Corporate
-
పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యానికి మొమెంటం ఇన్వెస్టింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్స్‌కి సంబంధించి నిర్దిష్ట లక్షణాల ప్రాతిపదికన పెట్టుబడులు పెట్టే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్లో భాగంగా ముమెంటం ఇన్వెస్టింగ్‌కి గణనీయంగా ప్రాచుర్యం పెరుగుతోందని టాటా అసెట్ మేనేజ్మెంట్ హెడ్ (ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్) ఆనంద్ వరదరాజన్ తెలిపారు.డిమాండ్ దృష్ట్యా ఎన్ఎస్ఈ ప్రస్తుతం దాదాపు 31 ఫ్యాక్టర్ ఆధారిత సూచీలను అందిస్తోందని వివరించారు. ధరపరంగా బలమైన ట్రెండ్‌ను ప్రదర్శిస్తున్న స్టాక్స్‌ను గుర్తించి, క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక రాబడులను అందించడంపై ముమెంటం ఇన్వెస్టింగ్ ప్రధానంగా దృష్టి పెడుతుందని తెలిపారు. దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులను అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించేందుకు ఇన్వెస్టర్లు కొంత భాగాన్ని ఈ వ్యూహానికి కేటాయించే అవకాశాన్ని పరిశీలించవచ్చని వరదరాజన్ చెప్పారు. గత కొన్నాళ్లుగా మార్కెట్లు కరెక్షన్కు లోను కావడంతో పాటు ఒడిదుడుకులమయంగా ఉంటున్నప్పటికీ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్స్ మాత్రం మెరుగ్గా రాణిస్తున్నాయని పేర్కొన్నారు. తమ టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌లోకి గతేడాది పెట్టుబడులు మూడింతలై సుమారు రూ. 500 కోట్లకు చేరడం వీటిపై పెరుగుతున్న ఆకర్షణకు నిదర్శనమని వరదరాజన్ తెలిపారు. -
నిక్కచ్చిగా తొలి పాతికేళ్ల ‘సోర్స్ కోడ్’!
మహాకవి పోతన రచించిన ఒక పద్యం ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కక్కడై తోచు’ అని మొదలవుతుంది. శత కోటీశ్వరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాకుడు బిల్ గేట్స్‌ను ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. కొందరికి ఆయన తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం. రాగల దశా బ్దాల్లో ప్రపంచాన్ని శాసించే సాంకేతికతను ముందే పసిగట్టి, అందుకోసం యాభైయ్యేళ్ల నాడే ఒక సంస్థను స్థాపించిన దార్శనికుడు. మరికొందరికి ఆయన దాతృత్వశీలి. తన స్వచ్ఛంద సంస్థ మెలిందా–గేట్స్ ఫౌండేషన్ ద్వారా వెనకబడిన దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఆరోగ్య పరిరక్షణలో పాటుపడుతున్న మహనీయుడు. కానీ అనేకులకు ఆయన అనుమానాస్పదుడు. ఆయన సేవా కార్యకలాపాల వెనక స్వప్రయోజనాలున్నాయని వారు సంశయిస్తారు. బిల్ గేట్స్ గురించి చాలా పుస్తకాలొచ్చాయి. అందులో ఆయన్ను కీర్తించినవీ ఉన్నాయి, తూర్పారబట్టినవీ ఉన్నాయి. కానీ ఇంతకూ బిల్ గేట్స్ ఎవరు? తన గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే ఏం చెబుతారు? వీటన్నిటికీ జవాబుగా ఫిబ్రవరి 4న తన స్వీయచరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ పుస్తకం వెలువరించారు. మొత్తం మూడు భాగాలుగా వచ్చే స్వీయచరిత్రలో ఇది తొలి భాగం. ఇందులో బాల్యం నుంచి తొలి పాతికేళ్ల ప్రస్థానం ఉంది. బిల్ గేట్స్ వరకూ పుస్తకం వచ్చిన సందర్భం అనేక విధాల ముఖ్యమైనది. ఆయనకు ఈ సంవత్సరంతో 70 ఏళ్లు వస్తాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతుంది. దివంగతుడైన ఆయన తండ్రికి ఇది శతజయంతి సంవత్సరం. ఏడాదిన్నర క్రితం తన గురించి తాను రాసుకోవాలనిపించిందని,ఇందులో తన ఎదుగుదలకు కారకులైన తల్లితండ్రుల గురించీ, కుటుంబం గురించీ, ఇద్దరు బాల్యస్నేహితుల గురించీ చెప్పాలనిపించిందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన సమకాలీకులతో పోలిస్తే ఆయనెప్పుడూ కొన్ని దశాబ్దాల ముందు ఆలోచించేవారని బిల్ గేట్స్ గురించి ఇప్పటికే చాలామంది చెప్పారు. కానీ ఈ పుస్తకం కోసం ఆయన కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగు దలకైనా, పతనానికైనా కుటుంబ ప్రభావం, పెంపకం ఎలా దోహద పడతాయో ఈ పుస్తకంలో వివరించారు. తండ్రికి కోపం తెప్పించిన సందర్భంస్వీయచరిత్ర రాయదల్చుకున్నవారికి నిజాయితీ ముఖ్యం. తన తప్పొప్పులన్నిటినీ నిర్భయంగా చెప్పగలిగినప్పుడే ఆత్మకథకు పూను కోవాలి. తాను మానవాతీతుడినన్న అహం ఉండకూడదు. తన ఎదు గుదల ఎలా సాధ్యమైందో, జీవితం ఏయే మలుపులు తిరిగిందో, తన ప్రతి అడుగులోనూ ఎవరెవరు అండదండలు అందించారో, ఎవరిపట్ల తాను నిర్దయగా వ్యవహరించాడో, ఆ తప్పును ఏ దశలో గుర్తించాడో, ఎలా సరిదిద్దుకున్నాడో చెప్పగలగాలి. ఈ చట్రంలో ఇమిడే స్వీయచరిత్రలు మనదగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువ. బిల్‌గేట్స్ తన గురించి తాను ఏం చెప్పుకుంటారన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. తొలి భాగం ‘సోర్స్ కోడ్’ ఆ విషయంలో అందరి మన్ననలూ పొందే అవకాశం ఉంది. ఇది బాల్యం గురించే కనుక, ఆ దశలో ఆయన్ను వివాదాలు చుట్టుముట్టే అవకాశం లేదని అనుకుంటారు. కానీ బాల్య జీవితంలోని కొన్ని అంశాలను నిస్సంశయంగా చెప్పటం ద్వారా బిల్ ఫుల్మార్క్లు కొట్టేశారు. అది అమెరికా కనుక 1970ల నాటికే అందరికీ కంప్యూటర్ గురించి తెలిసిపోయింది. పర్సనల్ కంప్యూటర్ల వాడకమూ మొదలైంది. కాకపోతే ఇప్పటిలా నిత్యావసర వస్తువు కాదు. బాగా ధనవంతులకు మాత్రమే సాధ్యపడే విలాసవంతమైన ఉపకరణం. అలాగని బిల్ గేట్స్ తల్లిదండ్రులు నిరుపేదలు కాదు. వారి కుటుంబం ఇతరు లతో పోలిస్తే సుఖంగానే జీవనం సాగించేది. తండ్రి గేట్స్ సీనియర్ సమాజం పట్లా, కుటుంబం పట్లా ఎంతో నిబద్ధతతో ఉండేవాడని బిల్ గుర్తు చేసుకున్నారు. ఆచితూచి వ్యవహరించేవాడని, పిల్లల పట్ల దయతో, శ్రద్ధాసక్తులతో ఉండేవాడని రాశారు. ఆయన ఒకే ఒకసారి ఉగ్రుడయ్యాడట. అది కూడా తన లోపమేనని ఆయనంటారు.డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్ ముఖంపై చిమ్మారట. ‘థాంక్స్ ఫర్ ద షవర్’ అంటూ అక్కడి నుంచి బిల్ నిష్క్రమించారు. ‘ఎప్పుడూ ఎంతో శాంతంగా, ప్రేమగా ఉండే తండ్రిని నా ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశాను’ అని బిల్ రాశారు. ‘చిన్నప్పుడంతా ‘జటిలమైన కొడుకు’గానే ఉండేవాడిని’ అంటారు. ‘ఇప్పుడైతే ఆ ప్రవర్తన చూసి కచ్చితంగా ఆటిజంతో బాధపడేవాడిగా పరిగణించివుండేవారు’ అని చెబుతారు. చిన్ననాడే మద్యపానం, గంజాయి, ఎల్ఎస్డీ వంటివి అలవా టైన సంగతి, వాటికి దూరమైన సంగతి కూడా బిల్ దాచుకోలేదు. కొన్ని విషయాల్లో తమ పిల్లాడు ఎందుకంత ఆలోచిస్తాడో, ప్రవర్తి స్తాడో తెలుసుకోవటానికి అవసరమైన పుస్తకాలు, ఇతరేతర సమా చారం తల్లితండ్రులకు ఉండేది కాదంటాడు. ‘పెద్దవాళ్లను కలవటం, వారితో చర్చించటం, వారి సలహాలు, సూచనలు పాటించడం అనే సంస్కృతిని అమ్మానాన్న, అమ్మమ్మ అలవాటు చేశారు. అందుకే ఎక్కడికి తీసుకెళ్లినా పెద్దవాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించటం, సంతృప్తికరమైన జవాబు వచ్చేవరకూ ఆ ప్రశ్నల పరంపరను కొనసాగించటం అలవాటైంది. అది జీవితంలో ఎదగటానికి తోడ్పడింది’ అని బిల్ గేట్స్ అభిప్రాయపడతారు. ముఖ్యంగా అమ్మ, అమ్మమ్మ తనలో పోటీతత్వాన్ని ఎంతగానో పెంచారంటారు. తన జీవితంలో చోటుచేసుకున్న ఈ అంశాలను చెప్పటం అవి అందరికీ ఉపయోగపడతాయన్న ఉద్దేశమేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన పుట్టుకే అయాచితంగా అదనపు హక్కు (ప్రివిలేజ్)ను ఇచ్చిందని నిజాయితీగా ఒప్పుకోవటం ప్రశసించ దగ్గది. అప్పటికే జాతిపరమైన విభేదాలతో నిలువునా చీలివున్న సియాటెల్ సమాజంలో తాను శ్వేతజాతిలో పుట్టడం, అందులోనూ మగవాడిని కావటం ఎంతో కలిసొచ్చిందని బిల్ స్వీయాభిప్రాయం. పుట్టుకతోనే ప్రతిభావంతులమని స్వోత్కర్షకు పోయేవారికి ఇదొక కనువిప్పు. మేము లేకుండా కంప్యూటర్ విప్లవమా?హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పేనాటికి బిల్ గేట్స్‌కూ, ఆయన బాల్యస్నేహితుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్కూ, 17 యేళ్లవయసులోనే మృత్యు వాత పడిన మరో స్నేహితుడు కెంట్ ఇవాన్స్కూ పర్సనల్ కంప్యూ టర్‌పై అవగాహన ఉంది. ఎయిత్ గ్రేడ్‌లో ఉన్నప్పుడు పాఠశాల కొచ్చిన కంప్యూటర్‌తో ఎక్కువ సమయం గడిపేందుకు కంప్యూ టర్లో బగ్స్ సృష్టించామని, అది కనిపెట్టి తననూ, ఇవాన్స్నూ వెళ్లగొట్టారని బిల్ గేట్స్ చెప్పారు. తర్వాత కాలంలో కంప్యూటర్లలో బగ్స్ గుర్తించి తొలగించే పనికి కుదిరి కొంత డబ్బు సంపాదించిన ఉదంతాలూ ఉన్నాయి. కంప్యూటర్ను నిర్వహించే సీసీసీ కంపెనీ మూతపడటంతో దాని నిర్వహణ భారాన్ని స్కూల్లో తనకు అప్పగిస్తే, మిత్రుడు అలెన్ సాయంతో దాన్ని పూర్తిచేశారు. తన తొలి వ్యాపార భాగస్వామిగా ఇవాన్స్ తనతో జతకట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని, అతని మరణం ఒక్కటే తన బాల్యంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనని ఆయన వివరి స్తారు. తమ ప్రమేయం లేకుండానే కంప్యూటర్ విప్లవం వెల్లువెత్తు తుందేమోనన్న ఆత్రుత గేట్స్‌కూ, అలెన్కూ ఉండేదంటే... తాము అందులో పాలుపంచుకుని ప్రముఖంగా ఎదగాలనుకున్నారంటే వారి తపన ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడే ఈ ఇద్దరు మిత్రులూ ఎంఎస్–డాస్ ఆపరేటింగ్ సిస్టమ్, బేసిక్ వంటి సాఫ్ట్వేర్ రూపకల్పనలు చేయ గలిగారు.ఇవాళ్టిరోజున మైక్రోసాఫ్ట్‌లో బిల్ గేట్స్ వాటాల విలువ 10,780 కోట్ల డాలర్లు. ప్రపంచంలో ఆయన 13వ అతి పెద్ద ఐశ్వర్యవంతుడు. 2021లో ఆయనతో విడిపోయిన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ వాటాలు 3,040 కోట్ల డాలర్ల పైమాటే. అన్నట్టు, దీని అనంతరం రాబోయే పుస్తకాల్లో చాలా వివాదాస్పద విషయాలుంటాయి. ‘సోర్స్ కోడ్’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు గమనిస్తే ఆయన దేన్నీ దాచదల్చలేదని స్పష్టమవుతుంది. మిత్రుడు అలెన్‌ను దూరం చేసుకోవటం తప్పేనని అంగీకరించారు. మైక్రోసాఫ్ట్‌లో కొందరు మహిళా ఉద్యోగినులతో తన వివాహేతర సంబంధాలు, లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణ లొచ్చిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టీన్‌తో తనకున్న అనుబంధం, 27 ఏళ్ల వివాహబంధం అనంతరం భార్యతో విడాకులు, స్టీవ్ జాబ్స్‌తో పరిచయం, గొడవలు వంటి వ్యవహారాలపై బిల్ గేట్స్ అరమరికలు లేకుండా మాట్లాడారు. ఇంకా పర్యావరణం, ఏఐ వరకూ అభివృద్ధిపరిచిన సాంకేతికత, కరోనా మహమ్మారి, డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌ల తీరుతెన్నులు వగైరాలు ఈ ఇంటర్వ్యూల్లో ప్రస్తావన కొచ్చాయి. కనుక రాబోయే రెండు భాగాల్లో వీటికి సంబంధించి మరిన్ని వివరాలందిస్తారని తెలుస్తూనే ఉంది. తెంపల్లె వేణుగోపాలరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడుvenujourno@gmail.com -
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్‌చేస్తే..
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు అతడిని నగర జీవితం నుంచి గ్రామం బాట పట్టేలా చేశాయి. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతకాలనుకున్నాడు. చివరికి అదే అతడికి కనివిని ఎరుగని రీతిలో లక్షలు ఆర్జించేలా చేసి..మంచి జీవనాధారంగా మారింది. ఒకరకంగా ఆ ఆరోగ్య సమస్యలే ఆర్థిక పరంగా స్ట్రాంగ్‌గా ఉండేలా చేయడమే గాక మంచి ఆరోగ్యంతో జీవించేందుకు దోహదపడ్డాయి. ఇంతకీ అతడెవరంటే..అతడే హర్యానాకి చెందిన జితేందర్ మాన్(Jitender Mann). ఆయన చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో 20 ఏళ్లు టీసీఎస్ ఉద్యోగిగా పనిచేశారు. అయితే ఆ నగరాల్లో కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో నలభైకే రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి రోగాల బారినపడ్డారు. జస్ట్ 40 ఏళ్లకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాను రాను ఎలా ఉంటుందన్న భయం ఆయన్ని నగర జీవితం నుంచి దూరంగా వచ్చేయాలనే నిర్ణయానికి పురిగొలిపింది. అలా ఆయన హర్యానాలోని సొంత గ్రామానికి వచ్చేశారు. అక్కడే తన భార్య సరళతో కలిసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా రెండు ఎకరాల్లో సేంద్రియ మోరింగ ఫామ్(organic moringa farm)ని ప్రారంభించారు. అలాగే ఆకుల్లో పోషకవిలువలు ఉన్నాయని నిర్థారించుకునేలా సాంకేతికత(technology)ని కూడా సమకూర్చుకున్నారు. అలా అధిక నాణ్యత కలిగిన మోరింగ పౌడర్ని ఉత్పత్తి చేయగలిగారు ఈ జంట(Couple). వారి ఉత్పత్తులకు త్వరితగతిన ప్రజాదరణ పొంది..ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు,ముంబై వంటి నగరాలకు వ్యాపించింది. ఈ పౌడర్‌కి ఉన్న డిమాండ్ కారణంగా నెలకు రూ. 3.5 లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది ఆ దంపతులకు. అలా ఇప్పుడు నాలుగు ఎకరాలకు వరకు దాన్ని విస్తరించారు. అత్యున్నత నాణ్యతను కాపాడుకోవడమే ధ్యేయంగా ఫోకస్ పెట్టారిద్దరు. అందుకోసం ఆకులను కాండాలతో సహా కోసి రెండుసార్లు కడిగి ఏడు నుంచి తొమ్మిది కాండాలను కలిపి కడతామని అన్నారు. తద్వారా ఆకుని సులభంగా ఎండబెట్టడం సాధ్యమవుతుందని జితేందర్ చెబుతున్నారు. ఆకులను పెద్ద ఫ్యాన్ల కింద నియంత్రిత గ్రీన్హౌస్ సెటప్‌లో ఎండబెట్టడం జరుగుతుంది. అందువల్ల 12 గంటలలోనే ఆకులను కాండాల నుంచి తీసివేసి ముతక పొడిగాచేసి జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. అంతేగాదు ఈ దంపతులు తాము నేలను దున్నమని చెబుతున్నారు. తాము కలుపు మొక్కలు, ఇతర ఆకులనే రక్షణ కవచంగా చేసుకుంటారట. అలాగే హానికరమైన రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులను ఉపయోగించమని చెబుతున్నారు. ఇలా జితేందర్ వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడంతోనే ఆయన లైఫ్ మారిపోయింది. ఇదివరకటిలా ఆరోగ్య సమస్యలు లేవు. మంచి ఆరోగ్యంతో ఉన్నాని ఆనందంగా చెబుతున్నాడు. అలాగే ప్యాకేజింగ్ కోసం పొడిని పంపే ముందే తాము కొన్ని జాడీలను తమ కోసం పక్కన పెట్టుకుంటామని చెప్పారు. ఈ మొరింగ పౌడర్ వినియోగం తమకు మందుల అవసరాన్ని భర్తీ చేసేస్తుందని అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ధీమాగా చెబుతున్నారు. అలాగే జితేంద్ర దంపతులు తాము గ్రామానికి వెళ్లాలనుకోవడం చాలామంచిదైందని అంటున్నారు. "ఎందుకంటే మేము ఇక్కడ కష్టపడి పనిచేయడం తోపాటు ఆరోగ్యంగా ఉంటున్నాం. పైగా కాలుష్యానికి దూరంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాం అని సంతోషంగా చెబుతోంది ఈ జంట. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: లెడ్‌లైట్ థెరపీ: అన్ని రోగాలకు దివ్యౌషధం..!) -
పనిగంటలు కాదు.. అదే ముఖ్యం: భారత్‌పే సీఈఓ
ఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి.. అంటూ వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పిన లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు దీనిని ఖండిస్తూ.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇప్పుడు తాజాగా భారత్‌పే సీఈఓ 'నలిన్ నేగి' (Nalin Negi) చేరారు.ఫిన్‌టెక్ సంస్థ పని చేసే ప్రదేశాలలో ఎక్కువ గంటలు ఉండదని, పని ప్రదేశాల్లో ఉద్యోగుల ఫలితాలు.. ఉత్పాదకతలో నాణ్యత మాత్రమే ముఖ్యమని నలిన్ నేగి అన్నారు. వారానికి 90 గంటలు పనిచేయడం అనేది చాలా కష్టం. ఇది ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతుంది. దానివల్ల సరైన ఉత్పాదక ఉండదు. కాబట్టి ఎన్ని గంటలు పనిచేశామనేది కాకుండా.. నాణ్యమైన ఉత్పాదకత ఎంత ఉంది అని చూడటం ముఖ్యమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.భారత్‌పే చీఫ్ మాట్లాడుతూ.. ఒక కంపెనీ ఉద్యోగాలను ఇవ్వడం మాత్రమే కాదు, ఉద్యోగులకు మంచి భవిష్యత్తును కూడా ఇవ్వాలి అని అన్నారు. ప్రస్తుతం ఇదే మా లక్ష్యం అంటూ వెల్లడించారు. ఒక ఉద్యోగి సంతోషంగా పనిచేస్తేనే.. సంస్థకు లాభం ఉంటుంది. కాబట్టి వారానికి 90 గంటల పనిపై నాకు నమ్మకం లేదు అని అన్నారు.వారానికి 90 గంటల పని చేయాలనే వ్యాఖ్యలపై.. 'ఆనంద్ మహీంద్రా', సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' మొదలైనవారు కూడా స్పందించారు.ఆనంద్ మహీంద్రాఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్అదార్ పూనావల్లాఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు. -
డబ్ల్యుహెచ్ఓ ఫార్ములాతో ఓఆర్ఎస్ తయారీ
ఆదాయం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యూర్-ప్లే కన్స్యూమర్ హెల్త్ కంపెనీ, ఓఆర్ఎస్ఎల్ (ORSL) ఎలక్ట్రోలైట్ పానీయాల తయారీదారు కెన్వ్యూ (Kenvue), నేడు డీహైడ్రేషన్ ఉన్న రోగుల కోసం రెడీ టు డ్రింక్ (RTD) ఫార్మాట్లో WHO ORSను ప్రారంభించింది.ఓఆర్ఎస్ఎల్.. భారతదేశంలోనే నెంబర్ 1 రెడీ-టు-డ్రింక్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ బ్రాండ్. ఇది గత 20 సంవత్సరాలుగా.. ఎలక్ట్రోలైట్లతో మనిషి నీరసించిన సమయంలో శక్తి కోసం ఉపయోగించే ద్రవాలను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దాని వారసత్వంగా తమ రెడీ-టు-డ్రింక్ (RTD) రీహైడ్రేషన్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నారు. ఇది అతిసార వల్ల కలిగే డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న రోగులను లక్ష్యంగా చేసుకుని ORS - WHO ఆమోదించిన ఫార్ములా ప్రారంభించింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 1.7 బిలియన్ల మంది విరేచనాల వల్ల అతిసారతో బాధపడుతున్నట్లు సమాచారం. ముక్యంగా భారతదేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మరణానికి అతిసార మూడవ ప్రధాన కారణంగా ఉంది. దీనిని నివారించడానికి ఓఆర్ఎస్ ఉపయోగపడుతోంది.రెడీ టు డ్రింక్ ఓఆర్ఎస్ అనేది రోగులకు ఉపయోగపడే విధంగా డబ్ల్యుహెచ్ఓ మార్గదర్శకాలను పాటిస్తూ తయారైంది. రెడీ టు డ్రింక్ ఫార్మాట్లో తీసుకోవడం సులభం.. అంతే కాకుండా విరేచనాలతో పోరాడటానికి రీహైడ్రేషన్ను అందిస్తుంది. ఓఆర్ఎస్ మాత్రమే విరేచనాల వల్ల 93 శాతం మరణాలను నివారించగలదని అంచనా. కొత్త డబ్ల్యుహెచ్ఓ ఓఆర్ఎస్ కొత్త ఉత్పత్తి ఆపిల్ & ఆరెంజ్ అనే రెండు రుచికరమైన రుచులలో లభిస్తుంది. -
కెరీర్ క్యాట్‌ఫిషింగ్.. ఇప్పుడిదే కొత్త ట్రెండ్..!
తమ అలవాట్లు, సంప్రదాయ విరుద్ధ ధోరణులతో కార్పొరేట్ ప్రపంచంలో జెన్ జెడ్ వార్తల్లో నిలుస్తోంది. ‘కెరీర్ క్యాట్‌ఫిషింగ్’ అనే కొత్త ట్రెండ్‌తో హల్చల్ చేస్తోంది. యువత ఉద్యోగ ఆఫర్లను అంగీకరిస్తారు.. కానీ వారి యజమానులకు తెలియజేయకుండా వారి మొదటి రోజున ఆఫీసులో కనిపించకుండా పోతారు. సదరు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో యజమానికి తెలియకోవడాన్ని ‘కెరీర్ క్యాట్‌ఫిషింగ్’ అంటారు.ఆన్లైన్ రెజ్యూమ్ ప్లాట్‌ఫామ్ ‘సివిజెనియస్’ నివేదిక ప్రకారం జెన్ జెడ్ ఉద్యోగులు జాబ్ ఆఫర్లను స్వీకరిస్తున్నప్పటికీ యజమానులకు తెలియజేయకుండా మొదటి రోజు హాజరు కావడంలో విఫలమవుతున్నారు. 27 ఏళ్లలోపు ఉద్యోగుల్లో ధిక్కారణ ధోరణి పెరుగుతుందని నివేదిక తెలియజేసింది.నెలల తరబడి ఉద్యోగాల వేట, సుదీర్ఘమైన అప్లికేషన్లు, ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరు కావడం.. దీనికి సంబంధించి ఫ్రస్టేషన్స్ జెన్ జెడ్‌లో కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఇరవై సంవత్సరాల రాస్పిన్కు 32 లక్షల(సంవత్సరానికి) జాబ్ ఆఫర్ వచ్చినా ఆఫర్‌ను తిరస్కరించడం సోషల్‌మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ‘ఈ జీతంతో నేను ఎలా బతకగలను? ఈ జీతంతో ఫుల్‌టైమ్ ఉద్యోగమా!’ అని ఆశ్చర్యపోతుంది ఆమె.ఇదీ చదవండి: ఐస్‌క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్ఈ ధిక్కారం ఒక తరం మార్పును నొక్కి చెబుతుంది. ఉద్యోగం లేదా జీవితం వారి అంచనాలకు అందని పరిస్థితి ఉన్నప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించే ధోరణి పెరగుతుంది. నచ్చని, అంచనాలకు తగని విధంగా ఉద్యోగం ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉండడానికే యువతలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. -
రూ.8000 కోట్లు ఉన్నాయి.. ఏం చేయాలో తెలియట్లేదు!
ప్రతి మనిషి బాగా డబ్బు సంపాదించాలని, నచ్చినట్టు జీవించాలని కలలు కంటూ.. దీనికోసం ప్రయత్నిస్తుంటారు. కొంతమంది తమ లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటే.. మరికొందరు ఈ లక్ష్య సాధనలోనే కన్ను మూసేస్తున్నారు. అయితే వేలకోట్లు సంపాదించిన లూమ్ కో-ఫౌండర్ 'వినయ్ హిరేమత్' మాత్రం, నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.కేవలం 33 సంవత్సరాల వయసున్న భారతీయ సంతతికి చెందిన వినయ్ హిరేమత్ (Vinay Hiremath).. లూమ్ (Loom) కంపెనీ స్థాపించి, దానిని 2023లో అట్లాసియన్ (Atlassian)కు సుమారు 975 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8092.5 కోట్లు)కు విక్రయించారు. ''నేను ధనవంతుడిని.. నా జీవితాన్ని ఏమి చేయాలో తెలియడం లేదు'' అనే శీర్షికతో తన భావాలను పంచుకున్నారు.కంపెనీ విక్రయించిన తరువాత.. వినయ్ హిరేమత్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చాలా ప్రయాణాలు చేసి, ఎన్నో ప్రాంతాలను సందర్శించారు. ఆ తరువాత తనకున్న అభద్రతా భావం వల్ల ఆమెకు దూరంగా ఉండిపోయాడు. ఈ పోస్ట్ చదువుతున్నట్లయితే.. నేను ఆమెకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. నేను నీకు నచ్చిన విధంగా ఉండలేకేపోయాను. నీవు అందించిన అనుభూతులకు కృతజ్ఞతలు అని వెల్లడించారు.లూమ్ కంపెనీ విక్రయించిన తరువాత.. అట్లాసియన్ కంపెనీలోని ఉద్యోగం చేసే అవకాశం లభించింది. అక్కడ అతని ప్యాకేజీ 60 మిలియన్ డాలర్లు (రూ. 500 కోట్ల కంటే ఎక్కువ). అయినా వినయ్ హిరేమత్ ఈ ఆఫర్ వదులుకున్నారు. రోబోటిక్ కంపెనీ సహా ఇతర వెంచర్లను స్థాపించాలని అనుకున్నారు. కానీ అది తన నిజమైన అభిరుచి కాదని వెంటనే గ్రహించి వదులుకున్నారు.ఇదీ చదవండి: రూ.63 వేలకోట్లు ఆస్తి.. అద్దె ఇంట్లో నివాసం!: ఎవరో తెలుసా?ప్రస్తుతం హిరేమత్.. వాస్తవ ప్రపంచ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీని ప్రారంభించాలనే లక్ష్యంతో భౌతికశాస్త్రం నేర్చుకుంటున్నట్లు సమాచారం. నేను ప్రారంభించబోయే కొత్త వెంచర్ గొప్ప విజయాలను సాధించాలని, లాభాలను ఆర్జించాలని లేదు. నేను ప్రస్తుతం చాలా సంతృప్తిగా ఉన్నానని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.I am rich and have no idea what to do with my life.Where I talk about leaving Loom, giving up $60m, larping as Elon, breaking up with my girlfriend, insecurities, a brief stint at DOGE, and how I'm now in Hawaii self-studying physics.https://t.co/cMgAsXq3St— Vinay Hiremath (@vhmth) January 2, 2025లూమ్ కంపెనీలూమ్ అనేది 2015లో స్థాపించిన టెక్ కంపెనీ. ఇది వీడియో కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ అందిస్తుంది. కెమెరా రికార్డింగ్, స్క్రీన్ రికార్డింగ్, ట్రాన్స్క్రిప్షన్, వీడియో ఎడిటింగ్, షేర్ చేయగల స్క్రీన్ రికార్డెడ్ వీడియో లింక్‌ని సృష్టించడం వంటి సాంకేతికతలను అందిస్తుంది. ఈ కంపెనీ విలువ 2022లో 1.5 బిలియన్ డాలర్లు. అయితే దీనిని 2023 నవంబర్ 30న ఆస్ట్రేలియన్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన అట్లాసియన్ కొనుగోలు చేసింది. -
క్యూ3 ఫలితాలే దిక్సూచి
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 9న షురూ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్తోపాటు టాటా గ్రూప్ కంపెనీ టాటా ఎలక్సీ, ఫైనాన్షియల్ పీఎస్‌యూ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ(ఇరెడా) గురువారం(9న) క్యూ3 పనితీరును వెల్లడించనున్నాయి. తద్వారా ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుట్టనున్నాయి. ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఫిన్‌టెక్ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ మంగళవారం తొలిసారి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. టీసీఎస్ పటిష్ట పనితీరు సాధిస్తే ఇటీవల అమ్మకాల బాటలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులవైపు దృష్టి పెట్టవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. దేశీ అంశాలు వారాంతాన(10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్‌లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ సరీ్వసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రకటించనుంది. దీంతో ఇన్వెస్టర్లు బడ్జెట్ ప్రతిపాదలపైనా దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఎఫెక్ట్ ఈ నెల మూడో వారంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో గత వారాంతాన ముడిచమురు ధరలు బలపడ్డాయి. బ్రెంట్ బ్యారల్ 75 డాలర్లను తాకింది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 85.79కు చేరింది. ఇక ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత పాలసీ నిర్ణయాలకు సంబంధించిన వివరాలు(మినిట్స్) 9న వెల్లడికానున్నాయి. ఈ అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలవని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అంచనా వేశారు. కాగా.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. అయితే దేశీ ఫండ్స్ భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ అంశాలన్నీ ట్రెండ్ నిర్ణయంలో కీలకంగా నిలవనున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సే తెలియజేశారు. గత వారమిలా శుక్రవారం(3)తో ముగిసిన గత వారం తీవ్ర ఆటుపోట్ల మధ్య మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 524 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 79,223 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 191 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 24,000 పాయింట్లకు ఎగువన 24,005 వద్ద నిలిచింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.3 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతం జంప్‌చేసింది.ఎఫ్‌పీఐలు వెనక్కివిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త ఏడాది తొలి మూడు(1–3) ట్రేడింగ్ రోజుల్లో నికర అమ్మకందారులుగా నిలిచారు. వెరసి రూ. 4,285 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే డిసెంబర్లో తొలుత అమ్మకాలకే పరిమితమైనప్పటికీ చివరి రెండు వారాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. వెరసి గత నెలలో నికరంగా రూ. 15,446 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారడం, డాలరు బలపటడంతో ఎఫ్‌ఫీఐలు అమ్మకాలకే కట్టుబడవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. -
కంపెనీల విడదీత.. లాభాల మోత!
వ్యాపారాలను విభజించిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండుతోంది. ప్రత్యేక సంస్థలతో పాటు మాతృ సంస్థ ఉమ్మడి మార్కెట్ విలువలు రాకెట్లా దూసుకెళ్తూ దలాల్ స్ట్రీట్(Dalal Street)లో లాభాల మోత మోగిస్తున్నాయి. గత ఏడాది కాలంలో దాదాపు డజను కార్పొరేట్ సంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తాజాగా ఐటీసీ(ITC) కూడా హోటళ్ల బిజినెస్‌ను విడదీసి ప్రత్యేక అనుబంధ సంస్థగా లిస్టింగ్ చేస్తోంది. అదేవిధంగా టాటా మోటార్స్ సైతం వాణిజ్య వాహన విభాగాన్ని విడదీసే పనిలో ఉంది.విభిన్న వ్యాపారాలను ఒకే గొడుగు కింద నిర్వహించడం చాలా క్లిష్టతరమైన వ్యవహారం. దీనివల్ల నిర్దిష్టంగా ఫోకస్ చేయడానికి వీలుండదు. వేరు చేయడం వల్ల నిర్వహణ పనితీరు మెరుగవుతుంది. – రవి సర్దానా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ, ఇన్వెస్టర్లకు మరింత విలువ చేకూర్చడం ఇలా కారణం ఏదైనా కానీ.. దేశీ కార్పొరేట్ కంపెనీలు విభజనతో కాసులు కురిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలా విడదీసిన కంపెనీల షేర్లు దండిగానే లాభాలు పంచాయి. గత ఏడాది వ్యవధిలో విభజన తర్వాత మాతృ సంస్థ, కొత్తగా ఏర్పాటు చేసిన కంపెనీల ఉమ్మడి మార్కెట్(Market) విలువ 14–487% స్థాయిలో ఎగబాకడం విశేషం. ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2023 జూన్‌లో తన వెల్త్ బిజినెస్‌ను వేరు చేసి నువామా వెల్త్ మేనేజ్మెంట్ పేరుతో కొత్త కంపెనీని నెలకొల్పొంది. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలూ బుల్లెట్లా దూసుకెళ్లాయి. ఉమ్మడి మార్కెట్ విలువ రూ.6,281 కోట్ల నుంచి తాజాగా రూ.36,900 కోట్లకు ఎగసింది. ఏకంగా 487 శాతం వృద్ధి చెందింది. నువామా గతేడాది సెపె్టంబర్లో లిస్టయింది. దీంతోపాటు షిప్పింగ్ కార్పొరేషన్, టీవీఎస్ హోల్డింగ్స్, ఎన్ఐఐటీ, జీహెచ్‌సీఎల్, ఫోర్బ్స్–కంపెనీ... ఈ సంస్థలు విభజన తర్వాత మార్కెట్ విలువను 50 శాతం పైగానే పెంచుకున్నాయి. రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ విభజన తర్వాత ఇరు కంపెనీల మార్కెట్ విలువ ఒక దశలో 25 శాతం పైగా ఎగసింది.మెరుగైన నిర్వహణ...అధిక వృద్ధికి అవకాశం గల వ్యాపారాలను మాతృ సంస్థల నుంచి విడదీయడం వల్ల ఇన్వెస్టర్లకు కూడా మరింత విలువ చేకూరుతోంది. ‘విడదీసిన సంస్థల వ్యాపారాలు పుంజుకోవడం, స్వతంత్ర నిర్వహణ వల్ల ఆయా బిజినెస్‌లపై మరింత ఫోకస్ పెట్టేందుకు వీలవుతుంది. తగినంత నిధుల కేటాయింపు, పరిశ్రమ ట్రెండ్స్‌తో మెరుగ్గా అనుసంధానం కావడంతో భారీగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది’ అని అవెండస్ క్యాపిటల్‌లో ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ గౌరవ్ సూద్ పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వ రంగ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చక్కని ఉదాహరణ. ఈ కంపెనీకి చెందిన నాన్–కోర్ బిజినెస్‌లు, రియల్ ఎస్టేట్ ఆస్తులను విడదీసి ఎస్సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. గతేడాది మార్చిలో ఇది లిస్టయింది. ఈ రెండు కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ రూ.4,379 కోట్ల నుంచి రూ.12,829 కోట్లకు దూసుకెళ్లింది. అంటే 192% జంప్ చేసింది. ఇక టీవీఎస్(TVS) హోల్డింగ్స్ నుంచి సుందరమ్ క్లేటాన్ విభజన, దీన్ని ప్రత్యేక కంపెనీగా లిస్ట్ చేయడం వల్ల ఈ రెండింటి మార్కెట్ విలువ ప్రస్తుతం 136 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..క్యూలో మరిన్ని కంపెనీలు...ఐటీసీ, వేదాంత, హెచ్ఈజీ, అరవింద్, క్వెస్ కార్ప్ వంటి డజనకు పైగా కంపెనీలు ఇప్పటికే డీమెర్జర్లను ప్రకటించాయి. మరో 12–18 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యి.. వేరు చేసిన కంపెనీలు లిస్టవుతాయి. దీంతో అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు ఆయా కంపెనీలకూ మరింత విలువ దక్కనుంది. ఐటీసీ హోటల్ వ్యాపారాన్ని విడదీస్తున్నట్లు గతేడాది ఆగస్ట్‌లో ప్రకటించడం తెలిపిందే. వాటాదారులకు ప్రతి 10 ఐటీసీ షేర్లకు 1 ఐటీసీ హోటల్స్ షేర్లు దక్కుతాయి. దీనికి రికార్డ్ తేదీ జనవరి 6 కాగా త్వరలో లిస్టింగ్ జరగనుంది. వేదాంత సైతం 5 కీలక వ్యాపారాలను (అల్యూమినియం, ఆయిల్–గ్యాస్ విద్యుత్, స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్) వేర్వేరు కంపెనీలుగా విడదీయనున్నట్లు 2023 సెప్టెంబర్‌లో తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన వ్యాపారాలు, జింక్ మాత్రం వేదాంత కింద ఉంటాయి. ఇక టాటా మోటార్స్ కూడా తన వాణిజ్య వాహన విభాగాన్ని విడదీసి ప్రత్యేక కంపెనీగా లిస్ట్ చేయనుంది. ప్యాసింజర్ వాహన విభాగం ఇప్పుడున్న లిస్టెడ్ కంపెనీ పేరుతోనే కొనసాగనుంది. -
కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలు
సమాజం నుంచి తీసుకోవడమే కాదు.. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే స్ఫూర్తితో పలు కార్పొరేట్ కంపెనీలు(Corporate Cos) సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో ప్రజలకు సాయమందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో వలంటీర్లు(Corporate volunteering)గా పాలుపంచుకునేలా ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం, పెయిడ్ లీవ్ ఇవ్వడమే కాకుండా తగు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరింత సమయం సైతం వెచ్చించేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న వాటిల్లో ఇన్ఫోసిస్, పీఅండ్‌జీ, క్యాప్‌జెమిని(Cap Gemini), స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్‌యూఎల్, నెట్‌యాప్ తదితర కంపెనీలు ఉన్నాయి.వివిధ కంపెనీలు నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో కొన్ని..ఇన్ఫోసిస్జీవవైవిధ్యానికి తోడ్పడేలా ప్రాంతీయంగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కంపెనీ నడుం కట్టింది. ఉద్యోగులంతా కలిసి ఇటీవలే 2,00,000కు పైగా సీడ్‌బాల్స్‌ను తయారు చేశారు. వీటిని దేశవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో అడవుల పెంపకం ప్రాజెక్టుల్లో ఉపయోగించనున్నారు. ఇక ఇన్ఫీ(Infosys)కి చెందిన బీపీఎం విభాగం ప్రాజెక్ట్ జెనిసిస్ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇలా 78,000 మందికి పైగా విద్యార్థులకు తోడ్పాటు అందించింది. పీఅండ్జీఅంతగా విద్యా సేవలు అందని ప్రాంతాల్లోని బాలలకు చదువును అందుబాటులోకి తెచ్చే దిశగా శిక్షా ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. దీనితో దాదాపు యాభై లక్షల మందికి పైగా చిన్నారులు లబ్ధి పొందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.క్యాప్జెమినివిద్య, సస్టైనబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాల అభివృద్ధి మొదలైన కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. వీటిలో 90,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం 2,43,000 పైగా గంటల సమయం వెచ్చించారు. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల కోసం వెచ్చించే సమయం వార్షికంగా 20 శాతం మేర పెరుగుతోందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులు మాక్ ఇంటర్వ్యూలు .. రెజ్యూమె బిల్డింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం, కెరియర్ విషయంలో మార్గనిర్దేశనం చేయడం మొదలైన మార్గాల్లో ఉద్యోగార్థులకు సహాయం చేస్తున్నారు. జాబ్ మార్కెట్‌కి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని, అవకాశాలను అందిపుచ్చుకునేలా వారికి తోడ్పాటు అందిస్తున్నారు.ఇదీ చదవండి: విల్మర్ నుంచి అదానీ ఔట్స్టాండర్డ్ చార్టర్డ్నైపుణ్యాలను బట్టి వివిధ సామాజిక సేవా ప్రాజెక్టుల్లో పాలుపంచుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయడం, కెరియర్‌పరంగా గైడెన్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. వాటిలో పాల్గొనే ఉద్యోగులకు మూడు రోజుల పాటు పెయిడ్ లీవ్ కూడా ఇస్తోంది. ఇలాంటి కార్యక్రమాలపై ఉద్యోగులంతా కలిసి మొత్తం 1,17,376 గంటల సమయాన్ని వెచ్చించారు. -
అనిల్ అంబానీ భారీ ప్లాన్..
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ .. 2030 నాటికి భారీ లక్ష్యాల సాధన దిశగా వృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ సెంటర్‌ని (ఆర్జీసీసీ) ఏర్పాటు చేసింది. కొత్త అవకాశాలను, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకోవడంలో గ్రూప్ కంపెనీలకు మార్గదర్శకత్వం వహించేందుకు ఇది వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడనుంది.సతీష్ సేథ్, పునీత్ గార్గ్, కె. రాజగోపాల్.. ఆర్జీసీసీ కీలక టీమ్ సభ్యులుగా ఉంటారు. గార్గ్ ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రాకు సీఈవోగా వ్యవహరిస్తుండగా, రాజగోపాల్ గత ఆరేళ్లుగా రిలయన్స్ పవర్‌కు సారథ్యం వహిస్తున్నారు. గ్రూప్ కంపెనీలకు చెందిన ఇతర సీనియర్స్ కూడా ఈ టీమ్‌లో భాగమవుతారు. కంపెనీలను సుస్థిర అభివృద్ధి సాధన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఆర్జీసీసీ కీలక పాత్ర పోషించగలదని రిలయన్స్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. విస్తరణ ప్రణాళికల కోసం రూ. 17,600 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ఆర్‌కామ్ ఖాతాలు ’ఫ్రాడ్’గా వర్గీకరణ.. రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్), దాని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం అకౌంట్లను కెనరా బ్యాంక్ ’ఫ్రాడ్’ ఖాతాలుగా వర్గీకరించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి లేఖ అందినట్లుగా ఆర్‌కామ్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి అంతలోనే మళ్లీ భారీ ఎదురుదెబ్బ! -
కార్పొరేట్ ట్రావెల్ 20.8 బిలియన్ డాలర్లు
ముంబై: కార్పొరేట్ ట్రావెల్ రంగం భారత్‌లో 2029–30 నాటికి ఏటా 10.1 శాతం వార్షిక వృద్ధితో 20.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. సాంకేతికత తోడుగా వ్యక్తిగతీకరించిన, స్థిర పరిష్కారాలు పరిశ్రమను నడిపిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ రంగం 10.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 45 మంది ట్రావెల్ మేనేజర్లు, వివిధ రంగాలకు చెందిన 160కిపైగా కార్పొరేట్ ట్రావెలర్స్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందింది.నివేదిక ప్రకారం.. మహమ్మారి తర్వాత వ్యాపారాలు హైబ్రిడ్ వర్క్ మోడళ్లతో తమ ప్రయాణ వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నందున.. భారత కార్పొరేట్ ట్రావెల్ సెక్టార్ పరిశ్రమను ఆవిష్కరణ, వ్యయ సామర్థ్యం, స్థిరత్వం యొక్క కొత్త శకంలోకి నడిపించడంలో ట్రావెల్ మేనేజ్మెంట్ కంపెనీలు (టీఎంసీ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ శక్తితో పనిచేసే చాట్బాట్లు, వాయిస్–సహాయక బుకింగ్ సిస్టమ్‌లు, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించి మరింత లోతుగా, వేగంగా నిమగ్నం అయ్యే కొత్త తరం ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి టీఎంసీలు తమ వ్యూహాలను పునరుద్ధరించాయి. ఒకే కంపెనీ రూ.2,600 కోట్లు.. చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (250 మంది ఉద్యోగుల వరకు) ప్రయాణ ఖర్చు సంవత్సరానికి రూ.1 కోటికి చేరుకుంటోంది. పెద్ద సంస్థలు (250–5,000 ఉద్యోగులు) ప్రయాణ ఖర్చుల కోసం ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తున్నాయి. భారీ పరిశ్రమలకు (5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు) ప్రయాణ ఖర్చులు ఉద్యోగుల సంఖ్యకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటాయి. అగ్రశ్రేణి 100 లిస్టెడ్ సంస్థల విశ్లేషణలో ప్రముఖ ఐటీ సంస్థ అత్యధికంగా 2022–23లో రూ.2,600 కోట్లకు పైగా వెచ్చించినట్లు నివేదిక పేర్కొంది. సహాయక సేవలకు డిమాండ్ పెరుగుతోంది.సర్వేలో పాల్గొన్నవారిలో 72 శాతం మంది టాక్సీ సేవలను కోరారు. 63 శాతం మంది ప్రయాణ ప్లాట్‌ఫామ్‌లపై వీసా సహాయం డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సమగ్ర ప్రయాణ పరిష్కారాల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఐటీ సేవలు, బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, ఏవియేషన్, ఆయిల్–గ్యాస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్స్ రంగాలు కార్పొరేట్ ప్రయాణ వ్యయాలను పెంచే అగ్ర పరిశ్రమలుగా గుర్తింపు పొందాయి. భారత్‌లోని టాప్ 100 లిస్టెడ్ సంస్థలలో ప్రయాణ వ్యయంలో ఈ రంగాల వాటా 86 శాతం ఉంది. -
ఇది సాయమా? మరో గాయమా!?
సాక్షి, అమరావతి: అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. అన్నట్లుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే. విజయవాడను వరదలు ముంచెత్తి 15 రోజులు పూర్తయినా బాధితులకు చిల్లిగవ్వ సాయం కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వారి జేబులకు చిల్లులుపడే బాధ్యతను మాత్రం భుజానికెత్తుకుంది. బాధితులకు మేలు చేస్తున్నట్లు ఓ వైపు బిల్డప్ ఇస్తూనే మరోవైపు ఓ కార్పొరేట్ సంస్థకు మేలు చేకూర్చేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా.. బాధితుల ఇళ్లలో పనికిరాకుండా పోయిన గృహోపకరణాలతోపాటు ఇళ్లలో నీటి పైపులైన్లు, నీటి కుళాయిలు వంటి ప్లంబింగ్ పనులకు నిర్ణీత రేట్లతో మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం ఓ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మరమ్మతుల రేట్లు అవాక్కయ్యేలా ఉండడం ముంపు ప్రాంతాల్లో పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఉదా.. స్విచ్‌బాక్స్ బిగించడానికి రూ.279, ఫ్యాన్ రెగ్యులేటర్ మార్చడానికి రూ.99, ఫ్యాన్ రిపేరుకు రూ.199, ఫ్యాన్ మార్చడానికి రూ.239, గీజర్ చెక్ చేయడానికి రూ.299, వాష్ బేసిన్ లీకేజీ రిపేరుకు రూ.169, సింక్ డ్రెయిన్ పైపు రిపేరుకు రూ.209, డ్రెయిన్ పైపులో అడ్డుతొలగించేందుకు రూ.169, వాటర్ ట్యాప్ రిపేరుకు రూ.139, ఫ్లష్ ట్యాంకు రిపేరుకు రూ.299, వెస్ట్రన్ టాయిలెట్ రిపేరుకు రూ.799, వెస్ట్రన్ టాయిలెట్ మార్చడానికి రూ.1,499, ఇండియన్ టాయిలెట్ బిగించడానికి రూ.1,699.. అంటూ సదరు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ధరలను నిర్ణయించింది. అంటే.. ఈ ధరలను బాధితులు స్వయంగా డబ్బులు చెల్లించి రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుంది. నిజానికి.. బయట మార్కెట్లో ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయని బాధితులే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు.. ఈ కార్పొరేట్ సంస్థకు అదనంగా అవసరమయ్యే టెక్నీíÙయన్లను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందిన వారిని ప్రభుత్వమే కేటాయించడం గమనార్హం. బాధితులకు యాప్ బాధ్యత ప్రభుత్వ సిబ్బందికి.. ఇదిలా ఉంటే.. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9–12 వరకు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించింది. ఏ ఇంట్లో ఏ వస్తువులు పాడయ్యాయో వివరాలను సేకరించింది. ఇప్పుడు వీరి సమాచారం పరోక్షంగా ఆ సంస్థ చేతిలో ప్రభుత్వం పెట్టేసింది. అలాగే, పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే ఉన్నతాధికారులు ఇటీవలే విజయవాడ పరిధిలోని మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించి ముంపు ప్రాంతాల్లోని పొదుపు మహిళల ఫోన్లలో సదరు కార్పొరేట్ సంస్థ యాప్‌ను డౌన్లోడ్ చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. కొన్నిచోట్ల సచివాలయాల ఉద్యోగులు ఈ బాధ్యతను చేపట్టినట్లు సమాచారం. అంతేకాక.. ‘మీ ఇంట్లో పాడైన వాటిని సంబంధిత కంపెనీతో తక్కువ ఖర్చుతో బాగుచేయించుకోండి’ అంటూ ఆ సంస్థ క్యూఆర్ కోడ్‌తో ప్రభుత్వమే కరపత్రాలను బాధితులకు అందిస్తూ ఆ సంస్థను ప్రోత్సహిస్తోంది.కళ్లుచెదిరేలా రిపేరింగ్ రేట్లు.. నిజానికి.. పాడైన వస్తువులను ఇంటి చుట్టుపక్కల ఉండే టెక్నీషియన్‌తో బాగుచేయించుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ, ప్రభుత్వ ఒప్పందం ప్రకారం నిర్ణయించిన రేట్లు చూస్తే బయట మార్కెట్ రేట్లు లేదా ఆ కార్పొరేట్ సంస్థ తన యాప్‌లో ప్రదర్శించే ధరల కన్నా ఎక్కువగా ఉన్నాయి. వీరిని ఆశ్రయిస్తే బాధితుల ఖర్చులు తడిసిమోపెడవడం ఖాయం. ఎందుకంటే.. ఒకే ఇంట మూడు ట్యూబ్లైట్లను ఆ కంపెనీ ద్వారా మార్చుకుంటే మొత్తం రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, బయట మెకానిక్‌లో చేయిస్తే 150–200 మించి కావు. అలాగే.. ఎలక్ట్రికల్ స్విచ్ బాక్స్ బిగించడానికి రూ.239లు అని యాప్‌లో పేర్కొనగా, వరద ప్రాంతాల్లో ఇదే సేవకు రూ.279లుగా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లోకల్‌గా ఉండే మెకానిక్‌లు ఇదే పనికి రూ.100 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు.. ఫ్యాన్ మార్చడానికి యాప్ ధర రూ.199లు ఉంటే వరద ప్రాంతాల్లో రూ.239లుగా నిర్ణయించారు. అదే స్థానిక మెకానిక్‌లు ఈ పనికి కేవలం రూ.100–150ల చొప్పున తీసుకుంటామని చెబుతున్నారు. నీటి కుళాయి మార్చడానికి రూ.50 అని యాప్‌లో ఉంటే ఇదే పనికి వరద ప్రాంతాల్లో ప్రభుత్వం రూ.139లు నిర్ణయించింది. స్థానిక మెకానిక్‌లు ఈ పనికి రూ.100 తీసుకుంటున్నారు. వాస్తవానికి.. అనేక ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు ఉచితంగా సేవలందిస్తుంటే ప్రభుత్వం వీటిని ప్రోత్సహించకుండా కార్పొరేట్ సంస్థకు కొమ్ముకాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక.. విపత్తు సమయంలో నిండా మునిగిన బా«ధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా బాధితుల నుంచి కార్పొరేట్ కంపెనీలు అధిక ధరలు వసూలుచేసుకునేలా వీలు కల్పించడం విడ్డూరంగా ఉందని బాధితులు వాపోతున్నారు. ఆదుకుంటామని చెప్పి ఇలా చేస్తారా!? ఇక వరద తగ్గిన ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లతో నీట మునిగిన ఇళ్ల పరిసరాలు శుభ్రం చేయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లోని సామాన్లు, దుస్తులు, గృహోపకరణాలు పాడైపోయిన వారిని ఏ విధంగా ఆదుకోవాలో కూడా ప్రకటిస్తామన్నారు. తీరా ఇప్పుడు బాధితులే డబ్బులు కట్టి బాగుచేయించుకోవాలని సూచించడంతో పాటు ఆయా పనులకు ప్రభుత్వం ధరలు నిర్ణయించి కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై బాధితులు మండిపడుతున్నారు. సాయం మాట దేవుడెరుగు ఇది తమను మరింత గాయపర్చేలా ఉందని వారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
'ఇదే జరిగితే వేలాదిమంది ఉద్యోగులు ఇంటికి'
ప్రపంచంలోనే అగ్రగామి నెట్వర్కింగ్ పరికరాల తయారీ సంస్థ సిస్కో, ఈ ఏడాది మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వేలాదిమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.2024 ఫిబ్రవరిలో సుమారు 4000 మందిని సిస్కో ఇంటికి పంపింది. అయితే సిస్కో తన నాల్గవ త్రైమాసిక ఫలితాలతో వెల్లడించే సమయంలోనే ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆగష్టు 14న వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.డిమాండ్, సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా కంపెనీ కొన్ని కఠినమైన సవాళ్ళను ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ మళ్ళీ ఓ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సారి ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుంది, ఏ విభాగం నుంచి తొలగిస్తుంది అనే మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.ఇదీ చదవండి: ఇలాగే కొనసాగితే బంగారం కొనడం కష్టమే! మళ్ళీ పెరిగిన ధరలుఇదిలా ఉండగా.. సిస్కో కంపెనీ ఏఐ రంగంలో కూడా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ 2025 నాటికి మరింత వృద్ధి చెందటానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈ వ్యూహంలో వారి ప్రధాన ఉత్పత్తులలో AI-ఆధారిత పరిష్కారాలను అందించడం, 1 బిలియన్ పెట్టుబడుల ద్వారా AI స్టార్టప్‌లను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. -
మా సంస్థలో ఈ రాశి వారికి ఉద్యోగం లేదు! చైనా కంపెనీ ప్రకటన
చైనాలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే కాకుండా.. రంగులు, తేదీలు ఇతరత్రా అన్నింటికీ ఇక్కడి ప్రజలు జాతకాలను విశ్వసిస్తారు. ఆఖరికి ఉద్యోగాల్లో చేరాలంటే కూడా రాశి చక్రం తప్పనిసరి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఇటీవల దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని 'శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్' అనే సంస్థ ఓ ప్రకటన చేసింది. డాగ్ సంవత్సరంలో (చైనా జాతక చక్రంలోని ఓ సంవత్సరం) జన్మించినవారు ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అనర్హులు, అలాంటి వారు ఉద్యోగానికి అప్లై చేసుకోవద్దు అని స్పష్టంగా వెల్లడించారు. ఇది చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటంటే.. కుక్క రాశిచక్రం కింద జన్మించిన వారు డ్రాగన్ సంస్థ అధిపతి దురదృష్టానికి మూలం కావొచ్చని భావిస్తారు. డ్రాగన్ & కుక్కల మధ్య 12 సంవత్సరాల రాశిచక్ర చక్రంలో వైరుధ్యం చైనీస్ జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్నారు. ఈ కారణంగానే శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే చైనాలో మూఢనమ్మకాలను ఎంతగా విశ్వసిస్తారో స్పష్టంగా అర్థమవుతోంది. డ్రాగన్‌లో నీటి మూలకం ఉందని, కుక్కలో అగ్ని మూలకం ఉందని జ్యోతిష్యులు చెబుతారు. -
కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఐసీఎంఆర్
హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) తమ కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)ను చేర్చినట్లు తెలిపింది.భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఒరిజినల్ పేటెంట్ ఫైలింగ్‌లో ఐసీఎంఆర్‌ను చేర్చకపోవడం వివాదానికి దారితీసింది. అయితే ఈ తప్పిదం అనుకోకుండా జరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీబీఐఎల్-ఐసీఎంఆర్ అగ్రిమెంట్ కాపీ గోప్యమైన డాక్యుమెంట్ కావడంతో అందుబాటులో లేదని, దీంతో ఐసీఎంఆర్‌ను ఒరిజినల్ అప్లికేషన్ లో చేర్చలేదని వివరణ ఇచ్చింది.ఈ తప్పిదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, ఐసీఎంఆర్ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, వివిధ ప్రాజెక్టులపై నిరంతరం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ పొరపాటును గుర్తించిన వెంటనే, కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పేటెంట్ దరఖాస్తులకు సహ యజమానిగా ఐసీఎంఆర్‌ను చేర్చడం ద్వారా దానిని సరిదిద్దే ప్రక్రియను బీబీఐఎల్ ఇప్పటికే ప్రారంభించింది. అవసరమైన లీగల్ డాక్యుమెంట్లను సిద్ధం చేస్తున్నామని, అవి సిద్ధమై సంతకం చేసిన వెంటనే పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేస్తామని కంపెనీ పేర్కొంది.ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ. పుణెలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత్ బయోటెక్ సంయుక్తంగా 2020 ఏప్రిల్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) తర్వాత కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేశాయి. -
నాన్‌స్టాప్‌గా ఎగిరిపోదాం!
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్ తదితర దేశాలకు వెళ్లే భారతీయ విమాన ప్రయాణికులు ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్ల కన్నా నాన్–స్టాప్, డైరెక్ట్ ఫ్లయిట్లకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ గణాంకాల ప్రకారం గత కొన్నాళ్లుగా ఈ ధోరణి పెరుగుతోంది.2023లో 3.72 కోట్ల మంది ప్యాసింజర్లు నాన్–స్టాప్ ఫ్లయిట్స్‌లో ప్రయాణించారు. కోవిడ్ పూర్వం 2019తో పోలిస్తే ఇది ఇరవై లక్షలు అధికం. ఇదే వ్యవధిలో ఒకటి లేదా అంతకు మించి స్టాప్స్‌లో ఆగుతూ వెళ్లే ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్స్‌లో ప్రయాణించిన వారి సంఖ్య 25 లక్షలు తగ్గి 2023లో 2.74 కోట్లకు పరిమితమైంది. 2023లో ప్రయాణించిన మొత్తం 6.46 కోట్ల మంది ప్యాసింజర్లలో 57 శాతం మంది నాన్–స్టాప్ ఫ్లయిట్స్‌నే ఎంచుకున్నారు. 2019లో ఇది 53 శాతంగా ఉంది.పశ్చిమాసియా హబ్‌లకు తగ్గిన ప్రయాణికులు అమెరికా, యూరప్‌లకు వెళ్లే ఫ్లయిట్స్ కోసం భారతీయులు ఎక్కువగా పశ్చిమాసియా హబ్‌ల వైపు మొగ్గు చూపే ధోరణి తగ్గింది. ఓఏజీ గణాంకాల ప్రకారం 2019–2023 మధ్య కాలంలో పశ్చిమాసియా హబ్‌లకు ప్యాసింజర్ల సంఖ్య 10 లక్షల మేర తగ్గింది. ఆ నాలుగేళ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఇతర హబ్‌లకు కూడా ప్రయాణికుల సంఖ్య 28 లక్షల మేర తగ్గింది. మరోవైపు, కొత్తగా 52 అంతర్జాతీయ రూట్లను జోడించడంతో ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్ ప్యాసింజర్లకు సంబంధించి దేశీ హబ్‌లలో ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మేర పెరిగింది.ఓఏజీ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) 36 లక్షల మంది, సౌదీ అరేబియాలో 26 లక్షల మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ రూట్లలో భారతీయులను గమ్యస్థానాలకు చేరవేయడంలో పశ్చిమాసియా దేశాల ఎయిర్‌లైన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ విషయంలో దశాబ్దం క్రితం గల్ఫ్ దేశాల ఎయిర్‌లైన్స్ వాటా 48 శాతంగా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది 50 శాతానికి పెరిగింది. -
జెప్టోకు నిధుల పంట
న్యూఢిల్లీ: గ్రోసరీ డెలివరీ స్టార్టప్ జెప్టో భారీగా పెట్టుబడులను అందుకుంది. త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న కంపెనీ 66.5 కోట్ల డాలర్ల (రూ. 5,550 కోట్లు) నిధులను సమీకరించింది. దీంతో ఈ క్విక్ కామర్స్ సంస్థ విలువ 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30,000 కోట్లు)కు ఎగసింది. వెరసి ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, బ్లింకిట్ (జొమాటో), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ (టాటా గ్రూప్)లతో పోటీ పడనుంది.గ్రోసరీ డెలివరీ విభాగంలో తీవ్ర పోటీ కారణంగా అధిక పెట్టుబడులు, తక్కువ మార్జిన్లు నమోదయ్యే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెప్టోలో తాజా పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. 2021 ఏప్రిల్‌లో ప్రారంభమైన స్టార్టప్ జెప్టోలో కొత్త సంస్థలు ఎవెనీర్ గ్రోత్ క్యాపిటల్, లైట్‌స్పీడ్, అవ్రా క్యాపిటల్‌సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు గ్లేడ్ బ్రూక్, నెక్సస్, స్టెప్‌స్టోన్ గ్రూప్ తాజా పెట్టుబడులను అందించాయి.కాగా.. జెప్టో నిర్వహణస్థాయిలో లాభాలు ఆర్జించేందుకు సిద్ధంగా ఉన్నదని, సమీప భవిష్యత్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే అవకాశముందని సంబంధిత వర్గా లు తెలిపాయి. గ్రోసరీస్‌ను 10 నిమిషాల్లో డెలివరీ చేసే సంస్థల్లో కంపెనీ 29% వాటాను ఆక్రమిస్తుండగా..40% వాటాతో బ్లింకిట్ టాప్‌లో ఉంది. -
తయారీ రంగానికి దన్నునివ్వండి
న్యూఢిల్లీ: తయారీ రంగానికి దన్నునివ్వమంటూ 100కుపైగా దేశీ కార్పొరేట్ దిగ్గజాలు, యూనికార్న్‌లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకు అనుగుణంగా స్టార్టప్‌లకు ఇన్క్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించింది. కార్పొరేట్ దిగ్గజాల జాబితాలో టాటా, హ్యుందాయ్, యాపిల్ తదితరాలున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆయా కంపెనీలకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) కార్పొరేట్ ఇన్క్యుబేషన్, యాక్సెలరేషన్పై హ్యాండ్‌బుక్‌ను అందించినట్లు వెల్లడించారు. సొంత తయారీ ఇన్క్యుబేటర్లను ఏర్పాటు చేసుకోవలసిందిగా 100కుపైగా సంస్థలను కోరినట్లు తెలియజేశారు. ఈ జాబితాలో కార్పొరేట్ దిగ్గజాలతోపాటు యూనికార్న్‌లు సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. సమీప భవిష్యత్‌లో ఇలాంటి 50 సంస్థల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ నేషనల్ కౌన్సిల్ ఇప్పటికే ఒక కేంద్రానికి తెరతీసినట్లు తెలియజేశారు. -
వేరబుల్స్ రంగానికీ పీఎల్ఐ స్కీమ్.. కేంద్రానికి ఎంఏఐటీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, వేరబుల్స్ తయారీకి సంబంధించి మరో రెండు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ( పీఎల్ఐ ) పథకాలను రూపొందించాలని ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అసోసియేషన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఏఐటి) ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు ఎన్నికల తర్వాత ట్యాక్స్‌ల్లో మార్పులు, చైనా పౌరుల వీసా సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఎంఏఐటీ విజ్ఞప్తిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.ఎంఏఐటీ విభాగం కేంద్ర ప్రభుత్వం తరుపున దేశంలో ప్రైవేట్ ఐటీ హార్డ్ వేర్ రంగాన్ని ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరిస్తుంది. ఆయా కంపెనీల కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. వాటి వృద్ది కోసం పాటు పడుతుంది.ఆ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్న డిక్సాన్ టెక్నాలజీస్, డెల్, హెచ్‌పీ,గూగుల్ కార్యకలాపాలు, నిబంధనలకు మేరకు పనిచేస్తున్నాయా? వంటి అంశాలపై రివ్యూ నిర్వహించనుంది.ఈ తరుణంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ,వేరబుల్స్ విభాగంలో సైతం పీఎల్ఐ స్కీంను రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. తద్వారా దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, వేరబుల్స్ తయారీ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఎగుమతులు, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు అవకాశాలను ఆకర్షించడం, దేశీయంగా ఆ రంగాల్సి ప్రోత్సహించడంతో పాటు అపారమైన అవకాశాల్ని సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. -
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
మీరు ఉద్యోగం చేస్తున్నారా? చాలిచాలనీ జీతంతో ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ సలహా పాటిస్తే మీ ప్రతిభకు తగ్గ వేతనం పొందొచ్చు. డెహ్రడూన్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్ సైనీ ఉద్యోగులకు అప్రైజల్ సీజన్‌పై అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీల గురించి పచ్చి నిజాల్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అక్షయ్ సైనీ ఏం చెప్పారంటేమీరు ఎక్కువ జీతం కావాలంటేమీరు ఎక్కువ జీతం కావాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయం. భారత్‌లో అత్యధిక కంపెనీల్లో ఇంట్రర్నల్ అప్రైజల్స్ ఓ జోక్‌గా అభివర్ణించారు. అంతేకాదు, సగటు కంటే ఎక్కువ ఉన్న ఇంజనీర్లు, డబుల్ డిజిట్ శాలరీ హైక్‌ను పొందలేదు. మీ వేతనం తక్కువగా ఉన్నట్లయితే, అతిగా ఆలోచించకండి. వెంటనే ఉద్యోగం మారండి! అంటూ తన పోస్ట్‌లో తెలిపారు. HARD TRUTH : Switching jobs is the only way to reach high salaries.In most Indian companies, the internal appraisals is a joke. Even above average engineers hardly get a double digit hike %If you're underpaid, don't overthink, just Switch! 🤷♂️— Akshay Saini (@akshaymarch7) May 2, 2024తక్కువ జీతంతో మీ కెరీర్‌ను ప్రారంభిస్తేమరో కఠినమైన నిజం ఏమిటంటే, మీరు తక్కువ జీతంతో మీ కెరీర్‌ను ప్రారంభిస్తే, అధిక జీతం (సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా) పొందాలంటే మీరు ఉద్యోగాలు మారాల్సి ఉంటుంది. కావాలంటే మీరే చూడండి తక్కువ వేతనంతో తమ కెరియర్ను ప్రారంభించిన ఐటీ ఉద్యోగులు జీతాలు పెంచుకునేందుకు తరుచూ ఉద్యోగాలు మారుతుంటారు. తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయికాబట్టి, మీరు తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి శాలరీ హైక్, డిజిగ్నేషన్ కోసం ప్రయత్నించి విఫలమైతే మీరు ఉద్యోగం మారడం మంచింది. మంచి పని ఎంత ముఖ్యమో జీతం కూడా అంతే ముఖ్యం చివరగా గుర్తుంచుకోండి. మీకు తక్కువ జీతం ఉంటే అది మీ తప్పు అని అక్షయ్ సైనీ పేర్కొన్నారు.అక్షయ్ సైనీ అభిప్రాయాలపై నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం పొందాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయమని, ఎక్కువ జీతం పొందేందుకు తాము కూడా సంస్థలు మారినట్లు చెబుతున్నారు. -
ధర్మవరంలో కార్పొరేట్ పాలిటిక్స్
ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ రాజకీయం రంగ ప్రవేశం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చానన్న బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఇక్కడ గల్లీలో ప్రలోభాలు, బెదిరింపులతో నీచరాజకీయాలు చేస్తున్నారు. రూ.కోట్లు కుమ్మరించి అధికార పార్టీ నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వని వ్యాపారులపై సీబీఐ, ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తానంటూ తన వర్గీయుల ద్వారా బెదిరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ధర్మవరం: ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగప్రవేశం చేయగానే ధర్మవరంలో కొత్త సంస్కృతి మొదలైంది. ఆయనకు మద్దతుగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి రెండు వేల మందికిపైగా ధర్మవరంలో దిగారు. పట్టణంలోని అద్దె ఇళ్లు, లాడ్జీలలో తిష్ట వేశారు. వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభాలకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారు. డబ్బు ఇస్తామని, నామినేటెడ్ పదవులు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని.. ఇలా పలు రకాలుగా ప్రలోభపెడుతున్నారు. గ్రామస్థాయి నాయకుడికైతే రూ.10 లక్షలు, ఓ మోస్తరు నాయకుడికైతే అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నాయకుడు గిర్రాజు నగేశ్, ఏపీ కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి బాబు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌లను పెద్దఎత్తున ప్రలోభపెట్టి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేర్చుకున్నట్లు సమాచారం. వీరివెంట భారీగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు వస్తారని భావించినప్పటికీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. వంద మందితో పారీ్టలో చేరుతానని చెప్పిన గిర్రాజు నగేశ్ కనీసం పది మందికి కూడా కండువా కప్పించలేకపోయాడు. కోటిబాబు వెంట కూడా ఎవరూ వెళ్లలేదు. కోటిబాబు బీజేపీలోకి చేరిన మరుసటి రోజే ఆయన సోదరులు మళ్లీ వైఎస్సార్సీపీలో చేరడం విశేషం. అదేవిధంగా తమ ప్రలోభాలకు లొంగని వారిని సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల పేరిట సత్యకుమార్ మనుషులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. పట్టు–చేనేత వస్త్ర వ్యాపారానికి కేంద్రమైన ధర్మవరంలో వ్యాపారులకు ఈ తరహా బెదిరింపులు ఎక్కువైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, సత్యకుమార్ ప్రచారానికి కూడా ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయన నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రొద్దుటూరు, కర్నూలు, రాప్తాడు తదితర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి వాహనాల్లో జనాలను తీసుకురాగా, వారు మధ్యలోనే వెళ్లిపోయారు. బీజేపీపై చేనేతల ఆగ్రహం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించడంతో నేతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. జీఎస్టీ రద్దు చేయాలని నేతన్నలు నిరసన తెలిపినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా గత కేంద్ర బడ్జెట్లో జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచాలని భావించింది. అప్పట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌లు కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి చేనేత వస్త్రాలపై జీఎస్టీని పెంచడం వల్ల కలిగే నష్టాలను వివరించడంతో 5 శాతానికే పరిమితం చేశారు. ఈ క్రమంలో బీజేపీపై నేతన్నలు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
ఫలితాల సీజన్‌తో జోష్!
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కార్పొరేట్ ఫలితాలు జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తున్న టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసిక ఫలితాలతో సీజన్‌ను ప్రారంభించనుంది. శుక్రవారం(12న) టీసీఎస్ జనవరి–మార్చి(క్యూ4)తోపాటు పూర్తి ఏడాదికి సైతం ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఇదే రోజు ఆర్థిక గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ప్రభుత్వం(ఎన్ఎస్వో) మార్చి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను విడుదల చేయనుంది. అంతేకాకుండా ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో సీపీఐ నామమాత్ర వెనకడుగుతో 5.09 శాతానికి చేరింది. ఇక పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) జనవరిలో 3.4 శాతంగా నమోదైంది. కాగా.. గురువారం(11న) ఈద్(రంజాన్) సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గత వారం రికార్డు గత వారం ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. చివరికి శుక్రవారంతో ముగిసిన గత వారం సెన్సెక్స్ 597 పాయింట్లు(0.8 శాతం) లాభపడి 74,248 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం 187 పాయింట్లు(0.84 శాతం) ఎగసి 22,514 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.84 శాతం జంప్‌చేసి 40,831 వద్ద నిలిచింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మరింత అధికంగా 6.64 శాతం దూసుకెళ్లి 46,033 వద్ద ముగిసింది. చమురు, రూపాయి ఎఫెక్ట్ ప్రపంచ స్టాక్ మార్కెట్లు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు ప్రస్తావించారు. అంతేకాకుండా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకాగలవని పేర్కొన్నారు. మరోవైపు రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరువైన నేపథ్యంలో ఆరు ప్రపంచ కరెన్సీలతో డాలరు మారకపు విలువ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. విదేశీ అంశాల విషయానికివస్తే గత వారాంతాన మార్చి నెలకు యూఎస్ వ్యవసాయేతర రంగాలలో ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెలువడ్డాయి. వీటితోపాటు ఈ నెల 10న(బుధవారం) యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఇటీవల చేపట్టిన పాలసీ సమీక్షలో యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీయంగా సైతం ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఏడోసారీ యథాతథంగా 6.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. సీపీఐ లక్ష్యాన్ని 4.5 శాతంగా పేర్కొంది. -
సెన్సెక్స్ 671 పాయింట్లు క్రాష్
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో పాటు దేశీయ కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఫలితాల ప్రకటనకు ముందు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సోమవారం దేశీయ మార్కెట్లు దాదాపు ఒకశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 671 పాయింట్లు పతనమై 71,355 వద్ద నిలిచింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 21,513 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 725 పాయింట్లు నష్టపోయి 71,301 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు పతనమైన 21,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మధ్య తరహా షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.87% నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.16.03 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ► అమెరికాలో డిసెంబర్‌కు సంబంధించి వ్యవసాయేతర రంగాల్లో 2.16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. పేరోల్ డేటా అంచనాలకు మించి నమోదవడంతో ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ ఊహాగాహాలు తెరపైకి వచ్చాయి. చైనా ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు డేటాతో సహా ఆయా దేశాల కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు అప్రమత్తత చోటు చేసుకోవడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ► మెక్వైర్ ఈక్విటీస్ రీసెర్చ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులపై రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేయడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎస్బీఐ 2%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 1.51% నష్టపోయాయి. ► బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.2.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.366 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► నష్టాల మార్కెట్లో కొన్ని చిన్న రంగాల షేర్లు రాణించాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేరు ఇంట్రాడేలో 2.50% పెరిగి రూ.1182 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఆమోదించినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. షేరుకి రూ. 10,000 ధర మించకుండా 40,00,000 షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 4,000 కోట్లు వెచి్చంచనుంది. -
కార్పొరేట్ బాండ్ల భారీ వృద్ధి.. 2030 కల్లా రూ.110 లక్షల కోట్లకు
ముంబై: రానున్న కాలంలో కార్పొరేట్ బాండ్ల మార్కెట్ భారీగా విస్తరించనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా పేర్కొంది. దీంతో 2030 మార్చికల్లా కార్పొరేట్ బాండ్ మార్కెట్ పరిమాణం రెట్టింపుకానున్నట్లు అభిప్రాయపడింది. వెరసి రూ.110 లక్షల కోట్ల మార్క్‌ను దాటే వీలున్నట్లు అంచనా వేసింది. పెట్టుబడి వ్యయాలకు దన్ను, ఆకట్టుకుంటున్న మౌలిక సదుపాయాల రంగం, పొదుపును ఫైనాన్షియలైజ్ చేయడం వంటి అంశాలు ఇందుకు దోహదం చేయనున్నట్లు వివరింంది. 2023 మార్చివరకూ గత ఐదేళ్లలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ వార్షికంగా 9 శాతం వృద్ధి చెంది ర. 43 లక్షల కోట్లకు చేరినట్లు నివేదికలో క్రిసిల్ పేర్కొంది. ఈ బాటలో 2030 మార్చికల్లా రెట్టింపునకుపైగా ఎగసి రూ. 100–120 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా వేసింది. నియంత్రణ సంస్థల మధ్యవర్తిత్వం కూడా ఇందుకు సహకరించనున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి పేర్కొన్నారు. గరిష్టస్థాయిలోని సామర్థ్య వినియోగం, కార్పొరేట్ రంగ పటిష్టత, బలమైన బ్యాలన్స్‌షీట్లు, ఆర్థిక పురోభివృద్ధి అంచనాలు పెట్టుబడి వ్యయాల్లో వృద్ధికి కారణంకానున్నట్లు క్రిసిల్ వివరింంది. దీంతో 2027కల్లా రూ. 110 లక్షల కోట్ల పెట్టుబడులు నవెదుకావచ్చని అభిప్రాయపడింది. అంచనా పెట్టుబడి వ్యయాలలో ఆరో వంతు కార్పొరేట్ బాండ్ మార్కెట్ సమకూర్చవచ్చని పేర్కొంది. మౌలిక రంగానికి మౌలిక రంగ ఆస్తుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ బలపడుతుండటం, వేగవంత రికవరీ వంటి అంశాల నేపథ్యంలో దీర్ఘకాలిక రుణాలకు అవకాశాలు మెరుగుపడనున్నట్లు క్రిసిల్ తెలియజేసింది. ప్రస్తుతం కార్పొరేట్ బాండ్ల జారీ నిధుల్లో 15 శాతం మౌలిక రంగానికి చేరుతున్నట్లు తెలియజేసింది. ఏఏ రేటింగ్ కార్పొరేట్ బాండ్ల జారీపై పెట్టుబడి నియంత్రణలను సరళతరం చేయడంతో పెన్షన్ ఫండ్స్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్‌ను వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక వృద్ధికి సహకరించే వీలున్నట్లు క్రిసిల్ డైరెక్టర్ రమేష్ కరుణాకరన్ వివరించారు. రిటైల్ విభాగంలో పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చేందుకు నాన్‌బ్యాంక్ రుణదాతల నుంచి సైతం కార్పొరేట్ బాండ్లకు డిమాండ్ కనిపించనున్నట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. నాన్‌బ్యాంక్ రుణదాతలు అధిక స్థాయిలో రుణాలను రిటైలర్లకు అందిస్తుండటంతో దేశ జీడీపీలో రిటైల్ క్రెడిట్ 30 శాతానికి చేరింది. యూఎస్‌లో ఇది 54 శాతంకాగా.. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్ ప్రొడక్టులలో గరిష్టంగా పెట్టుబడులు మళ్లుతున్నట్లు తెలియజేసింది. -
ప్రభుత్వాల చెలగాటం...‘న్యాక్’కు నిధుల సంకటం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పరమైన అంశాల్లో నెలకొన్న వివాదాలు ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు అడ్డంకిగా మారాయి. ఈ వివాదం వల్ల న్యాక్‌కు నిధులు రావటం నిలిచిపోవటంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణ ఇబ్బందిలో పడింది. ఏడాదిగా నిధుల కోసం నానాతిప్పలు పడుతున్న నాక్ యంత్రాంగం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద బడా సంస్థల వద్దకు వెళ్లి నిధులు సమీకరించుకుని కార్యక్రమాలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు కార్పొరేట్ సంస్థలతో పాటు, నాబార్డ్ చేసిన ఆర్థిక సాయంతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరిన్ని సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తే, కొత్త బ్యాచ్‌లను ఏర్పాటు చేసి మరిన్ని బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వాలని యత్నిస్తున్నారు. గతంలో విదేశీ యువతకు కూడా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయంగానూ ఖ్యాతి పొందిన న్యాక్‌కు.. ప్రభుత్వ విభాగాలు ఆర్థిక క్రమశిక్షణ తప్పటంతో నిధుల కోసం రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించింది. నిధుల వ్యయంపై అభిప్రాయభేదాలు.. న్యాక్ కోర్సులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తోంది. ఇది 70:30 దామాషాగా విడుదలవుతున్నాయి. తాను ఇస్తున్న నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సరిగా దాఖలు కావటం లేదని, కొన్ని నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కేంద్రం సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. అవి రానురాను పెద్దవి కావటంతో ఏడాది క్రితం కేంద్రం నిధుల విడుదలను ఆపేసినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా నిలిచిపోయి, న్యాక్‌కు నిధుల సమస్య ఉత్పన్నమైంది. మూడు నెలల కోర్సులను బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తున్న న్యాక్ వద్ద పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పోగయ్యాయి. ఈ తరుణంలో చేతిలో నిధులు లేకుండా పోయాయి. దీంతో న్యాక్ ఉన్నతాధికారులు కార్పొరేట్ కంపెనీలను సంప్రదించటం ప్రారంభించారు. అలా తొలుత తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్ సంస్థలు 350 మంది శిక్షణకు కావాల్సిన నిధులు అందించాయి. ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష వరకు ఫీజు ఉండే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి పీజీ కోర్సులు కూడా వాటితో నిర్వహిస్తుండటం విశేషం. ఇక మరో 200 మంది అభ్యర్థులతో కూడిన బ్యాచ్‌ల శిక్షణకు కావాల్సిన నిధులను నాబార్డు సమకూర్చింది. వీటితో ఇప్పటి వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. మరిన్ని సంస్థలు ముందుకొస్తే విస్తరిస్తాం... ‘‘సీఎస్ఆర్ నిధులతో శిక్షణ కార్యక్రమాలు విస్తరించాలని నిర్ణయించాం. ఇప్పటికి తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్, నాబార్డు నిధులు అందించాయి. ఈ డిసెంబరులో కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాబోతున్నాయి. వాటికి అదనంగా సీఎస్ఆర్ కింద కార్పొరేట్ కంపెనీలు సాయం అందిస్తే న్యాక్ మరింత ఉన్నతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది’అని న్యాక్ డీజీ బిక్షపతి పేర్కొన్నారు. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి న్యాక్ శిక్షణార్థులను ఎంపిక చేసుకుంటున్నందున కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని న్యాక్ ప్లేస్మెంట్ డైరక్టర్ శాంతిశ్రీ కోరారు. ఇదీ పరిస్థితి.. ఉన్నత విద్య చదువుకోలేని పరిస్థితిలో చదువు మానేసిన ఎంతోమంది యువతీయువకులకు భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో న్యాక్ శిక్షణ ఇస్తోంది. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఫాల్స్ సీలింగ్, భవన నిర్మాణ సూపర్వైజింగ్, వెల్డింగ్, కన్స్ట్రక్షన్ సర్వే అంశాల్లో తర్పి దు పొందుతున్న అభ్యర్థులకు దేశవిదేశాల్లోని నిర్మాణ సంస్థల్లో ఉపాధి దొరుకుతోంది. గతంలో కేవలం భవన నిర్మాణంలోని వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చిన న్యాక్.. ఆ తర్వాత పీజీ కోర్సులను కూడా ప్రారంభించింది. బీటెక్ సివిల్ అభ్యర్థులు, ఇంజినీర్లకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో నిధుల సమస్య ఉత్పన్నమై న్యాక్‌ను గందరగోళంలో పడేసింది. -
ఆ కంపెనీల ఆదాయ వ్యయాలు అధికం
డెబ్బై గంటల పని వారాలపై ఇటీవల తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగులు ఎన్నిగంటలు పనిచేసినా కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత పెరుగుతోంది. మరొకొన్నింటిలో తక్కువగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగికి చేసే ఖర్చు, ఆ ఉద్యోగి సంస్థకు చేకూర్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సంస్థలు చేసిన సర్వేలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం..గత ఐదేళ్లలో కంపెనీలకు వచ్చే మొత్తం రాబడిలో సిబ్బంది ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. అయితే 2019లో రూ.1.46 కోట్లుగా ఉన్న టాప్ 500 లిస్టెడ్ కంపెనీల రాబడి 36% పెరిగి 2023లో దాదాపు రూ.2 కోట్లకు చేరుకుంది. కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. దాంతోపాటు కొన్ని సంస్థలు ఉద్యోగులపై చేసే వ్యయం కూడా అధికమవుతుంది. దాదాపు కంపెనీల వ్యయంలో 10శాతం ఉద్యోగుల జీతాలకు కేటాయిస్తున్నాయి. 2020-21 కరోనా సమయంలో ఉద్యోగుల ఆదాయం పడిపోయింది. కానీ గత రెండేళ్లలో వారి ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో కంపెనీల ఉత్పాదకత తగ్గి ఉద్యోగుల ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తాయి. దాంతో వారి ఆదాయాలు పెరిగినట్లు అవుతుంది. కానీ ద్రవ్యోల్బణ భయాలు సమసిపోతున్నపుడు క్రమంగా ఆదాయ వ్యయాలు సర్దుబాటవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీస్, ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉత్పాదకత వాస్తవానికి మెరుగుపడింది. ఆయా రంగాలు వారి ఉద్యోగులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకున్నట్లు సర్వేలు తెలిపాయి. ఆ కంపెనీల ఆదాయవ్యయాలు పెరుగుతున్నాయి. రవాణా, లాజిస్టిక్స్, మ్యానుఫాక్చరింగ్, మైనింగ్, రిటైల్ రంగాలు ఇప్పటికీ తక్కువ స్థాయిలో కార్మికులను ఉపయోగిస్తున్నాయి. అయితే 2019 నాటికి టాప్ 500కంపెనీల్లో దాదాపు 6 కోట్ల ఉద్యోగులు ఉండేవారు. 2023 నాటికి వారి సంఖ్య 7 కోట్లకు చేరింది. గడిచిన ఐదేళ్లలో కంపెనీలు ఏటా 12.6శాతం మేర వృద్ధి చెందాయి. అదేవిధంగా వారి ఉద్యోగులకు చేసే ఖర్చు సైతం ఏటా 12.5శాతం చొప్పున పెరిగింది. -
ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్
రద్దు చేసుకున్న, పనిచేయని మొబైల్ నంబర్లను కనీసం మూడు నెలల తర్వాతే వేరేవారికి కేటాయిస్తామని భారత టెలికాం నియంత్రణ సంస్థ-ట్రాయ్ తెలిపింది. డియాక్టివేట్ లేదా డిస్కనెక్ట్ చేసిన మొబైల్ నంబర్లు వాడిన వారి సమాచార గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు చెప్పింది. మొబైల్ నంబర్లు డిస్కనెక్ట్, డీయాక్టివేట్ చేసిన తర్వాత వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందని గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అందుకు ప్రతిగా ట్రాయ్ స్పందించింది. ఇదీ చదవండి: పేదల నుంచే జీఎస్టీ గరిష్ఠ వసూళ్లు ఈ రిట్పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ట్రాయ్ తన స్పందనను తెలియజేసింది. గతంలో ఫోన్ నంబరు వాడిన చందాదారుడి గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే 90 రోజుల వ్యవధి విధించినట్లు చెప్పింది. సబ్స్క్రైబర్లు సైతం తమ వంతుగా వ్యక్తిగత సమాచారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సూచించింది. వాట్సప్ సైతం తన స్పందనను కోర్టుకు తెలియజేసింది. ఒకవేళ 45 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు వాడకంలోలేని ఫోన్‌నంబర్లు ఆ తర్వాత కొత్త డివైజ్‌లో యాక్టివేట్ అయితే అందులోని డేటా మొత్తం తొలగిపోతుందని తెలిపింది. దాంతో గతంలో ఫోన్నంబర్తో వాట్సాప్ వాడిన వారి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుందని వివరించింది. -
వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. డిజిటల్ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్లైన్ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు. అందరినీ ఇంతగా ప్రభావితం చేస్తోన్న ఆ ఆటల రూపకల్పన వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. దాంతోపాటు ఆన్లైన్ గేమ్‌ల ద్వారా దేశీయంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు రోజూ పుట్టుకొస్తున్నాయి. భారత్‌లోని డిజిటల్ గేమింగ్ మార్కెట్ రానున్న ఐదేళ్లలో 750 కోట్ల డాలర్ల (దాదాపు రూ.62,250 కోట్ల) స్థాయికి చేరుకోనుంది. ప్రధానంగా యాప్‌ల కొనుగోళ్లు, ప్రకటనల రాబడులు, వినియోగదారుల సంఖ్య పెరగడం ఇందుకు కారణమని గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికై తన నివేదికలో వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌లో 15వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) ప్రారంభమైంది. దాదాపు 100కు పైగా సంస్థలు తమ గేమింగ్ ఉత్పత్తులను ఈ కార్యాక్రమంలో ప్రదర్శిస్తున్నాయి. నవంబర్ 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్ గేమింగ్ రంగంలోని నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా లుమికై, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇదీ చదవండి: కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్ నివేదిక తెలిపిన వివరల ప్రకారం..దేశంలో 56.8 కోట్ల మంది గేమర్లు ఉన్నారు. ఇందులో 25 శాతం మంది చెల్లింపులు చేస్తున్నారు. భారత్‌లో మొత్తం డిజిటల్ గేమ్‌లు ఆడేవారిలో మహిళలు 41శాతం, పురుషులు 59 శాతం ఉన్నారు. 18-30 ఏళ్లవారు 50శాతం మంది, 31-45 ఏళ్లలోపు 29శాతం మంది, 45 ఏళ్లు దాటిన గేమర్లు 21శాతం ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ గేమింగ్ పరిశ్రమ 310 కోట్ల డాలర్ల (రూ.26,000 కోట్ల) ఆదాయం సంపాదించింది. రానున్న ఐదేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. రియల్ మనీ గేమింగ్ ఆదాయం వృద్ధిరేటు ఏటా పెరుగుతుంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 50 శాతానికి పైగా వివిధ డిజిటల్ గేమ్‌లు ఆడుతున్నారు. గత ఏడాది భారత్‌లో గేమర్ల సంఖ్య 12 శాతం పెరిగింది. చెల్లింపులు చేసే గేమర్ల సంఖ్యలో 17 శాతం వృద్ధి కనిపించింది. 15వందల కోట్ల గేమ్ డౌన్లోడ్లతో భారత గేమింగ్ రంగం అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. -
ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు! 18 ఏళ్ల అనుభవం.. అయినా..
2023 ప్రారంభం నుంచి ఐటీ సంస్థల ఆదాయం తగ్గడంతో.. ఖర్చులను తగ్గించుకోవడానికి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి, ఇప్పటికీ తొలగిస్తూనే ఉన్నాయి. ఒక వైపు ఆర్ధిక మందగమనం.. మరోవైపు ఊడిపోతున్న ఉద్యోగాల మధ్య టెక్ ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు . ఐటీ కంపెనీలు ఇప్పటికి లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో కేవలం ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా కొన్ని ఏళ్లుగా సంస్థలకు సేవలందిస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. సెప్టెంబర్‌లో గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుంచి వందలాది మంది ఉద్యోగుల్ని గూగుల్ తొలగించింది. ఇందులో ఏకంగా 18 సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన 'రీటా' కూడా ఉండటం గమనార్హం. గూగుల్‌లో మేనేజర్‌గా పనిచేసిన రీటా 18 ఏళ్లుగా గూగుల్ సంస్థకు సేవలందించినట్లు, ఇటీవలే ఉద్యోగం పోయినట్లు లింక్డ్ఇన్లో షేర్ చేసింది. అంతే కాకుండా హెచ్ఆర్, టాలెంట్ అక్విజిషన్, కెరీర్ డెవలప్మెంట్ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. ప్రముఖ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించడం, వారు సోషల్ మీడియాలో భావోద్వేగాలను పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో గూగుల్ మాత్రమే కాకుండా అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ ఐటీ దిగ్గజాలు కూడా ఉన్నాయి. -
కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్
ఒక దేశ ప్రగతికి అవరోధంగా నిలిచే ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. చేయడానికి పని లేక.. ఉపాధి లేక.. అర్హతలుండి కొందరు, అర్హతల్లేక మరికొందరు నిరుద్యోగితను ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ కంపెనీ వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుందనే సమాచారంతో పెద్దఎత్తున యువత ఒక్కసారి రావడంతో గేట్లు మూసివేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కొవిడ్ కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీల వృద్ధిరేటు తగ్గిపోయింది. దానికితోడు అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల బ్యాంకింగ్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాలో సాఫ్ట్వేర్ అప్డేట్లు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. దాంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయింది. గ్లోబల్‌గా నెలకొన్ని యుద్ధభయాల వల్ల కొన్ని దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. సిబ్బందికి లేఆఫ్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్నాయంటే చాలు వందల్లో ఉద్యోగార్థులు వస్తున్నారు. ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం Situation of walk-in interviews in India. This is in Hyderabad. pic.twitter.com/DRyz4R4YgM — Indian Tech & Infra (@IndianTechGuide) November 1, 2023 -
Zomato Jobs: ఉద్యోగ నియామకాలపై జొమాటో కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటో ఉద్యోగాల నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తులను తమ కంపెనీలో ఇకపై ఉద్యోగాలు ఇవ్వబోమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఇటీవల యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. సంస్థ ఉద్యోగ నియామకం భిన్నమైందని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వమని, ఎలాంటి పనిగురించి వెతకకుండా, నమ్మకంగా పని చేసే స్వభావం ఉన్న వారికే తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జొమాటో ప్రారంభించి 15 ఏళ్లు అయిందన్నారు. సంస్థలో గత 5-6 ఏళ్ల అనుభవం ఉన్న కంపెనీ అవసరాలకు సరిపడా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల వల్ల కొత్తవారిని నియమించుకోవాలంటే మాత్రం వారి నైపుణ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ‘కొత్తవారిని నియమించాలంటే ఇంటర్వ్యూకు మూడు నెలలు సమయం అయిపోతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ పాసైతే పాత సంస్థలో మరో మూడు నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది. సంస్థ కార్యకలాపాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మరింత సమయం పడుతుంది. అభ్యర్థి పనితనం గురించి తెలియాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మొత్తం దాదాపు 2 ఏళ్లు వృథా అవుతాయి’అని గోయల్ అభిప్రాయపడ్డారు. దానికిబదులుగా సంస్థలోని వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతస్థానంలో నియమిస్తే కంపెనీ విధానాలు తెలిసి ఉంటాయి కాబట్టి పెద్దగా సమస్య ఉండదని చెప్పారు. -
దీపావళికి ముందే అంబానీ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలు ఇవే..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పండగ ముందే రిలయన్స్ రిటైల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా క్రెడిట్‌కార్డులను తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో రెండు కోబ్రాండెడ్ రిలయన్స్ ఎస్బీఐ కార్డులను విడుదల చేయనుంది. వీటిని 100 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు సమాచారం. రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో వస్తున్న కొత్త క్రెడిట్ కార్డులను రిలయన్స్ ఎస్బీఐ కార్డ్, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ పేరుతో విడుదల చేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో లావాదేవీలపై వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు, ఆఫర్లను అందించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కిరాణా వస్తువులపై ఆఫర్లు పొందనున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రయోజనాలు: ఈ కార్డ్ వార్షిక రుసుం రూ.499. ఏడాదిలో కార్డు ద్వారా రూ.1,00,000 ఖర్చు చేసిన వినియోగదారులకు వార్షిక రుసుం మినహాయింపు ఉంటుంది. ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్లోడ్ మినహా ఇతర కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కి ఒక రివార్డు పాయింట్ అందించబడుతుంది. జాయినింగ్ ఫీజు చెల్లింపుపై రూ.500 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ కార్డు పొందుతారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో, డైనింగ్, సినిమాలపై ఖర్చు చేసిన చెల్లింపులపై ప్రతి రూ.100కి 5 రివార్డు పాయింట్లు అందించబడతాయి. వివిధ రిలయన్స్ రిటైల్ స్టోర్ల నుంచి రూ.3,200 విలువైన అదనపు తగ్గింపు వోచర్లు అందించబడుతున్నాయి. అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపును కార్డు అందిస్తోంది. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ ప్రయోజనాలు: ఈ కార్డ్ వార్షిక రుసుం రూ.2,999. రూ.3,00,000 వార్షిక ఖర్చు చేసిన వారికి వార్షిక రుసుం మినహాయింపు ఉంటుంది. కార్డు హోల్డర్లు రిలయన్స్ రిటైల్ స్టోర్లలో చేసే కార్డు కొనుగోళ్లపై ప్రతి రూ.100కి 10 రివార్డు పాయింట్లను అందుకుంటారు. డైనింగ్, సినిమాలు, దేశీయ విమానయాన సంస్థలు, అంతర్జాతీయ వ్యయంపై ఖర్చు చేసిన రూ.100 ఖర్చుకు 5 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి. ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్లోడ్ మినహా.. ఇతర రిటైల్ కొనుగోళ్లపై రూ.100 ఖర్చుకు 2 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి. జాయినింగ్ ఫీజు చెల్లింపుపై కార్డు హోల్డర్లు రూ.3,000 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ అందుకుంటారు. అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. బుక్‌మైషోలో ప్రతి నెలా రూ.250 విలువైన 1 సినిమా టిక్కెట్ కార్డు అందిస్తున్నారు. -
వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
వర్క్ ఫ్రం హోమ్ విషయంలో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ ఇంట్లోంచే విధులు నిర్వర్తిస్తున్న వారు ఇకపై నెలకు కనీసం పది రోజులపాటు ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎంట్రీ లెవెల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా ఉద్యోగులకు తెలియజేసినట్లు తెలిపింది. ‘‘బ్యాండ్ 5, 6 స్థాయుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల (మిడ్-లెవల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ హెడ్లు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు)కు నెలలో 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాలని మెయిల్ పంపారు. కరోనా అనంతరం చాలా కంపెనీలు ఆఫీస్ నుంచి పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రిమోట్ వర్క్‌తోపాటు హైబ్రిడ్‌వర్క్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది’ అని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవల కంపెనీ క్యూ2 ఫలితాల సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థలో అందరూ కలిసి ఒకచోట పనిచేయాలని భావిస్తున్నట్లు సలీల్ పరేఖ్ చెప్పారు. సాధారణంగా సౌకర్యవంతమైన విధానానికి తాము మద్దతిస్తామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు కొన్ని రోజులు కార్యాలయంలో పనిచేయడంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇటీవల వర్క్ ఫ్రం ఆఫీస్‌కే మొగ్గు చూపింది. దీనివల్ల సంస్థ అసోసియేట్లు, కస్టమర్ల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందని టీసీఎస్ భావిస్తోంది. సంస్థ ఉత్పత్తులను కస్టమర్లకు డెలివరీ చేయాలన్నా, వర్క్ అవుట్‌పుట్ మెరుగుపడాలన్నా వర్క్‌ఫ్రం ఆఫీస్ ద్వారానే సాధ్యం అని చెప్పింది. ఆఫీస్ సంస్కృతి, సహోద్యోగులతో ఎలా వ్యవహరించాలో తెలుస్తుందని, అందుకు సంబంధించి కంపెనీ మెంటార్‌గా వ్యవహరిస్తుందని టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ వివరించారు. -
ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రారంభించిన డోర్ తయారీ సంస్థ
జర్మన్ ఆధారిత హర్మన్ సంస్థ అనుబంధ కంపెనీ అయిన శక్తి హర్మన్ తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, దిల్లీలో రెండు ‘ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ప్రారంభించింది. బుధవారం బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో హర్మన్ గ్రూప్ యాజమాన్య భాగస్వామి మార్టిన్ జే.హర్మన్ పాల్గొని మాట్లాడారు. స్టీల్ డోర్, వుడెన్ డోర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందన్నారు. సంస్థ ప్రస్తుతం హైదరాబాద్ ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇండియావ్యాప్తంగా మార్కెట్‌ను పెంచనున్నట్లు తెలిపారు. సంస్థ ప్రారంభించిన ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ కేంద్రాల ద్వారా వినియోగదారులు నేరుగా ఉత్పత్తులను చూసి వాటి ఉపయోగాలపై అవగాహన పొందే వీలుంటుందన్నారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో కలిపి ఏటా 1.1లక్షల డోర్లు అమ్ముడవుతున్నాయన్నారు. శక్తి హర్మన్ సంస్థ ఎండీ శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ కంపెనీ విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలోపు జైపుర్‌లోని మహేంద్రాసిటీలో రెండో ప్లాంట్ అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్‌లోని ప్లాంట్ ద్వారా ఏటా 2లక్షల డోర్లు, 10వేల ఇండస్ట్రీయల్ డోర్లు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. జైపుర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఏటా మరో 1.3లక్షల డోర్లు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే దాదాపు 450 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం రూ.175కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్, ఇండస్ట్రీయల్, రెసిడెన్షియల్ విభాగాల్లో అధునాతన టెక్నాలజీతో డోర్లు తయారుచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, దిల్లీలో ప్రారంభించిన ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ల ద్వారా కస్టమర్లు నేరుగా సంబంధిత ప్రోడక్ట్‌ను చూసి దాని ఉపయోగాలు తెలుసుకుని నిర్ణయం తీసుకునే వీలుంటుందన్నారు. కేటలాగ్ చూసి డోర్లను కొనుగోలు చేయడం కంటే అనుభవపూర్వంగా వాటి గురించి తెలుసుకుని, చూసి కొనాలో వద్దో నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని వివరించారు. దేశవ్యాప్తంగా రియాల్టీ రంగం విస్తరిస్తుంది. దానికి అనువుగా డోర్ల అవసరం ఉంటుందన్నారు. హైదరాబాద్ మెట్రోతోపాటు చాలా ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల్లో తమ సంస్థకు చెందిన డోర్లను వాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగం, రెసిడెన్షియల్ విభాగాల్లో 2.5కోట్ల డోర్లు అవసరం ఉందన్నారు. అయినప్పటికీ డోర్ల తయారీలో అసంఘటిత రంగానికి ఇప్పటికీ 50 శాతం కంటే ఎక్కువ వాటా ఉందన్నారు. గతేడాది కంపెనీ రూ.270కోట్ల రెవెన్యూ సంపాదించినట్లు చెప్పారు. ఇండస్ట్రీయల్, కమర్షియల్ డోర్లు తయరుచేసే శక్తి హర్మన్ సంస్థ ప్రతిష్టాత్మక జర్మన్ ఆధారిత హర్మన్ బ్రాండ్ అనుబంధ కంపెనీ. హర్మన్ సంస్థ డోర్ సెగ్మెంట్లో 1935 నుంచి ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. ఇప్పటికే గ్లోబల్‌గా తమ సంస్థకు చెందిన దాదాపు 2కోట్ల డోర్లు వినియోగిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 6000 మంది సంస్థలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆసియా, ఉత్తర అమెరికా, యూరప్‌తో కలిపి మొత్తం 40 ఫ్యాక్టరీల్లో తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. అయితే 1994 నుంచి శక్తి హర్మన్‌గా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థ..2012 నుంచి ఇండియావ్యాప్తంగా తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసేలా చర్యలు తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.8వేల కోట్ల టర్నోవర్ ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
సాక్షి మనీ మంత్ర: రెండు రోజుల లాభాలు ఆవిరి.. నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 19,100 దిగువకు చేరింది. సెన్సెక్స్ 237.72 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 63,874.93 వద్ద, నిఫ్టీ 61.30 పాయింట్లు లేదా 0.32 శాతం క్షీణించి 19,079.60 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ ముగిసే వరకు అదే తంతు కొనసాగించింది. అంతకుముందు గడిచిన రెండు సెషన్‌ల్లో మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతుండడంతో మదుపర్లు కొంత జాగ్రత్త వహిస్తున్నారు. దాంతో మంగళవారం మార్కెట్లో లాభాలు స్వీకరించినట్లు తెలుస్తుంది. రియాల్టీ మినహా అన్ని రంగాల షేర్లల్లో అమ్మకాలు కొనసాగాయి. నిఫ్టీలో ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, ఎల్టీ మైండ్‌ట్రీ, ఓఎన్జీసీ అత్యధికంగా నష్టపోయాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో స్థిరపడ్డాయి. సెక్టార్ వారీగా అయితే మాత్రం రియాల్టీ మినహా ఆటో, బ్యాంక్, హెల్త్‌కేర్ విభాగాల్లోని అత్యధిక స్టాక్‌లు ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. -
‘స్టేట్ స్పాన్సర్డ్ అటాక్’ వివాదం.. యాపిల్ స్పందన ఇదే..
పలువురు లోక్‌సభలోని ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్లు వారి ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు అలర్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పటికే త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ ప్రియాంక చతుర్వేదికు అలర్ట్‌లు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన మెసేజ్‌లను తమ ఎక్స్ ఖాతాద్వారా ప్రముఖులు పంచుకున్నారు. ఈ అలర్ట్‌లను ఉద్దేశించి యాపిల్ స్పందించింది. స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ నోటిఫికేషన్లు కొన్నిసార్లు తప్పుడు అలారాలు కావచ్చని యాపిల్ చెప్పింది. అలా అటాక్ చేసేవారి వద్ద అధునాతన టెక్నాలజీ ఉంటుందని పేర్కొంది. దాంతో వారు ఎలాంటి దాడికైనా పాల్పడే అవకాశం ఉందని చెప్పింది. అయితే అలా వస్తున్న అలర్ట్‌ల్లో కొన్ని తప్పుడు నోటిఫికేషన్లు ఉండవచ్చని యాపిల్ వివరించింది. ఈ నోటిఫికేషన్ల జారీకి గల కారణాలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ నిరాకరించింది. ఎందుకంటే పూర్తి వివరాలు వెల్లడిస్తే భవిష్యత్తులో దాడిచేసే వారిని గుర్తించకుండా తప్పించుకోవడానికి సహాయపడినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది. -
బోయింగ్ 777లో సౌకర్యాలు మెరుగుపరిచిన ఎయిర్ ఇండియా
టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానాల్లోని సౌకర్యాలను మెరుగుపరించింది. ఈ విమానాల ద్వారా అమెరికాలోని మూడు స్థానాలకు నేరుగా చేరుకునేలా నాన్‌స్టాప్ సేవలు అందిస్తుంది. ముంబై నుంచి న్యూయార్క్ జేఎఫ్‌కే విమానాశ్రయం, నెవార్క్ లిబర్టీ ఎయిర్పోర్ట్ (న్యూజెర్సీ), శాన్ ఫ్రాన్సిస్కోకు సర్వీసులు ఉన్నాయి. అయితే గతంలో ఆ విమానాల్లో కల్పిస్తున్న సేవలపై వినియోగదారులు అంతగా సంతృప్తికరంగా లేకపోవడంతో వాటిని మెరుగుపరిచారు. అందుకు సంబంధించిన వీడియోలు సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. Nice to see @airindia’s new 777s. (From Etihad apparently) Finally an international quality experience.They will use them for the US route which is a relief given how bad the old 777s are! pic.twitter.com/kVTsjzPxNq — vir sanghvi (@virsanghvi) October 30, 2023 -
వీచాట్, క్యాస్పర్స్కైపై నిషేధం.. కారణం ఇదే..
కెనడా ప్రభుత్వం చైనా మెసేజింగ్ అప్లికేషన్ వీచాట్‌ను, రష్యన్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ కాస్పర్స్కైను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీచాట్ యాప్ విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగించే యాప్స్‌లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా దక్షిణాసియా వాసులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. వీచాట్ యాప్ నుంచి కీలకమైన డేటా లీక్ అవుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు లభించకపోయినప్పటికీ.. రిస్క్‌ను అంచనావేసి ముందు జాగ్రత్తగా ప్రభుత్వ పరికరాల నుంచి దీన్ని తొలగించాలని ఆదేశించినట్లు కెనడా ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలు అనితా ఆనంద్ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై వీచాట్ యజమాని అయిన టెన్సెంట్ సంస్థ స్పందించలేదు. మరోవైపు రష్యాకు చెందిన క్యాస్పర్స్కైపై కూడా చర్యలు తీసుకొంటున్నట్లు వెల్లడించారు. దాంతో కంపెనీ వర్గాలు మాట్లాడుతూ కెనడా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని, నిరాశను కలిగించిందని తెలిపాయి. ప్రభుత్వ ఆందోళనలను పరిష్కరించడానికి సంస్థకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ రెండు అప్లికేషన్లను డౌన్లోడ్ చేయకుండా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
వరుసగా బెదిరింపు ఈమెయిళ్లు.. అంబానీ భద్రత గురించి తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. గతంలో రూ.20 కోట్లు, రూ.200 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో మెయిళ్లు రాగా.. తాజాగా రూ.400 కోట్ల డిమాండ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులు ముఖేశ్ అంబానీపై ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆయనకు కల్పిస్తున్న భద్రత అలా ఉంది మరి! ప్రస్తుతం అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతేడాది నుంచే భద్రతను పెంచింది. గతంలో ముంబైలోని ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో బాంబు భయం తర్వాత పారిశ్రామిక వేత్తల భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. భద్రత ఎవరికంటే.. ప్రముఖులకు సంఘ విద్రోహశక్తుల నుంచి అపాయం ఉందని భావిస్తే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేస్తుంది. వీరిలో అత్యధిక ప్రజాదరణ కలిగి..వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని నిఘా సంస్థలు అందించే సమాచారం ఆధారంగా భద్రత అందిస్తారు. సంఘ విద్రోహశక్తుల నుంచి వీరిని కాపాడడం వారి విధి. నిఘా సంస్థ అందించే రిపోర్ట్ ఆధారంగా వివిధ రకాల భద్రతా కేటగిరీలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారికి కేటాయిస్తుంది. ప్రమాదాలను అంచనా వేసి భద్రతా వర్గాన్ని ఐదు గ్రూపులుగా విభజించింది. వాటిలో ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్పీజీ వర్గాలున్నాయి. భారత్‌లోని వీఐపీలు, వీవీఐపీలు, ఇతర ఉన్నత స్థాయి లేదా రాజకీయ ప్రముఖులకు ఈ రకమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. అయితే గతేడాది నుంచి ముకేశ్ అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత అందిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత అంటే.. రక్షణలో ఎస్పీజీ తర్వాత జెడ్ ప్లస్ భద్రత అనేది రెండో అత్యధిక స్థాయి భద్రతా. ఇందులో భాగంగా 10+ ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసు అధికారులతో కలుపుకుని 55మంది సిబ్బంది వీరికి రక్షణగా ఉంటారు. వీరంతా మార్షల్ ఆర్ట్స్, పోరాట శిక్షణలో నైపుణ్యం పొందినవారు. ఈ కేటగిరీలో భాగంగా 5+ బులెట్‌ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. దేశంలో ఇప్పటివరకు కేవలం 43 ప్రముఖులకు మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు. భద్రత సిబ్బంది వేతనాలు, ప్రయాణ భత్యాలు, వాహనాలు వంటి ఖర్చులను సందర్భాన్ని బట్టి వివిధ ఏజెన్సీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రత పొందే వ్యక్తులు, సంస్థలు భరిస్తాయి. ఎస్పీజీ మాత్రం దేశ ప్రధానికి భద్రత కల్పిస్తుంది. -
ఈసారి రూ.400 కోట్లు డిమాండ్..అంబానీకి వరుసగా మూడో బెదిరింపు ఈమెయిల్
ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్ వస్తున్నాయి. గతంలో రూ.20కోట్లు, రూ.200కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈమెయిల్ ఇచ్చాయి. ఈసారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. నాలుగు రోజుల్లో అంబానీకి పంపిన మూడో బెదిరింపు ఈమెయిల్ ఇదని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు అక్టోబర్ 27న ఓ వ్యక్తి రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ ఈమెయిల్ రావడంతో అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జీ చేసిన ఫిర్యాదు ఆధారంగా గామ్దేవి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అక్టోబర్ 28న రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో ఈమెయిల్ వచ్చింది. తాజాగా కంపెనీకి సోమవారం మూడో ఈమెయిల్ వచ్చినట్లు అధికారి తెలిపారు. ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచి, సైబర్ బ్రాంచి బృందాలు ఈమెయిల్ పంపిన వారిని కనుగొనే పనిలో ఉన్నాయని ఆయన అన్నారు. అంబానీ, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు గాను గతేడాది బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్‌ను పేల్చివేస్తామని నిందితులు గతంలో బెదిరించారు. -
గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్న నీతాఅంబానీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ 2023 సంవత్సరానికి గాను దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్-ఇండియా ఎస్పీఎఫ్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్పర్సన్ నీతా అంబానీ మహిళాసాధికారత, పిల్లల విద్య, భారతీయ కళలు, క్రీడలను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూఎస్ఐఎస్పీఎఫ్ పేర్కొంది. అవార్డు తీసుకున్న సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ..రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు 7 కోట్ల ప్రజలకు సేవ చేశామన్నారు. సీఎస్ఆర్ ప్రవేశపెట్టక ముందే రిలయన్స్ సొంతంగా ‘కార్పొరేట్ మోరల్ రెస్పాన్స్‌బిలిటీ’ ద్వారా సేవలందించినట్లు చెప్పారు. దేశ ప్రయోజనం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. భారత్, యూఎస్ మధ్య బంధాలను మరింతగా పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తున్న యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. USISPF was proud to honor Mrs. Nita M Ambani, Founder and Chairperson at @ril_foundation with the 2023 Global Leadership Award for Philanthropy and Corporate Social Responsibility. Mrs. Ambani is noted for her work in women's empowerment, education, promoting Indian arts & sports pic.twitter.com/rBuVQgvM97 — US-India Strategic Partnership Forum (@USISPForum) October 29, 2023 -
ఇకపై ‘కాలీ పీలీ’ ట్యాక్సీలు ఖాళీ!
ముంబైలో పదిహేనేళ్లు పైబడిన ట్యాక్సీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ నలుపు-పసుపు రంగుతో కూడిన ఐకానిక్ టాక్సీ(కాలీ పీలీ) ఇకపై రోడ్లపై కనిపించదనే వార్తలు వచ్చినప్పటి నుంచి ప్రజలతోపాటు ప్రముఖులు ఆ ట్యాక్సీతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోమవారం ముంబైలోని ఐకానిక్ టాక్సీలకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర శబ్దం చేస్తూ రోడ్లపై వెళ్లేవారికి అసౌకర్యంగా ఉన్నప్పటికీ, అవి చాలా మందికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చాయని గుర్తుచేశారు. ‘నేటి నుంచి ఐకానిక్ ప్రీమియర్ పద్మిని టాక్సీ ముంబై రోడ్ల నుంచి అదృశ్యమవుతుంది. అవి చేసే శబ్దం అసౌకర్యంగా ఉన్నా, ఎక్కువ మంది ప్రయాణించే వెసులుబాటు లేకపోయినా ప్రజలకు అవి టన్నుల కొద్దీ జ్ఞాపకాలను మిగిల్చాయి. ఇక ఈ కాలీ-పీలీ టాక్సీలకు సెలవు’అని తన ‘ఎక్స్(ట్విటర్)’ ఖాతాలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు) పబ్లిక్ ట్రాన్స్పోర్టర్ బృహన్ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) సంస్థ నుంచి డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను అధికారులు తొలగించినట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రసిద్ధ ప్రీమియర్ పద్మిని మోడల్ కార్లును సైతం ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 15 ఏళ్లు ముగిసిన డబుల్‌డెక్కర్ బస్సులను రద్దు చేశారు. అయితే ఫియట్ కంపెనీ తయారుచేసిన ఈ ప్రీమియర్ పద్మిని కార్లును ముంబయిలో ఎక్కువగా ట్యాక్సీలుగా వాడుతున్నారు. ఇవి నలుపు పసుపు రంగులో ఉండడంతో వాటికి కాలీపీలీ ట్యాక్సీలుగా పేరు వచ్చింది. ఈ ట్యాక్సీలకు కేటాయించిన రన్నింగ్ పీరియడ్ 20 సంవత్సరాలు. అక్టోబర్ 29, 2023తో ఆ సమయం ముగిసింది. From today, the iconic Premier Padmini Taxi vanishes from Mumbai’s roads. They were clunkers, uncomfortable, unreliable, noisy. Not much baggage capacity either. But for people of my vintage, they carried tons of memories. And they did their job of getting us from point A to… pic.twitter.com/weF33dMQQc — anand mahindra (@anandmahindra) October 30, 2023 -
దిగ్గజ ఎఫ్ఎమ్ సంస్థను కొనుగోలు చేయనున్న కంపెనీలు ఇవేనా..
ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఇండియా లిమిటెడ్ (ఈఎన్ఐఎల్)లో భాగంగా ఉన్న రేడియో మిర్చితో పాటు రేడియో ఆరెంజ్... బిగ్ ఎఫ్ఎమ్ రేడియో నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసేందుకు రూ.251 కోట్ల చొప్పున బిడ్ వేశాయని సమాచారం. దివాలా ప్రక్రియలో ఉన్న బిగ్ ఎఫ్ఎమ్ రేసులో హర్యానాకు చెందిన సఫైర్ ఎఫ్ఎమ్ కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సఫైర్ ఎఫ్ఎమ్ కూడా బిగ్ ఎఫ్ఎమ్ కోసం రూ.251 కోట్ల రూపాయల బిడ్ వేసింది. రేడియో మిర్చి, ఆరెంజ్ ఎఫ్ఎమ్ , సఫైర్ ఎఫ్‌ఎమ్‌ల బిడ్ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తామని ప్రకటించాయి. తమ బిడ్ల విలువను మరింత పెంచాలని లెండర్లు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కంపెనీ ఖాతాల్లో ఉన్న రూ.60 కోట్ల నగదు కూడా లెండర్లకే వెళ్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బిగ్ ఎఫ్ఎం ఖాతాల్లోని నగదును లెక్కలోకి తీసుకున్న తర్వాత, లెండర్లకు ఇంకా రూ. 578 కోట్లు రావాలి. ఇది దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్. 1,200 పట్టణాలకు, 50 వేలకుపైగా గ్రామాలకు ప్రసారాలను అందిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు దివాలా ప్రక్రియకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇంకా బిగ్ఎఫ్ఎమ్ సంస్థ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. -
వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్..
ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈ అభిప్రాయంపై ఏకీభవిస్తే, మరికొందరు వ్యతిరేకించారు. టైమ్ యూస్ సర్వే (Time Use Survey) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో వారానికి సరాసరి 61.6 గంటలు పనిచేస్తున్నట్లు తెలిసింది. వారానికి 65.4 గంటలు పనిచేస్తూ తెలంగాణ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! తక్కువ పని గంటలున్న రాష్ట్రాల్లో మణిపూర్ (46.9 గంటలు), నాగాలాండ్ (46.8 గంటలు) ఉన్నాయి. అండమాన్ & నికోబార్ దీవుల్లో కూడా వారానికి 58.7 గంటలు పనిచేస్తున్నట్లు ఈ జాబితాలో చూడవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ యువకులు చేసినట్లు భారతీయలు ఎక్కువ గంటలు పనిచేస్తే తప్పకుండా ఇండియా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని వెల్లడించారు. -
హైదరాబాద్ నుంచి నేరుగా సింగపూర్, కొలంబోలకు ఫ్లైట్స్: ఇండిగో
హైదరాబాద్ నుంచి ఇకపై నేరుగా సింగపూర్, కొలంబోకు వెళ్లేలా ఇండిగో సంస్థ విమాన సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రం నుంచి సింగపూర్, కొలంబోలను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం వల్లనే ఈ నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు ఇండిగో తెలిపింది. వీటిలో హైదరాబాద్-సింగపూర్ల మధ్య సర్వీసులు అక్టోబర్ 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 2.50 గంటలకు బయలుదేరనున్న 6ఈ-1027 విమాన సర్వీసు సింగపూర్‌కు ఉదయం 10 గంటలకు(సింగపూర్ కాలమాన ప్రకారం) చేరుకోనుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో సింగపూర్‌లో రాత్రి 23.25 గంటలకు(సింగపూర్ కాలమాన ప్రకారం) బయలుదేరి హైదరాబాద్‌కు ఉదయం 1.30 గంటలకు చేరుకోనుంది. హైదరాబాద్-కొలంబోల మధ్య అలాగే నవంబర్ 3 నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. 6ఈ-1181 విమాన సర్వీస్ హైదరాబాద్ నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరి కొలంబోకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో కొలంబోలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు సాయంత్రం 5 గంటలకు వస్తుంది. అయితే ఈ సర్వీస్ వారానికి నాలుగు రోజులు సోమ, మంగళ, శుక్ర, ఆదివారాల్లో మాత్రమే ఉంటుందని ఇండిగో తెలిపింది. -
‘70 గంటల పని’ వివాదంపై జిందాల్ ఏమన్నారంటే..
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. భారత యువత వారంలో కనీసం 70 గంటలు పనిచేయాలని ఆయన అనడంతో ఐటీ ఉద్యోగులతో సహా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. అయితే ఆయన మాటలను సమర్థిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్పర్సన్ సజ్జన్ జిందాల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. యువత విశ్రాంతి కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఐదు రోజులపాటే పని చేయాలనే సంస్కృతి అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోజూ 14-16 గంటలకు పైగా పని చేస్తారని, తానూ రోజూ 10-12 గంటలు విధుల్లో ఉంటానని తెలిపారు. A 5 day week culture is not what a rapidly developing nation of our size needs. Our PM @narendramodi ji works over 14-16 hours everyday. My father used to work 12-14 hours, 7 days a week. I work 10-12 hours everyday. We have to find passion in our work and in Nation Building. — Sajjan Jindal (@sajjanjindal) October 27, 2023 -
RIL: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 29.7 శాతం పెరిగింది. దాంతో రూ.19,878 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు జియో, రిటైల్ వ్యాపారం మంచి పనితీరు కారణంగా కంపెనీ లాభాల్లో పయనిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ స్థూల ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.2,55,996 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్‌లు సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 12 శాతం పెరిగి రూ.5,297 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,729 కోట్లుగా ఉంది. కొత్తగా చేరే సబ్‌స్క్రైబర్ బేస్‌లో 7.5 శాతం పెరుగుదల నమోదైంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఆదాయం 18.8 శాతం పెరిగి రూ.77,148 కోట్లుగా నిలిచింది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.75 శాతం పెరిగి రూ.2,265.25 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా వేగంగా 5జీ సేవలు విస్తరిస్తామన్నారు. రిలయన్స్ రిటైల్ విస్తరణను కొనసాగిస్తామని చెప్పారు. ఇంధన మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ ఆయిల్2కెమికల్ విభాగానికి డిమాండ్ పెరిగిందన్నారు. -
రూ.240కే ‘ఎక్స్’ సబ్స్క్రిప్షన్.. ఫీచర్లు ఇవే..
ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన ‘ఎక్స్’(ట్విటర్) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వినియోగదారులకు ప్రీమియం సేవలందిస్తూ డబ్బు సంపాదించాలనే యోచనలో ఉంది. అందుకు అనుగుణంగా రెండు ప్రీమియంలను తీసుకొచ్చింది. అందులో ప్రీమియం+, బేసిక్ ప్రీమియంలు ఉన్నట్లు సంస్థ చెప్పింది. వాటికి సంబంధించి ఒక్కోదానికి ప్రత్యేక ధర నిర్ణయించారు. ప్రీమియం+ ఈ శ్రేణిని ఎంచుకున్న వినియోగదారులు నెలకు 16 అమెరికన్ డాలర్లు(రూ. 1,300) చెల్లించాలి. ఇందులో యూజర్లతోపాటు, వారిని ఫాలో అవుతున్న వారినుంచి వచ్చే ప్రకటనలు తీసివేస్తారు. రిప్లై బూస్ట్ అవకాశం అధికంగా ఉంటుంది. క్రియేటర్ టూల్స్‌ను పూర్తిగా వాడే వెసులుబాటు కల్పిస్తున్నారు. బేసిక్ ప్రీమియం వినియోగదారులు ఈ శ్రేణిలో నెలకు 3 డాలర్లు(రూ.243.75) చెల్లించాలి. అయితే ఇది బ్లూ చెక్‌మార్క్‌ను కలిగి ఉండదు. ఇందులో పోస్ట్‌లను సవరించే అవకాశం ఉంటుంది. ఇది పొడవైన టెక్ట్స్, వీడియోలను పోస్ట్ చేయగల సామర్థ్యం వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ రెండు ప్లాన్లను వెబ్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచారు. ఎక్స్ ఇటీవల లైవ్‌స్ట్రీమింగ్ వీడియో, ఆడియో కాల్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లాట్‌ఫారమ్‌ను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చే క్రమంలో వినియోగదారుల కోసం మరిన్ని ఫీచర్లను తీసుకొచ్చే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే డిజిటల్ చెల్లింపుల వంటి బ్యాంకింగ్ సేవలను కూడా చేర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. introducing Premium+ – no ads in For You or Following – largest boost for your replies (vs other Premium tiers or unverified users) – access to our full suite of creator tools now available on Web ✌️ subscribe here → https://t.co/Ywvyijo9CQ — Premium (@premium) October 27, 2023 -
రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపుతామంటూ అంబానీకి ఈమెయిల్..నిందితుడు ఎవరంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని చంపుతామంటూ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తనకు రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని ఒక వ్యక్తి అంబానీని ఈమెయిల్ ద్వారా బెదిరించినట్లు చెప్పారు. "మీరు మాకు రూ.20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపుతాము. భారతదేశంలోనే అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు" అని ఈమెయిల్ వచ్చినట్లు చెప్పారు. అయితే ఆ ఈమెయిల్ అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి అకౌంట్ ద్వారా వచ్చినట్లు పోలీసులు ధ్రువపరిచారు. అంబానీ నివాసం యాంటిలియాలోని భద్రతా అధికారులు హత్య బెదిరింపుకు సంబంధించిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో విచారణ ప్రారంభించారు. (ఇదీ చదవండి: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం) అంబానీ, అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తూ అనామక కాల్స్ చేసినందుకు బిహార్‌కు చెందిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని అంబానీ కుటుంబ నివాసం 'యాంటిలియా'తో పాటు హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని ఆ వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు. -
2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు
శిలాజ ఇంధనాల క్షీణత, ముడిచమురు ధరల్లో అస్థిరత, కఠినమైన పర్యావరణ నిబంధనలు వంటి సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు, బొగ్గుకు గరిష్ఠ స్థాయిలో డిమాండ్ నెలకొనడం చరిత్రలో ఇదే మొదటిసారి. గ్లోబల్‌గా శిలాజ ఇంధన డిమాండ్ 2030 నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) 2023 నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అణు, సౌర, పవన విద్యుత్తుకు అధిక గిరాకీ ఉంటుందని నివేదిక తెలియజేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, అణుశక్తి తరిగిపోయే శక్తివనరులు. వాటిని ఒకసారి వినియోగిస్తే, మళ్లీ ఉపయోగించడం కుదరదు. నీరు, గాలి, సూర్యరశ్మి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి తదితరాలు ఎన్నటికీ తరిగిపోనివి. అందుకే వాటిన సంప్రదాయేతర లేదా తరిగిపోని ఇంధన వనరులు అంటారు. శాస్త్రవిజ్ఞానం, నవీన ఆవిష్కరణల ద్వారా వాటి వినియోగాన్ని పెంచుతున్నారు. (ఇదీ చదవండి: రూ.240కే ‘ఎక్స్’ సబ్స్క్రిప్షన్.. ఫీచర్లు ఇవే..) తగ్గుతున్న శిలాజ ఇంధన డిమాండ్ బొగ్గు, చమురు, సహజ వాయువులను శిలాజ ఇంధనాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలవారీగా వీటి డిమాండ్ ఆధారపడుతుంది. అనేక దశాబ్దాలుగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా, పారిశ్రామిక అవసరాలకు వీటిని వాడుతున్నారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల కారణంగా వీటికి మరింత డిమాండ్ పెరిగింది. కానీ వీటిని మండించడం ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చాయి. 2030 నాటికి శిలాజ ఇంధనాలకు గరిష్ట స్థాయిలో డిమాండ్ ఉంటుందని అంచనా. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కొన్ని విధానల ద్వారా క్రమంగా వీటి వాడకం తగ్గనుంది. వీటిస్థానే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీవైపు అడుగులు వేసే అవకాశం ఉంది. క్షీణిస్తున్న బొగ్గువాడకం ప్రపంచ బొగ్గు డిమాండ్ అనేది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపై ఆధారపడుతుంది. ఇతర మార్గాల ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంటే క్రమంగా బొగ్గుకు డిమాండ్ తగ్గుతుంది. అయితే 65శాతం బొగ్గును ప్రస్తుతం కరెంట్ తయారీకే వాడుతున్నారు. థర్మల్‌పవర్ ప్లాంట్లు సిస్టమ్ సేవలు ఉపయోగిస్తున్నాయి. దాంతో బొగ్గు వినియోగం కొంతమేర తగ్గుతుంది. అయితే పారిశ్రామిక డిమాండ్, ఉక్కు తయారీ, సిమెంట్ పరిశ్రమల కోసం వాడే బొగ్గు వినియోగం స్థిరంగా ఉంది. పునరుత్పాదక వనరులపై మక్కువ సౌరశక్తి, పవన శక్తి, జలశక్తి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఏర్పడింది. వాటిని వినియోగించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 140కి పైగా దేశాలు వీటిని విరివిగా వాడుతున్నాయి. 2010తో పోలిస్తే 2022 వరకు సౌరశక్తి వల్ల 90శాతం, పవనశక్తి ద్వారా 70శాతం, ఆఫ్‌షోర్ విండ్ ద్వారా 60శాతం విద్యుత్ ధరలు తగ్గాయి. (ఇదీ చదవండి: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..) క్లీన్ ఎనర్జీ వైపు..ప్రపంచం చూపు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ విస్తరణ వల్ల సౌర, పవన శక్తి వాడకం ఎక్కువైంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలు తగ్గనున్నాయి. 2030 వరకు సోలార్‌ఎనర్జీ వల్ల దాదాపు 3 గిగాటన్నుల ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోడ్డుపై ఉన్న అన్ని కార్ల నుంచి వెలువడే ఉద్గారాలకు సమానం. పవన శక్తి వల్ల మరో రెండు గిగాటన్నుల ఉద్గారాలు తగ్గనున్నాయి. -
ఇప్పటికే దేశంలో 4లక్షల 5జీ బేస్స్టేషన్లు: ప్రధానిమోదీ
న్యూదిల్లీలోని ప్రగతిమైదాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023ను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించి మాట్లాడారు. దేశం ప్రస్తుతం 6జీ దిశగా అడుగులు వేస్తోందన్నారు. 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంక్‌లో ఉండగా..ఇప్పుడు 43వ ర్యాంక్‌కు చేరిందని తెలిపారు. ఇటీవలే గూగుల్.. భారత్‌లో పిక్సెల్ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించిందన్నారు. శామ్సంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఐఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయని గుర్తచేశారు. ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉందని మోదీ కొనియాడారు. భారత టెక్ విప్లవంలో యువత పాత్ర కీలకమని, అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఒకే నెలలో 40లక్షల వీడియోలు డిలీట్..కారణం అదేనా..
మనదేశంలో టిక్‌టాక్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే యురోపియన్ యూనియన్‌లో మాత్రం సంస్థ తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. సెప్టెంబరులో యూరప్‌లో 40లక్షల వీడియోలను తొలగించినట్లు కంపెనీ అక్టోబరు 25న తెలిపింది. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్‌కు వ్యతిరేకంగా కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. యురోపియన్ యూనియన్‌లో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ సేవల చట్టం(డీఎస్ఏ) ప్రకారం..ప్రధాన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి ఆరు నెలలకోసారి పారదర్శకత నివేదికను అందించాలి. అందులో భాగంగా టిక్‌టాక్ ఈ సమాచారాన్ని తెలియజేసింది. ఆగస్టులో అమలులోకి వచ్చిన ఈచట్టం ద్వారా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, సెర్చ్ ఇంజిన్లకు భారీగా జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే అన్ని కంపెనీలకు కలిపి దాదాపు వాటి ప్రపంచ టర్నోవర్‌లో ఆరు శాతం వరకు జరిమానా వేసినట్లు తెలుస్తుంది. టిక్‌టాక్‌తోపాటు మరో 18 ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలు యూరప్‌లో వాటి నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తున్నాయి. -
Apple: ప్రపంచ నం1 కంపెనీ వాచ్‌లపై నిషేధం!
ప్రపంచ నంబర్‌వన్ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఆరోపణలు వస్తున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే లైట్ టెక్నాలజీతో పనిచేసే యాపిల్ వాచ్ మోడళ్ల దిగుమతులను నిషేధించాలంటూ మాసిమో కార్ప్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి అమెరికా ట్రేడ్ కమిషన్‌కు సిఫారసు చేసినట్లు మెడికల్ టెక్నాలజీ కంపెనీ మాసిమో కార్ప్ గురువారం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన మాసిమో తెలిపిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్(యుఎస్ఐటీసీ) 60 రోజులపాటు ‘పరిమిత మినహాయింపు ఉత్తర్వు’లు జారీ చేసినట్లు సమాచారం. యుఎస్ఐటీసీ ఇచ్చే తీర్పు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ కూడా చట్టానికి అతీతం కాదనే సందేశాన్ని పంపుతుందని మాసిమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ జో కియాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ పేటెంట్ టెక్నాలజీని యాపిల్ చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నారు. ‘లైట్-బేస్డ్ ఆక్సిమెట్రీ ఫంక్షనాలిటీ’ కోసం ఆపిల్ వాచ్ మాసిమో పేటెంట్ టెక్నాలజీని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ 2021లో సంస్థ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?) యాపిల్ వినియోగదారుల ఆరోగ్యం కంపెనీకి చాలా ముఖ్యమని సంస్థ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి యూజర్లకు మరింత సేవలందించేలా సంస్థ నిత్యం పనిచేస్తుందని చెప్పింది. అయితే కొందరు కావాలనే యాపిల్ ఉత్పత్తులను కాపీచేసి తమ సొంత ఉత్పత్తులుగా ప్రచారం చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మాసిమో చర్యలపై ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తామని యాపిల్ తెలిపింది. యాపిల్ గత నెలలో వాచ్సిరీస్ 9ని విడుదల చేసింది. ఆరోగ్య డేటాను యాక్సెస్ చేసి వివరాలు విశ్లేషించే వెసులుబాటు అందులో ఉంది. -
భారీగా తగ్గిన డైమండ్ ధరలు!
గతేడాది నవరాత్రి-దసరా కాలంతో పోలిస్తే ఈసారి పాలిష్ చేసిన వజ్రాల ధరలు గణనీయంగా 35 శాతం తగ్గాయి. కొన్ని కేటగిరీలకు చెందిన వజ్రాల ధరలు 2004లో ఉన్న ధరలతో సమానమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యుఎస్, చైనాలో నెలకొంటున్న ఆర్థిక మాంద్యంతోపాటు ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలకు పెరుగుతున్న ఆదరణ వల్ల ధరలు క్షీణిస్తున్నట్లు సమాచారం. పాలిష్ చేసే వజ్రాల్లో ప్రపంచంలోనే 90 శాతం భారత్‌లోనే తయారవుతాయి. అయితే ధరలు తగ్గడంతో కంపెనీలు దేశీయ మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయించాలని చూస్తున్నాయి. డైమండ్ ధరలు తగ్గడం వల్ల దేశంలోని స్టోర్‌ల్లో దసరా సందర్భంగా 20 శాతం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో ముడి వజ్రాల ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని, దాంతో పాలిష్ చేసిన వజ్రాల ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత మూడు నెలలుగా పాలిష్ చేసిన వజ్రాల కొనుగోలుదారుగా ఉన్న యూఎస్‌లో డిమాండ్ తగ్గడంతో కూడా వజ్రాలు సరసంగా లభిస్తున్నాయి. -
నెలవారీ 10కోట్ల యూజర్లను సంపాదించిన సంస్థ!
మెటా సంస్థలో భాగంగా ఉన్న ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ నెలవారీగా దాదాపు 100 మిలియన్ల(10కోట్లు) వినియోగదారులను చేరుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఇటీవల కంపెనీ త్రైమాసిక ఆదాయాల గురించి మాట్లాడుతున్నపుడు ఈ విషయాన్ని చెప్పారు. సానుకూలంగా సంభాషణలు సాగించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ టూల్‌ను తీసుకొచ్చిందన్నారు. ఇన్స్టాథ్రెడ్లు రానున్న రోజుల్లో మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయని మెటా సీఎఫ్ఓ సుసాన్ లి అన్నారు. ఇన్స్టాగ్రామ్ వార్తలకు వ్యతిరేకం కాదని, సంబంధిత ప్లాట్ఫామ్లో థ్రెడ్లు వార్తలను విస్తరించట్లేదని ఇన్‌స్టా ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎక్స్(ట్విటర్)కు పోటీగా మెటా ఇన్స్టాథ్రెడ్లను జులైలో ప్రారంభించింది. -
‘ఎక్స్’లో ఇక ఆడియో, వీడియో కాల్స్.. ఎలా ఆక్టివేట్ చేయాలంటే..
టెక్నాలజీ కంపెనీల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ కొన్నేళ్లుగా ఆడియో, వీడియోకాల్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అదే తరహాలో ఇపుడు మరో టెక్ దిగ్గజమైన ఎక్స్(ట్విటర్) ఆడియో, వీడియోకాల్ సౌకర్యాన్ని తన వినియోగదారులకు అందించనుంది. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఎలాన్‌మస్క్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే Settings->Privacy & Safety->Direct Messages-> Enable Audio & Video Calling ఫీచర్‌ని ఎనేబల్ చేసుకోవాలి. (ఇదీ చదవండి: ప్రపంచంలోనే మేటి ఇండియన్ బీస్కూళ్లు..) ఎవరికీ ఫోన్ నంబరు ఇవ్వకుండానే కాల్స్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ని ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లను తీసుకురానున్నట్లు గతంలో మస్క్ ప్రకటించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీల్లో ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh — Elon Musk (@elonmusk) October 25, 2023 -
ప్రపంచంలోనే మేటి ఇండియన్ బీస్కూళ్లు..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్ల జాబితాలో నాలుగు ఇండియన్ బీస్కూళ్లు చోటు సంపాదించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2024లో భాగంగా ప్రపంచంలోని 100 మేటి బిజినెస్ స్కూళ్ల జాబితాను తయారు చేశారు. అందులో ఐఐఎం బెంగళూరు-48వ స్థానం, గతేడాది టాప్ ర్యాంక్‌లో ఉన్న ఐఐఎం అహ్మదాబాద్ ఈ ఏడాది 53వ స్థానంలో నిలిచింది. ఐఐఎం కలకత్తా, ఐఎస్బీ వరుసగా 59, 78వ స్థానాల్లో ఉన్నాయి. ఐఎస్బీ మినహా అన్ని సంస్థలు గతేడాదితో పోలిస్తే వాటి స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి. ఐఐఎం ఇండోర్, ఐఐఎం లక్నో, ఐఐఎం ఉదయపూర్లు 150-200 ర్యాంకింగ్ జాబితాలో ఉన్నాయి. ఐఎంఐ దిల్లీ, ఎండీఐ గురుగావ్, ఎక్స్ఎల్ఆర్ఐలు 201-250 బ్యాండ్‌లో, ఐఎంఐ కోల్‌కతా 251+ ర్యాంకింగ్‌లో నిలిచాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా మొదటి 50 సంస్థల్లో నిలిచిన ఏకైక ఇండియన్ ఇన్స్టిట్యూట్గా ఐఐఎం బెంగళూరు నిలిచింది. దీనిలో ఇది 31వ స్థానంలో ఉంది. గత సంవత్సరం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకత్తా, ఐఎస్బీ వరుసస్థానాల్లో నిలిచాయి. -
IPO: నెలలో రూ.15వేల కోట్లు సమీకరించే కంపెనీలు ఇవే..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబరులో దాదాపు 12 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వీటి ద్వారా వచ్చే నెల రోజుల్లో దాదాపు రూ.15,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ డజన్ కంపెనీల్లో ఇప్పటికే బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఐపీఓ ప్రారంభం అయింది. సెల్లో వరల్డ్ ఇష్యూ తేదీలను ప్రకటించింది. టాటా టెక్నాలజీస్, మామాఎర్త్, ఏఎస్కే ఆటోమోటివ్, ప్రోటీన్ ఈగవ్ టెక్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ పబ్లిక్ ఆఫర్లు నవంబరులో రానున్నాయి. వీటితో మొత్తం దాదాపు రూ.15వేలకోట్లు సమీకరించే వీలుంది. రూ.1,900 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తోన్న సెల్లో వరల్డ్ ఐపీఓ అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.617-648గా నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఐపీఓ అక్టోబర్ 27 వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీ రూ.840 కోట్లు సమీకరించనుంది. చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ రెండు లేదా మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇరవయ్యేళ్లలో టాటా గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓ ఇది. దీని ఒక్కో షేరు ధర శ్రేణి రూ.400 నుంచి రూ.500 మధ్య ఉండొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. చివరగా 2004లో టాటా సంస్థల నుంచి టీసీఎస్ ఐపీఓగా వచ్చింది. హొనాస కన్జ్యూమర్(మామాఎర్త్ మాతృసంస్థ) పబ్లిక్ ఇష్యూకు త్వరలో రాబోతోంది. దాదాపు రూ.1,650 కోట్ల సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఫెడరల్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు రానుంది. రూ.1,200 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్రోటీన్ ఇగవ్ టెక్, రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఏఎస్కే ఆటోమోటివ్ సైతం నవంబర్లోనే ఐపీఓ (IPO)కి రానున్నాయి. వచ్చే నెలలోనే రూ.1,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకి సిద్ధ అవుతుంది. రూ.750 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు మరో 70.3 మిలియన్ల షేర్లు ఓఎఫ్ఎస్ కింద జారీ చేయనున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓకు వచ్చిన 36 కంపెనీలు దాదాపు రూ.28,330 కోట్లు సమీకరించాయి. గతేడాది మొత్తం 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. ఫలితంగా రూ.59వేలకోట్ల నిధులు కూడగట్టాయి. కంపెనీలు సమీకరించనున్న మొత్తం టాటా టెక్నాలజీస్: రూ.2500 కోట్లు సెల్లోవరల్డ్: రూ.1900 కోట్లు హొనాస కన్జ్యూమర్:రూ.1650 కోట్లు ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్సియల్: రూ.1400 కోట్లు ప్రొటీన్ ఈగోవ్టెక్: రూ.1300 కోట్లు డీఓఎంఎస్ ఇండస్ట్రీస్:రూ.1200 కోట్లు ఏఎస్కే ఆటోమోటివ్:రూ.1000 కోట్లు జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.1000 కోట్లు ఫిన్‌కేర్ మైక్రోఫైనాన్స్: రూ.900 కోట్లు బ్లూజెట్ హెల్త్‌కేర్: రూ.840 కోట్లు ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్: రూ.800 కోట్లు ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.630 కోట్లు -
మైక్రోసాఫ్ట్ ఆదాయం 13శాతం వృద్ధి
సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంచనాలను మించి 13శాతం ఆదాయం వృద్ధి చెందినట్లు తెలిపింది. అయితే ముందుగా విశ్లేషకులు, నిపుణులు కంపెనీ ఆదాయం రూ.4.4లక్షలకోట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనాలను మించి ఆదాయం రూ.4.6లక్షలకోట్లకు చేరింది. గత త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.83వేలకోట్లు నుంచి రూ.91వేలకోట్లు చేరింది. 2016 తర్వాత కంపెనీ చేసిన అత్యధిక మూలధన వ్యయంగా ఇది నిలిచింది. ఫలితాలు విడుదల చేసిన కొంతసేపటికే మైక్రోసాఫ్ట్ షేర్లు మూడు శాతం పెరిగాయి. సంస్థ ప్రతిష్టాత్మంగా ఉన్న అజూర్ సేవలు అంచనావేసిన 26.2 కంటే పెరిగి 29 శాతానికి చేరాయి. అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్‌లో ఫీచర్ ప్లాట్‌ఫామ్. క్లౌడ్ బిజినెస్ కోసం త్రైమాసిక అమ్మకాల పెరుగుదలలో ఏఐ సేవలు కీలకమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఓపెన్ఏఐతో చాలా ఉత్పత్తులను ఇంకా ప్రారంభించలేదని సంస్థ తెలిపింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
Google: ఒకేరోజు 9.5శాతం కుంగిన ఆల్ఫాబెట్ఇంక్!
గూగుల్-ఆల్ఫాబెట్ఇంక్ క్లౌడ్ బిజినెస్‌లో మూడో త్రైమాసిక ఆదాయంలో 22.5% వృద్ధిని నమోదు చేసింది. గూగుల్ క్లౌడ్ త్రైమాసికంలో నికర లాభాన్ని పోస్ట్ చేసింది. అయినప్పటికీ ఆల్ఫాబెట్ఇంక్ ఫలితాల్లో వాల్ స్ట్రీట్ అంచనాలను మించలేకపోయింది. దాంతో బుధవారం మార్కెట్ ముగింపు సమయానికి కంపెనీ స్టాక్ 9.5శాతం తగ్గి 125.6 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఫలితాలు విడుదల సందర్భంగా ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్‌పిచాయ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత ఉపయోగకరంగా మార్చడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్పారు. అందరికి ప్రముఖ ఏఐ మోడల్లను చేరువ చేస్తామన్నారు. ఏఐ రంగంలో అద్భుతమైన పురోగతి ఉందని చెప్పారు. కృత్రిమమేధలో పెట్టుబడి పెట్టడానికి వీలైనంత ఎక్కువ అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఆదాయ వృద్ధి గడిచిన త్రైమాసికంతో పోలిస్తే 28% నుంచి 22.5%కి మందగించింది. యూనిట్ మూడో త్రైమాసిక ఆదాయం రూ.69వేలకోట్లుకు పెరిగింది. ఈ యూనిట్ నిర్వహణ పరంగా గతేడాది రూ.3660 కోట్ల నష్టంతో పోలిస్తే, రూ.2213కోట్ల ఆదాయాన్ని పోస్ట్ చేసింది. అయితే వాల్ స్ట్రీట్ క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహణ..రూ.3600 కోట్లు, ఆదాయం..రూ.71వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. కొందరు కస్టమర్లు కాస్ట్‌కటింగ్ పేరిట్ క్లౌడ్ సేవలు వినియోగించుకోలేదని దాంతో యూనిట్ అమ్మకాలు దెబ్బతిన్నాయని సీఎఫ్ఓ రూత్ పోరట్ తెలిపారు. గూగుల్‌క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ సేవలు, సహకార సాధనాలు, కస్టమర్ల కోసం ఇతర ఎంటర్ప్రైజ్ సేవలు అందిస్తూ ఆదాయం సంపాదిస్తుంది. -
ద్వారకాధీశ్ దేవాలయంలో అంబానీ పూజలు
దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాకు చెందిన ద్వారకాధీశ్ దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారి పాదాలకు నమస్కరించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఇద్దరిని శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతుంది. #WATCH | Gujarat | Reliance Industries Chairman, Mukesh Ambani and his son Anant Ambani offered prayers at Dwarkadhish Temple in Devbhumi Dwarka district yesterday, on 24th October. pic.twitter.com/6efbOI2zNj — ANI (@ANI) October 25, 2023 -
ఆ కంపెనీలకు రూ.లక్ష కోట్ల జీఎస్టీ నోటీసులు!
పన్ను ఎగవేతలకు పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఓ సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ప్రభుత్వం సవరించిన జీఎస్టీ చట్టం ప్రకారం..అక్టోబర్ 1 నుంచి విదేశీ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు భారతదేశంలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే, అప్పటినుంచి ఎలాంటి సంస్థలు రిజిస్టర్ అవ్వలేదని సమాచారం. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెట్టే బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించాలని ఆగస్టులో సవరించారు. కానీ ఇప్పటివరకు పన్ను చెల్లించని గేమింగ్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పన్ను చెల్లించని కంపెనీలపై ఇప్పటివరకు సుమారు రూ.1లక్ష కోట్ల విలువైన నోటీసులు పంపింది. ఆన్లైన్ గేమ్‌లు, గుర్రపు పందేలు, క్యాసినోలు ఆడేందుకు డిపాజిట్ చేసిన మొత్తం నిధులపై 28 శాతం జీఎస్టీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటినుంచి దేశంలోని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొబైల్ ప్రీమియర్ లీగ్ వంటి కొన్ని సంస్థలు ఉద్యోగులను సైతం వదులుకోవడానికి దారితీసింది. జీఎస్టీ స్లాబ్‌ను తగ్గించాలని, ఇది విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కోల్పోతుందని గేమింగ్ సంస్థలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. అయినప్పటికీ, రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం అధిక పన్నులతో ముందుకుసాగుతుంది. -
World War: మూడో ప్రపంచ యుద్ధంపై మస్క్ కీలక వ్యాఖ్యలు
ఎలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లోని స్పేసెస్‌లో చర్చ సందర్భంగా మూడో ప్రపంచ యుద్ధంకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ నుంచి మాస్కో వెంటనే తమ బలగాలను విరమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్నారు. డేవిడ్ సాక్స్, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న అభ్యర్థి వివేక్ రామస్వామితో మస్క్ స్పేసెస్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్, హమాస్ భౌగోళిక రాజకీయాలపై విస్తృత చర్చ జరిగింది. రష్యా, చైనా సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయని మస్క్ పేర్కొన్నాడు. వ్లాదిమిర్ పుతిన్‌పై విస్తృతమైన ఆంక్షలు విధించాలనే పాశ్చాత్య నిర్ణయం ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. రష్యా ముడిసరుకులను అందిస్తుండడం, చైనా పారిశ్రామిక సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో గణనీయమైన సైనిక సామర్థ్యాన్ని సృష్టించే ప్రమాదం ఉందని తెలిపారు. వరుస అనాలోచిత నిర్ణయాలతో తెలియకుండానే మూడో ప్రపంచ యుద్ధం దిశగా పయనిస్తున్నట్లు హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రష్యా, చైనాల మధ్య అంతరం తగ్గుతున్నట్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. అంతర్జాతీయంగా అనిశ్చితుల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
నేను చేసిన పెద్ద తప్పు అదే..మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తను తీసుకున్న కష్టమైన నిర్ణయం ఏమిటో చెప్పారు. ఇటీవల బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొబైల్ ఫోన్ వ్యాపారం నుంచి కంపెనీ నిష్క్రమించినందుకు బదులుగా దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని అంగీకరించారు. ఫోన్ కేటగిరీపై దృష్టి సారించడం ద్వారా కంపెనీ మరింత మెరుగ్గా పని చేసే అవకాశం ఉండేదని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ మొబైల్ కేటగిరీ నుంచి వైదొలగడంపై సీఈఓను అడిగినపుడు ఆయన స్పందించారు. సత్యనాదెళ్ల తను సీఈఓ అయినప్పుడు తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయాలలో అది ఒకటన్నారు. గతంలో మొబైల్ఫోన్లో కంప్యూటర్ మాదిరి కార్యాకలాపాలకు అవకాశం ఉంటుందని భావించామన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ మొబైల్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. అయితే దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిందని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అదిప్రజల్లో ఆదరణ పొందలేదు. 2014లో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ నుంచి నాదెల్లా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏడాది నోకియా ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన దాదాపు రూ.63వేలకోట్ల ఒప్పందాన్ని కంపెనీ రద్దు చేసుకుంది. తర్వాత కొన్ని ఏళ్లకు విండోస్ ఫోన్ కనుమరుగయింది. మైక్రోసాఫ్ట్ గత పదేళ్ల నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లను అభివృద్ధి చేయడం వైపు దృష్టి సారించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లను విండోస్‌కి కనెక్ట్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. -
ఇండియాలోనే ఉత్తమ నెట్వర్క్..ఊక్లా అవార్డులు అన్నీ సంస్థకే..
దేశంలో అగ్రగామి నెట్‌వర్క్‌గా రిలయన్స్ జియో నిలిచింది. ఊక్లా సంస్థ ప్రకటించే స్పీడ్‌టెస్ట్‌లకు సంబంధించిన అవార్డులను అన్నింటినీ రిలయన్స్జియో గెలుచుకుంది. 5జీ నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్ విభాగంలో మొత్తం అవార్డులను జియో గెలుపొందినట్లు ఊక్లా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తమ, వేగవంత, టాప్ రేటెడ్ మొబైల్ నెట్వర్క్, ఉత్తమ మొబైల్ కవరేజీ, ఉత్తమ మొబైల్ వీడియో, గేమింగ్ అనుభూతి, 5జీ మొబైల్ నెట్వర్క్, 5జీ మొబైల్ వీడియో అనుభూతి, 5జీ మొబైల్ గేమింగ్ అనుభూతి అవార్డులను జియో దక్కించుకుందని తెలిపింది. ఊక్లా స్పీడ్‌టెస్ట్ అందించే సూచనల ద్వారా తమ సంస్థతోపాటు ఇతర సంస్థల వినియోయోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేలా ప్రయత్నిస్తున్నట్లు సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్ స్టీఫెన్ తెలిపారు. ఈ అవార్డులు, గుర్తింపుతో భారత్‌లో అత్యుత్తమ నెట్‌వర్క్‌గా జియో మారిందన్నారు. టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడంతోపాటు డిజిటల్ సమాజాన్ని సృష్టించాలన్నది జియో లక్ష్యమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. -
రూ.16,195 కోట్ల టాక్స్ నోటీసుపై హైకోర్టు స్టే
డెల్టాకార్ప్ సంస్థకు జారీ చేసిన రూ.16,195 కోట్ల జీఎస్టీ నోటీసుపై తుది ఉత్తర్వులు ఇవ్వకూడదని బొంబాయి హైకోర్టు గోవాబెంచ్ తేల్చి చెప్పింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనంతో డెల్టాకార్ప్ షేర్ హోల్డర్లకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. గత నెలలో డెల్టాకార్ప్‌తో పాటు అనుబంధ సంస్థలకు దాదాపు రూ.23,000 కోట్ల మేర పన్ను చెల్లింపునకు సంబంధించిన నోటీసులు అందాయి. ముందస్తు అనుమతి లేకుండా రూ.16,195 కోట్ల పన్ను నోటీసుపై తుది ఉత్తర్వులు జారీ చేయరాదని బొంబాయి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 23న కంపెనీ, దాని అనుబంధ సంస్థలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను బాంబే హైకోర్టు పరిశీలించింది. గేమింగ్, క్యాసినో వ్యాపారాలపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో జీఎస్టీ పన్ను రేట్లను సైతం భారీగా పెంచింది. ప్రస్తుతం ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీ పన్ను నోటీసులతో సతమతమవుతున్నాయి. -
ఇకపై వాటి దిగుమతులకు ఆమోదం తప్పనిసరి
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి లేని దిగుమతులకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి చేసింది. నాసిరకం వస్తువులు మార్కెట్లోకి వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత విధానం ప్రకారం..అన్ని ప్రమాణాలకు లోబడి ఉన్న సరైన అర్హత కలిగిన విదేశీ ఉక్కు పరిశ్రమల ఉత్పత్తులకు బీఐఎస్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. బీఐఎస్, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన సరుకును మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తారు. కానీ కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నికల్ కమిటీ సదరు ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించి దిగుమతి చేసే వీలుంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్-ఆగస్టు మధ్య 7.68 మిలియన్ టన్నుల ఐరన్, స్టీల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 4.82 మిలియన్ టన్నులు నుంచి 59.45శాతం పెరిగింది. వియత్నాం, జపాన్, చైనా నుంచి భారీ పరిమాణంలో ఎగుమతి చేసుకుంటున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. దాంతో ధరలు ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తుంది. -
ఆకాశ ఎయిర్‌లైన్స్ సంచలన నిర్ణయం
దేశీయ విమానయాన రంగం సంస్థ అయిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్‌లో విమానాలు నడపనుంది. అందుకు అనువుగా ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ వినయ్‌దూబే తెలిపారు. సంస్థ ప్రస్తుతం 4.2 శాతం మార్కెట్ వాటాతో కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పెట్టుబడి పెట్టిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్‌లో ప్రయాణించడానికి సిద్ధపడుతోంది. దీనికి తోడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకూ ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీతో సహా 16 దేశీయ గమ్యస్థానాలకు ఆకాశ తన సేవలు అందిస్తోంది. ఈ ఎయిర్ లైన్స్ వారానికి 750 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. కాగా ఈ దశాబ్దం చివరి నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా మార్కెట్లలో లిస్ట్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. 76 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఇప్పటికే ఆర్డర్ చేయగా.. 2027 మధ్య నాటికి ఇవి డెలివరీ అవుతాయని బావిస్తోంది. ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌కు 20 విమానాలు ఉన్నాయి. -
నిఫ్టీ50 కంపెనీల్లో మహిళా ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా..
భారతీయ కంపెనీల్లోని మహిళా ఉద్యోగుల జీతాలు సగటున పురుష ఉద్యోగుల జీతాల కంటే దాదాపు పదో వంతు తక్కువగా ఉన్నాయని కొన్ని కథనాలు ప్రకారం తెలుస్తుంది. నిఫ్టీ50 కంపెనీల్లోని స్త్రీ, పురుష ఉద్యోగుల జీతాలను విశ్లేషించి కొంత డేటాను సేకరించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. నిఫ్టీ50లోని 31 కంపెనీల్లో మహిళల జీతాల కంటే పురుషుల జీతాలు ఎక్కువగా ఉన్నాయి. సగటు స్త్రీల జీతాలు పురుషుల జీతాల కంటే 9.2% తక్కువగా ఉన్నాయి. ఇది సుమారు సంవత్సరానికి రూ.1.2 లక్షల వేతన వ్యత్యాసానికి సమానం. పురుషుల జీతాలు దాదాపు ఏటా రూ.12.9 లక్షలు అయితే మహిళా ఉద్యోగుల జీతాలు రూ.11.7 లక్షలుగా ఉన్నాయి. టాప్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉంది. అధిక కుటుంబ బాధ్యతలు, కెరీర్ బ్రేక్‌లు, కెరీర్ స్విచ్‌లు వంటి అంశాలు ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ కంపెనీల్లో పురుషుల జీతాలు 30-46% ఎక్కువగా ఉన్నాయి. టాటా కన్జ్యూమర్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా వంటి కంపెనీల్లో మహిళల వేతనాలు 20-73% ఎక్కువగా ఉన్నాయని డేటా తెలుపుతుంది. -
Onion Prices: మళ్లీ ఉల్లి లొల్లి షురూ..!
కొన్ని వారాల కొందట టొమాటో ధరలు ఏ స్థాయిని చేరుకున్నాయో చూశాం. కేజీ రూ.250 వరకు పలికిన వాటి ధరలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. ఇప్పుడు ఉల్లి రేట్లు పెరగడం ప్రారంభమైంది. దాంతో వీటి ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశంలో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నిత్యం వంటల్లో వాడే ఉల్లి ధరలు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి. దాంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వాటికి కొరత ఏర్పడింది. దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల కిలో నాణ్యమైన ఉల్లిపాయలు రూ.40-50 మధ్య విక్రయిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం..అపర కుబేరులకు ఝలక్) దీపావళి పండగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ధరల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై విధించే పన్నును ఆగస్టులో 40శాతం మేర పెంచింది. ఈ పన్ను ఏడాది చివరివరకు అమలవుతుంది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠస్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది. వర్షాకాలంలో కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు. కొన్ని చోట్లు ఉల్లిసాగు చేసినా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేల హెక్టార్లలో నేలకొరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దేశీయంగా ప్రతి నెలా సగటున 13లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పండుతుంది. 65శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే, నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40శాతం కోల్పోతాయి. కుళ్ళిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా. ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆహార ధరలు నియంత్రణలో ఉండాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉల్లి ధర కేజీకి రూ.50కి మించకుండా ఉండాలని చూస్తుంది. ఈ సారి ఖరీఫ్ పంట ఆలస్యంగా చేతికి రావటంతో పాటు పంట దిగుబడి తగ్గడంతో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను అరికట్టడానికి కేంద్రం మరింత జోక్యం చేసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. -
వారానికి జరిగే సైబర్ అటాక్‌లు ఎన్నంటే..
భారతదేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి వేగంగా పురోగమిస్తుంది. అయితే అందుకు అనువుగా డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల నిర్వహణ సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పొరుగు దేశాల్లోని శత్రువులు, స్కామర్లు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం..ఇండియాలోని సంస్థలపై సగటున గత ఆరు నెలల్లో వారానికి 2,157 సార్లు సైబర్ దాడులు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై సగటున 1,139 దాడులు జరిగాయి. ఇటీవల జరిగిన సింగపూర్ సైబర్ వీక్-2023 సమావేశంలో నిపుణులు మాట్లాడారు. భారతీయ సాంకేతిక నిపుణులు, వ్యాపార కార్యనిర్వాహకులు పరస్పరం సహకారం అందించుకుంటూ డేటా భద్రతపరంగా సమగ్ర వ్యవస్థను రూపొందించాలన్నారు. దేశ పురోగతికి ప్రధాన అంశాలైన ఐటీ పరిశ్రమలతోపాటు ఆరోగ్య సంరక్షణ, విద్య/ పరిశోధన, రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్, రవాణా వంటి రంగాలు సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు అనువుగా చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలిపారు. రోజురోజూ సైబర్ సెక్యూరిటీ చాలా క్లిష్టంగా మారుతుందని ఏపీఏసీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ గుల్లపల్లి చెప్పారు. కంపెనీల్లోని ఐటీ విభాగం తరచు సైబర్ సెక్యూరిటీని నిర్వహించాలని ఆయన సూచించారు. సంస్థలో సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని అమలు చేయడానికి బోర్డులు, మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి పని చేయాలన్నారు. -
బొమ్మా? బొరుసా? నిర్ణయించండిలా..!
క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా గెలుస్తుందా లేదా? వర్షం వస్తుందా రాదా? పేకలో జోకర్ మనకే పడుతుందా? అన్నీ అనుమానాలే! ఏమో.. కచ్చితంగా కావచ్చు.. కాకపోవచ్చు. కానీ దాన్ని తేల్చుకోవాలంటే కాయిన్‌ను పైకి వేసి ఏదో ఓ వైపు ఎంచుకుంటాం.. ఫలితం మనకు అనుకూలంగా వస్తే కొంత ఆనందాన్ని పొందుతుంటాం. అయితే కాయిన్ పైకి వేసినపుడు ఫలితం మనకూ, పోటీదారులకు అనుకూలంగా వచ్చే అవకాశం సమానంగా ఉంటుందని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ అది తప్పని కొన్ని పరిశోధనలు తేలుస్తున్నాయి. ఆమ్స్ట్రడమ్లో 48 మంది పరిశోధకులు 46 వివిధ కాయిన్లతో చేసిన ప్రయోగం సారాశం ప్రకారం..గాలిలో ఎగరేసిన కాయిన్‌పై బొమ్మా-బొరుసులు రావడానికి 50-50ఛాన్స్ ఉండదు. కాయిన్‌లోని బొమ్మని పైకి ఉంచి టాస్ వేస్తే అది గాల్లోకి వెళ్లి కిందకు చేరి తిరిగి బొమ్మపడే అవకాశం 51శాతం ఉందని తేలింది. దాదాపు 3లక్షల 50వేల సార్లు కాయిన్ గాల్లో ఎగరేసి ఈ ప్రయోగాన్ని చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. (ఇదీ చదవండి: అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా) ఇదిలా ఉండగా.. స్లాక్మార్కెట్లో పెట్టుబడులు అంతర్జాతీయ బౌగోళిక వ్యవహారాలు, కంపెనీ వ్యాపార స్వరూపం, అది విడుదల చేసేఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు యాజమాన్యం తీసుకుంటున్న అనేక అంశాలపై ఆధారపడి పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. గాల్లోకి విసిరిన కాయిన్ ఫలితం మనకు అనుకూలంగా రావొచ్చు..రాకపోవచ్చు. అదేవిధంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారి పెట్టుబడులకు రాబడులు రావొచ్చు..రాకపోవచ్చు. కంపెనీ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని పెట్టుబడులు పెడితే ఫలితం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఎగుమతులు, దిగుమతులు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాల మధ్యలోనూ అమెరికాతో వాణిజ్యం మెరుగ్గానే కొనసాగడం గమనార్హం. ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాతో భారత వాణిజ్య సంబంధాలు క్రమేపీ బలపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబరు మధ్య చైనాను వెనక్కునెట్టి యూఎస్‌కు ఇండియా అతిపెద్ద ట్రేడ్ పార్టనర్‌గా ఉద్భవించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితితో పాటు ఎగుమతులు, దిగుమతుల్లో భారీ క్షీణత ఏర్పడింది. అయినప్పటికీ భారత్‌కు అమెరికా ఆతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 11.3 శాతం మేర క్షీణించి 59.67 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వ తాత్కాలిక డేటా వెల్లడించింది. 2023 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అమెరికాకు ఎగుమతులు 38.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాదిలో 41.49 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఎగుమతులు తగ్గాయి. దిగుమతుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాది మొదటి ఆరు నెలల్లో 25.79 బిలియన్ డాలర్ల మేర భారత్ దిగుమతులు చేసుకోగా.. ఈసారి ఇది 21.39 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇక భారత్, చైనాల మధ్య వాణిజ్యం కూడా 3.56 శాతం తగ్గి 58.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో చైనాకు ఎగుమతులు 7.84 బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా 7.74 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు అంతకు ముందు ఏడాది 52.42 బిలియన్ డాలర్లు కాగా..ఇప్పుడు 50.47 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ఇండియా, అమెరికా మధ్య ఎగుమతులు, దిగుమతులు క్షీణిస్తున్నాయి. వృద్ధి రేటు త్వరలోనే సానుకూలంగా మారుతుందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
టెస్లా కారు రిపేర్ బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రపంచ ధనవంతుడైన ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా కార్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తుంటారు. అయితే ఇవి ఎలాంటి రిపేర్ రానంతవరకు సాఫీగానే ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా రిపేర్ వస్తే మాత్రం బిల్లు తడిసిమోపెడవుతుందనే వాదనలు ఉన్నాయి. ఇటీవల టెస్లా కారు ఓనర్ తన కారును రిపేర్ చేయించడానికి వెళ్తే ఏకంగా రూ.17.46లక్షలు బిల్లు వేసినట్లు హిండెన్‌బర్గ్ నివేదిక తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. టెస్లాకు సంబంధించిన 'స్కాటిష్ మోడల్ Y ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్' కారు కొనుగోలు చేసిన ఓనర్‌కు కంపెనీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వాహనాన్ని మరమ్మతు కోసం ఇవ్వగా.. టెస్లా వేసిన బిల్లు చూసి ఖంగుతిన్నాడు. ఏకంగా రూ.17.46 లక్షల బిల్లు వేశారు. నివేదిక తెలిపిన వివరాల ప్రకారం..భారీగా వర్షం కురుస్తున్న సమయంలో యజమాని కారు నడిపాడు. వాహనం తీసుకున్న కొత్తలో కొంతకాలం పాటు బాగానే నడిచినా వర్షంలో తడిసిన తర్వాత స్టార్ట్ అవలేదు. ఈవీని ట్రక్ ద్వారా వర్క్‌షాప్‌కు తరలించడానికి ఓనర్ ఐదు గంటలు వేచి చూడాల్సి వచ్చింది. టెస్లా కస్టమర్ సర్వీస్ కూడా అంతగా సహాయపడలేదని యజమాని పేర్కొన్నాడు. టెస్లా వర్క్‌షాప్ యాజమాన్యం ఈ విషయంపై స్పందించింది. బ్యాటరీలోకి నీరు ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ పాడైందని తెలిపింది. ఇది ప్రొపల్షన్ సిస్టమ్ పై ప్రభావం చూపినట్లు వివరించింది. టెస్లా అందించే వారంటీ పరిధిలోకి ఇది రాలేదని స్పష్టం చేసింది. అయితే యజమానికి రూ.17.46లక్షల రిపేర్ బిల్లు రావడంపై వర్క్‌షాప్ మేనేజర్ని నిలదీసినట్లు నివేదిక వెల్లడించింది. భారీగా బిల్లులు వసూలు చేస్తూ టెస్లా గతంలోనూ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి బిల్ మరింత షాకింగ్ గా ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కస్టమర్ సపోర్ట్ వల్ల అంతగా ఉపయోగం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
ఐడీబీఐ బ్యాంక్ నికర లాభం రూ.1,323 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను ఐడీబీఐ బ్యాంక్ రూ.1,323 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభంలో 60 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.6,066 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.6,924 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 16.51 శాతం నుంచి 4.90 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 1.15 శాతం నుంచి 0.39 శాతానికి దిగొచ్చింది. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన సమయానికి బ్యాంక్ ప్రమోటర్లయిన ఎల్ఐసీ, భారత ప్రభుత్వం వద్ద 94.72శాతం వాటా ఉంది. ఎఫ్ఐఐల వద్ద 0.40శాతం, డీఐఐల వద్ద 0.24శాతం, రిటైల్ ముదుపర్ల వద్ద 4.62శాతం వాటా ఉంది. -
ఆన్లైన్లో ఏవి ఎక్కువ కొంటున్నారంటే..
పండుగ సీజన్లో ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఆఫర్లు ప్రకటించాయి. అయితే కొందరు వారి ఆర్థికస్థోమత తగినట్లు ఆయా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కొన్నిసార్లు కొనే వస్తువులకు సరిపడా డబ్బు లేకపోయినా అప్పుచేసి మరీ వాటిని తీసుకుంటాం. అయితే కొంచెం ఆలస్యం అయినా ఎక్కువ మంది భారతీయులు ప్రీమియం వస్తువులనే తీసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే అందులో అధికంగా డిమాండ్ ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. ఆఫర్ సీజన్లో మొబైల్ ఫోన్ల కొనుగోళ్లకు ప్రత్యేకస్థానం ఉంది. అయితే ఈసారీ దాని ప్రస్థానం కొనసాగుతుంది. ప్రస్తుతం ఫ్యాషన్ వస్తువులు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. రెండు వర్గాలలోనూ ప్రీమియం ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో భాగంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ దశలో సేల్ ప్రారంభమైన మొదటి గంటలో సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారు. మొదటి 48 గంటల్లో విక్రయించిన ప్రతి ఐదు స్మార్ట్ఫోన్లలో నాలుగు 5జీ మోడళ్లు అని సర్వే తెలిపింది. ప్రీమియం స్మార్ట్ఫోన్లు గత ఏడాదితో పోలిస్తే 3 రెట్లు వృద్ధిని సాధించాయి. ల్యాప్‌టాప్‌లు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 40శాతం అధికంగా అమ్ముడయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ల విభాగంలో ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో పోలిస్తే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ 1.7 రెట్లు పెరిగింది. పండగ సీజన్ అమ్మకాల్లో భాగంగా 15లక్షల ఐఫోన్లను విక్రయించారు. ధరల తగ్గింపు, ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా అన్ని విభాగాల్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు తెలిసింది. -
ఏడాదిలో 42శాతం పెరిగిన కంపెనీ ఇదీ..
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విలువను 7.85 బిలియన్ డాలర్లు (రూ.65,000 కోట్లు)గా అమెరికా ఫండ్ మేనేజర్ ఇన్వెస్కో అంచనా వేసింది. ఈ ఏడాది జులై 31 నాటికి 5.5 బిలియన్ డాలర్లుగా స్విగ్గీ విలువను తేల్చిన ఇన్వెస్కో ప్రస్తుత విలువను ప్రకటించింది. గతంతో పోలిస్తే ప్రస్తుత అంచనా విలువ 42 శాతం ఎక్కువ. 2022 జనవరిలో స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. అప్పటితో పోలిస్తే తాజా అంచనా విలువ 30 శాతం తక్కువగానే ఉంది. ఆ సమయంలో ఇన్వెస్కో నేతృత్వంలో జరిగిన 700 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ ప్రక్రియ కోసం, స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్ల విలువగా పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే ఏడాదిలో పబ్లిక్ ఇష్యూకు రావాలని భావిస్తున్న స్విగ్గీ.. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు చర్యలు చేపడుతోంది. స్విగ్గీలో ఇన్వెస్కోకు 24,844 షేర్లు ఉన్నాయి. సంస్థ విలువలో మార్సును పరిగణనలోకి తీసుకోమని, వినియోగదార్ల సేవలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని స్విగ్గీ చెబుతోంది. అయితే స్విగ్గీ పోటీ సంస్థ జొమాటో విలువను గత జులైలో 7.7 బిలియన్ డాలర్లుగా లెక్కించడం గమనార్హం. ఆ తర్వాత జొమాటో షేరు 30 శాతం పెరగడంతో, ప్రస్తుతం ఆ సంస్థ విలువ ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా. -
ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, కాగ్నిజెంట్ భాగస్వామ్యం
ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా జనరేటివ్ ఏఐ సేవలందించేలా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కాగ్నిజెంట్ సీఈవోగా రవికుమార్ నియమితులైన తర్వాత పోటీ కంపెనీలకు చెందిన ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో కాగ్నిజెంట్ వ్యాపారాన్ని, కస్టమర్ల సంఖ్యను వేగంగా పెంచటమే లక్ష్యంగా రవి కుమార్ పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి వైదొలిగిన తర్వాత విశాల్ సిక్కా వియానై సిస్టమ్స్‌ను స్థాపించారు. ఇప్పుడు కాగ్నిజెంట్, వియానై సిస్టమ్స్ వినియోగదారులకు నేరుగా జనరేటివ్ ఏఐ సేవలను అందించేందుకు జతకట్టాయి. వియానై సిస్టమ్స్ కు సంబంధించిన హిలా ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫారమ్, కాగ్నిజెంట్ న్యూరో ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు ఏఐ సాంకేతికత ద్వారా వినియోగదారులకు సేవలను అందించనున్నాయి. -
బీపీసీఎల్, ఐఓసీకి రూ.3కోట్లు ఫైన్!
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)..భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు రూ.2కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు రూ.1కోటి మేర జరిమానా విధించింది. తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు జరిమానా విధించినట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని రిటైల్ అవుట్లెట్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ (వీఆర్ఎస్) ఇన్స్టాల్ చేయనందుకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్ స్టేషన్లలో వీఆర్ఎస్లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్ విధించలేదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో వీర్‌ఎస్‌ని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సీపీసీబీ నిర్దేశించిన సమయంలో వీఆర్ఎస్ను ఇన్స్టాల్ చేయనందుకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసు అందుకున్నట్లు బీపీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. -
ఆకాశ ఎయిర్‌కు బాంబు బెదిరింపు..185 మంది ప్రయాణికులు!
బ్యాగ్‌లో బాంబు ఉందని బెదిరించడంతో శనివారం ఆకాశ ఎయిర్ విమానాన్ని అత్యవసరంగా ముంబయికి మళ్లించారు. పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన ఆకాశ ఎయిర్ విమానాన్ని ఓ ప్రయాణికుడు తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత సదరు ప్రయాణికుడు సిబ్బందితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్పుడు విమానంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది వెంటనే కెప్టెన్‌కు సమాచారం అందించారు. అత్యవసరంగా ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా ప్రయాణీకుల బ్యాగ్‌లు పరిశీలించారు. విమానాశ్రయంలో దిగాక జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కన్పించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు బూటకమని తేలడంతో, విమానం తిరిగి ఢిల్లీకి బయలుదేరింది. ఘటనకు మందు సదరు ప్రయాణికుడు ఛాతీ సమస్యకు మెడిసిన్ తీసుకున్నట్లు తన కుటుంబ సభ్యులు అన్నారని సీఐఎస్ఎఫ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. -
ICICI Results: అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. 36 శాతం వృద్ధి
దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,558 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. స్టాండలోన్ పద్దతిలో రూ.10,261 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్ 4.31 శాతం నుంచి 4.53 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 2.76 శాతం నుంచి 2.48 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్ తెలిపింది. -
మదుపర్లను ఆకర్షించని గోల్డ్ ఈటీఎఫ్‌లు
ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్న సమయంలో మదుపర్లు బంగారంపై మొగ్గుచూపుతుంటారు. దాంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మదుపు చేస్తుంటారు. ఆగస్టు నెలలో ఈ ఈటీఎఫ్‌ల్లో గరిష్ఠంగా పెట్టుబడులు పెట్టారు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధర పెరుగుతుంది. దాంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గత నెలలో పసిడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి నికరంగా రూ.175 కోట్ల మేరకే పెట్టుబడులు వచ్చాయని భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (ఏంఎఆఫ్‌ఐ) వెల్లడించింది. ఆగస్టులో ఈ పెట్టుబడులు 17 నెలల గరిష్ఠమైన రూ.1028 కోట్లకు చేరాయి. జులైలో ఈ మొత్తం రూ.456 కోట్లుగా ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే వీలుండటం, ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగడం, వృద్ధి రేటు మందగించడంలాంటి కారణాల వల్ల ఇప్పటికీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగానే మదుపరులు భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య సగటున నెలకు రూ.298 కోట్ల మేరకు పెట్టుబడులు పసిడి ఈటీఎఫ్‌లలోకి వచ్చాయి. గత ఏడాది ఆగస్టులోనూ వీటిల్లోకి రూ.1,100 కోట్ల మేరకు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌లలో మదుపు చేస్తున్న పోర్ట్‌ఫోలియోల సంఖ్య 48.06 లక్షలుగా ఉంది. -
కోటక్ బ్యాంకుకు కొత్త సీఈఓ, ఎండీ నియామకం
దేశీయ దిగ్గజ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రాకు కొత్త సీఈఓ, ఎండీగా అశోక్ వాస్వానీ నియమితులయ్యారు. బ్యాంక్ ఎండీగా ఉదయ్ కోటక్ వైదొలిగిన తర్వాత తాజా నియామకం జరిగింది. వాస్వానీ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. షేర్ హోల్డర్లు ఆమోదం తెలపాల్సి ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. 2024 జనవరి 1లోగా అశోక్ వాస్వానీ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్యాంకింగ్ రంగంలో అశోక్ వాస్వానీకి దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది. గతంలో అంతర్జాతీయ బ్యాంక్ సిటీ గ్రూప్‌లో పనిచేశారు. బార్క్లేస్ బ్యాంక్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యూఎస్-ఇజ్రాయెల్ ఏఐ ఫిన్‌టెక్ పగాయా టెక్నాలజీస్ లిమిటెడ్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతేకాదు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ (యూకే) బోర్డు సభ్యులుగానూ ఉన్నారు. ప్రథమ్, లెండ్ హ్యాండ్ వంటి దాతృత్వ సంస్థల్లో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. కోటక్ బ్యాంక్ సీఈఓ, ఎండీగా నియమితులు కావడం పట్ల వాస్వానీ సంతోషం వ్యక్తంచేశారు. స్వదేశానికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ను నిలిపే ప్రయాణంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచస్థాయి బ్యాంకర్ అయిన అశోక్.. కోటక్ బ్యాంక్‌ను అద్భుతంగా తీర్చిదిద్దగలరని ఉదయ్ కోటక్ విశ్వాసం వ్యక్తంచేశారు. కోటక్ బ్యాంక్‌ను ఖాతాదారులకు అనుకూల సంస్థగా మార్చేందుకు అశోక్ అనుభవం అక్కరకొస్తుందని తాత్కాలిక ఎండీ, సీఈఓ దీపక్ గుప్తా పేర్కొన్నారు. -
టూర్స్ కోసం ఇండియన్స్ చేసే ఖర్చు ఇంతా..!
గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు విపరీతంగా పెరిగాయి. కొవిడ్‌కారణంగా కుంటుపడిన టూరిజం నుంచి వచ్చే రాబడులు ఊపందుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న భయాలు తొలగి భారత్ నుంచి విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈమధ్య భారతీయుల్లో టూర్స్ పట్ల ఉత్సాహం పెరుగుతోంది. ముఖ్యంగా నేటి యువతరం నాలుగు గోడల మధ్య బతకడానికి ఇష్టపడటం లేదు. ఖాళీ దొరికినప్పుడల్లా ట్రెక్కింగ్, విహారయాత్రలు, విదేశాలకు టూర్స్ ప్రణాళికలు వేస్తూ బిజీగా గడుపుతున్నారు. దాంతో దేశీయ పర్యాటక పరిశ్రమ వేగంగా దూసుకుపోతోంది. కొవిడ్ ముందు కంటే కూడా టూరిజం రంగంలో వస్తున్న ఆదాయం పెరుగుతుంది. కొవిడ్ మునుపుకంటే ప్రస్తుతం 173శాతం అధికంగా టూరిజం కోసం ఖర్చు చేస్తున్నారు. 2030 నాటికి భారత ట్రావెలర్స్ దాదాపు 410 బిలియన్ డాలర్లు(సుమారు రూ.32లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారని అంచనా. దాంతో ప్రపంచంలో పర్యాటకం కోసం అధికంగా వెచ్చించే నాలుగో దేశంగా ఇండియా నిలవనుందని గణాంకాలు చెబుతున్నాయి. 150 బిలియన్ డాలర్లు వెచ్చిస్తూ ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో ఆరో స్థానంలో కొనసాగుతోందని హౌ ఇండియా ట్రావెల్స్ పేరిట బుకింగ్స్ డాట్ కామ్, మెకిన్సే & కంపెనీ సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్లు సగటున 63 రోజులు, జపాన్ ప్రజలు 57 రోజులతో పోలిస్తే భారతీయులు టూర్స్ కోసం 29 రోజులు వెచ్చిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. భారతీయ పర్యాటకుల్లో 80 శాతం మంది బస చేసేందుకు రెస్టారెంట్లు, రూమ్ సర్వీస్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది. సంప్రదాయ మనాలీ, సిమ్లా వంటి ప్రాంతాలతో పాటు వారణాసి, గురుగ్రాం, కోయంబత్తూరు తరహా నగరాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది. గతేడాదికిగాను యూట్యూబ్ వీడియోలు చూసి తాము ట్రావెలింగ్ చేస్తున్నట్లు 91 శాతం మంది పర్యాటకులు చెప్పినట్లు బుకింగ్స్ డాట్ కామ్ నివేదిక పేర్కొంది. 85 శాతం మందిని ఇన్స్టాగ్రామ్ ప్రభావితం చేసినట్లు వెల్లడయింది. స్పోర్ట్స్, సమావేశాలు, మ్యూజికల్స్ వంటి ఇతర ఈవెంట్స్ పర్యాటకాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నట్లు సమాచారం. -
పైసా ఖర్చు లేకుండా.. కార్పొరేట్ ఫిజియోథెరపీ
విమ్స్ పేరు వినగానే రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు గుర్తుకొస్తాయి. ప్రశాంత వాతావరణం, కార్పొరేట్ స్థాయి పడకలు, ఐసీయూ గదులు, వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడి రోగుల సేవలకు అందుబాటులో ఉన్నాయి. అన్ని విభాగాల వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారు. అతి తక్కువ ధరలకు సీటీ స్కానింగ్, ఎక్స్‌రే, రక్త రీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు ఉచిత ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆరిలోవ: విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో కార్పొరేట్ స్థాయి ఆధునిక పరికరాలతో ఉచిత ఫిజియోథెరపీ సేవలను రోగులకు అందిస్తున్నారు. ఇటీవల స్పైనల్ అండ్ న్యూరో రీహేబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వైద్యాధికారులు ఇందులో ఉన్న ఆధునిక పరికరాలను ఉపయోగించి అవసరమైనవారికి ఫిజియోథెరపీ సేవల్ని ఉచితంగా అందిస్తున్నారు. వీటితో పాటు ఇక్కడ స్పీచ్ థెరపీ, ఆడియో థెరపీ అందుబాటులో ఉంది. కోమా, పక్షవాతంతో బాధపడిన అనంతరం పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. పక్షవాత రోగులకు ప్రత్యేక ఐసీయూ పక్షవాతంతో బాధపడుతున్నవారికి ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు చేశారు. ఇందులో ఆధునిక పడకలు అమర్చి ఇన్‌పేషెంట్ సేవలు అందిస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ సేవల్ని పొందాలంటే నెలకు కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. విమ్స్‌లో మాత్రం ఈ సేవలు పూర్తిగా ఉచితమేనని వైద్యులు చెప్తున్నారు. వీటితో పాటు లేజర్ థెరపీ, కంటిన్యూయస్ పాసివ్ మోషన్(సీపీఎం) థెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రో థెరపీ, సస్పెన్షన్ థెరపీ, మొబిలిటీ థెరపీ, ఇన్ఫ్రారెడ్(ఐఆర్ఆర్), ఆల్ట్రాసౌండ్, మజల్ స్టిమ్యులర్స్, ఇంటర్ ఫెరెన్షియల్ థెరపీ(ఐఎఫ్‌టీ), రోబోటిక్ గ్లౌజ్, టెన్స్, షార్ట్వేవ్ థెరపీ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న యంత్రాలు కార్పొరేట్ ఆస్పత్రులకు మించి, విమ్స్‌లో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. ట్రాక్షన్ మిషన్, సీపీ వాకర్, ఫింగర్ లేడర్, ఆల్ట్రా సౌండ్, ట్రెడ్ మిల్, స్పైన్ డీ ట్రాక్, మొబిలిటీ ట్రైనర్, స్టిమ్యులేటర్, ర్యాంప్ వాకర్, పేర్లాక్ బార్, స్టాటిక్ సైకిల్స్, షోల్డర్ వీల్, స్వెల్ బాల్, పెగ్ బోర్డు, బ్యాలన్స్ బోర్డు, డంబెల్స్, వోబుల్ బోర్డు, థ్రెడ్ బ్యాండ్ తదితర యంత్రాలు వినియోగిస్తున్నారు. వీటిని విజయవాడ, హైదరాబాద్, ముంబయ్ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి, ఇక్కడ ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక రోగులకు వరం ఈ కేంద్రంలో ఆరుగురు ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు మరికొందరు సహాయక సిబ్బంది ఉన్నారు. దీర్ఘకాలంగా ఎముకల వ్యాధులతో బాధపడుతున్నవారు, కీళ్ల నొప్పులు, మెడ నొప్పులు, వెన్నుపూస నొప్పులు, ఆర్థ్రరైటిస్ సమస్యలు, టెండాన్ సమస్య తదితర వాటితో బాధపడుతున్నవారికి అందుబాటులో ఉన్న ఆధునిక యంత్రాలను ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు ప్రమాదాలకు గురై, ఆపరేషన్ తర్వాత కాళ్లు, చేతులు కోల్పోయినవారికి రీహేబిలిటేషన్ కింద కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. పక్షవాత రోగులకు ప్రత్యేక థెరపీ ఇస్తున్నారు. ఉచిత సేవలను వినియోగించుకోండి విమ్స్‌లో ఈ మధ్యనే స్పైనల్ అండ్ న్యూరో రీహేబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, ఉచిత సేవలు అందిస్తున్నాం. ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచాం. ఇక్కడ ఉచితంగా అందించే థెరపీని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పొందాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్నవారి కోసం ప్రత్యేక ఐసీయూ సేవలు ఉచితంగా అందిస్తున్నాం. చెవిటి, మూగ బాధితులకు స్పీచ్, ఆడియో థెరపీ, కాక్లియర్ ఇంప్లాంటేషన్ జరిగినవారికి ప్రత్యేక స్పీచ్ థెరపీ అందిస్తున్నాం. ఆరుగురు ఫిజియోథెరపీ వైద్యులతోపాటు సహాయక సిబ్బందితో సేవలు అందిస్తున్నాం. – డాక్టర్ కె.రాంబాబు, డైరెక్టర్, విమ్స్ -
మెగా మిలిటరీ విన్యాసాలకు సిద్ధమవుతున్న ఇండియన్ నేవీ
ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణం, గ్లోబల్‌గా జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో భారతనౌకాదళం తొమ్మిది రోజులపాటు నావికా విన్యాసాలు చేపట్టనుంది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అరేబియా మహాసముద్రంలో జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం 50కి పైగా దేశాల భాగస్వామ్యం కానున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా మిలిటరీ విన్యాసాలు పెంచడం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న 'మిలన్' విన్యాసాల్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటాయని అధికారులు తెలిపారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ విన్యాసాల్లో భాగంగా అధునాతన వైమానిక రక్షణ కార్యకలాపాలు, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, యాంటీ-సర్ఫేస్ డ్రిల్లు ఉంటాయని సమాచారం. మిలన్‌ను 1995లో భారత నావికాదళం ప్రారంభించింది. 2022లో 39 దేశాలు ఈ మిలన్లో పాల్గొన్నాయి. -
Amazon: అమెజాన్ వేర్‌హౌజ్‌లో రోబోలు!
అమెజాన్ సంస్థ తన వేర్‌హౌజ్‌ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టింది. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్‌హౌజ్‌లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్ వెల్లడించింది. డిజిట్ అనే రెండు కాళ్ల రోబో అవలీలగా వస్తువులను తీసుకుని లిఫ్ట్ చేస్తుందని అమెజాన్ చెప్పింది. డిజిట్ 5.9 అడుగులు. 65 కిలోల బరువు ఉండి రెండు కాళ్లతో నడుస్తుంది. ప్రస్తుతం వేర్‌హౌస్‌లో ఖాళీగా ఉన్న బాక్సులను తరలించేందుకు ఈ రోబోలను వాడుతున్నారు. ప్రస్తుతం అమెజాన్‌లో 15లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, రోబోల ప్రవేశంతో వారి భరోసాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది. అయితే రోబోల ఎంట్రీతో కొన్ని ఉద్యోగాల అవసరం లేకపోయానా, ఇవి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయని అమెజాన్ రోబోటిక్స్ చీఫ్ టెక్నాలజిస్ట్ టై బ్రాడీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆటోమేషన్‌పై అమెజాన్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అమెజాన్ ఆటోమేషన్ ప్రక్రియ వల్ల కొలువుల్లో కోత పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఫుల్ఫిల్మెంట్ సెంటర్లలో వందలాది ఉద్యోగాలు కనుమరుగయ్యాయని బ్రిటన్ ట్రేడ్ యూనియన్ జీఎంబీ నిర్వాహకులు స్టువార్ట్ రిచర్డ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక డిజిట్ రోబోను ఆరేగాన్కు చెందిన స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. -
Tesla: ఒక్కరోజులోనే రూ.1.30లక్షల కోట్ల సంపద ఆవిరి
ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్(ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ సంపద ఒక్కరోజులోనే భారీగా రూ.1.30లక్షల కోట్లు ఆవిరైంది. 2023-24 రెండో త్రైమాసికం జులై-సెప్టెంబర్‌కు సంబంధించి టెస్లా సంస్థ బలహీన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో అక్టోబర్ 19న కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీనితో ఈ సంస్థలో 13 శాతం వాటాలున్న ఎలాన్ మస్క్ కూడా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. టెస్లా షేర్ విలువ అక్టోబరు 19న ఏకంగా 9 శాతం నష్టపోయింది. దాంతో మస్క్ సంపద కూడా అదే రీతిలో 16.1 బిలియన్ డాలర్లు(రూ.1.30 లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ఇప్పటికి 210 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మస్క్ సంపద దాదాపు 70 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రత్యర్థి సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని రాణించేందుకు టెస్లా గత కొన్ని నెలలుగా కార్ల ధరలను భారీగా తగ్గిస్తూ వచ్చింది. దీంతో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం మేర క్షీణత నమోదైంది. ఈ నేపథ్యంలోనే టెస్లా షేర్లు భారీగా పతనానికి గురయ్యాయి. వడ్డీరేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని మస్క్ వ్యాఖ్యానించారు. ఈ కారణంతోనే విక్రయాలు నెమ్మదించాయని పేర్కొన్నారు. అయితే సంస్థకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా సరే.. తమ కస్టమర్లకు అందించాల్సిన 18లక్షల కార్లను నిర్ణీత గడువులోగా డెలివరీ చేస్తామని టెస్లా ప్రకటించింది. -
Stock Market: రూ.435కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్ల విక్రయం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్, కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కంపెనీలో రూ.435 కోట్ల విలువైన తమ వాటాలను విక్రయించారు. అక్టోబర్ 19న ఓపెన్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లను అమ్మినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు. ఎస్డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్ వద్ద ఉన్న 2,37,04,350 ఇన్ఫోసిస్ షేర్లలో 23,70,435 షేర్లను ఒక్కో షేరుకు రూ.1,433.51 చొప్పున విక్రయించారు. దాని విలువ రూ.339.80 కోట్లు. దాంతో ప్రస్తుతం తన వద్ద 2,13,33,915 ఇన్ఫీ షేర్లు ఉన్నాయి. ఎస్డీ శిబులాల్ కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కలిగిఉన్న 66,79,240 షేర్లలో 6,67,924 షేర్లను రూ.1,432.96 చొప్పున అమ్మారు. దాని విలువ మొత్తం రూ.95.71 కోట్లు. ఇద్దరు విక్రయించిన షేర్ల విలువ దాదాపు రూ.435 కోట్లుగా ఉంది. అయితే ఈ షేర్లను ఎవరు కొనుగోలు చేశారో తెలియరాలేదు. ఎస్డి శిబులాల్ స్వయంగా 58,14,733 షేర్లను కలిగి ఉన్నారు. ఆయన భార్య కుమారి షిబులాల్ వద్ద 52,48,965 షేర్లు, కుమార్తె శృతి శిబులాల్ వద్ద 27,37,538 షేర్లు ఉన్నాయి. -
Layoffs: నోకియా సంచలన నిర్ణయం..14వేల మందికి ఉద్వాసన!
కార్పొరేట్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం పేరిట ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఐటీ సెక్టార్ మాత్రమే కాకుండా ఇతర రంగాలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికే యోచనలో ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ వేల మంది సిబ్బందికి షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. నోకియా కంపెనీ ఆర్థికంగా పుంజుకోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఏకంగా తన కంపెనీలో పనిచేస్తున్న 14 వేల మందిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఉత్తర అమెరికాలో సంస్థ పరికరాలకు డిమాండ్ తగ్గడంతో నోకియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మూడో త్రైమాసికంలోనూ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. దీంతో రానున్నరోజుల్లో కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగుల కోత విధించనుంది. ప్రస్తుతం నోకియాలో 86 వేల మంది పని చేస్తున్నారు. -
డాక్టర్ అవ్వాలనుకున్న ఇస్రో ఛైర్మన్..!
సంక్లిష్టమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని సుసాధ్యం చేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఛైర్మన్ సోమనాథ్ తాను చిన్నతనంలో డాక్టర్ కావాలనుకున్నానని చెప్పారు. ఇటీవల చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ యూనివర్శిటీలో జరిగిన వైద్యుల సదస్సులో ఆయన్ ప్రసంగించారు. ఆయనకు బయాలజీ అంటే ఇష్టమనీ, తాను చిన్ననాటి నుంచి జీవశాస్త్రంలో టాపర్‌గా ఉండేవాడినని గుర్తుచేసుకున్నారు. డాక్టర్ కావాలనే ఆకాంక్ష బలంగా ఉండేదన్నారు. అయితే వైద్య వృత్తి చాలా కఠినమైందని, ఇంజినీరింగ్ లేదా గణితాన్ని ఎంచుకోవాలని ఆయన తండ్రి చెప్పినట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఎలాంటి స్పెషలైజేషన్ చేయలేదని సోమనాథ్ వెల్లడించారు. తాను మెకానికల్ ఇంజినీర్ కోర్సు చేస్తున్నపుడు ప్రొపల్షన్‌పై ఆసక్తి కలిగిందన్నారు. వైద్య నిపుణులు సాఫ్ట్వేర్, ఏఐ టూల్స్ గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. టెక్నాలజీ వినియోగం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. -
ఓరియంట్ సిమెంట్‌ను కొనబోతున్న అదానీ!
సిమెంటు రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగేందుకు అదానీ గ్రూప్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పలు కంపెనీలను సొంతం చేసుకుంది. అదే జోరులో..ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఓరియంట్ సిమెంట్ ప్రమోటరు సి.కె.బిర్లా కంపెనీలో తన వాటా అమ్మేందుకు అదానీ గ్రూపు ఛైర్మన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అంబుజా, సంఘీ, ఏసీసీ వంటి ప్రధాన సిమెంటు కంపెనీలను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైతే అదానీ గ్రూపునకు ప్రయోజనం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఏసీసీ కార్యకలాపాలకు ఓరియంట్ సిమెంట్ ప్లాంట్లు ఉపయోగపడతాయని అంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ లిమిటెడ్ స్టాక్ కొన్ని రోజులుగా పాజిటివ్‌లో ట్రేడవుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకు చాలా సిమెంట్ అవసరం అవుతుంది. రోడ్లు, రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, ఇళ్లను వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. కానీ సిమెంట్ తలసరి వినియోగం చైనాలో 1,600 కిలోగ్రాములు, భారత్ 250 కిలోగ్రాములుగా ఉంది. -
Cyber Attack: యూట్యూబ్ లైక్ కొడితే రూ.77 లక్షలు దోచుకున్నారు!
ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్లైన్ జాబ్స్, పార్ట్‌టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది. యూట్యూబ్ లైక్‌ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్‌పుర్‌కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్‌ను లైక్చేసి స్క్రీన్ షాట్లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు. తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్‌పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు. -
ప్రముఖ సంస్థపై కేసులు.. ఉత్పత్తులపై క్యాన్సర్ ఆరోపణలు!
డాబర్ కంపెనీకి సంబంధించిన మూడు అనుబంధ సంస్థలపై యూకే, కెనడాలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. సంస్థ తయారుచేస్తున్న హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డాబర్ కంపెనీ ఆయా దేశాల్లో ఈ ఉత్పత్తులను వివిధ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలపై ఇప్పటికే 5,400 కేసులు నమోదయ్యాయి. డాబర్ అనుబంధ సంస్థలైన నమస్తే లేబొరేటరీస్, డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్, డాబర్ ఇంటర్నేషనల్ సంస్థలపై వివిధ కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీనికి తోడు ఇటీవల డాబర్ ఇండియా రూ.320.6 కోట్లకు జీఎస్టీ డిమాండ్ వడ్డీ, జరిమానా నోటీసును అందుకుంది. క్యాన్సర్ ఆరోపణలపై కంపెనీ స్పందిస్తూ.. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సరైన పరిశోధన చేయకుండానే అనుబంధ సంస్థలపై కేసులు పెట్టారని పేర్కొంది. కేసుల పరిష్కారానికి కంపెనీ లీగల్ వాభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో డాబర్ స్టాక్స్ మార్కెట్లో నష్టపోయాయి. అయితే ఈ అంశం వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ పేర్కొంది. డాబర్..చ్యవన్‌ప్రాష్, హోనిటస్ దగ్గు సిరప్, లాల్ దంత్ మంజన్ టూత్‌పేస్ట్, అశోకరిష్ట టానిక్, రియల్ జ్యూస్‌లు, ఓడోమాస్, వాటికా హెయిర్ ప్రొడక్ట్స్, పుదిన్ హర, హజ్మోలా వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. -
Israel Hamas war: యాపిల్ వాచ్ ద్వారా కూతురి మృతదేహాన్ని గుర్తించిన తండ్రి..!
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా మరణించిన ఓ యువతి మృతదేహాన్ని ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా గుర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు అకస్మికంగా దాడిచేశారు. ఒకవైపు రాకెట్లుతో, మరోవైపు తుపాకులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనలో మెల్లనాక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఇయల్ వాల్డ్‌మాన్ కుమార్తె డేనియల్ మరణించారు. స్నేహితుడితో కలిసి ఇజ్రాయెల్‌లోని ఓ మ్యూజిక్ ప్రోగ్రాంకు వెళ్లిన డేనియల్ హమాస్ దాడిలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అనంతరం డేనియల్ ఫోన్ నుంచి వాల్డమన్ ఫోన్‌కు అత్యవసర కాల్ వచ్చింది. కానీ ఎటువంటి సమాచారం అందలేదు. అయితే కుమార్తెను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకొని ఉంటారని తొలుత భావించారు. అనంతరం కుమార్తె వినియోగిస్తున్న ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా లోకేషన్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు డేనియల్ ఆపిల్ వాచ్ నుంచి సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ అందిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. కుమార్తె మృతదేహం కనిపించింది. ఆమెతోపాటు వెళ్లిన డేనియల్ స్నేహితుడు మృతదేహం కూడా అక్కడే కనిపించింది. వారిద్దరికి త్వరలో పెళ్లి చేయాలని భావించినట్లు వాల్డమన్ తెలిపారు. అంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డేనియల్ ఐఫోన్లో క్రాష్ డిటెక్షన్ కాల్ టెక్నాలజీ ఉందని, అందువల్ల ప్రమాదం జరిగిన వెంటనే తనకు అత్యవసర కాల్ వచ్చినట్లు వాల్డమన్ వెల్లడించారు. ఆ కాల్ రావడంతోనే తమ కుమార్తెను వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలిపారు. (బైక్‌పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్..సీఈవో ఏమన్నారంటే!) యాపిల్ ఐఫోన్, వాచ్‌లో ఉన్న క్రాష్ డిటెక్షన్ కాల్ ఫీచర్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా అందించిన ఫోన్ నంబర్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఆ ప్రాంతం లోకేషన్‌ను కూడా షేర్ చేస్తుంది. ఫలితంగా తమ ఆత్మీయులను త్వరగా కాపాడుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. -
జోరందుకున్న కార్పొరేట్ ఆదాయాలు
ముంబై: దేశీ కార్పొరేట్ ఆదాయాలు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో జోరందుకున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. 8–10 శాతం మధ్య టర్నోవర్ పుంజుకుంటున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో జులై–సెప్టెంబర్(క్యూ)లో లాభాల మార్జిన్లు సైతం మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. గత నాలుగు త్రైమాసికాలతో పోలిస్తే తొలిసారి దేశీ కంపెనీల ఆదాయాల్లో పటిష్ట వృద్ధి నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఆటోమొబైల్స్, కన్స్ట్రక్షన్, ఐటీ రంగాలు టర్నోవర్‌లో వృద్ధికి దోహదపడుతున్నట్లు పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్–జూన్(క్యూ1)లో ఆదాయం 7 శాతం బలపడినట్లు ప్రస్తావించింది. బ్యాంకింగ్, చమురు రంగాలను మినహాయించి 300 కంపెనీలను తాజా నివేదికలో విశ్లేషించినట్లు క్రిసిల్ వెల్లడించింది. ఆటో, రిటైల్ జోరు నివేదిక ప్రకారం వినియోగదారు విచక్షణానుగుణ(కన్జూమర్ డిస్క్రెషనరీ) ప్రొడక్టులు, సర్వీసులవైపు దేశీ కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధి ప్రయాణించింది. ప్రధానంగా ఆటోమొబైల్, రిటైల్ రంగాలు ప్రధానపాత్ర పోషించగా.. నిర్మాణ సంబంధ విభాగాలు సైతం జత కలిశాయి. రహదారులు, రైల్వే శాఖల పెట్టుబడుల ముందస్తు కేటాయింపులలతో నిర్మాణ రంగ కంపెనీలు లబ్ది పొందినట్లు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ అనికెట్ డాని పేర్కొన్నారు. అయితే వ్యవసాయ రంగంతో ముడిపడిన ఎరువులు, క్లోర్ ఆల్కలీస్, పెట్రోకెమికల్స్, కమోడిటీ కెమికల్స్, అల్యూమినియం తదితర ఇండస్ట్రియల్ కమోడిటీలు నీరసించకుంటే కార్పొరేట్ ఆదాయాలు మరింత జోరు చూపేవని నివేదిక అభిప్రాయపడింది. మొత్తం ఆదాయంలో 70 శాతానికి ప్రాతినిధ్యంవహించే 9 రంగాలు వృద్ధిని అందుకుంటున్నాయని వివరించింది. ఇక లాభాల విషయంలో నిర్వహణ లాభ మార్జిన్లు గతేడాది(2022–23) రెండో త్రైమాసికంలో నమోదైన 17.2 శాతంతో పోలిస్తే 20 శాతానికి మెరుగుపడినట్లు తెలియజేసింది. క్యూ1లో ఇవి 20.5 శాతంకాగా.. త్రైమాసికవారీగా స్వల్ప వెనకడుగు వేసినట్లు పేర్కొంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, వర్షాభావం వంటి అంశాలు ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో గ్రామీ ణ ప్రాంతాల డిమాండును ప్రభావితం చేయవచ్చని అంచనా వేసింది. -
Ramoji : రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది?
మార్గదర్శి చిట్‌ఫండ్ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది. అయితే అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు? రికార్డుల్లో ఏముంది? హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్‌గా చేరారు. ఏప్రిల్ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్, నవంబర్ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్ రిసివెబుల్స్ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.20.20కోట్లు డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.36.32కోట్లు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(తమిళనాడు)-రూ.50లక్షలు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(కర్ణాటక)-రూ.50లక్షలు మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్-రూ.52.02లక్షలు మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.75లక్షలు ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.99లక్షలు బాలాజీ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.65.06లక్షలు ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష రామోజీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.2.06కోట్లు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.26లక్షలు మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.44.77కోట్లు ఉషోదయ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1.80కోట్లు రామోజీ టూరిజం గేట్‌వే ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.9.44కోట్లు మార్గదర్శి హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.3.88కోట్లు మాన్పవర్ సెలక్షన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష వెరైటీ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.1లక్ష బాల్‌భారత్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష, బాల్‌భారత్ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు రామోజీ కిరణ్ ఫిల్మ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.50లక్షలు ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.24.87కోట్లు. ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్ విలువ చాలారెట్లు ఎక్కువ. ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తనకు తాను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ గా అభివర్ణించుకునే రామోజీ.. ఈ సంస్థల ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రుపాయలను పక్కదారి పట్టించారు. ఇదేమంటే HUF పేరిట తమకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని స్వయంగా బుకాయించారు. ఇప్పటివరకు ఆ జడ్జి ఎవరో బయటపెట్టలేదు ఈనాడు భవనాల కోసం వేర్వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వాటిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో పడ్డారు విశాఖలో లీజుకు తీసుకున్న భవనాన్ని రోడ్డు ఎక్స్ టెన్షన్ లో భాగంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ మొత్తం బిల్డింగ్ ఓనర్ కు చెందాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కాస్తా తన జేబులో వేసుకున్నారు రామోజీ. ఇదేమని అడిగిన ఓనర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఓ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీ.. దీని కింద ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడో లెక్కే లేదు. కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. ఇదేంటని అడిగిన పేద రైతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్నో సార్లు ఫిల్మ్ సిటీ ముందు రైతులు, కమ్యూనిస్టులు, సామాన్యులు ధర్నాలు చేసినా.. వాటన్నింటిని తొక్కించేశాడు. చిట్ ఫండ్స్ పేరిట జనం డబ్బులను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించాడు. నిబంధనల ఉల్లంఘించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు లేవంటూ కొత్త పాట అందుకున్నాడు. అంతే తప్ప తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పుకోలేదు. చంద్రబాబుతో బంధం పెరిగిన తర్వాత ముఖ్యంగా 1999-2004 మధ్య కాలంలో రామోజీ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఏ జీవో తయారయినా.. అది విడుదల కాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ కార్యాలయానికి ఒక కాపీ ఫ్యాక్స్ రూపంలో వచ్చేది. రామోజీ దర్పానికి ఇది కేవలం మచ్చుతునక. పచ్చళ్ల తయారీలో ప్రామాణికంగా లేవని, అందులో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలెన్నో ఉన్నాయని ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పరిశోధనల్లో తేల్చినప్పటికీ.. వాటిని విజయవంతంగా బయటకు రాకుండా చూసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఎల్లో మీడియా పేరిట చంద్రబాబు కోసం ఒక్కటయినా.. పత్రికలే.. ఒకప్పుడు రామోజీకి వ్యతిరేకంగా అక్రమాలన్నింటిని బ్యానర్లుగా అచ్చేసి వదిలారు. ఇక ఇటీవల బయటికొచ్చిన యూరీ రెడ్డి ఉదంతం మరింత విచిత్రం. తుపాకీతో బెదిరించి వారి కుటుంబానికి కేటాయించిన మార్గదర్శి వాటాలను రామోజీరావు బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. అయితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్‌కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే..288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడం రామోజీకే చెల్లుతుంది. ఉన్నదాంతో తృప్తి పడకుండా అన్నీ నాకే కావాలనే దోరణితో బెదిరింపులు, దైర్జన్యాలకు ఒడిగట్టడం వెనక ఆంతర్యం తనకే తెలియాలి. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల బాటపట్టాయి. సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమై చివరికి భారీ నష్టాలపాలయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 140 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 521 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 366 పాయింట్లు నష్టపోయాయి. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేస్తున్న వేళ మార్కెట్ నిపుణులు కంపెనీల ఆదాయాలు ప్రతికూలంగా ఉంటాయని అంచనాలు వేసిన వేళ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మెుదలైంది. దీనికి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు భారీ నష్టాలకు దారితీశాయి. బ్యాంకింగ్, పవర్ రంగాల్లోని కంపెనీలు ప్రధానంగా మార్కెట్లను నష్టాలోకి లాగాయి. ఫార్మా స్టాక్స్ లాభాల్లో ట్రేడయ్యాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, మారుతీ, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాలతో పయణించాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, విప్రో, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
Jio financial services: ఇకపై రిలయన్స్ జియో డెబిట్ కార్డులు!
రిలయన్స్ జియో టారిఫ్ పరంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ దెబ్బతో అదే రంగంలోని కొన్ని కంపెనీలు కుదేలయ్యాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నద్ధమవుతుంది. రిలయన్స్ ఫైనాన్షియల్ మార్కెట్లోనూ తన సత్తా చాటాలనుకుంటోంది. పేమెంట్ విభాగం సేవింగ్స్ అకౌంట్లను, బిల్ పేమెంట్ సర్వీసులను సంస్థ రీలాంచ్ చేసింది. త్వరలో డెబిట్ కార్డులు కూడా తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో ఆటో, హోమ్లోన్లను కూడా జారీ చేయనుంది. ఇటీవల సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కొన్ని అంశాలను వెల్లడించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా ఉన్న 300 స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై రుణాలను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి వ్యక్తిగత రుణాలు అందిస్తుంది. త్వరలో వ్యాపారులకు సైతం రుణాలు జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 24 బీమా సంస్థలతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జతకట్టింది. తన ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఓ యాప్‌ను సైతం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సిద్ధం చేస్తోంది. -
పబ్లిక్ ఇష్యూ ద్వారా హీరో ఫిన్‌కార్ప్ రూ.4వేల కోట్లు సమీకరణ!
ప్రముఖ దిగ్గజ కంపెనీ హిరో మోటోకార్ప్ ఆటోమోబైల్ రంగంలో సేవలు అందించడంతో పాటు ఫైనాన్స్ రంగంలోనూ తన సత్తాచాటేందుకు సిద్ధం అయింది. హీరో మోటోకార్ప్ ఆర్థిక సేవల విభాగమైన హీరో ఫిన్‌కార్ప్ రూ.4,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో 2024లో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూపై సలహాలు ఇచ్చేందుకు ఎనిమిది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను సంస్థ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జెఫ్రీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, యూబీఎస్, ఎస్బీఐ కేపిటల్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయని ఓ వార్త మీడియాలో ప్రచురించారు. ప్రతిపాదిత ఐపీఓలో భాగంగా కొత్త షేర్ల జారీ, ప్రస్తుత వాటాదార్ల షేర్ల విక్రయం ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హీరో ఫిన్‌కార్ప్‌లో హీరోమోటో కార్ప్ సంస్థకు 40 శాతం వాటా ఉంది. ముంజల్ కుటుంబం చేతిలో 35-39 శాతం వాటా ఉండగా.. అపోలో గ్లోబల్, క్రిస్ కేపిటల్, క్రెడిట్ సూయిజ్, హీరో మోటోకార్ప్‌నకు చెందిన కొన్ని డీలర్ల సంస్థల వద్ద మిగిలిన వాటా ఉంది. 1991లో హీరో ఫిన్‌కార్ప్ బ్యాంకింగేతర ఆర్థిక సేవల కంపెనీగా ఏర్పడింది. -
బైక్‌పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్..సీఈవో ఏమన్నారంటే!
ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో, సామాజిక్ మాధ్యమాల్లో ఫేమస్కావాలని యువతకు ఎంతో ఆశగా ఉంటుంది. అందుకు ఎన్నో మార్గాలను ఎంచుకుని ప్రయత్నాలు చేస్తారు. అందుకు అనుగునంగా కొందరు అనుకున్న విధంగా సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకుంటారు. అయితే ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ సేవల సంస్థ జొమాటో పేరును వాడుకొని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, పాపులర్ అయ్యేందుకు వింత ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి జనాల దృష్టిని ఆకర్షించాలని జొమాటో డ్రెస్ కోడ్‌లో యమహా R15 బైక్‌తో రోడ్డుపై చక్కర్లు కొట్టిన సంఘటన ఇండోర్‌లో జరిగింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో జొమాటో పాపులర్ అయింది. అయితే జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వారు ఎక్కువగా అబ్బాయిలే ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం ఓ స్టైలిష్ బైక్‌పై జొమాటో బ్యాగ్, డ్రైస్ ధరించి రోడ్లపై రౌండ్లు వేస్తూ నెట్టింట్లో వైరల్ అయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగినట్లుగా ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ఇది జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ దృష్టికి వెళ్లింది. ఈ వీడియోకు సంబంధించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. జొమాటోకు దీనితో ఎలాంటి సంబంధం లేదన్నారు. హెల్మెట్ లేని బైక్ రైడింగ్‌ను తాము ప్రోత్సహించబోమని చెప్పారు. తమకు ఇండోర్‌లో మార్కెటింగ్ హెడ్ లేరన్నారు. అయితే మహిళలు ఇలా ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా మారడంలో తప్పు లేదని చెప్పారు. View this post on Instagram A post shared by I N D O R E - R E E L G R A M (@indore_reelgram.official) -
ఇన్ఫోసిస్ సుధామూర్తి పేరుతో వసూళ్లు.. పూజారి అరెస్ట్!
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్.నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పేరుతో డబ్బు వసూళ్లు చేస్తున్న బెంగళూరుకు చెందిన అరుణ్‌కుమార్(34) అనే పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి బెంగళూరు సమీపంలోని మల్లేశ్వరంలో అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు జయానగర్ పోలీసులు తెలిపారు. అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలోని కన్నడ కూట నుంచి అరుణ్‌కుమార్ రూ.5 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నిర్వహించబోయే కన్నడ కూటాలో సుధామూర్తిని ముఖ్య అతిథిగా తీసుకొస్తానని చెప్పి వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. అయితే సదరు సంస్థ నుంచి ఏప్రిల్‌లో వచ్చిన ఆహ్వానాన్ని సుధామూర్తి తిరస్కరించారు. అయిన్పటికీ ఆమె సమావేశానికి హాజరవుతున్నట్లు ఓ మహిళ ఫొటోలు, వీడియోలను వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాలోని మిల్పిటాస్లో సెప్టెంబరు 26న సేవా ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ సోషల్ మీడియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ డాక్టర్ సుధామూర్తి’ ఈవెంట్‌ను తప్పడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకు మరో మహిళ కారణమని తెలిపారు. ఆ ఈవెంట్‌కు టిక్కెట్ ధర రూ.3,330 నిర్ణయించినట్లు చెప్పారు. -
ఆన్లైన్ షాపింగ్‌లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్‌లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్‌లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్‌తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్‌ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్‌నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
Infy New Campus: సీఎం జగన్ తోడ్పాటు హర్షణీయం: ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్
ఆంధ్రప్రదేశ్‌లో సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్న సీఎం జగన్ చేస్తున్న కృషి హర్షణీయం అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్ రాయ్ అన్నారు. సీఎం జగన్ వైజాగ్‌లోని రుషికొండలో సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలంజన్ రాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విశాఖపట్నం ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అందిస్తున్న మద్దతుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డిజిటల్ వంటి సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. సంస్థ భవనాన్ని 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1,000 మంది ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ కోసం అన్ని వసతులు కల్పించేలా దీన్ని రూపొందించామన్నారు. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముగిసిన గత వారం మార్కెట్‌తో పోలిస్తే సెన్సెక్స్ 125 పాయింట్ల నష్టంతో 66,166 వద్దకు చేరింది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 19,731లో ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 83.29 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎం అండ్ ఎం, టైటాన్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లే, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి టెక్ స్టాక్స్‌లో వచ్చిన అమ్మకాల సెగ సూచీలను కిందకు లాగింది. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్ల్లోనే స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలూ స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతోందన్న సంకేతాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తోందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం ఇటీవలి ధోరణికి భిన్నంగా రూ.317.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.102.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సియెట్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జై బాలాజీ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓరియెంట్ హోటల్స్, యాత్రా ఆన్లైన్ కంపెనీలు ఈ రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. -
పెట్టుబడుల ఆకర్షణకు సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం: లారస్ సీఈఓ
పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న కృషి అభినందనీయని లారస్ సీఈఓ చావ సత్యనారాయణ కొనియాడారు. విశాఖ పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలోని లారస్- 2 యూనిట్‌ను సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లారస్ సీఈఓ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్య, వైద్య రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు దేశానికే ఆదర్శమన్నారు. అచ్యుతాపురంలో రూ.460 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్ - 2 ద్వారా 1200 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా రూ.850 కోట్లతో నిర్మించే రెండు యూనిట్లు ద్వారా రానున్న రోజుల్లో మరో 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతానికి లారస్ లో సుమారు ఐదువేల మంది ఉన్నారని, కొత్తగా 2000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. నాడు-నేడు ద్వారా రాష్ట్రంలో వివిధ రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు ఆదర్శప్రామంటున్న లారస్ ల్యాబ్స్ సీఈఓ చావ సత్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి. -
పీఎల్ఐ ద్వారా ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు రూ.1000 కోట్లు
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) సాధికార కమిటీ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీలకు రూ.1000 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం లభించినట్లు అధికారులు తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద మొత్తం రూ.3,400 కోట్ల క్లెయిమ్‌లు రాగా.. 2023 మార్చికి ప్రభుత్వం రూ.2,900 కోట్లు పంపిణీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఇదే తొలి నగదు పంపిణీ. ఎలక్ట్రానిక్ తయారీ, వైట్ గూడ్స్, జౌళి, ఔషధ పరికరాల తయారీ, వాహన, స్పెషాలిటీ స్టీల్, ఆహార ఉత్పత్తులు, సోలార్ పీవీ మాడ్యుల్స్, అడ్వాన్డ్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్స్, ఔషధ వంటి 14 రంగాలకు పీఎల్ఐ పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశీయ తయారీ, ఉద్యోగాల సృష్టి, ఎగుమతులకు ఊతమిచ్చేందుకు 2021లో ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది. పీఎల్ఐ పథకం కింద ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న 32 భారీ సంస్థలకు ఆమోదం లభించింది. ఇందులో 10 కంపెనీలు మొబైల్ తయారీ సంస్థలే. ఈ పథకం కింద అదనంగా రూ.10లక్షల కోట్ల ఉత్పత్తి; 7 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా. -
TCS Recruitment Scam: లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!
దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 16 మందిపై వేటు వేసింది. వారిని విధుల నుంచి తొలగించింది. కంపెనీతో వ్యాపారం సాగిస్తున్న ఆరుగురు విక్రేతలపై నిషేధం విధించింది. లంచాలు తీసుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నారనే స్కామ్‌లో వీరి పాత్ర ఉన్నట్లు సంస్థ గుర్తించింది. జూన్ 23న ప్రారంభమైన విచారణ నివేదిక ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మొత్తం 19 మంది ఉద్యోగులు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం అయినట్లు టీసీఎస్ తెలిపింది. అయితే వీరిలో 16 మందిని తొలగించారు. మరో ముగ్గురిని సంస్థ రీసోర్స్ మేనేజ్మెంట్ విధుల నుంచి బదిలీ చేసింది. దాంతోపాటు ఆరుగురు విక్రేతలు సహా వారి అనుబంధ యజమానులు కంపెనీతో ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొంత మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ ఏడాది జూన్‌లో ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఉద్యోగులకు భారీ ఎత్తున డబ్బు ముట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారానే ఈ సమాచారం బయటకు వచ్చింది. కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొన్నేళ్లుగా సిబ్బంది నియామకాలకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తులు కమీషన్ల ద్వారా దాదాపు రూ.100 కోట్లు సంపాదించవచ్చని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌కు లేఖలు అందాయి. దాంతో ప్రాథమిక దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కంపెనీ..జూన్ 23న సమగ్ర విచారణకు కమిటీని నియమించింది. సదరు కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించింది. దాని ఆధారంగానే కంపెనీ చర్యలు చేపట్టింది. ఈ స్కాంతో కంపెనీకి ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పాలనా విధానాల్లో మార్పులు చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కుంభకోణంలో మేనేజర్ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని గుర్తించినట్లు వెల్లడించింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు రీసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలోని ఉద్యోగులను మారుస్తూ ఉంటామని తెలిపింది. ఉద్యోగులు సహా కంపెనీతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ సంస్థ నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పింది. హెచ్ఆర్ అండ్ టాలెంట్ అక్విజేషన్, రిసోర్స్ అలోకేషన్ గ్రూప్ ద్వారా 55 దేశాల్లో దాదాపు 6లక్షల మంది ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని, వర్క్‌ఫ్రంహోంకు స్వస్తి పలికినట్లు టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ గతంలో ఆఫర్ లెటర్లు ప్రకటించిన వారిని తప్పకుండా ఉద్యోగంలోకి తీసుకుంటుందని చెప్పింది. -
ED Attachment: మూడు ఆండ్రాయిడ్ యాప్‌లు..రూ.150 కోట్ల మోసం!
అధిక రాబడి వస్తుందని ప్రజల్లో ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్న మొబైల్ యాప్ నిర్వాహకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. యాప్ నిర్వాహకులైన వైభవ్ దీపక్ షా, సాగర్ డైమండ్స్, ఆర్‌హెచ్‌సీ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రూ.59.44 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పవర్ బ్యాంక్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉత్తరాఖండ్, దిల్లీ పోలీసులు(స్పెషల్ సెల్), కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు చెప్పారు. భారత ప్రజలను మోసం చేసేందుకు చైనాకు చెందిన కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల సహాయంతో దేశంలో షెల్ కంపెనీలను సృష్టించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తమ పెట్టుబడులపై భారీ మొత్తంలో సంపాదించవచ్చని ప్రజల్లో ఆశ చూపించి మోసం చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని పవర్ బ్యాంక్ యాప్, టెస్లా పవర్ బ్యాంక్ యాప్, ఈజీప్లాన్ అనే మూడు అప్లికేషన్ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించామన్నారు. ఈ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి రూ.150 కోట్ల మేర మోసం చేసినందుకు దిల్లీ పోలీస్ సైబర్ సెల్ జూన్ 2021లో అనేక మందిని అరెస్టు చేసింది. ఈ యాప్‌లు కస్టమర్ల నుంచి చెల్లింపులను సురక్షితం చేసిన తర్వాత వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేసేవని ఈడీ తెలిపింది. ఇలా కూడగట్టిన డబ్బును నిందితులు, ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు బోగస్ దిగుమతుల సాకుతో విదేశాలకు భారీగా నిధులు మళ్లించారని వెల్లడైంది. అయితే రూ.10.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ రికవరీ చేసింది. రూ.14.81 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్‌ప్రైజ్‌ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్‌కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్‌మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్‌స్టామార్ట్‌లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్‌లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
ఏటా 10లక్షల టన్నుల సామర్థ్యంతో అదానీ కాపర్ ఫెసిలిటీ
గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ 1.1 బిలియన్ డాలర్లతో గ్రీన్‌ఫీల్డ్ కాపర్ ఫెసిలిటీని మార్చి 2024లో ప్రారంభించనుంది. ఏటా 10లక్షల టన్నుల సామర్థ్యంతో దీన్ని రూపొందిచనున్నట్లు సమాచారం. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ బంగారం, వెండి, నికెల్, సెలీనియంకు సంబంధించిన ఉప ఉత్పత్తులతో పాటు కాపర్ కేథోడ్‌లు, రాడ్లను ఉత్పత్తి చేయనుంది. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌తో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కూడా తయారుచేయనున్నారు. ఈ మిశ్రమం ఎరువులు, డిటర్జెంట్లు, ఫార్మాస్యూటికల్స్, పేపర్, షుగర్ బ్లీచింగ్, వాటర్ ట్రీట్మెంట్తోపాటు ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కాపర్‌ను విద్యుత్ పరికరాల ఉత్పత్తికి, పవర్ ట్రాన్స్మిషన్, పునరుత్పాదక ఇంధన రంగానికి విరివిగా వాడుతారు. దాంతొ భవిష్యత్తులో కాపర్‌కు చాలా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. కానీ దేశంలో దాని నిలువలు పరిమితంగానే ఉన్నాయి. దేశీయ కంపెనీలు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఈ ప్లాంట్‌కు సంబంధించిన ముడిసరుకును లాటిన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఇప్పటికే దేశీయంగా హిందాల్కో వంటి కంపెనీలు కాపర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. పారిశ్రామికంగా వినియోగించే లోహాల్లో స్టీల్, అల్యూమినియం తర్వాత స్థానంలో రాగి ఉంటుంది. భారతదేశంలో లోహల పరంగా తలసరి వినియోగం కేవలం 0.6 కిలోలు. అదే ప్రపంచ సగటు 3.2 కిలోలుగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దేశంలోని రాగి ఎగుమతులు ఇటీవల క్షీణించాయని కచ్ కాపర్ దీన్ని భర్తీ చేస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాపర్ ప్లాంట్ ఉప ఉత్పత్తులను తమ గ్రూప్ సంస్థ అదానీ సిమెంట్స్ వినియోగించుకోగలదని కంపెనీ తెలిపింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో కదలాడిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ మార్కెట్లకు కొనుగోళ్ల అండ లభించలేదు. వారాంతం కావడంతో మదుపర్ల అమ్మకాలు, రూపాయి బలహీన పడడం, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, కీలక స్టాక్స్‌లో అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 66,068 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,895.41 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు కొంద పుంజుకుని 66,282.74 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,654 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,800 మార్క్ దగ్గర ఎగువ స్థాయికి చేరుకుంది. చివరకు గురువారం ముగింపుతో పోలిస్తే 43 పాయింట్లు నష్టపోయి 19,751 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, మారుతిసుజుకీ, టీసీఎస్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, బజాన్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ , ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈలో మొత్తం 3,820 షేర్లు ట్రేడ్ అవగా, 1,804 స్టాక్‌లు లాభాలతో ముగిశాయి. గతంతో పోలిస్తే 156 షేర్లు యథాతథంగా ఉన్నాయి. రోజులో 317 షేర్లు వాటి ఎగువ సర్క్యూట్‌ను తాకగా, 157 షేర్లు లోయర్ సర్క్యూట్ స్థాయిలో ట్రేడయ్యాయి. జై కార్ప్, ఐటీఐ, ఏడీఎఫ్ ఫుడ్స్ 20 శాతం చొప్పున పుంజుకోగా, స్పైస్‌జెట్ 19 శాతానికి పైగా లాభపడింది. టెక్స్మాకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోల్డింగ్స్ 16 శాతం ర్యాలీ కాగా, ఏజీఐ గ్రీన్‌పాక్ 15 శాతం పెరిగింది. ఆంధ్రా పెట్రోకెమికల్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్లు 10 శాతం పెరిగాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
స్టాక్ ఫలితాల వేళ ఇవి పాటిస్తే మేలు
దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఒక్కొక్కటిగా తమ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. స్టాక్ ఫలితాలకు తగ్గట్టుగా మన పెట్టుబడి వ్యూహాన్ని మారుస్తుంటాం. అయితే కొన్ని రోజులుగా మార్కెట్‌ను అనుసరిస్తున్నవారు, కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు ఈ సమయంలో ఎలా స్పందించాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. • మన పోర్ట్‌ఫోలియోలోని కంపెనీలు వాటి ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తుందో ట్రాక్ చేయాలి. ఇది సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇన్వెస్టర్ రిలేషన్స్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. • ఫలితాల్లో కంపెనీలు తమ ఆదాయాలు, బ్యాలెన్స్ షీట్, క్యాష్‌ఫ్లో సహా దాని ఆర్థిక నివేదికలను ప్రకటిస్తాయి. స్టాక్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ నివేదికల వల్ల కంపెనీ పనితీరును సమీక్షించడానికి వీలువతుంది. • కంపెనీలు ఫలితాలు విడుదల చేయడానికి ముందే ఆర్థిక నిపుణలు, విశ్లేషకులు తరచు సంస్థ పనితీరును గమనిస్తూ రిజల్ట్స్‌ను అంచనా వేస్తారు. ఈ అంచనాలతో వాస్తవ ఫలితాలను సరిపోల్చాలి. ఒకవేళ ఫలితాలు అంచనాలను మించి ఉంటే అది సానుకూలంగా పరిగణించవచ్చు. • గతంలో కంపెనీ పనితీరు ఎలా ఉంది.. ఫలితాలు ప్రభావితం చేసే ఏవైనా ఆర్థిక అంశాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. • చాలా కంపెనీలు వాటి భవిష్యత్ పనితీరుపై మార్గదర్శకత్వం లేదా ఔట్‌లుక్‌ను విడుదల చేస్తాయి. సానుకూలంగా నివేదికలు అందించే కంపెనీల్లో స్టాక్ పెరుగుదల చూడవచ్చు. • ఫలితాల వల్ల మార్కెట్ ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఒక్కోసారి స్టాక్ ధర వేగంగా పడిపోవచ్చు..పెరగొచ్చు. స్టాక్ సంబంధించిన అన్ని అంశాలను గమనించాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే స్టాక్ ధరలో హెచ్చుతగ్గులు అంతగా పట్టించుకోవద్దు. స్వల్పకాలిక మార్కెట్ కదలికల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు. • ఒకే కంపెనీలో కాకుండా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న ఫలితాలు విడుదల చేయకపోయినా పోర్ట్‌ఫోలియో పెద్దగా నష్టాల్లోకి వెళ్లకుండా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు, లాభాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫలితాల ఆధారంగా స్టాక్ అమ్మాలో, కొనాలో అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు కంపెనీ భవిష్యత్తు పనితీరును పరిగణలోకి తీసుకోవాలి. -
ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో మొబైల్ టవర్!
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకు నచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఫాలోవర్లలో స్ఫూర్తి నింపుతుంటారు. అలా ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సియాచిన్ పర్వత శ్రేణుల్లో జవాన్లు మొట్టమొదటగా మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేశారు. భారత జవాన్లు దీన్ని ఏర్పాటు చేయడంపై ఆనంద్ మహీంద్రా ఎక్స్(ట్వీటర్)లో స్పందించారు. ప్రపంచంలో ఇది ఒక చిన్న సంఘటన. మనల్ని రక్షించడానికి అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వారు ఇప్పుడు తమ కుటుంబాలతో కనెక్ట్ అవుతున్నారని ట్వీట్ చేశారు. అంత ఎత్తులో మొబైల్ టవర్ ఏర్పాటు చేసుకోవడం..విక్రమ్ ల్యాండర్ ఘనతతో సమానమైందని కొనియాడారు. సుమారు 15500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో బీఎస్ఎన్ఎల్ టవర్‌ను ఏర్పాటు చేసింది. These are photos shared by @devusinh of the first ever mobile tower installed in Siachen! A seemingly small event in our turbulent world. But it means our Jawans who put their lives on the line every single day on the world’s highest battlefield to defend us are now strongly… pic.twitter.com/bn1L260hLz — anand mahindra (@anandmahindra) October 13, 2023 -
సగానికిపైగా వినియోగదారులకు ఇంటర్నెట్ కష్టాలు!
జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సరఫరాకు సంబంధించి గత ఆరు నెలలుగా వందలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డీఎస్ఎల్ సేవలపై కొన్ని సంస్థలు ఇంటర్నెట్ అంతరాయంపై సర్వే నిర్వహించాయి. ఇంటర్నెట్ సేవలు అందించే కంపెనీలు దాదాపు రూ.75వేల కోట్లతో వినియోగదారులకు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. అయినప్పటికీ కనెక్టివిటీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. నిరంతరం ఇంటర్నెట్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో 56శాతం మంది నెట్ కనెక్షన్లో అంతరాయం వల్ల ఇబ్బందిపడుతూ సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. కంపెనీలు ముందుగా వాగ్ధానం చేసిన వేగం కంటే నెట్ తక్కువ వేగంతో వస్తుందని ఫిర్యాదులో తెలిపారు. వీరిలో 21శాతం మంది ప్రతి నెలా మూడుసార్లకు పైగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశం అంతటా 303 జిల్లాల నుంచి 51,000 మందితో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 67శాతం పురుషులు, 33శాతం మహిళలు ఉన్నారు. 46శాతం మంది వినియోగదారులు తమ ఫిర్యాదులను పరిష్కరించడానికి సర్వీస్ ప్రొవైడర్లు 24 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తెలిపారు. ఇదీ చదవండి: డేటా సెంటర్లలోకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రిమోట్ వర్క్, వర్క్‌ఫ్రంహోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని నివేదిక చెబుతుంది. 70శాతం మంది యూజర్లు ఇంటర్నెట్ సరఫరాలో మెరుగైన సేవలందించే ఇతర సర్వీస్ ప్రొవైడర్‌కు మారడానికి ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కొన్ని సర్వేల నివేదికల ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగించే సరళి ఈ కింది విధంగా ఉంది. * ఇంటర్నెట్ వ్యాప్తి 2012లో దేశవ్యాప్తంగా 12.6 శాతం నుంచి 2022 నాటికి 48.7 శాతానికి పెరిగింది. * ప్రపంచ వ్యాప్తంగా 692 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో భారత్ రెండో స్థానంలో ఉంది. * గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఎక్కువ. * తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నప్పటికీ..పేదరికం, అవగాహన లేకపోవడం, స్పష్టమైన లింగ వ్యత్యాసం వంటి కారణాల వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఇంకా ఆశించినమేర ఉండడం లేదు. * 2028 నాటికి 244 మిలియన్ కుటుంబాలు ఇంటర్నెట్ వినియోగిస్తాయని అంచనా. * 2020 నాటికి దేశంలో 622 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వచ్చే ఐదేళ్లలో దాదాపు 45 శాతం పెరుగుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2025 నాటికి 900 మిలియన్లకు చేరుకోనుంది. -
Movie Tickets: రూ.99కే సినిమా టిక్కెట్లు!
జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 13, శుక్రవారం రోజున మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.99కే సినిమా టిక్కెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫ్ర్ కేవలం ఇండియా సినిమాలకే కాకుండా ది ఎక్సార్సిస్ట్:బిలీవర్, పాపెట్రోల్ వంటి హాలీవుడ్ సినిమాలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. జవాన్, గదర్2, మిషన్ రాణిగంజ్ వంటి బాలీవుడ్ సినిమాలతో సహా అన్ని నేషనల్ మూవీస్‌కు రూ.99 టిక్కెట్ అందుబాటులో ఉంటుంది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి స్టార్లు కూడా తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కొత్త రూ.99 ఆఫర్‌ను ప్రచారం చేస్తున్నారు. #NationalCinemaDay par aap sab ke liye ek bahut khaas tohfaa, only for the love of cinema! Iss 13th October, jaiye aur dekhiye Jawan at just Rs. 99! Book your tickets now!https://t.co/fLEcPK9UQT Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/uS3LfpcTNb — Shah Rukh Khan (@iamsrk) October 12, 2023 సినిమా టిక్కెట్లను ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో లేదా బాక్సాఫీస్ వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే వారు మాత్రం సంబంధిత మల్టీప్లక్స్‌లు అందించే వెబ్సైట్ల్లోకి వెళ్లి ఫుడ్, బేవరేజెస్ వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున రికార్డు స్థాయిలో థియేటర్లో 6.5 మిలియన్ల అడ్మిషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం 4000 స్క్రీన్లలో ఈ ఆఫర్ ఉండనుంది. పీవీఆర్ ఐనాక్స్, సినోపోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీటైం, వేవ్, ఎం2కే, డెలైట్ వంటి మల్టీప్లెక్స్‌ల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. This cheer right here is why we do what we do... Thank you fans for the full houses & full hearts filled with love. Nothing matters beyond YOU. HAPPY NATIONAL CINEMA DAY. pic.twitter.com/R7h5v6xKZa — Ajay Devgn (@ajaydevgn) October 13, 2023 -
సాక్షి మనీమంత్ర: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతకుముందు రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో కీలక స్టాక్స్‌లో మదుపర్లు లాభాలను స్వీకరించారు. మరోవైపు నిన్న వెలువడ్డ ఇన్ఫోసిస్ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. నిఫ్టీలో దీని వాటా అధికంగా ఉండడంతో ఇది సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో సెప్టెంబరులో రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠమైన 5.02 శాతంగా నమోదైంది. ఇది ఒకింత మార్కెట్‌కు పాజిటివ్ విషయం. అయినప్పటికీ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. నిఫ్టీ గత ముగింపుతో పోలిస్తే 140 పాయింట్లు నష్టంతో ప్రారంభమై ఉదయం 9:37 వరకు కొంత పుంజుకుని 19721 వద్ద ట్రేడవుతుంది. సెన్సెక్స్ 286 పాయింట్ల నష్టపోయి 66,121.52 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22కు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, యాక్సిక్‌బ్యాంక్, ఎస్బీఐ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీలు మాత్రం నష్టంలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అక్కడ వెలువడిన సెప్టెంబరు నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు మదుపర్లను నిరాశపర్చాయి. ఐరోపా సూచీలు మాత్రం లాభాల్లో స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 86.48 డాలర్లకు చేరింది. టాటా స్టీల్ లాంగ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సాయి సిల్క్స్ కళామందిర్, డెన్ నెట్వర్క్స్, ఆదిత్య బిర్లా మనీ, మిత్తల్ లైఫ్ స్టైల్ కంపెనీలు ఈరోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. -
Q2 Results: ఆదాయవృద్ధి మార్గదర్శకత్వాన్ని తగ్గించనున్న ఇన్ఫోసిస్
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సుమారు రూ.7కోట్లు రెవెన్యూ వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. ఇక కంపెనీ కార్యకలాపాల వల్ల వచ్చిన ఆదాయం రూ.36,538 కోట్ల నుంచి రూ.38,994 కోట్లకు పెరుగుతందని సమాచారం. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాల్లో ఇన్ఫోసిస్ కోత పెట్టనుంది. 2023-24 సంవత్సరానికి గానూ ఆదాయ వృద్ధి 1 - 3.5 నుంచి 1-2.5 శాతంగా ఉండనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో కంపెనీ ఆదాయ అంచనాలను 4-7 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ వద్ద 7.7 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈఓ సలీల్‌పరేఖ్ చెప్పారు. జూన్ త్రైమాసికంలో 17.3 శాతంగా ఉన్న వలసల రేటు 14.6 శాతానికి తగ్గుతుందని తెలుస్తుంది. ఇన్ఫోసిస్ షేర్ ధర గురువారం త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందే 2.8శాతం పడిపోయింది. -
Vizag Green Field Airport: వైజాగ్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు రూ.4వేల కోట్లు
వైజాగ్‌లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థ రూ.4,000 కోట్ల రుణాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) నేతృత్వంలోని కన్సార్టియం ఈ నిర్మాణ సమూహానికి నిధులు సమకూరుస్తుంది. ఐఐఎఫ్‌సీఎల్ 14 ఏళ్లకు 10 శాతం వడ్డీ చొప్పున ఈ రుణాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎయిర్పోర్ట్ నిర్మాణ సమయంలో, కార్యకలాపాలు మొదలైన ఏడాది వరకు రుణం చెల్లింపుపై మారటోరియం అవసరం అవుతుందని ఐఐఎఫ్‌సీఎల్ తెలిపింది. ఆర్ఈసీ, పీఎఫ్సీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకింగ్ కన్సార్టియంలో భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు ఐఐఎఫ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ జైశంకర్ తెలిపారు. వైజాగ్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని 2200 ఏకరాల్లో భోగాపురంలో నిర్మిస్తున్నారు. దీన్ని ప్రధానంగా సాయుధ దళాల అవసరాలను తీర్చడానికి ప్రస్తుత విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. -
గూగుల్‌తో పోటీ: మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. సీవీపీగా అపర్ణ చెన్నప్రగడ
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయ అమెరికన్ మహిళ అపర్ణ చెన్నప్రగడ (Aparna Chennapragada) నియమితులయ్యారు. టెక్ పరిశ్రమలో విశేష అనుభవమున్న ఆమెకు కీలకమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ విభాగం బాధ్యతలు అప్పగించారు. ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన అపర్ణకు ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవముంది. గూగుల్‌లో సుమారు 12 ఏళ్లు పనిచేశారు. స్టాక్ ట్రేడింగ్ యాప్ రాబిన్‌హుడ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన ఆమె మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ డిజైనర్లో జెనరేటివ్ ఏఐ ప్రయత్నాలకు నాయకత్వం వహించనున్నారు. (TCS Headcount Drops: టీసీఎస్‌లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..) లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అపర్ణ చెన్నప్రగడ ఐఐటీ మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో టీటెక్ చేశారు. టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని, మిట్ నుంచి మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని పొందారు. ప్రముఖ ఈబే (eBay) సంస్థలో కన్స్యూమర్ షాపింగ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ఏఆర్, విజువల్ సెర్చ్ ప్రోడక్ట్‌లకు లీడ్‌గా, బోర్డు మెంబర్‌గా కూడా అపర్ణ పనిచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అపర్ణకు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా యూఎస్ చెందిన బిజినెస్ పబ్లికేషన్ ‘ఇన్ఫర్మేషన్’ నివేదించింది. అపర్ణ నియామకానికి ముందు మరో భారతీయ-అమెరికన్ రోహిణి శ్రీవత్స సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియాలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. పునీత్ చందోక్ ఆగస్టులో భారతదేశం, దక్షిణాసియాకు మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. -
Disney: డిస్నీ కొనుగోలుకు బ్లాక్‌స్టోన్‌తో చర్చలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్.. భారతదేశంలోని వాల్ట్‌డిస్నీ స్ట్రీమింగ్, టెలివిజన్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. వాల్ట్ డిస్నీ ఇండియాలోని తన కార్యకలాపాలను విక్రయించేందుకు గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్అంబానీతోపాటు ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే భారత మార్కెట్‌పై ఆసక్తి ఉన్న బ్లాక్‌స్టోన్.. డిస్నీ కొనుగోలుకు సిద్ధం అవుతుదని నివేదిక తెలుపుతుంది. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌తో ఈ ఒప్పందం కుదరకపోయినా డిస్నీ భారతదేశంలో తన డిజిటల్, టీవీ వ్యాపారాన్ని విక్రయించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకా బ్లాక్‌స్టోన్, డిస్నీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. డిస్నీ సబ్‌స్క్రైబర్ అట్రిషన్‌ను ప్రభావం చేసేలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉచిత క్రికెట్ కంటెంట్‌ను అందించడంతో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తుంది. -
టీసీఎస్ రిజల్ట్స్..స్వల్పంగా పెరుగనున్న ఆదాయం
ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ అయిన టీసీఎస్ రెండో త్రైమాసిక ఫలితాలు బుధవారం రానున్నాయి. మరికాసేపట్లో మార్కెట్ టీసీఎస్ సెప్టెంబర్ క్వార్టర్ క్యూ2 ఫలితాలు విడుదలవుతాయి. అయితే ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ విలువ దాదాపు రూ.13.29 లక్షల కోట్లుగా ఉంది. వివిధ బ్రోకరేజ్ సంస్థలు టీసీఎస్ ఫలితాలను అంచనా వేశాయి. దాని ప్రకారం..టీసీఎస్ ఆదాయం త్రైమాసికంలో 1.4శాతం వృద్ధితో రూ.60,218 కోట్లకు చేరుతుంది. వార్షిక వారీగా ఆదాయం దాదాపు 9% పెరుగుతుంది. నికర లాభం త్రైమాసికంలో 3%, వార్షిక వారీగా 9% పైగా పెరిగి రూ.11,404 కోట్లుగా ఉంటుందని అంచనా. టీసీఎస్ ఆపరేటింగ్ మార్జిన్ QoQలో 30-90 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ సేవలపై క్లయింట్స్ వ్యయాలు మందగించినప్పటికీ, టీసీఎస్ డీల్ విన్స్పై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డైరెక్టర్ల బోర్డ్ మీటింగ్ కూడా కాసేపట్లో జరుగనుంది. క్యూ2 ఆర్థిక ఫలితాలతో పాటు షేర్స్ బైబ్యాక్ గురించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన మరింత సమాచారం వెలువడనుంది. -
హైదరాబాద్‌లో ఎక్స్‌ఫెనో రిక్రూట్మెంట్ డెలివరీ కేంద్రం ప్రారంభం
ఇండియన్ స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీల్లో ఒకటైన ఎక్స్‌ఫెనో హైదరాబాద్‌లో రిక్రూట్మెంట్ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో సేవలు అందించనున్నారు. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ టి-హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యం అతిథిగా పాల్గొని ఆర్డీసీని ప్రారంభించారు. అలాగే టీపాజిటివ్ (బిల్డింగ్ అండ్ సస్టేనింగ్ ఏ టాలెంట్ పాజిటివ్ తెలంగాణ) పేరుతో వివిధ కంపెనీల్లోని సీఎక్స్ఓ, హెచ్ఆర్ పరిశోధన నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన సంస్థలతో పాటు, యునికార్న్‌లు, స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను విస్తరించడానికి హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా టెక్ ఉద్యోగుల ఉన్న హైదరాబాద్‌కు ఈ నివేదిక ఎంతో ఉపయోగమని అన్నారు. ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ మాట్లాడుతూ.. దేశంలో తమ టెక్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అన్ని విధాలుగా అనువైనదని అన్నారు. తెలంగాణలోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఎక్స్‌ఫెనో హైదరాబాద్ ఆపరేషన్స్ విభాగాధిపతి సతీష్ మన్నె అన్నారు. ‘ఉమెన్ ఇన్ ది వర్క్‌ఫోర్స్’ అనే అంశంపై ఇంటరాక్షన్ సెషన్ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు అనిల్ ఏతానూర్, పెగా సిస్టమ్స్ హెచ్ఆర్ స్మృతి మాథుర్, ది స్టార్ ఇన్ మీ సహ వ్యవస్థాపకుడు ఉమా కాసోజీ, హెచ్ఆర్ఎస్ఎస్ డీఎస్ఎం గ్లోబల్ డైరెక్టర్ డా.దినేష్ మురుగేశన్ పాల్గొన్నారు. ఎక్స్‌ఫెనో ఇప్పటి వరకు 12,000 మంది ఇంజినీర్లను నియమించింది. ఆర్డీసీ ద్వారా స్పెషలిస్ట్ టాలెంట్ సోర్సింగ్, లీడర్షిప్ హైరింగ్, టాలెంట్ డిప్లాయ్‌మెంట్, మేనేజ్మెంట్ సేవలు అందిస్తుంది. టాలెంట్ ఎంగేజ్మెంట్కు సంబంధించిన అనేక ఆన్ డిమాండ్ ఆఫర్లను కూడా కల్పిస్తుంది. -
తగ్గుతున్న పారిశ్రామిక రుణాలు.... వ్యక్తిగత రుణాలు పైపైకి...
బ్యాంకులు ఎక్కువగా కార్పొరేట్ రుణాల ద్వారానే అధికంగా లాభాలు సంపాదిస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా బ్యాంక్ రుణాల సరళిమారుతోంది. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీయల్ రంగానికి అధికంగా రుణాలు ఇస్తున్న బ్యాంకులు..ప్రస్తుతం వాటి వాటా తగ్గిస్తున్నాయి. అందుకు బదులుగా వ్యక్తిగత రుణాల ఇవ్వడంలో మొగ్గు చూపుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ నివేదిక ప్రకారం.. బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాల్లో దాదాపు 32.1శాతం వ్యక్తిగత రుణాలు, సర్వీస్ సెక్టార్‌కు 28.4శాతం, ఇండస్ట్రీ రంగానికి 26.2 శాతం, 13.3శాతం వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్లు వెల్లడించింది. హౌజింగ్, వెహికిల్, క్రెడిట్ కార్డు రుణాలు తగ్గిపోయాయి. గత పదేళ్లలో ఇండస్ట్రీ రంగానికి ఇచ్చే రుణాలు 46శాతం నుంచి 26శాతం మేర క్షీణించాయి. అదే వ్యక్తిగత రుణాలు మాత్రం 18శాతం నుంచి 32శాతానికి పెరిగాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల సంఖ్య పెరగడంతో అవి సర్వీస్ రంగంలో ఉన్న కంపెనీలకు ఎక్కువగా రుణాలు కల్పిస్తున్నాయి. (తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..) ఇండస్ట్రీయల్ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గించడంతో కార్పొరేట్ కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి. అయితే కంపెనీలు రుణ సమీకరణతో పాటు సంస్థ ఆర్థికవృద్ధిపై దృష్టి సారిస్తే మరింత ప్రయోజనం ఉంటుదని బ్యాంకింగ్ రంగ నిపుణులు వి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కంపెనీలు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి బదులుగా డెట్‌మార్కెట్ ద్వారా నగదును పెంచుకుంటున్నాయి. తమ బ్యాలెన్స్షీట్లో నగదు ఎక్కువగా ఉన్న కొన్ని సంస్థలు రుణం తీసుకోవలసిన అవసరం ఉండడం లేదు. ఎన్బీఎఫ్సీ, బ్యాంకు నిబంధనల ప్రకారం నిరర్థక ఆస్తులకు సంబంధించిన నియామాలు మార్చడం వల్ల కూడా ఇండస్ట్రీయల్ రుణాలు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..
Hurun India Rich List: దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 360 వన్ వెల్త్ అండ్ హురూన్ ఇండియా విడుదల చేసింది. దేశంలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఇందులో చోటు సంపాదించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతేడాది టాప్‌లో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలోకి చేరారు. ఆగస్టు చివరి నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా భారత్‌లోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది హురూన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఉన్నారు. వీరిలో అయిదుగురు మహిళలకు స్థానం దక్కింది. మొత్తం అందరి సంపద విలువ ఏకంగా రూ.5.25 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే వీరి సంపద ఏకంగా 33 శాతం పెరగడం విశేషం. ఈ 105 మందిలో 87 మంది హైదరాబాద్ వారే కావడం గమనార్హం. కొత్తగా 33 మంది ఇందులో చోటు సంపాదించారు. వీరి ద్వారానే మొత్తం రూ.76 వేల కోట్లు జమైనట్లు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివీస్ మురళి రూ. 55,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మేధా సర్వో డ్రైవ్స్ నుంచి అయిదుగురు ఈ లిస్ట్‌లో ఉన్నారు. హెటెరో ల్యాబ్స్ జి.పార్థసారధి రెడ్డి కుటుంబం రూ.21,900 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. అరబిందో ఫార్మా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపద, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లు, మైహోం ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు సంపద రూ.17,500 కోట్లుతో తరువాత స్థానాల్లో నిలిచారు. మహిళల్లో మహిమా దాట్ల మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.5700 కోట్లు. -
మనీలాండరింగ్ కేసులో లావా ఎండీ అరెస్టు
మనీ లాండరింగ్ కార్యకలాపాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా లావా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు హరి ఓం రాయ్‌తో పాటు వివో మొబైల్స్ ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్టు చేసింది. అయితే హరి ఓం రాయ్ ప్రమేయంపై నిర్దిష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు. వివో మొబైల్స్ ఇండియా, గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ (జీపీఐసీపీఎల్)తో సహా 23 అనుబంధ కంపెనీలకు చెందిన 48 స్థానాల్లో ఈడీ దాడుల నిర్వహించింది. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు అనుగుణంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 3, 2022న ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అయిలే జీపీఐసీపీఎల్ నేరపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అక్రమంగా చైనాకు నిధులు తరలించడమే లక్ష్యంగా భారత్‌లో బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లో పన్నులు ఎగవేస్తూ వివో మొబైల్స్ ఇండియా విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంలో దాదాపు సగం డబ్బును చైనాకు తరలించిందనే ఆరోపణలు వచ్చాయి. -
డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ఎంజీ మోటార్ కీలక నిర్ణయం
ఎంజీ మోటార్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కలిసి భాగస్వామ్యానికి సిద్ధమవుతున్న తరుణంలో డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ప్రత్యక దృష్టి సారించింది. డీలర్‌షిప్‌నకు సంబంధించి కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం. ఎంజీ మోటార్ దాని పనితీరు తక్కువగా ఉన్న కొన్ని షోరూమ్‌లను మూసివేసి, ఇతర ప్రదేశాల్లో కొత్త డీలర్‌షిప్‌లను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 158 నగరాల్లో 330 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే డిసెంబర్ 2023 నాటికి 270 నగరాల్లో 400కు షోరూమ్‌లకు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా దీపావళి నాటికి ఇరు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. చైనాకు చెందిన సాయిక్(SAIC) మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తమ కంపెనీల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చివరి దశ చర్చలు జరుపుతున్నారు. -
కొన్ని గ్రూప్‌ల నుంచే పెట్టుబడులు.. రిలయన్స్‌పై ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు
ముంబై: కార్పొరేట్ పెట్టుబడులు మరింతగా విస్తరించవలసి ఉన్నట్లు వెటరన్ బ్యాంకర్ ఉదయ్ కొటక్ పేర్కొన్నారు. కొన్ని గ్రూపులు మాత్రమే పెట్టుబడులు చేపడుతున్నాయని, మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే సదస్సులో ప్రసంగిస్తూ ఇందుకు విధానాలు మార్చవలసిన అవసరంలేదన్నారు. భారీ కార్పొరేషన్లు ప్రపంచస్థాయి బిజినెస్‌లను సృష్టిస్తున్నట్లు ప్రశంసించారు. ప్రధానంగా ముకేశ్ అంబానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఈ సందర్భంగా ఉదహరించారు. అయితే కొన్ని ప్రధాన గ్రూప్‌ల నుంచి మాత్రమే కొత్త పెట్టుబడులు నమోదవుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇందుకు విధానాలను సవరించవలసిన అవసరంలేదని పేర్కొంటూ, మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించవలసి ఉన్నదని తెలియజేశారు. -
అమ్మకు మానని గాయం!
బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వం పొందడం మహిళ అదృష్టంగా భావిస్తోంది. ప్రసవం ఆమెకు పునర్జన్మతో సమానం. ఒకప్పుడు అత్యధిక ప్రసవాలు సాధారణ పద్ధతిలోనే జరిగేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పలు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి సిజేరియన్లను మార్గంగా చూడటం.. తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలని కొందరు కుటుంబీకులు ఆపరేషన్లకు సరే అనడం.. మరి కొందరు శుభఘడియలు అంటూ కడుపు కోతకు ఒత్తిడి తేవడం.. ఇలా కారణాలు ఏవైనా అమ్మ కడుపుపై మానని గాయం ఏర్పడుతోంది. సిజేరియన్లతో భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నా పరిస్థితి మారడం లేదు. సాక్షి, నంద్యాల: దనార్జనే లక్ష్యంగా పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణులకు ఇష్టానుసారంగా సిజేరియన్లు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణ ప్రసవాలకు అవకాశం ఇవ్వకుండా సిజేరియన్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం వంటి అత్యవసర సమయాల్లో చేయాల్సిన ఆపరేషన్లను కాసుల కోసం అమ్మకు కడుపు కోత పెడుతున్నారు. సిజేరియన్లతో ప్రసవాలు జరగడంతో చిన్న వయస్సులోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గర్భం దాలిస్తే సిజేరియన్ తప్పనిసరి అన్నట్లు పరిస్థితి మార్చేశారు. గర్భం దాల్చిన రెండో నెల నుంచే అవసరం లేకపోయినా స్కానింగ్‌లు, టెస్టులు, మందులు, టానిక్‌ల పేరుతో రూ.వేలకు వేలు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 79 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వీటిలో శస్త్రచికిత్సలు చేసే హాస్పిటళ్లు సుమారు 35 వరకు ఉన్నాయి. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ (సీహె చ్‌సీ)లు 11, డోన్, బనగానపల్లెలో ఏరియా ఆస్పత్రి, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలకు సుమారు 2 వేలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా ప్రసవాల్లో సిజేరియన్లు గరిష్టంగా 15 శాతం మించకూడదు. కాన్పు కష్టమైన సమయాల్లో, తల్లీబిడ్డల్లో ఎవరికై నా ప్రాణహాని ఉండే సందర్భాల్లోనే సిజేరియన్ చేయాలి. రక్తహీనత, అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉన్నప్పుడే ఆపరేషన్‌కు మొగ్గు చూపాలి. అయితే ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ, కొందరు కుటుంబీకులు మూఢనమ్మకాలు వెరిసి సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 50 శాతానికి పైగా కడుపు కోత ఉంటున్నాయి. విస్తుగొల్పుతున్న గణాంకాలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏప్రిల్ నుంచి ఈనెల 21వ తేదీ వరకు మొత్తం 10,086 ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,034, ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,052 ప్రసవాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో దాదాపు 45 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయి. ఇందులోనూ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,052 ప్రసవాలు జరిగితే వీటిలో 50 శాతం అంటే 3 వేలకు పైగా ప్రసవాలు సిజేరియన్ ద్వారా చేయడం విస్తుపోయే వాస్తవం. గర్భం దాల్చినప్పుటి నుంచి సాధారణ ప్రసవం కావాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే సరికే ఏదో కారణంతో భయపెట్టి సిజేరియన్ చేయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఆపరేషన్‌కు వేలల్లో ఖర్చు..! సాధారణ ప్రసవం జరిగితే ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 వేలకు మించి బిల్లు కాదు. అదే సిజేరియన్ అయితే పేషంట్ పరిస్థితిని బట్టి, ఆస్పత్రిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు. సిజేరియన్‌కు కనిష్టంగా రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ. 80 వేల వరకు కూడా బిల్లులు వేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని ఐదు ప్రముఖ ఆస్పత్రుల్లో, ఆళ్లగడ్డలోని రెండు ఆస్పత్రుల్లో సిజేరియన్లు యథేచ్ఛగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రులోని వైద్య సిబ్బంది సాధారణ ప్రసవాలు చేసేందుకు చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో అవగాహన ఉన్న పలువురు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్యాపిలి, పాములపాడు, చాగలమర్రి, అహోబిలం.. తదితర మండలాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయి. ముహూర్తాలు చూసుకుని మరీ.. ఇటీవల కాలంలో ముహూర్తం, శుభ ఘడియలు చూసుకుని మరీ ప్రసవాలు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారంతా ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఫలానా రోజు, తేదీ, గంటలు, నిమిషాలను కూడా పాటిస్తూ పిల్లల్ని కనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొందరైతే బిడ్డ ఎన్ని సెకండ్లకు బయటకు రావాలో కూడా నిర్ణయించేస్తున్నారు. మరికొందరు గర్భిణులు పురిటి నొప్పులు భరించలేక సిజేరియన్ల వైపు వెళ్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వివరాలు నెల ప్రభుత్వ ప్రైవేటు ఏప్రిల్ 762 1,121 మే 814 1,051 జూన్ 800 1,064 జులై 798 1,057 ఆగస్ట్ 860 1,108 సెప్టెంబర్ 716 651 (21 తేదీ వరకు) పరీక్షలు చేయించుకోవాలి గర్భందాల్చినప్పటి నుంచి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ప్రతి నెల బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. సాధారణ ప్రసవమైతే రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. సిజేరియన్ అయితే కనీసం మూడు నెలల విశ్రాంతి అవసరం. జీవనశైలిలో వచ్చే మార్పుల వల్లే ఆపరేషన్లు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ అనూష గింజుపల్లి, గైనకాలజిస్ట్ అవగాహన కల్పిస్తున్నాం సిజేరియన్ల శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చేస్తున్నాం. కేవలం హై రిస్క్ ఉన్న వారిని మాత్రమే సిజేరియన్లకు రెఫర్ చేస్తున్నారు. బిడ్డ పుట్టిన సమయమే శుభ ఘడియలు. ప్రత్యేక తేదీలు, ప్రముఖల జన్మదిన రోజులు అంటూ డాక్టర్లపై ఒత్తిడి చేయకూడదు. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి (చదవండి: గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి దూసుకుపోయి..) -
ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల బీమా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగంలో సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (బీమా)ని రూ.45 లక్షల నుంచి ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచింది. ఈమేరకు ఆర్టీసీ గురువారం ఎస్బీఐతో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత మూడేళ్ల క్రితం రూ.45 లక్షల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలులోకి తెచి్చంది. తాజాగా దీన్ని ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచడం విశేషం. కొత్త శాలరీ ప్యాకేజీ 2026 సెప్టెంబరు 2 వరకు అమలులో ఉంటుంది. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం: పినిపె విశ్వరూప్, రవాణా శాఖ మంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారని రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ పేర్కొన్నారు. శాలరీ ప్యాకేజీ ఒప్పందం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. అధిక పెన్షన్ విధానంతో అప్పటి వరకు రూ.5 వేలు పింఛన్ పొందిన ఉద్యోగులకు ఏకంగా రూ.40 వేల వరకు పెన్షన్ పెరిగిందన్నారు.ఇప్పుడు ప్రమాద బీమాను రూ.1.10 కోట్లకు పెంచడం ఉద్యోగుల కుటుంబాలకు భరోసానిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం పట్ల ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. రూ.1.10 కోట్ల ప్రమాద బీమాతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు మరణిస్తే వారి పిల్లల చదువుల కోసం అబ్బాయిలకు రూ.8 లక్షలు, అమ్మాయిలకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగుల పిల్లల వివాహ రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ ఎంకే సిన్హా, ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఏ.కోటేశ్వరరావు, కృష్ణమోహన్,ఎఫ్ఏ–సీఏ రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈయూ హర్షం ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలు చేయడంపట్ల ఈయూ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కృతజ్ఞతలు తెలిపింది.ఈమేరకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.దామోదరరావు, జీవీ నరసయ్య ఓ ప్రకటన జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఇలా.. ప్రమాద బీమా రూ.30 లక్షల నుంచి రూ.85 లక్షలకు పెంపు రూపే డెబిట్ కార్డ్ లింకేజీ ద్వారా రూ.10 లక్షలు కొత్త రూపే కార్డ్ ద్వారా మరో రూ.10 లక్షలు సహజ మరణానికి రూ.5 లక్షలు మొత్తం మీద రూ.1.10 కోట్లు -
విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకోవాలి
హిమాయత్‌నగర్: దేశంలోని కొన్ని కార్పొరేట్ శక్తులకు లాభాలు అందించే సరుకుగా విద్యుత్ మారిందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో 7 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ‘2022 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలను ఎండగడదాం’అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహించారు. అంతకముందు బషీర్‌బాగ్ విద్యుత్ కాల్పుల్లో మృతి చెందిన అమరులకు నివాళులర్వించారు. ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రసదన్న, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురగరి, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఏఐఎఫ్బీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసా ద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ బిల్లు–2022 అనే ది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమేనన్నారు.ఈ బిల్లు వల్ల విద్యుత్ చార్జీలు సామన్య వినియోగ దారులకు అందుబాటులో లేనివిధంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పేదప్రజలు, రైతులు, ప్రజా వినియోగ రంగాలకు ఇచ్చే సబ్సిడీలు క్రమంగా రద్దు అవుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లు–2022ను ఉపసంహరించుకోవాలని,విద్యుత్ చట్టం–2003ను రద్దు చేయాలని, ప్రీపెయిడ్ మీటర్ల యోచనను విరమించుకోవాలని, 100 యూనిట్లు లోపు గృహవినియోగదారులకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలంటూ ఈ సదస్సు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, సుకన్య, తేజ, భరత్, హేమలత పాల్గొన్నారు. -
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నుతోంది. దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్ రూమ్ నుంచి భోజనశాల, బాత్రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. బుట్టాయగూడెం ఈఆర్ఎం స్కూలులోని తరగతి గదులు 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70 శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు ఎన్నో పథకాల ద్వారా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్ క్లాత్, టెక్ట్స్‌బుక్స్, నోట్ బుక్స్ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్‌్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు. స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ న్యాప్కిన్లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాలకు 2020 అక్టోబర్ 2న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్‌లో కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. – కంగాల వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి, ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మాకు ఇంగ్లిష్ చదువులు అందించారు మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. –ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. వీరికి తిరుగులేదండోయ్!
భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రముఖ రంగాలలో ఒకటి 'రియల్ ఎస్టేట్' అని అందరికి తెలుసు. ప్రస్తుతం ఈ రంగంలో దేశవ్యాప్తంగా సుమారు 7.1 కోట్ల ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సంఖ్య 2030 నాటికి 10 కోట్లకు చేరే అవకాశం ఉందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నైట్‌ఫ్రాంక్ ఇండియా, రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ సర్వేయర్స్ ప్రకారం.. ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం 2030 నాటికి మరింత అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. నిర్మాణ రంగంలో టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోందని.. ఈ తరుణంలో ఉద్యోగులకు డిమాండ్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో ఉద్యోగులకు డిమాండ్.. ఇప్పటి వరకు నిర్మాణ రంగంలో ఉన్న చాలా మంది ప్రజలకు సరైన నైపుణ్యాలు లేవని.. అలాంటి నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువని చెబుతున్నారు. కావున రానున్న రోజుల్లో ఈ రంగంలో అనుభవం ఉన్నవారికి డిమాండ్ భారీగా ఉండనుంది. అంతే కాకుండా ఈ రంగానికి తగిన విధంగా మార్చుకోవడానికి కంపెనీలు కూడా తమ వంతు పాటుపడాలని కొంత మంది సూచిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు పనిచేస్తున్న 7.1 కోట్ల మందిలో 44 లక్షలు ఇంజినీర్లు, టెక్నీషియన్స్ ఉన్నారు. మిగిలిన వారికి ఈ రంగంలో ఎక్కువ నైపుణ్యాలు లేకపోవడం గమనార్హం. కావున రానున్న రోజుల్లో సరైన మెళుకువలున్నవారు ఈ రంగంలో అడుగుపెడితే తప్పకుండా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన వంటి లక్ష్యాలను చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. -
పవర్‌గ్రిడ్ చెస్ టోర్నీ విజేత కార్పొరేట్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో మహిళల టీమ్ విభాగంలో కమలేశ్ భూరాణి, హిమాన్షిలతో కూడిన కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు విజేతగా నిలిచింది. కార్పొరేట్ సెంటర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. పవర్‌గ్రిడ్ సదరన్ రీజియన్–1 ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. మహిళల టీమ్ విభాగంలో ఈస్టర్న్ రీజియన్–1కు రెండో స్థానం, నార్తర్న్ రీజియన్–2కు మూడో స్థానం లభించాయి. పురుషుల టీమ్ విభాగంలో బిశ్వజ్యోతి దాస్, అరుణ్ తివారీ, హృషికేశ్ సింగ్, బిజిత్ శర్మలతో కూడిన నార్త్ ఈస్టర్న్ రీజియన్ చాంపియన్‌గా నిలిచింది. నార్తర్న్ రీజియన్–1కు రెండో స్థానం, కార్పొరేట్ సెంటర్‌కు మూడో స్థానం దక్కాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో అంజన్ సేన్ (కార్పొరేట్ సెంటర్), బిశ్వజ్యోతి దాస్, గౌరవ్ కుమార్ (నార్తర్న్ రీజియన్–1) వరుసగా తొలి మూడు స్థానాల్లో... మహిళల వ్యక్తిగత విభాగంలో మీనాక్షి మలిక్ (నార్నర్త్ రీజియన్–1), హిమాన్షి, కమలేశ్ భూరాణి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పవర్‌గ్రిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్ శర్మ (సీజీఎం–అసెట్ మేనేజ్మెంట్), సంజయ్ కుమార్ గుప్తా (సీజీఎం–ప్రాజెక్ట్స్), హరినారాయణన్ (సీజీఎం–హ్యూమన్ రిసోర్సెస్) తదితరులు పాల్గొన్నారు. -
CDMDF: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి
న్యూఢిల్లీ: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి (సీడీఎండీఎఫ్)కి సంబంధించి సెబీ కార్యాచరణను ప్రకటించింది. ఈ తరహా ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే విషయమై మ్యూచువల్ ఫండ్స్‌కు మార్గదర్శకాలను సెబీ విడుదల చేసింది. సీడీఎండీఎఫ్ ఏర్పాటుకు సంబంధించి సెబీ ఈ ఏడాది జూన్‌లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఇది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్) విభాగం కిందకు వస్తుంది. ఆర్థిక మాంద్యం, సంక్షోభాల సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన సన్నద్ధత సదుపాయం ఇది. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో విశ్వాసాన్ని పెంచడం, లిక్విడిటీని పెంచడమే దీని ఏర్పాటు ఉద్దేశ్యం. సీడీఎండీఎఫ్ యూనిట్లకు సంబంధించి సెబీ రెండు వేర్వేరు సర్క్యులర్లను జారీ చేసింది. సీడీఎండీఎఫ్ యూనిట్లను డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్, ఓవర్‌నైట్, గిల్ట్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా డెట్ ఫండ్స్ తమ నిర్వహణలోని ఆస్తుల్లో 0.25 శాతాన్ని సీడీఎండీఎఫ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది. నిర్వహణ ఆస్తులు పెరిగే కొద్దీ, ప్రతీ ఆరు నెలలకోసారి 0.25 శాతం గరిష్ట పరిమితి మేరకు పెట్టుబడులు పెంచుకోవచ్చని పేర్కొంది. సంక్షోభాల్లో ఆపత్కాల నిధి మార్కెట్లు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో డెట్ సెక్యూరిటీల పరంగా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా సెబీ సీడీఎండీఎఫ్ను తీసుకొచి్చంది. ఆ సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను సీడీఎండీఎఫ్ ముందుకు వచ్చి కొనుగోలు చేస్తుంది. సాధారణ సమయంలో లో డ్యురేషన్ జీ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్ చేస్తుందని సెబీ తెలిపింది. -
ఆఫీసుల్లో కూడా వైన్, బీర్ సర్వ్ చేసేలా కొత్త పాలసీ!
ఆ రాష్ట్రంలోని కార్యాలయాల్లో(ఆఫీసుల్లో) బీర్, వైన్ సర్వ్ చేసేలా అనుమితించడం కోసం ప్రత్యేక పాలసీని కూడా తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేటే కార్యాలయాల్లో వైన్, బీర్ వంటి తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డ్రింక్స్‌ని సర్వ్ చేసేలా అనుమితిస్తున్నారు. ఈ పాలసీ నిబంధన ప్రకారం కార్పోరేట్ కార్యాలయాల్లో సుమారు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ లేదా తినుబండరాలు ఉండాలి. ఈ మేరకు గురుగ్రామ్ లేదా హర్యానాలోని అక్కడ క్యాబినేట్ మంగళవారం ఈ క్తొత పాలసీ 2023-24కి ఆమోదం తెలిపింది. రిటైల్ పర్మిట్ రుసుము కింద పర్యావరణం, జంతు సంక్షేమ నిధి కోసం రూ. 400 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత విడదల చేసిన అధికారిక ప్రకటనలో దీని గురించి తెలిపారు. హర్యానా కొత్త మద్యం పాలసీలో ముఖ్యాంశాలు కొత్త పాలసీలో దేశీయ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఇంపోర్టెడ్ ఫారిన్ లిక్కర్ బేసిక్ కోటా పెరిగింది. దీంతో దేశీయ మద్యం, IMFL పై ఎక్సైజ్ సుంకం రేట్లలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉంది. ఈ పెంపుదలతో ఎక్సైజ్ ఆదాయానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాపారం చేసే సౌలభ్యం కోసం, కొత్త విధానంలో, జిల్లా స్థాయిలో IFL (BIO) లేబుల్‌లను పునరుద్ధరించింది. అలాగే సూక్ష్మ మధ్య తరహా రంగాన్ని ప్రోత్సహించడానికి చిన్న షాపులకు లైసెన్స్ ఫీజును తగ్గించింది. రాష్ట్రంలో వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకు వైన్ తయారీ కేంద్రాల పర్యవేక్షక రుసుమును తగ్గించినట్లు ప్రకటనలో తెలిపారు. పంచకులలోని శ్రీ మాతా మానస దేవి ఆలయం చుట్టుపక్కల నోటిఫై చేయబడిన పవిత్ర ప్రాంతాలు, గురుకులాలు ఉన్న గ్రామాలలో మద్యం దుకాణాలు తెరవకూడదని నిర్ణయించినట్లు ప్రకటన పేర్కొంది. తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలను ప్రోత్సహించడానికి, మైల్డ్, సూపర్ మైల్డ్ కేటగిరీల కింద సిద్ధంగా ఉన్న పానీయాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పబ్ కేటగిరీలో బీర్, వైన్ వినియోగానికి మాత్రమే లైసెన్స్ ఫీజు మరింతగా తగ్గించింది. (చదవండి: మరో భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సన్నాహాలు) -
ఆఫీస్‌లో కొత్త వర్క్ పాలసీ.. ఉద్యోగులు పాటించాల్సిందే! లేదంటే
‘త్వరలో ఆఫీసులో కొత్త వర్క్ పాలసీని అమలు చేస్తున్నాం. ఉద్యోగులు తప్పక పాటించాల్సిందే. లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవు! అంటూ పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ కంపెనీ బాస్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ మెమో ఇప్పుడు తెగ చక్కెర్లు కొడుతోంది. రెడిట్‌లో గుర్తు తెలియని యూజర్ చేసిన పోస్ట్‌లో ఇలా ఉంది. ‘ఉద్యోగులకు గమనిక! వర్క్ అంటే వినోదం కాదు. ఇది మీ బాధ్యత. ఆఫీస్ వర్క్ చేయకుండా.. బయట విషయాల గురించి అస్సలు చర్చించ కూడదు. పనివేళల్లో స్నేహానికి తావివ్వకూడదు. “work is not meant to be fun” by u/DiorRoses in mildlyinfuriating ఏదైనా మాట్లాడుకోవాలంటే అది ఆఫీస్ అవర్స్ తర్వాతే. ఆఫీస్ వేళల్లో మీ సహచర ఉద్యోగి.. ఆఫీస్ వర్క్ గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీతో మాట్లాడితే నన్ను సంప్రదించండి. పని మీ బాగోగులు చూసుకునే ‘డేకేర్’ కాదు. అంటూ సంబంధిత ఆఫీస్ బాస్ సంతకం చేసిన మెమోలో పేర్కొని ఉంది. ఈ నోటీస్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రెడిట్‌లో పోస్ట్ చేసిన నాటి నుంచి సుమారు 26 వేల మంది కామెంట్లు చేశారు. బాస్ చాలా ప్రమాదకరంగా ఉన్నారే. ఆ ఆఫీస్ వర్క్ కల్చర్ చెత్తగా ఉంది. ఆఫీస్‌లో స్నేహపూరితమైన వాతావరణం ఉంటే వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది’ అని కామెంట్లలో చెబుతున్నారు యూజర్లు. చదవండి👉 ప్రమాదంలో మరో బ్యాంక్.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి ఆందోళన! -
రతన్ టాటా గురించి తెలుసు, 'మాయా టాటా' గురించి తెలుసా?
టాటా అంటే మొదట గుర్తొచ్చే పేరు 'రతన్ టాటా'. కానీ టాటా కుటుంభంలో చాలామందికి తెలియని కొంతమందిలో 'మాయా టాటా' ఒకరు. రతన్ టాటా మార్గదర్శకత్వంలో భవిష్యత్ నాయకత్వ లక్షణాలు పొందుతున్న ఈమె టాటా గ్రూప్ డిజిటల్ విభాగంలో పని చేస్తోంది. మాయా టాటా ఆమె తోబుట్టువులు లేహ్, నెవిల్లే కూడా రతన్ టాటా బోర్డులో కొత్త సభ్యులుగా చేరారు. మల్టిపుల్ బిలియన్ డాలర్ల సాల్ట్ టు సాఫ్ట్వేర్ సమ్మేళనానికి నాయకత్వం వహించడానికి వీరు ప్రత్యేకంగా తయారైనట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. నోయెల్ టాటా ముగ్గురు పిల్లలలో మాయా టాటా చిన్నది. ఈ ముగ్గురూ టాటా గ్రూప్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. మాయా UK బేయెస్ బిజినెస్ స్కూల్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ నుంచి డిగ్రీ పట్టా పొందింది. ఈమె తల్లి ఆలూ మిస్త్రీ, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి, పల్లోంజి మిస్త్రీ కుమార్తె. (ఇదీ చదవండి: Jeep Grand Cherokee: మొన్న విడుదలైంది, అప్పుడే కొత్త ధరలు) నోయెల్ టాటా కుమార్తె మాయా టాటాకి న్యూ ఏజ్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల తక్కువ వయసుకే వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. ఈమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు, అయితే 2011లో రతన్ టాటా ప్రారంభించిన కోల్‌కతా క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులోని ఆరుగురు సభ్యులలో ఆమె ఒకరుగా కొనసాగుతున్నారు. -
జోరుగా కార్పొరేట్ డీల్స్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా దేశీయంగా విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్ఏ).. ఇతరత్రా కార్పొరేట్ డీల్స్ మాత్రం గతేడాది భారీగానే జరిగాయి. కోవిడ్ పూర్వ స్థాయిని మించి 159 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,103 లావాదేవీలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే విలువపరంగా 29 శాతం పెరిగాయి. 2022 వార్షిక నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం డీల్స్‌లో ఎంఅండ్ఏ తరహా ఒప్పందాల వాటా అత్యధికంగా ఉంది. 20పైగా భారీ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 2021తో పోలిస్తే రెట్టింపై 107 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. అయితే, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీన డీల్ (సుమారు 60 బిలియన్ డాలర్లు)ను మినహాయిస్తే మాత్రం ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 2021తో పోలిస్తే 15 శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులూ 2021తో పోలిస్తే 22 శాతం తగ్గి 52 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు పేర్కొంది. అయితే, అంతకన్నా ముందు మూడేళ్ల వ్యవధితో పోలిస్తే విలువ, పరిమాణంపరంగాను 20 శాతం ఎక్కువగానే నమోదైనట్లు వివరించింది. ఇన్వెస్టర్లు భారత్‌ను దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నారని, ప్రస్తుత మార్కెట్ మందగమనం కాస్త కష్టతరంగానే ఉన్నా చాలా మందికి పెద్దగా ఆందోళకరమైన అంశం కాకపోవచ్చని ఈ ధోరణుల ద్వారా తెలుస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ దినేష్ ఆరోరా తెలిపారు. ఆకర్షణీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ.. దేశీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇంధనం, విద్యుత్, ఇండస్ట్రియల్స్ మొదలైన విభాగాలు ఆకర్షణీయంగా ఉండగలవని నివేదిక పేర్కొంది. గతేడాది కంపెనీలు తమ స్థానాలను పటిష్టపర్చుకోవడం, పోటీని కట్టడి చేయడం, కొత్త వినూత్న విభాగాల్లోకి ప్రవేశించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. దీనితో బ్యాంకింగ్, సిమెంట్, విమానయాన రంగాల్లో కొన్ని భారీ డీల్స్ చోటు చేసుకున్నాయని నివేదిక వివరించింది. -
సోలార్ రంగంలో తగ్గిన కార్పొరేట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సోలార్ రంగంలో కార్పొరేట్ ఫండింగ్ గతేడాది మొదటి తొమ్మిది నెలల్లో 13 శాతం తగ్గింది. 24.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు మెర్కామ్ క్యాపిటల్ తన నివేదికలో పేర్కొంది. 2021లో ఇదే కాలంలో 27.8 బిలియన్ డాలర్లు వచ్చినట్టు తెలిపింది. వెంచర్ క్యాపిటల్, ప్రైవేటు ఈక్విటీ (వీసీ, పీఈ), డెట్ ఫైనాన్స్, పబ్లిక్ మార్కెట్ ఫండింగ్‌ను కార్పొరేట్ ఫండింగ్‌గా చెబుతారు. 2021తో పోలిస్తే గతేడాది వీసీ పెట్టుబడులు 56 శాతం పెరిగి 7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డెట్ ఫైనాన్స్ 24 శాతం తగ్గి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పబ్లిక్ మార్కెట్ ఫైనాన్స్ 5.1 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో వచ్చిన 7.5 బిలియన్ డాలర్లతో పో లిస్తే 32 శాతం తక్కు వ. అంతర్జాతీయంగా సోలార్ రంగంలో 2022లో మొత్తం 128 విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు జరిగాయి. ‘‘ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలో డిమాండ్ పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యం ఈ రంగానికి మద్దతుగా నిలిచింది. సోలార్ ప్రాజెక్టుల కొనుగోళ్ల పరంగా 2022 ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో వీసీ, పీఈ పెట్టుబడులు వచ్చాయి’’ అని మెర్కామ్ క్యాపిటల్ గ్రూపు సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. -
పరిమిత శ్రేణిలోనే కదలికలు..
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ, పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే.. యూఎస్, ఐరోపా మార్కెట్లు తీరుతెన్నులు, డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై రాబడులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టొచ్చంటున్నారు. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు నేడు(సోమవారం) గంట పాటు ప్రత్యేక ‘‘మూరత్ ట్రేడింగ్’’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. బలిప్రతిపద సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. దేశీయ కార్పొరేట్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రకటనతో గతవారం ప్రధాన సూచీలు రెండున్నర శాతం ఎగిశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1387 పాయింట్లు, నిఫ్టీ 391 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. ఈ వారంలో మూరత్ ట్రేడింగ్‌తో పాటు ఒకరోజు సెలవు కారణంగా ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపకపోవచ్చు. కావున కీలక సూచీలు పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అలాగే నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు సైతం చోటు చేసుకోవచ్చు. నిఫ్టీ 17900–18000 నిరోధ శ్రేణిని చేధిస్తే తదుపరి ర్యాలీకి అవకాశం ఉంటుంది. గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రభావం ముందుగా నేడు మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, ఐఓసీ, టాటా పవర్, వేదాంత, ఎన్టీపీసీ, డాలర్ ఇండియా, గ్లాండ్ ఫార్మా, ఎస్బీఐ కార్డ్స్, టాటా కెమికల్స్ కంపెనీ ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధం, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా పరిణామాలను ఈక్విటీ మార్కెట్ వర్గా లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తితో పాటు సెప్టెంబర్ నిరుద్యోగ రేటు, వాణిజ్య లోటు గణాంకాలను నేడు విడుదల చేయనుంది. అమెరికా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి అంచనాలను గురువారం ప్రకటించనుంది. యూరప్ సెంట్రల్ బ్యాంక్ గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం వడ్డీరేట్లను వెల్లడించనుంది. ఇటీవల దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు రికవరీ దిశగా సాగుతున్నాయి. భారత్ అధికంగా ఎగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90డాల ర్లకు పైకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(అక్టోబర్ 27న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,400–18,000 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన మూడు నెలలుగా నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్ఐఐలు అనూహ్యంగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్ 21 నాటికి రూ.6వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది(2022)లో ఇప్పటి వరుకు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ పెరుగుదల, బాండ్లపై రాబడులు పెరగొచ్చని అంచనాలతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల భారత మార్కెట్లపై బేరీష్ వైఖరిని ప్రదర్శించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
యస్ బ్యాంకు ఎండీగా మరో మూడేళ్లు ప్రశాంత్ కుమార్
న్యూఢిల్లీ: యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా ప్రశాంత్ కుమార్ మరో మూడేళ్లు కొనసాగనున్నారు. అక్టోబర్ 6 నుంచి తదుపరి మూడేళ్ల కాలానికి యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా ప్రశాంత్ కుమార్ నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలియజేసింది. ఈ ఏడాది జూలైలో ప్రశాంత్ కుమార్ నియామక ప్రతిపాదనను యస్ బ్యాంకు ఆర్బీఐకి పంపింంది. సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకు పునరుద్ధరణకు వీలుగా ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్న అనంతరం.. 2020లో ప్రశాంత్ కుమార్ మొదటిసారి యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా నియమితులు కావడం గమనార్హం. -
కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం కష్టమే: సర్వేలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: అస్థిరతలు, సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లో కార్పొరేట్ ఇంటిగ్రిటీని (కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం/ఆచరణ సాధ్యత) కొనసాగించడం కష్టమని 78 శాతం మంది భారత నిపుణులు భావిస్తున్నారు. 34 వర్ధమాన దేశాల నుంచి 2,750 మంది బోర్డు సభ్యులు, మేనేజర్లు, ఉద్యోగుల అభిప్రాయాలను ఈవై తన సర్వే కోసం తీసుకుంది. ఇందులో భారత్ నుంచి 100 మంది ఉన్నారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే మన దేశ సంస్థలు నియంత్రణ సంస్థల నుంచి ఎక్కువ చర్యలను ఎదుర్కొంటున్నాయి. ఇంటెగ్రిటీ ప్రమాణాలను ఉల్లంఘించినందుకు తమపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకున్నట్టు మన దేశం నుంచి 60 శాతం కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఇతర వర్ధమాన దేశాల నుంచి ఇలా చెప్పిన వారు 38 శాతమే ఉన్నారు. మారుతున్న నిబంధనలను వేగంగా అమలు చేయడం కష్టంగా ఉన్నట్టు భారత్‌లో 65 శాతం మంది చెప్పారు. వర్ధమాన దేశాల నుంచి ఇలా చెప్పిన కంపెనీలు 45 శాతంగానే ఉన్నాయి. భారత స్టార్టప్‌లు పెరుగుతున్న కొద్దీ.. నియంత్రణపరమైన నిబంధనల అమలు పెంచడానికి మరింత సమయం తీసుకోవచ్చని ఈవై ఇండియా గ్లోబల్ మార్కెట్స్ లీడర్ అర్పిందర్ సింగ్ పేర్కొన్నారు. ఇక మన దేశంలోనే ఎక్కువ కంపెనీలు ఈఎస్జీ దిశగా అడుగులు వేస్తున్నాయి. 47 శాతం కంపెనీలు తాము కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా ఈఎస్జీ విధానం కలిగి ఉన్నట్టు చెప్పాయి. వర్ధమాన దేశాల నుంచి కేవలం 33 శాతం కంపెనీలు ఇలా చెప్పాయి. చదవండి: మూన్‌లైటింగ్: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 17తో ముగిసిన కాలానికి స్థూలంగా 30 శాతం పురోగతితో రూ.8.36 లక్షల కోట్లకు చేరాయి. మహమ్మారి తర్వాత వేగంగా పుంజుకుంటున్న ఎకానమీ, ముందస్తు పన్ను చెల్లింపులు దీనికి కారణమని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, విలువ రూ.6,42,2876 కోట్ల నుంచి రూ.8,36,225 కోట్లకు చేరినట్లు ప్రకటన వివరించింది. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ రంగం వాటా రూ.4.36 లక్షల కోట్లుకాగా, వ్యక్తిగత పన్ను విభాగం వాటా రూ.3.98 లక్షల కోట్లు. ఒక్క అడ్వాన్స్ పన్ను విసూళ్లు 17 శాతం వృద్ధితో రూ.2.29 లక్షల కోట్ల నుంచి రూ.2.95 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్స్ రూ.1.36 లక్షల కోట్లు ఇక మొత్తం వసూళ్లలో రిఫండ్స్ విలువ రూ.1.36 లక్షల కోట్లు. దీనితో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం వృద్ధితో రూ.7 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ అంచనా వేస్తోంది. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. -
ఆ బిలియనీర్ ఆస్తి అమాంతం కరిగిపోయింది
ఆమె ఒక బడా వ్యాపారవేత్త. నాలుగు రోజుల్లో రెండు బిలియన్ల సంపద ఆర్జించి.. యుక్తవయసులోనే ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది.. ఆసియాలోనే అత్యంత సంపద ఉన్న మహిళగా ఖ్యాతికెక్కింది. ప్చ్.. కానీ, అది ఏడాది కిందటి మాట. ఇప్పుడామె ఆస్తి సగం కరిగిపోయింది. అలా ఇలా కాదు. మన కర్సెనీలో చెప్పాలంటే.. లక్షల కోట్ల రూపాయలు మాయమయ్యాయి. ఇదంతా చైనాలో తలెత్తిన రియల్ ఎస్టేట్ రంగపు సంక్షోభ ప్రభావమే. ► యాంగ్ హుయియాన్(41).. చైనా రియల్టి దిగ్గజ సంస్థ కంట్రీ గార్డెన్లో అత్యధిక వాటాలున్న వ్యక్తి. నిరుడు ఆమె సంపద అక్షరాల 23.7 బిలియన్ డాలర్లు(ఆ ఏడాది మొదట్లో 27 బిలియన్డాలర్లుగా ఉంది). కానీ, ► అందులో సుమారు 52 శాతం సంపద ఐస్‌లా కరిగిపోయింది. ఇప్పుడు ఆమె మొత్తం ఆస్తి విలువ 11.3 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ► చైనా ప్రావిన్స్ అయిన గువాంగ్‌డాంగ్‌కు చెందిన కంట్రీ గార్డెన్ షేర్లు.. హాంకాంగ్ ట్రేడింగ్‌లో బుధవారం దారుణంగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రభావంతోనే ఆమె దారుణంగా నష్టపోయింది. ► Yang Huiyan తండ్రి యాంగ్ గువోక్వియాంగ్.. కంట్రీ గార్డెన్ వ్యవస్థాపకుడు. ► 2005లో ఆయన తన వాటాలను కూతురి పేరు మీద రాయడంతో .. ఆమె రిచ్చెస్ట్ వుమెన్ లిస్ట్‌లో చేరిపోయారు. ► రెండేళ్లకు.. అంటే 2007లో కంట్రీ గార్డెన్ ఐపీవోకు వెళ్లింది. ఆ ప్రభావంతో.. ఆమె ఆసియాలో ధనిక మహిళగా గుర్తింపు పొందారు. ► అయితే సైప్రస్ పేపర్ల లీకేజీతో ఆమె ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. ► చైనాలో ద్వంద్వ పౌరసత్వానికి వీల్లేదు. కానీ, ఆమె సైప్రస్ పౌరసత్వం 2018లో తీసుకున్నారన్న విషయం సైప్రస్ పేపర్ల ద్వారా వెలుగు చూసింది. ► ప్రస్తుతం యాంగ్ సంపద తరిగిపోవడంతో.. ఆమె ఈ లిస్ట్‌లో గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ► ఫైబర్స్ టైకూన్ అయిన ఫ్యాన్ హోంగ్‌వెయి సుమారు 11.2 బిలియన్ డాలర్లతో.. యాంగ్‌కు గట్టిపోటీనే ఇస్తోంది. ► కరోనా టైం నుంచి చైనాలో రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ► రియల్టి రంగంలో పెనుసంక్షోభంతో ప్రపంచంలోనే రెండో పెద్ద అర్థిక వ్యవస్థ మొత్తం చైనా పతనం దిశగా దూసుకుపోతోంది. ► ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను తట్టుకునేందుకు అడ్డగోలుగా డిస్కౌంట్లను ప్రకటించి.. ఇప్పుడు నగదు కొరతతో రియల్టి రంగంలోని దిగ్గజ కంపెనీలు ఇబ్బందుల పాలవుతున్నాయి. ► దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలపై పట్టు సాధించడం కోసం డ్రాగన్ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ "సాధారణ శ్రేయస్సు" (కామన్ ప్రాస్సరటీ) పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల చైనా బిలియనీర్ క్లాస్‌లో భారీ ఆటుపోట్లు సంభవిస్తున్నాయి. -
గులాబీకి గుడ్‌బై.. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన గులాబీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన నేతలు.. కారు దిగడానికి దాదాపుగా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన సమీకరణలతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. టీఆర్ఎస్ కండువా కప్పుకొన్న నేతలు తాజాగా సొంతగూటికి వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీదళంలో చేరిన కార్పొరేటర్లు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా బడంగ్‌పేట నగర పాలక సంస్థ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు టీఆర్ఎస్కు ఝలక్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసి సంప్రదింపులు కూడా జరిపారు. ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి ఒకట్రెండు రోజుల్లో హస్తం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరేకాకుండా.. గతంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మరో నేత కూడా గులాబీకి గుడ్‌బై చెప్పనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరంతా హస్తినలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలిచిన అనంతరం టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి చేజిక్కించుకున్న సబితా ఇంద్రారెడ్డితో పొసగని నేతలు పక్క చూపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుండటం అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. ఎల్బీనగర్లోనూ... ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కీలక నేత కూడా సొంతగూటి వైపు చూస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. దీంతో అప్పటి నుంచి ఆయన అధికార టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తం గూటికొ ప్పుడు చేరనున్నారనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. టీకేఆర్ను బుజ్జగించిన కేటీఆర్ గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన తీగల కృష్ణారెడ్డి రెడ్డి సైతం కారు దిగేందుకు దాదాపు సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల ఆయన నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా సన్నిహితులు, వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఆయన కోడలు తీగల అనితా హరినాథ్‌రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీగల కృష్ణారెడ్డిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. రాజకీయ వారసత్వ విషయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆయన పార్టీని వీడే యోచన నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. మేయర్ సహా ఇద్దరు కార్పొరేటర్లపై వేటు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు సహా 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డిలను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి, పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. (చదవండి: ‘మేం బ్యాంకుల్ని మాత్రమే.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు’) -
బ్యాలెన్స్ షీట్స్ పటిష్టతపై కార్పొరేట్లు దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: కార్పొరేట్లు తమ బ్యాలెన్స్ షీట్స్ పటిష్టతపై దృష్టి సారించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. వ్యాపార సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్లలో అధిక నష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా, స్వల్పకాలిక రివార్డ్ కోరే సంస్కృతిని విడనాడాల్సిన అవసరం ఉందన్నారు. ‘రిస్క్ తీసుకోవడం’ అనేది వ్యాపారం చేయడంలో కీలకమైన అంశమని గవర్నర్ పేర్కొంటూనే.. అయితే కంపెనీలు ఆయా అంశాలు, పర్యావసానాలు అన్నింటిపై జాగ్రత్తగా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. స్వల్పకాలిక రివార్డ్ కోరుకోవడానికన్నా ముందు వ్యాపారంలో ఎదరవబోయే ప్రతికూల అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం, వాటి నివారణకు తగిన చర్యలకు సిద్ధమవడం అవసరమని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) ఆధ్వర్యంలో జరిగిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఐకానిక్ వీక్ వేడుకలో ‘ఇండియన్ బిజినెస్: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించి త్వరలో నియంత్రణా నిబంధనలను ఆర్బీఐ విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే... - ఆర్బీఐ దృష్టికి వచ్చిన కొన్ని అనుచితమైన వ్యాపార నమూనాలు లేదా వ్యూహాల సాధారణ లక్షణాలను పరిశీలిస్తే అవి ప్రధానంగా అనుచితమైన ఫండింగ్ స్ట్రక్చర్, రుణం– ఆస్తుల అసమతుల్యతను కలిగి ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైనవి. స్థిరమైనవి ఎంతమాత్రం కాదు. - వీటితోపాటు అవాస్తవిక వ్యూహాత్మక అంచనాలు, సామర్థ్యాలు– వృద్ధి అవకాశాలు–మార్కెట్ పోకడల గురించి మితిమీరిన ఆశావాదం వ్యాపార నమూనా సాధ్యతను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి చివరకు పేలవమైన వ్యూహాత్మక నిర్ణయాలకు దారితీస్తుంది. - వ్యాపార దీర్ఘకాలిక విజయాన్ని నిర్ణయించే ఏకైక అతి ముఖ్యమైన అంశం– కార్పొరేట్ గవర్నెన్స్. వ్యాపార సంస్థలలో విశ్వసనీయత, పారదర్శకత, జవాబుదారీతనం ఇవన్నీ కార్పొరేట్ గవర్నెన్స్‌తో ముడివడి ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడి, వ్యాపార స్థిరత్వం, సమగ్రతను పెంపొందించడంలో కార్పొరేట్ గవర్నర్స్ కీలక పాత్ర పోషిస్తుంది. - యునికార్న్‌ల సంఖ్య (బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కొత్త వ్యాపారాలు) చాలా వేగంగా పెరుగుతోంది. ఈ స్టార్టప్‌లకు ఏంజెల్, వెంచర్ ఫండింగ్, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, సమాజంలో వినియోగానికి సంబంధించి కొత్త సంస్కృతి ద్వారా మద్దతు లభిస్తోంది. - భారతీయ వ్యాపారం ఇప్పుడు అవకాశాలు– సవాళ్లు రెండింటితో కీలకమైన దశలో ఉంది. - స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. చదవండి: భారత జీడీపీ వృద్ధి: వరల్డ్ బ్యాంకు షాకింగ్ అంచనాలు -
మహిళా సీఈవోలకు జీతం పెరిగింది కానీ..
న్యూయార్క్: ఎస్అండ్పీ 500 కంపెనీలను నడిపించే మహిళా సారథులకు (సీఈవోలు) 2021లో వేతన ప్యాకేజీలు గణనీయంగా పెరిగాయని ఈక్విలర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవడానికితోడు, స్టాక్ ధరలు, లాభాలు పెరగడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. మహిళా సీఈవోలకు మధ్యస్థ వేతన చెల్లింపులు 26 శాతం వృద్ధితో 16 మిలియన్ డాలర్లకు (రూ.123 కోట్లు) చేరుకున్నట్టు చెప్పింది. ఇప్పటికీ కార్పొరేట్ ర్యాంకులు, వేతన చెల్లింపుల్లో స్త్రీ, పురుషల మధ్య వ్యత్యాసం ఉందని.. లింగ వైవిధ్యం కోసం మరింత కృషి చేయాల్సి ఉందని ఈ నివేదిక పేర్కొంది. ‘‘మహిళా సీఈవోల వేతనం పెరగడం మంచిది. కానీ, ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. అయితే, ఎక్కువ ఆర్జన పొందుతున్న మహిళా సీఈవోలవైపు చూడడం కాకుండా.. వేతన అంతరాన్ని సునిశితంగా చూడాల్సి ఉంది’’అని కార్న్ ఫెర్నీ సీఈవో జేన్ స్టెవెన్సన్ పేర్కొన్నారు. ఎస్అండ్పీ 500 కంపెనీల్లో.. 340 సీఈవోలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్అండ్పీ 500 కంపెనీల లాభాలు 50 శాతం పెరిగాయి. సూచీలు 27 శాతం వరకు లాభపడ్డాయి. ఈ పనితీరుతోనే ఎక్కువ మంది సీఈవోల పారితోషికం ముడిపెట్టి ఉండడం వల్ల.. ఏళ్ల పాటు మోస్తరు వృద్ధికే పరిమితమైన వేతన ప్యాకేజీలు ఒక్కసారిగా పెరగడానికి దోహదపడింది. మహిళా సీఈవోలకు ప్యాకేజీ పెంపు 26.4 శాతంగా ఉండి 15.8 మిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇదే కాలంలో పురుష సీఈవోలకు పెంపు 17.7 శాతంగా ఉండి 14.4 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
జొమాటోకుషాక్, షేర్లు జంప్, కొనుక్కోవచ్చా?
సాక్షి, ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు వరుస నష్టాల షాక్ తగిలింది. గత ఆర్థిక సంవత్సరం(2021-22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో నికర నష్టం భారీగా మూడురెట్లు పెరిగి రూ. 360 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020-21) ఇదే కాలంలో రూ. 134 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 692 కోట్ల నుంచి రూ. 1,212 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 885 కోట్ల నుంచి రూ. 1,702 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జొమాటో నికర నష్టం భారీగా పెరిగి రూ. 1,225 కోట్లను దాటింది. 202021లో రూ. 816 కోట్ల నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,994 కోట్ల నుంచి రూ. 4,192 కోట్లకు ఎగసింది. కంపెనీ తిరిగి వృద్ధి బాట పట్టినట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఫలితాల విడుదల సందర్భంగా అభిప్రాయపడ్డారు. కోవిడ్ తదుపరి సవాళ్లు బిజినెస్ వృద్ధిపై ఎలాంటి ప్రతికూలతలూ చూపించబోవని అంచనా వేశారు. వృద్ధిని కొనసాగించడం, నష్టాలను తగ్గించుకోవడం తదితర దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో సోమవారం జొమాటో షేరు 2.2 శాతం క్షీణించి రూ. 57 వద్ద ముగిసింది. అయితే మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలోనే ఏకంగా 17 శాతం ఎగిసింది. ప్రస్తుతం 8శాతం లాభాలతో కొనసాగుతోంది. ట్రేడ్పండితులు టార్గెట్ ధరను రూ.100గా నిర్ణయించడంతో పేర్కొనడంతో కొనుగోళ్ల జోరు నెలకొంది.