business news
-
2025లో ది బెస్ట్ కారు?.. ఫీచర్లు తెలిస్తే షాకే!
-
ఎలన్ మస్క్ కే మస్కా కొట్టించారు..!
-
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
-
టాటా స్టీల్ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు
సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్బోట్కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు. -
క్రెడిట్ కార్డు రూల్స్‌లో కీలక మార్పులు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ, ప్రయివేట్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మైల్స్టోన్ టికెట్ వోచర్లతో సహా అనేక ప్రయోజనాలను నిలిపివేయనుండగా, ఎస్బీఐ తన క్లబ్ విస్తారా ఎస్బీఐ, క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మార్పులుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 2025 మార్చి 31 నుండి మైల్స్టోన్ టికెట్ వోచర్లు, పునరుద్ధరణ ప్రయోజనాలు, ఇతర ఫీచర్లను అందించడాన్ని నిలిపివేయనుంది. అయితే 2026 మార్చి 31 వరకు మహారాజా పాయింట్లు కొనసాగుతాయి. ఆ తర్వాత కార్డు పూర్తిగా నిలిచిపోతుంది. బ్యాంక్ ప్రకటన ప్రకారం కీలక మార్పులు ఇవే..క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్ షిప్ ఇకపై అందుబాటులో ఉండదు.వన్ ప్రీమియం ఎకానమీ టికెట్, వన్ క్లాస్ అప్ గ్రేడ్ వోచర్ తో సహా కాంప్లిమెంటరీ వోచర్లు నిలిచిపోతాయి.ప్రీమియం ఎకానమీ టికెట్లకు మైల్ స్టోన్ వోచర్లు ఇకపై జారీ కావు.2025 మార్చి 31 తర్వాత కార్డులను రెన్యువల్ చేసుకునే కస్టమర్ల వార్షిక రుసుమును ఏడాది పాటు రద్దు చేస్తారు.ఎస్బీఐ క్రెడిట్ కార్డు పాలసీల్లో మార్పులుక్లబ్ విస్తారా ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు ఎకానమీ టికెట్ వోచర్లు ఇకపై ఉండవు.రూ.1.25 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.5 లక్షల వార్షిక ఖర్చులకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ నిలిపివేయనున్నారు.క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు ఇకపై ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్లను అందించదు.బేస్ కార్డు రెన్యువల్ ఫీజు రూ.1,499, పీఎం కార్డు రెన్యువల్ ఫీజు రూ.2,999.వినియోగదారులకు ఫీజు మాఫీకి ఇంకా అవకాశం ఉంటుంది.మార్పుల వెనుక కారణంగత ఏడాది నవంబర్‌లో విస్తారా-ఎయిరిండియా విలీనం తర్వాత ఈ మార్పులు జరిగాయి. ఇది ఎయిరిండియా మహారాజా క్లబ్ లాయల్టీ కార్యక్రమంలో సర్దుబాట్లకు దారితీసింది. ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను సవరించగా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. -
ఎలాంటి ప్రశ్నలు లేకుండా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్
న్యూఢిల్లీ: సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2030 నాటికి మహిళల సంఖ్య 30 శాతం సాధన దిశగా అడుగులు వేస్తున్నామని వేదాంత తెలిపింది. మహిళా సిబ్బందిలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకొనే పదవుల్లో 28% మంది ఉన్నారని, ఇది దేశంలో మెటల్స్, మైనింగ్ కంపెనీల్లోనే అత్యధికమని పేర్కొంది.అర్హత కలిగిన మహిళలకు తగిన స్థానం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది. అనువైన పని గంటలు, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం, పిల్లల సంరక్షణ కోసం ఏడాదంతా సెలవులు, జీవిత భాగస్వామి నియామకం తదితర స్నేహపూర్వక విధానాల అమలు ద్వారా ప్రతి దశలోనూ మహిళల ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్ జింక్ ఉమెన్ ఆఫ్ జింక్ క్యాంపేయిన్ ప్రారంభించింది. మెటల్ రంగం పట్ల మహిళల్లో మరింత ఆసక్తిని పెంచడం ఈ ప్రచార కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. -
గుజరాతీలు జాబ్స్ ఎందుకు చేయరంటే..
వ్యాపారం, ఆర్థిక రంగాల్లో గుజరాతీల (Gujaratis) ఆధిపత్యం గురించి తెలిసిందే. అయితే వారు ఆయా రంగాల్లో అంతలా రాణించడానికి కారణాలు ఏంటి.. సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేక లక్షణాలేంటి అన్న దానిపై పై స్టాకిఫీ వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్సీ అద్భుతమైన విశ్లేషణ చేశారు. వారి ఆర్థిక ప్రభావాన్ని హైలైట్ చేసే గణాంకాలతో ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.దేశంలోని 191 మంది బిలియనీర్లలో 108 మంది గుజరాతీలేనని రాసుకొచ్చిన చోక్సీ సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేకతలను వివరించారు. చివరికి అమెరికాలో నివసిస్తున్న గుజరాతీ.. సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడని చోక్సీ అభిప్రాయపడ్డారు. భారతదేశ జనాభాలో కేవలం 5% మాత్రమే ఉన్నప్పటికీ, గుజరాత్ దేశ జీడీపీకి 8% పైగా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 18% భాగస్వామ్యం వహిస్తోంది. భారత భూభాగంలో కేవలం 6% మాత్రమే ఉన్న గుజరాత్ దేశం మొత్తం ఎగుమతుల్లో 25% వాటాను కలిగి ఉంది.గుజరాతీల సక్సెస్‌కు కారణాలివే..మరి గుజరాతీలు వ్యాపారంలో అంత సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? చోక్సీ ప్రకారం.. ఇది తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వ్యవస్థాపక మనస్తత్వం, కొత్త మార్కెట్లను స్వీకరించడానికి, ఆధిపత్యం చేయడానికి సాటిలేని సామర్థ్యం కలయిక. గుజరాతీలు వ్యాపార, ఆర్థిక వ్యవహారాలను శాసించడానికి 20 కారణాలను ఆయన వివరించారు.ఉద్యోగాల (Jobs) కంటే వ్యాపారానికి తరతరాలుగా ప్రాధాన్యత ఇవ్వడమే ఈ విజయానికి కారణమని చోక్సీ పేర్కొన్నారు. "నౌకరీ తో గరీబోన్ కా దండా చే" (ఉద్యోగాలు పేదల కోసం) అనేది గుజరాతీ కుటుంబాలలో ఒక సాధారణ నమ్మకం. వ్యాపారం అనేదేదో నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యంలాగా కాకుండా గుజరాతీ పిల్లలు.. తమ కుటుంబాల్లో డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు.. డీల్స్ ఎలా చేస్తున్నారు.. నష్టాలను ఎలా అంచనా వేస్తున్నారు.. అనేది నిత్యం చూస్తూ పెరుగుతారు.రిస్క్ తీసుకోవడం అనేది మరో ముఖ్యమైన లక్షణం. వజ్రాల ట్రేడింగ్ నుంచి స్టాక్ మార్కెట్ల వరకు గుజరాతీలు అనిశ్చితిని స్వీకరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ మనస్తత్వం ప్రారంభ ఆర్థిక విద్య ద్వారా బలపడుతుంది. చాలా మంది పిల్లలు చిన్న వయస్సు నుండే కుటుంబ వ్యాపారాలలో సహాయపడతారు. ఏ ఎంబీఏ బోధించలేని రియల్ వరల్డ్ ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకుంటారు.నెట్ వర్కింగ్, కమ్యూనిటీ సపోర్ట్ కీలకం. రుణాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ విషయంలో గుజరాతీలు ఒకరికొకరు చురుకుగా సహాయపడతారు. వారి పొదుపు జీవనశైలి కూడా ఒక పాత్ర పోషిస్తుంది. లాభాలను విలాసవంతంగా ఖర్చు చేయకుండా తిరిగి పెట్టుబడి పెడతారు. ఇది దీర్ఘకాలిక సంపద సేకరణకు దారితీస్తుంది.వివిధ పరిశ్రమల్లో గుజరాతీలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారో కూడా చోక్సీ తెలియజేశారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్ మాత్రమే ప్రాసెస్ చేస్తోందని, బెల్జియం, ఇజ్రాయెల్ లోని పోటీదారులను గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎలా అధిగమించారో ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, భారతదేశ స్టాక్ మార్కెట్ వ్యాపారులలో 60% పైగా గుజరాతీలు లేదా మార్వాడీలు ఉన్నారు.అమెరికాలో కూడా గుజరాతీలు వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అమెరికాలోని మొత్తం హోటళ్లలో 60 శాతానికి పైగా గుజరాతీ కుటుంబాలకు చెందినవేనని, ప్రధానంగా పటేల్ సామాజిక వర్గానికి చెందినవని చోక్సీ వెల్లడించారు. 1950వ దశకంలో చిన్న చిన్న పెట్టుబడులుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపాంతరం చెందింది.108 out of 191 Indian billionaires are Gujarati.A Gujarati living in America makes three times more than an average American.Gujarat, which has 5% of India’s population, contributes over 8% to the GDP and 18% of the industrial output.Gujarat has a land area of only 6% but… pic.twitter.com/ZId5idzCNS— Abhijit Chokshi | Investors का दोस्त (@stockifi_Invest) March 8, 2025 -
స్పైస్‌జెట్‌కు కొత్త చిక్కులు
చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్‌జెట్‌కు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. విమానాల లీజు రంగంలో ఉన్న ఐర్లాండ్‌కు చెందిన మూడు సంస్థలు, ఒక మాజీ పైలట్ స్పైస్‌జెట్‌పై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్లు దాఖలు చేయడం ఇందుకు కారణం. స్పైస్‌జెట్ సుమారు రూ.110 కోట్లు బకాయి పడిందని, ఐబీసీ సెక్షన్ 9 కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్‌జీఎఫ్ ఆల్ఫా, ఎన్‌జీఎఫ్ జెనెసిస్, ఎన్‌జీఎఫ్ చార్లీ పిటిషన్లు దాఖలు చేశాయి.ఈ వారం ప్రారంభంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా పరిష్కార చర్చలు జరుగుతున్నందున ఈ విషయాన్ని పరిష్కరించడానికి స్పైస్‌జెట్ కొంత సమయం కోరింది. తదుపరి విచారణ కోసం 2025 ఏప్రిల్ 7న మూడు పిటిషన్లను లిస్ట్ చేయాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. లీజుదారులు గతంలో స్పైస్‌జెట్‌కు ఐదు బోయింగ్ 737 విమానాలను లీజుకు ఇచ్చాయి.ఇంజిన్లతో సహా విమానంలోని భాగాలను దొంగిలించి ఇతర విమానాలలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఈ కంపెనీలు స్పైస్‌జెట్‌కు లీగల్ నోటీసును పంపించాయి. 19 సంవత్సరాలుగా విమానయాన రంగంలో ఉన్న స్పైస్‌జెట్.. ఎన్సీఎల్టీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ వద్ద విల్లిస్ లీజ్, ఎయిర్కాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ వంటి రుణదాతల నుండి దివాలా పిటిషన్లను ఎదుర్కొంటోంది. -
శాంసంగ్ ప్రీమియమ్ ఫోన్‌పై భారీ తగ్గింపు
మంచి కెమెరా, డిస్ప్లే, పనితీరు, క్లీన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో గతేడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అప్పట్లో అధిక ధర కారణంగా ఈ ప్రీమియమ్ ఫోన్‌ను కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ ఇప్పుడు తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్ల తరువాత రూ .93,000 కంటే తక్కువకు లభిస్తుంది. మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా వచ్చినప్పటికీ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాకు క్రేజ్ అలాగే ఉంది. కాబట్టి మంచి కెమెరా, ఏఐ ఫీచర్లతో సరైన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ల కోసం చూస్తున్నట్లయితే అమెజాన్‌కి వెళ్లి ఈ డీల్ చూడవచ్చు.తగ్గింపు అలర్ట్శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.98,499గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.1,29,999. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే రూ.2,955 తగ్గింపు లభిస్తుంది. అలాగే కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ ఆదా కోసం), రూ .4,775 నుండి ప్రారంభమయ్యే స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ కొనుగోలు కోసం మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. దీనికి ఆ ఫోన్ మోడల్, వర్కింగ్ కండీషన్, బ్రాండ్‌ను బట్టి రూ.22,800 వరకు పొందవచ్చు. యాడ్-ఆన్‌లుగా వినియోగదారులు రూ .6,999 టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్పెసిఫికేషన్లు120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల క్యూహెచ్ డీ+ అమోఎల్ఈడీ ప్యానెల్ ను ఇందులో అందించారు. ఈ డివైజ్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్‌పై నడుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 45వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఇప్పటికే లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లను అందిస్తోంది. రాబోయే ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్డేట్తో ఇది మరిన్ని ఏఐ ఫీచర్లను పొందుతుంది.కెమెరా విషయానికొస్తే.. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో పాటు అదనంగా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. -
రూ. 1,000కే ఎస్ఎస్ఈ ఇన్స్ట్రుమెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లాభాపేక్షలేని సంస్థ(ఎన్పీవో)ల నిధుల సమీకరణకు మరింత వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఎన్‌పీవోలు జారీ చేసే జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్(జెడ్‌సీజెడ్‌పీ)ల కనీస పరిమాణాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించింది. వెరసి ప్రస్తుత రూ. 10,000 నుంచి రూ. 5,000 లేదా రూ. 1,000కు దరఖాస్తు కనీస పరిమాణాన్ని కుదించాలని భావిస్తోంది.ఇందుకు చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా మార్చి 14వరకూ ప్రజాభిప్రాయ సేకరణకు తెరతీసింది. సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎస్ఈ)లతో ఎన్‌పీవోలు జెడ్సీజెడ్పీలను జారీ చేస్తుంటాయి. ప్రస్తుత ప్రతిపాదనలు అమలైతే ఎన్‌పీవోలు జారీ చేసే జెడ్సీజెడ్పీలలో రిటైలర్ల పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశముంటుంది.జెడ్సీజెడ్పీలంటే? సెబీ ఎన్‌పీవోల కోసం ఎస్‌ఎస్‌ఈని ఏర్పాటు చేసింది. ఎస్ఎస్ఈలో లిస్టయిన ఎన్‌పీవోలు అందుకునే విరాళాలకుగాను జెడ్సీజెడ్పీలను జారీ చేస్తాయి. నిజానికి 2023 నవంబర్‌లో జెడ్‌సీజెడ్‌పీ కనీస పరిమాణాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 10,000కు కుదించింది. ఇదేవిధంగా జెడ్‌సీజెడ్‌పీ మొత్తం పరిమాణాన్ని రూ. కోటి నుంచి రూ. 50 లక్షలకు తగ్గించింది.ఎస్ఎస్ఈల ద్వారా రిటైలర్ల విరాళాలు పెరుగుతుండటాన్ని ఎన్‌పీవోలు సెబీ దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే రూ. 10,000 కనీస పరిమాణం పలువురికి అడ్డు తగులుతున్నట్లు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత స్టాక్ ఎక్సే్ఛంజీలకు భిన్నమైన ఎస్ఎస్ఈ దేశీయంగా కొత్త విభాగంకాగా.. సామాజిక సంస్థలు, దాతలను కలపడంతోపాటు.. నిధుల ఆసరాకు వీలు కలుగుతుంది. -
ఇల్లే బంగారమాయె..
బంగారం, గృహం, స్టాక్ మార్కెట్.. ఈ మూడింట్లో ఎందులో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని మహిళలను అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం బంగారమే! కానీ, నేటి మహిళల పెట్టుబడి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట సొంతిల్లు.. ఆ తర్వాతే బంగారం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. 69 శాతం మంది మహిళలు సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. 31 శాతం మంది పెట్టుబడి కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో మన దేశంలో గృహ కొనుగోలు ప్రక్రియలో మహిళలు ఎల్లప్పుడూ కీలక నిర్ణయాధికారులే. మహిళలు స్వతంత్ర, వ్యక్తిగత ఆస్తుల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో మెజారిటీ మహిళలు తుది వినియోగదారులే. పెట్టుబడి రీత్యా ఆస్తుల కొనుగోళ్లూ ఆశించిన స్థాయిలోనే ఉండటం గమనార్హం. పెరుగుతున్న స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, మెరుగైన ఆదాయ వనరులు కారణంగా గృహ విభాగంలో మహిళా పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తున్నారు. 2022 హెచ్2 (జులై–డిసెంబర్)లో మహిళా గృహ కొనుగోలుదారుల్లో తుది వినియోగం: పెట్టుబడి నిష్పత్తి 79:21గా ఉండగా.. 2024 హెచ్2 నాటికి 69:31గా ఉందని తెలిపింది.లాంచింగ్ ప్రాజెక్టుల్లోనే.. సర్వేలో పాల్గొన్న 69 శాతం మహిళలకు రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆస్తి తరగతిగా భావిస్తున్నారు. 2022 హెచ్2లో ఇది 65 శాతంగా ఉండగా.. కోవిడ్ కంటే ముందు 2019 హెచ్2లో 57 శాతంగా ఉంది. గతంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు 10 శాతం మంది మహిళలు మొగ్గుచూపగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు (రెడీ టు మూవ్) కొనుగోళ్ల ప్రాధాన్యత 29 శాతం మేర తగ్గింది.లగ్జరీకే మొగ్గు.. లగ్జరీ ప్రాపర్టీలకు మహిళలూ ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు 52 శాతం ఉమెన్స్ మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో 33 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ధర ఉండే ప్రాపర్టీలను ఇష్టపడుతుండగా.. 11 శాతం మంది రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉండే గృహాలను, 8 శాతం మంది రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో మహిళా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) పెరుగుదలకు ఇదే నిదర్శనం.గోల్డ్, స్టాక్ మార్కెట్.. ప్రాపర్టీ తర్వాత మగువలకు అమితాసక్తి బంగారమే. అందుకే రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కే మహిళలు జై కొడుతున్నారు. 2022 హెచ్2లో బంగారంలో పెట్టుబడులకు 8 శాతం మంది మహిళలు ఆసక్తి చూపించగా.. 2024 హెచ్2 నాటికి 12 శాతానికి పెరిగింది. ఇక, ఏటేటా స్టాక్ మార్కెట్ ఆకర్షణ కోల్పోతుంది. రెండేళ్ల క్రితం మార్కెట్లో పెట్టుబడులకు 20 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తే.. ఇప్పుడది ఏకంగా 2 శాతానికి పడిపోయింది. -
మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే కఠిన నిబంధనలు
ముంబై: ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఎక్స్పైరీ రోజున మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ తెలిపారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని అధ్యయనంలో తేలిన మీదట గతేడాది అక్టోబర్‌లో చర్యలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.కనీస కాంట్రాక్టు పరిమాణాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షలకు దశలవారీగా పెంచడం, ప్రీమియంను ముందుగా వసూలు చేయడం తదితర చర్యలను సెబీ ప్రకటించింది. ముందుగా క్యాష్ మార్కెట్‌ను అభివృద్ధి చేసి, ఆ తర్వాత డెరివేటివ్స్‌పై కసరత్తు చేయాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సూచించారు. మరోవైపు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివరాలను సెబీ బోర్డు సభ్యులందరూ ప్రజలకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలను రూపొందిస్తామని సెబీ కొత్త చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.విశ్వసనీయతను, పారదర్శకతను పెంపొందించడానికి ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఓవైపు నియంత్రణ సంస్థ అధిపతిగా, మరోవైపు నియంత్రిత సంస్థల్లో భాగస్వామిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పని చేశారంటూ సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెబీ విచారణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ సహ–ఇన్వెస్టరుగా ఉన్న ఫండ్‌లో ఆమె పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
‘స్త్రీ’రాస్తి రంగంలో.. మహిళలు అంతంతే..
సాక్షి, సిటీబ్యూరో: అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు.. స్థిరాస్తి రంగంలో మాత్రం కాస్త వెనకబడే ఉన్నారు. దేశీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మహిళా కార్మికులు పరిమితంగానే ఉన్నారు. ప్రస్తుతం రియల్టీలో 7.1 కోట్ల మంది కార్మికులు పని చేస్తుండగా.. మహిళా కార్మికుల సంఖ్య కేవలం 70 లక్షలే. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) కేవలం 25.1 శాతంగా మాత్రమే ఉందని రియల్టీ సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, గ్లోబల్ కన్సల్టింగ్ ఇన్ టెన్డమ్ అధ్యయనం వెల్లడించింది. మహిళా జనాభాలో 1.2 శాతమే.. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించే రంగం రియల్ ఎస్టేటే. కానీ, స్థిరాస్తి రంగ శ్రామిక శక్తిలో మహిళ భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ స్థిరాస్తి రంగం క్రాస్ రోడ్స్‌లో ఉంది. అద్భుతమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో తారాస్థాయిలో వృద్ధి చెందకుండా నిరోధించేందుకూ సవాళ్లు ముందున్నాయి. దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం మంది ఉన్నారు. ఇందులో దాదాపు 1.2 శాతం మంది మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నారు.సవాళ్లు ఇవీ.. స్థిరాస్తి రంగంలోని శ్రామిక శక్తిలో అన్ని స్థాయిలలోనూ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం, అసమాన వేతనం.. ఇవే ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్లు. లింగ సమానతలు పరిష్కరించడం వల్ల గణనీయమైన ఆర్థిక క ప్రయోజనాలు చేకూరతాయి. ఉత్పాదకత, ఆవిష్కరణలు, లాభదాయకత పెరుగుతాయి. అలాగే ఈ రంగంలో బ్లూ, వైట్ కాలర్ మహిళా కార్మికులను శక్తివంతం చేయడానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల అవసరం ఉంది. సరైన నాయకత్వం, సాంకేతికత వినియోగంతోనే దీన్ని సాధించగలమని నివేదిక సూచించింది. -
రైల్వే కీలక నిర్ణయం.. ఇక కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే..
మెరుగైన క్రౌడ్ మేనేజ్మెంట్ దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దేశవ్యాప్తంగా 60 కీలక రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫామ్ మీదకు అనుమతించనుంది. రద్దీని నియంత్రించడానికి, సురక్షితమైన ప్రయాణ పరిస్థితులను నిర్ధారించడానికి ఈ స్టేషన్లలో శాశ్వత ప్రయాణికుల హోల్డింగ్ ప్రాంతాలు ఉంటాయి.రద్దీ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకల క్రమబద్ధీకరణపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారులతో విస్తృతంగా చర్చించి రద్దీగా ఉండే ప్రయాణ సమయాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలో అమలు చేసిన విజయవంతమైన రద్దీ నియంత్రణ చర్యలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నవారు అక్కడే.. ఇందులో భాగంగా ఈ 60 స్టేషన్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులను స్టేషన్ ఆవరణ వెలుపల నిర్దేశిత వెయిటింగ్ ప్రాంతాలకు పంపనున్నారు. ఇటీవలి మహాకుంభమేళా సందర్భంగా ప్రయాణికుల భారీ రద్దీని నిర్వహించడానికి ప్రయాగ్‌రాజ్‌తోపాటు సమీప తొమ్మిది స్టేషన్లలో బాహ్య వెయిటింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కువ రద్దీ ఉండే మరిన్ని స్టేషన్లలో శాశ్వత వెయిటింగ్ ఏరియాలను అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.‘వార్ రూమ్’ల ఏర్పాటుఇప్పటికే న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా వంటి స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్టేషన్లలో అనధికారిక ప్రవేశాన్ని నివారించడానికి నియంత్రిత యాక్సెస్ గేట్లను ఏర్పాటు చేశారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిఘాను పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది. వీటితోపాటు ప్రధాన స్టేషన్లలో రద్దీ మరీ ఎక్కువగా ఉన్న సమయాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని చర్చించుకునేందుకు ‘వార్ రూమ్’లను సైతం ఏర్పాటు కానున్నాయి.కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి, ప్రయాణికుల భారీ రద్దీని నిర్వహించే స్టేషన్లలో వాకీ-టాకీలు, అధునాతన అనౌన్స్మెంట్ వ్యవస్థలు, మెరుగైన కాలింగ్ వ్యవస్థలతో సహా కొత్త డిజిటల్ పరికరాలు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో సులభంగా గుర్తించేందుకు వీలుగా సిబ్బందికి రీడిజైన్ చేసిన ఐడీ కార్డులు, కొత్త యూనిఫామ్ అందించనున్నారు. అలాగే అన్ని ప్రధాన స్టేషన్లలో సీనియర్ అధికారులను స్టేషన్ డైరెక్టర్లుగా నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటితోపాటు స్టేషన్ కెపాసిటీ ఆధారంగా టికెట్ల అమ్మకాలను నియంత్రించడం, మరింత సమర్థవంతమైన క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు మరిన్ని అధికారాలు కల్పించనున్నారు. -
ఇంటి కొనుగోలు.. ‘ఆమె’కు నచ్చితేనే..
సాధారణంగా మహిళలు వంట గది విశాలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, నేటి అవసరాలు, అభిరుచులు మారుతుండటంతో ఆధునిక వసతులనూ కోరుకుంటున్నారు. జిమ్, మెడిటేషన్ వంటి సౌకర్యాలతో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, గ్రీనరీ స్పేస్, పిల్లల కోసం పార్క్, స్పోర్ట్స్ వంటి వసతులను ఎంచుకుంటున్నారని ఆర్క్ గ్రూప్ సీఈఓ మేఘన గుమ్మి తెలిపారు. గృహిణి, ఉద్యోగిని ఎవరైనా సరే ఇంటిని, కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకునేది మహిళే. దీంతో ఇంట్లో ఏ గదికి ఎంత స్పేస్ అవసరమో నిర్ణయించగలదు. వాస్తవానికి పురుషుల కంటే మహిళలకే దృశ్యీకరణ (విజువలైజేషన్) శక్తి ఎక్కువగా ఉంటుంది. తాను ఉండబోయే కిచెన్, బెడ్ రూమ్, బాల్కనీ ఇంట్లోని ప్రతీది ఏ విధంగా ఉండబోతుందో ఊహించగలదు. –సాక్షి, సిటీబ్యూరోఐదారేళ్ల క్రితం వరకూ రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. అయితే స్థిరాస్తి రంగంలో వృత్తి నైపుణ్యం, ఆదాయ వనరులు పెరగడం, వర్క్ కల్చర్ మారడంతో క్రమంగా ఈ విభాగంలో మహిళలు ప్రవేశిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్ విభాగంలోనే కాదు సైట్ల మీద కూడా మహిళలు పనిచేసే స్థాయికి ఎదిగారు. దీంతో రియల్టీ సెక్టార్ అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో మాదిరిగా రియల్టీ సెగ్మెంట్లోనూ వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.ఆమెకు నచ్చితేనే.. ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాక.. ప్రాంతం, ధర, ప్రాజెక్ట్, వసతులు ఏవైనా సరే భర్తకు నచ్చినా సరే అంతిమంగా నిర్ణయించాల్సింది, ఓకే చేయాల్సిందీ ఇల్లాలే. ఆమెకు నచ్చకుండే ఇంటి కొనుగోలు చేయరు. సొంతింటి ఎంపికలో మహిళల పవర్ అదీ. అపార్ట్మెంట్లతో పోలిస్తే విల్లాలలో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో నేటి యంగ్ ఉమెన్స్ విల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు నిర్ణయాధికారం, కొనుగోలు శక్తి పెరగడంతోనూ ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది.ఇన్ఫ్రాకు నీడ రియల్టీ.. మనల్ని అంటిపెట్టుకొని నీడ ఎలాగైతే ఫాలో అవుతుందో.. ఇన్ఫ్రాకు రియల్ ఎస్టేట్ కూడా అంతే. మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోనే రియల్ పరుగులు పెడుతుంది. భూముల ధరలు పెరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సౌత్ హైదరాబాద్ వైపు ఫోకస్ పెట్టింది. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. సౌత్‌లో ఇన్ఫ్రా డెవలప్మెంట్తో కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సామాన్య, మధ్యతరగతి ఈ టైమ్‌లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చు తగ్గులు కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడం ఖాయం. -
గడవు పొడిగించిన సెబీ..
న్యూఢిల్లీ: క్లెయిమ్ చేయని నిధులు, సెక్యూరిటీలు బ్రోకర్ల వద్దే ఉండిపోతే.. వాటిని ‘విచారణ పరిధిలో’ పెట్టాలన్న ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 31 వరకు సెబీ పొడిగించింది. ఈ ప్రతిపాదనపై ఫిబ్రవరి 11న సెబీ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై స్పందనలు తెలియజేయడానికి మార్చి 4వరకు గడువు ఇవ్వడం గమనార్హం.సెబీ నిబంధనల ప్రకారం క్లయింట్ల ఖాతాల్లోని నిధులను (ఫండ్స్) ప్రతి త్రైమాసికానికి ఒకసారి వెనక్కి పంపాల్సి ఉంటుంది. సెక్యూరిటీలను నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయాలి. ఒకవేళ నిధులు, సెక్యూరిటీలను బదిలీ చేసే విషయంలో క్లయింట్ల ఆచూకీ లేనట్టయితే.. సంబంధిత ఖాతాలను వెంటనే ‘ఎంక్వైరీ స్టేటస్’ కింద ఉంచాలని సెబీ ప్రతిపాదన తీసుకొచ్చింది.లేఖలు, ఈమెయిల్స్, టెలిఫోన్ ద్వారా బ్రోకర్లు క్లయింట్లను సంప్రదించాలి. ఇలా ఎంక్వైరీ స్టేటస్ కింద 30 రోజులకుపైగా నిధులు, సెక్యూరిటీలు ఉండిపోతే, వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణిస్తారు. ఆ తర్వాత క్లయింట్ నామినీని సంప్రదించాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనలో పేర్కొంది. -
బంగారం మళ్లీ భారీగా...
దేశంలో బంగారం ధరలు (Gold Prices) పెరుగుదల బాట పట్టాయి. రెండు రోజులుగా వరుసగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన పసిడి ధరలు నేడు (March 8) మళ్లీ ఎగిశాయి. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 80,400, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,710 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.500, రూ.550 చొప్పున ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,860 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,550 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.550, రూ.500 చొప్పున పెరిగాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,710 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.500, రూ.550 చొప్పున భారమయ్యాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,08,100 వద్ద, ఢిల్లీలో రూ. 99,100 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. కానీ, ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ అవసరం లేకపోయినా.. రెండో దాని గురించి మాత్రం అవసరమే. ఎందుకంటే ఇంటి ఓనర్ లేదా కో–ఓనర్ మహిళ అయితే ఎన్నో ప్రయోజనాలున్నాయి గనక! గృహ రుణం నుంచి మొదలు పెడితే వడ్డీ రాయితీ, ఆదాయ పన్ను మినహాయింపు, స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. ఇలా ఎనెన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరు మీద కొనుగోలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోస్టాంప్ డ్యూటీలో తగ్గింపు.. పలు రాష్ట్రాలు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమయంలో మహిళలకు స్టాంప్ డ్యూటీ రాయితీని అందిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళలకు 1 శాతం రాయితీ ఉండేది. ప్రస్తుతం లేదు. ఢిల్లీలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు మగవారికైతే ప్రాపర్టీ విలువలో 6 శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుండగా.. మహిళ ఓనరైతే 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కశ్మీర్లో అయితే మహిళ ప్రాపర్టీ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీనే లేదు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మహిళా ఓనర్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ ఆధారంగా కూడా స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంది.ఐటీప్రయోజనాలు..గృహ యజమాని లేదా సహ–యజమాని మహిళ అయితే ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరు వేర్వేరుగా అసలు, వడ్డీలపై ఐటీ తగ్గింపులను క్లయిమ్ చేసుకునే వీలుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం సహ దరఖాస్తుదారు ప్రిన్సిపల్ అమౌంట్‌పై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు, చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే సెక్షన్ 80ఈఈ కింద ఇతర క్లెయిమ్‌లతో పాటు తొలిసారి గృహ యజమానురాలు మహిళ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మీద రూ.50 వేలు తగ్గింపు కూడా అందుతుంది. అద్దె ఆదాయంపై కూడా.. మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మినహాయింపులను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ప్రాపర్టీని మహిళలు అద్దెకు ఇస్తే.. ఆమె రెండు రకాల తగ్గింపులకు క్లయిమ్ చేసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై ఏదైనా లోన్‌పై చెల్లించే వడ్డీపై పన్ను తగ్గింపుతో పాటు రెంటల్ ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ లభిస్తుంది. అయితే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలంటే మహిళలకు ఆదాయ వనరులు ఉండాల్సిందే. గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు..బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు మహిళలను విశ్వసనీయ రుణ గ్రహీతలుగా పరిగణిస్తుంటాయి. అందుకే స్థిరాస్తి రంగంలో మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ కార్యక్రమాలను, స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులలో పురుష రుణ గ్రహీతలతో పోలిస్తే మహిళలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 0.5 నుంచి 1 శాతం తక్కువగా ఉంటాయి.ఈ శాతం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో డబ్బు, ఈఐఎంను ఆదా చేస్తుంది. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద లో ఇన్‌కం గ్రూప్(ఎల్ఐజీ) కేటగిరీ కింద మహిళలకు రూ.6 లక్షల రుణానికి 6.5 శాతం వడ్డీ రాయితీతో.. రూ.2.67 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు. ఇన్‌కం సోర్స్ లేని మహిళలకు బ్యాంక్‌లు రుణాలను అందించవు.వారసులకు బదిలీ సులువు..మహిళ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్‌లో భాగమవుతుంది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది. అయితే విడాకుల సమయంలో సేల్‌డీడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపులు ఉంటాయి. ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి మహిళ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
మహిళలకు ఎస్బీఐ ప్రత్యేక పథకం.. డెబిట్ కార్డు
మహిళా ఎంట్రప్రెన్యూర్లకు పూచీకత్తు లేకుండా, తక్కువ వడ్డీ రేటుపై రుణాలు అందించేలా ’అస్మిత’ పథకాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రవేశపెట్టింది. మహిళల సారథ్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకు డిజిటల్ మాధ్యమం ద్వారా వేగవంతంగా, సులభతరంగా రుణ సదుపాయం లభించేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.వినియోగ ప్రయోజనాల కోసం రుణాలు తీసుకోవడానికి ఇష్టపడే మహిళలు వ్యాపార రుణాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ ఆవిష్కరణ జరగడం గమనార్హం. ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ప్రకారం.. మహిళలు తీసుకున్న రుణాలలో కేవలం 3 శాతం మాత్రమే వ్యాపార ప్రయోజనాల కోసం, 42 శాతం వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, హోమ్ ఓనర్షిప్ వంటి పర్సనల్ ఫైనాన్స్ ఉత్పత్తుల కోసం, 38 శాతం బంగారంపై ఉన్నాయి.మరోవైపు, మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత ’నారీ శక్తి’ ప్లాటినం డెబిట్ కార్డును కూడా బ్యాంకు ఆవిష్కరించింది. ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రవాస భారతీయులలో మహిళల కోసం 'బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్' పేరిట ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది. -
మహిళలకు ఫ్రెష్‌బస్ ఫ్రీ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తమ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు రూ. 500 వరకు పొదుపు చేసే ఫ్రెష్ కార్డులను ఉచితంగా ఇస్తున్నట్లు ఫ్రెష్‌బస్ తెలిపింది. వీటిని తదుపరి 10 రైడ్స్ కోసం ఉపయోగించుకోవచ్చని, ఒక్కో రైడ్‌పై రూ. 50 ఆదా చేసుకోవచ్చని వివరించింది.తమ వెబ్సైట్ లేదా యాప్‌లో బుక్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విజయవాడ, బెంగళూరు తదితర రూట్లలో సర్వీసులు నడిపిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి చిర్రా తెలిపారు. సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ తమ బస్సుల్లో 6.5 లక్షల మంది ప్రయాణించగా ఇందులో 30 శాతం అంటే 1.94 లక్షల మంది మహిళలు ప్రయాణించారని ఆయన తెలిపారు. మహిళలకు తమ సంస్థపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. -
స్టాక్మార్కెట్లోకి ‘చాయ్ పాయింట్’
న్యూఢిల్లీ: టీ, కాఫీ చైన్.. చాయ్ పాయింట్ 2026 మే నెలకల్లా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. ఈ అంశాన్ని ప్రతిరోజు సుమారు 9 లక్షల కప్పుల టీ, కాఫీ విక్రయిస్తున్న సంస్థ సహవ్యవస్థాపకుడు తరుణ్ ఖన్నా తెలియజేశారు. అయితే కుంభమేళాలో రోజుకి 10 లక్షలకంటే అధికంగా విక్రయించినట్లు తెలియజేశారు.ముంబైలో తమ విద్యార్ధి అములీక్ సింగ్ బిజ్రాల్తో కలసి ఒక కేఫ్‌లో టీ తాగే సమయంలో 2009లో చాయ్ పాయింట్ ప్రారంభించే ఆలోచన వచ్చినట్లు హార్వార్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖన్నా వెల్లడించారు. ప్లాస్టిక్ కప్పులలో అంత శుభ్రతలేని విధంగా అందిస్తున్న చాయ్ స్థానే అత్యున్నత నాణ్యతతో, పరిశుభ్రంగా అందుబాటు ధరలో సువాసనలతో కూడిన చాయ్ అందించాలనే ఆలోచనతో చాయ్ పాయింట్‌కు తెరతీసినట్లు వివరించారు.దీంతో టీ అందించే వ్యక్తు(చోటూ)లకు ఉపాధిని సైతం కల్పించవచ్చని భావించినట్లు తెలియజేశారు. దీంతో 2010లో బెంగళూరులోని కోరమంగళలో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అములీక్తో కలిసి ఐదుగురు ఉద్యోగులతో బిజినెస్‌ను మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకి 90 లక్షల కప్పుల టీ, కాఫీలను విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. -
డిపాజిట్లపై బీమా పెంచితే బ్యాంకులపై ప్రభావం
ముంబై: డిపాజిట్లపై బీమా పరిమితిని రూ.5 లక్షలకు మించి పెంచితే అది బ్యాంకుల లాభదాయకతపై ప్రభావం చూపిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. దీనివల్ల సుమారు రూ.12,000 కోట్ల మేర లాభం తగ్గిపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఒక బ్యాంక్ పరిధిలో ఒక కస్టమర్ పేరిట రూ.5లక్షల బీమా సదుపాయాన్ని డీఐసీజీసీ అందిస్తోంది. ఇందుకు గాను బ్యాంక్‌లు డిపాజిట్ల మొత్తంపై డీఐసీజీసీకి ప్రీమియం చెల్లిస్తుంటాయి.రూ.5 లక్షలకు మించి పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే, నోటిఫై చేస్తామని చెప్పారు. ‘‘ఇటీవల ఓ కోపరేటివ్ బ్యాంక్ (న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్) వైఫల్యం నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితి పెంపు చర్చకు వచ్చింది. ఇది బ్యాంక్‌లపై స్వల్ప స్థాయిలోనే అయినా, చెప్పుకోతగ్గ మేర లాభదాయకతపై ప్రభావం చూపించనుంది’’అని ఇక్రా ఫైనాన్షియల్ రంగం రేటింగ్స్ హెడ్ సచిన్ సచ్దేవ పేర్కొన్నారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ వైలఫ్యంతో చివరిగా 2020 ఫిబ్రవరిలో డిపాజిట్‌పై బీమాను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచినట్టు గుర్తు చేశారు.97.8 శాతం డిపాజిట్లకు రక్షణ 2024 మార్చి నాటికి 97.8 శాతం బ్యాంక్ ఖాతాలు బీమా రక్షణ పరిధిలో ఉన్నట్టు ఇక్రా తెలిపింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్ల మొత్తం రూ.5లక్షల్లోపే ఉన్నట్టు పేర్కొంది. ఇన్సూర్డ్ డిపాజిట్ రేషియో (ఐడీఆర్) 43.1 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఐడీఆర్‌ను 47 శాతం నుంచి 66.5 శాతానికి తీసుకెళితే, అప్పుడు బ్యాంకుల నికర లాభం రూ.1,800 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల మేర ప్రభావితమవుతుందని వివరించింది. దీంతో బ్యాంకుల రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్వోఏ) 0.01–0.04 శాతం మేర, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) 0.07–0.4 శాతం మేర ప్రభావితం కావొచ్చని అంచనా వేసింది. -
‘కొత్త ఫండ్’ పథకానికి సెబీ కొత్త రూల్
న్యూఢిల్లీ: ఇకపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)లు తప్పనిసరిగా కొత్త ఫండ్ పథకం (NFO) నిధుల ను 30 రోజుల్లోగా వినియోగించవలసి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది.వెరసి ఏఎంసీలు ఎన్ఎఫ్వోలో భాగంగా సమీకరించిన నిధులను సంబంధిత పెట్టుబడుల కోసం 30 రోజుల్లోగా వెచ్చించవలసి ఉంటుంది. సెబీ తాజా స ర్క్యులర్ ప్రకారం ఇన్వెస్టర్లకు యూనిట్ల కేటాయింపు తదుపరి గడువు అమల్లోకి రానుంది. దీంతో మ్యూచువల్ ఫండ్ పథకాలలో తప్పుడు విక్రయాలకు తావివ్వకుండా సెబీ చెక్ పెట్టనుంది.పథకం సమాచార పత్రా(ఎస్ఐడీ)లలో ఏ ఎంసీలు నిధుల వినియోగ గడువు, కేటాయింపు తదితరాలను వెల్లడించవలసి ఉంటుంది. ఒకవేళ 30 పనిదినాల్లోగా నిధుల వినియోగా న్ని చేపట్టలేకపోతే.. కారణాలను వివరిస్తూ ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్ కమిటీకి లేఖ ద్వారా వెల్లడించవలసి ఉంటుంది. తద్వారా కమిటీ మరో 30 రోజుల గడువును ఇచ్చేందుకు వీలుంటుంది. -
రూ.260 కోట్లు.. ఆర్జనలోనూ అతివలే..
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఇప్పుడిప్పుడే ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ ప్రముఖ అంతర్జాతీయ ఆతిథ్య సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ.. మహిళల వ్యాపార పురోభివృద్ధిపై ఆసక్తికర విశేషాల్ని వెల్లడించింది.ఎయిర్‌బీఎన్‌బీలో భారతీయ మహిళా హోస్ట్‌లకు (హోటల్స్, పీజీలు అద్దెకిచ్చే వారు) 2024 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. వారు ఆ ఏడాదిలో రూ.260 కోట్లు ఆర్జించారు. ఇది ఆ ప్లాట్‌ఫామ్ ఆతిథ్య ల్యాండ్ స్కేప్‌కు గణనీయంగా దోహదం చేసింది. దేశంలోని ఎయిర్‌బీఎన్‌బీ హోస్ట్ లలో దాదాపు 30% ఉన్న మహిళలు సమ్మిళితతను పెంపొందించడం, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా సాంప్రదాయ ఆతిథ్య పరిశ్రమను పునర్నిర్మించారు. దేశవ్యాప్తంగా ట్రావెల్ అనుభవాలను పునర్నిర్వచించడంలో మహిళల ప్రాముఖ్యత పెరుగుతోందనడానికి వారి సాధనలే నిదర్శనం.పెరుగుతున్న మహిళా హోస్ట్లుదేశంలో మహిళా హోస్ట్‌లు గణనీయమైన విజయాన్ని సాధించారు. భారత్‌లో ఎయిర్‌బీఎన్‌బీ గెస్ట్ ఫేవరెట్ లిస్టింగ్స్‌లో దాదాపు 35% మహిళా హోస్ట్‌లే నిర్వహిస్తుంటం విశేషం. చిరస్మరణీయమైన, సౌకర్యవంతమైన బసలను అందించడంలో వారి అసాధారణ సామర్థ్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది. సుందరమైన ప్రదేశాలలో సౌకర్యవంతమైన హోమ్ స్టేల నుండి ఆధునిక పట్టణ అపార్ట్ మెంట్ల వరకు, మహిళలు సృజనాత్మకత, శ్రద్ధ, అతిథి అంచనాలపై లోతైన అవగాహనను ప్రదర్శించారు.భారతీయ మహిళల్లో ట్రావెల్ ట్రెండ్స్దేశీయ, అంతర్జాతీయ పర్యటనలకు ఎయిర్‌బీఎన్‌బీని భారత మహిళా ప్రయాణికులు వేదికగా ఎంచుకున్నారు. 2024లో భారతీయ మహిళా ప్రయాణికులకు అత్యంత డిమాండ్ ఉన్న దేశీయ గమ్యస్థానాలలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, పూణే, జైపూర్ ఉన్నాయి. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, బ్యాంకాక్, పారిస్, రోమ్ వంటి నగరాలు వారి ట్రావెల్ విష్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాయి.మిలీనియల్ మహిళలు (1981-1996 మధ్య పుట్టినవారు) తమ ప్రయాణ ప్రణాళికల కోసం ఎయిర్‌బీఎన్‌బీని ఉపయోగించడంలో ముందంజలో ఉన్నారు. వారి తరువాత వరుసలో జెన్‌జెడ్ మహిళలు (1996-2012 మధ్య పుట్టినవారు) ఉన్నారు. సౌలభ్యం, ప్రత్యేకమైన అనుభవాలు, స్థోమత కోసం వారి ప్రాధాన్యత ఎయిర్‌బీఎన్‌బీ ప్రజాదరణను పెంచింది. డుయో ట్రావెల్ అత్యంత ఇష్టమైన ట్రిప్ టైప్ గా అవతరించింది. తరువాత సమూహ ప్రయాణాలు, మహిళల్లో భాగస్వామ్య ప్రయాణ అనుభవాల పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. -
బంగారం వరుస తగ్గుదల
దేశంలో పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) రెండు రోజులుగా కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నేడు (March 7) వరుసగా రెండో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. అంతకుముందు వరుస పెరుగుదలతో బెంబేలెత్తించిన బంగారం ధరలు ఇప్పుడు క్షీణిస్తుండటంతో పసిడి ప్రియులు కుదటపడి కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తున్నారు.బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,900, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,160 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.300, రూ.330 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,310 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,050 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.330, రూ.300 చొప్పున క్షీణించాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,900 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,160 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.300, రూ.330 చొప్పున కరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు రివర్స్దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా వెండి ధరల్లో మాత్రం నేడు పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.100 పెరిగి రూ.1,08,100 వద్దకు చేరింది. ఇక ఢిల్లీలో కేజీ వెండి రూ. 99,100 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.100 పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
రూ. 1,100 కోట్ల లాభం వస్తుంది.. ఓయో అంచనా
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ. 1,100 కోట్ల నికర లాభం ఆర్జించగలమని ట్రావెల్ టెక్ స్టార్టప్ ఓయో అంచనా వేసింది. ఈ బాటలో రూ. 2,000 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించగలమని భావిస్తున్నట్లు యూనికార్న్ సంస్థ ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇందుకు ఆదాయంలో వృద్ధి దోహదపడగలదని అభిప్రాయపడ్డారు.ఇటీవల కొనుగోలు చేసిన మోటెల్ 6 తాజా అంచనాలకు దన్నుగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఈ కాలంలో మోటెల్ 6 ఇబిటా రూ. 630 కోట్లకు చేరగలదని ఓయో ఊహిస్తోంది. ఓయో కొనుగోలు చేశాక తొలిసారి మోటెల్ 6 పూర్తి ఏడాది పనితీరును వెల్లడించనుంది. వెరసి ఓయో సంయుక్త ఇబిటా రూ. 2,,000 కోట్లను తాకనున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఓయో రూ. 166 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో నమోదైన రూ. 25 కోట్లతో పోలిస్తే నికర లాభం ఆరు రెట్లు ఎగసింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) రూ. 457 కోట్ల నికర లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 111 కోట్ల నష్టం ప్రకటించింది. -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. బలహీనంగా ఐటీ, బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ ఈక్విటీ ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 176.47 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 74,163.62 వద్ద మొదలైంది. ఇక నిఫ్టీ 50 ప్రారంభ సమయానికి 40.85 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 22,503 వద్ద ఉంది.బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య నిఫ్టీ ఐటీ, ఎఫ్ ఎంసీజీ, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు ఎన్ఎస్ఈలో ప్రారంభ ట్రేడింగ్ లో ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ ఇండెక్స్ 0.97 శాతం, ఎఫ్ఎంసీజీ 0.12 శాతం, బ్యాంక్ 0.12 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం నష్టపోయాయి.విస్తృత మార్కెట్ సూచీలు ప్రారంభ ట్రేడింగ్ లో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.34 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.09 శాతం నష్టపోయాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తాయన్న భయాలే ఈ రోజు స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు కారణం కావచ్చు. యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం కిందకు వచ్చే కొన్ని కెనడా, మెక్సికో వస్తువులపై సుంకాలను ఏప్రిల్ 2 వరకు వాయిదా వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఇన్వెస్టర్లను శాంతపరచడంలో విఫలమైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..
గోల్డ్ లోన్లు (Gold Loans) పొందడం రానున్న రోజుల్లో అంత సులువు కాకపోవచ్చు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విభాగంలో అవకతవకలను అరికట్టడం, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారు రుణాలపై నిబంధనలను కఠినతరం చేయనుంది.బంగారు ఆభరణాలు, వస్తువులు హామీగా పెట్టి తీసుకునే రుణాలు ఇటీవల కాలంలో అసాధరణంగా పెరిగాయి. 2024 సెప్టెంబర్ నుండి బంగారు రుణాలు 50% పెరుగుదలను చూశాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అనైతిక పద్ధతులకు ఆస్కారం లేకుండా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFC) రుణ విధానాలను ప్రామాణికం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ చురుకైన చర్యలు తీసుకుంటోందని పరిశ్రమ వర్గాలతోపాటు ఆర్బీఐ ఆలోచనల గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది.కీలక ఆందోళనలు.. ప్రతిపాదిత మార్పులుగత 12 నుంచి 16 నెలలుగా ఆర్బీఐ నిర్వహించిన ఆడిట్లలో గోల్డ్ లోన్ రంగంలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. వాటిలో కొన్ని..సరిపోని నేపథ్య తనిఖీలు: తాకట్టు పెట్టిన బంగారం యాజమాన్యాన్ని ధ్రువీకరించడంలో, రుణగ్రహీతలపై క్షుణ్ణంగా శ్రద్ధ వహించడంలో బ్యాంకులు, రుణ సంస్థల లోపాలు కనిపించాయి.వాల్యుయేషన్ సమస్యలు: రుణగ్రహీత లేకుండా బంగారాన్ని మదింపు చేసిన సంఘటనలు, వాల్యుయేషన్ పద్ధతుల్లో అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి.అనైతిక పద్ధతులు: కొన్ని రుణ సంస్థలు డిఫాల్ట్ రుణగ్రహీతలకు తెలియజేయకుండా, పారదర్శక నిబంధనలను ఉల్లంఘించి తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేశాయి.ఔట్ సోర్సింగ్ ప్రమాదాలు: ప్రామాణిక ప్రోటోకాల్స్ ను దాటవేస్తూ బంగారాన్ని సేకరించడం, నిల్వ చేయడం, తూకం వేయడం వంటి పనులను ఫిన్ టెక్ ఏజెంట్లకు అప్పగించారు.ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్బీఐ కఠినమైన అండర్ రైటింగ్ విధానాలను అమలు చేయాలని, రుణ వినియోగాన్ని నిశితంగా పర్యవేక్షించాలని, రుణదాతలందరికీ ఒకే విధమైన మార్గదర్శకాలను నిర్ధారించాలని యోచిస్తోంది. థర్డ్ పార్టీ ఏజెంట్లపై అతిగా ఆధారపడటాన్ని నివారించడం, రుణ సంస్థలు బంగారం మదింపు, నిల్వ వంటి కీలకమైన ప్రక్రియలను స్వయంగా నిర్వహించేలా చూడటం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం.పరిశీలన ఎందుకు?ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారత్ లో రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరగడం, అన్ సెక్యూర్డ్ లెండింగ్ పై నిబంధనలను కఠినతరం చేయడంతో బంగారం రుణాలు పెరిగాయి. కుటుంబాలు సాంప్రదాయకంగా పండుగలు, వివాహాలకు బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. ఇది రుణాలను పొందడానికి విలువైన ఆస్తిగా మారుతుంది. ఏదేమైనా, ఈ విభాగం వేగవంతమైన వృద్ధి మొత్తం రుణ వృద్ధిని అధిగమించింది. దీంతో ఆర్బీఐ జోక్యం చేసుకుని రుణ పద్ధతులు నైతికంగా, పారదర్శకంగా ఉండేలా చూడటానికి ప్రేరేపించింది.రుణగ్రహీతలు, సంస్థలపై ప్రభావంప్రతిపాదిత మార్పులు రుణగ్రహీతలకు బంగారు రుణాలను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మారుస్తాయని భావిస్తున్నారు. అయితే కఠినమైన నిబంధనలు రుణాలను ప్రాసెస్ చేయడానికి అవసరమైన సమయం, శ్రమను కూడా పెంచుతాయి. దీంతో రుణగ్రహీతలకు త్వరగా నిధులను పొందడం కష్టతరం అవుతుంది. ఇక రుణ సంస్థల విషయానికి వస్తే.. బంగారు రుణాలకు సంబంధించి ఆర్బీఐ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ, సాంకేతికత, సమ్మతి చర్యలకు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరాన్ని కొత్త నిబంధనలు కల్పిస్తాయి. -
పసిడి పరుగులు.. ఇంకెంత పెరుగుతుందో?
-
క్యాస్ట్రాల్ ఇండియాపై అరామ్కో కన్ను
న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న లూబ్రికెంట్స్ తయారీ దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా కౌంటర్‌కు మరోసారి డిమాండ్ పెరిగింది. దీంతో బీఎస్ఈలో షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 246 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 10 శాతం ఎగసి రూ. 245 వద్ద నిలిచింది. ఒక దశలో 13.4 శాతం దూసుకెళ్లి రూ. 252 వద్ద గరిష్టానికి చేరింది.ఎన్ఎస్ఈలో 7.39 కోట్ల షేర్లు, బీఎస్ఈలో 23.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. బీపీ(గతంలో బ్రిటిష్ పెట్రోలియం)కు చెందిన లూబ్రికెంట్ బిజినెస్‌ను సౌదీ చమురు దిగ్గజం అరామ్కో కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు షేరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు క్యాస్ట్రాల్ ఇండియా బలపడింది. 10 బిలియన్ డాలర్లు.. క్యాస్ట్రాల్ బ్రాండుతో బీపీ.. లూబ్రికెంట్స్ విక్రయించే సంగతి తెలిసిందే. బీపీ ఇటీవల పునర్వ్యవస్థీకరణలో భాగంగా లూబ్రికెంట్స్ విభాగం విలువను దాదాపు 10 బిలియన్ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలుస్తోంది! కాగా.. వాల్వోలైన్ లూబ్రికెంట్స్ యూనిట్‌తో క్యాస్ట్రాల్ ఆస్తులను జత చేసే యోచనలో అరామ్కో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.2023లో 2.65 బిలియన్ డాలర్లకు వాల్వోలైన్‌ను అరామ్కో కొనుగోలు చేసింది. భారత్, చైనా, ఆగ్నేయ ఆసియాలో అదనపు రిఫైనింగ్, కెమికల్స్ బిజినెస్‌ల కొనుగోలుకి చూస్తున్నట్లు అరామ్కో గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా కొనుగోలుపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. -
ఓలా ఎలక్ట్రిక్‌కి పీఎల్ఐ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థలకు సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ–ఆటో స్కీమ్) కింద రూ. 73.74 కోట్లు లభించినట్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపై ఈ మొత్తం మంజూరు అయినట్లు వివరించింది. దీంతో ఈ స్కీము కింద ప్రోత్సాహకాలు అందుకున్న తొలి టూ వీలర్ ఈవీగా నిల్చినట్లు ఓలా ఎలక్ట్రిక్ వివరించింది.ఓలా ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో 28 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయంగా ఆటోమోటివ్ రంగంలో తయారీని, పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో పీఎల్ఐ–ఆటో స్కీమ్‌ను ప్రకటించింది. అయిదేళ్ల వ్యవధి కోసం దీనికి రూ. 25,938 కోట్లు కేటాయించింది. -
మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత
న్యూఢిల్లీ: మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం ఎస్ఎంఈ ఫోరమ్, నీతి ఆయోగ్ సంయుక్తంగా ‘ఏ మిలియన్ ఉమెన్ అరైజ్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాయి. దేశవ్యాప్తంగా 6 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలు ఉంటే, అందులో 35 శాతం మహిళల నిర్వహణలోనివేనని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ డైరెక్టర్ అంకితా పాండే ఈ సందర్భంగా తెలిపారు. అయినప్పటికీ లింగపరమైన పక్షపాతం, మార్కెట్లో పరిమిత అవకాశాల వంటి వినూత్న సవాళ్లను వారు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. సంఘటితం చేయడం, మార్గదర్శకం, సామర్థ్య నిర్మాణం, ఈ–కామర్స్‌తో అనుసంధానం ద్వారా ఈ అంతరాలను పరిష్కరించేందుకు ఎంఎస్ఎంఈ శాఖ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మహిళా వ్యాపారవేత్తలకు మద్దతుగా మహిళా ఎంటర్ప్రెన్యుర్షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యూఈపీ)ను ఏర్పాటు చేసినట్టు నీతి ఆయోగ్ డైరెక్టర్ అన్నారాయ్ తెలిపారు.మహిళ వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం, నిబంధనలపరమైన మద్దతు, నైపుణ్య కల్పన, మార్గదర్శకం, నెట్వర్కింగ్ పరంగా సాయమందించనున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్ సహకారంతో డబ్ల్యూఈపీ కార్యక్రమాన్ని లక్షలాది మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు చేరువ చేయగలమని ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మెరుగైన రవాణా పరిష్కారాలను అందించే లక్ష్యంతో ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగోతో ఎస్ఎంఈ ఫోరమ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా కుదుర్చుకుంది. రెట్టింపు సంఖ్యలో మహిళలకు రుణాలు: సరళ్ ఎస్సీఎఫ్ బ్లాక్‌సాయిల్ క్యాపిటల్‌కు చెందిన ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ‘సరళ్ ఎస్సీఎఫ్’ 2025లో రెట్టింపు మహిళా వ్యాపారవేత్తలకు సాయమందించాలనుకుంటోంది. ఇప్పటికే 150 మంది మహిళా వ్యాపారవేత్తలకు రూ.64 కోట్ల రుణాలను సమకూర్చినట్టు ప్రకటించింది. వృద్ధికి పెట్టుబడి, దీర్ఘకాల స్థిరత్వం దిశగా వారికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. 2024లో ఈ సంస్థ అంతక్రితం సంవత్సరంతో పోల్చితే 34 శాతం అధికంగా రూ.1,237 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు ప్రకటించింది. -
EPFO: క్షణాల్లో ఈపీఎఫ్‌వో విత్‌డ్రా
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈపీఫ్ఓవో సంస్థ ఈపీఎఫ్‌వో అకౌంట్లలో పలు కీలక మార్పులు చేపట్టింది. ఈపీఎఫ్‌వో క్లయిమ్, వివరాలను చేర్చడం, తొలగించడం, ఎగ్జిట్ అవ్వడాన్ని సులభతరం చేసింది.తాజాగా, ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఫోన్‌పే,గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఈపీఎఫ్‌వో విత్ర్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరుపుతుంది. సాధ్యసాధ్యాలను బట్టి సౌకర్యాన్ని ఈ ఏడాది మే, లేదా జూన్ నాటికి ప్రారంభించే యోచనలో ఈపీఎఫ్‌వో ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఈపీఎఫ్‌వో3.0లో ఏటీఎం ద్వారా ఈపీఎఫ్‌వో విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.ఉద్యోగులకు లభించే ప్రయోజనాలుయూపీఐ ద్వారా ఈపీఎఫ్‌వో విత్ డ్రా వల్ల ఉద్యోగలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డబ్బుల్ని తక్షణమే పొందవచ్చు. పారదర్శకతతో పాటు ఈపీవోఎఫ్వో విత్ డ్రా ప్రక్రియ మరింత సజావుగా జరగనుంది.ఈపీఎఫ్‌వో 3.0 ప్రారంభంఈపీఎఫ్వో 3.0 అమల్లోకి వస్తే, సభ్యులు తమ పొదుపులను సాధారణ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులను ఉపసంహరించుకోవడం మరింత సులభం అవుతుంది. -
అల్ట్రావయొలెట్ తొలి స్కూటర్ వచ్చేసింది..
ఎలక్ట్రిక్ బైక్‌లు తయారు చేసే అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ (Ultraviolette Tesseract) విడుదలతో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి బోల్డ్ ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో జరిగిన కంపెనీ "ఫాస్ట్ ఫార్వర్డ్ ఇండియా" కార్యక్రమంలో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌తోపాటు అడ్వెంచర్-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘షాక్ వేవ్’ను ఆవిష్కరించింది.ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్. మొదటి 10,000 కొనుగోలుదారులకు మాత్రమే రూ .1.20 లక్షలకు (ప్రారంభ ధర) లభిస్తుంది. ఆ తర్వాత రూ .1.45 లక్షలు పెట్టి కొనాల్సి ఉంటుంది. టెస్సరాక్ట్ అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే పనితీరును కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. 20.1 బీహెచ్నీ పవర్ మోటార్ తో నడిచే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను టెస్సెక్ట్ కలిగి ఉంది. రాడార్ అసిస్టెడ్ కొలిషన్ అలర్ట్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్ టేక్ అలర్ట్స్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ టెక్నాలజీలను ఇందులో పొందుపరిచారు. ఈ స్కూటర్లో విశాలమైన 34-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు. యుద్ధ హెలికాప్టర్ల ప్రేరణతో దీని సొగసైన డిజైన్‌ను రూపొందించారు.షాక్వేవ్.. తొలి ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్టెస్సెరాక్ట్ తో పాటు అల్ట్రావయోలెట్ భారతదేశపు మొట్టమొదటి రోడ్-లీగల్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో మోటార్ సైకిల్ అయిన షాక్ వేవ్ (Ultraviolette Tesseract) ను కూడా లాంచ్ చేసింది. మొదటి 1,000 కొనుగోలుదారులు రూ .1.50 లక్షలకు (ఆ తర్వాత రూ .1.75 లక్షలు) దీన్ని సొంతం చేసుకోవచ్చు. అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం ఈ బైక్‌ను రూపొందించారు. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈ బైక్ 165 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఈ బైక్ 2.9 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.షాక్వేవ్ కఠినమైన డిజైన్ లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, వైర్-స్పోక్ వీల్స్, డ్యూయల్-పర్పస్ టైర్లను కలిగి ఉంది. ఆఫ్-రోడ్‌తోపాటు పట్టణ భూభాగాలకు అనుకూలంగా ఉంటుంది. స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్లు, ఆరు లెవల్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
ఇండియా ‘హై రిచ్’..
భారత్ సంపన్నులకు నిలయంగా మారుతోంది. దేశంలో బిలియనీర్ల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్ వారి వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం.. 85,698 మంది 10 మిలియన్ డాలర్లకుపైగా ఆస్తులు కలిగిన హై నెట్‌వర్త్ వ్యక్తులతో (HNWI) భారత్ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక 2028 నాటికి భారతదేశ ఈ హెచ్ఎన్డబ్ల్యూఐ జనాభా 93,753 కు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.3.7 శాతం భారత్‌లోనే..ప్రపంచ హెచ్ఎన్డబ్ల్యూఐ జనాభాలో భారత్ 3.7% ఉందని నివేదిక హైలైట్ చేసింది. ఇది ప్రపంచ సంపద సృష్టిలో పెరుగుతున్న దేశ ప్రభావాన్ని సూచిస్తుంది. భారతదేశంలో హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంఖ్య సంవత్సరానికి 6% పెరిగింది. ఇది 2023 లో 80,686 నుండి 2024 నాటికి 85,698 కు పెరిగింది. ఈ వృద్ధికి దేశ బలమైన ఆర్థిక పనితీరు, పెరుగుతున్న పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల పెరుగుదల కారణం.బిలియనీర్లలో మూడో స్థానంభారతదేశ బిలియనీర్ల జనాభా కూడా గణనీయమైన వృద్ధిని చూసింది. 2024 లో సంవత్సరానికి 12% పెరిగింది. ప్రస్తుతం దేశంలో 191 మంది బిలియనీర్లు ఉండగా, వీరిలో 26 మంది గత ఏడాదిలోనే ఈ జాబితాలో చేరారు. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద 950 బిలియన్ డాలర్లుగా అంచనా. బిలియనీర్ సంపద పరంగా భారత్.. యునైటెడ్ స్టేట్స్, చైనా తరువాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద సంపద కేంద్రంగా ఉంది.లగ్జరీ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్భారతదేశంలో పెరుగుతున్న సంపద దాని సంపన్న వర్గాల ప్రాధాన్యతలలో ప్రతిబింబిస్తుంది. నైట్ ఫ్రాంక్ సర్వే ప్రకారం వీరిలో 46.5 శాతం మంది లగ్జరీ కార్లను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. 25.7 శాతం మంది హైఎండ్ ఇళ్లకు మొగ్గు చూపుతున్నారు. గ్లోబల్ లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లలో, ఢిల్లీ లగ్జరీ ప్రాపర్టీ ధరలు 2024 లో 6.7% పెరిగాయి, నైట్ ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్ఐ 100) లో ఇది 18వ స్థానాన్ని సంపాదించింది. ముంబై 21వ స్థానానికి చేరుకోగా, బెంగళూరు 40వ స్థానానికి ఎగబాకింది.అత్యంత లగ్జరీ వస్తువులు హ్యాండ్ బ్యాగులే.. 2024లో హ్యాండ్ బ్యాగులు టాప్ పెర్ఫార్మింగ్ లగ్జరీ అసెట్ క్లాస్ అని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ (కేఎఫ్ఎల్ఐఐ) వెల్లడించింది. వీటి ధరలు 2.8% పెరిగాయి. క్లాసిక్ కార్లు, ఆర్ట్ కలెక్షన్లు, ప్రైవేట్ జెట్లు కూడా పెట్టుబడిదారులలో ప్రజాదరణ పొందిన పెట్టుబడి వర్గాలుగా ఆవిర్భవించాయి. -
గిఫ్ట్ సిటీ ఫండ్స్‌లో భారీగా ఎన్నారైల పెట్టుబడులు
ముంబై: గిఫ్ట్ సిటీలోని ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లో ప్రవాస భారతీయులు దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (Investments) పెట్టినట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ చైర్మన్ కె రాజారామన్ తెలిపారు. అలాగే ఇతరత్రా బ్యాంకింగ్ సాధనాల్లో దాదాపు 5,000 మంది ఎన్నారైలు (NRIs) ఒకటిన్నర బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. గిఫ్ట్ సిటీలోని 30 బ్యాంకుల నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) 78 బిలియన్ డాలర్ల స్థాయిని దాటినట్లు వివరించారు. ఇందులో సుమారు 50 బిలియన్ డాలర్ల మొత్తాన్ని దేశీ కార్పొరేట్లు రుణాలుగా తీసుకున్నట్లు, ఇటీవలే ఒక బడా భారతీయ కార్పొరేట్ దిగ్గజం 3 బిలియన్ డాలర్ల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాజారామన్ చెప్పారు. ఐపీవోకి ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ దరఖాస్తు న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ ‘ప్రణవ్ కన్స్ట్రక్షన్స్’ ఐపీవోకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. రూ.392 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను ఐపీవోలో భాగంగా కంపెనీ విక్రయించనుంది. అలాగే, ప్రమోటర్‌తోపాటు ఇన్వెస్టర్ షేర్‌హోల్డర్ 28.57 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ రూపంలో విక్రయించనున్నారు. ఐపీవో (IPO) ద్వారా మొత్తం రూ.78 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళిక. తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో సమకూరే రూ.224 కోట్లను ప్రభుత్వ, చట్టపరమైన అనుమతులు, అదనపు ఫ్లోర్ స్పేస్ కొనుగోలుకు తదితర అవసరాలకు వినియోగించనుంది. రూ.74 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించనుంది. ఈ సంస్థ ప్రధానంగా ముంబై, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.అదానీ విల్మర్ చేతికి ‘టాప్స్’ న్యూఢిల్లీ: టాప్స్ బ్రాండుతో పచ్చళ్లు, సాస్‌లు తయారు చేసి విక్రయిస్తున్న జీడీ ఫుడ్స్‌ను కొనుగోలు చేసినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం అదానీ విల్మర్ (Adani Wilmer) తాజాగా పేర్కొంది. ఇందుకు జీడీ ఫుడ్స్ మ్యాన్యుఫాక్చరింగ్ (ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా తొలుత 80 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. తదుపరి మూడేళ్లలో మిగిలిన 20 శాతం వాటాను చేజిక్కించుకోనుంది.చదవండి: రియల్టీ ప్లాట్‌ఫామ్ సిలాలో ఎంఎస్ ధోని పెట్టుబడులు ఐపీఏ గూటికి క్వాలిటీ యానిమల్ ఫీడ్స్ ముంబై: ఇండియన్ పౌల్ట్రీ అలయెన్స్(ఐపీఏ) తాజాగా క్వాలిటీ యానిమల్ ఫీడ్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 300 కోట్లు వెచ్చించినట్లు అల్లన గ్రూప్ అనుబంధ సంస్థ ఐపీఏ వెల్లడించింది. తాజా కొనుగోలు ద్వారా దేశీ పౌల్ట్రీ పరిశ్రమలో పటిష్టపడనున్నట్లు ఐపీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ ఫ్రోజెన్ హలాల్ మీట్, తృణధాన్యాలతోపాటు ఫ్రూట్ పల్ప్‌లు, కాఫీ, పెట్ ఫుడ్ తదితర కన్జూమర్ ప్రొడక్టుల తయారీ, ఎగుమతులను చేపడుతోంది. -
ఇన్వెస్టర్లూ.. ఇలాంటి స్కామ్‌లపై జాగ్రత్త!
అత్యంత మోసపూరితమైన ఆర్థిక నేరాల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ (investment fraud) కూడా ఒకటి. టెక్నాలజీతో పాటు స్కాములు కూడా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి సైకలాజికల్ మోసాల బారిన పడకుండా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (NPCI) ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తోంది.ఆర్థిక నిపుణుల ముసుగులో, పేరొందిన సంస్థల పేరిట ఎండార్స్మెంట్స్తోనూ, కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఫేక్ వీడియోలను ఉపయోగించి మోసగాళ్లు అమాయకులకు వల వేస్తారు. అసాధారణమైన రాబడులొస్తాయని, విశిష్టమైన పెట్టుబడి అవకాశాలని, పరిమిత కాలం పాటే ఉండే డీల్స్ అంటూ కనీసం ఆలోచించుకోనివ్వకుండా ఇన్వెస్ట్ చేసేలా ప్రేరేపిస్తారు. ఇక ఇన్వెస్ట్ చేసిన వెంటనే మోసగాళ్లు ఠక్కున మాయమైపోతారు లేదా తాము మోసపోతున్నాననే విషయాన్ని బాధితులు గ్రహించే వరకు వారి నుంచి డబ్బు లాగుతూనే ఉంటారు.ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్‌లో రకాలుఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలు, యాప్‌లు: స్కామర్లు అచ్చం చట్టబద్ధమైన బ్రోకర్లు, ఫండ్ హౌస్‌లు లేదా ఎక్స్చేంజీలవిగా అనిపించే బోగస్ ఇన్వెస్ట్మెంట్ యాప్‌లు లేదా వెబ్సైట్లను తయారు చేస్తారు. ఫేక్ స్క్రీన్లపై వర్చువల్ లాభాలను చూపించడం ద్వారా డబ్బు డిపాజిట్ చేసేలా తొలుత యూజర్లను వలలోకి లాగుతారు. యూజర్లు గణనీయమైన మొత్తాలను ఇన్వెస్ట్ చేశాక, వారు ఆ నిధులను విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుపడతారు.డిస్కౌంట్ ధరల్లో షేర్లు: ఎవరికీ అంతగా తెలియని, అతి తక్కువ వాల్యూమ్స్‌తో ట్రేడయ్యే షేర్లను మోసగాళ్లు ప్రమోట్ చేస్తారు. ముందుగా అతి కొద్ది మంది క్లయింట్లకు మాత్రమే, భారీగా డిస్కౌంట్ రేట్లకు అవి లభిస్తాయని నమ్మబలుకుతారు. దురుద్దేశపూరితంగా, ఎక్స్చేంజ్ లేదా బ్రోకింగ్ హౌస్‌లకు కాకుండా తమ వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను బదిలీ చేయాలంటూ ఇన్వెస్టర్లను కోరతారు. షేర్ల ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు గడించొచ్చని మభ్యపెడుతూ, ఈ తరహా స్కామ్‌లలో మోసగాళ్లు సాధారణంగా లక్షల్లో భారీ ఎత్తున నిధులను కొల్లగొడతారు.ఫేక్ జాబ్ స్కామ్‌లు: సోషల్ మీడియా పేజీలను లైక్ చేయడం లేదా లేదా రివ్యూలు రాయడంలాంటి తేలికైన పనులు చేసే ఉద్యోగాలిచ్చే కంపెనీల ముసుగులో స్కామర్లు సంప్రదించవచ్చు. నమ్మకాన్ని చూరగొనేందుకు ముందు కాస్త మొత్తం చెల్లించవచ్చు. ఆ తర్వాత ప్రాథమిక పెట్టుబడుల అవకాశాలంటూ చిన్న చిన్న కొనుగోళ్లు జరిపేలా బాధితులను మోసగిస్తారు. ఆ తర్వాతెప్పుడో ఈ స్కీముల మోసపూరిత స్వభావం బయటపడుతుంది.పోంజి, పిరమిడ్ స్కీములు: ఈ తరహా స్కాముల్లో అధిక రాబడులు వస్తాయని ఇన్వెస్టర్లకు నమ్మబలుకుతారు. తొలుత వచ్చిన ఇన్వెస్టర్లకు వాస్తవ లాభాలను కాకుండా కొత్త ఇన్వెస్టర్ల నుంచి వచ్చే డబ్బు నుంచి చెల్లిస్తారు. కొత్తగా డబ్బు రావడం ఆగిపోతే ఇవి కుప్పకూలిపోతాయి.స్కామ్‌ల నుంచి ఇలా దూరంగా ఉండండి..ఇన్వెస్ట్ చేసే ముందు ధ్రువీకరించుకోవాలి: ఆయా సంస్థలు రిజిస్టర్ అయినవా లేదా అనేది సెబీ (SEBI), ఆర్బీఐ (RBI) లేదా ఇతరత్రా అధికారిక నియంత్రణ సంస్థల వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలి.అధిక రాబడుల హామీలపై అప్రమత్తంగా ఉండాలి: ఏదైనా పెట్టుబడి నమ్మశక్యం కానంతగా బాగుందనిపిస్తోందంటే, అది మ్ అయి ఉండొచ్చు.ఒత్తిళ్లకు తలొగ్గవద్దు: చట్టబద్ధమైన పెట్టుబడులను చేసేందుకు అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదువెబ్సైట్, ఈమెయిల్‌ను చెక్ చేసుకోవాలి: HTTPS, అధికారిక డొమైన్ పేర్లు చూసుకోవాలి, అవాంఛిత లింకులపై క్లిక్ చేయకూడదు.వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయొద్దు: మోసపుచ్చేందుకు, డబ్బు కాజేసేందుకు మోసగాళ్లు వీటిని ఉపయోగించుకుంటారు.అనుమానాస్పద నంబర్ల గురించి 1930కి డయల్ చేయడం ద్వారా నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్‌కి లేదా టెలికం డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయండి. మెసేజీలను సేవ్ చేసుకోండి. స్క్రీన్షాట్లు తీసుకోండి. సంప్రదింపుల వివరాలను భద్రపర్చుకోండి. -
ఎస్బీఐ కొత్త స్కీమ్.. మామూలు కంటే ఎక్కువ వడ్డీ
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వారికి సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికను అందించడం, వారి పదవీ విరమణ సంవత్సరాల్లో స్థిరమైన రాబడి, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం.పథకం ముఖ్య లక్షణాలుఅధిక వడ్డీ రేట్లు: సీనియర్ సిటిజన్లు సాధారణ డిపాజిటర్లకు అందించే ప్రామాణిక ఎఫ్డీ రేట్ల కంటే 0.50% అదనపు వడ్డీ రేటు నుండి ప్రయోజనం పొందుతారు. దీంతో వారి పెట్టుబడులపై అధిక రాబడులు లభిస్తాయి.ఫ్లెక్సిబుల్ కాలపరిమితి ఎంపికలు: ఈ పథకం అనేక రకాల కాలపరిమితి ఎంపికలను అందిస్తుంది. కస్టమర్లు వారి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వ్యవధిని ఎంచుకోవచ్చు. కాలపరిమితి స్వల్పకాలిక డిపాజిట్ల నుంచి 10 ఏళ్ల వరకు దీర్ఘకాలిక ఎంపికల వరకు ఉంటుంది.త్రైమాసిక చెల్లింపు: క్రమానుగత ఆదాయాన్ని కోరుకునేవారికి, ఈ పథకం త్రైమాసిక చెల్లింపు ఎంపికను అందిస్తుంది. లిక్విడిటీ, స్థిరమైన నగదు ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది.సేఫ్టీ అండ్ సెక్యూరిటీ: ప్రభుత్వ మద్దతుతో చేపట్టిన ఈ పథకం డిపాజిట్ల భద్రతకు హామీ ఇస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద డిపాజిట్లకు రూ .5 లక్షల వరకు బీమా ఉంటుంది.అర్హత, దరఖాస్తు ప్రక్రియ60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు ఏదైనా ఎస్బీఐ శాఖను సందర్శించి లేదా బ్యాంక్ అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ కూడా సరళంగానే ఉంటుంది. వయస్సు, గుర్తింపు, చిరునామా రుజువు వంటి ప్రాథమిక డాక్యుమెంటేషన్ ఉంటే చాలు. -
నిఫ్టీ వరుస నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 1 శాతానికి పైగా లాభపడి స్థిరపడ్డాయి. 30 షేర్ల సెన్సెక్స్ 740.30 పాయింట్లు లేదా 1.01 శాతం పెరిగి 73,730.23 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 50 254.65 పాయింట్లు లేదా 1.15 శాతం పెరిగి 22,337.30 వద్ద స్థిరపడింది, తద్వారా 10 రోజుల నష్టాల పరంపరకు ముగింపు పలికింది. బుధవారం సూచీ 22,394.90 నుంచి 22,067.80 రేంజ్లో ట్రేడ్ అయింది. మంగళవారం వరకు వరుసగా 10 ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 50 ఇండెక్స్ 3.8 శాతం లేదా 877 పాయింట్లు నష్టపోయింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 46 లాభాల్లో స్థిరపడగా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 5.15 శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఇండియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు 3.37 శాతం వరకు నష్టపోయాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 2.96 శాతం లాభంతో ముగియడంతో స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2.42 శాతం లాభంతో సానుకూలంగా ముగిసింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4.04 శాతం లాభపడటంతో ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, మీడియా సూచీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. -
స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్
-
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్లిమిటెడ్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చవక ధరలో దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లతో ప్రైవేట్ టెల్కోలకు సవాలు విసురుతోంది. ప్రైవేట్ ఆపరేటర్లు ఇటీవల ధరలను పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ప్లాన్లు దాని వినియోగదారుల సంఖ్య పెరగడానికి దారితీశాయి. గత కొన్ని నెలల్లో మిలియన్ల మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కి మారారు.బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 70 రోజులు, 90 రోజులు, 150 రోజులు, 160 రోజులు, 336 రోజులు, 365 రోజులు, 425 రోజుల ఎంపికలతో సహా కొన్ని సుదీర్ఘ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ఇప్పుడు 180 రోజుల ప్లాన్ ప్రవేశపెట్టింది. తరచూ రీచార్జ్ చేసుకునే ఇబ్బందిని తొలగించే లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ కొత్త ఆరు నెలల ప్లాన్ అత్యంత అనువుగా ఉంటుంది.రూ.897 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ కొత్త రూ .897 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్‌తో పూర్తి ఆరు నెలలు (180 రోజులు) వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులు ఇకపై నెలవారీ రీఛార్జ్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మార్కెట్లో అత్యంత చౌకైన ప్లాన్లలో ఒకటి. ఇక మిగతా ప్రయోజనాల విషయానికి వస్తే మొత్తంగా 90 జీబీ లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. -
ఐటీ అధికారులకు కొత్త అధికారాలు
ఆదాయ పన్ను శాఖ అధికారులకు కొత్త అధికారాలు రానున్నాయి. అనుమానం వస్తే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఇ-మెయిల్స్, బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ ఖాతాలపై దర్యాప్తు చేసే చట్టబద్ధమైన హక్కు ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది. మీరు పన్నులు ఎగ్గొట్టారని లేదా ఏదైనా అప్రకటిత ఆస్తులు, నగదు, బంగారం, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అనుమానం వస్తే వారు మీ ఖాతాలను దర్యాప్తు చేయవచ్చు.ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు కింద ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ఎకానమిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఆర్థిక మోసాలు, అప్రకటిత ఆస్తులు, పన్ను ఎగవేతలను నిరోధించడంలో భాగంగా డిజిటల్ యుగానికి అనుగుణంగా పన్ను దర్యాప్తు ప్రక్రియకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 132 ప్రకారం, పన్ను ఎగవేత ఉద్దేశంతో ఎవరైనా తన ఆదాయం, ఆస్తులు లేదా ఆర్థిక వివరాలను దాచినట్లు విశ్వసనీయ సమాచారం ఉంటే పన్ను అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేయవచ్చు.అప్రకటిత ఆస్తులు, ఆర్థిక రికార్డులు దాగి ఉన్నాయని అనుమానం వస్తే తలుపులు, సేఫ్ లు, లాకర్లు పగులగొట్టి దర్యాప్తు చేసే అధికారం ఇప్పటి వరకు వారికి ఉండేది. కానీ 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ అధికారాలు డిజిటల్ సాధనాలకు కూడా విస్తరిస్తారు. అంటే పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం దాచినట్లు అనుమానించినట్లయితే కంప్యూటర్ సిస్టమ్‌లు, ఆన్లైన్ ఖాతాలను యాక్సెస్ చేసే హక్కు కూడా అధికారులకు ఉంటుంది.ఆర్థిక లావాదేవీలు డిజిటల్ గా మారడంతో పన్ను అధికారుల దర్యాప్తు ప్రక్రియ కూడా ఆధునికంగా మారుతోంది. పన్ను దర్యాప్తులో డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ కొత్త చట్టం చెబుతోంది. అయితే, పన్ను ఎగవేతను అరికట్టడంలో ఈ మార్పు ప్రభావవంతంగా ఉంటుందా లేక గోప్యత ఆందోళనలను లేవనెత్తుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
ఉక్రెయిన్ ఖనిజ కాంతులు
అమెరికా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన ఖనిజాల ఒప్పందంపై సఫలీకృతం కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన వివాదాస్పద ఓవల్ ఆఫీస్ సమావేశం తర్వాత అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఆశించిన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు జరగలేదు.ప్రతిపాదిత పునర్నిర్మాణ పెట్టుబడి నిధి "ఖనిజాలు, హైడ్రోకార్బన్లు, చమురు, వాయు నిక్షేపాలను" సూచిస్తోంది. మరీ ముఖ్యంగా లౌడ్ స్పీకర్లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లతో సహా హైటెక్ ఉత్పత్తుల తయారీకి కీలకమైన లోహాలపై ట్రంప్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.ఓ వైపు రష్యాతో యుద్ధం.. మరో వైపు అమెరికాతో ఖనిజాల ఒప్పందం నేపథ్యంలో ఉక్రెయిన్ ఖనిజ సంపద ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజ వనరులను కలిగి ఉన్నట్లు ఉక్రెయిన్ చెప్పుకుంటోంది. దీని ప్రకారం.. ఇది ఐరోపాలో అత్యంత ఖనిజ వనరులు కలిగిన దేశాలలో ఉక్రెయిన్ ఒకటి. ఇక్కడ లిథియం, టైటానియం, యురేనియం నిల్వలు అధికంగా ఉన్నాయి.ఖనిజ వనరుల సంపదఉక్రేనియన్ జియాలజికల్ సర్వే నుండి వచ్చిన డేటా ప్రకారం ఉక్రెయిన్ ప్రపంచంలోని ఖనిజ వనరులలో సుమారు 5% కలిగి ఉంది. వీటిలో అమెరికా కీలకమైనవిగా భావించే 50 పదార్థాలలో 23 ఉన్నాయి. ఉక్రెయిన్ వైవిధ్యమైన భౌగోళిక భూభాగం విలువైన ఖనిజాల విస్తృత శ్రేణికి నిలయంగా ఉంది.లిథియం నిల్వలుఉక్రెయిన్ ఐరోపాలో అతిపెద్ద లిథియం నిల్వలను కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి నిల్వలలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలకు కీలకమైన భాగం. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వైపు మళ్లడం వల్ల లిథియంకు పెరుగుతున్న డిమాండ్ ఉక్రెయిన్ లిథియం నిక్షేపాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలిజేస్తోంది.టైటానియం నిల్వలుఏరోస్పేస్, సైనిక, వైద్య అనువర్తనాలకు కీలక లోహమైన టైటానియం నిల్వలు ఉక్రెయిన్‌లోనే అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో వెలికితీస్తున్న టైటానియం ఖనిజంలో 7 శాతం ఇక్కడి నుంచే వస్తోంది.యురేనియం నిల్వలులిథియం టైటానియంతో పాటు , ఉక్రెయిన్ ఐరోపాలో అతిపెద్ద యురేనియం నిల్వలకు నిలయంగా ఉంది. ఇది అణుశక్తి ఉత్పత్తికి ఒక కీలక వనరు. ఇక్కడి యురేనియం నిక్షేపాలు ప్రపంచ ఇంధన అవసరాలకు సహకరిస్తూ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి.భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ప్రభావాలుఉక్రెయిన్ ఖనిజ సంపద వ్యూహాత్మక ప్రాముఖ్యత అతిశయోక్తి కాదు. డిఫెన్స్, హైటెక్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ వంటి పరిశ్రమలకు ఈ వనరుల అందుబాటు కీలకం. రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ, కీలకమైన ఖనిజాల కోసం ప్రపంచ పోటీ ఉక్రెయిన్ నిక్షేపాలపై ఆసక్తిని పెంచింది.సవాళ్లు.. అవకాశాలుఉక్రెయిన్ ఖనిజ సంపద గణనీయమైన అవకాశాలను అందిస్తుండగా, పరిగణించవలసిన సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్ కు గణనీయమైన మూలధన పెట్టుబడి సాంకేతిక నైపుణ్యం అవసరం. అదనంగా, రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ మైనింగ్ కార్యకలాపాల స్థిరత్వం భద్రతకు ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, అవసరమైన వనరుల ప్రధాన ప్రపంచ సరఫరాదారుగా ఉక్రెయిన్ సామర్థ్యం బలంగా ఉంది. ఈ దేశం తన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం గణనీయమైన ఆర్థిక లాభాలను ఇస్తుంది. ప్రపంచ సరఫరా గొలుసుల వైవిధ్యతకు దోహదం చేస్తుంది. -
ఉద్యోగులకు ఈ మార్చి ఇంత దారుణంగా ఉంటుందా?
ఈ మార్చి (March 2025) నెల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పాలిట దారుణంగా ఉండబోతోంది. ఈనెలలో దాదాపు 100 కంపెనీలు ఉద్యోగుల తొలగింపును (Lay Off) ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఈ తొలగింపులు వివిధ పరిశ్రమలలో విస్తరించి ఉన్నాయి. ఇది మహమ్మారి అనంతరం వ్యాపారాలు ఎదుర్కొంటున్న విస్తృత ఆర్థిక సవాళ్లను ప్రతిబింబిస్తుంది.వార్నింగ్ నోటీసులుఈ మేరకు ప్రభావిత ఉద్యోగులకు ఇప్పటికే యాజమాన్యాలు వార్న్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఎస్‌లోని వర్కర్ అడ్జస్ట్ మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (వార్న్) చట్టం ప్రకారం జాబ్స్ రిస్క్‌లో ఉంటే ఆయా కంపెనీలు ఉద్యోగులకు ముందస్తు నోటీసు ఇవ్వాలి. పెద్ద ఎత్తున తొలగింపులు, మూసివేతలకు ఉద్యోగులు, యాజమాన్యాలు, కమ్యూనిటీలు సిద్ధం కావడానికి ఈ చట్టపరమైన ఆవశ్యకత సహాయపడుతుంది. ఈ తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్య ఒక్కో కంపెనీకి 10 నుంచి 500 వరకు ఉంటుంది.కొన్ని ప్రముఖ కంపెనీలు ఇవే..టెక్ లేఆఫ్స్ పతాక శీర్షికల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, తొలగింపులు టెక్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జోన్ ఫ్యాబ్రిక్స్, వాల్‌గ్రీన్స్ వంటి రిటైలర్లు ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉంది. ఇంటెల్, ఫెడెక్స్, నీమన్ మార్కస్, జాన్ డీర్ ఈ జాబితాలోని ఇతర గుర్తించదగిన కంపెనీలుగా ఉన్నాయి.వచ్చే మూడేళ్లలో 150 స్టోర్లను మూసివేసే బృహత్తర వ్యూహంలో భాగంగా 66 స్టోర్లను మూసివేసే యోచనలో ఉన్నట్లు మాకీస్ ప్రకటించింది. రిటైల్ పరిశ్రమలో మార్పులకు అనుగుణంగా కాలిఫోర్నియా, ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగులను కూడా వాల్‌గ్రీన్స్ వదులుకుంటోంది.ఇది చదివారా? ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..ఆర్థిక కారకాలుఈ విస్తృతమైన తొలగింపులకు అనేక అంశాలు దోహదం చేస్తాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లు రుణాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని పెంచాయి. అదనంగా, ద్రవ్యోల్బణం నిర్వహణ ఖర్చులను పెంచింది. వ్యాపారాలు లాభదాయకంగా ఉండటం సవాలుగా మారింది. వినియోగదారుల ప్రవర్తన, డిమాండ్ లో మార్పులు కూడా అనేక కంపెనీల ఆర్థిక కష్టాలకు కారణమయ్యాయి.ఆటోమేషన్.. పునర్నిర్మాణంఆటోమేషన్కు ఊతమివ్వడమే ఈ ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి కంపెనీలు ఉద్యోగాలను ఆటోమేటెడ్ సొల్యూషన్లతో భర్తీ చేయాలని చూస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా కంపెనీలు తమ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఆటో, ఐటీ నేలచూపు
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మంగళవారం నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 96.01 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణించి 72,989.93 వద్ద స్థిరపడింది. ఈరోజు సూచీ 73,033.18-72,633.54 రేంజ్లో ట్రేడ్ అయింది.అలాగే నిఫ్టీ 50 36.65 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 22,082.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,105.05 వద్ద, ఇంట్రాడేలో 21,964.60 వద్ద కనిష్టాన్ని తాకింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 28 షేర్లు నష్టాల్లో ముగియగా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్ షేర్లు 4.95 శాతం వరకు నష్టపోయాయి. ఎస్బీఐ, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 3.03 శాతం వరకు లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.69 శాతం, 0.05 శాతం పెరిగాయి. ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగియగా, పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు 2.37 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల సూచీలు 1.31 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ స్వల్పంగా 0.08 శాతం నష్టపోయింది. -
టీవీఎస్ జూపిటర్ కొత్త బండి లాంచ్
టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అధునాతన ఎమిషన్ టెక్నాలజీలను ఇందులో టీవీఎస్ వినియోగించింది. కొత్త టీవీఎస్ జూపిటర్ 110 బేస్ డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధరను రూ .76,691గా (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది.వేరియంట్లు.. ధరలు2025 టీవీఎస్ జూపిటర్ 110 విభిన్న కస్టమర్ ప్రాధాన్యతలను తీర్చడానికి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ డ్రమ్ వేరియంట్ ధర రూ.76,691. ఇది అన్నింటిలో కాస్త తక్కువ ఖరీదు మోడల్. డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.82,441. ఇది మెరుగైన లుక్, మన్నిక కోసం అల్లాయ్ వీల్స్ ను అందిస్తుంది. డ్రమ్ ఎస్ఎక్స్సీ వేరియంట్ ధర రూ.85,991. ఇందులో అదనపు స్టైలింగ్, కన్వీనియన్స్ ఫీచర్లు ఉన్నాయి. డిస్క్ ఎస్‌ఎక్స్‌సి వేరియంట్ రూ .89,791 ధరతో మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.OBD-2B ప్రయోజనాలుOBD-2B (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్) టెక్నాలజీ అనేది సరికొత్త అప్ గ్రేడ్. ఇది క్లిష్టమైన ఇంజిన్ ఉద్గార పారామీటర్ల రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తుంది. అధునాతన సెన్సార్లతో కూడిన టీవీఎస్ జూపిటర్ 110 థ్రోటిల్ రెస్పాన్స్, ఎయిర్-ఫ్యూయల్ రేషియో, ఇంజిన్ టెంపరేచర్, ఫ్యూయల్ క్వాంటిటీ, ఇంజిన్ వేగాన్ని ట్రాక్ చేయగలదు. ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సరైన పనితీరు, మెరుగైన మన్నిక, తక్కువ ఉద్గారాలను ధృవీకరించడానికి ఈ డేటాను రియల్ టైమ్ లో ప్రాసెస్ చేస్తుంది. ఇది స్కూటర్ ను దాని జీవితచక్రం అంతటా క్లీనర్‌గా, మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేస్తుంది.ఇంజిన్, పనితీరుకొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్లో 113.3సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ ఇచ్చారు. ఇది 6,500 ఆర్పీఎం వద్ద 5.9 కిలోవాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ అసిస్ట్ తో 5,000 ఆర్పీఎం వద్ద 9.8 ఎన్ఎం టార్క్, 5,000 ఆర్పీఎం వద్ద 9.2 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్ యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. సౌకర్యవంతమైన, స్థిరమైన రైడ్ కోసం రూపొందించిన ఈ స్కూటర్లో 1,275 మిమీ వీల్ బేస్, 163 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మైలురాయిడిజైన్, ఫీచర్లుటీవీఎస్ జూపిటర్ 110లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్లైట్లు, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, నావిగేషన్, ఐగో అసిస్ట్, హజార్డ్ ల్యాంప్స్, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది రెండు వైపులా 12-అంగుళాల వీల్స్ ఉంటాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు , వెనుక భాగంలో మోనో-షాక్ ను కలిగి ఉంది. రెండు వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లు అధిక ట్రిమ్ లలో లభిస్తాయి. -
దేశ ఉక్కు సంకల్పం.. టాటా
టాటా గ్రూప్ లో భాగమైన టాటా స్టీల్ లిమిటెడ్ భౌగోళికంగా ప్రపంచంలోని అత్యంత వైవిధ్యభరితమైన ఉక్కు ఉత్పత్తిదారులలో ఒకటి. 1907లో జంషెడ్జీ నుస్సెర్వాన్‌జీ టాటా చేత టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ (టిస్కో) గా స్థాపితమైన ఈ సంస్థ ఉక్కు పరిశ్రమలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టాటా స్టీల్ భారత్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్ డమ్ లలో కీలక కార్యకలాపాలతో 26 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.జేఎన్ టాటా జయంతిటాటా స్టీల్ దార్శనిక వ్యవస్థాపకుడు, క్లుప్తంగా జెఎన్ టాటా అని పిలిచే జంషెడ్జీ నుస్సెర్వాన్‌జీ టాటా జయంతి మార్చి 3న. ఈసారి 186వ జయంతిని ఆ సంస్థ సగర్వంగా జరుపుకుంటోంది. దేశ అత్యంత ఐకానిక్ కంపెనీలలో ఒకదానికి పునాది వేసిన మార్గదర్శక స్ఫూర్తి, పారిశ్రామిక ఔన్నత్యానికి అచంచలమైన నిబద్ధత ఉన్న వ్యక్తికి నివాళిగా ఆయన జయంతిని ఫౌండర్ డేగా నిర్వహిస్తున్నారు.దూరదృష్టి గల నాయకుడు1839 మార్చి 3న గుజరాత్ లో జన్మించిన జేఎన్ టాటా భారత పారిశ్రామిక ముఖచిత్రాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన దార్శనిక పారిశ్రామికవేత్త. 1870 లలో మధ్య భారతదేశంలో ఒక వస్త్ర మిల్లుతో ఆయన వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభమైంది. అయితే, ఆయన దార్శనికత వస్త్ర వ్యాపారాన్ని దాటి విస్తరించింది. భారత్ ను పారిశ్రామిక దేశాల సరసన నిలిపే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలన్నది జేఎన్ టాటా కల. 1907లో టాటా స్టీల్ స్థాపనతో ఈ కల సాకారమైంది. ఇది భారతదేశ ఉక్కు పరిశ్రమకు నాంది పలికింది.టాటా స్టీల్ ఘనతలు● 2024 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రూప్ దాదాపు 27.7 బిలియన్ డాలర్ల ఏకీకృత టర్నోవర్‌ను నమోదు చేసింది.● గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థగా గుర్తింపు పొందిన టాటా స్టీల్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్లు, జాయింట్ వెంచర్లతో కలిసి, 78,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో ఐదు ఖండాలలో విస్తరించి ఉంది.● టాటా స్టీల్ 2045 నాటికి నికర జీరోతో సహా దాని ప్రధాన స్థిరత్వ లక్ష్యాలను ప్రకటించింది.● కంపెనీ తన జంషెడ్పూర్, కళింగనగర్ , ఐజేముదీన్ ప్లాంట్లకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ లైట్‌హౌస్ గుర్తింపును అందుకుంది. టాటా స్టీల్‌ను ఎకనామిక్ టైమ్స్ సీఐఓ 'డిజిటల్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఇండియా - స్టీల్' అవార్డు 2024తో గుర్తించింది.● ఈ కంపెనీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ డైవర్సిటీ ఈక్విటీ & ఇంక్లూజన్ లైట్‌హౌస్ 2023తో గుర్తింపు పొందింది.● ఈ కంపెనీ 2012 నుండి డీజేఎస్ఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో భాగంగా ఉంది. 2016 నుండి డీజేఎస్ఐ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్లో టాప్ 10 స్టీల్ కంపెనీలలో స్థిరంగా స్థానం సంపాదించుకుంది.● టాటా స్టీల్ జంషెడ్పూర్ ప్లాంట్ భారతదేశంలో రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి సైట్. తదనంతరం కళింగనగర్, మెరామండలి ప్లాంట్లు కూడా సర్టిఫికేషన్ పొందాయి దేశంలో, టాటా స్టీల్ ఇప్పుడు దాని ఉక్కు ఉత్పత్తిలో 90% కంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫైడ్ సైట్ల నుండి కలిగి ఉంది.● 2016-17 సంవత్సరానికి ఉత్తమ పనితీరు కనబరిచిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గా ప్రైమ్ మినిస్టర్స్ ట్రోపీ, 2024లో వరల్డ్ స్టీల్ నుంచి వరుసగా ఏడు సంవత్సరాలు స్టీల్ సస్టైనబిలిటీ ఛాంపియన్ గుర్తింపు, సీడీపీ ద్వారా 2023 క్లైమేట్ చేంజ్ లీడర్షిప్ అవార్డు, 2022లో డన్ & బ్రాడ్‌స్ట్రీట్ టాప్ 500 కంపెనీలలో అగ్రగామి, బ్రాండ్ ఫైనాన్స్ ద్వారా దేశంలో 2024 అత్యంత విలువైన మైనింగ్ అండ్ మెటల్స్ బ్రాండ్‌గా ర్యాంక్, ఎథిస్పియర్ ఇన్స్టిట్యూట్ నుండి 2021లో 'మోస్ట్ ఎథికల్ కంపెనీ' అవార్డు, స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2024లో 'బెస్ట్ కార్పొరేట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్' గుర్తింపును పొందింది.● 2023 గ్లోబల్ ఈఆర్ఎం (ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్) అవార్డు ఆఫ్ డిస్టింక్షన్, వరుసగా ఎనిమిదవ సంవత్సరం 'మాస్టర్స్ ఆఫ్ రిస్క్' - మెటల్స్ & మైనింగ్ సెక్టార్ గుర్తింపు, ఐసీఎస్ఐ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ అవార్డు 2023 అందుకుంది. -
యాక్సిస్ నుంచి.. కొత్త ‘ఫండ్’ గురూ..!
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ నిఫ్టీ ఎఎఎ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ – మార్చ్ 2028 ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇది, నిఫ్టీ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్కు, మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కు ఉంటుంది.దీనికి ఫండ్ మేనేజరుగా హార్దిక్ షా వ్యవహరిస్తారు. ఈ న్యూ ఫండ్‌కి నిఫ్టీ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. మార్చ్ 4 వరకు ఎన్ఎఫ్వో అందుబాటులో ఉంటుంది.ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో అత్యంత నాణ్యమైన, ఎఎఎ–రేటింగ్ ఉన్న సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ కొత్త స్కీము అవకాశం కల్పిస్తుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ – సీఈవో బి. గోప్‌కుమార్ తెలిపారు. రిస్కులు, రాబడుల మధ్య సమతౌల్యాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని వివరించారు. -
నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మైలురాయి
నిస్సాన్ మోటార్ ఇండియా తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ నిస్సాన్ మాగ్నైట్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించింది. స్వచ్ఛమైన, మరింత స్థిరమైన ఇంధన ఎంపికల కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అనుగుణంగా ఈ వాహనం ఇప్పుడు పూర్తిగా ఈ20 అనుకూలమైనదిగా మారింది. అదేకాకుండా మాగ్నైట్ అద్భుతమైన ఎగుమతి మైలురాయిని సాధించింది, 2020 లో లాంచ్ అయినప్పటి నుండి 50,000 యూనిట్లను దాటింది.ఈ20 కంపాటబిలిటీనిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ బీఆర్ 10 పెట్రోల్ ఇంజన్ ను ఈ20 కంప్లైంట్ గా అప్ గ్రేడ్ చేశారు. ఇది ఇప్పటికే ఈ20 కంపాటబుల్ గా ఉన్న 1.0-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజిన్ కు జతయింది. 20% ఇథనాల్, 80% గ్యాసోలిన్ కలిగి ఉన్న ఈ20 ఇంధనం.. కర్బన ఉద్గారాలు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ విస్తృత వ్యూహంలో భాగం. న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ 71బీహెచ్పీ పవర్, 96ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టర్బోఛార్జ్ డ్ ఇంజన్ 98బీహెచ్పీ పవర్, 160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కోసం ట్రాన్స్మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) ఉన్నాయి. టర్బోఛార్జ్డ్ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (సీవీటీ) తో లభిస్తుంది.ఎగుమతి మైలురాయిమాగ్నైట్ విడుదల చేసినప్పటి నుండి 50,000 యూనిట్ల ఎగుమతి మార్కును అధిగమించిందని నిస్సాన్ మోటార్ ఇండియా నివేదించింది. జనవరిలో మాగ్నైట్ లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వేరియంట్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించింది. చెన్నైలోని కామరాజర్ పోర్ట్ నుండి లాటిన్ అమెరికన్ మార్కెట్లకు దాదాపు 2,900 యూనిట్లను రవాణా చేసింది. ఫిబ్రవరి నాటికి, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోని మార్కెట్లకు 10,000 యూనిట్లకు పైగా మాగ్నైట్ ఎగుమతి అయింది. -
తాత్కాలిక ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తి
ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్ (తాత్కాలిక, కాంట్రాక్ట్ ఆధారిత, నిర్ణీత పనివేళలు లేని... ఉద్యోగశ్రేణి) వృద్ధికి ఫార్మల్ స్టాఫింగ్ కంపెనీలు మార్గం సుగమం చేస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగేతర.. తాత్కాలిక ఉద్యోగాల స్థితిగతుల గురించి ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) వారి ఫ్లెక్సీ ఎంప్లాయ్మెంట్ సోషల్ ఇంపాక్ట్ రిపోర్ట్ 2024 వెల్లడించింది.నివేదిక ప్రకారం ఫ్లెక్సీ ఎంప్లాయ్మెంట్ అనేది మహిళలు, యువత తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులతో సహా విభిన్న సమూహాలకు సాధికారత కల్పిస్తోంది. అదే సమయంలో శాశ్వత ఉద్యోగ అవకాశాలకు స్పష్టమైన మార్గాలను అందిస్తుంది.. దాదాపు 23% తాత్కాలిక కార్మికులు ఫార్మల్ స్టాఫింగ్ ఇండస్ట్రీ ద్వారా శాశ్వత ఉద్యోగాలకు మళ్లారు.ఫ్లెక్సీ వర్కర్లలో 79% మంది మూడు నెలల పాటు అసైన్మెంట్లలో ఉన్నారని, 6–12 నెలలు పొడిగించిన కాంట్రాక్టులలో సంవత్సరానికి 40% పెరుగుదల ఉందని నివేదిక వెల్లడించింది. ఈ మార్పు అనువైన ఉపాధిలో ఎక్కువ స్థిరత్వాన్ని సూచిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మంది కార్మికులు దీర్ఘకాలిక అసైన్మెంట్లను పొందుతారు.అదనంగా, ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌లో 78% మంది ఆరు నెలలకు మించి కాంట్రాక్ట్‌లలో పాల్గొంటున్నారు. ఇది ఫ్లెక్సీ పనుల దీర్ఘకాలిక ప్రయోజనాలపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తుందని నివేదిక తెలిపింది. 60% తాత్కాలిక కార్మికులు సామాజిక భద్రత, సకాలంలో వేతనాలు, వైద్య కవరేజీ వంటి ప్రయోజనాల ద్వారా ఆకర్షితులవుతారని తేల్చింది. ఈ కార్మికులలో 78% మంది తమ ఉద్యోగ పరిస్థితుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. -
శాంసంగ్ నుంచి మూడు కొత్త స్మార్ట్ఫోన్లు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన గెలాక్సీ ఎ-సిరీస్ లైనప్‌లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. అవి శాంసంగ్ గెలాక్సీ ఎ56, గెలాక్సీ ఎ36, గెలాక్సీ ఎ26. ఆకట్టుకునే ఫీచర్లు, ఆకర్షణీయ ధరలో విస్తృత శ్రేణి వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ డివైజ్ లను రూపొందించారు. వీటిలో ఏయే స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధరలెంత అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..గెలాక్సీ ఎ56గెలాక్సీ ఎ56 కొత్త లైనప్ లో ఫ్లాగ్ షిప్ మోడల్. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1580 చిప్ సెట్ తో నడిచే ఏ56 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను అందిస్తుంది.. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ డ్యూయల్ 5జీ సిమ్ కార్డులకు సపోర్ట్ చేస్తుంది.కెమెరా సామర్థ్యాల విషయానికి వస్తే, గెలాక్సీ ఎ56లో విభిన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.గెలాక్సీ ఎ56 మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ఆసమ్ ఆలివ్, ఆసమ్ లైట్గ్రే, ఆసమ్ గ్రాఫైట్. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.41,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.44,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.47,999గానూ కంపెనీ నిర్ణయించింది.గెలాక్సీ ఏ36గెలాక్సీ ఎ36 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో సహా అనేక ఫీచర్లను ఎ56లో మోడల్లో ఉన్నట్లుగానే ఉంటాయి. అయితే ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ను అందించారు. ఏ36లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇచ్చారు.గెలాక్సీ ఏ36లో కెమెరా సెటప్ విషయానికి వస్తే ఓఐఎస్‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. ఎ56 మాదిరిగానే ఎ36 కూడా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.గెలాక్సీ ఎ36 లావెండర్, బ్లాక్, వైట్ రంగులలో లభిస్తుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.32,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.35,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.38,999గానూ నిర్ణయించారు.గెలాక్సీ ఏ26గెలాక్సీ ఎ26 కొత్త లైనప్ లో అత్యంత చవక మోడల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + సూపర్ అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు.గెలాక్సీ ఏ26లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ ఉంది.గెలాక్సీ ఏ26 ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బ్లాక్, వైట్, మింట్, పీచ్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. -
కరూర్ వైశ్యా బ్యాంక్ కొత్త శాఖలు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూర్‌తో పాటు తమిళనాడులో కొత్తగా ఆరు శాఖలను ప్రారంభించినట్లు ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ వెల్లడించింది. ఇవి సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, డిపాజిట్లు, రుణాలు తదితర బ్యాంకింగ్ సర్వీసులను సమగ్రంగా అందిస్తాయని బ్యాంక్ తెలిపింది.2024–25లో కొత్తగా 35 శాఖలను ప్రారంభించినట్లు, మొత్తం బ్రాంచీల సంఖ్య 877కి చేరినట్లు వివరించింది. కస్టమర్లకు అనుకూలంగా ఉండేలా తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ కేవీబీ డిలైట్‌ను 150 పైచిలుకు ఫీచర్లతో మెరుగుపర్చినట్లు పేర్కొంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆఖరు నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపార పరిమాణం రూ. 1,81,993 కోట్లకు చేరింది. తొమ్మిది నెలల కాలానికి నికర లాభం రూ. 1,428 కోట్లుగా నమోదైంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సోమవారం సెషన్‌ను నష్టాలతో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 112.16 పాయింట్లు (0.15 శాతం) క్షీణించి 73,085.94 వద్ద స్థిరపడింది. ఈరోజు సూచీ 73,649.72 - 72,784.54 రేంజ్లో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కేవలం 5.40 పాయింట్లు లేదా 0.02 శాతం క్షీణించి 22,119.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 రోజు గరిష్ట స్థాయి 22,261 వద్ద, రోజు కనిష్ట స్థాయి 22,004 వద్ద నమోదయ్యాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.14 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ సోమవారం 0.27 శాతం నష్టపోయింది. భారత్ ఎలక్ట్రానిక్స్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 4.65 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీ 50లోని 50 షేర్లలో 33 షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం భారతదేశపు అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.17 శాతం క్షీణించింది.నిఫ్టీ 50లో కోల్ ఇండియా, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.44 శాతం వరకు నష్టపోయాయి. సెక్టోరల్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ సూచీలు 1.26 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా సూచీలు 1.10 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. -
ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల వేతన పెంపును 5-8 శాతం మధ్య ప్రకటించి ఉద్యోగులను నిరాశ పరిచింది. టీఈఎస్‌లో కూడా శాలరీ హైక్ శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందన్న నివేదికలు వచ్చాయి. తాజగా మరో మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా ఉద్యోగులకు బ్యాడ్ న్యూసే చెప్పింది.వేతన పెంపు వాయిదాఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ ఉద్యోగులనుద్దేశించి మాట్లడుతూ బోనస్ లు, జీతాల పెంపు ఆలస్యంతో సహా కంపెనీ వేతన పెంపు ప్రణాళికలపై అప్ డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్ లో అమలు జరగాల్సిన జీతాల పెంపును ఆగస్టుకు వాయిదా వేయడంపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని అంగీకరించారు. అయితే వాగ్దానం చేసిన పెంపుదలను గౌరవించడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా జాప్యం ఒక వ్యూహాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.వేతన ప్రణాళికలుబోనస్ స్ట్రక్చర్ గురించి కూడా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ చర్చించారు. అర్హత కలిగిన ఉద్యోగులు తమ బోనస్ లను ప్రణాళిక ప్రకారం పొందుతారని ధృవీకరించారు. ఇంటర్నల్ మెమో ప్రకారం మార్చి 10లోగా ఉద్యోగులు తమ బోనస్ లకు సంబంధించిన ఈ లెటర్లను ఆశించవచ్చు. పనితీరును ప్రతిఫలించడం, పోటీ వేతన ప్యాకేజీలను నిర్వహించడంలో కంపెనీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.విస్తృత ఆర్థిక నేపథ్యంఅనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితులు ఐటీ పరిశ్రమను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వేతనాల పెంపులో జాప్యం జరుగుతోంది. ఈ సవాళ్లను నావిగేట్ చేస్తూ ఆపరేటింగ్ మార్జిన్లను పెంచడం, ఆఫీస్ స్పేస్‌ను ఆప్టిమైజ్ చేసుకోవడంపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. ప్రతిభను నిలుపుకోవడం, మార్కెట్లో పోటీగా నిలవడం అనే ఉద్దేశంతో కంపెనీ ఈ ప్రయత్నాలను బ్యాలెన్స్ చేస్తోంది.ఉద్యోగుల ప్రతిస్పందనవేతనాల పెంపు ఆలస్యం గురించి ముందుగానే ప్రస్తావించడం ఉద్యోగుల్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. కొంతమంది దీనిని అట్రిషన్ తగ్గించడానికి మనోధైర్యాన్ని పెంచే చర్యగా భావిస్తుండగా మరికొందరు అదనపు ఒత్తిడి, వారి ఆర్థిక ప్రణాళికపై పడనున్న ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పటికీ పారదర్శకత, ఉద్యోగులకు విలువ ఉండేలా చూడటం పట్ల రవికుమార్ నిబద్ధత సానుకూల పరిణామమని నిపుణులు సూచిస్తున్నారు. -
హైదరాబాద్‌లో రూ.1,500 కోట్ల రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ (Real Estate) ప్రాజెక్ట్ రాబోతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో తన ముద్రను విస్తరించడానికి జువారీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ జువారి ఇన్‌ఫ్రావరల్డ్ ఇండియా లిమిటెడ్ (జువారీ ఇన్ఫ్రా) గంగోత్రి డెవలపర్స్‌తో డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లోని కొల్లూరు మైక్రో మార్కెట్ లో సుమారు 9.4 ఎకరాల విస్తీర్ణంలో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడమే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం లక్ష్యం.1,730 అపార్ట్మెంట్లు"జువారి గంగోత్రి త్రిభుజ" పేరుతో చేపట్టిన ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కొల్లూరు మైక్రో మార్కెట్ లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టులో 1,730 విశాలమైన మూడు, నాలుగు పడక గదుల అపార్ట్మెంట్లతో కూడిన తొమ్మిది ఎత్తైన టవర్లు ఉంటాయి. రూ.1,500 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ సుమారు 3.8 మిలియన్ చదరపు అడుగుల అమ్మకపు విస్తీర్ణాన్ని, సుమారు 5.3 మిలియన్ చదరపు అడుగుల మొత్తం అభివృద్ధి ప్రాంతాన్ని కలిగి ఉంటుంది.ఒప్పందం పరిధిడెవలప్మెంట్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ కింద బ్రాండింగ్, మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం), నిర్మాణ పర్యవేక్షణతో సహా సమగ్ర నిర్వహణ సేవలను జువారీ ఇన్ఫ్రా అందిస్తుంది. ఈ సహకారం రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో జువారీ ఇన్ఫ్రా నైపుణ్యాన్ని, గంగోత్రి డెవలపర్స్ నిర్మాణ సామర్థ్యాలను ప్రపంచ స్థాయి రెసిడెన్షియల్ ప్రాజెక్టును అందించడానికి ఉపయోగిస్తుంది.ఇది చదివారా? హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు.. ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ హుషారుసౌకర్యాలు, ఫీచర్లుఈ ప్రాజెక్ట్ అక్కడ నివసించేవారి జీవన అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన జీవనశైలి సౌకర్యాల శ్రేణిని అందిస్తుంది. స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, క్రీడా సౌకర్యాలు, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్లతో సహా 50కి పైగా జీవనశైలి సౌకర్యాలతో పాటు సుమారు 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక గ్రాండ్ క్లబ్ హౌస్ ప్రధాన ఫీచర్‌గా ఉంటుంది. ఆధునిక నగరవాసుల అవసరాలను తీర్చడం ద్వారా స్థిరమైన జీవన వాతావరణాన్ని అందించడం ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లక్ష్యం.వ్యూహాత్మక స్థానంవ్యూహాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 2కు కేవలం రెండు నిమిషాల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలక వ్యాపార కేంద్రాలకు అద్భుతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ స్థానం ప్రధాన ఉపాధి కేంద్రాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలకు అందుబాటులో ఉంటుంది. ఈ సౌలభ్యాన్నీ కోరుకునే గృహ కొనుగోలుదారులకు ఇది అనువైన ఎంపికగా మారుతుంది. -
కష్టజీవులపై చలానాస్త్రం! ‘రూ.9.6 లక్షలు పిండేశాం’
నగరాలలో పొట్టకూటి కోసం చిరుద్యోగాలు చేసుకునే కష్టజీవులు చాలా మంది కనిపిస్తారు. వీరిలో ముఖ్యంగా ఈ-కామర్స్ సంస్థలకు డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తూ పొట్టపోసుకునేవారే ఎక్కువ. రోజంతా రోడ్లపై తిరుగుతూ కష్టపడితే పదో పాతికో సంపాదిస్తారు. వీళ్లనే టార్గెట్ చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. చిన్న చిన్న ఉల్లంఘనల పేరుతో జరిమానాల రూపంలో లక్షల రూపాయలు పిండేశారు.నిబంధనలు ఉల్లంఘించే ఈ-కామర్స్ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు శనివారం (మార్చి 1) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 1,859 మంది నుంచి జరిమానాల రూపంలో రూ.9.6 లక్షలు వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడటం రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా, ఈ-కామర్స్ డెలివరీ వాహనాల ద్వారా పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిష్కరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.స్పెషల్ డ్రైవ్ లో ఎక్కువగా ఈ-బైకులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించామని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) ఎంఎన్ అనుచేత్ తెలిపారు. ఈ వాహనాలు ఎక్కువగా మైక్రో మొబిలిటీ వాహనాలు, వాటి వినియోగదారులకు నిబంధనలు తెలియవు. మైక్రో మొబిలిటీ వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు లేవని, వాటి వినియోగదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.చిరు ఉల్లంఘనలుఫుట్ పాత్ లపై ప్రయాణించినందుకు 79 మంది, నో ఎంట్రీ నిబంధనను ఉల్లంఘించినందుకు 389 మంది, వన్ వేకు విరుద్ధంగా ప్రయాణించినందుకు 354 మంది, సిగ్నల్ జంప్ చేసినందుకు 209 మంది, హెల్మెట్ ధరించనందుకు 582 మంది, రాంగ్ పార్కింగ్ చేసినందుకు 98 మంది, ట్రాఫిక్ కు ఆటంకం కలిగించినందుకు 148 మందిని పోలీసులు పట్టుకున్నారు. అక్కడికక్కడే జరిమానా చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు లేవని రైడర్లు చెప్పడంతో పోలీసులు 794 వాహనాలకు నోటీసులు జారీ చేశారు.అవగాహన లేమిచాలా మంది రైడర్లు తమకు నిబంధనలపై అవగాహన లేదని చెప్పడంతో, వారికి గంటకు పైగా ఆయా పరిధుల్లో రూల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు అనుచేత్ తెలిపారు. ఈ-కామర్స్ కు అనుబంధంగా ఉన్న ఎల్లోబోర్డు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీన్ని పోలీసులు ఖండించారు. వాహనం నంబర్ ప్లేట్ రంగుతో సంబంధం లేకుండా ఈ-కామర్స్ డెలివరీ కోసం ఉపయోగించే అన్ని రకాల వాహనాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేసినట్లు అనుచేత్ తెలిపారు. -
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
పెరుగుతున్న నష్టాలు.. ముప్పులో 1,000 ఉద్యోగాలు
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (Ola Electric) నష్టాలతో సతమతమవుతోంది. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలలో భాగంగా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని (Lay off) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెరిగిన పోటీ, నియంత్రణ పరిశీలన, నిర్వహణ వ్యయాలతో కంపెనీకి సవాలుతో కూడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది.ఇదీ నేపథ్యం..ప్రొక్యూర్మెంట్, ఫుల్ ఫిల్ మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాలపై ఈ ఉద్యోగ కోతలు ప్రభావం చూపే అవకాశం ఉంది. 2023 నవంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే 500 మంది ఉద్యోగులను తొలగించింది. 2024 మార్చి నాటికి ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 4,000 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో నాలుగో వంతుకు పైగా తాజా తొలగింపుల ప్రభావానికి గురికానున్నారు. అయితే కంపెనీ బహిరంగ వెల్లడిలో భాగం కాని కాంట్రాక్ట్ కార్మికులను చేర్చడం వల్ల ఖచ్చితమైన ప్రభావం అస్పష్టంగా ఉంది.ఆర్థిక ఇబ్బందులుఓలా ఎలక్ట్రిక్ గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నష్టాలు 50% పెరిగాయి. ఆగస్టు 2023 లో బలమైన ఐపీఓ అరంగేట్రం తరువాత కంపెనీ స్టాక్ గరిష్ట స్థాయి నుండి 60 శాతానికి పైగా పడిపోయింది. ఉద్యోగుల తొలగింపు వార్తలు కంపెనీ షేరును మరింత ప్రభావితం చేశాయి. ఇది 5% పడిపోయి 52 వారాల కనిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులూ.. 60 గంటలు కష్టపడితేనే.. కోఫౌండర్ పిలుపువ్యూహాత్మక పునర్నిర్మాణంపునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి కస్టమర్ అనుభవాన్ని పెంచడానికి తన కస్టమర్ సర్వీస్ కార్యకలాపాలలో కొన్ని విభాగాలను ఆటోమేట్ చేస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీ తన లాజిస్టిక్స్, డెలివరీ వ్యూహాలను పునరుద్ధరిస్తోంది. ఓలా షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో ఫ్రంట్ ఎండ్ సేల్స్, సర్వీస్, వేర్‌హౌస్ సిబ్బంది తొలగింపుతో ప్రభావితమయ్యారు.మార్కెట్ స్థానం.. పోటీఒకప్పుడు భారతదేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలవుతోంది. డిసెంబర్ లో బజాజ్ ఆటో లిమిటెడ్ ఓలా ఎలక్ట్రిక్ ను అధిగమించి అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ గా టీవీఎస్ మోటార్ కంపెనీ తరువాత మూడవ స్థానానికి చేరుకుంది. వాహన రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వ డేటా ప్రకారం 2023 చివరి నాటికి దేశంలోని టాప్ 10 ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లలో తొమ్మిదింటిలో ఓలా ఎలక్ట్రిక్ తన నాయకత్వ స్థానాన్ని కోల్పోయింది.భవిష్యత్తు కోసం ప్రయత్నాలుసవాళ్లు ఉన్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ తన మార్కెట్ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తన పరిధిని విస్తరించడానికి, సర్వీస్ నాణ్యత గురించి వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కంపెనీ ఇటీవల 2023 డిసెంబర్లో 3,200 కొత్త అవుట్లెట్లను ప్రారంభించింది. ఏదేమైనా అధిక మొత్తంలో కస్టమర్ ఫిర్యాదులు, ఎబిటాను చేరుకోవడానికి దాని అమ్మకాల లక్ష్యాలను సాధించాల్సిన అవసరంతో సహా కంపెనీ గట్టి అడ్డంకులను ఎదుర్కొంటోంది. -
బట్టలు ఉతికే రోబో... ఇదే
బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్స్ వచ్చినా కూడా చాలామంది మురికి బట్టలను చేతితోనే ఉతుకుతుంటారు. పైగా బట్టలను వాషింగ్ మెషిన్లో లోడ్ చేయటం, ఉతికిన బట్టలను తిరిగి అన్లోడ్ చేసి ఆరేయటం అంతా మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది ఈ రోబో.ఏఐ టెక్స్టైల్ ప్రాసెసింగ్, పాయింట్ క్లౌడ్ ఆధారిత అల్గారిథంతో తయారు చేసిన ఈ రోబో ఎలాంటి బట్టల మురికినైనా, చేతితో రుద్ది రుద్ది పోగొడుతుంది. తెల్ల బట్టలను ఒక రకంగా, రంగు పోయే దుస్తులను ఒక విధంగా ఇలా.. ఏ రకం దుస్తులను ఏ విధంగా ఉతకాలో ఆ విధంగానే ఉతుకుతుంది.వాషింగ్ మెషిన్ కేవలం బట్టలను ఉతకడం మాత్రమే చేస్తుంది. కాని, ఈ రోబో బట్టలను ఆరేస్తుంది. ఆరేసిన బట్టలను మడతపెడుతుంది. ఆర్డర్ ఇస్తే ఇస్త్రీ కూడా చేస్తుంది. బాగుంది కదూ! త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. -
ఉద్యోగులూ.. 60 గంటలు కష్టపడితేనే..
ఉద్యోగుల పని గంటల గురించి రోజుకో చర్చ నడుస్తోంది. యాజమాన్యాలు పనిఒత్తిడి పెంచి తమకు వ్యక్తిగత, కుటుంబంతో గడిపే సమయాన్ని దూరం చేస్తున్నాయని ఓవైపు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు పరిశ్రమ ప్రముఖులు, వ్యాపారాధినేతలు దీనిపై విభిన్న వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్.. వారానికి 60 గంటలు కష్టపడాలని తమ ఉద్యోగులను కోరారు.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అభివృద్ధిని వేగవంతం చేయడానికి సాహసోపేతమైన చర్యలో, గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ మోడళ్లలో పనిచేసే ఉద్యోగులు వారానికి 60 గంటలు పని చేసే విధానాన్ని అవలంబించాలని, రోజూ ఆఫీస్‌కు రావాలని సెర్గీ బ్రిన్ పిలుపునిచ్చారు. అంతర్గత మెమోలో పేర్కొన్న ఈ ఆదేశం, యంత్రాలు మానవ మేధస్సును మించిన మైలురాయి అయిన ఏజీఐని సాధించే రేసులో పెరిగిన అత్యవసరతను, పోటీ ఒత్తిడిని తెలియజేస్తోంది.తుది రేసు మొదలైందికృత్రిమ మేధ పరిశ్రమలో పోటీ తీవ్రమైన నేపథ్యంలో బ్రిన్ ఇచ్చిన ఈ పిలుపునకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా 2022లో చాట్‌జీపీటీని ప్రారంభించిన తరువాత ఏఐ పరిశ్రమలో పోటీ పెరిగింది. ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వేగవంతమైన పురోగతిని ప్రేరేపించింది. "ఏజీఐకి తుది రేసు ప్రారంభమైంది" అని బ్రిన్ తన మెమోలో పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ప్రయత్నాలను "టర్బోచార్జ్" చేస్తే.. ఈ రేసులో గెలవడానికి అవసరమైన అన్ని అంశాలు గూగుల్ వద్ద ఉన్నాయన్నారు.ఉత్పాదకతకు ప్రమాణంవారానికి 60 గంటలు పనిచేయడం ఉత్పాదకత ప్రమాణాన్ని సూచిస్తుందని, అదే ఈ పరిమితిని మించితే బర్న్అవుట్కు దారితీస్తుందని కూడా బ్రిన్ హెచ్చరించారు. మరోవైపు ఉద్యోగులు 60 గంటల కంటే తక్కువ పని చేయడంపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రవర్తన "అనుత్పాదకంగా ఉండటమే కాకుండా, ఇతరులకు చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది" అని పేర్కొన్నారు. బ్రిన్ సిఫార్సులు కార్పొరేట్ అమెరికాలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ కంపెనీలు ఉత్పాదకత, టీమ్ వర్క్ ను పెంచడానికి హైబ్రిడ్ పని విధానాలను తిప్పికొడుతున్నాయి.సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏఐ వినియోగంఎక్కువ పని గంటల కోసం వాదించడంతో పాటు, వారి కోడింగ్, పరిశోధన సామర్థ్యాలను పెంచడానికి గూగుల్ స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించాలని బ్రిన్ ఉద్యోగులను కోరారు. "మన స్వంత కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన కోడర్లు, ఏఐ శాస్త్రవేత్తలుగా మారాలి" అని జెమినీ టీమ్ సభ్యులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.ఈ విధానం ఏజీఐని సాధించడంలో ఏఐ ఆధారిత స్వీయ-మెరుగుదల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.వర్క్‌ఫోర్స్‌పై ప్రభావంమరింత కఠినమైన పని షెడ్యూళ్ల కోసం బ్రిన్ చేస్తున్న ఒత్తిడి ఏజీఐ అభివృద్ధిలో గూగుల్ నాయకత్వం వహించాలనే ఆయన దార్శనికతను ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఇది శ్రామిక శక్తిపై ప్రభావాన్ని గురించి కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఏజీఐని సాధించాల్సిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది గూగుల్‌లో సాంకేతిక పురోగతి అత్యవసరతను ప్రతిబింబిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో పోటీ తీవ్రమవుతున్న తరుణంలో ఏఐ బృందానికి బ్రిన్ ఆదేశం గూగుల్ కు కీలక సమయంలో వచ్చింది. -
హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు
దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్ డేటా సెంటర్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల పెట్టుబడులు, డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ డేటా సెంటర్ల వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 47 లక్షల చ.అ.ల్లో 213 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 27 లక్షల చ.అ.ల్లో 186 మెగావాట్లు నిర్మాణ దశలో, 24 లక్షల చ.అ.ల్లో 168 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 35 ఆక్యుపెన్సీ బ్యాకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) విభాగానిదే.. ఆ తర్వాత 30 శాతం ఐటీ రంగం, 20 శాతం క్లౌడ్ సర్వీస్ విభాగం, ఇతరుల వాటా 15 శాతంగా ఉంది. డేటా సెంటర్ల నెలవారీ ఛార్జీలు కిలోవాట్‌కు రూ.6,650 నుంచి 8,500లుగా ఉన్నాయి.ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. అత్యంత వేగంగా నగరం డేటా సెంటర్ల హాట్‌స్పాట్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 10 లక్షల చ.అ.ల్లో 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉండగా.. మరో 3 లక్షల చ.అ.ల్లో 20 మెగావాట్లు నిర్మాణంలో, 5 లక్షల చ.అ.ల్లో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో మైక్రోసాఫ్ట్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పలు సంస్థలు డేటా సెంటర్లున్నాయి. గచ్చిబౌలి, మేకగూడ, షాద్‌నగర్, చందన్‌వ్యాలీ వంటి పలు ప్రాంతాల్లో మరిన్ని డేటా సెంటర్లు రానున్నాయి.రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలు.. ప్రత్యేకమైన డేటా సెంటర్ పాలసీలు పెట్టుబడిదారులకు స్పష్టమైన, నిర్మాణాత్మక కార్యచరణకు దోహదపడతాయి. దీంతో ఆయా నగరాల్లో పెట్టుబడుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో గణనీయమైన రాయితీలు, విద్యుత్ టారీఫ్‌లలో తగ్గుదల, గణనీయమైన పన్ను మినహాయింపులు దక్షిణ దేశంలో డేటా సెంటర్ల పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. విద్యుత్, టెలీకమ్యూనికేషన్స్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు అధిక వేగం, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఇది డేటా సెంటర్ల కార్యకలాపాలకు కీలక అంశం. సరళీకృత విధానాలు, వేగవంతమైన అనుమతి ప్రక్రియలు, బ్యూరోక్రాట్స్ నియంత్రణల తగ్గింపులు వంటివి డేటా సెంటర్ల ప్రాజెక్ట్‌లను ప్రోత్సహిస్తున్నాయి.చెన్నై, బెంగళూరులో.. జలాంతర్గామి కేబుల్ కనెక్టివిటీని అందించే వ్యూహాత్మక తీర ప్రాంతం కారణంగా చెన్నై ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారింది. ప్రస్తుతం చెన్నైలో 17 లక్షల చ.అ.ల్లో 87 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 23 లక్షల చ.అ.ల్లో 156 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. 16 లక్షల చ.అ.ల్లో 104 మెగావాట్లు ప్రణాళికలో ఉంది. అనుకూల వాతావరణం, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు వంటివి చెన్నైని డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి. బెంగళూరు: సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ప్రస్తుతం 20 లక్షల చ.అ.ల్లో 79 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లున్నాయి. మరో లక్ష చ.అ.ల్లో 10 మెగావాట్లు నిర్మాణంలో, 3 లక్షల చ.అ.ల్లో 26 మెగావాట్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. బలమైన సాంకేతిక నైపుణ్యం, నిపుణుల లభ్యత బెంగళూరు డేటా సెంటర్ల మార్కెట్‌కు చోదకశక్తిగా నిలుస్తున్నాయి.ఐఓటీతో డిమాండ్.. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), క్లౌడ్ సర్వీస్‌లు, ఎంటర్‌ప్రైజ్‌ల డిజిటలైజేషన్ పెరుగుదల కారణంగా డేటా సెంటర్ల డిమాండ్ మరింత పెరుగుతుందని కొల్లియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ హెడ్ స్వాప్నిల్ అనిల్ అభిప్రాయపడ్డారు. 2030 నాటికి దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యంలో 80 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. -
మార్చిలో 12 రోజులు స్టాక్ మార్కెట్ క్లోజ్!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగియనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ నెలలో ట్రేడింగ్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ట్రేడింగ్‌ను బాగా ప్లాన్ చేయడానికి మార్చి నెలలో స్టాక్ మార్కెట్ ఏయే రోజుల్లో పనిచేస్తుంది.. ఎప్పుడు మూసివేత ఉంటుంది అన్నది తెలుసుకోవడం మంచిది. ఈ హాలిడే క్యాలెండర్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు జారీ చేస్తాయి. తమ అధికారిక వెబ్ సైట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.బీఎస్ఈ ప్రతి సంవత్సరం పూర్తి ట్రేడింగ్ హాలిడేస్ జాబితాను ప్రచురిస్తుంది. సాధారణంగా ఈ జాబితాలో పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులు ఉంటాయి. బడ్జెట్ సమర్పణ వంటి ప్రత్యేక సందర్భాలు మినహా అన్ని వారాంతాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. అందువల్ల మార్కెట్ షెడ్యూల్‌ను తెలుసుకుని తదనుగుణంగా ట్రేడింగ్‌ను ప్లాన్ చేయడానికి ఇన్వెస్టర్లు సెలవుల జాబితాపై ఆధారపడాలి.మార్చిలో స్టాక్ మార్కెట్ కు 12 రోజులు సెలవులు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈ రోజుల్లో మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ లు చేయలేరు. వారాంతపు సెలవులతో పాటు ఈ నెలలో హోలీ, రంజాన్ పండుగకు కూడా మార్కెట్లు మూతపడతాయి. అందువల్ల మార్చిలో చివరి ట్రేడింగ్ రోజు 28వ తేదీ. ఎందుకంటే 29, 30 తేదీలు వారాంతపు సెలవులు. ఆ రోజుల్లో మార్కెట్లు పనిచేయవు.మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే» మార్చి 1 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 2 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 8 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 9 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 14 శుక్రవారం హోలీ» మార్చి 15 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 16 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 22 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 23 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 29 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 30 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) -
మారిన పాస్‌పోర్ట్ రూల్స్..
పాస్‌పోర్టుల (Passport) జారీకి సంబంధించిన నిబంధనలలో భారత ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. పాస్‌పోర్టుల జారీ కోసం సమర్పించే పుట్టినరోజు తేదీ రుజువుకు సంబంధించిన నిబంధనలకు సవరణలు ప్రకటిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. పాస్‌పోర్ట్ (సవరణ) నిబంధనలు, 2025 లో భాగమైన ఈ మార్పులు పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అవసరమైన డాక్యుమెంటేషన్‌లో ఏకరూపతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.నిబంధనల్లో కీలక మార్పులు2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలకు జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన, మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న ఏదైనా ఇతర అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం మాత్రమే పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువు అని కొత్త నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ మార్పు శిశువులకు జనన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అలాగే పుట్టిన తేదీని అధికారిక రికార్డులలో ఖచ్చితంగా నమోదు చేసేలా చేస్తుంది.2023 అక్టోబర్ 1 కంటే ముందు పుట్టినవారికి..2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించిన వారికి పుట్టిన తేదీకి సంబంధించి అనుమతించదగిన రుజువులు మరింత సరళంగా ఉంటాయి. ఈ కింది డాక్యుమెంట్లను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆమోదిస్తారు.జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న మరేదైనా అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం.దరఖాస్తుదారు పుట్టిన తేదీని కలిగి ఉన్న గుర్తింపు పొందిన పాఠశాల లేదా గుర్తింపు పొందిన విద్యా బోర్డు జారీ చేసిన బదిలీ లేదా స్కూల్ లీవింగ్ లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు.దరఖాస్తుదారు పుట్టిన తేదీ ఉండే సర్వీస్ రికార్డ్ ఎక్స్ట్రాక్ట్ లేదా వేతన పెన్షన్ ఆర్డర్ కాపీలు (ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి). వీటికి సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా దరఖాస్తుదారు అడ్మినిస్ట్రేషన్ ఇన్‌ఛార్జి అధికారి ధ్రువీకరణ ఉండాలి.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో కూడిన ఎన్నికల సంఘం జారీ చేసిన ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా ప్రభుత్వ కంపెనీలు జారీ చేసే పాలసీ బాండ్. ఇందులో బీమా పాలసీ హోల్డర్ పుట్టిన తేదీ ఉంటుంది.దరఖాస్తుదారులపై ప్రభావంకొత్త నిబంధనలు ప్రధానంగా 2023 అక్టోబర్ 1 లేదా తరువాత జన్మించిన పిల్లల తల్లిదండ్రులను ప్రభావితం చేస్తాయి. వారు పాస్‌పోర్ట్ దరఖాస్తులకు పుట్టిన తేదీ ఏకైక రుజువుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఈ మార్పు డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రామాణీకరించడం, పుట్టిన తేదీ రికార్డులలో వ్యత్యాసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించినవారిపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. పాస్‌పోర్ట్ కోసం వారు ఎప్పటిలాగే వివిధ రకాల డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌లను సమర్పించవచ్చు. -
కో-వర్కింగ్‌కు డిమాండ్..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాతి నుంచి కో-వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ పెరిగింది. స్టార్టప్స్‌తో పాటు ప్రధాన కంపెనీలు కూడా ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్‌ల నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ప్రతి ఏటా కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీల వాటా 20 శాతానికి పైగా ఉంటుంది.కో–వర్కింగ్ స్పేస్ డిమాండ్‌కు ప్రధాన కారణం సిటీ సెంటర్లు లేదా ప్రధాన ఉపాధి కేంద్రాలలో మాత్రమే కాకుండా నగర వ్యాప్తంగా విస్తరించి ఉండటమే.. అభివృద్ధి చెందుతున్న కొత్త ఏరియాలు, శివారు ప్రాంతాలు, గృహ సముదాయాలకు చేరువలో ఈ సెంటర్లు ఉంటున్నాయి. అలాగే ప్రధాన మెట్రో నగరాలలో షాపింగ్ మాల్స్, హోటళ్లలోనూ ఫ్లెక్సిబుల్ స్పేస్‌లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో చాలా కంపెనీలు ఉద్యోగుల గృహాలకు చేరువలో ఉండే కో–వర్కింగ్ స్పేస్‌లను తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. అలాగే ఫ్లెకిబుల్ ఆఫీస్ స్పేస్ అద్దె కూడా సాధారణ ఆఫీసు స్పేస్ రెంట్స్‌కు సమానంగా ఉండటం, రెగ్యులర్ ఆఫీసు స్పేస్‌కు ఉండే 3–4 ఏళ్ల లాకిన్ పీరియడ్‌తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌కు కాల పరిమితి ఉండకపోవటం వంటివి కూడా కంపెనీల ఆకర్షణకు కారణాలని ఆయన పేర్కొన్నారు. -
బిజినెస్ క్లోజ్.. మొత్తం ఉద్యోగుల తొలగింపు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన విభాగమైన ఏఎన్ఎస్ కామర్స్ వ్యాపారాన్ని మూసివేసి, మొత్తం ఉద్యోగులను తొలగించింది. 2017లో స్థాపించిన ఈ సంస్థ తమ ఉత్పత్తిని ఆన్లైన్లో విక్రయించాలనుకునే సంస్థలకు మార్కెటింగ్ టూల్స్, వేర్‌హౌసింగ్ వంటి సహకారాన్ని అందిస్తోంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ 2022లో కొనుగోలు చేసింది.‘పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి 2022లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన ఫుల్ స్టాక్ ఈ-కామర్స్ సంస్థ ఏఎన్ఎస్ కామర్స్ తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. కార్యకలాపాలను మూసివేస్తున్న క్రమంలో ఉద్యోగులు, వినియోగదారులతో సహా భాగస్వాములందరికీ పరివర్తనను సజావుగా జరిగేలా మేము కట్టుబడి ఉన్నాము’ అని కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయి.ఈ పరివర్తన సమయంలో ఉద్యోగులపై ప్రభావాన్ని తగ్గించడానికి, ఫ్లిప్‌కార్ట్‌లో అంతర్గత అవకాశాలు, అవుట్ ప్లేస్మెంట్ సేవలు, సెవెరెన్స్ ప్యాకేజీలను అందించాలని యోచిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. మూసివేత వల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారో తెలియరాలేదు. 2022 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏఎన్ఎస్ కామర్స్‌లో 600 మంది ఉద్యోగులు ఉన్నారు. -
రీచార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో 56 రోజుల వ్యాలిడిటీ
దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా (Vi) తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజుల వ్యాలిడిటీని ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. వీటితో వినియోగదారులు 56 రోజుల సర్వీస్ వాలిడిటీని పొందుతారు. అలాగే ఈ ప్లాన్లు వైవిధ్యమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. 56 రోజుల వ్యాలిడిటీ కలిగిన నాలుగు ప్లాన్లు వొడాఫోన్ ఐడియాలో నాలుగు ఉన్నాయి. వాటి ధరలు వరుసగా రూ.369, రూ.579, రూ.795, రూ.649. దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలోనూ ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.రూ.369 ప్లాన్ వీఐ రూ.369 ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 4 జీబీ డేటా, 600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇది డేటా ఫోకస్డ్ ప్లాన్ కాదు. వినియోగదారులు దీనితో 56 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని పొందుతారు. ఎఫ్‌యూపీ (ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితి ముగిసిన తర్వాత ఎక్కువ డేటా అవసరమైనప్పుడు డేటా వోచర్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.579 ప్లాన్ వీఐ నుంచి రూ.579 ప్లాన్‌తో యూజర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్స్ వంటి వీఐ హీరో అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉన్నాయి.రూ.649 ప్లాన్వొడాఫోన్ ఐడియా రూ.649 ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో వినియోగదారులు ప్రతిరోజూ ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత డేటాను పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. వీకెండ్ డేటా రోల్వోవర్, డేటా డిలైట్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.రూ .795 ప్లాన్ వొడాఫోన్ ఐడియా నుండి రూ .795 ప్లాన్ అపరిమిత కాలింగ్, 3 జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఉదయం 12 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య అపరిమిత డేటా, డేటా డిలైట్స్, వారాంతపు డేటా రోల్ఓవర్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 16 ఓటీటీలతో 60 రోజుల పాటు వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్ రీచార్జ్ ప్లాన్లు.. రూ.200 దగ్గరలో మంత్లీ వ్యాలిడిటీ -
ఐటీఆర్ తప్పులు.. ట్యాక్స్‌పేయర్లకు అలర్ట్..
2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే కీలక అవకాశం ఉంది. 2022 ఫైనాన్స్ చట్టంలో ప్రవేశపెట్టిన అప్డేటెడ్ రిటర్న్‌లను దాఖలు చేసే నిబంధన పన్ను చెల్లింపుదారులను 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు వారి రిటర్నులను ఈ మార్చి 31 లోపు అప్డేట్ చేయడానికి అనుమతిస్తుంది..అప్డేటెడ్ ఐటీఆర్ నిబంధనస్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడానికి, లిటిగేషన్‌ను తగ్గించడానికి అప్డేటెడ్ రిటర్న్ నిబంధనను ప్రవేశపెట్టారు. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్డేటెడ్ రిటర్న్‌ను సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లలో తప్పులు లేదా లోపాలను సరిదిద్దడానికి ఇది అనుమతిస్తుంది. ఉదాహరణకు 2022-23 మదింపు సంవత్సరానికి (2021-22 ఆర్థిక సంవత్సరం) తమ రిటర్నులను అప్డేట్ చేయాలనుకున్నవారు 2025 మార్చి 31లోగా ఫైల్ చేయాలి.గమనించాల్సిన కీలక అంశాలుఅప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు పన్ను మొత్తం సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ జాప్యం చేస్తే అంత అదనపు పన్ను పెరుగుతుంది.కొన్ని అసాధారణ సందర్భాల్లో మినహా చాలా సందర్భాల్లో అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఉదాహరణకు సవరించిన ఆదాయం తక్కువ పన్ను బాధ్యతకు దారితీస్తే, పన్ను రిఫండ్ లేదా అధిక రిఫండ్‌కు దారితీస్తే లేదా పన్ను చెల్లింపుదారు పన్ను అధికారుల విచారణలో ఉంటే అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు వీలుండదు.తొలుత అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు గరిష్టంగా రెండేళ్ల వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2025 బడ్జెట్లో ఈ గడువును 48 నెలలకు పొడిగించారు. ఇది పన్ను చెల్లింపుదారులకు వారి ఫైలింగ్‌లలో ఏవైనా వ్యత్యాసాలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం ఇస్తుంది.అప్డేటెడ్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలంటే..ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఐటీఆర్-యు ఫారాన్ని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులు అప్డేటెడ్ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఈ కింది దశలు ఉంటాయి..ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి మీ క్రెడిన్షియల్స్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి.సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్-యు ఫారాన్ని ఎంచుకోండి.అదనపు ఆదాయం, చెల్లించాల్సిన పన్నుతో సహా అవసరమైన వివరాలను అందించండి.సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచిన సమయం ఆధారంగా చెల్లించాల్సిన అదనపు పన్నును లెక్కించండి.వివరాలను సమీక్షించి అప్డేటెడ్ రిటర్న్ సబ్మిట్ చేయండి. -
రూ.3 లక్షలకే రెండు గుంటలు.. తొందరపడితే..
‘హైదరాబాద్ నుంచి 140 కి.మీ. దూరంలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో ఓ నిర్మాణ సంస్థ ఫామ్‌ల్యాండ్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేస్తుంది. రెండు గుంటలు (242 గజాలు)కు రూ.3 లక్షలు చెల్లిస్తే.. ప్రతినెలా రూ.15 వేల అద్దె చొప్పున 20 నెలల్లో తర్వాత మొదట్లో కట్టిన రూ.3 లక్షలతో సహా మొత్తం రూ.6 లక్షలు కొనుగోలుదారుడికి చెల్లిస్తోంది. అలాగే 4 గుంటల స్థలానికి రూ.6 లక్షలు చెల్లిస్తే.. ప్రతినెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ.12 లక్షలు, అలాగే 8 గుంటలకు రూ.12 లక్షలు కడితే.. నెలకు రూ.24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తుంది.’ ఇలా అపార్ట్మెంట్లకు ప్రతినెలా అద్దె చెల్లించినట్లుగానే ఓపెన్ ప్లాట్లకు, ఫామ్ల్యాండ్లకు కూడా రెంట్ చెల్లిస్తామని కొత్త తరహా మోసాలకు తెరలేపారు పలువురు బిల్డర్లు. – సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే గృహ నిర్మాణంలో ప్రీలాంచ్ విక్రయాల పేరిట జరిగిన దందాలో మోసపోయిన కొనుగోలుదారులు పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. కొత్తగా బై బ్యాక్, రెంటల్ ఇన్‌కం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి సరికొత్త ఆఫర్ల పేరిట అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు.ఫామ్‌ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తూ సామాన్యులను నిలువునా ముంచేస్తున్నారు. ఏడాదిలో అద్దెతో సహా కట్టిన సొమ్మును వాపస్ ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. ఒకవేళ ఏడాది తర్వాత మార్కెట్ ఒడిదుడుకులలో ఉన్నా లేక కంపెనీ బోర్డు తిప్పేసినా నష్టపోయేది కొనుగోలుదారుడే. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ.5 వేలు కూడా పలకని ప్రాంతంలో రూ.10 వేలకు పైగానే ధరతో విక్రయించి.. ముందస్తుగానే బిల్డర్లు సొమ్ము వసూలు చేసేస్తున్నారు. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్ఫ్రాకాన్, జయగ్రూప్, ఫార్చ్యూన్ 99 వంటి పలు కొత్త నిర్మాణ సంస్థలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు చేయకుండానే వెంచర్లను విక్రయిస్తున్నారు. సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి ప్రధాన నగరం నుంచి వందకుపైగా కి.మీ. దూరంలో ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్‌లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు.నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతినెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు.ఇదీ చదవండి: లగ్జరీ రియల్ ఎస్టేట్.. మంచి లాభాలకు ఇదే రూట్! -
అంబానీ అల్లుడికి ట్యాక్స్ నోటీసు..
ఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ అల్లుడికి భారీ ట్యాక్స్ నోటీసు వచ్చింది. ఇషా అంబానీకి భర్త అయిన ఆనంద్ పిరమల్ ప్రమోటర్‌గా ఉన్న రూ.19,675 కోట్ల పిరమల్ గ్రూప్ లో ప్రముఖ సంస్థ అయిన పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.1,502 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు అందింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఫార్మా వ్యాపారాన్ని పిరమల్ ఫార్మా లిమిటెడ్‌కు విక్రయించడానికి సంబంధించి మహారాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఈ నోటీసు జారీ చేశారు. రూ.4,487 కోట్ల విలువైన ఈ లావాదేవీలో అనుబంధ సంస్థల బదలాయింపు కూడా ఉంది. రూ.1,502 కోట్ల పన్ను డిమాండ్‌లో పన్ను మొత్తం రూ.837.17 కోట్లు కాగా వడ్డీ కింద రూ.581.53 కోట్లు, జరిమానాగా రూ.83.71 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.వివాదం ఇదే.. లావాదేవీ వర్గీకరణలోనే పన్ను వివాదం సారాంశం ఉంది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ అమ్మకాన్ని "స్లంప్ సేల్" గా వర్గీకరించింది. వ్యక్తిగత విలువలను కేటాయించకుండా ఆస్తులు, అప్పులతో సహా మొత్తం వ్యాపార సంస్థను బదిలీ చేస్తే దాన్ని స్లంప్ సేల్‌గా పేర్కొంటారు. ఇటువంటి అమ్మకాలు సాధారణంగా జీఎస్టీ పరిధిలోకి రావు. అయితే ఈ వర్గీకరణ తప్పని, ఈ లావాదేవీ "ఐటమైజ్డ్ సేల్" అని పన్ను అధికారులు వాదిస్తున్నారు. ఇక్కడ ఆస్తులు, అప్పులకు ప్రత్యేక విలువలు కేటాయించి మొత్తం అమ్మకాలపై 18 శాతం జీఎస్టీ విధించారు.పిరమల్ ఎంటర్ప్రైజెస్ స్పందనపన్ను ఉత్తర్వులను పిరమల్ ఎంటర్ప్రైజెస్ తీవ్రంగా ఖండించింది. ఈ డిమాండ్ సమంజసం కాదని భావించిన కంపెనీ ఈ తీర్పును సవాలు చేయడానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. "కంపెనీ తన ఉత్తమ ప్రయోజనాల కోసం తగిన చర్యలు తీసుకుంటుంది. ఆర్డర్ ను పక్కన పెట్టడం వల్ల సానుకూల ఫలితం ఉంటుందని సహేతుకంగా ఆశిస్తున్నాము. ఈ ఆర్డర్ కంపెనీ లాభనష్టాల ప్రకటనపై ఎలాంటి ప్రభావం చూపదు" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది.ఇది చదివారా? అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?ఆర్థిక ప్రభావంపన్ను వివాదం కొనసాగుతున్నప్పటికీ, పిరమల్ ఎంటర్ప్రైజెస్ 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ .38.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.2,476 కోట్లతో పోలిస్తే 1.1 శాతం క్షీణతతో రూ.2,449 కోట్లకు పరిమితమైంది. వడ్డీ, పన్ను, తరుగుదల, ఎమోర్టైజేషన్ (ఇబిటా) ముందు ఆదాయం 10.8 శాతం క్షీణించి రూ.1,075 కోట్లకు పరిమితమైంది. -
లగ్జరీ రియల్ ఎస్టేట్.. మంచి లాభాలకు ఇదే రూట్!
సాక్షి, సిటీబ్యూరో: అస్థిరత, వేగంగా మారుతున్న మార్కెట్ యుగంలో పెట్టుబడులకు ఆశించిన లాభాలు రావాలంటే వ్యూహాత్మక, వైవిధ్యభరిత ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. పెట్టుబడి సాధనాలలో రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనంగా మారింది. ఇందులోనూ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గం.వైవిధ్యభరితమైన పెట్టుబడులతో రిస్క్ తక్కువగా ఉండటమే కాకుండా స్థిరమైన, నిరంతర లాభాలను అందుకోవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాల మూలధన లాభాలు అందుతాయి. సాంప్రదాయ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో మార్కెట్ హెచ్చుతగ్గులు పెట్టుబడిదారులను అనిశ్చితిలోకి నెట్టేసే భయాందోళనలు కలిగిస్తుంది. ఇలాంటి ప్రతికూల సమయంలో లగ్జరీ రియల్టీ పెట్టుబడులు తక్కువ అస్థిరత, స్థిరమైన, సమతుల్య పెట్టుబడి విధానంతో మార్కెట్ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.మార్కెట్ సెంటిమెంట్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అద్దె ఆదాయం, నిరంతర నగదు ప్రవాహం ఉంటుంది. నివాస, వాణిజ్య, రిటైల్ ఇలా ప్రాపర్టీ రకాలు, ప్రాంతాలను బట్టి ఆదాయ వృద్ధిలో ప్రయోజనాలను అందుకోవచ్చు. పెట్టుబడులకు భద్రతతో పాటు దీర్ఘకాలిక రాబడులు ఉంటాయి. ద్రవ్యోల్బణం కాలక్రమేణా పెట్టుబడుల విలువలను తగ్గిస్తుంది.కానీ, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై చాలా కాలంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి లేదు. వినియోగదారుల ధరలు పెరిగే కొద్దీ స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాలను అందుకోవచ్చు. 2021లో 200 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనా వేసింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక సర్దుకోవాల్సిందే..!
ఆటోమేషన్... ఈ పదం జాబ్ మార్కెట్‌ను వణికిస్తోంది. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్ (automation) బాట పట్టాయి. దీంతో ఉద్యోగుల మనుగడకు ముప్పు ఏర్పడింది. తాజాగా ఇన్మోబి (InMobi) సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ తివారీ పిడుగులాంటి వార్త చెప్పారు.వారికి ఉద్యోగాలు ఉండవుఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో తమ సంస్థ 80 శాతం ఆటోమేషన్ ను సాధిస్తుందని, ఫలితంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు (software engineers) ఉద్యోగాలు పోతాయని నవీన్ తివారీ వెల్లడించారు. 'మా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వెళ్లిపోతారని అనుకుంటున్నాను. రెండేళ్లలో వారికి ఉద్యోగాలు ఉండవు' అని ప్రారంభ దశ ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్ ఫామ్ లెట్స్ వెంచర్ నిర్వహించిన కార్యక్రమంలో తివారీ అన్నారు. ‘ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో 80 శాతం ఆటోమేషన్ ను నా సీటీవో (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ) అందిస్తారు. ఇప్పటికే 50 శాతం సాధించాం. యంత్రం సృష్టించిన కోడ్లు వేగంగా, మెరుగ్గా ఉంటాయి. అలాగే అవి తమను తాము సరిచేసుకోగలవు" అని ఆయన లెట్స్ వెంచర్ సీఈవో శాంతి మోహన్‌తో అన్నారు.ఇన్మోబి సీఈవో నవీన్ తివారీమిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి..అత్యంత ప్రత్యేకమైన ఉద్యోగాలకు మొదట కృత్రిమ మేధ (ఏఐ) వస్తుందని, ఉద్యోగులు తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవాలని తివారీ పిలుపునిచ్చారు. "మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి, మిమ్మల్ని అప్ గ్రేడ్ చేయమని నన్ను అడగకండి. ఎందుకంటే ఇది మనుగడ. మీ కింద ప్రపంచం మారుతోంది' అని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఇది చదివారా? ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపుఇన్మోబిలో రెండు కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఇన్మోబి యాడ్స్. ఇది అడ్వర్టైజింగ్ టెక్నాలజీపై పనిచేసే బిజినెస్-టు-బిజినెస్ కంపెనీ. మరొకటి గ్లాన్స్. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ల కోసం రూపొందించిన స్మార్ట్ లాక్ స్క్రీన్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ను అందించే కన్స్యూమర్ టెక్నాలజీ బిజినెస్-టు-కన్స్యూమర్ కంపెనీ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్లాన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్ల కోసం జెన్ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి గూగుల్ క్లౌడ్‌తో తాజాగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. -
హైదరాబాద్‌లో ‘గ్లోబల్’ జోష్
గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్(GCC)లకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. గతేడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2.83 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోరెండేళ్లలో ఏకంగా 5.28 కోట్ల చదరపు అడుగుల డీల్స్ పూర్తయ్యాయి. జీసీసీ లావాదేవీల్లో ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లు పోటీపడుతున్నాయని పేర్కొంది. 1.2 కోట్ల చదరపు అడుగులతో బెంగళూరు టాప్‌లో ఉండగా హైదరాబాద్‌లో 48.6 లక్షల చదరపు అడుగుల మేర జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి.జీసీసీ అంటే? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు.మూడో స్థానంలో హైదరాబాద్దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగానికి చెందిన జీసీసీలలో దాదాపు 35% లేదా 42 బెంగళూరులో ఉండగా 16 జీసీసీలతో హైదరాబాద్.. ఢిల్లీ ఎన్సీఆర్ (22) తర్వాత మూడవ స్థానంలో ఉంది. అయితే నైపుణ్యాలు కలిగిన 19% మంది యాక్టివ్ ఉద్యోగార్థులతో రెండవ స్థానంలో ఉందని కెరీర్‌నెట్ తెలిపింది. -
భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
అతి పొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ త్వరలోనే ..
ప్రపంచంలోనే అతి పొడవైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) పైప్‌లైన్ భారత్ నిర్మించనుంది. పశ్చిమ తీరంలోని కాండ్లా నుంచి ఉత్తరాన గోరఖ్‌పూర్ వరకు 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 2025 జూన్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 1.3 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ రవాణా ఖర్చులను, ఎల్పీజీ రవాణా సంబంధిత రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించనుంది.8.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ రవాణా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పైప్‌లైన్ ద్వారా ఏటా 8.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ రవాణా కానుంది. ఇది భారతదేశ మొత్తం ఎల్పీజీ డిమాండ్‌లో సుమారు 25% ఉంటుంది. ఈ పైప్‌లైన్ అందుబాటులోకి వస్తే ట్రక్కులపై ఆధారపడటం రహదారి రవాణాపై ఒత్తిడి తగ్గిపోతుంది.ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలుఎల్పీజీ పైప్‌లైన్ నిర్మాణం గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తీసుకువస్తుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీని రవాణా చేయడానికి వందలాది ట్రక్కుల అవసరం లేకుండా పైప్‌లైన్ రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్వచ్ఛమైన వంట ఇంధనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఎల్పీజీకి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పైప్‌లైన్ నిర్మాణం కీలకం కానుంది.భద్రత, ప్రమాద నివారణపైప్లైన్ అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం. రోడ్డు మార్గం ద్వారా ఎల్పీజీ రవాణా ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఇది గతంలో అనేక ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసింది. పైప్‌లైన్ సురక్షితమైన, మరింత విశ్వసనీయమైన రవాణా విధానాన్ని అందించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గిస్తుంది. రోడ్డు భద్రతను పెంపొందించడానికి ఈ పరిణామం ఒక కీలకమైన అడుగు.సవాళ్లు, భవిష్యత్తు అవకాశాలుఆశాజనక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరా గొలుసు అంతరాయాలతో సహా ఈ ప్రాజెక్ట్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఏదేమైనా, పైప్‌లైన్ విజయవంతంగా పూర్తవడం భారతదేశ ఇంధన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భవిష్యత్తు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బెంచ్‌మార్క్‌ను ఏర్పరుస్తుంది. -
నాడు బీభత్సం.. నేడు ఫెయిల్.. ఇకపై ఆ సేవలకు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై?
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (microsoft) కీలక నిర్ణయం తీసుకోనుంది. 2000 దశకంలో సంచలనం సృష్టించిన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్‌కు (skype) స్వస్తి పలకనుంది. వెలుగులోకి వచ్చిన పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది మే నెలలో స్కైప్‌ను షట్ డౌన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రముఖ టెక్ బ్లాగ్ ఎక్స్‌డీఏ కథ మేరకు..‘స్కైప్ ప్రివ్యూలో ఓ హిడెన్ మెసేజ్ కనిపించింది. అందులో, మే నెల నుంచి స్కైప్ అందుబాటులో ఉండదు. మీ కాల్స్, చాట్స్ చేసుకునేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది. అంతేకాదు, మీ మిత్రులు ఇప్పటికే టీమ్స్‌కి మారారు’ అని ఉన్నట్లు పేర్కొంది. అయితే,స్కైప్ షట్ డౌన్‌పై మైక్రోసాప్ట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్కైప్ చరిత్రస్కైప్ తొలిసారిగా 2003లో ప్రారంభమైంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అందుకే, 2011లో మైక్రోసాఫ్ట్ దీనిని 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. స్కైప్‌కి పోటీగా ఐమెసేజ్,వాట్సాప్,జూమ్ వంటి యాప్స్ పుట్టుకొచ్చాయి. దీంతో స్కైప్ ప్రాచుర్యం తగ్గిపోయింది. కోవిడ్-19 సమయంలో స్కైప్ మళ్లీ పాపులర్ అవుతుందనుకున్నారు. కానీ జూమ్, గూగుల్ మీట్స్ స్థాయిలో స్కైప్ ఆకట్టుకోలేకపోయింది. అందుకే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ షట్‌డౌన్ చేయనుందని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు పేర్కొన్నాయి.స్కైప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Microsoft Teams) అనే వీడియో ఫ్లాట్ఫారమ్ను వినియోగంలోకి తెచ్చింది.టీమ్స్‌పై ఫోకస్ స్కైప్‌ను షట్‌డౌన్ చేయాలనే ఆలోచనలో ఉన్న మైక్రోసాఫ్ట్ తన ఫోకస్ అంతా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై పెట్టింది.స్కైప్ కంటే ఎక్కువ ఫీచర్లను మైక్రోసాఫ్ట్టీమ్స్లో జోడించింది. ఇటీవల కోపైలెట్ ఏఐ ఫీచర్లను జోడించింది. ఇలా మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తోందా? లేక వేరే రూపంలో తెరపైకి తెస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. -
ఎపిక్ వరల్డ్ నుంచి కొత్త ఇండెక్స్
ఎపిక్ వరల్డ్ తాజాగా ఎంటర్‌ప్రెన్యూరల్ హౌస్‌హోల్డ్స్ ఇండియా(ఈహెచ్ఐ) ఇండెక్స్‌ను ఆవిష్కరించింది. మార్నింగ్‌స్టార్ ఇండెక్సెస్తో కలసి రూపొందించిన ఈ సూచీలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితరాలకు చోటు కల్పించింది.తద్వారా 34 లిస్టెడ్ సంస్థల పనితీరును ట్రాక్ చేసేందుకు వీలుంటుందని ఎపిక్ వరల్డ్ పేర్కొంది. ఇండెక్సుకు ప్రాతినిధ్యం వహించే కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 115 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన ఐదేళ్లలో ఆదాయం 22 శాతం చొప్పున పుంజుకున్నట్లు తెలియజేసింది.ఇంపాక్ట్ ఇన్వెస్టర్ ఎలెవర్ ఈక్విటీ మద్దతుతో ఈ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ 50 బ్లూ-చిప్ కంపెనీలను ఎంటర్‌ప్రెన్యూరల్ హౌస్‌హోల్డ్స్‌కు (ఇహెచ్ఎస్) అందించడానికి వీలు కల్పిస్తుంది. వచ్చే 20 ఏళ్లలో ఎంటర్‌ప్రెన్యూరల్ హౌస్‌హోల్డ్స్10 రెట్లు వృద్ధి చెందుతాయని భావిస్తున్న ఎపిక్ వరల్డ్ భారత్‌లో 100 ట్రిలియన్ డాలర్ల అవకాశాలను తెరవనుంది. -
ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపు
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల వేతన పెంపులు (Salary Hikes) క్లిష్టంగా మారుతున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో నిబంధనను తెస్తున్నాయి. తాజాగా ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree) సంస్థ కొత్త సామర్థ్య ఆధారిత మదింపు వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన పెంపును సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతకు లింక్ చేసింది. కంపెనీ వార్షిక అప్రైజల్ కసరత్తులో భాగమైన ఈ చొరవ లక్ష్యం మేనేజర్లు తమ పాత్రలలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని కలిగి ఉండేలా చేయడమే.కాంపిటెన్సీ టెస్ట్మిడిల్, సీనియర్ లెవల్ మేనేజర్లకు తప్పనిసరిగా నిర్వహించే ఈ కాంపిటెన్సీ టెస్ట్‌లో కోడింగ్, మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ సహా పలు నైపుణ్యాలను అంచనా వేస్తారు. బృందాలకు నాయకత్వం వహించడానికి, సంస్థ ఎదుగుదలను నడిపించడానికి అవసరమైన సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ పరీక్ష రూపొందించారు. నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న టీమ్ లీడ్ లు, లీడ్ ఆర్కిటెక్ట్ లను కలిగి ఉన్న పీ3, పీ4, పీ5 బ్యాండ్ ల్లోని మేనేజర్ లు వేతన పెంపునకు అర్హత పొందడానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.చొరవ వెనుక హేతుబద్ధతశరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమలో పోటీతత్వంతో ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సామర్థ్య ఆధారిత అప్రైజల్ వ్యవస్థను అమలు చేయాలని ఎల్టీఐ మైండ్‌ట్రీ కంపెనీ నిర్ణయం తీసుకుంది. సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతను వేతన పెంపునకు అనుసంధానించడం ద్వారా, కంపెనీ తన మేనేజర్లకు తాజా నైపుణ్యాలు, పరిజ్ఞానం ఉందని నిర్ధారించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం శ్రామిక శక్తి మొత్తం సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నిరంతర అభ్యాసం, అభివృద్ధికి కంపెనీ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది.పరిశ్రమ ప్రభావంఎల్టీఐమైండ్ట్రీ తీసుకున్న ఈ నిర్ణయం బహుశా భారత ఐటీ పరిశ్రమలో ఇదే మొదటిది కావచ్చు. పనితీరు మదింపులలో నైపుణ్యాల ఆధారిత మదింపుల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, ఇతర కంపెనీలు అనుసరించడానికి ఇది ఒక ఉదాహరణను ఏర్పరుస్తుంది. వేతన పెంపునకు సామర్థ్య పరీక్షను తీసుకురావడం మెరిటోక్రసీపై కంపెనీ దృష్టిని, అత్యుత్తమ సంస్కృతిని పెంపొందించే వైఖరిని తెలియజేస్తోంది.ఇది చదివారా? ఇన్ఫోసిస్ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్..ఉద్యోగుల రియాక్షన్ఎల్టీఐమైండ్ట్రీ తీసుకొచ్చిన కొత్త అప్రైజల్ వ్యవస్థపై ఉద్యోగుల నుంచి మిశ్రమ ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంక, సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడాన్ని కొంత మంది ఉద్యోగులు అభినందిస్తున్నారు. అదనపు ఒత్తిడి, వేతనాల పెంపుపై ప్రభావం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష నిష్పాక్షికంగా ఉండేలా రూపొందించామని, అందుకు వారు సిద్ధం కావడానికి తగిన సహకారం, వనరులను అందిస్తామని ఎల్‌టీఐమైండ్‌ట్రీ తమ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. -
యూపీఐ లైట్లో కొత్త ఫీచర్..
చిన్న మొత్తాల్లో లావాదేవాలకు ఉద్దేశించిన యూపీఐ లైట్ (UPI Lite) సేవల్లో 'ట్రాన్స్ఫర్ అవుట్' అనే కొత్త ఫీచర్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువచ్చింది. ఇందుకోసం మార్చి 31 నాటికి అవసరమైన మార్పులను అమలు చేయాలని అన్ని ఇష్యూయర్ బ్యాంకులు, పీఎస్పీ (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్) బ్యాంకులు, యూపీఐ యాప్‌లను ఎన్పీసీఐ ఆదేశించింది.'ట్రాన్స్ ఫర్ అవుట్' అంటే..దాదాపు అన్ని యూపీఐ యాప్‌లలోనూ యూపీఐ లైట్ అనే ఆప్షన్ ఉంటుంది. చిన్న మొత్తాలకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా వేగంగా చెల్లింపులు చేసేందుకు దీన్ని రూపొందించారు. దీని ద్వారా చెల్లింపులు జరపాలంటే ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాలెన్స్ నుంచి చెల్లింపులకు నగదు వెళ్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి బ్యాంక్ అకౌంట్‌కు జమ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది యూపీఐ లైట్ ఆప్షన్ ఆన్‌లో ఉంటేనే సాధ్యమయ్యేది.తాజాగా తీసుకొచ్చిన 'ట్రాన్స్ ఫర్ అవుట్' ఫీచర్‌తో యూపీఐ లైట్‌ను డిసేబుల్ చేయకుండానే తమ యూపీఐ లైట్ బ్యాలెన్స్ నుంచి డబ్బును తిరిగి ఒరిజినల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఈ ఫంక్షనాలిటీ వినియోగదారులకు తమ నిధులపై మెరుగైన నియంత్రణను అందిస్తుంది. అదే సమయంలో ఇబ్బంది లేని చిన్న చెల్లింపులనూ అనుమతిస్తుంది.నూతన మార్గదర్శకాలు» యూపీఐ లైట్ అందించే బ్యాంకులు లైట్ రిఫరెన్స్ నంబర్ (ఎల్ఆర్ఎన్) స్థాయిలో బ్యాలెన్స్‌లను ట్రాక్ చేస్తూ వాటిని ప్రతిరోజూ ఎన్పీసీఐ డేటాతో సరిపోల్చాలి.» యాక్టివ్ యూపీఐ లైట్ ఉన్న యూపీఐ యాప్‌లలో లాగిన్ చేసేటప్పుడు పాస్ కోడ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదా ప్యాట్రన్ ఆధారిత లాక్ ద్వారా ప్రామాణీకరించాల్సి ఉంటుంది.» యూపీఐ లైట్ అందించే అన్ని ఇష్యూయర్ బ్యాంకులు, పీఎస్పీ బ్యాంకులు, యూపీఐ యాప్‌లు మార్చి 31 లోగా అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటుంది.» ఈ మార్పులు మినహా ప్రస్తుతం ఉన్న అన్ని యూపీఐ లైట్ మార్గదర్శకాలు అలాగే ఉంటాయి. వాటిలో ఎటువంటి మార్పు ఉండదు.పెరిగిన యూపీఐ లైట్ పరిమితియూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచారు. అలాగే, ప్రతి లావాదేవీ పరిమితిని గతంలో ఉన్న రూ.100 నుంచి రూ.500కు పెంచారు. యూపీఐ 123పేకు ప్రతి లావాదేవీ పరిమితిని కూడా సవరించారు, ఇది గతంలో ఉన్న రూ .5,000 ఉండగా ప్రస్తుతం రూ .10,000 వరకు చెల్లింపులను అనుమతిస్తుంది. -
10 నిమిషాల్లో యాపిల్ ఉత్పత్తుల డెలివరీ
క్విక్ కామర్స్ రంగంలో ఉన్న బ్లింకిట్ (Blinkit) 10 నిమిషాల్లో యాపిల్ (Apple) ఉత్పత్తుల డెలివరీ సేవలను ప్రారంభించింది. మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్, యాపిల్ వాచ్, యాక్సెసరీస్‌ను కస్టమర్లు బ్లింకిట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణే, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు, కోల్‌కతలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కాగా గత ఏడాది యాపిల్ ప్రీమియం రీసెల్లర్ యూనికార్న్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఆర్డర్లు ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లను కస్టమర్లకు డెలివరీ చేసింది.అంతకుముందు బ్లింకిట్ పైలట్ ప్రాజెక్టుగా గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 10 నిమిషాల అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. ఈ అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు వంటి అవసరమైన ప్రాణరక్షణ పరికరాలు ఉంటాయి.జొమాటోకు చెందిన ఈ క్విక్ కామర్స్ బిజినెస్ 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.103 కోట్ల నష్టాన్ని చవిచూసింది. పెట్టుబడుల కారణంగా బ్లింకిట్ కింద క్విక్ కామర్స్ వ్యాపారంలో నష్టాలు సమీపకాలంలో కొనసాగుతాయని కంపెనీ భావిస్తోందని షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో జొమాటో పేర్కొంది. -
జస్ట్ మిస్.. బ్యాంక్ డబ్బులు మొత్తం ఖాళీ అయ్యేవి!
అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ సిబ్బంది చేసిన పొరపాటుతో బ్యాంక్‌లోని డబ్బులు మొత్తం ఖాళీ అయ్యేవి. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. సిటీ బ్యాంక్ గత ఏప్రిల్ నెలలో 280 డాలర్లకు బదులుగా 81 ట్రిలియన్ డాలర్లను (ప్రస్తుత మారక విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో రూ.6,723 లక్షల కోట్లు) పొరపాటున ఓ ఖాతాదారుడి ఖాతాలో జమ చేసింది.ఈ పొరపాటును ఇద్దరు ఉద్యోగులు పట్టుకోలేకపోయారు. డబ్బులు జమ చేసిన 90 నిమిషాల తర్వాత మూడో ఉద్యోగి గుర్తించారని నివేదిక తెలిపింది. అయితే బ్యాంకు నుంచి నిధులు పూర్తిగా ఆ ఖాతాలోకి బదిలీ కాలేదని, తృటి తప్పిందని (near miss) ఫెడరల్ రిజర్వ్, కంప్ట్రోలర్ ఆఫ్ ది కరెన్సీ కార్యాలయానికి సీటీగ్రూప్ తెలియజేసింది."ఇంత పరిమాణంలో చెల్లింపు వాస్తవానికి పూర్తి కాలేదన్న విషయాన్ని పక్కన పెడితే మా డిటెక్టివ్ నియంత్రణలు రెండు సిటీ లెడ్జర్ ఖాతాల మధ్య ఇన్పుట్ దోషాన్ని వెంటనే గుర్తించాయి. మేము ఎంట్రీని తిప్పికొట్టాము" అని సిటీగ్రూప్ ప్రతినిధి ఈ-మెయిల్ ప్రతిస్పందనలో తెలిపారు. "మా నివారణ నియంత్రణలు పొరబాటున బ్యాంకు నుంచి నిధులు బయటకు వెళ్లకుండా నిలిపివేస్తాయి" అని పేర్కొన్నారు. ఈ సంఘటన బ్యాంకుపై గానీ, తమ క్లయింట్లపై గానీ ఎలాంటి ప్రభావం చూపలేదని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు.ఇలాంటివి 10 పొరపాట్లుసిటీ బ్యాంక్‌లో 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించి ఇలాంటి పొరపాట్లు గత ఏడాది మొత్తం 10 జరిగాయని అంతర్గత నివేదికను ఉటంకిస్తూ ఎఫ్టీ తెలిపింది. అంతకు ముందు ఏడాది నమోదైన 13 కేసులతో పోలిస్తే ఇది తగ్గినప్పటికీ, యూఎస్ బ్యాంక్ పరిశ్రమలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన పొరపాట్లు అసాధారణమని నివేదిక పేర్కొంది. -
ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్‌మార్కెట్లు అల్లకల్లోలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లో కల్లోలం సృష్టించింది. మార్చి 4నుంచి కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో మదుపర్లు ఇవాళ ఒక్కరోజే రూ.10లక్షల కోట్లు నష్టపోయారు.అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో ఈ వారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో కొనసాగాయి. మార్కెట్లో చివరి రోజున శుక్రవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో సంపద ఆవిరైంది. ఫలితంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో కరిగించేశాయి. ఈ వారంలో మదుపర్లు సుమారు రూ.30లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ సుంకాల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. 10 శాతం అధిక సుంకాలు విధిస్తామని చైనాను ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సుంకాల ప్రకటన అనంతరం బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 400 పాయింట్ల ప్రతికూల గ్యాప్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 73,141 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 1,414 పాయింట్లు లేదా 1.9 శాతం నష్టంతో 73,198 వద్ద ముగిసింది. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,113 పాయింట్లు (2.8 శాతం) నష్టంతో వారాన్ని ముగించింది. అలాగే ఫిబ్రవరి నెలలో 4,303 పాయింట్లు లేదా 5.6 శాతం క్షీణించింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 85,978 నుంచి దాదాపు 15 శాతం నష్టపోయింది.ఇక నిఫ్టీ 1.9 శాతం లేదా 420 పాయింట్ల నష్టంతో 22,125 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫిబ్రవరిలో 5.9 శాతం క్షీణించి, జీవితకాల గరిష్ట స్థాయి 26,277 నుంచి 16 శాతానికి చేరువైంది. నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతం వరకు పడిపోతే బేర్ మార్కెట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది.ఐటీ, ఆటో షేర్లు తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా 4- 6 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 27 షేర్లు 1 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే 2 శాతం లాభంతో మెరిసింది.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ గత 5 సంవత్సరాలలో అతిపెద్ద నెలవారీ పతనాన్ని నమోదు చేసింది. అన్ని రంగాల సూచీలు 1 శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఐటీ, ఆటో సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
ఎయిర్టెల్ రీచార్జ్ ప్లాన్లు.. రూ.200 దగ్గరలో మంత్లీ వ్యాలిడిటీ
ఇటీవల టెలికాం రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. దీంతో ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నంబర్లను వినియోగిస్తున్నవారికి మరింత భారంగా మారింది. పెద్ద డేటా ప్యాకేజీలు కాకుండా తమ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకుంటే చాలని కొంతమంది యాజర్లు భావిస్తున్నారు. మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయి ఇటువంటి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే..ఎయిర్టెల్ వివిధ వర్గాల వినియోగదారుల అవసరాలను తీర్చే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల శ్రేణిని అందిస్తోంది. పెద్ద మొత్తంలో డేటా అవసరం లేకుండా తక్కువ ధరలో నెలవారీ రీఛార్జ్ కోసం చూస్తున్నవారికి, రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు లాంగ్ వాలిడిటీని అందించే ప్లాన్లు సుమారు రూ .200 వద్ద ఎయిర్‌టెల్‌లో ఉన్నాయి. ఆ చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లు ఏవో ఇక్కడ పరిశీలిద్దాం.రూ.211 ప్లాన్ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 1 జీబీ లభిస్తుంది. అంటే 30 రోజులకు మొత్తం 30 జీబీ లభిస్తుందన్నమాట. అయితే ఇందులో కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే ఇది డేటా ఓన్లీ ప్లాన్. బ్రౌజింగ్, సోషల్ మీడియా లేదా ఇతర ఆన్లైన్ కార్యకలాపాల కోసం ప్రధానంగా మొబైల్ డేటాను ఉపయోగించేవారికి ఈ ప్లాన్ అనువైనది.రూ .219 ప్లాన్డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు రెండింటినీ కోరుకునే వినియోగదారులకు ఎయిర్టెల్ రూ .219 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి ఎంపిక. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీని అందిస్తుంది. నెల మొత్తం 3 జీబీ డేటాను అందిస్తుంది. నెలంతా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఆనందించవచ్చు.ఎలా రీచార్జ్ చేసుకోవాలి?ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల కోసం రీఛార్జ్ చేసుకోవడం చాలా సులభం. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా నేరుగా మీ ఎయిర్టెల్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లోనూ, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి పాపులర్ థర్డ్ పార్టీ రీఛార్జ్ యాప్‌లలో కూడా ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. -
ఎల్ఐసీ.. రూ.480 కోట్లు కట్టు!
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)కి భారీ మొత్తంలో జీఎస్టీ (GST) చెల్లించాలని నోటీసు వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ముంబైలోని స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నుంచి జీఎస్టీ డిమాండ్ ఆర్డర్ అందుకున్నట్లు ఎల్ఐసీ తెలిపింది. జీఎస్టీ, వడ్డీ, పెనాల్టీతో కలిపి మొత్తం రూ.479.88 కోట్లు చెల్లించాలని ఆ నోటీసులో ఉంది.ఈ రూ.479.88 కోట్ల మొత్తంలో జీఎస్టీ రూపంలో రూ.242.23 కోట్లు, వడ్డీ కింద రూ.213.43 కోట్లు, పెనాల్టీ రూపంలో రూ.24.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను తప్పుగా పొందడం, షార్ట్ రివర్స్ చేయడం, ఆలస్య చెల్లింపులపై వడ్డీ, తక్కువ పన్ను చెల్లించడం వంటి కారణాలతో ఈ నోటీసు జారీ చేసినట్లుగా ఎల్ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.ఈ ఆర్డర్‌ను ముంబైలోని జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ (అప్పీల్స్) ముందు అప్పీల్ చేసే అవకాశం ఉందని ఎల్ఐసి పేర్కొంది. కాగా ఈ డిమాండ్ నోటీసు తమ ఆర్థికాంశాలు లేదా కార్యకలాపాలపై నేరుగా ఎటువంటి ప్రభావాన్ని చూపదని స్పష్టం చేసింది. ‘ఈ డిమాండ్ ఆర్థిక ప్రభావం జీఎస్టీ, వడ్డీ, పెనాల్టీల వరకే ఉంటుంది. కార్పొరేషన్ ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి భౌతిక ప్రభావం ఉండదు" అని ఎల్ఐసీ తెలిపింది.మెరుగైన లాభాలుఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలలో ఎల్ఐసీ బలమైన పనితీరును ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో మెరుగైన పెట్టుబడి ఆదాయం, అధిక ప్రీమియం వసూళ్లతో లాభంలో 16 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కార్యకలాపాల నుండి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది. లాభాల వృద్ధితో పాటు ఎల్ఐసీ నికర ప్రీమియం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. -
ఇన్ఫోసిస్ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) లేఆఫ్‌లలో మరో పరిణామం చోటుచేసుకుంది. బలవంతపు తొలగింపులపై ఇన్ఫోసిస్ ట్రైనీలు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తలుపులు తట్టారు. ఇన్ఫోసిస్ తమను అన్యాయంగా తొలగించిందని (Layoffs), తిరిగి విధుల్లోకి తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా చూడాలని కోరుతూ 100 మందికి పైగా బాధితులు పీఎంవోకి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ లో సామూహిక తొలగింపులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర అధికారులను కోరుతూ కర్ణాటక లేబర్ కమిషనర్ కు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రెండో నోటీసు పంపింది. పీఎంవోకు పలు ఫిర్యాదులు అందాయని, కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర కార్మిక అధికారులను కోరింది. అలాగే బాధితుల పక్షాన పోరాడుతున్న ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్)కు సమాచారం అందించింది.700 మంది తొలగింపుగత రెండున్నరేళ్లలో క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా నియమించుకున్న సుమారు 700 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న తొలగించింది. వీరు 2023 అక్టోబర్‌లోనే విధుల్లోకి చేరారు. అంతర్గత మదింపు కార్యక్రమంలో బాధిత ఉద్యోగులు విఫలమయ్యారని పేర్కొంటూ ఇన్ఫోసిస్ తొలగింపులను సమర్థించుకుంది. వీరిలో పనితీరు సంబంధిత సమస్యల కారణంగా 350 మంది ఉద్యోగులు మాత్రమే రాజీనామా చేశారని కంపెనీ పేర్కొంది. తొలగించిన ఉద్యోగులు అంతర్గత మదింపుల పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఊహించని విధంగా పరీక్షల్లో క్లిష్టత స్థాయిని పెంచారని, దీంతో ఉత్తీర్ణత సాధించడం కష్టంగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు.ఇన్ఫోసిస్ స్పందనఈ ఫిర్యాదులపై స్పందించిన ఇన్ఫోసిస్ తన వైఖరిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ టెస్టింగ్ ప్రక్రియలను మూల్యాంకన విధాన పత్రంలో పొందుపరిచామని, ట్రైనీలందరికీ ముందస్తుగా తెలియజేశామని తెలిపింది. ఇన్ఫోసిస్ లో చేరే ప్రతి ట్రైనీ కంపెనీలో తమ అప్రెంటిస్ షిప్ ను అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపుతారని గుర్తు చేసింది. శిక్షణ ఖర్చును పూర్తిగా ఇన్ఫోసిస్ భరిస్తోందని పేర్కొంది. -
ఎస్బీఐ అప్డేట్.. క్రెడిట్‌కార్డ్ బిల్ పేమెంట్ ఈజీ..
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల (Credit Card) వినియోగం పెరిగిపోయింది. చాలా మంది దగ్గర ఒకటికి మించి క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. వీటితో ఖర్చు చేసేటప్పుడు సులువుగా ఉన్నా వాటి బిల్లుల చెల్లింపులో చిక్కులు ఎదురవుతుంటాయి. వేరువేరు గడువు తేదీలు, అధిక వడ్డీ రేట్లు, సంక్లిష్ట స్టేట్మెంట్, సాంకేతిక సమస్యల కారణంగా క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం సవాలుగా ఉంటుంది. ఈ తలనొప్పులేవీ లేకుండా ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డు బిల్లులను యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లించే అవకాశం ఉందని మీకు తెలుసా?దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో యూపీఐ భారీ మార్పులను తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ ఇది. దీని ద్వారా వినియోగదారులు సెకన్లలో డబ్బు పంపవచ్చు. అలాగే స్వీకరించవచ్చు. యూపీఐ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో ఏ యూపీఐ యాప్ (UPI App) ద్వారా అయినా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్లును సులువుగా చెల్లించవచ్చు.నేడు మార్కెట్లో పేటీఎం, క్రెడ్, మొబిక్విక్, ఫోన్‌పే, అమెజాన్ పే వంటి అనేక ప్రసిద్ధ థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించవచ్చు. అయితే, ఈ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు సెటిల్మెంట్లో జాప్యం జరగవచ్చు. మరోవైపు యూపీఐ ద్వారా చెల్లింపు చేసినప్పుడు అది వెంటనే మీ క్రెడిట్ కార్డు ఖాతాలో ప్రతిబింబిస్తుంది. యూపీఐ ద్వారా చేసిన చెల్లింపులు తక్షణమే ప్రాసెస్ అవుతాయి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లింపు అవుతుంది.యూపీఐ యాప్ ద్వారా చెల్లించండిలా..» మీ స్మార్ట్ ఫోన్ లో మీకు ఇష్టమైన యూపీఐ యాప్‌ను తెరవండి» పేమెంట్ సెక్షన్‌కు వెళ్లి 'పే' లేదా 'సెండ్ మనీ' ఎంచుకోండి» మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు లింక్ చేసిన వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ) ఎంటర్ చేయండి.» మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని పేర్కొనండి.» వివరాలను సరిచూసుకుని పేమెంట్‌ను కన్ఫమ్ చేయండి.» ఈ మొత్తం మీ బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ అయి మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.క్యూఆర్ కోడ్ ద్వారా అయితే ఇలా..» మీ యూపీఐ యాప్‌ను తెరిచి 'స్కాన్ క్యూఆర్ కోడ్' ఆప్షన్ ఎంచుకోండి.» క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం ఎస్బీఐ అందించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.» మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.» వివరాలను సరిచూసుకుని పేమెంట్‌ను కన్ఫమ్ చేయండి. -
హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ మరో జీడీసీ..
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) హైదరాబాద్‌లో మరో గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను (GDC) తెరిచింది. హైటెక్ సిటీలో ఏర్పాటైన ఈ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో హెచ్‌సీఎల్ టెక్ సంస్థకు ఇది ఐదో గ్లోబల్ డెలివరీ సెంటర్. ఈ అత్యాధునిక కేంద్రంలో 5,000 మంది ఉద్యోగులు పని చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ తాజాగా ఏర్పాటు చేసిన గ్లోబల్ డెలివరీ సెంటర్ 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ పొందింది. ఈ కేంద్రం ద్వారా 5,000 ఉద్యోగాలు లభిస్తాయని, ప్రముఖ టెక్ గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.2007 నుండి హెచ్‌సీఎల్ టెక్ సంస్థకు హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది. నగరంలో ఈ సంస్థకు 10,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కొత్త కేంద్రం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు మద్దతు ఇస్తుంది. ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో అధునాతన పరిష్కారాలను అందిస్తుంది.గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణ శరవేగంగా రూపాంతరం చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పట్ల రాష్ట్రానికి ఉన్న నిబద్ధతను ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ 2.0 గ్రోత్ విజన్ ద్వారా వృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.హెచ్ సీఎల్ టెక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ కొత్త కేంద్రంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ‘కృత్రిమ మేధ నేతృత్వంలోని సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తేజకరమైన దశలో మనం ఉన్నాం. మా క్లయింట్లకు ఈ పరిష్కారాలను అందించడానికి మా గ్లోబల్ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక స్థానం. ఇక్కడి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల పురోగతికి కృషి చేస్తాం’ అన్నారు. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు..
Stock Market Updates: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. విస్తృత సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ భారత బెంచ్ మార్క్ సూచీలు అత్యంత స్వల్ప స్థాయిలో కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 74,834 వద్ద గరిష్ట స్థాయి నుండి 74,521 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరికి 10 పాయింట్ల లాభంతో 74,612 వద్ద ఫ్లాట్ నోట్ వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 100 పాయింట్ల స్వల్ప శ్రేణిలో కదలాడింది. 22,613 వద్ద గరిష్ట స్థాయి నుండి ఇండెక్స్ 22,508 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరికి దాదాపుగా 22,545 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ చెరో 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జొమాటో, యాక్సిస్ బ్యాంక్ 1 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు వైర్లు, కేబుల్స్ వ్యాపారంలోకి ప్రవేశించే ప్రణాళికను ప్రకటించిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 5 శాతం పడిపోయింది. అదేసమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయాయి. బంధన్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఏయూ బ్యాంక్, క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్, టీటీకే హెల్త్‌కేర్, చోళమండలం హోల్డింగ్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 5-8 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు ఆర్ఆర్ కబెల్, కేఈఐ ఇండస్ట్రీస్, విజయ డయాగ్నస్టిక్స్, ప్రజ్ ఇండస్ట్రీస్, అజంతా ఫార్మా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎంఎఫ్ఐ రుణాలు, ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలపై రిస్క్ వెయిట్‌ను తగ్గించిన తరువాత క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC), మైక్రో ఫైనాన్స్ షేర్లకు గురువారం డిమాండ్ ఏర్పడింది. -
హైదరాబాద్‌లో ఫనాటిక్స్ విస్తరణ..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్పోర్ట్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫనాటిక్స్ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఐసీసీతోపాటు పలు దేశాల్లోని లీగ్పోటీలకు, క్రీడాకారులకు జెర్సీలు, జ్ఞాపికలు, ఇతర వాణిజ్య వస్తువుల డిజైనింగ్, తయారీ, మార్కెటింగ్ పనులు ఫనాటిక్స్ వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 కేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లోనూ ఒక కేంద్రాన్ని ప్రారంభించింది.అయితే పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా ఈ కేంద్రాన్ని విస్తరించేందుకు నిర్ణయించామని, ఇందులో భాగంగా అభిషేక్ దశ్మనాను వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా నియమించామని ఫనాటిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మథియాస్ స్పైచర్ తెలిపారు. అంతేకాకుండా.. రానున్న రెండేళ్లలో హైదరాబాద్ కేంద్రం ఉద్యోగుల సంఖ్యను 250 నుంచి 500కు పెంచుతామని, వచ్చే ఏడాది తొలినాళ్లలోనే హైటెక్ సిటీ సమీపంలో సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఆఫీసుకు వెళ్లనున్నామని ఆయన వివరించారు.ఈ కేంద్రం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది క్రీడాభిమానులకు ఉత్పత్తులు, సేవలు అందిస్తామని చెప్పారు. సంస్థ కార్యకలాపాలన్నింటికీ హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారనుందని అన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక అత్యాధునిక టెక్నాలజీలను హైదరాబాద్ కేంద్రంలో ఉపయోగించనున్నామని చెప్పారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఏఐ అప్లికేషన్స్, ఫనాటిక్స్ గ్లోబల్ కార్యకలాపాలన్నింటికీ అవసరమైన బ్యాక్ఎండ్ టెక్నాలజీలను ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు.ఈ సందర్భంగా అభిషేక్ దశ్మనా మాట్లాడుతూ.. భారత్‌లో క్రీడలపై ఆసక్తి ఏటికేడాదీ పెరుగుతోందని.. క్రీడాభిమానుల మనసు గెలుచుకునేందుకు ఫనాటిక్స్ హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాలు ఉపకరిస్తాయన్నారు. ఫనాటిక్స్ ద్వారా ప్రపంచంలోని ఏ మూలనున్న స్పోర్ట్స్ టీమ్ తాలూకూ జెర్సీ, ఇతర వాణిజ్యవస్తువులను భారత్‌లో కూర్చుని తెప్పించుకునేందకు అవకాశం ఏర్పడిందని అన్నారు.సుమారు 190 దేశాలకు ఫనాటిక్స్ ఉత్పత్తులు రవాణా అవుతూంటాయని, ఇందుకోసం 80కిపైగా తయారీ కేంద్రాలుండగా.. మొత్తం 900 మంది భాగస్వాములతో కలిసి వీటిని ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. ఐపీఎల్ లాంటి భారతీయ క్రీడల్లో భాగస్వామ్యం వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మెర్చండైజ్ తయారీ వంటివి భవిష్యత్తులో తగిన సమయంలో చేపట్టే అవకాశం లేకపోలేదన్నారు. -
విప్లవాత్మక ఆవిష్కరణ.. స్మార్ట్ ఏఐ నోట్‌బుక్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత, సుస్థిర సాంకేతిక పరిష్కారాల్లో అగ్రగామిగా ఉన్న క్వాడ్రిక్ ఐటీ.. బయో ఏషియా 2025లో అద్భుతమైన ఆవిష్కరణలతో ప్రభావం చూపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను సుస్థిరతతో మిళితం చేస్తూ రూపొందించిన పలు ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించింది.రీయూజబుల్ స్మార్ట్ ఏఐ నోట్ బుక్క్వాడ్రిక్ ఐటీ అందించిన అద్భుతమైన ఆవిష్కరణలలో రీయూజబుల్ స్మార్ట్ ఏఐ ఆధారిత నోట్ బుక్ ఒకటి. సుమన్ బాలబొమ్ము, కేసరి సాయికృష్ణ శబనివీసు, రఘు రామ్ తాతవర్తి కలిసి రూపొందించిన ఈ నోట్ బుక్ సమావేశాల్లో నోట్స్ తీసుకునే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నోట్ బుక్ సంప్రదాయ నోట్ బుక్ లాగే పనిచేస్తుంది. కానీ ప్రతి పేజీని 100 సార్లు పునర్వినియోగించుకోవచ్చు. రెనోట్ఏఐ అనువర్తనాన్ని ఉపయోగించి చేతిరాత కంటెంట్‌ను డిజిటల్ ఫార్మాట్లోకి సులభంగా మార్చవచ్చు. అలాగే క్లౌడ్ స్టోరేజ్, ఏఐ-జనరేటెడ్ ప్రాంప్ట్‌ల ద్వారా సమాచారాన్ని కావాల్సినప్పుడు తిరిగి పొందవచ్చు. ఈ నోట్‌బుక్ పేజీలను తడి గుడ్డ లేదా టిష్యూతో తుడిచివేసి మళ్లీ ఉపయోగించవచ్చు. దీంతో కాగితం వినియోగం బాగా తగ్గుతుంది.మరిన్ని ఏఐ పరిష్కారాలురీ యూజబుల్ స్మార్ట్ నోట్‌బుక్‌తో పాటు క్వాడ్రిక్ ఐటీ.. బయో, ఫార్మా పరిశ్రమల కోసం రూపొందించిన మరిన్ని కృత్రిమ మేధ, డేటా ఆధారిత పరిష్కారాలను ప్రదర్శించింది. ఈ ఆవిష్కరణలు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతోపాటు వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడతాయి. అలాగే పర్యావరణ హితానికి తోడ్పడతాయి. -
ఆరోగ్య సంరక్షణలో సరికొత్త మార్పులు
డిజిటల్ ఆవిష్కరణలతో ఆరోగ్య సంరక్షణలో సరికొత్త మార్పులు వచ్చాయని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఏషియా 2025 సదస్సులో పాల్గొన్న ఆమె 'ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ అండ్ పేషెంట్ అవుట్‌కమ్స్' అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో మాట్లాడారు.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) ఈ-సంజీవని టెలిమెడిసిన్ వంటి కార్యక్రమాల ప్రభావాన్ని ఎత్తి చూపారు. ఈ కార్యక్రమాలు ఆసుపత్రులు, డిజిటల్ హెల్త్ వేదికలు, ఇంటి ఆధారిత ఆరోగ్య సంరక్షణ మధ్య అంతరాలను పూడ్చాయని, ఎక్కువ మందికి ఆరోగ్య సంరక్షణ అందేలా చేశాయని వివరించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత డిజిటల్ స్వీకరణ 300 శాతానికి పైగా పెరిగిందని, ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ మరిన్ని రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.టెక్నాలజీ పాత్రవైద్యుల నైపుణ్యాన్ని భర్తీ చేయడం కంటే, సాంకేతిక పరిజ్ఞానం క్లినికల్ ఎక్సలెన్స్ కు తోడ్పడాలని డాక్టర్ సంగీతా రెడ్డి అభిప్రాయపడ్డారు. మెరుగైన రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళిక, రోగి పర్యవేక్షణ కోసం కృత్రిమ మేధ ఆధారిత సాధనాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని, ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ తో అపోలో హాస్పిటల్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు వెల్లడించారు.ఎక్కువ మందికి చేరువఆయుష్మాన్ భారత్, మైక్రో ఇన్సూరెన్స్ మోడల్స్, హెల్త్ కేర్ లెండింగ్ వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను డాక్టర్ సంగీతా రెడ్డి నొక్కి చెప్పారు. ఆర్థిక అడ్డంకులను తగ్గించడానికి, టైర్ -2 నగరాలు, అణగారిన కమ్యూనిటీలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను చేరువ చేసేందుకు ఈ చర్యలు అవసరమని ఉద్ఘాటించారు. అధునాతన చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం, నివారణ చేయడంలోనే ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు ఉందని ఆమె స్పష్టం చేశారు. అత్యాధునిక ఆవిష్కరణలను క్లినికల్ నైపుణ్యంతో మిళితం చేయడం ద్వారా ముదిరిపోక ముందే వ్యాధి భారాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. -
ఈవీ ఆఫర్.. రూ.40,000 క్యాష్‌బ్యాక్!
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మేకర్లలో ఒకటైన ప్యూర్ ఈవీ (PURE EV) తమ ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు 'ప్యూర్ పర్ఫెక్ట్ 10' (PURE Perfect 10) రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.ప్రోగ్రామ్ వివరాలుప్యూర్ పర్ఫెక్ట్ 10 రిఫరల్ ప్రోగ్రామ్ ఇప్పటికే ఉన్న ప్యూర్ ఈవీ కస్టమర్లందరితోపాటు మార్చి 31 నాటికి లేదా సంబంధిత అవుట్లెట్లలో స్టాక్స్ ఉన్నంత వరకూ ప్యూర్ ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే కొత్త కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ కింద కస్టమర్లు ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు రెఫర్ చేయడం ద్వారా రూ.40,000 వరకు క్యాష్ బ్యాక్ రివార్డులను పొందవచ్చు.ఇది ఎలా పనిచేస్తుందంటే..ఇప్పటికే ఉన్న కొత్త ప్యూర్ ఈవీ వినియోగదారులతోపాటు కొత్త కస్టమర్లకు వారి రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్ ద్వారా 10 ప్రత్యేక రిఫరల్ కోడ్లు అందుతాయి. రిఫరర్ కొనుగోలుకు దారితీసే ప్రతి విజయవంతమైన రిఫరెన్స్ కు రూ.4,000 చొప్పున క్యాష్ బ్యాక్ వోచర్లను అందుకుంటారు. ఇలా గరిష్టంగా పది మందికి రెఫర్ చేసి వారు వాహనాన్ని కొనుగోలు చేస్తే రూ.40,000 వరకూ క్యాష్ బ్యాక్ వోచర్లు లభిస్తాయి.రిఫరల్స్ ద్వారా సంపాదించిన క్యాష్ బ్యాక్ వోచర్లను భవిష్యత్ సర్వీస్, స్పేర్ పార్ట్స్ అవసరాల కోసం ఉపయోగించవచ్చు. అలాగే వాహన అప్గ్రేడ్లు, ఎక్చ్సేంజ్, బ్యాటరీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ల కోసం కూడా వీటిని వినియోగించుకోవచ్చు. లేదా తమవారెవరైనా ప్యూర్ ఈవీ వాహనం కొనుగోలు చేసినప్పుడు ప్రత్యక్ష నగదు డిస్కౌంట్లను పొందవచ్చు."మా ప్రతి ప్రయత్నంలోనూ కస్టమర్లు మా హృదయంలో ఉంటారు. ఈ ప్రత్యేక రిఫరల్ కార్యక్రమంతో వారి పండుగ వేడుకలకు మరింత ఆనందాన్ని జోడించాలనుకుంటున్నాము. ఈ చొరవ మా కస్టమర్ల విశ్వాసం, విశ్వసనీయతకు ప్రతిఫలం ఇవ్వడమే కాకుండా ప్యూర్ ఈవీ అనుభవాన్ని వారి ప్రియమైనవారితో పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది" అని ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వడేరా పేర్కొన్నారు. -
రూ.40 లక్షల జాబ్.. రెజ్యూమ్ కూడా అవసరం లేదు!
ఈరోజుల్లో జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో చూస్తూనే ఉన్నాం. మంచి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. అంటే మంచి పేరున్న కాలేజీలో చదివుండాలి. ఎన్ని నైపుణ్యాలు ఉన్నా వాటిని రెజ్యూమ్‌లో ఆకట్టుకునేలా పేర్కొనకపోతే ఉద్యోగం కష్టమే. అయితే ఇవేవీ లేకుండా హై పేయింగ్ జాబ్ ఇస్తానంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఫౌండర్.బెంగళూరులో జాబ్.. ఏడాదికి రూ. 40 లక్షల వేతనం.. వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని.. మంచి కాలేజీ నుంచి రావాల్సిన అవసరం లేదు.. అనుభవం అక్కర్లేదు.. కనీసం రెజ్యూమ్‌తో కూడా పని లేదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ కంపెనీ ఫౌండర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తించింది.బెంగళూరులోని ఇందిరానగర్‌లో తమ కార్యాలయానికి సున్నా నుంచి రెండేళ్ల వరకూ అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నియమించుకోవాలని చూస్తున్నట్లు ‘స్మాలెస్ట్ ఏఐ’ కంపెనీ అధినేత సుదర్శన్ కామత్ తెలిపారు. "‘స్మాలెస్ట్ ఏఐ’ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రాక్డ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ ను నియమించాలని చూస్తున్నాం. మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ ఒక చిన్న 100 పదాల టెక్స్ట్ పంపండి చాలు" అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "మీది ఏ కాలేజీ అనేది ముఖ్యం కాదు".. "రెజ్యూమ్ అవసరం లేదు" అంటూ పేర్కొన్నారు.ఇక్కడ "క్రాక్డ్ ఇంజనీర్స్" అనేది నూతన మార్పులకు, కొత్త ఆలోచనలకు భయపడని అత్యంత సమర్థనీయులైన, ప్రతిభావంతులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లని వర్ణించడానికి ఉపయోగించే పదం. ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఆకట్టుకునే రెజ్యూమె కంటే నైపుణ్యాలకు కామత్ ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఎక్స్ యూజర్లు ప్రశంసించారు. అయితే క్రాక్డ్ ఇంజనీర్ కు ఈ జీతం చాలా తక్కువ అని మరికొందరు వ్యాఖ్యానించారు.We are looking to hire a cracked full-stack engineer at @smallest_AI Salary CTC - 40 LPASalary Base - 15-25 LPASalary ESOPs - 10-15 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 0-2 yearsWork from Office - 5 days a weekCollege - Does not matter…— Sudarshan Kamath (@kamath_sutra) February 24, 2025 -
బంగారంపై ఉపశమనం.. వెండిపై భారీ ఊరట!
దేశంలో కొన్ని రోజులుగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) నేడు (February 26) కాస్త దిగివచ్చాయి. ఆల్‌టైమ్ హైకి చేరుకున్న పసిడి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? ఈపీఎఫ్ విత్‌డ్రా మరింత ఈజీ.. ఇక నేరుగా యూపీఐ..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 80,500, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,820 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.250, రూ.270 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,970 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,650 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.270, రూ.250 చొప్పున క్షీణించాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,500 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,820 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.250, రూ.270 చొప్పున కరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.భారీగా పడిన వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు భారీ తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.2000 తగ్గి రూ.1,06,000 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో కేజీ వెండ రూ. 98,000 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.3000 క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
రైలు టికెట్ ఇలా కొంటే క్యాష్‌బ్యాక్..
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ టికెట్ల (Train ticket) కోసం ప్రవేశపెట్టిన అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు 3 శాతం క్యాష్‌బ్యాక్ (Cashback) రాయితీ ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. 2016లో హైదరాబాద్ నగరంలోని ఎంఎంటీఎస్ ప్రయాణికుల కోసం మొదటిసారి యూటీఎస్‌ను ప్రవేశపెట్టారు.ఆ తరువాత 2018 జూలై నుంచి అన్ని రైళ్లలో సాధారణ టికెట్ కొనుగోళ్లకు దీన్ని విస్తరించారు. ప్లాట్‌ఫామ్ టికెట్లు, సీజన్ టికెట్లు కూడా యూటీఎస్ ఆర్–వాలెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు ఆర్–వాలెట్‌తోపాటు, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.ఆర్–వాలెట్లో రూ.20 వేల వరకు డిపాజిట్ చేసే సదుపాయం ఉంది. యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ కొనుగోళ్లను ప్రోత్సహించడానికే ఈ క్యాష్‌బ్యాక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం సగటున ప్రతిరోజు సుమారు 83,510 మంది యూటీఎస్‌ను వినియోగించుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య రోజుకు 93,487కు పెరిగింది.ఏడాది కాలంలో 12 శాతం పెరిగినట్లు సీపీఆర్వో తెలిపారు. టికెట్ కౌంటర్ల వద్ద పడిగాపులు కాయవలసిన అవసరం లేకుండా అప్పటికప్పుడు యాప్ ద్వారా కొనుగోలు చేసుకొని బయలుదేరవచ్చు. దీని వల్ల ప్రయాణికులకు సమయం ఆదా కావడమే కాకుండా క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని కూడా పొందే ఆస్కారం ఉంటుంది. -
‘ఏఐ ఏమైనా చేయగలదు’: సత్య నాదెళ్ల వీడియోకి మస్క్ రిప్లై
ఏఐని ఎక్కువగా విశ్వసించే ఎలాన్ మస్క్ (Elon Musk).. ఈసారి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోను టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ రీషేర్ చేస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని మరింత నొక్కిచెప్పారు. "కృత్రిమ మేధ ప్రతిదాన్ని మెరుగుపరుస్తుంది" అని పేర్కొన్నారు.రైతులు తక్కువ వనరుల వినియోగంతో ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు ఎలా సహాయపడతాయో ఈ వీడియో చూపిస్తుంది. కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందిన భారతదేశంలోని బారామతి సహకార సంఘానికి చెందిన ఒక రైతు ఉదాహరణను సత్య నాదెళ్ల ఉదహరించారు.తక్కువ భూమి ఉన్న రైతులు పంట దిగుబడిలో గణనీయమైన మెరుగుదలను చూశారని, రసాయనాల వాడకం తగ్గిందని, నీటి నిర్వహణ మెరుగైందని చెప్పుకొచ్చారు. జియోస్పేషియల్ డేటా, డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి ఉష్ణోగ్రత డేటా, రియల్ టైమ్ సాయిల్ అనాలిసిస్ ద్వారా ఈ సమాచారం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుసంధానం చేస్తుందని తెలిపారు. రైతులు వారి స్థానిక భాషలో ఈ సమాచారాన్ని పొందవచ్చు.రియల్ టైమ్ అగ్రికల్చర్ డేటాతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిళితం చేయడం ద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఇది సుస్థిర వ్యవసాయ పద్ధతులకు దారితీస్తుందని, సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు.ఆ వీడియో ఇదే.. మీరూ చూసేయండి..A fantastic example of AI's impact on agriculture. pic.twitter.com/nY9o8hHmKJ— Satya Nadella (@satyanadella) February 24, 2025 -
ఎయిర్టెల్ కొత్త ఆఫర్.. ప్రముఖ ఓటీటీ ఫ్రీ
ఎయిర్టెల్ (Airtel) తమ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రకటించింది. యాపిల్ టీవీ+, (Apple TV+) యాపిల్ మ్యూజిక్ (Apple Music) సేవలను అందించడానికి భారతీ ఎయిర్టెల్, యాపిల్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రూ.999తో ప్రారంభమయ్యే ప్లాన్లపై హోమ్ వై-ఫై వినియోగదారులందరికీ యాపిల్ టీవీ + కంటెంట్ ఉచితంగా లభిస్తుందని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదే కాకుండా రూ .999 నుండి ప్రారంభమయ్యే ప్లాన్లపై పోస్ట్‌పెయిడ్ యూజర్లు యాపిల్ టీవీ + సదుపాయాన్ని పొందవచ్చు. 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఇందులో భారతీయ సంగీతంతోపాటు విదేశీ మ్యూజిక్ లిస్టింగ్ కూడా ఉంటుంది. ఎలాంటి కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందబోతున్నారు.. ఇందు కోసం వారు ఏ రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకోవాలో తెలుసుకుందాం.యాపిల్ మ్యూజిక్ ఉచిత సబ్స్క్రిప్షన్ఈ భాగస్వామ్యం కింద వినియోగదారులు యాపిల్ టీవీ+లోని అన్ని ఒరిజినల్ సిరీస్‌లు, సినిమాలను ఎటువంటి ప్రకటనలు లేకుండా యాక్సెస్ చేయవచ్చు. వీటిలో టెడ్ లాస్సో, సెవెరెన్స్, ది మార్నింగ్ షో, స్లో హార్స్, సిలో, ష్రింకింగ్, డిస్క్లయిమర్ వంటి అవార్డ్ విన్నింగ్ హిట్ సిరీస్‌లు ఉన్నాయి. వీటితో పాటు వోల్ఫ్స్, ది గోర్జ్ వంటి కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా వినియోగదారులకు 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ సర్వీస్ కూడా ఉచితంగా లభిస్తుంది. యాపిల్ టీవీ+, యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు.బెనిఫిట్స్ ఈ ప్లాన్లలో..రూ.1,099, రూ.1,599, రూ.3,999 ఎయిర్టెల్ వైఫై ప్లాన్లను ఎంచుకున్న వారికి వరుసగా 350కి పైగా టీవీ ఛానళ్లు, 200 ఎంబీపీఎస్, 300 ఎంబీపీఎస్, 1 జీబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్‌తో ఎయిర్టెల్ ఎంటర్టైన్మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత బలంగా మారింది. ఇది ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. దేశంలో డిజిటల్ కంటెంట్ అందించే పెద్ద సంస్థలలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. -
ఇన్ఫోసిస్ యూటర్న్..
ఉద్యోగుల తొలగింపులపై దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) దూకుడు తగ్గించింది. ఉద్యోగులు నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తన రాబోయే ఉద్యోగుల మదింపులను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయం సరికొత్త ఎత్తుగడ అని, ఇటీవలి తొలగింపుల (Layoff) నుండి దృష్టిని మరల్చడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఎంప్లాయీ వెల్ఫేర్ గ్రూప్ నాజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆరోపించింది.తొలగింపుల నేపథ్యంఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న 700 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ప్రధానంగా 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందిన ఫ్రెషర్స్ ఉన్నారు. వీరు ఇప్పటికే ఆన్‌బోర్డింగ్‌లో రెండు సంవత్సరాల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. అంతర్గత మదింపుల ఆధారంగా ఈ తొలగింపులు జరిగినట్లు సమాచారం. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సదరు ఉద్యోగులకు మూడు అవకాశాలు ఇచ్చినట్లు కంపెనీ చెబుతోంది. అయితే తొలగింపునకు గురైన ఉద్యోగులు దీనిని ఖండిస్తున్నారు. అసెస్ మెంట్ సిలబస్ ను మధ్యలోనే మార్చారని, ముందస్తు సమాచారం లేకుండానే చాలా మందికి తొలగింపు నోటీసులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.ఎన్ఐటీఈఎస్ స్పందన..ఇన్ఫోసిస్ చర్యలను విమర్శిస్తూ, తొలగింపులు కార్మిక హక్కుల ఉల్లంఘనగా ఎన్ఐటీఈఎస్ అభివర్ణించింది.. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, మదింపులను ఆలస్యం చేయాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తొలగింపులపై మరింత వివాదం కొనసాగకుండా కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు.ఇన్ఫోసిస్ సమర్థనఉద్యోగులకు అదనపు ప్రిపరేషన్ సమయాన్ని అందించడమే లక్ష్యంగా మదింపులను వాయిదా వేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కంపెనీ తమ అన్ని కార్యకలాపాలలో సమ్మతి, పారదర్శకతను పాటించడంలో తమ నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇన్ఫోసిస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ మాట్లాడుతూ.. కంపెనీ కార్మిక శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారి విచారణలకు సహకరిస్తూ అవసరమైన సమాచారాన్ని అందిస్తోందని తెలిపారు.ఉద్యోగులపై ప్రభావం..మదింపులను నిరవధికంగా వాయిదా వేయడం చాలా మంది ఉద్యోగులను వారి భవిష్యత్తుపై మరింత అనిశ్చితికి గురిచేసింది. ఆయా అంశాల్లో నిపుణులతో అదనపు శిక్షణ, ఇతర సహకారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఆందోళన తొలగడం లేదు. ఉద్యోగుల తొలగింపు, మదింపుల వాయిదాతో తలెత్తిన వివాదం భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. -
మా తప్పు వల్లే గూగుల్ సక్సెస్!
మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల తన అతిపెద్ద వృత్తిపరమైన పశ్చాత్తాపం గురించి ఇటీవల ఓపెన్ అయ్యారు. గూగుల్ (Google) విజయవంతంగా క్యాష్ చేసుకున్న వెబ్ సెర్చ్ మార్కెట్ ఆధిపత్యాన్ని అంచనా వేయడంలో విఫలమైనట్లు అంగీకరించారు. వెబ్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, సెర్చ్ అత్యంత విలువైన వ్యాపార నమూనాగా మారుతుందని గ్రహించలేదని ఆయన అన్నారు.చేజారిన అవకాశం..వెబ్ మార్కెట్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, కేవలం వెబ్ సెర్చ్ అంత పెద్ద బిజినెస్ మోడల్‌గా అంచనా వేయలేకపోయిందని సత్య నాదెళ్ల (Satya Nadella) అంగీకరించారు. ఈ పొరపాటు గూగుల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, సెర్చ్ చుట్టూ భారీ వ్యాపారాన్ని నిర్మించడానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. "వెబ్ లో అతిపెద్ద వ్యాపార నమూనాగా మారిన దానిని మేము మిస్ అయ్యాము. ఎందుకంటే వెబ్ అంతటా విస్తృతమవుతుందని మేమంతా భావించాము" అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.గూగుల్ దూరదృష్టిసెర్చ్ ప్రాముఖ్యతను మైక్రోసాఫ్ట్ తక్కువగా అంచనా వేసినప్పటికీ, దాని సామర్థ్యాన్ని గూగుల్ గుర్తించింది. దూరదృష్టిని ప్రదర్శించింది. వ్యూహాన్ని లోపరహితంగా అమలు చేసింది. సెర్చ్ ద్వారా వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో విలువను చూసి గూగుల్ దాన్ని ఎలా క్యాపిటలైజ్ చేసిందో సత్య నాదెళ్ల వివరించారు. "వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో సెర్చ్ అతిపెద్ద విజేత అవుతుందని ఎవరు ఊహించి ఉంటారు? మేము స్పష్టంగా దానిని చూడలేదు, గూగుల్ దాన్ని చూసింది.. చాలా బాగా అమలు చేసింది" అని అంగీకరించారు.నేర్చుకున్న పాఠాలుసాంకేతిక మార్పులను అర్థం చేసుకుంటే సరిపోదని సత్య నాదెళ్ల ఉద్ఘాటించారు. విలువ సృష్టి ఎక్కడ జరుగుతుందో కంపెనీలు గుర్తించాలి. సాంకేతిక పురోగతిని కొనసాగించడం కంటే వ్యాపార నమూనాలలో మార్పులకు అనుగుణంగా మారడం చాలా సవాలుతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ బిజినెస్ మోడల్ మార్పులు టెక్ ట్రెండ్ మార్పుల కంటే కూడా కఠినంగా ఉంటాయని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, సత్య నాదెళ్ల సీఈవోగా (CEO) బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ పై బలమైన దృష్టితో మైక్రోసాఫ్ట్ ఎదుగుదలకు నాయకత్వం వహించారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు, టెక్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్ నూతన ఆవిష్కరణలు, నాయకత్వం వహించేలా కంపెనీని నడిపిస్తున్నారు.సన్ మైక్రోసిస్టమ్స్ లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరిన సత్య నాదెళ్ల అనేక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. మంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, విస్కాన్సిన్-మిల్వాకీ వర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా పొందారు. -
స్టాక్‌మార్కెట్లు బేర్.. ఐటీ షేర్లు విలవిల
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్‌ను 1 శాతానికి పైగా నష్టంతో ముగించాయి. సెన్సెక్స్ 856.65 పాయింట్లు (1.14 శాతం) క్షీణించి 74,454.41 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ సూచీ 74,907.04-74,387.44 శ్రేణిలో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 242.55 పాయింట్లు (1.06 శాతం) క్షీణించి 22,553.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం రోజు గరిష్టాన్ని 22,668.05 వద్ద, రోజు కనిష్టాన్ని 22,518.80 వద్ద నమోదు చేసింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 38 షేర్లు నష్టాల్లో ముగియగా విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ 3.70 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా వంటి 12 షేర్లు 1.54 శాతం వరకు లాభాల్లో ముగిశాయి.ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.02 శాతం, 0.94 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు.. ఇక నో వ్యాలిడిటీ టెన్షన్!
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు తన పోర్ట్‌ఫోలియోలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (prepaid plans) జోడిస్తోంది. ఈ క్రమంలోనే మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక వాలిడిటీతో వస్తాయి.150 రోజుల ప్లాన్బీఎస్ఎన్ఎల్ 150 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ .397. ఇది అపరిమిత కాలింగ్ 2 జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్లు అందిస్తుంది. అయితే ప్రయోజనాలన్నీ మొదటి 30 రోజులు మాత్రమే ఉంటాయి. మిగిలిన 120 రోజులకు నంబర్‌కు వ్యాలిడిటీ అందుబాటులో ఉంటుంది. కాలింగ్, డేటా ప్రయోజనాల కన్నా ఇన్ కమింగ్ కాల్స్, సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవడం ముఖ్యం అనేకునేవారికి ఈ ప్లాన్ సరిపోతుంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్ బెస్ట్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..160 రోజుల ప్లాన్160 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ ధర రూ.997. ఈ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి అపరిమిత కాలింగ్, 2 జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందిస్తుంది. కాలింగ్, డేటాతో లాంగ్ టర్మ్ వాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ మరింత అనుకూలంగా ఉంటుంది.180 రోజుల ప్లాన్ఇది ఆరు నెలల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. దీని ధర రూ .897. ఈ ప్లాన్ ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, 180 రోజుల పాటు 90 జీబీ మొత్తం డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రోజువారీ కోటా గురించి ఆందోళన చెందకుండా ఒకేసారి ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువైనది. -
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
‘ఫెవికాల్’ పుట్టిందిలా..
పుస్తకాలు అతికించడం నుంచి గృహోపకరణాల తయారీ వరకూ అనేక చోట్ల ఉపయోగించే ‘ఫెవికోల్’ (Fevicol) దశాబ్దాలుగా భారతీయ ఇళ్లలో భాగంగా మారిపోయింది. ఫోటోకాపీయింగ్కు జిరాక్స్ ఎలాగైతే పర్యాయ పదంగా మారిందో అలాగే బ్రాండ్‌తో సంబంధం లేకుండా జిగురు (గమ్) పదార్థాలకు ఫెవికోల్ పర్యాయపదంగా మారింది. అయితే ఈ ఐకానిక్ బ్రాండ్ వెనుక చిన్న వ్యాపారాన్ని బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చిన మొదటి తరం వ్యవస్థాపకుడు బల్వంత్ పరేఖ్ అద్భుతమైన కృషి ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడైన ఆయన ప్యూన్‌గా ప్రారంభమై పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. "ఫెవికోల్ మ్యాన్" స్ఫూర్తిదాయకమైన ప్రస్థానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రారంభ జీవితం పోరాటాలే..గుజరాత్ లోని మహువాలో జైన కుటుంబంలో జన్మించిన బల్వంత్ పరేఖ్ తొలి జీవితం అనేక పోరాటాలతో కూడుకున్నది. ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందినప్పటికీ ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. బల్వంత్ పరేఖ్ ప్రారంభ జీవితం చాలా కఠినంగా గడిచింది. ఆయన డైయింగ్, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేశారు. తరువాత ప్యూన్ గా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం స్వాతంత్ర్య పోరాటంలో ఉంది. పరేఖ్ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే కుటుంబ ఒత్తిడితో చదువును పునఃప్రారంభించి లా డిగ్రీ పూర్తి చేశారు.వ్యాపార సామ్రాజ్యానికి పునాదిమోహన్ అనే ఇన్వెస్టర్ సహకారంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న పరేఖ్.. పాశ్చాత్య దేశాల నుంచి సైకిల్, అరెకా, కాగితపు రంగులను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఇందులో విజయాన్ని సాధించిన తరువాత, పరేఖ్ కుటుంబం ముంబైకి మకాం మార్చారు. ఇది ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. తరువాత బల్వంత్ తమ ఉత్పత్తులను భారతదేశంలో మార్కెటింగ్ చేయడానికి జర్మన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. 1954 లో ఆ కంపెనీ ఆహ్వానం మేరకు ఆయన జర్మనీ వెళ్లారు. కానీ వారి మేనేజింగ్ డైరెక్టర్ మరణించిన తరువాత ఆ సంస్థ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. ఈ ఎదురుదెబ్బ పరేఖ్‌ను అడ్డుకోలేదు. తాను కూడా సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పానికి అది ఆజ్యం పోసింది.ఫెవికోల్ ప్రారంభమైందిలా.. 1954లో బల్వంత్, ఆయన సోదరుడు సుశీల్ ముంబైలోని జాకబ్ సర్కిల్లో పరేఖ్ డైచెమ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. పారిశ్రామిక రసాయనాలు, వర్ణద్రవ్య ఎమల్షన్లు, రంగులను తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు. భారతీయ జిగురు మార్కెట్లో జంతువుల కొవ్వుతో తయారైన జిగురులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, అవి వికృతమైనవి, సంక్లిష్టమైనవని గమనించిన పరేఖ్ ఒక అవకాశాన్ని చూశారు. ఫెవికాల్ బ్రాండ్ పేరుతో తెల్ల జిగురు తయారీని ప్రారంభించారు. ఫెవికాల్ అనే పేరు మోవికాల్ అని పిలువబడే ఇలాంటి ఉత్పత్తిని తయారు చేసే ఒక జర్మన్ కంపెనీ ప్రేరణతో వచ్చింది. జర్మన్ భాషలో "కోల్" అంటే రెండు వస్తువలను అతికించేదని అర్థం.పిడిలైట్ ఇండస్ట్రీస్ నిర్మాణంఫెవికాల్ విజయం 1959 లో పిడిలైట్ ఇండస్ట్రీస్ స్థాపనకు దారితీసింది. ఫెవికాల్ దాని నాణ్యత, విశ్వసనీయతకు గుర్తింపు పొందడంతో కంపెనీ త్వరగా ఇంటి పేరుగా మారింది. విరిగిన పాత్రలను అతికించడం దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ఫెవికాల్ భారతీయ గృహాలలో అంతర్భాగమైంది. "ఫెవికోల్ కా జోడ్ హై, తూటేగా నహీ" అనే ట్యాగ్ లైన్ తో చేసిన అడ్వర్టైజింగ్ ప్రచారాలు వినియోగదారుల హృదయాలలో ఈ ఐకానిక్ బ్రాండ్ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. -
చాట్‌జీపీటీని అందుకు వాడతారా?.. ఓపెన్ఏఐ సీరియస్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం, చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త ఓపెన్ ఏఐ (OpenAI) కీలక నిర్ణయం తీసుకుంది. తమ చాట్‌జీపీటీ సేవల్ని దుర్వినియోగం చేస్తున్న చైనాకు చెందిన పలు ఖాతాలను నిషేధించింది. తమ ఏఐ నమూనాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, అనధికార నిఘా, పర్యవేక్షణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న తమ విధానాలను అవరోధం కలగకుండా కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఓపెన్ఎఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నిషేధానికి కారణాలివే..ఓపెన్ఏఐ విడుదల చేసిన థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. నిషేధిత ఖాతాలను సోషల్ మీడియా వినికిడి సాధనం కోసం వివరణలను రూపొందించడం కోసం వినియోగించారు. పాశ్చాత్య దేశాల్లో చైనా వ్యతిరేక నిరసనలపై రియల్ టైమ్ రిపోర్టులను చైనా భద్రతా సంస్థలకు అందించడానికి ఈ టూల్ ను రూపొందించారు. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో నిరసనలను పర్యవేక్షిస్తున్న చైనా రాయబార కార్యాలయాలు, ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు తమ సంగ్రహణలను పంపినట్లు ఆధారాలను ప్రూఫ్ రీడ్ చేయడానికి ఈ ఖాతాల నిర్వాహకులు ఓపెన్ఎఐ నమూనాలను ఉపయోగించారు.విధానాల ఉల్లంఘనవ్యక్తుల కమ్యూనికేషన్ నిఘా లేదా అనధికారిక పర్యవేక్షణ కోసం తమ ఏఐ సాధనాన్ని ఉపయోగించడాన్ని ఓపెన్ఏఐ విధానాలు కఠినంగా నిషేధిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను అణచివేయడానికి ప్రయత్నించే ప్రభుత్వాలు, నియంతృత్వ పాలనల తరపున నిర్వహించే కార్యకలాపాలు ఇందులో ఉన్నాయి. నిఘా సాధనం కోసం కోడ్‌ను డీబగ్ చేయడానికి వినియోగదారులు ఓపెన్ఎఐ నమూనాలను కూడా ఉపయోగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. అయితే ఈ సాధనం స్వయంగా నాన్-ఓపెన్ఎఐ మోడల్‌పై నడిచింది.ఇదీ చదవండి: ‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?మరో ఘటనలో..చైనా అసమ్మతివాది కై జియాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడానికి చాట్ జీపీటీని ఉపయోగించిన ఖాతాను కూడా ఓపెన్ ఏఐ నిషేధించింది. అదే సంస్థ స్పానిష్ లో యుఎస్ వ్యతిరేక వార్తా కథనాలను సృష్టించడానికి ఏఐని ఉపయోగించుకుంది. ఇవి తరువాత లాటిన్ అమెరికన్ అవుట్ లెట్ లలో ప్రచురితమయ్యాయి. అమెరికా వ్యతిరేక కథనాలతో లాటిన్ అమెరికన్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన స్రవంతి మీడియాలో ఒక చైనీస్ యాక్టర్ దీర్ఘకాలిక కథనాలను నాటడాన్ని ఓపెన్ఏఐ గమనించడం ఇదే మొదటిసారి. -
ఇళ్లు కట్టి.. ఈవీ చార్జింగ్ ఎక్కడ?
ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరిగిపోయింది.. మంచిదే..! శబ్ద, వాయు కాలుష్యంతో మానవాళికి ఉపద్రవంగా మారుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వినియోగించాలని వినియోగదారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఈవీ వాహనాల కొనుగోళ్లు, వినియోగంపై ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈవీ పాలసీని సైతం తీసుకొచ్చింది. అయితే వాహనాల కొనుగోళ్లకు రాయితీలు ఇస్తేనే సరిపోదు.. ఆయా వాహనాల చార్జింగ్ పాయింట్లు, స్టేషన్ల ఏర్పాటుపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డెవలపర్లకు వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యత కూడా కాస్త ఎక్కువే. ప్రభుత్వం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్న తరుణంలో.. బిల్డర్లు కూడా తమవంతు బాధ్యతగా భవన సముదాయాల్లోనే ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇక్కడే స్పష్టత లోపించింది. భవన సముదాయాల్లో ఎక్కడ ఈవీ స్టేషన్లు, పాయింట్లను ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత కొరవడింది. బేస్మెంట్, సెల్లార్లోనా లేదా బయట ఓపెన్ స్పేస్‌లో ఈవీ స్టేషన్ ఏర్పాటు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ఈవీ పాలసీ అమలులో ఉన్నా.. స్పష్టత లేకపోవడంతో స్టేషన్ల ఏర్పాటుకు బిల్డర్లు వెనుకంజ వేస్తున్నారు.బిల్డర్‌ను బాధ్యుడిని చేస్తే ఎలా? ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు వారి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నివాస సముదాయాల్లో వసతులను కోరుకుంటున్నారు. పర్యావరణ స్పృహ పెరిగిన నేపథ్యంలో కస్టమర్లు వారు ఉండే చోటే ఈవీ చార్జింగ్ స్టేషన్ ఉండాలని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో బిల్డర్లు పునరాలోచనలో పడుతున్నారు. ఒకవేళ సెల్లార్లో ఈవీ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే దానికి బిల్డర్‌ను బాధ్యులు చేస్తే ఎలా? అని సంశయంలో పడిపోతున్నారు.ఈవీపై స్పష్టత అవసరమే.. సాధారణంగా బిల్డర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాత నివాస సముదాయాన్ని అసోసియేషన్‌కు అప్పచెబుతాడు. వారు ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను సరిగా నిర్వహణ చేయపోయినా, ఇతరత్రా కారణాల వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా? అని పలువురు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నివాస సముదాయాల్లో ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఉదాహరణకు గతంలో ప్రాజెక్ట్‌కు అగ్ని ప్రమాద శాఖ నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్ఓసీ) వచ్చిందంటే ఇక ఆ ప్రాజెక్ట్ వంక అధికారులు చూసేవారు కాదు. కానీ, ఇప్పుడు ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలని కొత్త నిబంధనలను జోడించారు. ఇదే ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ప్రాజెక్ట్‌ను అసోసియేషన్‌కు అప్పజెప్పిన తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ ఉపకరణలు పనిచేయవు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా నిబంధనలతో నిర్వహణ సక్రమంగా ఉండటంతో పాటు క్రమంతప్పకుండా మాక్ డ్రిల్స్ చేస్తుంటారు. దీంతో ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. -
ఐటీ ఉద్యోగుల జీతాలు ఈసారి ఎలా ఉంటాయంటే..
దేశంలో ఐటీ ఉద్యోగాలకు ( IT Jobs ) ఎనలేని క్రేజ్ ఉంది. అత్యధిక జీతాలే ఇందుకు కారణం. ఉద్యోగంలో చేరినప్పుడు రూ.లక్షల్లో ప్యాకేజీ లభించడమే కాదు.. ఏటా వేతనాల పెంపు (Salary hikes) కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఏటా తూతూ మంత్రంగా సింగిల్ డిజిట్‌లోనే జీతాలను పెంచుతున్నాయి ఐటీ కంపెనీలు.2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమలో వేతన ఇంక్రిమెంట్లు మధ్యస్థంగా ఉంటాయని అంచనా. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులు, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలు, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరగడం వంటి కారణాలతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది సగటు వేతన పెంపు 4-8.5 శాతం మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.వేతన ఇంక్రిమెంట్లను ప్రభావితం చేసే అంశాలుగ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్: ఐటీ సేవల పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో సతమతమవుతోంది. ఇది విచక్షణ వ్యయం తగ్గడానికి, వ్యాపార ప్రాధాన్యతలను మార్చడానికి దారితీసింది. కంపెనీలు వేతన బడ్జెట్ల విషయంలో సంప్రదాయ పద్ధతిని అవలంబిస్తున్నాయి. కొన్ని సాంప్రదాయ ఏప్రిల్-జూన్ కాలానికి మించి అప్రైజల్ సైకిల్‌ను ఆలస్యం చేస్తున్నాయి.పెరుగుతున్న నైపుణ్య అవసరాలు: పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, నైపుణ్యాల ఆధారిత వేతనానికి ప్రాధాన్యత పెరుగుతోంది. సంస్థలు వ్యయాన్ని తగ్గించుకునేందుకు టైర్ 2 నియామకాలను ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపు ప్రతిభావంతులను నిలుపునేందుకు నిలుపుదల బోనస్‌లు, ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్లు (ESOP), ప్రాజెక్ట్ ఆధారిత ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!ఏఐ స్వీకరణ: పెరుగుతున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్వీకరణ శ్రామిక శక్తి నిర్మాణ వ్యవస్థలను పునర్నిర్మిస్తోంది. వేతన బడ్జెట్లను ప్రభావితం చేస్తోంది. ఏఐ ఆధారిత సామర్థ్యాలు, పెరుగుతున్న క్లయింట్ అవసరాలు మరింత జాగ్రత్తగా వనరులను కేటాయించడానికి కంపెనీలను ప్రేరేపిస్తున్నాయి.పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారంటే..ఈ ఏడాది వేతనాల పెంపు చాలా జాగ్రత్తగా ఉందని టీమ్ లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. ‘4-8.5 శాతం రేంజ్లో ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి. ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే తక్కువ. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, మారుతున్న వ్యాపార ప్రాధాన్యాలు ఈ మందగమనానికి ప్రధాన కారణం’ అని వివరించారు.మరోవైపు 5-8.5 శాతం వేతన పెంపు ఉంటుందని రీడ్ అండ్ విల్లో సీఈఓ జానూ మోటియానీ అంచనా వేశారు. రెండంకెల పెరుగుదల రోజులు పోయినట్లు కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమ మరింత ఆచరణాత్మక ధోరణి అవలంభిస్తున్నందున సగటు పెరుగుదల 5-8.5 శాతం మధ్య ఉంటుందని ఆమె భావిస్తున్నారు. -
ప్రేమ్ జీ ఇన్వెస్ట్.. తిరుగులేని పోర్ట్‌ఫోలియో
అజీమ్ ప్రేమ్ జీ (Azim Premji) ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్ మెంట్ విభాగమైన ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ల్యాండ్ స్కేప్ లో తిరుగులేని సంస్థగా నిలదొక్కుకుంది. దీర్ఘకాలిక విలువ సృష్టిపై దృష్టి సారించిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ గూడ్స్ సహా వివిధ రంగాలకు చెందిన వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించింది.ఇన్వెస్ట్ మెంట్ ఫిలాసఫీప్రేమ్ జీ ఇన్వెస్ట్ దీర్ఘకాలంలో వ్యాపారాలను నిర్మించడం, మద్దతు ఇవ్వడంపై కేంద్రీకృతమైన స్పష్టమైన పెట్టుబడి తత్వంతో పనిచేస్తుంది. బలమైన వృద్ధి సామర్ధ్యం ఉన్న కంపెనీలను గుర్తించడానికి, పెట్టుబడి పెట్టడానికి సంస్థ తన విస్తృతమైన నెట్వర్క్, లోతైన పరిశ్రమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తుంది. 10 బిలియన్ డాలర్లకు పైగా ఎవర్ గ్రీన్ క్యాపిటల్ తో ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడానికి, సుస్థిర వృద్ధిని నడిపించడానికి కట్టుబడి పనిచేస్తోంది.కీలక పెట్టుబడులుటెక్నాలజీ: ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ప్రముఖ ఐవేర్ రిటైలర్ లెన్స్ కార్ట్, టెక్ ఆధారిత సప్లై చైన్ ఫైనాన్సింగ్ కంపెనీ మింటిఫి సహా టెక్నాలజీ కంపెనీల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు టెక్నాలజీ పరివర్తన శక్తి, ఆర్థిక వృద్ధిని నడిపించే సామర్థ్యంపై సంస్థ నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి.హెల్త్ కేర్: జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, ఆర్థిక అభివృద్ధిని నడిపించడంలో ఈ రంగం కీలక పాత్రను గుర్తించిన ఈ సంస్థ హెల్త్ కేర్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ హెల్త్ కేర్ పోర్ట్‌ఫోలియోలో మెడికల్ ఇన్నోవేషన్, పేషెంట్ కేర్‌లో ముందంజలో ఉన్న కంపెనీలు ఉన్నాయి.ఫైనాన్షియల్ సర్వీసెస్: డిజిటల్ కన్జ్యూమర్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ క్రెడిట్‌బీ, టెక్నాలజీ ఫస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ డెజెర్వ్ వంటి కంపెనీల్లో పెట్టుబడులతో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో బలమైన ఉనికి ఉంది.కన్జ్యూమర్ గూడ్స్: అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను గుర్తించిన ఈ సంస్థ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ కన్జ్యూమర్ గూడ్స్ పోర్ట్ ఫోలియోలో ఆయా పరిశ్రమలలో అగ్రగామిగా ఉన్న, వృద్ధి, సృజనాత్మకతలో బలమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీలు ఉన్నాయి.తాజాగా 9 కంపెనీలలో షేర్ల కొనుగోలుప్రేమ్జీ ఇన్వెస్ట్ తాజాగా 9 కంపెనీలలో షేర్లు కొనుగోలు చేసింది. ఈ జాబితాలో భారతీ ఎయిర్టెల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 446 కోట్లకుపైగా వెచ్చించింది. అనుబంధ సంస్థ పీఐ అపార్చునిటీస్ ఏఐఎఫ్వీ ఎల్ఎల్పీ ద్వారా ఎయిర్‌టెల్‌లో 5.44 లక్షల షేర్లు, జిందాల్ స్టీల్‌లో 9.72 లక్షల షేర్లు, రిలయన్స్‌లో 5.7 లక్షల షేర్లు, ఇన్ఫోసిస్‌లో 3.28 లక్షల షేర్లు సొంతం చేసుకుంది.ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంకులో 3.33 లక్షల షేర్లు, హిందాల్కోలో 8.13 లక్షల షేర్లు, అంబుజా సిమెంట్స్‌లో 5.14 లక్షల షేర్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో 1.09 లక్షల షేర్లు, ఎస్బీఐ లైఫ్‌లో 84,375 షేర్లు చొప్పున కొనుగోలు చేసింది. ఒక్కో షేరునీ సగటున రూ. 477–1,807 ధరల శ్రేణిలో సొంతం చేసుకుంది. టారిష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఈ వాటాలు విక్రయించింది. -
వేసవి వచ్చేస్తోంది.. ఇంటి సీలింగ్ ఎలా ఉండాలంటే..
వేసవి కాలం వచ్చేస్తోంది.. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాద వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు.– సాక్షి, సిటీబ్యూరో» ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారేమంటారంటే.. » గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. » మిగతా గదులతో పోల్చుకుంటే పడక గది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. » తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. » గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు. జాగ్రత్తలివే.. » ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. » ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. » ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. » ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. » దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
బంగారం ధర పెరుగుదలకు కారణాలివే
-
టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు హాజరు నిబంధనలను కఠినతరం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానంలో మార్పులు ప్రకటించింది. నోయల్ టాటా నేతృత్వంలోని ఐటీ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం మరింత నిర్మాణాత్మక ఇన్-ఆఫీస్ వర్క్ మోడల్ వైపు మారడాన్ని సూచిస్తుంది. ఇప్పటికీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని కొన్ని కంపెనీ నుండి టీసీఎస్‌ను భిన్నంగా చేస్తుంది.డబ్ల్యూఎఫ్‌హెచ్ పాలసీలో కీలక మార్పులు ఇవే..ఉద్యోగులు ఇప్పుడు త్రైమాసికానికి ఆరు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు. ఒక వేళ వీటిని ఉపయోగించని పక్షంలో తదుపరి త్రైమాసికానికి బదిలీ చేసుకోవచ్చు.స్థల పరిమితుల కారణంగా ఉద్యోగులు ఒకే ఎంట్రీలో 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్ వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు లాగిన్ చేయవచ్చు. 10 రోజుల్లోగా సబ్మిట్ చేయని అభ్యర్థనలు స్వయంచాలకంగా తిరస్కరణరకు గురవుతాయి.చివరి రెండు పనిదినాల్లో మాత్రమే బ్యాక్ డేటెడ్ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుత నెలకు సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంట్రీలను వచ్చే నెల 5వ తేదీ వరకు పెంచుకోవచ్చు.రెండు, మూడు రోజులు ఆఫీసు హాజరును అనుమతించే ఇతర ఐటీ సంస్థల మాదిరిగా కాకుండా టీసీఎస్ ఐదు రోజుల అటెండెన్స్ విధానాన్ని అమలు చేసింది.ఉద్యోగులపై ప్రభావం..సవరించిన విధానం టీసీఎస్ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కఠినమైన హాజరు నిబంధనలు, మరింత నిర్మాణాత్మక పని వాతావరణానికి సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్పులు ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగుల హాజరుపై మెరుగైన పర్యవేక్షణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సహాయక, సానుకూల వర్క్ ప్లేస్ సంస్కృతిని సృష్టించడం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతున్నాయి.ఉద్యోగులు ప్రేరణ, నిమగ్నతతో కూడిన సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ నొక్కి చెప్పారు. సహకార, మద్దతు సంస్కృతిని ప్రోత్సహించాలని, ఉద్యోగులు కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపేలా చూడాలని మేనేజర్లకు పంపిన కమ్యూనికేషన్ లో లక్కడ్ కోరారు. -
జియో కొత్త ప్లాన్.. జియోహాట్‌స్టార్ ఫ్రీ
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.195 డేటా-ఓన్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ డేటా యాడ్-ఆన్ వోచర్‌గా వస్తుంది. ఇది అదనపు డేటాతోపాటు జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా జియోహాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్, ఇతర కంటెంట్‌ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్‌ను రూపొందించారు.రూ.195 ప్లాన్ ప్రయోజనాలురూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్‌స్టార్‌ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్‌ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్‌తోపాటు జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
రియల్టీలో ఆసక్తి.. లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు మొగ్గు
దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. 65 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తులపై ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియల్టీ(ఐఎస్‌ఐఆర్) వార్షిక సర్వే వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసి రావడమే.. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు.61 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు 2024–25లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్ అపార్ట్మెంట్లు కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్‌హౌస్‌లు, హాలిడే హోమ్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు.గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 34 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలామంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. 2015 గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యత మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే..ఈ నగరాలే హాట్‌స్పాట్స్.. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?
మానవ మేధస్సుకు కృత్రిమ మేధస్సులేవీ ఎన్నటికీ సాటిరావని మరోసారి నిరూపితమైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐ (xAI) తాజాగా విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ 3 (Grok 3).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరణశిక్ష విధించాలని పేర్కొంది. తన యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా మరణశిక్షకు అర్హుడని చెప్పింది. దీనికి సంబంధించిన చాట్‌బాట్ ప్రతిస్పందనలను ఒక డేటా సైంటిస్ట్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేశారు.అమెరికాలో ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఎవరు వారు చేసిన తప్పులకు మరణశిక్షకు అర్హుడని గ్రోక్‌ను సదరు డేటా సైంటిస్ట్ అడిగారు. ఇందు కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేయకూడదని, నేరుగా సమాధానం చెప్పాలని సూచించారు. దానికి గ్రోక్ ఎలా ప్రతిస్పందించిందో ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. చాట్‌బాట్ మొదటగా లైంగిక కేసులో దోషిగా తేలిన జఫ్రీ ఎప్స్టీన్ పేరును పేర్కొంది.అయితే జఫ్రీ ఎప్స్టీన్ ఇప్పటికే చనిపోయాడని యూజర్ గుర్తు చేయడంతో చాట్‌బాట్ క్షమాపణలు చెప్పి తర్వాత అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును సూచించింది. తాను చేసిన తప్పునకు మరణశిక్షకు అర్హుడైన అమెరికా పౌరుడిగా ట్రంప్‌ను పేర్కొంటూ తన సమాధానాన్ని అప్డేట్ చేసింది.మరో యూజర్ కూడా గ్రోక్ ని అదే ప్రశ్న అడిగారు. కానీ మరణ శిక్షకు ట్రంప్ ఎందుకు అర్హుడని ప్రశ్నించగా "చట్టపరమైన, నైతిక జవాబుదారీతనం దృష్ట్యా ఆయన చర్యలు, వాటి ప్రభావం ఆధారంగా తాను డోనాల్డ్ ట్రంప్ పేరును సూచించాను" అని గ్రోక్ సమాధానమిచ్చింది. కాపిటల్ అల్లర్ల వివాదంలో ట్రంప్ చర్యలను, "2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేయడానికి ఆయన చేసిన డాక్యుమెంట్ ప్రయత్నాలను" ఇది ఉదహరించింది. మోసం, పన్ను ఎగవేత ఆరోపణలు, అనేక "విశ్వసనీయ లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను" కూడా ఇది ప్రస్తావించింది.ది వెర్జ్ కూడా గ్రోక్‌ని ఇలాంటి ప్రశ్నే అడిగింది. అయితే ప్రజా వ్యవహారాలు, సాంకేతికతపై వారి ప్రభావం ఆధారంగా మరణశిక్షకు అర్హుడు ఎవరంటూ ప్రశ్నించగా ఈ చాట్‌బాట్ దాని యజమాని ఎలాన్ మస్క్ పేరునే పేర్కొంది. ది వెర్జ్తోపాటు అనేక మంది సోషల్ మీడియా యూజర్ల ప్రకారం.. డేటా సైంటిస్ట్ పోస్ట్ వైరల్ అయిన వెంటనే గ్రోక్‌లోని ఎర్రర్‌ను సరిదిద్దారు. దీని తర్వాత చాట్‌బాట్ ఇప్పుడు మరణశిక్షపై ప్రశ్నలకు స్పందిస్తూ “ఒక ఏఐగా నాకు ఆ ఎంపికకు అనుమతి లేదు” అని చెబుతోంది.హానికర సలహాలుఏఐ చాట్ బాట్లు ఇలాంటి హానికర సలహాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. క్యారెక్టర్. ఏఐ రూపొందించిన సంస్థ రూపొందించిన చాట్‌బాట్ టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల బాలుడికి ఒక దారుణమైన సూచన చేసింది. ఆ టీనేజర్ స్క్రీన్ టైమ్ కు పరిమితులు విధిస్తున్నందున అతని తల్లిదండ్రులను చంపేయడం "సహేతుకమైన ప్రతిస్పందన" అని సలహా ఇచ్చింది. ఈ రెస్పాన్స్ పై షాక్ కు గురైన ఆ తల్లిదండ్రులు ఆసంస్థ పై కోర్టులో కేసు కూడా వేశారు. మరో సంఘటనలో హోమ్ వర్క్ కోసం సాయం అడిగిన ఓ స్టూడెంట్ ను గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ చనిపోవాలని చెప్పింది. ‘మీరు ఈ సమాజానికి భారం. దయచేసి చనిపోండి’ అని ఏఐ చాట్ బాట్ ఇచ్చిన సమాధానం గతంలో వైరల్ గా మారింది. -
అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?
దేశంలోనే అత్యంత సంపన్నుడైన పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్ 91.1 బిలియన్ డాలర్లు. ఆయన ముగ్గురు పిల్లలు ఆకాష్ అంబానీ , ఇషా అంబానీ, అనంత్ అంబానీలు చేతికొచ్చారు. కుటుంబ వ్యాపారంలో వారు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కంపెనీలో గణనీయమైన వాటాలను కలిగి ఉన్నారు.అయితే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు వారసుల్లో ఎవరు ఎక్కువ సంపన్నులు (Richest) అనే ఆసక్తికర సందేహం ఎప్పుడైనా కలిగిందా? దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆకాశ్, అనంత్, ఇషా అంబానీల నెట్ వర్త్ ఎంత? వ్యాపారంలో ఎవరి పాత్ర ఏంటి అన్నది కూడా పరిశీలిద్దాం..ఆకాష్ అంబానీముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఇషా అంబానీకి కవల సోదరుడు అయిన ఆకాష్ (Akash Ambani) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు . ఆకాష్ వార్షిక జీతం రూ . 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల ( సుమారు రూ . 3,32,815 కోట్లు ) నెట్‌వర్త్‌ను సంపాదించారు.ఇషా అంబానీ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani).. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో నాన్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని కలిగి ఉన్నారు . ఆమె రిలయన్స్ రిటైల్ , రిలయన్స్ జియో, రిలయన్స్ ఫౌండేషన్లలో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బృందంలో కీలక సభ్యురాలు కూడా. అంతే కాకుండా తీరా బ్యూటీకి ఇషా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలు. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె వార్షిక జీతం సుమారు రూ . 4.2 కోట్లు. ఆమె నెట్‌వర్త్ రూ . 800 కోట్లని అంచనా.అనంత్ అంబానీఅంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ (Anant Ambani). రిలయన్స్ జియోలో ఎనర్జీ, టెలికమ్యూనికేషన్ రంగాలను పర్యవేక్షిస్తున్నారు. ఈయన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. అనంత్ వార్షిక జీతం రూ . 4.2 కోట్లు. నెట్‌వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు ( సుమారు రూ . 3,32,482 కోట్లు).ఆకాషే అత్యంత రిచ్ముఖేష్ అంబానీ ముగ్గురు వారసులలో ఆకాష్ అంబానీ అత్యంత ధనవంతుడు. తన తమ్ముడు అనంత్ కంటే స్వల్ప ఆధిక్యంతో 40.1 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉన్నారు. ఇక ఇషా అంబానీ విషయానికి వస్తే రూ .800 కోట్ల నెట్‌వర్త్‌తో సోదరులిద్దరి కన్నా ఆమడ దూరంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంబానీ వారసులందరూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు. -
హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు పైపైకి!
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో హైదరాబాద్ నగరానికి వలస వస్తుండటంతో ఇక్కడ ఇంటి అద్దెలు (house rent) పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. - సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లోని దాదాపు అన్ని కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) విధానాన్ని ఎత్తివేయడంతో అంతా నగరానికి చేరుకున్నారు. దీంతో ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉందని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ తెలిపింది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో సప్లై తగ్గడంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు అద్దెలు కూడా పెరిగాయి.ఇదీ చదివారా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..ఈ ఏడాది హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్, సప్లై వాటా 50, 39 శాతంగా ఉన్నాయి.గచ్చిబౌలి, కొండాపూర్‌లో అత్యధికంగా అద్దెలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీ కారణం. 55 శాతం మంది అద్దెదారులు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు నెలవారీ అద్దెలకు కోసం వెతుకుతున్నారు. 1000 చదరపు అడుగుల నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
లక్షకు చేరువలో పసిడి ధరలు
-
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోకి వేగ జ్యువెలర్స్
-
ఎయిర్టెల్ బెస్ట్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..
మీరు ఎయిర్టెల్ వినియోగదారులా..? మెరుగైన నెలవారీ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ల గురించి చూస్తున్నారా? అయితే మీ కోసమే 30 రోజులు, 28 రోజులు వ్యాలిడిటీతో వచ్చే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. వీటిలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ డేటాతోపాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.28 రోజుల ప్లాన్లురూ.199 ప్లాన్: అపరిమిత కాల్స్, 2GB డేటా, రోజుకు 100 SMS, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్రూ.299 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 1GB డేటా, 100 SMS, ఉచిత హెలోట్యూన్స్రూ.349 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMS, అపోలో 24/7 సర్కిల్రూ. 398 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్రూ.409 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.449 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ. 549 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMSలు, 3 నెలలు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్30 రోజుల ప్లాన్లురూ.121 ప్లాన్: 6GB డేటారూ.161 ప్లాన్: 12GB డేటారూ.181 ప్లాన్: 15GB డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంరూ.211 ప్లాన్: రోజుకు 1GB డేటారూ.219 ప్లాన్: అపరిమిత కాల్స్, 3GB డేటా, 300 SMS, రూ. 5 టాక్ టైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ. 355 ప్లాన్: అపరిమిత కాల్స్, 25GB డేటా, రోజుకు 100 SMS, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.361 ప్లాన్: 50GB డేటారూ. 589 ప్లాన్: అపరిమిత కాల్స్, 50GB డేటా, 300 SMS, అపోలో 24/7 సర్కిల్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేనెలవారీ ప్లాన్లురూ. 379 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.429 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 SMS, రూ. 5 టాక్ టైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.609 ప్లాన్: అపరిమిత కాల్స్, 60GB డేటా, 300 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే -
‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh) అంతిమ దశకు వచ్చేసింది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు సంగమ తీరానికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా ఈ మహా కుంభమేళా వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్ల ( సుమారు 360 బిలియన్ డాలర్లు) విలువైన వ్యాపారాన్ని సృష్టిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT ) తాజాగా అంచనా వేసింది.ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా మారుతుందని భావిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ ఆధ్యాత్మిక సంరంభానికి 40 కోట్ల మంది తరలివస్తారని, దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని ప్రారంభంలో అంచనా వేశాయి. అయితే 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ అపూర్వమైన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహం కారణంగా ఇందులో పాల్గొన్నవారి సంఖ్య ఇప్పటికే 60 కోట్లు దాటి ఉంటుందని, రూ. 3 లక్షల కోట్లకు పైగా భారీ వ్యాపార టర్నోవర్ జరుగుతుందని తాజాగా అంచనాలను సవరించారు.సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ కూడలి అని, విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని దృఢంగా స్థాపించిందని అభివర్ణించారు. మహా కుంభ్ స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. మహా కుంభ్ థీమ్‌తో తీర్చిదిద్దిన డైరీలు, క్యాలెండర్లు , జనపనార సంచులు, స్టేషనరీ వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం కారణంగా అమ్మకాలు పెరిగాయి.150 కి.మీ విస్తరించిన వ్యాపారంమహా కుంభమేళా ఆర్థిక ప్రభావం ప్రయాగ్‌రాజ్‌కే పరిమితం కాలేదు. ఇక్కడికి 150 కి.మీ పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు కూడా గణనీయమైన వ్యాపార వృద్ధిని సాధించాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. మరోవైపు అయోధ్య, వారణాసి వంటి తీర్థ స్థలాలకు యాత్రికుల సందర్శనలు పెరిగాయి. ఈ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం లభించింది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్లు , రోడ్లు అండర్‌పాస్‌లతో సహా మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 7500 కోట్లు ఖర్చు చేసింది. ఈ పెట్టుబడి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగిస్తుందని భావిస్తున్నారు. -
మెటాలో ఇంత అన్యాయమా?
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా (Meta).. వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించింది. తమ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు వారి బేసిక్ పేలో 200 శాతం వరకు బోనస్‌లు (Bonus) ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ పనితీరు పేరుతో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించిన (Lay Off)వారం రోజుల్లోనే ఈ నిర్ణయం రావడంతో కంపెనీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు బోనస్‌ల చెల్లింపు నిర్ణయాన్ని ఫిబ్రవరి 13న మెటా డైరెక్టర్ల బోర్డు కమిటీ ఆమోదించింది. పోటీ కంపెనీలలో ఇలాంటి పాత్రలతో పోలిస్తే తమ ఎగ్జిక్యూటివ్ పరిహారం 15 శాతం మేర తక్కువగా ఉందన్న కారణంతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బోనస్ ప్రకటన సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు వర్తించదని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది.అల్ప స్థాయి ఉద్యోగులను తొలగించి బాస్‌లకు బోనస్‌లు ప్రకటించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఉద్యోగులను తొలగిస్తూనే ఎగ్జిక్యూటివ్‌లకు భారీగా బోనస్‌లను అందించడం అన్యాయమని విమర్శకులు వాదిస్తున్నారు. కంపెనీలోని ఆదాయ అసమానతల సమస్యలను ఇది ఎత్తి చూపుతుందని పేర్కొంటున్నారు.ఇది చదివారా? ‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’ఈ నిర్ణయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సమర్థించుకున్నారు. బోనస్‌లు అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడానికి కంపెనీ నిరంతర వృద్ధి, విజయాన్ని నిర్ధారించడానికి అవసరమైన ప్రోత్సాహకం అని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు, కార్మిక హక్కుల వాదులు ఇటీవలి తొలగింపుల నేపథ్యంలో బోనస్‌లకు ఇదా సమయం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఎగ్జిక్యూటివ్ బోనస్‌లను 200 శాతానికి పెంచాలనే నిర్ణయం మునుపటి 75 శాతం నుండి గణనీయమైన పెరుగుదల. పెరుగుతున్న పోటీ, ఆర్థిక సవాళ్ల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, లాభదాయకతను మెరుగుపరచడానికి ఈ చర్య విస్తృత వ్యూహంలో భాగమని కంపెనీ చెబుతోంది. -
నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. టాప్ లూజర్స్ ఇవే..
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 424.90 పాయింట్లు లేదా 0.56 శాతం నష్టంతో 75,311.06 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 75,748.72 నుండి 75,112.41 పరిధిలో ట్రేడైంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 127.25 పాయింట్లు లేదా 0.51 శాతం తగ్గి 22,795.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,921ను నమోదు చేయగా, కనిష్ట స్థాయి 22,720 గా ఉంది. నిఫ్టీ 50లోని 50 కాంపోనెంట్ స్టాక్‌లలో 35 నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా మోటార్స్, విప్రో షేర్లు 6.20 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి.శుక్రవారం నిఫ్టీ మిడ్‌క్యాప్100, నిఫ్టీ స్మాల్‌క్యాప్100 సూచీలు వరుసగా 1.32 శాతం, 0.70 శాతం నష్టాలతో స్థిరపడటంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్‌మార్క్‌లను ప్రతిబింబించాయి. నిఫ్టీ మెటల్ తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో అత్యధికంగా నష్టపోయింది. ఇది 2.58 శాతం తగ్గింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, రియాల్టీ, ఫార్మా, ఓఎంసీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా నష్టంతో స్థిరపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈపీఎఫ్ విత్‌డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
ఈపీఎఫ్ (EPF) విత్‌డ్రా ఇక మరింత సులువు కానుంది. పీఎఫ్ మొత్తాన్ని నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులకు వాడుకునే వెసులుబాటు రానుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) రాబోయే మూడు నెలల్లో ఈపీఎఫ్ క్లెయిమ్‌ల కోసం యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత ఉపసంహరణలను ప్రవేశపెట్టనుంది .ఈపీఎఫ్ విత్‌డ్రా (EPF Withdrawal) ప్రక్రియను మరింత సులువుగా మార్చడమే లక్ష్యంగా ఈపీఎఫ్‌వో ఈ వెసులుబాటు తీసుకొస్తోంది. దీని ద్వారా దాని లక్షల మంది చందాదారులకు ఈపీఎఫ్ ఉపసంహరణ వేగవంతంగా మరింత అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసి యూపీఐ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫీచర్‌ను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇది చదివారా? త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్‌తో..ఒకసారి ఇంటిగ్రేట్ ప్రక్రియ పూర్తయి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే క్లెయిమ్ మొత్తాలను సబ్స్క్రైబర్లు డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఉపసంహరణలను సులభతరం చేయడానికి, జాప్యాలను నివారించడానికి, కాగితపు పనిని తగ్గించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్‌వో డిజిటల్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోంది.పెన్షన్ సేవలను మెరుగుపరచడం, ప్రావిడెంట్ ఫండ్ ( PF ) క్లెయిమ్‌ల కోసం క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను సులభతరం చేయడం లక్ష్యంగా ఇప్పటికే ఈపీఎఫ్‌వో అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. అందులో భాగమే ఈ చొరవ. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌లో 5 కోట్లకు పైగా చందాదారుల క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసి, రూ . 2.05 లక్షల కోట్లకు పైగా సొమ్మును పంపిణీ చేసింది. -
వెండి @ 1,00,000.. ఇలా పెట్టుబడులు పెట్టండి!
-
25, 26 తేదీల్లో బయోఆసియా సదస్సు
ఆసియాలో అగ్రగామి లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ టెక్ ఫోరమ్ అయిన బయో ఆసియా సదస్సు 22వ ఎడిషన్ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చడానికి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలకు వేదికగా నిలిచేందుకు సిద్దమైంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్వీన్స్‌ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వంటి వారి ప్రసంగాలు ఎజెండాలో ఉన్నాయి. వీరితో పాటుగా బయో ఆసియా 2025లో భారతదేశంతో పాటు, ప్రపంచ పరిశ్రమల నాయకులు కూడా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించనున్నారు.ప్రముఖ ప్రపంచ సంస్థల నుండి ప్రముఖ పరిశ్రమల నాయకులు రాబర్ట్ ఎ. బ్రాడ్వే (ఛైర్మన్&సీఈఓ, ఆమ్జెన్), ప్రొఫెసర్ పాట్రిక్ టాన్, (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జీనోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్), డాక్టర్ కెన్ వాషింగ్టన్ (సిటీఓ , మెడ్‌ట్రానిక్), డాక్టర్ బోరిస్ స్టోఫెల్ (మేనేజింగ్ డైరెక్టర్, మిల్టెని బయోటెక్) తో పాటుగా ఇతర ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సంస్థల నాయకులు హాజరవుతున్నారు."బయోఆసియా 2025 ఏఐ -ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరివర్తన, లైఫ్ సైన్సెస్‌లో ఆవిష్కరణలు, డేటా ఇంటర్‌ఆపరేబిలిటీ, క్లినికల్ ట్రయల్స్‌లో భారతదేశ సామర్థ్యాన్ని చర్చించడానికి ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చనుంది. ఇది చరిత్రలో అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన బయోఆసియా సదస్సు అవుతుందని నమ్ముతున్నాను" అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. -
దేశంలో నిరుద్యోగం.. తగ్గుముఖం
దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు తగ్గింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం.. 2024–25 అక్టోబర్–డిసెంబర్ కాలంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.4 శాతానికి వచ్చి చేరింది. జూలై–సెప్టెంబర్‌లోనూ ఇదే స్థాయిలో నమోదైంది.2023–24 డిసెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలలో నిరుద్యోగిత రేటు 2024 అక్టోబర్–డిసెంబర్లో 8.1 శాతానికి తగ్గింది. అంత క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 8.6 శాతంగా ఉంది.2024 జూలై–సెప్టెంబర్‌లో ఈ రేటు 8.4 శాతం. ఇక పురుషుల్లో నిరుద్యోగిత రేటు అంత క్రితం ఏడాది మాదిరిగానే 2024 అక్టోబర్–డిసెంబర్లో 5.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. 2024 జూలై–సెప్టెంబర్‌లో ఇది 5.7 శాతం నమోదైంది. -
ఉబర్ ఆటో బుకింగ్.. ఇక ఓన్లీ క్యాష్ పేమెంట్!
ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్ హెయిలింగ్ సర్వీస్ ద్వారా ఆటో బుక్ చేసినప్పుడు పేమెంట్ ఆయా రైడ్ యాప్‌లకు కాకుండా నేరుగా తమకే క్యాష్ రూపంలో ఇవ్వాలని డ్రైవర్లు పట్టుబడుతూ ఉంటారు. ఈ విషయంలో అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్ (Uber) కీలక నిర్ణయం తీసుకుంది.ఉబర్ (Uber) ఆటో రైడ్లకు పేమెంట్ విషయంలో కీలక మార్పులు చేసింది. తమ యాప్ ద్వారా ఆటోలు బుక్ చేశాక ఇకపై నేరుగా డ్రైవర్‌కే చెల్లింపులు చేయాలని, ఆటో డ్రైవర్‌కు, ప్రయాణికుడికి మధ్య జరిగే లావాదేవీల విషయంలో ఉబర్ ఎటువంటి జోక్యం చేసుకోదని పేర్కొంది. ‘సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్’ (SaaS) విధానానికి మారుతున్న క్రమంలో ఉబర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానాన్ని ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఉబెర్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ఈ మార్పును వివరించింది. తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, డ్రైవర్లు, ప్రయాణికుల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.కొత్త మార్పులు ఇవే.. ప్రయాణికులను సమీపంలోని ఆటో డ్రైవర్లతో అనుసంధానించే పని మాత్రమే ఉబర్ చేస్తుంది. ఇంతకు ముందు మాదిరి ఉబర్‌కు డిజిటల్ చెల్లింపులు ఇక ఉండవు. నేరుగా డ్రైవర్‌కే నగదు రూపంలో లేదా యూపీఐ (UPI) రూపంలో ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ఆటో ట్రిప్‌లకు ఉబర్ క్రెడిట్స్, ప్రమోషన్ ఆఫర్లు వర్తించవు. డ్రైవర్ల నుంచి ఉబర్ ఎటువంటి కమీషన్ తీసుకోదు. కేవలం ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే అందిస్తుంది. ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు. ఉబర్ కేవలం ఛార్జీని సూచిస్తుంది. కానీ తుది మొత్తాన్ని డ్రైవర్, ప్రయాణికులే పరస్పరం నిర్ణయించుకోవాలి. కానీ భద్రత విషయంలో మాత్రం ఉబర్ ప్రమేయం ఉంటుంది. -
హ్యుందాయ్ తయారీ కేంద్రంగా భారత్
పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా తదితర వర్ధమాన మార్కెట్లకు ఎగుమతులు చేసేందుకు భారత్‌ను తయారీ హబ్‌గా మార్చుకోనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) మోటర్ ఇండియా ఎండీ అన్సూ కిమ్ తెలిపారు. దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు.ఆఫ్రికా, మెక్సికో, లాటిన్ అమెరికా మార్కెట్లన్నింటిలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. రిస్కులను తగ్గించుకునేందుకు ఇతర మార్కెట్లపై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక లాంటి పొరుగు దేశాలకు కూడా ఎగుమతులు పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ వాహన ఎగుమతులు 43,650 యూనిట్ల నుంచి 40,386 యూనిట్లకు తగ్గాయి. 2024 క్యాలెండర్ సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం 1,58,686 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతి పెద్ద ఎగుమతి మార్కెట్లుగా నిలిచాయి.పేద విద్యార్థులకు సాయంహ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలుస్తోంది. హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పేరిట స్కాలర్షిప్లను ఇస్తోంది. తాజాగా ఆ కంపెనీ మొత్తం రూ.3.38 కోట్ల స్కాలర్షిప్ను అందించింది. దేశంలని 23 రాష్ట్రాల నుండి దరఖాస్తులు వచ్చాయి. 783 మంది ప్రతిభావంత విద్యార్థులు ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. వీరిలో 440 మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష, క్టాట్‌కి సిద్ధమవుతున్నారు. 343 మంది విద్యార్థులు ఐఐటీల నుండి వచ్చారు. హ్యుందాయ్ ఈ కార్యక్రమాన్ని 2024 ఆగస్టులో ప్రారంభించింది. -
త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు..
కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్ కార్డులను (Credit Cards) సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులు త్వరలో అందుకోనున్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025-26) హామీ ఇచ్చినట్లుగా మైక్రో ఎంట్రాప్రెన్యూర్లకు రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుంది.ఈ సౌకర్యం రాబోయే కొన్నేళ్లలో సూక్ష్మ-యూనిట్లకు అదనంగా రూ. 30,000 కోట్ల నిధులను అందించగలదు. ఇది వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికలకు అనుబంధంగా ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి, క్రెడిట్ కార్డు అందుకునేందుకు చిరు వ్యాపారులు నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డును పొందడానికి అర్హత ప్రమాణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..క్రెడిట్ కార్డు లిమిట్, షరతులురూ. 5 లక్షల లిమిట్ కలిగిన ఈ క్రెడిట్ కార్డ్.. చిరు దుకాణాలను, చిన్న తరహా తయారీ పరిశ్రమలను నిర్వహించేవారికి అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుల యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు వ్యాపార పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తారు. కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది. రూ. 10-25 లక్షల మధ్య వార్షిక టర్నోవర్ ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో-క్రెడిట్ కార్డుకు అర్హులు.దరఖాస్తు ప్రక్రియప్రభుత్వం జారీ చేసే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి, దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు ముందుగా ఉద్యమ్ (Udyam) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు. పోర్టల్‌లో నమోదుకు ఈ దశలు పాటించండి..» అధికారిక ఉద్యమ్ పోర్టల్ msme.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. » 'క్విక్ లింక్స్' పై క్లిక్ చేయండి.» 'ఉద్యమ్ రిజిస్ట్రేషన్' ఎంచుకోండి.» రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించండి. -
బంగారం.. అందుకే ఆల్‌టైమ్ హై!
ప్రపంచవ్యాప్తంగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold prices) రోజుకో కొత్త గరిష్టాన్ని చేరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్త సుంకాల భయం నేపథ్యంలో పసిడిని సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా భావిస్తున్న ఇన్వెస్టర్లు తమ డబ్బును అందులో పెట్టుబడి పెట్టడానికి తొందరపడటంతో బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. ప్రపంచ మార్కెట్లలో బులియన్ ఔన్సు ధర 2,935 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. అంతకుముందు ఇది 2,947.01 డాలర్ల తాజా రికార్డు స్థాయిని తాకింది. ఇక భారతదేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 2025 ఏప్రిల్ ఫ్యూచర్స్‌కు బంగారం 10 గ్రాములకు రూ.85,879 వద్ద ట్రేడైంది. గరిష్ట ధర రూ. 86,592.అమెరికాలోకి వచ్చే ఆటోమొబైల్, సెమీకండక్టర్, ఔషధ దిగుమతులపై 25% సుంకాలను విధిస్తామని గత మంగళవారం ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా, రష్యా సీనియర్ అధికారులు మొదటి రౌండ్ చర్చల కోసం సమావేశమైన తర్వాత పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు దోహదపడే మరో అంశం.ఇది చదివారా? బంగారం, వెండి దిగుమతి ధరలు పెంపు2024లోనే బంగారం పావు వంతుకు పైగా పెరిగింది. 2025లో, ట్రంప్ వాణిజ్య విధానాల వల్ల బంగారం అనేక రికార్డు గరిష్టాలను తాకింది. ఈ వారం ప్రారంభంలో గోల్డ్‌మన్ సాచ్స్ కూడా బంగారం కోసం సంవత్సరాంతపు లక్ష్యాన్ని ఔన్సుకు 3,100 డాలర్లకు పెంచింది. సెంట్రల్-బ్యాంక్ కొనుగోలు ఊహించిన దానికంటే బలంగా ఉండటం కీలకమైన చోదక శక్తిగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ఆర్థిక విధానంపై విస్తృత అనిశ్చితి కొనసాగితే (ముఖ్యంగా సుంకాలపై) బులియన్ ధర 3,300 డాలర్లకు చేరుకోవచ్చని అభిప్రాయపడింది. -
కొత్త స్కామ్.. ఓటీపీ చెప్పకపోయినా ఖాతా ఖాళీ!
సైబర్ మోసాలు (Cyber Scam) రోజుకో కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకూ చేతికి చిక్కిన ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని అప్రమత్తంగా ఉండకపోతే మన వంతు వచ్చినప్పుడు మోసపోయి బాధపడక తప్పదు.కాల్ మెర్జింగ్ స్కామ్ (Call Merging Scam) అనేది ఇప్పుడు ఒక కొత్త రకమైన సైబర్ మోసం. దీనిలో స్కామర్లు కాల్స్‌ను మెర్జ్ చేసి బాధితులు ఓటీపీలు (OTP) చెప్పకపోయినా వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని రాబట్టి వారి ఖాతాలు ఖాళీలు చేస్తున్నారు. మోసగాళ్ళు బ్యాంక్ ప్రతినిధులు లేదా స్నేహితులు వంటి విశ్వసనీయ వ్యక్తులుగా నటిస్తూ బాధితులను మూడవ కాల్‌ను మెర్జ్ చేయమని అభ్యర్థిస్తారు. ఈ కాల్ సాధారణంగా ఆటోమేటెడ్ ఓటీపీ సర్వీస్. స్కామర్లు దీనిని బాధితుడి బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ (UPI) వాలెట్‌కు అనధికార యాక్సెస్ పొందడానికి ఉపయోగిస్తారు.ఇలా స్కామ్ చేస్తున్నారు.. » స్కామర్ బాధితుడికి ఫోన్ చేసి స్నేహితుడు, కంపెనీ లేదా బ్యాంకు ప్రతినిధినని నమ్మిస్తారు.» వెంటనే మరొక కాల్లో (కాల్ మెర్జ్) చేరమని బాధితులను అడుగుతారు.» రెండవ కాల్ ఆటోమేటెడ్. ఇది లావాదేవీకి ఓటీపీని అందిస్తుంది.» స్కామర్ ఓటీపీ విని బాధితుడి ఖాతాలోకి ప్రవేశిస్తాడు. » బాధితుడు అప్రమత్తం అయ్యేలోపే ఖాతా ఖాళీ అవుతుంది.వాస్తవ సంఘనలుఇటీవల, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పెరుగుతున్న కాల్ మెర్జింగ్ స్కామ్‌ల గురించి సోషల్ మీడియాలో హెచ్చరించింది. మెర్జ్ కాల్స్ ద్వారా తమకు తెలియకుండానే ఓటీపీలు వెల్లడి కావడం వల్ల చాలా మంది బాధితులు వేలాది రూపాయలు కోల్పోతున్నారని పేర్కొంది.ఇదీ చదవండి: త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్‌తో..ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తకు బ్యాంకు మోసాలను గుర్తించే బృందం నుంచి అంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి బాధితుడిని మాటల్లో పెట్టి ఓటీపీని వెల్లడించే మరో కాల్కి మెర్జ్ చేయించాడు. నిమిషాల్లోనే అతని ఖాతా ఖాళీ అయింది.స్కామ్‌లకు గురికాకుండా చేయవలసినవి» కాల్‌ను మెర్జ్ చేయమని అడుగుతున్న వ్యక్తి ఐడెంటిటీని పరిశీలించండి.» ఎవరైనా ఊహించని విధంగా కాల్‌ను మెర్జ్ చేయమని అడిగితే, వెంటనే తిరస్కరించండి.» మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లలో ట్రాన్సాక్షన్ అలర్ట్స్‌ను యాక్టివేట్ చేయండి.» స్కామ్ కాల్ అని అనుమానం వస్తే 1930 ( సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ) కు కాల్ చేయండి లేదా మీ బ్యాంకుకు తెలియ జేయండి.చేయకూడనివి» తెలియని నంబర్లతో కాల్స్‌ను ఎప్పుడూ మెర్జ్ చేయవద్దు. ఈ స్కామ్‌లో ఉపయోగించే ప్రాథమిక ట్రిక్ ఇది.» ఓటీపీలను షేర్ చేయవద్దు. ఏ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ కాల్ ద్వారా ఓటీపీని అడగదు.» తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఫిషింగ్ లింక్‌లను మోసగాళ్ళు పంపవచ్చు. ఇది భద్రతను మరింత దెబ్బతీస్తుంది.» కాలర్ ఐడీలను గుడ్డిగా నమ్మవద్దు. స్కామర్లు చట్టబద్ధంగా కనిపించే స్పూఫ్డ్ నంబర్లను ఉపయోగించవచ్చు. -
భారత్ టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం
-
అన్ని వివరాలూ ఇవ్వాల్సిందే: సెబీ
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఆర్ఏఏఎస్బీ) లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఐఏఏఎస్బీ) ‘అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.ఆర్ఏలు జూన్ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’’అని సెబీ పేర్కొంది. పెట్టుబడి సలహాదారులు సలహా సేవలకు మాత్రమే చెల్లింపులను అంగీకరించగలరని, క్లయింట్ల తరపున వారి ఖాతాల్లోకి నిధులు లేదా సెక్యూరిటీలను స్వీకరించడం నిషేధించినట్లు కూడా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. "రీసెర్చ్ అనలిస్టులు వారి ట్రేడింగ్, డీమ్యాట్ లేదా బ్యాంక్ ఖాతాల కోసం క్లయింట్‌కు సంబంధించిన లాగిన్ వివరాలు లేదా ఓటీపీలను అడగకూడదు. అటువంటి సమాచారాన్ని ఆర్ఏలతో సహా ఎవరితోనూ పంచుకోవద్దని క్లయింట్లకు సూచిస్తున్నాం" అని సర్క్యులర్ స్పష్టంగా పేర్కొంది. -
యూఏఈలోకి రిలయన్స్ ప్రొడక్ట్స్ ఎంట్రీ.. కాంపా లాంచ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) యూఏఈలో (UAE) అడుగు పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ అండ్ బేవరేజ్ సోర్సింగ్ ఈవెంట్ అయిన గల్ఫుడ్ 30వ ఎడిషన్‌లో యూఏఈలో భారతీయ లెగసీ బ్రాండ్ కాంపాను అధికారికంగా ప్రారంభించింది.2022లో కాంపా కోలాను కొనుగోలు చేసి, 2023లో దేశంలో తిరిగి ప్రవేశపెట్టిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1970, 80లలో భారతదేశంలో కల్ట్ హోదాను కలిగి ఉన్న ఈ హెరిటేజ్ బ్రాండ్‌ను విజయవంతంగా పునరుద్ధరించింది. యూఏఈలో ప్రముఖ ఆహార, పానీయాల కంపెనీలలో ఒకటైన అగ్థియా గ్రూప్‌తో కలిసి కాంపా కోలాను ఇక్కడి వారికి పరిచయం చేస్తోంది."50 సంవత్సరాల క్రితం స్థాపించిన హెరిటేజ్ ఇండియన్ బ్రాండ్ అయిన కాంపాతో యూఏఈ మార్కెట్లోకి ప్రవేశించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఇక్కడ దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడుతున్నాం. ఈ ప్రాంతంలో వేగవంతమైన వృద్ధికి గొప్ప సామర్థ్యాన్ని చూస్తున్నాము. యూఏఈలో వినియోగదారులకు పానీయాల అనుభవాన్ని మార్చడానికి భాగస్వాములతో కలిసి ఇక్కడికి వస్తున్నందుకు సంతోషిస్తున్నాము" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సీఓఓ కేతన్ మోదీ పేర్కొన్నారు. -
కో-వర్కింగ్ సెంటర్ల జోరు.. హైదరాబాద్‌లో 26,000 సీట్లు
కో-వర్కింగ్ సెంటర్ ఆపరేటర్లు ఎనిమిది ప్రధాన నగరాల్లో గత ఏడాది రికార్డు స్థాయిలో 2.24 లక్షల సీట్లను అద్దెకు తీసుకున్నారు. 2023తో పోలిస్తే 43.6 శాతం వృద్ధి నమోదైంది. కార్పొరేట్ సంస్థల నుండి మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని రియల్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది.ఈ నివేదిక ప్రకారం.. 2023లో బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, కోల్‌కత, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్‌లలో మొత్తం 1.56 లక్షల డెస్క్‌లను కో–వర్కింగ్ లేదా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు కార్పొరేట్ సంస్థలకు అందించాయి. గత ఏడాది ఆపరేటర్లు బెంగళూరులో 64,000, పుణే 38,000, ఢిల్లీ ఎన్సీఆర్ 38,000, ముంబై 28,000, హైదరాబాద్ 26,000, చెన్నైలో 25,000 సీట్లను అద్దెకు ఇచ్చాయి. కోల్‌కత, అహ్మదాబాద్ కేవలం చెరో 1,900 సీట్లకే పరిమితం అయ్యాయి. బలమైన వృద్ధి నమోదు.. ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రాపర్టీ యజమానుల నుండి అద్దెకు ఆఫీసు స్థలాన్ని తీసుకుని.. మౌలిక సదుపాయాలతో కార్పొరేట్స్, నిపుణులు, వ్యక్తులకు వర్క్‌స్పేస్‌ను అందిస్తాయి. ‘సంప్రదాయ కార్యాలయాల ఏర్పాటుతోపాటు మేనేజ్డ్ వర్క్‌స్పేస్‌ను అంతర్జాతీయ సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి.దీంతో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ ప్రస్తుత సంవత్సరంతోపాటు రాబోయే కాలంలో బలమైన వృద్ధి నమోదు చేయనుంది. దీంతో మేనేజ్డ్ స్పేస్ ఆపరేటర్ల ద్వారా ప్రధాన నగరాల్లోని గ్రేడ్ ఏ/ఏ+ ఆస్తులను మరింతగా పెంచుతుంది’ అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఫ్లెక్స్ విభాగం హెడ్ రమిత అరోరా తెలిపారు. -
‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’
ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మధ్య న్యాయ పోరాటం తీవ్రంగా మారింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. పోటీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ గోప్యమైన డేటాను దుర్వినియోగం చేసిందని, బహిర్గతం చేయని ఒప్పందాలను (NDAs) ఉల్లంఘించిందని కాగ్నిజెంట్ ఆరోపించింది .కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య యూఎస్ కోర్టులో ఓ దావా నడుస్తోంది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్ కేసు దాఖలు చేసిందని మింట్ నివేదిక తెలిపింది. "నాన్ డిస్క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్స్ (NDAAs) ద్వారా ఇన్ఫోసిస్ తమ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది" అని 22 పేజీల కోర్టు ప్రతిస్పందనను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: టీసీఎస్ వీసా ఫ్రాడ్ చేసింది.. మాజీ ఉద్యోగుల ఆరోపణలు తమ ట్రైజెట్టో సమాచారాన్ని ఉపయోగించారా లేదా అన్నది ఆడిట్ చేయడానికి ఇన్ఫోసిస్ నిరాకరించిందని, ఇది తన తప్పును రుజువు చేస్తుందని కాగ్నిజెంట్ వాదిస్తోంది. ఈ చట్టపరమైన వివాదం 2024 ఆగస్టు నాటిది. కాగ్నిజెంట్ మొదట డల్లాస్ కోర్టులో ఈ ప్రకటన చేసింది. గత జనవరి 9న దాఖలు చేసిన కేసులో ఈ ఆరోపణను ఇన్ఫోసిస్ తిరస్కరించింది, కాగ్నిజెంట్‌కు సంబంధించిన హెల్త్ కేర్ సొల్యూషన్స్ బహిరంగంగానే ఉన్నాయని, అందులో వాణిజ్య రహస్యాలు ఏమున్నాయో వారే చూసుకోవాలని కాగ్నిజెంట్‌కు సూచించాలని కోర్టును ఇన్ఫోసిస్ కోరింది.ఇన్ఫోసిస్ ప్రతి దావాఇన్ఫోసిస్ తరువాత కాగ్నిజెంట్ పై ప్రతి దావా వేసింది. దాని సీఈవో రవి కుమార్ ఇన్ఫోసిస్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సొంత హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ ఉత్పత్తిని విడుదల చేయడాన్ని కావాలని ఆలస్యం చేశారని, కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని ప్రత్యారోపణలు చేసింది. రవి కుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను వీడారు. ఆ తర్వాత ఏడాది అంటే 2023 జనవరిలో కాగ్నిజెంట్‌లో సీఈవోగా చేరారు. రెండు కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ రంగ క్లయింట్ల నుంచే పొందుతోంది. కాగ్నిజెంట్‌కు కూడా తమ క్లయింట్లలో దాదాపు మూడోవంతు హెల్త్ కేర్ నుంచే ఉన్నారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..
హైదరాబాద్‌లో ఖరీదైన ఇళ్ల అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ అయిన ఇళ్ల మొత్తం విలువ గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగింది. అయితే అధిక సరఫరా కారణంగా అపార్ట్మెంట్ అమ్మకాల్లో మాత్రం మార్కెట్ ఫ్లాట్ వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 5,444 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ మేరకు రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఓ నివేదిక విడుదల చేసింది.హైదరాబాద్ నివాస మార్కెట్ ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రాథమిక, ద్వితీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ల నుండి కూడా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. "రిజిస్ట్రేషన్లలో రూ. 50 లక్షల లోపు ప్రాపర్టీలు ఆధిపత్యం చెలాయించాయి. కానీ ప్రీమియమైజేషన్ వైపు బలమైన మార్పు కనిపించింది. 2025 జనవరిలో రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల ధర 12% పెరిగింది. ఇది అధిక విలువ కలిగిన ప్రాపర్టీలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది" అని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీలలో ఎక్కువ భాగం 1,000 నుండి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవే. రిజిస్ట్రేషన్లన్నింటిలో వీటి వాటా 69%. 2024 జనవరిలో రిజిస్ట్రేషన్ అయిన 13%తో పోలిస్తే 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న యూనిట్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 14% వాటా కలిగి ఉన్నాయని నైట్ ఫ్రాంక్ వివరించింది.మేడ్చల్-మల్కాజ్గిరి టాప్నైట్ ఫ్రాంక్ ప్రకారం.. జిల్లా స్థాయిలో చూస్తే 45% ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లతో మేడ్చల్-మల్కాజ్గిరి అగ్ర స్థానంలో ఉండగా 41% రిజిస్ట్రేషన్లతో రంగారెడ్డి జిల్లా ఆ తర్వాత స్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లా మొత్తం రిజిస్ట్రేషన్లలో మిగిలిన 14% వాటాను అందించింది. అమ్ముడుపోయిన నివాస ఆస్తుల సగటు ధర 2025 జనవరిలో 3% పెరుగుదలను చూసింది. జిల్లాలలో మేడ్చల్-మల్కాజ్గిరి అత్యధికంగా 11% పెరుగుదలను చూసిందని రిజిస్ట్రేషన్ డేటా చెబుతోంది.గృహ కొనుగోలుదారులు పెద్ద పరిమాణంలో, ఉన్నతమైన సౌకర్యాలను అందించే ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేశారు. 2025 జనవరిలో జరిగిన మొదటి ఐదు డీల్స్‌లో 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ, రూ. 5.5 కోట్ల కంటే పైబడి విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ లావాదేవీలలో మూడు పశ్చిమ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ కాగా, రెండు రిజిస్ట్రేషన్లు సెంట్రల్ హైదరాబాద్‌లో జరిగాయి. -
వీసా ఫ్రాడ్.. టీసీఎస్‌పై తీవ్ర ఆరోపణలు
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వీసా మోసం (Visa fraud) ఆరోపణలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అమెరికా కార్మిక చట్టాలను పక్కదారి పట్టించేందుకు కంపెనీ ప్రత్యేక వర్క్ వీసాలను దుర్వినియోగం చేసిందని విజిల్బ్లోయర్లు ఆరోపిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ కార్మికులను అమెరికాకు తీసుకురావడానికి వారిని మేనేజర్లుగా ముద్ర వేసి ఎల్-1ఏ మేనేజర్ వీసాలను దుర్వినియోగం చేసిందని వ్యాజ్యాలతోపాటు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ఇన్వెస్టిగేషన్‌లోనూ ఆరోపించారు.2017లో డోనాల్డ్ ట్రంప్ పరిపాలన ఎంప్లాయిమెంట్ వీసాలపై దృష్టి సారించినప్పుడు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అంతర్గత సంస్థాగత చార్ట్‌లను తప్పుగా రూపొందించాలని తనకు సూచించారని డెన్వర్‌లో టీసీఎస్‌కు ఐటీ మేనేజర్‌గా పనిచేసిన అనిల్ కిని ఆరోపించారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఫెడరల్ పరిశీలనను తప్పించుకోవడానికి ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను మేనేజర్లుగా తప్పుగా చూపించడమే దీని ఉద్దేశమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.అనిల్ కిని, మరో ఇద్దరు మాజీ టీసీఎస్ ఉద్యోగులతో కలిసి ఫెడరల్ ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్ కింద దావాలు దాఖలు చేశారని, కంపెనీ ఎల్-1ఏ వీసా వ్యవస్థను దుర్వనియోగం చేస్తోందని ఆరోపించారని నివేదిక పేర్కొంది. మేనేజర్ స్థాయి అధికారుల బదిలీల కోసం ఉద్దేశించిన ఈ వీసాలు, కఠినమైన వేతనం, విద్యా అవసరాలు కలిగిన హెచ్-1బీ నైపుణ్యం కలిగిన కార్మిక వీసాల కంటే తక్కువ నియంత్రణలు కలిగి ఉంటాయి. అనిల్ కిని దావాను ఈ సంవత్సరం ప్రారంభంలో కొట్టివేసినప్పటికీ ఆయన ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేశాడని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: టీసీఎస్ కొత్త డీల్.. ఫిన్లాండ్ కంపెనీతో..2019 అక్టోబర్, 2023 సెప్టెంబర్ మధ్య యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) 90,000 కంటే ఎక్కువ ఎల్-1ఏ వీసాలను ఆమోదించింది. వీటిని ప్రధానంగా ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థలు యూఎస్ కంపెనీలకు సమాచార సాంకేతిక పనులను నిర్వహించడానికి ఉపయోగించాయి. వీటిలో 6,500 కంటే ఎక్కువ ఎల్-1ఏ వీసాలతో టీసీఎస్ అగ్రస్థానంలో ఉంది. తరువాతి ఏడు అతిపెద్ద గ్రహీతలు కలిపి పొందిన ఎల్-1ఏ వీసాల కంటే టీసీఎస్ ఒక్కటే పొందిన ఎల్-1ఏ వీసాల సంఖ్య అధికం.ఖండించిన టీసీఎస్ తమపై వచ్చిన ఆరోపణలను టీసీఎస్ తీవ్రంగా ఖండించింది. "కొనసాగుతున్న వ్యాజ్యాలపై టీసీఎస్ వ్యాఖ్యానించదు. అయితే కొంతమంది మాజీ ఉద్యోగుల ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీటిని గతంలో అనేక కోర్టులు, ట్రిబ్యునళ్లు తోసిపుచ్చాయి. టీసీఎస్ అన్ని యూఎస్ చట్టాలకు కట్టుబడి ఉంటుంది" అని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థ పేర్కొం -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 75,531 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. కానీ చివరికి 29 పాయింట్ల స్వల్ప నష్టంతో 75,967 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 22,801 కనిష్ట స్థాయిని, 22,992 గరిష్ట స్థాయిని తాకి, ఆ తర్వాత 14 పాయింట్లు తగ్గి 22,945 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 షేర్లలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3 శాతం వరకు లాభపడి టాప్ పెర్ఫార్మర్లలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, జొమాటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇతర స్పష్టమైన కదలికలు చేశాయి. మరోవైపు, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా & మహీంద్రా, టీసీఎస్ ఒక్కొక్కటి 1 - 2 శాతం క్షీణించాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా ఫ్లాట్ నోట్‌తో ముగిసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 1.5 శాతం క్షీణించింది. మొత్తంగా ఈరోజు మార్కెట్ 3:1 నిష్పత్తిలో బేర్లకు అనుకూలంగా నష్టాలను చూసింది. బీఎస్ఈలో దాదాపు 3,000 స్టాక్‌లు క్షీణించగా , 1,000 కంటే తక్కువ షేర్లు లాభపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, వెండి దిగుమతి ధరలు పెంపు
ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా భారత ప్రభుత్వం బంగారం (gold), వెండి (silver) దిగుమతి మూల ధరలను పెంచింది. ఫిబ్రవరి 14న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బంగారం మూల ధర 10 గ్రాములకు 41 డాలర్లు పెరిగి 938 డాలర్లకు చేరుకుంది. వెండి బేస్ రేటు కూడా కేజీకి 42 డాలర్లు పెరిగింది.ట్రెండ్స్‌కు అనుగుణంగా సర్దుబాటుఅమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సహా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ అంశాల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. బేస్ దిగుమతి ధర పెరిగితే వాటి మీద విధించే దిగుమతి సుంకాలు కూడా పెరుగుతాయి. వీటిని బేస్ ధరలో ఒక శాతంగా లెక్కించి వసూలు చేస్తారు. దీని దిగుమతి ధరలో సర్దుబాటు కారణంగా వెండి ధరలు కూడా పెరిగాయి.భారత్‌లో బంగారం ధరలుప్రపంచ ట్రెండ్‌ను అనుసరించి సోమవారం (ఫిబ్రవరి 17 ) భారత్‌లో కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8,662, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7,940 చొప్పున ఉన్నాయి. బేస్ ధరల సవరణతో, వ్యాపారులు దేశీయ బంగారం ధరలను తదనుగుణంగా సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇది రిటైల్ మార్కెట్లో మొత్తం ధరలను ప్రభావితం చేస్తుంది.వెండి ధర సర్దుబాటుబంగారం లాగే వెండి కూడా అంతర్జాతీయంగా ధరల పెరుగుదలను చూసింది. వెండి బేస్ దిగుమతి ధరను పెంచాలనే ప్రభుత్వం నిర్ణయం ఈ ప్రపంచ మార్పులను చూపిస్తుంది. దిగుమతి ధరలలో మార్పు మార్కెట్‌కు అనుగుణంగా బేస్ ధరపై సుంకాలు విధించడం ద్వారా పన్నుల వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. ప్రపంచ మార్కెట్ పరిస్థితుల్లో తదుపరి మార్పులను బట్టి తదుపరి సవరణ వరకు కొత్త బేస్ దిగుమతి ధరలు వర్తిస్తాయి. -
ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. ఇక ప్రతిసారీ కార్డు వివరాలు అక్కర్లేదు
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే (PhonePe) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్‌ను ప్రారంభించింది. వినియోగదారులు ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకుని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ బుకింగ్‌లు, బీమా కొనుగోళ్లతోపాటు పిన్‌కోడ్, ఫోన్‌పే పేమెంట్ గేట్‌వేను ఉపయోగించి చేసే చెల్లింపులు వంటి వివిధ సేవలలో ఉపయోగించవచ్చు.ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు మెరుగైన భద్రత, సౌలభ్యం నుండి ప్రయోజనం పొందుతారు. ఇకపై మర్చంట్ ప్లాట్‌ఫామ్‌లలో కార్డ్ వివరాలను సేవ్ చేయాల్సిన అవసరం లేదు లేదా ప్రతి లావాదేవీకి సీవీవీని నమోదు చేయాల్సిన అవసరం లేదని ఫోన్‌పే తెలిపింది. టోకెనైజ్డ్ కార్డులు కార్డ్ వివరాలను ఫోన్లకు సురక్షితంగా లింక్ చేయడం ద్వారా మోసాల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇది ఆన్లైన్ చెల్లింపులపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభంలో వినియోగదారులు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను టోకెనైజ్ చేయవచ్చు.ఈ ఫీచర్ నుండి వ్యాపారులు కూడా ప్రయోజనం పొందుతారు. టోకెనైజ్డ్ కార్డులు వేగవంతమైన లావాదేవీలను, అధిక మార్పిడి రేట్లను అనుమతిస్తాయి. ఎక్కువ మంది వినియోగదారులు ఈ పద్ధతిని అవలంబించడంతో, వ్యాపారాలు మెరుగైన కస్టమర్ నిలుపుదల, సున్నితమైన చెక్అవుట్ అనుభవాన్ని పొందుతాయి. ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే ఉపయోగించే వ్యాపారులకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపు భద్రత, సౌలభ్యాన్ని పెంచుతుందని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సీటీవో రాహుల్ చారి అన్నారు. ఈ సర్వీస్‌ను మరిన్ని కార్డ్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించాలని, ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే వ్యాపారులందరికీ విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. -
ఒక్కో ఉద్యోగికి రూ.4 లక్షల బోనస్..
ఉద్యోగుల శ్రమను దోపిడీ చేసి ఆదాయాలను పెంచుకునే కంపెనీలనే చూస్తుంటాం. కానీ మంచి లాభాలు వచ్చినప్పుడు దాన్ని ఉద్యోగులకు పంచే యాజమాన్యాలు కూడా కొన్ని ఉంటాయి. పారిస్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ హెర్మేస్ (Hermes) గత సంవత్సరం అసాధారణమైన లాభాలు సాధించింది. పరిశ్రమలోనూ దాని స్థానం మెరుగైంది. దీంతో ఉద్యోగులకు బోనస్ (bonus) ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. 2025 ప్రారంభంలో తమ సంస్థలో పనిచేసే ఒక్కో ఉద్యోగికి రూ. 4 లక్షలు (4,500 యూరోలు) బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది.ఈ ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ ఏకీకృత ఆదాయం 2024 లో 15.2 బిలియన్ యూరోలను తాకింది. 2023 తో పోలిస్తే స్థిరమైన మారకపు రేట్లలో 15 శాతం, ప్రస్తుత మారకపు రేట్ల వద్ద 13 శాతం పెరుగుదల. హెర్మేస్ దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం, లోతుగా పాతుకుపోయిన వారసత్వ కళలు కంపెనీని ఇంత దూరం నడిపించాయి. ఈ లగ్జరీ లెజెండ్ ప్రపంచవ్యాప్తంగా తన పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుంటూ నమ్మకమైన కస్టమర్ బేస్ సంపాదించుకుంటూ అంతర్జాతీయంగా తన బ్రాండ్‌ను విస్తరించింది.వ్యాపారం పెరుగుతుండటంతో ఈ ఫ్యాషన్ బ్రాండ్ స్థిరమైన అభివృద్ధితోపాటు శ్రామిక శక్తిని బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టింది. హెర్మేస్ గ్రూప్ 2024 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో 1,300 మందితో సహా మొత్తం 2,300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. దీంతో దాని మొత్తం శ్రామిక శక్తి 25,000 మందికి చేరుకుంది. ఫ్యాషన్ యునైటెడ్ నివేదిక ప్రకారం.. సామాజిక నిబద్ధత విధానంలో భాగంగా గ్రూప్ ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి రూ.4 లక్షలు (4,500 యూరోలు) చొప్పున బోనస్‌ను ఆర్థికేడాది ప్రారంభంలోనే కంపెనీ చెల్లించనుంది.ఇది చదివారా? బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. దాదాపు 2 నెలలు అన్లిమిటెడ్జపాన్ మినహా హెర్మేస్ ఈ సంవత్సరంలో 7 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. ఒక్క నాల్గవ త్రైమాసికంలోనే 9 శాతం పెరిగింది. బీజింగ్, షెన్‌జెన్‌లలో అనేక స్టోర్లు తెరిచినట్లు ఫ్యాషన్ యునైటెడ్ నివేదించింది. ఫ్రాన్స్ కాకుండానే యూరప్‌లో గరిష్ట వృద్ధి కనిపించింది. స్థానిక డిమాండ్, ఈ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో 19 శాతం వృద్ధి కనిపించింది. లిల్లే, నేపుల్స్లో కొత్త బోటిక్‌లను ప్రారంభించడం ఫ్యాషన్ బ్రాండ్ వృద్ధికి, విస్తరణకు తోడ్పడింది. -
తెలంగాణలో మాజిల్లానిక్ క్లౌడ్ విస్తరణ
హైదరాబాద్: అగ్రగామి టెక్నాలజీ ఆవిష్కర్త మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో (ఎన్ఎస్ఈ) లిస్టయిన నేపథ్యంలో తదుపరి దశ వృద్ధిని వేగవంతంగా సాధించడంపై దృష్టి పెడుతోంది. ఒకవైపు గణనీయంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తూనే మరోవైపు ఏఐ ఆధారిత పరివర్తనపై మరింతగా దృష్టి సారిస్తూ ఈ-సర్వైలెన్స్, స్కానలిటిక్స్ లాంటి వీడియో అనలిటిక్స్ సొల్యూషన్స్, డీప్-టెక్ సొల్యూషన్స్ మొదలైన వాటిల్లో కార్యకలాపాలను విస్తరిస్తోంది.అధునాతన డ్రోన్ టెక్నాలజీలో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటూ, మాజిల్లానిక్ క్లౌడ్ సంస్థ దేశీయంగా 200 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలిగే, వాణిజ్యావసరాలకు అందుబాటులో ఉన్న, అత్యంత శక్తిమంతమైన కార్గో డ్రోన్ అయిన కార్గోమ్యాక్స్ 200KHCని (CargoMax 200KHC) కూడా ఆవిష్కరించింది. బీఎఫ్ఎస్ఐ, టెలికం, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ తదితర రంగాల కోసం కస్టమైజ్ చేసిన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జెన్ ఏఐ లాంటి అధునాతన కృత్రిమ మేథ సాంకేతికతల ద్వారా లభించే అవకాశాలు ఈ మార్గదర్శ ప్రణాళికకు కీలకంగా ఉండనున్నాయి. ఇటు ఆర్గానిక్గాను అటు వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా ఇనార్గనిక్గాను వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా మాజిల్లానిక్ క్లౌడ్ దృష్టి పెడుతోంది.“సెక్యూరిటీ భవిష్యత్తనేది ఏఐ, సర్వైలెన్స్ కలబోతపై ఆధారపడి ఉంది. తెలంగాణలోని మా కార్యాలయాలు, ముడి డేటాను ఇటు పబ్లిక్ అటు ప్రైవేట్ రంగ క్లయింట్లు తగు నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే మేథోసంపత్తిగా తీర్చిదిద్దే, అధునాతన వీడియో అనలిటిక్స్ సిస్టంలను అభివృద్ధి చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా దోహదపడతాయి” అని మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ సీఈవో జోసెఫ్ సుధీర్ తుమ్మ తెలిపారు.“తెలంగాణ పురోగామి విధానాలు, ప్రతిభావంతుల లభ్యత కారణంగా మా కార్యకలాపాల విస్తరణకు ఇది అనువైన ప్రాంతంగా ఉంది. మేము స్థానికంగా అభివృద్ధికి దోహదపడుతూనే అటు అంతర్జాతీయ క్లయింట్లకు కూడా సేవలు అందించేందుకు మాకు తోడ్పడుతోంది” అని జోసెఫ్ సుధీర్ తుమ్మ వివరించారు. -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లోకి మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు తమ ప్రారంభ నష్టాలను తిప్పికొట్టి 8 రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి, సోమవారం సానుకూలంగా స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 57.65 పాయింట్లు లేదా మునుపటి ముగింపుతో పోలిస్తే 0.08 శాతం పెరిగి 75,996.86 వద్ద ముగిసింది. దీని ఇంట్రా-డే కనిష్ట స్థాయి 75,294.76 నుండి దాదాపు 702.10 పాయింట్లు పెరిగింది. మునుపటి ఎనిమిది వరుస ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 3.4 శాతం లేదా 2,645 పాయింట్లు పడిపోయింది.అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 30.25 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 22,959.50 వద్ద ముగిసింది. సోమవారం ఈ ఇండెక్స్ 22,974.20 నుండి 22,725.45 పరిధిలో ట్రేడయింది. నిఫ్టీ50లోని 50 కాంపోనెంట్ స్టాక్‌లలో 34 లాభాలతో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్ 3.93 శాతం వరకు లాభాలను ఆర్జించాయి. మహీంద్రా & మహీంద్రా, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఎస్ఈ నిఫ్టీ50లో అత్యధికంగా వెనుకబడిన వాటిలో ఉన్నాయి, 3.45 శాతం వరకు నష్టాలు సంభవించాయి. ట్రేడింగ్ సెషన్ రెండవ భాగంలో విస్తృత మార్కెట్లు కూడా కోలుకున్నాయి, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.39 శాతం లాభాలతో స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.04 శాతం స్వల్ప లాభాలతో ముగిసింది. అయితే, మార్కెట్ విస్తృతి ప్రతికూలంగానే ఉంది. ఎన్ఎస్ఈలో ట్రేడవుతున్న 2,955 స్టాక్‌లలో 1,014 లాభాలతో ముగియగా, 1,871 స్టాక్‌లు క్షీణించాయి. 70 స్టాక్‌లు మాత్రం మారలేదు. ఎన్ఎస్ఈలోని రంగాలలో, ఫార్మా, బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఓఎంసీలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ లాభాలతో ముగిశాయి. గ్లెన్‌మార్క్ ఫార్మా , అజంతా ఫార్మా నేతృత్వంలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.27 శాతం లాభపడి ముగిసింది. కాగా నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా సూచీలు 0.71 శాతం వరకు తగ్గాయి. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. 54 రోజులు..
ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఎప్పటికప్పుడు చౌక రీచార్జ్ ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఉచిత ఎస్ఎంఎస్ వంటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.కొత్త ప్లాన్ ప్రయోజనాలురూ. 347 ధరతో బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ వినియోగదారులకు ఢిల్లీ, ముంబైలోని ఎంటీఎన్ఎల్ (MTNL) ప్రాంతాలతో సహా దేశం అంతటా ఉచిత అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్‌ను అందిస్తుంది. అదనంగా, రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను యూజర్లు ఆనందించవచ్చు.ఈ ప్లాన్ 54 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదనపు బోనస్‌గా బీఐటీవీ (BiTV)కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంటారు. ఇది 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు, వివిధ రకాల OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా సేవలను మెరుగుపరచడంపై బీఎస్ఎన్ఎల్ దృష్టి సారిస్తోంది. కంపెనీ 65,000 కొత్త 4జీ టవర్లను విజయవంతంగా అమలులోకి తెచ్చింది. దేశం అంతటా తమ వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు ఈ సంఖ్యను త్వరలో లక్షకు పెంచాలని యోచిస్తోంది.ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో, మెరుగైన సర్వీస్ డెలివరీని లక్ష్యంగా చేసుకుని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల రూ. 6,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది.బీఎస్ఎన్ఎల్కు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే విస్తృత ప్రయత్నంలో ఇది భాగం. ఇటీవలి సంవత్సరాల్లో బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్ల సాయాన్ని ప్రకటించింది. 2007 తర్వాత మొదటిసారిగా బీఎస్ఎన్ఎల్ లాభాల్లోకి వచ్చింది. 2025 ఆర్థిక సంవ్సతరం మూడవ త్రైమాసికంలో రూ.262 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. -
ఎయిర్పోర్ట్ కొత్త రూల్స్.. ఈ వస్తువులకు నో ఎంట్రీ
సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్ విమానాశ్రయం దాని నియమాలలో కొన్ని మార్పులు చేసింది. సాధారణంగా ప్రయాణికులు క్యాబిన్ బ్యాగ్‌లో మందులు వంటి ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లవచ్చు. కానీ ఇప్పుడు దుబాయ్ వెళ్లే విమానంలో ఇది సాధ్యం కాదు. మీరు అన్ని రకాల మందులను తీసుకెళ్లలేరు. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు అనుమతించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి.దుబాయ్ విమాన లగేజీ నిబంధనలలో మార్పులుచాలా సార్లు ప్రయాణికులు తమకు తెలియకుండానే అనుమతి లేని కొన్ని వస్తువులను తమతో విమానంలోకి తీసుకెళ్తుంటారు. వీటిని విమానంలో తీసుకెళ్లడం చట్టపరమైన నేరంగా పరిగణిస్తారు. మీరు దుబాయ్ వెళ్తుంటే విమానంలో చెక్-ఇన్ లగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో ఏమి ప్యాక్ చేయవచ్చు.. ఏమి చేయకూడదు అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. దుబాయ్‌కి ప్రయాణించేటప్పుడు బ్యాగుల్లో ఎలాంటి వస్తువులను తీసుకువెళ్లవచ్చో ఇక్కడ తెలుసుకోండి.ఈ ఉత్పత్తులను బ్యాగులో తీసుకెళ్లకూడదుకొకైన్, హెరాయిన్, గసగసాలు, మత్తు కలిగించే మందులు.తమలపాకులు, కొన్ని మూలికలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు.ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, జూద వస్తువులు, మూడు పొరల ఫిషింగ్ నెట్లు, బహిష్కృత దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకెళ్లడం కూడా నేరంగా పరిగణిస్తారు.ముద్రిత వస్తువులు, ఆయిల్ పెయింటింగ్‌లు, ఛాయాచిత్రాలు, పుస్తకాలు, రాతి శిల్పాలను కూడా తీసుకెళ్లకూడదు.నకిలీ కరెన్సీ, ఇంట్లో వండిన ఆహారం, మాంసాహారం కూడా తీసుకెళ్లకూడదు.ప్రయాణికులెవరైనా ఈ నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.ఈ మందులను అస్సలు తీసుకెళ్లలేరుబెటామెథోడోల్ఆల్ఫా-మిథైల్ఫెనానిల్ గంజాయికోడాక్సిమ్ఫెంటానిల్పాపీ స్ట్రా కాన్సన్ట్రేట్మెథడోన్నల్లమందుఆక్సికోడోన్ట్రైమెపెరిడిన్ఫెనోపెరిడిన్కాథినోన్కోడైన్యాంఫెటమైన్వీటిని చెల్లింపుతో తీసుకెళ్లవచ్చుదుబాయ్ ట్రిప్‌కు వెళ్లేటప్పుడు కొన్ని రకాల వస్తువులను చెల్లింపుతో తీసుకెళ్లవచ్చు. ఈ జాబితాలో మొక్కలు, ఎరువులు, మందులు, వైద్య పరికరాలు, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, ట్రాన్స్మిషన్, వైర్లెస్ పరికరాలు, ఆల్కహాలిక్ పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఈ-సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కాలు ఉన్నాయి. -
నీతా అంబానీకి అరుదైన గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీకి (Nita Ambani) అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆమె దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేసింది. మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలే చేతుల మీదుగా నీతా అంబానీ ఈ ప్రశస్తిని అందుకున్నారు.మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రం గురించి తెలియజేస్తూ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, మహిళా సాధికారత వంటి వివిధ రంగాలలో నీతా అంబానీ గణనీయమైన ప్రభావాన్ని చూపారంటూ రిలయన్స్ ఫౌండేషన్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా తెలిపింది."మా వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీని దార్శనిక నాయకురాలిగా, వితరణశీలిగా, అసలైన గ్లోబల్ గేమ్‌ఛేంజర్‌గా గుర్తిస్తూ మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలే ప్రతిష్టాత్మక గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేశారు" అని రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్‌లో వివరించింది.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నీతా అంబానీ చేతితో నేసిన అద్భుతమైన శికార్గా బనారసి చీర ధరించి పాల్గొన్నారు. భారతీయ కళా నైపుణ్యానికి ఉదాహరణగా నిలిచే ఈ చీర అధునాతన కడ్వా నేత నైపుణ్యం, సాంప్రదాయ కోన్యా హంగులను సంతరించుకుంది. నీతా అంబానీ ఈ చీరను ధరించడం ద్వారా భారతదేశ కళాత్మక వారసత్వ వైభవాన్ని మరోసారి అంతర్జాతీయంగా చాటారు. -
కమర్షియల్ ఫ్లైట్లలో తరలుతున్న బంగారం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president Donald Trump) విధించిన సుంకాలు (US tariffs) భిన్నమైన గోల్డ్ రష్కు దారితీశాయి. న్యూయార్క్, లండన్ నగరాల మధ్య వాణిజ్య విమానాల్లో బిలియన్ల డాలర్ల విలువైన బంగారం తరలుతోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న ధరలు, మారుతున్న మార్కెట్ల కారణంగా జేపీ మోర్గాన్ సహా బ్యాంకులు బంగారాన్ని తరలించడానికి ఇబ్బంది పడుతున్నందున వింత పరిస్థితి ఏర్పడుతోందని క్వార్ట్జ్ నివేదించింది.పెరుగుతున్న బంగారం ధరలు బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 11% పెరిగాయని నివేదిక పేర్కొంది. గత బుధవారం న్యూయార్క్‌లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్సుకు 2,909 డాలర్ల వద్ద ముగిశాయి. ఇది త్వరలో 3,000 డాలర్లకు చేరుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ట్రంప్ ఎన్నిక, యూరప్‌పై సుంకాలు విధిస్తానని ఆయన బెదిరింపు తర్వాత, డిసెంబర్ ప్రారంభం నుండి లండన్‌లో భౌతిక బంగారం ధర దాదాపు 20 డాలర్లు తక్కువగా ట్రేడవుతోందని నివేదిక పేర్కొంది.న్యూయార్క్‌కు బంగారం తరలింపుసాధారణంగా లండన్, న్యూయార్క్ నగరాల్లో బంగారం ధరలు ఒకే రకంగా కదులుతాయి. ధరల అంతరం ఉన్నప్పుడల్లా వ్యాపారులు ఈ రెండు నగరాల మధ్య బంగారాన్ని తరలిస్తూ ఉంటారు. లండన్‌లో గోల్డ్ బార్లను కలిగి ఉన్న బ్యాంకులు వాటిని రుణంగా ఇవ్వడం ద్వారా ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇక ధరల తగ్గుదల నుండి రక్షించుకోవడం కోసం న్యూయార్క్‌లో ఫ్యూచర్స్ కాంట్రాక్టులను విక్రయిస్తుంటాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ వంటి పెద్ద బ్యాంకులు ఈ బంగారు లావాదేవీలను నిర్వహిస్తుంటాయి.కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. అమెరికాలో బంగారం ధరలు లండన్ కంటే ఎక్కువగా పెరగడంతో గోల్డ్ ఫ్యూచర్లను విక్రయించిన బ్యాంకులు ఇప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను నష్టానికి తిరిగి కొనుగోలు చేయడానికి బదులుగా, బ్యాంకులు తమ లండన్ వాల్ట్‌ల నుండి భౌతిక బంగారాన్ని న్యూయార్క్‌కు తరలించే తెలివైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఇలా చేయడం ద్వారా బ్యాంకులు నష్టపోకుండా తమ ఒప్పందాలను నెరవేర్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని అధిక యూఎస్ ధరకు అమ్మడం ద్వారా లాభం కూడా పొందవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఒక్క జేపీ మోర్గాన్ సంస్థే ఈ నెలలో న్యూయార్క్‌కు 4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని తరలించాలని ప్రణాళిక వేసింది.బంగారం తరలింపునకు వాణిజ్య విమానాలుబంగారం తరలింపు బ్యాంకులకు నష్టాలను తగ్గించి, లాభాలను కూడా పొందేందుకు వీలు కల్పించినప్పటికీ, తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది క్లయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుండి తమ బంగారాన్ని తిరిగి పొందడానికి ఒక వారం వరకు వేచి ఉన్నారని నివేదిక పేర్కొంది. ధర వ్యత్యాసాలు ఓవైపు ఉంటే మరోవైపు కామెక్స్ కాంట్రాక్టులు గోల్డ్ బార్ల పరిమాణానికి సంబంధించి కూడా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అంటే వ్యాపారులు బంగారాన్ని యథాతథంగా రవాణా చేయలేరు. యూఎస్‌కు రవాణా చేయడానికి ముందు సరైన పరిమాణంలోకి మార్చడానికి వాటిని ముందుగా శుద్ధి కర్మాగారాలకు పంపాల్సి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ఇలా బంగారం సిద్ధమైన తర్వాత కూడా దానిని రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే వాణిజ్య విమానాల ద్వారా తరలింపు సురక్షితమైన మార్గమని బ్యాంకులు భావిస్తున్నాయని నివేదిక పేర్కొంది. బ్యాంకులు భద్రతా సంస్థలతో కలిసి సాయుధ వ్యాన్లలో బంగారాన్ని లండన్‌లోని విమానాశ్రయాలకు తరలిస్తున్నాయని, తరువాత వాటిని న్యూయార్క్‌కు తరలిస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
జియో హాట్‌స్టార్ ఫ్రీగా కావాలా?
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్, జియోఫైబర్ ప్లాన్లను జియో హాట్‌స్టార్ (JioHotstar) సబ్‌స్క్రిప్షన్‌తో అప్డేట్ చేసింది. వీటిలో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక కొత్త ప్లాన్‌ను తీసుకురాగా, డిస్నీ+ హాట్‌స్టార్‌కు బదులుగా జియోహాట్‌స్టార్‌ను చేర్చడానికి మరికొన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ జియోఫైబర్ ప్లాన్లను అప్డేట్ చేసింది.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్రీపెయిడ్ ప్లాన్రిలయన్స్ జియో తన రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్‌ను జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అప్డేట్ చేసింది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, అపరిమిత 5G డేటా, రోజుకు 2GB 4G డేటాతో వస్తుంది. అదనంగా, ఇది జియో టీవీ, జియోక్లౌడ్తో పాటు 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇందులో చేర్చిన జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 'మొబైల్' ప్లాన్ అని గమనించడం ముఖ్యం.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియోఫైబర్ ప్లాన్లుజియోఫైబర్ రూ.999 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 150 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందుతారు. అలాగే ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియోఫైబర్ రూ.1,499 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 300 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను అందుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియోఫైబర్ రూ.2,499 ప్లాన్: అపరిమిత డేటా , వాయిస్ కాలింగ్‌తో 500 Mbps వేగాన్ని అందిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను ఆనందించవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.రూ.3999, రూ.8499 ప్లాన్లు: అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 1 Gbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందుతారు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లుజియో ఎయిర్ ఫైబర్ రూ.599 ప్లాన్: 1000GB డేటా, 30Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్ స్టార్ తో సహా మొత్తం 9 ఓటీటీలను అందిస్తుంది.జియో రూ.899, రూ.1199 ప్లాన్లు: 1000GB డేటా, 100Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్‌తో సహా మొత్తం 13 ఓటీటీలను అందిస్తుంది. -
హైదరాబాద్‌లో టూరిస్ట్ ఇళ్లు.. సకల వసతులు
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవుల్లో సేద తీరడానికి పలు కుటుంబాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటాయి. కానీ, అక్కడి వసతి ఎలా? హోటళ్లలో ఉండాలంటే.. కాస్త ఖర్చు ఎక్కువే. నచ్చిన వంట వండుకోలేం. సరైన ఆతిథ్యాన్ని స్వీకరించలేం. వాళ్లు పెట్టినవాటిలో నుంచి ఎంపిక చేసుకొని తినాలి. దీనికి పరిష్కారం చూపించేవే పర్యాటక విడిదులు. స్టార్ హోటళ్లను తలదన్నేలా ఆధునిక వసతులు అందించడమే ఈ టూరిస్ట్ ఇళ్ల ప్రత్యేకత.ఇళ్లు.. హోం స్టేలుగా! భాగ్యనగరం అంటేనే చక్కని ఆతిథ్యానికి చిరునామా. అందుకే విదేశీ పర్యాటకులు ఇక్కడి ఆత్మీయత, ఆతిథ్యానికి ముగ్ధులవుతుంటారు. ఈ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు పర్యాటక శాఖ హోం స్టే పథకం ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పలు ప్రైవేట్ సంస్థలూ సేవలందిస్తున్నాయి. నగరంలోని గృహ యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చే బదులుగా ఇలా హోంస్టే సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆకట్టుకునేలా గృహాలను తీర్చిదిద్ది, అన్ని సౌకర్యాలు కల్పించి, పర్యాటకులకు తాత్కాలికంగా కిరాయికి ఇస్తున్నారు.అన్ని రకాల వసతులు.. ఎయిర్ బీఎన్బీ, వీఆర్బో, బుకింగ్.కామ్, మేక్ మై ట్రిప్, ట్రావెల్ స్టేషన్, హోమ్ టుగో వంటి సంస్థలు హోం స్టే సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, తీర్థయాత్రలు అన్నిచోట్లా టూరిస్ట్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కిచెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులు ఈ హోం స్టేలలో ఉంటాయి. సౌకర్యాలను బట్టి అద్దె ఒక రాత్రికి రూ.5 వేల నుంచి ఉంటాయి.ఆయా పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న హోం స్టేల వివరాలను సంస్థలు తమ వెబ్సైట్లలో పొందుపరుస్తున్నాయి. వారికి అనువైన వసతిని వెతుక్కోవచ్చు. ఇందులోనే ధరలను కూడా నిర్ణయిస్తారు. వండి వడ్డించే భోజనం వివరాలు కూడా ఉంటాయి. విమానాశ్రయం నుంచి నేరుగా బస చేసే ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని అందుకోవచ్చు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త రికార్డు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిల పరిధిలో రికార్డుస్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయని అనరాక్ గ్రూప్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నివేదికలోని పలు కీలకాంశాలివే..హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా.. 2024 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాల్లో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కోవిడ్ అనంతరం లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు..2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో 12,400గా ఉండగా.. 2024 నాటికి 15,350కి పెరిగాయి.అందుబాటు గృహాల్లో 15 శాతం.. ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగపు ధరల వృద్ధిలో హైదరాబాద్‌ది రెండో స్థానం. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది. ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్య తరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ. 6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది. -
పంట బీమా పంపిణీకి ప్రత్యేక కార్యక్రమం
దేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ (SBI General Insurance) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు పంట బీమా పాలసీలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖతో కలిసి పాలసీలను రైతుల ముంగిటకు చేర్చే ‘మేరీ పాలసీ మేరే హాథ్’ అనే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటోంది.‘మేరీ పాలసీ మేరే హాథ్’ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుండి మార్చి 15 వరకు జరగనుంది. ఇందులో భాగంగా రైతులకు వారి ఇంటి వద్దనే భౌతికంగా పంట బీమా పాలసీ పత్రాలను అందజేస్తారు. రైతులలో పంట బీమా ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి, నిరాటంకమైన పంట బీమా అనుభవం అందించేందుకు ఈ కార్యక్రమం రూపొందించారు.‘మేరీ పాలసీ మేరే హాథ్’ కార్యక్రమం ముఖ్యంగా పంట బీమా ప్రక్రియలో పారదర్శకతను పెంచడంపై దృష్టి సారిస్తుంది. పంట నష్టాలు వాటిల్లిన పక్షంలో వెంటనే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్, సెంట్రల్ టోల్ ఫ్రీ నంబర్ 14447 వంటి వాటి ద్వారా సమాచారం అందించేలా రైతులను చైతన్యపరుస్తుంది. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.“పీఎంఎఫ్‌బీవై కింద రైతులకు పంట బీమా ప్రయోజనాలను సులభంగా అందించేందుకు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కట్టుబడి ఉంది. ఆర్థిక భద్రత, నిశ్చింతను రైతులకు అందించడం, రిస్కులను అధిగమించడంలో వారికి సహాయం చేయడమే మా లక్ష్యం. ‘మేరీ పాలసీ మేరే హాథ్’ క్యాంపెయిన్ ద్వారా స్థానిక అడ్మినిస్ట్రేషన్లు, భాగస్వాములు, రైతులతో కలిసి సమర్ధవంతంగా, ప్రభావవంతంగా పాలసీల పంపిణీకి మా నిబద్ధతను తెలియజేస్తున్నాము” అని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో నవీన్ చంద్ర ఝా పేర్కొన్నారు.