cars
-
బెస్ట్ సీఎన్జీ కార్లు: ధర రూ.10 లక్షల కంటే తక్కువే..
పెట్రోల్ ధరలు పెరగడం, సీఎన్జీ రీఫ్యూయలింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం అన్నీ జరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది పెట్రోల్ కార్ల స్థానంలో సీఎన్జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ సిఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్జీప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కార్లలో ఒకటి 'మారుతి సుజుకి ఆల్టో కే10'. ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు ధరలు రూ. 5.8 లక్షలు, రూ. 6.04 లక్షలు. ఇందులోని 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5300 rpm వద్ద 56 Bhp పవర్, 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 33.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీఇది కూడా ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు వరుసగా రూ. 5.91 లక్షలు, రూ. 6.11 లక్షలు. ఈ కారులో 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 56 Bhp పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 32.73 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.టాటా టియాగో సీఎన్జీటాటా టియాగో సీఎన్జీ ధరలు రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ట్విన్ సిలిండర్ CNG ట్యాంక్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కారు ఐదు మాన్యువల్, మూడు ఆటోమాటిక్ వేరియంట్లలో లభిస్తుంది. మాన్యువల్ ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.19 లక్షల మధ్య ఉన్నాయి. ఆటోమాటిక్ ధరలు రూ. 7.84 లక్షల నుంచి రూ. 8.74 లక్షల మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్‌జీమారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్జీ.. ఎల్ఎక్స్ఐ (ఓ), విఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 6.54 లక్షల నుంచి రూ. 6.99 లక్షల వరకు ఉంటాయి. ఇది 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ద్వారా 5300 ఆర్పీఎమ్ వద్ద 56 బిహెచ్పీ పవర్ఉ.. 3400 ఆర్పీఎమ్ వద్ద 82.1 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని మైలేజ్ 33.47 కిమీ/కేజీ వరకు ఉంది.ఇదీ చదవండి: అమ్మకాల్లో టాప్ కంపెనీలు.. ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీమారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ.. భారతదేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లలో ఒకటి. దీని ధర రూ. 6.90 లక్షలు. ఇది 34 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారులోని 998 సీసీ ఇంజిన్ 5300 rpm వద్ద, 55.92 Bhp పవర్ & 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ అందిస్తుంది. -
తక్కువ ధర.. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్: ఇదిగో బెస్ట్ కార్లు
తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్స్, మంచి డిజైన్ కలిగిన కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు.. భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే దాదాపు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి సెలెరియోప్రారంభంలో సెలెరియో కారులో మారుతి సుజుకి కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లను మాత్రమే అందించింది. ఆ తరువాత కాలంలో ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించడం మొదలు పెట్టింది. అయితే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న కారు ధర.. స్టాండర్డ్ వేరియంట్ ధర కంటే కొంత ఎక్కువ. ఈ కారు ధరలు రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షల మధ్య ఉన్నాయి.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో కూడా కంపెనీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఉందులో ఉన్నాయి. ఈ కారు ధరలు రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.38 లక్షలు. ఇది 1.2 లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్ ద్వారా 82 హార్స్ పవర్, 113.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.నిస్సాన్ మాగ్నైట్మార్కెట్లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్ల జాబితాలో నిస్సాన్ మాగ్నైట్ ఒకటి. రూ. 6.12 లక్షల నుంచి రూ. 11.72 లక్షల మధ్య ధరలో అందుబాటులో ఉన్న ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు.. 360 డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటివి కూడా ఉన్నాయి.హ్యుందాయ్ ఎక్స్టర్2023లో అత్యధిక అమ్మకాలు పొందిన హ్యుందాయ్ ఎక్స్టర్.. ఆరు ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ మొదలైనవి పొందుతుంది. దీని ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 9.48 లక్షల మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి స్విఫ్ట్ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ సీట్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన మారుతి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.50 లక్షల మధ్య ఉంది. ఇది పెట్రోల్, CNG రూపంలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?సిట్రోయెన్ సీ3ఫ్రెచ్ వాహన తయారీ సంస్థ అయిన.. సిట్రోయెన్ తన సీ3 కారులో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తోంది. రూ. 6.16 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, డే - నైట్ ఐఆర్వీఎమ్ వంటి వాటిని పొందుతుంది. తక్కువ ధరలో.. మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్ల జాబితాలో సిట్రోయెన్ సీ3 ఒకటి. -
సుంకాల భారం అమెరికాపైనే!
ఔషధాలు, ఆటోమొబైల్, సెమికండక్టర్ దిగుమతులపై దాదాపు 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఔషధ ఎగుమతుల్లో యూఎస్ మార్కెట్ తొలి స్థానంలో ఉంది. అలాగే అమెరికా వినియోగిస్తున్న జనరిక్స్‌లో దాదాపు సగం వాటా భారత్ సమకూరుస్తోంది. దీంతో ట్రంప్ ని ర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.ఔషధ దిగుమతులపై ఆధారపడ్డ యూఎస్ ప్రతీకార పన్నుల విషయంలో ఒక అడుగు వెనక్కి వేసే అవకాశమే ఉందని భారతీయ ఫార్మా కంపెనీలు, నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. యూఎస్ వెలుపల అత్యధిక యూఎస్ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ ప్లాంట్లు ఉన్నది భారత్‌లోనే. పైగా ఇప్పటికిప్పుడు డిమాండ్‌కు తగ్గట్టుగా మందులను సరఫరా చేసే స్థాయిలో అక్కడి కంపెనీల సామర్థ్యం లేదు. ఇదంతా ఒక ఎత్తైతే ఒకవేళ ఔషధాలపై ప్రతీకార పన్నులు విధిస్తే తమపై ప్రభావం తక్కువేనని, దిగుమతుల భారం యూఎస్పైనే ఉంటుందని భారతీయ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, బిజినెస్ బ్యూరోప్రధాన మార్కెట్‌గా యూఎస్.. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఔషధాల్లో తొలి స్థానంలో ఉన్న యూఎస్ వాటా ఏకంగా 30 శాతంపైనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి రూ.75,385 కోట్ల విలువైన ఔషధాలు యూఎస్‌కు చేరాయి. ఇక యూఎస్ నుంచి భారత్‌కు వచ్చిన మందులు కేవలం రూ.5,199 కోట్ల విలువైనవి మాత్రమే. 2023–24లో భారత్ నుంచి వివిధ దేశాలకు మొత్తం ఔషధ ఎగుమతులు రూ.2,40,887 కోట్లు. ఇందులో జనరిక్ ఫార్ములేషన్స్ (ఫినిష్డ్ డోసేజ్) రూ.1,64,635 కోట్లు. అంతర్జాతీయంగా జనరిక్స్ మార్కెట్ పరిమాణం రూ.39,85,900 కోట్లు. 2030 నాటికి ఇది రూ.68,45,350 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఆ సమయానికి భారత మార్కెట్ ఎగుమతులతో కలుపుకుని రూ.9,53,150–10,39,800 కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది రూ.4,76,575 కోట్లు. చవకగా నాణ్యమైన ఔషధాలు.. నాణ్యమైన ఔషధాలను చవకగా తయారు చేయడం భారతీయ జనరిక్ కంపెనీల ప్రత్యేకత. కోట్లాది రూపాయలు వెచ్చించి యూఎస్ఎఫ్డీఏ అప్రూవల్స్ దక్కించుకున్న కంపెనీలు.. యూఎస్‌లో ఉన్న అపార అవకాశాలను కాదనుకునేందుకు సిద్ధంగా లేరని ఓ కంపెనీ ప్రతినిధి అన్నారు. ఎఫ్‌డీఏ ఆమోదం అంటేనే ప్రతిష్టగా భావిస్తారని అన్నారు. భారతీయ మందుల కారణంగా 2013–2022 మధ్య యూఎస్ ఆరోగ్య రంగం రూ.1,12,64,500 కోట్లు ఆదా చేసిందని నివేదికలు చెబుతున్నాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజ భాను తెలిపారు. నూతన, వినూత్న ఔషధాలను యూఎస్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. సిద్ధం కావడానికి నాలుగేళ్లు.. యూఎస్ఎఫ్డీఏ ఆమోదం కలిగిన తయారీ ప్లాంట్లు భారత్‌లో 650 దాకా ఉన్నాయి. ఈ ధ్రువీకరణ రావాలంటే ప్రమాణాలకు తగ్గట్టుగా ప్లాంటును సిద్ధం చేయడం, ఏఎన్‌డీఏ ఆమోదం, అనుమతులకు నాలుగేళ్లు పడుతుంది. ఇప్పటికిప్పుడు మరో దేశం నుంచి ఔషధాలను దిగుమతి చేసుకుందామని అనుకున్నా యూఎస్‌కు సాధ్యం కాదు. కోవిడ్ మహమ్మారి సమయంలో చైనా, భారత్‌లో ఎఫ్‌డీఏ తనిఖీలు ఆలస్యం అయ్యాయి. దీంతో సరఫరా తగ్గి యూఎస్‌లో ఔషధాల కొరత వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో టారిఫ్‌లు విధించే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. యూఎస్ నుంచి వచ్చే ఔషధాలపై దిగుమతి సుంకాన్ని భారత్ ఎత్తివేసే చాన్స్ ఉంది. యూఎస్‌లో తయారీ ప్లాంట్లు పెట్టాలన్నా అంత సులువు కాదు. – రవి ఉదయ భాస్కర్, మాజీ డైరెక్టర్ జనరల్, ఫార్మెక్సిల్వినియోగదారులపైనే భారం.. భారత్ నుంచి దిగుమతయ్యే ఔషధాలపై అమెరికా ప్రస్తుతం కేవలం 0.1 శాతం సుంకాన్ని విధిస్తోంది. ఇందుకు విరుద్ధంగా భారత్ 10 శాతం వసూలు చేస్తోంది. యూఎస్ వినియోగిస్తున్న జనరిక్స్‌లో సింహ భాగం భారత్ సమకూరుస్తోంది. భారత్‌లో తయారైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్పై (ఏపీఐ) యూఎస్ ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రతిపాదిత ప్రతీకార సుంకాలు కొన్ని జనరిక్స్ లాభదాయకతను ప్రభావితం చేయవచ్చు. కానీ ఆ భారాన్ని తుది వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది. – శ్రీనివాసరెడ్డి, చైర్మన్, ఆప్టిమస్ గ్రూప్ఏపీఐ కంపెనీలకు.. సుంకాలు విధిస్తే ఔషధాలు ప్రియం అవుతాయి. ఇదే జరిగితే యూఎస్ ప్రజలపైనే భారం పడుతుంది. అయితే దీని ప్రభావం ఫినిష్డ్ డోసేజ్ కంపెనీలపైనే ఉంటుంది. ఇక ఏపీఐ త యారీ సంస్థలకు మంచి రోజులు రానున్నాయి. భారత కంపెనీల నుంచే వీటి దిగుమతికి యూఎస్ ఆసక్తిగా ఉండడమే ఇందుకు కారణం. ప్రధానంగా ఆంకాలజీ విభాగంలో అవకాశాలు ఎక్కువ. యూఎస్ఎఫ్డీఏ ఆమోదం ఉన్న కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది. – ఆళ్ల వెంకటరెడ్డి, ఎండీ, లీ ఫార్మా -
త్వరలో కొత్త టోల్ పాసులు.. హైవేలపై నో టెన్షన్!
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. టోల్ గేట్ల అపరిమిత వినియోగం కోసం ఏడాది, జీవిత కాలపు టోల్ పాస్‌లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఏడాది టోల్ పాల్ కోసం రూ. 3 వేలు, జీవిత కాలపు టోల్ పాస్ కోసం రూ.30,000 నిర్ణయించినట్లు తెలుస్తోంది.అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం జీవిత కాలం 15 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ కాలానికే జీవిత కాలపు పాస్ వర్తిస్తుంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఇదే కాకుండా వాహనదారులకు మరింత ఊరట కలిగించేందుకు బేస్ టోల్ రేటును కూడా తగ్గించే యోచనలో రోడ్డు రవాణా శాఖ ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.ఇప్పటి వరకు ఒకే టోల్ ప్లాజా పరిధిలో తరచుగా ప్రయాణించే వారి కోసం నెలవారీ పాస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందాలంటే వినియోగదారులు వారి అడ్రెస్ ప్రూఫ్ సహా మరిన్ని వివరాలను అందింస్తూ.. నెలకు రూ.340 చెల్లంచాల్సి ఉంది. అలాగే ఈ పాస్‌ను ఏడాది పాటు వాడుకుంటూ పోతే మొత్తంగా రూ.4,080 చెల్లించాల్సి వస్తుంది.కానీ ఇప్పుడు తీసుకురానున్న కొత్త ఏడాది పాస్ ధర కేవలం రూ. 3 వేలు మాత్రమే. అది కూడా దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఏ టోల్ గేట్నైనా ఈ పాస్‌తో దాటొచ్చు. దీంతో వాహనదారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కానుంది. కాగా ఈ ప్రతిపాదన గురించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే సంకేతాలిచ్చారు. కార్ల యజమానులకు పాస్‌లు అందించే ప్రణాళికపై పని చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు. -
ఖండాంతరాలు దాటుతున్న మేడ్ ఇన్ ఇండియా కారు: ఇదే..
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'నిస్సాన్' (Nissan) బ్రాండ్ కారు 'మాగ్నైట్' (Magnite) సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో అక్టోబర్ 2024లో లాంచ్ అయింది. ఈ మోడల్ ఇప్పుడు ఖండాంతరాలు దాటడానికి సిద్ధమైంది. ఇండియాలో తయారైన అప్డేటెడ్ నిస్సాన్ మాగ్నైట్ త్వరలో లాటిన్ అమెరికా దేశాల్లో అమ్ముడవుతాయి.నిస్సాన్ ఇండియా జనవరి చివరిలో చెన్నై నుంచి దాదాపు 2,900 యూనిట్ల ఎల్‌హెచ్‌డి (లెఫ్ట్ హ్యండ్ డ్రైవ్) వేరియంట్ల మొదటి షిప్‌మెంట్‌ను ప్రారంభించింది. మరో 7,100 కార్లు త్వరలోనే ఎగుమతి అవుతాయని సమాచారం. మొత్తం మీద కంపెనీ భారత్ నుంచి 10,000 మాగ్నైట్ కార్లను ఎగుమతి చేయనుంది. ఈ కార్లు అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, సెంట్రల్ అమెరికా, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలకు వెళతాయి.ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో భారత్ కూడా దూసుకెళుతోంది. కాబట్టి చాలా దేశాల్లో మేడ్ ఇన్ ఇండియా కార్లను కోరుకుంటున్నారు. ఈ కారణంగా భారత్ ఎగుమతులకు కూడా కేంద్రం అయింది. ఇప్పటికే పలు కంపెనీలు దేశంలో తయారైన కార్లను విదేశాలకు తరలిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియన్ బ్రాండ్ కార్లను వినియోగించనున్నాయి.నిస్సాన్ కంపెనీ ఎగుమతి చేయడానికి సిద్ధం చేసిన మాగ్నైట్ కార్లు 'లైఫ్ హ్యాండ్ డ్రైవ్' ఆప్షన్ కలిగి ఉంటాయి. ఎందుకంటే.. ప్రపంచంలోని చాలా దేశాలలో ఉపయోగిస్తున్న కార్లు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆప్షన్ పొందాయి. కాబట్టి మన దేశంలో ఎగుమతికి సిద్ధం చేసిన కార్లను కూడా ప్రత్యేకంగా రూపొందించారు.నిస్సాన్ మాగ్నైట్ఇండియన్ మార్కెట్లో అక్టోబర్ 2024లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ కారు ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 11.50 లక్షల మధ్య ఉన్నాయి. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బూమరాంగ్ ఆకారపు డీఆర్ఎల్ వంటి వాటితో పాటు అప్డేటెడ్ గ్రిల్ కూడా ఈ కారులో చూడవచ్చు. ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందాయి.ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్ 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4 కలర్ యాంబియంట్ లైటింగ్, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.ఇదీ చదవండి: తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్!మాగ్నైట్‌లో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (72 పీఎస్ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్) లేదా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (100 పీఎస్ పవర్, 160 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజన్స్ ఉన్నాయి. ఇవి రెండూ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.ఫేస్‌లిఫ్టెడ్ నిస్సాన్ మాగ్నైట్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటో డిమ్మింగ్ IRVM, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
యూజ్డ్ కార్లు @ కోటి.. పాత కారు టాప్ గేరు!
న్యూఢిల్లీ: పాత కార్ల అమ్మకాలు 2023లో దేశవ్యాప్తంగా 46 లక్షల యూనిట్లు దాటాయి. 2030 నాటికి ఈ సంఖ్య ఏటా 1 కోటి యూనిట్లను దాటుతుందని కార్స్24 తాజా నివేదిక వెల్లడించింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం.. 2030 నాటికి యూజ్డ్ కార్ల విభాగం సగటు వార్షిక వృద్ధి ఏటా 13% నమోదు కానుంది. ఈ లెక్కన వార్షిక అమ్మకాలు ఆ సమయానికి 1.08 కోట్ల యూని ట్లకు చేరుకుంటాయి. పాత కార్లకు డి మాండ్ నగరాలు, పట్టణాల్లో దూసుకెళ్లనుంది. మహా రా ష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ జోరును నడిపిస్తున్నా యి. మరింత చవక, ఆధారపడదగిన ఎంపికల కోసం వినియోగదార్ల ప్రాధాన్యతలు మారుతు న్నందున కొత్త కార్ల మార్కెట్‌తో పోలిస్తే యూజ్డ్ కార్ల మార్కెట్ పురోగమిస్తోంది. పాత కార్ల విపణిలో 2024లో 16.7 శాతం వాటాతో ఎస్‌యూవీలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఎస్‌యూవీల డిజైన్, సామర్థ్యం, ప్రీమియం ఆకర్షణలు పట్టణ, గ్రామీణ కస్టమర్లకు ఇష్టమైనవిగా మారాయి. వ్యక్తిగత వాహనాలకు.. కోవిడ్ అనంతర కాలంలో వినియోగదారుల ప్రాధాన్యతలలో గణనీయ మార్పు కనిపించింది. షేర్డ్ మొబిలిటీ కంటే సౌలభ్యం, భద్రత కోసం 12 శాతం మంది కార్ల కొనుగోలుదారులు వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మెట్రో, నాన్–మెట్రో నగరాల్లో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా మారుతీ సుజుకీ స్విఫ్ట్ అవతరించింది. అలాగే హ్యుండై శాంట్రో, టాటా టియాగో ఎన్ఆర్జి, మారుతీ సుజుకీ వ్యాగన్–ఆర్ వంటి మోడళ్లు అసాధారణ రీసేల్ విలువను స్థిరంగా అందించాయి. బడ్జెట్ స్పృహ, విలువను చూసే కొనుగోలుదారులలో ఈ మోడళ్లకు ప్రజాదరణ పటిష్టంగా ఉంది. కొత్త కార్ల ఫైనాన్సింగ్ గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఫైనాన్సింగ్ వాటా 2010లో 60 శాతం నుండి 2024లో 84 శాతానికి చేరింది అని నివేదిక వివరించింది. నూతన వాహనాల కోసం రుణాలపై వినియోగదారులు ఆధారపడుతున్నారని చెప్పేందుకు ఈ గణాంకాలు నిదర్శనమని కార్స్24 కో–ఫౌండర్ గజేంద్ర జంగిద్ తెలిపారు.→ 2023లో అమ్ముడైన పాత కార్లు 46 లక్షల యూనిట్లు → 2030 నాటికి ఏటా ఒక కోటి యూనిట్లకు విక్రయాలు → యూజ్డ్ కార్ల విపణి సగటు వార్షిక వృద్ధి ఏటా 13% → ఎస్‌యూవీలదే హవా. వీటి వాటా 2024లో 16.7 శాతం → కొత్త కార్ల ఫైనాన్సింగ్ వాటా 2010లో 60 శాతం. 2024లో 84 శాతానికి చేరిక. → వ్యక్తిగత వాహనాలకే 12 % మంది మొగ్గు → అత్యంత డిమాండ్ ఉన్న మోడల్ మారుతీ సుజుకీ స్విఫ్ట్ -
కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపు
వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే.. కాలుష్య కారకాలను తగ్గించాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ కీలక ప్రకటన చేసింది. పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే ట్యాక్స్‌లో గరిష్టంగా 50 శాతం తగ్గింపు లభించనున్నట్లు వెల్లడించింది.ప్రస్తుతం పాత వాహనాలను రద్దు (స్క్రాపేజ్) చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే.. వాహన పన్నులో 25 శాతం తగ్గింపు, వాణిజ్య వాహనాల విషయంలో 15 శాతం తగ్గింపు ఉంది. కానీ దీనిని 50 శాతానికి పెంచుతూ.. జనవరి 24న విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్లో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.బిఎస్ 4 వాహనాల విక్రయాలు ఎప్పుడో ఆగిపోయాయి. ప్రస్తుతం బిఎస్ 6 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే 2000లో వాహనాలకు బిఎస్ 1 ఉద్గార ప్రమాణాలు తప్పనిసరి. ఆ తరువాత బిఎస్ 2 ప్రమాణాలు 2002లో అమలులోకి వచ్చాయి.దేశంలో పాత వాహనాల సంఖ్య ఎక్కువ కావడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా మంత్రిత్వ శాఖ వాలంటరీ వెహికల్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించింది. అంతే కాకుండా వెహికల్స్ స్క్రాపేజ్ కోసం వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలను, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లకు అనుమతిచ్చింది.ఇదీ చదవండి: అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి!ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో స్కాపేజ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీ వాహనాన్ని స్కాపేజ్ చేసి, సర్టిఫికెట్ తీసుకుంటే.. కొత్త కారు కొనుగోలుపై పలు రాయితీలను పొందవచ్చు. ఇది కొత్త కారు కొనుగోలు చేయడానికి కొంత ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది. -
దిగ్గజ కంపెనీలన్నీ ఒకేచోట: అబ్బురపరుస్తున్న కొత్త వెహికల్స్ (ఫోటోలు)
-
‘భారత్ మొబిలిటీ ఎక్స్పో’ ప్రారంభం.. కొత్త కార్లు, బైక్‌లతో సందడే సందడి (ఫొటోలు)
-
డాకర్ ర్యాలీ 2025 - ఎడారిలో దూసుకెళ్లిన కార్లు (ఫోటోలు)
-
అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది
బెంజ్, ఆడి, పోర్స్చే, లంబోర్ఘిని కార్లు అందుబాటులోకి వచ్చిన తరువాత వింటేజ్ కార్లు కనుమరుగైపోయాయి. దీనికి కారణం.. ఆ కార్లను కంపెనీలు తయారు చేయడం ఆపేయడం, కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రావడం. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ వింటేజ్ కార్లు (Vintage Cars) లేదా పాతకాలం కార్లను కొనుగోలు చేయడానికి.. ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు అలాంటి కార్లను కొనుగోలు చేయడం ఓ కలగా పెట్టుకుంటారు. ఇటీవల బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళ ఓ పాతకాలం కారును కొనుగోలు చేసి.. కల నెరవేరిందని సంబరపడిపోయింది.బెంగళూరుకు చెందిన 'రచన మహదిమనే' అనే మహిళ.. 'ప్రీమియర్ పద్మిని' (Premier Padmini) కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. చిన్నప్పటి నుంచి ఈ కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మహిళ.. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా ఈ అరుదైన కారును కొనుగోలు చేసింది.బెంగళూరు మహిళ కొనుగోలు చేసిన ప్రీమియం పద్మిని కారు చూడటానికి కొత్త కారు మాదిరిగానే ఉంది. దీని కోసం ఈమె ప్రత్యేకంగా కారుకు మరమ్మతులు చేయించింది. ఈ కారణంగానే ఆ కారు కొత్తదాని మాదిరిగా కనిపిస్తోంది. నా పుట్టినరోజు సందర్భంగా.. నేను కారు కొన్నాను. ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుంచి ఈ కారు గురించి కలలు కన్నాను అని ఆమె వీడియోలో వెల్లడించారు.గతంలో మన చుట్టూ ఉన్న ప్రీమియర్ పద్మిని కార్లు చాలా ఉండేవి. అయితే ఇప్పుడు నేను దీనిని డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని మహదిమనే పేర్కొంది. పాతకాలపు కార్లను ఉపయోగించాలని అందరికీ ఉంటుంది. కానీ బహుశా అది అందరికీ సాధ్యం కాదు. అయితే పాతకాలపు కారును ఎంతో ఇష్టంగా మళ్ళీ పునరుద్ధరించి, డ్రైవ్ చేయడాన్ని చూసి పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలువురు వినియోగదారులు ఈ ఐకానిక్ వాహనం గురించి తమ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఫ్యాన్సీ లగ్జరీ కార్ ఛేజింగ్ ప్రపంచంలో ప్రీమియర్ పద్మిని చెప్పుకోదగ్గ మోడల్ అని ఒకరు పేర్కొన్నారు. మా తాత అంబాసిడర్లో పని చేసేవారు. అంతే కాకుండా పద్మిని పేరు పెట్టడానికి ఆయన కూడా బాద్యుడు. నేను పద్మినిలో డ్రైవింగ్ నేర్చుకున్నాను అని మరొకరు వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane)ప్రీమియర్ పద్మినిప్రీమియర్ పద్మిని కార్లను.. ఇటాలియన్ కంపెనీ 'ఫియట్' లైసెన్స్‌తో ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ (PAL) తయారు చేసింది. ఇది ఫియట్ 1100 సిరీస్ ఆధారంగా తయారైంది. 1964లో మొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారుని మొదట ఫియట్ 1100 డిలైట్ అని పిలిచేవారు. ఆ తరువాత దీనిని 1970లలో 'ప్రీమియర్ పద్మిని' పేరుతో పిలిచారు.ప్రీమియర్ పద్మిని కారు.. గుండ్రని అంచులు, క్రోమ్ గ్రిల్ వంటి వాటితో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో పెద్ద స్టీరింగ్ వీల్, బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఐదుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్‌తో కూడిన ఇంటీరియర్లు అన్నీ ఉన్నాయి. రోజువారీ వినియోగానికి ఈ కారును ఒకప్పుడు విరివిగా ఉపయోగించారు.ఇదీ చదవండి: 'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్‌తో..1970, 1980లలో సినిమాల్లో ఈ కార్లను విరివిగా ఉపయోగించారు. ఆ తరువాత కాలంలో మారుతి 800 భారతదేశంలో అడుగుపెట్టాక.. ప్రీమియర్ పద్మిని కార్లకు ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. దీంతో కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని 2000వ సంవత్సరంలో నిలిపివేసింది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది సినీతారలు తమ గ్యారేజిలలో ఈ కార్లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో రజనీ కాంత్, మమ్ముట్టి వంటివారు ఉన్నారు. -
గంటకు 360 కి.మీ వేగంతో దూసుకెళ్లే కారు (ఫోటోలు)
-
ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా?
కొన్ని కంపెనీలు దసరాకు బోనస్‌లు ఇవ్వడం, దీపావళికి గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు బోనస్‌లు, బహుమతుల ఊసేలేకుండా మిన్నకుండిపోతాయి. అయితే ఇటీవల చెన్నైకి చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ఉద్యోగులకు బైకులు, కార్లను గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది.సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా 20 మందికి టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అందించింది.చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాజిస్టిక్స్ రంగంలో సరుకుల రవాణా, పారదర్శకత, సరఫరాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్స్‌ను మరింత సరళీకృతం చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దాని వ్యవస్థాపకుడు, ఎండీ డెంజిల్ రాయన్ పేర్కొన్నారు. -
తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లు
ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సీఎన్జీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థలు, తమ కార్లను సీఎన్జీ విభాగంలో లాంచ్ చేశాయి. ఈ కథనంలో రూ.8 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న టాప్ 5 కార్ల గురించి తెలుసుకుందాం.టాటా పంచ్అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచిన టాటా పంచ్ ప్రస్తుతం మార్కెట్లో సీఎన్జీ విభాగంలో.. ఓ సరసమైన కారుగా లభిస్తోంది. ఇది ప్యూర్, అడ్వెంచర్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 7.22 లక్షలు, రూ. 7.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ఫ్యూయెల్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులో సీఎన్జీ బ్యాడ్జెస్ చూడవచ్చు.టాటా పంచ్ సీఎన్జీ కారులో 3.5 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫోర్ స్పీకర్ ఆడియో సెటప్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం వంటి ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ సీఎన్జీ కారు 6000 rpm వద్ద 72.4 Bhp పవర్, 3250 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఇది పెట్రోల్ కారు కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ కారు ప్రారంభ ధర రూ. 7.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది పెట్రోల్ (రూ. 5.92) వేరియంట్ ప్రారంభ ధర కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఇది 68 బీహెచ్పీ పవర్, 95.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో 3.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి ఉన్నాయి.టాటా ఆల్ట్రోజ్టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.2 లీటర్ ఇంజిన్ 6000 rpm వద్ద 72.4 Bhp, 3500 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారులో 4 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ పార్కింగ్ సెన్సార్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్ ఉన్నాయి.హ్యుందాయ్ ఆరాహ్యుందాయ్ ఆరా సీఎన్జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.7.48 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ రెండు కలర్ ఆప్షన్స్ పొందుతాయి. ఇందులోని ఇంజిన్ 68 Bhp, 95.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో 3.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టిల్ట్ స్టీరింగ్ వీల్, ముందు భాగంలో పవర్ విండోస్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, అడ్జస్టబుల్ రియర్ సీటు హెడ్రెస్ట్ వంటివి ఉన్నాయి.మారుతి సుజుకి సెలెరియోమారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.6.73 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 5300 rpm వద్ద 55.9 Bhp పవర్.. 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. -
భారత్‌లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలు
ఒకప్పటి నుంచి భారతదేశంలో డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే వాయు కాలుష్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఉద్గార ప్రమాణాలు కఠినంగా మారాయి. దీంతో కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని చాలా వరకు తగ్గించేసాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని డీజిల్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.10 లక్షల లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న టాప్ 5 కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన డీజిల్ కారు. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 Bhp పవర్, 200 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.మహీంద్రా బొలెరోరూ. 9.79 లక్షల ధర మధ్య లభించే మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' (బిఎస్4 మోడల్) మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ కారు. దీనిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 76 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.కియా సోనెట్కియా సోనెట్ అనేది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 Bhp పవర్, 253 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).మహీంద్రా బొలెరో నియోమహీంద్రా బొలెరో నియో.. చూడటానికి కొంత బొలెరో మాదిరిగానే అనిపిస్తుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే కొన్ని తేడాలను గమనించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 100 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇదీ చదవండి: టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలుమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ కూడా మన జాబితాలో ఒకటి. రూ. 9.98 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 115 Bhp పవర్, 300 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. -
జొమాటో సీఈఓ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా (ఫోటోలు)
-
ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన టాప్ 10 పాపులర్ కార్లు (ఫోటోలు)
-
ఉదయపూర్ యువరాజు వాహన ప్రపంచం - తప్పకుండా చూడాల్సిందే (ఫోటోలు)
-
పొల్యూషన్ ఎఫెక్ట్: రోడ్డుపై ఆ కార్లు తిరిగితే భారీ ఫైన్..
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న తరుణంలో సుప్రీంకోర్టు బీఎస్3 పెట్రోల్ కార్లను, బీఎస్4 డీజిల్ కార్లను నడపడం నిషేదించింది. ఈ నిషేధం గురువారం (డిసెంబర్ 5) వరకు కొనసాగుతుంది. రెండు రోజులుగా సాధారణ స్థాయికంటే.. ఎక్కువ కాలుష్యం ఏర్పడింది. కాబట్టి పొల్యూషన్ అదుపులోకి వచ్చే వరకు నిర్దేశించిన కార్లను ఉపయోగించకూడదది సుప్రీంకోర్టు ఆదేశించింది.ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) నవంబర్ 8 నుంచి పరిమితులను అమలు చేసింది. కాలుష్యాన్ని తగ్గించడానికి కొన్ని వాహనాలను నియంత్రించింది. ఈ చర్యలు తీసుకోకపోతే.. కాలుష్యం మరింత తీవ్రతరం అవుతుంది. నిషేధిత వాహనాల జాబితాలో కార్లు మాత్రమే కాకుండా కమర్షియల్ ట్రక్కులు, డీజిల్‌తో నడిచే పబ్లిక్ బస్సులు.. కాలం చెల్లిన ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి.డిసెంబర్ 5 తరువాత బీఎస్3 పెట్రోల్ కార్లను, బీఎస్4 డీజిల్ కార్లను అనుమతించే ముందు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు చెందిన అధికారులను సుప్రీంకోర్టులో హాజరు కావాలని ధర్మాసనం కోరింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమర్థవంతంగా పనిచేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.గత వారం.. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ వాహనాలపై నిషేధాన్ని పాక్షికంగా సడలించింది. అయితే ప్రస్తుతం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ.. మళ్ళీ కఠినమైన ఆంక్షలు విధించింది. కాబట్టి నియమాలను ఉల్లంఘిస్తే.. రూ. 20,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పీయూసీ సర్టిఫికేట్ లేకుండా తిరిగే వాహనాలకు రూ. 10,000 జరిమానా విధించారు. ఇవి కాకుండా 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ కార్లు లేదా 10 ఏళ్లు పైబడిన డీజిల్ కార్లు రోడ్డుపై తిరిగితే.. వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి వీటిని గుర్తుంచుకుని వ్యవహరించాలి. లేకుంటే భారీ జరిమానాలు చెల్లించక తప్పదు. -
కింగ్ నాగార్జున గ్యారేజిలోని కార్లు ఇవే (ఫోటోలు)
-
భారత్‌లోని అత్యుత్తమ 7 సీటర్ కార్లు (ఫోటోలు)
-
ప్రపంచ కుబేరుడు 'మస్క్' కార్ల ప్రపంచం (ఫోటోలు)
-
సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..
అతి తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలు పొందిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన 'సీ3 ఎయిర్‌క్రాస్' (C3 Aircross) ఇటీవల క్రాష్ టెస్టులో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ వార్త ఒక్కసారిగా సిట్రోయెన్ కారు కొనుగోలు చేసిన వారికి భయాన్ని కలిగించింది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ 'లాటిన్ ఎన్సీఏపీ' క్రాష్ టెస్టులో జీరో రేటింగ్ సాధించింది. అయితే ఇక్కడ టెస్ట్ చేయడానికి ఉపయోగించిన మోడల్ 'బ్రెజిల్ స్పెక్' కావడం గమనార్హం. ఇది గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెల్తూనే ఉంది. అయితే సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ అని తెలియడంతో.. రాబోయే అమ్మకాలు బహుశా తగ్గే అవకాశం ఉంది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ సొంతం చేసుకుందన్న విషయాన్ని లాటిన్ ఎన్సీఏపీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. క్రాష్ టెస్ట్ కోసం ఎంచుకున్న మోడల్ రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందింది.అడల్ట్ సేఫ్టీలో 33.01 శాతం, చైల్డ్ సేఫ్టీలో 11.37 శాతం స్కోర్ సాధించిన సీ3 ఎయిర్‌క్రాస్.. ముందున్న ప్రయాణికులకు పటిష్టమైన భద్రత అందించడంలో విఫలమైంది. సైడ్ ఇంపాక్ట్ కూడా ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. తలకు కూడా మంచి రక్షణ అందించడంలో కంపెనీ సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఇది ప్రయాణికులకు భద్రత అందించడంలో విఫలమైందని లాటిన్ ఎన్సీఏపీ ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉన్న సీ3 ఎయిర్‌క్రాస్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధరలు రూ. 6.16 లక్షల నుంచి రూ. 10.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
మూడు కార్లకు 5 స్టార్ రేటింగ్: సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కార్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మహీంద్రా కంపెనీకి చెందిన మూడు కార్లు చేరాయి. అవి మహీంద్రా థార్ రోక్స్, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ. ఇవన్నీ 'భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (B-NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నాయి.మహీంద్రా థార్ రోక్స్భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో మహీంద్రా థార్ రోక్స్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 45 పాయింట్ల స్కోర్ సాధించింది.మహీంద్రా థార్ రోక్స్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఈ కారు ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిన మరో మహీంద్రా కారు ఎక్స్‌యూవీ400. ఈ ఎలక్ట్రిక్ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 30.37 పాయింట్లు.. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 43 పాయింట్ల స్కోర్ సాధించింది.రూ. 16.74 లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ400 మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, ఆల్ డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి ఉన్నాయి.మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు కూడా భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి, అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 32 పాయింట్లకు 29.36 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 49 పాయింట్లకు 43 పాయింట్లు సాధించింది.మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు వంటి వాటితో పాటు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
సన్‌రూఫ్.. సూపర్ క్రేజ్!
బీచ్ రోడ్డులోనో... ఫారెస్ట్ దారిలోనో కారులో అలా ఓ లాంగ్ డ్రైవ్కెళ్లాలని ఎవరికుండదు చెప్పండి? దీంతో పాటు కారులో సన్‌రూఫ్ కూడా ఉంటే... మజామజాగా ఉంటుంది కదూ! దేశంలో కారు ప్రియుల మది దోచేస్తున్న క్రేజీ ఫీచర్ ఇది. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ అదిరిపోయే ఫీచర్ ఇప్పుడు చిన్న కార్లలోనూ వచ్చి చేరుతుండటం దానికున్న క్రేజ్‌కు నిదర్శనం!దేశీ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు సన్/మూన్ రూఫ్ మాంచి ట్రెండింగ్‌లో ఉంది. యువ కస్టమర్ల జోరుతో ఈ ఫీచర్ ‘టాప్’లేపుతోంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఎస్‌యూవీలు, సెడాన్లతో పాటు హ్యాచ్బ్యాక్స్లోనూ దీన్ని చేర్చేందుకు సై అంటున్నాయి. డిమాండ్ ‘రూఫ్’ను తాకుతుండటంతో ప్రపంచస్థాయి తయారీ సంస్థలు దీన్ని సొమ్ము చేసుకోవడానికి తహతహలాడుతున్నాయి. మార్కెట్లో అధిక వాటా కోసం భారీ పెట్టుబడులతో ఉత్పత్తి పెంచే పనిలో ఉన్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన ఇనాల్ఫా రూఫ్ సిస్టమ్స్ దాని భాగస్వామ్య సంస్థ గాబ్రియెల్ ఇండియాతో కలిసి తయారీని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో సన్‌రూఫ్‌ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది ఈ జాయింట్ వెంచర్ (ఐజీఎస్ఎస్) లక్ష్యం. ఈ ఏడాది ఆరంభంలో చెన్నైలో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఐజీఎస్ఎస్కు ఏటా 2 లక్షల సన్‌రూఫ్‌ల తయారీ సామర్థ్యం ఉంది. హ్యుందాయ్, కియా కంపెనీలకు ఇది సన్‌రూఫ్‌లను సరఫరా చేస్తోంది. ఇక జర్మనీకి చెందిన గ్లోబల్ సన్‌రూఫ్ తయారీ దిగ్గజం వెబాస్టో కూడా తయారీ గేరు మార్చింది. ప్రస్తుతం ఏటా 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుండగా... 2027 నాటికి రెట్టింపు స్థాయిలో 9.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తోంది. ట్రెండ్ రయ్ రయ్... దేశీ వాహన రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా కొంగొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యధికంగా కారు ప్రియులు కోరుకుంటున్న ఫీచర్లలో సన్‌రూఫ్ శరవేగంగా దూసుకుపోతోందని యూనో మిండా చైర్మన్, ఎండీ ఎన్కే మిండా చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ వాహన విడిభాగాల సంస్థల్లో ఇది ఒకటి. సన్‌రూఫ్‌ల తయారీ కోసం తాజాగా జపాన్‌కు చెందిన ఐసిన్ కార్ప్‌తో సాంకేతిక లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోని టాప్–10 వాహన విడిభాగాల ఉత్పత్తి కంపెనీల్లో ఐసిన్ కార్ప్ కూడా ఒకటి. కాగా, యూనో మిండా 80,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో హరియాణాలో కొత్త ప్లాంట్ నెలకొల్పుతోంది. ‘ఈ మధ్య కాలంలో సన్‌రూఫ్‌ల వాడకం ఓ రేంజ్లో పెరుగుతోంది. గతంలో బడా ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ట్రెండ్ మరింత జోరందుకోనుంది. ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ (చిన్న కార్లు) కస్టమర్లు సైతం ఈ ఫీచర్ కోసం ఎగబడుతుండటమే దీనికి కారణం’ అని మిండా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరే ఇక్కడా వినూత్న ఫీచర్లు, కస్టమైజేషన్లకు ప్రాధాన్యమిచ్చే ట్రెండ్ కనిపిస్తోందన్నారు.స్టేటస్ సింబల్... ఇప్పుడు కారే కాదు అందులోని ప్రీమియం ఫీచర్లు కూడా స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. ఇందులో సన్‌రూఫ్ కూడా ఒకటి. క్రూయిజ్ కంట్రోల్, కళ్లు చెదిరే డిస్ప్లేలు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లాంటి ఫీచర్లకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. వీటి వాడకం అరుదుగానే ఉన్నప్పటికీ, భారతీయ రోడ్డు పరిస్థితులకు పెద్దగా ఉపయోగకరం కానప్పటికీ.. కస్టమర్లు మరిన్ని ప్రీమియం ఫీచర్లు కోరుకుంటుండటంతో కార్ల కంపెనీలు వాటిని తప్పనిసరిగా అందించాల్సిన పరిస్థితి నెలకొందని జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా పేర్కొన్నారు.ప్రతి నాలుగు కార్లలో ఒకటి... జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు కార్లలో ఒక కారుకు (27.5%) ఈ లగ్జరీ ఫీచర్ ఉంది. ఐదేళ్ల క్రితం 12.7%తో పోలిస్తే కస్టమర్లు దీనికి ఎలా ఫిదా అవుతున్నారనేది ఈ జోరు చాటిచెబుతోంది. కాగా వచ్చే ఐదేళ్లలో (2029 నాటికి) ఈ విభాగంలో 17.6 శాతం వార్షిక వృద్ధి (సీఏజీఆర్) నమోదవుతుందనేది వాహన పరిశ్రమ అంచనా. ముఖ్యంగా ఎస్‌యూవీల్లో సన్‌రూఫ్ ఫీచర్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ ఏడాది జనవరి–ఆగస్ట్ మధ్య ఏకంగా 44.7% వృద్ధి ఈ విభాగంలో నమోదైంది. మరోపక్క, భారతీయ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తయారీ సంస్థలు అధునాతన గ్లాస్ టెక్నాలజీతో సన్‌రూఫ్‌లను ప్రవేశపెడుతున్నాయి. వేడిని బాగా తట్టుకోవడం, యూవీ కిరణాల నుంచి రక్షణతో పాటు సన్‌రూఫ్‌లను ‘స్మార్ట్రూఫ్’లుగా మార్చేస్తున్నాయి. పానోరమిక్ సన్‌రూఫ్‌లు కారు లోపల మరింత విశాలమైన స్పేస్ ఫీలింగ్‌ను కూడా అందిస్తాయని భాటియా చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‌లో అత్యుత్తమ కార్లు ఇవే..
వెహికల్ అంటే.. ఒక్క మైలేజ్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా అని వాహన ప్రియులు తెలుసుకున్నారు. కాబట్టి చాలామంది కార్ల కొనుగోలుదారులు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అధిక సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఈ కథనంలో సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.హ్యుందాయ్ వెర్నాగత ఏడాది దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ వెర్నా.. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. వెర్నా అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకు 28.18 పాయింట్లు, కిడ్స్ సేఫ్టీలో 49 పాయింట్లకు 42 పాయింట్ల స్కోర్ సాధించి.. మొత్తం మీద 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది.రెండు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన హ్యుందాయ్ వెర్నా.. మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏడీఏఎస్ ఫీచర్స్ పొందుతుంది. ఈ సెడాన్ ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 17.42 లక్షల వరకు ఉంది.ఫోక్స్‌వ్యాగన్ వర్టస్గ్లోబల్ ఎన్సీఏపీ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న మరో కారు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్. ఇది పిల్లల సేఫ్టీలో 49కి గానూ 42 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 34కి గానూ 29.71 పాయింట్లు స్కోర్ సాధించింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హై-స్పీడ్ వార్ణింగ్, సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన ఈ కారు ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 19.41 లక్షల మధ్య ఉన్నాయి.టాటా నెక్సాన్సేఫ్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కార్లు. కంపెనీ కారైన నెక్సాన్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన కార్ల జాబితాలో ఒకటి. ఇది కిడ్స్ సేఫ్టీలో 44.52 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 32.22 పాయింట్లు సాధించి.. అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కారుగా నిలిచింది.ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లను కలిగి ఉన్న ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లను టాటా నెక్సాన్ కారులో చూడవచ్చు. నెక్సాన్ ధరలు రూ. 8 లక్షల నుంచి రూ. 15.50 లక్షల మధ్య ఉన్నాయి.టాటా హారియర్టాటా కంపెనీకి చెందిన సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది మరో కారు హారియర్. ఇది పిల్లల భద్రతలో 49కి 45 పాయింట్లు, పెద్దల రక్షణలో 34కు 33.05 పాయింట్ల స్కోర్ సాధించింది. రూ. 14.99 లక్షల నుంచి రూ. 25.89 లక్షల మధ్య ధరతో అందుబాటులో ఉన్న హారియర్.. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.మహీంద్రా స్కార్పియో ఎన్రూ. 13.85 లక్షల నుంచి రూ. 24.54 లక్షల మధ్య ధరతో లభించే మహీంద్రా స్కార్పియో గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ సాధించిన అత్యుత్తమ కార్లలో ఒకటి. ఇది అడల్ట్ సేఫ్టీలో 34కు 29.25 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 49కు 28.93 పాయింట్లు సాధించి సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.మహీంద్రా స్కార్పియో ఎన్.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. 6 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభించే ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: మార్కెట్లో మరో పవర్ఫుల్ బైక్ లాంచ్: ధర ఎంతో తెలుసా?సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఇతర కార్లు➤స్కోడా స్లావియా➤టాటా సఫారి➤స్కోడా కుషాక్➤ఫోక్స్‌వ్యాగన్ టైగన్➤టాటా పంచ్➤మహీంద్రా ఎక్స్‌యూవీ300➤టాటా ఆల్ట్రోజ్➤టాటా నెక్సాన్➤మహీంద్రా ఎక్స్‌యూవీ700 -
కార్స్ 'ఎన్' కాఫీలో ఆకట్టుకున్న వింటేజ్ కార్లు (ఫొటోలు)
-
దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం!
అసలే పండుగ సీజన్.. కొత్త కారు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ రూ.10 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.కార్లు, వాటిపై లభించే డిస్కౌంట్స్ఆడి క్యూ3: రూ. 5 లక్షలుమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: రూ. 5 లక్షలుఆడి క్యూ5: రూ. 5.5 లక్షలుబీఎండబ్ల్యూ ఐ4: రూ. 8 లక్షలుమెర్సిడెస్ బెంజ్ సీ200: రూ. 9 లక్షలుఆడి క్యూ8 ఈ ట్రాన్: రూ. 10 లక్షలుఆడి ఏ6: రూ. 10 లక్షలుబీఎండబ్ల్యూ ఎక్స్5: రూ. 10 లక్షలుకియా ఈవీ6 ఆల్ వీల్ డ్రైవ్: రూ. 12 లక్షలుకార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు
దసరా, దీపావళి వస్తున్నాయంటే.. ఉద్యోగులకు సంబరపడిపోతుంటారు. ఎందుకంటే తాము పనిచేస్తున్న కంపెనీలు బోనస్‌లు లేదా గిఫ్ట్స్ వంటివి ఇస్తాయని. కొన్ని కంపెనీలు బోనస్ ఇచ్చి సరిపెట్టుకుంటే.. మరికొన్ని కంపెనీలు ఏకంగా ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.ఇటీవల హర్యానాలోని పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ 15 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పంచకుల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి 13 టాటా పంచ్ వాహనాలు, రెండు మారుతి గ్రాండ్ విటారా కార్లను గిఫ్ట్ ఇచ్చింది.కంపెనీ యజమాని ఎంకే భాటియా స్వయంగా కార్ల తాళాలు ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉత్తమ పనితీరు కనపరిచిన అందరూ నాకు సెలబ్రిటీల వంటివారని, కంపెనీ విజయానికి వారి సహకారం చాలా ప్రశంసనీయమని భాటియా అన్నారు.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటాఎంకే భాటియా తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా 12 మంది ఉద్యోగులకు కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఏటా 15 మందికి కార్లను బహూకరించారు. ఇప్పటికి కంపెనీ మొత్తం 27 కార్లను ఉద్యోగులకు అందించింది. ఈ పద్దతిని మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ భవిష్యత్తులో కొనసాగించాలని యోచిస్తోంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న బీఎండబ్ల్యూ కారు ఇదే..
బీఎండబ్ల్యూ కంపెనీ తన 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ కారును అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే దీనికి సంబంధించిన వివరాలను, ఫోటోలను విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత బిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ ఒక పెద్ద ఎయిర్ డ్యామ్ పొందుతుంది. బంపర్ విశాలంగా ఉంటుంది. పరిమాణంలో కూడా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత పెద్దదిగానే ఉంది. ఇంటీరియర్ స్పేస్ కూడా కొంత పెరిగినట్లు తెలుస్తోంది. లోపలి భాగం చాలా వరకు బ్లాక్ అవుట్ ట్రీట్మెంట్ పొందుతుంది. అంతే కాకుండా ఇక్కడ ఫిజికల్ బటన్ల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. వెనుక వైపు నెంబర్ ప్లేట్ టెయిల్ ల్యాంప్‌ల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ త్రి సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 48 వోల్ట్స్ మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద పనితీరు కూడా దాని మునుపటి మోడల్ కంటే ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. -
రోజుకు 12వేల కొత్త కార్లు
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో భారత్‌లో విద్యుత్, ఇంధనాల వినియోగానికి, కార్లకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. రోజుకు కొత్తగా 12,000 కార్లు రోడ్డెక్కనున్నాయి. 2035 నాటికి ఎయిర్ కండీషనర్ల (ఏసీ) విద్యుత్ వినియోగం మొత్తం మెక్సికోలో విద్యుత్ వినియోగాన్ని మించిపోనుంది. వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2024 నివేదికలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో చమురు, గ్యాస్, బొగ్గు, విద్యు త్, పునరుత్పాదక విద్యుత్ మొదలైన అన్ని రూపాల్లోనూ శక్తికి డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం చమురు వినియోగం, దిగుమతికి సంబంధించి ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్‌లో చమురుకు డిమాండ్ రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్ల మేర పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు డిమా ండ్ పెరిగేందుకు భారత్ ప్రధాన కారణంగా ఉంటుందని తెలిపింది. 2023లో అయిదో భారీ ఎకానమీగా ఉన్న భారత్ 2028 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వివరించింది.నివేదికలో మరిన్ని వివరాలు.. → భారత్‌లో జనాభా పరిమాణం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దకాలంలో మిగతా దేశాలతో పోలిస్తే ఇంధనాలకు డిమాండ్ మరింత పెరగనుంది. → 2035 నాటికి ఐరన్, స్టీల్ ఉత్పత్తి 70 శాతం, సిమెంటు ఉత్పత్తి సుమారు 55 శాతం పెరుగుతుంది. ఎయిర్ కండీషనర్ల నిల్వలు 4.5 రెట్లు పెరుగుతాయి. దీంతో ఏసీల కోసం విద్యుత్ డిమాండ్ అనేది వార్షికంగా యావత్ మెక్సికో వినియోగించే విద్యుత్ పరిమాణాన్ని మించిపోతుంది. → ఆయిల్ డిమాండ్ రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) నుండి 7.1 మిలియన్ బీపీడీకి చేరుతుంది. రిఫైనరీల సామర్థ్యం 58 లక్షల బీపీడీ నుండి 71 లక్షల బీపీడీకి పెరుగుతుంది. సహజవాయువుకు డిమాండ్ 64 బిలియన్ ఘనపు మీటర్ల (బీసీఎం) నుంచి 2050 నాటికి 172 బీసీఎంకి చేరుతుంది. బొగ్గు ఉత్పత్తి సైతం అప్పటికి 645 మిలియన్ టన్నుల నుంచి 721 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. → భారత్‌లో మొత్తం శక్తి వినియోగం 2035 నాటికి సుమారు 35 శాతం మేర పెరగనుండగా, విద్యుదుత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగి 1,400 గిగావాట్లకు చేరనుంది. → సౌర విద్యుదుత్పత్తి పెరుగుతున్నప్పటికీ బొగ్గు నుంచి విద్యుదుత్పత్తి దానికన్నా 30 శాతం అధికంగా ఉండనుంది. సోలార్ ఇన్స్టాలేషన్ల సామర్థ్యం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమ విద్యుత్ అవసరాలను తీర్చడంలో బొగ్గు కీలకపాత్ర పోషిస్తోంది. 40 శాతం అవసరాలను తీరుస్తోంది. → రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తి, ఇంధనాలకు సంబంధించి భారత్ పలు సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. వంటకోసం పర్యావరణహితమైన ఇంధనాన్ని సమకూర్చాలి. విద్యుత్ రంగం విశ్వసనీయతను పెంచాలి. వాయు కాలుష్య స్థాయిని నియంత్రించాలి. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా వడగాలులు, వరదల్లాంటి ప్రభావాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలి. → భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2030 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుతుంది. (ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టొచ్చు). పరిశ్రమల్లో విద్యుత్, హైడ్రోజన్ వినియోగం క్రమంగా పెరగనున్న నేపథ్యంలో బొగ్గుకు కూడా డిమాండ్ 2030 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. → 2, 3 వీలర్లకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి కాగా, ప్యాసింజర్ కార్ల మార్కెట్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. → వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లో కొత్తగా 3.7 కోట్ల పైచిలుకు కార్లు, 7.5 కోట్ల పైగా 2,3 వీలర్లు రోడ్లపైకి రానున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా పెరుగుతున్నప్పటికీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలూ వృద్ధి చెందుతాయి కనుక రహదారి రవాణా విభాగం విషయంలో చమురుకు డిమాండ్ 40 శాతం పెరుగుతుంది. దేశీయంగా ప్రతి రోజూ 12,000 కార్లు రోడ్లపైకి రానుండటంతో రహదార్లపరంగా మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. వాహనాల వల్ల వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతుంది. 2035 నాటికి రోడ్ మార్గంలో ప్రయాణికుల రవాణా రద్దీ వల్ల కర్బన ఉద్గారాలు 30 శాతం పెరుగుతాయి. -
50 మందికే ఈ బీఎండబ్ల్యూ కారు
బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ ఈ సంవత్సరం ప్రారంభంలో కాంకోర్సో డి'ఎలెగాంజా విల్లా డి'ఎస్టేలో ఒక కాన్సెప్ట్‌గా మొదటిసారిగా కనిపించింది. అయితే ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది. కానీ ఇది కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితమైనట్లు సమాచారం.బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్ పొందుతుంది. ఇది 617 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ రోడ్‌స్టర్ 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.రెండు సీట్లు కలిగిన ఈ కారు షార్ప్ అండ్ యాంగ్యులర్ ఫ్రంట్ ఎండ్, ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది. ఇందులో డోర్ హ్యాండిల్స్ లేకపోవడాన్ని గమనించవచ్చు. లోపలి భాగం మొత్తం ఎరుపు-గోధుమ రంగులో ఉండటం చూడవచ్చు. గేర్ సెలెక్టర్‌కు క్రిస్టల్ లాంటి రూపాన్ని అందించారు.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ క్యాబిన్లో ప్రీమియం బోవర్స్ & విల్కిన్స్ సౌండ్ సిస్టమ్ ఉంది. మిగిలిన అన్ని ఫీచర్స్ దాదాపు 8 సిరీస్ మోడల్లో మాదిరిగానే ఉన్నట్లు సమాచారం. ఈ కారు ధర, ఇతర వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. లాంచ్ డేట్, డెలివరీ డీటైల్స్ కూడా తెలియాల్సి ఉంది. -
కార్లు, బైక్‌లు అబ్బో.. అదృష్టమంటే ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులదే!
చెన్నైకి చెందిన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ అద్భుతమైన బహుమతులతో తమ ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. 28 కార్లు, 29 బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగుల్లో మరింత ప్రేరణ కల్పించడానికి, ఉత్పాదకతను పెంచడానికి కంపెనీ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.2005లో ప్రారంభమైన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్, డిటైలింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కణ్ణన్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, అభినందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ గుర్తింపు ఉద్యోగులను తమ పాత్రల్లో రాణించేలా మరింత ప్రేరేపిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన కార్లలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీలతోపాటు మెర్సిడెస్ బెంజ్ కార్లు కూడా ఉండటం విశేషం. కార్లు, బైక్‌లతో పాటు, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తమ ఉద్యోగులకు వివాహ కానుకను కూడా అందిస్తోంది. గతంలో రూ.50,000గా ఉన్న ఈ కానుకను ఈ ఏడాది రూ.లక్షకు కంపెనీ పెంచింది. -
ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత మార్కెట్లో ఈ–మ్యాక్స్ 7 ఎలక్ట్రిక్ ఎంపీవీ ప్రవేశపెట్టింది. ధర రూ.26.9 లక్షల నుంచి ప్రారంభం. మూడు వరుసల సీటింగ్‌తో 2021లో ఎంట్రీ ఇచి్చన ఈ6కు ఆధునిక హంగులు జోడించి ఈ–మ్యాక్స్7కు రూపకల్పన చేశారు. ఒకసారి చార్జింగ్‌తో ప్రీమియం వేరియంట్ 420 కిలోమీటర్లు, సుపీరియర్ వేరియంట్ 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 12.7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 12.8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ చార్జింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి హంగులు ఉన్నాయి. -
బుల్లి ఎస్‌యూవీలు.. భలే జోరు!
దేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీల) క్రేజ్ ఓ రేంజ్లో ఉంది! ఒకపక్క, కార్ల అమ్మకాల్లో మందగమనం నెలకొన్నప్పటికీ.. మైక్రో ఎస్‌యూవీలు మాత్రం దుమ్మురేపుతున్నాయి. కస్టమర్లు చిన్న కార్లు/ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి అప్‌గ్రేడ్ అవుతుండటంలో వాటి సేల్స్ అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నాయి. మరోపక్క, చిన్న ఎస్‌యూవీల సెగ్మెంట్ తగ్గేదేలే అంటూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది! – సాక్షి, బిజినెస్ డెస్క్గత కొంతకాలంగా దేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్లో ట్రాక్‌లో వెళ్తున్నాయి. డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోతుండటంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వాటిని ఎలాగైనా వదిలించుకునేందుకు నానాతిప్పలు పడాల్సి వస్తోంది. అయితే, చిన్న ఎస్‌యూవీలు దీనికి మినహాయింపు. హాట్ కేకుల్లా సేల్ అవుతూ దేశీ మార్కెట్లో అవి భారీ వాటాను కొల్లగొడుతున్నాయి. రూ.10 లక్షల వరకు ధర ఉన్న మైక్రో ఎస్‌యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్ ఈ సెగ్మెంట్లో టాప్ లేపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (2024–25, ఏప్రిల్–జూలై) వీటి అమ్మకాలు 72 శాతం దూసుకెళ్లగా... మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో కేవలం 1.8 శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం దీనికి నిదర్శనం. ఈ నాలుగు నెలల్లో 1,75,350 (11 శాతం వృద్ధి) చిన్న ఎస్‌యూవీలు అమ్ముడవడం విశేషం. మరోపక్క, చిన్నకార్లు/హ్యాచ్బ్యాక్స్ సేల్స్‌లో 17 శాతం (69,936 యూనిట్లు) తగ్గుదల నమోదైంది. చిన్న ఎస్‌యూవీల కేటగిరీలోకి ఎక్స్టర్, పంచ్‌తో పాటు కాంపాక్ట్ మోడల్స్ అయిన మారుతీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ ఎంట్రీ వేరియంట్లు ఉంటాయి. క్యూ కడుతున్న కంపెనీలు... ఈ సెగ్మెంట్ శరవేగంగా దూసుకుపోతుండటంతో ఇతర కార్ల దిగ్గజాలు సైతం ఇందులోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నాయి. కియా మోటార్స్ తన తొలి మైక్రో ఎస్యూవీ ‘క్లావియా’ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉండగా.. హ్యుందాయ్ మరో కాంపాక్ట్ ఎస్యూవీ ‘బేయాన్’తో మార్కెట్ షేర్‌ను మరింత పెంచుకోవాలనుకుంటోంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌తో ఈ విభాగంలో పోటీ పడుతోంది. ఇక ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా సైతం వచ్చే ఏడాది ఆరంభంలో తొలి కాంపాక్ట్ ఎస్యూవీ కైలాక్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సెగ్మెంట్లోకి దూకనుంది. ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీల విభాగంలో పంచ్, ఎక్స్టర్ హవా కొనసాగుతుండటంతో మారుతీ కూడా ఈ విభాగంపై కన్నేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజా కంటే తక్కువ ధరలో ప్రత్యేకంగా కొత్త మోడల్‌ను మారుతీ రూపొందిస్తోందని, రెండేళ్లలో రోడ్డెక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.మారుతున్న ట్రెండ్... హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే మరింత విశాలమైన స్పేస్, దృఢమైన రూపంతో ఆకర్షణీయంగా ఉండటంతో దేశంలో ఎస్‌యూవీల క్రేజ్ కేకపుట్టిస్తోంది. దీనికితోడు ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటు ధరల్లో లభిస్తుండటం వల్ల గ్రామీణ కొనుగోలుదారులు కూడా వీటికే సై అంటున్నారని, దీంతో చిన్న ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ‘ఈ ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మైక్రో ఎస్వీయూల సెగ్మెంట్ అవతరించింది. ధర విషయానికొస్తే ఎక్స్టర్ వంటి చిన్న ఎస్‌యూవీలు కొన్ని హ్యాచ్‌బ్యాక్‌లతో సమానమైన ధరకే లభిస్తున్నాయి. దీనికితోడు పరిశ్రమలో తొలిసారిగా సన్‌రూఫ్, డాష్‌క్యామ్, 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి వినూత్న ఫీచర్లు చిన్న ఎస్‌యూవీల్లోనూ ఉండటం కూడా కస్టమర్లు వీటి వెంట పడటానికి మరో ప్రధాన కారణం. నచి్చన ఫీచర్లు, డిజైన్ ఉంటే రేటెక్కువైనా కొనేందుకు వెనుకాడటం లేదు’ అని హ్యుందాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. 2024 తొలి 8 నెలల్లో మైక్రో ఎస్‌యూవీల సేల్స్ 86% దూసుకెళ్లగా... మొత్తం ఎస్యూవీ విభాగం విక్రయాల వృద్ధి 19 శాతంగా ఉంది. -
ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు
పండుగ సీజన్ మొదలైపోయింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా తమ వాహనాల సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వంటివి ప్రకటిస్తాయి. ఈ కథనంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు ధర వద్ద లభించే కార్లు ఏవో తెలుసుకుందాం.కార్లు, వాటిపై లభించే తగ్గింపులు ● హోండా సిటీ: రూ. 1.14 లక్షలు ● టాటా నెక్సాన్: రూ. 1.25 లక్షలు ● మారుతి గ్రాండ్ వితారా: రూ. 1.28 లక్షలు ● కియా సెల్టోస్: రూ. 1.30 లక్షలు ● సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: రూ. 1.50 లక్షలు ● టాటా సఫారీ: రూ. 1.65 లక్షలు ● ఎంజీ హెక్టర్: రూ. 2.0 లక్షలు ● మారుతి జిమ్నీ: రూ. 2.50 లక్షలు ● మహీంద్రా ఎక్స్‌యూవీ400: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ ఏ-క్లాస్ లిమోసిన్: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ సీ-క్లాస్: రూ. 3 లక్షలు ● టయోటా క్యామ్రీ: రూ. 3 లక్షలు ● ఫోక్స్‌వ్యాగన్ టైగన్: రూ. 3.07 లక్షలు ● జీప్ కంపాస్: రూ. 3.15 లక్షలు ● ఎంజీ గ్లోస్టర్: రూ. 6 లక్షలు ● టయోటా హైలక్స్: రూ. 10 లక్షలు ● కియా ఈవీ6: రూ. 10 లక్షలు ● జీప్ గ్రాండ్ చెరోకీ: రూ. 12 లక్షలుఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్: టెక్ సీఈఓ పోస్ట్ వైరల్కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
అక్టోబర్‌లో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే..
పండుగ సీజన్ వచ్చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో కొరియన్ బ్రాండ్, చైనా బ్రాండ్, జర్మనీ బ్రాండ్స్ మొదలైనవి ఉన్నాయి. వచ్చే నెలలో (అక్టోబర్ 2024) లాంచ్ అయ్యే కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.2024 కియా కార్నివాల్కొత్త తరం కియా కార్నివాల్ 2023 అక్టోబర్ 3న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందనుంది. 2+2+3 సీటింగ్ లేఅవుట్‌తో 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ కలిగి 193 పీఎస్ పవర్, 441 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్నట్లు సమాచారం.కియా ఈవీ9ఎప్పటి నుంచో లాంచ్‌కు సిద్దమవుతున్న కియా ఈవీ9 వచ్చే నెలలో దేశీయ విఫణిలో లాంచ్ అవుతుందని సమాచారం. దీని ధర రూ. 90 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ధర ఎక్కువగా ఉండటానికి కారణం.. ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి కావడమనే తెలుస్తోంది.నిస్సాన్ మాగ్నైట్ ఫేస్లిఫ్ట్భారతీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్.. అక్టోబర్ 4న ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అవుతుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. పరిమాణం పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, అప్డేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, టెయిల్‌లైట్ మొదలైనవి ఉంటాయి.బీవైడీ ఈమ్యాక్స్7దేశీయ విఫణిలో అతి తక్కువ కాలంలోనేఅధిక ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్ బీవైడీ అక్టోబర్ 8న ఈమ్యాక్స్7పేరుతో ఓ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మొదటి 1000 మంది కస్టమర్లకు రూ. 51000 విలువైన ప్రయోజనాలను అందించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ రేంజ్: ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు2024 మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ ఎల్డబ్ల్యుబీమెర్సిడెస్ బెంజ్ తన 2024 ఈ క్లాస్ ఎల్డబ్ల్యుబీ కారును అక్టోబర్ 9న ఆవిష్కరించనుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఎంపికలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు కోసం కంపెనీ ఇప్పటికీ ఫ్రీ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు సమాచారం. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి. ధర, వివరాలు తెలియాల్సి ఉంది. -
మొదటిసారి కారు కొన్నవారు ఇంతమందా?
కరోనా మహమ్మారి తరువాత చాలామంది సొంత వాహనం కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మొదటిసారి కార్లను కొనుగోలు చేసినవారు 67 శాతం మంది ఉన్నట్లు రిటైల్ ప్లాట్‌ఫారమ్ స్పిన్నీ ఒక నివేదికలో వెల్లడించింది.మొదటిసారి వాహనం కొనుగోలు చేసిన మొత్తం 67 శాతం మందిలో 30 శాతం మహిళలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కూడా 80 శాతం మంది పెట్రోల్ కార్లను కొనుగోలు చేశారు. డీజిల్ కార్ల కొనుగోలుకు కేవలం 12 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఐదు శాతం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మోడల్ ఎంచుకున్నారు.కొత్త వాహనాలను కొనుగోలు చేసినవారిలో చాలామంది వైట్, రెడ్, గ్రే కలర్స్ ఎంచుకున్నారు. సుమారు 60 శాతంమంది ఫైనాన్సింగ్ ద్వారా కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. డెలివరీల విషయానికి వస్తే.. 82 శాతం మంది డీలర్షిప్స్ నుంచి డెలివరీ తీసుకున్నట్లు, 18 శాతం మంది హోమ్ డెలివరీ ద్వారా డెలివరీ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 76 శాతం మంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగిన కార్లను కొనుగోలు చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ వాహనాలను కొనుగోలు చేసినవారు 24 శాతం మంది మాత్రమే. దీన్ని బట్టి చూస్తే.. టెక్నాలజీ పెరిగినప్పటికీ.. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.కొత్త వాహనాల అమ్మకాలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో బెంగళూరు, ముంబై ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆటోమొబైల్ భారత్ మూడో స్థానంలో ఉంది. నేడు మన దేశంలో చైనా, జపాన్, జర్మన్ వంటి అనేక దేశాల బ్రాండ్స్ కూడా గొప్ప అమ్మకాలను పొందుతున్నాయి. -
91 శాతం వాహనాలు బీమాకు దూరం
బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ 2018లో తీసుకు వచ్చిన నిబంధనల ప్రకారం షోరూం నుంచి కొత్త కారు రోడ్డెక్కాలంటే ఒక ఏడాది ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, మూడేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఐఆర్డీఏఐ 2019లో తెచ్చిన రూల్స్ ప్రకారం ద్విచక్ర వాహనాల విషయంలో ఇది 1+5 ఏళ్లు ఉంది. ఇదంతా సరే. మరి రెన్యువల్స్ సంగతి ఏంటి? తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో ఎంత మంది తమ వాహనాలను రెన్యువల్ చేస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 19 శాతం టూ వీలర్లు, 47 శాతం కార్లు మాత్రమే రెన్యువల్ అవుతున్నాయట. మొత్తంగా దేశంలో అన్ని వాహనాలకు కలిపి బీమా విస్తృతి 9 శాతమే ఉంది. అంటే రోడ్డుమీద తిరుగుతున్న 100 వాహనాల్లో తొమ్మిదికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉన్నట్టు లెక్క. 2015కు ముందు ఇది కేవలం 3 శాతమే. వాహనానికి ఏమీ కాదు.. అనవసరంగా డబ్బులు ఖర్చు అన్న నిర్లక్ష్యపు భావనే ఇందుకు కారణమని బీమా కంపెనీలు అంటున్నాయి. బీమా లేకుంటే వాహనానికి జరగరానిది జరిగితే జేబులోంచి ఖర్చు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టమూ తప్పదు. సమగ్ర బీమా ఉంటే ప్రకృతి విపత్తుల నుంచీ వాహనానికి రక్షణ లభిస్తుంది.డిజిటల్ పాలసీలదే హవా.. వ్యయాలను తగ్గించుకోవడానికి, పాలసీల జారీని వేగవంతం చేయడానికి బీమా కంపెనీలు డిజిటల్ వైపు మళ్లుతున్నాయి. 10 నిమిషాల్లోనే పాలసీలను కస్టమర్ల చేతుల్లో పెడుతున్నాయి. ఆన్లైన్లో జారీ అవుతున్న పాలసీల సంఖ్య ఏకంగా 65 శాతం ఉందంటే డిజిటల్ వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ (పీవోఎస్‌పీ) అడ్వైజర్లు సైతం కస్టమర్లను నేరుగా చేరుకుని డిజిటల్ రూపంలో పాలసీలను అందిస్తున్నారు. 2029–30 నాటికి జారీ అవుతున్న పాలసీల్లో డిజిటల్ వాటా 75 శాతానికి చేరుతుందని పరిశ్రమ భావిస్తోంది. కస్టమర్లలో 15 శాతం మంది జీరో డిప్రీసియేషన్ కోరుకుంటున్నారు. నడిపే దూరానికి బీమా చెల్లించే ‘పే యాజ్ యూ డ్రైవ్’ ప్లాన్స్‌ను 6 శాతం మంది ఎంచుకుంటున్నారని పాలసీబజార్‌కు చెందిన పీబీపార్ట్నర్స్ మోటార్ ఇన్సూరెన్స్ అసోసియేట్ డైరెక్టర్, సేల్స్ హెడ్ అమిత్ భడోరియా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీల మధ్య పోటీ కారణంగానే ప్రీమియంలో వ్యత్యాసం ఉంటోందని అన్నారు. రూ.1.60 లక్షల కోట్లకు.. దేశంలో వాహన బీమాను 27 సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పాలసీల జారీలో 57 బ్రోకింగ్ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. భారత్‌లో మోటార్ ఇన్సూరెన్స్ మార్కెట్ 2023–24లో 12.9 శాతం దూసుకెళ్లి రూ.91,781 కోట్లు నమోదు చేసింది. 2029 నాటికి ఇది సుమారు రూ.1.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ అంచనా. వాహనాలన్నింటికీ బీమా కలిగి ఉండాలన్నదే ఐఆర్డీఏఐ లక్ష్యం. అంతేగాక బీమా ప్రీమియం వినియోగదార్లకు అందుబాటులో ఉంచేందుకు ఐఆర్డీఏఐ కృషి చేస్తోంది. బీమా పాలసీలను విస్తృతం చేసే లక్ష్యంతో 2015లో పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ (పీవోఎస్‌పీ) కాన్సెప్ట్‌కు ఐఆర్డీఏఐ శ్రీకారం చుట్టడం పరిశ్రమ వృద్ధికి ఆజ్యం పోసింది. జారీ అవుతున్న పాలసీల్లో 60 శాతం బ్రోకింగ్ కంపెనీల నుంచే ఉండడం గమనార్హం. 40 శాతం పాలసీలు నేరుగా బీమా కంపెనీల నుంచి జారీ చేస్తున్నారు. 75 శాతం చౌక ప్రీమియం పాలసీలే..దేశంలో 2018కి ముందు రెన్యువల్స్ ద్విచక్ర వాహనాలకు 31 శాతం, కార్లకు 37 శాతం నమోదైంది. ఐఆర్డీఏఐ చొరవతో ఇన్సూరెన్స్ విస్తృతి పెరిగింది. పాలసీబజార్.కామ్ ప్రకారం టాప్–20 నగరాల్లో 50 శాతం టూ వీలర్స్, 60 శాతం కార్లకు బీమా ఉంది. తృతీయ, ఆపై తరగతి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో 40 శాతం ద్విచక్ర వాహనాలు, 45 శాతం ఫోర్ వీలర్స్‌కు ఇన్సూరెన్స్ ఉంది. టాప్–20 నగరాల్లో సమగ్ర బీమా (కాంప్రహెన్సివ్) పాలసీని 55 శాతం మంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 70 శాతం మంది ఎంచుకుంటున్నారు. ఈ నగరాల వెలుపల 30 శాతం మంది సమగ్ర పాలసీ, 50 శాతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ప్రీమియంలో లభించే పాలసీలను 75 శాతం మంది తీసుకుంటున్నారు. ఇక ప్రమాదానికి గురైన వాహనాల్లో 40 శాతం వాటికి బీమా ఉండడం లేదట. -
మరమ్మతుల ఖర్చూ ముంచుతోంది
బుడమేరు వరద ధాటికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు వారం రోజులకు పైగా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, కృష్ణా నదిలో భారీ ప్రవాహం, బుడమేరు వరద.. ఇలా అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లో విలువైన వస్తువులతోపాటు ద్విచక్రవాహనాలు, కార్లు సైతం నీట మునిగాయి. దీంతో అవి పూర్తిగా పాడయ్యాయి. –లబ్బీపేట (విజయవాడ తూర్పు)/మధురానగర్ (విజయవాడ సెంట్రల్)ఒక్కో వాహనానికి రూ.వేలల్లో ఖర్చుఇప్పటికే వరదలతో తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ఇప్పుడు తమ వాహనాల మరమ్మతులకు కూడా భారీగా వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మరమ్మతులకు మెకానిక్‌లు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. చేతిలో వాహనం లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి కాబట్టి అప్పోసొప్పో చేసి బాగు చేయించక తప్పడంలేదని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డుల్లోని మెకానిక్‌ల వద్ద రిపేర్లు కోసం పెద్ద సంఖ్యలో బైక్‌లు స్కూటర్లు బారులు తీరాయి.కొన్ని వాహనాల ఇంజన్లు పాడైపోవడంతో పూర్తిగా స్తంభించిపోయి కనీసం నడపడానికి కూడా వీలు కావడం లేదు. ఒక్క సింగ్‌నగర్‌లోనే 25 నుంచి 30 వేలకు పైగా ద్విచక్రవాహనాలు పాడయ్యాయని అంచనా. మరోవైపు కార్లను కూడా రిపేర్లు కోసం రికవరీ వెహికల్స్‌తో షెడ్లకు తరలిస్తున్నారు. సింగ్‌నగర్ ప్రాంతంలో సోమవారం ఎక్కడ చూసినా కార్లు తరలించే దృశ్యాలే కనిపించాయి. మా వాహనాలన్నీ మునిగిపోయాయి..నాకు, మా పిల్లలకు మూడు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రిపేరు కోసం తీసుకెళ్తే రూ.7 వేలు నుంచి రూ.10 వేలు అవుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఆటోలకు ఎంత అవుతుందో తెలియడం లేదు. అంత ఖర్చు ఎలా భరించాలో అర్థం కావడం లేదు. – ఎస్కే కరీముల్లా, సింగ్నగర్జీవనోపాధి పోయింది.. బుడమేరు వరద ఉధృతికి నా టాటా ఏస్ నీట మునిగింది. దీంతో జీవనోపాధి కోల్పోయాను. వాహనం ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మరమ్మతులు చేయించాలంటే కనీసం రూ. 70 వేలు అవుతుందని అంటున్నారు. వరద వల్ల అన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు అంత డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. – గౌస్, బాధితుడు -
సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసింది
మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త 'మేబ్యాచ్ ఈక్యూఎస్' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ.2.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). 'లోటస్ ఎలెట్రే' ఎలక్ట్రిక్ కారు తరువాత అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ నిలిచింది.కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారు.. బ్లాక్ గ్రిల్ ప్యానెల్ పొందుతుంది. బానెట్ మీద బ్రాండ్ లోగో, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్ లైట్, టెయిల్ లైట్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నాయి. 11.6 ఇంచెస్ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే కలిగిన బెంజ్ ఈక్యూఎస్.. ముందు సీట్ల వెనుక భాగంలో కూడా 11.6 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంది. కప్ హోల్డర్లు, నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్స్, కూలింగ్ కంపార్ట్మెంట్స్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు.మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ 680 ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ పొందుతుంది. ఇది 658 హార్స్ పవర్, 950 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది ఒక ఫుల్ చార్జితో 611 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంటమెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ కారులోని 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ కారు 20 నిమిషాల చార్జితో 300 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జ్ చేసుకుంటుంది. ఈ కారుకు ప్రస్తుతం దేశీయ విఫణిలో ప్రధాన ప్రత్యర్థులు లేదు. -
7000 కార్లు ఉన్న బ్రూనే సుల్తాన్.. ప్రధాని మోదీకి ఆతిథ్యం
న్యూఢిల్లీ: ప్రధానమత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) బ్రూనే వెళ్తున్నారు. ఆ దేశ సుల్తాన్ హస్సనాల్ బోల్కియా.. మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాలను బలోపేతం చేయనున్నారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రూనై పర్యటన తర్వాత అక్కడి నుంచి మోదీ సింగపూర్ వెళతారు.కాగా బ్రూనే సుల్తాన్ హస్సనాల్ బోల్కియా.. ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరు. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ రాణి 2 తరువాత ప్రపంచంలోనే రెండవ అత్యధిక కాలం పాలించిన చక్రవర్తి సుల్తాన్ పేరుగాంచారు. ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆయన వద్ద అత్యధిక సంఖ్యలో ఖరీదైన ప్రైవేటు కార్లు ఉన్నాయి. సుమారు 5 బిలియన్ల డాలర్ల ఖరీదైన లగ్జరీ కార్లు(సుమారు 4 లక్షల కోట్లు) ఉన్నాయి.సుల్తాన్ బోల్కియా సంపద దాదాపు 30 బిలియన్ డాలర్లు. ఆయనకు సంపద ప్రధానంగా బ్రూనై చమురు, సహజ వాయువు నిల్వల నుంచి వస్తుంది. సుల్తాన్ బల్కియా వద్ద సుమారు ఏడు వేల లగ్జరీ వాహనాలు ఉన్నాయి. వాటిల్లో 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. సుల్తాన్ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. ఆయన కలెక్షన్లలో 450 ఫెరారీలు, 380 బెంట్లీ కార్లు కూడా ఉన్నాయి. పోర్షె, లాంబోర్గిని, మేబాచ్, జాగ్వార్, బీఎండబ్ల్యూ, మెక్లారెన్ కార్లు కూడా అతని వద్ద ఉన్నాయి.బోల్కియా కలెక్షన్లో బెంట్లీ డామినేటర్ ఎస్యూవీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది దాని విలువ సుమారు 80 మిలియన్ల డాలర్లు. పోర్షె 911 హారిజన్ బ్లూ, 24 క్యారెట్ల గోల్డ్ ప్లేట్ రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్-2 కార్లు ఉన్నాయి. కస్టమ్ డిజైన్డ్ రోల్స్ రాయిస్ విత్ ఓపెన్ రూఫ్ కారు కూడా ఉంది. కూతురు, యువరాణి మజేదేదా పెళ్లి కోసం 2007లో గోల్డ్ కోటింగ్ రోల్స్ రాయిస్ కారును ఆయన ఖరీదు చేశారు.సుల్తాన్ జీవన విధానం చాలా విలాసవంతమైనది. ఆయన ఇల్లు ‘ఇస్తానా నూరుల్ ఇమాన్’ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని 1984లో నిర్మించారు. బ్రిటన్ నుంచి బ్రూనై స్వాతంత్ర్యం పొందిన సమయంలో నిర్మించారు. దీని ధర రూ.2,250 కోట్లు. ఈ ప్యాలెస్‌లో 22 క్యారెట్ల బంగారు గోపురాలు, 1,700 గదులు, 257 స్నానపు గదులు, ఐదు ఈత కొలనులు ఉన్నాయి. 110 గ్యారేజీలు ఉన్నాయి. ఆయన వద్ద ఒక ప్రైవేట్ జంతు ప్రదర్శనశాలను కూడా ఉంది. ఇందులో 30 బెంగాల్ పులులు, వివిధ పక్షి జాతులు ఉన్నాయి. అతనికి బోయింగ్ 747 విమానం కూడా ఉంది. -
ఎక్కువ కార్లను ఎగుమతి చేసిన ఐదు కంపెనీలు
ఆటోమొబైల్ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. కార్లు, బైకులు లెక్కకు మించి లాంచ్ అవుతూనే ఉన్నాయి. విదేశీ కంపెనీలు సైతం ఇండియన్ మార్కెట్లో వాహనాలను లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ఈ కంపెనీలు దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి.దేశీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా తిరుగులేని కంపెనీగా అవతరించింది. దేశీయ అమ్మకాల్లో మాత్రమే కాకుండా ఈ కంపెనీ లెక్కకు మించిన వాహనాలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. దీంతో కంపెనీ ఎగుమతుల్లో కూడా అగ్రగామిగా నిలిచింది.ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) సమాచారం ప్రకారం.. భారతదేశం నుంచి కార్ల ఎగుమతులు సంవత్సరానికి 14.48 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఎగుమతులు భారీగా పెరిగాయి.కార్ల ఎగుమతుల్లో మారుతి సుజుకి ఇండియా అగ్రస్థానంలో నిలువగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, హోండా కార్స్ ఇండియా, నిస్సాన్ మోటార్ ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.కంపెనీలు ఎగుమతి చేసిన కార్ల సంఖ్య➼మారుతి సుజుకి ఇండియా: 93,858 యూనిట్లు➼హ్యుందాయ్ మోటార్ ఇండియా:- 58,150 యూనిట్లు➼ఫోక్స్‌వ్యాగన్ ఇండియా: 26,553 యూనిట్లు➼హోండా కార్స్ ఇండియా: 20,719 యూనిట్లు➼నిస్సాన్ మోటార్ ఇండియా: 17,182 యూనిట్లు -
గుద్దుకుంటూ పోయిన బస్సు..
-
కొత్తగా మారిన పాత కార్లు..! (ఫొటోలు)
-
డిస్కౌంట్ల షికారు!
వానాకాలం వచ్చేసింది. దీనికి తోడు కార్ల కంపెనీల ఆఫర్ల వర్షం కూడా మొదలైపోయింది. అయితే, ఈ ఏడాది డిస్కౌంట్ల మోత మరింతగా మోగుతోంది. సార్వత్రిక ఎన్నికలు, మండుటెండల దెబ్బకు వేసవి సీజన్లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. షోరూమ్‌లకు కస్టమర్ల రాక కూడా భారీగా తగ్గిపోయింది. మరోపక్క, వర్షాకాలంలో విక్రయాల తగ్గుదల కూడా పరిపాటే. ఈ పరిస్థితిని మార్చేందుకు, ఏదో రకంగా విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీలు పలురకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. భారీ డిస్కౌంట్ ధరలతో ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రారంభ స్థాయి మోడళ్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పాత కార్ల ఎక్సే్ఛంజ్పై మంచి ధర, అదనపు బోనస్, బహుమతులను కూడా అందిస్తున్నాయి.బలహీన సీజన్... పండుగలు పెద్దగా లేకపోవడంతో పాటు, వర్షాలు ఎప్పుడు పడతాయో ఊహించని పరిస్థితులు ఉంటాయి. దీంతో కస్టమర్లు ఈ సీజన్లో కొనుగోళ్ల ప్రణాళికలను వాయిదా వేసుకుని.. దసరా, దీపావళి సమయాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తుంటారు. అందుకే ఏటా వర్షాకాలంలో అమ్మకాలు పెంచుకునేందుకు దేశవ్యాప్తంగా డీలర్లు డిస్కౌంట్లు, ఇతరత్రా స్కీమ్‌లను అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు మోడల్ కార్లపై రూ.20 వేల నుంచి రూ.4 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది వర్షాకాలం కంటే ఈ ఏడాది డిస్కౌంట్లు కూడా పెరిగాయి. వేసవిలో విక్రయాలు తగ్గడంతో డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోయాయి. వీటిని తగ్గించుకోవాలంటే డీలర్లు విక్రయాలు పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. డబుల్ బెనిఫిట్... డిమాండ్ పెంచేందుకు కార్ల కంపెనీలు.. స్టాక్‌ను తగ్గించుకునేందుకు డీలర్ల స్థాయిలోనూ డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. ‘గతేడాది ఇదే సీజన్లో కొన్ని కార్ల మోడళ్లకు కొరత నెలకొంది. వెయిటింగ్ వ్యవధి కూడా పెరిగింది. కానీ, ఈ ఏడాది చాలా మోడళ్లు డీలర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇదే కస్టమర్లకు ఆఫర్లు పెంచేందుకు కారణం’ అని ఫాడా ప్రెసిడెంట్ మనీ‹Ùరాజ్ సింఘానియా తెలిపారు. మారుతీ ఆల్టో కే10పై రూ.40 వేలు, ఎస్–ప్రెస్సో, వ్యాగన్ఆర్పై రూ.25,000–30,000, స్విఫ్ట్ మోడళ్లపై రూ.15,000–20,000 వరకు తగ్గింపు ఆఫర్లు నడుస్తున్నాయి. బాలెనో పెట్రోల్ ఎంటీ వెర్షన్‌పై రూ.35 వేలు, పెట్రోల్ ఏజీఎస్ వెర్షన్‌పై రూ.40 వేల వరకు, ఎక్స్ఎల్6 పెట్రోల్ వేరియంట్‌పై 20 వేలు, సీఎన్జీ వేరియంట్‌పై రూ.15 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.ఉచిత విదేశీ ట్రిప్..! ‘హోండా మ్యాజికల్ మాన్సూన్’ పేరుతో హోండా కార్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని కార్లపై బహుమతులు, ఇతర ప్రయోజనాలను ఇందులో భాగంగా అందిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో కొనుగోలుదారుల నుంచి విజేతలను ఎంపిక చేసి, వారికి స్విట్జర్లాండ్ ఉచిత పర్యటన, రూ.75,000 వరకు నగదు బహుమతులను ఆఫర్ చేస్తోంది. హోండా కారు కొనుగోలుపై ఈ పరిమిత కాల ఆఫర్ తమ డీలర్లందరి వద్దా అందుబాటులో ఉన్నట్టు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు.ఆఫర్ సూపర్... → ఎంఅండ్ఎం ఎక్స్‌యూవీ400 (ఈవీ) – రూ. 4 లక్షలు → మారుతి జిమ్నీ ఆల్ఫా వేరియంట్ – రూ. 2 లక్షలు → హోండా అమేజ్, సిటీ, ఎలివేట్, సిటీ ఈ–హెచ్ఈవీ – రూ. 75,000 వరకు → టాటా టియాగో, ఆ్రల్టోజ్, నెక్సాన్, పంచ్, హ్యారియర్, సఫారీ – రూ. 50,000 వరకు → అధిక డిమాండ్ ఉండే ఎస్‌యూవీలపై తగ్గింపు కొంతే → ఆరంభ మోడళ్లు, హ్యాచ్‌బ్యాక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు → ఎక్స్చేంజ్పైనా అదనపు బోనస్ → సాధారణ రోజుల్లో ఎస్‌యూవీలకు 60 రోజుల వెయిటింగ్ → ఈ సీజన్లో 30 రోజుల్లోనే డెలివరీ → పండుగల ముందు వరకు ఇదే ధోరణి -
ఇకపై ఈ మహీంద్రా కొత్త కారు కనిపించదు!.. ఎందుకంటే?
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు ఉత్తమ అమ్మకాలు పొందిన 'మహీంద్రా మరాజో' ఉత్పత్తిని కంపెనీ త్వరలో నిలిపివేయనున్నట్లు సమాచారం. 2018లో మారుతి ఎర్టిగా, ఎక్స్ఎల్6, కియా కారెన్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా దేశీయ విఫణిలో అడుగుపెట్టిన మరాజో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఈ ఎమ్‌పీవీ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.90 లక్షల మధ్య ఉండేది.ప్రారంభంలో ఉత్తమ అమ్మకాలు పొందినప్పటికీ.. క్రమంగా ఇది ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందలేకపోయింది. గత ఐదు నెలలో ఈ కారు కేవలం 34 యూనిట్ల అమ్మకాలను మాత్రమే సాధించింది. ప్రస్తుతం ప్యాసింజర్ ఎమ్‌పీవీ మార్కెట్లో టయోటా, మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో కంపెనీ మరాజో కారును నిలిపివేయడానికి సంకల్పించింది.ప్రారంభం నుంచి జూన్ 2024 వరకు మహీంద్రా మరాజో సేల్స్ మొత్తం 44793 యూనిట్లు మాత్రమే. నెలకు సగటున కేవలం 640 యూనిట్ల మరాజో కార్లు మాత్రమే అమ్ముడైనట్లు కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాలు తగ్గడమే కాకుండా.. బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అవ్వలేదు. ఇది కూడా కంపెనీ మార్కెట్లో విజయం పొందకపోవడానికి కారణమనే తెలుస్తోంది. -
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా ?
-
అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ లగ్జరీ కార్లు
-
కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!?
స్పెయిన్‌లోని అతి చిన్న నగరం ‘సిటీ ఆఫ్ ఫ్రియాస్’. స్పెయిన్‌కు వచ్చే పర్యాటకులు దీనిని పెద్దగా పట్టించుకోరు గాని, ఈ ఊరికి చాలా విశేషాలే ఉన్నాయి. పదో శతాబ్దికి చెందిన ఈ నగరంలో ఆనాటి రాజు రెండో జువాన్ నిర్మించిన రాతికోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మునిసిపాలిటీ నిర్వహణలో ఉన్న ఈ ఊరు సాంకేతికంగా పట్టణమే అయినా, పేరులో మాత్రం ‘సిటీ’ ఉండటంతో స్పెయిన్‌లోని అతి చిన్న నగరంగా గుర్తింపు పొందింది.చిన్నా చితకా పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా కార్లు విరివిగా తిరిగే పరిస్థితులు ఉన్నా, ఈ ఊర్లో మాత్రం కార్లు కనిపించవు. ఇక్కడి ప్రజలు తమ ఊరిలో కార్లను నిషేధించారు. అందువల్ల మోటారు శబ్దాల రొద లేకుండా ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊరి జనాభా దాదాపు మూడువందల మంది మాత్రమే! ఈ విశేషాలు తెలిసిన కొద్దిమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఊళ్లోని పురాతనమైన ‘ఇగ్లేషియా డి సాన్ విన్సెంటె మార్టిర్’ కేథలిక్ చర్చి, ‘ఫ్యూంటే డి లాస్ తేజాస్’ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణలు.ఈ ఫౌంటెన్ నుంచి నీరు కిందకు పడేటప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఈ ఊళ్లో చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటళ్లు, సెలూన్లు, మాంసం కొట్లు, ఫ్యాన్సీ దుకాణాలు, బేకరీ, ఫార్మసీ దుకాణాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి ‘హోటల్ రూరల్ ఫ్రియాస్’ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పురాతన యూరోపియన్ విశేషాలను తిలకించాలనుకునే పర్యాటకులు ఇక్కడ బస చేయవచ్చు. ఈ హోటల్లో బస చేయడానికి రోజుకు 79 పౌండ్లు (రూ.8,411) చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ యూరోపియన్ హోటళ్లతో పోల్చుకుంటే ఈ ధర తక్కువే!ఇవి చదవండి: అబ్బే! ప్రాణహాని ఉందని కాదు! -
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారతదేశంలో 2 సిరీస్ షాడో ఎడిషన్‌ను రూ. 46.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ షాడో ఎడిషన్ 220ఐ ఎం స్పోర్ట్స్ అనే ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది బ్లాక్ అవుట్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్‌తో సూక్ష్మమైన అప్డేట్లను పొందుతుంది.బీఎండబ్ల్యూ షాడో ఎడిషన్ బ్లాక్ ఎడిషన్ కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, రియర్ స్పాయిలర్ వంటి వాటితో పాటు.. ఆధునిక ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మొదలైనవి ఉన్నాయి.ఆల్పైన్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 179 హార్స్ పవర్ మరియు 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా ముందు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 7.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.కొత్త బీఎండబ్ల్యూ 2 సిరీస్ షాడో ఎడిషన్.. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటో గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. -
Lok Sabha Election 2024: ఈ కామర్స్ వేదికలకు ఎన్నికళ
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ వేదికలు ఎన్నికల సీజన్‌ను సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. పార్టీల ప్రచార సామగ్రి, వాటి అభిమానించే ఓటర్లు ధరించే ఉత్పత్తులను అమ్మకానికి పెట్టాయి. దాంతో ఎన్ని‘కళ’ ఈ వేదికలనూ చేరింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో పారీ్టల రంగులతో కూడిన టీ షర్టులు, క్యాప్‌లను విక్రయిస్తున్నాయి. ‘నమో హ్యాట్రిక్’, ‘రాహుల్ ఈజ్ హోప్’ (రాహులే ఆశాకిరణం) వంటి సందేశాలతో కూడిన టీ షర్ట్లు అందుబాటులో ఉన్నాయి. ‘‘సుమారు 12 మంది విక్రేతలు ఈ కామర్స్ వేదికలపై ఎన్నికల సామగ్రి అమ్మకాలకు నమోదు చేసుకున్నారు. ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ మరింతమంది ఆసక్తి చూపిస్తున్నారు’’ అని ఓ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఉద్యోగి వెల్లడించారు. స్వతంత్ర రిటైలర్లు, బ్రాండ్ లైసెన్స్ తీసుకున్న కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో యువ ఓటర్లను ఆకర్షించేలా అమ్మకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఖరీదైన వ్రస్తాలు, కీ చైన్లు, కార్లు, ఇళ్లలో పెట్టుకోగలిగిన జెండాలు, ల్యాంపులు, క్లాక్‌ల వంటివి వీటిలో ఉన్నాయి. బ్లాక్ వైట్ ఆరెంజ్ కంపెనీ ‘హౌ టు బి యాన్ ఇన్ఫ్లుయెన్సర్’, ‘ఐ వాంట్ టు వోట్ ఫర్ ఇండియా’ వంటి సందేశాలతో ‘ఏ47’ బ్రాండ్‌పై ఖరీదైన వ్రస్తాలను విక్రయిస్తోంది. అమెరికాలో ఎన్నికల సామగ్రి మార్కెట్ చాలా పెద్దది. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని బ్లాక్‌వైట్ వ్యవస్థాపకుడు భవిక్ వోరా తెలిపారు. బీజేపీ ఇప్పటికే నమో యాప్‌పై టీ షర్ట్లు, మగ్లు, స్టేషనరీని విక్రయిస్తుండడం తెలిసిందే. -
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
చాలామంది కార్లను భలే మెయింటెయిన్ చేస్తారు. కొందరు లగ్జరీ కార్లను ఎంచుకుంటే..మరికొందరూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కార్లను ఇష్టపడతారు. అయితే కొంతమంది పెద్ద సౌండ్లు వచ్చే కార్లను ఇష్టపడతారు. వాళ్లకు తమ ఇంజిన్ల నుంచి వచ్చే సౌండ్లు అదిరిపడేలా ఉంటేనే వారికి మంచి కిక్ అన్న ఫీల్‌లో ఉంటారు. అయితే తాజా అధ్యయనంలో పెద్ద శబ్దాలు వచ్చే కార్లను ఇష్టపడే వారిలో ఆ టైపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయిని వెల్లడయ్యింది. అంతేగాదు దీని గురించి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.కారు ఇంజిన్ల శబ్దం ఎక్కువగా ఇష్టపడే వారి జీవన విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. తమ కారు శబ్దమే అధికంగా ఉండాలనుకుని మార్పులు కూడా చేసుకుంటారట కొందరు. అలాంటి వారిలో అధిక స్థాయిలో శాడిజం, సైకో మనస్తత్వం ఎక్కుగవగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మేరకు కెనడాలోని వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త జూలీ ఐట్కెమ్ షెర్మెర్ నేతృత్వంలోని బృందం దీనిపై అధ్యయనం చేయగా..బిగ్గరగా శబ్దం వచ్చే కార్లను ఇష్టపడే వారి మనస్తత్వం చాలా వైరైటీగా ఉంటుందని తేలింది. అందుకోసం దాదాపు 500 మందికి పైగా వ్యక్తలపై అధ్యయనం నిర్వహించారు. మనుషులకు, జంతువులకు ఇబ్బంది కలిగించే పరిధిలో శబ్బాలను ఇష్టపడేవారిలో మనసు చాలా భయనకంగా ఉంటుందట. ఈ పరిశోధన పాల్గొన్న వారిలో దాదాపు 52% మంది పురుషులకు బిగ్గరగా శబ్దం వచ్చే కార్లకు ప్రాధాన్యత ఇచ్చారట. వారిలో ఇతరుల భావలకు విలువ ఇవ్వని నిర్లక్ష్య పూరిత మనస్తత్వం క్లియర్‌గా కనిపించిందట. ప్రజలు ఆ శబ్దాలను చూసి ఇబ్బందిపడుతుంటే..వారు ఆనందిస్తూ కిక్‌గా ఫీలవ్వుతారట. వారిలో ఇలాంటి సైకోపతి, శాడిజం లక్షణాలు ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. పరిశోధకులు జరిపిన ఈ పరిశోధనను 'ఎ డిజైర్ ఫర్ ఎ లౌడ్ కార్ విత్ మోడిఫైడ్ మఫ్లర్ ఈజ్ ప్రిడిక్డ్ బై ఏ మ్యాన్ అండ్ హైయర్ స్కోర్ ఆన్ సైకోపతి అండ్ శాడిజం' అనే పేరుతో అంతర్జాతీయ జర్నల్ కరెంట్ ఇష్యూస్ ఇన్ పర్సనాలిటీ సైకాలజీలో ప్రచురితమయ్యింది కూడా.(చదవండి: ఉంగరంతో ఆరోగ్యం పదిలం!) -
నీతా అంబానీ లగ్జరీ కార్లు, డైమండ్ నగలు (ఫోటోలు)
-
కార్ల కొనుగోలు దారులకు మారుతి సుజుకి బంపరాఫర్
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎస్యూవీ, హ్యాచ్ బ్యాక్ తదితర కార్ల సెగ్మెంట్లలో తన స్థానం పదిలం చేసుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ తరుణంలో ఏప్రిల్‌లో కొన్ని మోడల్ కార్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి ఇగ్నీస్ మోడల్ కారుపై గరిష్టంగా రూ.58 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. మారుతి సుజుకి పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనోపై రూ.58 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. మారుతి సుజుకి సియాజ్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 కలుపుకుని మొత్తం రూ.53 వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రీడ్ కార్లపై రూ.58 వేలు, స్ట్రాంగ్ హైబ్రీడ్ వర్షన్లపై రూ.84 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఫ్రాంక్స్ టర్బో పెట్రోల్ వేరియంట్ మీద రూ.68 వేల వరకూ ధర తగ్గించింది. మారుతి సుజుకి జిమ్నీ కారుపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 2022-23, 2023-24 మోడల్ కార్లలో స్పెషిఫిక్ ట్రిమ్స్ మీద గణనీయ క్యాష్ డిస్కౌంట్లు అందిస్తున్నది -
న్యూయార్క్ ఆటో షోలో హల్చల్ చేసిన లేటెస్ట్ కార్లు (ఫోటోలు
-
భారత్‌లో భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ కార్లదే
దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా లేకుండా చేయడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. భారతదేశాన్ని హరిత ఆర్థికవ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారత దేశం ఏటా ఇంధ దిగుమతులపై రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్రోల్, డీజిల్ వాహనాలు నిషేధిస్తే ఈ డబ్బును రైతులు, గ్రామాలు, యువతకు ఉపాధి వాటికి ఉపయోగించవచ్చు అని వెల్లడించారు. అంతేకాదు, హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని 5శాతం, ఫ్లెక్స్ ఇంజన్లపై 12 శాతం మేర తగ్గించే ప్రతిపాదనను ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు పంపామన్న ఆయన ప్రస్తుతం అవి పరిశీలన దశలో ఉన్నాయని పేర్కొన్నారు. పలు ఆటోమొబైల్ సంస్థలు ఫ్లెక్స్ ఇంజన్లను ఉపయోగించి మోటార్‌సైకిళ్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, ఆ సాంకేతికతను ఉపయోగించి ఆటో రిక్షాలను కూడా తయారు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం తను హైడ్రోజన్‌తో నడిచే కారులో తిరుగుతున్నారని, ఫ్యూచర్లో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కార్లు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఇది అసాధ్యమని చెప్పుకునేవాళ్లు తమ అభిప్రాయాలను మార్చుకునే రోజులు వస్తాయని నితిన్ గడ్కరీ అన్నారు. -
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. చెర్రీ ఇవాళ 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపాసన, క్లీంకారతో కలిసి తిరుమలకు వెళ్లిన చెర్రీ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బర్త్ డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో చెర్రీ ఆస్తులపై నెట్టింట చర్చ మొదలైంది. రామ్ చరణ్ ఆస్తుల గురించి సినీ ప్రియులతో పాటు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆస్తుల విలువ ఎంత? నెలకు ఎంత సంపాదిస్తున్నారన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. ఓ నివేదిక ప్రకారం మెగా హీరో రామ్ చరణ్‌కు దాదాపు రూ.1370 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్కు ముందు ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల పారితోషికం తీసుకునే చెర్రీ.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి దాదాపు రూ.45 కోట్ల పారితోషికం అందుకున్నారు. అంతే కాకుండా సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. ఒక్కో ప్రకటనకు దాదాపుగా రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెర్రీ ఇప్పటివరకు దాదాపు 34 ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించారు. ప్రస్తుతం నెలకు కేవలం ప్రకటనల ద్వారానే రూ.3 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. లగ్జరీ హోమ్ రామ్ చరణ్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్ లాంటి ఆధునాతన సౌకర్యాలున్నాయి. ఆ ఇంటి విలువు దాదాపు రూ.38 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అంతే కాకుండా రామ్ చరణ్‌కు ముంబయిలోనూ ఖరీదైన పెంట్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లగ్జరీ కార్లు మన గ్లోబల్ స్టార్ రేంజ్‌కు తగ్గట్టుగానే లగ్జరీ కార్లు ఉన్నాయి. దాదాపు రూ.4 కోట్ల విలువైన మెర్సిడెజ్‌తో పాటు ఆడి మార్టిన్, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, ఫెరారీ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా నడిపిస్తున్నారు. ఈ బ్యానర్లో ఖైదీ నెం.150 మూవీని తెరకెక్కించారు. వీటితో పాటు రామ్ చరణ్‌కు ట్రూజెట్ అనే ఎయిర్‌లైన్ సంస్థను నడుపుతున్నారు. ఇలా అన్ని విధాలుగా ఆస్తులు, వాణిజ్య ప్రకటనలు, బిజినెస్ కలిపితే రామ్ చరణ్ ఆస్తులు రూ.1370 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
భారత్‌లో ప్రతి 5 నిమిషాలకు అమ్ముడు పోయే కారు ఇదే!
-
300 కార్లు, ప్రైవేట్ ఆర్మీ, సొంత జెట్స్ ఇంకా...కళ్లు చెదిరే మలేషియా కింగ్ సంపద
మలేషియా కొత్త రాజుగా బిలియనీర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ (65) సింహాసనాన్ని అధిష్టించారు. దక్షిణ జోహోర్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ మలేసిమా 17వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ సందర్బంగా ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఇతర సంపదపై ఆసక్తి నెలకొంది. మలేషియాలో ఇప్పటికీ ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది. తొమ్మిది రాజకుటుంబాల అధిపతులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక సారి రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని ‘‘యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్’’ అని పిలుస్తారు. దేశ రాజధాని కౌలాలంపూర్ లోని నేషనల్ ప్యాలెస్‌లో సుల్తాన్ ఇబ్రహీం.. ఇతర రాజకుటుంబాలు, ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం , క్యాబినెట్ సభ్యుల సాక్షిగా జరిగిన వేడుకలో పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన సుల్తాన్ ఇబ్రహీం రియల్ ఎస్టేట్ నుండి టెలికాం , పవర్ ప్లాంట్ల దాకా విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి 5.7 బిలియన్ల డాలర్ల సంపద అతని సొంతం. బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసిన కుటుంబ సంపద 5.7 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసినప్పటికీ, సుల్తాన్ నిజమైన సంపద అంతకు మించి ఉంటుందని భావిస్తారు. రియల్ ఎస్టేట్ , మైనింగ్ నుండి టెలికమ్యూనికేషన్స్ , పామాయిల్ వరకు అనేక వ్యాపారాల ద్వారా అపార సంపద అతని సొంతం. ముఖ్యంగా మలేషియా ప్రధాన సెల్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ‘యూ’ మొబైల్లో 24శాతం వాటాతో పాటు, ఇతర అదనపు పెట్టుబడులూ ఉన్నాయి. అతని అధికారిక నివాసం ఇస్తానా బుకిట్ సెరీన్, సుల్తాన్ న కుటుంబ సంపదకు నిదర్శనం. అడాల్ఫ్ హిట్లర్ బహుమతిగా అందించినదానితో సహా ఇతనికి 300కు పైగా లగ్జరీ కార్లున్నాయి. గోల్డెన్, బ్లూ కలర్బోయింగ్ 737తో సహా, ఇతర ప్రైవేట్ జెట్లున్నాయి. వీటిన్నిటితోపాటు అతని ప్రైవేట్ సైన్యం కూడా విశేషంగా నిలుస్తోంది. సింగపూర్‌లో 4 బిలియన్ల డాలర్ల విలువైన భూమి ఉంది. ఇంకా షేర్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. సుల్తాన్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మొత్తం 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందట. సుల్తాన్ సింహాసనాన్ని అధిష్టించిన క్రమంలో దేశాభివృద్ధి, ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉంటాయనేది పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మలయ్ కమ్యూనిటీకి గేట్ కీపర్, అతను చైనీస్ వ్యాపారవేత్తలతో జాయింట్ వెంచర్ల ద్వారా ప్రధాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన సుల్తాన్ రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాడనీ, తన పూర్వీకుల మాదిరిగా కాకుండా, సుల్తాన్ ఇబ్రహీం విభిన్నంగా ఉంటాడని అంచనా. సింగపూర్ బిజినెస్ టూకూన్స్తో సన్నిహిత సంబంధాలు, ప్రముఖ చైనీస్ డెవలపర్లతో వ్యాపార అనుబంధం లాంటివి దేశీయ, విదేశాంగ విధానంతోపాటు, దేశ ఆర్థికరంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయంటున్నారు విశ్లేషకులు. -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ భారీ షాక్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల కొనుగోలు దారులకు భారీ షాకిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి టాటా ఎలక్ట్రిక్ వెహికల్ ధరల్ని 0.7 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కార్ల తయారీకి వినియోగించే ముడి సరకు ధరలు పెరగడమే తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ప్రతి మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే, టాటా మోటార్స్ నిర్దిష్ట వేరియంట్ మోడల్‌పై 0.7 శాతం సగటు పెరగనుంది.ఫలితంగా, టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వాహనాల ధరలు పెరగనున్నాయి. ఇటీవలే లాంచ్ చేసిన పంచ్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.11 లక్షలుగా ఉంది. టాటా కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో దీని ధరలు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది ఏప్రిల్‌లో టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వెహికల్ ధరల్ని దాదాపు 0.6 శాతం పెంచింది. మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. టాటా కంపెనీ కార్ల ధరల్ని పెంచినప్పటికీ దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలలో కంపెనీ 9 శాతం వృద్ధిని సాధించింది. డిసెంబర్ 2022లో 40,043 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 2023 డిసెంబర్ 43,470 యూనిట్లకు చేరుకుంది. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు..
ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం. ఆ కుటుబంలోని వ్యక్తులంతా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్లు ఉండే ఫ్యాలెస్ ఏకంగా మూడు పెంటాగాన్ భవనాల పరిమాణంలో ఉంటుంది). సంతానం, తోబుట్లువులు కూడా ఎక్కువ మందే. పైగా అందరూ అత్యంత లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా ప్రముఖ కంపెనీలన్నింటిలో అత్యధిక శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఇంతకీ ఆ అత్యంత ధనిక కుటుంబం ఏదంటే.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కుటుంటం. ఆయన పేరులోని మొదటి అక్షరాలతో ఎంబీజెడ్గా పిలుస్తారు. ఈయనే కుటుంబ పెద్ద. అతని కుటుబమే అత్యంత ధనిక రాయల్ కుటుంబంగా ఉంది. ఆయనకు 11 మంది సోదరీమణులు, తొమ్మది మంది పిల్లలు, సుమారు 18 మంది దాక మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. ప్రపంచంలోని చమురు నిల్వల్లో దాదాపు ఆరు శాతం ఆ కుటుంబమే సొంతం చేసుకుంది. అలాగే మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ వంటి అనేక ప్రసిద్ధ కంపెనీల్లో అత్యధిక వాటా కలి ఉన్నారు. ఎలోన్ మస్క్ స్పెసఎక్స్ కంపెనీ నుంచి ప్రముఖ గాయకుడు బ్యూటీ బ్రాండ్ ఫెంటీ వంటి కంపెనీలన్నింటిలో ఈ రాయల్ కుటుంబ సభ్యులే వాటాలు కలిగి ఉన్నారు. అధ్యక్షుబు షేక్ మొహమ్మద్ బిన్ తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్కే ప్రపంచంలోని అతిపెద్ద ఎస్యూవీ, మెర్సిడెస్ బెంజ్, వంటి లగ్జరీ కార్లు దాదాపు 700 పైచిలుకు ఉన్నాయి. ఆ కుటుంబ సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద ప్యాలెస్‌లో నివశిస్తోంది. దాని విలువ నాలుగు వేల కోట్లు ఉంటుంది. ఆ కుటుంబానికి సంబధించని ప్రధాన ఇన్విస్టెమెంట్ కంపెనీకి ఆయన మరో సోదరుడు బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నిర్వహిస్తున్నారు. దీని విలువ గత ఐదేళ్లలో దాదాపు 2 లక్షల పర్సంటేజ్ వరకు పెరిగింది. ఐతే ప్రస్తుతం ఆ కంపెనీ విలువ లక్ష కోట్లు. ఇది వ్యవసాయం, ఇందనం, వినోదం, సముద్ర వ్యాపారాలు వంటివి నిర్వహిస్తుంది. సుమారు పదివేల మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. ఈ కుటుంబానికి యూఏఈలోనే కాకుండా పారిస్, లండన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అత్యంత లగ్జరీ ఆస్తులు ఉన్నాయి. ఈ యూఏఈ అధ్యక్షుడికి యూకేలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో పెద్దమొత్తంలో ఆస్తులు ఉండటంతో ఆయన్ని ‘ల్యాండ్ లార్డ్ ఆఫ్ లండన్’(లండన్ భూస్వామి) అని కూడా పిలుస్తారు. అంతేగాదు న్యూయార్క్ నివేదిక ప్రకారం 2015లో ఈ దుబాయ్ రాజకుటుంబం బ్రిటీష్ రాజ కుటుంబంతో సరితూగేలా ఆస్తులను కలిగి ఉందని పేర్కొంది. అతేగాదు 2008లో అధ్యక్షుడు ఎంబీజెడ్కి చెందిన అబుదాబి యునైటెడ్ గ్రూప్ యూకే ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీని సుమారు రెండు వేల కోట్లకు కొనుగోలు చేసింది. మాంచెస్టర్ సిటీ, ముంబై సిటీ, మెల్బోర్న్ సిటీ, న్యూయార్క్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లను నిర్వహిస్తున్న సిటీ ఫుట్‌బాల్ గ్రూపులో 81 శాతం ఈ అబుదాబి కంపెనీ యాజమాన్యంలోనే ఉంది. في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة! اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb — Qasr Al Watan (@QasrAlWatanTour) November 1, 2022 (చదవండి: అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని..57 ఏళ్ల క్రితమే ఊహించారా?) -
ఈ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్లు.. ఇవే!
2024 మొదలైపోయింది, ఈ ఏడాది కొత్త కార్లు లాంచ్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది ఈ నెలలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే 5 కార్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి 8న మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తన జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయనుంది. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు సిల్వర్ షాడో ఫినిషింగ్, ఎయిర్ ఇన్లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్‌లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4 మ్యాటిక్ AWD పొందుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఆధునిక హంగులతో 'ఫేస్‌లిఫ్ట్'గా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఈ నెల 16న అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ.. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్డేటెడ్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది. మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్న ఈ కారు డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. మహీంద్రా ఎక్స్యువీ300 ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా కంపెనీ పాపులర్ కారు ఎక్స్యువీ300 కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లకు పొందనుంది. పనితీరు పరంగా కూడా దాని స్టాండర్డ్ మోడల్‌కు ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ జనవరి చివరి నాటికల్లా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా ఉంది. ఇది కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. ధరలు, రేంజ్ వంటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొని
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా.. అస్తమా వ్యాధితో బాధపడుతోన్న కర్ణాటక రాష్ట్రం సైదాపూర్ గ్రామానికి చెందిన రెహమాన్‌బేగం(40)ను చికిత్స కోసం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం సంకలమద్దికి తీసుకువచ్చారు. చికిత్స పొందిన అనంతరం తిరుగు ప్రయాణంలో భర్త మౌలాలి(40), కలీల్(43), మరో వ్యక్తి వడివాల్‌తో కారులో కలిసి బయలుదేరారు. ఇదే క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని కార్వాల్లో పనిచేస్తున్న నేవీ ఉద్యోగి దీపక్ సమల్, భార్య భవిత సమల్(35), కూతురు అవిస్మిత సమల్(8)తో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. జక్లేర్ సమీపంలో ఉన్న దాబా దగ్గర అతివేగంగా వచి్చన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో రెహమాన్ బేగం, మౌలాలి, ఖలీల్, భవిత సమాల్, అవిస్మిత సమాల్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వడివాల్, దీపక్ సమల్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీపక్ సమల్ పరిస్థితి విషమించడంతో 108లో మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంలాల్ తెలిపారు. దీపక్ సమల్‌కు విశాఖపట్టణానికి బదిలీ కావడంతో అక్కడికి వెళ్లేందుకు హైదరాబాద్‌కు బయలుదేరారని బంధువులు తెలిపారు. కాగా, కార్లలో బెలూన్ల సౌకర్యం ఉన్నప్పటికీ అవి సకాలంలో ఓపెన్ కాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టు చెబుతున్నారు. రోడ్డుపై డివైడర్ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. -
2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే!
దేశీయ విఫణిలో కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్లను CNG కార్లుగా రూపొందించి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఈ కథనంలో 2023లో లాంచ్ అయిన బెస్ట్ సీఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం. మారుతి గ్రాండ్ విటారా సీఎన్జీ (Maruti Grand Vitara CNG) ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి 'సుజుకి గ్రాండ్ వితారా'.. ఏప్రిల్ 2023న సీఎన్జీ కారుగా అడుగుపెట్టింది. 1.5 లీటర్ కె15సీ ఇంజిన్ కలిగిన ఈ కారు 26 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ మోడల్ కేవలం సిటీ డ్రైవింగ్‌కు మాత్రమే కాకుండా హైవేలలో కూడా మంచి పనితీరుని అందిస్తుంది. మారుతి బ్రెజ్జా సీఎన్జీ (Maruti Brezza CNG) దేశీయ విఫణిలో లాంచ్ అయిన మరో మారుతి CNG కారు బ్రెజ్జా. 2023 'మే'లో విడుదలైన ఈ కారు డిజైర్ సీఎన్జీ మాదిరిగానే 1.5 లీటర్ కె12సీ ఇంజిన్ కలిగి 20.15 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సరసమైన ధర వద్ద లభిస్తున్న బెస్ట్ CNG కార్లలో ఒకటిగా ఉంది. టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG) దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి చెందిన 'పంచ్' మైక్రో SUV కూడా జూన్ 2023న CNG కారుగా లాంచ్ అయింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు 73 పీఎస్ పవర్, 113 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.2 లీటర్ 3 సిలినార్ ఇంజిన్ పొందుతుంది. ఇది 18.5 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ (Hyundai Exter CNG) 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన 'హ్యుందాయ్ ఎక్స్టర్' 2023 జులైలో CNG కారుగా మార్కెట్లో లాంచ్ అయింది. 1.2 లీటర్ ఫోర్ సిలినార్ ఇంజిన్ కలిగిన ఈ కారు 74 పీఎస్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ మోడల్ 21 కిమీ?కేజీ మైలేజ్ అందిస్తుంది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు! టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ (Tata Altroz CNG) టాటా ఆల్ట్రోజ్ కూడా ఇప్పుడు మార్కెట్లో CNG కారుగా అందుబాటులో ఉంది. దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా పెద్దగా మార్పు పొందినప్పటికీ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 74 పీఎస్ పవర్, 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 25.15 కిమీ/కేజీ మైలేజ్ అందించే ఈ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. -
2023లో భారత్‌లో అడుగుపెట్టిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
రోజు రోజుకి ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈవీలనే లాంచ్ చేయడానికి సుముఖత చూపుతున్నాయి. 2023లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లోటస్ ఎలెట్రా (Lotus Eletre) ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు 'లోటస్ ఎలెట్రా'. నవంబర్ 2023న అధికారికంగా లాంచ్ అయిన ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్లు. ఈ కారు కేవలం 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 265కిమీ. సింగిల్ చార్జితో 600 కిమీ ప్రయాణించే ఈ కారు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5) హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 5 దేశీయ మార్కెట్లో 2022లో అడుగు పెట్టినప్పటికీ 2023లో అధికారిక ధరలు వెల్లడయ్యాయి. 2023లో భారతీయ విఫణిలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. దీని ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింగిల్ చార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా చాలా కొత్తగా ఉంటుంది. 2023 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (2023 Tata Nexon EV Facelift) దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించే ఈ కారు ప్రారంభం నుంచి ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తోంది. సింగిల్ చార్జితో 325 కిమీ రేంజ్ అందించే ఈ కారు ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు. ఎంజీ కామెట్ (MG Comet) ఇండియన్ మార్కెట్లో సరసమైన ధరకు లభించే ఎంజి ఈవీ కామెట్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. రూ. 7.89 లక్షల వద్ద లభించే ఈ కారు సింగిల్ చార్జితో 230కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు టాటా టియాగో ఈవీ, సిట్రోయిన్ ఈసీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. సిట్రోయిన్ ఈసీ3 (Citroen EC3) 'సిట్రోయెన్ సీ3'తో భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్.. ఈ ఏడాది రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ఈసీ3 విడుదల లాంచ్ చేసింది. సింగిల్ చార్జితో 320కిమనీ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచేలా తయారైంది. -
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఫ్రేమ్‌వర్క్: కేంద్ర మంత్రి
డ్రైవర్ల ఉద్యోగాలను కాపాడే దృష్టితో డ్రైవర్ లెన్ కార్లను భారత్‌లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఐఐఎం నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్డు భద్రతా సమస్యలపై గురించి మాట్లాడుతూ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చడం, రోడ్లపై బ్లాక్ స్పాట్లను తొలగించడం లాంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామన్నారు. ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా ఆయన అభివర్ణించారు. కాగా ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో గడ్కరీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై మూలధన వ్యయం 2013-14లో రూ. 51 వేల కోట్లు ఉండగా, అది 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,40 వేల కోట్లకు పెరిగిందన్నారు. రోడ్డు,రవాణా మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2013-14లో రూ.31,130 కోట్లు ఉండగా, 2023-24 నాటికి ఇది రూ. 2,70,435 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇది కూడా చదవండి: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి! -
తుఫాన్ ప్రభావం.. కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టిన ఆటోమొబైల్ కంపెనీలు
అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించిన 'మిచాంగ్ తుఫాన్' (Michaung Cyclone) ప్రజలను మాత్రమే కాకుండా.. వాహనాలను కూడా ప్రభావితం చేసింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవడంతో వాహనాల్లో అనేక సమస్యలు తలెత్తాయి. వీటన్నింటిని పరిష్కరించడానికి వాహన తయారీ సంస్థలు కొన్ని ప్రత్యేక సర్వీసులను అందించడానికి ముందుకు వచ్చాయి. ఏ కంపెనీలు స్పెషల్ సర్వీసులను అందించనున్నాయి, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ వాహన తయారీ దిగటం టాటా మోటార్స్ తుఫాన్ కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వరదల కారణంగా నష్టపోయిన తన వినియోగదారులకు సంఘీభావంగా తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ వాహనాల్లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి స్టాండర్డ్ వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ టైమ్ పొడిగించడమనే కాకుండా.. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, ఫ్రీ సర్వీస్ వంటి వాటిని కూడా పొడిగిస్తున్నట్లు తెలిపింది. 2023 డిసెంబర్ 1 నుంచి 15 లోపు ముగిసే ఒప్పందాలను కూడా డిసెంబర్ 31 వరకు పెంచారు. ఎమర్జెన్సీ రోడ్ అసిస్టెన్స్ టీమ్ ఏర్పాటు చేసి.. 24 X 7 హెల్ప్‌డెస్క్ ప్రారంభించింది. తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అవసరమైన సర్వీస్ అందించడానికి ఫ్రీ టోయింగ్ సహాయాన్ని కూడా అందిస్తోంది. టయోటా కిర్లోస్కర్ (Toyota Kirloskar) మిచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు ప్రాంతాల్లో తమ కస్టమర్లకు ప్రత్యేక సహాయక చర్యలను అందించడానికి డీలర్ భాగస్వాములతో కలిసి ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా కస్టమర్లకు తక్షణ సహాయం అందించడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. కస్టమర్ల వెహికల్ పికప్ అండ్ డ్రాప్ సేవలను వారి ఇంటి వద్దకే పరిమితం చేసి మరింత సులభతరం చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మహీంద్రా కంపెనీ కూడా తన కస్టమర్లకు కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, నో-కాస్ట్ ఇన్స్పెక్షన్, డ్యామేజ్ అసెస్మెంట్, ప్రత్యేక తగ్గింపుల ద్వారా కొంత ఉపశమనం కలిగించడానికి ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. ఈ సర్వీసులన్నీ కూడా డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: షుగర్ మిల్ ఓనర్లతో ముఖేష్ అంబానీ చర్చలు - ఎందుకో తెలుసా? మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా కంపెనీలు మాత్రమే కాకుండా హ్యుందాయ్ మోటార్ ఇండియా, మారుతీ సుజుకి ఇండియా, ఆడి, టీవీఎస్ వంటి కంపెనీలు కూడా తమ కస్టమర్లకు సర్వీసులను అందించడానికి తగిన ఏర్పాట్లను చేశాయి. వినియోగదారులు కూడా ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. -
మిచౌంగ్ బీభత్సం: కొట్టుకుపోయిన కార్లు, రన్‌వే పైకి వరద నీరు..
చెన్నై: మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై కాకావికలమైతోంది. భారీ వర్షాలకు చెన్నైలో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రభావంతో కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. వర్షాల ప్రభావంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Deeply concerned about the impact of the Cyclone Michaung on Chennai city. I wish and pray for safety and well-being of the people. Stay strong, Chennai. We're with you. Prayers🙏🏼 #TakeCareChennai pic.twitter.com/cerOJbIAjf — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 4, 2023 చెన్నై నగరంలో భారీ వార్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపై మోకాలు వరకు నీరు చేరుకుంది. దీంతో రోడ్లపై రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెంగల్పట్టు సమీపంలోని సముద్రతీర ప్రాంతం నుంచి వేగవంతమైన గాలులు వీస్తున్నాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను రద్దు చేశారు. Understand this is Chennai airport today. The sea seems to have taken it over. And the most lowly paid staff in an airline typically are out braving it all. 👏👍#ChennaiRains pic.twitter.com/vJWNTmtTez — Tarun Shukla (@shukla_tarun) December 4, 2023 చెంగల్పట్టులోని పలు ప్రాంతాలపై భారీ వర్షం, సముద్రపు గాలులు తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు కాలువలా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నిలిచి ఉన్న కార్లు వాన నీటిలో కొట్టుకుపోతున్నాయి. 🌀 Michaung CYCLONE Police in action. Man fell down in a deep construction site was rescued by police. #ChennaiRain #Update@SandeepRRathore@R_Sudhakar_Ips@ChennaiTraffic pic.twitter.com/gsqeUUFZXk — GREATER CHENNAI POLICE -GCP (@chennaipolice_) December 4, 2023 -
7 సీటర్ విభాగంలో టాప్ 5 కార్లు, ఇవే..
భారతీయ మార్కెట్లో కేవలం చిన్న కార్లకు మాత్రమే కాకుండా 7 సీటర్ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కథనంలో దేశీయ విఫణిలో కొంత తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ టాప్ 5.. 7 సీటర్ కార్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రెనాల్ట్ ట్రైబర్ ఇండియన్ మార్కెట్లో రూ. 6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే రెనాల్ట్ ట్రైబర్'' ఈ జాబితాలో చెప్పుకోదగ్గ 7 సీటర్. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 71 Bhp పవర్, 96 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఎర్టిగా భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ కారు. దీని ధరలు రూ. 8.64 లక్షల నుంచి రూ. 13.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 102 బీహెచ్‌పి పవర్ 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ పొందుతుంది. టయోటా రూమియన్ టయోటా కంపెనీకి చెందిన రూమియన్ అనేది మారుతి సుజుకి ఎర్టిగా రీబ్యాడ్జ్ వెర్షన్. ఈ MPV ధరలు రూ. 10.29 లక్షల నుంచి రూ. 13.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇది కూడా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన బొలెరో నియో ధరలు రూ. 9.64 లక్షల నుంచి రూ. 11.38 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 99 బీహెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇదీ చదవండి: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సైబర్‌ట్రక్ లాంచ్ చేసిన టెస్లా - ధర ఎంతంటే? కియా కారెన్స్ 7 సీటర్ విభాగంలో చెప్పుకోదగ్గ కారు కియా కారెన్స్. దీని ధర రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 113 బీహెచ్‌పి పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కియా కారెన్స్ కారులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా మంచి పనితీరుని అందిస్తాయి. -
పెరగనున్న టాటా కార్ల ధరలు!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ ప్యాసింజర్ వాహన ధరల్ని పెంచనుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ధరల్ని పెంచనున్నట్లు వెల్లడించింది. హ్యాచ్‌బ్యాక్ టియాగో ప్రారంభం వేరియంట్ ధర రూ. 5.6 లక్షల నుండి రూ. 25.94 లక్షల మధ్య విక్రయించింది. అయితే, ఎంతమేరకు ధర పెంచుతుందనే విషయాన్ని ప్రస్తావించలేదు. ‘జనవరి 2024లో మా ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల్లో ధరల్ని పెంచాలని భావిస్తున్నారు.పెంపుదల, ఖచ్చితమైన వివరాలు కొన్ని వారాల్లో ప్రకటిస్తామని టాటా మోటార్స్ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే మారుతీ సుజుకీ, ఆడీ కంపెనీలు ధరల పెంపుపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ ఇప్పుడే ఆ జాబితాలో చేరింది. -
14 సంవత్సరాల కృషి.. నిజమవుతున్న ఎగిరే కారు కల - వీడియో
ఇప్పటివరకు డీజిల్, పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్ అంటూ గత కొన్ని రోజులుగా చాలా కంపెనీలు చెబుతూనే ఉన్నాయి. కొన్ని సంస్థలు చెప్పినట్లుగానే ఎగిరే కార్లను విడుదల చేసే పనిలో ఉంటే. మరి కొన్ని సైలెంట్‌గా ఉన్నాయి. అయితే 'సామ్సన్ స్కై' (Samson Sky) కంపెనీ ఎట్టకేలకు ఓ ఫ్లైయింగ్ కారుని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వాషింగ్టన్‌లోని మోసెస్ లేక్‌లోని గ్రాంట్ కంట్రీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 'సామ్సన్ స్విచ్‌బ్లేడ్' (Samson Switchblade) ఆకాశానికి ఎగిరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది దాదాపు ఆరు నిముషాలు 500 అడుగులు ఎత్తులో ఎగిరింది. సుమారు 14 సంవత్సరాల తరువాత కంపెనీ తన మొదటి ఫ్లైయింగ్ కారు తయారైందని సంస్థ సీఈఓ, స్విచ్‌బ్లేడ్ రూపకర్త 'సామ్ బౌస్ఫీల్డ్' తెలిపాడు. ఇప్పటికే సుమారు 57 దేశాల నుంచి 170000 డాలర్ల అంచనా ధరతో 2300 రిజర్వేషన్స్ తీసుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. రెండు సీట్లు కలిగిన ఈ ఫ్లైయింగ్ కారు స్ట్రీట్ మోడ్‌లో గంటకు 200 కిమీ, ఫ్లైట్ మోడ్‌లో 322 కిమీ/గం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదని కంపెనీ ధ్రువీకరించింది. ఈ కారులోని వింగ్స్, టెయిల్ వంటివి పార్కింగ్స్ సమయంలో ముడుచుకుని ఉంటాయి. కాబట్టి పార్కింగ్ కోసం ఎక్కువ స్థలం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్ సామ్సన్ స్విచ్‌బ్లేడ్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 125 లీటర్లు వరకు ఉంటుంది. కాబట్టి ఒక ఫుల్ ట్యాంక్‌లో 805కిమీ పరిధిని అందిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ కారు ఎప్పుడు అధికారికంగా మార్కెట్లో విడుదలవుతుందనే సమాచారం కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
కార్ల కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ - ఏకంగా రూ.3 లక్షలు!
దీపావళి పండుగ సందర్భంగా కంపెనీలు మంచి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయని చాలామంది కొత్త కారు కొనాలనుకుంటారు. అనుకున్న విధంగానే కొన్ని కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద లక్షల డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఏ కంపెనీ.. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? వివరాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. మహీంద్రా ఎక్స్‌యూవీ400 దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ పండుగ సీజన్లో తన 'ఎక్స్‌యూవీ400' ఎలక్ట్రిక్ కారు మీద ఏకంగా రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ ఈ కారు కొనుగోలుపైన 5 సంవత్సరాల పాటు ఫ్రీ ఇన్సూరెన్స్, ఫ్రీ ఛార్జింగ్ కాండీ సదుపాయాలను అందిస్తుంది. ఎక్స్‌యూవీ400 ధరలు రూ. 15.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ హ్యుందాయ్ కంపెనీ తన 'కోనా' ఎలక్ట్రిక్ కారు కొనుగోలు మీద దీపావళి సందర్భంగా రూ. 2 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 23.84 లక్షలు. అయితే ఈ పండుగ సందర్భంగా కొనుగోలు చేస్తే రూ. 2 లక్షల తగ్గింపు లభిస్తుంది. సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్ ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ దీపావళి సందర్భంగా తన 'సీ5 ఎయిర్‌క్రాస్' SUV మీద రూ. 2 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 36.91 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్కోడా కుషాక్ దీపావళి పండుగ సందర్భంగా స్కోడా కంపెనీ తన కుషాక్ కారు మీద రూ. 1.5 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. దేశీయ విఫణిలో స్కోడా కుషాక్ ప్రారంభ ధర రూ. 10.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఆఫర్ ఈ నెలలో కొనుగోలు చేసేవారికి మాత్రమే లభిస్తుంది. ఆ తరువాత బహుశా అందుబాటులో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఇదీ చదవండి: ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్ ఎంజీ ఆస్టర్ మోరిస్ గ్యారేజ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఆస్టర్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు రూ. 1.75 లక్షల తగ్గింపు అందిస్తోంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 10.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ పర్ఫామెన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. -
జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!
న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్మెంట్కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి. దీంతో భారత్‌తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి. -
కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్
రానున్న దీపావళిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి, మహీంద్రా, స్కోడా, జీప్, సిట్రోయెన్ కంపెనీలు రూ. 50000 నుంచి రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ ఆఫర్స్ కేవలం కొన్ని ఎంపిక చేసిన మోడల్స్‌కి మాత్రమే వర్తిస్తాయి. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా డిస్కౌంట్స్ మహీంద్రా ఎక్స్‌యూవీ400 - రూ. 3.5 లక్షలు మహీంద్రా ఎక్స్‌యూవీ300 - రూ. 1.2 లక్షలు మహీంద్రా బొలెరో - రూ. 70,000 మహీంద్రా బొలెరో నియో - రూ. 50,000 మహీంద్రా మొరాజో - రూ. 73.300 సిట్రోయెన్ డిస్కౌంట్స్ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ - రూ. 99,000 సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్ - రూ. 2,00,000 సిట్రోయెన్ సీ3 - రూ. 99,000 మారుతి సుజుకి డిస్కౌంట్స్ మారుతి జిమ్నీ - రూ. 1,00,000 స్కోడా డిస్కౌంట్స్ స్కోడా కుషాక్ - రూ. 1.5 లక్షలు జీప్ డిస్కౌంట్స్ జీప్ మెరిడియన్ - 1.30 లక్షలు జీప్ కంపాస్ - రూ. 1.45 లక్షలు ఫోక్స్‌వ్యాగన్ డిస్కౌంట్ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ - రూ. 1,00,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి. -
అదిరిపోయే దివాలీ గిఫ్ట్: సంబరాల్లో కంపెనీ ఉద్యోగులు
హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ తన ఉద్యోగులకు రానున్న దీపావళికి కార్లను బహుమతిగా ఇచ్చింది. తన ఆఫీస్ హెల్పర్‌తో సహా 12 మంది ఉద్యోగులకు సరికొత్త టాటా పంచ్ కార్లను గిఫ్ట్‌గా అందించింది కంపెనీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు తన ఉద్యోగులే తనకు సెలబ్రిటీలు అని పేర్కొనడం విశేషంగా నిలిచింది. హర్యానా, పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్‌కార్ట్ ఛైర్మన్ కార్లను కానుకగా ఇచ్చారు. అంతేకాదు తమ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ఛైర్మన్ ఎంకె భాటియా. వారి అంకితభావం, కృషి తనను ముగ్ధుడ్ని చేసిందనీ, అందుకే వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కంపెనీ ఎన్నో ఒడిదుడుకులను చవి చూసింది అయినా ఉద్యోగులు తమతోనే ఉండి కంపెనీ ఎదుగుదలకు సహకరించారని పేర్కొన్నారు. వాళ్లే తమ స్టార్స్ అంటూ భాటియా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అటు ఉద్యోగుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. కారు తాళాలను ఉద్యోగులిస్తున్న వీడియోను లింక్డ్ఇన్ పోస్ట్ చేశారు. కంపెనీ పట్ల వారి నిబద్ధతకు, విశ్వాసానికి గుర్తుగా నెల రోజుల క్రితమే కార్లు అంద జేశానని, అంతేకానీ దీపావళి సందర్బంగా ప్లాన్ చేసింది కాదంటూ వివరించారు. ఈ సమయంలో వార్తలు రావడం యాదృచ్చిక మన్నారు. అలాగే సమీప భవిష్యత్తులో మరో 38 మందికి కూడా ఈ గిప్ట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు మిట్స్‌కార్ట్ యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే కలలో కూడా ఊహించని కార్లను బహుమతిగా అందుకోవడం పట్ల ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనయ్యారు.. వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా తెలియదట. టాటా పంచ్ టాటా మోటార్స్‌కు చెందిన టాటా పంచ్ 2021 లో లాంచ్ అయింది. టాటా పంచ్ అనేది ఎంట్రీ-లెవల్ మైక్రో SUV. ఈ వెహికల్ ప్రారంభ ధర సుమారు రూ. 6లక్షలు -
కార్లకు రిలయన్స్ ఇన్సూరెన్స్ కొత్త పాలసీ - తిరిగే దూరాన్ని బట్టి..
ముంబై: సాధారణ బీమా సంస్థ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్‌జీఐసీఎల్) తాజాగా కార్ల కోసం ’రిలయన్స్ లిమిట్ ష్యూర్ – పే యాజ్ యూ డ్రైవ్’ పేరిట కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. వాహనం తిరిగే దూరానికి అనుగుణంగా ఈ పాలసీని తీసుకోవచ్చని సంస్థ సీఈవో రాకేశ్ జైన్ తెలిపారు. కనిష్టంగా 2,500 కిలోమీటర్ల శ్లాబ్‌తో మొదలుపెట్టి అవసరాన్ని బట్టి అదనంగా 1,000 కిలోమీటర్ల మేర పరిమితిని పెంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే తాము ఎంచుకున్న శ్లాబ్‌లో కిలోమీటర్లు మిగిలిపోతే, పాలసీని రెన్యువల్ చేసుకునేటప్పుడు వాటిపై డిస్కౌంటు కూడా పొందవచ్చని వివరించారు. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! అటు తమ ప్లాన్‌లో కిలోమీటర్ల పరిమితిని దాటిపోయినప్పటికీ అగ్నిప్రమాదం, దొంగతనానికి సంబంధించి థర్డ్ పార్టీ కవరేజీని పొందవచ్చని తెలిపారు. 'రిలయన్స్ లిమిట్ ష్యూర్ - పే యాజ్ యు డ్రైవ్' అనేది పూర్తి థర్డ్-పార్టీ, ఓన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌తో సహా కన్వెన్షనల్ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి సమానమైన అన్నింటిని కవర్ చేసే కవరేజీని అందిస్తుంది. -
రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు
దీపావళి సందర్భంగా చాలామంది కొత్త కారు కొనాలనుకుంటారు. ఈ కథనంలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 డీజిల్ కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహీంద్రా XUV700 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా XUV700 దీపావళి సందర్భంగా కొనుగోలు చేయదగిన ఉత్తమ SUV. దీని ప్రారంభ ధర రూ. 14.47 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ 185 పీఎస్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా హారియర్ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కంపెనీకి చెందిన హారియర్ కూడా మన జాబితాలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారునిలోని 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 170 పీఎస్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. హ్యుందాయ్ ఆల్కజార్ రూ.17.73 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభిస్తున్న హ్యుందాయ్ ఆల్కజార్ కూడా ఈ పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన ఉత్తమ మోడల్. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 Bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఎంజి హెక్టర్ మోరిస్ గ్యారేజ్ కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ హెక్టర్ రూ. 17.99 లక్షల ధర వద్ద లభిస్తుంది. ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! కియా సెల్టోస్ సౌత్ కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్‌కి చెందిన సెల్టోస్ దేశీయ మార్కెట్లో రూ. 13.60 లక్షల ధర వద్ద లభించే ఉత్తమ మోడల్. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 115 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. -
దుమ్మురేపుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు.. తయారీలో సరికొత్త రికార్డ్‌లు
జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు దుమ్మురేపుతున్నాయి. రోజుకీ రోజుకీ ఇందన ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు పోటీ పడి మరీ కొత్త కొత్త ఫీచర్లు, సరికొత్త డిజైన్లతో కార్లను తయారు చేస్తున్నాయి. వాటిని మార్కెట్‌కి పరిచయం చేస్తున్నాయి. కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల తయారీ సంస్థలు ఈవీ కార్ల తయారీ సంఖ్యను ఏయేటికాయేడు పెంచుకుంటూ పోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈవీ వ్యాల్యూమ్ నివేదిక ప్రకారం.. 2021లో ఈవీ కార్ల విభాగంలో తొలి 15 స్థానాల్లో ఉన్న ఆయా కంపెనీల వృద్దిరేట్లు గణనీయంగా పెరిగింది. 2021లో పైన పేర్కొన్నట్లు 15 కంపెనీలు మొత్తం ఏడాది కాలంలో 6.7 మిలియన్ల కార్లను తయారు చేయగా.. వాటి సంఖ్య 2022 తొలిసారి 10 మిలియన్లకు చేరింది. ఇక కార్ల తయారీ, వృద్దిలో చైనాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ బీవైడీ తొలిస్థానంలో ఉంది. టెస్లా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. తొలి 15 సంస్థలు తయారు చేసిన కార్ల వివరాలు ఇలా ఉన్నాయి. వాటిల్లో బీవైడీ 2021లో 598,019 కార్లను తయారు చేయగా.. ఆ సంఖ్య 1,858,364 చేరింది. వృద్ది రేటు 211శాతంగా ఉంది. -
డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ఎంజీ మోటార్ కీలక నిర్ణయం
ఎంజీ మోటార్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కలిసి భాగస్వామ్యానికి సిద్ధమవుతున్న తరుణంలో డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ప్రత్యక దృష్టి సారించింది. డీలర్‌షిప్‌నకు సంబంధించి కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం. ఎంజీ మోటార్ దాని పనితీరు తక్కువగా ఉన్న కొన్ని షోరూమ్‌లను మూసివేసి, ఇతర ప్రదేశాల్లో కొత్త డీలర్‌షిప్‌లను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 158 నగరాల్లో 330 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే డిసెంబర్ 2023 నాటికి 270 నగరాల్లో 400కు షోరూమ్‌లకు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా దీపావళి నాటికి ఇరు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. చైనాకు చెందిన సాయిక్(SAIC) మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తమ కంపెనీల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చివరి దశ చర్చలు జరుపుతున్నారు. -
జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో - ప్రత్యేక ఆకర్షణగా 'సిముర్గ్' (ఫోటోలు)
-
అలనాటి అందాల కింగ్ ఆఫ్ రోడ్... ఫోటోలు చూస్తే ఫిదా
-
అమెరికాలో వరదొస్తే ఆఫ్రికాకు వరం!
గతంలో లిబియాలో సంభవించిన వరదలు, మొరాకోలో వచ్చిన భూకంపం చాలామంది ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారాంతం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వీధులన్నీ జలమయమైపోయాయి, ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, కొన్ని వరద ఉధృతిలో కొట్టుకుపోతున్నాయి. వర్షాలు తగ్గిన తరువాత ఇలాంటి వాహనాలను (కార్లను) ఉపయోగిస్తారా? లేదా ఎక్కడికైనా ఎగుమతి చేస్తారా? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో వరదల్లో మునిగిన కార్లను కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొత్తం ఖర్చు చేసి రిపేర్ చేసుకుని మళ్ళీ ఉపయోగిస్తారు. అది కూడా కారు ఖరీదుని బట్టి, రిపేరుకి అయ్యే ఖర్చుని బట్టి ఉంటుంది. అయితే అమెరికా దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఒకసారి వరద నీళ్లలో కారు ఇంజిన్ తడిస్తే.. దాన్ని అమెరికాలో ఎవరూ ముట్టుకోరు. సాధారణంగా లగ్జరీ కార్ల ధరలు లక్షన్నర డాలర్ల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఉంటాయి. ఇంత ఖరీదైన కార్లు ఒక్కసారి వరద నీళ్లలో తడిచినా.. దాని విలువ దారుణంగా పడిపోతుంది. బురద నీళ్లలో ఇంజిన్ తడిస్తే.. ఎంత గొప్ప కారయినా 5 వేల డాలర్లకు మించి విలువ రాదు. ఇలాంటి కార్లన్నింటిని ఓనర్లు ఇన్సూరెన్స్ వాళ్లకు అప్పగించి కొత్త కార్లు తీసుకుంటారు. కార్లను వేలం ద్వారా విక్రయించడం నిజానికి అమెరికా వరదల్లో మునిగిన కార్లను.. అది ఎంత ఖరీదైన కారైనా చాలా తక్కువ ధరకు జంక్‌యార్డ్‌లు లేదా వెహికల్ రీబిల్డర్లకు సాల్వేజ్ వేలంలో విక్రయిస్తారు. అయితే ఇలాంటి వాటిని కొనుగోలు చేసిన కంపెనీలు.. లేదా వ్యక్తులు కెన్యా, జింబాంబ్వే, నైజీరియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. కారు వరదల్లో మునిగితే ఇంటీరియర్ & ఇంజిన్ వంటి వాటిలో మాత్రమే సమస్యలు తలెత్తుతాయి. కొంత మేర సీట్లు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను అక్కడి కంపెనీలు పరిష్కరించి, వాటి స్థానాల్లో చైనా వస్తువులను ఉపయోగించి, కొంత యధా స్థితికి తీసుకువస్తారు. ఇలా మళ్ళీ కొత్తగా తయారైన కార్లను సుమారు 40వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్లకు విక్రయిస్తారని తెలుస్తోంది. అంటే 2లక్షల డాలర్ల విలువ చేసే కార్లు కేవలం 40వేల డాలర్లకే విక్రయిస్తారన్న మాట. వరదల్లో మునిగిన కార్లకు పైపై మెరుగులు దిద్ది ఆఫ్రికా దేశాలు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నాయి. ఇక మధ్యలో బ్రోకర్లు ఒక్కో కారుకు కనీసం 25వేల డాలర్లు సంపాదిస్తారు. ఆఫ్రికాలో లాభాల పంట ఇలాంటి కార్లు ఎన్ని రోజులు పనిచేస్తాయని కచ్చితంగా చెప్పలేరు. తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. మొత్తం మీద దీన్ని బట్టి చూస్తే అమెరికాలో వరదలు వస్తే ఆఫ్రికాలో లాభాల పంట పండినట్లే. ముఖ్యంగా కెన్యా, నైగర్, జింబాబ్వే, నైజిరియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. కాసింత ఖర్చు పెట్టి కొత్తగా తీర్చిదిద్దుతున్నాయి. సాధారణంగా వరదల్లో మునిగిన కారు ఇంజిన్ కొంత మేరకు దెబ్బతింటుంది, వాహనానికి గుండెలాంటి ఇంజిన్‌లో సమస్య తలెత్తితే దాన్ని మళ్ళీ బాగుచేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నపని, కావున అమెరికాలో ఇలాంటి కార్లను వెనుకాడకుండా విక్రయించేస్తారు. ఇదీ చదవండి: వేగం పెంచిన ఇండియా.. డౌన్లోడ్ స్పీడ్ గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఇలా.. ఇంజిన్‌తో పాటు కార్పెట్లు, సీట్-మౌంటు స్క్రూలు, లైట్స్, ఎయిర్ ఫిల్టర్ వంటివన్నీ సమస్యకు గురవుతాయి. అంతే కాకుండా కొన్ని రోజులకు తుప్పు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను గుర్తించే వాటిని తక్కువ ధరలను విక్రయిస్తారు. ఇక సాఫ్ట్వేర్ విషయంలోనూ ఇప్పుడు చాలా పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ఆడి, బెంజ్, BMW, లెక్సస్, ఫోర్డ్ ఫోక్స్ వాగన్.. బ్రాండ్ ఏదైనా అందులో ఉండే సాఫ్ట్‌వేర్‌ను చైనా కంపెనీలు క్రాకర్ వర్షన్లలో అమ్ముతున్నాయి. కాబట్టి ఈ వరద కార్లు అన్ని హంగులు సమకూర్చుకుని బురదను వదిలి మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. మరి ఈ కార్లు ఇండియాకు రావా.. అనుకుంటున్నారా? మన ప్రభుత్వం ఎందుకనో ఈ డీల్స్‌కు నో చెబుతోంది. కాబట్టి ఆ అదృష్టమేదో అఫ్రికన్లకే చేరని. Consumer caution is rising as flood-damaged cars enter the used car market, often appearing in auto auctions, dealerships and classified ads. The @WisconsinBBB joined us this morning for tips on how to avoid being scammed by these vehicles: https://t.co/wN3xPmoTDR — CBS 58 News (@CBS58) October 2, 2023 -
పండగ సీజన్: అందుబాటులో ధరలో సీఎన్జీ కార్లు
పండుగ సీజన్ దగ్గర పడుతోంది. అందుబాటులో ధరలో సీఎన్జీకారు కోసం చూస్తున్నారా? అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన, పర్యావరణహిత CNG-ఆధారిత కార్లను ఒకసారి పరిశీలిద్దాం Maruti Alto & Alto K10 S-CNG దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన కార్లలో సిఎన్జి కార్ సెగ్మెంట్ల ఆల్టో సిరీస్, ఆల్టో ఆల్టో కె10 లాంటి ప్రధానంగా ఉన్నాయి. ఆల్టో 796cc ఇంజన్ 40 bhp, 60 గరిష్టటార్క్ను అందిస్తుంది. వీటి ధరలు ఆల్టో ధర రూ. 5.13 లక్షలు. ఆల్టో కె10 1.0-లీటర్ ఇంజన్ (56 బిహెచ్పి & 82 ఎన్ఎమ్) కలిగి ఉంది. ఈ మోడల్ రెండూ సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. లు ప్రశంసనీయమైన ఇంధన సామర్థ్యంతో సిటీ డ్రైవింగ్‌కు అనువైనవి. ఆల్టో K10 ధర రూ. 5.96 లక్షలు Maruti S-Presso S-CNG మారుతి ఎస్ ప్రెస్సో 1.0-లీటర్ ఇంజన్. 56 bhp. 82 Nm అందిస్తుంది. ధర: రూ. 5.91-6.11 లక్షలు Maruti Wagon R S-CNG, వ్యాగన్ ఆర్ చక్కటి ఇంటీరియర్ స్పేస్‌తో ముచ్చటైన కారు ఇది. రోజువారీ ప్రయాణానికి ఆకర్షణీయమైన ఎంపిక. 1.0-లీటర్ ఇంజన్ (56 bhp & 82 Nm) సామర్థ్యంతో వస్తుంది. ధర: రూ. 6.44-6.89 లక్షలు Tata Tiago iCNG టాటా టియాగో టాటా టియాగో iCNG చక్కటి బూట్ స్పేస్‌తో అందుబాటులోఉన్న CNG హ్యాచ్‌బ్యాక్ ఇది. 1.2-లీటర్ CNG ఇంజన్ (72 bhp & 95 Nm) , స్పెషల్ ట్విన్ CNG సిలిండర్ సిస్టమ్‌తో ఉన్నదీనిధర: రూ. 6.54-8.20 లక్షలు. Maruti Celerio S-CNG: మారుతి సెలేరియో 1.0-లీటర్ CNG ఇంజిన్‌తో బడ్జెట్‌ధరలో అందుబాటులో ఉన్న కారిది. ధర: రూ. 6.73 లక్షలు టాటా పంచ్ Tata Punch iCNG ఈ కాంపాక్ట్ SUV 1.2-లీటర్ ఇంజన్ 72 bhp మరియు 95 Nm ను అందిస్తుంది. ధర: రూ. 7.09 నుంచి 9.67 లక్షలు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ Hyundai Grand i10 Nios CNG : 1.2-లీటర్ ఇంజన్ 68 బిహెచ్పి, 95 ఎన్ఎంను అందిస్తుంది. ధర: రూ. 7.58-8.13 లక్షలు -
Manipur Violence: నిరసనలతో దద్దరిల్లిన ఇంఫాల్
ఇంఫాల్: మణిపూర్‌లో యువ జంట హత్యతో మొదలైన నిరసనలు గురువారం సైతం కొనసాగాయి. ఆందోళనకారులు ఇంఫాల్ వెస్ట్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై దాడికి దిగారు. అక్కడున్న రెండు కార్లకు నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బుధవారం రాత్రి పలు చోట్ల నిరసనకారులు భద్రతా బలగాలపై దాడులకు దిగారు. దీంతో, బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. పోలీసు వాహనానికి నిప్పుపెట్టడంతోపాటు పోలీసు వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కెళ్లారు. థౌబల్ జిల్లా ఖొంగ్జమ్లో బీజేపీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. గురువారం రాత్రి సీఎం బిరేన్ సింగ్ పూరీ్వకుల ఇంటిపై దాడికి జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు. మా వాళ్ల మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించండి దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురైన తమ పిల్లల మృతదేహాల జాడ చెబితే అంత్యక్రియలు జరుపుకుంటామని వారి తల్లిదండ్రులు పోలీసులను కోరారు. మెయితీ వర్గానికి చెందిన యువతి, యువకుడు జూన్‌లో గుర్తు తెలియని దుండగుల చేతుల్లో హత్యకు గురి కావడం, వారి ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం తెలిసిందే. ఈ హత్య ఘటన మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది. మెయితీల ఆచారం ప్రకారం..అంతిమ సంస్కారాలు జరపడానికి మృతులు ధరించిన దుస్తులకు సంబంధించిన చిన్న గుడ్డ ముక్కయినా ఉండాలి. అంత్యక్రియలు జరిపేవరకు వారి ఫొటోల వద్ద మృతుల తల్లులు అగరొత్తులు, క్యాండిల్ వెలిగిస్తూ రోజూ ఆహారం నివేదన చేస్తూ ఉండాలి. వారి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరు. కనీసం వారికి తగు గౌరవంతో అంత్యక్రియలు జరపాలనుకుంటున్నామని యువతి తండ్రి హిజామ్ కులజిత్ చెప్పారు. తాజాగా, సీబీఐ దర్యాప్తుతోనయినా తమ కోరిక నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మణిపూర్‌కు శ్రీనగర్ ఎస్ఎస్పీ బల్వాల్ బదిలీ న్యూఢిల్లీ: ఉగ్ర సంబంధ కేసులను డీల్ చేయడంలో సమర్థుడిగా పేరున్న శ్రీనగర్ సీనియర్ ఎస్పీ రాకేశ్ బల్వాల్ను కేంద్రం మణిపూర్‌కు బదిలీ చేసింది. మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, శాంతిభద్రతలు దారుణంగా దెబ్బతినడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. 2012 ఐపీఎస్ అధికారి అయిన రాకేశ్ బల్వాల్ను డిసెంబర్ 2021లో అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌కు మార్చారు. తాజాగా ఆయన్ను మణిపూర్ కేడర్‌కు మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన హోం వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మణిపూర్‌లో ఆయన కొత్త బాధ్యతలను చేపడతారని తెలిపింది. జమ్మూలోని ఉధంపూర్‌కు చెందిన బల్వాల్ మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌కు 2017లో సీనియర్ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. -
IAA MOBILITY 2023: ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ షో - ఔరా అనిపిస్తున్న బ్రాండెడ్ కార్లు (ఫోటోలు)
-
10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ
10% GST on the sale of diesel vehicles: పొల్యూషన్‌కు చెక్ పెట్టేలా డీజిల్ ఇంజన్ల వాహనాల కొనుగోలుపై 10 శాతం అదనపు జీఎస్టీ బాదుడుకు కేంద్రం సిద్ధమవుతోందన్న వార్తలు కలకలం రేపాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచన మేరకు ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇక డీజిల్ వాహనాలకు కాలం చెల్లినట్టే అన్న ఊహాగానాలు మార్కెట్లో వ్యాపించాయి. దీంతో స్టాక్మార్కెట్లో ఆటో, చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా తీవ్ర నష్టాలను చవి చూశాయి. అయితే దీనిపై తక్షణమే స్పందించిన రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వార్తలు అవాస్తవాలు అంటూ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి 'యాక్టివ్ పరిశీలన'లో లో లేదని స్పష్టం చేశారు. అయితే 2070 నాటికి కార్బన్ ఉద్గరాలను పూర్తిగా నిరోధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా డీజిల్ వంటి ప్రమాదకర ఇంధనాల వల్ల ఏర్పడే వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడంతోపాటు ఆటోమొబైల్ విక్రయాలు వేగంగా పెరుగుతుండటంతో క్లీనర్ , గ్రీన్ ఆల్టర్నేటివ్ ఇంధనాలను చురుకుగా స్వీకరించడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఈ ఇంధనాలు దిగుమతి ప్రత్యామ్నాయాలుగా, ఖర్చుతో కూడుకున్నవి కాకుండా దేశీయమైనవి , కాలుష్య రహితంగా ఉండాలని సూచించారు. పర్యావరణహితమైన వాహనాల ఉత్పత్తిపై కంపెనీలు దృష్టి సారించాలన్నారు. There is an urgent need to clarify media reports suggesting an additional 10% GST on the sale of diesel vehicles. It is essential to clarify that there is no such proposal currently under active consideration by the government. In line with our commitments to achieve Carbon Net… — Nitin Gadkari (@nitin_gadkari) September 12, 2023 -
జవాన్ స్టార్ 'షారుఖ్ ఖాన్' ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?
బాలీవుడ్ బాద్షా 'షారుఖ్ ఖాన్' (Shahrukh Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పఠాన్‌తో దుమ్మురేపిన కింగ్ ఖాన్.. తాజాగా 'జవాన్' చిత్రంతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. మన దేశంలో అన్ని భాషలలో కలిపి రూ. 75 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో కథానాయకుడైన షారుఖ్ నెట్‌వర్త్, లగ్జరీ కార్లు వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఐదు పదుల వయసు దాటినా ఎంతో హుందాగా బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న షారుఖ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ పాలోయింగ్ కలిగి ఉన్నారు. ఈయన ఒక సినిమాకు రూ.130 నుంచి రూ.150 కోట్లు తీసుకుంటారని సమాచారం. ఇది మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, వివిధ వ్యాపార సంస్థల నుంచి రూ. 100 కోట్లు కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లు.. వార్షిక ఆదాయం మొత్తం రూ. 280 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా వీరు సంవత్సరానికి రూ.500 కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆయన భార్య గౌరీ ఖాన్ చూసుకుంటున్నట్లు సమాచారం. ఇవి కాకుండా దుబాయ్‌లో రూ.200 కోట్లు విలువ చేసే విల్లా, అమెరికాలో ఒక ఖరీదైన విల్లా ఉన్నట్లు చెబుతారు. ఇదీ చదవండి: ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు! కార్ కలెక్షన్స్.. షారుఖ్ ఖాన్ వద్ద ఉన్న కార్ల విషయానికి వస్తే.. వీరి వద్ద సుమారు రూ. 7 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూప్, బెంట్లీ కాంటినెంటల్ జిటి, బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆడి ఏ8 ఎల్, బిఎమ్‌డబ్ల్యూ ఐ8, బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ కన్వర్టిబల్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, మిత్సుబిషి పజెరో, హ్యుందాయ్ క్రెటా మొదలైన కార్లు ఉన్నాయి. మొత్తం మీద అయన ఆస్తుల విలువ ఏకంగా రూ. 6300 కోట్లు కంటే ఎక్కువని సమాచారం. -
విజయవాడలో కార్స్24 హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోటెక్ కంపెనీ కార్స్24 వచ్చే నెలలో విజయవాడలో హబ్‌ను ప్రారంభిస్తోంది. 200 కార్లు పార్క్ చేయగలిగే సామర్థ్యంతో ఈ కేంద్రం రానుందని కార్స్24 కోఫౌండర్ గజేంద్ర జంగిద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘దేశవ్యాప్తంగా పాత కార్ల క్రయవిక్రయాల్లో 8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మార్కెట్ 8వ స్థానంలో ఉంది. కార్స్24 వ్యాపారంలో ఢిల్లీ రాజధాని ప్రాంతం, మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత తెలుగు రాష్ట్రాలు 15 శాతం వాటాతో నాల్గవ స్థానంలో ఉన్నాయి. కొత్త కార్లకు రుణం సులభంగా లభిస్తుంది. పాత కార్ల విషయంలో రుణ లభ్యత అంత సులువు కాదు. యూజ్డ్ కార్ల రంగంలో విలువ ఉందని గ్రహించాం. సులభ వాయిదాల్లో వినియోగదార్లకు రుణం అందించాలన్న ధ్యేయంతో 2019లో నాన్–బ్యాంకింగ్ ఫై నాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్ దక్కించుకున్నాం. కంపెనీ కస్టమర్లలో దేశవ్యాప్తంగా 55 శాతం మంది రుణం ద్వారా కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఈ సంఖ్య 65 శాతం ఉంది’ అని వివరించారు. కంపెనీ వృద్ధి 50 శాతం.. ఏడాది వారంటీతో సరి్టఫైడ్ కార్లను మాత్రమే విక్రయిస్తున్నామని గజేంద్ర తెలిపారు. ‘కారుకు 140 క్వాలిటీ చెక్ పాయింట్ల ద్వారా మరమ్మతులు చేపడతాం. కారు నచ్చకపోతే ఏడు రోజుల్లో వెనక్కి ఇవ్వొచ్చు. అర్హత కలిగిన వినియోగదార్లకు జీరో డౌన్ పేమెంట్ సౌకర్యమూ ఉంది. కస్టమర్లలో 15% మహిళలు ఉన్నారు. పరిశ్రమ 15 శాతం వృద్ధి చెందితే, కార్స్24 ఏకంగా 50% నమోదు చేస్తోంది. వ్యవస్థీకృత రంగంలో రెండవ స్థానంలో ఉన్నాం. 2025 నాటికి తొలి స్థానం లక్ష్యంగా చేసుకున్నాం. ప్రస్తుతం యూజ్డ్ కార్స్ విపణిలో 5% వాటా సొంతం చేసుకున్నాం. వచ్చే ఏడాది రూ.30–50 లక్షల ధరల శ్రేణి విభాగంలోకి ఎంట్రీ ఇస్తాం. ఇప్పటి వరకు భారత్‌లో 8 లక్షల కార్లు విక్రయించాం. 2022–23లో ఈ సంఖ్య 2.5 లక్షల యూనిట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30% వృద్ధి ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు. -
మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్లు యూజర్ల ఏటాను చోరీ చేస్తున్నాయా? అంటే నివేదికలు అవుననే అంటున్నాయి. మోడ్రన్ టాప్ బ్రాండ్స్ కార్లలో డేటా ప్రైవసీ అనేది పీడకలే అంటూ కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ తన తాజా పరిశోధనలో వెల్లడించింది. దాదాపు 25 కార్ బ్రాండ్లను సమీక్షించింది. ఆ సందర్బంగా సెక్స్ లైఫ్ నుంచి ఇష్టా ఇష్టాలు, పాలిటిక్స్ గగుర్పాటు కలిగించే ఇతర విషయాలు అన్నీ లీక్ అవుతున్నాయంటూ సంచలన అధ్యయన నివేదికను ప్రకటించింది. (గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్ ) మొజిల్లా ఫౌండేషన్ నిర్వహించిన వినియోగదారు గోప్యతా పరీక్షల్లో అవన్నీ విఫలమయ్యాయని తేలింది. పరిశోధనలో 84శాతం కార్ కంపెనీలు కారు యజమానుల నుండి సేకరించిన డేటాను సమీక్షించాయి, పంచుకుంటాయి లేదా విక్రయించాయి అని వెల్లడించింది. డ్రైవింగ్ డిజిటల్‌గా మారుతున్న యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, విక్రయించడంపై ఆందోళన వ్యక్తం చేసిన మొజిల్లా అసలు తమ పరిశోధనలోని కంపెనీలేవీ గోప్యతపై దాని ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరచలేదని తెలిపింది. సెక్స్ టాయ్‌లు ,మానసిక ఆరోగ్య యాప్‌ల తయారీదారులతో సహా ఇంత పేలవమైన సమీక్ష రాలేదని తెలిపింది. కార్ల తయారీదారులు తమ కార్లను 'కంప్యూటర్ ఆన్ వీల్స్' అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అంతా డొల్ల అని ప్రైపసీ ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌కు ప్రసిద్ధి చెందిన మొజిల్లా రిపోర్ట్ చేసింది. "ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే డోర్‌బెల్‌లు, గడియారాలు తమపై గూఢచర్యం చేస్తున్నాయని ఆందోళన నేపథ్యంలో కార్ బ్రాండ్లు కూడా తమ వాహనాలను డేటా-గాబ్లింగ్ మెషీన్లుగా మార్చడం ద్వారా నిశ్శబ్దంగా డేటా వ్యాపారంలోకి ప్రవేశించాయని మొజిల్లా పేర్కొంది. అధ్యయనం ప్రకారం టెస్లా టాప్‌లో ఉందంటూ మరో బాంబు పేల్చింది.నిస్సాన్ రెండో స్థానంలో నిలిచింది. నిస్సాన్ సేకరించే డేటాలో “లైంగిక కార్యకలాపాలు” ఎక్కువగానూ, అలాగే కియా కంపెనీ ప్రైవసీ సిస్టం ప్రకారం, జాతి, మతపరమైన లేదా తాత్విక విశ్వాసాలు, లైంగిక ధోరణి, లైంగిక జీవితం, రాజకీయ అభిప్రాయాలతోపాటు "ట్రేడ్ యూనియన్ సభ్యత్వం" సమాచారంతో సహా "ప్రత్యేక వర్గాల" డేటాను ప్రాసెస్ చేయవచ్చని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!) 84 శాతం బ్రాండ్స్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు , ఇతర బహిర్గతం చేయని వ్యాపారాలతో పంచుకున్నట్లు అంగీకరించినట్లు అధ్యయనం తెలిపింది. ఎక్కువమంది, 76 శాతం కస్టమర్ల డేటాను విక్రయించినట్లు చెప్పడం గమనార్హం. సగం కంటే ఎక్కువమంది డేటాను షేర్ చేస్తున్నట్టు చెప్పారు. కనెక్టెడ్ వాహనాలు డ్రైవింగ్ డేటామాత్రమే కాకుండా, వాహనంలోని వినోదం, శాటిలైట్ రేడియో మ్యాప్ లాంటి థర్డ్-పార్టీ ఫంక్షన్లను ట్రాక్ చేస్తున్నాయట. అత్యధిక సంఖ్యలో కార్ బ్రాండ్లు, 92 శాతం, కేవలం ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్, Dacia బ్రాండ్‌తో వినియోగదారులకు వారి వ్యక్తిగత డేటాపై ఎటువంటి నియంత్రణ లేకుండా అందిస్తోంది. బహుశా యూరోపియన్ యూనియన్ చట్టానికి లోబడి డేటా డిలిట్ రైట్ను వినియోగదారులకు అనుమతించి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. కనీస భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్నుటికీ ఫోర్డ్, చేవ్రొలెట్, టయోటా, వోక్స్వ్యాగన్ , BMW వంటి కార్ల బ్రాండ్లు ఏవీ కూడా గత మూడేళ్లుగా 68 శాతం డేటా లీక్‌లు, హ్యాక్‌లు లేదా ఉల్లంఘన బారిన పడుతున్నాయని మొజిల్లా ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్టడీపై టాప్ కంపెనీలేవీ ఇంకా ఎలాంటి స్పందన ప్రకటించలేదు. (రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?) కాగా ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్లు, భద్రత, డేటా నియంత్రణ, ఏఐ కి సంబంధించిన అన్ని రివ్యూల్లో ఫెయిల్ అనే విమర్శలను ఎదుర్కొంది. కస్టమర్ల కార్లలోని కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు,ఫోటోలు ను ఉద్యోగులు పంచుకోవడం దుమారాన్ని రేపింది. అయితే 2021లో, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా చైనా సైనిక మిలిటరీకి ఈ వాహనాలను నిషేధించిన తర్వాత చైనాలో కెమెరాలు నిలిపివేసినట్టు టెస్లా ప్రకటించింది. -
పాత కారే అని చీప్‌గా చూడకండి: ఈ విషయం తెలిస్తే..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కారు.. పేరులో పాత ఉందని చిన్నచూపు చూడకండి. దేశంలో అమ్ముడవుతున్న పాత కార్ల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెడతారు. 2022–23లో దేశవ్యాప్తంగా 15 శాతం వృద్ధితో 50 లక్షల యూనిట్ల యూజ్డ్ కార్లు చేతులు మారాయి. ఇందులో అవ్యవస్థీకృత రంగం వాటా 70 శాతం కాగా వ్యవస్థీకృత (ఆర్గనైజ్డ్) రంగం వాటా 30 శాతం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 65 లక్షల యూనిట్లను తాకనుంది. ఈ రంగంలో దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 8 శాతంగా ఉంది. భారత్‌లో 2030 నాటికి పాత కార్ల పరిశ్రమ కొత్త వాటితో పోలిస్తే రెండింతలకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా కారును సొంతం చేసుకుంటున్న కస్టమర్లలో 70 శాతం మంది పాత కారును కొనుగోలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. వ్యవస్థీకృత రంగమే.. యూజ్డ్ కార్ల మార్కెట్‌ను వ్యవస్థీకృత రంగమే నడిపిస్తోందని కార్స్24 కో–¸పౌండర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గజేంద్ర జంగిద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘పాత కార్ల రంగంలో అవ్యవస్థీకృత మార్కెట్ వార్షిక వృద్ధి 10 శాతమే. ఆర్గనైజ్డ్ మార్కెట్ ఏకంగా 30 శాతం వృద్ధి చెందుతోంది. కొత్త కార్ల విషయంలో 75 శాతం మందికి రుణం లభిస్తోంది. అదే పాత కార్లు అయితే ఈ సంఖ్య 15 శాతమే. యూజ్డ్ కార్లకు రుణం లభించడం అంత సులువు కాదు. ఇక కారు ఉండాలనుకోవడం ఒకప్పుడు ఆకాంక్ష. నేడు అవసరంగా భావిస్తున్నారు. అందుకే కొత్తదానితో పోలిస్తే సగం ధరలో దొరికే యూజ్డ్ కారు స్టీరింగ్ పట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సర్టీఫైడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. క్వాలిటీ చెక్స్, వారంటీ, రిటర్న్ పాలసీ, ఈజీ ఫైనాన్స్.. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో సర్టీఫైడ్ కార్ల పట్ల వినియోగదార్లలో నమ్మకం ఏర్పడింది’ అని ఆయన వివరించారు. రెండు నగరాల్లోనే.. భారత్‌లో యూజ్డ్ కార్ల విక్రయ రంగంలో ఉన్న కంపెనీలు, విక్రేతలు వాహనాలను కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. అదే హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లలో మాత్రమే పార్కింగ్ విధానం ఉందని కార్స్24 చెబుతోంది. అంటే పాత కారు యజమానులు యూజ్డ్ కార్స్ విక్రయ కేంద్రాల్లో అద్దె చెల్లించి తమ వాహనాన్ని పార్క్ చేయవచ్చు. మంచి బేరం వస్తే యజమాని సమ్మతి మేరకు కారును విక్రయిస్తారు. కమీషన్ ఆధారంగానూ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇక 2015లో 100 కొత్త కార్లు రోడ్డెక్కితే అంతే స్థాయిలో పాత కార్లు చేతులు మారాయి. ఇప్పుడీ సంఖ్య 150 యూనిట్లకు చేరింది. యూఎస్, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 100 కొత్త కార్లకు 400 పాత కార్లు అమ్ముడవుతున్నాయి. సగటు ధర రూ. 6 లక్షలు.. పాత కారు కొనుగోలు సగటు ధర రూ.6 లక్షలు ఉంటోంది. అమ్ముడవుతున్న మొత్తం పాత కార్లలో హ్యాచ్‌బ్యాక్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఈ విభాగం వృద్ధి నిలకడగా ఉంది. 20 శాతం వాటా ఉన్న సెడాన్స్ వృద్ధి రేటు తగ్గుతూ ప్రస్తుతం 20 శాతానికి వచ్చి చేరింది. ఎస్‌యూవీల వాటా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 20 శాతంగా ఉంది. అయితే వృద్ధి ఏకంగా 30 శాతానికి చేరింది. 2030 నాటికి ఎస్‌యూవీల వాటా పాత కార్ల కొనుగోళ్లలో 40 శాతానికి ఎగుస్తుందని పరిశ్రమ భావిస్తోందని సుదీర్కార్స్.కామ్ ఫౌండర్ బండి సు«దీర్ రెడ్డి తెలిపారు. అదే కొత్త కార్ల విషయంలో ప్రస్తుతం ఎస్‌యూవీల వాటా 45 శాతం తాకిందన్నారు. హ్యాచ్బ్యాక్స్ వాటా 30 శాతముందని చెప్పారు. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్ల కొత్త కార్లు రోడ్డెక్కాయి. 2023–24లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. -
ఒకదాన్ని మించి మరొకటి.. ఔరా అనిపించే వాహనాలు - ఓ లుక్కేసుకోండి!
ఆధునిక ప్రపంచంలో ఆటోమొబైల్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే అనేక కొత్త ఉత్పత్తులు పుట్టుకొచ్చాయి. కాగా ఇప్పుడు జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ఈవెంట్లో అనేక కొత్త కార్లు దర్శనమివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి ఆదివారం వరకు (సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు) జరిగే IAA మొబిలిటీ 2023 ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారులు, ఔత్సాహికులు, ఆవిష్కర్తలను ఒక చోటుకి చేరుస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద మొబిలిటీ షోలలో ఒకటైన ది మ్యూనిచ్ మోటార్ షో కోసం ఎంతోమంది వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. రానున్న రోజుల్లో ఫ్యూయెల్ కార్లకంటే కూడా ఎలక్ట్రిక్ కార్లకు ఎక్కువ ఆదరణ ఉండనుంది. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ కార్లుగా రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, టెస్లా, ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్, బీవైడీ (BYD), అవత్ర్ (Avatr) (చైనా కంపెనీ) తమ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌తో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం బాగా పెరిగింది. బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశాయి. అయితే ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ కంపెనీలు ఎలక్త్రుయిక్ కార్లను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ కంపెనీ కార్లు కూడా ఎలక్ట్రిక్ అవతార్‌లో కనిపించనున్నాయి. -
AP: కార్ల అమ్మకాలు రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చదవండి: కాకినాడకు ‘నానొ’చ్చేస్తున్నా! ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషిస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ ఎందుకు పెరిగాయి? కార్లు, ద్వి చక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయంటే అర్థమేంటీ..? రాష్ట్రంలో అభివృద్ది వేగంగా జరుగుతోందని అర్ధం. అంతేకాదు.. జనాల చేతుల్లో డబ్బులున్నాయని అర్ధం. సంపదను ప్రభుత్వం ప్రజలకు పంచుతుందని అర్ధం. -
వరల్డ్ ఛాంపియన్ 'నీరజ్ చోప్రా' అద్భుతమైన కార్లు, బైకులు - ఓ లుక్కేసుకోండి!
టోక్యో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్రను సృష్టించిన 'నీరజ్ చోప్రా' (Neeraj Chopra) తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణ పతకం గెలిచి యావత్ భారతదేశం మొత్తం గర్వపడేలా మరో రికార్డ్ నెలకొల్పాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మొదటి భారతీయుడిగా ప్రసిద్ధి చెందిన నీరజ్ ఎలాంటి కార్లు & బైకులు వినియోగిస్తారనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోర్డ్ మస్టాంగ్ జీటీ (Ford Mustang GT).. నీరజ్ చోప్రా గ్యారేజిలోని మొదటి కారు ఈ ఫోర్డ్ మస్టాంగ్ జీటీ. దీని ధర రూ. 75 లక్షల వరకు ఉంటుందని సమాచారం. చాలామంది సెలబ్రిటీలకు కూడా ఈ అమెరికన్ బ్రాండ్ కారంటే చాలా ఇష్టం. ఇది 5.0 లీటర్ ఇంజన్ కలిగి 396 హార్స్ పవర్, 515 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మస్టాంగ్ టాప్ స్పీడ్ గంటకు 180 మైల్స్/గం. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (Range Rover Sport).. రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన 'స్పోర్ట్స్' కారు కూడా నీరజ్ చోప్రా వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 2.20 కోట్లు ధర కలిగిన ఈ లగ్జరీ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 5.0 లీటర్ V8 ఇంజన్ కలిగి 567 హార్స్ పవర్ & 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ. మహీంద్రా థార్ & XUV700.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'థార్' నీరజ్ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 17 లక్షలు విలువైన ఈ కారు అద్భుతమైన ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది 2.2 లీటర్ డీజిల్ & 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయానికి వస్తే, ఇది నీరజ్ కోసం ప్రత్యేకంగా రూపోంచిన కారు. ఇందులో చాలా వరకు కస్టమైజ్ చేసిన డిజైన్స్ చూడవచ్చు. ఈ SUV మిగిలిన కార్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది కూడా పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner).. భారతదేశంలో ఎక్కువమంది వినియోగించే టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్ నీరజ్ చోప్రా గ్యారేజిలో ఉంది0 దీని ధర రూ. 51 లక్షలు అని తెలుస్తోంది. 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్ 2.7-లీటర్ పెట్రోల్ అండ్ 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లతో వస్తుంది. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా! హార్లే డేవిడ్సన్ 1200 రోడ్‌స్టర్ (Harley-Davidson 1200 Roadster).. బైక్ విభాగంలో ఖరీదైనవిగా భావించే హార్లే డేవిడ్సన్ 1200 రోడ్‌స్టర్ నీరజ్ చోప్రా వద్ద ఉంది. దీనిని 2019లో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువ. ఇదీ చదవండి: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 'ఏఐ'పై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన బజాజ్ పల్సర్ 200ఎఫ్ (Bajaj Pulsar 200F).. ఎక్కువమంది యువ రైడర్లకు ఇష్టమైన బజాజ్ పల్సర్ 200ఎఫ్ కూడా నీరజ్ గ్యారేజిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కార్లు, బైకులు మాత్రమే కాకుండా ఒక ట్రాక్టర్ కూడా నీరజ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj____chopra) -
ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తోంది...సూపర్ అప్‌కమింగ్ కార్లు
TopUpcomingCars: పండుగల సీజన్ సమీపిస్తున్నతరుణంలో భారత మార్కెట్లోకి కొత్త కార్లు హల్చల్ చేస్తున్నాయి. వినాయక చవితి దసరా, దీపావళి రోజుల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పండుగల సీజన్ కార్ల డిమాండ్ నేపథ్యంలో అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్, ఈవీ కార్లు ఇలా రకరకాల సెగ్మెంట్లలో కార్లను లాంచ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, రానున్న రాబోయే మోడళ్ల కార్లను ఓసారి చూద్దాం! Maruti suzuki invicto మారుతి సుజుకి ఇండియా తన లీడర్ మోడల్ - మారుతి సుజుకి ఇన్విక్టో ఎమ్‌పివిని జీటా ఆల్ఫా అనే రెండు వేరియేషన్లలో అందుబాటులో ఉంది. మారుతి ఇన్విక్టో ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో సరిపోలిన 2.0-లీటర్ పెట్రోల్ మోటారును పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 11 బిహెచ్పి ,206 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఐసిఇ వెర్షన్ 172 బిహెచ్పి మరియు 188 ఎన్ఎమ్ టార్క్‌ను కలిగి ఉంది. ధర రూ. రూ. 24.79 లక్షలు 28.42 లక్షలు (ఎక్స్ షోరూం) Honda Elevate హోండా ఎలివేట్ వచ్చే నెల ( సెప్టెంబరు) లో దేశంలో సేల్ కు రానుంది.హోండా ఎలివేట్ 1.5L NA పెట్రోల్ ఇంజన్‌తో 6-స్పీడ్ MT , CVT అనే రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో లభ్యం. దీని ధర రూ. 10.50-17 లక్షలు ఉంటుందని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ లాంటివాటికి గట్టి పోటీగా ఉండనుంది. Citroen C3 Aircross సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: 7-సీటర్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ బెస్ట్ ఆప్షన్. బోల్డ్ స్టైలింగ్‌తో, బెస్ట్ ఇంటీరియర్‌తో వస్తోంది. అయితే ఇది 1.2L టర్బో-పెట్రోల్ కేవలం ఒక ఇంజన్ ఎంపిక మాత్రమే లభ్యం. దీని ధర రూ. 9-13 లక్షలు ఉంటుందని అంచనా. Toyota Rumion మరో 7-సీటర్ కారు టయోటా రూమియన్. ఈమధ్యనే లాంచ్ అయినా ఈ కారు త్వరలోనే కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. విజువల్ ఫ్రంట్‌లో కొన్ని మార్పులను కలిగి ఉంది. అలాగే రేడియేటర్ గ్రిల్ సవరించిన బంపర్‌తో కొత్తగానూ, అల్లాయ్ వీల్స్ కూడా తాజా డిజైన్‌ను కలిగి ఉన్నాయి. టయోటా లోగో మినహా లోపలి భాగంలో అంతా సేమ్. Tata Punch EV SUV టాటా పంచ్ ఈవీ టియాగో ఈవీ తరహాలో ఇదే ఆర్కిటెక్చర్‌తో పంచ్ ఈవీని విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇది జిప్ట్రాన్ సాంకేతికతతో బానెట్ కింద ఉంచబడిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తోంది. 350 కిమీల పరిధితో లాంచ్ కానుంది. దీని ధర రూ. 9-12 లక్షలు ఉంటుందని అంచనా. Tata Nexon facelift ప్రమోషనల్ షూట్లో అందరి దృష్టినీ ఆకర్షించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని తొలుత అనుకున్నప్పటికీ పండుగ సీజన్లోనే దాదాపు అక్టోబరులోనే దీన్ని లాంచ్ చేస్తుందని తాజా అంచనా.దీని ధర రూ. 8-15 లక్షలు ఉంటుందని అంచనా. Volvo C40 Recharge వోల్వో సీ40 రీఛార్జ్ (VolvoC40) XC40 రీఛార్జ్ SUV-కూపే వెర్షన్. మెరుగు పర్చిన 78kWh బ్యాటరీ ప్యాక్‌తో,530కిమీ పరిధిని అందిస్తుంది. 408PSతో డ్యూయల్-మోటార్ AWD కారణంగా 4.7 సెకన్లలో 100kmph వరకు దూసుకెళ్తుంది. అంచనా ధర రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెప్టెంబరు 4న లాంచింగ్ -
మహీంద్రా కీలక నిర్ణయం..ఎక్స్‌యూవీ 700 కార్లను వెనక్కి ఇచ్చేయండి
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌యూవీ 700 కార్ల ఇంజన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్‌లో లోపాల్ని గుర్తించింది. వెంటనే ఈ సమస్య ఉన్న కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, 2021 జూన్ 8 నుంచి 2023 జూన్ 28 మధ్య తయారైన మొత్తం 1,08,306 కార్లలో ఈ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌యూవీ 700తో పాటు, ఎక్స్‌యూవీ 400 ఎస్‌యూవీలను సైతం రీకాల్ చేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. 2023 ఫిబ్రవరి 16 నుంచి 2023 జూన్ 5 మధ్య తయారైన 3,560 కార్లలో బ్రేక్ పొటెన్షియోమీటర్‌లో స్ప్రింగ్ రిటర్న్ యాక్షన్‌లో లోపాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కార్లను సైతం వెనక్కి రప్పిస్తున్నట్లు మహీంద్రా తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కార్లలో సమస్యల్ని గుర్తించి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా బాగు చేసి కస్టమర్లకు అందిస్తామని స్పష్టం చేసింది. -
ఎంజీ మోటార్స్.. ఏడాది చివరి నాటికి 400 షోరూమ్స్ దిశగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్ దేశీయంగా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దాదాపు 330 స్టోర్స్ ఉండగా.. ఏడాది ఆఖరు నాటికి వీటిని 400కు పెంచుకోనుంది. తెలంగాణలో 9 స్టోర్స్ ఉండగా.. వీటిని 20కి పెంచుకోనుంది. హైదరాబాద్‌లో కొత్తగా మూడు స్టోర్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డిప్యుటీ ఎండీ గౌరవ్ గుప్తా ఈ విషయాలు తెలిపారు. తెలంగాణలో 13,000 పైచిలుకు వాహనాలను విక్రయించినట్లు ఆయన వివరించారు. గతేడాది ఇక్కడ 4,000 పైచిలుకు వాహనాలను విక్రయించగా, ఈసారి 5,000 వాహనాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుప్తా తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పుంజుకుంటోందని చెప్పారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ విజయవాడ, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో తమ స్టోర్స్ ఉన్నట్లు తెలిపారు. ఏడాదికో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలనే వ్యూహంతో ముందుకెడుతున్నామని.. వచ్చే సంవత్సరం మరో కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామని ఆయన వివరించారు. ఎంజీ మోటార్స్ ప్రస్తుతం హెక్టర్, జియస్, కామెట్ తదితర వాహనాలను విక్రయిస్తోంది. -
పాత కార్ల అమ్మకాల్లో కనీవినీ ఎరుగని రికార్డ్ - అట్లుంటది మారుతి అంటే!
న్యూఢిల్లీ: ఆటోమొబై ల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐఎల్) గత రెండు దశాబ్దాల్లో రికార్డు స్థాయిలో పాత కార్లను విక్రయించింది. సంస్థలో భాగమైన ట్రూ వేల్యూ 22 ఏళ్లలో 50 లక్షల వాహనాలను అమ్మింది. ట్రూ వేల్యూ 2001లో ఏర్పాటైంది. ప్రస్తుతం 281 నగరాల్లో 560 అవుట్‌లెట్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. ‘మారుతీ సుజుకీ ట్రూ వేల్యూ పరిశ్రమలో విజయవంతంగా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. 50 లక్షల మంది కొనుగోలుదారులకు సంతోషాలను పంచింది. వారి ప్రథమ ఎంపికగా ఎదిగింది‘ అని ఎంఎస్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
ఎలక్ట్రిక్ ఆటోపరికరాల తయారీకి కొత్త కంపెనీ
ముంబై: ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ పరికరాల తయారీ కోసం కొత్తగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు కైనెటిక్ ఇంజినీరింగ్ వెల్లడించింది. కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ పేరుతో 2022లో దీన్ని నెలకొల్పినట్లు తెలిపింది. ఇది మోటార్లు, కంట్రోలర్లు, బ్యాటరీలు మొదలైనవి తయారు చేస్తుందని పేర్కొంది. కొత్త కంపెనీలో మాతృ సంస్థకు 92 శాతం, ప్రమోటర్లయిన ఫిరోదియా కుటుంబానికి మిగతా 8 శాతం వాటాలు ఉంటాయి వ్యూహాత్మక/ఆర్థిక భాగస్వామికి 25 శాతం వరకు వాటాను విక్రయించేందుకు కూడా కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేఈఎల్, కైనెటిక్ కమ్యూనికేషన్స్ కింద ఉన్న తమ ప్రస్తుత ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) వ్యాపారాన్ని కొత్త సంస్థలో విలీనం చేయనున్నట్లు కైనెటిక్ ఇంజినీరింగ్ ఎండీ అజింక్యా ఫిరోదియా తెలిపారు. తాము ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల కోసం గేర్‌బాక్సులు, ఛాసిస్‌లను తయారు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా 700 పైచిలుకు సంస్థలు ద్విచక్ర ఈవీలను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో తమకు భారీగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆయన ఫిరోదియా చెప్పారు. -
ఆగష్టులో విడుదలయ్యే కొత్త కార్లు ఇవే!
Upcoming Cars: జులై నెల దాదాపు ముగిసింది. ఇక రెండు రోజుల్లో ఆగష్టు నెల రానుంది. అయితే ఆ నెలలో (ఆగష్టు) విడుదలయ్యే కొత్త కార్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది.. ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG) దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ కంపెనీకి చెందిన మైక్రో ఎస్యువి త్వరలో సీఎన్జీ రూపంలో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టింది. గత కొంత కాలంలో ఇది టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. కావున ఈ కారు ఆగష్టు ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సెకండ్ జనరేషన్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్సీ (Second-gen Mercedes-Benz GLC) జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 2023 ఆగష్టు 09న తన సెకండ్ జనరేషన్ జిఎల్సీ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తాహముగా అరంగేట్రం చేసిన ఈ కారు పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవకాశం లేదు. ఆధునిక కాలంలో వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ లభించనున్నట్లు స్పష్టమవుతోంది. ఆడి క్యూ8 ఈ-ట్రాన్ (Audi Q8 e-tron) జర్మనీ బ్రాండ్ కంపెనీ అయిన ఆడి కూడా ఆగష్టు 18న తన క్యూ8 ఈ-ట్రాన్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా, రియర్ బంపర్ వంటి వాటిని కలిగిన ఈ కారు ఒక ఫుల్ ఛార్జ్‌తో 600 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ టయోటా రూమియన్ (Toyota Rumion) మనదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లు ఏవైన ఉన్నాయంటే అందులో 'టయోటా' కూడా ఉంటుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలో అందుబాటులో ఉన్న ఈ ఎంపివి త్వరలోనే ఇండియన్ మార్కెట్లో కూడా అడుగుపెట్టనుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 103 హార్స్ పవరే, 137 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. రానున్న రోజుల్లో ఇది సీఎన్జీ రూపంలో విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇదీ చదవండి: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు! వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge) స్వీడన్ కంపెనీకి చెందిన వోల్వో కంపెనీ త్వరలో సీ40 రీఛార్జ్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది కంపెనీకి చెందిన రెండవ ఎలక్ట్రిక్ మోడల్ కావడం విశేషం. ఇది చూడటానికి దాదాపు దాని మునుపటి మోడల్ గుర్తుకు తెస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
వైరల్ వీడియో: వరద నీటిలో ముగినిపోయిన వందలాది కార్లు
-
షాకింగ్ వీడియో.. వరద నీటిలో ముగినిపోయిన వందలాది కార్లు
దేశ వ్యాప్తంగా వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు. కుండపోత వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనావాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా.. రహదారులు, కాలనీలు ఇలా ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ముందుకు కదలడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతోసహా ఉత్తర భారత దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. యమునా ఉప నది అయిన హిండన్ నది నీటిమట్టం పెరగడంతో గ్రేటర్ నోయిడా మునిపోయింది. ఓ బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసిన దాదాపు 200కు పైగా కార్లు నీట మునిగాయి. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో వరస క్రమంలో పార్క్ చేసిన తెలుపు రంగు కార్ల పైకప్పుల వరకు వరద నీరు కప్పేసి ఉండటం కనిపిస్తోంది. హిండన్‌లో నీటి మట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలో ఉన్న వారిని తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి. నోయిడా, ఢిల్లీ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో ఈరోజు తెల్లవారుజామున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈరోజు మధ్యాహ్న సమయానికి యమునా నది ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) మించి ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 205.4 మీటర్ల స్థాయిలో ఉంది. -
భారత్‌లో టాప్ 5 బెస్ట్ సన్‌రూఫ్ కార్లు ఇవే!
Affordable Cars With Sunroof: ఆధునిక కాలంలో కార్ల కొనుగోలుదారులు లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న వాటిని కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. కావున కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్లో కస్టమర్ల సౌలభ్యం మేరకు కావలసిన ఫీచర్స్ అందిస్తున్నాయి. ఒకప్పుడు సన్‌రూఫ్ అనేది కేవలం హై-ఎండ్ కార్లలో మాత్రమే లభించేది. కాగా ఇప్పుడు మనకు స్టాండర్డ్ ఎస్‌యువిలలో కూడా ఈ ఫీచర్ లభిస్తోంది. మార్కెట్లో లభించే టాప్ 5 బెస్ట్ సన్‌రూఫ్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా సన్‌రూఫ్ ఫీచర్‌తో దాని విభాగంలో లభించే సరసమైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 13.96 లక్షల నుంచి రూ. 19.20 లక్షల వరకు ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు 1.5-లీటర్, పెట్రోల్ ఇంజన్ & 1.5-లీటర్, డీజిల్ ఇంజన్ పొందుతుంది. రేండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతాయి. ఎంజి ఆస్టర్ (MG Aster) రూ. 14.21 లక్షల నుంచి రూ. 18.69 లక్షల మధ్య లభించే ఈ ఎంజి ఆస్టర్ సన్‌రూఫ్ ఫీచర్ లభించే ఉత్తమ మోడల్. ఇది 1.5-లీటర్, పెట్రోల్ అండ్ 1.3-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్స్ పొందుతుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. రెడ్ కలర్ ఇంటీరియర్ కలిగిన ఈ కారు చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. కియా సెల్టోస్ (Kia Seltos) సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ పాపులర్ కారు సెల్టోస్ సన్‌రూఫ్ ఫీచర్‌తో లభించే అత్యుత్తమ కారు. దీని ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 1.5-లీటర్, పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తాయి. కాగా మల్టిపుల్ గేర్‌బాక్స్ ఎంపికలు ఇందులో లభించడం విశేషం. ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు ఎంతోమంది ప్రజలకు నచ్చిన మోడల్ కావడం గమనార్హం. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) రూ. 15.41 లక్షల నుంచి రూ. 19.83 లక్షల మధ్య లభించే మారుతి సుజుకి గ్రాండ్ విటారా సన్‌రూఫ్ ఫీచర్ కలిగి టాప్ 5 కార్లలో ఒకటి. ఒక మిడ్-సైజ్ ఎస్యువి సన్‌రూఫ్ ఫీచర్‌తో రావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇది ఆల్ఫా పెట్రోల్ ట్రిమ్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ట్రిమ్‌లలో మాత్రమే లభిస్తుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఐఐటీ నుంచి సాఫ్ట్వేర్.. లక్షల ఉద్యోగం వదిలి కమెడియన్‌గా.. ఎంత సంపాదిస్తున్నాడంటే?) టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) టయోటా కంపెనీకి చెందిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మన జాబితాలో అత్యధిక ధర వద్ద లభించే సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన కారు. దీని ధర రూ. 16.04 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. బ్లాక్ అండ్ బేజ్ కలర్ ఆప్షన్ ఇంటీరియర్ కలిగిన ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 1.5-లీటర్ పెట్రోల్ & 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో e-CVT పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
గుజరాత్లో వరద బీభత్సం.. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు
జునాగఢ్: గుజరాత్‌ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు నగరాలను సైతం నీట ముంచుతున్నాయి. వరద నీటితో నదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. నవసారి, జునాగఢ్, ద్వారక, భావనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్షం కుంభవృష్టి సంభవించింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాలనీల్లో ప్రవహించే వరద నీరు నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. వరదల్లో వస్తువులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. जूनागढ़ : मेघ तांडव… खिलौने की तरफ़ पानी में डूबती तैरती कारें, मुख्य सड़क पर पानी का ज़बरदस्त बहाव,#JunagadhRain pic.twitter.com/T7lesOoh86 — Janak Dave (@dave_janak) July 22, 2023 నవసారి జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. కాలనీలు వరద నీటితో బురదమయంగా మారాయి. జునాగఢ్‌లోనూ అదే పరిస్థితి. నవసారిలో 30.3 సెంటీమీటర్ల వర్షం సంభవించగా.. జునాగఢ్‌లో 21.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జులై 24 వరకు సౌరాష్ట్రలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ పక్కనే ఉన్న మహారాష్ట్రలోనూ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. మహారాష్ట్రాను కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. #WATCH | Maharashtra: Severe waterlogging witnessed in Yavatmal due to incessant rain in the region. pic.twitter.com/3iARiiBfbI — ANI (@ANI) July 22, 2023 ఇదీ చదవండి: నదిలో చిక్కుకున్న బస్సు.. 40 మంది అందులోనే.. వీడియో వైరల్.. -
దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్
అహ్మదాబాద్: హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలను వణికించిన వర్షాలు ఇక గుజరాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నేడు గుజరాత్‌లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కేవలం కొన్ని గంటల్లోనే 30 సెంటీమీటర్ల వర్షం సంభవించింది. దీంతో రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. రానున్న మరికొన్ని గంటల్లో దక్షిణ గుజరాత్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) వెల్లడించింది. వర్షాల ధాటికి గుజరాత్లో పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. రహదారులపై నీరు పేరుకుని రాకపోకలు దెబ్బతిన్నాయి. వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. #WATCH | Gujarat | Severe waterlogging in Dhoraji city of Rajkot district due to incessant rainfall. (18.07) Around 300 mm of rainfall has been recorded in the last few hours. 70 people have been shifted to safer places. pic.twitter.com/oaf5Z03q5R — ANI (@ANI) July 18, 2023 గుజరాత్లో నేడు ఉదయం 6 గంటల నుంచి దాదాపు 14 గంటల్లోనే గిర్ సోమనాథ్ జిల్లాలోని సుత్రపడ తాలూకాలో అత్యధికంగా 345 మీమీ వర్షపాతం సంభవించింది. రాజ్‌కోట్‌లోని ధోరాజీ తాలూకాలో 250 మీమీ వర్షపాతం రాగా.. కేవలం రెండు గంటల్లోనే 145 మీమీ వర్షం సంభవించడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా గుజరాత్లో 43 రిజర్వాయర్లకు హై అలర్ట్ జారీ చేశారు. 18 డ్యామ్‌లకు అలర్ట్ జారీ చేశారు. భారత విపత్తు నిర్వహణ శాఖా కూడా అలర్ట్ అయింది. ఇదీ చదవండి: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. ట్రాన్స్ఫార్మర్ పేలి కరెంట్ షాక్‌తో 15 మంది దుర్మరణం -
ఆఫ్ రోడింగ్ అంటే ఈ కార్లు ఉండాల్సిందే - ఎందుకంటే?
ఆధునిక కాలంలో భారతీయ మార్కెట్లో అనేక వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో కొంతమంది హ్యాచ్‌బ్యాక్ కార్లను కొనుగోలు చేస్తే, కొంతమంది ఎంపివిలను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలామంది ఆఫ్ రోడింగ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మనం ఈ కథనంలో దేశీయ విఫణిలో అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే ఐదు ఆఫ్-రోడ్ కార్లను గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Zimny) ఆఫ్ రోడింగ్ అనగానే గుర్తొచ్చే కార్ల జాబితాలో మారుతి కంపెనీకి చెందిన జిమ్నీ ఒకటి. దీని ధర రూ. 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల వరకు ఉంటాయి. ఈ SUV 4x4 హార్డ్‌వేర్, దృఢమైన సస్పెన్షన్, లైట్ కర్బ్ వెయిట్, నారో ట్రాక్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. మహీంద్రా థార్ (Mahindra Thar) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన అమ్మకాలు పొందుతున్న థార్ పర్ఫామెన్స్ విషయంలో అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ కారుని ఎగబడి మరి కొనుగోలు చేస్తుంటారు. దీని ధర రూ. 13.87 లక్షల నుంచి రూ. 16.78 లక్షల వరకు ఉంటుంది. మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ కలిగిన ఈ SUV ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. ఫోర్స్ గూర్ఖా (Force Gurkha) అమ్మకాల పరంగా థార్, జిమ్నీ అంత ఆదరణ పొందనప్పటికీ ఆఫ్ రోడింగ్ విషయం ఇది కూడా అద్భుతమైన చెప్పుకోదగ్గ మోడల్. దీని ధర రూ. 14.75 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?) మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N) దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా మన జాబితాలో అద్భుతమైన కారు. ఇది SUV అయినప్పటికీ ఆఫ్ రోడింగ్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. కావున అద్భుతమైన ఆఫ్ రోడర్‌గా కూడా పనిచేస్తుంది. దీని ధర రూ. 17.69 లక్షల నుంచి రూ. 24.52 లక్షల మధ్య ఉంది. ఇది ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్, లో లెవెల్ గేర్‌బాక్స్ అండ్ మెకానికల్ లాకింగ్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. (ఇదీ చదవండి: కొత్త కారు కొన్న ఆనందంలో రచ్చ రచ్చ చేసిన వామిక గబ్బి - వైరల్ వీడియో) ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ (Isuzu D-Max V-Cross) ఆఫ్ రోడింగ్ విభాగంలో అత్యంత ఖరీదైన కారు ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్. దీని ధర రూ. 23.50 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు ఉంది. ఇది సాధారణ ఆఫ్ రోడింగ్ వాహనాల మాదిరిగా కాకుండా లైఫ్ స్టైల్ పికప్ ట్రక్కు మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో వెనుక ఒక చిన్న లగేజ్ స్పేస్ ఉంటుంది. అయినప్పటికీ ఇది మంచి పనితీరుని అందిస్తుంది. -
మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే కార్లు: ఎపుడైనా చూశారా? (ఫొటోలు)
-
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్స్ చూడండి!
భారతదేశంలో త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు మహీంద్రా, మారుతి సుజుకి కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా కంపెనీ తన థార్ 4x4, బొలెరో, బొలెరో నియో, మరాజో, ఎక్స్యువి300 వంటి కార్ల మీద డిస్కౌంట్స్, బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే కనిష్టంగా రూ. 30,000 నుంచి గరిష్టంగా రూ. 73,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ ఎంచుకునే వేరియంట్, ఇంజిన్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. (ఇదీ చదవండి: హ్యుందాయ్ కొత్త కారు - టాటా ప్రత్యర్థిగా నిలుస్తుందా?) మారుతి సుజుకి విషయానికి వస్తే.. కంపెనీ ఈ నెలలో నెక్సా మోడల్స్ అయిన ఇగ్నిస్, సియాజ్, బాలెనో మీద రూ. 64,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, ఈకో, డిజైర్ మీద కూడా కంపెనీ రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీలు అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ బెనిఫిట్స్ స్టాక్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించవచ్చు. -
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. త్వరలో రానున్న లేటెస్ట్ మోడల్స్ ఇవే!
భారతదేశంలో పండుగ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది, అయితే ఇప్పటికే అనేక కంపెనీలు ఆధునిక మోడల్స్ (కార్లు & బైకులు) విడుదల చేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని కార్లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో టాటా పంచ్ ఈవీ, ఫోర్స్ గూర్ఖా 5-డోర్, హోండా ఎలివేట్ మొదలైన మోడల్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఇప్పటికే ఉత్తమ అమ్మకాలు పొందుతున్న టాటా పంచ్ మైక్రో ఎస్‌యువిని ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయంలో అనేక సందర్భాల్లో కనిపించింది. కావున ఇది 2023 సెప్టెంబర్ నాటికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఫోర్స్ గూర్ఖా 5-డోర్ (Force Gurkha 5 Door) అత్యంత శక్తివంతమైన ఆఫ్ రోడర్ ఫోర్స్ గూర్ఖా కూడా త్వరలో 5 డోర్స్ వెర్షన్లో విడుదలకావడానికి సిద్ధంగా ఉంది. కేరళ మార్కెట్లో విపరీతమైన అమ్మకాలు పొందిన ఈ SUV మరిన్ని ఆధునిక హంగులతో విడుదలైతే తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని తెలుస్తోంది. ఇది 5 డోర్ మోడల్ కాబట్టి సీటింగ్ కాన్ఫిగరేషన్ మారుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. హోండా ఎలివేట్ (Honda Elevate) 2023 సెప్టెంబర్ నాటికి దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కారు మిడ్ సైజ్ విభాగంలో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది మన దేశంలో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer) 2023 ఆటో ఎక్స్పో వేదికపై కనిపించిన టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇది హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ హ్యాచ్‌బ్యాక్ ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందిస్తుందని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ జీతం వారికే.. సర్వేలో హైదరాబాద్ ఎక్కడుందంటే?) టయోటా రూమియన్ (Toyota Rumion) ఎమ్‌పివి విభాగంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మాత్రమే కాకుండా వినియోగదారుల కోసం టయోటా కొత్త 'రూమియన్' విడుదల చేయనుంది. మారుతి ఎర్టిగా బేస్డ్ రూమియన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 2021 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో విడుదలైన ఈ కారు 2023 సెప్టెంబర్ నాటికి భారతీయ గడ్డపై అడుగుపెట్టనుంది. దీని కోసం కంపెనీ ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది. ఇవి మాత్రమే కాకుండా మార్కెట్లో విడుదలకావడానికి హ్యుందాయ్ ఐ20 పేస్లిఫ్ట్ (2023 నవంబర్), ఫోక్స్‌వ్యాగన్ పోలో (2023 నవంబర్), ఎంజి 3 (MG 3) హ్యాచ్‌బ్యాక్ కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత
ముంబై: కార్ల కొనుగోలు విషయంలో కస్టమర్లు భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా, ఎన్ఐక్యూ బేసెస్ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా క్రాష్ రేటింగ్‌లు, ఎయిర్ బ్యాగుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారని తెలిపింది. జనాదరణ పొందిన ఫీచర్లలో ఇంధన సామర్థ్యం మూడో స్థానంలో ఉంది. భారత్‌లో కార్లకు భద్రతా రేటింగ్ తప్పనిసరిగా ఉండాలని 10 మందిలో 9 మంది కస్టమర్లు అభిప్రాయపడ్డారు. ‘అధిక రేటింగ్ మోడళ్లు కలిగిన తొలి 3 బ్రాండ్లలో స్కోడా ఒకటి. గ్లోబల్ ఎన్సీఏపీ పరీక్షలో స్లావియా, కుషాక్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. భద్రత మాకు తొలి ప్రాధాన్యత’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోలాక్ తెలిపారు. -
Dhoni Cars, Bikes Collection: ధోనీ అంటేనే సెన్సేషన్ అదో..వైబ్రేషన్ చూడండి ఆయన క్లాసిక్ కలెక్షన్ (ఫోటోలు)
-
పాకిస్థాన్ ప్రజల మనసు దోచిన పాపులర్ కార్లు ఇవే!
Pakistan Popular Cars: మనం ఇప్పటి వరకు చాలా కథనాలతో భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లు, సేఫ్టీ కార్లు, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు, మంచి పాపులర్ కార్లను గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఎక్కువగా ఉపయోగించే పాపులర్ కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సుజుకి ఆల్టో పాకిస్థాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల జాబితాలో సుజుకి ఆల్టో ఒకటి. దీని ధర 22,51,000 పాకిస్థాన్ రూపాయలు (PKR). భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 6 లక్షల కంటే ఎక్కువ. ఈ కారు ఇండియాలో అమ్ముడయ్యే కారు కంటే భిన్నంగా ఉంటుంది. 2023 మార్చిలో మొత్తం 2542 ఆల్టో యూనిట్లు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. సుజుకి స్విఫ్ట్ భారతీయ విఫణిలో మాత్రమే కాకుండా పాకిస్థాన్ ప్రజలను కూడా ఎక్కువ ఆకర్శించిన కారు సుజుకి స్విఫ్ట్. దీని ప్రారంభ ధర PKR 42,56,000. గత మార్చి నెలలో కంపెనీ ఆ దేశంలో 877 యూనిట్లను విక్రయించింది. ఇది కేవలం 1.2-లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజిన్ 6000 rpm వద్ద 89 bhp పవర్, 4200 rpm వద్ద 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుజుకి బోలన్ ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి ఓమ్ని మాదిరిగా అమ్ముడవుతున్న కారు పాకిస్థాన్‌లో బోలాన్ పేరుతో అమ్ముడవుతోంది. ఓమ్నికి.. బోలాన్ కారుకి డిజైన్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. 2023 మార్చిలో 782 యూనిట్లు అమ్ముడైన ఈ కారు ధర PKR 19,40,000. ఇది 3-సిలిండర్ OHC 6-వాల్వ్ ఇంజన్‌తో 5000 rpm వద్ద 37 bhp, 3000 rpm వద్ద 62 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. టయోటా కరోలా ఆల్టిస్ ఎక్స్ పాకిస్థాన్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అత్యధిక అమ్మకాలు పొందుతున్న కారు 'టయోటా కరోలా ఆల్టిస్ ఎక్స్'. దీని ప్రారంభ ధర PKR 61,69,000. 2023 మార్చిలో ఇది 778 యూనిట్ల అమ్మకాలను పొందింది. చూడటానికి హోండా సిటీ మాదిరిగా ఉండే ఈ కారు రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: మహీంద్రా ప్రియులకు గుడ్ న్యూస్.. థార్ 5 డోర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!) హోండా సిటీ ఎక్కువ మంది భారతీయులను ఆకర్శించిన హోండా సిటీ, పాకిస్థాన్ వాహన ప్రియులను కూడా ఆకర్శించడంలో విజయం సాధించింది. 2023 మార్చిలో 611 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇది కూడా రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర PKR 47,79,000. ఎంచుకునే వేరియంట్‌ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న కొత్త కార్లు - ఇన్విక్టో నుంచి ఎక్స్టర్ వరకు..) నిజానికి పాక్ ఆర్థిక వ్యవస్థ భారత్‌లో కొంత భాగం మాత్రమే కావచ్చు, కానీ ఆటోమోటివ్ ఉత్పత్తిలో ప్రపంచంలో 35వ స్థానంలో ఉంది. అంతే కాకుండా జాతీయ ఖజానాకు ప్రతి సంవత్సరం దాదాపు $220 మిలియన్ డాలర్లకు దోహదం చేస్తోంది. అయితే గత కొంత కాలంలో అక్కడ ఏర్పడిన అంతర్గత సవాళ్లు, షట్డౌన్లు, రాజకీయ అస్థిర వాతావరణం కారణంగా ఆటోమోటివ్ పరిశ్రమ కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. -
త్వరలో విడుదలకానున్న కొత్త కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ వంటి అత్యంత ఖరీదైన కార్లు దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. కాగా వచ్చే నెలలో కూడా కొన్ని కార్లు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఇన్విక్టో, హ్యుందాయ్ ఎక్స్టర్, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా 2023 జులై 5న ఇన్విక్టో అనే కొత్త ఎంపివిని విడుదల చేయనుంది. కంపెనీ దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రూ. 25,000 టోకెన్ మొత్తంతో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న మైక్రో ఎస్యువి 'ఎక్స్టర్'. కంపెనీ రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరిస్తుంది. ఇది జులై 10న అధికారికంగా విడుదలకానున్నట్లు ఇప్పటికే సంస్థ వెల్లడించింది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు సింగిల్ అండ్ డ్యూయెల్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?) హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్జీ ఇంజన్ తక్కువ అవుట్‌పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందుతున్న కియా సెల్టోస్ త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త మోడల్ ట్వీక్డ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ లాంప్స్ వంటి వాటితో పాటు సరి కొత్త బంపర్ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్‌లో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 115 హార్స్పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు.. 116 హార్స్పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఈ కారుకి సంబంధించిన అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు. జులై మధ్య నాటికి లేదా చివరి నాటికి అధికారిక ధరలు తెలుస్తాయి. -
ఫోక్స్‌వ్యాగన్ ఆఫర్ల జాతర.. టైగన్, వర్టస్ కొనుగోలుకు ఇదే మంచి సమయం!
ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) కంపెనీ ఎట్టకేలకు తన టైగన్ అండ్ వర్టస్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం 2022 - 2023 మోడల్ కార్లకు, BS6 ఫేజ్-2 కంప్లైంట్ ఇంజన్లతో నడిచే కార్లకు మాత్రమే లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 2022 మోడల్ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మీద రూ. 1.40 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో కూడా వేరియంట్‌ను బట్టి రూ. 65,000 నుంచి తగ్గింపులు ప్రారంభమవుతాయి. టాప్‌లైన్ మాన్యువల్ వేరియంట్ మీద అత్యధిక తగ్గింపు, కంఫర్ట్‌లైన్ మాన్యువల్ వేరియంట్ మీద అత్యల్ప తగ్గింపు లభిస్తుంది. అయితే 2023 మోడల్ మీద రూ. 85,000 వరకు లభిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఇక ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ విషయానికి వస్తే.. కంపెనీ 2022 మోడల్ ఇయర్ మోడల్ మీద రూ. 1.20 లక్షల తగ్గింపుని ప్రకటించింది. ఇది కూడా కంఫర్ట్‌లైన్ మాన్యువల్, టాప్‌లైన్ మాన్యువల్ వేరియంట్లకు అత్యధికంగా లభిస్తుంది. మరో వైపు జీటీ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 20000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది. అదే సమయంలో 2023 మోడల్ ఇయర్ వర్టస్ కంఫర్ట్‌లైన్ మాన్యువల్, టాప్‌లైన్ మాన్యువల్, ఆటోమేటిక్ అనే మూడు వేరియంట్లపై రూ. 85,000 వరకు తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!) ఆఫర్స్ అనేవి నగరం నుంచి మరో నగరానికి లేదా డీలర్ నుంచి మరో డీలర్‌కి మారే అవకాశం ఉంటుంది. కావున టైగన్, వర్టస్ వేరియంట్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్‌ను సంప్రదించడం మంచిది. -
టాప్ స్పీడ్.. లాంగ్ రేంజ్.. లగ్జరీ.. అదిరిపోయే టెస్లా కార్లు (ఫొటోలు)
-
బాలీవుడ్ నటులు మరియు వారి ఖరీదైన కార్లు
-
ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!
M.A Yusuf Ali Car Collection: భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' (Lulu Group International) అధినేత 'ఎమ్ఏ యూసఫ్ అలీ' (M.A Yusuf Ali) గురించి దాదాపు అందరికి తెలుసు. ఎందుకంటే ఈయన ఇండియాలోని సంపన్నుల జాబితాలో ఒకరు మాత్రమే కాదు, కోట్లు విలువ చేసే అనేక అన్యదేశ్యపు లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో కూడా ఒకరు. యూసఫ్ అలీ గ్యారేజిలోని లగ్జరీ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కేవలం సంపన్న వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈ జాబితాలో యూసఫ్ అలీ ఉన్నారు. ఈయన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఘోస్ట్ కారుని కలిగి ఉన్నారు. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారతదేశంలో ఉన్నప్పుడు ఈయన ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తారని సమాచారం. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ఖరీదైన రేంజ్ రోవర్ వోగ్ కూడా ఈయన గ్యారేజిలో ఉంది. యూసఫ్ అలీ కొనుగోలు చేసిన ఈ కారు వైట్ కలర్ పెయింట్ స్కీమ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇతని వద్ద బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ కూడా ఉన్నట్లు సమాచారం. వీటిని తన కుటుంబంతో పాటు ప్రయాణించడానికి ఉపయోగిస్తాడని తెలుస్తోంది. ఈ కార్లు కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉండటం గమనార్హం. బెంట్లీ బెంటాయగా బెంట్లీ కంపెనీకి చెందిన బెంటాయగా వంటి విలాసవంతమైన SUV కూడా యూసఫ్ అలీ ఖాన్ గ్యారేజిలో ఉంది. ఇది కూడా కేరళ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. భారతదేశంలో మొట్ట మొదటి బెంట్లీ బెంటాయగా కొనుగోలు చేసిన వ్యక్తి యూసఫ్ అలీ కావడం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!) రోల్స్ రాయిస్ కల్లినన్ ముఖేష్ అంబానీ వంటి కుబేరుల వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా యూసఫ్ అలీ గ్యారేజిలో ఉంది. ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే రోల్స్ రాయిస్ కార్లలో కల్లినన్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. ఈ కారుని అతడు దుబాయ్‌లో ఉపయోగిస్తాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి కార్లతో పాటు యూసఫ్ అలీ మినీ కూపర్ కంపెనీకి చెందిన మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్-మేబ్యాక్ GLS, లెక్సస్ LX750, BMW 7-సిరీస్, మెర్సిడెస్-మేబ్యాక్ S600 వంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజిలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే ధనవంతుల జాబితాలో యూసఫ్ అలీ ఖాన్ కూడా ఒకరుగా ఉన్నారు. -
టాటా కార్ల కొనుగోలుపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్ - ఏ కారుపై ఎంతంటే?
Discounts: భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కాగా కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో టాటా టియాగో, టిగర్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ వంటి కార్లు ఉన్నాయి. అయితే సంస్థ టాటా పంచ్ మరియు నెక్సాన్ కార్ల మీద ఎటువంటి తగ్గింపులను అందించడం లేదు. కాగా కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా టియాగో (Tata Tiago) భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న హ్యాచ్బ్యాక్స్ లో ఒకటైన టియాగో మీద కంపెనీ రూ. 43000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఇది మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. కావున వేరియంట్‌ని బట్టి డిస్కౌంట్ మారుతుంది. టియాగో పెట్రోల్ వేరియంట్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ. 20000 వరకు కంజ్యుమర్ స్కీమ్ కింద తగ్గింపు లభిస్తుంది. ఇక CNG వేరియంట్ మీద 43000 తగ్గింపు లభించగా.. ఇందులో కంజ్యుమర్ స్కీమ్ కింద రూ. 30 వేలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ. 10,000, రూ. 3000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్, ఇగ్నీస్, గ్రాండ్ ఐ వంటి వాటికి ఇది ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. టాటా టిగోర్ (Tata Tigor) టాటా మోటార్స్ ఇప్పుడు టిగోర్ పెట్రోల్ మోడల్ మీద రూ. 33,000 తగ్గింపుని సిఎన్జీ మోడల్ మీద రూ. 48000 తగ్గింపుని ప్రకటించింది. ఈ రెండు మోడల్స్ మీద ఎక్స్చేంజ్ డిస్కౌంట్, కంజ్యుమర్ స్కీమ్ లభించే డిస్కౌంట్ మాత్రమే కాకుండా కార్పొరేట్ తగ్గింపులు కూడా లభిస్తాయి. (ఇదీ చదవండి: సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?) టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) టాటా ఆల్ట్రోజ్ మీద ఇప్పుడు రూ. 30000 వరకు బెనిఫీట్స్ లభిస్తున్నాయి. ఈ తగ్గింపులు కేవలం పెట్రోల్, డీజిల్ మోడల్స్‌కి మాత్రమే వర్తిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సిఎన్జీ మోడల్ మీద మాత్రం ఎటువంటి తగ్గింపులు లభించవు. పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25,000 తగ్గింపు, డీజిల్ మోడల్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!) టాటా హారియర్ & సఫారి (Tata Harrier and Safari) టాటా హారియర్ & సఫారి కార్ల కొనుగోలుపైన రూ. 35000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు SUVల మీద రూ. 25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో కార్పొరేట్ తగ్గింపు కింద రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ రెండు మోడల్స్ మీద ఎటువంటి కంజ్యుమర్ బెనిఫిట్స్ లభించవు. "డిస్కౌంట్లు నగరం నుంచి నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్షిప్ సందర్శించండి.'' -
మీరు ఇప్పటి వరకు చూడని విచిత్రమైన కార్లు (ఫోటోలు)
-
ప్రమాదంలో ప్రాణాలు కాపాడే సేఫెస్ట్ కార్లు (ఫోటోలు)
-
తక్కువ ధర వద్ద మంచి మైలేజ్ అందించే టాప్ 5 కార్లు - చూసారా?
Affordable Cars in 2023: భారతదేశంలో ప్రస్తుతం చాలామంది సొంతవాహనాలను కలిగి ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ సొంతంగా కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే కొంతమంది ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తే మరి కొందరు వారి రేంజ్ కి తగ్గట్టుగా తక్కువ ధరలో లభించే కార్లను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. నిజానికి ఖరీదైన కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కంటే సరసమైన ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. భారతీయ మార్కెట్లో తక్కువ ధరకు లభించే టాప్ అండ్ బెస్ట్ 10 కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బజాజ్ క్యూట్ భారతదేశంలో అతి తక్కువ ధరకు లభించే సరసమైన కారు బజాజ్ కంపెనీకి చెందిన క్యూట్. దీని ప్రారంభ ధర కేవలం రూ. 2.64 లక్షల నుంచి రూ. 2.84 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకుల ధర కంటే చాలా తక్కువ. ఇది 216 సిసి ఇంజిన్ కలిగి లీటరుకు 35 కిమీ నుంచి 45 కిమీ మైలేజ్ అందిస్తుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇది మంచి డిజైన్, మంచి ఫీచర్స్ పొందుతుంది. డాట్సన్ రెడీ గో అమెరికన్ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ కంపెనీకి చెందిన డాట్సన్ రెడీ గో కూడా మన జాబితాలో తక్కువ ధరకు లభించే బెస్ట్ కారు. దీని ధర రూ. 3.8 లక్షల నుంచి రూ. 4.96 లక్షల వరకు ఉంది. ఇది 799 సిసి ఇంజిన్ కలిగి లీటరుకు 20.7 కిమీ నుంచి 22 కిమీ మైలేజ్ అందిస్తుంది. 2017లో NDtv స్మాల్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్న ఈ కారు ప్రొడక్షన్ ఇప్పుడు ఇండియాలో ఆగిపోయింది. కానీ విక్రయాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) రెనాల్ట్ క్విడ్ మన జాబితాలో చెప్పుకోదగ్గ సరసమైన కారు మాత్రమే కాదు, అత్యంత సురక్షితమైన కారు కూడా. దీని ధర రూ. 4.7 లక్షల నుంచి రూ. 6.33 లక్షల మధ్య ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ డిజైన్ పరంగా ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులోని 799 ఇంజిన్ ఒక లీటరుకు 22 కిమీ నుంచి 23 కిమీ మధ్య మైలేజ్ అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎక్కువ అమమకాలు పొందుతున్న కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. (ఇదీ చదవండి: రూ. 5.1 కోట్ల మెక్లారెన్ కొత్త సూపర్‌కార్ ఇదే - పూర్తి వివరాలు) మారుతి ఆల్టో 800 ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మారుతి ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ. 5.13 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు ఆధునిక కాలంలో మాత్రమే కాకుండా ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ఉంది. ఇది ఇప్పుడు ఆధునిక హంగులతో మార్కెట్లో అందుబాటులో ఉంది. కావున మునుపటికంటే మంచి డిజైన్, ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 796 సిసి ఇంజిన్ లీటరుకు 24.7 కిమీ నుంచి 31.4 కిమీ మైలేజ్ అందిస్తుంది. మంచి మైలేజ్ అందిస్తున్న కారణంగా కూడా ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. (ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?) మారుతి ఎస్ ప్రెస్సో మారుతి సుజుకి కంపెనీకి చెందిన మరో కారు ఎస్-ప్రెస్సో. ఇది కూడా తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కారు. దీని ధర రూ. 4.25 లక్షల నుంచి రూ. 6.1 లక్షల మధ్య ఉంటుంది. ఇందులోని కె10బి పెట్రోల్ ఇంజిన్ ఆటోమాటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది లీటరుకు 24.8 కిమీ నుంచి 32.7 కిమీ మైలేజ్ అందిస్తుంది. పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. -
భారత్ లో టెస్లా కార్ల తయారీ కేంద్రం....
-
2023లో చీప్ అండ్ బెస్ట్ కార్లు ఇవే (ఫోటోలు)
-
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు ఏవో మీకు తెలుసా.. ఇక్కడ చూడండి (ఫోటోలు)
-
Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!
గ్లోబల్ స్టార్, ఆస్కార్ విన్నింగ్ హీరో జూ.ఎన్టీఆర్ ఈరోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా నందమూరి నటవారసుడి ఆస్తి, విలువైన కార్లు, ఇల్లు తదితర అంశాలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆసక్తి ఉంటుంది. ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, మెడ్రన్ వాచెస్, ప్రైవేట్ జెట్ తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడే నందమూరి తారక రామారావు. 1991లో బాలనటుడిగా అరంగేట్రం చేసి తాతకు తగ్గమనవడిగా, జూ.ఎన్టీఆర్‌గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. దశాబ్దాలుగా తన నటనతో సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, మూవీ ఏదైనా బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకోవడం ఆయన స్పెషాల్టీ. అందుకే అభిమానులు ఆయనను టాలీవుడ్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా అతని సింప్లిసిటీకి కూడా పెట్టింది పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరు. తాజాగా సెన్సేషనల్ టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌కి ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, ఒక ప్రైవేట్ జెట్ వీటన్నింటికి మించి సూపర్ వాచ్ కలెక్షన్స్ ఉన్నాయి. రూ. 25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం, రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయభూమి కూడా ఉందని, దీనిని ఆయన లక్ష్మీ ప్రణతికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారని చెబుతారు. దీని వాల్యూ సుమారు 9 కోట్ల రూపాయలట. దీంతోపాటు బెంగుళూరులో కూడా ఆయనకు పలు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు రకరకాల వాచీలను ఇష్టపడే అతను రిచర్డ్ మిల్లే వాచ్ అంటే ఎక్కవగా లైక్ చేస్తారు. దీని ధర రూ. 4 కోట్లు. అలాగే 40MM వాట్ వాచ్ ధర రూ. 2.5 కోట్లు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆస్కార్ రెడ్‌కార్పెట్ లుక్ అభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా తారక్ ధరించిన పాటెక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ వాచ్. దీని ధర రూ. 1. 56 కోట్ల రూపాయలు. టోటల్‌గా జూ.ఎన్టీరా్ ఆయన ఆస్తి విలువ రూ.571 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. పలు మీడియా నివేదికల ప్రకారం ఆయన నెలవారీ ఆదాయం రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. ఇక కార్ల విషయానికి వస్తే లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్ని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ మన జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. రూ. 2 కోట్ల రేంజ్ రోవర్ రోగ్ కారు, సుమారు 5 కోట్ల విలువైన నీరో నోక్టిస్ (బ్లాక్) ఉంది. దీని కస్టమ్ నంబర్ ప్లేట్ ధర 15 లక్షల రూపాయల కంటే ఎక్కువేనట. పోర్లే 718 కేమాన్రూ. కోటి, రూ. 2 కో ట్లబీఎండబ్ల్యూ 720 ఎన్డీ, కోటి రూపాయల మెర్సిడెస్‌బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మే 20, 1983లో జన్మించారు. బాల రామాయణం చిత్రంలో తన నటనకు ఉత్తమ బాలనటుడి అవార్డును గెలుచుకోవడమే కాదు హీరోగా తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. -
ఇటలీ మిలన్లో భారీ పేలుడు..అగ్నికి కార్లు ఆహుతి
ఉత్తర ఇటలీలోని మిలన్లో గురువారం ఓ వీధిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అనేక వాహానాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న వ్యాన్‌లో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్లు పక్కల ఉన్న కార్లకు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఐతే సంఘటనా స్థలంలోనే పాఠశాల, నర్సింగ్ హోం ఉండటంతో..అందులో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. ఐతే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి త్వరితగతిన మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు అధికారులు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవ్వుతున్నాయి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: పాక్ చరిత్రలో ఆ రోజు చీకటి అధ్యాయం: పాక్ ఆర్మీ) -
మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఈ నెలలో (2023 మే) ఎంపిక చేసిన నెక్సా లైనప్ మోడల్స్‌పై గొప్ప ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో మారుతీ సుజుకి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్: మారుతి సుజుకి ఇప్పుడు ఇగ్నిస్ కొనుగోలుపై రూ. 47,000 తగ్గింపుని అందిస్తుంది. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. అంతే కాకుండా ఇగ్నిస్ ఆటోమాటిక్ వేరియంట్స్ మీద రూ. 42,000 డిస్కౌంట్స్ లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000 వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ ఒకేలా ఉంటుంది. మారుతి సుజుకి సియాజ్: మారుతి సుజుకి సియాజ్ కొనుగోలుపైన ఇప్పుడు రూ. 35,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ అఫర్ కింద రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 10,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంటుంది. మారుతి సుజుకి బాలెనొ: ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మారుతి సుజుకి బాలెనొ కొనుగోలుపై కంపెనీ రూ. 20,000 బెనిఫీట్స్ అందిస్తుంది. ఇందులోని డెల్టా & జీటా వేరియంట్స్ మీద రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. అయితే CNG మోడల్స్ మీద ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) కంపెనీ అందిస్తున్న ఆఫర్స్, బెనిఫీట్స్ వంటి వాటిని గురించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలో ఉన్న మారుతి డీలర్షిప్ సందర్శించవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ఇవే!
భారతదేశంలో ఎక్కువ మంది సొంతంగా కార్లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే కొనుగోలుదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లను ఎంచుకుంటున్నారు. అలాంటి వారికోసం ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి తక్కువ ధరకు లభించే టాప్-5 కార్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: దేశీయ మార్కెట్లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి రూ. 7.95 లక్షల నుంచి రూ. 8.51 లక్షల మధ్య లభించే సరసమైన కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆస్టా. ఇందులో డ్రైవర్, ఫ్యాసింజర్, సైడ్ ఎయిర్ బ్యాగులను పొందుతుంది. కావున భారతదేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటిగా ఉంది. గ్రాండ్ ఐ10 నియోస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి బాలెనొ: మారుతి సుజుకి కంపెనీకి చెందిన బాలెనొ జీటా, ఆల్ఫా ట్రిమ్‌లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. దీని ధర రూ. 8.38 లక్షల నుంచి రూ. 9.88 లక్షల మధ్య ఉంటుంది. CNG మోడల్ కారులో కూడా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న బాలెనొ పనితీరు పరంగా కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. హ్యుందాయ్ ఆరా: ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే హ్యుందాయ్ ఆరా ధర రూ. 8.61 లక్షలు. ఆరా ఎస్ఎక్స్(ఓ) ట్రిమ్‌లో మాత్రమే ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. మిగిలిన అన్ని వేరియంట్లు నాలుగు ఎయిర్ బ్యాగులను పొందుతాయి. హ్యుందాయ్ ఆరా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. (ఇదీ చదవండి: రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!) టయోటా గ్లాంజా: ఇండియన్ మార్కెట్లో రూ. 8.63 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య లభించే టయోటా గ్లాంజా ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని జి, వి ట్రిమ్‌లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 హెచ్‌పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!) హ్యుందాయ్ ఐ20: మన జాబితాలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఆరు ఎయిర్ బ్యాగులు కలిగిన హ్యుందాయ్ ఐ20 ఒకటి. దీని ధర రూ. 9.77 లక్షల నుంచి రూ. 11.88 లక్షల మధ్య ఉంటుంది. ఆరు ఎయిర్ బ్యాగులు హ్యుందాయ్ ఐ20 ఆస్టా(ఓ) ట్రిమ్‌లో మాత్రమే ఉంటాయి. ఐ20 రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్. రెండూ మంచి పనితీరుని అందిస్తాయి. -
మే నెలలో లాంచ్ అయ్యే కార్లు ఇవే..
ఫేవరెట్ కార్ల కోసం ఎంతోగానో ఎదురుచూస్తున్న కస్టమర్లకు వాహన సంస్థలు శుభవార్త చెప్పాయి. మే నెలలో పలు ప్రముఖ కార్లు లాంచ్ అవుతున్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్, ఎంజీ కామెట్ ఈవీ, 2023 లెక్సస్ ఆర్ఎక్స్ వంటి కొన్ని కార్లు ఏప్రిల్ నెలలోనే విడదలయ్యాయి. ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్.. విండోస్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు! చాలా కాలంగా ఊరిస్తున్న జిమ్నీని మే నెలలో విడుదల చేయడానికి మారుతి సుజికి సిద్ధమైంది. టాటా మోటార్స్ తన సీఎన్జీ లైనప్‌ను రెండు కొత్త మోడళ్లతో విస్తరిస్తోంది. అలాగే బీఎండబ్ల్యూ కూడా రెండు మోడళ్లను లాంచ్ చేస్తోంది. కొన్ని కార్లకు ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. మారుతీ సుజుకి జిమ్నీ మారుతీ సుజుకి జిమ్నీ (Jimny) కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన లాంచ్ ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. మారుతి జిప్సీకి వారసత్వంగా ఇది వచ్చేస్తోంది. భారత్ కోసం ప్రత్యేకంగా ఐదు-డోర్ల బాడీ స్టైల్‌తో దీన్ని రూపొందించారు. దీని నో-నాన్సెన్స్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలు, నిచ్చెన-ఫ్రేమ్ చట్రం, తక్కువ-శ్రేణి 4x4 ఫీచర్లతో లైఫ్ వాహనంగా గుర్తింపు పొందుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇది 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ ద్వారా 105 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండవచ్చని అంచనా . బీఎండబ్ల్యూ ఎం2 బీఎండబ్ల్యూ రెండవ తరం M2 (G87)ని భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి కానుంది. టాప్-రంగ్ కాంపిటీషన్ రూపంలో వచ్చే ఈ లగ్జరీ కార్ అంతకుముందున్న కార్ మాదిరిగా కాకుండా కొత్త M2 ప్రామాణిక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కార్ 460 హార్స్ పవర్‌ను, 550Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.0-లీటర్ ట్విన్-టర్బో ఇన్లైన్ సిక్స్ ఇంజన్ ఉంటుంది. స్టాండర్డ్‌గా 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అయితే 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. M2 ఎక్స్-షోరూమ్ అంచనా ధర సుమారు రూ. 1 కోటి. టాటా ఆల్ట్రోజ్ CNG దేశంలో సీఎన్జీ అత్యంత ఆదరణ పొందడంతో టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ CNGని విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇది ఫ్యాక్టరీ అమర్చిన సీఎన్జీ కిట్‌తో వస్తున్న దేశంలోని మూడవ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అవుతుంది. ఆల్ట్రోజ్ CNG కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టోకెన్ మొత్తం రూ. 21,000. మే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయని ఇదివరకే ప్రకటించింది. CNG కిట్ ఆల్ట్రోజ్ XE, XM+, XZ, XZ+ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. టాప్-స్పెక్ ట్రిమ్ అల్లాయ్ వీల్స్, ఆటో AC, సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌తో ఈ కార్ నడుస్తుంది. ఇది సీఎన్జీ మోడ్‌లో 77 హార్స్ పవర్, 97Nm టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. బీఎండబ్ల్యూ X3 M40i బీఎండబ్ల్యూ X3 M40i అనేది X3 కార్లలో హై పర్ఫార్మెన్స్ వేరియంట్. ఇది BMW M340i సెడాన్‌తో దాని పవర్‌ట్రెయిన్‌ను పంచుకుంటుంది. ఇది 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 360 హార్స్ పవర్, 500Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. X3 M40i M స్పోర్ట్ స్టైలింగ్ ప్యాకేజీని ప్రామాణికంగా కలిగి ఉంది. అలాగే వేరియబుల్ స్పోర్ట్ స్టీరింగ్, M స్పోర్ట్ బ్రేక్‌లు, M స్పోర్ట్ డిఫరెన్షియల్, అడాప్టివ్ M సస్పెన్షన్ వంటి హై పర్ఫార్మెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొత్తం రూ. 5 లక్షలు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! -
కోట్లు విలువ చేసే అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - వారెవరో తెలుసా?
ప్రపంచంలోని చాలామంది ధనవంతులు ఖరీదైన లగ్జరీ కార్లను వినియోగిస్తారనే సంగతి తెలుసు. అయితే భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే వారు ఎవరు, వారు ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విఎస్ రెడ్డి - బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ EWB భారతదేశంలో ఖరీదైన విలాసవంతమైన కార్లు ఉపయోగించే వారి జాబితాలో మెడికల్ న్యూట్రిషన్ తయారీ కంపెనీలలో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'VS రెడ్డి' ఉన్నారు. ఈయన ఉపయోగించే బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ ఈడబ్ల్యుబి ధర సుమారు రూ. 14 కోట్లు. బెంట్లీ కంపెనీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ కారు ప్రపంచ వ్యాప్తంగా 100 యూనిట్లకు మాత్రమే పరిమతమై ఉంది. ఇది 6.75 లీటర్ వి8 ఇంజిన్ కలిగి 506 హెచ్‌పి పవర్ 1020 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 296 కిలోమీటర్లు. ముఖేష్ అంబానీ - రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB & మెర్సిడెస్ S600 గార్డ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. ఈయన గ్యారేజిలో ఉన్న ఖరీదైన కార్లలో ఒకటి రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ సిరీస్ VIII EWB. దీని ధర రూ. 13.5 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ కలిగి 563 బిహెచ్పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మెర్సిడెస్ S600 గార్డ్ అంబానీ గ్యారేజిలోని మరో ఖరీదైన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్600 గార్డ్. ఇది ముఖేష్ అంబానీకి కోసం ప్రత్యేకంగా తాయారు చేసిన కారు. దీని ధర సుమారు రూ. 10 కోట్లు. ఈ కారుని ముఖేష్ అంబానీ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. (ఇదీ చదవండి: ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ) కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్స్ కలిగిం ఈ కారు బాడీ షెల్ రీన్ఫోర్స్డ్ స్టీల్‌తో తయారు చేశారు. ఇది ట్విన్ టర్బోచార్జ్ 6 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 523 బిహెచ్పి పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB మాత్రమే కాకుండా రోల్స్ రాయిస్ ఫాంటమ్, కల్లినన్స్, గోస్ట్స్ వంటి కార్లతో పాటు ఇతర బెంజ్, ఆడి, బెంట్లీ కార్లు ఉన్నాయి. వీరి సెక్యురిలో కూడా అత్యంత ఖరీదైన కార్లు వినియోగించడం గమనార్హం. (ఇదీ చదవండి: పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - కారణం ఇదే..!) నసీర్ ఖాన్ - మెక్లారెన్ 765 LT స్పైడర్ అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో హైదరాబాద్ నగరానికి చెందిన 'నసీర్ ఖాన్' కూడా ఉన్నారు. ఈయన వద్ద ఉన్న ఖరీదైన కారు మెక్లారెన్ 765 LT స్పైడర్. దీని ధర రూ. 12 కోట్లు. ఈ మోడల్ ప్రపంచ వ్యాప్తంగా 765 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 పెట్రోల్ ఇంజిన్ కలిగి 765 పిఎస్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సూపర్ కారు 7-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది. రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్: నసీర్ ఖాన్ గ్యారేజిలో మరో ఖరీదైన కారు రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్. దీని ధర సుమారు రూ. 8.20 కోట్లు. ఇది షారుఖ్ ఖాన్ వంటి ఇతర సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 600 బిహెచ్పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
క్రికెట్ దేవుడు సచిన్‌కు ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
క్రికెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. కాబట్టి సచిన్ టెండూల్కర్ గురించి దాదాపు అందరికి తెలుసు. సచిన్ ఆటల్లో మాత్రమే కాదు ఆటో మోటివ్ ఔత్సాహికుడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. ఈ రోజు క్రికెట్ గాడ్ సచిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆస్తులు విలువ ఎంత? లగ్జరీ కార్లు ఎన్ని ఉన్నాయి వంటి విషయాలతో వాటితో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. క్రికెట్ తన ఊపిరిగా క్రికెట్ ద్వారానే ఉన్నత స్థాయికి ఎదిగిన సచిన్ నికర ఆస్తుల విలువ కొన్ని నివేదికల ప్రకారం సుమారు 165 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1350 కోట్ల కంటే ఎక్కువ. బెంగళూరులో రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..) 11 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఇప్పుడు క్రికెట్ గాడ్ అయ్యాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన అంజలిని వివాహం చేసుకున్న సచిన్ ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. (ఇదీ చదవండి: 28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని) క్రికెట్ అంటే ప్రాణమిచ్చే సచిన్ మొదటి కారు మారుతి 800 కావడం గమనార్హం. ప్రస్తుతం అత్యంత ఖరీదైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో బిఎండబ్ల్యూ 30 జహ్రే ఎమ్5, ఎమ్ 6 గ్రాన్ కూపే, 7 సిరీస్, నిస్సాన్ జిటి-ఆర్, ఐ8, ఫెరారీ-360-మొడెనా మొదలైనవి ఉన్నాయి. సచిన్ వద్ద ఉన్న కార్ల ఖరీదు రూ. 15 కోట్లకంటే ఎక్కువ. ఖరీదైన కార్లు, బంగ్లా కలిగి ఉన్న సచిన్ పెప్సి, అడిడాస్, టీవీఎస్, బ్రిటానియా, వీసా, బూస్ట్, ఎయిర్టెల్, కోకాకోలా, కోల్గేట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ. 17 నుంచి 20 కోట్లు. -
తక్కువ ధర వద్ద సన్‌రూఫ్ కారు కావాలా - ఇదిగో ఇది మీ కోసమే
ఒకప్పుడు సన్‌రూఫ్ ఫీచర్ అనేది కేవలం హై-ఎండ్ కార్లలో మాత్రమే లభించేది. ఇలాంటి కార్లు ఎక్కువ ధర కలిగి ఉండటం వల్ల సామాన్యులకు సన్‌రూఫ్ కార్లు కొనటం కొంత కష్టమయ్యేది. అయితే ఇప్పుడు తక్కువ ధరకు లభించే కార్లలో కూడా సన్‌రూఫ్ లభిస్తోంది. దేశీయ మార్కెట్లో సరసమైన ధరకు లభించే టాప్ 5 సన్‌రూఫ్ కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. హ్యుందాయ్ ఐ20 (Hyundai i20): హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ20 సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన చౌకైన కార్లలో ఒకటి. ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో ఇది ఒకటి. సన్‌రూఫ్ కలిగిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన ఈ కారు ధర రూ. 9.1 లక్షలు. ఇది 1.2-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue): భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ వెన్యూ. సబ్-కాంపాక్ట్ ఎస్యువి సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన వెన్యూ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 10.93 లక్షలు. మహీంద్రా ఎక్స్యువి300 (Mahindra XUV300): దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్యువి300 ప్రారంభ ధర రూ. 8.41 లక్షలు. ఈ కాంపాక్ట్ ఎస్యువి సన్‌రూఫ్ కలిగి తక్కువ ధరకు లభించే ఉత్తమ మోడల్. ఇది 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. కియా సోనెట్ (Kia Sonet): సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ విడుదల చేసిన కార్లలో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న సబ్-కాంపాక్ట్ ఎస్యువి సోనెట్ కూడా సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 10.49 లక్షలు. ఇది సోనెట్ మూడు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. అవి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు. టాటా నెక్సాన్ (Tata Nexon): టాటా నెక్సాన్ భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న అత్యంత సురక్షితమైన కారు. సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్న సరసమైన కార్ల జాబితాలో ఇది చెప్పుకోదగ్గ మోడల్. ఈ ఎస్యువి ప్రారంభ ధర రూ. 9.39 లక్షలు(ఎక్స్-షోరూమ్). టాటా నెక్సాన్ ప్రస్తుతం ఎలక్ట్రిక్, ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌లో కూడా అందుబాటులో ఉంది. -
భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ డీజిల్ కార్లు, ఇవే!
2023 ఏప్రిల్ 01 నుంచి బిఎస్-6 ఫేజ్ 2 నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. ఈ తరుణంలో దాదాపు చాలా కంపెనీలు డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయడానికి సన్నద్ధమైపోతున్నాయి. మరి కొన్ని సంస్థలు ఉన్న కార్లను సరసమైన ధరలతో విక్రయించడానికి ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ కూడా అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఏడాది మార్కెట్లో సరసమైన ధర వద్ద లభించే డీజిల్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz): భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభిస్తున్న పాపులర్ డీజిల్ కారు. దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 10.40 లక్షల మధ్య ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో 90 హెచ్‌పి పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా ఆల్ట్రోజ్ దేశంలో మిగిలి ఉన్న ఏకైక డీజిల్ హ్యాచ్‌బ్యాక్. మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo): మహీంద్రా బొలెరో నియో కూడా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ కారణంగా తక్కువ ధరకే లభిస్తోంది. దీని ధర రూ. 9.62 లక్షల నుంచి రూ. 12.14 లక్షలు. ఈ కారు 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ కలిగి 100 హెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. మహీంద్రా బొలెరో (Mahindra Bolero): మహీంద్రా బొలెరో మన జాబితాలో తక్కువ ధరలో లభించే ఉత్తమైన డీజిల్ కారు. ఇది రూ. 9.78 లక్షల నుంచి రూ. 10.79 లక్షల మధ్య లభిస్తుంది. ఇది 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో 76 హెచ్‌పి పవర్ 210 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ మైలేజ్ అందిస్తుంది. మహీంద్రా ఎక్స్యువి300 (Mahindra XUV300): ఎక్స్యువి300 మహీంద్రా కంపెనీకి చెందిన బెస్ట్ డీజిల్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 9.90 లక్షల నుంచి రూ. 14.60 లక్షల మధ్య ఉంది. మహీంద్రా ఎక్స్యువి300 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ద్వారా 117 హెచ్‌పి పవర్ 300 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ పొందుతుంది. కియా సోనెట్ (Kia Sonet): దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ దేశీయ విఫణిలో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తున్న SUV లలో ఒకటి సోనెట్. ఈ డీజిల్ కారు ధర రూ. 9.95 లక్షల నుంచి రూ. 14.89 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్, టర్బో-పెట్రోల్, టర్బో-డీజిల్ అనే మూడు ఇంజిన్ ఎంపికలతో విక్రయిస్తోంది. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 116 హెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. టాటా నెక్సాన్ (Tata Nexon): భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్లలో ఒకటి టాటా నెక్సాన్. టాటా నెక్సాన్ డీజిల్ మోడల్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 13.70 లక్షల మధ్య ఉంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ద్వారా 115 హెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మంచి మైలేజ్ అందించే వాహనాల్లో కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. -
సీఎన్జీ కారు కొనడానికి ఇదే మంచి సమయం - ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ & సీఎన్జీ కార్లు విడుదలవుతున్నాయి. భారతీయ విఫణిలో సీఎన్జీ కార్లకు డిమాండ్ భారీగానే ఉంది. ఈ తరుణంలో తక్కువ ధరలో సీఎన్జీ కొనాలనుకునే వారు ఈ బెస్ట్ కార్లను ఎంపిక చేసుకోవచ్చు. మారుతి సుజుకి ఆల్టో 800 సీఎన్జీ: మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఆల్టో 800 మన జాబితాలో చెప్పుకోదగ్గ బెస్ట్ సీఎన్జీ కారు. ఈ మోడల్ ధర రూ. 5.13 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 30 కి.మీ/కేజీ మైలేజ్ అని తెలుస్తోంది. మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే వాహనాల్లో మారుతీ సుజుకీ 800 సీఎన్జీ ఉత్తమ మైలేజ్ అందిస్తుందని రుజువైంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీ: ఎస్-ప్రెస్సో సీఎన్జీ కూడా మారుతి సుజుకి కంపెనీకి చెందిన బెస్ట్ సీఎన్జీ కారు. ఇది కేజీకి 32 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎల్ఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే సీఎన్జీ ఆప్షన్ లభిస్తుంది. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్ 82 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్జీ: రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కే10 కేజీకి 34 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తూ ఉత్తమ సీఎన్జీ కారుగా నిలిచింది. ఇందులోని 1.0 లీటర్ కే10 సిరీస్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్ 82 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మారుతి సుజుకి వాగన్ఆర్ సీఎన్జీ: వాగన్ఆర్ సీఎన్జీ ఉత్తమ మైలేజ్ అందించే మారుతి కంపెనీ బ్రాండ్. దీని ధర రూ. 6.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఒక కేజీ సీఎన్జీతో 34.05 కి.మీల మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్, 82 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా టియాగో ఐసీఎన్జీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఉత్తమ CNG కార్లను అందిస్తోంది. ఈ విభాగంలో ఒకటైన టియాగో ఐసీఎన్జీ కేజీకి 26.49 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 6.44లక్షలు. టియాగో ఐసీఎన్జీలోని 1.2 లీటర్ ఇంజిన్ 72 బీహెచ్పీ పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇటీవలే భారతదేశంలో సీఎన్జీ ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో సీఎన్జీ కారు కొనాలనుకునే వారికి పైన చెప్పిన కార్లు మంచి ఎంపిక అవుతాయని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను, సందేహాలను మాతో పంచుకోండి. -
సిట్రోయెన్ సి3 టాప్ ఎండ్ మోడల్ లాంచ్ - విశేషాలు!
భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ కంపెనీ తన సి3 హ్యాచ్‌బ్యాక్‌లో టాప్ వేరియంట్ అయిన 'షైన్' విడుదల చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న లైవ్, ఫీల్ వేరియంట్ల కంటే దీని ధర ఎక్కువగా ఉంది. ఈ కొత్త వేరియంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ధర: మార్కెట్లో విడుదలైన కొత్త సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్ టాప్-స్పెక్ ట్రిమ్ షైన్ ధర రూ. 7.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది లైవ్ అండ్ ఫీల్ ట్రిమ్‌లలో లేని అనేక ఫీచర్లను పొందుతుంది, కావున ఈ కారు ధర దాని మునుపటి మోడల్స్ కంటే రూ. 12,000 ఎక్కువ. డిజైన్ & ఫీచర్స్: చూడటానికి సిట్రోయెన్ సి3 దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగా కనిపించినప్పటికీ కొంత అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, రియర్ పార్కింగ్ కెమెరా, మ్యాన్యువల్ డే/నైట్ రియర్ వ్యూ మిర్రర్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ వంటి వాటిని చూడవచ్చు. అంతే కాకూండా రియర్ వైపర్, వాషర్, డీఫాగర్ ఉన్నాయి.ఇవి ప్రస్తుతం C3 షైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. లైవ్ అండ్ ఫీల్ ట్రిమ్‌లలో మాదిరిగా కాకుండా షైన్ వేరియంట్ 15 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్స్ పొందుతుంది. ఆదిమాత్రమే కాకుండా C3 ఇప్పుడు దాదాపు 35 కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉన్న My Citroen Connect యాప్ కూడా పొందుతుంది. 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటివి ప్రామాణికంగా అందుబాటులో ఉంటాయి. పవర్‌ట్రెయిన్స్: కొత్త సిట్రోయెన్ సి3 షైన్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 82 బిహెచ్పి పవర్ & 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న సిట్రోయెన్ సి3 ఇకపై షైన్ వేరియంట్లో లభిస్తుంది. కావున సి3 అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ లేటెస్ట్ హ్యాచ్‌బ్యాక్ టాటా పంచ్, మారుతి సుజుకి ఇగ్నిస్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. -
లగ్జరీ కారు కొన్న మోహన్ లాల్.. వామ్మో అన్ని కోట్లా?
మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్ కొత్త మోడల్ ఆటో బయోగ్రఫీని తన ఇంటికి తీసుకొచ్చారు. ఈ కారు ధర దాదాపుగా రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాాగా.. మోహన్‌లాల్ వద్ద ఇప్పటికే 3 కోట్ల రూపాయల ఖరీదు చేసే లంబోర్గినీ కారును కలిగి ఉన్నాడు. టయోటా వెల్ఫైర్ రూ. 1 కోటి, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350(సుమారు రూ. 80 లక్షలు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (సుమారు రూ. 2 కోట్లు) మోహన్ లాల్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం అతని గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కారుగా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ నిలవనుంది. కాగా.. మోహన్‌లాల్ ఇటీవలే రాజస్థాన్‌లో తన రాబోయే చిత్రం మలైకోట్టై వాలిబన్ షెడ్యూల్‌ను ముగించారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ లాల్ రజనీకాంత్ జైలర్‌లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. New one to the garage 🚗#RangeRover @Mohanlal #Mohanlal #MalaikottaiVaaliban pic.twitter.com/2bZBuBKL3K — Mohanlal Fans Club (@MohanlalMFC) April 10, 2023 -
అమెరికన్ బ్రాండ్ కార్లపై రూ. 2.35 లక్షలు తగ్గింపు - పూర్తి వివరాలు
అమెరికన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ 'జీప్' (Jeep) భారతీయ మార్కెట్లో కంపాస్, మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి నాలుగు SUVలను విక్రయిస్తోంది. అయితే కంపెనీ ఈ నెలలో తన కంపాస్, మెరిడియన్ బేస్ వేరియంట్ల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జీప్ మెరిడియన్ బేస్ మోడల్ లిమిటెడ్ MT ధర రూ. 2.35 లక్షలు తగ్గింది. ధరల తగ్గుదల తర్వాత దీని ధర రూ. 27.75 లక్షలు. ఇందులో లిమిటెడ్ AT మోడల్ ధర రూ. 32 లక్షలు. ఈ ధరలలో ఎటువంటి మార్పు లేదు. అదే సమయంలో లిమిటెడ్ (O) ట్రిమ్ ధర రూ. 35వేలు వరకు పెరిగింది. ఈ మోడల్ కొత్త ధర రూ. 32.95 లక్షలు. ఇక కంపాస్ స్పోర్ట్ ఎటి పెట్రోల్ మోడల్ ధర ఇప్పుడు రూ. 20.99 లక్షలు. ఈ ఎస్యువి ధరలను కంపెనీ రూ. 1.08 లక్షలు తగ్గించింది. ధరల తగ్గుదలకు ముందు దీని ధర రూ. 22.07 లక్షలు. అదే సమయంలో లిమిటెడ్ ఏటి, మోడల్ ఎస్ ఏటి ధరలలో ఎటువంటి మార్పులు లేదు. (ఇదీ చదవండి: కృతి ఖర్బందా కొత్త కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు!) జీప్ కంపాస్ డీజిల్ ధరల విషయానికి వస్తే.. అన్ని మోడల్స్ ధరలు రూ. 35,000 తగ్గాయి. ఇందులో లిమిటెడ్, మోడల్ ఎస్ సిరీస్, 4X4 మోడల్ మొదలైనవి ఉన్నాయి. కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రావడం వల్ల ఈ మోడల్స్ ధరలు తగ్గి ఉండవచ్చని భావిస్తున్నారు. కంపాస్ రెండూ డీజిల్ ఇంజన్స్ పొందుతుంది, అవి1.4-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ & 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్. అదే సమయంలో మెరిడియన్ ఒకే సింగిల్ డీజిల్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. అయితే పనితీరు పరంగా రెండూ అద్భుతంగా ఉంటాయి. -
టైగన్ ప్రియులకు షాక్.. భారీగా ధరలు పెంచిన ఫోక్స్‌వ్యాగన్
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గత నెలలోనే టైగన్ ధరల పెరుగుదలను గురించి ప్రకటించింది. అయితే ఇప్పుడు కొత్త ధరలను కూడా వెల్లడించింది. రియల్ డ్రైవ్స్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా అప్డేట్ చేయడం వల్లే ఈ ధరల పెరుగుదల జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ధరల పెరుగుదలకు గల కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రస్తుతం కంఫర్ట్‌లైన్, హైలైన్, ఫస్ట్ యానివర్సరీ, టాప్‌లైన్, జిటి, జిటి ప్లస్ అనే ఆరు వేరియంట్లలో లభిస్తోంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ ధర రూ. 45,000 పెరిగింది. అదే సమయంలో జిటి & జిటి ప్లస్ ధరలు వరుసగా రూ. 30,000, రూ. 10,000 పెరిగాయి. ఇక హైలైన్ వేరియంట్ ధర రూ. 24,000 పెరిగింది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి) ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్పి పవర్, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది. ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్పి పవర్, 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. పనితీరు పరంగా ఈ రెండు ఇంజిన్లు ఉత్తమంగా ఉంటాయి. -
విదేశీ ఎగుమతికి సిద్దమైన బుజ్జి కారు, ఇదే!
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'సిట్రోయెన్' ఇప్పుడు తమ కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి సన్నద్ధమైపోయింది. కంపెనీ దీని కోసం చెన్నైలోని కామరాజర్ పోర్ట్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేసింది. సిట్రోయెన్ ఎగుమతులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. కంపెనీ విదేశీ ఎగుమతికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ మార్గం ద్వారా రవాణా చేస్తుంది. 2023 మార్చి 31న మొదటి బ్యాచ్ మేడ్-ఇన్-ఇండియా C3 హ్యాచ్‌బ్యాక్‌లు కామరాజర్ పోర్ట్ నుండి ASEAN, ఆఫ్రికా మార్కెట్లకు ఎగుమతి చేయడం జరిగింది. కంపెనీ తమ కార్లను ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, కంబోడియా, సింగపూర్, మలేషియా దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ప్రపంచ వ్యాప్తంగా తమ ఉనికిని చాటుకోవడానికి తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. సి2 ఎయిర్ క్రాస్ విడుదలతో దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొంది, ఇటీవల సి3 ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసి మరింత గొప్ప అమ్మకాలను పొందటానికి సన్నద్ధమవుతోంది. (ఇదీ చదవండి: మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్) చెన్నైలోని కామరాజర్ పోర్ట్ నుంచి రెనాల్ట్, నిస్సాన్, టయోటా, మారుతీ సుజుకి, ఇసుజు మోటార్స్ వంటి కంపెనీలు కూడా ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగింది. నిజానికి ఈ పోర్ట్ ఎగుమతుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. సిట్రోయెన్ సి3 ధర భారతీయ మార్కెట్లో రూ. 7.02 లక్షల నుంచి రూ. 9.35 లక్షల వరకు ఉంది. అయితే ఇందులో సి3 ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ. 13.34 లక్షల నుంచి రూ. 14.06 లక్షల వరకు ఉంది. కాగా సిట్రోయెన్ కొత్త సి3 ఎయిర్‌క్రాస్ మిడ్ సైజ్ SUV ఈ నెల 27న మార్కెట్లో విడుదలకానున్నట్లు సమాచారం. -
వెబ్సైట్లో మాయమైన క్విడ్, ఇక కావాలన్నా కొనలేరు!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన 'రెనాల్ట్ క్విడ్' (Renault Kwid) ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్సైట్లో మాయమైంది. ఇటీవల అమలులోకి వచ్చిన రియల్ డ్రైవింగ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మోడల్ని నిలిపివేసింది. నివేదికల ప్రకారం.. క్విడ్ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నప్పటికీ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. ఈ హ్యాచ్‌బ్యాక్ ఏ విధమైన అప్డేట్ పొందినప్పటికీ ధరల పెరుగుదల పొందుతుంది. అప్పుడు అమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే కంపెనీ ఈ 800cc వెర్షన్‌ను తొలగించింది. రెనాల్ట్ క్విడ్ 0.8 లీటర్ వెర్షన్ RXL, RXL(O) వేరియంట్లలో అందుబాటులో ఉంది. 800cc వేరియంట్ నిలిపివేయడంతో, రెనాల్ట్ ఇప్పుడు ఐదు వేరియంట్లలో 1.0 లీటర్ వెర్షన్‌ను మాత్రమే అందిస్తుంది. క్విడ్ 800 సీసీ వేరియంట్ త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 52 బిహెచ్పి పవర్, 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు) రెనాల్ట్ కంపెనీ కంటే ముందు మారుతి సుజుకి తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800ని నిలిపివేసింది. అంతే కాకుండా స్కోడా నుంచి ఆక్టావియా, హోండా జాజ్, 4వ తరం హోండా సిటీ ఉత్పత్తి కూడా నిలిపేయడం జరిగింది. నిజానికి కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల ఈ ఉత్పత్తులు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
ఇవి కదా డిస్కౌంట్స్ అంటే! మహీంద్రా కార్లపై భారీ తగ్గింపు..
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' తమ ఉత్పత్తుల కొనుగోలు మీద ఈ నెలలో (ఏప్రిల్ 2023) భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్స్, బెనిఫీట్స్ అన్నీ మహీంద్రా మొరాజో, బొలెరో, బొలెరో నియో, థార్ 4RD, XUV300 కొనుగోలుపై పొందవచ్చు. మహీంద్రా మొరాజో: మహీంద్రా కంపెనీ ఇప్పుడు మొరాజో కొనుగోలుపైన ఏకంగా రూ. 72,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ తగ్గింపు టాప్ స్పెక్ M6 వేరియంట్‌పై లభిస్తుంది. అయితే బేస్ వేరియంట్ M2, మిడ్-స్పెక్ వేరియంట్ M4+ మీద వరుసగా రూ. 58,000, రూ. 34,000 తగ్గింపుని పొందవచ్చు. మహీంద్రా బొలెరో: మహీంద్రా బొలెరో కొనుగోలుపైన ఇప్పుడు రూ. 66,000 డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇందులో టాప్ స్పెక్ వేరియంట్ మీద రూ. 51,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. ఇక మిడ్-స్పెక్ B6 వేరియంట్ మీద రూ. 24000, ఎంట్రీ-లెవల్ B4 వేరియంట్ మీద రూ. 37000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా XUV300: XUV300 కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు రూ. 52,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో కూడా W8 డీజిల్ వేరియంట్ కొనుగోలుపై రూ. 42,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. అదే సమయంలో W8(O), W6 డీజిల్ వేరియంట్ల మీద వరుసగా రూ. 22000, రూ. 10000 తగ్గింపు & పెట్రోల్ వేరియంట్స్ అయిన డబ్ల్యూ8(ఓ), డబ్ల్యూ8, డబ్ల్యూ6 వేరియంట్లపై వరుసగా రూ. 25000, రూ. 20000, రూ. 20000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా బొలెరో నియో: బొలెరో నియో టాప్ స్పెక్ వేరియంట్స్ N10, N10 (O) మీద రూ. 48,000 డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 36,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 12,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. మిడ్ స్పెక్ వేరియంట్, ఎంట్రీ లెవెల్ మోడల్ మీద రూ. 30000, రూ. 22,000 డిస్కౌంట్ లభిస్తుంది. మహీంద్రా థార్ 4X4: దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ కొనుగోలుపై కూడా ఇప్పుడు రూ. 40,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇది కేవలం థార్ 4WD వేరియంట్ మీద మాత్రమే లభిస్తాయి. ఇందులో కూడా AX(O), LX అనే రెండు ట్రిమ్‌ల మీద తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా కంపెనీ అందించే డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న కంపెనీ అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకు ఏప్రిల్ నెలలో మాత్రమే డిస్కౌంట్స్ వర్తిస్తాయి. -
విజయ్ దేవరకొండ గ్యారేజీలో కాస్ట్లీ కార్లు..
తెలుగు సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాలో ఓ డాక్టర్‌గా, గీత గోవిందంలో మేడమ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటూ అమ్మాయిల మనసు దోచుకున్న ఈ వరల్డ్ ఫెమస్ లవర్ గ్యారేజిలో జర్మన్, బ్రిటీష్, అమెరికన్, స్వీడన్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఫోర్డ్ మస్టాంగ్: ఒకప్పటి నుంచి ఎంతో ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ గత సంవత్సరం భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ మస్టాంగ్ విజయ్ దేవరకొండ గ్యారేజిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తాయి. మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జిఎల్సి విజయ్ గ్యారేజిలో ఉంది. ఈ కారుని యితడు ఇతర కార్లకంటే ఎక్కువగా ఉపయోగిస్తాడని సమాచారం. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్సన్లలో లభిస్తుంది. వోల్వో ఎక్స్‌సి 90: విజయ్ దేవరకొండ గ్యారేజిలో స్వీడన్ బ్రాండ్ కారు వోల్వో ఎక్స్‌సి 90 కూడా ఉంది. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 90 లక్షల నుంచి రూ. 1.31 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వోల్వో కంపెనీ భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన కార్లలో ఇది ఒకటి కావడం విశేషం. రేంజ్ రోవర్: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ ఒకటి. విజయ్ దేవరకొండ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్: విజయ్ దేవరకొండ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ కారు మాత్రమే కాకుండా బిఎండబ్ల్యు కంపెనీకి చెందిన 5-సిరీస్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 60 లక్షల కంటే ఎక్కువ. 2021 బిఎండబ్ల్యు 5-సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్స్, 520డి మరియు 530డి ఎమ్ స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లో విడుదలైంది. వీటి ధరలు రూ. 63 లక్షల నుంచి రూ. 72 లక్షల వరకు ఉన్నాయి. -
Honda: ఏప్రిల్ నుంచి ఈ కార్ల ఉత్పత్తి బంద్
గతంలో బిఎస్6 ఉద్గార నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత చాలా కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే 2023 ఏప్రిల్ 01నుంచి బిఎస్6 ఫేజ్-2 రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులలో కొన్నింటిని నిలిపివేయాలని నిర్చయించాయి. ఇందులో హోండా కంపెనీ కూడా ఉంది. నివేదికల ప్రకారం.. హోండా కంపెనీ ఏప్రిల్ ప్రారంభం నుంచి జాజ్, డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం సిటీ వంటి మోడల్స్ ఉత్పత్తిని నిలిపివేయనుంది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ నిబంధనలు క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ల వంటి భాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. బిఎస్6 ఫేస్-2 నిబంధనలు కొంత కఠినంగా ఉంటాయి, కావున కంపెనీ ఉత్పత్తులు మరింత పటిష్టంగా తయారవుతాయి, తద్వారా ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ హోండా సిటీ ఐదవ తరం మోడల్, అమేజ్ వంటి వాటిని కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. వచ్చే నెల ప్రారంభం నుంచే తమ ఉత్పత్తుల ధరలు రూ. 12,000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇదే బాటలో మరిన్ని కంపెనీలు ముందుకు సాగనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే ఈ ధరల పెరుగుదల వాహనాల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా? లేదా? అనేది త్వరలో తెలియాల్సి ఉంది. -
మారుతి కస్టమర్లకు మరో షాక్: ఏ మోడల్ అయినా బాదుడే!
సాక్షి,ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి మరోసారి తన వినియోగదారులకు షాకిచ్చింది. మారుతి అన్ని మోడల్ కార్ల ధరలను ఏప్రిల్ నుంచి పెంచేందుకు నిర్ణయించింది. ఈమేరకు కంపెనీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వ్యయాలే కారణమని గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి వ్యయాలను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వివిధ అంశాల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ధరల పెంపు తప్పడం లేదని తెలిపింది. ఏప్రిల్ 2023 నుండి ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన కంపెనీ, ఎంత శాతం పెంచేదీ స్పష్టం చేయలేదు. మోడల్‌ను బట్టి ఈ పెంపు ఉంటుందని తెలుస్తోంది. హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్‌ఝున్‌వాలా ఎంట్రీ! సూపర్! -
Top Car News of The Week: ఒక్క కథనం.. అన్ని వివరాలు!
భారతదేశం ఆటోమొబైల్ రంగంవైపు రోజురోజుకి వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే గత వారం మార్కెట్లో కొత్త ఉత్పత్తులు విడుదలయ్యాయి, కొన్ని కార్ల ధరలు కూడా పెరిగాయి. గత వారం దేశీయ మార్కెట్లో అడుగెట్టిన కార్లు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకోవచ్చు. మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జి: వాహన ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న మారుతి బ్రెజ్జా సిఎన్జి రూ. 9.14 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ సిఎన్జి వెర్షన్ కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్న బ్రెజ్జా సిఎన్జి మైలేజ్ విషయంలో అద్భుతంగా తయారైంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. 2023 కియా కారెన్స్: ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే గొప్ప అమ్మకాలు పొందుతున్న కియా కారెన్స్, రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారైంది. ఈ అప్డేటెడ్ మోడల్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.5 లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 157.8 బిహెచ్పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT యూనిట్ పొందుతుంది. 2023 కియా కారెన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. సిట్రోయెన్ సి3 కొత్త ధరలు: ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన సి3 కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది, ఈ తరుణంలో కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్ ధరలను రూ. 45,000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత సి3 రూ. 6.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. సిట్రోయెన్ సి3 కొత్త ధరల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. పెరిగిన జీప్ గ్రాండ్ చెరోకీ ధరలు: దేశీయ విఫణిలో మంచి ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి జీప్ కంపెనీకి చెందిన గ్రాండ్ చెరోకీ. ఈ SUV ధరలు ఇటీవల లక్ష వరకు పెరిగింది. కావున దీని ధర ఇప్పుడు రూ. 78.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో 268 బిహెచ్పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జీప్ గ్రాండ్ చెరోకీ కొత్త ధరలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. టయోటా హైలెక్స్ డిస్కౌంట్: భారతదేశంలో అతి పెద్ద వాహనంగా గుర్తింపు పొందిన టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కు కొనుగోలు మీద కంపెనీ రూ. 3.59 లక్షల (స్టాండర్డ్ వేరియంట్) తగ్గింపును ప్రకటించింది. అదే సమయంలో హై వేరియంట్ మ్యాన్యువల్, ఆటోమాటిక్ ధరలను భారీగా పెంచింది. హైలెక్స్ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..
భారతదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న కియా మోటార్స్ మరో నాలుగు కొత్త కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో సిఎన్జి, 5 సీటర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా 2025 నాటికి ఎలక్ట్రిక్ SUV విడుదలచేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. కొత్త కియా సెల్టోస్: కంపెనీకి ఎక్కువ అమ్మకాలు తీసుకువస్తున్న ఉత్పత్తులలో కియా సెల్టోస్ ఒకటి. ఇది త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకానుంది. ఈ మోడల్ సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టారు. కావున ఈ ఏడాది చివరినాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. కియా సోనెట్ సిఎన్జి: ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ సిఎన్జి రూపంలో విడుదలవుతుందని కంపెనీ తెలిపింది. సిఎన్జి వాహనాల వినియోగం పెరుతున్న తరుణంలో సోనెట్ సిఎన్జి విడుదలకు సిద్ధమవుతోంది. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనుంది, దీని ధర పెట్రోల్ వెర్షన్ కంటే రూ. 1 లక్ష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ) కియా కారెన్స్ 5 సీటర్: సెవెన్ సీటర్ విభాగంలో మంచి ఆదరణ పొందుతున్న కియా కారెన్స్ త్వరలో 5 సీటర్ రూపంలో విడుదలకానుంది. ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్‌లో లభించే అవకాశం ఉంది. అయితే ఈ ఫైవ్ సీటర్ కేవలం బేస్ వేరియంట్లకు మాత్రమే సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. న్యూ జనరేషన్ కార్నివాల్: 2023 కియా కార్నివాల్ 2023 ప్రారంభమలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో దర్శనమిచ్చింది. ఈ MPV ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతీయ మార్కెట్లో విడుదలకానుంది. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న కార్నివాల్ కంటే 2023 మోడల్ కొంత పెద్దదిగా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది అభిమానులు కలిగి ఉన్న హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా పరిచయమై 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా మారి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ రోజు దక్షిణాది చిత్ర సీమలో ఎక్కువ సంపాదిస్తున్న నటులలో ఈయన ఒకరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 571 కోట్లు. ఈయన నెలకు రూ. 3 కోట్లు వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. గతంలో ఒక్కో సినిమాకు రూ. 12 కోట్లు తీసుకునే వారని, ఆర్ఆర్ఆర్ మూవీకి 45 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్ ఎండార్స్మెంట్ కూడా సంపాదిస్తారు. ఇతర హీరోలతో పోలిస్తే అలాంటి సంపాదన ఎన్టీఆర్‌కి కొంత తక్కువనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా విజయం తరువాత ఇప్పుడు తన రెమ్యునరేషన్ రూ. 60 నుంచి 80 కోట్లకు పెంచారు. టాలీవుడ్లో యంగ్ టైగర్‌గా పిలువబడే Jr NTR హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రూ. 25 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాలో తన కుటుంబముతో కలిసి నివసిస్తున్నారు. బెంగళూరులో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా హైదరాబాద్ శివార్లలోని గోపాలపురంలో 'బృందావనం' అనే ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారుని కలిగి ఉన్నారు. అంతే కాకుండా రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే 718 కేమాన్, బిఎండబ్ల్యు 720LD, మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 250డి, 4 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే ఎఫ్1తో పాటు ఖరీదైన వాచీలు, సుమారు రూ. 8 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు. -
సిట్రోయెన్ సి3 కొత్త ధరలు.. వాహన ప్రియులకు షాక్
భారతదేశంలో ఇప్పటికే మంచి అమ్మకాతో ముందుకు సాగుతున్న ఫ్రెంచ్ బ్రాండ్ కారు 'సిట్రోయెన్ సి3' ధరలు తాజాగా మళ్ళీ పెరిగాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ లైవ్, ఫీల్ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లో విడుదలైంది. ప్రారంభంలో వీటి ధరలు రూ. 5.71 లక్షల నుండి రూ. 8.05 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేవి. కాగా ఇప్పుడు వీటి ధరలు రూ. 45,000 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత సి3 రూ. 6.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. 2023 ప్రారంభంలో కూడా దీని ధరలు పెరిగాయి. మార్కెట్లో మొదటి నుంచి గొప్ప అమ్మకాలు పొందుతున్న ఈ హ్యాచ్‌బ్యాక్ నాలుగు మోనోటోన్, ఆరు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. సిట్రోయెన్ సి3 మంచి డిజైన్ పొందుతుంది. ముందు భాగంలోని బంపర్లపై కలర్-కోడెడ్ ఇన్సర్ట్లు, గ్రిల్‌తో కలిసే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, హెక్సా గోనల్ ఎయిర్ డ్యామ్, X-షేప్ లో ఉండే ఫాక్స్ స్కఫ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్, బాడీ క్లాడింగ్ ఉన్నాయి. ఇది 15 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది, వెనుక భాగంలో ర్యాపరౌండ్ టెయిల్-లైట్స్ చక్కగా అమర్చబడి ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేసే 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫోర్-స్పీకర్స్, యుఎస్బి ఛార్జింగ్ సాకేట్, మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉన్నాయి. (ఇదీ చదవండి: రతన్ టాటా గురించి తెలుసు, 'మాయా టాటా' గురించి తెలుసా?) సిట్రోయెన్ సి3 రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 81 బిహెచ్పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 108 బిహెచ్పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
దెబ్బకు 17 కార్లు డిస్కంటిన్యూ: వచ్చేనెల నుంచే..
గతంలో బిఎస్6 ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన సందర్భంగా అనేక కార్ల ఉత్పత్తి నిలిపివేశారు. అయితే ఈ ఏడాది కూడా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) ఉద్గార ప్రమాణాల కారణంగా 2023 ఏప్రిల్ 01 నుంచి ఏకంగా 17 కార్లు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అనేది బిఎస్6 ఉద్గార ప్రమాణాల 2వ దశగా చెబుతున్నారు. ఇది వెహికల్ ఎగ్జాస్ట్‌ను నిశితంగా పరిశీలించి ఉద్గార నిబంధనలకు అనుగుణంగా క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ వంటి కీలక భాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. అంతే కాకుండా వాహనాల నుండి విడుదలయ్యే NOx వంటి కాలుష్య కారకాలను కొలుస్తుంది. వాహనంలో ఉపయోగించే సెమీకండక్టర్ కూడా క్రాంక్ షాఫ్ట్ పొజిషన్, థొరెటల్, ఎయిర్ ఇన్‌టేక్ ప్రెజర్, ఎగ్జాస్ట్, ఇంజిన్ ఉష్ణోగ్రత మొదలైన వాటి నుండి వచ్చే ఉద్గారాలను పర్యవేక్షించడానికి అప్‌గ్రేడ్ చేయాలి. కావున కంపెనీలు ఇంజిన్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సంస్థ ఉత్పత్తుల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొత్త ఉద్గార నిబంధనలను ప్రవేశపెట్టడంతో, వాహనాల ఇంజిన్‌లో అనేక కొత్త మార్పులు చేయవలసి ఉంది, దీని కారణంగా వాహనాల ధరలు రూ.50,000 నుంచి రూ. 90,000 వరకు & ద్విచక్ర వాహనాల ధరలు రూ. 3,000 నుంచి రూ. 10,000 మధ్య పెరిగే సూచనలు ఉన్నాయి. (ఇదీ చదవండి: రూ. 1,299కే కొత్త ఇయర్‌ఫోన్స్.. ఒక్క ఛార్జ్‌తో 40 గంటలు) ఏప్రిల్ 01 నుంచి కనుమరుగయ్యే కార్ల జాబితాలో మహీంద్రా మొరాజో, ఆల్టురాస్ జి4, టాటా ఆల్ట్రోజ్ డీజిల్, మహీంద్రా KUV100, స్కోడా సూపర్బ్, ఆక్టేవియా, హ్యుందాయ్ ఐ20 డీజిల్, వెర్నా డీజిల్, రెనో క్విడ్800, నిస్సాన్ కిక్స్, మారుతి ఆల్టో800, ఇన్నోవా క్రిస్టా పెట్రోల్, హోండా జాజ్, అమేజ్ డీజిల్, డబ్ల్యుఆర్-వి, హోండా సిటీ 4వ తరం & 5వ తరం డీజిల్ మోడల్స్ ఉన్నాయి. -
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' కార్ల ప్రపంచం.. ఓ లుక్కేసుకోండి!
భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి దాదాపు చాలామందికి తెలుసు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా పద్మభూషణ్ అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే ఈయన నిజ జీవితంలో ఎలాంటి కార్లను కొనుగోలు చేశారు, ఎలాంటి కార్లను వినియోగిస్తారనేది కొంతమందికి తెలియకపోవచ్చు. అలాంటి వారికోసం ఇక్కడ ప్రత్యేక కథనం. మహీంద్రా బొలేరో ఇన్వాడెర్: ఆనంద్ మహీంద్రా యుక్త వయస్సులో కొనుగోలు చేసిన కారు మహీంద్రా బొలేరో ఇన్వాడెర్. ఇది దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ. బొలేరో ఇన్వాడెర్ లైఫ్ స్టైల్ ఎస్యూవీ కావున సాఫ్ట్ రూఫ్ పొందుతుంది. ఇది 2.5 లీటర్ డీజల్ ఇంజన్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ కార్లు రోడ్లమీద కనిపించడం చాలా అరుదు. మహీంద్రా టియూవీ300: ఆనంద్ మహీంద్రా 2015లో టియూవీ300 కొనుగోలు చేశారు. డిజైన్ పరంగా చాలా సాలిడ్‌గా ఉన్నప్పటికీ పనితీరులో ఉత్తమంగా ఉంటుంది. మహీంద్రా టియూవీ300 అధికారిక 'ఆర్మీ' యాక్సెసరీ ప్యాక్, బోనెట్‌పై ఉండే హుల్, రూఫ్ మౌంటెడ్ యాక్సిలరీ ల్యాంప్, బ్లాక్ కలర్లో చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ యుద్ధ వాహనం మాదిరిగా కనిపిస్తుంది. మహీంద్రా టియూవీ300 ప్లస్: ఆనంద్ మహీంద్రా గ్యారేజిలో ఉన్న కార్లలో టియూవీ300 ప్లస్ ఒకటి. దీనికి 'గ్రే ఘోస్ట్' అని పేరు పెట్టుకున్నారు. ఇది స్పెషల్ స్టీల్ వైట్ కలర్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మోడల్ కొనుగోలు చేయడానికి ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వచ్చిందని ఆనంద్ మహీంద్రా చెప్పినట్లు సమాచారం. మహీంద్రా స్కార్పియో: ఒకప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగిన స్కార్పియో, ఆనంద్ మహీంద్రాను కూడా ఆకర్శించింది. ప్రస్తుతం స్కార్పియో కొత్త మోడల్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ ఆనంద్ మహీంద్రా ఉన్న కారు పాత మోడల్. ఈయన ఎక్కువ రోజులు ఈ కారునే వినియోగించారని కొంతమంది చెబుతున్నారు. మహీంద్రా ఆల్టురాస్ జి4: ఆల్టురాస్ జి4 కూడా ఆనంద్ మహీంద్రా గ్యారేజిలో చేరిన కార్లలో ఒకటి. ఇటీవల ఇందులోని కొన్ని వేరియంట్స్ నిలిపివేయబడినప్పటికి ఒకప్పుడు దేశీయ మార్కెట్లో విజయవంతంగా ముందుకు సాగింది. ఇది ప్రీమియమ్ ఆల్టురాస్ జి4 మహీంద్రా ఖరీదైన కార్ల జాబితాలో ఒకటి. ఈ కారుకి 'బాజ్' అనే పేరు ఉంది. 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: గత సంవత్సరం ఆనంద్ మహీంద్రా స్కార్పియో-ఎన్ కొనుగోలు చేసి తన గ్యారేజిలో చేర్చారు. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు కాగా టాప్ మోడల్ ధర రూ. 23.90 లక్షలు. ఇది మొత్తం 25 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త కారుకి ఆనంద్ మహీంద్రా 'భీమ్' అని పేరు పెట్టుకున్నారు.