CEO
-
ఈ బ్యాంక్ సీఈఓ జీతం ఎంతో తెలుసా?: ప్రపంచంలోనే..
గురువారం విడుదలైన బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం, డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో.. భారత సంతతికి చెందిన సీఈఓ 'పియూష్ గుప్తా' (Piyush Gupta) వేతనం భారీగా పెరిగింది. 2024 సంవత్సరానికి 56 శాతం వేతన పెంపును పొందారు. దీంతో ఆయన వేతనం 17.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు (రూ. 110 కోట్ల కంటే ఎక్కువ) చేరింది.సింగపూర్‌కు చెందిన DBS గ్రూప్ హోల్డింగ్స్ సీఈఓ గుప్తా.. 2023లో డిజిటల్ బ్యాంకింగ్ లోపాల కారణంగా 11.2 మిలియన్ సింగపూర్ డాలర్లను వార్షిక వేతనంగా తీసుకున్నారు. ఆ తరువాత ఈయన వేతనం క్రమంగా పెరిగింది. ఇప్పుడు 17.6 మిలియన్లకు చేరింది. కాగా పియూష్ గుప్తా ఈ నెలలో తన పదవిని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో 'టాన్ సు షాన్' నియమితులయ్యారు. ఈయన మార్చి 28 నుంచి DBS గ్రూప్ హోల్డింగ్స్ బాధ్యతలు స్వీకరిస్తారు.2024 సంవత్సరానికి పియూష్ గుప్తా.. తన ప్యాకేజీలో 6.6 మిలియన్స్ క్యాష్ బోనస్, 2.5 డాలర్స్ ఇతర అలవెన్స్ వంటివి పొందారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న బ్యాంకర్లలో ఒకరిగా నిలిచారు. కాగా మొదటి వ్యక్తి.. స్టాండర్డ్ చార్టర్డ్ సీఈవో 'బిల్ వింటర్స్' ఉన్నారు.ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్‌లో..గత 15 సంవత్సరాలుగా.. డీబీఎస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ గణనీయంగా పెరుగుతోంది. 2009లో ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ 35 బిలియన్ సింగపూర్ డాలర్స్ కాగా.. 2024 నాటికి ఇది 124 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 100 బిలియన్ డాలర్ల మార్కును దాటిన సింగపూర్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో చేరింది. 2009లో కేవలం 14,000 మంది ఉద్యోగులు మాత్రమే ఈ బ్యాంకులో పనిచేసేవారు. ఈ సంఖ్య 2024కు 41,000 మందికి చేరింది. డీబీఎస్ బ్యాంక్ సీఈఓ జీతం మాత్రమే కాకుండా.. ఇతర సీనియర్ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. -
ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల వేతన పెంపును 5-8 శాతం మధ్య ప్రకటించి ఉద్యోగులను నిరాశ పరిచింది. టీఈఎస్‌లో కూడా శాలరీ హైక్ శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందన్న నివేదికలు వచ్చాయి. తాజగా మరో మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా ఉద్యోగులకు బ్యాడ్ న్యూసే చెప్పింది.వేతన పెంపు వాయిదాఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ ఉద్యోగులనుద్దేశించి మాట్లడుతూ బోనస్ లు, జీతాల పెంపు ఆలస్యంతో సహా కంపెనీ వేతన పెంపు ప్రణాళికలపై అప్ డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్ లో అమలు జరగాల్సిన జీతాల పెంపును ఆగస్టుకు వాయిదా వేయడంపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని అంగీకరించారు. అయితే వాగ్దానం చేసిన పెంపుదలను గౌరవించడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా జాప్యం ఒక వ్యూహాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.వేతన ప్రణాళికలుబోనస్ స్ట్రక్చర్ గురించి కూడా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ చర్చించారు. అర్హత కలిగిన ఉద్యోగులు తమ బోనస్ లను ప్రణాళిక ప్రకారం పొందుతారని ధృవీకరించారు. ఇంటర్నల్ మెమో ప్రకారం మార్చి 10లోగా ఉద్యోగులు తమ బోనస్ లకు సంబంధించిన ఈ లెటర్లను ఆశించవచ్చు. పనితీరును ప్రతిఫలించడం, పోటీ వేతన ప్యాకేజీలను నిర్వహించడంలో కంపెనీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.విస్తృత ఆర్థిక నేపథ్యంఅనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితులు ఐటీ పరిశ్రమను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వేతనాల పెంపులో జాప్యం జరుగుతోంది. ఈ సవాళ్లను నావిగేట్ చేస్తూ ఆపరేటింగ్ మార్జిన్లను పెంచడం, ఆఫీస్ స్పేస్‌ను ఆప్టిమైజ్ చేసుకోవడంపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. ప్రతిభను నిలుపుకోవడం, మార్కెట్లో పోటీగా నిలవడం అనే ఉద్దేశంతో కంపెనీ ఈ ప్రయత్నాలను బ్యాలెన్స్ చేస్తోంది.ఉద్యోగుల ప్రతిస్పందనవేతనాల పెంపు ఆలస్యం గురించి ముందుగానే ప్రస్తావించడం ఉద్యోగుల్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. కొంతమంది దీనిని అట్రిషన్ తగ్గించడానికి మనోధైర్యాన్ని పెంచే చర్యగా భావిస్తుండగా మరికొందరు అదనపు ఒత్తిడి, వారి ఆర్థిక ప్రణాళికపై పడనున్న ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పటికీ పారదర్శకత, ఉద్యోగులకు విలువ ఉండేలా చూడటం పట్ల రవికుమార్ నిబద్ధత సానుకూల పరిణామమని నిపుణులు సూచిస్తున్నారు. -
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటారు. అందుకోసమే యువత అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు పయనమవుతోంది. ఆ దేశాలు వారికి వృత్తిపరమైన అబివృద్ధితోపాటు ఆర్థిక స్థైర్యాన్ని కూడా అందిస్తున్నాయి. అయితే ఇది కాస్త సవాళ్లతో కూడినది కూడా. పైగా ఆ దేశాల సంస్కృతికి అనుగుణంగా బతకడం అనేది అంత ఈజీ కూడా కాదు. తమ వాళ్లను వదిలి ఆ కొత్త వాతావరణంలో నెగ్గుకురాక తప్పని స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఓవ్యక్తి మాత్రం పదేళ్లకు పైగా విదేశంలో ఉండి మరీ..తాను స్వదేశానికి వచ్చి మంచి పనిచేశానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని చెప్పేస్తున్నాడు. విదేశాలకి వెళ్తేనే మంచి లైఫ్ అనుకునేవారి ఆలోచనకు అత్యంత విభిన్నంగా తన మనోభావాలను ఆన్లైన్ వేదికగా షేర్ చేసుకున్నాడు ఈ సీఈవో.ఎందుకంటే..ఆర్క్అలైన్డ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అనిరుద్ధ అంజనా అమెరికాలో ఒక దశాబ్ద కాలం పాటు ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు భారతదేశానికి తిరిగి రావాలని గట్టిగా నిర్ణయించుకుని మరీ వచ్చేశారు. అయితే వాళ్లు వీసా సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం వంటి రీజన్లు కాకుండా బలమైన కారణాన్ని వివరిస్తూ నెటిజన్ల మనసును దోచుకున్నారు. ఇంతకీ ఎందువల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడంటే..అనిరుద్ధ తన వృద్ధ తల్లిదండ్రులును చూసుకోవాలనే ఉద్దేశ్యంతో స్వదేశానికి తిరిగి వచ్చేశానని అన్నారు. జాబ్ సెక్యూరిటీ, వలస అనిశ్చితులు, కెరీర్ సమస్యల వల్ల కాదని తేల్చి చెప్పేరు. కేవలం తన కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రులకు తన అవసరం ఉన్నందున తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాడు. అయితే తన స్నేహితులు బంధువులు నుంచి తాను ఉద్యోగం కోల్పోవడం, వీసా సమస్యలు వల్ల ఇలా నిర్ణయం తీసుకున్నానంటూ పలు వ్యాఖ్యాలు వచ్చాయి. కానీ అసలు రీజన్ మాత్రం తల్లిదండ్రులతో పూర్తి సమయం వెచ్చించేందుకే ఇలా చేశానంటూ తెలిపారు. వారు నన్ను తిరిగి వచ్చేయమని ఎప్పటికీ అడగరని తెలిసే ఇలా చేశానంటూ ఇన్‌స్టాగ్రాంలో వివరించారు సీఈవో అనిరుద్ధ. తాను జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదేనని చాలా నమ్మకంగా చెప్పారు. అనిరుద్ధ పోస్ట్ సోషల్‌మీడియా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అతని పోస్ట్‌పై స్పందిస్తూ..సవాలుతో కూడిన చక్కటి నిర్ణయం అని ఒకరు, బంధాల విలువను తెలిపేలా ఉంది, అందరూ ఇలా ఆలోచిస్తే బాగుండును అంటూ మరొకరు ఇలా అనిరుద్ధ నిరర్ణయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aniruddha (@growwith_ani) (చదవండి: 'గైనకాలజీ పితామహుడు': అనస్థీషియా లేకుండా నల్లజాతి మహిళలపై..!) -
సీఈవో... జీతాలు అదరహో
కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, చార్టర్డ్ విమానాల్లో ప్రయాణం.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కనిపెట్టుకొని ఉండే సేవకులు.. జీ హుజూర్ అనే యాజమాన్యాలు.. వీటన్నింటికీ మించి వందల కోట్ల రూపాయల వేతనాలు.. ప్రపంచ టాప్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల జీవితమిది. కంపెనీని లాభాల్లో నడిపించగలడు అని నమ్మితే ఎంత వేతనం, ఎన్ని సౌకర్యాలైనా ఇచ్చి సీఈవోగా నియమించుకునేందుకు కంపెనీలు వెనుకాడటంలేదు.అందుకే కొందరు సీఈఓలు కళ్లు చెదిరే వేతనాలు అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణ స్టార్‌బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్. ఆయన వారంలో మూడు రోజులే ఆఫీస్‌కు వస్తారు. అది కూడా 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఫీస్‌కు చేరుకుంటారు. ప్రయాణం, నివాసం.. ఇలా అన్ని ఖర్చులూ కంపెనీయే భరిస్తుంది. ఆయన ఏడాదికి 113 మిలియన్ డాలర్ల (రూ.971 కోట్లు) ప్యాకేజీ అందుకుంటున్నారు. బ్రియాన్ అమెరికాలోని టాప్–20 సీఈఓల్లో ఒకరు. ఎందుకంత అధిక వేతనాలు? భారత కంపెనీలు చాలా వేగంగా వృద్ధి చెందుతూ, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా దేశీ సీఈఓలకు సైతం అధికంగా పారితోషికాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో టాప్ బాస్ అయిన సీఈఓనే కంపెనీ వ్యాపార విజయాలకు సూత్రధారి.కంపెనీలను విజయపథంలో నడపగలిగే సీఈఓలకు అంతర్జాతీయంగా అధికడిమాండ్ ఉంది. వారిని పారితోషికాలతో ప్రసన్నం చేసుకునేందుకు కంపెనీ బోర్డులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటంలేదు. సీఈఓల పారితోíÙకం షేర్ల కేటాయింపు రూపంలోనూ ఉంటుంది. షేర్ల ధరలు పెరగడం వారి పారితోíÙకాన్ని మరిన్ని రెట్లు చేయగలదు.భారత్‌లో సగటు నెల వేతనం 10 కోట్లుభారత్‌లో సీఈవోల సగటు నెల వేతనం రూ.10 కోట్లుగా ఉంది. అమెరికాలో ఇది 14–15 మిలియన్ డాలర్లు (రూ. 129 కోట్లు) కోట్లు. అమెరికా కంపెనీల్లో సీఈఓ వేతనం సగటు ఉద్యోగి వేతనం కంటే 160–300 రెట్లు ఎక్కువగా ఉంది. మనదేశంలో నిఫ్టీ –50 కంపెనీల్లో సగటు ఉద్యోగి కంటే సీఈవో వేతనం 260 రెట్లు అధికం. -
తాజా కార్పొరేట్ నియామకాలు
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్‌కు నేతృత్వం వహిస్తున్న జీఎస్ఎంఏ బోర్డ్ ఛైర్మన్‌గా ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. టెలిఫోనికా ఛైర్మన్, సీఈవో పదవికి హొసే మరియా అల్వరేస్ ప్యాలే రాజీనామా చేయడంతో జీఎస్ఎంఏ ఛైర్మన్ పదవి కోల్పోయారు. జీఎస్ఎంఏ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇటీవలే గోపాల్ విఠల్ తిరిగి నియమితులయ్యారు. అసోసియేషన్ బోర్డు సభ్యుడిగా 2019–20లో పనిచేశారు. 1,100లకుపైగా టెలికం, హ్యాండ్సెట్, డివైస్, సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్, ఇంటర్నెట్ రంగ కంపెనీలు జీఎస్ఎంఏలో సభ్యులుగా ఉన్నాయి.ఇదీ చదవండి: రేపు భారత్‌కు ఓపెన్ఏఐ సీఈఓ ఆల్ట్మన్టీవీఎస్ టూవీలర్స్ ప్రెసిడెంట్వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ టూవీలర్స్ బిజినెస్ ప్రెసిడెంట్‌గా గౌరవ్ గుప్తా నియమితులయ్యారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఈవీ విభాగాలకు ఆయన నేతృత్వం వహిస్తారని కంపెనీ ఇటీవల తెలిపింది. గతంలో ఆయన ఎంజీ మోటార్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, డిప్యూటీ ఎండీ, చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయం
హ్యూమన్స్ ఆఫ్ బాంబే సీఈఓ కరిష్మా మెహతా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇటీవల తన అండాలను (ఎగ్స్)ను భద్రపర్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్దతిని ఇప్పటికే చాలా మంది, సెలబ్రిటీలు హీరోయిన్స్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పునరుత్పత్తి సాధికారత కోసం ఎగ్స్‌ను చాలా మంది మహిళలు ఫ్రీజ్ చేసుకుంటున్న అంశాన్ని ఆమె హైలైట్ చేశారు. ఇంతకీ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో..ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎగ్ ఫ్రీజింగ్ అంటే వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకోవడం. ఇది కరియర్లో లేదా చదువులో బిజీగా ఉన్నపుడు, కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులు బాటు కల్పిస్తుంది. 30 వయసు దాటిన తరువాత నుంచి మహిళల్లో అండాల ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత క్షీణిస్తుంది అందుకే ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మహిళల అండాలను సేకరిచి భద్రపరుస్తారు. కావాలనుకున్నపుడు ఈ అండాల ద్వారా పిల్లల్ని కనవచ్చు.ఈ ప్రక్రియను “ఓసైట్ క్రయోప్రెజర్వేషన్ అంటారు. తద్వారా జీవితంలో తరువాతి కాలంలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు తమ అండాలను గుడ్డు దానం విషయంలో ఇదే టెక్నిక్ సహాయపడుతుంది. మహిళల అండాల పరిస్థితి, ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈ ప్రక్రియకోసం దాదాపు 10 నుండి 14 రోజుల వరకు పట్టవచ్చు. తాజాగా కరిష్మా మెహతా ఇన్‌స్టా స్టోరీలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. తద్వారా ఎగ్ ఫ్రీజింగ్ మహిళల సంతానోత్పత్తి, పిల్లల్ని ఎపుడు కనాలి అంశాలనే చర్చను మరింత విస్తృతం చేశారు. కాగా ముంబైకి చెందిన కరిష్మా 1992 మార్చి 5న జన్మించింది. తన ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఫేస్బుక్ ద్వారా ఎందరో విజేతలను పరిచయం చేసింది. వారు అసామాన్య జీవన పోరాటాలు, త్యాగాలు, గొప్ప పనులు ఈ పేజీ ద్వారా లోకానికి తెలిశాయి.ఇలా సంతానోత్పత్తిలో కీలకమైన అండాలను మహళలు భద్రపర్చుకోవడం ద్వారా పిల్లల్ని ఎపుడు కనాలనుకుంటే అపుడు కనేందుకు ఇది చాలా అవసరమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం పిల్లల్ని కనేందుకు సంసిద్దంగా లేనపుడు, భవిష్యత్తులో పిల్లలు పుడతారా లేదా? అనే ఒత్తిడిని అరికట్టేందుకు ఎగ్ ఫ్రీజింగ్ అనేది అనుమతిస్తుంది.ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్లు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. స్టార్ హీరోయిన్, ప్రియాంక చోప్రా, హీరోయిన్ మెహ్రీన్ కూడా ఆ జాబితాలో చేరారు. అంతేకాదు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత రోజుల్లో సరైన రిలేషన్ షిప్ దొరకడం చాలా కష్టమని. అందుకే తాను ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పు కొచ్చింది. -
‘రూ.కోటి జీతమిచ్చినా సాఫ్ట్వేర్ ఉద్యోగులంతే’
భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై తీవ్ర విమర్శలు చేశారు అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో. భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ. 1 కోటి వరకు అధిక జీతాలు ఇస్తున్నా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన వరుణ్ ఉమ్మడి తన కంపెనీ భారతీయ కార్యాలయానికి నియామకం ఇబ్బందిగా మారిందని, చాలా మంది ఇంజనీర్లు కూడా వారానికి ఆరు రోజులు పని చేయడానికి కూడా ఇష్టపడటం లేదంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు."మా భారతీయ కార్యాలయానికి ఇంజనీర్లను నియమించుకోవడంలో ఒక విచిత్ర పరిస్థితిని గమనించాను. రూ. 1 కోటి మూల వేతనం ఉన్నప్పటికీ, చాలా మంది కష్టపడి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. 3 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉన్న ఇంజనీర్లు చాలా మంది వారానికి ఆరు రోజులు పని చేయడానికి ముందుకు రాలేదు" అంటూ వరుణ్ రాసుకొచ్చారు.వరుణ్ ‘ఎక్స్’ పోస్ట్‌కు లక్షలలో వ్యూస్ వచ్చాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కాదు.. ప్రస్తుతం అన్ని వృత్తులలోనివారూ మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారని చాలా మంది వినియోగదారులు కామెంట్స్ చేశారు.ఉద్యోగులను ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ నేపథ్యంలో వరుణ్ ఉమ్మడి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగులతో వారానికి ఆరు రోజులు ఎందుకు పని చేయిస్తున్నారంటూ కొంతమంది ఎక్స్ యూజర్లు వరుణ్‌ను ప్రశ్నించారు. -
పాక్ ఎఫెక్ట్..? ఐసీసీ సీఈవో అలార్డీస్ రాజీనామా
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ ముందర అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో సీఈవో జెఫ్ అలార్డీస్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇందుకు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ సన్నద్ధత సరిగా లేకపోవడం గురించి స్పష్టంగా వివరించడలేకపోవడం కూడా అలార్డీస్ రాజీనామాకు ఒక కారణమని ఐసీసీ సభ్యుడొకరు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్‌లో కాకుండా.. దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ఆడనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 57 ఏళ్ల అలార్డీస్ 2012లో జనరల్ మేనేజర్‌గా ఐసీసీలో చేరాడు. 2021 నవంబరులో ఐసీసీ సీఈవోగా నియమితుడయ్యారు. మరోవైపు ఆయన తప్పుకోవడానికి గల కారణాలు ఐసీసీ పేర్కొనలేదు. అయితే సీఈవోగా అలార్డీస్ అంకితభావంతో పనిచేశాడని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. తదుపరి సీఈవో ఎంపిక ప్రక్రియను ఐసీసీ ప్రారంభించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్టు పాక్‌లో కరాచీ, రావల్పిండిలో మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే అక్కడి స్టేడియాలు ఇంకా నిర్మాణంలోనే ఉన్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రతిష్టాత్మక ట్రోఫీ నిర్వహణకు పాక్ రెడీనేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు పాక్ ఎంపికపై ఐసీసీ పైనా విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో అలార్డీస్ ఇప్పుడు తప్పుకోవడం గమనార్హం.మరోవైపు.. ఐసీసీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లే, యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్, మార్కెటింగ్ & మీడియా హెడ్ క్లెయిర్ ఫర్లోంగ్‌లు వ్యక్తిగత కారణాలు చూపుతూ తమ తమ పదవుల నుంచి వైదొలిగారు. -
జోహో సీఈఓ రాజీనామా: న్యూ చాప్టర్ బిగిన్ అంటూ ట్వీట్
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ జోహో కార్పొరేషన్ (Zoho Corporation) ఫౌండర్ 'శ్రీధర్ వెంబు' (Sridhar Vembu) తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే అదే కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేయనున్నట్లు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తూ.. పరిశోధన, కంపెనీ అభివృద్ధికి దోహదపడనున్నట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న మార్పులతో పాటు.. తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ వెంబు తెలిపారు. అంతే కాకుండా నేను నా వ్యక్తిగత గ్రామీణ అభివృద్ధి మిషన్‌ను కొనసాగించడంతో పాటు.. R&D కార్యక్రమాలపై పూర్తి సమయం దృష్టి కేటాయిస్తానని తెలిపారు.కంపెనీ కో ఫౌండర్ శైలేష్ కుమార్ డేవే కొత్త సీఈఓగా వ్యవహరిస్తారు. మరో సహ వ్యవస్థాపకుడు టోనీ థామస్ జోహో యూఎస్‌ను లీడ్ చేస్తారు. రాజేశ్ గణేశన్ మేనేజ్‌ఇంజిన్ డివిజన్‌ను, మణి వెంబు జోహో.కామ్ డివిజన్‌ను లీడ్ చేస్తారని.. కంపెనీ భవిష్యత్తు పూర్తిగా మనం R&D ఛాలెంజ్‌ని ఎంత బాగా నావిగేట్ చేస్తాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నేను కూడా టెక్నికల్ వర్క్‌కి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 365 రోజుల వ్యాలిడిటీ1996లో శ్రీధర్ వెంబు AdventNet అనే నెట్వర్క్ పరికరాల ప్రొవైడర్ల కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ హౌస్‌ను స్థాపించారు. ఇదే 2009లో జోహో కార్పొరేషన్‌గా మారింది. గత సంవత్సరం 5.85 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో 39వ సంపన్నుడిగా నిలిచిన శ్రీధర్ వెంబు.. 2021లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు.A new chapter begins today. In view of the various challenges and opportunities facing us, including recent major developments in AI, it has been decided that it is best that I should focus full time on R&D initiatives, along with pursuing my personal rural development mission.…— Sridhar Vembu (@svembu) January 27, 2025 -
దిగ్గజ కంపెనీ సీఈఓ రాజీనామా
ప్రముఖ వాహన తయారీ సంస్థ కేటీఎం.. ఒక ప్రధాన నాయకత్వ మార్పును చేసింది. కో-సీఈఓ అయి 'గాట్ఫ్రైడ్ న్యూమీస్టర్' (Gottfried Neumeister)ను కొత్త సీఈఓగా నియమించింది. కాగా 30 సంవత్సరాలకు పైగా కేటీఎంకు నాయకత్వం వహించిన 'స్టీఫన్ పియరర్' (Stefan Pierer) తన సీఈఓ పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ మార్పులు జరిగాయి.రాజీనామా తరువాత కూడా స్టీఫన్ పియరర్.. కేటీఎం, హస్క్వర్నా, గ్యాస్గ్యాస్ మాతృ సంస్థ అయిన 'పియరర్ మొబిలిటీ' (Pierer Mobility)లో కీలక వాటాదారుగా బోర్డులో ఉంటూనే.. కో-సీఈఓగా తన ఆలోచనలను పంచుకోనున్నారు. 1992 నుంచి కంపెనీ వృద్ధికి పాటుపడుతూ.. సంస్థను గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగేలా చేశారు. కాగా కంపెనీ ప్రస్తుతం అప్పుల్లో కొనసాగుతోంది.కంపెనీ తన మోటార్‌సైకిల్స్ ఉత్పత్తిని కూడా గణనీయంగా తగ్గించింది. సంస్థ 2024లో మొత్తం 2,30,000 మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేసింది. ఇది 2023 కంటే 26 తక్కువ. అంతే కాకుండా దాని అనుబంధ సంస్థలో గత ఏడాది 1,800 మంది ఉద్యోగులను తొలగించింది.ఇదీ చదవండి: నెలకు రూ.260 కోట్ల జీతం.. ఎవరీ సీఈఓ తెలుసా?ప్రస్తుతం కంపెనీ మళ్ళీ పూర్వ వైభవం పొందటానికి ఎంవీ అగస్టా వంటి పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. కంపెనీ ఆర్థికంగా మళ్ళీ ఓ గాడిలో పడినట్లు అవుతుంది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని కొత్త బైకులను మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. -
నెలకు రూ.260 కోట్ల జీతం: ఎవరీ సీఈఓ తెలుసా?
ఎక్కువ జీతాలు తీసుకునే సీఈఓలు ఎవరంటే? టక్కున చెప్పే సమాధానం.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్. అయితే వీరి కంటే ఎక్కువ జీతం తీసుకున్న ఓ వ్యక్తి ఒకరున్నారని బహుశా.. కొంతమందికి తెలిసుండకపోవచ్చు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన జీతం ఎంత? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.యాపిల్, గూగుల్ చీఫ్‌లు ఒక్కొక్కరు దాదాపు 75 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 646 కోట్లు) ప్యాకేజ్ తీసుకుంటారు. కానీ ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ (Starbucks) సీఈఓ 'బ్రియాన్ నికోల్'(Brian Niccol) మాత్రం ఏకంగా 96 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం తీసుకుంటున్నారు. అంటే ఆయన జీతం సుమారు రూ. 827 కోట్లు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.గత ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో కంపెనీలో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ నికోల్.. జీతంలో దాదాపు 94 శాతం స్టాక్ అవార్డుల నుంచి వచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన కంపెనీలో చేరిన నెల రోజుల తరువాత 5 మిలియన్ డాలర్ల సైన్ ఆన్ బోనస్ కూడా పొందారు. దీంతో అమెరికాలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓలలో నికోల్ ఒకరుగా నిలిచారు.సెప్టెంబర్ 2024లో నికోల్ బాధ్యతలు తీసుకున్నప్పుడు.. కంపెనీ ఆయన వార్షిక వేతన ప్యాకేజీ విలువ సుమారు 113 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. అయితే సీఈఓగా చేరిన కేవలం నాలుగు నెలల్లో 96 మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు. గత ఏడాది స్టార్‌బక్స్ వరుస నష్టాలను చవి చూసిన సమయంలో.. సంస్థ భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగించి, ఆ స్థానంలో నికోల్‌ను నియమించింది.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
పనిగంటలు కాదు.. అదే ముఖ్యం: భారత్‌పే సీఈఓ
ఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి.. అంటూ వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పిన లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు దీనిని ఖండిస్తూ.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇప్పుడు తాజాగా భారత్‌పే సీఈఓ 'నలిన్ నేగి' (Nalin Negi) చేరారు.ఫిన్‌టెక్ సంస్థ పని చేసే ప్రదేశాలలో ఎక్కువ గంటలు ఉండదని, పని ప్రదేశాల్లో ఉద్యోగుల ఫలితాలు.. ఉత్పాదకతలో నాణ్యత మాత్రమే ముఖ్యమని నలిన్ నేగి అన్నారు. వారానికి 90 గంటలు పనిచేయడం అనేది చాలా కష్టం. ఇది ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతుంది. దానివల్ల సరైన ఉత్పాదక ఉండదు. కాబట్టి ఎన్ని గంటలు పనిచేశామనేది కాకుండా.. నాణ్యమైన ఉత్పాదకత ఎంత ఉంది అని చూడటం ముఖ్యమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.భారత్‌పే చీఫ్ మాట్లాడుతూ.. ఒక కంపెనీ ఉద్యోగాలను ఇవ్వడం మాత్రమే కాదు, ఉద్యోగులకు మంచి భవిష్యత్తును కూడా ఇవ్వాలి అని అన్నారు. ప్రస్తుతం ఇదే మా లక్ష్యం అంటూ వెల్లడించారు. ఒక ఉద్యోగి సంతోషంగా పనిచేస్తేనే.. సంస్థకు లాభం ఉంటుంది. కాబట్టి వారానికి 90 గంటల పనిపై నాకు నమ్మకం లేదు అని అన్నారు.వారానికి 90 గంటల పని చేయాలనే వ్యాఖ్యలపై.. 'ఆనంద్ మహీంద్రా', సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' మొదలైనవారు కూడా స్పందించారు.ఆనంద్ మహీంద్రాఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్అదార్ పూనావల్లాఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు. -
భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..
ప్రముఖ టెక్ దిగ్గజం 'యాపిల్' (Apple).. సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) జీతాన్ని ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 18 శాతం పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.వార్షిక వేతనం 18 శాతం పెరగడంతో.. టిమ్ కుక్ వేతనం 74.6 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 643 కోట్లు)కు చేరింది. యాపిల్ సీఈఓ జీతంలో బేసిక్ పే 3 మిలియన్ డాలర్లు, స్టాక్ అవార్డులు 58.1 మిలియన్ డాలర్లు, సుమారు 13.5 మిలియన్ డాలర్లు అదనపు పరిహారం వంటివి ఉన్నాయి.కంపెనీ వార్షిక సమావేశం (ఫిబ్రవరి 25) జరగడానికి ముందే యాపిల్ టిమ్ కుక్ జీతం భారీగా పెంచినట్లు ప్రకటించింది. త్వరలో జరగనున్న సంస్థ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కుక్ వేతనం 2023 కంటే ఎక్కువే. అయినప్పటికీ ఈయన 2022లో (100 మిలియన్ డాలర్లు) అందుకున్న వేతనంతో పోలిస్తే చాలా తక్కువే అని సమాచారం.టిమ్ కుక్‌తో పాటు యాపిల్ రిటైల్ చీఫ్, మాజీ సీఎఫ్ఓ, సీఓఓ, జనరల్ కౌన్సిల్ సహా ఇతర యాపిల్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ 2024లో 27 మిలియన్ డాలర్లకు పైగా వేతనాన్ని పొందనున్నారు. మొత్తం మీద యాపిల్ కంపెనీ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. -
బాత్రూమ్లో ఏడ్చేదాన్ని: పనిగంటలపై రాధికా గుప్తా
వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy), 70 గంటలు కాదు.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ 'సుబ్రమణ్యన్' (Subrahmanyan) పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' (Radhika Gupta) తాను వారానికి 100 గంటలు పనిచేశానని వెల్లడించారు.రాధికా గుప్తా ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో వారానికి 100 గంటలు పనిచేసాను. అలా నాలుగు నెలల పాటు పని చేసినట్లు పేర్కొన్నారు. పనిగంటలు పెరిగినంత మాత్రమే ఉత్పాతకత పెరుగుతుందనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. ఇది ఉద్యోగిపై ఒత్తిడిని పెంచడమే కాకుండా.. మానసికంగా కృంగదీస్తుంది. కుటుంబాలకు సైతం దూరం చేస్తుందని అన్నారు.ఛాయిస్, హార్డ్‌వర్క్, ఆనందం పేరుతో ట్వీట్ చేస్తూ.. రాధికా గుప్తా ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పనిగంటలపై పెద్ద డెబిట్ జరుగుతోంది. కాబట్టి ఈ అంశం మీద ట్వీట్ చేయాలా? వద్దా? అని ఆలోచించాను. అయితే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం మీద చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.కష్టపడి పనిచేయడం ముఖ్యం. నేను దానిని నేర్చుకున్నాను. మనిషి ఎదగడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడిపని చేయడం అని నమ్ముతున్నాను. కష్టపడి పనిచేసే వ్యక్తి వేగంగా ఎదుగుతాడని కూడా నేను నమ్ముతానని అన్నారు.ఇక పని గంటల విషయానికి వస్తే.. నేను ఉద్యోగంలో చేరిన మొదటిరోజుల్లో, మొదటి ప్రాజెక్ట్‌లో నెలకు వారానికి 100 గంటలు, రోజుకు 18 గంటలు పని చేశాను. పని ఒత్తిడి తట్టుకోలేక ఆఫీసు బాత్రూమ్లోకి వెళ్లి ఏడ్చేదాన్ని. కొన్ని సార్లు తెల్లవారుజామున 2 గంటలకు తినేదాన్ని. ఈ కారణంగానే రెండు సార్లు ఆసుపత్రిలో చేరాను. బ్యాంకింగ్, కన్సల్టింగ్ మొదలైన రంగాలలో ఉద్యోగాలు చేసే నా స్నేహితులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు.ఎక్కువ గంటలు పనిచేసినంత మాత్రాన.. ఎక్కువ ఉత్పాదకత ఉండదు. ఉన్న సమయంలో ఎంత సమర్ధవంతంగా పనిచేశామన్నదే ముఖ్యం అని రాధికా గుప్తా పేర్కొన్నారు. పని గంటలు ఎక్కువైతే.. ఆందోళన, గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతూ.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. అయితే ఆ సమయంలో ఉత్పాదకత ఉండేలా చూసుకుంటారు. కాబట్టి సమయానికి ఆఫీసుకు రండి, చేయాల్సిన పనిని పూర్తి చేయండి. అవసరమైన సమావేశాలను మాత్రమే నిర్వహించండి, టెక్నాలజీని కావలసిన విధంగా ఉపయోగించుకోండని రాధికా గుప్తా పేర్కొన్నారు.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక రిపోర్ట్: వేలాది ఉద్యోగులు బయటకుభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మనమందరం దోహదపడాలి. కానీ మనం అలా చేస్తున్నప్పుడు, ఆ అభివృద్ధి ఫలాలను ఆస్వాదించడానికి కూడా మనం ప్రయత్నించాలి. పని చేస్తూనే కుటుంబాలతో కలిసి ఉండటం.. పిల్లలకు మెరుగైన జీవితాలను అందించడం వంటి వాటి మీద కూడా దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు.నేను ఎంతోమంది యువతను.. ముఖ్యంగా మహిళలకు కలుస్తుంటాను. కుటుంబం & కెరీర్ కలిసి ఉండలేవనే భయం కారణంగా తమకు కుటుంబం ఉండాలా వద్దా అని వారు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న నన్ను చాలా భయపెడుతుంది. అయితే ప్రతి ఒక్కరూ.. వికసిత్ భారత్ కల సాకారానికి దోహదపడుతూనే.. పని - జీవితంతో సంతోషాన్ని ఆస్వాదించాలని రాధికా గుప్తా స్పష్టం చేశారు.Choices, Hard Work and Happiness I debated whether to write this post, because the risk of being misquoted on this issue in this clickbait world is high. But I am trying to share what is a nuanced point of view on the issue of work-life balance.1. Hard work is important and…— Radhika Gupta (@iRadhikaGupta) January 11, 2025 -
టేబుల్ స్పేస్ సీఈవో అమిత్ బెనర్జీ కన్నుమూత
వర్క్‌స్పేస్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘టేబుల్ స్పేస్’ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అమిత్ బెనర్జీ కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గుండెపోటుతో ఆయన చనిపోయాడంటూ కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నప్పటికీ అమిత్ బెనర్జీ మరణానికి తక్షణ కారణం ఇంకా తెలియలేదు.“మా వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు ప్రకటించడం చాలా విచారకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ సొల్యూషన్ పరిశ్రమను మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. ఆయన నాయకత్వంలో టేబుల్ స్పేస్ ఈస్థాయికి చేరింది” అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.కంపెనీ, దాని వ్యక్తులు మరియు పరిశ్రమపై అతని ప్రభావం శాశ్వతంగా ఉంటుంది మరియు అతని కుటుంబం, స్నేహితులు మరియు భాగస్వాములచే అతను తీవ్రంగా మిస్ అవుతాడు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము.అమిత్ బెనర్జీ గురించి..దాదాపు 44 ఏళ్ల వయస్సు ఉన్న అమిత్ బెనర్జీ, 2017 సెప్టెంబర్‌లో టేబుల్ స్పేస్‌ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్‌గా అందుబాటులోకి వచ్చింది.పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో 2002లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన అమిత్ బెనర్జీ 2004 జనవరిలో ఐటీ మేజర్ యాక్సెంచర్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ సంస్థలో 13 సంవత్సరాలు పనిచేసిన ఆయన రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్‌కు బాధ్యత వహించారు.వృత్తిపరమైన అనుభవం అతన్ని రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టేబుల్ స్పేస్‌ను ప్రారంభించడంలో సహాయపడింది. అమిత్ బెనర్జీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. బెనర్జీ సెజ్ డీల్ స్ట్రక్చరింగ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆయన సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌లో ఆవిష్కరణలతో పేటెంట్ హోల్డర్ కూడా.టేబుల్ స్పేస్ గురించి..గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ హిల్‌హౌస్ క్యాపిటల్ మద్దతుతో ఉన్న టేబుల్ స్పేస్, 2025లో ఐపీఓకి వెళ్లాలని చూస్తున్న అనేక స్టార్టప్‌లలో ఒకటి. రూ. 3,500 కోట్ల కంటే ఎక్కువ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. సుమారు 2.5 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.టేబుల్ స్పేస్ వెబ్సైట్ ప్రకారం.. సంస్థ నిర్వహించే వర్క్‌స్పేస్‌లలో మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రధానంగా గూగుల్ (Google), యాపిల్ (Apple), డెల్ (Dell) వంటి ఫార్చూన్ (Fortune) 500 కంపెనీలతో కలిసి పని చేస్తుంది. పెద్ద స్థలాలను లీజుకు ఇవ్వడం, వాటిని ఆధునీకరించడమే కాకుండా వాణిజ్య రియల్ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి జాయింట్ వెంచర్ల కోసం కంపెనీ భారతీయ రియల్టర్లతో కూడా జతకట్టింది.వరుస విషాదాలుస్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. రెండు వారాల క్రితం, ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్‌లో బైకింగ్ ట్రిప్‌లో గుండెపోటుతో మరణించారు. -
అవరోధాలెన్నో చూసాను: పెద్ద మహిళగా కనిపించడానికి..
షార్క్ ట్యాంక్ ఇండియా కార్యక్రమంలో.. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్స్ సీఈఓ 'రాధికా గుప్తా' (Radhika Gupta) తాను ఉద్యోగం సాధించడంలో ఎదుర్కొన్న కష్టాలను, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలను వెల్లడించారు.పైకి కనిపించేంత కఠినంగా ఉండను, నేను చాలా సెన్సిటివ్ పర్సన్‌ని. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. నేను ఎప్పుడూ చదువులో ముందుండేదాన్ని. నా తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి, తల్లి టీచర్. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి బాగా చదివేదాన్ని అని రాధికా గుప్తా పేర్కొన్నారు.నాకు ఎలాంటి కార్పొరేట్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. కాబట్టి చదువులో ముందున్నప్పటికీ.. ఏం చేయాలి? ఎలా చేయాలి అనే విషయాల్లో స్పష్టత ఉండేది కాదు. ఉద్యోగం విషయంలో చాలా తిరస్కరణలను ఎదుర్కొన్నాను. క్యాంపస్‌లో ఉన్నప్పుడే అనేక ఓటములు చూశాను. లుక్స్ పరంగా ఎన్నో అవరోధాలను అధిగమించి.. జాబ్ తెచ్చుకున్నాను. కానీ ఫైనాన్స్ రంగం వైపు వస్తానని ఎప్పుడూ ఊహించలేదు.ఫైనాన్స్ రంగం (Finance Sector)లోకి అడుగు పెట్టిన తరువాత 33 సంవత్సరాల వయసులోనే సీఈఓ (CEO) అయ్యాను. కానీ పెట్టుబడులు పెట్టేవారు నా వయసును చూసి వెనుకడుగు వేసేవారు. పెద్ద మహిళగా కనిపించడానికి చీర కట్టుకోవడం అలవాటు చేసుకున్న. ఆ తరువాత ప్రజలకు నా మీద నమ్మకం పెరిగిందని రాధికా గుప్తా వెల్లడించారు. -
ఉద్యోగులందర్ని నిలబెట్టి పనిష్ చేసిన సీఈవో
-
అధికారులకు అరగంట శిక్ష!
అధికారులు ప్రజలతో వ్యవహరించే తీరు కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతుంటుంది. ఆ టైంలో చూసేవాళ్లకు రక్తం మరిగిపోతుంటుంది. వాళ్లు ఉన్నది తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడానికే కదా! అనుకుంటాం. అయితే.. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు ఇక్కడ ఓ ఉన్నతాధికారి భలే శిక్ష విధించారులేండి.అది నోయిడా అథారిటీ కార్యాలయం. సోమవారం నాడు ఓ వృద్ధ జంట తమ పని కోసం అక్కడికి వచ్చారు. చాలాసేపు దాకా అక్కడున్నవాళ్లెవరూ వాళ్లను పట్టించుకోలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ వాళ్లు అలా నిలబడే ఉండిపోయారు. ఇది నోయిడా అథారిటీ సీఈవో లోకేష్ ఎం గమనించారు. మరో అరగంట పోయాక చూస్తే.. ఆ వృద్ధ జంట అలాగే నిలబడి ఉన్నారట!. దీంతో.. ఆయన తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చారు.వెంటనే.. బయటకు వచ్చి అరగంట పాటు నిలబడి పని చేయండి అని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. దీంతో అక్కడున్నవాళ్లంతా నిర్ఘాంతపోయారు. అలా నిలబడి పని చేస్తే.. ఆ వృద్ధ జంట పడ్డ కష్టమేంటో మీకు తెలుస్తుంది అని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. హ్యాట్సాఫ్ సర్!.. ప్రస్తుతం ఆ శిక్షకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.In Noida Authority, an elderly couple was struggling to get their file approved but faced complete neglect. Witnessing this, the CEO took a bold step – ordered all employees to stand and work for 30 minutes as punishment!#CEO #Noida pic.twitter.com/RrZMOAc4xn— Sneha Mordani (@snehamordani) December 17, 2024 -
తలకాయ కట్ చేస్తా బిడ్డా..
బంజారాహిల్స్(హైదరాబాద్): యాప్ రూపకల్ప నలో భాగంగా ఓ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కోట్లాది రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్ట డమే కాకుండా అడగడానికి ఇంటికొచ్చిన సీఈఓను అంతుచూస్తానని బెదిరించిన ఘటనలో హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరాషేక్, ఆమె భర్త సమీర్‌ఖాన్ లపై బంజారాహిల్స్‌లో క్రిమినల్ కేసు నమో దెంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎమ్మెల్యే కాల నీలో నివసించే నౌహీరా షేక్ వ్యాపారాల పేరుతో డబ్బులు వసూలు చేసి వేలాది మందికి కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు. ఎవరెవరికి బకాయి ఉన్నారో, వారికి సంబంధించిన లెక్కలు తేల్చేందుకు ఒక యాప్‌ను రూపొందించాలని బెంగళూరుకు చెందిన వన్హెల్ప్ టెక్నాలజీ సీఈఓ మహ్మద్ అఖిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.2021–23లో వన్ హెల్ప్ టెక్నాలజీ ఈ యాప్ రూపకల్పనలో భాగంగా బకాయిదారులకు చెల్లించాల్సిన డబ్బు లతో వివరాలు రూపొందించింది. ఇందుకు గాను రూ.7.46 కోట్లు నౌహీరా షేక్ సదరు సంస్థ సీఈఓకు అఖిల్‌కు బాకీ పడింది. ఈ డబ్బులు తరచూ అడుగుతున్నా, ఆమె దాటవేస్తూ వచ్చింది. ఎక్కువ మాట్లాడితే కేసులు పెడ తానని బెదిరించసాగింది. ఈ నెల 11వ తేదీన అఖిల్ నౌహీరాషేక్ ఇంటి కొచ్చాడు.తనకు బాకీ పడ్డ రూ.7.46 కోట్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. ఆగ్రహంతో ఊగిపోయిన నౌహీరా షేక్ తలకాయ కట్ చేస్తా బిడ్డా..ఇక్కడే హత్య చేసి పాతిపెడతా..హైదరాబాద్ దాటి ఎలా వెళతావో చూస్తా అంటూ బెదిరించడమే కాకుండా ఆమె భర్త సమీర్‌ఖాన్ దూషిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బయటకు గెంటించాడు. మా సంగతి మీకు తెలియదు.. నాకున్న కేసుల్లో ఇంకోటి చేరుతుంది అంతే..అంటూ హెచ్చరించారు. ఈ బెదిరింపులన్నీ అఖిల్ వారికి తెలియకుండా రికార్డు చేసి బంజారాహిల్స్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నౌహీరాషేక్, ఆమె భర్తపై బీఎన్ఎస్ సెక్షన్ 351 (2)(3) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటెల్ ఉద్యోగుల కోసం మాజీ సీఈవో ఉపవాసం..
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ ఉద్యోగుల కోసం దాని మాజీ సీఈవో పాట్ గెల్సింగర్ ఉపవాసం ఆచరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులనూ కోరుతున్నారు. ఇంతకీ ఉపవాసం ఎందుకు చేస్తున్నారు.. ఇంటెల్ ఉద్యోగులకు ఏమైంది.. ఈయన ఏం చెప్పారన్నది ఇప్పుడు చూద్దాం..ఇంటెల్ సంస్థ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ సీఈవో పాట్ గెల్సింగర్.. సంస్థలో పనిచేస్తున్న లక్ష మందికి పైగా ఉద్యోగుల శ్రేయస్సు, వారి భవిష్యత్తు కోసం లోతైన ఆందోళనను వ్యక్తం చేస్తూ తాను ఆచరిస్తున్న ప్రార్థన, ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరుకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు."నేను ప్రతి గురువారం 24 గంటలపాటు ప్రార్థన, ఉపవాసం ఆచరిస్తున్నాను. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న లక్ష మంది ఇంటెల్ ఉద్యోగుల కోసం ప్రార్థనలు, ఉపవాసం చేయడంలో నాతో చేరాలని ఈ వారం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంటెల్, దాని సిబ్బంది పరిశ్రమకు, యూఎస్ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది" అని గెల్సింగర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురుచిప్ మార్కెట్లో ఇంటెల్ ప్రభ తగ్గిపోవడం, మరోవైపు ఎన్విడియా పుంజుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కంపెనీ బోర్డ్ విశ్వాసాన్ని కోల్పోయిన జెల్సింగర్ ఉద్వాసనకు గురయ్యారు. ఇంటెల్ సంస్థను నడిపించడం తనకు లభించిన జీవితకాల గౌరవమని తన పదవీ విరమణ సందర్భంగా గెల్సింగర్ పేర్కొన్నారు.ఇంటెల్‌లో ఇటీవల గణనీయమైన పునర్వ్యవస్థీకరణ మార్పులు సంభవించాయి. 15% సిబ్బందిని తొలగించింది. 10 బిలియన్ డాలర్ల మేర ఖర్చును తగ్గించుకుంది. కంపెనీ ఇటీవలే ఒక్కో షేరుకు 0.46 డాలర్ల చొప్పున నష్టపోయింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 6.2% క్షీణించి 13.28 బిలియన్ డాలర్లకు తగ్గింది. జెల్సింగర్ నిష్క్రమణ తరువాత డేవిడ్ జిన్స్నర్, మిచెల్ జాన్స్టన్ హోల్తాస్లు తాత్కాలికంగా సహ సీఈవోలుగా నియమితులయ్యారు. శాశ్వత సీఈవో కోసం ఇంటెల్ తీవ్రంగా అన్వేషిస్తోంది.Every Thursday I do a 24 hour prayer and fasting day . This week I'd invite you to join me in praying and fasting for the 100K Intel employees as they navigate this difficult period. Intel and its team is of seminal importance to the future of the industry and US.— Pat Gelsinger (@PGelsinger) December 8, 2024 -
జొమాటో సీఈఓ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా (ఫోటోలు)
-
యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో హత్య
న్యూయార్క్: అమెరికాలో ఆరోగ్యరంగ దిగ్గజం యునైటెడ్‌హెల్త్ గ్రూప్ సంస్థలో ఇన్సురెన్స్ విభాగమైన యునైటెడ్‌హెల్త్‌కేర్ సంస్థకు సీఈఓగా సేవలందిస్తున్న బ్రియాన్ థాంప్సన్ హత్యకు గురయ్యారు. బుధవారం ఉదయం అమెరికాలోని మిడ్‌టౌన్ మన్హాట్టన్లో గుర్తుతెలియని ఆగంతకుడు కాల్పులు జరిపాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన థాంప్సన్పైకి గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్టు దర్యాప్తు అధికారి చెప్పారు. -
డిసెంబర్ 20 నాటికి 3200: సీఈఓ ట్వీట్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసిన కస్టమర్లతో అసంతృప్తి పెరిగిపోతున్న తరుణంలో.. కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ శుభవార్త చెప్పారు. వాహనాల సర్వీసుల్లో జాప్యం కలగకుండా చూడటానికి దేశ వ్యాప్తంగా మరో 3,200 సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.డిసెంబర్ 20 నాటికి 3,200 కొత్త స్టోర్స్ ప్రారంభించనున్నట్లు భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఆ తరువాత కంపెనీ మొత్తం నెట్వర్క్ 4,000 అవుట్లెట్లకు చేరుకుంటుంది.ప్రస్తుతం దేశంలో ఓలా స్టోర్లు కేవలం 800 మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య త్వరలోనే 4,000లకు చేరుకుంటుంది. వినియోగదారులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా సీఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ప్రారంభం కానున్న స్టోర్లలో సర్వీస్ కూడా లభిస్తుంది. కాబట్టి కస్టమర్లు నిశ్చింతగా.. తమ వాహనంలో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఓలా ఎస్1 ఎక్స్, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ వంటి స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి కాకుండా మరో మూడు (ఓలా ఎస్1 జెడ్, ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్) స్కూటర్లను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఇవి త్వరలోనే అమ్మకానికి రానున్నాయి. కాగా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కూడా అడుగు పెట్టడానికి యోచిస్తోంది. ఇది బహుశా వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.Taking the Electric revolution to the next level this month.Going from 800 stores right now to 4000 stores this month itself. Goal to be as close to our customers as possible.All stores opening together on 20th Dec across India. Probably the biggest single day store opening…— Bhavish Aggarwal (@bhash) December 2, 2024 -
'ఆలోచిస్తే ఆశ్చర్యపోతుంటాను': భారత్‌పై నితిన్ కామత్ వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే.. జెరోధా సీఈఓ 'నితిన్ కామత్' భారత్ చాలా వైవిధ్యంగా ఉందని అన్నారు. ఇటీవలే ఐరోపాలోని చాలా దేశాలను సందర్శించాను. అక్కడన్నీ చిన్న తేడాతో అంతా కట్, కాపీ.. పేస్ట్ మాదిరిగా అనిపించాయని అన్నారు.భారతదేశం మాత్రం చాలా వైవిధ్యంగా ఉంది. మనది ఒక దేశం అయినప్పటికీ.. వైవిధ్యంలో ఓ ఖండం లాంటిదని నితిన్ కామత్ అన్నారు. ఒక్కో రాష్ట్రంలో.. ఒక్కో భాష, ఒక్కో ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు.. ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఇన్ని భిన్నమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ దేశం మొత్తం ఏకతాటిపై ఉంది. ఈ విషయం గురించి ఆలోచించినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతుంటానని కామత్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఎన్ని భాషలు, ఆచార & సంప్రదాయాలు ఉన్నప్పటికీ.. ప్రజలందరినీ ఏకీకృతం చేయగలిగిన సత్తా ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందని కామత్ దేశాన్ని కీర్తించారు. ఈ పోస్టుపై నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ.. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రత్యేకంగా నిలుస్తోంది అంటే.. దానికి కారణం ఈ ఏకీకృతమే అని ఒకరు అన్నారు.భారతదేశానికి ఎంత గొప్ప చరిత్ర ఉన్నా.. ఎన్నెన్ని దేశాలు ఇండియాను ఆదర్శంగా తీసుకుంటున్నా.. కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ప్రగతి కుంటుపడుతోంది. వీరు కూడా సవ్యంగా నడుచుకుంటే.. ప్రపంచానికి మన దేశం మకుటాయమానంగా నిలుస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.I recently returned from visiting several countries in Europe. Everything feels like a cut, copy, and paste with very small differences.In contrast, India is more like a continent than a country. The diversity in terms of languages, food, culture, etc., between the 28 states… pic.twitter.com/6er6J4IvVB— Nithin Kamath (@Nithin0dha) November 26, 2024 -
మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని.. దాదాపు ఉద్యోగులందరినీ సీఈఓ తొలగించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఉదయం ఉద్యోగులందరీ సమావేశానికి హాజరుకావాలని కంపెనీ సీఈఓ వెల్లడించారు. కానీ ఈ సమావేశానికి 99 మంది హాజరుకాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరందరిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆ కంపెనీలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 110 మంది మాత్రమే. 99 మందిని తీసేస్తూ సీఈఓ నిర్ణయం వల్ల ఆ సంస్థలో 11 మంది మాత్రమే మిగిలారు.ఉద్యోగులను తొలగించడం మాత్రమే కాకుండా.. కంపెనీకి సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉంటే తిరిగి ఇచ్చేయండి. అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వండి అంటూ సీఈఓ పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాలేదనే కారణంతో జాబ్ నుంచి తొలగించిన సీఈఓపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి చేయడంలో నిమగ్నం కావడం వల్లనే, సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.ఇదీ చదవండి: భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసిందిఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్క సమావేశానికి హాజరు కాలేదని సుమారు 90 శాతం మందిని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మిగిలిన 11 మంది ఉద్యోగులను సీఈఓ పీల్చి పిప్పి చేస్తాడు అని అన్నారు. ఇంకొందరు.. ఇలాన్ మస్క్ నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. -
మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..
కొందరు మన కళ్లముందే బిలియనీర్ సీఈవోలుగా అత్యున్నతస్థాయికి ఎదుగుతుంటారు. ఆ క్రమంలో వాళ్లు ఎంతో కష్టపడటమే గాక ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. అయినా కూడా ఫ్యామిలీని, వృత్తిపర జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. రెండింటికీ పూర్తి న్యాయం చేసి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలానే చేశారు ఈ బిలియనీర్ సీఈవో. అతడు విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలదొక్కుకునేందుకు ఎంతలా కష్టపడ్డాడో వింటే ఆశ్చర్యపోతారు. మరి దాంతోపాటు కుటుంబ జీవితాన్ని కూడా విజయవంతంగా ఎలా బ్యాలెన్స్ చేశాడంటే..రైజింగ్ కేన్స్ చికెన్ ఫింగర్స్ సహ-వ్యవస్థాపకుడు టాడ్ గ్రేవ్స్ బిలియనీర్ సీఈవో. అతను దాదాపు 800 రెస్టారెంట్లు నిర్వహిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు. అయితే తాను ప్రారంభదశలో వారానికి 90 గంటలకు పైగా పనిచేసి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆనందాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు 52 ఏళ్ల గ్రేవ్స్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రోజూ 12 నుంచి 16 గంటల వరకు కష్టపడేవాడినని అన్నారు. అయితే వృత్తిపరమైన జీవితం తోపాటు కుటుంబ ఆనందాన్ని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుని అందుకోసం సమయం కేటాయించేలా తన విధులను సెట్ చేసుకునే వాడినని అన్నారు. అలా తన వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితాన్ని పూర్తి న్యాయం చేసేలా బ్యాలెన్స్ చేసికోగలిగానని అన్నారు సీఈవో గ్రేవ్స్. అన్ని గంటలు పనిచేస్తూ కూడా ఇదెలా సాధ్యమయ్యిందో కూడా వివరించారు గ్రేవ్స్. తనకు గనుక ఆఫీస్‌లో పనిభారం ఎక్కువగా ఉంటే..తన భార్య పిల్లలను ఆపీసుకి తీసుకువచ్చి తనతో గడిపేలా ప్లాన్ చేస్తుందట. అలాగే తాను కూడా సెలవు రోజుల్లో పొద్దున్నే 4.30 గంటల కల్లా నిద్రలేచి పిల్లలతోనూ, తన తల్లిదండ్రులతోనూ గడిపేలా ప్లాన్ చేసుకునేవాడట. అలా తన కుటుంబ సభ్యులకు ప్రేమానుబంధాలను పంచుతూ వారిని సంతోషంగా ఉండేలా చేయడమే గాక మంచి వ్యాపారవేత్తగా రాణించేలా పాటుపడటంలో రాజీకి తావివ్వకుండా ఆహర్నిశలు శ్రమించానని చెప్పుకొచ్చాడు గ్రేవ్స్. ఓ బిజినెస్‌మ్యాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసేలా అత్యున్నత స్థాయికి చేరాలంటే అంకితభావంతో పనిచేయాలి సమయంతో సంబంధం లేకుండా కష్టపడాలని అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో 1996 ఆ టైంలో కాలిఫోర్నియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో వారానికి తొంభై గంటలకు పైగా పనిచేశానని, అలాగే లూసియానాలోని బాటన్ రూజ్‌లో చికెన్ ఫింగర్ రెస్టారెంట్ల నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు అలస్కాలో సాల్మన్ చేపలు పట్టేవాడినని అన్నారు. అంతలా కష్టపడి దాదాపు 800 చికెన్ ఫిగర్ రెస్టారెంట్లు నిర్వహించే స్థాయికి చేరుకున్నాడు గ్రేవ్స్. వాటి ద్వారా ఏడాదికి ఏకంగా రూ. 500 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. అంతేగాదు అతడు ఉద్యోగులును నియమించుకునేటప్పడూ అతడిలో ఉన్న నిబద్ధత, కష్టపడేతత్వం ఎంతమేర ఉన్నాయో గమనించి నియమించుకుంటాడట. ఇక్కడ గ్రేవ్స్ వృత్తిని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడమే గాక మంచి సక్సెస్‌ని అందుకున్నాడు. మాటిమాటికి టైం లేదు అని చెప్పేవాళ్లకు ఈ బిలియనీర్ సీఈవో జీవితమే ఓ ఉదాహరణ కదూ..!. (చదవండి: వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!) -
ర్యాపిడోపై చెన్నై సీఈఓ ఫైర్: ఎందుకంటే..
ర్యాపిడో, ఉబర్ క్యాబ్స్, ఓలా రైడ్స్ వంటివి కస్టమర్ల నుంచి నిర్ణీత ధర కంటే ఎక్కువ డబ్బు వసూలు చేసిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 21 కి.మీ దూరంలో ఉన్న తొరైపాక్కం వరకు వెళ్లడానికి ర్యాపిడో ఏకంగా రూ.1,000 వసూలు చేసినట్లు ఏజే స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ ఫౌండర్ అండ్ సీఈఓ 'అశోక్ రాజ్ రాజేంద్రన్' వెల్లడించారు. 21 కిలోమీటర్లకు ఛార్జ్ రూ. 350 మాత్రమే. కానీ ర్యాపిడో మూడు రెట్లు డబ్బు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదని అన్నాడు.ఈ సమస్య గురించి ర్యాపిడోకు తెలియజేసినప్పటికీ.. డ్రైవర్ చర్యల గురించి కూడా అడగకుండా చాట్‌ను ముగించారని, రాపిడో కస్టమర్ కేర్ సర్వీస్‌పై సీఈఓ నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు త్వరలోనే తగిన గుణపాఠం ఎదురవుతుందని వెల్లడించాడు.ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి అనుభవాలు ఎదురైనా పలువురు నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ర్యాపిడోలో ఇలాంటివి చాలాసార్లు ఎదురయ్యాయని చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్లు.. కస్టమర్లను మోసం చేయడం ప్రారంభించారని మరికొందరు చెబుతున్నారు. -
ఎన్‌పీసీఐకి ప్రవీణా రాయ్ రాజీనామా: ఎంసీఎక్స్‌లో కొత్త బాధ్యతలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ప్రవీణా రాయ్' తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం 'మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్' (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణా రాయ్ ఎంసీఎక్స్‌లో నియామకానికి 'సెబీ' ఆమోదం తెలిపింది. రాయ్ ఎన్పీసీఐలో చేరటానికి ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీలలో కూడా పనిచేశారు.ఇదీ చదవండి: బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూతఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ప్రవీణా రాయ్.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పేజీ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో చేరినప్పుడు ఈమె క్యాష్ మేనేజ్మెంట్ పోర్ట్ ఫోలియో నిర్వహించారు. ఆ తరువాత హెచ్ఎస్బీసీలో ఆసియా - పసిఫిక్ రీజియన్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్పీసీఐలో రాయ్ మార్కెటింగ్, ప్రొడక్ట్, టెక్నాలజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఆపరేషన్ డెలివరీ వంటి బాధ్యలు నిర్వహించారు. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు.PRESS RELEASE - Ms. Praveena Rai takes charge as MD & CEO of MCXClick here to read more: https://t.co/114IrR0cYL#pressrelease pic.twitter.com/yZW5GGEmbT— MCX (@MCXIndialtd) October 31, 2024 -
మేధావులకు ప్రశ్న.. చెబితే జాబ్: సీఈఓ పోస్ట్ వైరల్
తెలివితేటలను, ఆలోచనా శక్తిని పెంచుకోవడానికి చాలామంది చదరంగం, పదవినోదం వంటివి ఆడుతారు. అయితే ఇటీవల కాలంలో దీనికోసం బ్రెయిన్ టీజర్లు విరివిగా అందుబాటులోకి వచ్చేసాయి. ఇలాంటివి చూడటానికి గమ్మత్తుగా ఉన్నప్పటికీ.. లోతుగా ఆలోచింపజేస్తాయి. ఈ కోవకు చెందిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది.జెనెసిస్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ 'డినో డియోన్' ఈ పోస్ట్ చేస్తూ.. ఉద్యోగం కావాలంటే దీనికి మూడు సెకన్లలో సరైన సమాధానం చెప్పాలి, అని పేర్కొన్నారు. దీనికి సమాధానం నా ఆరేళ్ళ పిల్లాడు 30 సెకన్లలో చెప్పినట్లు వెల్లడించారు.డినో డియోన్ షేర్ చేసిన పోస్టులో 3x3-3/3+3 అని ఉంది. ఇది కేవలం మేధావులకు మాత్రమే అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వేల లైక్స్ పొందిన ఈ పోస్టుకు.. భారీ సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్లలో.. దీనిని మూడు సెకన్లలో ఎలా చెప్పగలం అని కొందరు చెబితే.. మరికొందరు మూడు సెకన్లలో ఆలోచించడానికి ప్రయత్నించవచ్చని అన్నారు. ఇంకొందరు దీనికి సమాధానం తొమ్మిది అని వెల్లడించారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు సమాధానాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు. -
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్‌తో సహా ప్రస్తుత ఛానెల్‌లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్‌కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్‌ఫామ్‌లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
70 విమానాలకు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్ సీఈఓలతో భేటీ
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. అటు దేశీయంగా నడిచే వాటితోపాటు విదేశాలకు వెళ్తున్న అనేక ఎయిర్‌లైన్స్ వరసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే.. వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అధికారులు, కపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నకిలీ బెదిరింపులపై దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పరిస్థితులో మార్పు కనిపించడం లేదు.ఈ క్రమంలో తాజాగా ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) అప్రమత్తమైంది. విమానయాన సంస్థల సీఈఓలతో శనివారం సమావేశమైంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే బెదిరింపులను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) అనుసరించాలని సీఈవోలను కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్న వేళ.. ప్రయాణికులకు అసౌకర్యం, క్యారియర్లకు నష్టం కలగకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించింది. బెదిరింపులు, వాటి పట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని కోరింది.ఇక గత వారం రోజులుగా 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో బెదిరింపులు వచ్చిన బెదిరింపులు వాటిలో ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామాలు లండన్, జర్మనీ, కెనడా, యూఎస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
రిటర్న్ టు ఆఫీస్.. ‘నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’
ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది. -
హనీ సంస్థ ప్రచారకర్తగా అదితిరావు హైదరీ
న్యూఢిల్లీ: హమ్దర్ద్ హనీ తన ప్రచాకర్తగా సినీ నటి అదితిరావు హైదరీని నియమించుకుంది. ఈ సందర్భంగా ‘ద నో కాంప్రమైజ్ హనీ’ పేరుతో ఒక టీవీ ప్రచార వీడియో విడుదల చేసింది. నాణ్యత, స్వచ్ఛతల మేలికలయిక హమ్దర్ద్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనుండటం సంతోషం కలిగిస్తోందని అదితిరావు అన్నారు. ఆరోగ్యకర జీవన శైలి కోరుకునే ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఈ తేనె భాగం కావాలన్నారు. అదితిరావుతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై హమ్దర్ద్ సీఈవో హమీద్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం అప్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ క్యూ2లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 4,235 కోట్లుగా నమోదైంది. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రెవెన్యూ వృద్ధితో పాటు లాభదాయకత కూడా మెరుగ్గా ఉందని సంస్థ సీఈవో సి. విజయ్ కుమార్ తెలిపారు. వార్షికంగా ఆదాయ వృద్ధి 3.5–5.0 శాతంగా ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచి్చంది. క్యూ2లో 780 మంది ఉద్యోగులను తగ్గించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,621కి చేరింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి గాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 12 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు స్వల్పంగా ఒక్క శాతం పెరిగి రూ. 1,856 వద్ద క్లోజయ్యింది. -
బిహార్‌లో కంపెనీ పెట్టి తప్పు చేశాను.. సీఈవో ఆవేదన
బిహార్‌లో తొలి సెమీకండక్టర్ కంపెనీ సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఏర్పాటైంది. అయితే బిహార్‌లో కంపెనీ పెట్టడం తన జీవితంలో "అత్యంత చెత్త నిర్ణయం" అని వాపోతున్నాడు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన చందన్ రాజ్. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.బిహార్‌ను "ల్యాండ్ ఆఫ్ ఫ్రస్టేషన్"గా పేర్కొన్న చందన్ రాజ్ అక్కడ సెమీకండక్టర్ కంపెనీ నడపడానికి అష్టకష్టాలు పడుతున్నట్టు వాపోయారు. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తన కంపెనీతో కలిసి పనిచేయడానికి క్లయింట్స్ ఎవరూ ముందుకు రావడం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, మౌలిక సదుపాయాల కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఎవరూ సహాయం చేయలేదన్నారు. బిహార్ ప్రభుత్వం సెమీకండక్టర్ పరిశ్రమలను అర్థం చేసుకోలేదని రాసుకొచ్చారు. స్థానిక గ్యాంగ్‌స్టర్ బెదిరిస్తే పోలీసులు కూడా పట్టించుకోరంటూ చందన్ రాసుకొచ్చారు.ఎవరీ చందన్ రాజ్?సెమీకండక్టర్ స్టార్టప్ వ్యవస్థాపకుడైన చందన్ రాజ్.. తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఒడిషాలోని బిజూ పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో 2009లో పట్టభద్రుడయ్యారు.శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మలేషియా, ఇజ్రాయెల్‌లోని ఇంటెల్, రొమేనియాలోని సిలికాన్ సర్వీస్ ఎస్ఆర్ఎల్, షాంఘైలో నోకియా బెల్ ల్యాబ్స్, ఎన్ఎక్స్పీలతో సహా వివిధ సాంకేతిక సంస్థలలో ఇంజనీరింగ్, నిర్వాహక పాత్రలలో పనిచేశారు. 2020 డిసెంబర్లో బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ సంస్థను ఏర్పాటు చేశారు.Bihar - The land of frustration. Lots of problems and struggle to survive here as a semiconductor/VLSI Company.Worst decision of my life to start a company in Bihar— Chandan Raj (@ChandanRaj_ASIC) October 9, 2024 -
సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..
చిరుద్యోగుల పట్ల సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బంది నిత్యం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు స్వయంగా జొమాటో సీఈవో ఎదుర్కోవాల్సి ఉంది.విషయం ఏంటంటే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అప్పుడప్పుడూ డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారు. అందులో భాగంగానే తన సతీమణి గ్రీసియా మునోజ్‌తో కలిసి తాజాగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌గా రెస్టారెంట్స్, మాల్స్ తిరిగారు.ఇలాగే ఆర్డర్ పికప్ చేసుకునేందుకు గురుగ్రామ్‌లోని ఓ మాల్‌కు వెళ్లగా డెలివరీ బాయ్ దుస్తుల్లో ఉన్న వారిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించేందుకు అనుమతి లేదని, మెట్లు ఎక్కి వెళ్లాలని సూచించారు. దీంతో చేసేది లేక మూడో అంతస్తులోని రెస్టారెంట్‌కు మెట్లు ఎక్కి వెళ్లి ఆర్డర్ పికప్ చేసుకున్నారు.తమకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి దీపిందర్ గోయల్ ‘ఎక్స్’లో ప్టోస్ట్ చేశారు. వీడియోలను షేర్ చేశారు. డెలివరీ భాగస్వాములందరికీ పని పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. మాల్స్ వారు కూడా డెలివరీ సిబ్బంది పట్ల మానవత్వం చూపించాలని కోరారు. గోయల్ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, మాల్స్ మాత్రమే కాదు.. చాలా సొసైటీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని చాలా మంది వినియోగదారులు వాపోతూ కామెంట్లు పెట్టారు.During my second order, I realised that we need to work with malls more closely to improve working conditions for all delivery partners. And malls also need to be more humane to delivery partners. What do you think? pic.twitter.com/vgccgyH8oE— Deepinder Goyal (@deepigoyal) October 6, 2024 -
ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్!!
ఉద్యోగంలో చేర్చుకోవడం ఎంత ముఖ్యమో.. తొలగించడం కూడా అంతే ముఖ్యం అంటూ, టెక్ కంపెనీ జర్నీ సీఈఓ 'ఆండ్రియాస్ రోట్ల్' (Andreas Roettl) చెబుతున్నారు. దీనికోసం నైపుణ్యం అవసరమని తమ మేనేజర్లను, టీమ్ లీడర్లకు సంస్థలే ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఫోటో ప్రింటింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్న టెక్ సంస్థ జర్నీ సీఈఓ ఆండ్రియాస్ రోట్ల్.. నాయకులంటే ఉద్యోగులను నియమించుకోవడం మాత్రమే కాదు, తొలగించడంలో కూడా కొంత నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా నేను ఉద్యోగులను తొలగించడంలో చాలా మంచివాడినని ఆండ్రియాస్ పేర్కొన్నారు.జర్నీ సంస్థలో ఉద్యోగులను ఎలా తొలగించాలో మా లీడ్‌లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెడతాము. మీరు కూడా అలా చేయాలని ఆండ్రియాస్ వెల్లడించారు. ఉద్యోగి పనితీరును అంచనా వేయడానికి తొలగింపు విధానాలను తప్పకుండా నేర్చుకోవాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఉపయోగించడం వంటివి కూడా తెలుసుకోవాలి. పనితీరు ఎక్కువగా ఉన్న సిబ్బందికి మద్దతు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యం అని అన్నారు.తొలగించడానికి సంబంధించిన విధానాన్ని ఆండ్రియాస్ రోట్ల్ ఫుట్‌బాల్ ఆటతో పోల్చారు. ఇక్కడ ఆటగాళ్లకు హెచ్చరికగా పసుపు కార్డు అందుతుంది. దీనిని మొదటి హెచ్చరికగా వెల్లడించాలి. పనితీరును మెరుగుపరచుకోవాలి, కష్టపడుతున్న ఉద్యోగులతో సంభాషణలు జరపాలని చెప్పాలి.ఇదీ చదవండి: పోయిన రూ.5 కోట్ల కారు: పట్టించిన ఎయిర్‌పాడ్స్ - ఎలా అంటే?మొదటిసారి పసుపు కార్డు అందుకున్న వ్యక్తి పనితీరులో ఎలాంటి పురోగతి కనిపించకపోతే.. రెండవ పసుపు కార్డును ఇవ్వాలి. ఇది వారు తమ ఉద్యోగానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని తెలియజేస్తుందని అన్నారు. రెడ్ కార్డు ఇవ్వాల్సిన సందర్భాలు వస్తే.. అది వేరే కథ. దానికి వేరే ప్రాసెస్ ఉంటుందని అన్నారు. ఆండ్రియాస్ రోట్ల్ చేసిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే ఆండ్రియాస్ ఫాలో-అప్ సందేశాన్ని పేర్కొన్నారు. నా సందేశం వల్ల బాధ కలిగి ఉండే క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. -
సైబర్ వలలో ప్రముఖ పారిశ్రామికవేత్త: రూ.7 కోట్లు మాయం
వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్‌ను.. సైబర్ మోసగాళ్ల ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 7 కోట్లు మోసగించింది. దీనిని ఛేదిస్తూ పంజాబ్ పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 5.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని లూథియానా పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు.ఎస్పీ ఓస్వాల్‌ను మోసగించిన ముఠాలో మరో ఏడుగురిని గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కుల్దీప్ సింగ్ చాహల్ వెల్లడించారు. ముఠాలోని మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు, వారంతా అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని ఆయన తెలిపారు.సైబర్ మోసగాళ్లలో ఒకరు తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని, పారిశ్రామికవేత్తకు నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి డిజిటల్ అరెస్ట్ చేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఓస్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు.ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్దేశంలో ఇలాంటి సైబర్ మోసాలు చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గుర్తు తెలియనివారు ఫోన్ చేసి బెదిరించినా? డబ్బు డిమాండ్ చేసినా? సంబంధిత అధికారులకు వెంటనే వెల్లడించడం ఉత్తమం. లేకుంటే భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. -
నకిలీ టికెట్ల వ్యవహారం.. బుక్‌మైషో సీఈవోకు సమన్లు
బ్రిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ షో నలికీ టికెట్లతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై బుక్‌మైషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడైన ఆశిష్ హేమ్రజనీ ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈయనతోపాటు కంపెనీ టెక్నికల్ హెడ్‌కు కూడా సమన్లు పంపినట్లు ఒక అధికారి తెలిపారు.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వచ్చే ఏడాది జనవరి 19 నుండి 21 వరకు జరగనున్న కోల్డ్‌ప్లే కచేరీకి సంబంధించి బుక్‌మైషో టిక్కెట్ల బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుపై ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ సీఈవో, టెక్నికల్ హెడ్లకు సమన్లు పంపిన అధికారులు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయాల్సి ఉందని కోరారు.కోల్డ్‌ప్లే ఇండియా టూర్ టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి బుక్‌మైషోపై ఫిర్యాదు చేసిన న్యాయవాది అమిత్ వ్యాస్.. రూ.2,500 ఉన్న టెకెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేసి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే అమిత్ వ్యాస్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అధికారులు.. టికెట్ల దందాలో పాల్గొన్న పలువురు బ్రోకర్లను గుర్తించారు. -
యాక్సెంచర్‌లో జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ భారత్‌లో గణనీయంగా నియామకాలు చేపట్టనుంది. ప్రధానంగా ఫ్రెషర్స్‌ను తీసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. కంపెనీ సీఈవో జూలీ స్వీట్ ఈ విషయాలు వెల్లడించారు.జెనరేటివ్ఏఐ (జెన్‌ఏ) మీద ఫోకస్‌తో తమ సర్వీసులను ఎప్పటికప్పుడు సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆమె వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపార వృద్ధికి ఇదే దోహదపడిందని పేర్కొన్నారు. జెన్ఏఐ సాంకేతికతను ఉపయోగించడంలో సిబ్బందికి విస్తృతంగా శిక్షణనిస్తున్నట్లు జూలీ చెప్పారు.ఐర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాక్సెంచర్‌కి భారత్‌లో 3,00,000కు పైగా సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 7,74,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 64.90 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. యాక్సెంచర్ సెప్టెంబర్–ఆగస్టు వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. -
బొంబార్డియర్ సీఈవోతో గౌతమ్ అదానీ భేటీ
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన బిజినెస్ జెట్స్ తయారీ దిగ్గజం బొంబార్డియర్ సీఈవో ఎరిక్ మార్టెల్తో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఎయిర్‌క్రాఫ్ట్ సరీ్వసులు, రక్షణ రంగ కార్యకలాపాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ఇందులో చర్చించినట్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో అదానీ పోస్ట్ చేశారు. అదానీ గ్రూప్ దేశీయంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజం
ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకుంటున్న అతి కొద్దిమంది సీఈఓలలో ఒకరు ఐబీఎమ్ సీఈఓ 'అరవింద్ కృష్ణ'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన వేతనం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓలలో ఒకరుగా మాత్రమే తెలిసిన అరవింద్ కృష్ణ.. మన భారతీయుడు అని బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈయన 1962 నవంబర్ 23 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన తెలుగు బిడ్డ. తండ్రి భారత సైన్యంలో పనిచేసిన ఆర్మీ అధికారి.అరవింద్ కృష్ణ తమిళనాడులోని కూనూర్‌లోని స్టాన్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో, డెహ్రాడూన్‌లోని సెయింట్ జోసెఫ్స్ అకాడమీలో చదువుకున్నారు. ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని.. 1991లో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా - ఛాంపెయిన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్డీ పట్టా పొందారు.అరవింద్ కృష్ణ 1990లోనే ఐబీఎంకు సంబంధించిన థామస్ జే. వాట్సాన్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. 2009 వరకు అక్కడే కొనసాగారు. ఆ తరువాత ఐబీఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్‌లో జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2015లో ఐబీఎం రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. ఆ తరువాత ఐబీఎం క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్వేర్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2020లో ఐబీఎం సీఈఓ అయ్యారు. కంపెనీలో ఈయన దాదాపు 34 ఏళ్ళు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్ఐబీఎం సీఈఓ అయిన తరువాత అరవింద్ కృష్ణ.. కంపెనీ ఉన్నతికి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన వార్షిక వేతనం ఇప్పుడు రూ.165 కోట్లు. అంటే రోజుకు రూ.45 లక్షల జీతం అన్న మాట. 2023లో ఈయన జీతం పెరగడంతో వార్షిక వేతనం భారీగా పెరిగింది. -
భారత్‌లో ఆకర్షణీయమైన అవకాశాలు: సేల్స్‌ఫోర్స్
శాన్ ఫ్రాన్సిస్కో: భారత్‌లో వ్యాపార అవకాశాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని, దేశంలో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ చైర్మన్, సీఈవో మార్క్ బెనియాఫ్ తెలిపారు. ప్రపంచం అంతా ’భారతీయ శకం’లోకి మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు.తమకు భారత్‌లో 11,000 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో చాలా మంది అంతర్జాతీయ క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నారని బెనియాఫ్ చెప్పారు. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరిగే కొద్దీ భారత వ్యాపార విభాగం కూడా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బజాజ్ గ్రూప్ వంటి దిగ్గజ కస్టమర్లకు కూడా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిర్వహించిన వార్షిక ’డ్రీమ్‌ఫోర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెనియాఫ్ ఈ విషయాలు చెప్పారు.సేల్స్‌ఫోర్స్ భారత విభాగం చీఫ్‌గా ఉన్న ఎస్బీఐ మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య సారథ్య సామర్థ్యాలను ఆయన ప్రశంసించారు. కార్యక్రమం సందర్భంగా ఏజెంట్‌ఫోర్స్ సొల్యూషన్‌ను ఆవిష్కరించారు. వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగుల కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. -
చిన్న వయసులోనే సీయీవో అయ్యారు!
ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు ఈ బ్రదర్స్.ఫ్రెండ్స్ ఈరోజు మనం చెన్నైకి చెందిన శ్రావణ్, సంజయ్ బ్రదర్స్ గురించి తెలుసుకుందాం. పది, పన్నెండేళ్ల వయసులోనే ఈ బ్రదర్స్ ఒక యాప్‌ను డెవలప్ చేసి బోలెడు పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు...‘గో డైమన్షన్స్’ పేరుతో ఒక కంపెనీని మొదలుపెట్టారు. యంగెస్ట్ సీయీవోలుగా దేశం దృష్టిని ఆకర్షించారు.వారి తండ్రి కుమరన్ సురేంద్రన్ వల్ల శ్రావణ్, సంజయ్‌లకు సాంకేతిక విషయాలపై ఆసక్తి పెరిగింది.‘కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి?’ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు తండ్రి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేవారు.టెక్నాలజీకి సంబంధించిన విషయాలను చందమామ కథల్లాగా ఆసక్తిగా వినేవారు.ఏ మాత్రం సమయం దొరికిన కంప్యూటర్లో రకరకాల కొత్త విషయాల గురించి తెలుసుకునేవారు.అలా ఎన్నో యాప్‌ల గురించి తెలుసుకున్నారు.కొత్త కొత్త యాప్‌ల గురించి తెలుసుకునేటప్పుడు తమకు కూడా యాప్ తయారు చేయాలనిపించింది.‘క్యాచ్ మీ కాప్’ పేరుతో ఈ బ్రదర్స్ రూపోందించిన యాప్‌కు మంచి పేరు వచ్చింది. ఇది పిల్లల ఆటలకు సంబంధించిన యాప్. దీంతో పాటు రూపోందించిన ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు.ఫ్రెండ్స్, శ్రావణ్, సంజయ్ గురించి మీరు చదివారు కదా... మరి మీ గురించి కూడా గొప్పగా రాయాలంటే.... మీరు కూడా ఏదైనా సాధించాలి. మరి ఒకేనా! -
కొత్త ఉత్పత్తులకు అనుమతుల్లో జాప్యం: సింజెంటా సీఈవో
న్యూఢిల్లీ: బ్యూరోక్రసీ విధానాల కారణంగా భారత సాగురంగంలో వినూత్న ఉత్పత్తులకు అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అగ్రోకెమికల్స్ దిగ్గజం సింజెంటా గ్రూప్ సీఈవో జెఫ్ రోవ్ వ్యాఖ్యానించారు. దీంతో రైతులపై ప్రభావం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత పర్యటన సందర్భంగా ఆయన తెలిపారు.దేశీయంగా సులభతరంగా వ్యాపారాల నిర్వహణ అంశంపై స్పందిస్తూ ‘భారత్‌లో ప్రోడక్టుల అనుమతులకు సంబంధించి పాలసీ అంతా బ్యూరోక్రసీమయంగా ఉంటుంది. దీంతో అనుమతులకు చాలా సమయం పట్టేస్తుంది. ఆ ప్రభావం రైతులపై పడుతుంది‘ అని జెఫ్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణల కోసం రైతులు ఎంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తే అంత ఎక్కువగా రిస్కులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు.వినియోగదారుల వ్యవస్థను డిజిటలీకరించడంలో భారత ప్రభుత్వ కృషిని ప్రశంసించిన జెఫ్.. వ్యవసాయ రంగంలోనూ అదే తరహాలో అనుమతుల ప్రక్రియను ఆధునీకరించాలని కోరారు. వాతావరణ మార్పులతో రిస్కులే కాకుండా అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే 3 ఏళ్లలో 40 ఉత్పత్తులు..రాబోయే 2–3 సంవత్సరాల్లో కొత్తగా 40 పంట సంరక్షణ ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు జెఫ్ చెప్పారు. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై తమ సంస్థ అంతర్జాతీయంగా ఏటా 2 బిలియన్ డాలర్లు వెచ్చిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో తమ వ్యాపారం ఈ ఏడాది ద్వితీయార్థంలో కాస్త మెరుగుపడగలదని వివరించారు.ప్రపంచవ్యాప్తంగా ఆహార అవసరాలు పెరుగుతున్న తరుణంలో సేంద్రియ వ్యవసాయాన్ని భారీ స్థాయిలో విస్తరించడానికి అవకాశాలు తక్కువని జెఫ్ తెలిపారు. సంప్రదాయ సాగుతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయ సామరŠాధ్యలు 20–30 శాతం మేర తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ప్రత్యేకమైన భారత వ్యవసాయ రంగ సవాళ్లను పరిష్కరించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని జెఫ్ వివరించారు. -
హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్.. సంచలనాల సీఈవో..
-
టెలిగ్రామ్ సీఈవో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా?
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్లైన్లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్‌లో దురోవ్ అరెస్టయ్యారు.రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్‌ను మెసేజింగ్ యాప్‌గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్‌కి చెందిన ఈ బిలియనీర్‌ను వారం రోజుల క్రితం పారిస్‌లో అదుపులోకి తీసుకున్నారు.దురోవ్ 2011 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. దురోవ్ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.సోషల్ మీడియాలో వైరల్ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. దురోవ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని, లేదు విగ్ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.Pavel Durov (Telegram CEO) before his hair transplant and plastic surgery. pic.twitter.com/TTb3am2Ddn— Creepy.org (@creepydotorg) September 1, 2024 -
అసాధారణ పోలింగ్ శాతం.. ఈసీ క్లారిటీ ఇవ్వాల్సిందే: అంబటి
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని, వాటిని నివృత్తి చేయాలని అవసరం ఎన్నికల సంఘానికి ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఉదయం పలువురు వైఎస్సార్సీపీ పార్టీ ప్రతినిధులు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్‌ను కలిశారు. అనంతరం సచివాలయం వద్ద అంబటి మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై మాకు అనుమానం ఉంది. పోలింగ్ శాతాన్ని ఈసీ మూడుసార్లు వేర్వేరుగా వెల్లడించారు. ఏయే అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్ నమోదు అయ్యింది?. ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించడం లేదు. ఫారం-20 సమాచారాన్ని వెంటనే అప్లోడ్ చేయాలని అని అంబటి, ఈసీని డిమాండ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారని మొదట చంద్రబాబే అన్నారు. గతంలో ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు. ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయో వీవీప్యాట్‌లో కూడా అన్నే చూపించాలి. కానీ, ఏపీలో అలాంటి పరిస్థితి లేదు అని ఆరోపించారాయన. మా అనుమానాల్ని ఈసీ నివృత్తి చేయాల్సిందే. త్వరలో ఈసీ స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారాయన. ఏపీ సీఈవోను కలిసిన వాళ్లలో అంబటితో పాటు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు.సీఈఓ ని మా పార్టీ ప్రతినిధులం కలిశాము‘‘ఎన్నికల ఫలితాలపై ఓట్ ఫర్ డెమోక్రసీ అనుమానాలు వ్యక్తం చేసింది. మాకు ఉన్న అనుమానాలకు ఇప్పుడు బలం చేకూరింది. ఈ అనుమానాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాల్సి ఉంది. ఆరు గంటల తర్వాత కేవలం క్యూ లో ఉన్నవారికి మాత్రమే ఓటింగ్ కి అవకాశం ఇస్తారు. ఆ టైంలో ఎన్నికల కమిషన్ 68.12 శాతం ఓటింగ్ జరిగిందని ప్రకటించింది. .. రాత్రి 11.45 గంటలకి 76.5 శాతం ఓటింగ్ పెరిగింది అని ప్రకటించింది. ఫైనల్ గా 80.66 శాతం ఓటింగ్ జరిగిందని ప్రకటించారు. చాలా తేడా ఉంది. జూన్ 4 న లెక్కింపు నాడు 82 శాతం చూపించారు. ఇదంతా అనుమానాస్పదంగా ఉంది. ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఈసీ చెప్పాలి. .. 12 శాతానికి పైగా వ్యత్యాసం ఉండటం అసాధారణంగా ఉంది. దీనిని ఎన్నికల కమిషన్ నివృత్తి చేయకపోవడం అనుమానాస్పదంగా ఉంది. అలాగే ఫారం 20 లో పార్టీల వారిగా ఓట్లను ప్రకటించాలి. కానీ ఈసీ ఈరోజు వరకు కూడా పార్టీల వారిగా ఓట్లను ప్రకటించలేదు. ఇది చాలా విచిత్రం, అసాధారణ చర్య. గతంలో ఎప్పుడు ఎన్నికల్లో ఇంత ఆలస్యం జరగలేదు. ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ అధికారుల నుండి రాలేదు అంటున్నారు. దీంతో రోజు రోజు కీ అనుమానాలు బలపడుతున్నాయి.. ..విజయనగరం, గజపతినగరం లలో మా అభ్యర్థులు ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు. ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఉంది. అది ఎలా సాధ్యం అని తనిఖీ కోసం ఫిర్యాదు చేశారు. ఈవీఎంలను భద్రపరిచాక బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరుగుతుంది?. దానికి మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటి?. వీవీప్యాట్లను తనిఖీ చేయమంటే ఒంగోలులో మాక్ పోలింగ్ అంటున్నారు. ఈ అనుమానాలు అన్నింటికీ ఈసీ సమాధానం చెప్పాలి.. ఈవీఎంల తనిఖీ కి వెళితే తాళాలు లేవు అన్నారు. అధికారులు దగ్గర తాళాలు లేకపోవడం ఏంటి..?. ఈరోజుకి పోలింగ్‌పై ఫైనల్ ఫిగర్ చెప్పక పోవడం ఏంటి?. అందుకే సీఈవోను కలిసి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి అన్నారు. -
టెలిగ్రామ్‌ను నిషేధిస్తారా..? సీఈఓ అరెస్టు!
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను ప్రాన్స్ నిషేధిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సంస్థ సీఈఓ పావెల్ దురోవ్(39)ను పారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో ఇటీవల అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి గతంలో ఫ్రెంచ్ అధికారులు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తాజాగా తనను అరెస్టు చేయడంతో ఒకవేళ ఆరోపణలు రుజువైతే స్థానికంగా ప్రాన్స్‌లో ఈ యాప్‌ను నిషేధిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ సమాచారం నియంత్రణకు ప్లాట్ఫామ్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దాంతో సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దురోవ్ నియంత్రిత కంటెంట్ నిర్వహణలో విఫలమయ్యారని పారిస్ అధికారులు తెలిపారు. అయితే టెలిగ్రామ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం సంస్థ అనుసరిస్తున్న నియంత్రణ పద్ధతులు సమర్థంగా ఉన్నాయని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: పేరుకుపోతున్న ప్యాసింజర్ కార్లు!ఈ వ్యవహారంపై రష్యా రాయబార కార్యాలయం స్పందిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్న దురోవ్‌ను సంప్రదించాలంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందడం లేదని తెలిపింది. ఇదిలాఉండగా, రష్యా, ఉక్రెయిన్తోపాటు గతంలోని సోవియట్ కూటమిలో భాగంగా ఉన్న దేశాల్లో ఈ యాప్ ప్రజాదరణ పొందింది. అయితే యూజర్ డేటాను పంచుకోవడానికి దురోవ్ నిరాకరించడంతో 2018లో రష్యా ప్రభుత్వం ఈ యాప్‌ను నిషేధించింది. ఈ నిషేధం 2021లో ముగిసింది. -
టెలిగ్రామ్ అధినేత అరెస్ట్
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు. యాప్‌కు సంబంధించిన నేరాలకు సంబంధించి దురోవ్‌ను ఫ్రెంచ్ పోలీసులు శనివారం పారిస్ సమీపంలోని విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.ఫ్రెంచ్ రాజధానికి ఉత్తరాన ఉన్న లే బోర్గెట్ విమానాశ్రయంలో ఈ ఫ్రాంకో-రష్యన్ బిలియనీర్‌ను నిర్బంధించినట్లు అధికారి ఒకరు ఏఎఫ్పీకి చెప్పారు. ఆయన అజర్‌బైజాన్‌లోని బాకు నుండి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు కేసుకు దగ్గరగా ఉన్న మరొకరు తెలిపారు. దురోవ్‌ను ఆదివారం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సమాచారం.మైనర్లపై హింసను నిరోధించడంలో కృషి చేసే ఫ్రాన్స్‌కు చెందిన ఆఫ్మిన్ సంస్థ మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపు, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తులో సమన్వయ ఏజెన్సీగా దురోవ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసుకు దగ్గరగా ఉండే మరో అధికారి ఈ విషయాన్ని తెలిపారు. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు సెట్ కాదు.. ఆఫీస్‌కి వచ్చేయండి’
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తమ ఉద్యోగులందరూ ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘నథింగ్’ సీఈఓ కార్ల్ పీ ప్రకటించారు. కోవిడ్ నుంచి సంవత్సరాల తరబడి రిమోట్‌గా పనిచేస్తున్న లండన్ ఉద్యోగులు ఇక ఆఫీస్‌కు రావాలంటూ వారికి ఈమెయిల్స్ పంపించారు.కంపెనీ భవిష్యత్తు వృద్ధికి, ఆవిష్కరణలకు ఆఫీసు నుంచి పని చేయడం చాలా కీలకమని కార్ల్ పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన లింక్డిన్ ఖాతాలో పూర్తి ఈమెయిల్‌ను కూడా షేర్ చేశారు. "మనం తక్కువ సమయంలోనే చాలా దూరం వచ్చాం. పదేళ్లలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని స్థాపించి భారతదేశంలో 567 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. అయినప్పటికీ, మనం మన సామర్థ్యంలో 0.1% వద్దే ఉన్నాం" అంటూ రాసుకొచ్చారు.రిమోట్ లేదా హైబ్రిడ్ విధానం చాలా కంపెనీలకు సరిపోయినప్పటికీ, ‘నథింగ్’కు సెట్ కాదని వివరించారు. ఇందుకు ఆయన మూడు ముఖ్యమైన కారణాలను పేర్కొన్నారు. భౌతిక ఉత్పత్తులను రూపొందించడంలో సన్నిహిత సహకారం అవసరం. బలమైన పోటీదారులను ఓడించడంలో సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యత. నవతరం టెక్ కంపెనీగా మారాలనే కంపెనీ ఆకాంక్ష అని వివరించారు. -
క్యూట్ కుర్రాడిగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. అరుదైన ఫొటోలు
-
'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!
ఓ మహిళ ఇద్దరు పిల్లలు తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ గొప్ప మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగడం అంత ఈజీ కాదు. ఓపక్క అమ్మగా పిల్లలకు అన్ని ఇవ్వలేకపోతున్న ఆవేదనను తట్టుకుంటూ.. పురషాధిక్య పారిశ్రామిక ప్రపంచంలో నెగ్గుకొచ్చి.. తానెంటో చూపించింది. పైగా అందరిచేత ప్రశంసలందుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..భారతీయ కాస్మెటిక్ రూపరేఖలను మార్చిన వినీత సింగ్ ప్రస్థానం చాలా సవాళ్లుతో కూడుకున్నది. మగవాళ్లు ఆధిపత్యం ఉండే రంగంలో రాణించి అందరికీ స్ఫూర్తిగా నిచింది. అదికూడా ఇద్దరు పిల్లల తల్లిలా బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ సౌందర్య సాధనాల సీఈవో స్థాయికి చేరుకుంది. 2021వ సంవత్సంరో బ్యూటీ మార్కెట్లో తన షుగర్ కాస్మోటిక్స్ కంపెనీతో సంచలనం సృష్టించింది. 2015లో వినీత తన భర్త కౌశిక్ ముఖర్జీతో కలిసి ఈ షుగర్ కాస్మటిక్స్‌ని ప్రారంభించిది. అప్పుడే మహిళపట్ల ప్రజల్లో వేనూళ్లుపోయిన భావాలను ఎదుర్కొంది. ఆమె తన షుగర్ బ్రాండ్స్‌తో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా దూసుకుపోవడమే గాక డిజిటల్ యుగం ఫ్లాట్‌ఫాంని క్యాష్ చేసుకుంది. భారతీయ యువుతులు తమ బ్రాండ్‌కి మారేలా చేయడంలో విజయం సాధించింది వినీత. అయితే వినిత గొప్ప మహిళా పారింశ్రామిక వేత్తగా మారడం అంత జీగా జరగలేదు. తన కంపెనీ ప్రారంభదశలో వెంచర్‌ని కాపాడుకునేలా ఇన్వెస్టర్లని తీసుకోవడం అత్యంత సవాలుగా మారింది. ఎందుకంటే వారందరీ నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట..కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీకెందుకు ఇంత పెద్ద పనులు అనే విమర్శలు, ఉచిత సలహాలకు కొదువలేదు అన్నట్లుగా వచ్చాయి. అయినా సరే ఆమె వెనక్కి తగ్గకుండా తన వ్యాపారాన్ని మంచిగా నిర్మించడంపైన దృష్టి పెట్టింది. 17 ఏళ్ల వయసులో తన ప్రొఫెసర్ వ్యవస్థాపకత కోసం నాటిన బీజాలు ఆమె నరనరాల్లో నిక్షిప్తమయ్యాయి. అదే ఆమెను వెనడుగు వేయనివ్వలేదు. తన వ్యాపారాన్ని విజయవంతంగా నిర్మించడంపై ఫోకస్ అయ్యేలా చేసింది. లక్షల వేతనం లభించే బ్యాంక్ జాబ్‌ని వదిలి మరీ..స్వంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్సాటు చేయాలని ప్రగాఢంగా నిశ్చయించుకుంది వినీత. ఆ దృఢ నిశ్చరయం ఆమెను షుగర్ బ్యూటీ ప్రొడక్ట్‌లకు సంబంధించిన సీవోవో స్థాయికి చేరుకునేలా చేసింది. అయితే తనని ఎప్పుడూ అమ్మ అపరాధం వెంటాడుతూ ఉండేదని అన్నారు. అలాగే ఈ కంపెనీ ప్రారంభ రోజుల్లో తన పెద్ద కొడుకు పుట్టడంతో పెద్ద కొడుకు పాలు ఇవ్వడం, పని చేయడం, ఆఫీసు కాల్‌లను నిర్వహించడం చాలా కష్టంగా ఉండేదని అన్నారు. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో 'అమ్మ అపరాధాన్ని' ఎదుర్కొన్నానని వివరించారు వినిత. అలాగే తన చిన్న కొడుకు ఆరవనెల కడుపున ఉన్నప్పుడూ మారథాన్‌లో పరిగెత్తానని అన్నారు. అంతేగాదు ఆమె తరుచుగా ఆఫీస్ ఫైల్స్, మరో చేత్తో తన బిడ్డను లాలించేది. చెప్పాలంటే ఏకకాలంలో అన్ని పనులు నిర్వహించేదాన్ననని, అందువల్లో అమ్మగా వాళ్లకు అన్ని సమకూరుస్తున్నానా లేదా అనే భావం కలుగుతుండేదని అన్నారు వినీత. చివరిగా వినీత 'అమ్మ అపరాధం' చాలా విలువైనదని, దాన్ని నిర్వర్తించడం అంత ఈజీ కాదని చెప్పారు. ఏదీఏమైన ఓ తల్లిగా ఇద్దరూ పిలల్లను సాకుతూ..విజయవంతమైన పారిశ్రామికవేత్త ఎదగడం అనేది మాములు విషయం కాదు..!(చదవండి: కన్నూర్ జైలు బిర్యానీ: ఖైదీలే స్వయంగా వండుతారట..!) -
వాట్సప్ స్టేటస్లు కాదు..వీరి గురించి తెలుసా..
స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఒకరోజు సెలవు.. స్కూల్లో చాక్లెట్లు.. వాట్సప్‌లో స్టేటస్లు అనుకుంటున్నారేమో. ఇంట్లో విభిన్న మనస్తత్వాలున్న కుటుంబ సభ్యులను ఒప్పించి మనకు ఇష్టమైన పని చేయాలంటే ఎంత కష్టమో తెలుసుకదా. అలాంటిది మన ఊరు..పట్టణం..జిల్లా..రాష్ట్రం..దేశంలోని కోట్ల ప్రజలను ఏకధాటిపైకి తీసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఎందరో మహానుభావులకు వందనాలు. వారి కష్టఫలానికి గుర్తుగా కొందరు వ్యక్తులు బాగా చదివి వ్యాపారంలో రాణించి ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. భారత్ పేరును ప్రపంచానికి చాటుతున్నారు. అందులో కొందరి గురించి తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా..ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ కలిగిన వారికి భారత్ నెలవుగా మారింది. దాంతో గ్లోబల్‌గా ఆధిపత్యం చలాయిస్తున్న కంపెనీలు భారతీయులను నియమించుకుంటున్నాయి. ఎంట్రీ లెవల్, మేనేజర్ స్థాయి ఉద్యోగులుగా వెళ్లినవారు కంపెనీల్లో టాప్ స్థాయికి చేరి ఏకంగా సీఈఓలు, ఛైర్మన్లుగా ఎదుగుతున్నారు.అల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈవో, సుందర్పిచాయ్సుందర్పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్.తమిళనాడులోని అశోక్ నగర్లో 1972 జులై 12న జన్మించారు.ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో మెటలార్జికల్ ఇంజినీరింగ్ విభాగంగా బీటెక్ చేశారు.1993లో అమెరికా వెళ్లిన సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.గూగుల్‌లో చేరడానికి ముందు మెకిన్సే, అప్లైడ్ మెటీరియల్స్ సంస్థల్లో పనిచేశారు.2004లో గూగుల్ సంస్థలో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు.గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు.2015లో గూగుల్ సీఈఓగా నియమితులయ్యారు.నాలుగేళ్లకే 2019లో గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్హైదరాబాద్లో జన్మించిన సత్యనాదెళ్ల కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు.అతడి తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్, 1962 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి.సత్య విస్కాన్సిన్ మిల్వాకీ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు.సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు.మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.ఆన్లైన్ సర్వీసెస్ విభాగానికి ఆర్ అండ్ డీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, మైక్రోసాఫ్ట్ బిజినెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్ తర్వాత కంపెనీ చరిత్రలో మూడో సీఈఓగా 4 ఫిబ్రవరి 2014న నియమితులయ్యారు.శాంతను నారాయణ్, అడోబ్ ఇంక్ ఛైర్మన్, సీఈవోహైదరాబాద్లో 1963లో జన్మించారు.యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.1998లో అడోబ్‌లో వరల్డ్‌వైడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు.2001 నుంచి 2005 వరకు అడోబ్ ప్రపంచవ్యాప్త ఉత్పత్తులకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.2005లో ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.నవంబర్ 2007లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.అజయ్‌పాల్ సింగ్ బంగా, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్అజయ్ బంగా 1959 నవంబరు 10న మహారాష్ట్ర పుణెలోని ఖడ్కీ కంటోన్మెంట్లో ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు.ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా ఆర్మీ అధికారి.అజయ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు.ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) నుంచి మేనేజ్మెంట్లో పీజీపీ(ఎంబీఏతో సమానం) పూర్తి చేశారు.భారత ప్రభుత్వం 2016లో బంగాకు పద్మశ్రీ అందించింది.ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా 2023 మే 3న ఎన్నికయ్యారు.గీతా గోపీనాథ్, డిప్యూటీ ఎండీ ఐఎంఎఫ్గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పుట్టారు.2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.2019-2022 వరకు ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు.ఐఎంఎఫ్‌లో చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు.అరవింద్ కృష్ణ, ఐబీఎం ఛైర్మన్, సీఈవోఅరవింద్ కృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1962లో జన్మించారు.ఆయన తండ్రి మేజర్ జనరల్ వినోద్ కృష్ణ భారత సైన్యంలో ఆర్మీ అధికారిగా చేశారు.అరవింద్ 1985లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు.1990లో ఐబీఎంలో చేరారు.ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవోగా, తర్వాత జనవరి 2021లో ఛైర్మన్‌గా బాధ్యలను స్వీకరించారు.ఇంద్రా నూయి, పెప్సికో సీఈఓఇంద్రా అక్టోబర్ 28, 1955న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు.1975లో మద్రాస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్‌కతా నుంచి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ డిప్లొమా పూర్తి చేశారు.జాన్సన్ & జాన్సన్, బార్డ్సెల్ లిమిటెడ్‌లో ప్రొడక్ట్ మేనేజర్ హోదాలతో తన కెరీర్‌ను ప్రారంభించారు.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)లో స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా చేరారు.మోటొరోలాలో వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.1994లో పెప్సికోలో చేరారు. 2006లో సీఈఓగా నియమితులయ్యారు.ఇదీ చదవండి: ముంబయి-ఢిల్లీ టికెట్ కంటే తులం బంగారం చీప్!రేవతి అద్వైతి, ఫ్లెక్స్ సీఈఓఅద్వైతి 1990లో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.2005లో థండర్బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుండి MBA సంపాదించారు.2019లో ఫ్లెక్స్‌లో చేరడానికి ముందు ఈటన్, హనీవెల్‌లో నాయకత్వ స్థానాల్లో పనిచేశారు. -
యూట్యూబ్ మాజీ సీఈఓ కన్నుమూత
యూట్యూబ్ మాజీ సీఈఓ 'సుసాన్ వొజ్కికి' (Susan Wojcicki) క్యాన్సర్‌తో రెండేళ్ల పోరాటం తర్వాత 56 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె మరణ వార్తను ఆమె భర్త 'డెన్నిస్ ట్రోపర్' ఆగస్టు 9న ధృవీకరించారు.సుసాన్ వొజ్కికి మరణ వార్తను ట్రోపర్ ఫేస్బుక్ పోస్ట్‌తో తెలియజేశారు. నా భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి చివరకు కన్నుమూసింది. సుసాన్ నాకు ప్రాణ స్నేహితురాలు. జీవిత భాగస్వామి మాత్రమే కాదు, తెలివైన మనస్సు, ప్రేమగల తల్లి, చాలా మందికి మంచి స్నేహితురాలు. మా కుటుంబంపై ఆమె ప్రభావం ఎనలేనిదని అన్నారు.సుసాన్ వొజ్కికి మరణం టెక్ ప్రపంచానికి తీరని లోటు అని చాలామంది నివాళులు అర్పించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్యాన్సర్‌తో పోరాడి నా ప్రియమైన స్నేహితురాలు సుసాన్ వొజ్కికిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టంగా ఉందని అన్నారు.Unbelievably saddened by the loss of my dear friend @SusanWojcicki after two years of living with cancer. She is as core to the history of Google as anyone, and it’s hard to imagine the world without her. She was an incredible person, leader and friend who had a tremendous…— Sundar Pichai (@sundarpichai) August 10, 2024 -
జీతం ఇవ్వము.. ఉద్యోగంలో చేరండి!.. సీఈఓ పోస్ట్ వైరల్
ఉద్యోగంలో చేరాలంటే మంచి జీతం, వారాంతపు సెలవులు కావాలని ఎవరైనా కోరుకుంటారు. కొన్ని సార్లు జీతం తక్కువైనా తప్పకుండా సెలవుల విషయంలో రాజీపడే అవకాశమే లేదు. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ సంస్థ సీఈఓ ఓ జాబ్ ఆఫర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతలా వైరల్ అవ్వడానికి.. అంతలా అందులో ఏముందో ఇక్కడ చూసేద్దాం.అహ్మదాబాద్‌లోని 'బ్యాటరీ ఒకే టెక్నాలజీస్' వ్యవస్థాపకుడు, సీఈఓ శుభమ్ మిశ్రా ఉద్యోగుల కోసం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఇందులో మా కోర్ టీమ్‌లో చేరడానికి అసాధారణమైన వ్యక్తుల కోసం చూస్తున్నాము. ఉద్యోగులకు ఎలాంటి జీతం ఉండదు, వారాంతపు సెలవులు, సెలవులు (నిజంగా అవసరమైతేనే సెలవు) లేదు. ఎలాంటి బహుమతులు కూడా ఉండవని స్పష్టం చేశారు.రెడ్డిట్, లింక్డ్ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దీని గురించి శుభమ్ మిశ్రా స్పందిస్తూ.. మేము దీర్ఘకాలికంగా కంపెనీని నిర్మిస్తున్నాము. మాతో పాటు ఎదగాలని అనుకుంటున్నా వ్యక్తుల కోసం మేము వెతుకుతున్నామని ఆయన అన్నారు. వినూత్న ఏఐ పరిష్కారాల ద్వారా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే స్టార్టప్ లక్ష్యంగా ఈ విధమైన పోస్ట్ చేసినట్లు మిశ్రా స్పష్టం చేశారు. -
అడిగినంత జీతం.. ఎంత మంచి సీఈవో!!
శాలరీ నెగోషియేషన్.. అదేనండి జీతాల బేరసారాలు. ఇది ప్రతి ఇంటర్వ్యూ ప్రక్రియలో భాగమైన, సాధారణమైన, సంక్లిష్టమైన విషయమే. అభ్యర్థి ఎంత ఆశిస్తున్నారు.. కంపెనీ బడ్జెట్ ఎంత అన్నవాటి మధ్య ఈ జీతం చర్చలు జరుగుతాయి. అయితే బెంగుళూరుకు చెందిన ఒక సీఈవో తన కంపెనీలో ఇలాంటి తతంగం ఏమీ లేకుండా అభ్యర్థులు అడిగినంత జీతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ జోకో సహ వ్యవస్థాపకుడు, సీఈవో అర్జున్.వి లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ పెట్టారు. తమ కంపెనీలో నియామక ప్రక్రియ నుంచి శాలరీ నెగోషియేషన్ దశను తప్పించామని, అభ్యర్థులు అడిగినంత జీతాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. దీనికి కారణాలను సైతం ఆయన వివరించారు.“నా బృందం కోసం 18 మందికి పైగా నియమించుకున్న తర్వాత, ప్రపంచ స్థాయి ప్రతిభను నిలుపుకునే రహస్యాన్ని నేను కనుగొన్నాను. మేము శాలరీ నెగోషియేషన్ చేయము. వారు అడిగినంత అక్షరాలా చెల్లిస్తాము” అని జోకో సీఈవో అర్జున్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.“ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి సవరిస్తాం. కారణం సింపుల్” అంటూ తన నిర్ణయం వెనుక నాలుగు కారణాలను ఆయన పేర్కొన్నరు. తాను ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే శాలరీ నెగోషియేషన్ చేశానని, అది కూడా అభ్యర్థి అడిగినదాని కంటే పెంచడం కోసమని వివరించారు. అదే ఉద్యోగానికి బయట ఇతర కంపెనీలు ఇస్తున్నదాని కంటే ఆ అభ్యర్థి తక్కువ అడగడంతో తాను మరింత ఆఫర్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.సీఈవో అర్జున్ ఈ పోస్ట్ షేర్ చేసినప్పటి నుంచి దానికి అనేక స్పందనలు వచ్చాయి. ప్రశ్నలు, కామెంట్లు వెల్లువెత్తాయి. అభ్యర్థులు అసమంజసమైన జీతాలు అడిగితే ఎలా? అంటూ మరో కంపెనీ సీఈవో ప్రశ్నించారు. అది సరే వార్షిక పెంపు మాటేంటి అని ఏఐ అండ్ అనలైటిక్స్‌లో పనిచేస్తున్న ఓ యూజర్ అడిగారు. పరిమిత వనరులు ఉన్న స్టార్టప్‌లు, బల్క్ రిక్రూట్మెంట్ అవసరమయ్యే పెద్ద కంపెనీలకు ఇది సరిపోకపోవచ్చని మరో యూజర్ కామెంట్ చేశారు. -
నీరజ్ ‘గోల్డ్’ గెలిస్తే అందరికీ... ఓ సీఈవో అదిరిపోయే ఆఫర్!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఓ పోస్ట్‌ను పంచుకుంటూ.. "ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే నేను వ్యక్తిగతంగా అందరికీ ఉచిత వీసా పంపుతాను" అంటూ ప్రకటించారు. జూలై 30న నహ్తా పోస్ట్ పెట్టిన వెంటనే, ఈ ఆఫర్‌కు సంబంధించి యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన ఆఫర్‌ను వివరిస్తూ మరో పోస్ట్‌ను మోహక్ నహ్తా షేర్ చేశారు."నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. చాలా మంది అడిగారు కాబట్టి, ఇవిగో వివరాలు.." అంటూ తాజా పోస్ట్‌లో పూర్తి వివరాలు అందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీపడతాడు. ఆయన బంగారు పతకం సాధిస్తే, ఒక రోజంతా వినియోగదారులందరికీ ఒక ఉచిత వీసా అందిస్తామన్నారు. ఆ రోజు అన్ని దేశాలకు వీసా ఖర్చును కంపెనీ భరిస్తుందని ఆయన తెలిపారు.వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కంపెనీ ఉచిత వీసా క్రెడిట్‌తో యూజర్ తరపున ఖాతాను సృష్టిస్తుందన్నారు. సీఈవో మోహక్ నహ్తా పోస్ట్ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో భాఈగా రీపోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్లను పొందింది. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్‌లోని ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి. -
ఏడాదికి రూ.84.16 కోట్లు.. ఇండియాలో అధిక వేతనం తీసుకునే సీఈఓ
2023-24 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ సీ విజయకుమార్ అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా నిలిచారు. ఈయన మొత్తం జీతం సుమారు 10.06 మిలియన్ డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 84.16 కోట్లు. ఈ విషయాన్ని కంపెనీ నివేదికలో వెల్లడించింది. దీంతో ఈయన ఈ ఏడాది భారతీయ ఐటీ కంపెనీల సీఈఓలలో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు.హెచ్‌సీఎల్ టెక్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 ప్రకారం.. విజయకుమార్ వేతనం గత ఏడాది కంటే 190.75 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఈయన మొత్తం ప్యాకేజీలో 16.39 కోట్లు (1.96 మిలియన్ డాలర్లు) బేసిక్ శాలరీ కాగా.. పర్ఫామెన్స్ లింక్డ్ బోనస్ 1.14 మిలియన్ డాలర్లు లేదా రూ. 9.53 కోట్లు, లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ రూ. 2.36 మిలియన్ డాలర్లు (రూ. 19.74 కోట్లు). ఇతరత్రా ప్రయోజనాల కింద కూడా భారీ మొత్తంలోనే లభిస్తుంది. విజయకుమార్ వేతనం.. కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగుల జీతం కంటే 707.6 రెట్లు ఎక్కువని తెలుస్తోంది.ఇతర కంపెనీల సీఈఓల వేతనాల విషయానికి వస్తే.. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ. 66 కోట్లు, విప్రో సీఈఓ శ్రీని పల్లియా రూ. 50 కోట్లు, టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ రూ. 25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దేశంలోని దిగ్గజ కంపెనీలలో పని చేసే సీఈఓలలో ఎక్కువ వేతనం తీసుకునే వ్యక్తిగా విజయకుమార్ నిలిచారు. -
మైక్రోసాఫ్ట్ సమస్య పరిష్కారం.. క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ ట్వీట్
మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడిన సమస్య పలు రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఈ సమస్యను పరిష్కరించినట్లు క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ ట్వీట్ చేశారు.సమస్యను గుర్తించామని, పరిష్కారం కూడా అమలు చేశామని క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ 'జార్జ్ కర్ట్జ్' వెల్లడించారు. ఈ ప్రభావం మ్యాక్, లినక్స్ హోస్ట్‌ల మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇది సైబర్‌టాక్ అటాక్ కాదు. వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ కస్టమర్లను చేరువలో ఉంటామని ఆయన అన్నారు.మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది.CrowdStrike is actively working with customers impacted by a defect found in a single content update for Windows hosts. Mac and Linux hosts are not impacted. This is not a security incident or cyberattack. The issue has been identified, isolated and a fix has been deployed. We…— George Kurtz (@George_Kurtz) July 19, 2024 -
అందరూ భయపడుతుంటే.. ఇన్ఫోసిస్ మాత్రం ఓకే..
ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు కంపెనీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని గురించి అన్ని కంపెనీలు భయోందోళన చెందుతుంటే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాత్రం తమకు ఓకే అంటోంది.ప్రైవేట్ సంస్థల్లో స్థానిక నియామకాలకు రాష్ట్ర ప్రతిపాదిత రిజర్వేషన్లకు ప్రతిస్పందనగా కర్ణాటక ఏ కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను ప్రవేశపెట్టినా తమ కంపెనీ పాటిస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తామని పరేఖ్ స్పష్టం చేశారు. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు వచ్చినా మద్దతిస్తాం.పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించే కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు, 2024 ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఈ వారం ప్రారంభంలో ఆమోదించింది. ఏ పరిశ్రమ, కర్మాగారం లేదా ఇతర సంస్థలు అయినా మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 70 శాతం స్థానిక అభ్యర్థులను నియమించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది.ఈ బిల్లు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే వ్యాపార ప్రముఖులు, టెక్నాలజీ రంగ ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దీన్ని నిలిపివేశారు. ఈ ఆంక్షల వల్ల స్థానిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఏర్పడితే కంపెనీలు తరలిపోతాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) హెచ్చరించింది.ఫోన్ పే సీఈఓ సమీర్ నిగమ్ ఈ ప్రతిపాదనను సోషల్ మీడియాలో ‘షేమ్’ అంటూ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపాదిత కోటాను 'ఫాసిస్టు', 'స్వల్పదృష్టి'గా అభివర్ణిస్తూ పరిశ్రమ పెద్దలు కూడా ఈ కోటాపై తీవ్రంగా స్పందించారు. ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్ దాస్ పాయ్ ఈ బిల్లును తిరోగమనంగా అభివర్ణించారు. బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా, అసోచామ్ కర్ణాటక కో-చైర్మన్ ఆర్కే మిశ్రా వ్యతిరేక స్వరం వినిపించారు. -
బజాజ్ ఎలక్ట్రికల్స్ సీఈవో రాజీనామా
బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనూజ్ పొద్దార్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 30న ఆయన పదవి నుంచి వైదొలగుతారని కంపెనీ మీడియా ప్రకటనలో వెల్లడించింది.పరివర్తన కాలంలో అనూజ్ బాధ్యతలను కంపెనీ ఛైర్మన్ శేఖర్ బజాజ్ నిర్వర్తించనున్నారు. 2022 మార్చిలో మొదటిసారిగా బజాజ్ ఎలక్ట్రికల్స్‌ను నికర రుణ రహితంగా మార్చడంలో కృషి చేసిన పొద్దార్, కంపెనీని సవాలుతో కూడిన దశలో నడిపించడం, దాని కార్యకలాపాలను పునర్నిర్మించడంలో ఘనత పొందారు.పొద్దార్ నాయకత్వంలో, బజాజ్ ఎలక్ట్రికల్స్ తన ఫ్లాగ్షిప్ బ్రాండ్ 'బాజాజ్'ని పునరుద్ధరించింది, 'హౌస్ ఆఫ్ బ్రాండ్స్' నిర్మాణాన్ని రూపొందించింది, 'మార్ఫీ రిచర్డ్స్' బ్రాండ్ కోసం దీర్ఘకాలిక లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఆయన పదవీకాలంలో కంపెనీ పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను మెరుగుపరిచింది."బోర్డు ఆయన రాజీనామాను ఆమోదించింది. అలాగే గత ఐదున్నర సంవత్సరాలుగా కంపెనీ పరివర్తన, వృద్ధి ప్రయాణాన్ని రూపొందించడంలో అనుజ్ అందించిన అద్భుతమైన సహకారాన్ని గుర్తించింది" అని బజాజ్ ఎలక్ట్రికల్స్ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్న కాలంలో పొద్దార్ నాయకత్వాన్ని బజాజ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ శేఖర్ బజాజ్ కొనియాడారు. -
బిలియనీర్ అయిపోయిన దీపిందర్ గోయల్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ బిలియనీర్స్ క్లబ్‌లోకి చేరారు. గతేడాది నుంచి జొమాటో షేర్లలో రికార్డు ర్యాలీతో దీపిందర్ బిలియనీర్ అయ్యారు. 2023 జూలై కనిష్ట స్థాయి నుంచి కంపెనీ స్టాక్ 300 శాతానికి పైగా పెరిగింది.జొమాటో స్టాక్ బీఎస్ఈలో రూ.230 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది రోజులో 2 శాతం లాభపడింది. దాని మార్కెట్ క్యాప్ రూ.1.8 ట్రిలియన్లకు చేరుకుంది. దీంతో గోయల్ నెట్‌వర్త్ రూ.8,300 కోట్లకు చేరుకోవడంతో భారతదేశపు అత్యంత ధనిక ప్రొఫెషనల్ మేనేజర్‌గా నిలిచాడు. ప్రస్తుతం గోయల్‌కు కంపెనీలో 36.95 కోట్ల షేర్లు లేదా 4.24 శాతం వాటా ఉంది.జొమాటో క్విక్ కామర్స్ వ్యాపారం బ్లింకిట్ తోటి కంపెనీలను అధిగమించి ఊహించిన దాని కంటే ముందుగానే లాభదాయకంగా మారవచ్చు అనే అంచనాల మధ్య గతేడాది ప్రారంభం నుంచి జొమాటలో స్టాక్ గణనీయంగా పెరుగుతూ చ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్లింకిట్ ఇబీట ఆదాయం బ్రేక్ ఈవెన్‌గా మారవచ్చని కంపెనీ ఇంతకు ముందు పేర్కొంది. ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయకమైన యూనిట్ కావడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది.మధ్యతరగతి కుటుంబం నుంచి..మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దీపిందర్ ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆహారం పట్ల తనకున్న మక్కువతో స్ఫూర్తి పొంది ఫుడ్ ఆర్డర్ చేయడానికి యాప్‌ను రూపొందించారు. బెయిన్& కంపెనీలో ఉన్నప్పుడే FoodieBay.comని స్థాపించారు. దీన్ని తరువాత Zomato.com అని పేరు మార్చారు. 2011లో ఇన్ఫో ఎడ్జ్ నుంచి నిధులు లభించడంతో గోయల్, ఆయన బృందం తమ ఉద్యోగాలను వీడి జొమాటో వృద్ధిపై పూర్తిగా దృష్టి పెట్టారు. జొమాటో 2018లో యునికార్న్‌గా మారింది. -
ఉన్నట్టుండి సీఈవోను తొలగించిన లగ్జరీ బ్రాండ్
ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బుర్బెర్రీ ఉన్నట్టుండి తమ సీఈవోను మార్చేసింది. బోర్డ్ పరస్పర అంగీకారంతో సీఈవో జొనాథన్ అకెరాయిడ్ తక్షణం పదవి నుంచి వైదొలగుతున్నారని, కంపెనీని వీడుతున్నారని కంపెనీ తాజాగా ప్రకటించింది.అకెరాయిడ్ స్థానంలో మైఖేల్ కోర్స్ మాజీ బాస్ జాషువా షుల్మాన్ను దాని కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బుర్బెర్రీ నియమించింది. అమ్మకాలు క్షీణించడంతో నష్టాలు తప్పవన్న సంకేతాలతో డివిడెండ్‌ను రద్దు చేసిన కంపెనీ.. సీఈవో జొనాథన్ అకెరాయిడ్పైనా వేటు వేసింది.లగ్జరీ సెక్టార్లో మందగమనం ప్రత్యర్థి బ్రాండ్ల కంటే బుర్బెర్రీని తీవ్రంగా దెబ్బతీసింది. 168 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్రిటిష్ కంపెనీలో ఏకంగా సీఈవో మార్పునకు దారితీసింది. జూన్ 29 వరకు 13 వారాలలో బుర్బెర్రీ అమ్మకాలు 21% క్షీణించాయి. ప్రస్తుత ట్రెండ్స్ వార్షిక లాభాల అంచనాలను దెబ్బతీసిన నేపథ్యంలో వృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి ఈ సంవత్సరం డివిడెండ్‌ను కంపెనీ రద్దు చేసింది.షుల్మాన్ 2021-2022 వరకు యూఎస్ బ్రాండ్ మైఖేల్ కోర్స్‌కు సీఈవోగా పనిచేశారు. అంతకుముందు కోచ్ కంపెనీకి బ్రాండ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బుర్బెర్రీలో షేర్లు గత 12 నెలల్లో వాటి విలువలో 57% నష్టపోయాయి. -
బంధన్ బ్యాంక్ సీఈఓగా రతన్ కుమార్ కేష్
బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'రతన్ కుమార్ కేష్' జూలై 10 నుంచి అమలులోకి వచ్చేలా ప్రైవేట్ లెండర్ తాత్కాలిక ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎండీ & సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ 2024 జులై 9న పదవీ విరమణ చేయనున్నారు.జూలై 6న సమావేశంలో రతన్ కుమార్ కేష్‌ను తాత్కాలిక ఎండీ అండ్ సీఈఓగా నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు తీర్మానించింది. ఈ నియామకం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం కూడా లభించింది.రతన్ కుమార్ కేష్ మార్చి 2023 నుంచి బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అంతకంటే ముందు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యెస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్‌లలో కూడా పనిచేశారు. -
ఉద్యోగులు లేట్‌గా వస్తే ఫైన్ : పాపం బాస్కే చుట్టుకుంది! ట్విస్ట్ ఏంటంటే!
ఉద్యోగులు సమయాన్ని కచ్చతంగా పాటించాలనే ఉద్దేశంతో ఒక బ్యూటీ కంపెనీ బాస్ కఠినమైన నియమం తీసుకొచ్చాడు. ఆఫీసుకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులెవరైనా రూ. 200 ఫైన్ చెల్లించాల్సిందే అంటూ రూల్ పెట్టాడు. అది తిరిగి తిరిగి బాస్కే చుట్టుకుంది. దీంతో ఆయన ఫన్నీగా ఒక పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్‌గా మారింది. ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ ఇంకోటి ఉంది. అదేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. ముంబైలోని ఈవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు కౌశల్ షా ఉద్యోగులకు సమయానికి రావాలని రూల్ విధించాడు. కంపెనీ ఉత్పాదక పెరగాలని, క్రమశిక్షణ అండాలంటూ ఉద్యోగులు ఉదయం 9:30 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. అలాగే ఆలస్యంగా వచ్చిన వారికి రూ. 200 జరిమానా విధించారు. ఈ రూల్ అలా పెట్టాడో లేదో ఆయనే అయిదుసార్లు లేట్ వచ్చినందుకు స్వయంగా షా వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్‌లో షేర్ చేశాడు. ఈ రూల్‌తో తనకే ఎదురుదెబ్బ తగిలిందని హాస్యాస్పదంగా పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అలాగేవిష సంస్కృతి అని కొందరు, “ఉద్యోగులందరికీ మీకున్నంత జీతం ఉందా?, మరి ఎక్కువ పనిగంటలకి అదనంగా చెల్లిస్తున్నారా?. ఇలా రక రకాల కమెంట్స్ వచ్చాయి. ‘‘ఇది చాలా దారుణం. మీ నుండి ఇది ఊహించలేదు బ్రో రూ. 200 కోసం వారు తొందరపడితే, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగదే ఎలా?’’ అంటూ మరికొందరు ఇంకొంచె ఘాటుగా స్పందించారు. దీంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తన పోస్ట్‌కు వచ్చిన స్పందన నేపథ్యంలో షా, తన ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించాడు.ఇదీ సంగతి!తన పోస్ట్ వెనకాల ఉన్న ఉద్దేశాన్ని నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని షా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేశాడు. కంపెనీ ఒక రూల్ పెట్టినపుడు, ఫౌండర్ నుంచి కింది స్థాయి ఉద్యోగి దాకా అన్ని స్థాయిల్లో అందరూ దీన్ని తు.చ. తప్పకుండా పాటించాలనే సూత్రాన్ని నొక్కిచెప్పడమే తన ఉద్దేశమని పేర్కొన్నాడు. అంతేకాదు లేటు ఫీజు ద్వారా సేకరించిన డబ్బును తన సొంత యూపీఐ వాలెట్‌కు చెల్లించడం గురించి కూడా వివరణ ఇచ్చాడు. దీన్ని ప్రత్యేక టీమ్ ఫండ్‌గా చేసి టీమ్ ఈవెంట్లకు, లంచ్‌కు ఉపయోగిస్తామని వెల్లడించాడు. -
పిజ్జాలు పంపించి.. రూ.కోట్ల డీల్స్ పట్టాడు!
కంపెనీలు తమ వ్యాపారం కోసం క్లయింట్లను ఆకర్షించడానికి చాలా చేస్తుంటారు. అయితే ఒక స్టార్టప్ సీఈఓ క్లయింట్లకు ఫుడ్ ట్రీట్ ఇచ్చి కోట్ల రూపాయల డీల్స్ దక్కించుకున్న సంగతి మీకు తెలుసా? ఈ డీల్స్ ద్వారా ఆ స్టార్టప్‌కు ఊహించనంత ఆదాయం వచ్చింది.న్యూయార్క్‌కు చెందిన టెక్ స్టార్టప్ యాంటిమెటల్ కో ఫౌండర్, సీఈవో మాథ్యూ పార్క్‌హస్ట్ గత ఏప్రిల్ నెలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ ఇన్ఫ్లుయన్సర్లతో సహా పలువురికి పిజ్జాలను కొనుగోలు పంపించారు. ఇందు కోసం 15,000 డాలర్లు (సుమారు రూ.12.5 లక్షలు) ఖర్చు పెట్టారు. బీటా దశలో తమ కంపెనీ గురించి అవగాహన పెంచడమే ఈ ట్రీట్ ఉద్దేశం.కేవలం రెండు నెలల్లోనే యాంటిమెటల్ తన ఖర్చులను లాభదాయక ఒప్పందాలుగా మార్చి ఒక మిలియన్ డాలర్లకు పైగా (రూ.8.3 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. పిజ్జాతో ట్రీట్ చేసిన 75 కంపెనీలు పార్క్ హస్ట్ క్లయింట్లుగా మారాయి. ఈ విషయాన్ని సీఈవో పార్క్‌హస్ట్ సీఎన్‌బీసీ మేక్ ఇట్తో స్వయంగా వెల్లడించారు. నిజానికి 'పిజ్జా' తమ ఫస్ట్ ఛాయిస్ కాదని చెప్పారు. షాంపైన్ పంపించాలనుకున్నామని, అయితే దానికి చాలా ఖర్చవుతుందని, పిజ్జాను ఎంచుకున్నట్లు పార్క్‌హస్ట్ వివరించారు. -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఎడెల్వీస్ ఏఆర్సీ చీఫ్‌గా 'ఆర్కే బన్సాల్' రిజెక్ట్
ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా 'రాజ్‌కుమార్ బన్సాల్'ను మళ్ళీ నియమించాలనే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తిరస్కరించింది.రాజ్‌కుమార్ బన్సాల్ ఏప్రిల్ 2018లో ఎడెల్వీస్ ఏఆర్‌సీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. సుమారు మూడు దశాబ్దాలపాటు బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న ఈయన.. ఐడీబీఐ బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఇప్పటి వరకు 8.2 శాతం క్షీణించాయి. -
రూ. 5,000 కోట్ల ఏయూఎం లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండు–మూడేళ్లలో రూ. 5,000 కోట్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) సాధించాలని నిర్దేశించుకున్నట్లు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ఇన్‌క్రెడ్‌మనీ సీఈవో విజయ్ కుప్పా తెలిపారు. ప్రస్తుతం ఇది రూ. 1,250 కోట్ల స్థాయిలో ఉందని, సుమారు రెండు లక్షల మంది యూజర్లు ఉన్నారని వివరించారు. వచ్చే రెండేళ్లలో బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తున్నామని, ఇప్పటికే లైసెన్స్ కూడా పొందామని ఆయన తెలిపారు. దేశీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పాన్కార్డ్హోల్డర్ల సంఖ్య 6–7 కోట్ల స్థాయిలో ఉండగా వచ్చే పదేళ్లలో ఇది 20 కోట్లకు చేరే అవకాశం ఉందని విజయ్ చెప్పారు. ప్రజలు క్రమంగా పొదుపు నుంచి ఇతర ఆర్థిక సాధనాల వైపు మళ్లుతుండటం ఇందుకు దోహదపడగలదని ఆయన వివరించారు. తమ ప్లాట్‌ఫాంలో రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వారి కోసం 24 ప్రోడక్ట్‌లు అందుబాటులో ఉన్నాయని విజయ్ చెప్పారు. బాండ్లు, ఈక్విటీల్లో పెట్టుబడుల మేళవింపుతో ఒకవైపు పెట్టుబడి భద్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ మరోవైపు అధిక రాబడులను కూడా అందించే విధంగా ఈ ప్రోడక్టులు ఉంటాయని ఆయన తెలిపారు. -
సత్య నాదెళ్ల సక్సెస్ అయింది ఇలాగేనా..?
మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ ఏడాది పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా యాపిల్‌ను అధిగమించేలా మైక్రోసాఫ్ట్‌ను సత్య నాదెళ్ల విజయవంతంగా నడిపించారని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక తెలిపింది.తనను విజయపథంలో నడపడానికి దోహదపడిన అంశాల గురించి సత్య నాదెళ్ల పలు సందార్భాల్లో వెల్లడించారు. వాటిలో 10 మేనేజ్మెంట్, కెరీర్ టిప్స్ ఇక్కడ ఇస్తున్నాం..ఏదీ లేనప్పుడు స్పష్టతను సృష్టించగలగడం ఏ నాయకుడికైనా ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం.విషయాలు ఎల్లప్పుడూ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి మన చుట్టూ శక్తిని సృష్టించుకునే నైపుణ్యాలను పెంచుకోవాలి.నాయకుడనే వాడు మితిమీరిన నియంత్రిత ప్రదేశంలోనూ విజయాన్ని సృష్టించగలగాలి.ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి.విధుల్లో మానసిక భద్రతను పెంపొందించడంలో తాను పెద్దవాడినని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ప్రశ్నలు అడిగినందుకు, ఆందోళనలను పంచుకున్నందుకు లేదా తప్పులు చేసినందుకు ఉద్యోగులు శిక్షకు భయపడని వాతావరణాన్ని సృష్టిస్తుంది.సత్య నాదెళ్ల సహానుభూతిని మృదువైన నైపుణ్యంగా పరిగణించరు. వాస్తవానికి ఇది మనం నేర్చుకునే కఠినమైన నైపుణ్యమని ఆయన నమ్ముతారు.ఎవరూ "పరిపూర్ణ" నాయకుడు కారు. కానీ వారు తమ ఉద్యోగులకు మరింత స్పష్టత, శక్తి లేదా స్వేచ్ఛను ఎలా తీసుకురాగలరని ప్రశ్నించే వారు ఎల్లప్పుడూ మెరుగుపడతారు.మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి. మీ ప్రస్తుత బాధ్యతల నుంచి నేర్చుకుంటూ ఉండండి. 30 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు సీఈవో అవుతానని సత్య నాదెళ్ల ఎప్పుడూ అనుకోలేదు. తనకు ఇచ్చిన ఏ పాత్రలోనైనా రాణించడంపైనే దృష్టి పెట్టారు.అడాప్టబుల్గా ఉండండి. మైక్రోసాఫ్ట్ లో పనిచేసినంత కాలం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తాను పనిచేసిన బృందాలు, తాను నిర్వహించిన విభాగాలను బట్టి నిరంతరం మారాల్సి వచ్చిందని సత్య నాదెళ్ల చెప్పారు.మీ లక్ష్యం.. మిమ్మల్ని నడిపించేది ఏమిటో తెలుసుకోండి. మనం ఉద్యోగాలలో ఎక్కువ సమయం గడుపుతున్నందున, పనికి లోతైన అర్థం గురించి ఆలోచించడం అవసరం. -
గ్లాండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 'శ్రీనివాస్ సాదు'
హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ శుక్రవారం (జూన్ 7) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ సీఈఓగా 'శ్రీనివాస్ సాదు'ను నియమించినట్లు ప్రకటించింది. ఈ నెల 10 నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ, న్యూయార్క్ నుంచి ఇండస్ట్రియల్ ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన సాదు.. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ నుంచి ఎంబీఏ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ నుంచి ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ వంటి చదువులు చదువుకున్నారు.వ్యాపార అభివృద్ధి, తయారీ కార్యకలాపాలు, సరఫరా గొలుసు నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలలో సాదుకు 23 సంవత్సరాల అనుభవం ఉంది. ఈయన గత 22 సంవత్సరాలుగా.. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. 2000లో జనరల్ మేనేజర్‌గా, 2002లో సీనియర్ జనరల్ మేనేజర్‌గా, 2003లో వైస్ ప్రెసిడెంట్‌గా, 2005లో డైరెక్టర్‌గా, 2011లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. కాగా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్: సీఈవో వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్ అవుతాయన్నారు. తెలంగాణలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని సీఈవో వెల్లడించారు.34 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని.. 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 19 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశామన్నారు. 12 కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని సీఈవో పేర్కొన్నారు. -
ఈ సీఈవో జీతం 12 రూపాయలే.. నమ్మబుద్ధి కావడం లేదా?
సాధారణంగా కంపెనీల సీఈవో వేతనం రూ.కోట్లలో ఉంటుంది. కానీ ఈ ఫిన్‌టెక్ యూనికార్న్ సీఈవో వార్షిక జీతం కేవలం 12 రూపాయలే. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ కథనం చదవండి.ప్రైవేట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ప్రైవేట్ సర్కిల్ రీసెర్చ్ యూనికార్న్ వ్యవస్థాపకుల మధ్యస్త, సగటు వేతన అంతరాలపై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఫిన్‌టెక్ యూనికార్న్ స్లైస్ ఫౌండర్, సీఈవో రాజన్ బజాజ్ 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 వార్షిక వేతనం మాత్రమే తీసుకున్నారు.సీఈవో బజాజ్ జీతం నామమాత్రంగా ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు, రుణ వ్యాపార కార్యకలాపాల నుంచి స్లైస్ రూ .847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ తన అప్పటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తి అయిన ప్రీపెయిడ్ కార్డుపై రివాల్వింగ్ క్రెడిట్ లైన్‌ను రద్దు చేసినప్పటికీ కంపెనీ దీనిని సాధించగలిగింది. -
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన
సాక్షి, విజయవాడ: పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను మేము విడుదల చేయలేదని.. ఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదు.. అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని సీఈవో ముకేష్ కుమార్ మీనా అన్నారు.‘‘దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లింది పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశాం. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదు ఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను’’ అని సీఈవో ముకేష్ కుమార్ మీనా చెప్పారు. -
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ESPS) ఉండదు.2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు. -
ఈజిప్టులో మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ (ఫోటోలు)
-
Kaviya Maran: వేలకోట్లకు ఏకైక వారసురాలు.. కావ్యా మారన్ గురించి ఈ విషయాలు తెలుసా? (ఫోటోలు)
-
నేను మంచి తల్లినా కాదా?! మామాఎర్త్ సీఈఓ పోస్టు వైరల్
ఒకప్పుడు ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అయ్యేవారు. అరకొర చదువులు చదివించి.. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తరింటికి పంపిచేశారు. అమ్మాయిలకు పెద్ద చదువులు చెప్పించడం, ఉద్యోగాలకు పంపడం అన్న మాటే లేదు. కానీ రోజులు, పరిస్థితులు మారాయి. నేటి కాలంలో మగవారితో సమానంగా చదువుతున్నారు అమ్మాయి. ఇటు ఉద్యోగాలు కూడా చేస్తూ తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు పెళ్లి అయ్యాక ఓ వైపు ఇంటిని చూసుకుంటూ మరోవైపు ఉద్యోగం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. సగటు వర్కింగ్ విమెన్‌కు ఉండే సవాళ్లు తాజాగా బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్ సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్కు కూడా ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ భావోద్వేగ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. గజల్ తన కొడుకును తొలిరోజు పాఠశాలకు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ తనకున్న పనుల వల్ల అది సాధ్యపదడలేదు. దీంతో ఆమె ఎంతో బాధపడిపోయింది. కుమారుడితో కలిసి మొదటి రోజు పాఠశాలకు వెళ్లకపోడంతో ‘నేను చెడ్డ తల్లినా?’ అనే ప్రశ్న తన మదిలో మెదిలినట్లు చెప్పుకొచ్చింది. చివరికి తన కొడుకును వాళ్ల నానమ్మతో స్కూల్‌కు పంపినట్లు పేర్కొంది. ‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు ను మంచి తల్లిని కాదా? అనే ప్రశ్న నా మదిలో మెదిలింది. ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్‌కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదదు. అది ఎంత విలువైనది అయినా సరే. అలా మొదటిరోజు స్కూల్‌కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. అదేవిధంగా తన కుటుంబ సపోర్ట్‌ను కూడా అలఘ్ ఈ పోస్టులో వివరించారు. నేను, వరుణ్ అలగ్, కుమారుడు అగస్త్య, మా అత్త ఐదేళ్ల కిత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నాలుగుతరాల వాళ్లంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సొంతవాళ్లే కావాలనేం లేదు. దగ్గరి బంధువులు, అర్థం చేసుకునే స్నేహితులున్నా పర్లేదు. అయితే, ప్రతీ విషయంలోనూ లాభాలు, నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణం. తల్లులు కెరీర్ లక్ష్యాలను పక్కనపెట్టకుండా.. ప్రేమ, రక్షణ అందించే ప్రదేశం’ అంటూ సుదీర్ఘ మైన పోస్ట్ రాసుకొచ్చారు. -
దేశ ఐటీ రంగంలో టాప్.. అత్యధిక వేతనం ఈయనదే..
దేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. ‘మింట్’ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ గత సంవత్సరం వేతన పరిహారంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకున్నారు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం, రవి కుమార్ సింగిశెట్టి గత సంవత్సరం మొత్తంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకోగా ఇందులో 20.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.169.1 కోట్లు) విలువైన షేర్లను అందుకున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం రూ.19.35 బిలియన్ డాలర్లు ఉండగా ఇందులో సీఈవో రవి కుమార్ వేతన పరిహారం 0.11 శాతంగా ఉంది. ఇతర ఐటీ సీఈవోల వేతనాలు ఇలా.. విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే రూ. 10.1 మిలియన్ డాలర్లు (రూ. 83 కోట్లు) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 10.65 మిలియన్ డాలర్లు (రూ. 88 కోట్లు) అసెంచర్ సీఈవో జూలీ స్వీట్ 31.55 మిలియన్ డాలర్లు (రూ.263 కోట్లు) ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 6.8 మిలియన్లు ( రూ. 56.4 కోట్లు) టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ 3.5 మిలియన్ ( రూ. 29.16 కోట్లు) -
దిగిపోనున్న బోయింగ్ సీఈవోకి రూ.366 కోట్లు!
బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ భారీ మొత్తంలో రిటైర్మెంట్ చెల్లింపులు పొందనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్న ఆయన రిటైర్మెంట్ చెల్లింపుల కింద 44 మిలియన్ డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) అందుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. డేవిడ్ కాల్హౌన్ 2023 సంవత్సరానికి 33 మిలియన్ డాలర్ల (సుమారు రూ.274 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. దాదాపుగా అదంతా స్టాక్ అవార్డ్స్‌లో ఉంది. అయితే జనవరిలో గాల్లో ఉన్న బోయింగ్ విమానం డోర్ ప్యానెల్ ఊడిపడిన ఘటన తర్వాత బోయింగ్ షేర్ ధర తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరం ఆయన స్టాక్ చెల్లింపు దాదాపు నాలుగింట ఒక వంతు తగ్గుతుంది. ఈ ఘటన తర్వాత 2023 సంవత్సరానికి సీఈవో డేవిడ్ కాల్హౌన్ బోనస్‌ను (దాదాపు రూ.24 కోట్లు) తిరస్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఘటనకు సంబంధించి బోయింగ్ దాని తయారీ నాణ్యత, భద్రతపై పలు విచారణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరిలో తాను పదవి నుంచి వైదొలుగుతానని కాల్హౌన్ ఈ నెలలో ప్రకటించారు. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కాల్హౌన్ గత సంవత్సరం 1.4 మిలియన్ డాలర్ల జీతం, 30.2 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులను పొందినట్లు పేర్కొంది. ఇతర చెల్లింపులతో సహా కాల్హౌన్ 2023 పరిహారం మొత్తం 32.8 మిలియన్ డాలర్లు. కాగా 2022లో ఆయన 22.6 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. -
థియరీ డెలాపోర్టే రాజీనామా, విప్రో కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన స్థానంలోశ్రీనివాస్ పల్లియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 6న థియరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేసినట్లు విప్రో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తెలిపారు. మే 31,2024 వరకు ఆయన పదవిలోనే కొనసాగుతారని విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుతం అమెరికాస్ 1 ఏరియా సీఈఓగా ఉన్న శ్రీనివాస్ పల్లియా ఏప్రిల్ 7 నుంచి విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో సీఈఓ పదవికి రాజీనామా చేసిన డెలాపోర్టే జూలై 2020లో విప్రో సీఈఓగా, ఎండీగా నియమితులయ్యారు. అంతకు ముందు క్యాప్‌జెమినీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పనిచేశారు. విప్రో సీఈఓ జీతం ఎంత? గత డిసెంబరులో, డెలాపోర్టే సంవత్సరానికి రూ. 82 కోట్లకు పైగా జీతం ప్యాకేజీని అందించినట్లు విప్రో నివేదించింది. తద్వారా డెలాపోర్టే భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా పేరు సంపాదించారు. డెలాపోర్టే సైన్సెస్పో ప్యారిస్ నుండి ఆర్థిక, ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, సోర్బోన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లాస్‌ను పూర్తి చేశారు. -
బంధన్ బ్యాంక్‌కు సీఈవో గుడ్‌బై
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో సీఎస్ ఘోష్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుత సర్వీసు 2024 జూలై9తో ముగియనుండటంతో పదవీవిరమణ చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. వరుసగా మూడుసార్లు ఎండీ, సీఈవోగా దాదాపు దశాబ్ద కాలం బ్యాంకుకు నాయకత్వం వహించిన తాను బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బోర్డుకు రాసిన లేఖలో ఘోష్ పేర్కొన్నారు. -
రెండేళ్లలో 71 కిలలో బరువు తగ్గిన సీఈవో! ఎలా తగ్గారంటే..!
కొందరూ మనకళ్ల ముందే అధిక బరువుతో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడినవాళ్లు అద్భుతం చేసినట్లు స్లిమ్‌గా అయ్యిపోతారు. వాళ్లను చూడగానే భలే బరువు తగ్గారనిపిస్తుంది. అచ్చం అలానే హౌసింగ్ డాట్ కమ్ సీఈవో జస్ట్ రెండేళ్లలోనే చాలా బరువు తగ్గి తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన వెయిట్ లాస్ జర్నీ ఎలా మొదలయ్యిందంటే.. హౌసింగ్ డాట్ కామ్ సీఈవో ధ్రవ్ అగర్వాలా 2021 నుంచి గుండోపోటు, గుండెల్లో మంట వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడ్డాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇబ్బందులకు గురిచేసిన ఆ అనారోగ్య సమస్యలే అతడిని బరువు తగ్గేందుకు ప్రేరేపించాయి. ఆ గుండె జబ్బు కారణంగా ఆయన ఫేస్ చేసిన సమస్యలే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేశాయి. అప్పుడు ఆయన దాదాపు 151 కిలోలు బరువు ఉన్నాడు. ఆ టైంలో ప్రీ డయాబెటిక్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. వీటితోపాటు స్లీప్ ఆప్నీయా కూడా వచ్చింది. దీంతో ధ్రువ్ ఎలాగైన బరువు తగ్గాల్సిందే అని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాడు. అందుకని మంచి ఫిట్నెస్ర్ని నియమించుకున్నారు. ఈ వ్యాధుల కారణంగా ఆస్పత్రులకు లేదంటే బెడ్లకే పరిమితమవ్వడం తనను బాగా బాధించిందని అంటాడు ధ్రువ్. ఇక ఫిట్నెస్ నిపుణుడు సమక్షంలో రోజుకు రెండుసార్లు వ్యాయామ కసరత్తులు చేసేలా దృష్టి పెట్టారు. కిలోమీటర్లు చొప్పున నడక, కేలరీలు తక్కువుగా ఉన్నా ఆహారం తీసుకోవడం వంటివి చేశారు. ముఖ్యంగా రోజువారి దాదాపు 17 వందల కేలరీలను తగ్గించాడు. నోటిని కంట్రోల్ చేసుకునేలా ఏదైనా వర్కౌట్లలో బిజీగా ఉండేవాడు. వాటి తోపాటు ఆల్కహాల్, ప్రాసెస్ చేసి, వేయించిన ఆహారానికి పూర్తిగా దూరంగా ఉన్నాడు. మధ్యాహ్న భోజనంలో పప్పు, వండిన కూరగాయాలకే ప్రాముఖ్యత ఇచ్చాడు. రాత్రిపూట కాల్చిన చికెన్ లేదా చేపలతో సెలెరీ లేదా ఆస్పరాగస్ సూప్ వంటివి తీసుకునేవాడు. అలాగే చక్కటి గుమ్మడి గింజలు, అవిసె గింజలు, దోసకాయలు, క్యారెట్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకునేవాడు. దీంతో ధ్రువ్ అనూహ్యంగా తన బరువులో సగానికి పైగా తగ్గిపోయాడు. పైగా తనకు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అంటే ఇష్టమని, ఆయనంత బరువే ఉండాలని గట్టిగా కోరుకోవడంతోనే ఇది సాధ్యమయ్యిందని ఆనందగా చెబుతున్నారు ధ్రువ్. తాను మరింతగా బరువు తగ్గేలా స్విమ్మింగ్, రన్నింగ్ వంటి వాటిపై కూడా దృష్టిపెట్టానని చెప్పాడు. తన వార్డ్‌బోర్డ్‌లో దుస్తులను మార్చి ఇష్టమైన ఫ్యాషన్ దుస్తులను ధరించడం చాలా అద్భుతంగా అనిపించని అన్నాడు ధ్రువ్. నిజానికి ధ్రువ్ చిన్నతనంలో కోల్‌కతాలో పెరిగారు. ఆయన బాల్యంలో ఎక్కువగా క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటివి ఆడేవారు. అయితే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిన వ్యాయామం వంటివి చేయకపోవడంతో ఆయన విపరీతంగా బరువు పెరిగిపోవడం జరిగింది. ఏదీఏమైతేనేం అనారోగ్యం సమస్య ఆరోగ్యంపపై స్ప్రుహ కలిగించి, స్లిమ్‌గా అయ్యేలా చేసింది. అధిక బరువు కాదు సమస్య తగ్గాలనే స్పిరిట్ ఉండాలి. అది ఉంటే ఈజీగా తగ్గిపోవచ్చని ధ్రువ్ చేసి చూపించారు. (చదవండి: సమ్మర్లో చెరుకురసం తాగటం మంచిదేనా? అందరూ తాగొచ్చా..!) -
ఎప్పుడో తీసుకున్న రూ. 1000 అప్పుకు..2 కోట్లు చెల్లించిన బ్యాంక్ సీఈఓ
-
గాల్లో ప్రయాణికుల ప్రాణాలు.. ‘బోయింగ్’ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూయార్క్: ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ముగిసే సమయానికి బోయింగ్ సీఈవో పదవి నుంచి డేవ్ కాల్హౌన్ దిగిపోనున్నారు. ఆయనతో పాటు మేలో జరగనున్న వార్షిక సమావేశంలో సంస్థ బోర్డ్ ఛైర్మన్‌గా ఉన్న లారీ కెల్నర్ సైతం రాజీనామా చేయనున్నట్లు బోయింగ్ అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ 9 రకం విమానం 177 మంది ప్రయాణికులతో గాల్లో ఉండగా.. డోర్ ప్లగ్ ఊడిపోయింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి 171 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం 16వేల అడుగుల ఎత్తుకు చేరగానే ఎడమవైపున తలుపు ఊడిపోయింది. వెంటనే వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నుంచి బోయింగ్‌కు చెందిన పలు విమానాల్లో సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ విమానాలపై, ఆ సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో బోయింగ్ సీఈవో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు రాజీనామాలు చేస్తున్నట్లు బోయింగ్ ప్రకటించడం చర్చాంశనీయంగా మారింది. -
రద్దీ ప్రాంతాల్లో రోడ్ షోలకు అనుమతి లేదు: CEO వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో సీఈఓ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోసం లక్షా 80 వేల సిబ్బంది అవసరమని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8,58,491 ఓట్లు తొలగించామని అన్నారు. పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారన్నారు. ke\\రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల ఓటర్లు ఉంటే.. 8 లక్షల కొత్త యువ ఓటర్లు ఉన్నారు. ఈ సారి 85 ఏళ్ల పైబడిన వాళ్లకు హోం ఓటింగ్ అవకాశం ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణ తరువాత రోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ ఓటింగ్ కొత్త సాప్ట్ వేర్ ద్వారా ఈసారి నిర్వహిస్తున్నాం. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ప్రాసెస్ పూర్తి అయింది. EVM లు సిద్ధంగా ఉన్నాయి. రిజర్వ్ కూడా ఉంచాం. 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. 50వేల కంటే ఎక్కువ నగదు ఉంటే పేపర్స్ ఉండాలి లేదంటే సీజ్ చేస్తారు. ఫిర్యాదులు c - విజిల్ app లేదా 1950కి ఫిర్యాదు చేయొచ్చు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలకు అనుమతి సువిదా యాప్ ద్వారా తీసుకోవాలి. 7 లక్షల ఓటర్ కరెక్షన్స్ ఎమ్మెల్యే ఎన్నికల తరువాత చేశాంము. చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా అతిపెద్ద ఎంపి సెగ్మెంట్ మల్కాజిగిరి. రోడ్ షో లు సెలవు రోజుల్లోనే.. రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్ షో లకు అనుమతి లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి లేదు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను, స్కూల్ డ్రెస్‌లకు అనుమతి లేదు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రాసెస్ జరుగుతోంది...షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది. -
మురికివాడల్లో ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి..నేడు సీఈవోగా రూ. 8 కోట్లు..!
మురికి వాడలో కటిక దారిద్యం మధ్య పెరిగాడు. తండ్రి మరణం, తల్లి కుటుంబాన్ని పోషించాల్సిన స్థితి. ఏకంగా ఐదుగురు సంతానం. ఒక్కరోజు కూడా కడుపు నిండా తినలేని ధీన స్థితి అయినా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తల్లి చేసే ఇడ్లీ అమ్మే వ్యాపారంలో చేదోడుగా ఉంటునే ఐఐఏం వంటి ఉన్నత చదువులు చదివాడు. చివరికీ స్వంతంగా ఓ ఫుడ్ కేటరింగ్ సర్వీస్ పెట్టి.. తనలాంటి మురికి వాడ పిల్లల్నే స్టాఫ్‌గా పెట్టుకుని కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అతడెవరంటే.. చెన్నైలోని మడిపాక్కంకి చెందిన ఏలుమలై శరత్‌బాబు తల్లి, నలుగురు తోబుట్టువులతో కలసి మురికి వాడలో జీవించేవాడు. తండ్రి మరణించడంతో తల్లే కుటుంబ జీవనాధారం. తనపై ఆధారపడిని ఐదుగురు పిల్లల కడుపు నింపేందుకు ఆమె రోజుకు మూడు ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. ఇక శరత్ తన తల్లికి మురికివాడలో ఇడ్లీలు అమ్మే విషయంలో సాయం చేస్తుండేవాడు. తనతల్లి పడుతున్న కష్టాన్ని దగ్గరగా చూసిన శరత్ బాగా చదువుని ఎట్టి పరిస్టితుల్లో నిర్లక్ష్యం చేయకూడదనే నిశ్చయానికి వచ్చేవాడు. ఎందుకంటే..? తల్లి గ్రాడ్యుయేట్ అయ్యుంటే ఏదో ఉద్యోగం చేసి పోషించగలిగేది ఇన్ని పాట్లు పడేది కాదు కదా అని బాధపడేవాడు. అందుకే అతడు తినడానికి తిండి లేని ఎన్నో రాత్రుళ్లు గడుపుతూ కూడా చదవడం మాత్రం మానలేదు. అలా పదోతరగతిలో క్లాస్ టాపర్‌గా నిలిచి మంచి మార్కులతో పాసయ్యాడు. ఆ తర్వాత ప్రభుత్వ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో సీటు సంపాదించుకున్నాడు. కానీ అతనికి ఆంగ్లంలో మంచి ప్రావిణ్యం లేకపోవడంతో స్నేహితుల ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా తన చదువును సాగించాడు. అలా బిట్స్ పిలానీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వెంటనే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే పోలారీస్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు సరిగ్గా 30 నెలలు పనిచేసి ఇంటి అప్పులన్నీ తీర్చేశాడు. ఆ తర్వాత ఎంబీయే చేయాలనే ఆశ కలిగింది. దీంతో పోలారీస్లో ఉద్యోగం చేస్తూనే క్యాట్‌కి ప్రీపేరయ్యాడు. అలా మొదటి ప్రయత్నంలో విఫలమైన చివరికీ క్యాట్ ఉత్తీర్ణుడై అహ్మదాబాద్ ఐఐఏంలో ఎంబీఏలో చేరాడు. అక్కడ హాస్టల్ మెస్ కార్యదర్శి పదవికి ఎంపికయ్యాడు. ఇదే అతడికి ఆహారాన్ని తయారు చేసే సంస్థను నిర్వహించడం ఎలా అనేదానిపై అవగాహన ఏర్పడేలా చేసింది. ఇక విజయవంతంగా ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే లక్షల ప్యాకేజీలతో ఎన్నో కార్పోరేట్ ఉద్యోగాలు వచ్చినా అటువైపుకి అసలు వెళ్లలేదు. తనలాంటి నిరుపేద యువకులకు ఉపయోగపడాలనుకున్నాడు. అందుకోసం కేవలం రూ. 2000 రూపాయలు పెట్టుబడితో ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు. తాను పెరిగిన మురికివాడలోనే ఓ చిన్న హోటల్ పెట్టాడు. తనలాంటి పేద యువకులని ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాడు. మొదట్లో కార్పొరేట్ సంస్థలకు, బ్యాంకులకు వండి సరఫరా చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. చెన్నైతో మొదలైన ఫుడ్ కింగ్ ప్రయాణం హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ కూడా విస్తరించింది. ఇప్పుడు ఎనిమిది కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని చేస్తున్నాడు. దాదాపు 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఆ 200 మంది కూడా తనలా మురికివాడలో పెరిగిన వారే. బాల్యమంతా కటిక దారిద్య్రం మధ్యే గడిచింది. ఆ క్రమంలో లెక్కలేనన్ని అవమానాలు, చీత్కారాలు అనుభవించాడు. ఓ పక్క ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో భయాన కష్టాలు, సమస్యలు చవి చూశాడు. అయినప్పటికీ ఎన్నడూ బాబోయ్! నావల కాదని పారిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. తన కుటుంబాన్ని ఎలాగైన ఈ కష్టం నుంచి గట్టేక్కిస్తే చాలని తప్పన పడ్డాడు. అందుకు చదువొక్కటే మార్గం అని భావించాడు. కటిక దారిద్య్రాన్ని భరిస్తూనే ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. పైగా తన మూలలను మర్చిపోకుండా తనలాంటి వారికే జీవనోపాధి కల్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు శరత్ బాబు. ఇతడి కథ సమస్యలతో ఎలా పోరాటం చేయాలో నేర్పిస్తుంది. పైగా అచంచలంగా కష్టపడితే ఎప్పటికైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని చాటి చెబుతోంది కదూ.! (చదవండి: నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!) -
ప్రాణం తీసిన టెస్లా కారు రివర్స్
వాషింగ్టన్: అమెరికాతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ మోడ్‌లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్ మోడ్‌కు మార్చడంతో అది చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్చ్ మెక్కానెల్ బంధువు, ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్‌మోస్ట్ గ్రూప్ సీఈఓ ఏంజెలా చావో(50) మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆమె తన మిత్రులతో కలిసి టెక్నాస్‌లోని ఆస్టిన్ సమీపంలో ఉన్న తన ప్రైవేట్ అతిథి గృహానికి వెళ్లారు. 900 ఎకరాల్లో ఈ ఎస్టేట్ విస్తరించి ఉంది. మిల్లర్ సెలయేర్ ఇక్కడ ఈ ఎస్టేట్ గుండా ప్రవహిస్తోంది. ఏంజెలా చావో ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, రాత్రిపూట టెస్లా కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు. మధ్యతో త్రీ పాయింట్ మూలమలుపు వచి్చంది. దానిని దాటే క్రమంలో ఏంజెలా గందరగోళానికి గురై పొరపాటున కారును రివర్స్ మోడ్‌లోకి మార్చారు. దాంతో అది వేగంగా వెనక్కి వెళ్లి కొలనులో పడిపోయింది. ఏంజెలా భయాందోళనకు గురై స్నేహితురాలికి పోన్ చేశారు. వెంటనే గెస్ట్ హౌస్ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా మునిగిపోయింది. అద్దాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో వాటిని పగలగొట్టడం సాధ్యం కాలేదు. చివరికి కారును బయటకు తీసినా అప్పటికే ఏంజెలా ప్రాణాలు కోల్పోయారు. ఆమె అమెరికాలో ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ జిమ్ బ్రేయార్ సతీమణి. అమెరికా మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి అవుతారు. -
ఒక్కరోజులో ఎగిసిన షేర్లు.. 100 బిలియన్ క్లబ్‌లోకి డెల్ సీఈవో
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ (Dell Technologies) సీఈవో మైఖేల్ సాల్ డెల్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత పరికరాలకు పెరిగిన డిమాండ్‌తో కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయం అమాంతం ఎగిసింది. దీంతో డెల్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్, సీఈవో అయిన మైఖేల్ డెల్ సంపద శుక్రవారం మొదటిసారిగా 100 బిలియన్ డాలర్ల మార్కును సాధించింది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకటైన డెల్ షేర్లు రికార్డు స్థాయికి 32 శాతం జంప్ చేసి, దాని వ్యవస్థాపకుని నెట్‌వర్త్‌ను 13.7 బిలియన్ డాలర్లు పెంచి 104.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.8.6 లక్షల కోట్లు) చేర్చాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం డెల్ ఇప్పుడు భారత్ చెందిన గౌతమ్ అదానీ తర్వాత 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మైఖేల్ డెల్ సంపదలో దాదాపు సగం తన కంప్యూటర్ల తయారీ కంపెనీ నుంచే వచ్చింది. ఆయన 40 సంవత్సరాల క్రితం ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు డెల్ కంపెనీకి ప్రారంభించారు. ఏఐ సంబంధిత స్టాక్‌లలో దూసుకుపోతున్న ర్యాలీ కారణంగా ఈ సంవత్సరం సంపద విపరీతంగా పెరిగిన కొంతమంది బిలియనీర్లలో మైఖేల్ డెల్ కూడా ఒకరు. ఆయన సంపద పెరగడానికి చిప్‌మేకర్ బ్రాడ్‌కామ్ కూడా దోహదపడింది. 2021లో వీఎంవేర్‌ని కొనుగోలు చేసిన తర్వాత డెల్ అందులో వాటాను పొందారు. ఆ షేర్ల విలువ ఇప్పుడు 31 బిలియన్ల డాలర్లుకు పైగా ఉంది. -
సుందర్ పిచాయ్ కు 'జెమినీ' గండం..!
-
మైండ్ బ్లోయింగ్ శాలరీ.. ఏడాదిలో రూ.7,400 కోట్లు!
Blackstone CEO Payout : సీఈవోల వేతనాల గురించి మనం తరచూ వింటుంటాం. అయితే అమెరికాకు చెందిన ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ బ్లాక్‌స్టోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) స్టీవ్ స్క్వార్జ్మాన్ (Steve Schwarzman) ఏడాదిలో తీసుకున్న వేతనం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. బ్లాక్‌స్టోన్ సీఈవో స్టీవ్ స్క్వార్జ్మాన్ గత సంవత్సరం రూ.896.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,400 కోట్లు) వేతనం అందుకున్నారు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గినప్పటికీ ఫైనాన్ రంగంలో అతిపెద్ద వార్షిక చెల్లింపులలో ఒకటి. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. 77 ఏళ్ల స్క్వార్జ్మాన్ కంపెనీలో తన సుమారు 20 శాతం వాటా నుంచి డివిడెండ్ల రూపంలోనే 777 మిలియన్ డాలర్లు (రూ.6,400 కోట్లు) అందుకున్నారు. అదనంగా 120 మిలియన్ డాలర్లు (రూ.990 కోట్లు)ప్రోత్సాహక రుసుములు, క్యారీడ్ వడ్డీగా అని పిలిచే ఫండ్ లాభాల వాటా ద్వారా సంపాదించారు. కాగా స్క్వార్జ్మాన్ 2022లో రికార్డు స్థాయిలో 1.27 బిలియన్ డాలర్లు అందుకున్నారు. స్క్వార్జ్మాన్ వాటాలు, డివిడెండ్లు ఇప్పటికీ ఆయనను ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడిగా స్థిరపరుస్తున్నాయి. ఆయన అదృష్టం తాను సహ స్థాపించిన సంస్థతో ముడిపడి ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం స్క్వార్జ్మాన్ నెట్‌వర్త్ 41.8 బిలియన్ డాలర్లు (రూ.3.4 లక్షల కోట్లు). -
జెరోధా సీఈఓపై మండిపడుతున్న నెటిజెన్స్!.. కారణం ఇదే..
ఇప్పటికి కూడా చాలా మందికి సొంత ఇంట్లో ఉండాలా? లేక అద్దె ఇంట్లో ఉండాలా? అనే ప్రశ్న, ప్రశ్నగానే ఉంది. కొందరు సొంత ఇల్లు బెస్ట్ అంటే.. మరి కొందరు అద్దె ఇల్లు బెటర్ అని చెబుతున్నారు. అయితే ఈ ప్రశ్నకు జెరోధా సీఈఓ నితిన్ కామత్ తనదైన రీతిలో సమాధానం వెల్లడించారు. జర్నలిస్ట్ సోనియా షెనాయ్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జెరోధా సీఈఓ నితిన్ కామత్ 'రెంట్ vs బై' ప్రశ్నకు సమాధానంగా.. సొంత ఇల్లు కంటే అద్దె ఇంట్లో ఉండటానికే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తన అభిప్రాయం వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నితిన్ కామత్ జవాబుతో కొందరు ఏకీభవిస్తే.. మరికొందరు సొంతంగా ఇల్లు ఉంటేనే బాగుంటుందని వాదిస్తున్నారు. నితిన్ కామత్ మాట్లాడుతూ.. తనకు ఉన్న ఇల్లు తన తల్లిదండ్రులదని, భావోద్వేగాల కారణంగా ఎప్పుడూ ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉండాలని, కాబట్టే కొత్త ఇల్లు కొనేది లేదని వెల్లడించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో లక్షల వ్యూవ్స్ పొందింది. దీనిపైనా నెటిజన్లు రకరాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అతని మాటలు ఎవరూ నమ్మొద్దని, అవన్నీ మూర్ఖపు మాటలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆగస్టు నుంచి 'జీమెయిల్' షట్‌డౌన్! ఇందులో నిజమెంత? View this post on Instagram A post shared by Sonia Shenoy (@_soniashenoy) -
ఉద్యోగులు వణికిపోతుంటే.. సీఈవోకి ఆనందం!
ఉద్యోగులకు వణికిపోతుంటే.. సీఈవోకి ఆనందం ఏంటి అనుకుంటున్నారా? రెండింటికీ సంబంధం లేదు కానీ ఆ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. వేలాది మంది ఉద్యోగులను తొలంచాలని యోచిస్తున్న సిటీ గ్రూప్ తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జేన్ ఫ్రేజర్ వేతన పరిహారాన్ని మాత్రం పెంచింది. సీఈవో జేన్ ఫ్రేజర్ 2023 వేతన పరిహారం సుమారు 6 శాతం పెరిగి 26 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.215 కోట్లు) చేరుకుందని సిటీ గ్రూప్ తాజా ఫైలింగ్‌లో తెలిపింది. ఇందులో ఆమె మూల వేతనం 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.12.5 కోట్లు) కాగా 3.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ.30 కోట్లు) క్యాష్ బోనస్. మిగిలిన 20.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.172 కోట్లు) పర్ఫామెన్స్ ఆధారిత స్టాక్స్ అని ఫైలింగ్ ద్వారా తెలుస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి కంపెనీ సంస్థాగత, నిర్వహణలో మార్పులను అమలు చేయడంలో, అంతర్జాతీయంగా వ్యాపార వృద్ధిలో ఫ్రేజర్ చేసిన కృషి ఆధారంగా వేతన పరిహారాన్ని నిర్ణయించినట్లు బ్యాంక్ బోర్డు పేర్కొంది. ఇతర బ్యాంకింగ్ సంస్థల్లోనూ సీఈవోల వేతన పరిహారాలు ఇటీవల పెరిగాయి. జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ పరిహారం 4.3 శాతం, మోర్గాన్ స్టాన్లీస్ మాజీ సీఈవో జేమ్స్ గోర్మాన్ 17 శాతం పెరిగాయి. ఇక గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సీఈవో వేతన పరిహారమైతే ఏకంగా 24 శాతం పెరిగింది. యూఎస్ మల్టీనేషన్ ఇన్వెస్టర్ బ్యాంకు సిటీ గ్రూప్ గత నెలలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను పోస్ట్ చేసింది. దాదాపు రూ.15 వేలకోట్ల మేర నష్టాలు నమోదైనట్లు రిగ్యులేటరీకు రిపోర్ట్ చేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో నష్టాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే రెండేళ్లలో కనీసం 20,000 ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది. -
ఒకప్పుడు రెస్టారెంట్లో సర్వర్.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి
కన్న కలను నిజం చేసుకోవడం అంటే అంత సులభమైన పనేమీ కాదు. దాని కోసం నిరంతర ప్రయత్నం, అంకిత భావం చాలా అవసరం. ఇవన్నీ తోడైనప్పుడు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'జెన్సన్ హువాంగ్' (Jensen Huang). ఇంతకీ ఈయనెవరు? ఈయన సాధించిన సక్సెస్ ఏంటి అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. 1963లో తైవాన్‌లోని తైనాన్‌లో జెన్సన్ హువాంగ్ జన్మించారు. ఈయన కుటుంబం అతనికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే.. థాయిలాండ్‌కు మకాం మార్చారు. తొమ్మిదేళ్ల ప్రాయంలో అతని మేనమామతో కలిసి వాషింగ్టన్‌లోని టాకోమాకు వెళ్ళాడు. చదువుకునే రోజుల్లోనే హువాంగ్ ఒకప్పుడు డెన్నీ రెస్టారెంట్లో సర్వర్‌గా పనిచేసేవారు. ఆ తరువాత క్రిస్ మలాచోస్కీ అండ్ కర్టిస్ ప్రీమ్లతో కలిసి 1993లో 'ఎన్విడియా' (Nvidia) స్థాపించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో సీఈఓగా జెన్సన్ హువాంగ్ వేతనం 24.6 మిలియన్ డాలర్లు. దీంతో యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక జీతం తీసుకునే 61వ వ్యక్తిగా నిలిచారు. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. సర్వర్‌గా పనిచేసిన జెన్సన్ హువాంగ్ ప్రస్తుతం 64.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 23వ స్థానంలో ఉన్నారు. ఈయన కంపెనీ క్యాపిటలైజేషన్ 1.83 ట్రిలియన్లు లేదా రూ. 15100000 కోట్ల కంటే ఎక్కువ. ఒక సర్వర్ స్థాయి నుంచి ప్రపంచ ధనవంతుల జాబితాలో నిలిచే వరకు ఎదిగారంటే దాని వెనుక ఆయన కృషి, పట్టుదల ఇట్టే అర్థంపైపోతుంది. -
భారత్‌లోకి టెస్లా.. పేరు మార్చుకుంటేనే పనవుతుంది! వైరల్ ట్వీట్
ఎలాన్ మస్క్ ( Elon Musk ) నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ( Tesla ) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ ( Nothing Phone ) సీఈఓ కార్ల్ పీ ( Carl Pei ).. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి ఓ ఫన్నీ సలహా ఇచ్చారు. భారత్‌లో ఫ్యాక్టరీని ఎలా తెరవాలో చమత్కారంగా సూచించారు. భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే ముందుగా ‘ఎక్స్’ (ట్విటర్) ప్లాట్‌ఫారమ్‌లో తన యూజర్ నేమ్‌ను "ఎలాన్ భాయ్"గా మార్చుకోవాలని కార్ల్ పీ సూచించారు. ఈయన కూడా స్వయంగా తన ‘ఎక్స్’ యూజర్ నేమ్‌ను 'కార్ల్ భాయ్'గా మార్చుకున్నారు. "ఎలాన్ మస్క్.. మీ యూజర్ నేమ్‌ను ఎలాన్ భాయ్‌గా మార్చకుండా భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొచ్చనుకుంటున్నారా?" ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. 6.7 లక్షల వీవ్స్, వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌కు యూజర్లు సైతం అంతే ఫన్నీగా స్పందించారు. "మీరు భాయ్, అతను (మస్క్) మామూ అవుతాడు" అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "ప్రాంతాన్ని బట్టి పేరు ఆధారపడి ఉంటుంది. గుజరాత్ అయితే ఎలాన్ భాయ్, మహారాష్ట్ర అయితే ఎలాన్ భావ్, తెలంగాణ అయితే ఎలాన్ గారు, హర్యానా అయితే ఎలోన్ టౌ, పంజాబ్ అయితే ఎలాన్ పాజీ, తమిళనాడు అయితే ఎలాన్ అన్నా, అలాగే పశ్చిమ బెంగాల్ అయితే ఎలాన్ దాదా" అని మరొక యూజర్ పేర్కొన్నారు. "ఎలాన్ దాదా బాగా సరిపోతుంది!" ఇంకొక యూజర్ చమత్కరించారు. ఇంకా రకరకాల పేర్లను యూజర్లు సూచించారు. .@elonmusk did you really think you could build a Tesla factory in India without changing your username to Elon Bhai? — Carl Bhai (@getpeid) February 18, 2024 ది ఎకనామిక్ టైమ్స్ తాజా నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించే అంచున ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై రూ.30 లక్షలకు మించిన రాయితీ దిగుమతి సుంకాలను 2-3 సంవత్సరాల పాటు పొడిగించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ రూ.33 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని, ఆ శ్రేణి కంటే తక్కువ ఉన్న కార్లపై 60 శాతం విధిస్తోంది. కార్యకలాపాల ప్రారంభ సంవత్సరాల్లో విదేశీ ఈవీలపై ప్రభుత్వం 15 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లయితే భారత్‌లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టెస్లా సుముఖతను వ్యక్తం చేసింది. -
సీఈవోకే షాక్ ఇచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీ.. రూ.1000 కోట్లు క్యాన్సిల్!
దేశీయ సాఫ్ట్వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ దాని సీఈవోకే షాక్ ఇచ్చింది. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీగా సేవలందిస్తున్న ఫ్రెష్‌వర్క్స్ డైరెక్టర్ల బోర్డు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన గిరీష్ మాతృబూతంకు 2022లో కేటాయించిన ఆరు మిలియన్ స్టాక్ యూనిట్ల పనితీరు అవార్డును రద్దు చేసింది. ఈ మేరకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పనితీరు లక్ష్యాలలో చేసిన మార్పులే సీఈవో పనితీరు అవార్డును రద్దు చేయడానికి కారణంగా నాస్డాక్-లిస్టెడ్ కంపెనీ అయిన ఫ్రెష్‌వర్క్స్ పేర్కొంది. అయితే 19 మిలియన్ల డాలర్ల (రూ.157 కోట్లు) విలువతో కొత్త వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డుకు సీఈవో గిరీష్ మాతృభూతం అర్హులవుతారని కంపెనీ తెలిపింది. “సీఈవో మాతృభూతం పర్ఫామెన్స్ బేస్డ్ రిస్ట్రిక్టివ్ స్టాక్ యూనిట్స్ అవార్డును రద్దు చేసి 2024లో ఆయనకి వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డును అందించాలని నిర్ణయించడంతోపాటు దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని పెట్టుబడిగా పరిగణించేందుకు కంపెనీ స్టాక్‌హోల్డర్ల అభిప్రాయాలను తీసుకున్నాం" అని ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. 2023కి ఫ్రెష్‌వర్క్స్ మొత్తం స్టాక్ ఆధారిత పరిహారం ఖర్చు 212 మిలియన్ డాలర్లు. 2021లో కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రారంభించింది. కంపెనీ బోర్డు 6 మిలియన్ స్టాక్ యూనిట్లను ఈసీవో మాతృభూతమ్కు బహుళ-సంవత్సరాల పనితీరు-ఆధారిత పరిమిత స్టాక్ యూనిట్ అవార్డుగా మంజూరు చేసింది. సీఈవో పనితీరు అవార్డు మొత్తం విలువ 131 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు). -
యూట్యూబ్ మాజీ సీఈవో ఇంట్లో విషాదం
కాలిఫోర్నియా: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వుజిక్ కొడుకు మార్కో ట్రోపర్(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాలిఫోర్నియాలోని బర్కేలి యూనివర్సిటీ కాలేజీలో ట్రోపర్ చదువుతున్నాడు. యూనివర్సిటీ క్యాంపస్‌లోని అతడి గదిలో ట్రోపర్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అతడు స్పందించలేదు. దీంతో ట్రోపర్ మృతి చెందినట్లు ప్రకటించారు. డ్రగ్ ఇంజెక్షన్ ఓవర్‌డోస్ అవడం వల్లే ట్రోపర్ చనిపోయినట్లు అతడి అమ్మమ్మ ఎస్తర్ తెలిపింది. ‘ట్రోపర్ ఒక గణిత మేధావి. అతడు ఇలా మృతి చెందడంతో గుండె పగిలిపోయింది. అతడు బతికి ఉంటే కచ్చితంగా ఏదైనా సాధించేవాడు’అని ట్రోపర్ అమ్మమ్మ కన్నీటి పర్యంతమైంది. ఇదీ చదవండి.. ట్రంప్‌ను తెగ తిట్టిన ఆత్మ.. ఏఐ వీడియో వైరల్ -
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంస్థలో విషాదం!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంస్థలో విషాదం చోటు చేసుకుంది. ఆ కంపెనీకి చెందిన మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ కుమారుడు 19 ఏళ్ల మాక్రో ట్రోపర్ మరణించారు. నార్తన్ కాలిఫోర్నియాలోని బర్కిలీ నగరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన హాస్టల్లో మరణించిట్లు ట్రాపర్ తల్లిదండ్రులు నిర్ధారించారు. ట్రోపర్ ఎందుకు మరణించారనే విషయంపై స్పష్టత లేదు. ట్రోపర్ ఆపస్మారక స్థితిలో జారుకున్నప్పుడు సమాచారం అందుకు బర్కిలీ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ట్రాపర్ మరణించినట్లు తేలింది. ట్రోపర్ ఎందుకు మరణించారనే అంశం వెలుగులోకి వచ్చేందుకు ఇంకా నెల రోజుల సమయం పట్టొచ్చంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టాక్సికాలజీ రిపోర్ట్ కోసం కుటుంబం ఎదురు చూస్తున్నారు. మనవడి మరణంపై ట్రోపర్ నాయనమ్మ, యూట్యూబ్ మాజీ సీఈఓ సూసన్ వోజిస్కీ తల్లి ఎస్తేర్ వోజిస్కీ కన్నీరుమున్నీరుగా విలపించారు. మెటా పోస్ట్‌లో తన మనవడిది ప్రేమించే తత్వం, గణిత మేధావి’ అంటూ అభివర్ణించింది. యూట్యూబ్ సీఈఓ సూసన్ వోజిస్కీ తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్‌కు సీఈఓగా వ్యవహరించిన సూసన్ వోజిస్కీ గత ఏడాది రాజీనామా చేశారు. 54 ఏళ్ల సూసన్ తన కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తొమ్మిదేళ్ల క్రితం తాను యూట్యూబ్‌లో చేరినప్పుడు, మంచి లీడర్షిప్ టీంను ఏర్పాటు చేశానని, నీల్ మోహన్ ఆ బృందంలో భాగమని సూసన్ చెప్పారు. సూసన్ రాజీనామాతో భారత సంతతికి చెందిన నీల్ మోహన్, యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించారు. -
గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్
ప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువకుడు తన ప్రియురాలికి పువ్వులు ఇవ్వాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసాడు, అయితే అతని ప్లాన్స్ ఏవీ వర్కౌట్ కాలేదు, కానీ అతని బండారం మొత్తం బయటపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' సందర్భంగా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు పంపించడం లేదని, ఎలాగైనా ఆమెకు పువ్వులు ఇవ్వాలని ఏకంగా 'బ్లింకిట్' (Blinkit) డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో చాటింగ్ చేసాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కంపెనీ సీఈఓ 'అల్బిందర్ ధిండ్సా' (Albinder Dhindsa) ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేశారు. మనోజ్ అనే వ్యక్తి బ్లింకిట్ సపోర్ట్ టీమ్‌తో చాట్ చేస్తూ.. నా గర్ల్‌ఫ్రెండ్‌ను వాళ్ళ పేరెంట్స్ బయటకు పంపడం లేదని, కాబట్టి ఆమె కోసం నేను ఆమె కోసం పువ్వులు ఆర్డర్ చేసి ఈ ఆర్డర్‌కి నేను మీ డెలివరీ పార్టనర్‌గా వెళ్లవచ్చా? అని అడిగాడు. కానీ సంస్థ దీనికి మేము హెల్ప్ చేయలేమని రిప్లై ఇచ్చింది. ఈ సంభాషణ మొత్తాన్ని అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'ఇండియా నాట్ ఫర్ బిగెనర్స్' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది వీక్షించిన ఈ పోస్ట్‌ను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: టెక్స్ట్ ఇస్తే వీడియో వచ్చేస్తుంది - టెక్నాలజీలో ఏఐ మరో అద్భుతం.. India is clearly not for beginners 🤦♂️ https://t.co/JIqwpls2pN — Albinder Dhindsa (@albinder) February 14, 2024 -
రూ.5 వేల జీతానికి నానా అగచాట్లు.. ఇప్పుడు ఏకంగా...
సాధారణంగా ప్రైవేటు టీచర్లంటే చిన్నచూపు ఉంటుంది. తక్కువ జీతం ఉంటుందని, పెద్దగా సంపాదన ఉండదని భావిస్తారు. కానీ టీచింగ్‌తోనే ఎడ్టెక్ సంస్థలు పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్న వారూ ఉన్నారు. వారిలో దేశంలోనే రిచెస్ట్ టీచర్‌గా నిలిచిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సంపన్న ఉపాధ్యాయుడిగా నిలిచారు ఫిజిక్స్‌వాలా ( PhysicsWallah ) వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే ( Alakh Pandey ). అయితే దేశంలో రిచెస్ట్ టీచర్ బైజూస్ రవీంద్రన్ అని చాలామంది వాదించవచ్చు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ ఆయనది కాదు. ఫోర్బ్స్ ప్రకారం బైజూస్ పతనం తర్వాత, దాని నికర విలువ కూడా రూ. 830 కోట్లకు పడిపోయింది. అంటే రూ. 2000 కోట్ల కంటే ఎక్కువ నెట్‌వర్త్ ఉన్న అలఖ్ పాండేనే దేశంలోనే అత్యంత ధనిక ఉపాధ్యాయుడు. ప్రముఖ ఉపాధ్యాయుడు, ఎంటర్‌ప్రిన్యూర్‌గా పేరొందిన అలఖ్ పాండే సాధారణంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖలో ఈ స్టార్టప్ నమోదై ఆయన వార్షిక వేతనం వెల్లడి కావడంతో వార్తల్లోకి వచ్చారు. భారతీయ టెక్, స్టార్టప్ సంస్థల సమాచారం అందించే ‘Inc42’ నివేదిక ప్రకారం.. అలఖ్ పాండే వేతనం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.6 కోట్లు. దీంట్లో ఆయన రూ.5 కోట్లను తగ్గించుకున్నారు. అయినప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో అలఖ్ పాండే వేతనం రూ. 4.57 కోట్లు. ఇంత ఆదాయం ఉన్న అలఖ్ పాండే మొదటి సంపాదన ఎంతో తెలుసా.. కేవలం రూ.5 వేలు. అది కూడా చాలా మంది పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చేది. యాక్టర్ కావాలనుకున్నాడు దేశంలో 101వ యునికార్న్ కంపెనీ ఫిజిక్స్‌వాలాను స్థాపించిన అలఖ్ పాండే ఒక టీచర్‌గానే చాలా మందికి తెలుసు. అయితే యాక్టర్ కావాలన్నది తన కల అని ఎంత మందికి తెలుసు? అలహాబాద్‌లో జన్మించిన అలఖ్ పాండే యాక్టర్ అవ్వాలనే కోరికతో నుక్కడ్ నాటకాల్లో పాల్గొనేవాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో 8వ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలఖ్ పాండే, ఆయన సోదరి చదువుల కోసం వారి తల్లిదండ్రులు తమ ఇంటిని అమ్మేశారు. అలఖ్ పాండే చాలా చురుకైన విద్యార్థి. 10వ తరగతిలో 91 శాతం, 12వ తరగతిలో 93.5 శాతం మార్కులు వచ్చాయి. కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఐఐటీలో చేరాలనుకున్న అలఖ్ పాండే కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. అయితే, కోర్సు మూడవ సంవత్సరం తర్వాత కాలేజీ మానేశాడు. 2017లో యూపీలో ఒక చిన్న గది నుంచి యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అలాఖ్ పాండే వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. ఎంతగా అంటే ఓ ఎడ్-టెక్ కంపెనీని ప్రారంభించేంతలా. ఇందులో ఇప్పుడు 500 మందికి పైగా టీచర్లు, 100 మంది టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. యూట్యూబ్‌లో ఫిజిక్స్‌వాలా చానల్‌కు కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. -
హెలికాప్టర్ ప్రమాదం: ప్రముఖ బ్యాంక్ సీఈఓ దుర్మరణం!
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నైజీరియాలోని అతిపెద్ద access bank సీఈఓతో సహా 9 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. కాలిఫోర్నియాలోని నిప్టన్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో కూలిపోయిన సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వారిలో access bank యాక్సెస్ బ్యాంక్ గ్రూప్ సీఈఓ హెర్బర్ట్ విగ్వే ఉన్నారని, ఆయన మరణాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకోంజో ఇవెలా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నైజీరియన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ మాజీ చైర్మన్ అబింబోలా ఒగున్బాంజో సైతం విగ్వే మరణాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా.. ప్రమాద స్థలం హాలోరాన్ స్ప్రింగ్స్ రోడ్డు సమీపంలోని 15-ఫ్రీవేకు తూర్పున ఉందని నిర్ధారించామని శాన్ బెర్నార్డినో కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. ఈ హెలికాప్టర్‌ను యూరోకాప్టర్ ఈసీ 130గా గుర్తించిన ఎఫ్ ఏఏ.. నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో కలిసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాగా, లాస్ వెగాస్‌కు వెళ్తుండగా నెవాడా- కాలిఫోర్నియా సరిహద్దు నగరం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. -
T V Narendren: రానున్న మూడు దశాబ్దాలు భారత్‌కు కీలకం
జంషెడ్పూర్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌కు రాబోయే మూడు దశాబ్దాలు అభివృద్ధి విషయంలో కీలకమైనవని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. గత 30–40 ఏళ్లలో చైనా వేగంగా అభివృద్ధి చెందిందని, ఇక ఇదే విధమైన వృద్ధి తీరును భారత్ కొనసాగించే సమయం ఆసన్నమైందని ఇక్కడ సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎస్‌సీసీఐ) సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశం. భారత్ రెండవ స్థానంలో ఉంది. ఉక్కు రంగం ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లను, ధరలను దృష్టిలో ఉంచుకుని మనం విధాన కల్పనలో ముందుకుసాగాలి. ► భారత్‌లో గత రెండు, మూడేళ్లలో మౌలిక సదుపాయాల రంగం ఊపందుకుంది. దీని ఫలితంగా ప్రైవేట్ స్టీల్ దిగ్గజ సంస్థల ద్వారా సరఫరా పెరిగింది. ► టాటా స్టీల్‌కు చెందిన జంషెడ్పూర్ ప్లాంట్ జనసాంద్రత కలిగిన ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడి ప్లాంట్‌ను మరింత విస్తరించే అవకాశం లేదు. ► సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో టాటా స్టీల్ సంబంధాలు నిరంతరం బలపడుతున్నాయి. ఇది మరింత పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుంది. ► కంపెనీ వృద్ధిలో కారి్మకులు చేసిన త్యాగాలు చిరస్మరణీయం. టాటా స్టీల్ ఒక ‘‘బహుళ తరం కంపెనీ’’. టాటా స్టీల్– టాటా వర్కర్స్ యూనియన్ల మధ్య ఉన్న సత్సంబంధాలు కంపెనీని ముందుకు నడిపించాయి. ప్రపంచ ఆర్థిక, ఫైనాన్షియల్ పరిస్థితులు అనిశి్చతిగా ఉన్నప్పటికీ కంపెనీ విజయాలు గర్వకారణం. ► ఎకానమీ, పరిశ్రమల పురోగతిలో సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకం. ఎంఎస్ఎంఈ నాణ్యమైన ఉత్పత్తులపై ఆధారపడే పెద్ద పరిశ్రమలు పురోగమిస్తాయి. పెద్ద పరిశ్రమలకు ఎంఎస్ఎంఈలే వెన్నెముక. టాటా స్టీల్ ఒక పెద్ద కంపెనీ. దాని వెన్నెముక కూడా ఎంఎస్ఎంఈ యూనిట్లే. ఎంఎస్ఎంఈలకు సంబంధించినంత వరకు జంషెడ్పూర్ ఒక ముఖ్యమైన ప్రదేశం. సంస్థ పురోగతి హర్షణీయం: ఆనంద్ మూన్కా కాగా, సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ విజయ్ ఆనంద్ మూన్కా తన స్వాగత ప్రసంగంలో నరేంద్రన్ అద్భుత నాయకత్వంలో టాటా స్టీల్ నిరంతరం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. జంషెడ్పూర్ పరిసరాల్లో విమానాశ్రయం అభివృద్ధికి టాటా స్టీల్ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కుటుంబం దివాళా.. ఓ కుర్రాడి అష్టకష్టాలు! ప్రముఖ సీఈవో ‘ఫిలాసఫీ’ కథ
అప్పటివరకూ విలాసవంతంగా గడిపిన కుటుంబం అనుకోని కారణాలతో దివాళా తీస్తే ఆ ఇంట్లోని కుర్రాడు కుటుంబం కోసం డెలివరీ బాయ్‌గా, డీటీపీ ఆపరేటర్‌గా ఇలా చిన్నాచితకా పనులు చేస్తూ అష్టకష్టాలు పడ్డాడు. ఏదో సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఇది రియల్ స్టోరీనే.. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ (CRED) సీఈవో ‘ఫిలాసఫీ’ కథ ఇది.. క్రెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా (Kunal Shah) తన కుటుంబం దివాళా తీసినప్పుడు డెలివరీ ఏజెంట్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేయవలసి వచ్చింది. తనకు తెలిసిన ఈ చేదు గతాన్ని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో ఇటీవల కలుసుకున్నప్పుడు కునాల్ షా చిన్నతనంలో పడిన కష్టాలను సంజీవ్ బిఖ్‌చందానీ తెలుసుకున్నారు. ఆసక్తికర ‘ఫిలాసఫీ’! సంజీవ్ బిఖ్‌చందానీ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఇలా షేర్ చేశారు.. “ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో కునాల్ షాతో కలిసి కూర్చున్నాను. ఐఐటీ, ఐఐఎం ఫౌండర్ల ప్రపంచంలో అతను ముంబైలోని విల్సన్ కాలేజీ నుంచి ఫిలాసఫీ గ్రాడ్యుయేట్. అతను ఫిలాసఫీనే ఎందుకు చదివాడు.. 12వ తరగతిలో వచ్చిన మార్కులు అతనికి ఆ సబ్జెక్ట్‌లో మాత్రమే అడ్మిషన్ ఇచ్చాయా లేదా ఫిలాసఫీపై నిజంగా ఆసక్తి ఉందా అని అడిగాను. కానీ ఇవేం కాదని, కుటుంబం దివాళా తీయడంతో డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకే తరగతులు ఉండే ఏకైక సబ్జెక్ట్ ఫిలాసఫీ కావడమే కారణం అన్నాడు. సెల్యూట్.” Sitting with Kunal Shah at a coffee shop in Delhi. In a world of IIT IIM Founders he stands out as a philosophy graduate from Wilson College in Mumbai. I asked him why he studied philosophy - is it that his marks in Class 12 only gave him admission in that subject or was it out… — Sanjeev Bikhchandani (@sbikh) February 2, 2024 తన కుటుంబం క్లిష్ట ఆర్థిక పరిస్థితి గురించి కునాల్ షా ఇదివరకే తెలియజేశారు. కుటుంబం కోసం తాను చిన్న వయసు నుంచే పనిచేయడం, సంపాదించడం ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు. 16 సంవత్సరాల వయసు నుంచే తాను చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించడం మొదలు పెట్టానని, సీడీలను పైరసీ చేయడం, సైబర్ కేఫ్ నడపడం వంటి పనులు సైతం చేసినట్లు కునాల్ షా వెల్లడించారు. తన కంపెనీ ఫిన్‌టెక్ లాభదాయకంగా మారే వరకు తాను నెలకు కేవలం రూ.15,000 జీతం తీసుకుంటానని కూడా చెప్పారు. -
నాదెళ్ల పదేళ్ల ప్రయాణం..
ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ షేర్ ధర గత పదేళ్లలో దాదాపు వెయ్యిశాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గడిచిన దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనైతే అనూహ్య వృద్ధి. వీటన్నింటికి మూలం భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఆయన బాధ్యతలు ఇటీవల పదేళ్లు పూర్తి చేసుకున్నారు. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాటు మందగమనంతో సాగాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ కూడా శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది. ఐటీ పరిశ్రమ ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయానికి బదులుగా సంస్కరణలను నమ్ముతుంది. అందులో భాగంగా పరిశోధనలను అందిపుచ్చుకుంటుదని సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు సత్య మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో తెలిపారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటికే 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నారు. ఇన్నేళ్లుగా కంపెనీలోనే ఉన్నారు కదా..కొత్తగా ఏమి ఆవిష్కరిస్తారని చాలామంది అనుమానించారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు సీఈఓ కావడం అంటే పెద్ద సవాలే. సత్య నాదెళ్ల చేసే ప్రతి పనిని, ప్రతి కదలికను ఆ ఇద్దరితో పోలుస్తారు. కానీ అందరి అపనమ్మకాలను తుడిచేస్తూ మైక్రోసాఫ్ట్‌ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నారు. ‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ 7.3 బి.డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటిదాకా అంతర్గతంగా ఉత్తమ ఫలితాలు సాధించడం కంటే, ప్రజలు-పరిశ్రమలో బ్రాండ్ బిల్డింగ్ వైపు మైక్రోసాఫ్ట్ ఎక్కువగా మొగ్గుచూపేది. ఆ వైఖరిని ఆయన పూర్తిగా మార్చారు. పేరు: సత్య నారాయణ నాదెళ్ల తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ తల్లి: ప్రభావతి భార్య: అనుపమ నాదెళ్ల పిల్లలు: 3 కుమారుడు: జైన్ నాదెళ్ల కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల జన్మస్థలం: హైదరాబాద్ వయసు: 56 (2024) జాతీయత: భారతీయుడు పౌరసత్వం: యూఎస్ఏ చదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్ డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
అమెరికా నుంచి వచ్చి.. యువతిని వేధించిన సీఈఓ
హైదరాబాద్: తన సంస్థలో విధులు నిర్వహిస్తున్న యువతి కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ సీఈఓ..ఆమెను వేధించి కటకటాల పాలైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్‌పేటలో ఉన్న ఇన్ఫోగ్రావిటీ సంస్థ సీఈఓ టి.చంద్ర అమెరికాలో ఉంటాడు. ఇండియాలో తన కంపెనీ అభివృద్ధిలో భాగంగా నిరంతరం జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో తన కంపెనీలో (అమీర్‌పేట సంస్థ)లో హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న యువతిని జూమ్ సమావేశంలో చూశాడు. అంతేగాకుండా ఆమెపై మనసు పారేసుకున్నాడు. తన కంపెనీ అభివృద్ధి కోసం అందమైన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించడమే కాకుండా ఆమెను నిత్యం పొగిడేవాడు. అయితే అతను తన యజమాని కావడంతో యువతి ఏమీ అనలేక పోయింది. గతేడాది డిసెంబర్లో ఇండియాకు వచి్చన చంద్ర ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేశాడు. దీంతో విసుగుచెంది అదే నెల 12న ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు రిలీవింగ్ లెటర్, జీతం, లీగల్ సరీ్వసెస్ డ్యూస్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ కావాలని కోరింది. అయితే తన కోర్కె తీరిస్తేనే వాటిని ఇస్తానని చంద్ర చెప్పడంతో ఆమె ఆగ్రహించి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Forbes Billionaires 2023: నూతన కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్
పారిస్: ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్(74) అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు. ఎలాన్ మస్క్ స్థానంలో ఆర్నాల్ట్‌ను చేరుస్తూ తాజాగా ఫోర్బ్స్ కంపెనీ రియల్ టైం బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచ కుబేరుడి స్థానంలో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ శుక్రవారం 204.5 బిలియన్ డాలర్లకు తగ్గిపోగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ ఏకంగా 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 207.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్ వివరించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ గురువారం ఒక్కసారిగా 13 శాతం తగ్గడంతో ఆ మేరకు మస్క్ ఆస్తిలో 18 మిలియన్ డాలర్ల మేర కోతపడింది. అదే సమయంలో, ఎల్వీఎంహెచ్ షేర్ల విలువ శుక్రవారం 13 శాతం పెరుగుదల నమోదు చేసుకోగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 388.8 మిలియన్ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్ తెలిపింది. బెర్నార్డ్‌కు ఎల్వీఎంహెచ్తోపాటు లూయిస్ విట్టన్, ట్యాగ్ హ్యుయెర్, డామ్ ప్రిగ్నోన్, టిఫ్ఫనీ అండ్ కో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. 500 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక యూరప్ కంపెనీగా గత ఏడాది ఏప్రిల్‌లో ఎల్వీఎంహెచ్ గుర్తింపు పొందింది. -
తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు!
Foxconn CEO Young Liu: 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ సీఈఓ 'యంగ్ లియు' (Young Liu) ను కూడా పద్మభూషణ్ వరించింది. 66 ఏళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).. తైవాన్‌కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) చైర్మన్ 'యంగ్ లియు' నాలుగు దశాబ్దాల కాలంలో మూడు కంపెనీలను స్థాపించారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లియుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. యంగ్ లియు స్థాపించిన మూడు కంపెనీలలో యంగ్ మైక్రో సిస్టమ్స్ అని పిలువబడే మదర్బోర్డ్ కంపెనీ (1988), నార్త్‌బ్రిడ్జ్ అండ్ సౌత్‌బ్రిడ్జ్ ఐసీ డిజైన్ కంపెనీ (1995), ఐటీఈ టెక్ అండ్ ఏడీఎస్ఎల్ ఐసీ డిజైన్ కంపెనీ (1997) ఉన్నాయి. తైవాన్‌కు చెందిన యంగ్ లియు 1978లో తైవాన్‌లోని నేషనల్ చియావో తుంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, ఆ తరువాత సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. భారతదేశంలో ఫాక్స్‌కాన్ ఉనికి భారతదేశంలో.. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో గణనీయమైన పెట్టుబడులు, వెంచర్లతో తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న కంపెనీల జాబితాలో ఫాక్స్‌కాన్ ఒకటిగా ఉంది. ఈ సంస్థ తమిళనాడులో ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 40000 మంది పనిచేస్తున్నారు. ఫాక్స్‌కాన్ సంస్థ బెంగళూరు శివార్లలో యూనిట్‌ను నెలకొల్పడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి కూడా సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొత్త నిర్మాణ ప్రాజెక్టుల కోసం 1.6 బిలియన్ డాలర్ల గణనీయమైన పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని విస్తృతం చేయబోతున్నట్లు ఫాక్స్‌కాన్ సీనియర్ అధికారి గత సంవత్సరం తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఫాక్స్‌కాన్ దేశంలో విస్తృత సేవలను అందించనున్నట్లు సమాచారం. పద్మ అవార్డ్స్ 2024 కేంద్రం ప్రకటించిన మొత్తం పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. విదేశీయులకు పద్మ అవార్డులు ఎందుకిస్తారంటే! కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డ్స్ వెబ్సైట్ ప్రకారం.. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వాలనే నిబంధన లేదు. దేశంలో కళలు, సాహిత్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, వైద్యం, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో సహా అనేక రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన సేవలందించిన ఎవరికైనా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది ఈ విభాగంలో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏపీలో ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయ్యిందా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్‌లో జరగబోతున్నాయా?. దీనికి సంబంధించి ఇప్పటికే రంగం సిద్ధమైందా?, ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించి వెళ్లిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల తేదీ ఫిక్స్ చేశారా?, ఇప్పుడు ఇదే టాపిక్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 16వ తేదీన ఏపీలో ఎన్నికలంటూ ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారి లేఖ ఒకటి సర్క్యులేషన్లో ఉంది. ఫిబ్రవరి చివరలో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ అంటూ ప్రచారం సాగుతోంది. ఏపీలో అసెంబ్లీకి ఏప్రిల్ 16వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్‌గా ఈసీ పెట్టుకున్నట్లు ఆ లేఖలో ఉంది. ఈ మేరకు రాష్ట్రాలను కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం చేస్తోంది. లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్లు ఢిల్లీ సీఈవో లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీ సీఈవో వివరణను ట్వీట్టర్లో రీపోస్ట్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కాగా, 2019లో ఏప్రిల్ 11 నుంచి మే 17 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగ్గా, 2019 మే 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. 2019లో మొదటి దశలోనే ఏపీలో ఎన్నికల నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ఉడాన్‌లో కీలక పరిణామం..ఇంటర్ గ్లోబ్ సీఈఓగా ఆదిత్య పాండే
ప్రముఖ బీ2బీ ఈకామర్స్ కంపెనీ ఉడాన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే ఆ సంస్థకు రాజీనామా చేశారు. తాజాగా పాండే ఏవియేషన్ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ సీఈఓ నియమితులయ్యారు. మార్చి 1, 2024 నుండి విధులు నిర్వహించనున్నారు. గతంలో ఇండిగోలో పనిచేసిన అనుభవం కారణంగా ఇంటర్‌గ్లోబ్ యాజమాన్యం సీఈఓగా కీలక బాధ్యతలు అప్పగించింది. వ్యూహాత్మక వ్యాపారం, కార్పొరేట్ సిబ్బంది విధులను పర్యవేక్షించడం, బలోపేతం చేయడం వంటి బాధ్యతలు చూసుకోనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాండే ప్రొడక్టివీటీ, ప్రాఫిట్ వంటి విభాగాల్లో దృష్టిసారిస్తూ వివిధ కంపెనీలలో వ్యాపార వ్యూహం, ఆర్ధిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. గతంలో పాండే దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఉడాన్‌లో చేరారు. తాజాగా ఉడాన్ నుంచి ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ సీఈఓగా పదోన్నతి సాధించారు. ఇక,ఉడాన్‌లో పాండే స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే విషయం వెలుగులోకి రావాల్సి ఉండగా.. బదులుగా ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అదనపు ఫైనాన్స్ బాధ్యతలను అప్పగించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం!
అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా సాగుతోంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాదిమంది ప్రముఖులు అయోధ్యకు విచ్చేశారు. వీరిలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపార రంగ ప్రముఖులు సైతం ఉన్నారు. భారతీయ సాఫ్ట్వేర్ సంస్థ జోహో చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్ వెంబు కుటుంబంతోపాటు ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఒక రోజు ముందే అయోధ్యకు చేరుకున్నారు. కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న సుమారు 500 మంది స్టేట్ గెస్ట్స్ లిస్ట్‌లో శ్రీధర్ వెంబు కూడా ఉన్నారు. తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో అయోధ్య చేరుకున్న ఆయన తమకు కలిగిన భక్తి పారవశ్యాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్ తన అమ్మ జానకి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో అయోధ్య చేరుకున్నానని ‘ఎక్స్’(ట్విటర్)లో శ్రీధర్ వెంబు తెలియజేశారు. ‘అమ్మ శ్రీరామునికి జీవితాంతం భక్తురాలు. అయోధ్యను దర్శించడం గొప్ప అదృష్టం. జై శ్రీరామ్’ అని పేర్కొంటూ తల్లి, కుటుంబ సభ్యులతో అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేశారు. In Ayodhya with my amma Janaki and my brother Kumar and his wife Anu. Amma is a life-long devotee of Lord Shri Ram. Very blessed to be here. Jai Shri Ram 🙏🙏🙏 pic.twitter.com/gwFIE8mZJb — Sridhar Vembu (@svembu) January 21, 2024 -
సబ్సిడీ ఎత్తేస్తే అంతే.. సీఈవో ఆందోళన!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకోవడంపై ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో ఒకటీ రెండు సంవత్సరాల వృద్ధి స్తబ్దతకు దారితీయవచ్చని ఆయన అంటున్నారు. పరిశ్రమ మనుగడ కోసం రాయితీలపైనే పూర్తిగా ఆధారపడనప్పటికీ వచ్చే ఏప్రిల్‌లోనే సబ్సిడీని నిలిపివేస్తే కంపెనీలు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టాంతం పరిశ్రమ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యానికి దారి తీస్తుంది. ఈ ఏడాది మార్చిలో ముగియనున్న ఫేమ్2(FAME-II) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే గత ఏడాది జూన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది. ఉన్నట్టుండి సబ్సిడీని తగ్గించడం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాన్ని తరుణ్ మెహతా ఎత్తిచూపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ 2023లో వృద్ధిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో పేరుగాంచిన చండీగఢ్ ఫేమ్ స్కీమ్ లేకపోతే ప్రభావితం కావచ్చన్నారు. దేశం అంతటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఫేమ్ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాలుష నియంత్రణ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తోంది. అయితే బ్యాటరీ ఖర్చులు అధికంగా ఉండటం, విడి భాగాలపై సరఫరా పరిమితులు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. -
విస్‌టెక్ కంపెనీ సీఈవో సంజయ్ షా మృతి
-
టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఈఓ ఏమన్నారంటే?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓ అండ్ ఎండీ కె కృతివాసన్ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయం గురించి మాట్లాడుతూ.. రిటర్న్ టు ఆఫీస్ పాలసీ చాలా బాగా పనిచేస్తోందని, రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తారని వెల్లడించారు. ఇప్పటికే 65 శాతం మంది ఉద్యోగులు వారానికి 3 నుంచి 5 రోజులు ఆఫీసుకు వస్తున్నారని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) పర్యటనలో ఉన్న కృతివాసన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేము రిటర్న్ టు ఆఫీస్ విధానం ప్రకటించిన కొంత కాలానికి ప్రత్యర్థి కంపెనీలు కూడా దీన్నే అనుసరించడం మొదలుపెట్టేశాయి. రిటర్న్ టు ఆఫీస్ విధానం అమలు చేయడం కంపెనీకి బాగా కలిసొచ్చిందని, దీంతో సిబ్బందిని మరింత మోటివేట్ చేయడానికి అవకాశం లభించిందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి తీవ్రత భారీగా పెరిగిన సమయంలో TCSతో పాటు అనేక ఇతర సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. ఆ తరువాత కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఐటీ సంస్థలు రొటేషన్ పద్దతిలో ఉద్యోగులు మళ్ళీ ఆఫీసులకు రావడానికి సన్నాహాలు చేశాయి. ఇదీ చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా! అప్పటి సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2025 నాటికి 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు వచ్చే అవకాశం ఉందని భావించారు, కానీ ఇప్పటికే 65 శాతం మంది ఆఫీసుకు వస్తున్నారు. కంపెనీ గత ఏడాది వందల మంది ఉద్యోగులను తొలగించింది కూడా. గతంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. రానున్న రోజుల్లో అవసరానికి తగ్గట్టుగా ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, వచ్చే త్రైమాసికం నాటికి 5 వేల నుంచి 6 వేల మందిని నియమించుకుంటే కంపెనీ తొలగించిన ఉద్యోగులకు సమానమవుతుందని కృతివాసన్ అన్నారు. -
భారత్‌కు మద్దతుగా నిలిస్తే.. రాజకీయంగా చూస్తున్నారు - ఈజ్‌మైట్రిప్ సీఈఓ
ఇండియా & మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదాల కారణంగా ప్రముఖ ట్రావెల్ ఏజన్సీ 'ఈజ్‌మైట్రిప్' (EaseMyTrip) అన్ని బుకింగ్స్ నిలిపివేసింది. మన దేశానికి మద్దతుగా నిలువడానికి సంస్థ సీఈఓ అండ్ కో ఫౌండర్ 'నిషాంత్ పిట్టి' (Nishant Pitti) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ విషయం మీద ప్రశాంత్ పిట్టి కూడా చలో లక్షద్వీప్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తూ.. మాల్దీవులు/సీషెల్స్ మాదిరిగానే లక్షద్వీప్‌లోని నీరు & బీచ్‌లు చాలా బాగున్నాయి. ఇటీవల వీటిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి అద్భుతమైన క్రేజీ స్పెషల్-ఆఫర్లు ఇక్కడ ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ఈజ్‌మైట్రిప్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాలు కొందరు రాజకీయంగా చూస్తున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ నుంచి చాలామంది మాల్దీవులకు వెళ్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా మాల్దీవులకు చెందిన ముగ్గురు డిప్యూటీ మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. దీంతో మాల్దీవుల చర్యలను భారత్ ఖండించింది. ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు.. ప్రస్తుతం ఈజ్‌మైట్రిప్ తీసుకున్న నిర్ణయాన్ని సుమారు 95 శాతం మంది భారతీయులు సమర్థిస్తున్నారు. దీంతో యాప్ డౌన్లోడ్ కూడా గత వారం 280 శాతం పెరిగిందని.. 5 శాతం మంది మాత్రమే మా నిర్ణయాన్ని రాజకీయం చేస్తున్నట్లు వెల్లడించారు. Read some tweets, saying we instigated India-Maldives Standoff Here is a brief history: Nov 2023, President of Maldives won election on plank of "India Out" campaign. They wanted India & its tourist OUT, since last few years. Being 2nd largest tourism provider to Maldives, we… — Nishant Pitti (@nishantpitti) January 15, 2024 -
60 వేలమందికి మొబైల్ నెంబర్ ఇచ్చిన సీఈఓ - ఎందుకంటే?
సాధారణంగా ఒక కంపెనీ సీఈఓను కలవాలన్నా.. లేదా మాట్లాడాలన్నా పర్మిషన్ / అపాయింట్మెంట్ వంటి ప్రాసెస్ ఉంటాయి. కానీ ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ అడిడాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'బిజార్న్ గుల్డెన్' (Bjorn Gulden) ఇటీవల కంపెనీలో పనిచేసే 60000 మంది ఉద్యోగులకు తన మొబైల్ నెంబర్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. 2023 జనవరిలో అడిడాస్ కంపెనీ సీఈఓగా గుల్డెన్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంస్థ కొన్ని ఆర్థిక నష్టాల్లో ఉండేది. అంతే కాకుండా అడిడాస్.. అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్‌తో సంబంధాలను తెంచుకుంది. అలాంటి ఒడిదుడుకులను దాటుకుంటూ కంపెనీ లాభాల్లో పయనించేలా చేసిన ఈయన పనిలో పారదర్శకతను పెంచడానికి తన మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు వెల్లడించారు. గుల్డెన్ తన మొబైల్ నెంబర్ ఇచినప్పటి నుంచి 200 కాల్స్ వచ్చాయని.. వ్యాపారంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆ కాల్స్ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు. 1990 తరువాత గుల్డెన్ అడిడాస్ వదిలి ప్యూమా కంపెనీలో చేరాడు. ఆ తరువాత 2023 జనవరిలో అడిడాస్‌కు తిరిగి వచ్చాడు. గుల్డెన్ తిరిగి కంపెనీయికి రావడంతో సంస్థ షేర్లు దాదాపు రెండింతలు పెరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా కంపెనీ ప్రత్యర్థి నైక్ కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజాల్లో అలజడి.. నాలుగు కంపెనీలలో 50000 మంది స్వతహాగా ఫుట్‌బాల్ ఆటగాడైన గుల్డెన్.. కంపెనీలో అనేక మార్పులు చేశారు. సంస్థ ఉత్పత్తులను క్రికెట్ రంగానికి మరింత దగ్గర చేశారు. 2023లో భారత క్రికెట్ జట్టుతో బ్రాండ్ స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, సంస్థ మూడు నెలల్లో భారతదేశంలో 6,00,00 జెర్సీలను విక్రయించింది. రాబోయే రోజుల్లో అడిడాస్ మరింత వృద్ధి సాదిస్తుందని పలువురు ఆశిస్తున్నారు. -
ప్రపంచ టెక్ సంస్థలకు సీఈవోలు.. ఈ ‘గే’లు..
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే చాలామంది ఆ ఫొటోలను ఏఐ రూపొందించిందా అని అభిప్రాయపడ్డారు. డీప్‌ఫేక్ అందుబాటులోకి రావడంతో ఇలాంటి అనుమానాలు రావడం సహజం. దాంతో ఆల్ట్‌మన్ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హైస్కూల్లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న సీఈఓలు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలను కొందరు వ్యతిరేకిస్తారు, మరికొందరు ఆహ్వానిస్తారు. ఏదిఏమైనా వారు తమ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా పూర్తి హక్కు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీల సీఈవోలు తమనుతాము ‘గే’గా ప్రకటించుకుని వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో కొందరి వివరాలు కొంద తెలుపబడ్డాయి. శామ్ ఆల్ట్‌మన్, ఓపెన్ ఏఐ సీఈవో హైస్కూల్లో 17 సంవత్సరాల వయసులో తాను ఒక గే అని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో తోటి విద్యార్థుల నుంచి చాలా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా మల్హెరిన్‌తో పెళ్లికి ముందు లూప్ట్ సంస్థలో తన సహ వ్యవస్థాపకుడు నిక్ శివోతో సహజీవనం చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సంయుక్తంగా అమెరికన్ జియోలొకేషన్ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించిన వీరిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నారు. 2012లో కంపెనీని విక్రయించిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆల్ట్మాన్ అనేక సందర్భాల్లో మల్హెరిన్‌తో డేటింగ్ గురించి పబ్లిక్‌గా మాట్లాడారు. సెప్టెంబరు 2023లో న్యూయార్క్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆల్ట్మాన్ త్వరలో మల్హెరిన్‌తో పిల్లలను కనాలని ఆశపడుతున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో ఇచ్చిన విందులోనూ ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. టిమ్ కుక్, యాపిల్ సీఈవో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2014లో స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. ఆ సంవత్సరం జూన్‌లో ‘శాన్ ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్’లో యాపిల్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అక్టోబరు 30, 2014న కుక్ బహిరంగంగా ‘నేను స్వలింగ సంపర్కుడిగా గర్వపడుతున్నాను. స్వలింగ సంపర్కం దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నాను’ అని చెప్పారు. పీటర్ థీల్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు 2016లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పీటర్ థీల్ తాను స్వలింగ సంపర్కుడిగా గర్విస్తున్నట్లు చెప్పారు. 2002లో, ‘ఈబే’ పేపాల్‌ను 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ థీల్ను బిలియనీర్‌గా మార్చింది. క్రిస్ హ్యూస్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు ఫేస్బుక్ నలుగురు సహ వ్యవస్థాపకులలో క్రిస్ హ్యూస్ ఒకరు. అతడు బహిరంగంగా ‘గే’ ప్రకటించుకున్నారు. హ్యూస్ 2012లో సీన్ ఎల్డ్రిడ్జ్ను వివాహం చేసుకున్నారు. 2019లో హ్యూస్ ఫేస్బుక్, మార్క్ జుకర్‌బర్గ్‌పై విమర్శలు గుప్పించి వార్తల్లోకెక్కారు. క్లాడియా బ్రిండ్, మేనేజింగ్ డైరెక్టర్, ఐబీఎం క్లాడియా బ్రిండ్ ఐబీఎంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1990లో ఆ సంస్థలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె తాను ఒక లెస్బియన్‌గా ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి ఆన్ మే చాంగ్, కాండిడ్, సీఈవో యాపిల్, గూగుల్, ఇన్టుఇట్ కంపెనీల్లో కీలక స్థానాల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం సామాజిక రంగానికి సంబంధించిన డేటాను అందించే ఒక నాన్‌ప్రాఫిట్ సంస్థ కాండిడ్‌లో పని చేస్తున్నారు. లెస్బియన్ల హక్కుల కోసం వివిధ వేదికలపై ఆమె మాట్లాడారు. -
సహచరుడితో చాట్‌జీపీటీ సీఈఓ వివాహం!
శామ్ ఆల్ట్‌మన్..ఓపెన్ ఏఐ సీఈఓ. ప్రపంచానికి చాట్‌జీపీటీను పరిచయం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓ కీలకమార్పు తీసుకొచ్చి అన్ని దిగ్గజ టెక్ కంపెనీలకు సవాలు విసిరిన ఘనుడు. అలాంటి వ్యక్తిని కొద్ది రోజుల క్రితం ఓపెన్ ఏఐ సంస్థ బోర్డ్ అతనిని సీఈఓ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల వల్ల ఆల్ట్‌మన్‌ను తిరిగి సంస్థలోకి తీసుకోక తప్పలేదు. తాజాగా శామ్ ఆల్ట్‌మన్ తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాంతో ఆల్ట్‌మన్ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హవాయ్ నగరంలో సముద్రపు ఒడ్డున కొంతమంది సన్నిహితుల మధ్య వీరు ఒక్కటైనట్లు మీడియా కథనాల్లో వెల్లడైంది. శామ్ వివాహ చేసుకున్న మల్హెరిన్ ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన పట్టా పొందినట్లు మల్హెరిన్ లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం తెలుస్తోంది. 2020 ఆగస్టు నుంచి 2022 నవంబర్ వరకు మెటాలో పనిచేశారు. ఆల్ట్‌మన్, మల్హెరిన్ తమ బంధం గురించి ఎప్పుడూ బయట మాట్లాడిన సందర్భాలు లేవు. ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన! 2023 సెప్టెంబర్‌లో న్యూయార్క్ మ్యాగజైన్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరూ శాన్ఫ్రాన్సిస్కోలో ఒకే ఇంట్లో ఉంటున్నట్లు ఆల్ట్‌మన్ వెల్లడించారు. గత ఏడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విందుకు ఆల్ట్‌మన్ మొదటిసారి మల్హెరిన్‌తో కలిసి వచ్చారు. ఇదిలాఉండగా హై స్కూల్లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు. -
Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్!
బెంగళూరు: గోవాలో నాలుగేళ్ల కొడుకు చంపి, మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరుకు తీసుకువచ్చిన సీఈవో సూచనా సేథ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటలపాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12.30 సమయంలో గోవాలోని కండోలిమ్‌లో ఉన్న ‘సోల్ బన్యాన్ గ్రాండ్’అనే సర్వీస్ అపార్టుమెంట్ నుంచి డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జంటుగా బెంగళూరుకు తీసుకెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్లాడు. ఒంటి గంటకు సూచనా సేథ్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతోపాటు ఉన్న నల్ల రంగు బ్యాగు చాలా బరువుగా ఉంది. బ్యాగు గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. ‘మద్యం బాటిళ్లు గానీ ఉన్నాయా మేడం, బ్యాగు బరువుగా ఉంది’అని అడిగా. అందుకామె, అవును, మద్యం బాటిళ్లున్నాయి అని సమాధానమిచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తమ్మీద దాదాపుగా వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా–కర్ణాటక సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్‌తో 4 గంటలు లేటయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ, భయపడ్డట్లుగానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ‘ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదు’అని తెలిపాడు. ‘ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యమవుతుంది మేడం. అర్జంటు అన్నారు కదా, యూ–టర్న్ తీసుకుని ఎయిర్ పోర్టుకు పోనివ్వమంటారా? అని అడిగా. అయితే, ఆమె ఎయిర్‌పోర్టుకు వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాకే వెళ్దామని బదులిచ్చింది. అర్జంటుగా వెళ్లాలంటూనే, ట్రాఫిక్ సమస్య ఉన్నా సమస్య లేదనడం వింతగా అన్పించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోనొచ్చింది. కారులో ఉన్న మహిళతోపాటు బాబు ఉన్నాడా అని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్, ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్లావరణలో కారును ఆపడంతో, సూచన ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడుతామన్నారు’అని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. ‘పోలీసులు కారు సోదా చేసి, బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు’అని డిసౌజా చెప్పాడు. -
భర్త ఆదాయం కోటి.. భార్యకు భరణంగా రూ.2.5 లక్షలు
బళ్లారి: నాలుగేళ్ల కుమారున్ని హత్య చేసిన ఏఐ స్టార్టప్ సీఈఓ సూచన సేథ్.. తన భర్త పీఆర్ వెంకట రామన్‌పై గత ఆగష్టులో గృహ హింస కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కుమారున్ని, తనను భర్త వెంకట రామన్ వేధించాడని ఆరోపించింది. దీంతో సేథ్ ఇంటికి రాకుండా వెంకట రామన్ నిషేధాజ్ఞలు కూడా ఎదుర్కొన్నట్లు పేర్కొంది. తన భర్త ఏడాదికి రూ.కోటి సంపాదిస్తాడని వెల్లడించిన సేథ్.. తనకు నెలకు రూ.2.5 భరణాన్ని ఇవ్వాల్సిందిగా కోరినట్లు పోలీసులకు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను బహిర్గతపరిచింది. వాట్సాప్ మెసేజ్‌లు, మెడికల్ రిపోర్టులకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లను వెల్లడించింది. ఇండోనేషియాలో ఉన్న భర్త వెంకటరామన్.. గృహహింస వేధింపులను ఖండించాడు. నిషేధాజ్ఞల కారణంగా తన భార్య ఇంటికి వెళ్లడం మానేశానని ఆయన తెలిపారు. సోషల్ మీడియా, ఫోన్, వాట్సాప్ ద్వారా కూడా తన భార్యకు దూరంగా ఉన్నట్లు పేర్కొంది. చివరికి తన కుమారునికి కూడా దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే.. చివరికి తన పిల్లాడిని కలుసుకునే హక్కును భర్త వెంకట రామన్ పొందాడు. ఇదే కుమారుని హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కృత్రిమ మేధ స్టార్టప్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలో స్వయంగా హత్య చేసింది. కిరాతకంగా పసిబిడ్డ ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు దొరికిపోయింది. కన్నబిడ్డ శవాన్ని బ్యాగ్‌లో కుక్కి, ట్యాక్సీలో పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చేరుకుంది. చిత్రదుర్గలో ఆమెను అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Suchana Seth Planned Murder: దగ్గు మందుతో చంపేసిందా? -
బిడ్డను కడతేర్చిన తల్లి... వెలుగులోకి మరిన్ని వివరాలు!
బళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు బయటపడుత్నాయి. పోలీసులకు హత్య జరిగిన గోవాలోని సర్వీస్ అపార్టుమెంట్ గదిలో ఖాళీగా ఉన్న రెండు సిరప్ సీసాలు లభ్యమయ్యాయి. సిరప్‌ను అధిక డోస్‌తో తన కుమారుడికి తాగించి హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పరిశీలిస్తే సుచనా సేథ్ ముందుగానే తన కుమారుడిని హత్య చేయాలని ప్రణాళిక వేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికల్లో మాత్రం బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మరణించడానికి ఒక వస్త్రం లేదా తలగడను ఆమె ఉపయోగించినట్లు తెలుస్తోందని వెల్లడించారు. సుచనా సేథ్ గోవాలో ఉన్న సర్వీస్ అపార్టుమెంట్లో రెండు సిరప్ బాటిల్స్ (ఒకటి చిన్నది, మరోటి పెద్దది) లభించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మృతి చెందినట్లు తెలుస్తోందని చెప్పారు. అయితే బాలుడు మరణించక ముందు సుచనా అతనికి అధిక డోస్‌తో కూడిన సిరప్‌ను తాగించిందా? అన్న విషయంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సుచనాకు దగ్గు వస్తోందని సిరప్ కొనుగోలు చేయాలని సర్వీస్ అపార్టుమెంట్ సిబ్బందితో చెప్పిందని పోలీసు అధికారి తెలిపారు. దానితోపాటు ఆమె మరో పెద్ద సిరప్ బాటిల్‌ను కూడా కొనుగోలు చేసి తన వెంట తెచ్చుకుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని పరిళీలిస్తే పక్కా ప్రణాళిక ప్రకారం బాలుడిని ఆమె హత్య చేసిందని అన్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం బాలుడిని తాను హత్య చేయలేదని, తాను నిద్ర లేచేవరకు బాలుడు మృతి చెంది ఉన్నాడని సుచనా సేథ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె చెప్పే విషయాలపై పలు అనుమానాలు కలుగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు. త్వరలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని.. బాలుడిని హత్య చేయడానికి ఆమెకు గల ప్రధానమైన కారణాన్ని చేధిస్తామని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో విడాకులు తీసుకొవాలని వేరుగా ఉంటోందని.. అదే విషయంలో బాలుడిని హత్య చేసినట్లు తెలుస్తోందని తెలిపారు. ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ గోవాలో తన కుమారుడిని చంపి, కొడుకు శవాన్ని బ్యాగులో కుక్కి ట్యాక్సీలో కర్ణాటకకు తరలించారు. సోమవారం రాత్రి చిత్రదుర్గలో అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. నిందితురాలు సుచనా సేథ్‌ను విచారణ నిమిత్తం ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ గోవా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి -
మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి
సాక్షి బళ్లారి: మాతృత్వానికే మచ్చ తెచ్చిన కన్నతల్లి ఘాతుకం ఇది. కృత్రిమ మేధ స్టార్టప్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలో స్వయంగా హత్య చేసింది. కిరాతకంగా పసిబిడ్డ ప్రాణాలను బలితీసుకుంది. మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు దొరికిపోయింది. కన్నబిడ్డ శవాన్ని బ్యాగ్‌లో కుక్కి, ట్యాక్సీలో పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చేరుకుంది. సోమవారం రాత్రి చిత్రదుర్గలో ఆమెను అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. మంగళవారం గోవాకు తరలించి, న్యాయస్థానంలో హాజరుపర్చారు. నిందితురాలు సుచనా సేథ్‌ను తదుపరి విచారణ నిమిత్తం ఆరు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ గోవా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె దురాగతానికి ఒడిగట్టడానికి కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త నుంచి విడిపోయి.. 39 ఏళ్ల సుచనా సేథ్ మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ సీఈఓగా పనిచేస్తోంది. 2021లో ‘టాప్ 100 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్’గా గుర్తింపు పొందింది. ఈ నెల 6న తన కుమారుడితో కలిసి ఉత్తర గోవాలోని కాండోలిమ్‌లో సర్విసు అపార్టుమెంట్లో అద్దెకు దిగింది. రెండు రోజులపాటు అక్కడే గడిపింది. ఓ పని కోసం తాను బెంగళూరు వెళ్లాల్సి ఉందని, ట్యాక్సీ ఏర్పాటు చేయాలని ఈ నెల 8న అపార్ట్ట్‌మెంట్ సిబ్బందిని కోరింది. ట్యాక్సీని అద్దెకు తీసుకోవడం కంటే విమానంలో వెళ్లడమే చౌక అని వారు సూచించగా, అందుకు నిరాకరించింది. ట్యాక్సీ కావాలని పట్టుబట్టడంతో వారు ఆ మేరకు వాహనం ఏర్పాటు చేశారు. 8వ తేదీన తెల్లవారు జామునే ట్యాక్సీలో బెంగళూరుకు పెద్ద బ్యాగుతో బయలుదేరింది. అపార్ట్ట్మెంట్లో ఆమె గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బందికి అక్కడ టవల్‌పై రక్తపు మరకలు కనిపించాయి. అంతేకాకుండా అపార్ట్ట్‌మెంట్ నుంచి వెళ్లిపోయినప్పుడు ఆమె వెంట కొడుకు లేడని గుర్తించారు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి, సుచనా సేథ్తో ఫోన్లో మాట్లాడారు. ఆ రక్తపు మరకలు తన పీరియడ్స్‌కు సంబంధించినవని, తన బిడ్డ ఉత్తర గోవాలోని మార్గావ్లో తన స్నేహితురాలి వద్ద ఉన్నాడని బదులిచ్చింది. అంతేకాకుండా సదరు మిత్రురాలి చిరునామా కూడా చెప్పింది. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి విచారించగా, అది నకిలీ చిరునామా అని తేలింది. దాంతో ట్యాక్సీ డ్రైవర్‌ను ఫోన్లో సంప్రదించారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్నట్లు అతడు చెప్పగా, స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు సుచనా సేథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్దనున్న బ్యాగ్‌ను తెరిచి చూడగా బాలుడి మృతదేహం కనిపించింది. గోవా పోలీసులు చిత్రదుర్గ చేరుకొని, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. గోవాకు తరలించి, ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 201(సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం)తోపాటు గోవా చిల్డ్రన్స్ చట్టం కింద ఆమెపై కేసులు నమోదు చేశారు. భర్త నుంచి విడిపోయానని, విడాకుల కోసం ప్రయతి్నస్తున్నానని నిందితురాలు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆమె భర్త ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్నాడు. భార్య చేతిలో కుమారుడి మరణం గురించి అతడికి పోలీసులు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. -
Suchana Seth: కసాయిగా మారిన కన్నతల్లి.. కొడుకునెందుకు చంపింది?
గోవాలో కన్నకొడుకుని హతమార్చిన బెంగుళూరు సీఈఓ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. స్టార్టప్ కంపెనీకి సీఈఓ, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌లో మేధావి అయిన మహిళ నాలుగేళ్ల పసివాడిని గోవాలో అతి కిరాతకంగా చంపిన ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అంతేగాక చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో కుక్కి రహస్యంగా బెంగుళూరుకు తీసుకురావడాన్ని తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పుడుస్తోంది పనాజీ/ బెంగళూరు: నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో నిందితురాలిని చిత్రదుర్గ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కన్నతల్లి అంత కసాయిరాలుగా ఎందుకు మారింది.. పేగు బంధాన్ని తెంపుకొని కొడుకును హత్య చేయడానికి గల కారణాలేంటనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని చంపేందుకు అదే కారణమా? 39 ఏళ్ల సుచనకు, ఆమె భర్త వెంకట్ రామన్‌కు మధ్య వివాదాలే చిన్నారి హత్యకు దారితీసినట్లు గోవా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సీఈఓకు భర్త వెంకట్ రామన్ మద్య గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే కుమారుడిని భర్త నుంచిదూరంగా ఉంచేందుకు గోవా టూర్ ప్లాన్ చేసింది. గత శనివారం నార్త్ గోవాలోని బనియన్ గ్రాండ్ హోటల్లో దిగింది. తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయ్యింది. అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని హతమార్చింది. అనంతరం బెంగుళూరుకు ట్యాక్సీ బుక్ చేయాలని ఆమె హోటల్ సిబ్బందిని కోరింది. కొడుకుతో కలిసి హోటల్ లోపలికి వెళ్లిన మహిళా.. సోమవారం ఒంటరిగా బయటికి వెళ్లడాన్ని గమనించిన సిబ్బందికి అనుమానం రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ రక్తపు మరకలను గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంబంధిత వార్త: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అపర మేధావి.. ఎవరీ సుచనా సేథ్! బ్యాగ్‌లో దాచి.. గోవా నుంచి కర్ణాటకకు.. ఇంతలో ఎవరికి అనుమానం రాకుండా కొడుకు మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టిన మహిళ.. గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. మరోవైపు గోవా పోలీసులు ట్యాక్సీ డ్రైవర్‌కు కాల్ చేసి కుమారుడి గురించి చెప్పాలని సీఈవో సుచననాను అడిగారు. తన స్నేహితురాలి వద్ద కొడుకు ఉన్నాడని చెప్పి ఆమె అడ్రస్ ఇచ్చింది. అయితే ఆ అడ్రస్ ఫేక్ అని తెలుసుకున్న పోలీసులు మళ్లీ క్యాబ్ డ్రైవర్‌కు కాల్ చేసి సుచనాకు అర్థం కాకుండా ఉండేందుకు కొంకణి భాషలో మాట్లాడారు. దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటూ ఆ డ్రైవర్‌కు పోలీసులు చెప్పడంతో అతడు తన కార్‌ను నేరుగా దగ్గర్లోని చిత్రదుర్గ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీంతో చిత్రదుర్గలో సుచనాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రయాణిస్తున్న కారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. నేరం అంగీకరించిన మహిళను.. ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు మళ్లీ గోవాకు తీసుకెళ్లారు. ఎవరీ సుచనా.. లింక్డ్ఇన్ ఫ్రొఫైల్‌లోని వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సుచన.. కలకత్తాలోని యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆస్ట్రోఫిజిక్స్‌తో పాటు ప్లాస్మా ఫిజిక్స్‌లో నైపుణ్యం సాధించింది. అదే విధంగా సంసృతంలో పీజీ పట్టా అందుకుంది. తరువాత ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్‌గా ప్రావిణ్యం పొందింది. ఈ రంగంలో ఆమెకు 12 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ క్రమంలో 2020లో మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించి.. దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది. కాగా 100 బ్రిలియంట్ వుమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021లో సుచనా టాప్ ప్లేస్‌లో ఉన్నారు. -
గోవాలో స్టార్టప్ సీఈఓ దారుణం.. ఆపై బెంగళూరుకు..
పనాజీ: బెంగళూరులో ఓ స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తున్న మహిళా సీఈఓ గోవాలో దారుణానికి ఒడిగట్టింది. తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి మృతదేహాన్ని కర్ణాటక వరకు తీసుకువెళ్లింది. బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెల్సిజెన్స్‌కు సంబంధించిన మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీకి సుచనా సేథ్ సీఈఓగా ఉన్నారు.అయితే ఆమె గోవాలోని ఓ అపార్టుమెంట్ భవనంలో తన నాలుగెళ్ల కుమారుడిని చంపినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమె తన కొడుకు మృతదేహాన్ని బ్యాగ్‌లో మూటకట్టి టాక్సీలో కర్ణాటకకు తీసుకువెళ్లింది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు. టాక్సీలో ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఆరెస్ట్ చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బెంగళూరు చెందిన మహిళ.. గోవాలో తన కొడుకును హత్య చేయడానికి గల కారణాలపై లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా.. -
త్వరలో ఐపీవోకి.. అంతలోనే రూ.300 కోట్ల షేర్లు అమ్ముకున్న సీఈవో..
పిల్లల దుస్తులు, ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫస్ట్‌క్రై’ (FirstCry) త్వరలో ఐపీవోకి రానుంది. అంతలోనే ఈ కంపెనీ సీఈవో దాదాపు రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు. కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఫస్ట్‌క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి ఐపీవో కోసం పత్రాలను సమర్పించడానికి పది రోజుల ముందు కంపెనీకి చెందిన 6.2 మిలియన్ షేర్లను విక్రయించారు. ఒక్కొక్కటి రూ.487.44 ధరతో మొత్తం రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. సీఈవో సుపమ్ మహేశ్వరి పబ్లిక్ ఇష్యూలో సెల్లింగ్ షేర్‌హోల్డర్‌గా కూడా నమోదు చేసుకున్నారని మనీకంట్రోల్ నివేదించింది. 6.2 మిలియన్లకు పైగా షేర్లను ఆఫ్‌లోడ్ చేయడానికి ముందు, సుపమ్ మహేశ్వరి కంపెనీలో 7.46 శాతం వాటాను (35,097,831 షేర్లు) కలిగి ఉన్నారు. ఇప్పుడు కంపెనీలో ఆయన వాటా 5.95 శాతానికి (28,893,347 షేర్లు) తగ్గింది. ఐపీవోకి వచ్చే నాటికి ఫస్ట్‌క్రై కంపెనీ విలువ 3.5 నుంచి 3.75 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఐపీవో తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫస్ట్‌క్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన సుపమ్ మహేశ్వరి అహ్మదాబాద్ ఐఐఎం నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. బ్రెయిన్వీసా అనే కంపెనీతో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన పిల్లల ఉత్పత్తుల విక్రయ సంస్థలు పరిమితంగా ఉన్నాయని గ్రహించి 2010లో అమితవ సాహాతో కలిసి ఫస్ట్‌క్రై కంపెనీని స్థాపించారు. ఇందులో మహీంద్ర అండ్ మహీంద్ర, సాఫ్ట్ బ్యాంక్ వంటివి కూడా పెట్టుబడులు పెట్టాయి. -
రూ.97 లక్షల టిప్స్ - సీఈఓ రియాక్షన్ ఇలా..
2024 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి ప్రపంచంలోని చాలా దేశ ప్రజలతో పాటు భారతీయులు కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో ఫుడ్, డ్రింక్స్ వంటి వాటి కోసం జొమాటో, స్విగ్గీ వంటి యాప్‌ల మీద పడ్డారు. 2023 డిసెంబర్ 31 రోజు మాత్రమే జొమాటో లెక్కకు మించిన డెలివరీలు చేసి ఏకంగా రూ. 97 లక్షల టిప్స్ పొందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఇండియన్ జొమాటో డెలివరీ భాగస్వాములకు కస్టమర్లు ఏకంగా రూ. 97 లక్షలకు పైగా టిప్ ఇచ్చినట్లు జోమాటో సీఈవో 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. 2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే రైడ్! దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్‌లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. Love you, India! You’ve tipped over ₹97 lakhs till now to the delivery partners serving you tonight ❤️❤️❤️ — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 -
PhonePe: కొత్త సీఈవోను ప్రకటించిన ఫోన్‌పే
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అంతర్జాతీయ విస్తరణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రితేష్ పాయ్‌ను తమ ఇంటర్నేషనల్ పేమెంట్స్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. ఫోన్‌పేలో చేరిన రితేష్ పాయ్.. యూకేకి చెందిన టెర్రాపే (TerraPay)లో ప్రాడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ విభాగానికి ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. యస్ బ్యాంక్‌లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా కూడా పనిచేసిన ఆయన అక్కడ బ్యాంక్ డిజిటల్ వ్యూహానికి నాయకత్వం వహించారు. రితేష్ పాయ్ చేరికపై ఫోన్‌పే చీఫ్, వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలకు నాయకత్వం వహించడానికి రితేష్ మాతో చేరినందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫోన్‌పే 2015 డిసెంబర్లో ఏర్పాటైంది. ఆ తర్వాత దీన్ని ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసి వాలెట్‌గా రీబ్రాండ్ చేసింది. ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. యూపీఐ యాప్‌ను ప్రారంభించిన మూడు నెలల్లోనే కోటి మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 2018లో గూగుల్ ప్లేస్టోర్‌లో ఐదు కోట్ల బ్యాడ్జ్‌ని పొందిన అత్యంత వేగవంతమైన భారతీయ చెల్లింపు యాప్‌గా ఫోన్‌పే నిలిచింది. -
ఎయిర్ ఏషియా సీఈవో రాజీనామా.. కారణమిదే..
ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఆపరేటర్ ఎయిర్ ఏషియా బెర్హాడ్ (AirAsia Berhad) మలేషియా యూనిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రియాద్ అస్మత్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం ఎయిర్‌లైన్‌లో నాయకత్వంలో చెప్పుకోదగ్గ మార్పును సూచిస్తోంది. కారణమిదేనా? రియాద్ అస్మత్ 2018 జనవరిలో ఎయిర్ ఏషియా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కంపెనీ బోర్డులో సలహాదారుగా మారాలనే యోచనతో ఆయన సీఈవోగా వైదొలగడానికి సిద్ధమయ్యారు. అస్మత్ నిష్క్రమణ ప్రకటనలో గల కారణాలకు సంబంధించి నిర్దిష్ట వివరాలు లేవు. అయితే ఎయిర్ ఏషియా ఏవియేషన్ గ్రూప్ పునర్నిర్మాణ కార్యక్రమాలు, సిబ్బంది మార్పులపై రాబోయే అప్డేట్లను ఇది తెలియజేస్తోంది. బడ్జెట్ ఎయిర్‌లైన్ సెక్టార్లో ప్రముఖ సంస్థ అయిన ఎయిర్ ఏషియా ఏవియేషన్ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లను, రానున్న మహమ్మారి నేపథ్యంలో తలెత్తే ఒడిదుడుకులను అధిగమించడానికి ఈ సంస్థాగత మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రియాద్ అస్మత్ తన నైపుణ్యం, అనుభవాన్ని కంపెనీ కోసం మరింతగా వినియోగించేందుకు సలహాదారుగా మారుతున్నట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. -
ఐదుగురు సీఈఓల అర్ధాంతర రాజీనామా.. 2023లో ఊహించని పరిణామం!
సరిగ్గా వారం రోజుల్లో ఈ ఏడాది(2023) ముగియనుంది. కొత్త సంవత్సరం సోమవారంతో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎన్నో అనూహ్య పరిణామాలకు సాక్షిగా నిలిచింది. ఈ సంవత్సరంలో కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులు కనిపించాయి. 2023లో పలువురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయ్ కోటక్ (కోటక్ మహీంద్రా బ్యాంక్) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉదయ్ కోటక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నిర్ణీత సమయం కంటే ముందే పదవిని వదిలిపెట్టి, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. ఉదయ్ కోటక్ ఇంత హఠాత్తుగా ఎందుకు తన పదవిని విడిచిపెట్టారనే దానిపై ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే ఆయన రాజీనామా చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. 2. రాజేష్ గోపీనాథన్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్/టీసీఎస్) దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో ఈ ఏడాది నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ మార్చిలో హఠాత్తుగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐదు దశాబ్దాల కంపెనీ చరిత్రలో కేవలం నలుగురు సీఈవోలు మాత్రమే విధులు నిర్వహించారు. 3. వేణు నాయర్ (షాపర్స్ స్టాప్) రిటైల్ స్టోర్ చైన్ షాపర్స్ స్టాప్ సీఈఓ వేణు నాయర్ గత ఆగస్టులో రాజీనామా చేశారు. తన కుటుంబంతో సమయం గడిపేందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత వేణు షాపర్స్ స్టాప్‌లో చేరారు. కంపెనీని ఓమ్నిఛానల్ రిటైలర్‌గా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన రాజీనామా మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఈ వార్త బయటకు వచ్చాక కంపెనీ షేర్లు 11 శాతం మేరకు పడిపోయాయి. 4. మురళీ రామకృష్ణన్ (సౌత్ ఇండియన్ బ్యాంక్) మురళీ రామకృష్ణన్ ఈ ఏడాది మార్చిలో ఇండియన్ బ్యాంక్ నుండి నిష్క్రమించారు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానని, అందుకే రాజీనామా చేశానని తెలిపారు. 2020 జూలైలో బ్యాంక్‌లో సలహాదారుగా చేరిన రామకృష్ణన్ నాలుగు నెలల వ్యవధిలోనే ఎండీ, సీఈఓగా ఎదిగారు. 5. మాథ్యూ జాబ్ (క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్) క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ సీఈఓ మాథ్యూ జాబ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇతర కెరీర్ ప్రయోజనాలను కారణంగా చూపుతూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆకస్మిక రాజీనామా కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది కూడా చదవండి: లక్షమంది సామూహిక గీతా పఠనం..ప్రధాని అభినందనలు! -
...అలా విజయం సాధించినట్లు చరిత్రలో లేదు: మరో సీఈవో..
దేశంలో ఉద్యోగులు, యువత ఎంత సేపు కష్టపడాలి.. ఎన్ని గంటలు పని చేయాలి అనే దానిపై మళ్లీ చర్చ మొదలైంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి బాటలోకి మరో సీఈవో వచ్చి చేరారు. ఎక్కువ గంటలు పనిచేయడానికి ఏ మాత్రం సంకోచించకూడదని, జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన.. ఇంకా ఏమన్నారన్నది ఇక్కడ తెలుసుకుందాం.. ఆన్లైన్ ఫర్నీచర్ సంస్థ ‘వేఫెయిర్’ సీఈవో నీరజ్ షా (Wayfair CEO Niraj Shah).. ఎక్కువ పని గంటలు పనిచేయాలని తమ కంపెనీ ఉద్యోగులకు సూచించారు. ఎవరైనా సోమరితనంతో విజయం సాధించినట్లు చరిత్రలో లేదని ఉద్బోధించారు. విజయం సాధించాలంటే కష్టపడాల్సిందేనంటూ ఈ భారతీయ-అమెరికన్ బిజినెస్‌మన్ తమ ఉద్యోగులకు పంపిన ఒక నోట్లో పేర్కొన్నట్లుగా సీఎన్ఎన్ వార్తా సంస్థ ఓ కథనంలో నివేదించింది. కంపెనీ డబ్బును మీదిగా భావించండి.. "ఎక్కువ గంటలు పని చేయడానికి, మరింత బాధ్యతగా ఉండటానికి, పనిని, జీవితాన్ని మిళితం చేయడానికి సంకోసించాల్సిన, సిగ్గుపడాల్సిన పనిలేదు. సోమరితనంతో ఎవరూ విజయం పొందినట్లు చరిత్రలో లేదు" అని నీరజ్షా ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. కంపెనీ ఇటీవలి విజయాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ నెల ప్రారంభంలో ఆయన ఈ సందేశాన్ని పంచుకున్నారు. కంపెనీ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయినీ తమదిగా భావించి మరింత బాధ్యతగా పనిచేయాలని ఉద్యోగులను కోరారు. నారాయణమూర్తి బాటలో.. యువత ఎక్కువ పని గంటలు పనిచేయాలనే భావనను మొదటి సారిగా వెలుబుచ్చిన వ్యక్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. రెండు నెలల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని సూచించారు. ఆ తర్వాత చర్చ విస్తృతమైంది. విభిన్న వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమందికి ఆయన భావనను సమర్థించగా మరికొందరు వ్యతిరేకించారు. -
ఏసీఆర్‌ఈ సీఈవో నీతా ముఖర్జీ రాజీనామా!
ప్రముఖ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అసెట్స్ కేర్ & రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతా ముఖర్జీ రాజీనామా చేసినట్లుగా సమాచారం. కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్న ఆమె కంపెనీ నుంచి వైదొలిగినట్లు ఎకనమిక్ టైమ్స్ నుంచి ఓ కథనం వెలువడింది. గ్లోబల్ ఫండ్ ఆరెస్ ఎస్ఎస్జీ క్యాపిటల్ మద్దతుతో 2020 నవంబర్‌లో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అయిన ఏసీఆర్ఈలో సీఈగా చేరారు. ఆమె ఐదు సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు. నీతా ముఖర్జీ ప్రీమియర్ ఫైనాన్షియల్ సంస్థలలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంకర్. ఏసీఆర్ఈలో చేరడానికి ముందు ఆమె ఆర్బీఎల్ బ్యాంక్‌లో చీఫ్ క్రెడిట్ ఆఫీసర్‌గా పని చేశారు. దానికి ముందు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆఫ్ ఇండియా (ఆర్సిల్) అధ్యక్షురాలిగా ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్తోనూ పనిచేశారు. “ముఖర్జీ తన ప్రణాళికల గురించి తెలియజేయలేదు. బోర్డు ఆమె తదుపరివారిని గుర్తించే ప్రక్రియలో ఉంది ” అని కంపెనీకి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పినట్లుగా ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. -
తండ్రి రోజు కూలీ...కొడుకు వేల కోట్ల కంపెనీకి....
చుట్టూ వెలుతురు కనిపించినంత కటిక చీకటి అయిన చిన్న అగ్గిపుల్ల వెలుగు మొత్తం చీకటిని తరిమేయగలదు. అలాగే ఎంతటి కటిక దారిద్యం అయినా గెలవాలన్న కసి, పట్టుదల, డెడికేషన్ ఉంటే అందనంత శిఖరాలకు చేరుకోవచ్చు అని నిరూపించాడు ఓ కూలి కొడుకు. తండ్రి సంపదన రోజుకి జస్ట్ రూ. 10లే. కనీసం కుటుంబ పోషణకు సరిపడని సంపాదన. కడుపు నిండ తిండలేని దారుణ స్థితిలో పెరిగిన వ్యక్తి. కానీ అతను నా జీవితం ఇంతే అనుకుని రాజీపడలేదు. గెలిచేందుకు మార్గాలు అన్వేషించాడు. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చిన వెనకడుగువేయలేదు. ఈసారి కాకపోయిన మరోసారైనా గెలవగలను అనుకుంటూ సాగిపోయాడు. నేడు ఏకంగా రూ. 3 వేల కోట్ల ఫుడ్ కంపెనీకి సీఈవో అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు!. అతడే ఐడీ ఫ్రెష్ ఫుడ్ చీఫ్ ఎగ్జిక్యూటివివ్ ఆఫీసర్(సీఈవో) ముస్తాఫా పీసీ. ఆయన ఇటీవల జరిగిన ది నియన్ షో పోడోకాస్ట్లో తన బాల్య జీవితం ఎలా సాగిందో షేర్ చేసుకున్నారు. తాను కేరళలో ఓ మారుమూల గ్రామంలో జన్మించానని, తన తండ్రి రోజూ వారి కూలి అని చెప్పారు. ఆయన రోజుకు జస్ట్ రూ. 10 సంపాదించడమే చాలాకష్టంగా ఉండేదని చెప్పుకొచ్చారు. అది తమ కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో తన తోబుట్టువులంతా ఆదాయం కోసం 'అల్లం' పొలంలో పనిచేయడం, కట్టెలు అమ్మడం వంటి చిన్న చితక పనులు చేసి డబ్బులు కూడబెట్టేవాళ్లమని చెప్పారు. అలా తమ కుటుంబం ఓ మేకును కొనుగోలు చేసే స్థాయికి చేరుకోగలిగిందని అన్నారు. అదే మా తొలి ఆస్తి అని కూడా చెప్పొచ్చన్నారు. అయితే అది తినేందుకు కాదని చెప్పారు. ఆ తర్వాత తమ కుటుంబం క్రమక్రమంగా పురోగతి సాధించడం ప్రారంభించింది. అలా ఆ మేకను అమ్మి ఆవును కొనుగొలు చేసే స్థాయికి చేరుకున్నాం. దీంతో తమ కుటుంబ సభ్యులంతా రెండు పూట్ల కడుపు నిండా భోజనం చేయగలిగే స్థాయికి చేరుకున్నామంటూ.. నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. అలా కష్టాలను దాటుకుంటూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదవుకోగలిగే స్థాయికి చేరుకున్నాను అన్నారు. ఆ తర్వాత వెంటనే ఐటీ ఉద్యోగం రావడంతో కొన్నాళ్లపాటు అందులో కొనసాగినట్లు తెలిపారు. సరిగ్గా 2006లో ఐడీ ఫ్రెష్ ఫుడ్ అనే కంపెనీని ఏర్పాటు చేశాను. ఒక చిన్న గదిలో వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి విక్రయించానని తెలిపారు. అయితే భారతీయ వినయోగదారులకు ప్యాక్ చేసిన ఇడ్లీ, దోస పిండిని పరిచయం చేయడం చాలా సవాలుగా మారింది. మొదట్లో ప్యాక్ చేసిన ఆహారం వినియోగించమని తీవ్రంగా వ్యతిరేకించేవారు. పైగా ప్యాక్ చేసిన ఆహారం అనారోగ్యకరమైనదిగా భావించి కొనడానికి కూడా ఇష్టపడేవారు కాదు. దీంతో తాము మార్కెట్లోకి 100 ప్యాకెట్లు పంపిస్తే అందులో 90 ప్యాకెట్లు వెనకొచ్చేసివి. ఏం చేయాలో పాలుపోయేది కాదు. అప్పుడే అర్థమయ్యింది ఫుడ్ వ్యాపారాన్ని నడపడం అంత ఈజీ కాదు అని. తాజా ఆహార వ్యాపారాన్ని నిర్వహించడం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన పని అని తనకు క్లియర్‌గా తెలిసిందన్నారు. ప్రారంభంలో ఎదుర్కొన్న చాలా ఎదురదెబ్బల సాయంతో నేర్చుకున్న మెళుకువలను అన్ని ఉపయోగించి సమర్థవంతంగా తాజా ఆహారాన్ని అందించడమే కాకుండా తన బ్రాండ్‌కి ఓ నమ్మకం ఏర్పడేలే చేసుకున్నాను. నేడు నా ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో ఆహారానికి ఢోకా ఉండదు తాజాగా అందిస్తారు అనే ఓ ముద్ర(బ్రాండ్) పడేలా చేసుకున్నాను. అలా నా వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించేలా అభివృద్ధి చేశానంటూ తన కంపెనీ విజయం ప్రస్థానం గురించి వివరించారు ముస్తఫా. ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరూ అద్భుతాలు చేయగలరన్నారు. ఇక్కడ కేవలం సడలని నమ్మకం, నిబద్ధత ఉంటే అనుకున్నదీ ఏదైనా సాధించొచ్చుని ఆత్మవిశ్వాసంగా చెప్పారు ముస్తఫా. (చదవండి: 19 ఏళ్లకే సర్పంచ్ ఆమె!..మద్యానికి బానిసైన తండ్రి, కటిక దారిద్యం..) -
ఆ సీఈవో వేతనం రోజూ రూ.5 కోట్లు..!
కార్పొరేట్ సంస్థల్లో చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు అందరూ కీలకమే. కానీ వారి బాధ్యతలను అనుసరించి వారికి చెల్లించే వేతనాల్లో తేడా ఉంటుంది. ప్రతి కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (సీఈఓ)ల అత్యంత కీలకం.. కంపెనీ అభివృద్ధి సాధించే వ్యూహ రచనలోనూ, ఆదాయం పెంపులోనూ, సిబ్బంది పనితీరు మెరుగు పర్చడంతోపాటు సాధక బాధకాలు తీర్చడంలోనూ సీఈఓలే కీలకం. ఇక ఐటీ, టెక్ సంస్థల సీఈఓలైతే వేరే చెప్పనక్కర్లేదు. సంస్థ పురోగతి సాధించడంలో ఎంతో ముఖ్య భూమిక పోషించే వారి వేతనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అమెరికాలో 2023 సంవత్సరానికిగాను అత్యధిక వేతనాలు అందుకున్న సీఈఓల్లో సుందర్ పిచాయ్, బ్యారీ మైక్ కార్తీ, టిమ్ కుక్ తదితరులు ఉన్నారు. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనం అక్షరాల 226 మిలియన్ డాలర్లు(రూ.1800 కోట్లు). దాంతో ఆయన రోజూ రూ.5 కోట్లు వేతనం పొందుతున్నారు. అమెరికాలోని కార్పొరేట్ సంస్థల సీఈఓల వేతనంతో పోలిస్తే సుందర్ పిచాయ్ వేతనం అత్యధికం. అతిపెద్ద కార్ల రెంటల్ కంపెనీల్లో హెర్ట్జ్ ఒకటి. దాని సీఈఓ స్టీఫెన్ స్కెర్ వేతనం 182 మిలియన్ డాలర్లు(రూ.1500 కోట్లు). అమెరికన్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ కంపెనీ పెలోటాన్ ఇంటర్ యాక్టివ్ సంస్థ సీఈఓగా బ్యారీ మైక్ కార్తీ ఉన్నారు. ఆయన వార్షిక వేతనం 168 మిలియన్ డాలర్లు(రూ.1400 కోట్లు). ఇదీ చదవండి: ‘ఎవరు చనిపోయినా అవి మాత్రం ఆగవు’ అమెరికాలో లైవ్ నేషన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సీఈఓగా మిచెల్ రాపినో పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 139 మిలియన్ డాలర్లు(రూ.1100 కోట్లు). గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పినారెస్ట్ ఒకటి. దీనికి విలియం రెడీ సీఈఓగా పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 123 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు). ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెక్ దిగ్గజం ఆపిల్. దీనికి సీఈఓగా పని చేస్తున్న టిమ్ కుక్ వార్షిక వేతనం 99 మిలియన్ డాలర్లు(రూ.825 కోట్లు). -
భారత్‌లో ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓ ఎవరో తెలుసా?
భారత్‌లో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన థియరీ డెలాపోర్టే అగ్రస్థానంలో నిలిచారు. 2020 నుంచి విప్రో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న డెలాపోర్టే .. వేతనాల విషయంలో దేశీయ మిగిలిన టెక్ కంపెనీలు హెచ్‌సీఎల్, టీసీఎస్ సీఈఓలను వెనక్కి నెట్టారు. ఏడాదికి రూ.82 కోట్ల వేతనాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా ఫోర్బ్స్తో డెలాపోర్టే మాట్లాడుతూ.. ‘‘ విప్రో సీఈఓ పదవికి అర్హులైన వారి కోసం అన్వేహిస్తున్న సమయంలో ఆ సంస్థ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీని, ప్రస్తుత ఛైర్మన్ అజీమ్ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీని కలిశాను. వారితో మాట్లాడక ముందు భవిష్యత్‌పై నాకు అనేక ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి. కానీ అజీమ్, రిషద్‌తో మూడు, నాలుగు గంటలు గడిపిన తర్వాత నా ఆలోచన ధోరణి పూర్తిగా మారింది. వారి ఇద్దరి మాటల్లో విలువలతో కూడిన ఆశయాలు, ప్రాధాన్యతల గురించి విన్న తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించాను’’ అని డెలాపోర్టే అన్నారు. డెలాపోర్టే తర్వాత ఎవరంటే? ఇక డెలాపోర్టే తర్వాత ఇన్ఫోసిస్‌కు చెందిన సలీల్ పరేఖ్ దేశంలోనే అత్యధిక చెల్లింపులు జరుపుతున్న రెండవ సీఈఓగా అవతరించారు. ఎకనామిక్ టైమ్స్ నివేదికలో స్టాక్ మార్కెట్లోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 500 కంపెనీల విశ్లేషణలో తేలింది. పరేఖ్ ఈ ఏడాది రూ. 56.45 కోట్ల జీతం తీసుకున్నారు. రూ. 30 కోట్ల వేతనంతో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ మూడో స్థానంలో నిలిచారు. నాల్గవ స్థానంలో మాజీ టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రూ. 29 కోట్లకు పైగా సంపాదించారు రేసులో కామత్ సోదరులు ఈ ఏడాదిలో అత్యధిక వేతనం పొందుతున్న స్టార్టప్ డైరక్టర్, సీఈఓగా జీరోధా సోదరులు నిలిచారు. జీరోధార ఫౌండర్ నితిన్ కామ్, నిఖిల్ కామత్‌లు ఇద్దరూ అత్యధిక వేతనం పొందుతున్న స్టార్టప్ సీఈఓలుగా ప్రసిద్ధి చెందారు. వారిద్దరి వేతనం ఏడాది రూ.72కోట్లుగా ఉంది. -
జూబిలెంట్ సీఈవో మను అహుజా కన్నుమూత
జూబిలెంట్ ఇండస్ట్రీస్ (Jubilant Industries) ఎండీ, సీఈవో మను అహుజా కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ తెలియజేసింది. "కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మను అహుజా డిసెంబర్ 9 శనివారం నాడు ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాము" అని జూబిలెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆదివారం (డిసెంబర్ 10) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అహుజా ఆకస్మిక మరణం కంపెనీకి కోలుకోలేని నష్టమని పేర్కొన్న యాజమాన్యం కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులందరూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, విచారం, సంతాపాన్ని తెలియజేస్తున్నారని అని వివరించింది. మను అహుజా 2018 మేలో జూబిలెంట్ ఇండస్ట్రీస్‌లో చేరారు. కంపెనీ వెబ్సైట్ ప్రకారం, అహుజా జంషెడ్‌పూర్‌లోని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, పాటియాలాలోని థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదివారు. భారత్‌తోపాటు ఆగ్నేయాసియా అంతటా విభిన్న వ్యాపారాలు, పరిశ్రమలలో ఆయనకు విశేష అనుభవం ఉంది. జూబిలెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది జూబిలెంట్ భారతీయ గ్రూప్‌నకు చెందిన అగ్రి, పెర్ఫార్మెన్స్ పాలిమర్స్ కంపెనీ. విస్తృత శ్రేణి పంట పోషణ, పంట పెరుగుదల, పంట రక్షణ ఉత్పత్తులతో పాటు అడెసివ్‌లు, వుడ్ ఫినిషెస్ వంటి వినియోగదారు ఉత్పత్తులు, వినైల్ పిరిడిన్, ఎస్బీఆర్, ఎన్‌బీర్ లేటెక్స్ వంటి ఆహార పాలిమర్లు కంపెనీ ఫోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. -
ఫిక్కీ అధ్యక్షుడిగా అనిష్ షా
ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అధ్యక్షుడిగా మహీంద్రా గ్రూప్ సీఈవో, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిష్ షా బాధ్యతలు స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 96వ వార్షికోత్సవంలో ప్రస్తుత అధ్యక్షుడు సుభ్రకాంత్ పాండా నుంచి 2023-2024 సంవత్సరానికి గానూ అనిష్ షా బాధ్యతలు చేపట్టారు. ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీస్ బేరర్‌గా ఉన్న అనిష్ షా యూకే ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ సభ్యుడిగానూ ఉన్నారు. దీంతోపాటు ఆటోమోటివ్ గవర్నర్స్ కౌన్సిల్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) అధ్యక్షుడిగా, ఇండియా అలయన్స్ ఆఫ్ సీఈవోస్ ఫర్ క్లైమేట్ చేంజ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్), ఇండియా-ఆస్ట్రేలియా సీఈవో కౌన్సిల్లకు అనిష్ షా సహ అధ్యక్షుడిగా ఉన్నట్లు ఫిక్కీ ప్రకటనలో పేర్కొంది. మహీంద్రా గ్రూప్ కంటే ముందు అనిష్ షా 2009-14 వరకు జీఈ క్యాపిటల్ ఇండియాకు ప్రెసిడెంట్, సీఈవోగా పనిచేశారు. ఇక్కడ 14 సంవత్సరాలు పనిచేసిన ఆయన జీఈ క్యాపిటల్ యూఎస్, గ్లోబల్ యూనిట్లలో అనేక నాయకత్వ స్థానాలను నిర్వహించారు. అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా యూఎస్ డెబిట్ ఉత్పత్తుల వ్యాపారానికి నాయకత్వం వహించారు. ఇక బోస్టన్, ముంబైలోని సిటీ బ్యాంక్‌లో బైన్ అండ్ కంపెనీతో కలిసి పనిచేశారు. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన అనిష్ షా.. కార్నెగీ మెల్లన్స్ టెప్పర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. -
ఎవరీ సోమా మండల్? ఉక్కు పరిశ్రమకే క్వీన్‌గా..!
పెద్ద బాధ్యతను స్వీకరించినప్పుడు గర్వించదగిన క్షణాలు మాత్రమే ఉండవు. పెద్ద పెద్ద సవాళ్లు కాచుకొని కూర్చుంటాయి. భయపెడతాయి. ఆ సవాళ్లకు భయపడితే అపజయం మాత్రమే మిగులుతుంది. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే విజయం సొంతం అవుతుంది. ఇంజినీరింగ్ చదివే రోజుల నుంచి ఉక్కు పరిశ్రమలోకి అడుగు పెట్టే వరకు, ఉద్యోగ ప్రస్థానంలో రకరకాల సవాళ్లను ఎదుర్కొంది సోమా మండల్. వాటిని అధిగమించి అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా...ఫోర్బ్స్ ‘వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్–2023’ జాబితాలో చోటు సంపాదించింది. భువనేశ్వర్‌లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది సోమా మండల్. తండ్రి అగ్రికల్చర్ ఎకానమిస్ట్. అప్పట్లో చాలామంది తల్లిదండ్రుల ధోరణి ‘ఆడపిల్లలను ఒక స్థాయి వరకు చదివిస్తే చాలు. పెద్ద చదువు అక్కర్లేదు’ అన్నట్లుగా ఉండేది. సోమా తండ్రిలో మాత్రం అలాంటి భావన లేదు. ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను’ అనేవాడు.అలాంటి వ్యక్తి కాస్తా సోమా ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ‘కుదరదు’ అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసింది. రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది. ఇక కాలేజీ రోజుల విషయానికి వస్తే బ్యాచ్‌లో రెండు వందల మంది ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు. పాఠం వింటున్నప్పుడు ఏదైనా సందేహం అడగాలంటే అబ్బాయిలు నవ్వుతారేమోనని భయపడేది. అయితే ఒకానొక సమయంలో మాత్రం...‘అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చదువు చదువుతున్నప్పుడు భయపడటం ఎందుకు?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది...ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే తన భవిష్యత్ విజయాలకు పునాదిగా నిలిచింది. సోమా మెటల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. ‘మెటల్ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం’ అన్నట్లుగా ఉండేది. ఇక మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భవిష్యత్‌పై ఆశను కోల్పోలేదు సోమా మండల్. నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)లోకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్(కమర్షియల్) స్థాయికి చేరింది. 2017లో సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోకి వచ్చిన తరువాత ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెయిల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో మార్పులు తీసుకువచ్చింది. మైక్రో–మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. సెయిల్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేయడానికి మార్గాలు అన్వేషించింది. గ్రామీణ ప్రాంతాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించింది. సోమా కృషి వృథా పోలేదు..అప్పులు తగ్గించుకుంటూ ‘సెయిల్’ను లాభాల దిశగా నడిపించింది. ‘నా కెరీర్లో జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాలేదు. మహిళ అయినందుకు గర్వపడుతున్నాను. మన దేశంలో వివిధ రంగాలలో మహిళా నాయకుల సంఖ్య పెరుగుతోంది. లీడర్‌కు అసంతృప్తి ఉండకూడదు. ఆశాభావం ఉండాలి. పరిమిత వనరులు ఉన్నా సరే మంచి ఫలితం సాధించే సామర్థ్యం ఉండాలి’ అంటుంది సోమా మండల్. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సోమా మండల్ అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ‘సక్సెస్‌కు షార్ట్‌కట్ అనేది లేదు. అంకితభావం, సమర్థత మాత్రమే మనల్ని విజయానికి దగ్గర చేస్తాయి’ అంటుంది సోమా మండల్. (చదవండి: ఆమె నవయుగ సావిత్రి!) -
చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్, ప్రభాస్.. అందరినీ కవర్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ టీమ్ (ఫోటోలు)
-
Bimal Dayal: అదానీ కంపెనీకి కొత్త సీఈవో
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సీఈఓగా బిమల్ దయాల్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ట్రాన్స్మిషన్ బిజినెస్ చీఫ్‌గా ఉన్నారు. పీటీఐ వార్తా సంస్థ నివేదికల ప్రకారం ఈ నిర్ణయాన్ని ఏఈఎస్ఎల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సంబంధించిన థర్మల్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును బిమల్ దయాల్ పర్యవేక్షిస్తారని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది . అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాన్ని సంవత్సరానికి 15 శాతానికిపైగా పెంచాలన్న సంకల్పాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నియామకం ద్వారా మరో ముఖ్యమైన అడుగు వేసినట్లు కంపెనీ తెలిపింది.\ దేశంలో అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థగా తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాబోయే 10 సంవత్సరాల్లో రూ. 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని పోర్ట్‌ఫోలియో ఇటీవల ప్రణాళికను ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది. బిమల్ పటేల్ నియామకం నేపథ్యంలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రస్తుత మేనేజ్మెంట్ బృందంలోని మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా, కంపెనీ అన్ని విభాగాలను చూసుకునే కందర్ప్ పటేల్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, స్మార్ట్ మీటర్ విభాగాలను నడిపిస్తారని పీటీఐ కథనం పేర్కొంది. -
Jr NTR-Netflix CEO Ted: జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో (ఫొటోలు)
-
టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే..
Time’s CEO of the Year 2023: టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT)కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘సీఈవో ఆఫ్ ది ఇయర్-2023’గా ఎంపికయ్యారు. ఆల్ట్మాన్ టెక్ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అవార్డు పొందారు. 5 రోజుల్లోనే మిలియన్ యూజర్లు 2022 నవంబర్ లో ప్రారంభమైన చాట్‌జీపీటీ 5 రోజుల్లోనే మిలియన్ మంది యూజర్లను సంపాదించకుందని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. చాట్‌జీపీటీకి ప్రస్తుతం 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ బెంచ్‌మార్క్‌ను చేరుకోవడానికి ఫేస్‌బుక్‌కు 4.5 సంవత్సరాలు పట్టింది. 2022లో 28 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నివేదించిన ఓపెన్ఏఐ 2023లో నెలకు 100 మిలియన్ డాలర్ల ఆదాయానికి చేరుకుంది. ఓ వైపు చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ పింక్ స్లిప్‌లు ఇస్తున్న సమయంలో ఓపెన్ఏఐ మాత్రం నియామకాలు చేపట్టడం విశేషం. చాట్‌జీపీటీ భారీ విజయం తర్వాత ఈ ఏడాది మార్చిలో జీపీటీ-4ను ఓపెన్ఏఐ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఓ వైపు యూఎస్ సెనేట్‌లో చర్చలు జరుగుతున్న సమయంలో ఆల్ట్‌మన్ భారత్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు వెళ్లి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మళ్లీ సీఈవోగా.. బోర్డు సభ్యులతో విభేదాల కారణంగా ఆల్ట్‌మన్ ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి వైదొలిగారు. గత నవంబర్ 17న బోర్డు ఆల్ట్‌మాన్‌ను కంపెనీ నుంచి తొలగించింది. ఈ ఘటన జరిగిన వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆల్ట్‌మన్‌కు అండగా నిలిచారు. మైక్రోసాఫ్ట్‌లో అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే 5 రోజుల నాటకీయ పరిణామాల అనంతరం ఆయన మళ్లీ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. -
'సహస్రనామం' సమ్మోహన విజయం!
‘ఎడారిలో రెయిన్ కోట్లు అమ్మకూడదు’ అనేది వ్యాపారానికి సంబంధించి అప్రకటిత ప్రాథమిక సూత్రం! ఎక్కడ ఏది అవసరమో అది అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడే ఎంటర్ప్రెన్యూర్ గెలుపు జెండా ఎగరేయగలడు. సంప్రదాయ విధానాలకు భిన్నంగా సంస్థలకు సంబంధించిన డేటా–ఎనాలటిక్స్ ప్రాసెస్‌ను సులభతరం చేయడానికి, కాలాన్ని, ఖర్చును తగ్గించడానికి ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఏఐ స్టార్టప్‌లకు ప్రాధాన్యత పెరిగింది. చెన్నైకి చెందిన అజిత్ సహస్రనామం ఏఐ స్టార్టప్ ‘ఆన్‌గిల్’తో విజయం సాధించాడు. ‘రైట్ మోడల్ అనేది ముఖ్యం’ అంటున్న అజిత్ స్టార్టప్ కలల యువతరం రోల్మోడల్స్లో ఒకరిగా నిలిచాడు. 'ప్రాసెసింగ్ ఆఫ్ డేటా’కు సంబంధించి వివిధ సంస్థలకు రకరకాల సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఐఏ) సాంకేతికత డేటా–డ్రైవెన్ మెథడాలజీలతో ఖర్చును తగ్గిస్తుంది. టైమ్ సేవ్ చేస్తోంది. రిపోర్ట్స్ తయారీని సులభతరం చేస్తోంది. అందుకే ఇప్పుడు ఏఐ స్టార్టప్‌లకు ప్రాధాన్యత పెరిగింది. ‘ఒకప్పుడు రోజుల్లో మాత్రమే పూర్తయ్యే పని ఇప్పుడు నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది’ అంటున్నాడు ఏఐ స్టార్టప్ ‘ఆన్‌గిల్’ ఫౌండర్, సీయీవో అజిత్. ఒక్క మాటలో చెప్పాలంటే డేటా ఆధారిత నిర్ణయాలకు సంబంధించి ఏఐ–డ్రైవెన్ సొల్యూషన్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. బిజినెస్ ప్రాసెస్‌కు డైనమిక్ లుక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఎర్లీ–స్టేజ్ స్టారప్ ఫౌండర్స్ సమావేశంలో స్టారప్ ప్రయాణ ప్రారంభంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వివరంగా చెప్పాడు అజిత్ సహస్రనామం. ‘రైట్ మోడల్ లేకుండా ఎలా ముందుకు వెళ్లగలం?’ అంటాడు అజిత్. రైట్ మోడల్ మాట ఎలా ఉన్నా స్టార్టప్ కలల యువతరం ‘రోల్ మోడల్స్’లో అజిత్ సహస్రనామం ఒకరు. ఏఐ స్టార్టప్ ‘ఆన్‌గిల్’ ఫౌండర్, సీయివోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజిత్. ఇన్స్టంట్ మెసేజింగ్ ΄ప్లాట్‌ఫామ్ ‘ఆన్‌గిల్’ పరిశ్రమలకు సంబంధించి డేటా కలెక్షన్ నుంచి ఇన్సైట్స్ వరకు ఎనాలటిక్స్ టాస్క్‌లను వేగవంతం చేస్తుంది. ‘ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లు అందుబాటులో ఉన్న మోడల్స్‌పై ఆధారపడడం అనేది ఒక విధానం. రెండోది పబ్లిక్ సోర్స్ శాంపిల్స్ ద్వారా సొంత డేటా తయారుచేసుకోవడం. అన్నిటికంటే పెద్ద సవాలు యూజర్స్ ఓకే అనేలా ప్రొడక్ట్‌ను బిల్డ్ చేయడం’ అంటాడు అజిత్. ‘ఆన్‌గిల్’ సాధించిన విజయం ఏమిటి? 2017లో ప్రారంభమైన ‘ఆన్‌గిల్’ రియల్–టైమ్ విజువలైజేషన్, ప్రిడెక్టివ్ ఎనాలటిక్స్ ఫీచర్ల ద్వారా పరిశ్రమలకు సంబంధించి ఎనాలటిక్స్ టాస్క్‌లను వేగవంతం చేస్తోంది. 2025 నాటికి మన దేశంలో ఏఐ మార్కెట్ మరింతగా విస్తరించనుంది అని నిపుణులు చెబుతున్నారు. డొమెస్టిక్ ఏఐ మార్కెట్లోకి యువతరం సారథ్యంలో మరెన్నో స్టార్టప్‌లు అడుగు పెట్టనున్నాయి. ఔత్సాహికులకు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ల మాటలే పాఠాలు అవుతాయి. ‘ఆన్‌గిల్’తో విజయం సాధించిన అజిత్ సహస్రనామం నోటి మాటల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. -
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ (ఫోటోలు)
-
ఆ రోజు మీటింగ్‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస..
ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఏకంగా అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్లారు. మరికొందరు టీవీలకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి లైవ్ చూడటం మొదలెట్టసారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ళ' (Satya Nadella) సైతం మ్యాచ్ మిస్ చేసుకోలేదని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఏఐ ప్రాజెక్టుకి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నారు, అయినప్పటికీ మధ్య మధ్యలో ఫైనల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం, విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటూనే ఉన్నట్లు ఆంగ్ల మీడియా సంస్థ న్యూయార్కర్ వెల్లడించింది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కూడా రాత్రంగా మేల్కొని మరీ చూసినట్లు సత్య నాదెళ్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్‌సీఎల్ - ఎందుకిలా? ఈ ఇంటర్వ్యూలోనే టీమ్ ఇండియా ఓటమికి ప్రతీకారంగా ఆస్ట్రేలియాను కొంటారా? అంటూ సత్య నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. Next time you think your job is more important than cricket, remember that this man had $12 billion on the line and the potential for a very public egg-on-his-face, but that didn’t stop him from updating an uncomprehending audience about Kohli’s batting https://t.co/dSZP9Wn9Dk pic.twitter.com/EPspe36BwU — Sriram (@sriramin140) December 2, 2023 -
ఐఐటీ–బాంబేలో ప్రొఫెసర్‌గా ‘టీసీఎస్’ గోపీనాథన్
ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకుని అందర్నీ ఆశ్చర్యపర్చిన రాజేశ్ గోపీనాథన్ తాజాగా ఐఐటీ–బాంబేలో పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మేథోసంపత్తిని ప్రయోగశాలల నుంచి పరిశ్రమకు బదలాయించడంలో సహాయకరంగా ఉండేలా ఇటీవల ఏర్పాటు చేసిన ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ సెంటర్‌కు ఆయన హెడ్‌గా వ్యవహరిస్తారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐ టీ) బాంబే తెలిపింది. ’ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’ హోదాలో గోపీనాథన్ ఈ సెంటర్ మరింత క్రి యాశీలకంగా పని చేసేందుకు తోడ్పాటు అందించనున్నట్లు వివరించింది. ఈ కోవకు చెంది న ప్రొఫెసర్లు ప్రత్యేక లెక్చర్లు, కోర్సులను అందిస్తూ పార్ట్–టైమ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏ డాది తొలినాళ్లలో రాజేశ్ గోపీనాథన్ టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
ఓటర్ల సంఖ్య పెరిగినా.. పోలింగ్ తగ్గింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి అర్హులైన ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా, ఆ మేరకు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోక పోవడంతో పోలింగ్ శాతం తగ్గింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,26,02,793 మంది ఓటర్లకు గాను 2,32,59,256 మంది (71.34%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1,62,98,482 మంది పురుషులకు గాను 1,15,84,728 మంది, 1,63,01,634 మంది మహిళలకు గాను 1,16,73,722 మంది, 2,677 మంది థర్డ్ జెండర్ ఓటర్లకు గాను 806 మంది ఓటేశారు. గురువారం నాటి పోలింగ్‌కు సంబంధించిన తుది గణాంకాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) శుక్రవారం రాత్రి విడుదల చేశారు. అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్ నమోదు కాగా..పాలేరు (90.89 శాతం), ఆలేరు (90.77 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా యాకుత్‌పురలో 39.64 శాతం నమోదైంది. మలక్‌పేట (41.32 శాతం), చారి్మ నార్ (43.27 శాతం) ఆపై స్థానాల్లో ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో ఓటేయడం గమనార్హం. కాగా 2018లో జరిగిన ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో 1.86 శాతం పోలింగ్ తగ్గింది. 2018 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మొత్తం 2.8 కోట్ల మంది ఓటర్లుండగా, 2.05 కోట్ల మంది ఓటేశారు. అయితే ఈసారి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగి 3.26 కోట్లకు చేరుకోగా, 2.32 కోట్ల మందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ కారణంగానే.. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం 26.78 లక్షల మంది ఎక్కువగా ఓటేసినా, పోలింగ్ శాతం మాత్రం తగ్గింది. -
రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి..
-
రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే..
ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ.. చాలా మంది సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. కొందరికి వ్యాపారాలు వారసత్వంగా వస్తే.. మరి కొందరు జీరో నుంచి ప్రారంభమవుతారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు 'దేవిత సరఫ్' (Devita Saraf). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె బిజినెస్ బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1981 జూన్ 25న ముంబైలో జన్మించిన 'దేవిత సరఫ్' క్వీన్ మేరీ స్కూల్లో చదివింది, ఆ తరువాత హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే బిజినెస్ మీద పట్టు సాధించిన దేవిత చదువు పూర్తయిన తరువాత కేవలం 24 సంవత్సరాల వయసులోనే.. టీవీలను తయారు చేయడానికి ఒక కంపెనీని ప్రారంభించింది. దేవిత సరఫ్ తండ్రి రాజ్‌కుమార్ సరఫ్.. జెనిత్ కంప్యూటర్స్ బిజినెస్ ప్రారంభించారు. తండ్రి వ్యాపారంలో చిన్నప్పటి నుంచి సహాయం చేయడం అలవాటు చేసుకున్న దేవితా.. టెక్నాలజీ వ్యాపారంలో కొంత నైపుణ్యం సంపాదించింది. అంతే కాకుండా ఈమె తన అన్నయ్యతో కలిసి ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఇతర సమావేశాలకు వెళ్లడం వల్ల వ్యాపారంలోని చిక్కులను గురించి తెలుసుకుంది. కాలిఫోర్నియాలో చదువు పూర్తి చేసిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చి.. 'వియు' (VU) గ్రూప్ పేరుతో టీవీలను తయారు చేసే కంపెనీ ప్రారంభించింది. ప్రారంభంలో వ్యాపారం కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, అతి తక్కువ కాలంలోనే బాగా పుంజుకుంది. నేడు ఈ సంస్థ విలువ ఏకంగా రూ. 1000 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్ వియు కంపెనీ టీవీలను కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని దాదాపు 60 దేశాల్లో విక్రయిస్తోంది. అయితే మనదేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీ బ్రాండ్‌గా వియు అవతరించింది. కంపెనీ అభివృద్ధి విశేషమైన కృషి చేసిన దేవితను ఫార్చ్యూన్ ఇండియా (2019) భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ఒకరుగా ప్రకటించింది. -
10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..!
కంపెనీలో పనిచేస్తున్న చిరుద్యోగి మొదలు నాయకత్వ స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిపై పనిఒత్తిడి ఉంటుంది. కానీ అది వారి స్థాయులను బట్టి మారుతోంది. కంపెనీ దానికి సంబంధించిన రంగంలో దూసుకుపోతుంటే ఇంకా మార్జిన్లు పెంచాలనే ధోరణి కనిపిస్తోంది. ఒకేవేళ మార్కెట్లో కంపెనీ స్థానాన్ని కోల్పోతే తిరిగి పునరుద్ధరించే దిశగా పనిచేయాలని ఒత్తిడి ఉంటుంది. ఏటా పెరుగుతున్న టార్గెట్లు, పనితీరులో అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం, ప్రతిభ కోసం పాకులాట వంటి వివిధ ఒత్తిళ్ల కారణంగా కంపెనీలోని అగ్రశ్రేణి నాయకత్వంలో పని చేస్తున్న వారి రాజీనామాలు పెరుగుతున్నాయి. గడిచిన పది నెలల్లో ఏకంగా 110 మంది సీఈవోలు వారి పదవుల నుంచి వైదొలిగినట్లు సమాచారం. కొవిడ్ తర్వాత భారతదేశంలోని కంపెనీలు సీఈవో, ఎండీ స్థాయి ఉద్యోగులు రాజీనామా చేస్తున్న ధోరణి గణనీయంగా పెరిగింది. 2023 మొదటి 10 నెలల సమయంలో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో పనిచేస్తున్న 110 మంది మేనేజింగ్ డైరెక్టర్లు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తమ పదవుల నుంచి వైదొలిగారు. 2023లో నమోదైన పదవుల నిష్క్రమణలో అధికంగా రాజీనామాల వల్లే జరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. అగ్రనాయకత్వంపై కంపెనీల్లో పెరిగిపోతున్న అంచనాలు, ఆ అంచనాలు అందుకోకపోతే వారి పనితీరుపై అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం వంటి వివిధ ఒత్తిళ్లతో అగ్రశ్రేణి రాజీనామాలు హెచ్చవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? మహమ్మారి సమయంలో కంపెనీలు మారితే ఆ స్థాయిలోని వారిని ఇతర సంస్థలు వెంటనే తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. దాంతో అప్పుడు ఎక్కువ రాజీనామాలు జరగలేదు. కొవిడ్‌తో దాదాపు ఏడాదికిపైగా కంపెనీలు ఆర్థిక అనిశ్చుతులు ఎదుర్కొన్నాయి. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్లు, టార్గెట్లు పెంచి ఎండీ/ సీఈఓలపై ఒత్తిడి పెంచుతుండడంతో ఈ రాజీనామాలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు అదే రంగంలోని ఇతర కంపెనీలు నైపుణ్యాలు ఉన్న అగ్రశ్రేణి నాయకత్వానికి మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఈవోల రాజీనామాలు పెరుగుతున్నాయి. -
బెళగావి కంటోన్మెంట్ సీఈఓ ఆత్మహత్య
యశవంతపుర: బెళగావిలోని సైనిక స్థావరం.. కంటోన్మెంట్ (దండు మండలి) సీఈఓ కె.ఆనంద (40) అందులోని క్యాంప్ ప్రాంతంలోని నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. భారత రక్షణశాఖ ఆస్తుల సర్వీసు (ఐడీఈఎస్)కు చెందిన ఆనంద్ ఏడాదిన్నర కిందట కంటోన్మెంట్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన తమిళనాడు వాసి, కుటుంబం చైన్నెలో ఉంటే, ఆయన ఇక్కడే ఒంటరిగా జీవిస్తున్నారు. శనివారం ఉదయం ఇంటి తలుపులు తీయకుపోవటంతో అనుమానం వచ్చి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులను బద్ధలుగొట్టి పరిశీలించగా ఆనంద మృతదేహం కనిపించింది. ఆనంద రాసిన డెత్‌నోటును స్వాధీనం చేసుకున్నారు. బెడ్ పక్కన పురుగుల మందు డబ్బా పడి ఉంది. అక్రమాల ఆరోపణలు, సీబీఐ సోదాలు ఇటీవల కంటోన్మెంట్లో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గురువారమే సీబీఐ అధికారులు కార్యాలయంలో దాడులు నిర్వహించారు. సీబీఐ సోదాల తరువాత మరుసటి రోజే ఆనంద ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. డెత్‌నోటులో ఏమి రాశారనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. నగర పోలీసు కమిషనర్ ఎస్ఎన్ సిద్ధరామప్ప, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆత్మహత్యకు కారణం తెలియదని అన్నారు. చైన్నెలోని ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ ఉద్యో వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.