Chandrababu Naidu government
-
పోసానిపై పైశాచికం!
సాక్షి, అమరావతి: సినిమాల్లో విలన్లు.. వృద్ధులు, మహిళలను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు చూపిస్తారు..! అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది!! తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. రోజుకో కేసులో అరెస్ట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ రోడ్డు మార్గంలో ఏకంగా 2,501 కి.మీ. తిప్పి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది! 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు పక్కా పన్నాగంతో పోసాని కృష్ణ మురళిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టీకానికి తెగించారు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు మొదట అరెస్ట్ చేయగా అక్కడ నుంచి రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్ట్‌ల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా నాలుగు కేసుల్లో అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని పోసాని కృష్ణ మురళి నివాసంపై పోలీసులు దండెత్తారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. రాత్రంతా వాహనంలో తిప్పి ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు ఓబులవారిపల్లెకు తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు పోసానిని ఏకంగా 9 గంటల పాటు విచారించడం గమనార్హం.ఫలించిన న్యాయ పోరాటం..నేడు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశంవిశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తదితర పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి ఆ జిల్లాలకు వరసగా తరలించాలని పోలీసులు భావించారు. అయితే పోసాని న్యాయ పోరాటం ఫలించింది. ఆయనపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. ఇక పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి. విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఆదోని ఇన్చార్జి అపర్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణ మురళి బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. -
అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్ యూటర్న్
-
పిఠాపురం పీఠాధిపతి ఎక్కడ ? పవన్ కళ్యాణ్‌పై శ్యామల సెటైర్లు
-
శ్రీధర్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం
-
Karumuri Venkat Reddy: నాగబాబుకి ఇచ్చినప్పుడు.. హైపర్ ఆదికి ఎందుకివ్వరు!
-
పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు
-
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స
-
బాబుపై కదంతొక్కిన అంగన్వాడీలు
-
స్టార్ హోటల్లో IAS అధికారుల భార్యలు.. ప్రభుత్వం సిగ్గు పడాల్సిన విషయం
-
ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీ భార్య పిటిషన్ పై విచారణ
-
వర్మ.. నీ కర్మ వాళ్ళని ఎలా నమ్మావయ్యా..
-
అక్రమ కేసులపై తగిన మూల్యం చెల్లించక తప్పదు: రజని
-
Anganwadi Workers: విజయనగరంలో అంగన్వాడీల ధర్నా
-
Vidadala Rajini: పత్తిపాటి పుల్లారావు డైరెక్షన్లో తప్పుడు కేసులు..ఇవిగో ఆధారాలు
-
పోసాని క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
-
ఎమ్మెల్సీ పదవుల్లో సీనియర్లకు హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు
-
ఇంకా నయం ఇంటి చుట్టు వరకే ఫ్రీ బస్సు అనలేదు రోజా సెటైర్లే సెటైర్లు
-
ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
-
అబద్ధాలలో చంద్రబాబు PHD చేశారు
-
ఏమైంది డిప్యూటీ సీఎం సార్ .. శ్యామల ఫన్నీ సెటైర్స్
-
పోసానికి బెయిల్ మంజూరు చేసిన కడప మొబైల్ కోర్టు
-
Super Six Schemes: కూటమిపై ఎమ్మెల్సీ బొత్స ఆగ్రహం
-
Tatiparthi Chandrasekhar: అసెంబ్లీ సాక్షిగా అప్పు లపై టీడీపీ అబద్ధాలు బట్టబయలు
-
నేను గాంధీ గారి బాటలో నడిచేవాణ్ణి.. జగన్ గురించి ఒక్కటే చెప్తున్నా
-
హంద్రీ–నీవా.. ‘ఈనాడు కిరణ్’ బంధువా!
సాక్షి, అమరావతి: అధికారం మనోళ్ల చేతిలో ఉంటే అక్రమాలకు అడ్డేముంది..! దోచుకున్నోడికి దోచుకున్నంత! టెండర్లలో ఎన్నో వండర్లు సృష్టించొచ్చు. నియమ, నిబంధనలు అనుకూలంగా సృష్టించుకోవచ్చు. దోపిడీకి అడ్డుండదు. హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ (ఆధునికీకరణ) పనుల్లో ఇదే జరుగుతోంది. లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు పెరగవని.. బోర్లు, బావులు ఎండిపోతే పంటలు సాగుచేసుకోలేక రోడ్డున పడతామని అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల రైతులు మొత్తుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోకుండా లైనింగ్ పనుల టెండర్లకు ఆమోదముద్ర వేశారంటే ప్రభుత్వ పెద్దల ‘ఉద్దేశం’ ఏమిటో అర్థమవుతుంది. అస్మదీయులకు పనులను అధిక ధరలకు కట్టబెట్టి ఖజానాను దోచుకోవడమే ఇందులోని పరమార్థం. ఈ బాగోతం కథాకమామిషు ఏమిటంటే.. బట్టబయలైన లాలూ‘ఛీ’ పర్వం.. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,520 క్యూసెక్కులకు పెంచడమే లక్ష్యంగా 216.3 కి.మీ. నుంచి 400 కి.మీ. వరకూ లైనింగ్ పనులను 12 ప్యాకేజీలుగా చేపట్టేందుకు రూ.936.70 కోట్లతో గతేడాది డిసెంబరు 3న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. కానీ, ఈ పనులను ఐదు ప్యాకేజీలకు కుదించి ఆర్నెలల్లో పూర్తి చేయాలనే నిబంధనతో టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే.. ఐదు ప్యాకేజీల్లో మూడు ప్యాకేజీలను ‘ఈనాడు’ కిరణ్ సమీప బంధువుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు, రెండు ప్యాకేజీలను సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన బీఎస్సార్ ప్రాజెక్ట్స్‌కు కట్టబెట్టాలని ముఖ్యనేత నిర్ణయించినట్లు అప్పట్లో కాంట్రాక్టర్లలో చర్చ జరిగింది. ఈ టెండర్లలో పాల్గొనేందుకు అర్హత కోసం ఆ రెండు కాంట్రాక్టు సంస్థలు ఎల్సీసీ ప్రాజెక్ట్స్ అనే సంస్థతో వేర్వేరు జాయింట్ వెంచర్లు (జేవీ) ఏర్పాటు చేశాయి. ఒకటి, రెండు, మూడు ప్యాకేజీల పనులను ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్–ఎల్సీసీ (జేవీ).. నాలుగు, ఐదు ప్యాకేజీల పనులను బీఎస్సార్ ప్రాజెక్ట్స్–ఎల్సీసీ (జేవీ) దక్కించుకునేలా లోపాయికారీ ఒప్పందం మేరకు బిడ్లు దాఖలు చేశాయి. ఆర్ధిక బిడ్ తెరిచినప్పుడు ఒకటి, రెండు, మూడు ప్యాకేజీల్లో ఆర్వీఆర్–ఎల్సీసీ (జేవీ) ఎల్–1గా నిలిస్తే, బీఎస్సార్–ఎల్సీసీ (జేవీ) ఎల్–2గా నిలిచింది. నాలుగు, ఐదు ప్యాకేజీల్లో బీఎస్సార్–ఎల్సీసీ (జేవీ) ఎల్–1గా నిలిస్తే ఆర్వీఆర్–ఎల్సీసీ (జేవీ) ఎల్–2గా నిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే ఈ సంస్థలు అధిక ధరలకు కోట్ చేశాయి. లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకించడంతో టెండర్లను ఆమోదించడంలో జాప్యం చోటు చేసుకుంది. చివరికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇటీవల ఎస్‌ఎల్‌టీసీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) టెండర్లకు ఆమోద ముద్ర వేసింది. ఐదు ప్యాకేజీలకు రూ.743.85 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిస్తే.. కాంట్రాక్టు సంస్థలు అధిక ధరకు కోట్ చేశాయి. రూ.936.70 కోట్లకు పనులను ఈ సంస్థలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అంటే.. ప్రభుత్వ ఖజానాపై రూ.192.85 కోట్ల మేర భారం పడింది. పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌లోనూ ఇంతేపుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 0 కి.మీ. నుంచి 75.075 కి.మీ. వరకూ లైనింగ్ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. రూ.254.77 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రెండు ప్యాకేజీల పనులను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్ ఇన్ఫ్రాకు రూ.266.24 కోట్లకు కట్టబెట్టారు. అంటే.. ప్రభుత్వ ఖజానాపై రూ.11.47 కోట్ల భారం పడింది. మొత్తమ్మీద హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను అధిక ధరలకు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.204.32 కోట్ల మేర భారం పడింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీడీపీ కూటమి సర్కారు రద్దు చేసింది. అది అమల్లో ఉంటే ఈ పనుల్లో కనీసం రూ.300 కోట్లు ఖజానాకు ఆదా అయ్యేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 75.075 కి.మీ. నుంచి 207.80 కి.మీ. వరకూ రూ.480.22 కోట్లతో చేపట్టిన లైనింగ్ పనులను ఎన్సీసీ సంస్థకు నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వం కట్టబెట్టడం గమనార్హం. -
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర కామెంట్స్
-
పోసాని కృష్ణమురళికి కూటమి ప్రభుత్వం నుంచి బిగ్ రిలీఫ్
-
Ambati Rambabu: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం
-
2024 నవంబర్ 2న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు
-
పూర్తిగా అమ్మేసి కాష్ చేసుకుంటున్నారు.. ఏపీ అసైన్డ్ భూములపై షాకింగ్ నిజాలు
-
భీమవరంలో రోడ్డెక్కిన ఆక్వా రైతులు..
-
‘సాక్షి’పై సర్కారు అక్కసు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం నినదిస్తున్న ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతి రేక విధానాలను నిలదీస్తున్న ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులకు తెగబడుతోంది. రెడ్‌బుక్ కుట్రలో తాజా అంకంగా.. కేసు నమోదు చేయాలని రియ ల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)ను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ‘వాట్సాప్ గవర్నెన్స్’ విధానం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ యాప్ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించేదిగా ఉందని పలువురు నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో.. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కు పరిరక్షణకు బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా సాక్షి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్పందించింది. ‘మన మిత్ర.. మరో మారీచుడు’ శీర్షికన గతనెల 3న ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ అంశాలను కూడా ఇందులో ప్రస్తావించింది. ఆ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే అమాంతంగా పెరిగిపోతున్న సోషల్ మీడియా వేధింపులు, సైబర్ నేరాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం వాటిల్లే పరిస్థితి తలెత్తడం అందర్నీ ఆందోళనపరిచింది. కానీ, ఆ కథనం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. ‘సాక్షి’ పత్రికపై కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసు వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
సూపర్ 6కు గుండు సున్నా: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లను గమనిస్తే అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు అన్ని రకాలుగా చేసిన మోసం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.. ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ.. అన్నది తేటతెల్లమవుతోంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీల అమలుకే ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ నవంబర్‌లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీల అమలుకు రూ.7,282 కోట్లే కేటాయించారు. అందులోనూ కేవలం రూ.865 కోట్లు మాత్రమే వ్యయం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు’ అని మండిపడ్డారు. 2025–26 బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీల అమలుకు రూ.17,179 కోట్లు మాత్రమే కేటాయించి ఎంతమందికి కోతలు విధిస్తారు? అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాగ్ నివేదిక, బడ్జెట్ డాక్యుమెంట్లు, యూడీఐఎస్ఈ, పెట్రోలియం శాఖ నివేదికలు, సామాజిక ఆర్థిక సర్వే, గణాంకాలు, ఆధారాలతో చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సొంత ఆదాయం తగ్గింది. మూలధన వ్యయం కూడా దారుణంగా పడిపోయింది. కానీ.. జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 12.94 శాతం నమోదు అయ్యిందని చంద్రబాబు చెబుతున్నాడు. రాష్ట్ర సొంత ఆదాయం తగ్గితే జీఎస్డీపీ పెరగడం ఎలా సాధ్యం?’ అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఏడాది రూ.3,22,359 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ కాదా? అంటూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..భృతి లేదు.. ఉద్యోగాలు లేవుయువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. ఆ ఉద్యోగాలు వచ్చేదాకా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున 20 లక్షల మందికి ఏడాదికి రూ.7,200 కోట్లు అవసరం. గతేడాది బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. పోనీ ఈ ఏడాది బడ్జెట్లోనైనా ఉందా అంటే అదీ లేదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పంపిణీ చేసిన గవర్నర్ ప్రసంగం తెలుగు ప్రతుల్లో తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని స్పష్టంగా ముద్రించారు. (గవర్నర్ ప్రసంగం ప్రతిని చదివి వినిపించారు) ‘ఇప్పటివరకు రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది’ అని అందులో స్పష్టంగా ఉంది. ఈ మోసాలు ఇంతటితో ఆగలేదు. అసెంబ్లీలో విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో ఎంఎస్ఎంఈల రంగంలో 2024–25కి సంబంధించి 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపకుండా లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పడం పచ్చి మోసం. చంద్రబాబు నిరుద్యోగులకు గతేడాది రూ.36 వేలు చొప్పున ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా మరో రూ.36 వేలు చొప్పున ఎగనామం పెడుతున్నారు. ప్రతీ నిరుద్యోగికి రూ.72వేలు బకాయి పెట్టి మోసం, దగా, వంచన చేశారు. నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగాలూ లేవు. ఉన్న ఉద్యోగాలే ఊడబెరుకుతున్నారు.ఆధార్ కార్డులతో సహా చెబుతాం...వైఎస్సార్సీపీ హయాంలో తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలను గ్రామ, వార్డు, సచివాలయాల్లో కల్పించాం. మరో 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించాం. ఆప్కాస్ ద్వారా 96 వేల ఉద్యోగాలు కల్పించాం. పే స్లిప్‌లు, ఆధార్ నంబర్లతో సహా ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో చెప్పగలుగుతాం. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగులకు మేలు చేశాం. కాంట్రాక్టు, గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కలిపితే వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లలో 6,31,310 మందికి ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు సర్కారు తొలి బడ్జెట్ సందర్భంగా విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వేలో కూడా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ (భారీ పరిశ్రమలు)లో 1.02 లక్షల మందికి, ఎంఎస్ఎంఈ రంగంలో 32,79,970 మందికి వైఎస్సార్సీపీ పాలనలో ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టంగా ఉంది. గవర్నమెంట్, లార్జ్ అండ్ మెగా, ఎంఎంఎస్ఈ రంగాలలో 40,13,552 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మేం ఆధార్ కార్డులతో సహా చెప్పగలుగుతాం. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తోందో చెప్పేందుకు ఇదే నిదర్శనం.అదేమైనా బాబు సొమ్మా..?చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో.. అందరూ చూస్తుండగా బహిరంగ సభలో.. ‘వైఎస్సార్సీపీ వాళ్లకు ఏ పథకాలూ ఇవ్వొద్దు.. ఏ పనులూ చేయొద్దు..’ అని చంద్రబాబు మాట్లాడారు. అసలు ఇవ్వడానికి... ఇవ్వకపోవడానికి ఇది బాబు గారి సొమ్మా? ప్రభుత్వానికి చంద్రబాబు కేవలం ధర్మకర్త (కస్టోడియన్) మాత్రమే. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం... ప్రజల సొమ్ముతో నడుస్తోంది. ఇదే పెద్దమనిషి.. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశాడు. ఇప్పుడిలా బాహాటంగా, బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాటలు, నా మాటలను వింటున్న జడ్జీలు, గవర్నర్ ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా? - వైఎస్ జగన్ పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు..చంద్రబాబు ఉద్యోగాలను కల్పించకపోగా పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సజ్జన్ జిందాల్‌ను బెదరగొట్టి పంపేశారు. అరవిందో వాళ్లను బెదిరించి పంపుతున్నారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు భయపడే పరిస్థితి తెచ్చారు. అన్నదాత సుఖీభవ.. ద్రోహం..వైఎస్ జగన్ రైతు భరోసా కింద పీఎం కిసాన్ కలిపి ఇస్తున్నారని, తాను పీఎం కిసాన్ కాకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రతి మీటింగ్‌లోనూ నమ్మబలికారు. అన్నదాతా సుఖీభవ కింద 53,58,266 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రూ.10,717 కోట్లు కేటాయించాలి. తొలి ఏడాది బడ్జెట్లో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించి అది కూడా ఒక్కరికీ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రెండో బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించారు. ఎలాగూ ఇచ్చేది లేదు.. చచ్చేది లేదు..! మోసం చేయడమే..! అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు! ఇప్పటికే ప్రతీ రైతుకు రూ.20 వేలు బాకీ పడ్డారు. రెండో ఏడాది మరో రూ.20 వేలు అంటే మొత్తం రూ.40 వేలు ఎగనామం పెట్టాడు, బాకీ పెట్టాడు. అయినా మోసాలు చంద్రబాబుకు కొత్తకాదు. 2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించి ఇస్తానని హామీ ఇచ్చి దగా చేశారు. వడ్డీలకు కూడా సరిపోని విధంగా రూ.15 వేల కోట్లు మాత్రమే విదిల్చి, నాడు ఎలా ఓడిపోయాడో చూశాం. మళ్లీ ఈరోజు అదే పద్ధతిలో రైతులను మోసగిస్తున్నారు.వెలగని ‘దీపం’.. రాష్ట్రంలో 1.59 కోట్ల యాక్టివ్ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీళ్లందరికి దీపం పథకం కింద 3 సిలెండర్లు ఇవ్వాలంటే ఏడాదికి రూ.4 వేల కోట్లు అవసరం. తొలి ఏడాది బడ్జెట్లో రూ.865 కోట్లే కేటాయించారు. అంటే మూడు సిలెండర్లు ఒక సిలెండర్‌కు తీసుకొచ్చారు. పోనీ అందరికి ఇచ్చాడా అంటే అదీ లేదు. ఇక ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. ఎలాగూ ఎగరగొట్టేదే కాబట్టి నామ్‌కే వాస్తేగా చేస్తున్నారు.50 ఏళ్లకే పెన్షన్ పేరుతో మోసం..చంద్రబాబు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పింఛన్! నీకు రూ.48 వేలు.. నీకు రూ.48 వేలు అన్నారు. వారికి పింఛన్ ఇవ్వాలంటే లబ్ధిదారులు మరో 20 లక్షలు అదనంగా పెరుగుతారు. 20 లక్షల మందికి ఒక్కొక్కరికి నెలకు రూ.4వేల చొప్పున లెక్కిస్తే ఏడాదికి రూ.9,600 కోట్లు కేటాయించాలి. తొలి ఏడాది రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ఈ ఏడాదీ కూడా అంతే. 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు గతేడాది రూ.48 వేలు ఎగనామం పెట్టాడు. ఈ ఏడాది మరో రూ.48 వేలు ఎగనామం పెట్టారు. అంటే రూ.96 వేల చొప్పున ఎగ్గొట్టడం ఈ పథకం పేరుతో జరిగిన మోసం!పెన్షన్ల బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కోత..మా ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఎన్నికల కోడ్ నాటికి 66,34,372 పెన్షన్లు ఉంటే ఈరోజు చంద్రబాబు పాలనలో ఏకంగా 62,10,969కి తగ్గిపోయాయి. ఈ పది నెలల కాలంలో 4,23,403 ఫించన్లు కోత పెట్టారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. 62,10,969 పెన్షన్లకే రూ.32 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.27 వేల కోట్లు మాత్రమే కేటాయించి, రూ.5వేల కోట్లు కోత వేశారు. పెన్షన్ కేటాయింపులు పెరగాల్సింది పోయి తగ్గుతూ ఉన్నాయి.చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేదంతా మోసాలేగవర్నర్ ప్రసంగం.. బడ్జెట్‌పై చర్చ.. ఏది చూసినా పరనింద, ఆత్మస్తుతి కనిపిస్తాయి. రెండో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు కూడా ఇంకా జగన్ ఇట్టా.. జగన్ అట్టా.. అంటూ విమర్శలే గానీ సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల విషయం ఏమిటన్నది మాత్రం చెప్పరు. మొదటి ఏడాది బడ్జెట్లోనూ అరకొరే. కేటాయింపులకు పరిమితం. ఇచ్చిందెంత? అని చూస్తే బోడి సున్నా కనిపిస్తుంది. రెండో బడ్జెట్లోనూ అంతే. చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేదంతా మోసాలే. -వైఎస్ జగన్ఆడబిడ్డ నిధికి శూన్యం..ప్రతి మహిళకూ రూ.36 వేలు బాకీఆడబిడ్డ నిధి ద్వారా 18 నుంచి 59 ఏళ్ల లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ పథకం లబ్ధిదారులను తేల్చడానికి రాకెట్ సైన్స్ పరిజ్ఞానం అవసరం లేదు. ఓటర్ల జాబితా మన కళ్లెదుటే ఉంది. 2.07 కోట్ల మంది మహిళలు ఓటు వేశారు. వీరంతా 18 ఏళ్లు నిండిన వాళ్లే. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇవ్వాలంటే రూ.32,400 కోట్ల కేటాయింపులు చేయాలి. గతేడాది బడ్జెట్లో కేటాయింపులు సున్నా. ఈ ఏడాది బడ్జెట్లోనూ కేటాయింపులు సున్నా. అంటే ప్రతీ మహిళకు చంద్రబాబు రూ.36 వేలు ఎగ్గొట్టారు, బాకీ పడ్డారు!మహిళలు అంతా ఎదురు చూస్తున్నారుమహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. రాయలసీమలో మహిళలు అంతా ఎదురు చూస్తున్నారు..! విశాఖపట్నం వెళ్లి చూసి రావచ్చు కదా..! బాగుంటుందని! కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు జిల్లాల మహిళలూ ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా.. అని ఎదురు చూస్తున్నారు! అమరావతి కడుతున్నాడు కదా..! ఎలా కడుతున్నాడో చూసి రావచ్చు కదా అని! ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు కదా..! విహార యాత్రలకు వెళ్లి రావచ్చు అని ఎదురు చూస్తున్నారు! ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు తన నైజాన్ని చాటుకుంటున్నారు. తొలి ఏడాది ఎగరగొట్టేశారు. ఈ ఏడాదీ ఎగనామమే! ఉచిత బస్సు పేరుతో గత ఏడాది రూ.3,500 కోట్ల మేర మహిళలకు ఎగ్గొట్టారు! ఈ ఏడాది మరో రూ.3,500 కోట్లు కేటాయించ లేదు. ఉచిత బస్సు పుణ్యమాని మహిళలకు ఇప్పటికి రూ.7,000 కోట్లు బకాయి పెట్టారు.తల్లికి వందనం.. దగా..స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు ఉంటే రూ.45వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తానన్నాడు. ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళితే అంత మందికి రూ.15 వేలు చొప్పున ఇస్తానన్నాడు. ఆ పథకానికి తల్లికి వందనం అనే పేరు కూడా పెట్టాడు. ఎన్నికలప్పుడు చెప్పాడు. సూపర్ సిక్స్‌లో, మేనిఫెస్టోలో పెట్టాడు. తొలి బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి రూ.5,386 కోట్లు కేటాయింపులు చేసినట్లు చూపించి ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించినట్లు చూపారు. బడ్జెట్ డాక్యుమెంట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌లో రూ.8,278 కోట్లు కేటాయించినట్లు కనిపిస్తోంది. పిల్లల సంఖ్యపై కలెక్టర్లు పంపిన సమాచారాన్ని ‘యూడీఐఎస్ఈ’ వెబ్సైట్లో ఆప్‌లోడ్ చేస్తారు. జిల్లా పరిధిలో స్కూళ్లు, ఎంతమంది చదువుతున్నారో అందులో స్పష్టంగా ఉంటుంది. దాని ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 1 నుంచి 12వ తరగతి వరకు 87,41,885 మంది పిల్లలు చదువుతున్నారు. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు తల్లికి వందనం పథకానికి రూ.13,112 కోట్లు కేటాయించాలి. కానీ.. చంద్రబాబు తొలి ఏడాది బడ్జెట్లో రూ.5,386 కోట్లు కేటాయించారు. అది కూడా ఇవ్వకుండా ఎగనామమే. రెండో బడ్జెట్లోనూ రూ.13,112 కోట్లు ఎక్కడా కనపడదు. ఈ ఒక్క పథకం కిందే ప్రతి పిల్లవాడికి చంద్రబాబు రూ.15 వేలు బాకీ పడ్డారు, ఎగనామం పెట్టారు. ఈ ఏడాది కూడా కలిపితే రూ.30 వేలు బాకీ పడినట్లు అవుతుంది. చిన్న పిల్లలను సైతం చంద్రబాబు వదిలి పెట్టడం లేదు.సూపర్ సిక్స్ హామీల అమలుకు మొత్తంగా ఎంత అవుతుందని లెక్కేసి చూస్తే.. ఏడాదికి రూ.79,867 కోట్లు కేటాయించాలి. కానీ గతేడాది బడ్జెట్లో రూ.7,282 కోట్లే కేటాయించారు. అందులోనూ కేవలం రూ.865 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,179 కోట్లే కేటాయించారు. అది కూడా ఎలాగూ మోసం చేయడం అనే పద్ధతిలో జరుగుతోంది. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అనేందుకు ఇదే నిదర్శనం. – వైఎస్ జగన్పలావ్ పోయింది.. బిర్యానీ ఓ మోసం!సూపర్‌సిక్స్ కాకుండా చంద్రబాబు ఇచ్చిన మిగిలిన 143 హామీల పరిస్థితి చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకు పెన్షన్ కట్..! వలంటీర్లకు రూ.10 వేలు జీతం దేవుడెరుగు ఉద్యోగాలు కట్..! పది నెలలు గడిచినా పెట్రోల్, డీజీల్ ధరల తగ్గింపు లేదు. చంద్రన్న బీమా గాలికి పోయింది. డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ రుణాలకు బోడి సున్నా..! ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ ఉన్న టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేల సాయం హామీని ఎగ్గొట్టారు. జగన్ వాహన మిత్రకు పోటీగా ఈ హామీని ఇచ్చారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ ఓ మోసంగా తయారైంది! ముస్లింలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణాలు ఒక్కరికీ ఇవ్వలేదు. ఇంకా ఎన్నో హామీలిచ్చాడు. -
Singer Majji Devi Sri : చంద్రబాబుపై అదిరిపోయే సాంగ్
-
అప్పులపై చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచన: వైఎస్ జగన్
-
YS Jagan: ఉద్యోగులకు రావాల్సిన వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టారు
-
ప్రతిపక్ష హోదాపై పవన్ వ్యాఖ్యలకు జగన్ అదిరిపోయే ఆన్సర్
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే వాడిని ప్రపంచ చరిత్రలో చూడలే..!
-
రాష్ట్ర ఆదాయాలు.. బాబు, వాళ్ల మనుషుల జేబుల్లోకే..
-
Fake Promise: ఇంటింటికీ వెళ్లి.. అవ్వా నీకు 50,000 నీకు 50,000 అన్నాడు!
-
సంక్షేమం కాదట.. సంశ్లేభం అంట..!
-
జగన్ అది జగన్ ఇది అంటూ ఎంతసేపు నా భజనే.. చివరికి ప్రజలకు గుండు సున్నా
-
Super Six Scheme: ఇచ్చేది లేదు సచ్చేది లేదని.. నోటికొచ్చినట్టు చెప్తున్నారు!
-
బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ..!
-
ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో పోసానిపై అక్రమ కేసు నమోదు
-
YS Jagan: జగన్‌దే జనరంజక పాలన
-
పోసాని కృష్ణమురళిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
కృష్ణా జలాల వాటాపై తోడు దొంగలాట
-
AP MLC Results 2025: షాక్ లో టీడీపీ, జనసేన
-
Vizag: రుషికొండ బీచ్ కు ఉన్న బ్లూఫాగ్ హోదా రద్దుతో పర్యాటకుల విచారం
-
కూటమికి ఓటేసిన వారికి మాత్రమే పథకాలందాలన్నది బాబు యోచన
-
ఏపీ వ్యాప్తంగా పోసానిపై 30కి పైగా ఫిర్యాదులు, 16 కేసులు నమోదు
-
సీఎంగా ఉండి ఇలాగేనా మాట్లాడేది: Reddy Shanthi
-
పథకాలు ఇవ్వరు కానీ టాక్సులు కట్టాలా? చంద్రబాబు వ్యాఖ్యలకు దిమ్మితిరిగే కౌంటర్
-
అచ్చెన్నాయుడుకు కౌంటర్ ఇచ్చిన బొత్స సత్యనారాయణ
-
ప్రభుత్వానికి డప్పు కొట్టే ఎల్లో మీడియాకు మాత్రమే అనుమతి
-
కక్ష సాధింపులో బరితెగింపు
సాక్షి, అమరావతి: దళిత అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటికే సీఐడీ పూర్వపు అదనపు డీజీ సంజయ్‌ని కుట్ర పూరితంగా సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం.. పలువురు దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఉద్దేశ పూర్వకంగా అవమానిస్తోంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వ కక్ష చల్లారినట్టు లేదు. అందుకే డీజీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై తాజాగా కక్ష సాధింపు చర్యలకు తెగబడింది. కనీసం నోటీసు కూడా జారీ చేయకుండా ఆయన్ను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం విస్మయ పరుస్తోంది. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారనే అభియోగాలపై ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ పీవీ సునీల్ కుమార్ ప్రభుత్వ ముందస్తు అనుమతితోనే విదేశీ పర్యటన చేశారు. అయినా పీవీ సునీల్ కుమార్ 2019–2024 మధ్య పలుసార్లు ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా తదితర దేశాల్లో పర్యటించారని ప్రభుత్వం ఆరోపించింది. కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్ అధికారి అనధికారిక విదేశీ పర్యటనలతో సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందనే సాకు చూపుతూ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ అనుమతితోనే విదేశీ పర్యటనలు పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించిన కారణాలు పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే 2019–2024 మధ్య కాలంలో ఆయన విదేశీ పర్యటనలకు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఆ పర్యటనలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత పర్యటనలు కాబట్టి పీవీ సునీల్ కుమార్ తన సొంత ఖర్చుతో విదేశాలకు వెళ్లాలని కూడా పేర్కొంది. అందుకు సమ్మతించి, పూర్తిగా తన సొంత ఖర్చులతో, వ్యక్తిగత హోదాలో ఆయన అమెరికాలో ఉంటున్న కుమారుడిని చూడటానికి వెళ్లారు. అయినా సస్పెండ్ చేయడం కేవలం చంద్రబాబు ప్రభుత్వ కుట్రేనన్నది స్పష్టమవుతోంది. నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేసి ఆయన వివరణ కోరాలి. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు జారీ చేస్తే.. తాను ప్రభుత్వ అనుమతితోనే, సొంత ఖర్చులతో విదేశాల్లో పర్యటించానని ఆయన ఆధారాలు సమరి్పస్తూ వివరణ ఇస్తారు. అందుకే ఆయనకు ఆ అవకాశం ఇవ్వకూడదనే ప్రభుత్వం కనీసం నోటీసు జారీ చేయకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం కుట్ర దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా సస్పెండ్ చేసిందని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంబేడ్కర్ ఇండియా మిషన్ (ఏఐఎం) ప్రతినిధులు, దళిత సంఘాల నేతలు శ్రీకాకుళంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. అస్మదీయులైతే అనుమతి లేకున్నా ఏ దేశానికైనా వెళ్లొచ్చట! పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు ముందస్తు అనుమతి లేకుండానే విదేశాల్లో పర్యటిస్తున్నారు. వారు తమ విదేశీ పర్యటనల ఫొటోలను సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదు. పైగా ఆ ఉన్నతాధికారులు స్వదేశానికి వచ్చిన కొంత కాలం తర్వాత వారి విదేశీ పర్యటనను ర్యాటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుండటం గమనార్హం. సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ భూషణ్ 2018 మార్చిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశాల్లో పర్యటించారు. ఆయన స్వదేశానికి వచ్చిన ఏడాది తర్వాత అంటే 2019 మార్చి 28న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన విదేశీ పర్యటనను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటువంటి చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం ముందస్తు అనుమతి తీసుకుని మరీ విదేశాల్లో పర్యటించిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం విస్మయ పరుస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!
అదే.. అమరావతి! అంతా.. రైతన్నలే..! కానీ రాజధాని ప్రాంతంలో.. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. అదే చోట నిరుపేద రైతుల నుంచి అసైన్డ్ భూములను కాజేసిన పచ్చ ముఠాలను ‘రాజముద్ర’తో సత్కరిస్తోంది. అమరావతిలో ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్ భూములు రిటర్న్‌బుల్ ప్లాట్ల ముసుగులో పచ్చ రాబందులకు ఫలహారంగా మారిపోతున్నాయి! అసలు అసైన్డ్ భూములను కొనడమే పెద్ద తప్పు.. ఇక వాటిని కొనుగోలు చేసిన టీడీపీ నేతలకు బదులుగా ప్లాట్లు కేటాయించడం అంతకంటే పెద్ద నేరం కాదా? రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న లక్షలాది మంది పేద రైతుల సమస్యకు పరిష్కారం చూపుతూ వాటిపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని సైతం కూటమి సర్కారు వివాదాస్పదంగా మార్చింది. గత సర్కారు 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన లక్షలాది ఎకరాల భూములు, ఫ్రీ హోల్డ్ భూములపై తీసుకున్న నిర్ణయాలను తిరగతోడి వాటిని పారిశ్రామిక పార్కులు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవడంపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ఒకవైపు ల్యాండ్ టైట్లింగ్ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ మరోవైపు ప్రక్షాళన పేరుతో తూతూమంత్రంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించింది.సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో 2014–19 మధ్య బరితెగించి సాగించిన ‘అసైన్డ్’ భూముల దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాజముద్ర వేస్తోంది. అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మాయ మాటలు చెప్పి రూ.5 వేల కోట్లకు పైగా విలువ చేసే 1,300 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బినామీలు, సన్నిహితులు చేజిక్కించుకున్నట్లు అప్పట్లోనే వెల్లడైంది. వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో ఈ దోపిడీదారులు హైకోర్టుకు వెళ్లి రైతుల ఫోర్జరీ సంతకాలతో ఏకంగా న్యాయస్థానాన్నే మోసగించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భూ సమీకరణ కింద తీసుకున్న ఈ భూములకు అమరావతిలో ప్లాట్లు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భూ దోపిడీకి వ్యతిరేకంగా అసైన్డ్ రైతులు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. తమకు న్యాయం చేయాలని తాజాగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.పరిహారం ఇవ్వరంటూ భయపెట్టి..కేంద్ర ప్రభుత్వ అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అప్పటి రెవెన్యూ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్ భూముల దోపిడీకి పాల్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఈ భూములను చేజిక్కించుకోవడానికి పక్కా పన్నాగం పన్నింది. రాజధాని కోసం అన్ని భూములను సమీకరణ కింద ప్రభుత్వం తీసుకుంటుందని, ఇవి అసైన్డ్ భూములైనందున ఎలాంటి పరిహారం ఇవ్వదని మొదట రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయించింది. ఇందులో భాగంగా భూ సమీకరణ విధానాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 1 లోనూ అసైన్డ్ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించలేదు. దీంతో పేద రైతులు భయాందోళనకు గురయ్యారు. అదే అదునుగా టీడీపీ పెద్దల బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. అసైన్డ్ భూములు తమకు అమ్మేయాలని, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వాటిని తీసేసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టారు. అతి తక్కువ ధరకు సేల్ డీడ్ అగ్రిమెంట్లతో భూములను బదలాయించుకున్నారు. మొత్తం 1,300 ఎకరాలను చేజిక్కించుకున్నాక చంద్రబాబు ప్రభుత్వం వీటికి కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. అంటే అసైన్డ్ భూములను అక్రమంగా అతి తక్కువకు కొట్టేసిన టీడీపీ ముఠాకు రాజధానిలో విలువైన వాణిజ్య, నివాస స్థలాలను కేటాయిస్తామని తెలిపింది. దాంతో తాము మోసపోయామని అసైన్డ్ రైతులు గుర్తించి, ఆందోళన వ్యక్తం చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటికి ఎకరా రూ.కోటి విలువ ఉన్న భూములకు రాజధాని నిర్మిస్తే ఎకరా రూ.4 కోట్లు పలుకుతాయంటూ నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. అంటే టీడీపీ ముఠా కొల్లగొట్టిన 1,300 ఎకరాల మార్కెట్ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లు పైనే!రికార్డుల గల్లంతు మాయాజాలం1954 తర్వాత ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలిపారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కూడా ఈ మేరకు లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను అప్పటి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. దాంతో దోపిడీదారులు ఆ భూములన్నీ 1954కు ముందు రైతులకు కేటాయించినవంటూ తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు. వాస్తవానికి అవన్నీ 1980 – 2006 మధ్య రైతులకు కేటాయించినవే. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2006లో కేటాయించిన భూములు కూడా వీటిలో ఉన్నాయి. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ పెద్దలు గుంటూరు కలెక్టరేట్లో అసైన్డ్ భూముల రికార్డులను ఏకంగా మాయం చేశారు.ఫోర్జరీ సంతకాలతో హైకోర్టుకే మస్కాఅసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో చంద్రబాబు బినామీలు, సన్నిహితులు హైకోర్టుకు వెళ్లారు. 1954కు ముందు కేటాయించిన ఈ భూములను ఎస్సీ, ఎస్టీ రైతులు తమకు స్వచ్ఛందంగానే విక్రయించారని హైకోర్టుకు తెలిపారు. ఇందుకోసం ఆ రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేలా అధికారులను ఆదేశించాలని, వాటికి భూ సమీకరణ కింద రాజధానిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించేలా సీఆర్డీఏను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఓ వైపు హైకోర్టులో ఈ వ్యాజ్యం సాగుతుండగా.. మరోపక్క అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీకి ఆమోద ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూ సమీకరణ కింద తీసుకున్న ఆ 1,300 ఎకరాల అసైన్డ్ భూములకు అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాలని సీఆర్డీఏను ఆదేశించింది. తదనుగుణంగా చంద్రబాబు బృందం సభ్యుల పేరిట రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అడ్డుకోండి..టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను గుర్తించిన అసైన్డ్ రైతులు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తాము అసలు భూములు విక్రయించనే లేదని స్పష్టం చేశారు. తాము స్వచ్ఛందంగా భూములు విక్రయించినట్టు తమ సంతకాలు ఫోర్జరీ చేసి అఫిడవిట్లు దాఖలు చేశారని పలువురు అసైన్డ్ రైతులు న్యాయస్థానానికి నివేదించారు. తమ భూములకు ప్లాట్లను తమకే కేటాయించేలా సీఆర్డీఏను, ఇతరుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.భూ దోపిడీని ఆధారాలతో నిగ్గు తేల్చిన సిట్2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అమరావతిలో అసైన్డ్ రైతులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దాంతో గత ప్రభుత్వం విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు బృందం భూ బాగోతం మొత్తం ఆధారాలతో బట్టబయలైంది. అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా భూముల బదలాయింపు చేయకూడదని లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపామని అప్పటి గుంటూరు కలెక్టర్‌గా ఉన్న కాంతిలాల్ దండేతో సహా పలువురు అధికారులు సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారు. దాంతో ఏ1గా చంద్రబాబు, ఏ 2గా నారాయణతో పాటు పలువురిపై గతంలో సిట్ కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. -
‘ఆశా’.. నిరాశే!
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న ‘ఆశా’ సిబ్బందికి కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి, ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ ప్రోత్సాహంతో సరిపెట్టింది. ఆశాలను ఉద్ధరించింది తామేనని, దేశంలోనే అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. వాస్తవానికి వేతనాలు పెంచి ఆశా కార్యకర్తలను ఆదుకున్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2019కి ముందు వరకు చాలీచాలని వేతనాలతో ఆశాలు అగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వారి కష్టాలను విన్నది కూడా లేదు. ఈ నేపథ్యంలో తమ వేతనాలు పెంచి ఆదుకోవాలని పాదయాత్రలో వైఎస్ జగన్‌ను ఆశా సిబ్బంది కోరారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు. అయితే, పెరిగిన జీవన వ్యయాలు, కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని గత ఏడాది డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా ఆశా సిబ్బంది ధర్నాకు దిగారు. మరోపక్క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక నాయకులు వీరిపై దాడులు మొదలుపెట్టారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఆశాలను రాజకీయ కారణాలతో తొలగించి, వారి పొట్టగొట్టే పన్నాగానికి తెర తీశారు. ఏళ్లుగా సేవలందిస్తున్న వారిని సైతం ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేసి బలవంతంగా తొలగించారు. ఈ క్రమంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించి రూ.20 వేల వేతనం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. కానీ, ఈ ప్రధాన డిమాండ్‌తో పాటు ఉద్యోగ భద్రత, ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పదోన్నతి కల్పనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, 180 రోజుల ప్రసూతి సెలవులు, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షల చెల్లింపునకు అంగీకరించారు.30 ఏళ్ల సర్వీసు ఉంటేనే గ్రాట్యుటీ! ‘ఆశా’లను ఆదేకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రయోజనాలను అమలు చేసేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఆశాల ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంపు, 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి రూ.1.50 లక్షల గ్రాట్యుటీ, 180 రోజుల ప్రసూతి సెలవులు అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో 42,752 మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. -
AP: ఉద్యోగులకు ఉత్తచెయ్యి
సాక్షి, అమరావతి: పేద, సామాన్య ప్రజానీకాన్ని రెండు బడ్జెట్లలో మోసం చేసిన విధంగానే కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను కూడా దగా చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టినప్పటికీ.. అందులో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల గురించి ప్రస్తావనే చేయకుండా మొండి చేయి చూపింది. వారికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన చెప్పాయి. ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు కావస్తున్నా ఐఆర్‌కు దిక్కు లేకుండా పోయిందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్ గురించి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం చూస్తుంటే మోసపోయినట్లు అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. బకాయిలు, డీఏల మాటేంటి? ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ, అధికారంలోకి వచ్చి పది నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. పది నెలలైనా చెల్లించక పోవడంతో బకాయిలు మరో రూ.3 వేల కోట్లు పెరిగి మొత్తంగా రూ.26 వేల కోట్లకు చేరాయని చెబుతున్నారు. మొదటి బడ్జెట్లో అసలు ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదని, ఇప్పుడు రెండో బడ్జెట్లో కూడా ఉద్యోగుల అంశాలను ప్రస్తావించక పోవడం చూస్తుంటే కూటమి సర్కారుపై నమ్మకం సడలి పోతోందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డీఏల గురించి కూడా సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది జనవరి, జూలై డీఏలు పెండింగ్‌లో పెట్టిందని, ఈ బడ్జెట్లోనైనా ఐఆర్‌తో పాటు వాటిని చెల్లిస్తారని ఆశించామని.. అయితే తమ ఆశలపై కూటమి సర్కారు నీళ్లు చల్లిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. సీపీఎస్ ఉద్యోగులను నమ్మించి మోసం సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు దాని గురించి ఆలోచనే చేయక పోవడం ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారని, ఇది సీపీఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగులు పేర్కొంటున్నారు. పీఆర్సీ ఆశలపై నీళ్లుఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అలవెన్స్ పేమెంట్స్‌పై కూడా పునః పరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ పది నెలలైనా పీఆర్సీ గురించి అసలు మాట్లాడకపోగా, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ చైర్మన్ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా, అది అమలుకు నోచుకోలేదని, తుదకు చిరుద్యోగులు కూడా దగాకు గురైయ్యారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో మాట ఇచ్చి, కూటమి ప్రభుత్వం మాట తప్పిందని.. ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారెంటీ లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రూ.26 వేల కోట్ల బకాయిలు, రెండు డీఏలతో పాటు ఐఆర్ కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని, వీటి గురించి అటు కూటమి నేతలు, ఇటు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మాయలేళ్లూ... మరీచికలు!
‘చెప్పేదొకటి, చేసేదొకటి’ స్వభావం గలవాళ్లను మోసగాళ్లనే అంటాము. ప్రజా జీవితంలో ఉంటూ మచ్చుకైనా పారదర్శకత లేని ఇటువంటి బ్యాచ్ కూడా మోసగాళ్లే! మాయ లేడి వేషం వేసుకొని మోసగించిన మారీచునికి వీళ్లు వారసులనుకోవాలి. ఇటువంటి మూడు మాయలేళ్లు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడమంటే మరీచికల వెంట పరుగులు తీయడమే! ఈ కూటమి ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో కూడా ఎన్నికల వాగ్దానాలకు నామం పెట్టారని ప్రతిపక్షం విమర్శిస్తున్నది. ప్రతిపక్షంగా అది వాళ్ల డ్యూటీ కావచ్చు.కూటమి మాత్రం ఆ విమర్శలను పట్టించుకోదు. మేనిఫెస్టో హామీలను అమలుచేయలేమనీ, చేయబోమనీ వారికి ముందే తెలుసు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమం వగైరాల కంటే పరమ పవిత్రమైన ఆశయాలు, ప్రయోజనాలు వారికి విడివిడిగా వేరే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేరాలంటే అధికారం కావాలి. విడివిడిగా ఉంటే అది కుదిరే పని కాదు. అందుకని ఒక్కటయ్యారు. అయినా నమ్మకం లేక ‘కొండమీది కోతిని నేలకు దించుతాం, బొందితో కైలాసం తీసుకుపోతాం, కళ్ల ముందటే వైకుంఠాన్ని నిలబెడతాం’ తదితరాల స్థాయికి తగ్గని హామీలను మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. వాటిని నెరవేర్చి తీరుతామని కూటమి నేతలు వివిధ సభల్లో చేసిన మంగమ్మ శపథాలు,భీష్మ ప్రతిజ్ఞలు ఇప్పటికీ జనం చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి.పిట్టల దొర వాగ్దానాలకు తోడు ఢిల్లీ సర్కార్ సౌజన్యంతో ఎన్నికల సంఘం కూడా ఓ చేయి వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి. జాతీయ స్థాయిలో కూటమికి పెద్దన్నగా బీజేపీ ఉంటున్నా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీదే పెద్దన్న పాత్ర. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి మారిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించే వైఖరి తీసుకుంటున్నది. విద్య, వైద్యం వంటి ప్రాథమిక విషయాలు కూడా ప్రభుత్వ బాధ్యత కాదనీ, ఆ రంగాల్లో ప్రైవేట్ సేవలు అవసరమనీ చెప్పిన చరిత్ర బాబుది.ప్రభుత్వం నుంచి పొందే సేవలకు కూడా ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించవలసిందేనని ఆయన గతంలోనే ఘంటా పథంగా ప్రకటించారు. అదేరకంగా పాలించారు. మొన్నటి ఎన్ని కల సందర్భంగా ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలకు ఆయన సిద్ధాంతపరంగానే వ్యతిరేకి! అయినప్పటికీ అటువంటి మేనిఫెస్టోకు రూపకల్పన చేయడమంటే అధికారం పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా మోసానికి తెగబడ్డారంటే తప్పవుతుందా? ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈ మధ్యనే ‘పీ4’ అనే ఓ వంటింటి చిట్కాను ప్రకటించారు.ఈ ఉగాది నుంచి అమలుచేయ సంకల్పించిన ఈ ‘పీ4’ చిట్కాతో రాష్ట్రంలోని పేదరికం మటుమాయమైపోతుందట! పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ భాగస్వామ్యమని దాని పూర్తి పేరు. సమాజంలోని పది శాతం మంది అత్యంత సంపన్నులు అట్టడు గున ఉన్న 20 శాతం మంది కడుపేదలను దత్తత తీసుకో వాలట! ఈ పేదవారి అవసరాలను ఆ సంపన్నులు గుర్తించి తృణమో పణమో సాయం చేసి పేదరికం నుంచి బయట పడేయాలట! ఈ ‘సామాజిక బాధ్యత’ నెరవేర్చినందుకు ఆ సంపన్నులకు ఏ సహజ వనరుల్ని కట్టబెడతారన్నది ఇక్కడ రహస్యం.కుల మత ప్రాంతీయ లింగ భేదాల్లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికీ భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది. చారిత్రకంగా వివిధ సమూహాల మధ్య అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఆదేశించింది. సహజ వనరుల్లో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. అందరూ సమానస్థాయిలో పోటీ పడగలిగే అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఏర్పడాలని రాజ్యాంగం చెబుతున్నది. అటువంటి పరిస్థితులను ప్రభు త్వాలు ఏర్పాటు చేసినట్లయితే పేదరికాన్ని పేదలే జయిస్తారు. ఈ దేశాన్ని కూడా సంపన్న దేశంగా నిర్మిస్తారు. రాజ్యాంగం ఆశయం కూడా అదే! ఎవరి ఎంగిలి మెతుకుల తోనో పండుగ చేసుకొమ్మని చెప్పలేదు.ఈ ‘పీ4’ కార్యక్రమాన్ని గురించి రానున్న రోజుల్లోయెల్లో మీడియా ఏ రకమైన ప్రచారాన్ని చేపట్టబోతున్నదోనని ఊహించుకుంటేనే గగుర్పాటు కలుగుతున్నది. ఇంతటి మహత్తరమైన ఆలోచన గతంలో కార్ల్ మార్క్స్‌కు గానీ, అంబేడ్కర్‌కు గానీ, మరెవ్వరికీ గానీ రాలేదని వీరతాడు వేయవచ్చు. ఇకముందు రాబోదని కూడా ఛాలెంజ్ చేయవచ్చు. ఈ చిట్కా వైద్యంతో చిటికెలోనే పేదరికం పరారైందని కూడా ప్రకటించవచ్చు.‘పీ4’ సంక్షేమ ప్రచారం హోరులో తెలుగుదేశం పార్టీ అధినేతలకు మిగిలిన పవిత్ర కార్యక్రమం ఏమున్నది? ఒక్క అమరావతి తప్ప! దానికి అభివృద్ధి అనే ముసుగు వేయడం తప్ప! మిగిలిన ఈ మూడేళ్లూ (ఒక సంవత్సరం జమిలి ఎన్నికల కోత ఉండవచ్చు) అమరావతి సేవలోనే ప్రభుత్వం తరించే అవకాశం ఉన్నది. అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దాని ల్యాండ్ బ్యాంక్ ద్వారా సంపాదించిన సొమ్ముతోనే నిర్మాణం జరిగి పోతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, జర్మనీ, ‘హడ్కో’ల ద్వారా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయలను సీఆర్డీఏ ద్వారా సమీకరించేందుకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు.జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గనక ఉపయోగంలోకి తెచ్చుకుంటే వైజాగ్ తక్షణమే అందుబాటులోకి వచ్చేది. ఆ సంగతి పక్కనబెట్టి, వైజాగ్‌ను విస్మరించి, ఇన్ని వ్యయప్రయాసలకోర్చడం వెనుక అసలు కథ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. రాష్ట్ర రాజధాని పేరుతో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని, దాని ద్వారా ఆ పార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రణాళికలు రచించారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను పూర్వపక్షం చేసే సంతృప్తికరమైన సమాధానాన్ని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నది. ప్రతిపక్షం వారు రుజువులు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలను సహేతుకంగా ఖండించనూ లేకపోతున్నది. దీన్నిబట్టి ఈ మూడేళ్లలో జరగ బోయేది – పేదలకు ‘పీ4’ గంజినీళ్లు! పాలక పెద్దలకు కనక వర్షం!!ఇక భారతీయ జనతా పార్టీది జాతీయ స్థాయి లక్ష్యం. వరసగా మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, సంఘ్ పరివార్లు మంచి ఊపుమీదున్నాయి. ఇక ఆరెస్సెస్ స్థాపిత లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఎజెండాను బయటకు తీసే ముహూర్తం ఇప్పుడు కాక ఇంకెప్పుడని అవి భావిస్తు న్నాయి. మొన్నటి ‘మహా కుంభమేళా’ సందడిలోనే అందుకు అంకురార్పణ కూడా జరిగిపోయిందట! ‘అమర్ ఉజాలా’ అనే ఉత్తరాది హిందీ పత్రిక కోసం అలోక్ కుమార్ త్రిపాఠీ రాసిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ‘ది వైర్ తెలుగు డాట్ ఇన్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకో పాతికేళ్లలో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నదట! అందుకు అవసరమైన అడుగులన్నీ ఇక వరసగా వేసుకుంటూ వెళతారు. ‘రుషి సంవిధాన్’ అనే పేరుతో ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా సిద్ధమైందట! దీన్నే ‘సనాతన రాజ్యాంగ’మని పరివార్ ముఖ్యులు పిలుచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబో మంటూ బీజేపీ నేతలు పదేపదే ఇస్తున్న హామీలన్నీ బూటకమే నని ఇప్పుడు సిద్ధంగా ఉన్న ‘రుషి సంవిధాన్’ లేదా సనాతన రాజ్యాంగం రుజువు చేస్తున్నది.సంఘ్ పరివార్ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి కీలకమైన తొలి అడుగు జమిలి ఎన్నికలు లేదా ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ (ఒక జాతి... ఒకే ఎన్నిక). ఆ తర్వాత ‘ఒక జాతి... ఒకే భాష’, ‘ఒక జాతి... ఒకే మతం’ వంటి నినాదాలు మొదలు కావచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో జమిలి ఎన్నికల కార్యక్రమాన్ని ఈ దఫా వాయిదా వేసే అవకాశం లేదు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సరిపోయే సంఖ్యాబలం ఎన్డీఏకు ఉన్నదా లేదా అనే శంకలు అనవసరం. సమకూర్చుకోగలమనే నమ్మకం ఎన్డీఏకు ఉన్నది. బీజేపీ శిబిరానికి దూరంగా ఉండే తటస్థ పార్టీలకు కూడా వాటి అవసరాలు వేరువేరుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన రాజకీయ కక్షను, స్టేట్ టెర్రర్ను ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దమన కాండను వదిలించుకుందామనే దిశలో ఆలోచించవచ్చు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏడాది ముందుగానే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇల్లలకంగానే పండగ కాదు. జమిలి ఎన్నికలు జరిగినంత మాత్రాన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు కాదు. ఇంకా చాలా దూరం ఉన్నది. జమిలి ఎన్నికలకు సహ కరించిన పార్టీలన్నీ ‘రుషి సంవిధాన్’కు సహకరించకపోవచ్చు. జమిలి ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే చాప కింద నీరులా బీజేపీ చేస్తున్న సన్నాహాలకూ, ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్న మాటలకూ ఏమాత్రం పొంతన లేదనే విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇక మాటలకూ, చేతలకూ పొంతన ఉండనివాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘జనసేనాని’ని నియమించుకోవచ్చు. ఈ పదేళ్లలో ఆయన తన ఐడియాలజీని తలకిందులుగా వేలాడ దీశారు. ఆయన ఆరాధన చేగువెరా నుంచి సావర్కర్‌కు బదిలీ అయింది. తన మాటలకు విరుద్ధంగా తానే మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు. సనాతన రాజ్యాంగం గురించిన మాటలు సంఘ్ పరివారంలో వినపడగానే సనాతన ధర్మ పోరాట యోధుడి అవతారమెత్తడం గమనార్హం. ఏ రాజకీయ స్రవంతిలో కలిసిపోతే తన ప్రయాణం సుఖంగా సాగుతుందని భావిస్తారో అందులో దూకెయ్యడం ఆయనకు రివాజుగా మారింది. ఇలా మాట నిలకడ లేని, పారదర్శకత అసలే లేని ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి నుంచి హామీల అమలు గురించి ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరుగులు తీయడమే అవుతుంది. కాకపోతే ఈ రాజకీయ వంచనా శిల్పాన్ని ఎండగట్టడం, ప్రజలను జాగృతం చేయడం ప్రజాస్వామ్య ప్రియుల తక్షణ కర్తవ్యం.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Kakani Govardhan: ఇది మోసం, వంచన బడ్జెట్
-
కూటమి పానలపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది
-
చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవిన్యూ లోటు ఉంటుంది
-
Buggana: బడ్జెట్ కోసమా..? లేక గత ప్రభుత్వం కోసం అసెంబ్లీ పెట్టారా..?
-
Payyavula Keshav: ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు బడ్జెట్
-
Botsa Satyanarayana: ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్ డకౌట్
-
పోలీసులను ఒక్కటే అడుగుతున్న.. వల్లభనేని వంశీ భార్య ఎమోషనల్
-
కూటమి సర్కార్ వికటాట్టహాసం.. పోసానికి 14 రోజుల రిమాండ్
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కూటమి సర్కారు పాతరేసింది. భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికేనని హూంకరిస్తోంది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు.. కామెంట్లు సహజం అన్న స్ఫూర్తిని మంటగలిపింది. ప్రశ్నించే వారిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోలీసులను అడ్డు పెట్టుకుని రాక్షస పాలన సాగిస్తోంది. చట్టం, కోర్టులు అంటే ఏమాత్రం గౌరవం లేనట్లు లెక్కలేనితనంతో బరితెగించింది. పదేళ్ల కిందట నంది అవార్డు తిరస్కరిస్తూ వ్యాఖ్యలు చేస్తే.. దానిపై సంబంధం లేని వారెవరో ఇప్పుడు ఫిర్యాదు చేస్తే.. మరెక్కడో కేసు.. పొరుగు రాష్ట్రంలో అరెస్టు.. స్వయంగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణ.. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిది అక్రమ అరెస్టు అని చెప్పేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా?⇒ పక్కా కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పోసానిని వేధిస్తోందని స్పష్టమవుతోంది. అతనో అంతర్జాతీయ టెర్రరిస్ట్ అన్నట్లు పోలీసులు వ్యవహరించిన తీరు నివ్వెర పరుస్తోంది. రేపటి తేదీ వేసి ఈ రోజే (27వ తేదీ వేసి.. 26నే) అరెస్ట్ చేయడం.. అదీ వేరే రాష్ట్రంలో ఆ రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేకుండా బలవంతంగా ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం.. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్కడి నుంచి ఎత్తుకు రావడం.. 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పక పోవడం.. తుదకు ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నప్పుడు ఏకంగా జిల్లా ఎస్పీ రావడం.. ఉన్నతాధికారులు గంట గంటకూ ఆరా తీయడం.. ఇవన్నీ చూస్తుంటే ఓ వ్యూహం ప్రకారం ప్రభుత్వ పెద్దలే వెనకుండి నడిపించారని తేటతెల్లమవుతోంది.⇒ పోసానిపై ఇచ్చిన ఫిర్యాదు దేశ ద్రోహానికి సంబంధించింది కాదు.. స్మగ్లింగ్‌కు సంబంధించిందీ కాదు.. హత్యా నేరం అంతకంటే కాదు.. ఆయన వయసు 66 ఏళ్లు.. పైగా గుండె సమస్యతో బాధ పడుతున్నారు.. ఇలాంటి వ్యక్తిని ఇంతగా వేధించాల్సిన అవసరం ఏముంది? ఒక మామూలు కేసు ఇది.. ఇలాంటి కేసులో ఇంత హంగామా, భయభ్రాంతులకు గురి చేయడం అవసరమా? రాత్రిళ్లు అరెస్టు చేయడం ఏమిటి? విచారణ జరుగుతున్న చోటుకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రావడం ఎంత వరకు అవసరం? న్యాయవాదులను, వైఎస్సార్సీపీ నేతలను పోసానితో మాట్లాడటానికి ఎందుకు అంగీకరించ లేదు? ఇదంతా కుట్ర కాదా? ఇవన్నీ రెడ్‌బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా? దీనిని బరితెగింపు అనాలా.. కండ కావరం అనాలా.. అధికార మదం అనాలా.. లేక ఇంకేమనాలి?సాక్షి, అమరావతి/ఓబులవారిపల్లె/రైల్వేకోడూరు అర్బన్/ సాక్షి, రాయచోటి: రెడ్‌బుక్ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్ కొనసాగించింది. జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్ 196, 353(2), 111 ఆర్/డబ్ల్యూ 3(5) ఆఫ్ ది బీఎన్ఎస్ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు. ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి. ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు పోసాని కృష్ణమురళిని తీసుకొస్తున్న పోలీసులు ఒత్తిడికి గురిచేయొద్దన్న వైద్యులు పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకు వచ్చిన అనంతరం తొలుత వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో స్థానిక పీహెచ్సీ వైద్యుడు గురు మహేష్.. బీపీ, షుగర్, పల్స్ పరిశీలించారు. అన్నీ సాధారణంగానే ఉన్నాయని, తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. అయితే గుండె సమస్య కారణంగా సాఫ్ట్‌గా విచారించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైతే పోసాని కృష్ణమురళి ఆరోగ్యం నార్మల్‌గానే ఉందని వైద్యులు తెలియజేశారు. కాగా, పోసానిని కలవడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతిని«ధి, మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సుదర్శన్‌రెడ్డి, పార్టీ లీగల్ సెల్ జిల్లా కనీ్వనర్ నాగిరెడ్డి తదితరులను పోలీసులు అనుమతించ లేదు. తాము పోసానికి వ్యక్తిగత న్యాయవాదులమని, పోసాని వద్ద కాకుండా పక్క గదిలో ఉంటామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా లీగల్ సెల్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగినా వినిపించుకోలేదు. రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఇతర నేతలను సైతం పోలీసులు అడ్డుకున్నారు.హైకోర్టు ఆదేశాల ధిక్కారం ‘కేసులో నిందితుడిని న్యాయవాది కలిసి మాట్లాడవచ్చు. లేదంటే పక్క గదిలో కూర్చోవచ్చు’ అన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులు ధిక్కరించారు. పోసాని కృష్ణ మురళి ఏం చేశారని అతడిపై ఈ సెక్షన్లతో కేసు నమోదు చేశారు? అసలు ఫిర్యాదు ఎవరు చేశారన్నది చెప్పాలి కదా.. ఎవరి ఆదేశాలతో ఇలా చేస్తున్నారు?’ అని వైఎస్సార్సీపీ లీగల్ అడ్వయిజర్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేయలేదు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తోంది.’ అని కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.ధైర్యంగా ఉండండి.. మేమంతా తోడుగా ఉన్నాం పోసాని సతీమణి కుసుమలతను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పోసాని భార్య పోసాని కుసుమలతతో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణ మురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, తామంతా తోడుగా ఉంటామని ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు జిల్లా ఎస్పీఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు పోసాని కృష్ణ మురళిని తీసుకొచ్చిన అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి కేసు పూర్వాపరాలను పరిశీలించడంతోపాటు పోసానిని కూడా విచారించినట్లు సమాచారం. ప్రభుత్వ న్యాయవాదులను స్టేషన్‌కు పిలిపించి మంతనాలు సాగించారు. ఈ కేసులో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇటు పోలీసులకు, అటు న్యాయవాద వర్గాలకు మార్గ నిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్ నుంచి సమీపంలోని ప్రధాన రహదారి వరకు అటు, ఇటుగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎవరినీ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగాయి. వయోభారం, ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టడం సరికాదని నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపుగా కేసులు నమోదు చేసిందని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి 2.. కొనసాగిన వాదనలు పోసాని కృష్ణ మురళిని ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో విచారణ పేరుతో గురువారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9.10 గంటలకు వరకు వేధింపులకు గురి చేశారు. ఆయనకు కొంత మేర అనారోగ్య సమస్యలున్నా అన్ని గంటలపాటు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. పోలీసుస్టేషన్ ద్వారం వద్దకు వాహనాన్ని తీసుకెళ్లి పోసానిని ఎక్కించుకుని రైల్వేకోడూరులోని మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. పోసాని తన వెంట తెచ్చుకున్న బ్యాగుతో వాహనంలో ఎక్కి కూర్చున్నారు. పోసాని కొంత మేర నిస్సత్తువతో కనిపించారు. రాత్రంతా వాహనంలో జర్నీ చేయడం, నిద్రలేమితోపాటు అనారోగ్య సమస్యలు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టడంతో నీరసించిపోయారు. కాగా ఉదయం 5 గంటలదాకా కొనసాగిన వాదనలు. సుమారు 7 గంటలు కొనసాగిన వాదనలు. సుదీర్ఘ వాదనల అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విదించింది. కాసేపట్లో కడప జైలుకు పోసాని తరలింపు.త్రిబుల్ వన్ సెక్షన్ల దుర్వినియోగం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది హామీలు నెరవేర్చడానికని, అయితే వాటిని గాలికి వదిలేసి ఇష్టంలేని వ్యక్తులపై త్రిబుల్ వన్ (111) సెక్షన్లతో కేసులను నమోదు చేస్తోంది. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతిపక్ష నాయకులపై మూడేళ్ల క్రితం నమోదైన కేసులను తిరగదోడి వేధిస్తోంది. అధికారం మారాక అధికార బలంతో కేసులు పెడుతున్నారా.. అని సుప్రీంకోర్టు తప్పు పట్టినప్పటికీ, 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులపై వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులను పెడుతోంది. వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలపై పెట్టిన పోస్టులకు సంబంధించి ప్రతి జిల్లాలో ఫిర్యాదులు చేసినా, కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేయలేదా? పోసాని కృష్ణ మురళి పోస్టులకు సంబంధించి కోర్టులు చూసుకుంటాయి. 111 సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్న పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇలా చేయడం చట్ట వ్యతిరేకం. మా అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా వచ్చాం. – పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్ -
అనేక పోలింగ్ బూత్ ల నుండి మా ఏజెంట్లను పంపించారు: లక్ష్మణరావు
-
Ponnavolu Sudhakar Reddy: పోసానిపై 111 సెక్షన్ కేసు దుర్మార్గం..
-
మంగళగిరిలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతల దౌర్జన్యం
-
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
-
ఇంతలో ఎంత తేడా!
సాక్షి, అమరావతి: అటు మూల ధన వ్యయం, ఇటు పారిశ్రామిక వృద్ధిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మూల ధన వ్యయం ద్వారా సంపద సృష్టిస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు తీరా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే బాగా వెనుకబడి ఉన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో మూల ధన వ్యయం ఖర్చులో ఏపీ చివరి నుంచి మూడో స్థానంలో ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేయడమే ఇందుకు నిదర్శనం. 2023 – 25 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ కేటాయింపుల్లో 9 నెలల్లో చేసిన మూల ధన వ్యయంపై ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. 2023–24లో 9 నెలల్లోనే 62 శాతం మూల ధన వ్యయం చేసినట్లు వెల్లడించింది. అదే చంద్రబాబు ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో 9 నెలల్లో కేవలం 27 శాతం మాత్రమే మూల ధన వ్యయం చేసిందని తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో అతి తక్కువగా మూల ధన వ్యయం చేసిన 19 రాష్ట్రాల్లో అట్టడుగున జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ అధ్వానంగా ఉందని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర వృద్ధిపై ప్రభావం చూపుతుందని స్పష్టం అవుతోంది.తిరోగమనంలో పారిశ్రామిక వృద్ధి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో పయనిస్తోంది. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూత పడటమే ఇందుకు కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు ఈ ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు వచ్చి ఉంటే పారిశ్రామిక వృద్ధి ఎందుకు తగ్గిందో ఆయనే సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు సమాధానం చెబుతూ రాష్ట్ర వృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని ప్రకారం 2024–25లో పారిశ్రామిక వృద్ధి అంతకు ముందు ఆర్థిక ఏడాది కన్నా తక్కువగా ఉందని పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక వృద్ధి 7.42 శాతం ఉండగా 2024–25లో కేవలం 6.71 శాతమేనని ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూత పడుతుండటం వల్లే పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. పారిశ్రామిక రంగంలోకి వచ్చే మైనింగ్, క్వారీయింగ్‌లో వృద్ధి మైనస్ 1.38 శాతానికి పడిపోయింది. రెడ్‌బుక్ పాలన పేరుతో వేధింపుల పర్వం కొనసాగిస్తుండటంతో పాటు బడా పారిశ్రామిక వేత్తలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సంపద సృష్టి అంటూ జపం చేయడం తప్ప తొమ్మిది నెలల పాలనలో చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2024–25 ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి రాష్ట్రంలో 1107 ఎస్ఎంఈలు మూత పడినట్లు కేంద్ర మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో పక్క రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరిగిందని పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పురుషుల నిరుద్యోగ రేటు 6.3 శాతం ఉండగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి 7.3 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 6.4 శాతం ఉంది. మహిళల నిరుద్యోగ రేటు 6.4 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగిందని సర్వే తెలిపింది.నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదుతమ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శాసన మండలిలో స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పడంపై మంగళవారం మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని మాత్రమే చెప్పామని తెలిపారు. గవర్నర్ ఇంగ్లిష్ ప్రసంగం ప్రతిలో ఇలానే ఉందని, తెలుగు ప్రసంగం ప్రతిలో ఉద్యోగాలు కల్పించినట్లు అచ్చు తప్పు పడిందని చెప్పుకొచ్చారు. -
అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలతో బరి తెగిస్తున్న చంద్రబాబు సర్కారు ఏకంగా న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ అడ్డదారులు తొక్కుతోంది. దర్యాప్తు పేరిట కొండను తవ్వినప్పటికీ కనీసం ఎలుకను కూడా పట్టుకోలేకపోయిన సీఐడీ సరికొత్త కుట్రకు తెరతీసింది. న్యాయ ప్రక్రియలో అత్యంత కీలకమైన 164 సీఆర్పీసీ వాంగ్మూలాల (183 బీఎన్ఎస్ఎస్) నమోదు ముసుగులో కుతంత్రం పన్నుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వాంగ్మూలాలను నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్‌తో సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడం ద్వారా కుట్రకు మరింత పదునుపెట్టింది. ఆ అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా రెడ్‌బుక్ కుట్రను అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. టీడీపీ ఆఫీసులో తయారీ.. న్యాయమూర్తి ఎదుట నమోదువైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం మోపిన అక్రమ కేసు దర్యాప్తులో సీఐడీ అడ్డదారులు తొక్కుతోంది. పూర్తిగా టీడీపీ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు దర్యాప్తును కొనసాగిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తాము అందచేసిన జాబితాలో ఉన్నవారిపై అక్రమ కేసు నమోదు చేయాల్సిందేనని ఇటీవల డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తాకు ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. ఈమేరకు దర్యాప్తు పేరిట వేధింపులను పర్యవేక్షించే బాధ్యతను రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌కు అప్పగించారు. దీంతో మద్యం అక్రమ కేసులో సీఐడీ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. బెవరేజస్ కార్పొరేషన్లో గతంలో పని చేసిన సత్యప్రసాద్‌ను సీఐడీ అధికారులు అనధికారికంగా అదుపులోకి తీసుకుని బెదిరింపులకు గురి చేశారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా అక్రమ కేసులతో వేధిస్తామని హెచ్చరించారు. దీంతో సీఐడీ అధికారులు చెప్పినట్టుగా వాంగ్మూలం ఇచ్చేందుకు సత్యప్రసాద్ సమ్మతించినట్లు తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో తిష్టవేసిన రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను సీఐడీ అధికారులు సంప్రదించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అప్పటికే రూపొందించిన వాంగ్మూలం ప్రతిని ఆయన సీఐడీ అధికారులకు పంపినట్లు సమాచారం. అందులో ఉన్నట్లుగా సత్యప్రసాద్‌తో 164 సీఆర్పీసీ కింద న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించాలని ఆదేశించారు. దాంతో సీఐడీ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా సత్యప్రసాద్‌ను తరలించి న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇప్పించినట్లు సమాచారం. సీఐడీ అధికారులు రాసిచ్చిన సమాచారాన్నే యథాతథంగా తాను వాంగ్మూలంగా న్యాయమూర్తి ఎదుట చదివి వినిపించానని సత్యప్రసాద్ తన సన్నిహితుల వద్ద పేర్కొనడం గమనార్హం. సంబంధం లేని వ్యక్తుల పేర్లు...!మద్యం కేసులో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టిస్తోంది. 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం నమోదుకు నిర్దేశించిన విధానాన్ని సీఐడీ నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో వాంగ్మూలం నమోదు చేయించిన తీరే అందుకు నిదర్శనం. టీడీపీ కార్యాలయం రూపొందించిన వాంగ్మూలాన్నే ఆయన న్యాయమూర్తి ఎదుట వల్లె వేసేలా పక్కా కుట్రతో కథ నడిపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు నిర్వర్తించని వారు.. రాష్ట్రంలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేనివారు... పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తున్నవారు... ఇలా పలువురి పేర్లను మద్యం విధానం, వ్యవహారాలతో ముడిపెడుతూ తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించినట్లు తెలుస్తోంది. అసలు బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేనివారు, ప్రభుత్వంలో ప్రత్యక్షంగాగానీ పరోక్షంగా భాగస్వాములుకానివారు, జీవితంలో తాను ఏనాడూ ప్రత్యక్షంగా చూడనివారు, అసలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే లేనివారి పేర్లను కూడా ప్రభుత్వ పెద్దలు సత్య ప్రసాద్ అబద్ధపు వాంగ్మూలం ద్వారా చెప్పించినట్టు సమాచారం. 164 సీఆర్పీసీ నిబంధనల ప్రకారం కేసుతో నేరుగా ప్రమేయం ఉన్నవారి గురించే వాంగ్మూలంలో పేర్కొనాలి. అంతేగానీ ఆ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లను వాంగ్మూలంలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం. తాము చెప్పే వాటికి సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలతో నిరూపించగలిగే వాటినే చెప్పాలి. అంతేగానీ గాలి కబుర్లు, అక్కడ ఇక్కడ విన్నవాటిని చెప్పడం నిబంధనలకు విరుద్ధం. 164 సీఆర్పీసీ వాంగ్మూలం స్వచ్ఛందంగా ఇవ్వాలేగానీ అధికారులు, ఇతరుల ఒత్తిడితో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఈ రెండు నిబంధనలకు విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టంలో వెసులుబాటు ఉంది. అయితే ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న సీఐడీ అధికారులు నిబంధనలను కాల రాస్తున్నారు. అంటే చట్టప్రకారం సాగాల్సిన దర్యాప్తును చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా భ్రష్టుపట్టిస్తోందన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు న్యాయమూర్తి ఎదుట నమోదు చేసే వాంగ్మూలం ప్రక్రియను కూడా అపహాస్యం చేస్తోందనడానికి పరాకాష్ట ఈ ఉదంతం. ఆ అబద్ధపు వాంగ్మూలాన్ని ఏకైక ఆధారంగా చేసుకుని ఈ కేసులో అక్రమ అరెస్టులకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిలతోపాటు మరికొందర్ని అరెస్టు చేసి వేధించాలన్నది సీఐడీ పన్నాగం. అనంతరం వారిని విచారణ పేరిట వేధించి తాము చెప్పినట్లుగా నడుచుకునేలా ఒత్తిడి తేవాలన్నది కుతంత్రం. దర్యాప్తు నిబంధనలు, న్యాయ విచారణ ప్రక్రియ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ సీఐడీ బరితెగిస్తున్న తీరుపై పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేసే సాధనంగా సీఐడీ దిగజారిపోయిందని పోలీసు ఉన్నతాధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రశ్నించే గొంతు నొక్కాలనే..ప్రశ్నించే గొంతు నొక్కాలన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశ్యం. రాజకీయాల నుంచి తప్పుకున్నానని పోసాని ప్రకటించినా చంద్రబాబు వెంటాడ్డం అన్యాయం. చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రం రగిలిపోతోంది. నాగరిక సమాజం నుంచి మళ్లీ ఆటవిక సమాజంలోకి తీసుకెళ్తున్నారు. చట్టాలను, న్యాయవ్యవస్థలను సీఎం అపహాస్యం చేస్తున్నారన్నారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రిప్రజాస్వామ్యం ఖూనీ..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. విమర్శలను టీడీపీ కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అందుకే పోసాని లాంటి వారి అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా.– గడికోట శ్రీకాంత్‌రెడ్డి,మాజీ చీఫ్ విప్ఒక నియంతలా చంద్రబాబు చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగవు. పోసాని అరెస్టుతో ప్రభుత్వ అరాచకం తీవ్రస్థాయికి చేరినట్లయింది. కచ్చితంతా ప్రజలు గుణపాఠం చెప్తారు. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని పోలీసులను కోరుతున్నాం. పోసాని ఆరోగ్యానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రికక్ష రాజకీయాలు మంచివి కావురాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నానని పోసాని ఎప్పుడో ప్రకటించారు. అయినా ఆయనపై దుర్మార్గంగా కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్రిటిష్ పాలనలోనే స్వేచ్ఛగా ఉన్నామేమోనన్న భావన ప్రజలకు వస్తోంది. ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివి కావు. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రిపండగ పూటా హింసిస్తున్నారుశివరాత్రి రోజున కూడా చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టే దీనికి నిదర్శనం. చంద్రబాబును ఎవ్వరూ ప్రశ్నించకూడదా? పోసాని అనారోగ్యంతో ఉన్నా చంద్రబాబు వేధిస్తున్నారు. పోలీసులు బలిపశువులు కావొద్దని కోరుతున్నా. చట్టాన్ని మీరితే ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. – అంబటి రాంబాబు, మాజీ మంత్రికక్ష సాధింపులకు పరాకాష్ట..పోసాని కృష్ణమురళి అరెస్టు టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను గాలికొదిలేసి, ఎంపిక చేసుకున్న వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్టుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు ప్రభుత్వ చర్యలు దుర్మార్గం. – కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ మంత్రి -
రెడ్‌బుక్ రాజ్యాంగం..బాబు నియంతృత్వం.. చినబాబు నిరంకుశత్వం
రెడ్‌బుక్ రాజ్యాంగ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా విధ్వంసానికి బరితెగిస్తోంది. టీడీపీ కూటమి నియంతృత్వ పాలన రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. పౌరుల ప్రాథమిక హక్కులను పాశవికంగా అణచివేస్తోంది. చట్టబద్ధ దర్యాప్తు ప్రక్రియను భ్రష్టు పట్టిస్తోంది. ధర్మబద్ధ న్యాయ ప్రక్రియను మంటగలుపుతోంది. అందుకోసం పోలీసు శాఖ ద్వారా అధికారిక గూండాగిరీకి పాల్పడుతోంది. సీఐడీ విభాగాన్ని తమ కక్ష సాధింపు చర్యలకు సాధనంగా చేసుకుంటోంది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పచ్చ కుట్రలకు అంతకంతకూ పదునుపెడుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు తీరే చంద్రబాబు కుతంత్రానికి తాజాగా మరో తార్కాణం. ఏకంగా 164 సీఆర్పీసీ పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదుకు తెగబడటం బాబు కుట్రకు పరాకాష్ట.ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుతంత్రంలో తాజా పర్వం. ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్య ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి వికటాట్టహాసం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ రాజ్యాంగ అమానుష పాలనలో మరెన్ని దారుణాలను చూడాల్సి వస్తుందోనని యావత్ రాష్ట్రం బెంబేలెత్తిపోతోంది. సాక్షి, అమరావతి/సాక్షి రాయచోటి/రాయచోటి, గచ్చిబౌలి: చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రెడ్‌బుక్ కుట్రకు బరితెగించింది. ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తన రాజకీయ వికృతరూపాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నారు. గతంలో కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి. తద్వారా తాము ఎప్పుడు అనుకుంటే అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి తరలించేందుకు ముందస్తు పన్నాగం పన్నాయి. ఆ ఫిర్యాదులపై పోసాని కృష్ణ మురళిని ఇప్పటివరకు విచారించడంగానీ ఇతరత్రా దర్యాప్తు ప్రక్రియగానీ కొనసాగలేదు. కానీ హఠాత్తుగా బుధవారం ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించడం గమనార్హం. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పలేదు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి ఆయన్ను పోలీసులు బలవంతంగా తమ వాహనంలో తరలించారు. అసలు సంబేపల్లి పోలీస్ స్టేషన్లో తనపై ఎవరు ఫిర్యాదు చేశారు..? ఏ విషయంలో ఫిర్యాదు చేశారో చెప్పాలని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించినా పోలీసులు సరైన సమాధానమే ఇవ్వలేదు. ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఓ నోటీసు ఇచ్చి తమతో తీసుకుపోయారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం లేదు... పోసాని అరెస్ట్ గురించి ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా చెప్పలేదు. యూనిఫాంలో ఇద్దరు పోలీసులు, మఫ్టీలో మరో ఇద్దరు పోలీసులు వచ్చి ఆయన్ను బలవంతంగా తమతో తీసుకుపోయారు. పోసాని అనారోగ్యంతో ఉన్నారని, కనీసం మందులు అయినా తీసుకెళ్లనివ్వాలని కుటుంబ సభ్యులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు. తమ న్యాయవాది వచ్చే వరకు ఆగాలని అభ్యర్ధించినా ఆలకించకుండా బలవంతంగా తమతో తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం పోలీసులు ఎవర్ని అయినా అరెస్ట్ చేస్తే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలి. వారు న్యాయ సహాయం పొందేందుకు అవకాశం కల్పించాలి. కనీసం ఈ ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకుండా పోలీసులు పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తమతో తీసుకుపోయారు. కాగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నట్టు సంబేపల్లి పోలీసులు చెప్పారు. కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చిన సమాచారంలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ నంబరు ఇవ్వడం గమనార్హం. అంటే ఉద్దేశపూర్వకంగానే వేర్వేరు పోలీస్ స్టేషన్ల వివరాలు ఇచ్చి ఆయన కుటుంబ సభ్యులకు సందిగ్దంలోకి నెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేస్తున్నందున తరువాత న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తకుండా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడ వేశారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే పక్కా ముందస్తు కుట్రతోనే పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసినట్టు తేటతెల్లమవుతోంది. 111, ఇతర సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశంపోసానిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు నిర్ధారించారు. పోలీసు వాహనంలో అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిపారు. కోర్టుకు హాజరు పరిచేముందు పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఓబులవారిపల్లె పీఎస్, సంబేపల్లె పీఎస్‌లలో పోసానిపై కేసులు నమోదైనట్లు చర్చించుకుంటున్నారు. గురువారం ఉదయం రాజంపేట లేదా రైల్వేకోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పోసానికి దారిలో వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం.ముందస్తు కుట్రతోనే అక్రమ ఫిర్యాదులు...పోసాని కృష్ణ మురళిని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదే ముందస్తు కుట్రలకు తెరతీసింది. అందులో భాగంగానే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతోపాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేశారు. ఒకే రోజు ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేయడం గమనార్హం. వాటిలో కొన్ని కేసులను ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది కూడా. కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శాసనసభ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది. అందులో భాగంగానే గతంలో ఎప్పుడో చేసిన ఫిర్యాదుపై ప్రస్తుతం స్పందిస్తూ పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసింది. -
పోలవరం ఎత్తు తగ్గించడం సంపద సృష్టా? తోపుదుర్తి స్ట్రాంగ్ కౌంటర్
-
మదనపల్లిలో రెవెన్యూ అధికారులపై కూటమి నేతల దాడి
-
Chandrasekhar Reddy: లోకేష్ చాలెంజ్‌కి దిమ్మతిరిగే కౌంటర్
-
కూటమి నేతల తీరు పట్ల ప్రజల ఆగ్రహం
-
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక 4 లక్షల ఉద్యోగాలిచ్చారట...
-
High Court: విచారణ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
వెండర్ విధానంపై మరోసారి కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన AP పంచాయితీ రాజ్
-
ప్రతీ YSRCP కార్యకర్త, నేతలు జగన్‌కు సెల్యూట్ చేయాల్సిన రోజు ఇది
-
లోకేష్ వ్యాఖ్యలకు బొత్స దిమ్మతిరిగే కౌంటర్
-
వైఎస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: సుబ్రమణ్యస్వామి
-
సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ సీపీ నేతలకు ఊరట
-
ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి YSRCPకి అన్ని అర్హతలు ఉన్నాయి
-
ఏమ్మా షర్మిలా... షర్మిలపై సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
ఏపీ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ తో అబద్ధాలు చెప్పించిన చంద్రబాబు
-
సాక్షి టీవీ సహా 4 ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ
-
Magazine Story: తాలిబన్లే సిగ్గుపడేలా
-
ఫైబర్ నెట్లో తారస్థాయికి చేరిన రచ్చ
-
అనుమతించకపోవడం హక్కుల ఉల్లంఘనే!
‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మీడియాను సభా కార్యక్రమాలను కవర్ చేయడానికి అను మతించకపోవడం అప్రజాస్వామికం. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియజేయడంలో మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ సమస్యలపై ప్రజల వాణిని ప్రదర్శిస్తుంది’.‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం లేదా ప్రసారం చేయకుండా మీడియాను నిరోధించాలని గతంలో ప్రభుత్వాలు చేసిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. నేడు, అసెంబ్లీ దగ్గర మీడియా పాయింట్‌ని నిరోధించడం అత్యంత గర్హనీయం! ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించేందుకు, అవసరమైతే సూచనలు చేసేందుకు ప్రతిపక్షాలకు పూర్తి హక్కు ఉంది.’ ‘మీడియా మాత్రమే అధికార, ప్రతిపక్షాల వైఖరిని నిష్పక్షపాతంగా ప్రొజెక్ట్ చేయగలదు. మీడియా విధినిర్వహణకు అనుమతించకపోవడం అంటే హక్కుల ఉల్లంఘన’. ఈ మాటలు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి అనుకుంటారు. కానీ, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడే అంటే కించిత్ ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ? అయితే ఈ మాటలు అన్నది ‘నిన్న!’ అదే తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అని చదువు కోవాలి. ఇప్పుడు మాత్రం ఆయన తెలుగు నాట నాలుగు ప్రముఖ టీవీ చానళ్ళ (సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ)ను అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయడానికి కూడా వీలు లేకుండా అనుమతి నిరాకరించారు.గతంలో అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌ని శీతకాల సమావేశాలలో దూరం జరిపినప్పుడు (అసెంబ్లీలో వార్తలు కవర్ చేసే వారికి అడ్డంకులు లేక పోయినా) అసలు అసెంబ్లీ కవరేజ్‌నే అనుమతించలేద న్నట్టు హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సరిగ్గా అదే పని చేశారు. అంటే ‘అధికారంలో ఉంటే ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా’ అనే తన సహజ సిద్ధ శైలిని మీడియా మీద కూడా ప్రదర్శించారు.పాలనా వైఫల్యాలతో తీవ్ర అసహనంలో ఉన్న బాబు కూటమి తన అణచివేత ధోరణిని మీడియా మీద కూడా ప్రదర్శిస్తోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించింది. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల కార్యకలాపాలను నివేదించే హక్కు పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంటుంది. ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లికేషన్) చట్టం ఇచ్చిన హక్కు. 1977లో కూడా మరొక సారి ఈ హక్కు స్పష్టమైంది. భారత నలభై నాల్గవ రాజ్యాంగ సవరణ తర్వాత మీడియా స్వేచ్ఛ హక్కును కాలరాస్తోంది బహుశా చంద్ర బాబు ప్రభుత్వమేనేమో?!మీడియాపై ఆంక్షలు అంటే, భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే! స్పీకర్ తనే సర్వాధికారి అన్నట్టు వ్యవహరించడం ఒంటెద్దు పోకడ తప్ప మరొకటి కాదు. ఈ తరహా శైలిపై భారత అత్యున్నత న్యాయస్థానం చాలా తీర్పులు ఇచ్చింది. భారతదేశంలో మీడియా హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ నుంచి ఉద్భవించాయి. పత్రికలకు ప్రచురించే హక్కు, సర్క్యులేట్ చేసే హక్కు, సమాచా రాన్ని స్వీకరించే హక్కు, ప్రకటన హక్కు, అసమ్మతి తెలిపే హక్కు వంటి అనేక రకాల హక్కులున్నాయి. మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక విప్లవం పురోగతి మిలియన్ల మందికి రాతపూర్వక, మౌఖిక, దృశ్య మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తిని సులభతరం చేసింది. ప్రెస్, మీడియా సమాచారాన్ని రాయడానికి, ప్రచు రించడానికి, ప్రసారం చేయడానికి ఏ వ్యక్తి కంటే ఎక్కువ లేదా తక్కువ కాదు. భారత రాజ్యాంగం, 1950లోని ఆర్టికల్ 19(1)(ఎ)లోని వాక్, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు నుంచి పత్రికలూ, మీడియా ఈ హక్కును పొందాయి. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, మర్యాద, నైతికత లేదా కోర్టు ధిక్కారానికి సంబంధించి, ఈ హక్కుపై రాజ్యాంగం కింద విధించే పరిమితులు మాత్రమే ఆర్టికల్ 19(2) ప్రకారం సహేతుకమైన పరిమితులను ఏర్పరుస్తాయి.‘రొమేశ్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్’ (1950)తో సహా అనేక కేసుల్లో ప్రసార స్వేచ్ఛ ఎంత అవసరమో, ప్రచురణ స్వేచ్ఛ కూడా అంతే అవసరమని కోర్టు చెప్పింది. ‘బెన్నెట్ కోల్మన్ అండ్ కో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1972) కేసులో సుప్రీం కోర్ట్ పేజీలను, సర్క్యులేషన్‌ను నిర్ణయించే అధికారాన్ని వార్తా పత్రికలకే వదిలి వేయాలని పేర్కొంది. వాక్, భావప్రకటనా స్వేచ్ఛ అనేది సర్క్యులేషన్ ద్వారా సమాచారాన్ని వ్యక్తీకరించడం, ప్రచురించడం, ప్రచారం చేయడం మాత్రమే కాకుండా సమాచారాన్ని స్వీకరించే హక్కును కలిగి ఉంటుంది. సమాచార హక్కు చట్టం–2005 ద్వారా ప్రభుత్వ సంస్థల నుండి సమా చారాన్ని అడిగే హక్కు పత్రికలతో సహా భారతీయ పౌరులకు ఉంది. కొసమెరుపు ఏమిటంటే... ఆత్యయిక స్థితి నాటి ఆంక్షలు ఎత్తి వేసి మీడియా స్వేచ్ఛ పునరుద్ధరించిన నాటి బీజేపీ నేడు ఈ అంక్షల ప్రభుత్వంలో భాగ స్వామి కావడం! మార్చి 21 వరకూ జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసి ప్రజలకు నివేదించే హక్కును పైన పేర్కొన్న నాలుగు టీవీ ప్రతినిధులకూ నిరాకరించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే సుమా!పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ పత్రికా సంపాదకుడు -
మీడియాపైనా ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాకముందే రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని 9 నెలలుగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, తప్పులను ప్రశ్నించే గొంతులను నిరంకుశంగా నొక్కేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టులు చేయించి, జైళ్లకు పంపించి దుర్మార్గంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపెట్టింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా నాలుగు ప్రధాన టెలివిజన్ చానళ్లతో పాటు పలు మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాల కవరేజీకి రాకుండా చేసింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విశేషాలను ప్రజలకు అందించేందుకు టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్టీవీ రిపోర్టర్లను, కెమెరామెన్లను ప్రభుత్వం అనుమతించలేదు. ఎంట్రీ పాసులు ఇవ్వకుండా ఇలా ఎందుకు బహిష్కరించారనేది కూడా చెప్పలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చానళ్లుగానీ, పత్రికలుగానీ వ్యవహరిస్తే వివరణ కోరుతూ ముందస్తు నోటీసులు ఇవ్వడం పరిపాటి. ఆ తరువాతే ఏవైనా చర్యలు తీసుకోవడం అనేది నిబంధనల ప్రకారం జరగాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా కేవలం రాజకీయ కారణాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా గతంలో మీడియాకు ప్రవేశం ఉన్న మార్గాల్లోనూ అనేక ఆంక్షలు విధించింది. అసెంబ్లీ గేటు నుంచి మీడియాను అనుమతించలేదు. పాసులు ఉన్నప్పటికీ వెనుక నుంచే రావాలని చెప్పి అధికారులు పంపించేశారు. దీంతో అసెంబ్లీ బయట మండుటెండలోనే మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. వారికి కనీసం తాగునీరు కూడా లభించకపోవడంతో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇంత దారుణమైన పరిస్థితులను మీడియా గతంలో ఏనాడూ ఎదుర్కోలేదని, తమ విధులను మాత్రమే తాము నిర్వర్తిస్తున్నామని, తమపైనా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పక్షపాత ధోరణి తగదు: ఏపీయూడబ్ల్యూజేరాష్ట్ర శాసనసభ సమావేశాల కవరేజీ కోసం కొందరికి పాసులు ఇచ్చి, కొన్ని పత్రికలు, చానళ్ల రిపోర్టర్లను అనుమతించకపోవడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఏచూరి, ‘సామ్నా’ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా పట్ల పక్షపాత ధోరణులు కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధికారిక సమావేశాలకు కూడా కొన్ని పత్రికలు, చానల్స్‌ను పిలవకపోవడం తగదన్నారు. శాసనసభ స్పీకర్, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి, ప్రభుత్వ కార్యక్రమాలకు, అసెంబ్లీ సమావేశాలకు టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీతో పాటు మిగిలిన అన్ని చానల్స్, పత్రికలకు అనుమతి ఇచ్చి, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు.ఈ వైఖరి మంచిదికాదు: ఏపీడబ్ల్యూజేఎఫ్అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కొన్ని మీడియా సంస్థలకు పాసులు నిరాకరించడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఏపిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వీసం శ్రీనివాసరావు, కె.మునిరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టసభల్లో జరిగే కార్యకలాపాలను మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన ప్రభుత్వం, అసెంబ్లీ అధికారులు మీడియా విషయంలో అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి మీడియా సంస్థలకు మీడియా పాసులు నిరాకరించడం సరైన విధానం కాదన్నారు. ఈ విషయంపై స్పీకర్ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించి మీడియా సంస్థలన్నిటికీ పాసులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
రష్యా అల్లుడివి కదా అందుకేనేమో... రోజా దిమ్మతిరిగే కౌంటర్
-
రామోజీ ఫిలిం సిటీ గోడలు బద్దలు కొడతాం
-
కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని YSRCP నేతలు మండిపడ్డారు
-
ప్రశ్నించే ప్రతిపక్షం ఉండకూడదనే ఆలోచనతోనే కుట్రలు చేస్తున్నారు
-
అసెంబ్లీకి రమ్మంటారు వస్తే భయపడతారు: YS Jagan
-
ప్రజా సమస్యలపై పోరాటం దిశగా వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
మా జీవితాలతో చెలగాటం.. వాయిదాపై వంచన
సాక్షి, అమరావతి: అర్ధరాత్రి వరకు ఆందోళనలు.. అడ్డగింతలు.. అరెస్టులు.. తరలింపులు.. తీవ్ర ఉత్కంఠ మధ్య ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహించి తమ జీవితాలతో ఆడుకుందని రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు తమను నమ్మించి నిండా ముంచారని, తమ జీవితాలతో చెలగాటం ఆడారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తీరుతో తీవ్ర మనస్థాపానికి గురయ్యామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇంత గందరగోళం సృష్టించిందని, ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదని ధ్వజమెత్తారు. రోస్టర్ విధానంలో తప్పులున్నాయని తొలుత చెప్పిందే టీడీపీ అని, అలాంటప్పుడు అది సరిచేయకుండా ఎలా పరీక్ష నిర్వహిస్తారని నిలదీశారు. పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి వల్లే తమ సమయం వృథా అయిందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దోబూచులాట మధ్య పరీక్ష నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేసి ఆశలు రేపారని.. ఇప్పుడింత గందరగోళం జరుగుతుంటే ఆయన మాత్రం ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఇండియా–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నారని విరుచుకుపడ్డారు. తమను ఇంత దగా చేసిన కూటమి సర్కారును ఊరికే వదిలి పెట్టం అని.. ‘బాయ్‌కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్’ కాదు.. ‘ఎన్నికల్లో పాల్గొందాం.. కూటమికి గట్టిగా బుద్ధి చెబుదాం’ నినాదంతో తమ సత్తా చాటుతామని శపథం చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ఏ విధంగా ముంచిందో కళ్లారా చూశామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము కూడా తమ శక్తి ఏపాటిదో చూపిస్తామని లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ స్పష్టం చేస్తున్నారు. ఇంతటి గందరగోళం సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమని కోపంతో రగిలిపోయారు. పచ్చి దగా.. దుర్మార్గం ‘పరీక్ష వాయిదా పడుతుందని సాక్షాత్తు విద్యా శాఖ మంత్రి ట్వీట్ చేసినప్పుడు నమ్మకుండా ఎలా ఉంటాం? పరీక్షపై సమీక్షిస్తున్నాం అంటూ ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి అయోమయమే. ఎటూ పాలుపోని పరిస్థితి. టెన్షన్‌తో రాత్రంతా నిద్రపోలేదు. ఈ గందరగోళంలేకుండా ఉండివుంటే పరీక్ష ఇంకా బాగా రాసి ఉండేదాన్ని’ అని తిరుపతికి చెందిన సౌజన్య ఆవేదన వ్యక్తం చేసింది. ‘రోస్టర్ విధానంలో తప్పులున్నాయని ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినా, దీన్ని సవరించకుండా పరీక్ష నిర్వహించడమేంటి? రేపు న్యాయపరమైన చిక్కులతో పరీక్ష రద్దయితే.. మా కష్టమంతా వృథానే కదా? ఇంత గందరగోళం మధ్య పరీక్ష నిర్వహించడం దుర్మార్గం కాదా?’ అని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన హరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని శ్రీకాకుళంకు చెందిన గణేష్ ప్రశ్నించాడు. పరీక్ష జరుగుతుందో లేదో ముందు రోజు రాత్రి వరకు తేల్చకపోతే ఎలా అంటూ కడపకు చెందిన మూల బిందు మాధవి నిలదీసింది. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం ‘ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్‌ల ప్రకటనల వల్ల పరీక్ష వాయిదా పడుతుందని భావించాను. చివరి నిమిషం వరకు స్పష్టత లేకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందాను. పరీక్షకు బాగా ప్రిపేర్ అయినప్పటికీ తీవ్రంగా కలత చెందాను. పరీక్షను సరిగా రాయలేకపోయాను. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం’ అంటూ విజయవాడకు చెందిన కె.కాంతారావు మండిపడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం 92 వేల మందిని మోసం చేశారని నంద్యాలకు చెందిన హుస్సేన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ ఏమి చేసుకోలేరనే అభిప్రాయంతోనే ప్రభుత్వ పెద్దలు ఇలా మా జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇంత టెన్షన్ ఎన్నడూ పడలేదన్నారు. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామా అని నిప్పులు చెరిగారు. అంతా టెన్షన్.. టెన్షన్.. ⇒ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు అభ్యర్థుల భవితవ్యంతో ప్రభుత్వం ఆటలాడింది. పరీక్ష వాయిదా పడుతుందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం ఓ వైపు ప్రకటించడం.. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోను పరీక్ష కొనసాగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేయడం.. వెరసి అసలు పరీక్ష ఉంటుదా.. లేదా? అన్న సందిగ్ధంలో అభ్యర్థులు ఉండిపోయారు. ఈ క్రమంలో పరీక్ష వాయిదా పడుతుందని ప్రకటించిన ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్మిన అభ్యర్థులు తమకు కేటాయించిన సెంటర్లున్న ప్రాంతాలకు వెళ్లకుండా నిలువునా మోసపోయారు. రెండు వ్యవస్థల విరుద్ధ ప్రకటనలతో మీ మాంసలో మరికొందరు పరీక్ష ఉంటుందో ఉండదో తెలియక చాలా మంది సమయానికి సెంటర్లకు చేరుకోలేకపోయారు. దీంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. ⇒ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని శనివారం అర్ధరాత్రి వరకు అభ్యర్థులు ఆందోళన చేశారు. తాము కూడా వాయిదా వేయమని సర్వీస్ కమిషన్‌ను కోరామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం, కానీ చైర్మన్ అంగీకరించలేదని ఆరోపణలు చేయడం వంటి నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఉదయం 9.45 తర్వాత అభ్యర్థులను అనుమతించేది లేదని సర్వీస్ కమిషన్ ప్రకటించడంతో సమయం దాటాక వచ్చిన మరికొంత మంది పరీక్షకు దూరమయ్యారు. గ్రూప్–2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అర నిమిషం ఆలస్యం అవడంతో పరీక్షకు దూరమైన కొండబాబు, శ్యామల ⇒ ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి, 92,250 మందిని మెయిన్స్‌కి ఎంపిక చేశారు. వీరికి 2024 జూలైలో మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే, సాధారణ ఎన్నికల అనంతరం జూన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి ఏపీపీఎస్సీ చైర్మన్‌ను అర్ధంతరంగా తొలగించింది. దాదాపు 3 నెలల పాటు కమిషన్‌కు చైర్మన్ లేకుండా చేయడంతో జూలైలో జరగాల్సిన మెయిన్స్ డిసెంబర్‌కు వాయిదా వేశారు. ⇒ అక్టోబర్‌లో ఏఆర్ అనురాధను చైర్మన్‌గా నియమించి పరీక్షను ఫిబ్రవరి 23కి మార్చారు. సరిగ్గా పరీక్షకు వారం రోజుల ముందు కూటమి నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు. హైకోర్టు పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో ఏపీపీఎస్సీ తన ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఈనెల 20 నుంచి పరీక్షపై అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ⇒ రోస్టర్‌లో జరిగిన తప్పులను సరిచేసి మెయిన్స్ నిర్వహించాలన్న డిమాండ్‌తో అభ్యర్థులు రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ అంశంపై చివరి వరకు స్పందించని ప్రభుత్వం.. ఈనెల 21న రాత్రి మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ట్వీట్‌తో పరీక్ష వాయిదా పడుతుందన్న అభిప్రాయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించింది. పరీక్షకు ఒక్కరోజు ముందు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసి పరీక్ష వాయిదా వేయాలని కోరడం, సాయంత్రం సీఎం చంద్రబాబునాయుడు పరీక్ష వాయిదాపై సర్వీస్ కమిషన్ చైర్మన్ అంగీకరించలేదని వాయిస్ లీక్ చేసి తప్పును చైర్మన్‌పైకి నెట్టే ప్రయత్నం చేశారు. సర్వీస్ కమిషన్ చరిత్రలో అత్యంత ఉత్కంఠ వాతావరణంలో జరిగిన పరీక్షగా గ్రూప్–2 మెయిన్స్ నిలిచింది.గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష పూర్తిఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో పరీక్ష నిర్వహించినట్లు సర్వీస్ కమిషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో 175 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 905 పోస్టులకు 92,250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించగా, 86,459 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆదివారం ఉదయం జరిగిన పేపర్–1కు 79,599 మంది హాజరు కాగా, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్–2కి 79,451 మంది అభ్యర్థులు హాజరైనట్టు కమిషన్ పేర్కొంది. విశాఖపట్నం జిల్లాలో 16 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకే లైజన్ అధికారులు సంబంధిత మెటీరియల్‌తో కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి పోలీసు భద్రత నడుమ పరీక్షా కేంద్రాలకు తరలించారు. డ్రోన్లతో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించారు. ఉదయం వచ్చిన వారిలో కొంత మంది మధ్యాహ్నం జరిగిన పరీక్షకు హాజరు కాలేదు. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఒక అభ్యరి్థకి పరీక్ష రాస్తున్న సమయంలో బీపీ తగ్గటంతో అస్వస్థతకు గురయ్యాడు. పోలీసు భద్రత నడుమ అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.మమ్మల్ని మోసం చేశారు గ్రూప్–2 పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే వార్తలు రావడంతో మేలుకున్నట్లు కలరింగ్ ఇచ్చారు. అభ్యర్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు ప్రకటనలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ డబుల్ గేమ్ ఆడారు. చివరకు చేతులెత్తేశారు. మేమంతా.. ఇది డబుల్ గేమ్ అని తెలియని అమాయకులమా? మమ్మల్ని మానసికంగా హింసించారు. – హుస్సేన్‌బాషా, నంద్యాలభావోద్వేగాలతో ఆడుకుంటారా?గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష వాయిదా అంటూ వార్తలు వచ్చాయి. గ్రూప్–2లో రోస్టర్ విధానం ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం. రోస్టర్‌లో తప్పులు ఉన్నాయంటూ టీడీపీయే గతంలో పలు మార్లు చెప్పింది. ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు. కానీ విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకుంటూ వచ్చారు. పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని డైవర్ట్ చేసి నాశనం చేశారు. నిరుద్యోగులను వంచిస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రభుత్వానికి త్వరలోనే తెలిసి వస్తుంది. – రవికుమార్, తిరుపతిఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు తొలుత ఏపీపీఏస్సీ అధికారులు గ్రూప్–2 మెయిన్ పరీక్ష ఆదివారం జరగుతుందన్నారు. కానీ పరీక్షపై సమీక్షిస్తున్నాం.. వాయిదా పడుతుందంటూ ప్రభుత్వ పెద్దల ప్రకటనలు హల్చల్ చేశాయి. పరీక్షపై గందరగోళం సృష్టించారు. పరీక్ష జరుగుతుందో లేదో అనే అనుమానం కలిగింది. శనివారం అర్ధరాత్రి వరకు పరీక్ష నిర్వహణపై స్పష్టత లేదు. అంతా గందరగోళం. రాత్రంతా టెన్షన్‌తో గడిపా. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం దారుణం. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు, అధికారులు ఓవరాక్షన్ చేశారు. గతంలో ఏ పరీక్షప్పుడూ ఇలా వ్యవహరించలేదు. – సౌజన్య, తిరుపతిఫలితం అనుభవిస్తారు.. ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలనేది నా కల. తాడిపత్రి నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను. గ్రూప్–2 మెయిన్స్ కోసం అహోరాత్రులు కష్టపడి చదివాను. రోస్టర్ విధానంలో తప్పులున్నాయని, ప్రభుత్వంలోని పెద్దలే చెప్పినా, దీన్ని సవరించకుండా పరీక్ష నిర్వహించడమేంటి? న్యాయ చిక్కులతో రేపు పరీక్ష రద్దయితే.. మా కష్టమంతా వృథానే కదా? అందుకే మేము ఆందోళన చేశాం. కానీ మా బాధను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడింది. ఇది ఎంతమాత్రం భావ్యం కాదు. ఇందుకు ఫలితం చవిచూడక తప్పదు. – హరి, తాడిపత్రి ప్రభుత్వం తీరు దారుణం గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బాధించింది. రాత్రి పొద్దుపోయే వరకు పరీక్ష జరుగుతుందో లేదో అనే టెన్షన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఖరి కారణంగా మా సమయం వృథా అయింది. ఈ గందరగోళం మధ్య పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటో అర్థం కాలేదు. ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా వదిలే పోస్టులు కావని తెలిసినప్పటికీ, ఈ పరీక్ష నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించడం దారుణం. – మూల బిందు మాధవి, కడపతప్పులు ఎందుకు సరిదిద్ద లేదు? రిజర్వేషన్ రోస్టర్‌లో తప్పులు ఉన్నాయని చెప్పింది టీడీపీనే. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా.. అలాంటప్పుడు ఆ తప్పులు సరిదిద్దాక పరీక్ష నిర్వహించాలన్న కనీస విషయాన్ని విస్మరించడం దారుణం. ఏపీపీఎస్సీ తమ మాట వినలేదని చెప్పడం భావ్యం కాదు. అలా చెప్పడం ప్రభుత్వ పెద్దలకు ఇన్సల్ట్. – ఎ.ఢిల్లేశ్వరరావు, శ్రీకాకుళంప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గ్రూప్–2 పరీక్ష నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక వైపు రోస్టర్ సమస్య ఉన్నప్పటికీ దాన్ని సకాలంలో పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరి నిమిషంలో పరీక్షలు రద్దు చేయాలంటూ ఏపీపీఎస్సీకి లేఖ రాయడం నాటకమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగానే సరైన నిర్ణయం తీసుకొని ఉండేది. – మేఘన, ఒంగోలుప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల గ్రూప్–2 పరీక్ష రాసిన అభ్యర్థులందరం డైలమాలో పడ్డాం. ఇది సీఎం చంద్రబాబు తనకున్న రాజకీయ అనుభవంతో ఆడిన డ్రామా అని చాలా స్పష్టంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం వల్ల పరీక్ష ఉంటుందా, ఉండదా.. అనే విషయంలో చాలా గందరగోళానికి గురయ్యాను. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామాగా భావిస్తున్నా. ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో ఇలా ఆడుకోకూడదు. – కె.కాంతారావు, విజయవాడనిరుద్యోగులతో రాజకీయం దుర్మార్గం రోస్టర్ విధానం పాటించకుండా అభ్యర్థులను చివరి ఘడియ వరకు ఉత్కంఠకు గురిచేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి తీవ్రమైన గందరగోళానికి తెరలేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఇంత డ్రామా ఆడింది. కష్టపడి చదివాం. తీరా పరీక్ష రాసే సమయంలో తీవ్రంగా టెన్షన్ పడ్డాం. నిరుద్యోగులతో రాజకీయం చేయడం దుర్మార్గం. – రౌతు రామచంద్రులు, విజయనగరంనిరుద్యోగులను మోసం చేస్తారా? గ్రూపు–2 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే కాలయాపన చేసేందుకు పూనుకుంది. రోస్టర్‌లో తప్పులున్నాయని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఒప్పుకున్నారు. మరి అలాంటప్పుడు లోపాలు సరి చేసి మరో 10 రోజులు తర్వాత పరీక్ష జరిపితే వచ్చే నష్టమేముంది? కోర్టు తీర్పు అంటూ మరికొంత కాలం కాలయాపన చేసి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రభుత్వం పూనుకోవడం దారుణం. – గుడిపాటి చంద్రశేఖర్, కండాపురం, నెల్లూరు జిల్లా అర నిమిషం ఆలస్యంతో పరీక్షకు దూరంఓ అభ్యర్థి అర నిమిషం ఆలస్యంతో మెయిన్స్ పరీక్షకు దూరమైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖ గ్రామీణ ప్రాంతం రొంగలినాయుడుపాలేనికి చెందిన అభ్యర్థి కొండబాబుకు విశాఖపట్నం ద్వారకానగర్‌లోని బీవీకే కళాశాలలో సెంటర్ కేటాయించారు. ఉదయం 9.45 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించి, సమయం దాటగానే గేట్లు మూసివేశారు. ఇంటి నుంచి బస్సులో బయలుదేరిన కొండబాబు సెంటర్‌కు రావడం అర నిమిషం ఆలస్యమైంది. దీంతో అతన్ని లోనికి అనుమతించలేదు. తాను ఈ పరీక్ష కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నానని, లోనికి అనుమతించాలని ఎంత ప్రాధేయపడ్డా సిబ్బంది అనుమతివ్వలేదు. దీంతో తాను పడ్డ శ్రమ వృథా అయిందని కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగాడు. మరో ఘటనలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలానికి చెందిన డి.శ్యామలకు విశాఖపట్నంలోని విజయం స్కూల్లో సెంటర్ కేటాయించారు. ఈమె ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేకపోయింది. ఎంతో కష్టపడి మెయిన్స్‌కి సిద్ధమయ్యానని, ఐదు నిమిషాల ఆలస్యంతో తాను పరీక్ష రాయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. -
గ్రూప్–2 అభ్యర్థులతో 'బాబు బంతాట'
డ్రామాలో భాగంగానే సీఎం పలుకులు మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతోనే ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్సీ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఈ డ్రామాలో భాగమే. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగళం పేరుతో లోకేశ్ ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ఈ 900 పోస్టులు పూర్తి చేసి ఈ ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేసేశాం అని డబ్బా కొట్టుకోవడానికే ఈ డ్రామాలు. – గ్రూప్–2 అభ్యర్థినిసాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులను అనేక రకాలుగా మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు వారి భావోద్వేగాలతో ఆడుకుంది. ఆదివారం పరీక్ష ఉందనగా.. శనివారం సాయంత్రం వరకు రకరకాల విన్యాసాలతో నాటకాలాడిన తీరు విస్తుగొలుపుతోంది.. ఓ పరీక్ష విషయంలో ఇంతటి గందరగోళం, 8 గంటల ముందు వరకు నాన్చుడు వ్యవహారం ఏపీపీఎస్సీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. బాబు సర్కారు బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అభ్యర్థుల్లో ఆశలు రేపారు. అయితే, పరీక్ష వాయిదా అంటూ ‘సోషల్ మీడియా’లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ శనివారం ఉదయం ఏపీపీఎస్సీ ప్రకటించింది. తర్వాత శనివారం మధ్యాహ్నానికి పరీక్ష వాయిదాకు అనువుగా నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. వాస్తవానికి రోస్టర్ అమలులో సమస్యలున్నాయని, వాటిని సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని, అప్పటిదాకా పరీక్ష వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం కలిసి విజ్ఞప్తులు చేశారు. కానీ, ఏ ఒక్కరూ నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే, కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఎమ్మెల్సీలు హామీ ఇవ్వడంతో ఈ నెల 20వ తేదీ వరకు ఆగారు. కోర్టు గ్రూప్–2 మెయిన్స్ రద్దుకు అంగీకరించకపోవడంతో పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు నేడు యథాప్రకారం జరగనున్నాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం కుదరదని ఏపీపీఎస్సీ చైర్మన్ అనూరాధ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ప్రభుత్వ తీరుపై గ్రూప్ –2 అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని చూసి లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ కూడా కోపంతో రగిలిపోతున్నారు. ఇంత దగా చేసిన కూటమి సర్కారును వదిలిపెట్టకూడదని, ‘బాయ్‌కాట్ ఎలక్షన్’ కాదు.. ఎన్నికల్లో పాల్గొని తగినవిధంగా బుద్ధిచెప్పాలని గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రాడ్యుయేట్స్ తీర్మానించుకుంటున్నారని తెలుస్తోంది. ‘బాయ్‌కాట్ ఎలక్షన్’ నిర్ణయంతో సర్కారు డ్రామాలు.. గ్రూప్–2 మెయిన్స్ నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు సర్కారుకు మొరపెట్టుకున్నారు. కోర్టు తీర్పు అనంతరం నిర్ణయాధికారం ప్రభుత్వ పరిధిలోకి వచ్చినందున రోస్టర్ సవరించే వరకు పరీక్షను వాయిదా వేయాలని ఈనెల 20నుంచి కోరుతున్నారు. అయిన్పటికీప్రభుత్వం స్పందించలేదు. దీంతో అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించింది. ‘‘పరీక్షలను వాయిదా వేయమని గ్రూప్–2 అభ్యర్థుల నుంచి నాకు అనేక అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను అర్థం చేసుకున్నాను. మా న్యాయ బృందాలతో సంప్రదించి, పరిష్కారాన్ని కనుగొనేందుకు అన్ని మార్గాలను అన్వేíÙస్తాము’’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే, శనివారం ఉదయం ఏపీపీఎస్సీ మరో ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఒకే అంశంపై రెండు వ్యవస్థలు భిన్న అభిప్రాయాలను వెల్లడించడంతో అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు. పరీక్ష మరో 14 గంటలు ఉందనగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో రోస్టర్ సమస్యను పరిష్కరించి పరీక్ష నిర్వహించాలని, అప్పటిదాకా మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వ కార్యదర్శి.. ఏపీపీఎస్సీకి రాసినట్టుగా ఓ లేఖ శుక్రవారం తేదీతో శనివారం మధ్యాహ్నం బహిర్గతమైంది. దీనిపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సర్వీస్ కమిషన్ చైర్మన్ అనురాధను తప్పుబడుతూ ఉన్న ఆడియోను లీక్ చేశారు. ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయమంటే ఏపీపీఎస్సీ పట్టించుకోవడం లేదన్నది ఆ ఆడియో సారాంశం. ఈ నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదు? గ్రూప్–2 రిజర్వేషన్లలో రోస్టర్ అమలు తప్పులున్నాయని ఏడాది కాలంగా ప్రచారం చేస్తూ వచి్చన కూటమి ప్రభుత్వంలోని నేతలు కేసు కోర్టు పరిధిలోకి వచ్చేవరకు ఎందుకు మార్చే ప్రయత్నం చేయలేదన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. వాస్తవానికి ఎన్డీఏ సర్కారు ఏర్పడి దాదాపు 9 నెలలు పూర్తవుతోంది. గ్రూప్–2 మెయిన్స్ ఒకసారి జూలైకి, మరోసారి డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ క్రమంలో తప్పులు సరిచేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కోర్టుకు సైతం తప్పులు లేవని చెప్పారని, ఒకవేళ తప్పులుంటే సరి చేస్తామని పేర్కొన్నట్టు చెబుతున్నారు. పరీక్ష తేదీ సమీపించే వరకు వాయిదా వేసే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నారు. ఆదివారం పరీక్ష ఉందనగా, శనివారం మధ్యాహ్నం పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ తప్పేంలేదని చెప్పేందుకే ఈ డ్రామా ఆడుతున్నట్టుగా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ తీరుతో సుదూర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరుకావాల్సిన వారు మూడు రోజులుగా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వివాదాలే ‘అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ కేలండర్ ఇస్తాం. నిరుద్యోగులకు మేలు చేసేలా సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తా’మని చెప్పిన ఎన్డీఏ కూటమి నాయకులు.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక సర్వీస్ కమిషన్‌ను నీరుగార్చే పనిలో పడ్డారు. ఏడాది పదవీ కాలం ఉండగానే.. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న కమిషన్ చైర్మన్‌ను రాజకీయ కుట్రతో తొలగించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు జరగకుండా వాయిదాలు వేశారు. ఇందులో గ్రూప్–2తో పాటు గ్రూప్–1 మెయిన్స్, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు వంటి కీలమైన 21 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటికి నిర్విరామంగా సిద్ధమవుతున్న దాదాపు 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చేశారు. ఇప్పుడూ గ్రూప్–2 మెయిన్స్ కొన్ని గంటల వ్యవధిలో ఉందనగా రాజకీయం ప్రారంభించారు. ఇందులో సాక్షాత్తూ ‘ముఖ్య’ నేతలే అభ్యర్థుల భావోధ్వేగాలతో ఆడుకోవడం గమనార్హం.ఇప్పటికిప్పుడు మెయిన్స్ వాయిదా వేయలేం : ఏపీపీఎస్సీ చైర్మన్ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను ఇప్పటికిప్పుడు వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ ద్వారా అవసరమైన వివరణ ఇచ్చేందుకు పరీక్షను వాయిదా వేయాలని శనివారం జీఏడీ సర్వీస్ కమిషన్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పైవిధంగా స్పందించినట్టు సమాచారం. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాక.. గంటల వ్యవధిలో వాయిదా వేయాలనడం సబబుకాదని చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం. నేడు గ్రూప్–2 మెయిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాలు సిద్ధంగ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 పేపర్–2 నిర్వహిస్తారు. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంతో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు ఉదయం 9.30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9.45కు కేంద్రాల గేట్లను మూసివేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీల వీరంగంవిజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కోట కూడలిలో శనివారం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీలు వీరవిహారం చేశారు. ఉన్నత విద్యావంతులని కూడా చూడకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. నిరసన శిబిరాన్ని చెదరగొట్టారు. పలువురు అభ్యర్థులను రాత్రి సమయాన జీపుల్లో దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. రోస్టర్ విధానంపై స్పష్టత ఇచ్చాకే గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించాలని కోరిన పాపానికి ప్రభుత్వం పోలీసులతో నిరుద్యోగుల ఆందోళనను అణచివేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. గ్రూప్–2 పరీక్షల్లో రోస్టర్ విధానం ప్రకటించాలని కోరుతూ కోట కూడలి వద్ద అభ్యర్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ఆదేశాలు రాకపోవడంతో సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో కోట వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో వన్‌టౌన్, టుటౌన్ సీఐలు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడలి వద్దకు చేరుకుని నిరుద్యోగులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు.ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటున్నాం..నిరుద్యోగులకు మేలు చేస్తుందని ఆశించి మేమంతా ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా రెండు చెప్పులతో మేం కొట్టుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా రోస్ట్‌ర్ సరిచేయకుంటే మేమంతా పెద్ద ఎత్తున నష్టపోతామంటూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించకుండా మెయిన్స్ నిర్వహిస్తోంది. మా భవిష్యత్‌ను, ఆశలను తుంగలొకి తొక్కిన ఈ ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా మేం బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. – గ్రూప్–2 అభ్యర్థి -
ఇది కుట్రపూరిత నిర్లక్ష్యం!
కాలం కలిసొస్తే కొందరికి అధికారం సంప్రాప్తించవచ్చు. అదృష్టం ఈడ్చితంతే కొందరు సరాసరి సింహాసనం మీదనే కూలబడవచ్చు. నక్కజిత్తులతో, తోడేలు వంచనతో, వెన్నుపోటుతో, మోసపు మాటలతో మరికొందరు ‘పవర్’ఫుల్‌గా మారిపోవచ్చు. కానీ వారందరూ ప్రజానాయకులు కాలేరు. అసలు నాయకుడంటే ఎవరు? అతనెట్లా ఉండాలి?... నమ్మకానికి నిలువెత్తు ప్రతిరూపంలా ఉండాలి. ఆడిన మాట మీద నిలబడే వాడై ఉండాలి. మడమ తిప్పని వాడై ఉండాలి. నిరంతరం జనం గుండె చప్పుళ్లను వినగలిగే విద్యాపారంగతుడై ఉండాలి. సకల జనుల శ్రేయస్సు కోసం పరితపించే తాపసిగా ఉండాలి. అటువంటి ప్రజా నాయకుడికి అధికార హోదాలను మించిన గౌరవం ఉంటుంది. జనం గుండెల్లో కొలువుండే అత్యున్నత హోదా ఉంటుంది. ఆ నాయకుడు వీధుల్లోకి వస్తే జనవాహిని అతని వెంట ప్రవహిస్తుంది. ఆబాలగోపాలం ఆనందోద్వేగాలతో హోరెత్తుతుంది. అది గిరిజన ప్రాంతమా... నగరం నడిబొడ్డా అనే తేడా ఉండదు. అన్ని చోట్లా ఒకటే స్పందన. ఆ నాయకుడు కనిపించగానే జనశ్రేణుల పాదాలు జజ్జెనకరె గజ్జల సడి చేయడానికి సిద్ధమవుతాయి. అతడే ప్రజానాయకుడు! ద మాస్ లీడర్! ఇటువంటి మాస్ లీడర్లు ఎందరుంటారు? ఆంధ్రరాష్ట్రం విషయానికి వస్తే అప్పుడెప్పుడో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రకాశం పంతులు గారిలో ఈ మ్యాజిక్ ఉండేదట. ఆ తర్వాత ఒక ఎన్టీ రామారావు... ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి... ఇదిగో ఇప్పుడు ఒక జగన్మోహన్రెడ్డి. దట్సాల్!సింహం ఇంకా వేటకు బయల్దేరనే లేదు. అది వెళ్లేదారిలో గోతులు తవ్వడానికీ, మందుపాతర్లు పెట్టే వ్యూహం పన్నడానికీ తోడేలు మందలు, నక్కల గుంపులు సమావేశమవుతున్నాయట. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇంకా విస్తృత జనయాత్రలకు శ్రీకారం చుట్టనేలేదు. గద్దెనెక్కిన వారు ఏడాది పండుగ జరుపుకొనేదాకా ఊపిరిపీల్చుకునే అవకాశం ఇవ్వడానికి ఈ తాత్సారం కావచ్చు. ఇప్పుడు అడపాదడపా పర్యటనలు మాత్రమే జరుగుతున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజాశ్రేణులను కలవడానికీ, నిర్బంధాలకు గురవుతున్న కార్యకర్తలకూ, నేతలకూ అండగా నిలవడానికీ మాత్రమే ఈ పర్యటనలు పరిమితం. గడిచిన వారం ఇటువంటి మూడు యాత్రలు జరిగాయి. రెడ్‌బుక్ స్కీము కింద అరెస్టయిన సహచరుడు వంశీని కలవడానికి జగన్ విజయవాడ జైలుకు వెళ్లారు. దగా పడుతున్న రైతన్నకు దన్నుగా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. కన్నుమూసిన పార్టీ నాయకుని కుటుంబాన్ని పలకరించడానికి పాలకొండకు వెళ్లారు. ప్రదేశం ఏదైనా, సందర్భం ఏదైనా ప్రజాస్పందన సుస్పష్టం. జనప్రభంజనపు అడుగుల చప్పుడు విస్పష్టం. ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి పార్టీ ఓడిపోయిందని నమ్మడానికి పేదవర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. ఏదో ‘మాయ’ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నారు. పేదల అభ్యున్నతి కోసం పని చేసినందుకే బడా బాబులంతా కలిసి కుట్ర చేశారన్న అభిప్రాయం వారి మనసుల్లో బలంగా నాటుకొని పోయింది. ఫలితంగా జగన్‌పై వారికున్న అభిమానం మరింత బలపడుతున్నది.ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెట్లా ఇస్తామని ఇటీవలనే ప్రవచించిన ముఖ్యనాయకుడికి ప్రజలు మూడ్ బాగానే తెలుసు. జగన్మోహన్రెడ్డి జనంలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. జనంలో ఉన్న జగన్మోహన్రెడ్డితో తాము తలపడలేమని కూడా తెలుసు. అందుకే ఆయన జనంలోకి రాకూడదని ముఖ్యమంత్రీ, ఆయన శిబిరం భావిస్తుండవచ్చు. ఒక వేళ జనంలోకి వస్తే ఏం చేయాలన్న పథకంపై మొన్నటి పర్యటనల్లో రిహార్సళ్లు, రెక్కీలు జరిగి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతా కవచాలలో ఉన్న జగన్మోహన్రెడ్డికి ఆ స్థాయి భద్రతను కల్పించవలసి ఉన్నది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఆ సిబ్బందిని భారీగా కుదించినప్పుడే అనుమానాలకు బీజం పడింది.తాడేపల్లిలోని జగన్మోహన్రెడ్డి నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీ టెంట్లనూ, బారికేడ్లనూ, సిబ్బందినీ తొలగించినప్పుడే ప్రభుత్వ పెద్దల దురుద్దేశం బట్టబయలైంది. వినుకొండ పట్టణ నడివీధిలో జరి గిన రెడ్‌బుక్ ఘాతుకానికి బలైన రషీద్ కుటుంబ పరామర్శకు బయ ల్దేరినప్పుడు కూడా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించి జగన్ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు. ఆయన నివాసానికి సమీపంలోనే మంటలు చెలరేగడం భద్రతా వైఫల్యం కాక మరేమంటారు? ప్రొటోకాల్ ప్రకారం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే నాయకుడు పర్యటనలో ఉన్నప్పుడు రోడ్డు క్లియర్ చేసే టీమ్, కాన్వాయ్, రోప్ పార్టీ, ఎస్కార్ట్ విధిగా ఉండి తీరాలి. కానీ జగన్ పర్యటనల్లో వేళ్ల మీద లెక్కించగలిగేంత మంది కానిస్టేబుళ్లు తప్ప ఇవేమీ కనిపించడం లేదు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భద్రతకు ఎటువంటి లోటూ జరగలేదు. రూల్‌బుక్ స్థానాన్ని రెడ్‌బుక్ ఆక్రమించలేదు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోనే స్థిరనివాసం ఉండేవారు. జడ్ ప్లస్ కేటగిరీ కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొటోకాల్ ప్రకారం తీసుకోవలసిన భద్రతా చర్యల్ని తీసుకున్నది. అది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. జగన్ విషయంలో ఈ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం విస్మరించడం వెనుక భయంకరమైన కుట్ర ఉండవచ్చనే అనుమానాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అవి కేవలం అనుమానాలు మాత్రమే కావని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం.జగన్ భద్రత విషయంలో కుట్రపూరితమైన ఆలోచనలు చేయవలసిన అవసరం ప్రభుత్వ పెద్దలకు తప్ప ఇంకెవరికీ లేదు. చంద్రబాబు కూటమి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. తాము అమలు చేయలేమని తెలిసినప్పటికీ అనేక హామీలను గుప్పించి ఓటర్లను వంచించింది. ఇప్పుడా హామీలన్నింటినీ చాప చుట్టేసి అటకెక్కించింది. అంతకు ముందు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్న’ పథకాలు కూడా ఆగిపోయాయి.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాస్వామికీకరణ కార్యక్రమాన్ని నిలిపి వేసి ప్రైవేట్ దోపిడీకి బాటలు వేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన గృహనిర్మాణ విప్లవానికి కళ్లెం వేశారు. ‘అమ్మ ఒడి’ని ఆపేశారు. ‘చేయూత’ను వదిలేశారు. ‘కాపు నేస్తం’ కనిపించడం లేదు. ఈ బీసీ నేస్తం పత్తా లేదు. జాతీయ స్థాయిలో బహుళ ప్రశంసలు అందుకున్న వలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేశారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తానని ప్రతి ఎన్నికల సభలోనూ బాబు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థనే గిరాటేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇటువంటి పచ్చి మోసాన్ని అనుమతించవచ్చునా? ఇటువంటి మోసగాళ్లు పాలకులు కావడం వాంఛనీయమేనా? ఇదొక్క అంశమే కాదు. అన్ని హామీలకూ ఇదే గతి పట్టింది. వీటిపై ప్రజల్లోనూ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారిలోనూ విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ప్రజానాయకుడైన జగన్మోహన్రెడ్డి ఒకసారి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడితే కూటమి మోసాల గుట్టురట్టవుతుంది. విస్తృత స్థాయిలో చర్చ మొదలవుతుంది. ఈ పరిణామం కూటమి మనుగడకే ్రపమాదం. కనుక జగన్మోహన్రెడ్డి జనంలోకి రాకూడదు. గతంలోనే ఆయనపై రెండు మార్లు హత్యాప్రయత్నాలు జరిగి ఉన్నాయి గనుక భద్రతా చర్యలను నిలిపివేస్తే ఆయన యాత్రలు ఆగిపోతాయన్న వెర్రి ఆలోచన ఏమైనా ఉండవచ్చు. భద్రతా సిబ్బందిని తొలగించినా, కార్యకర్తలే రోప్ పార్టీగా మారి నడుస్తున్న పరిణామాన్ని చూసిన తర్వాత మరింత తీవ్రమైన వ్యూహాలకు కూటమి సర్కార్ పదును పెట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే జగన్ వంటి ప్రజానాయకుడు రంగంలో ఉండగా తన వారసుడు రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆదిలో బాబు నిల దొక్కుకోవడానికి కూడా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు ద్వారా రంగం నుంచి తప్పించడానికి ఎటువంటి వ్యూహాలు అమలు చేశారనేది తెలిసిన సంగతే!రాజశేఖర్‌రెడ్డిని గద్దెదించడానికి కూడా బాబుకూటమి చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్నూ, సమైక్య రాష్ట్రానికి కట్టుబడివున్న సీపీఎంనూ ఒక్కచోటకు చేర్చి ‘మహాకూటమి’ని కట్టిన సంగతి కూడా తాజా జ్ఞాపకమే! ఆయన మీద ఎంత దుష్ప్రచారం చేసినా, ‘మహాకూటమి’ని నిర్మించినా, సంప్రదాయ కాంగ్రెస్ ఓటును చిరంజీవి పార్టీ బలంగా చీల్చినా బాబు ముఠా ప్రయత్నాలు ఫలించలేదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ మహానేత మరో విధంగా రంగం నుంచి నిష్క్రమించారు.జగన్మోహన్రెడ్డి మరో బలమైన మాస్ లీడర్‌గా ఆవిర్భవిస్తారని చంద్రబాబు – యెల్లో మీడియా వారు ఆదిలోనే గుర్తించారు. ఆయన్ను మొగ్గలోనే తుంచేయడానికి చేసిన ప్రయత్నాలను తెలుగు ప్రజలందరూ గమనించారు. గడిచిన పదిహేనేళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న వ్యక్తిత్వ హనన కార్యక్రమం న భూతో న భవిష్యతి. ప్రపంచ చరిత్రలోనే ఈ స్థాయిలో వ్యక్తిత్వ హనన గోబెల్స్ ప్రచారం ఎవరి మీదా జరిగి ఉండదు. ప్రజా నాయకులను దూరం చేసి చంద్రబాబుకు మార్గం సుగమం చేసే కార్య క్రమంలో యెల్లో మీడియా, దాని రింగ్ లీడర్ రామోజీరావు పోషించినది దుర్మార్గమైన పాత్ర. చట్టాన్ని ధిక్కరించి ఫైనాన్సియర్స్ పేరుతో నిధులు పోగేసిన వ్యక్తి రామోజీ. చిట్‌ఫండ్స్ పేరుతో జనం సొమ్మును సొంత వ్యాపారాలకు వాడుకున్న వ్యక్తి రామోజీ. ఒకరి కొకరు తోడు నీడగా బాబు–రామోజీలు ముప్ఫయ్యేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను భ్రష్టు పట్టించారు. అయినా సరే, జనం మాత్రం జగన్ వెంట నిలబడుతున్నారు. ఈ పరిణామం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు జగన్‌కు భద్రత కల్పించడంలో విఫలం కావడమనేది కేవలం పొరపాటు కాదు. వట్టి నిర్లక్ష్యం కాదు. ఉద్దేశపూర్వక∙నిర్లక్ష్యం, కుట్రపూరిత నిర్లక్ష్యం! ఇటువంటి ధోరణిని ఎండగట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు మరింత బలహీనపడతాయి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Ramoji Film City: ఫిలిం సిటీ గోడలు బద్దలుగొట్టి
-
Kakani : సెకీ నుంచి ఈ ఏడాదే 4వేల మెగావాట్ల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు
-
నీకు దమ్ము, ధైర్యం ఉంటే. .. చంద్రబాబు కుట్ర బయటపెట్టిన గౌతంరెడ్డి
-
'జగన్ ' అంటే నమ్మకం కోల్పోయింది అధికారమే.. ప్రజాదరణ కాదు
-
Group 2: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన
-
కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
-
ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది: Botsa
-
ఫోన్ ట్యాపింగ్‌లకు నేను భయపడను: పేర్నినాని
-
మానసికంగా వేధిస్తున్నారు మీ ఇంట్లో పిల్లను ఇలాగే చేస్తావా: Pothina Mahesh
-
వివేకా హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రలు
-
‘మార్గదర్శి’ మోసాల కేసు మూత
ఆర్బీఐ సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్లను సేకరించిన వ్యవహారంలో రామోజీ, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎంత చేయాలో అంత చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రామోజీ కుటుంబానికి ఆర్థికంగా అత్యంత కీలకమైన మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఇప్పటికే ఉపసంహరింప చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత బరి తెగించి మార్గదర్శి చిట్‌ఫండ్‌పై అసలు కేసు నమోదు చేయడమే ‘పొరపాటు..’ అంటూ దర్యాప్తు సంస్థతో చెప్పించింది.సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాలు, ఆర్థిక అవకతవకలకు కీలక ఆధారాలున్నాయని గతంలో బల్లగుద్ది గట్టిగా వాదించిన సీఐడీ.. చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడితో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించింది. తాము సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలేవీ మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాలను రుజువు చేసేవి కావంటూ నిస్సహాయంగా చేతులెత్తేసింది. ఈమేరకు మార్గదర్శి చిట్‌ఫండ్ విషయంలో కేసు నమోదు చేయడం పొరపాటు అంటూ సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయనున్నట్లు దర్యాప్తు సంస్థ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి అక్రమాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలున్నాయని గతంలో తేల్చి చెప్పిన సీఐడీ హఠాత్తుగా స్వరం మార్చడం వెనుక సీఎం చంద్రబాబు ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాబు డైరెక్షన్లో.. ఆయన ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థ నడుచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. రాజగురువు రామోజీ లేనప్పటికీ ఆయన కుటుంబం పట్ల చంద్రబాబు సర్కారు రాజభక్తిని చాటుకుంటూనే ఉంది! రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా... ఆర్బీఐ సెక్షన్ 45 (ఎస్) తమకు వర్తించదంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా అక్రమ డిపాజిట్లను సేకరించిన వ్యవహారంలో రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎంత చేయాలో అంత చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రామోజీ కుటుంబానికి ఆర్థికంగా అత్యంత కీలకమైన మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల విషయంలో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఇప్పటికే ఉపసంహరింప చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత బరి తెగించింది. ఏకంగా మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కేసు నమోదే ‘పొరపాటు..’ అంటూ సీఐడీ చేత చెప్పించింది. అంతేకాక ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలు ఏవీ కూడా మార్గదర్శి చిట్‌ఫండ్‌పై పెట్టిన కేసును నిరూపించేవిగా లేవంటూ సీఐడీతో ఏకంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించింది. మార్గదర్శి చిట్‌పై కేసు నమోదు ‘పొరపాటు..’ (మిస్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్) అంటూ సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేయించింది. ఇక ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు సీఐడీ అదనపు డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ అనుమతి మంజూరు చేయడమే తరువాయి. తద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు ఎప్పటికీ బహిర్గతం కాకుండా శాశ్వతంగా సమాధి కట్టాలని బాబు సర్కారు నిర్ణయించింది. ఒకవైపు తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీరావు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆర్బీఐ బహిర్గతం చేయగా.. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు ఆధారాల్లేవని ఏపీ హైకోర్టులో సీఐడీ చేత చెప్పించడం గమనార్హం. మరో కీలక విషయం ఏమిటంటే.. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాల కేసు విచారణకు వచ్చిన రోజే.. ఏపీ హైకోర్టులో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు అనుకూలంగా సీఐడీ కౌంటర్ దాఖలు చేయడం. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కి చెందిన రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లను ఆ సంస్థ చేత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపసంహరింప చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మార్గదర్శిపై కేసు నమోదు చేయడం ‘పొరపాటు’ అంటూ సీఐడీ దాఖలు చేసే తుది నివేదికను సంబంధిత కోర్టు ఆమోదిస్తే చంద్రబాబు ప్రభుత్వం విజయం సాధించినట్లే! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కేసు క్లోజ్ అయినట్లే!!చిట్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ...మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ 2023 మార్చి 10న సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా అదే రోజు రామోజీరావు, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్స్ ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. అనంతరం మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. గడువు ముగిసి ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయడం లేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందని చందాదారులు స్పష్టంగా చెప్పారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం లాంటి ఉల్లంఘనలకు మార్గదర్శి చిట్స్ పాల్పడినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ సంస్థ ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌ను 2023 మార్చి 29న అరెస్ట్ చేసింది. అనంతరం సంబంధిత కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.అప్పట్లో మార్గదర్శికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన సీఐడీశ్రవణ్ కుమార్ అరెస్ట్‌ను, రిమాండ్‌ను ప్రశ్నిస్తూ ఆయన భార్య నర్మదతో పాటు శ్రవణ్ కుమార్ కూడా ఆశ్చర్యకరంగా ‘హెబియస్ కార్పస్’ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. కీలక స్థానాల్లో ‘అనుకూల’ వ్యక్తులు ఉండటంతోనే అసాధారణ రీతిలో వీరు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా సాగింది. ఈ పిటిషన్‌ను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీ చాలా గట్టిగా వాదనలు వినిపించింది.ఆధారాల్లేవంటూ తాజాగా కౌంటర్మార్గదర్శి చిట్‌ఫండ్ విషయంలో కేసు నమోదు చేయడం పొరపాటు అని సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయనున్నామంటూ హైకోర్టులో దాఖలు చేసిన తాజా కౌంటర్లో నివేదించింది. సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు సీఐడీ అదనపు డీజీని అనుమతి కోరినట్లు సీఐడీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం అదనపు ఎస్పీ డి.ప్రసాద్ తన కౌంటర్లో హైకోర్టుకు తెలిపారు. ఆధారాలు చాలకపోవడంతో మార్గదర్శిపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు అనుమతి కోరుతూ అప్పటి దర్యాప్తు అధికారి రాజశేఖరరావు సీఐడీ అదనపు డీజీకి గత ఏడాది ఆగస్టు 12న లేఖ రాశారని, ఆ లేఖను పరిశీలించిన అదనపు డీజీ మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కేసు మూసివేతకు ఆగస్టు 16న అనుమతినిచ్చారని పేర్కొన్నారు. దీంతో తుది నివేదిక సిద్ధం చేసి కోర్టులో దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని అదనపు డీజీని కోరామన్నారు.నాడు కీలక ఆధారాలు ఉన్నాయన్న సీఐడీ..వాస్తవానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ అవకతవకలపై దర్యాప్తు జరిపిన సీఐడీ పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించింది. ఇదే విషయాన్ని గతంలోనే హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాల కేసులో సంస్థ యజమాని శైలజా కిరణ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ వినిపించిన వాదనల సందర్భంగా ఈ విషయాన్ని చెప్పింది. మార్గదర్శి చిట్‌ఫండ్‌కు వ్యతిరేకంగా కీలక ఆధారాలున్నాయని, అందువల్ల బెయిల్ ఇవ్వొద్దంటూ గట్టిగా వాదనలు వినిపించింది. సీఐడీ సేకరించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాలు, అవకతవకలకు కీలక ఆధారాలున్నాయని అప్పుడు తేల్చి చెప్పిన సీఐడీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించింది. తాము సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలేవీ కూడా మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాలను రుజువు చేసేవిగా లేవంటూ నిస్సిగ్గుగా, నిస్సహాయంగా చేతులెత్తేసింది.మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల్లో మచ్చుకు..సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం.. చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం.. తక్కువ వడ్డీ చెల్లించడం.. చెల్లింపులు ఎగవేయడం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల్లో మచ్చుకు కొన్ని! చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే... చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. తన వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టి పెట్టుకున్న మొత్తాలను మార్గదర్శి రొటేషన్ చేస్తూ వస్తోంది. చట్ట ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. కానీ మార్గదర్శిలో అలా ఉంచకుండా దాన్ని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయి. -
YS జగన్‌ను కలిసిన విద్యార్థినిని మానసికంగా వేధిస్తున్నారు: Varudu Kalyani
-
జగన్ ప్రాణాలకు ముప్పు కేంద్రానికి ఎంపీ సంచలన లేఖ
-
ఏదో సాధించాం అని గొప్పలు చెప్పుకోవడం కాదు..
-
ప్రభుత్వంపై మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి సీరియస్
-
పక్కనే ఉండి మోసం చేసారు భూమన ఎమోషనల్..
-
టీడీపీ కోసం పనిచేస్తున్నట్లుగా పోలీసుల వైఖరి ఉంది: YS Jagan
-
ఓ వీడియో విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
-
Nandigam Suresh: కూటమి ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టదు
-
చంద్రబాబు వచ్చాక మళ్లీ రైతులను పట్టి పీడిస్తున్నారు : వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ పర్యటనతో సీఎం చంద్రబాబు కొత్త డ్రామా
-
జగన్ పర్యటనలో అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం
-
అధికార మదంతో రెచ్చిపోతున్నారు టీడీపీపై యనమల కృష్ణుడు ఫైర్
-
ఉక్కిరి బిక్కిరి చేసిన అభిమానం ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ
-
జగన్‌తో తమ గోడు చెప్పు కున్న మిర్చి రైతులు
-
తప్పు చేసినోళ్లు.. ఎక్కడున్నా వదలం: వైఎస్ జగన్
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేటప్పుడు తాను ఏడాదిన్నర తర్వాత రిటైర్ అవుతానని సీఐ అన్నాడట..! రిటైర్ అయినా.. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా.. మొత్తం అందరినీ పిలిపిస్తాం.. చట్టం ముందు నిలబెడతాం. న్యాయం జరిగేటట్లు చేస్తాం.2023లో పోలీసులు సత్యవర్థన్ నుంచి రికార్డు చేసిన 161 స్టేట్ మెంట్లోనూ వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండోసారి తీసుకున్న 161 స్టేట్మెంట్లోనూ తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ లేడని సత్యవర్థన్ స్పష్టంగా చెప్పాడు. న్యాయమూర్తి ముందు హాజరైనప్పుడూ అదే విషయాలను చెప్పాడు.దీంతో ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి.. తప్పుడు ఫిర్యాదు ఇప్పించి కేసు పెట్టారు. వంశీని తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే.. అదే రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేసి బలవంతంగా పేరు చెప్పించారు. చంద్రబాబు పాలనలో ప్రతి కేసూ ఇల్లీగలే... ప్రతి కేసులోనూ వీరే బెదిరిస్తారు.. మళ్లీ తిరిగి తమను బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడతారు. అసలు ఎవరు.. ఎవరిని బెదిరిస్తున్నారు? రాజకీయ నేతలతోపాటు పారిశ్రామికవేత్తలనూ వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరినీ వీరే బెదిరిస్తూ అవతలి వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవన్నీ ఊరికే పోవు. వారికి తప్పకుండా చుట్టుకుంటాయి. అప్పుడు వారి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది.. – మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని.. వారు ఎక్కడున్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీసి చట్టం ముందు నిలబెడతామని వైఎస్సార్సీపీ(YSRCP)అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. అన్యాయం చేసిన అధికారులు, నాయకులు ఎవరినీ వదిలి పెట్టబోమన్నారు. ‘మీ టోపీలపై కనిపించే మూడు సింహాలకు సెల్యూట్ చేయండి..! టీడీపీ నాయకులకు కాదు..! మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి..’ అని పోలీసులకు హితవు పలికారు. ‘టీడీపీ నాయకులు ఆడించినట్లల్లా ఆడుతూ అన్యాయాలు చేస్తే.. ఎల్లకాలం ఆ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి..! రేపు మేం అధికారంలోకి వస్తాం.. అన్యాయం చేసిన అధికారులు, నాయకులను చట్టం ముందు నిలబెడతా..’ అని హెచ్చరించారు. అక్రమ కేసులో అరెస్టై విజయవాడలోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. వంశీ సతీమణి పంకజశ్రీతో కలిసి జైలు లోపలికి వెళ్లారు. పార్టీ సీనియర్ నేతలు, నాయకులెవరినీ జైలు అధికారులు లోపలకు అనుమతించలేదు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం బయటే నిలువరించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో జైలు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వారందరినీ పోలీసులు చాలా దూరంలోనే అడ్డుకున్నారు. వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం జైలు బయట వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలను సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. విజయవాడ గాందీనగర్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూడడానికి తరలివచ్చిన అశేష జనసందోహంలో ఓ భాగం వంశీ ఏ తప్పూ చేయకున్నా.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనిస్తే.. అత్యంత దారుణంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోంది. ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ(TDP) ఆఫీస్‌లో పని చేస్తున్నారు. ఆ వ్యక్తి సాక్షాత్తూ తానే న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని అందులో ఆయన చెప్పినప్పటికీ తప్పుడు కేసు బనాయించారు. మేం ఏనాడూ ఏకపక్షంగా వ్యవహరించలేదు.. 2023 ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీని భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తిట్టించారు. ‘వాడో పిల్ల సైకో. నేనే గన్నవరం వెళ్తా.. ఎవడేం పీకుతాడో చూస్తా... ఆ వంశీ సంగతి చూస్తా... నియోజకవర్గం నుంచి బయటకు విసిరేస్తా..’ అని పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మర్నాడు ఫిబ్రవరి 20న కూడా అదే పట్టాభిని చంద్రబాబు గన్నవరం పంపాడు. అక్కడ పట్టాభి మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి వంశీని తిట్టాడు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోగేసిన మనుషులను వెంట బెట్టుకుని పట్టాభి ఒక ప్రదర్శనగా వైఎస్సార్సీపీ ఆఫీస్‌పై దాడికి బయలుదేరాడు. వైఎస్సార్సీపీ ఆఫీస్ వద్దకు చేరుకుని అక్కడ శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా వారు దాడి చేయడంతో ఆయన తల పగిలింది. ఆయన కూడా దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. టీడీపీ వారు పెద్ద సంఖ్యలో దాడికి సిద్ధం కావడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఇరువైపుల వారిపై కేసులు నమోదు చేశారు. నిజానికి ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదు. పోలీసుల చర్యలను అడ్డుకోలేదు. కేసు నుంచి బయటపడే ప్రయత్నమూ చేయలేదు. ఎక్కడా వంశీ ప్రమేయం, పేరు లేకున్నావైఎస్సార్సీపీ ఆఫీస్‌పై దాడికి ప్రయత్నించిన టీడీపీ నేతలు మూడు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. అయితే వాటిలో ఎక్కడా వంశీ పేరు లేదు. ఆ ఫిర్యాదుల్లోనూ, పోలీసులు సుమోటోగా పెట్టిన కేసుల్లోనూ ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. కారణం.. ఆ ఘటన జరిగినప్పుడు వంశీ అక్కడ లేరు. అది జరిగిన రెండు రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో డీటీపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ అనే దళిత యువకుడిని మంగళగిరిలోని తమ కార్యాలయానికి చంద్రబాబు మనుషులు పిలిపించారు. సత్యవర్థన్‌తో తెల్ల కాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు. దాని ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసులో కూడా వంశీ పేరు లేదు. 2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్ నుంచి 161 స్టేట్మెంట్ రికార్డు చేశారు. అందులోనూ వంశీ పేరు, ప్రసావన లేదు. టార్గెట్ వంశీ... కేసు రీ ఓపెన్ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2024 జూలై 10న ఆ కేసును రీ ఓపెన్ చేశారు. ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇదే సత్యవర్థన్‌తో రెండోసారి 161 స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే అందులో కూడా తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ లేడని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ ఘటన జరుగుతున్నప్పుడు తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తొలి స్టేట్మెంట్లో చెప్పిందే రిపీట్ చేశాడు. అయినా సరే.. చంద్రబాబు ఆక్రోశం, కోపం ఏ స్థాయిలో ఉందంటే.. ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, ఘటనా స్థలంలో లేకపోయినా కూడా ఆయన్ను ఈ కేసులో 71వ నిందితుడిగా చేర్చారు. అయితే ఆ కేసులోవి బెయిలబుల్ సెక్షన్లు కావడంతో ముందస్తు బెయిల్ కోసం అప్పటికే వంశీ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకి బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ కుట్రను మరింత ముందుకు తీసుకెళ్లారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌ను తగలబెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు. నిజానికి అలాంటిది జరగకపోయినా చంద్రబాబు కట్టుకథ అల్లారు. ఎందుకంటే.. ఆ ఆఫీస్ భవనం యజమానులు ఎస్సీ, ఎస్టీలైతే వారితో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించవచ్చని భావించి ఆ భవనం అదే సామాజిక వర్గానికి చెందిన వారిదంటూ దొంగ వాంగ్మూలం కూడా ఇచ్చేశాడు. వాస్తవానికి టీడీపీ ఆఫీస్‌ను ఎవరూ తగలబెట్టే ప్రయత్నం చేయలేదు. ఆ బిల్డింగ్ కూడా చంద్రబాబుకు సంబంధించిన కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినది. అంటే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి బెయిల్ కూడా రాకూడదని చేసిన కుట్ర ప్రయత్నమిది అని అర్థమవుతోంది. కుట్రతో బెయిల్‌నూ అడ్డుకుంటున్నారుమొత్తం 94 మందిపై కేసు పెడితే, నెలల తరబడి వైఎస్సార్సీపీ వారిని వేధించేందుకు ఇంకా 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్ మేజి్రస్టేట్ ముందు హాజరై వాంగ్మూలం ఇస్తే వారికి కూడా బెయిల్ వస్తుందనే ఆందోళనతో చంద్రబాబు, పోలీసులు కలిసి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే సత్యవర్థన్‌కు 20 సార్లు కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చినా.. ప్రతిసారీ దాటవేస్తూ కోర్టుకు రాలేదు. చివరకు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సత్యవర్థన్ తనంతట తానే న్యాయమూర్తి ముందు హాజరయ్యాడు. గతంలో తాను పోలీసులకు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో.. అదే విషయాలను చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తాను లేనని, తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని స్పష్టం చేశాడు. అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని కోర్టుకు మొర పెట్టుకున్నాడు.ప్రజాస్వామ్యం ఖూనీ..ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోంది. పిడుగురాళ్ల మునిసిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటే.. సోమవారం జరిగిన ఉప ఎన్నికలో ఒక్క సభ్యుడు కూడా లేని టీడీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. టీడీపీకి సంఖ్యా బలం లేకున్నా.. ఒక్క సభ్యుడు కూడా లేకున్నా ఏమాత్రం సిగ్గు లేకుండా తామే ఆ ఎన్నికలో గెల్చామని చెప్పుకుంటోంది. చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం.⇒ తిరుపతి కార్పొరేషన్‌లోని 49 డివిజన్లలో 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందగా కేవలం ఒక్క డివిజన్లో మాత్రమే టీడీపీ నెగ్గింది. అలాంటి చోట.. పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ పీఠాన్ని సాధించామని టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది. దీన్నిబట్టి అక్కడ కూడా పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. ⇒ తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. మరి అలాంటి చోట టీడీపీ వైస్ ఛైర్మన్ పదవిని ఎలా గెల్చుకుంటుంది? అక్కడ దౌర్జన్యం చేసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి టీడీపీ ఒత్తిడితో ఎన్నికనే వాయిదా వేయించారు. అంటే వారికి అనుకూల పరిస్థితి వచ్చే వరకు ఆ ఎన్నిక జరపరు. పోలీసులతో కలసి తండ్రీ కుమారుల కుట్ర..తన తల్లితో కలిసి ఆటోలో కోర్టుకు వచ్చానని, తన స్టేట్మెంట్ వెనక ఎవరి బలవంతమూ లేదని సత్యవర్థన్ మొన్న.. ఫిబ్రవరి 10న న్యాయమూర్తి ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో మనశ్శాంతి కరువైన చంద్రబాబు, లోకేశ్ మళ్లీ పోలీసులతో కలసి కుట్ర పన్నారు. అందులో భాగంగా ఆ మర్నాడే.. సత్యవర్థన్ కోర్టును తప్పుదోవ పట్టించడంతో పాటు తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడంటూ ఫిబ్రవరి 11న విజయవాడ పటమట పీఎస్‌లో ఆయనపై ఒక ఎఫ్ఐఆర్ పెట్టి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఆ వెంటనే ఫిబ్రవరి 12న.. సత్యవర్థన్ వద్ద ఉన్న రూ.20 వేలు లాక్కుని అతడిని కిడ్నాప్ చేశారని, దాన్ని ఎవరో చూసి తనకు చెప్పారంటూ సత్యవర్థన్ అన్నతో పోలీసులకు ఒక ఫిర్యాదు ఇప్పించి వెంటనే కేసు రిజిస్టర్ చేశారు. ఇక ఆ మర్నాడు.. ఫిబ్రవరి 13 తెల్లవారుజామున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేశారు. అందులో వంశీ పేరు చెప్పించారు. అంటే.. ఎవరైతే కిడ్నాప్ అయ్యారని చెబుతున్నారో అతడి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోకుండానే వంశీని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. ఆ సాయంత్రం తాపీగా సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేశారంటే ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందో అర్థమవుతోంది. ఒక మనిషి తప్పు చేస్తే.. అతడిని శిక్షిస్తే పోలీసులకు గౌరవం ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైళ్లలో ఉంచుతున్నారు. వంశీపై పెట్టిన కేసే దీనికి నిదర్శనం.వంశీ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే..‘‘వంశీని ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే.. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి! చంద్రబాబు, లోకేశ్ కంటే ఆయన గ్లామరస్‌గా ఉన్నారనే..! వల్లభనేని వంశీతో పాటు కొడాలి నానిపై వారికి జీరి్ణంచుకోలేని ఆక్రోశం. ఇక అవినాశ్ కూడా లోకేశ్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారు... ఇదీ చంద్రబాబు మనస్తత్వం! ఆ సామాజిక వర్గంలో చంద్రబాబు, ఆయన కుమారుడు మాత్రమే లీడర్లుగా ఉండాలనుకుంటారు! వారికి అనుకూలంగా లేని వారిని ఆ సామాజికవర్గం నుంచి వెలి వేస్తారు..!’’ అని మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అదో మాఫియా సామ్రాజ్యం!‘‘చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 కలిసి చేసేవన్నీ కుట్రలు, కుతంత్రాలే..! అది ఒక మాఫియా సామ్రాజ్యం. చంద్రబాబును సీఎంను చేయడం కోసం.. ఆయనకు ఓట్లు వేయించడం కోసం వారు ఒక మాఫియా సామ్రాజ్యంలా తయారయ్యారు. వారి సామాజిక వర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని ఇక అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. బురద చల్లడంతో పాటు దారుణంగా ట్రోలింగ్ చేస్తారు. ఇవన్నీ చంద్రబాబు, లోకేశ్ నైజానికి అద్దం పడుతున్నాయి’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం.అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, నల్లగట్ల స్వామిదాసు, పార్టీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తదితరులు ఉన్నారు. -
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: మాజీ ఎంపీ నందిగం సురేష్
-
రాష్ట్రంలో దిగజారిన లా అండ్ ఆర్డర్‌కు వంశీ అరెస్టు ఒక నిదర్శనం
-
ఇవన్నీ పకోడీ కేసులు.. బాబుపై కొడాలి నాని సెటైర్లు
-
నువ్వు రిటైరైనా సప్త సముద్రాలు దాటినా ఈడ్చుకొస్తాం
-
లోకేష్ కన్నా వంశీ, నాని గ్లామర్ గా ఉన్నారని బాబుకి కుళ్లు!
-
ఎవ్వరినీ వదిలిపెట్టను.. బట్టలూడతేసి నిలబెడతా!
-
కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి.. ఇదీ ఓ గెలుపేనా!
-
సత్య వర్ధన్ ఫ్యామిలీని బెదిరించి..తప్పుడు కేసు పెట్టించారు!
-
జగన్ మాట్లాడుతుంటే సీఎం సీఎం అంటూ నినాదాలు
-
వంశీ పేరు అసలు లేదు.. పథకం ప్రకారమే ఇరికించారు!
-
గన్నవరం వెళ్తా.. ఎవడేం పీకుతాడో చూస్తా..!
-
వంశీ ఎలాంటి తప్పు చేయలేదు.. ఫాల్స్ కేసులు పెట్టారు..!
-
LIVE:వంశీ అరెస్ట్ పై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
వైఎస్ఆర్ సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు
-
విశాఖ ఆర్కే బీచ్ లో ఇసుక లారీ బీభత్సం
-
కాకినాడ జిల్లా తునిలో పరాకాష్టకు చేరిన టీడీపీ దౌర్జన్యం
-
వంశీతో వైఎస్ జగన్ ములాఖత్..మీడియాపై ఆంక్షలు
-
చలో తుని.. వైఎస్ఆర్సీపీ నేతలు హౌస్ అరెస్ట్