటరీ పథకం కూడా ఇందులోనే ప్రకటించి దాదాపు 80,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకం కింద భారతీయ సాంకేతిక పరిజ్ఞానం వాడి... 4జీ సౌకర్యం బీఎస్ఎన్ఎల్కు ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. ప్రయివేటు టెలికాం కంపెనీలు మాత్రం విదేశీ సాంకేతిక పరిజ్ఞా నాన్ని వాడుకునే వెసులుబాటు కల్పించారు. గత మూడేళ్ళుగా బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు ప్రారంభిం చడానికి అనేక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. కనుక 4జీ స్పెక్ట్రమ్ కోసం సర్దుబాటు చేస్తానన్న 44,993 కోట్లు కానీ, 4జీ సాంకేతిక అభివృద్ధి కోసం ఇస్తామన్న 22,471 కోట్లు కానీ గతంలో ప్రకటించిన 70,000 కోట్ల రివైవల్ ప్యాకేజీలో చెప్పినవే! వాటినే ఇప్పుడు మరో సారి కేంద్రం 1.64 లక్షల కోట్ల ప్యాకేజీలో కలిపి గొప్పగా పెద్ద అంకె కనపడేలా చేసింది. కనుక ఈ మొత్తంలో 67,464 కోట్లు మినహాయిం చాల్సి ఉంటుంది. ఏమీ ఆదాయం రాని భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడం అదనపు భారమే. కేంద్రం ప్రకటించిన బీఎస్ఎన్ఎల్ ప్యాకేజీలో 4జీ కోసం రూ. 44,993 కోట్లు ఈక్విటీని ఇన్ఫ్యూజన్ చేస్తామనీ, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై బీఎస్ఎన్ఎల్ చెల్లించాల్సిన రూ. 33,404 కోట్లు ఈక్విటీగా మారుస్తామనీ చెప్పారు. ప్రయివేటు టెలికాం కంపెనీలకు పన్నులు చెల్లించకుండా నాలుగేళ్ళ మారటోరియం విధించి, బకాయిలు కట్టడానికి పదేళ్ల వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం... బీఎస్ఎన్ఎల్కు అలాంటి రాయితీ కల్పించలేదు. పైగా ఈక్విటీ ఇన్ఫ్యూజన్, ఈక్విటీగా మార్పు చేయాలంటే షేర్లు అమ్మాల్సి ఉంటుంది. ఇదే బీఎస్ఎన్ఎల్లో డిజిన్వెస్ట్మెంటుకు నాంది పలుకుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్యాకేజీలోని మంచి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం రంగం అభివృద్ధి కోసం బీఎస్ఎన్ఎల్ చేస్తున్న సేవలకు ప్రతి ఫలం ఇస్తామని ప్రభుత్వం రాత పూర్వకంగా బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఈక్వల్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ పేరుతో ఈ సహా యాన్ని 2011 నుండే ఆపి వేశారు. కానీ యూనియన్లు, అసోసియేషన్లు అడగకపోయినా 2014–2019 కాలానికి గ్రామీణ ప్రాంతాల్లో సేవలకుగాను రూ. 13,789 కోట్లు ప్రకటించారు. అలాగే బీఎస్ఎన్ఎల్కు ఉన్న అప్పు రూ. 33,000 కోట్లకు సావర్న్ గ్యారెంటీ కల్పించేందుకు ప్రభుత్వం ఎవరూ అడగకుండానే ముందుకువచ్చింది. సర్వీసుల నాణ్యత పెంచు తామనీ, ఒక యూనిట్‌కు బీఎస్ఎన్ఎల్కు వచ్చే ఆదాయాన్ని 170 /180 రూపాయలకు పెంచుతామనీ ప్రకటిం చడం మంచిదే. అయితే, ఈ ప్యాకేజీ ద్వారా ఒక లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొనడం హాస్యాస్పదం. ఇదే నిజమైతే బీఎస్‌ఎన్‌ఎల్‌లోని యాభై శాతం మందిని వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా ఇప్పటికే ఇంటికి పంపడం ఎందుకు? ఒడాఫోన్ ఐడియా సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడగానే, ఆ సంస్థను బీఎస్ఎన్ఎల్లో కలపాలని ఊదరగొట్టిన కొంత మంది... బీఎస్ఎన్ఎల్కు లక్షల కోట్లు దోచి పెడుతున్నట్లూ... తద్వారా ప్రజాధనాన్ని దోచి పెడుతున్నట్లూ గగ్గోలు పెడుతు న్నారు. నిజానికి రూ. 1.64 కోట్ల ప్యాకేజీలో రూ. 13,789 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సర్వీసుల పరిహారం తప్ప, ఏదీ కొత్తది కాదు. అప్పుకు హామీ ఇవ్వడం భారం కాదు. మిగతా మొత్తాలను ఈక్విటీగా మార్చడంవల్ల అదనపు భారం లేదు. ఏమైనా, బీఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండటం వల్లనే టెలికాం రంగం సమతూకంగా ఉంటుందనీ, కనుక బీఎస్ఎన్ఎల్ మనుగడ కోసం కృషి చేస్తామనీ, దానికి 5జీ కూడా ఇస్తామనీ ప్రభుత్వం ప్రకటించడం మాత్రం ముదావహం. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా, ఈ ప్యాకేజీని ఎంత త్వరగా అమలు చేస్తారు, దాని ఫలితాలు ఏమిటన్నది వేచి చూడాలి. తారానాథ్ మురాల వ్యాసకర్త టెలికాం రంగ విశ్లేషకులు -
బీఎస్ఎన్ఎల్ గట్టెక్కుతుందా?
కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)కు లక్షా 64 కోట్ల ఆర్థిక ప్యాకేజీ అందించాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో నగదు వాటా రూ. 43,964 కోట్లు కాగా, ఇతరేతర రూపాల్లో లక్షా 20 వేల కోట్లు సమకూరుస్తారు. ఇదంతా నాలుగేళ్ల కాలవ్యవధిలో అందిస్తారు. 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కూడా ఇందులో భాగం. అందరూ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం పూర్తయిన కొన్ని గంటలకే ఈ నిర్ణయం వెలువడింది. ఎయిరిండియా సంస్థను పూర్తిగా టాటాలకు అమ్మిన తరహాలోనే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను కేంద్రం వదుల్చుకుంటుందని భావిస్తున్న తరుణంలో ప్యాకేజీ ప్రకటన చాలామందిని సంతోషపరిచిందనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్యాకేజీ తులసి తీర్థంగా మిగులుతుందా, సంస్థకు జవసత్వాలిస్తుందా అన్నది మున్ముందు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఛత్రఛాయలో ఉండే టెలిఫోన్ విభాగం నుంచి మహానగరాల్లో కార్యకలాపాల కోసం 1986లో ఎంటీఎన్ఎల్ పేరిట ఒక లిమిటెడ్ కంపెనీని ఏర్పాటుచేసిన చాన్నాళ్లకు... అంటే 2000 సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ ఏర్పడింది. ఎంటీఎన్ఎల్ ఎటూ మొదటినుంచీ నష్టాలతోనే సాగుతోంది. అయితే బీఎస్ఎన్ఎల్ ప్రాభవం అడుగంటడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణా లున్నాయి. టెలికాం రంగంలో గుత్తాధిపత్యం ఉన్న రోజుల్లో ఓ వెలుగు వెలిగిన టెలిఫోన్ విభాగం బీఎస్ఎన్ఎల్గా మారి, ప్రైవేటు ఆపరేటర్లతో పోటీపడవలసి వచ్చాక క్షీణించడం మొదలుపెట్టిం దని తీర్మానించడం తొందరపాటవుతుంది. దాన్నొక సంస్థగా మార్చాక వృత్తి రంగ నిపుణులకు అప్పజెప్పి, సమర్థవంతంగా పోటీని ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేయాల్సిందిపోయి కేంద్రం యధావిధిగా పెత్తనం చలాయించడం బీఎస్ఎన్ఎల్కు శాపంగా మారింది. ఇప్పుడు టెలికాం రంగంలో మెరుస్తున్న సంస్థలతో పోలిస్తే అనుభవంలోనూ, వనరుల్లోనూ బీఎస్ఎన్ఎల్ ఏమాత్రం తీసిపోదు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయివుండి కూడా సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక, వాటిని సక్రమంగా అమలు చేయలేక అది బోర్లాపడింది. అంతక్రితంతో పోలిస్తే లాభాలొస్తున్న మాట నిజమే అయినా గత మూడేళ్లుగా బీఎస్ఎన్ఎల్ నష్టాలు దాదాపు రూ. 30,000 కోట్లు. ఇప్పుడు టెలికాం రంగంలో 5జీ మోత మోగిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే 60 దేశాలు ఆ సర్వీసులు ప్రారంభించాయి. మన దేశంలో 5జీ స్పెక్ట్రమ్ వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఒకటి రెండేళ్లు పడుతుంది. ఇలాంటి తరుణంలో బీఎస్ఎన్ఎల్కు అందిస్తున్న 4జీ వల్ల ఏమంత ప్రయోజనం ఉంటుందన్నది చూడాల్సి ఉంది. 2016లోనే ప్రైవేటు సంస్థలు 4జీ స్పెక్ట్రమ్ దక్కించుకుని వినియోగదారుల్లో 98 శాతంమందిని చేజిక్కించుకున్నాయి. దేశంలో వైర్లెస్, వైర్‌లైన్ సేవలు రెండింటినీ కలుపుకొంటే మొత్తంగా 110 కోట్లమంది వినియోగదారులుంటే అందులో బీఎస్ఎన్ఎల్ వాటా ప్రస్తుతం 12 కోట్లు. అంతక్రితం గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ హవా ఉండేది. కానీ రాను రాను అది కూడా క్షీణించింది. ఇప్పుడు గ్రామీణ వినియోగదారుల్లో బీఎస్ఎన్ఎల్ వాటా ఏడు శాతం. ఇది ఉద్దేశపూర్వకంగా సంస్థను నీరుగార్చడంవల్ల వచ్చిన ఫలితం. వీఆర్ఎస్ అమలు చేయడం మొదలెట్టాక సిబ్బంది కొరత ఏర్పడి చురుగ్గా సేవలందించే స్థితి మందగించింది. ఒకప్పుడు 1.65 లక్షలమంది ఉద్యోగులతో కళకళ లాడిన సంస్థలో వారి సంఖ్య 64,536కి పడిపోయింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం గురించిన చర్చోపచర్చలే దశాబ్దంపాటు సాగాయి. ఇప్పటికీ అవి వేర్వేరుగానే ఉంటున్నాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే 4జీ స్పెక్ట్రమ్ గురించి బీఎస్ఎన్ఎల్ ఆత్రుత పడింది. దాన్ని వేలం వేసే సమయానికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా బీఎస్ఎన్ఎల్కు 4జీ దక్కలేదు. 4జీకి అవసరమైన పరికరాల కొనుగోలుకు కావాల్సిన రూ. 25,000 కోట్లు సమకూర్చడం ఎలా అన్న ఆలోచనలోనే ఏళ్లు గడిచిపోయాయి. ఈ జాప్యం ప్రైవేటు సంస్థల లబ్ధి కోసమేనని సిబ్బంది సంఘాలు ఆరోపించినా జవాబిచ్చినవారు లేరు. 2019 అక్టోబర్‌లో సంస్థను గట్టెక్కించడానికి కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఆ తర్వాత అక్కడక్కడ 4జీ సేవలు ప్రారంభించగలిగింది. కానీ పూర్తి స్థాయి 4జీ సేవలకు గ్రీన్‌సిగ్నల్ రావడానికి మరో మూడేళ్లు పట్టింది. పూర్తి స్థాయి సేవలు వినియోగదారులకు అందడానికి మరెంత సమయం పడుతుందో? 2019లో ప్యాకేజీ ప్రకటించాక సంస్థ నష్టాలు క్రమేపీ తగ్గడం మొదలయ్యాయి. 2019–20లో రూ. 15,500 కోట్లుగా ఉన్న నష్టం నిరుడు రూ. 7,441 కోట్లకు పరిమితమైంది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఇప్పటికైనా బీఎస్ఎన్ఎల్కు పూర్వ వైభవం వస్తుంది. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే ప్రైవేటు సంస్థలు ఈనాటికీ గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. వాటి టారిఫ్‌లు గ్రామీణులు అందుకోలేని స్థితిలో ఉంటున్నాయి. దేశంలో విస్తృతంగా టవర్లు, ఇతర వనరులు ఉన్న సంస్థల్లో ఇప్పటికీ అగ్రగామి బీఎస్ఎన్ఎల్ అనడంలో సందేహంలేదు. వేగవం తంగా నిర్ణయాలు తీసుకోవడం, తీసుకున్న నిర్ణయాలను చురుగ్గా అమలు చేయడం, లక్ష్య సాధనపై సర్వశక్తులూ కేంద్రీకరించడం వంటివి చేస్తే ఆ సంస్థ మళ్లీ పట్టాలెక్కుతుంది. ఉద్దేశపూర్వకంగా దానికి బ్రేకులు వేయాలని చూస్తే ఎప్పటిలానే నిస్తేజంగా మిగిలిపోతుంది. సంస్థను ప్రాణప్రదంగా చూసుకుంటూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటే దాన్ని లాభాల బాటకు మళ్లించడం కష్టమేమీ కాదు. -
BSNL పునరుద్ధరణకు కేంద్రం నిర్ణయం
-
బీఎస్ఎన్ఎల్పై కేంద్రం కీలక నిర్ణయం.. భారీ ప్యాకేజీ
సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్లో భారత్ బ్రాడ్‌బాండ్ నెట్వర్క్(బీబీఎన్ఎల్) విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవల పటిష్టం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. బీఎస్ఎన్ఎల్కు భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ. లక్షా 64 వేల కోట్లతో బీఎస్ఎన్ఎల్ పునరుద్దరణ ప్యాకేజీకి కేబినెట్ అనుమతి తెలిపింది. ఈ సందర్భంగా టెలికంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ అప్పులను వాటాలుగా మారుస్తామని తెలిపారు. సేవలను మెరుగుపరచడం, బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడం, ఫైబర్ నెట్వర్క్ విస్తరణ వంటి మూడు అంశాలు ప్యాకేజీలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. బలమైన ప్రభుత్వ రంగ సంస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. 1,20,000 సైట్లలో 4జీ సేవలు అవసరమని తెలిపిన కేంద్ర మంత్రి.. ప్రతి నెలా కొత్తగా లక్ష కనెక్షన్లు ఇస్తామని పేర్కొన్నారు. చదవండి: సోనియా నోటి వెంట రాహుల్ సమాధానాలు! -
బ్యాటరీలు లేక.. నెట్వర్క్ పనిచేయక
వినియోగదారుల ఆదరణతో టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) సంస్థ క్రమంగా ఉనికి కోల్పోతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టడంతో సంస్థ అభివృద్ధికి ఎటువంటి సహకారం అందడం లేదు. ఫలితంగా బ్యాటరీలు సైతం సమకూర్చుకోలేని దీన స్థితికి ఆ సంస్థ చేరింది. కరెంట్ ఉంటేనే ఫోన్లు పని చేస్తున్నాయి. లేదంటే పని చేయడం లేదు. దీంతో వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్ట్ అయిపోతున్నారు. అనంతపురం సిటీ: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో బీఎస్ఎన్ఎల్కు సంబంధించి 2జీ, 3జీ కలిపి మొత్తం 552 టవర్లు ఉన్నాయి. 89 టెలిఫోన్ ఎక్సే్చంజ్‌లు ఉండగా, మొబైల్ ఫోన్లు 4 లక్షలకు పైబడి ఉన్నాయి. ల్యాండ్ ఫోన్లు 11 వేలు, ఫైబర్ నెట్ మరో 11 వేలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో మాత్రం బీఎస్ఎన్ఎల్ విఫలమవుతోంది. కరెంట్ ఉంటేనే కాల్స్ కరెంట్ ఉంటేనే బీఎస్ఎన్ఎల్ మొబైల్ కాల్స్ వెళ్తున్నాయి. లేని సమయంలో వినియోగదారులకు చుక్కలు కనపడుతున్నాయి. కరెంట్ లేని సమయంలో బ్యాటరీలు వాడితే కొంతైనా ఇబ్బందులు తప్పేవి. అయితే కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాటరీలను సరఫరా చేయడం లేదని తెలిసింది. దీంతో కరెంట్ సరఫరా లేనప్పుడు టవర్లు పని చేయడం లేదు. ప్రైవేటీకరణ జపం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇండెంట్ ప్రకారం బ్యాటరీలు సరఫరా చేయకపోగా, తగినంత బడ్జెట్ కూడా కేటాయించలేకపోతోందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటుతో పోటీపడలేక.. టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్.. ప్రైవేటు సంస్థలతో పోటీ పడలేకపోతోంది. ప్రభుత్వరంగ సంస్థపై మమకారంతో ఇన్నాళ్లూ అంటిపెట్టుకొని ఉన్న వినియోగదారులు క్రమంగా దూరమవుతున్నారు. ఇతర నెట్‌వర్క్‌లలోకి పోర్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ల్యాండ్ఫోన్లు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంటోంది. కరెంట్ లేకపోతే ఫోన్ పని చేయడం లేదు మా ఇంట్లో కొన్నేళ్ల నుంచి బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నాం. గతంలో బాగా పని చేసేది. ఇప్పుడు కరెంట్ ఉంటేనే కాల్స్ వెళ్తున్నాయి. లేకపోతే ఫోన్ మూగబోతోంది. నెట్ కూడా చాలా అధ్వానంగా ఉంది. విసుగెత్తిపోయి ప్రైవేటు నెట్వర్క్కి పోర్ట్ అయ్యాం. – దర్గా యాస్మిన్, డిగ్రీ విద్యార్థిని, హెచ్ఎల్సీ కాలనీ, అనంతపురం ప్రైవేటు నెట్‌వర్క్‌లు బాగున్నాయి బీఎస్ఎన్ఎల్కంటే ప్రైవేటు నెట్వర్క్ బాగా పని చేస్తోంది. ప్రతి నెలా రీచార్జ్ చేసుకోవడమే తప్ప.. బీఎస్ఎన్ఎల్ నుంచి ఎటువంటి సేవలు పొందలేకపోతున్నాం. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకే ప్రైవేటు నెట్‌వర్క్‌లోకి పోర్ట్ అయ్యాయి. – ఎం.షాహిద్ ఖాన్, చిరుద్యోగి, ఓబుళదేవరచెరువు ప్రతిపాదనలు పంపాం సమస్య ఉన్న మాట వాస్తవమే. బ్యాటరీల కొరతతోనే ఈ పరిస్థితి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. 14 ఎక్సే్చంజీలకు సరిపడా బ్యాటరీలు రానున్నాయి. పరిస్థితి ఎక్కడైతే తీవ్రంగా ఉందో అక్కడ తొలుత ఏర్పాటు చేస్తాం. సమస్యలన్నీ మరో రెండు నెలల్లో పరిష్కారమవుతాయి. – బాలగంగాధర్‌రెడ్డి, డీజీఎం, బీఎస్ఎన్ఎల్, అనంతపురం -
టెలికాం దిగ్గజ సంస్థల విలీనం వాయిదా, అదే కారణం!
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెలికం నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్ఎల్ త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది. దేశవ్యాప్తంగా 1.12 లక్షల 4జీ టవర్లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయనున్నట్టు టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు తెలిపారు. 5జీ నెట్వర్క్ అమల్లోకి వచ్చిన తర్వాతే రైళ్లలోపల ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌లో రైళ్లు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఇంటర్నెట్లో అంతరాయాలు వస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అభివృద్ధి చేసిన 4జీ నెట్వర్క్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనికి ప్రపంచవ్యాప్త ప్రశంసలు వచ్చాయి. బీఎస్ఎన్ఎల్ ముందుగా 6 వేల టవర్లకు ఆర్డర్ ఇవ్వనుంది. ఆ తర్వాత మరో 6,000. అనంతరం లక్ష 4జీ టవర్లు ఏర్పాటు చేస్తుంది’’ అని చెప్పారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా ప్రభుత్వరంగ టెలికం సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనాన్ని ఆర్థిక కారణాల దృష్ట్యా వాయిదా వేసినట్టు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ రాజ్యసభకు తెలిపారు. భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రతిపాదిత విలీనం పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. ఎంటీఎన్ఎల్కు అధిక రుణభారం ఉండ డం సహా ఆర్థిక కారణాలు ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనం వాయిదాకు కారణమని చెప్పారు. -
బీఎస్ఎన్ఎల్లో పెట్టుబడుల ఉపసంహరణ.. కేంద్రం వివరణ..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేవని కేంద్రం తెలియజేసింది. లోక్‌సభలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్ చౌహన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2020 ప్రారంభంలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) అమలు కారణంగా బీఎస్ఎన్ఎల్ అందించే సేవల్లో ఎలాంటి జాప్యం లేదని లోక్‌సభలో ప్రకటించారు. సంస్థకు నిర్వహణకు ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య సరిపోతుందని చౌహాన్ చెప్పారు. అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన స్థిరాస్తులపై కూడా చౌహాన్ సమాధానమిచ్చారు.మార్చి 31, 2021 నాటికి భవనాలు, భూములు, టవర్లు, టెలికాం పరికరాలు , నాన్-టెలికాం పరికరాలతో సహా స్థిరాస్తుల విలువ ఆడిట్ చేయబడిన ఆర్థిక గణాంకాల ప్రకారం రూ. 89,878 కోట్లుగా ఉందని వెల్లడించారు. డిసెంబర్ 31, 2021 నాటికి బీఎస్ఎన్ఎల్ మొబైల్ సబ్స్క్రైబర్లలో 9.90 శాతంగా, వైర్డు బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్ల వాటా 15.40 శాతంగా ఉందని తెలిపారు. 2019లో బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 50ఏళ్లు పైబడిన వారికీ వీఆర్ఎస్ను అమలు చేసే ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలను చేశారు. దాంతో పాటుగా 4జీ సర్వీసుల కోసం సెక్ర్టంను కూడా కేటాయించారు. పలు చర్యల ఫలితంగా 2020-21లో బీఎస్ఎన్ఎల్ అపరేటింగ్ లాభాలు పాజిటివ్‌గా మారాయని చౌహన్ పేర్కొన్నారు. చదవండి: బీఎస్‌ఎన్‌ఎన్‌లో ఆ సంస్థ పూర్తిగా విలీనం..! మలుపు తిప్పే అవకాశం..! -
బీఎస్‌ఎన్‌ఎన్‌లో ఆ సంస్థ పూర్తిగా విలీనం..! మలుపు తిప్పే అవకాశం..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)లో మరో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్(బీబీఎన్ఎల్)ను పూర్తిగా వీలినం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలలో వీలిన ప్రక్రియ పూర్తిగా ముగుస్తోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆల్ ఇండియా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అండ్ టెలికాం ఆఫీసర్స్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ మాట్లాడుతూ...బీబీఎన్ఎల్ వీలిన ప్రక్రియతో బీఎస్ఎన్ఎల్ను ఒక మలుపు తిప్పే అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు. బీబీఎన్ఎల్ పూర్తి బాధ్యతలు బీఎస్ఎన్ఎల్ పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రైవేట్‌కు ధీటుగా..! ఇప్పటికే పలు దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలు మొబైల్ నెట్‌వర్క్‌తో పాటుగా బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. బీబీఎన్ఎల్ వీలిన ప్రక్రియతో బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్లో బీఎస్ఎన్ఎల్కు భారీగా లబ్థి చేకూరే అవకాశం ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 6.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారత్ నెట్ ప్రాజెక్ట్..! బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌నెట్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చింది. 2021 జూలైలో దేశ వ్యాప్తంగా 6 లక్షల గ్రామాలకు ఆప్టిక్ ఫైబర్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ అమలు బాధ్యతను పూర్తిగా బీబీఎన్ఎల్ చూసుకునేది. అందుకోసం సుమారు రూ. 24 వేల కోట్లను వెచ్చించారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో 1.71 లక్షల గ్రామ పంచాయతీలను భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద అనుసంధానం చేశారు. చదవండి: క్రిప్టోకరెన్సీలపై కేంద్రం కీలక నిర్ణయం..! వాటి పరిధిలోకి -
అత్యంత చవకైన ఇంటర్నెట్ ప్లాన్..! కేవలం రూ.329తో 1000జీబీ డేటా..!
BSNL: గత ఏడాది దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలు పోటీ పడుతూ మొబైల్ ఇంటర్నెట్ ప్లాన్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటుంది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు యూజర్లకు కలిగే విధంగా బీఎస్ఎన్ఎల్ పలు ప్లాన్స్‌ను ప్రకటించింది. తాజాగా బ్రాడ్ బ్యాండ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ అత్యంత చవకైన ఇంటర్నెట్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ. 329తో 1 టీబీ డేటా..! బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ఫైబర్ ఎంట్రీ ప్లాన్ రూ. 329ను ప్రకటించింది.ఈ ప్లాన్ కాల పరిమితి నెలరోజులు. ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్‌లో అత్యంత చౌకైన ప్లాన్‌గా నిలుస్తోంది. ఈ ప్లాన్‌తో 1000జీబీ(1టీబీ) డేటా వరకు యూజర్లు గరిష్టంగా 20Mbps వేగాన్ని పొందవచ్చును. తరువాత నామమాత్రం స్పీడ్‌తో బ్రాడ్ బ్యాండ్ సేవలను యూజర్లకు కల్పిస్తోంది బీఎస్ఎన్ఎల్. కాగా ఇది ప్రస్తుతం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. దీంతో పాటుగా ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అదనంగా ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్, STD కాలింగ్‌ను కూడా యాక్సెస్‌ను చేయవచ్చును. ఫైబర్ ఎంట్రీ ప్లాన్‌తో పాటుగా పైబర్ ఎక్స్పీరియన్స్, ఫైబర్ బేసిక్, ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్స్ నెలకు రూ. 399 నుంచి రూ. 599 అందుబాటులో ఉన్నాయి. సదరు ప్లాన్స్‌పై అదనపు డేటాతో పాటుగా, పలు ఓటీటీ సర్వీసులను కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లే లక్ష్యంగా..! బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల పెంపును లక్ష్యంగా చేసుకొని బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త భారత్ ఫైబర్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్లను ప్రకటించింది. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ విషయంలో ప్రైవేట్ టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్ నుంచి బీఎస్ఎన్ఎల్ గట్టిపోటీను ఎదుర్కొంటుంది. చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
కేవలం రూ. 197తో 150 రోజుల వ్యాలిడిటీ..! ఇంకా ఎన్నో ప్రయోజనాలు..!
BSNL 197 Plan Details: ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్ ధరలను పెంచుతూ యూజర్లపై అధిక భారాన్ని మోపాయి. ఇక ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్‌ను పరిచయం చేసింది. ఏ టెలికాం కంపెనీ ఆఫర్ చేయని ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ..! పాత యూజర్ల కోసం, కొత్త యూజర్ల కోసం వారిని ఆకర్షించేలా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్. తాజాగా అతి తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీను అందించే ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసింది. కేవలం రూ.197రీచార్జ్ ప్లాన్‌తో 150 రోజుల వ్యాలిడిటీను అందించనుంది. అధిక వ్యాలిడిటీతో పాటుగా..! బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన రూ. 197 ప్లాన్‌తో ఎక్కువ రోజుల వ్యాలిడిటే కాకుండా రోజుకు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్లు కూడా ఆఫర్ చేస్తుంది. కాగా ఈ ప్రయోజనాలు మాత్రం కేవలం 18 రోజులు మాత్రమే పొందే వీలు ఉంటుంది. సుదీర్ఘ వ్యాలిడిటీ అందించమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 18 రోజుల తర్వాత కూడా ఎలాంటి టాప్అప్ వేయకపోయినా ఉచిత ఇన్కమింగ్ సౌకర్యాన్ని పొందే వీలు ఉంటుంది. దాంతో పాటుగా 40kbps వేగంతో ఇంటర్నెట్ను కూడా పొందవచ్చును. చదవండి: హైదరాబాద్ బేస్డ్ బ్లాక్ చెయిన్ స్టార్టప్.. ఇన్వెస్ట్ చేసిన అమెరికా కంపెనీ -
బీఎస్ఎన్ఎల్కు అన్యాయం...ప్రైవేటులో భాగస్వామ్యం!
వొడాఫోన్– ఐడియా కంపెనీలో కేంద్రం 35.8% వాటా పొందుతుందని, అలాగే టాటా టెలీలో కేంద్రం 9.5% వాటా పొందుతుందని ఆయా కంపెనీలు ప్రకటించాయి. టాటా టెలీ మహారాష్ట్ర కూడా తమ కంపెనీ కేంద్రానికి వాటా ఇస్తోందని పేర్కొంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రైవేటు టెలికాం కంపెనీలు లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ చార్జీలు కలిపి దాదాపు రూ.1,60,000 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని 10 ఏళ్లలో వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటు, స్పెక్ట్రమ్ చార్జీలపై వడ్డీ చెల్లింపును ఈక్విటీగా మార్చుకునే వెసులుబాటు, బ్యాంకు రుణాలపై బ్యాంకు గ్యారెంటీ తగ్గింపు వంటి రాయితీలు కేంద్రం ఇచ్చింది. వొడాఫోన్–ఐడియా స్పెక్ట్రమ్ వడ్డీ రూపంలో దాదాపు రూ. 16,000 కోట్లు చెల్లించాలి. ఈ వడ్డీని చెల్లించలేమని, 2021 ఆగస్ట్ 14 నాటి షేరు రేటు ప్రకారం కేంద్రానికి 35.8% వాటా ఇవ్వాలని వొడాఫోన్ ఐడియా బోర్డు నిర్ణయించింది. ఇదే ప్రకారం టాటా టెలీ కంపెనీ తాము చెల్లించాల్సిన రూ.850 కోట్ల వడ్డీ మొత్తాన్ని ఈక్విటీగా మార్చి 9.5% వాటాను కేంద్రానికి కేటాయించాలని నిర్ణయించారు. కేంద్రం ఈ విషయంపై వివరణ ఇస్తూ... టెలికాం కంపెనీలకు వాటాల కేటాయింపు కోసం ఎలాంటి డబ్బు చెల్లించడం లేదనీ, కేవలం వడ్డీ రూపంలో తమకు చెల్లించాల్సిన డబ్బును వాటా లుగా మార్చడానికి అంగీకరించామనీ, టెలికాం రంగంలో ఒకటి, రెండు కంపెనీలు ఉంటే గుత్తాధి పత్యం ఏర్పడి ధరలు పెరుగుతాయనీ, దాని నివారణకు ఈ చర్య అవసరమని పేర్కొన్నారు. ఆయా టెలికాం కంపెనీలకు ఉన్న అప్పులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఆ విధంగా టెలికాం కంపెనీల నుండి హామీ పొందామని కమ్యూనికేషన్ మంత్రి తెలిపారు. వొడాఫోన్–ఐడియా టెలికాం కంపెనీలో కేంద్రానికి 35.8% వాటా ఉండగా, వొడాఫోన్‌కు 28.5%, ఆదిత్య బిర్లాకు 17.8% వాటాలు ఉంటాయి. ఆ రకంగా వొడాఫోన్ – ఐడియాలో కేంద్రానికి మెజా రిటీ వాటాలు లభిస్తాయి. కానీ మెజారిటీ వాటా కేంద్రానికి ఉన్నా ఆ కంపెనీని పాత యాజ మాన్యమే నిర్వహిస్తుందని కమ్యూనికేషన్లమంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో వొడాఫోన్ – ఐడియాకు దాదాపు రూ. 1.95 లక్షల కోట్లు అప్పు ఉండటం గమనార్హం. బీఎస్ఎన్ఎల్కు ద్రోహం అప్పుల్లో ఉన్న ప్రైవేటు కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి వెనుకాడని కేంద్రం... సొంత కంపెనీ బీఎస్ఎన్ఎల్కు 3జీ స్పెక్ట్రమ్ ఇచ్చేందుకు దాదాపు 3 ఏళ్ళు ఆలస్యం చేసింది. దీనివల్ల బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు 4జీ స్పెక్ట్రమ్ ఇవ్వకుండా సాకులు చెబుతోంది. ప్రైవేటు టెలికాం కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు పెట్టని ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్ మాత్రం భారత్‌లో తయారైన 4జీ టెక్నాలజీని మాత్రమే వాడాలని నిబంధనలు పెట్టింది. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్కు దేశ వ్యాప్తంగా ఆరు లక్షల గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ నిర్మించడానికి భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్కు లిమిటెడ్ (బీబీఎన్ఎల్) పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేసి రూ. 20000 కోట్ల విలువైన పనిని అప్పగించింది. ఇప్పుడు దీనిని పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పేరుతో ప్రైవేటుకు అప్పగించి, బీబీఎన్ఎల్ను బీఎస్ఎన్ఎల్లో కలిపేసి రూ.20000 కోట్ల కాంట్రా క్టును రద్దు చేసి నష్టం కలిగించింది. బీబీఎన్ఎల్ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కనెక్టివిటీ నిర్వహణ భారం బీఎస్ఎన్ఎల్పై పడుతుంది. ఇది అదనపు భారం. బీఎస్ఎన్ఎల్కు ఉన్న 78,568 మంది ఉద్యోగు లను 2020 జనవరి 31న వీఆర్ఎస్పై ఇంటికి పంపిన కేంద్రం, కంపెనీకి వచ్చే నష్టాలకు ఉద్యో గుల ఖర్చే కార ణంగా చెప్పింది. నిజానికి దానికి ఉన్న అప్పు రూ. 30,000 కోట్లు మాత్రమే. వొడా ఫోన్ ఐడియాకు ఉన్న అప్పు దాదాపు రూ. 1,95,000 కోట్లు. అక్కడ మాత్రం నష్టాలకు, అప్పు లకు ఉద్యోగులను కారణంగా చూపకుండా లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఒకే టెలికాం రంగంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకని, అందుకే ఎంటీఎన్ఎల్ నిర్వహణ బీఎస్ఎన్ఎల్కు అప్ప గించామని పేర్కొన్న కేంద్రం, ప్రైవేటు టెలికాం కంపెనీలలో వాటాలు తీసుకోవడానికి సిద్ధపడింది. మరో ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేస్తారా? అన్న ప్రశ్నకు అలాంటి ఉద్దేశం లేదని కమ్యూనికేషన్ల మంత్రి పేర్కొన్నప్పటికీ, బీఎస్ఎన్ఎల్లో వ్యూహాత్మక భాగస్వామి చేరికకు, ప్రయివేటీకరణకు రంగం సిద్ధమవుతోందా అన్న అనుమానం మాత్రం కలుగుతోంది. కేంద్రం సావర్న్ గ్యారెంటీతో రూ. 8,500 కోట్లు బాండ్ల రూపంలో బీఎస్ఎన్ఎల్ సమీకరించింది. బాండ్ల రూపంలో రుణం సమీరించారు కనుక నిబంధనల ప్రకార ం బీఎస్ఎన్ఎల్ను స్టాక్ ఎక్చేంజి బోర్డు ఆఫ్ ఇండియాలో లిస్ట్ చేయడం ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది. వ్యాసకర్త: మురాల తారానాథ్ టెలికాం రంగ విశ్లేషకులు -
బీఎస్ఎన్ఎల్ను దాటిన జియోఫైబర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవల రంగంలో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను వెనక్కి నెట్టి రిలయన్స్ జియో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. వాణిజ్య పరంగా సేవలు అందుబాటులోకి తెచ్చిన రెండేళ్లలోనే జియోఫైబర్ ఈ ఘనతను సాధించింది. ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో రెండు దశాబ్దాలుగా బీఎస్ఎన్ఎల్ ఆధిపత్య స్థానంలో కొనసాగింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. 2021 నవంబర్‌లో 43.4 లక్షల మంది కస్టమర్లతో జియో తొలి స్థానంలో ఉంది. అంత క్రితం నెలలో ఈ సంఖ్య 41.6 లక్షలు. బీఎస్ఎన్ఎల్ వినియోగదార్ల సంఖ్య 47.2 లక్షల నుంచి 42 లక్షలకు వచ్చి చేరింది. భారతి ఎయిర్‌టెల్‌కు 40.8 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. 2019 నవంబర్‌లో బీఎస్ఎన్ఎల్కు 86.9 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ సమయంలో భారతి ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య 24.1 లక్షలు. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్ల సంఖ్య అక్టోబర్‌లో 79.9 కోట్లు, నవంబర్‌లో 80.1 కోట్లకు చేరుకుంది. -
బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్..! ఉచితంగా 5జీబీ డేటా..! ఎన్ని రోజులంటే..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకువస్తోంది. కొద్ది రోజుల క్రితం జియో పోటీగా బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2399 ఏకంగా 90 రోజుల అదనపు వ్యాలిడిటీని అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఇతర నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు మారే యూజర్ల కోసం క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. స్విచ్ టూ బీఎస్ఎన్ఎల్...! యూజర్ల బేస్‌ను పెంచుకునేందుకుగాను బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌ను ముందుకొచ్చింది. #switchtoBSNL అనే ప్రచారాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్కు మారే కొత్త యూజర్లకు 5జీబీ హైస్పీడ్ డేటాను 30 రోజుల పాటు ఉచితంగా అందించనుంది. ఆయా యూజరు ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ ఐనా వారికే మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ అన్ని సర్కిళ్లలో జనవరి 15 వరకు అందుబాటులో ఉండనుంది. షరుతులు వర్తిస్తాయి..! బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఈ ఆఫర్‌ను సొంతం చేసేకునే కొత్త కస్టమర్లకు పలు షరతులను పెట్టింది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి రావాలనుకునే సదరు యూజరు ఫేస్బుక్, ట్విటర్ ప్లాట్‌ఫామ్స్‌లో #switchtoBSNL ప్రచారాన్ని షేర్ చేయాలి. అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్ అధికారిక ఫేస్బుక్ పేజీ (@bsnlcorporate), ట్విట్టర్ హ్యాండిల్ (@BSNLcorporate) ఫాలో చేయాల్సి ఉంటుంది. ఆయా యూజర్ బీఎస్ఎన్ఎల్కు ఎందుకుమారుతున్నారో కూడా సోషల్‌మీడియా హ్యండిల్స్లో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పోర్ట్ కానున్న నంబర్‌నుంచి 9457086024 నంబర్‌కు స్క్రీన్షాట్లను పంపాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించి ఆయా యూజర్లకు 30 రోజుల పాటు 5జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను బీఎస్ఎన్ఎల్ అందజేస్తుంది. A great reason to #SwitchToBSNL!#BSNL #NewYear #Offers T&C: https://t.co/4YNfqFRgLU pic.twitter.com/voDknZFvI2 — BSNL India (@BSNLCorporate) January 4, 2022 చదవండి: BSNL: జియోకు పోటీగా...బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్..! -
జియోకు పోటీగా...బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) జియోకు పోటీగా మరో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకువచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా జియో తన యూజర్ల కోసం వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2545కు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. అదనంగా 90 రోజుల వ్యాలిడిటీ..! ప్రైవేటు టెలికాం సంస్థలకు పోటీగా బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం వరుస ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399పై ఏకంగా 90 రోజుల అదనపు వ్యాలిడిటీని ప్రకటించింది. గతంలో ఈ ప్లాన్‌పై 60 రోజుల అదనపు వ్యాలిడిటీని బీఎస్ఎన్ఎల్ అందించింది. ఇప్పడు మరో 30 రోజుల అదనపు వ్యాలిడిటీ వర్తిస్తోందని బీఎస్ఎన్ఎల్ ప్రకటనలో పేర్కొంది. దీంతో మొత్తంగా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399పై యూజర్లకు ఏకంగా 455 రోజుల వ్యాలిడిటీ రానుంది. ఈ ఆఫర్ జనవరి 15 వరకు అందుబాటులో ఉండనుంది. రూ. 2,399 ప్లాన్‌పై మరిన్నీ ఆఫర్స్..! బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399పై అదనపు వ్యాలిటిడీతో పాటుగా పలు ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్లు డేలీ 3 జీబీ డేటా వరకు పొందవచ్చును. అంతేకాకుండా అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌పై ప్రముఖ ఓటీటీ ఈరోస్ నౌ సేవలను కూడా యూజర్లు సొంతం చేసుకోవచ్చును. ఈ ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ ట్యూన్లకు యాక్సెస్ చేయవచ్చును. చదవండి: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ.600కే డైలీ 5జీబీ డేటా!.. ఇంకా డైలీ? చదవండి: దీర్ఘకాలిక వ్యాలిడిటీ, ఓటీటీ సేవలను అందిస్తోన్న టాప్ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఇవే..! -
మేకిన్ ఇండియా కాదు.. సేల్ ఇన్ ఇండియా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి వాటిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వానిది మేకిన్ ఇండియా కాదని, సేల్ ఇన్ ఇండియా పాలసీ అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు కార్మిక సంఘాలతో కలిసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ‘సేవ్ పీఎస్‌యూ– సేవ్ ఇండియా’నినాదంతో ప్రజల్లోకి వెళతామని చెప్పారు. ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్‌లో ప్రభుత్వరంగ సంస్థల అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులతో వినోద్‌కుమార్ సమావేశమయ్యారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు ట్రేడ్ యూనియన్స్ జేఏసీ ఏర్పా టుకు నిర్ణయం తీసుకున్నారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బీడీఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, హెచ్ఎంటీ – ప్రాగా టూల్స్, మిథాని, డీఆర్డీ ఎల్, ఈసీఐఎల్, మింట్, పోస్టల్, డీఎల్ఆర్ఎల్, పలు బ్యాంకుల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం నుంచే కేంద్రంపై సమర శంఖారావాన్ని పూరిస్తున్నట్లు వినోద్ కుమార్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం ‘కేంద్ర సంస్థలను ప్రైవేటీకరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు. ప్రభుత్వసంస్థలను ప్రైవేట్ పరం చేయడమంటే రిజర్వేషన్లు తొలగించడమే. ఈ సంస్థల్లో ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు లక్ష యాభై వేల మంది పని చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలతో పాటు దేశ రక్షణ శాఖను సైతం ప్రైవేట్‌కు అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది. మిథాని, బీడీఎల్ సంస్థలను అమ్మేందుకూ సిద్ధమయ్యారు’అని వినోద్ అన్నారు. -
బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ.600కే డైలీ 5జీబీ డేటా!.. ఇంకా డైలీ?
బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు అదిరిపోయే న్యూయర్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రైవేటు టెలికాం సంస్థలు టారిఫ్ ఛార్జీలను పెంచిన సమయంలో వినియోగదారులకు ఆకట్టుకునే విధంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆకర్షణీయ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరలో ఎక్కువ డేటా ఇచ్చే రూ.599 ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి ప్రతిరోజు 5జీబీ డేటాను అందిస్తుంది. ఈ 5జీబీ డేటా అయిపోయిన తర్వాత వేగం 40 కెబిపిఎస్‌కు పడిపోతుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారు రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పంపించవచ్చు. దీనితో పాటు జింగ్‌మ్యూజిక్‌ను కూడా ఉచితంగా చూసేయవచ్చు. ఇంకా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్లిమిటెడ్ డేటా అందిస్తోంది. అయితే, ఇవన్నీ ఫీచర్స్ ఎన్ని రోజుల కాలపరిమితితో వస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ప్లాన్ 84ల రోజు వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ వల్ల ఇతర కంపెనీలకు పెద్ద దెబ్బపడే అవకాశం ఉంది. -
దీర్ఘకాలిక వ్యాలిడిటీ, ఓటీటీ సేవలను అందిస్తోన్న టాప్ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఇవే..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) దీర్ఘకాలిక వ్యాలిడిటీ, హై స్పీడ్ డేటాతో పలు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇతర మొబైల్ నెట్వర్క్ ప్లాన్లతో పోల్చితే...బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తక్కువ ధరకే ఎక్కువ వ్యాలిడిటీని అందిస్తున్నాయి. వీటితో పాటుగా యూజర్లు పర్సనలైజ్డ్ రింగ్ బ్యాంక్ టోన్ సేవలను ఉచితంగా పొందవచ్చును. దీర్ఘ-కాల వ్యాలిడిటీ, హై స్పీడ్ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న టాప్ 5 ప్లాన్స్ ఇవే..! 1. రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399 ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లు 425 రోజుల వ్యాలిడిటీను పొందుతారు. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 3జీబీ డేటా, 100ఎస్ఎమ్ఎస్, పొందవచ్చును. వీటితో పాటుగా బీఎస్ఎన్ఎల్ పీఆర్బీటీ రింగ్ టోన్స్ సేవలను, ఈరోస్ నౌ సభ్యత్వాన్ని కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. 2. రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో రానుంది. 600జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చును. ఒకవేళ 600జీబీ డేటా పూర్తైతే 80కేబీపీఎస్లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చును. దీంతో పాటుగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్, బీఎస్ఎన్ఎల్ పీఆర్బీటీ రింగ్ టోన్స్ సేవలను, ఈరోస్ నౌ సభ్యత్వాన్ని కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. 3. రూ. 1499 ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1499 ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో రానుంది. ఈ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్, 24జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చును. 4. రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ అతి తక్కువ ధరలో ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో రానుంది. ఈ ప్లాన్స్‌తో 300 రోజుల వ్యాలిడిటీ రానుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, 100 ఎస్ఎమ్ఎస్తో పాటుగా బీఎస్ఎన్ఎల్ పీఆర్బీటీ రింగ్‌టోన్ సేవలను కూడా పొందచ్చును.ఈ ప్లాన్ ప్రస్తుతం గోవా, మహారాష్ట్ర సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. 5. రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ రూ.999 ప్లాన్ 240 రోజుల చెల్లుబాటుతో రానుంది. ఇది రెండు నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, పీఆర్బీటీ సేవలను పొందవచ్చును. చదవండి: 2022లో భారత మార్కెట్లపై స్మార్ట్‌ఫోన్ కంపెనీల దండయాత్ర..! వచ్చే ఏడాదిలో రానున్న పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన యూజర్లకు అదిరిపోయే శుభవార్తను అందించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు కేవలం ఎంపిక చేయబడిన ప్రాంతాలలోనే 4జీ సేవలను అందిస్తోంది. 4జీ సేవలతో దాదాపు 900 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతుందని పార్లమెంటులో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. అన్ని పుకార్లను కొట్టివేస్తూ..బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణపై ఏలాంటి ప్రణాళికలు లేవని లోక్‌సభకు లిఖితపూర్వకంగా దేవుసిన్హ్ చౌహాన్ సమాధానమిచ్చారు. పీటీఐ నివేదిక ప్రకారం..రాబోయే బీఎస్ఎన్ఎల్ 4జీ టెండర్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (PoC)ను బీఎస్ఎన్ఎల్ ఆహ్వానించింది. ప్రభుత్వ టెలికాం సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రారంభించింది . ఈ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు 4జీ సేవల స్పెక్ట్రమ్ కేటాయింపులు ఉన్నాయి. దీనికోసం బడ్జెట్ కేటాయింపులు వాడనున్నారు. ఆర్థిక నివేదికలోని గణాంకాల ప్రకారం...సెప్టెంబర్ 30, 2021 వరకు బీఎస్ఎన్ఎల్ ఆస్తుల విలువ రూ. 1,33,952 కోట్లు , ఉండగా ఎంటీఎన్ఎల్ ఆస్తుల విలువ రూ. 3,556 కోట్లుగా ఉంది. అప్పుల విషయానికి వస్తే..బీఎస్ఎన్ఎల్ మొత్తం రూ. 85,721 కలిగి ఉంది. ఎంటీఎన్ఎల్ రూ. 30,159 కోట్ల అప్పు కలిగి ఉంది. చదవండి: యూజర్లకు భారీ షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్..! -
టారిఫ్‌ల పెంపు.. ‘ట్రాయ్ నిద్రపోతోందా?’
BoycottJioVodaAirtel Twitter Trend Amid Tariffs Hike: పరిణామాలు ఏవైనా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యావసరాలు మొదలుకుని.. ప్రతీదానిపైనే బాదుడు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిరసనలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా మొబైల్ టారిఫ్‌ల పెంపుపైనా వ్యతిరేక గళం వినిపిస్తోంది. భారత జనాభాలో సగానికి కంటే ఎక్కువగా(దాదాపు 60 శాతంపైనే అని సర్వేలు చెప్తున్నాయి) మొబైల్ ఇంటర్నెట్నే ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలో ధరల పెంపు పెద్దషాక్ అనే చెప్పాలి. ఈ తరుణంలో టెలికాం కంపెనీలను నియంత్రించలేని ట్రాయ్ (TRAI) నిద్రపోతోందా? అంటూ తీవ్ర విమర్శలను దిగుతున్నారు నెటిజనులు. నష్టాల సాకును చూపిస్తూ.. టెలికామ్ కంపెనీలన్నీ సగటు భారతీయుల డబ్బును దోచేస్తున్నాయని మండిపడుతున్నారు. ఎయిర్‌లెట్, వొడాఫోన్-ఐడియా, జియో కంపెనీలు 20రూ. మినిమమ్ పెంపుతో రెగ్యులర్, డాటా టారిఫ్ ప్యాకేజీలన్నింటిని సవరించడం సామాన్యుడికి దెబ్బే అని చెప్పాలి. పేద దేశమైనా సుడాన్ సూపరహే.. 1 జీబీకి ఎంత ఖర్చంటే.. ఇక ఎయిర్టెల్, వొడాఫోన్, జియో కంపెనీలు టారిఫ్‌లను అమాంతం పెంచేయడంపై నిరసన తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది. అదే టైంలో ఈ నిరసన సరదా కోణంలోనూ నడుస్తోంది. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇంటర్నెట్తోనే ఈ ట్రెండ్‌ను నడిపిస్తున్నారంటూ సరదా కామెంట్లు కనిపిస్తున్నారు. పరుషంగా తిట్టలేక మీమ్స్ టెంప్లెట్స్‌తో విమర్శిస్తున్నారు కొందరు. పెరిగిన జియో టారిఫ్ ధరల పూర్తి వివరాలు VI పెంచిన ధరలు ఇవే! ఎయిర్టెల్ బాదుడు.. ఇలా ఉంది మరికొందరేమో బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్లడం మంచిదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ను ప్రైవేట్‌పరం చేయొద్దని, అలాగని ప్రజలంతా బీఎస్ఎన్ఎల్ (సిగ్నల్, ఇంటర్నెట్ స్పీడ్ ఆధారంగా) పోర్ట్ కావాలంటూ పిలుపు ఇస్తున్నారు నెటిజన్స్. ట్విటర్లో ఈ ట్రెండ్‌ను మీరూ చూసేయండి. #BoycottJioVodaAirtel In the past jio hiked the prices then after all the telecom companies hiked,but now airtel hiked then after suddenly jio hiked something is fishy, #Airtel #Jio #VI these fu.... Companies wanted to create monopoly in the market — VAMSHI RUDRA (@VAMSHIRUDRA2) November 29, 2021 #BoycottJioVodaAirtel is trending People who are using BSNL right now reaction of #BSNL user..💪 pic.twitter.com/ZXCMPA4EHR — Rakesh prajapat (@Rakeshp8290) November 29, 2021 #BoycottJioVodaAirtel We will go to BSNL network — prakash (@sibdumercury) November 29, 2021 #BoycottJioVodaAirtel People in this corona situation lost their jobs and all the investments. In this difficult situation the telecom operators are ruthlessly increasing their tariff price. 😡😡🤬🤬😤😤😤🤧🤧 @JioCare @reliancejio — Satnam Singh (@SatnamS1995) November 29, 2021 Why @TRAI is sleeping? all telecome companies are extending their money is it easy to paid by poor people? wake up TRAI.#BoycottJioVodaAirtel pic.twitter.com/L6CKCy3m4k — Ajeet Kushwaha (@AjeetKushwaha33) November 29, 2021 Jio Raises Prepaid Rates By Up To 20% After Airtel, Vodafone Idea. Where is @TRAI in all this loot?#BoycottJioVodaAirtel — Ajeet Kushwaha (@AjeetKushwaha33) November 29, 2021 Meanwhile me to those who are trending: #BoycottJioVodaAirtel pic.twitter.com/yk8POQ387W — All in One 🇮🇳 (@mayankm94847123) November 29, 2021 This woman got so busy on her mobile that she left her child at the hotel. Just think from where did this mobile reach us #BoycottJioVodaAirtel #Vellore #VirgilAbloh #NZvsIND #bimbisarateaser pic.twitter.com/svBgJczqSV — Imtiyaz Ahamad (@ahamad1_imtiyaz) November 29, 2021 -
యూజర్లకు భారీ షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) యూజర్లకు భారీ షాకిచ్చింది. లైఫ్‌టైమ్ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. లైఫ్‌టైమ్ ప్రీ పెయిడ్ ప్లాన్లను డిసెంబర్ 1నుంచి పూర్తిగా రద్దు చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం లైఫ్ టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్లలో కొనసాగుతున్న యూజర్లను వేరే ప్లాన్‌లోకి షిఫ్ట్ చేయనుంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల్లో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1000 కిమీ ప్రయాణం..! లైఫ్ టైమ్ ప్లాన్‌తో ఏలాంటి సంబంధం లేకుండా యూజర్లు వారి బెనిఫిట్స్‌కు ఎలాంటి నష్టం కలిగించకుండా మరో ప్లాన్‌లోకి బదలాయించనుంది. లైఫ్ టైమ్ ప్లాన్లను 107 రూపాయల ప్లాన్‌లోకి మార్చనుంది. ఈ మార్పు ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అయితే యూజర్లకు రూ. 107 ప్లాన్‌లో ఉండే కొన్ని అదనపు ప్రయోజనాలు వర్తించవని తెలిపారు. రూ. 107 ప్లాన్‌కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లేదు. దీని కాల పరిమితి మూడు నెలలు మాత్రమే. ఇదిలా ఉండగా..బీఎస్ఎన్ఎల్ రూ. 2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీను 60 రోజులకు పెంచింది. దీంతో యూజర్లు 425 రోజుల వ్యాలిడిటీను పొందనున్నారు. చదవండి: ఎలక్ట్రిక్ కార్లు కాదు..కానీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయ్..! -
రూ.1100 కోట్ల సేకరణ..! బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ ఆస్తుల వేలం..!
Centre Begins Auction Of BSNL MTNL Assets: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్కు చెందిన రియల్ ఎస్టేట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచనుంది. ఈ వేలంతో సుమారు రూ. 1,100 కోట్లను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ సంస్థలకు చెందిన ఆస్తుల విక్రయాల జాబితాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) వెబ్సైట్లో ఉంచింది. చదవండి: సామాన్యులకు కేంద్రం షాక్..! భారీగా పెరగనున్న దుస్తులు, చెప్పుల ధరలు ఆస్తుల విక్రయాల జాబితాలో హైదరాబాద్, ఛండీగడ్, భావనగర్, కోల్‌కతా నగరాల్లోని బీఎస్ఎన్ఎల్ ప్రాపర్టీలను రూ. 800 కోట్ల రిజర్వ్ ప్రైజ్‌కు వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. వాసరి హిల్, గోరెగాన్ (ముంబై) లలోని ఎమ్టీఎన్ఎల్ ఆస్తులను రూ. 270 కోట్ల రిజర్వ్ ప్రైజ్‌కు వేలం వేయనున్నారు. నాన్ కోర్ అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌లో భాగంగా ఎమ్టీఎన్ఎల్కు చెందిన ఓషివారాలోని 20 అంతస్తుల ఫ్లాట్‌ను కూడా అమ్మకానికి పెట్టింది. ఈ ఫ్లాట్‌ను గత ఏడాది డిసెంబర్ 14 న ఈ–వేలం కింద సేల్కు ఉంచారు. రివైవల్ స్కీమ్ కింద బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ సంస్థలకు రూ. 69 వేల కోట్లు ఇవ్వాలని 2019 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు త్వరలో తీపికబురు -
విమానాల్లో ‘జీఎక్స్’ ఇంటర్నెట్ సేవలు
న్యూఢిల్లీ: విమానాల్లో హై–స్పీడ్ ఇన్‌ఫ్లయిట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్సును ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దక్కించుకుంది. దీనితో ఇకపై ఏవియేషన్, మారిటైమ్, ప్రభుత్వ విభాగాల్లో బ్రిటన్ శాటిలైట్ సంస్థ ఇన్మార్శాట్కు చెందిన గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ (జీఎక్స్) మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థ అయిన ఇన్మార్శాట్ ఈ విషయాలు వెల్లడించింది. వివిధ సరీ్వసులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే స్పైస్‌జెట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు జీఎక్స్ సరీ్వసులు పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇన్మార్శాట్ ఇండియా ఎండీ గౌతమ్ శర్మ తెలిపారు. వీటితో భారత గగనతలంలో ఎగిరే దేశ, విదేశ ఎయిర్‌లైన్స్‌లో వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దీనితో విమాన ప్రయాణికులు ఆకాశంలో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడం, సోషల్ మీడియాను చెక్ చేసుకోవడం, ఈమెయిల్స్ పంపడం, యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ చేయడం వంటివి వీలవుతుంది. -
40వేల కోట్లు సాయం చేయండి ప్లీజ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. రూ.40,000 కోట్ల ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని ఆశ్రయించింది. ఇందులో సగం స్వల్పకాలిక రుణాన్ని చెల్లించడానికి సార్వభౌమ హామీ రూపంలో అవసరమని విన్నవించింది. ‘అదనపు రుణం సంస్థకు అవసరం లేదు. కార్యకలాపాలను నిర్వహించేందుకు వ్యాపారం నిలకడగా మారింది. ఒక లక్ష మొబైల్ సైట్లను ఏర్పాటు చేసేందుకు రూ.20,000 కోట్లు కావాలి’ అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ పి.కె.పూర్వార్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు కలిపి కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రకటించిన రూ.69,000 కోట్ల ఉపశమన ప్యాకేజీకి ఇది అదనమని అన్నారు. ప్రస్తుతం సంస్థ రుణ భారం రూ.30,000 కోట్లుంది. టెలికం రంగంలో ఇదే తక్కువ అని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. 2019–20లో బీఎస్ఎన్ఎల్ నష్టాలు రూ.15,500 కోట్లుంటే.. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,441 కోట్లకు వచ్చి చేరింది. -
పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మొబైల్ రీఛార్జీలపై అందించనున్న క్యాష్‌బ్యాక్, ఇతర రివార్డులను పేటీఎం నేడు(సెప్టెంబర్ 23) ప్రకటించింది. ప్రతిరోజూ మొదటి 1,000 మంది వినియోగదారులు ఇన్నింగ్స్ విరామ సమయంలో తమ మొబైల్ ఫోన్ నంబర్లను రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్(రూ.50 వరకు) పొందుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.(చదవండి: బ్యాంకు ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిక!) జియో, వీఐ, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ కస్టమర్లు రూ.10 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేటీఎం తెలిపింది. "కొత్త వినియోగదారులు జియో రూ.11, రూ.21, రూ.51 అదనపు డేటా ప్యాక్స్, వోడాఫోన్ ఐడియా రూ.16, రూ.48 అదనపు డేటా ప్యాక్, ఎయిర్టెల్ అదనపు డేటా ప్యాక్ రూ.48 రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ప్రతిరోజూ ఐపీఎల్ మ్యాచ్ జరిగే రాత్రి 7.30 నుంచి 11 గంటల మధ్య వచ్చే విరామ సమయంలో వారు చేసుకునే ప్రతి రీఛార్జీలపై 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే, ఇతర బహుమతి వోచర్లను కూడా రీడీమ్ చేసుకోవచ్చు" పేటీఎం పేర్కొంది. -
టెలికం రాయితీలతో ప్రజలకేం లాభం?
టెలికం రంగ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. కేవలం మూడు ప్రైవేటు టెలికం కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ప్రకటించిన కేంద్రం, అదే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ విషయంలో పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. విశాఖ ఉక్కు కర్మాగారం అప్పు విషయంలోనూ కేంద్రం ధోరణి అదే. మరి ప్రైవేటు రంగం మీద ఎందుకింత ప్రేమ? అయితే, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఉన్న అవరోధాల వల్ల ఈ సహాయం అవసరమేననే నిపుణుల వాదన కూడా తోసిపుచ్చదగినది కాదు. కానీ ఈ మొత్తం ఉదారత సామాన్యులకు అందే సేవల్లో ఏమేరకు ప్రతిఫలిస్తుంది అన్నదే వేచిచూడాల్సిన అంశం.ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీల విషయం ఆయా రంగాల్లోని వారికి తప్ప ఇతరులకు పెద్ద ఆసక్తి గొలపలేదు. కానీ టెలికం రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కేవలం మూడు టెలికం కంపెనీలకు దాదాపు రూ.రెండు లక్షల కోట్ల రాయితీ ఇచ్చి, దేశ టెలికం రంగం బాగుపడిందంటే నమ్మడం ఎలా? ప్రజలకు వీటి వల్ల ఒరిగేదేమిటి? పూర్వరంగం 1994లో ప్రైవేటు టెలికం కంపెనీలకు ఫిక్స్డ్ లైసెన్సు విధానంలో అనుమతి నిచ్చారు. లైసెన్స్‌తో పాటు కొంత స్పెక్ట్రమ్ ఉచితంగా ఇచ్చేవారు. ఫిక్స్డ్ లైసెన్స్ విధానం అంటే, ఏడాదికి కొంత మొత్తం లైసెన్స్‌గా చెల్లించడం. ఏడాదికి కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని టెలిఫోన్ కనెక్షన్లు ఇవ్వాలన్న నిబంధనలు ఉండేవి. అప్పట్లో ఇన్కమింగ్ కాల్స్‌కు కూడా ప్రైవేటు టెలికం కంపెనీలు డబ్బులు వసూలు చేసేవి. లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లు ఇవ్వని కారణంగా ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.50వేల కోట్ల పెనాల్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. తమకు నష్టాలు వస్తున్నాయని, పెనాల్టీలు రద్దు చేయాలని టెలికం కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో 1999 నూతన టెలికం విధానం వచ్చింది. దీని ప్రకారం టెలికం కంపెనీలు ఫిక్స్డ్ లైసెన్స్ విధానం ప్రకారం కాకుండా, రెవెన్యూపై 8 శాతం లైసెన్స్ ఫీజుగానూ, 3–5 శాతం స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీగానూ చెల్లించాలి. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన 50 వేల కోట్ల పెనాల్టీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రెవెన్యూ అంటే ఏమిటి అన్న విషయంలో టెలికం కంపెనీలకూ, ప్రభుత్వానికీ వివాదం ఏర్పడింది. నాన్ టెలికం ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలని ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు 2019లో ఈ విషయంలో తీర్పు ఇస్తూ– ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పన్ను చెల్లించాలని తీర్పు నిచ్చింది. దీని ప్రకారం రూ.1,46,000 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. దీనిపై అప్పీలుకు వెళ్లినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సమయంలో ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన పన్నులు చెల్లించే అవసరం లేకుండా రెండేళ్ల మారిటోరియం విధించింది. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై పన్నులు చెల్లించేందుకు 10 ఏళ్ల గడువు ఇవ్వాలని కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. రూ.39 వేల కోట్ల రూపాయలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా, వీఆర్ఎస్ పేరుతో 90 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. కానీ మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.1,46,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, వారికి 10 ఏళ్ల గడువు ఇమ్మని కోర్టును కేంద్రం కోరడం గమనార్హం. తాజాగా కల్పించిన రాయితీలేమిటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ఏమేమి రాయితీలు కల్పించిందో చూద్దాం: 1.అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ నిర్వచనాన్ని మార్చి, ప్రైవేటు టెలికం కంపెనీలు కోరుకున్న విధంగా నాన్ టెలికం ఆదాయంపై పన్ను చెల్లించకుండా వెసులుబాటు. అయితే ఈ నిర్ణయం ఇప్పటి నుంచి మాత్రమే వర్తిస్తుంది. గత కాలపు పన్ను బకాయిలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెల్లించాలి. 2.టెలికం కంపెనీలు చెల్లించాల్సిన చట్టబద్ద పన్నులకు గతంలోని రెండేళ్ల కాలానికి అదనంగా మరో నాలుగేళ్ళ మారటోరియం విధించారు. అంటే అక్టోబర్ 2025 వరకు టెలికం కంపెనీలు కేవలం వడ్డీ చెల్లిస్తే చాలు. 3.డైరెక్ట్ విధానం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100 శాతం అమలు. ఈ నిర్ణయం వల్ల విదేశీ టెలికం కంపెనీలు దేశ టెలికం రంగాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. 4.వడ్డీ రేటు గతంలో ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటుకు అదనంగా నాలుగు శాతం ఉండగా, దాన్ని రెండు శాతానికి తగ్గించారు. 5.స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు ఇకపై రద్దు. గతకాలపు స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు నెలవారిగా కాకుండా ఏడాదికి ఒకసారి చెల్లించే వెసులుబాటు. 6.లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ చెల్లించకపోతే విధించే అదనపు రుసుం రద్దు. 7.స్పెక్ట్రమ్ లైసెన్స్ ఇకపై 20 ఏళ్ళు కాకుండా 30 ఏళ్ల కాలానికి పొడిగింపు. 8.స్పెక్ట్రమ్ షేరింగ్ చేసుకోవచ్చు. ఈ షేరింగ్‌పై ఇప్పటివరకు విధించిన రెవెన్యూపై 0.5 శాతం పన్ను రద్దు. 9. బ్యాంకు గ్యారెంటీలు ఇకపై బిజినెస్ సర్కిల్ ప్రకారం కాకుండా యావత్ ఇండియా ప్రాతిపదికన ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల టెలికం కంపెనీలకు 80 శాతం భారం తగ్గుతుంది. 10.ఇకపై ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో స్పెక్ట్రమ్ వేలం. 11. నాలుగేళ్ళ మారటోరియం తర్వాత కూడా టెలికం కంపెనీలు పన్నులు చెల్లించలేకపోతే ఆ మొత్తం ఈక్విటీగా మార్చుకోవచ్చు. 12. స్పెక్ట్రమ్ వాపస్ ఇవ్వాలంటే కనీసం 10 ఏళ్ల తర్వాతనే వీలవుతుంది. ఇలా విధాన పరమైన నిర్ణయాల్లో కేంద్రం మార్పులు చేసింది. ప్రధానంగా ఈ నిర్ణయాల వల్ల దివాలా స్థితిలో ఉన్న వొడాఫోన్–ఐడియా కంపెనీ తాను చెల్లించాల్సిన లక్షా ఎనభై వేల కోట్ల బకాయిలలో, రూ. 96,000 కోట్ల వెసులుబాటు నాలుగేళ్ళ కాలానికి లభించింది. ప్రజలకు ఏం ఉపయోగం? విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న అప్పు 20,000 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని ఈక్విటీగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరగా కేంద్రం తిరస్కరించింది. మానిటైజేషన్ పేరుతో బీఎస్ఎన్ఎల్కు చెందిన 20,000 టవర్లు అమ్మివేసి, కేబుల్ అమ్మి, భూములు అమ్మి రూ.35,000 కోట్లు ఆర్జించాలని కేంద్రం ప్రకటించింది. కానీ టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీలు గమనిస్తే ఒక్క వొడాఫోన్–ఐడియాకే రూ.96,000 కోట్ల వెసులుబాటు వచ్చింది. కాగా మొత్తం టెలికం రంగానికి రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చారు. 1994 నుండి ఇప్పటి దాకా అనేక పర్యాయాలు టెలికం రంగానికి రాయితీలు లభించాయి. టెలికం రంగ పారిశ్రామికవేత్తల అభిప్రాయం ప్రకారం– టెలికం రంగంలో 2జీ నుండి 3జీకి, 3జీ నుండి 4జీకి, 4జీ నుండి 5జీకి ప్రతి నాలుగైదేళ్ల వ్యవధిలో మారాల్సి రావడం, దానికోసం టెక్నాలజీ దిగుమతులు, సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడులు, టెలికం కంపెనీల మధ్య అనారోగ్య కరమైన పోటీతో ధరల తగ్గుదల లాంటి కారణాల వల్ల పెట్టుబడులు పెరిగి, ఆదాయాలు తగ్గి, నష్టాలు వస్తున్నాయి కనుక ఈ వెసులుబాట్లు అవసరం. కొంతమంది పారిశ్రామికవేత్తల కోసం ఇంత మొత్తంలో రాయితీ ఇవ్వడం సరి కాదని, ఈ రాయితీలు ప్రజలకు సరాసరి చేరేలా చూసే విధానాన్ని రూపొందిస్తే బాగుండేదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రజల ధనంతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న ఆరు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను భారత్ నెట్ కింద నిర్మిస్తూ, అందులో రెండు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను అమ్మి రూ.20,000 కోట్లు సమీకరించాలను కోవడం ఏమిటి? మరోవైపు లక్షల కోట్లు రాయితీగా ఇవ్వడం ఏమిటి? బీఎస్ఎన్ఎల్కు ఉన్న 70,000 టవర్లలో 20,000 టవర్లు అమ్మి రూ.15,000 కోట్లు సమీకరించే ఆలోచన ఎందుకు? 4జీ ఇవ్వకుండా, టవర్లను 4జీకి అప్‌గ్రేడ్ చేయకుండా ప్రభుత్వ డైరెక్టర్లే అడ్డు పడటం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా టెలికం రంగంలో ఒకటి రెండు కంపెనీల గుత్తాధిపత్య నివారణకు ప్రభుత్వం భారీ రాయితీలే ఇచ్చింది. ఈ రాయితీల ద్వారా మెరుగైన సేవలను ప్రజలకు ప్రైవేటు టెలికం కంపెనీలు అందుబాటులోకి తెస్తాయని; ప్రపంచంలొనే అతి తక్కువ టారిఫ్‌లు ఉన్న దేశంగా మనం ఇకపై కూడా కొనసాగేలా ఉండాలంటే ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్కు కూడా మరిన్ని వెసులుబాట్లు ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుందాం. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు -
బీఎస్ఎన్ఎల్: ఆశ్చర్యకరమైన పరిణామాలు!
ప్రభుత్వ రంగ మొబైల్ నెట్వర్క్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ఆశ్చర్యకర ఫలితాల్ని చవిచూస్తోంది. 4జీ సర్వీసులు లేకున్నా.. ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం కొనసాగుతున్నప్పటికీ.. సబ్ స్క్రయిబర్ షేర్ మీద మాత్రం ఎలాంటి ప్రభావం పడకపోవడం విశేషం. బీఎస్ఎన్ఎల్ స్క్రయిబర్ షేర్ గత కొన్నేళ్లుగా నిలకడగా పెరుగుతూ వస్తోంది. 2016-2017 మధ్య బీఎస్ఎన్ఎల్ స్క్రయిబర్ షేర్ 8.6 శాతంగా ఉండగా, 2017-18కి 9.4 శాతం, 2018-19కి 9.9 శాతం, 2019-2020 నాటికి 10 శాతానికి చేరింది. ఇక 2020-2021కి(మార్చి 21, 2021) స్వల్పంగా పెరిగి.. 10.3 శాతానికి చేరుకుందని కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. డాటా వినియోగం, టెలికామ్ సెక్టార్లో పోటీ వల్ల టారిఫ్‌లలో మార్పులు కనిపిస్తున్నప్పటికీ.. 4జీ సర్వీసులు లేకపోవడం బీఎస్ఎన్ఎల్కు ప్రతికూలంగా మారాయని టెలికాం నిపుణులు చెప్తున్నారు. ఇది ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU)పై మాత్రం ప్రభావం పడేలా చేస్తోంది. 4జీ ఎందుకు లేట్ అంటే.. లోకల్ ఎక్విప్మెంట్లు, తగిన సాంకేతికత లేకపోవడం బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రయత్నాలకు ప్రతికూలంగా మారుతూ వస్తోంది. నిజానికి 2019 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం.. 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయించారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు దాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూనే ఇవ్వాలని ఫిర్యాదులు రావడం, చైనా కంపెనీలు పాల్గొనకూడదన్న నిర్ణయంవల్ల గత రెండేళ్లుగా బీఎస్ ఎన్ఎల్ 4జీ సేవలను అమలు చేయడం ఆలస్యం అవుతోంది. హాట్ న్యూస్: మీ ఫోన్లో ఈ యాప్స్.. వెంటనే డిలీట్ చేయండి నష్టాల్ని ఇలా తగ్గించుకుంది పీఎస్‌యూ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. మరోపక్క ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్ ఐడియా-బీఎస్ఎన్ఎల్ను విలీనం చేయాలనే ప్రతిపాదనను కొందరు తెర మీదకు తెస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పరిధిలో మాత్రం అలాంటి ఆలోచనేం కనిపించడం లేదు. -
BSNL Vodafone Idea Merger: అప్పుల బరువుతో విలీనమా?
వొడాఫోన్–ఐడియా(వీఐ) కంపెనీని ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్లో విలీనం చేస్తే సమస్య పరి ష్కారం అవుతుందా? వీఐకి 2018లో చైర్మన్‌గా ఎన్నికైన ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన కుమారమంగళం బిర్లా కొన్ని రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఐడియా కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న హిమాంషు కాపారియా కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వొడాఫోన్–ఐడియా ఆర్థిక కష్టాలలో పడటం, మార్చి 2022 లోపు రూ. 24,000 కోట్లు కట్టాల్సి ఉండటం, కొత్త అప్పులు పుట్టకపోవడం, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు వల్ల అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై ఎక్కువ పన్ను కట్టాల్సి రావడం వంటి కారణాల వల్ల రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు బిర్లా వెల్లడించారు. టెలికం రంగంలో ఒకటి, రెండు కంపెనీల గుత్తాధిపత్యం కొనసాగితే వినియోగదారునికి అన్యాయం జరుగుతుందనీ, కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, వీఐ కంపెనీని బీఎస్ఎన్ఎల్లో కలపడం లేదా అప్పుల్ని ఈక్విటీలుగా మార్చడం, టెలికం శాఖకు కట్టాల్సిన వాయిదాలు చెల్లించే గడు వులు పెంచడం లాంటి చర్యలు వెంటనే చేపట్టాలనీ మొన్న జూన్‌లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు రాసిన లేఖలో కుమారమంగళం బిర్లా కోరారు. ఐడియా కంపెనీలో 2018లో విలీనమైన వొడాఫోన్ కంపెనీలో ఆదిత్య బిర్లా గ్రూపునకు 27 శాతం, బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు 44 శాతం వాటాలు ఉన్నాయి. 2020 సెప్టెంబర్ 7న కంపెనీ పేరును ‘వీఐ’గా మార్చారు. వొడాఫోన్‌కి దాదాపు రూ. 1,80,000 కోట్ల అప్పులున్నాయి. రాబోయే 10 ఏళ్లలో స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీల కింద రూ. 58,254 కోట్లు, ఏటా రూ. 7,854 కోట్లు చెల్లించాల్సి ఉంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్ వేసే ఆలోచనలో వొడాఫోన్ ఐడియా ఉంది. ఇదే జరిగితే ఆ ప్రభావం ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకులపై ఉంటుంది. మరోవైపు ‘డీఓటీ’కి వెంటనే చెల్లించాల్సిన రూ. 8,292 కోట్లు చెల్లించడానికి మరో ఏడాది గడువు కావాలని వొడాఫోన్–ఐడియా కోరింది. బీఎస్ఎన్ఎల్లో వీఐ విలీనం వల్ల ఉపయోగం ఉంటుందా? ప్రతి టెలికం సర్కిల్లో కనీసం నాలుగు టెలికం కంపెనీలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలనీ, లేకపోతే ఒకటి, రెండు కంపెనీల పెత్తనం కొనసాగి, టెలికం రంగమే కొందరి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనీ, బీఎస్ఎన్ఎల్కు 4జీ సర్వీసులు ఇంకా లేవు కనుక 4జీ సౌకర్యం కల్పిస్తున్న వీఐని వినియోగించుకుంటే రెండు కంపె నీలకూ మేలు జరుగుతుందని కొంతమంది టెలికం రంగ నిపుణులు సూచిస్తు న్నారు. ఈ ఆలోచనను బీఎస్‌ఎన్‌ఎల్‌లోని కొన్ని యూనియన్లు, అసోసి యేషన్లు సమర్థిస్తున్నాయి. కొన్ని నిజాలను పరిశీలిస్తే బీఎస్ఎన్ఎల్ అప్పు కేవలం రూ. 26,000 కోట్లు కాగా, వొడాఫోన్–ఐడియా అప్పు రూ. 1,80,000 కోట్లు. 2022లో జరుగబోయే 5జీ స్పెక్ట్రమ్ వేలంలో మరింత అప్పు చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ పథకం ద్వారా 80 వేల మంది ఉద్యోగులను సాగనంపడం ద్వారా ఏటా 8 వేలకోట్ల ఖర్చును బీఎస్ఎన్ఎల్ తగ్గించుకుంది. నిజానికి 2019 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయిం చారు. కానీ ఆత్మనిర్భర్ భారత్ పథకం ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు దాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూనే ఇవ్వాలని ఫిర్యాదులు రావడం, చైనా కంపెనీలు పాల్గొనకూడదన్న నిర్ణయంవల్ల గత రెండేళ్లుగా బీఎస్ ఎన్ఎల్ 4జీ సేవలను అమలు చేయడం ఆలస్యం అవుతోంది. కానీ వొడాఫోన్– ఐడియా చైనాకు చెందిన హువవాయ్, జడ్టీయూ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానం తోనే 4జీ ఇస్తోంది. కనుక వొడాఫోన్–ఐడియాతో బీఎస్ఎన్ఎల్ కలిసి పనిచేయ డానికి ఇది ఒక అడ్డంకి. పైగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో గతంలో విదేశీ సంచార నిగమ్ మొత్తం ప్రైవేటుపరం అయిన అనుభవాలు తెలుసు. కాబట్టి వొడాఫోన్–ఐడియాను బీఎస్ఎన్ఎల్లో కలిపే ఆలోచన ప్రభుత్వం చేయకూడదనే ఆశిద్దాం. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు ‘ మొబైల్: 94405 24222 -
బీఎస్ఎన్ఎల్ షాకింగ్ నిర్ణయం..!
ప్రభుత్వ రంగ మొబైల్ నెట్వర్క్ సంస్థ బీఎస్ఎన్ఎల్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. సగటు స్థూల ఆదాయాన్ని పెంచుకునే చర్యలో భాగంగా పలు టెలికాం సంస్థలు మొబైల్ టారిఫ్‌లను రివైజ్ చేశాయి. ఇప్పటికే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లను రివైజ్ చేశాయి. కాగా ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టెలికాం సంస్థల అడుగుజాడల్లోనే బీఎన్ఎన్ఎల్ నడుస్తోంది. పలు మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లను రివైజ్ చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రివీజన్‌లో భాగంగా ప్లాన్లను ధరలను మార్చకుండా ప్లాన్ల వ్యాలిడీటీ కుదించింది. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అందుబాటులో ఉన్న రూ. 49, రూ. 75, రూ. 94 ప్లాన్ల వ్యాలిడీటీను తగ్గించింది. అంతేకాకుండా రూ. 106, రూ.107, రూ.197, రూ. 397 ప్లాన్లను కూడా రివైజ్ చేసింది. బీఎస్ఎన్ఎల్ రూ.49 ప్లాన్ వ్యాలిడిటీని 24 రోజులుగా, రూ.75 ప్లాన్ వ్యాలిడిటీని 50 రోజులుగా, రూ. 94 ప్లాన్ వ్యాలిడిటీని 75 రోజులుగా నిర్ణయించింది. దాంతోపాటుగా రూ.106, రూ. 107, ప్లాన్లకు అందించే 100 రోజుల వ్యాలిడిటీని 84 రోజులకు కుదించింది. రూ. 197 ప్లాన్‌కు అందించే 180 రోజుల వ్యాలిడిటీని 150 రోజులకు కుదించింది. రూ. 397 ప్లాన్‌కు అందించే 365 రోజుల వ్యాలిడిటీని 300 రోజులకు కుదించింది. -
మున్ముందు ఈ గొంతు వినిపించేనా?
సొంత సంతానం మీద సవతి తల్లి ప్రేమ చూపడం అనే వ్యక్తీకరణ మీరు ఎప్పుడైనా విన్నారా? టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ విషయంలో కేంద్ర వైఖరికి ఇది సరిగ్గా సరిపోతుంది. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల కొత్త భావాలు పురుడు పోసుకుంటున్నాయి. కానీ అది మాత్రం పాత కంపెనీల ఉసురు తీస్తోంది. ప్రైవేటు టెలికం కంపెనీలు పాపం అప్పులు చెల్లించలేవని వారి కోసం తెగ బాధపడుతున్న కేంద్రం, బీఎస్ఎన్ఎల్కు తానుగా చెల్లించాల్సిన బకాయిలు తీర్చే పుణ్యం మాత్రం కట్టుకోవడం లేదు. ఓ వైపు ప్రైవేటు కంపెనీలు 5జీ సేవలకు ఉరకలు ఎత్తుతుంటే, బీఎస్ఎన్ఎల్ విషయంలో మాత్రం 4జీ సేవలకు పచ్చజెండా ఊపడానికే కేంద్రానికి చేతులు రావడం లేదు. ఇది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. కొత్తగా టెలికం శాఖ బాధ్యతలు స్వీకరించిన కొత్త కేంద్ర మంత్రి గారు అయినా ఆ పాత ధోరణిని వదిలించుకుంటారేమో చూడాలి. టెలికం రంగంలోకి 5జీ సేవలు రాబోతున్న తరుణంలో, ఇదివరకే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ఎంటీఎన్ఎల్ (మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్) మనుగడపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమకు సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడులు లేవనీ, అప్పులు కూడా పుట్టడం లేదని చెప్పే ప్రైవేటు టెలికం కంపెనీలు ఓ వైపు; మరోవైపు డీఓటీ నుండి సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిలు బీఎస్ఎన్ఎల్కు రావాలన్న డిమాండ్లు, దాదాపుగా రెండేళ్లుగా ఎప్పుడు జీతాలు ఇస్తారో తెలియని స్థితిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు; బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల భూముల అమ్మకం ద్వారా లక్ష కోట్లు ఆర్జించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశల నేపథ్యంలో కొత్త టెలికం మంత్రి బాధ్యతలు చేప ట్టారు. తన ముందున్న అనేక సమస్యలకు ఆయన పరిష్కారాలు వెతకాల్సి ఉంది. ప్రైవేటుపై ప్రత్యేక ప్రేమ ప్రైవేటు టెలికం కంపెనీలు తాము ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇతర లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ చార్జీల లాంటివి చెల్లించలేక పోతున్నామనీ, కనుక తమకు ఈ పన్నులు చెల్లించడానికి మరింత గడువు కావాలనీ కోరుతున్నాయి. తగ్గుతున్న తమ ఆదాయాలు, నిర్వహణ ఖర్చుల్లో పెరుగుదల, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి అయ్యే ఖర్చులు దీనికి కారణంగా అవి చెబుతున్నాయి. ఇటీవల వొడా ఫోన్ ఐడియా సంస్థ తమకు పెట్టుబడులు కూడా రావడం లేదనీ, రుణం తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు అడ్డంకులు ఉన్నాయనీ వాపో యింది. మొత్తం టెలికం కంపెనీల అప్పు ఆరు లక్షల కోట్ల రూపా యలు కాగా, అందులో బీఎస్ఎన్ఎల్ అప్పు కేవలం దాదాపుగా రూ. 25,000 కోట్లు మాత్రమే ఉండటం గమనించాలి. కానీ గౌరవ సుప్రీంకోర్టు, టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల బకాయిలను మూడునెలల్లో చెల్లించాలని తీర్పు ఇస్తే, కేంద్ర ప్రభుత్వమే ఒక పిటిషన్ వేసి టెలికం కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని కనుక బకాయిలు చెల్లించడానికి 10 ఏళ్ల కాలపరిమితి ఇవ్వాలని వేడుకుంది. దీనికి కోర్టు అనుమతించింది. 2జీ సేవల కోసం కోర్టుకు ప్రైవేటు టెలికం కంపెనీలపై ఇంత ప్రేమ కురిపించిన కేంద్ర ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్ విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించింది. 1–10–2000 నాడు బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన సమయంలో దానికి మహారత్న స్టేటస్ ఇస్తామనీ, గ్రామీణ సర్వీసుల నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తామనీ, గ్రామీణ టెలికం సర్వీ సుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామనీ, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తామే ముందు ఉంటామనీ రాత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అనంతర కాలంలో తాను ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కింది. అన్ని టెలికం కంపెనీలకు సమాన హక్కులు ఉండాలన్న ప్రైవేటు టెలికం కంపెనీల ఒత్తిడికి తలవొగ్గి, గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సర్వీసుల నిర్వహణకు ఇచ్చే ఏడీసీ చార్జీలను (యాక్సెస్ డెఫిసిట్ చార్జెస్), గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సర్వీసుల అభివృద్ధికి ఇచ్చే యూఎస్ఓ (యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్) ఫండ్ నుండి ఇచ్చే నిధులను కూడా నిలిపివేసింది. అలాగే 2జీ మొబైల్ సర్వీసులు ప్రారంభించడానికి ప్రైవేటు టెలికం కంపెనీలకు 1994లో అనుమతి ఇవ్వగా, బీఎస్ ఎన్ఎల్ మాత్రం ఢిల్లీ కోర్టుకు వెళ్లి, కోర్టు తీర్పు ప్రకారం ప్రారం భించవలసి వచ్చింది. ఐదో తరంలో 4జీ కోసం పోరు 2006 నాటికి దేశంలో బీఎస్ఎన్ఎల్ రెండవ స్థానంలో ఉండగా, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో సంస్థపై కుట్రలు ప్రారంభమ య్యాయి. 3జీ టెండరుకు అడ్డంకులు సృష్టించారు. చైనా పరికరాల వినియోగంపై నిషేధం పేరుతో రెండేళ్ల పాటు ఆటంకాలు కల్పించి పోటీలో వెనుకబడేలా చేశారు. ఇప్పుడు కూడా బీఎస్ఎన్ఎల్ 4జీ టెండర్ విషయంలో ఇదే పద్ధతిని ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోంది. 5జీ సర్వీసుల కోసం ప్రైవేటు టెలికం కంపెనీలకు స్పెక్ట్రమ్ ట్రయల్ కోసం అనుమతులు ఇచ్చి, బీఎస్ఎన్ఎల్కు మాత్రం ఇవ్వలేదు. 23–10–2019న కేంద్ర క్యాబినెట్ సంస్థకు 4జీ స్పెక్ట్రమ్ ఇచ్చినా ఇప్పటిదాకా అమలులోకి రాలేదు. మరోవైపు రిలయన్స్ జియో ఇటీ వలి తమ వార్షిక సమావేశంలో 5జీ సౌకర్యం ఉన్న ఫోన్ కేవలం 2,000 రూపాయలకే అందుబాటులోకి తెస్తామనీ, తమ 5జీ నెట్వర్క్ విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నామనీ ప్రక టించింది. కాంట్రాక్ట్ దిశగా... 31–1–2020 నాడు బీఎస్ఎన్ఎల్లో అమలైన వాలంటరీ రిటైర్మెంట్ పథకంలో 79,518 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇప్పుడు సంస్థలో ఇంకా కేవలం 62,000 మంది ఉద్యోగులే ఉన్నారు. సంస్థలో దేశవ్యాప్తంగా కాంట్రాక్టు మేనేజ్మెంట్ విధానం అమలు చేయడం ద్వారా, అన్ని ఆఫీసులు, కస్టమర్ సర్వీసు సెంటర్లు, ఫాల్టు రిపేర్లు లాంటివి ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడం ద్వారా, రాబోయే రోజుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా బీఎస్ఎన్ఎల్ను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వ ప్రయత్నం. బకాయిలు చెల్లిస్తే నిల్వలే బీఎస్ఎన్ఎల్కు డీఓటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) నుండి గ్రామీణ ఫోన్ల నిర్వహణ కోసం 13,789 కోట్ల రూపాయలు రావాలి. వైమాక్స్ స్పెక్ట్రమ్ సరెండర్ వల్ల రూ. 5,850 కోట్లు, సీడీఎంఏ (కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్) స్పెక్ట్రమ్ సరెండర్ వల్ల రూ. 2,472 కోట్లు, భారత్ నెట్ పథకం అమలు కింద రూ.1,051 కోట్లు, ఉద్యో గుల లీవు రీయింబర్స్మెంట్ కింద రూ. 2,998 కోట్లు... ఇలా దాదాపు 29,540 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కు బకాయి ఉంది. ప్రైవేటు టెలికం కంపెనీలు ప్రభు త్వానికి చెల్లించాల్సిన బకాయిలు కట్టడానికి ఇబ్బందులు పడుతు న్నాయని కోర్టులో చెప్పిన కేంద్ర ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్ నష్టాలకు మాత్రం ఉద్యోగులే కారణమనీ, వారు అధికంగా ఉన్నారనీ పేర్కొంది. తాను దాదాపు 30,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్న సంగతి మాత్రం చెప్పలేదు. బీఎస్ఎన్ఎల్ అప్పు రూ. 25,000 కోట్లు. ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన రూ. 30,000 కోట్లు చెల్లిస్తే సంస్థ నగదు నిల్వలోకి వస్తుంది. ప్రైవేటు టెలికం కంపెనీలు ఒకవైపు 5జీ సేవలు ఇవ్వడానికి సమాయత్తం అవుతున్న దశలో, బీఎస్ఎన్ఎల్ మాత్రం 4జీ సర్వీసుల కోసం పోరాటం చేయాల్సి రావడాన్ని గమనించాలి. 4జీ బస్సు మిస్ కానివ్వనని పార్లమెంటులో అప్పటి సమాచార మంత్రి ఇచ్చిన హామీ ఏమైందో అర్థం కాదు. రైల్వే, టెలికం, ఐటీ శాఖలు ఒకే మంత్రికి ఇవ్వడం ఇదే ప్రథమం. గతంలో వీటికి విడివిడిగా మంత్రులు ఉండేవారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో జరిగే పనులను విజయవంతంగా గుజరాత్ రాష్ట్రంలో అమలు చేసిన కొత్త టెలికం మంత్రి, బీఎస్ఎన్ఎల్, రైల్వే శాఖల్లో ఏమేమి మార్పులు చెయ్యడానికి పూనుకుంటారో, ఇందులో ఉద్యోగుల భాగస్వామ్యం ఏమిటో రాబోయే రోజుల్లో చూడాలి. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు మొబైల్ : 94405 24222 -
బీఎస్ఎన్ఎల్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం దాదాపు 2 శాతం నీరసించి రూ. 18,595 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 18,907 కోట్ల ఆదాయం సాధించింది. మార్చికల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 59,140 కోట్ల నుంచి రూ. 51,687 కోట్లకు వెనకడుగు వేసింది. కంపెనీ నికర రుణ భారం రూ. 21,675 కోట్ల నుంచి రూ. 27,034 కోట్లకు పెరిగింది. -
బీఎస్ఎన్ఎల్ ప్రియులకు గుడ్ న్యూస్!
బీఎస్ఎన్ఎల్ మరో శుభవార్త చెప్పింది. అన్ని రకాల ఫిక్స్డ్ లైన్ కనెక్షన్ల తీసుకునే ఇన్స్టాలేషన్ ఛార్జీలను మాఫీ చేయాలని భారత ప్రభుత్వ టెలికం ఆపరేటర్ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ప్రకటించింది. టెలికాం పీఎస్‌యు ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, ల్యాండ్‌లైన్ సేవలు వంటి అనేక టెలికాం సేవలను అందిస్తుంది. ఈ సేవలకు సంబంధించి ఏప్రిల్ 30, 2021 వరకు ఏదైనా కొత్త కనెక్షన్ కోసం తీసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జీలు మాఫీ కానునున్నట్లు టెలికామ్‌టాక్ నివేదించింది. బీఎస్ఎన్ఎల్ 2021 ఏప్రిల్ 8న దీనికి సంబంధించి సమాచారాన్ని ఒక సర్క్యులర్ ద్వారా ప్రకటించింది. ఈ ఆఫర్ పాన్-ఇండియా మొత్తం అందుబాటులో ఉంటుంది. అంటే ఇది ఏ ప్రత్యేక సర్కిల్‌కు మాత్రమే పరిమితం కాదు. ఢిల్లీలోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం ప్రతి ఇతర రాష్ట్రలోని, సర్కిల్లలోని వెబ్సైట్లో సమాచారాన్ని నవీకరించాలని పేర్కొంది. అంతేకాకుండా, నిబంధనలు వెంటనే అమలు చేయాలనీ సూచించింది. అంటే ఈ అఫర్ 2021 ఏప్రిల్ 30 వరకు మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. కొత్త బ్రాడ్‌బ్యాండ్ లేదా ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను పొందాలనుకునే ఏ యూజర్ అయినా ఇన్స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. బీఎస్ఎన్ఎల్ సాధారణంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల తీసుకునేటప్పుడు వినియోగదారుల నుంచి ఇన్స్టాలేషన్ ఛార్జీగా రూ.250 వసూలు చేస్తుంది. చదవండి: 6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్జీ కంపెనీ! -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన యూజర్ల కోసం కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనున్నది. ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా యూజర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను తీసు కొచ్చింది. ప్రస్తుతం రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కేవలం 28 రోజులకు లేదా 56 రోజుల కాలపరిమితితో 1జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పోలిస్తే తక్కువ రేటుకే ఈ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ తన రూ.108 ల తాజా ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, ఉచితంగా 500 ఎస్ఎంఎస్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. నిర్దేశిత రోజువారి డేటా పూర్తి అయితే, అప్పుడు ఇంటర్నెట్ డౌన్లోడింగ్, అప్లోడింగ్ స్పీడ్‌ను 80కేబీపీఎస్‌కు పరిమితం కానుంది. అయితే ఈ కొత్త ప్యాక్ ఢిల్లీ, ముంబై ఎంటీఎన్ఎల్ నెట్ వర్క్‌లో లభ్యం. అలాగే రూ.47కే ఫస్ట్ రీచార్జ్, రూ.109 ప్లాన్ వోచర్, రూ.998, రూ.1098 లాంటి స్పెషల్ టారిఫ్ వోచర్స్ ను బీఎస్ఎన్ఎల్ రద్దు చేసింది. -
బీఎస్ఎన్ఎల్ లాభాలు: పార్లమెంటరీ ప్యానెల్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి లాభాలను ఆర్జించొచ్చని.. ఇది కూడా పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా రూపొందించిన విధానాలు, ప్రణాళికల అమలు, మిగులు భూముల విక్రయంపైనే ఆధారపడి ఉంటుందని ఐటీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ నిర్వహణపరమైన లాభాల్లోకి మాత్రమే అడుగు పెట్టినట్టు గుర్తు చేసింది. అంటే పన్ను, వడ్డీ, తరుగుదలకు ముందు లాభాల్లో ఉండడం. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం 2019 అక్టోబర్‌లో ఆమోదం తెలిపిన విషయం గమనార్హం. ఇందులో భాగంగా అధిక శాతం మంది ఉద్యోగులను స్వచ్చంద పదవీ విరమణ పథకం కింద తగ్గించుకుని నిర్వహణ వ్యయాలను ఆదా చేసుకోవడం ఒకటి. ఇది అమలైంది. అలాగే, ఈ సంస్థలకు ఉన్న భూముల విక్రయాలు, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కూడా ప్యాకేజీలో భాగమే. -
బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ : 2000 జీబీ డేటా
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. అధిక వేగం, భారీ డేటాను అందించే ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది. సూపర్ స్టార్ 2 ప్లాన్‌గా పిలిచే బ్రాడ్ బ్యాండ్ రూ . 949 ప్లాన్‌లో తాజాగా 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2000 జీబీ వరకు డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 10 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల ధర రూ .777 నుండి రూ .16999 వరకు ఉండగా ఎఫ్టిటిహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను మార్చి 31, 2021 వరకు ఉచితంగా ఇన్స్టాల్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ ప్లాన్లను మార్చి 1 న సవరించింది. ఇందులో హై స్పీడ్,అధిక డేటా అందిస్తోంది. ఈ కొన్నిప్లాన్ల రేటు మార్చలేదు కానీ పేర్లను మార్చింది. సూపర్ స్టార్ 2 ప్లాన్ అని కూడా పిలిచే ఈ ప్లాన్లు ఇలా ఉంటాయి. రూ .1000 లోపు ప్లాన్స్ రూ. 777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: దీన్ని ఇపుడు ‘ఫైబర్ టీబీ ప్లాన్‌గా మార్చింది. ఇందులో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ డేటా లభ్యం. రూ 779 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్‌ను ఎందుకు మార్చలేదో స్పష్టంగా తెలియదు. ఇది యథాతథంగా ఉంది. రూ 849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1500 జీబీ డేటా రూ .949 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2000 జీబీ డేటా రూ .2500 లోపు ప్లాన్స్ రూ .1277 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3300 జీబీ వరకు డేటా రూ. 1999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 4500జీబీ వరకు డేటా రూ .2499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 300ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5500 జీబీ వరకు డేటా టాప్-టైర్ ప్లాన్ల ధరలు రూ. 4499, రూ .5999, రూ .999, రూ .16,999గా ఉంటాయి. ఇందులో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 6500, 8000, 12000, 21000 జీబీ వరకు డేటా అందిస్తుంది. -
రూ.299కే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్
కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కారణంగా సంస్థలు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తున్నాయి. తాజాగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరకే కొత్త ఇంటర్నెట్ ప్లాన్స్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ రూ.299, రూ.399, రూ.555 ధరకే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ధరకు కూడా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ 2021 మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. బిఎస్ఎన్ఎల్ రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కింద 100జీబీ డేటా 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో అందిస్తున్నారు. డేటా పూర్తీ అయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ ఆరు నెలలే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో 200జీబీ డేటా అందిస్తారు. డేటా పరిమితి అయిపోయిన తర్వాత వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. రూ.555 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబిపిఎస్ వేగంతో 500జీబీ డేటా వస్తుంది. డేటా పూర్తైన తర్వాత ఇంటర్నెట్ వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. కొత్త వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ రూ.299, రూ.399 ప్లాన్లు తీసుకోవాలంటే రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. చదవండి: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు బీమా పాలసీదారులకు శుభవార్త! -
అలర్ట్ : సిమ్ బ్లాక్ అంటూ లక్షలు మాయం
సాక్షి, భువనేశ్వర్ : మొబైల్ సిమ్‌కార్డు యాక్టివేట్ చేసుకోవాలంటూ సాక్షాత్తూ ఒక వైద్యుడిని నిలువునా ముంచేసిన వైనం కలకలం రేపింది. బ్యాంకు అధికారులు, ఇతర నిపుణులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. చదువుకున్న వారు సైతం సైబర్ మాయగాళ్ల వలలో పడి లక్షల రూపాయలను పోగొట్టుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే ఒడిశాలోని కటక్‌కు చెందిన డాక్టర్ సనతాన్ మొహంతి సైబర్ మోసానికి దారుణంగా బలయ్యాడు. కేటుగాడి మాయలోపడి రూ .77 లక్షలకు పైగా నష్టపోయారు. తన మొబైల్ సిమ్ కార్డును త్వరగా యాక్టివేట్ చేసుకోవాలని., లేదంటే బ్లాక్ అవుతుందంటూ ఫిబ్రవరి 9 మహంతికి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘క్విక్ సపోర్ట్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని బ్యాంక్ వివరాలను ఇవ్వమని తానే స్వయంగా సిమ్ యాక్టివేట్ చేస్తానంటూ నమ్మబలికాడు. అతని మాటల్ని విశ్వసించిన మహంతి మరో ఆలోచన చేయకుండా డెబిట్ కార్డు నంబర్, ఇతర బ్యాంక్ వివరాలను యాప్‌లోని షేర్ చేశారు. అంతే...అదే రోజు సాయంత్రం ఏటీఎం లావాదేవీలను నిలిపివేస్తున్నట్టు అకస్మాత్తుగా ఎస్బీఐ నుంచి మెసేజ్ వచ్చింది. అంతేకాదు ఈ వ్యవహారంపై బ్యాంకులో ఫిర్యాదు చేసిన తరువాత కూడా అతని ఖాతాలోని నగదు సర్వం గోవిందా అయిపోయింది. దీంతో ఖంగుతిన్న మహంతి సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై సంబంధిత తులసీపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో మహంతి మొదట ఫిర్యాదు చేశారు. 25 వేల రూపాయల చొప్పున రెండుసార్లు తన ఖాతాలనుంచి నగదు విత్‌డ్రా అయిందని డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కొత్త ఎటిఎం కార్డు జారీ చేస్తామని, ఇకపై మెసపూరిత లావాదేవీలు జరగవని బ్రాంచ్ మేనేజర్ హామీ ఇచ్చారు. కానీ ఫిబ్రవరి 9నుండి ఫిబ్రవరి 15 వరకు తనకు సంబంధం లేకుండానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయనీ, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ .67లక్షలు మాయమయ్యాయని తెలిపారు. మొత్తం జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న రూ. 77,86,727 రూపాయలు నష్టపోయానని మహంతి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపి తన డబ్బును తిరిగి ఇప్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఐఐఈని ఆశ్రయించారు. -
బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్తో ప్రముఖ గ్లోబల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యప్ టీవీ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం కొత్త సర్వీసును తన యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు తన ఓటీటీ సేవలను మరింత విస్తరించేందుకు ‘యప్‌టీవీ స్కోప్ ప్లాట్‌ఫాం’ను లాంచ్ చేసింది. ఇందులో వినియోగదారులకు అన్ని ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు ఒకే ప్యాకేజీలో అందించనుంది. సోనీలివ్, జీ5, వూట్ సెలెక్ట్ అండ్ లైవ్ టీవీ లాంటి ప్రీమియం ఓటీటీ సర్వీసులను ఒకే ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్, ఆండ్రాయిడ్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్ ఫాంల్లో ఇది అందుబాటులో ఉండనుంది. దీంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ డివైస్‌లు, స్మార్ట్ టీవీల్లో ఓటీటీ సర్వీసులు ఎంజాయ్ చేయవచ్చు. ఏఐ, ఎంఎల్ సామర్థ్యాల వినియోగంతో యప్ టీవీ స్కోప్ అత్యంత క్యూరేటెడ్ అనుభవాన్ని అందిస్తుందనీ, మునుపెన్నడూ లేని విధంగా కంటెంట్ ఆవిష్కరణను సులభతరం చేస్తుంది. యప్‌టీవీ వెల్లడించింది. కంటెంట్కోసం పలు యాప్‌ల అవసరం లేకుండానే తమ క్రాస్-ప్లాట్‌ఫాం ద్వారా, స్మార్ట్ టీవీ, పీసీ, మొబైల్, టాబ్లెట్.. వివిధ పరికరాలకు యాక్సెస్ పొందవచ్చు. అలాగే వినియోగదారులు లైవ్ టీవీని చూస్తూనే ప్రత్యక్ష చాట్లను నిర్వహించవచ్చు, ప్రత్యక్ష పోల్స్‌లో పాల్గొనవచ్చు. నచ్చిన కంటెంట్‌ను కూడా కోరుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో సింగిల్ సబ్స్క్రిప్షన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ యుప్ టీవీ స్కోప్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని యప్‌టీవీ వ్యవస్థాపకుడు ,సీఈఓ ఉదయ్ రెడ్డి వెల్లడించారు. అటు బీఎస్ఎనల్ఎల్ సీఎండీ సిఎండి శ్రీ పి.కె.పూర్వర్ కూడా ఈ సేవలపై సంతోషం వెలిబుచ్చారు. -
జియోపై ఎయిర్టెల్ పైచేయి
న్యూఢిల్లీ: 2020 నవంబర్ నెలలో కొత్త యూజర్లను ఆకర్షించడంలో ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియోపై భారతీ ఎయిర్టెల్ పైచేయి సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం, కొత్తగా 43 లక్షల మందిని తన నెట్వర్క్ పరిధిలో చందాదారులగా చేర్చుకుంది. దింతో వరుసగా నాలుగు నెలలు పాటు అన్ని టెలికాం కంపెనీల కంటే ఎక్కువగా యూజర్లను ఎయిర్టెల్ ఆకర్షించినట్లు ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది. రెండో స్థానంలో మరో ప్రముఖ సంస్థ రిలయన్స్ జియో నిలిచింది.(చదవండి: షియోమీ నుంచి సరికొత్త టెక్నాలజీ) కానీ, ఇప్పటికి మొత్తం ఖాతాదారుల సంఖ్యలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ డేటా ప్రకారం, నవంబర్ లో 4.37 మిలియన్ల కొత్త యూజర్లను చేర్చుకున్న తర్వాత భారతి ఎయిర్టెల్ మొత్తం చందాదారుల సంఖ్య 33.4 కోట్లకు చేరుకున్నారు. అదే నెలలో 1.93 మిలియన్ల కొత్త వినియోగదారులను చేర్చుకున్న తర్వాత రిలయన్స్ జియో మొత్తం చందాదారుల సంఖ్య 40.8 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే వోడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్ఎన్ఎల్ మాత్రం తమ ఖాతాదారులను కోల్పోయాయి. వొడాఫోన్ ఐడియా 28.9 కోట్ల మందితో మూడోస్థానంలో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 11.8 కోట్ల మంది చందాదారులతో తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇతర కంపెనీల యాక్టీవ్ యూజర్లతో పోలిస్తే మాత్రం వోడాఫోన్ ఐడియా 96.63శాతం యాక్టీవ్ యూజర్లతో పైచేయి సాధించింది. తర్వాత స్థానంలో ఎయిర్టెల్ 89.01శాతం, రిలయన్స్ జియో 79.55శాతం యాక్టీవ్ యూజర్లను కలిగి ఉంది. అయితే, నవంబర్ నెలలోనూ వొడాఫోన్ భారీగా చందాదారులను కోల్పోయింది. ఆ ఒక్క నెలలోనే 28.9 లక్షల మంది ఖాతాదారులు వొడాఫోన్ ఐడియాను వీడారు. నవంబర్ నెలలో కొత్తగా చేరిన ఖాతాదారులతో మొత్తం టెలిఫోన్ యూజర్ల సంఖ్య 1,171.80 మిలియన్ల నుంచి 1,175.27 మిలియన్లకు పెరిగిందని ట్రాయ్ తెలిపింది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. బిఎస్ఎన్ఎల్ తన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది. ఈ కొత్త ప్లాన్ల ద్వారా రెట్టింపు వేగంతో అధిక డేటాను అందించడమే కాకుండా అదనపు ఆఫర్లు కూడా ప్రకటించింది. పాన్-ఇండియా ప్రాతిపదికన బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్లకు 4టీబీ డేటాను 200 ఎమ్‌బిపిఎస్ వేగంతో అందించనుంది. దీంతో పాటు చెన్నై సర్కిల్లలోని ఫైబర్-టు-హోమ్(ఎఫ్టిటిహెచ్) కస్టమర్ల కోసం ప్రత్యేకంగా అదనపు ఆఫర్లను కూడా ప్రకటించింది.(చదవండి: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక చుక్కలే!) సవరించిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్: బిఎస్ఎన్ఎల్ కొత్త భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కింద ఇతర ప్రయోజనలతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం మెంబర్ షిప్‌ను కూడా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. దాని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో పోటీ పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది.డేటా ప్లాన్లలో చేసిన నూతన సవరణలను బిఎస్ఎన్ఎల్ తన వెబ్సైట్లో ఉంచింది. భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ రూ.499 ప్లాన్ కింద గతంలో 100జీబీ డేటాను 20ఎమ్‌బిపిఎస్ వేగంతో అందించేది. ప్రస్తుతం 50ఎమ్‌బిపిఎస్ వేగంతో అందించనుంది. అదేవిదంగా భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ రూ.779 ప్లాన్ 100ఎమ్‌బిపిఎస్ వేగంతో(గతంలో 50ఎమ్‌బిపిఎస్) 300జీబీకి అప్‌గ్రేడ్ చేయబడింది. అలాగే 300జీబీ హై-స్పీడ్ డేటా లిమిట్ పూర్తయితే, ఇంటర్ నెట్ స్పీడ్ 5ఎమ్‌బిపిఎస్(గతంలో 2ఎంబీపీఎస్)కి తగ్గిపోనుంది. ఈ ప్లాన్ కింద డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సభ్యత్వం కూడా లభించనుంది. ప్రస్తుతం రూ.849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇకపై 100ఎంబీపీఎస్(గతంలో 50ఎంబీపీఎస్) వేగంతో లభించనుంది. ఈ ప్లాన్ కింద లభించే 600జీబీ హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులు 10ఎంబీపీఎస్(గతంలో 2 ఎంబీపీఎస్) వేగాన్ని పొందేవారు. ఇలా బిఎస్ఎన్ఎల్ రూ.949, రూ.1,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను కూడా సవరించింది. -
నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్
ముంబై, సాక్షి: నెలకు రూ. 500 లోపు ఖర్చులో నెట్ కనెక్షన్ తీసుకుందామనుకునే వినియోగదారులకు శుభవార్త. పలు కంపెనీలు రూ. 500లోపు అద్దెలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. జాబితాలో ఎయిర్టెల్, రిలయన్స్ జియోతోపాటు.. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎగ్జైటెల్ చేరాయి. పలు ఆఫర్లు రూ. 399తోనే ప్రారంభంకానున్నాయి. చదవండి: (బంగారు హెడ్‌ఫోన్స్ @ రూ. 80 లక్షలు) పలు ఆఫర్లు ఈ ఏడాది(2020) టెలికం కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు సంబంధించి పలు ఆఫర్లు ప్రకటించాయి. పీఎస్‌యూ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రమోషనల్ సమయంలో డేటా పెంచడం వంటి ఆఫర్లు ప్రకటించగా.. జియో ఫైబర్ రూ. 399 నుంచి ప్రారంభమయ్యే సర్వీసులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని సమకూర్చింది. ఇక ఎగ్జైటెల్ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో డేటా పరిమితిలేని ప్యాకేజీలు ప్రకటించింది. నెలకు రూ. 500లోపు చెల్లించే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల వివరాలివి.. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్: నెలకు రూ. 499 ధరలో అన్లిమిటెడ్ బ్రాండ్‌బ్యాండ్ ప్లాన్ ఇది. 40 ఎంబీపీఎస్ స్పీడ్వరకూ లభించే ఈ ప్లాన్‌లో భాగంగా పరిమితిలేని ఇంటర్నెట్ను అందిస్తోంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్కు సబ్స్క్రిన్సన్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ తదితర సౌకర్యాలు సైతం లభిస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ యాప్ ద్వారా వూట్ బేసిక్, ఈరోస్ నౌ, హాంగామా ప్లే, షెమారూ ఎం, అల్ట్రాను పొందవచ్చు. చదవండి: (హీరో ఈసైకిల్@ 49,000) బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్: 100 జీబీ సీయూఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ. 499 ధరలో అందిస్తోంది. నెలకు 100 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. నెలవారీ జీబీ తదుపరి 50 ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్‌లో 2 ఎంబీపీఎస్‌కు స్పీడ్ తగ్గనుంది. జియోఫైబర్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్: ఈ పథకంలో భాగంగా 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఈ పథకంలో ఎలాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్లనూ కంపెనీ ఆఫర్ చేయడంలేదు. అయితే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎగ్జైటెల్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్: ఈ పథకంలో భాగంగా వినియోగదారులు ఏడాది కాలానికి సబ్‌స్ర్కయిబ్ చేస్తే.. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఇందుకు ఒకేసారి రూ. 4,788ను చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్‌లో భాగంగా (నెలకు రూ. 449 అద్దె) ఏడాదికి రూ. 5,388, లేదా (రూ. 499 అద్దె) రూ. 5,988 ఒకేసారి చెల్లిస్తే 200 ఎంబీపీఎస్ లేదా 300ఎంబీపీఎస్ స్సీడ్‌తో సర్వీసులు అందించనుంది. ఇలా కాకుండా 9 నెలలకే కావాలనుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 424 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. ఇదే ఆఫర్లో 6 నెలల కోసం రూ. 490 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. -
వోడాఫోన్ ఐడియా రికార్డ్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం నవంబర్ నెలలో అత్యధిక కాల్ క్వాలిటీ యూజర్ రేటింగ్ ను వోడాఫోన్ ఐడియా పొందింది. సర్వీసు ప్రొవైడర్లలో వాయిస్ క్వాలిటీ విషయానికి వస్తే ఐడియా అగ్రస్థానంలో నిలిచినట్లు డేటా చూపిస్తుంది. ఇటీవల రీబ్రాండ్ చేసిన వోడాఫోన్ ఐడియా ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో నెట్ వర్క్ లను అధిగమించింది. ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం 5కి 4.9 రేటింగ్‌తో ఐడియా అగ్రస్థానంలో ఉంది. వొడాఫోన్ 4.6/5, బిఎస్ఎన్ఎల్ 4.1/5 రేటింగ్ తో తర్వాత స్థానంలో ఉన్నాయి. ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో రెండూ 3.8/5 రేటింగ్‌తో వెనుకబడి ఉన్నాయి. (చదవండి: ఆ కాల్స్‌తో జర జాగ్రత్త!) కాల్ నాణ్యత విషయంలో 88.4 శాతం మంది వినియోగదారులు సంతృప్తి చెందారు. 8.24 శాతం మంది కాల్ నాణ్యత విషయంలో సంతృప్తిగా లేరు. అలాగే 3.62 శాతం మంది కాల్స్ డ్రాప్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఇండోర్, అవుట్ డోర్ కాల్ నాణ్యత పరంగా ఐడియా 4.9/5, 4.8/5 రేటింగును పొందింది. అలాగే ఇండోర్, అవుట్ డోర్ కాల్ నాణ్యత పరంగా వోడాఫోన్ 4.6/5, 4.3/5, ఎయిర్టెల్ 3.9, 3.5, బిఎస్ఎన్ఎల్ 3.9 మరియు 4.3, జియో 3.9, 3.6 రేటింగులు లభించాయి. అక్టోబర్ నెలలో కాల్ నాణ్యత పరంగా బిఎస్ఎన్ఎల్ 3.7 రేటింగ్ పొందింది. దీని తరువాత ఎయిర్టెల్ 3.5, ఐడియా 3.3, జియో 3.2, వోడాఫోన్ 3.1 రేటింగ్ ను పొందింది. -
బీఎస్ఎన్ఎల్ పతనం వెనక కారణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై వాసి అమిష్ గుప్తా 2005లో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ పెట్టించుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అది పని చేయడం మానేసింది. ఆయన దాన్ని పట్టించుకోకుండా తన మొబైల్ ఫోన్ మాత్రమే ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. హఠాత్తుగా గత మే నెలలో మళ్లీ ఆయన ఇంట్లోని ల్యాండ్‌లైన్ పని చేయడం ప్రారంభించింది. ఈ విషయమై ల్యాండ్‌లైన్ టెలికాం సర్వీసు ప్రొఫైడర్ అయిన మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)కు ఫిర్యాదు చేయాలని అమిష్ గుప్తా నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు ఎంటీఎన్ఎల్ అనుబంధ సంస్థ. ఇది ఢిల్లీ, ముంబై నగరాల్లో టెలికమ్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఎలాగు ఫోన్ పని చేస్తోందిగదా! అని గుప్తా ఎంటీఎన్ఎల్ అధికారులకు పది, పదిహేనుసార్లు ఫోన్లు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయనే ఓ రోజు వడాలాలోని ఎంటీఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ రెండు, మూడు కుర్చీలు, టేబుళ్లు తప్పా అన్ని కుర్చీలు, టేబుళ్లు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు, మూడు టేబుళ్ల చుట్టే ఐదారు సార్లు తిరగాల్సి వచ్చింది. అప్పటికి సరైన సమాధానం లేకపోవడంతో జూలై నెలలో ఆయన తన ల్యాండ్‌లైన్ సర్వీసును రద్దు చేసుకోవాలనుకున్నారు. ‘ల్యాండ్‌లైన్‌ను సరండర్ చేయడానికి నాకు మరో రెండు నెలలు పట్టింది. నేను సహజంగా ఎంటీఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలను అభిమానిస్తాను. ఎందుకంటే నేను అంభాని అభిమానిని కాదు. ఇంటి నుంచి పనిచేయాల్సిన కరోనా గడ్డుకాలంలో పటిష్టమైన ఇంటర్నెట్ అవసరం కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఎంటీఎన్ఎల్ సర్వీసును రద్దు చేసుకొని ఆ స్థానంలో జియో ల్యాండ్‌లైన్, బ్రాండ్ బ్యాండ్ తీసుకోవాల్సి వచ్చింది’ అంటూ గుప్తా వాపోయారు. రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఆసియాలోనే అత్యంత కుబేరుడైన ముకేష్ అంబానీదని తెల్సిందే. ఆ కంపెనీ 2016లో 4జీ సర్వీసులను అత్యంత చౌకగా అందిస్తూ మార్కెట్లోకి ప్రవేశించింది. ‘టెలికం రంగంలో ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడం కోసమే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నీరుగారుస్తూ వచ్చాయి’ ఎంటీఎన్ఎల్ మాజీ డిప్యూటి మేనేజర్ సూర్యకాంత్ ముద్రాస్ వ్యాఖ్యానించారు. 2010లో ముంబై, ఢిల్లీ నగరాల్లో 60 లక్షల ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఉండగా, వారి సంఖ్య ప్రస్తుతం 27 లక్షలకు పడి పోయింది. ఇక దేశవ్యాప్తంగా 2016 నాటికి 2.4 కోట్ల మంది ల్యాండ్‌లైన్ వినియోగదారులుండగా, వారి సంఖ్య 2020, జూలై నాటికి 1.9 కోట్లకు పడిపోయింది. ఒక్క మొబైల్ ఫోన్ల వాడకం పెరగడమే దీనికి కారణం కాదని, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సర్వీసులు మరీ అధ్వాన్నంగా ఉండడమే కారణమని పలువురు వాటి మాజీ వినియోగదారులు తెలియజేశారు. ఫోన్ పనిచేయడం లేదంటూ ఎన్ని సార్లు ఫిర్యాదు చే సినా వచ్చి చూసేందుకు సిబ్బంది లేరంటూ నెలల తరబడి రాకపోవడంతో 2009లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్‌ను సరెండ్ చేయక తప్పలేదని హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన టీచర్ మంజులా గోస్వామి తెలిపారు. 2000 సంవత్సరం నుంచే బీఎస్ఎన్ఎల్లో సిబ్బంది తగ్గుతూ వచ్చింది. సాధారణంగా ప్రతి 500 ల్యాండ్‌లైన్ ఫోన్లకు ఒక టెక్నీషియన్ అవసరమని, అయితే ప్రస్తుతం రెండువేల ఫోన్లకు ఒక టెక్నీషియన్ చొప్పున ఉన్నారని ‘ఫెడరేషన్ ఆఫ్ టెలికామ్ ఆపరేటర్స్ యూనియన్’ అధ్యక్షుడు థామస్ జాన్ తెలిపారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ల విభాగం ‘స్వచ్ఛంద పదవీ విరమణ పథకం’ ప్రవేశపెట్టినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల్లో సిబ్బంది బాగా తగ్గిపోయారు. ఈ వాస్తవానికి ఈ రెండు సంస్థల పునరుద్ధరకు కేంద్ర ప్రభుత్వం 70 వేల రూపాయల నిధులను ప్రకటించగా, అందులో 30 వేల కోట్ల రూపాయలను పదవీ విరమణ పథకానికే కేటాయించడం గమనార్హం. పథకాన్ని అమలు చేసిన తొలి రోజే ఈ రెండు ప్రభుత్వ టెలికమ్ సంస్థల నుంచి 92,300 మంది పదవీ విరమణ పొందారు. ఆ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా టెలికం సిబ్బంది ఆందోళన చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 2019 నాటికి బీఎస్ఎన్ఎల్ నష్టాలు 13,804 కోట్ల రూపాయలుకాగా ఎంటీఎన్ఎల్ నష్టాలు 3,693 కోట్ల రూపాయలు. సిబ్బంది కొరత కారణంగానే ప్రభుత్వ టెలికమ్ సంస్థలు దెబ్బతినలేదని, ల్యాండ్లైన్లకు ఉపయోగించిన కాపర్లైన్లను మార్చి కొత్తగా ఫైబర్ కేబుళ్లు వేయాల్సి ఉండగా, అందుకు బడ్జెట్‌ను కేటాయించలేదని ఎంటీఎన్ఎల్ సెక్షన్ సూపర్వైజర్ షర్కీ తెలిపారు. ప్రైవేటు టెలికమ్ సంస్థలను ప్రోత్సహించడంలో భాగంగానే ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు జరపలేదని పేర్లు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఎంటీఎన్ఎల్ అధికారులు మీడియాకు తెలిపారు. 2016లో రిలయెన్స్ జియో సహా అన్ని ప్రైవేటు టెలికమ్ కంపెనీలు 4 జీ సర్వీసులను ప్రవేశపెట్టగా, ప్రభుత్వ సంస్థలు 3 జీ టెక్నాలజీకే పరిమితం అవడం కూడా వాటి పతనానికి దారితీసిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ‘బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ సంస్థలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం వాటి ప్రయోజనాలకు వ్యతిరేకమైనదే. వాటిని చంపేయాలనే ఉద్దేశంతోనే వారు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు’ అని ఎంటీఎన్ఎల్ కామ్‌గర్ సంఘ్ అధినేత, శివసేన పార్లమెంట్ సభ్యులు అర్వింద్ సామంత్ ఆరోపించారు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇటీవల కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ తాజాగా డేటా రోల్ఓవర్ సదుపాయంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లందించే కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డిసెంబర్ 1, 2020 నుంచి దేశవ్యాప్తంగా వీటిని లాంచ్ చేయనున్నామని తెలిపింది. రూ.199 రూ .798, 999 రూపాయల ధరతో మూడు కొత్త ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ తీసుకురాబోతోంది. ఈ ప్లాన్లలో అపరిమిత కాలింగ్, డేటా, డేటా రోల్ ఓవర్, ఫ్యామిలీ యాడ్-ఆన్ లాంటి ప్రయోజనాలు అందించనుంది ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో పాటు, బీఎస్ఎన్ఎల్ రెండు యాడ్-ఆన్ ప్లాన్లను రూ .150 రూ.250 లకు తీసుకొస్తోంది. ఇవి వరుసగా 40 జీబీ డేటా 70 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నాయి. రూ 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: 300 నిమిషాల ఉచిత ఆఫ్-నెట్ కాల్లతో అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 75 జీబీ వరకు రోల్ఓవర్ ప్రయోజనాలతో 25 జీబీ డేటాను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్ కూడా ఇస్తుంది. యాడ్ ఆన్ ఫ్యామిలీ సదుపాయం లేదు. రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ సదుపాయం.150 జీబీ వరకు రోల్ఓవర్ ప్రయోజనాలతో 50 జీబీ డేటాను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్ సదుపాయం.అలాగే ఇద్దరుకుటుంబ సభ్యులకు ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా ఇస్తుంది. ఈ యాడ్-ఆన్‌లో అపరిమిత వాయిస్ సౌకర్యం, 50 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రోల్ఓవర్ ప్రయోజనాలతో 75 జీబీ డేటాను 225 జీబీ వరకు ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్లు, 3 ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా ఇస్తుంది. ఇందులో రోజుకు అపరిమిత వాయిస్ సౌకర్యం, 75 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభ్యం. -
బీఎస్ఎన్ఎల్ : మరో 20వేల ఉద్యోగాలకు ముప్పు
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తోంది. మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించనుందన్న అంచనాలు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఈనిర్ణయాన్ని సమీక్షించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగాలు తొలగిపునకు సంబంధించి సెప్టెంబర్ 1న బీఎస్ఎన్ఎల్ తన మానవ వనరుల డైరెక్టర్ అనుమతితో ఒక ఉత్తర్వు జారీ చేసిందని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించింది. కాంట్రాక్ట్ పనులు, కాంట్రాక్ట్ కార్మికుల ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అన్ని చీఫ్ జనరల్ మేనేజర్లు చర్యలను తీసుకోవాలని కోరినట్టు యూనియన ఆరోపించింది. ఈ క్రమంలో మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 30వేలమంది కార్మికులను తొలగించిందనీ, వీరికి ఒక సంవత్సరం పాటు వేతనాలు చెల్లించాలని యూనియన్ ఆరోపించింది. ఈ విషయంలో సంస్థ తన నిర్ణయాన్ని సమీక్షించాలని కోరింది. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) అమలు తర్వాత సంస్థ ఆర్థికపరిస్థితి క్షీణించిందని, దీంతోపాటు వివిధ నగరాల్లో ఉద్యోగుల కొరత కారణంగా నెట్‌వర్క్‌లలో లోపాలు పెరిగాయంటూ బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి కె పూర్వర్‌కు యూనియన్ ఒక లేఖ రాసింది.మరోవైపు 900 కోట్ల రూపాయల విలువైనపెండింగ్ బకాయిలను బీఎస్ఎన్ఎల్ చెల్లించకపోతే ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని గతనెలలో ఫిన్నిష్ టెలికాం పరికరాల సంస్థ నోకియా హెచ్చరించింది. కరోనావైరస్ మహమ్మారి మధ్య ఖర్చు తగ్గించే చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని కంపెనీ తెలిపింది. కాగా నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రెండు సంస్థలను విలీనం చేయడం, ఆస్తులను మోనటైజ్ చేయడం, ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వడం లాంటి చర్యలను ప్రకటించింది. ఇందుకు 2019 అక్టోబర్‌లో 69 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. -
చైనాను కాదని మన ‘టెలికామ్’ బతుకుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం రగులుతున్న కొద్దీ ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని, ఆ దేశ కంపెనీలపై నిషేధం విధించాలని రాజకీయ నేతల నుంచి సామాన్య మానవుల వరకు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన వావై, జెడ్‌టీఈ కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేయరాదంటూ భారతీయ టెలికామ్ సంస్థలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదేశించినట్లు ‘ఫైనాన్సియల్ టైమ్స్’ ఆగస్టు 25వ తేదీన ఓ వార్తను ప్రచురించింది. ప్రధాని నరేంద్ర మోదీ అంతటి సాహసానికి సిద్ధపడి ఉండవచ్చుగాక, ఆ కంపెనీల ఉత్పత్తులను వినియోగించకుండా భారతీయ టెలికాం సంస్థలు బతకగలవా అని పారిశ్రామిక మార్కెటింగ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. భారతీయ టెలికామ్ పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో భారత వైర్లెస్ టెలికామ్ రంగంలో 55 శాతం వాటా కలిగిన భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రధానంగా చైనాకు చెందిన ‘వావై’ కంపెనీకి ప్రధాన కస్టమర్లు. అతి చౌక టెలికామ్ పరికరాల కోసం ఈ రెండు భారతీయ కంపెనీలు ‘వావై’ పైనే ఆధార పడ్డాయి. 4జీ నెట్వర్క్ పరికరాల్లో ‘వావై’ కంపెనీకి 40 శాతం లాభాలు భారత్ నుంచే వస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో పని చేస్తోన్న బీఎస్ఎన్ఎల్ ప్రధానంగా చైనాకు చెందిన జెడ్‌టీఈ కంపెనీపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. బీఎస్ఎన్ఎల్లో 40 శాతం 3జీ నెట్‌వర్క్‌ను అభివద్ధి చేసింది జెడ్‌టీఈ కంపెనీయే. 2018లో 5జీ నెటవర్క్ ట్రయల్స్‌ను చైనా వావై కంపెనీతో కలిసి ఎయిర్టెల్ నిర్వహించింది. వావై, జెడ్‌టీఈ, ఎరిక్సన్ కంపెనీలతో 5జీ టెక్నాలజీ పరికరాల కోసం ఐడియా వోడాఫోన్ ఒప్పందం కుదుర్చుకుంది. నష్టాల్లో ఉన్న భారతీయ టెలికామ్ సంస్థలు ‘వావై, జెడ్‌టీఈ’ లాంటి చైనా కంపెనీల సహకారంతో బయట పడాలని భావిస్తున్నాయి. అలాంటి సమయంలో వావై, జెడ్‌టీఈ కంపెనీలను దూరం చేసుకోవడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని ‘కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్’ సంస్థ హెచ్చరిస్తోంది. ముకేశ్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ జియో’ నుంచి ఎయిర్టెల్, వొడాఫోన్ సంస్థలకు గట్టి పోటీ ఎదురవుతుండగా, జూన్ 30వ తేదీ నాటికి వొడాఫోన్ నష్టాలు 25,460 కోట్ల రూపాయలు కాగా, ఎయిర్టెల్ నష్టం 15,933 కోట్ల రూపాయలు. చైనాకు చెందిన వావై, జెడ్‌టీఈ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా దక్షిణ కొరియాకు చెందిన శ్యామ్‌సంగ్, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్, ఫిన్లాండ్కు చెందిన నోకియా కంపెనీలు ఉన్నాయి. చైనా కంపెనీలంత నాణ్యతగల పరికరాలను ఈ కంపెనీలు అందజేయక పోవడమే కాకుండా దిగుమతుల భారం ఎక్కువ పడుతోంది. ఈ రెండు చైనా కంపెనీలను నిషేధించాలనే డిమాండ్ అమెరికా, బ్రిటన్‌తోపాటు ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు డిమాండ్ ఊపందుకుంది. ఈ విషయంలో ఆ దేశ ప్రభుత్వాలు ఇప్పటికీ తర్జనభర్జన పడుతున్నాయి. చదవండి: మావాళ్లకు ఇవ్వొద్దు -
తగ్గిన టెలికం యూజర్ల సంఖ్య
న్యూఢిల్లీ: టెలికం యూజర్ల సంఖ్య ఈ ఏడాది మే నెలలో 116.3 కోట్లకు తగ్గింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే 0.49 శాతం క్షీణించింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలైన ఏప్రిల్‌లో టెలికం యూజర్ల సంఖ్య 85.3 లక్షల మేర క్షీణించి 116.94 కోట్లకు తగ్గింది. ఏప్రిల్‌తో పోలిస్తే మేలో యూజర్ల సంఖ్య తగ్గుదల 57.6 లక్షలకు పరిమితమైంది. మొబైల్ టెలిఫోనీ విభాగంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు చెరి 47 లక్షల యూజర్లను కోల్పోయాయి. ఎయిర్టెల్ వైర్లెస్ కస్టమర్ల సంఖ్య 31.7 కోట్లు, వొడాఫో¯Œ ఐడియా యూజర్ల సంఖ్య 30.9 కోట్లకు క్షీణించింది. జియో, బీఎస్ఎన్ఎల్ జోరు..: జియో 36 లక్షల కొత్త కనెక్షన్లు జారీ చేసింది. మొత్తం మీద 39.2 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య సైతం 2 లక్షలు పెరిగి 11.9 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో క్షీణత..: పట్టణాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య 92.3 లక్షల మేర తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో 36.2 లక్షలు పెరిగింది. మే నెలాఖరు నాటికి మొత్తం మొబైల్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 114.39 కోట్లుగా, ల్యాండ్‌లైన్ యూజర్ల సంఖ్య 1.97 కోట్లుగా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఫిక్స్డ్ లైన్ కస్టమర్ల సంఖ్య తగ్గుదల మేలోనూ కొనసాగింది. మొత్తం 1.34 లక్షలు క్షీణించింది. అటు జియో మాత్రం 90,000 కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. పెరిగిన బ్రాడ్‌బ్యాండ్... మొత్తం టెలికం యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు మాత్రం పెరిగారు. వీరి సంఖ్య ఏప్రిల్‌లో 67.3 కోట్లుగా ఉండగా 1.13 శాతం పెరిగి 68.3 కోట్లకు చేరింది. వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అత్యధికంగా 66.37 కోట్లుగా ఉండగా, వైర్‌లైన్ కనెక్షన్లు 1.93 కోట్లుగా ఉన్నాయి. -
‘బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశద్రోహులు’
బెంగళూరు: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఉద్యోగులను ఉద్దేశిస్తూ.. హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులన్నారు. కుమ్టే ప్రాంతంలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రసిద్ధ సంస్థను అభివృద్ధి చేయడానికి సంస్థ ఉద్యోగులు ఏమాత్రం ఇష్టపడటం లేదన్నారు. వీరంతా దేశ ద్రోహులని హెగ్డే విరుచుకుపడ్డారు. (బై బై బీఎస్ఎన్ఎల్.. భావోద్వేగానికి లోనైన ఉద్యోగి) అందుకే 88000 మంది ఉద్యోగులను తొలగించారని, సంస్థను ప్రైవేటీకరణ చేయనున్నారని హెగ్డే పేర్కొన్నారు. వారికి బుద్ధి చెప్పాలంటే ఇది ఒక్కటే సరైన పరిష్కారం అన్నారు హెగ్డే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ వ్యాఖ్యలు ఆయన చౌకబారు వ్యక్తిత్వానికి నిదర్శమని పేర్కన్నది. బీజేపీ అసమర్థత వల్లే బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఆరోపించింది. కేంద్రం ప్రతిదానిని ప్రైవేటీకరిస్తుందని తెలిపింది. -
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త
ముంబై: దేశీయ ఇంటర్నెట్ వినియోగదారులకు త్వరలో ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ప్రభుత్వం బ్రాండ్ బ్యాండ్ సర్వీసులకు లైసెన్స్ ఫీజులను తగ్గించబోతున్నట్లు ట్రాయ్(టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు తక్కువ ధరకే ఇంటర్నెట్ను అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం దేశంలో 1.98కోట్ల మంది వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని, ప్రస్తుతం లైసెన్స్ ఫీజులు తగ్గిస్తే ప్రభుత్వానికి రూ.592 కోట్ల నష్టం వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.కానీ, 10 శాతం బ్రాడ్ బ్యాండ్ కంపెనీల వృద్ధి రేటు పెరిగి వినియోగదారులకు మెరుగైన సేవలందించవచ్చని టెలికాం నిపుణులు సూచిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ 82.3 లక్షల మంది వినియోగదారులతో మెదటి స్థానంలో ఉండగా, ఎయిర్టెల్ 2వ స్థానంలో(24.3 లక్షలు), జియో ఫైబర్ (8.4 లక్షల) మంది వినియోగదారులతో దేశంలోని బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లో ఐదవ స్థానంలో నిలిచింది. కాగా దేశంలోని ప్రతి ఒక్కరికి జ్ఞానసముపార్జనకు బ్రాండ్ బ్యాండ్ సేవలు విస్తరించడం ఎంతో ముఖ్యమని, అందులో భాగంగానే ట్రాయ్ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు అనేక చర్యలు చేపడుతన్నట్లు ట్రాయ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు ట్రాయ్ అనేక సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. (చదవండి: వీరిలో సామాజిక ఒంటరితనం అధికం) -
బీఎస్ఎన్ఎల్ లోన్ టాక్‌టైమ్ ప్లాన్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో ప్రజలందరు ఇంట్లో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే అధిక టెలికాం కంపెనీలు రూ.200 దాటిన డిజిటల్ రీచార్జ్‌లనే అనుమతిస్తున్నాయి. ప్రస్తుతం వినియోగదారులు స్టోర్స్‌లోకి వెళ్లి రీచార్జ్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఎగువ నుంచి దిగువ తరగతి కస్టమర్లకు లాభం కలిగించే విధంగా సరికొత్త టాక్‌టైమ్ లోన్స్(రుణాలు)తో ముందుకొచ్చింది. టాక్‌టైమ్ లోన్స్ ప్రారంభ ధర రూ.10 నుంచి 50 రూపాయల వరకు వినియోగదారులు లోన్ తీసుకునే అవకాశం కల్పించింది. అయితే టాక్‌టైమ్ లోన్స్(రుణాలు) కావాలనుకునే వారు యూఎస్ఎస్డీ (USSD) కోడ్(*511*7#)లో నమోదు చేసుకోవాలని సంస్థ పేర్కొంది. ఈ కోడ్ నమోదు చేసుకోగానే వినియోగదారులకు దృవీకరించినట్లు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. ఈ ఎస్ఎమ్ఎస్లో లోన్‌కు సంబంధించిన వివరాలుంటాయి. వినియోగదారులకు కావాల్సిన రీచార్జ్ నెంబర్లు ఉంటాయి. రీచార్జ్‌కు కావాల్సిన నెంబర్‌ను ఎంచుకొని సెండ్ ఆఫ్షన్ క్లిక్ చేస్తే లోన్ రీచార్జ్ అవుతుంది. కాగా, మెరుగైన సేవల కోసం వినియోగదారులు మై బీఎస్ఎన్ఎల్ యాప్‌లో లాగిన్ అయ్యాక గో డిజిటల్ ఆఫ్టన్‌ను సెలక్ట్ చేయాలని తెలిపింది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ రూ .18తో కాంబో ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.8 జీబీ డేటాను, 250 నిమిషాల ఉచిత కాల్ టాక్‌టైమ్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం 2 రోజుల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. రూ .108 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 1జీబీ డేటాతో పాటు 500 ఎస్ఎంఎస్లను 60 రోజుల కాలపరిమితిలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. (రూ .153 ప్లాన్):ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 1 జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎంఎస్లను 180 రోజుల కాలపరిమితితో పొందవచ్చు. (రూ .186 ప్లాన్): ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 2 జీబీ, 100 ఎస్ఎంఎస్లను 180 రోజుల కాలపరిమితో పొందవచ్చు. -
చైనాకు షాకివ్వనున్న భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తత, నెట్వర్క్ సెక్యూరిటీ సమస్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు షాకివ్వనుంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాల వినియోగాన్ని నిషేధించనుంది. బీఎస్ఎన్ఎల్ తో పాటు ఎంటీఎన్ఎల్, ఇతర అనుబంధ సంస్థలకు కూడా ఇదే ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి పాత టెండర్లను రద్దు చేసి రీ-టెండరింగ్ కు కూడా వెళ్లనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎన్ఎల్ సంస్థలో మేడ్-ఇన్-చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించాలని టెలికం విభాగం నిర్ణయించింది. కేంద్రం ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ లో భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువులను కొనుగోలు చేయమని తన పరిధిలోని అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రైవేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తి చేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించాలంటూ ఆదేశించనుంది. అలాగే టెండర్ల ప్రక్రియలో చైనా కంపెనీలు పాల్గొనలేని విధంగా నిబంధనలను మార్చాలని రాష్ట్రంలోని సర్వీసు ప్రొవైడర్లను కోరడంతోపాటు, మునుపటి టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కోరనుంది. కాగా లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా దుశ్చర్య కారణంగా 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) కూడా సిద్ధమయ్యింది. చైనాకు సంబంధించిన 500 వస్తువుల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ట్విటర్లో 'హిందీచీనిబైబై', 'భారత్ వెర్సస్ చైనా వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. -
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఈద్ ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి. ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ముఖ్యంగా రూ.786 ప్లాన్ ను ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈద్ సందర్భంగా ముస్లింలు పవిత్ర సంఖ్యగా భావించే 786 నంబరుతో ఈ ప్లాన్ తీసుకు రావడం విశేషం. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు మాత్రమే. సంస్థ ఆవిష్కరించిన మరో ప్లాన్ ధర 699 రూపాయలు. వీటితో పాటు కంపెనీ ఇప్పటికే ఎస్‌టివి 118, కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్లనుతీసుకొచ్చింది ఈ ప్లాన్లు అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉన్నాయి. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి, బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకోసం ఇటీవల చాలా ప్రీపెయిడ్ ప్లాన్లతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ .786 ఈద్ స్పెషల్ ప్లాన్ : రూ. 786 టాక్‌టైమ్, మొత్తం 30జీబీ హై స్పీడ్ డేటా లభ్యం. ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటులోవుంటుంది. 2020 జూన్ 21 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ .699 ప్రీపెయిడ్ ప్లాన్: ఈద్ స్పెషల్ ప్లాన్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా విడుదల చేసింది. మొత్తం 500 ఎమ్‌బి డేటాతో పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ సదుపాయం, రోజుకు 100ఎస్ఎంఎస్ లు లభ్యం. ఇది 160 రోజుల చెల్లుబాటులో వుంటుంది. అలాగే స్పెషల్ పెర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టోన్ కూడా వుంది. బీఎస్ఎన్ఎల్ కాంబో 18 డేటా ప్లాన్: కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్ : రెండు రోజులుతో స్వల్పకాలిక ప్రణాళిక. ఈ ప్రణాళిక పుదుచ్చేరి, లక్ష్వదీప్ సహా 22 సర్కిళ్లలో లభిస్తుంది. 30 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఇతర నెట్‌వర్క్‌లకు 250 నిమిషాల వరకు ఉచిత కాలింగ్ సదుపాయం. -
బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ల్యాండ్‌లైన్ వినియోగదారుల కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్డౌన్ సమయంలో మొబైల్ సబ్‌స్కైబర్స్‌కు వెసులుబాటు కలిగించేలా ఒక ప్రకటన చేసింది. ఉచితంగా వ్యాలిడిటీని పొడగించడంతోపాటు, టాక్‌టైమ్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ సమయంలో రీచార్జ్ చేసుకోవడం కుదరని వారికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. మర్చి 20 తర్వాత వ్యాలిడిటీ అయిపోయిన మొబైల్ వినియోగదారులకు ఏప్రిల్ 20 వరకు ఉచితంగా వ్యాలిడిటీని పొడిగించనున్నట్టు ప్రకటించింది. అలాగే లాక్డౌన్ కాలంలో వినియోగదారుల బ్యాలెన్స్ జీరోకు చేరితే.. వారికి 10 రూపాయల ఉచిత టాక్‌టైమ్ అందించనున్నట్టు తెలిపింది. ‘ఈ కష్ట సమయంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మద్దతుగా నిలుస్తుంది. వినియోగదారు రీచార్జ్ చేసుకోవడానికి డిజిటల్ పద్దతులు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందుకు మై బీఎస్ఎన్ఎల్ మొబైల్ యాప్, బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ వాలెట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి’ అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ప్రవీణ్ కుమార్ పూర్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
కరోనా : బీఎస్ఎన్ఎల్, నెల రోజులు ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్ననేపథ్యంలో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల సౌలభ్యం కోసం ఒక ఆఫర్‌ను తీసుకొచ్చింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఇంటినుంచే పనిచేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని నిరోధించేందుకు ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ల్యాండ్ లైన్ వినియోగదారులకోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 'వర్క్ ఫ్రమ్ హోమ్' ను బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. ప్రమోషనల్ ఆఫర్ తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో ల్యాండ్‌లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజులు పాటు ఈ సేవలను అందించనుంది. ప్రమోషనల్ వ్యవధి ముగిసిన తరువాత, పై ప్లాన్ కింద ఉన్న కస్టమర్లు వారి ఉపయోగాల ప్రకారం సాధారణ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మరలతారని బీఎస్ఎన్ఎల్ తన సర్క్యులర్‌లో తెలిపింది. ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్ఎస్ డౌన్ స్పీడ్‌ను, రోజుకు 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉండి, బ్రాడ్‌బ్యాండ్ లేని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ బ్రాడ్‌బ్యాండ్ సేవను ఒక నెల ఉచితంగా అందిస్తున్నామని, తద్వారా వారు ఈ సేవను ఇంటి నుండి పని చేయడానికి, ఇంటి నుండే విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సిఎఫ్ఎ వివేక్ బంజాల్ చెప్పారు. ఇంటి నుండే కిరాణాను ఆన్లైన్లో కొనుగోలు, లేదా అవసరమైన అవసరాల నిమిత్తం బయటికి వెళ్లవలసిన అవసరాన్ని తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా ల్యాండ్‌లైన్ వినియోగదారులను బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులుగా మార్చడంలో ఈ సరికొత్త ప్లాన్ సహాయపడుతుందని అంచనా. ముఖ్యంగా ప్రధాన పోటీదారులు, ఎయిర్టెల్, జియోతోపాటు, ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లతో బాగా పోటీ పడటానికి సహాయపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
కరోనా: జియో, బీఎస్ఎన్ఎల్ సందేశం విన్నారా?
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలకు వ్యాపించిన కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని చెందిన నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలు కీలక ప్రచారాన్ని చేపట్టాయి. మొబైల్ ఫోన్ వినియోగదారులకు కాల్ చేసిననపుడు ఒక అవగాహనా సందేశాన్ని ప్లే చేస్తోంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నివారణకు అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్యలతో ఈ సందేశం నిండి వుండటం విశేషం. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో వినియోగదారులకు ఫోన్ చేసినపుడు ఈ సందేశాన్ని వినియోగదారులు గమనించవచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన అవగాహనా చర్యల్లో భాగంగా ప్రీ కాలర్ ట్యూన్ అవగాహనా సందేశం జియో, బీఎస్ఎన్ఎల్ ఫోన్ కనెక్షన్లలో శనివారం ప్రారంభమైంది. దగ్గు శబ్దంతో సందేశం ప్రారంభమవుతుంది. "మీరు నవల కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. దగ్గినపుడు లేదా తుమ్ముతున్నప్పుడు మీ ముఖాన్ని చేతిరుమాలు అడ్డుపెట్టుకోండి. సబ్బుతో చేతులను నిరంతరం శుభ్రం చేసుకోండి" అనే సందేశం హిందీ, ఆంగ్లంలో ప్లే అవుతుంది. "ముఖం, కళ్ళు లేదా ముక్కును తాకకండి. ఎవరికైనా దగ్గు, జ్వరం లేదా ఊపిరి కష్టంగా వుంటే వారినుంచి కనీసం ఒక మీటర్ దూరంలో వుండండి. అవసరమైతే, వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి" అనే సందేశాన్ని ఇస్తోంది. కాగా గత ఏడాది సెప్టెంబరులో చైనా వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి సోకింది. 3 వేలమంది మరణించారు. మన దేశంలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య ఇప్పటికే 33కి చేరింది. -
చార్జీల వడ్డన: జియోకు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఉచిత సేవలతో టెలికాం పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియోకు తాజాగా భారీ షాక్ తగిలింది. ఇటీవలి కాలవంలో టారిఫ్ సవరింపు కారణంగా డిసెంబరు నెలలో జియో కొత్త వినియోగదారుల సంఖ్యలో భారీగా క్షీణించిందని ట్రాయ్ వెల్లడించింది. నవంబరు నెలలో 5లక్షల 60 వేల కొత్త చందారులను జత చేసుకున్న జియో డిసెంబర్ నెలలో 82,308 మంది ఖాతాదారులను మాత్రమే నమోదు చేసింది. అంతేకాదు ఈ విషయంలో బీఎస్ఎన్ఎల్ కంటే వెనకపడటం విశేషం. మరోవైపు ఏజీఆర్ బకాయిలతో సంక్షోభంలో పడ్డ వొడాఫోన్ ఐడియా చందాదారుల విషయంలో కూడా పురోగతి లేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డిసెంబర్ 31, 2019తో ముగిసిన నెలలో భారతీయ టెలికాం కంపెనీల చందాదారుల డేటాను బుధవారం విడుదల చేసింది. జియో గత ఏడాది డిసెంబర్లో తన టారిఫ్ పెంపును ప్రవేశపెట్టడమే సబ్ స్కైబర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం కావచ్చని పేర్కొంది. కంపెనీ మార్కెట్ వాటా పుంజుకుంది. నవంబర్ 2019 చివరిలో 32.04 శాతంతో పోలిస్తే 32.14 శాతానికి పెరిగింది. వోడాఫోన్-ఐడియా మార్కెట్ వాటా నవంబర్‌లో 29.12 శాతం నుండి డిసెంబర్లో 28.89 శాతానికి తగ్గింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ ఈ నెలలో సుమారు 4,26,958 మంది కొత్త చందాదారులను చేర్చుకుంది. ఇది జియో కంటే ఎక్కువ. నవంబర్ 2019 నెలలో 3,38,480 మంది మాత్రమే. దీని మార్కెట్ వాటా ఒక నెలలో 10.19 శాతం నుండి 10.26 శాతానికి పెరిగింది. 2 019 చివరి నెలలో ప్రవేశపెట్టిన సుంకం పెంపు కారణంగా మొత్తం చందాదారుల వృద్ధి మందగమనంలో ఉందని ట్రాయ్ వెల్లడించింది. అయినప్పటికీ రిలయన్స్ జియో ఇప్పటికీ మార్కెట్ వాటాలో 32.14 శాతంతో టాప్‌లో ఉండగా, వొడాఫోన్ ఐడియా 28.89 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంది. 28.43 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో ఎయిర్ టెల్ వుంది. తాజా ట్రాయ్ నివేదిక ప్రకారం వొడాఫోన్ ఐడియా డిసెంబర్ 31తో ముగిసిన నెలలో 36,44,453 మంది సభ్యులను కోల్పోయింది. ఇది నవంబర్ నెలలో కోల్పోయిన 3,64,19,365 కంటే చాలా తక్కువ. చందాదారుల సంఖ్యలో నష్టం గణనీయంగా తగ్గినప్పటికీ, మార్కెట్ వాటా గత నెలలనుంచి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఎయిర్టెల్ డిసెంబర్ నెలలో చందాదారులను కోల్పోయినా ఈ సంఖ్య 11,050 వద్ద స్థిరంగా ఉంది. మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 2019 నవంబరులో 1,154.59 మిలియన్ల నుండి 2019 డిసెంబర్ చివరినాటికి 1,151.44 మిలియన్లకు తగ్గింది. తద్వారా నెలవారీ క్షీణత రేటు 0.27 శాతం. -
బీఎస్ఎన్ఎల్ నో నెట్వర్క్
కర్ణాటక,దొడ్డబళ్లాపురం: రామనగర జిల్లాలో గత నాలుగు రోజులుగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నెట్వర్క్ అందడం లేదు. ల్యాండ్‌లైన్, మొబైల్, ఇంటర్నెట్ సేవలన్నీ నిలిచిపోవడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్పై శాపనార్థాలు పెడుతున్నారు. జిల్లాలోని కనకపుర తాలూకాలో కంపెనీకి చెందిన నెట్వర్క్ కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఈ సమస్య తలెత్తిందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. మరమ్మత్తులు జరుగుతున్నాయని త్వరలో సేవలు ప్రారంభిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో మూడు రోజులుగా కస్టమర్లు రామనగర పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వచ్చి సిబ్బందితో గొడవపడుతున్నారు. సిబ్బంది షరా మామూలుగానే నిర్లక్ష్యంగా జవాబిస్తుండడంతో కస్టమర్లు తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ కారణంగా సిబ్బంది కూడా కార్యాలయంలో ఉండకుండా వెళ్లిపోతున్నారు. రామనగర తాలూకాలో 1800 ల్యాండ్‌లైన్ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు ఉండగా,వేల సంఖ్యలో మొబైల్ సిమ్‌కార్డులు వాడుతున్నారు. అందులోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ కోసం బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకుని ఉండడంతో ప్రజలకు ప్రభుత్వపర సేవలు అందడంలేదు. ఇంతపెద్ద కంపెనీ నాలుగు రోజులుగా సేవలు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బీఎస్ఎన్ఎల్ ఆఫీసుల్లో వాహనాల చార్జింగ్ స్టేషన్లు
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ (ఈఈఎస్ఎల్), బీఎస్ఎన్ఎల్ చేతులు కలిపాయి. దశల వారీగా దేశవ్యాప్తంగా 1,000 బీఎస్ఎన్ఎల్ సైట్లలో చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం చార్జింగ్ సర్వీసులకు అవసరమైన ఇన్ఫ్రా ఏర్పాటు, నిర్వహణ మొదలైన వాటికి కావాల్సిన నిధులను ఈఈఎస్ఎల్ ఇన్వెస్ట్ చేయనుంది. స్థలం, విద్యుత్ కనెక్షన్లను.. బీఎస్ఎన్ఎల్ సమకూరుస్తుంది. జాతీయ విద్యుత్ వాహన పథకంలో భాగంగా ఈఈఎస్ఎల్ ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 300 ఏసీ, 170 డీసీ చార్జర్లను ఏర్పాటు చేసింది. -
బై బై బీఎస్ఎన్ఎల్.. భావోద్వేగానికి లోనైన ఉద్యోగి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు చెందిన రాష్ట్ర కార్యాలయాల్లో నిన్న (శుక్రవారం) ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఇందుకు భారీ ఎత్తున ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. ఇలా వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారి విధుల నిర్వహణకు జనవరి 31 చివరి రోజు. దీంతో బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో శుక్రవారం ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. బాధ్యతల నుంచి రిలీవ్ అవుతున్నవారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ భావాలను పరస్పరం పంచుకుంటూ గడిపారు. సంస్థ పరిస్థితి దయనీయంగా మారడం...కోలుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో చాలామంది ఉద్యోగులు వీఆర్ఎస్కు ముందుకొచ్చి అప్లయ్ చేసుకున్నారు. ఏపీలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సంఖ్య 8,878మంది ఉండగా, వీరిలో 5,031మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. దీంతో సంస్థలో 3,847మంది ఉద్యోగులు మాత్రమే మిగిలినట్లు అయింది. అర్హత ఉన్నా 1,361మంది వీఆర్ఎస్కు దూరంగా ఉన్నారు. ఉద్యోగం...ఉద్వేగభరితం.. ఎన్నో ఏళ్లుగా తమ మధ్య విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగిని స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తుండటం.. తోటి ఉద్యోగులను భావోద్వేగానికి గురి చేసింది. ఆమెకు వీడ్కోలు పలకడం వారికి భారంగా మారింది. ఎస్డీఈ (పీఆర్)గా పని చేసిన పద్మా శర్మ స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా సహోద్యోగి డీఎస్ నరేంద్ర..ఆమెతో చివరిసారి కరచాలనం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యం శుక్రవారం హైదరాబాద్‌లోని బీఎస్ఎన్ఎల్ భవన్లో చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ భవన్ మూడొంతులు ఖాళీ సాక్షి, హైదరాబాద్ : ఇక నగరంలోని టెలికం ఉద్యోగుల్లో సుమారు 77% మంది వీఆర్ఎస్ తీసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సంస్థలో కొత్తగా చేరిన ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా వీఆర్ఎస్ తీసుకున్నారు. హైదరాబాద్ టెలికం జిల్లా పరిధిలో మొత్తం 3,500 మంది ఉద్యోగులకు గాను అందులో 2,613 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది డీజీఎంలు, 80 ఎజీఎంలు, 100 మంది ఎస్‌డీవోలు, 80 మంది జేటీవోలు ఉన్నారు. మిగతా వారిలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందిన వారున్నారు.హైదరాబాద్ సర్కిల్ సీజీఎం పరిధిలోకి వచ్చే మరో 284 మంది ఉద్యోగులు సైతం వీఆర్ఎస్ తీసుకున్నారు. దీంతో ఆదర్శనగర్‌లో గల టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) కార్యాలయమైన బీఎస్ఎన్ఎల్ భవన్ మూడొంతులు ఖాళీ అయింది. ఉన్నతాధికారుల నుంచి నాల్గోవ తరగతి సిబ్బంది వరకు పదవీ విరమణ చేయడంతో పలు సెక్షన్లు బోసిపోయాయి. -
ట్రిపుల్‌ప్లే సేవలు: బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ జోడీ..
సాక్షి, న్యూఢిల్లీ : గ్రామీణ ప్రజలకు, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ట్రిపుల్ ప్లే సర్వీసులు అందించేందుకు ఓటీటీ కంటెంట్‌లో గ్లోబల్ లీడర్ యప్ టీవీ బీఎస్ఎన్ఎల్తో కలిసి పనిచేస్తుంది. ఈ ఏడాదిలో తెలంగాణ సర్కిల్‌తో పాటు సౌత్ జోన్లో సేవలు మొదలవనున్నాయి. ఈనెల 22న ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో టెమా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామంలో భారత్ ఎయిర్‌ఫైబర్ సేవలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. భారత్ ఎయిర్‌ఫైబర్ బిజినెస్ మోడల్ గురించి బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ (సీఎఫ్ఏ) వివేక్ బంజల్ వివరిస్తూ గ్రామీణ ప్రాంత గృహాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే క్రమంలో ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని చెప్పారు. గ్రామీణ గృహాలకు రేడియో ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిచేందుకు గ్రామస్ధాయి వాణిజ్యవేత్తలు బీఎస్ఎన్ఎల్తో చేతులు కలిపే విధానాన్ని ప్రకటిస్తున్నామని చెప్పారు. యప్ టీవీ వ్యవస్ధాపక సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో తదుపరి డిజిటలీకరణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బీఎస్ఎన్ఎల్తో కలిసి తాము చేపట్టడం సంతోషకరమని అన్నారు. గ్రామీణ భారతానికి హైస్పీడ్ ఇంటర్నెట్ను బీఎస్ఎన్ఎల్ చేరువ చేస్తే తాము తమ యూజర్లకు వినోదభరితంగా వారిని చైతన్యపరిచేలా వైవిధ్యమైన కంటెంట్‌ను అందించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. సౌత్ జోన్‌తో ప్రారంభమైన ఈ ప్రక్రియకు అద్భుత స్పందన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కాగా బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లకు కంటెంట్‌ను అందించేలా గత ఏడాది బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ ఓ అవగాహనా ఒప్పందంపై సంతకం చేసిన క్రమంలో తదనుగుణంగా ఎంపిక చేసిన సర్కిళ్లలో ట్రిపుల్ ప్లే సర్వీసులను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. చదవండి : అసెట్స్ విక్రయంలో బీఎస్ఎన్ఎల్ చదవండి : యప్ టీవీ చేతికి బీసీసీఐ డిజిటల్ రైట్స్ -
అసెట్స్ విక్రయంలో బీఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసెట్స్ విక్రయం ద్వారా దాదాపు రూ. 300 కోట్లు సమీకరించడంపై ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట భూములను విక్రయించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తదితర సంస్థలతో చర్చలు జరుపుతోందని టెలికం శాఖ (డాట్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీఎస్ఎన్ఎల్తో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన మరో టెల్కో ఎంటీఎన్ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. దీనితో బీఎస్ఎన్ఎల్ జీతాల బిల్లు 50శాతం, ఎంటీఎన్ఎల్ బిల్లు 75 శాతం మేర తగ్గుతుందని అధికారి వివరించారు. బాండ్ల ద్వారా సుమారు రూ. 15,000 కోట్లు సమీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తునివ్వనుందని పేర్కొన్నారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతులు వస్తే జనవరి లేదా ఫిబ్రవరిలో సమీకరణ జరిపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. ఈ నిధులను రుణాల చెల్లింపు, పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు వివరించారు. -
రూ. 24 లక్షలు గోవిందా! బ్యాంకు అధికారులు బుక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఖాతానుంచి రూ. 24 లక్షలు మోసపూరితంగా దారి మళ్లాయి. ఢిల్లీలోని కేజీ మార్క్‌వద్ద ఉన్న ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో బీఎస్ఎన్ఎల్ చెక్కుల పేరుతో అక్రమంగా నగదు విత్ డ్రా అయింది. తద్వారా నకిలీ చెక్కులతో అక్రమార్కులు, అటు బ్యాంకునకు, ఇటు బీఎస్ఎన్ఎల్ సంస్థకు కుచ్చు టోపీ పెట్టారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బీఎస్ఎన్ఎల్ అధికారులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారికంగా తాము ఎలాంటి చెక్కులు జారీ చేయకుండానే తమ ఖాతా నుంచి రూ .24 లక్షలకు పైగా నగదును తప్పుగా డెబిట్ చేశారనే డీప్యూటీ మేనేజర్ లీలా రామ్ మీనా ఆరోపించారు. ఈ విషయమై బ్యాంకు అధికారులను సంప్రదించి, తమ డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాల్సిందిగా కోరామని దీనికి బ్యాంకు తిరస్కరించిందని తెలిపారు. నవంబర్ 21న రూ. 66,505 విలువైన చెక్‌తోపాటు మొత్తం మూడు చెక్కులిచ్చామని, అయితే అవి సంబంధిత లబ్దిదారులకు చేరింది, కానీ తాము జారీ చేయని (బీఎస్ఎన్ఎల్) మరో మూడు చెక్కులను అనధికారింగా బ్యాంకు క్లియర్ చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రూ .24,25,635 నష్టాన్ని చవిచూశామని బీఎస్ఎన్ఎల్ ఆరోపించింది. ఈ ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ప్రాథమిక విచారణ తరువాత, అదే నెంబర్‌తో మరో మూడు చెక్కులను బ్యాంకుకు సమర్పించినట్లు నిర్ధారించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్, 2 నెలలు అదనం
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా సరికొత్త ప్రయోజనాలను తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,999 విలువైన వార్షిక ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలను అందించనుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు 60 రోజుల ఎక్స్ట్రా వాలిడిటీని పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కాగా తాజా ఆఫర్ కింద 425 రోజుల వాలిడిటీని పొందవచ్చు. ఈ ఆఫర్ నేటి (జనవరి 25) నుంచి జనవరి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. రూ.1,999 ప్లాన్ అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, టీవీ సబ్స్రిప్షన్, రోజుకు 3జీబీ డేటా లభ్యం. కాగా రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ కింద రూ.2020తో వార్షిక ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. 5జీబీ డేటా
సాక్షి, ముంబై: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ. 90 రోజుల చెల్లుబాటుతో రూ. 109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తాజాగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. "మిత్రం ప్లస్" పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 5 జీబీ డేటాను అందిస్తుంది. దీంతోపాటు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాలింగ్ సదుపాయం లభ్యం. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఉన్న (రూ.49, రూ. 40, 500 ఎమ్‌బి డేటా, 15 రోజుల వాలిడిటీ) మిత్రం ప్లాన్లతో పాటు అందుబాటులో ఉండనుంది. బీఎస్ఎన్ఎల్ కేరళ వెబ్సైట్లో లిస్టింగ్ ప్రకారం రూ. 109 మిత్రం ప్లస్ ప్లాన్ 5 జీబీ డేటా, ముంబై ఢిల్లీ, సర్కిల్‌లతో సహా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అయితే కేరళ సర్కిల్లోని బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా మిగతా సర్కిళ్లకు త్వరలోనే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకురానుంది. అయితే ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టత లేదు. -
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో ముగిసిన వీఆర్ఎస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకం మంగళవారంతో ముగిసింది. రెండు సంస్థల్లో 92,700 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ ఎంచుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బీఎస్ఎన్ఎల్లో 78,300 మంది, ఎంటీఎన్ఎల్లో 14,378 మంది దీన్ని ఎంచుకున్నారు. ‘ఊహించిన స్థాయిలోనే ఇది ఉంది. మేం సుమారు 82,000 మేర సిబ్బంది సంఖ్య తగ్గుతుందని భావించాం. 78,300 మంది వీఆర్ఎస్ ఎంచుకోగా, మరో 6,000 మంది రిటైరయ్యారు‘ అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ తెలిపారు. మరోవైపు 14,378 మంది వీఆర్ఎస్ ను ఎంచుకున్నట్లు ఎంటీఎన్ఎల్ సీఎండీ సునీల్ కుమార్ తెలిపారు. వీఆర్ఎస్తో ఇరు సంస్థల వేతన భారం రూ. 8,800 కోట్ల మేర తగ్గనుంది. బీఎస్ఎన్ఎల్లో వేతన పరిమా ణం రూ.14,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు దిగివస్తుందని పుర్వార్ తెలిపారు. ఎంటీఎన్ఎల్ వేతన భారం రూ. 2,272 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గుతుంది. -
92 వేలకు పైగా వీఆర్ఎస్ దరఖాస్తులు
న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ఎంచుకున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 92,000 దాటిందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. రెండు సంస్థల ఉద్యోగుల నుంచీ ఈ పథకం పట్ల విశేష స్పందన కనిపిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు. 70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. కేంద్రం అందిస్తున్న పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్కు కొద్ది రోజుల ముందే తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది. -
బీఎస్ఎన్ఎల్కు మారుతున్న యూజర్లు...
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కారణంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు మారే వారి కన్నా.. వేరే ఆపరేటర్ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 2018–19లో పోర్ట్–అవుట్స్ సంఖ్య (వేరే ఆపరేటర్‌కు మారినవారు) 28.27 లక్షలుగా ఉండగా, పోర్ట్–ఇన్స్ (బీఎస్ఎన్ఎల్కు మారిన వారు) 53.64 లక్షలుగా ఉంది. మొత్తం మీద 2019 అక్టోబర్ దాకా 2.04 కోట్ల మేర పోర్ట్–ఇన్స్ ఉండగా, 1.80 కోట్ల మేర పోర్ట్–అవుట్స్ ఉన్నాయి. ఆగస్టు 31 నాటికి బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్ల సంఖ్య 11.64 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ లోక్‌సభలో తెలిపారు.