challenge
-
చంద్రబాబు, నారా లోకేష్ కు సీదిరి అప్పలరాజు సవాల్..
-
కూటమి ప్రభుత్వానికి దేవినేని అవినాష్ ఛాలెంజ్
-
Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు నాలుగు సవాళ్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు సవాళ్లను ఎదుర్కొనబోతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కీలక బాధ్యత కొత్త ముఖ్యమంత్రిపైనే ఉంటుంది. ప్రస్తుతం రేఖ గుప్తా ముందున్న నాలుగు పెద్ద సవాళ్లు ఇవే..1. మహిళల ఖాతాల్లోకి రూ. 2500 బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలలో భాగంగా మార్చి 8 నాటికి అర్హత కలిగిన మహిళా లబ్ధిదారుల ఖాతాలకు తమ ప్రభుత్వం రూ. 2,500 బదిలీ చేస్తుందని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన ఎన్నికల ప్రచార ప్రసంగాలలో ఈ హామీనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8న మహిళల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని పేర్కొన్నారు. రేఖ గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా నిలిచిందని నిపుణులు అంటున్నారు.2. యమునా నది శుద్ధిబీజేపీ గతంలో యమునా నదిని(Yamuna River) శుభ్రపరచడంపై హామీనిచ్చింది. యమునలో కాలుష్యం అధిక స్థాయిలో ఉండటం ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశంగా నిలిచింది. యుమున పరిశుభత విషయంలో కాంగ్రెస్, ఆప్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది తాము చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. పలు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, అనధికార కాలనీల నుంచి వచ్చే మురుగునీరు కారణంగా యమునా నదిలో కాలుష్యం పేరుకుపోతోంది. దీని పరిశుభ్రత కొత్త ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలిచింది.3. పథకాలకు నిధులుఆప్ ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఇతర సబ్సిడీలు కొనసాగుతాయని బీజేపీ గతంలో హామీనిచ్చింది. కొత్త ప్రభుత్వం రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్), ఢిల్లీ మెట్రో వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో నెలకొన్న సమస్యలను చక్కదిద్దాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులను సమకూర్చడమనేది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి భారం కానున్నదనే వాదన వినిపిస్తోంది.4. రోడ్ల మరమ్మతు- చెత్త కుప్పల నుంచి విముక్తిగత ఆప్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం- లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదాల కారణంగా నగరంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో రోడ్డు మరమ్మతుల నుండి చెత్త సేకరణ వరకు అనేక అంశాలు ఉన్నాయి. ఈ పనుల కోసం పట్టణాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సివుంటుంది. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టకముందే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి? -
తడి బట్టలతో గుడికి రా రేవంత్.. హరీష్ రావు సవాల్
సాక్షి, సిద్ధిపేట: మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదంటూ సీఎం రేవంత్ అబద్దాలాడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఆదివారం ఆయన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో మాట్లాడుతూ.. ‘‘దేవుడిపై నమ్మకం ఉంటే కురుమూర్తి ఆలయానికి రేవంత్ రావాలి.. తడి బట్టలతో నువ్వు, నేను గుడిలోకి వెళ్దాం’’ అంటూ హరీష్‌రావు సవాల్ విసిరారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కొడంగల్‌లో ప్రశ్నించిన పాపానికి రైతులకు బేడీలు వేయించారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయలేదా? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.‘‘11 విడతల్లో రూ.73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 13 లక్షల మందికి లక్ష రూపాయల చొప్పున తిప్పలు పడకుండ కళ్యాణ లక్ష్మి ఇచ్చినం. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది...ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడు తప్పా రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండు. ఈ రోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికే అని గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్‌ను కూడా మోసం చేసిండు’’ అంటూ హరీష్‌రావు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్ -
ఏసీబీ అడిగిన ప్రశ్నలే ఈడీ అడిగింది
-
వైజాగ్ -కాకినాడ ఛాలెంజ్ : 52 ఏళ్ల తెలుగు మహిళ సాహసం
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల అరుదైన ఘనతను సాధించారు. విశాఖపట్నం (వైజాగ్) నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈది చరిత్రకెక్కారు. ఐదు రోజుల పాటు సాగిన శ్యామల సాహస యాత్ర సాగింది. డిసెంబర్ 28న ఆర్.కె. వైజాగ్‌లోని బీచ్ నుంచి మొదలై కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో జనవరి 1న ముగిసింది. ఇలాంటి విజయాలను అలవోకంగా అందుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు. వైజాగ్-కాకినాడ ఛాలెంజ్ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్యామలకు సముద్రాలను ఈదడం హాబీ. తాజాగా బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా ఈదారు. వారం రోజుల తరువాత సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకోవడంతో ఆమె సాహస యాత్ర ముగిసింది. ఆమె భద్రత, విజయాన్ని నిర్ధారించేందుకు ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్లు, స్కూబా డైవర్లు , కయాకర్లతో సహా 12 మంది సభ్యుల, రెండు పెద్ద పడవలు ఒక చిన్న నౌక ఆమె వెంట సాగాయి.52-Year-Old woman Goli Shyamala Swims 150 km from #Visakhapatnam to #Kakinada, Inspiring GenerationsGoli #Shyamala, a 52-year-old #WomanSwimmer from Samalkot in Kakinada district, #AndhraPradesh successfully completed an adventurous swim of 150 kilometers in the sea from… pic.twitter.com/DenfvFaHgr— Surya Reddy (@jsuryareddy) January 4, 2025 అంతకుముందు- తమిళనాడు- శ్రీలంక నార్త్ ప్రావిన్స్‌ను అనుసంధానించే పాల్క్ స్ట్రెయిట్‌ను 13 గంటల 43 నిమిషాల్లో అధిగమించి ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా శ్యామలనిలిచారు. గతంలో రామసేతు సమీపంలో అలవోకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికాలోని కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు ఇలాంటి సాహసాన్ని పూర్తి చేశారు. కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 12 డిగ్రీల టెంపరేచర్లో 19 గంటల్లో అధిగమించారు. లక్షద్వీప్‌లో కీల్టన్ ఐలండ్- కడ్మట్ ఐలండ్, హుగ్లీ, గంగ, భాగీరథీ నదుల్లో రికార్డు సమయాల్లో ఈది రికార్డు సృష్టించిన చరిత్ర శ్యామలది. శ్యామల సృజనాత్మక దర్శకురాలు, రచయిత కూడా. అయితే తన యానిమేషన్ స్టూడియో సక్సెస్‌కాకపోవడంతో ఆమె స్విమ్మింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వేసవి ఈత శిబిరాల్లో పాల్గొనడం ద్వారా మరింత ఆసక్తి పెరిగింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం, ప్రజలను ప్రోత్సహించడం ఆమె లక్ష్యంగా మారింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో విజయాలుపాక్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈదుతూ, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచింది.కాటాలినా ఛానల్: కాటాలినా ద్వీపం నుండి లాస్ ఏంజిల్స్ వరకు 36 కిలోమీటర్లు 19 గంటల్లో గడ్డకట్టే 12°C ఉష్ణోగ్రతల మద్య స్విమ్మింగ్ చేశారు.లక్షద్వీప్ : లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది కిల్టన్ ద్వీపం నుండి కద్మత్ ద్వీపానికి 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదారు.ఆమె స్విమ్మింగ్ చేసిన నదులు•కృష్ణా నది: 1.5 కి.మీ•హూగ్లీ నది: 14 కిలోమీటర్లు•గంగా నది: 13 కి.మీ•భాగీరథి నది: 81 కి.మీ -
కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై ఆగని అక్రమ కేసులు
-
మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం
-
రాజమౌళికి ఛాలెంజ్ విసిరే సినిమాతో రాబోతున్న డైరెక్టర్ అట్లీ..
-
మోదీకిదే నా సవాల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత 75 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇవ్వలేదని.. దీనిపై తాను సూటిగా ప్రధాని మోదీకే సవాల్ విసురుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపాలని... ఢిల్లీ నడిబజార్లో క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తానని సవాల్ చేశారు. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా, కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదని సీఎం ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ’’కేసీఆర్, బీఆర్ఎస్ వారు మాట్లాడిన ప్రెస్మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి అవే నకలు కొడుతున్నారు. కిషన్‌రెడ్డి, ఈటల మారాలి. ఆ దొంగల సోపతి పడితే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు. అటే పోతారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. అడ్డగోలుగా మాట్లాడవద్దు. ఏది పడితే, ఎలా పడితే అలా మాట్లాడితే చెల్లదు. మీరు కేసీఆర్‌లా తయారుకాకండి. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపండి. మోదీకి సవాల్ చేస్తున్నా.. ఢిల్లీ నడిబజార్లో మీకు క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తా. లేకపోతే నా లెక్క అప్పజెబుతా. మీ నాయకులు, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించండి. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. అంతేకాదు మేం తొలి ఏడాదే 25.50 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశాం. రూ.21 వేల కోట్లు వారి ఖాతాల్లో వేశాం. మోదీ, కేసీఆర్ మీరు ఎప్పుడైనా చేశారా? సవాల్ విసురుతున్నా. మోదీ అధికారంలో ఉన్నప్పుడైనా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా ఒక్క ఏడాదిలోనే ఇలా రుణమాఫీ చేస్తే.. నేను మా మంత్రులతో సహా వచ్చి క్షమాపణ చెబుతాం. కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోండి.. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? అధికారంలో ఉంటే చలాయిస్తాం, ఓడిపోతే ఫామ్‌హౌస్‌లో పడుకుంటామంటే ఎలా? దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? మేం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండలేదా? రెండుసార్లు మీరు గెలిచారు. మేం ఓడిపోయాం.. అయినా జానారెడ్డిలాంటి పెద్దలు ప్రజల్లో ఉండి, అసెంబ్లీలో పాలకపక్షానికి సూచనలు, సలహాలు ఇస్తూ, తప్పిదాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.మా ఎమ్మెల్యేలను గుంజుకున్నా, సీఎల్పీ హోదాను తొలగించినా మొక్కవోని ధైర్యంలో భట్టి విక్రమార్క కొట్లాడారు. ఇప్పుడు సంవత్సరం పూర్తయినా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర పోషించారా? అసెంబ్లీకి వచ్చారా? ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పదేళ్లు సీఎంగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్కరోజైనా వినియోగించారా? ఆలోచించాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంచడం పట్ల తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? గాలి బ్యాచ్‌ని ఊరి మీదకు వదిలారు.. ప్రభుత్వ నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజలపక్షాన మాట్లాడాల్సింది పోయి ఒక గాలి బ్యాచ్‌ను తయారు చేసి ఊరి మీదికి వదిలారు. వారేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పుడైనా విన్నారా? ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వొద్దన్నప్పుడు, గ్రూప్–4, గ్రూప్–1 పరీక్షలు పెట్టవద్దన్నప్పుడు, డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళుతుంది? కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంటే.. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పుతో మాకు అప్పగించారు. అప్పులకు ప్రతి నెలా రూ.6,500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.65 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోంది. నాడు ‘ఔటర్’ రోడ్డు.. ఇప్పుడు ‘రీజనల్’ రోడ్డు నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు వేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రీజనల్ రింగు రోడ్డు తీసుకువచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. 50వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా కొత్త నగరాన్ని నిర్మించుకుని, పెట్టుబడులు తెచ్చి.. నిరుద్యోగులకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మాదే. మూసీ కాలుష్యంతో మనుషులు జీవించలేని పరిస్థితి నల్లగొండ ప్రాంతానికి రాబోతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అందుకే మూసీలో గోదావరి జలాలను పారించేందుకు, పారిశ్రామిక కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రక్షాళన చేపట్టాం. అడ్డం వచ్చే వారి సంగతి ప్రజలే చూసుకోవాలి..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్సార్ కాదా? ‘‘వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెప్పినప్పుడు.. కొందరు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్నారు.ఆ మాటలు తప్పు అని నిరూపించి రైతులకు ఉచిత కరెంటును ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ, వారి రూ.1,200 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేస్తూ, వేల మంది రైతులపై విద్యుత్ చౌర్యం కేసులను ఎత్తివేస్తూ.. ఒక్క సంతకంతో హామీలు అమలు చేశారు. మేం ఆయనను ఆదర్శంగా తీసుకుని వ్యవసాయానికి 24 గంటల ఇస్తున్నాం. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. వైఎస్సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీని అమల్లోకి తెస్తే... కేసీఆర్ వచ్చి నిరీ్వర్యం చేశారు. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అన్నారు. మేం వరి సాగు చేయాలని చెప్పడమేకాదు సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.’’ తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా చేస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నల్లగొండ: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్‌గా నిలబెడతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో వారు మాట్లాడారు. తమ ప్రభుత్వం ఓవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తూనే, మరోవైపు అప్పులు తీర్చుకుంటూ ముందుకుసాగుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను పెట్టిందే తప్ప నిర్వహణను పట్టించుకోలేదని.. తాము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకులాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మిస్తున్నామని చెప్పారు. గత సర్కారు యాదాద్రి పవర్ ప్లాంట్ మొదలుపెట్టిందే తప్ప పర్యావరణ అనుమతులు తీసుకోలేకపోయిందని.. తాము అనుమతులు తెప్పించి, నిధులిచ్చి పనులు వేగవంతం చేశామని తెలిపారు. నల్లగొండ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం: ఉత్తమ్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే బీఆర్ఎస్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. కార్యకర్తల కష్టం, త్యాగంతో తాము ఈ స్థాయిలో ఉన్నామని.. వారికి ఏ కష్టం వచి్చనా అండగా ఉంటామని చెప్పారు. ఎస్ఎల్బీసీ.. ఇక ఆర్ఆర్ ప్రాజెక్టు: కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఇక నుంచి ఆర్ఆర్ (రాజశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి) ప్రాజెక్టుగా పేరు పెట్టుకున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. నాడు వైఎస్సార్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు సీఎం రేవంత్ ఆ ప్రాజెక్టు పూర్తికి నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం పేర కూలేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. నల్లగొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకే జిల్లా ప్రజలు బీఆర్ఎస్ను పాతాళానికి తొక్కారని వ్యాఖ్యానించారు. -
కేసీఆర్, మోదీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్
-
కేటీఆర్ కు నీతి, నిజాయితీ ఉంటే చర్చకు రావాలి: మంత్రి సీతక్క
-
పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు ప్రశాంత్‌రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
సాక్షి,నిజామాబాద్జిల్లా:రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోసే పనిలో ఉన్నాడని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం(నవంబర్19) నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘త్వరలో కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించటం ఖాయం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.రుణమాఫీ,రైతు బంధు,వడ్ల బోనస్ మీరు ఇచ్చారని ప్రజలు చెప్తే నేను రాజీనామా చేస్తాను. ఇవ్వలేదు అని ప్రజలు చెప్తే నువ్వు నీ పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? పీసీసీ పదవి రాగానే మహేష్‌గౌడ్ నిషాలో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని అవాకులు చవాకులు పేలుతున్నారు.11నెలల కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ సంగతి వదిలేసి మీ పార్టీ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టండి.బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేతలు రిబ్బన్లు కట్ చేస్తున్నారు. ఏం ముఖం పెట్టుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తారు.సామాన్య ప్రజలతో తిట్లు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సైతం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.మహారాష్ట్రలో తెలంగాణ పరువు తీస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.ఇపుడు అదే వరంగల్ లో విజయోత్సవాలా’అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. -
హరీశ్‌రావు పక్కచూపులు చూస్తున్నారు: పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. గత పదేళ్లో ఎంత అభివృద్ధి చేశారో హరీశ్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామన్నారు. ఈ మేరకు మహేష్‌గౌడ్ సోమవారం(నవంబర్ 18) సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్నారు. హరీశ్‌రావు వేరే దారి వెతుక్కుంటున్నారన్నారు. ఆయన ఇప్పటికే పక్క చూపులు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లో మిగిలేది కేసీఆర్,కేటీఆర్,కవితలేనని మహేష్‌గౌడ్ ఎద్దేవా చేశారు.మహేష్‌కుమార్‌గౌడ్ ఇంకా ఏమన్నారంటే...కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదుసీఎం రేవంత్‌ని వ్యతిరేకించినా అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదుకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు...ఆ విషయం తెలుసుమీకు ఆ హక్కుంది...మేము మీకు అండగా ఉంటాంజనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తాంస్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలిఅధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయిబీజేపీ,బీఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయికార్యకర్త కూడా సీమని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందికార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందేమరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలికేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందిబంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యిందికాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయికాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదుహరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండిమేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాంవచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదుహరీశ్రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడుచివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరు -
క్విక్ కామర్స్‌తో రిటైలర్లకు సవాళ్లు
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ నమూనా స్థానిక రిటైలర్లకు సవాళ్లు విసురుతోందని, రాజకీయ అంశంగానూ మారొచ్చని వెటరన్ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. భారత్‌ను ప్రపంచంలోనే వినూత్నమైన దేశంగా పేర్కొంటూ.. మరెక్కడా క్విక్ కామర్స్ నమూనా అంత సత్ఫలితాలు సాధించలేదని, ఇక్కడ మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నట్టు చెప్పారు.‘‘ఇది సానుకూల సంకేతమే. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలకు ఫలితాలు కనిపిస్తున్నాయి’’ అని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అదే సమయంలో యాపిల్, మెటా, యూనిలీవర్ వంటి బ్రాండ్లను భారత్ సృష్టించాల్సి ఉందన్నారు. అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా ఈ విధమైన ఆవిష్కరణల బలం కనిపిస్తుందంటూ.. భారత వ్యాపార సంస్థలు ఉత్పతాదకత, సృజనాత్మకతపై దృష్టి సారించాలని సూచించారు. దేశీయ సంస్థలకు, దేశీయ మార్కెట్ నుంచే రక్షణ కల్పించడం అన్నది దీర్ఘకాల పోటీతత్వం కోణంలో ప్రమాదకరమన్నారు.దేశీయ వ్యాపారాలను కాపాడుకోవడం కంటే అవి స్వేచ్ఛగా పోటీపడేలా చూడాలన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లలో 900 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని, ట్రంప్ పాలనలో వచ్చే మార్పులతో లేదా ఏదైనా అంతర్జాతీయ పరిణామంతో ఇందులో 5–10 శాతం మేర వెనక్కి మళ్లినా అందుకు సన్నద్ధమై ఉండాలని సూచించారు. -
నీ తోబుట్టువులకు పది పైసలు ఇచ్చావా బాబు.. నీకు దమ్ముంటే..
-
సీబీఐ విచారణ కోరే దమ్ముందా: కాకాణి సవాల్
సాక్షి,నెల్లూరు:సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించే ధైర్యం సోమిరెడ్డికి ఉందా అని కాకాణి ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్5) ఈ విషయమై కాకాణి మీడియాతో మాట్లాడారు.‘తాను చెప్పిన పనులు అధికారులు చెయ్యడం లేదనే ఫ్రస్టేషన్లో సోమిరెడ్డి ఉన్నారు.తాను చెప్పిన వారిని కేసుల్లో ఇరికించడం లేదని సోమిరెడ్డి బాధపడుతున్నారు.సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.కేసులు,అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచిన తర్వాత మంచంలో పడుకుని ఉన్నాలాక్కొస్తాం. నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలలో ఒక్క దానినైనా రుజువు చెయ్యగలవా?నీకు దమ్ము దైర్యం ఉంటే నేను అవినీతి చేసినట్టు నిరూపించు. సూరాయి పాలేం ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాల మీద గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్తున్నాం. నీరు చెట్టులో జరిగిన అవినీతి మీద విచారణకి అదేశిస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయని మానవత్వంతో వెనక్కి తగ్గాను. మైనింగ్ కాంట్రాక్టర్లతో చంద్రబాబు వద్దకు సోమిరెడ్డి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.సోమిరెడ్డి అవినీతి మీద విచారణ వేయాలి.ఆయన చేసిన అవినీతి బయటడుతుంది’అని కాకాణి అన్నారు. ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ -
చంద్రబాబుకు సజ్జల ఛాలెంజ్
-
చంద్రబాబుకి కాటసాని సవాల్
-
విచారణకు మేము సిద్ధం.. నువ్వు సిద్ధమా?.. చంద్రబాబుకు విశ్వేశ్వర రెడ్డి సవాల్
-
కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు.కేటీఆర్ చెప్పినట్లు అమృత్ స్కీమ్ కింద టెండర్లు అయినట్లు నిరూపిస్తే తాను మంత్రిగా రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఈ విషయమై శనివారం(సెప్టెంబర్21) పొంగులేటి మీడియాతో మాట్లాడారు.ఆరోపణలను నిరూపించకపోతే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చెప్పాలన్నారు.రూ.3వేల6వందల కోట్లు కాస్తా రూ.8888 కోట్లు ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అమృత్ టెండర్లను గత ప్రభుత్వమే వాళ్లు దిగిపోయే సమయంలో 3 ప్యాకేజీల కింద ఇచ్చారని చెప్పారు.ఇదీ చదవండి.. సీఎం రేవంత్ ప్రమేయంతోనే అమృత్ టెండర్లలో అవినీతి: కేటీఆర్ -
కౌశిక్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన అరికెపూడి గాంధీ
-
కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
-
రుణమాఫీపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణలో ఏ ఊరికైనా వెళ్లి రుణమాఫీ జరిగిందా లేదా అనే చర్చ పెడదాం. సంపూర్ణ రుణమాఫీ అయిందని తేలితే నేను దేనికైనా సిద్ధం. నా సవాల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమేనా’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో శనివారం(ఆగస్టు17) జరిగిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘రూ.31 వేల కోట్లని చెప్పి రూ.17 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టారు. రూ.14 వేల కోట్లు కోత పెట్టారు. రైతులను నిట్టనిలువునా ముంచారు. పంచపాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ ఉంది’అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. హరీశ్‌రావు ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం.. కుల్లం కుల్లా రైతులను అడుగుదాంసిద్దిపేట మండలం తడకపల్లిలో రుణమాఫీకి అర్హులు 720 మంది రైతులు కాగా.. రుణమాఫీ అయ్యిందికేవలం 350 మంది రైతులకేరుణమాఫీ పై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు లక్షా 16 వేల 460 మంది రైతులు ఫిర్యాదు చేశారుమాట తప్పింది రేవంత్రెడ్డినాడు కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారురేవంత్ నాడు మాట నిలబెట్టుకున్నారా ? రైతుల నెత్తిన టోపీ పెడుతున్నారు రేవంత్ రెడ్డిఅధికారం దక్కించుకోవడానికి మోసం.. వచ్చిన అధికారం కాపాడుకోవడానికి రేవంత్ మోసం చేస్తున్నారు ఆగష్టు 20వ తేది వచ్చింది ఇప్పటి వరకు రైతు భరోసా పై నిర్ణయం తీసుకోలేదు రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి రుణ మాఫీ సగం చేశారు రుణ మాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలినీటి పారుదల, అప్పుల మీద శ్వేత పత్రాలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. రుణ మాఫీ పై ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయడం లేదుసాక్షి పత్రికలో వచ్చిన రుణం తీరలే అన్న వార్త కథనాన్ని చూపిన హరీష్ రావురేవంత్ రెడ్డి పరిపాలన లో ప్లాప్ తొండి చేయడంలో తోపుబూతులు తిట్టడంలో టాప్ రంకెలు వేస్తే అంకెలు మారిపోవు పాలకుడిగా రేవంత్ రెడ్డి పాపాలు మూట కట్టుకున్నారు దేవుళ్ళ మీద ఒట్ట్లు పెట్టారు.. తెలంగాణ ప్రజలకు శాపం కావొద్దని కోరుకుంటున్న అన్ని దేవాలయాల దగ్గరకు వెళ్ళి తెలంగాణ ప్రజలకు పాపం తగలవద్దని కోరుకుంటున్న దేవుళ్ళను పాపాల రేవంత్ రెడ్డిని క్షమించమని కోరుకుంటా ముఖ్యమంత్రి నన్ను తాటిచెట్టులా పెరిగావని నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు రుణ మాఫీ పై రేవంత్ ది ప్లాప్ షో భౌతిక దాడులకు పురి గొల్పుతున్నారు రేవంత్ గాడ్ ఫాదర్లకే భయపడలేదు చావాలని కోరుకుంటున్న వారు.. రేపు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారేమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు రైతుల పక్షాన పోరాటం చేస్తాం రుణ మాఫీ పై బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం త్వరలో ప్రకటన చేస్తాం -
త్యాగానికి అర్థమే స్నేహం.. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్న దోస్తులు (ఫొటోలు)
-
ఈనాడులో నా పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే.. ఎంవీవీ సత్యనారాయణ సవాల్
-
‘దానం’ దమ్ముంటే రా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో తనను ఉద్దేశించి ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియాహాల్లో కౌశిక్‌రెడ్డి శనివారం(ఆగస్టు3) మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయన్నారు. సభలో రూల్స్‌కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే సీటు నుంచి మాట్లాడారన్నారు.‘దానం నాగేందర్ నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం. ఎక్కడో స్పాట్ చెప్పు రావడానికి నేను రెడీ. దానం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవడు ఇక్కడ భయపడటం లేదు. కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు.గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్‌లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మరువకు. మేము మళ్లీ కొట్టే సమయం వచ్చింది. దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్‌కు టీషర్ట్, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు’అని కౌశిక్‌రెడ్డి దానంపై విరుచుకుపడ్డారు. -
నేను చెప్పేటప్పుడు మధ్యలో రాకు
-
కంగనా ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీంతో పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది. మండి లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే కంగనా ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను రద్దు చేయాల్సిందేనని కిన్నౌర్‌కు చెందిన లాయక్ రామ్ నేగి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను(రామ్ నేగి) వేసిన నామినేషన్ పత్రాన్ని అసంబద్ధంగా తిరస్కరించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని కంగనా రనౌత్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ ఆదేశాలు జారీ చేశారు. మండీ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లాయక్ రామ్ నేగి తాను పోటీచేసేందుకు నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ, తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు చెల్లవని, అందుకే కంగనా రనౌత్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు.లాయక్ రామ్ నేగి అటవీ శాఖ మాజీ ఉద్యోగి. నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారికి ‘నో డ్యూస్’ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించారు. విద్యుత్, నీరు, టెలిఫోన్ తదితర శాఖల నుంచి ఎలాంటి బకాయిలు లేవని చూపేందుకు ఆయనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒకరోజు సమయం ఇచ్చారు. అయితే నేగి ఈ సర్టిఫికెట్లను గడువులోగా సమర్పించినప్పటికీ, రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించినట్లు నేగి ఆరోపిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం.. నేగి దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా తిరస్కరించినట్లు రుజువైతే, మండీ లోక్‌సభ ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించే అవకాశాలున్నాయి. మండి లోక్‌సభ స్థానం నుంచి రనౌత్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
నిజమే..! తాను తొమ్మిదేళ్ల సూపర్ రేసర్!!
‘రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్’ ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ స్థాయి గోకార్ట్ రేసింగ్. 7 నుంచి 15 ఏళ్ల లోపు వయసు పిల్లలు అనేక దేశాల నుంచిపాల్గొంటారు. 9 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల ‘మైక్రో మ్యాక్స్’ రేస్‌లో ఈసారి విజేతగా నిలిచింది మన కశ్మీర్ చిన్నారి అతికా మీర్. దాదాపు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గోకార్ట్ నడుపుతూ డ్రైవింగ్ మెళకువలు ప్రదర్శిస్తూ ఈ విజయం సాధించింది. మోటర్‌స్పోర్ట్స్ చరిత్రలో గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రేస్ గెలిచిన ఫస్ట్–ఫిమేల్ రేసర్‌గా చరిత్ర సృష్టించింది అతికా మీర్..ప్రతిష్ఠాత్మకమైన రోటాక్స్ మాక్స్ ఛాలెంజ్(ఆర్ఎంసీ) ఇంటర్నేషనల్ ట్రోపీలో మైక్రో మాక్స్ కేటగిరీ రేస్ 2లో అతికా మీర్ విజయం సాధించింది. గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్(ఫ్రాన్స్)లోపాల్గొనడం మీర్‌కు ఇదే తొలిసారి. ముందస్తు ప్రాక్టీస్ లేక΄ోయినప్పటికీ కొత్త బ్రాండ్ కార్ట్‌ను వేగంగా ఎడాప్ట్ చేసుకొని తన ప్రతిభ చాటుకుంది. రోటాక్స్ మాక్స్ చాలెంజ్ ప్రతిష్ఠాత్మకమైన రేస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన కార్ట్ డ్రైవర్స్‌కు వేదిక. రేస్ 2లో అతికా విజయాన్ని ‘స్పీడ్ అండ్ స్ట్రాటజీ’కి సంబంధించి మాస్టర్‌క్లాస్ అంటున్నారు విశ్లేషకులు.‘రేస్ విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. యూరప్‌లో ఇది నా తొలి విజయం. ఈ విజయం కోసం చాలా శ్రమ పడ్డాను. నా టీమ్ ఎంతో సహకారాన్ని అందించింది. నా తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం నాకెంతో బలం’ అంటుంది అతికా మీర్. దుబాయ్‌లోని మాల్స్‌లో మీర్ సరదాగా ఎలక్ట్రిక్ కార్లు నడిపేది. మీర్ డ్రైవింగ్ స్కిల్స్‌ను చూసి తండ్రితో సహా మాల్లో ఉన్న వాళ్లు ముక్కున వేలేసుకునేవారు. మీర్ తండ్రి ఆసిఫ్ నజీర్ మీర్ మన దేశ తొలి నేషనల్ కార్టింగ్ ఛాంపియన్. డ్రైవింగ్‌కు సంబంధించి తండ్రి ఇచ్చిన రకరకాల టైమ్ చాలెంజ్‌లను బీట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేది మీర్.‘ఇక టైమ్ వృథా చేయవద్దు. మీర్‌ను కార్టింగ్ ప్రపంచంలోకి తీసుకురా వాల్సిందే’ అనుకున్నాడు ఆసిఫ్ నజీర్. ఇక ఆరోజు నుంచి మీర్‌లో కార్టింగ్పై మొదలైన ఇష్టం అంతకంతకూ పెరుగుతూ ΄ోయింది. ఫిట్నెస్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫార్ములా వన్‌లో విజయకేతనం ఎగరేసి చరిత్ర సృష్టించాలని కల కనేలా చేసింది.ఆరు సంవత్సరాల వయసులో ఎఫ్ఐఏ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ అండ్ యంగెస్ట్ ఫిమేల్ డ్రైవర్‌గా రికార్డ్ సృష్టించింది. మీర్ తొలి ఫుల్ సీజన్ రేసింగ్ యూఏయిలో జరిగిన మినీ ఆర్ కేటగిరితో మొదలైంది. ఈ రేస్‌లో వైస్–చాంపియన్ టైటిల్ గెలుచుకుంది.వచ్చే ఆగస్ట్‌లో మీర్ యూకేలోని వరల్డ్–ఫేమస్ ‘కార్ట్మాస్టర్స్’లో డ్రైవింగ్ చేయనుంది. ఇటలీలోని ఐరన్ డేమ్స్ యంగ్ టాలెంట్ ఈవెంట్‌కు కూడా ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ΄ోటీకి ఎంపికైన 11 మంది బాలికలలో ఆసియా నుంచి ఎంపికైన ఏకైక బాలిక మీర్. ‘రేస్‌కు ముందు నెర్వస్‌గా ఉంటాను. కారులో కూర్చున్న తరువాత మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఎలాగైనా ఈ రేస్‌లో గెలవాల్సిందే అనే పట్టుదల పెరుగుతుంది. భయాలు కొట్టుకు΄ోతాయి’ అంటుంది మెరిసే కళ్లతో అతికా మీర్. ఈ చిన్నారి భవిష్యత్‌లో ఎన్నెన్ని మెరుపులు మెరిపించనుందో వేచిచూద్దాం! -
రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించే ప్రజాప్రతినిధులను అనర్హులను చేస్తామంటూ ‘పాంచ్ న్యాయ్’పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి ఫిరాయింపులపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చేత రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్ చేశారు.పార్టీ ఫిరాయింపులు, అవినీతి, అక్రమాలు, హామీలు అమలు చేయకుండా మోసం చేసే విషయంలో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్కు తేడా లేదని విమర్శించారు. బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘మోదీ సర్కార్ వచ్చాక గోకుల్ చాట్ పేలుళ్లు లేవు. లుంబిని పార్కు బాంబు బ్లాస్ట్‌లు లేవు. ఉగ్రవాదుల ఊచకోతలు లేవు. నక్సలైట్ల అర్ధరాత్రి హత్యలు లేవు. దేశం ప్రశాంతంగా ఉంది. దేశ భద్రత మా ప్రథమ కర్తవ్యం. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏది? ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ వాళ్లకు మాత్రం ఉద్యోగాలు దొరికాయి. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వని కాంగ్రెస్ సర్కార్.. మిగతా 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తుందో చెప్పాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకొనందుకే లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయని కాంగ్రెస్ అధిష్టానానికి డౌట్ వచ్చింది. అందుకే కురియన్ కమిటీ వచ్చి హమీల అమలుపై కసరత్తు చేస్తున్నట్టుంది. బీజేపీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లకు నిధులివ్వరా? రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదు. నిధుల పంపిణీ బాధ్యతను అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు అప్పగించడం దుర్మార్గం. ఇది ప్రజాతీర్పును, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. రాష్ట్రంలో కాంగ్రెస్ మాదిరిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. రాజకీయాలకు, పారీ్టలకు అతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమాన ప్రాధాన్యత, నిధుల కేటాయింపు జరపాలి. చిత్తశుద్ధితో పనిచేయాలి విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నాం. అయితే చిత్తశుద్ధితో ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఇక కొందరు గోతికాడ నక్కలా సీఎంల భేటీని అడ్డుపెట్టుకుని మళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వొద్దు. తెలంగాణ బిడ్డగా నా అభిప్రాయాలు నాకు ఉంటాయి. కానీ భారత ప్రభుత్వ ప్రతినిధిగా నేను రెండు రాష్ట్రాలను సమంగా చూడాల్సి ఉంటుంది. సమస్యల పరిష్కారానికి బాధ్యతతో కృషి చేస్తా. రేవంత్, ఒవైసీ కుమ్మక్కయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచి్చనా బీజేపీ గెలుపు ఖాయం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజాసమస్యలను ప్రస్తావించిన బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం నేతల దాడి హేయమైన చర్య. సీఎం రేవంత్‌తో ఒవైసీ కుమ్కక్కై దాడులకు పాల్పడుతున్నారు. బీజేపీ తలచుకుంటే ఎంఐఎం నేతలు బయట తిరగలేరు..’’అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.కేకే ఒక్కడితోనే ఎలా రాజీనామా చేయిస్తారు?కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ రాజ్యసభ స భ్యుడు కె.కేశవరావు ఒక్కరితోనే ఎట్లా రాజీనామా చేయిస్తారు? నిజంగా కాంగ్రెస్ ప్రజా పాలన మీద అంత నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. కాంగ్రెస్‌లోకి 26 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వారందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళితే.. ఆ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. బీజేపీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలెవరైనా రాజీనామా చేసి చేరాల్సిందే. గతంలో హుజూరాబాద్, మును గోడు ఎమ్మెల్యేలు రాజీనామా చేశాకే బీజేపీలో చేరారు. -
‘శిరోముండనం’ ప్రకటన వెనక్కి తీసుకున్న ఆప్ నేత
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎంపికైతే తాను శిరోముండనం చేయించుకుంటానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి ఇప్పుడు తన నిర్ణయంపై యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాదు దీనివెనుకగల కారణాన్ని కూడా వివరించారు.నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ఆప్ నేత సోమనాథ్ భారతి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన రోజున ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ మూడోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపధ్యంలో పలువురు సోమనాథ్ భారతిని శిరోముండనం ఎప్పుడు చేయించుకుంటారని అడుగుతున్నారు.ఈ నేపధ్యంలో సోమనాథ్ భారతి దీనికి సమాధానమిస్తూ, తాను శిరోముండనం చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ప్రధాని మోదీ తన సొంత సత్తాతో విజయం సాధించలేదని, ఇది ఎన్డీఏ మిత్రపక్షాల ఏకీకృత విజయమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సమయంలో ఢిల్లీ లోక్‌సభ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ప్రకటించారు.జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలిపోతుందని సోమనాథ్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో భారత కూటమి విజయం సాధిస్తుందని కూడా సోమనాథ్ భారతి చెప్పారు. కాగా న్యూఢిల్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ చేతిలో సోమనాథ్ భారతి ఓటమి పాలయ్యారు. -
రేపు బీజేపీ ఆఫీసుకు వస్తా... కేజ్రీవాల్ ఓపెన్ ఛాలెంజ్
న్యూఢిల్లీ: ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో తన సహాయకుడు బిభవ్‌కుమార్ అరెస్టయిన తర్వాత ఆమ్ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైరయ్యారు. బీజేపీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఆదివారం(మే19) తన పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తానని, ఎవరిని కావాలంటే వారిని అరెస్ట్ చేసుకోవచ్చని ఛాలెంజ్ చేశారు.‘మోదీజీ మీరు జైల్ గేమ్ ఆడుతున్నారు. మనీష్ సిసోడియా, సంజయ్‌సింగ్, అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఒకరి తర్వాత ఇంకొకరిని జైలుకు పంపుతున్నారు. నా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు వస్తా. ఎవరిని కావాలంటే వారిని జైల్లో పెట్టండి. మొత్తం అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి’అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఆప్‌ను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని, అయితే ఆప్ ప్రజల గుండెల్లో ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా, కేజ్రీవాల్ ఓపెన్ ఛాలెంజ్‌పై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ స్పందించారు. ఎంపీ స్వాతిమలివాల్‌పై మీ ఇంట్లోనే దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. -
నవీన్‌పట్నాయక్‌కు ప్రధాని మోదీ ఆసక్తికర సవాల్
భువనేశ్వర్: ఎవరో రాసిచ్చిన కాగితం సాయం లేకుండా ఒడిషాలో ఉన్న జిల్లాల పేర్లు వరుసగా చెప్పాలని సీఎం నవీన్‌పట్నాయక్‌కు ప్రధాని మోదీ సవాల్ విసిరారు. ‘నవీన్‌బాబుకు నేనొక సవాల్ విసురుతున్నాను. ఆయన అన్నేళ్లు సీఎంగా పనిచేశారు కదా ఒడిషాలో జిల్లాల పేర్లు అడగండి. చూడకుండా చెప్తాడేమో తెలుస్తుంది. పేర్లు చెప్పలేని సీఎంకు మీ బాధ ఎలా తెలుస్తుంది. ఈసారి బీజేపీకి ఛాన్సివ్వండి. ఐదేళ్లలో ఒడిషాను నెంబర్‌వన్‌గా చేయకపోతే అవగండి’అని మోదీ అన్నారు. ఒడిషాలో ఉన్న 147 ఎమ్మెల్యే సీట్లకు 21 ఎంపీ సీట్లకు మే 13 నుంచి జూన్ 1 వరకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. -
లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
-
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు కేతిరెడ్డి సవాల్
సాక్షి, సత్యసాయి: ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కేతిరెడ్డి మాట్లాడారు. సత్యకుమార్ ఢిల్లీలో అంత పలుకుబడి ఉంటే.. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగిస్తామని కేంద్రంతో ప్రకటన చేయించాలన్నారు. అలా చేస్తే.. తాను ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. అలాగే సత్యకుమార్ యాదవ కులస్తుడిగా చెప్పుకుంటున్నారని.. కానీ, నిరూపించుకోవాలని కేతిరెడ్డి సవాల్ చేశారు. కేతిరెడ్డి సమక్షంలో పలువురు నేత వైఎస్సార్సీపీలో చేరారు. -
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
-
కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్
-
చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్
-
పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్
-
సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఈడీ ప్రకటన చేసింది. సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేశామని, మనీలాండరింగ్ యాక్ట్ కింద కవితను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. కవితను అరెస్ట్ చేసినట్లు ఆమె భర్తకు సమాచారం ఇచ్చామని ఈడీ అధికారులు తెలిపారు. రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ రోజు రాత్రంత ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. కాగా, తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. మరోవైపు, కవిత భర్త అనిల్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనని అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. -
నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్..
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి కేటీ ఆర్ రాజీనామా చేసి నల్లగొండ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. తాను సైతం నల్ల గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. నల్లగొండలో కేటీఆర్ ఓటమి ఖాయమని, ఇక కారు షెడ్డు మూసుకోక తప్పదన్నారు. కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని మూసివేస్తాం అని కేసీఆర్ ప్రకట న చేస్తారా? అని సవాల్ విసిరారు. తాను సిరిసి ల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన ని స్పష్టం చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం సచివాల యంలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లా డారు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదని కానీ రూ. లక్షల కోట్లు ఉన్నాయని, తనకు క్యారెక్టర్ ఉందని కానీ డబ్బులు లేవన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో రూ.200 కోట్లు ఖర్చు చేసి 30 వేల ఓట్లతో గెలిచాడని, తానై తే అలా గెలిస్తే రాజీనామా చేసేవాడినన్నారు. మాకు ప్రత్యర్థి బీజేపీనే... లోక్‌సభ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదని, బీజేపీనే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోటీలో లేదని, బీజేపీకి రెండు, మూడు సీట్లు వస్తాయో లేదో తెలియదన్నా రు. బీజేపీ ఎంపీ డి.అర్వింద్‌ను ప్రజలు ఎప్పు డో మరిచిపోయారని కోమటిరెడ్డి చెప్పారు. రాజకీ యాల వల్ల ఆస్తులు పోగొట్టుకున్నామని, తనతో పాటు ఉత్తమ్ ఆస్తులు తగ్గాయన్నారు. తన పేరు మీద ఆస్తులుంటే అర్వింద్‌కు ఇచ్చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరిలలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని రాహుల్ గాంధీకి ప్రతిపాదించామని తెలిపారు. -
TS: సీఎం రేవంత్‌కు కడియం సవాల్
సాక్షి,వరంగల్: సీఎం రేవంత్ రెడ్డి వేదిక ఏదైనా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఆయన భాష జుగుప్సాకరంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. బుధవారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మాట్లాడుతున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నానమని, ఇది మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. ‘సీఎంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీ మేనిఫెస్టో.. మా మేనిఫెస్టోపైన మేం చర్చకు రెడీ. ప్రశ్నిస్తే మాపై మాటల దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో అర్దం కావడం లేదు. రాజకీయాల్లో మగతనం మాట ఎందుకు వస్తోంది. మహిళా నాయకుల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం. నువ్వు అంత మగాడివే అయితే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగ తనాన్ని నిరూపించుకో. సీఎంగారు మీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న అలోచన మాకు లేదు. మీ ఆంతట మీరు కూలిపోతే మాకు సంబంధం లేదు. మీ వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే అనుకుంటున్నాం. రాజీవ్ గాంధీ కుటుంబం ఇనామ్ కింద ఇచ్చిందే కదా నీ కుర్చీ. ఇందిరాగాంధీ నామజపంతో తుకుతున్న పార్టీ మీది. మీది జాతీయపార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ మీది. ఆప్ కంటే అద్వాన్నంగా మారింది కాంగ్రెస్ పార్టీ. మార్చి1వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్నాం. త్వరలో కేసీఆర్ కూడా మేడిగడ్డ కు వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదు. మేడిగడ్డకు పెట్టిన ఖర్చు కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే. కూలిపోయిన 3 పిల్లర్ల వద్ద రిపేర్ చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి. బ్యారేజ్ కొట్టుకుపోయేలా చేయాలనే దుర్మార్గపు అలోచన చేస్తున్నారు. ఇదీ చదవండి.. తెలంగాణకు మరోసారి మోదీ.. రెండు రోజులు ఇక్కడే -
మీ మేనిఫెస్టోలు, మా ఆరు గ్యారంటీలపై చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: 2014, 2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోలు, 2014, 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిద్దామని, బీఆర్ఎస్, బీజేపీ నేతలు సిద్ధమా? అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమ లు చేస్తున్నామని, గత పదేళ్లలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేలా ముందుకెళ్తున్నామని చెప్పా రు. బీఆర్ఎస్, బీజేపీల భాష, భావం, ఆలోచనా విధానం ఒక్కటేనని, రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు. సోమవారం సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డ రోజున అప్పుల కింద ఏడాదికి రూ. 6 వేల కోట్లు కట్టేవారమని, ఇప్పుడు పదేళ్ల తర్వాత ఏడాదికి రూ.70 వేల కోట్లు అప్పుల కింద కట్టాల్సి వస్తోందని చెప్పారు. మిగులు బడ్జెట్ స్థితిలో రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే రాష్ట్రాన్ని దివాలా స్థితికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఇంత త్వరగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయగల శక్తి కేసీఆర్‌కు తప్ప ఎవరికైనా ఉందా అని ఎద్దేవా ఏశారు. మార్చి 31 కల్లా రైతుబంధు రైతుబంధును మార్చి 31 కల్లా రైతులకు ఇస్తామని అసెంబ్లీలోనే చెప్పానని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రైతుబంధును 15 రోజుల్లోనే ఇవ్వొచ్చని, అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు నిధులివ్వలేమని వెల్లడించారు. ఉద్యోగాలను వారు వదిలేస్తే న్యాయ పరిష్కారం చూపెట్టి 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు తెడ్డు తిప్పుతున్నారని హరీశ్‌రావు అంటున్నారని, మరి తెడ్డు తిప్పలేని సన్నాసి మంత్రి ఎలా అయ్యా రని ఎద్దేవా చేశారు. మార్చి 2న మరో ఆరువేల ఉద్యోగాలిస్తామని, 70 రోజుల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. దూలం లెక్క పెరిగిన హరీశ్‌కు దూడకున్న బుద్ధి కూడా లేదని విమర్శించారు. రేవంత్‌ను సీఎంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లి ఉంటే కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా వచ్చేవి కాదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన్ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. గత ఎన్నికల్లో తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, కిషన్‌రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా తలపడ్డామని, తమ పార్టీ నేతలతో కలిసి 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలకు వెళ్లానని, పార్టీ అధ్యక్షుడంటే ఇంటి పెద్దే కదా అని అన్నారు. కిషన్‌రెడ్డి ఏనాడైనా కలిశారా? అధికారం చేపట్టిన తర్వాత రాజకీయాలకతీతంగా తాము నిధుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కేంద్రం వద్దకు వెళ్లామని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఏ రోజైనా ప్రజా సమస్యల కోసం తనను కలిశారా అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలన్న ఆలోచన బీజేపీకి లేదని విమర్శించారు. మూడోసారి ప్రధానిగా మోదీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని, రైతులను కాల్చిచంపడానికా అని అన్నారు. నిరుద్యోగులకు ఆన్లైన్ క్లాసులు పేద, గ్రామీణ నిరుద్యోగుల కోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ల పేరిట అత్యవసరంగా ఆడిటోరియాలు కట్టి, అక్కడ ఆన్లైన్ క్లాసులతో శిక్షణనిస్తామని రేవంత్ చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు తెల్ల రేషన్‌కార్డును కొలబద్దగా తీసుకున్నామని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా అనర్హులకు రూ.22వేల కోట్లు పంచిపెట్టారన్న అంచనా ఉందన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల కోసం ఆధార్‌కార్డు చూపిస్తే నమోదు చేసుకునేలా మండల కేంద్రాల్లో హెల్ప్ డెసు్కలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉజ్వల్ పథకం కింద కేంద్రం ఇస్తున్న మొత్తం పోను మిగిలింది సిలిండర్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు. -
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది: వంశీచంద్ రెడ్డి
-
లోకేష్ కు పుష్ప శ్రీవాణి ఛాలెంజ్
-
నారా లోకేష్ కు మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్
-
నేను గుడివాడలో పోటీ చెయ్యను !..చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
-
లోకేష్ కు అమర్నాథ్ ఛాలెంజ్
-
సభలో తేల్చుకుందాం!
ఎంత సమయం కావాలన్నా ఇస్తాం.. కేసీఆర్ నల్లగొండకు వెళ్లేముందు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలి. ఆయనకు ఎంత సమయం కావాలంటే అంత కేటాయిస్తాం. ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చెయ్యం. ప్రతి అంశంపై చర్చించాలి. చెయ్యి నొప్పి, కాలు నొప్పి అని సాకులు చెప్పి సమావేశాలకు గైర్హాజరు కావొద్దు. ఎంతసేపైనా చర్చిద్దాం. కావాలంటే చద్దర్లు, దుప్పట్లు కూడా తెచ్చుకోండి. అవసరమైతే తలుపులేసి మాట్లాడుకుందాం. కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావు కూడా రావాలి. ఎమ్మెల్సీ కవిత కూడా హాజరుకావొచ్చు. అవసరమైతే ఉభయసభలను ఒకే సమయంలో సమావేశపరుస్తాం. సాక్షి, హైదరాబాద్: అరవై ఏళ్ల ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ధనదాహానికి తెలంగాణ బలైందని, రాష్ట్రంలో కృష్ణాబేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు ఎడారిగా మారాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగిస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వా న్ని బదనాం చేస్తున్నారన్నారు. త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులు, నిధుల వినియోగం, నీటి పారుదల అంశాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. దమ్ముంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు. ఆదివారం సచివాలయంలో మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖలతో కలసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితారావు అంతా కలసి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అసలు తెలంగాణలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు పునాదిపడినది కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేలా బిల్లులో పొందుపర్చారు. తెలంగాణ ఏర్పాటు బిల్లులోని ప్రతి అక్షరాన్ని తన సమ్మతితోనే పెట్టారని చెప్పుకునే కేసీఆర్.. ప్రాజెక్టుల అప్పగింత నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? స్వయంగా సంతకాలు చేసి కూడా.. తెలంగాణ, ఏపీ మధ్య 811 టీఎంసీల జలాలను పంచుకునేందుకు 2015 జూన్ 18, 19 తేదీల్లో కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అప్పటి సీఎం కేసీఆర్, నాటి ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు, సాగునీటి నిపుణుడు విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల చొప్పున నీటిని పంచేందుకు ఒప్పుకొన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే నీరే తీసుకునేందుకు ఎలా ఒప్పుకొన్నారు? ఇదంతా ఆ సమావేశం మినిట్స్‌లో రికార్డు అయింది. రాష్ట్రానికి రావాల్సిన నీటిని ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. అంతేకాదు 2022 మే 27న జరిగిన సమావేశంలో 15 ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు అంగీకరించారు. గత ఏడాది మే 19న జరిగిన కృష్ణాబోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 2023–24 బడ్జెట్లో గోదావరి బోర్డు, కృష్ణా బోర్డులకు చెరో రూ.200 కోట్ల చొప్పున రూ.400 కోట్లు బడ్జెట్లో కేటాయించారు కూడా. ఇంత చేసిన కేసీఆర్.. ఇప్పుడు నల్లగొండలో నిరసన తెలుపుతాననడం సిగ్గుచేటు. కేసీఆర్ చేతగానితనం వల్లే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు భూభాగమంతా తెలంగాణలోనే ఉంటుంది. కానీ రెండు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం స్వా«దీనం చేసుకునే ప్రయత్నం చేసింది. ఏపీ పోలీసులు తుపాకులతో మోహరించారు. తెలంగాణ ప్రాజెక్టును స్వా«దీనం చేసుకునేందుకు ఏపీకి ఎంత దమ్ము ఉండాలి. కేసీఆర్ చేతగానితనం వల్లే అలా జరిగింది. అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చున్న కేసీఆర్ బయటికి వచ్చే పరిస్థితి లేక ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్‌వన్నీ తుగ్లక్ నిర్ణయాలు: ఉత్తమ్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అన్నీ తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాఖ్యానించారు. లక్షకోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మూన్నాళ్ల ముచ్చట అయ్యిందని, పలు ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని అన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తి చేసే ప్రాజెక్టులకు అంచనాలను రెట్టింపు చేసి నిధులన్నీ దుబారా చేశారన్నారు. రెండు టీఎంసీల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి, గ్రావిటీ ద్వారా వచ్చే 8 టీఎంసీలను తీసుకెళ్తుంటే చోద్యం చూశారు. నీటినిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రాజెక్టులు ఏడారిగా మారుతున్నాయని, రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టికొట్టిన పరిస్థితిని కేసీఆర్ సృష్టించారన్నారు. ఆయన కుట్రతోనే ప్రాజెక్టులకు బొక్కలు.. రాష్ట్ర ప్రయోజనాలు తీర్చాల్సిన జలాలను కేసీఆర్ కుట్రపూరితంగా ఆంధ్రకు కట్టబెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు మంత్రులుగా పనిచేశారు. కేంద్రంలో కేసీఆర్‌తోపాటు నరేంద్ర మంత్రులుగా కొనసాగారు. అప్పట్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 44వేల క్యూసెక్కుల జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లే ప్రయత్నాలను టీఆర్ఎస్ మంత్రులు ఎందుకు అడ్డుకోలేదు? కేసీఆర్ లో పాయికారీ ఒప్పందాలతోనే తెలంగాణకు అన్యా యం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ము చ్చుమర్రికి నీటిని తరలించుకెళ్లేలా మరో టన్నెల్ ఏర్పాటు చేసుకునేందుకు కేసీఆర్ కారణమయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ప్రాజెక్టుతో రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకునేందుకు శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద బొక్కపెట్టారు. దానికి సంబంధించి 2020 మే 5న ఏపీ జీఓ 203ని కూడా తెచి్చంది. అప్పట్లో ప్రగతిభవన్‌కు వచి్చన ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ ఏకాంత చర్చల తర్వాతే ఆ జీఓ జారీ అయింది. ఆ ఏడాది ఆగస్టు 5న కృష్ణాబోర్డు సమావేశం ఉంటే కేసీఆర్ బిజీగా ఉన్నానంటూ వెళ్లలేదు. వెంటనే ఆ ప్రాజె క్టు టెండర్లు, కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత కమీషన్ల కోసం కుట్ర చేసిన వ్యక్తి కేసీఆర్. ఇలాంటి వ్యక్తి ప్రజా ఉద్యమాలు చేస్తానంటే ప్రజలే బుద్ధిచెప్తారు. తెలంగాణ వ చ్చాక కేసీఆర్ సీఎంగా, ఆయన అల్లుడు హరీశ్‌రా వు నీటిపారుదల, ఆర్థికశాఖల మంత్రిగా ఏమేం చేశారో అన్నింటినీ ప్రజల ముందు పెడతాం. వా రి ఘనకార్యాలన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. ప్రాజెక్టులను బోర్డుకు ఇచ్చే ప్రసక్తే లేదు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదు. కృష్ణా, గోదావరి నదులు పుట్టినచోటి నుంచి సముద్రంలో కలిసేవరకు ఉన్న ప్రాజెక్టులన్నింటిపై సమీక్షించి రాష్ట్రాల వారీగా నీటి వాటాలు తేల్చాలి. కేవలం ఏపీ, తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులతో ముడిపెట్టొద్దు. ఈ అంశంపై ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను కలసి వినతిపత్రాలు ఇచ్చాం. అది తేలేవరకు ప్రాజెక్టుల అప్పగింత మాటే ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి పనులు పూర్తిచేస్తాం..’’అని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. -
చర్చ పెట్టు..సమాధానమిస్తాం
వనస్థలిపురం (హైదరాబాద్), సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర విషయం లేదు గనకనే ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌కు ప్రతిసవాల్ చేశారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చపెట్టాలని.. దిమ్మతిరిగే సమాధానం చెప్తామని పేర్కొన్నారు. గతంలో తాము అసెంబ్లీలో చర్చ పెడితే ప్రిపేర్ కాలేదంటూ కాంగ్రెస్ తప్పించుకుందని.. ఇప్పుడు తాము అలా చేయకుండా ధైర్యంగా చర్చకు వస్తామని చెప్పారు. గత పదేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా తాము రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించలేదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని హస్తినాపురంలో, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం రేవంత్‌కు ఆలోచన లేక, అర్ధంకాక ఆగమాగమై మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి నీటి సమస్యను తీసుకువస్తున్నారని ఆరోపించారు. విభజన బిల్లులో పెట్టిందెవరు? ‘‘రాష్ట్ర విభజన సమయంలో.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? ఆ బిల్లును తయారుచేసింది మీ జైపాల్‌రెడ్డి, జైరాం రమేశ్ కాదా? అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు. దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే. పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని 30 రోజులు స్తంభింపజేశాం. నాడు టీడీపీలో ఉన్న రేవంత్ పోతిరెడ్డిపాడుపై ఏమాత్రం స్పందించలేదు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని వెంకయ్యనాయుడు ఉదయమే రేవంత్‌కు చెప్పారు. కానీ మధ్యాహ్నమే రేవంత్ చిల్లర మాటలు మాట్లాడారు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు. తాము మేం కృష్ణా నీటిలో 50శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే హైదరాబాద్‌కు మంచినీటి సమస్య వస్తుందని.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లకు సాగునీరు, తాగునీటి సమస్య నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే ఆరోపణలా? కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందని.. హామీలపై ప్రశ్నిస్తే పసలేని అంశాలతో ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. డిసెంబర్లోనే రూ.4వేలు పింఛన్ ఇస్తామని, ఫిబ్రవరి 1న గ్రూప్–1 నోటిఫికేషన్ ఇస్తామని, డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని డేట్లు పెట్టి.. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి ముక్కలవుతోందని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవని హరీశ్‌రావు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవనందున రాష్ట్రంలో హామీలను అమలు చేయడం కుదరడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి సాకు చెప్పబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరగబోతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
చంద్రబాబుకి మంత్రి కాకాని ఛాలెంజ్
-
దమ్ముంటే రా..చంద్రబాబుకు కేశినేని సవాల్
-
దమ్ముంటే నాపై పోటీ చెయ్ : కేశినేని నాని
గంపలగూడెం(తిరువూరు): చంద్రబాబునాయుడికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ ఎంపీ స్థానం నుంచి తనపై నిలబడి గెలవాలని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్టీమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల మ్యాంగో మార్కెట్లో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ మండల ఆత్మియ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చివరివని జోస్యం చెప్పారు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే, పేదలకు వ్యతిరేకంగా పాలన చేసిన ఘనుడు నారా చంద్రబాబునాయుడని అన్నారు. తన పుత్రరత్నం లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక అజెండాతో చంద్రబాబు ముందుకు పోతున్నారని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తినని చెప్పుకొనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఇల్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. అమరావతి పేరిట ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు నష్టం తెచ్చారన్నారు. రూ.2.60 లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసిన ఘనత దేశంలో ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అభ్యర్థుల డబ్బు చూసి చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. మండలంలో ప్రధాన సమస్య అయిన కట్టెలేరు వంతెన నిర్మాణానికి వచ్చే నెల 3వ తేదీన శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. తిరువూరు నియోజకవర్గంలో 10వేల మెజారిటీతో పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఓటు అడిగేహక్కు వైఎస్సార్ సీపీకి మాత్రమే ఉంది రాష్ట్ర ప్రజలకు 57 నెలలుగా మెరుగైన పాలన అందించిన వైఎస్సార్ సీపీకి మాత్రమే రోబోయే సాధారణ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. పార్టీ మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేసిన మంచిని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. తిరువూరు అభ్యర్థి ఎంపిక కోసం తలపట్టుకొంటున్నారు తనను వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన తర్వాత తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి కోసం వెతుకులాట ప్రారంభించిందని స్వామిదాసు అన్నారు. తనపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని పనిచేస్తానని చెప్పారు. ముందుగా అయోధ్యరామిరెడ్డి, కేశినేని నాని, స్వామిదాసు తోటమూలలో అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వినగడప పేరంటాళ్ళ గుట్ట వద్ద అచ్చం పేరంటాళ్ళకు పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎన్.సుధారాణి, ఎంపీపీ జి.శ్రీలక్ష్మీ, జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు దమ్ముందా ?..కేశినేని ఛాలెంజ్..
-
షర్మిలకు కాసు మహేష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
చంద్రబాబుకు అరకు టీడీపీ లీడర్ ఛాలెంజ్
-
యనమల బ్రదర్స్ కు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్
-
కమీషన్ తీసుకుంటే విచారణ చేయించండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో తాను కమీషన్ తీసుకున్నట్టు కొందరు ఆరోపిస్తున్నందున దానిపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదాయం ఎంతో, తన ఆదాయం ఎంతో విచారణకు సిద్ధమని ప్రకటించారు. బీజేపీలో తన ›ప్రస్థానం ఎలా మొదలైందో, రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందో ఎవరు ఏ రకంగా డబ్బు సంపాదించారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. ఎవరిపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో మొత్తం తెలంగాణ సమాజం ఎదుటే ఉందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కుటుంబంతో వ్యాపార భాగస్వామ్యం ఉన్నది కూడా ఎవరికో అందరికీ తెలుసునన్నారు. ’తాను కేసీఆర్‌కు బినామీ కాదు..తనపై ఆరోపణలు చేస్తున్న వారే కేసీఆర్‌కు బినామీలు’ అని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరర్థకంగా మారడంతో అందరూ బాధ పడుతున్నారని, దీనిపై న్యాయ విచారణతో పాటు సీబీఐ విచారణ జరిపించాలని తాను కోరితే కాంగ్రెస్ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు విషయం పక్కన పెట్టి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీఎం గతంలో ఎంపీగా కాళేశ్వరం అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సీబీఐకి లేఖ రాస్తున్నట్లు చెప్పారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నపుడు సీబీఐ విచారణకు లేని అభ్యంతరం సీఎం అయ్యాక ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరిట కాలయాపన చేసి కేసీఆర్‌ను కాపాడాలనుకుంటే తాను చేసేదేమీ లేదన్నారు. లంకె బిందెల కోసం వచ్చారా రేవంత్ లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, ఆయన లంకె బిందెల కోసం వచ్చారా అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మళ్ళీ ఫార్మా సిటీ ఉంటుందని చెప్పారని 15 రోజుల్లోనే ప్రభుత్వం ఎందుకు యూటర్న్ తీసుకుందనీ, అందులో మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఫార్మా కంపెనీల లాబీయింగ్‌కు లొంగిపోయారా అని నిలదీశారు. మోదీ మెడిసిన్ ప్రపంచానికే సంజీవని.. మోదీ మెడిసిన్‌కు కాలం తీరిపోయిందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు... ఆయన ఎప్పుడు ఆ మందు వేసుకున్నార’ని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మీ రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు ఆ మెడిసిన్ రిజెక్ట్ కాదు.. మోదీ మెడిసిన్ ప్రపంచానికే సంజీవని’’ అని వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ. ఆ పార్టీ అవసరం తెలంగాణకు లేదు, లోక్‌సభ ఎన్నికల్లో చిచాణా ఎత్తేయడం ఖాయం’’ అని అన్నారు. అభయ హస్తం పేరుతో ప్రజల్లో గందరగోళం ‘అభయ హస్తం పేరుతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఆ ఫారం నింపడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.. కాలయాపన కోసమే ఇదంతా. ఇందులో రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదు. ఫార్మ్స్ బ్లాక్‌లో కొనుక్కోవాల్సి వస్తుంది. దరఖాస్తు అవసరం లేకుండానే ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఇవ్వలేదు... ఆ విషయం తెలిసి కూడా దరఖాస్తులకు రేషన్ కార్డ్ జత చేయమనడం ఎందుకు? లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధికోసమే ప్రజలను తమచుట్టూ తిప్పుకుని ఇబ్బందిపెడుతున్నారు’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రా యాలని, 48 గంటల్లో తాను కేంద్రం నుంచి అను మతి తెస్తానని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధి చాటుకోవాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య దోస్తీ లేదని నిరూపించుకోవాలని అన్నారు. న్యాయ విచారణతో పాటు సీబీఐ దర్యాప్తుతో ఫలితాలు వేగంగా వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. విపక్షంలో ఉన్నపుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కేవలం న్యాయవిచారణ జరిపిస్తామనడం అనేక అనుమానాలకు తావిస్తోందని మంగళవారం మీడి యాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు తాత్సారం? బీఆర్ఎస్ సర్కార్ అతిపెద్ద అవినీతి స్కాం కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని, ఎందుకు తాత్సారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం విషయంలో కేంద్రంతో పాటు ప్రధాని మోదీపై, తనపై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచి్చనట్టుగా విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు జరిపి దోషులను శిక్షించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? లేదా? స్పష్టం చేయాలన్నారు. అవగాహన నేపథ్యంలో సానుభూతి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి బొటాబోటీ మెజారిటీతో తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా ఉండడంతో ప్రస్తుత సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ల మధ్య ఎంఐఎం మధ్యవర్తిత్వంతో అవగాహన ఏర్పడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్‌కు సాను భూతి ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. తామిద్దరం చే సేది దోపిడీయేనని, తమ డీఎన్ఏ ఒకటేననే అభి ప్రాయంతో కాంగ్రెస్ ఉందని వ్యాఖ్యానించారు. మే డిగడ్డ సందర్శన సందర్భంగా రాష్ట్ర మంత్రులు పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్లకే పరిమితమయ్యారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారని, దీని కోసం ఖర్చు చేసిన రూ.లక్ష కోట్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 17 ఎంపీ స్థానాలకు పోటీ ఫిబ్రవరి 28న లేదా మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలోని 17 స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుందని, జనసేనతో పొత్తు ఉండకపోవచ్చునని అన్నా రు. జనసేన ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామిగా ఉందని, ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు విషయమై చర్చ జరగలేదని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి కేంద్రం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ నెల 17న సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానుందని, ఆ లోగానే కేంద్రం అఫిడవిట్‌ను సమర్పిస్తుందని చెప్పారు. -
రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడైనా ఉందా ?
-
మీ ముగ్గురికీ శంకరగిరిమాన్యాలే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్ ఓడిపోవడం ఖాయమని.. వారికి శంకరగిరిమాన్యాలు తప్పదని, పవన్‌కళ్యాణ్‌ది కూడా అదే పరిస్థితి అని మంత్రి అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ దెబ్బకు చంద్రగిరిలో చంద్రబాబు ఓడి కుప్పం పారిపోయాడని.. అలాగే, వైఎస్ జగన్ దెబ్బకు మంగళగిరిలో లోకేశ్, రెండుచోట్ల దత్తపుత్రుడు పవన్ చిత్తుచిత్తుగా ఓడిపోయి రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం అంత సీన్ ఉంటే 175 సీట్లలో సింగిల్‌గా పోటీచేయగలరా? అని సవాల్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. బాబు మతిస్థిమితం కోల్పోయారు.. జగన్ ఒక్కడిపై అందరూ ఎందుకు గుంపుగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు? జనసేనతో జతకట్టి చంద్రబాబు ఎందుకు ఎన్నికలకు వస్తున్నారు? రాజమండ్రి జైలుకు వెళ్లొచ్చాక చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారు. అందుకే వైఎస్సార్సీపీ అభ్యర్థుల మార్పుపై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్‌పైనా, ప్రభుత్వంపైనా పిచ్చి విమర్శలు ఎన్నిచేసినా చంద్రబాబుకు మళ్లీ ఓటమి ఖాయం. ఈసారి టీడీపీ, జనసేనల ఉనికి ఉండదు. ఆ దిశగానే మా పార్టీ వ్యూహరచన చేస్తోంది. వైఎస్ జగనే మళ్లీ సీఎం కావాలని 60 శాతానికి పైగా ప్రజలు కోరుకుంటున్నారు. వారే మా పార్టీకి బలం. 175 సీట్లు గెలవడమే మా టార్గెట్. పార్టీ గెలుపే ధ్యేయంగా కొన్ని సీట్లు మార్పులు జరుగుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. నిజానికి.. చంద్రబాబు ఏనాడైనా ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకున్నారా? ఆయన కేవలం ప్రైవేట్ స్కూళ్లకు మాత్రమే రాచబాట వేశారు. అలాగే, ఒక్కసారైనా పేదలకు ఇళ్ల పట్టాలిచ్చారా? కానీ, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు వైఎస్ జగన్. టీడీపీ దిగజారిపోయిన పార్టీ. ఎన్నికల తర్వాత ఆ పార్టీ భూస్థాపితమే. పవన్‌కు ఎన్ని సీట్లు ముష్టి వేస్తారు బాబు? పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు అసలు ఎన్ని సీట్లు ముష్టి వేయాలనుకుంటున్నారు? అలాగే, పవన్ ఎన్ని సీట్లు తీసుకోవాలనుకుంటున్నారు? పవన్ ఏమైనా పదేళ్లకు కాంట్రాక్టు మాట్లాడుకున్నారా? గతంలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీచేసి అధికారంలోకి వచ్చినప్పుడు, కాపాడిన రాష్ట్ర భవిష్యత్తేంటో వాళ్లు చెప్పాలి. అధికారంలోకి రాగానే ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఇద్దరిదీ కలహాల కాపురం అని తేలిపోయింది. వాళ్లిద్దరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్లీ ఇప్పుడు కలుస్తామంటున్నారు. అలాగే, మోదీని విమర్శించిన చంద్రబాబు మళ్లీ బీజేపీతో కలుద్దామనుకుంటున్నారు. పోలవరాన్ని నాశనం చేసింది బాబే.. ఇక పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబే. దీనిపై ఆయనతో ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం. అంకెల గారడీతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రిటైర్మెంట్ ఖాయం. టీడీపీ, జనసేన రెండు పార్టీలను కాలగర్భంలో కలిపేస్తాం. -
మెజారిటీ రాదు.. ఒట్టు.. బీఆర్ఎస్ కౌన్సిలర్ చాలెంజ్
రామాయంపేట(మెదక్): ఎన్నికల నేపథ్యంలో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని చాలెంజ్ చేసిన ఇదే పార్టీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు గుండు కొట్టించుకున్న ఉదంతమిది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పరిశీలకులు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి పార్టీ పరంగా సర్వేలో భాగంగా కౌన్సిలర్ల అభిప్రాయాలు సేకరించారు. ఈ మేరకు చైర్మన్ జితేందర్‌గౌడ్‌తోపాటు కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని, కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ వస్తుందని, తాను స్వయంగా పట్టణంలో పర్యటించగా ఈ విషయం తెలిసిందని 8వ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్ పరిశీలకుడితో వాగ్వాదం చేశారు. ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో మెజారిటీ వస్తే తాను గుండు కొట్టించుకొని గడ్డం, మీసాలు తీసి వేస్తానని చాలెంజ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందని తెలుసుకున్న సదరు కౌన్సిలర్ గంగాధర్ అన్న మాటను నిలబెట్టుకున్నారు. -
మంకీ డ్యాన్స్ చాలెంజ్
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్‌లు వస్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందడి ఇంటర్నెట్కే పరిమితం కావడం లేదు. బయట రకరకాల ఫంక్షన్లలో నృత్యాభిమానులు ఈ ట్రెండింగ్ డ్యాన్స్‌లను ఫాలో అవుతున్నారు. ‘గాంగ్నమ్’ డ్యాన్స్ తరువాత రకరకాల డ్యాన్సులు వచ్చాయి. తాజాగా ‘మంకీ డ్యాన్స్ చాలెంజ్’ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమ సనా షేక్ ‘నేను సైతం’ అంటూ ఈ చాలెంజ్‌ను స్వీకరించింది. పింక్ శారీలో మెరిసిపోతూ తన బృందంతో కలిసి చేసిన మంకీ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘దిస్ ఈజ్ అమేజింగ్’లాంటి కామెంట్స్‌తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. కొత్త స్టైల్లో డ్యాన్స్ ట్రై చేయాలనుకుంటున్నావారికి ఈ వీడియో బెస్ట్ ఛాయిస్. -
తొలిసారి అలాంటి సీన్ చేశా!
‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్‌గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. ∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్లో తమిళంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలకు క్రేజ్ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్’లో శ్రీకాంత్‌గారు, నేను పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ. పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్‌లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్తో ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నాను. -
నన్ను గెలిపించండి పనిచేయకపోతే ఈ చెప్పుతో కొట్టండి
-
ప్రమాణం చేద్దామా?.. దామచర్లకు బాలినేని సవాల్
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో జరిగే అన్ని మీటింగ్‌లకు నన్ను పిలిచారని, మీడియా వాళ్లు అనవసరంగా ప్రతీది రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కి అబద్ధాలు మాట్లాడటం అలవాటు. కాంట్రాక్టర్ల దగ్గర ఎవరు డబ్బులు తీసున్నారో ప్రమాణం చేద్దామా?. చీము, నెత్తురు, సిగ్గు ఉంటే నా ఛాలెంజ్‌కు స్పందించు’’ అంటూ సవాల్ విసిరారు. కొత్తపట్నం బ్రిడ్జి మెటీరియల్ కొనుగోలుకు నేను రూ.40 లక్షలు ఇచ్చా. నోటికి వచ్చినట్లు మాట్లాడితే పద్దతిగా ఉండదు’’ అని బాలినేని హెచ్చరించారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? -
అయోధ్య భద్రత ఒక సవాలు: సీఆర్పీఎఫ్
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయంలో భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన మౌలిక సదుపాయాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 27 ఎకరాల్లో అభివృద్ధి చేసిన క్యాంప్‌ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ సత్యపాల్ రావత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలు తెలియజేశారు. రామ మందిర నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని, అది ఇక్కడ పనిచేసే భద్రతా బలగాలకు సవాల్‌గా మారుతుందని సత్యపాల్ తెలిపారు. అయోధ్యలో పలు భద్రతా సంస్థలు పనిచేస్తున్నాయని, వీటిలోని సిబ్బంది మధ్య ఎంతో సమన్వయం ఉందన్నారు. భద్రతా పరంగా ఇక్కడ నూతన ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా భద్రతకు ఉపయుక్తమయ్యే ఆధునిక పరికరాలు కూడా తీసుకురానున్నామన్నారు. అయోధ్యలో భద్రత గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఆర్పీఎఫ్ అన్నివేళలా, అన్ని పరిస్థితుల్లో సన్నద్ధంగా ఉంటుందన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మళ్లీ హింస: నలుగురి అపహరణ, కాల్పుల్లో ఏడుగురికి గాయాలు! -
తుమ్మలపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
-
‘కృత్రిమ మేథ’తో రసాయన దాడులు? ‘ఛాలెంజ్’ స్వీకరించిన ‘ఓపెన్ ఏఐ’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ముడిపడిన విస్తృత నష్టాలను అంచనా వేయడానికి, తగ్గించడానికి ఓపెన్ ఏఐ బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ బెదిరింపులు, వ్యక్తిగత ఒప్పందాలు, సైబర్ సెక్యూరిటీ, అటానమస్ రెప్లికేషన్తో సహా సంభావ్య ఏఐ బెదిరింపులపై ఈ బృందం దృష్టి సారించనుంది. అలెగ్జాండర్ మాడ్రీ నేతృత్వంలోని ఈ బృందం.. ఏఐని ఉపయోగించుకుని ఎవరైనా చేసే కుట్రపూరిత చర్యలకు అడ్డుకట్ట వేసే పనిని ప్రారంభించింది. అలాగే ఏఐ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల కలిగే నష్టాలను పరిశోధిస్తుంది. ఇటువంటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఓపెన్ ఏఐ ఒక ఛాలెంజ్ కూడా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో ఉత్తమంగా నిలిచిన వాటికి ఏపీఐ క్రెడిట్‌తో పాటు 25 వేల డాలర్లు(ఒక డాలర్ రూ.83.15) అందించనున్నట్లు ప్రకటించింది. చాట్ జీపీటీ తరహా సాంకేతికతను అభివృద్ధి చేసే ఓపెన్ ఏఐ ఇప్పుడు ఏఐతో ఏర్పడే ముప్పును అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది. ఇటీవలే దీని గురించి వెల్లడించింది. దీని ప్రధాన లక్ష్యం ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే భారీ ముప్పులపై అధ్యయనం చేయడం, అంచనా వేయడం, తగ్గించడం. గత జూలైలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తలెత్తే ముప్పును అరికట్టేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ సూచించింది. కృత్రిమ మేధస్సుతో ముడిపడిన ఏఐ వ్యవస్థలు ఏదో ఒక రోజు మానవ మేధస్సును అధిగమించవచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే ఓపెన్ ఏఐ.. కృత్రిమ మేథలో తలెత్తే ముప్పును నివారించే దిశగా ముందడుగు వేస్తోంది. ఈ నేపధ్యంలో 2023 మే నెలలో ఈ సంస్థ.. ఏఐతో కలిగే ముప్పును ప్రస్తావిస్తూ, ఒక బహిరంగ లేఖను ప్రచురించింది. కృత్రిమ మేథస్సుతో కలిగే నష్టాలను ప్రపంచ స్థాయిలో తీవ్రంగా పరిగణించాలని ఆ లేఖలో ఓపెన్ ఏఐ కోరింది. ఇది కూడా చదవండి: ఖతార్‌లో అత్యాచారానికి ఏ శిక్ష విధిస్తారు? -
కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చేయాలి
కొడంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం ఆయన కొడంగల్‌కు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి నివాసానికి వెళ్లి దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులకు జమ్మి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తన నివాసానికి చేరుకొని అభిమానులు, పార్టీ శ్రేణులతో ముచ్చటించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన అన్ని ప్రభుత్వ భవనాలను తానే మంజూరు చేయించినట్లు చెప్పారు. 2018లో పోలీసులను అడ్డు పెట్టుకొని తనను ఓడించారని, ఇప్పుడు కూడా పోలీసుల సాయంతో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌కు కేసీఆర్ అన్యాయం అన్ని విషయాల్లోనూ సీఎం కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గానికి అన్యాయం చేశారని రేవంత్ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి సాగునీరు తెచ్చి రైతుల కాళ్లు కడుతానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ ఊసేలేదని మండిపడ్డారు. కొడంగల్‌ను కేసీఆర్ రెండు ముక్కలు చేసి పాలనాపరమైన ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. ఉద్యోగులంతా ఏకమై కేసీఆర్‌ను ఇంటికి పంపాలని రేవంత్ పిలుపునిచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు నెలకు రూ.4 వేలు ఇస్తామని, కేసీఆర్ చేసిన రుణమాఫీ బ్యాంకుల మిత్తీకి కూడా సరిపోలేదన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గంలోని 8 మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆర్థిక నేరగాళ్లను ప్రజలు సపోర్ట్ చేయరు..!
-
అక్కడికి రా.. ప్రమాణం చేద్దాం?.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ నిర్ణయాలు కాపీ కొట్టడంలో కేసీఆర్ బిజీబిజీ అయ్యారు.. మా అభ్యర్థులను ప్రకటించే దాకా కేసీఆర్ బీఫారం లు ఇవ్వలేదు’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేం 55 మందిని ప్రకటిస్తే కేసీఆర్ 51 మందికే బీ ఫామ్‌లు ఇచ్చారు. కేసీఆర్ లాగా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. మేం ఇచ్చిన హామీలన్నీ ఆచరణకు సాధ్యమే’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సాధ్యమేనని కేసీఆర్ రాజముద్ర వేశారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్లకే కొంత డబ్బులు పెంచారు. మా గ్యారెంటీ స్కీమ్ చూసి కేసీఆర్ పెద్ద లోయలో పడిపోయారు. కేసీఆర్‌కి ఆలోచన చేసే శక్తి తగ్గిపోయింది. కేసీఆర్ ఇప్పుడు పరాన్నజీవి’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలను కేసీఆర్ తన మేనిఫెస్టోలో పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పైసా ఇవ్వకుండా, మందు పోయకుండా ప్రజల్లోకి వెళ్దామా?. 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నువ్వు, నేను ప్రమాణం చేద్దామా? అంటూ రేవంత్ సవాల్ విసిరారు. ‘‘నవంబర్ నెల 1వ తేదీన పెన్షన్లు, జీతాలు వేస్తే కేసీఆర్‌ను ప్రజలు నమ్ముతారు. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లో వేసినట్టు పాత అంశాలను మేనిఫెస్టోలో పెట్టారు. మేం పొగ పెడితే బొక్కలో ఉన్న ఎలుక బయటకి వచ్చింది. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్.. కేసీఆర్ ఎక్పైరీ డేట్ అయిపోయింది. కేసీఆర్ ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటే మంచిది’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే.. -
‘చమురు’ ధరలు ముంచేస్తాయి.. భారత్ హెచ్చరిక!
న్యూఢిల్లీ: అధిక చమురు ధరలు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం చూపుతాయని భారత్ హెచ్చరించింది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ సంక్షోభం పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. భారత్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఆర్థిక సేవల సంస్థ– కేపీఎంజీ ఫ్లాగ్షిప్ ఇన్నోవేషన్ అండ్ ఎనర్జీ 14వ ఎడిషన్– ఎన్రిచ్ 2023 కార్యక్రమంలో చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ, ఇజ్రాయెల్–హమాస్ సైనిక సంఘర్షణను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ‘సప్లై చైన్’పై ఈ ‘ఘర్షణ’ ప్రభావం పడలేదని అన్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య సైనిక ఘర్షణల తరువాత చమురు ధరలు సోమవారం బ్యారెల్‌కు దాదాపు 3 డాలర్లు పెరిగాయి. అయితే సరఫరా అంతరాయాలపై ఆందోళనలు అక్కర్లేదన్న వార్తలతో కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు. ముడి చమురు ధరలు పెరిగితే అది ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ప్రయత్నాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్లోబల్ మార్కెట్లు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయని నేను భావిస్తున్నాను. సరఫరా మార్గాలకు అంతరాయం కలగకపోతే, భారత్ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తుందని భావిస్తున్నాను. పెరుగుతున్న జనాభా, క్షీణిస్తున్న వనరులు, పర్యావరణ క్షీణత, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరల వంటి అన్ని అంశాలు ప్రస్తుత ప్రపంచం ముందు సవాళ్లుగా ఉన్నాయి. భారత్ ఇంధన డిమాండ్ విపరీతంగా వృద్ధి చెందుతోంది. భవిష్యత్ ఆర్థిక వృద్ధిలో ఇంధనం కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే.. భారత్ చమురు వినియోగంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం. మూడవ అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారు. నాల్గవ అతిపెద్ద ఎన్ఎన్జీ దిగుమతిదారు, నాల్గవ అతిపెద్ద రిఫైనర్. నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కలిగి ఉన్న దేశం. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ వృద్ధిలో భారత్ 25 శాతం వాటాను కలిగి ఉంటుంది. 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్! భారత్ 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతనూ చక్రవర్తి తెలిపారు. బలమైన వినియోగం, ఎగుమతులు ఇందుకు దోహదపడతాయని ఆయన విశ్లేషించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి దాదాపు 6.3 శాతంగా, ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా చూస్తే, జీడీపీ వృద్ధి రేటు దాదాపు 12 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ తరహా వృద్ధి వేగం కొన్నాళ్లు కొనసాగితే, 2045–50 నాటికి 21,000 డాలర్ల తలసరి ఆదాయంతో భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’’ అని కేపీఎంజీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అన్నారు. -
ఓట్ల పండుగ.. రూ.కోట్లు పిండేద్దాం
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ గతేడాది నుంచి ప్రత్యేక సందర్భాల్లో ‘చాలెంజ్’పేరుతో సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. గత దసరా, దీపావళి సమయాల్లో ఫెస్టివల్ చాలెంజ్, ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు వంద రోజుల చాలెంజ్‌లను నిర్వహించింది. ఇప్పుడు దసరా, దీపావళి, కార్తీకమాసం, శబరిమలై అయ్యప్ప దర్శనం, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతిలను పురస్కరించుకుని అక్టోబరు 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 16వరకు ‘100 రోజుల చాలెంజ్’ను నిర్వహిస్తోంది. ఆయా సందర్భాల్లో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించేలా చూడటంతోపాటు, వీలైనన్ని ఎక్కువ బస్సులను రోడ్కెక్కించటం, ఎక్కువ కిలోమీటర్లు తిప్పటం లక్ష్యం. ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భాల జాబితాలో ఎన్నికలు కూడా చేరాయి. ఈమేరకు అన్ని డిపోలకూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల సమయంలోఏం చేస్తారంటే? ♦ ఎన్నికల సభలకు అద్దెకు బస్సులు: ప్రచారంలో రాజకీయ పార్టీలకు బహిరంగసభలు కీలకం. ఆ సభలకు జనాన్ని తరలించేందుకు వాహనాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ ఎక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయో ముందుగానే తెలుసుకుని ఆ సభలకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు బుక్ అయ్యేలా చూడాలి. ♦ నగరంలో ఏ ప్రాంత ప్రజలు ఎక్కడో గుర్తింపు: నగరంలో ఉండే ఓటర్లలో చాలామంది ఓటు హక్కు వేరే నియోజకవర్గాల్లో ఉంటుంది. పోలింగ్ రోజు వారు ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఏ నియోజకవర్గం ఓటర్లు నగరంలోని ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారో గుర్తించాలి. వారిని సొంత నియోజకవర్గాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకునేలా ఆయా నియోజకవర్గ నేతలతో మాట్లాడి ఒప్పించాలి. ♦ ప్రచార సామగ్రి కోసం బస్సులు: ప్రచారంలో కీలకమైన సామగ్రిని తరలించేందుకు నేతలు వాహనాలను బుక్ చేసుకుంటారు. ఆర్టీసీ బస్సులను అందుకు బుక్ చేసేలా వారితో మాట్లాడి ఒప్పించాలి. ♦ ఓటర్లూ బస్సులే ఎక్కాలి: వేరే ప్రాంతాల్లో ఉండే ఓటర్లు పోలింగ్ రోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ప్రాంతానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులనే ఎ క్కేలా చూడాలి. ఇందుకు ప్రచారం చేయటంతోపాటు, కీలక పాయింట్ల వద్ద స్టాఫ్ ఉండి దీనిని సుసాధ్యం చేయాలి. ♦ ఈవీఎంలు, సిబ్బంది తరలింపునకు బస్సులు: పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల తరలింపునకు ఎన్నికల సంఘం వాహనాలను బుక్ చేసుకుంటుంది. అందుకు ఆర్టీసీ బస్సులే బుక్ అయ్యేలా చూడాలి. గతేడాది దసరా, దీపావళి సమయాల్లో ఆర్టీసీ రూ.1360.69 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎన్నికల నేపథ్యంలో ఈసారి గతేడాది కంటే కనీసం 10 శాతం ఆదాయం పెరగాలన్నది సంస్థ లక్ష్యం. -
పవన్ కల్యాణ్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
-
మెగా పొలిటికల్ బ్రోకర్ పవన్ కళ్యాణ్ కు కైకలూరు ఎమ్మెల్యే ఛాలెంజ్
-
కేటీఆర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్
-
పవన్, లోకేష్ కు అనిల్ కుమార్ ఛాలెంజ్..
-
24 గంటల కరెంటు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మోసం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టాడని, ఆయన హామీ నమ్మి లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే ఎండిపోతున్నాయని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి 14 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు తాను సవాల్ విసురుతున్నానని, ఏ సబ్‌స్టేషన్ వద్దకు రమ్మంటారో చెపితే వస్తానని, అక్కడ 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండే ఈ నెలరోజుల పాటైనా రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎన్ని స్కీములు పెట్టినా జనం నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తమ కాంగ్రెస్ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూసేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తానంటే ప్రత్యేక విమానం పెట్టి తీసుకెళ్తామని, మంత్రివర్గం వచి్చనా ఫర్వాలేదన్నారు. పథకాల అమలును వివరించేందుకు సీఎం కేసీఆర్ రావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహా్వ నించాలని కోరుతానని చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్లోకే రూ.60 కోట్లు దళిత బంధు పథకానికి సంబంధించిన ఒక్క తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్లోకే రూ. 60 కోట్లు వెళ్లాయని కోమటిరెడ్డి ఆరోపించారు. దళితబంధులో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ముతోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయవచ్చని చెప్పారు. అధికారంలోకి వచి్చన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీ స్కీంలను అమలు చేస్తామనీ, అమలు చేయలేకపోతే దిగిపోతామన్నారు. బాబు అరెస్టు ఎపిసోడ్ ఫాలో కావడం లేదు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్‌ను తాను ఫాలో కావడం లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యా నించారు. టీవీ చూస్తున్నప్పుడు ఆ వార్తలు వస్తు న్నా చానల్ మారుస్తున్నానని, తమ బాధలు తమకున్నాయని, తెలంగాణలో అధికారం దక్కించుకోవడమెలా అనే దానిపైనే దృష్టి పెట్టినట్లు చెప్పా రు. తాను 30 స్థానాల్లో గెలిపించడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు ఎలా తీసుకురావాలన్న దానిపైనే ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లోకి చేరికలపై మాట్లాడుతూ పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట మాట్లాడబోనని, వచ్చే నెల 1న ఢిల్లీలో జరిగే సమావేశంలోనే అన్ని విషయాలను మాట్లాడుతానని వెల్లడించారు. -
దమ్ముంటే హైదరాబాద్ లో పోటీ చేయండి..రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్
-
సుప్రీంకోర్టులో కృష్ణమోహన్‌రెడ్డికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టులో ఎందుకు వాదనలు వినిపించలే దని ధర్మాసనం కృష్ణమోహన్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సుందరాన్ని ప్రశ్నించింది. పిటిషనర్ సంతకం ఫోర్జరీ చేసి నోటీసులు అందినట్లు హైకో ర్టును మభ్యపెట్టారని, తామెక్కడా వివరాలు దాచ లేదని సుందరం తెలిపారు. అఫిడవిట్లో ఫిక్స్డ్ డిపాజిట్లు అని మాత్రమే ఉందని, సేవింగ్స్ ఖాతా ల గురించి కాదన్నారు. అయితే, సేవింగ్స్ ఖాతాల గురించి వెల్లడించకపోవడం తప్పేనని తెలి పారు. మొత్తం ఆరు ఖాతాలకు సంబంధించి వివా దం చేశారని అందులో తొలి మూడు వివాదరహిత మని చెప్పారు. వివాదాస్పద రూ.1.80 కోట్లు వ్యవ సాయ భూమికి సంబంధించినవని, ఎన్నికలకు ముందుగానే ఆ భూమి అమ్మి వేసినట్లు వివరించారు. ఎన్నికల చట్టాలకు సంబంధించి అన్ని ఖాతాల వివ రాలు వెల్లడించాల్సిందేనని డీకే అరుణ తరఫు సీని యర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తెలిపారు. డీకే అరుణను ఎమ్మె ల్యేగా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫి కేషన్ ఇచ్చినట్లు ధర్మాస నం దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఎన్నికల సంఘం, ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ వీలైనంత త్వరగా ఇవ్వాలని రవిశంకర్ కోరగా విచారణ నాలుగు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. వెన్నుపోటు రాజకీయాలు: కృష్ణమోహన్‌రెడ్డి ప్రజా క్షేత్రంలో గెలవలేకనే ఫోర్జరీ సంతకాలతో వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే కావాలని డీకే అరుణ చూస్తున్నారని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కృష్ణమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు నోటీసులు అందలేని అందుకే హైకోర్టుకు వెళ్లలేదన్నారు. తన సంతకం ఫోర్జరీ చేశారని తెలిసి తమ వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థించినా వినలేదన్నారు. ఎన్నికలకు ముందుగానే కొన్ని భూములు విక్రయించానని, వివరాలు అఫిడవిట్లో చూపాల్సిన అవసరం లేదన్నారు. -
15– 20 గంటల కరెంట్ నిరూపిస్తే రాజీనామా
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): రాష్ట్రమంతటా విద్యుత్ కోతలు ఉన్నాయని, ఎక్కడైనా 15–20 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ చేశారు. విద్యుత్ కోతలపై వివరాలు తెలుసుకునేందుకు తాము భువనగిరి పరిధిలోని ఓ సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ను తీసుకుంటే, ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్స్టేషన్లలోని లాగ్ బుక్‌లను తీసేసుకుందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులను నమ్ముకున్నారని, తాము మాత్రం ప్రజలను నమ్ముకున్నామని చెప్పారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలలో రహదారులు మాత్రమే అభివృద్ధి చెందాయని, ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదని కోమటిరెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని బతకలేని తెలంగాణగా మార్చారన్నారు. ఎన్నికల కోసం దళితబంధు, బీసీ బంధులను ప్రకటిస్తూ సొంత పారీ్టకి చెందిన వారి కుటుంబసభ్యులకే లబ్ధి చేకూరుస్తున్నారని, ఈ బంధులతో కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని చెప్పారు. హోంగార్డు రవీందర్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కాంగ్రెస్‌లో అసంతృప్తి లేదు కాంగ్రెస్‌లో ఎలాంటి అసంతృప్తి లేదని కోమటిరెడ్డి అన్నారు. పదవులు తనకు కొత్తకాదని వ్యాఖ్యానించారు. 17న కొంగరకలాన్‌లో జరిగే కాంగ్రెస్ సభలో కర్ణాటక తరహాలో ఐదు గ్యారంటీ పథకాలను సోనియాగాంధీ ప్రకటించనున్నట్లు తెలిపారు. -
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్/కంటోన్మెంట్: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చినట్టు నిరూపిస్తే, తాను ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. రైతాంగానికి నిరంతర విద్యుత్ ఇస్తున్నట్టు అబిడ్స్ చౌరస్తాలో, సచివాలయంలో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాను ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.గురువారం ఈటల మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ది అబద్ధాల ప్రభుత్వమనీ, చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం లేదని మండిపడ్డారు. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల రైతన్నలు అప్పులపాలయ్యారనీ, రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల బకాయిలు ఎగ్గొట్టే వారనే ముద్ర తెలంగాణ రైతుల పైన పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హోంగార్డులకు సీఎం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈటల డిమాండ్ చేశారు. ఆసరా పింఛన్ల మంజూరు, కొత్త కేటాయింపు అంశాల్లో సంబంధిత పీఆర్ మంత్రికే ప్రమేయం లేకుండా పోయిందని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను గద్దె దింపుతాం 40 నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న ముదిరాజ్‌లకు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా వారిని అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామని ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ తొలిమేయర్, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకుడు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 130 వ జయంతి సందర్భంగా జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. కృష్ణస్వామి హైదరాబాద్ ప్లాన్ ఇచ్చిన మేధావి, రచయిత, కవి అని కొనియాడారు. ప్రొఫెసర్ గాలి వినోద్, బండ ప్రకాశ్ ముదిరాజ్, కేంద్ర మాజీ మంత్రి సర్వేసత్యనారాయణ, బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటమి ఒప్పుకున్నకేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఈ విషయం స్పష్టమైందని అన్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో ముఖ్యమంత్రి గొంతులో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని, ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి రెండింటిలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మొత్తం సిట్టింగులకు సీట్లివ్వాలన్న తన సవాల్‌ను స్వీకరించకుండా కొందరిని మార్చారని అన్నారు. సోమవారం గాందీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీలను అవమానించడమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్పిన మాటలు నిజమయ్యాయని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ జాబితా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలిపోయిందని, మూడింట రెండొంతుల మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది..కానీ ఒక మైనారిటీ నేత బరిలో ఉన్న కామారెడ్డికి వెళ్లడం.. మైనారిటీలను అవమానించడమే. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎనలేని సేవ చేశారు. కాంగ్రెస్ అంతా షబ్బీర్ అలీకి అండగా ఉండి కేసీఆర్ పని పడుతుంది. అసలు కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు వెళ్లకుండా కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి..’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓటమి సూర్యాపేట సభలోనే స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 12.03 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరగగా, ఆ సమయంలో లిక్కర్ షాపుల డ్రా తీశారని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలని అన్నారు. రుణమాపీలో రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారు రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 వరకు మాత్రమే రుణమాఫీ చేసి రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారని ఆరోపించారు. ఒక్క రూపాయే తేడా అని అందరూ అనుకుంటున్నారు కానీ.. దానివల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే పూర్తి రుణమాఫీ జరిగిందని రేవంత్ చెప్పారు. రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200కు పెంచింది కాంగ్రెస్సేనన్నారు. ‘50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ అంటున్నారు. నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా? 12,500 గ్రామ పంచాయతీలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? చింతమడకలో బడి కట్టింది, ముఖ్యమంత్రి ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్సే. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్..’అని స్పష్టం చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధమని ప్రకటించారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసేశారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రూ.4 వేల పెన్షన్ ఇస్తుందని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రగతి భవన్ గోడలమీద రాసుకోవాలని సవాల్ విసిరారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా, తర్వాత పది రోజులకు పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని విమర్శించారు. సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి కేసీఆర్ అవమానించారని అన్నారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసి పారేశారని ధ్వజమెత్తారు. మోసానికి గురైన కమ్యూనిస్టులు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలని అన్నారు. పార్టీ లో చేరికలు బాన్సువాడ, వర్ధన్నపేట, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు సోమవారం గాందీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!
మనసు దోచే దోసె గురించి ఎంత చెప్పినా తక్కువే. దోసె ప్రియుల కోసం సరికొత్త ‘ఫుడ్ చాలెంజ్’ ముందుకు వచ్చింది. ‘ఆరడుగుల పొడవు ఉన్న దోసెను ఒక్క సిట్టింగ్‌లో తినగలరా?’ అనే సవాలు విసురుతుంది ఈ ఫుడ్ చాలెంజ్. విజేత పొట్టశ్రమ వృథా పోదు. పదకొండు వేల రూపాయలను నగదు బహుమతిగా ఇస్తారు. పాపులర్ బ్లాగర్స్ వాణి, సావిలు ‘సమ్‌వన్ హు కెన్ ఫినిష్ దిస్?’ ట్యాగ్‌తో పోస్ట్ చేసిన ‘ఫుడ్ చాలెంజ్’ 5.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఢిల్లీలోని పాపులర్ రెస్టారెంట్ ‘దోసె ఫ్యాక్టరీ’లో ఈ ఆరు అడుగుల దోసెను తయారు చేయడంతోపాటు షూట్ చేశారు. మూడు రకాల మసాలాలు, నెయ్యితో తయారు చేసిన ఈ మెగా దోసెకు సాంబార్, చట్నీ, రవ్వ కేసరి కాంబినేషన్లుగా ఉంటాయి. ‘టైమ్ లిమిట్ లేకపోతే ఈజీగా లాగించవచ్చు’ అని కొందరు నెటిజనులు స్పందించారు. (చదవండి: ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!) -
పాపులారిటీ కోసం పాకులాడింది.. ప్రాణాలు మీదకు తెచ్చుకుంది..
టొరంటో: టిక్ టాక్ ఛాలెంజ్ పేరుతో కెనడాకు చెందిన ఒకమ్మాయి రోజుకు నాలుగు లీటర్ల చొప్పున తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంది. 12 రోజుల పాటు ఇలా రోజుకు 4 కంటే ఎక్కువ లీటర్లు తగ్గటంతో చివరి రోజున ఆమెకు కొంత అసౌకర్యంగా అనిపించి డాక్టరును సంప్రదించింది. డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి శరీరంలో సోడియం స్థాయిలు బాగాతగ్గిపోయాయని తెలిపారు. మరి కొంచెముంటే ప్రాణాపాయమేనని తెలిపారు. అదోరకం వెర్రి.. సొషల్ మీడియాలో క్రేజ్ కోసం జనం ఎంతగా వెంపర్లాడుతూ ఉంటారంటే తొందరగా స్టార్లు అయిపోయి చేతికందినంత సంపాదించుకోవాలి. ఎక్కడికెళ్లినా కూడా జనం వారిని గుర్తించాలి. ఇదొక్కటే వారికున్న లక్ష్యం. ఈ క్రమంలో ఎలాంటి పిచ్చి పని చేయడానికైనా వెనకాడరు. తాజాగా కెనడాలో వైరల్ గా మారిన ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ ఒకమ్మాయిని దాదాపుగా చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళింది. 75 హార్డ్ ఛాలెంజ్.. కెనాడకు చెందిన మిచెల్ ఫెయిర్‌బర్న్ అనే టిక్‌టాక్ స్టార్ ఆండీ ఫ్రైసెల్లా అనే ఓ యూట్యూబర్ 2019లో ప్రారంభించిన 75హార్డ్ అనే ఫిట్నెస్ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా ఆమె రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. కనీసం 45 నిముషాల పాటు రోజుకు రెండు సార్లు వర్కౌట్లు కూడా చేయాలి. రోజుకు 10 పేజీలు చదవాలి. ఇవన్నీ చేస్తునట్టుగా ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి. అయినా బుద్ధి మారలేదు.. పాపం ఫెయిర్‌బర్న్ ఈ ఛాలెంజ్ చివరి రోజు వరకు బాగానే చేసింది. 12వ రోజున మాత్రం కొంత అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే డాక్టరును సంప్రదించింది. డాక్టర్ రోజుకు కేవలం అరలీటరు నీళ్లు మాత్రమే తాగాలని సూచంచారట. ఈ విషయాన్ని స్వయంగా ఫెయిర్‌బర్న్ చెబుతూ.. నేను ఎలాగైనా ఈ ఛాలెంజ్ పూర్తి చేసి తీరతాను. మొదటిసారి కావడంతో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎక్కువ నీళ్లు తాగడంతో రాత్రి పూత ఎక్కువగా మూత్రానికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అరలీటరు నెల మాత్రమేతాగా మంటున్నారు కష్టమే కానీ ప్రయత్నిస్తానంది. ఇది కూడా చదవండి: ఫాతిమాగా మారిన అంజు... ఇల్లు కట్టుకోవడానికి స్థలం, డబ్బు.. -
సిట్టింగ్‌లందరికీ బీఫామ్ ఇచ్చే దమ్ముందా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పాలన అందించి ఉంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ బీఫామ్ ఇచ్చే దమ్ముందా అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. గురువారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణను బంగారుమయం చేసి ఉంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్లోని 25–30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారంతా దొంగలని, ప్రజలను ఇబ్బందు లపాలు చేసేందుకే మార్చాలని అనుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పొంగులేటి కోరారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి గ్రామపంచాయతీ మొదలు పార్లమెంటు వరకు కాంగ్రెస్ జెండాను రెపరెప లాడించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న వారు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా.. అది ఇంకా 55 రోజులు మాత్రమేనని, బీఆర్ఎస్కు కౌంట్‌డౌన్ మొదలైందని పొంగులేటి చెప్పారు. ప్రచార కమిటీ కోచైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి జిల్లాకు వచ్చిన పొంగులేటికి పార్టీ నాయకులు జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద ఘనస్వాగతం పలికారు. డీసీసీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఖమ్మం, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్
ఒక్కోసారి చిన్నచిన్న సరదాలే ప్రాణాలమీదకు తీసుకొస్తుంటాయి. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో స్నేహితులు చేసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. స్నేహితులు పెట్టిన షరతులకు మించి మూమూస్ తినడంతో ఆ యువకుడు అనారోగ్యం పాలయ్యాడని, అనంతరం ఊపిరి తీసుకోలేక ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుని తండ్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తన కుమారునికి విషం ఇచ్చి చంపేశారని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోపాల్‌గంజ్‌లో కొందరు స్నేహితులు ఎంజాయ్ చేస్తూ, వారిలోవారు మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. దీనిలో పాల్గొన్న బిపిన్ కుమార్(25) ఛాలెంజ్‌కు మించి అధికంగా మూమూస్ తిన్నాడు. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. బిపిన్ పరిస్థితిని గమనించిన అతని స్నేహితులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బిపిన్ ఒక మొబైల్ రిపేరింగ్ దుకాణంలో పనిచేస్తుంటాడు. కుమారుని మృతి నేపధ్యంలో అతని తండ్రి మాట్లాడుతూ తన కుమారుని చేత విషం తినిపించారని, తన కుమారుడిని అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపించారు. వారంతా ఉద్దేశపూర్వకంగానే ఈ ఛాలెంజ్ చేసి, తన కుమారుడని హత్యచేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే -
నలుగురిని బలిగొన్న టిక్ టాక్ ఛాలెంజ్..
అలబామా: అమెరికాలోని అలబామాలో టిక్ టాక్ వీడియోల పిచ్చి నలుగురు ప్రాణాలను తీసింది. వీరంతా బోట్ జంపింగ్ ఛాలెంజ్ పేరుతో వేగంగా వెళ్తోన్న రన్నింగ్ బోటు లోనుంచి నీటిలోకి దూకే ప్రయత్నంలో మెడలు విరగ్గొట్టుకుని అక్కడికక్కడే చనిపోయారు. టిక్ టాక్ వీడియోలంటే చాలా మందికి ఒక సరదా. వీడియోలో ఐడియా వినూత్నంగా ఉండాలే గానీ చాలా తక్కువ వ్యవధిలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవచ్చు. అలా పాపులర్ అయినవారు చాలామందే ఉన్నారు. అయితే టిక్ టాక్ వలన కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్న నెపంతో చాలా దేశాలు ఈ యాప్ ను నిషేధించాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని అలబామాలో టిక్ టాక్ సరికొత్త ఛాలెంజ్ ఇప్పటికే నలుగురిని బలి తీసుకుంది. అదే బోట్ జంపింగ్ ఛాలెంజ్.. సముద్రంలో వేగంగా వెళ్తున్న బోటు నుండి నీటిలోకి దూకడమే ఈ ఛాలెంజ్. ఈ విచిత్రమైన ఛాలెంజ్ ఉన్నట్టుండి వైరల్ గా మారడంతో అనేకమంది ఈ ప్రయత్నం చేస్తూ బోట్ నుండి దూకుతూ వీడియోలు తీశారు. కానీ వారిలో నలుగురు మాత్రం తమ మెడలను విరగ్గొట్టుకుని విగతజీవులుగా మారిపోయారు. ఈ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. TikTok boat jumping challenge that sees people leap off vessels moving at high speed is blamed for FOUR deaths in Alabama - as cop says victims broke their necks instantly. pic.twitter.com/2aCxvJZsRy — Molly Ploofkins™ (@Mollyploofkins) July 9, 2023 అమెరికాకు చెందిన కెప్టెన్ జిమ్ డేవిస్ మాట్లాడుతూ గత ఆరు నెలల్లో మనం నియంత్రించగలిగి కూడా అలా చేయకపోవడం వలన ఈ దిక్కుమాలిన ఛాలెంజ్ వలన నలుగురు చనిపోయారని అన్నారు. నీటిలోకి దూకగానే క్షణాల వ్యవధిలో వారి మెడలు విరిగిపోయాయని, వీరంతా స్నేహితుల ముందు షో ఆఫ్ చేయాలన్న తపనతో చనిపోయినవారేనని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ.. -
ఆనంకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్
-
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం
న్యూఢిల్లీ: ఇటీవల బీహార్‌లో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఆర్డినెన్స్ పై స్పందించిన విధానం నచ్చక బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో షాక్ ఇచ్చారు. విపక్షాలు తమ నాయకుడిగా రాహుల్ గాంధీని ఎంచుకుంటే మాత్రం తాము మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు ఆప్ నేత ప్రియాంక కక్కర్. ట్విట్టర్ వేదికగా ప్రియాంక కక్కర్ స్పందిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతివ్వకుంటే వారి నేతృత్వంలోని విపక్షాలతో మేము భాగస్వామ్యులము కాలేము. దేశం బాగుపడాలంటే మొదట కాంగ్రెస్ మరోసారి రాహుల్ గాంధీని నాయకుడిగా నిలబెట్టి విపక్షాలను కూడా అతడికి మద్దతివ్వమని అడగకూడదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించడం కంటే కూడా చాలా ముఖ్యమైన విషయమని రాశారు. అనుకుందొక్కటి.. అయినదొక్కటి.. బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతిస్తుందని కోటి ఆశలతో వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కు దానిపై కూలంకషంగా చర్చించి గాని నిర్ణయం తీసుకోలేమని రాహుల్ చెప్పిన సమాధానం రుచించలేదు. సమావేశం అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడకుండా ఢిల్లీ పయనమైన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తమకు మద్దతివ్వకుంటే వారితో కలిసి ప్రయాణించడం కష్టమని సందేశం పంపించారు. ఈ సమావేశానికి ఆప్ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, ఎంపీ సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా కూడా హాజరయ్యారు. సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని విభేధాలన్నిటినీ పక్కన పెట్టేసి కలిసి నడుద్దామని అభ్యర్ధించగా రాహుల్ మాత్రం ఆర్డినెన్స్ పై చర్చించడానికి ఒక పద్ధతుంటుందని తేలికగా చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై ఆప్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దుకు మీరు మద్దతిచ్చినప్పుడు కూడా మేము ఇలాగే బాధపడ్డామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. अगर देश बचाना है तो सबसे पहले कांग्रेस को बोल देना चाहिए की वो तीसरी बार भी Rahul Gandhi पर दाव नहीं लगायेंगे और समूचे विपक्ष पर ये दबाव नहीं डालेंगे। देश हित में ये संविधान बचाने से भी ऊपर है। — Priyanka Kakkar (@PKakkar_) June 24, 2023 ఇది కూడా చదవండి: మరో ప్రమాదం.. లూప్ లైన్లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్ -
ఒకవేళ ఎన్నికల్లో ఓడితే..రేవంత్ కు జోగు రామన్న సవాల్
-
గుడివాడ బహిరంగ సభ నుంచి చంద్రబాబుకు కొడాలి నాని ఓపెన్ ఛాలెంజ్..!
-
కమ్మని కాఫీలాంటి కళ
యువతరంలో చాలామంది..తమ క్రియేటివ్ స్కిల్స్‌ను అభిరుచికి మాత్రమే పరిమితం చేసుకోవడం లేదు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఆసక్తి, అభిరుచులనే కెరీర్ ఛాయిస్‌గా తీసుకుంటున్నారు. కాపీరైటర్ కావాలనే కల కూడా అందులో ఒకటి. ‘మేకిట్ సింపుల్. మేకిట్ మెమొరబుల్’ ‘రైట్ వితౌట్ ఫియర్. ఎడిట్ వితౌట్ మెర్సీ’... లాంటి మాటలను గుండెలో పెట్టుకొని తమ కలల తీరం వైపు కదులుతున్నారు.. పశ్చిమ బెంగాల్‌లోని చిన్న పట్టణం నుంచి తన కలల తీరమైన ముంబైకి వచ్చింది అనూష బోస్. మాస్ కమ్యూనికేషన్లో పట్టా పుచ్చుకున్న అనూష ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో చేరింది. జింగిల్స్, డైలాగులు రాయడంలో తనదైన శైలిని సృష్టించుకుంది. మూడురోజుల్లో రాసే టైమ్ దొరికినా కేవలం 30 సెకండ్లలో మాత్రమే రాసే అవకాశం ఉన్నా.. ఎక్కడా తడబాటు ఉండకూడదనేది తన ఫిలాసఫీ. ‘ఇండస్ట్రీలో నేను కూడా ఒకరిని అనుకోవడం కాదు. మనలోని ప్రత్యేకత గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా క్రియేటివిటీకి సానబట్టాలి’ అంటుంది సీనియర్ కాపీ రైటర్ అయిన అనూష బోస్. ట్రైనీ కాపీరైటర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ముంబైకి చెందిన ఆకృతి బన్సాల్. చిన్నప్పటి నుంచి తనకు టీవీలో వచ్చే యాడ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనని అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌కు తీసుకువచ్చింది. అది ఏ వ్యాపారానికి సంబంధించినది అనేదానికంటే ఆ యాడ్ వెనుక ఉన్న ఐడియా తనకు బాగా నచ్చేది. ‘హోం సైన్స్’ చదువుకున్న ఆకృతికి ‘ఎడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్రిలేషన్’ ఒక సబ్జెక్ట్‌గా ఉండేది. ఆ సబ్జెక్ట్ ఇష్టంగా చదువుకున్న తరువాత ‘ఈ రంగంలో నేను ప్రయత్నించవచ్చు’ అనుకుంది. ఫీల్డ్‌కు వచ్చిన తరువాత ప్రతిరోజు, ప్రతి డెడ్‌లైన్‌ను ఒక సవాల్‌గా స్వీకరించింది. ‘చాలెంజ్ ఉన్నప్పుడే మజా ఉంటుంది’ అంటుంది ఆకృతి బన్సాల్. మరి ఆమె భవిష్యత్ లక్ష్యం ఏమిటి? ‘ప్రతిష్ఠాత్మకమైన ఎడ్వర్టైజింగ్ అవార్డ్ తీసుకోవాలి లేదా నా తల్లిదండ్రులు రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి నచ్చిన యాడ్ హోర్డింగ్ నేను రాసినదై ఉండాలి’ అంటుంది ఆకృతి బన్సాల్. రాధిక నాగ్‌పాల్ టీనేజ్ నుంచి పుస్తకాల పురుగు. భాషలోని సొగసు అంటే ఇష్టం. రాధిక జర్నలిజం కోర్స్ చేసింది. అందులో ఒక సబ్జెక్ట్ అయిన ఎడ్వర్టైజింగ్ తనకు బాగా నచ్చింది. రాధిక ఇప్పుడు ‘సోషియోవాష్’లో సీనియర్ కాపీ రైటర్. ‘యాడ్ ఏజెన్సీలో పనిగంటలు అంటూ ఉండవు. కాలంతో పరుగెత్తాల్సిందే. బ్రాండ్‌ను అర్థం చేసుకోవడంతో పాటు క్లయింట్ ఆశిస్తున్నది ఏమిటి? ఆడియెన్స్‌ను వేగంగా ఎలా చేరుకోవాలి? అనే దానిపై అవగాహన ఉండాలి. మనం చెప్పదల్చుకున్నది సింగిల్ లైన్లోనే క్యాచీగా చెప్పగలగాలి’ అంటుంది రాధిక. విస్తృతంగా చదవాలి. గత అనుభవాల నుంచి రెఫరెన్స్ తీసుకోవడానికి ఎంతో ఉంది’ అనేది ఔత్సాహిక కాపీరైటర్లకు రాధిక ఇచ్చే సలహా. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన అంజు న్యూస్పేపర్లలో వచ్చే ఎడ్వర్టైజింగ్లను ఫైల్ చేస్తుంటుంది. ఆమె ఎన్నోసార్లు చదివిన పుస్తకం క్లాడ్ సీ.హాప్కిన్స్ రాసిన సైంటిఫిక్ ఎడ్వర్టైజింగ్ (1923). ఈ పుస్తకంలోని సరళమైన భాష అంటే అంజుకు ఇష్టం. ‘జస్ట్ సేల్స్‌మన్‌షిప్’ ‘ఆఫర్ సర్వీస్’ ‘హెడ్ లైన్స్’ ‘బీయింగ్ స్పెసిఫిక్’ ‘ఆర్ట్ ఇన్ ఎడ్వర్టైజింగ్’ ‘టెల్ యువర్ ఫుల్స్టోరీ’ ‘ఇన్ఫర్మేషన్’ ‘స్ట్రాటజీ’ ‘నెగెటివ్ రైటింగ్’... మొదలైన చాప్టర్ల గురించి అనర్గళంగా మాట్లాడగలదు. అంజు భవిష్యత్ లక్ష్యం ‘కాపీ రైటర్’ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు! వీరు కూడా.. ప్రముఖ సినీ నటి రాశీఖన్నా న్యూ దిల్లీ, లేడీ శ్రీరామ్ కాలేజీ స్టూడెంట్. కాలేజీ రోజుల నుంచి చదవడం రాయడం అంటే ఇష్టం. కాపీరైటర్ కావాలనేది తన కల. కలను నిజం చేసుకోవడానికి ముంబైకి వెళ్లింది. అయితే సినిమాల్లో అవకాశాలు రావడంతో తన రూట్ మారింది. కాపీరైటర్ కాబోయి యాక్టర్ అయిందన్నమాట! సినిమారంగంలో ఉన్నప్పటికీ గుడ్ కాపీరైటింగ్ కోసం వెదుకుతుంది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ కాలేజీ చదువు పూర్తికాగానే ఒక యాడ్ ఏజెన్సీలో కాపీరైటర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ఇప్పటికీ చిన్న చిన్న రచనలు చేస్తుంటాడు. మన ప్రత్యేకతే మన శక్తి ఇండస్ట్రీలో నేను కూడా ఒకరిని అనుకోవడం కాదు. మనలోని ప్రత్యేకత గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా క్రియేటివిటీకి సాన పట్టాలి. – ఆకృతి బన్సాల్, కాపీ రైటర్ ఒక ఐడియా... వెయ్యి ఏనుగుల బలం ఒక ఐడియా స్ట్రైక్ అయ్యేవరకు మనసులో భయంగా ఉంటుంది. తళుక్కుమని ఒక ఐడియా మెరిసిందా...ఇక అంతే. వెయ్యి ఏనుగుల బలం దరి చేరుతుంది! క్రియేటివ్ బ్లాక్స్ రాకుండా ఉండడానికి పుస్తకాలు చదువుతాను. నచ్చిన పుస్తకాలు మళ్లీ చదువుతాను. – రాధిక నాగ్‌పాల్, సీనియర్ కాపీ రైటర్ (చదవండి: కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయ్! ) -
మేం రెడీ: ఆల్ట్‌మాన్‌కు సీపీ గుర్నానీ చాలెంజ్, ఏం జరిగిందంటే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్ సిలికాన్ వ్యాలీతో భారతీయ నిపుణులు పోటీ పడలేరన్న వ్యాఖ్యలపై టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ స్పందించారు. భారతీయ కంపెనీలు తమ సిలికాన్ వ్యాలీ కౌంటర్ పార్ట్లతో పోటీ పడలేరన్న ఆల్ట్మాన్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. భారతదేశంతో సహా ఆరు దేశాల పర్యటనలో ఉన్న ఆల్ట్‌మాన్‌ను ఇండియాలో చాలా పవర్ ఫుల్ ఎకోసిస్టం ఉంది. ప్రత్యేకంగా ఏఐపై దృష్టి పెడుతున్నాం, కానీ చాట్‌జీపీటీ లాంటి కృత్రిమ మేధస్సు సాధనాన్ని ఇండియా, ఆగ్నేయాసియాలో తయారు చేయగలదా అని మాజీ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. (వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!) "ఇది ఎలా పని చేస్తుందో మీకు చెప్పబోతున్నాం, ట్రైనింగ్ ఫౌండేషన్ మోడల్స్‌పై పోటీ పడటం పూర్తిగా ప్రయోజనం లేనిది, ఆఫ్కోర్స్.. ఎలాగైనా ప్రయత్నించడం మీ జాబ్ అయినా కానీ వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందడని సమాధానమిచ్చాడు. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) ఆల్ట్మాన్ వ్యాఖ్యలను పూర్తి తిప్పికొడుతూ గుర్నానీ ట్వీట్ చేశారు. ఒక సీఈవోకి మరో సీఈవోకి ఇచ్చిన సవాలును స్వీకరిస్తున్నానంటూ ప్రతి సవాల్ విసిరారు. మరోవైపు చాట్‌జిపిటి వంటి టూల్‌ను రూపొందించే సామర్థ్యం భారత్‌కు లేదని ఆల్ట్మాన్ పేర్కొన్నప్పటికీ, భారతీయ పారిశ్రామికవేత్తలు తమ సొంత సాధనాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారని ఆనందన్ కూడా ట్వీట్ చేశారు. అంతేకాదు 5000 సంవత్సరాల భారతీయ వ్యవస్థాపకత, భారతీయ పారిశ్రామిక వేత్తలను మనం ఎప్పటికీ తక్కువ అంచనా వేయొద్దు, తామూ ప్రయత్నించాలనుకుంటున్నామన్నారు. OpenAI founder Sam Altman said it’s pretty hopeless for Indian companies to try and compete with them. Dear @sama, From one CEO to another.. CHALLENGE ACCEPTED. pic.twitter.com/67FDUtLNq0 — CP Gurnani (@C_P_Gurnani) June 9, 2023 -
Gyanvapi Case: వారణాసిలోనే జ్ఞానవాపి కేసు..ఆ వ్యాజ్యం చెల్లుతుంది.!
జ్ఞానవాపి కేసులో ముస్లీం కమిటికి చుక్కెదురైంది. మసీదు కమిటీ హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనను బుధవారం అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో హిందూ మహిళలు వేసిన వ్యాజ్యం చెల్లుబాటవుతుందని అనూహ్యమైన తీర్పు ఇచ్చింది కోర్టు. అలాగే స్థానిక వారణాసిలోనే కేసు కొనసాగేలా అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో హిందు మహిళల బృందానికి భారీ ఊరట లభించినట్లయ్యింది. వారణాసిలో జ్ఙానవాపి మసీదులో పూజలు చేసుకునే హక్కును కోరుతూ హిందూ మహిళల బృందం లక్ష్మీ దేవి, రేఖా పాఠక్, సీతా సాహు, మంజు వ్యాస్ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ కేసు తెరపైకి వచ్చి గణనీయమైన వివాదాస్పదానికి దారితీసింది. ఈ వివాదం ఏప్రిల్ 2021 నుంచి కోర్టులోనే ఉంది. వారణాసి జిల్లా న్యాయమూర్తి ఈ కేసు నిర్వహణను సమర్థించారు. ఇదిలా ఉండగా, అంజుమన్ ఇంతేజామియా మసీదు(ఏఐఎం) కమిటీ, ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం, 1995 సెంట్రల్ వక్ఫ్ చట్టం ప్రకారం ఈ కేసును నిర్వహించడం సాధ్యం కాదని వాదిస్తూ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 23, 2022న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కాగా, హిందూ మహిళల పిటిషన్‌పై వారణాసి కోర్టు మసీదు సముదాయంపై సమగ్ర సర్వే నిర్వహించాలని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది కూడా. (చదవండి: Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్ సర్వేపై సుప్రీం కోర్టు స్టే)) -
ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత
సాక్షి, ముంబై: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 20 ఏళ్ల అస్మీ జైన్ ప్రఖ్యాత యాపిల్ WWDC23 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌ని గెల్చుకుంది. స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అద్భుతమైన ఒరిజినల్ యాప్‌ను రూపొందించనందుకుగాను ఈ ఘనతను దక్కించుకుంది. అస్మి జైన్‌తో పాటు, ఈ ఏడాది స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలలో మార్టా మిచెల్ కాలియెండో , యెమి అజెసిన్ కూడా ఉన్నారు. వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో (ఈసంవత్సరం జూన్ 5న)కి ముందు, యాపిల్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అసలైన యాప్ ప్లేగ్రౌండ్ చాలెంజ్‌ను నిర్వహిస్తుంది. గ్లోబల్ యాపిల్ డెవలపర్ కమ్యూనిటీకి WWDC23 ఈవెంట్‌ను వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఛాలెంజ్ విజేతలకు కూడా అనుమతి ఉంటుంది. బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న తన స్నేహితురాలి మేనమామకు సహాయం చేసేలా యాప్‌ను రూపొందించి ఈ అవార్డును దక్కించుకుంది. బ్రెయిన్ సర్జరీ కారణంగా కంటి అంగ వైకల్యంతో పాటు ముఖం పక్షవాతానికి గురైంది. దీంతో ఇండోర్‌లోని మెడి-క్యాప్స్ యూనివర్శిటీకి చెందిన జైన్ రంగంలోకి దిగింది. స్క్రీన్ చుట్టూ కదులుతున్న బంతిని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్న యూజర్కంటి కదలికలను ట్రాక్ చేయడానికి యాప్ ప్లేగ్రౌండ్ని డిజైన్ చేసింది. దీని ప్రాథమిక ఉద్దేశ్యం కంటి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడటం. అయితే వివిధ రకాల కంటి పరిస్థితులు, గాయాలైన సందర్భాల్లో కూడా దీనిని ఉపయోగించవచ్చని జైన్ భావిస్తోంది. ఇది ప్రభావవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడడమే తన తదుపరి లక్ష్యం అని కూడా చెప్పింది. (ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్ సంచలన వ్యాఖ్యలు) హెల్త్ చాలెంజెస్ ఎదుర్కొనేలా కోడింగ్‌ని ఉపయోగించి యాపల్ ప్లే గ్రౌండ్ రూపకల్పనలో పట్ల జైన్‌కు అభిరుచే ఆమెను ఈ స్థాయిలో ఉంచింది. అలాగే జైన్ తోటి విద్యార్థులతో కలిసి విశ్వవిద్యాలయంలో ఒక ఫోరమ్‌ను కూడా స్థాపించారు. ఈ ప్లాట్‌ఫారమ్ సపోర్ట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. (IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్‌ఎవరిదో తెలుసా? ) కాగా ప్రతీ ఏడాది వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో భాగంగా, స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అసలైన యాప్ రూపొంచే చాలెంజ్ యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకిస్తుంది. గతంతో పోలిస్తే విజేతల సంఖ్యను 350 నుంచి 375కి పెంచామనీ, తద్వారా మరింత మంది ఔత్సాహిక విద్యార్థులు ఈ ఈవెంట్లో చేరవచ్చని భావించినట్టు తెలిపింది. 30 కంటే ఎక్కువ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, వినోదం, పర్యావరణం లాంటి విభిన్న టాపిక్స్ ఇందులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. మరిన్ని స్ఫూర్తిదాయక, విజేతల కథనాలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి : సాక్షిబిజినెస్ -
బాబూ.. మేనిఫెస్టో అమలుపై చర్చకు రా.. మంత్రి కారుమూరి సవాల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు అలవి కాని హామీలతో ప్రజలను మళ్లీ బురిడీ కొట్టించే యత్నాలు చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనమని, అది ఎందుకూ పనికిరాదు. ఒక్కటీ అమలు కాదంటూ మండిపడ్డారు. ‘బాబూ.. నీకు చిత్తశుద్ధి ఉంటే.. మేనిఫెస్టో అమలుపై చర్చకు రా.. ఎవరు ఎన్ని అమలు చేశారో చూద్దాం’ అంటూ మంత్రి కారుమూరి సవాల్ విసిరారు. మంత్రి ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. టిష్యూ పేపర్కన్నా హీనం: చంద్రబాబూ.. నీ మొఖంలో రాజకీయంగా చావుకళ వచ్చింది. నీలో ప్రేతకళ కనిపిస్తోంది. అయినా సరే పదవీకాంక్ష. ఇంకా దోచుకోవాలన్న తపన వదలట్లేదు. ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించావు. ఆడబిడ్డలకు 18 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.18 వేల చొప్పున 5 ఏళ్లలో రూ.90 వేలు ఇస్తామంటున్నారు. ప్రజలు నిన్ను నమ్ముతారా? ఇంకా తల్లికి వందనం. దీపం పథకం. అన్నీ అబద్ధాలు. మహిళలకు ఉచిత ప్రయాణం. ఇది గతంలో కూడా చెప్పావు. అమలు చేయలేదు. పిల్లలకు ఉచిత ప్రయాణం అని, దాన్ని కూడా అమలు చేయలేదు. పారదర్శకంగా మా పథకాలు: సీఎం వైఎస్ జగన్, పదవీ బాధ్యతలు స్వీకరించి, నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రమంతా వేడుక చేసుకుంటున్నారు. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రధాన అర్హతగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేదు. వైఎస్ జగన్ పాలనలో నిరుపేదలతో పాటు, అన్ని వర్గాల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజానికి గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు.. కలెక్టర్లకు ఒక మాట చెప్పారు. తన పార్టీ వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అదే సీఎం జగన్, కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందాలని నిర్దేశించారు. అందుకే ఎక్కడా అవినీతికి తావు లేకుండా, ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. చదవండి: చంద్రబాబు భయాన్నే ఈనాడు హైలైట్ చేసింది అంతులేని ప్రజాదరణ: అందుకే ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. మా జిల్లాలో చంద్రబాబు రైతు పోరు బాట పేరుతో పాదయాత్ర చేస్తే, కనీసం 500 మంది కూడా లేరు. అదే నా నియోజకవర్గంలో నేను నిన్న బైక్ ర్యాలీ నిర్వహిస్తే.. దాదాపు 6,500 మోటర్‌సైకిళ్లపై.. దాదాపు 13 వేల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చంద్రబాబు పాదయాత్రలో 450 మంది పాల్గొంటే, సభకు కేవలం 1100 మంది మాత్రమే హాజరయ్యారు. అదే మా సభకు ఏకంగా 13 వేల మంది హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలకు ఆ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అన్ని వర్గాలకు న్యాయం: సీఎం జగన్.. తన పాలనలో రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపిస్తే, చంద్రబాబు ఒక్కరిని కూడా పంపలేదు. ఇంకా జగన్ 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. వారిలో కొందరు అట్టడుగు వర్గంలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇంకా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆ పదవులు కూడా ఇచ్చారు. అదే చంద్రబాబు బీసీలను ఏమన్నాడు? వారి తోక కట్ చేస్తానన్నాడు. తాట తీస్తానన్నాడు. ప్రతి కులాన్ని అవమానించి మాట్లాడడం చంద్రబాబుకు అలవాటు. వారిని కేవలం ఓటింగ్ యంత్రాలుగా చూడడమే తప్ప, ఒక్క బీసీకి కూడా ఆయన న్యాయం చేయలేదు. అదే జగన్ పాలనలో ఇంటింటికీ వెళ్తున్న వలంటీర్లు.. ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటి గడప వద్దే అందిస్తున్నారు. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వడంతో పాటు, దాదాపు 22 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. బాబు సిద్ధాంతం. దోచుకో–దాచుకో: 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలు చేసిన చంద్రబాబు, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. రైతుల రుణాలు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి, ఆ మాట కూడా తప్పాడు. చివర్లో ఎన్నికల ముందు పౌర సరఫరాల సంస్థ పేరుతో రుణం తీసుకుని పసుపు కుంకుమ కింద పంపిణీ చేశాడు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం అందించిన సీఎం జగన్, ప్రతి ఇంట్లో.. ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్నారు. అదే చంద్రబాబు తన పాలసలో చేసిందని చెప్పుకోవడానికి ఏ ఒక్కటి కూడా లేదు. స్కిల్ డెవలప్మెంట్లో రూ.371 కోట్ల అవినీతి. విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేయించావు. దుర్మార్గంగా దోపిడి. దోచుకో. దాచుకో.. అదే బాబు సిద్ధాంతం. రాష్ట్ర రుణం తక్కువే: సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని దుయ్యబట్టిన నీవు కూడా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నావు. మేము రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నామని విమర్శిస్తున్నావు. నిజానికి ఆ స్థాయిలో మేము అప్పులు చేయడం లేదు. నీ హయాంలో రూ.2,71,450 లక్షల కోట్లు అప్పు చేశావు. అదే మా ప్రభుత్వం కేవలం రూ.1.30 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది. అలాగే తీసుకున్న రుణంలో ప్రతి రూపాయికి లెక్క ఉంది. అదే యూపీ అప్పు చూస్తే.. ఏకంగా రూ.8 లక్షల కోట్లు. తమిళనాడు అప్పు రూ.5.50 లక్షల కోట్లు, కర్నాటక అప్పు రూ.5 లక్షల కోట్లు. గుజరాత్ అప్పు రూ.7 లక్షల కోట్లు. వాటితో పోల్చుకుంటే మన అప్పులు చాలా తక్కువ. అయినా అదే పనిగా ప్రభుత్వంపై బురద చల్లుతున్నావు. మాది జనరంజక పాలన: చంద్రబాబూ నీవు నిజం చెబితే.. నీ తల వెయ్యి ముక్కలవుతుంది.. నీ జీవితమంతా అబద్ధాలమయం. అదే సీఎం జగన్.. చేసేదే చెబుతాడు. చెప్పిందే చేస్తాడు. ఆయనది జనరంజక పాలన. విద్యా రంగంలో 14వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాం. రాష్ట్ర జీడీపీలో మనమే ముందున్నాం. కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకొస్తే.. దానిపైనా ఏడుపే. రాష్ట్ర ప్రజలు బాగుపడొద్దు. వారు ఇబ్బందుల్లో ఉండాలి. అప్పుడే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలి. తద్వారా మళ్లీ అధికారంలోకి రావాలన్నదే నీ ఆలోచన. అందుకే రాష్ట్రానికి మేలు జరుగుతుంటే కూడా ఓర్చుకోలేకపోతున్నావు. రాష్ట్రం చాలా రంగాల్లో ముందుంది. దీన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించింది. బాబుకు ఓటమి తప్పదు: దీంతో చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ఈర్శ్యతో తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వంపై అదేపనిగా బురద చల్లుతున్నారు. అయితే మీరు ఎన్ని చేసినా, మీకు మళ్లీ ఓటమి తప్పదు. నాడు ఎన్టీఆర్‌ను అన్ని రకాలుగా వేధించి, ఆయన నుంచి పదవిని, పార్టీని లాక్కున్నారు. ఆయనను అంతులేని క్షోభకు గురి చేశారు. అంత దుర్మార్గుడు చంద్రబాబు అని.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. -
టిక్‌టాక్ కార్ థెఫ్ట్ చాలెంజ్: రాజీకి వచ్చిన హ్యూందాయ్, కియా..
హ్యూందాయ్, కియా కంపెనీలకు చెందిన కొన్ని మోడళ్ల కార్లను ఎంత సులువుగా దొంగిలించవచ్చో చూపించారు కొందరు టిక్‌టాకర్లు. ‘టిక్‌టాక్ థెఫ్ట్ ఛాలెంజ్’ పేరుతో అమెరికాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీని తర్వాత కార్ దొంగతనం బాధితులు ఈ రెండు కార్ల కంపెనీలపై కోర్టులో 200 మిలియన్ డాలర్లకు ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించుకునేందుకు హ్యుందాయ్, కియా కంపెనీలు ఎట్టకేలకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు బాధితులతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం... దావా పరిష్కారం కోసం దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల కంపెనీలకు 200 మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుంది. దీంట్లో అధిక మొత్తం కార్ల దొంగతనం సంబంధిత నష్టాలను భర్తీ చేసేందుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బాధితులతో కార్ల కంపెనీలు చేసుకున్న రాజీ ఒప్పందాన్ని ఆమోదించాలా వద్దా అనేది కోర్టు ఇష్టం. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు హ్యూందాయ్, కియా కంపెనీల కార్లను సులభంగా దొంగిలించవచ్చని చూపించే వీడియోలు టిక్‌టాక్‌లో వ్యాప్తి చెందడంతో అమెరికాలో గత సంవత్సరం ఆయా కంపెనీలకు చెందిన కార్ల దొంగతనాలు పెరిగాయి. యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) ప్రకారం.. ఛాలెంజ్‌తో ముడిపడి ఉన్న కారు దొంగతనాలు కనీసం 14 క్రాష్‌లు, ఎనిమిది మరణాలకు దారితీశాయి. దొంగతనాలపై సోషల్ మీడియాలో జరిగిన ప్రమోషన్ వల్ల అమెరికాలో ప్రస్తుతం ఉన్న సుమారు 9 మిలియన్ల హ్యుందాయ్, కియా కార్లు ప్రమాదంలో పడ్డాయని ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్హెచ్టీఎస్ఏ ప్రకారం.. హ్యుందాయ్, కియా కంపెనీలు తమ కార్లలో ఇప్పటికే యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేశాయి. కార్ ఓనర్లకు పదివేల స్టీరింగ్ వీల్ లాక్‌లను అందించాయి. ఇదీ చదవండి: కారు కొన్న ఆనందం.. డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహింద్రా స్పందనేంటో తెలుసా? -
గులాబీ బాస్‌నే ఢీకొడుతున్న పొంగులేటి.. బీఆర్ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది?
తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ బాస్‌నే ఢీకొడుతున్నారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? జిల్లాలో పొంగులేటికి కౌంటర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఖమ్మం జిల్లాలోని పది సీట్లను గెలుచుకునే విధంగా కేసీఆర్ ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నారు? గులాబీ పార్టీకి కొరుకుడు పడని జిల్లా ఉమ్మడి ఖమ్మం. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో ఒక్కొక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను గులాబీ గూటిలో చేర్చుకుని తమ బలం పెరిగిందని అధికార పార్టీ భావించింది. గత ఎన్నికల్లో ఎంపీ సీటు దక్కని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉంటూ.. గులాబీ బాస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేశారు. చివరికి పార్టీ నుంచి సస్పెండయ్యారు. ప్రస్తుతం ఏ పార్టీకి అనుబంధంగా లేని పొంగులేటి త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరతారు. పైగా కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులను పోటీ పెట్టడానికి సైతం పొంగులేటి ప్లాన్ చేశారు. తాను ఏ పార్టీలో చేరినా వారికి టిక్కెట్ ఇప్పించేవిధంగా హామీ ఇచ్చారు. జిల్లాలో పునాదులు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న బీజేపీ, పోయిన బలాన్ని కూడదీసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు పొంగులేటితో మంతనాలు జరుపుతున్నాయి. మే మొదటివారంలో పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున ఒక్క ఎమ్మేల్యేను కూడ గెలవనివ్వనంటూ పొంగులేటి చేసిన శపథం అధికార పార్టీలో మంటలు రేపింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సైతం ఈ జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఒక మాజీ ఎంపీ నేరుగా సీఎంనే ఢీకొడుతుంటే ఆ పార్టీ కామ్‌గా ఉంటుందా? పొంగులేటిపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ ఎటాక్ చేయాలని గులాబీ దళానికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు పొంగులేటి మీద విమర్శలు సంధించడం ఆరంభించారు కూడా. అదేవిధంగా మే నెలలో పొంగులేటి ఏదో ఒక పార్టీలో చేరతారు గనుక.. అదే నెలలో ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?) గత రెండు ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆదరించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పదికి పది నియోజకవర్గాలు తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకే కేసీఆర్ కూడా ఈ జిల్లాపై పూర్తి స్తాయిలో ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి ఒకవేళ కాంగ్రెస్‌లో చేరితే జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయి...ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ ఎటువంటి పరిస్తితులనైనా ఎదుర్కొని జిల్లాను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ వేస్తున్నారు. పార్టీ చేయించిన సర్వేల్లో ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలను ఈసారి మార్చివేసి వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మూడు నియోజకవర్గాల్లో మార్పులు తప్పవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ పార్టీలో చేరే విషయాన్ని మే నెలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించబోతున్నారు. ఇక అప్పటి నుంచే ఖమ్మం జిల్లా పొలిటికల్ ఈక్వేషన్స్‌లో మార్పులు రావడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొంగులేటి ప్రకటన తర్వాత అసలు గేమ్ మొదలు కాబోతోంది. చదవండి: ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్.. హస్తం పార్టీ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
తిరువూరు అభివృద్ధిపై చర్చకు సిద్ధమైన వైఎస్ఆర్ సీపీ
-
అభివృద్ధి అంటే ఇది..చంద్రబాబుకు ఎమ్మెల్యే భూమన దిమ్మతిరిగే సెల్ఫీ ఛాలెంజ్
-
రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాళ్లు విసురుకోవడంపై విజయశాంతి స్పందించారు. విపక్ష నేతల ఛాలెంజ్‌లు బీఆర్ఎస్కు వేడుకలు అవుతున్నాయని ఆమె అన్నారు. దుర్మార్గ వ్యవస్థపై పోరాడటం మన కర్తవ్యమని పిలుపునిచ్చారు. రేవంత్, ఈటల ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవద్దని విజయశాంతి సూచించారు. కాగా.. మునుగోడు ఉపఎన్నిక సమయంలో కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి రూ.25కోట్లు తీసుకున్నారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. తనకు డబ్బులు తీసుకునే ఖర్మ పట్టలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తానే పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. రూ.25 కోట్లు తీసుకోలేదని దేవుడిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, ఈటల సిద్ధమా అని సవాల్ విసిరారు. శనివారం సాయంత్రం 6 గంటలకు తాను భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేస్తానని, ఈటల కూడా రావాలన్నారు. లేదా ఈటల ఏ గుడికి రమ్మంటే తాను అక్కడకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. ఈ సవాళ్ల నేపథ్యంలో విజయశాంతి స్పందించారు. విపక్ష నేతలు ఒకరిపైఒకరు ఇలా ఆరోపణలు చేసుకుంటే అధికార బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ.. నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించిందని ఆమె వరుస ట్వీట్లు చేశారు. చదవండి: కేసీఆర్ నుంచి పైసలు తీస్కునే ఖర్మ నాకేందీ? -
అచ్చేన్నా...నీకు మొగుడు వచ్చాడు కాస్కో...
-
ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా: మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను తమ పిల్లలు వదిలేస్తారనీ, తాను పదవికి రాజీనామా చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అక్కడే తన పదవికి రాజీనామా చేసి పోవాలని సవాల్ విసిరారు. ‘నాకు మూడు ఫాంహౌస్‌లు ఉన్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రచారం చేయడం అవివేకం...పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లుగా కనిపిస్తే అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం’అని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన స్వగ్రామం పాన్గల్లో ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నవేనని స్పష్టం చేశారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది తన సతీమణి సొంత డబ్బులు, బ్యాంకు రుణాలతో కట్టుకున్న ఇల్లు అని వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న తన ఇద్దరు అమ్మాయిలు చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుంచి, ఇతరుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నారని వివరించారు. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారంటూ రఘునందన్ రావు ఆరోపించడం తగదని పేర్కొన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన బాలుడు గౌడనాయక్ ను చేరదీసి ఉన్నత చదువులు చదివించానని, ప్రస్తుతం అతను తన ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నాడని తెలిపారు. భూముల రిజి్రస్టేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితుల్లో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి, తర్వాత పిల్లల తమ పేరు మీదకు మార్చుకున్నారని వివరించారు. రఘునందన్‌పై చట్టపరంగా ముందుకెళ్తాం పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి ఉందని ఆరోపించారనీ, కానీ అది వెల్టూరు గ్రామ పరిధి అని, అక్కడ లండన్‌లో డాక్టర్ గా పనిచేస్తున్న తన మరదలు కవిత, వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మా త్రమేనని వెల్లడించారు. వారు ఇక్కడ ఉండరనీ, తానే అప్పుడప్పుడు పర్యవేక్షణకు వెళ్తుంటానని మంత్రి వివరించారు. దురుద్దేశపూర్వకంగా రఘునందన్‌రావు చేస్తున్న అసత్య ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తామని తెలిపారు. చదవండి: 165 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఎలా? -
బాబు సెల్ఫీకి మంత్రి రోజా అదిరిపోయే కౌంటర్
-
నన్ను కుప్పం రమ్మంటావా..? నువ్వే నగరి వస్తావా..?
-
చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. మీ మేనిఫెస్టో తెచ్చుకో, మా మేనిఫెస్టో తెస్తాం.. ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలను అడుగుదామని ఛాలెంజ్ చేశారు. అప్పుడు ఎవరితో సెల్ఫీ తీసుకుంటారో చూద్దామని సెటైర్ వేశారు. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వ్యాఖ్యానించారు. 'మెగా సర్వే చేయటానికి దమ్ము ఉండాలి. సీఎం జగన్‌కు దమ్ముంది. తన పాలనపై నమ్మకం ఉంది. అందుకే ఏడు లక్షల మంది సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజలంతా మాకు మద్దతు తెలుపుతున్నారు. వాలంటీర్లంతా జగన్ సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఆయన మీద నమ్మకంతో అన్ని వర్గాల వారు ఉన్నారు. గతంలో ఏ ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరగలేదని జనం చెప్తున్నారు. ఇప్పుడు జగన్ పాలనలో ఇంట్లో నుంచి బయటకు రాకుండానే వాలంటీర్లు చేసి పెడుతున్నారని చెప్తున్నారు. అందుకే జగన్ సైన్యం అంటే ప్రజలకు అంత ప్రేమ. జగన్ స్టిక్కర్ల మీద చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన వాళ్లు దొంగతనంగా వెళ్లి పోటీగా స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఒక పది ఇళ్లకు ఇలా చేసి తమ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. టిట్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అది సెల్ఫీ కాదు, సెల్ఫ్ గోల్. మా నగరిలో లేదా మీ కుప్పంలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో చూద్దామా? ఇదే నా సవాల్. ఈ సవాల్ తీసుకుంటావా చంద్రబాబూ? రాజకీయాల్లో వంద శాతం సంతృప్తి చేయగలమా? అనే డౌట్ ఉండేది. కానీ జగన్ పాలనలో చేసి చూపించారు. ఈ రాష్ట్రాని పట్టిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు. ఓటు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకుని రాష్ట్రాన్ని నాశనం చేశాడు. యువతకు నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. రైతులకు రుణమాఫీ పేరుతో మోసం చేశాడు. ఇలా ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. జగన్ పాలనలో అందరికీ న్యాయం చేశారు కాబట్టే ధైర్యంగా మేము జనంలోకి వెళ్తున్నాం.' అని రోజా వ్యాఖ్యానించారు. చవదండి: జగనన్నే మా భవిష్యత్తు.. ఇది చారిత్రాత్మక ప్రజా మద్దతు -
అభివృద్ధిపై చర్చకు రావాలని కొమ్మలపాటికి నంబూరి సవాల్
-
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్
-
లోకేష్ కు కేతిరెడ్డి సవాల్.. ఆరోపణలు నిరూపించగలరా?
ధర్మవరం: తప్పుడు ఆరోపణలతో వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఆరోపణలు చేసి బురదజల్లాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి టీడీపీ నేతలు నారా లోకేష్, పరిటాల శ్రీరామ్‌లను హెచ్చరించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఇటీవల ధర్మవరం మండలంలో తాను కొనుగోలు చేసిన ఫాంహౌస్‌కు సంబంధించి చెరువు స్థలాన్ని కబ్జా చేశానని, పక్క వారి భూముని కూడా గూగుల్ మ్యాప్‌లో చిత్రీకరించి నారా లోకేష్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. వాస్తవంగా ధర్మవరం పొలంలో సర్వే నంబర్ 904, 905, 908, 909లలో కేవలం 25.38 ఎకరాలను కొనుగోలు చేసి అందులో మాత్రమే ఫాంహౌస్ నిర్మించి వ్యవసాయం చేస్తున్నామన్నారు. ఈ పొలాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే నారా లోకేష్ మాత్రం తన ఫాంహౌస్‌కు ఆనుకుని సర్వే నంబర్ 43లో ఉన్న జే. సూర్యనారాయణ అనే రైతుకు చెందిన పొలాన్ని తనదిగా చూపుతూ గూగుల్ మ్యాప్‌లో చిత్రీకరించి 20 ఎకరాలు కబ్జా చేశానని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. నారా లోకేష్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం వల్ల మరింత విలువలు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ఏ విచారణకై నా తాను సిద్ధమని, ఒకవేళ తాను చెప్పింది నిజమని తేలితే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఒక వేల అబద్ధమని తేలితే తాను ఎమ్మెల్యే పదవికి తక్షణం రాజీనామా చేస్తానని, సవాల్‌ను స్వీకరించే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఆధారాలతో సహా మీడియాకు... ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు 20 ఎకరాల భూమిలో ప్లాట్లు వేసి రూ.60 కోట్లు కాజేశారని నారా లోకేష్ తాజాగా ఆరోపించారన్నారు. ఇది కూడా పూర్తిగా అవాస్తవమన్నారు. 2009లో తామే ఈ పొలంలో పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశామని తెలిపారు. ఆ తర్వాత 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ స్థలంలో పట్టాలను పంపిణీ చేసి ప్లాట్లను కాజేశారన్నారు. ఈ పొలం కూడా కోర్టు పరిధిలో ఉందన్నారు. అలానే దొరిగిల్లు రోడ్డులో సర్వే నంబర్ 1330–1లో గుట్టలు చదును చేసి 17 ఎకరాలను ఆక్రమించారని ఆరోపించారన్నారు. వాస్తవంగా అయితే తామే ఈ పొలం అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ భూమి అని తెలియజేసే బోర్డును ఏర్పాటు చేయించినట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మీడియాకు ఎమ్మెల్యే చూపించారు. అంతేకాక సదరు స్థలంలో కొంత భాగంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలానే దొరిగిల్లు రోడ్డులో సర్వే నంబర్ 2060–4 మూడెకరాల స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వం ఖబరస్థాన్ను ఏర్పాటు చేస్తే దాని ఆక్రమించారని చెప్పారని ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. వాస్తవంగా అయితే 2022లో 2–90 ఎకరాల స్థలాన్ని ఖబరస్తాన్కు స్థలాన్ని కేటాయించింది తామేనన్నారు. ఇందుకు సంబంధించి ఈ స్థలం పూర్తి రక్షణలో ఉందన్నారు. దీనికి సంబంధించి ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ కాపీని ఎమ్మెల్యే మీడియాకు చూపించారు. పరువు నష్టం దావా వేస్తా ప్రతి ఒక్క ఆరోపణకు తాను ఆధారాలతో సహా వివరణ ఇస్తున్నానని, తాను ఒక్కటే చెబుతున్నానని తన అనుచరులు ఎవరైనా సరే చిన్నపాటి తప్పు చేసిన ఉపేక్షించేది లేదన్నారు. అయితే ఏ ఆధారం లేకుండా తప్పుడు ఆరోపణలు చేసే మీలాంటి వారిని ప్రజలు క్షమించరన్నారు. పాదయాత్రలో ప్రజలకు మీరు ఏం మంచి చేస్తారో చెప్పాల్సింది పోయి ఇలా బురదజల్లుడు రాజకీయాలు చేస్తూ పోతే మనుగడ ఉండదని హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేసిన నారా లోకేష్, పరిటాల శ్రీరామ్‌లతో సహా యల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు. -
Defamation Case: న్యాయ పోరాటానికి రాహుల్ సై!
పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సిద్దమయ్యినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన మంగళవారం (ఏప్రిల్ 03, 2023న) సూరత్ సెషన్స్ కోర్టులో తన శిక్షను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తన పిటిషన్లో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. అలాగే దీనిపై తీర్పు వెలువడేంత వరకు మధ్యంతర ఉత్తర్వులు విధించాలని సెషన్స్ కోర్టుని అభ్యర్థించనున్నారు. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి పరువు నష్టం కేసులో రాహుల్‌గాందీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలసింది. ఆ తదుపరి వెంటనే ఎంపీగా లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. ఆ వెను వెంటనే అధికారిక నివాసాన్ని సైతం ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు రాహుల్ ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడైంది. (చదవండి: కాఫీ షాప్ పార్కింగ్ ఆఫర్..రూ 60 కోసం పదేళ్లు పోరాడి గెలిచాడు) -
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన వైఎస్సార్సీపీ
సాక్షి, నెల్లూరు: ఉదయగిరిలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు స్వీకరించాయి. వైఎస్సార్సీపీ నేత మూలే వినయ్‌రెడ్డి వర్గీయులు బస్టాండ్ సెంటర్లో కూర్చున్నారు. అవినీతి ఎమ్మెల్యే, పార్టీ ద్రోహి మేకపాటి అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేకపాటి తన వద్ద డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా అంటూ మూలే వినయ్‌రెడ్డి సవాల్ విసిరారు. మేకపాటికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ ద్రోహి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఉదయగిరి నుంచి చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లిపోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలపై నోరు పారేసుకున్న మేకపాటి.. వారిపై రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. మేకపాటి చేసిన సవాల్‌తో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. చదవండి: కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్! -
ఆనం రాంనారాయణరెడ్డికి నేదురుమల్లి ఛాలెంజ్
-
ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ: సోర్స్ కోడ్ లీక్ కలకలం
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విటర్‌కు మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ట్విటర్ సోర్స్ కోడ్ ఆన్లైన్లో లీక్ అయిందన్న తాజా అంచనాలు కలకలం రేపాయి. 44 బిలియన్డాలర్లతో సంస్థను కొనుగోలు చేసినప్పటినుంచి అనేక సవాళ్లను మధ్య నెట్టుకొస్తున్న మస్క్‌కు ఇది మరో సవాల్ అని నిపుణులు భావిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ GitHub నుండి లీక్ అయిన సమాచారాన్ని తీసివేసేలా ట్విటర్ చట్టపరమైన చర్య తీసుకున్న తర్వాత ఈ కోడ్ లీక్ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కోడ్‌లో భద్రతా లోపాలు హ్యాకర్లకు వినియోగదారు డేటాను దొంగిలించడానికి లేదా సైట్‌ను తీసివేయడానికి అవకాశం ఇస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకైన్ సోర్స్ కోడ్‌లో ట్విటర్, ఇంటర్నల్ టూల్స్ ప్రాపర్టీ సోర్స్ కోడ్ ఉంది, అయితే ఇది ట్వీట్లను సిఫార్సు చేసే సోర్స్ కోడ్ లీక్‌లో భాగమేనా అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. (మస్క్ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్!) దీనికి సంబంధించి కాలిఫోర్నియాలోని నార్తర్న్ కోర్ట్‌లో దాఖలైన ఫిర్యాదు మేరకు అనుమతి లేకుండా దాని సోర్స్ కోడ్ స్నిప్పెట్లను షేర్ చేసిన తర్వాత GitHubకి నోటీసు లిచ్చింది. కాపీరైట్ ఉల్లంఘన నోటీసు తర్వాత కంటెంట్‌ను తక్షణమే తీసివేయడానికి GitHub అంగీకరించింది, అయితే కోడ్ ఆన్లైన్లో ఎంతకాలం ఉందో అస్పష్టంగా ఉంది. డేటాను షేర్ చేసిన యూజర్ పేరు “FreeSpeechEnthusiast” గా తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారంపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. గత ఏడాది మస్క్ ట్విటర్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ట్వీట్లను సిఫార్సుకుఉపయోగించే కోడ్ మార్చి 31న ఓపెన్ సోర్స్ చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు ట్విటర్ విలువ దాదాపు సగానికి పడిపోయిందని అంగీకరించిన మస్క్, యూజర్లకు బ్లూ సబ్స్క్రిప్షన్, ప్రకటనదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
లోకేష్ కు కొడాలి నాని సవాల్
-
మాజీ ఎంపీ పొంగులేటికి ఎమ్మెల్సీ తాత మధు సవాల్
-
కోటంరెడ్డికి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం జిల్లా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అనంతపురంలో రాయలసీమ రైతు ఉత్పత్తి దారుల సమ్మేళనాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి.. సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ప్రమాణం చేస్తా... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉందా.. అని మంత్రి సవాల్ విసిరారు. కోటంరెడ్డి నమ్మకద్రోహి అని.. మంత్రి పదవి రాలేదనే.. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి పచ్చి అబద్ధాల కోరు. విశ్వాస ఘాతకుడు, నమ్మక ద్రోహి అని కాకాణి దుయ్యబట్టారు. చదవండి: వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: నారాయణ స్వామి షాకింగ్ కామెంట్స్ -
దమ్ములేనిది కేసీఆర్ బానిసలకే: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: ‘సీఎం కేసీఆర్ బానిసలు, ఆయన సంధించిన సైకో శాడిస్టులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్ళు నెత్తికెక్కి, అహంకారంతో బలుపెక్కి దమ్ముందా అని మాకు చాలెంజ్ చేస్తున్నారు ... దమ్ములేనందునే వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ఏనుగు రవీందర్ రెడ్డి, తుర్క నరసింహులుతో కలిసి శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు. తమపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన తమ ధైర్యం ఏమాత్రం దెబ్బతినదని.. వారి మాటలను మరింత స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు క్షేత్రస్థాయిలో ఇంకా దూకుడుగా కొట్లాడ తామన్నారు. ఈ దేశంలో తెలంగాణ భాగం కాదు ఒక ప్రత్యేక దేశం అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరి స్తున్న తీరు ఏమాత్రం మంచిది కాదన్నారు. గవర్నర్‌తో వ్యవహరించిన తీరు జుగుప్సాకరం ‘ఈ జనవరి 26న కేసీఆర్ రాజ్యాంగం పట్ల వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని మహిళలను అవమానపరచడమే’ అని ఈటల అన్నారు. చదవండి: మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ -
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్
-
చర్చకు రెడీ.. చంద్రబాబుకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సవాల్
సాక్షి, గుంటూరు: పొన్నూరు అభివృద్ధిపై చంద్రబాబు చర్చకు రావాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సవాల్ విసిరారు. బాబు సవాల్ స్వీకరిస్తున్నానని, ఐలాండ్ సెంటర్లో చర్చకు రెడీ అని రోశయ్య స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను మోసం చేసిన చంద్రబాబు.. ఏ ముహం పెట్టుకుని పొన్నూరుకు వచ్చారని నిలదీశారు. మూడున్నరేళ్లలో పొన్నూరులో రూ.1200 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. చదవండి: ప్రభుత్వంపై బురదజల్లడమే పచ్చపత్రికల పని -
11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో
న్యూఢిల్లీ: తనపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 1992 ఉపశమన నిబంధనలకు ఈ కేసుకు వర్తింపజేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో అనుమతివ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. అలాగే 11 మంది దోషులను ముందుగానే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను ఒకేసారి, ఒకే ధర్మాసనం విచారించే విషయాన్ని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె మూడెళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. అప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు. ఐదు నెలల గర్భవతి కూడా. ఈ దారుణ ఘటనలో 11 మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే 15 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వీరిని ఈ ఏడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా' -
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
-
ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..!
ముంబై: ముంబైలో వరుస చోరీలకు పాల్పడుతూ స్థానికులను హడలెత్తిస్తోంది ఓ దొంగల ముఠా. దాదర్, బైకులా ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులు లేని అపార్ట్మెంట్స్, ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తోంది. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య పాలు పోసేవాళ్లు, న్యూస్‌పేపర్లు వేసేవాళ్లు వస్తారని తలుపులు తీసి ఉంచే ఇళ్లనే టార్గెట్ చేసుకుని దోపిడీలు చేస్తోంది. క్షణాల్లో ఇంట్లోకి ప్రవేశించి మొబైల్ పోన్లు, వస్తువులు, నగలు, ఇలా ఏది కన్పిస్తే దాన్ని తీసుకెళ్లిపోతుంది. ఒక్క అక్టోబర్‌లోనే ఈ ముఠా 12 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 30 ఏళ్ల పైబడిన ఓ మహిళ, 18 ఏళ్ల యువతి, 10 ఏళ్ల బాలుడు, 10-12ఏళ్ల బాలిక కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో లభించిన వీరి ఫోటోను షేర్ చేసి స్థానికులను అప్రమత్తం చేశారు. అయితే సోమవారం రాత్రి దాదర్ రైల్వే స్టేషన్లో ఈ ముఠా లీడర్‌గా ఉన్న మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం వేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తలుపులు బార్ల తీసి ఉంచొద్దని సూచించారు. చదవండి: 6 అడుగుల ఎత్తు.. 30 లక్షల ఉద్యోగం ఉన్నోడే కావాలి..! -
గడ్కరీ ఛాలెంజ్: హమ్మయ్యా.. 32 కేజీలు తగ్గాను
ఢిల్లీ: అనిల్ ఫిరోజియా Anil Firojiya గుర్తున్నాడా?.. అదేనండీ బరువు తగ్గితేనే(కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున) నియోజకవర్గ నిధులు మంజూరు చేస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ షరతు విధించడం.. అది ఛాలెంజ్‌గా తీసుకుని వర్కవుట్లు చేస్తూ బరువు తగ్గించుకునేందుకు యత్నించిన బీజేపీ ఎంపీ. ఆ ఎంపీ ఇప్పడు ఏకంగా 32 కేజీల బరువు తగ్గారట. పొద్దున్నే ఐదున్నరకు లేచి నడక. ఆపై రన్నింగ్, ఎక్సర్సైజ్లు, యోగాలతో కూడిన వర్కవుట్స్. ఆయుర్వేదిక్ డైట్ పాలో కావడం. ఆపై లైట్ బ్రేక్‌ఫాస్ట్. లంచ్, డిన్నర్‌లోకి సలాడ్, ఒక గిన్నెలో గ్రీన్ వెజిటెబుల్స్, మిశ్రమ తృణధాన్యాలలతో చేసిన ఒక రోటీ, క్యారట్ సూప్, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్.. ఇవి మాత్రమే తిని ఆయన తన బరువును ఏకంగా 30 కేజీలకు పైగా తగ్గించుకున్నారట. అలా ఎనిమిది నెలలకు పైగా ఇష్టాలను కట్టడి చేసుకుని.. కష్టం మీద బరువును నియోజకవర్గం కోసం తగ్గించుకున్నారాయన!. ఈ మేరకు సోమవారం ఉజ్జయిని ఎంపీ(మధ్యప్రదేశ్) అనిల్ ఫిరోజియా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి తాను బరువు తగ్గిన విషయాన్ని వెల్లడించారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన గడ్కరీ.. ఫిరోజియాను అభినందించి ఇచ్చిన మాట ప్రకారం.. తొలి దశలో రూ.2,300 కోట్ల అభివృద్ది నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. గడ్కరీ స్ఫూర్తితో పాటు ప్రధాని మోదీ ఇచ్చిన ఫిట్ భారత్ పిలుపు తనను ఆకర్షించాయని చెప్తున్నారాయన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఫిరోజియాగారికి ఒక షరతు. ఆ పని చేస్తేనే నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తా. ఒకప్పుడు నా బరువు 135 కేజీలు ఉండేది. అది ఫిరోజియాగారి కంటే ఎక్కువ. ఇప్పుడు నా బరువు 93 కేజీలు. నా పాత ఫొటోను కూడా ఆయనకు చూపించా. అందులో నన్ను గుర్తు పట్టడం కష్టమే. ఒక వేళ ఫిరోజియా గనుక బరువు తగ్గితే.. కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తా అని ప్రకటించారు. BJP MP from Ujjain @bjpanilfirojiya is on a mission to shed excess flab, not just to become fit, but also to fund the development of his Lok Sabha constituency as promised by Union Minister @nitin_gadkari @ndtv @ndtvindia pic.twitter.com/t7qv7K0FAB — Anurag Dwary (@Anurag_Dwary) June 11, 2022 ఇదీ చదవండి: ప్లీజ్ సార్.. మా అమ్మను అరెస్ట్ చేయండి!! -
ప్రధాని మోదీ, అమిత్‌షాకు మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్
-
మోదీ, అమిత్‌షాకు మంత్రి జగదీష్‌రెడ్డి చాలెంజ్
సాక్షి, నల్గొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. మునుగోడు మండలం కొరటికల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు చాలెంజ్ విసిరారు. ‘‘రూ.18 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధికి ఇవ్వండి.. ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటాం’’ అని మంత్రి అన్నారు. ఒక వ్యక్తి కోసం రూ.18 వేల కోట్లు ఇవ్వడమేంటి?. పార్టీ మారినందుకే రాజగోపాల్‌రెడ్డికి రూ.18వేల కోట్లు ఇచ్చారని జగదీష్‌రెడ్డి దుయ్యబట్టారు. చదవండి: చిక్కుల్లో మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే.. మరో వైపు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారంటూ మండిపడ్డారు. తనపై కావాలనే అపనిందలు వేస్తున్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేకపోతే ఆరోపణలు చేసేవారు రాజీనామా చేయాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయిమెంట్ ఇవ్వకుండా అవమానించారంటూ రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
ఆ వీడియో నిజమైతే నన్ను అరెస్టు చేయండి.. బీజేపీకి సిసోడియా సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆ పార్టీ విడుదల చేసిన స్టింగ్ వీడియోపై మండిపడ్డారు. ఒకవేళ ఆ వీడియో నిజమైతే నాలుగు రోజుల్లో తనను అరెస్టు చేయాలని కమలం పార్టీ నేతలకు సిసోడియా సవాల్ విసిరారు. బీజేపీ అధికార ప్రతినిధి సుదాన్షు త్రివేద్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఓ స్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నిందితుల్లో ఒకడైన అమిత్ ఆరోరా.. కొంతమందికి ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించిందని మాట్లాడినట్లు ఉంది. అంతేకాదు లిక్కర్ పాలసీతో వచ్చిన డబ్బును గోవా, పంజాబ్‌లో ఆప్ ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసినట్లు అతను చెప్పాడు. దీన్నే ఆధారంగా చూపుతు బీజేపీ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే సిసోడియా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. సీబీఐ అధికారులు తన ఇల్లు, బ్యాంకు లాకర్లో సోదాలు చేసినా ఒక్క ఆధారం కూడా లభించలేదని గుర్తు చేశారు. ఒకవేళ ఆ వీడియో నిజమైతే తనను అరెస్టు చేసినా సిద్ధమన్నారు. లేకపోతే ఆ వీడియో ఫేక్ అని బీజేపీ నేతలు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీని ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఇది అమలులో లేదు. ఈ పాలసీలో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ, అలాంటిదేమీ లేదని ఆప్ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయు. ఈ వ్యవహారంపై సీబీఐ కూడా కేసు నమోదు చేసి విచారణ చేపడుతోంది. చదవండి: గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల బెదిరింపులు -
వైరల్ వీడియో.. 5 నిమిషాల్లో 3 కేజీల సమోసా తినేశాడు..
న్యూఢిల్లీ: ఆహార పోటీల గురించి చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆహార పదార్థాలను చెప్పిన సమయంలోపు పూర్తి చేస్తే నగదు బహుమతులు సైతం ఇస్తుంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ బహుమతులు ఇస్తున్నారు. అలాంటి.. సంఘటనే తాజాగా వైరల్‌గా మారింది. రాజ్నీశ్ జ్ఞాని అనే వ్యక్తి ‘ఆర్ యూ హంగ్రీ’ అనే పేరుతో ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఆహార పోటీలకు వెళ్లటం.. ఇచ్చిన ఛాలేంజ్‌ను పూర్తి చేసి నగదు గెలుచుకోవటమే పనిగా పెట్టుకున్నాడు. గత నెలలో 30 నిమిషాల్లోనే 21 ప్లేట్ల ‘చోలే కుల్తే’ తిని వైరల్‌గా మారాడు. ఆ ఛాలేంజ్ పూర్తి చేయటం ద్వారా బులెట్ బైక్ గెలుచుకున్నాడు. అయితే, ఆ బైక్‌ను తిరిగి ఇచ్చేసి ఛాలెంజ్‌ను కొనసాగించాలని సూచించాడు. ఆ వీడియోను ఫేస్బుక్లో 12 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు మరోమారు ఈ బ్లాగర్ వీడియో వైరల్‌గా మారింది. స్ట్రీట్ ఫుడ్ ఛాలేంజ్‌లో పాల్గొని కేవలం 5 నిమిషాల్లోనే 3 కిలోల సమోసా లాగించేశాడు. ఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన ఈ సంఘటన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా 1 మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో.. ఛాలెంజ్‌ను బ్లాగర్‌తో పాటు రెస్టారెంట్ ఓనర్ వివరించారు. ఆ తర్వాత బాహుబలి సమోసాను తింటున్న వీడియోను ప్లే చేశారు. అయితే, ఇలాంటి ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు ముందు 1-2 రెండు రోజులు ఏమీ తినకుండా ఉంటాడు. కొంచెం చట్నీ, నీళ్లతో స్నేహితుల ప్రోత్సాహంతో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు బ్లాగర్. అందుకు గానూ రెస్టారెంట్ ఓనర్ వద్ద రూ.11వేల నగదు బహుమతి అందుకున్నాడు. ఇదీ చదవండి: Bahubali Samosa Challenge: తిన్నారంటే రూ. 51,000 మీవే.. కానీ ఒక్క షరతు! -
పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్‌కు సవాళ్లు
న్యూఢిల్లీ: పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్‌కు సమీప కాలంలో సవాళ్లు నెలకొన్నాయని డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్‌సింగ్ పేర్కొన్నారు. అయినా పరిశ్రమపై గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చన్నారు. నివాస గృహాలకు డిమాండ్ పరంగా గడిచిన రెండేళ్లలో నిర్మాణాత్మక రికవరీ కనిపిస్తోందని.. పరిశ్రమలో స్థిరీకరణ కారణంగా నమ్మకమైన సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నట్టు తెలిపారు. కంపెనీ వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్లకు ఉన్న డిమాండ్, దేశ ఆర్థిక వ్యవస్థ బలం ఈ రంగానికి మద్దతునిస్తాయన్నారు. ఆర్బీఐ గడిచిన మూడు నెలల్లో మూడు విడతలుగా 1.40 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో బ్యాంకులు సైతం వెంటనే రుణ రేట్లను పెంచేశాయి. 6.5-7 శాతం మధ్య ఉన్న గృహ రుణ రేట్లు 8-8.5 శాతానికి చేరాయి. డిమాండ్‌కు అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొత్త ఉత్పత్తులను అందిస్తున్నట్టు రాజీవ్‌సింగ్ చెప్పారు. దీంతో కొత్త ఇళ్ల బుకింగ్‌లలో మెరుగైన వృద్ధిని నమోదు చేస్తామన్న ఆశాభావాన్ని తెలిపారు. డీఎల్ఎఫ్ సేల్స్ బుకింగ్‌లు 2021-22లో రూ.7,273 కోట్లకు పెరగ్గా.. అంతకు ముందు సంవత్సరంలో ఇవి రూ.3,084 కోట్లుగానే ఉన్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బుకింగ్‌లు రెట్టింపై రూ.2,040 కోట్లుగా నమోదయ్యాయి. -
కేటీఆర్ చేనేత చాలెంజ్ స్వీకరించిన పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: చేనేత దినోత్సవం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీ రామా రావు విసిరిన చేనేత చాలెంజ్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వీకరించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ స్పందిస్తూ ’రామ్ భాయ్ చాలెంజ్‌ను స్వీకరించా. ఎందుకంటే చేనేత వర్గాలంటే నాకు ప్రేమ, అభిమానం’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. అనంతరం పవన్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఏపీ మాజీ మంత్రి బాలి నేని శ్రీనివాసరెడ్డి, తెలంగాణకు చెందిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌లను నామినేట్ చేస్తూ చేనేత చాలెంజ్ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను షేర్ చేయాలని వారిని కోరారు. కాగా, పవన్ స్పందన పట్ల కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లకు కూడా కేటీఆర్ చేనేత చాలెంజ్ విసిరారు. -
దిక్కుమాలిన టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్! ఏడుగురు చిన్నారులు బలి
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది చైనాకు చెందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్. కొద్ది రోజుల్లోనే మిలియన్ల మంది దానిని వినియోగించటం ప్రారంభించారు. అయితే.. దానికి ఎక్కువగా యువకులు, చిన్నారులు బానిసలవుతున్నారు. అందులోని ఛాలెంజ్‌లను అనుసరించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. టిక్‌టాక్ తీసుకొచ్చిన 'బ్లాకౌట్ ఛాలెంజ్' కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా 15 ఏళ్ల వయసులోపు వారే కావటం గమనార్హం. ఏమిటీ బ్లాకౌట్ ఛాలెంజ్? యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చె టిక్‌టాక్.. బ్లాకౌట్ ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఛాలెంజ్.. ఆక్సిజన్ అందకుండా చేసుకుని అపస్మారక స్థితికి చేరుకునేలా ప్రోత్సహిస్తుంది. బెల్టులు, చిన్న చిన్న బ్యాగులకు కట్టే దారాలతో తమను తాము ఊపిరి ఆడకుండా చేసుకోవాలి. బ్లాకౌట్ ఛాలెంజ్ ద్వారా తమ పిల్లలు ఊపిరాడకుండా చేసుకుని చనిపోయినట్లు టిక్‌టాక్‌పై పలువురు తల్లిదండ్రులు కేసులు పెట్టినట్లు ది వెర్జ్ న్యూస్ గురువారం వెల్లడించింది. ఇటీవలే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లాలాని వాల్టన్(8), అరియాని అరోయో(9)ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గతంలో 2021, జనవరిలో ఇటలీలో పదేళ్ల చిన్నారి, మార్చిలో అమెరికాలోని కొలొరాడోలో 12 ఏళ్ల బాలుడు, జూన్‌లో ఆస్ట్రేలియాలో 14 ఏళ్ల బాలుడు, జులైలో ఓక్లాహోమాలో 12 ఏళ్ల చిన్నారి, డిసెంబర్లో పెన్సిల్వేనియాలో 10 ఏళ్ల బాలిక మృతి చెందారు. టిక్‌టాక్ ప్రమాదకరమైన ఛాలెంజ్‌లతో చిన్నారులను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు పెన్సిల్వేనియా చిన్నారి నైలాహ్ అండర్సన్ తల్లి తవైన అండర్సన్. తన మొదటి పేజీలోనే ఈ ఛాలెంజ్‌ను ఉంచటం వల్ల పిల్లలు ఎక్కువగా చూస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నాం.. టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్ వల్ల చిన్నారులు చనిపోతున్నట్లు కేసులు నమోదవుతున్న క్రమంలో సంస్థ ప్రతినిధి సమాధానమిచ్చారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రమాదకర కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగిస్తామని తెలిపారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చదవండి: మాల్ పార్కింగ్‌లో శవమై కనిపించిన టిక్‌టాక్ స్టార్ -
బీజేపీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయంటున్న బీజేపీ రాష్ట్ర నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తోంది ఎంత.. కేంద్ర నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు ఎంత అన్న దానిపై కమలం పెద్దలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల కంటే కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చినట్లు రుజువు చేస్తే మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. చదవండి: దేశంలో మోదీ రాజ్యాంగం నడుస్తోంది: కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ అక్రమాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందన్నారు. దర్యాప్తు సంస్థలతో విపక్షాలపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం లేదని, మోదీ రాజ్యాంగమే అమలవుతోందన్నారు. బీజేపీ నిరంకుశత్వ తీరును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే సిన్హా మద్దతు కోరుతూ మిగిలిన ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతామని కేటీఆర్ తెలిపారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులకు బాధ్యులు ఎవరు ??
-
Sakshi Cartoon: కిలో బరువు తగ్గితే వెయ్యి కోట్లు.. గడ్కరీ సరదా సవాల్
మీకు కూడా ఎవరన్నా ఇలాంటి సవాల్ విసిరితే బావుండు సార్! -
మెట్రో రైలులో యువతి ‘జిగల్’ డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు నెటిజన్లు వినూత్నంగా థింక్ చేస్తుంటారు. ఇందుకోసం స్పెషల్ ఫీట్స్, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఈ కేటగిరికి చెందిన ఓ వీడియో తాజాగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇటీవలే వచ్చిన జిగల్ జిగల్ డ్యాన్స్ ఛాలెంజ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కొందరు నెటిజన్లు ఈ డ్యాన్స్‌పై ఫ్రెండ్స్‌కు ఛాలెంజ్ విసురుతున్నారు. తన ఫ్రెండ్ విసిరిన ఛాలెంజ్‌ను ఆక్సెప్ట్ చేసిన ఢిల్లీకి చెందిన ఓ యువతి ట్రెండీగా ఆలోచించింది. ఢిల్లీ మెట్రో రైలులో జిగల్ జిగల్ డ్యాన్స్ చేసి.. ఛాలెంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by kashika (@kashikabassi) కాగా, ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా క్షణాల్లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దీంతో వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక, జిగల్ జిగల్ డ్యాన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఛాలెంజ్ నడుస్తోంది. వివిధ దేశాలకు చెందిన అమ్మాయిలు కూడా డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆమె వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. మెట్రోలో డ్యాన్స్ చేయాలంటే ఎంతో కరేజ్ ఉండాలి అంటూ కామెంట్ చేశాడు. [TIKTOK] 220528 #ROSÉ Tiktok update with #JENNIE & #LISA 블랙핑크 @BLACKPINK pic.twitter.com/BXWbjvN6mF — Worldwide BLIИK 🌷 (@WorldwideBLINK) May 28, 2022 My favorite female artist Shakira dancing to a song called my money don't jiggle jiggle on the Tonight show with Jimmy Fallon she absolutely killed it ♥️♥️🔥🔥@shakira ♥️♥️🔥🔥 pic.twitter.com/zHR1JEkQLj — Vanessa Mendes (@vanessa_ban2) May 20, 2022 View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) ఇది కూడా చదవండి: నెట్టింట్లో హల్చల్ చేస్తున్న హైబ్రిడ్ భరతనాట్యం -
జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్లాన్ : ఉద్యోగుల షాక్!
ముంబై: ఎయిర్‌లైన్స్ కోసం జలాన్-కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళికను సవాలుచేస్తూ, ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్)లో అప్పీల్ దాఖలు చేసినట్లు ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ గురువారం తెలిపింది. బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్‌ల కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను 2020 అక్టోబర్‌లో జెట్ ఎయిర్వేస్ రుణ దాతల కమిటీ (సీఓసీ) ఆమోదించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ పరిష్కార ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు గత వారం జెట్ ఎయిర్వేస్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తిరిగి ధృవీకరించింది. దీనితో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్ 2019లో ఆగిపోయిన ఎయిర్‌లైన్ పునఃప్రారంభానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియను సవాలు చేస్తూ, ఆ సంస్థ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ తాజాగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. బీకేస్, జెట్ ఎయిర్వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్, వివిధ సంఘాలు కూడా గత నెలలో ఎన్సీఎల్ఏటీ ముందు అప్పీల్ దాఖలు చేశాయి. రాబోయే నెలల్లో సేవలను పునఃప్రారంభిస్తుందని భావిస్తున్న జెట్ ఎయిర్వేస్ను ప్రస్తుతం మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తోంది. అప్పీల్ ఎందుకంటే... జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, ఫ్లైట్ స్లాట్లు, మరీ ముఖ్యంగా ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగులతో సహా కీలక విభాగాల వినియోగం ఎలా అన్నది రిజల్యూషన్ ప్రణాళికలో ఊహాజనితంగా ఉందని ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ పావస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే తాము దీనిని సవాలు చేస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఏప్రిల్ 2018 నుండి జూన్ 2019 వరకు బోనస్, కార్మికులు-ఉద్యోగులందరికీ రిట్రెంచ్‌మెంట్ పరిహారం పూర్తి చెల్లింపులపై తగిన పరిష్కారం చూపాలని ఎన్సీఎల్ఏటీ ముందు దాఖలు చేసిన అప్పీల్లో విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. రిజల్యూషన్ దరఖాస్తుదారు లేదా మానిటరింగ్ కమిటీ ద్వారా తిరిగి నియమించబడిన ఏ ఉద్యోగికైనా అప్పటికే రావాల్సిన వారి గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, బోనస్ రిట్రెంచ్‌మెంట్ పరిహారం చెల్లించాలని కూడా అసోసియేషన్ డిమాండ్ చేస్తోందన్నారు. మినహాయింపులను ఎంతమాత్రం అంగీకరించడం జరగదని కిరణ్ పావస్కర్ స్పష్టం చేశారు. రిజల్యూషన్ ప్రణాళిక అస్పష్టమైన వ్యాపార ప్రణాళికతో ముడివడి ఉందని జెట్ ఎయిర్వేస్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఉద్యోగుల న్యాయ సలహాదారు నారాయణ్ హరిహరన్ అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన అన్ని చట్టబద్ధమైన హక్కులను, ముఖ్యంగా గ్రాట్యుటీ, ప్రివిలేజ్లీవ్, చెల్లించని జీతం, బోనస్‌లను మాఫీ చేయలని చూస్తున్నట్లు విమర్శించారు. జెట్ ఎయిర్వేస్ ఇంతక్రితం నరేష్ గోయల్, గల్ఫ్ క్యారియర్ ఎతిహాద్ యాజమాన్యంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం 2019 జూన్‌లో రూ. 8,000 కోట్లకు పైగా బకాయిల కోసం దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. -
ఐస్‌క్రీం తిని ఫ్లేవర్ చెప్తే చాలు.. రూ. లక్ష మీవే..
సాక్షి, హైదరాబాద్: హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియా ఐస్‌క్రీం టేస్టింగ్ చాలెంజ్’ నిర్వహిస్తున్నట్లు హైబిజ్ టీవీ ఎండీ రాజగోపాల్ తెలిపారు. గురువారం గోల్కొండ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియన్ ఐస్‌క్రీం మాన్యుఫ్రాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధీర్‌షా, దొడ్ల డెయిరీ ఐసీక్రీమ్స్ ప్రతినిధి అజయ్ సింహాలతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న హైటెక్స్‌లో ఈ ఛాలెంజ్ నిర్వహిస్తున్నామని, కళ్లకు గంతలు కట్టుకుని ఐస్‌క్రీం రుచి చూసి నగదు బహుమతిని గెలుచుకోవచ్చునన్నారు. ఈ సందర్భంగా నటి, మిస్ఇండియా–2018 స్పందన కళ్లకు గంతలు కట్టుకుని ఏ విధంగా ఐస్‌క్రీం రుచి చూడాలో చేసి చూపించారు. మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండో బహుమతి రూ.50 వేలు, ఉత్తమ ప్రతిభ కనబరచిన 25 మందికి రూ. 10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ఛాలెంజ్‌లో పలు ఫ్లేవర్ల ఐస్క్రీంలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ చాలెంజ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చునని రూ. 150 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 8340974747 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. చదవండి: రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్.. ‘వన్ ప్లస్’తో చిక్కాడు! -
చేతనైతే ప్రధాని అవినీతి బయటపెట్టు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు సత్తా ఉంటే, చేతనైతే ప్రధాని మోదీ అవినీతి చిట్టాను ప్రజల ముందు ఉంచాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రంపై, ప్రధానిపై గాలి మాటలు మాట్లాడ వద్దని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు సహా ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమన్నారు. గౌరవప్రదమైన భాషలో మాట్లాడితేనే వస్తానని శనివారం మీడియాతో కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్లో భూకంపం రాకుండా చూసుకోండి గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ దిగజారి ప్రవర్తిస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మరో గవర్నర్ ఉండి ఉంటే కాళ్ల మీద పడతాడు, ఈ గవర్నర్ కాళ్లు పీకుతున్నాడు. ఇంత దిగజారుడు వ్యవహారం ఏ సీఎం చేయలేదు’ అని అన్నారు. ఢిల్లీ వెళ్లి భూకం పం సృష్టిస్తామన్నారని, ముందు టీఆర్ఎస్లో భూకంపాలు, ప్రళయాలు రాకుండా కేసీఆర్ చూసుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సీబీఐ, ఈడీ ఒక్క కేసు అయినా రాజకీయ కోణంలో పెట్టిం దేమో చూపాలన్నారు. ‘111జీఓ పరిధిలో మీకు ఏమైనా భూములు ఉన్నాయా... ఈడీ, సీబీఐలకు ఎందుకు భయపడుతున్నారు.’అని ప్రశ్నించారు. గవర్నర్ పాలన రావాలనుకోవడం లేదు తెలంగాణలో గవర్నర్ పాలన రావాలని తాము అనుకోవడం లేదని కేంద్రమంత్రి చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడ గెలిచి అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ని తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తామన్నారు. ‘రూ.10 వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి రాష్ట్రం సహకరించలేదు. సైన్స్ సిటీకి భూమి ఇవ్వలేదు. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రారంభించడం లేదు. వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఇస్తే పెట్టలేదు. మెట్రో పనులు ఆపారు’ అని విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్న బస్తీ దవాఖానాలు ఎవరివో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పం దించడంతో చివరకు ఈ నెల 29న కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి రూ.10 వేల కోట్ల రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు టీఆర్ఎస్ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్ మీడియాపై నిర్బంధం పెరిగి పోయిందని కేంద్ర మంత్రి విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌పై 16 కేసులు పెట్టారని, మూడుసార్లు జైలుకు పంపించి పోలీసులు వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్‌పై కేసు పెట్టారు కానీ అందుకు కారణం అయిన వారిపై మాత్రం కేసు పెట్టలేదని విమర్శించారు. -
చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్
సాక్షి, తిరుపతి: చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం శిరోధార్యమన్నారు. తమకు పదవులు ఉన్నా లేకున్నా వైఎస్ జగన్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. జేసీపై పల్లె సంచలన వ్యాఖ్యలు సీఎం జగన్‌కు మరింత మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నానని.. దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం వైఎస్ జగన్ సీఎంగానే ఉంటారని, అన్ని అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత సీఎం జగన్ ప్రధాని అవుతారని నారాయణ స్వామి అన్నారు. వేషాలు వేసుకునే వాళ్లు రాజకీయాలకు పనికిరారని.. ఎన్టీఆర్‌పై నేను పోటీ చేస్తా అన్న చంద్రబాబు.. నేడు ఆ తెలుగుదేశం పార్టీ వారసులుగా చలామణి అవుతున్నాడు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం వుంటే.. కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని.. అలా గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాని నారాయణ స్వామి సవాల్ విసిరారు. -
దమ్ముంటే ఒక్కడివే రా.. పుతిన్‌కు ఎలాన్ మస్క్ ఛాలెంజ్
-
బీజేపీ నేత జీవీఎల్ కు వెల్లంపల్లి సవాల్
-
మంత్రి మునుగోడుకు వచ్చినా సరే.. నన్ను సూర్యాపేటకు రమ్మన్నా సరే!
సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడుకు వచ్చినా సరే.. నన్ను సూర్యాపేటకు రమ్మన్నా సరే! నాపై పోటీకి సిద్ధమా?’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్ చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయిం ట్లో మాట్లాడుతూ, అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని, తనను వ్యక్తి గతంగా కాంట్రాక్టర్ అనడం బాధాకరమని అన్నారు. తెలంగాణ కోసం వ్యాపారాలు నష్ట పోయామని, మంత్రి పదవి సైతం వదులుకు న్నామని గుర్తుచేశారు. 2014 ముందు జగదీశ్ రెడ్డి ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత? అని ప్రశ్నిం చారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకు నేం దుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సభలో కోరితే మంత్రి సమాధానంలో తన పేరు ప్రసా వించ కుండా శ్రీధర్‌బాబు, భట్టి పేర్లనే చెప్పి తనను కించపరచారని దుయ్యబట్టారు. మాకు పార్టీ గుర్తింపు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అధి ష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతోనే తాము పార్టీకి కొంత దూరంగా ఉంటున్నామని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. సీఎల్పీలో మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నుంచి వాళ్లకు పదవులు ఇస్తే ఏం లాభమని, తెలంగాణ కోసం కొట్లా డిన వారికి ప్రాధాన్యమివ్వాలన్నారు. అలా చేయకపోతే పాత కాంగ్రెస్ నేతలు దూరం అవుతారని చెప్పారు. పదవుల విష యంలో తమకు పార్టీ గుర్తింపు ఇవ్వలేద న్నారు. తనకు పార్టీలో ఎవరితో విభేదాలు లేవని, రేవంత్‌తో వ్యక్తిగత విభేదాలు లేవన్న రాజగోపాల్‌రెడ్డి సమర్థత ఉన్న వారికే మాత్రమే పదవులివ్వా లన్నది తన ఉద్దేశమని చెప్పారు. -
'చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా.. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకో'
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దించి నువ్వు(చంద్రబాబు) కుర్చీ ఎక్కితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. నిరంతరం తప్పుడు కథనాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న ఈనాడు, ఈటీవీ, టీవీ 5, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఇది అమలు చేస్తున్నామని తెలిపారు. ‘చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా. సీఎంగా జగన్‌ని దించి నువ్వు కుర్చీ ఎక్కితే నేను రాజకీయాలు వదిలి వెళ్లిపోతా. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకోవాలి. హైదరాబాద్‌లో ఎయిర్ పోర్ట్, రింగురోడ్డు నువ్వే వేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా. ఎవరో చేసినదాన్ని నువ్వు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎంగిలిమెతుకుల కోసం పాకులాడే తత్వం నీది. కుల పత్రికలు, కుల టీవీలు పెట్టుకుని రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూడొద్దు. రాష్ట్రానికి పట్టిన వైరస్, శని చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. చదవండి: (కుప్పం పర్యటన.. జనంపై చంద్రబాబు చిందులు) -
Squid Game Challenge: స్క్విడ్ గేమ్ ఛాలెంజ్‌లో నెగ్గిన 'హిట్‌మ్యాన్'
Team India Star Cricketers Take Squid Game Challenge: నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'లోని డల్గోనా క్యాండీ ఛాలెంజ్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను టీమిండియా క్రికెటర్లు సైతం స్వీకరించారు. ఛాలెంజ్‌లో భాగంగా క్యాండీలో ఉన్న ఆకారాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా బయటకు తీయాల్సి ఉంటుంది. టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా పాల్గొన్న ఈ పోటీకి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, మహ్మద్ షమీలు విజేతలుగా నిలిచారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. హిట్‌మ్యానా మజాకా అంటూ అతని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరో పక్క షమీపై సైతం నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా టీమిండియా.. ఈ నెల 24న దాయాది పాకిస్థాన్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు నమోదు చేసిన కోహ్లి సేన మాంచి ఊపు మీదుంది. చదవండి: ఐపీఎల్‌పై ఆసక్తి చూపుతున్న క్రిస్టియానో రొనాల్డో జట్టు..! -
చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికిన హాలీవుడ్..!
అప్పుడప్పుడు మనం సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూస్తూ ఉంటాం. అయితే, అలాంటి చిత్రాల కోసం ప్రత్యేకంగా సెట్స్ డిజైన్ చేయడమో లేదా గ్రాఫిక్స్ రూపంలోనో వాటిని డైరెక్టర్లు చూపిస్తారు. ఆ చిత్రాలు కూడా నిజంగానే అంతరిక్షానికి వెళ్లి తీశారో ఏమో అన్న అనుభూతిని కలిగిస్తాయి. తాజాగా, అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ కోసం రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లారు. షూటింగ్ కోసం ఆ సినిమా డైరెక్టర్, హీరోయిన్ ప్రత్యేక వ్యోమనౌకలో నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఐస్)కు బయల్దేరి వెళ్లారు. ‘ది ఛాలెంజ్’ అనే సినిమా షూటింగ్ కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ నేడు అంతరిక్షానికి బయల్దేరారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్ ఎంఎస్19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్‌తో కలిసి ఐఎస్ఎస్ వెళ్లారు. మన దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో కజకిస్థాన్‌లోని బైకోనుర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. 12 రోజుల పాటు వీళ్లు స్పేస్ స్టేషన్లోనే ఉండనున్నారు. ఆ తర్వాత వీళ్లను మరో రష్యన్ కాస్మోనాట్ భూమి మీదికి తీసుకు వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం నాలుగు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అంతరిక్షంలో మూవీ షూటింగ్‌ను రష్యన్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శించినా లెక్క చేయకుండా రష్యన్ స్పేస్ కార్పొరేషన్ రాస్‌కాస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ ఈ మిషన్‌లో కీలక పాత్ర పోషించారు. అక్కడి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయితే, అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం రష్యానే కానుంది. గతేడాది ప్రముఖ హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కూడా స్పేస్‌లో షూటింగ్ చేయడం కోసం సిద్దమైన సంగతి తెలిసిందే. దానికోసం నాసా, స్పేస్-ఎక్స్ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే ఆ తర్వాత దానిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ మధ్య కాలంలో అంతరిక్ష పర్యటన అనేది చాలా ఒక బస్ జర్నీ లాగా మారింది. The #SoyuzMS19 spacecraft successfully reaches orbit 🚀 Cosmonaut @Anton_Astrey and spaceflight participants Yulia Peresild and Klim Shipenko are on their way to the International Space Station! The docking will take place in 3 hours - at 12:12 UTC. pic.twitter.com/viEeHHVovH — РОСКОСМОС (@roscosmos) October 5, 2021 -
వైరల్: బంఫర్ ఆఫర్.. 20 నిమిషాల్లో తింటే 20 వేలు మీవే !
ఇటీవల సోషల్‌మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఒక్కోసారి అనుకోకుండా అవి వైరల్‌గా మారి దూసుకుపోతుంటాయ్ కూడా. తాజాగా ఓ రోడ్ సైడ్ పుడ్ స్టాల్ యజమాని ఇలానే భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరాడు. అదేంటంటే.. ఓ రోల్‌ని జస్ట్ 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోవచ్చంటూ అందరినీ ఆకర్షించాడు. సాధారణంగా ఇటువంటి ఫుడ్ ఛాలెంజ్‌లు విదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అందులో తక్కువ సమయంలో ఎక్కువ ఫుడ్ లాగిస్తే సరిపోతుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్ స్టాల్ యజమాని తను తయారు చేసిన 10 కేజీల బాహుబలి కాథీ రోల్‌ను కేవలం 20 నిమిషాల్లో తింటే రూ.20,000 ఇస్తానని పుడ్ లవర్స్‌కి బంఫర్ ప్రకటించాడు. ఇక ఆ రోల్ మేకింగ్ వీడియోని సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ఛాలెంజ్‌కి ఎవరైనా రావచ్చని తెలిపాడు. ఆ రోల్‌ని.. గోధుమపిండితో తయారుచేసి 30 గుడ్లను ఆమ్లెట్‌గా వేయడంతో పాటు అదనంగా అందులో నూడుల్స్, కబాబ్స్, సోయా ఛాప్‌తో నింపేశాడు. చూస్తుంటే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. దీనంతటనీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారి పుడ్ లవర్స్‌ని నోరూరిస్తోంది. ఛాలెంజ్ ఆసక్తిగా ఉన్నా, రోల్ టేస్టీగా ఉన్నా.. ఆ బాహుబలి రోల్‌ని 20 నిమిషాల్లో తినాలంటే ఎంతటి భోజనప్రియులకైనా కొంచెం కష్టమే మరీ. అది కూడా 10 కేజీలు బరువు గల ఆహారం అంటే.. మామూలు విషయం కాదండి. అందుకే ఏమో అంత ధైర్యంగా ఆ ఛాలెంజ్ విసురుతున్నాడు. View this post on Instagram A post shared by THE FOOD CULT - TFC (@the.food_cult) చదవండి: ‘పాల దంతాలు ఊడిపోయాయి సాయం చేయండి’.. ప్రధాని మోదీ, అస్సాం సీఎంకు అక్కాచెల్లెళ్ల లేఖ -
‘రైస్ గమ్’ మీమ్ గుర్తుందా.. యువకుడి తలరాతను మార్చేసింది
ట్రెండ్ ఫాలో అయ్యేవారు కొందరు. ఇది ఎంతో వీజీ. ట్రెండ్ సెట్ చేసేవారు కొందరు. ఇది చాలా కష్టం. ఇష్టమైన పనికోసం కష్టపడితే.... ట్రెండ్ సెట్ చేయడం చిటిక వేసినంత పని అంటున్నాడు అమీర్. నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్లి యూట్యూబ్‌లో ‘రైస్ గమ్’ అనే మీమ్‌ను చూడండి. అది ఒక యువకుడి తలరాతను మార్చిన మీమ్. అమీర్ అనే కుర్రాడు ట్రెండ్‌సెట్టర్‌గా మారడానికి శ్రీకారం చుట్టిన మీమ్... ఎవరీ అమీర్? ‘కెనడాలో జన్మించిన అమీర్ ఉస్మాన్ ఫ్రెంచ్ మాట్లాడుతూ పెరిగాడు. వాళ్ల కుటుంబం లెబనాన్ నుంచి కెనడాకు వలస వచ్చింది....’ ఒకప్పుడు అమీర్ గురించి చెప్పడానికి ఈమాత్రం సరిపోతుంది. ‘ట్రెండ్ సెట్టర్’గా యూత్‌కు ఆదర్శంగా నిలిచిన అదే అమీర్ గురించి చెప్పడానికి ఇప్పుడు చాలా ఉంది. మన ఇంట్లో లేదా ఇరుగింటి, పొరుగింటి కుర్రాళ్లలాగే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో విహరించడం అంటే అమీర్‌కు ఇష్టం. ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియోగేమ్ ‘కాల్ ఆఫ్ డ్యూటీ’లాంటివి ఆడడం అంటే ఇష్టం. ఇక ‘ఫేజ్ క్లాన్’లాంటి యూట్యూబర్స్ అంటే మామూలు ఇష్టం కాదు. ‘అథెంటిక్ అండ్ రిలేటబుల్’ వీడియోలు రూపొందిస్తుంటారు అని వేనోళ్ల పొగిడేవాడు. ఒకరోజు ఎందుకో సరాదాగా మీమ్ చేయాలనిపించింది. అనుకున్నదే ఆలస్యం ‘రైస్గమ్’ అనే మీమ్ చేసి యూట్యూబ్‌లోకి వదిలి మరిచిపోయాడు. ‘ఇంత రెస్పాన్స్ వస్తుంది’ ‘అంత రెస్పాన్స్ వస్తుంది’ అని లెక్కలేమీ వేసుకోలేదు. మూడు రోజుల తరువాత ఈ మీమ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. వ్యూస్, నొటిఫికేషన్లతో ఫోన్ బరువుగా మారింది. కామెంట్స్‌లో ఒకచోట... ‘నేను మీ సబ్స్రైబర్ను. ఏదో ఒకరోజు మీరు బిగ్ యూట్యూబర్ అవుతారు’ అని ఎవరో ఆశీర్వదించారు. వారి మాట నిజమైంది!‘రైస్గమ్’ మీమ్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసిన తరువాత ‘యస్.నేను చేయగలను. అందరినీ ఆకట్టుకునేలా కంటెంట్ క్రియేట్ చేయగలను’ అనే నమ్మకానికి ఉత్సాహం వచ్చింది. ప్రఖ్యాత మొబైల్ గేమ్ ‘పోక్‌మన్’ను దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేసిన కంటెంట్‌కు వచ్చిన రెస్పాన్స్ అదిరిపోయింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. రకరకాల ఛానళ్ల వాళ్లు దీన్ని మురిపెంగా ప్రసారం చేశారు. ఒలింపిక్ ఆటలపై తయారుచేసిన మీమ్స్ కూడా అదరహో అదరహో! తన టీ అంటే ఇష్టం. అలా తన పేరును ‘టీవాప్’గా, బ్రాండ్‌గా మలిచి, దాన్ని యూట్యూబ్ చానల్ చేసి ట్రెండింగ్ టాపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కంటెంట్ క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. తన తమ్ముడి సహాయం కూడా తీసుకున్నాడు. ‘టీవాప్’ వీడియోలు ఎంత పాప్లర్ అయ్యాయి అంటే...‘యూట్యూబ్ వీడియోలలో ఇదొక కొత్తగాలి’ అని ప్రశంసలు అందుకున్నాయి. కంటెంట్ విషయం పక్కన పెడితే ఎడిటింగ్, ప్రయోగాలు చేయడంలో ట్రెండ్‌సెట్టర్ అనిపించుకున్నాయి. ‘హౌ టు ఎడిట్ లైక్ టీవాప్’ పేరుతో రకరకాల వీడియోలు హల్చల్ చేస్తున్న సమయంలో ‘ఆ పని మనమే ఎందుకు చేయకూడదు’ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తమ్ముడు ఐమన్ ఉస్మాన్‌తో కలిసి రంగంలోకి దిగి ఆటోమేషన్, యానిమేషన్ నిపుణులతో చర్చించాడు అమీర్. కొత్త క్రియేటర్లకు సులువుగా ఎడిటింగ్‌లో మెలకువలు నేర్పించే చిట్కాలతో పాటు హై–క్వాలిటీ యానిమేషన్స్ 5 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకునే సాంకేతికజ్ఞానాన్ని రెడీ చేశాడు. ‘మీకు ఇష్టమైన పనిలో బాగా కష్టపడితే, మీకు ఉపాధి లభించడమే కాదు ఆ కష్టం మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది’ అంటున్నాడు అమీర్. అక్షరసత్యం అని చెప్పడానికి అడ్డేముంది! -
మారుతీ మొబిలిటీ చాలెంజ్: పది లక్షలు మీ సొంతం..!
న్యూఢిల్లీ: రవాణా, వాహనాలకు సంబంధించిన కొత్త తరం టెక్నాలజీలను ఆవిష్కరించే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) కొత్తగా మొబిలిటీ చాలెంజ్ పోటీలను ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు చెందిన టీ–హబ్‌తో కలిసి దీన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దేశవిదేశాలకు చెందిన సిరీస్ ఎ స్థాయిలోని స్టార్టప్‌లు మొదలుకుని యూనికార్న్‌ల స్థాయి సంస్థలు ఇందులో పాల్గొనవచ్చని వివరించింది. మారుతీ ఇప్పటికే మెయిల్ (మొబిలిటీ, ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్) పేరిట స్టార్టప్‌ల కోసం ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. కొత్తగా ఆవిష్కరించిన మొబిలిటీ చాలెంజ్ .. ప్రత్యేకంగా ప్రారంభ దశలోని, పూర్తి స్థాయిలో విస్తరించిన స్టార్టప్‌ల కోసం ఉద్దేశించినది. ఎంపికైన స్టార్టప్‌లకు మారుతీ, టీ–హబ్ నుంచి తోడ్పాటు లభిస్తుంది. గెలుపొందిన రెండు సంస్థలకు చెరి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా ఉంటుంది. చదవండి: మే నెలలో భారీగా తగ్గిన వాహన విక్రయాలు