Delhi
-
Holi: మధుర.. కోల్‌కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం
న్యూఢిల్లీ: దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్ గన్లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. #WATCH | Bhopal: Madhya Pradesh CM Mohan Yadav celebrates Holi at his residence pic.twitter.com/o47ciC9C64— ANI (@ANI) March 14, 2025మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన ఇంటిలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనం ఆయనపై పూలవాన కురిపించారు.#WATCH | Gorakhpur: UP CM Yogi Adityanath attends Holi celebration event organised by the RSS pic.twitter.com/U2pqt2djaV— ANI (@ANI) March 14, 2025ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.#WATCH | Sambhal, Uttar Pradesh | CO Anuj Chaudhary says, "The police personnel are continuing their foot patrolling. There is no issue; people are celebrating Holi. Friday prayers will also be organised as usual." pic.twitter.com/4Z922S70vS— ANI (@ANI) March 14, 2025ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హోలీ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.#WATCH | Uttar Pradesh | People celebrate #Holi outside Shri Krishna Janmasthan Temple in Mathura pic.twitter.com/itlcYLR28x— ANI (@ANI) March 14, 2025శ్రీకృష్ణ జన్మభూమి మధురలో భక్తులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.#WATCH | Bihar: BJP leader Ram Kripal Yadav and others climb a bulldozer, play dhols and celebrate #Holi in Patna. pic.twitter.com/mYSpv3RGhQ— ANI (@ANI) March 14, 2025బీహార్‌లో బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ బుల్గోజర్ ఎక్కి, డోలు వాయిస్తూ, వినూత్నంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.#WATCH | Delhi: Defence Minister Rajnath Singh plays #Holi with people who have arrived at his residence. pic.twitter.com/O7K77VLsOw— ANI (@ANI) March 14, 2025కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలోని తన స్వగృహంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.#WATCH | Varanasi, UP | Historic city, Kashi celebrates the festival of colours #Holi pic.twitter.com/fYkCJwpikL— ANI (@ANI) March 14, 2025ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీలో హోలీ వేడుకలు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి.#WATCH | Maharashtra: People arrive at Juhu Beach in Mumbai to celebrate the festival of #Holi pic.twitter.com/ngIkpvlbEC— ANI (@ANI) March 14, 2025మహారాష్ట్రలోని ముంబైలో జుహూ బీచ్ దగ్గర హోలీ సందడి కనిపిస్తోంది.#WATCH | Madhya Pradesh | Rudrabhishek of lord Shiva is being performed at Ujjain's Mahakaleshwar Temple on the occasion of #Holi pic.twitter.com/sK64EWECuu— ANI (@ANI) March 14, 2025హోలీ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుని ఘనంగా అభిషేకాలు నిర్వహించారు.#WATCH | Kolkata, West Bengal: Women apply gulaal and celebrate the festival of colours, Holi pic.twitter.com/9U4w9mZavi— ANI (@ANI) March 14, 2025పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో హోలీ వేడుకలు అంత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇది కూడా చదవండి: ‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన -
పదేళ్ల తుప్పును వదిలిస్తున్నాం!
సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని తుప్పు పట్టించిందని, దానిని వదిలించే పనిలో తామున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పట్టిన తుప్పును ఒకేసారి వదిలించాలంటే వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే నెమ్మది నెమ్మదిగా వదిలిస్తూ అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని, నిధుల సాధనలో ఇద్దరు కేంద్ర మంత్రులూ ఏమాత్రం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గురువారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్ కొద్దిసేపు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘ఏ ముఖ్యమంత్రికైనా అధికారం చేపట్టిన తర్వాత అన్నీ సర్దుకోవడానికి రెండేళ్లు సమయం పడుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇలా ఎవరి పాలనైనా చూడండి.. గత పాలకులు పరిపాలించిన దానిని చక్కదిద్దడానికే రెండేళ్లు సమయం పట్టింది. ఓ పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరోపక్క ప్రతీ హామీని అమలుచేస్తూ ముందుకెళ్తున్నా’అని చెప్పారు.కేంద్ర మంత్రి అయినందునే కిషన్‌రెడ్డి టార్గెట్ ‘కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే వాళ్లు ఎవరైనా సొంత రాష్ట్రాల సమస్యలను లేవనెత్తుతారు. ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తారు. నిర్మలా సీతారామన్ అలాగే చెన్నై మెట్రోను సాకారం చేశారు. కానీ, మన కిషన్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అంశాలేవీ పట్టించుకోరు. నేను ముఖ్యమంత్రిని కాబట్టే కదా? అందరూ నన్ను టార్గెట్ చేస్తోంది.కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టే ఆయనను టార్గెట్ చేస్తున్నాం. రాష్ట్రానికి ఏం తెచ్చారని అడిగితే తప్పేంటి? మూసీ, ట్రిపుల్ ఆర్, మెట్రో ఇలా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో ఆయన ఏమైనా మాట్లాడారా? ఆయన కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెప్పిస్తే పనులు మొదలుపెట్టొచ్చు. కిషన్‌రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు, మరో మంత్రి బండి సంజయ్ ఒక నిస్సహాయ మంత్రి ’అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. హిందీని రుద్దడం ఏంటి? మూడు భాషల విధానాన్ని రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. ‘అసలు హిందీ జాతీయ భాష ఏంటి? మీరు అనుకుంటే సరిపోతుందా? హిందీ అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. ఆ తర్వాత అత్యధికమంది మాట్లాడే భాష తెలుగే. మూడో వరుసలో బెంగాల్ భాష ఉంటుంది. మీరు హిందీ మాట్లాడతారు కదా? అందరూ అదే మాట్లాడాలంటే ఎలా?’అని రేవంత్ అన్నారు. ‘గాంధీ కుటుంబంతో సీఎంకు సాన్నిహిత్యం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. గాంధీ కుటుంబంతో అందరూ అనుకునేదానికంటే ఎక్కువే సాన్నిహిత్యం ఉంది’ అని తెలిపారు.ప్రజలకు చెప్పకపోతే ఎలా? ‘రూ.7 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎలా? పదవుల విషయంలో నేను సమీకరణాలను చూడలేదు, కేవలం నేను ఇచ్చిన మాటనే చేశా. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, వివిధ చైర్మన్ పదవులు అన్నీ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికే ఇచ్చాను. విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయనన్నారు, ఆమె పార్టీకోసం ఎంతో కాలం కష్టపడి పనిచేశారు అందుకే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు.నేను ఇక్కడ కులగణన చేశాను మరి ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది అక్కడ ఎందుకు చేయడం లేదు? కేసీఆర్ అసెంబ్లీలో జరిగే చర్చలకు కూడా రావాలి. ఓన్ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. నేను 2029 ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రజలే ఈ విషయాలన్నీ గమనిస్తారు. చెప్పినవి చేస్తే వాళ్లే మనకు అండగా నిలుస్తారు’అని రేవంత్ చెప్పారు. వచ్చే మే నెలలో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఆ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
తెలంగాణ రైజింగ్‌కు మద్దతుగా నిలవండి
ఢిల్లీ : తెలంగాణ రైజింగ్ కు మద్దతుగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి జైశంకర్ ను కోరారు. ఈ మేనరకు వినతి పత్రం అందజేశారు సీఎం రేవంత్. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ కార్యక్రమాలకు సహకరించాలని విన్నవించారు.ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ రైజింగ్‌ను ప్రోత్సహించేందుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి జైశంకర్‌ను సీఎం రేవంత్ కోరారు. తెలంగాణ రైజింగ్‌ను విదేశాల్లో భారత్ కార్యక్రమాల్లోనూ ప్రచారం చేయాలని, దౌత్య, లాజిస్టిక్ సహాయంతో హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని కేంద్ర మంత్రి జైశంకర్‌కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. -
పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా..
2027 నాటికి ఢిల్లీలో తిరిగే వాహనాలలో 95 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలని, దీనికోసం ప్రభుత్వం ఈవీ పాలసీ 2.0 ప్రారంభించింది. ఈ పాలసీ కింద దశల వారీగా ఫ్యూయెల్ వాహనాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేస్తామని రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ వెల్లడించారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ నగరం.. కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దీనిని నివారించాలంటే.. ఫ్యూయెల్ వాహన స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలి. ఇందులో భాగంగానే.. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, చిన్న కమర్షియల్ వాహనాలను మాత్రమే కాకుండా CNGతో నడిచే వాహనాల సంఖ్యను తగ్గించనున్నారు. ప్రజా రవాణా కోసం కూడా ఎలక్ట్రిక్ బస్సులనే ఉపయోగించనున్నట్లు చెబుతున్నారు.ఢిల్లీ ఈవీ పాలసీ 2.0ను ప్రోత్సహించడానికి.. ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందించనుంది. ఇవి ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ట్రక్కులు మొదలైనవాటికి వరిస్తాయి. స్క్రాపేజ్ కింద కూడా కొన్ని ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పాత వాహనాన్ని స్క్రాప్ చేస్తే.. కొత్త వెహికల్ కొనుగోలుపై కొన్ని రాయితీలు లభిస్తాయి.ఇదీ చదవండి: గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలంటే.. మౌలిక సదుపాయాలను పెంచాలి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం ఛార్జింగ్ స్టేషన్లను పెంచనుంది. కొత్త భవనాలు, బహిరంగ ప్రదేశాలకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. మొత్తం మీద 2027 నాటికి ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను గణనీయంగా పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 'ఈవీ పాలసీ 2.0' ప్రారంభించింది. -
ఇన్స్టాగ్రామ్ పరిచయం.. భారత్‌కు రావడమే ఆమెకు శాపమైంది
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ఢిల్లీకి వచ్చిన విదేశీయురాలిపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం..భారత్‌కు చెందిన కైలాష్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో, ఆమెను భారత్‌కు రావాల్సి కైలాష్ కోరారు. దీంతో, ఆమె.. మహారాష్ట్ర, గోవాలో పర్యటించేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడ పర్యటనలో ఉండగా ఆమె.. కైలాష్కు ఫోన్ చేసి తన దగ్గరకు రావాలని కోరింది. అయితే, తాను అంత దూరం ప్రయాణించలేనని కైలాష్.. ఆమెకు చెప్పాడు. ఢిల్లీకి రావాలని ఆమెకు కైలాష్ సూచించారు.ఈ క్రమంలో బాధితురాలు మంగళవారం ఢిల్లీకి చేరుకుంది. అనంతరం, మహిపాల్‌పూర్‌లోని ఒక హోటల్లో బస చేసింది. ఆ తర్వాత ఆమె.. కైలాష్కు ఫోన్ చేసి తాను హోటల్లో ఉన్నట్టు తెలిపింది. దీంతో, కైలాష్ తన స్నేహితుడు వసీంతో కలిసి హోటల్‌కు వెళ్లారు. రాత్రి వారిద్దరూ అక్కడే బస చేశారు. అదే అదునుగా భావించిన వసీం.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో మరుసటి రోజు ఉదయమే బాధితురాలు.. మహిళ వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కైలాష్, వసీంను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. అలాగే, మార్గదర్శకాల ప్రకారం.. ఈ ఘటనపై బ్రిటిష్ హైకమిషన్‌కు సమాచారం అందించారు. ఇక, కైలాష్ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిసింది. తనకు ఇంగ్లీష్ మాట్లాడటం కష్టమని, తనతో కమ్యూనికేట్ చేయడానికి గూగుల్ ట్రాన్స్‌లేట్ ఉపయోగించేవాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది.British Woman Allegedly Raped In Delhi Hotel By Man She Met on Instagram @anushkagarg2000 reports pic.twitter.com/kGI9dWxwJ2— NDTV (@ndtv) March 13, 2025 -
పార్లమెంట్ లోని YSRCP కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు
-
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఛాతి నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, తెల్లవారుజామున 2 గంటలకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. Vice President Jagdeep Dhankhar was admitted to the cardiac department at AIIMS Delhi in the early morning. He is stable and under observation: AIIMS Hospital Sources— ANI (@ANI) March 9, 2025 -
Women's Day : మహిళలకు ప్రతీ నెల రూ. 2,500!
ఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా నెలకు రూ. 2,500 చొప్పున అందిస్తామని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. ‘మహిళా సమృద్ధి యోజనా’ పథకంలో భాగంగా ఈ హామీని అమలు చేయాలని ఢిల్లీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో మహిళలకు రూ. 2500 స్కీమ్‌కు ఆమోద ముద్ర పడింది. దీనిపై సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ‘ ఈరోజు మహిళల దినోత్సవం. మన క్యాబినెట్ సమావేశం కూడా అందుకే ఈరోజున పెట్టాం. మహిళా సమృద్ధి యోజనా పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ హామీని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చాం. దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నాం’ అని ఆమె తెలిపారు. ఈ స్కీమ్ కోసం రూ. 5,100 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని తన నేతృత్వంలోనే ఏర్పాటు చేసి మరీ పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు రేఖా గుప్తా.మహిళా సమృద్ధి యోజనా పథకానికి ఆమోద ముద్ర పడింది. ఇందుకోసం పోర్టల్ త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ నుంచి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పోర్టల్ పొందుపరుస్తాం. దీనికి ముగ్గురు మంత్రుల కమిటీ ఉంది. కపిల్ శర్మ, అశిష్ సూద్, పర్వేష్ వర్మలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మంత్రి మన్ జిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. -
ఢిల్లీలో నేషనల్ మీడియా ముందు చంద్రబాబు కోతలు
-
ఢిల్లీ పార్లమెంటుకు షిప్ట్ అవుతున్న రామ్ చరణ్
-
ఢిల్లీకి కాంగ్రెస్ బృందం
-
పార్లమెంట్‌కు రామ్ చరణ్.. ఎందుకంటే?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం ఆర్సీ16. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే సెట్లోని ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు చెర్రీ. తన కూతురు క్లీంకారతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్సీ16 మూవీ షూటింగ్ షెడ్యూల్ మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే.మైసూరు షెడ్యూల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ దాదాపుగా ముగిసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ టీమ్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. ఢిల్లీలోని పార్లమెంట్లో మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుడా జామా మసీదు ప్రాంతంలోనూ షూట్ చేయనున్నారని టాక్. షూటింగ్ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 4న పార్లమెంట్లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం బంద్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పెట్రోల్ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చిచెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకొనేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్ పంపుల యజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణ(Pollution control)పై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.కాలం చెల్లిన వాహనాల(old vehicles)కు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు. గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు.ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రజారవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
వాహనదారులకు అలర్ట్.. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.కాగా, పెట్రోల్ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చి చెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్ పంపుల యాజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణపై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు.గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు. ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రజా రవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ప్రపంచ శక్తిగా భారత్
న్యూఢిల్లీ: తాను ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపుతో సత్ఫలితాలు లభిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్నాయని, ప్రపంచమంతటా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. మన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోందని అన్నారు. భారతదేశం అత్యున్నత తయారీ కేంద్రంగా, ప్రపంచ కర్మాగారంగా ఎదుగుతోందని స్పష్టంచేశారు. శనివారం ఢిల్లీలో ఎన్ఎక్స్టీ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘న్యూస్ఎక్స్ వరల్డ్’ వార్తాచానల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇండియా ఎన్నో రికార్డులు సృష్టిస్తోందని, ప్రపంచ శక్తిగా మారుతోందని ఉద్ఘాటించారు. అపరిమిత నూతన ఆవిష్కరణలకు భారత్ అడ్డా అని తేల్చిచెప్పారు. ఎన్నో క్లిష్టమైన సమస్యలకు చౌకగా పరిష్కార మార్గాలు కనుగొంటూ ప్రపంచ దేశాలకు సైతం అందిస్తోందని వివరించారు. 21వ శతాబ్దంలో భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. భారత్‌లో పర్యటించాలని, దేశాన్ని అర్థం చేసుకోవాలని ప్రపంచ దేశాల ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలిపారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ఇండియా ప్రగతికి ప్రపంచమే సాక్షి ‘‘ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలపాటు ఇండియాను తమ బ్యాక్ ఆఫీసుగానే పరిగణించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రపంచానికి న్యూ ఫ్యాక్టరీగా ఇండియా ఎదుగుతోంది. మ నం శ్రమశక్తి కాదు.. ముమ్మాటికీ ప్రపంచ శక్తి. రక్షణ ఉత్పత్తుల్లో మనది అగ్రస్థానం. మన ఇంజనీరింగ్, టెక్నాలజీ సామర్థ్యం ఎలాంటిదో ప్రపంచానికి తెలుస్తోంది. ఎల్రక్టానిక్స్ నుంచి ఆటోమొబైల్ దాకా కీలక రంగాల్లో ఇండియా ప్రగతికి ప్రపంచమే సాక్షి. విదేశాలకు ఎన్నో ఉత్పత్తులు అందజేస్తున్నాం. గ్లోబల్ సప్లై చైన్‌లో విశ్వసనీయ భాగస్వామిగా ఇండియాకు గుర్తింపు దక్కుతోంది. వేర్వేరు రంగాల్లో దేశం నేడు నాయకత్వ స్థాయికి ఎదిగిందంటే ఎన్నో ఏళ్ల నిరి్వరామ శ్రమ, క్రమానుగత విధానపరమైన నిర్ణయాలు’’. ఇండియా అంటే ఇండోవేటింగ్ ‘‘వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ గ్లోబల్ అనే దార్శనికతను కొన్నేళ్ల క్రితం నేను స్వయంగా ఆవిష్కరించా. అది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఆశయం ఆచరణగా మారింది. ఫలితాలను స్వయంగా చూస్తున్నాం. సెమీకండక్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల తయారీలో ముందుకు దూసుకెళ్తున్నాం. మన సూపర్‌ఫుడ్స్ మఖానా, చిరుధాన్యాలకు ప్రపంచమంతటా ఆదరణ దక్కుతోంది. మన ఆయుష్ ఉత్పత్తులు, యోగా గురించి అన్ని దేశాల్లోనూ చర్చించుకుంటున్నారు. మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా ప్రపంచం ఎదుట వ్యక్తీకరించుకోవాలి. మేకప్ అవసరం లేదు. సంకోచం వద్దు. మన అసలైన విజయగాథలు ఉన్నది ఉన్నట్లుగానే ప్రపంచానికి చేరాలి. ‘సున్నా’ను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఇండియా. ఇప్పుడు అపరిమిత ఆవిష్కరణల వేదికగా ఎదుగుతోంది. ఇండియా అంటే కేవలం ఇన్నోవేషన్ కాదు.. అది ఇండోవేటింగ్. అంటే ఇన్నోవేటింగ్ ద ఇండియన్ వే. ప్రపంచానికి అవసరమైన ఎన్నో పరిష్కార మార్గాలను చౌకగా, సులభంగా, వేగంగా మనం అందిస్తున్నాం. అద్భుతమైన యూపీఐ వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలు ఇలాంటి వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాయి. కోవిడ్–19 నియంత్రణ కోసం వ్యాక్సిన్లు తయారీ చేసి ఇతర దేశాలకు సరఫరా చేశాం. మనం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ఎన్నో దేశాలకు మార్గదర్శిగా మారింది’’ అని మోదీ అన్నారు. -
Delhi: ఆ వాహనాలకు ఇంధనం బంద్..!
ఢిల్లీ : నిత్యం తీవ్ర వాయు కాలుష్యం(Delhi Pollution)తో కొట్టిమిట్టాడే ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది తాజా బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలను బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈరోజు(శనివారం) సమీక్ష నిర్వహించారు పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా.ఈ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. పాత వాహణాలపై ఆంక్షలు, స్మోగ్ నిరోధక చర్యలు తప్పనిసరి చేయడంతో పాటు పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. ఢిల్లీలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి యాంటీ స్మోగ్ గన్ లను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నఆరు. ఢిల్లీలో కొన్ని పెద్ద హోటళ్లు, కొన్ని పెద్ద కార్యాలయం సముదాయాలు, ఢిల్లీ విమానాశ్రయం, పెద్ద నిర్మాణ స్థలాలకు వెంటనే యాంటీ స్మోగ్ ఎక్స్ ని ఇన్ స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయనున్నారు.వాహనాలకు 15 ఏళ్లు దాటితే..ఇక 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఢిల్లీ బంకుల్లో ఇంధనం నిలిపివేయనున్నారు. 15 ఏళ్ల పైబడిని వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
రాజ్యం అండదండలతో పట్టపగలు ఢిల్లీ రాజవీధుల్లో చెలరేగిపోయిన ముష్కర మూకలు చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా 3,000 మందిని ఊచకోత కోసిన ఉదంతాల్లో ఆలస్యంగానైనా బాధితులకు న్యాయం దక్కుతోంది. ఆ మారణహోమం జరిగి నిరుడు అక్టోబర్‌కు నలభైయ్యేళ్లు కాగా, ఒక కేసులో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌కు రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను హతమార్చిన కేసులో ఒక యావజ్జీవ శిక్ష, గృహదహనానికి ప్రేరేపించిన కేసులో మరో యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ ఊచకోతకు సంబంధించి వేరే కేసులో సజ్జన్ 2018 నుంచి యావ జ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. దేశ విభజన సమయంలో పెద్ద యెత్తున జరిగిన హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు, లూటీలు, ఆస్తుల ధ్వంసం ఉదంతాల తర్వాత దేశ చరిత్రలో 1984 నాటి నరమేధం అతి పెద్దది. ఇలాంటి ఉదంతాల్లో మూకలు ఉన్మాదంతో దాడులు చేయటం కనబడుతుంది. ఈ దాడుల వెనక ఎప్పుడూ సంఘటిత నేరగాళ్ల ముఠా ఉంటుంది. వీరికి రాజకీయ నాయకుల అండదండలుంటాయి. రాజకీయాల్లో తమ మాటే చెల్లు బాటు కావాలని, తమ పేరు చెబితే జనమంతా హడలెత్తిపోవాలని ఈ ముఠాల వెనకున్న నేతలు కోరుకుంటారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన నివాస గృహంలోనే ఒకచోటి నుంచి మరో చోటుకు వెళ్తుండగా అంగరక్షకులు ఆమెను తుపాకులతో కాల్చిచంపిన అనంతరం ఢిల్లీలోనూ, వేరే రాష్ట్రాల్లోనూ ఈ మారణహోమం కొనసాగింది. ఇందిర హంతకులు సిక్కులు గనుక, ఆ ఉదంతానికి ప్రతీకారంగా సిక్కు మతానికి చెందిన ఎవరినైనా చంపుకుంటూ పోవాలని స్పష్టమైన ఆదేశాలున్న పర్యవసానంగానే ఈ దుర్మార్గం సాగింది. ‘ఉన్మాద మూకలు ఇల్లిల్లూ తిరిగి మారణహోమం సాగిస్తున్నాయి. దయచేసి కాపాడండ’ంటూ పోలీస్ స్టేషన్లకు పోయి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. హంతక ముఠాలు పట్టపగలు నడివీధుల్లో స్వైరవిహారం చేస్తున్నా దిక్కూ మొక్కూ లేదంటే అలాంటి నేరగాళ్లు మరింతమంది పుట్టుకొస్తారు. సమాజానికి పీడలా తయారవుతారు. ప్రతీకారం పేరుతో మరికొన్ని ముఠాలు రంగప్రవేశం చేస్తాయి. పర్యవసానంగా శాంతిభద్రతలు కరువవు తాయి. వరసగా మూడు నాలుగు రోజులపాటు ఈ మాదిరి ఉదంతాలు తీవ్ర స్థాయిలో కొనసాగినా పోలీసులు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోతే ఆనాడు ప్రజాతంత్ర హక్కుల ప్రజాసంఘం (పీయూడీఆర్), పౌరహక్కుల ప్రజాసంఘం(పీయూసీఎల్) నాయకులు విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో బాధిత కుటుంబాల నుంచి వివరాలు కనుక్కుని హత్యలు, సజీవ దహనాలు, అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసాలు, గృహదహనాల వివరాలతో రోజుల వ్యవధిలోనే ‘ఎవరు నేరస్తులు?’ పేరుతో పుస్తకం ప్రచురించారు. ఒకపక్క ఢిల్లీ నగరంలో దారుణాలు కొనసాగుతుండగానే వీరు ప్రాణాలకు తెగించి ఇల్లిల్లూ తిరిగారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనాల ఆధారంగా దగ్గరుండి హింసాకాండ నడిపించిన ఆనాటి కాంగ్రెస్ నాయకుల పేర్లు సైతం దానిలో ప్రచురించారు.అందులో సజ్జన్‌కుమార్ ఒకరు. ఢిల్లీలోని సుల్తాన్‌పురి, కంటోన్మెంట్ తదితరచోట్ల సజ్జన్ రెచ్చగొట్టే ఉపన్యాసాలిచ్చి ఉన్మాద ముఠాల్లోని ప్రతి ఒక్కరికీ వందేసి రూపాయలు, మద్యం సీసా అందించా డని ప్రత్యక్ష సాక్షులు ఫిర్యాదు చేశారు. హంతక మూకలను ఉసిగొల్పిన నాయకుల్ని వదిలి ప్రత్యక్ష సాక్షులను భయపెట్టేందుకు, కేసులు ఉపసంహరింపజేయటానికి పోలీసులు ఒత్తిడి తెచ్చిన ఉదంతాలు కోకొల్లలు. ఢిల్లీ కౌన్సిలర్‌గా, మూడుసార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇంతగా బరితెగించటం ఊహించలేం. ఈయనే కాదు... హెచ్‌కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ వంటి అనేకమంది నాయకులకు ఢిల్లీ ఊచకోతలో ప్రమేయం ఉండొచ్చని దాదాపు డజను కమిషన్లు భావించాయి. అయినా తమ దర్యాప్తులో సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తేల్చింది.వ్యక్తులకు భావోద్వేగాలుంటాయి. రాగద్వేషాలుంటాయి. కానీ వ్యవస్థ వీటికి అతీతంగా ఉండాలి. తటస్థంగా మెలగాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలి. కానీ ఢిల్లీ ఊచ కోత నిందితులకు ఆనాటి రాజ్యవ్యవస్థ అండదండలిచ్చింది. అందుకే నలభైయ్యేళ్లు గడుస్తున్నా చాలా కేసులు ఇంకా కింది కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి. కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో వీగిపోయాయి. ఇలాంటి పరిస్థితులే ప్రతీకారేచ్ఛకు పునాదులవుతాయి. పంజాబ్‌ను దాదాపు దశాబ్దంపాటు అట్టుడికించిన ఉగ్రవాదానికి మూలం సిక్కుల ఊచకోతనే. వెనువెంటనే నిందితులను అరెస్టుచేసి వారికి సత్వరం శిక్షలుపడేలా చేస్తే ఈ బెడద ఉండేదే కాదు. ఈ మారణకాండపై అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని ప్రశ్నించినప్పుడు ‘వటవృక్షం నేలకూలినప్పుడు భూమి కంపించటం సహజమే’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఆ తర్వాత కాలంలో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాటి ఊచకోతకు క్షమాపణ చెప్పారు. అలాగని నిందితులను శిక్షించే ప్రక్రియను వేగవంతం చేయలేకపోయారు. ఇలాంటి ధోరణులు మరిన్ని హత్యాకాండలను ప్రోత్సహిస్తాయి. 2002లో గుజరాత్లో జరిగిన నరమేధం అందుకు ఉదాహరణ. ఆ దారుణ ఉదంతంలోనూ కొద్దిమంది దోషులకు శిక్షపడినా చాలామంది తప్పించుకున్నారు. కాలం గాయాలను మాన్పుతుందని చెబుతారు. కానీ తమ ఆప్తులను కళ్లెదుటే హతమార్చినవారిని నిర్లజ్జగా నెత్తిన పెట్టుకునే వ్యవస్థలుంటే అది ప్రతీకారానికి పురిగొల్పుతుంది. క్షతగాత్ర హృదయం చల్లారదు. అది నిత్యమూ రగులుతూనే ఉంటుంది. -
సీఎం గారు నిద్ర లేవండి.. మనం అసెంబ్లీలో ఉన్నాం
ఢిల్లీ : ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం రేఖా గుప్తాను టార్గెట్ చేసింది. మొన్నటికి మొన్న సీఎం క్యాంప్ ఆఫీసులో రేఖాగుప్తా బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్ర పటాల్ని తీసేయించారని ఆరోపణలు గుప్పించింది. ఆప్ నేత అతిషీ మర్లేనా ట్వీట్ కూడా చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆప్ మరోసారి సీఎం రేఖా గుప్తాను ప్రస్తావిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో 1౩ సెకన్ల వీడియోను షేర్ చేస్తూ ఇక్కడ నిద్ర పోతున్నది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. తమకు సేవ చేయాలని ఢిల్లీ ప్రజలు రేఖాగుప్తాను అసెంబ్లీకి పంపించారు. కానీ అసెంబ్లీ సమావేశం జరిగే సమయంలో సీఎం గారు నిద్రపోతున్నారు’అని సెటైర్లు వేసింది. అంతేకాదు, సీఎం గారు అంబేద్కర్,భగత్ సింగ్‌ను అవమానించడంలో మీరు కొంత సమయం తీసుకున్నట్లయితే, దయచేసి అసెంబ్లీ చర్చపై కూడా కొంచెం దృష్టి పెట్టండి’అని వ్యాఖ్యానించింది. ఇక ఆప్ షేర్ చేసిన వీడియోలో సీఎం రేఖా గుప్తా అసెంబ్లీలో కళ్లు మూసుకున్నట్లు కనిపిస్తున్న దృశ్యాల్ని చూడొచ్చు.CM मोहतरमा के दो रूप‼️1️⃣ विपक्ष में रहते हुए जनता के काम रोकना 2️⃣ सरकार में रहते हुए सदन के अंदर कुंभकर्णी नींद सोना pic.twitter.com/zY6E72pquU— AAP (@AamAadmiParty) February 26, 2025అయితే, ఆప్ షేర్ చేసిన వీడియోపై రేఖా గుప్తా అభిమానులు, బీజేపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. మా సీఎం అసెంబ్లీ చర్చను కళ్లుమూసుకుని శ్రద్దగా వింటున్నారని, ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ఆప్ కావాలనే టార్గెట్ చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. -
ఆప్ సర్ప్రైజ్.. ఎంపీగా కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సైలెంట్ అవుతారని భావించిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. పార్టీ కన్వీనర్ హోదాలో క్రమం తప్పకుండా పార్టీ మీటింగ్‌లకు హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం చవిచూసింది. మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓడిపోవడంతో ఢిల్లీ రాజకీయాలకు ఆయన శాశ్వతంగా దూరం అవుతారని, అందుకు ‘లిక్కర్ స్కామ్’ అవినీతి మరకే కారణమని విశ్లేషణలు నడిచాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష నేతగా అతిషీని ఎంపిక చేశారని కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో..పంజాబ్ లూథియానా వెస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఆప్ ఆశ్చర్యకరరీతిలో అభ్యర్థిని ఎంపిక చేసింది. కిందటి నెలలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి మృతి చెందారు. దీంతో.. రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఆ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఈ ఉదయం ప్రకటించింది ఆప్. సంజీవ్ అరోరా(Sanjeev Arora) 2022లో ఆప్ తరఫున పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028తో ముగియనుంది. దీంతో అరోరాను అసెంబ్లీకి పంపి.. ఆ ఎంపీ సీటును కేజ్రీవాల్‌కు అప్పజెప్పబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఈసీ ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. అయితే ఆర్నెల్ల లోపు ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ప్రకారం.. జులై 11లోపు ఈ ఉపన్నిక జరిగే అవకాశం ఉంది.అందుకేనా సమీక్షలు!ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పంజాబ్ ఆప్ కేడర్‌తో కేజ్రీవాల్ వరుసబెట్టి సమావేశాలు జరిపారు. ఒకానొక టైంలో.. భగవంత్ మాన్‌ను తప్పించి కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అవుతారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ చర్చల సారాంశం.. బహుశా రాజ్యసభ స్థానం కోసమే అయి ఉంటుందని ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. -
ప్రధాని మోదీతో రేవంత్ భేటీ.. మెట్రో, ఆర్ఆర్ఆర్పై చర్చ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటుగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ సహా మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మెట్రో ఫేజ్-2 లైన్ ఎయిర్పోర్ట్ పొడిగింపు, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అనుమతులు, మూసీ నది సుందరీకరణ నిధులు, కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. -
ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ రిపోర్ట్
ఢిల్లీ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ప్రభుత్వానికి రూ.2002 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. తాజా కాగ్ నివేదికతో కోర్టు విచారణ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.కాగా, నవంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు నూతన మద్యం విధానం కొనసాగింది. కుంభకోణం వెలుగు చూడడంతో నూతన మద్యం విధానం రద్దయ్యింది. ఈ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు కీలక నేతలు జైలు శిక్షను అనుభవించారు. -
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా అధికార బీజేపీ శాసనసభ్యుడు విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. కొత్తగా కొలువుదీరిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. సెషన్ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. అనంతరం, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గుప్తా పేరును స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తూ సీఎం రేఖా గుప్తా, మంత్రి రవీందర్ ఇంద్రజ్ రెండు తీర్మానాలను ప్రవేశపెట్టగా, వీటిని మంత్రులు పర్వేశ్ వర్మ, మంజిందర్ సింగ్ బలపరిచారు. మూడువాణి ఓటుతో తీర్మానాలను సభ ఆమోదించిందని ప్రొటెం స్పీకర్ అర్వీందర్ సింగ్ లవ్లీ ప్రకటించారు. దీంతో, సీఎం రేఖా గుప్తా, ప్రతిపక్ష నేత ఆతిశీ వెంట రాగా కొత్త స్పీకర్ కుర్చీలో ఆసీనులయ్యారు. స్పీకర్ విజేందర్ గుప్తాకు సీఎం రేఖా గుప్తా శుభాకాంక్షలు తెలపగా, ఆప్‌కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత, సిక్కు వ్యతిరేక పార్టీ ఢిల్లీ అసెంబ్లీకి సారథ్యం వహించడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. సీఎం కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలను తీసేయడం చూస్తే బీజేపీ దళిత వ్యతిరేక వైఖరి తేటతెల్లమవుతోందని ఆరోపించారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో సభ 15 నిమిషాలపాటు వాయిదా పడింది. ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించవద్దని అనంతరం ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ‘ఎక్స్’లో బీజేపీని కోరారు. ప్రధాని మోదీ ఫొటో పెట్టి, అంబేడ్కర్ ఫొటోను తీసేయడం కోట్లాది మంది ఆయన అనుచరుల మనస్సులను గాయపరిచినట్లేనన్నారు.ఆరు భాషల్లో ఎమ్మెల్యేల ప్రమాణంసెషన్ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. వీరు హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, మైథిలి, పంజాబీ భాషల్లో ప్రమాణం చేయడంతో అసెంబ్లీలో భాషాపరమైన వైవిధ్యం ప్రతిఫలించింది. -
వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?
ఢిల్లీ : సీఎం రేఖా గుప్తా (Delhi cm Rekha Gupta) వివాదంలో చిక్కుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party)నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను సీఎం రేఖా గుప్తా అవమానించారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది?ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులైన అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని, ఆ ఫొటోల స్థానంలో మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను ఉంచినట్లు ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో తాను సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయని, నూతన సీఎంగా బాధత్యలు చేపట్టిన రేఖాగుప్తా ఆ ఫొటోల్ని తొలగించి వాటి స్థానంలో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టారని పేర్కొన్నారు.बीजेपी को दलितों और सिखों से है गहरी नफ़रत‼️सरकार में आते ही बाबा साहेब और भगत सिंह जी की तस्वीर हटवाई। pic.twitter.com/9loyTc7R1w— AAP (@AamAadmiParty) February 24, 2025 ఇదే అంశంపై అతిషీ మర్లేనా మీడియాతో మాట్లాడారు. బీజేపీ దళిత వ్యతిరేకి. తాజాగా,ఘటనతో ఆధారాలతో సహా భయట పడింది. తమ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్,అంబేద్కర్ ఫొటోలు పెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ యాంటీ దళిత్ ఎజెండాతో ముందుకు సాగుతుంది. అంబేద్కర్,భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని విమర్శలు గుప్పించారు.ఆప్‌కు భయం పట్టుకుందిఆ ఆరోపణల్ని సీఎం రేఖాగుప్తా స్పందించారు. తన కార్యాలయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయంటూ ఆప్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాడు పెండింగ్‌లో ఉన్న 14 కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెడతామని ఆదివారం సీఎం రేఖాగుప్తా ప్రకటించారు. ఆ ప్రకటనకు ఆప్ భయపడిందని, ప్రజల్ని మభ్య పెట్టేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. మీరెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా.. కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రభుత్వ అధిపతి ఫొటో పెట్టకూడదా? దేశ రాష్ట్రపతి ఫొటో పెట్టకూడదా? జాతిపిత గాంధీజీ ఫొటో పెట్టకూడదా? భగత్ సింగ్, అంబేద్కర్ మన మార్గదర్శకులు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధిపతిగా, మేం వారి ఫొటోలు పెట్టేందుకు స్థలం కేటాయించాం. ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం నా పని కాదు.నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటానని స్పష్టం చేశారు. -
ఢిల్లీ అసెంబ్లీ: ప్రతిపక్షనేతగా అతిషి.. చరిత్రలో తొలిసారిగా..
ఢిల్లీ: ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. కీలక పదవిని చేపట్టిన తొలి మహిళా నేతగా ఆమె చరిత్రలో నిలిచారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక మహిళా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించనున్న అతిషి.. ఢిల్లీ మహిళా సీఎంతో తలపడనున్నారు.ఆదివారం నిర్వహించిన ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో అతిషిని ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కీలక పదవి కోసం ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించారు. తనను విశ్వసించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు, శాసనసభా పక్షానికి అతిషి కృతజ్ఞతలు తెలిపారు.బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతుకకు ప్రతీకగా నిలుస్తోందని అతిషి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ పేర్కొంది.ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. కేజ్రీవాల్‌పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్‌పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దీంతో ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది. -
విజనరీ నాయకులు కావాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించేలా నేడు అన్ని రంగాల్లో ప్రపంచస్థాయి నాయకులు రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రయోజనాలను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసే అత్యుత్తమ నాయకులు సమాజానికి కావాలని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్(సోల్) సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఉత్సాహవంతులైన సారథుల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో సోల్ లాంటి సంస్థలు గేమ్‌ఛేంజర్ అవుతాయని వ్యాఖ్యానించారు. వేర్వేరు రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ఆలోచనా దృక్పథంతో వ్యవహరిస్తూ స్థానికంగా అభివృద్ధికి పాటుపడే నేతలు తయారు కావాలని పిలుపునిచ్చారు. నేడు మన దేశం ‘గ్లోబల్ పవర్‌హౌస్’గా ఎదుగుతోందని, ఈ నేపథ్యంలో భారతీయ దార్శనికతను ప్రతిబింబించే నాయకత్వం అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. దేశానికి విజనరీ నాయకులు కావాలని వివరించారు. కీలక రంగాల్లో దేశం మరింత వేగంగా ముందుకు పరుగెత్తాలని, సమర్థ నాయకత్వం వల్లే అది సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. సోల్ లాంటి సంస్థల అవసరం నేడు ఎంతో ఉందన్నారు. రాజకీయ అధికారానికే పరిమితం కావొద్దు ‘గ్లోబల్ అప్రోచ్, లోకల్ మైండ్‌సెట్’కలిసిన నాయకులు సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, సంక్షోభాలను పరిష్కరించడంలో, భవిష్యత్తు పట్ల సరైన ఆలోచనలు చేయడంలో సమర్థులైన వ్యక్తులను దేశం కోరుకుంటోందని పేర్కొన్నారు. భవిష్యత్ నాయకత్వం కేవలం రాజకీయ అధికారానికే పరిమితం కావొద్దని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లు, వేదికలపై మన దేశం పోటీ పడాలంటే అంతర్జాతీయ పరిణామాలపై పూర్తి అవగాహన కలిగిన నాయకులు కావాలన్నారు. డీప్–టెక్, అంతరిక్షం, బయోటెక్, పునరుత్పాదక ఇంధనం వంటి ఆధునిక రంగాలతోపాటు క్రీడలు, వ్యవసాయం, తయారీ, సామాజిక సేవ వంటి రంగాల్లో నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని ఉద్ఘాటించారు. ఆ స్ఫూర్తిని మననం చేసుకోవాలి అన్ని రంగాల్లో అత్యున్నత ఫలితాలు సాధించాలని కేవలం కోరుకుంటే సరిపోదని, ఆచరణలో సాధించి చూపాలని ప్రధానమంత్రి తేలి్చచెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థలను అభివృద్ధి చేసే సమర్థుల అవసరం నేడు దేశానికి ఎంతగానో ఉందని అభిప్రాయపడ్డారు. మన దేశంలో పురుడు పోసుకున్న ఎన్నో సంస్థలు ప్రపంచ స్థాయిలో విజయాలు సాధించాయని గుర్తించారు. ఆ స్ఫూర్తిని మరోసారి మననం చేసుకోవాలన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా మనమంతా ముందుకు సాగుతున్నామని, ఈ తరుణంలో జాతి నిర్మాణం కోసం మానవ వనరుల నిర్మాణం అత్యంత కీలకమని వివరించారు. ఉత్తమమైన పౌరులతోనే దేశం ముందంజ వేస్తుందన్నారు. మానవ వనరుల విషయంలో గుజరాత్ అనుభవాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు. మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు గుజరాత్లో సహజ వనరులేవీ లేవన్నారు. గుజరాత్ భవిష్యత్తుపై అప్పట్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. సమర్థవంతమైన మానవ వనరులను, నాయకులను తయారు చేసుకోవడంతో గుజరాత్ నేడు అభివృద్ధి పథంలో నడుస్తోందని వెల్లడించారు. గుజరాత్లో వ జ్రాల గనులు లేవని, అ యినప్పటికీ ప్రపంచంలో ప్రతి పది వజ్రాల్లో తొమ్మి ది వజ్రాలు గుజరాతీల చేతుల్లోనే సానపెట్టుకొని అందంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. మోదీ నాకు పెద్దన్న: భూటాన్ ప్రధాని గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ సమీపంలో విశాలమైన ‘సోల్’క్యాంపస్ త్వరలో సిద్ధం కాబోతోందని నరేంద్ర మోదీ చెప్పారు. బలమైన నాయకత్వాన్ని త యారు చేసుకోవడంపైనే మన దార్శనికత, భవిష్యత్తు ఆధారపడి ఉన్నా యని తెలిపారు. ‘సోల్’ నుంచి సమర్థులైన నాయకులు బయటకు రావాలని ఆకాంక్షించారు. మనమంతా ఉమ్మడి లక్ష్యం, సమ్మిళిత ప్రయత్నాలతో ముందుకు కదిలితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని వెల్లడించారు. 21వ శతాబ్దంలో జని్మంచినవారు భారతీయ సమాజాన్ని తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. యువశక్తితో దేశం నవ్య పథంలో పయనించబోతోందని అన్నారు. ‘సోల్’సదస్సులో భూటాన్ ప్రధానమంత్రి దాషో త్సెరింగ్ తాబ్గే సైతం పాల్గొన్నారు. మోదీ గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. ఆయన తనకు పెద్దన్న లాంటివారని చెప్పారు. -
ఢిల్లీ లేడీడాన్ అరెస్ట్.. డ్రగ్స్ సరఫరా చేస్తుండగా..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో లేడి డాన్‌గా పేరొందిన జోయాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోయాఖాన్ వద్ద నుంచి 270 గ్రాముల నిషేధిత హెరాయిన్‌ను స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హషీమ్బాబా మూడో భార్య అయిన జోయాఖాన్ బాబా నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. విలాసవంతమైన జీవితం గడిపే జోయా సెలబ్రిటీల పార్టీలు,ఫంక్షన్లకు తరచు హాజరవుతుంది.గ్యాంగ్ నడిపే విషయమై తన భర్త బాబాను తరచు జైలుకు వెళ్లి కలిసి సలహాలు తీసుకుంటుందని పోలీసులు తెలిపారు.జోయాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె వారి నుంచి తప్పించుకుంటూ వస్తోంది.అయితే నార్త్ఈస్ట్ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తోందని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి జోయాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.జోయా వద్ద దొరికిన 270 గ్రాముల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఒక కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా. -
అతిషికి సీఎం రేఖా గుప్తా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా మాజీ సీంఎ అతిషికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయిందంటూ అతిషి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు పాలించాయి. ఇన్ని సంవత్సరాల పాలనలో వాళ్లేం చేశారు. మేం వచ్చి ఒక్కరోజే అయింది. తొలి రోజే నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఢిల్లీ ప్రజలకు రూ.10 లక్షల రూపాయల ఆయుష్మాన్ బీమా యోజన వర్తించేలా ఆదేశాలిచ్చాం. వాళ్లకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు. వాళ్లు ముందు వారి పార్టీని సరిగా చూసుకోవాలి. చాలా మంది పార్టీని వదిలేందుకు సిద్ధమవుతున్నారు.గత ప్రభుత్వ అక్రమాలపై కాగ్ రిపోర్ట్ బయటపెడతామని ‘ఆప్’ భయపడుతోంది’అని అతిషికి సీఎం రేఖ కౌంటర్ ఇచ్చారు. కాగా, కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీ మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీ అమలును మరిచిపోయిందని అతిషి గురువారం ఎక్స్(ట్విటర్)లో విమర్శించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ కొత్త సీఎంకు ‘ఏడు’ సవాళ్లు.. రూపు ‘రేఖ’లు మారేనా?
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. అదే వేదికపై మంత్రులుగా మరో ఆరుగురితోనూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజే మంత్రులకు శాఖలు కూడా ఏర్పాటు చేశారు. మంత్రివర్గ తొలి కూర్పులో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశీశ్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. రేఖా గుప్తాకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది.మరోవైపు, బీజేపీ కొత్త ప్రభుత్వానికి ఢిల్లీలో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలు తీర్చాల్సి ఉంది. రాబోయే ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం హామీల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రేఖా గుప్తా ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే...1. మహిళలకి నెలకు రూ.2500 ఉచిత ఆర్థిక సహాయం, గర్భిణులకు 21 వేల రూపాయల ఆర్థిక సహాయం. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం.2. యమునా నది ప్రక్షాళన 3. వాయు కాలుష్య నిర్మూలన 4. మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం 5. 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీలు సహా సంక్షేమ పథకాల అమలు 6. మహిళల భద్రత 7. దేశ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం. -
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత
-
42.6% మంది పట్టభద్రులే ఉద్యోగాలకు అర్హులు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. కానీ, దేశంలోని గ్రాడ్యుయేట్లలో 42.6 శాతం మందికే ఉద్యోగం పొందడానికి అర్హత ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ‘ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్–2025’అధ్యయనంలో పట్టభద్రుల నైపుణ్యాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2023లో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య 44.3 శాతం కాగా.. 2024లో 1.7 శాతం పడిపోయి 42.6 శాతానికి తగ్గిపోయింది. కొత్తగా పట్టభద్రులైన వారి నుంచి అంచనాలు అధికంగాఉండటం వల్ల ఈ కొరత ఏర్పడిందని నివేదికలో తేలింది. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,700కి పైగా క్యాంపస్‌లలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులపై అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అత్యంత సమర్థత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌కాలేజీలు వరుసగా టాప్–3లో ఉన్నాయి.అలాగే.. అత్యధిక అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ 10స్థానంలో ఉండటం విశేషం. ఉత్తరాది రాష్ట్రాలదే హవా... » దేశంలో కనీసం 50% మంది గ్రాడ్యుయేట్లు ఉపాధి పొందగల రాష్ట్రాలు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. » ఓవరాల్ పర్ఫార్మెన్స్లో రాజస్తాన్‌కు టాప్ 10లో చోటు దక్కలేదు. కానీ, సాంకేతిక అర్హతలున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తర్వాత 48.3 శాతంతో రాజస్తాన్ 5వ స్థానంలో నిలిచింది. » నాన్–టెక్నికల్ విభాగంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ (54%), ఢిల్లీ (54%), పంజాబ్ (52.7%) ఉన్నాయి నైపుణ్యాలుఉండాల్సిందే.. ఎస్.లావణ్యకుమార్, సహవ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్ నాన్–టెక్ గ్రాడ్యుయేట్స్ అంశంపై గత 15 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విశ్వవ్యాప్తం కావడంతో... భారత్‌లో విదేశీ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల తగిన శిక్షణ పొందడంతోపాటు అవసరమైన డొమైన్లలో నైపుణ్యాలు ఉంటే నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్‌కూ మంచి అవకాశాలు లభిస్తాయి. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆన్లైన్లో డిగ్రీలు, ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి కొన్ని విషయాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే తగిన నైపుణ్యాలు తప్పనిసరి. » 2023తో పోలిస్తేౖటైర్–1, టైర్–3 కళాశాలలకు చెందిన పట్టభద్రుల ఉపాధి సామర్థ్యం స్వల్పంగా తగ్గింది. టైర్–1 విషయానికొస్తే.. ఈ సంఖ్య 2023లో 49.1శాతం కాగా.. 2024లో 48.75 శాతంగా ఉంది. » టైర్–3 లో 44% నుంచి 43.6 శాతానికి పడిపోయింది. టైర్–2 కళాశాలల్లో ఎక్కువ క్షీణత కనిపించింది. 2023లో 47.5% మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగానికి అర్హులుగా ఉంటే.. 2024లో అది 46.2 శాతానికి తగ్గింది. » ఉద్యోగానికి అర్హులైన గ్రాడ్యుయేట్ విభాగంలో మహిళలు (42%) పురుషుల (43%) కంటే పెద్దగా వెనుకబడి లేరని స్పష్టమవుతోంది. -
Delhi: మంత్రులకు శాఖల కేటాయింపు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ కుమార్, , మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రుల సైతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నేటి సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఢిల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపురేఖా గుప్తా ముఖ్యమంత్రి: హోమ్, ఫైనాన్స్, విజిలెన్స్ ప్లానింగ్పర్వేష్ వర్మ డిప్యూటీ సీఎం : విద్య, రవాణా, ప్రజా పనుల విభాగంమంజీందర్ సింగ్ సిరస : వైద్యం, పట్టణ అభివృద్ధి, పరిశ్రమలురవీంద్ర కుమార్: సోషల్ జస్టిస్, కార్మిక శాఖకపిల్ మిశ్రా :టూరిజం, కల్చర్, వాటర్ఆశిష్ సూద్: పర్యావరణం, రెవెన్యూ, ఆహార పౌరసరఫరలుపంకజ్ కుమార్ సింగ్: న్యాయశాఖ, గృహ నిర్మాణం శాఖ -
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి!
ఢిల్లీ : కొత్త సీఎం రేఖాగుప్తా (Rekha Gupta Takes Oath) ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఎవరా? ఆ అనుకోని అతిథి అనుకుంటున్నారా? అదేనండి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్. ఆప్ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేసి రెబల్ మహిళా నేతగా మారిన స్వాతి మాలివాల్. గురువారం బీజేపీ సీఎం రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీ మీద కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ముచ్చటిస్తూ తారసపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి, తర్వాత జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలతో ఆప్ ఇమేజ్ డ్యామేజీ అయ్యేందుకు పరోక్షంగా స్వాతి మాల్ కారణమవుతున్నారు. గతేడాది మేలో ఆప్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న కుమ్ములాటలపై చర్చించేందుకు కేజ్రీవాల్ తనని ఆహ్వానించారని, అలా వెళ్లిన తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ మోసం చేసి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. కాబట్టే ఆప్‌కు కేవలం రెండు శాతం ఓట్లు పడినట్లు కేజ్రీవాల్‌పై ఎదురుదాడికి దిగారు. VIDEO | AAP Rajya Sabha MP Swati Maliwal (@SwatiJaiHind) attends Delhi CM oath-taking ceremony at Ramlila Maidan. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/z9kXxTo9GX— Press Trust of India (@PTI_News) February 20, 2025ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ నివాసం ఎదుట యమునా నది శుద్ధి చేయాలనే హామీని నెరవేర్చలేదని ఆరోపిస్ స్వాతి మలివాల్ ఆందోళన చేపట్టారు. స్వాతి మాలివాల్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమినిపై పరోక్షంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణం ఫోటోను షేర్ చేశారు. (ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!)pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025 ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ ఓటమికి కేజ్రీవాల్ కారణమని అన్నారు. ఒక వ్యక్తి అహంకారంతో పనిచేయాలని చూస్తే ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారు. కేజ్రీవాల్ విషయంలో అది ఈరోజే జరిగింది’అని వ్యాఖ్యానించారు. గొప్ప విజన్‌తో రాజకీయాల్లోకి వచ్చాం. ఆప్‌లో అదే విధంగా పనిచేశాం. కానీ నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్మకపోవడం, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయగలమని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇదే సమయంలో, ఆప్ వీడి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తే. నేనెందుకు రాజీనామా? చేయాలి. నేను ఏమైనా తప్పుచేశానా? అని ప్రశ్నించారు. ఆప్ ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రశ్నించినందుకే రాజీనామా చేస్తారా? అని ద్వజమెత్తారు. (ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?)#WATCH | Rajya Sabha MP Swati Maliwal greets Delhi CM-designate Rekha Gupta as she arrives at Ramlila Maidan to attend her oath ceremony. pic.twitter.com/y6jSJLCaRO— ANI (@ANI) February 20, 2025 ఇలా కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బతీస్తున్న స్వాతిమాల్ తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రేఖాగుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరై చర్చాంశనీయంగా మారారు. -
30 ఏళ్ల క్రితం.. ఢిల్లీ సీఎం ఫొటో షేర్ చేసిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తాకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అల్కా లాంబా(Alka Lamba) ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. రాజకీయాలకు పక్కనపెట్టి రేఖతో ఉన్న స్నేహబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) అధ్యక్షురాలిగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తరఫున ఆల్కా లాంబా ప్రమాణం చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఏబీవీపీ తరఫున రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రేఖాకు అభినందనలు తెలియజేశారామె.రేఖా గుప్తా ముఖ్యమంత్రి అని తెలియగానే 30 ఏండ్లు వెనక్కి వెళ్లా. విద్యార్థి సంఘాల నేతలుగా మేం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాకు ఇంకా గుర్తు. సిద్ధాంతపరంగా మాకు ఎప్పుడూ పడేది కాదు. కానీ, ఏడాది పాటు మేం కలిసి పని చేసిన రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి అని అన్నారామె.ఇక యమునా నది(Yamuna River) ప్రక్షాళన ప్రధాన హామీగా బీజేపీ ఢిల్లీ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై దృష్టిసారించాలని ఆల్కా లాంబా సీఎం రేఖా గుప్తాకు సూచించారు. ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తాకు అభినందనలు. యమునా మాత శుభ్రమవుతుందని, యమునా పుత్రులంతా ఇక సురక్షితంగా ఉంటారని మేం ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారామె.1995 की यह यादगार तस्वीर - जब मैंने और रेखा गुप्ता ने एक साथ शपथ ग्रहण की थी- मैंने @nsui से दिल्ली विश्वविद्यालय छात्र संघ (DUSU) #अध्यक्ष पद पर जीत हासिल की थी और रेखा ने #ABVP से #महासचिव पद पर जीत हासिल की थी- रेखा गुप्ता को बधाई और शुभकामनाएँ.दिल्ली को चौथी महिला… pic.twitter.com/csM1Rmwu9y— Alka Lamba 🇮🇳 (@LambaAlka) February 19, 2025 -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ సీఎం పదవిపై ఉత్కంఠకు తెరదించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించింది. నేడు (ఫిబ్రవరి 20న) రాంలీలా మైదానంలో బీజేపీ రెండో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడమే కాదు ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవికి యువ నాయకురాలిని ఎంపిక చేయడం విశేషం. ఈ సందర్భంగా రేఖా గుప్తా ఆస్తులపై నెట్టింట చాలా ఆసక్తి నెలకొంది.ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్లో, రేఖ గుప్తా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 6,92,050గా, భర్త మనీషా గుప్తా ఆదాయం రూ.97,33,570 గా ప్రకటించారు.కుటుంబం నికర విలువ రూ. 5.3 కోట్లుగా ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.రేఖ గుప్తా నికర ఆస్తుల విలువరేఖ గుప్తా ఆస్తులు మొత్తం ఆస్తులు: రూ.5.31 కోట్లు రేఖ గుప్తాపై లోన్లు ఇంకా ఇతర అప్పులు: రూ.1.20 కోట్లు రేఖ గుప్తా వార్షిక ఆదాయం 2023-24: రూ.6.92 లక్షలు 2022-23: రూ.4.87 లక్షలు 2021-22: రూ.6.51 లక్షలు 2020-21: రూ.6.07 లక్షలు 2019-20: రూ.5.89 లక్షలు రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం 2023-24: రూ.97.33 లక్షలు 2022-23: రూ.64.56 లక్షలు 2021-22: రూ.23.13 లక్షలు రేఖ గుప్తాకి మారుతి XL6 (2020 మోడల్) కారు ఉంది, దీని విలువ దాదాపు రూ.4.33 లక్షలు ఉంటుందని అంచనా.రేఖా గుప్తాకు నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? హర్యానాలోని జింద్ జిల్లా నంద్‌గఢ్ గ్రామంలో జూలై 19, 1974న జన్మించిన రేఖా గుప్తా తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. 1976లో, గుప్తాకు రెండేళ్ల వయసులో కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. రాజధాని నగరంలోనే తన విద్యను పూర్తి చేసింది. ఇక్కడే ఆమె భవిష్యత్ రాజకీయ జీవితానికి పునాది వేసింది.విద్యార్థి దశలోనే ఆగుప్తా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు. విద్యార్థి రాజకీయాల్లో ఆమె చురుగ్గా ఉంటూ 1996-1997లోఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU)అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.రేఖ గుప్తా బీజేపీలో రాజకీయ జీవితం 2000లో ప్రారంభంలో ప్రారంభమైంది. పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి, ఢిల్లీ యూనిట్లో కార్యదర్శిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆ తరువాత 2004 నుండి 2006 వరకు BJYM జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె రాజకీయ నైపుణ్యం, లక్షణాలు 2007లో ఉత్తర పితంపురా నియోజకవర్గానికి కౌన్సిలర్‌గా చేశాయి. అంతేకాదు 2007 నుండి 2009 వరకు MCDలో మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంకా ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ,పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక ఇతర కీలక పదవులను కూడా ఆమె చేపట్టారు. -
ఆనాడు మార్షల్స్ ఈడ్చుకెళ్లిన నేత.. నేడు ఢిల్లీ స్పీకర్!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేయబోతున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. ఈ క్రమంలో రేఖా గుప్తాతో పాటుగా మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నుంచి రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తాకు అవకాశం ఇచ్చారు. అయితే, గతంలో(2015) విజేందర్‌ను సభ నుంచి మార్షల్స్ ఎత్తుకెళ్లిన ఘటనను బీజేపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజేందర్ గుప్తా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌గా తనకు అవకాశం ఇవ్వడంపై విజేందర్ గుప్తా స్పందించారు. ఈ క్రమంలో విజేందర్ మాట్లాడుతూ.. ‘నాకు స్పీకర్ స్థానం ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు. సభకు సంబంధించి నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. గత ఆప్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కాగ్ నివేదికలను నేను సభ ముందుకు తీసుకువస్తాను’ అని తెలిపారు.అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజేందర్ గుప్తా, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ఆప్ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలను సమర్పించకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ గతంలో కోర్టును ఆశ్రయించారు. కాగ్ నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.VIDEO | Delhi: BJP leader Vijender Gupta (@Gupta_vijender) says, “I am thankful to the party for giving me the responsibility of Speaker of Delhi Assembly. I will fulfill my responsibility… I hope we will have healthy discussions in the House.”(Full video available on PTI… pic.twitter.com/8SsH8GEmNT— Press Trust of India (@PTI_News) February 20, 20252015లో ఏం జరిగింది?నవంబర్ 30, 2015న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. నాటి ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబా(ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు), ఓపీ శర్మపై విజేందర్ గుప్తా అవమానకర వ్యాఖ్యలు చేశారని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అప్పటి అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్.. విజేందర్ గుప్తాను బయటకు పంపించి వేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో విజేందర్‌ను సభ నుంచి మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్లారు. ఈ సందర్భంగా విజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతల పట్ల స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక, ఇప్పుడు విజేందర్కు స్పీకర్ అవకాశం రావడంతో ఆనాటి పరిస్థితులను బీజేపీ నేతలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. I remember that day when then LOP of Delhi assembly @Gupta_vijender ji was dragged out of the assembly not once but many times. Now he will become the Delhi assembly speaker. AAP will taste its karma. Many congratulations to Mr Gupta. pic.twitter.com/fwGsUxF10k— Prof Sayantan Ghosh (@sayantan_gh) February 20, 2025 -
రేఖా గుప్తా అనే నేను
-
ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎట్టకేలకు ముఖమంత్రిని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది.నేడు (ఫిబ్రవరి 20న) బీజేపీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఢిల్లీ పీఠానెక్కనున్నారు. దివంగత సుష్మా స్వరాజ్ తర్వాత, బీజేపీ ఢిల్లీకి రేఖ గుప్తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి పదవికి యువ మహిళా నాయకురాలిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. రికార్డులురెండు దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరపున తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మరో మహిళా ముఖ్యమంత్రి కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత్ - మూడు దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించి రికార్డు సాధించారు. ఇపుడు ఆప్‌కి చెందిన అతిషి నుండి రేఖా గుప్తా మరో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. మహిళా సీఎంల విషయంలో ఢిల్లీదే రికార్డ్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ,తమిళనాడు బిహార్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు.రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. షాలిమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గత దశాబ్దంలో అమలు చేయని వాగ్దానాలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పాలన ఆమెకు కత్తిమీద సామే. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.ఢిల్లీ పీఠమెక్కిన మహిళా మణులుదేశరాజధాని నగరంఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటివరకు ముగ్గురు అధిరోహించారు. ఇపుడు ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.సుష్మా స్వరాజ్ (బీజేపీ) బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.షీలా దీక్షిత్, (కాంగ్రెస్)కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నారు. 1998 డిసెంబరు- 2013 డిసెంబరు వరకు ఆమె సీఎంగా సేవలందించారు. అతిషి మార్లెనా సింగ్ (ఆప్)8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు, 2024 - నుంచి ఫిబ్రవరి 2025 పనిచేశారు.రేఖా గుప్తా(బీజేపీ)రేఖా గుప్తా ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా?.. కంపెనీ ఆఫర్‌పై నెటిజన్లు ఫైర్!
వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' మాటలు, వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పిన ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మాటలు మరువకముందే.. ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ జాబ్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ.. జాబ్ ఆఫర్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఫుల్ టైమ్ జాబ్, నెలకు రూ. 40000 అని పేర్కొంది. అయితే ఉద్యోగి తప్పకుండా ఆఫీసు నుంచే పనిచేయాలి. వారానికి ఆరు రోజులు (ఆదివారం మినహా).. ఉదయం 9:30 గంటలకు ఆఫీసుకు రావాలి, పని పూర్తయ్యే వరకు 10 నుంచి 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది.భారతదేశంలో ఇలాంటి కంపెనీలు.. ఎందుకు ఇలాంటి నియమాలను బహిరంగంగా వెల్లడిస్తున్నాయో అర్థం కావడం లేదని కొందరు చెబుతున్నారు. కొన్ని కంపెనీలలో పని భారం ఎక్కువవుతుంది ఇంకొందరు చెబుతున్నారు. కార్మిక చట్టంలోని అధికారులు ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదని, ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా? అని మరికొందరు చెప్పారు.ఇదీ చదవండి: అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?రూ. 40,000 జీతం తీసుకునేటప్పుడు.. 12 గంటలు పనిచేయొచ్చని కొందరు చెబుతున్నారు. ఆ కంపెనీ అయిన నిజాయితీగా వెల్లడించింది, కొన్ని కంపెనీలు ఉద్యోగంలో చేరిన తరువాత ఎక్కువ పని చేయించుకుంటున్నాయని మరికొందరు చెప్పారు. భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి కంపెనీలు కూడా ఇలాంటి నిబంధలను పెడుతూ.. ఒత్తిడి పెంచుతున్నాయని అన్నారు. -
ఇవాళ ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం
-
Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు నాలుగు సవాళ్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు సవాళ్లను ఎదుర్కొనబోతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కీలక బాధ్యత కొత్త ముఖ్యమంత్రిపైనే ఉంటుంది. ప్రస్తుతం రేఖ గుప్తా ముందున్న నాలుగు పెద్ద సవాళ్లు ఇవే..1. మహిళల ఖాతాల్లోకి రూ. 2500 బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలలో భాగంగా మార్చి 8 నాటికి అర్హత కలిగిన మహిళా లబ్ధిదారుల ఖాతాలకు తమ ప్రభుత్వం రూ. 2,500 బదిలీ చేస్తుందని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన ఎన్నికల ప్రచార ప్రసంగాలలో ఈ హామీనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8న మహిళల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని పేర్కొన్నారు. రేఖ గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా నిలిచిందని నిపుణులు అంటున్నారు.2. యమునా నది శుద్ధిబీజేపీ గతంలో యమునా నదిని(Yamuna River) శుభ్రపరచడంపై హామీనిచ్చింది. యమునలో కాలుష్యం అధిక స్థాయిలో ఉండటం ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశంగా నిలిచింది. యుమున పరిశుభత విషయంలో కాంగ్రెస్, ఆప్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది తాము చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. పలు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, అనధికార కాలనీల నుంచి వచ్చే మురుగునీరు కారణంగా యమునా నదిలో కాలుష్యం పేరుకుపోతోంది. దీని పరిశుభ్రత కొత్త ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలిచింది.3. పథకాలకు నిధులుఆప్ ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఇతర సబ్సిడీలు కొనసాగుతాయని బీజేపీ గతంలో హామీనిచ్చింది. కొత్త ప్రభుత్వం రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్), ఢిల్లీ మెట్రో వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో నెలకొన్న సమస్యలను చక్కదిద్దాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులను సమకూర్చడమనేది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి భారం కానున్నదనే వాదన వినిపిస్తోంది.4. రోడ్ల మరమ్మతు- చెత్త కుప్పల నుంచి విముక్తిగత ఆప్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం- లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదాల కారణంగా నగరంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో రోడ్డు మరమ్మతుల నుండి చెత్త సేకరణ వరకు అనేక అంశాలు ఉన్నాయి. ఈ పనుల కోసం పట్టణాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సివుంటుంది. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టకముందే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి? -
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, మంత్రుల ప్రమాణం..
Delhi CM Rekha Gupta Oath Ceremony Live Updates..👉ఢిల్లీకి తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. #WATCH | BJP's first-time MLA Rekha Gupta takes oath as the Chief Minister of Delhi. Lt Governor VK Saxena administers her oath of office. With this, Delhi gets its fourth woman CM, after BJP's Sushma Swaraj, Congress' Sheila Dikshit, and AAP's Atishi. pic.twitter.com/bU69pyvD7Y— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ ఇంద్రజ్ సింగ్, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిశ్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | BJP's Parvesh Sahib Singh takes oath as minister in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/0ertQiFXHO— ANI (@ANI) February 20, 2025 #WATCH | BJP's Kapil Mishra takes oath as a minister in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/PVDlRfsq1U— ANI (@ANI) February 20, 2025 BJP's Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa and Ravinder Indraj Singh take oath as ministers in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/pzOXHgqXu1— ANI (@ANI) February 20, 2025 👉ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం.. వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. #WATCH | Along with Delhi's new cabinet, led by CM Rekha Gupta, Prime Minister Narendra Modi greets the crowd at Ramlila Maidan. pic.twitter.com/jiy2AbWjUd— ANI (@ANI) February 20, 2025 👉ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే నేతల హాజరయ్యారు. 👉 యమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులుఢిల్లీలో కీలక పరిణామం..యమునా నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త ప్రభుత్వంయమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులుప్రమాణ స్వీకారం అనంతరం యమునా నది తీరానికి వెళ్ళనున్న సీఎం, మంత్రులు 👉రామ్‌లీలా మైదానానికి చేరుకున్న రేఖా గుప్తా.. ఆమెకు స్వాగతం పలికిన బీజేపీ నేతలు, కార్యకర్తలు. #WATCH | Delhi CM-designate Rekha Gupta and BJP leader Parvesh Sahib Singh greet each other at Ramlila Maidan in Delhi. Parvesh Sahib Singh will also take oath today as part of her council of ministers. pic.twitter.com/k41QI69r4n— ANI (@ANI) February 20, 2025👉ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ..‘ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు సీఎంను అవుతానని నాకు తెలియదు. 48మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా బీజేపీ శాసన సభాపక్ష సమావేశానికి వెళ్లాను. కానీ పర్వేశ్‌వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసింది. నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే మార్చి ఎనిమిది నాటికి ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అలాగే ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో శీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు.#WATCH | Delhi CM-designate Rekha Gupta shows a victory sign and accepts the greetings of people as she leaves from her residence. pic.twitter.com/LDCQZAICBb— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తాకు అవకాశం. ఈ సందర్బంగా విజేందర్ గుప్తా మాట్లాడుతూ.. బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదాలు. స్పీకర్ స్థానం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా బాధ్యతలను నేను నెరవేరుస్తాను అని అన్నారు. అయితే, గతంలో సభ జరుగుతున్న సమయంలో మార్షల్స్.. విజేందర్ గుప్తాను బయటకు ఎత్తుకెళ్లారు. అధికార ఆప్ నేతలపై కామెంట్స్ చేయడంతో ఆయనను బయటకు తీసుకెళ్లారు. VIDEO | Delhi: BJP leader Vijender Gupta (@Gupta_vijender) says, “I am thankful to the party for giving me the responsibility of Speaker of Delhi Assembly. I will fulfill my responsibility… I hope we will have healthy discussions in the House.”(Full video available on PTI… pic.twitter.com/8SsH8GEmNT— Press Trust of India (@PTI_News) February 20, 2025 👉రామ్‌లీల మైదానం వద్ద బీజేపీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మరోవైపు.. రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. #WATCH | Delhi swearing-in ceremony | BJP Mahila Morcha workers rejoice at Ramlila Maidan ahead of the swearing-in ceremony of CM-designate Rekha Gupta. pic.twitter.com/Hr8gMubHzo— ANI (@ANI) February 20, 2025 👉 ఇక, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నాలుగో మహిళగా ఆమె నిలవనున్నారు. అలాగే, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్‌ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న ఐదో మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ మహిళగా రేఖా గుప్తా నిలవనున్నారు.#WATCH | Delhi CM designate Rekha Gupta says, "It is a miracle, it is a new motivation and a new chapter. If I can be the CM, this means ways are open for all the women... Anyone who has been corrupt will have to give an account of each and every rupee..." pic.twitter.com/F1GUVRELVp— ANI (@ANI) February 20, 2025 #WATCH | Swearing-in ceremony of Delhi CM-designate Rekha Gupta and her council of ministers to take place at Ramlila Maidan today. Visuals from the venue. pic.twitter.com/d6acoUYOSr— ANI (@ANI) February 20, 2025మోదీకి థ్యాంక్స్: రేఖా గుప్తా భర్త👉రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా మాట్లాడుతూ.. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక అద్భుతంలా అనిపిస్తుంది. పార్టీ మాకు ఇంత గౌరవం ఇవ్వడం మాకు సంతోషకరమైన విషయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | Delhi CM-designate Rekha Gupta's husband, Manish Gupta says, "...We never thought that she (Rekha Gupta) would become the Chief Minister of Delhi. It seems like a miracle... It is a matter of happiness for us that the party has given us so much respect..." pic.twitter.com/I7rX6X9PaW— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటుగా నేడు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వీరిలో పర్వేష్ వర్మ, అశిశ్ సూద్, మన్జిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రాజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్‌సింగ్ ఉన్నారు. Delhi swearing-in ceremony | Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa, Ravinder Indraj Singh, Kapil Mishra and Pankaj Kumar Singh to take oath as Ministers today. pic.twitter.com/1Gbvkq9xK7— ANI (@ANI) February 20, 2025👉అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హైకమాండ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన బీజేపీ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి సీఎంగా అవకాశం దక్కింది. అయితే, దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో(సొంతంగా 15 రాష్ట్రాల్లో.. మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు) బీజేపీ అధికారంలో ఉన్నది. కానీ, ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరు. మహిళలకు బీజేపీ సముచిత స్థానం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఇదివరకే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.#WATCH | NSG (National Security Guard) commandos, Delhi Police personnel and RAF (Rapid Action Force) personnel deployed on security at Ramlila Maidan. Delhi CM-designate Rekha Gupta and her new cabinet ministers will take oath here today. pic.twitter.com/9WMgoncQtb— ANI (@ANI) February 20, 2025రేఖా గుప్తా రాజకీయం ప్రస్థానం ఇలా.. 👉హర్యానాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే (1992) ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పని చేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరఠ్‌లోని చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. 1998లో మనీశ్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆరెస్సెస్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.మోదీకి కృతజ్ఞతలు👉ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సర్వతోముఖాభివృద్ధికి విశ్వాసం, నిజాయితీ, అంకిత భావంతో పని చేస్తానని వెల్లడించారు. రేఖా గుప్తాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. -
నేడే ఢిల్లీ సీఎం పట్టాభిషేకం
-
Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ టిక్కెట్‌పై పోటీచేసి, గెలుపొందిన రేఖా గుప్తా(Rekha Gupta) ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి కానున్నారు. ఢిల్లీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర పరిశీలకుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఆమె పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరు ప్రకటించగానే హర్యానాలోని జింద్‌లో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. జింద్‌లోని జులానా ప్రాంతంలోని నంద్‌గఢ్ రేఖా గుప్తా పూర్వీకుల గ్రామం. హర్యానాలోని ఆల్ ఇండియా అగర్వాల్ సమాజ్(All India Agarwal Samaj) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌కుమార్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఎన్నికవడం అగర్వాల్ సమాజానికి, జింద్‌కు గర్వకారణమని అన్నారు. కృషి, దృఢ సంకల్పం, సామాజిక సేవా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని రేఖ గుప్తా నిరూపించారని గోయల్ పేర్కొన్నారు.రేఖా గుప్తా సారధ్యంలో ఢిల్లీ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని, ఆమె ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్వీకుల గ్రామం కూడా హర్యానాలోనే ఉండటం, ఆయన కూడా అగర్వాల్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేశారు. ఆయన గతంలో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కుటుంబాన్ని కూడా ఆయన ఢిల్లీకి తీసుకువచ్చారు. దీంతో రేఖా గుప్తా పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్బీని ఢిల్లీలోనే పూర్తిచేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రేఖాగుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత వందన కుమారిని ఓడించారు.ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ -
అండగా ఉన్నోళ్లనే అక్కున చేర్చుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ భావజాలానికి కట్టుబడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీకోసం నిలబడిన వ్యక్తులను ప్రోత్సహించాలని, కష్ట సమయాల్లో పార్టీని వీడిన నేతలను దూరం పెట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ‘పార్టీకి సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించండి. కష్ట సమయాల్లో పారిపోయే బలహీనులకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా కష్టకాలంలో పార్టీని వీడిన నేతలను తొందరపడి చేర్చుకుంటారు. మనం అలాంటి వ్యక్తులను దూరం పెడదాం’ అని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జీలతో ఖర్గే సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టత, భవిష్యత్ ప్రణాళికలపై ఆ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ‘పార్టీని బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతంం చేసే బాధ్యతను ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు తీసుకోవాలి. ఈ పని కోసం మీరే బూత్‌కు వెళ్లాలి. కష్టపడి పనిచేయాలి. కార్మికులతో సంభాషించాలి. పార్టీ విభాగాలతో చర్చించాలి. సంస్థ పునర్ నిర్మాణంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) ని భాగస్వామ్యులను చేయండి’’ అని ఖర్గే సూచించారు. ‘‘రాష్ట్రాల్లో పార్టీ నిర్వహణ, భవిష్యత్తు ఎన్నికల ఫలితాలకు ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జీలే బాధ్యత వహించాలి. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల సమయంలో మన పార్టీ మద్దతుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడమో లేక ఆ పేరును మరో బూత్‌లోకి మార్చడమో చేస్తున్నారు. ఈ రిగ్గింగ్‌ను ఎలాగైనా మనం ఆపాలి’’ అని ఖర్గే పిలుపునిచ్చారు. -
ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి,హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాయితీ అమలు మార్చి 31 వరకు గడువు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్న వారికి రాయితీ వర్తించనుంది. ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించింది. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి సైతం 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా
ఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా (Delhi Cm Rekha Gupta) ఎంపికయ్యారు. సీఎంగా బీజేపీ (bjp) ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. సీఎంగా రేఖా గుప్తా రేపు(గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖాగుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.26 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో 47 మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్‌ఖడ్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా రేఖ గుప్తా2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. సీఎంగా ఆ పార్టీ షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖ గుప్తాను ఎంపిక చేసింది. ఢిల్లీలో బీజేపీ నుంచి చివరగా 1998లో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ తరుఫున ఢిల్లీ సీఎంగా సుష్మా స్వరాజ్ తర్వాత రేఖ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కాగా, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్,ఆప్ నుంచి అతిషీ మర్లేనా సీఎంలుగా సేవలందించారు. తాజాగా రేఖ గుప్తా ఢిల్లీకి నాలుగవ మహిళా సీఎంగా పనిచేయనున్నారు. రేఖ గుప్తా రాజకీయ ప్రస్థానంఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన యాబైఏళ్ల రేఖా గుప్తా (Who is Rekha Gupta) బీజేపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ (ఉత్తర-పశ్చిమ) నియోజకవర్గం నుండి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 68,200 ఓట్లతో విజయం సాధించారు. రేకా గుప్తా విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీలో అనుబంధ డౌలత్ రామ్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్, ఆర్ఎస్ఎస్లో యాక్టీవ్ మెంబర్‌గా పనిచేశారు. ఢిల్లీలో మూడుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా,ఒకసారి మేయర్‌గా సేవలందించారు. 1996-97లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2003-2004 మధ్య బీజేపీ యువ మోర్చా ఢిల్లీ కార్యదర్శిగా పనిచేశారు. 2004-2006 మధ్య ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.2007లో ఉత్తరీ పితాంపుర, ఢిల్లీ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా గెలుపొందారు2007-2009 మధ్య రెండు వరుస సంవత్సరాల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా సంక్షేమం, బాల అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్‌గా వ్యవహరించారు2009లో ఢిల్లీ రాష్ట్ర మహిళా మోర్చా బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు2010లో బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఎన్నియ్యారు2023 ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి,ఆప్ నేత షెల్లీ ఒబెరోయి చేతిలో ఓడిపోయారు. 2025లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లురామ్ లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు.. రామ్ లీలా మైదానంలో మూడు వేదికలను సిద్ధం చేయనున్నారు. ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా, రెండో వేదికను మత గురువులు కోసం, మూడో వేదికపై బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన 200 పైగా ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఆప్ అధినేత,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే కాంగ్రెస్ ఢిల్లీ శాఖాధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌లను సైతం ఆహ్వానించిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..
దేశ రాజధానిని సుదీర్ఘకాలం ఏలిన స్ట్రాంగెస్ట్ విమెన్ సీఎంగా పేరుగాంచి మహిళ లవ్ స్టోరీ గురించి విన్నారా..?. అగ్ర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించారామె. అస్సలు ఆనాటి భయంకరమైన కట్టుబాటుల నడుమ పెళ్లి అవుతుందా..? లేదా అనే రసవత్తరమైన టెన్షన్ల మధ్య ఆమె ప్రేమను గెలిపించుకున్నారు. అలా ఆమెలో ఒక గొప్ప ప్రేమికురాలి తోపాటు బలమైన నాయకురాలు, గొప్ప తల్లి ఉందని నిరూపించారు. ఆమె ఎవరంటే..భారత చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళగా నిలిచిన వ్యక్తి ఢిల్లీ మాజీ సీఎం షిలా దీక్షిత్. ఆమెలో బలమైన నాయకురాలు, గొప్పతల్లి కంటే ముందుకు ఓ గొప్ప ప్రేమికురాలు కూడా ఉందనే విషయం కొద్దిమందికే తెలుసు. అదికూడా ఆమె ఆత్మకథ "సిటిజన్ ఢిల్లీ: మై టైమ్స్, మై లైఫ్" ద్వారానే బహిర్గతమైంది. ఆమె తన కాబోయే భర్తను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక మిరాండా హౌస్‌లో చదువుతున్నప్పుడే గుర్తించారు. ఆయన పేరు వినోద్ దీక్షిత్. అతనిని ఒక తరగతిలో కలిశారు. అదికూడా తమ స్నేహితుల మధ్య నెలకున్న ప్రేమ వివాదాన్ని పరిష్కరించడం నేపథ్యంలో ఇరువురు స్నేహితులుగా మారారు. దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ మూవీ ఖుషీ సినిమాలో మాదిరిగా మొదట స్నేహితులై తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు. అయితే షీలా వినోద్‌లు మాత్రం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కన్నాట్‌కు వెళ్లే బస్ నంబర్ 10లో కలుసుకునే మాట్లాడుకునేవారు. అయితే ఇరువురి అంతరంగం వేరుగా ఉన్నా ఆలోచన తీరు ఒకేవిధంగా ఉండేది. అయితే వినోద్ ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడు కాబట్టి ఐఏఎస్ ప్రవేశ పరీక్ష పూర్తి అయ్యాకే తల్లిదండ్రులను ఒప్పిస్తానని షీలాతో చెప్పారు. అయితే ఆ రోజుల్లో అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేయడం జరుగుతుంది కాబట్టి షీలా పెళ్లి విషయమై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందేవారు. అయితే ఆమె కనీసం ఆయన్ని ప్యూన్ ఉద్యోగమైన సంపాదించే వరకు ఆగమని చెప్పేవారట పేరెంట్స్‌కి. ఇక వినోద్ కూడా 1959లో IAS మెరిట్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచి, ఉత్తర ప్రదేశ్ కేడర్ని ఎంపిక చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వారి ప్రేమ పోరాటం మాములగా సాగలేదు. ఎందుకంటే వినోద్ స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ సభ్యుడు ఉమా శంకర్ దీక్షిత్ కుమారుడు. పైగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కి చెందిన ఉన్నత సనాతన కన్యాకుబ్జ్ బ్రహ్మణులలో అత్యున్నతంగా పరిగణించే దీక్షతుల కుటుంబం. అందులోనూ విపరీతమై కట్లుబాట్లు సంస్కృతి సంప్రదాయలతో పాతుకపోయిన కుటుంబం కావడంతో వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో వినోద్ తండ్రికి చూపడంతో ఆయన పెళ్లికి సుమఖం వ్యక్తం చేసినా.. తల్లి అస్సలు ఒప్పుకోలేదు. ఆమె ఆంగీకారం కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదని షీలా తన ఆత్మకథలో రాసుకొచ్చారు.పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన షీలా కపూర్ భర్త ఎంపికను చూసి తల్లిదండ్రులు కూడా దిగ్బ్రాంతి చెందారు. ఎందుకంటే దీక్షితుల కుటుంబానికి కోడలుగా వెళ్లడం అంత ఈజీ కాదని వాళ్లకు కూడా తెలుసు. అందువల్లే ఆమె తల్లిదండ్రులు అసలు షీలా పెళ్లి అవుతుందా అనే దిగులుతో ఉండిపోయారు. అయితే ఆ ఉత్కంఠకు తెరదించేలా షీలా అత్తగారు ఒప్పుకోవడంతో జూలై 11, 1962న షీలా వినోద్‌ల ప్రేమ పెళ్లి పీటలెక్కింది. అలా ఆమె గొప్ప ప్రేమికురాలిగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూసి తన ప్రేమను ఫలవంతం చేసుకున్నారు. అలాగే సుదీర్ఘకాలం దేశ రాజధానికి సీఎంగా బాధ్యతలు చేపట్టి అత్యంత బలమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు షీలా.(చదవండి: ఏడేళ్ల చిన్నారి పేరెంటింగ్ టిప్స్..! ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి....) -
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా?
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi new CM) కొత్త సీఎం ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ ఉత్కంఠతకు తెరపడేలా బినోయ్ సామాజిక వర్గానికి (Baniya community) చెందినే నేతకే బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. పలు రాజకీయ, సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న బినోయ్ సామాజికి వర్గ కీలక మహిళా నేత, షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తాకే (Rekha Gupta) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవటం ఆమెకు మరింత కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇవాళ రాత్రి ఢిల్లీ బీజేపీ శాసన సభాపక్షం తమ నేతను ఎంపిక చేసుకోనుంది. రాత్రి 7 గంటలకు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించనుంది. ఈ తరుణంలో ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీతో పాటు మాజీ సీఎం, కేజ్రీవాల్‌ను ఓడించిన బనియా సామాజిక వర్గం నేతకే సీఎం పట్టం కట్టే యోచనలో కమలం అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం.ఢిల్లీ రాజకీయాల్లో బనియా సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పాటు,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించేందుకు బనియా వర్గం ఓట్లు దోహదం చేసినట్లు హస్తిన రాజకీయాల్లో తలపండిన నేతలు చెబుతున్న మాట. ఆ సామాజిక వర్గానికి చెందిన వారు వాణిజ్యం, వ్యాపారం,రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషిస్తున్నారు. కేజ్రీవాల్ సైతం బనియా సామాజిక వర్గం. కాబట్టే ఆ సామాజిక వర్గానికి చెందిన నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బినోయ్ సామాజిక వర్గం నుంచి విజేందర్ గుప్తా, రేఖాగుప్తా, జితేందర్ మహాజన్ ఈ ముగ్గురు నేతలు సీఎం రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో బినోయ్ సామాజిక వర్గంలో కీలక మహిళా నేత రేఖా గుప్తా వైపు బీజేపీ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బనియా సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తా ఆర్ఎస్ఎస్తో మంచి అనుబంధం ఉంది. దీనికి తోడు ఢిల్లీ మేయర్‌గా పనిచేశారు. అదే సమయంలో ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవటం మరింత కలిసివస్తోంది. రేఖా గుప్తాతో పాటు బీజేపీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసిన విజేందర్ గుప్తా సైతం ఉన్నారు.ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం ఉన్నప్పటికీ 2015, 2020 రెండుసార్లూ విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహిణి స్థానం నుంచి గెలుపొందారు. అంతేకాదు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు.జితేంద్ర మహాజన్.. ఆర్ఎస్ఎస్తో బలమైన సంబంధాలు ఉన్న బనియా సామాజిక వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. రోహ్తాస్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడోసారి ఆయన విజయం సాధించారు. జాతీయ నాయకులతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో సీఎం ఎవరు? అనేది అధికారిక ప్రకటన ఈ రోజు రాత్రి 7గంటల తరువాత వెలువడనుంది. ఢిల్లీ సీఎం ఎవరు? అని తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. -
Delhi: చుట్టుముట్టిన అగ్ని కీలలు.. రెండో అంతస్థు నుంచి దూకి..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని నాంగ్లోయీలోని ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భవన్నాన్నంతటినీ చుట్టుముట్టాయి. మంగళవారం పొద్దుపోయాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భవనంలో ఉంటున్నవారంతా భయాందోళనలకు లోనయ్యారు. అయితే వారంతా అప్రమత్తమై, తమ బాల్కనీలలోనికి చేరుకుని ఒక్కొక్కరుగా రెండో అంతస్థు నుంచి దూకారు. ఈ నేపధ్యంలో వారంతా గాయాలపాలయ్యారు. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమేమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు. देखिए एक घर में लगी भयंकर आग,एक शख़्स दूसरी मंज़िल से कूद पड़ा आग लगने की घटना दिल्ली नांगलोई फोन मार्किट कल देर रात की है , जिसका वीडियो सामने आया है बताया जा रहा है गैस लीक होने की वजह से एक घर की पहली मंजिल पर आग लग गई थी,दूसरी मंज़िल पर से एक व्यक्ति ने छलांग लगा दी जो घायल… pic.twitter.com/MvwtDgwzua— Lavely Bakshi (@lavelybakshi) February 18, 2025ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో భవనంలో ఎగసిపడుతున్న మంటలను, బాల్కనీలో నుంచి దూకుతున్నవారిని చూడవచ్చు. అలాగే అక్కడే ఉన్న ఫైర్ బ్రిగేడ్ మంటలు ఆపే ప్రయత్నం చేయడాన్ని కూడా గమనించవచ్చు. భవనంలో వ్యాపించిన మంటల నుంచి మొత్తం ఆరుగురు రెండో అంతస్థు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ -
13 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఈశాన్య భారతంలోని 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే ఏడు రోజుల్లో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని, పర్వత ప్రాంతాల్లో విపరీతంగా మంచుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ తుఫాను ప్రభావం నాగాలాండ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా ఉండనుంది. ఫిబ్రవరి 19న అసోం, మేఘాలయలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 21న పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ,పశ్చిమబెంగాల్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలకు ఇప్పటికే వర్ష సూచన హెచ్చరికలు జారీ చేశారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో బీహార్‌లోని 16 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో బుధవారం, గురువారం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19, 20 తేదీలలో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.ఇది కూడా చదవండి: పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్ -
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి గ్రాండ్ గా ఏర్పాట్లు
-
Delhi Stampede: ఆ ఐదుగురి ఉసురు తీసింది ఈ వైద్య పరిస్థితే..!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోగా, పదిమందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఆ బాధితులలో ఐదుగురు మాత్రం బాధకరమైన పరిస్థితితో మరణించినట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ ఘటన ఫుట్ఓవర్ వంతెనపై నుంచి దిగుతుండగా కొంతమంది ప్రయాణికులు జారిపడి పడిపోవడంతో చోటుచేసుకుందన్న సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్లు ఆ ఐదుగురు బాధితులు మాత్రం తొక్కిసలాట కారణంగా చనిపోలేదంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్యులు. ప్రయాణీకులతో కిక్కిరిసిన ప్రదేశాల్లో కొందరికి అలాంటి వైద్య పరిస్థితి ఎదురై ప్రాణాంతకంగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ అస్సలు ఆ బాధితులు మరణానికి ప్రధాన కారణం ఏంటి..?. ఆ వైద్య పరిస్థితిని ఏమని పిలుస్తారు..? ఎలా నివారించాలి..?ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నిఖిల్ మోడీ ఐదుగురు బాధితుల మరణానికి ప్రధాన కారణాన్ని వివరించారు. వారంతా ట్రామాటిక్ అస్ఫిక్సియా అనే శ్వాసకోశ వ్యాధి కారణంగా మృతి చెందినట్లు వెల్లడించారు. బాధితుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఈ పరిస్థితికి గురయ్యినట్లు తెలిపారు.అలాగే ఆ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ..గాయపడిన బాధితులను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకురాలేదని, కానీ ఈ ఐదు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఎల్ఎన్జేపీ ఆస్పత్రి నుంచి ఆర్ఎంఎల్కి తరలించడంతో ఈ విషయం నిర్థారణ అయినట్లు తెలిపారు. అంతేగాదు ఆ నివేదికలో ఆ వైద్య పరిస్థితి గురించి సవివరంగా పేర్కొన్నారని సదరు వైద్యుడు వెల్లడించారు. ఇంతకీ ఏంటీ ట్రామాటిక్ అస్ఫిక్సియా..?ట్రామాటిక్ అస్ఫిక్సియాట్రామాటిక్ అస్ఫిక్సియాను క్రష్ అస్ఫిక్సియా అని కూడా పిలుస్తారు. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై తీవ్ర ఒత్తిడిని కలుగజేసితే సంభవిస్తుంది. ఈ తీవ్రమైన శక్తి డయాఫ్రాగమ్ విస్తరించకుండా నివారిస్తుంది. ఫలితంగా సాధారణ శ్వాస కూడా కష్టమవుతుంది. అదనంగా పీడనం రక్తాన్ని పైశరీరంలోకి తిరిగి నెట్టివేస్తుంది. దీనివలన ముఖం, మెడ, కళ్లల్లో పెటెచియే(కేశనాళికలు పగిలిపోవడం వల్ల ఊదా-ఎరుపు రంగు మారడం) వంటి సంకేతాలు కనిపిస్తాయి. అంటే తల, పై శరీరం వాపుకి గురైనట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే బాధితుడు నిమిషాల్లోనే స్ప్రుహ కోల్పోవచ్చు. తదనంతర అంతర్గత అవయవాలు వైఫల్యం జరిగి నిమిషాల వ్యవధిలోనే మరణం సంభవిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అలాంటి వ్యక్తులకు పరిస్థితి విషమించక మునుపే సకాలంలో ఆక్సిజన్ థెరపీ వంటి వైద్య చికిత్సలు అందిస్తే తొందరగా ఆ విషమ పరిస్థితి నుంచి బయటపడేలా చేయడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితి ఊపిరాడనంత రద్దీ ప్రదేశాల్లో కొందరికి ఎదురవుతుందని చెబుతున్నారు.అయితే ఇలాంటి శ్వాసకోశ సమస్యను నివారించాలంటే ప్రమాదకరమైన వాతావరణం లేదా రద్దీ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటేనే సాధ్యమని తేల్చి చెప్పారు వైద్యులు. అంతేగాదు అధికారులు సైతం ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉత్ఫన్నం కాకుండా నివారించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తులు చేపట్టారు.(చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..) -
Viral: నారీశక్తి.. చంటిబిడ్డతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
నాణేనికి రెండు వైపుల మాదిరే.. సోషల్ మీడియాలో రెండు పార్శ్వాలు ఉంటాయి. మంచిని ఎక్కువగా చర్చించినప్పుడు మధ్యలో చెడును.. అలాగే చెడుపై ఎక్కువగా చర్చ జరిగినప్పుడు మధ్యలో మంచి ప్రస్తావననూ తెస్తుంటుంది. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఓ అమ్మ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇప్పుడు.ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజు.. అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉంది. ఆ టైంలో ఆమె తన చంటిబిడ్డతో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో.. అందంగా ఎడిట్ చేసిన ఆమె ఫొటో సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. చాలామంది అమ్మ గొప్పతనమంటూ ఆ ఫొటోలు స్టేటస్‌గా పెట్టుకున్నారు కూడా. మరోవైపు..This picture is representative of what Bharat truly is - young, responsible and hardworking. Balancing family and work. Instilling same values to the next generation. While we celebrate rich celebrities as icons, we tend to forget the real women of Bharat - young mothers who… pic.twitter.com/uZSCpTPIzm— Tejasvi Surya (@Tejasvi_Surya) February 17, 2025రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఈ ఫొటోకు స్పందించారు. నిజమైన భారత్ ఇదేనని, నారీ శక్తికి ఆమె ప్రతిరూపమంటూ కొనియాడారు. RPF ఇండియా కూడా ఎక్స్ అకౌంట్లో ఆ వీడియోను పోస్ట్ చేసింది. తన విధులతో పాటు తల్లిగా బాధ్యతను విస్మరించని కానిస్టేబుల్ రీనా గొప్ప యోధురాలు అంటూ గర్వంగా ప్రకటించుకుంది. అదే సమయంలో విమర్శలు మొదలయ్యాయి.She serves, she nurtures, she does it all—A mother, a warrior, standing tall…Constable Reena from 16BN/RPSF performing her duties while carrying her child, representing the countless mothers who balance the call of duty with motherhood every day.#NariShakti #HeroesInUniform… pic.twitter.com/enzaw0iDYo— RPF INDIA (@RPF_INDIA) February 17, 2025ప్రముఖ నగరాల్లో రైల్వేస్టేషన్లలో ఏమేరు రద్దీ ఉంటుందో చూస్తున్నదే. అలాగే ఈ మధ్య అయితే తోపులాట, తొక్కిసలాట ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వారిని నియంత్రించాల్సిన బాధ్యత.. ఇలాంటి కానిస్టేబుళ్లకే ఉంటుంది. అలాంటప్పుడు ఆమె అలా తన బిడ్డ ప్రాణాలు పణంగా పెట్టి మరీ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. బిడ్డల సంరక్షణ కోసం ఆర్పీఎఫ్ స్టేషన్లలో ఉండే సదుపాయాల్ని ఆమె వినియోగించుకోవాల్సిందని సూచిస్తున్నారు. మరోవైపు.. నారీశక్తి అని పిలడడంపైనా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిడ్డతో విధులకు హాజరుకావడాన్ని అన్యాయంగా అభివర్ణిస్తున్నారు. అధికారులైనా ఈ విషయంలో చొరవ చూపాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక.. బిడ్డ పెంపకం విషయంలోనూ ఆమెకు ఉన్న ఇబ్బందుల గురించీ, ఆమెపై ఉన్న బాధ్యతల గురించీ కొందరు ప్రస్తావిస్తున్నారు.Quit romanticising women doing it all by themselves. She should have help raising her baby when she's on duty, she absolutely doesn't need to do this alone, she's doing it because she has no choice, because men barely help with raising a child. Call it what it is: she's solidly… pic.twitter.com/G7M6LGXdOM— Dr. Ruchika Sharma (@tishasaroyan) February 17, 2025అదే సమయంలో.. ఆమెకు ఉన్న సవాళ్లను ప్రస్తావిస్తూ కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. అయినా సరే మహిళలు ఎక్కడా వెనుకడుగేయకుండా, ఆ సవాళ్లను లెక్కచేయకుండా ఈ పోటీ ప్రపంచంతో పోటీపడుతుండటం.. అన్నింటికి మించి అటు అమ్మగా, ఇటు ఆర్పీఫ్ కానిస్టేబుల్‌గా మెప్పించడం గొప్ప విషయమని వాదిస్తున్నారు. -
ఢిల్లీ సీఎం ప్రమాణానికి కేజ్రీవాల్‌కు ఆహ్వానం?
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత కేజ్రీవాల్‌ను సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి పిలుస్తారా లేదా అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతోంది. ఇప్పుడు దీనికి సమాధానం దొరికింది. బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను, మరో మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.నూతన సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి ఢిల్లీలోని లక్షమంది చోటామోటా నేతలను బీజేపీ ఆహ్వానించనుందని తెలుస్తోంది. అయితే కొత్త సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రమాణస్వీకారానికి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ నేతలు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, వీరేంద్ర సచ్దేవ్ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.ఫిబ్రవరి 19న జరగబోయే బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎంగా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది వెల్లడికానుంది. తొలుత ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 19న నిర్వహించాలని బీజేపీ అధిష్టానం భావించింది. తరువాత ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20న నిర్వహించాలని నిశ్చయించారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరుపై తుది నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులను నియమించనున్నదని సమాచారం. ఈ పరిశీలకులు ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు. వీటి ఆధారంగా పార్టీ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తుంది. కాగా ముఖ్యమంత్రి రేసులో న్యూఢిల్లీ ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, రేఖ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్ -
20న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై పది రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి అతిత్వరలో తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4.30 నిమిషాలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.కొత్త సీఎంను బీజేపీ పెద్దలు ఇంకా ఎంపిక చేయలేదు. బీజేపీ శాసనసభాపక్ష భేటీ నిర్వహించలేదు. మార్చి 8న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లివచ్చారు. సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగాల్సి ఉండగా.. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట నేపథ్యంలో ఈ భేటీ వాయిదా పడింది. బుధవారం శాసనభాపక్షం సమావేశం కానున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రివర్గ కూర్పుపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. -
ఢిల్లీని కుదిపేసిన భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు బిహార్‌లోని సివాన్‌లో సోమవారం ఉదయం భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.0గా నమోదైంది. ప్రకంపనల కేంద్రం ఎర్రకోటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధౌలా కువాన్లోని ఝీల్ పార్క్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ఉదయం 5.36 గంటల సమయంలో కంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) తెలిపింది. ఈ ప్రాంతంలో భూమి కంపించిన సమయంలో పెద్దపెద్ద శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. భూమికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలను సాధారణ భూకంపాలుగా పరిగణిస్తారు. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఎక్కువ నష్టం సంభవించేందుకు అవకాశముంటుంది. ఝీల్ పార్క్ ప్రాంతంలో ఏటా కనీసం రెండుమూడుసార్లు భూమి కంపిస్తుంటుందని స్థానికులు తెలిపారు. 2015లో ఇక్కడ సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. ప్రకంపనలతో భయపడిన ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లోని జనం భూకంపం వచ్చిందంటూ రోడ్లపైకి చేరుకున్నారు. ఇంత తీవ్రమైన భూకంపం ఇంతకు ముందెన్నడూ తాము చూడలేదని పలువురు తెలిపారు. భారీగా శబ్దాలు రావడంతో ఎంతో భయపడిపోయామని చెప్పారు. భూకంపంతో ఎవరూ గాయపడలేదని, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో సంభవించిన భూ ప్రకంపనలతో ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తదుపరి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ‘ఎక్స్’లో సూచించారు. అధికారులు పరిస్థితులను గమనిస్తున్నారన్నారు. బిహార్‌లోనూ ప్రకంపనలుబిహార్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. ముఖ్యంగా శివాన్ చుట్టుపక్కల జిల్లాల్లో భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. శివాన్‌లో ఉదయం 8 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలను గుర్తించామని ఎన్సీఎస్ తెలిపింది. భూకంపం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించినట్లు ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. సివాన్‌లో ప్రకంపనలతో భయకంపితులైన జనం ముందు జాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.తరచూ ఎందుకు?ఢిల్లీలో భూకంపాలు అసా ధారణమేం కాదు. ఢిల్లీ ప్రాంతం క్రియా శీల భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. హిమాలయాలకు దగ్గరగా ఉండటంతోపాటు ప్రపంచంలో అత్యంత భూకంప చురుకైన ప్రాంతాలలో ఒకటిగా ఉంది. కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ఆవలి హిమాలయ పర్వతాలకు ఇవతలి వైపు హిమాలయాలకు మధ్య నెలకొన్న ఒత్తిడి( మెయిర్ బౌండరీ థ్రస్ట్–ఎంబీటీ) అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఢిల్లీ–హరిద్వార్ రిడ్జ్, మహేంద్రగఢ్–డెహ్రాడూన్ ఫాల్ట్, మొరాదాబాద్ ఫాల్ట్, సోహ్నా ఫాల్ట్, యమునా నదీ రేఖతో సహా అనేక భూకంప అనుకూల ప్రాంతాలు దేశరాజధాని భూభాగానికి సమీపంలో ఉన్నాయి. దీంతో భూకంపాల తీవ్రత అధికం. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం ఢిల్లీ భూకంప జోన్–4లో ఉంది. జోన్–4 అంటే భూకంపాల ప్రమాదం ఎక్కువ ఉంటుందని అర్థం. ఇలాంటి జోన్లో భూకంపాలు సాధారణంగా రిక్టర్ స్కేల్‌పై ఐదు లేదా ఆరు తీవ్రతతో వస్తాయి. అప్పు డప్పుడు ఏడు లేదా 8 తీవ్రతతో సంభవిస్తాయి. అయితే ఈ జోన్ పరిధి∙నిరంతరం మారు తూ ఉంటుంది. రిక్టర్ స్కేల్‌పై నాలుగుగా నమోదైనాసోమవారం రిక్టర్ స్కేల్‌పై కేవలం 4 తీవ్రతతో సంభవించినప్పటికీ దాని ప్రభావం మాత్రం తీవ్రంగా కనిపించింది. అందుకు కారణం ఉంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు వస్తాయి. భూకంపం పుట్టిన ప్రదేశంలో దాని శక్తి తీవ్రంగా ఉంటుంది. దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రకంపనలు బలహీ నమవు తాయి. నేల రకం వంటి స్థానిక భౌగోళిక పరిస్థితులు కూడా కదలికల్లో హెచ్చు తగ్గులకు కారణ మవుతాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ విషయానికొస్తే భూఉపరి తలానికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇది నగరం అంతటా బలమైన ప్రకంపనలను సృష్టించింది. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి ఉత్తర ప్రాంతాల్లో సంభవించే భూకంపాల వల్ల ఢిల్లీలో స్వల్ప కదలికలు న మోదవుతాయి. అయితే, సోమవారం æ భూకంప కేంద్రం ఢిల్లీ సమీపంలో ఉండటంతో ఢిల్లీ–ఎన్సీఆర్లో మరింత తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ముగ్గురు సీఎంలను చూస్తాం’
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ఇంకా సీఎం ఎవరు అనే దానిపై సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ సీఎం((Delhi Next CM))పై తర్జన భర్జనలు పడుతున్న బీజేపీ.. ఇంకొంత సమయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సెటైర్లు వేస్తోంది. ఢిల్లీ సీఎం జాప్యంపై ఆప్ నేత గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ సీఎంను ప్రకటించడాన్ని అటుంచితే, ఈ ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను ఢిల్లీ చూడాల్సి వస్తోందంటూ జోస్యం చెప్పారు. గతంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే జరిగిందంటూ గతాన్ని తోడే యత్నం చేశారు.బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి((Delhi Assembly Elections)) వచ్చి 10 రోజులైనా ఇప్పటివరకూ సీఎంను ప్రకటించ లేదంటి వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. తమకు ప్రజలు ఏదైతే ప్రతిపక్షం ఉండమనే మ్యాండేట్ ఇచ్చారో దాన్ని తప్పకుండా పాటిస్తామన్నారు గోపాల్ రాయ్. ఢిల్లీలో ఇప్పటికే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, సీఎం ఎవరైనా ఆ కష్టాలను ఎదుర్కోక తప్పదన్నారు.కాగా, ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం.బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే..సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
Delhi Earthquake : డబ్బు కాదు భయ్యా.. బతకాలంటే దమ్ముండాలే!
దేశ రాజధాని నగరం ఢిల్లీని భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడం జనం భయంతో పరుగులుతీశారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. బలమైన ప్రకంపనలతో చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం సమయంలో ఇళ్ల బయట నిలబడి ఉన్న వ్యక్తులు వణుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదు.ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై చాలామంది ఆందోళనవ్యక్తం చేశారు . ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఢిల్లీ భూకంపంపై పలు మీమ్స్‌ను సృష్టించారు. #earthquake హ్యష్‌ట్యాగ్‌తో రూపొందించిన మీమ్స్ వైరల్‌గా మారాయి. ఢిల్లీలో నెలకొన్ని పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. పొద్దున్న కాలుష్యం, సాయంత్రం గ్రహణం, రాత్రికి భూకంపం అంటూ నిరాశను ప్రకటించారు. Money is the second thing you need to survive in Delhi, the first is still the courage to live in that city#earthquake pic.twitter.com/E4Jq0XqKY6— isHaHaHa (@hajarkagalwa) February 17, 2025#earthquake #Delhi earthquake to Delhi people: pic.twitter.com/vAYLFraIZo — Yash Khandelwal (@yashk1140) February 17, 2025ఢిల్లీలో జీవించడానికి కావాల్సింది డబ్బులు కాదు భయ్యా, ముందు ధైర్యం కావాలి అంటూ మీమ్ తయారు చేశారు. రెండు నెలలకోసారి టెక్నో ప్లేట్స్ ఢిల్లీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయంటూ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు ఒక పక్క ప్రాణ భయంతో ఢిల్లీ వాసులు అల్లాడిపోతే, సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తూ కామెడీ చేయడం విమర్శలకు దారి తీసింది. Tectonic plates in Delhi NCR in every few months : #earthquake pic.twitter.com/vDJSw14sI3— UmdarTamker (@UmdarTamker) February 17, 2025 సాధారణంగా మీమ్స్‌ను జనాలకు వినోదం పండిస్తాయి. మానసిక ఉల్లాసాన్నిస్తాయి. చాలా తక్కువ సమయంలో సంబంధిత సమాచారాన్ని చేరవేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల వ్యవహార శైలిపై వేసే మీమ్స్ ఆలోచన రగిలిస్తాయి. క్రికెట్మ్యాచ్లు, సినిమా రివ్యూల్లో వచ్చే మీమ్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. చాలా క్రియేటివ్‌గా ఉండే ఈ మీమ్స్ ఒకవైపు సమాచారాన్ని ఇస్తూనే, మరోవైపు బోలెడంత హాస్యాన్ని పండిస్తాయి. भूकंप कुछ ऐसा ही था आज Delhi NCR में, बहुत तेज #earthquake pic.twitter.com/pGhsanaidT— बलिया वाले 2.0 (@balliawalebaba) February 17, 2025 -
ఇంకెన్ని పిటిషన్లు వేస్తారు?.. ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ : ప్రార్థన స్థలాలకు సంబంధించిన అంశంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సోమవారం ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లకు ఒక ముగింపు ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను విచారణ చేపట్టదని స్పష్టం చేశారు.అయితే అదనపు అంశాలను జతచేస్తూ కొత్తగా పిటిషన్ దాఖలు చేయడం అనుమతించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్, మజ్లిస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్ల తరుఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనల్ని వినిపిస్తున్నారు.ఇక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతించామని, కానీ ఇలాంటి వ్యాజ్యాలకు ఒక పరిమితి ఉండాలని గుర్తు చేసింది. ప్రార్థన స్థలాలకు సంబంధించిన కొత్త పిటిషన్లు దాఖలు చేస్తే.. అందులో కొత్త అంశాలను జోడించాలని, అలా అయితేనే వాటిని విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. -
Driver Neelam: ఆటో డ్రైవర్ సీట్లో ఆమె.. సలాం కొట్టాల్సిందే!
కుటుంబం అనే బండిలో అందరిలా ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చోవాలనుకోలేదు. పరిస్థితుల ప్రభావంతో.. తన బతుకు బండికి తానే సారథిగా మారింది. ‘ఇలాంటి పనులు మగాళ్లే చేయాలమ్మా..’ అని తోటి మహిళలే సూటిపోటి మాటలు అంటున్నా.. మగవాళ్లు వంకర చూపులు చూస్తున్నా.. ఆమె మాత్రం తన గమ్యం వైపు దూసుకుపోతోంది. అందుకే ఆ డ్రైవర్ గాథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.ఆమె పేరు నీలమ్(Neelam). ఢిల్లీలో బిజీ రోడ్లపై ఆటో డ్రైవర్‌గా కనిపిస్తోంది. నిత్యం మెట్రోలో వెళ్లే ఓ ఉద్యోగిణి.. ఎందుకనో ఆ ఆటో ఎక్కాల్సి వచ్చింది. ‘‘ఆటోను నడిపేది ఓ మహిళనా?’’ అని తొలుత ఆమె కూడా అందరిలా ఆశ్చర్యపోయింది. ఈ పనినే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని నీలమ్‌ను కుతూహలంతో అడిగిందామె. అక్కడి నుంచి జీవితం ఒకసారి నీలమ్ ఎదుట గిర్రున తిరిగింది.అందరిలాగే పెళ్లై కోటి ఆశలతో అత్తింటి అడుగు మోపిందామె. కానీ, ఆ ఇంట అడుగడుగునా ఆమెకు వేధింపులే (Domestic Violence) ఎదురయ్యాయి. చివరకు.. కట్టుకున్నవాడు కూడా ఆ వేధింపులను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఓపిక ఉన్నంతకాలం భరించిన ఆమె.. అది నశించడంతో చంటి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక కష్టాలు స్వాగతం పలికాయి. చేయడానికి ఆమెకు ఏ పని దొరకలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నా.. పుట్టింటి వాళ్ల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అందుకనే.. ఇలా ఆటో నడుపుతున్నట్లు నవ్వుతూ చెప్పిందామె.కానీ, ఆ మహిళా ఆటో డ్రైవర్(Woman Auto Driver) పెదాలపై నవ్వు కంటే ఆమె గొంతులో దిగమింగుకుంటున్న బాధ, కళ్లలో కూతురికి బంగారు భవిష్యత్తు అందించాలని పడుతున్న ఆరాటం రెండూ కనిపించాయి. అందుకే నీలమ్ కథను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమాజంలో మార్పును స్వాగతించేవాళ్లెందరో నీలమ్ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. -
Railway Station Stampede: ప్లాట్ఫారం టిక్కెట్ల విక్రయాలు నిలిపివేత
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగిన దరిమిలా రైల్వే అధికారులు స్టేషన్లో భద్రతను మరింత కట్టదిట్టం చేశారు. ప్రయాణికుల రద్దీ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. సోమవారం మరోమారు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఏర్పడటాన్ని చూసిన అధికారులు ప్లాట్ఫారం టిక్కెట్లు విక్రయాలను నిలిపివేశారు.న్యూఢిల్లీ రైల్వే అధికారులు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికు సంఖ్య తగ్గాకనే ప్లాట్ఫారం టిక్కెట్లను విక్రయిస్తామని తెలిపారు. ప్రయాణికులు రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్లాట్ఫారం టిక్కెట్ల కౌంటర్ దగ్గర ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ అతికించారు. దానిలో ప్లాట్ఫారం టిక్కెట్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆన్లైన్లో ప్లాట్ఫారం టిక్కెట్లను విక్రయిస్తున్నారా? లేదా అనేది తెలియరాలేదు. కాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్ డెడ్ తల్లి..
తల్లికి తన పిల్లలే సర్వస్వం అని అంటారు. తనకు పుట్టిన బిడ్డను తొలిసారి ఎత్తుకున్నప్పుడు ఆ తల్లి లోకాన్ని జయించినంతగా మురిసిపోతుంది. అయితే ఢిల్లీకి చెందిన ఆషితా చందక్(38) కథ దీనికి భిన్నమైనది. దీనిని విన్నవారంతా కంటతడి పెడుతున్నారు. ఆషితా చందక్ కొద్ది రోజుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. ఇందుకోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తోంది. బిడ్డను కని, ఎప్పుడెప్పుడు ఒడిలోకి తీసుకుంటానా అని ఆమె ఎదురుచూసింది. అయితే ఎనిమిదినెలల గర్భవతి అయిన ఆషితా విషయంలో విధి కన్నెర్రజేసింది. తన బిడ్డను చూసుకోకుండానే ఆమె ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించింది. ఆషితా కుటుంబ సభ్యులు ఆమె ఇంతలోనే తమకు దూరమవుతుందనే విషయాన్ని నమ్మలేకున్నారు.ఆషితా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కస్టమర్ సపోర్ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. పెళ్లయిన ఎనిమిదేళ్త తరువాత ఆమె గర్భం దాల్చింది. ఫిబ్రవరి 7న ఆషిత ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆషిత 8 నెలల గర్భవతి. కొన్ని వారాల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనందున వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. దీంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే శిశువును వెంటిలేటర్ సపోర్ట్‌తో ఐసీయీలో ఉంచి చికిత్ప అందించారు. ఫిబ్రవరి 13న ఆషితా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు.ఆషితా కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఆషితా భర్త రాజుల్ రామ్పాట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. మెదడు పూర్తిగా పనిచేయడం మానేసిన బాధితుడు లేదా బాధితురాలిని వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటిస్తారు. అటువంటి స్థితిలో మెదడులో ఎటువంటి చురుకుదనం ఉండదు. దేనినైనా అర్థం చేసుకునే సామర్థ్యం, శరీరానికి సంకేతాలను పంపే సామర్థ్యం పూర్తిగా పోతుంది. వైద్యులు ఎవరినైనా బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారంటే వారు దాదాపు చనిపోయారని అర్థం.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
ఢిల్లీ సీఎం ప్రకటనపై బిగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి (Delhi Next CM) ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం. బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.అందుకే ఆలస్యం!ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే.. సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ప్రమాణం ఎప్పుడంటే..ఆ మరుసటిరోజు(ఫిబ్రవరి 20న) రామ్ లీలా మైదానం(Ram Leela Maidan)లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. ఎన్టీయే పాలిత ప్రాంతాలకు ఇప్పటికే ఆహ్వానం వెళ్లింది. గురువారం సాయంత్రం 4గం.30ని. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. మోదీ, అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతల సమక్షంలో సీఎం, మంత్రి వర్గం ప్రమాణం చేయనుంది. ఈ మేరకు కార్యక్ర కో ఆర్డినేటర్లుగా వినోద్ తావ్డే,తరుణ్ చుగ్‌లను బీజేపీ హైకమాండ్ నియమించింది.ఇక.. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా)ర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనాల్లో ‘క్లీన్ ఇమేజ్’ ఉన్న నేతకే ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: వద్దని తిరిగి వెళ్లిపోతుండగా ప్రాణం పోయింది!! -
ఢిల్లీ, బిహార్ లో కంపించిన భూమి
-
ఢిల్లీ సీఎం సస్పెన్స్‌కు నేడు తెర!
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం సస్పెన్స్‌కు నేడు తెర పడనుంది. సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీ బీజేపీల్పీ(Delhi BJPLP) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల, పార్టీ జాతీయ కార్యదర్శుల సమక్షంలో జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. ఈ మేరకు అధిష్టానం అంతర్గత సంప్రదింపులు సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టబోతోంది. ఇవాళ సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత.. ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుంది అనే దానిపై స్పష్టత రానుంది.ఇక నేటి సమావేశంలో కొత్త సీఎం, మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నా.. మాజీ సీఎం కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఓడించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. అశీశ్ సూద్, రేఖా గుప్తాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నట్లు , రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. -
‘బాంబు పేలింది’.. భూకంపం అనుభవాల వెల్లువ
న్యూఢిల్లీ: ఈరోజు (సోమవారం) ఢిల్లీ ప్రజలు తెల్లవారుజామున నిద్ర నుంచి లేస్తూనే భూకంప ప్రభావానికి లోనయ్యారు. భయంతో వణికిపోతూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 5 గంటల 36 నిముషాలకు సుమారు 55 సెకెన్లపాటు ఢిల్లీలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయ్యింది. భూకంపం వచ్చిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను పలువురు ట్వట్ల ద్వారా పంచుకున్నారు. Earthquake in Delhi NCR pic.twitter.com/XQwyhc8PvI— Navneet K Singh (@Navneet_K_Singh) February 17, 2025‘ఎక్స్’ ప్లాట్‌ఫారంపై నవనీత్ సింగ్ అనే యూజర్ భూకంపం సమయంలో తమ ఇంటిలో కదులుతున్న ఫ్యానుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మరో యూజర్ బాంబు పేలిందని అనుకున్నామని రాశారు.You know it's a massive one when it forces you out of your sleep and out of bed. #earthquake— Sarah Waris (@swaris16) February 17, 2025@swaris16 అనే యూజర్ ‘ఆ సమయంలో వచ్చిన భారీ శబ్ధం నిద్ర ఎగిరిపోయేలా చేసింది’ అని రాశారు. దీనిని చూసిన ఒక యూజర్ ‘ఆ శబ్ధం ఉలిక్కిపడేలా చేసిందని’ పేర్కొన్నారు.Severe #earthquake tremors in #Delhi at 0537 amI was in hospital. Yet to evacuate all a patients down. Told those who can walk to go down— Anish K Gupta (@optionurol) February 17, 2025అనిష్ అనే యూజర్ ‘ఢిల్లీలో ఉదయం 05:37కు తీవ్రమైన ప్రకంపన వచ్చింది. ఆ సమయంలో నేను ఆస్పత్రిలో ఉన్నాను. ఇక్కడి సిబ్బంది అందరినీ బయటకు పంపించివేశారు’ అని రాశారు.Very strong earthquake for a couple of seconds here in delhi. The whole society is up!— Worah | #WalkingInDelhi (@psychedelhic) February 17, 2025ఇంకొక యూజర్ ‘ఢిల్లీలో కొద్ది సెకెన్లపాటు భూకంపం వచ్చింది. సొసైటీలోని వారంతా ఉలిక్కిపడ్డారు’ అని రాశారు. మరొకరు ‘ఇది భయానక అనుభవం’ అని పేర్కొన్నారు. -
ఢిల్లీ భూకంపంలో భయపెట్టే శబ్దాలు..!కారణమిదే..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం(ఫిబ్రవరి17) తెల్లవారుజామున వచ్చిన భూకంపానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0 పాయింట్లుగా నమోదైంది. ఇది తక్కువ తీవ్రత కలిగిన భూకంపమే అయినప్పటికీ ఢిల్లీ వాసుల కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేసింది.అరుదైన శబ్దాలతో వారిని భయభ్రాంతులకు గురి చేసింది. వారిని ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసేలా చేసింది. తక్కువ తీవ్రత కలిగిన భూకంపం ఇంత ప్రభావం చూపడానికి శాస్త్రవేత్తలు వెల్లడించార. భూకంప కేంద్రం భూ ఉపరితం నుంచి అతి తక్కువగా కేవలం 5 కిలోమీటర్ల లోతులో ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.సాధారణంగా తక్కువ లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువలోతులో వచ్చేవాటికంటే తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. భూ ప్రకంపనలు వేగంగా భూఉపరితలాన్ని చేరుకోవడమే ఇందుకు కారణం.భయంకర శబ్దాలు ఎందుకు వస్తాయి..తక్కువ లోతులో సంభవించే భూకంపాలు వింత,భయంకర శబ్దాలకు కారణమవుతాయని జియాలజిస్టులు వివరిస్తున్నారు. ఈ భూకంపాల వల్ల కలిగే ప్రకంపనలు భూమిపైకి వేగంగా చేరుకుని గాలిలో కలిసినపుడు శబ్దాలు ఉద్భవిస్తాయి. భూకంపాల నుంచి వెలువడే తొలి తరంగాలను ‘పీ’ వేవ్స్‌గా పిలుస్తారు. ఇవి వాతావరణంలో కలిసినపుడు శబ్దాలు వస్తాయి. భూఉపరితలం ధృడంగా ఉండి ఈ తరంగాలను గట్టిగా అడ్డుకున్నప్పుడు శబ్దాలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. ఢిల్లీలో జరిగింది కూడా ఇదే కావచ్చనే వాదన వినిపిస్తోంది. -
ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరం
-
ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్న బీజేపీ హైకమాండ్
-
మళ్లీ ప్రకంపనలు రావొచ్చు.. అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఈరోజు (సోమవారం) ఉదయం బలమైన భూకంపం సంభవించింది. దీంతో జనం భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంపన తీవ్రంగా ఉండటంతో భూమి కొన్ని సెకన్ల పాటు దీని ప్రభావం కనిపించింది. జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. దీని కేంద్రం ఢిల్లీ చుట్టూ ఉందని సమాచారం. భూ ప్రకంపనలతో పాటు, ఏదో విరిగిపోతున్నట్లు శబ్దం కూడా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ శబ్ధాలకు జనం మరింత భయాందోళనలకు గురయ్యారు.CCTV में कैद दिल्ली-NCR में भूकंप के तेज झटकेसुबह-सुबह भूकंप के झटकों से कांपी दिल्ली, 4.0 तीव्रता. दिल्ली में सोमवार सुबह भूकंप के जोरदार झटके महसूस किए गए. भूकंप के कारण लोगों की नींद भी खुल गई. कंपन इतनी ज्यादा थी कि कई सेकंड तक धरती डोलती रही.#earthquake | #delhincr |… pic.twitter.com/2zsuG2ZyKe— NDTV India (@ndtvindia) February 17, 2025ఈ భూకంప ప్రకంపనల గురించి స్థానికుడు సుమన్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘భూమి కింద ఏదో విరిగిపోతున్నట్లు అనిపించింది. ఆ పెద్ద శబ్దంతో నేను నిద్రలో నుంచి మేల్కొన్నాను. ఎంతో భయాందోళనలకు లోనయ్యాను. నేను నా ఐదేళ కుమారుడిని ఎత్తుకుని, ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంటి నుండి బయటకు పరుగులు తీశాను. నాలాగే చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిలబడ్డారు’ అని తెలిపారు. కాగా చాలా కాలం తర్వాత ఢిల్లీలో ఈ స్థాయి భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.బీహార్, హర్యానాలో..ఢిల్లీతో పాటు బీహార్,హర్యానాలలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. బీహార్‌లోని సివాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైంది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. హర్యానాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, రోహ్తక్, సోనిపట్‌లలో భూమి కంపించింది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న బహదూర్‌గఢ్‌లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. Prime Minister Narendra Modi tweets, "Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation." pic.twitter.com/KX9qCArbG3— ANI (@ANI) February 17, 2025ప్రధాని మోదీ ట్వీట్ఢిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భూకంపం పై ఢిల్లీ ప్రజలెవరూ ఆందోళనకు గురి కావొద్దని, సురక్షితంగా ఉండేందుకు ముందు జాగ్రత్తలతో వ్యవహరించాలని తెలిపారు. మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. భూకంపాలకు కారణమిదే..భూమి నాలుగు పొరలతో కూడి ఉంటుంది. ఇవి ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్. వీటిలో క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్పియర్ అని అంటారు. ఈ 50 కి.మీ మందపాటిగా ఉన్న పొర అనేక భాగాలుగా విభజితమై ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. భూమి లోపల ఇలాంటి ఏడు ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు భూప్రకంపనలు సంభవిస్తాయి. భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్ ఆధారంగా కొలుస్తారు. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అని కూడా అంటారు. భూకంపం కేంద్రం నుంచి తీవ్రత ఎంతనేది కొలుస్తారు. భూకంపం సంభవించినప్పుడు ఆ సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను లెక్కించి భూకంపం ఏ తీవ్రతతో ఉందనేది చెబుతారు. భూగర్భ శక్తి విడుదలయ్యే ప్రదేశానికి కొంచెం దిగువన భూకంప కేంద్రం ఉంటుంది. ఈ కంపనం ఫ్రీక్వెన్సీ ఎంత దూరం ఉంటే.. దాని ప్రభావం అంత తగ్గుతూ ఉంటుంది. రిక్టర్ స్కేల్‌పై 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత ఉంటే దానిని భారీ భూకంపంగా గుర్తిస్తారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా స్టన్నింగ్ లుక్! -
తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్రేగ్రేషియా
-
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటనపై మోదీ దిగ్భ్రాంతి
-
వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు షాక్!
ఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ (Delhi Railway Station) కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి తొక్కిసలాట (stampede) జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు భారీ సంఖ్యలో వచ్చారు. కుంభమేళాకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ క్రమంలో 14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండడంతో భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో, 18 మంది మృతిచెందారు.Reportedly 21 people lost lives in the Delhi railway station stampede !who's taking responsibility for this ? This is not mismanagement? #RailwayMinisterResign #STAMPEDE #Delhi#NewDelhiRailwaystation#delhirailwaystation #MahakumbhStampede #trainaccident #Railway pic.twitter.com/oxrtomGkKL— sustainme.in®️ (@sustainme_in) February 16, 2025 See the crowd⚠️Each & every human is stuck to another like a garland woven togetherStampede is bound to happen at the slightest hint of chaos & panicIndian Railways for you 🤷#NewDelhiRailwaystation #STAMPEDE#trainaccident #ResignRailwayMinister pic.twitter.com/DKnrE8TYTS— Sudiksha (@Su_diksha) February 16, 2025ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అయినప్పటి నుంచే రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రైలు ప్రమాదాల్లో ఇప్పటికే చాలా మంది చనిపోయారని అంటున్నారు. రైలు ప్రమాదాలకు బాధత్య వహించి రైల్వే మంత్రి (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్యాగ్(#ResignRailwayMinister) ట్విట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. भारतीय रेलवे 21वी सदी के सबसे अच्छे दौर से गुजर रही है। और सबसे बड़ा योगदान रील मंत्री का है। #STAMPEDE #ResignRailwayMinister #NewDelhiRailwaystation pic.twitter.com/lUXGTLCF5Y— Sunand Sarkar Kushwaha (@TheSunandSarkar) February 16, 2025 ఇక, ఇదే సమయంలో అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో గత కొన్నేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల గురించి కూడా పోస్టులు పెడుతున్నారు. ఆయన రైల్వే శాఖకు మంత్రి అయ్యాకే ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. 1956లో అరియలూర్‌లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ప్రమాదానికి బాధత్య వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేస్తున్నారు. తన హయాంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 1956 :: Ariyalur Train Accident Railway Minister Lalbahadur Shastri Resigned Taking Moral Responsibility ( Photo - The Hindu ) pic.twitter.com/rtUy9TdcGD— indianhistorypics (@IndiaHistorypic) February 15, 2025 Not again Indian Railways 💔Sealdah bound Kanchenjungaa Express hit by a goods train near New Jalpaiguri, More Details awaited, Wishing for everyone's safety 🙏 #trainaccident #indianrailways pic.twitter.com/ALkidHnESb— Trains of India (@trainwalebhaiya) June 17, 2024 Railway Minister Lal Bahadur Resigned Taking Moral Responsibility of The Train Accident In 1956 pic.twitter.com/xJF8PDKPys— indianhistorypics (@IndiaHistorypic) February 15, 2025 ज्यादा लोग बिहार के हैं #AshwiniVaishnawMustResign #AshwiniVaishnawResignNow pic.twitter.com/mh1uW2gpJl— Magadh Updates (@magadh_updates) February 16, 2025 -
ఢిల్లీ టూర్ లో రాహుల్ తో సీఎం రేవంత్ భేటీ
-
ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు కారణాలు..
-
విషాదం.. ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట (ఫోటోలు)
-
హస్తిన ముఖ్యమంత్రి ఎవరో?
-
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?
ఢిల్లీ: భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, నూతన సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు.ఈ కమిటీ సభ్యులు కొత్త సీఈసీని ఎంపిక చేయనున్నారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్ కుమార్.. కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కాగా, మంగళవారం రిటైర్డ్ కానున్న రాజీవ్ కుమార్ సీఈసీగా మే 15, 2022న బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగాయి.ఎన్నికల కమిషనర్.. బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం! -
ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం!
దేశ రాజధాని రీజియన్‌లో దాదాపు.. మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తొందరపాటు పనికి రాదని భావిస్తోంది. ఇందుకు గత అనుభవాలతో పాటు ప్రస్తుత సామాజిక పరిస్థితులు కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్యాకేజీల సర్ప్రైజ్లను ఇవ్వబోతుందని సంకేతాలు అందుతున్నాయి.ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్ర హోదా దక్కింది. 1993లో జరిగిన ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే.. ఐదేళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల అసంతృప్తి నడుమ ముగ్గురు ముఖ్యమంత్రులను(మదన్ లాల్ ఖురానా, షాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్) మార్చాల్సి వచ్చింది. ఆపై అధికారం కోసం మళ్లీ ఇన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో.. సుదీర్ఘ కాలం తర్వాత దక్కిన అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటోంది.సర్ప్రైజ్ తప్పదా?ఈ మధ్య గెలిచిన రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలను సైతం బోల్తా కొట్టించాయి. మధ్యప్రదేశ్‌కు మోహన్ యాదవ్, రాజస్థాన్‌కు భజన్ లాల్ శర్మ, ఛత్తీస్‌గఢ్‌కు విష్ణుదేవ్ సాయ్‌లను ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో.. రాజస్థాన్ విషయంలో ఏకంగా తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన భజన్ లాల్‌కు సీఎం పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఢిల్లీ విషయంలోనూ ఇలాంటి సర్ప్రైజ్ నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదు. అదే ఫార్ములా!ఢిల్లీ కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ తెరపైకి తెస్తోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇదే పద్ధతిని అవలంభిస్తోంది. అలాగే.. ఢిల్లీని బీజేపీ మినీ ఇండియాగా భావిస్తోంది. బీజేపీ విజయంలో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచలీస్, ఉత్తరాఖండీస్, వైశ్యాస్, జాట్.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని బీజేపీ భావిస్తోంది. కాబట్టి డిప్యూటీ సీఎంల ఎంపికలోనూ సామాజిక సమీకరణను ప్రముఖంగా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.రేసులో ఎవరంటే..ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ ఛీప్‌లు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయలతో పాటు సీనియర్ నేతలు మంజిదర్ సింగ్ సిర్సా, పవన్ శర్మ, అశిష్ సూద్ మహిళా నేతలు రేఖా గుప్తా, శిఖా రాయ్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక.. కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్ణెయిల్ సింగ్, రాజ్‌కుమార్ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ(సింగర్), కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పేరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జాతీయ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. సీఎం రేసుతో పాటు కేబినెట్ కోసం పలువురి పేర్లతో కూడిన జాబితాను పరిశీలిస్తోంది. అవినీతి ప్రభుత్వంగా పేర్కొంటూ ఆప్‌ను బీజేపీ గద్దె దించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో కుల సమీకరణాలతో పాటు ‘క్లీన్ ఇమేజ్’ను పరిగణనలోకి తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అగ్రనేత, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. అలాగే.. సోమ, లేదంటే మంగళవారాల్లో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీ తర్వాత సీఎం ఎవరనేదానిపై స్పష్టమైన ప్రకటన వెలుడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదంటే 20వ తేదీ ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది తాజా సమాచారం. -
‘ఢిల్లీలో కరెంట్ కష్టాలు.. ప్రజలు ఇన్వెర్టర్లు కొంటున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ఆప్ 22 స్థానాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఢిల్లీలో అప్పుడే కరెంట్ కష్టాల్లో మొదలయ్యాయంటూ ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషి(Atishi) ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఢిల్లీలో కరెంట్ కష్టాలు ఆరంభం అయ్యాయంటూ సెటైర్లు వేశారు. బీజేపీకి ఎలా పరిపాలించాలో తెలియడం లేదు. ప్రధానంగా పరిస్థితిని బట్టి కరెంట్ సదుపాయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇవ్వడంలో బీజేపీ అప్పుడే విఫలమైంది. దీనిపై నాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులొచ్చాయి. చాలా ఏరియాల నుంచి పలు ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. ప్రజలు అప్పుడే కరెంట్ ఉంటుందనే నమ్మకం కోల్పోయారు. వారు ఇన్వెర్టర్లు కొనుగోలు చేయడం ఇప్పటికే ఆరంభించారు. . ఢిల్లీని యూపీ తరహాలో మార్చబోతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆమె విమర్శించారు.ఢిల్లీలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. ఇంకా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ప్రధాని మొదీ అమెరికా పర్యటన అనంతరం ఢిల్లీ సీఎంను ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎంగా బీజేపీ ఇంకా ఎంపిక చేయకుండానే, పూర్తి స్థాయి పరిపాలన బాధ్యతలు తీసుకోకుండానే ఆప్ విమర్శలు చేయడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు. -
న్యూఢిల్లీ: వందరోజుల కార్యాచరణకు బీజేపీ కసరత్తు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ త్వరలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. అయితే ఇంతలోనే అధిష్టానం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని వివిధ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వికసిత్ ఢిల్లీ, ఆయుష్మాన్ భారత్ లాంటి కేంద్ర పథకాల అమలుకు, మురుగునీటి పారుదల, నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలను కోరారు.ఏదైనా ప్రాజెక్టు లేదా పథకాన్ని మంత్రి మండలికి సమర్పించాలనుకుంటే ముందుగా ఆ శాఖ ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇదేవిధంగా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకం అమలుపై క్యాబినెట్ నోట్ తయారు చేయాలని ఆరోగ్య శాఖను బీజేపీ అధిష్టానం కోరింది. బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రారంభించే పథకాలు లేదా ప్రాజెక్టుల కోసం క్యాబినెట్ ముసాయిదా నోట్లను సిద్ధం చేయాలని బీజేపీ అన్ని విభాగాల అధిపతులను ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, కొత్త ప్రభుత్వానికి అందజేస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.గత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో అమలు చేయని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడానికి క్యాబినెట్ నోట్ సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖను బీజేపీ కోరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ అగ్ర నేతలు హామీనిచ్చారు. దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలను ప్రధాన కార్యదర్శి కోరారు.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
ఏపీ ప్రయోజనాలు వదిలేశారు: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి,న్యూఢిల్లీ: పోలవరం ఏపీకి జీవనాడి అని,పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, గురుమూర్తి, గొల్ల బాబూరావు, మేడ రఘునాథ్‌రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) మీడియాతో మాట్లాడారు.‘150 టీఎంసీల సామర్థ్యం 115 టీఎంసీలకు పడిపోతుంది.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపైన దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.ఉద్యోగస్తులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి. స్టీల్ ప్లాంట్‌కు ప్లాంటుకు అవసరమైన గనులు కేటాయించాలి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు మాట్లాడాలి. వ్యక్తిగతంగా మా పైన, మా పార్టీ అధ్యక్షుడిపైన మాట్లాడడం మానుకోవాలి. మిర్చి రైతులకు మద్దతు ధర లేకుండా పోయింది. మిర్చి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో మేము మార్కెట్ జోక్యం ద్వారా రైతులను ఆదుకున్నాం’అని వైవీసుబ్బారెడ్డి తెలిపారు.ఎత్తు తగ్గిస్తే బనకచర్లకు నీళ్లు సాధ్యం కాదు: మిథున్రెడ్డిపోలవరం ప్రాజెక్టుకు రూ. 60 వేల కోట్ల ఖర్చు అవుతుందికానీ కేవలం రూ. 30,000 కోట్లతో ముగించాలని చూస్తున్నారుపోలవరం ఎత్తు తగ్గించడం వల్ల బనకచర్లకు నీళ్లు తరలించడం సాధ్యం కాదుఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం 45 మీటర్ల ఎత్తు ఉండాలిరాష్ట్రం నష్టపోతుంటే, టీడీపీ ఎంపీలు చూస్తూ కూర్చుంటున్నారురాష్ట్రంలో మెడికల్ సీట్లను సరెండర్ చేసేలా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందివ్యక్తిగత ఆరోపణలకు పార్లమెంటును వేదికగా మార్చుకోవద్దు సీఎం రమేష్‌పై మిథున్‌రెడ్డి ఫైర్ మద్యం విషయంలో తనపై సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) లోక్‌సభలో అన్నారు. సీఎం రమేష్‌కు కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవాలని చురకంటించారు. మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తమపై సీఎం రమేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి కుంభకోణం అతిపెద్ద స్కామ్ అని, ఈ స్కామ్‌పై విచారణ జరగాల్సిందేనని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఏపీపై కేంద్రం చిన్నచూపు: పిల్లి సుభాష్చంద్రబోస్బీహార్కు ఇచ్చిన ప్రాధాన్యత ఏపీక ఇవ్వడం లేదుటీడీపీ ఎంపీలు రాజకీయ ద్వేషంతో చేసే వ్యక్తిగత విమర్శల వల్ల ఉపయోగం లేదుపార్లమెంటును రాష్ట్ర ప్రయోజనాల కాపాడేందుకు సద్వినియోగం చేసుకోవాలిటీడీపీ ఎంపీలు పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నారుమేము మాట్లాడుతుంటే అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదుపోలవరం ఎత్తు తగ్గింపు రైల్వే జోను ఇతర అంశాలపై ఐక్యంగా పోరాడుదాంఏపీలో వ్యవసాయం సంక్షోభంలో పడిందిరైతులను ఆదుకోవాలని మేము అడుగుతుంటే టీడీపీ వారు సభలో అడ్డుకుంటున్నారురైతులను గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంది ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీ పడ్డారు: వైఎస్ అవినాష్రెడ్డివిభజన సమయంలో ఏపీకి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయించడం చంద్రబాబు రాజీ పడ్డారు25 వేలకోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదాను వదిలేశారుపోలవరం ఎత్తును కుదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించిందిరూ. 57 వేలకోట్లకుగాను 30 వేలకోట్ల రూపాయలకు పోలవరాన్ని పరిమితం చేశారు 27 వేల కోట్ల గ్రాంట్ వదిలేశారు ఫలితంగా అమరావతికి 15000 కోట్ల అప్పు సాధించారు పోలవరం ఎత్తును, కెపాసిటీ తగ్గించి రాష్ట్రాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారు16 మంది ఎంపీల మద్దతు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడడం లేదు చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారుమేము ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు కడపలో స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్‌ను తీసుకొస్తే చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారుదాని ఫలితంగా ఆయన మహారాష్ట్రకు వెళ్లిపోయి మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారుచంద్రబాబు చర్యల వల్ల యువత రైతులు నష్టపోయారు 9 నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు ఏ వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు రాజీపడుతున్నారుకూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలను మానుకోవాలి:గురుమూర్తితిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నాపై దాడికి పాల్పడ్డారుప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులో ఖూనీ చేశారూఒక్కరే సభ్యులు ఉన్న టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది పార్లమెంట్లో రాష్ట్రం పరువు తీయొద్దుశిఖండి తరహా రాజకీయాలకు పాల్పడవద్దుమాపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడుతున్నారుసంపద సృష్టిస్తానని హామీ ఇచ్చి అప్పులు చేస్తున్నారు:గొల్లబాబూరావుసూపర్ సిక్స్ పేరుతో జనం చెవులలో ఊదరగొట్టారుఒక్క హామీ కూడా అమలు చేయక ప్రజలను మోసం చేస్తున్నారుచంద్రబాబు వల్ల మోసపోయామని జనం అంటున్నారువైఎస్ జగన్ మాటిస్తే వెనక్కి పోరురాష్ట్ర ప్రయోజనాలపై మేము టీడీపీతో కలిసి వస్తాంతమిళనాడు కర్ణాటక ఎంపీల తరహాలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలిఏపీకి న్యాయం జరగాలనే మా పోరాటం: మేడ రఘునాథ్రెడ్డితిరుపతి ఐఐటీకి అదనపు నిధులు కావాలితిరుపతిని నూతన రైల్వే డివిజన్ చేయాలని సభలో కోరాపార్లమెంటులో ఏపీ పరువు తీయొద్దుసాధ్యమైనంత ఎక్కువగా ఏపీకి నిధులు వెళ్లేలా మేమే చొరవ తీసుకుంటున్నాంవ్యక్తిగత విమర్శలుమాని, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ ఎంపీలు పనిచేయాలి -
వీడియో: కన్నీళ్లను దిగమింగుకున్న ఆప్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంపై ఆప్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి(కాబోయే మాజీ) సౌరభ్ భరద్వాజ్ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ గ్రాండ్ విక్టరీ కైవసం చేసుకోగా, అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ దిగ్గజాలంతా ఈ ఎన్నికలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెబుతూనే సౌరభ్ భదర్వాజ్ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి షికా రాయ్ చేతిలో ఓడారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఆటలో గెలుపోటములు సహజమే. అలాగే రాజకీయాల్లో కూడా. నా.. పార్టీ ఓటమిని నేను అంగీకరిస్తున్నా. కానీ, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం భరించలేకపోతున్నా’’ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టబోయారాయన. అయితే వెంటనే పక్కకు వెళ్లి.. ఆ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీలో ఆప్ కోసం ప్రతీ కార్యకర్త కష్టపడ్డారని, వాళ్లను చూస్తే గర్వంగా ఉందని అన్నారాయన. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Saurabh Bharadwaj of Aam Admi Party gets emotional when his cader visit him to console after losing in Delhi elections He couldn’t control from crying! He contested from Greater Kailash and lost by 3188 votes! Shika Rai won from this place!#saurabhbhardwaj #DelhiElection2025… pic.twitter.com/ktFqzvKUUg— North East West South (@prawasitv) February 10, 2025 గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో సౌరభ్ భరద్వాజ్ నెగ్గారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి.. బీజేపీ షికా రాయ్ చేతిలో మూడు వేల ఓట్ల ఆధిక్యంతో ఓడారు. షికా రాయ్‌కు 49,594 ఓట్లు పోలవ్వగా, భరద్వాజ్‌కు 46,406 ఓట్లు పడ్డాయి. అలాగే.. కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి 6,711 ఓట్లు పోలయ్యాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ రాకేష్ కుమార్‌పై 14 వేల ఓట్లు, 2020 ఎన్నికల్లో 16 వేల ఓట్ల ఆధిక్యంతో భరద్వాజ్ గెలుపొందడం గమనార్హం. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ 48 సీట్లు దక్కించుకుని అద్భుత విషయం సాధించింది. గత రెండు ఎన్నికల్లో 67, 62 సీట్లు సాధించిన ఆప్.. ఈసారి 22 స్థానాలకు పడిపోయింది. ఇక.. కాంగ్రెస్ జీరోకి పరిమితమైంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ఢిల్లీకి మహిళా సీఎం?
న్యూఢిల్లీ: ఢిల్లీకి మరోసారి మహిళే ముఖ్యమంత్రి కానున్నారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అత్యున్నత వర్గాలను ఉటంకిస్తూ పార్టీ వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. కాబోయే సీఎం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లోంచే ఎంపికవుతారని కూడా తెలుస్తోంది. పార్టీలో పలువురు నేతల అభిప్రాయం కూడా అదే కావడంతో ఈ విషయంలో అధిష్టానం రెండో ఆలోచన చేయకపోవచ్చంటున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను బీజేపీ ఓడించడం తెలిసిందే. తద్వారా ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ తరఫున నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం పదవికి మహిళనే ఎంచుకుకోవాలని పార్టీ నిర్ణయిస్తే వారిలో ఎవరికి అదృష్టం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేగాక వెనకవబడ్డ వర్గాల నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రిని కూడా చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మహిళలకు, దళితులు, ఇతర వెనకబడ్డ వర్గాలకు మంత్రివర్గ కూర్పులో కూడా అధిక ప్రాధాన్యం దక్కడం ఖాయమంటున్నారు. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియపై పార్టీ పెద్దలు ఇప్పటికే దృష్టి పెట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు సమావేశమై దీనిపై చర్చించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన విజయం సాధించిన బీజేపీ నేత పర్వేశ్ వర్మ సీఎం రేసులో ముందున్నారంటూ రెండు రోజులుగా వార్తలు వస్తుండటం తెలిసిందే. ఆయన మాజీ సీఎం కుమారుడు. పర్వేశ్ తండ్రి సాహిబ్‌సింగ్ వర్మ బీజేపీ తరఫున ఢిల్లీ సీఎంగా పని చేశారు. పర్వేశ్‌తో పాటు వీరేంద్ర గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, పవన్ వర్మ తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్న తరుణంలో తాజాగా అనూహ్యంగా మహిళా సీఎం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ 13న తిరిగి రానున్నారు. సీఎం అభ్యరి్థపై ఆ తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. బహు శా 15వ తేదీకల్లా దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు. ఆ నలుగురు వీరే... బీజేపీ నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. షాలిమార్‌బాగ్ స్థానం నుంచి రేఖా గుప్తా, నజఫ్‌గఢ్ నుంచి నీలం పెహల్వాన్ 29 వేల పై చిలుకు మెజారిటీతో నెగ్గారు. గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా రాయ్ 3,188 ఓట్ల మెజారిటీతో ప్రముఖ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్‌పై నెగ్గారు. వాజీపూర్ నుంచి పూనం శర్మ కూడా 11 వేల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటిదాకా ముగ్గురు ఢిల్లీకి ఇప్పటిదాకా ముగ్గురు మహిళలు సీఎంలయ్యారు. వారిలో తొలి వ్యక్తిగా బీజేపీ నేత సుష్మా స్వరాజ్ నిలిచారు. 1998లో ఆమె సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే కేవలం 52 రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. ఆమె తర్వాత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ రూపంలో రెండో మహిళ ఢిల్లీ గద్దెనెక్కారు. ఆమె 2013 దాకా ఏకంగా 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగడం విశేషం. అనంతరం ఆప్ నుంచి తాజాగా ఆతిశీ రూపంలో మూడో మహిళ ఢిల్లీ సీఎం అయ్యారు. ఆమె కేవలం నాలుగున్నర నెలల పాటు పదవిలో కొనసాగారు. -
బ్యాటర్‌కు ఉన్నంత ఏకాగ్రత ఉండాలి
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షలపై ఉండే భయాలను పోగొడుతూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ ఆద్యంతం స్ఫూర్తివంతంగా సాగే ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమం సోమవారం ఢిల్లీలో జరిగింది. 8వ ఎడిషన్‌లో భాగంగా ఈసారి కూడా ప్రధాని మోదీతో నేరుగా సంభాషించేందుకు కోట్లాది మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోగా కేవలం 35 మందికి మాత్రమే నేరుగా మాట్లాడే అవకాశం దక్కింది. ఢిల్లీలోని సుందర్ నర్సరీ వనంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘పరీక్షల ఒత్తిడిని విద్యార్థులు క్రికెట్ స్టేడియంలో బ్యాటర్‌లాగా ఎదుర్కోవాలి. తర్వాతి బంతికి ఫోర్ కొట్టు, సిక్స్ కొట్టు అంటూ వేలాది మంది ప్రేక్షకులు అరుస్తున్నా, ఈలలు వేస్తున్నా బ్యాటర్‌కు ఇవేం వినిపించవు. ఒక్క బంతి మీద మాత్రమే దృష్టిపెడతాడు. అంతటి ఏకాగ్రతను మీరూ సాధించండి. పరీక్షలు అనే ఒత్తిళ్లకు లొంగకుండా చదువు మీద మాత్రమే మీరు పూర్తిగా ధ్యాస పెట్టాలి. గత పరీక్షల ఫలితాల కంటే మెరుగైన మార్కులు తెచ్చుకుంటానని మీకు మీరే సవాల్ విసురుకోండి. పోషకాహారం తీసుకోండి. ధ్యానంపై దృష్టిపెట్టండి. జ్ఞానం, పరీక్షలు అనేవి భిన్నమైన అంశాలు. పరీక్షలే లోకంగా ఎప్పుడూ బతకొద్దు. సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. సమయాన్ని ఎంత ఎక్కువగా సద్వినియోగం చేస్తారో జీవితంలో అంతపైకి ఎదుగుతారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోండి. సానుకూలతతో దేనినైనా సాధించవచ్చు’’అని మోదీ అన్నారు. ‘‘ఇటీవలికాలంలో సమాజంలో ఒక ఆలోచన బలంగా నాటుకుపోయింది. విద్యార్థులు పది, 12వ తరగతుల్లో సరిగా చదవక మార్కులు తక్కువొస్తే ఆ విద్యార్థి జీవితం నాశనమైనట్లేనని తల్లిదండ్రులు ఒక నిశ్చయానికి వచ్చేస్తున్నారు. విద్యార్థులేమీ రోబోట్లు కాదు. విద్య అనేది కేవలం తదుపరి తరగతికి అర్హత సాధించేందుకు ఉద్దేశించిందికాదు. విద్యార్థి సమగ్రాభివృద్ధికి విద్య ఒక సోపానం. తక్కువ గ్రేడ్లు వచి్చనప్పుడు సమాజం నుంచి విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఒత్తిళ్లను పక్కనబెట్టి విద్యార్థులు మిమ్మల్ని మీరు సవాల్‌గా తీసుకుని చదవండి. మంచిగా నిద్రపొండి. అత్యధిక స్కోర్ రాలేదంటే తమ పని అయిపోయిందనే ఆలోచనతో లోయలోకి విద్యార్థులు పడిపోవద్దు’’అని అన్నారు. ఆన్లైన్లో కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. -
‘మీకు శాపం తగిలింది.. అందుకే ఓడిపోయారు’.. అతిషీతో సక్సేనా!
ఢిల్లీ: ‘నేను ముందునుంచి చెబుతూనే ఉన్నా. యమునాతో పెట్టుకోవద్దు. మీ కొంప మునుగుతుంది అని. అయినా మీరు నా మాట విన్నారా. వినలేదు. పెడ చెవిన పెట్టారు. ఇప్పుడు అనుభవించండి’ అంటూ ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనాతో (Atishi Marlena) లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (lieutenant governor V K Saxena) అన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అతిషీ మర్లేనా తన రాజీనామాను లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. ఆ సమయంలో ఇరువురు మధ్య ఈ సంభాషణ జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (delhi assembly elections) బీజేపీ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 27ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకుంది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ తరుణంలో కర్ణుడి చావుకి వందకారణాలు అన్నట్లు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో యమునా నదిని శుభ్రం చేయకుండా కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించడమే ప్రధాన కారణమని సమాచారం.యమునా నదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్‌ను నిలిపివేయమని కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతే యమునా శాపం గురించి ఆయనను హెచ్చరించా’ అని గవర్నర్ సక్సేనా అతిషితో చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. కేజ్రీవాల్‌కు యమునా నది శాపం ఏంటి?యమునా నది కాలుష్యం కోరలు చాచడంతో జనవరి 2023లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నది పునరుజ్జీవనాన్ని పర్యవేక్షించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అత్యున్నత స్థాయి కమిటీ ఐదు సమావేశాలు నిర్వహించి యమునా నదిని శుభ్రపరచే పనిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమైంది. అందుకు ఆప్ ప్రభుత్వం సహకరించింది. యమునా నది ఆక్రమణలు తొలగించడం, 11 కిలోమీటర్ల మేర శుభ్రం చేయడం పూర్తయింది. నదిలో నీటి ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అప్పుడే యమునా నదిని శుభ్రం చేసిన ఘనత తమకు దక్కదనే దురుద్దేశ్యంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో యమునా నదిని శుభ్రం చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై స్టే విధించాలని పిటిషన్ పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే విధించింది. తత్ఫలితంగా, యమునా నదిని పరిశుభ్రం చేసే పనులు ఐదు నెలల తర్వాత ఆగిపోయాయి. ఆ విషయంలో కేజ్రీవాల్ విజయం సాధించినా నదిని శుభ్రపరిచేందుకు గత 16 నెలలుగా ఒక్క పని కూడా చేయలేదు’అని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా గతేడాది నవంబర్‌లో ఓ కార్యక్రమంలో ఆరోపణలు గుప్పించారు.తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తన రాజీనామా సమర్పించేందుకు వచ్చిన అతిషీ మర్లేనాకు ‘యమునా నది పునరుజ్జీవనం’ శాపం అంశం గురించి గుర్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా,ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అటు అతిషీ కానీ, ఎల్జీ రాజ్‌భవన్ వర్గాలు నిరాకరించాయి.👉చదవండి : మాజీ సీఎం కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన ఎవరీ పర్వేష్ వర్మ? -
ఢిల్లీ సీఎం ఎవరన్న దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
కేజ్రీవాల్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. ఎవరీ పర్వేష్ వర్మ?
ఢిల్లీ: 27ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో కంట్లో నలుసుగా, కొరకరానికి కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) ని బీజేపీ చిత్తు చేతింది. ఆ పార్టీ చేతిలో రెండు సార్లు ఓటమి చవిచూసిన బీజేపీ (bjp) మూడోసారి విజయం సాధించింది. దీంతో ఢిల్లీ సీఎం ఎవరు?హస్తినలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువు దీరనుంది? అనే ప్రశ్నల పరంపర కొనసాగుతుంది.ఈ తరుణంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన తర్వాతే ఢిల్లీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. రేపటి నుంచి నాలుగు రోజులపాటు మోదీ అమెరికా, ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. పర్యటన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది.నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రస్తుత ఢిల్లీ సీఎంగా ఉన్న అతిశీ మార్లేనా తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. అతిశీ రాజీనామా అనంతరం, ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఉత్తర్వులు వెలువరించారు.ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల కావడంతో కేజ్రీవాల్‌ను ఓడించి జైంట్ కిల్లర్‌గా ఆవిర్భవించిన పర్వేష్ వర్మ (parvesh verma) గవర్నర్ సక్సేనాతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. ఈ వరుస పరిణామాలతో ఢిల్లీ సీఎంగా పర్వేష్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కాగా,బీజేపీ తరఫున చివరి సారిగా పర్వేష్ వర్మ తండ్రి సాహెబ్ సింగ్ వర్మ సీఎంగా పనిచేశారు. శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను 4,089 ఓట్లతో పర్వేష్ వర్మ విజయం సాధించారు. కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు, వర్మకు 30,088ఓట్లు వచ్చాయి. వర్మ అంతకుముందు 2013లో అసెంబ్లీకి, ఆ తర్వాత 2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వచ్చించారు. ఎవరీ పర్వేష్ వర్మ?ఢిల్లీలోని ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో పర్వేష్ వర్మ కుటుంబం ఒకటి. పర్వేష్ వర్మ బీజేపీలో పంజాబీ జాట్ నేత. ఆయన 'రాష్ట్రీయ స్వయం' అనే సామాజిక సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. పర్వేష్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఆయన మామ ఆజాద్ సింగ్ ఒకప్పుడు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. పర్వేష్ వర్మ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ముండ్కా నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. పర్వేష్ భార్య స్వాతి సింగ్ మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె. పర్వేష్ వర్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.పర్వేష్ వర్మ విజయంపై ఆయన కుమార్తెలు త్రిష, సనిధి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.‘అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తికి ఢిల్లీ ప్రజలు రెండవ అవకాశం ఇచ్చే తప్పును ఎప్పటికీ చేయరు మా తండ్రి గెలుపుతో పాటు పార్టీ గెలుపుపై నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికల్లో స్పష్టమైన విజయం ఉంటుందని మాకు తెలుసు. మేము సరైన సమయం కోసం ఎదురు చూశాం. ఆ సమయం రానే వచ్చింది.ఈసారి ఢిల్లీ ప్రజలు అబద్ధాలను గెలవనివ్వలేదు’ అని వ్యాఖ్యనించారు. -
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అతిషి రియాక్షన్
-
ఢిల్లీలో బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీ! కేటీఆర్ అదిరిపోయే సెటైర్
-
కాంగ్రెస్ సృష్టించిన భస్మాసురుడు కేజీవాల్
-
మోదీ రెండాకులు ఎక్కువే చదివారు.. అందుకే కేజ్రీవాల్‌కు మాస్టర్ స్ట్రోక్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు నిశ్చయించుకున్న బీజేపీ వ్యూహాలు పని చేశాయి. దేశరాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తన ‘బాణాన్ని’ ప్రచారం చివరి దశలో గురి చేసి వదిలారు. ఆ దెబ్బకే కేజ్రీవాల్ సర్కారు ఓటమి దాదాపు ఖరారై పోయింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా గత వారమే విశ్లేషకులు అభివర్ణించారు.గత వారం.. సరిగ్గా శనివారం నాడే కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టించింది. . ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనా నేడు(శనివారం) అక్షరాలా నిజమైంది.మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), బీజేపీ(BJP) మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారిన సంగతి తెలిసిందే. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది.దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు శాయశక్తులా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమైంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది.ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది.ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసింది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడ్డాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది బీజేపీకి బాగా అనుకూలంగా మారిందని, అందుచేతే ఆప్‌కు గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు.ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా ఓటమి పాలవ్వడం ఆ పార్టీ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి కేజ్రీవాల్ ఓటమి చెందారు.ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. ఇది కేజ్రీవాల్‌కు మైనస్‌గా మారింది.అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టించాయి. . వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరిచారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు కేజ్రీవాల్.నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసిరారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొట్టగా, ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్‌కు వరంలా మారింది. -
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)పై ఏఐసీసీ పెద్దలతో చర్చించినా, ప్రస్తుత ఎన్నికలు, ఇతర అంశాల దృష్ట్యా ప్రస్తుతం విస్తరణ చేయడం లేదన్నారు. ‘‘మంత్రివర్గ విస్తరణపై చర్చ లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికైతే విస్తరణ ఉండదు. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై అధిష్టానం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు విస్తరణ ఉంటుంది. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను మంత్రి పదవుల కోసం ఎవరి పేరును సిఫార్సు చేయడం లేదు.మంత్రి పదవులకు అర్హులైన వారిని ఏఐసీసీనే ఎంపిక చేస్తుంది. వారు ఎవరి పేరు సూచిస్తే వారితో ప్రమాణస్వీకారం చేయిస్తా..’’అని చెప్పా రు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శితో కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్‌చాట్ చేశారు. అత్యంత శాస్త్రీయంగా కులగణన నిర్వహించామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఒక్కరోజులో పూర్తి చేయలేదని చెప్పారు.1.12 కోట్ల కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించాకే లెక్కలు బయటపెట్టామన్నారు. ఈ సర్వేలో ఎక్కడా బీసీల శాతం తగ్గలేదని, బీసీలు ఐదున్నర శాతం పెరిగారని.. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ సభ్యులు సైతం అంగీకరించారని పేర్కొన్నారు. ఈ కులగణన లెక్కల ఆధారంగానే సంక్షేమ విధానాలకు రూపకల్పన చేస్తామన్నారు. ప్రస్తుత సర్వేతో ముస్లిం రిజ ర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కేటీఆర్ అరెస్ట్‌పై తొందరపడం.. ఫార్ములా–ఈ రేసు కేసులో చట్టప్రకారమే నడుచుకుంటున్నామని, ఇప్పటికే నగదు బదిలీ జరిగిన కంపెనీకి నోటీసులు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. నోటీసులపై స్పందించేందుకు సదరు కంపెనీ గడువు కోరిందన్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలన్న తొందరేమీ తమకు లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో ఎక్కడా రాజకీయ జోక్యం లేదని, చట్టప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిçస్ లోకూర్ కమిషన్ నివేదిక అందిందని, దానిని అడ్వొకేట్ జనరల్ పరిశీలనకు పంపామని వెల్లడించారు. రాహుల్‌గాం«దీతో దూరమేమీ లేదు.. రాష్ట్రంలో పీసీసీ కమిటీ కూర్పు కొలిక్కి వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన ఉంటుందని రేవంత్ చెప్పారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇక పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని రేవంత్ చెప్పారు. ఈ పర్యటనలో తాను రాహుల్ అపాయింట్మెంట్ కూడా కోరలేదన్నారు. రాహుల్ గాంధీతో ఎప్పటికప్పుడు ఫోన్లో టచ్‌లో ఉన్నామంటూ.. రాహుల్ గాంధీ పెట్టిన మెసేజీలను చూపించారు. -
అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్
-
ఇప్పట్లో లేనట్టేనా?.. కేబినెట్ విస్తరణపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కుల గణన పక్కాగా చేశామని.. త్వరలో దీనిపై చట్టం కూడా తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. మా సర్వేలో బీసీలు 5 శాతం పెరిగారు. సూర్యాపేట, గజ్వేల్‌లో సభలు నిర్వహిస్తాం. మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. నేను ఎవరి పేరు సిఫారసు చేయను. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు మంత్రులవుతారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.‘‘ఏదో ఒక హోటల్లో నలుగురు కూర్చుంటే దాన్ని అసంతృప్తి అని ఎలా అంటారు?. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు ఇదంతా బీఆర్ఎస్ ప్రచారం. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మేము ఫోన్లో చర్చించుకుంటున్నాం. మేము నిర్వహించిన కుల గణనపై పార్లమెంటులోని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ప్రచారంపై ఫోకస్ లేదు. ప్రస్తుతం మేము ఇచ్చిన హామీల అమలుపైనే దృష్టి పెట్టాం’’ అని రేవంత్ చెప్పారు.ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!‘‘ఈ-ఫార్ములా రేసు స్కామ్‌లో ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చాం. ఆ కంపెనీ స్పందించేందుకు సమయం అడిగింది. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి కార్యచరణ ఉంటుంది. తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ పరిశీలనలో ఉంది. ఏజీ ఒపీనియన్ తర్వాత దానిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఎల్జీ ఆదేశం.. ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీ
న్యూఢిల్లీ: తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ఒక్కోక్కరికీ రూ. 15 కోట్లు చొప్పున బీజేపీ ఆఫర్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ఫలితాలకు ఒక రోజు ముందు కేజ్రీవాల్.. ీబీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ సిద్ధమైందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీనిపై చట్టపరమైన చర్యలకు తీసుకుంటామని హెచ్చరించిన బీజేపీ.. ఇందులో భాగంగా ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసింది. ఆప్ ఆరోపణలపై నిగ్గు తేల్చాలని బీజేపీ(BJP) కోరింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని లేఖ ద్వారా ఎల్జీని కోరింది. దీనిపై స్పందించిన ఎల్జీ.. ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు.ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీఎల్జీ ఆదేశాలతో దర్యాప్తుకు సిద్ధమైన ఏసీబీ(ACB).. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇంటితో ాపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో సోదాలు ప్రారంభించింది. దీనిలో ఏసీబీకి చెందిన బృందాలు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే దీనిపై ఆప్ ేనేత సంజయ్ సింగ్ మండిపడుతున్నారు. ఏసీబీ డ్రామా ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకోవడానికి బదులు సరికొత్త డ్రామాకు తెరలేపారన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని ఆయన అన్నారు.కాగా, ఆప్ నేతలు బీజేపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారన్న కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్..‘గత రెండు గంటల్లోనే మా పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులకు ఫోన్లు వచ్చాయి. ఆప్‌ను వీడి బీజేపీ చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ పార్టీకే 55కుపైగా సీట్లు వస్తుంటే.. మా అభ్యర్థులకు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏముంది? దీన్నిబట్టి చూస్తే.. నకిలీ సర్వేలు నిర్వహించారని స్పష్టమవుతోంది. కొంతమంది అభ్యర్థులను లాక్కునే ఉద్దేశంతోనే ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏదేమైనా మావాళ్లు ఒక్కరూ అమ్ముడుపోరు’ అని చెప్పుకొచ్చారు.అయితే కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్ల ఆఫర్
ఢిల్లీ : మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్‌ను నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు. అభ్యర్థులు ఎవరనేది చెప్పకుండా మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో ఆఫర్ చేసిందని చెప్పారు.గురువారం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.‘బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15కోట్లు ఇస్తాం.మా పార్టీలో చేరమని బీజేపీ ఆఫర్ చేసింది.ఎన్నికల ఫలితాలు వెలువడకముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఢిల్లీలో సైతం ఇతర పార్టీలను నిర్విర్యం చేసేందుకు శ్రీకారం చుట్టుంది. ప్రలోభాలకు చేసేలా ఆడియో,వీడియో కాల్స్ వస్తే ఫిర్యాదు చేయాలని, నేరుగా కలిస్తే రహస్యంగా వీడియోలు తీయమని సదరు అభ్యర్ధులకు చెప్పాం’ అని అన్నారు.#WATCH | Delhi: AAP MP Sanjay Singh says, "Seven MLAs (of AAP) have received phone calls from some BJP elements, who have offered to give them Rs 15 crore to leave the Aam Aadmi Party and join the BJP... We have told the MLAs to record such audio calls and complain about it. If… pic.twitter.com/YbYhfu7rEC— ANI (@ANI) February 6, 2025 బీజేపీ ప్రలోభాలపై స్పందిస్తూ..ఎన్నికల ఫలితాలు (ఫిబ్రవరి 8న) వెలువడకముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది.దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఢిల్లీలో కూడా బీజేపీ పార్టీలను బద్దలు కొట్టే రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. కాగా,బుధవారం (ఫిబ్రవరి 5) జరిగిన ఎన్నికలలో ఢిల్లీలో 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. అధిక సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. దీంతో ఆప్‌లో కలవరం మొదలైందనే పొలిటికల్ సర్కిళ్ల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఫిరాయింపుల వ్యవహారం.. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ!
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 10న విచారణ చేపట్టనుంది. ఈ తరుణంలో కేటీఆర్ రేపటి నుంచి నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ వినోద్, దాసోజు శ్రవణ్‌లు వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై న్యాయవాదులతో చర్చించనున్నారు.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
ఐదు ట్రాలీ బ్యాగుల్లో నీట్‌గా ఫారిన్ గంజాయి
న్యూఢిల్లీ: రాజధానిలో మరోసారి మత్తు దందా బయటపడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ముఠాకు సంబంధించిన ఐదుగురిని అరెస్ట్ చేసిన అధికారులు.. మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో గ్రీన్ చానెల్ దాటేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ల కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు చేశారు. వాళ్ల దగ్గర ఉన్న ట్రాలీ బ్యాగుల నుంచి 94 ప్యాకెట్లలో నీట్‌గా ప్యాక్ చేసిన గంజాయి బయటపడింది. అది ఫారిన్ గంజాయి అని, దాని విలువ రూ.47 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఆ ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. -
నేడే హస్తిన సమరం
న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 1.56 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల సంఘం అధికారులు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,000 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.220 కంపెనీల పారామిలటరీ బలగాలను, 35,626 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది, 19,000 మంది హోంగార్డులను మోహరించారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం చేస్తోంది. క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్(క్యూఎంఎస్) యాప్‌ను తీసుకొచ్చింది. ఏయే పోలింగ్ కేంద్రాల్లో ఎంతమంది ఓటర్లు బారులు తీరి ఉన్నారో దీనిద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. జనం తక్కువగా ఉన్న సమయంలో వెళ్లి ఓటు వేయొచ్చు. అలాగే వృద్ధులు, దివ్యాంగుల కోసం 733 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 6,980 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. ఈ నెల 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోరు దేశ రాజధానిలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరాట పడుతుండగా, పూర్వవైభవం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. కాంగ్రెస్ సైతం అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటీపడి మరీ హామీలు గుప్పించాయి. ప్రజలు ఎవరిని విశ్వసించారో మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఓటింగ్ శాతం సైతం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం భారీగా నమోదైతే ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువరు కేంద్ర మంత్రులు.ఆ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆప్ తరపున పార్టీ జాతీయ కన్వినర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం హోరెత్తించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ, యమునా నది కాలుష్యం, ఓట్ల తొలగింపు వంటి అంశాలను పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి. పదేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆప్ అవినీతి పాలన పట్ల ఢిల్లీ ఓటర్లు విసుగెత్తిపోయారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ పెద్దలు తేల్చిచెబుతున్నారు. -
కయ్యాలతో కాలం గడిపిన ఆప్
న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వమున్న కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుండగా, కేంద్ర ప్రభుత్వంతో ఆప్ కయ్యాలు పెట్టుకుంటూ ఢిల్లీని వెనుకబాటుకు గురి చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. జంగ్పురలో సోమవారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియా బడే మియా–చోటే మియా మాదిరిగా ఢిల్లీని దోచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవించిన ఏకైక విద్యావంతుడు ఈయన మాత్రమేనంటూ సిసోడియానుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తరగతిగదుల పేరుతో కుంభకోణానికి పాల్పడిన సిసోడియా ఢిల్లీ చిన్నారుల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. అబద్ధాలతో మభ్యపెడుతున్న కేజ్రీవాల్.. చెత్తాచెదారం, విష జలం, అవినీతిని మాత్రమే ఢిల్లీ ప్రజలకిచ్చారన్నారు. ఆప్ తరఫున ఎన్నికైన వారిలో ప్రస్తుతం సగం మంది మాత్రమే మిగిలి ఉన్నారని, ఆ పార్టీ మునిగిపోయే ఓడ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా ఢిల్లీ మార్చే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. -
మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు(సోమవారం) నుండి రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడనుంది. సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం 7 గంటలకు దృశ్యమానత 200 మీటర్లుగా నమోదైంది. పాలంలో ఉదయం 4 గంటలకు 50 మీటర్లుగా ఉంది.జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షం, హిమపాతం కారణంగా వాతావరణం(Weather)లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా మంచు గాలులు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను తాకాయి. దేశంలోని 12 రాష్ట్రాల్లో విపరీతంగా కురుస్తున్న పొగమంచు పలు సమస్యలను సృష్టిస్తోంది. పంజాబ్, హర్యానాలలో పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.పొగమంచు కారణంగా కోల్‌కతాలో 13 విమానాల రాకపోకలకు(flight arrivals) అంతరాయం కలిగింది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, బెంగాల్, బీహార్, ఒడిశా సహా 12 రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిశా, అస్సాం, మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో సోమవారం కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోనుందని వాతావరణశాఖ తెలిపింది.మంగళవారం పొగమంచు నుండి కొంత ఉపశమనం లభిస్తుందని, రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. పొగమంచు కారణంగా పంజాబ్‌లోని అమృత్సర్-ఖేమ్కరన్ రహదారిపై ఒక కారు- బస్సు ఢీకొన్నాయి. అమర్‌కోట్ బస్తీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేవిధంగా హర్యానాలోని మంగళ్‌పూర్-దరౌలి రోడ్డుపై దట్టమైన పొగమంచు కారణంగా, ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.ఇది కూడా చదవండి: America: 10 సురక్షిత రాష్ట్రాలు.. కాల్పుల మోతకు దూరం.. ప్రాణహానికి సుదూరం -
'వావ్ వాట్ ఎ బాల్'.. తనను ఔట్ చేసిన బౌలర్‌పై కోహ్లి ప్రశంసలు
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున కోహ్లి ఆడాడు. అతడిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అరుణ్ జైట్లీ స్టేడియంకు తరలివచ్చారు.కానీ కింగ్ కోహ్లి మాత్రం అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ అద్బుతమైన బంతితో కోహ్లిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కోహ్లి ఔటయ్యాక స్టేడియం నుంచి అభిమానులు వెళ్లిపోయారు.సాంగ్వాన్‌ను మెచ్చుకున్న కోహ్లి..కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత హిమాన్షును కింగ్ కోహ్లి ప్రశంసించినట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. సాంగ్వాన్ తాను వికెట్ తీసిన బంతిపై సంతకం చేయమని కోహ్లి వద్దకు వెళ్లి అడిగాడంట. అందుకు కోహ్లి.. వాట్ ఎ బాల్.. అద్బుతమైన డెలివరీ సంధించావు అని కొనియాడినట్లు సదరు పత్రిక తమ కథనంలో పేర్కొంది.గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఫ్యాన్స్..మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు రక్షణ వలయాన్ని ఛేదించుకొని విరాట్ కోసం ముగ్గురు అభిమానులు మైదానంలోకి పరుగులు తీయడంతో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ తొలి రోజు గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చిన అభిమాని అతడి కాళ్లు మొక్కగా... శనివారం ముగ్గురు అభిమానులు సెక్యూరిటీని దాటి మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ‘గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. కోహ్లి భయ్యా క్రేజ్‌కు ఇది నిదర్శనం. మైదానంలో దూసుకొచి్చన వాళ్లను కొట్టకండి అని కోహ్లి సెక్యూరిటీ సిబ్బందితో చెప్పాడు’ అని ఢిల్లీ స్పిన్నర్ శివమ్ శర్మ తెలిపాడు. మ్యాచ్ అనంతరం సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్‌తో కోహ్లి ఫొటోలు దిగాడు.ఢిల్లీ ఘన విజయం..ఇక విరాట్ కోహ్లికి తన సహచరులు గెలుపు కానుక ఇచ్చారు. కోహ్లికి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాకుండానే ఢిల్లీ జట్టు ఘనవిజయం సాధించింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా మూడు రోజుల్లో ముగిసిన పోరులో ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో రైల్వేస్ జట్టును ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 334/7తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు... చివరకు 106.4 ఓవర్లలో 374 పరుగులకు ఆలౌటైంది. సుమిత్ మాథుర్ (206 బంతుల్లో 86; 8 ఫోర్లు) మెరుగైన ప్రదర్శన చేశాడు. రైల్వేస్ బౌలర్లలో హిమాన్షు సాంగ్వాన్ 4, కునాల్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రైల్వేస్ జట్టు 30.5 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ సైఫ్ (31) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో శివమ్ శర్మ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన సుమిత్ మాథుర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.చదవండి: Rohit Sharma: నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విషయం చెప్పలేను -
సూపర్‌స్టార్ విఫలమైనా..
రంజీ ట్రోఫీ పునరాగమనంలో విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలమైనా.. అతడి జట్టు ఢిల్లీ మాత్రం ఘన విజయం సాధించింది. రైల్వేస్(Railways Team)ను ఏకంగా ఇన్నింగ్స్ పందొమ్మిది పరుగుల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో వైఫల్యం తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లి ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైల్వేస్ జట్టుతో గురువారం మొదలైన మ్యాచ్ సందర్భంగా కోహ్లి ఢిల్లీ తరఫున సొంతమైదానంలో అడుగుపెట్టాడు. దీంతో కోహ్లి ఆటను చూసేందుకు తొలిరోజే వేలాది మంది అరుణ్ జైట్లీ స్టేడియానికి పోటెత్తారు. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో తొలిరోజు.. కోహ్లికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాట్‌తో అతడు మైదానంలో అడుగుపెట్టాడు. కరతాళ ధ్వనులు, ఆర్సీబీ... ఆర్సీబీ... కోహ్లి... కోహ్లి... అనే అభిమానుల నినాదాల మధ్య ఉదయమే అతడు క్రీజులోకి వచ్చాడు.15 బంతుల్లోనే ముగిసిన ముచ్చటఅప్పటికే ఐదు వేల పైచిలుకు ప్రేక్షకులు మైదానంలోకి వచ్చేశారు. అయితే కోహ్లిని 6 పరుగుల వద్దే హిమాన్షు క్లీన్‌బౌల్డ్ చేయడంతో మరింత మంది అభిమానులు స్టేడియం లోపలికి వచ్చేందుకు ఆసక్తి కనబరచలేదు. కనీసం అతడిబ్యాట్ నుంచి ఫిఫ్టీ వచ్చినా వేలసంఖ్యతో తొలిరోజులాగే అరుణ్ జైట్లీ స్టేడియం నిండిపోయేది.కానీ.. పుష్కర కాలం తర్వాత రంజీ బరిలోకి దిగిన ఈ దిగ్గజ ఆటగాడి బ్యాటింగ్ ముచ్చట 15 బంతుల్లోనే ముగిసింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే సూపర్‌స్టార్ కోహ్లి విఫలమైనప్పటికీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్‌ను 241 పరుగులకు ఆలౌట్ చేసిన బదోని సేన.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 374 రన్స్ స్కోరు చేసింది.బదోని కెప్టెన్ ఇన్నింగ్స్టాపార్డర్లో ఓపెనర్లు అర్పిత్ రాణా(10), సనత్ సంగ్వాన్(30).. వన్‌డౌన్ బ్యాటర్ యశ్ ధుల్(32) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. మరోవైపు.. కోహ్లి ఆరు పరుగులకే అవుట్ కాగా.. ఆయుశ్ బదోని కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 77 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుటయ్యాడు.మూడో రోజే ముగిసిన కథఇక బదోనికి తోడుగా సుమిత్ మాథుర్ 86 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రణవ్ రాజువన్షీ 39 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో 374 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించిన ఢిల్లీ.. శనివారం నాటి మూడో రోజు ఆటలో రైల్వేస్ కథను ముగించింది.సూరజ్ అహుజా బృందాన్ని కేవలం 114 పరుగులకే ఆలౌట్ చేసి.. ఘన విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్ శివం శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ, సిద్ధాంత్ శర్మ, మోనీ గరేవాల్, ఆయుశ్ బదోని ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు చేయడంతో పాటు.. ఓవరాల్‌గా మూడు వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సుమిత్ మాథుర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రోహిత్‌కు మాత్రం పరాభవంఏదేమైనా రంజీ రీఎంట్రీలో విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపించలేకపోయినప్పటికీ.. విజయంతో తిరిగి వెళ్లడం విశేషం. మరోవైపు.. రంజీ పునరాగమనం(జనవరి 23)లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. బ్యాటర్(3, 28)గా అతడి వైఫల్యం ముంబై జట్టుపై ప్రభావం చూపింది. జమ్ము కశ్మీర్ చేతిలో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.విరాట్ కోహ్లికి సన్మానంఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) తమ స్టార్ క్రికెటర్ కోహ్లిని సత్కరించింది. అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున వంద టెస్టులు పూర్తి చేసుకున్న తమ ఆటగాడిని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మెమెంటోను బహూకరించారు. మూడేళ్ల క్రితమే 2022లోనే కింగ్ కోహ్లి వంద టెస్టుల మార్క్ దాటాడు. కానీ రంజీల బరిలోకి దిగకపోవడంతో ఆత్మీయ సత్కారం కోసం డీడీసీఏ ఇన్నేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.చదవండి: అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు: బట్లర్ -
ఢిల్లీ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ
-
వికసిత భారతమే ఏకైక లక్ష్యం..
-
మా పథకాలతో రూ.25 వేల ఆదా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఢిల్లీలోని ప్రతి కుటుంబానికి నెలకు రూ.25 వేల వరకు ఆదా అవుతోందని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోసారి తమకు అధికారమిస్తే అదనంగా రూ.10 వేలు ఆదా అయ్యేలా కొత్తగా పథకాలను తీసుకువస్తామని ప్రకటించారు. శుక్రవారం ఆయన ‘బచత్ పాత్ర’ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. ఆప్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎంత మేరకు లబ్ధి కలుగుతుందో తెలుసుకునేందుకు తమ వలంటీర్లు ఇంటింటికీ వచ్చి ‘బచత్ పాత్ర’గురించి వివరిస్తారన్నారు. కొత్త పథకాల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటివి ఉన్నాయని కేజ్రీవాల్ వివరించారు. ‘సామాన్యంగా బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం, సామాన్యులపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది వంటి అంశాలను తెలుపుతుంది. కానీ, ఢిల్లీ ఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి అయ్యే ఆదాపైనే దృష్టి పెడుతుంది’అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం సన్నిహితులైన వాణిజ్యవేత్తలకు ఎలాంటి ప్రయోజనాలను కల్పించాలని యోచిస్తోందని ఆరోపించారు. ముంబైలోని ధారావిలో మురికివాడల వాసుల భూమిని ఇప్పటికే తమ సంబంధీకులకు కట్టబెట్టిందని, ఢిల్లీలో కూడా భూముల్ని ఆక్రమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. 70లో 60 సీట్లు మావే: ఆప్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 5న జరిగే ఎన్నికల్లో అసెంబ్లీలోని 70 స్థానాలకు 60 సీట్లను చేజిక్కించుకుంటుందని ఆయన చెప్పారు. బీజేపీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో జరిగిన జనసభలో ఆయన మాట్లాడారు. -
ఈ క్యాబ్ ఎక్కితే దిగరు..!
సాధారణంగా మీరు క్యాబ్‌ని (cab) బుక్ చేసుకుని ఎక్కగానే ఎంత త్వరగా గమ్యస్థానాన్ని చేరుకుంటామా అని ఆలోచిస్తారు. కానీ ఢిల్లీలోని అబ్దుల్ ఖదీర్ ఉబెర్ (Uber) క్యాబ్లోకి అడుగు పెడితే రైడ్ ముగియాలని కోరుకోకపోవచ్చు! ఎందుకంటే స్నాక్స్, నీరు, వై-ఫై, పెర్ఫ్యూమ్లు, మందులు, హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్లు, టిష్యూలు, శానిటైజర్లు, యాష్‌ట్రే ఒకటేమిటి అన్నీ సౌకర్యాలు ఈ క్యాబ్‌లోనే ఉన్నాయి. దీనిపై రెడ్డిట్‌లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది.అబ్దుల్ ఖదీర్ కేవలం రైడ్ మాత్రమే అందించడం లేదు. బిజినెస్ క్లాస్ ఫ్లైట్‌లో (business class flight) ఉండే లాంటి లగ్జరీ అనుభూతిని ఇస్తున్నాడు. పైగా క్యాబ్‌లో అతడు అందిస్తున్న ప్రతిదీ ఉచితం. ఇది సాధారణ టాక్సీ కంటే విలాసవంతమైన లాంజ్ లాగా అనిపిస్తుంది. తన క్యాబ్ ఫోటోను షేర్ చేసిన ఓ ప్రయాణికుడు.. "విమానాల కంటే క్యాబ్ సౌకర్యాలు మెరుగ్గా దొరికాయి!" అని చమత్కరించాడు.క్యాబ్‌లో ప్రయాణికులకు ఖదీర్ అందిస్తున్న విశిష్ట కస్టమర్ సేవలపై సోషల్ మీడియా యూజర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల పట్ల ఖదీర్‌కు ఉన్న శ్రద్ధ అతనిని ఎంతగానో పాపులర్ చేసింది. ఎప్పుడు క్యాబ్ అవసరం వచ్చినా అతని క్యాబ్‌నే బుక్ చేసుకుంటామంటున్నారు చాలా మంది. కొంతమంది అయితే ఖదీర్ అందిస్తున్న సౌకర్యాలకు అదనంగా చెల్లిస్తామని కూడా చెబుతన్నారు. -
నాటి బాలకార్మికురాలు..ఇవాళ లీడ్ స్టార్‌గా..!
ఏ కలలకు ఆస్కారం లేని కరుకు జీవితాన్ని చిన్న వయసులోనే అనుభవించిన సజ్దా పఠాన్ పేరు ఆస్కార్ విశేషాల్లో భాగంగా తరచు వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా గునీత్ మోంగా షార్ట్ ఫిల్మ్ ‘అనూజ’ 97వ ఆస్కార్ అవార్డుల్లో నామినేట్ అయిన విషయం తెలిసిందే. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా నామినేట్ అయిన ‘అనూజ’పై బజ్ వేడెక్కడంతో అందరి దృష్టి ఆ చిత్రంలో నటించిన తొమ్మిదేళ్ల లీడ్‌స్టార్ సజ్దా పఠాన్‌పై పడింది.ఢిల్లీ మురికివాడల్లోని బాల కార్మికురాలైన సజ్దాను ‘సలాం బాలక్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ కాపాడింది. సజ్దాకు సినిమా నేపథ్యం లేకపోయినప్పటికీ సినిమాలకు బొత్తిగా కొత్త కాదు. ఇంతకుముందు లాటిటియా కొలోంబానీ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ చిత్రం ‘ది బ్రైడ్’లో సజ్దా నటించింది. ఆ సినిమాలో మియా మేల్జర్తో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. మీరా నాయర్ ఆస్కార్ నామినేటెడ్ చిత్రం ‘సలాం బాంబే’ ద్వారా వచ్చిన ఆదాయంతో ఏర్పాటైన ‘సలాం బాలక్ ట్రస్ట్ కృష్ణన్ నాయక్ ఫిల్మ్స్ భాగస్వామ్యంతో ‘ది బ్రైడ్’ను నిర్మించింది. ఊహించని నాటకీయ పరిణామాలు వెండితెరకే పరిమితం కాదు అని నిజజీవితంలో కూడా ఉంటాయని మరోసారి బలంగా చెప్పడానికి సజ్దా పఠాన్ బలమైన ఉదాహరణ. (చదవండి: ‘హైబ్రీడ్ త్రీ ఇన్ వన్’ సైకిల్ ఆవిష్కరించిన 14 ఏళ్ల కుర్రాడు..!) -
Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్! దారుణ వైఫల్యం
‘కింగ్’ రాకతో రంజీ(Ranji Match)లకు కూడా కళొచ్చింది. పుష్కర కాలం తర్వాత రికార్డుల రారాజు రంజీ బరిలో దిగగానే అభిమానం కట్టలు తెంచుకుని స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుందా అన్న స్థాయిలో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దాదాపు ఇరవై ఏడు వేల మంది తరలివచ్చారు. సూపర్‌స్టార్ బ్యాటింగ్ చేస్తే చూడాలని ఆశగా రెండో రోజు వరకు వేచి చూశారు.కానీ వారి ఆశలపై ‘రన్‌మెషీన్’ నీళ్లు చల్లాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే క్రీజును వీడాడు. తన వైఫల్యాల పరపరంపర కొనసాగిస్తూ భారంగా నిష్క్రమించాడు. దీంతో స్టేడియమంతా ఒక్కసారిగా మూగబోయింది. తమ అభిమాన ఆటగాడు మైదానం వీడుతుంటే అంతా నిరాశగా అతడి వైపు చూస్తూ ఉండిపోయారు.ఆసీస్ గడ్డపై విఫలంగత కొంతకాలంగా టెస్టుల్లో విఫలమవుతున్న భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి(Virat Kohli).. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాది టచ్‌లోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు.ముఖ్యంగా ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడబోయిన ప్రతిసారీ ఆసీస్ బౌలర్ల చేతికి ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు కోహ్లి. ఈ క్రమంలో ‘కింగ్’ పనైపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి మునుపటి లయను అందుకోవాలనే సూచనలు వచ్చాయి.తొలిరోజు ఫీల్డింగ్‌కే పరిమితమైన కోహ్లిఈ క్రమంలో సొంతజట్టు ఢిల్లీ తరఫున రైల్వేస్‌తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి రంజీల్లో పునరాగమనం చేశాడు. సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌ను చూసేందుకు జనం పోటెత్తారు. వాళ్లంతా వచ్చింది కేవలం కోహ్లిని చూడటానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.Cameras 📸. Posters 🖼️ Chants 🗣️Cheers 👏A fantastic reception for @imVkohli as he walks out to bat 🔥#RanjiTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/IhwXam37gl pic.twitter.com/FXnCSzmOfC— BCCI Domestic (@BCCIdomestic) January 31, 2025 అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. తొలిరోజు కోహ్లి ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. తనదైన శైలిలో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ సందడి చేశాడు. ఇక ఆయుశ్ బదోని సారథ్యంలోని ఢిల్లీ జట్టు.. రైల్వేస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం గురువారమే బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది.ఒకే ఒక్క ఫోర్ఈ క్రమంలో రెండో రోజైన శుక్రవారం ఆట సందర్భంగా కోహ్లి క్రీజులోకి వచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు పదిహేను బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ సాయంతో ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. రైల్వేస్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి.. క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బౌలర్ దెబ్బకు కోహ్లి ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. దీంతో రైల్వేస్ జట్టు సంబరాలు అంబరాన్నంటగా.. ప్రేక్షకులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక కోహ్లి రంజీ రీఎంట్రీలో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచి పెవిలియన్ బాట పట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. 40 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డుHarish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli𓃵 | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb— 𝐒𝐑𝐈𝐉𝐀𝐍 🇮🇹 (@LegendDhonii) January 31, 2025 -
‘కేజ్రీవాల్.. ఆ విషం పేరేంటో చెప్పు’
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల తరుణంలో యమునా (yamuna) నదిపై రాజకీయ రంగు పులుముకుంది. ఢిల్లీకి జీవనాడి యమునాపై బీజేపీ (bjp) విషం కక్కుతోందంటూ ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) వ్యాఖ్యలపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఎదురుదాడికి దిగారు. కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేసే బదులు ఆ విషం పేరేంటే బయట పెట్టాలని సూచించారు. గురువారం రోహిణిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది.ఈ ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేజ్రీవాల్‌కు అర్ధమైంది. అందుకే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే యమునా వాటర్‌లో విషం కలిపారని ఆరోపిస్తున్నారు. యమునా నదిలో విషం ఉందన్న ల్యాబ్ రిపోర్టును విడుదల చేయాలి. అబద్ధాల పుట్టఎన్నికల్లో గెలవాలంటే అబద్ధాలు చెప్పడం మానేయమని కేజ్రీవాల్‌కు చెప్పాలనుకుంటున్నాను. ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నీళ్లలో విషం కలిపిందని అంటున్నారు. యమునాలో విషం కలిపితే ఏ విషం కలిపారు? విషయం ఉన్నట్లు లేబొరేటరీలో గుర్తించారు. అంతేకాదు, ఆప్ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తామని హామీ ఇచ్చిందని, బదులుగా ఆలయాలు,స్కూల్ పరిసర ప్రాంతాల్లో తెరిచారు. కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో జైలు పాలయ్యారు’ అని అమిత్ షా ఆరోపించారు.తనను తాను నిజాయితీ పరుడినని చెప్పుకుని తిరిగే కేజ్రీవాల్ మద్యం కుంభకోణం, జల్ బోర్డులో రూ. 28400 కోట్ల కుంభకోణం, రేషన్ పంపిణీలో రూ. 5,400 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉందన్నారు. -
13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో కోహ్లి.. పోటెత్తిన జనం.. తొక్కిసలాట
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ బరిలోకి దిగాడు. రైల్వేస్‌తో ఇవాళ (జనవరి 30) మొదలైన మ్యాచ్‌లో కోహ్లి ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. కోహ్లి సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. 🚨 15,748 ATTENDANCE ON DAY 1 IN DELHI vs RAILWAYS MATCH AT ARUN JAITLEY STADIUM 🚨 (Vipul Kashyap).- The Craze of King Kohli..!!!! 🐐🔥 pic.twitter.com/5yMvhgbcKU— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025చాలాకాలం తర్వాత కోహ్లి సొంత మైదానంలో రంజీ మ్యాచ్ ఆడుతుండటంతో అతన్ని చూసేందుకు జనం పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్ చూసేందుకు 15 వేల పైచిలుకు జనం హాజరయ్యారు. సాధారణంగా రంజీ మ్యాచ్ చూసేందుకు ఈ స్థాయిలో జనం రారు. THE CRAZE & AURA OF VIRAT KOHLI. 🐐- The Scenes at Arun Jaitley stadium at the moment. 🔥 pic.twitter.com/Cym5H3EM8z— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025కోహ్లిని తమ సొంత మైదానంలో చూసేందుకు అభిమానులు ఇవాళ తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. మ్యాచ్ ప్రారంభం కాగానే స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. కోహ్లి నామస్మరణతో అరుణ్ జైట్లీ స్టేడియం మార్మోగిపోయింది. స్టేడియంలోకి ప్రవేశం ఉచితం కావడంతో జనాలను అదుపు చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. స్కూలు విద్యార్థులు సైతం భారీ సంఖ్యలో హాజరయ్యారు. KING KOHLI IS AN EMOTION..!!!! 🐐- The Moments fan entered the ground and touched Virat Kohli's feet. 🥹❤️ pic.twitter.com/RsSgFKeK2t— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025మైదానంలోకి ప్రవేశించిన అభిమాని.. కోహ్లికి పాదాభివందనంకోహ్లి ఫీల్డింగ్ చేస్తుండగా ఓ అభిమాని స్టేడియంలోకి జోరబడ్డాడు. సెక్యూరిటీని తప్పించుకుని కోహ్లికి పాదాభివందనం చేశాడు. అనంతరం సెక్యూరిటీ అతన్ని అదుపులోకి తీసుకుని దండించే ప్రయత్నం చేసింది. అయితే కోహ్లి వారిని వారించి సదరు అభిమానిని వదిలి పెట్టాలని కోరాడు. SCHOOL KIDS COMING & CRAZY FOR VIRAT KOHLI AT ARUN JAITLEY STADIUM. 🔥 (Vipul Kashyap).pic.twitter.com/gYH6eGXoHU— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025ఈ మ్యాచ్‌లో కోహ్లిని చూసేందుకు ఢిల్లీ నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అభిమానులు వచ్చారు. ఓ అభిమాని ఆంధ్ర నుంచి వచ్చి కోహ్లిని చూస్తూ తరించాడు. కోహ్లిని చూసేందుకు ఇంకా జనాలు వస్తున్నారు. అభిమానులను కంట్రోల్ చేయడం కోహ్లి వల్ల కాకపోవడంతో పారా మిలిటరీ రంగంలోకి దిగింది. గతంలో ఓ రంజీ మ్యాచ్ చూసేందుకు ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎప్పుడూ రాలేదని వ్యాఖ్యాతలు అంటున్నారు. తొక్కిసలాట.. పలువురికి గాయాలుఓ దశలో స్టేడియంలోకి వచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. పోలీసులు, పారా మిలిటరీ ఒక్కొక్కరిని స్టేడియంలోకి పంపిస్తున్నారు. ఎంట్రీ ఉచితం కావడంతోనే అభిమానులు ఈ స్థాయిలో పోటెత్తారని పోలీసులు అంటున్నారు. ఈ మ్యాచ్‌ను జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.Fan Frenzy Gets Out of Control! 🚨 Heavy rush at Arun Jaitley Stadium leaves supporters injured during Kohli’s return!Click here to view: https://t.co/OYRAcmpXHN pic.twitter.com/07mrfIxr6T— CricTracker (@Cricketracker) January 30, 2025మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలింగ్ చేస్తున్న ఢిల్లీ.. రైల్వేస్‌పై పట్టు సాధించింది. ఢిల్లీ బౌలర్లు మనీ గ్రేవాల్ (8-1-14-2), సిద్దాంత్ శర్మ (6-1-25-2), నవ్‌దీప్ సైనీ (10-1-31-1) చెలరేగడంతో రైల్వేస్ 27 ఓవర్లలో 87 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. వికెట్‌కీపర్ ఉపేంద్ర యాదవ్ (27), కర్ణ్ శర్మ (2) క్రీజ్‌లో ఉన్నారు.Fans started gathering at Arun Jaitley stadium from 3 AM night to see Virat Kohli's Ranji Match. 🥶 (RevSportz).- King Kohli, The Biggest Crowd Puller in this Sports. 🐐pic.twitter.com/y9j2JuxfBU— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అదిరిపోయే ట్రాక్ రికార్డుఅంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన విరాట్ కోహ్లికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ అదిరిపోయే రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఢిల్లీకు ప్రాతినిథ్యం వహించే విరాట్.. ఆ జట్టు తరఫున 40 ఇన్నింగ్స్‌లు ఆడి 52.66 సగటున 1843 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 6 అర్ద శతకాలు ఉన్నాయి. కోహ్లి చిన్న వయసులోనే జాతీయ జట్టులోకి ప్రవేశించడంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పెద్దగా ఆడలేకపోయాడు. -
‘నేను తాగే నీళ్లలో విషం కలిపారా?’
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ (narendra modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ (aap) నేతలు బీజేపీపై అసహ్యకరమైన అభియోగాలు మోపుతుందని మండిపడ్డారు.ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ విషం కలిపిన నీటిని ఢిల్లీ ప్రజలకు అందిస్తుందని ఆరోపించారు. అంతేకాదు, హర్యానా బీజేపీ ప్రభుత్వం విషయం కలిపిన నీటిని ప్రధాని మోదీ తాగగలరా? అని ఓటర్లను ప్రశ్నించారు.అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై మోదీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ ఘోండా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని తాగే నీళ్లలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా..? అని ప్రశ్నించారు #WATCH | During a public rally in Delhi, PM Modi says, ": In 'aapda' walon ki lutiya Yamuna mein hi doobegi...""People of 'aapda' say that people of Haryana mix poison in water sent to Delhi. This is not just an insult to Haryana but to all Indians. Ours is a country where… pic.twitter.com/kJoQCAuEi2— ANI (@ANI) January 29, 2025 ఆప్ నేతలు అసహ్యకరమైన అభియోగాలు మోతున్నారంటూ.. ఆ పార్టీ కన్వినర్ కేజ్రీవాల్‌పై మోదీ విరుచుకు పడ్డారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా యమునా (yamuna water) నీటిని తాగే నీరుగా మార్చి ఢిల్లీ ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ఏమైంది. నెరవేర్చలేదు. పైగా సిగ్గు లేకుండా ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో యమునా నీటి అంశాన్ని అడ్డం పెట్టుకొని తమకు ఓటేయ్యమని అడుగుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్ పాపాలు చేస్తోంది. అలాంటి వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు.. ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు’ అంటూ మోదీ దుయ్యబట్టారు.ఈ సందర్భంగా మోదీ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన డెడ్‌లైన్‌పై పరోక్షంగా స్పందించారు. హార్యానాలోని బీజేపీ ప్రభుత్వం..అక్కడి నుంచి ఢిల్లీ ప్రవహించే నీటిలో అమోనియాను కలిపించదని ఆప్, కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన ఈసీ.. బుధవారం రాత్రి 8 కల్లా తగిన ఆధారాల్ని అందించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలపై మోదీ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ను టార్గెట్ చేశారు. గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నంలో.. నిందలు మాపై పడతాయని ఆశిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. వచ్చే వారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అధికార పార్టీ గందరగోళంలో పడింది. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించకూడదా? ఢిల్లీ ప్రజలతో ప్రధాని మోదీ తాగే నీటిని హర్యానా విషపూరితం చేయగలదా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. చివరిగా ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్,ఆప్ పాలన చూశారు. ఇప్పుడు బీజేపీకి ఓ అవకాశం ఇవ్వండి’ అని ఢిల్లీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.👉చదవండి : మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని విచారం -
Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈరోజు(బుధవారం) మౌని అమావాస్య కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు లెక్కలేనంతమంది భక్తులు సంగమ తీరానికి చేరుకున్నారు.మౌని అమావాస్యకు ఒక రోజు ముందు అంటే మంగళవారం నాటికే ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తండోపతండాలుగా చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం దాదాపు 5.5 కోట్ల మంది సంగమంలో స్నానమాచరించారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం 8 నుంచి 10 కోట్ల మంది జనాభా ఉన్నారని ముఖ్యమంత్రి స్వయంగా తెలిపారు.ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఇక్కడ ఇప్పుడున్న జనాభా.. ఢిల్లీలో ఉంటున్న జనాభాకు నాలుగు రెట్లు అధికంగా ఉంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతమంతా జనసంద్రంలా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ నగరంలో దాదాపు 10 కోట్ల మంది ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నాలుగు వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ అధికారులు 45 ఘాట్లను ఏర్పాటు చేసినప్పటికీ, భక్తులు త్రివేణీ సంగమంలోనే స్నానాలు చేయాలని భావిస్తున్నారు. దీంతో సంగమ ప్రాంతంలో విపరీతంగా భక్తుల రద్దీ నెలకొంది. కుంభమేళా ప్రాంతంలోని భూలా బిస్రా సెంటర్లో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్ నిఘా పెంపు -
పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!
‘ఒక దేశ ఉజ్వల భవిష్యత్ ఆ దేశ గ్రామీణాభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది’ అనేది తిరుగులేని చారిత్రక సత్యం.పల్లెపచ్చగా కళ కళలాడాలంటే, ఆకలి డొక్కలతో పట్నానికి వలసపోకుండా ఉండాలంటే.. పల్లెతల్లిని కంటిపాపలా కాపాడుకోవాలి. ఈ మహిళా సర్పంచులు అదే పని చేశారు. గ్రామ ఆర్థికవృద్ధి నుంచి సర్వతోముఖాభివృద్ధి వరకు అంకితభావంతో పనిచేశారు. వారి సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడమే కాదు, అక్కడకు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ‘ఉత్తమ గ్రామ సర్పంచ్’ అవార్డ్ అందుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన వేదికపై ప్రసంగించారు.ఘనత అనేది ‘నేను ఈ ఊరి సర్పంచు(Sarpanch)ని’ అని ఘనంగా చెప్పుకోవడంలో ఉండదు. సర్పంచుగా ఆ ఊరికి ఎలాంటి మంచి పనులు చేశారనేదే అసలు సిసలు ఘనత. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మేజర్ పంచాయతీల్లో ఒకటైన ఈడుపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పి.ఇందిర ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులను చేపడుతోంది. సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే దిశగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది.అర్హులకు సంక్షేమ పథకాలు అందించటం, హర్‌ఘర్ జల్ యోజన, మిషన్ ఇంద్రధనుష్, ప్రధాన మంత్రి జెన్ ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, పీఎం మాతృవందన యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం పోషణ యోజన, పీఎం ముద్ర యోజన, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సద్వినియోగంలో 90 శాతానికి పైగా ప్రగతి సాధించారు.‘ఉత్తమ సర్పంచ్‌గా ఢిల్లీ(Delhi)లో రాష్ట్రప(President)తి సమక్షంలో అవార్డు అందుకోవడం, ప్రసంగించే అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నా బాధ్యతను రెట్టింపు చేసింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం దిశగా మరింత అంకితభావంతో పని చేస్తాను’ అంటోంది ఇందిర.మా అమ్మ ఎప్పుడూ బాగుండాలి...గ్రామ పంచాయతీలో లేబర్ కాంట్రాక్టరుగా, గుమస్తాగా పనిచేసిన తన భర్త అనుభవాన్ని కూడగట్టుకొని తన ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం లో విజయం సాధించింది ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం పొందుగల గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోతు కోటమ్మ. ఉత్తమ గ్రామ సర్పంచ్‌గా ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ(Republic day) వేడుకలలో అవార్డ్ అందుకుంది. వేదిక ఎక్కి ప్రసంగించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, టాటాట్రస్టు సహకారం, జలజీవన్ మిషన్ నిధులు... ఇలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రూ.40 కోట్లతో గ్రామ అభివృద్ధి, సంక్షేమంపై ఖర్చు చేసింది. జలజీవన్ మిషన్‌లో భాగంగా రెండు వాటర్ ట్యాంకులు, ఇంటింటికి సురక్షితమైన నీటిని అందించేందుకు గ్రామంలో 350 ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేసింది. టాటా ట్రస్టు సహకారంతో ఐఓటీ సిస్టమ్ ఏర్పాటు చేసి నీటి సరఫరా లెక్కింపుతోపాటు క్లోరినేషన్ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చేసిన మొదటి గ్రామంగా పొందుగలను నిలిపింది. నీటి వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తోంది. వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు, సేంద్రియ ఎరువుల తయారీలో విజయం సాధించింది. ‘ఊరు అంటే సొంత తల్లిలాంటిది. మా అమ్మ ఎప్పుడూ బాగుండాలి. అందుకోసం ఎంతైనా కష్టపడతాను’ అంటుంది గుగులోతు కోటమ్మ.– ఇ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, వేమిరెడ్డి రామకృష్ణారెడ్డి, సాక్షి, జి.కొండూరుకార్పొరేట్ వరల్డ్ నుంచి పల్లె ప్రపంచానికి...ఎంబీఏ(MBA) చేసిన చేబ్రోలు లక్ష్మీమౌనిక మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షన్(Medical Transcription) సంస్థలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత పంచాయితీ ఎన్నికల బరిలోకి దిగి పదివేల జనాభా, నాలుగు శివారు గ్రామాలతో కూడిన కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి మేజర్ గ్రామపంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికయ్యింది. హెచ్‌సీఎల్ క్యాంపస్ ఏర్పాటు, గృహసముదాయాల పన్నుల ద్వారా గ్రామపంచాయతీ వార్షిక ఆదాయాన్ని రూ. 45 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పెంచింది. గ్రామంలో పారిశుధ్య వ్యవస్ధను మరింత మెరుగు పరచడంతోపాటు సుమారు రూ. 2 కోట్లు వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, కొత్తగా తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేసింది. మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె సేవలను గుర్తించిన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు దిల్లీలో జాతీయస్థాయిలో జరిగిన గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై జరిగిన వర్క్‌షాప్‌కు ఆంధ్రప్రదేశ్ నుండి లక్ష్మీమౌనికను ఎంపిక చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఈ వర్క్‌షాపుకు హాజరైన లక్ష్మీమౌనిక తన అభిప్రాయాలను తెలియజేసింది. మైసూర్లో జరిగిన ‘పంచాయతీరాజ్ వ్యవస్థల్లో మహిళా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం’పై జరిగిన జాతీయ సదస్సుకు కూడా లక్ష్మీమౌనిక ఎంపికయింది.– కొడాలి ప్రేమ్‌చంద్, సాక్షి, గన్నవరం (చదవండి: వందేళ్ల నాటి పైథానీ చీరలో బరోడా మహారాణి రాధికా రాజే..! అచ్చమైన బంగారంతో..) -
కోహ్లితో కళకళ... ఓ బుడ్డోడి ఆసక్తికర ప్రశ్న!
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 2012 తర్వాత దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగనున్నాడు. ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో పాటు షాట్ సెలెక్షన్ విషయంలో పదే పదే పొరబాట్లు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లి... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు రంజీ మ్యాచ్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి రైల్వేస్‌తో ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్‌లో కోహ్లి ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. చివరిసారిగా 2012లో ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆడిన కోహ్లి... ఆ తర్వాత అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దేశవాళీ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందే అని ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లేయర్లను హెచ్చరించడంతో స్టార్ ఆటగాళ్లు కూడా రంజీ బాటపట్టారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ ఆరో రౌండ్ రంజీ మ్యాచ్‌ల్లో ఆడగా... రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో కోహ్లితో పాటు కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, హైదరాబాద్ తరఫున మొహమ్మద్ సిరాజ్ కూడా ఆడుతున్నారు. మంగళవారం ఢిల్లీ జట్టుతో కలిసి కోహ్లి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఆద్యంతం ఉత్సాహంగా కనిపించిన కోహ్లి ... కోచ్‌లతో చర్చిస్తూ కుర్రాళ్లలో ఉత్సాహం నింపుతూ సందడి చేశాడు. కోహ్లి... ‘కడీ చావల్’ కెరీర్ ఆరంభంలో ఢిల్లీ జట్టు తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన విరాట్... తిరిగి 13 ఏళ్ల తర్వాత ఆ డ్రెస్సింగ్‌రూమ్‌లో అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఉన్న నవ్‌దీప్ సైనీ మినహా మిగిలిన 17 మంది ప్లేయర్లు కేవలం టీవీల్లో మాత్రమే చూసిన స్టార్ ఆటగాడితో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ‘చీకూ’గా మొదలైన విరాట్ కోహ్లి ప్రస్థానం... దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ‘కింగ్’ వరకు చేరింది. ఢిల్లీ హెడ్ కోచ్ శరణ్‌దీప్ సింగ్, బ్యాటింగ్ కోచ్ బంటూ సింగ్ పర్యవేక్షణలో విరాట్ ప్రాక్టీస్ సాగించాడు. భారత అండర్–19 జట్టుకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో కోచ్‌గా పనిచేసి, ప్రస్తుత జట్టుకు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేశ్ భాటీ విరాట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ‘అతడేం మారలేదు. అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. విరాట్‌కు ‘ఛోళే పూరీ’ బాగా ఇష్టమని అతడి కోసం అవి తెప్పించాం. కానీ ఇప్పుడు తినడంలేదని విరాట్ చెప్పాడు’ అని మహేశ్ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ అనంతరం ప్లేయర్లతో కలిసి ‘కడీ చావల్’ (పప్పన్నం) తిన్నాడని వెల్లడించాడు. మొదట ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించకపోయినా... విరాట్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని జియో సినిమా లైవ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. కుర్రాళ్లతో కలిసి... ఉదయం తొమ్మిది గంటలకు ఖరీదైన పోర్షే కారులో మైదానానికి చేరుకున్న విరాట్... ఒక్కసారి ప్రాక్టీస్ ప్రారంభించాక నిత్యవిద్యార్థిలా శ్రమించాడు. తొలుత 35 నిమిషాల పాటు ప్లేయర్లతో కలిసి వార్మప్ చేసిన కోహ్లి... ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఫుట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాత నెట్ సెషన్ ప్రారంభమైంది. ఆ సమయంలో ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్ ఆయుశ్ బదోనీ వద్దకు వెళ్లిన కోహ్లి... ‘ఆయుశ్ నువ్వు ముందు బ్యాటింగ్ చేయి. ఆ తర్వాత మనిద్దరం స్థానాలు మార్చుకుందాం’ అని చెప్పాడు. స్టార్ ఆటగాళ్లు రంజీల్లో ఆడనున్న నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ బోర్డు రిషబ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లికి కెపె్టన్సీ చేపట్టాలని కోరగా... ఈ ఇద్దరూ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఐపీఎల్ మెరుపులతో వెలుగులోకి వచ్చిన ఆయుశ్ బదోనీ ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. నెట్స్‌లో గంటకు పైగా ప్రాక్టీస్ చేసిన విరాట్... త్రోడౌన్స్ వేయించుకొని పుల్ షాట్లు సాధన చేశాడు. పేసర్లు నవ్‌దీప్ సైనీ, రాహుల్ గెహ్లాట్, సిద్ధాంత్ శర్మ, మోనీ గ్రెవాల్, స్పిన్నర్లు హర్‡్ష త్యాగి, సుమిత్ మాథుర్‌ను సునాయాసంగా ఎదుర్కొన్న కోహ్లి బ్యాక్‌ఫుట్‌పై ఎక్కువ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. అలాగే ఆఫ్ వికెట్ లైన్ బంతులను ఎక్కువగా వదిలేశాడు. కోహ్లికి కబీర్ ఆసక్తికర ప్రశ్న! మంగళవారం విరాట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గ్రౌండ్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కోహ్లి సాధన ముగించుకొని వెళ్తున్న సమయంలో నాలుగో తరగతి చదువుతున్న ఓ కుర్రాడు... ‘విరాట్ అంకుల్’ అంటూ పిలవడంతో అటు వైపు వెళ్లిన కోహ్లి అతడితో సుదీర్ఘంగా ముచ్చటించి కీలక సూచనలు చేశాడు. ఆ కుర్రాడి పేరు కబీర్ కాగా... అతడి తండ్రి ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి ఢిల్లీ అండర్–17, అండర్–19 జట్లకు ఆడిన షావేజ్. భారత జట్టుకు ఆడాలంటే ఏం చేయాలని కబీర్ ప్రశ్నించగా... ‘కఠోర సాధన చేయాలి. ప్రాక్టీస్ ఎప్పుడూ వదిలేయొద్దు. మీ నాన్న నిన్ను ప్రాక్టీస్‌కు వెళ్లు అని చెప్పకూడదు. నువ్వే నాన్నా నేను గ్రౌండ్‌కు వెళ్తున్నా అని చెప్పాలి’ అని కోహ్లి సూచించాడు. -
సీమాంతర పెట్టుబడులకు ముంబై టాప్
న్యూఢిల్లీ: సీమాంతర పెట్టుబడులకు సంబంధించి ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 10 కీలక మార్కెట్ల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఇండియా నిర్వహించిన సర్వే నివేదికలో ముంబైకి అయిదో ర్యాంకు, న్యూఢిల్లీకి ఎనిమిదో ర్యాంకు లభించింది. ఈ జాబితాలో ముంబై కన్నా ముందువరుసలో టోక్యో, సిడ్నీ, సింగపూర్, హోచిమిన్ సిటీ ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది పైగా ఇన్వెస్టర్లు 2025లో మరింతగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించారు.దేశీయంగా రియల్టీలో ఆఫీస్, రెసిడెన్షియల్ స్పేస్‌తో పాటు పారిశ్రామిక.. డేటా సెంటర్లపై కూడా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2024లో భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడులు 54 శాతం పెరిగి ఆల్‌టైం గరిష్టమైన 11.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ‘భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు 2024లో రికార్డు స్థాయికి చేరాయి. ఇందులో దేశీ ఇన్వెస్టర్ల ఆధిపత్యం ఎక్కువగానే ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా గణనీయంగా పెరగడమనేది గ్లోబల్ రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా భారత్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటానికి నిదర్శనంగా నిలుస్తుంది‘ అని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుత విభాగాలతో పాటు కొత్త విభాగాల్లోకి సైతం పెట్టుబడుల ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ–కామర్స్, వేగవంతమైన డెలివరీ సేవలకు డిమాండ్ నెలకొనడమనేది లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ పరిశ్రమకు ఊతమివ్వగలదని అన్షుమన్ చెప్పారు. దీనితో ఇటు డెవలపర్లు, ఇన్వెస్టర్లకు కూడా ఆకర్షణీయమైన అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నారు. -
ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం ఆతిశికి బిగ్ రిలీఫ్..
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్‌కు ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఎన్నికల వేళ ఆప్ సీనియర్ మహిళా నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశికి ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఒక్క వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆమె మాట్లాడలేదని.. మొత్తం పార్టీని ఉద్దేశించే వ్యాఖ్యానించారని న్యాయస్థానం పేర్కొంది. కాగా, గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందు మంత్రిగా వ్యవహరించిన ఆతిశి.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీలో చేరకపోతే.. ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఆప్ నేతలను అరెస్టు చేస్తుందని కొందరు బీజేపీ నేతలు బెదిరించారంటూ ఆమె ఆరోపించారు. దీంతో ఆతిశి వ్యతిరేకంగా బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో పాటు ఆమెపై న్యాయస్థానంలో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్‌ను కొట్టేసింది.మరో వైపు, దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు. ఈ సారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో 15 గ్యారంటీలను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదలచేసిన ఆప్ సోమవారం మరో అదనపు మేనిఫెస్టోను విడుదలచేసింది. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, మెట్రో ఛార్జీలో 50 శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రజలకు ఆప్ మరో 15 గ్యారంటీలు -
విరాట్ కోహ్లి మంచి మనసు.. కెప్టెన్సీ రిజక్ట్ చేసిన కింగ్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) రంజీ ట్రోఫీ పునరాగమానికి సమయం అసన్నమైంది. రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా గురువారం నుంచి రైల్వేస్‌తో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరపున కోహ్లి బరిలోకి దిగనున్నాడు.2012లో చివరగా ఢిల్లీ తరపున ఆడిన విరాట్.. మళ్లీ ఇప్పుడు పుష్కరకాలం తర్వాత తన రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే జట్టుతో కలిసిన కింగ్ కోహ్లి తన ప్రాక్టీస్‌ను షురూ చేశాడు. న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి తన సహాచరలతో కలిసి తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.Virat Kohli is playing a circle football game with the Delhi Ranji team pic.twitter.com/94Q5n0lNKg— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 28, 2025 ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రైల్వేస్‌తో మ్యాచ్‌కు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ప్రకటించిన జట్టులో కోహ్లికి చోటు దక్కింది. దీంతో అతడు రైల్వేస్‌తో మ్యాచ్‌లో ఆడడం ఖాయమైంది. అంతకుముందు జట్టుతో పాటు తను శిక్షణ పొందేందుకు సిద్దంగా ఉన్నానని ఢిల్లీ హెడ్‌కోచ్ శరణ్‌దీప్ సింగ్‌కు కోహ్లి తెలిపినట్లు డీడీసీఎ అధికారి చెప్పుకొచ్చారు. కోహ్లి మంచి మనసు..కాగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌కు ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వ్యవహరించాడు. అయితే ఇప్పుడు రైల్వేస్‌తో మ్యాచ్‌కు పంత్‌కు డీడీసీఎ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా వ్యవహరించమని సెలక్టర్లు అడిగినట్లు తెలుస్తోంది.#RanjiTrophyVirat Kohli training at the Arun Jaitley Stadium ahead of Delhi’s Ranji match against Railways. 12 years since he last played. pic.twitter.com/pqAhLStTSA— Samreen Razzaqui (@SamreenRazz) January 28, 2025 కానీ కోహ్లి మాత్రం అందుకు తిరష్కరించి అయూష్ బదోనిని కెప్టెన్‌గా కొనసాగించమని సూచించినట్లు సమాచారం. దీంతో సెలక్టర్లు రైల్వేస్‌తో మ్యాచ్‌కు ఆయూష్ బదోనిని ఢిల్లీ సారధిగా ఎంపిక చేశారు. బదోని సారథ్యంలో కోహ్లి ఆడనున్నాడు.గత కొంత కాలంగా ఢిల్లీ జట్టు సారథిగా బదోనినే వ్యవహరిస్తున్నాడు. అయితే పంత్ రీఎంట్రీ ఇవ్వడంతో కెప్టెన్సీ నుంచి బదోనిని తప్పించారు. ఇప్పడు రైల్వేస్‌తో మ్యాచ్‌కు పంత్ దూరం కావడంతో మళ్లీ బదోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కాగా కోహ్లి తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. జూనియర్లు గౌరమివ్వడంలో కింగ్ ఎప్పుడు ముందుంటాడని ఫ్యాన్స్ కొనియాడుతున్నాడు.రంజీల్లో అదుర్స్..కాగా రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 23 రంజీ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 5 సెంచరీలు ఉన్నాయి. ఇక 12 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీల్లో ఆడుతుండడంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ ఉచితంగా అనుమతించనుంది.ఢిల్లీ జట్టు: ఆయుష్ బడోని (కెప్టెన్), విరాట్ కోహ్లి, సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, జాంటీ సిద్ధు, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్‌వంశీ, వైభవ్ కంద్పాల్, మయాంక్ గుసైన్, గగన్ వాట్స్ , ఆయుష్ దోసెజా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోట్, జితేష్ సింగ్, వంశ్ బేడీ.చదవండి: Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్ -
12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్న కోహ్లి.. రేపే జట్టులోకి ఎంట్రీ?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) దాదాపు 12 ఏళ్ల తర్వాత తిరిగి రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. జనవరి 30 నుంచి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్‌తో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరపున కింగ్ కోహ్లి బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ జట్టు హెడ్ కోచ్ శరణ్‌దీప్ సింగ్ ధ్రువీకరించాడు. విరాట్ మంగళవారం(జనవరి 28) ఢిల్లీ జట్టులో చేరి, ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనున్నట్లు ఆయన తెలిపారు.రెడ్ బాల్ క్రికెట్లో కోహ్లి గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. తొలి టెస్టులో సెంచరీ మినహా మిగితా మ్యాచ్‌ల్లో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లితో పాటు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ వంటి ప్లేయర్లు కూడా నిరాశపరిచాడు.ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లు సైతం దేశవాళీ క్రికెట్లో ఆడాలని భారత క్రికెట్ బోర్డు ఆదేశాలను జారీ చేసింది. దీంతో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా రంజీ బాటపడుతున్నారు. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజాలు తమ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించగా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ సైతం ఆడేందుకు సిద్దమయ్యారు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది.కాగా కోహ్లికి రంజీల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 5 సెంచరీలు ఉన్నాయి. అయితే కోహ్లి కేవలం 19 ఏళ్ల వయస్సులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిచించలేదు. ఇక 12 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీల్లో ఆడుతుండడంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ ఉచితంగా అనుమతించనుంది. కోహ్లి చివరగా రంజీల్లో 2012-13 సీజన్లో ఢిల్లీ తరపున ఆడాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
గర్వించేలా గణతంత్రం
న్యూఢిల్లీ: భారత సైనిక శక్తిని, ఆయుధ పాటవాన్ని, సాంస్కృతి వైభవాన్ని ప్రదర్శిస్తూ 76వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాల ప్రదర్శన, జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. ‘సశక్త్ ఔర్ సురక్షిత్’ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఆదివారం జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, ప్రముఖుల పాల్గొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో కలిసి రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. త్రివిధ దళాల సైనికులు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ ప్రారంభమైంది. మొదట లెఫ్టినెంట్ అహన్‌కుమార్ నేతృత్వంలో 61 కావల్రీ సైనిక బృందం ముందుకు సాగింది. జాట్ రెజిమెంట్, గర్వాల్ రైఫిల్స్, మహర్ రెజిమెంట్, జమ్మూకశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్ వంటి దళాల కవాతు ఆకట్టుకుంది. దేశాభివృద్ధిని, ప్రజల సంక్షేమం, సాధికారతను కళ్లకు కడుతూ పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ థీమ్‌తో 31 శకటాలను ప్రదర్శించారు. వైమానిక దళానికి చెందిన 40 యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను అలరించాయి. 10 వేల మంది ప్రత్యేక అతిథులు రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రముఖులు సహా 10 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వీరిలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, విపత్తు సహాయక చర్యల సిబ్బంది, ఆశా వర్కర్లు, పారా ఒలింపిక్ అథ్లెట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కృషి సఖీలు, ఉద్యోగ్ సఖీలు తదితరులు ఉన్నారు. పలు ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పేటెంట్ హోల్డర్లు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరంతా జాతీయ యుద్ధ స్మారకం, పీఎం సంగ్రహాలయ్ తదితర కట్టడాలను సైతం సందర్శించారు. నాలో ఇండియన్ డీఎన్ఏ సుబియాంటో సరదా వ్యాఖ్యలు ఆహ్లాదంగా ‘ఎట్ హోమ్’గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి నిలయంలో ఆదివారం రాత్రి ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండొనేసియా అధ్యక్షుడు సుబియాంటో గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విందు ఆసాంతం సరదా సరదాగా సాగింది. తనకు భారతీయ మూలాలున్నాయని ఈ సందర్భంగా సుబియాంటో చెప్పారు. ‘‘కొన్ని వారాల క్రితమే జెనెటిక్ సీక్వెన్సింగ్, డీఎన్ఏ పరీక్షలు చేయించుకున్నా. నాలో ఇండియన్ డీఎన్ఏ ఉన్నట్లు తేలింది. భారతీయ సంగీతం విన్నప్పుడల్లా నేను డ్యాన్స్ చేస్తానని అందరికీ తెలుసు. నాలోని ఇండియన్ జీన్స్‌లోనే భారతీయ సంగీతం, నృత్యం దాగున్నాయి’’ అని సుబియాంటో చెప్పడంతో అతిథులంతా హాయిగా నవ్వేశారు. తమ భాషలో చాలా భాగం సంస్కృతం నుంచే వచ్చిందిన సుబియాంటో ఈ సందర్భంగా అన్నారు. తమ దేశంలో పేర్లు చాలావరకు సంస్కృతంలోనే ఉంటాయని చెప్పారు. తమరోజువారీ జీవితాల్లో భారతీయ ప్రాచీన నాగరికత ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు. భారత్, ఇండొనేసియా మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని ఆయన గుర్తు చేశారు. మోదీ తలపాగా గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఎరుపు, పసుపు రంగు గీతలతో కూడిన తలపాగా ‘సఫా’ను ధరించారు. దాంతోపాటు తెల్లరంగు కుర్తా–పైజామా, దానిపై ఊదారంగు బంద్గలా జాకెట్ ధరించారు. మోదీ ప్రతిఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్లో రంగురంగుల తలపాగాలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది గణతంత్ర ఉత్సవాల్లో ఆయన బహుళ రంగులతో కూడిన బాంధానీ ప్రింట్ సఫా ధరించారు. గూగుల్ డూడుల్ 76వ గణతంత్ర వేడుకల సందర్భంగా గూగుల్ ఆదివారం తీసుకొచ్చిన ప్రత్యేక డూడుల్ అందరినీ ఆకట్టుకుంది. లద్దాఖీ దుస్తులు ధరించిన మంచు చిరుత, ధోతీ–కుర్తా ధరించిన పులి వంటి జంతువులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వాయిద్యాలను ఇవి వాయిస్తున్నట్లుగా ఈ డూడుల్‌ను రూపొందించారు. ఇది జంతువుల పరేడ్‌లా ఉందని చెప్పొచ్చు. అంతర్లీనంగా గూగుల్ అనే అక్షరాలు పొందుపర్చారు. విదేశాల్లోనూ ఉప్పొంగిన దేశభక్తి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశా ల్లోనూ భారత గణతంత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయులతోపాటు స్థానికులు వాటి లో ఉత్సాహంగా పా ల్గొన్నారు. భారతీ యులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. భార తీయ నృత్యాలను ప్రదర్శించారు. నేపాల్, ఆ్రస్టేలియా, సింగపూర్, చైనా, శ్రీలంక, ఇజ్రాయెల్, జపాన్, ఇండొనేసియా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో రిపబ్లిక్ డే నిర్వహించారు. భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి. హైలైట్స్ → రాజ్యాంగానికి 75 ఏళ్లయిన సందర్భంగా వేడుకలు మరింత వైభవంగా జరిగాయి.→ గణతంత్ర వేడుకల్లో ఇండొనేసియా అధ్యక్షుడు పాల్గొనడం ఇది నాలుగోసారి. ఆ దేశ సైనిక బృందం కూడా పాలుపంచుకుంది.→ పరేడ్‌లో పరమ్‌వీర్ చక్ర అవార్డు గ్రహీతలు సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, అశోక చక్ర అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ కల్నల్ జస్రామ్ సింగ్ పాల్గొన్నారు.కర్తవ్య పథ్‌పై... మోదీ స్వచ్ఛభారత్ కర్తవ్యపథ్‌పై ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ చేసి చూపించారు. ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికయ్యాయి. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను స్వాగతించేందుకు వెళ్తుండగా దారిలో చెత్త కన్పించింది. దాంతో వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది చూస్తుండగా ఆయన కిందకు వంగి దాన్ని ఏరారు. డస్ట్‌బిన్‌లో పడేయాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మోదీ చర్యను నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు. సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి. -
ఆత్మీయతను పంచిన బర్మా హౌజ్!
దేశ రాజకీయాలను అనుసరించేవాళ్లకు న్యూఢిల్లీలోని ‘24, అక్బర్ రోడ్’ అనగానే అది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అని గుర్తొస్తుంది.అయితే దాదాపు ఐదు దశాబ్దాల పాటు అక్కడ కార్యకలాపాలు నెరిపిన అనంతరం ఆ పార్టీ అక్కడినుంచి కొత్త చిరునామాకు మారడంతో ఇది వార్తల్లో నిలిచింది. కానీ దానికంటే ముందు ఆ చిరునామాను ‘బర్మా హౌజ్’ అనేవారని చాలామందికి తెలియదు. అప్పుడు అది భారత్‌లో బర్మా (మయన్మార్) రాయబారి ఇల్లుగా ఉండేది. ఆమె భర్త సాక్షాత్తూ బర్మా జాతిపిత; ఆమె కూతురు తర్వాత్తర్వాత ఆ దేశ గొప్ప నాయకురాలిగా ఎదిగిన ఆంగ్ సూన్ సూ కీ. అందుకే ఆ ఇంట్లో బర్మా వాతావరణం, వాళ్ల ఆత్మీయతలు వెల్లివిరిసేవి.న్యూఢిల్లీలోని ‘24, అక్బర్ రోడ్’ చిరునామా గురించి మీకు తెలుసా? సుమారుగా యాభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉండేది. ఈ మధ్యే మారిపోయిందనుకోండి! అంతకంటే ముందు దీని పేరు ‘బర్మా హౌజ్’. బర్మా (తర్వాత మయన్మార్‌గా పేరు మారింది) దేశపు రాయబారి నివాస స్థానం అది. ‘24, అక్బర్ రోడ్’ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కాక మునుపు ఈ ఇంట్లో ‘డా ఖిన్ కీ’ ఉండే వారు. ఆమె బర్మా స్వాతంత్య్ర సమర యోధుడు ఆంగ్ సాన్ (బర్మా జాతిపితగా పిలుస్తారు) పత్ని. భర్త హత్యకు గురైన తరువాత ఆ దేశపు మంత్రిగానూ ఆమె పనిచేశారు. 1960లో ఇండియాకు బర్మా రాయబారిగా నియమితులయ్యారు. ఢిల్లీకి వచ్చి, ఏడేళ్ల పాటు ‘24, అక్బర్ రోడ్’లో నివసించారు. డా ఖిన్ కీ నా తల్లిదండ్రులకు స్నేహితురాలైతే... ఆమె కూతురు ఆంగ్ సాన్ సూ కీ (మయన్మార్ ప్రతిపక్ష నేత; నోబెల్ శాంతి బహు మతి గ్రహీత) మా అక్క కిరణ్‌కు ఫ్రెండ్. లేడీ శ్రీరామ్ కాలేజీలో ఆంగ్ సాన్ సూ కీ, కిరణ్ కలిసి చదువుకున్నారు. 1964లో మా అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగ రీత్యా కాబూల్(అఫ్గానిస్తాన్ రాజధాని)కి వెళ్లాల్సి వచ్చినప్పుడు, తన చివరి ఏడాది చదువు ఇంకా మిగిలి ఉండటంతో కిరణ్ ఆరు నెలల పాటు ‘24, అక్బర్ రోడ్’లో ఉండింది. డా ఖిన్ కీ పెద్ద పొడగరి ఏమీ కాదు. పైగా కొంచెం లావుగా ఉండేది. బర్మీస్ మహిళల్లో అధికుల మాదిరి లుంగీ కట్టుకునేది. వెంట్రుకలన్నీ పూలతో అలంకరించిన బన్‌లో ఒద్దికగా ఇమిడి పోయేవి. ఆమె ముఖంలో ఒక రకమైన దయ వ్యక్తమయ్యేది. ఎల్ల ప్పుడూ చిరునవ్వుతో కళకళలాడే మోము. మృదుభాషి!మొదటిసారి ఆమెను కలిసినప్పుడు నాకు ఆరేళ్లు ఉంటా యేమో! కొడుకు దగ్గర లేని కారణంగా ఆమె నన్ను తల్లిలా చూసుకునేది. డైనింగ్ రూమ్‌లో బోలెడంత ‘ఖో సూయి’ (చికెన్ నూడుల్స్) తినడం ఇప్పటికీ గుర్తుంది. అయితే నా ఫేవరెట్ మాత్రం ‘బ్లాక్ రైస్ పుడ్డింగ్’. బర్మీస్ ఇళ్లల్లో దీన్ని బాగా చేస్తారు. మిగతావాళ్ల మాటేమో కానీ నాకు మాత్రం చాలా ఇష్టమీ వంటకం. పిసరంత వదలకుండా తినే వాడినేమో... మిగిలిన వాళ్లు రుచి చూసేందుకు కూడా ఉండేది కాదనుకుంటా! అప్పట్లో చాలా బొద్దుగా ఉండేవాడిని. అందుకే సూ కీ నన్ను ‘రోలీ – పోలీ’ అని ఆటపట్టిస్తూండేది. చాలామంది దౌత్యవేత్తల మాదిరిగానే బర్మా రాయబారికి మెర్సిడెస్ కారు ఉండేది. వాళ్ల డ్రైవర్ పేరు ‘విల్సన్ ’. వారాంతాల్లో కుతుబ్ మీనార్ దాటుకుని అవతల ఉండే బౌద్ధారామాలకు ఆమె వెళ్లేది. అక్కడి భిక్షువులకు ఆహారం అందించేది. చాలాసార్లు నేనూ ఆమెతో వెళ్లేవాడిని. ఎప్పుడు మళ్లీ ‘24, అక్బర్ రోడ్’కు వస్తామా అని ఎదురుచూసేవాడిని. ఎందుకంటే... తిరిగి వచ్చిన తరువాతే భోజ నాల వడ్డన జరిగేది.ఆంగ్ సాన్ సూ కీ సుమారు ఏడేళ్లు భారత్‌లో ఉంది. ముందు జీసస్ అండ్ మేరీ కాన్వెంట్లో, ఆ తరువాత లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో చదివింది. యుక్త వయసులో ఉండగానే రాజకీయాల్లో చేరాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎప్పటికైనా ఉన్నత స్థానానికి చేరుకో గలనన్న నమ్మకం కూడా తనలో ఉండేది. సుమారు 18 ఏళ్ల వయసు ఉండేదేమో అప్పుడు. ఒకరోజు కిరణ్ పెన్సిల్ డ్రాయింగ్ గీసింది. దాని కింద, ‘కిరణ్ థాపర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బర్మా రావొచ్చు’అని రాసింది.దశాబ్దాల తరువాత నేను ‘డా ఖిన్ కీ’ని లండన్ లో కలిశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూతురు ఆంగ్ సాన్ సూ కీతో కలిసి నివసిస్తూండేది. అప్పుడామె వయస్సు ఎనభైల్లో ఉంది. నేను ముప్ఫైలలో ఉన్నాను. నన్ను చూడగానే... అనారోగ్యం, తన వయసు ఏదీ గుర్తు రాలేదు. బోసినవ్వుతో భళ్లున నవ్వుతూ, ‘వీడు సన్న బడ్డాడు’ అంది. కళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. నవ్వుతో ముఖమంతా నిండిపోయింది. ‘‘ఇంత సన్నబడతాడని అనుకోనే లేదు’’ అంది. ‘‘ఖో–సూయి అంటే ఇప్పటికీ బాగా ఇష్టమట. వచ్చి నప్పుడల్లా కావాలని అడుగుతూంటాడు’’ అని చెప్పింది ఆంగ్ సాన్ సూ కీ. ఆక్స్‌ఫర్డ్‌లో ఉండగా సూ కీ ఎప్పుడూ బ్లాక్ రైస్ పుడ్డింగ్ చేసేది కాదు. అందుకేనేమో... నాకు అది ఎలా ఉంటుందో లీలగా గుర్తుంది కానీ, రుచి ఎలా ఉంటుందన్నది మాత్రం గుర్తు లేకుండా పోయింది. కొబ్బరి తురుముతో కప్పిన నల్ల బియ్యంతో చేసే తీపి పదార్థం అది.నేను మళ్లీ 2015లో రంగూన్ లో ఆంగ్ సాన్ సూ కీని కలిశాను. ‘24, అక్బర్ రోడ్’ నాటి ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదని చూడగానే అర్థమైంది. ‘‘నా మరో ఇంటికి స్వాగతం. 24, అక్బర్ రోడ్ గురించి నీకు తెలుసు కదా... ఇది అమ్మ మరో ఇల్లు’’ అంది. ఢిల్లీ ఇంట్లో ఓ భారీ పియానో ఉండేది. సూ కీ పియానో వాయించేది కూడా! గత వారం ‘24, అక్బర్ రోడ్’కు సంబంధించి పత్రికలు బోలెడన్ని వార్తలు రాశాయి. అప్పుడే నాకూ గుర్తుకొచ్చింది... ఆ ఇంటి గురించి నాకు ముందే తెలుసు అని! రాజకీయ పార్టీ కేంద్రం కాక మునుపు ఆ ఇంటి పొడవాటి నడవాలో ప్రేమ, ఆప్యాయతలు అల్లుకునిపోయి ఉండేవి. అది లూట్యెన్స్ ఢిల్లీలో భాగమని అస్సలు అనిపించేది కాదు. అది ‘డా ఖిన్ కీ’ ఇల్లు అన్నది మాత్రమే నాకు లెక్క. ఎప్పుడైనా వెళ్లగలిగే... ప్రేమ ఆప్యాయతలు అందుకోగల ఇల్లు!డా ఖిన్ కీ, ఆంగ్ సాన్ సూ కీ భారత్‌లో గడిపిన రోజులు చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ సూ కీ తరచూ ఆ రోజులను గుర్తు చేసుకునేది. దీన్ని బట్టే వాళ్లు ‘24, అక్బర్ రోడ్’లో చాలా సంతోషంగా ఉండేవారు అనిపించేది. ఆ భవనం గోడలిప్పుడు మాట్లాడగలిగితే ఆ రోజుల ఊసులు ఇంకెన్ని చెప్పేవో... ప్చ్!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Watch Live: ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
-
Republic Day-2025: అందంగా ముస్తాబు.. అణువణువునా గాలింపు
నేడు (జనవరి 26) దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలను అందంగా ముస్తాబు చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచారు. #WATCH | Delhi: On the eve of #RepublicDay, and the occasion of National Voters' Day as well as ahead of #DelhiElections2025, the iconic Qutub Minar illuminated in colours of the Tricolour and Voter Awareness Programme. pic.twitter.com/oRGtZO6ASu— ANI (@ANI) January 25, 2025దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో అత్యంత భారీగా పరేడ్ జరగనుంది. ఈ నేపద్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.#WATCH | Delhi | The Central Secretariat building complex illuminates with colourful lights and Tricolor on the eve of the 76th #RepublicDay pic.twitter.com/bSBTKWNClV— ANI (@ANI) January 25, 2025ఢిల్లీలోని ప్రతీ ప్రాంతంలో సైనికులు పహారా కాస్తున్నారు. దీనికి సంబంధించి అనేక వీడియోలు వెలువడ్డాయి.#WATCH | Delhi: Security personnel carry out foot patrolling at Sarojini Nagar Market on the eve of #RepublicDay pic.twitter.com/9OwyABwjBc— ANI (@ANI) January 25, 2025ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ నియంత్రణ కేంద్రం ద్వారా భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.#WATCH | Delhi: Security tightened at Sarojini Nagar Market on the eve of #RepublicDay pic.twitter.com/drBd5dnTRC— ANI (@ANI) January 25, 2025భద్రతా సిబ్బంది ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్లో పెట్రోలింగ్ నిర్వహించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.ఢిల్లీ లోని చారిత్రాత్మక ఇండియా గేట్ త్రివర్ణ పతాక కాంతితో వెలిగిపోతోంది. సెంట్రల్ సెక్రటేరియట్ భవన సముదాయం కూడా రంగురంగుల లైట్లు, త్రివర్ణ పతాకాలతో మెరుస్తోంది. కుతుబ్ మినార్ కూడా త్రివర్ణ పతాక రంగుల్లో కాంతివంతంగా మారింది.#WATCH | Delhi: Police monitor the security situation at Sarojini Nagar Market through the FRS (Facial recognition system) control centre here. pic.twitter.com/PsT4UNHDFO— ANI (@ANI) January 25, 2025ఒకవైపు జనవరి 26, మరోవైపు ఢిల్లీ ఎన్నికలు ఉన్నందున విరివిగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఢిల్లీ అదనపు డీసీపీ (సౌత్) అచింత్ గార్గ్ తెలిపారు. సున్నితమైన ప్రదేశాలు,మార్కెట్లలో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. ఇది కూడా చదవండి: Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు#WATCH | Odisha: Sand artist Sudarsan Pattnaik created sand art in Puri, on the eve of #RepublicDay pic.twitter.com/fD9KLPWqvr— ANI (@ANI) January 25, 2025 -
అద్దెదార్ల ఓట్లపై పార్టీల వల
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం అద్దె ఇంట్లోనే నివసిస్తోంది. మొత్తం ఓటర్లలో అద్దెదార్ల వాటా తక్కువేమీ కాదు. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించిగల స్థాయిలో ఉన్న ఈ ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు వల విసురుతున్నాయి. వారి ఓట్లపై గురిపెడుతూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. అద్దెదార్ల ఓట్లు గంపగుత్తగా పడితే ఎన్నికల్లో గెలుపునకు ఢోకా ఉండదని భావిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పలు హామీలు ఇచ్చారు. అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి ఉచితంగా నీరు, విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. → ఢిల్లీ నివాసితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నగరంలో 66.6 శాతం మంది సొంత ఇళ్లల్లో నివసిస్తుండగా, 32.4 శాతం మంది కిరాయి ఇళ్లల్లోనే బతుకులీడుస్తున్నారు. → అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారిలో 51.9 శాతం మంది న్యూఢిల్లీ జిల్లాలోనే ఉండగా, 41.9 శాతం మంది సౌత్ఈస్ట్ జిల్లాలో ఉన్నారు. → న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో 62.7 శాతం మంది, ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో 46.9 శాతం మంది అద్దెదార్లు ఉన్నారు. → ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ప్రజలు వలస వస్తున్నారు. ప్రధానంగా పూర్వాంచల్‌గా పిలిచే ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ వాసులు దేశ రాజధాని గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. చిన్నచిన్న ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకొనే పూర్వాంచల్ ప్రజల్లో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. → ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ సైతం అద్దెదార్ల ఓటర్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. → తాము అధికారంలోకి వస్తే పూర్వాంచల్ ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. → ఆమ్ ఆద్మీ సర్కారు పాలనలో అద్దెదార్లు నిర్లక్ష్యానికి గురయ్యారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘పద్మ’ అవార్డు గ్రహీతలు వీరే.. ప్రకటించిన కేంద్రం
సాక్షి,ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం (Republic Day ) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం(జనవరి25) ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్ రెడ్డిని వైద్య విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. పద్మ విభూషణ్ వరించింది వీరికే దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) - తెలంగాణ జస్టిస్ జగదీశ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజా వ్యవహారాలు) - చండీగఢ్ కుముదిని రజినీకాంత్ లాఖియా (కళలు) - గుజరాత్ లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) - కర్ణాటక ఎం.టి.వి.వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - కేరళ ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) - జపాన్ శారదా సిన్హా (కళలు) - బిహార్ ‘పద్మభూషణులు’ వీరే..నందమూరి బాలకృష్ణ (కళలు) - ఏపీఎ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) కర్ణాటక అనంత్ నాగ్ (కళలు) - కర్ణాటకబిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - ఎన్సీటీ ఢిల్లీ జతిన్ గోస్వామి (కళలు) - అస్సాం జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) - కేరళ కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) - ఎన్సీటీ ఢిల్లీ మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) - తమిళనాడుపీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) - కేరళ పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) - గుజరాత్ పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) - మహారాష్ట్ర రామ్బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - ఉత్తర్ప్రదేశ్సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) - ఉత్తర్‌ప్రదేశ్ ఎస్.అజిత్ కుమార్ (కళలు) - తమిళనాడుశేఖర్ కపూర్ (కళలు) - మహారాష్ట్ర శోభన చంద్రకుమార్ (కళలు) - తమిళనాడు సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - బిహార్ వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికాపద్మశ్రీ అవార్డు గ్రహీతలు..అద్వైత చరణ్ గడనాయక్ (కళలు) - ఒడిషా అచ్యుత్ రామచంద్ర పలవ్ (కళలు) - మహారాష్ట్ర అజయ్ వి.భట్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికా అనిల్ కుమార్ బోరో (సాహిత్యం, విద్య) - అస్సాం అరిజిత్ సింగ్ (కళలు) - బెంగాల్ అరుంధతి భట్టాచార్య (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ) - మహారాష్ట్ర అరుణోదయ్ సాహా (సాహిత్యం, విద్య) - త్రిపుర అర్వింద్ శర్మ (సాహిత్యం, విద్య) - కెనడా అశోక్‌కుమార్ మహాపాత్ర (వైద్యం) - ఒడిషా అశోక్ అక్ష్మణ్ షరఫ్ (కళలు) - మహారాష్ట్ర అశుతోష్ శర్మ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - ఉత్తర్‌ప్రదేశ్ అశ్విని బిడే దేశ్‌పాండే (కళలు) - మహారాష్ట్ర బైజ్యనాథ్ మహారాజ్ (ఆధ్యాత్మికం) - రాజస్థాన్ బర్రే గాడ్ఫ్రే జాన్ (కళలు) - ఎన్సీటీ ఢిల్లీ బేగమ్ బతోల్ (కళలు) - రాజస్థాన్భరత్ గుప్త్ (కళలు) - ఎన్సీటీ ఢిల్లీ బేరు సింగ్ చౌహాన్ (కళలు) - మధ్యప్రదేశ్ భీమ్‌సింగ్ భవేశ్ (సామాజిక సేవ) - బిహార్ భీమవ్వ దొడ్డబాలప్ప (కళలు) - కర్ణాటక బుదేంద్ర కుమార్ జైన్ (వైద్యం) - మధ్యప్రదేశ్ సి.ఎస్.వైద్యనాథన్ (ప్రజా సంబంధాలు) - ఎన్సీటీ ఢిల్లీ చైత్రమ్ దియోచంద్ పవార్ (సామాజిక సేవ) - మహారాష్ట్ర చంద్రకాంత్ సేత్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - గుజరాత్ చంద్రకాంత్ సోంపుర (ఆర్కిటెక్చర్) - గుజరాత్ చేతన్ ఇ చిట్నిస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - ఫ్రాన్స్ డేవిడ్ ఆర్ సిమ్లీహ్ (సాహిత్యం, విద్య) - మేఘాలయ దుర్గాచరణ్ రణ్‌బీర్ (కళలు) - ఒడిశా ఫరూక్ అహ్మద్ మిర్ (కళలు) - జమ్ముకశ్మీర్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ (సాహిత్యం, విద్య) - ఉత్తర్‌ప్రదేశ్ గీతా ఉపాధ్యాయ్ (సాహిత్యం, విద్య)- అస్సాం గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమబెంగాల్ గురువయూర్ దొరాయ్ (కళలు) - తమిళనాడు హర్చందన్ సింగ్ భాఠీ (కళలు) మధ్య ప్రదేశ్ హరిమన్ శర్మ (వ్యవసాయం) - హిమాచల్ ప్రదేశ్ హర్జిందర్ సింగ్ శ్రీనగర్ వాలే (కళలు) - పంజాబ్ హర్వీందర్ సింగ్ ( క్రీడలు) -హరియాణా హస్సన్ రఘు ( కళలు) - కర్ణాటక హేమంత్ కుమార్ (వైద్యం) - బిహార్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ ( సాహిత్యం, విద్య) - ఉత్తర్ ప్రదేశ్ హ్యూగ్ అండ్ కొల్లీన్ గాంట్జర్ (మరణానంతరం) (జర్నలిజం) - ఉత్తరాఖండ్ ఇనివలప్పి మని విజయన్ (క్రీడలు) - కేరళ జగదీశ్ జోషిల ( సాహిత్యం, విద్య) - మధ్య ప్రదేశ్ జస్పీందర్ నారుల (కళలు) - మహారాష్ట్ర జోనస్ మాసెట్టి (ఆధ్యాత్మికం) - బ్రెజిల్ మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) - తెలంగాణ కె.ఎల్.కృష్ణ (సాహిత్యం, విద్య) - ఏపీ మాడుగుల నాగఫణిశర్మ (కళలు) - ఏపీ మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు) - ఏపీ జోయ్‌నాంచారన్ బతారీ (కళలు) - అస్సాం జుమ్దే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక సేవ) - అరుణాచల్ ప్రదేశ్ కె.దామోదరన్ (పాకశాస్త్రం) - తమిళనాడు కె.ఓమనకుట్టి అమ్మ (కళలు) - కేరళ కిశోర్ కునాల్ (మరణానంతరం) (పౌర సేవ) - బిహార్ ఎల్.హాంగ్‌థింగ్ (వ్యవసాయం) - నాగాలాండ్ లక్ష్మీపతి రామసుబ్బఅయ్యర్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - తమిళనాడు లలిత్ కుమార్ మంగోత్ర (సాహిత్యం, విద్య) - జమ్మూకశ్మీర్ లాలా లోబ్‌జంగ్ (మరణానంతరం) (ఆధ్యాత్మికం) - లద్దాఖ్ లిబియా లోబో సర్దేశాయ్ (సామాజిక సేవ) - గోవా ఎం.డి.శ్రీనివాస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - తమిళనాడు మహాబీర్ నాయక్ (కళలు) - ఝార్ఖండ్ మమతా శంకర్ (కళలు) - పశ్చిమ బెంగాల్ మారుతి భుజంగరావు చితంపల్లి (సాహిత్యం, విద్య) - మహారాష్ట్ర నాగేంద్ర నాథ్ రాయ్ (సాహిత్యం, విద్య) - పశ్చిమ బెంగాల్ నారాయణ్ (భులయ్ భాయ్) (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - ఉత్తర్‌ప్రదేశ్ నరేన్ గురుంగ్ (కళలు) - సిక్కిం నీర్జా భాట్ల (వైద్యం) - ఎన్సీటీ ఢిల్లీ నిర్మలా దేవీ (కళలు) - బిహార్ నితిన్ నొహ్రియా (సాహిత్యం, విద్య) - అమెరికా ఓంకార్ సింగ్ పహ్వా (వాణిజ్యం, పరిశ్రమలు) - పంజాబ్ పి.దచనమూర్తి (కళలు) - పుదుచ్చేరి పాండీ రామ్ మందవీ (కళలు) - ఛత్తీస్‌గఢ్ పార్మర్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (కళలు) - గుజరాత్ పవన్ గొయెంక (వాణిజ్యం, పరిశ్రమలు) - పశ్చిమ బెంగాల్ ప్రశాంత్ ప్రకాశ్ (వాణిజ్యం, పరిశ్రమలు) - కర్ణాటక -
Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు
జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని రక్షణ విభాగంలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి శౌర్య పురస్కారాలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి 942 మంది రక్షణ సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా, పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర భద్రత తదితర విభాగాలకు చెందిన 942 మంది సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు. ఇందులో 95 మంది సైనికులకు శౌర్య పతకం, 101 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పతకం, 746 మందికి ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి.95 శౌర్య పురస్కారాలలో అత్యధిక పురస్కారాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నియమితులైన సైనికులకు అందజేయనున్నారు. వీరిలో నక్సలైట్ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, జమ్ముకశ్మీర్ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, ఈశాన్య ప్రాంతానికి చెందిన 03 మంది సైనికులు, ఇతర ప్రాంతాలకు చెందిన 36 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 78 మంది పోలీసులు, 17 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు.101 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలలో 85 పోలీసు సేవకు, ఐదు అగ్నిమాపక సేవకు, ఏడు పౌర రక్షణ-హోంగార్డ్‌లకు, నాలుగు సంస్కరణల విభాగానికి లభించాయి. 746 మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎస్ఎం)పతకాలలో 634 పోలీసు సేవకు, 37 అగ్నిమాపక సేవకు, 39 సివిల్ డిఫెన్స్-హోం గార్డ్స్‌కు, 36 కరెక్షనల్ సర్వీస్‌కు లభించాయి.రాష్ట్రాల వారీగా గ్యాలంట్రీ అవార్డుల డేటాను పరిశీలిస్తే ఈ అవార్డులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 మందికి, ఒడిశాకు చెందిన ఆరుగురికి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 మందికి, జమ్ముకశ్మీర్‌కు చెందిన 15 మంది పోలీసు సిబ్బందికి అందజేయనున్నారు. అస్సాం రైఫిల్స్ నుండి ఒక సైనికునికి, బీఎస్ఎఫ్ నుండి ఐదుగురు, సీఆర్పీఎఫ్ నుండి 19 మంది, ఎస్ఎస్బీ నుండి నలుగురికి శౌర్య పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను ఉత్తరప్రదేశ్ అగ్నిమాపక విభాగానికి చెందిన 16 మంది అగ్నిమాపక సిబ్బందికి, జమ్ముకశ్మీర్ అగ్నిమాపక విభాగానికి చెందిన ఒక అగ్నిమాపక అధికారికి అందజేయనున్నారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలివే.. -
Republic Day 2025: ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలివే..
భారతదేశం 2025, జనవరి 26న 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణలకు కేంద్రంగా మారనుంది.గణతంత్ర దినోత్సవ కవాతు జనవరి 26న ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కవాతు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి ప్రారంభమై, కర్తవ్య పథ్ ద్వారా ఎర్రకోటకు చేరుకుంటుంది. ఈ సంవత్సరం కవాతు కార్యక్రమం, శకటాలు, ముఖ్య అతిథి, థీమ్, భద్రతా వివరాలు ఇలా ఉన్నాయి.గణతంత్ర దినోత్సవం 2025 థీమ్76వ గణతంత్ర దినోత్సవం థీమ్ 'స్వర్ణ భారతదేశం: వారసత్వం- పురోగతి'. ఈసారి కవాతు 90 నిమిషాల్లో ముగియనుంది. ఈసారి కవాతులో 31 శకటాలు, 18 మార్చింగ్ కంటింజెంట్లు, 15 బ్యాండ్లు పాల్గొంటాయి. కవాతు సందర్భంగా మొత్తం 5,000 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.త్రివిధ సైన్యాల ఉమ్మడి శకటంగణతంత్ర దినోత్సవ చరిత్రలో తొలిసారిగా మూడు దళాలు అంటే సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన ఒకే శకటం ప్రదర్శితం కానుంది. కవాతులో మొదటిసారిగా మూడు సాయుధ దళాల విభాగాల ప్రత్యేక శకటాలు ఉండవు. ఈ మూడు విభాగాల సమన్వయాన్ని తెలిపేదిగా ఉమ్మడి శకటాన్ని రూపొందించారు.రాష్ట్రాల ఘనతను చాటే శకటాలుగణతంత్ర దినోత్సవ కవాతులో బీహార్, మధ్యప్రదేశ్, యూపీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, చండీగఢ్, గోవా, హర్యానా,జార్ఖండ్‌తో సహా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు ప్రదర్శితం కానున్నాయి. 2025 మహాకుంభ్ ప్రాముఖ్యతను తెలియజేసే శకటం ప్రత్యేక ఆకర్షణ కానుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు కూడా కనిపించనున్నాయి.ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడుఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే ఈసారి తొలిసారిగా ఇండోనేషియాకు చెందిన 352 మంది సభ్యుల మార్చింగ్, బ్యాండ్ బృందం గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననుంది. కాగా 1950లో జరిగిన భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.భద్రతా ఏర్పాట్లుగణతంత్ర దినోత్సవం వేడుకల వేదిక సమీపంలో యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అతిథులకు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. ఆర్మీ హెలికాప్టర్లు గస్తీ తిరుగుతాయి. దీనితో పాటు ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు, డీర్డీఓ శాస్త్రవేత్తలు భద్రతా బాధ్యతలు చేపట్టనున్నారు. 14 'పరాక్రమ్' కమాండో వాహనాలను ఇప్పటికే మోహరించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
‘ఎన్నికల’ వజ్రోత్సవం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియగా నిలిచే లోక్‌సభ ఎన్నికలు. అందుకు ఏ మాత్రమూ తగ్గని పలు పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. సుమారు 100 కోట్ల ఓటర్లు. లక్షల్లో పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది. వేలాది మంది అభ్యర్థులు. ఇంతటి భారీ ప్రజాస్వామిక క్రతువు సజావుగా జరిగేలా చూసే గురుతర బాధ్యతను మోస్తూ వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన ఈసీ శనివారం 76 ఏట అడుగు పెడుతోంది. ఈ క్రమంలో బాలారిష్టాలను దాటి ‘ఇంతింతై’ అన్నట్టుగా ఎదిగి, నేడు అత్యాధునిక పద్ధతుల ద్వారా ఎన్నికల ప్రక్రియను దేశవ్యాప్తంగా ఆసాంతమూ డేగకళ్లతో పర్యవేక్షించగల స్థాయికి చేరుకుంది.ఆ క్రమంలో ఎన్నో మెరుపులు మెరిపించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎంతటి అద్భుతాలు సాధ్యమో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా టి.ఎన్.శేషన్ ఆచరణలో చూపించారు. అభ్యర్థుల ఆస్తుల వెల్లడి మొదలుకుని ప్రచార వ్యయ నియంత్రణ దాకా నిబంధనలన్నింటినీ కట్టుదిట్టంగా అమలు చేసి ఔరా అనిపించుకున్నారు. ఈసీ అధికారాలు ఎంతటివో పార్టీలు, నేతలతో పాటు సామాన్య ప్రజలకు కూడా తెలిసొచ్చేలా చేశారు. అలాంటి చరిత్ర ఉన్న ఈసీ పనితీరుపై కొన్నేళ్లుగా ఎన్నెన్నో ప్రశ్నలు! పారదర్శకత లోపిస్తున్న తీరుపై ప్రజలు మొదలుకుని ప్రతిపక్షాల దాకా అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి! మొత్తంగా ఈసీ వ్యవహార శైలిపైనే ఆరోపణల మరకలు. ఈ పరిణామాలు ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనపరుస్తున్నాయి.ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు గుండెకాయ వంటి ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) విశ్వసనీయతపైనే నానాటికీ సందేహాలు పెరుగుతున్నాయి. వాటికి మద్దతుగా సహేతుక వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈవీఎంల పనితీరును మేధావులు మొదలుకుని సాధారణ ప్రజల దాకా అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక చివరి గంటల్లో పోలింగ్ శాతంలో అనూహ్యంగా నమోదవుతున్న భారీ పెరుగుదలను స్వయానా ఈసీ మాజీ సారథులే ప్రశ్నిస్తున్న పరిస్థితి! వీటన్నింటినీ మించి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉంటున్న వైనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వందల స్థానాల్లో ఇదే పరిస్థితంటూ పలు గణాంకాలు వెల్లువెత్తాయి.ఇలాంటి సందేహాలు, ప్శ్నలు ప్రజాస్వామిక ప్రక్రియనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అరకొర వివరణలతో సరిపెట్టడం, ప్రధాన సందేహాలపై మౌనాన్ని ఆశ్రయిస్తుండటం అనుమానాలను మరింతంగా పెంచుతోంది. ప్రభుత్వ పెద్దల చేతిలో ఈసీ కీలు»ొమ్మగా మారుతోందని విపక్షాలు ఆరోపించడం పరిపాటిగా మారింది. చివరికి ఎన్నికల కమిషనర్ల నియామకం కూడా తరచూ వివాదాస్పదంగా మారుతోంది. వాటిని సవాలు చేస్తూ పలు పార్టీలు సుప్రీంకోర్టు దాకా వెళ్తున్న పరిస్థితి! ఈసీ 76వ వార్షికోత్సవ వేడుక శనివారం హస్తినలో జరగనుంది. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎక్సలెన్స్ అవార్డులు అందజేస్తారు. ‘ఇండియా వోట్స్–2024’ పేరిట ఇటీవలి లోక్‌సభ ఎన్నికలపై ఈసీ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను, ఆ ఎన్నికలకు సంబంధించిన మానవాసక్తి కథనాల కూర్పు ‘బిలీఫ్ ఇన్ ద బ్యాలెట్’ను విడుదల చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియపై ‘ఇండియా డిసైడ్స్’ పేరిట వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లలో అవగాహనను పెంచేలా పలు కార్యక్రమాలను ఈసీ ప్రకటించనుంది. ..అలా మొదలైంది ఎన్నికల సంఘం ఉనికిలోకి వచ్చిన రెండేళ్లకే 1952 తొలి సాధారణ ఎన్నికల రూపంలో అతి పెద్ద సవాలును ఎదుర్కొంది. ఉన్నది ఒక్క ఎన్నికల కమిషనర్, చాలీచాలని సిబ్బంది. వనరులు, వసతులు అంతంతమాత్రం. ఓటర్లలో మెజారిటీ అక్షరజ్ఞానం కూడా లేనివారే. వారందరినీ చేరుకోవడం, ఓటేసేలా చూడటమే అతి పెద్ద సవాలుగా మారిన పరిస్థితి! అన్ని ప్రతికూలతల మధ్య కూడా తొలి ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించి ఔరా అనిపించుకుంద. రవాణా సదుపాయాలే లేని అతి మారుమూల ప్రాంతాలకు కూడా సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని చేర్చి ప్రక్రియ వీలైనంత సమగ్రంగా జరిగేలా చూసింది.అందుకోసం ఎన్నో కష్టనష్టాలకోర్చింది. దాంతో తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ దేశ విదేశాల్లో పాపులరయ్యారు. ఎన్నో దేశాలు తమ ఎన్నికల ప్రక్రియను గాడిన పెట్టేందుకు ఆయన సేవలను వాడుకున్నాయి. తర్వాత ఈసీ క్రమక్రమంగా ఎదుగుతూ వచి్చంది. ప్రపంచంలోకెల్లా అతి బృహత్తరమైన ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆద్యంతం శాంతియుతంగా నిర్వహించడంలో తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. 1989లో ఎన్నికల కమిషనర్ల సంఖ్యను మూడుకు పెరిగింది.ఓటర్ల జాబితాతోనూ చెలగాటం ఎన్నికల ప్రక్రియకు అతి కీలకమైన ఓటర్ల జాబితాతో ప్రభుత్వాలు, పాలక పెద్దలు చెలగాటమాడుతున్న తీరు కూడా ఈసీ పనితీరుపై మచ్చగా మారుతోంది. తమకు అనువైన చోట్ల ఇష్టారాజ్యంగా ఓటర్లను చేరుస్తున్నారని, లేనిచోట్ల భారీగా పేర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరోపణలు పదేపదే వినిపించాయి. ఇక తాజాగా జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనైతే ఈ రచ్చ కనీవినీ ఎరగని స్థాయికి పెరిగింది. రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన అంబేడ్కర్ ఈ విపరిణామాన్ని ముందే ఊహించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఎన్నికల జాబితాను ఒకటిగా ఆయన అభివర్ణించారు.‘‘జాతి, సంస్కృతి, భాష తదితరాలపరంగా తమవారు కారని భావించిన వారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించే అవకాశముంది. ఇలాంటి పెడపోకడలకు చెక్ పెట్టేందుకే ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నాం’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటును ప్రతిపాదిస్తూ 1949 జూన్‌లో రాజ్యాంగ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో అంబేడ్కర్ స్పష్టం చేశారు. నేటి పరిస్థితులు చూస్తే నాటి భయాలే నిజమవుతున్నాయని ఆయన ఆవేదన చెందేవారేమో. -
యోగీ జీ.. అమిత్ షాకు కాస్త చెప్పండి: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) వ్యాఖ్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఏకీభవించారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్ అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉందని, ఆ విషయాన్ని ఆయనకే మీరు కాస్త కూర్చొని చెప్పండని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్‌ను ఎలా మరుగుపరుచాలో అమిత్ షాకు కాస్త దిశా నిర్దేశం చేయండి యోగీ జీ అంటూ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi assembly election 2025) ఫిబ్రవరి 5వ తేదీన జరుగనున్న నేపథ్యంలో ఇటు ఆప్, అటు బీజేపీలు తమ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు సాగుతోంది ఇర పార్టీల ప్రచారం. దీనిలోభాగంగా యోగీ ఆదిత్యానాథ్ మాట్లాడిన మాటలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు చెప్పింది నిజమే యోగీ జీ..‘ నిన్న( గురువారం) యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఒక మంచి విషయం చెప్పారు. దీనికి ఢిల్లీ ప్రజల కూడా మద్దతుగా నిలుస్తారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదని యోగి అన్నారు. దాంతో ఢిల్లీ ప్రజలు వంద శాతం ఏకీభవిస్తారు. ఢిల్లీలో గ్యాంగ్స్టర్లు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. ఢిల్లీలో చాలా గ్యాంగ్‌స్టర్ గ్రూపులున్నాయి. వీరంతా ఢిల్లీ నగరాన్ని విభజించి వారి వారి కార్యకలాపాల్ని ఎంతో స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని బెదిరించి వారి అరాచకాల్ని సాగిస్తున్నాయి గ్యాంగ్‌స్టర్ గ్రూపులు. ప్రధానంగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న బడా వ్యాపారస్తులకు ఏ రోజు సుఖం లేదు. రోజూ ఏదొక గ్యాంగ్స్టర్గ్రూప్ నుంచి వారు బెబెదిరింపు కాల్స్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు. వారి కుటుంబాల్ని చంపేస్తామంటూ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల్ని గ్యాంగ్‌స్టర్ గ్రూపులు వసూలు చేస్తూ ఉంటాయి. ఢిల్లీలో జరిగే గ్యాంగ్ వార్స్‌కి అక్కడి రోడ్లే సాక్ష్యం. ఢిల్లీలో మహిళలు ఇళ్లు ాదాటి బయటకు రావాలంటే చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీ నగరంలో చిన్న పిల్లలు, మహిళలు తరచు కిడ్నాప్‌లకు గురౌవుతుంటారు. ఇక్కడ గ్యాంగ్స్టర్లకు కత్తుల్ని వారి వద్దనున్న మారణాయుధాల్ని చాలా బహిరంగంగా వాడుతుంటారు. హత్యలు, చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు నిత్యం ఏదో మూలన జరుగుతూనే ఉంటాయి. ఢిల్లీ ప్రజలు చాలా భయాందోళన మధ్య బ్రతుకుతున్నారనేది నిజం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.ఢిల్లీలో శాంతి భద్రతల బాధ్యత అమిత్ షాదే..‘యూపీలో లా అండ్ ఆర్డర్ అనేది ఎంతో అమోగంగా ఉందన్నారు. ఒక ఫిక్స్డ్ లా అండ్ ఆర్డర్ యూపీలో ఉందన్నారు. యూపీలో గ్యాంగ్‌స్టర్ గ్రూపులను కట్టడి చేశామని చెప్పారు యోగీ జీ. అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందా.. బాలేదా అనేది నాకైతే తెలీదు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేతుల్లో ఉంది. మరి మీరు(యోగీ ఆదిత్యానాథ్) యూపీలో లా అండ్ ఆర్డర్ ఏదైతే మెరుగైందని చెప్పారో అదే విషయాన్ని అమిత్ షాకు కూడా చెప్పి ఢిల్లీ నగరంలో శాంతి భద్రతల్ని మెరుగుపర్చండి. ఢిల్లీలో గ్యాంగ్స్టర్లకు ఎలా అడ్డుకట్ట వేయాలో కాస్త అమిత్ షా జీకి చెప్పండి యోగీ జీ’ అని కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
Republic Day 2025: అందమైన ఈ శకటాలను చూసితీరాల్సిందే
జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ నేపధ్యంలో ప్రతీయేటా అదేరోజున రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఈ వేడుకల నిర్వహణకు ఇప్పుటికే దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన అందమైన శకటాలు అందరినీ అలరించనున్నాయి. ఇప్పటికే ఈ శకటాల రూపకల్పన పూర్తయ్యింది.లడఖ్ ఘనతను చూపే ఈ శకటం ఎంతో ప్రత్యేకంగా రూపొందింది. ఇది అత్యంత అందమైన శకటాలలో ఒకటి కానుంది. ఈ శకటాన్ని పాత్ ఆఫ్ డ్యూటీ ముందు నేషనల్ స్టేడియం క్యాంప్‌లో ప్రదర్శనకు ఉంచారు.గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ శకటం ఎంతగానో ఆకట్టుకుంటోంది. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో దీనిని మనం చూడవచ్చు.2025 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పశ్చిమ బెంగాల్ శకటాన్ని కూడా చూడవచ్చు. ఈ అందమైన శకటం అందరి ప్రశంసలు అందుకోనుంది.జమ్ముకశ్మీర్ శకటం చాలా మంది హృదయాలను దోచుకోనుంది. జమ్ముకశ్మీర్ సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిందనే విషయం అందరికీ తెలిసిందే.జార్ఖండ్ శకటాన్ని ఎంతో అందంగా తయారు చేశారు. ఈ శకటం రాజ్‌పథ్‌లో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.ఉత్తరప్రదేశ్ శకటం జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ అందమైన శకటంలో ‘సముద్ర మథనం’ప్రాణం పోసుకుంది.బీహార్ శకటం ఆ రాష్ట్రంలోని స్వర్ణయుగాన్ని ప్రతిబింబిస్తోంది. బీహార్ అనేక శతాబ్దాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాన కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ శకటం కూడా అందరి దృష్టిని ఆకర్షించడంలో ముందుంటుంది. జనవరి 26న ఈ శకటాన్ని చూడవచ్చు.2025 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనబోతున్న గోవా శకట కళాకారులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ ఆదేశాలు.. బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం -
ఢిల్లీలో ఈనెల 26న రిపబ్లిక్ డే వేడుకలు
-
విరాట్ కోహ్లి కీలక ప్రకటన
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలక ప్రకటన చేశాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే రంజీ మ్యాచ్‌లో ఆడతానని స్పష్టం చేశాడు. విరాట్ దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడతాడు. విరాట్ రంజీల్లో ఆడటం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. విరాట్ ఈ నెల 23న సౌరాష్ట్రతో జరుగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. మెడ నొప్పి కారణంగా విరాట్ సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఢిల్లీ జట్టులో మరో టీమిండియా స్టార్ రిషబ్ పంత్ ఉన్నాడు.సౌరాష్ట్ర తరఫున టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 23 నుంచి జరిగే రంజీ మ్యాచ్‌ల్లో చాలా మంది భారత స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్.. పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. టెస్ట్‌ల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు తప్పక రంజీల్లో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత ఆటగాళ్లంతా రంజీ బాట పట్టారు.రేపటి నుంచి (జనవరి 22) టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. విరాట్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారథిగా వ్యవహరిస్తాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు.ఈ సిరీస్‌కు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. ఇదే సిరీస్‌తో స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతా వేదికగా జరుగనుంది. అనంతరం జనవరి 25 (చెన్నై), 28 (రాజ్‌కోట్), 31 (పూణే), ఫిబ్రవరి 2వ (ముంబై) తేదీల్లో మిగతా నాలుగు టీ20లు జరుగనున్నాయి.టీ20 సిరీస్ అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడతాయి. ఈ సిరీస్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉండనుంది. వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో జరుగనుండగా.. ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్‌లు కటక్, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.ఇంగ్లండ్‌తో టీ20ల కోసం ఎంపిక చేసిన భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్)ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, హర్షిత్ రానాఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి -
‘ఇదేమి దుస్థితి.. వందలాది మంది రోగులు ఫుట్‌పాత్‌పైనే..’
ఢిల్లీ: ‘వారికి అత్యంత ఖరీదైన వైద్యం(high-quality healthcare) చేయించుకునే స్థోమత లేదు. నాణ్యమైన వైద్యం చేయించుకునేందుకు వారి స్థాయి సరిపోవడం లేదు. అందుకే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోని వందలాది మంది రోగులు రోడ్లపైనే ఉంటున్నారు. ఫుట్‌పాత్‌లే వారికి దిక్కు అవుతున్నాయి.’ అని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖా మాత్యులు జేపీ నడ్డాకు, ఢిల్లీ సీఎం అతిషికి లేఖ రాశారు రాహుల్ గాంధీ.‘ ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS) దగర్గ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ బయట చూస్తే వందలాది మంది రోగులు ఫుట్‌పాత్‌లపైనే ఉంటున్నారు. ఈ దుస్థితి ఎందుకొచ్చిందనేది ఆలోచన చేస్తే కోట్ల మంది ప్రజలకు మెరుగైన వైద్యం చేయించుకునే పరిస్థితి దేశంలోలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ వంటి మహా నగరంలో ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆస్పత్రికి అధిక భారంగా మారింది. దేశంలో హెల్త్ సిస్టమ్ మారాలి. అందుకే కేంద్ర హెల్త్ మినిస్టర్.జేపీ నడ్డాకు విన్నవించుకుంటున్నా. హెల్త్ సిస్టమ్‌లోని లోపాల్ని గుర్తించండి, మొదటిగా దేశంలోన ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రిల్లో పరిస్థితిని చక్కదిద్దండి. ఎంత తొందరగా ఆ సమస్యను పరిష్కారిస్తానే ఇక్కడ ముఖ్యం. వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు బలోపేతం కావాలి. ఇది అన్నిస్థాయిల్లోనూ జరగాల్సిన అవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయండి’ అని రాహుల్ పేర్కొన్నారు.రాహుల్ ‘వైట్ టీ–షర్ట్’ ఉద్యమం కాంగ్రెస్ అగ్రనేత (రాహుల్ గాంధీ సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం వైట్ టీ–షర్ట్’ఉద్యమం ప్రారంభించారు. తన ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’లో..‘ఆర్థిక న్యాయం కోరుకునే వారు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిరసించేవారు, సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు, అన్ని వివక్షలను వ్యతిరేకించేవారు, దేశంలో శాంతి స్థిరతలను కోరుకునే వారు తెల్ల టీ–షర్ట్‌లను ధరించండి. ఉద్యమంలో పాల్గొనండి’అని కోరుతూ ఓ వీడియో షేర్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం దృష్టంతా కేవలం కొందరు పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడంపైనే ఉంది. అందుకే, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. తమ రక్తం, స్వేదంతో దేశం కోసం కృషి చేస్తున్న సామాన్యుల పరిస్థితి మరింత దిగజారుతోంది. -
‘అది కేజ్రీవాల్ పనే .. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election 2025) సమీపిస్తున్న వేళ.. అధికార ఆమ్ ఆద్మీపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో తమదైన రీతిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిల్లీలో ఓడిపోతామన్న భయంతో ఆప్(AAP) ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగుతుందని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఆప్ నేతలు.. ఢిల్లీ ఓటర్లకు కుర్చీలు పంచి పెడుతున్నారని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ని ఆప్ ఉల్లంఘిస్తుందని పోలీసులకు, ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతలు స్థానికంగా ఉన్న ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పర్వేష్‌వర్మ ఎన్నికల ఏజెంట్ సందీప్ సింగ్ చేత ఫిర్యాదు చేయించారు పర్వేష్ వర్మ.‘ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. తమ కార్యకర్తల చేత కుర్చీలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని ఈస్ట్ కిద్వాల్ నగర్ లో నిన్న(ఆదివారం) కుర్చీలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది ఆప్ నేతలే పని. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనిలో పడ్డారు ఆప్ నేతలు. ఇది కేజ్రీవాల్.. ఆప్ కార్యకర్తల చేత చాలా తెలివిగా చేయిస్తున్నారు. ఒక ట్రాలీలో కుర్చీలను తీసుకెళ్తున్న వ్యక్తి వాటిని పంపిణీ చేస్తున్నాడు. ఆ కార్యకర్త కేజ్రీవాల్ పంపిన కార్యకర్తే’ అని పర్వేష్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సైతం జత చేశారు. వెంటనే కేజ్రీవాల్పైఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.వారికి భూములివ్వండి.. నగరానికి వారే బ్యాక్బోన్కాగా, వరుసగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు కేజ్రీవాల్. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసిన కేజ్రీవాల్.. మరొకసారి మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొచ్చి, దాని ద్వారా వారికి ఈఎంఐల రూపంలో నగదు చెల్లించే అవకాశం ఇవ్వాలన్నారు.ఈరోజు(ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ ఢిల్లీ ప్రభుత్వానికి భూములు ఇవ్వండి. ఎందకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో భూ పంపిణీ చేసే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు గురించి కూడా లేఖలో మోదీకి వివరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ ఎన్డీఎంసీ, ఎంసీడీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నివాసం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. వారికి రాయితీలు కల్పించి తక్కువ రేట్లకు భూమిని ఇస్తే వారు గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీరిది కీలక పాత్ర. వారు నగరానికి బ్యాక్బోన్వీరు భూమి కోసం తీసుకున్న రుణాన్ని నెలవారీ పద్దతుల్లో తిరిగి చెల్లించే విధంగా స్కీమ్ తీసుకురండి. వారు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో నివాసం ఉంటున్నారు. అవి తాత్కాలికమే. రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఆ గృహాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. శానిటేషన్ కార్మికులు వేరే ఇళ్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీ వంటి మహా నగరంలో అద్దెకు ఉండాలన్నాఅది భరించలేనంతగా ఉంది. అలా కాకుండా వారికి భూమిని ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహం ఇస్తే వారికి ఎంతో మేలు చేసిన వారిగా మిగిలిపోతాం’ అని లేఖలో పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. -
మోదీ జీ.. వారికి భూమిలిచ్చి ఆదుకోండి: కేజ్రీవాల్ మరో లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election 2025) మరింత సమీపిస్తున్న వేళ.. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. వరుసగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసిన కేజ్రీవాల్.. మరొకసారి మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొచ్చి, దాని ద్వారా వారికి ఈఎంఐల రూపంలో నగదు చెల్లించే అవకాశం ఇవ్వాలన్నారు.ఈరోజు(ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ ఢిల్లీ ప్రభుత్వానికి భూములు ఇవ్వండి. ఎందకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో భూ పంపిణీ చేసే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు గురించి కూడా లేఖలో మోదీకి(Narendra Modi)కి వివరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ ఎన్డీఎంసీ, ఎంసీడీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నివాసం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. వారికి రాయితీలు కల్పించి తక్కువ రేట్లకు భూమిని ఇస్తే వారు గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీరిది కీలక పాత్ర. వారు నగరానికి బ్యాక్బోన్వీరు భూమి కోసం తీసుకున్న రుణాన్ని నెలవారీ పద్దతుల్లో తిరిగి చెల్లించే విధంగా స్కీమ్ తీసుకురండి. వారు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో నివాసం ఉంటున్నారు. అవి తాత్కాలికమే. రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఆ గృహాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. శానిటేషన్ కార్మికులు వేరే ఇళ్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీ వంటి మహా నగరంలో అద్దెకు ఉండాలన్నాఅది భరించలేనంతగా ఉంది. అలా కాకుండా వారికి భూమిని ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహం ఇస్తే వారికి ఎంతో మేలు చేసిన వారిగా మిగిలిపోతాం’ అని లేఖలో పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఇటీవల జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ను ప్రధాని మోదీ దృష్టి తీసుకొచ్చారు కేజ్రీవాల్. జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్‌లో జాబ్స్‌కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంచితే, గత రెండు పర్యాయాలుగా ఢిల్లీలోఆప్ అధికారాన్ని చేపట్టింది. 2013 నుంచి ఇప్పటివరకూ ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైనా ఢిల్లీ పగ్గాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆప్‌కు ధీటుగా ప్రచారాన్నిసాగిస్తూ బీజేపీ సైతం దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా వీరిద్దరి ప్రచారం నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కేజ్రీవాల్ కారుపై రాయితో దాడి: బీజేపీ పనే అంటోన్న ఆప్! -
అతిపెద్ద ఆటో షోకు వేదికగా ఢిల్లీ
-
స్టార్టప్ కుంభమేళా
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్టార్టప్‌ల వాతావరణాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘స్టార్టప్ మహాకుంభ్ 2025’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. దీనిద్వారా వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి భాగస్వామ్యాల ద్వారా కొత్త లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ద్వారా ‘స్టార్టప్ మహాకుంభ్ 5.0’నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2047 నాటికి భారత్‌లో స్టార్టప్‌లు సాధించాల్సిన లక్ష్యాలపై ఇందులో చర్చించి, దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా పాలసీలు, ప్రోగ్రామ్‌లు దేశంలో స్టార్టప్‌ల వాతావరణానికి ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పాలసీలు, ప్రోగ్రాములను అమలు చేస్తోంది. నేషనల్ మెంటార్íÙప్ ప్లాట్‌ఫామ్, సీడ్ ఫండ్ సపోర్ట్, ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్, స్టార్టప్ ఇండియా యాత్ర, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వంటివి చేపట్టింది. ఈ క్రమంలోనే భారతీయ స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి తమ కార్యకలాపాలను విస్తరించేలా స్టార్టప్ మహాకుంభ్ 2025ను కేంద్ర ప్రభుత్వ అనుబంధ విభాగం డీపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 1.54 లక్షల స్టార్టప్‌లు డీపీఐఐటీ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2016లో 502 స్టార్టప్‌లు ఉండగా.. 2024 నవంబర్ 24 నాటికి 1,54,719 స్టార్టప్‌లకు చేరాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 17 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. స్టార్టప్‌లలో అత్యధికంగా 17,618 స్టార్టప్‌లు ఐటీ సేవలు, 14,285 స్టార్టప్‌లు ఆరోగ్య రక్షణ, 9,047 స్టార్టప్‌లు విద్యా రంగానికి చెందినవి ఉన్నాయి. మొత్తంగా చూస్తే మహారాష్ట్ర (27,459 స్టార్టప్‌లు), కర్ణాటక (16,335), ఢిల్లీ (15,851) దేశంలో టాప్ మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 5,157 స్టార్టప్‌లు ఉన్నాయి. భారత్‌లోని స్టార్టప్‌లలో నాయకత్వ స్థాయిలో 48 శాతం మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం. ఫలితాలను ఇస్తున్న పథకాలు భారతీయ స్టార్టప్‌ల రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ఫలిస్తున్నాయి. స్టార్టప్‌ల ఆవిష్కరణలు, వాణిజ్య భాగస్వామ్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్టార్టప్ ఐడియాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ‘స్టార్టప్ యాత్ర’236 జిల్లాలు, 23 రాష్ట్రాల మీదుగా సాగుతూ... 143 బూట్ క్యాంపులను, 300 చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. స్టార్టప్ బ్రిడ్జెస్ కార్యక్రమంలో భాగంగా 21 దేశాలతో భారతీయ స్టార్టప్‌లను అనుసంధానం చేశారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2024 నాటికి 1,165 స్టార్టప్‌లలో 21,221 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైంది.యూనికార్న్‌ల వైపు అడుగులు..కొద్దిపాటి పెట్టుబడులతో వినూత్న ఆవిష్కరణలతో ప్రారంభమైన సంస్థలు స్వల్పకాలంలో ఒక బిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ.8,629 కోట్లు) విలువ కలిగిన సంస్థగా ఎదిగితే యూనికార్న్‌లుగా పిలుస్తారు. 2016 నాటికి భారత్‌తో 11 యూనికార్న్‌లు ఉండగా.. 2014 నాటికి వాటి సంఖ్య 118కి చేరింది. ఎడ్టెక్ రంగంలో అన్ అకాడమీ, వేదాంత.. ఫిన్టెక్లో పేటీఎం, ఫోన్‌పే, జెటా.. ఈ–కామర్స్‌లో ఫ్లిప్‌కార్ట్, ఫస్ట్ క్రై.. హెల్త్ టెక్‌లో ఫార్మ్ ఈజీ వంటి సంస్థలు భారతీయ యూనికార్న్‌ల జాబితాలో ఉన్నాయి. ఇలా భారతీయ స్టార్టప్‌ల నుంచి మరిన్ని యూనికార్న్‌లు ఎదిగేందుకు ‘స్టార్టప్ మహాకుంభ్’దోహదం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఢిల్లీ: రెండు విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బడ్జెట్లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని.. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది చివరలో బీహార్ ఎన్నికలు జరగనున్నందున, రెండు మిత్రపక్షాలు జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రెండూ రాష్ట్రానికి కీలకమైన ప్రకటనల కోసం ఆశిస్తున్నాయి.బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, రైతులు, కార్మికులు.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఎదురుచూస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.7లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రూ. రూ.9 లక్షలకు పెంచనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.ఇదీ చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్: 16 మంది భారతీయులు మిస్సింగ్, 12 మంది మృతి -
ఉత్తరాదిలో పొగమంచు ఎఫెక్ట్.. వాహనదారుల ఇబ్బందులు
-
కోచ్‌లకు ‘టీ’ అందించేవాడిని.. ఇంకా: శిఖర్ ధావన్
క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకునే క్రమంలో తాను చేసిన పనుల గురించి శిఖర్ ధావన్(Shikhar Dhawan) తాజాగా వెల్లడించాడు. పిచ్‌ను రోల్ చేయడం సహా కోచ్‌లకు ‘టీ’లు అందించడం వరకు అన్నీ తానే చేసేవాడినని తెలిపాడు. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు రోజంతా ఎండలో నిలబడేవాడినని గుర్తు చేసుకున్నాడు.కాగా ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ ఎడమచేతి వాటం బ్యాటర్. అండర్-19 వరల్డ్‌కప్-2004లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. నాటి టోర్నీలో మూడు శతకాల సాయంతో 505 పరుగులు చేసి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియాలోకి రావడానికి ధావన్ చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.ఢిల్లీ తరఫున ఓపెనర్గావీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్లతో కలిసి ఢిల్లీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్.. ఎట్టకేలకు 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్.. 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. ఇక టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్ చేశాడు. 2022లో చివరగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్‌కు.. ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి.టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ తదితర యువ బ్యాటర్లు ఓపెనర్లుగా టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో ధావన్‌కు మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు కూడా గుడ్‌బై చెప్పాడు.ఇక ప్రస్తుతం లెజెండ్స్ లీగ్, నేపాల్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలలో పాల్గొంటున్న శిఖర్ ధావన్ తాజాగా చిన్నారులతో ముచ్చటించాడు. శిఖర్ ధావన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ పిల్లాడు.. ‘‘మీ క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైంది’’ అని అడిగాడు.కోచ్‌లకు ‘టీ’ అందించేవాడినిఇందుకు బదులిస్తూ.. ‘‘చిన్నతనంలో క్లబ్ క్రికెట్ ఆడేవాడిని. అక్కడ దాదాపు ఏడాది పాటు సాధన చేశాను. ఆ మరుసటి ఏడాది నాకు టోర్నమెంట్లో ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఖాళీగా ఉన్న ఆ ఏడాదిలో నేను ఎన్నెన్నో చిత్రమైన పనులు చేశాను.పిచ్‌ను రోల్ చేయడం, కోచ్‌ల కోసం టీ తీసుకురావడం.. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు గంటల పాటు ఎండలో నిల్చోవడం.. ఇలాంటివి చాలానే చేశాను’’ అని శిఖర్ ధావన్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కుమారుడికి దూరంగా.. కాగా శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియా మహిళను అతడు 2012లో పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్‌తో కలిసి జోరావర్‌కు జన్మనిచ్చింది. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆయేషా- శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇక కుమారుడు జొరావర్‌ను ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లగా.. ధావన్ తన గారాలపట్టిని మిస్సవుతున్నట్లు చాలాసార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపాడు. ధావన్ తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.చదవండి: ఇలాంటి కెప్టెన్‌ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్ -
కాంగ్రెస్ తరఫున నేను హామీ ఇస్తున్నా
-
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రివాలు షాక్
-
జెండాకు నమస్కరించని వారు దేశం గురించి మాట్లాడతారా?: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన కాంగ్రెస్(congress Office) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ కార్యాలయ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పార్టీ జెండా ఎగురవేశారు. ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఇక, కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul Gandhi) మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేసే వారిని ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. జాతీయ జెండాకు నమస్కరించరని వారు దేశం గురించి మాట్లాడుతున్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని కించపరిచే విధంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో పోరాడుతూనే ఉంటాం. బ్రిటీష్ వారితో పోరాడిన యోధులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ భవనం ప్రతీ కార్యకర్తకు చెందుతుంది. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "The Constitution was essentially attacked yesterday by Mohan Bhagwat when he said that the Constitution was not the symbol of our freedom, but also after that, thousands of our workers died in Punjab, Kashmir,… pic.twitter.com/ghK13PDOk2— ANI (@ANI) January 15, 2025ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ భవనంలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది.9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కోట్లా మార్గ్‌కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది.#WATCH | Congress MP Sonia Gandhi inaugurates 'Indira Bhawan', the new headquarters of the party in Delhi Congress president Mallikarjun Kharge, MP Rahul Gandhi and other prominent leaders of the party also present pic.twitter.com/9X7XXNYEOn— ANI (@ANI) January 15, 2025 -
ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. పలు విమానాలు ఆలస్యం, రద్దు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు కప్పేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ జీరోకు పడిపోయింది. దీంతో.. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.ఢిల్లీని పొగ మంచు కప్పేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం నమోదవుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున విజిబిలిటీ జీరోకు పడిపోయింది. ఈ కారణంగా దాదాపు 184 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో ఏడు విమానాలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే సమయంలో ఆరు రైలు సర్వీసులను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.Delhi under 'Orange' warning due to 'dense to very dense' fog at many places today, says India Meteorological Department (IMD). pic.twitter.com/3wQwz13OJE— ANI (@ANI) January 15, 2025 ఇదిలా ఉండగా.. ఢిల్లీలో వాయు నాణ్యత పూర్ కేటగిరీలో కొనసాగుతోంది. దీంతో, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆరెంజ్ అలర్ట్ విధించింది ఇక, బుధవారం ఉదయం ఢిల్లీలోని కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సఫర్జజ్‌గుంజ్‌లో ఆరు డిగ్రీలుగా నమోదైంది. దీంతో, ప్రజలు చలితో వణికిపోతున్నారు. #WATCH | Delhi | A dense layer of fog engulfs the national capital as cold wave intensifies in Northern India.Visuals from India Gate and surrounding areas pic.twitter.com/X4mpFsSCRt— ANI (@ANI) January 15, 2025 Delhi | Minimum temperature recorded at 6 degrees Celsius at 0830 hours at IMD's Safdarjung observatory today, says India Meteorological Department.— ANI (@ANI) January 15, 2025 -
బీజేపీ 29 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల
-
హస్తినకు మంచు ముసుగు
-
ఢిల్లీలోని మురికివాడల కంటే.. శీష్ మహల్లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువ: అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్‌లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు. మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను పట్టించుకోకుండా, ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ ‘ఆపద’ప్రభుత్వం అడ్డంకిగా మారిందన్నారు. గత పదేళ్లుగా ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని చెప్పారు. కనీసం తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ వసతులు కూడా లేని మురికివాడలు చెత్తకుప్పల్లా మారాయని చెప్పారు. సుమారు 5.25 లక్షల మంది ఢిల్లీ విద్యార్థులకు పాఠశాల విద్య అందడం లేదంటూ కేజ్రీవాల్‌ను నిలదీశారు. -
బీజేపీ సీఎం అభ్యర్థి బిధూరీకి అభినందనలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి మాజీ ఎంపీ రమేశ్ బిధూరీకి ఆప్ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. బిధూరీని ఒకట్రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించవచ్చంటూ తనకు సమాచారముందని చెప్పారు. బిధూరీ అయినా మరెవరైనా సరే తనతో బహిరంగ చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. శనివారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. సీఎం అతిశీ పోటీ చేసే కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ రమేశ్ బిధూరీని పోటీకి నిలిపింది. శుక్రవారం సీఎం అతిశీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ‘దుర్భాషలాడటంలో ఆరితేరి’న రమేశ్ బిధూరీని ఎంపిక చేసిందని చెప్పారు. సీఎం అతిశీ తన ఇంటి పేరును మర్లెనా నుంచి సింగ్‌కు మార్చుకోవడం ద్వారా తండ్రిని కూడా మార్చేశారని బిధూరీ అన్నారు. అదేవిధంగా, ఢిల్లీలో రోడ్లను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తామంటూ బిధూరీ వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా, తను పోటీ చేసే న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ఎంపీలు ఓట్లను దేశవ్యాప్తంగా ఉన్న తమ సొంత నియోజకవర్గాలకు మార్చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఈసీకి లేఖ రాశారు. బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి పర్వేశ్ వర్మ అధికార నివాసం పేరుతో 33 ఓట్లను బదిలీ చేశారని ఆరోపించారు. విచారణ చేపట్టి, వర్మను అనర్హుడిగా ప్రకటించాలన్నారు. పోలింగ్ బూత్‌లను కబ్జా చేసుకోవడం కంటే ఇది అధ్వానమైన చర్యగా అభివర్ణించారు. ఇదీ చదవండి: కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ.. సీఎం అతిశీ వర్సెస్ రమేష్ బిదూరి