cricket
-
లెజెండ్స్ లీగ్‌కు మెరుపు ఆరంభం.. శతకాల మోత మోగించిన ప్లేయర్లు
ఏషియన్ లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) నిన్న (మార్చి 10) ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు. నిన్న జరిగిన టోర్నీ ఓపెనర్‌లో ఏషియన్ స్టార్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ తలపడ్డారు. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏషియన్ స్టార్స్.. ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. షోయబ్ ఖాన్ (63 బంతుల్లో 104 నాటౌట్) మెరుపు శతకంతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్ (65) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం బరిలోకి దిగిన ఏషియన్ స్టార్స్ కెప్టెన్ మెహ్రాన్ ఖాన్ (52 బంతుల్లో 109 నాటౌట్) సునామీ శతకంతో విరుచుకుపడటంతో 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మరో ఎండ్‌లో మెహ్రాన్ ఖాన్‌కు పెద్దగా సపోర్ట్ లేనప్పటికీ.. ఒంటిచేత్తో ఏషియన్ స్టార్స్‌ను గెలిపించాడు. ఏషియన్స్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో అంకిత్ నర్వాల్ (39), రాఘవ్ ధావన్ (34 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నిన్ననే జరగాల్సిన మరో మ్యాచ్ రద్దైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టైగర్స్, ఇండియన్ రాయల్స్‌తో తలపడాల్సి ఉండింది.ఏషియన్ లెజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ జట్టు..అంబటి రాయుడు, మనోజ్ తివారి, సుబ్రమణ్యం బద్రీనాథ్, ఫయాజ్ ఫజల్, శిఖర్ ధవన్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, నమన్ ఓఝా, శ్రీవట్స్ గోస్వామి, అనురీత్ సింగ్, మునాఫ్, కరణ్వీర్ సింగ్, బరిందర్ శ్రాన్, షాదాబ్ జకాతి, మన్‌ప్రీత్ గోని, సుదీప్ త్యాగి -
Rohit Sharma: పెను తుపాను తలొంచి చూస్తే తొలి నిప్పు కణం అతడే
-
పాకిస్థాన్ పరువు పాయే
-
స్టార్ క్రికెటర్ల భార్యలకు బీసీసీఐ బిగ్ షాక్
-
దుబాయ్ లో జరిగే మ్యాచ్‌లో తలపడనున్న భారత్-ఆస్ట్రేలియా
-
సిరాజ్‌తో 'బిగ్‌బాస్' బ్యూటీ డేటింగ్.. లైక్ కొట్టడం వల్లే ఇదంతా
భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీతో టచ్‌లో ఉన్న వారితో ఆయన ప్రేమలో పడినట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే లెజెండరీ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో ప్రేమలో ఉన్నాడని రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే, వాటిని సిరాజ్ ఖండించారు. ఆమె తనకు సోదరిలాంటిదని చెప్పేశాడు. అయితే, ఇప్పుడు హిందీ బిగ్‌బాస్ ఫేమ్ మహిరా శర్మ (Mahira Sharma)తో సిరాజ్ డేటింగ్లో ఉన్నాడంటూ బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది.కొద్దిరోజుల క్రితం మహిరా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌కు సిరాజ్ లైక్ కొట్టడమే కాకుండా ఫాలో అయ్యాడు. దీంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మహిరా శర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చింది. ' సిరాజ్‌తో నేను డేటింగ్లో ఉన్నానంటూ వచ్చిన వార్తలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. సోషల్‌మీడియాతో పాటు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ కావడంతో నాపై ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అభిమానుల పేరుతో చాలామంది మమ్మల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయవచ్చు. మేము వారిని ఆపలేము. చిత్ర పరిశ్రమలో చాలామందితో కలిసి పనిచేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మేము కొన్ని ఎదుర్కొవాల్సిందే. ఒక్కోసారి మా ఫోటోలను వారు ఎడిట్లు కూడా చేస్తారు. కానీ వీటన్నింటికీ నేను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను. కానీ, ఇలాంటి రూమర్స్ ఎవరు చేసినా తప్పేనని చెబుతాను.' అని ఆమె చెప్పింది.సిరాజ్‌తో డేటింగ్ వార్తలపై మహిరా శర్మ తల్లి సానియా శర్మ కూడా గతంలో రియాక్ట్ అయ్యారు. ఇలాంటి రూమర్స్ ఎవరూ నమ్మద్దొని ఆమె కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిని ఖండించారు. నా కూతురు గురించి మీడియా వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బయట వాళ్లు ఎన్నో అంటారు.. అవన్నీ నిజాలు అయిపోతాయా..? నా కూతురు ఒక సెలబ్రిటీ కాబట్టే ఇలాంటి రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. కొందరు అభిమానులే ఇలాంటి పనిచేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు.' అని సానియా శర్మ చెప్పారు.హిందీ టీవీ సీరియల్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు మహిరా శర్మ దగ్గరైంది. అలా బిగ్‌బాస్ 13లో అవకాశం రావడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత వెబ్‌సిరీసుల్లోనూ ఛాన్సులు దక్కించుకుని మరింత పాపులర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, బిగ్‌బాస్ సమయంలో పరాస్ ఛాబ్రాతో మహిరా శర్మ ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని పరాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ, కొద్దిరోజుల్లోనే తాము బ్రేకప్ చెప్పుకున్నామని కూడా ఆయన పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Mahira Sharma (@mahirasharma) -
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉంటాడు.. బరువు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. ఏదో లక్కీగా అతడికి కెప్టెన్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రోహిత్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ ఆటతీరుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. షామా మొహమ్మద్ ట్విట్టర్ వేదికగా రోహిత్‌ను టార్గెట్ చేసి.. రోహిత్ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిటినెస్ ఉండదు ఏదో అదృష్టం కొద్ది రోహిత్ భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్ రోహిత్. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడు’ అంటూ కామెంట్స్ చేశారు.Congress leader Shama Mohamed has insulted and mocked 'National Pride' and T20 world cup winning captain Rohit Sharma .Congress with Rahul Gandhi at their helm is giving certificate of mediocrity to others ! Some jokes write themselves. pic.twitter.com/IQlquH4mri— विकास प्रताप सिंह राठौर🚩🇮🇳 (@V_P_S_Rathore) March 3, 2025దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు, నెటిజన్లు షామా మొహమ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంతో ఆమె తన ట్వీట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ..‘భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, మరోసారి షామా మొహమ్మద్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. Shame on Congress!Now they are going after the Indian Cricket Captain!Do they expect Rahul Gandhi to now play cricket after failing in Indian politics! https://t.co/taWuC8bqgi— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) March 2, 2025ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ తర్వాత 2022 నుంచి రోహిత్ శర్మ(37) భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ నాయకత్వంలో, గత సంవత్సరం భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను సాధించింది. ఐపీఎల్లో కూడా రోహిత్ సారథ్యంలోనే ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. క్రికెట్ చరిత్రలోనే రోహిత్‌కు పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. -
కోహ్లికి శ్రేయస్ చురకలు?
-
భారత్- పాక్ మ్యాచ్.. ఊర్వశి రౌతేలా క్రేజీ రికార్డ్!
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఐదేళ్ల కుర్రాడి నుంచి డెబ్బై ఏళ్ల ముసలోళ్లు కూడా వదిలిపెట్టరు. మ్యాచ్ ఎప్పుడు మొదలతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రపంచ క్రికెట్లోనే అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇండియా- పాకిస్తాన్ పోరు మాత్రమే. ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్‌లు లేనందువల్ల అప్పుడప్పుడు వచ్చే ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నారు దాయాది జట్లు. మరి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చే ఈ మ్యాచ్ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు క్రీడా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక మ్యాచ్ లైవ్‌లో చూసేవారికి ఆ థ్రిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఏంటా స్పెషల్? అనేది తెలియాలంటే మీరు లుక్కేసేయండి మరి.తాజాగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. ఇటీవల డాకు మహారాజ్‌తో ఫ్యాన్స్‌ను అలరించిన ముద్దుగుమ్మ సడన్‌గా మ్యాచ్‌లో దర్శనమిచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా డైరెక్టర్ సుకుమార్, పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ మ్యాచ్ లైవ్‌లో అభిమానులు వీక్షించారు.అయితే చాలా మంది సెలబ్రిటీలు ఈ మ్యాచ్‌కు హాజరైనప్పటికీ అందరి కళ్లు ఊర్వశి రౌతేలాపైనే ఉన్నాయి. ఈ బాలీవుడ్ భామ దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. టీమిండియా- పాక్ మ్యాచ్‌లో ఏకంగా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫిల్మ్ ఫేర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తొలి సెలబ్రిటీ అంటూ..భారత్- పాక్ మ్యాచ్‌లో పుట్టినరోజు జరుపుకున్న తొలి సెలబ్రిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో రికార్డ్ సృష్టిస్తే.. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఊర్వశి తొలిసారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని అంటున్నారు. మరికొందరైతే ఊర్వశి రౌతేలాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఖరికి ఫిల్మ్ ఫేర్ వాళ్లు కూడా ఊర్వశిపై జోకులు వేస్తున్నారని మరికొందరు రాసుకొచ్చారు. కొందరు రిషబ్ పంత్ పేరును కూడా కామెంట్స్‌లో ప్రస్తావిస్తున్నారు. అయితే ఆమెపై ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ.. చివరికీ బాలీవుడ్ భామ మాత్రం ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అందర దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఇటీవల టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఊర్వశి రౌతేలా బర్త్ డే ఈనెల 25న కాగా.. ముందుగానే స్టేడియంలో సెలబ్రేట్ చేసుకుని హైలెట్‌గా నిలిచింది. #ViratKohli broke several records during the India vs Pakistan match yesterday but #UrvashiRautela became the first actress to celebrate her birthday during an #IndvsPak cricket match. 🤣#Trending #indvspak #indiavspakistan #iccchampionstrophy pic.twitter.com/OLjHILtvgh— Filmfare (@filmfare) February 24, 2025 -
ఖేలో.. అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్
ఎన్నో విశిష్టతలున్న భాగ్యనగరం అంతర్జాతీయ క్రీడల్లోనూ తన ప్రశస్తిని కొనసాగిస్తుంది. ముఖ్యంగా క్రికెట్, టెన్నిస్ వంటి ప్రజాధరణ ఉన్న క్రీడలతో పాటు బ్యాడ్మింటన్ వంటి క్రీడలతో దేశానికి ఒలింపిక్స్ మెడల్స్ అందించిన ఘనత నగరానికి ఉంది. ఇదే కోవలో మరిన్ని అంతర్జాతీయ క్రీడలు నగరంలో రాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ ఫుట్‌బాల్ సైతం ఈ మధ్య తన ప్రశస్తిని పెంచుకుంటుంది. నగరవాసులు అమెరికన్ ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆదరణ దృష్ట్యా తెలంగాణ అమెరికన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రారంభమై ఈ క్రీడ అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది. అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడను నగరంతో పాటు రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసేందుకు అమెరికన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన తెలంగాణ అమెరికన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (టాఫా) కృషి చేస్తుంది. ఇందులో భాగంగా 2025–28 మధ్య కాలానికి అధ్యక్షుడిగా చాగన్ల బల్వీర్ందర్ నాథ్‌ను నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో అమెరికన్ ఫుట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ప్రోత్సహించి, ఒలింపిక్స్ వేదికల పై మన క్రీడాకారుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఈ అమెరికన్ ఫుట్‌బాల్ ప్రసిద్ధి చెందింది. సాకర్, రగ్బీ నుంచి వచ్చిన ఈ గేమ్ 2022లో లీగ్ వార్షిక ఆదాయం 18.6 బిలియన్ డాలర్లుగా నమోదు చేసి ప్రపంచంలోనే విలువైనస్పోర్ట్స్ లీగ్‌లో భాగంగా చేరింది. రాష్ట్ర వ్యాప్త గుర్తింపు దిశగా..ఈ క్రీడను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. దీని కోసం ప్రత్యేకంగా అన్ని పట్టణాల్లో, జిల్లాల్లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి, వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పిస్తాం. ఈ ప్రయత్నంలో భాగంగా అసోసియేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేయనున్నాం. మరో రెండేళ్లలో నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా అంతర్జాతీయ స్థాయి లీగ్‌ను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందులో దాదాపు 22 దేశాలను భాగం చేస్తున్నాం. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్‌లో ఔత్సాహిక క్రీడాకారులకు, యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నాం. టాఫా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు నడిపల్లి, ఏఎఫ్ఎఫ్ఐ సీఈఓ సందీప్ చౌదరి వంటి దార్శనికుల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందించాలని కొరనున్నాం. – చాగన్ల బల్వీర్ందర్ నాథ్, టాఫా అధ్యక్షులు.అమెరికన్ ఫుట్‌బాల్ గేమ్‌లో కాంటాక్ట్, నాన్‌కాంటాక్ట్ అనే ఈ విభాగాల్లో పోటీ ఉంటుంది. నాన్ కాంటాక్ట్ విభాగంలోని ఫ్లాగ్ గేమ్ ఇక్కడ అభివృద్ధిలో ఉంది. రగ్బీలా ఇందులో మ్యాన్ పుల్లింగ్ ఉండదు. నేను 13 ఏళ్ల నుంచి ఈ గేమ్ ఆడుతున్నాను. అంతేకాకుండా ఇండియన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాను. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం నాలుగు నేషనల్స్ గెలిచింది. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రస్తుతం సన్నద్ధమవుతున్నాం. ఇందులో స్థానిక క్రీడాకారులను భాగం చేసేందుకు టాఫా ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి మాదిరిగా ఇక్కడ కూడా ఈ క్రీడకు పాపులారిటీ తీసుకురానున్నాం. – జీవీ మణికంఠ రెడ్డి, ఇండియన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ కెప్టెన్ -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
India Vs Bangladesh Match Live Updates And Highlights:భారత్ ఘన విజయం..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో అందుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. గిల్ సెంచరీ..శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత్ విజయానికి ఇంకా 7 పరుగులు కావాలి.విజయానికి చేరువలో భారత్..44 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(88), కేఎల్ రాహుల్(33) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.34 ఓవర్లకు భారత్ స్కోర్: 158/434 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(65), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్..144 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్..134 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్‌మన్ గిల్(56), అక్షర్ పటేల్(3) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి ఔట్..టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 24 ఓవర్లకు భారత్ స్కోర్: 118/2ఆచితూచి ఆడుతున్న గిల్-కోహ్లిరోహిత్ శర్మ ఔటయ్యాక భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి(13), శుబ్‌మన్ గిల్(41) ఆచితూచి ఆడుతున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.టీమిండియా తొలి వికెట్ డౌన్..69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 69/1దూకుడుగా ఆడుతున్న రోహిత్, గిల్..229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), శుబ్‌మన్ గిల్(13) ఉన్నారు.ఐదేసిన షమీ.. బంగ్లాదేశ్ 228 ఆలౌట్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. భారత బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైన సాధించిందంటే అది తౌహిద్ హృదోయ్ (100), జాకిర్ అలీ (68) చలువే. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవరూ రాణించలేదు. ఈ మ్యాచ్‌లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. రోహిత్ శర్మ సునాయాసమైన క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఐదు వికెట్లు తీసిన షమీతౌహిద్ హృదోయ్ సూపర్ సెంచరీజట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన తౌహిద్ హృదోయ్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీ చేశాడు. కండరాల సమస్యతో బాధపడుతూనే హృదోయ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. నాలుగో వికెట్ తీసిన షమీఈ మ్యాచ్‌లో షమీ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. షమీ.. తంజిమ్ హసన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 47 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 221/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (96) , తస్కిన్ అహ్మద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సూపర్‌గా బ్యాటింగ్ చేస్తున్న హృదోయ్ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రిషద్ హొసేన్ (18) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్హృదోయ్, జాకిర్ అలీ మధ్య భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. జాకిర్ అలీని (68) షమీ ఔట్ చేశాడు. 189 పరుగుల వద్ద (42.4 ఓవర్లు) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదోయ్ (84), రిషద్ హొసేన్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న జాకిర్ అలీ, హృదోయ్బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. ప్రస్తుతం జాకిర్ అలీ 54, హృదోయ్ 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 37.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 150/5గా ఉంది. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5తౌహిద్ హృదోయ్ (37), జాకిర్ అలీ (41) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాదేశ్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 78 పరుగులు జోడించారు. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5గా ఉంది.25 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 92/535 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది.25 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 92/5గా ఉంది. తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ తలో 29 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. హ్యాట్రిక్ మిస్అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో ఓవర్లో వరుసగా 2, 3 బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. నాలుగో బంతికి కూడా వికెట్ తీయాల్సింది. జాకిర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌కు రోహిత్ శర్మ మిస్ కావడంతో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5గా ఉంది. తౌహిద్ హృదోయ్ (4), జాకిర్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు.వరుస బంతుల్లో వికెట్లు తీసిన అక్షర్.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో (2, 3) వికెట్లు తీశాడు. తొలుత తంజిద్‌కు పెవిలియన్‌కు పంపిన అక్షర్.. ఆతర్వాతి బంతికే ముష్ఫికర్‌కు ఔట్ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (25) పెవిలియన్ బాట పట్టాడు. మళ్లీ వికెట్ తీసిన షమీ.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో షమీ తన రెండో వికెట్ తీశాడు. స్లిప్స్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మెహిది హసన్ మిరాజ్ (5) పెవిలియన్‌కు చేరాడు. 6.2 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 26/3గా ఉంది. తంజిద్ హసన్ (20) ధాటిగా ఆడుతున్నాడు. తౌహిద్ హృదోయ్ కొత్తగా క్రీజ్‌లోకి వచ్చాడు.రెండో ఓవర్లో మరో వికెట్బంగ్లాదేశ్ జట్టు రెండో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నజ్ముల్ హసన్ షాంటో డకౌటయ్యాడు. బంగ్లా ఖాతాలో ప్రస్తుతం 2 పరుగులకే ఉన్నాయి. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ డకౌటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 20) భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) బరిలోకి దిగుతుంది. అర్షదీప్ స్థానంలో షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీకి జతగా హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నాడు. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. మిస్టరీ స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ సైతం ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ -
ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఢీకొట్టనున్న ఆర్సీబీ
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL) షెడ్యూల్ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదలైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR).. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (RCB) తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో (Eden Gardens) జరుగుతుంది.ఇదే ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్-2 (మే 23) మరియు ఫైనల్ మ్యాచ్‌లు (మే 25) జరుగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో క్వాలిఫయర్-1 (మే 20) మరియు ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్‌లు జరుగుతాయి. గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. మార్చి 23న జరిగే తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను ఎస్ఆర్హెచ్ తమ సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంది. అదే రోజు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 65 రోజుల పాటు జరిగే ఐపీఎల్-2025 సీజన్లో 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మెగా లీగ్ నిర్వహించబడుతుంది. -
క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలు ...!
-
ప్రపంచ కప్ సాధించడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: భారత దేశానికి మహిళా ప్రపంచ క్రికెట్ కప్ సాధించడమే తన లక్ష్యమని మహిళా క్రికెటర్ గొంగడి త్రిష పేర్కొన్నారు. నగరంలోని హయత్ ప్లేస్ హోటల్లో నిర్వహించిన సన్మాన సభలో ఆమె మాట్లాడారు. ‘అండర్ –19 టీ–20 ప్రపంచ కప్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. క్రికెట్లో మిథాలిరాజ్ స్ఫూర్తి. ప్రతి మ్యాచ్ ఆడే ముందు ఒక్కటే ఆలోచన ఉంటుంది. బాగా ఆడాలి. టీం గెలవాలన్న లక్ష్యంతో గ్రౌండ్లోకి వెళతా. ఓవర్ కవర్ షాట్ నా ఫేవరెట్. నిద్రలో లేపి ఆడమన్నా ఆడతాను. ఆటలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు. నిత్యం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆరు, ఏడేళ్ల నుంచి ఫిట్నెస్, బ్యాటింగ్, ఆహారపు అలవాట్లలో కోచ్ సూచలను పాటిస్తున్నా. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను’ అన్నారు. లక్ష్యంతో పనిచేస్తేనే.. కేవలం డబ్బు సాయంతో విజయం సాధ్యం కాదు, కష్టపడి, నిర్థేశిత లక్ష్యంతో పనిచేస్తేనే జీవితంలో రాణించగలమని ఏఆర్కే ఫౌండర్ ఛైర్మన్ రామ్‌రెడ్డి అన్నారు. 2028లో లోకేష్ , వెన్నెల మెడల్స్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్రిష తండ్రి, హాకీ ప్లేయర్, ట్రైనర్ రామ్‌రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ఐటీసీలో ఉద్యోగం చేస్తూ త్రిషకు క్రికెట్లో శిక్షణ ఇప్పించాను. మెరుగైన కోచింగ్ కోసం 17 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేశాం. చాలా కష్టనష్టాలను చూశానన్నారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ చిన్నతనంలో కరణం మల్లీశ్వరిని ప్రభుత్వం ఘనంగా సత్కరించినపుడు పోడియం ముందున్న నేను అలా సత్కారం పొందాలని అనుకున్నానని తెలిపారు. ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టడంతో ఎంతో మంది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కష్టపడి పనిచేయడం, నిబద్ధత, నమ్మకంతో పనిచేస్తే విజయం సాధించడం తధ్యమని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్ ఆడని రోజు లేదని టీజీపీఎస్సీ మాజీ ఛైర్మన్ జనార్థన్‌రెడ్డి అన్నారు. త్రిష నిత్యం తన ఆటను మెరుగుపరుచుకుని, వృద్ధిచెందాలని మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రికెట్ కోచ్ జాన్ మనోజ్, మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఎంఎస్కే ప్రసాద్, మాజీ ఐఏఎస్ రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. -
Ranji Trophy: పారస్ డోగ్రా సెంచరీ... విజయం దిశగా జమ్మూ కశ్మీర్
పుణే: రంజీ ట్రోఫీ (Ranji Trophy) తాజా సీజన్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) జట్టు కేరళతో క్వార్టర్ ఫైనల్లో భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 180/3తో మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూ కశ్మీర్ జట్టు 100.2 ఓవర్లలో 399/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ పారస్ డోగ్రా (Paras Dogra) (232 బంతుల్లో 132; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీతో చెలరేగగా... కన్హయ్య (64; 5 ఫోర్లు), సాహిల్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో నిదీశ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు మంగళవారం ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. రోహన్ (36), ఆక్షయ్ చంద్రన్ (32 బ్యాటింగ్), కెప్టెన్ సచిన్ బేబీ (19 బ్యాటింగ్) తలా కొన్ని పరుగులు చేశారు. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 8 వికెట్లు ఉన్న కేరళ జట్టు విజయానికి ఇంకా 299 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఫలితం జమ్మూ కశ్మీర్‌కు అనుకూలంగా వస్తే చరిత్ర అవుతుంది. ఈ జట్టు తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించినట్లవుతుంది. -
అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా ఓపెనర్ (South Africa Opener) మాథ్యూ బ్రీట్జ్కీ (Matthew Breetzke) వన్డే అరంగేట్రంలోనే (ODI Debut) సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో బ్రీట్జ్కీ ఈ ఫీట్‌ను సాధించాడు. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 19వ ఆటగాడిగా, నాలుగో సౌతాఫ్రికన్ ప్లేయర్‌గా బ్రీట్జ్కీ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. బ్రీట్జ్కీకి ముందు డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (విండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సలీం ఇలాహి (పాకిస్తాన్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), కొలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా), రాబర్ట్ నికోల్ (న్యూజిలాండ్), ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా), మైఖేల్ లంబ్ (ఇంగ్లండ్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (ఇండియా), టెంబా బవుమా (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హార్ (పాకిస్తాన్), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా), ఆబిద్ అలీ (పాకిస్తాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), మైఖేల్ ఇంగ్లిష్ (స్కాట్లాండ్), అమీర్ జాంగూ (వెస్టిండీస్) వన్డే అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.వన్డే అరంగేట్రంలనే సెంచరీలు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..కొలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపైటెంబా బవుమా 2016లో ఐర్లాండ్పైరీజా హెండ్రిక్స్ 2018లో శ్రీలంకపైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైతటస్థ వేదికపై వన్డే అరంగ్రేటంలో సెంచరీ చేసిన ఆటగాళ్లు..ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపైఇమామ్ ఉల్ హాక్ 2017లో శ్రీలంకపైఆబిద్ అలీ 2018లో ఆస్ట్రేలియాపైరహ్మానుల్లా గుర్బాజ్ 2021లో ఐర్లాండ్పైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైబ్రీట్జ్కీ ప్రపంచ రికార్డున్యూజిలాండ్తో మ్యాచ్‌లో 148 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కీ 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రదర్శనతో బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో వన్డే అరంగేట్రంలో 150 పరుగులు ఎవ్వరూ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్‌కు ముందు వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ పేరిట ఉండింది. హేన్స్ తన వన్డే డెబ్యూలో 148 పరుగులు స్కోర్ చేశాడు. తాజా ప్రదర్శనతో వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు కూడా బ్రీట్జ్కీ ఖాతాలోకి చేరింది.న్యూజిలాండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కీ (150) అరంగేట్రంలోనే సెంచరీతో కదంతొక్కగా.. వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో రాణించాడు. జేసన్ స్మిత్ (41) పర్వాలేదనిపించాడు. టెంబా బవుమా 20, కైల్ వెర్రిన్ 1, సెనూరన్ ముత్తుసామి 2 పరుగులు చేసి ఔటయ్యారు.న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ తలో రెండు వికెట్లు.. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. సండే స్పెషల్ అంటూ పోస్ట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్రౌండ్లో అడుగుపెట్టారు. తన క్రికెట్ టీమ్‌తో కలిసి మైదానంలో సందడి చేశారు. మహారాష్ట్రలోని థానేలో ఉన్న దడోజి కొండేవ్ స్డేడియంలో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఐఎస్‌టీఎల్ టీ10 లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో తన టీమ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ బరిలో నిలిచింది. తాజాగా తన టీమ్‌కు మద్దతు తెలిపిందుకు మన స్టార్ హీరో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చారు.(ఇది చదవండి: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు లవర్స్ డే కానుక.. రొమాంటిక్ చిత్రం రీ రిలీజ్)ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ16 పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీతో సినీ ప్రియులను అలరించాడు చెర్రీ. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. Sunday special at Dadoji Konddev Stadium! 🏟️ Cheering for my team Falcon Risers Hyderabad! 🙌Watch @ispl_t10 live on @DisneyPlusHS & @StarSportsIndia #ISPLT10 #Street2Stadium #NewT10Era #Season2 #DikhaApnaGame #ISPLonJioStar pic.twitter.com/TYuAYjPMBy— Ram Charan (@AlwaysRamCharan) February 9, 2025 -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 విజేత ఫార్చూన్ బారిషల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన ఫైనల్లో బారిషల్.. చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చిట్టగాంగ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు ఖ్వాజా నఫే (66), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (78 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఆతర్వాత వచ్చిన గ్రహం క్లార్క్ (44) కూడా రాణించడంతో కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బారిషల్ బౌలర్లలో మొహమ్మద్ అలీ, ఎబాదత్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్‌కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (54), తౌహిద్ హృదోయ్ (320 శుభారంభాన్ని అందించారు. అనంతరం కైల్ మేయర్స్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బారిషల్ను విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (18 నాటౌట్) రెండు సిక్సర్లు బాది బారిషల్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. మరో మూడు బంతులు మిగిలుండగానే బారిషల్ విజయతీరాలకు చేరింది. కింగ్స్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 4 వికెట్లు తీసి బారిషల్ను భయపెట్టాడు. నయీమ్ ఇస్లాం 2, బినుర ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ఫార్చూన్ బారిషల్ టైటిల్ సాధించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం. -
IPL 2025: IPL కప్ మనదేనా?
-
IND vs ENG: 1 టికెట్ ప్లీజ్!
భువనేశ్వర్: కటక్ బారాబటి స్టేడియంలో ఈ నెల 9న జరగనున్న భారత్, ఇంగ్లాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి టికెట్ల విక్రయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో చేరుకుని రాత్రంతా పడిగాపులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కౌంటర్లో విక్రయించే టిక్కెట్లు కోసం అర్ధరాత్రి నుంచి జనాలు చేరడంతో ఒకానొక సమయంలో తొక్కిసలాట పరిస్థితి చోటు చేసుకుంది. 4 కౌంటర్లు.. 12 వేల టికెట్లు టిక్కెట్ల విక్రయానికి 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 12 వేల టికెట్లు విక్రయించారు. రద్దీ నియంత్రణ కోసం పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆన్లైన్లో టికెట్లు దక్కించుకోలేని క్రికెట్ అభిమానులు వాటిని ఆఫ్‌లైన్‌లో కొనాలని ఎగబాకడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. స్పెషల్ ఎన్‌క్లోజర్, ఏసీ గ్యాలరీ, న్యూ పెవిలియన్, కార్పొరేట్ బాక్స్ టిక్కెట్ల గురప్రు గేట్ ప్రాంగణంలో టికెట్లు విక్రయించారు. మిగిలిన అన్ని గ్యాలరీ టికెట్లను కిల్ఖానా లేక్‌లోని 3 కౌంటర్లలో విక్రయానికి ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా మహిళా ప్రేక్షకుల కోసం ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులు.. బారాబటి స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ పురస్కరించుకుని కటక్ నగరంలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా స్టేడియం లోపల, వెలుపల గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. కటక్ నగర పాలక సంస్థ స్టేడియం పరిసరాల్లో సుందరీకరణ, పారిశుధ్యం, ఫాగింగ్ కార్యకలాపాలను చేపడుతోంది. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో మ్యాచ్ సన్నాహాలను సమీక్షించారు. కటక్ జిల్లా యంత్రాంగం, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), ఒడిశా ఒలింపిక్ అసోసియేషన్, పోలీసు, ఆరోగ్య విభాగాలు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. జేమీ స్మిత్ భారత్‌తో ఇటీవల జరిగిన మూడో టీ20 సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను చికిత్స తీసుకుంటున్నాడు. తొలి వన్డేకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండగా.. జేమీ స్మిత్ ఇంకా కోలుకోలేదు. దీంతో అతను తొలి రెండు వన్డేలకు దూరం కానున్నాడని తెలుస్తుంది. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. భారత్‌తో వన్డే సిరీస్‌లో స్మిత్ లేకపోయినా ఇంగ్లండ్‌కు మరో రెండు వికెట్‌కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్‌లలో ఎవరో ఒకరు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే బట్లర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటివరకు వికెట్‌కీపింగ్ చేయలేదు. మరోవైపు సాల్ట్‌కు వన్డేల్లో పెద్దగా వికెట్‌కీపింగ్ చేసిన అనుభవం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి.కాగా, భారత్‌తో తాజాగా ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 1-4 తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో పరాభవం తర్వాత ఇంగ్లండ్ కోలుకోవాలని చూస్తుంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌కు ఇదే ఆఖరి వన్డే సిరీస్. ఈ సిరీస్‌లో సత్తా చాటి ఛాంపియన్స్ ట్రోఫీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఇంగ్లండ్ వన్డే జట్టులో స్టార్ ఆటగాడు జో రూట్ చేరాడు. రూట్ చేరికతో ఇంగ్లండ్ బలం పెరుగుతుంది.ఫిబ్రవరి 6 నుంచి మొదలుభారత్తో తొలి వన్డే నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 6న జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు కటక్, అహ్మదాబాద్ వేదికలు కానున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ -
World Cancer Day: క్యాన్సర్‌ను జయించిన క్రికెట్ యోధులు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) (ఫిబ్రవరి 4) నాడు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడి గెలిచిన ఐదురుగు స్టార్ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. క్రికెటర్లకు సంబంధించి క్యాన్సర్ (Cancer) పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు యువరాజ్ సింగ్(Yuvraj SIngh). ఈ టీమిండియా మాజీ క్రికెటర్ 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో క్యాన్సర్‌తో బాధ పడ్డాడు.ఆ సమయంలో యువరాజ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో బరిలోకి దిగి భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఆ టోర్నీలో యువీ 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.ప్రపంచ కప్ గెలిచిన వెంటనే యువరాజ్‌కు ఊపిరితిత్తులలో అరుదైన జెర్మ్ సెల్ కణితి (క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతను అమెరికాలో కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆ సమయంలో యువీ నెలల తరబడి తీవ్రమైన నొప్పి మరియు మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నాడు. 2012లో అతను క్యాన్సర్‌ను జయించి యోధుడిలా తిరిగి భారత జట్టులో చేరాడు. యువీ ప్రయాణం క్రికెట్ యొక్క గొప్ప పునరాగమన కథలలో ఒకటిగా మిగిలిపోయింది.మైఖేల్ క్లార్క్: 43 ఏళ్ల ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ చర్మ క్యాన్సర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా గొప్ప కెప్టెన్లలో ఒకరైన క్లార్క్‌కు 2006లో క్యాన్సర్ బయటపడింది. వైద్యులు అతని ముఖం, ఛాతీ, నుదిటిపై క్యాన్సర్ మచ్చలను గుర్తించారు. వీటిని తొలగించేందుకు క్లార్క్ అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. క్లార్క్ కెరీర్ ఆరంభంలోనే క్యాన్సర్‌పై విజయం సాధించి విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగించాడు. క్లార్క్ ఆసీస్ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడి 17000 పైచిలుకు పరుగులు చేశాడు.మార్టిన్ క్రో: ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ యుక్త వయసులో ఉండగానే క్యాన్సర్‌తో పోరాడాడు. అతనికి లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ నుంచి బయట్ట పడ్డాక క్రో తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చాడు. అయితే అతనికి రెండోసారి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు కూడా అతను ప్రాణాంతక వ్యాధితో పోరాడే ప్రయత్నం చేశాడు. అయితే 2016లో అతను విషాదకర రీతిలో మరణించాడు. మార్టిన్ క్రోకు క్లాసికల్ బ్యాటర్‌గా గుర్తింపు ఉంది. క్రో 1982-95 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 77 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడి 10000 పైచిలుకు పరుగులు చేశాడు.గ్రేమ్ పొల్లాక్: ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్‌కు ఆ దేశ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్‌గా పేరుంది. గ్రేమ్ పొల్లాక్ 1963-70 మధ్యలో ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున 23 టెస్ట్‌లు ఆడిన పొల్లాక్ 7 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 2256 పరుగులు చేశాడు. 2013లో పొల్లాక్కు కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో అతను క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు. ప్రస్తుతం పొల్లాక్ 80 ఏళ్ల వయసులో జీవనం కొనసాగిస్తున్నాడు.జెఫ్రీ బాయ్‌కాట్: ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనర్.. 1990, 2000 దశకాల్లో ప్రముఖ వ్యాఖ్యాత అయిన జెఫ్రీ బాయ్‌కాట్ గొంతు క్యాన్సర్‌పై విజయం సాధించాడు. అతను 35 కఠినమైన రేడియోథెరపీ సెషన్లు చేయించుకున్నాడు. రేడియోథెరపీ సమయంలో బాయ్‌కాట్ తీవ్రమైన నొప్పిని ఎదుర్కొన్నాడు. క్యాన్సర్‌ను జయించాక బాయ్‌కాట్ తిరిగి వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. ప్రస్తుతం బాయ్‌కాట్ వయసు 84 ఏళ్లు. -
ముంబయిలో క్రికెట్ ఆడిన బ్రిటన్ మాజీ ప్రధాని
ముంబయి:బ్రిటన్ మాజీ ప్రధాని,ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ ఆదివారం(ఫిబ్రవరి2) ముంబయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ ముంబయిలోని పార్సీ జింఖానా గ్రౌండ్లో కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ విషయమై ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడకుండా తన ముంబయి పర్యటన ఎప్పుడూ ఉండదని తెలిపారు.రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఐదు రోజులపాటు జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు రిషి సునాక్ భారత్‌కు వచ్చారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శనివారం సాయంత్రం ముంబయికి చేరుకున్నారు.ఆదివారం ఉదయం ఇక్కడి పార్సీ జింఖానా మైదానానికి వెళ్లారు.క్లబ్ వార్షికోత్సవాల నేపథ్యంలో అక్కడికి వచ్చిన వారితో కాసేపు ముచ్చటించారు. క్లబ్ సాధించిన విజయాల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం బ్యాట్ పట్టుకుని టెన్నిస్‌బాల్‌తో కాసేపు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ జట్టు ప్రకటన.. ముగ్గురిపై వేటు
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025), దానికి ముందు స్వదేశంలో జరిగే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్ (Pakistan) జట్టును ఇవాళ (జనవరి 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మొహమ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan) వ్యవహరించనుండగా.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) సల్మాన్ అలీ అఘా ఉండనున్నాడు. గతేడాది చివర్లో సౌతాఫ్రికాతో ఆడిన పాక్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ సైమ్ అయూబ్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు. ఫామ్‌లో లేని అబ్దుల్లా షఫీక్, మెహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సుఫియాన్ ముఖీమ్‌లపై పాక్ సెలెక్టర్లు వేటు వేశారు. పైన పేర్కొన్న నలుగురి స్థానాల్లో ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, ఖుష్దిల్ షా, సౌద్ షకీల్ జట్టులోకి వచ్చారు. ఈ జట్టులో 2017 టైటిల్ (ఛాంపియన్స్ ట్రోఫీ) విన్నింగ్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు (బాబర్ ఆజం, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్) చోటు దక్కించుకున్నారు. పాక్ జట్టు పేస్ విభాగాన్ని షాహీన్ అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు. ఈ జట్టు పేస్ దళంలో మొహమ్మద్ హస్నైన్, నసీం షా, హరీస్ రౌఫ్ ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 8న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ సిరీస్‌లో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన తొలి రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ పాక్, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాక్.. ఫిబ్రవరి 19న జరిగే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 20న భారత్.. బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో జరిగింది. నాటి ఎడిషన్‌లో పాక్ విజేతగా నిలిచింది. త్వరలో ప్రారంభమయ్యే ఎడిషన్‌లో పాక్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.ముక్కోణపు సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్ జట్టు:మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది. -
డేవిడ్ మలాన్ ఊచకోత.. 39 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో ఇవాళ (జనవరి 29) ఓ వన్ సైడెడ్ మ్యాచ్ జరిగింది. ఢాకా క్యాపిటల్స్‌పై ఫార్చూన్ బారిషల్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 22 ఓవర్లలో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 15.3 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌటైంది. బారిషల్ బౌలర్లు మొహమ్మద్ నబీ (4-0-9-3), తన్వీర్ ఇస్లామ్ (2-1-2-3), ఫహీమ్ అష్రాఫ్ (2.3-0-15-3) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు పోటీపడి వికెట్లు తీశారు. ముగ్గురూ తలో మూడు వికెట్లు తీశారు. జేమ్స్ ఫుల్లర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. లిటన్ దాస్, రోన్స్ఫర్డ్ బీటన్ తలో 10 పరుగులు చేయగా.. కెప్టెన్ తిసార పెరీరా అత్యధికంగా 15 పరుగులు సాధించాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో (11) వచ్చాయి. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి.మలాన్ ఊచకోత74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్.. డేవిడ్ మలాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడటంతో 6.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది (వికెట్ కోల్పోయి). మలాన్‌కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కూడా తోడవ్వడంతో మ్యాచ్ తొందరగా ముగిసింది. తమీమ్ 14 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బారిషల్ ఇన్నింగ్స్‌లో తౌహిద్ హృదోయ్ 9 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. తౌహిద్ వికెట్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు దక్కింది. ఈ గెలుపుతో బారిషల్ రంగ్పైర్ రైడర్స్‌ను వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. క్యాపిటల్స్ 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు డేవిడ్ మలాన్ బీపీఎల్ ఫ్రాంచైజీలను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. మీ దగ్గర డబ్బుంటేనే ఫ్రాంచైజీలను తీసుకోండి. లేదంటే ఊరకనే ఉండండంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో కొన్ని ఫ్రాంచైజీలు విదేశీ ఆటగాళ్లకు రెమ్యూనరేషన్ చెల్లించడంలో జాప్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలాన్ ఈ కామెంట్స్ చేశాడు. కొద్ది రోజుల కిందట దర్బార్ రాజ్‌షాహీ ఫ్రాంచైజీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు చెల్లించని కారణంగా ఓ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశాయి. ఆ మ్యాచ్‌లో రాజ్‌షాహీ ఫ్రాంచైజీ స్వదేశీ ఆటగాళ్లను మాత్రమే బరిలోకి దించింది. -
క్రికెట్ చరిత్రలో అసాధారణ రనౌట్
క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన రనౌట్ నమోదైంది. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అండర్-19 జట్టు ఆటగాడు ఆర్యన్ సావంత్ అసాధారణ రీతిలో రనౌటయ్యాడు. మ్యాచ్ 3వ రోజు సావంత్ 11 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ జేసన్ రౌల్స్ వేసిన బంతిని స్లాగ్-స్వీప్ చేశాడు. అయితే బంతి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జోరిచ్ వాన్ షాల్క్విక్ హెల్మెట్‌ను బలంగా తాకి, స్టంప్స్‌పైకి తిరిగి వచ్చింది. ఆ సమయంలో సావంత్ క్రీజ్ బయట ఉన్నాడు. సెకెన్ల వ్యవధిలో జరిగిపోయిన ఈ తంతు చూసి కొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రనౌట్‌కు అప్పీల్ చేయగా.. మరికొందరు బంతి హెల్మెట్‌కు తాకి గాయపడిన జోరిచ్ను పరామర్శించే పనిలో పడ్డారు. The first and last time you'll see a run out like this... @collinsadam pic.twitter.com/ZIEFI8s1Te— Brent W (@brentsw3) January 28, 2025దక్షిణాఫ్రికా ఫీల్డర్ల అప్పీల్‌తో ఔటయ్యానన్న విషయాన్ని గ్రహించిన సావంత్ మెల్లగా పెవిలియన్ బాట పట్టగా.. బంతి బలంగా తాకడంతో జోరిచ్ మైదానంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గాయపడిన జోరిచ్ను హుటాహుటిన అసుపత్రికి తరలించారు. జోరిచ్కు ఎలాంటి అపాయం కలగలేదని తదనంతరం దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ వెల్లడించింది. సావంత్ అసాధారణ రీతిలో రనౌటైన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.కాగా, ఈ మ్యాచ్‌లో సావంత్ ఔటయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ను కొనసాగించిన ఇంగ్లండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే 20 పరుగులు వెనుకపడ్డ ఇంగ్లండ్ ప్రస్తుతం 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో థామస్ ర్యూ (71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఫర్హాన్ అహ్మద్, జాక్ హోమ్ అర్ద సెంచరీలతో రాణించారు. బదులుగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తరఫున ముహమ్మద్ బుల్బులియా, జేసన్ రౌల్స్ అర్ద సెంచరీలు చేశారు. -
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. 10000 పరుగుల క్లబ్లో చేరిక
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 10000 పరుగుల క్లబ్లో చేరాడు. గాలే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో స్టీవ్ ఈ ఘనత సాధించాడు. 9999 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టీవ్.. తొలి బంతికే 10000 పరుగుల మార్కును అందుకున్నాడు. స్టీవ్ ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్‌కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు. 10000 పరుగుల మార్కును తన 205వ ఇన్నింగ్స్‌లో అధిగమించిన స్టీవ్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఈ ఫీట్‌ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.There it is!Steve Smith is the fourth Australian to reach 10,000 Test runs 🙌#SLvAUS pic.twitter.com/06FLk8iqMI— 7Cricket (@7Cricket) January 29, 2025టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ ఒక్కడే 10000 పరుగుల క్లబ్లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్‌లోనే ఉన్నారు. రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ (Kane Williamson), విరాట్ కోహ్లిలను (Virat Kohli) ఈ జమానా ఫాబ్ ఫోర్‌గా కీర్తిస్తారు. స్టీవ్ తన 115 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 205 ఇన్నింగ్స్‌లు ఆడి 56.18 సగటున 10056* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 34 సెంచరీలు, 42 అర్ద సెంచరీలు ఉన్నాయి.శ్రీలంకతో మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ 74 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (102 నాటౌట్) చాలాకాలం తర్వాత సెంచరీతో మెరువగా, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ అర్ద సెంచరీలతో రాణించారు. హెడ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా తన సెంచరీలో 8 బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్యకు హెడ్ వికెట్ దక్కగా.. జెఫ్రీ వాండర్సేకు లబూషేన్ (20) వికెట్ దక్కింది.కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (రెండు వన్డేలు కూడా) కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్.. సౌతాఫ్రికాతో ఆమీతుమీ తేల్చుకోనుంది.శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా కమిన్స్ ఈ సిరీస్‌లో పాల్గొనడం లేదు. ఈ కారణంగా స్టీవ్ స్మిత్ ఆసీస్‌కు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌లో ట్రవిస్ హెడ్‌కు ప్రమోషన్ లభించింది. మిడిలార్డర్ బ్యాటింగ్‌కు దిగే హెడ్.. తొలి టెస్ట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే హెడ్ ఓపెనింగ్ స్థానంలో తనదైన మార్కును చూపించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగే హెడ్.. ఇక్కడ కూడా అదే తరహా చెలరేగిపోయాడు. -
2024 ఐసీసీ అవార్డుల విజేతలు వీరే..!
2024 ఐసీసీ అవార్డుల ప్రకటన ప్రక్రియ జనవరి 24న మొదలై, ఇవాల్టితో (జనవరి 28) ముగిసింది. మూడు ఫార్మాట్లలో పురుషులు, మహిళల విభాగాల్లో వ్యక్తిగత అవార్డులతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను రివీల్ చేశారు. గతేడాదికి సంబంధించి మొత్తం 12 వ్యక్తిగత అవార్డులు, 5 ఐదు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ప్రకటించబడ్డాయి.వ్యక్తిగత విభాగాల్లో ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (రేచల్ హెహోయ్ ఫ్లింట్ ట్రోఫీ)-మేలీ కెర్ (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధన (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ (నామినీలు- వనిందు హసరంగ, కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్)ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ (నామినీలు-సస్కియా హోర్లీ, శ్రేయాంక పాటిల్, ఫ్రేయా సర్జెంట్)ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ (నామినీలు-సైమ్ అయూబ్, గస్ అట్కిన్సన్, షమార్ జోసఫ్)ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ (నామినీలు-బాబర్ ఆజమ్, ట్రవిస్ హెడ్, సికందర్ రజా)ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ (నామినీలు- చమారీ ఆటపట్టు, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, లారా వోల్వార్డ్ట్)ఫార్మాట్ల వారీగా టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు..ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
సెంచరీతో రికార్డ్ సాధించిన భద్రాచలం యువతి త్రిష
-
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా
-
PAK VS WI 2nd Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఆసియా ఖండంలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ ఆసియా పిచ్‌లపై తొలి రోజే 20 వికెట్లు పడలేదు. తొలి రోజు పడిన వికెట్లలో 16 స్సిన్నర్లకు దక్కగా.. 4 పేస్ బౌలర్లు పడగొట్టారు.ఈ మ్యాచ్ తొలి రోజు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డి విరిచాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు గడకేశ్ మోటీ (55), కీమర్ రోచ్ (25), గోమెల్ వార్రికన్ (36 నాటౌట్), కవెమ్ హాడ్జ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రికన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.9 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బ్రాత్‌వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరచగా.. బాబర్ ఆజమ్ (31) మరోసారి లభించిన శుభారంభాన్ని భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు.సౌద్ షకీల్ (13)తో పాటు కషిఫ్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే మరో 178 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో కెవిన్ సింక్లెయిర్ రెండు వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రికన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి టెస్ట్‌లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..?
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 20 ఏళ్ల తన వైవాహిక బంధానికి స్వస్తి పలుకనున్నట్లు తెలుస్తుంది. సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్‌తో విడాకులు తీసుకోనున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వార్త నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. సెహ్వాగ్, ఆర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. గత దీపావళి రోజున సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫోటోలు షేర్ చేయడం.. సెహ్వాగ్ ఒంటరిగానే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం విడాకుల ప్రచారానికి బలం చేకూరుస్తుంది. కొడుకులు ఇద్దరూ క్రికెట్లో రాణిస్తున్నారుసెహ్వాగ్కు 2004లో ఆర్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. ఆర్యవీర్, వేదాంత్. వీరిద్దరూ తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.అర్యవీర్.. గతేడాది నవంబర్‌లో జరిగిన అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించే ఆర్యవీర్.. మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 200 పరుగులు చేశాడు.రెండో కుమారుడు వేదాంత్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. వేదాంత్.. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్లో వేదాంత్ 24 వికెట్లు పడగొట్టి.. ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇందులో రెండు 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.ఆర్తి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసిందిఆర్తి.. సెహ్వాగ్ కంటే రెండేళ్లు చిన్నది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసింది. ఆర్తి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది. ఆర్తి భారతీయ విద్యా భవన్లో చదువుకుంది. సెహ్వాగ్-ఆర్తిల వివాహం దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇంట్లో జరిగింది. విడాకుల ప్రచారంపై సెహ్వాగ్ కాని, ఆర్తి కాని ఇప్పటివరకు స్పందించలేదు.భారత క్రికెట్ సర్కిల్స్‌లో వరుస విడాకుల వార్తలుకాగా, ఇటీవలికాలంలో భారత క్రికెట్ సర్కిల్లో విడాకుల వార్తలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. విడాకుల ప్రచారాన్ని చహల్, ధనశ్రీ ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని తెలుస్తుంది. మరో భారత క్రికెటర్ మనీశ్ పాండే కూడా తన భార్య అశ్రిత షెట్టి నుంచి విడిపోబోతున్నాడని తెలుస్తుంది. మనీశ్, అశ్రిత్ సైతం సెహ్వాగ్-ఆర్తి, చహల్-ధనశ్రీ తరహాలో సోషల్‌మీడియాలో ఒకరినొకరు అన్ఫాల్లో చేసుకున్నారు. వీరిద్దరికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే డ్రామా నడిచింది. అయితే హార్దిక్, అతని భార్య నటాషా ఒకరినొకరు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హార్దిక్‌కు ముందు షమీ, శిఖర్ ధవన్ కూడా తమతమ భార్యలతో విడాకులు తీసుకున్నారు.సెహ్వాగ్ క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. సెహ్వాగ్‌ను క్రికెట్ సర్కిల్స్‌లో ముద్దుగా నజఫ్ఘడ్ నవాబ్, వీరూ అని పిలుస్తారు. వీరూ 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసి 2013లో రిటైరయ్యాడు. సెహ్వాగ్ తన కెరీర్లో 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20 ఆడి 17000కు పైగా పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సెహ్వాగ్ భారత్ తరఫున 136 వికెట్లు తీశాడు. సెహ్వాగ్ కెరీర్లో 23 టెస్ట్ సెంచరీలు, 15 వన్డే సెంచరీలు ఉన్నాయి. సెహ్వాగ్ టెస్ట్‌ల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ చేశాడు. -
చరిత్ర సృష్టించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ లయన్స్ (అండర్-19 జట్టు) తరఫున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. రాకీ 16 ఏళ్ల 291 రోజుల వయసులో లయన్స్ తరఫున సెంచరీ చేశాడు. 16 YEARS OLD ROCKY FLINTOFF SMASHED A BRILLIANT HUNDRED..!!!!! ⭐Andrew Flintoff's son Rocky Flintoff is 16 years old and he smashed a magnificent Hundred for England Lions vs Cricket Australia XI.- ROCKY, A STAR IS BORN..!!!! pic.twitter.com/UB0STrNET8— Tanuj Singh (@ImTanujSingh) January 23, 2025ఇక్కడ మరో విశేషమేమిటంటే.. రాకీ స్వయానా తన తండ్రి రికార్డునే బద్దలు కొట్టాడు. రాకీకి ముందు లయన్స్ తరఫున అతి చిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు ఆండ్రూ ఫ్లింటాఫ్ పేరిట ఉండేది. ఆండ్రూ ఫ్లింటాఫ్ 20 ఏళ్ల 28 రోజుల వయసులో లయన్స్ తరఫున సెంచరీ చేశాడు.క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీ సెంచరీ చేశాడు. రాకీకి లయన్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో రాకీ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగి కష్టాల్లో ఉన్న తన జట్టును (161/7) గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో) రాకీ 127 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు.🚨 ANDREW FLINTOFF SON ROCKY FLINTOFF CREATED HISTORY 🚨 - Rocky Flintoff becomes the youngest player to score a Maiden for England Lions (16 Year age). 🤯pic.twitter.com/1oL1QpoGO8— Tanuj Singh (@ImTanujSingh) January 23, 2025రాకీ సెంచరీతో సత్తా చాటడంతో లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆస్ట్రేలియా ఎలెవెన్ 214 పరుగులకే చాపచుట్టేసింది. రాకీ హీరోయిక్ ఇన్నింగ్స్ కారణంగా లయన్స్‌కు 102 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.కాగా, ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో మూడు నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్ కోసం లయన్స్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో లయన్స్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఆ మ్యాచ్‌లో రాకీ తొలి ఇన్నింగ్స్‌లో 19, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో లయన్స్‌కు రాకీ తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్ హెడ్ కోచ్ కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో లయన్స్ తరఫున ఐదుగురు ఇంగ్లండ్ సీనియర్ జట్టు ఆటగాళ్లు (షోయబ్ బషీర్, పాట్ బ్రౌన్, టామ్ హార్ట్లీ, జోష్ టంగ్, జాన్ టర్నర్ ఆడుతున్నారు. -
రంజీ బాట పట్టిన మరో టీమిండియా స్టార్ ప్లేయర్
టీమిండియా స్టార్ ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ (ముంబై), యశస్వి జైస్వాల్ (ముంబై), శుభ్‌మన్ గిల్ (పంజాబ్), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), శ్రేయస్ అయ్యర్ (ముంబై) తమతమ జట్ల తరఫున బరిలోకి దిగారు. జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (ఢిల్లీ) కూడా బరిలోకి దిగుతానని ప్రకటించాడు. తాజాగా మరో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగుతాడు. కర్ణాటక జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహిస్తాడు. ఈనెల 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కర్ణాటక.. హర్యానాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కర్ణాటక హోం గ్రౌండ్ అయిన చిన్న స్వామి స్టేడియంలో జరుగుతుంది.కాగా, రాహుల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన తన సహచరులు రోహిత్, యశస్వి, గిల్, పంత్, జడేజాలతో పాటు రంజీ బరిలో దిగాల్సి ఉండింది. అయితే మోచేతి గాయం కారణంగా అతను ఇవాళ (జనవరి 23) ప్రారంభమైన మ్యాచ్‌కు దూరమయ్యాడు. విరాట్ కోహ్లి సైతం గాయం కారణంగానే ఇవాళ మొదలైన మ్యాచ్‌కు అందుబాటులో లేడు.ఇదిలా ఉంటే, ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పకుండా ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే. రంజీల్లో ఆడటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో గత్యంతరం లేక భారత ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. టీమిండియా స్టార్లంతా విఫలం.. ఒక్క జడేజా తప్ప..!రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్లంతా దారుణంగా విఫలమయ్యారు. వేర్వేరు జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఒక్క రవీంద్ర జడేజా మాత్రమే సత్తా చాటాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.రంజీల మాట అటుంచితే, ప్రస్తుతం భారత టీ20 జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 22) జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోస్ బట్లర్ (68) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు సంజూ శాంసన్ (26), అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) నిరాశపరిచినా తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. కేవలం 12.5 ఓవర్లలోనే (3 వికెట్లు) భారత్ గెలుపు తీరాలు తాకింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది. -
IND VS ENG 1st T20: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అర్షదీప్ ఇవాళ (జనవరి 22) ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20లో ఐదు వికెట్లు తీస్తే.. పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. అర్షదీప్ ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ఆడి 2 నాలుగు వికెట్ల ఘనతల సాయంతో 95 వికెట్లు తీశాడు. వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అర్షదీప్ కంటే ఓ వికెట్ అధికంగా తీసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. చహల్ 80 మ్యాచ్‌ల్లో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత సాయంతో 96 వికెట్లు తీశాడు.టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (టాప్-10)..యుజ్వేంద్ర చహల్-96అర్షదీప్ సింగ్-95భువనేశ్వర్ కుమార్-90జస్ప్రీత్ బుమ్రా-89హార్దిక్ పాండ్యా-89అశ్విన్-72కుల్దీప్ యాదవ్-69అక్షర్ పటేల్-65రవి బిష్ణోయ్-56రవీంద్ర జడేజా-54కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు 24 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో భారత్ 13 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత్ వేదికగా ఇరు జట్లు 11 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 6, ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తొలి టీ20కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఇప్పటివరకు 7 టీ20లు ఆడింది. ఇందులో భారత్ ఆరింట విజయాలు సాధించింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమిని ఎదుర్కొంది. ఆ ఒక్క ఓటమి భారత్ ఇంగ్లండ్ చేతుల్లోనే (2011) ఎదుర్కోవడం గమనార్హం.జట్ల బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో పాటు మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు ఉన్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు సహకరించనున్న నేపథ్యంలో తొలి టీ20లో పరుగుల వరద పారడం ఖాయం.భీకర ఫామ్‌లో తిలక్, సంజూటీమిండియా టాపార్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ, సంజూ శాంసన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో వీరిద్దరూ చెలరేగిపోయారు. తిలక్ చివరి రెండు టీ20ల్లో మెరుపు సెంచరీలు చేయగా.. సంజూ మొదటి, నాలుగు మ్యాచ్‌ల్లో శతక్కొట్టాడు. సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సంజూ సెంచరీ చేశాడు. సంజూ గత ఐదు టీ20ల్లో మూడు సెంచరీలు చేశాడు.ఇప్పటికే జట్టును ప్రకటించిన ఇంగ్లండ్తొలి టీ20 కోసం ఇంగ్లండ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. కెప్టెన్ జోస్ బట్లర్‌తో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. యువ ఆటగాడు జేకబ్ బేతెల్ తొలిసారి భారత్‌తో తలపడనున్నాడు.ఇంగ్లండ్ తుది జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత తుది జట్టు (అంచనా): సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి -
బిగ్‌బాష్ లీగ్ ఫైనల్లో హరికేన్స్
బిగ్‌బాష్ లీగ్ 2025 ఎడిషన్ ఫైనల్లోకి హోబర్ట్ హరికేన్స్ ప్రవేశించింది. నిన్న (జనవరి 21) జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హరికేన్స్ సిడ్నీ సిక్సర్స్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (15 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కాలెబ్ జువెల్ (41 బంతుల్లో 40; 2 ఫోర్లు), బెన్ మెక్‌డెర్మాట్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. మథ్యూ వేడ్ 7 బంతుల్లో 4, నిఖిల్ చౌదరీ 11 బంతుల్లో 14, క్రిస్ జోర్డన్ 3 బంతుల్లో 2 (నాటౌట్), కెప్టెన్ నాథన్ ఇల్లిస్ 2 బంతుల్లో ఒక్క పరుగు చేశారు. సిక్సర్స్ బౌలర్లలో జాఫర్ చోహాన్, బెన్ డ్వార్షుయిస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జాక్ ఎడ్వర్డ్స్, మిచెల్ పెర్రీ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సిక్సర్స్ 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సిక్సర్స్‌ను కర్టిస్ ప్యాటర్సన్ (33 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జోర్డన్ సిల్క్ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు), లాచ్లన్ షా (25 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే హరికేన్స్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో వీరి ప్రయత్నం వృధా అయ్యింది. రిలే మెరిడిత్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గానన్ 3 ఓవర్లలో 10 పరుగులకు 2 వికెట్లు తీశాడు. నాథన్ ఇల్లిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సిక్సర్స్ బ్యాటర్లు జోష్ ఫిలిప్ (0), జాక్ ఎడ్వర్డ్ (0), కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ (1) దారుణంగా విఫలమయ్యారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓడినా సిక్సర్స్‌కు మరో అవకాశం ఉంది. జనవరి 24న జరిగే ఛాలెంజర్‌లో నాకౌట్ విజేతతో తలపడుతుంది. ఇవాళ (జనవరి 22) జరుగబోయే నాకౌట్ మ్యాచ్‌లో సిడ్నీ థండర్, మెల్బోర్న్ స్టార్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో మెగా ఫైనల్ జనవరి 27న జరుగనుంది. ఛాలెంజర్ విజేతతో హరికేన్స్ ఫైనల్లో తలపడుతుంది. -
2032 ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌ను కొనసాగించాలి..!
లూసానే: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్‌తో భేటీ అయ్యారు. త్వరలో లూసానేలోనే ఐఓసీ ఉన్నతస్థాయి అధికారులు పాల్గొనే అసాధారణ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మేటి క్రీడా కమిటీల చీఫ్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరున (30వ తేదీ) జరిగే ఈ కీలకమైన సమావేశంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో కొనసాగించే అంశంపై చర్చ జరుగనుంది. దీంతో ఈ చర్చ కంటే ముందుగా జై షా, థామస్ బాచ్లు అ అంశంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఐసీసీ సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోను పోస్ట్ చేసింది. ‘లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో టి20 ఫార్మాట్లో క్రికెట్ ఈవెంట్ జరగనుంది. అయితే 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. దాంతో తదుపరి విశ్వక్రీడల్లోనూ క్రికెట్ క్రీడను కొనసాగించే విషయంపై ప్రాథమిక దశ సంప్రదింపులు మొదలయ్యాయి. ఐసీసీ చైర్మన్ జై షా ఈ అంశమై ఐఓసీ చీఫ్ బాచ్‌తో సమావేశమయ్యారు’ అని ఐసీసీ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. -
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. శ్రీలంకలో జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 118 పరుగులకే ఆలౌటైంది.The Celebrations of Team India after winning Physical Disabled Champions Trophy 2025. 🇮🇳- A WHOLESOME VIDEO..!!!! 🥹❤️pic.twitter.com/HJ9Ic38RgT— Tanuj Singh (@ImTanujSingh) January 21, 2025భారత దివ్యాంగ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన విషయాన్ని భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఎక్స్ వేదికగా ప్రకటించింది. కృషి, దృఢ సంకల్పం మరియు నైపుణ్యం యొక్క అసాధారణ ప్రదర్శన అంటూ కామెంట్ చేసింది.మెగా టోర్నీలో విక్రాంత్ కేనీ భారత జట్టును ముందుండి నడిపించాడు (కెప్టెన్‌గా). అద్భుతమైన జట్టును విజయపథంలో నడిపించడం నా కెరీర్‌కు గర్వకారణమని కేనీ అన్నాడు. ప్లేఆఫ్‌లో ప్రయాణం తమ జట్టులోని ప్రతిభ మరియు పోరాట స్ఫూర్తిని చూపిస్తుందని తెలిపాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఈ చారిత్రాత్మక విజయానికి దోహదపడ్డాడని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడికి చెందుతుందని అని DCCI విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉటంకించారు.యోగేంద్ర భదోరియా విధ్వంసంఫైనల్లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 40 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. రాధికా ప్రసాద్ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కెప్టెన్ విక్రాంత్ కేనీ 3 ఓవర్లలో 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర సంటే 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాన్ని జట్టు ప్రధాన కోచ్ రోహిత్ జలానీ కొనియాడాడు. తన జట్టు అసాధారణ ప్రదర్శన మరియు సన్నద్ధతను ప్రశంసించాడు. టోర్నీ ఆధ్యాంతం తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని ఆకాశానికెత్తాడు. విభిన్న పరిస్థితుల్లో ఎదురైన ప్రతి సవాలును తమ ఆటగాళ్లు అధిగమించారని అన్నాడు. -
ఆ జట్టులో నితీశ్ రెడ్డి లేడు కారణం అదేనా
-
రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి.. అఫీషియల్ అప్డేట్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ (లోక్‌సభ) ప్రియా సరోజ్ పెళ్లాడబోతున్నారు. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తూఫానీ సరోజ్ తెలిపారు. ప్రస్తుతం ప్రియా తిరువనంతపురంలో జరుగుతున్న పార్లమెంటరీ కమిటీ మీటింగ్‌తో బిజీగా ఉందని తూఫానీ పేర్కొన్నారు. రింకూ కూడా త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే టీ20 సిరీస్ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాడని అన్నారు. రింకూ, ప్రియాల నిశ్చితార్థం జరిగిందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అనంతరం రింకూ, ప్రియా ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. లక్నోలో ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతుందని స్పష్టం చేశారు.కాగా, రింకూ సింగ్, ప్రియా సరోజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని వారు డిసైడయ్యారు. తాజాగా ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్లు ప్రియా తండ్రి వెల్లడించారు. స్నేహితురాలి తండ్రి ద్వారా ప్రియాకు రింకూతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది.27 ఏళ్ల రింకూ భారత్ తరఫున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచ్లిషెహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్‌లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్‌పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు. వారణాసికి చెందిన ప్రియా పాలిటిక్స్‌లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్‌లర్ డిగ్రీ పొందింది. ప్రియా తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేసింది. ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రింకూ సింగ్ పాల్గొననున్నాడు. ఇందు కోసం అతను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. -
శతక్కొట్టిన టామ్ బాంటన్.. ముంబై ఇండియన్స్ తరఫున తొలి సెంచరీ
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025 ఎడిషన్‌లో రెండో సెంచరీ నమోదైంది. షార్జా వైపర్స్‌తో నిన్న (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ శతక్కొట్టాడు. ఐఎల్టీ20 (ILT20) చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. బాంటన్‌కు ముందు ఐఎల్టీ20లో కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీలు చేశారు. లీగ్ చరిత్రలో తొలి సెంచరీని టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (షార్జా వారియర్స్) చేయగా.. రెండో సెంచరీని అలెక్స్ హేల్స్ (డెజర్ట్ వైపర్స్) చేశాడు. లీగ్‌లో మూడో సెంచరీ ఇదే సీజన్లో నమోదైంది. సీజన్ నాలుగో మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌పై షాయ్ హోప్ (దుబాయ్ క్యాపిటల్స్) శతక్కొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వారియర్స్‌పై ఎంఐ ఎమిరేట్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్, ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ అవిష్క ఫెర్నాండో (17 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. లూక్ వెల్స్ (18), కరీమ్ జనత్ (18), ఎథన్ డిసౌజా (11) రెండంకెల స్కోర్లు చేశారు. జేసన్ రాయ్ (1), రోహన్ ముస్తఫా (6), కీమో పాల్ (4), కెప్టెన్ సౌథీ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ రెండు, రొమారియో షెపర్డ్, వకార్ సలామ్కిల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన ఎంఐ ఎమిరేట్స్ 17.4 ఓవర్లలో ఆడుతూపాడుతూ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎమిరేట్స్ ఆదిలోనే ముహమ్మద్ వసీం (12) వికెట్ కోల్పోయినా, టామ్ బాంటన్ (55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ కుసాల్ పెరీరా (42 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయమైన 157 పరుగులు జోడించారు. ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. లీగ్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఐఎల్టీ20లో డెసర్ట్ వైపర్స్ ఆటగాళ్లు కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్ నెలకొల్పిన 164 పరుగుల భాగస్వామ్యం ఏ వికెట్‌కైనా అత్యధికం. 2023 సీజన్లో మున్రో, హేల్స్ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ గెలుపుతో ఎమిరేట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
స్టార్ క్రికెటర్‌పై అరెస్టు వారెంట్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్టు వారెంట్ జారీ అయింది. అవామీ లీగ్ ఎంపీగానూ వ్యవహరించిన షకీబ్‌పై చెక్ బౌన్స్‌కు సంబంధించిన కేసులో ఢాకా న్యాయస్థానం చర్యలు తీసుకుంది. ‘అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జైదుర్ రహమాన్.. షకీబ్ అల్ హసన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేశారు. మార్చి 24 నాటి ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశించారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా గతేడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగగా... ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడారు. ఆ సమయంలో జరిగిన గొడవల్లో షకీబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా... అప్పటి నుంచి షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి రాకుండా విదేశాల్లో ఉంటున్నాడు. స్వదేశంలో చివరి టెస్టు ఆడాలని షకీబ్ ఆశించినా... భద్రత ఏర్పాట్ల విషయంలో హామీ లభించకపోవడంతో అతడు వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్ ఎదుర్కొంటున్న షకీబ్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాంపియన్స్ ట్రోఫీకి పరిగణించలేదు. -
రెచ్చిపోయిన స్పిన్నర్లు.. విండీస్‌ను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ చేతులెత్తేసింది. పాక్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్ (15-3-50-5), అబ్రార్ అహ్మద్ (11.3-2-27-4), నౌమన్ అలీ (10-1-42-1) చెలరేగడంతో విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 123 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ను గెలిపించేందుకు అలిక్ అథనాజ్ (55) విఫలయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (12), మికైల్ లూయిస్ (13), టెవిన్ ఇమ్లాచ్ (14), కెవిన్ సింక్లెయిర్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కీసీ కార్తీ 6, జస్టిన్ గ్రీవ్స్ 9, కవెమ్ హాడ్జ్, మోటీ, వార్రికన్ డకౌటయ్యారు.ఏడేసిన వార్రికన్విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రకన్ (18-3-32-7) స్పిన్ మాయాజాలం దెబ్బకు పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌటైంది. గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీయగా.. ఇద్దరు పాక్ ఆటగాళ్లు రనౌట్ అయ్యారు. పాక్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ (52) టాప్ స్కోరర్ కాగా.. ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.పాక్ స్పిన్నర్ల మాయాజాలంఅంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే కుప్పకూలింది. నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్‌లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. బ్రాత్‌వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. మికైల్ లూయిస్ (1), కీసీ కార్తీ (0), కవెమ్ హాడ్జ్ (4), అలిక్ అథనాజ్ (6), జస్టిన్ గ్రీవ్స్ (4), టెవిన్ ఇమ్లాచ్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే టపా కట్టేశారు.రాణించిన షకీల్, రిజ్వాన్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఇదే వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. -
విండీస్ స్పిన్నర్ మాయాజాలం.. 157 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే కుప్పకూలింది. విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ ఏడు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. మరో స్పిన్నర్ గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీశాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు (షాన్ మసూద్, ఖుర్రమ్ షెహజాద్) రనౌట్ అయ్యారు. షాన్ మసూద్ 52, ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని పాక్ విండీస్ ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో విండీస్ సైతం తడబడుతుంది. ఆ జట్టు 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలవాలంటే మరో 221 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్(12), కీసీ కార్తీ (6) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (11), కవెమ్ హాడ్జ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. సాజిద్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే కుప్పకూలింది. పాక్ స్పిన్నర్లు నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్‌లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. వీరిద్దరు చివరి వికెట్‌కు 46 పరుగులు జోడించి విండీస్ పరువు కాపాడారు. లేకపోతే విండీస్ 100లోపే ఆలౌటయ్యేది. విండీస్ ఇన్నింగ్స్‌లో వీరితో పాటు బ్రాత్‌వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మికైల్ లూయిస్ 1, కీసీ కార్తీ 0, కవెమ్ హాడ్జ్ 4, అలిక్ అథనాజ్ 6, జస్టిన్ గ్రీవ్స్ 4, టెవిన్ ఇమ్లాచ్ 6 పరుగులు చేశారు. -
టి20 ప్రపంచకప్‌లో నేడు (జనవరి 19) భారత్, వెస్టిండీస్ మ్యాచ్
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు తొలి రోజు వర్షం ఆటంకం కలిగించింది. శనివారం మొత్తం 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... అందులో మూడింట మాత్రమే ఫలితం వచ్చింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో స్కాట్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 15.1 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేమీ బ్రే 1 పరుగే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎలెనార్ లరోసా 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ఆ్రస్టేలియా 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి గెలిచింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. మొదట నేపాల్ 18.2 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లాదేశ్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.గ్రూప్ ‘సి’లో భాగంగా దక్షిణాఫ్రికా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా... మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులకు పరిమితమైంది.పాకిస్తాన్, అమెరికా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్... నైజీరియా, సమోవా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా... ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు.మన అమ్మాయిలకు తొలి పరీక్ష డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్–19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ తొలి పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలవగా... ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టులో గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లోనూ భాగస్వాములు కావడం భారత జట్టుకు కలిసిరానుంది. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు టి20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ అమ్మాయిలు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనుకుంటున్నారు. -
షార్జా స్టేడియంలో చిరంజీవి సందడి (ఫోటోలు)
-
BCCI: ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు..!
-
భారత ఆటగాళ్లు.. బహుపరాక్.. ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు..!
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులో క్రమశిక్షణ, ఐక్యత పెంపొందించేందుకు బీసీసీఐ 10 పాయింట్ల మార్గదర్శకాలను రూపొందించింది. భారత ఆటగాళ్లు కింద పేర్కొన్న గైడ్‌లైన్స్‌ను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలికాలంలో భారత జట్టు వరుస వైఫల్యాలకు క్రమశిక్షణ లేమి కారణమని భావిస్తున్న బీసీసీఐ ఈ కఠిన మార్గదర్శకాలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది.బీసీసీఐ ప్రవేశపెట్టిన 10 పాయింట్ల క్రమశిక్షణా మార్గదర్శకాలు..దేశవాలీ క్రికెట్ ఆడటం తప్పనిసరిజాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలంటే ఇకపై ఆటగాళ్లు దేశవాలీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడాలి. ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే కూడా దేశవాలీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడాలి.కుటుంబాలతో వేరుగా ప్రయాణం చేయడం నిషేధంమ్యాచ్లు జరిగే సమయంలో లేదా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనే సమయంలో ఆటగాళ్లు కుటుంబాలతో కలిసి వేరుగా ప్రయాణాలు చేయడం నిషేధం. మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆటగాళ్లు వేరుగా కుటుంబాలతో కలిసి ప్రయాణించడం జట్టు ఐక్యతను దెబ్బతీస్తుందని బీసీసీఐ భావిస్తుంది.అధిక లగేజీ భారాన్ని ఆటగాళ్లే మోయాల్సి ఉంటుందిఆటగాళ్లు పరిమితికి మించి లగేజీని క్యారీ చేస్తే సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది.వ్యక్తిగత సిబ్బందితో ప్రయాణాలు ఆపండివిదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ళు వంటవారు, హెయిర్ డ్రెస్సర్లు, స్టైలిస్టులు, సెక్యూరిటీ గార్డులతో ప్రయాణించడాన్ని నిషేధించాలని బీసీసీఐ నిర్ణయించింది.అధికారిక కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలిబీసీసీఐ అధికారిక కార్యక్రమాలకు (షూటింగ్‌లు, ప్రమోషన్స్, ఫంక్షన్లు) ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి.టూర్ ముగిసే వరకు జట్టుతో పాటే ఉండాలిఆటగాళ్లు టూర్ లేదా సిరీస్ అధికారికంగా ముగిసే వరకు జట్టుతో పాటే ఉండాలి. మ్యాచ్ తొందరగా ముగిసినా జట్టును వీడ కూడదు.ప్రాక్టీస్ తర్వాత ప్రయాణంషెడ్యూల్ ప్రాక్టీస్ పూర్తయ్యే వరకు ప్లేయర్లందరూ కలిసి ఉండాలి. ప్లేయర్లు ప్రాక్టీస్ అనంతరం కలిసి ప్రయాణించాలి.ఎండార్స్మెంట్లపై నిబంధనలుపర్యటన సమయంలో ఎలాంటి వ్యక్తిగత షూట్లు లేదా ఎండార్స్మెంట్లకు అనుమతి లేదు. ఆటపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఇది నిర్దేశించబడింది.కుటుంబ సభ్యుల అనుమతి45 రోజుల కంటే ఎక్కువ గల విదేశీ పర్యటనల్లో మాత్రమే ప్లేయర్ల కుటుంబ సభ్యులకు రెండు వారాల అనుమతి ఉంటుంది.ఈ కొత్త పాలసీ ప్రకారం జట్టు సభ్యులందరూ క్రమశిక్షణతో ఉంటూ, జట్టు కోసం కట్టుబడి పనిచేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
మహిళల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 14వ తేదీన మొదలవుతుంది. వడోదరా (కొటాంబి స్టేడియం), బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం), ముంబై (బ్రబోర్న్ స్టేడియం), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం) నగరాల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడా వేదికగా ఫిబ్రవరి 14న జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. మార్చి 15న ముంబైలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. గుజరాత్, బెంగళూరు జట్లతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. తదుపరి డబ్ల్యూపీఎల్ గడిచిన రెండు సీజన్ల (2023, 2024) తరహాలో రెండు వేదికలపై కాకుండా నాలుగు వేదికల్లో జరుగనుంది. ఓపెనింగ్ లెగ్ మ్యాచ్‌లకు కొటాంబి స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. రెండో వారం మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు షిఫ్ట్ అవుతాయి. అనంతరం నాలుగు లీగ్ మ్యాచ్‌లు లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగనుండగా.. ఎలిమినేటర్ (మార్చి 13), ఫైనల్ మ్యాచ్‌లు (మార్చి 15) సహా నాలుగు మ్యాచ్‌లకు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మహిళల ఐపీఎల్-2025 పూర్తి షెడ్యూల్..వడోదర లెగ్:14 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్16 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ 17 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్19 ఫిబ్రవరి 2025 యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్బెంగళూరు లెగ్:21 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ 22 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్ 23 ఫిబ్రవరి 2025 బ్రేక్24 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్ 25 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్26 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్27 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ 28 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్1 మార్చి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ 2 మార్చి 2025 బ్రేక్లక్నో లెగ్:3 మార్చి 2025 యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్4 మార్చి 2025 బ్రేక్5 మార్చి 2025 బ్రేక్6 మార్చి 2025 యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స7 మార్చి 2025 గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్8 మార్చి 2025 యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు9 మార్చి 2025 బ్రేక్ముంబై లెగ్:10 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ 11 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు12 మార్చి 2025 బ్రేక్13 మార్చి 2025 ఎలిమినేటర్14 మార్చి 2025 బ్రేక్15 మార్చి 2025 ఫైనల్ -
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో మరో వ్యక్తి కొత్తగా చేరాడు. సౌరాష్ట్ర మాజీ కెప్టెన్ సితాన్షు కొటక్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టి20 సిరీస్ నుంచి అతను బాధ్యతలు చేపడతాడు. 52 ఏళ్ల సితాన్షు 2019 నుంచి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. భారత ‘ఎ’ జట్టు పర్యటనల్లో పలు మార్లు కోచ్‌గా పని చేసిన సితాన్షు... సీనియర్ టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వెళ్లిన సిరీస్‌లలో అతనికి అసిస్టెంట్‌గా కూడా వ్యవహరించాడు. సితాన్షు లెవల్–3 క్వాలిఫైడ్ కోచ్ కూడా. తాజా ఎంపికతో భారత టీమ్‌లో అసిస్టెంట్ కోచ్‌ల సంఖ్య ఐదుకు చేరింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా ...మోర్నీ మోర్కెల్ (బౌలింగ్), టి.దిలీప్ (ఫీల్డింగ్)లతో పాటు అభిషేక్క్ నాయర్, టెన్ డస్కటేలకు కూడా ఇప్పటికే అసిస్టెంట్ కోచ్ హోదా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని బీసీసీఐ తాజా సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. దాంతో మన బ్యాటర్లను సాంకేతికంగా మరింత మెరుగుపర్చే క్రమంలో భాగంగానే కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. దశాబ్ద కాలానికి పైగా సాగిన దేశవాళీ కెరీర్లో సౌరాష్ట్ర టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన సితాన్షు 130 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 41.76 సగటుతో 8061 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 89 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు కూడా ఆడిన సితాన్షు 42.23 సగటుతో 3083 పరుగులు సాధించాడు. -
ఆర్సీబీలోకి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఛార్లీ డీన్ మహిళల ఆర్సీబీ జట్టుకు ఎంపికైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ గాయపడటంతో ఆమె స్థానంలో ఛార్లీ డీన్ ఆర్సీబీలోకి వచ్చింది. డీన్‌ను ఆర్సీబీ 30 లక్షలకు సొంతం చేసుకుంది. మోకాలి గాయం కారణంగా మోలినెక్స్ డబ్ల్యూపీఎల్ తదుపరి ఎడిషన్‌కు (2025) దూరం కానుందని ఆర్సీబీ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. గత ఎడిషన్ ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.మోలినెక్స్: లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన మోలినెక్స్ ఆసీస్ తరఫున 3 టెస్ట్‌లు, 13 వన్డేలు, 28 టీ20లు ఆడింది. మోలినెక్స్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 71 వికెట్లు (టెస్ట్‌ల్లో 7, వన్డేల్లో 23, టీ20ల్లో 41 వికెట్లు) తీసింది.ఛార్లీ డీన్: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన డీన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్‌లు, 39 వన్డేలు, 36 టీ20లు ఆడింది. ఇందులో మొత్తంగా 122 వికెట్లు (టెస్ట్‌ల్లో 7, వన్డేల్లో 69, టీ20ల్లో 46 వికెట్లు) తీసింది.కాగా, మహిళల ఐపీఎల్ ఇప్పటివరకు రెండు ఎడిషన్ల పాటు విజయవంతంగా సాగింది. తొలి ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచింది. మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకు జరుగనుంది. 2025 డబ్ల్యూపీఎల్ మొత్తం నాలుగు వేదికల్లో జరుగనుంది. బెంగళూరు, లక్నో, ముంబై, వడోదరాలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తదుపరి సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.డబ్ల్యూపీఎల్-2025లో పాల్గొనే జట్లు, ఆటగాళ్ల వివరాలు..ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా రోడ్రిగెజ్, మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ, స్నేహ దీప్తి, తనియా భాటియా, సారా బ్రైస్, నందిని కశ్యప్, అలైస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసెన్, మారిజన్ కాప్, మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, నికీ ప్రసాద్, నల్లపురెడ్డి చరణి, టిటాస్ సాధుగుజరాత్ జెయింట్స్: భారతి ఫుల్మలి, లారా వోల్వార్డ్ట్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ప్రియా మిశ్రా, సిమ్రన్ షేక్, బెత్ మూనీ, ఆష్లే గార్డ్నర్, దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, సయాలి సత్గరే, తనూజా కన్వర్, డేనియల్ గిబ్సన్, డియండ్రా డొట్టిన్, కష్వీ గౌతమ్, మన్నత్ కశ్యప్, మేఘనా సింగ్, షబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా, కమలిని, అమన్‌దీప్ కౌర్, అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, కీర్తన బాలకృష్ణన్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సజనా, అక్షిత మహేశ్వరి, సంస్కృతి గుప్త, నదినే డి క్లెర్క్, సైకా ఇషాఖీ, షబ్నిమ్ ఇస్మాయిల్ఆర్సీబీ: డేనియల్ వ్యాట్ హాడ్జ్, సబ్బినేని మేఘన, స్మృతి మంధన, రిచా ఘోష్, ఆశా శోభన, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, కనిక అహుజా, శ్రేయాంక పాటిల్, సోఫీ డివైన్, జోషిత, ప్రేమా రావత్, రాఘవి బిస్త్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, రేణుకా సింగ్, జాగ్రవి పవార్, ఛార్లీ డీన్యూపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, వృందా దినేశ్, ఆరూషి గోయల్, అలైసా హీలీ, చమారీ ఆటపట్టు, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్‌గ్రాత్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్, అంజలి శర్వాని, గౌహెర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అలానా కింగ్ -
ఈ పాపమంతా భార్యలదేనంట..!
-
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. బిగ్ బాష్ లీగ్‌లో పేలవ ఫామ్‌లో ఉండిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ జేకబ్ బేతెల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో బేతెల్ మెరుపు అర్ద సెంచరీ (50 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు. ఫలితంగా అతని జట్టు మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. JACOB BETHELL - A SPECIAL PLAYER. 🌟The Highlights of Jacob Bethel's 87(50) in the BBL and all players combined made 61(70) - Bethel, The Future of RCB. 🔥pic.twitter.com/zIyhli7iOi— Tanuj Singh (@ImTanujSingh) January 14, 2025మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో బేతెల్ మినహా ఎవరూ రాణించలేదు. టిమ్ సీఫర్ట్ (24), కెప్టెన్ సదర్‌ల్యాండ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జోష్ బ్రౌన్ 6, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 7, హ్యారీ డిక్సన్ 1, టామ్ రోజర్స్ 5 (నాటౌట్), ఫెర్గస్ ఓనీల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఇల్లిస్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.155 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 7 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (24), కాలెబ్ జువెల్ (1) ఔట్ కాగా.. చార్లీ వకీం (12), నిఖిల్ చౌదరీ (4) క్రీజ్‌లో ఉన్నారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఫెర్గస్ ఓనీల్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ గెలవాలంటే 78 బంతుల్లో 105 పరుగులు చేయాలి.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో జేకబ్ బేతెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ జేకబ్ బేతెల్పై భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే బీబీఎల్ తొలి అర్ద భాగంలో బేతెల్ తుస్సుమనిపించాడు.బీబీఎల్-2025లో బేతెల్ ప్రదర్శనలు..87(50) vs హోబర్ట్ హరికేన్స్1(8) vs మెల్బోర్న్ స్టార్స్2(9) vs పెర్త్ స్కార్చర్స్49(36) vs మెల్బోర్న్ స్టార్స్21(21) vs అడిలైడ్ స్ట్రైకర్స్2(4) vs సిడ్నీ థండర్30(22) vs పెర్త్ స్కార్చర్స్3(6) vs హోబర్ట్ హరికేన్స్ -
పాక్ యువ పేసర్ సంచలన నిర్ణయం
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ ఇహసానుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 22 ఏళ్లకే పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌కు (PSL) గుడ్‌బై చెప్పాడు. నిన్న జరిగిన పీఎస్ఎల్-10 డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడంతో చిర్రెత్తిపోయిన ఇహసానుల్లా ఇకపై పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడనని శపథం చేశాడు. వాస్తవానికి ఇహసానుల్లా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా ఇహసానుల్లాపై ఫ్రాంచైజీలు ఆనాసక్తిని ప్రదర్శించాయి. ఇహసానుల్లా గంటకు 150 కిమీకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఇహసానుల్లాకు పేస్ కింగ్‌గా పేరుంది. పీఎస్ఎల్ డ్రాఫ్ట్ అనంతరం ఇహసానుల్లా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాను కోపంలో ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే పీఎస్ఎల్ ఫ్రాంచైజీలపై అసహనం వ్యక్తిం చేశాడు. నెలన్నర రోజుల్లో పీఎస్ఎల్ ఫ్రాంచైజీలకు తానేంటో తెలిసొచ్చేలా చేస్తానని అన్నాడు. దేశవాలీ క్రికెట్ ఆడి సత్తా చాటుతానని తెలిపాడు. పీఎస్ఎల్లో కాకుండా దేశవాలీ క్రికెట్లో బాగా పెర్ఫార్మ్ చేసి పాకిస్తాన్ జట్టుకు ఎంపికవుతానని అన్నాడు.కాగా, నిన్న జరిగిన పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని తమ జట్లను పటిష్టం చేసుకున్నాయి. డ్రాఫ్ట్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, రస్సీ వాన్ డర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. పీఎస్ఎల్ 2025లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఒకే ఫ్రాంచైజీకి ఆడనున్నారు. వీరిద్దరిని కరాచీ కింగ్స్ కొనుగోలు చేసింది. వార్నర్, కేన్ ద్వయం గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడింది.పాకిస్తాన్ సూపర్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాళ్లు..కరాచీ కింగ్స్- డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జేమ్స్ విన్స్, టిమ్ సీఫర్ట్, ఆడమ్ మిల్నే, మొహమ్మద్ నబీ, లిటన్ దాస్లాహోర్ ఖలందర్స్- కుసాల్ పెరీరా, డారిల్ మిచెల్, సికందర రజా, సామ్ కర్రన్, రిషద్ హొసేన్, డేవిడ్ వీస్, సామ్ బిల్లింగ్స్ముల్తాన్ సుల్తాన్స్- మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లే, గుడకేశ్ మోటీ, జాన్సన్ ఛార్లెస్, షాయ్ హోప్, జాషువ లిటిల్, క్రిస్ జోర్డన్ఇస్లామాబాద్ యునైటెడ్- మాథ్యూ షార్ట్, ఆండ్రియస్ గౌస్, బెన్ డ్వార్షుయిష్, రిలే మెరిడిత్, జేసన్ హోల్డర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, కొలిన్ మున్రోక్వాట్టా గ్లాడియేటర్స్- ఫిన్ అలెన్, కైల్ జేమీసన్, అకీల్ హొసేన్, రిలీ రొస్సో, మార్క్ చాప్మన్, సీన్ అబాట్, కుసాల్ మెండిస్పెషావర్ జల్మీ- బ్రైయాంట్, కొర్బిన్ బాష్, అల్జరీ జోసఫ్, ఇబ్రహీం జద్రాన్, నహిద్ రాణా, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ -
టీ20ల్లో అరుదైన ప్రదర్శన.. రికార్డుల వెల్లువ
టీ20ల్లో అరుదైన ప్రదర్శన నమోదైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఢాకా క్యాపిటల్స్ ఆటగాళ్లు (తంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్) సెంచరీలు చేశారు. టీ20ల్లో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది తొమ్మిదో సారి.టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేసిన సందర్భాలు..కెవిన్ ఓ'బ్రియన్ & హమీష్ మార్షల్ vs మిడిల్సెక్స్, ఉక్స్బ్రిడ్జ్, 2011విరాట్ కోహ్లీ & ఎబి డివిలియర్స్ vs గుజరాత్ లయన్స్, బెంగళూరు, 2016అలెక్స్ హేల్స్ & రిలీ రోసౌ vs చిట్టగాంగ్ వైకింగ్స్, చట్టోగ్రామ్, 2019డేవిడ్ వార్నర్ & జానీ బెయిర్‌స్టో vs ఆర్సిబి, హైదరాబాద్, 2019సబావూన్ డేవిజి & డిలాన్ స్టెయిన్ vs బల్గేరియా, మార్సా, 2022లాచ్లాన్ యమమోటో-లేక్ & కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ vs చైనా, మోంగ్ కోక్, 2024శుభ్‌మన్ గిల్ & బి సాయి సుదర్శన్ vs CSK, అహ్మదాబాద్, 2024సంజు సామ్సన్ & తిలక్ వర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2024తాంజిద్ హసన్ తమీమ్ & లిట్టన్ దాస్ vs దర్బార్ రాజ్షాహి, సిల్హెట్, 2025మ్యాచ్ విషయానికొస్తే.. దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఢాకా క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్ చేసింది. తంజిద్ హసన్ (64 బంతుల్లో 108; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), లిటన్ దాస్ (55 బంతుల్లో 125 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో ఢాకా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 254 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్ 44 బంతుల్లో శతక్కొట్టాడు. బీపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టులో లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. తనను జట్టు నుంచి తప్పించిన రోజే దాస్ సెంచరీతో కదంతొక్కడం విశేషం.ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్ తొలి వికెట్‌కు 241 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు జపాన్ ఆటగాళ్లు యమమోటో, కడోవాకీ పేరిట ఉంది. ఈ జోడీ 2024లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 258 పరుగులు జోడించింది. ఢాకా క్యాపిటల్స్ నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దర్బార్ రాజ్‌షాహీ చేతులెత్తేసింది. ఆ జట్టు 15.2 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఢాకా క్యాపిటల్స్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇదే భారీ విజయం. ఈ సీజన్లో ఢాకా క్యాపిటల్స్‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌కు ముందు ఢాకా క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది. -
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు ఇదే..!
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి ఈ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చారు. 2023 వన్డే వరల్డ్‌కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఈ టోర్నీ కోసం ఎంపికయ్యారు. ఈ జట్టులో టోనీ డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, వియాన్ ముల్దర్ లాంటి కొత్త ముఖాలు ఉన్నాయి. ఈ ముగ్గురికి ఇదే తొలి 50 ఓవర్ల ఐసీసీ టోర్నీ.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 21న ఆడనుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ప్రొటీస్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 25న రావల్పిండిలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. తదనంతరం మార్చి 1న కరాచీలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌తో పోటీపడనుంది.కాగా, సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఐసీసీ ఈవెంట్లలో అదరగొడుతున్న విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ప్రొటీస్ టీమ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. సౌతాఫ్రికా గత రెండు ఐసీసీ ఈవెంట్లలో చేసిన ప్రదర్శనలే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రిపీట్ చేయాలని భావిస్తుంది. సౌతాఫ్రికాకు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన అనుభవం కూడా ఉంది. ఈ జట్టు 1998 ఇనాగురల్ ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి పాక్‌ను మట్టికరిపించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ అనంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు అర్హత సాధించింది. బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడి రీఎంట్రీ
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హష్మతుల్లా షాహిదీ ఎంపికయ్యాడు. మెగా టోర్నీలో షాహిదీకి డిప్యూటీగా రహమత్ షా వ్యవహరించనున్నాడు. మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. జద్రాన్ గాయం కారణంగా గతేడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్.. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన సెడిఖుల్లా అటల్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కాదని ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. 50 ఓవర్ల ఫార్మాట్‌కు కావాల్సినంత ఫిట్నెస్ లేకపోడంతో ముజీబ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ముజీబ్‌ను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కావాలని అతని డాక్టర్లు సలహా ఇచ్చారట. ముజీబ్ 2023 వన్డే వరల్డ్‌కప్ చివరిసారి ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డే ఆడాడు.2023 వరల్డ్ కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికయ్యారు. ముజీబ్, నవీన్ ఉల్ హక్, రియాజ్ హసన్, అబ్దుల్ రెహ్మాన్, నజీబుల్లా జద్రాన్ లాంటి సీనియర్లకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు గత రెండు ఐసీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆఫ్ఘన్లు సంచలన విజయాలు నమోదు చేశారు. వీటిలో పాటు ఆఫ్ఘన్లు గతేడాది వన్డేల్లో సౌతాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించారు. అదే ఊపుతో ఆఫ్ఘన్లు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సంచలనాలు సృష్టించాలని ఆశిస్తున్నారు.మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 21న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు సౌతాఫ్రికాను ఢీకొంటారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ దశలో ఇంగ్లండ్ (ఫిబ్రవరి 26న లాహోర్‌లో), ఆస్ట్రేలియాతో (ఫిబ్రవరి 28న లాహోర్‌లో) తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, ఎఎమ్ గజన్హర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్ ఆటగాళ్లు: దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. కెప్టెన్ అయ్యాక సాంట్నర్‌కు ఇదే తొలి ఇసీసీ టోర్నీ. ఈ రెండు టోర్నీల కోసం పేస్ బౌలింగ్ త్రయం విలియమ్ ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ. పేసర్ జేకబ్ డఫీ ఈ రెండు టోర్నీల కోసం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ILT20 ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లోకీ ఫెర్గూసన్ ట్రయాంగులర్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే స్టాండ్ బైగా డఫీ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఆతిథ్య పాకిస్తాన్‌తో ఆడనుంది. టోర్నీ ఆరంభ రోజునే ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్‌లో (2000) న్యూజిలాండే విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఛాంపియన్స్ ట్రోఫీ-2025, పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీపాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (ముల్తాన్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 14- ఫైనల్ (ముల్తాన్)ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్ -ఏ, కరాచీఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి, కరాచీఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 23- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి,రావల్పిండిఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, లాహోర్మార్చి 01- దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, కరాచీమార్చి 02- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్మార్చి 04- మొదటి సెమీ ఫైనల్ (A1 వర్సెస్ B2), దుబాయ్మార్చి 05- రెండో సెమీ ఫైనల్ (B1 వర్సెస్ A2), లాహోర్మార్చి 09- ఫైనల్ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే అత్యధిక వయస్కులు వీరే..!
ఐపీఎల్-2025లో పాల్గొనే అత్యధిక వయస్కుల వివరాలను ఈ ఐటంలో చూద్దాం. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనబోయే అత్యధిక వయస్కుడిగా ధోని రికార్డు సృష్టించాడు. ధోని 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 ఆడతాడు. ధోనిని ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రీటైన్ చేసుకుంది. సీఎస్కేకు ఐదు సార్లు టైటిళ్లు అందించిన ధోని ఈసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే రెండో అత్యధిక వయస్కుడు ఫాఫ్ డుప్లెసిస్. డుప్లెసిస్ 40 ఏళ్ల వయసులో క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. గత సీజన్ వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్ 2025 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. మెగా వేలంలో డీసీ డుప్లెసిస్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. డుప్లెసిస్ ఐపీఎల్లో 145 మ్యాచ్‌లు ఆడి 4571 పరుగులు స్కోర్ చేశాడు.ఐపీఎల్-2025లో మూడో అత్యధిక వయస్కుడు రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ 38 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడతాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యష్‌ను 9.75 కోట్లకు సొంతం చేసుకుంది. అశ్విన్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు.ఐపీఎల్-2025 నాలుగో అత్యధిక వయస్కుడు రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్ 37 ఏళ్ల వయసులో ముంబై ఇండియన్స్‌కు ఆడతాడు. ముంబై ఇండియన్స్ 16.3 కోట్లకు రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ తదుపరి సీజన్లో సాధారణ ఆటగాడిగా బరిలో ఉంటాడు. రోహిత్ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడి 6628 పరుగులు స్కోర్ చేశాడు.ఐపీఎల్-2025లో పాల్గొనే ఐదో అత్యధిక వయస్కుడు మొయిన్ అలీ. మొయిన్ అలీ 37 ఏళ్ల వయసులో (రోహిత్ కంటే చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. మెగా వేలంలో కేకేఆర్ మొయిన్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. మొయిన్ తన ఐపీఎల్ కెరీర్లో 67 మ్యాచ్‌లు ఆడి 1162 పరుగులు చేసి 35 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఆరో అత్యధిక వయస్కుడు కర్ణ్ శర్మ. కర్ణ శర్మ 37 ఏళ్ల (రోహిత్, మొయిన్ కంటే రోజుల్లో చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. కర్ణ్ శర్మను మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. కర్ణ్ శర్మ ఐపీఎల్లో 84 మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఏడో అత్యధిక వయస్కుడు ఆండ్రీ రసెల్. రసెల్ 36 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు రసెల్‌ను కేకేఆర్ రీటైన్ చేసుకుంది. రసెల్ ఐపీఎల్లో 126 మ్యాచ్‌లు ఆడి 2484 పరుగులు చేసి 115 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఎనిమిదో అత్యధిక వయస్కుడు సునీల్ నరైన్. నరైన్ 36 ఏళ్ల వయసులో (రసెల్ కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు కేకేఆర్ నరైన్‌ను రీటైన్ చేసుకుంది. నరైన్ ఐపీఎల్లో 1534 పరుగులు చేసి 180 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే తొమ్మిదో అత్యధిక వయస్కుడు అజింక్య రహానే. రహానే 36 ఏళ్ల (రసెల్, నరైన్ కంటే రోజుల్లో చిన్నవాడు) వయసులో క్యాష్ రిచ్ లీగ్ ఆడనున్నాడు. రహానేను మెగా వేలంలో కేకేఆర్ 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. రహానే తన ఐపీఎల్ కెరీర్లో 185 మ్యాచ్‌లు ఆడి 30.14 సగటున 4642 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే పదో అత్యధిక వయస్కుడు ఇషాంత్ శర్మ. ఇషాంత్ 36 ఏళ్ల వయసులో (రసెల్, నరైన్, రహానే కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. ఇషాంత్‌ను 2025 సీజన్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఇషాంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి వేలంలో అమ్ముడుపోయిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇషాంత్ ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. -
డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం
బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఆడుతున్న ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్.. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో తన బ్యాట్‌తో తనే కొట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే.. హరికేన్స్‌తో మ్యాచ్‌లో సిడ్నీ థండర్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను రిలే మెరిడిత్ బౌలింగ్ చేశాడు. వార్నర్ స్ట్రయిక్‌లో ఉన్నాడు. తొలి బంతిని మెరిడిత్ డ్రైవ్ చేసే విధంగా ఆఫ్ స్టంప్ ఆవల బౌల్ చేశాడు. ఈ బాల్‌ను వార్నర్ మిడ్ ఆఫ్ దిశగా డ్రైవ్ చేశాడు. అయితే వార్నర్‌కు ఊహించిన ఫలితం రాలేదు. బౌలర్ స్పీడ్ ధాటికో ఏమో కాని డ్రైవ్ షాట్ ఆడగానే వార్నర్ బ్యాట్ హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది. క్రికెట్లో ఇలా జరగడం సాధారణమే. ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. బ్యాట్ విరగగానే రెండో భాగం కాస్త వార్నర్ తల వెనుక భాగాన్ని తాకింది. అదృష్టవశాత్తు హెల్మెట్ ధరించినందుకు గాను వార్నర్‌కు ఏమీ కాలేదు. ఇలా జరగ్గానే వార్నర్ గట్టి అరిచాడు. కామెంటేటర్లు సరదాగా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలలో వైరలవుతుంది.David Warner's bat broke and he's hit himself in the head with it 🤣#BBL14 pic.twitter.com/6g4lp47CSu— KFC Big Bash League (@BBL) January 10, 2025మ్యాచ్ విషయానికొస్తే.. కొత్త బ్యాట్ తీసుకున్న తర్వాత వార్నర్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో చాలా జాగ్రత్తగా ఆడిన వార్నర్ చివరి వరకు క్రీజ్‌లో నిలిచాడు. వార్నర్ అజేయ హాఫ్ సెంచరీ సాధించడంతో సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. వార్నర్ 66 బంతుల్లో 7 బౌండరీల సాయంతో 88 పరుగులు చేశాడు. థండర్ ఇన్నింగ్స్‌ను వార్నర్ ఒక్కడే నడిపించాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. సామ్ బిల్లింగ్స్ (15 బంతుల్లో 28; 4 ఫోర్లు), ఒలివర్ డేవిస్ (17 బంతుల్లో 17; ఫోర్) కాసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. థండర్ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. భారీగా బిల్డప్ ఇచ్చిన సామ్ కొన్‌స్టాస్ 9 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. మాథ్యూ గిల్కెస్ 7 బంతుల్లో 9, క్రిస్ గ్రీన్ 7 బంతుల్లో 8 పరుగులు చేశారు. అసిస్టెంట్ కోచ్ కమ్ ప్లేయర్ అయిన డేనియల్ క్రిస్టియన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌటయ్యాడు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టాన్లేక్, క్రిస్ జోర్డన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ దక్కించుకున్నారు.భీకర ఫామ్‌లో వార్నర్ఈ సీజన్లో సిడ్నీ థండర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వార్నర్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో వార్నర్ స్కోర్లు..7 (5)17 (10)19 (15)86 నాటౌట్ (57)49 (33)50 (36)88 నాటౌట్ (66)టాప్‌లో థండర్ప్రస్తుత బీబీఎల్ సీజన్లో సిడ్నీ థండర్ అద్భుత విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు (9 పాయింట్లు) సాధించింది. రెండింట ఓడిపోగా, ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. పాయింట్ల పట్టికలో థండర్ తర్వాతి స్థానాల్లో సిడ్నీ సిక్సర్స్ (9 పాయింట్లు), హోబర్ట్ హరికేన్స్ (9), బ్రిస్బేన్ హీట్ (7), పెర్త్ స్కార్చర్స్ (6), మెల్బోర్న్ రెనెగేడ్స్ (6), మెల్బోర్న్ స్టార్స్ (6), అడిలైడ్ స్ట్రయికర్స్ (4) ఉన్నాయి. -
హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో హిందీ బాషను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో యాష్ మాట్లాడుతూ.. హిందీ జాతీయ భాష కాదు. అది కేవలం అధికారిక భాష మాత్రమే అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దూమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ నడుస్తుంది.#Watch | தமிழுக்கு அதிர்ந்த அரங்கம்.. இந்திக்கு SILENT.. "இந்தி தேசிய மொழி இல்ல".. பதிவு செய்த அஸ்வின்!சென்னையில் உள்ள தனியார் பொறியியல் கல்லூரியில் நடைபெற்ற பட்டமளிப்பு விழாவில் மாஸ் காட்டிய கிரிக்கெட் வீரர் அஸ்வின்#SunNews | #Chennai | #Ashwin | @ashwinravi99 pic.twitter.com/TeWPzWAExQ— Sun News (@sunnewstamil) January 9, 2025అసలు ఏం జరిగిందంటే.. కాంచీపురంలోని రాజలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో యాష్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశాడు. యాష్ తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు ఏ భాష అయితే మీకు కంఫర్ట్‌గా ఉంటుందని స్టూడెంట్స్‌ను అడిగాడు. ఇంగ్లిష్, తమిళ్, హిందీ భాషల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలని కోరాడు. తమిళ్, ఇంగ్లిష్ అని అశ్విన్ చెబుతుండగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే హిందీ పేరు ఎత్తగానే ఆడిటోరియం మొత్తం మూగబోయింది. ఈ సందర్భంగా అశ్విన్ హిందీ జాతీయ భాష కాదు, అధికారిక భాష మాత్రమే అని వ్యాఖ్యానించాడు. అశ్విన్ మాటల్లో.. "హిందీ మన జాతీయ భాష కాదు. అది అధికారిక భాష మాత్రమే. ఈ విషయాన్ని నేను చెప్పాలని అనుకున్నాను" అశ్విన్ ఈ విషయాన్ని ప్రస్తావించిన వెంటనే తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. యాష్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడో కానీ, ఈ అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అశ్విన్ లాంటి వ్యక్తి ఇలాంటి సున్నితమైన అంశాలపై (భాష) వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.కాగా, భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన భారతదేశం, రాజ్యాంగం ప్రకారం 22 షెడ్యూల్డ్ భాషలను గుర్తిస్తుంది. ఇండియాలో ఇంగ్లిష్తో పాటు హిందీ అధికారిక భాష హోదాను కలిగి ఉంది. భారత్‌లో హిందీ సహా ఏ భాషకు జాతీయ భాష హోదా లేదు. అధికారిక భాష, జాతీయ భాష మధ్య వ్యత్యాసాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. ఇది విస్తృత చర్చలకు దారితీస్తుంది. సంవత్సరాలుగా హిందీని ఏకీకృత భాషగా ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఇదిలా ఉంటే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో భాగమైన అశ్విన్.. టీమిండియా తరఫున 106 టెస్ట్‌లు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 537 వికెట్లు తీసి భారత్ తరఫున రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న యాష్.. వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. 38 ఏళ్ల అశ్విన్ తదుపరి ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. -
మెరుపు అర్ద శతకం.. మ్యాక్స్‌వెల్ ఖాతాలో భారీ రికార్డు
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ భారీ రికార్డును సాధించాడు. లీగ్ చరిత్రలో 3000 పరుగుల మార్కును దాటిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బీబీఎల్ 2024-25లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఈ అరుదైన ఘనత సాధించాడు. మ్యాక్సీకి ముందు క్రిస్ లిన్, ఆరోన్ ఫించ్, డిఆర్కీ షార్ట్, మోసెస్ హెన్రిక్స్, జాన్ వెల్స్ మాత్రమే బీబీఎల్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకారు. సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో మెరుపు అర్ద శతకం బాదిన మ్యాక్సీ.. బీబీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెల్స్, హెన్రిక్స్లను అధిగమించాడు.బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్..క్రిస్ లిన్-3908ఆరోన్ ఫించ్-3311డిఆర్కీ షార్ట్-3102గ్లెన్ మ్యాక్స్‌వెల్-3047మోసెస్ హెన్రిక్స్-3035మ్యాక్సీ మెరుపు అర్ద శతకంసిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మెరుపు అర్ద శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు. ఫలితంగా మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో బ్యూ వెబ్‌స్టర్ (48) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. బెన్ డకెట్ (20), డాన్ లారెన్స్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. సామ్ హార్పర్ (4), కెప్టెన్ మార్కస్ స్టోయినిస్ (4) విఫలమయ్యారు. సిక్సర్స్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాక్ ఎడ్వర్డ్స్, హేడెన్ కెర్ తలో వికెట్ దక్కించుకున్నారు.19వ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన హాఫ్ సెంచరీ బీబీఎల్‌లో అతనికి 19వది. ఓవరాల్‌గా అతను టీ20ల్లో 55 అర్ద శతకాలు సాధించాడు. టీ20 కెరీర్లో 427 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 154 స్ట్రయిక్‌రేట్‌తో 28 సగటున 10,183 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ తరఫున 133 అంతర్జాతీయ టీ20లు ఆడిన మ్యాక్సీ ఐదు సెంచరీల సాయంతో 2664 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మ్యాక్స్‌వెల్ 16వ స్థానంలో ఉన్నాడు.చిత్తుగా ఓడిన సిక్సర్స్157 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మార్క్ స్టీకిటీ (3/14), పీటర్ సిడిల్ (2/26), మార్కస్ స్టోయినిస్ (2/30), ఉసామా మిర్ (2/19) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి మెల్బోర్న్ స్టార్స్‌ను గెలిపించారు. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ విన్స్ (53) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. కర్టిస్ ప్యాటర్సన్ (18), హేడెన్ కెర్ (21), మోసెస్ హెన్రిక్స్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. -
పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ
స్వదేశంలో వెస్డిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ వికెట్‌కీపర్ బ్యాటర్ హసీబుల్లా ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా హసీబుల్లా ఖాన్ గాయపడినట్లు పాక్ మీడియా తెలిపింది. 21 ఏళ్ల హసీబుల్లా ఖాన్ విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో మహ్మద్ రిజ్వాన్‌తో పాటు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌గా ఎంపిక కావాల్సి ఉండింది. అయితే ఊహించని గాయం టెస్ట్ అరంగేట్రం చేయాలనుకున్న హసీబుల్లా ఆశలపై నీళ్లు చల్లింది. హసీబ్ గతేడాదే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. హసీబ్ గాయపడటంతో విండీస్‌తో సిరీస్‌లో పాక్ రిజ్వాన్‌పైనే పూర్తిగా ఆధార పడాల్సి ఉంటుంది. విండీస్‌తో సిరీస్ కోసం పాక్ జట్టును త్వరలోనే ప్రకటిస్తారు.అందుబాటులో ఉండని స్టార్ బ్యాటర్పాక్ ఇటీవలే ఓ కీలక బ్యాటర్ సేవలు కోల్పోయింది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ సందర్భంగా ఆ జట్టు స్టార్ ఓపెనర్ సైమ్ అయూబ్ తీవ్రంగా గాయపడ్డాడు. సైమ్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో సైమ్ విండీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు.జనవరి 17 నుంచి ప్రారంభంవిండీస్తో తొలి టెస్ట్ జనవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. దీనికి ముందు విండీస్ పాక్-ఏతో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ జనవరి 10, 11 తేదీల్లో జరుగుతుంది. జనవరి 25 నుంచి 29 తేదీల మధ్యలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు కూడా ముల్తానే ఆతిథ్యమివ్వనుంది.18 ఏళ్ల విరామం తర్వాత..18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విండీస్ పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. దీంతో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.డబ్ల్యూటీసీ 2023-25లో చివరిదిపాకిస్తాన్ క్రికెట్ జట్టుకు విండీస్‌తో సిరీస్ డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో చివరిది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్, విండీస్ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఎప్పుడో బయటకు వచ్చాయి.కాగా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవలే సౌతాఫ్రికా గడ్డపై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను పాక్ 0-2 తేడాతో కోల్పోయింది.రెండు రోజుల వార్మప్ మ్యాచ్ కోసం పాక్-ఏ జట్టు..ఇమామ్ ఉల్ హాక్ (కెప్టెన్), మొహమ్మద్ హురైరా, ఒమైర్ యూసఫ్, అలీ జర్యాబ్, సాద్ ఖాన్, కషిఫ్ అలీ, మొహమ్మద్ సులేమాన్, హుసేన్ తలాత్, హసీబుల్లా ఖాన్ (వికెట్‌కీపర్), రొహైల్ నజీర్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ మూసా, మొహమ్మద్ రమీజ్ జూనియర్పాకిస్తాన్తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు..క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, మిఖైల్ లూయిస్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, గుడకేశ్ మోటీ, జాషువ డ సిల్వ, తెవిన్ ఇమ్లాచ్, అమిర్ జాంగూ, ఆండర్సన్ ఫిలిప్, జోమెల్ వార్రికన్, కెవిన్ సింక్లెయిర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్ -
వరుణ్ చక్రవర్తి మాయాజాలం.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఖాయం
మిస్టరీ స్పిన్నర్, తమిళనాడు ఆటగాడు వరుణ్ చక్రవర్తి విజయ్ హజారే ట్రోఫీ రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ తన ఐదు వికెట్ల ప్రదర్శనలో ఏకంగా ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ ఓ క్యాచ్ కూడా పట్టాడు. వరుణ్‌తో పాటు సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) కూడా వికెట్లు తీయడంతో రాజస్థాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్ అభిజీత్ తోమర్ (111) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (60) అర్ద సెంచరీతో కదం తొక్కడంతో రాజస్థాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో వీరిద్దరితో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అభిజీత్ తోమార్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో బాధ్యతాయుతమైన సెంచరీ చేయగా.. లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకం బాదాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో సచిన్ యాదవ్ 4, దీపక్ హూడా 7, అజయ్ సింగ్ 2, మానవ్ సుతార్ 1, అనికేత్ చౌదరీ 2, ఖలీల్ అహ్మద్ 1, అమన్ షెకావత్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.Varun Chakravarthy with a peach of a delivery. 🤯🔥 pic.twitter.com/kL0BfOHH5m— Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2025అనంతరం 268 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0) ఔట్ కాగా.. నారాయణ్ జగదీశన్ (37 బంతుల్లో 52; 9 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (13) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీకి తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 183 పరుగులు చేయాలి.ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఖాయంఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటించడానికి ముందు వరుణ్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ ప్రదర్శన అనంతరం వరుణ్ టీమిండియాకు ఎంపిక కావడం ఖాయమని తెలుస్తుంది. భారత జట్టులో చోటు విషయంలో వరుణ్‌కు రవి భిష్ణోయ్ నుంచి పోటీ ఉండింది. అయితే తాజా ప్రదర్శన నేపథ్యంలో సెలెక్టర్లు ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వరుణ్ ఇటీవల టీమిండియా తరఫున టీ20ల్లోనూ అదరగొట్టాడు. గతేడాది నవంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ 12 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో వరుణ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే, ఇవాళే జరుగుతున్న మరో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో (మొదటిది) హర్యానా, బెంగాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో పార్థ్ వట్స్ (62), నిషాంత్ సంధు (64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ రెండు, సుయాన్ ఘోష్, ప్రదిప్త ప్రమాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
USA: ‘వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ స్థాయి పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలోనే క్రికెట్ కొత్తగా అభివృద్ధి చెందుతోంది. 2024 టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణతో స్థానికుల దృష్టి దీనిపై పడగా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగం కావడంతో మరింత ఎక్కువ మందికి ఆసక్తి పెరుగుతోంది. అయితే అమెరికన్లు పెద్దగా పట్టించుకోని సమయంలో ఆటను వారికి చేరువ చేయడంలో యూఎస్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, తెలుగు వ్యక్తి వేణుకుమార్ రెడ్డి పిసికె పాత్ర ఎంతో ఉంది. నల్లగొండకు చెందిన వేణు గత ఆరేళ్లుగా యూఎస్‌లో క్రికెట్‌ను విస్తృతం చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటను అమెరికన్లు తమదిగా భావించి ఇతర క్రీడల్లాగే ప్రాధాన్యత ఇచ్చేలా చేయడమే తన లక్ష్యమని వేణు ‘సాక్షి’తో చెప్పారు. ఇటీవలే భారత్‌కు వచ్చిన ఆయన బీసీసీఐ ఉన్నతాధికారులను కలిసి అమెరికా క్రికెట్ అభివృద్ధి కోసం సహకారాన్ని కూడా కోరారు. ‘టి20 వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించగలిగాం. భారత్, పాకిస్తాన్లతో అమెరికా తలపడిన మ్యాచ్‌లకు స్థానిక అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాక్‌పై గెలుపుతో అమెరికన్లు కూడా ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇప్పుడు మా ముందు ఒలింపిక్స్ రూపంలో పెద్ద లక్ష్యం ఉంది. వచ్చే రెండేళ్లలో క్రికెట్ వారికి మరింత చేరువ చేయడమే మా లక్ష్యం’ అని వేణు రెడ్డి అన్నారు. 1998లో ఐటీ నిపుణుడిగా యూఎస్‌కు వెళ్లి ఆపై సగటు భారత క్రికెట్ అభిమాని తరహాలో అక్కడ క్రికెట్ టోర్నీలు, క్యాంప్‌లు నిర్వహిస్తూ వేణు ఆటకు ప్రాచుర్యం పెంచారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీలలో టీమ్‌లను తయారు చేయడం ద్వారా ప్రతిభను గుర్తించే అవకాశం దక్కింది. ‘సహజంగానే భారత్ నుంచి వచ్చిన వారు, భారత మూలాల ఉన్నవారే క్రికెట్ వైపు వచ్చారు. అందరూ ఇతర ఉద్యోగాల్లో ఉంటూ క్రికెట్ ఆడేందుకు వచ్చేవారే. వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు వాలంటీర్లు ముందుకు వచ్చారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు యూఎస్ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులు ఇస్తున్నాం. ఇదంతా ఇన్నేళ్లలో అమెరికా క్రికెట్లో వచి్చన మార్పు గురించి చెబుతుంది’ అని వేణు వివరించారు.అయితే ఇప్పటికీ అసలైన అమెరికన్లు కాకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న వారే యూఎస్ క్రికెట్ జట్లలో ఎక్కువగా ఉండటం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అలా జరిగితే క్రికెట్ కూడా యూఎస్‌లో ఇతర క్రీడల్లా దూసుకుపోతుందని వేణు అభిప్రాయపడ్డారు. ‘టి20 వరల్డ్ కప్ సమయంలో పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రతిష్టాత్మక మీడియా కంపెనీలు క్రికెట్‌పై బాగా దృష్టి పెట్టాయి. అండర్–11 స్థాయి నుంచి అండర్–23 వరకు ఇప్పుడు వరుసగా టోర్నీలు నిర్వహిస్తున్నాం. ఈ దశలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు భాగమవుతున్నారు. జాతీయ జట్టుకు ఎంపిక చేసే ముందుకు జరిగే సెలక్షన్స్‌లో వీరంతా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో యూఎస్ టీమ్‌లో మనవారు మాత్రమే కాకుండా అమెరికన్లను కూడా చూడవచ్చు. అయితే భారతీయుల్లో మన తెలుగువారు కూడా యూఎస్ క్రికెటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరం. సీనియర్ మహిళల క్రికెట్లో పగడ్యాల చేతనా రెడ్డి ఇటీవల 136 పరుగులు చేసి అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది’ అని వేణు గుర్తు చేశారు. ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం అమెరికాకు ఎక్కువగా రావడం లేదని... భారత్‌లోని రంజీ టీమ్‌లతో మ్యాచ్‌లు ఏర్పాటు చేసి తమ ఆటను మెరుగుపర్చుకునే అవకాశం ఇవ్వాలని ఇటీవల ఐసీసీ చైర్మన్ జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలకు విజ్ఞప్తి చేసినట్లు వేణు వెల్లడించారు. ఆసియా కప్ తరహాలో ‘నార్త్ అమెరికన్ చాంపియన్‌షిప్’ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని, త్వరలోనే ఈ టోర్నీ జరుగుతుందని ఆయన చెప్పారు. 2018 నుంచి యూఎస్సీఏలో డైరెక్టర్‌గా అడుగు పెట్టిన వేణు 2023లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలో యూఎస్ జట్టు 2024 టి20 టోర్నీ (ఆతిథ్య జట్టు హోదాలో), 2026 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిందని... 2027 వన్డే వరల్డ్ కప్‌కు క్వాలిఫై కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వేణు రెడ్డి స్పష్టం చేశారు. -
విరాట్ కోహ్లికి అవమానం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణంగా విఫలమై ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి మరో అవమానం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ 27వ స్థానానికి పడిపోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ టాప్-25 లోనుంచి బయటికి రావడం 12 ఏళ్ల తర్వాత ఇది మొదటిసారి. కెరీర్ ఆరంభంలో మాత్రమే విరాట్ టాప్-25 బ్యాటర్ల జాబితాలో లేడు. 2011లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విరాట్.. 2012లో ఓసారి 36వ స్థానానికి పడిపోయాడు.బీజీటీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో విరాట్ కేవలం 23 పరుగులు (17, 6) మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శన అనంతరం విరాట్ మూడు స్థానాలు కోల్పోయి ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చుకున్నాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 614 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. బీజీటీ ఆధ్యాంతం దారుణంగా విఫలమైన విరాట్ ఈ సిరీస్ మొత్తంలో (9 ఇన్నింగ్స్‌ల్లో) 190 పరుగులు మాత్రమే చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ తన సమకాలీకులైన జో రూట్ (నంబర్ వన్ ర్యాంక్), కేన్ విలియమ్సన్ (మూడో ర్యాంక్), స్టీవ్ స్మిత్ (ఎనిమిదో ర్యాంక్), బాబర్ ఆజమ్ (12వ ర్యాంక్) కంటే చాలా వెనుకపడ్డాడు.2018 ఆగస్ట్‌లో కెరీర్ అత్యధిక రేటింగ్ పాయింట్లు (937) సాధించి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విరాట్.. 2020 ఫిబ్రవరిలో తొలిసారి అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కెరీర్ పీక్స్‌లో (2016-2020) ఉండగా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగిన విరాట్ ప్రస్తుతం గుడ్డకాలం ఎదుర్కొంటున్నాడు.2024లో ఒకే ఒక టెస్ట్ సెంచరీ చేసిన విరాట్.. గతేడాది మూడు ఫార్మాట్లలో చెత్త ప్రదర్శనలు చేశాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో 21.83 సగటున 655 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కెరీర్ మొత్తంలో ఓ క్యాలెండర్ ఇయర్లో ఇంత దారుణమైన ప్రదర్శనలు ఎప్పుడూ లేవు.తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, నితీశ్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ కూడా పడిపోయారు. గిల్ మూడు స్థానాలు కోల్పోయి 23వ స్థానానికి పడిపోగా.. రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 42వ ప్లేస్‌కు దిగజారాడు. ఆసీస్‌తో చివరి టెస్ట్‌లో కోహ్లి, రోహిత్‌తో పాటు విఫలమైన రాహుల్ 11 స్థానాలు కోల్పోయి 52వ స్థానానికి పడిపోయాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయిన నితీశ్ కుమార్.. సిడ్నీ టెస్ట్‌లో పేలవ ప్రదర్శనలు చేసి 19 స్థానాలు కోల్పోయాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో నితీశ్ 72వ స్థానానికి పడిపోయాడు.తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు అర్ద శతకం చేసిన రిషబ్ పంత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్లలో జైస్వాల్, పంత్ మాత్రమే ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచారు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు. -
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
జనవరి 9 నుంచి మరో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా వేదికగా SA20-2025 లీగ్ (మూడో ఎడిషన్) మొదలవుతుంది. 30 రోజుల పాటు సాగే ఈ మెగా లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రేపు జరుగబోయే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో తలపడుతుంది. ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాధరణ కలిగిన ఈ లీగ్ ఆరు వేదికల్లో (గెబెర్హా, డర్బన్, పార్ల్, జొహనెస్‌బర్గ్, సెంచూరియన్, కేప్‌టౌన్) జరుగనుంది. ఈ లీగ్‌లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్) ఫిబ్రవరి 4న మొదలవుతాయి. ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ఈ లీగ్ ముగుస్తుంది. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్. ఈ జట్టు వరుసగా రెండు సీజన్లలో (2023, 2024) విజేతగా నిలిచింది.ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్) పాల్గొంటాయి. ఈ ఎడిషన్‌లో గత ఎడిషన్లలోలాగే ఒక్కో జట్టు 10 లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడుతుంది.ఈ లీగ్‌లో డే మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతాయి. నైట్ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి.ఈ లీగ్‌లోని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమా యాప్‌తో పాటు వెబ్సైట్లో జరుగుతుంది.జట్ల వివరాలు..డర్బన్ సూపర్ జెయింట్స్: బ్రాండన్ కింగ్ (వెస్టిండీస్), క్వింటన్ డి కాక్, నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్థాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), ప్రేనెలన్ సుబ్రాయెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్), హెన్రిచ్ క్లాసెన్, జోన్-జాన్ స్మట్స్, వియాన్ ముల్డర్, జూనియర్ డాలా, బ్రైస్ పార్సన్స్, మాథ్యూ బ్రీట్జ్కే, జాసన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా), షమర్ జోసెఫ్ (వెస్టిండీస్), సీజే కింగ్ (రూకీ).జోబర్గ్ సూపర్ కింగ్స్: ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ (ఇంగ్లండ్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), మహేశ్ తీక్షణ (శ్రీలంక), డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ వీస్ (నమీబియా), ల్యూస్ డు ప్లూయ్ (ఇంగ్లండ్), లిజాద్ విలియమ్స్, నాండ్రే బర్గర్, డోనోవన్ ఫెరీరా, ఇమ్రాన్ తాహిర్, సిబోనెలో మఖాన్యా, తబ్రైజ్ షమ్సీ, విహాన్ లుబ్బే, ఇవాన్ జోన్స్, డగ్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), జేపీ కింగ్ (రూకీ).ఎంఐ కేప్ టౌన్: రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), కగిసో రబడా, ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్), డెవాల్డ్ బ్రీవిస్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, నువాన్ తుషార (శ్రీలంక), కానర్ ఎస్టర్‌హుజెన్ , డెలానో పోట్గీటర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, థామస్ కాబెర్, క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), కార్బిన్ బాష్, కోలిన్ ఇంగ్రామ్, రీజా హెండ్రిక్స్, డేన్ పీడ్ట్, ట్రిస్టన్ లూస్ (రూకీ).ప్రిటోరియా క్యాపిటల్స్: అన్రిచ్ నోర్ట్జే, జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్), విల్ జాక్స్ (ఇంగ్లండ్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), విల్ స్మీడ్ (ఇంగ్లండ్), మిగెల్ ప్రిటోరియస్, రిలీ రోసౌవ్, ఈథన్ బాష్, వేన్ పార్నెల్, సెనూరన్ ముత్తుసామి, కైల్ వెర్రెయిన్, డారిన్ డుపావిల్లోన్, స్టీవ్ స్టోక్, టియాన్ వాన్ వురెన్, మార్క్వెస్ అకెర్మాన్, ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), కైల్ సిమండ్స్, కీగన్ లయన్-కాచెట్ (రూకీ).పార్ల్ రాయల్స్: డేవిడ్ మిల్లర్, ముజీబ్ ఉర్ రెహమాన్ (ఆఫ్ఘనిస్థాన్), సామ్ హైన్ (ఇంగ్లండ్), జో రూట్ (ఇంగ్లండ్), దినేష్ కార్తీక్ (భారత్), క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్న్ ఫార్టుయిన్, లుంగి ఎన్గిడి, మిచెల్ వాన్ బ్యూరెన్, కీత్ డడ్జియన్, న్కాబా పీటర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కోడి యూసుఫ్, జాన్ టర్నర్ (ఇంగ్లండ్), దయాన్ గాలియం, జాకబ్ బెథెల్ (ఇంగ్లండ్), రూబిన్ హెర్మాన్, దేవాన్ మరియాస్ (రూకీ).సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఐడెన్ మార్క్రామ్, జాక్ క్రాలే (ఇంగ్లాండ్), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), లియామ్ డాసన్ (ఇంగ్లండ్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, బేయర్స్ స్వాన్‌పోయెల్, కాలేబ్ సెలెకా, ట్రిస్టన్ స్టబ్స్, జోర్డాన్ హర్మన్, ప్యాట్రిక్ క్రుగర్, క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), టామ్ అబెల్ (ఇంగ్లండ్), సైమన్ హార్మర్, ఆండిల్ సిమెలన్, డేవిడ్ బెడింగ్హామ్, ఒకుహ్లే సెలే, రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్), డేనియల్ స్మిత్ (రూకీ). -
టీమిండియాకు కొత్త తలనొప్పి..!
-
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల పూర్తి వివరాలు
పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లు జనవరి 22 నుంచి మొదలవుతాయి. తొలుత ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా భారత్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన వెంటనే జరుగుతున్న సిరీస్‌లు కావడంతో ఈ సిరీస్‌లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిమత ఓవర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)వన్డే సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతాయి.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..?భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్‌లలోని మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్‌లలోని మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్సైట్లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.ఇంగ్లండ్ వన్డే జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జోస్ బట్లర్ (కెప్టెన్), జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్ఇంగ్లండ్ టీ20 జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రెహన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోస్ బట్లర్ (కెప్టెన్), జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్లను ప్రకటించాల్సి ఉంది.కాగా, భారత జట్టు తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని (2024-25) ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పదేళ్ల తర్వాత ఆసీస్ బీజీటీని సొంతం చేసుకుంది. బీజీటీ పూర్తయిన 17 రోజుల్లో భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌ల అనంతరం టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. పాక్‌తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ హైబ్రిడ్ మోడల్లో దుబాయ్‌లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడుతుంది. మెగా టోర్నీలో దాయాదుల సమరం (భారత్ వర్సెస్ పాక్) ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరుగుతుంది. మార్చి 2న భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్ దశ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-ఏ టాపర్, గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-బి టాపర్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్‌కు మరో షాక్
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ పాకిస్తాన్ మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించబడింది. అలాగే ఐదు డబ్ల్యూటీసీ పాయింట్లు డాక్ చేయబడ్డాయి. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ కథనం మేరకు.. నిర్దేశిత సమయం ముగిసే లోగా పాక్ ఐదు ఓవర్లు వెనుకపడింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. నిర్దేశిత సమయంలోగా ఓవర్ వెనుకపడితే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధిస్తారు. అలాగే ఓ డబ్ల్యూటీసీ పాయింట్ డాక్ చేయబడుతుంది. ఐసీసీ విధించిన జరిమానాను పాక్ సారధి షాన్ మసూద్ స్వీకరించాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ చివరి నుంచి రెండో స్థానంలో (ఎనిమిది) ఉంది.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను పాక్ 0-2 తేడాతో కోల్పోయింది. తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో పాక్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డబుల్ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా తలో మూడు వికెట్లు తీయగా.. మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ఫాలో ఆడింది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ రికార్డు స్కోర్ (478) చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సూపర్ సెంచరీతో మెరవడంతో పాక్ ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోగలిగింది. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. బాబర్ ఆజమ్ (81) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ద సెంచరీతో ఆకట్టుకోగా.. మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేలా చేశారు.పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్ (47), మార్క్రమ్ (14) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. -
10 పరుగులకే నాలుగు వికెట్లు.. కట్ చేస్తే..!
బిగ్ బాష్ లీగ్‌లో ఇవాళ (జనవరి 7) మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆస్టన్ అగర్ (30 బంతుల్లో 51; ఫోర్, 4 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించడంతో స్కార్చర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆరోన్ హార్డీ (34), ఫిన్ అలెన్ (19), నిక్ హాబ్సన్ (12), జై రిచర్డ్సన్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. మిచెల్ మార్ష్, కూపర్ కన్నోలి, మాథ్యూ కెల్లీ డకౌట్ అయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. టామ్ రోజర్స్, సదర్‌ల్యాండ్ తలో రెండు, కేన్ రిచర్డ్సన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.తడబడినా నిలబడ్డారు..!148 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ ఆదిలో తడబడింది. ఆ జట్టు 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ విల్ సదర్‌ల్యాండ్ (45 బంతుల్లో 70; 5 ఫోర్లు,3 సిక్సర్లు), థామస్ రోజర్స్ (31 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 92 పరుగులు జోడించి మ్యాచ్‌ను రెనెగేడ్స్ వశం చేశారు. సదర్‌ల్యాండ్, రోజర్స్ దెబ్బకు రెనెగేడ్స్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో సదర్‌ల్యాండ్, రోజర్స్‌తో పాటు మార్కస్ హ్యారిస్ (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు. టిమ్ సీఫర్ట్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, లారీ ఇవాన్స్ ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. స్కార్చర్స్ బౌలర్లలో జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, జై రిచర్డ్సన్, లారీ మోరిస్ తలో రెండు వికెట్లు తీసి రెనెగేడ్స్‌ను ఇబ్బంది పెట్టారు.26 మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల పట్టికలో సిడ్నీ సిక్సర్స్ (9 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. సిడ్నీ థండర్ (8), హోబర్ట్ హరికేన్స్ (8), బ్రిస్బేన్ హీట్ (7), పెర్త్ స్కార్చర్స్ (6), మెల్బోర్న్ రెనెగేడ్స్ (6), అడిలైడ్ స్ట్రయికర్స్ (4), మెల్బోర్న్ స్టార్స్ (4) వరుసగా రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. -
బవుమా.. ద రియల్ కెప్టెన్.. ఓటమి ఎరుగని ధీరుడు..!
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు సారథి టెంబా బవుమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బవుమా తన సారథ్యంలో సౌతాఫ్రికాను తొమ్మిదింట ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఓ మ్యాచ్ డ్రా ముగిసింది. జట్టును విజయవంతంగా ముందుండి నడిపించడంతో పాటు బవుమా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. బవుమా సౌతాఫ్రికా కెప్టెన్‌గా 9 మ్యాచ్‌ల్లో 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 809 పరుగులు (57.78 సగటున) చేశాడు. బవుమా తొలిసారి సౌతాఫ్రికాను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉంది.ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సౌతాఫ్రికా చాలాకాలం తర్వాత సెకెండ్ ప్లేస్‌కు చేరింది. బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. బవుమా కెప్టెన్సీ స్కిల్స్‌కు ముగ్దులవుతున్న అభిమానులు అతన్ని గొప్ప సారధిగా కొనియాడుతున్నారు. బవుమా.. ద రియల్ కెప్టెన్.. ఓటమి ఎరుగని ధీరుడని జేజేలు పలుకుతున్నారు. బ్యాటర్‌గానూ పోరాట యోధుడని కితాబునిస్తున్నారు. బవుమా కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు.గత 10 మ్యాచ్‌ల్లో బవుమా ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..పాక్‌పై రెండో టెస్ట్‌లో 106 (179)పాక్‌పై తొలి టెస్ట్‌లో 31 (74), 40 (78)శ్రీలంకపై రెండో టెస్ట్‌లో 78 (109), 66 (116)శ్రీలంకపై తొలి టెస్ట్‌లో 70 (117), 113 (228)వెస్టిండీస్‌పై రెండో టెస్ట్‌లో 0 (2), 4 (18)వెస్టిండీస్‌పై తొలి టెస్ట్‌లో 86 (182), 15 (17)భారత్‌తో తొలి టెస్ట్‌లో 0 (0)వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో 28 (64), 172 (280)వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో 0 (2), 0 (1)ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో 35 (74), 17 (42)బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచింది. అలాగే వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. కెరీర్లో 63 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బవుమా 38 సగటున 3606 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో (రెండో టెస్ట్) సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ పాక్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.పాక్‌తో రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 615 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ భారీ డబుల్ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ఫాలో ఆడింది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ సౌతాఫ్రికా గడ్డపై రికార్డు స్కోర్ (478) చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సూపర్ సెంచరీతో మెరవడంతో పాక్ ఇన్నింగ్స్ పరాజయం బారి నుంచి తప్పించుకుంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (81), మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేలా చేశారు.పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్ (47), మార్క్రమ్ (14) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. -
టీమిండియాకు మరో పరాభవం
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో కోల్పోయిన టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. చాలాకాలం తర్వాత టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-2 నుంచి బయటకు వచ్చింది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా టీమిండియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచి సెకెండ్ ప్లేస్‌కు చేరుకుంది. సౌతాఫ్రికా వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. మరోపక్క భారత్ గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిన భారత్.. బీజీటీలో ఒక్క మ్యాచ్ గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ (న్యూజిలాండ్ చేతిలో ఓటమి) కోల్పోయిన భారత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని పదేళ్ల తర్వాత ఆసీస్‌కు వదిలేసింది. బీజీటీ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. టీమిండియా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. బీజీటీలో చివరి టెస్ట్ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. పాక్‌పై తొలి టెస్ట్‌లో విజయంతోనే సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.మరోవైపు బీజీటీలో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని అగ్రపీఠాన్ని (ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో) పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 126 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఖాతాలో 112 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానానికి పడిపోయిన భారత్ 109 రేటింగ్ పాయింట్లు కలిగి ఉంది. 106 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉండగా.. 96 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో ప్లేస్‌లో ఉంది. 87 పాయింట్లతో శ్రీలంక ఆరో స్థానంలో ఉండగా.. 83 పాయింట్లతో పాకిస్తాన్ ఏడో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (65), ఐర్లాండ్ (26), జింబాబ్వే (4), ఆఫ్ఘనిస్తాన్ (0) వరుసగా ఎనిమిది నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ 2-0 తేడాతో పాక్‌ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్ట్‌లో పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. -
ఘోర పరాభవాన్ని తప్పించుకున్న పాకిస్తాన్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఇన్నింగ్స్ పరాజయాన్ని అధిగమించింది. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలిన పాక్ ఫాలో ఆన్ ఆడుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయడంతో పాక్ లీడ్‌లోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సౌతాఫ్రికా ముందు కనీసం 250 పరుగుల లక్ష్యాన్ని అయినా ఉంచాల్సి ఉంది. అయితే పరిస్థితులు అలా కనిపించడం లేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ చేతిలో మరో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 50 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కీలక బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరారు. నాలుగో రోజు ఆటలో మూడో సెషన్ కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే రేపు (ఐదో) తొలి సెషన్ వరకు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సౌతాఫ్రికా ముందు ఫైటింగ్ టార్గెట్‌ను ఉంచగలుగుతుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా అతి భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ భారీ డబుల్ సెంచరీ (259) చేసి సౌతాఫ్రికాను కమాండింగ్ పొజిషన్లో ఉంచాడు. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) కూడా సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 17, ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, బెడింగ్హమ్ 5, మఫాకా 0, రబాడ 6 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా తలో మూడు వికెట్లు తీయగా.. మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాన్ మసూద్ 2, కమ్రాన్ గులామ్ 12, సౌద్ షకీల్ 0, సల్మాన్ అఘా 19, ఆమెర్ జమాల్ 15, ఖుర్రమ్ షెహజాద్ 14, మీర్ హమ్జా 13, మొహమ్మద్ అబ్బాస్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో పాక్ 10 మంది ఆటగాళ్లతోనే బ్యాటింగ్‌ను కొనసాగించాల్సి వచ్చింది. యువ ఓపెనర్ సైమ్ అయూబ్ సౌతాఫ్రికా బ్యాటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. సైమ్ కాలు మడతపడటంతో ఉన్నపళంగా మైదానం నుంచి వైదొలిగాడు. అతను ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. అందుకే అతను బ్యాటింగ్‌కు దిగలేదు.ఫాలో ఆన్ ఆడుతన్న పాక్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 471 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 50 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ చేశాడు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (81) రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఖుర్రమ్ షెహజాద్ (18), కమ్రాన్ గులామ్ (28), సౌద్ షకీల్ (23) కొద్ది సేపు నిలదొక్కుకున్నట్లు కనిపించినా ఆతర్వాత పెవిలియన్ బాట పట్టారు. మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆమెర్ జమాల్ (34 నాటౌట్), మీర్ హమ్జా (16 నాటౌట్) పాక్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, మార్కో జన్సెన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మఫాకా ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
అలెక్స్ హేల్స్ ఊచకోత
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు, రంగ్‌పూర్ రైడర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిల్హెట్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 6) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హేల్స్ శతక్కొట్టడంతో సిల్హెట్ స్ట్రయికర్స్పై రంగ్‌పూర్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోనీ తాలుక్దార్ (32 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జకీర్ హసన్ (38 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. జార్జ్ మున్సే 18, పాల్ స్టిర్లింగ్ 16 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో ఆరోన్ జోన్స్ (19 బంతుల్లో 38 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), జాకెర్ అలీ (5 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్లలో సైఫుద్దీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్, ఆకిఫ్ జావెద్ తలో వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్య ఛేదనకు దిగిన రంగ్‌పూర్ రైడర్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అలెక్స్ హేల్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. సైఫ్ హసన్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. రంగ్‌పూర్ రైడర్స్ బ్యాటర్లలో హకీమ్ తమీమ్ డకౌట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ 8 పరుగులు (నాటౌట్) చేశాడు. సిల్హెట్ స్ట్రయికర్స్ పేసర్ తంజిమ్ హసన్ సకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి.ఈ గెలుపుతో రంగ్‌పూర్ రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినట్లైంది. పాయింట్ల పట్టికలో రంగ్‌పూర్ రైడర్స్ అగ్రస్థానంలో నిలిచింది. రెండింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఖుల్నా టైగర్స్ రెండో స్థానంలో ఉంది. చిట్టగాంగ్ కింగ్స్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఫార్చూన్ బారిషల్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం), దర్బార్ రాజ్షాహి (3 మ్యాచ్‌ల్లో ఓ విజయం), సిల్హెట్ స్ట్రయికర్స్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), ఢాకా క్యాపిటల్స్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. -
క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టిన బాలీవుడ్ సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టాడు. క్రీడా ఔత్సాహికుడైన బచ్చన్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఇటీవలే ఐసీసీ అమోదం పొందిన ETPL ఈ ఏడాది లాంచ్ కానుంది. ఈ లీగ్‌లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఆమ్స్టర్డామ్, రోట్టర్‌డామ్, ఎడిన్బర్గ్, గ్లాస్గో నగరాలకు చెందిన ప్రాంచైజీలు బరిలో ఉంటాయి. ఈ లీగ్ జులై 15 నుంచి ఆగస్ట్ 3 మధ్యలో జరుగుతుంది. ఫ్రాంచైజీ పేర్లు, ఓనర్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.కాగా, అభిషేక్ బచ్చన్ ప్రో కబడ్డీ లీగ్ మరియు ఇండియన్ సూపర్ లీగ్‌లో (ఫుట్‌బల్) పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు లీగ్‌ల్లో బచ్చన్ ఫ్రాంచైజీలు కలిగి ఉన్నాడు. ETPLలో పెట్టుబడులు పెట్టిన సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ.. ఈ లీగ్ మూడు దేశాల (ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్) క్రికెట్ బోర్డుల సహకారంతో ముందుకు వస్తుందని అన్నాడు. ETPL ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తుందని తెలిపాడు. క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు, ఇది సరిహద్దులను అధిగమించే ఏకీకృత శక్తి అని బచ్చన్ చెప్పుకొచ్చాడు. ETPLలో అభిషేక్ చేరిక ప్రధాన పెట్టుబడులను ఆకర్శిస్తుంది. ETPL యూరోపియన్లకు క్రికెట్‌ను మరింత చేరువ చేస్తుంది.ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ క్రికెట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ క్రికెట్ లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ లీగ్ భారత్ వేదికగా జరుగుతుంది. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), బిగ్ బాష్ లీగ్(BBL) ఎక్కువ ప్రజాధరణ ఉంది. వివిధ దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్‌లు..ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్బిగ్బాష్ లీగ్ (ఆస్ట్రేలియా)కరీబియన్ ప్రీమియర్ లీగ్ (వెస్టిండీస్)గ్లోబల్ టీ20 కెనడా (కెనడా)ఇండియన్ ప్రీమియర్ లీగ్ (భారత్)ఇంటర్నేషన్ లీగ్ టీ20 (దుబాయ్)లంక ప్రీమియర్ లీగ్మేజర్ లీగ్ క్రికెట్ (యూఎస్ఏ)నేపాల్ ప్రీమియర్ లీగ్పాకిస్తాన్ సూపర్ లీగ్SA20 (సౌతాఫ్రికా)సూపర్ స్మాష్ (న్యూజిలాండ్)టీ20 బ్లాస్ట్ (ఇంగ్లండ్) -
ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఘోర అవమానం ఊహించిందే..!
సిడ్నీ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను జారవిడుచుకుంది.డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాల్సి ఉండింది. అయితే టాపార్డర్ బ్యాటర్ల ఘోర వైఫల్యం కారణంగా భారత్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.భారత్ ఆధిపత్యానికి తెరపడింది ఈ సిరీస్‌లో భారత్ వైఫల్యం ఊహించిందే. భారత్ పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం బాధాకరం. 2018-19 మరియు 2021-22లో ఆస్ట్రేలియా గడ్డ పై వరుసగా రెండు సార్లు అద్భుతమైన ప్రదర్శనలతో చాలా కాలం పాటు ఈ ట్రోఫీ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత్ క్రికెట్‌కు ఏంతో గర్వకారణం. అయితే ఇలా ఓటమి చెందడం భారత్ క్రికెట్ అభిమానులకి ఒకింత బాధాకరమే.అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3తో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతాలు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. గతంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూడటం, గత కొంత కాలంగా టెస్టుల్లో భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయి లో లేదనేది వాస్తవం. ఇది భారత్ క్రికెట్ అభిమానులు అంగీకరించక తప్పదు. ఈ నేపథ్యంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని భావించడం హాస్యాస్పదమే.భారత్ బ్యాటర్ల ఘోర వైఫల్యం క్రికెట్లోని పాత నానుడిని భారత్ అభిమానులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. " బ్యాటర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారు. బౌలర్లు సిరీస్‌లను గెలిపిస్తారు" అనేది ఈ సిరీస్ లో మరో మారు నిజమైంది. హేమాహేమీలైన భారత్ బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమవడంతో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చతికిలపడ్డారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అడపా దడపా మెరుపులు మెరిపించినా , ప్రతీసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆడతారని భావించడం సరైన పద్దతి కాదు. భారత్ టాపార్డర్ బ్యాటర్లు అదీ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఎడమ చేతి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ భాగస్వామ్యం మినహాయిస్తే, భారత్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా నిలదొక్కుకొని ఆడినట్టు కనిపించ లేదు. ఆస్ట్రేలియా వంటి ఏంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఈ రీతిలో బ్యాటింగ్ చేస్తే భారత్ జట్టు గెలుస్తుందని ఆశించడం కూడా తప్పే!బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియాఈ సిరీస్ మొత్తం పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలో సాగింది. బుమ్రా ఈ సిరీస్ లో ఒంటి చేత్తో భారత్ జట్టుని నడిపించాడు. తన అద్భుత ప్రదర్శన తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ కి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్ లో మొత్తం 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ సిరీస్ లో అధిగమించడం విశేషం. గాయంతో బుమ్రా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ముందు వైదొలగడంతో ఈ సిరీస్ ని కనీసం డ్రా చేయాలన్న భారత్ ఆశలు అడుగంటాయి. బుమ్రా లేని భారత్ బౌలింగ్ అనేకమంది హేమాహెమీలున్న ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై తక్కువ స్కోరు కి ఆలౌట్ చేస్తుందని భావించడం అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఉండదు! -
అరివీర భయంకర ఫామ్‌లో మయాంక్ అగర్వాల్.. ఐదింట నాలుగు శతకాలు
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా ఆటగాడు, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో మయాంక్ గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాదాడు. ఇందులో హ్యాట్రిక్ సెంచరీలు సహా ఓ హాఫ్ సెంచరీ ఉంది.పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. ఆతర్వాత అరుణాచల్ ప్రదేశ్‌పై 100 నాటౌట్‌గా నిలిచాడు. దీని తర్వాత హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగులు చేసిన మయాంక్ హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. అనంతరం సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీ (69) చేసిన మయాంక్.. తాజాగా నాగాలాండ్‌పై 116 నాటౌట్‌గా నిలిచాడు.విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత ఎడిషన్‌లో మయాంక్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 613 పరుగులు చేశాడు. వీహెచ్‌టీ 2024-25లో మయాంక్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో మయాంక్ 153.25 సగటున 111.66 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఇందులో 66 బౌండరీలు, 18 సిక్సర్లు ఉన్నాయి.నాగాలాండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక నాగాలాండ్‌ను 48.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్ చేసింది. శ్రేయస్ గోపాల్ 4, అభిలాశ్ షెట్టి 2, కౌశిక్, హార్దిక్ రాజ్, విద్యాధర్ పాటిల్, నికిన్ జోస్ తలో వికెట్ తీసి నాగాలాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో చేతన్ బిస్త్ (77 నాటౌట్), కెప్టెన్ జోనాథన్ (51) అర్ద సెంచరీలు సాధించారు. వీరిద్దరు మినహా నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవు.207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 37.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మయాంక్ సూపర్ సెంచరీతో అలరించగా.. అనీశ్ కేవీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. కర్ణాటక ఇన్నింగ్స్‌లో నికిన్ జోస్ 13 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. నికిన్ జోస్ వికెట్ లెమ్టూర్కు దక్కింది. ఈ గెలుపుతో కర్ణాటక గ్రూప్-సిలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో కర్ణాటక ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించింది. -
మొహమ్మద్ షమీ విధ్వంసం.. సెలెక్టర్లకు సవాల్
విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బౌలర్, బెంగాల్ ఆటగాడు మొహమ్మద్ షమీ చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షమీ.. 34 బంతుల్లో 5 బౌండరీలు, సిక్సర్ సాయంతో అజేయమైన 42 పరుగులు చేశాడు. షమీ బ్యాట్ ఝులిపించడంతో ఈ మ్యాచ్‌లో బెంగాల్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.సెలెక్టర్లకు సవాల్..తాజాగా ఇన్నింగ్స్‌తో షమీ భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. గాయం కారణంగా చాలాకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్ ఆడుతున్నాడు. షమీ ఫిట్‌గా ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు అతన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోలేదు. త్వరలో భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లు తప్పించినా.. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో భాగం కావాలని షమీ భావిస్తున్నాడు. తాజా ఇన్నింగ్స్ షమీని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తాయేమో వేచి చూడాలి.పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న కెప్టెన్ఈ మ్యాచ్‌లో బెంగాల్ కెప్టెన్ సుదీప్ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఘరామీ 125 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఘరామీతో పాటు సుదీప్ ఛటర్జీ (47), షమీ (42 నాటౌట్), కౌశిక్ మైతి (20 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. షమీ-మైతీ జోడి ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 64 పరుగులు జోడించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్యన్ పాండే, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్, సాగర్ సోలంకీ చెరో వికెట్ దక్కించుకున్నారు.270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 23 ఓవర్ల అనంతరం 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మధ్య ప్రదేశ్ ఓపెనర్లు హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి డకౌట్లయ్యారు. శుభమ్ శ్యామ్ సుందర్ శర్మ (53), కెప్టెన్ రజత్ పాటిదార్ (49) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 27 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. -
తండ్రైన టీమిండియా విధ్వంసకర ఆటగాడు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండోసారి తండ్రి అయ్యాడు. దూబే భార్య అంజుమ్ ఖాన్ నిన్న (జనవరి 3) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన విషయాన్ని దూబే ఇవాళ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశాడు. మేము 4 మంది కుటుంబంగా మారడంతో మా హృదయాలు పెద్దవిగా మారాయి. మెహ్విష్ శివమ్ దూబేకు స్వాగతం అంటూ దూబే తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by shivam dube (@dubeshivam)31 ఏళ్ల దూబేకు 2021 జులై 16న అంజుమ్ ఖాన్‌తో వివాహమైంది. వీరికి 2022 ఫిబ్రవరి 13న బాబు జన్మించాడు. బాబుకు అయ్యాన్ దూబే అని పేరు పెట్టారు.దూబే క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 80 పరుగులు చేసి ఓ వికెట్ తీసుకున్నాడు. దూబే.. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో దూబే ఐదు మ్యాచ్‌లు ఆడి 75.50 సగటున 151 పరుగులు చేశాడు. సర్వీసెస్‌పై దూబే మ్యాచ్ విన్నింగ్ నాక్ (71 నాటౌట్) ఆడాడు.వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు2019 నవంబర్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మెగా టోర్నీలో దూబే ప్రతి మ్యాచ్ ఆడాడు. ఆ టోర్నీలో దూబే ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 22.16 సగటున 133 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లో 27 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ను సాధించడం అది రెండోసారి.దూబే టీమిండియా తరఫున 33 టీ20లు ఆడి 29.86 సగటున 448 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన దూబే 11 వికెట్లు కూడా తీశాడు. టీమిండియా తరఫున నాలుగు వన్డేలు కూడా ఆడిన దూబే 43 పరుగులు చేసి ఓ వికెట్ పడగొట్టాడు. -
రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. సౌతాఫ్రికా భారీ స్కోర్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓ భారీ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ నమోదయ్యాయి. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (259) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (54 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరవగా.. కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, డేవిడ్ బెడింగ్హమ్ 5, క్వేనా మపాకా 0 పరుగులకు ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మొహమ్మద్ అబ్బాస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు క్యాచ్‌లు పట్టిన రిజ్వాన్ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) పాకిస్తాన్ వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఓ పక్క సౌతాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడినప్పటికీ రిజ్వాన్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్కీపర్ల జాబితాలో రిజ్వాన్ నాలుగో స్థానంలో నిలిచాడు.7 - వాసిం బారి vs NZ, ఆక్లాండ్, 19796 - రషీద్ లతీఫ్ vs ZIM, బులవాయో, 19986 - అద్నాన్ అక్మల్ vs NZ, వెల్లింగ్టన్, 20116 - మొహమ్మద్ రిజ్వాన్ vs SA, కేప్ టౌన్, 2025100 వికెట్ల క్లబ్లో మొహమ్మద్ అబ్బాస్ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్ 100 వికెట్ల క్లబ్లో చేరాడు. క్వేనా మపాకా వికెట్ అబ్బాస్‌కు టెస్ట్‌ల్లో 100వది.తొలి ఓవర్లోనే పాక్‌కు షాక్సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి ఆలౌటైన అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్‌కు భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ షాన్ మసూద్ (2) ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో బెడింగ్హమ్కు క్యాచ్ ఇచ్చి మసూద్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సిన సైమ్ అయూబ్ గాయపడటంతో అతని స్థానంలో బాబర్ ఆజమ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో సైమ్ అయూబ్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. 3.4 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 10/1గా ఉంది. బాబర్ ఆజమ్ (2), కమ్రాన్ గులామ్ (4) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 605 పరుగులు వెనుకపడి ఉంది. -
ఇదెక్కడి రనౌట్ రా సామీ.. క్రికెట్ చరిత్రలో వింత ఘటన
పాకిస్తాన్ దేశవాలీ క్రికెట్లో ఓ వింత రనౌట్ చేసుకుంది. కైడ్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో సియాల్కోట్ బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. బౌలర్ రిటర్న్ త్రోను తప్పించుకోబోయి మొహమ్మద్ వాలీద్ గాల్లోకి ఎగరగా.. అదే సమయంలో బంతి వికెట్లను తాకింది. దీంతో వాలీద్ రనౌటయ్యాడు. ఈ వింత రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.A STRANGE RUN-OUT IN PAKISTAN DOMESTIC CRICKET. 🤯 pic.twitter.com/dCCV6e9DhO— Johns. (@CricCrazyJohns) January 4, 2025పూర్తి వివరాల్లో వెళితే.. పెషావర్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ ఖాన్ సంధించిన బంతిని మొహమ్మద్ వాలీద్ డిఫెండ్ చేసుకున్నాడు. ఆ బంతి నేరుగా బౌలర్ ఆమిర్ ఖాన్ చేతుల్లోకి వెళ్లింది. బ్యాటర్ ముందుకు రావడం చూసిన ఆమిర్ ఖాన్ బంతిని వికెట్లపైకి విసిరాడు. అప్పటికే క్రీజ్‌లో ఉన్న వాలీద్ బంతి నుంచి తప్పించుకోబోయి పైకి జంప్ చేశాడు. వాలీద్ గాల్లో ఉండగానే బంతి వికెట్లను తాకింది. దీంతో పెషావర్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అప్పీల్ రీజనబుల్‌గా ఉండటంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశాడు. పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ బ్యాటర్ వాలీద్‌ను రనౌట్‌గా ప్రకటించాడు. వాలీద్ గాల్లో ఉన్నప్పుడు బంతి వికెట్లను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనపడింది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి విచిత్ర రనౌట్లు చోటు చేసుకోవడం చాలా అరుదు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఇదెక్కడి రనౌట్ రా సామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాక్ జాతీయ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాక్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు తేలిపోవడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా బ్యాటర్లు మూడంకెల స్కోర్ చేశారు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. టెంబా బవుమా (106), కైల్ వెర్రిన్ (100) సెంచరీ అనంతరం ఔట్ కాగా.. డబుల్ సెంచరీ చేసిన ర్యాన్ రికెల్టన్ (233 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. 123 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోర్ 477/6గా ఉంది. రికెల్టన్కు జతగా జన్సెన్ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. -
టీజీఎస్పీలో బాక్సింగ్, క్రికెట్ కోచింగ్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగం (టీజీఎస్పీ)లో అత్యుత్తమ శిక్షణ ఇచ్చే బాక్సింగ్, క్రికెట్ కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తున్నట్లు డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్పీ బెటాలియన్లలో శుక్రవారం జరిగాయి. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ మొదటి బెటాలియన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి జితేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్, క్రికెట్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌లను టీజీఎస్పీ డీఎస్పీలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. వారి ఆధ్వర్యంలో పోలీసులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు టీజీఎస్పీ విభాగంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ నిరోధంలోనూ టీజీఎస్పీ సేవలు టీజీఎస్పీ సిబ్బందికి శాంతి భద్రతల పరిరక్షణలోనూ, ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేవలు అందించటంలోనూ మంచి పేరుందని డీజీపీ ప్రశంసించారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న టీజీఎస్పీ సిబ్బందిని మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల నియంత్రణకు వాడుకొంటామని తెలిపారు. జిఆర్పీ, సీఐడీ విభాగాలలోను వీరి సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,077 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చామని, యూసఫ్‌గూడ బెటాలియన్‌లో 548 మందికి శిక్షణ పూర్తయిందని వెల్లడించారు. పోలీస్ విభాగంలో చేరుతున్న యువ సిబ్బంది తల్లిదండ్రులు గర్వపడేలా, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చేలా పని చేయాలని సూచించారు. టీజీఎస్పీ అదనరు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తిచేసుకున్న 4,077 కానిస్టేబుళ్లలో 2,746 గ్రాడ్యుయేట్లు, 596 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 62 మంది ఎక్స్ సరీ్వస్‌మెన్లు ఉన్నారని తెలిపారు. కమాండెంట్ మురళీకృష్ణ, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
శతక్కొట్టిన బవుమా
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా సెంచరీతో కదంతొక్కాడు. బవుమా 166 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో బవుమాకు ఇది నాలుగో శతకం. సెంచరీ అనంతరం బవుమా (106) ఔటయ్యాడు. మరో ఎండ్‌లో ర్యాన్ రికెల్టన్ (219 బంతుల్లో 172; 21 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. 76.4 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 307/4గా ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ (17), వియాన్ ముల్దర్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (0), బవుమా ఔట్ కాగా.. రికెల్టన్, డేవిడ్ బెడింగ్హమ్ క్రీజ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా 2, ఖుర్రమ్ షెహజాద్, మొహమ్మద్ అబ్బాస్ తలో వికెట్ పడగొట్టారు.రికార్డు భాగస్వామ్యంఈ మ్యాచ్‌లో టెంబా బవుమా, ర్యాన్ రికెల్టన్ నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. సౌతాఫ్రికా తరఫున నాలుగో వికెట్ ఇదే అత్యధిక భాగస్వామ్యం. సౌతాఫ్రికా తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని గ్రేమ్ స్మిత్, హెర్షల్ గిబ్స్ నమోదు చేశారు. 2002-03 కేప్‌టౌన్ టెస్ట్‌లో గిబ్స్-స్మిత్ జోడీ తొలి వికెట్‌కు 368 పరుగులు జోడించారు.భీకర ఫామ్‌లో బవుమాఇటీవలి కాలంలో బవుమా భీకర ఫామ్‌లో ఉన్నాడు. బవుమా గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.ఫైనల్ల్లో సౌతాఫ్రికాదక్షిణాఫ్రికా జట్టు ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. 2023-25 ఎడిషన్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టు సౌతాఫ్రికానే. తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌పై విజయం అనంతరం సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ పోటీపడుతున్నాయి.కాగా, పాక్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కమ్రాన్ గులామ్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్ పీటర్సన్ 5, కార్బిన్ బాష్ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (89), కార్బిన్ బాష్ (81 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్ 6 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తడబడింది. మార్క్రమ్ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. -
జింబాబ్వేకు ఆధిక్యం
బులవాయో వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో జింబాబ్వేకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 86 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ ఎర్విన్ (75) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సికందర్ రజా (61), సీన్ విలియమ్స్ (49) రాణించారు. జింబాబ్వే జట్టులో జాయ్‌లార్డ్ గుంబీ 8, బెన్ కర్రన్ 15, కైటానో 0, డియాన్ మైయర్స్ 5, బ్రియాన్ బెన్నెట్ 2, న్యూమ్యాన్ న్యామ్హురి 11, రిచర్డ్ నగరవ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అహ్మద్జాయ్ మూడు, ఫరీద్ అహ్మద్ రెండు, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. అబ్దుల్ మాలిక్ 1, రియాన్ హసన్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. రహ్మత్ షా (6), హస్మతుల్లా షాహిది (0) క్రీజ్‌లో ఉన్నారు. బ్లెస్సింగ్ ముజరబాని రెండు వికెట్లు తీశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 67 పరుగులు వెనుకపడి ఉంది. రెండో రోజు ఆట కొనసాగుతుంది.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్ మాలిక్ 17, రియాజ్ హసన్ 12, రహ్మద్ షా 19, షాహిది 13, జజాయ్ 16, షహీదుల్లా 12, ఇస్మత్ అలామ్ 0, అహ్మద్ జాయ్ 2, జియా ఉర్ రెహ్మాన్ 8 (నాటౌట్), ఫరీద్ అహ్మద్ 17 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమ్యాన్ న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబాని రెండు, నగరవ ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
సూపర్ సెంచరీతో సత్తా చాటిన రికెల్టన్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (Ryan Rickelton) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రికెల్టన్ 134 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సల్మాన్ అఘా బౌలింగ్‌లో బౌండరీ బాది రికెల్టన్ సెంచరీ మార్కును అందుకున్నాడు. టెస్ట్‌ల్లో రికెల్టన్కు ఇది రెండో సెంచరీ. మరోవైపు కెప్టెన్ టెంబా బవుమా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బవుమా 82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ విరామం సమయానికి రికెల్టన్ (106), బవుమా (51) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహజాద్, సల్మాన్ అఘా తలో వికెట్ పడగొట్టారు.కాగా, పాక్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కమ్రాన్ గులామ్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్ పీటర్సన్ 5, కార్బిన్ బాష్ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (89), కార్బిన్ బాష్ (81 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్ 6 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడింది. మార్క్రమ్ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. -
తీరు మార్చుకోని కోహ్లికి రిటైర్మెంట్ తప్పదా..?
భారత్ బ్యాటర్లు తమ తప్పిదాల నుంచి పాఠం నేర్చుకుంటున్నట్టు లేదు. అదే పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్ల అనాధిపత్యానికి తలొగ్గుతున్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన చివరి టెస్ట్ లోనూ భారత్ బ్యాటర్లు మరోసారి చతికిలబడి మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటయ్యారు. పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి వైదొలగి విశ్రాంతి తీసుకోగా మిగిలిన బ్యాటర్లు అదే తరహాలో బాధ్యతారహితంగా ఆడి తొలి రోజు నే తమ ప్రత్యర్థులకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు.రోహిత్ శర్మ వైదొలిగినా భారత్ బ్యాటర్ల ఆటతీరుతో ఎలాంటి మార్పు రాలేదు. పిచ్‌ని అర్థం చేసుకొని నిలదొక్కుకొని ఆడేందుకు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇందుకు మాజీ కెప్టెన్, జట్టులోని సీనియర్ బాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఎలాంటి మినహాయింపు లేదు. మ్యాచ్ కి ముందు చెమటోడ్చి ప్రాక్టీస్ చేసే కోహ్లీ, బ్యాటింగ్ దిగిన వెంటనే తన పాత పంధా నే అనుసరిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ప్రతిసారి అతను ఒకే తరహాలో ఔట్ కావడం నమ్మశక్యంగాని చేదు నిజం.ఎంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ కూడా తన బ్యాటింగ్ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ అవుటైన తీరు చూస్తే టెస్ట్ క్రికెట్ లో ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల శకం ముగిసినట్లే అనిపిస్తోంది. ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ పది పరుగులు మాత్రం చేసి వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినట్టు కనబడలేదు.కోహ్లీ మొదటి బంతికే వెనుదిరగాల్సింది. పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ పట్టుకొనే ప్రయత్నం లో విఫలమై గాల్లో విసిరివేయగా దానిని మార్నస్ లబుషేన్ పట్టుకున్నప్పటికీ మూడో అంపైర్ జోయెల్ విల్సన్ బంతి నేలను తాకినట్లు తేల్చాడు. ప్రారంభంలోనే ఈ అవకాశం లభించినా కోహ్లీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.69 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసిన అనంతరం బోలాండ్ బౌలింగ్ లోనే ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళ్తున్న బంతిని బాధ్యతారహితమైన షాట్ కొట్టబోయి మరో సారి స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 36 ఏళ్ళ కోహ్లీ ఈ తరహా లో ఔటవ్వడం ఇది ఆరోసారి. కోహ్లీ ఔటైన అనంతరం మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రిటైర్ అవ్వడమే మేలని విమర్శకులు దుమ్మెత్తిపోశారు.రోహిత్ స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ ప్రారంభం లో బాగానే బ్యాటింగ్ చేసాడు. అయితే లంచ్‌కి ముందు చివరి బంతికి స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ లో స్లిప్ల్స్ లో 20 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ సిరీస్ లో గిల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు 20 పరుగులకి చేరుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా 31 స్కోర్ ని దాటలేదు.వికెట్ కీపర్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ కి చేరుకోగలిగింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజా ని కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత్ ని ఈ టెస్ట్‌లో గట్టికించే బాధ్యత మరో సారి బుమ్రా భుజస్కందాలపై ఉంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాటర్
సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. షెల్డన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇవాళ (జనవరి 3) ప్రకటించాడు. సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జాక్సన్ మూడు ఫార్మాట్లలో (ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ,టీ20) కలిపి 11,791 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నాయి. 38 ఏళ్ల జాక్సన్ ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో తన చివరి మ్యాచ్ ఆడాడు. జాక్సన్ తన చివరి మ్యాచ్‌లో (పంజాబ్) 10 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేశాడు. జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.జాక్సన్ లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) 84 ఇన్నింగ్స్‌ల్లో 36.25 సగటున 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జాక్సన్‌కు టీ20 ఫార్మాట్లో కూడా మంచి రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లో జాక్సన్ 80 మ్యాచ్‌లు ఆడి 1812 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.జాక్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో జాక్సన్ ఆర్సీబీ, కేకేఆర్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. జాక్సన్‌కు ఆర్సీబీ తరఫున ఆడే అవకాశం రానప్పటికీ 2017-2022 మధ్యలో కేకేఆర్‌కు తొమ్మిది మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2022 విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో మహారాష్ట్రపై చేసిన సెంచరీ (136 బంతుల్లో 133 పరుగులు) జాక్సన్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. నాటి మ్యాచ్‌లో సౌరాష్ట్ర విజేతగా నిలిచి విజయ్ హజారే ట్రోఫీని సొంతం చేసుకుంది.జాక్సన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాక్సన్ ఇటీవలే వందో మ్యాచ్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాక్సన్ 103 మ్యాచ్‌లు ఆడి 46.36 సగటున 7187 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జాక్సన్ వికెట్‌కీపింగ్‌లో 75 క్యాచ్‌లు పట్టి, రెండు స్టంపౌట్లు చేశాడు. జాక్సన్‌కు టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు. -
Viral Video: మ్యాక్స్‌వెల్ అద్భుత విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్
బిగ్‌బాష్ లీగ్ 2024-25లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతమైన విన్యాసం చేశాడు. బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (జనవరి 1) జరుగుతున్న మ్యాచ్‌లో మ్యాక్సీ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌ను క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్‌ను చూసి అభిమానులు ఔరా అంటున్నారు.GLENN MAXWELL!CATCH OF THE SEASON. #BBL14 pic.twitter.com/3qB9RaxHNb— KFC Big Bash League (@BBL) January 1, 2025పూర్తి వివరాల్లోకి వెళితే.. మెల్బోర్న్ స్టార్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మ్యాక్స్ బ్రయాంట్ (77 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో బ్రయాంట్‌తో పాటు పాల్ వాల్టర్ (21), టామ్ బాంటన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మెల్బోర్న్ బౌలర్లలో స్టీకిటీ రెండు వికెట్లు పడగొట్టగా.. జోయల్ పారిస్, పీటర్ సిడిల్, ఉసామా మిర్, డాన్ లారెన్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.ఇన్నింగ్స్ 17వ ఓవర్‌ను డాన్ లారెన్స్ బౌల్ చేశాడు. తొలి బంతిని ఎదుర్కొన్న విల్ ప్రెస్ట్‌విడ్జ్ భారీ షాట్ ఆడాడు. ప్రెస్ట్‌విడ్జ్ ఈ షాట్ ఆడిన విధానం చూస్తే సిక్సర్ తప్పదని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాక్స్‌వెల్ మ్యాజిక్ చేశాడు. సెకెన్ల వ్యవధిలో సిక్సర్ వెళ్తున్న బంతిని అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. బౌండరీ లైన్ వద్ద మ్యాక్స్‌వెల్ చేసిన ఈ విన్యాసం చూసి ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. సిక్సర్‌కు వెళ్తున్న బంతిని మ్యాక్సీ గాల్లోకి ఎగిరి లోపలికి తోశాడు. ఆతర్వాత క్షణాల్లో బౌండరీ లోపలికి వచ్చి క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్ మాటల్లో వర్ణించలేనిది. కాగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఈ క్యాచ్‌తో పాటు మరో మూడు క్యాచ్‌లు పట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డాన్ లారెన్స్, మార్కస్ స్టోయినిస్ (62) తమ జట్టును గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు. మరో నాలుగు పరుగులు చేస్తే మెల్బోర్న్ విజయం సాధిస్తుందనగా బార్ట్లెట్ విజృంభించాడు. వరుస బంతుల్లో స్టోయినిస్, మ్యాక్స్‌వెల్‌లను (0) ఔట్ చేశాడు. మొత్తానికి లారెన్స్ (64 నాటౌట్) బాధ్యతగా ఆడి మెల్బోర్న్ను విజయతీరాలకు చేర్చాడు. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ డకౌట్ కాగా.. థామస్ రోజర్స్ 6, సామ్ హార్పర్ 8 పరుగులు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో బార్ట్లెట్ నాలుగు, స్పెన్సర్ జాన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా 907 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రాకు ముందు అత్యధిక రేటింగ్ పాయింట్లు కలిగిన భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. యాష్ 2016లో 904 రేటింగ్ పాయింట్లు సాధించాడు. తాజాగా బుమ్రా అశ్విన్ రికార్డును బద్దలు కొట్టి భారత్ తరఫున ఆల్‌టైమ్ గ్రేట్ రికార్డును నెలకొల్పాడు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ సీమర్లు సిడ్నీ బార్న్స్ (932), జార్జ్ లోమన్ (931), పాక్ మాజీ పేసర్ ఇమ్రాన్ ఖాన్ (922), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (920) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. తాజాగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ డెరిక్ అండర్వుడ్తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాతి స్థానంలో జోష్ హాజిల్‌వుడ్ (843) ఉన్నాడు. బుమ్రాకు హాజిల్‌వుడ్‌కు మధ్య 64 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. బుమ్రా, హాజిల్‌వుడ్ తర్వాతి స్థానాల్లో కమిన్స్ (837), రబాడ (832), మార్కో జన్సెన్ (803), మ్యాట్ హెన్రీ (782), నాథన్ లియోన్ (772), ప్రభాత్ జయసూర్య (768), నౌమన్ అలీ (751), రవీంద్ర జడేజా (750) ఉన్నారు.బ్యాటింగ్‌లో విరాట్ టాప్ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లి చలామణి అవుతున్నాడు. విరాట్ కోహ్లి 2018లో 937 రేటింగ్ పాయింట్లు సాధించాడు. భారత్ తరఫున ఏ ఇతర బ్యాటర్ ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించలేదు.నాలుగో స్థానానికి ఎగబాకిన జైస్వాల్ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో రెండు భారీ అర్ద సెంచరీలు చేసిన జైస్వాల్ తన రేటింగ్ పాయింట్లను 854 పాయింట్లకు పెంచుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (895) నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. హ్యారీ బ్రూక్ (876), కేన్ విలియమ్సన్ (867), జైస్వాల్, ట్రవిస్ హెడ్ (780) టాప్-5 టెస్ట్ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. జైస్వాల్ టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకునేందుకు మరో 41 పాయింట్ల దూరంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున జైస్వాల్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. భారత స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్ 12, శుభ్‌మన్ గిల్ 20, విరాట్ కోహ్లి 24, రోహిత్ శర్మ 40 స్థానాల్లో నిలిచారు. -
కరుణ్ నాయర్ 430 నాటౌట్
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో విదర్భ కెప్టెన్, టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్ (టెస్ట్‌ల్లో) కరుణ్ నాయర్ (Karun Nair) అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు సెంచరీల సాయంతో 430 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కరుణ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఔట్ కాకపోవడం విశేషం. ప్రస్తుతం కరుణ్ విజయ్ హజారే ట్రోఫీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే ఈ టోర్నీలో అత్యధిక బౌండరీలు (56) బాదిన ఘనత కూడా కరుణ్‌కే దక్కుతుంది. కరుణ్ ఈ సీజన్లో విదర్భను ప్రతి మ్యాచ్‌లో (4) గెలిపించాడు. విదర్భ ఈ సీజన్లో ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచి గ్రూప్-డి టాపర్‌గా కొనసాగుతుంది.ఈ సీజన్లో కరుణ్ నాయర్ స్కోర్లు.. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో కరుణ్ 108 బంతుల్లో 17 బౌండరీల సాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విదర్భను విజయతీరాలకు చేర్చిన కరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.చత్తీస్‌ఘడ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కరుణ్ 52 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విదర్భ 8 వికెట్ల తేడాతో చత్తీస్‌ఘడ్‌ను చిత్తు చేసింది.చండీఘడ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కరుణ్ 107 బంతుల్లో 20 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 163 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విదర్భను విజయతీరలకు చేర్చిన కరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.ఇవాళ (డిసెంబర్ 31) తమిళనాడుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో కరుణ్ మరోసారి శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 103 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 111 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ సీజన్లో కరుణ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు కూడా గెలుచుకున్నాడు.తమిళనాడు-విదర్భ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు.. దర్శన్ నల్కండే (6/55) విజృంభించడంతో 48.4 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే 2, యశ్ ఠాకూర్, భూటే తలో వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో తుషార్ రహేజా (75) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మొహమ్మద్ అలీ (48), ఆండ్రే సిద్దార్థ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన విదర్భ.. కరుణ్ శతక్కొట్టడంతో 43.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్ షోరే 31, యశ్ రాథోడ్ 14, యశ్ కడెం 31, జితేశ్ శర్మ 23, శుభమ్ దూబే 39 (నాటౌట్) పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సాయికిషోర్ 2, వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ తలో వికెట్ పడగొట్టారు. -
శార్దూల్ ఠాకూర్ ఊచకోత.. 28 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో..!
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) విశ్వరూపం ప్రదర్శించాడు. నాగాలాండ్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరుగుతున్న మ్యాచ్‌లో శార్దూల్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 28 బంతుల్లో రెండు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.సిక్సర్ల సునామీ సృష్టించిన శార్దూల్ 260.71 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. శార్దూల్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై అతి భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 403 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది.ఆయుశ్ మాత్రే రికార్డు శతకంఈ మ్యాచ్‌లో ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్.భారీ భాగస్వామ్యంఈ మ్యాచ్‌లో మాత్రే.. అంగ్‌క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్‌కు 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం మాత్రే.. సిద్దేశ్ లాడ్‌తో కలిసి మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. డబుల్ సెంచరీకి చేరువైన మాత్రే మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.మాత్రే, శార్దూల్ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవుముంబై ఇన్నింగ్స్‌లో మాత్రే, శార్దూల్ ఠాకూర్ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవు. బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన నాగాలాండ్404 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఏదో అద్భుతం జరిగేతే తప్ప ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ గెలవలేదు. 36.4 ఓవర్ల అనంతరం నాగాలాండ్ స్కోర్ 115/6గా ఉంది. జగదీష సుచిత (46), లెమ్టూర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ రుపేరో (53) అర్ద సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో నాగలాండ్ గెలవాలంటే 80 బంతుల్లో 289 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.బంతితోనూ రాణించిన శార్దూల్బ్యాట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్ ఈ మ్యాచ్‌లో బంతితోనూ రాణించాడు. బౌలింగ్ అటాక్‌ను మొదలుపెట్టిన శార్దూల్ నాలుగు ఓవర్లలో 12 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఓవర్ ఉంది.స్టార్లకు విశ్రాంతిఈ మ్యాచ్‌లో ముంబై యాజమాన్యం స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు బద్దలు
ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ భారీ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో 150 ప్లస్ చేసిన ఆటగాళ్లుఆయుశ్ మాత్రే 17 ఏళ్ల 168 రోజులుయశస్వి జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజులురాబిన్ ఉతప్ప 19 ఏళ్ల 63 రోజులుటామ్ ప్రెస్ట్ 19 ఏళ్ల 136 రోజులుమాత్రే ఇన్నింగ్స్ విషయానికొస్తే.. నాగాలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో మాత్రే.. అంగ్‌క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ (28 బంతుల్లో 73 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడటంతో ముంబై భారీ స్కోర్ చేసింది. శార్దూల్ సిక్సర్ల సునామీ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 42 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. బ్యాట్‌తో మెరిసిన శార్దూల్ ఠాకూర్ (4-1-12-2) బంతితోనూ సత్తా చాటాడు. రాయ్స్టన్ డయాస్ రెండు, సుయాన్ష్ షేడ్గే ఓ వికెట్ దక్కించుకున్నారు. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో డేగా నిశ్చల్ (5), హేమ్ చెత్రి (2), యుగంధర్ సింగ్ (0), కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ (0), చేతన్ బిస్త్ (0) ఔట్ కాగా.. రుపేరో (22), జే సుచిత్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ గెలవాలంటే 36 ఓవర్లలో 362 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు, టీమిండియా స్టార్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ముంబై మేనేజ్మెంట్ పై ముగ్గురికి విశ్రాంతినిచ్చింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే..!
మెల్బోర్న్ టెస్ట్‌లో ఓటమితో 2024 సంవత్సరాన్ని ముగించిన టీమిండియా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్ట్‌తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభిస్తుంది. సిడ్నీ టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు సాగనుంది. అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తుంది.ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్‌లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి.మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 జరుగుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది జూన్ 20న మొదలవుతుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ఇలా ఉండనుంది.జూన్ 20-24: తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6: రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14: మూడో టెస్ట్ (లండన్, లార్డ్స్)జులై 23-27: నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4: ఐదో టెస్ట్ (లండన్, కెన్నింగ్స్టన్ ఓవల్)షెడ్యూల్ ప్రకారం టీమిండియా వచ్చే ఏడాది బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో కూడా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.2025లో టీమిండియా ఆడే వన్డేలుఇంగ్లండ్తో 3ఛాంపియన్స్ ట్రోఫీలో 5బంగ్లాదేశ్‌తో 3 (బంగ్లాదేశ్‌తో)ఆస్ట్రేలియాతో 3 (ఆస్ట్రేలియాలో)సౌతాఫ్రికాతో 3 (భారత్‌లో)వచ్చే ఏడాది టీమిండియా ఆడే టెస్ట్లుఆస్ట్రేలియాతో ఒకటి (బీజీటీ)క్వాలిఫై అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ఇంగ్లండ్తో 5 (ఇంగ్లండ్‌లో)వెస్టిండీస్‌తో 2 (భారత్‌లో)సౌతాఫ్రికాతో 2 (భారత్‌లో) -
నిప్పులు చెరిగిన డఫీ.. లంకను చిత్తు చేసిన కివీస్.. సిరీస్ కైవసం
మౌంట్ మాంగనూయ్ వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ సిరీస్‌ను కివీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇవాళ (డిసెంబర్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టిమ్ రాబిన్సన్ (41), మార్క్ చాప్మన్ (42), మిచెల్ హే (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 23, డారిల్ మిచెల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో మిచెల్ హే (Mitchell Hay) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మతీశ పతిరణ తలో వికెట్ దక్కించుకున్నారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. జేకబ్ డఫీ (Jacob Duffy) (4-0-15-4) నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ తలో రెండు.. మైఖేల్ బ్రేస్‌వెల్, జకరీ ఫోల్క్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పథుమ్ నిస్సంక (37), చరిత్ అసలంక (20), కుసాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కమిందు మెండిస్ (7), అవిష్క ఫెర్నాండో (5), వనిందు హసరంగ (1), మహీశ్ తీక్షణ (0), బినుర ఫెర్నాండో (3), మతీశ పతిరణ (0) విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 నెల్సన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 2న జరుగనుంది.తొలి మ్యాచ్‌లోనూ ఇబ్బంది పెట్టిన డఫీన్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ తలో టీ20లోనూ లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ మ్యాచ్‌లో డఫీ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. తద్వారా ఛేదనలో శ్రీలంక ఇబ్బంది పడి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (62), మైఖేల్ బ్రేస్‌వెల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ, బినుర తలో రెండు వికెట్లు తీయగా.. పతిరణ ఓ వికెట్ దక్కించుకున్నాడు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు నిస్సంక (90), కుసాల్ మెండిస్ (46) రాణించడంతో ఓ దశలో గెలుపు దిశగా సాగింది. అయితే డఫీ సహా కివీస్ పేసర్లు మ్యాట్ హెన్రీ (2/28), జకరీ ఫోల్క్స్ (2/41) ఒక్కసారిగా విజృంభించడంతో శ్రీలంక ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. -
పరుగుల వీరుడు మనోడే
ఒంగోలు: కాకి నితీష్‌కుమార్‌రెడ్డి.. నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్లో ఎనలేని క్రేజ్ నింపేశాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్‌లో అతను ఆడిన అద్భుత ఇన్నింగ్స్ భారత క్రికెట్ ప్రేమికులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ యువ ఆటగాడి స్వస్థలం విశాఖ అయినా అతని తల్లి స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole) నగర శివారులోని చెరువుకొమ్ముపాలెం కావడంతో అతనికి జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది.చిన్నతనం నుంచి క్రికెట్ అంటేనే క్రేజ్:అందరు చదువుతూ ఆడతామంటారు. కానీ నితీష్‌కుమార్‌రెడ్డి (Nitish Kumar Reddy) మాత్రం ఆడుతూ చదువుకుందామంటారు. చిన్నతనం నుంచి క్రికెట్ (Cricket) అంటే ఎంతో మక్కువ ఉన్న నితీష్ కఠోర సాధనతో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గానే కాకుండా మీడియం పేసర్‌గా కూడా రాణిస్తూ నేడు అంతర్జాతీయ క్రికెట్‌కు మరో అద్భుత వరంగా మారాడు.ఒంగోలుతో అనుబంధం ఇలా..చెరువుకొమ్ముపాలేనికి చెందిన పూసపాటి నరశింహారెడ్డి, సుశీలకు ఇద్దరు సంతానం. ఒకరు మానస (నితీష్ రెడ్డి తల్లి). మరొకరు సురేంద్రరెడ్డి (ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం). మానస, ముత్యాలరెడ్డిలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె తేజస్వి ఆస్ట్రేలియాలో మెడిసిన్ చేస్తున్నారు. ఇక రెండో సంతానమే నితీష్‌రెడ్డి. ఒక వైపు విద్యను అభ్యసిస్తూనే మరో వైపు క్రికెట్లో దూసుకెళుతున్నాడు. ఐదో ఏటనే ప్లాస్టిక్ బ్యాట్‌తో క్రికెట్ ఆటలో అరంగేట్రం చేసిన నితీష్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి నేడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. 2017–18లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో నాగాలాండ్ జట్టుపై 441 బంతుల్లో 345 పరుగులు చేసి క్రికెట్ అభిమానుల మనస్సును దోచుకున్నాడు. దీంతో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అవకాశాన్ని కై వసం చేసుకున్నాడు. పంజాబ్‌పై అద్భుతంగా 64 పరుగులు (ఒకే ఒక్క పరుగుతో గెలుపు), రాజస్థాన్‌పై 76 పరుగులు చేసి సన్‌రైజర్స్ జట్టు గెలుపులో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఒంగోలులోని శర్మా కాలేజీ గ్రౌండులో సైతం 2018, 2019లో రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల అమ్మమ్మ సుశీల పరమపదించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నితీష్‌రెడ్డి చెరువుకొమ్ముపాలేనికి వచ్చారని గ్రామస్తులు తెలిపారు.సంతోషంగా ఉందినితీష్రెడ్డికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటేనే ప్రేమ. అనేక మార్లు గ్రామానికి తల్లితో పాటు వచ్చి వెళుతుండేవాడు. విద్యాభ్యాసం ఇక్కడ చేయకున్నా ఇక్కడ ఉన్న కుర్రాళ్లతో మాత్రం పరిచయాలు మెండుగానే ఉన్నాయి. ఇన్నాళ్లకు అంతర్జాతీయంగా క్రికెట్లో రాణించాడని తెలియడంతో గ్రామంలో చాలామంది నా మనవడి గురించి గొప్పగా మాట్లాడుతుంటే చెందే అనుభూతిని వర్ణించలేం. ఇంకా ఉన్నత స్థాయికి చేరాలనేదే మా ఆకాంక్ష. – పూసపాటి నరశింహారెడ్డి, నితీష్‌రెడ్డి తాతయ్యస్నేహితుడిగా ఆనందంగా ఉందినాది చెరువుకొమ్ముపాలెమే. నితీష్‌రెడ్డి మేనమామ సురేంద్రరెడ్డి నాకు క్లాస్మేట్. దీంతో అమ్మమ్మ గారింటికి వచ్చినపుడల్లా నాకు నితీష్రెడ్డితో పరిచయం ఉండేది. మాతో ఎక్కువగా క్రికెట్ ప్రాక్టీస్ గురించే మాట్లాడేవాడు. ఒంగోలులో రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చిన సమయంలోను నాతో మాట్లాడాడు. స్నేహితులను గుర్తుపెట్టుకుని పలకరిస్తాడు. చాలామంది యువ క్రికెటర్లలో ఎనలేని క్రేజ్‌ను నితీష్ రెడ్డి సంపాదించుకోవడం ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది జూన్‌లో మళ్లీ చెరువుకొమ్ముపాలేనికి నితీష్‌రెడ్డి వస్తారని సమాచారం. ఆ రోజు గ్రామంలో ఘనంగా సత్కారం చేయాలని భావిస్తున్నాం.– ఆల నారాయణ, నితీష్‌రెడ్డి చిన్ననాటి స్నేహితుడు -
IND VS AUS 4th Test: నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియా ముందు భారీ లక్ష్యంమెల్బోర్న్ టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాథన్ లయోన్ (41), స్కాట్ బోలాండ్ (10) చివరి వికెట్‌కు 50కు పైగా పరుగులు (100కు పైగా బంతులు ఎదుర్కొని) జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. స్టార్క్ రనౌట్ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్148 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న లబూషేన్‌ను (70) సిరాజ్ సూపర్ డెలివరీతో ఎల్బీడబ్ల్యూ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 253 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. గాడిలో పడుతున్న ఆస్ట్రేలియాలంచ్ తర్వాత వడివడిగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీ విరామానికి ముందు కాస్త కుదుటపడింది. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆ ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. టీ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 135/6గా ఉంది. లబూషేన్ (65).. కమిన్స్‌తో (21) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్91 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన బంతితో అలెక్స్ క్యారీని (2) క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 196 పరుగుల లీడ్‌లో ఉంది. బుమ్రా ఆన్ ఫైర్.. 85 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. తొలుత డేంజర్ మ్యాన్ ట్రవిస్ హెడ్‌ను (1) పెవిలియన్‌కు పంపిన బుమ్రా అదే ఓవర్ చివరి బంతికి మిచెల్ మార్ష్‌ను (0) ఔట్ చేశాడు. మొత్తంగా ఆసీస్ 10 బంతుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. జోరు మీదున్న బుమ్రా, సిరాజ్.. కష్టాల్లో ఆసీస్భారత పేసర్లు బుమ్రా, సిరాజ్ జోరు మీదున్నారు. వీరి ధాటికి ఆసీస్ ఆరు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్‌ను (13) సిరాజ్.. డేంజర్ మ్యాన్ ట్రవిస్ హెడ్‌ను (1) బుమ్రా పెవిలియన్‌కు పంపారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 85/4గా ఉంది. లబూషేన్ (39), మిచెల్ మార్ష్ క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 190 పరుగుల ఆధిక్యంలో ఉంది.లంచ్ బ్రేక్.. 158 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియారోజు లంచ్ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 53/2గా ఉంది. 105 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని ప్రస్తుతం ఆసీస్ 158 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబూషేన్ (20), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు.43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను 369 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కొన్‌స్టాస్‌ను బుమ్రా.. ఖ్వాజాను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. లబూషేన్ (16), స్టీవ్ స్మిత్ క్రీజ్‌లో ఉన్నారు.భారత్ 369 ఆలౌట్358/9 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 11 పరుగులు జోడించి 369 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డి (114) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. -
IND Vs AUS 4th Test: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్
IND VS AUS 4th Test Day 3 Live Updates And Highlights:మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట ముందుగానే ముగిసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 358/9గా ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి (105), సిరాజ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ గడ్డపై సత్తా చాటిన తెలుగోడు.. నితీశ్ సూపర్ సెంచరీఆసీస్ గడ్డపై తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో నితీశ్ సూపర్ సెంచరీ చేశాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు బరిలోకి దిగిన నితీశ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. బోలాండ్ బౌలింగ్‌లో బౌండరీ బాది నితీశ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11వ నంబర్ ఆటగాడు సిరాజ్ సహకారంతో నితీశ్ సెంచరీ పూర్తి చేశాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్.. బుమ్రా డకౌట్ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సుందర్ ఔట్348 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నాథన్ లయోన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి సుందర్ పెవిలియన్ బాట పట్టాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్.. సెంచరీకి చేరువగా నితీశ్లయోన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుందర్ 146 బంతుల్లో సింగిల్ బౌండరీతో హాఫ్ సెంచరీ మార్కు తాకాడు. మరో ఎండ్‌లో నితీశ్‌కుమార్ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం నితీశ్ స్కోర్ 94 నాటౌట్‌గా ఉంది. భారత్ స్కోర్ 345/7. నితీశ్, సుందర్ ఇద్దరూ క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది. తిరిగి ప్రారంభమైన ఆట10:30- వెలుతురు లేమి కారణంగా కాసేపు నిలిచిపోయిన ఆట తిరిగి ప్రారంభమైంది. వెలుతరు లేమి కారణంగా నిలిచిపోయిన ఆట.. సెంచరీకి చేరువగా నితీశ్వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా స్కోర్ 326/7గా ఉంది. భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన నితీశ్ కుమార్ (85) సెంచరీకి చేరువగా ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ (40) నితీశ్‌కు అండగా క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం నితీశ్‌కుమార్ రెడ్డి చేసుకున్న పుష్ప తరహా సెలబ్రేషన్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.లంచ్ విరామం.. ఎదురీదుతున్న టీమిండియా మూడో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఎదురీదుతుంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 230 పరుగులు వెనుకపడి ఉంది. నితీశ్‌కుమార్ రెడ్డి (40), సుందర్ (5) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ స్కోర్ 244/7గా ఉంది.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా221 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. లయోన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (17) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్191 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బాగా సెట్ అయ్యాడనుకున్న తరుణంలో రిషబ్ పంత్ (28) బోలాండ్ బౌలింగ్‌లో లయోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.మూడో రోజు మొదలైన ఆట310 పరుగులు వెనుకపడి టీమిండియా మూడో రోజు ఆట ప్రారంభించింది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్‌లో ఉన్నారు.రెండో రోజు ముగిసిన ఆటబాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా 6 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 164/5గా ఉంది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 310 పరుగులు వెనుకపడి ఉంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, విరాట్ కోహ్లి 36, కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3, నైట్ వాచ్‌మన్ ఆకాశ్‌దీప్ 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. శుబ్‌మన్ గిల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.మరోవైపు ఆసీస్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కొంటాస్ తుది జట్టులోకి రాగా.. గాయం కారణంగా దూరమైన హాజిల్‌వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొంటాస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ -
IND VS AUS 4th Test: రెండో రోజు ముగిసిన ఆట.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
IND VS AUS 4th Test Day 2 Live Updates And Highlights: రెండో రోజు ముగిసిన ఆట.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియాబాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా 6 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 164/5గా ఉంది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 310 పరుగులు వెనుకపడి ఉంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, విరాట్ కోహ్లి 36, కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3, నైట్ వాచ్‌మన్ ఆకాశ్‌దీప్ 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు. కష్టాల్లో టీమిండియా.. పరుగు వ్యవధిలో జైస్వాల్, కోహ్లి ఔట్పరుగు వ్యవధిలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. లేని పరుగుకు ప్రయత్నించి జైస్వాల్ (82) ఔట్ కాగా.. విరాట్ (36) తన వీక్నెస్ అయిన ఔట్ ఆఫ్ ఆఫ్ స్టంప్ బంతికి బలయ్యాడు. మరి కొద్ది సేపట్లో రెండో రోజు ఆట ముగుస్తుందనగా భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్‌మన్ ఆకాశ్‌దీప్, రిషబ్ పంత్ క్రీజ్‌లో ఉన్నారు. 43 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 155/4గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియారెండో రోజు ఆట కొద్ది సేపటిలో ముగుస్తుందనగా టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లేని పరుగు కోసం రిస్క్ చేసి యశస్వి జైస్వాల్ (82) రనౌటయ్యాడు. అంతకుముందు బంతికే బౌండరీ బాది జోష్ మీదుండిన జైస్వాల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్.. వంద దాటిన టీమిండియా స్కోర్స్టార్క్ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ ఫిఫ్టి అనంతరం టీమిండియా స్కోర్ వంద పరుగులు దాటింది. 30 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 111/2గా ఉంది. జైస్వాల్‌కు జతగా విరాట్ (21) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 363 పరుగులు వెనుకపడి ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియాటీ విరామం ముందు ఆఖరి బంతికి టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 51/2గా ఉంది. రోహిత్ (3), రాహుల్ ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (23) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ కోల్పోయిన రెండు వికెట్లు కమిన్స్‌కే దక్కాయి.ఆసీస్ 474 ఆలౌట్.. ఓపెనర్‌గా వచ్చినా నిరాశపర్చిన రోహిత్ శర్మఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. నాథన్ లయోన్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. బుమ్రా లయోన్ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 8 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. గత రెండు మ్యాచ్‌లుగా మిడిలార్డర్ వచ్చిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చినా నిరాశపరిచాడు. హిట్‌మ్యాన్ కేవలం 3 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ బోలాండ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 4 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 14/1గా ఉంది. యశస్వి జైస్వాల్ (10), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు.స్టీవ్ స్మిత్ ఔట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాస్టీవ్ స్మిత్ (140) ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తద్వారా ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 114.1 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 455/9గా ఉంది. స్కాట్ బోలాండ్, నాథన్ లయోన్ క్రీజ్‌లో ఉన్నారు. లంచ్ విరామం తర్వాత మూడో బంతికే మిచెల్ స్టార్క్ (15) ఔటయ్యాడు. స్టార్క్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లంచ్ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ ఎంతంటే..?రెండో రోజు లంచ్ విరామం సమయానికి స్టీవ్ 139 పరుగలతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా స్టార్క్ (15) క్రీజ్‌లో ఉన్నాడు. 113 ఓవర్లలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 454/7గా ఉంది. రెండో రోజు తొలి సెషన్లో ఆసీస్ పాట్ కమిన్స్ (49) వికెట్ మాత్రమే కోల్పోయింది.సెంచరీ పూర్తి చేసుకున్న స్టీవ్ స్మిత్.. భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియామెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆట తొలి సెషన్లో స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాట్ కమిన్స్ పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. 108 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 432/7గా ఉంది. కమిన్స్ వికెట్ రవీంద్ర జడేజాకు దక్కింది.మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్(68 బ్యాటింగ్), కమిన్స్(8) ఉన్నారు. తొలి రెండు సెషన్స్‌లో ఆస్ట్రేలియా అధిపత్యం చలాయించగా.. ఆఖరి సెషన్లో భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసి తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చాడు.భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్, సుందర్, జడేజా తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో కాన్స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72), స్మిత్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. శుబ్‌మన్ గిల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.మరోవైపు ఆసీస్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కొంటాస్ తుది జట్టులోకి రాగా.. గాయం కారణంగా దూరమైన హాజిల్‌వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొంటాస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ -
మన ఐకాన్.. త్రిష!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఉమెన్ అండర్ – 19, టీ 20 వరల్డ్ కప్ పోటీలకు జిల్లాకు చెందిన గొంగడి త్రిష ఎంపికైంది. 2022లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలోనూ ఆమె తనదైన ప్రతిభ చాటింది.ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ..ఈనెల 15న పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒత్తిడికి గురైన త్రిష ఓపెనర్‌గా దిగి పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యింది. ఆ తర్వాత పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచి క్రీజులో లయను అందుకుంది. తర్వాత జరిగిన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్‌లలో వరుసగా 58 నాటౌట్, 32 పరుగులతో రాణించింది. చివరగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విలువైన 52 పరుగులు జోడించి, భారత్ గెలుపులో కీలకంగా మారింది. దీంతో ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు తన ఖాతాలో వేసుకుంది.శిక్షణలో రాటుదేలి..సికింద్రాబాద్‌లో ఇప్పించిన ప్రత్యేక శిక్షణలో రాటుదేలిన త్రిష 12 ఏళ్ల వయసులోనే అండర్ – 19 హైదరాబాద్ జట్టుకు ఎంపికై ంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అండర్ –19 ఇండియా జట్టుకు ఎంపికై దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్రను సమర్థంగా పోషించింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు భారత ఏ జట్టులో ఆడుతూ సీనియర్ జట్టులో చోటు కోసం శ్రమిస్తోంది.భద్రాచలం టు సికింద్రాబాద్..భద్రాచలానికి చెందిన గొంగడి రామిరెడ్డి ఫిట్నెస్ ట్రైనర్‌గా ఐటీసీలో పని చేస్తూనే పట్టణంలో సొంతంగా రామ్స్ జిమ్ నిర్వహించేవారు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా రాణించాలనే ఆయన కల నెరవేరలేదు. అయితే ఆ లోటు తీర్చేందుకు అన్నట్టుగా కూతురు త్రిష చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి చూపించింది. దీంతో క్రికెట్‌ను కెరీర్‌గా మలచాలని భావించిన రామిరెడ్డి ఉత్తమ శిక్షణ కోసం సికింద్రాబాద్‌కు మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు. అలా త్రిషకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే ఐటీసీలో ఫిట్‌నెన్ ట్రైనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పట్టణంలో ఉన్న జిమ్ సెంటర్‌ను అమ్మేసి 2013లో రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. అక్కడ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ మొదలైంది.ఐపీఎల్ లెగ్ బ్రేక్..భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లింది మొదలు రెండేళ్ల క్రితం వరకు క్రికెట్లో త్రిష ప్రయాణం ఎదురులేకుండా సాగింది. హైదరాబాద్ అండర్ – 19 నుంచి భారత ఏ జట్టు వరకు ప్రయాణం సాఫీగా సాగింది. అయితే క్రికెట్ వరల్డ్‌లో క్రేజీ టోర్నమెంట్‌గా పేరున్న ఉమెన్ ఐపీఎల్ త్రిషకు కలిసి రాలేదు. ఈ టోర్నీ కోసం జరిగిన వేలంలో త్రిషను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో టోర్నమెంట్ గెలుపులో తాను ఒకరిగా ఉండడం కంటే మెరుగైన ప్రదర్శన చేయడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. కఠోర సాధన చేసింది. దాని తాలూకూ ఫలితాలు ఈ డిసెంబర్లో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో కనిపించాయి.ఎన్నికల ప్రచారకర్తగా..తెలంగాణ ఎన్నికల సంఘం గొంగడి త్రిషను ఐకాన్‌గా గుర్తించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎలక్షన్ ఐకాన్‌గా, ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ ఐకాన్‌గా పని చేసింది. 2023లో తెలంగాణ ఉమెన్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వీకరించింది. ఈ విజయ పరంపరను ఇలాగే కొనసాగిస్తూ త్వరలోనే ఇండియన్ ఉమెన్ క్రికెట్లో సీనియర్ జట్టుకు ఆడాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.ఇండియా జట్టుకు ఆడాలిఅండర్ –19 విభాగంలో మూడేళ్లుగా భారత జట్టుకు ఆడుతున్నా. ఇటీవల భారత ఏ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఆడాను. ఏషియా కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రావడం, ఆ కప్ దేశానికి అందించడం సంతోషాన్ని ఇచ్చింది. ఇండియా మహిళల జట్టుకు ఆడాలన్నదే నా లక్ష్యం.– గొంగడి త్రిష -
టీమిండియాకు గుడ్ న్యూస్
-
అశ్విన్ హెబర్ సెంచరీ
ముంబై: ఓపెనర్ అశ్విన్ హెబర్ (136 బంతుల్లో 132; 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు బోణీ కొట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 91 పరుగుల తేడాతో రైల్వేస్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 49.2 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అశ్విన్ శతకంతో విజృంభించగా... కెపె్టన్ శ్రీకర్ భరత్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), రికీ భుయ్ (41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రైల్వేస్ బౌలర్లలో రాహుల్ శర్మ 4, యువరాజ్ సింగ్ మూడు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో రైల్వేస్ 41.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ ఉపేంద్ర యాదవ్ (64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం బాదగా... మొహమ్మద్ సైఫ్ (46; 5 ఫోర్లు), సూరజ్ అహుజా (40; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఆంధ్ర బౌలర్లలో వినయ్ కుమార్ 4, శశికాంత్ మూడు వికెట్లు తీశారు. తమ తదుపరి మ్యాచ్‌లో సోమవారం రాజస్తాన్‌తో ఆంధ్ర జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. -
ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?
-
YS Jagan: చదువుతో పాటు క్రీడలకూ సమ ప్రాధాన్యం
YS Jagan Mohan Reddy Birthday Special: చదువుతో పాటు ఆటలూ ముఖ్యమే. చిన్న వయసు నుంచే క్రీడల్లో భాగమవడం వల్ల మనోల్లాసం లభించడంతో పాటు.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా పాఠశాల స్థాయి నుంచే ఆటల పట్ల మక్కువ ఎక్కువ. క్రికెట్ ఆడటం అంటే ఆయనకు చాలా ఇష్టం. హౌజ్ కెప్టెన్గాఅంతేకాదు.. స్కూల్ లెవల్లో వైస్ జగన్ బాస్కెట్ బాల్ కూడా ఆడేవారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అంతేకాదు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించేవారు. హెచ్‌పీఎస్‌లో హౌజ్ కెప్టెన్‌గా జగన్ అరుదైన ఘనత సాధించారు. పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. రెడ్ హౌజ్‌కు ఆల్‌రౌండర్ చాంపియన్‌షిప్ అందించారు. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీల్లోనూ తమ జట్టును విజయపథంలో నిలిపి టైటిల్ కైవసం చేసుకున్నారు.మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకుఇక క్రీడల్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి స్వతహాగా తెలుసు కాబట్టే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్.. తన హయాంలో విద్యతో పాటు క్రీడా రంగానికీ పెద్దపీట వేశారు. ప్రతిభ ఉండి వెలుగులోకి రాని మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.కేవలం రాష్ట్ర స్థాయిలోనే గాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించేలా జగన్ ప్రభుత్వం ఈ మేర ప్రణాళికలు రచించింది. టాలెంట్ హంట్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) వంటి ప్రతిష్టాత్మక ఐపీఎల్ ఫ్రాంఛైజీని ఆహ్వానించింది.ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్రా క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కె.పవన్ అనే యువకుడిని సీఎస్కే దత్తత తీసుకోవడం విశేషం. విజయనగరం జిల్లాలోని జామి మండలం అలమండకు చెందిన పవన్ అలా ఐపీఎల్‌కు చేరువయ్యాడు. ఇక ఆడుదాం ఆంధ్రాతో పాటు ఏపీ సీఎం కప్ టోర్నమెంట్‌ను కూడా ప్రతిష్టాత్మంగా నిర్వహించింది జగన్ ప్రభుత్వం.ఆంధ్ర ప్రీమిర్ లీగ్ హిట్వైఎస్ జగన్ హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ‘ఆంధ్ర ప్రీమిర్ లీగ్’ పేరిట పోటీలు మొదలుపెట్టింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించేందుకు నిర్వహించిన ఈ లీగ్ విజయవంతంగా కొనసాగుతోంది. బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. ఏపీఎల్‌తో జోనల్ స్థాయి క్రికెటర్లకు కూడా మంచి గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు. -
ఆంతా వాళ్లే చేశారంట..! క్రికెటర్ల తండ్రుల ఆవేదన
-
స్నేహితుడే కారణమా..? అశ్విన్ రిటైర్మెంట్ వెనుక సంచలన నిజాలు
-
ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
-
రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన రోహిత్...
-
వర్షం ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా- భారత్ మూడో టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
క్రికెటర్‌గా స్టార్ హీరోయిన్ భర్త.. బౌలింగ్‌లో అదుర్స్.. ఎవరో గుర్తుపట్టారా?
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుగ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీరిద్దరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. అయితే హీరోయిన్ భర్త కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే. క్రికెట్లో మంచి బౌలర్ కూడా. తాజాగా ఆయన ఓ దేశవాళీ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనురాగ్ ఠాకూర్ బ్యాటింగ్ చేస్తుండగా తన స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశాడు. కాగా.. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ వర్సెస్ రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.మాల్దీవుస్‌లో వెడ్డింగ్ డే..గతంలోనే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట. తన భర్త రాఘవ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరూ మాల్దీవుస్‌లో తమ మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
పాకిస్తానీల కళ్లన్నీ భారత్‌పైనే.. గూగుల్‌లో ఏం వెతికారంటే..
వివిధ దేశాలలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ట్రెండ్స్, భిన్న అంశాలను వెల్లడిస్తూ గూగుల్ (Google) ప్రతి సంవత్సరం తన "ఇయర్ ఇన్ సెర్చ్" నివేదికను ఆవిష్కరిస్తుంది. ఇందులో వార్తలు, క్రీడా ఈవెంట్ల దగ్గర నుండి సెలబ్రిటీలు, సినిమాలు, టీవీ షోలు, సందేహాలు వంటివెన్నో ఉంటాయి.ఈ క్రమంలోనే గూగుల్ ఇటీవల పాకిస్తాన్‌కు సంబంధించిన “ఇయర్ ఇన్ సెర్చ్ 2024”ని విడుదల చేసింది. ఏడాది పొడవునా పాకిస్తాన్ ప్రజలు గూగుల్ ఏం వెతికారు..కీలక పోకడలు, అంశాలను హైలైట్ చేస్తూ విభిన్న రంగాలలో జాతీయ ఆసక్తిని ఆకర్షించిన వాటిపై ఒక సంగ్రహావలోకనం ఈ నివేదిక అందిస్తుంది.గూగుల్ పాకిస్తాన్ 2024 సంవత్సరాంతపు జాబితాలో క్రికెట్, వ్యక్తులు, సినిమాలు&నాటకాలు, హౌ-టు సందేహాలు, వంటకాలు, టెక్నాలజీ వంటి ఆరు కేటగిరీల్లో అత్యధిక సెర్చ్ చేసిన టాప్ 10 అంశాలు ఉన్నాయి. అయితే యాదృచ్ఛికంగా వీటిలో భారత్ గురించి లేదా దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. భారతీయ వ్యాపారవేత్తలు, సోనీ, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో భారతీయ షోలు, టీ20 ప్రపంచ కప్ సిరీస్‌లో భారత జట్టు క్రికెట్ మ్యాచ్‌లు వీటిలో ఉన్నాయి.పాకిస్థానీల ఆసక్తులు ఇవే..క్రికెట్లో పాకిస్థాన్‌లో అత్యధికంగా శోధించిన ఐదు గేమ్‌లు భారత్ ఆడిన మ్యాచ్‌లే. వీటిలో టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య పోరు ఒకటి. ఇది కాకుండా అత్యధికంగా సెర్చ్ చేసిన ఇతర మ్యాచ్‌లలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌లు ఉన్నాయి.ఇక వ్యక్తుల విషయానికి వస్తే.. 'పీపుల్ లిస్ట్ ఫర్ పాకిస్థాన్'లో భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్నారు.సినిమాలు & నాటకాల జాబితాలో అత్యధికంగా భారతీయ టీవీ షోలు, నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. హీరామండి, ట్వల్త్ ఫెయిల్, మీర్జాపూర్ సీజన్ 3, బిగ్ బాస్ 17 పాకిస్తానీలు అత్యధికంగా సెర్చ్ చేసిన టీవీ షోలు కాగా యానిమల్, స్త్రీ 2, భూల్ భులైయా 3, డంకీ 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన బాలీవుడ్ సినిమాలు. -
IND vs AUS: 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
-
Rohit Sharma: టీమిండియా కొంప కొల్లేరు చేస్తున్న రోహిత్
-
13 ఏళ్లకే కోటి రూపాయలు.. క్రికెట్లో కొత్త ‘వైభవం’
12 సంవత్సరాల 9 నెలల 9 రోజులు.. సాధారణంగా ఈ వయసులో చిన్నారులంతా ఏం చేస్తుంటారు? బడిలో పాఠాలు నేర్చుకుంటూంటారు. కానీ ఆ అబ్బాయి దేశంలో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగాడు. 13 సంవత్సరాల 7 నెలల 29 రోజులు.. ఈ వయసులో చిన్నారులు సంపాదిస్తారా? తాము కోరుకున్నది పేరెంట్స్ కొనిస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఆ బాలుడు తన ఆటతో కోటి రూపాయలు సంపాదించి, ఔరా అనిపించాడు. భారత క్రికెట్లో సంచలనంలా మారిన ఆ అబ్బాయే వైభవ్ సూర్యవంశీ. అతి పిన్న వయసులో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాడిగా కొత్త ఘనతను నమోదు చేశాడు.చిన్నప్పటి నుంచి అపార ప్రతిభను ప్రదర్శించిన వైభవ్ ఎప్పటికప్పుడు తనకంటే పెద్ద వయసు ఉన్న ఆటగాళ్ల టోర్నీలలోనే పాల్గొంటూ వచ్చాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఇతర ఆటగాళ్లు అతని కంటే కనీసం 5–6 ఏళ్లు పెద్దవాళ్లు. అలాంటి చోట బరిలోకి దిగడమే కాదు.. తన పదునైన బ్యాటింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. స్థానికంగా జరిగిన ఒక అండర్–19 స్థాయి టోర్నీలో ఏకంగా 332 పరుగులతో వైభవ్ అజేయంగా నిలవడం విశేషం. ఫలితంగా బిహార్ రాష్ట్ర అండర్–19 జట్టులో చోటు దక్కింది. ఈ స్థాయిలో బీసీసీఐ నిర్వహించే రెండు ప్రధాన టోర్నీలు కూచ్‌బెహర్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో ప్రదర్శన వైభవ్ ఆట గాలివాటం కాదని నిరూపించింది. కూచ్‌బెహర్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లోనే 151 పరుగులు చేయడంతో అతని ఆట అందరికీ తెలిసింది. వినూ మన్కడ్ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌లో 78.60 సగటుతో 393 పరుగులు చేయడం వైభవ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. సహజంగానే ఈ ప్రదర్శన భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. విజయవాడలో నాలుగు జట్ల మధ్య జరిగిన చాలెంజర్ టోర్నీలో భారత అండర్–19 బి జట్టు తరఫున బరిలోకి దిగిన అతను తన చూడ చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక్కడే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. వైభవ్‌లోని ప్రతిభను గుర్తించాడు. అప్పటి నుంచి జాఫర్ అతనికి మార్గనిర్దేశనం చేస్తూ వచ్చాడు. నాన్న నేర్పిన ఓనమాలతో..బిహార్‌లోని సమస్తీపుర్కి చెందిన సంజీవ్ సూర్యవంశీకి క్రికెట్ అంటే పిచ్చి. ఆటను అభిమానించడమే కాదు.. క్రికెటర్‌గా కూడా ఎదిగే సత్తా తనలో ఉందని నమ్మిన అతను భవిష్యత్తును వెతుక్కుంటూ ముంబైకి చేరాడు. అక్కడి ప్రఖ్యాత మైదానాల్లో మ్యాచ్‌లు ఆడుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాతే సంజీవ్‌కు వాస్తవం అర్థమైంది. ముంబై మహానగరంలో తనలాంటివారు, తనకంటే ప్రతిభావంతులు ఎందరో క్రికెట్లో ఎదిగేందుకు సర్వం ఒడ్డి పోరాడుతున్నారని! దాంతో తన ఆశలను కట్టిపెట్టి మళ్లీ బిహార్ చేరాడు. అయితే తాను చేయలేనిది కొడుకు ద్వారా సాధించాలనే తపనతో వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్ బ్యాట్ పట్టిన వైభవ్.. తండ్రి శిక్షణ, పర్యవేక్షణలో రాటుదేలాడు. 13 ఏళ్ల వయసుకే ప్రపంచ క్రికెట్ దృష్టిలో పడ్డాడు.రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి..ఏజ్ గ్రూప్ క్రికెట్ తర్వాత ప్రతి ఆటగాడి లక్ష్యం సీనియర్ టీమ్‌లోకి ఎంపిక కావడమే. అక్కడికి వెళ్లాక ఆట స్థాయి, ప్రత్యర్థుల స్థాయి కూడా పెరుగుతుంది. సీనియర్ టీమ్‌లోకి రావడం అంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి భీకరమైన బౌలింగ్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అతి పిన్న వయసులో రంజీ ట్రోఫీలోకి అడుగు పెడుతూ అతను తొలి మ్యాచ్‌లోనే అత్యంత పటిష్ఠమైన ముంబై టీమ్‌ను ఎదుర్కొన్నాడు. భారీ స్కోరు చేయకపోయినా అతని షాట్లు చూసినవారు ప్రశంసల వర్షం కురిపించారు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను అభిమానించే ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ ఇప్పటికి 5 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. ఆడిన ఏకైక టి20 మ్యాచ్‌లో కొట్టిన భారీ సిక్సర్లు అతని ధాటిని చూపించాయి. వేలంలో ప్రధాన ఆకర్షణగా..వైభవ్ కెరీర్లో అసలు మలుపు రెండు నెలల క్రితం చెన్నైలో ఆస్ట్రేలియా అండర్–19 టీమ్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో వచ్చింది. ఈ పోరులో భారత అండర్–19కు ప్రాతినిధ్యం వహించిన అతను 62 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు బాదాడు. ఇదే ఆట అతణ్ణి ఐపీఎల్ దిశగా అడుగులు వేయించింది. నాగపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్‌లో వైభవ్ దూకుడు టీమ్ సీఈఓ జేక్ లష్ను ఆకర్షించింది. భవిష్యత్తు కోసం తీర్చిదిద్దగల తారగా ఆయన భావించాడు. అందుకే వేలంలో రూ. 30 లక్షల కనీస విలువ నుంచి ఢిల్లీతో పోటీ పడి మరీ రాజస్థాన్ రూ.1.10 కోట్లకు వైభవ్‌ను ఎంచుకుంది. ‘వైభవ్‌లో నిజంగా చాలా ప్రతిభ ఉంది. మా టీమ్‌లో అతను ఎదిగేందుకు తగిన వాతావరణం ఉంది. అందుకే అతణ్ణి తీసుకోవడం పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం’ అని రాజస్థాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పడం వైభవ్ కెరీర్ సరైన రీతిలో వెళ్లనుంది అనేందుకు సంకేతం. -
Vinod Kambli: కాంబ్లీకి ఏమైంది..?
-
క్రికెట్లో మన ‘దీక్ష’.. మెరిసింది! సత్తా చాటుతున్న గుంటూరు బాలిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కొంచెం ఊహ వచ్చిన తర్వాత పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం కాలక్రమేణా తగ్గిపోతుంది. అందుకే వారు స్నేహితులపైనా, సెల్ఫోన్స్లాంటి ఎల్రక్టానిక్ గాడ్జెట్స్‌పై ఎక్కువ ఆధారపడుతుండడం మనం తరచూ చూస్తుంటాం. పిల్లలకు విషయాలు తెలుస్తున్న సమయంలో వారితో ఎక్కువ టైం గడిపితే వారిలోని అభిరుచులు, అలవాట్లు తెలుసుకునే వీలుంటుంది. ఇదే చేశారు ఎస్వీఎన్ కాలనీకి చెందిన కాట్రగడ్డ శేషసాయి, హేమ ప్రభ దంపతులు. తమ ఒక్కగానొక్క కుమార్తె దీక్షను చిన్న వయస్సులోనే క్రికెట్ ఆటలో చేరి్పంచి మార్గదర్శకులుగా మారారు. అందుకే దీక్ష కేవలం 13 సంవత్సరాల వయస్సులోనే బీసీసీఐ అండర్–15 బాలికల క్రికెట్లో సత్తా చాటి ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో కీలక భూమిక పోషించింది. ఓపెన్ బ్యాటర్‌గానూ, వికెట్ కీపర్‌గానూ రాణించింది. కన్నవారి ప్రోత్సాహంతో.. దీక్ష తండ్రి శేషసాయి ఒకప్పుడు క్రికెటర్. దీక్షకూ క్రికెట్‌పై మక్కువ ఏర్పడింది. ఆమెకు ఆట నేర్పడంతో దీక్ష అండర్–13 జిల్లా, జోనల్క్రికెట్లో రాణించింది. గత నెలలో జరిగిన బీసీసీఐ అండర్–15 బాలికల టోర్నీకి ఆంధ్ర జట్టుకు ఎంపికైంది. కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఆ టోరీ్నలో ఆంధ్ర జట్టు విజేతగా నిలిచింది. దీంతో నేరుగా ఆంధ్ర జట్టుకు బీసీసీఐ తదుపరి టోరీ్నకి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. దీక్ష బ్యాటర్‌గానూ, కీపర్‌గానూ రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. మంగళవారం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దీక్షను అభినందించారు. తల్లిదండ్రులే స్ఫూర్తి నాన్నను చూసి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నా. అమ్మ నాతో మ్యాచ్‌లకు వస్తుంది. నాకు ఏం కావాలన్నా తనే చూసుకుంటుంది. కేవలం నేను క్రికెట్‌ను శ్రద్ధగా ఆడాలని మాత్రమే వారు చెబుతుంటారు. కోచ్‌ల సహకారం కూడా ఎంతో ఉంది. ఏసీఏతోపాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నాకు అన్ని విధాలుగా సహకరిస్తోంది. ముందు సీనియర్స్ విభాగానికి రావాలి. ఆ తర్వాత నాకంటూ లక్ష్యాలు పెట్టుకుంటా. పేరెంట్స్ సహకారముంటే ఏ క్రీడలోనైనా రాణించవచ్చు. – దీక్ష -
IPL 2025 Teams: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం
-
INDvsAUS - 295 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం
-
Virat Kohli: చరిత్ర సృష్టించిన చి విరాట్ కోహ్లి..
-
కావ్య మారన్ సెలక్షన్ అదిరిందంటున్న ఫ్యాన్స్
-
IND vs AUS:పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం
-
వేలంలో భారత క్రికెటర్లకు కాసుల పంట.. తొలి రోజు ఎవరు ఎంత ధర పలికారంటే..?
-
గౌతమ్ గంభీర్‌కు ఇదే లాస్ట్ మ్యాచ్ అవుతుందా?
-
గౌతమ్ గంభీర్‌కు ఇదే లాస్ట్ మ్యాచ్ అవుతుందా?
-
బంతి తగిలి అంపైర్ ముఖంపై తీవ్ర గాయాలు..!
క్రికెట్ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంతి తగిలి ఫీల్డ్ అంపైర్ ముఖం వాచిపోయింది. ఆస్ట్రేలియాలోని ఛార్లెస్ వెర్యార్డ్ రిజర్వ్ క్రికెట్ మైదనంలో ఇది జరిగింది. ఓ స్థానిక మ్యాచ్ సందర్భంగా టోనీ డినోబ్రెగా అనే వ్యక్తి వికెట్ల వద్ద అంపైరింగ్ చేస్తున్నాడు. బ్యాటర్ కొట్టిన బంతి (స్ట్రయిట్ డ్రైవ్) నేరుగా డినోబ్రెగా ముఖంపై తాకింది. బంతి బలంగా తాకడంతో డినోబ్రెగా ముఖం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కుడి కన్ను, కుడి వైపు ముఖం అంతా కమిలిపోయి, వాచిపోయింది.అదృష్టవశాత్తు డినోబ్రెగా ముఖంపై ఎలాంటి ఫ్రాక్చర్స్ లేవు. ప్రస్తుతం అతను అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డినోబ్రెగా త్వరగా కోలుకోవాలని స్థానిక అంపైర్ల సంఘం ఆకాంక్షించింది. గాయపడక ముందు డినోబ్రెగా ముఖం.. గాయపడిన తర్వాత డినోబ్రెగా ముఖాన్ని అంపైర్ల సంఘం సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. క్రికెట్ మైదానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. అందుకే అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాలోనే ఓ ఫీల్డ్ అంపైర్ ఇలానే బంతి ముఖంపై తాకడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. 2014లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ బంతి తలకు తాకడంతో తొలుత కోమాలోని వెళ్లి, ఆతర్వాత ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. -
సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్సర్లు.. వీడియో
స్పెయిన్ టీ10 క్రికెట్లో సంచలనం నమోదైంది. యునైటెడ్ సీసీ గిరోనాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్సిలోనాకు మెరుపు ఆరంభం లభించింది. అయితే ఆ జట్టు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. pic.twitter.com/Mpq9PeLddD— Sunil Gavaskar (@gavaskar_theman) November 20, 2024ఈ దశలో బరిలోకి దిగిన అలీ హసన్ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఏడో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా ఐదు సిక్సర్లు.. ఆతర్వాత ఎనిమిదో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న అలీ హసన్ 8 సిక్సర్లు, బౌండరీ సాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కడపటి వార్తలు అందేసరికి ఛేదనలో గిరోనా జట్టు ఎదురీదుతుంది. ఆ జట్టు కేవలం 19 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో బార్సిలోనా చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, మరో పరాజయాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయిన పేర్లలో అల్ హసన్ పేరు లేకపోవడం విచారకరం. -
ఇంగ్లండ్, విండీస్‌ల ఆఖరి టి20 రద్దు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను నెగ్గింది. ఈ సిరీస్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని -
IPL రిటెన్షన్ లిస్ట్ విడుదల..అత్యధిక ధర ఎవరికంటే?
-
IND vs NZ: రెండో టెస్టులో భారత్ ఓటమి..
-
పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్
-
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో పెను సంచలనం
-
CWG 2026: మనకే దెబ్బ!.. ఎందుకిలా చేశారు?
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నుంచి కీలక క్రీడాంశాలను ఎత్తివేసింది నిర్వాహక బృందం. 2026లో గ్లాస్గో వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నుంచి క్రికెట్, హాకీ, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రోడ్ రేసింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్ని తొలగించారు. ఈ నేపథ్యంలో పతకాల పట్టికలో భారత్ వెనుకబడే అవకాశం ఉంది.మనకే దెబ్బ! తీవ్ర ప్రభావంఎందుకంటే.. హాకీ, క్రికెట్(మహిళలు), బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్లలోనే మనకు ఎక్కువ పతకాలు వస్తున్నాయి. ముఖ్యంగా షూటింగ్లో అత్యధికంగా ఇప్పటి వరకు 135 కామన్వెల్త్ మెడల్స్ గెలిచింది భారత్. ఇందులో 63 పసిడి పతకాలు ఉండటం విశేషం. మరోవైపు.. రెజ్లింగ్‌లోనూ వివిధ విభాగాల్లో 114 మెడల్స్ దక్కాయి.బడ్జెట్‌ను తగ్గించుకోవడం కోసమే!వచ్చే కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఈ రెండింటిని తొలగించారు గనుక భారత్‌కు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. అయితే, గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేర క్రీడల్ని తొలగించడానికి ప్రధాన కారణం బడ్జెట్‌ను తగ్గించుకోవడం కోసమే అని తెలుస్తోంది. గతంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో అత్యధికంగా 10 క్రీడలు మాత్రమే నిర్వహించేవారు. అయితే, 1998 తర్వాత 15- 20 క్రీడలను అదనంగా చేర్చారు.నాలుగు వేదికల్లోనే ఈవెంట్స్అయితే, గ్లాస్గోలో పాత పద్ధతినే ఫాలో అయ్యేందుకు నిర్వాహకులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తక్కువ క్రీడలు ఉంటే తక్కువ వేదికలు మాత్రమే అవసరమవుతాయి.. ఫలితంగా తక్కువ ఖర్చుతో మెగా ఈవెంట్‌ను పూర్తి చేయవచ్చని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి కేవలం నాలుగు వేదికల్లోనే ఈవెంట్స్ నిర్వహించనున్నారు.స్కాట్స్టౌన్ స్టేడియం, టోల్క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్, కామన్వెల్త్ ఎరీనా/సర్ క్రిస్ హోయ్ వెలడ్రోమ్, స్కాటిష్ ఈవెంట్స్ క్యాంపస్‌లను వేదికలుగా ఎంపిక చేశారు. అయితే, గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాదు. భవిష్యత్తులో మరిన్ని క్రీడలను చేర్చే, తొలగించే వెసలుబాటు ఆతిథ్య దేశాల కమిటీలకు ఉంటుంది. తమ దేశ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వీలుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో ఉండబోయే క్రీడలు👉అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్👉స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్👉ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్👉ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్👉నెట్‌బాల్👉వెయిట్‌లిఫ్టింగ్, పారా వెయిట్‌లిఫ్టింగ్👉బాక్సింగ్👉జూడో👉బౌల్స్, పారా బౌల్స్👉3*3 బాస్కెట్‌బాల్, 3*3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్.చదవండి: Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే -
46 రన్స్ కే కుప్పకూలిన టీమిండియా
-
LLC 2024 Final: రెచ్చిపోయిన మసకద్జ
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 సీజన్ ఫైనల్లో సదరన్ సూపర్ స్టార్స్, కోణార్క్ సూర్యాస్ ఒడిశా జట్లు పోటీపడుతున్నాయి. శ్రీనగర్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 16) జరుగుతున్న ఫైనల్లో కోణార్క్ సూర్యాస్ ఒడిశా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కోణార్క్ సూర్యాస్ ఒడిశా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. హ్యామిల్టన్ మసకద్జ మెరుపు ఇన్నింగ్స్ (58 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి సూపర్ స్టార్స్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. సూపర్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో మార్టిన్ గప్తిల్ 27, శ్రీవట్స్ గోస్వామి 0, పవన్ నేగి 33, చతురంగ డిసిల్వ 9, చిరాగ్ గాంధీ 0, ఎల్టన్ చిగుంబర ఒక్క పరుగు చేశారు. దిల్షన్ మునవీర వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సూపర్ స్టార్స్ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించింది. కోణార్క్ సూర్యాస్ ఒడిశా బౌలర్లలో మునవీర నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇర్ఫాన్ పఠాన్, దివేశ్ పఠానియా తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఉప్పల్ మ్యాచ్ పై VHP కీలక వార్నింగ్
-
అమెరికా జాతీయ క్రికెట్ లీగ్ భాగస్వామిగా సచిన్
వాషింగ్టన్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అమెరికాకు చెందిన నేషనల్ క్రికెట్ లీగ్ (ఎన్సీఎల్) యాజమాన్యంలో భాగస్వామి అయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రీడాకారులు ఏదో ఒక రూపంలో పాల్గొంటుండగా... ఇప్పుడు ఆ జాబితాలో సచిన్ టెండూల్కర్ పేరు చేరింది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘క్రికెట్ నా జీవితంలో అతి ముఖ్య భాగం. అలాంటి ఈ ప్రయాణంలో ఎన్‌సీఎల్‌లో భాగం కావడం మరింత ఆనందాన్నిస్తోంది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం లభించే విధంగా కృషి చేస్తా. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చిన ఎన్‌సీఎల్‌లో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది’ అని సచిన్ పేర్కొన్నాడు. ఎన్సీఎల్ తొలి సీజన్లో సునీల్ గవాస్కర్, వెంగ్‌సర్కార్, వెంకటేశ్ ప్రసాద్ (భారత్), జహీర్ అబ్బాస్, అక్రమ్, మొయిన్‌ఖాన్ (పాకిస్తాన్), రిచర్డ్స్ (వెస్టిండీస్), జయసూర్య (శ్రీలంక) వేర్వేరు జట్లకు కోచ్, మెంటార్లుగా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో మార్పులను స్వాగతించే వారిలో ముందు వరుసలో ఉండే సచిన్... ఇప్పుడు ఈ 60 స్ట్రయిక్ ఫార్మాట్లో భాగం కానున్నారు. ఇప్పటికే విశ్వవ్యాప్తంగా టి20, టి10, హండ్రెడ్ ఫార్మాట్లు ప్రాచుర్యం పొందగా... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ ఎన్సీఎల్ సిక్స్టీ స్ట్రయిక్స్ పేరుతో మరో కొత్త ఫార్మాట్‌కు తెరలేపుతోంది. తొలి ఎడిషన్‌లో రైనా, దినేశ్ కార్తీక్, అఫ్రిది, షకీబ్, షమ్సీ, క్రిస్ లిన్, ఏంజెలో మాథ్యూస్, బిల్లింగ్స్ వంటి పలువురు ప్లేయర్లు పాల్గొంటారు. -
బంగ్లా రెండో టెస్ట్ లో మార్పు ఆ స్టార్ ప్లేయర్ ని తీసుకుంటున్న రోహిత్
-
‘EY ఉద్యోగి చావుకు కారణం ఆ మేనేజర్ క్రికెట్ పిచ్చి’
యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) సీఏ అన్నా సెబాస్టియన్ మరణం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పని సంస్కృతిపై పెను చర్చకు దారితీసింది. ఆమె 'అధిక పని' కారణంగానే మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్నా సెబాస్టియన్ పెరాయిల్ తండ్రి సీబీ జోసెఫ్ కొత్త విషయాలు చెప్పారు. ఆమె మేనేజర్‌కు ఉన్న క్రికెట్ పిచ్చే తమ కుమార్తెపై పని ఒత్తిడి పెంచిందంటూ ఆరోపిస్తున్నారు."ఆమె (అన్నా సెబాస్టియన్) మార్చి 18న అక్కడ (EY) చేరింది. ఒక వారం తర్వాత, ఆమె సాధారణ ఆడిటింగ్‌ను ప్రారంభించింది. EY పూణేలో 6 ఆడిట్ బృందాలు ఉన్నాయి. ఆమెను 6వ టీమ్‌లో చేర్చారు. ఆడిట్ మేనేజర్ పనిని సమీక్షించారు. ఆమె అర్ధరాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది. ఆమె పీజీకి చేరుకున్న తర్వాత కూడా అదనపు పనిని చేయవలసి వచ్చింది.నిద్రించడానికి, తినడానికి కూడా ఆమెకు సమయం లేదు. ఆమె పని ఒత్తిడిని కలిగి ఉంది. మేనేజర్ సమయానికి పనిని సమీక్షించలేదు. అతను క్రికెట్ అభిమాని. మ్యాచ్ షెడ్యూల్‌కు అనుగుణంగా తన షెడ్యూల్‌ను మార్చాడు. దాని కారణంగా ఆమె తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి చాలా సేపు ఆలస్యంగా కూర్చోవలసి వచ్చింది.అంతటి ఒత్తడితో తాను అక్కడ పనిచేయలేనని ఏడ్చేది. రాజీనామా చేసి వచ్చేయాలని మేం కోరాం. కానీ ఆమె ఈవైలో కొనసాగాలని నిర్ణయించుకుంది. దురదృష్టవశాత్తు జూలై 21న ఆమె తన గదిలో కుప్పకూలిపోయి ఆసుపత్రికి చేరుకునేలోపు మరణించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీబీ జోసెఫ్.#WATCH | EY employee's death allegedly due to 'overwork' | Ernakulam, Kerala: Father of EY employee Anna Sebastian Perayil, Sibi Joseph says, "... She joined there on March 18... After one week, she started the regular auditing. There are 6 audit teams in EY Pune and she was… pic.twitter.com/aMTabuAei0— ANI (@ANI) September 21, 2024 -
క్రికెట్ కోచింగ్ కు.. క్యూ కడుతున్న విద్యార్థులు
-
లోకల్ హిట్టర్స్..
ఒకప్పుడు ఆదివారం వస్తే చాలు ఉదయం చాయ్ తాగి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సాయంత్రం ఆరు గంటల వరకూ కూడా ఇంటికి రాకుండా క్రికెట్ ఆడిన రోజులు పాత తరం యువతకు చాలామందికి అనుభవమే. అలాగే క్రికెట్ చూడాలంటే కనీసం 5 నుంచి 7 కి.మీ. ప్రయాణించి టీవీ చూసి వచ్చిన రోజులూ ఉన్నాయి.. క్రికెట్ అంటే అంత పిచి్చ.. అంత అభిమానం ఉండేది. ఇప్పుడు కూడా ఆ అభిమానం అస్సలు మారలేదు. కానీ రూపు మార్చుకుంది. గల్లీ క్రికెట్ కాస్త పోష్ క్రికెట్ అయ్యింది. అకాడమీల్లో గంటకు కొంత డబ్బులు చెల్లించి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు. అంతేనా లోకల్ మ్యాచ్‌ల నుంచి జాతీయ స్థాయి మ్యాచ్‌ల స్థాయికి చేరుతున్నారు. రోజుకు కనీసం 8 గంటల పాటు ప్రాక్టీస్ మెళకువలతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి బౌండరీలు దాటుతున్న లోకల్ టాలెంట్ ఐపీఎల్ వరకూ ఎదిగేందుకు అడుగులు క్రికెట్.. భారతదేశంలో ఒక మతం. దేశంలో క్రికెట్‌ను ఆరాధించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు చిన్నా పెద్దా, ఆడా మగ తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోతుంటారు. క్రికెట్ ఆడటం అంటే చిన్నప్పటి నుంచే క్రేజ్. గల్లీ క్రికెట్లో ఆడుతూ మంచి షాట్ కొడుతూ తమను తామే సచిన్ టెందుల్కర్, విరాట్‌కోహ్లి అనుకుంటూ సంబరపడిపోతుంటారు. అయితే ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం వినోదం కోసం చూడటమో.. ఆడటమో చేస్తుండేవారు. కానీ నేటి తరం క్రికెట్‌ను కూడా తమ కెరీర్‌గా మార్చుకుంటున్నారు. క్రికెట్ కాస్త ఖరీదైన వ్యవహారమే అయినా.. ఎలాగైనా కష్టపడి రంజీ లేదా ఐపీఎల్ ఆడి తమ సత్తా చూపాలని తాపత్రయపడుతున్నారు. అందుకోసం చిన్నతనం నుంచే గ్రౌండ్లో చెమటలు చిందిస్తున్నారు. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో ఆడకపోతామా అనే ధీమాతో ముందుకు వెళ్తున్నారు. క్రికెట్‌ను కెరీర్‌గా చేసుకునే వారికి చాలా నిబద్ధతతో శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లు నగరంలో భారీగా వెలిశాయి. అసలు కోచింగ్ సెంటర్లు పిల్లలను క్రికెటర్లుగా ఎలా మలుస్తున్నాయి.. ఎన్ని గంటల పాటు వారికి శిక్షణ ఇస్తున్నాయి.. ఎలా కష్టపడితే ఐపీఎల్ లేదా జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం వస్తుంది.. అనే విషయాలను తెలుసుకుందాం..! ఏడో యేటనుంచే.. సాధారణంగా క్రికెట్ ఆకాడమీల్లో పిల్లలు ఏడేళ్ల వయసు నుంచే చేరుతుంటారు. అందరూ క్రికెట్‌ను కెరీర్‌గా మలచుకునేందుకు చేరరు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే క్రికెట్ అకాడమీల్లో చేరి్పస్తుంటారు. మిగిలిన వారంతా క్రికెటర్లుగా చూడాలనే ఉద్దేశంతోనే అకాడమీల్లో చేరి్పస్తుంటారు. మొదటి రెండేళ్ల వరకూ టెన్నిస్ బాల్, ప్లాస్టిక్ బాల్‌తో ఆడిస్తారు. 12 ఏళ్లు దాటిన తర్వాత లెదర్ బాల్‌తో నెట్స్‌లో ఆడిస్తుంటారు. ఈ సమయంలోనే బ్యాచ్‌లుగా వేరు చేసి, వారి ఆట తీరునుబట్టి తరీ్ఫదు ఇస్తుంటారు. కష్టపడితే ఎన్నో అవకాశాలు.. క్రికెట్లో రాణించడం ఒకప్పుడు డబ్బులపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కష్టపడి మంచి ఆటతీరు కనబరిస్తే ఎంతో ఎత్తుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని పలువురు కోచ్‌లు చెబుతున్నారు. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఎదురుచూస్తూనే ఉంటాయని, ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోకుండా ముందుకు వెళ్లాలని చెబుతున్నారు.ఒక్కో రోజు ఒక్కో సెషన్.. సాధారణంగా క్రికెట్ ఆడాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని అంశాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. రోజుకో అంశంలో పిల్లలకు కోచ్ శిక్షణ ఇస్తుంటారు. ఒక రోజు బ్యాటింగ్ అయితే మరో రోజు బౌలింగ్, ఇంకో రోజు నాకింగ్, ఫీల్డింగ్‌లో ప్రాక్టీస్ చేయిస్తుంటారు. క్యాచ్‌లు పట్టే విధానంలో కూడా మెళకువలు నేరి్పస్తుంటారు. దీంతో పాటు క్రికెట్ ఫిట్నెస్ కూడా ముఖ్యం. ఇందులో భాగంగా జంపింగ్స్, ఫాస్ట్ రన్నింగ్, డ్రిల్స్ చేయిస్తుంటారు.అకాడమీ ఎంచుకునే ముందు..చాలా అకాడమీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయతి్నస్తున్నారు. ఇలాంటి వారి వద్ద చేరితే సమయంతో పాటు డబ్బు కూడా వృథా అవుతుంది. కమర్షియల్‌గా, బాక్స్ క్రికెట్ మాదిరిగా ఉండే అకాడమీలు కూడా ఉన్నాయి. అందుకే అకాడమీల్లో చేరేముందు అది ఎలాంటి అకాడమీ.. వాళ్లు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు.. ఎంత సమయం ప్రాక్టీస్ చేయిస్తారు అనే విషయాలు ముందే చూసుకుని చేరి్పస్తే మంచిదని పలువురు శిక్షకులు సూచిస్తున్నారు.భారత్ తరపున ఆడించాలనే లక్ష్యంతో.. ప్రతి అకాడమీ కూడా తమ పిల్లలను భారత జట్టులో చూసుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకోసం వారు మెళకువలు నేర్చుకోవడంతో పాటు వాటిని పిల్లలకు నేరి్పస్తుంటారు. ప్రతి వారం మ్యాచ్‌లు పెట్టి వారి ఆటతీరును పరిశీలిస్తుంటారు. సీజనల్ మ్యాచ్‌లు అంటే జూన్–జులైలో జరిగే వన్ డే, టూడే, త్రీడే లీగ్ మ్యాచ్‌లకు కూడా వెళ్లి పాల్గొంటారు. హెచ్‌సీఏ నుంచి జరిగే లీగ్ మ్యాచ్‌లలో బాగా ఆడితే అండర్–14, –16, –19 స్టేట్ టీమ్స్‌కు ఆడే అవకాశం వస్తుంది. అక్కడ ఎవరైనా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే రంజీ ఆడే అవకాశం ఉంటుంది.రోజుకు ఎనిమిది గంటల ప్రాక్టీస్ క్రికెట్ అకాడమీల్లో చాలావరకూ ఉదయం 5– 5.30 గంటల నుంచే దినచర్య ప్రారంభం అవుతుంది. రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ తర్వాత కాసేపు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేస్తుంటారు. మళ్లీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రాత్రి 7 గంటల వరకూ ప్రాక్టీస్ చేస్తుంటారు. బౌలింగ్ మెషీన్స్, నెట్ సెషన్స్, సైడ్ ఆర్మ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. వీరి వెన్నంటే ఉండే కోచ్‌లు ఎప్పటికప్పుడు వారికి ఆటలో తప్పులు అర్థం చేసుకుని ఆటగాళ్లు ఆడే విధానంలో మార్పులు చేస్తుంటారు. ఎక్కడైనా టోర్నమెంట్స్‌కు వెళ్లినప్పుడు వేరే అకాడమీ లేదా వేరే జట్టు ఆటగాళ్లు ఆడే తీరును కూడా పరిశీలించి.. తమ అకాడమీ పిల్లల ఆటలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందనే విషయాలను వారికి చెబుతుంటారు. ఇలా రోజులో కనీసం 8 నుంచి 9 గంటల పాటు గ్రౌండ్‌లోనే ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ ఆటతీరును అప్డేట్ చేసుకుంటారు. క్వాలిఫైడ్ ట్రైనర్స్‌తో.. క్రికెట్ కోసం చాలా మంది అకాడమీకి వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ శిక్షణ ఇస్తుంటాం. దాదాపు 15 మంది మా అకాడమీ నుంచి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యారు. వారికి ఎప్పటికప్పుడు ఆటలో మెళకువలు నేర్పించేందుకు క్వాలిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు. మానసికంగా కూడా వారికి కావాల్సిన మద్దతు ఇస్తుంటాం. – కల్యాణ్, క్రికెట్ కోచ్, కూకట్పల్లి ఆసక్తి చూపుతున్న అమ్మాయిలు.. ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా క్రికెట్‌పై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వారికి కూడా అబ్బాయిలతో పాటు సమానంగా అకాడమీ నుంచి శిక్షణ ఇస్తుంటాం. కావ్యశ్రీ అనే అమ్మాయి ఇటీవల సీనియర్ వుమెన్స్ రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు. ఆమెతో పాటు మరో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు స్టేట్ లెవల్ టీమ్స్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. వారిలో ఒకరినైనా ఇండియా జట్టులో చూడాలనేదే మా ఆశ. – తలకంటి సతీశ్‌రెడ్డి, ఎంఎస్డీ క్రికెట్ అకాడమీ, మేడిపల్లి -
ఆదుకున్న ములానీ
సాక్షి, అనంతపురం: ఆల్‌రౌండర్ షమ్స్ ములానీ (174 బంతుల్లో 88 బ్యాటింగ్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దులీప్ ట్రోఫీలో భాగంగా భారత్ ‘డి’తో గురువారం మొదలైన రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట... ములానీ చక్కటి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ జట్టుకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (7)తో పాటు మరో ఓపెనర్ ప్రథమ్ సింగ్ (7) సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో 21 పరుగులకే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37; 5 ఫోర్లు, ఒక సిక్సర్), శాశ్వత్ రావత్ (15) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో భారత్ ‘ఎ’ జట్టు 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే కుమార్ కుశాగ్ర (28) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో తనుశ్ కొటియాన్ (53; 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి షమ్స్ ములానీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. టాపార్డర్ సత్తా చాటలేకపోయిన చోట సంయమనంతో క్రీజులో నిలిచి ఒక్కో పరుగు జోడి స్తూ స్కోరు బోర్డు ను ముందుకు నడిపించాడు. అతడికి తనుశ్ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి షమ్స్ ములానీతో పాటు ఖలీల్ అహ్మద్ (15 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) అర్‡్షదీప్ (బి) విద్వత్ 7; మయాంక్ (సి) సామ్సన్ (బి) విద్వత్ 7; తిలక్ వర్మ (సి) శ్రేయస్ (బి) సారాంశ్ జైన్ 10; రియాన్ పరాగ్ (సి) పడిక్కల్ (బి) అర్‡్షదీప్ 37; శాశ్వత్ రావత్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ రాణా 15; కుశాగ్ర (సి) యశ్ దూబే (బి) అర్‡్షదీప్ 28; షమ్స్ ములానీ (బ్యాటింగ్) 88; తనుశ్ (సి) అర్‡్షదీప్ (బి) సౌరభ్ 53; ప్రసిద్ధ్ కృష్ణ (సి) (సబ్) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 8; ఖలీల్ అహ్మద్ (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: (82 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–18, 2–21, 3–65, 4–69, 5–93, 6–144, 7–235, బౌలింగ్: హర్షిత్ రాణా 16–4–49–2; విద్వత్ 14–5–30–2; అర్‡్షదీప్ 18–3–73–2; సారాంశ్ జైన్ 14–3–55–1; సౌరభ్ కుమార్ 20–1–65–1. -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన ప్రశ్న
ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తొలి ఐదారు ప్రశ్నల్లో ఏదో ఒకటి క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఎడిసోడ్లోనూ క్రికెట్‌కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. 40000 రూపాయల కోసం ఎదురైన ఆ ప్రశ్న ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కింది నాలుగు ఆప్షన్స్‌లో ఎవరూ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు సభ్యులు కాదు..? ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఏ-కుల్దీప్ యాదవ్, బి-రవీంద్ర జడేజా, సి-రవిచంద్రన్ అశ్విన్, డి-సూర్యకుమార్ యాదవ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. A cricket related question in KBC for 40,000 INR. pic.twitter.com/GF3Lc3Kal6— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024కాగా, కౌన్ బనేగా కరోడ్‌పతి అనేది దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ షో. ఇందులో కంటెస్టెంట్స్ కంప్యూటర్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి నిర్దిష్ట పారితోషికం లభిస్తుంది.వరల్డ్ ఛాంపియన్‌గా భారత్ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై జయకేతనం ఎగురవేసి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. త్వరలో బంగ్లాదేశ్ సిరీస్ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్డెంబర్ 27 నుంచి మొదలుకానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్ -
ఆసీస్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ముగ్గురి అరంగేట్రం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో రేపు (సెప్టెంబర్ 11) జరుగబోయే తొలి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్‌తో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు (జేకబ్ బేథెల్, జేమీ ఓవర్టన్, జోర్డన్ కాక్స్) టీ20 అరంగేట్రం చేయనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాంప్టన్ వేదికగా రేపటి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.ఆసీస్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్ తుది జట్లు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్), విల్ జాక్స్, జోర్డన్ కాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెథెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లేకాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది.ఆసీస్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్..సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)సెప్టెంబర్ 24- చెస్టర్ లీ స్ట్రీట్సెప్టెంబర్ 27- లండన్సెప్టెంబర్ 29- బ్రిస్టల్ -
నా రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు: మురళీథరన్
శ్రీలంక బౌలింగ్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన పేరిట ఉన్న అత్యధిక టెస్టు వికెట్ల (800) రికార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో తన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని ధీమా వ్యక్తం చేశాడు. టెస్ట్‌ల్లో తన రికార్డు శాశ్వతంగా మిగిలిపోతుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుత తరం బౌలర్లలో ఎవరూ తన రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నాడు.తన రికార్డు చాలా కాలం పాటు పదిలంగా ఉండటానికి పొట్టి క్రికెటే ప్రధాన కారణమని తెలిపాడు. పొట్టి ఫార్మాట్ కారణంగా టెస్ట్ క్రికెట్ ప్రభ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు, ప్రేక్షకుల్లో టెస్ట్ ఫార్మాట్‌పై ఆసక్తి తగ్గుతోందని ఆవేదన చెందాడు. కాగా, ప్రస్తుత తరం క్రికెటర్లలో మురళీథరన్ రికార్డు కునుచూపు మేరలో నాథన్ లియోన్ (530 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (516) మాత్రమే ఉన్నారు. వీరిలో లియోన్ వయసు 36, అశ్విన్ వయసు 37. వీరద్దరూ రిటైరయ్యేలోపు మురళీథరన్ రికార్డును అందుకునే అవకాశం లేదు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇటీవల 704 వికెట్లతో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
అరుదైన క్లబ్లో చేరిన కరుణరత్నే
శ్రీలంక వెటరన్ ఓపెనర్ దిముత్ కరుణరత్నే అరుదైన క్లబ్లో చేరాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది పరుగులు చేసిన అతను.. టెస్ట్‌ల్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. కరుణరత్నేకు ముందు సంగక్కర (12400), జయవర్దనే (11814), ఏంజెలో మాథ్యూస్ (7766) టెస్ట్‌ల్లో శ్రీలంక తరఫున ఏడు వేల మార్కును దాటారు. టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కరుణరత్నే 57వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (15921) అగ్రస్థానంలో ఉన్నాడు.బ్రాడ్‌మన్‌ను అధిగమించిన కరుణరత్నేతొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది పరుగులు చేసిన కరుణరత్నే దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్‌మన్ 6996 పరుగులు చేశాడు. ప్రస్తుతం కరుణరత్నే ఖాతాలో 7007 పరుగులు ఉన్నాయి.కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిస్సంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిస్సంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325, ఓలీ పోప్ 154, బెన్ డకెట్ 86, మిలన్ రత్నాయకే 3/56శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 263, నిసాంక 64, ధనంజయ డిసిల్వ 69, కమిందు మెండిస్ 64, ఓల్లీ స్టోన్ 3/35ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 156, జేమీ స్మిత్ 67, లహీరు కుమార 4/21శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 219/2, నిసాంక 127 నాటౌట్, అట్కిన్సన్ 1/44 -
నిసాంక సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన శ్రీలంక
కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌కు పర్యాటక శ్రీలంక ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిసాంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిసాంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిసాంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్‌లో దిముల్ కరుణరత్నే (8), కుసాల్ మెండిస్ (39) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు.పోప్ భారీ శతకంఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఇంగ్లండ్ కెప్టెన్ చెత్త రికార్డు.. పదికి పది వేస్ట్ చేశాడు..!
బెన్ స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఓలీ పోప్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్ను మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పోప్ ఇప్పటివరకు 10 రివ్యూలు తీసుకోగా.. పదికి పది విఫలమయ్యాయి. ఒక్కటంటే ఒక్క రివ్యూలోనూ పోప్ సక్సెస్ కాలేదు. టెస్ట్‌ల్లో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. రివ్యూల విషయంలో పోప్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లంకతో సిరీస్‌లో వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికీ రివ్యూల విషయంలో పోప్ దారుణంగా విఫలమయ్యాడని ఇంగ్లిష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక జట్టు గెలుపు దిశగా సాగుతుంది. ఆ జట్టు మరో 99 పరుగులు చేస్తే మ్యాచ్‌ను గెలవడంతో పాటు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిస్సంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక గెలుపు దిశగా సాగుతుంది. నిస్సంక (67), ఏంజెలో మాథ్యూస్ (6) క్రీజ్‌లో ఉన్నారు. -
సౌతాఫ్రికా జట్ల ప్రకటన.. స్టార్ పేసర్ రీ ఎంట్రీ
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం మూడు వేర్వేరు దక్షిణాఫ్రికా జట్లను ఇవాళ (సెప్టెంబర్ 9) ప్రకటించారు. ఈ సిరీస్‌లలో సౌతాఫ్రికా తొలుత ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు షార్జా వేదికగా జరుగనున్నాయి. ఆతర్వాత సౌతాఫ్రికా ఐర్లాండ్‌తో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అబుదాబీ వేదికగా జరుగనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లతో జరిగే సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ఈ సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. జేసన్ స్మిత్, న్కాబా పీటర్, ఆండిలే సైమ్‌లేన్ తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ సెప్టెంబర్ 18, 20, 22 తేదీల్లో జరుగనుంది. ఐర్లాండ్‌తో టీ20లు సెప్టెంబర్ 27, 29.. వన్డేలు అక్టోబర్ 2, 4, 7 తేదీల్లో జరుగనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్, ఆండిలే సైమ్‌లేన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రైన్, లిజాడ్ విలియమ్స్ఐర్లాండ్తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రూగర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిలే సైమ్‌లేన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్ఐర్లాండ్తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెయిన్, లిజాడ్ విలియమ్స్ -
శ్రీలంకకు లభించిన మరో ఆణిముత్యం
టెస్ట్‌ల్లో కుమార సంగక్కర, మహేళ జయవర్దనే లాంటి దిగ్గజ బ్యాటర్లు రిటైరయ్యాక శ్రీలంక బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనపడింది. కొందరు ఆటగాళ్లు అడపాదడపా ప్రదర్శనలు చేస్తున్నా అవంత చెప్పుకోదగ్గవేమీ కాదు. ఇటీవలికాలంలో ఆ జట్టులోకి కమిందు మెండిస్ అనే ఓ యువ ఆటగాడు వచ్చాడు. ఇతను ఆడింది ఐదు టెస్ట్ మ్యాచ్‌లే అయినా దిగ్గజ బ్యాటర్లను మరిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో సెంచరీ, రెండు అర్ద సెంచరీలు చేసిన కమిందు.. తన 10 ఇన్నింగ్స్‌ల స్వల్ప కెరీర్లో ఏకంగా మూడు సెంచరీలు, నాలుగు అర్ద సెంచరీలు చేసి ఔరా అనిపించాడు.ఆస్ట్రేలియాతో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్న కమిందు.. ఆతర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి లంక దిగ్గజం కుమార సంగక్కరను గుర్తు చేశాడు. ఆ మరుసటి టెస్ట్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్న ఇతను.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో సెంచరీతో మెరిశాడు. మళ్లీ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన కమిందు.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు.ఇలా కమిందు తన స్వల్ప కెరీర్లో ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. కమిందు టెస్ట్‌ల్లో చేసిన పరుగులు దాదాపుగా విదేశాల్లో చేసినవే కావడం విశేషం. అందులోనూ కమిందు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి చాలా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన కమిందు లోయర్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగుతాడు. కమిందు గణాంకాలు.. అతని ఆటతీరు చూసిన వారు శ్రీలంకకు మరో ఆణిముత్యం లభించిందని చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇదివరకే (0-2) కోల్పోయిన శ్రీలంక.. మూడో టెస్ట్‌లో మాత్రం విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు మరో 125 పరుగులు చేస్తే విజయం సొంతం చేసుకుంటుంది. ఆట మరో రెండు రోజులు మిగిలి ఉండటంతో పాటు శ్రీలంక చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్నాయి. నిస్సంక (53), కుసాల్ మెండిస్ (30) క్రీజ్‌లో ఉన్నారు. -
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్.. రేపే టీమిండియా ప్రకటన..?
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాను రేపు (సెప్టెంబర్ 9) ప్రకటించనున్నారని తెలుస్తుంది. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ నివేదిక ప్రకారం భారత సెలెక్టర్లు, టీమిండియా హెడ్ కోచ్, కెప్టెన్ రోహిత్ శర్మ రేపు ముంబైలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.ప్రస్తుతమున్న సమాచారం మేరకు రిషబ్ పంత్ చాలాకాలం తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను ధృవ్ జురెల్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. తాజాగా ముగిసిన దులీప్ ట్రోఫీలో జురెల్ ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు క్యాచ్‌లు పట్టి వికెట్‌కీపింగ్ పరంగా పర్వాలేదనిపించగా.. పంత్ అటు బ్యాట్‌తోనూ, వికెట్‌కీపింగ్‌లోనూ మెప్పించాడు.పేస్ బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. బుమ్రా, సిరాజ్ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. కొత్తగా ఆకాశ్‌దీప్ పేస్ టీమ్‌లోకి జాయిన్ కావచ్చు. షమీ అందుబాటులో ఉండేది లేనిది రేపటి వరకు చెప్పలేని పరిస్థితి. ఒకవేళ సెలెక్టర్లు షమీని ఎంపిక చేస్తే ఆకాశ్‌దీప్‌కు నిరాశ తప్పదు. ఆకాశ్‌దీప్.. షమీతో పాటు ముకేశ్ కుమార్ నుంచి సైతం పోటీ ఎదుర్కొంటాడు. తాజాగా ముగిసిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్ 9 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ కూడా పర్వాలేదనిపించాడు.స్పిన్ విభాగం విషయానికొస్తే.. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఆస్కారం ఉంది. కుల్దీప్ అవకాశాలను సైతం కొట్టిపారేయడానికి వీళ్లేదు. అక్షర్ తాజాగా ముగిసిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించడంతో అతనికి కాస్త వెయిటేజ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అక్షర్‌ను జట్టులోకి తీసుకుంటే జడేజాను పక్కకు పెడతారా లేక కుల్దీప్ను తప్పిస్తారా అన్నది చూడాలి.ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ విభాగమే టీమిండియా సెలెక్టర్లకు అతి పెద్ద తలనొప్పి తెచ్చి పెడుతుంది. సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండటంతో సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తొలి నాలుగు స్థానాలకు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి ఖాయమని అనుకుంటే మిడిలార్డర్ ఎంపిక భారత సెలెక్టర్లకు కత్తి మీద సామే అవుతుంది. మిడిలార్డర్లో స్థానంలో కోసం సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. తాజాగా రేసులోకి సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా వచ్చాడు. ముషీర్.. దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారీ శతకం బాది సెలెక్టర్లకు సవాలు విసిరాడు. మొత్తంగా చూస్తే.. బంగ్లాతో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక సెలెక్టర్లకు అంత తేలికైన పనైతే కాదు.