diet
-
నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) ఇప్పటికీ అంతే అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. శ్రియ ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాదు ఇప్పటికీ అంతే ఆకర్షణీయమైన లుక్‌తో కుర్ర హీరోయిన్లకు మించిన సౌందర్యం ఆమెది. శ్రియ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడూ ఎలా ఉందో.. అలానే గ్లామర్‌గా ఉంది. ఆమె అందం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు అనేలా మాయ చేస్తుంటుంది. అంతే ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఇంతలా బాడీ ఎలా మెయింటైన్ చేస్తుందా అని ఆశ్యర్యం కలగకమానదు. మరీ ఆమె హెల్త్, బ్యూటీ సీక్రెట్లేంటో చూద్దామా.. నటి శ్రియ శరణ్ ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ రహస్యాన్ని షేర్ చేసుకుంది. అదే తన తన బ్యూటీ సీక్రెట అని నవ్వుతూ చెబుతోంది. ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నట్లేనని అంటోంది శ్రియ. మన ఆరోగ్యంతో మన సౌందర్యం ముడిపడి ఉంటుందంట. అందుకే తినే భోజనం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటానంటోంది. వర్కౌట్ల కంటే కూడా తీసుకునే భోజనం పోషకవంతమైనదైతే ఆటోమేటిగ్గా స్లిమ్‌గా, అందంగా ఉంటామని నమ్మకంగా చెబుతోంది శ్రియ. ఇదేంటి ఆమె చాలా వెరైటీగా మాట్లాడుతుందనుకుంటే.. పొరబడ్డట్టే. ఎందుకంటే చాలామంది నిపుణులు కూడా చాలాసార్లు ఈ విషయాన్నే బలంగా నొక్కి చెప్పారు. డైట్ ఎలా ఉండాలంటే..సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చే మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటుందట. నిర్ణిత సమయానికే బోజనం తీసుకునేలా చూసుకుంటుందట. కడుపు నిండిన అనుభూతి కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని తెలిపింది. తన రోజుని నిమ్మకాయ తేనెలతో కూడిన వాటర్ తీసుకుంటుందట. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,బాడీలో ఉండే టాక్సిన్లను బయటకు పంపేస్తుందట. హైడ్రేషన్ తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తానంటోంది. బ్రేక్‌ఫాస్ట్ కోసం బాదంగింజలు, ఓట్మీల్, గుడ్లులో తెల్లసొనతే వేసిన ఆమ్లేట్ లేదా బెర్రీలు, అరటి పండ్లు తింటుందట. పొద్దపొద్దునే డీప్ ఫైడ్ పదార్థాల జోలికిపోదట. ఇవి జీర్ణక్రియను నెమ్మదించి చురుకుదనం లేకుండా చేస్తాయట. ఇక భోజనంలో పప్పు, రోటీ , సబజీ, కవినోవా, ఉడికించిన కూరగాయలు, కాల్చిన చేప లేదా చికెన్ ఉంటాయట. ఇంట్లో తయారు చేసిన పెరుగుని తీసుకుంటుందట. పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక జీర్ణక్రియ సమస్యలను అదుపులో ఉంచుతుందట. ఇక స్నాక్స్‌గా బిస్కెట్లు లేదా చిప్స్ వంటి జోలికి అస్సలు పోనంటోంది. అందుకోసం దోసకాయ, క్యారెట్ వంటివి ఆస్వాదిస్తా, ఒకవేళ కుదరకపోతే కొంచెం డార్క్ చాక్లెట్ ముక్కతో గ్రీన్ టీ తీసుకుంటానంటోంది. జీవక్రియను చురుగ్గా ఉంచే స్నాకస్ తీసుకుంటే అతిగా తినాలనే కోరిక అదుపులో ఉంటుందటోంది శ్రియ. రాత్రి భోజనం తేలికగా జీర్ణంమయ్యే వాటిని ఎంచుకుంటానంటోంది. కూరగాయలతో తయారు చేసిన సూప్, కిచ్డీ లేదా సలాడ్ తీసుకుంటానంటోంది. అయితే రాత్రి భోజనం సాధ్యమైనంతవరకు సాయంత్రం ఏడున్నరలోపే ఫినిష్ చేస్తుందట. అంతేగాదు రాత్రి సమయాల్లో ఎక్కువ ఆయిల్‌తో కూడిన ఆహారాలను తీసుకోకపోవడమే మేలంటోంది. ఎందుకంటే ఇది జీరణక్రియను మందగింపచేసి, మరసటి రోజు బాడీలోని శక్తిస్థాయిలను ప్రభావితం చేస్తుందట. ఎలాంటి వర్కౌట్లంటే.. చర్మం ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఉపకరించేలా నీళ్లను ఎక్కువగా తీసుకుంటుందట. అలాగే యోగా, పైలేట్స్, డ్యాన్స్ వంటివి తన దినచర్యలో భాగమని అంటోంది. హెల్తీగా ఉండటం అంటే..ఫిట్‌గా ఉండటం అంటే ఆహారాలను దూరం చేసుకోవడం అని కాదు. ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవడం అని భావిస్తే..బరువు నిర్వహించడం తేలిక అవుతుంది. అలాగే కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటే నోరు కట్టేసుకున్నామనే ఫీల్ కలగదు. పైగా శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. శ్రమ లేకుండానే మంచి పోషకాహారాలతో హెల్తీగా, నాజుగ్గా ఉండొచ్చని చెబుతోంది అందాల శ్రియ. (చదవండి: మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!) -
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అచ్చం తల్లిలానే తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అలనాటి అందాల తార శ్రీదేవిని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. దేవర మూవీలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ సరసన నటించి నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ ఏడాది మార్చి 06తో 28 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె గ్లామర్ పరంగా తన తల్లికి ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. మరో అతిలోక సందరిలా కళ్లు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. అంతలా ఫిజిక్ మెయింటైన్ చేయడం వెనుకున్న రహస్యం ఏంటో చూద్దామా..!.జాన్వీ తరుచుగా తన ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో బ్యూటీ సీక్రెటని బయటపెట్టింది. తన ఆహారపు అలవాట్లు, ఫిటెనెస్ సీక్రెట్ తదితరాల గురించి షేర్ చేసుకుంది. తాను ఎక్కువుగా ఇంట్లో వండిన ఆహారాలనే ఇష్టంగా తింటానని అంటోంది. కఠినమైన డైట్‌ని ఫాలోఅవుతానని అంటోంది. అల్పాహారం అవకాడో, రెండు గుడ్ల మాత్రమేనని, భోజనంలో గ్రిల్డ్ చికెన్, పాలకూర, సూప్ తీసుకుంటానని చెబుతోంది. ఎక్కువగా జపనీస్, ఇటాలియన, ఆంధ్ర, మొఘలాయ్ వంటకాలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే తాను గ్లూటైన్ రహిత ఫుడ్‌నే తీసుకుంటానంటోంది. ఎందుకంటే గ్లూటైన్ తనకు పడదని, అలెర్జీ వస్తుందని తెలిపింది. తనకు బాగా నచ్చిన ఆరోగ్యకరమైన మంచీలను లేదా పండ్లు ఎక్కువగా ఇష్టంగా తింటానని చెప్పింది. వాటిలో చక్కెర ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్స్ జోలికి వెళ్లనంటోంది. బాగా, పానీపూరీ, ఐస్‌క్రీం, స్ట్రాబెర్రీలు అంటే మహా ఇష్టమని చెబుతోంది. చాలామటుకు అన్ని కూరగాయలు, పళ్లు తింటానని, కాకపోతే బరువు పెరగకుండా చూసుకునేందుకు ఎక్కువగా వ్యాయామాలు చేస్తానని చెప్పింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తుందట. అందుకే ఎక్కువగా రెడ్‌రైస్ బిర్యానీనే తింటుదట. తన చివరి భోజనం తొందరగానే పూర్తి చేశానని ఒకవేళ షూటింగ ఉంటే 10 గంటల కల్లా పూర్తి చేస్తానని చెబుతోంది. ఇంతకుమునుపు చిలగడదుంప, పరాఠా వద్దకు వెళ్లేదాన్నికాదని, నో కార్బ్సో డైట్‌ను పాటించేదాన్ని అని తెలిపింది. అయితే ఇప్పుడు కార్బోహైడ్రేట్లు పెంచడం ప్రారంభించినట్లు వెల్లడించింది జాన్వీ కపూర్. గ్లామర్ పీల్డ్‌లో రాణించాలంటే ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే కష్టమే కదూ..!.(చదవండి: కోచింగ్ లేకుండానే నీట్లో 720కి 720 మార్కులు..!) -
మహిళలు అలాంటి డైట్‌ని పాటించకండి! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల యువత స్మార్ట్‌గా, నాజుగ్గా ఉండటానికి ఇష్టపడుతోంది. అలా ఉండేందు కోసం వ్యాయామాల, కసరత్తులంటూ తెగ కష్టపడుతున్నారు. మరికొందరూ కఠినమైన డైట్ల పేరుతో నోరు కట్టేస్తుకుంటున్నారు. ఎలాగైన హీరోయిన్ మాదిరిగా స్లిమ్‌గా ఉండాలన్నదే అందరి ఆరాటం. ఏ మాత్రం కొద్దిగా బరువు పెరిగినా..ఏదో జరగకూడనిది జరిగినట్లుగా ఫీలవ్వుతున్నారు. అంతలా చిన్నా, పెద్దా..తమ బాడీపై శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఆ క్రమంలో ఫాలో అయ్యే డైట్లు ఒక్కోసారి బరువు తగ్గడం ఎలా ఉన్నా..పలు ఆరోగ్య సమస్యలు తెచ్చు పెడుతున్నాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక్కడ అలానే ఒక మహిళ స్లిమ్‌గా ఉండాలని అనుసరించిన డైట్ ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టిందో చూస్తే షాకవ్వుతారు. అంతేకాదండోయ్ వైద్యులు మహిళలందర్నీ అలాంటి డైట్ ఫాలో కావద్దని హెచ్చరిస్తున్నారు కూడా. అదెంటో చూద్దామా..శరీరంలో కొవ్వుని తగ్గించి శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచేందుకు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడంపై ఆధారపడతారు. ఆ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. అంటే ఇక్కడ మాంసాహారంతో కూడిన డైట్‌కి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఈ డైట్లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, చిక్కుళ్లు, నెట్స్ మినహాయించి మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, సముద్ర ఆహారం, చేపలు, పాల ఉత్పత్తులు, నీటిని మాత్రమే తీసుకుంటారు. నిజానికి దీన్ని"జీరో కార్బ్" అని పిలుస్తారు. ఈ డైట్లో కార్బోహైడేట్స్ అనేవి ఉండవు. అయితే ఇది మహిళ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ కరణ్ రాజన్ అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేసి మరీ వివరించారు. ఇలా మాంసాహారంతో కూడిన డైట్ మహిళలకు పనికిరాదని చెప్పారుమహిళలు మాంసాహారం ఎందుకు తీసుకోకూడదంటే..డాక్టర్ కరణ్ షేర్చేసిన వీడియోలో ఒక మహిళ ఎనిమిది వారాలపాటు మాంసాహారమే తీసుకునే డైట్‌ని పాటించినట్లు వెల్లడించి. ఆమె ఆ వీడియోలో తాను ఎమనిది వారాల పాటు మాంసాహారమే తీసుకున్నట్లు చెబుతుంది. దీంతో ఆమె కొవ్వుని కోల్పోయి కొన్ని రకాల ఆరోగ్య సమస్యల బారినపడినట్లు చెబుతోంది. ముఖ్యంగా ఆమెకు పీరియడ్స్ ఆగిపోవడం జరిగిపోతుంది. అంటే పీసీఓఎస్ సమస్యలు వచ్చాయి. మొటిమలు తీవ్రమయ్యాయి. మాంసాహారం అధికంగా తీసుకుంటే మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఉండదు అది మొత్తం ప్రత్యుత్పత్తి వ్యవస్థనే తీవ్రంగా ప్రభావితం చేస్తుందట. అదెలాగంటే..మొక్కల ఆధారిత ఆహారం జీవక్రియను ప్రభావితం చేసి శరీరంలోని వేస్ట్‌ని బయటకు పంపేస్తుంది.చెప్పాంటే డంపింగ్ పనిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ కాలేయం ఈస్ట్రోజెన్‌ను గట్‌లోకి పంపిస్తుంది. అయితే ఆహారంలో ఫైబర్ లేని కారణంగా దాన్ని బంధించి బయటకు పంపిచే అవకాశం లేకపోతుంది. దీంతో ప్రేగులే ఈస్ట్రోజన్ని తిరిగి గ్రహిస్తాయి. దీంతో ఈ జీవక్రియ సమస్య కాస్త చర్మంపై దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అధిక ఈస్ట్రోజన్ చర్మ సమస్యలు, హర్మోన్ల అసమతుల్యతకు దారితీసి మొటిమలకు కారణమవుతుందని అన్నారు. అంతేగాదు దీనితోపాటు మూడ్ స్వింగ్స్, ఆందోళన, మెదడు పనిచేయకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు డాక్టర్ కరణ్. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి మాంసాహారం డైట్ సైడ్ఎఫెక్ట్స్ ఇవ్వకపోవచ్చు. కానీ చాలామటుకు ఇది సరిపడదని తేల్చి చెప్పారు. హర్మోన్ల అసమతుల్యతకు, గట్ ఆరోగ్యానికి ప్రతిబంధకాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ డైట్ మానవ శరీరాన్ని జడత్వంగా మార్చేస్తుందని, చురుకుదనం ఉండదని పలువురు వైద్యులు చెబుతున్నారు. (చదవండి: పప్పు ధాన్యాలు తీసుకోకపోతే శరీరంలో సంభవించే మార్పులు ఇవే..!) -
Sundeep Kishan: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..
స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్.బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉంటే సందీప్ చాలా స్మార్ట్‌గా మంచి బాడీని మెయింటైన్ చేస్తాడు. అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా తన రూపురేఖలను కూడా మార్చుంటాడు చాలా సులభంగా. మరీ అతడి ఫిటనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.అందరి హీరోల మాదిరిగా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడట. తనకస్సలు స్ట్రిక్ట్ డైట్'పై నమ్మకం లేదని తేల్చి చెప్పాడు. దానికంటే ఏడాది పొడవునా మంచిగా తినడమే మంచిదని చెబుతున్నాడు. చాలామంది కఠినమైన డైట్లు ఎంచుకోమని చెబుతారు గానీ, దానిపై తకెందుకనో నమ్మకం రాదని, హయిగా నచ్చిన ఫుడ్ తింటూ వ్యాయామాలు చేసుకోవడమే మేలు. అలాగే అందరీ బాడీకి ఒకేవిధమైన డైట్ సెట్ అవ్వదు. ప్రతి శరీరానికి వివిధ రకాలు ఆహార నియమాలు అవసరమవుతాయిని అన్నాడు సందీప్. కాబట్టి ఎవరికి వారు తమ బాడీకి ఏది సూటవ్వుతుందో పరీక్షించుకుని ఎంచుకోవడమే ఉత్తమం అని సూచిస్తున్నాడు. తీవ్రమైన కఠిన ఆహార నియంత్రణ కంటే ఒత్తిడిని దూరం చేసే మంచి ఉత్తేజకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నొక్కి చెబుతున్నాడు. ఏదైతే ఇష్టంగా తింటారో దాన్నే తీసుకోండి, అయితే అది ఆరోగ్యకరమైనదే అయ్యి ఉండాలన్నది గుర్తించుకోండి అని అంటున్నాడు. తాను మాత్రం వివిధ రకాల ఆహారాలను ఆస్వాదించడం తోపాటు, రోజంతా యాక్టివ్‌గా ఉంచే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తన బాడీకి సరిపోయే వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేస్తానని అన్నాడు సందీప్. కాగా, సందీప్ నటించిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 3' షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన 'మజాకా' మూవీ విడుదలైంది. (చదవండి: పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!) -
మఖానా... మా ఖానా!
పేరేమో బ్లాక్ డైమండ్స్.. లోపలున్నది వైట్ గోల్డ్! అవునండీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న సూపర్ ఫుడ్ ‘మఖానా’సంగతే ఇది. పుష్కలమైన పోషకాలతో ఆరోగ్య వరప్రదాయినిగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఫూల్ మఖానా క్రేజ్ కేక పుట్టిస్తోంది. బిహారీ రైతులకు కాసుల పంటగా మారింది. మఖానాకు తాజా కేంద్ర బడ్జెట్లో కూడా పెద్దపీట వేయడంతో దీని పేరు మరింత మార్మోగుతోంది. మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించింది. దీనివల్ల మార్కెటింగ్ సదుపాయాలు పెరగడంతో పాటు రైతులకు కూడా మరింత చేయూత లభించనుంది. సాక్షి, బిజినెస్ డెస్క్: రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ రారాజుగా నిలుస్తున్న మఖానా.. ప్రపంచ సూపర్ ఫుడ్స్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఫూల్ మఖానా, లోటస్ సీడ్స్, పఫ్డ్ వాటర్ లిల్లీ సీడ్స్, ఫాక్స్ నట్స్ వంటి పేర్లతో ప్రాచుర్యం పొందిన వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే తామర గింజలు. సహజమైన, సమతుల్య ఆహారంతో శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఈ బ్లాక్ డైమండ్స్ వరంలా మారుతున్నాయి. ఇతర చిరుతిళ్లకు బదులు పోషకాల ఖజానా.. మఖానాను డైట్లో చేర్చుకుంటున్నారు. మిలీనియల్స్‌తో పాటు జెన్ జీ యువతరం కూడా ఇప్పుడు దీని వెంట పడుతున్నారు. విదేశాలకు ఎగుమతులు జోరందుకోవడంతో ‘వైట్ గోల్డ్’రేటు కూడా బంగారంలా దూసుకెళ్తోంది. మార్కెట్లో కేజీ ధర రూ.2,000 పైనే పలుకుతోంది. పెళ్లిళ్లతో పాటు ఏ పంక్షన్లో చూసినా మఖానా వంటకం ట్రెండింగ్ ఫుడ్‌గా నిలుస్తోంది! ఇక హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఈ హెల్తీ స్నాక్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ చానెల్స్ కూడా వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తుండటంతో మఖానాకు మాంచి డిమాండ్ నెలకొంది. బిహార్ హబ్..ప్రపంచవ్యాప్తంగా మఖానా ఉత్పత్తిలో 90 శాతం వాటా భారత్‌దే. అందులో 85 శాతం ఒక్క బిహార్ నుంచే వస్తుండటం విశేషం! అంతర్జాతీయంగా ఈ సూపర్ ఫుడ్‌కు ఫుల్ డిమాండ్‌తో బిహార్ రైతులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మిథిలాంచల్ ప్రాంతం ఈ పంటకు ప్రధాన కేంద్రం. ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో పాటు పుష్కలంగా చిత్తడి నేలలు (వెట్ ల్యాండ్స్) ఉండటం తామర పంట సాగుకు సానుకూలంగా నిలుస్తోంది. 200 ఏళ్లుగా ఇక్కడ మఖానా సాగు కొనసాగుతూనే ఉంది. మధుబనీ దీనికి పుట్టినిల్లుగా చెబుతారు. 2020లో బిహార్ మఖానాకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కూడా లభించడంతో ప్రపంచవ్యాప్తంగా మరింత ఖ్యాతి పొందింది. ఎందుకింత రేటు? ఫూల్ మఖానా ఒక ప్రత్యేకమైన తామర పూల రకానికి చెందినది. సాధారణంగా ప్రిక్లీ వాటర్ లిల్లీగా పిలిచే దీని శాస్త్రీయ నామం యూరేల్ ఫెరాక్స్. ఇవి ఎక్కువగా ఆసియా ప్రాంతంలో చెరువుల్లో, చిత్తడి నేలల్లో పెరుగుతాయి. తామర పూల రెక్కలన్నీ రాలిపోయాక.. నల్లటి విత్తనాలు నీటి అడుగుకు (4–12 అడుగుల లోతు) చేరుకుంటాయి. రైతులు వీటిని వలలు, బుట్టలతో సేకరించాక, ఎండలో బాగా ఆరబెడతారు. తర్వాత ప్రత్యేకంగా వేయించి, జాగ్రత్తగా గింజల్ని పగలగొడితే తెల్లగా.. పఫీగా ఉండే ఫాక్స్ నట్స్ విక్రయానికి సిద్ధమవుతాయి. ఇదంతా ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ. ఇది కొన్ని ప్రాంతాల్లోనే, అది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఈ పంట సాగవుతోంది. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతోంది. సరఫరా పరిమితంగా ఉండటం.. దేశ, విదేశాల్లో గిరాకీ భారీగా పెరిగిపోవడంతో రేటు అ‘ధర’హో అనిపిస్తోంది! మార్కెట్ రయ్... 2023లో భారత్ మఖానా మార్కెట్ పరిమాణం రూ.780 కోట్లుగా నమోదైంది. 2032 నాటికి ఇది రూ.1,890 కోట్లకు వృద్ధి చెందుతుందని ఐమార్క్ గ్రూప్ అంచనా వేసింది. ఏటా ఈ మార్కెట్ 9.7 శాతం వృద్ధి చెందనుందని లెక్కగట్టింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 25,130 టన్నుల మఖానా ఎగుమతులు జరిగాయి. భారత్ నుంచి ఫూల్ మఖానా ఎగుమతికి అతిపెద్ద మార్కెట్‌గా అమెరికా ఉంది. కెనడా, ఆ్రస్టేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాల ప్రజలు కూడా మన మఖానాను లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే, 2024లో 15 కోట్ల డాలర్లుగా ఉన్న ఫూల్ మఖానా మార్కెట్.. 2031 నాటికి 8.5 శాతం వార్షిక వృద్ధితో 26.6 కోట్ల డాలర్లకు చేరవచ్చని కాగి్నటివ్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఆరోగ్యమే ’మఖానా’భాగ్యం.. » మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కీలకమైన ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్లే ఇది గ్లోబల్ సూపర్ ఫుడ్‌గా పేరుగాంచింది. » ప్రతి 100 గ్రాముల గింజల్లో 9.7 గ్రాముల ప్రొటీన్, 14 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది శాఖాహారులకు అద్భుతమైన ప్రొటీన్ సోర్స్‌గా మారింది. » 25 గ్రాముల మఖానాలో 89 క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు మఖానా మంత్రం జపిస్తున్నారు. » గ్లూటెన్ అస్సలు లేకపోవడం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక పీచు పదార్థం (ఫైబర్) ఉండటం వల్ల మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. » ఇక అధిక మెగ్నీషియం, తక్కువ సోడియం కారణంగా రక్తపోటును నియంత్రించి, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. -
జనరల్ మోటార్స్ డైట్..! దెబ్బకు బరువు మాయం..
ఎన్నో రకాల డైట్లు గురించి విని ఉంటారు. కానీ ఇదేంటీ జనరల్ మోటార్స్ డైట్..?.పేరే ఇలా ఉంది. ఆహార నియమాలు ఎలా ఉంటాయిరా బాబు అనిపిస్తోంది కదూ. కంగారు పడకండి మనం చూసే డైట్ మాదిరిగానే ఉంటుంది కానీ దీని వల్ల త్వరితగతిన బరువు తగ్గిపోతారట. అయితే ఇది ఆరోగ్యకరమైన రీతీలోనే ఉంటుంది. కానీ ఈ డైట్ ప్లాన్ నియమాలను తుచా తప్పకుండా సరిగా అనుసరిస్తే వారంలోనే బరువు తగ్గడంలో మంచి మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇది మంచేదేనా అంటే..?..బాలీవుడ్ నటి సురభి చంద్నా తాను జనరల్ మోటార్స్ డైట్‌గా పిలిచే జీఎం డైట్‌ని ఫాలో అయ్యేదానిని అని చెబుతోంది. దీని వల్ల ఫిట్‌గా బాడీ ఉంచుకోగలిగానని అంటోంది. ఆమె బాలీవుడ్ బుల్లి తెర షో ఖుబూల్ హైలో విలక్షణమైన నటనతో మెప్పించిన నటి. నటి సురభి తనకు ఈ డైట్ అంటే మహా ఇష్టమని, ఇట్టే బరువు తగ్గిపోతామని చెబుతోంది.ఈ డైట్లో కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే ఉంటాయి. అందువల్ల మనకిష్టమైన వాటిని తింటూ హ్యాపీగా బరువు తగ్గించే బెస్ట్ డైట్ అని ధీమాగా చెబుతోంది. ఇంతకీ ఈ డైట్ నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిదా..?. నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రముఖ డైటీషియన్ అండ్ డయాబెటిస్ నిపుణురాలు కనిక మల్హోత్రా ఇది బరువు తగ్గేందుకు ఉపకరించే ఏడు రోజుల జీఎం డైట్ అని చెప్పారు. దీన్ని ఎఫ్‌డీఏ, యూఎస్డీఏ సహాకారంతో రూపొందించిన డైట్‌ని అని వాదనలు ఉన్నాయి.అందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. ఈ డైట్ ప్రకారం నిర్థిష్ట ఆహార పదార్థాలనే తీసుకోవడం జరుగుతుంది. దానిలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లపై దృష్టి పెట్టి.. కొవ్వులు, కార్బోహైడ్రేట్లను తగ్గించడంపై దృష్టి పెడుతుంది అని మల్హోత్రా వివరించారు.ఎలా పనిచేస్తుందంటే..ఆహారంలో పరిమిత కేలరీలు తీసుకోవడం అనే సూత్రంపై ఆధారంగా ఉంటుంది ఈ డైట్ ప్లాన్. ప్రతి రోజు పరిమిత పరిధిలో ఒకరకమైన ఆహారమే తీసుకోవాల్సి ఉంటుంది.అదెలా అంటే..మొదటి రోజు: పండ్లు మాత్రమే (అరటిపండ్లు తప్ప)రెండో రోజు: కూరగాయలు మాత్రమే (పచ్చి లేదా వండినవి)మూడవ రోజు: పండ్లు, కూరగాయల మిశ్రమంనాల్గవ రోజు: అరటిపండ్లు, పాలుఐదో రోజు: టమోటాలు, లీన్ ప్రోటీన్లు ఉండే మాంసం (లేదా ప్రత్యామ్నాయాలు)ఆరో రోజు: మరిన్ని కూరగాయలు, మాంసంఏడవ రోజు: బ్రౌన్ రైస్, పండ్ల రసాలు, కూరగాయలుఅలాగే ఈ డైట్‌ని అనుసరించేవారు ప్రతిరోజూ ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసులు నీరు తాగాల్సి ఉంటుంది. ఈ డైట్‌ని ప్రయత్నించిన వారందరూ గణనీయమైన బరువు తగ్గుతారనేది నిజమేనని అన్నారు. ఎందువల్ల అంటే ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలే ఉండటంతో శరీరానికి కావల్సిన ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి, కేలరీలు మాత్రం తక్కువగానే ఉంటాయి.దీంతో సులభంగా బరువు కోల్పోతున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ డైట్లో ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరలు లేకపోవడం వల్ల ఆరోగ్యకరంగానే సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. అలాగే ఈ డైట్ వల్ల చక్కెరను తీసుకోవడం చాలామటుకు తగ్గిపోతుందని కూడా చెప్పారు.ప్రతికూలతలు..ఇందులో మంచి కొవ్వులు, విటమిన్ బీ12, డీ, ఇనుము, కాల్షియం వంటి పోషకాల లోపిస్తాయిని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణరాలు మల్హోత్రా. కాలక్రమేణ ఈ డైట్‌ని ఫాలో అయితే విటమిన్ డెఫిషెన్సీకి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తీవ్రమైన కేలరీల పరిమితి వల్ల ఆకలి భావన ఎక్కువగా ఉంటే ప్రమాదం లేకపోలేదు.దీర్ఘకాలికంగా ఇది అంత ఆచరణీయమైనది కాదని చెబుతున్నారు. ఎందుకంటే కొవ్వుకు బదులుగా ఎక్కువగా కోల్పోయిన నీటి బరువే ఉంటుందని చెబుతున్నారు మల్హోత్రా. అయితే ఎప్పుడైన ఈ డైట్ స్కిప్ చేసి నార్మల్‌గా తినేస్తే మాత్రం ఎంత స్పీడ్‌గా అయితే బరువు తగ్గామో అంతే మాదిరి పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఆరగ్యో నిపుణురాలు మల్హోత్రా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: 'ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
Ram Kapoor: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా .!
వెయిట్‌లాస్ జర్నీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. కొందరు బరవు తగ్గినట్లు తగ్గి మళ్లీ యథావిధి బరువుకి వచ్చేస్తుంటారు. అందరి శరీరతత్వం ఒకలా ఉండదు. ఒకరికి సాధ్యమైనట్లు మరొకరి బాడీకి సాధ్యం కాకపోవచ్చు. అలానే ప్రయత్నం మానకుండా బరువు తగ్గాలని బలంగా అనుకున్నవారే విజయవంతమవుతారు. అలాంటి కోవకు చెందినవారే బాలీవుడ్ నటుడు రామ్ కపూర్. ఆయన 140 కిలోల బరువతో ఊబకాయంతో నానా ఇబ్బందులు పడ్డారు. తగ్గే ప్రయత్నం చేసిన ప్రతిసారి..తగ్గినట్లుగా అనిపించేలోపే మళ్లీ యథావిధిగా అదే బరువుకి వచ్చేసేవారు. అయినా విసుగు చెందకుండా విజయవంతంగా బరువు తగ్గి స్లమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మరీ ఆయన ఫిట్నెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా..!నటుడు రామ్ కపూర్(Ram Kapoor) తన అధిక బరువు గురించి తనభార్య గౌతమి(Gautami) ఎన్నడూ ఏమి అనలేదు గానీ తన ఆరోగ్యం గురించి కలత చెందేదని అన్నారు. ఎందుకంటే.. అధిక బరువు కారణంగా ఒబెసిటీ, టైప్2 డయాబెటిస్(type 2 diabetes) వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవాడినని చెప్పారు. వాటికి చెక్ పెట్టాలంటే బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చాలా ఆస్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. గత 15 ఏళ్లుగా అధిక బరువుతో నిరాటంకంగా పనిచేశాను. కానీ కనీసం ఇప్పుడైనా ఆరోగ్యం కోసం తన ఒంటిపై దృష్టి పెట్టాలని గట్టిగా అనుకున్నట్లు తెలిపారు. అందుకోసం తాను రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యానని అన్నారు. తాను రెండు సార్లు 30 కిలోలు వరకు తగ్గి మళ్లీ నార్మల్ బరువుకి తిరిగి వచ్చేసిట్లు చెప్పారు. అయితే ఎప్పుడు డైట్‌తో బరువు తగ్గుతారని అనుకోవడం సరైనది కాదని అంటున్నారు.ఇక్కడ కేవలం మన సంకల్ప శక్తి(willpower.), సానుకూల మనస్తత్వం వల్లే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. తాను రోజుకు రెండు పూటలా భోజనం చేసేవాడినని అన్నారు. ఒకటి ఉదయం 10.30 గంటలకు, మరొకటి సాయంత్రం 6.30 గంటలకని చెప్పారు. మధ్యలో నీళ్లు, కాఫీ లేదా టీ తాగేవాడినని అన్నారు. అయితే సాయంత్రం మాత్రం 6.30 గంటల కల్లా భోజనం చేసేస్తానని చెప్పారు. అస్సలు అల్పాహారం తినని అన్నారు. సూర్యాస్తమయం తర్వాత అస్సలు తినని చెప్పారు. దీన్ని కరెక్ట్‌గా చేసేలా మన మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండేలా చూడాలని చెప్పారు. డైట్లు, ఆహారపు అలవాట్ల కంటే..మనసుని నియంత్రించగలిగే శక్తే బరువు తగ్గడానికి అత్యంత కీలకమైనదని అన్నారు. వాటివల్ల తాను 55 కిలోల మేర బరువు తగ్గడమే కాకుండా ఆ బరువునే మెయింటైన్ చేయగలిగానని అన్నారు. నిపుణుల ఏమంటున్నారంటే..నిపుణులు సానుకూల మనస్తత్వంతోనే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపడుకోవడానికి అంకితభావంతో కూడిన మనస్తత్వం అవసరమని చెప్పారు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తగ్గించి ట్రాన్స్ఫ్యాట్లను నివారించాలన్నారు. ఇక్కడ వ్యాయామాన్ని శిక్షగా కాకుండా ఇష్టంతో చేయాలని చెప్పారు. ఒక్కోసారి చీట్ మీల్స్ ఉండొచ్చు. అయినా దాన్ని బర్న్ చేసేలా శారీరక శ్రమ చేయడం ముఖ్యం అని చెబుతున్నారు. మనసు మన మాట వినేలా ఎంత బలంగా చేసుకోగలిగితే అంతలా డైట్‌ని నియమబద్ధంగా ఫాలో అవ్వడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీంతోపాటు సరిగా నిద్రపోవడం, తగినంత నీరు తాగడం తదితర జీవనశైలి చర్యలు ఉంటే అనుకున్న రీతిలో బరువు తగ్గగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
61 ఏళ్ల వయసులో బరువు తగ్గిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. జస్ట్ ఐదు నెలల్లోనే..
భారత మాజీ క్రికెటర్(former cricketer), రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత(Television presenter) నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu) బరువు తగ్గినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. అలాగే అంతకుమునుపు, బరువు తగ్గాక తన ఫోటోలను కూడా షేర్ చేశారు. తానెలా తక్కువ సమయంలో బరువు తగ్గి స్మార్ట్‌గా మారారో, అందుకు ఉపకరించినవి ఏంటో సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.బరువు తగ్గడం అనేది సంకల్ప శక్తి, ధృఢసంకల్పం, క్రమశిక్షిణతో కూడిన ప్రక్రియ. ఆరోగ్యకరమైన జీవనశైలి మొత్తం బరువుని అదుపులో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తనకు ఈ ఫిట్నెస్ లక్ష్యాన్ని సాధించడంలో ఆహారం, ప్రాణాయామం, వాకింగ్ ఎలా ఉపయోగపడ్డాయో తెలిపారు.సిద్ధూ దినచర్యలో..ప్రాణాయామం(pranayam,)..ప్రాణాయామం అనేది శ్వాస నియంత్రణ సాధన. దీనిలో ఉద్దేశపూర్వకంగా గాలి పీల్చడం, వదలడం వల్ల శ్వాసను ఒక నిర్దిష్ట క్రమంలో పెట్టుకోగలుగుతాం. యోగా అభ్యాసకుల ప్రకారం.. ప్రాణాయామ అనేది శరీరం, మనస్సు రెండింటినీ అనుసంధానించే ప్రక్రియ. ఇది ఇతర శారీరక భంగిమలు, ధ్యానం వంటి ఇతర అభ్యాసాలతో చేస్తారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడే జీవక్రియను కూడా పెంచుతుందంటున్నారు నిపుణులు.వెయిట్ ట్రైనింగ్(Weight training)..ఇది బలమైన కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి, పగుళ్ల ప్రమాదాన్ని నివారిస్తుంది. చాలామంది పెద్దలు 35 ఏళ్ల తర్వాత నుంచి ప్రతి ఏడాది దాదాపు అర పౌండ్ల కండరాలను కోల్పోతారు. ఎందుకంటే చిన్నతనంలో ఉన్నంత చురుకుగా శరీరం ఉండదు. జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. పైగా కండరాలు కోల్పోవడం, బరువు పెగరడానికి దాంతోపాటు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే వయసు కూడా ఇదే. కాబట్టి ఇది ఈ వెయిట్ ట్రైనింగ్ కేలరీలను బర్న్ చేయడానికి, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమర్థవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.నడక(Walking)..క్రమం తప్పకుండా నడవడం వల్ల అదనపు కేలరీలు బర్న్ అవుతాయి, కండరాలు పెరుగుతాయి. పైగా బొడ్డు కొవ్వు గణనీయంగా తగ్గుతుంది. కొండలు లేదా స్వల్ప వంపులు ఉన్న మార్గాల్లో నడవడానికి ప్రయత్నిస్తే మరింత ఫలితం ఉంటుందన్నారు నిపుణులు.ఆరోగ్యకరమైన ఆహారం(Healthy Diet)ఇతర ఏ డైట్ల కంటే కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే మంచివి. ముఖ్యంగా బరువుని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్లో చేర్చుకోవడం మంచిది. జంతు ఆహారాల కంటే మొక్కల ఆధారిత ఆహారాలైన..పండ్లు, కూరగాయాలు తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు సిద్ధూ. అలాగే చక్కెర, ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు. నిపుణులు కూడా ఆలివ్ నూన్, ఇతర మొక్కల నుంచి తీసిన నూనెలకు ప్రాధాన్యత ఇవ్వాలని వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని నొక్కి చెబుతున్నారు. Before and after … have lost 33 kilograms in less than 5 months since August last year … it was all about willpower, discipline, process and a strict diet facilitated by pranayama ( breath control ) weight training and walking ….. impossible is nothing people … ‘ pehla sukh… pic.twitter.com/nCNYN57kLW— Navjot Singh Sidhu (@sherryontopp) January 29, 2025(చదవండి: మహా కుంభమేళాలో పాల్గొన్న ఇండిగో సీఈవో..మాటల్లో చెప్పలేని శాంతి..!) -
హీరోయిన్ రమ్యకృష్ణ ఫిట్నెస్ రహస్యం.. ఇప్పటికీ అదే ఫాలో అవుతూ!
టాలీవుడ్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథనాయికిగానూ, విలన్‌గానూ మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న గొప్ప నటి. ఒక హీరోయిన్ విలన్ పాత్రలో నటిస్తే తన విలువ పడిపోతుందేమోనని చేసేందుకు ముందుకు రాని ఆ కాలంలో అలవోకగా చేసి ఆ అపోహను పారద్రోలింది. ఇలా రెండు పాత్రల ద్వారా ఎక్కువ ఆఫర్లు అందుకుని విలక్షణమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హీరో తల్లిపాత్రల్లోనూ కూడా అంతే గ్లామర్‌గా అదే ఫిట్నెస్తో అలరిస్తోంది. కుర్ర హీరోయిన్లకు తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఈ అందాల భామ వన్నెతరగని అందం వెనుకున్న రహస్యాన్ని ఆమె కుటుంబ సభ్యుడు, డాక్టర్ గుగనాథ్ శివకదక్షమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అదెంటో తెలుసుకుందామా..!.ఐదు పదుల వయసు దాటిన తర్వాత లీన్ కండరం అనేది బంగారం కంటే విలువైనదని చెబుతున్నారు కార్డియాలజిస్ట్ వైద్యుడు శివకదక్షమ్(Guganath Sivakadaksham). మెడిటేరియన్ డైట్(అడపాదడపా ఉపవాసం)తో బాడీని ఫిట్‌గా ఉంచుతుందని చెప్పారు. అందాల బామ రమ్యకృష్ణ(Ramya Krishnan) కూడా ఈ డైట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. అలాగే నటి రమ్య యోగా, తేలికపాటి కార్డియో వెయిట్ ట్రైనింగ్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటుందట. అలాగే వర్కౌట్లలో తప్పనిసరిగా బరువులు ఎత్తే వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తుందని అన్నారు. ఇవి ఆమె కండరాలను బలోపేతం చేసి మజిల్స్(muscle) స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తాయట. అందువల్ల ఆమె బాడీ షేప్అవుట్ అవ్వకుండా ఉందని చెప్పారు. అలాగే యాభై ఏళ్లు దాటక బాడీలో లీన్ కండర ద్రవ్యరాశి తగ్గి ఎముకలు పటుత్వం కోల్పోయి శరీరం ఆకృతి మారిపోతుందట. అందువల్ల ఇలాంటి శక్తిమంతమైన వ్యాయమాలతో కండరాలను బలోపేతం చేసుకుంటే ఎముకలకు సంబంధించిన గాయాలను నివారించగలుగుతామని అన్నారు. ముఖ్యంగా మహిళలకు మెనోపాజ్ దశ(menopause)లో ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. అందువల్ల ఇవి తప్పనరిగా చేయాల్సిన పవర్ఫుల్ వ్యాయామాలు. అంతేగాదు ప్రతి సెషన్లో ఈవ్యాయామాలు కనీసం 6-12 సార్లు రిపీట్ చేయాలన్నారు. తద్వారా కండరాల క్షీణతను నివారించగలమని తెలిపారు. దీంతోపాటు అందుకు తగ్గా డైట్ కూడా ఉండాలన్నారుడైట్(diet)..పోషకాహారం పరంగా కండరాల మరమత్తు, పెరుగుదలకు తోడ్పడేలా అధిక ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. కోళ్లు, చేపలు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను తప్పనిసరిగా డైట్లో భాగమయ్యేలా చూడాలి. ఈ వ్యాయామాలను శిక్షగా కాకుండా శరీరాన్ని పిట్‌గా ఉంచేలా ఎంజాయ్ చేస్తూ చేయాలని చెబుతున్నారు. ఎక్కువ కండరాల ద్రవ్యరాశి అనేది కీళ్ల పనితీరు, కదలిక సామర్థ్యాలను పెంచుతుంది. అలాగే ఇది బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుందట. అంతేగాదు ఇది మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను దూరం చేస్తుందని చెబుతున్నారు వైద్యుడు శివకదక్షమ్ . కాబట్టి యాభైలలో కూడా ఫిట్‌గా, గ్లామర్‌గా ఉండేలా అందాల భామ రమ్య కృష్ణలా వర్కౌట్లే చేసేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. View this post on Instagram A post shared by Guganath Sivakadaksham (@idoctorg)s (చదవండి: మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!) -
ఈజీగా బరువు తగ్గించే యోగా డైట్ ఇదే..!
ఆధునిక కాలంలో న్యూట్రిషన్లు బరువు తగ్గడానికి వివిధ రకాల డైట్లను పరిచయం చేశారు. వాటిలో ప్రతి డైట్ ప్రత్యేకమైనది, ఆరోగ్యకరమేనదే. అయితే ఆయా వ్యక్తులు ఆరోగ్య రీత్యా తమకు సరిపడేది ఎంపిక చేసుకుని మరీ పాటించి విజయవంతం అవుతున్నారు. అయితే ఎన్నో ఏళ్ల క్రితం మన ఆయుర్వే గ్రంథాల్లో బరువుని అదుపులో ఉంచుకోవడం ఎలాగో వివరించారు. అందుకోసం ఆహారం ఎలా తీసుకుంటే మంచిదో సవివరంగా చెప్పారు. ఆ ఆహారాలు మనకు అందుబాటులో ఉండేవే, సులభంగా ఆచరించగలిగేవే. అయితే కాస్త ఓపికతో కూడిన నిబద్ధతతో క్రమం తప్పకుండా ఈ యోగా డైట్(Yogic diet) అనుసరిస్తే బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు యోగా నిపుణులు. అదెలాగో చూద్దామా..!.ది యోగా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ హన్సాజీ యోగేంద్ర(Dr Hansaji Yogendra)ఒక ఇంటర్వ్యూలో బరువుని తగ్గించే(weight loss) ఆహారం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బుద్ధి పూర్వకమైన ఆహారపు(మైండ్‌ఫుల్‌నెస్) అలవాట్లతోనే బరువుని అదుపులో ఉంచుకోగలమని చెబుతున్నారు. ఇప్పుడు న్యూట్రీషన్లు చెబుతున్నారే ప్రోటీన్ల(Protein)ని వాటి గురించి అనాడే యోగా గురువులు చెప్పారని అన్నారు. కాకపోతే ఇలా ప్రోటీన్లని చెప్పకపోయినా..శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెప్పారు. గుమ్మడి విత్తనాలు, నట్స్, పల్లీలు, శెనగలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని అన్నారు. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోమని సూచించేరు. ముఖ్యంగా అధికంగా నీళ్లు తీసుకోవాలని అన్నారు. ఒక కోడిగుడ్డు కంటే చియా గింజలు, అవిసె గింజలు మంచివని చెప్పారు. భోజనం తినడానికి ఒక గంట ముందు ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఎక్కువ తినకుండా ఉంటామని చెబుతున్నారు. ఇక అన్నంలో పప్పు, రోటీ, సబ్జీ తినవ్చ్చు అన్నారు. కొద్దిగా సలాడ్లు కూడా జోడించొచ్చు. స్నాక్స్ కోసం పల్లీలు, మఖానా, శెనగలు వంటివి తీసుకోండి. ఇక రాత్రి భోజనంలో ఒక పెద్ద గిన్నె సూప్ తాగడం, ఆకలిగా అనిపిస్తే ఆ సూప్‌లో కొద్దిగా బియ్యం, రోటీల ముక్కలు జోడిస్తే సరి అని చెబుతున్నారు. ఇలా తీసుకుంటే నెల రోజుల్లోనే స్లిమ్‌గా మారడమే గాక బరువు కూడా అదుపులో ఉంటుందట.(చదవండి: స్కిన్ టోన్‌కి సరితూగే స్టన్నింగ్ మేకప్! ఏ వధువైనా అదిరిపోవాల్సిందే..) -
బరువు నిర్వహణకు ది బెస్ట్ 30-30-30 రూల్ డైట్..!
ఎన్నో రకాల డైట్ల గురించి విన్నాం. కానీ ఏంటిది 30-30-30 డైట్..?. కీటోజెనిక్ డైట్ నుంచి వీగన్ ప్లాన్స్, అడపాదడపా ఉపవాసం, అధిక-ప్రోటీన్ నియమాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ భోజనం ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా నెంబర్ల రూల్‌తో కూడిన డైట్ ఏంటి..? మంచిదేనా అని సందేహించకండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు ఈ డైట్ నూటికి నూరు శాతం మంచిదని కితాబిస్తున్నారు. మరీ ఆ డైట్ ఏంటి..? అందులో ఎలాంటి ఆహారం తీసుకుంటారో చూద్దామా...ప్రస్తుతం తీసుకునే డైట్లలో ఎక్కువగా అధిక బరువు సమస్యను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండటం కోసం అనుసరించేవి. అయితే కొన్ని డైట్లతో తొందరగా ఫలితాలను అందుకోగలం. అదేవిధంగా అందరికీ అన్ని డైట్లు సరిపడవు కూడా. అయితే పోషకాహార నిపుణురాలు లోవ్నీత్ బాత్రా చెప్పే 30-30-30 డైట్ మాత్రం సత్వర ఫలితాలను ఇవ్వడమే గాక తొందరగా వెయిట్ లాస్ అవ్వుతారట. నిపుణుల సైతం నూటికి నూరు మార్కుల ఇస్తున్నారు ఈ డైట్‌కి. పైగా ఇది సమర్థవంతమైనది, ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ డైట్ అని చెబుతున్నారు. ఈ డైట్ ఎలా ఉంటుందంటే..ఉదయం మేల్కోగానే 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్ తీసకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయాలి. మనం ఎప్పుడైతే కేలరీలను తగ్గిస్తామో.. అప్పుడు శరీరంలో ఉన్న వేస్ట్ కొవ్వు అదనపు శక్తి కోసం ఖర్చువుతుంది. దీనివల్ల చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. అలాగే ఈ డైట్ పరంగా చేసే శక్తిమంతమైన వ్యాయామాలు కండరాలను బలోపేతం చేస్తాయి. ఇది ఒకరకంగా తినాలనే కోరికను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అదీగాక ప్రతి ఉదయాన్ని 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్‌తో ప్రారంభిస్తారు కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలనే ధ్యాస తెలియకుండానే తగ్గుతుందట. ఆటోమేటిగ్గా ఈ రూల్ గుర్తొచ్చి చకచక మన పనులు పూర్తిచేసుకునేలా మన మైండ్ సెట్ అయిపోవడంతో త్వరితగతిన ఫలితాలు అందుకుంటామని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. View this post on Instagram A post shared by Lovneet Batra (@lovneetb) (చదవండి: దీర్ఘాయువు మందులతో దుష్ప్రభావాలే ఎక్కువ..!: టెక్ మిలియనీర్) -
సొట్ట బుగ్గల సుందరి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలిన అందాల తార ప్రీతి జింటా(Preity Zinta). యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా పాపులర్ అయిన నటి. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. అంతేగాదు బాలీవుడ్లో మంచి సినిమాలతో సక్సెస్‌ని అందుకున్న అగ్రనటి. ఆమె టాలీవుడ్లో కూడా ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంటేష్ల సరసన నటించి బ్యూటీఫుల్ హిరోయిన్‌గా మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పంజాబ్‌కింగ్స్ కో ఓనర్‌గా వ్యవహరిస్తూ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తళుక్కుమని.. అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ మంచి సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆమెకు దగ్గరదగ్గరగా 50 ఏళ్లు ఉంటాయి. అయినా ఇప్పటకీ అంతే అందం, గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. అంత అందం వెనుకున్న సీక్రెట్ ఏంటంటే..ఏవయసులోనైనా అంతే అందంగా, గ్లామర్‌గా ఉండొచ్చు అనేందుకు ప్రేరణ ప్రీతి జింటా(Preity Zinta). ఈ ఏడాది ప్రారంభంలో వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వన్నె తరగని అందం రహస్యం గురించి షేర్ చేసుకుంది. తాను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతానని చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తానని, అలాగే తీసుకునే ఆహారంపై కూడా దృష్టిపెడతానని తెలిపారు. తాను పైలేట్స్(Pilates)కి అభిమానిని అని చెప్పారు. వర్కౌట్(workouts)ల విషయంలో రాజీ ప్రసక్తే లేదంటోంది ప్రీతి. బాడీని మంచి ఆకృతిలో ఉంచేవి పైలెట్స్ అని, అందుకే ఇది చేయడం అంటే మహా ఇష్టం అంటోంది. ఇది తన కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. దీంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం అంటోంది. పనికంటే తగిన నిద్ర ఉంటేనే రోంతా యాక్టివ్‌గా ఉండగలం. పైగా ఆరోగ్యం బాగుటుందని నమ్మకంగా చెబుతోంది. నోటిని అదుపులో పెట్టుకున్నవాళ్లు కచ్చితంగా అందంగా ఉంటారని చెబుతోంది. ఏ పదార్థం పడితే అది ఇష్టంతో డైట్‌ని బ్రేక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కేలరీలు తీసుకోవడంలో సరైన స్ప్రుహ ఉండాలంటోంది. రోజూ మొతంలో సరైన ఆహారం తీసుకోవాంటే ఈ నాలుగు చిట్కాల(Tips)ను తప్పనిసరిగా పాటించమని చెబుతోంది. అవేంటంటే..హడావిడిగా, నుంచొని అస్సలు తొనొద్దు. ఆకలిపై శ్రద్ధ పెట్టి నిధానంగా తినవల్సినంత మేర తినాలి. మైండ్‌ఫుల్‌గా తినాలి. ఒకవేళ మూడ్ బాగోకపోయినా సరే ఆహారం చూడగానే మనసు ఆటోమెటిగ్గా మారాలి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన రావాలి. నెమ్మదిగానే తినాలి. ముఖ్యంగా బాగా నమిలి తినాలి. ఇలా చేస్తే అతిగా తినడాన్ని నిరోధించగలుగుతాం వారానికి ఒక్కసారైనా ఒంటరిగా తినండి. ఎందుకంటే ఇతరులతో కలిసి తినడం వల్ల తెలియకుండా వారితో ప్రభావితమై ఎక్కువగా తినే అవకాశం ఉంటుందట. అందుకని అప్పడప్పుడూ ఇలా ప్లాన్ చేస్తే డైట్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పైగా ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటాం అని చెబుతోంది అందాల భామ ప్రీతి జింటా. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) (చదవండి: దటీజ్ మధురిమ బైద్య..! మైండ్‌బ్లాక్ అయ్యే గెలుపు..) -
ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..
బరువు తగ్గేందుకు ప్రస్తుతం రకరకాల డైట్లు ట్రెండ్ అవుతున్నాయి. కొందరు మాకు ఆ డైట్ పనిచేసింది, తొందరగా బరువు తగ్గామని చెప్పేస్తుంటే.. ఏది ఫాలో కావాలో తెలియని గందరగోళం ఎదురవ్వుతోంది. పోనీ అవి ఫాలో అయినా.. బరువు తగ్గలేదని కొందరు వాపోతుంటే..ఇదేంట్రా దేవుడా అనిపిస్తుంటుంది. ఇలాంటి అనుభవం చాలామందికి పరిచయమే. అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నప్పటికీ.. మొక్కవోని దీక్షతో బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అవేమీ వద్దు ఈ డైట్ ఫాలోకండి అంటూ కనివినీ ఎరుగని విధమైన ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకొచ్చాడు. తెలిస్తే మాత్రం ఇదా..! అతడి సీక్రెట్ అని విస్తుపోవడం ఖాయం. అమెరికాకు చెందిన నిక్ జియోప్పో జస్ట్ ఒక్క ఏడాదిలో 48 కిలోలు బరువు తగ్గి అందరూ ఆశ్చర్యపోయే రీతీలో స్లిమ్‌గా తయారయ్యాడు. అంతేగాదు వెయిట్ లాస్ జర్నీలో స్ఫూర్తిగా నిలిచాడు. బరువు తగ్గడం అనేది క్రమానుగుణంగా జరిగితేనే సత్ఫలితాలిస్తుందని చెబుతున్నాడు నిక్. అతను సోషల్ మీడియాలో చెప్పే చిట్కాలు, ప్రముఖలు చెప్పే ప్రతి డైట్‌ని ఫాలో అయ్యేవాడనని, ఐతే మొదట్లో బరువు తగ్గినా.. సరైన లక్ష్యం మాత్రం చేరుకోలేకపోయినట్లు తెలిపాడు. ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న ప్రతీ డైట్‌ని ఫాలో అయినట్లు చెప్పాడు. ఐతే అవేమీ తనకు మంచి ఫలితాన్ని అందివ్వకపోగా, ఆహారంపై నియంత్రణ లేకపోవడం, తినలేకపోతున్న బాధ ఇంకా ఎక్కువయ్యాయని వెల్లడించారు. తనకు ఈ ప్రయత్నాల వల్ల తెలిసిందేంటంటే..ఎవ్వరు బరువు తగ్గాలన్నా.. ముందుగా మానసికంగా మైండ్‌ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత తినడంలో కామెన్ సెన్స్‌తో వ్యవహరించాలి. అప్పుడే మనం ఎలాంటి డైట్‌ని అనుసరించినా.. మంచి రిజల్ట్ వస్తుందని చెబుతున్నాడు. తాను మాత్రం కామెన్ సెన్స్ డైట్‌ని ఫాలో అయ్యి తొందరగా బరువు తగ్గినట్లు తెలిపాడు నిక్కీ.కామెన్ సెన్స్ డైట్ అంటే..ఏం తింటున్నామో.. దానిపై ధ్యాస ఉండాలి. తగ్గాలి కాబట్టి తక్కువగా తినాలనుకోవద్దు. ఆరోగ్యం కోసం మితంగా తింటున్నా అనే భావనతో మొదలుపెట్టాలి. నోరు ఎండబెట్టేసుకునేలా కఠిన పత్యం వద్దు. ఇష్టమైన వాటిని హాయిగా తినేసి..మరుసటి రోజు అందుకు తగ్గట్టు వర్కౌట్లు లేదా కాస్త డైట్ ఎక్కువగా పాటించాలి. అలా అని శృతిమించేలా తినొద్దు. కేవలం నచ్చిన పదార్థాలు దూరం చేసుకోకండా ఆరోగ్యంగా తినేలా ప్రాధాన్యత వహించండి. తింటున్నప్పుడు కాస్త కామెన్ సెన్స్‌తో వ్యహరించండి చాలు. ఇలా చేస్తే..బరువు తగ్గడం ఏమంత కష్టం కాదని నమ్మకంగా చెబుతున్నాడు నిక్. ఇది తన అనుభవాల ద్వారా తెలుసుకున్న సత్యం అని అంటున్నాడు. పెద్దలు అన్నట్లు అనుభవపూర్వకంగా నేర్చుకున్న జ్ఞానానికి మించి ఏదీ లేదన్నట్లుగా..స్వతహాగా శరీరానికి సరిపడే విధంగా అనుసరించే డైటే మేలు అని చాటిచెప్పాడు కదూ..!. View this post on Instagram A post shared by Nick Geoppo • Weight Loss Coach (@nickgeoppo)గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం. (చదవండి: అంతర్జాతీయ మోడల్ హఠాన్మరణం.) -
నాలుగు చిట్కాలతో 18 కిలోలు : ఇన్ఫ్లూయెన్సర్ వెయిట్ లాస్ జర్నీ
అధిక బరువు తగ్గించుకోవాలని, స్లిమ్‌గా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ప్రణాళికా బద్ధంగా ప్రయత్నించి సక్సెస్ సాధిస్తారు. ఇందులో ఒక్కొక్కరి సక్సెస్ ఒక్కోలా ఉంటుంది. అలా పట్టుదలగా సాధన చేసిన ఇన్ఫ్లూయెన్సర్ తన బరువును తగ్గించుకొని, ఆరోగ్యంగా మారింది. ఎలా? తెలుసుకుందాం...రండి!అనేక రకాల ఆహార, వ్యాయామ నియమాలు ప్రచారంలోఉన్నాయి. వీటిల్లో ఏది పాటించాలో తెలియక, చాలామంది గందరగోళంలో పడి పోతారు. ఇవన్నీ చూశాక బరువు తగ్గడం కష్టం రా బాబూ అని ఊరుకుంటారు. మరికొంత మంది బరువు తగ్గించుకునే క్రమంలో విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు మాడీసే అనే మహిళ. తన విజయాన్ని సోషల్ మీడియాలో పంచుకొని మరో నలుగురికి ప్రేరణగా నిలిచింది. View this post on Instagram A post shared by @madyy_tseyఇన్‌స్టాలో తన వెయిట్ లాస్ జర్నీని షేర్ చేసింది. మేడీ. 4 దశల ఫార్ములా, వర్కౌట్స్, ఆహార నియమాలతో 18 కిలోల బరువు తగ్గించుకున్నట్టు తెలిపింది. అనుకున్న ఫలితం పొందాలంటే.. దీర్ఘకాలిక ఆచరణ, కచ్చితమైన యాక్షన్ ప్లాన్ ఉండాలని చెప్పింది. ఫిట్నెస్ , వెల్నెస్ రెండింటి మేళవింపుతో బరువు తగ్గించుకోవాలని సూచించింది. మాడీ సే పాటించిన నాలుగు సూత్రాలుకంబైన్డ్ స్ట్రెంత్ ట్రైనింగ్ & కార్డియో (వారానికి 4-6 సార్లు)కండరాలు బలంగా ఉండేందుకు జీవక్రియను పెంచుకునేందుకు కార్డియోతో పాటు పవర్ ట్రైనింగ్ఈ కాంబో కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది, మొత్తం ఫిట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.రోజుకి 2-3లీటర్లు నీళ్లు తాగడంపుష్కలంగా నీరు తాగడ వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఎనర్జీ వస్తుంది. విష పదార్థాలు తొలగిపోతాయిజీర్ణక్రియకు మద్దతు ఇస్తుందిసమతుల్య ఆహారం80 శాతం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, 20 శాతంమాత్రమే ఇష్టమైన అనుకూలమైన ఫుడ్ తీసుకోవాలి. ఫలితంగా అవసరమైన విటమిన్లు , మినరల్స్ శరీరానికి అందుతాయి, అదే సమయంలో స్వల్ప పరిధిలో మిగిలిన ఆహారం, ట్రీట్స్ ఎంజాయ్ చేయొచ్చు.ప్రతి 10 రోజులకు ఫోటోలుసాధారణ ఫోటోలు తీసుకుని చూసుకుంటూ ఉంటే అసలు విషయం తెలుస్తుంది. ఉత్సాహం వస్తుంది. కండరాల బలం, హార్మోన్ల మార్పులను పరిశీలించుకోవాలి. అలాగే కామెంట్లు కూడా చాలా ముఖ్యం.శరీర ఆకృతి, మార్పులను చూసుకోండం తనను సరియైన్ దారిలో నడవటానికి ఉపయోగపడింది అని చెప్పింది. అలాగే ఈ వెయిట్ లాస్ జర్నీలో కఠినంగా ఉండాలని ఓపిగ్గా ఫలితాల కోసం ఎదురు చూడాలని కూడా ఆమె వెల్లడించింది. View this post on Instagram A post shared by @madyy_tsey -
ఆ నాలుగు 'వైట్ ఫుడ్స్'ని నివారిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!
ఈ బిజీ లైఫ్‌లో సంపూర్ణ ఆరోగ్యంగాన్ని ఎలా పొందగలమని చాలామంది బాధపడుతుంటారు. కొద్దిపాటి చిట్కాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండొచ్చట. ఇక్కడ కొద్దిపాటి శ్రద్ధ ఉంటే చాలంటున్నారు నిపుణులు. వర్కౌట్లు, డైట్లు చేయకపోయినా.. తినే ఆహారంపై కాసింత స్ప్రుహ ఉంటే చాలు..సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దామా..!.మైదాతో చేసిన పదార్థాలకు దూరంగా ఉంటే సగం వ్యాధుల దరిచేరవట.అలాగే పంచదారను నివారించటం అంటే..టీ, కాఫీల్లో పర్లేదని లైట్‌గా తీసుకోకూడదట. వాటిల్లో కూడా పూర్తిగా నివారించి దానికి బదులుగా ఫ్రూట్ స్వీట్స్ లేదా బెల్లం జోడించండి చాలు.మరొకటి బంగాళ దుంపలు ఆరోగ్యకరమైన రీతిలో తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదట. డీఫ్ ఫై, చిప్స్ రూపంలో అయితే అస్సలు వద్దని చెబుతున్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందటచివరిగా తెల్లబియ్యం నివారించాలట. బాగా పాలిష్ పెట్టిన బియ్యం కాకుండా పొట్టు తక్కువగా తీసిని బియ్యం, ముడిబియ్యం లేదా బ్రౌన్ రైస్ తీసుకోమంటున్నారు. అలాగే ఒకవేళ తినాలనుకున్న వైట్ రైస్‌ని మితంగా తీసుకునే యత్నం చేసినా చాలు. ఎలాంటి అనారోగ్య సమస్యలు బారినపడే అవకాశం ఉండదని చెబుతున్నారు నిపుణులు. దీంతోపాటు పొగ, మద్యపానం వంటి చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండమని సూచిస్తున్నారు.ఒకవేళ పైన చెప్పిన ఆ ఆహారాలను పూర్తిగా నిషేధించలేకపోయినా..కనీసం పరిమిత స్థాయిలో మితంగా తీసుకునే యత్నం చేసినా..సత్ఫలితాలను పొందగలరని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించి అనుసరించటం మంచిది. (చదవండి: ఛీ.. ఫేషియల్ కోసం అదా? హాలీవుడ్ తారల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే..) -
వర్కవుట్స్ డైట్... డౌట్
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం వర్కవుట్లు చేయాలని సలహా ఇస్తుంటారు అందరూ. అయితే కేవలం ఎక్సర్సైజ్ చేయడంతోనే సరిపోదు, వ్యాయామం చేయక ముందు, చేసిన తర్వాత తీసుకునే ఆహారాలను బట్టి కూడా దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఒక క్రమపద్ధతిలో చేస్తేనే ఫలితం కనిపిస్తుంది. ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.ఏ వయసువారికైనా ఆరోగ్యంగా ఉండడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి వ్యాయామం చేయడానికి ముందు, చేసిన తర్వాత ఏం తినాలో తెలుసుకోవడం అవసరం. అందువల్ల వ్యాయామం చేసే ముందు, తర్వాత ఏం తినాలి..? అనేదానిని ఇక్కడ చూద్దాం.వర్కౌట్స్‌కు ముందు..?ఎక్సర్సైజ్లు చేయడానికి కొద్దిసేపటి ముందే ఏదైనా తినడం మంచిది కాదు. దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అందువల్ల తిన్న వెంటనే వర్కవుట్స్‌కి దిగకుండా కొంత గ్యాప్ ఇవ్వాలి. వ్యాయామానికి కనీసం అరగంట నుంచి గంట ముందు అల్పాహారం పూర్తి చేయాలి. అలాగే కసరత్తులు చేసిన తర్వాత కూడా శరీరానికి శక్తి కావాలి. అందుకే వ్యాయామం అయిన తర్వాత గంటలోపు మీకిష్టమైన పోషకాలున్న ఆహారాన్ని తినాలి. ఆ ఆహారం కొవ్వులు, పిండి పదార్థాల మిశ్రమంగా ఉండాలి. ఇక వ్యాయామం ముగిసిన తర్వాత బాడీ అలసిపోతుంది. ఈ సమయంలో శరీరానికి శక్తి ఎంతో అవసరం. అదే సమయంలో కసరత్తుల వల్ల ఖర్చైపోయిన శక్తిని పొందడానికి వోట్ మీల్, క్వినోవా, గుడ్లు, చికెన్, చేపలు, గింజలు, మొలకెత్తిన విత్తనాల వంటివి తీసుకోవాలి. వ్యాయామానికి ముందు, తర్వాత కూడా నీళ్లు తాగొచ్చు. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయడానికి ముందు సుమారు 2 నుంచి 3 కప్పుల నీళ్లు తాగాలి. ఇక అయిపోయిన తర్వాత కూడా అంతే పరిమాణంలో తాగాలి. కసరత్తులు చేస్తున్నప్పుడు..హెవీ వెయిట్లు లేపడం, ఎక్కువ క్యాలరీలు ఖర్చయ్యే వ్యాయామాలు చేస్తే.. ప్రతి అరగంటకు 50 నుంచి 100 కేలరీల ఆహారం తీసుకోవాలి. దీనికోసం తక్కువ కొవ్వు ఉన్న పెరుగు, ఎండు ద్రాక్ష లేదా అరటి పండు తీసుకోవాలి. -
అందాల చందమామ కాజల్! ఆ సీక్రెట్ ఏంటంటే..
'అందం అమ్మాయైతే నీలా ఉంటుందే...' అనేలా ఉంటుంది కాజల్ అగర్వాల్. చందమామలాంటి మోముతో చూడముచ్చటగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లితో హీరోయిన్ల కథ కంచికి అనుకుంటారు. కానీ కాజల్ విషయం అందుకు విరుద్ధం. పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటకీ అంతే గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. పైగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కాజల్ ఇంతలా గ్లామర్‌ని మెయింటైన్ చేసేందుకు ఏం చేస్తుందో, అలాగే ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో సవివరంగా తెలుసుకుందామా..!కాజల్ అందం, ఫిట్నెస్ గురించి అభిమానుల్లో ఎల్లప్పడూ చర్చనీయాంశమే. ఆమె ఇప్పటికీ అలానే ఉందంటూ మాట్లాడుకుంటుంటారు. పెళ్లైతే ఎలాంటి హీరోయిన్ల క్రేజ్ అయినా తగ్గిపోతుంది. కానీ కాజల్ విషయంలో నో ఛాన్స్ చెప్పేస్తున్నారు అభిమానులు. అంతలా సహజ సౌందర్యంతో మైమరిపించే కాజల్ ఓ ఇంటర్వ్యూలో తన అందం, ఫిటెనెస్ల సీక్రెట్ గురించి షేర్ చేసుకుంది. అందం కోసం..కాజల్ తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్, హైడ్రేషన్ నైట్ సిరమ్‌లు తప్పనిసరిగా వాడతానని అంటోంది. అవి తన చర్మాన్ని ప్రకాశంతంగా కనిపించేలా చేస్తాయని తెలిపింది. స్కిన్ గ్లో కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకుంటానంటోంది. ఫిట్నెస్ కోసం..ఎంత బిజీ షెడ్యూల్ అయినా వ్యాయామాలు, యోగా, వర్కౌట్లు స్కిప్ చేయనని చెబుతోంది. సినిమా షూటింగ్‌లు, కుటుంబానికి సంబంధించిన కమిట్మెంట్స్ ఉన్నా సరే..రోజువారి దినచర్యలో భాగమైన వ్యాయామాలను చేసే తీరతానని అంటోంది. అలాగే ప్రతిరోజు కనీసం 30-40 నిమిషాలు పైలెట్స్ చేసేలా లక్ష్యం పెట్టుకుంటానని చెబుతోంది. డైట్ కోసం..సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానంటోంది. తాజా పండ్లు, ఆకుకూరలు, కొబ్బరి నీళ్లు, రోజువారీ డైట్లో తప్పనిసరి అని చెబుతోంది. పైగా పండ్ల సహజ చక్కెరలతో తక్షణ శక్తి, ఆకుకూరల ద్వారా పోషకాలు, నట్స్ ద్వారా అవసరమైన కొవ్వులు అందుతాయని చెబుతోంది. కొబ్బరి నీరు తన దినచర్యలో భాగమని అంటోంది. ఇది తనను హైడ్రేటెడ్‌గా ఉంచడమే గాక రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. తాను ఎలాంటి మోడ్రన్ డైట్లు ఫాలోకానని తేల్చి చెప్పింది. ఆరోగ్యకరమై డైట్‌తో ఫిట్‌గా, అందంగా ఉండేలా కేర్ తీసుకుంటానని పేర్కొంది కాజల్.(చదవండి: ఏడు పదుల వయసులోనూ ఎంతో చలాకీగా, ఫిట్‌గా శక్తికపూర్..! హెల్త్ సీక్రెట్ ఇదే..) -
పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ ..!
ప్రస్తుతం దేశమంతా పుష్ప 2 ఫీవరే నడుస్తుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డుని సృష్టించి బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ప్రభాస్‌ల పేరు మీదున్న రికార్డుని బ్రేక్ చేశాడు. ముఖ్యంగా ఈ మూవీలో ఆయన డైలాగులు, ఆహార్యం, ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. స్టైలిష్ స్టార్ స్టెప్పులు, ఫిజికల్ అపీరియన్స్కే ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. ముఖ్యంగా హై ఎనర్జీతో కూడిన పెర్ఫార్మెన్స్కి ఎవ్వరైనా.. ముగ్గులైపోవాల్సిందే. అలా ఉంటుంది ఆయన నటన. మరి చూడటానికి ఆకర్షణీయంగా, ఆజానుబాహుడిలా ఉండే మన పుష్ప2 హీరో ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా..!పుష్ప మూవీలో డైలాగ్ మాదిరిగా.. "అల్లు అర్జున్ డైట్ అంటే నార్మల్ అనుకుంటివా అత్యంత హెల్తీ". ఆయన చెప్పే డైలాగులు..స్టెప్పులు అత్యంత వేగంగా ఉంటాయి. ప్రేక్షకుడిని అటెన్షన్‌తో వినేలా చేస్తాయి. అంతలా శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మంచి ఆరోగ్యకరమైన డైట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అందుకోసం హీరో అల్లు అర్జున్ ఈ ఎనిమిది చిట్కాలను తప్పనిసరిగా పాటిస్తారట. అవేంటంటే..బన్నీ రోజు.. వ్యాయామాలు, వర్కౌట్లతోనే ప్రారంభమవుతుందట. అందువల్ల ఉదయాన్నే హై ప్రోటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌నే తీసుకుంటారట. దీని కారణంగానే ఆయన రోజంతా చురుకుగా ఉంటారుతప్పనిసరిగా అల్పాహారంలో గుడ్లు ఉండాల్సిందేనట. కండలు తిరిగిన దేహానికి అవసరమైన ప్రోటీన్ ఇందులో ఉంటుంది. ఇవి కండరాలను బలోపతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.ఇక లంచ్‌లో తప్పనిసరిగా గ్రిల్డ్ చికెన్ ఉండాల్సిందే. దీనిలోని లీన్ ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే ఆకుపచ్చని కూరగాయలను కూడా డైట్లో చేర్చకుంటారు. దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, చర్మ సంరక్షణకు, మెరుగైన జీర్ణక్రియకు దోహదపడతాయి. హైడ్రేటెడ్‌గా ఉండేలా ఫ్రూట్ జ్యూస్‌లు, సలాడ్లు, షేక్‌లు కూడా తీసుకుంటారు. దీని ద్వారా శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్లు అందుతాయి. డిన్నర్ దగ్గరకి వచ్చేటప్పటికీ చాలా తేలికైన ఆహారమే తీసుకుంటారు. బ్రౌన్‌రైస్, కార్న్, గ్రీన్ రైస్ , సలాడ్లు ఉండేలా చూసుకుంటారు. చివరగా అల్లు అర్జున్‌లా మంచి పిట్‌నెస్‌తో ఉండాలంటే..వ్యాయమాలను స్కిప్ చేసే ధోరణి ఉండకూడదు. సమతుల్యమైన డైట్‌ని తీసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలతోపాటు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం నిబద్ధతతో ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకునేలా డైట్‌ని అనుసరిస్తే.. పుష్ప హీరోలాంటి లుక్‌ని ఈజీగా సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు.(చదవండి: ఏఐ బ్యూటీషియన్ రంగాన్ని కూడా శాసించగలదా..?) -
క్రికెటర్ రిషబ్ పంత్ వెయిట్ లాస్ సీక్రెట్: ఆ టిప్స్‌తో ఏకంగా 16 కిలోలు..
ఢిల్లీ ఫ్రాంఛైజీతో ఉన్న సుదీర్ఘ అనుబంధానికి వీడ్కోలు పలకనున్నాడు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల వచ్చే ఏడాది పంత్ లక్నోకు ఆడబోతున్నాడు. రిషబ్ పంత్‌కు వందకు పైగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉంది. పైగా వేలాది పరుగులు కూడా సాధించాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత కూడా అందే దూకుడుతో మైదానంలో విధ్వసం సృష్టించాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్‌గా పంత్ నిలిచారు. అలాంటి అద్భుత ఆటగాడి డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందామా..!ఈ భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ జట్టుకు సిద్ధమవుతున్న సమయంలో కేవలం నాలుగు నెలల్లో 16 కిలోలు బరువు తగ్గాడు. ఇంతలా బరువుని అదుపులో ఉంచుకునేందుకు ఆయన ఫాలో అయ్యే సింపుల్ డైట్ టిప్స్ ఏంటో చూద్దామా..!.కేలరీలు తక్కువగా ఉన్న ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. దీనివల్ల అతని శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగిస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉంటుంది.అలాగే ఇంట్లో వండిన బోజనానికే ప్రాధాన్యత. బయట ఫుడ్ జోలికి వెళ్లడు. ముఖ్యంగా రెస్టారెంట్ లేదా హోటల్ ఫుడ్స్ వైపుకి వెళ్లడు. దీనివల్ల ఇంట్లో వండే పద్ధతుల రీత్యా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవడమే గాక అనారోగ్య సమస్యల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుతుంది. ఆయిల్ పరిమితంగా ఉన్న ఆహారమే ఎంపిక చేసుకుంటాడు పంత్అలాగే రాస్మలై వంటి స్వీట్లు, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ వంటి అధిక క్యాలరీల ఆహారానికి పూర్తిగా దూరం. బరువు అదుపులో ఉండేలా వేయించిన పదార్థాలు, చక్కెర సంబంధిత పదార్థాలను తీసుకోరట పంత్. తగిన సమయానికి నిద్ర పోవడం కూడా తన బరువుని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోందిగోవాన్ భిండి(ఓక్రా) పట్ల తనకున్న మక్కువ, మసాల దినుసుల తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలా పంత్‌లా ఆగ్యకరమైన డైట్‌కి ప్రాధాన్యత ఇస్తే బరువు తగ్గడం అత్యంత ఈజీ. అందుకు కాస్త శ్రద్ధ, నిబద్ధత అవసరం అంతే..!.(చదవండి: ఆర్బీఐ గవర్నర్‌కి ఛాతినొప్పి: ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా?) -
నిమ్మకాయ, పచ్చిపసుపుతో సిద్ధు భార్య కేన్సర్ ఖతం: నిపుణుల హెచ్చరికలివే!
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల కీలక విషయాన్ని ప్రకటించిన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 కేన్సర్‌ని విజయవంతంగా ఓడించిందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేవలం వైద్యులమీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేక మైన చికిత్సా పద్దతులను అవలంబించామని క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి,ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్-4 కేన్సర్‌నుంచి బయటపడినట్టు వెల్లడించారు. ముఖ్యంగా నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా కేన్సర్ మహమ్మారిని జయించినట్టు ప్రకటించడం చర్చకు దారి తీసింది. మరి కేవలం స్ట్రిక్ట్ డైట్ మాత్రమే క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?కొన్నాళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన నవజ్యోత్ కౌర్ చికిత్స తీసుకుంది. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత స్టేజ్-3 రూపంలో తీవ్రంగా మళ్లీ వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేదు సరికదా మరింత ముదిరింది. కేవలం 5 శాతం మాత్రమే చాన్స్ ఉందని, కోలుకోవడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. కానీ కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలి మార్పులతో ఆమె క్యాన్సర్‌ను ఓడించిందని, అయితే ఇది దగ్గర డబ్బు ఉన్నందున కాదు, క్రమశిక్షణ, ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు సిద్దూ. ఆమె ఇపుడు వైద్యపరంగా కేన్సర్‌ను ఓడించిందని సిద్దూ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపవాసం ప్రాముఖ్యత, చక్కెర , కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కేన్సర్‌ను దూరం చేస్తుందన్నారు. ఆమె తన రోజును నిమ్మరసంతో ప్రారంభించేదని, పచ్చి పసుపు తినేదని, ఆపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి లాంటి తీసుకునేదన్నారు. ఇంకా సిట్రస్ పండ్లు,గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్ , వాల్నట్స్ వంటి రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేవన్నారు.My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024అందరికీ వర్తించదు: నిపుణుల హెచ్చరిక కేన్సర్ చికిత్సలో పోషకాహార పాత్ర కీలకమైనదే, కానీ అది మాత్రమే రికవరీకి ఆహారం మాత్రమే సరిపోదని హెచ్చరిస్తున్నారు. వ్యాధినుంచి కోలుకోవడానికి ఆహారం గణనీయంగా తోడ్పడుతుంది. కానీ కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటి సాంప్రదాయ చికిత్సలకు ఎంతమాత్రం సరిపోదు. కేన్సర్ బహు ముఖమైంది. తీవ్రతను బట్టి, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి పలు చికిత్సల కలయిక అవసరం అంటున్నారు వైద్య నిపుణులుఅలాగే ఉపవాసం కేన్సర్ రోగులకు ఉపవాసం అస్సలు పనికిరాదని, కేన్సర్ రోగులను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లేదా ఉపవాసంలో ఉంచడం నేరమంటున్నారు మరికొందరు నిపుణులు. ఇది కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని నిరోధిస్తుందన్నారు.తక్కువ-గ్లైసెమిక్ డైట్, న్యూట్రాస్యూటికల్స్ గ్లూకోజ్-ఆధారిత కేన్సర్లలో చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలవని డాక్టర్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే అందరికీ ఇది వర్తించదన్నారు. కేన్సర్ రకం, దశ ఆధారంగా, జీవక్రియ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆహార ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా రోగులు ఆంకాలజిస్టులు, డైటీషియన్ల సలహాలను తీసుకోవాలని డాక్టర్ మల్హోత్రా జోడించారు.కేన్సర్‌నుంచి బయటపడాలంటే.. తొలి దశలోనే గుర్తించడం,కేన్సర్ రకం, లక్షణాలతో పాటు అత్యాధునిక చికిత్స, రోగి విల్ పవర్, ఆహార నియమాలు, రోగి శారీరక, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల సహకారం, మద్దతు ఇవన్నీ కీలకమైనవి. -
నేహా ధూపియా అనుసరించే గ్లూటెన్-ఫ్రీ డైట్ అంటే..!
బాలీవుడ్ నటి నేహా ధూపియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మోడల్, ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా. అలాగే 2002లో మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్య వహించింది. బాలీవుడ్లో అనేక బ్లాక్బాస్టర్ మూవీలతో మంచి సక్సెస్‌ని అందుకోవడమే గాక అనేక రియాలిటీ షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ..విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఆమె అంగద్ బేడీని 2018లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లకు జన్మనివ్వడంతో లావుగా అయిపోయారు. అయితే అనుకోకుండా ఒక రోజు మీడియా కంట పడటంతో..ఒక్కసారిగా ఆమె అధిక బరువు గురించి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఏకంగా 23 కిలోలు బరువు తగ్గి ఇదివరకటి నేహాలా నాజుగ్గా కనిపించి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది.పైగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే గాక..పలు ఆఫర్లను కూడా అందుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేగాదు తన అభిమానుతో తన వెయిట్ లాస్ జర్నీ గురించి, అందుకు సంబంధించిన చిట్కాలను కూడా షేర్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆరోగ్య స్ప్రుహ కలిగించే నేహా తాజాగా డైట్‌కి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం షేర్ చేసుకుంది. అదేంటంటే..డైట్ పాటించేటప్పుడూ కేవలం బరువు తగ్గేందుకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని నొక్కి చెబుతోంది. ముఖ్యంగా గ్లూటెన్ ఫ్రీ డైట్‌ని అనుసరించమని చెబుతోంది. మంచి శరీరాకృతి తోపాటు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడమని ధీమాగా చెబుతోంది నేహా. దీన్ని అత్యంత రుచికరమైన రీతిలో తయారు చేసుకుంటే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్‌ని ఇష్టంగా తినగలుగుతారని అంటోంది. తాను అరటిపండ్లతో చేసిన పాన్కేక్, తాజా బెర్రీలు, లావెండర్ జామ్ వంటివి తీసుకుంటానని చెబతుతోంది. గ్లూటెన్ ఫ్రీ ఆహారపదార్థాలను ఎంపిక చేసుకుని మరీ డైట్‌ని ప్రారంభిస్తే మంచి ఫలితం ఉండటమే గాక బరువు కూడా అదుపులో ఉంటుందని తెలిపింది. గ్లూటెన్ డైట్ అంటే..గ్లూటెన్ రహిత ఆహారంమే తీసుకోవడం. అందుకోసం గ్లూటెన్ లేని పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు వంటిఆహారాలనే తీసుకుంటారు. అలాగే గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ లేదా పాస్తా వంటివి కూడా తీసుకుంటారు. ఎవరికి మంచిదంటే..గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలు పడని వాళ్లకు, గోధుమ పిండితో చేసిన వంటకాలు తింటే ఎలెర్జీ లేదా జీర్ణశయాంతర సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ డైట్ మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణుల. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచిదే. ఇక్కడ గ్లూటెన్ ఫ్రీకి ప్రత్యామ్నాయంగా మంచి ఆరోగ్యకరమైనవి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత ఆరోగ్య నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం.(చదవండి: కాకర : చక్కెరకు చెక్ పెడుతుందా?) -
శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం..!
శీతాకాలంలో శారీరక శ్రమ తగ్గడం, కాలానుగుణ మార్పులు తదితరాల కారణంగా అధిక రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయిలు పెరగడం జరుగుతుంది. ఈ కాలంలో హృదయనాళం పనితీరుకు అనుగుణమైన ఆహారపదార్థాలు తీసుకుంటే గుండె సంబంధిత ప్రమాదాలను నివారించొచ్చని చెబతున్నారు నిపుణులు. ఈ కాలంలో ఎక్కువగాయాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉన్నవి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ వణికించే చలిలో రక్తపోటుని నిర్వహించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం మేలని చెబుతున్నారు. అవేంటో చూద్దామా..ఆకు కూరలుపాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ, సీ, కే, ఫైబర్ తోపాటు ఫోలేట్ వంటివి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ ఆకుకూరలు నైట్రేట్లను కలిగి ఉంటాయి. అందువల్ల రక్తపోటును తగ్గించి, ధమనుల పనితీరును మెరుగ్గా ఉంచడంలో కీలకంగా ఉంటాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు హాని కలిగించే ఆక్సీకరణ ఒత్తిడిని కూడా నివారిస్తాయి.నారింజదీనిలో విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. నారింజలోని పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడగా, ఫైబర్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇక విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నట్స్:ముఖ్యంగా వాల్నట్లు, బాదంపప్పులలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, మెగ్నీషియం తదితరాలు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఒమేగా -3లు వాపును తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అయితే మెగ్నీషియం ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇవి రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటే.. ఎలాంటి హృదయ సంబంధ సమస్యలు తలెత్తవు.దానిమ్మ..దానిమ్మపండులో పాలీఫెనాల్స్ అని పిలువబడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని తగ్గిస్తాయి. దానిమ్మ రసం త్రాగడం లేదా విత్తనాలు తినడం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లివెల్లుల్లిలో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. అందువల్ల ఇది గుండె-ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో అత్యంత కీలకమైనదిగా చెప్పొచ్చు. ఈ చలికాలంలో దీన్ని జోడించటం వల్ల రక్తనాళాల్లో ఎలాంటి బ్లాక్‌లు ఏర్పడే అవకాశం ఉండదు, గుండె పనితీరు కూడా బాగుంటుంది. క్యారెట్లుక్యారెట్లో బీటా కెరోటిన్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి దోహదడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి. క్యారెట్లు పచ్చిగా, ఆవిరిలో ఉడికించి లేదా సూప్‌లాగా తీసుకోవచ్చు.బీట్రూట్లుబీట్రూట్లలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా ఉండేలా చేసి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇవన్నీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ శీతాకాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడమే గాక సమతుల్యమైన ఆహారం శరీరానికి అందించగలుగుతాం. గమనించి: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది. (చదవండి: సోరియాసిస్‌ను తగ్గించే సహజసిద్ధమైన ఆయిల్..) -
సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సీక్రెట్స్ : మేక పెరుగు, నెయ్యి, జ్యూస్‌లు
ఆర్ట్ కలెక్టర్, దాత సోషల్ మీడియా సెన్సేషన్, రియాలిటీ టీవీ స్టార్ షాలిని పాసి 'ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' సిరీస్‌తో మరింత పాపులర్ అయిపోయింది. ఆమె అదిరిపోయే పంచ్ డైలాగులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు 49 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? శిల్పం లాంటి ఆకృతి, మెరిసే చర్మం కోసం, ఆమె ఏమి తింటుంది అనేది చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆహార నియమాలు, సౌందర్య రహస్యాలను బహిర్గతం చేసింది. షాలిని రోజువారీ ఆహారంలో ఎటువంటి ఘనమైన ఆహారం తీసుకోదట. సెలెరీ (ఆకుకూరలు)జ్యూస్, కూరగాయలతో చేసిన జ్యూస్‌లు, నెయ్యి, మేక పెరుగు ఖచ్చితంగా తీసుకుంటానని తాగా వెల్లడించింది. ప్రధానంగాకొంచెం వింతగా అనిపించినా తాను మేక పెరుగును ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. మేక పెరుగుతో ఎముకలు ,దంతాలు బలంగా ఉంటాయని వివరించింది. డైట్ మాత్రమే కాదు, రోజుకు రెండు గంటల వ్యాయామం తప్పకుండా చేస్తుందట.షానిలి డైట్ సీక్రెట్, ఆమె మాటల్లో ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటా.తర్వాత ఉసిరి అల్లం కలిపిన బీట్రూట్ రసం.డైట్లో హెర్బల్ లిక్విడ్లు, కూరగాయలజ్యూస్లు ఎక్కువ భాగం ఉంటాయి. రెండు గిన్నెల మొలకలను నమలడం కష్టం. అదే జ్యూస్ అయితే సులభంగా తాగవచ్చు. సెలెరీ జ్యూస్, రెడ్ జ్యూస్, స్ప్రౌట్ జ్యూస్, మిరియాలతో చేసే క్యాప్సికమ్ జ్యూస్ ఇలా చాలా ఉంటాయి.సాయంత్రం ఆహారంలో ప్రతిదీ సూప్ రూపంలో ఉంటుంది. వడకట్టకుండా, చిక్కగా ఉండే కూరగాయలను జ్యూస్‌లను తాగుతాను. ఇంకా బచ్చలికూర, బ్రోకలీ సూప్, టొమాటో, బెండ, తామర కాండం, బఠానీలు ఇలా ఏదైనా జ్యూస్ రూపంలోనే.సాయంత్రం 6 గంటల వరకు పచ్చి ఆహారం మాత్రమే .. రాత్రి 7 గంటలకు భోజనం. అదీ కూడా 'ఘర్ కా ఖానా (ఇంట్లో వండిన ఆహారం)'ఉండేలా చూసుకుంటా. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే సహజమైన వాటిని మాత్రమే తీసుకుంటాను.డిన్నర్లో అవకాడో, రాగి లేదా జొన్న పిండితో చేసిన దోసలు తింటానుఇక గుడికి వెళ్లని రోజుల్లో ప్రోటీన్ కోసం గుడ్డు, చేపలు లేదా చికెన్ తీసుకుంటా.సాయంత్రం 4 నుండి 6 వరకు నా వర్కౌట్ సమయం. కండరాలకు బలం చేకూర్చే పైలేట్స్ , డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. (ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!) -
కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!
యూఎస్ అధ్యక్ష రేసులో నిలిచిన.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆహార నియామాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆమె అనుసరించే డైట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఆమె పాక్షిక శాకాహారి లేదా రోజులో కొద్దిసేపు శాకాహారిగా ఉంటారు అని చెప్పొచ్చు. ఇదేం విచిత్రం అనుకోకండి. ఈ ప్రక్రియను 'ఫ్లెక్సిటేరియన్ డైట్' అని అంటారట. అసలేంటి ఈ డైట్..? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దామా..!.కమలా హారిస్ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ను అనుసరిస్తారు. ఈ డైట్ శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు మితంగా నాన్‌వెజ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను అందించడంలో సహాయపడుతుంది. అందువల్లే ఈ డైట్‌ని "ఫ్లెక్సిబుల్" "వెజిటేరియన్" అనే పదాల కలయికతో ఫ్లెక్సిటేరియన్ డైట్‌గా పిలుస్తున్నారు.ఈ డైట్ విధానం..కమలా హారిస్ తరుచుగా శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతుంటారు. అయితే కమలా సాయంత్రం ఆరుగంటలోపు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత నాన్‌వెజ్ సంబంధిత పదార్థాలను తీసుకుంటారు. ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..?డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ని రూపొందించారు. దీనిలో స్పష్టమైన నియమాలు లేదా సిఫార్సు చేసిన కేలరీలు, స్థూల పోషకాల సంఖ్యను కలిగి ఉండదు. ఇది కేవలం ఆహారం కంటే ఎక్కువ మన జీవనశైలినే ప్రతిబింబిస్తుంది. అంటే ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..నిపుణల అభిప్రాయం ప్రకారం..పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తీసుకోవడంనాన్వెజ్ కంటే మితమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చడంసౌకర్యవంతమైన పద్ధతిలో మితంగా నాన్‌వెజ్ తీసుకోవడంప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండటంస్వీట్లను పరిమితం చేయడం తదితరాలు ఉంటాయి.ఆమె ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..ఉదయం టీలో తేనెను తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌గా బాదం పాలు, ఎండు ద్రాక్ష మాత్రమే తీసుకుంటారు. అంతేగాదు పలు ఇంటర్వ్యూలో బ్రేక్‌ఫాస్ట్ అస్సలు తీసుకోనని కేవలం బాదంపాల తోపాటు ఏదో ఒక డ్రైఫ్రూట్ తీసుకుంటానని చెప్పారు కూడా. అలా సాయంత్రంలోపు మొక్కల ఆధారిత ఆహారమే తీసుకోగా, రాత్రిపూట మితంగా నాన్‌వెజ్‌కి ప్రాధాన్యత ఇస్తారు.ఈ డైట్లో ఉండే ఆహారాలు..ప్రోటీన్లు - సోయాబీన్స్, టోఫు, టెంపే, కాయధాన్యాలుకార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు - బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, ఆకుపచ్చ బీన్స్, క్యారెట్లు, కాలీఫ్లవర్కార్బోహైడ్రేట్స్ ఉండే కూరగాయలు - వింటర్ స్క్వాష్, బఠానీలు, మొక్కజొన్న, చిలగడదుంపపండ్లు - యాపిల్స్, నారింజ, బెర్రీలు, ద్రాక్ష, చెర్రీస్తృణధాన్యాలు - క్వినోవా, టెఫ్, బుక్వీట్, ఫార్రోనట్స్: బాదం, అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్లు, జీడిపప్పు, పిస్తాపప్పులు, వేరుశెనగ వెన్న, అవకాడోలు, ఆలివ్‌లు, కొబ్బరిమొక్కల ఆధారిత పాలు - తియ్యని బాదం, కొబ్బరి, జనపనార, సోయా పాలుపానీయాలు - తగినన్ని నీళ్లు, టీ, కాఫీప్రయోజనాలు:ఫైబర్ తోపాటు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయిగుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిమధుమేహం నియంత్రణలో ఉంటుంది.కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గమనికి: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం మంచిది.(చదవండి: ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?) -
విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్లు మాత్రం..!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే గాక విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. కానీ ఫిట్నెస్ పరంగా విద్యా చాలా ఇబ్బందులు పడింది. ఒక్కోసారి చాలా స్లిమ్‌గా, మరోసారి లావుగా కనిపిస్తూ ఉండేది. అయితే ఇటీవల ఆమె చాలా స్లిమ్‌గా మారడమే గాక బాడీని అదే ఫిట్నెస్తో మెయింటైన్ చేయడంలో విజయవంతమయ్యింది. అందుకోసం తాను ఏం చేసిందో ఓ ఇంటర్యూలో వివరంగా వెల్లడించింది కూడా. ఇంతకీ విద్యా బాలన్ వెయిట్ లాస్ సీక్రెట్ ఏంటంటే..విద్యాబాలన్ తను స్లిమ్‌గా మారేందుకు ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చింది. తాను నాజుగ్గా ఉండాలని చాలా పిచ్చిగా వర్కౌట్లు చేసినట్లు వెల్లడించింది. అయితే అంతలా చేసినా.. తన బరువులో పెద్ద మార్పు కనిపించక చాలా విసిగిపోయినట్లు తెలిపింది. దాంతో తాను చెన్నైలోని 'అమురా' అనే న్యూట్రిషన్ బృందాన్ని కలిసినట్లు పేర్కొంది. అయితే వాళ్లు నిజంగా ఇది లావు కాదని తేల్చి చెప్పారు. బరువు తగ్గడంలో మంచి మార్పు కనిపించాలంటే సరైన డైట్ పాటించాలని అన్నారు. అలాగే ముందుగా తనని ఇలా విపరీతమైన వ్యాయామాలు చేయడం మానేయమని చెప్పారు నిపుణులు. అలాగే ముందుగా ఇన్ఫ్లమేషన్ని వదిలించుకునేలా ఆహారం తీసుకోవాల్సిందిగా న్యూట్రిషన్లు సూచించారు. అంటే ఇక్కడ శరీరానికి సరిపడని ఆహారాన్ని తొలగించడమే ఇన్ఫ్లమేషన్ డైట్. అయితే ఇదేలా పనిచేస్తుందంటే.. 'ఇన్ఫ్లమేషన్ ఎలిమినేషన్' డైట్ అంటే..ఇది యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం. పోషకాలతో నిండిన ఆహారం. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి.. వాపుని, మంటని అరికట్టే మంచి ఆహారం. ఇవి తప్పక డైట్లో చేర్చుకోవాల్సిని మంచి ఫుడ్స్‌గా పేర్కొనవచ్చు.కూరగాయలు..బ్రోకలీ, కాలే, బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను తప్పక డైట్లో ఉండేలా చూసుకోవాలి.పండ్లు..బ్లూబెర్రీస్, దానిమ్మపండ్లు, ద్రాక్ష, చెర్రీస్ వంటి పండ్లను తీసుకోవాలి.ఆరోగ్యకరమైన కొవ్వులుఅవకాడోస్, ఆలివ్ వంటి అధిక కొవ్వు ఉండే వాటిని చేర్చుకోవాలి. మంచి కొవ్వులు ఉండే చేపలుమాంసాహారులు మంచి పోషకాల కోసం సాల్మన్, సార్డినెస్, ఇంగువ వంటి రకాల చేపలను తీసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు, నట్స్బాదం, పిస్తా వంటి వాల్నట్ల తోపాటు పసుపు, మెంతులు దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. (చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!) -
శ్రద్ధా కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..! ఇష్టంగా పోహా..!
బాలీవుడ్ స్టార్ క్వీన్ శ్రద్ధా కపూర్ స్త్రీ 2 మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఆ విజయోత్సాహంలో మునిగితేలుతుంది. శ్రద్ధా తన విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంటుంది. అంతేగాదు శ్రద్ధా నటనకు, గ్లామర్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. పాపులారిటీ పరంగా భారతదేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటీనటులలో శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. అలాంటి శ్రద్ధాకి ఆరోగ్య స్ప్రుహ కూడా ఎక్కువే. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఎలాంటి ఆహారం తింటే మంచి ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉంటామో తన అభిమానులతో షర్ చేసుకుంటుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా..ఇప్పటికి అలానే వన్నె తరగని అందంతో కట్టిపడేస్తుంది. అందుకు కారణం శ్రద్ధా పాటించే ఆహార నియమాలే. అవేంటో చూద్దామా..!2010లో తీన్ పట్టితో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన శ్రద్ధా ఇప్పటికీ అలానే అంతే అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే యంగ్‌గా ఫిట్నెస్తో ఉండేందుకు మంచి జీవనశైలిని పాటిస్తుంది. అలాగే రోజువారీ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది. అంతేగాదు ఇటీవల ఇంటర్యూలో శ్రద్ధా కపూర్ తాను కొన్నేళ్లక్రితం శాకాహారిగా మారానని చెప్పుకొచ్చింది. తన భోజనంలో పూర్తిగా స్వచ్ఛమైన శాకాహారమే ఉంటుందని తెలిపింది. ఇక ఆమె ఫిట్నెస్ ట్రైనర్ మాహెక్ నాయర్ కూడా శ్రద్ధా పోహా, ఉప్మా, దలియా, ఇడ్లీ లేదా దోస వంటి ఆరోగ్యకరమైన ఇంటి భోజనంతో ప్రారంభిస్తుందని చెబుతున్నారు. కక్డీ చి భక్రి వంటి సాధారణ మహారాష్ట్ర వంటకం, దాల్ చావల్, ఊరగాయలంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇలా వైవిధ్య భరితమైన వంటకాలని ఇష్టపడే ఆమెకు ఈ డైట్‌ప్లాన్‌ని అనుసరించాలని చెప్పడం కాస్త కష్టమని చెప్పారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) అందువల్లే ఆమె రోజులో మూడు సార్లు విభిన్నంగా తినేందుకే ఇష్టపడుతుందట. కూరగాయల్లో బెండకాలయంటే ఇష్టమని, పండ్లలో మామిడి పండు అంటే మహా ఇష్టమని పేర్కొంది శ్రద్ధా. తన సినిమాల పరంగా ఎక్కువ డ్యాన్స్‌తో కూడిన వాటికి గానూ మితమైన కార్బ్, ప్రోటీన్, ఫ్యాట్ డైట్లు తీసుకుంటుందని శ్రద్ధా ట్రైనర్ చెబుతున్నారు. అలాగే బికినీ పాత్రలకు అనుగుణంగా మంచి టోన్ స్కిన్ కోసం అధిక ఫైబర్‌తో కూడిన పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుతో కూడిన లీన్ డైట్‌ని తీసుకుంటుంది. ఆమె భోజనంలో తప్పనిసరిగా స్ప్రౌట్ సలాడ్లు, ఓట్స్ ఉంటాయి. అయితే ఏదైనా పండుగ సమయాల్లో మాత్రం డైట్‌ని పక్కన పెట్టేసి మరీ తనకిష్టమైన మోదకాలు, స్వీట్లు లాగించేస్తుంది. అయితే లిమిట్ దాటకుండా తీసుకుంటుదట. అంతేగాదు ఆమెకు ఫ్రెంచ్ ఫ్రైస్, వడ పావ్, పానీ పూరీ వంటివి కూడా చాలా ఇష్టమని చెబుతోంది శ్రద్ధా. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) (చదవండి: యాపిల్స్‌లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!) -
మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..
టాలీవుడ్ నటి తమన్నా భాటియా హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. వరుస హిట్ సినిమాలతో మంచి సక్సెస్‌ని అందుకుంది. మిల్కీ బ్యూటీ, తన అందం, నటనతో విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించింది. కళ్లు తిప్పుకోలేని అందం, ఆహార్యం ఆమె సొంతం. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా ఉంటుంది. ఇప్పటికి అలానే చెక్కిన శిల్పంలా అందంగా ఉంటుంది. అంతలా బాడీ మెయింటైన్ చేసేందుకు ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతుందోనని కుతూహలంగా ఉంటారు అభిమానులు. అయితే తమన్నా మాత్రం ఫిట్నెస్ అనేది రోజు బ్రెష్ చేయడం మాదిరిగా శరీరానికి సంబంధించిన ఓ దినచర్య. అందుకోసం తాను ఎలాంటి డైట్లు ఫాలో అవ్వనని, తనకు వాటిపై నమ్మకం లేదని అంటోంది. మరీ అంతలా నాజుకైన శరీరం ఎలా మెయింటైన్ చేస్తుందంటే..తమన్నా నాజూకైన శరీరాకృతి పరంగా ఎన్నో ప్రశంసలందుకుంటుంది. ఫిట్‌గా ఉండేందుకు మెరిసే చర్మం కోసం ఎలాంటి ఫుడ్ తింటుందంటే..బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరి అవి..గ్లూటెన్ ఫ్రీ గ్రానోలా, ఖర్జూరాలు, బాదంపాలు, అరటి పండు, గింజలు, కొన్ని బెర్రీలు ఉంటాయి. శక్తి బూస్ట్ కోసం తేలికపాటి అల్పాహారంతో డైట్ ప్రారంభిస్తుంది. ప్రోటీన్ కోసం గుడ్లను తింటుంది. అంతేగాదు మరింత హెల్తీగా ఉండేందుకు ఉల్లిపాయలు, టొమాటోలు, బచ్చలికూరతో చేసి ఆమ్లేట్లు తీసుకుంటుందట. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) లంచ్ వద్దకు వస్తే సాధారణ భోజనం, పప్పు, అన్నం, పచ్చికూరగాయలే తింటుంది. ఇలాంటి భోజనం సంతృప్తినిస్తుందని అంటోంది. షూటింగ్లో ఉన్న రోజుల్లో లేదా బయటకు వెళ్లే రోజుల్లో ఇడ్లీ, సాంబార్ లేదా రసం, దోస వంటి దక్షిణ భారత ఆహారాన్నే ఎంచుకుంటానంటోంది. డిన్నర్ చాలావరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల్లోపు తినేలా చూసుకుంటుందట. దీంతోపాటు కొన్ని గింజలను తింటానని చెబుతోంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) అంతేగాదు తాను ఎక్కువగా సాయంత్రం సమయాల్లో జిమ్ చేస్తానని అంటోంది. ఆ టైంలో తప్పనిసరిగా గుడ్లు, కూరగాయలతో కూడిన ప్రోటీన్ రిచ్ డిన్నర్‌కి ప్రాధాన్యత ఇస్తుందట. జిమ్ ఎక్కువ చేస్తే తాను తీసుకునే భోజనం క్వాంటిటీని కూడా పెంచుతానని చెబుతోంది. ఇక మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్‌గా ఉండేలా ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతానని అంటోంది. (చదవండి: కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!) -
ఫుల్ ట్రెండ్ వేగన్ డైట్
చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కొందరు మాత్రం మాంసాహారం ముట్టరు. కొందరేమో కొన్ని ప్రత్యేక వారాల్లో నాన్‌వెజ్ తినరు. కానీ మరికొందరు మరీ ప్రత్యేకం.. ఎందుకంటే వారు నాన్‌వెజ్ మాత్రమే కాదు.. కనీసం జంతువుల నుంచి తయారైన ఉత్పత్తులే తినరు. వారినే ఇప్పుడు వేగన్స్ అంటున్నారు. ఇటీవల వేగనిజం కాన్సెప్‌్టకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఖచి్చతంగా పాటిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నారు. అసలు వేగనిజం అంటే ఏంటి.. అసలు అటువైపు ప్రజలు.. ముఖ్యంగా యువత ఎందుకు మొగ్గు చూపుతున్నారని పరిశీలిస్తే పర్యావరణ పరిరక్షణ, జీవహింసకు దూరంగా ఉండాలని చాలామంది పేర్కొంటున్నారు. పర్యావరణ, జంతు ప్రేమికుల్లో వేగన్‌గా మారాలన్న ఆలోచనలు పెరుగుతున్నాయి. తీసుకునే ఆహారంలో పోషకాలు కావాలంటే ఒక్క మాంసాహారమే తినాల్సిన అవసరం లేదు. శాఖాహారంలోనూ శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు, ప్రోటీన్లు లభిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. దీనికి సంబంధించిన స్టడీస్ ఆధారాలను ముందుంచుతున్నారు. జంతువుల నుంచి వచ్చే ముడిసరుకు ఆధారంగా తయారయ్యే ఉత్పత్తుల వలన కలిగే లాభాలు ఏంటి, వాటికి శాఖాహారపరంగా ప్రత్యామ్నాయాలను ఎలా సమకూర్చుకోవాలనే ఆలోచనలకు పదును పెడుతున్నారు.మాంసాహారం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా వినియోగించే కోడినే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒక కోడి పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది. వేగంగా పెరగడానికి ఇస్తున్న స్టెరాయిడ్స్ వంటివి మానవ శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తాయనే అంశాలను వివరిస్తున్నారు. అలాగే ప్రతి విషయంలోనూ ప్రస్తుత పరిస్థితుల్లో మాంసాహారం వల్ల రోగాలు కొనుక్కునట్లే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండి, ప్రకృతి సిద్ధమైన శాఖాహారం తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు. నగరంలో పూర్తిగా కాకపోయినా వారంలో ఒకటి రెండు రోజులైనా పూర్తిస్థాయి వేగన్‌గా మారిపోవాలని కోరుకుంటున్నారు. గత రెండేళ్లలో ఇటువంటి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీళ్లకు అనుగుణంగా నగరంలోని పలు ప్రైమ్ ప్రాంతాల్లో వేగన్స్ ఫుడ్ స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి శాఖాహార ఉత్పత్తులు అక్కడ లభిస్తున్నాయి.జీవన విధానంలో మార్పు కోరుకున్నా.. ఒక కోడి లేదా మేక పెరగాలంటే కనీసం మూడు నెలల నుంచి రెండు మూడేళ్లు పడుతుంది. దాన్ని ఒక్క రోజులో తినేస్తారు. ఆ జంతువు పెరగడానికి ఎన్ని ప్రకృతి వనరులు కావాలి. అంటే రెండేళ్ల రిసోర్సెస్‌ను ఒక్క పూటలో ఆరగించేస్తున్నామన్నమాట. మాంసం తింటేనే ప్రోటీన్లు అంటారా.. వాటికి ఎక్కడి నుంచి ప్రోటీన్ వస్తుందో అదే ఆహారం మనం తీసుకుంటే సరిపోతుంది కదా.. వేగన్‌గా మారడానికి ప్రకృతి, జీవహింస మాత్రమే కాదు. నా జీవన విధానంలో మార్పు కోరుకున్నా.. ఆచరిస్తున్నా. ప్రతివారం చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పక్షుల సంరక్షణకు కార్యక్రమాలకు సమయం కేటాయిస్తా. – వినయ్, ఆర్కిటెక్ట్ఆరేళ్ల నుంచి ఆచరిస్తున్నాను నాకు జీవహింస చేయడం నచ్చదు. అందుకే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులకు దూరంగా ఉంటాను. కాల్షియం కోసం పాలు తాగుతున్నాం.. నువ్వులు వినియోగిస్తే మన శరీరానికి అవసరమైన కాల్షియం వస్తుంది. పాలు కావాలంటే సోయాబ్సీన్తో తయారు చేసుకోవచ్చు. శాఖాహారంలోనూ పోషకాలన్నీ లభిస్తాయి. మాంసాహారమే కాదు లెదర్ బెల్టు, పర్సు, బూట్లు, జంతువుల నుంచి వచ్చే ఏ వస్తువులను వినియోగించను. సిల్క్ తయారు చేయడానికి లక్షల పురుగులను చంపాల్సి వస్తుంది. సిల్క్ వస్తువులకు దూరం. చికెన్ వంటి వంటకాలతో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఆరేళ్ల నుంచి పూర్తిగా మారిపోయాను. – అఖిల్, హైదరాబాద్ -
80/20 నా డైట్ సీక్రెట్
నటి మసాబా గుప్తా జిహ్వచాపల్యం, తిండి పుష్టి గురించి అందరికీ తెలిసిందే! ఇంట్లో తయారు చేసే రకరకాల చిరుతిళ్లు అంటే ఆమెకు మహా మక్కువ. నోరూరించే రకరకాల తినుబండారాలకు నో చెప్పలేని బలహీనత ఆమెది. అయితే వాసికీ, రాశికీ మధ్య సమతూకాన్ని పాటించడం ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. డైట్ విషయంలో తాను 80/20 సూత్రాన్ని పాటిస్తానని చెప్పిన మసాబా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో కరోసెల్ అనే క్యాప్షన్ కింద తన రోజువారీ డైట్ గురించిన వివరాలు ఇలా పంచుకుంది. ‘‘80/20 రూల్ అనేది నా పాలిట బంగారం లాంటిది. ఇక్కడ 80 అనేది ప్రోటీన్లతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని సూచిస్తే, 20 నాకు నచ్చిన ఆహారాన్ని సూచిస్తుంది. (పేస్ట్రీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా బర్గర్లను సూచిస్తూ ఇమోజీలు పెట్టింది) వారంలో ఆరు రోజులూ నేను నా శరీరానికి ఏది అవసరమో అది ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తాను. ఒకరోజు మాత్రం నా నాలుక ఏది కోరిందో అది తీసుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది. తాను రోజువారీ తీసుకునే డైట్ గురించిన వివరాలు ఇలా పంచుకుంది మసాబా. ‘‘ఉదయం ఆరున్నరకు టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ సోంపు గింజలను బాగా నమిలి తిని గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగుతాను. నా దృష్టిలో ఇది అమృత జలం. తొమ్మిది గంటలకు పెద్ద కప్పు నిండా ముసేలీ, బెర్రీలు. దాంతోపాటు వీలయితే అత్తిపళ్లు (రాస్బెర్రీ), నేరేడు పళ్లు. వర్క్ అవుట్స్ చేసిన తర్వాత పెద్ద గ్లాసు నిండా ప్రోటీన్ షేక్ తీసుకుంటాను. నానబెట్టిన ఐదు బాదం, ఐదు వాల్నట్స్ తీసుకుంటా. మధ్య మధ్యలో చల్లటి మజ్జిగ పిప్ చేస్తుంటా. ఒంటిగంటకు ఆలూ లేదా బెండకాయ ఫ్రై, చికెన్ కర్రీ, రైస్, స్ప్రౌట్స్తో చేసిన సలాడ్‌తో సంతృప్తికరమైన లంచ్ చేస్తాను. 5 గంటలకు చికెన్ లేదా చీజ్, కూరగాయలతో టాపింగ్ చేసిన హోల్ వీట్ లేదా మల్టిగ్రెయిన్స్తో చేసిన పిజ్జా.. రెండు ఉడకబెట్టిన గుడ్లు, కొద్దిగా చికెన్ గ్రేవీతో ఏడింటికల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాను. మొత్తం మీద నా డైట్లో కార్బ్స్ కంటే ్రపోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను’’ అంటూ ఆమె చేసిన పోస్టింగ్‌కు చాలా లైకులు వచ్చాయి. -
హార్ట్ బైపాస్ సర్జరీ: రికవరీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఇదే..!
కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) శస్త్రచికిత్స నుంచి కోలుకోవడం అంటే హృదయ ఆరోగ్యం వైపు వేస్తున్న తొలి అడుగు. ఇక్కడ అంత పెద్ద సర్జరీ తర్వాత త్వరితగతిన కోలుకోవడంలో తీసుకునే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. సరైన పోషకాహారంపై దృష్టిసారిస్తే త్వరితగతిన కోలుకోవడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఇక్కడ సర్జరీ తర్వాత లిక్విడ్ డైట్‌తో ప్రారంభించి..కోలుకున్న వెంటనే రెగ్యులర్ డైట్‌ని ఫాలో అవ్వడానికి ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే..?మళ్లీ ఘన పదార్థాలు తీసుకునేటప్పుడూ ఆకలి లేకపోవడం, వికారం లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చంటే..గుండెకు ఉపకరించే ఆరోగ్యకరమైన ఆహారాలు..హృదయాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా చేసే అత్యుత్తమమైన ఆహారాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండేవి తీసుకోవాలి. ఇవి గుండెల్లో మంటను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు..మీలో కొలస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.అందుకోసం వేయించిన ఆహారాలు, మాంసాహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవోకాడోస్, నట్స్, గింజలు,సాల్మన్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలను తినండి. అలాగే వేరుశెనగ, బియ్యం ఊక, పొద్దుతిరుగుడు లేదా ఆవాల నూనెలను వంటనూనెలుగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు తగ్గించండి..రక్తపోటుని నిర్వహించేందుకు ఉప్పు తక్కువుగా తీసుకోవడం అత్యంత ముఖ్యం. అధిక సోడియం ప్రాసెస్ చేసిన ఆహారాలు, క్యాన్డ్ సూప్‌లు, స్నాక్స్‌కి బదులుగా ఉప్పులేని భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.ప్రోటీన్ ప్యాకేజీలు రికవరీకి లీన్ ప్రోటీన్లు కీలకం, ఎందుకంటే అవి కణజాల మరమ్మత్తు, కండరాల బలానికి సహాయపడతాయి. పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్ళు, టోఫు, తక్కువ కొవ్వు వంటి లీన్ సోర్స్‌లను ఎంచుకోండి. కండరాల రిపేర్‌కు తోడ్పడేందుకు, అలాగే నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ప్రతి భోజనంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి..సర్జరీ తర్వాత కోలుకోవాలంటే హైడ్రేటెడ్ ఉండటం అత్యంత కీలకం. శరీరం బాగా పనిచేసేలా రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. చక్కెర పానీయాలు, కెఫిన్‌లను నివారించండి. డైటీషియన్ సలహాలు తీసుకోవడం..సర్జరీ తర్వాత ఎలాంటి ఆహారం మంచిదనేది మన వైద్య చరిత్ర తెలిసిన డైటీషియన్‌ని అడగడం మంచిది. అది మనకు ఎలాంటి సమస్యలు రాకుండా నివారించడమే గాకుండా ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు ఉపకరిస్తుంది. బాడీ పరిస్థితిని అర్థం చేసుకోండి..దీర్ఘకాలిక గుండె ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమైనదో అలాగే మనం తీసుకునే ఫుడ్‌కి శరీరం ఎలా రియాక్షన్ ఇస్తుందనేది గమనించడం అంతే ముఖ్యం.అలాగే ఎప్పటికప్పుడూఆరోగ్య సంరక్షణ నిపుణులు సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవడం కూడా విస్మరించొద్దని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్) -
బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!
బాలీవుడ్ నటి, దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇద్దరు పిల్లలు తల్లి అయినా కూడా అందం, ఫిట్నెస్ పరంగా యువహీరోయిన్లకు తీసిపోని వన్నె తరగని అందం అనుష్కాది. ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ రహస్యం, ఫాలో అయ్యే డైట్ గురించి షేర్ చేసుకుంది. తాను ప్రతిరోజు ఒకే రకమైన ఆహారాన్ని తింటానని చెప్పుకొచ్చింది. ఇలా తినడాన్ని మోనోట్రోపిక్ డైట్ అనిపిలుస్తారని చెప్పింది. ప్రతిరోజూ ఒకేరకమైన లేదా ఒకలాంటి ఆహారాన్నే ఈ డైట్లో తీసుకుంటారు. ఇలాంటి డైట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ డైట్లో ఆహారం సరళంగా, సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ డైట్ ఎక్కువగా తినాలనే ఆసక్తిని తగ్గిస్తుంది. అలసటను కూడా పోగొడుతుంది. అనుష్క కూడా అల్పాహారంలో ఇడ్లీ సాంబార్ తినాలనుకుంటే ఆరునెలలపాటు అదే బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకుంటుందట. ఇక్కడ అనుష్క తీసుకనే సాంబార్, ఇడ్లీ పులియబెట్టినది కావడం వల్ల ఇందులోని గట్ స్కిన్‌ని మెరిసేల చేసుంది. దీనిలో ఉండే విటన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల శోషణ మేని ఛాయు ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. ఈ మోనోట్రోఫిక్ డైట్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..ఈజీగా ఫుడ్ ప్లాన్భోజన ప్రణాళికను గణనీయంగా సులభతం చేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో ఒకరకమైన ఆహారం లేదా ఒకే విధమైన ఆహార తినవల్సి ఉంటుంది. దీనివల్ల ఆహారం ఎక్కువగా తీసుకునే ఆసక్తి తగ్గుతుంది. ఒక విధమైన అలసటను నివారస్తిఉంది. ఒక నియమబద్ధమైన ఆహార నియమావళికి కట్టుబడి ఉండటాన్ని సులభతరం చేస్తంది.జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందిఒకేసారి ఒక రకమైన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. శరీరం ఏకకాలంలో బహుళ ఆహార రకాలను నిర్వహించడంలో సంక్లిష్టత లేకుండా ఒకే పోషకాన్ని విచ్ఛిన్నం చేయడం, గ్రహించడంపై దృష్టి పెడుతుంది. ఇది పోషకాల శోషణను మెరుగుపరచడంలో, జీర్ణ అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.కేలరీలు తీసుకోవడం తగ్గిస్తొంది..భోజనాన్ని ఒకే ఆహారం లేదా ఒక విధమైన ఆహార సమూహానికి పరిమితం చేసినప్పుడు..ఆటోమెటగ్గా కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. అలాగే వివిధ రకాల ఆహార పదార్థాల కొరత ఉన్నప్పుడు అతిగా తినడాన్ని అరికట్టడానికి సహాయపడుతుంది. ఎందుకంటే..? ఒకేరకమైన ఆహారం అతిగా తినాలనే ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ఇది చివరికి బరువు నిర్వహణలో సహాయపడుతుంది.మైండ్‌ఫుల్ ఈటింగ్‌లో సహాయపడుతుందిఒక మోనోట్రోపిక్ ఆహారం సంపూర్ణతను ప్రోత్సహిస్తుంది. అనేక రుచులు వైప దృష్టిపోనివ్వకుండా, నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. పైగా అతిగా తినడాన్ని నిరోధస్తుంది.నిర్విషీకరణలో సహాయపడుతుందిఒక రకమైన ఆహారంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు శరీరం నిర్విషీకరణ ప్రక్రియలలో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి టాక్సిన్లను తొలగించడంలో, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.ఆహారం పట్ల అవగాహనను పెంచుతుందిమోనోట్రోపిక్ డైట్ వల్ల వివిధ ఆహారాలు, శక్తి స్థాయిలు, మానసిక స్థితి, మొత్తం శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై అవగాహనను పెంచుతుంది. ఆహారాన్ని వేరుచేయడం ద్వారా, రీరంపై ప్రతి ఒక్కటి ప్రత్యక్ష ప్రభావాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఆహారంలో సంక్లిష్టతను తొలగిస్తుందిమోనోట్రోపిక్ డైట్ సరళత ఆహార సున్నితత్వం లేదా అలెర్జీలను గుర్తించడం సులభం చేస్తుంది. ఆహార సమూహాలను వేరుచేసినప్పుడు, ఏ ఆహారాలు ప్రతికూల ప్రతిచర్యలకు కారణమవుతాయో సులభంగా గుర్తించవచ్చు. అలాగే శరీరం ఆహారంలో సర్దుబాట్లు చేసేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.(చదవండి: 90 ఏళ్లు... రెండు మైళ్లు..: సొసైటీకీమె దివిటీ) -
క్రికెటర్ కోహ్లీ ఫాలో అయ్యే డైట్ ఇదే..!
దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ చూడటానికి బాలీవుడ్ హీరోల మాదిరిగా స్లైలిష్‌గా ఉంటాడు. బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వెళ్లితే సిక్సర్లతో చెలరేగిపోతాడు. చూసేందుకు గాంభీర్యంగా, కూల్‌గా కనిపిస్తున్నా..క్రికెట్‌కి సంబంధించి ఎలాంటి ఒత్తిడిని భావోద్వేగ రూపంలో వ్యక్తం చేయకుండా జాగ్రత్త పడతాడు. ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కి లుకింగ్ స్టైల్‌ని మార్చేస్తుంటాడు. అలాంటి ఈ యంగ్ క్రికెటర్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఎలాంటి డైట్ ఫాలో అవుతాడు వంటి వాటి గురించి తెలసుకోవాలని ఆరాట పడుతుంటారు అభిమానులు. ఇంతకీ అతడి ఫిట్నెస్, ఆహార నియమాలు ఎలా ఉంటాయంటే.. 35 ఏళ్ల క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రమశిక్షణతో కూడిన డైట్‌ని, ఫిట్‌నెస్‌ని అనుసరిస్తాడు. అంతేగాదు ఐపీఎల్ వంటి సీజన్లలో కేవలం బేక్ చేసిన చికెన్, ఆవిరి మీద ఉడికించిన కూరగాయ ముక్కలతో ఫిట్నెస్ కాపాడుకున్నాడు. ఆహారం వద్ద చాలా స్ట్రిక్ట్ డైట్‌ని ఫాలో అవుతాడని అతడని జిమ్ కోచ్ తెలిపారు. కోహ్లీ ఆహారంలో రుచి కన్నా పోషకాలకే ప్రాధాన్యత ఇస్తాడు. అంతేగాదు అతడు తన శరీరానికి అవసరమయ్యే పోషకాల అవసరాన్ని అనుసరించే తీసుకుంటాడు.ప్రయాణ సమయంలో ఉండేవి ఇవే..విమాన ప్రయాణలో కోహ్లీ వెంట బ్యాగులో కాఫీసెట్, ప్రోటీన్ బార్, కొన్ని నెట్స్, తదితరాలు ఉంటాయి. వాటిని సమయాన్ని కేటాయించుకుని మరీ తింటాడు. చెప్పాలంటే..అరగంటకోసారి తింటాడట. కోహ్లీ డైట్ సీక్రెట్..కోహ్లీ అనుసరించే డైట్, ఫిట్స్ సూత్రాలు మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని హెల్తీగా, ఫిట్‌గా ఉండొచ్చు. అవేంటంటే..స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు, బలం, ఫ్లెక్సిబిలిటీని పెంచే హై ఇంటెన్సీటీ వ్యాయామాలువిరాట్ కోహ్లీ చేస్తాడు. సంవత్సరం మొత్తం క్రమం తప్పకుండా ట్రైనింగ్ షెడ్యూల్‌ను కోహ్లీ పాటిస్తాడు. స్కిప్ చేయకుండా స్ట్రిట్‌గా డైట్ ఫాలో అవ్వడమే అతడి ఫిట్నస్ సీక్రెట్.క్రమశిక్షణే అతని ఫిట్‌నెస్‌కు మూల కారణం. విరామం సమయంలో కూడా వర్కవుట్ చేయడం వదిలిపెట్టడు.అతని వర్కౌట్ ట్రైనింగ్, క్రికెట్ మ్యాచ్‌లకు తగ్గట్లుగా ప్లాన్ ఉంటుంది. కావాల్సిన శక్తి అందేలా, దానికి తగ్గట్లుగా ఆహార నియమావళి పకడ్బంది వ్యూహంతో వ్యక్తిగత నిపుణలు సెట్ చేస్తారు.ఎక్కువ ఆహారం తీసుకోవడం కాకుండా పోషకాలపై దృష్టిపెడతాడు కోహ్లీ. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ ఉన్న ఆహారాలను తీసుకుంటాడు.ఎప్పుడూ శరీరం హైడ్రెటెడ్‌గా ఉండేలా చూసుకుంటాడు. అలాగే తన ఆటకు కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాడు.(చదవండి: గ్రీన్ టమాటాల గురించి విన్నారా? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..!) -
వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలివే..!
వర్షాకాలం వ్యాధుల కాలంగా చెప్పొచ్చు. అదీగాక ఈ కాలంలో వాతారవరణం అంతా చల్లబడిపోవడంతో చాలామందికి జీర్ణ సమస్యలు ఎదురవ్వుతాయి. దీనికి తోడు వాతావరణంలో పెరిగిన తేమ కారణంగా రోగనిరోధక వ్యవస్థ అనారోగ్య బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో ఇలాంటి కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు. జీర్ణక్రియకు మద్దతు ఇచ్చేలా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ కూరగాయలని మీ డైట్లో జోడించాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అవేంటంటే..ఈ మాన్సూన్ డైట్లో చేర్చుకోగల కూరగాయల జాబితాన ఏంటంటే..వర్షాకాలంలో ప్రయోజనకరంగా ఉండే కూరగాయలు ఏవంటే..కాకరకాయదీనిలోని చేదు లక్షణం రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.ఆనపకాయకడుపులో తేలికగా ఉంటుంది . సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.పొట్లకాయఇది మంచి డైటరీ ఫైబర్. అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. పొట్లకాయలోని పీచు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది.బచ్చలికూరబచ్చలికూరలో అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తాయి. అంతేగాక తేమతో కూడిన వాతావరణం వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.మెంతి ఆకులుమెంతి ఆకులు (మేతి) యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. మెంతి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడటాంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన మంచి ఆకుకూర కూడా. మునగకాయలుమునగకాయలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శ్వాసకోశ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గుల బారినపడకుండా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.క్యారెట్లుక్యారెట్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి దృష్టిని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు అంటువ్యాధుల నుంచి రక్షించడానికి, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి. బీట్రూట్బీట్రూట్లోని అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరుకు తోడ్పడతాయి. వర్షాకాలంలో శక్తి స్థాయిలను నిర్వహించడానికి మెరుగైన రక్త ప్రసరణకు ప్రయోజనకరంగా ఉంటుంది.గుమ్మడికాయగుమ్మడికాయలో విటమిన్ ఏ, సీ, ఈ తోపాటు ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడికాయలోని విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అయితే దాని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడటమే గాక మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలు చెక్‌పెట్టడంలో కీలకంగా ఉంటుంది.బెండకాయ దీనిలో విటమిన్లు ఏ, సీ, ఫోలేట్, ఫైబర్ల మూలం. బెండకాయలో అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రబలంగా ఉండే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.(చదవండి: బరువు తగ్గేందుకు కీటో డైట్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
బరువు తగ్గేందుకు కీటో డైట్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
కీటోజెనిక్ లేదా కీటో డైట్‌ని మొట్టమొదటగా 1921లో మూర్చ వ్యాధికి ఉపయోగించేవారు. ఈ డైట్లో అధిక కొవ్వు, తగినంత ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం ఉంటాయి. ఇటీవల అంతా బరవు తగ్గడం కోసి రకరకాల డైట్లు ఫాలో అవుతున్నారు. అందులో ఇది కూడా ఒకటి. ఈ డైట్‌తో బరువు తగ్గడం జరుగుతుంది కానీ పరిశోధనలో ఈ డైట్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గట్ బ్యాక్టీరియాను తగ్గిస్తాయని తేలింది. ఇది అంత ఆరోగ్యకరమైనది కాదని వెల్లడయ్యిందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండటానికి సమహయపడే డైట్‌ని అనుసరించడం ముఖ్యమని చెబుతున్నారు. అసలు ఈ డైట్ ఎలా మంచిది కాదో సవివరంగా చూద్దాం. కీటో డైట్ ఆరోగ్యానికి సురక్షితమైనదేనా కాదా? అని సుమారు 53 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. వారికి తక్కువ చక్కెరతో కూడిన ఆహారం, తక్కువ కార్బోహైడ్రేట్లు, ఇవ్వగా వారి శరీరం కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే గ్లూకోజ్‌కి బదులుగా కాలేయం నిల్వ చేసిన కొవ్వులను ఇంధనంగా ఉపయోగించుకోవడాన్ని గుర్తించారు. దీన్ని కీటోన్ బాడీల ద్వారా కొవ్వులను కాల్చడం అని అంటారు. ఈ డైట్ ప్రకారం వారంతా 20 నుంచి 50 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలు తీసుకోవాలి. ఇలా కీటోసిస్ స్థితికి చేరడానికి కొన్ని రోజుల పడుతుంది. ఇందుకోసం అదిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది హానికరమేనని చెబుతున్నారు. ఇక్కడ కీటోడైట్‌లో తీసుకునే ఆహారాల్లో కొబ్బరి నూనె, వెన్న, చికెన్, గుడ్లు, అని కూరగాయలు, కాయధాన్యాలు, పిండి, వోట్స్, చిక్కుళ్ళు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, గింజలు, కాటేజ్ చీజ్, మేక, ఫెటా చీజ్ తదితరాలు ఉంటాయి. అలాగే ఈ డైట్ కోసం వోట్స్, కేకులు శుద్ధి చేసిన పిండితో చేసిన డెజర్ట్‌లు, అధిక కార్బ్ ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ కీటో డైట్‌ని అనుసరిచిన 12 వారాల తర్వాత సగటున శరీరంలో 2.9 కిలోల మేర కొవ్వు తగ్గుతుందన పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ చక్కెర నిరోధిత ఆహారం కారణంగా 2.1 కిలోల బరువు కోల్పోయేలా చేస్తుంది. అందువల్లే చాలామంది ఈ డైట్‌ని అనుసరించేందుకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ డైట్ వల్ల కొన్ని ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడించారు పరిశోధకులు. ఎదురయ్యే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు..ఈ కీటో డైట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇది ధమనులలో ఫలకం ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ డైట్‌ని అనుసరించే వారి రక్తంలో అననూకూల స్థాయిలో కొవ్వులు పెరిగినట్లు గుర్తించామన్నారు. ఇలా ఏళ్ల తరబడి ఈ డైట్‌ని ఫాలో అయితే దీర్ఘకాలికా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారీతీసే ప్రమాదం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఈ తక్కువ చక్కెర ఆహారం చెడు కొలస్ట్రాల్‌ని గణనీయంగా తగ్గించింది కూడా అని చెప్పారు.కీటో డైట్ గట్ మైక్రోబయోమ్ కూర్పును మార్చింది. ముఖ్యంగా బిఫిడోబాక్టీరియాను తగ్గిస్తుంది. ప్రోబయోటిక్స్‌లో తరచుగా కనిపించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఇది. ఇది 'బీ' విటమిన్లను ఉత్పత్తి చేస్తుంది. వ్యాధికారక హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇలా గట్ బ్యాక్టీరియా తగ్గిపోతే ప్రకోప ప్రేగు వ్యాధి వంటి జీర్ణ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధకత తగ్గి దీర్ఘకాలికి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు పరిశోధకులు.కీటో డైట్ గ్లూకోస్ టాలరెన్స్‌ని తగ్గించింది. అంటే..శరీరం కార్బోహైడ్రేట్లను నిర్వహించడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని అర్థం. ఎప్పుడైన అధిక కార్బోహైడ్రేట్ తీసుకుంటే మాత్రం దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణలు. ఇక్కడ బరువు తగ్గాలనుకుంటే తక్కువ చక్కెర ఉన్న ఆహారాలు మంచివే కానీ ఫైబర్‌తో కూడిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు నిపుణులు.(చదవండి: ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!) -
ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా..!
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో క్రీడాకారులు మొత్తం పోటీ అంతా పూర్తి అయ్యేవరకు హెల్తీగా ఉండటానికి ఏం తింటారో తెలుసా. దీని గురించి ఎప్పుడైన ఆలోచించారా..?. తెలిస్తే మాత్రం షాకవ్వుతారు. మనం హెల్తీగా, ఫిట్‌గా ఉండేందుకే ఏ ఫుడ్స్‌కి అయితే దూరంగా ఉంటామో వాటినే వీళ్లు తిని పోటీ అంతటా హెల్తీగా ఉంటారట. నిజానికి పోటీ సమయంలో ఆహారాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ క్రీడాకారులంతా ఫుడ్‌ని తగ్గించడం లేదా మితంగా తీసుకోవండంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. వాళ్లంతా ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఎలా పోటీలో చివరి వరకు ఉత్సాహంగా ఉండేందుకు ఏం చేస్తారు తదితరాల గురించి సవివరంగా చూద్దాం.ఒలింపిక్ పతకాలను గెలుచుకునే క్రీడాకారులంతా పిండి పదార్థాలతో ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. అథ్లెట్లకు అత్యుత్తమ శక్తి కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అందుకే చాలా వరకు వాళ్ల ఫుడ్‌లో చాలా వరకు పిండి పదార్థాలే అధికంగా ఉంటాయి. వాళ్లు పోటీలోకి దిగేటప్పడు అవన్నీ సమర్థవంతమూన శక్తిగా మార్చబడి కండరాలకు శక్తి నిల్వ చేస్తాయి. వీటిని కండరాల గ్లైకోజెన్ అని పిలుస్తారు. క్రీడాకారులకు, సరళమైన (లేదా శుద్ధి చేయబడిన) కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి. ప్రాక్టీస్ లేదా పోటీకి ముందు పండ్లు, కూరగాయలు మరియు చిక్కుళ్ళు (బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు) వంటి పోషకమైన పిండి పదార్థాలు తర్వాత కోలుకోవడానికి గొప్పవి. చాలా మంది అథ్లెట్లకి ఈ అధిక-ఫైబర్, అధిక-పోషకాహార పిండి పదార్థాలే వారి ప్రధాన శక్తి వనరుగా ఉంటుంది. ఇవి కండరాల నిర్మాణం మరమ్మత్తు కోసం ఉపయోగపడతాయి. అలాగే రికవరీ సమయంలో బలం, శక్తిని పెంపొందించేందుకు ప్రోటీన్ కూడా ముఖ్యమైనది.ముఖ్యంగా అథ్లెట్లు తగినంత నిద్రను పొందినప్పుడే, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోగలరని చెబుతున్నారు. దీంతోపాటు రోజువారీ వ్యాయామం కూడా ముఖ్యమే అని వెల్లడించారు. శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఉత్తమమైన మార్గం ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆహారాన్ని ఎంచుకోవడం. ప్రాసెస్ చేయని ఆహారాలు, అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండటం మేలని అంటున్నారు.అథ్లెట్లు తమ పనితీరుని మెరుగ్గా ఉంచేందుకు సరైన సంఖ్యలో కేలరీలను తీసుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది కూడా. దాదాపు క్రీడాకారులందరికీ ఇలానే ఒకేలా ఉంటుంది. ఇకండ రోజువారి అవసరాలు, పనితీరుకి తగ్గట్టు ఆహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెస్ట్!: పోషకాహార శాస్త్రవేత్తలు) -
వర్షాకాలంలో పచ్చి బాదంపప్పులే ఎందుకు తినాలంటే..?
సాధారణంగా ఎండు బాదంపప్పులను నానబెట్టుకుని తింటాం. వీటిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా. ఐతే వర్షాకాలంలో మాత్రం పచ్చిబాదంపప్పులు తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ఈ, విటమిన్ సీ, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని అందువల్లే ఇవే తీసుకోవడం మంచిదని అంటున్నారు. వర్షాకాలంలో ఏవిధంగా ఇవి మంచివో సవివరంగా చూద్దామా..!పెంకు లోపల ఉన్న గింజ పూర్తిగా పక్వానికి రాకముందే ఆకుపచ్చ బాదంపప్పును తినేందుకు వినియోగిస్తారు. ఇది పోషకమైనది కూడా.ఎలాంటి పోషకాలు ఉంటాయంటే..విటమిన్ 'ఈ': గ్రీన్ బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది, దీనిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ సీ: రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సీ కూడా వీటిలో ఉంటుంది.ఆరోగ్యకరమైన కొవ్వులు: పరిపక్వ బాదం వలె, ఆకుపచ్చ బాదం మోనోశాచురేటెడ్ కొవ్వుల మూలం. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఫైబర్: ఇవి డైటరీ ఫైబర్‌ను అందిస్తాయి. అందువల్ల ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి, పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.మెగ్నీషియం, పొటాషియంల గని: ఆరోగ్యకరమైన రక్తపోటు, కండరాల పనితీరును నిర్వహించడానికి అవసరమైన ఖనిజాలు.వర్షాకాలంలో ఇవే ఎందుకు తీసుకోవాలంటే..వర్షాకాలంలో అధిక తేమ, హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతల కారణంగా అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆకుపచ్చ బాదంలో విటమిన్లు ఈ, సీలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.వర్షాకాలం వాతావరణం కొన్నిసార్లు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఆకుపచ్చ బాదంలోని ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది , ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక అధ్యయనం ప్రకారం, డైటరీ ఫైబర్ గట్ మైక్రోబయోటాను కూడా మెరుగుపరుస్తుంది. ఇది మొత్తం జీర్ణ వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.వర్షాకాలంలో వచ్చేద హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది. దీనిలోని మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఆకుపచ్చ బాదం అనేది హైడ్రేషన్, ఎనర్జీ లెవల్స్ నిర్వహించడానికి సహాయపడే పోషకాల మూలం. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, కండరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి.(చదవండి: మినీ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!) -
కత్రినా ఫిట్నెస్ సీక్రెట్ తెలిసిపోయింది ఆమెది షట్పావళి డైట్ ప్లాన్
-
Deepika Padukone: డైట్ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు
‘‘డైట్’ అనే పదం చుట్టూ చాలా అ΄ోహలు ఉన్నాయని నాకనిపిస్తోంది. డైట్ అంటే కడుపు మాడ్చుకోవడం, తక్కువ తినడం, కష్టంగా నచ్చనవి తినడం అని మనందరం అనుకుంటాం. కానీ డైట్ అంటే మనం తీసుకునే ఆహారం, తీసుకునే ΄ానీయాలు. నిజానికి డైట్ అనే పదం గ్రీకు పదం ‘డైటా’ నుంచి వచ్చింది. డైటా అంటే జీవన విధానం అని అర్థం’’ అన్నారు దీపికా పదుకోన్. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా ఫలానా డైట్‌ని ఫాలో అవుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రచారంలో ఉన్నవి నమ్మవద్దంటూ దీపికా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘నేను బాగా తింటాను. కాబట్టి సరిగ్గా తిననని వస్తున్న వార్తలను నమ్మొద్దు. డైట్ అంటే క్రమం తప్పకుండా తినడం, మన శరీరాన్ని అర్థం చేసుకోవడం.. ఫాడ్ డైట్ (త్వరగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక)ని ఫాలో కాను. శుభ్రంగా తినడానికే ఇష్టపడతాను. నా డైట్లో ఇవి ఉన్నాయని ఆశ్చర్య΄ోతున్నారా?’’ అంటూ కేక్స్, సమోసా వంటి వాటి ఫొటోలను కూడా షేర్ చేశారు దీపికా పదుకోన్. ఇక సెప్టెంబరులో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆ మధ్య దీపికా, ఆమె భర్త–హీరో రణ్వీర్ సింగ్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
డైట్ అంటే ఏంటి? నిండు గర్భిణి దీపికా పదుకొణే డైట్ సీక్రెట్స్
తన తొలి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తన డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను బాగా తింటానని, ఫ్యాడ్ డైట్‌పై తనకస్సలు నమ్మకం లేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ డైట్లో భాగమైన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఫ్యాడ్ డైట్‌ని ఫాలో అయ్యే కంటే బాగా తినడానికేతాను ఇష్టపడతానని వెల్లడించింది. (ఫాడ్ డైట్: తొందరగా,సులువుగా, అనూహ్యంగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక).నిండు గర్భిణి దీపికా పదుకొణె మాతృత్వ అనుభవం కోసం రోజులు లెక్కిస్తోంది. తన ప్రెగ్నెన్సీ జర్నీ, అనుభవాలు, ఫిట్నెస్ సీక్రెట్స్‌పై తన ఫ్యాన్స్‌తో అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన డైట్‌కు సంబంధించి పిక్స్ షేర్ చేసింది. తన బాలెన్స్డ్ డైట్ వెనుక రహస్యాన్ని దీపిక బుధవారం వెల్లడించింది. రుచికరమైన ఆహార పదార్థాలతో కూడిన మూడు చిత్రాలను షేర్ చేసింది. దీంతో పాటు ఒక సుదీర్ఘ నోట్ కూడా పెట్టింది. ఇందులో డైట్ అంటే ఏంటో ఇలా వివరించింది."నా ఫీడ్‌లో దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను బాగా తింటాను! నాకు తెలిసిన ఎవరినైనా అడగండి. బాగా తింటా. కాబట్టి మీరు విన్న లేదా చదివిన దాన్ని నమ్మవద్దు. 'డైట్' అనే పదం చుట్టూ చాలా అపార్థాలున్నట్లు అనిపిస్తుంది, 'డైట్' అంటే ఆకలితో అలమటించడం, తక్కువ తినడం లేదా మనకు నచ్చని వస్తువులన్నింటినీ తినడం అని అనుకుంటాం. బాలెన్స్, క్రమం తప్పకుండా తింటూ, మన బాడీ మాట వినడమే ఇదే అసలైన ట్రిక్.’’ View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) డైట్ నిజమైన అర్థం ఒక వ్యక్తి పూర్తిగా తినే ఆహారం, లేదా పానీయం అని దీపిక పేర్కొంది.. 'డైట్' అనే పదం గ్రీకు పదం 'డైటా' నుండి వచ్చింది. అంటే జీవిన విధానం అని అర్థంని, తానెపుడు విపరీతమైన ఆహారపు అలవాట్లకు బదులు సమతుల్యమైన ఆహారాన్ని పాటిస్తానని వెల్లడించింది.కాగా రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో దీపికా తన బేబీ బంప్‌తో అందంగా కనిపించింది. సందర్భానికి తగ్గట్టుగా చక్కటి అనార్కలీ, దుప్పట్టాతో స్టయిలిష్‌గా కనిపించింది. సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మ నివ్వబోతున్నా మని దీపికా, ఆమె భర్త నటుడు రణవీర్ సింగ్ గతంలో ప్రకటించారు. -
అత్యుత్తమమైన డైట్ ఇదే! నిర్థారించిన వైద్యులు!
ఇంతవరకు ఎన్నో రకాల డైట్లు చూశాం. ఎవరికి వారు శారీరక సమస్యలు దృష్ట్యా తమకు నచ్చిన డైట్ ఫాలో అవ్వుతారు. చెప్పాలంటే కీటో డైట్, జోన్ డైట్, పాలియా డైట్, వంటి ఎన్నో రకాల డైట్ల ఫాలో అవుతున్నారు. అయితే వైద్యులు మాత్రం ఈ డైటే అత్యుత్తమైనది అంటూ సిఫార్సు చేస్తున్నారు. పైగా ఇది చిత్త వైకల్యం, కేన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలను దరి చేరనివ్వదని చెబుతున్నారు. ఇంతకీ ఆ డైట్ ఏంటి? దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషించేది ఆహారమే. మనం తీసుకునే సమతుల్య ఆహారంతోనే అనారోగ్య సమస్య ప్రమాదాన్ని నివారించగలుగుతాం. మనం తినే ఆహారంలో చక్కెర శాతం, సోడియం కంటెంట్ ఎంత మేర తక్కువగా ఉంటే అంత మంచిది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారినపడకూడదంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించాలని చెబుతున్నారు. అంతేగాదు తమ పరిశోధనలో అన్నిటికంటే మెడిటేరియన్ డైట్ అత్యుత్తమమైనదని తేలిందని చెబుతున్నారు. ఇది గుండె జబ్బులు, కేన్సర్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలదని వెల్లడించారు. చాలా వరకు మరణాలకు కారణం.. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడమేనని చెబుతున్నారు. మెడిటేరియన్ డైట్ లేదా మధ్యధరా ఆహారంలో పుష్కలంగా గింజలు, చేపలు అదనపు వెర్షన్ ఆలివ్ ఆయిల్లు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ అధ్యయనం న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. యూకేలో నంబర్ 1 కిల్లర్‌గా ఉన్న డిమెన్షియా(చిత్త వైకల్యం) నివారించగలదని చెబుతున్నారు. దీన్ని చాలామంది పెద్ద సమస్యగా భావించారు. కానీ నిశ్శబ్ద కిల్లర్ అని చెప్పొచ్చు. ఇక మరో మహమ్మారి కేన్సర్ చాలావరకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా వస్తుందని, దీన్ని ఈ డైట్‌తో సమర్ధవంతంగా నియంత్రించగలమని చెప్పారు. అంతేగాదు 30% గుండె ప్రమాదాలను కూడా నివారించగలదని చెబుతున్నారు. వ్యాధులను నివారించడంలో అత్యంత శక్తివంతమైన వైద్య సాధానంగా ఆహారమే కీలకపాత్ర పోషిస్తుందని నొక్కిచెబుతున్నారు. మెడిటేరియన్ డైట్/మధ్యధరా ఆహారం అంటే..ఈ పోషక సమతుల్య ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారాలు, పండ్లు, కూరగాయలు ఉంటాయి. ధాన్యాలు, బీన్స్, గింజలు, సీఫుడ్, వర్జిన్ నూనెలను ఉపయోగిస్తారు. గ్రీస్, ఇటలీ, లెబనాన్, క్రొయేషియా, టర్కీ, మొనాకోతో సహా మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న 21 దేశాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇది ఈ దేశాల సంప్రదాయ ఆహారం.మెడిటేరియన్ డైట్ ప్రయోజనాలు..గుండె ఆరోగ్యం: ఈ ఆహారం ఆలివ్ ఆయిల్,నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టి పెడుతుంది, ఇది చెడు కొలెస్ట్రాల్,రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్,ఇతర హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు నిర్వహణ: ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా,సంతృప్తిగా ఉంచడంలో సహాయపడతాయి. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాధుల ప్రమాదం తగ్గింది: టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్,కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మధ్యధరా ఆహారం సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.కాగ్నిటివ్ హెల్త్: మెడిటరేనియన్ డైట్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే గాక మెదడు పనితీరులో క్షీణతను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబతున్నాయి. (చదవండి: -
నటి విద్యాబాలన్ ఫాలో అయ్యే డైట్ ఇదే..!
బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. తాను మాత్రమే చేయగలిగిన పాత్రలను ఎంచుకొని మరీ నటించే గొప్ప నటి విద్యాబాలన్. తనుంటే హీరోతో పనిలేదు అన్నట్లుగా సినిమా ఆశాంతా ఆమె చుట్టూనే తిరిగేలా ఆమె నటన ఉంటుంది. బ్యూటీ పరంగా ఇప్పటికీ యువ హీరోయిన్లను తలదన్నేలా గ్లామరస్‌గా ఉంటుంది. వయసు పెరుగుతుందా అన్న సందేహం వచ్చేలా ఆమె ఫిట్నెస్ ఉంటుంది. ఇంతలా గ్లామర్‌ని మెయింటెయిన్ చేసేందుకు విద్యా బాలన్ ఎలాంటి డైట్ ఫాలో అవుతుందంటే..బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఆకట్టుకునే నటనా నైపుణ్యానికే గాక ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించడంలో కూడా పేరుగాంచింది. ఇటీవల ఒక ఇంటర్యూలో తను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని ఫాలో అవుతుందో షేర్ చేసుకుంది. తాను ఇంట్లో వండిన గ్లూటైన్ రహితమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తాను "నో రా డైట్"ని ఫాలో అవుతానని చెప్పారు. 'నో రా డైట్' అంటే..పచ్చి ఆహారం కాకుండా వండినవి అని అర్థం. ఇక్కడ నటి విద్యా బాలన్ కూరగాయాలు, కొన్ని రకాల పండ్లు, మాంసం, పాల సంబంధిత ముడి ఆహారాలను పచ్చిపచ్చిగా తీసుకోనని చెబుతున్నారు. సురక్షితమైన పోషకాహారం కోసం చక్కగా వండిన వాటికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అనారోగ్యాలను నివారించడం కోసమే తాను ఇలాంటి డైట్‌ని అనుసరిస్తానని చెప్పారు. పచ్చి ఆహారాల్లో ముఖ్యంగా మాంసాలు, గుడ్లు, పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తుల్లో సాల్మొనెల్లా, లిస్టేరియా వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి తీవ్రమైన ఆహార వ్యాధులకు కారణమవుతాయి. ఈ ఆహారాలను పూర్తిగా ఉడికించడం వల్ల ఆయా వ్యాధికారకక్రిములు నశించి, ఇన్ఫెక్షన్ల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వండిన ఆహార పదార్థాల్లో సంక్లిష్ట ప్రోటీన్లు, ఫైబర్లు విచ్ఛిన్కన్నం అవుతాయి. దీంతో సులభంగా జీర్ణమయ్యి, ప్రేగు సిండ్రోమ్ లేదా జీర్ణశయాంతర రుగ్మతలు దరి చేరవు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ నో రా డైట్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉడికించి లేదా కుక్ చేసినవి తినడం వల్ల మన శరీరం పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా టమోటాలలోని యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్, క్యారెట్‌లోని బీటా కెరోటిన్‌ను కుక్ చేస్తే సులభంగా గ్రహించగలుగుతాం. ఎలా ఫాలో అవ్వాలంటే..కుక్ చేయడం వల్ల పోషక శోషణ మెరుగుపడుతుంది. పోషకాలను సంరక్షించే వంట పద్ధతులను ఉపయోగించడం ముఖ్యం. స్టీమింగ్, మైక్రోవేవ్, వంటి పద్దుతల్లో తక్కువ నీటితోనే ఉడికిపోతాయి. పోషకాల నష్టం కూడా జరగదు. అయితే ఉడకబెట్టడం వల్ల నీటిలో కరిగిపోయే విటమిన్ సీ, బీ వంటి వాటిని కోల్పోవచ్చు. అందువల్ల పోషక విలువలు కోల్పోకుండా ఉండే వంట పద్ధతులను అనుసరించడం ముఖ్యం. ఈ డైట్‌ని అనుసరించాలనుకున్నప్పుడూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. తగినంత పోషకాలు లభించేలా ఉడికించిన కూరగాయలు తోపాటు పండ్లు, ధాన్యాలు వంటివి కూడా చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే వండటం వల్ల కోల్పోయిన పోషకాల నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారని అన్నారు. ఈ డైట్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ..కొన్ని రకాల కూరగాయాలు, పండ్లను కుక్ చేసి తీసుకోవాలి, అలాగే కొన్ని రకాల పోషకాల కోసం ఫైబర్‌తో కూడిన పప్పుధాన్యాలు పండ్లను పచ్చిగానే తీసుకోవాలని చెబుతున్నారు. వ్యక్తిగత ఆహార అవసరాలకు అనుగుణంగా వండిన వాటి తోపాటు ముడి ఆహారాలను కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన సమతుల్యమైన ఆహారాన్ని అందించగలుగుతారు. దీనివల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: మిలమిల మెరిసే మిణుగురు చేపలు గురించి విన్నారా..?) -
యాలకుల వాటర్‌తో ఎన్ని లాభాలో తెలుసా..!
జీరా వాటర్, మెంతి వాటర్ తాగడం గురించి విని ఉంటారు. యాలకుల వాటర్ గురించి విని ఉండరు. ఈ యాలకులను స్వీట్స్ తయారీలో మంచి ఘుమ ఘుమలాడే సువాసన కోసం ఉపయోగిస్తుంటారు. అలాగే స్పైసీ కర్రీల్లో కూడా వాడుతుంటారు. అలాంటి యాలకుల వేసి మరిగించిన నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. యాలకుల సుగంధభరతమైన వాసనకి కచ్చితంగా.. ఈ నీళ్లను సులభంగా తాగగలం కూడా. అందులో ఆరోగ్యం కోసం అంటే ఎవరైనా ఎందుకు మిస్ చేసుకుంటారు..?. మరీ ఈ యాలకుల వాటర్‌తో కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా చూద్దామా..!యాలకులు ఫినోలిక్ సమ్మేళనాలు, అస్థిర నూనెలు, ఫిక్స్డ్ ఆయిల్స్‌తో నిండి ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగ్గా ఉంచాయి. ముఖ్యంగా ప్రేగుల ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో ఉన్న అదనపు గ్యాస్‌ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.యాలుకుల్లో యాంటీమైక్రోబయాల్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాలుకుల్లోని నూనెలు శిలీంధ్రాలను, బ్యాక్టీరియాలను సమర్థవంతంగా పోరాడతాయి. ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నిరోధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.యాలకుల్లో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగిన టెర్పెనెస్, ఫినోలిక్ సమ్మెళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు యాలకుల నీటిని తాగితే పెద్ద మొత్తంలో శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అందడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.రక్తపోటును నియంత్రించి లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అనేక జంతు పరిశోధనలు యాలకుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేగాదు 2015లో జరిపిన అధ్యయనంలో యాలకులలోని యాంటిఆక్సిడెంట్లు గుండెపోటు నుంచి రక్షిస్తాయని తేలింది. అలాగే కొస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయిని వెల్లడయ్యింది.ముఖ్యంగా నోటి ఆరోగ్యం కోసం యాలకులను వినియోగిస్తే దుర్వాసన, కావిటీస్, చిగుళ్ల వ్యాధులు దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.(చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..) -
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ తీసుకుంటున్నారా..?
ప్రజలు తమ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి ఎక్కువగా వినియోగించే తృణధాన్యాల్లో ఒకటి ఓట్స్. పైగా శరీరానికి పుష్కలమైన ఫైబర్స్ అందుతాయని దీనికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా డైటీషియన్లు, జిమ్ శిక్షకులు ఫైబర్ కంటెంట్ ఉండే ఓట్స్‌ని తీసుకోమని సూచిస్తారు. జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి, చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించడానికి తోడ్పడే ఓట్స్‌ని తీసుకోవడం మంచిదే అయినప్పటికీ దీన్ని డైట్లో భాగం చేసుకునేటప్పుడూ ఈ జాగ్ర త్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని అంటున్నారు నిపుణలు. లేదంటే దుష్పభావాలు తప్పవంటున్నారు.రోజు ఎందుకు తినకూడదు..నిపుణులు అభిప్రాయం ప్రకారం వోట్స్ కొన్ని రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది. వారి ప్రకారం ఇది శరీరానికి విషపూరితం కావొచ్చని అంటున్నారు. శాస్త్రవేత్తలు 2017 నుంచి 2023 మధ్యకాలంలో జరిపిన అధ్యయనంలో చాలామంది అమెరికన్ల ఉపయోగించే ఓట్స్‌లో క్లోమరోమెక్వాట్ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. ఆ పరిశోధనల్లో సుమారు 92% వోట్స్ ఆధారిత వాటిల్లో క్లోర్మెక్వాట్ గుర్తించదగిన స్థాయిల్లో ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని పెద్దపెద్ద బ్రాండ్ ఓట్స్‌లలో కూడా ఈ విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. ఇది పునరుత్పత్తి అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది మానవులకు హాని కలిగించే అవకాశాలు ఎక్కుగా ఉన్నట్లు అని పరిశోధన వెల్లడించింది. బరువు పెరిగేందుకు..ఓట్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ..ఇవి ఎక్కువగా తీసుకుంటే మాత్రం వ్యతిరేక పరిణామాలు చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఎక్కువగా ఓట్స్ తీసుకుంటే పెద్ద మొత్తంలో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అంటన్నారు. అలాగే చాలామంది దీన్ని చక్కెర, నట్స్, చాక్లెట్ చిప్స్, ఉప్పుతో కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకుంటే ప్రయోజనాల కంటే, సమస్యలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. పొట్ట ఉబ్బరం..కొందరికి అదేపనిగా తృణధాన్యాలు తీసుకుంటే పొట్ట ఉబ్బరం కలిగిస్తాయి. అందువల్ల డైటీషియన్లు ఎప్పడూ కొద్ది మొత్తంలోనే తీసుకోమని సూచిస్తారు. దీన్ని జీర్ణశయాలు లేదా పెద్ద ప్రేగలలోని బ్యాక్టీరియాను వినియోగించుకోవటంతో గ్యాస్ ఫామ్ అయ్యి పొట్ట ఉబ్బరానికి దారితీస్తుంది.గ్లూటెన్ సున్నితత్వం..ఇవి గ్లూటెన్ రహితంగా ఉన్నప్పటికీ..తరుచుగా గోధుమ, బార్లీ మాదిరిగా ప్రాసెస్ చేయబడతాయి. ఇది ఉదరకుహార వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీకి దారితీస్తంది. క్రమం తప్పకుండా ఓట్స్ తింటుంటే ప్రతికూల ప్రతి చర్యలకు దారితీస్తుంది. డైలీ తినాలనుకునేవారు పూర్తిగా గ్లూటెన్ రహిత ఓట్స్‌ని ఎంచుకోవాని చెబుతున్నారు. కడుపు వాపుఇవి ఒక్కోసారి గ్యాస్టిక్ వాపుని కలుగజేస్తాయి. ఆహారంలో ఆకస్మిక మార్పు వల్ల కలిగే ప్రభామే ఈ కడుపు వాపు. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వోట్స్ తీసుకునే మొత్తాన్ని తగ్గించాలి. మోతాదుకి మించి ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ఫైటిక్ యాసిడ్లుఈ ఓట్స్‌లో ఫైటిక్ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాల్షియం, జింక్ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. ఓట్స్‌ని నానబెట్టడం లేదా పులియబెట్టడం వల్ల వాటిలో ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది.(చదవండి: భారతీయ యువతికి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని..) -
డైట్లో ఈ ఆహార పదార్థాలు చేర్చి..హైబైపీకి బ్రేక్ వేయండి
మారుతున్న జీవనశైలి కారణంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ వేధించే వ్యాధి హైబీపీ. ముఖ్యంగా నిద్రలేమి ఒత్తిడి ఈ హైబీపీ బారిన పడేస్తున్నాయి. బీపీని సకాలంలో గుర్తించి నియంత్రణలో ఉంచుకోకుంటే అది స్ట్రోక్, గుండెపోటు, గుండె వైఫల్యం, కిడ్నీ వైఫల్యం సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలాంటి బీపీని నేచురల్ ప్రోబయాటిక్ ఆహారంతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు అవేంటో చూద్దామా..!జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉన్నందుకే పెరుగును నేచురల్ప్రోబయాటిక్ ఆహారం అంటారు. అరటిలో పొటాషియమ్ లవణాలుంటాయి. ఇటు అరటి, అటు పెరుగు... ఈ రెండూ రక్తపోట (హైబీపీ)ని సమర్థంగా అదుపు చేస్తాయని ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనల్లో తేలడం మాత్రమే కాదు... ఆ సంగతి ‘హైపర్‌టెన్షన్’ అనే హెల్త్‌జర్నల్‌లోనూ ప్రచురితమైంది. హైబీపీ రాకముందే నివారించాలంటే... అందుకు అరటి, పెరుగు, తియ్యటి మజ్జిగ బాగా ఉపయోగపడతాయి. వాటితోపాటు ఇంకా పూర్తిగా పులవకుండా... అందుకు సంసిద్ధంగా ఉన్న అట్ల పిండితో వేసే అట్లు, ఇడ్లీ వంటివి తీసుకుంటే కూడా హైబీపీ నేచురల్‌గానే నివారించవచ్చని వైద్య పరిశోధకులు, న్యూట్రిషన్ నిపుణులు పేర్కొంటున్నారు. (చదవండి: మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!) -
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడటానికి మంచి స్టైయిలిష్ లుక్‌తో కండలు తిరిగిన బాడీతో మంచి ఫిట్నెస్గా ఉంటాడు. అమ్మాయిల కలల రాకుమారుడిలా క్రేజీ లుక్‌తో ఎట్రాక్ట్ చేస్తుంటాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ రౌడీ హీరో పిట్ నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..!వర్కౌట్లు..కండలు తిరిగిన టోన్డ్ ఫిజిక్‌ని మెయింటెయిన్ చేసేందుకు తీవ్రమైన వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా అధిక బరువులు, కార్డియో ఫంక్షన్లకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటాయడు. ప్రతిరోజు కనీసం రెండు గంటలు వర్కౌట్లకు కేటాయిస్తాడు. ముఖ్యంగా మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండేలా యోగా, మెడిటేషన్ వంటివి తప్పనిసరి. డైట్ ప్లాన్..విజయ్ చాలా స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌ని ఫాలో అవుతాడు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. ముఖ్యంగా జీవక్రియను చురుకుగా ఉంచేందుకు అతిగా తినకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. ముఖ్యంగా రోజంతా చిన్న చిన్నగానే భోజనం తీసుకుంటాడు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడు. హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగుతుంటాడు.ఇక్కడ విజయ్ దేవరకొండలా పిట్‌గా ఉండాలంటే మంచి ఫిజిక్, తీవ్రమైన వర్కౌట్లు, స్ట్రిక్ట్ డైట్ ప్లాన్లు అవసరం అనేది గ్రహించాలి. అలా అని ఎలా పడితే అలా చేసేయ్యకూడదు. ఫిట్నెస్ కోచ్‌లు, ఆరోగ్య నిపుణులు పర్యవేక్షణలో సలహాలు, సూచనలతో సరైన విధంగా వర్కౌట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే అందుకు తగ్గట్టుగా తీసుకునే డైట్ కూడా నిపుణుల సలహాలు మేరకు తీసుకోవాలినేది గ్రహించాలి. అందరికి ఒకలాంటి డైట్‌ప్లాన్‌లు వర్కౌట్లు సరిపోవు. ఇక్కడ ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్ర, ఫేస్ చేసే హెల్త్ సమస్యలు తదితరాలను పరిగణలోనికి తీసుకుని ఎలాంటి వర్కౌట్ సెషన్లు మంచివి, ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటన్నింటిని పరిగనలోనికి తీసుకుని ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!) -
అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్ల డైట్..షుగర్ పేషెంట్లకు మంచిదేనా..?
లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే డైట్లో మామిడిపండ్లు తీసుకోవడం, టీలో చక్కెర వేసుకోవడం వంటివి చేస్తున్నారని ఈడీ ఆరోపణలు చేసింది. అయితే కోర్టు ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారం తినడానికి అనుమతించినందున మామిడిపండ్లు, స్వీట్లతో సహా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే మధుమేహం ఉన్నవ్యక్తి ఇలాంటివి తింటారా అనేది ఈడీ వాదన, కానీ కేజ్రీవాల్ న్యాయవాది మాత్రం డాక్టర్ సూచించన ప్రకారమే ఇంటి నుంచి ఆహారం పంపిస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ మామిడి పండు కారణంగా డయాబెటిస్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయలు పెరుగుతాయా అంటే..? నిజానికి అరవింద్ కేజ్రీవాల్ టైప్2 డయాబెటిస్ పేషెంట్. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారని ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. ఇక్కడ ఆయన డైట్లో మామిడిపండ్లు తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా? అసలు షుగర్ పేషెంట్లు తినోచ్చా అంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో మామిడి పండు ఒకటి. ఇది అధిక చక్కెర కంటెంట్ తోపాటు ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్ సీ, ఫైబర్, కాపర్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే ఇందులో 90 శాతానికి పైగా కేలరీలు చక్కెర నుంచే వస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఇది దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు డయాబెటిస్ ఉన్న వ్యక్తులు చక్కెర స్థాయిలను ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోకూడదు. ముఖ్యంగా మామిడి, అరటి పండ్లు, సపోటా, వంటివి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎల్ సుదర్మన్ రెడ్డి అన్నారు. అయితే ఇందులో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వాటి మొత్తం చక్కెర ప్రభావాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి. అందులో ఉండే ఫైబర్ శరీరంలోని రక్తం చక్కెరను గ్రహించే రేటుని తగ్గిస్తుంది. పైగా శరీరంలోని కార్బోహైడ్రేట్లు ప్రభావాన్ని తగ్గించి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ పండుని తీసుకుంటే షుగర్ పేషంట్లకు కూడా ఎలాంటి హాని ఉండదని తెలిపారు. అయితే దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందేలా షుగర్ పేషెంట్లు ఎలా తీసుకుంటే మంచిదంటే.. మామిడి పండును డయాబెటిక్ ఫ్రెండ్లీగా మార్చే మార్గాలు.. ముందుగా డైట్‌ని అరకప్పు మామిడి కప్పులతో ప్రారంభించండి ఆ రోజు అధిక కార్బోహైడ్రేట్లు తీసుకోకూడదు. ప్రోటీన్లు తీసుకోవాలి. అందుకోసం గుడ్డు, కొన్ని రకాల తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. మామిడి పండ్లు అమితంగా ఇష్టం అనుకునేవారు ఆరోజు మంచిగా పండ్లు తింటూనే సరిపడ ప్రోటీన్ ఫైబర్ అందేలా ఫుడ్స్‌ని జోడిస్తే సరి. అప్పుడు మామిడిపండ్లు డయాబెటిస్ పేషెంట్లు తిన్నా ఏం కాదు. (చదవండి: 61 ఏళ్ల వయసులో 38 ఏళ్ల కుర్రాడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్‌లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్‌ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్‌ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్‌ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్‌గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్‌లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్‌లో జరగనుంది. -
అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు.. డైట్ సీక్రెట్స్ ఇవే..
బాలీవుడ్ టీవీ నటుడు, ప్రముఖ కమిడియన్, ప్రోడ్యూసర్, సింగర్ అయిన కపిల్ శర్మ సెటబ్రిటీలతో చేసిన 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోతో మంచి పేరు సంపాదించికున్నాడు. ఇటీవల ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ నెట్పిక్స్లో విడుదల అయ్యింది అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ షోలో సెలబ్రిటీలు రణబీర్ కపూర్, నీతూ కపూర్ మరియు రిద్ధిమా కపూర్ సహానితో షేర్ చేసుకున్న ఆసక్తికర విషయాల తోపాటు హాస్యంతో కూడిన చిందులు అన్నింటిని ప్రేక్షక్షులు అలరించాయి. ఆ ఐదు షోల్లో ప్రముఖ సెలబ్రిటీలు ఫాలో అయ్యే డైట్ సీక్రెట్స్ కూడా కపిల్ వెల్లడించడం జరిగింది. స్రీన్‌పై మంచి అందంతో, పిట్‌నెస్‌తో కనిపించే హీరో/హీరోయిన్ల బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలన్న కుతుహలం అందరికీ ఉంటుంది. అది కపిల్ శర్మ షో ద్వారా ప్రేక్షకులు తెలుసకునే అరుదైన అవకాశం లభించింది. అవేంటీ, ఎవరెవరు? ఎలాంటి డైట్స్ ఫాలో అవుతారో సవివరంగా చూద్దామా..! జాన్ అబ్రహం బాలీవుడ్ నటుడు, మోడల్, నిర్మాత అయిన జాన్అబ్రహం ఫిజిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆరడుగుల ఆజానుబాహుడు అంటే అతడేనేమో అన్నట్లు ఉంటుంది అతడి ఆహార్యం. చక్కటి బాడీని మెయింటెయిన్ చేస్తూ మంచి ఫిట్నెస్తో కనిపిస్తాడు. 2021లో తన మూవీ 'సత్యమేవ జయతే2' ప్రమోషన్ సందర్భంగా కపిల్ శర్మ షోకి వచ్చినప్పుడూ తన ఫిట్నెస్ సీక్రెట్స్‌ని పంచుకున్నాడు. మంచి బాడీ మెయింటెయిన్ చేయాలంటే మంచి ఆహారం అనేది చాలా ముఖ్యం అని చెప్పాడు. అలాగే ఆహారంపై నియంత్రణ ఉండాలని అన్నారు. ప్రోటీన్ కోసం నాన్‌వెజ్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. చాలామంది శాకాహారంతో ప్రోటీన్లు అందుతాయని చెబుతారు గానీ అందులో నిజం లేదని జాన్ చెప్పడం జరిగింది. ఇక్కడ జాన్ కండల దేహ సౌష్టవాన్ని చూస్తే.. పోషకాల తోకూడిన ఆహారం తినాల్సిందేనని స్పష్టమవుతుంది. అక్షయ్ కుమార్ ఇక అక్షయ్ కుమార్ తన 'హౌస్‌ఫుల్ 3' చిత్రం ప్రమోట్ చేసేందుకు కపిల్ శర్మ షోకి రావడం జరిగింది. ఆ షోలో ఆ మూవీ నటులంతా రావడం జరిగింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆ షోలో అక్షయ్ కుమార్ ఫాలో అయ్యే స్ట్రీట్ డైట్ గురించి వెల్లడించారు. "తాను రితేష్ చక్కగా వ్యాయామం చేసి అలసిపోయి ఉన్నాం. అందువల్ల చాలా ఆకలిగా అనిపించి బటర్ చికెన్ తినాలని అనుకున్నాం. అయితే ఆ టైంలో అక్షయ్ వారికి ఉడకబెట్టిన క్యారెట్లు, బచ్చలి కూర ఇచ్చాడని, కనీసం అన్నం గానీ రోటీ గానీ లేదు. ఇంత స్ట్రీట్‌గా డైట్ ఫాలో అవుతాడని,అందువల్లే అక్షయ్ ఇప్పటికీ యంగ్ లుక్‌లోనే కనిపస్తాడని". అమితాబ్ అన్నారు. కేక్ అంటే చాలా ఇష్టం: కత్రినా కైఫ్.. కపిల్ శర్మ షోకి సంబంధించి ఒక ఎపిసోడ్లో కత్రినా తన డైట్ గురించి మాట్లాడింది. "నిజంగా ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు కేక్‌లంటే మహా ఇష్టం కానీ దాన్ని తింటే జిమ్‌లో ఎక్కువసేపు గడపక తప్పదు. అందుకని ప్రతి ఆదివారం మనం కలుసుకుందామని కేక్‌తో సర్ది చెప్పుకుని నోటిని కంట్రోల్ చేసేందుకు కష్టపడతానని అంటోంది." కత్రినా. ఇక్కడ సెలబ్రిటీలు కూడా మనలానే ఒక్కోసారి ఫుడ్ స్కిప్ చేస్తారు. ఐతే తినాలనుకుంటే మాత్రం కంట్రోల్గానో లేక ఏదో ఒక రోజు కేటాయించుకుని పరిమితంగా తిని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. గులాబ్ జామూన్లు, సమోసాలు తినాల్సిందే: రాజ్‌కుమార్ రావ్ కపిల్ శర్మ షో 2020లో రాజ్‌కుమార్ రావ్ సందడి చేశారు. అయితే రాజ్ కుమార్ తనకు తినడమంటే ఇష్టమని చెప్పాడు. ఐతే రాజ్ ఫిటనెస్ చూస్తే.. ఆయన చెబుతుంది నమ్మశక్యంగా లేదని కపిల్ ఆ షోలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో తన డైట్ గరించి క్లియర్‌గా చెప్పారు. "తనకు గులాబ్ జామూన్లు, సమోసాలంటే ఎంతో ఇష్టమో ఎలా తినేసేవాడో చెప్పారు. టీనేజ్‌లో ఉండగా వర్కౌట్స్ అయ్యాక తిన్నగా స్వీట్ షాక్కివెళ్లి ఏకంగా ఆరు గులాబ్ జామూన్లు, రెండు సమోసాలు తినాల్సిందే. అయితే సినీ పరిశ్రమలో ప్రవేశించాక డైట్ మీద దృష్టికేంద్రీకరించడంతో అలా తినడం మానేశానని, స్వీట్ తినాలనుకుంటే మాత్రం లిమిట్‌గా తింటానని అన్నారు." ఆదిత్య రాయ్: అరకేజీ ఐస్‌క్రీమ్ ఉండాల్సిందే.. ఇక ఆదిత్య రాయ్ మృణాల్ ఠాకూర్‌తో కలిసి కపిల్ శర్మ షోకి వచ్చి డైట్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. తాను రాత్రిపూట ఏకంగా అరకేజీ ఐసీక్రీం తినేవాడినని అన్నారు. చాల సమయం డైట్‌లోనే ఉంటాను కాబట్టి సడెన్‌గా నాలోపల ఉన్నవాడికి తినాలనే కోరిక మొదలవ్వగానే వెంటనే వెళ్లి ఏదో ఒకటి రెండు ఐస్‌క్రీమ్‌లు కాదు ఏకంగా 1/2 కేజీ ఐస్‌క్రీం లాగించేస్తాను. ఆ తర్వాత రోజు పూర్తిగా డైట్లో ఉండి, కసరత్తు చేస్తుంటానని అన్నారు. బరువు తగ్గే యత్నంలో ఉన్నప్పుడూ రోజుకి 1700 కేలరీలు ఉండే పిండి పదార్థాలు, కొవ్వు తక్కువుగా ఉన్నా ఆహారం, అలాగే 15 నుంచి 20 నిమిషాలు కార్డియో సెషన్లు చేయండి చాలు. మంచి ఫిట్నెస్గా ఉంటారు. ఇలా చేసే క్రమంలో ఒక్కోసారి డైట్ స్కిప్ అవుతుంది. అంతమాత్రాన వదిలేయకుండా మరసటి రోజు నార్మల్‌గా డైట్ ఫాలో అయిపోవాలంతే అన్నారు ఆదిత్య రాయ్. ఈ సెలబ్రిటీల డైట్ సీక్రెట్స్ అన్ని చూశాక కచ్చితంగా ఎవ్వరైనా అంతలా నోరు కట్టేసుకుని ఉండటం ఈజీ కాదు. అలా అని నోరు కట్టేసుకుని ఇబ్బంది పడక.. తినాలనిపించిన ఐటెమ్స్ హాయిగా తినేసి కాస్త వర్కౌట్ డోస్ పెంచడం తోపాటు డైట్లో కేలరీల తక్కువగా ఉన్నవి తీసుకుంటే చాలు. ఒక్కరోజుని డైట్‌ని స్కిప్ చేసినంత మాత్రన పూర్తిగా వదిలేయకూడదన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. సో..! మీరు కూడా మీ వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సాయంతో మంచి ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అవ్వండి, మంచి ఫిట్ నెస్‌తో బరువుని అదుపులో ఉంచుకోండి. -
సిక్సర్ల బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
ప్రముఖ స్టార్ క్రికెటర్ రోహిత్ గురునాథ్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలోకి బ్యాట్‌తో దిగడంతోనే ప్రత్యర్థులను మట్టికరిపించేలా సిక్స్‌ర్లతో చెలరేగిపోతాడు. విధ్వంసకర బ్యాట్సమెన్గా ఈ హిట్‌మ్యాన్‌కి పేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేగాదు రోహిత్ టీమిండియా జట్టు కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో ఆడి తొలి సిరీస్‌ల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్సమెన్ రోహిత్ ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..! క్రీడాకారులు మంచి ఆటతీరుని కనబర్చాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తేనే మంచి ఆట తీరుని కనబర్చగలరు. మరి ఈ దిగ్గజ ఆటగాడు రోహిత్ ఫిట్నెస్ సీక్రెట్, ఫాలో అయ్యే డైట్ ఏంటో సవివరంగా చూద్దామా..! డైట్.. రోహిత్ పోషకాహారంతో కూడిన ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అవ్వుతాడు. తన డైట్లో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అల్పాహరంలో రోహిత్ తప్పనిసరిగా గుడ్లు, ఓట్స్, పండ్లను తింటాడు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. మధ్యాహ్నాం లంచ్‌లో తప్పనిసరిగా బ్రౌన్ రైస్, చికెన్, కూరగాయాలు తీసుకుంటాడు. రాత్రిపూట తప్పనిసరిగా కాల్చిన చేపలు, సలాడ్, ఉడికించిన కూరగాయాలు తీసుకుంటాడు వర్కౌట్లు.. ఫిట్‌గా ఉండేలా శరీరంలో చెడు కొలస్ట్రాల్ చేరకుండా జాగ్రత్త పడతాడు. అలాగే ఇన్సులిన్ స్థాయిలు సమంగా ఉండేలా డైలీ శరీరానికి కావాల్సిన వర్కౌట్లు చేస్తుంటాడు. ఎక్కువ సమయం తన ట్రైనర్‌తో కలిసి వ్యాయామ శాలలో గడుపుతాడు. కోర్ వర్కౌట్లపై దృష్టిపెడతాడు. ఇది కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది. బరువుని అదుపులో ఉంచుతుంది. నిజానికి రోహిత్ కెరియర్ ప్రారంభంలో ఫిట్‌నెస్‌లో అంత ప్రావీణ్యం పొందలేదు. రానురాను ఆటను మెరుగుపరచుకునే క్రమంలో తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడం ప్రారంభించినట్లు ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఇక రోహిత్ శాకాహార కుటుంబంలో జన్మించినప్పటికీ ఫిట్నెస్గా ఉండి మెరుగ్గా ఆడేందుకు నాన్‌వెజ్ తీసుకోక తప్పలేదు. (చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
యంగ్ హీరోలకు ధీటుగా మాధవన్.. ఫిట్నెస్ రహస్యం ఇదే!
కోలీవుడ్ నటుడు రంగనాథ్ మాదవన్ తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించి, విమర్శకుల ప్రశంసలందకున్నారు. మాధవన్ తన అభినయ నటనకుగానూ రెండు ఫిలింఫేర్ పురస్కరాలు అందుకున్నాడు. దాదాపు ఏడు భాషల్లో నటించారు. ఆయన రచయిత కూడా. మాధవన్ సినీ ప్రయాణం టీవీ సీరియల్ నుంచి మొదలై అలా 2000లో వచ్చిన 'అలై పాయుదే; అదే తెలుగులో 'చెలి'(2001) మూవీ నుంచి వెనుతిరిగి చూడకుండా విజయపథంలోకి దూసుకుపోయారు. ఐదు పదుల వయసుకు చేరువైన మాధవన్ ఇప్పటికీ యువ హీరోలకు ధీటుగా మంచి స్మార్ట్ లుక్‌లో కనిపిస్తారు. అంతలా గ్లామరస్‌గా కనిపించడానికి మాధవన్ ఫాలో అయ్యే డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా! వర్కౌట్లు.. మాదవన్ ఫిట్నెస్కి పెట్టింది పేరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాడు. చక్కటి బాడీ మెయింటెయిన్ చేసేందుకు కఠిన వర్కౌట్లు డైలీ లైఫ్‌లో భాగం. దాదాపు 30 నిమిషాల పాటు కార్డియో సెషన్ ప్రారంభిస్తాడు. ముఖ్యంగా రన్నింగ్, సైక్లింగ్, ఎలిప్టికల్ మెషీన్ వంటివి ఉంటాయి. ఆయన స్క్వాట్లు, డెడ్‌లిఫ్ట్‌లు, పుల్ అప్స్లు తప్పనిసరిగా చేస్తాడు. అవి అతని హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అంతేగాదు ప్రతి వ్యాయామాన్ని కనీసం మూడు నుంచి నాలుగు సెట్ల వారీగా ప్రతిసెట్లో కనీసం ఎనిమిది నుంచి 12 కసరత్తుల చొప్పున చేస్తారు. అలాగే ఒత్తడిని దూరం చేసుకునేలా ధ్యానం వంటివి చేస్తారు సముతుల్య ఆహారం, పోషకాలతో కూడిన ఆహారాలను డైట్లో ఉండేలా చూసకుంటారు. కానీ తినాలనుకున్నది మాత్రం కడుపు నిండుగా తింటాని చెబుతున్నాడు మాధవన్. అయితే అందుకు తగ్గట్టుగానే కసరత్తులు కూడా చేస్తానని అంటున్నాడు. డైట్.. చికెన్, చేపలు, కాయధాన్యాలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటారు. శక్తినిచ్చేలా బ్రౌన్ రైస్, క్వినోవా, చిలగడదుంప, తదితరాలను తీసుకుంటారు. అలాగే ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయాలు ఉండేలా చూసుకుంటారు. పైగా శరీరానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అందేలా జాగ్రత్త పడతారు. తన వ్యక్తిగత ఫిట్నెస్ నిపుణుడు సాయంతోనే మంచి డైట్ ఫాలో అవుతారు మాధవన్. (చదవండి: కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?) -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!
భారత రాష్ట్రపతిగా ఆ అత్యున్నత పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కురాలు ద్రౌపది ముర్ము. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండో మహిళ ఆమె. అంతేగాదు ఈ పదవిని అలంకరించిన తొలి గిరిజన మహిళ కూడా ఆవిడే కావడం విశేషం. రాష్ట్రపతిగా అనునిత్యం బిజీగా ఉండే ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఆమె డైట్ ఎలా ఉంటుందనే కుతుహలం ఉంటుంది. అయితే ఆమె ఏం డైట్ ఫాలో అవ్వుతారో రాష్ట్రపతి భవన్ చెఫ్‌లు వెల్లడించడమేగాక పలు ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చారు. అవేంటంటే.. ద్రౌపది ముర్ము సాత్విక ఆహారాన్నే ఇష్టపడతారని, ప్రధానంగా శాకాహారమే ఇష్టంగా తింటారని రాష్ట్రపతి భవన్ చెఫ్‌లు పేర్కొన్నారు. ఆమె 2022లో షెడ్యూల్డ్ తెగకు చెందిన మొదటి సభ్యురాలిగా, భారత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేగాదు ఆమె తన తెగకు చెందిన ప్రజల గొంతుకగా మారి వారి సంక్షేమం కోసం కృషి చేసి ప్రజల ఆదరాభిమానలను పొందారు. అలాంటి మహోన్నత వ్యక్తి ముర్ము తను తీసుకునే ఆహారం విషయంలో సాత్వికాహారానికే పెద్దపీట వేస్తారని చెఫ్‌లు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపు, ఉప్పు, కొత్తిమీర, పచ్చి బొప్పాయితో చేసే వంటకాన్ని కచ్చితంగా చేయాల్సిందేనని అన్నారు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా వండిన భోజనాన్నే తినడానికి ఇష్టపడతారట ఆమె. ఇక ఆమె ఓట్స్, సంప్రదాయ పూరీ ఆలు సబ్జీ కలియకతో కూడిన అల్పాహారంతో రోజుని ప్రారంభిస్తారని సీనియర్ కుక్ చెఫ్ సంజయ్ కుమార్ చెప్పారు. ఆమెకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో రైస్ చిల్లాస్ ఒకటని అన్నారు. తరచుగా ఆమె ఒడియా వంటకాలనే ఇష్టపడతారని తెలిపారు. 2000 నుంచి 2009 వరకు రాయ్‌రంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒడిశా శాసనసభ సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేయడంతో ఆ రాష్ట్రంతో ఆమెకున్న విడదీయరాని అనుబంధం అమె అభిరుచిలో ప్రతిబింబిస్తోందని అన్నారు. అందువల్లే ఆమె భోజనంలో ఒడియా వంటకాలైన దాల్మా, సంతులా వంటకాలు కచ్చితంగా ఉంటాయని చెప్పారు. దాల్మా అనే వంటకం చిక్పీస్, మునగకాయలు, బొప్పాయి వంటి కూరగాయాలతో కూడిన ఆహారం. ఇక సంతులా అంటే కాలానుగుణ కూరగాయాలతో చేసే మిశ్రమ వంటకం. ఈ రెండు సాత్వికాహారానికి చెందినవేనని చెబుతున్నారు చెఫ్‌లు. ఆమె కాలానుగుణ కూరగాయాలకు, పండ్లకు ప్రాముఖ్యత నిస్తారని తెలిపారు. కాగా, ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే ఈ సాత్వికాహార డైట్ వల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. సాత్వికాహారంతో ఒనగురే ప్రయోజనాలు.. మెరుగైన జీర్ణక్రియ, పోషకాల శోషణ శరీరానికి అవసరమయ్యే శక్తి స్థాయిలు అందిస్తుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది బరువుని అదుపులో ఉంచుతుంది సుదీర్ఘ ఆయుర్ధాయం ఉంటుంది. (చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, ఆ మహిళే) -
ఓమాడ్ డైట్ అంటే ఏంటీ? ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇటీవల కాలంలో ఎన్నో డైట్లు చేసి ఉంటారు. మంచి ఫలితాలు పొందేందుకు అవన్నీ కాస్త టైం తీసుకుంటాయి. అయితే ఈ డైట్ మాత్రం సత్వర ఫలితాలు ఇవ్వడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా బరువు తగ్గడమే గాక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అంటున్నారు. ఇంతకీ ఏంటీ ఓమాడ్ డైట్? చెయొచ్చా అంటే.. ఓమాడ్ అంటే.. 'వన్ మీల్ ఏ డే'ని ఓమాడ్ అంటారు. అంటే..ఒక్కపూట భోజనం చేసి మిగతా సమయం అంతా తినడానికి బ్రేక్ ఇవ్వడం అన్నమాట. దీని వల్ల ఈజీగా శరీరంలోని కేలరీలు బర్న్ అవుతాయంటున్నారు. చాలా గంటల సేపు తినడానికి విరామం ఇచ్చేస్తాం కాబట్టి శరీరంలోని కొవ్వులు కరుగుతాయని చెబుతున్నారు. ఇంతలా గ్యాప్ ఇవ్వడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుందంటున్నారు. ఇక్కడ ఈ డైట్లో వ్యక్తి రోజువారీగా ఒక్కసాగే నిండుగా భోంచేస్తాడు. ఆ ఆహరం ఒకటి నుంచి రెండు గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి దాదాపు 20 నుంచి 23 గంటలు విరామం ఇస్తారు. మొదట్లో మాత్రం వ్యక్తులకు కేవలం 16 గంటలే విరామం ఇవ్వగా రానురాను ఎక్కువ గంటలు పెంచడం జరుగుతుంది. దీన్ని అడపదడపా ఉపవాసం అనికూడా పిలుస్తారు. ఈ డైట్ ఆర్యో శ్రేయస్సును పెంచి ఎటువంటి అనారోగ్య సమస్యల బారినపడకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. ఈ డైట్ వల్ల ఈజీగా బరువు తగ్గుతారు, పైగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలింది. జీవక్రియ మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది సెల్యూరలార్ ప్రక్రియలను సక్రియం చేస్తుంది. జీర్ణవ్యవస్థకు సుదీర్ఘ విరామం కారణంగా ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఉబ్బరం, అజీర్ణం, వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఎదురయ్యే సమస్యలు.. ఇక్కడే ఒకేసారి ఆహారం స్వీకరిస్తాం కాబట్టి..అన్ని క్యాలరీలు ఉండే ఆహారానని తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాలతో కూడిన ఆహార తీసుకోవడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే సుదీర్ఘ విరామాన్ని తట్టుకునేలా మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది దీనీని సరిగా తీసుకోలేకపోవచ్చు. లేదా ఒకేసారి ఇలా తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొనవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టు జీవనశైలి ఉండాలి అప్పుడే ఈ డైట్ మంచి ఫలితాలనిస్తుంది. గమనిక: ఇది ఆరోగ్యంపై అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. అనుసరించే ముందు మీ వ్యక్తిగత నిపుణుడు లేదా వైద్యులను సలహాలు, సూచనలతో పాటించటం ఉత్తమం. (చదవండి: చెరుకురసం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? కానీ వీళ్లు మాత్రం..) -
వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలివిగో!
బరువు తగ్గడం అనుకున్నంత ఈజీ కాదు. దీనికి తగ్గ ఆహార నియమాలు, కమిట్మెంట్ చాలా అవసరం. ఎలా పడితే అలా డైటింగ్ చేయడం కాకుండా బాడీ తీరును అర్థం చేసుకుని, నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. బరువు తగ్గించే ప్రణాళికలకు సరైన ఆహార విధానం, జీవనశైలి పాటించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, జాగ్రత్తగా తినడం అవసరం. అయితే ఈ లక్ష్యాన్ని స్థిరమైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో చేరుకోవడం అత్యవసరం. మీబాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉన్నదీ లెక్కించుకొని, దానిని బట్ట ప్రణాళిక వేసుకోవాలి. నో జంక్ ఫుడ్, నో సుగర్ పోషకాహారం, సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెస్డ్ఫుడ్ సుగర్ పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. తక్కువ కేలరీలు ఎక్కువ శక్తినిచ్చే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలను తీసుకోవాలి. తొందరగా బరువు తగ్గాలంటే కాఫీ, టీలు పూర్తిగా మానేయ్యాలి. దీని బదులు, గ్రీన్ టీ, హెర్బల్ టీ తీసుకోవాలి. రాత్రి 7 గంటల తరువాత భోజనం వద్దు రాత్రి 7 గంటలకే భోజనం చేయాలి. ఒక పూట భోజనంలోపూర్తిగా ఉడికించిన కూరగాయలు తీసుకుంటే ఇంకా మంచి ఫలితం . కంప్యూటర్, టీవీ ముందు కూర్చుని చిరు తిండ్లు (చిప్స్ కానీ, ఇంట్లో చేసుకున్నవైనా) మన తిండి మర ఆడుతూనే ఉంటుందనేది గుర్తు పెట్టుకోండి. వ్యాయామం బరువు ఎంత తొందరగా అంత వ్యవధిని వ్యాయామాన్ని పెంచాలి. యోగా, నడక, ఏరోబిక్, సైక్లింగ్ వంటివి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి బరువు తగ్గే ప్రక్రియలో నీరు చాలా కీలక పాత్ర. రోజంతా బాగా హైడ్రేటెడ్‌గా ఉండటంతోపాటు, పరగడుపున,రాత్రి నిద్రపోయేముందు నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు, చర్మానికి మంచిది. నిద్ర తప్పనిసరి మీరు తగినంత మంచి నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ప్రతి రాత్రి 7 నుండి 9 గంటల నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలి. Exercises with weights to lose weight fast: pic.twitter.com/Bm2RcZxUru — Health & Fitness (@FitnessF0rWomen) March 26, 2024 -
భారత అత్యున్నత న్యాయమూర్తి ఫాలో అయ్యే డైట్ ఇదే!
ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. గతంలో ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ కుమారుడే ఈ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. ఇక ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో తన జీవనశైలి, ఫాలో అయ్యే డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతేగాదు తన దైనందిన జీవితంలో ఆహార ప్రాధాన్యతలు, అలాగే తన రోజు ఎలా ప్రారంభమవుతుందనే వాటి గురించి కూడా చెప్పుకొచ్చారు డివై చంద్రచూడ్. అవేంటో తెలుసుకుందాం! ఆయన మంచి జీవనశైలే ఆరోగ్యంగా ఉండటంలోనూ రోజంతా ఉత్సాహంగా ఉండంటంలోనూ ఉపకరిస్తుందని అన్నారు. తాను ఉదయం 3.3 గంలకు యోగాతో రోజు ప్రారంభిస్తానని, ప్రాధమిక ఆయుర్వే ఆహార జీవనశైలిని అనుసరిస్తానని అన్నారు. ఇక తాను తన భార్య శాకాహారులమని చెప్పారు. తనకు ఎక్కువుగా మొక్కల ఆధారిత డైట్ బాగా పనిచేసిందన్నారు. ఎందుకంటే మన నాలుక మీదే మన శరీరం తీరు, మానసికోల్లాసం ఆధారపడి ఉందన్నారు. అంటే నాలుక రుచి కావాలనుకుంటే శరీరం బరువు అదుపుతప్పుతుంది. తద్వారా మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుందని అర్థం. ఇక్కడ నాలుకను నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి ఆహారమైన అమృతంగా తీసుకోగలమని చంద్రచూడ్ చెబుతున్నారు. మరాఠి అయిన చంద్రచూడ్ తాను సాబుదానా కంటే రామాదాన ఇష్టపడతానన్నారు. అంటే ఇక్కడ రామదానా అంటే ఉసిరికాయ అని అర్థం. అలాగే తాను ఆరోగ్యకరమైన తృణధాన్యాలను తీసుకుంటానని చెప్పారు. ఈ డ్రైట్ ఒక్కోసారి తాను కూడా స్ట్రిట్‌గా ఫాలో అవ్వలేనని అన్నారు. ఎందుకంటే ఒక్కోసారి నాకిష్టమైన ఐసీక్రీ కూడా వచ్చి చేరుతుందిగ అంటూ నవ్వేశారు. కానీ తాను నాలుకును, మనసును నియంత్రణలో పెట్టుకోగలనని అందువల్లో ఒక్కోసారి స్కిప్ అయ్యినా, ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోగలనని అన్నారు. మొక్కల ఆధారిత డైట్ అంటే.. గత కొన్నేళ్లుగా ప్రజల జీవనశైలిలో పలు మార్పులు వచ్చాయి. ఎక్కువగా శాకాహారంవైపుకు మళ్లుతున్నారు. ఒకకరకంగా జంతు హింస జరగకుండా ఉండేలా చేయడం నుంచి మొదలయ్యిందే ఈ మొక్కల ఆధారిత డైట్ అని చెప్పొచ్చు. ఈ డైట్లో పచ్చగా ఉండే వాటితో ఆరోగ్యాన్ని మెరుగ్గు ఉంచుకుంటారు. ఈ శాకాహారం డైట్లో తప్పనిసరిగా తీసుకోవాల్సినవి పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, కాయధాన్యలు తోపాటు ఆకకూరలకు సంబంధించిన మొక్కల ఆధారిత ఆహారాలు. ఇక్కడ శాకాహార అనంగానే పాల ఉత్పత్తులను కూడా దగ్గరకు రానియ్యరు. దాని బదలు, బాదంపాలు, సోయా పాలు, కొబ్బరి పాలు, తదితర మొక్కల ఆధారిత పాలను ప్రత్నామ్నాయంగా తీసుకుంటారు కానీ ఇక్కడ ఇలా భారత అత్యున్నత న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాదిరిగా మొక్కల ఆధారిత డైట్ ఫాలో అవ్వాలంటే శరీరం, మనస్సు నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే సులభంగా, రుచికరంగా శాకాహారాన్ని వండుకునే యత్నం చేయాలి. అప్పుడే ఈ డైట్‌ని సక్రమంగా ఫాలో అయ్యి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇక్కడ ఏదైనా ఇష్టంతో, ఆరోగ్య స్ప్రుహతో చేయగలిగితేన మెరుగైన ఫలితాలు పొందగలరనేది అత్యంత కీలకం. (చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!) -
నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఓ మంచి గృహిణిగా, వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. కేవలం ముఖేశ్ అంబానీ భార్య అనే ఐడెంటిటీ కంటే తనను తానుగా గుర్తించే ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నారు. రిలయన్స్ బోర్డు మెంబర్‌గా, ఐపీఎల్లో ముంబై ప్రాంచైజ్ ఓనర్‌గా మంచి విజయాలను అందుకున్నారు. ఆ సక్సెస్ ఆమెను ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకునేలా చేశాయి కూడా. ఇటీవల చిన్న కొడుకు నీతా అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో హడావిడి అంత ఆమెదే. ఏ డ్రెస్‌లు వేసుకోవాలి..? ఈవెంట్ ఎలా చేయాలి..? వంటివన్నీ తన అమ్మే దగ్గరుండి మరీ చూసుకున్నారని స్వయంగా అనంత్ అంబానీనే చెప్పారు కూడా. 54 ఏళ్ల నీతా అంబానీ తన కోడళ్లకు, కూతురుకి ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. చూడటానికి ఓ హిరోయిన్ మాదిరిగా మంచి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె అందం, ఫిట్నెస్ ముందు సినీ సెలబ్రెటీలు కూడా సరిపోరని చెప్పొచ్చు. ఇంతలా చలాకీగా ఫిట్నెస్గా ఉండటానికి ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతారు?. ఆమె ఫిట్నెస్ రహస్యం తదితరాలు గురించి చూద్దామా!. నీతా అంబానీ మొదట్లో 90 కిలోల బరువు ఉండేవారు. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ఆస్మా, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల కారణంగా విపరీతమైన బరవు పెరిగిపోయాడు. దీని కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాడు కూడా. తన కొడుకు బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతం కాకపోవడంతో ఆమెనే స్వయంగా తగ్గి కొడుకుకి స్ఫూర్తినిచ్చారు. పైగా నీతా కొడుకు తగ్గేందుకు ఉపక్రమించేలా చేశారు. అలా అనంత్ కూడా ఆ టైంలో బరువు తగ్గడం జరిగింది కూడా. అదీగాక నీతా మంచి శాస్త్రీయ నృత్యకారిణి కావడంతో ఆమె రోజువారీ దినచర్యలో భాగంగా నృత్యం చేస్తుంటారు. ఇదే ఆమెను మంచి ఫిట్నెస్గా ఉండేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు. అలాగే ఈ డ్యాన్స్ కదిలికలు, శరీరానికి ఓ మంచి వ్యాయామంలా ఉండి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే నీతా క్రమం తప్పకుండా బీట్ రూట్ జ్యూస్ తగ్గుతారు. పోషకాలు అధికంగా ఉండే ఈ జ్యూస్‌లో అద్భుతమైన డిటాక్స్‌లు ఉంటాయి. అవి అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా చేసి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. ఇది నిధానంగా బరువు తగ్గడంలో తోడ్పాడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫ్క్ట్లు తలెత్తకుండా ఉండేలా చేసి బరువుని అదుపులో ఉంచుతుంది. పైగా మంచి మానసికొల్లాసం కలిగించి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు నిర్వహించే సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, చికాకులు, టెన్షలు వంటి వాటిని తట్టుకునేలా చేస్తుంది. ఇదే ఆమె ఫిటనెస్ రహస్యం. అందువల్లే నీతా ఇంత అందంగా ఆరోగ్యంగా మంచి ఫిట్నెస్తో ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగానే ఆమె శక్తిమంతమైన బిజినెస్ విమెన్‌గా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారని కూడా అనొచ్చు. (చదవండి: ట్రెండీ షార్ట్ బాబ్ హెయిర్ స్టయిల్..ఎక్కడి నుంచి వచ్చిందంటే..) -
మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..!
కుటుంబ సభ్యులందరికీ కావలసిన వాటిని అమర్చడంలో పడి మహిళలు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించరు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని అందరికీ తెలిసిందే. అందువల్ల ముందే మేలుకొనడం అవసరం. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకునే ఉంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు తమ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టి సమయం కేటాయించడం. తమ వయసుకు తగ్గ పోషకాహారం తీసుకోవడం. అనారోగ్య సమస్యలను దాచిపెట్టకుండా తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే...మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.. ఐరన్ ఉండే ఆహారం... మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన దానిలో ఐరన్ మొదటి స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ చాలా అవసరం. శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల నీరసం, అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మీ ఆహారంలో మాంసకృత్తులు, చికెన్, సీఫుడ్, బీన్స్, కాయధాన్యాలు, బచ్చలి కూర, బ్రోకలీ, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ ఎ తప్పనిసరి... మహిళలకు అవసరమైన విటమిన్ల జాబితాలో విటమిన్ ఎ ద్వితీయ స్థానంలో ఉంది. ఇది మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, అరటి పండ్లు వంటివి తీసుకోవాలి. విటమిన్ బి 12.. విటమిన్ బి 12 అనేది జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందువల్ల బీ 12 సమృద్ధిగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు తీసుకోవాలి. శాకాహారులు ΄÷ట్టు తియ్యని వేరసెనగపప్పు, సెనగలు, దంపుడు బియ్యం, వెన్న తియ్యని పాలు (జంతువుల నుంచి వచ్చిన పాలు) వంటివి తీసుకోవాలి. కాల్షియం... మహిళలు వయస్సు పెరిగేకొద్దీ, ఎముక సంబంధిత ఆరోగ్య సమస్యలను తరచు ఎదుర్కొంటారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యానికి మహిళలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం పాలు, గుడ్డు, నువ్వులు వంటివి తీసుకోవాలి. విటమిన్ డి... ఈ జాబితాలో విటమిన్ డి తర్వాతి స్థానంలో ఉంది. విటమిన్ డి మన శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. మెగ్నీషియం... మెగ్నీషియం కూడా స్త్రీలకు కావలసిన అతి ముఖ్యమైన పోషకం. కండరాల బలం ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. మహిళలు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్షలు అవసరం.. భారతదేశంలో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.. ఎన్నో గణాంకాలు స్త్రీలల్లో ఐరన్ లోపం ఉంది అని చెబుతున్నాయి. కనీసం 10 శాతం కూడా హిమోగ్లోబిన్ ఉండటం లేదు. ఈ పరిస్థితిని ఇలానే నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా ఇది బ్లడ్ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అందువల్ల అత్యవసరమైన సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్, విటమిన్ పరీక్షలు, కాల్షియం, కొలెస్ట్రాల్, ఐరన్ వంటి పరీక్షలను చేయించుకోవడం అవసరం. ఇవి చదవండి: సమాజాన్ని అద్దంలో చూపించాను -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్‌లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అట్లాంటిక్ డైట్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
ఇప్పుడు వెజిటేరియన్ డైట్ అని, ఫ్రూట్ జ్యూస్ డైట్ అని పలు రకాల డైట్లు వచ్చేశాయి. తమ ఆహార్యానికి తగ్గట్టుగా వారికి నచ్చిన డైట్‌ని ఫాలో అవుతున్నారు. ఇటీవల బాగా సోషల్ మీడియాలో అట్లాంటిక్ డైట్ అని ఓ డైట్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ డైట్ ఫాలో అయితే కేవలం బరువు మాత్రమే అదుపులో ఉండటమే గాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అత్యంత ఆరోగ్యకరమైన డైట్లలో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. ఏంటా డైట్ అంటే.. ఈ అట్లాంటిక్ డైట్ మెడిటేరియన్ డైట్‌ని పోలి ఉంటుంది. ఇది యూరప్‌లో బాగా ఫేమస్ అయ్యిన డైట్. ఇది బరువుని అదుపులో ఉంచడమే గాక శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆరునెలల పాటు ఈ డైట్ ఫాలో అయితే గొప్ప ప్రయోజనాలు పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిల తోపాటు రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్య స్థాయిలో ఉండేట్లు చేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. దాదాపు 200 స్పానిష్ కుటుంబాలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యిందlన్నారు. ఈ డైట్లో ఏం ఉంటాయంటే.. ఈ డైట్లో పోర్చుగల్, వాయువ్య స్పెయిన్‌లో ప్రసిద్ధి చెందిన ఆహారాలు ఉంటాయి. దీనిని దక్షిణ యూరోపియన్ డైట్ అని కూడా అంటారు. ఐరోపాలో జరిపిన పలు అధ్యయనాల్లో ఈ డైట్ వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు తేలింది. ఇందులో క్యాన్సర్ లేదా గుండె జబ్బుల నుంచి ముందుగానే చనిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కొరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటిస్, స్ట్రోక్ ,ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచే వేలాడే పొట్ట కొవ్వుని కూడా తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ డైట్లో ఉండే ఆహారాలు.. తాజా చేప కొద్దిగా ఎర్ర మాంసం ఉత్పత్తులు పాలు చిక్కుళ్ళు తాజా కూరగాయలు బంగాళదుంపలు గోధమ బ్రెడ్ కొద్ది మోతాదులో వైన్ ఆకుకూరలు ఈ డైట్లె మాంసం, చేపలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే మితంగానే ఉంటుంది. ముఖ్యంగా ఒమెగా 3కి సంబంధించిన కొవ్వు ఆధారిత చేపలు, గుడ్లు, పాలు ఉత్పత్తులు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. దీన్ని చాలావరకు కుటుంబసభ్యులంతా కలిసి ప్రిపేర్ చేసుకుని ఉత్సాహ భరితంగా ఆస్వాదిస్తారు. దీంతోపాటు రోజువారీ నడక, సైక్లింగ్ తప్పనిసరి ఉంటాయి. ప్రయోజనాలు.. మెటబాలిక్ సిండ్రోమ్‌ను తగ్గిస్తుంది జబ్బులు, మధుమేహం, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఊబకాయం వంటివి రావు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెడు కొలస్ట్రాల్‌ని దరిచేరనీయ్యదు బరువు అదుపులో ఉంటుంది అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడగలుగుతారు. మూడేళ్లకు అట్లాంటిక్ డైట్‌కు కట్టుబడి ఉంటే 60 ఏళ్ల పైబడిన పెద్దల్లో ముందస్తుగా మరణించే ప్రమాదాలు 14% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ డైట్. (చదవండి: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!) -
స్లిమ్‌గా మారిన నటుడు సురేష్! డాక్టర్లే అదేం డైట్ అన్నారు? చివరికి..
టాలీవుడ్ సీనియర్ నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే? ఆయన నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో మెప్పించిన వ్యక్తి. అదీగాక నటుడిగా సుమారు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలను తెరకెక్కించారు కూడా. కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత విలన్ పాత్రలు, తండ్రి పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే సీరియల్స్‌లోనూ పలు కీలక పాత్రలు చేస్తున్నారు. మొన్నటి వరకు మనం సురేషని పెద్ద తరహాలో లావుగా చూశాం. ఇప్పుడూ కుర్రాడిలా స్లిమ్‌గా హీరో లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంతలా మారిపోయిన సురేష్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో తాను ఫాలో అయ్యిన డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఏకంగా 15 గంటల వరకు నో ఫుడ్.. ఒకప్పుడు సినిమాల్లో మంచి స్లిమ్‌గా హీరోలా కనిపించే సురేష్ గత కొద్దికాలం క్రితం బాగా లావయ్యారు. సుమారు 120 కిలోల బరువు ఉండేవారు. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి సీరియల్స్‌లో నటించడంతో అంతా బరువుగా ఉండటం వల్లే సినిమాలు చేయడం లేదని అనుకున్నారు. ఆ మాటాలు సురేష్ చెవిన పడటంతో ఎలాగైనా బరువు తగ్గాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్లుతెలిపారు నటుడు సురేష్. అందుకోసం గత ఐదు నెలలుగా చాలా కఠినమైన డైట్ ఫాలో అయినట్లు చెప్పారు. అందువల్లే ఇంతలా బరువు తగ్గానని అన్నారు. ఈ నేపథ్యంలో తాను ఫాలో అయిన డైట్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను నిద్ర లేచిన గంట వరకు ఎలాంటి ఫుడ్స్ తీసుకోనని, కేవలం నీళ్లు, గ్రీన్ టీ వంటివే తీసుకుంటానని అన్నారు. ఆ తర్వాత ఒక గంటకి అరటి పండు లేదంటే ఆపిల్ తీసుకోవడం జరుగుతుందన్నారు. అదీ కాదంటే టమాట తింటానన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఎగ్‌లోని తెల్ల సొన తింటానన్నారు. ఇక బ్రేక్ ఫాస్ట్‌గా ఓట్స్ తింటానని, ఎక్కువగా ఉడికించిన కాయగూరలే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. లంచ్‌లో పుల్కాలు కొద్దిగా రైస్ తీసుకుంటానని చెప్పారు. ఆదివారం వస్తే బిర్యానీ రైస్, గ్రిల్ చికెన్, గ్రిల్ ఫిష్, తప్పనసరిగా ఉండాల్సిందే అన్నారు. మధ్యాహ్నం కడుపునిండా ఫుడ్ తీసుకున్నా 15 గంటల వరకు ఏం తిననని చెప్పారు సురేష్. అంటే మధ్యాహ్నాం ఒంటి గంటకు తింటే మరుసటి రోజు ఉదయం వరకు ఏం తినేది ఉండదు. మరీ తట్టుకోలేనంటే ..కొద్దిగా నీళ్లు లేదా మజ్జిగలో కాస్త నిమ్మరసం పిండుకుని తాగడం వంటివి చేస్తానని చెప్పారు. ఆ డైట్ చూసి.. డాక్టర్లే షాకయ్యారు.. తన డైట్ గురించి విని డాక్టర్లు షాకయ్యారని సురేష్ చెప్పారు. గత ఐదు నెలలుగా ఈ డైటే ఫాలో అవుతున్నట్లు తెలిపారు. అలా 21 కేజీల వరకు బరువు తగ్గినట్లు చెప్పారు. ప్రస్తుతం తాను 88 కేజీల బరువు ఉన్నట్లు చెప్పారు. ఐతే ఇలా 15 గంటలకు వరకు ఏం తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ పెరిగే అవకాశమే ఉండదన్నారు. ఎందుకంటే కాస్త తినడానికి విరామం ఇవ్వడం వల్ల బరువు ఆటోమెటిక్‌గా తగ్గిపోతాం అని వివరించారు సురేష్. అయితే ఈ డైట్ మొదలు పెట్టే ముందు తాను ఎన్ని రోజుల వరకు తినకుండా ఉండగలనో చెక్ చేసుకున్నట్లు తెలిపారు. తాను మూడు రోజుల కేవలం నిమ్మకాయ నీళ్లతో ఏం తీసుకోకుండా ఉండగలిగానని, అప్పుడే ఏకంగా ఆరు కేజీలు వరకు తగ్గానని అన్నారు. ఈ విషయమే వైద్యులకు చెప్పగా..వాళ్లు కోప్పడి అదేం డైట్? చచ్చిపోతావ్! అని ఫైర్ అయ్యారని అన్నారు. సరైన విధంగా డైట్ ఫాలో అవ్వు అని హెచ్చరించడంతో ఇలా డైట్లో పలు మార్పులు చేసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. తాను మొదట్లో ఐదు నిమిషాలే వాకింగ్ చేసేవాడినని, ఇప్పుడూ ఏకంగా 18 కిలోమీటర్లు వరకు వాకింగ్ చేస్తున్నట్లు చెప్పారు నటుడు సురేష్. (చదవండి: మిథున్ చక్రవర్తికి వచ్చిన ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..? ఎందువల్ల వస్తుంది?) -
కింగ్ చార్లెస్‌కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కేన్సర్‌తో బాధపడుతున్న బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కోంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్‌గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్ ప్రెస్ ప్రకారం ఆయన కెరిర్లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన ఆరోగ్యకరమ జీవితాన్నే గడిపారు. ఆయన చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. పైగా బ్రిటిష్ చరిత్రలో రాజుగా పట్టాభిషేకం అయిన అంత పెద్ద వయసు వ్యక్తి కూడా ఆయనే. ఇక ఆయన లైఫ్‌స్టైల్ విషయానికి వస్తే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని అంతరంగికులు చెబుతున్నారు. అందులోనూ ఆయన ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అంటునన్నారు. అలాంటి ఆయన ఈ కేన్సర్ మహమ్మారిన బారిన పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన ఆహార అలవాట్లు ఎలా ఉండేవి? రోజూవారి దినచర్య ఎలా ఉంటుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందామా!. ఆయన ఒకసారి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజీ షెడ్యూల్‌కు ఆటంకం కలిగించే భోజనం లగ్జరీ లాంటిదని విశ్వసిస్తానని అన్నారు. అంతేగాదు ఆయన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వంటివి చేస్తారని అధికారిక వర్గాల సమాచారం. 2018లో కార్లెస్ హౌస్‌లో తన 70వ పుట్టిన రోజు పురస్కరించుకుని తనకు సంబంధించిన 70 వాస్తవాల జాబితాలో తాను రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటానని అదికూడా అల్పహారం, రాత్రి భోజనం మాత్రమేనని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారంలో రెండు రోజులు పూర్తిగా శాకాహారం భోజనం తింటానని, పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువుగా మొక్కల ఆధారిత ఆహారమే ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అల్పాహారంలో ఎక్కువగా చీజ్, ఉడకబెట్టిన గుడ్లు, పాలు, తేనేతో కూడిన డార్జిలింగ్ టీ తదితరాలే తీసుకుంటారని రాయల్ డైట్ పేర్కొంది. ఆయన ఎక్కువగా సేంద్రీయ ఉత్పత్తులనే ఇష్టపడతారని రాయల్ చెఫ్‌లు చెబుతున్నారు. ఇక ఫిట్నెస్ విషయానికి వచ్చేటప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయమాలు చేస్తారని ప్యాలెస్ పేర్కొంది. అలాగే కెనడియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన ఐదు ప్రాథమిక వ్యాయమాలను రోజుకు రెండుసార్లు చేస్తారని తెలిపింది. ముఖ్యంగా రెండు నిమిషాల స్ట్రెచింగ్ ఒక నిమిషం సిట్ అప్లు, మరో నిమిషం బ్యాక్ లెగ్ రైజ్‌లు పుష్ అప్లు 11 నిమిషాలు చేస్తారని వెల్లడించింది. వాటన్నింటి తోపాటు ఆరు నిమిషాల పాలు రన్నింగ్, ప్రతి 75 అడుగులకు డేగ జంప్‌లు చేయడం, వాతావరణం బాగుంటే ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశంలో గడపడం వంటివి చేస్తారని రాయల్ ప్యాలెస్ పేర్కొంది. ఇంతలా పిట్‌నెస్‌గా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించనప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఎందుకు దాడి చేస్తాయనేది ఎవ్వరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న. నిజం చెప్పాలంటే వ్యాధికి రాజు, పేద అనే తారతమ్యం ఉండదేమో రావాలి, వేదన అనుభవించాలి అని ఉంటే టైంకి వచ్చి దాని ప్రభావం చూపించేస్తుందేమో కదూ!. View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!
-
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!అలా చేయడం మంచిదేనా?
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ భారీ బడ్జెట్ మూవీ 'షెహజాదా'తో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఆ తర్వాత 'సత్యప్రేమ్‌కి కథ'తో ప్రేక్షకుల మన్ననలను పొంది నెమ్మది నెమ్మదిగా పరిశ్రమలో నిలదొక్కుకునే యత్నం చేశాడు. మళ్లీ అలానే మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. ఆ నేపథ్యంలోనే ప్రఖ్యాత దర్శకుడు కబీర్ ఖాన్ నిర్మిస్తున్న 'చందు ఛాంపియన్' మూవీతో మన ముందుకొస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఈ మూవీ షూటింగ్ ఒక ఏడాదికి పైగా పట్టింది. పగలు, రాత్రి అనక జరిగిన నిర్విరామ షూటింగ్లో హీరో ఆర్యన్ చక్కెర జోలికే పోలేదట. ఈ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి అవ్వడంతో దర్శకుడు కబీర్ సింగ్ ఇప్పుడైన నోరీ తీపి చేసుకోమంటూ రసమమలై తీసుకొచ్చి హీరో ఆర్యన్‌కి తినిపించాడు. ఈ మూవీ షూటింగ్ ఎంతలా విజయవంతంగా పూర్తి అయ్యిందో, అలానే ఈ మూవీ నీకు మంచి పేరు తెచ్చిపెడుతుందంటూ ఆర్యన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. ఆర్యన్ తన కొత్త సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు అంటే..దాదాపు ఏడాదికి పైగా చక్కెర లేని ఆహారమే తీసుకున్నాడు. పైగా చక్కెరకు బదులు తాను సహజ ఉత్పత్తుల తీసుకున్నట్లు కొన్ని రహస్యాలు బయటపెట్టాడు. ఆ హీరోలా చేస్తే శరీరంలో సంభవించే మార్పేలేంటి తదితరాల గురించి తెలుసుకుందామా!. ఒక ఏడాది పాటు ఆ హీరోలా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఎవ్వరైన దీన్ని ప్రయ్నతించవచ్చా?. ఈ డైట్ కారణంగా శరీరంలో ఎలా ప్రభావితమవ్వుతుంది, ఇది మంచిదేనా? అంటే..పూర్తిగా చక్కెరకు దూరంగా ఉండటం లేదా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరం అనేక సానుకూల మార్పులకు దారితీస్తుంది. మొదట్లో ఈ డైట్ పాటించటం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. క్రమేణ మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ సమ స్థాయిల్లో ఉండటం జరగుతుంది. తద్వారా మానసికోల్లాసం ఏర్పడి జీవక్రియ మెరుగుపడుతుంది. ఒబెసిటీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మొటిమలు తగ్గి నిత్య యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ డైట్ వల్లే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో సవివిరంగా చూద్దాం!. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది: ఒక టీస్పూన్ చక్కెరలో 20 కిలో కేలరీలు ఉంటాయి. కాబట్టి ఈ చక్కెరను పూర్తిగా దూరంగ పెట్టగలిగితే ఇన్సులిన్ సెన్సిటివిటీకీ సహాయపడుతుంది. టైప్ 2 డయబెటిస్ రాకుండా చేస్తుంది. ఒక రకంగా దంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధులు దరిచేరవు. ఎప్పుడైతే పరిమిత కేలరీలు తీసుకుంటామో అప్పుడూ ఆటోమెటిక్‌గా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది: చక్కెర వినియోగం ఎప్పుడైతే తగ్గిస్తామో.. ముందుగా మానసిక స్థితిలో మంచి మార్పులు వస్తాయి. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది తద్వారా మతిమరుపు వంటి బ్రెయిన్ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం ఏర్పడి తెలియని మానసికోల్లాసం వస్తుంది. నిజం చెప్పాలంటే చక్కెర వినియోచటం మానేయడం వల్ల చాలావరకు పాజిటివ్ మార్పులే చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభంలో పంచదార తీసుకోకపోతే నీరసంగా అనిపిస్తుంది. ఎలాగైతే ఆల్కహాల్ అకస్మాత్తుగా వదిలేస్తే సమస్యలు ఎదురవ్వుతాయో అలాంటి లక్షణాలే పంచాదర మానేసిన వారిలోనూ కనిపిస్తాయట. అంతేగాదు నీరసం తోపాటు మానసికంగా కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుందట. అయితే శరీరంలో మెటబాలిజం మాత్రం పెరుగుతందట. ఫలితంగా ఎలాంటి దీర్ఘాకాలిక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇక్కడ చక్కెరను తగ్గించడం అంటే దానికి బదులుగా బెల్లం లేదా కృత్రిమ స్వీటెనర్లతో భర్తీ చేయడం కాదు. చక్కెర, బెల్లం రెండూ సమాన కేలరీలను కలిగి ఉంటాయనే విషయం గుర్తించుకోవాలి. అందువల్ల మనం తీసుకునే స్వీట్లు, పానీయాలు, శక్తి పానీయాలు వంటి వాటిల్లోని షుగర్ కంటెంట్ దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటేనే మంచింది. అలాగే ఈ నో షుగర్ డైట్‌ని ఫాలో అయ్యే మందు ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణుడిని సంప్రదించి వారి మార్గదర్శకంలో సరైన విధంగా ఈ డైట్‌ని ఫాలో అయ్యి సత్ఫలితాలను పొందడం మంచిది. ఏదీఏమైన చక్కెరను పరిమిత చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చనేది వాస్తవం. (చదవండి: ఆ వాటర్ ఫాల్ 'ఓ కన్నతల్లి గుండె కోత'! ఇప్పటికీ రాత్రిళ్లు అక్కడకు వెళ్తే హడలిపోవాల్సిందే!) -
93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!
ఓ వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా దేహ ధారుడ్యంతో పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారు. అతడి శరీరాకృతిని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఇంత అద్భుతమైన ఫిట్నెస్కి గల కారణాలేంటని అధ్యయనం చేసే పనిలో పడ్డారు పరిశోధకులు. ఐరిష్కి చెందిన 93 ఏళ్ల రిచర్డ్ మెర్గాన్ అనే వ్యక్తి చూడటాని 40 ఏళ్ల వ్యక్తిలా చురుగ్గా ఉన్నాడు. పైగా 70 ఏళ్ల వయసులో రోయింగ్(పడవ రేస్)ను ప్రారంభించినప్పటికీ నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడిని చూస్తే యువకుడి మాదిరిగా మంచి శరీరాకృతితో ఉంటాడు. శాస్త్రవేత్తలు సైతం అతడి హృదయ స్పందన రేటుని చూసి ఆశ్చర్యపోతున్నారు. మోర్గాన్ ఫిట్నెస్ ప్రయాణం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై పరిశోధకులు అధ్యయనం చేయడంతో ఒక్కసారిగా అతను వార్తల్లో నిలిచాడు. అంతేగాదు అతని శరీరంలోని 80% కండర ద్రవ్యరాశి, గుండె పనితీరుని ఆశ్చర్యపోతున్నారు. అచ్చం 40 ఏళ్ల వ్యక్తిని పోలి ఉందని చెప్పారు. అతను మనందరికీ ప్రేరణ అని చెబుతున్నారు. అతని జీవన శైలి, ఆహార పద్ధతులు, చేసే వ్యాయమాలు తదితరాలను పరిశీలించింది పరిశోధకుల బృందం. అంతేగాదు అతడి శారీరక పనితీరు, పోషకాహారం తీసుకోవడం తదితరాలను బయో ఎలక్ట్రిక్ ఇంపెడెన్స్ ద్వారా అంచనా వేసింది. ఇక అతను ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదలడం, హృదయ స్పందన రేటు, తదితర వాటిని రోయింగ్ ఎర్గోమీటర్తో కొలిచారు. అందుకు సంబంధించిన అధ్యయనం గురించి గత నెలలో జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీలో ప్రచురితమయ్యింది. ఇక మోర్గాన్ తాను 73 ఏళ్ల వయసులో వ్యాయామం ప్రారంభించానని, ఆ తర్వాత రోయింగ్ క్రీడలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చానని చెప్పుకొచ్చారు. తనకు వ్యాయామం చేయడంలో ఆనందం ఉందని తెలిశాక ఇక ఆపలేదని, అదే ఈ రోయింగ్ క్రీడో పాల్గొనేలా చేసిందని చెప్పారు మోర్గాన్. వ్యాయామం మంచి ఫిట్నెస్గా ఉండేలా చేయడమే గాక సర్వసాధారణంగా వయసు రీత్యా వచ్చే శరీరంలోని వృద్ధాప్య ప్రభావాలను అరికడుతుందని మోర్గాన్‌పై జరిపిన పరిశోధనలో తేలిందని చెబుతున్నారు పరిశోధకులు. ఇక అతను మంచి ఫిట్‌నెస్‌లో.. వ్యాయామం స్కిప్ చేయకపోవడం, బరువుకి సంబంధించిన వ్యాయామాలు, ప్రోటీన్ ఆహారం తదితరాలు తన రోజూ వారీ జీవశైలిలో ఉండే ప్రాథమిక మూల స్థంభాలని చెప్పారు పరిశోధకులు. ఇంకేందుకు ఆలస్యం వయసుతో సంబంధం లేకుండా చక్కగా మంచి వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా ఉండటమే గాక వృధాప్య ప్రభావం పడకుండా చూసుకోండి. (చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడికి చూపించిన ప్రధాని మోదీ!) -
నా ఫిట్ నెస్ డైట్ సీక్రెట్ ఇదే
-
శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తినొచ్చా?
మిగతా అన్నీ సీజన్లలో కంటే శీతాకాలం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. ఓ పక్క ముసుగుతన్ని పడుకోమనేలా చలి గజగజలాడిస్తుంది. దీంతో ఎలాంటి వ్యాయామాలు, వర్క్ అవుట్లు కుదరవు. ఓ రెండు రోజులు సీరియస్‌గా చేసినా..చలికి లేవలేక నానా పాట్లు. అందులోనూ ఈ శీతాకాలం శరీరం బద్ధకంగా తయారయ్యి కొవ్వుకూడా పొట్ట, తొడల్లోకి చేరిపోతుంది. బరువు తగ్గడం అటుంచి పెరిగే సూచనలే ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడూ ఈ స్ట్రాబెర్రీలు ఎంతగానో ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే శీతాకాలంలో సులభంగా బరువు తగ్గొచ్చు. శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించడంలో సహాయడపతాయి. ఒకరకంగా చెప్పాలంటే శీతాకాలంలో ఈ స్ట్రాబెర్రీలు ఆరోగ్యాకి చాలా ప్రత్యేకమైన పండ్లు అని చెప్పొచ్చు. వీటివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం!. కేలరీలు తక్కువ ఫైబర్ అధికం: స్ల్రాబెర్రీల్లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. దాదాపు వంద గ్రాముల స్ట్రాబెర్రీల్లో కేవలం 32 కేలరీలే ఉంటాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకుంటే ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ వచ్చి అతిగా తినాలనే కోరిక ఆటోమేటిగ్గా తగ్గుతుంది. అధిక నీటి కంటెంట్: వీటిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దీన్ని ఆహారంగా తీసుకుంటే తిన్న సంతృప్టికలిగి ఎక్కువ కేలరీల ఉన్న ఆహారం తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధి: కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, స్ట్రాబెర్రీల్లో కావల్సినన్నీ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రధానంగా విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడానికి, ఐరన్ శోషణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి స్ట్రాబెర్రీలు తగిన పోషకాహారాన్ని అందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్: స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారిస్తుంది, బరువుని అదుపులో ఉంచుతుంది. ఇక ఈ స్ట్రాబెర్రీల్లో ఉండే సహజమైన తీపి, సంతృప్తికరమైన రుచిని అందిస్తాయి. ప్రాసెస్ చేసిన స్వీట్ల కంటే ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మీ రోజువారి ఆహారంలో వీటిని చేర్చడం వల్ల అవసరమైన పోషకాల తోపాటు తీపి తినేలనే కోరికను తగ్గిస్తుంది. ఈ స్ట్రాబెర్రీలు ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గేందుకు ఉపయోగపడటమే గాక కేలరీల లోటుని భర్తిచేసేలా శరీరానికి అవసరమైన సమతుల్య ఆహారాన్ని కూడా అందిస్తాయి. (చదవండి: ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా కడపుబ్బా నవ్వించే డాక్టర్!) -
టాప్-5 డైట్ ప్లాన్స్... 2023లో ఇలా బరువు తగ్గారట!
2023లో కొన్ని డైట్ ప్లాన్లు వార్తల్లో నిలిచాయి. వీటిలో వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనకరంగా ఉండే డైట్ ప్లాన్ కూడా ఉంది. ఆ వివరాలతో పాటు 2023లో చర్చకు వచ్చిన టాప్-5 డైట్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెడిటేరియన్ డైట్ 2023లో మెడిటేరియన్ డైట్ అధికంగా చర్చల్లోకి వచ్చింది. చాలా మంది దీనిని అనుసరించారు. ఈ డైట్ ప్లాన్‌లో వారానికోసారి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. చక్కెర, కొవ్వు పదారార్థాలు తీసుకోకూడదు. గుండెపోటు, స్ట్రోక్, టైప్ -2 డయాబెటిస్ బాధితులు వైద్యుల సూచనల మేరకు ఈ ప్లాన్ అనుసరించారు. 2. వెయిట్ వాచర్స్ రెసిపీ డైట్ వెయిట్ వాచర్స్ రెసిపీలో వేగంగా బరువు తగ్గడంలో సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో సహాయపడే ఆహార ప్రణాళిక దీనిలో ఉంది. దీనిలో రెండు ఫార్ములాలు ఉన్నాయి. మొదటి ఫార్ములాలో ఆహారంలో నూనె పదార్థాలకు దూరంగా ఉండటం. రెండవ ఫార్ములా.. అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం. అలాగే కార్బోహైడ్రేట్లు వీలైనంత తక్కువగా తీసుకోవడం. 3. కీటో డైట్ కీటో డైట్లో తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు పదార్ధాల వినియోగంపై దృష్టి పెట్టాలి. కీటో డైట్ ద్వారా కొన్ని వారాల్లోనే వేగంగా బరువు తగ్గవచ్చు. వైద్యులు పర్యవేక్షణలో ఈ డైట్‌ని ఎంచుకోవాలి. ఎందుకంటే దీనిని దీర్ఘకాలం పాటు ఫాలో చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 4. డాష్ డైట్ డాష్ డైట్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెబుతారు. డాష్ అంటే హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడానికి ఉపయోగపడే డైట్ ప్లాన్. ఇది అధిక రక్తపోటు నియంత్రణకు రూపొందించిన ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక. హృద్రోగులు దీనిని పాటిస్తుంటారు. 5. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అడపాదడపా ఉపవాసం. ప్రతిరోజూ కొంత సమయం లేదా వారంలో ఒకరోజు ఏమీ తినకుండా ఉండటం. అడపాదడపా ఉపవాసంలో ప్రతిరోజూ కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. లేదా వారంలో ఒక రోజు ఉపవాసం చేసి, మరుసటి రోజు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. ఈ ఐదు డైట్ ప్లాన్లు 2023లో అత్యంత ఆదరణ పొందాయి. ఇది కూడా చదవండి: గ్యాస్ చాంబర్‌గా రాజధాని.. కనిపించని సూర్యుడు! -
'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!
మనం వంటల్లో వాడే ఇంగువతో బోలెడెన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మన ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఇంగువని నిపుణులు చెప్పిన విధానంలో గనుక తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. దీన్ని 'హింగ్' లేదా 'ఇంగువ' అని కూడా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన మసాలా. దీన్ని మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యల నుంచి సత్వరమే బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి మెరుగైన పోషక శోషణను ఇస్తుందని చెబుతున్నారు. అలాగే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తదితర సమస్యల నుచి రిలీఫ్ పొందగలరని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు మాత్రం ఇలా ఇంగువ వాటర్‌ని ఇలా తయారు చేసుకుని తాగితే చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఇంగువ వాటర్ తయారీ విధానం: 1/4 టీస్పూన్ హింగ్ (ఇంగువ లేదా ఆసుఫోటిడా) 1 గ్లాసు వెచ్చని నీరు తయారీ విధానం: గోరు వెచ్చని నీటిలో ఇంగువ వేసి కలపండి. ఇంగువ పూర్తిగా నీటిలో కరిగిపోయేంత వరకు కాసేపు అలానే ఉంచండి. కాసేపటి తర్వాత ఆ నీటిని తాగండి. ఇలా పరగడుపునే ఖాళీ కడుపుతో తీసుకోంటే బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: టమాటాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!) -
చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే పౌష్టికాహార లోపాన్ని సులువుగా జయించవచ్చని, నిరుపేదలు సైతం చిరుధాన్యాలను రోజువారీ ఆహారంగా తిసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)–న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో నోవోటెల్ హోటల్లో సోమవారం ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డా. తమిళిసై ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలను తాను ప్రతి రోజూ తింటానన్నారు. వైద్యురాలిగా కూడా చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తిరిగి ప్రజలంతా భాగం చేసుకోవటం అవశ్యమన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలకు మాత్రమే పరిమితం కావద్దని అంటూ.. వీటితో పాటు కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు తదితర స్మాల్ మిల్లెట్స్‌ను కూడా మార్చి మార్చి తినాలని సూచించారు. ఒక్కో చిరుధాన్యంలో వేర్వేరు ప్రత్యేకతలున్నాయంటూ, ఒక్కో దాంట్లో ఒక్కో రకం వ్యాధుల్ని పారదోలే ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, పీచుపదార్థాలు వేర్వేరు పాళ్లలో ఉన్నాయని డా. తమిళిసై వివరించారు. ఈ మిల్లెట్స్ చిన్నసైజులో ఉంటాయి కాబట్టి చిన్నచూపు చూడకూడదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో యోగాతో పాటు చిరుధాన్యాలను ప్రపంచానికి తిరిగి పరిచయం చేయటం హర్షదాయకమన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్‌లో శిక్షణతో పాటు ఆర్థిక సాయం పొంది చిరుధాన్యాల ఆహారోత్పత్తుల వ్యాపారం చేపట్టిన పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు గవర్నర్ తమిళిసై గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందించి ప్రశంసించారు. ముగింపు సమావేశానికి ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈవో డా. బి. దయాకర్‌రావు అధ్యక్షతవహించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్‌సైన్స్) డా. శర్మ ప్రసంగిస్తూ వచ్చే నెలతో ముగియనున్న అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం తర్వాత 2033 వరకు చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను త్వరలో వెలువరిస్తామని ప్రకటించారు. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రాచుర్యంలోకి తెస్తున్నామని, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తున్నామన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి) చైర్మన్ డాక్టర్ విజయపాల్ శర్మ ప్రసంగిస్తూ ప్రస్తుతం చిరుధాన్యాలు పేదలకు అందుబాటులో లేవని, వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కనీస మద్దతు ధర పెంపుదలలో కేంద్రం ఇప్పటికే చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడినందున రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. సి.తార సత్యవతి మాట్లాడుతూ మెరుగైన చిరుధాన్య వంగడాల తయారీకి జన్యు సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
శ్రీదేవి గ్లామర్ కోసం చేసిన ఆ డైట్ అంత డేంజరా?
శ్రీదేవి అందం కాపాడుకోవడం కోసం ఫాలో అయిన డ్రైట్ అత్యంత ప్రమాదకరమైంది. వైద్యలు సైతం వద్దని వారించిన ఆమె చనిపోయేంత వరుకు ఆ డైట్ ఫాలో కావడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ సైతం చెబుతున్నారు. ఆమె అందం కోసం చేసిన డైట్ ఏంటీ? అంత ప్రమాదకరమైందా? వైద్యులు ఏం చెబుతున్నారు? తదితరాల గురించే ఈ కథనం. టాలీవుడ్ నటి శ్రీదేవి అందంగా కనిపించడం కోసం ఉప్పు తక్కువుగా ఉండే డైట్ ఫాలో అయ్యేది. అదే ఆమె ప్రాణాలు కోల్పోయేందుకు ఒక రకంగా కారణమైంది. డాక్టర్లు సైతం ఇలా ఉప్పు తక్కవుగా ఉండే ఆహారం తీసుకోవద్దని హెచ్చరించారు కూడా. అయినా ఆమె చనిపోయేంత వరకు కూడా అలా ఉప్పులేకుండానే తినడంతో అదికాస్తా లో బీపీకి దారితీసిందని, ఆమె ఆకస్మిక మరణానికి అది కూడా ఒక కారణమని ఆమె భర్త బోనీ కపూర్ సైతం చెబుతున్నారు. ఇలా అస్సలు వద్దు.. మనిషి వయసు, బాడీ మాస్ ఇండెక్స్, ఆరోగ్యం, తదితరాల ఆధారంగా మనిషి, మనిషికి సోడియం తీసుకునే విధానం మారుతుంది. మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం నుంచి ఉప్పును పూర్తిగా స్కిప్ చేయకూడదు. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమయ్యే అత్యంత ప్రధానమైన ఖనిజాల్లో ఒకటి. ఇది సెల్యూలార్ ఫంక్షన్లను నిర్వహిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఒకవేళ ఉప్పుని ఆహారంలో పూర్తిగా స్కిప్ చేస్తే ఎలక్టోలైట్ బ్యాలెన్స్‌లో తేడా వచ్చి ఒక్కసారిగా మైకం కమ్మి స్ప్రుహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా లోబీపీ రావడమే గాక అనే రకాల దుష్ప్రభావాలను ఎదర్కొనక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎదురయ్యే దుష్ప్రభావాలు.. శరీరానికి సరిపడ సోడియం అందనట్లయితే నీరు చేరి ఉబ్బినట్లుగా అయిపోతారు. ఒక మనిషి శరీరంలో ఉండవల్సిన సోడియం సాధారణంగా పర్ లీటర్‌కి 135 మిల్లీక్వివలెంట్స్(ఎంఈక్యూ/ఎల్) కంటే తక్కువుగా ఉంటే దాన్ని హైపోనాట్రేమియా అంటారు. దీంతో కండరాలు, కణాలు ఉబ్బడం తోపాటు రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. రోజుకు కేవలం 2.4 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకున్నట్లయితే మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీంతో తలనొప్పి, అలసట, మైకం కమ్మడం, కళ్లు తిరిగడం వంటివి ఎదర్కొంటారు. ఈ హైపోనాట్రేమియా కూడా మూడు రకాలుగా ఉంటుంది. కొందరికి అంత త్రీవ స్థాయిలో ఉండకపోవచ్చు. మందులతోనే క్యూర్ అవ్వొచ్చు. కొందరికి ఇది తీవ్ర స్థాయిలో ఉండి..మూర్ఛ లేదా కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. ఒక్కొసారి మెదడులో నరాలు చిట్లిపోయే పరిస్థితి ఏర్పడి చనిపోవచ్చని వైద్యలు విక్రమ్‌జిత్ సింగ్ చెబుతున్నారు. మధుమేహం, బీపీ ఉన్నవారు ఉప్పు తగ్గిస్తే ఎటువంటి సమస్య లేదుగానీ ఏదో అందం కోసం అని ఉప్పు లేకుండా ఆహరా పదార్థాలు తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సైతం ప్రతి రోజు ఐదు గ్రాములు ఉప్పు వినియోగించొచ్చని నొక్కి చెబుతోంది. ఇంతకు మించి తక్కువగా వాడితే కోమాలోకి వెళ్లిపోయి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అందువల్ల దయచేసి సినీతారలు దగ్గర నుంచి సామాన్యుల వరకు మన శరీరానికి కావాల్సినంత ఉప్పుని తీసుకోవడమే సర్వవిధాల మంచిది. (చదవండి: ఓ మహిళకి క్యాన్సర్ థర్డ్ స్టేజ్!ఎలాంటి సర్జరీ లేకుండానే..) -
బరువు తగ్గాలని రోజూ కూరగాయలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం శారీరక శ్రమ తగ్గించడం, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నీ, జంక్ ఫుడ్‌నీ తీసుకోవడం, తగినంత నిద్రపోకపోవడం వంటివి. ఊబకాయం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే సరైన బరువును మెయింటెయిన్ చేయడం అవసరం. బరువు తగ్గాలంటే పొట్ట మాడ్చుకోనవసరం లేదు. కొన్ని రకాల కూరగాయలని డైట్లో చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం. బ్రకోలీ బ్రకోలీలో ఉండే కెరోటినాయిడ్ అనే మూలకం వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, కె వంటి పోషకాలు, ఫైబర్ ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బ్రకోలీని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. క్యాబేజీ క్యాబేజీలో విటమిన్ ఎ, బి, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూర పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ అధిక శాతం ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి అదుపులో ఉంటుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాప్సికమ్ క్యాప్సికమ్‌లో పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్‌లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. సులువుగా బరువు తగ్గుతారు. వీటన్నింటినీ తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం కూడా అవసరం. -
బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది కాదా..?
అనారోగ్యంగా ఉన్న పేషెంట్లు ముందుగా కోలుకునేంత వరకు బ్రెడ్లే పెడుతుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ అయితే ఈజీ అని అందరూ దాన్నే ప్రిఫర్ చేస్తారు. పిల్లల కూడా జామ్, ఆమ్లెట్ వంటి వాటిని నొంచుకుని మరీ లాగిస్తుంటారు బ్రెడ్ల్ని. అయితే అవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు. ఆ బ్రెడ్లు ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలను చూపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రెడ్ ఎక్కువగా వినయోగించడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎందువల్ల ఇది ప్రమాదకారి అంటే.. ►ఇంట్లో తయారు చేసే బ్రెడ్‌లో సాధారణమైన వాటినే కలుపుతాం. తాజాగా బ్రెడ్ తింటాం. అదే మార్కెట్లో లభించే బ్రెడ్ అయితే తాజాగా ఉండేందుకు సోడియం సల్ఫెట్, పోటాషియం మెటాబైసల్ఫైట వంటి వాటిని అధికమొత్తంలో కలుపుతారు. దీనివల్ల ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు పెరిగే ప్రమాదం ఉంది. బ్రెడ్ మెత్తగా ఉండేందుకు వినియోగించే ఎమల్సిఫైయర్లు మైక్రోబయోమ్‌లు కారణంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొనవల్సి వస్తుంది. ►నిల్వ ఉండేదుకు వాడే రసాయానాలు కారణంగా ఆస్తమా, శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తాయి. మార్కెట్లో లభించే బ్రెడ్లు స్వచ్ఛమైన గోధుమ పిండి లేదా మైదా పిండితో తయారవ్వవు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. దీని కారణంగా టైప్ 2 మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ►మార్కెట్లో తయారయ్యే బ్రెడ్‌లో ఫైబర్ కంటెంట్ తక్కువుగా ఉంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని బ్రెడ్లలో అధిక చక్కెర ఉంటుంది. ఇది ఊబకాయం, దంత క్షయం, ఇతర ఆరోగ్య సమస్య తలెత్తడమే గాక శరీరంలో అధిక కేలరీలు పెంచుతాయి. ►ఈ బ్రెడ్లకు కుత్రిమ రంగులు జోడించటం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాన్ని పెంచుతుంది. గమనిక: ఎప్పుడూ బ్రెడ్ కొనేటప్పుడూ అందులో వాడే పదర్థాల మోతాదును చదివి ఎప్పుడూ తయారయ్యింది తదితర వివరాలు చదివిగానీ తీసుకోకండి. సాధ్యమైనంత మేర ఇంట్లో తయారయ్యే బ్రెడ్‌నే వినయోగించండి. (చదవండి: ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!) -
బరువు తగ్గాలని రాత్రిపూట డిన్నర్ స్కిప్ చేస్తున్నారా? ఇది మీకోసమే
ప్రస్తుతం మనలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. ప్రతి పది మందిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలో చాలామంది బరువు తగ్గేందుకు ఎన్నో పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకునేందుకు డైటింగ్, ఫాస్టింగ్ పద్దతిని ఫాలో అవుతుంటారు. దీనికోసం డిన్నర్‌ను స్కిప్ చేసి మరుసటిరోజు అల్పాహారం తీసుకుంటున్నారు.కానీ దీనివల్ల బరువు తగ్గడమేమో కానీ అనేక నష్టం జరుగుతుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోటి విద్యలు కూటి కోసమే అన్న సామెత అందిరికి తెలిసిందే. ఎంత సంపాదించినా మూడు పూటల కడుపు నింపుకోవడం కోసమే. కానీ ఈ మధ్య చాలామంది ఉద్యోగాల ఒత్తిడి, సమయం సరిపోక, బరువు పెరుగుతామని రాత్రి భోజనం మానేస్తుంటారు. దీని వల్ల సన్నబడటం సంగతేమో కానీ అనారోగ్య సమస్యలు తప్పవట. రాత్రిపూట తినడం మానేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం. ►రాత్రిపూట ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉంటే సరిగా నిద్ర ఉండదట. దీని కారణంగా మరుసటి రోజు అలసట, నీరసంగా అనిపిస్తుంది. ► ఏమీ తినకుండా పడుకుంటే ఆ ప్రభావం బ్రేక్‌ఫాస్ట్‌పై కూడా పుడుతుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల అల్పాహారం ఎక్కువగా తినే ఛాన్స్ ఉంది. ► ఇక బరువు తగ్గుతామని చాలా మంది డిన్నర్ స్కిప్ చేస్తుంటారు. కానీ దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఫలితంగా రక్తహీనతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► భోజనం మానేస్తే మెదడు చికాకు పెట్టేస్తుంది. శరీరం కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల ఒత్తిడి, ఆకలి ఎక్కువగా ఉంటుంది. ► భోజనం మానేయడం వల్ల శరీరం ఆకలితో ఉండటం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోతాయి. అధిక కార్టిసాల్ స్థాయిలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ► రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై కూడా రాత్రినిద్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా రోగాలు దాడిచేస్తాయి. ► రక్తంలో చక్కెర అసమతుల్యత ఏర్పడి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ► దీర్ఘకాలంగా డిన్నర్ మానేస్తే నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. ఇది నిద్రలేమికి దారితీస్తుంది. అలాగే, శరీరానికి అవసరమైన కేలరీలు, పోషకాలు అందవు. ► నిద్ర సంబంధిత రుగ్మతలతో మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ► న్యూరోసైకియాట్రిక్ డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం తీవ్రమైన నిద్ర లేమి జ్ఞాపకశక్తి లోపానికి దారితీస్తుందట. ► అందుకే మూడు పూటల తిండి, తగినంద నిద్ర శరీరానికి ఎంతో అవసరం అని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని క్వాంటిటీ తగ్గించి తీసుకోవాలని చెబుతున్నారు. -
ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు
నిన్న మొన్నటి దాకా చెమటలు పట్టించిన ఎండలు కాస్తా ఇప్పుడు మబ్బుల వెనక దాక్కుని, వానలు కురిపిస్తున్నాయి. వానలు ఆహ్లాదంగానే ఉంటాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధులను కూడా వెంట మోసు కొస్తాయి. ఈ అనారోగ్యాలతో పోరాడటానికి. రోగనిరోధకశక్తి బలంగా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తిని మరింత పెంచుకోవడానికి నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. ఆ మార్పులేమిటో, ఈ సీజన్లో ఏ ఆహారం తీసుకుంటే మందో చూద్దాం... ముసురు పట్టినప్పుడు వేడి వేడి టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే వాటికి బదులు గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ వంటివి తీసుకోవాలి. దాంతోపాటు అల్లం, మిరియాలు, తేనెతో తయారు చేసిన టీ సేవిస్తే.. ఆరోగ్యానికి చాలా మంది. అదేవిధంగా బజ్జీలు, పునుగులు, బోండాలకు బదులు వేడి వేడి ఉగ్గాణి, సెనగ, పెసర గుగ్గిళ్లు, చుడువా, సగ్గుబియ్యం కిచిడీ మంది. పుదీనా, తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటితో కషాయం కాచుకుని తాగితే మంది. రాగులు, సోయాబీన్, పెసలు, మెుక్కజొన్న వంటి పప్పుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల దరిచేరవు. వీటితోపాటు పోషక విలువలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు అంటే దానిమ్మ, ఆపిల్, స్ట్రాబెర్రీ, అరటì , క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలి కూర వంటివి తీసుకుంటే మంచిది. అల్లం: ఇది శరీర కణ జాలాలకు పోషకాలను సమీకరించడానికి, సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. ఈ రోజుల్లో జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వసాధారణం. అల్లం కఫాన్ని తగ్గిస్తుంది కాబట్టి అల్లం టీ తాగితే జలుబు, దగ్గు దూరం అవుతాయి. ఫ్లూతో పోరాడటానికి అల్లం తోడ్పడుతుంది. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయి. టీలు, సప్లు, కూరల్లో అల్లాన్ని ఎక్కువ ఉపయోగిస్తే వ్యాధి నిరోధకతను పెంచుకోవచ్చు. నేరేడు పండు... ఈ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాల ఫైటోకెమికల్సూ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. నేరేడులో క్యాలరీలు తక్కువ. వానాకాలంలో వచ్చే అతిసార, కలరా వ్యాధులతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లకీ నేరేడు ఔషధంలా పనిచేస్తుంది. తులసి... ఈ కాలంలో రోజూ తులసి ఆకులను నమలడం ద్వారా అనారోగ్యాల నుంచి రక్షణ పొందవచ్చు. ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని.. నీటిని తాగాలి. తులసి రోగనిరోధక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది. నిమ్మ... నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచే సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు, శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. మిరియాలు... నల్ల మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జీవక్రియలను పెంచుతాయి. దగ్గు, గొంతు నొప్పి ఉన్నట్లయితే నల్ల మిరియాలను పొడి చేసి నిద్రవేళకు ముందు వేడి పాలలో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు... పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. రోజూ రాత్రిపూట చిటికడు పసుపు కలిపిన వేడి పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లవంగం... ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. వర్షాకాలంలో లవంగాలను తీసుకుంటే గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దాల్చిన చెక్క... అద్భుత ఔషధ గుణాలెన్నో దాగి ఉన్న దాల్చిన చెక్క మధుమేహులకు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. రోజూ గ్లాసు పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, శరీరంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించే గుణం దీనిలో ఇమిడి ఉంది. వీటికి దూరంగా ఉండటం మేలు! రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలంటే చక్కెర పదార్థాలకి దరంగా ఉండాలి. ముఖ్యంగా ఐస్ క్రీం, కేక్, క్యాండీ, చాక్లెట్, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. చాలామంది ప్యాక్ చేసిన ఆహారాలని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అధిక ఉప్పు ఆటో ఇమ్యూన్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఆల్కహాల్, ధూమపానం కూడా శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉంటే మేలు. (చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!) -
ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!
వేసవి తాపం చల్లారి హమ్మయ్యా అనిపించే కాలం. చలచల్లగా హాయిగా ఉంటుందని ఆనందించేలోపు అంటు వ్యాధులు మనం కోసం రెడీగా ఉంటాయి. ఈ కాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా దోమలు, ఈగలు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో డెంగ్యూ, మలేరియా, కలరా, టైఫాయిడ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ తదితర అంటువ్యాధులు ప్రబలేకాలం. ఇలాంటి కాలంలో ఈ పండ్లు తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పండ్లు నేరెడు పండ్లు: ఇందులో పోటాషియం, ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే రక్తంలో ఆకస్మికంగా పెరిగే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. చెర్రీస్: దీనిలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణం కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలోనూ రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచడంలో ఉపకరిస్తుంది. ఇందులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సాధారణ ఇన్వెక్షన్ల నుంచి సునాయసంగా బయటపడే సామార్థ్యాన్ని పెంపొందిస్తాయి. బొప్పాయి: ఈ బొప్పాయిలో పాపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సంక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే గాక చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. దానిమ్మ : దానిమ్మ గింజలు: ఆరోగ్యాన్ని అందించే రుచికరమైన పండు. ఇందులో ముఖ్యంగా బీ విటమిన్లు, ఫోలేట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, రక్త ప్రసరణకు సహయపడతాయి. ఈ పళ్లు హైపర్‌టెన్షన్, గుండె సమస్యల వంటి తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పీచెస్: ఈ పండ్లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని పచ్చిగా గానీ సలాడ్‌తో గానీ కలిపి తినండి. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ ఐరన్ ఉన్నాయి. ఇది జామూన్ మాదిరి మంచి శక్తిమంతమైన పోషకాలను అందిస్తుంది. లిచ్చి: ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆస్తమా రోగుల శ్వాసక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి తరుచుగా తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పైన చెప్పిన ఈ పళ్లల్లో దేని రుచి మీకు నచ్చకపోయినా, వాటిని తినడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ పండ్లను పచ్చిగా తినడం లేదా జ్యూస్ /సలాడ్లు, స్మూతీలు, యోగర్ట్‌లు లేదా డెజర్ట్‌లలో చేర్చి తీసుకోండి. ఇవి మీ రోజువారీ ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోండి. (చదవండి: ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..) -
ఈ స్మార్ట్ డివైస్‌తో ఎవరైనా నాజుగ్గా తయారవ్వాల్సిందే
ఎన్ని చిట్కాలు పాటించినా.. ఎంత డైట్ ఫాలో అయినా.. శారీరక శ్రమ ఉంటేనే ఒంట్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది. అందుకే చాలా మంది ప్రతిరోజు వ్యాయామాలు చేసి ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటూ ఉంటారు. అయితే రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి డైలీ వర్కౌట్స్ అన్నిటికీ చక్కటి ప్రత్యామ్నాయమే ఈ వెయిటెడ్ హూలా హూప్. దీన్ని నడుముకు బిగించుకుని.. ఒకే చోట స్థిరంగా నిలబడి కేవలం నడుముని మాత్రమే తిప్పితే.. నాజూగ్గా మారొచ్చు. ఈ స్మార్ట్ ఎక్స్ర్సైజ్తో నడుము, పొట్ట భాగాల్లోని కొవ్వు ఇట్టే కరుగుతుంది. రోజుకి 30 నిమిషాలు చేస్తే చాలు.. 180 నిమిషాల యోగా / 60 నిమిషాల సైక్లింగ్ / 60 నిమిషాల రన్నింగ్ చేసినంత ఫలితం దక్కుతుంది. ఇది అన్ని వయసుల వారికి ఉత్తమమైన వ్యాయామం.న్యూ అప్‌గ్రేడెడ్ డిజైన్‌తో రూపొందిన ఈ ‘హూలా హూప్ డివైస్.. మ్యాగ్నెటిక్ లాక్ సిస్టమ్‌తో సర్దుబాటు చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. 13 నాట్స్‌తో ఉన్న ఈ టూల్‌ని 28 నాట్స్ దాకా అటాచ్ చేసుకుని.. లావుగా ఉన్న వాళ్లు కూడా వాడుకోవచ్చు. ప్రతి నాట్కి 24 మసాజ్ పాయింట్స్ ఉంటాయి. దీనికి వేల్లాడే ఒక వెయిట్ బాల్.. 360 డిగ్రీలు గిర్రున తిరుగుతూ ప్రతి మసాజ్ హెడ్‌ని ప్రెస్ చేస్తూ వెళ్తుంది. దాంతో చుట్టూ పేరుకున్న కొవ్వు వేగంగా కరిగిపోతుంది. -
తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? ఈ లక్షణాలు ఉంటే మాత్రం..
కొందరికి ఎంత తిన్నా మళ్లీమళ్లీ ఆకలి వేస్తుంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే ఆరోగ్యపరంగా ఏవో సమస్యలు ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఇలా అతిగా తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే మనం తినే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేయండం ద్వారా ఆకలి సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు వైద్యులు. ► ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే మీ జీర్ణాశయంలో ఏదో సమస్య ఉన్నట్లే... దీనికి మరో కాఱనం.. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తినడం వల్ల ఆకలి పెరగుతుంది. ► మన శరీరంలో 70శాతం వరకూ నీరు నిండి ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత కూడా తిరిగి ఆకలేస్తుందంటే అందుకు శరీరంలో నీరు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి తగినన్ని నీళ్లు తీసుకోవడం చాలా ఉత్తమం. ► బ్రేక్‌ఫాస్ట్ మానేసి ఒకేసారి భోజనం చేయడం మరికొందరికి అలవాటు. దీనివల్ల ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్న ఫీలింగ్ ఏర్పడి ఎక్కువ తినేస్తారు. ► కొందరికి భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంది. దీనికి మెడిసిన్స్ కారణం ఉండొచ్చు. మెడిసిన్స్‌లో రాయిడ్స్, ప్రిడ్నోసోన్స్, కార్టికాస్టెరాయిడ్ వంటివి ఆకలిని మరింత పెంచేస్తాయి. ► అతిగా వర్కవుట్స్ చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గిపోయి ఎక్కువగా ఆకలేస్తుంటుంది. కాబట్టి శరీరానికి ఎంత అవసరమో అంతవరకే వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ►ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనది ఒత్తిడి. ఈరోజుల్లో చాలావరకు ఒత్తిడితో బాధపడుతున్నవాళ్లు ఉన్నారు. అదే సమయంలో ఎక్కువ ఆహరం తీసుకోవాలనిపిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. ►మనం తినే ఆహారంలో శరీరానికి సరైన పోషకాలు, ప్రోటీన్స్ అందకపోయినా వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. కాబట్టి సరైన డైట్‌ను పాటిస్తూ వేళకు భోజనం, 8గంటల నిద్ర పాటిస్తే మంచిందటున్నారు డైటీషియన్స్ -
బామ్మ వయసు 73.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన పోటీలో పాల్గొని చాంపియన్‌గా నిలిచింది!
ఆనందంగా జీవించే వారికి వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. అచ్చం ఇలాగే.. ఏడు పదుల వయసు దాటిన తర్వాత కూడా బాడీ బిల్డర్‌గా రికార్డులు బద్దలు కొడుతోంది ఈ బామ్మ. ఈమె పేరు రెబెకా వూడీ. అమెరికాకు చెందిన రెబెకా అథ్లెట్స్ కుటుంబంలో జన్మించింది. తండ్రి, అన్నయ్య ఇద్దరూ గోల్డన్ గ్లోవ్స్ బాక్సర్స్. రెబెకా తండ్రికి ఒక కోచింగ్ సెంటర్ కూడా ఉంది. అక్కడ మగపిల్లలతో పాటు, ఆడపిల్లలు కూడా బాడీ బిల్డింగ్‌తో బాక్సింగ్, ఫుట్‌బాల్, బేస్ బాల్, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో శిక్షణ తీసుకునేవారు. అలా వారిని చూసి, చిన్నప్పుడే తానూ బాడీ బిల్డర్ కావాలని నిర్ణయించుకుంది. తండ్రి ప్రోత్సాహంతో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించింది. అయితే, తన నలభయ్యో ఏట చక్కెర వ్యాధి రావడంతో పోటీలకు స్వస్తి పలకాలని వైద్యులు ఆమెకు సూచించారు. అయినా తను బాడీబిల్డింగ్ని ఆపలేదు. ఇక తన 73వ ఏట అయితే, ఇకపై పోటీల్లో పాల్గొంటే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారట. అప్పుడు కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. వైద్యుల మాటను వమ్ము చేస్తూ.. 111 కిలోగ్రాముల పోటీలో పాల్గొని చాంపియన్‌గా నిలిచింది. ఇన్ని విజయాలు సాధించే ఈ బామ్మకు ఇప్పటికీ పిజ్జా, మెక్సికన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. ‘ఇష్టమైన ఆహారం తీసుకుంటూ, ఆనందంగా జీవిస్తే ఏ అనారోగ్యమూ మిమ్మల్ని ఏమీ చేయలేదు’ అంటోంది ఈ బాడీబిల్డర్ బామ్మ. చదవండి: 127 గంటలు.. డ్యాన్స్! -
ఈ ప్రాంత ఆహారంతో మీ మెదడు వయస్సు తగ్గిపోతుంది..!
కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ..జంక్ ఫుడ్‌ను తగ్గిస్తే మన మెదడు మెరుగ్గా పనిచేస్తుందని ఎన్నో నివేదికలు తెలిపాయి. కానీ ప్రస్తుతం ఓ నివేదిక మెదడు వయస్సును తగ్గించే విషయాలను వెల్లడించింది. మధ్యదరా ప్రాంతంలోని ఆహారంతో మెదడు వయస్సు తగ్గుతుందని ఇజ్రాయెల్‌లోని నెగేవ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ నివేదిక స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో సాధారణంగా తీసుకునే కూరగాయలు,సీఫుడ్, తృణధాన్యాల కారణంగా శరీరంలో ఒక శాతం కొవ్వు తగ్గడమే కాకుండా మెదడు పనితీరు మెరుగుపడిందని తెలిపారు. మెదడుకు సాధారణంగా ఉండే వయస్సు కంటే తొమ్మిది నెలలు తగ్గుతుందని పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. 102 మందితో 18 నెలలపాటు ఆ ఆహారాన్ని ఇచ్చి శరీర భాగాల పనితీరును పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఆహారంతో కొత్తగా వచ్చి చేరుతున్న కొవ్వు, బాడీ మాస్ ఇండెక్స్, కాలెయ పనితీరును పరిశీలించగా.. మెదడు పనితీరుపై మెరుగైన ఫలితాలు కనిపించినట్లు వెల్లడించారు. శరీర బరువు కూడా 2.3కిలోగ్రాములు తగ్గినట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనవిధానం వల్ల మెదడుపై మెరుగైన ఫలితాలు ఉంటున్నాయని బెన్ గ్యురియన్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైంటిస్టు గిడోన్ లెవకోవ్ తెలిపారు. ప్రాసెసింగ్ ఫుడ్‌ను తగ్గించడం, స్వీట్లు, జంక్ ఫుడ్స్ మెదడు పనితీరును దెబ్బతీయడమే కాకుండా.. బయోలాజికల్ వయస్సును కూడా పెంచుతున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి:భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం -
194 కేజీల బరువున్న వైద్యుడు 110 కిలోల బరువు తగ్గాడు.. తన సీక్రెట్ ఇదేనంటూ...
శరీరానికి అవసరమైనంత మేరకే కేలరీలు తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీని కొనసాగించడం ద్వారా ఎవరైనా బరువు తగ్గవచ్చని చెబుతుంటారు. దీనిని తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఒక వైద్యుడు ఏకంగా 110 కిలోల బరువు తగ్గారు.ఈ వైద్యుని పేరు డాక్టర్ అనిరుద్ధ్ దీపక్. ఆయన సర్టిఫైడ్ న్యూట్రిషనిస్టు కూడా. చెన్నైకి చెందిన ఈయన 5 అడుగుల 7 ఇంచుల ఎత్తు కలిగివున్నారు. డాక్టర్ అనిరుద్ధ్ బరువు ఒకప్పుడు 194 కిలోలు ఉండేది. అయితే ఇప్పుడు అతని బరువు 80 కిలోల కన్నా తక్కువగానే ఉంది. 194 కిలోల నుంచి 80 కిలోలకు తగ్గిన అతని ఫిట్ నెస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ అనిరుద్ధ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి తింటూవుండటం అలవాటు. ఈ కారణంగానే నా శరీర బరువు మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఈ విషయన్ని నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ ఫుడ్ మొదలైనవాటిని ఎంతో ఇష్టపడేవాడిని. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ పొట్ట నింపేసేవాడిని’ అని తెలిపారు. 2018లో అతని ఎంబీబీఎస్ పూర్తయ్యింది. అయితే ఇంతలోనే అనిరుద్ధ్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. ఆ సమయంలో వైద్యులు అనిరుద్ధ్తో ఇదే శరీర బరువుతో ఉంటే మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఇదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా మారింది. బరువు తగ్గాలని అనిరుద్ధ్ నిర్ణయించుకున్నారు. తాను బరువు తగ్గిన విధానం గురించి అనిరుద్ధ్ మాట్లాడుతూ ‘ఒక ట్రైనర్ నాకు డైట్, వర్కవుట్ ప్లాన్ చెప్పారు. దీనిని క్రమం తప్పకుండా అనుసరిస్తూ రెండేళ్లలో 110 కిలోల బరువు తగ్గాను. రోజులో కేవలం 5 మిల్లీలీటర్ల వంట నూనెను మాత్రమే తీసుకునేవాడిని. 2000 కేలరీలు మాత్రమే ఉండేలా చూసుకున్నాను.బ్రేక్ ఫాస్ట్‌లో పోహా లేదా చపాతీ, సోయా చంక్స్, సలాడ్ తీసుకునేవాడిని. స్నాక్స్‌లో పండ్లు, బాదాం మాత్రమే తినేవాడిని. మధ్యాహ్నం భోజనంలో రైస్ లేదా రోటీ, పప్పు లేదా రాజ్మా, కూర, పెరుగు తీసుకున్నాను.ఈవెనింగ్ స్నాక్స్‌లో ప్రొటీన్, రాత్రి ఆహారంలో రైస్ లేదా రోటీ, పన్నీర్, కూర ఉండేలా చూసుకునేవాడిని. నేను ఫిట్నెస్ జర్నీ ప్రారంభించినప్పుడు లాక్డౌన్ నడుస్తోంది.దీంతో హోమ్ వర్క్అవుట్ మాత్రమే చేయగలిగాను. ఈ సమయంలో నేను డంబెల్స్, ఫ్లోస్‌తో వ్యాయామాలు చేసేవాడిని. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, జంప్ రోప్, సర్కిట్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ మొదలైనవి చేసేవాడిని’ అని డాక్టర్ అనిరుద్ధ్ తెలిపారు. -
ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువ అవుతోందని.. బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి
ప్రజలకు ఆరోగ్య స్పృహ గతంలో కంటే మరింత పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల అనంతరం ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తలు అధికమయ్యాయి. ఇక కొందరేమో పర్యావరణ హితంగా జీవనం ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా వీగన్లుగా మారిపోతున్నారు. అయితే, కెనాడాకు చెందిన టిఫానీ అనే ఫుడ్ బ్లాగర్ షేర్ చేసుకున్న ఓ విషయం మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. తన 18 నెలల కూతురుకు ఏకంగా ఆమె మిడతలను తినిపిస్తోంది. అదేంటి? చిన్న పిల్లకు మిడతలు ఆహారంగా ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకున్నారా? నిజంగా ఇది నిజం! ఖర్చుల భారం.. అందుకే.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. వారానికి 250 నుంచి 300 డాలర్లు (సుమారు రూ.25000) సరుకులకు ఖర్చవుతోందని, అందుకనే తన బిడ్డకు ప్రోటీన్ సప్లిమెంట్ కోసం వినూత్నంగా ఆలోచించానని వెల్లడించింది. మిడతల్లో (క్రికెట్స్) విలువైన ప్రోటీన్ ఉంటుందని, తన బేబీకి అవి తినిపించి వాటిని భర్తీ చేస్తున్నానని టిఫానీ వివరించింది. డబ్బులు ఆదా అవడంతో పాటు పాపకు అవసరమైన ప్రోటీన్ అందుతోందని ఆమె పేర్కొంది. కీటక శాస్త్రంపై తనకున్న అవగాహన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను కూడా సాలెపురుగు నుంచి తేలు వరకు పలు కీటకాలను గతంలో రుచి చూశానని పేర్కొంది. థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో పర్యటించినప్పుడు చీమలు, మిడతలను తిన్నానని చెప్పుకొచ్చింది టిఫానీ. అక్కడి ప్రజల జీవన విధానంలో కీటకాలను తినడం మామూలేనని వెల్లడించింది. (చదవండి: 69 క్యాన్ల సోడాలు హాంఫట్) ఇలాంటి ప్రయోగాలు అవసరమా? మిడతలతో తయారు చేసిన పఫ్‌లు, ప్రోటీన్ పౌడర్‌ను తన బిడ్డకు అందిస్తునన్నాని టిఫానీ చెప్పింది. బీఫ్, చికెన్, పంది మాంసంలో ఉండే ప్రోటీన్లకు బదులు మిడతలపై ఆధారపడటంతో వారానికి అయ్యే ఖర్చులో 100 డాలర్ల వరకు ఆదా అవుతోందని పేర్కొంది. అయితే, టిఫానీ చర్యను సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. చిన్న పిల్లపై ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని హితవు పలుకుతున్నారు. మరికొందరేమో కొత్త ఐడియా బాగానే ఉందిగానీ, చిన్నారికి ఇదో రకమైన శిక్ష కదా! అంటూ కామెంట్ చేశారు. ఏదైనా పాపకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే, తన కూతురు కొత్త రకమైన ఆహారాన్ని స్వీకరించడంలో ఎలాంటి బెరుకు, భయం కనబర్చదని టిఫానీ పేర్కొనడం గమనార్హం. అందువల్లే తమ ఆహారం కానిదైనప్పటికీ ఆమె తింటోందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు.. పీడియాట్రిక్ డైటీషియన్ వీనస్ కలామి ప్రకారం.. 6 నెలల వయసు తర్వాత పిల్లలకు ఆహారంలో పురుగులు, కీటకాలు భాగం చేస్తే తినే తిండి పట్ల పాజిటివ్ దృక్పథం అలవడుతుందని పేర్కొంది. (చదవండి: వింత ఘటన: విడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంది..ఫోటోషూట్ చేసి మరీ..) -
ఉపాసన బరువు పెరగకపోవడానికి కారణం..?
-
ప్రాంతాన్నిబట్టి ప్లాన్
‘అన్నం మానండి, సాయంత్రం చపాతీ తినండి,ఉదయం మిల్లెట్స్ బెటర్..’ మధుమేహంతో బాధపడే వారికి ఇలాంటి సూచనలు,సలహాలు సాధారణమే. అయితే వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉన్న రోగులందరికీ ఒకే రకమైన డైట్ చార్ట్ సరైనదేనా?అంటే కానేకాదు అంటున్నారు వైద్య నిపుణులు. ప్రాంతాల వారీగా, జీవనశైలులకు అనుగుణంగా కస్టమైజ్డ్ (కావలసిన విధంగా) డైట్ చార్ట్ రూపొందించాల్సిందే అంటున్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా విస్తృత అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. ఇందులో వేలాదిగా వైద్యులు, రోగులు భాగంపంచుకోనున్నారు. సాక్షి, హైదరాబాద్: ‘మన దేశపు ఆహారపు అలవాట్లలో ఉన్న విస్తృతమైన వ్యత్యాసాల కారణంగా, మధుమేహాన్ని నియంత్రించడానికి అందరికీ ఒకే రకంగా సరిపో యే డైట్ చార్ట్ లేదని తాజాగా పరిశోధకులు తేల్చారు. దీని ఫలితంగానే ట్రాన్స్కల్చరల్ డయాబెటిస్ న్యూట్రిషన్ అల్గోరిథం (టీడీఎన్ఏ) పుట్టింది..’అని చక్కెర వ్యాధి నిపుణులు డాక్టర్ ఒసామా హమ్డీ, పోషకాహార నిపుణులు డాక్టర్ ఇర్ఫాన్ షేక్ చెప్పారు. ఈ టీడీఎన్ఎపై అవగాహన కార్యక్రమాలకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీఎన్ఏ అనేది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్లకు గొప్ప ఉపశమనంగా మారుతుందని వీరు పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా.. వివిధ ప్రాంతాల ప్రజల విభిన్న ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను అధ్యయనం చేసి ఆయా ప్రాంతాల్లోని రోగుల్లో మధుమేహ నియంత్రణకు అవసరమైన ఆహారపు అలవాట్లను (ఆహార ప్రణాళిక) సూచించేదే టీడీఎన్ఏ. ఈ ఆల్గోరిథమ్‌ను రూపొందించడానికి, భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు, ఈశాన్య జోన్లుగా విభజించారు. ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లు పరిగణనలోకి తీసుకుని మధుమేహానికి పరిష్కారాలు అన్వేషించాలనేది ఈ విభజన ఉద్దేశం. ఉదాహరణకు.. కేరళలోని తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువగా కనిపించే మధుమేహానికి కారణం.. వీరు ఎక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ ప్రోటీన్ తీసుకోవడమట. ఆ ప్రాంతంలో కాసావా (కర్ర పెండలం) ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాసావా ప్రోటీన్ ద్వారా కాలేయంలో శరీరానికి తగ్గట్టుగా ఫిల్టర్ కావాలి. అయితే శరీరంలో ఉన్న తక్కువ స్థాయి ప్రోటీన్ల కారణంగా ఇది జరగడం లేదు. ఇది ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)లో కాల్షియం ఏర్పడటానికి, అంతిమంగా మధుమేహానికి దారి తీస్తోందని తేల్చారు. ఇలాంటి పలు అధ్యయన ఫలితాల నేపథ్యంలో ప్రాంతాల వారీ డైట్ చార్ట్ (టీడీఎన్ఏ) తయారీ ఆవశ్యకత ఏర్పడింది. అందరూ చేయాల్సిందిదే.. చక్కెర వ్యాధి పెరగడానికి ప్రధాన కారణాల్లో.. ప్రోటీన్లతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ అధిక వినియోగం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహులు టీడీఎన్ఏ పాటించడంతో పాటు ఆహారాన్ని నిదానంగా తీసుకోవడం, అర్ధరాత్రి అత్యధిక కేలరీలతో కూడిన ఆహార వినియోగాన్ని తగ్గించడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లను మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం విస్తృతి తెలంగాణలో ఎక్కువ ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నివేదిక ప్రకారం, గత మూడు దశాబ్దాలుగా దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 150% పెరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల విస్తృతి 16.6% కాగా, ముంబై (7.5%), చెన్నై (13.5%), బెంగళూరులో 11.7% మేర పెరుగుదల ఉంది. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు గుండె జబ్బులు, దృష్టి లోపం, మూత్రపిండాల రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మధుమేహం నియంత్రణలో జీవనశైలిలో మార్పులదే కీలక పాత్ర. అలాగే ప్రత్యేకమైన పోషకాహార సప్లిమెంట్స్ కూడా చాలా అవసరం. – డాక్టర్ ఇర్ఫాన్ షేక్, మెడికల్ అఫైర్స్ హెడ్, అబాట్ న్యూట్రిషన్ మన దగ్గర రైస్ వినియోగమే సమస్య డయాబెటిస్ నియంత్రణలో డైట్ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంత మాత్రాన అందరికీ చపాతి/పుల్కా తినేయమని చెప్పేయడం కుదరదు. తరతరాలుగా, ప్రాంతాల వారీగా అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మన దగ్గర రైస్ బాగా తీసుకుంటారు. సాధారణ అన్నం లాగే కాకుండా బిర్యానీ, పులిహోర తదితరాల రూపంలో కూడా రైస్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. తద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనిని తగ్గించడం/నియంత్రించడానికే డైట్ ప్లాన్‌ను ఇస్తుంటాం. ఉదాహరణకు అన్నం మానలేమనేవారికి పరిమాణం తగ్గించమని, రాత్రి పడుకునే ముందు తినే అలవాటున్నవారికి 7 గంటల కల్లా ముగించమని చెబుతుంటా. ఉదయం పూటి ఎక్కువమంది ఇడ్లీ తీసుకుంటారు. కానీ మేం ఇడ్లీ, దోశ బదులు పెసరట్టు తినమంటాం. కాదు కూడదనే ఇడ్లీ ప్రియులకు.. ఇడ్లీ పిండిలో చిక్కుళ్లు, పెసలు, కేరట్ తురుము, రాజ్ మా గింజలు... వంటివి కలుపుకో మంటాం. తద్వారా కార్బ్స్ శాతాన్ని తగ్గించడం, ప్రోటీన్, ఫైబర్‌ని పెంచడానికి ప్రయతి్నస్తాం. – డా.పద్మనాభ వర్మ, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్, హైదరాబాద్ నియంత్రణే ముఖ్యం.. మధుమేహులు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆహారపు అలవాట్లను మానుకుని ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్లక తప్పదు. అయితే దీనికి కట్టుబడి ఉండే రేటు 38% కంటే తక్కువ. ఈ నేపథ్యంలో రోగుల జీవనశైలి, ఆహారపు అలవాట్ల చరిత్రకు అనుగుణంగా రూపొందించే ప్రత్యేకమైన ఆహార జాబితాయే టీడీఎన్ఏ. బరువు తగ్గడం, గ్లైసెమిక్ నియంత్రణ, నిర్వహణలో ఇది రోగికి తోడ్పడుతుంది – డాక్టర్ ఒసామా హమ్డీ, మెడికల్ డైరెక్టర్ జోస్లిన్ డయాబెటిస్ సెంటర్ -
అసలే ఎండాకాలం.. ఇవి తాగేందుకు తయారా? డాక్టర్ల చెప్తున్న ఆ జాగ్రత్తలేంటి...
ఉదరం తేలికగా అనిపించాలంటే.. మలినాలు పోవాలంటే.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలగాలంటే.. శరీరానికి తక్షణ శక్తి రావాలంటే.. చర్మం ఆరోగ్యంగా కనిపించాలంటే? అన్నింటికీ అదే మందు.. అదే విందు కూడా అన్నట్టు మారుతోంది. సులభంగా సేవించే వీలు, ఇన్‌స్టాంట్‌గా కలిగే మేలు.. దీంతో ద్రవాహారమే శరణ్యం అంటోంది నవతరం. లిక్విడ్ డైట్‌పై నవతరంలో పెరుగుతున్న మోజు మోతాదు మించితే ప్రమాదకరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో నుంచి మలినాలు తొలగించి తేలికపరిచే డిటాక్స్ డ్రింక్స్, శరీరానికి అవసరమైన పోషణను అందించే ఎనర్జీ డ్రింక్స్.. ప్రొటీన్ షేక్ సప్లిమెంట్స్.. ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో డ్రింక్.. అన్నట్టుగా అందుబాటులో ఉన్న ఈ పానీయాలు... గత ఏడాది చివరి నుంచీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చేశాయి. వేసవిలో లిక్విడ్ డైట్ల వెల్లువ మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఇవి అవసరమా? ఈ ట్రెండ్ ఆరోగ్యకరమైనదేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అతి కాకుంటే అనర్థం కాదు.. ‘డిటాక్స్ డ్రింక్స్ అతిగా తాగకపోతే ఆరోగ్యకరమైనవే. అయితే ‘చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బయోటిన్, ఇతర కొల్లాజెన్ పానీయాల వంటి సప్లిమెంట్లతో సరిపుచ్చుకోవాలి హెర్బల్ టీలు వంటి సహజ డిటాక్స్ పానీయాలు సహజమైన నోని, గిలోయ్, తేనె కలిపినవి, ఇతర ఆయుర్వేద పానీయాలను మితంగా తీసుకుంటే మంచిదే. అయితే.. ప్రిజర్వేటివ్‌లను కలిగి ఉన్న సింథటిక్ డిటాక్స్ డ్రింక్స్ మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి’ అని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి పరిశోధనా కేంద్రానికి చెందిన వైద్యుడు డాక్టర్ పి. ప్రసాద్ స్పష్టం చేశారు. వ్యాధి పీడితుల ఆహారం అది.. ‘లిక్విడ్ డైట్లను జబ్బుపడినవారి డైట్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఆహారాన్ని నమలడం మింగడం కష్టంగా ఉన్న వ్యక్తులకు తరచుగా ఇవి సిఫార్లు చేస్తాం. కాకపోతే ఇప్పుడు ‘సప్లిమెంట్ రంగం బాగా విస్తరించేసింది. పోటాపోటీగా సప్లిమెంట్లను ఆహారంగా మార్చేసి విక్రయిస్తోంది. సప్లిమెంట్లను అవసరమైన వ్యక్తుల కోసం మాత్రమే సూచిస్తాం. అవి ఆరోగ్య సమస్యలు లేని సరిపడా బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) కలిగి ఉన్న వారికి ఇవి తప్పనిసరి కాదు’ అని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన క్లినికల్డైటీషియన్ డాక్టర్ ఎం.గాయత్రి అంటున్నారు. వేసవిలో ఇలా... సహజంగానే వేసవిలో ద్రవాహారాలు తీసుకోవడం పెరుగుతుంది. అది మంచిదే కూడా. అయితే.. తేలికగా జీర్ణం చేసుకోవడానికో మరో కారణంతోనో అలవాటైన ఆహారాన్ని పక్కన పెట్టేసి మరీ లిక్విడ్ డైట్‌కి మళ్లడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణంగా మనం రోజుకు మూడుసార్లు ఆహారం తీసుకుంటాం. కానీ వేసవిలో ఆకలి మందగిస్తుంది. కాబట్టి ఒకసారి ఆహారం తీసుకోవడం మానేసి, లిక్విడ్ ఫుడ్ ద్వారా భర్తీ చేయవచ్చు. అంతే తప్ప ఆహారానికి ప్రత్యామ్నాయంగా సంపూర్ణ లిక్విడ్ డైట్‌ని ఎప్పుడూ సూచించం, అది విటమిన్ మినరల్ లోపాలకు పోషకాహార అసమతుల్యతకు కారణమవుతుంది’ అని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత స్టీఫెన్ అంటున్నారు. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు ఒకపూట భోజనాన్ని విటమిన్ సి– రిచ్ ఫ్రూట్ జ్యూస్‌తో భర్తీ చేయవచ్చు. ఇది వారికి శక్తినిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఉపకరిస్తుంది అని సూచించారామె. -
ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..?
ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కారణం సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడమే. డైట్ నుంచి కొన్ని ఆహారాలని మినహాయించడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం... చక్కెర మీరు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ముందుగా ఆహారం నుంచి చక్కెరను మినహాయించండి. ఎందుకంటే తీపి పదార్థాలు మీ శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతను కలిగిస్తాయి. దీనివల్ల మనిషిలో టెన్షన్ పెరగడం మొదలవుతుంది. అందుకే డిప్రెషన్‌తో బాధపడేవారు చక్కెరను ఎక్కువగా తినకూడదు. ఆల్కహాల్ ఆల్కహాల్ కాలేయానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఆల్కహాల్ మెదడులోని సెరోటోనిన్ చర్యను మారుస్తుంది. ఇది ఆందోళనను పెంచుతుంది. అందుకే మద్యం తాగకూడదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ∙ఆందోళన పెరుగుతుంది. కెఫిన్ కెఫిన్ కలిగిన పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి కారణమవుతాయి. కెఫిన్ అనేది కాఫీలోనే కాదు, టీలో కూడా ఉంటుంది. అందువల్ల కాఫీ, టీ, చాక్లెట్లు, కొన్ని రకాల శీతల పానీయాలలో కూడా కెఫిన్ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటివల్ల డిప్రెషన్‌కు గురవుతారు. ఉప్పు ఉప్పు మానసిక స్థితిని పాడు చేస్తుంది. మీరు అలసిపోయేలా చేస్తుంది. అలాగని ఉప్పు తీసుకోవడాన్ని పూర్తిగా మానేయకూడదు. తగ్గించి తీసుకుంటే ఉత్తమం. కొందరికి మజ్జిగన్నంలో ఉప్పు తప్పనిసరి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. -
కొడుకు కోసం ఏకంగా 62 కిలోల బరువు తగ్గిన మహిళ... వైరలవుతోన్న ఫోటోలు
తనకి ఏమైపోతుందో అని ఆ కొడుకు పెట్టిన కన్నీళ్లు ఆ తల్లిలో మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు ఎలాంటిదంటే.. గుర్తుపట్టలేనంతంగా ఆమె మారిపోయేలా!సోషల్ మీడియాలో ఓ తల్లి విజయవంతమైన ప్రయత్నం గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఒకప్పుడు 114 కేజీల బరువు ఉన్న ఆమె.. ఏకంగా 62 కేజీలు తగ్గిపోయింది. అంత బరువూ తగ్గడానికి ఒకే ఒక్క కారణం కొడుక్కి తన మీద ఉన్న అమితమైన ప్రేమ.. అది బయటపడేలా చేసిన ఓ చేదు అనుభవం.. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన సారా లాకెట్ అనే మహిళ 114 కిలో బరువు ఉండేది. ఓరోజు కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. కొడుకుతోపాటు స్లైడ్‌లోకి వెళ్లగా మలుపు తిరుగుతున్న సమయంలో ఆమె స్లైడ్‌లో ఇరుక్కుపోయింది. తల్లిని చూసిన కొడుకు కంగారు పడిపోయాడు. ఆమెకు ఏమైందోనని కన్నీరు పెట్టుకున్నాడు. చివరికి ఆమె భర్త వచ్చి తనను బయటకు తీశాడు. అయితే కొడుకు ముందు అలా జరగడం సారాకు ఇబ్బందిగా అనిపించింది. స్లైడ్‌లో చిక్కుకోవడానికి తన బరువే కారణమని బాధపడింది. కొడుకు ముందు అవమానం జరిగిందంటూ భావించి.. అతని కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఎలగైనా బరువు తగ్గాలని డిసైడ్ అయ్యింది. కేవలం తన డైట్ మార్చి, వర్కౌట్ల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. చదవండి: మెన్స్ డే.. ఇది జోక్ కాదు బ్రదర్! ఈ ప్రక్రియలో మహిళకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది బరువు తగ్గాలన్న ఆమె ఆశయాన్ని కష్టతరం చేసింది. దీంతో తన లైఫ్‌స్టైల్, డైట్‌ను పూర్తిగా మార్చుకుంది. వైద్యుల సలహా తీసుకొని.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా జాగ్రత్తలుు తీసుకుంది. వర్కౌట్స్, పోషక విలువులు కలిగిన డైట్ కంటిన్యూ చేసింది. రోజుకి 3వేల క్యాలరీలు బర్న్ చేయడం ప్రారంభించింది. అల్పాహారంగా టమాటా, బచ్చలికూర, గుడ్డులోని తెల్లసొన.. భోజనంలో కొద్దిగా రైస్, ఉడికించిన కూరగాయాలు, ఆకు కూరలను మాత్రమే క్రమం తప్పకుండా తీసుకుంది. ఫలితంగా ఆమె శరీరంలో భారీ మార్పును చూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 62 కేజీల బరువు తగ్గింది. ప్రస్తుతం 53 కేజీల బరువుతో ఉంది. View this post on Instagram A post shared by Sara Lockett 🧚🏼 VSG • Fitness • Fashion Inspo (@sculptingsara) నిజానికి ఆమె మొదట్లో అంత బరువు ఉండేది కాదట. ప్రెగ్నెన్సీ సమయంలో ఆమెకు జరిగిన సర్జరీల కారణంగా అంత బరువు పెరిగిపోయిందట. మొదటి ప్రెగ్నెన్సీ సమంలో 26 కేజీలు పెరిగిందని, అలా మూడో బిడ్డ వరకు 133 కిలోలకు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోలేదని, ఎక్కువగా వేయించినవి, పాస్తా, ఫాస్ట్‌ఫుడ్ ఇలా దొరికిన ఆహారాన్ని లాగించేదానినని తెలిపింది. దీంతో బీపీ పెరిగి, డయాబెటిస్ కూడా వచ్చిందని తెలిపింది. అందుకే బరువు పెరిగినట్లు పేర్కొంది. అయితే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెంటనే బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నారు. చివరకి ఊహించని విధంగా ట్రాన్స్ఫార్మింగ్ చెందారు. బరువుతో ఉన్నవి.. బరువు తగ్గిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఇంత బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదని ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
Health: ఆస్తమా ఉందా? కాకర, గుమ్మడి, లవంగాలు.. తరచుగా తింటున్నారా? అయితే
కొన్ని పదార్థాలు (అలర్జెన్స్) మాత్రమే కాకుండా ఒక్కోసారి కొన్ని ఆహారాలూ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అయితే మరికొన్ని ఆహారపదార్థాలు ఆస్తమాను నివారిస్తాయి కూడా. ఆస్తమాను అదుపులో ఉంచుకోడానికి మనకు సరిపడని ఆహారాలకు దూరంగా ఉంటూ, ఆస్తమాను నివారించే వాటిని తీసుకోవడం మంచిది. అయితే తమ తమ వ్యక్తిగత తత్త్వాన్ని బట్టి ఆస్తమాను నివారించేవిగా పేర్కొన్న అదే ఆహారం... మరికొందరిలో ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే తమ తమ శరీరతత్త్వాన్ని బట్టి తమకు ఏయే ఆహారాలు సరిపడవో జాగ్రత్తగా పరిశీలించుకుని సరిపడేవే వాడాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా ఆస్తమాను నివారించే, ప్రేరేపించే ఆహారాల జాబితా ఇది. ఆరోగ్యాన్నిచ్చి.. ఆస్తమాను అదుపు చేసే ఆహారాలు... కాయగూరలూ, ఆకుకూరలు : ►ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది. ►ఇందుకోసం కాకర, గుమ్మడి, అరటి వంటి కూరగాయలు, పాలకూర వంటి ఆకుకూరలు.. మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. వండకుండానే తినే వాటిల్లో : ►కిస్మిస్, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్, క్యారట్, బీట్రూట్, తాజా కాయగూరలు తీసుకోవాలి. అలాగే కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పండ్లలో సాధారణంగా విటమిన్–సితో పాటు అనేక ఇతర విటమిన్లు, పోషకాలు ఉండటం వల్ల అవి ఆస్తమాను నివారించేవే. అయితే ఇవే పండ్లు కొందరిలో ఆస్తమాను ప్రేరేపించనూ వచ్చు. ►అలాగే అరటిపండు, పెరుగు వంటివి కొందరిలో ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు. వ్యక్తిగతంగా అవి తమకు సరిపడనప్పుడు మాత్రమే వీటి నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ తమ శరీర తత్వాన్ని బట్టి అవి ఆస్తమాను ప్రేరేపించనివైతే... ఈ ఆహారాలు ఆస్తమాను సమర్థంగా నివారించడమే కాదు... ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి. ఆస్తమాతో పాటు మరెన్నో రుగ్మతలను నివారిస్తాయి. ►అలాగే బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు నివారణకు ఎంతో తోడ్పతాయి. ►వెల్లుల్లి, ఉల్లి, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా గింజలు, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు. ►ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్తమాను నివారిస్తాయి, తీవ్రతనూ తగ్గిస్తాయి. ►అయితే మసాలాల తీవ్రత పెరగడం కొందరిలో ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా తీవ్రతను పెంచే ఆహారాలు: ►రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ►కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వీటిని మానేయాలి. ►ఉప్పు బాగా తగ్గించాలి. ►ఆస్తమా రావడానికి చిన్నప్పటి ఆహారపు అలవాట్లు కూడా కారణమేననే కోణంలో చాలా అధ్యయనాలు జరిగాయి. ►చిన్నపిల్లలకు ఆ వయసప్పుడే మంచి ఆహారపు అలవాట్లను నేర్పడం వల్ల పెద్దయ్యాక వారిలో ఆస్తమా వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. నోట్: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. Health Tips In Telugu: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే.. -
చిన్న వయసుసులోనే గుండెపోటు మరణాలు.. ఎందుకు?
మొన్న కన్నడ సినీహీరో పునీత్ రాజ్ కుమార్.. నిన్న మేకపాటి గౌతమ్ రెడ్డి.. తాజాగా గాయకుడు కేకే.. గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే మరణించిన వారు వీరందరూ! ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పైన ఉదహరించిన వారంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేవారే. నిత్యం వ్యాయామాలు చేస్తూ.. పుష్టికరమైన ఆహారం తీసుకునే వారే. అయినా సరే చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. కారణాలేమైనా... ఈ ఘటనల సారాంశం ఒక్కటే! అది ఆరోగ్యంపై పురుషులు మరింత శ్రద్ధ వహించాలని. అంతర్జాతీయ పురుషుల ఆరోగ్య వారోత్సవాల (జూన్ 13 – 19)నేపథ్యంలో ఆహారం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందడం ఎలాగో చూద్దాం... ప్రొటీన్ మోతాదు పెంచండి... మనం తినే ఆహారం.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు. ప్రతీదీ తగు మోతాదులో అవసరం. ఆహార అలవాట్ల ప్రకారం మనం కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటాం. ఇలా కాకుండా... భోజనంలో ఎంతో కొంత ప్రొటీన్లను కూడా తీసుకోగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉడికించిన కోడిగుడ్లు మొదలుకొని పన్నీర్, పరాఠా, చేపలు, రాజ్మా, సాంబార్, బీన్స్, సోయా పులావ్ వంటి వెజ్/నాన్‌వెజ్ ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన ప్రొటీన్ లభిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రమాణాల ప్రకారం ప్రతి భారతీయుడు రోజుకు కనీసం 48 గ్రాముల ప్రొటీన్‌ను తీసుకోవడం అవసరం. ఇంకోలా చెప్పాలంటే ప్రతి కిలోగ్రాము బరువుకు ఒక గ్రాము ప్రొటీన్ అవసరమవుతుంది. అయితే నూటికి 80 శాతం మంది అవసరమైన దానికంటే తక్కువ ప్రొటీన్ తీసుకుంటున్నారు. కండరాలు బలోపేతమయ్యేందుకు మాత్రమే కాకుండా... రోగ నిరోధక శక్తిని పెంచేందుకూ, ఒత్తిడికి విరుగుడుగా పనిచేసే సెరటోనిన్ ఉత్పత్తికీ ప్రొటీన్ అత్యవసరమన్న విషయం పురుషులు గుర్తించాలి. ఐదారు సార్లు పండ్లూ, కాయగూరలు! మెరుగైన ఆరోగ్యం కోసం కాయగూరలు, పండ్లు అవసరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు అందేందుకు ఇదే మేలైన దారి. జాతీయ పోషకాహార సంస్థ అంచనాల ప్రకారం రోజు కనీసం 400గ్రాముల కాయగూరలు, పండ్లు తినాల్సి ఉండగా.. చాలామంది ఇందులో సగం కూడా తీసుకోవడం లేదు. వీటిలోని పీచు పదార్థం జీర్ణకోశం మెరుగ్గా పనిచేసేందుకు, యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి.ఏ కాయగూరనైనా ఏదో ఒక రూపంలో శరీరానికి అందివ్వడం మేలు. మితమే.. హితం! ఎంత తింటే అంత బలం కాదు.. మితమే హితమకోవాలి. మరీ ముఖ్యంగా ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పక పాటించాలి. చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉన్న ఆహారం విష యంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. నోరు కుట్టేసుకుని ఉండటం ఎలా అనిపిస్తే... అన్ని రకాల ఆహారాన్ని కొంచెం కొంచెం తీసుకుంటే సరి. పాల ఉత్పత్తులు... పాల ఉత్పత్తుల వాడకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రోజూ వాడాలని కొందరు, అవసరమే లేదని కొందరు చెబుతారు. పెరుగు, మజ్జిగల రూపంలో తీసుకునే విషయంలో మాత్రం ఎవరికీ అభ్యంతరాలు లేవు. అయితే ఎంత మోతాదులో అన్నది ఒక ప్రశ్న. నిపుణులు చెప్పిన దాని ప్రకారం రోజుకు ఏదో ఒక రూపంలో కనీసం 300 మిల్లీలీటర్ల పాలు/పాల ఉత్పత్తులు శరీరానికి అందించడం మేలు. చిరుతిళ్లతోనూ చిక్కులు.. సాయంత్రం చిరుతిళ్లు తినాలనిపించడం సహజం. అలాంటి సందర్భాల్లో నూనె పదార్థాలు కాకుండా.. మొలకెత్తిన గింజలు, ఉడికించిన శనగలు, వేరుశనగ పప్పుల్లాంటివి తినడం మేలు. వీటివల్ల శరీరానికి శక్తి, ప్రొటీన్లు రెండూ లభిస్తాయి. ఉప్పుతో ముప్పు... ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల రక్తపోటు సహా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చదువుతూనే ఉన్నాం. రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవద్దు. కానీ.. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు. శుద్ధీకరించిన ఆహారంలో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి... వాటిని వీలైనంత తక్కువగా తీసుకోవడం మేలు. ఈ ఆహారపు అలవాట్లకు తోడుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. నలభై ఏళ్లు దాటిన తరువాతైనా తరచూ వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా పురుషులు ఆకస్మిక మరణాలను కొంతవరకైనా నివారించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఫలించిన అంధుడి పదేళ్ల పోరాటం..
సాక్షి, కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) చొరవతో మధ్యలో నిలిచిపోయిన డైట్ విద్యను కొనసాగించేందుకు ఓ అంధుడికి అవకాశం లభించింది. సీటును పునరుద్ధరిస్తూ విద్యాశాఖ శుక్రవారం నివేదికను సమర్పించడంతో పదేళ్ల పోరాట నిరీక్షణకు తెరపడింది. కడపలోని అల్మాస్ పేటకు చెందిన బి.రామాంజనేయులు కుమారుడు బి.కిరణ్‌కుమార్ అంధుడు. 2012లో డైట్ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తమ ర్యాంకు సాధించడంతో నెల్లూరు ప్రభుత్వ డైట్ కళాశాలలో సీటు వచ్చింది. తెలుగు మీడియంలో సోషల్ స్టడీస్ మెథడాలజీ డీఈడీ కోర్సులో చేరాడు. కొద్దిరోజులకే నెల్లూరు రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురై కాళ్లు, చేతులు విరిగిపోవడంతో ఐదారు నెలలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. కాస్త కోలుకున్న తరువాత కాలేజీకి వెళ్లగా తమకు ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో సీటు నిలిపివేసినట్లు ప్రిన్సిపాల్, ఇతర అధికారులు చెప్పారు. ఒకపక్క ఆరోగ్యం బాగోలేకపోవడం, మరో పక్క సీటు రద్దు కావడంతో ఆందోళన చెందాడు. పూర్తిగా కోలుకున్నాక ఎలాగైనా డీఈడీ పూర్తి చేయాలని తలచి న్యాయం కోసం 2019లో ఉమ్మడి హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. ఆ సమయంలో ఏపీ కేసులను విచారణకు తీసుకోకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. ఈఏడాది ఫిబ్రవరిలో హెచ్ఆర్సీ కర్నూలు తరలివచ్చిన తరువాత మరోసారి ఫిర్యాదు చేశాడు. అయితే పోస్టులో పంపడంతో విచారణకు రాలేదు. చదవండి: (సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే కారణమా..?) చివరగా అదే ఏడాది ఏప్రిల్ 8న నేరుగా కమిషన్‌ను ఆశ్రయించడంతో ప్రత్యేక కేసుగా పరిగణించి చైర్మన్ మంధాత సీతారామమూర్తి నేతృత్వంలోని బెంచ్ కిరణ్‌కుమార్ చదువుకోవడానికి ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని నెల్లూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు నోటీçులు జారీ చేసింది. అందుకు విద్యాశాఖ అధికారులు స్పందించి మొదటి ఏడాది డీఈడీ కాలేజీలో కొనసాగిస్తామని శుక్రవారం కమిషన్ చైర్మన్‌కు నివేదిక సమర్పించారు. దీంతో కిరణ్‌కుమార్ చదువుకోవాలన్న ఆశ, జిజ్ఞాస, పట్టుదలను చైర్మన్ అభినందించారు. విద్యాశాఖాధికారులు కూడా బాగా స్పందించి విద్యార్థి చదువుకోవడానికి అవకాశం కల్పించడంతో అభినందనలు తెలిపి కేసును మూసి వేసినట్లు కమిషన్ సెక్షన్ ఆఫీసర్ బొగ్గారం తారక నరసింహకుమార్ తెలిపారు. -
సిర్రోసిస్‌తో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆహారం
సిర్రోసిస్ అన్నది ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం స్థానంలో అనారోగ్యకరమైన (ఫైబ్రస్ స్కార్ టిష్యూ) పెరగడం వల్ల వచ్చే సవుస్య. విపరీతంగా వుద్యం తాగేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు... హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఫ్యాటీలివర్ అనే వ్యాధుల వల్ల కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో దీనికి ఎలాంటి కారణం తెలియకపోవచ్చు కూడా. ఇలాంటి కండిషన్‌ను క్రిప్టోజెనిక్ అంటారు. సిర్రోసిస్ వల్ల కడుపులో నీరు చేరడం, కాలేయ–వుూత్రపిండాల సవుస్యలు లాంటి ఎన్నో సవుస్యలు వస్తాయి. సిర్రోసిస్ వచ్చినప్పుడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్లను బట్టి ఆహార నియవూలు పాటించాల్సి ఉంటుంది. సిర్రోసిస్ సవుస్య వచ్చినవాళ్లకు సాధారణ సవుతుల ఆహారం ఇవ్వాలి. అంటే... అన్ని రకాల పోషకాలు సమంగా అందేలా... ఆహారంలో పళ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. లివర్ సిర్రోసిస్ వచ్చినవాళ్లలో కడుపులో ద్రవాలు చేరడం, కాలేయవాపు, పోర్టల్ రక్తనాళంలో ప్రెషర్ ఉన్నట్లయితే... అలాంటివారికి ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉండే పదార్థాలు ఇవ్వకూడదు. అంటే వారికి ఆహారంలో పచ్చళ్లు, అప్పడాలు, బేకరీ ఐటమ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్ (సాల్టెడ్ చిప్స్), ఉప్పులో వేయించిన జీడిపప్పు (సాల్టెడ్ నట్స్), సాస్‌లు, జామ్‌లు వంటివాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. సిర్రోసిస్వల్ల హెపాటిక్ ఎన్‌కెఫలోపతి అనే వూనసిక సవుస్య వస్తే నాన్వెజిటేరియన్ ప్రోటీన్స్ ఇవ్వడం సరికాదు. -
లక్షణాలు లేనివారిలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ.. ఈ పరీక్షలో స్కోర్ ఎక్కువగా ఉంటే!
కర్నూలు(హాస్పిటల్): మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లతో చిన్న వయస్సులోనే కొందరు గుండెపోటుకు గురై తనువు చాలిస్తున్నారు. కడుపునిండా తినడం వ్యాయామాలు చేయకపోవడం, కూర్చుని చేసే పనులు అధికంగా ఉండటం, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం తదితర కారణాలతో ఇటీవల గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ఓపీకి 200 నుంచి 250 మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఇన్‌పేషంట్లుగా ప్రతి నెలా 350 నుంచి 400 మంది వరకు చికిత్స అందుకుంటున్నారు. పెద్దాసుపత్రిలో ప్రతిరోజూ 400 మందికి ఈసీజీ, 40 నుంచి 50 వరకు 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నంద్యాలలోని కార్డియాలజిస్టులలో ఒక్కొక్కరి వద్దకు ప్రతిరోజూ 20 నుంచి 50 మంది వరకు చికిత్స కోసం వెళ్తుంటారు. జిల్లా మొత్తంగా ప్రతిరోజూ 40 నుంచి 60 మందికి గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. లక్షణాలు లేనివారిలో రిస్క్ ఎక్కువ గుండెజబ్బుకు సంబంధించి లాంటి లక్షణాలు లేని వారిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారి కోసం కరోనరి కాల్షియం స్కాన్ ఉపయోగ పడుతుంది. ఈ పరీక్షకు ఉపయోగించే పరికరం రక్తనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకులను, నాళాల అంచులకు ఏర్పడ్డ ఫ్లేక్(ఫలకం)లను గుర్తిస్తుంది. గుండెలో కొలెస్ట్రాల్ లోడ్ ఏ లెవెల్లో ఉందో చెప్పేస్తుంది. కరోనరి ఆర్టరి కాల్షియం స్కోర్‌ను చూపిస్తుంది. దీని ద్వారా గుండె కాల్సిఫికేషన్(బోన్ డిపోజిషన్)ను అంచనా వేస్తుంది. ఈ నివేదిక ప్రకారం భవిష్యత్‌లో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో కార్డియాలజిస్టు చెప్తారు. స్కోర్ ఎక్కువగా ఉంటే వైద్యుల సూచనలతో మందులు వాడి, భవిష్యత్‌లో హార్ట్ ఎటాక్‌ను నివారించుకోవచ్చు. జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి కరోనరి కాల్షియం స్కాన్ అందరికీ అవసరం లేదు. 40 ఏళ్లు పైబడిన వారికి రిస్క్ ఫాక్టర్స్ అధికంగా ఉంటే ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో మొదటి నుంచి చివరి వరకు చేసే ప్రక్రియకు ఐదు నుంచి పది నిమిషాల వరకు సమయం పడుతుంది. ఈ పరీక్ష ఐదేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. స్కానింగ్ రిపోర్ట్‌ను బట్టి వైద్యులు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి స్పష్టంగా చెప్పగలగుతారు. స్కోర్ 400లకు పైగా ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో మందులు వాడాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. –డాక్టర్ తేజానందన్రెడ్డి, కార్డియాలజిస్టు, కర్నూలు -
మహిళలే పోషకులు.. కొత్త ఆలోచనకు వేదిక
ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అన్నట్టే ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని చూసి ఇల్లాలి వంటను చూడు అని కూడా అంటారు. తనవారందరి ఆరోగ్యాన్నీ పరిరక్షించేందుకు తగినట్టుగా ఆహారాన్ని వండిపెట్టడంలో గృహిణులకు సాటి లేదు. అందుకేనేమో... పోషకాహార రంగంలో దేశవ్యాప్తంగా మహిళలు సత్తా చాటుతున్నారు. డైటీషియన్లుగా, న్యూట్రిషనిస్ట్లుగా రాణిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇండియన్ డైటెటిక్ డే రోజును పురస్కరించుకొని జరిగిన దేశవ్యాప్త ‘సాధన’ అసోసియేషన్ కార్యక్రమంలో పోషకాహార నిపుణులంతా కలిశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 99 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. వారిలో అన్ని కేటగిరీలలో కలిపి తెలుగు రాష్ట్రాల మహిళలకు ఎనిమిది పురస్కారాలు దక్కాయి. పోషకాహార వైద్యులు అవంతీరావు, సంతోషి లక్ష్మి, వసుంధరా అయ్యగారి, జ్యోతి శ్రీనివాస్, అంజలి డాంగె, గౌరీప్రియ, హరితాశ్యామ్, సి.అంజలి... పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు. కార్యక్రమ నిర్వాహకులు, అవార్డు గ్రహీతలతో మాట్లాడినప్పుడు ఈ రంగం పట్ల మహిళల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. ఆరోగ్యాన్ని పంచడానికి... కొంత కాలంగా ఫిట్నెస్ రంగం ఊపందుకోవడంతో యువతులు న్యూట్రిషన్/డైటీషియన్లుగా ఈ రంగంలోకి వచ్చారు. దీంతో పాటు ఆసుపత్రులు, ఫిట్నెస్ స్టూడియోలు, కార్పొరేట్ కంపెనీలు, కాలేజీలు... వగైరాలన్నీ సర్టిఫైడ్ పోషకాహార నిపుణులైన మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూసినా, మహిళలే పోషకాహార నిపుణులుగా టాప్‌లో ఉన్నారు. ఇదీ మరింత మంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది. తమను తాము ఆరోగ్యకరంగా ఉంచుకుంటూ ఇతరులకు కూడా ఆరోగ్య పరంగా మంచి చేసే అవకాశం ఉండడంతో ఈ రంగానికి ఓటేస్తున్నారు. ‘వివిధ శాఖలకు అనుసంధానంగా ఉండటం, సమాజ సంక్షేమం కోసం పాటు పడేలా మంచి ఉద్దేశ్యం కూడా తోడవడంతో మహిళలు ఈ రంగం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు’ అంటారు పాతికేళ్లుగా పోషకాహార రంగంలో ఉన్న డాక్టర్ జానకి. మహమ్మారి పెంచిన అవగాహన ఇటీవల కరోనా మహమ్మారి వల్ల చాలామందిలో పోషకాహారం పట్ల అవగాహన మరింత పెరిగింది. వ్యాధినిరోధకత పెంచడంలో సరైన ఆహారం పాత్ర గురించిన ఆలోచన చాలా మందిలో వచ్చింది. ప్రస్తుత సమాజంలో పోషకాహార నిపుణుల పాత్ర గురించి వివరిస్తూ ‘‘ఇప్పుడు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండటం ఎంత అవసరమో, వ్యక్తిగత న్యూట్రిషనిస్ట్ కూడా అంతే అవసరంగా భావిస్తున్నారు. ఒక్కో జబ్బుకు ఒక్కో రకమైన ఆహార ప్లానింగ్ చేయాల్సి ఉంటోంది. ఇది కూడా న్యూట్రిషనిస్ట్‌ల ప్రాధాన్యత పెంచింది’’ అంటూ 22ఏళ్లుగా పోషకాహార నిపుణురాలిగా కొనసాగుతున్న జ్యోతి శ్రీనివాస్ విశ్లేషించారు. ఎస్పెరర్ న్యూట్రిషన్ సిఇఒ రక్టిమ్ ఛటోపాధ్యాయ్ మాట్లాడుతూ ‘‘ఈ రంగం మహిళల మనసులకు దగ్గరైనది కావడం, పార్ట్‌టైమ్‌గా, ఇంటి దగ్గర నుంచి కూడా పనిచేసే వీలుండడం వల్ల చాలా మంది యువతులు ఈ రంగంలో కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. అందువల్లే కావచ్చు మేం ఏ డైటీషియన్ ప్రోగ్రామ్ చేసినా దానికి పురుషుల సంఖ్య కన్నా చాలా ఎక్కువగా మహిళలే ఉంటున్నారు’’ అని తెలిపారు. అడ్డంకులను అధిగమించడానికే... ‘కొందరు తక్కువ సమయంలో నైపుణ్యాలు పొందాలనుకుంటారు. ఎమ్మెస్సీ న్యూట్రిషన్ చదవరు. ఏదో ఒక ఫుడ్ పాయింట్ ఎంచుకుని, దానినే ప్రధానంగా ప్రజల మీద రుద్దడానికి చూస్తుంటారు. వ్యాపారపరంగా ఆలోచించేవారు చేసే పని ఇది. ఉదాహరణకు.. వెయిట్‌లాస్ మీద మార్కెట్లోకి విపరీతమైన ఉత్పత్తులు వచ్చాయి. అవి ఏ మేరకు అవసరం? వాటి వల్ల ప్రయోజనాలు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు కోరుకోవడం వల్ల కూడా గతంలో కన్నా ఇప్పుడు డైటీషియన్ల ప్రాముఖ్యం పెరిగింది’ అంటున్నారు పోషకాహార నిపుణులు. కొత్త ఆలోచనకు వేదిక ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే పోషకాహార నిపుణలు ఉండేవారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ డైటీషియన్స్ని నియమించుకుంటున్నారు. అమ్మాయిలకు ఇది నప్పే రంగం అని తల్లిదండ్రులు కూడా భావిస్తూ ఇస్తున్న ప్రోత్సాహం వల్ల కూడా ఈ రంగంలోకి అమ్మాయిలు ఎక్కువ శాతం వస్తున్నారు. అబ్బాయిలు వచ్చినా ఫుడ్ సైన్స్ మీద ఆసక్తి ఉన్నవారు ఒక శాతం మాత్రమే ఉంటున్నారు. – డాక్టర్ జానకి, న్యూట్రిషనిస్ట్ సమాజ శ్రేయస్సుకు.. పోషకాహార నిపుణులుగా మహిళలు ఇంకా అధిక సంఖ్యలో రాణిస్తే వ్యాధుల నివారణకు అది ఎంతైనా ఉపయోగపడుతుంది. మిషన్ న్యూట్రిక్ కోవిన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎనిమిది రాష్ట్రాల అసోషియేషన్స్‌తో కలిపి వర్క్ చేస్తున్నాను. సమతుల ఆహారం, సరైన వ్యాయామం, సరైన జీవన విధానం ఉన్నవారిలో ఏ ఫ్లూ వచ్చినా త్వరగా బయటపడతారు. ఇమ్యూనిటీకి రైట్ డైట్ అనేది కీలకం. – జ్యోతి శ్రీనివాస్, న్యూట్రిషనిస్ట్ -
అన్నం పూర్తిగా మానేశాను.. ప్లేట్లో మెనూ మారింది
కర్నూలులో బుధవారపేటకు చెందిన రామాంజనేయులు ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తాడు. ఆయన పదేళ్లుగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నాడు. వైద్యుల సూచన మేరకు ఆయన ఆహార మెనూ మార్చుకున్నాడు. రాగులు, జొన్నలతో చేసిన ఆహారాన్ని తింటున్నాడు. ఫలితంగా షుగర్ స్థాయి సాధారణ స్థితికి వచ్చింది. నంద్యాలకు చెందిన రఘురామయ్యకు ఎంతకూ షుగర్ నియంత్రణలోకి రాలేదు. దీంతో ఆహారంలో సిరిధాన్యాలు చేర్చుకున్నాడు. మూడురోజులకు ఒక సిరిధాన్యాన్ని మార్చి మార్చి వివిధ వంటకాలు తయారు చేయించుకుని తినసాగాడు. కొన్ని రోజులకే షుగర్ నియంత్రణలోకి వచ్చింది. ... వీరే కాదు జిల్లాలో అనేక మంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకున్నారు. పాతకాలం నాటి ఆహార పదార్థాలను ఇష్టపడుతున్నారు. కొర్రలు, సజ్జలు, రాగులు, సామలు, గోధుమలతో చేసిన వంటకాలను తింటున్నారు. సాక్షి, కర్నూలు(హాస్పిటల్): బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, ఊబకాయం, గ్యాస్ట్రబుల్, గుండెజబ్బులు వంటివన్నీ జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే జబ్బులే. జిల్లా జనాభా 45లక్షలకుపైగానే ఉంది. ఇందులో 20% ప్రజలు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జీవనశైలి జబ్బులతో బాధపడుతున్నారు. తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లునొప్పులు, నీరసం, మూత్రం ఎక్కువసార్లు వెళ్లడం వంటి లక్షణాలుండి వైద్యుల వద్దకు వెళ్లే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి బీపీ, షుగర్ ఉన్నట్లు నిర్ధారిస్తున్నారు. వైద్యులు ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. రొట్టెలకు భలే గిరాకీ వైద్యుల సూచన మేరకు చాలా మంది రొట్టెలు తింటున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కర్నూలులో రొట్టెల విక్రయాలు పెరిగాయి. కర్నూలులోని గాంధీనగర్, వెంకటరమణ కాలనీ, నరసింహారెడ్డి నగర్, రైల్వేస్టేషన్ రోడ్, అశోక్‌నగర్, మద్దూర్‌నగర్, నంద్యాల రోడ్డు, గణేష్‌నగర్, సి.క్యాంపు, నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ, బుధవారపేట, శ్రీరామనగర్ తదితర కాలనీల్లో రొట్టెలు విక్రయించే దుకాణాలు వెలిశాయి. ఒక్కో రొట్టె రూ.12 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. వీటిలోకి కర్రీ కావాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రెస్టారెంట్లలోనూ మార్పు ప్రజల ఆహారపు అలవాట్లు మారడంతో హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మెనూలో మార్పులు తీసుకొచ్చారు. నగరంలో 30కి పైగా చిన్నా, పెద్దా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో అధిక శాతం జొన్న రొట్టెలు ఆర్డర్ ఇస్తున్నారు. అందులో ఏదో ఒక కర్రీని ఆహారంగా తీసుకుంటున్నారు. రాగి ముద్ద, రాగిసంకటి, కొర్ర అన్నం కూడా రెస్టారెంట్లలో వండి పెడుతున్నారు. కర్నూలులోని ఐదురోడ్ల కూడలిలో కేవలం సిరిధాన్యాలతో వండిన ఆహారపదార్థాలను విక్రయించడం విశేషం. సిరిధాన్యాలకు భలే గిరాకీ ప్రస్తుతం మార్కెట్లో కేజీ జొన్నలు(రాయచూరు) రూ.55, కొర్రలు రూ.60, సామలు, అరికెలు రూ.80కు పైగానే విక్రయిస్తున్నారు. ఇక సేంద్రియ ఎరువులతో పండించిన సిరిధాన్యాలు కిలో రూ.110కు పైగానే పలుకుతున్నాయి. గతంలో వీటిని కొనేవారు లేక పశువులకు పెట్టేవారంటే అతిశయోక్తి కాదు. శుభపరిణామం ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు తినడం వల్ల కొవ్వు శాతం అధికమైపోయి గుండెపోటుకు దారి తీస్తోంది. పలుమార్లు కాచిన నూనెలో చేసిన బజ్జీలు తినడం, కూల్‌డ్రింక్స్, నిల్వ ఉంచిన బిస్కట్లు తినడం వల్ల క్యాన్సర్ వస్తోంది. వీటన్నింటికీ విరుగుడూ ఆహారంలో మార్పులే. ఈ దిశగా ప్రస్తుతం ప్రజలు ముందుకు వెళ్లడం శుభపరిమాణం. –డాక్టర్ జి.రమాదేవి, డైటీషియన్, కర్నూలు వ్యాధులు దరి చేరవు వరి, గోధుమల్లో రెండు శాతంలోపే పీచు ఉంటుంది. సిరిధాన్యాల్లో 6 నుంచి 8 శాతం వరకు పీచు ఉంటుంది. దీనివల్ల త్వరగా జీర్ణం గాక నిదానంగా శరీరంలోకి గ్లూకోజు విడుదల అవుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మలబద్దకం పోతుంది. సిరిధాన్యాలతో తయారు చేసిన కషాయాలు సేవించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. –డాక్టర్ ద్వారం ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు అన్నం పూర్తిగా మానేశాను నాకు 12 ఏళ్లుగా షుగర్ జబ్బు ఉంది. ఈ వ్యాధి వల్ల నేను అనేక ఇబ్బందులు పడ్డాను. చివరకు వైద్యుల సలహా మేరకు నా మెనూలో మార్పులు చేసుకున్నాను. ఇప్పుడు చాలా తక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటున్నాను. తెల్ల అన్నాన్ని పూర్తిగా మానేశాను. జొన్నరొట్టెలు, రాగి సంకటి వంటివి తింటున్నాను. ఈ కారణంగా ప్రస్తుతం షుగర్ కంట్రోల్లో ఉంటోంది. –వాడాల ప్రసాద్, కర్నూలు -
నేడు వరల్డ్ వేగన్స్ డే... ఆ పదం ఎలా వచ్చిందో తెలుసా?
‘ఒక దేశం గొప్పతనం, నైతిక ప్రగతి... ఆ దేశం జంతువుల పట్ల వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది’ అంటారు మహాత్మాగాంధీ! అట్లా జంతువుల మీద ప్రేమ కొంత, సొంత ఆరోగ్యంపట్ల శ్రద్ధ మరికొంత... మొత్తంగా వేగనిజం మీద ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వేగన్స్‌గా మారిపోతున్నారు. నేడు (సోమవారం) వరల్డ్ వేగన్ డే సందర్భంగా ‘వేగనిజం’ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం! వేగన్స్ అంటే? మాంసాహారం మాత్రమే మానేసినవాళ్లు శాకాహారులు. కానీ జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగువంటి ఉత్పత్తులను కూడా తీసుకోకుండా, కేవలం మొక్కలు, ఆకుల మీద ఆధారపడి బతికేవారు వేగన్స్. జంతువుల హక్కుల న్యాయవాది డోనాల్డ్ వాట్సన్ వెజిటేరియన్ అనే పదం నుంచి వేగన్‌ను సృష్టించాడు. 1944లో ‘ది వేగన్ సొసైటీ’ని స్థాపించాడు. ఆ వేగన్ సొసైటీ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1994 నుంచి ప్రతి ఏటా నవంబర్ 1న వరల్డ్ వేగన్ డే నిర్వహిస్తున్నారు. నవంబర్ నెలను వేగన్ మంత్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. పోషకాల కొరతేం లేదు.. వేగన్‌గా మారతాం సరే... శరీరానికి పోషకాలు అందేదెలా? ప్రోటీన్ మాటేమిటి? చాలా మంది ప్రశ్న. కానీ శరీరానికి అత్యవసరమైన అమినో యాసిడ్స్ అన్నీ ఆకుకూరలు, కూరగాయల్లో దొరుకుతాయంటారు వేగన్స్. మాంసాహారం, పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉన్నవారికి .. టోఫు, బాదం పాలు, సోయాపాలు, కొబ్బరిపాలు, బియ్యంపాలు వంటివాటిని ప్రత్యామ్నాయంగా చూపుతున్నారు. ఛీజ్, మయోనీజ్ సైతం... పాలు, గుడ్లు లేకుండా తయారు చేసుకోవచ్చట. ప్రత్యామ్నాయంగా శాకాహార మాంసం! ముక్కలేనిదే ముద్దదిగని వాళ్లు కొంతమంది ఉంటారు. ఎంత వద్దనుకున్నా ఏదో ఒకరకంగా మాంసాహారం ఊరిస్తూనే ఉంటుంది. మాంసాహారం తినేటప్పుడు ఎక్కువ నములుతాం. నోటి నిండా ఎక్కువ సమయం పదార్థ్ధాన్ని ఫీల్ అవుతాం. మాంసాహారం పంటికి సరిపోయే బైట్ స్ట్రెంత్ కలిగి ఉంటుంది. శాకాహారంతో అది ఉండదు. చాలామంది నాన్‌వెజ్ వదలకపోవడానికి కారణమిదే. కానీ... ఇలాంటివారికోసం మొక్కల నుంచి ప్రత్యామ్నాయం దొరుకుతుందట. అదే వెజ్ మీట్. మాంసం టెక్చర్‌తోపాటు... పంటికి మాంసం తిన్న ఫీలింగ్‌ని ఇస్తుంది. మొక్కల నుంచి వచ్చే మాంసందే భవిష్యత్ అని చెబుతున్నది... ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న నటి జెనీలియా. వీటితో సీక్ కబాబ్, చికెన్ నగ్గెట్, బిర్యానీ, బర్గర్పాటీస్, సాసేజెస్ వంటివి చేసుకోవచ్చట. లాభాలెన్నో.. వేగన్స్‌గా మారడం వల్ల జంతువులను రక్షించినవాళ్లమే కాక... పర్యావరణాన్ని పరిరక్షించినవాళ్ల మవుతామంటున్నారు. వేగన్‌గా మారడం వల్ల 15 రకాల ప్రాణహాని కారక వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఆహారంలో కొలెస్ట్రాల్ తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు, టైప్ టు డయాబెటిస్, క్యాన్సర్స్, ఆర్థ్రరైటిస్, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులేవీ దరిచేరవంటున్నారు. బరువు పెరగరు, మానసిక ఆరోగ్యానికి సైతం ఇదే మందంటున్నారు. సెలబ్రిటీస్‌తో పాపులారిటీ... ఏటా వేగనిజం పాపులారిటీ పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనూ చాలామంది సెలబ్రిటీస్ ఇప్పుడు వేగన్స్‌గా మారిపోయారు. బాలీవుడ్ స్టార్స్ ఆమిర్‌ఖాన్, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్, కంగనా రనౌత్, వంటి మాంసాహారం ముట్టబోమని ఒట్టు పెట్టుకున్నారు. ►ప్రపంచ జనాభాలో 5శాతం శాఖాహారులు. అందులో సగం వేగన్స్.నో మీట్ పాలసీలో భాగంగా 2012 నుంచి లాస్ ఏంజిల్స్‌లో ప్రతి సోమవారం మాంసాహారం విక్రయించరు. 2020లో కేఎఫ్‌సీ మొట్టమొదటి వేగన్ బర్గర్‌ను తయారు చేసింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పీవీ సింధు ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ 2020లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకువచ్చిన భారత షట్లర్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. శనివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు చైనాకు చెందిన తైజుయింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత బంగారు పతకం ఆశలకు తెరపడింది. అయితే కాంస్య పతకం ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. దీని కోసం సింధు చైనా షట్లర్ పింగ్ జియావోతో తలపడనుంది. సింధు క్యాంస్య పతకం తీసుకురానుందనే ఆశలు భారీగానే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. పూర్తి ఫిట్‌గా కనిపించే ఆమె తన బరువును, ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రొటీన్డ్ ఫుడ్ తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఆమె బరువు, హైడ్రేషన్ , ప్రోటీన్ ఆహారంతో సింధు ఫుడ్ ఆధారపడి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్: బ్రేక్ ఫాస్ట్ పాలు, గుడ్లు, ఇతర ప్రొటీన్లతో నిండి ఉంటుంది. పండ్లు కూడా తీసుకుంటారు. ఇక శిక్షణా సమయంలో సెషన్ల మధ్య మరింత యాక్టివ్‌గా, బలంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటారు. లంచ్ అండ్ డిన్నర్: సింధు రోజూ రెండుపూటలా భోజనంలో రైస్ ఉండేలా చూసుకుంటారు. దీంతోపాటు కూరగాయలు కూడా తీసుకుంటారు. అలాగే టోర్నమెంట్ల సమయంలో అన్నం, చికెన్ తీసుకుంటారు. అలాగే ఆరోగ్యాన్నినియంత్రించుకునే చర్యల్లో భాగంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. ఈ ఫలితాల కనుగుణంగా తన డైట్‌ను ఆమె ఎడ్జస్ట్ చేసుకుంటారు. ఇక చివరగా మ్యాచ్ గెలిచిన తరువాత ఫాస్ట్ ఫుడ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారట. కేకులు, పేస్ట్రీలు, ఐస్ క్రీమ్, చాక్లెట్లను ఎంచక్కా ఎంజాయ్ చేస్తారట. అయితే సాధారణంగా సింధు తల్లి స్వయంగా ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటారట. ఇంకా అరటిపండ్లు, ప్రోటీన్ షేక్ స్నాక్ బార్లు ఈ మూడు తీసుకుంటానని సింధు జాతీయ మీడియాతో చెప్పారు. అలగే భారీ ట్రైనింగ్ సెషన్ తర్వాత ఎనర్జీ కోసం స్నాక్ బార్లపైనే ఆధారపడతానని చెప్పారు. సాధారణంగా మ్యాచ్ తర్వాత అరగంటలోపు ఏదో ఒకటి తినాలి, ఆ తర్వాత స్ట్రెచ్స్ చేసి, రెస్ట్ తీసుకుంటానని సింధు వెల్లడించారు. ఇక చీట్ మీల్లో భాగంగా హైదరాబాదీ బిర్యానీ తన మెనూలో టాప్‌లో ఉంటుందని ఆమె చెప్పారు. అలాగే ప్రొఫెషనల్ అథ్లెట్లు తక్కువ నూనె, కూరగాయలతో చేసిన నూడుల్స్, స్పఘెట్టి, పాస్తా లాంటివి కూడా తీసుకుంటారని కూడా సింధు చెప్పారు. కోచ్ శ్రీకాంత్ వర్మ ఏమన్నారంటే.. ఆమె కోసం ప్రత్యేకంగా హై-పెర్ఫార్మెన్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ను కస్టమైజ్ చేశామని సింధు కోచ్ శ్రీకాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యంగా సింధు ఆట, బాడీ తీరు, ఆమె బలాబలాలు వీటన్నింటినీ దృష్టి ఉంచుకుని ఇదంతా రూపొందిస్తామని చెప్పారు. పతకాల బరిలో నిలిచే క్రీడాకారులు హైఇంటెన్సిటీ షెడ్యూల్‌కు సిద్ధంగా ఉంటారన్నారు. ముఖ్యంగా వారంలో ఆరు రోజులు, రెండున్నర గంటలు కఠినమైన శిక్షణా విధానాన్ని సింధు అవలంబిస్తోందని శ్రీకాంత్ వెల్లడించారు. అలాగే సింధు ట్రైనింగ్‌కు ఎపుడూ నో చెప్పదు..అదే ఆమెలోని గొప్పతనం..శిక్షణ ఎంత కఠినంగా ఉన్నా, తాను ఎంత బిజీగా ఉన్నా ఎపుడూ నవ్వుముఖంతో సిద్ధంగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఒలింపిక్స్‌లో ప్రతీ రౌండ్ ఫైనల్ లాంటిదే. అత్యుత్తమ ఫామ్‌ని అందుకోవడమే లక్క్ష్యమని ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో హెడ్ స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్‌గా ఉన్నారు శ్రీకాంత్ వర్మ. -
అలా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి..తమన్నా
పన్నెండు గంటల గ్యాప్‌తో ఆహారం తీసుకోవడం వల్ల తనకు ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నట్లుగా హీరోయిన్ తమన్నా చెబుతున్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నేను చాలా రకాల డైట్స్‌ను ఫాలో అయ్యాను. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ డిన్నర్‌కి, నెక్ట్స్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్య పన్నెండుగంటల గ్యాప్ ఉన్నప్పుడు నాకు మంచి ఫలితాలు కనిపించాయి. ఉదాహరణకు నేను ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు నా లాస్ట్ మీల్ చేస్తే... మర్నాడు ఉదయం 6 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేసేదాన్ని. ఇలా చేయడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. మునుపటి కన్నా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి. అయితే నాకు బాగుందని అందర్నీ పన్నెండు గంటల గ్యాప్‌ని ఫాలో అవ్వమని చెప్పడంలేదు. ఎందుకంటే వారి వారి ఆరోగ్య స్థితి, వారి సామర్థ్యాలను బట్టి డైట్ టైమింగ్‌ని ఫాలో అవ్వడం ఉత్తమం’’ అని పేర్కొన్నారు. కాగా ఓ ప్రముఖ చానెల్లో తమన్నా చేస్తున్న కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ త్వరలో ప్రసారం కానుంది. సినిమాల విషయానికి వస్తే... తమన్నా నటించిన ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్’, ‘గుర్తుందా..శీతాకాలం’ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. -
నీలోఫర్: రికార్డుల్లో అంకెలు దిద్ది.. రూ.1.2 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి డైట్ మాజీ కాంట్రాక్టర్ కోడూరి సురేష్ బాబును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బోగస్ బిల్లులతో రూ.1.2 కోట్లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇతడిపై కేసు నమోదైనట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. మియాపూర్‌నకు చెందిన సురేష్‌బాబు 2017 ఏప్రిల్ 1న నిలోఫర్ ఆస్పత్రి డైట్ సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషేంట్లతో పాటు వైద్యులకు అవసరమైన ఆహారం సరఫరా చేయడం ఈయన బాధ్యత. 2020 జూలైతో ఈయన కాంట్రాక్టు పూర్తి కావడంతో టెండర్లు పిలిచి మరొకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. 2017–18 నుంచి 2019–20 మధ్య ఆహార సరఫరాలో సురేష్ బాబు గోల్‌మాల్‌కు పాల్పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఆస్పత్రి వర్గాలు విచారణ కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాయి. వీరి పరిశీలన నేపథ్యంలోనే ఆహార సరఫరా రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నట్లు బహిర్గతమైంది. కొన్ని చోట్ల అంకెల్ని దిద్దినట్లు గుర్తించారు. దీంతో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ గత నెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు మొత్తం రూ.1,13,28,320 స్వాహా చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కట్టంగూర్ శ్రీనివాస్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు రోగులు, వైద్యులకు సాధారణ ఆహారం సరఫరా చేసిన సురేష్ బాబు హై ప్రొటీన్ డైట్ ఇచ్చినట్లు రికార్డులు సృష్టించాడని తేల్చారు. దీంతో పాటు ఉన్న వైద్యులు, రోగుల కంటే ఎక్కువ మందికి ఆహారం అందించినట్లు రికార్డులు ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. ఆస్పత్రి వర్గాలు గుర్తించిన మొత్తానికి మించి రూ.1.2 కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో సోమవారం సురేష్ బాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
Coronavirus: పోస్ట్ కరోనా డైట్
కరోనా వైరస్‌తో ప్రభావితమైనవారి సంఖ్యపరంగా చూస్తే అది చాలా నిరపాయకరమైనది. దాదాపు 85 శాతం మంది ఎలాంటి లక్షణాలు గానీ కనిపించకుండానే, వారు చాలావరకు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటారు. కానీ మరో 10 శాతం మంది మాత్రం హాస్పిటల్ లో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. అంటే దాదాపు 5% కంటే తక్కువ మందిలో మాత్రమే అది ప్రమాదకారి. వారిలోనూ దాదాపు 4% మంది కొంత ఎక్కువగా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినా కోలుకుంటారు. కేవలం ఒక శాతం మందిలో మాత్రమే అది ప్రాణాంతకమవుతుందని ప్రస్తుతపు గణాంకాలు చెబుతున్నాయి. ఆ గణాంకాల మాట ఎలా ఉన్నా ఓ వ్యక్తి హాస్పిటల్ లో చేరాల్సిన పరిస్థితి వచ్చిందంటే కరోనా వైరస్ అతడి వ్యాధి నిరోధక శక్తిని లొంగదీసుకుందనే అర్థం కదా. అలాగే కొంతకాలం పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారంటే... ఆ చికిత్స ప్రక్రియల్లో ఉపయోగించే స్టెరాయిడ్స్, మందుల తర్వాత ఎంతోకొంత బలహీన పడటం తప్పనిసరి. అందుకే మామూలు వ్యక్తి నుంచి కోవిడ్ వచ్చి కోలుకున్నవారి వరకు మళ్లీ మునుపటి ఆరోగ్యాన్ని పొందేలా శక్తిని పుంజుకోవడం అవసరం. అంతేకాదు... అంతకుమించి ఇమ్యూనిటీ పెంచుకోవడం కూడా అవసరం. అందుకు ఉపయోగపడే ఆహారం ఎలా ఉండాలో చెప్పేదే ప్రస్తుత కథనం. కరోనా తర్వాత పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఒక రోగికి ఆరు నుంచి ఎనిమిది మాసాలు పడుతుందని అంచనా. ఎలాంటి దుష్ప్రభావాలూ, లక్షణాలూ లేకుండా కరోనా బారిన పడ్డవారి నుంచి మొదలుకుని... ఇటు హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నవారు... భౌతికంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవాల్సిందే. పోస్ట్–కోవిడ్ రోగులు తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలో చూద్దాం. కోలుకున్న రకరకాల వ్యక్తులు... మనం దృష్టి పెట్టాల్సిన అంశాలు... పోస్ట్ కోవిడ్ వారంతా ఒకేలా ఉండరు. కరోనా కారణంగా ఒకింత సంక్లిష్టదశకు వెళ్లేవాళ్లలో చాలామంది ఇతరత్రా మరికొన్ని వ్యాధులు / జబ్బులతో (కో–మార్బిడ్ కండిషన్స్‌తో) బాధపడేవారేనన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే కోలుకున్న తర్వాత కూడా వారిలో ఇన్ఫ్లమేటరీ వ్యాధులు కనిపించే అవకాశం ఎక్కువ. (ఇన్ఫ్లమేటరీ అంటే ఆ అవయవం ఎర్రబారి, వాపు వచ్చేలాంటి కండిషన్). అందునా ఊపిరితిత్తులకు ఇలాంటి ప్రమాదం మరీ ఎక్కువ. కోమార్బిడ్ కండిషన్స్‌తో బాధపడేవారు కరోనా బారిన పడతారు కాబట్టి ఈ కింది రోగులు ఆహారపరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వారెవరంటే... హైపర్‌టెన్షన్ (హైబీబీ) ∙డయాబెటిస్ కిడ్నీ జబ్బులున్నవారు కాలేయ వ్యాధులు ఉన్నవారు (అక్యూట్ హెపాటిక్ ఇంజ్యూరీ) గుండెజబ్బులు ఉన్నవారు జీర్ణసంబంధ వ్యాధులు ఉన్నవారు త్వరగా కోలుకోడానికి మంచి ఆహారం తీసుకోవాలి. వారితో పాటు కరోనా తర్వాత దాని దుష్పరిణామంగా... ‘మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్’కు గురైన వారు కరోనా సమయంలో రుచి/వాసన ను కోల్పోయినవారు కరోనా వైరస్ కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమైనవారు మింగడం కష్టమైనవారు గొంతులో పైప్ వేసిన వారు ఆహారపరంగా మరిన్ని అదనపు జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటివారు పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోకుండా... ఏదో ఓ ఆహారం తీసుకుంటే మళ్లీ మునపటి రోగనిరోధకశక్తిని పుంజుకోవడం కష్టం కావచ్చు. దాంతో పోస్ట్ కోవిడ్ దుష్పరిణామాల బారిన పడే అవకాశాలు పెరగవచ్చు. అందుకే అటు కోవిడ్ బారిన పడ్డవారే కాకుండా... ఇటు ఆరోగ్యవంతులు కూడా ఇమ్యూనిటీని పెంచే పోషకాహారంపై దృష్టిపెట్టడం అవసరం. ఎవరెవరు... ఎందుకు... ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే... కరోనా వైరస్ బారిన పడ్డవారిలో ఎవరెవరు, ఎందుకు, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో కొన్ని కేస్ స్టడీస్ చూద్దాం. కరోనా బారిన పడ్డ వ్యక్తులు అప్పటికే స్థూలకాయంతో బాధపడేవారై ఉన్నారనుకోండి. వారు తమ ఫ్యాట్ మజిల్ నిష్పత్తి దెబ్బతినకుండా... తమలో మరింత కొవ్వు చేరనివ్వని ఆహారం తీసుకోవాలి. అంటే తమలో కొవ్వు పెరగకుండా... కేవలం తమ కండరాలకు శక్తినిచ్చేలాంటి ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. అలాగే... స్థూలకాయం ఉన్నవారికి శ్వాస సమస్య వచ్చిందనుకోండి... వారు మరింత బరువు పెరిగితే ఊపిరి తీసుకోవడం కష్టమై నిమోనియా బారిన పడే అవకాశంతోపాటు గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశమూ ఉంది. అందుకే ఇలాంటివారు బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు గుండెను మరింత బలోపేతం చేసే ఆహారాలు తీసుకోవాలి. ఇక డయాబెటిస్ వంటివి ఉన్నవారైతే కోలుకోడానికి దోహదపడే ఆహారం తీసుకుంటూనే... అందులో చక్కెర మోతాదులను పెంచనివ్వని విధంగా ఆ ఆహారం ఉండేలా చూసుకోవాలి. ఇదే నియమం హైబీపీ ఉన్నవారికీ వర్తిస్తుంది. అంటే వాళ్లు తమ రక్తపోటు పెరిగేందుకు దోహదం చేసే ఆహారాన్ని తమ డైట్లో తీసుకుండా జాగ్రత్త పడాలి. పోస్ట్–కోవిడ్ రోగులూ... తీసుకోవాల్సిన ఆహారం కార్బోహైడ్రేట్లను తగ్గించండి మన తెలుగు రాష్ట్రాలలో మన ఆహారం ప్రధానంగా వరి. అయితే ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. ఈ పిండిపదార్థాలూ మన ఆహారంలో ఉండాల్సిందే. కాకపోతే అవి రోజుకు 100 – 150 గ్రాములకు మించకూడదు. దీనికి ఓ కారణం ఉంది. కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి జరుగుతుంది. (ఇలా జరగడాన్ని రెస్పిరేటరీ కోషియెంట్ అంటారు). ఇలా జరిగినపుపడు వారి శ్వాసక్రియకు అవసరమైనంత ఎక్కువ ఆక్సిజన్ అందకపోవచ్చు. అందుకే ప్రోటీన్లతో పోల్చినప్పుడు కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డయాబెటిస్ రోగుల్లోనూ కార్బోహైడ్రేట్లు చక్కెర మోతాదులను పెంచుతాయి. కాబట్టి వీటిని తక్కువగా తీసుకోవాలి. అయితే పూర్తిగా తీసుకోకపోవడమూ మంచిది కాదు. కాబట్టి... గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... కార్బోహైడ్రేట్లను వచ్చే వరి అన్నంతో పోలిస్తే పప్పులూ, ఆకుకూరలూ ఎక్కువగా కలుపుకుని తినడం మంచిదనే సూత్రాన్ని పాటిస్తే చాలు. ఈ జాగ్రత్తతో మన ఆహారంలో ప్రోటీన్లతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు పరిమితంగానే ఉంటాయి. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోండి మన దేహంలో దెబ్బతిన్న కణజాలాన్ని రిపేర్ చేసి, మునపటిలా పునరుద్ధరించడంలో ప్రోటీన్ల భూమిక చాలా ఎక్కువ. అందుకే మన ఆహారంలో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఈ ప్రోటీన్లు మన దెబ్బతిన్న కణాలనూ, కణజాలాన్ని బాగు చేసే ‘బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ (బీసీఏఏ)’ను సప్లిమెంట్ చేస్తాయి. దాంతో మన కండరాలు బలం పుంజుకుంటాయి. అదే జరగకపోతే... మన జీవక్రియల అవసరాల కోసం... దేహం మన కండరాల నుంచి ప్రోటీన్‌ను లాగేసుకుంటుంది. అందుకే మనం ఆహారం ద్వారా ప్రోటీన్లను అందజేస్తే మన కండరాల బలం అలాగే ఉండటంతో పాటు... రిపేర్లకు కావాల్సిన బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ (బీసీఏఏ) అందడంతో పాటు.. మన కండరాలకు అదనపు శక్తి కూడా సమకూరుతుంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారు తమ ఆరోగ్యకరమైన ప్రోటీన్ కోసం కొవ్వు తక్కువగా ఉండే పాలు, తాజా పెరుగు, పనీర్, కాటేజ్ చీజ్, బాగా ఉడికించిన గుడ్లపై ఎక్కువగా ఆధారపడవచ్చు. మాంసాహారంలో చికెన్, చేపల వంటి వైట్ మీట్ మేలు. మాంసాహారం ఒకింత ఖరీదైనదైనందున... ప్రోటీన్ అవసరాలకోసం రాజ్మా, శనగలు, కందులు, పెసర్ల వంటి రకరకాల పప్పుదినుసులపై ఆధారపడవచ్చు. శాకాహారులు సైతం వీటిపై ఆధారపడవచ్చు. ఆకుకూరలు, సీజనల్ పండ్లు కీలకమైన మినరల్స్, విటమిన్స్ కోసం ఆకుకూరలు, పండ్ల కంటే మించిన వనరులు లేవు. ఈ మినరల్స్, మిటమిన్స్ మన ఇమ్యూనిటీని బాగా పెంచేందుకు దోహదపడతాయి. పైగా ఇందులోని పీచుపదార్థాలు చక్కెరనూ అదుపులో ఉంచుతాయి. డయాబెటిస్ వారు మినహాయించాల్సిన మామిడి, అరటి, సపోటా మినహా... మిగతా పండ్లను తినవచ్చు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు తప్ప మిగతా అన్ని పండ్లనూ అందరూ నిస్సంకోచంగా తీసుకోవచ్చు. కొవ్వులు / నూనెలు మన దేహానికి తగిన మోతాదులో కొవ్వులు / నూనెలు కూడా అవసరమే. అయితే అవి మరీ మోతాదు మించడం ఆరోగ్యనికి అంత మేలు చేయదు. అందుకే ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం నట్స్, ఆలివ్‌నూనె, సన్ఫ్లవర్నూనె, నువ్వుల నూనె, కనోలా ఆయిల్, కార్న్ ఆయిల్ పరిమితంగా తీసుకోవాలి. కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం, చీజ్, క్రీమ్, వెన్న, నెయ్యి వంటివి చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఇక ట్రాన్స్‌ఫ్యాట్స్, జంతుసంబంధిత కొవ్వులు, వేపుళ్లు, బేకరీ ఫుడ్స్ వంటివి పూర్తిగా మానేయాలి. తృణ ధాన్యాలు మలబద్దకం వంటి సమస్య చాలా అనర్థాలను తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా జబ్బు నుంచి కోలుకున్నవారిలో సాఫీగా మలవిసర్జన జరుగుతూ, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగుంటే... అన్ని పోషకాలు దేహానికి సక్రమంగా అందుతుండటం వల్ల వారి ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇందుకోసం ఆహారంలో తగినంతగా పీచు అవసరం. పీచుపదార్థాలు... రక్తంలోని చక్కెరపాళ్లను నియంత్రితంగా ఉంచడంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తాయి. ఈ పీచుపదార్థాలు దేహానికి పుష్కలంగా అందడం కోసం మన ఆహారంలో రాగులు, సజ్జలు, జొన్నల వంటి తృణధాన్యాలను తీసుకోవాలి. ద్రవాహారాలు మన దేహంలో 70% పైగా నీరే ఉంటుంది. ఈ నీటిపాళ్లు తగినన్ని ఉన్నప్పుడే దేహంలోని జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. అందుకే దేహాన్ని ఎప్పుడూ తగినంతగా హైడ్రేటెడ్‌గా ఉంచడం అవసరం. అంటే దేహంలో ఉండాల్సినన్ని నీళ్లు తగ్గకుండా చూసుకోవాలన్నమాట. ఈ ద్రవాలు పుష్కలంగా ఉన్నప్పుడే ఖనిజాలూ, లవణాలూ కండరాలకు అంది, అవి సక్రమంగా పనిచేస్తాయి. అందుకే మనం రోజూ కనీసం 10 – 12 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పడు సైతం దేహంలో నీటి పాళు తగ్గుతాయి. అందుకే తప్పనిసరిగా నీళ్లు, ద్రవాహారం తీసుకోవడం అవసరం. నీటితో పాటు రకరకాల సూప్స్, గ్రీన్ టీ వంటి హెర్బల్ టీలు తగినంతగా తీసుకోవాలి. అలాగే తాజా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు కూడా తీసుకోవచ్చు. కాకపోతే కాఫీలు, కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్ వంటివి డీహైడ్రేషన్‌కు దోహదపడతాయి కాబట్టి వాటిని చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఉప్పు, చక్కెరలను చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా వేళకు ఆహారం తీసుకోవాలి. తక్కువ పరిమాణాల్లో ఎక్కువసార్లు తినాలి. రెండు ఆహారాలకు మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలి. నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) సంస్థ మన ఆరోగ్యం వేగంగా పుంజుకోడానికి మచింత శక్తిని ఇచ్చే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే అది వ్యాధినిరోధకశక్తిని ఇవ్వడంతో పాటు దేహానికి మంచి శక్తినీ, సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతోంది. -సుజాతా స్టీఫెన్ సీనియర్ న్యూట్రీషనిస్ట్ -
పాలిచ్చే తల్లులూ... తీసుకోవాల్సిన ఆహారాలు!
మీరు పాలిచ్చే బిడ్డ తల్లా? అయితే ఈ సూచనలు పాటించండి. ఇవి ఇటు తల్లికీ, అటు బిడ్డకూ మేలు చేస్తాయి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంటుంది. అప్పుడు బిడ్డ ఇష్టంగా ఆస్వాదిస్తూ తల్లిపాలను తాగుతుంటాడు. ఇక్కడ చిన్నజాగ్రత్త పాటించాలి. తల్లి తినే పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడిగాకే తినాలి. లేకపోతే వాటిపై ఉండే క్రిమిసంహారక రసాయనాలు తల్లిలోకి, అక్కడినుంచి బిడ్డకు ఇచ్చే పాలలోకీ ప్రవేశించి, బిడ్డ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అందుకే వాటిని బాగా కడిగాక మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా కట్టడి చేస్తుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. తల్లికి ఎక్కువగా పాలు ఊరి, బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. క్యాల్షియమ్ బాగా సమకూరేలా బాగా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటి ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్ బి12తో పాటు విటమిన్ డి సమృద్ధిగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు విటమిన్ బి12, విటమిన్–డి సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవాలి. -
ఫోడ్మ్యాప్ ఆహారం అంటే..?
వాస్తవానికి ఫోడ్మ్యాప్ అంటే... ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డిసార్కరైడ్స్, మోనోశాకరైడ్స్ అండ్ పాలీయాల్స్ అనే రకరకాల ఆహారాలను సూచించే పదాల మొదటి అక్షరాలతో ఏర్పడిన సంక్షిప్త రూపమే ‘ఫోడ్మ్యాప్’. అయితే మనం సౌలభ్యం కోసం ఇక్కడ చెప్పినట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఫోడ్మ్యాప్ ఆహారం అంటే... మనం తిన్న తర్వాత పేగుల్లో పూర్తిగా జీర్ణం కాకుండా కేవలం పాక్షికంగా మిగిలిపోయే ఆహారం అన్నమాట. ఇది అలా పాక్షికంగా జీర్ణమై మిగతాది మిగిలిపోవడంతో అది పులియడం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో గ్యాస్ వెలువడటం, గ్యాస్ నిండి పొట్టబిగుతయ్యేలా చేయడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫోడ్‌మ్యాప్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు మనం తినే ఆహారంలో కృత్రిమ చక్కెరలు, కొన్ని తీపిపదార్థాలు, పాలు, పండ్లలో మామిడి, ఆపిల్, కూరగాయల్లో బీట్రూట్, క్యాబేజీ, ఉల్లి వంటివాటిలో ఎక్కువ ఫోడ్‌మ్యాప్స్ ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. ఫోడ్మ్యాప్ తక్కువగా ఉండే ఆహారాలు అరటి, బ్లూబెర్రీ, ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి వాటిల్లో ఫోడ్‌మ్యాప్స్ తక్కువగా ఉంటాయి. ఇలాగే గుమ్మడి, పాలకూర, టొమాటో, చిలగడదుంప (మోరంగడ్డ), కొత్తిమీర, అల్లం, ల్యాక్టోజ్ లేని పాలు, ఆలివ్ ఆయిల్, పెరుగు వంటి వాటిల్లోనూ ఫోడ్మ్యాప్ తక్కువ. వరి, ఓట్స్‌లో ఫోడ్ మ్యాప్స్ తక్కువ. ఫోడ్మ్యాప్ ఎక్కువగా ఉండే ఆహారం తింటే కడుపుబ్బరం, గ్యాస్పోవడం వంటి లక్షణాలతోపాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు ఫోడ్మ్యాప్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. రోజంతా చురుగ్గా ఉండాలా..అయితే ఇది మీకోసమే! -
గ్లూటెన్ సుష్టుగా తింటే సిలియాక్ వ్యాధి ఖాయం
ఇది డైట్ల కాలం. ‘ఈ తిండి తింటే ఆ వ్యాధి దూరం.. ఈ ఆహారం అన్నిటికంటే శ్రేష్టం’ అంటూ కొత్త కొత్త డైట్ విధానాలు తామరతంపరగా ఇప్పటికే ఎన్నో పుట్టుకొచ్చాయి/పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాంటి కోవలోకి తాజాగా చేరిందే గ్లుటెన్ ఫ్రీ డైట్. గ్లుటెన్ అంటే.. సాధారణంగా గోధుమల్లో బంకగా ఉండే పదార్ధాన్ని గ్లుటెన్ అంటారు. గోధుమలు/మైదాతో తయారుచేసిన ఏ ఆహార పదార్థంలోనైనా గ్లుటెన్ తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా వీటిని ఉపయోగించి తయారుచేసే పిజ్జాలు, పేస్ట్రీలు, కేకులు, స్వీట్సు, కొన్ని రకాల బ్రెడ్లలో అధికంగా ఉంటుంది. ఈ పదార్థాలు ఎక్కువగా తినడం సిలియాక్ వ్యాధికి కారణమని, దీని నుంచి బయటపడాలంటే గ్లుటెన్ రహిత ఆహారం తీసుకోవాలన్నదే గ్లూటెన్ ఫ్రీడైట్ కాన్సెప్ట్. సిలియాక్ వ్యాధి అంటే.. అజీర్తి, కడుపు ఉబ్బరం, నీరసం, పొత్తి కడుపులో నొప్పి, అతిసారం, ఎముకల బలహీనత లక్షణాలను సిలియాక్ వ్యాధిగా పేర్కొంటారు. గోధుమలు, బార్లీ, మైదాతో తయారుచేసిన ఆహారం తీసుకోవడం వల్ల అందులోని గ్లుటెన్ జీర్ణశక్తి ప్రక్రియపై దుష్ప్రభావం చూపుతుందని, ఫలితంగా పైన చెప్పిన అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. ఒక వైద్య సర్వే ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సుమారు ఒకశాతం జనాభా సిలియాక్ వ్యాధితో బాధపడుతున్నారు. నివారించాలంటే.. గ్లుటెన్ ఫ్రీ (గ్లుటెన్ రహిత ఆహారం) డైట్ అనుసరించడం ద్వారా సిలియాక్ వ్యాధికి చెక్ పెట్టొచ్చనేది ఈ డైట్‌ను ఫాలో అవుతున్న వారి మాట. అమెరికాలో కన్జూమర్ రిపోర్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్(సీఆర్ఎన్ఆర్సీ) వెలువరించిన నివేదిక ప్రకారం సుమారు 63శాతం మంది అమెరికన్లు గ్లుటెన్ ఫ్రీ డైట్ ను నమ్ముతున్నట్లు తేలింది. ఈ డైట్‌ను అనుసరించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపర్చుకోవచ్చని వారు భావిస్తున్నట్లు గుర్తించారు. అలాగే గ్లుటెన్ కారణంగా వచ్చే సిలియాక్ వ్యాధినీ అడ్డుకోవచ్చని నమ్ముతున్నట్లు తేల్చారు. ఎందుకింత ఆదరణ? వివిధ రకాల కారణాల వల్ల గ్లుటెన్ ఫ్రీ డైట్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ఈ డైట్‌ను ఒకసారి ప్రయత్నించి చూద్దామనే సహజమైన ఉత్సుకత, సిలియాక్ వ్యాధిగ్రస్థులకు గ్లుటెన్ ప్రమాదకరమైతే నాకు కూడా ప్రమాదమేమో అనే ఆలోచన, ఈ డైట్‌ను క్యాష్ చేసుకోవాలనుకునే కొందరి మార్కెటింగ్ నైపుణ్యం తదితర కారణాలు కావచ్చు. నష్టాలు లేవా? నిజానికి ఏ డైట్లోనైనా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ఇదీ అందుకు అతీతం కాదు. ముఖ్యంగా ఈ డైట్ అందరికీ మేలు చేయకపోవచ్చు. కొత్త అనారోగ్య సమస్యలూ తీసుకురావచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ఒక సర్వే ప్రకారం గ్లుటెన్ ఫ్రీ డైట్ అనుసరించేవాళ్లు చెబుతున్నదేంటంటే సాధారణ ఆహారం కంటే గ్లుటెన్ లేని పదార్థాల్లో ఎక్కువ న్యూట్రిషన్స్, అధిక మినరల్స్, విటమిన్లు ఉన్నాయి. కానీ, నిజానికి సాధారణ ఆహార పదార్థాల కంటే గ్లుటెన్ ఫ్రీ పదార్థాల్లో తక్కువ ఫోలిక్ ఆసిడ్, ఐరన్, ఇతర న్యూట్రిషన్స్ ఉన్నాయి. అలాగే గ్లుటెన్ రహిత ఆహార పదార్థాల్లో తక్కువ ఫైబర్, అధిక చక్కెర, కొవ్వు ఉన్నాయి. ఈ డైట్ అనుసరించే వారిలో అధికశాతం మంది బరువు పెరగడం, స్థూలకాయంతో బాధపడుతుండడాన్ని కొన్ని అధ్యయనాలు కనుగొనడం దీనికి బలం చేకూరుస్తోంది. ఎవరు అనుసరించాలి? ఎలాంటి అజీర్ణ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గ్లూటెన్ ఫ్రీ డైట్ గురించి ఆలోచించకపోవడం అత్యుత్తమం. అయితే గ్లుటెన్ సంబంధ అనారోగ్య సమస్యలు, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని వైద్య పరీక్షల ఆధారంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దేనికి దూరంగా ఉండాలి అనేది తెలుస్తుంది. ఒక్కోసారి సిలియాక్ వ్యాధి లక్షణాలకు లాక్టోజ్(చక్కెర, పాలు) కారణం కావొచ్చు. చివరగా చెప్పేదేంటంటే మంచికో చెడుకో ప్రస్తుతం గ్లుటెన్ గురించి అవగాహన చాలా పెరిగింది. ఒకవేళ సిలియాక్ వ్యాధి ఉంటే వారు కచ్చితంగా గ్లుటెన్ ఫ్రీ డైట్‌ను అనుసరించాల్సి వస్తే అందుకు తగిన ఆహార పదార్థాలు కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్రీడాకారుల్లాగానో, సినిమా నటుల్లాగానో గ్లుటెన్ ఫ్రీ డైట్‌ను అనుసరించడం మాత్రం చేయొద్దు. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన డాక్టర్ చేతుల్లో ఉంది. ఎవరో ఏదో చెప్పారని, ఇంకెవరో ఏదో పాటిస్తున్నారని మాత్రం అనుసరించొద్దు. వాస్తవాలేంటి? నిజానికి గ్లుటెన్ ఫ్రీ డైట్ శాస్త్రీయమేనా? అంటే ప్రస్తుతానికి కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే, ఇందులో ఒక నిజం ఉంది. అదేంటంటే గ్లుటెన్ ప్రమాదకరం. పైన చెప్పినట్లు సిలియాక్ వ్యాధి ఉన్న వారు గ్లుటెన్ ఫ్రీ డైట్ పాటించడం ద్వారా కొంతమేర స్వస్థత పొందవచ్చు. అయితే, మరికొందరికి సిలియాక్ వ్యాధి లేనప్పటికీ గ్లుటెన్ ఆహారం తీసుకున్నప్పుడు ఉబ్బరం, అతిసారం, పొత్తి కడుపు నొప్పి లాంటివి కనిపిస్తున్నాయి. దీనికి కారణం వారి శరీర తత్వానికి గోధుమలు పడకపోవడమని కొందరిలో తేలింది. అయితే, వీరిలో చాలా మందిలో సిలియాక్ వ్యాధి లక్షణాలకు సరైన కారణం గుర్తించలేకపోయారు. అలాగే సిలియాక్ వ్యాధి లేనివారు గ్లుటెన్ పదార్థాలను నిశ్చింతంగా తినొచ్చు. చదవండి: పెద్దవయసు పిల్లలూ చొల్లు కార్చుకుంటున్నారా? -
ఆఖరి రౌండ్
పరుగు పందెంలో ఆఖరి రౌండ్‌కి వచ్చేశారు రష్మి.. ఫలితం ఏమైందన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘రష్మి రాకెట్’. ఇందులో రష్మి అనే రన్నర్ పాత్రలో తాప్సీ కనిపిస్తారు. ఆఖర్ష్ ఖురానా దర్శకుడు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ గుజరాత్లో ప్రారంభం అయింది. ఫిబ్రవరి వరకూ సాగే ఈ షెడ్యూల్‌తో ‘రష్మి రాకెట్’ చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందులో అథ్లెట్‌గా కనిపించడం కోసం శరీరాకృతిని మొత్తం మార్చుకున్నారు తాప్సీ. కఠినమైన వ్యాయామాలు చేశారు. స్ట్రిక్ట్ డైట్ పాటించారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
బీపీ,షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చు..
ఈ ఏడాది చలికాలంలోకి అడుగుపెట్టాం. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంత వ్యాయమం చేయడంతో పాటు డైట్ పాటించడం కూడా చాలా ముఖ్యం. అందుకే చలికాలంలో దొరికే కొన్ని పండ్లను మీ డైట్లో భాగంగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి. ఈ కాలంలో దొరుకుతూ, ఆరోగ్యానికి, బీపీ, షుగర్ లెవల్స్ తగ్గించడానికి దోహదపడే ఐదు రకాల పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. కమల పండు: ఈ పండులో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఫైబర్‌తో నిండి వుండే ఈ పండులో సీ విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది భోజనం తరువాత షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు దోహదపడుతోంది. ఇది షుగర్ లెవల్స్‌ను, కొలస్ట్రాల్‌ను, బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 2. పీర్స్: ఈ పండులో ఎక్కవ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ పోషకాలు, ఫైబర్ కలిగి ఉంటుంది. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. అయితే ఈ పండు జ్యూస్ తాగకుండా కొరికి తినడం ఉత్తమం. ఎందుకంటే జ్యూస్ తాగితే ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉండే ఫ్రూట్స్‌లో పీర్స్ ఒకటి. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉండవు. 3.కివి: దీనిలో సీ విటమిన్ పుష్కలంగా ఉండటంతో పాటు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్ ఫ్రూట్‌గా చెప్పవచ్చు. ఇది కూడా గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉండే పండ్లలో ఒకటి. సంవత్సరం అంతా కివి అందుబాటులో ఉంటుంది.అందుకే మీ డైట్లో కచ్ఛితంగా దీనిని భాగంగా చేసుకోండి. 4. యాపిల్స్: దీని గురించి చెప్పాలంటే రోజు ఒక యాపిల్ తినడం ద్వారా డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు అనే నానుడి ఉండనే ఉంది. దీని ద్వారా యాపిల్‌లో ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఎన్ని పోషకాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనిలో చాలా తక్కువ కొలిస్ట్రాల్ ఉంటుంది. తక్కువ కాలరీలు ఉంటాయి. ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి. షుగర్ లెవల్స్ పెంచే కారకాలు దీనిలో చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎతో పాటు సోడియం లాంటి సూక్ష్మ పోషకాలు కూడ పుష్కలంగా ఉంటాయి. అందుకే యాపిల్‌ను మీ డైట్లో భాగంగా మార్చుకోండి. 5.బెర్రీస్: ఇక మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన ఫ్రూట్స్‌లో బెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. తీయగా ఎంతో రుచికరంగా ఉండే ఈ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుండి షుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్చేస్తాయి. అయితే వీటిని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలతో కలిపి తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. అందుకే వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: షుగర్‌తో డిప్రెషన్.. జాగ్రత్త -
ఎక్కువ కాలం బతకాలనుకుంటే ఇలా చేయండి!
చాలా పాతకాలపు నానుడి.. లంఖణం పరమౌషధం! ఆ తరువాతి కాలంలో తిండి కలిగితేనే కండ కలదోయ్ అన్నారు గానీ.. ఇటీవల కాలంలో మాత్రం మరోసారి సీన్ రివర్స్ అయింది. వయసు మీదపడ్డా ఆరోగ్య సమస్యలేవీ దరి చేరకూడదనుకున్నా.. ఎక్కువకాలం బతకాలని ఆశిస్తున్నా.. శరీరంలోని మంట/వాపులను తగ్గించుకోవాలని భావిస్తున్నా.. వీలైనంత తక్కువ ఆహారం తీసుకోవడమంత ఉత్తమమైన మార్గం లేదని అంటున్నారు చైనా, అమెరికా శాస్త్రవేత్తలు. అంతేకాదు.. కేలరీల నియంత్రణ ద్వారానే దీర్ఘాయుష్షు సాధ్యమన్న భావన వెనుక ఉన్న అసలు ప్రక్రియ ఏమిటిన్నది కూడా వీరు అధ్యయనపూర్వకంగా తెలుసుకున్నారు. ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. (చదవండి: బరువు తగ్గాలంటే ఈ స్నాక్ తినాల్సిందే..) వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల వ్యాధులు చుట్టుముట్టడం సహజం. కేన్సర్, మతిమరుపు, జీవక్రియలు మందగించడం.. ఇలా బోలెడన్ని సమస్యలు వృద్ధాప్యాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఈ కారణంగా ప్రభుత్వాలు వృద్ధుల ఆరోగ్యంపై పెట్టాల్సిన ఖర్చులు పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలో సాల్క్స్ జీన్ ఎక్స్ప్రెషన్ లేబొరేటరీకి చెందిన జువాన్ కార్లోస్ బెహమోంటే, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ప్రొఫెసర్ గువాంగ్ హుయి ల్యూలు ఎలుకలపై కొన్ని పరిశోధనలు చేశారు. ఆహారాన్ని నియం త్రించినప్పుడు ఎలుకల కణాల్లో ఏ రకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనల ఆధారంగా వృద్ధాప్య సమస్యలను అధిగమించేం దుకు మంచి మందులు తయారు చేయవచ్చునన్నది వీరి అంచనా. తమ పరిశోధనల్లో భాగంగా బెహమోంటే కొన్ని ఎలుకలను ఎంచుకుని 30 శాతం తక్కువ కేలరీలు అందేలా చేశారు. వీటిని సాధారణ స్థాయిలో ఆహారం తీసుకుంటున్న ఎలుకలతో పోల్చి చూశారు. మొత్తం 56 ఎలుకల్లోని కొవ్వు, కాలేయ, కిడ్నీ, చర్మ, ఎముక మజ్జ, మెదడు, కండరం వంటి 40 రకాల కణాల్లోంచి లక్షా అరవై ఎనిమిది వేల కణాలను నిశితంగా పరిశీలించారు. ఒక్కో కణంలోని జన్యుపరమైన చర్యలను ప్రత్యేక టెక్నాలజీ ద్వారా పరిశీలించినప్పుడు.. వయసు ఎక్కువవుతున్నప్పటికీ కేలరీలు తక్కువగా తీసుకున్న ఎలుక కణాల్లో మార్పులు పెద్దగా చోటుచేసుకోలేదు. అంతేకాదు.. వీటి కణజాలం, కణాలు కూడా యుక్తవయసులో ఉండే ఎలుకలను పోలి ఉన్నాయి. (చదవండి: బరువు తగ్గేందుకు 12 సూత్రాలు) కేలరీలు తక్కువగా తీసుకున్న ఎలుకల్లో రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా మంట/ వాపు, కొవ్వులు జీర్ణ ప్రక్రియలకు సంబంధించిన జన్యువులపై కూడా సానుకూల ప్రభావం కనిపించింది. ఆహారం కారణంగా వైబీఎక్స్1 అనే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ 23 రకాల మార్పులను నియంత్రించగలిగిందని తెలిసింది. ఈ పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను కొత్త కొత్త మందులను తయారు చేసేందుకు వినియోగించనున్నట్లు బెహమోంటే తెలిపారు. -
బరువు తగ్గాలంటే ఇవి తినాల్సిందే..
ప్రస్తుతం అందరినీ వేధించి సమస్య అధిక బరువు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. మరి బరువు తగ్గాలనుకునేవారు తక్కువ తినడం కన్నా సరైన ఆహారం తినడం ముఖ్యమని చెబుతున్నారు పోషకాహార, ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గడంలో హెల్తీ స్నాక్ తినడం ఒక భాగమే. ఇవి ఆకలిని తగ్గించమేగాక జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు తోడ్పడుతాయి. సెనగలు: వీటిలో ప్రొటీన్స్, పీచు పదార్థాలుంటాయి. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్ని తీసుకోవాలి. మినప పప్పు: మినపపప్పులో శరీరానికి అవసరమైన ప్రొటీన్ ఉంటుంది. మినప పప్పుతో సాయత్రం స్నాక్‌గా ఇడ్లీలు చేసుకుని తినొచ్చు. ఈ ఇడ్లీలు తొందరగా జీర్ణమవుతాయి. నట్స్: బఠాణీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో గ్లూటెన్ ఉండదు. వీటిలో ముఖ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని వేగించి లేదా వీటికి కొద్దిగా మొక్కజొన్నలు కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు: వీటిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తామర గింజలు: వీటిలో కొలెస్ట్రాల్, కొవ్వులు, సోడియం వంటివి అస్సలుండవు. ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎండు బఠాణి: ప్రొటీన్స్, కొవ్వులు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే బరువు తగ్గడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. -
13 సంవత్సరాలుగా వాడింది, కానీ...
కాలిఫోర్నియా: అధిక బరువుతో బాధపడుతున్నారా? మీ చింతను మాకు వదిలేసి మా దగ్గరున్న వస్తువును మీరు తీసుకెళ్లండి. బరువును తగ్గించుకుని ఆనందంగా జీవించండి.. ఇలాంటి యాడ్స్ రోజూ ఎన్నో వస్తుంటాయి. ప్రోడక్ట్ వాడక ముందు, తర్వాత అంటూ ఊదరగొట్టే ఫొటోలతో జనాలను బుట్టలో పడేస్తారు. దీంతో చాలామంది ఆ ప్రోడక్ట్‌ను కొనడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇక్కడ కూడా ఓ మహిళ బరువు తగ్గడం కోసం డైట్ ప్రోడక్ట్ ఏళ్ల తరబడి వాడింది. కానీ, ఎలాంటి ఫలితం కానరాక చివరికి కోర్టుకెక్కింది. వివరాలు.. కాలిఫోర్నియాకు చెందిన షానా బాసెరా అనే మహిళ ఊబకాయంతో బాధపడుతోంది. ఎలాగైనా బరువు తగ్గించుకుకుందామని ప్రముఖ కంపెనీ డా.పెప్పర్‌కు చెందిన సోడా డైట్ డ్రింక్‌ను రోజూ వాడటం మొదలు పెట్టింది. అలా 13 సంవత్సరాలు గడిచాయి. కానీ ఆమె బరువులో ఏమాత్రం మార్పు కనిపించలేదు. దీంతో విసుగెత్తిపోయిన మహిళ తను వాడుతున్న సోడా డ్రింక్ కంపెనీపై కోర్టుకెక్కింది. ఈ ప్రోడక్ట్ తనను తప్పుదారి పట్టించిందని ఆరోపించింది. కానీ అనూహ్యంగా కోర్టు ఆమెకు దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. మీరు తాగుతున్న సోడా డ్రింక్‌ను ఆ కంపెనీ ‘డైట్’ అని పేర్కొందే కానీ ఎక్కడా ‘వెయిట్ లాస్’ అని పేర్కొనలేదని స్పష్టం చేసింది. దీన్ని వినియోగదారులు తప్పుగా అర్థం చేసుకున్నంత మాత్రాన కంపెనీ వారిని మోసం చేసినట్టు కాదని వెల్లడించింది. ‘డైట్’ అంటే సాధారణ ఉత్పత్తుల కన్నా తక్కువ కేలరీలు కలిగి ఉండటమని వివరించింది. ప్రకటనలో కనిపించేవాళ్లు అందంగా, స్లిమ్‌గా ఉన్నవాళ్లు కనిపించినంత మాత్రాన మీరు కూడా అలా మారుతారని కాదని చెప్తూ కేసును కొట్టివేసింది. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే.. -
ఇలా చేస్తే.. కచ్చితంగా బరువు తగ్గుతారు
సాక్షి, న్యూఢిల్లీ : సినీ తారలా సన్నగా, మెరపు తీగలా ఉండాలని తాపత్రయపడే యువతులు, బక్కగా ఉండడమే కాకుండా హృతిక్ రోషన్లాగా బలిష్టంగా కూడా కనిపించాలని కోరుకునే యువకులు, లావు తగ్గి చురుగ్గా కనిపించాలనుకునే మధ్య వయస్కులు మన చుట్టూ కోకొల్లలు. అందుకోసం వారంతా బరువు తగ్గించే బెల్టులు, యంత్రాలతో రోజు కుస్తీ పట్టడం, రక రకాల డైటింగ్లు కూడా చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. అయినా ఆశించిన ఫలితాలు లేక కొత్త కొత్త పద్ధతులు, సూచనల కోసం ఎదురు చూసే వారు లేకపోలేదు. అలాంటి వారిని సొమ్ము చేసుకోవడానికి ఈ డైటింగ్ మంచిది, ఆ డైటింగ్ మంచిదంటూ ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఎన్నో సూచనలతో కూడిన పత్రికలు పుస్తకాలు వెలువడుతున్నాయి. ఫలితంగా బ్రిటన్‌లో డైట్ ఫుడ్ బిజినెస్ ఏడాదికి 18 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. డైటింగ్లకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు లక్షలకుపైగా పరిశోధనాత్మక పత్రాలు, పుస్తకాలు వెలువడి ఉంటాయని అమెరికా ఫిజిషియన్, రచయిత డాక్టర్ మైఖేల్ గ్రెగర్ అంచనా వేశారు. ఈ పత్రాల్లో, పుస్తకాల్లో సూచించిన డైటింగ్లు ఎంత మేరకు శాస్త్రీయంగా ఉన్నాయన్న అంశాన్ని తెలుసుకునేందుకు డాక్టర్ మైఖేల్ తన బృందంతో అధ్యయనం చేయించారు. ఆ తర్వాత ఆయన మూడు వేర్వేరు వాలంటీర్ల బృందాలను ఎంపిక చేసుకొని రక రకాల డైటింగ్‌లను వారిపై ప్రయోగించి ఫలితాలను విశ్లేషించారు. ఇలా ఆయన 17 ఏళ్లపాటు పరిశోధనలు జరిపి వాటి ఆధారంగా ఎలా డైటింగ్ చేయాలో, ఎలా చేయకూడదో వివరణ ఇస్తూ ‘హౌ నాటు టు డైట్’ అంటూ ఓ పుస్తకాన్నే వెలువరించారు. టూకీగా చెప్పాలంటే అందులో ఆయన డైటింగ్‌కు 12 చిట్కాలు చెప్పారు. 1. అల్పాహారం మానవద్దు అల్పాహార విందును మానేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. గోడ గడియారంలాగానే మన భౌతిక శరీర గడియారంలో కూడా 24 గంటలు ఉంటాయి. ఆహారం తీసుకునేందుకు, విశ్రాంతి, నిద్రలకు సమయాలు ఉంటాయి. ఉదయం పూట ఎక్కువ కేలరీలను కరిగించే గుణం మన భౌతిక శరీరానికి ఉంటుంది. అందుకని అల్పాహారం మానేయాల్సిన అవసరం లేకపోగా, అల్పాహారప్పుడుగానీ, మధ్యాహ్నంగానీ ఎక్కువ తినాలి. రాత్రి పూట చాలా తక్కువ తినాలి. 2. శరీరంలో కొవ్వు రెండు రకాలు కడుపు, నడుముల వద్ద పేరుకుపోయే కొవ్వును వైట్ ఫ్యాట్ అంటారు. భుజాల వద్ద, మెడ, చెక్కిళ్ల వద్ద పేరుకుపోయే ఫ్యాట్‌ను గోధుమ రంగు ఫ్యాట్ అంటారు. శాస్త్ర విజ్ఞానపరంగా ‘బ్రౌన్ అడపోస్ టిష్యూ (బ్యాట్)’గా వ్యవహరిస్తారు. పగటి పూట ఈ ఫ్యాట్‌లోని కేలరీస్ త్వరగా కరుగుతాయి. 3. టీ, కాఫీలతో కాలరీలు కరుగుతాయి రోజుకు మూడుసార్లు టీ తాగడం వల్ల 25 కేలరీలు, రోజుకు మూడుసార్లు కాఫీలు తాగడం వల్ల 14 కాలరీలు మన శరీరంలో కరగుతాయి. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. 4. టమాటాలతో ఎంతో ప్రయోజనం ప్రతి మీల్స్ ముందు పండిన ఓ టమాటను తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ టమాటలో 90 శాతం నీళ్లు ఉండడం వల్ల తిండిని తగ్గిస్తుంది. అందులోని రసాయనాలు తిన్నదాంట్లోని కేలరీలను కరిగిస్తాయి. 5. డ్రైఫ్రూట్స్ గింజలు వీటిలో కాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. 24 గంటల భౌతిక గడియారం సజావుగా సాగేందుకు ఇవి ఉపయోగపడతాయి. 6. నల్ల జిలకర మన కూరల్లో నల్ల జిలకర ఉపయోగించడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు దాదాపు వెయ్యి పరిశోధనా పత్రాల్లో పేర్కొన్నట్లు డాక్టర్ వివరించారు. ఇది అతివేగంగా శరీరంలోని కాలరీలను కరిగిస్తోంది. 7. వెనిగర్ దీన్ని రోజుకు రెండు టీ స్పూన్ల చొప్పున తీసుకుంటే నెల రోజుల్లో రెండున్నర కిలోల శరీర బరువును తగ్గిస్తుంది. నేరుగా తీసుకుంటే స్వరపేటిక దెబ్బతినే ప్రమాదం ఉన్నందున, సలాడ్స్‌పై పోసి వాటిని తీసుకోవాలి. 8. ఉడకబెట్టిన బంగాళ దుంపలు ప్రతి భోజనంతో పాటు అంచుకు ఉడకబెట్టిన బంగాళ దుంపలు తీసుకోవడం వల్ల 200 కాలరీల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. 9. వ్యాయామంతో ఫిట్ వ్యాయామం చేయడం వల్ల లావు తగ్గరు. తిండి పెరుగుతుంది. వ్యాయామం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు పెరిగి బలంగా తయారవుతారు. 10. ఇంటి పనుల్లో చురుగ్గా ఉండడం వంటావార్పు, ఇతర ఇంటి పనుల్లో తరచుగా కూర్చొడం, లేవడం, నిలబడడం, వంగడం తదిర క్రియల వల్ల శరీరంలోని కాలరీలు ఎక్కువగా కరగుతాయి. 11. బొజ్జలను తగ్గించే బెల్టులు.. వీటి వల్ల, ఇతర పరికరాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. 12. శృంగారంతో 10 కేలరీలు.. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇరువురి మధ్య లైంగిక సంబంధం మహా అయితే ఆరు నిమిషాలు ఉంటుంది. దీని వల్ల కేవలం పది కేలరీలు మాత్రమే కరుగుతాయి. ఆ సమయంలో ఎక్కువగా గుండెకు ఆక్సిజన్ అందక పోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. రోజు టీవీ చూడడం వల్ల కూడా 14 కేలరీలు కరగుతాయి. (గమనిక: డాక్టర్ మైఖేల్ గ్రెగర్ రాసిన ‘హౌ నాట్ టు డైట్’ పుస్తకం డిసెంబర్, 10వ తేదీనాడు మార్కెట్లోకి వస్తోంది. అమెజాన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది) -
కీటో డైట్‌తో గుండెకు చేటు
లండన్ : కొవ్వును కరిగించి స్ధూలకాయాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కీటో డైట్‌పై తాజా అథ్యయనం బాంబు పేల్చింది. కార్బొహైడ్రేట్లను ఆహారంలో తగ్గించే ఈ డైట్ ద్వారా గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పు అధికమని అథ్యయనం హెచ్చరించింది. సెలబ్రిటీలు సైతం వాడుతున్న కీటో ఆహారంతో గుండెకు చేటేనని సర్వే తేల్చింది. ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదని వెల్లడించింది. కీటో ఆహారంలో భాగంగా ధాన్యాలు, పండ్లు, కూరగాయలను తగ్గించడం ద్వారా గుండెకొట్టుకునే వేగం లయతప్పుతుందని, ఇది గుండె పోటు వంటి తీవ్ర అనర్ధాలకు దారితీస్తుందని తమ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు. బరువు తగ్గే క్రమంలో పాటిస్తున్న కీటో డైట్‌పై జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్య నిపుణులకు అథ్యయన రచయిత సన్ యాట్-సేన్ యూనివర్సిటీ, చైనాకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ జుంగ్ సూచించారు. కార్బోహైడ్రేట్ల స్ధానంలో ప్రొటీన్, కొవ్వు పదార్ధాలు తీసుకున్నప్పటికీ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారంతో గుండె కొట్టుకునే వేగం లయ తప్పుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని ఆయన చెప్పారు. 14,000 మంది ఆహారపు అలవాట్లను రెండు దశాబ్ధాల పాటు పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. -
ఎంతిష్టమో!
ముప్పై ఐదేళ్ల వయసు. ముగ్గురు పిల్లలు. ఆరు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్. ఒక ఒలింపిక్ మెడల్! ఏమిటి మేరీ కోమ్ విజయ రహస్యం? బాక్సర్‌గా అనుభవమా? ఆమె ఫిట్నెస్సా? రెండూ! రెండిటినీ మించి గెలవాలన్న తపన. అలాగని కోమ్ మరీ గంటల కొద్దీ ప్రాక్టీసేం చెయ్యరు. యువ బాక్సర్లకు రెండు గంటల ప్రాక్టీస్ చాలు. కోమ్‌కి రోజూ 40 నుంచి 45 నిమిషాల సాధన సరిపోతుందట. ఇక శక్తి. ఎక్కడి నుంచి వస్తుంది ఆమెలోంచి ఆ పవర్ పంచ్? విల్ పవర్ ఎలాగూ ఉంటుంది. డైట్ ఏమిటి? స్పెషల్‌గా ఏమీ ఉండదట. ఏం తినాలని ఉంటే అప్పటికి అది తినేస్తారట. జన్రల్‌గా కోమ్ తినేది వరన్నం (వరి అన్నం). ‘‘రైస్ లేకుండా నేను బతకలేను. తరచు జిలేబీలు తింటాను. అలాగే ఐస్‌క్రీమ్. ఒక్కోసారి రెండూ కూడా. అయితే నో మసాలా.. నో స్పైసీ ఫుడ్’’ అని చెప్తారు మేరీ కోమ్. ఇవి మాత్రమే కాదు. సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారట. బలమిచ్చే మందులు. డాక్టర్ నిఖిల్ లేటీ ఆమె ఫిజియోథెరపిస్ట్. ఆయన్నడిగితే కోమ్ ఆహారపు అలవాట్ల గురించి మరికొంత వివరంగా చెబుతుంటారు. ఇంట్లో వండిన మణిపురి ఫుడ్. అన్నంలోకి మాంసం, కూరగాయలు. బయట డబ్బాలో లభించే ప్రొటీన్, మల్టీ విటమిన్లు. ఇదీ మేరీ మెనూ. సరే, బాక్సింగ్‌లో ఆడడానికి ఒక వెయిట్ ఉండాలి కదా! ఆ వెయిట్‌ని ఎక్కువా కాకుండా, తక్కువగా కాకుండా కోమ్ ఎలా మేనేజ్ చెయ్యగలుగుతున్నారు? మొన్నటి వరల్డ్ బాక్సింగ్ పోటీలలో మేరీ కోమ్ బంగారు పతకాన్ని కొట్టింది 48 కిలోల కేటగిరీలో. ఇప్పుడు ఆమె గోల్ ఒలింపిక్స్‌లో గోల్డ్ కొట్టడం. అందుగ్గాను ఆమె 51 కిలోల బరువు ఉండాలి. అంటే పెరగాలి. ఆటకు తగ్గట్లు పెరగడం, తగ్గడం కోమ్‌కి కష్టమేం కాదట! బరువు తగ్గడానికి స్కిప్పింగ్, బ్యాడ్మింటన్. పెరగడానికి.. బలమైన ఆహారం. క్రమబద్ధమైన వ్యాయామం. చివరగా ఒక్క విషయం. కోమ్ సాధారణంగా బంగారు పతకాన్నో, ఇంకో బ్రాస్ పతకాన్నో పంటి కింద కొరుకుతూ కనిపిస్తారు కానీ.. ఆహారాన్ని భుజిస్తూ ఎక్కడా కనిపించరు! -
మధుమేహులకు శాకాహారం మేలు!
రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకోవాలనుకుంటున్నారా? అయితే వీలైనంత వరకూ శాకాహారం ఎక్కువగా తీసుకోండి అంటోంది బ్రిటిష్ మెడికల్ జర్నల్. పండ్లు, కాయకూరలు, గింజలు, పప్పుదినుసులు, విత్తనాలు ఎక్కువగా తీసుకుంటూ.. వీలైనంత తక్కువ పశు ఆధారిత ఉత్పత్తులను వాడేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిసిందే. అయితే దీనికి కారణమేమిటన్నది మాత్రం స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మధుమేహంపై జరిగిన 11 అధ్యయనాల వివరాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 23 వారాల పాటు జరిగిన ఈ అధ్యయనాల వివరాలను నిశితంగా పరిశీలించినప్పుడు శాకాహారం తీసుకునేవారి భౌతిక, మానసిక ఆరోగ్యం ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా నాడీ సంబంధిత నొప్పులు కూడా శాకాహారుల్లో తక్కువగా ఉన్నట్లు తెలిసింది. పశు ఉత్పత్తులు తీసుకోవడం మానేసిన లేదా తగ్గించిన వారి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ మోతాదుతో పాటు బరువులోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది. మరింత విస్తృత స్థాయిలో అధ్యయనాలు చేపట్టడం ద్వారా ఈ ఫలితాలను రూఢీ చేసుM -
మీది నైట్ షిఫ్టా..?
సాఫ్ట్వేర్ పుణ్యామా అని జీతాలతో పాటు రోగాలు కూడా పెరిగాయి. సూర్యుడితో పాటు మేలుకోవాల్సిన వారం కాస్తా చంద్రుడితో సహవాసం చేస్తున్నాం. అర్ధరాత్రి పూట.. తెల్లవారు జామున తినడం ఈ రోజుల్లో చాల సాధరణం అయ్యింది. ఫలితంగా ఇంట్లో.. ఒంట్లో రకరకాల సమస్యలు. శరీరం బాగుంటే మనసు బాగుంటుంది.. ఆపై అన్ని బాగుంటాయి. మరి అలా ఉండాలంటే పని గంటలకు తగ్గట్టుగా మన ఆహార అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పూర్తి ఆరోగ్యంగా ఉండోచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి.. డిన్నర్‌తో రోజు ప్రారంభం.. ఎవరైనా బ్రేక్‌ఫాస్ట్‌తో తమ రోజును ప్రారంభిస్తారు. కానీ నైట్ షిఫ్ట్ చేసే వారు మాత్రం డిన్నర్‌తో తమ రోజును ప్రారంభించాలంటున్నారు నిపుణులు. మీరు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆఫీస్‌కు వెళ్లేటట్లయితే 7 - 7. 30 మధ్య.. సాయంత్ర 4 గంటలకు ఆఫీస్‌కు వెళ్లేవారు రాత్రి ఎనిమిదింటికల్లా డిన్నర్ చేయడం మేలంటున్నారు నిపుణులు. తేలికపాటి ఆహరం.. డిన్నర్ చేయగానే ఎవరికైనా నిద్ర వస్తున్నట్లు అన్పించడం సహజం. అందుకే నైట్ షిఫ్ట్ చేసేవారు తేలీకపాటి ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయల భోజనం చేయడం.. బ్రౌన్ రైస్ తీసుకోవడం ఉత్తమం. ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫలితంగా చాలా చురుగ్గా పని చేయగల్గుతారు. ఒక చెంచాడు నెయ్యి.. ఆయుర్వేదం ప్రకారం రాత్రి పూట మెలుకువగా ఉంటే శరీరం పొడిగా తయారవుతుంది. అందువల్ల ఆఫీస్‌కు వెళ్లే ముందు ఓ చెంచాడు నెయ్యి తీసుకుంటే మంచిది. అది శరీరాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. వేపుళ్లు అసలే వద్దు.. ఎక్కువగా వేయించిన పదార్థాలు తినడం వల్ల చాలా ఇబ్బందిగా అన్పించడం మాత్రమే కాకా బరువు కూడా అధికంగా పెరుగుతారు. రాత్రి పూట మన జీర్ణ వ్యవస్థ చురుగ్గా ఉండదు. అందువల్ల రాత్రి సమయంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల అది సరిగా జీర్ణం కాదు ఫలితంగా ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. పప్పులే ఉత్తమం.. రాత్రి పూట పని చేసేటప్పుడు ఆకలిగా అనిపిస్తే ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. వేయించిన శనగలు, బాదం పప్పులు వంటి వాటిని తీసుకోవడం మేలంటున్నారు. పిజ్జా బర్గర్లకు దూరంగా ఉండండం మంచిదంటున్నారు. కాఫీ, టీలు వద్దు.. రాత్రి పూట పనిచేసేవారు మెలకువగా ఉండటం కోసం అదేపనిగా కాఫీ, టీలు తాగుతుంటారు. కానీ దీనివల్ల చేకూరే ప్రయోజనం చాలా తక్కువ. నిద్ర వచ్చినట్లు అనిపిస్తే నీరు తాగడం, తాజా పండ్ల రసాలు తీసుకోవడం మేలంటున్నారు. -
బరువును విసిరి కొట్టండి!
బరువు తగ్గడానికి ప్రపంచంలో ఉన్న ?డైట్ ప్లాన్స్ అన్నీ వివరించాం.కాని అసలైన డైట్ మన వాకిలి ముంగిటే ఉంది.మన చేలలోనే ఉంది.పంట పొలాల్లోనే పండుతోంది. సిరి ధాన్యాలతో ఒంటి మీద పేరుకున్న అదనపు సిరిని వదిలించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. తరిమికొట్టవచ్చు.అరికలు, సామలు, ఊదలు, కొర్రలు... ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యవంతం చేయడమే కాదు బరువును అదుపు చేస్తాయి. భారాన్ని తగ్గిస్తాయి. సిరిధాన్యాలతో బరువును విసిరికొట్టండి. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. అనువంశికత కారణం కాదు. ఊబకాయానికి, మధుమేహానికి కూడా ముఖ కారణాలు ఇవే. గతంలో ఊబకాయుల సంఖ్య తక్కువ ఎందుకని? పూర్వం ఊబకాయంతో బాధపడే ప్రజలు దాదాపుగా లేరు. క్రీ.శ.1900 వరకు ఊబకాయ సమస్య పహిల్వానులు వంటి వాళ్లలో తప్ప సాధారణ ప్రజానీకంలో చాలా అరుదుగా ఉండేది. ఎందుకనంటే, అప్పట్లో గ్లూకోజ్ నిదానంగా రక్తంలో కలిసేందుకు అనువైన ఆహారం మనం తింటూ ఉండేవాళ్లం. అదీకాకుండా, ప్రజలంతా రోజూ చాలా సేపు నడిచేవారు. అంటే, ఆహారం ద్వారా రక్తంలోకి చేరే గ్లూకోజ్ ఖర్చు అయ్యేది. ఎప్పుడైతే గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ అవుతూ, పేరుకుంటూ వస్తున్నదో అప్పుడు గ్లైకోజన్ గాను, కొవ్వు గాను, మాంసం గాను మార్చే వ్యవస్థ తయారవుతుంది. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ మొదలవుతాయన్నమాట. వీటికితోడు కాలక్రమంలో పంచదార ఉత్పత్తి, వినియోగం బాగా పెరిగింది. చక్కెర ఉత్పత్తి క్రీ.శ. 1846 నుంచే ప్రారంభమైంది. గడచిన 70 సంవత్సరాల్లో వరిబియ్యం, గోధుమలతోపాటు పంచదార వినియోగం బాగా పెరిగింది. వరి, గోధుమల్లో పీచుపదార్థం అతి తక్కువగా ఉంది. పంచదార ద్వారా తీసుకునే గ్లూకోజ్‌ను ఖర్చు చేసే వ్యాయామం చేయకపోవడం వల్ల ఊబకాయం ఏర్పడుతోంది. సూటిగా చెప్పుకోవాల్సిందేమిటంటే.. ఆహారంలో వచ్చిన మార్పు వల్ల, వ్యాయామం తగ్గిపోవడం వల్ల ఊబకాయం వచ్చింది. సరైన ఆహారం తినాలి. సరిగ్గా వ్యాయామం చేయాలి. అప్పుడే తిరిగి సంపూర్ణ స్థితి నెలకొంటుంది. అంటే ఊబకాయులు తమ శరీరంలో అతిగా పెరిగిన మాంసం, కొవ్వు పదార్థం, గ్లైకోజెన్ కరిగించుకునేలా ఆహార విహారాలను నియమబద్ధంగా మార్చుకోవాలి. అంటే, ఎక్కువగా నడవాలి. గ్లూకోజ్‌ను రోజూ నడక ద్వారా ఖర్చు చేయాలి. అదే సమయంలో.. ఆహారం ద్వారా గ్లూకోజ్ నిదానంగా రక్తంలోకి వచ్చేలా చూడాలి. సిరిధాన్యాలను ఎప్పుడో ఒక సారి కాకుండా రోజువారీగా ముఖ్య ఆహారంగా తింటూ ఉంటేనే ఇది సాధ్యమవుతుందని గుర్తించాలి. స్టెరాయిడ్స్ వల్ల ఊబకాయం.. ఆహారం వల్ల సహజంగా ఊబకాయం తయారవటం ఒకటైతే వైద్యచికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం కూడా ఊబకాయానికి మరో ముఖ్య కారణం. రోగాలకు చికిత్సలో భాగంగా ఈ మధ్యకాలంలో డాక్టర్లు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఆడవాళ్లలో హార్మోన్ అసమతుల్యతకు, ఆస్తమా, నొప్పి మందులుగా వాడుతున్నారు. సాధారణంగా ఆహార విహారాలలో మార్పుల వల్ల కన్నా స్టెరాయిడ్స్ వాడే వారికి మరింత వేగంగా ఊబకాయం వస్తుంది. స్టెరాయిడ్స్ వల్ల ఆకలి ఎక్కువ కావటం వల్ల ఎక్కువగా తినటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల కూడా కొందరు ఊబకాయులుగా మారుతున్నారు. మాంసం, కోడిగుడ్లను తక్కువ రోజుల్లో అధికోత్పత్తి సాధించే క్రమంలో పశువులకు, కోళ్లకు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. అలా ఉత్పత్తయిన మాంసం, కోడిగుడ్లను తిన్న వారి ఆరోగ్యంపై కూడా ఈ స్టెరాయిడ్స్ ప్రభావం ఉంటుంది. వీళ్లు కూడా ఎక్కువ తినటం మొదలు పెట్టి ఊబకాయులుగా మారిపోతున్నారు. మాంసాహారం తినటం అంతకంతకూ ఎక్కువై పర్యావరణ అసమతుల్యతకు దారితీస్తోంది. జంతువుల పాలు మనిషి ఆరోగ్యానికి సరిపడవు. పాలు, టీ, కాఫీలు తాగటం వల్ల హార్మోన్ అసమతుల్యత మనుషుల ఆరోగ్యాన్ని అస్థవ్యస్థం చేస్తోంది. పాలను తోడు వేస్తే ఈ అలసమతుల్యత సమసి పోతుంది. కాబట్టి, పెరుగు, మజ్జిగ పర్వాలేదు. మొత్తంగా ప్రపంచం ఇప్పుడు తింటున్న ఆహారం పర్యావరణానికి కూడా పెనుముప్పుగా మారాయి. సిరిధాన్యాలతో మనుషులు సంపూర్ణ ఆరోగ్యం పొందటమే కాకుండా భూతాపాన్ని కూడా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. మెట్ట రైతులనూ బతికించుకోవచ్చు. నెమ్మదిగానైనా రోజూ నడవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయం గంట, సాయంత్రం గంట నడవాలి. అధికబరువు ఉన్న వారు నడవడానికి ఇబ్బందులు ఉంటాయి. అయితే, ఈ రోగానికి కారణభూతాలైన ఆహారం తినటం మాని, సిరిధాన్యాలు తినటం, కషాయాలు తాగటం మొదలు పెడితే వారికి నడిచే శక్తి వస్తుంది. కీళ్ల నొప్పులు, సంధివాతం కొర్రలతోనే బాగువుతుంది. అందుకే ఐదు ధాన్యాలూ తినాలి. అరికెలు, సామలు ఎక్కువ రోజులు తింటూ మిగతా 3 ధాన్యాలూ తక్కువ రోజులు తినాలి. ఊబకాయులు వేగంగా నడవనక్కర లేదు. నెమ్మదిగా నడిచినా చాలు. ఉదయం, సాయంత్రం గంట చొప్పున వారికి చేతనైనంత వేగంతో నడవవచ్చు. రోజులు గడిచేకొద్దీ వారు బాగా నడవగలుగుతారు. వేగంగా తగ్గటం మంచిది కాదు.. ఆహారంలో, శారీరక వ్యాయామంలో వచ్చిన మార్పు వల్ల ఊబకాయం మరీ వేగంగా పెరగదు. కొన్ని ఏళ్లపాటు, నిదానంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి, తగ్గేటప్పుడు కూడా ఆహారంలో మార్పు చేసుకొని, నడక వంటి వ్యాయామం క్రమబద్ధంగా చేస్తూ నిదానంగానే ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. సిరిధాన్యాలు తింటూ, కషాయాలు తాగుతూ, నడుస్తూ ఉంటే.. ఆరు నెలల నుంచి రెండేళ్లలో వయసు, ఎత్తుకు తగిన బరువును సంతరించుకోవటంతోపాటు.. ఏ వయస్కులైనా, ఏయే జబ్బులున్న వారైనా, ఆడవారైనా, మగవారైనా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. 6 నెలల్లో 10–25 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. మరీ ఎక్కువ బరువున్న వారు కొంచెం వేగంగా, మధ్యస్థంగా అధిక బరువున్న వారు కొంచెం నెమ్మదిగా బరువు తగ్గుతారు. ఉదాహరణకు 100 కిలోల బరువున్న మనిషి ఆహార విహారాలను మార్చుకుంటే ఆరునెలల్లో 12 కిలోల వరకు తగ్గొచ్చు. 80–90 కిలోలున్న వారు అదే ఆరునెలల్లో 10 కిలోలు తగ్గొచ్చు. చిన్న వయస్కులైన ఊబకాయులు 50 ఏళ్లు దాటిన ఊబకాయులకన్నా కొంచెం వేగంగా బరువు తగ్గుతారు. ఇంతకన్నా వేగంగా బరువును తగ్గించే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అవి ప్రమాదకరం.మరీ వేగంగా బరువు తగ్గటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల కిడ్నీ సంబంధమైన సమస్యలు వస్తాయి. హానికరమైన ఆహారాన్ని తినటం మానేసి చిరుధాన్యాలను (కనీసం 2–4 గంటలు నానబెట్టుకొని వంట చేసుకోవటం విధిగా పాటించవలసిన చాలా ముఖ్యమైన నియమం) తింటూ, కషాయాలు తాగుతూ, క్రమం తప్పకుండా నడుస్తూ ఉంటే.. ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు ఎంతటి రోగాలున్న వారైనా (అవసరాన్ని బట్టి హోమియో/ఆయుర్వేద మందులను తీసుకోవాలి) ఆయా రోగాల పీడ నుంచి పూర్తిగా బయటపడటమే కాకుండా.. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని నా దగ్గరకు వచ్చిన వేలాది మంది సాక్షిగా బల్లగుద్ది చెప్పగలను. అరికెలు, సామలు ఎక్కువ రోజులు తినాలి.. ఏ కారణంగా ఊబకాయం వచ్చినా.. ఊబకాయాన్ని ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవాలనుకునే వారు మొదట ఆహారం మార్చుకోవాలి. గ్లూకోజ్‌ను అసమతుల్యంగా, తక్కువ సమయంలోనే రక్తంలోకి పంపించే వరి బియ్యం, గోధుమలు, మైదాతో చేసిన ఆహారాన్ని తినటం మానేయాలి. గ్లూకోజ్‌ను సమతుల్యంగా, కొన్ని గంటల పాటు నెమ్మదిగా రక్తంలోకి వదిలే సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా తినాలి. వరుసగా మూడు రోజులు అరికెలు, మరో మూడు రోజులు సామెలు రోజువారీ ముఖ్య ఆహారంగా తినాలి. కొర్రలు, ఊదలు, అండుకొర్రలను వరుసగా ఒక్కోరోజు తినాలి. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి. సిరిధాన్యాలు తింటే ఏమవుతుంది? కాలేయం, క్లోమం.. ఇవన్నీ తమ పనులను సక్రమంగా పనిచేయాలంటే రక్తం శుద్ధంగా ఉండాలి. రక్తం పలచగా, తేలిగ్గా ఉండి, ఇమ్యునో బాగ్యులన్స్ అన్నీ సరిగ్గా ఉంటేనే నిర్ణాల గ్రంథులన్నీ(ఎండోక్రైన్ గ్లాండ్స్) సరిగ్గా పనిచేసేది. రక్తం శుద్ధ కావటానికి, నిర్ణాల గ్రంధులు సరిగ్గా పనిచేయటానికి ఈత ఆకు కషాయం పని చేస్తుంది. దీనికి తోడు సిరిధాన్యాలు ప్రధాన ఆహారంగా తినాలి. ఇలా చేస్తే దేహంలో పేరుకున్న కొవ్వు, మాంసం క్రమంగా కరగటం ప్రారంభమవుతుంది. పసుపు, గరిక, ఈత ఆకుల కషాయాలు తాగాలి సిరిధాన్యాలు తినటంతోపాటు.. పసుపు, గరిక, ఈత ఆకుల కషాయాలు తాగాలి. వీటిల్లో వారానికి ఒక రకంæచొప్పున తాగాలి. ఉదయం, సాయంత్రం తాగాలి. దీనిలో కొంచెం ఈతబెల్లం లేదా తాటిబెల్లం పాకాన్ని రెండు చుక్కలు కలుపుకుంటే.. కషాయం రుచిగానూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈతబెల్లం జనాన్ని సన్నగా ఉంచుతుంది. ఈతాకులో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల మజ్జలో పనిచేస్తుంది. ఎముకల మజ్జ శుభ్రం అయితేనే ఊబకాయం తగ్గుతుంది. – డా. ఖాదర్ వలి, స్వతంత్ర శాస్త్రవేత్త, ప్రముఖ ఆహార, ఆరోగ్య నిపుణులు, హోమియో వైద్యులు, మైసూరు -
అతి ‘కీటో’ అనర్థమే..!
ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుళ్లు... బోలెడన్ని ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వు... పిడికెడు మాంసం.. కొన్ని పాలు... దీర్ఘాయుష్షు, ఆరోగ్యకర జీవనానికి మేలైన మార్గాలివే! ప్రపంచం మొత్తమ్మీద లక్షల మంది ఆహారపు అలవాట్లను విశ్లేషించి పరిశోధకులు చెబుతున్న విషయమిది! మరి బరువు తగ్గేందుకు, మధుమేహాన్ని దూరం పెట్టేందుకు చాలా మంది అనుసరిస్తున్న కీటోడైట్ మాటేమిటి? ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’అని ఓ సామెత ఉంది. ఏ విషయంలోనైనా అవసరానికి మించి వ్యవహరించడం సరికాదన్నది దీని అర్థం. ఆహారం కూడా దీనికి మినహాయింపు కాదంటున్నారు సారా సైడల్‌మ్యాన్. బ్రిగమ్ అండ్ బోస్టన్ విమన్స్ హాస్పిటల్ (అమెరికా)లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె ఇటీవల ఓ భారీ అధ్యయనాన్ని పూర్తి చేశారు. ప్రపంచం నలుమూలల్లోని దాదాపు 4.5 లక్షల మంది ఆహారపు అలవాట్లు, వారి ఆరోగ్య వివరాలను విశ్లేషించి సారా చెప్పేదేమిటంటే ‘‘మన ఆరోగ్యానికి రోజూ తీసుకునే ఆహారం కంటే ముఖ్యమైనది ఇంకోటి లేనే లేదు’’అని! అంతేకాదు పిండి పదార్థాలను దాదాపుగా మానేసి కొవ్వు, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న కీటోడైట్‌తో స్వల్పకాలంలో ప్రయోజనం చేకూరవచ్చునేమోగానీ దీర్ఘకాలంలో మాత్రం ఇది మనల్ని తొందరగా కాటికి పంపేస్తుందని అంటారు ఆమె. ప్రపంచంలో ఏ చోట ఉన్న వారికైనా ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, నాలెడ్జ్ సెంటర్ ఇదీ తర్కం... కీటోడైట్‌లో పిండి పదార్థాలు చాలా తక్కువగా.. వీలైతే అస్సలు తీసుకోరాదన్నది ప్రాథమిక నియమం. శరీరానికి కావాల్సిన శక్తి మొత్తం కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లతోనే అందేలా చేయాల్సి ఉంటుంది. వంద శాతం కార్బోహైడ్రేట్ అయిన చక్కెరకూ దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా కీటోడైట్ పాటించే వారు వీలైనంత వరకూ మరపట్టిన అంటే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారన్నదీ మనకు తెలుసు. చక్కెర తగ్గించడం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకపోవడం అనే రెండు అలవాట్లూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇందులో వివాదం ఏమీ లేదు. కాకపోతే కీటోడైట్ పేరుతో మనకు మేలు చేసే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కూడా దూరంగా పెట్టడంతోనే వస్తుంది చిక్కంతా! పైగా కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు శరీరానికి అందకుండా పోతాయి. తాజా చిక్కుళ్లు, అరటిపండ్లు, ఓట్స్ వంటి వాటిల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. కీటోడైట్ పేరెలా వచ్చిందంటే... కార్బోహైడ్రేట్ల స్థానంలో కొవ్వు నుంచి శక్తి పొందే జీవ క్రియను కీటోసిస్ అంటారు. తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు లేకుండా కొవ్వు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు శరీరం కొవ్వునే దహనం చేసి అవసరమైన శక్తిని పొందుతుంది. ఇలా కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కాలేయంలో కొవ్వు నుంచి కీటోన్స్ అనే రసాయనాలు వెలువడతాయి. కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కీటోన్స్ వెలువడటం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్నే ఈ డైట్లో ప్రధానంగా పాటించాల్సి ఉండటంతో దీనికి కీటోడైట్ అనే పేరు వచ్చింది. మరో రెండు అధ్యయనాలు ఏం చెప్పాయంటే... సారా సైడల్‌మ్యాన్ కీటోడైట్ దీర్ఘకాలిక దుష్ప్రభావాల గురించి ఇటీవల యూరప్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. ఇదే సదస్సులో మరో రెండు అధ్యయనాలు కూడా కీటోడైట్ ప్రభావశీలతపై అనుమానాలు వ్యక్తం చేశాయి. పిండి పదార్థాలను పూర్తిగా పరిహరించడం కాకుండా మోస్తరుగా వాటిని ఆహారంగా తీసుకోవడం మేలని ఇవి చెబుతున్నాయి. దీర్ఘకాలపు కీటోడైట్‌తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత సమస్యలు, కేన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని తమ అధ్యయనాల ద్వారా తెలిసిందని పోలండ్‌లోని మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మాసెచ్ బనాచ్ అంటున్నారు. యూరప్‌లోని దాదాపు 5 లక్షల మందిపై జరిగిన మరో అధ్యయనం ప్రకారం కూడా తినే తిండిలో పోషకాలు తక్కువగా ఉంటే కొన్ని రకాల కేన్సర్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. పిండి పదార్థాలను తక్కువ తీసుకొని వెన్న, మాంసాలను ఎక్కువ తీసుకుంటే రక్తపోటు, కేన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా. పాల ఉత్పత్తులు, మాంసం శరీరంలో మంట/వాపులకు కారణమని, ఇది దీర్ఘకాలంలో కేన్సర్ కణతులు ఏర్పడేందుకు/పెరిగేందుకూ దారితీస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కీటోడైట్ అస్సలు పనికిరాదా...? కొన్ని అంశాల్లో కీటోడైట్ అద్భుతంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొవ్వు ఎక్కువగా, పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడే అంశమే. రక్తంలో చక్కెర మోతాదులను తగ్గించుకోవాలనుకునే వారు కూడా దీన్ని వాడవచ్చు. అంతేకాదు అదుపు చేసేందుకు కూడా సాధ్యం కాని మూర్ఛ లక్షణాలున్న పిల్లలకూ కీటోడైట్‌తో ఎంతో మేలు జరుగుతుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి. నిపుణుల మార్గదర్శకత్వంలో పాటించే కీటోడైట్‌తో ఈ రకమైన ఫలితాలు సాధించడం సాధ్యమే. అదే సమయంలో ఇది అందరికీ సమానంగా వర్తించే విషయం కాదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా తీసుకునే వారిలో కొందరికి మధుమేహం వచ్చే అవకాశముందని కొన్ని పరిశోధనలు సూచిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం. పీచు పదార్థాలతోనే దీర్ఘాయువు... కీటోడైట్ కానీ మరో కొత్త ఆహారపు అలవాటుగానీ చక్కటి ఆరోగ్యానికి దగ్గరి దారి ఏదీ లేదు. కడుపు మాడ్చుకున్న పరిస్థితుల్లో మినహా సాధారణ పరిస్థితుల్లో కొవ్వులుతోనే శక్తిని పొందడం మన శరీరానికి అలవాటు లేని పని. కీటోడైట్‌ను విస్తృత ప్రచారంలోకి తెచ్చిన వారూ చెప్పేది ఇదే. మీ ఆరోగ్య సమస్యకు అనుగుణంగా ఈ ఆహార అలవాటును కొన్ని నెలలే పాటించండి అని! కీటోడైట్‌ను పాటించకపోయినా పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్, మాంసాలను పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలని ఇప్పటికే బోలెడన్ని అధ్యయనాలు చెబుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే కాయగూరలు, ధాన్యాలు, నట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నా సరే చిక్కుళ్లను తరచుగా తీసుకోవడం మేలని సారా సైడల్‌మ్యాన్ వంటి వారు సూచిస్తున్నారు. ఈ రకమైన ఆహారం తీసుకునే వారు మిగిలిన వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని తమ అధ్యయనంలో తేలిందని సారా చెబుతున్నారు. తెల్లగా తళతళలాడే బియ్యం బదులు ముతక బియ్యం వాడటం, పండ్లు, కాయగూరలను పానీయాల రూపంలో కాకుండా వీలైనంత వరకూ తాజాగా తినడం వల్ల వాటిల్లోని పీచు శరీరానికి చేరుతుందని సారా వివరించారు. -
బరువు తగ్గడానికి ఫుల్లుగా లాగించండి
జీఎమ్ డైట్ ఒక విలక్షణమైన డైట్. తమ సంస్థలోని ఉద్యోగులు బరువు పెరగకుండా ఆరోగ్యకరంగా ఉండాలని ‘జనరల్ మోటార్స్’ సంస్థ అనేక పరిశోధనల తర్వాత ఒక డైట్‌ను రూపొందించింది. ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారాన్ని కడుపునిండా తిన్నప్పటికీ బరువు పెరగరన్నది ఈ డైట్ ప్రక్రియ సిద్ధాంతం. ప్రయత్నించండి... బరువు తగ్గండి. ‘జీఎమ్ డైట్’ అంటే ‘జనరల్ మోటార్స్ డైట్’కు సంక్షిప్తరూపం. ఈ డైట్‌తో కేవలం ఒక వారంలో దాదాపు ఆరేడు కిలోల వరకు తగ్గవచ్చు. వారంలోని ఒక్కో రోజు ఒక్కో విధమైన ఆహారం (ఫుడ్) లేదా ఆహార సముదాయాన్ని (ఫుడ్ గ్రూపును) తీసుకోవడం ఈ డైట్ ప్రత్యేకత. జీఎమ్ డైట్ విధానం కొవ్వులను వేగంగా మండించేలా చేస్తూ బరువు తగ్గిస్తుంది. ఈ విధానంలో ఎప్పుడూ ఒంటికి క్యాలరీలు అవసరమవుతూ ఉంటాయి. అవి దొరక్క ఒంట్లోని క్యాలరీలు దహించుకుపోతూ ఉండటం వల్ల బరువు తగ్గుతుంది. జీఎమ్ డైట్ ఎలా ఉపయోగపడుతుందంటే... జీఎమ్ డైట్లో తీసుకునే ఆహారాలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. కొవ్వులను మరింతగా దహనం చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ ప్రక్రియలో తీసుకునే ఆహారాలు పుష్కలమైన నీటిపాళ్లను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవన్నీ ఒంట్లోని కొన్ని వ్యర్థాలు, విషాలు బయటకు వెళ్లేలా చేయడంలో సమర్థంగా పని చేస్తాయి. ఈ డైట్ విధానం వల్ల ప్రయోజనం పొంది, దీన్ని ఆమోదించేవారు చెప్పే మాట ఏమిటంటే... ఐదు రోజుల నుంచి ఏడు రోజుల గడువు ఇస్తూ మాటిమాటికీ ఈ ఆహార ప్రక్రియను రిపీట్ చేస్తూ కొనసాగించడం వల్ల చాలా బరువు తగ్గొచ్చని, మళ్లీ బరువు పెరగకుండా ఉండొచ్చని. ఇంకా ఏమేమి తీసుకోవాలి... దాంతో ప్రయోజనం ఏమిటి? ►ఈ ఆహార ప్రక్రియలో రోజూ 8 – 12 గ్లాసుల నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు ఒంట్లోంచి అనవసర పదార్థాలు బయటకు విసర్జితమవుతాయి. ►ఈ ప్రక్రియ సమయంలో వ్యాయామం చేయడం తప్పనిసరి కాదుగానీ అభిరుచి ఉంటే చేయవచ్చు. అలా చేయదలచినప్పుడు మొదటి మూడు రోజులు మాత్రమే చేయాలి. ► ఈ ప్రక్రియను అనుసరించేవారు ప్రతిరోజూ రెండు నుంచి మూడు గిన్నెల (బౌల్స్‌లో) ‘జీఎమ్ వండర్ సూప్’ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సూప్‌ను క్యాబేజ్, సెలెరీ, టొమాటోలు, ఉల్లిగడ్డలు, బెల్పెప్పర్స్తో తయారుచేస్తారు. ఇది మనమూ చేసుకోవచ్చు. పై పదార్థాలతో మనం చారు కాచుకున్నట్లుగానే దీన్ని తయారు చేసుకోవచ్చు. జీఎమ్ డైట్ పాటించే సమయంలో కొన్ని సూచనలు ► జీఎమ్ డైట్ పాటించేవారు కాఫీలు తాగవచ్చా అనే సందేహం వస్తుంది. కాఫీలను నిపుణులు సిఫార్సు చేయరు. అయితే హెర్బల్ టీ మాత్రం పరిమితంగా కొన్నిసార్లు తీసుకోవచ్చు. ►జీఎమ్ వండర్సూప్కు ఏవైనా ప్రతిబంధకాలు ఉన్నాయా అని కొందరు అడుగుతుంటారు. అది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రోజులో రెండు మూడు సార్లైనా దీన్ని తీసుకోవచ్చు. డైట్ పాటించే సమయంలో ఆకలిగా అనిపించినప్పుడు దీన్ని తీసుకోవచ్చు. ► డైట్ ప్లాన్‌లో ఉండగా ఆల్కహాల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఆల్కహాల్‌తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ లేవు. ► డైట్ ప్లాన్‌లో ఉన్నప్పుడు బయట తినాల్సిన పరిస్థితి ఏర్పడితే బయటి ఆహారం తీసుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. అయితే డైట్‌ప్లాన్‌లో ఉన్నప్పుడు బయటి ఆహారం ఎలాంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మీరు పూర్తిగా పాటించగలిగే సమయంలోనే డైట్‌ను ప్లాన్ చేసుకోవాలి. బయటి ఆహారాల్లో ప్రాసెస్ చేసినవి ఉండవచ్చు. హానికారక రసాయనాలు కలిసిన ఆహారపదార్థాలూ ఉండవచ్చు. ఉదాహరణకు బ్రెడ్ తయారీకి ఉపయోగించే పిండిలోనూ, ఇతర మాంసాహారాల్లోనూ కొన్ని కండిషనర్లు, సల్ఫేట్స్, మోనోసోడియమ్ గ్లుటామేట్ వంటి రుచిని ఇచ్చే చైనా ఉప్పు వంటివి, నైట్రేట్లు, ఫాస్ఫేట్లు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తీపిని ఇచ్చే అనేక పదార్థాలతో పాటు ఎక్కువ మోతాదులో ఉప్పు కూడా ఉండవచ్చు. అసలు జీఎమ్ డైట్ పాటించేదే వీటన్నింటి నుంచి దూరంగా ఉండటం కోసమే. అలాంటప్పుడు అవి తినాల్సి వస్తే జీఎమ్ డైట్ పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలేమీ ఒనగూరవు. ►నాలుగోరోజున పాలు తీసుకోవాలని జీఎమ్ డైట్ నిబంధన కదా... ఒకవేళ పాలు అంత ఇష్టంగా లేకపోతే మజ్జిగ లేదా పెరుగు తినవచ్చా అని చాలామందిలో సందేహాలు వస్తుంటాయి. అయితే పాలు తీసుకోవడం అంతగా ఇష్టపడకపోతే పెరుగు లేదా మజ్జిగ తీసుకోవచ్చు. అయితే పెరుగు లేదా మజ్జిగలో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోకూడదు. ► జీఎమ్ డైట్‌ను అనుసరించడంలో భాగంగా చపాతీలు, గోధుమలు, తృణధాన్యాలు, బ్రెడ్ వంటివి ఏమాత్రం తీసుకోకూడదు. ►రోజూ పొద్దున్నే నిమ్మనీళ్లలో తేనె కలుపుకొని తాగడం మంచిదంటారు కదా... మరి జీఎమ్ డైట్ సమయంలో ఈ పని చేయవచ్చా అని కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అనుసరించేవారు తేనె తీసుకోకూడదు. దానికి బదులు నిమ్మకాయనీరు (చక్కెర లేకుండా) ఎంతైనా తీసుకోవచ్చు. ►శాకాహారులు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోదగినవి... కొబ్బరినూనె, ఆలివ్‌నూనె, వెన్న లేదా నెయ్యి. కొందరు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పెరుగు కూడా తీసుకుంటారు. అది కూడా మంచిదే. ► జీఎమ్ డైట్లో భాగంగా ఉప్పు, మిరియాలు లేదా ఇతర సుగంధద్రవ్యాలు (స్పైసెస్) తీసుకోవచ్చా అంటే... ఉప్పు చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డైట్లో ఉన్నవారు చాలా ఎక్కువగా నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మూత్రం రూపంలో మనలోంచి వెళ్లిపోయే లవణాల కోసం ఉప్పు తీసుకోవడం అవసరమే అయినా దాన్ని చాలా పరిమితంగానే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. సముద్రపు ఉప్పు అయితే ఇంకాస్త మంచిది. మిరియాల వంటి చెట్ల నుంచి వచ్చే (హెర్బల్) సుగంధద్రవ్యాలన్నీ తీసుకోవచ్చు. మీ ఆహారానికి మంచి ఫ్లేవర్ తెచ్చుకొని, తినేందుకు అనువైనవిగా చేసుకునేందుకు ఈ డైట్లో స్పైసెస్ ఒక మంచి మార్గం. ►జీఎమ్ డైట్లో భాగంగా ఎండుఫలాలను (నట్స్) తీసుకోవడం ఏమాత్రం సరికాదు. అయితే మొదటిరోజున, మూడోరోజున... ఇలా జీఎమ్ డైట్ అనుమతించిన రోజుల్లో సాధారణ తాజా ఫలాలను మాత్రం తీసుకోవచ్చు. నట్స్ లేదా డ్రైఫ్రూట్స్‌లో పోషకాలన్నీ చాలా గాఢతతో చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్ది ఆహారంతోనే ఎక్కువ పోషకాలు ఒంట్లోకి వెళ్తాయి. అందుకే జీఎమ్ డైట్ పాటిస్తున్న కాలంలో వాటిని తీసుకోడానికి వీల్లేదు. అయితే డైట్ ప్లాన్ ముగిశాక మాత్రం... చాలా కొద్ది కొద్ది పరిమితుల్లో అప్పుడప్పుడు మాత్రం వాటిని తీసుకోవచ్చు. ► జీఎమ్ డైట్ ప్లాన్ వ్యవధి ముగిశాక ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది చాలామందిలో ఉండే ఒక సందేహం. ఎవరికి వారు తమ సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే మునపటిలా ఏది పడితే అది... ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా... మంచి ఆరోగ్యకరమైన సమతుల ఆహారం, నిర్ణీతమైన వేళలకు తింటూ మంచి జీవనశైలిని పాటించాలి. మంచి సమతుల ఆహారం అంటే... మీ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అన్నీ సమపాళ్లలో అందేలాంటి భోజనం. అందులో ఆకుకూరలు, కాయగూరల వంటివి చాలా ఎక్కువగా ఉండాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. పొట్టు తీయని హోల్ గ్రెయిన్స్ తినడం చాలా మంచిది. అప్పుడు మాత్రమే జీఎమ్ డైట్‌తో ఒనగూరిన ఫలితాలు కాస్తంత ఎక్కువ రోజులు ఉంటాయి. ► జీఎమ్ డైట్ ప్లాన్ వ్యవధి ముగిశాక... యథాతథంగా తింటున్నప్పుడు మళ్లీ బరువు పెరుగుతామా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అవును... ముందుగా పేర్కొన్నట్లు మంచి సమతులాహారం తీసుకోకుండా... ఇష్టం వచ్చినట్లుగా తింటూ సక్రమమైన జీవనశైలి పాటించకపోతే... చాలా కొద్దికాలంలోనే మళ్లీ బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. అయితే తగ్గిన బరువు అలాగే ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలిని అనుసరించాలి. అయితే కొందరిలో థైరాయిడ్ వంటి ఆరోగ్యకారణాల వల్ల బరువు పెరుగుతుంటే మాత్రం వారిలో ఈ డైట్ వల్ల ప్రయోజనం ఉండదు. వారు తమకు ఉన్న అసలు సమస్య (అండర్లైయింగ్ ప్రాబ్లమ్)కు చికిత్స తీసుకోవాలి. ► జీఎమ్ డైట్‌ను మొదలు పెట్టాక అదేపనిగా దీన్ని కొనసాగించవచ్చా... అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే నిర్ణీత వ్యవధి కోసం దీన్ని పాటించాక... మళ్లీ మొదలు పెట్టడానికి తప్పకుండా గ్యాప్ ఇవ్వాలి. జీఎమ్ డైట్ప్లాన్నే ఒక జీవనశైలి అలవాటుగా మార్చుకోకూడదు. ఏదైనా డైట్‌ప్లాన్ మళ్లీ ప్రారంభించాలని అనుకుంటే మాత్రం... కనీసం రెండు వారాల వ్యవధి తర్వాత మళ్లీ ఆ డైట్‌ప్లాన్ మొదలుపెట్టాలి. ► జీఎమ్ డైట్ పాటిస్తున్నప్పుడు యోగా చేయవచ్చా లేదా అన్నది చాలామందిలో ఉండే సందేహం. అయితే జీఎమ్ డైట్ పాటిస్తూ యోగా చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. వ్యాయామం చేయాలన్న నియమేమీ లేదుగానీ... ఒకవేళ ఇష్టమై చేస్తుంటే మాత్రం మంచిదే. అయితే చాలా శ్రమతో కూడుకున్న వ్యాయామాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగాలాంటివీ, శారీరక శ్రమ లేనివి మాత్రం మామూలుగానే చేసుకోవచ్చు. గమనిక : జీఎమ్ డైట్‌ను పాటించే సమయంలో మొదటి రెండు రోజులు తగిన ప్రోటీన్, మిగతా రోజుల్లో అన్ని పోషకాలు అందక కొందరిలో సమస్యలు రావచ్చు. అందుకే దీన్ని ప్రారంభించాలనుకున్న వారు ఒకసారి డాక్టర్ లేదా డైట్ నిపుణులను సంప్రదించి, తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డైట్‌ప్లాన్ పొంది అప్పుడు మొదలుపెట్టడం మంచిది. జీఎమ్ డైట్ ప్రతికూలతలు ఈ ఆహార ప్రక్రియలో కొన్ని రకాల ప్రతికూలతలు ఉన్నాయి. అవి... ►ఇది బరువు తగ్గిస్తుంది. కానీ ఈ ఆహారం బరువును ఎలా తగ్గిస్తుందన్న విషయంలో ఎలాంటి నిరూపిత అధ్యయనమూ లేదు. ►ఈ ఆహారం సమతులాహారం కాదు. దీన్ని తీసుకున్నప్పుడు కొన్ని రకాల అసంతృప్తులు, ఆకలి ఉంటాయి. రకరకాల ఆహారాలు తీసుకుంటున్నప్పుడు మనకు అవసరమైన కొన్ని సూక్ష్మపోషకాలు ఒంటికి అందకపోవచ్చు. ►వారంలోని చాలా రోజుల్లో ఒంటికి అవసరమైన ప్రోటీన్ అందదు. అందినది చాలా తక్కువ. అది సరిపోదు. ► ముందుగా చెప్పినట్లే చాలా సందర్భాల్లో ఒంటికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. ముఖ్యంగా మొదటి మూడు రోజులూ ఒంటికి అవసరమైన కొవ్వులు, విటమిన్ బి12, ఐరన్, క్యాల్షియమ్ వంటివి లోపించే ప్రమాదం ఉంది. ►జీఎమ్ డైట్‌తో ఒనగూరే ప్రయోజనం కేవలం తాత్కాలికం. అందుకే కొంత వ్యవధి ఇస్తూ మాటిమాటికీ చేయాలంటూ దీనితో ప్రయోజనం పొంది, దీన్ని ఆమోదించిన వారు చెబుతుంటారు. జీఎమ్ డైట్ పాటించే పద్ధతి డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కేన్సర్ చికిత్సకు కీటో డైట్ అండ!
ఈ మధ్యకాలంలో విపరీతమైన ప్రచారంలోకి వచ్చిన కీటో డైట్ కేన్సర్ చికిత్సకు మరింత బలం చేకూర్చగలదని అంటున్నారు కొలంబియా యూనివర్శిటీకి చెంది వెయిల్ కార్నెల్ మెడిసిన్ సంస్థ శాస్త్రవేత్తలు. మన శరీంలో ఇన్సులిన్ కారణంగా చైతన్యవంతమయ్యే ఫాస్పాడైలినోసిటోల్ –3 (పీఐ3కే) అనే ఎంజైమ్‌లో మార్పులు జరిగితే కేన్సర్లు వచ్చే అవకాశముందని ఇప్పటికే అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పీఐ3కే ఉత్పత్తిని నియంత్రించే రసాయనాల ద్వారా కేన్సర్‌కు చెక్ పెట్టాలన్నది శాస్త్రవేత్తల ఉద్దేశం అయితే ఈ మందుతో అంతగా ఫలితం లేకపోయింది. దీనికి కారణం ఏమిటని పరిశోధించినప్పుడు.. రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం మందుపై దుష్ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. దీంతో తాము కీటోడైట్‌తో ఇన్సులిన్ మోతాదులను తక్కువ స్థాయిలో ఉంచేందుకు ప్రయత్నించామని.. ఆ పరిస్థితుల్లో పీఐ3కే ఉత్పత్తిని నిలిపివేసే మందులు మెరుగ్గా పనిచేశాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లూయిస్ సి కాంట్లీ తెలిపారు. పీఐ3కే ఉత్పత్తిని నియంత్రించే మందులు దాదాపు 20 వరకూ ప్రస్తుతం మానవ ప్రయోగాల దశలో ఉన్నాయని, మందు వాడినప్పుడు కొందరిలో ఇన్సులిన్ స్థాయిలు గణనీయంగా పెరిగిపోయాయని వివరించారు. దీంతో వారికి ఆ మందు ఇవ్వడం నిలిపివేయాల్సి వస్తోందని, కీటోడైట్‌తో ఇన్సులిన్‌ను సమర్థంగా నియంత్రించగలిగితే ఈ మందుతో జరిపే కేన్సర్ చికిత్స మరింత ప్రభావశీలంగా ఉంటుందన్నది తమ అంచనా అని చెప్పారు. -
డైట్ చిట్కాలు వికటించి అస్వస్థత..
సాక్షి, హైదరాబాద్: మందులు వేసుకోకుండా పాటించిన డైట్ చిట్కాలు చివరకు ఆమె ప్రాణాల మీదకు తెచ్చాయి. ఓ ఆయుర్వేద వైద్యుడు చెప్పిన డైట్ చిట్కాలు పాటిస్తూ వేళకు మందులు వేసుకోకపోవడంతో అస్వస్థతకు గురైంది. దీంతో బంధువులు ఆమెను చికిత్స కోసం బుధవారం నిమ్స్‌కు తరలించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మేన కోడలు అలివేలు(45) మధుమేహం, అధిక బరువు సమస్యలతో బాధపడుతోంది. బరువు తగ్గేందుకు ఓ ఆయుర్వేద వైద్యుడి సూచన మేరకు గత 31 రోజుల నుంచి డైట్(దీనిలో భాగంగా కొబ్బరినూనె తాగినట్లు తెలిసింది) పాటిస్తోంది. చిట్కాలు పాటిస్తూ ఇన్సులిన్ వాడకపోవడం వల్లే షుగర్ లెవల్స్ 450 ఎంజీకి పెరిగాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వైద్యులు తగిన చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. కాగా, అలివేలును కడియం శ్రీహరి గురువారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా ఇదే సదరు ఆయుర్వేద వైద్యుడు సూచించిన చిట్కాలు వికటించి కేవలం 35 రోజుల్లో నలుగురు బాధితులు నిమ్స్‌లో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
నిరూపిస్తే జైలుకెళ్తా : వీరమాచనేని
సాక్షి, హైదరాబాద్ : తాను వైద్యుడిని కానని సామాజిక చైతన్యం తీసుకొచ్చే కార్యకర్తను మాత్రమేనని డైట్ గురు వీరమాచనేని రామకృష్ణ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో సంచలనం జరగడం ఖాయమని చెప్పారు. జీవన విధానం, వైద్య విధానం వేర్వేరు ప్రక్రియలన్నారు. కిడ్నీలు చెడిపోవడానికి మధుమేహం ఎంత మాత్రం కారణం కాదని చెప్పారు. దీని కోసం తీసుకునే ట్రీట్మెంట్తో అనేక సైడ్ ఎఫెక్ట్స్ సంక్రమిస్తాయని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలను డయాబెటిస్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. తాను చేసే ఆరోగ్య విధానం రోగాలను నయం చేస్తుందే తప్ప అనారోగ్యానికి గురి చేయదని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా కిడ్నీ చెడిపోయిందని నిరూపిస్తే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. ఆదివారం మూసాపేట్ సమీపంలో ఉన్న కైతలాపూర్ గ్రౌండ్స్‌లో బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డైట్‌కు, వైద్య పద్ధతులకు సంబంధమే లేదని డైట్ విధానం ద్వారా లబ్ధి పొందిన అట్లూరి సుబ్బారావు, రామరాజు చెప్పారు. -
ఫిట్‌గా ఉండటం కోసమే డైట్
శ్రీదేవి విపరీతంగా డైట్ చేయడంవల్ల ఆమె ఆరోగ్యం పాడైందన్నది ఇప్పుడు కొందరి అభిప్రాయం. నిజానికి తాను విపరీతంగా డైటింగ్ చేయడంతో పాటు సన్నగా ఉండాలని పిల్లలను కూడా సరిగ్గా తిననిచ్చేవారు కాదనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది. ఇదే విషయం గురించి గతంలో ఓసారి అడిగినప్పుడు.. జగదేక సుందరి నవ్వేశారు. ‘‘పిల్లల కడుపు మాడ్చే తల్లిని కాదు. ఆ మాటకొస్తే నేను అన్‌హెల్దీ వేలో ఫుడ్ తీసుకోను. ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాను. నేను హెల్త్ క్లబ్‌కి వెళ్లేదాన్ని. ఒకసారి నా పిల్లలు కూడా వస్తానంటే రమ్మన్నాను. అక్కడ నాతో పాటు జాన్వీ, ఖుషీ యోగా చేశారు. దాంతో పిల్లలను కూడా హెల్త్ సెంటర్స్‌కి తీసుకొచ్చి వాళ్లతో విపరీతంగా వర్కవుట్స్ చేయిస్తున్నానని, డైట్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటానని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అది నిజం కాదు. నా కూతుళ్లకు కూడా ఫిట్నెస్ మీద మంచి అవగాహన ఉంది. వాళ్లు స్పోర్ట్స్ ఆడతారు. ఫిట్‌గా ఉండాలనుకుంటారు. అందులో తప్పేముంది’’ అన్నారు శ్రీదేవి. భార్య కఠినమైన డైట్ పాటిస్తే భర్త బోనీ కపూర్ మాత్రం డైటింగ్‌కి దూరం. ఆయన భోజనప్రియుడు. ఆయనతో ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయించడానికి శ్రీదేవి చాలా ప్రయత్నాలు చేశారట. కానీ పొద్దున్నే నిద్ర లేవగానే ఏదో వంక చెప్పి బోనీ తప్పించుకునేవారట. ‘‘డైట్ విషయంలో శ్రీదేవి చాలా పర్టిక్యులర్‌గా ఉంటుంది. తను కంట్రోల్ చేసుకుంటూ నన్ను కంట్రోల్ చేస్తుంటుంది. వాస్తవానికి నేను భోజనప్రియుణ్ణి. హైదరాబాద్, చెన్నై వంటకాలు అంటే చాలా ఇష్టం నాకు. వీలు దొరికినప్పుడు ఫుడ్ లాగించడానికి ట్రై చేస్తాను. అలా చేస్తానని తనకీ తెలుసు. చిన్నగా మందలిస్తుంది. నాకు రెండే రెండు బలహీనతలు. ఫస్ట్ నా కుటుంబం అయితే సెకండ్ నాకు ఇష్టమైన ఫుడ్’’ అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ తెలిపారు. భర్త ఫుడ్ లవర్ కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడు తినడానికి వీలుగా ఫుడ్ రెడీ చేయించేవారట శ్రీదేవి. -
మధుమేహులకు మందుల కంటే ఇవే బెటర్
లండన్ : ఆహార నియమాలు, నిత్యం వ్యాయామం టైప్ టూ డయాబెటిస్ నియంత్రణకు మెరుగ్గా పనిచేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. మందుల కంటే ఇవే మధుమేహులకు ఉపకరిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో అథ్యయనం పేర్కొంది. చురుకైన జీవనశైలి కలిగిన టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న 1500 మంది రోగులను శారీరకంగా యాక్టివ్‌గా లేని రోగులతో గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు పోల్చిచూశారు. నిత్యం వ్యాయామం చేస్తూ మెరుగైన మానసిక ఆరోగ్యం కలిగిన వారు తేలిగ్గా బరువు తగ్గినట్టు గుర్తించారు. కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం మందులు తీసుకోవడం కన్నా సమర్ధవంతంగా పనిచేసినట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది. 16 వారాల పాటు చురుకైన జీవనశైలి కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు తమ డయాబెటిస్ మందుల మోతాదు మించకపోవడం, మరోవైపు వారు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. మూడేళ్లలో వీరిలో బ్లడ్ ఘుగర్ లెవెల్స్ తగ్గినట్టు కూడా గుర్తించారు. మందుల కంటే కూడా మెరుగైన ఆహారపు అలవాట్లతో చక్కెర వ్యాధిని అదుపులో ఉంచవచ్చని ఈ అథ్యయనంలో వెల్లడైంది. యాక్టివ్ లైఫ్‌స్టైల్ సెషన్లో పాల్గొన్న పలువురికి టైప్ టూ డయాబెటిస్ పూర్తి అదుపులోకి వచ్చింది. మరికొందరు ఇన్సులిన్ తీసుకోవడం కూడా మానివేశారని పరిశోధకులు పేర్కొన్నారు. -
ఆహార మార్పులతో మధుమేహానికి చెక్!
సాక్షి, హైదరాబాద్: ఏటికేడాది పెరిగిపోతున్న మధుమేహాన్ని నియంత్రించేందుకు ఆహారపరమైన కొన్ని మార్పులు చేసుకుంటే చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం రాకుండా ఉండాలంటే ఒమేగా–6 కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం మేలని సిడ్నీకి చెందిన ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు సూచించారు. దాదాపు పది దేశాలకు చెందిన 40 వేల మందిపై జరిపిన ప్రయోగాల ద్వారా ఈ అంచనాకు వచ్చినట్లు డాక్టర్ జేసన్ వూ తెలిపారు. సాధారణంగా ఆరోగ్యవంతులే అయిన వీరిని ప్రయోగాల్లో భాగంగా పలానా ఆహారం తీసుకోవాల్సిందిగా కోరారు. కొన్ని రోజుల తరువాత రక్తంలో ఒమేగా–6 కొవ్వులు ఎక్కువగా ఉన్న వారిలో చక్కెర శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒమేగా–6 కొవ్వులు ఆరోగ్యానికి మంచివి కావని కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా పరిశోధనలు చేశామని దీంట్లో ఎలాంటి వాస్తవమూ లేనట్లు స్పష్టమైందని వూ తెలిపారు. ద ల్యాన్సెట్ డయాబిటీస్ అండ్ ఎండోక్రైనాలజీ మ్యాగజైన్లో ఈ పరిశోధన తాలూకు వివరాలు ప్రచురితమయ్యాయి. -
కండలు పెరిగి సిక్స్ ప్యాక్ రావాలంటే.....
న్యూయార్క్: నేడు సిక్స్ ప్యాక్‌లు పెంచుకోవడం బాలీవుడ్, టాలీవుడ్ హీరోలకే పరిమితం కాలేదు. సిక్స్ ప్యాక్‌లను పెంచుకునేందుకు నేటి కుర్రకారంతా తహతహలాడుతున్నారు. అందుకోసం జిమ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. కండర గండులు కావాలంటే జిమ్ములకెళ్లి గంటల కొద్ది కసరత్తు చేయడం ఒక్కటే సరిపోదు. శరీరంలో కండలు పెరిగేందుకు పద్ధతిగా ప్రోటీన్లు తీసుకోవడం తప్పనిసరి. ప్రొటీన్లు మాంసాహారంలో ఎక్కువగా ఉంటాయా లేదా శాకాహారంలో ఎక్కువ ఉంటాయా? మాంసాహారులైతే రెండూ తీసుకోవచ్చు. మరి శాకాహారాలు ఏం చేయాలి? ఈ అంశంపై ఆది నుంచి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆదిలో మంసాహారంలోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని, మాంసాహారం తీసుకోవడమే మేలన్న వాదన కొనసాగేది. ఆ తర్వాత కాలంలో శాకాహారానికి ప్రోత్సాహం, ఆదరణ పెరిగాక శాకాహారంలోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి. శాకాహారాన్ని తీసుకోవడమే మంచిదన్న వాదన పుట్టుకొచ్చింది. ఒకరి వాదనను ఒకరు ఒప్పుకోకుండా ఈ అంశంపై మాంసాహారులు, శాకాహారులు రెండుగా చీలిపోయారు. ఎవరి వాదనలో నిజం ఎంతుందో శాస్త్రీయంగా తెలుసుకునేందుకు అమెరికాలోని ఓ న్యూట్రిషన్ బృందం ప్రాక్టికల్‌గా ఓ అధ్యయనం జరిపింది. ఇందుకోసం ఆ బందం కసరత్తు, ప్రోటీన్ల ద్వారా కండలు పెంచుకోవాలనుకుంటున్న మూడు ఏజ్ గ్రూపులకు చెందిన మూడు వేల మంది వలంటీర్లను ఎంపిక చేసింది. వారిలో జిమ్ములకెళ్లి కసరత్తు ఎక్కువ చేయగలిగిన కుర్రవాళ్లను ఓ గ్రూపుగాను, మధ్యవయస్కులను మరో గ్రూపుగాను, పెద్ద వయస్కులను మరో గ్రూపుగాను విభజించింది. మళ్లీ ఈ మూడు గ్రూపులను శాకాహారులుగా, మాంసాహారులుగా విభజించింది. శాకాహారులకు అత్యధిక పోషక విలువలు కలిగిన పండ్లు, కూరగాయలతో కూడిన ఆరు రకాల డైట్‌ను అందజేయగా, మాంసాహారులకు మేక, కోడి మాంసం, చేపలు, గుడ్డు, తక్కువ ఫ్యాట్ కలిగిన పాలను డైట్‌ను అందజేసింది. ఎవరు ఎంత మోతాదులో ఆహారం తీసుకుంటారు, ఎంత సేపు కసరత్తు చేస్తున్నారనే అంశాలను కూడా ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ వచ్చారు. కొన్ని నెలల తర్వాత అన్ని గ్రూపుల వారి కండలను కొలిచి చూడగా ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. అన్ని గ్రూపుల్లోనూ మాంసాహారం తీసుకున్నవారిలోనే కండరాలే ఎక్కువగా పెరిగాయి. ఎక్కువ మోతాదులో శాకాహారం తీసుకున్న వారికన్నా తక్కువ మోతాదులో మాంసాహారాన్ని తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయి. అంటే శాకాహారులు అత్యధిక పోషక విలువలు కలిగిన 60 గ్రాముల శాకాహారాన్ని తీసుకున్న వారికన్నా 20 గ్రాముల మాంసాహారాన్ని తీసుకున్న వారిలోనే మంచి ఫలితాలు వచ్చాయి, ఎందుకు అలా జరిగిందో నిపుణుల బృందం మళ్లీ అధ్యయనం జరిపింది. మనుషుల్లో కండరాలు పెరగడానికి, అవి బలోపేతం అవడానికి లూసినో లాంటి ఆమ్లో ఆసిడ్స్ కారణమని, అవి మాంసాహారుల్లో ఎక్కువ ఉండడం వల్ల వాటిని డైట్‌గా తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయని తేలింది. లూసినో లాంటి కీలకమైన ఆమ్లో ఆసిడ్ మాంసాహారంలో 9 నుంచి 13 శాతం ఉండగా, పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు లాంటి వెజిటేరియన్ డైట్లో ఆరు నుంచి ఎనిమిది శాతం ఉన్నాయి. మొక్కజొన్న, సజ్జలు, కొర్రల్లో మాత్రమే 12 శాతం వరకు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా మాంసహారంలో మొత్తం తొమ్మిది రకాల ఆమ్లో ఆసిడ్స్ ఉండగా, శాకాహారంలో రెండు రకాల ఆసిడ్స్ తక్కువగా ఉన్నాయని, అవి కూడా అధ్యయన ఫలితాలను ప్రభావితం చేసి ఉంటాయని నిపుణుల బృందం పేర్కొంది. ఈ అధ్యయనం వివరాలను ‘అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురించారు. -
విశ్వాసిని అజేయునిగా చేసే ‘లెంట్’
విశ్వాసి... శరీరం– ఆత్మల, సమన్వయ– సమున్నత కలయిక. ఈ రెండూ భిన్న నియమాలతోనే నడిచినా విశ్వాసిలో దేవుని ప్రతినిధిగా ఉన్న ఆత్మే అతనికి దిశానిర్దేశం చేస్తుంది. అందువల్ల రెండింటి మధ్య సమన్వయ సాధనకు ఉపకరించేదే ఈస్టర్ ఆదివారానికి ముందు భస్మ బుధవారంతో ఆరంభమయ్యే 40 రోజుల ఉపవాస ప్రార్థనా దీక్ష. అదే ‘లెంట్’. యేసుప్రభువు కూడా బాప్తిస్మం తీసుకున్న వెంటనే 40 రోజుల ఉపవాస ప్రార్థనా దీక్ష చేపట్టారు. ఆ తర్వాత కూడా తరచు ఏకాంత ఉపవాస ప్రార్థనలు చేసి దేవునితో తన అనుబంధాన్ని చాటుకున్నారు. ఆహారం అనేది మనిషి ఎంతో ప్రియంగా ఆస్వాదించే లోకపరమైన అంశం. అలాంటి ఆహారాన్ని సేవించకుండా ఉపవాసానికి పూనుకోవడం ద్వారా విశ్వాసి దేవునికి తనకూ గల అనుబంధం ఎంత ప్రగాఢమైనదో రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ఉపవాసానికి ప్రార్థన కూడా తోడైతే ఆ ప్రక్రియలో విశ్వాసి ఒక అజేయమైన శక్తిగా రూపొందుతాడని యేసుక్రీస్తే వెల్లడించాడు (మార్కు 9:29, మత్తయి 17:21). ఉపవాస ప్రార్థనా దీక్షతో ఉపవాసానికి, ప్రార్థనకు కూడా ప్రాధాన్యతనివ్వకపోతే ఆ దీక్షకు అర్థం, విలువ ఉండదు. యూదు నియమావళి ప్రకారం సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకొని, సూర్యాస్తమయం తర్వాత మళ్లీ ఆహారం సేవించే వరకు దాదాపుగా 12 గంటలపాటు చేసేదే ఉపవాసదీక్ష! శరీరంలోని ద్రావిక సమతుల్యం కోసం అవసరమైన మేరకు నీళ్లు తాగడంలో తప్పు లేదు. వృద్ధులు, మధుమేహం ఉన్నవారు ఒకటి లేదా రెండుసార్లు ఏదైనా ఫలరసాన్ని సేవించడమూ నిషిద్ధం కాదు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కూడా అవసరానికి మించి భోంచేయడం అనేది ఆ దీక్ష ఉద్దేశ్యాన్నే చెరుపుతుందన్నది గమనించాలి. ఈ నలభై రోజుల దీక్షలోనూ ఆహారాన్ని సేవించడంలోనే కాదు అన్ని విషయాల్లోనూ మితంగా వ్యవహరించడం ద్వారా దేవుని మనం ఘనపర్చుతామన్నది గుర్తుంచుకోవాలి. మాంసాహారం యూదు సంస్కృతి ప్రకారం నిషిద్ధం కాకున్నా, శరీరాన్ని అదుపు చేసుకునే ఒక ప్రక్రియ గనుక ‘శాకాహారం’ ఆ ధ్యేయ సాధనకు ఉపకరిస్తుందన్నది కొందరు పెద్దల అభిప్రాయం. ఎవరితోనైనా విభేదాలున్నా, గొడవలున్నా వాటిని సరిచేసుకొని వారితో సంబంధాలు పునరుద్ధరించుకోవడం దీక్షాపరులు చేయవలసిన పని. ఈ నలభై రోజులే కాదు... ఆ తర్వాత కూడా చేతనైనంతగా ఇతరులకు, నిర్భాగ్యులకు సాయం చేయడం దేవుడు మెచ్చే సత్కార్యం తోటివారితో మనం ఎంత సఖ్యతతో వ్యవహరిస్తున్నామనేదే దేవునితో మన అనుబంధం ఎంత ప్రగాఢంగా ఉందనడానికి గీటురాయి అని మర్చిపోరాదు. మొత్తం నలభై రోజులూ దీక్ష చేయగలిగితే మంచిది. అలా కాకున్నా మన పరిస్థితుల మేరకు కొన్ని రోజులైనా దీక్షను నిబద్ధతతో చేయడం మంచిది. దీక్షలో ఉన్న దినంలో అత్యధిక భాగాన్ని దైవ వాక్యధ్యానంలో, ప్రార్థనలో గడపలేకపోతే అది ఉపవాస ప్రార్థనా దీక్ష కాదు. ఉపవాస ప్రార్థనా దీక్ష... దేవుని శక్తి మన జీవితంలోనికి ప్రవేశించే గవాక్షాలను తెరిచి విశాలం చేస్తుంది. అలా మనలోకి ప్రవేశించే దేవుని శక్తి మనలో, కుటుంబంలో ఎన్నో అద్భుతకార్యాలు జరిగేందుకు కారణమవుతుంది. దీక్ష రోజున ఆఫీసులో లేదా మీ మీ పనుల్లో నిమగ్నమై ఉన్నా, విరామ సమయాన్ని ప్రార్థనలో, వాక్యపఠనంలో గడపండి, పదిమందికీ సాయం చేయండి. ఉత్తమ శ్రేణికి చెందిన విశ్వాసిగా, పరిణతి చెందండి. అదే ఉపవాస ప్రార్థనా దీక్ష ఉద్దేశ్యం. – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్ -
గుండెకు మేలు చేసే ఆహారం
► సాల్మన్ ఫిష్, ట్యూనా, హెర్రింగ్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే బెటరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ► ఓట్ మీల్ తింటే మంచిది. పీచు పదార్థం ఉండే ఈ ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే. ► స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, ఆ పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. ► డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరిగే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం లేదు. అయితే వీటిని కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి. ► విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్ళీ అతిగా పంచదార కలుపుకోకూడదు. ► సోయా పాలు, సోయా జున్ను (తోఫూ) తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. సోయా ప్రొటీన్లు ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ► బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదకరం కావు. పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది. ► టొమాటోలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. ఇందులోని విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ►గుప్పెడన్ని నట్స్ అంటే బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ►బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి. ►దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. దానిమ్మ పండు గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే అడ్డంకులు (ప్లాక్స్)నూ శుభ్రం చేస్తాయి. యాపిల్ పండ్లు కూడా. ►అవిశె గింజలలో (ఫ్లాక్ సీడ్స్) పీచు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటిని రోజుకు 20 గ్రాములు తింటే మేలు. - రాధిక చీఫ్ డైటీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ధోనీ, కోహ్లీ ఫిట్నెస్ రహస్యం ఇదే
ముంబై: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇద్దరూ విజయానికి మారుపేరు. కెప్టెన్‌గా ధోనీ దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించగా.. కోహ్లీ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ప్రతిభ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు, ఫిటినెస్, పాపులారిటీ వంటి విషయాల్లో వీరిద్దరి మధ్య సారూపత్య ఉంది. కాగా ధోనీ, కోహ్లీ వ్యవహార శైలి మాత్రం విభిన్నం. మైదానం లోపల, బయట మహీ మిస్టర్ కూల్ అయితే.. విరాట్‌ది దూకుడు స్వభావం. అలాగే డైట్లో కూడా వీరిద్దరికి వేర్వేరు అభిరుచులు ఉన్నాయి. విరాట్ ఎక్కువగా సలాడ్స్, చేపలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని తీసుకుంటాడు. ఇక ఒత్తిడి తగ్గించుకోవడానికి కోహ్లీ జిమ్‌లో కసరత్తులు చేస్తాడు. కాగా ధోనీ ఆహారపు అలవాట్లు సింపుల్‌గా ఉంటాయి. ఎక్కువగా చపాతీలు, దాల్, పండ్లు, తృణధాన్యాలు తీసుకుంటాడు. లంచ్ లేదా డిన్నర్లో మాత్రం చికెన్ లాగిస్తాడు. ధోనీ, కోహ్లీ ఫిట్నెస్ రహస్యం ఇదే. క్రీడాకారులకు ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుంటుంటారు. -
4 నుంచి డైట్ కౌన్సెలింగ్
గార: డీఈఈ సెట్–2016 ప్రత్యేక కౌన్సెలింగ్ అక్టోబర్ 4, 5 తేదీల్లో నిర్వహిస్తామని వమరవల్లి డైట్ ప్రిన్సిపాల్ ఎ.ప్రభాకరరావు తెలిపారు. అక్టోబర్ 2న ఆన్లైన్లో సీట్లు కేటాయింపు జరుగుతుందని, 3న అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని, 4, 5 తేదీల్లో వమరవల్లి డైట్లో నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని కోరారు. -
హార్ట్...డైట్... హెల్త్...
గుండెజబ్బుల నివారణ... ఆహారం! ఆధునిక జీవనశైలితో ఇటీవల డయాబెటిస్ ఉండటం, హైబీపీతో బాధపడటం ఎక్కువ. ఇవి వచ్చేయంటే గుండెజబ్బు ఖాయంగా ఉన్నట్లుగా భావించి, డాక్టర్లు ముందునుంచే నివారణ చర్యలు చేపడుతుంటారు. ఆహారంతో వీటిని నివారించడమూ తేలికే. డయాబెటిస్ ఉన్న వాళ్లూ, హైబీపీ ఉన్నవాళ్లు తమ ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెజబ్బులను నివారించవచ్చు. అలాగని కేవలం వాళ్లు మాత్రమే కాదు... ఆరోగ్యవంతులూ వీటిని పాటిస్తే గుండెజబ్బులను చాలా వరకు దూరంగా ఉంచుకోవచ్చు. ♦ మీరు తీసుకునే ఆహారంలో పీచు, కార్బొహైడ్రేట్స్ వంటి పదార్థాలు ఎక్కువగా లభ్యమయ్యేలా చూసుకోండి. ఇందుకోసం జొన్న, మొక్కజొన్న, గోధుమ, దంపుడుబియ్యం, మొలకెత్తిన గింజలు, పళ్లూ, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలైన నెయ్యి, వెన్న, జున్ను, మీగడ వంటి పదార్థాలను బాగా తగ్గించాలి. ♦ తక్కువగా కొవ్వులు ఉండే లో-ఫ్యాట్ పాల ఉత్పాదనలు వాడాలి. ♦ మాంసాహారం తీసుకునేవారు స్కిన్లెస్ చికెన్‌ను తినాలి. వాటిని ఆరోగ్యకరంగా వండాలి. అంటే వేపుళ్లు వంటివి కాకుండా ఉడికించినవి అన్నమాట. ♦ ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే సాల్మన్, హెర్రింగ్ వంటి చేపలను వారంలో కనీసం రెండు సార్లు తినాలి. ♦ ఆహారపదార్థాలు కొనేప్పుడు తక్కువ సోడియమ్ ఉన్నవాటినే చూసి కొనాలి. ♦ తాము ఇప్పటికే ఎక్కువ బరువు ఉన్నామని కొందరు నట్స్ తీసుకోరు. అయితే చాలా అధ్యయనాల ప్రకారం నట్స్‌లో పీచుపదార్థాలు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఎక్కువ. పైగా అవి చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తాయి కూడా. అందుకే పరిమితంగానైనా తీసుకోవాలి. ♦ అవిశెలను (ఫ్లాక్స్ సీడ్స్‌ను) ఆహారంలో తప్పక తీసుకోవాలి. ♦ ఇక తీపి పదార్థాల విషయానికి వస్తే చక్కెర, తేనె, బెల్లం చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ♦ {బెడ్స్, బేకరీ ఫుడ్స్, కార్న్‌ఫ్లేక్స్ వంటి పీచు తక్కువగా ఉండేవి, మైక్రోన్యూట్రియెంట్స్ తక్కువగా ఉండే పదార్థాలను పూర్తిగా తగ్గించాలి. ♦ తాజా కూరగాయల్లో పీచు పదార్థాలు, కొన్ని విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవాలి. ♦ కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు అనే ఆహార నియమం మంచిది. బెడ్ టైంలో తేలిగ్గా ఉండే ఆరోగ్యకరమైన శ్నాక్స్ తీసుకోవడం ఉత్తమం. వ్యాయామం: చురుగ్గా ఉండటానికీ, షుగర్‌ను అదుపులో ఉంచుకోడానికీ ఎక్సర్సైజ్ బాగా దోహదపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం. అయితే ఇవన్నీ సాధారణ నియమాలు మాత్రమే. ఒక్కొక్కరికీ తమ వ్యక్తిగతమైన అంశాలకు తగినట్లుగా వ్యక్తిగతమైన డైట్ ప్లాన్... అంటే డీటెయిల్డ్ న్యూట్రిషనల్ ప్లాన్ అవసరం. ఒకరు ఎంత బరువున్నారు, వారి దైనందిన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. వాళ్లలో ప్రస్తుత బ్లడ్ సుగర్ లెవెల్స్ ఏమిటి, చక్కెరను కంట్రోల్ చేయడానికి వారు వాడుతున్న మందులు ఏమిటి... అనేక రకరకాల అంశాల ఆధారంగా ఎవరికైనా చక్కటి డీటెయిల్డ్ న్యూట్రిషన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ‘డ్యాష్’ ఆహార నియమావళి... ♦ అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియువూవళిని ’డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ‘డ్యాష్’. ♦ హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లకు పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా ఇవ్వాలి. వాటిలో పొటాషియుమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి ఆ ఆహారం తీసుకోవడం ప్రధానం. తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ♦ అలాగే వాళ్లకు క్యాల్షియుం కూడా అవసరం. ఇందుకోసం వాళ్లు కొవ్వు పాళ్లు (వెన్నపాళ్లు) తక్కువగా ఉన్న పాలూ, పాల ఉత్పాదనలు తీసుకోవాల్సి ఉంటుంది. ♦ ఉప్పు (సోడియుం) పాళ్లను గణనీయంగా తగ్గించాలి. ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. ♦ హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానంలోనూ (లైఫ్స్టైల్లో) వూర్పులు విధిగా పాటించాల్సి ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ఆపేయూలి. పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి. ♦ బరువు పెరగకుండా శారీరక శ్రమ (ఫిజకల్ యూక్టివిటీస్) ఉండేలా చూసుకోవాలి. -
డైట్ కళాశాలలో సిబ్బంది కొరత
31మందికి గానూ ముగ్గురే బోధకులు పట్టించుకోని ఉన్నతాధికారులు గాడితప్పుతున్న విద్యావ్యవస్థ మెదక్:జిల్లాలో ఏకైక ప్రభుత్వ విద్యా శిక్షణ కేంద్రం(డైట్)లో సిబ్బంది కొరత నెలకొంది. విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయులను తయారుచేసే డైట్ కళాశాలలో సిబ్బంది కొరత ఉండటంతో విద్యా వ్యవస్థే గాడితప్పుతోంది. యేళ్లతరబడి ఇదే తంతు కొనసాగుతున్నా.. పాలకులుగాని, ఉన్నతాధికారులుగానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మెదక్ మండలం హవేళి ఘణాపూర్ శివారులో సుమారు పాతికేళ్ల క్రితం డైట్ కళాశాలను ఏర్పాటుచేశారు. ఈ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులు రెండేళ్లపాటు శిక్షణ పొందుతారు. ఇందులో తెలుగు, ఉర్దూ మీడియాలు కొనసాగుతున్నాయి. 300 ఛాత్రోపాధ్యాయులు శిక్షణ పొందే ఈ కళాశాలలో ప్రిన్సిపల్‌తోపాటు 30మంది లెక్చరర్లు ఉండాలి. కాని చాలా కాలంగా కేవలం ఇద్దరు లెక్చరర్లు, ఇన్చార్జ్ ప్రిన్సిపల్‌తోపాటు మొత్తం ముగ్గురే ఉన్నారు. మరో 28మంది లెక్చరర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ స్పందించి ఐదుగురు లెక్చరర్లను డిప్యుటేషన్‌పై పంపించారు. ఇందులో తెలుగు మీడియానికి సంబంధించి మొదటి సంవత్సరం, రెండో సంవత్సరానికి 20 సబ్జెక్ట్‌లుంటాయి. ఉర్దూ మీడియంలోనూ 20 సబ్జెక్ట్‌లుంటాయి. మొత్తం 40 సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈయేడు గోటిచుట్టపై రోకటి పోటుల సిలబస్ సైతం మారిందని, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారిన సిలబస్‌ను సిబ్బంది ప్రతిరోజూ విద్యార్థుల మాదిరిగా ప్రిపెరేషన్ అయి ఛాత్రోపాధ్యాయులకు బోధించాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న ఒకైక డైట్ కళాశాలలో 28మంది సిబ్బంది కొరత ఉండటం వల్ల ఉన్న సిబ్బంది ఎవరికి ఏ సబ్జెక్ట్ బోధించాలో అర్థంకాక తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. గతంలో ఛాత్రోపాధ్యాయులు తమకు బోధకులను కేటాయించాలని ఆందోళనలు చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయినా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థులే వారికి వారుగా స్వతహాగా ప్రిపరేషన్ అవుతున్నారు. కొంతమంది చురుకైన విద్యార్థులు లెక్చరర్లుగా అవతారమెత్తి తోటి విద్యార్థులకు బోధిస్తున్నారు. అంతేకాకుండా 300మంది ఛాత్రోపాధ్యాయులున్న ఈ డైట్ కళాశాలలో కనీసం టాయిలెట్లు లేకపోవడం దురదృష్టకరం. తోటి ఛాత్రోపాధ్యాయులకు బోధిస్తున్నా: తాను డైట్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నా. ప్రిన్సిపాల్ సూచన మేరకు తోటి ఛాత్రోపాధ్యాయులకు కొన్ని సబ్జెక్ట్‌లు బోధిస్తున్నా. మాకు సరిపడా బోధకులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. అలాగే కళాశాలలో టాయిలెట్లు కూడా లేక చెట్లు, పుట్టల వెంట వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. -మమత, రెండో సంవత్సరం, డైట్ కళాశాల సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది: డైట్ కళాశాలలో ప్రిన్సిపాల్‌తోపాటు 31మంది ఉండాలి. కొంతకాలంగా కేవలం ముగ్గురం మాత్రమే ఉన్నాం. ఈ విషయాన్ని ఎంతోమంది అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ ఇటీవల ఐదుగురు లెక్చరర్లను డిప్యుటేషన్‌పై పంపించారు. మరో పది మందిని డిప్యుటేషన్‌పై పంపిస్తే ఎలాంటి ఆటంకంలేకుండా బోధన సాగుతుంది. సిలబస్ మారడంతో మరింత ఇబ్బందిగా మారింది. -రమేష్‌బాబు, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, డైట్ కళాశాల ఫోటోరైటప్: 19ఎండికె02: మెదక్డైట్ కళాశాల. 19ఎండికె02ఏ: మమత. 19ఎండికె02బి: రమేష్‌బాబు. -
మూల్యాంకనంపై డైట్లో వర్క్‌షాప్
గార: వమవరవల్లి డైట్ కళాశాలలో సీసీఈలో భాగంగా నిర్వహణా మూల్యాంకనంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సీసీఈ విధానంలో సంగ్రహణ మూల్యాంకనంపై 1 నుంచి 5 తరగతుల్లో ప్రశ్నాపత్రాలు తయారుచేస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్ తదితర సబ్జెక్టులపై ముగ్గురేసి నిపుణులు ప్రశ్నపత్రాలు తయారుచేస్తున్నారని ప్రిన్సిపాల్ ఎ. ప్రభాకరరావు చెప్పారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, భావ ప్రకటన వంటివి కలుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో డైట్ సీనియర్ లెక్చరర్లు తిరుమల చైతన్య, ఎస్.పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
డైట్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
గార: వమరవల్లి ప్రభుత్వ డైట్ కళాశాలలో ఆదివారం డైట్‌సెట్–2016 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని ఒక ప్రభుత్వ, సుమారు 25 ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను డైట్ ప్రిన్సిపాల్ ఎ.ప్రభాకరరావు పరిశీలించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. పరిశీలనలో సీనియర్ అధ్యాపకులు పురుషోత్తం, ధర్మరాజు తదితరులు ఉన్నారు. -
ఆగస్టు 5న డైట్లో జిల్లాస్థాయి పోటీలు
మెదక్: మెదక్ మండలం హవేళి ఘణాపూర్‌లో గల డైట్లో ఆగస్టు 5న విద్యార్థులకు నాటకీకరణ, జానపద నృత్యాలపై జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ రమేష్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లాపరిషత్, కేజీబీవీ, గురుకులం, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాలల విద్యార్థులను ఎంపికచేసి ఈ పోటీలకు పంపించాలన్నారు. గెలుపొందిన వారికి నగదు పురస్కారాలు అందిస్తామన్నారు. వీరు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల పేర్లను ఇతర సమాచారాన్ని ఆగస్టు 3లోగా 88016 84241కు ఫోన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. -
టఫ్ గాళ్స్... టామ్‌బాయ్స్!
సిగ్గుల మొగ్గవుతూ... గుమ్మం చాటున నిలబడి కాలిగోళ్లతోనే ముగ్గులు వేసే బాపూబొమ్మల స్థానంలో అబ్బాయిలతో సమానంగా రఫ్ఫాడిస్తున్న రఫ్ అండ్ టఫ్ గాళ్స్ వచ్చేస్తున్నారు. అనుక్షణం అణిచివేతలకు, అనుసరించే వేటగాళ్ల వేధింపులకు తిరస్కారంగా మగవాళ్లకు థీటుగా తమను తాము మలచుకుంటున్నారు అమ్మాయిలు. ఏతావాతా టామ్‌బాయ్స్ తరహా అమ్మాయిలు పెరుగుతున్నారు. ‘నేను టామ్‌బాయ్ టైప్’ అంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు సిటీ అమ్మాయిలు. -సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందనగానే కలిగేంత బాధ ఇప్పుడు లేదు. పుట్టిన దగ్గర్నుంచీ ఆ అమ్మాయిని అబ్బాయిలాగా పెంచాలనే తపన తప్ప. ‘మా అమ్మాయిని చిన్నప్పటి నుంచీ ఆడపిల్ల అనుకోలేదు. అబ్బాయిల్తో సమానంగా పెంచాను’ అని చెప్పారు బేగంపేట నివాసి రాకేష్ గులాటి. ప్రస్తుతం ఆయన కుమార్తె ఆ పెంపకానికి తగ్గట్టే... క్రీడల్లో అబ్బాయిలతో సమానంగా దూసుకుపోతోంది. నిజం... ఇది టామ్బాయిజం... ఒక అమ్మాయి మగవారిలా దుస్తులు ధరిం చడం, అదే తరహాలో రఫ్ అండ్ టఫ్‌గా ప్రవర్తించడం 15వ శతాబ్ధంలో వెలుగులోకి వచ్చిన పదంగా టామ్‌బాయ్‌ని చెబుతారు. అనంతరం 19వ శతాబ్దంలో బాగా వ్యాయా మం చేస్తూ, కండపుష్టిని అందించే డైట్‌ని తీసుకునే అమ్మాయిలను అమెరికాలో టామ్బాయ్లుగా అభివర్ణించారట. అలా అలా ఆ పదం డైనమిక్‌గా, అడ్వంచరస్‌గా ఉండే అమ్మాయిలకు పర్యాయపదంలా మారింది. అబలకు బై... సబలల సై సిగ్గుల మొగ్గల్లా ముడుచుకుపోయే కన్నా సివంగిలా ముందుకురికే ఆడపిల్లలకే ప్రస్తుత సమాజంలో గెలుపు సాధ్యం అని ఆధునిక మహిళలు భావిస్తున్నారు. ‘యోగా సర్టిఫైడ్ ఇన్‌స్ట్రక్టర్‌ని. నేను జిమ్నాస్టిక్స్‌లో సర్టిఫికెట్ హోల్డర్ని. బైక్ డ్రైవింగ్ కాలేజ్ డేస్ నుంచే వచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే నేను టామ్‌బాయ్ టైప్’ అని శ్రీనగర్‌కాలనీ నివాసి నేహా చౌదరి చెప్పారు. ఈ రోజుల్లో ఇలా ఉంటే ఎలా బ్రతుకుతాం లాంటి ఆలోచనల నేపథ్యమే ఈ టామ్‌బాయ్ ట్రెండ్ అనొచ్చు. ‘చిన్నప్పటి నుంచి బైక్ నడపడంలోనే కాదు ఫీట్స్ చేయడంలో కూడా అబ్బాయిలతో పోటీపడేదాన్ని. అప్పుడూ ఇప్పుడూ నేను టామ్‌బాయ్ టైపే’ అని నగరం నుంచి సినిమా హీరోయిన్గా రాణిస్తున్న తేజస్విని చెప్పారు. కాలు కదిపితే చాలు కామపు చూపులు, వేలు తాకినా చాలన్నట్టు కొనసాగుతున్న మగాళ్ల వేధింపులు కూడా అమ్మాయిల్లో రఫ్‌నెస్ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. అనుక్షణం రక్షణగా ఉండలేక, అటు వెళ్లకు, ఇటు వెళ్లకు వంటి ఆంక్షలతో ఆడపిల్లల స్వేచ్ఛని హరించలేక అమ్మాయిలు టామ్బాయ్స్లా పెరగడమే మేలని తల్లిదండ్రులు సైతం ఈ ధోరణికి ఊతమిస్తున్నారు. ‘నన్నిలా రఫ్ అండ్ టఫ్‌గా మార్చింది మా నాన్నగారే అని చెప్పాలి. అమ్మాయిలా వయ్యారంగా తయారయి వెళితే మరింతగా పోకిరీలు రెచ్చిపోతారు. అందుకే కావాలని బైక్ నేర్చుకున్నాను. ఎంత అర్ధరాత్రయినా జాకెట్ గ్లవ్స్ అవీ వేసుకుని రఫ్‌గా కనిపిస్తాను’ అంటూ చెప్పారు బంజారాహిల్స్‌కు చెందిన దివ్య. సాహసమే జీవనం మరోవైపు మగువల్లో ఈ తరహా తెగింపు వారిని మరిన్ని సాహసాలవైపు నడిపిస్తోంది. గత కొన్నేళ్లుగా అడ్వంచర్స్ క్లబ్లో నమోదు చేసుకుంటున్న సభ్యుల్లో అమ్మాయిల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని క్లబ్ నిర్వాహకులు రంగారావు చెప్పారు. ఒకప్పుడు మొత్తం సభ్యుల్లో వీరి సంఖ్య 5 శాతం లోపే, అయితే ఇటీవల అది బాగా పెరిగి దాదాపు 25 శాతానికి చేరిందన్నారు. మగవాళ్లు సైతం తటపటాయించే రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్... వంటి ప్రమాదభరిత సాహసాలకు సైతం అమ్మాయిలు సై అంటున్నారని వివరించారాయన. -
‘పరీక్ష’ కాలం!
♦ సమతుల ఆహారం తీసుకోండి ♦ కనీసం 6 గంటల నిద్ర తప్పనిసరి ♦ అతి ఆందోళన ప్రమాదకరం ♦ తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం ♦ ఇది ఒక అవకాశమే... జీవితం కాదు ♦ విద్యార్థులకు నిపుణుల సూచనలు.. సలహాలు సాక్షి, సిటీబ్యూరో: పరీక్షల సీజన్ మొదలైంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఇంటర్మీడియెట్.. డిగ్రీ... ఆ తర్వాత పదో తరగతి... అనంతరం వివిధ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తరగతులు ముగిశాయి. పునఃశ్చరణ జోరుగా కొనసాగుతోంది. దాదాపు 3 నెలలు ఒకదాని తర్వాత మరొకటి జరిగే పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే విజయం సొంతమవుతుంది. గంటల తరబడి చదివినా.. ఏకాగ్రత తప్పకూడదు. చదువుపైనే మనసు లగ్నం కావాలి. ఇవన్నీ సజావుగా సాగాలంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మలచుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. చదువు పైనే మనసు కేంద్రీకృతం కావాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆందోళనను దరిచేరనీయవద్దని స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రులకు సూచనలు ‘చద వండి’ అంటూ పదే పదే విద్యార్థులను విసిగించొద్దు. పరీక్షల సమయంలో అతిగా చదివినా... పెద్దగా లాభం ఉండదు. కాకపోతే ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో వారికి తెలియజేయండి. పరీక్షలు ముగిసే వరకు వారికి పనులు చెప్పకపోవడమే మంచిది. విద్యార్థులు ఆందోళనపడుతున్నట్లు గుర్తిస్తే.. వారితో గడిపేందుకు కొంత సమయాన్ని కేటాయించండి. టీవీ చూడడం... మొదటిపేజీ తరువాయి సంగీతాన్ని ఆస్వాదించడం... పార్క్‌కు వెంట తీసుకెళ్లడం..వంటి వాటితో మనసుకు ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థి చదువుతున్న చోటనేమీరూ చిన్న చిన్న పనులు చేస్తూ గడిపితే వారికి కొంత విశ్వాసం పెరుగుతుంది. వీలైతే ఫలితాల గురించి కాకుండా.. చదివిన అంశాలను ఏవిధంగా పూర్తి స్థాయిలో పేపర్‌పై పెట్టవచ్చో చూపిస్తే మంచిది. ఇంట్లో నిశ్శబ్దం పాటించాలి. టీవీలు, రేడియోలు కట్టిపడేస్తే అంతరాయం ఉండదు. అంతా మంచే జరుగుతుందని విద్యార్థులకు ధైర్యం చెప్పాలి. విద్యార్థులు పాటించాల్సినవి భవిష్యత్‌కు మేలిమలుపుగా నిలిచే టెన్త్, ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థులు ఇతర వ్యాపకాలను విడిచిపెట్టాలి. ప్రధానంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ల నుంచి ఆలోచనలను చదువు వైపు మళ్లించాలి. లేదంటే సమయం వృథా కావడమే కాక.. భావోద్వేగాలకు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. స్నేహితులతో సరదా తిరుగులు వదిలేయండి. పుస్తకాన్నే స్నేహితుడిగా భావించి.. నిత్య నూతనోత్సాహంతో సన్నద్ధం కావాలి. ముఖ్యంగా బృందాలుగా చదవడం ఎంతో సహకరిస్తుంది. పాఠ్యాంశాలపై దగ్గరి స్నేహితులతో కలిసి రోజుకు 2-3 గంటలపాటు చర్చిస్తే.. సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. అంతేగాక సందేహాలు నివృత్తి అవుతాయి. ఆందోళన దూరమవడమే కాకుండా మన చదువుపై ఓ అంచనాకు రావచ్చు. విరామంలేకుండా అదేపనిగా చదువకూడదు. ఇలా చేయడం వల్ల పాఠ్యాంశాలన్నీ గుర్తుండడం కష్టం. తెల్లవారుజామున పుస్తకం పట్టేందుకు అధిక ప్రాధాన్యంఇవ్వండి. చదవడంలో ఒక పద్ధతిని అవలంబిస్తే మేలు. ఎంతసేపు చదివామన్నది కాకుండా.. ఎంత చదివామన్నది... చదివింది ఎంత గుర్తుందన్నది ముఖ్యం. గుర్తున్న పాఠ్యాంశాలను సమాధాన పత్రాలపై పూర్తి స్థాయిలో రాయడం అవసరం. మన దగ్గర పరీక్షలన్నీ.. రాత పద్ధతిలోనే జరుగుతాయి. ఈ క్రమంలో చదువుతూ రాసే విధానాన్ని విద్యార్థులు అలవర్చుకుంటే.. మతిమరుపు అనే సమస్య దరిచేరదు. ద్రవాహారం తీసుకోవాలి పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే వేపుడు పదార్ధాలకు బదులు ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లు లభించే ఆహారం తీసుకోవాలి. తల్లిదండ్రులు సమయానికి ఆహారం అందించాలి. తరచుగా పండ్లు, పళ్ల రసాలు ఇస్తే నీరసం రాదు. ప్రోటీన్లు అధికంగా లభించే పాలు, గుడ్లు, లస్సీ తదితర పదార్థాలు తీసుకునేందుకు మొగ్గు చూపాలి. తద్వారా రోగ నిరోధక శక్తితోపాటు ఏకాగ్రత పెరుగుతుంది. తినే పళ్లెంలో ఎంతగా రంగురంగుల కూరగాయలు ఉంటే.. అంతగా శ రీరానికి మేలు జరుగుతుంది. పరీక్షలంటే ఒత్తిడి సహజం. దీని నుంచి బయట పడేందుకు ఆల్కహాల్ ని ఆశ్రయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఫలితం ఉండకపోవడమేగాక.. ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. పరీక్షలు పూర్తయ్యే వరకు మాంసాహారం తీసుకోకపోవడమే మంచిది. - డాక్టర్ రాధ, పోషకాహార నిపుణురాలు అతి ఆందోళన ప్రమాదకరం పరీక్షల పేరు చెబితే 30-40 శాతం విద్యార్థులు విపరీతంగా ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్య 8-16 ఏళ్ల వయసు వారిలో అధికంగా ఉంటుంది. అటువంటి వారిలో మిగతా విద్యార్థులతో పోల్చుకుంటే తీవ్ర ఆందోళన వల్ల జ్ఞాపక శక్తి 30-50 శాతం తగ్గుతుంది. సక్రమంగా సమాధానాలు రాయలేరు. పరీక్ష అనేది ఒక అవకాశమే తప్ప..అదే జీవితం కాదని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఉన్న సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టి సారించాలి. ఏకాగ్రత, హార్డ్‌వర్క్ గురించే ఆలోచించాలి. ఫలితాల మాట మనసులోకి రానివ్వద్దు. ఆందోళన మితిమీరితే జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చదువు పేరుతో చాలామంది నిద్రను దూరం చేసుకుంటారు. ఇది పొరపాటు. పరీక్షల సమయంలో కనీసం ఆరేడు గంటలైనా నిద్రకు కేటాయించాలి. చాలామంది రాత్రిళ్లు విడతల వారీగా అలారం పెట్టుకుని.. చదువుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారికి పెద్దగా ఒరిగేదేముండదు. ఒక పని తర్వాత ఒకటి చేస్తే.. నిద్రకు భంగం కలగదు. ఎటువంటి అంతరాయం లేకుండా చదువుకోవచ్చు. - డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, మానసిక వైద్య నిపుణులు టీవీలు కట్టేయడమే ఉత్తమం తల్లిదండ్రులు ఎక్కువ సమయం టీవీల ముందు కాలక్షేపం చేస్తే.. విద్యార్థుల దృష్టి దీనిపై పడుతుంది. దీనికి ఉత్తమ పరిష్కారం.. పరీక్షలు ముగిసేంత వరకు ఇంట్లో టీవీలు కట్టేయడమే. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు పరోక్షంగా మేలు జరిగినట్లే. మొబైల్స్‌కు దూరంగా ఉండాలి. పరీక్షలు ముగిసేంత వరకు తల్లిదండ్రులు ఎంతో కొంత త్యాగం చేయాలి. లేదంటే తమ పిల్లల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. బయటి ఆహారానికి పుల్‌స్టాప్ పెట్టి.. ఇంటి వంటలే చేసి పెట్టాలి. విద్యార్థులను ప్రోత్సహించకున్నా ఫర్వాలేదు కానీ.. నిరుత్సాహ పర చవద్దు. - సుబ్రహ్మణ్యం, ఇంటర్ విద్యార్థిని తండ్రి, కొండాపూర్ భావోద్వేగాలను వాయిదా వేసుకోండి సాక్షి,సిటీబ్యూరో:‘ఎలాంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులైనా ప్రణాళిక ప్రకారం చదివితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. భావోద్వేగాలకు అతీతమైన ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం మంచిద’ని ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్ వీరేందర్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేరయ్యే సమయంలో పాటించవలసిన నియమాలను వివరించారు. ఆంగ్లంలో సిక్స్ ‘పీ’స్ (ఆరు ‘పీ’లు) ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందగలరని చెప్పారు. అవి... 1) ప్రిపేర్ స్టడీ వెదర్: ఇంట్లో ఒక్కో గది ఒక్కో రకమైన అవసరానికి ఉపయోగపడుతుంది. డ్రాయింగ్ రూమ్‌లో టీవీ.. వంటగదిలో ఆహార పదార్ధాలు... బెడ్రూమ్లో పడక... మన ఆలోచనలను ప్రభావితం చేస్తా యి. ఇలాంటి వాటికి దూరంగా ఇంట్లోనే ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ స్థలంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల చిత్రాలు, నినాదాలు, సూత్రాలు, సిద్ధాంతాలు గోడలపైన ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు త మ ఆశయాలను, లక్ష్యాలను రాసి పెట్టుకోవాలి. 2) పుల్ స్టడీ టైమ్: రోజులోని 24 గంటల సమయం వివిధ రకాల అవసరాలతో ముడిపడి ఉంటుంది. ఉదయాన్నే టిఫిన్... స్కూల్‌కు వెళ్లడం... మధ్యాహ్నం భోజనం... సాయంత్రం ఆటలు, కాలక్షేపం, రాత్రి నిద్ర వంటి అవసరాలు ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని దైనందిన అవసరాల సమయాన్ని కుదించుకొని స్టడీ అవర్స్‌ను పెంచుకొనే విధంగా ప్లాన్ వేసుకోవాలి. ఉదయం పూట చదివితే బాగుంటుందని కొందరు అంటారు. కానీ మనస్తత్వ విశ్లేషణ ప్రకారం కొందరు రాత్రుళ్లలో చదవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మరికొందరు పగలంతా కష్టపడి చదివి పెందరాళే నిద్రకు ఉపక్రమిస్తారు. విద్యార్థులు తమకు ఇష్టమైన వేళల్లోనే చదవడం మంచిది. 3)పోస్ట్‌పోన్ ఎమోషన్స్: ఇది చాలా ముఖ్యమైనది. పరీక్షల సమయంలో అన్ని రకాల భావోద్వేగాలను వాయిదా వేసుకోవాలి. స్నేహితులతో పోట్లాటలు, వాదోపవాదాలు, తగవులు లేకుండా చూసుకోవాలి. ఇంట్లోని వారు ఒత్తిళ్లకు గురి చేసినా పట్టించుకోకుండా చదువుపై ధ్యాస ఉంచాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచేలా, నిరుత్సాహానికి గురి చేసేలా మాట్లాడకూడదు. 4) ప్రిపేర్ స్టడీ ప్లాన్: రోజులో ఎన్ని సబ్జెక్టులు చదవాలి అనేది ముఖ్యం. రోజుకు 3 సబ్జెక్టుల చొప్పున వారంలో అన్ని సబ్జెక్టులు పూర్తయ్యే విధంగా చదువుకోవాలి. సులభంగా ఉన్నవి ఎక్కువగా చదవడం, కష్టంగా ఉన్నవి తక్కువగా చదవడం మంచిది కాదు. అలా అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కష్టం. 5) ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ : గత 5 ఏళ్లుగా వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. వాటిలోని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 6) ప్రాక్టీస్ సెల్ఫ్ టెస్ట్ : పరీక్షలకు ముందు ఇంట్లోనే మనకు మనం ఒక సెల్ఫ్‌టెస్ట్ పెట్టుకోవాలి. దీని వల్ల భయాందోళనలు తొలగిపోతాయి. -
వారంలో 4 రోజులు మాత్రమే!
ఆలియా భట్ ఒకప్పుడు చాలా బొద్దుగా ఉండేవారు. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు తగ్గడం మొదలుపెట్టారు. వచ్చాక ఇంకా తగ్గారు. ఇప్పుడీ మెరుపు తీగ కుర్రకారు కలల రాణి. స్లిమ్‌గా ఉండటం కోసం ఆలియా రోజూ అదే పనిగా వర్కవుట్స్ చేస్తారనుకుంటే పొరపాటే. జస్ట్ నాలుగే నాలుగు రోజులు చేస్తారట. ‘‘నిద్రపోయే రెండు గంటల ముందే డిన్నర్ ముగించేయాలి. కేలరీలు కరిగించాలంటే కార్డియో ఎక్సర్సైజ్ బెస్ట్. ఆయిలీ, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి’’ అంటున్నారు ఆలియా. ఈ బ్యూటీ తీసుకునే డైట్, చేసే వర్కవుట్స్ గురించి తెలుసుకుందాం... డైట్ స్వీట్స్ అంటే ఆలియాకి చాలా ఇష్టం. ఖీర్, బాసుంది బాగా తింటారు. అయితే వారంలో రెండు రోజులు మాత్రమే. ఉదయం పంచదార లేని హెర్బల్ టీ తాగుతారు. ఆ తర్వాత కార్న్‌ఫ్లేక్స్ లేక అటుకులతో చేసిన ఉప్మా తింటారు. ఒక్కో రోజు రెండు ఎగ్ వైట్స్, ఏదైనా పండ్ల రసం తీసుకుంటారు. పండ్ల రసం తీసుకోని రోజున ఎగ్ వైట్స్‌తో పాటు గ్లాసుడు పాలతో బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చేస్తారు. అల్పాహారం తీసుకున్న రెండు గంటలకు ఏదైనా వెజిటెబుల్ సూప్ తాగుతారు, మధ్యాహ్నం రెండు లేక మూడు రోటీలు, పప్పు, ఉడకబెట్టిన కూరగాయలు కూడా తీసుకుంటారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పంచదార లేని టీ లేక కాఫీ తీసుకుంటారు. డ్రై ఫ్రూట్స్ తింటారు. రాత్రి ఏడు గంటలకల్లా డిన్నర్ ముగించేస్తారు. ఒక కప్ వెజిటెబుల్ సలాడ్స్, ఒక కప్పు అన్నం, పప్పు లేకపోతే చికెన్ బ్రెస్ట్ తీసుకుంటారు. సలాడ్స్ తిననప్పుడు సూప్ తాగుతారు. వారంలో ఒక్క రోజు మాత్రం న్యూడుల్స్, బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్... ఇలా ఏది కావాలనుకుంటే అది తింటారు. అలాగే, ఆ ఒక్కరోజు శీతల పానీయాలు కూడా తీసుకుంటారు. వర్కవుట్స్ సోమ, బుధ, శుక్ర, ఆదివారం.. ఈ నాలుగు రోజులు మాత్రమే వర్కవుట్స్‌కి కేటాయిస్తారు. మంగళ, గురు, శనివారాల్లో పొరపాటున వీటి జోలికి వెళ్లరు. ఒక్కోసారి ఆదివారం కూడా వర్కవుట్స్‌కి సెలవు చెప్పేస్తారు. రోజు మార్చి రోజు 30 నుంచి 40 నిమిషాల వరకూ కార్డియో ఎక్సర్సైజ్ చేస్తారు. కార్డియో చేయని రోజున డ్యాన్స్ చేస్తారు. కథక్ అంటే ఆలియాకు చాలా ఇష్టం. శరీరం దృఢంగా ఉండటం కోసం వెయిట్ ట్రైనింగ్ చేస్తారు.జిమ్‌లో వర్కవుట్స్ చేయని రోజున యోగా చేస్తారు. సూర్య నమస్కారాలతో పాటు స్ట్రెచింగ్ ఆసనాలు చేస్తారు.యోగా, జిమ్ చేయని రోజున స్మిమ్మింగ్ చేస్తారు. అప్పుడప్పుడు కిక్-బాక్సింగ్ చేస్తుంటారు. బాగా ఖాళీగా ఉంటే రన్ చేస్తారు. ఆలియా చాలా ఫాస్ట్ రన్నర్ అట! -
బల్లి పడిన ఆహారం తిని మహిళ మృతి
వైరా: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బల్లి పడిన ఆహారం తిని ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన వైరా మండలం పాటడుగు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జానకి రామయ్య కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమానం వచ్చిన వారు వంట గిన్నెలు తీసి చూడగా.. సాంబారులో బల్లి పడి ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. జానకి రామయ్య భార్య భారతమ్మ చికిత్స పొందుతూ మృతిచెందగా..జానకి రామయ్యతో పాటు కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. -
ఆ నేడు 7 అక్టోబర్, 1950
వెలుగు దీపం ‘ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసేముందు- తినడానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు’. తనకు అసౌకర్యంగా, బాధగా అనిపించినప్పుడు తన గురించి కాకుండా కోట్లాది మంది దీనుల గురించి ఆలోచించారు మదర్ థెరిసా. ఆ ఆలోచనే కలకత్తాలో ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’గా రూపుదిద్దుకుంది. వేల కిలోమీటర్ల దూరమైనా...ఒక్క అడుగుతో మొదలైనట్లు 13 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తమైంది. ఆకలితో అలమటించేవాళ్లు, వ్యాధిగ్రస్తులు, పేదవాళ్లు, నిరాశ్రయులకు ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ వెలుగు దీపం అయింది. కలకు, ఆ కలను నిజం చేసుకునే వాస్తవానికి మధ్య దూరం ఉండొచ్చు. అది కొందరికి అగాధంలా కనబడవచ్చు. సంకల్పబలం ఉన్నవాళ్లకు అది సులభం కావచ్చు. ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ రాత్రికి రాత్రే పుట్టింది కాదు. ఆలోచన నుంచి ఆచరణ నుంచి, కష్టాల దారిలో నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నిర్మాణాత్మక సేవాదృక్పథం. -
తెలివిగా తినండి.!
మెదడు... మరేమీ కాదు, తలకాయలో కాస్తంత గుజ్జు. బుద్ధిజీవులైన మనుషుల్లో తెలివితేటలకు ఇదే కేంద్రం. మెదడు సజావుగా పనిచేస్తేనే మనం సక్రమంగా ఆలోచించగలం. అంతేకాదు, మన శరీరంలోని అన్ని వ్యవస్థలూ వాటి విధులను అవి సక్రమంగా నిర్వర్తించుకోగలవు. మరి... అలాంటి మెదడును పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవాలంటే, దానికి చక్కని పోషణను అందించాలి. పిండ దశ నుంచే మెదడుకు పోషణ అవసరం. ఇందులో ఎలాంటి లోపం ఏర్పడినా, నానా సమస్యలు తలెత్తుతాయి. ఆ పోషకాలన్నీ మన రోజువారీ ఆహారంలోనే దొరుకుతాయి. కొన్ని నేర్చుకునే సత్తువనిస్తాయి. మరికొన్ని మెదడును స్తబ్దుగా, మందకొడిగా తయారు చేస్తాయి. ఆలోచనల చురుకుదనానికి ఆహారంతో బ్రేక్ వేయకండి. తిండిలో ఉప్పు ఎక్కువైతే చురుకుదనానికి ముప్పు, కూల్‌డ్రింకులతో కుదేలు, కెఫిన్‌తో బెంబేలు. బ్రెయిన్‌ను మరింత హుషార్ప్ చేసే ఆహారాన్ని తీసుకోండి. చురుకైన మెదడు కోసం తెలివిగా తినండి. అదెలాగో తెలుసుకోండి... మెదడుకు మేలు చేసేవి మెదడు చురుగ్గా పనిచేయాలంటే, ఈ దిగువ జాబితాలోని ఆహార పదార్థాలు మీ రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. పసుపు, కొత్తిమిర: కూరల్లో వేసుకునే పసుపు, గార్నిషింగ్ కోసం వాడే కొత్తమిరతో మెదడు చురుకుగా మారుతుంది. చేపలు: పండుగప్ప, వంజరం, మాకరెల్. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నూనెలు: ఆలివ్ ఆయిల్, శాకాహార నూనెలు మెదడుకు మేలుచేస్తాయి. ఆలివ్ ఆయిల్ కొలెస్ట్రాల్‌ను అరికడుతుంది. రక్తపోటును అదుపు చేస్తుంది. మెదడుకు వచ్చే పక్షవాతం, అల్జైమర్స్ డిసీజ్ వంటి వ్యాధులను నివారిస్తుంది. పండ్లు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటి పండ్లు మెదడుకు మేలు చేస్తాయి. ఆకుకూరలు, కూరగాయలు: పాలకూర, బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో పాటు డార్క్ చాక్లెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ పిండ దశ నుంచే మెదడు ఎదుగుదలకు దోహదపడే కీలకమైన పదార్థం ఫోలిక్ యాసిడ్. గర్భస్థ పిండం మెదడు సక్రమంగా ఎదగడానికి, పిండంలో న్యూరల్ ట్యూబ్‌కు సంబంధించిన సమస్యలను నివారించడానికి గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ ఇస్తుంటారు. ఆకుకూరల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డ మెదడు ఆరోగ్యకరంగా ఎదగడానికి కావలసిన డీహెచ్ఏ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో ఇదొక రకం) తల్లిపాల ద్వారా అందుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మెదడు పనితీరులో సునిశితత్వం, వేగం ఉండాలంటే దానికి తగినంత గ్లూకోజ్ అందాలి. మన ఆహారంలో తక్షణ శక్తినిచ్చే గ్లూకోజ్‌లో కనీసం 15 శాతం నేరుగా మెదడుకు అందినప్పుడే అది సక్రమంగా పనిచేస్తుంది. ఇందుకోసం మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా తీసుకోవాలి. దంపుడు బియ్యం, పొటు ్టతీయకుండా మరపట్టించిన గోధుమ పిండి, బంగాళ దుంపలు, చిలగడ దుంపలు వంటి వాటిలో ఇవి లభిస్తాయి. పొట్టుతీయని ఆహారం ద్వారా శరీరంలో తయారయ్యే గ్లూకోజ్ ఒక క్రమ పద్ధతిలో మెదడుకు దీర్ఘకాలం పాటు నిదానంగా అందుతూ ఉంటుంది. పొట్టుతీసిన ఆహారం ద్వారా తయారైన గ్లూకోజ్ వెంటనే వినియోగమైపోతుంది, ఫలితంగా తక్కువ వ్యవధిలోనే మెదడుకు మళ్లీ గ్లూకోజ్ అవసరమవుతుంది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి శరీరానికి అత్యవసరమైన కొవ్వు పదార్థాలు. కొవ్వులు పరిమితికి మించితే ఆరోగ్యానికి మంచిది కాదనే సంగతి తెలిసిందే. అయితే, మెదడు చురుగ్గా పనిచేయాలంటే మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావలసిందే. అందుకే, మెదడుకు అత్యవసరమైన కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ అంటారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, సాంకేతికంగా చూస్తే మెదడు కణాలన్నీ కొవ్వు కణాలే. మెదడు బరువులో అరవై శాతం కొవ్వుపదార్థమే. మిగిలిన దానిలోనూ మరో ఇరవై శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్‌ను శరీరం తనంతట తానే తయారు చేసుకోలేదు కాబట్టి వాటిని తప్పనిసరిగా ఆహారం నుంచి స్వీకరించాల్సిందే. మనం తీసుకునే ఆహారంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్‌గా పరిగణిస్తారు. ఇవి మనకు చేపలు, గుడ్లు, వేరుశనగలు, జీడిపప్పు, బాదం గింజలు వంటి నట్స్, అవిసెనూనె వంటి పదార్థాల నుంచి లభిస్తాయి. హాని చేసే కొవ్వులు మెదడు చురుగ్గా పనిచేయడానికి కొవ్వు పదార్థాలు అవసరమే అయినా, కొన్ని రకాల కొవ్వులు మెదడుకు మేలు బదులు హాని చేస్తాయి. సాంకేతికంగా ట్రాన్స్‌ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు (కృత్రిమ కొవ్వులు) మెదడు చురుకుదనాన్ని దెబ్బతీసి, మందకొడిగా మార్చేస్తాయి. కృత్రిమ నెయ్యిలో (వనస్పతి) ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసే కేకులు, బిస్కట్లు, స్వీట్లు వంటివి మెదడుకు హాని చేస్తాయి. మనం మార్కెట్లో కొనే పదార్థాల ప్యాకెట్లను పరిశీలిస్తే, వాటిలో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఉన్నట్లయితే, అప్పటికీ జిహ్వచాపల్యం ఆపుకోలేకపోతే చాలా పరిమితంగా మాత్రమే వాటిని తీసుకోవాలి. అమినో యాసిడ్స్ మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు దోహదపడే భాగాలను న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఇవి ఎంత వేగంగా పనిచేస్తే, మెదడు అంత చురుగ్గా పనిచేస్తున్నట్లు లెక్క. న్యూరోట్రాన్స్మిటర్స్ చురుకుదనానికి దోహదపడేవే అమినో యాసిడ్స్. ఇవి ప్రొటీన్స్ నుంచి దొరుకుతాయి. మన మూడ్స్ కూడా న్యూరోట్రాన్స్‌మిటర్స్‌పైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు బాగా నిద్రపట్టాలంటే ‘సెరటోనిన్’ అనే జీవరసాయనం కావాలి. పాలలో ఉండే ‘ట్రిప్టోఫాన్’ అనే అమినో యాసిడ్ ద్వారా శరీరంలో ‘సెరటోనిన్’ తయారవుతుంది. అందుకే, నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. విటమిన్స్, మినరల్స్ మెదడు చురుకుదనానికి విటమిన్లు, ఖనిజలవణాలు కూడా కీలకమైనవే. అమినో యాసిడ్స్‌ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోను, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మార్చడంలోను ఇవి విశేషంగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బి1, బి6, బి12 విటమిన్లు చాలా అవసరం. ఇవి తాజా కూరగాయల్లో, ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ బి12 ఎక్కువగా మాంసాహారంలోనే దొరుకుతుంది. పూర్తి శాకాహారులు విటమిన్-బి12 లోపంతోను, ఎండ సోకకుండా ఉండేవారు విటమిన్-డి లోపంతోను బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్లు వైద్యుల సూచనపై విటమిన్ బి-12, విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక విటమిన్-ఇ మెదడుకు వేగంగా నేర్చుకునే శక్తిని ఇస్తుంది. నీరు మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయినా, మొత్తం మెదడును తీసుకుంటే, అందులో 80 శాతం ఉండేది నీరే. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీరు చాలా అవసరం. మూత్రం ద్వారా, ఊపిరి ద్వారా రోజు మొత్తంలో మనం 2.5 లీటర్ల నీటిని విసర్జిస్తాం. మెదడు సజావుగా పనిచేయాలంటే రోజుకు కనీసం 1.5 లీటర్లు... అంటే దాదాపు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. మిగిలిన నీరు మనం తీసుకునే ఘనాహారం నుంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల ద్వారా భర్తీ అవుతుంది. రోజువారీ తాగే నీరు 1.5 లీటర్ల కంటే తక్కువైతే మాత్రం మెదడు చురుకుదనం మందగిస్తుంది. ఆ ప్రభావం మూడ్స్‌పై పడుతుంది. అందుకే రోజుకు దాదాపు ఎనిమిది గ్లాసుల నీటితో పాటు పాలు, మజ్జిగ, రాగిజావ, పండ్లరసాలు వంటివి తీసుకోవాలి. ఈ ద్రవాహారాలు మెదడును చురుగ్గా ఉంచుతాయి. - ఇన్పుట్స్: సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌తో ఇబ్బందే... కెఫీన్ ఉండే కాఫీ, టీ వంటి పానీయాలు మితిమీరి తాగితే డీహైడ్రేషన్‌కు గురికాక తప్పదు. కెఫీన్ ప్రభావం వల్ల శరీరంలోని నీరు త్వరగా బయటకు పోతుంది. అందుకే కాఫీ, టీలను రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ తీసుకోకపోవడం క్షేమం. అంతకు మించి తీసుకుంటే, తొలుత మెదడు చురుగ్గా పనిచేసినా, త్వరగా అలసిపోతుంది. చక్కెర ఎక్కువ మోతాదులో ఉండే కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్ కూడా ఇలాంటి ప్రభావాన్నే చూపుతాయి. చేటు ఇవి బాగా ఉప్పువేసి, నిల్వ ఉంచిన ఆలూచిప్స్, టిన్డ్ సూప్స్ వంటివి మెదడుపై దుష్ర్పభావం చూపుతాయి. మన ఆహారంలో ఉప్పు రోజుకు ఆరు గ్రాములకు మించితే, అది మెదడుకు చేటు చేస్తుంది. వనస్పతి, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు మంచిది కాదు. మాంసాహారులు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు తీసుకోవాలి. ఇక వెన్న, మీగడలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. పొగతాగటం, ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తాయి.మెదడును స్తబ్దుగా మార్చేస్తాయి. దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరుపు) వంటి మెదడు సమస్యలకు దోహదం చేస్తాయి. -
పెళ్లి.. పిల్లాడు.. అందమైన ప్రయాణం...
పెళ్లయ్యాక కూడా అమ్మలు అందాల రాణులు అవుతున్నారు. సంతూర్మమ్మీల్లా సొగసులతో మెప్పిస్తున్నారు. సిటీకి చెందిన మిసెస్ ఇండియా ప్లానెట్ టైటిల్ విజేత అనుపమ... ఈ వారం తన ఫిట్నెస్ జర్నీని వివరిస్తున్నారిలా.. రోజూ ఇడ్లీలో నెయ్యి, కారప్పొడి వేసుకుని తినేదాన్ని. 8వతరగతి చదువుతున్నప్పుడే ఒబెసిటీ సమస్యతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ డాక్టర్ బాగా భయపెట్టడంతో నోరు కట్టేసుకుని కొంత బెటరయ్యా. టీనేజ్‌లో స్టడీస్‌లో పడి మళ్లీ పెరిగాను. ‘కొంచెం బరువు తగ్గవే చాలా బావుంటావ్’ అనేవారు. అప్పుడు విజయవాడలో ఉండేవాళ్లం. రైల్వేగ్రౌండ్, మున్సిపల్ స్టేడియంలలో వాకింగ్, జాగింగ్ చేసేదాన్ని. సన్నగా కాదు గానీ కరెక్ట్ ఫిజిక్ వచ్చేసింది. పెళ్లి, పిల్లాడు... మళ్లీ ఒబెసిటీ... తక్కువ వయసులోనే పెళ్ళై పిల్లాడు పుట్టాడు. బరువేమో 90 కిలోలు.. నాకు నేనే అన్‌హెల్దీగా కనపడ్డా. వర్కవుట్స్ స్టార్ట్ చేశాను. ఆర్నెల్లు ఒంటిమీదే ధ్యాస. అన్ని వ్యాయామాలు చేశా. వారానికి 1, 2 కిలోల చొప్పున బరువు తగ్గుతూ 60 కిలోలకు వచ్చేశా. అమెరికాలో ఉన్నప్పుడు ఫొటోగ్రాఫర్ ఫ్రాంక్ ప్రోద్బలంతో ఫొటో షూట్ చేశాం. ఆ ఫొటోలకు వచ్చిన రెస్పాన్స్‌తో ఇన్స్పైర్ అయ్యి బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్నా. మిసెస్ ఇండియా ప్లానెట్ గెలుచుకున్నాను. వర్కవుట్ రొటీన్ ఇదీ... ఉదయం 10 నుంచి 11గంటల వరకూ వర్కవుట్ సెషన్. యోగా స్ట్రెచెస్, యాబ్స్‌కి సంబంధించినవి చేస్తా. డెలివరీ అయ్యాక పొట్ట జారిపోతుంది కదా. మజిల్ టోన్ అవడానికి క్రంచెస్ బాగా చేసే అలవాటు కంటిన్యూ అవుతోంది. కేలరీస్ బర్న్ అవ్వడానికి బెస్ట్ అయిన క్రాస్ ట్రైనర్ బాగా ఇష్టమైన వర్కవుట్. అది 30 నిమిషాలు చేస్తా. సైక్లింగ్, స్క్వాట్స్, సైడ్ బెండ్స్, వెయిస్ట్ లిఫ్టింగ్ అన్నీ చేస్తా. కపాల భాతి, మెడిటేషన్లు కూడా సాధన చేస్తా. ఫుడ్ రొటీన్ ఇదీ... పొద్దున్నే 7గంటలకు తేనె, లైమ్ వాటర్ తాగుతా. పిల్లాడ్ని స్కూల్‌కి రెడీ చేసేసి బ్రేక్‌ఫాస్ట్‌గా చిన్న కప్పుతో ఓట్స్ లేదా 3 వైట్ ఎగ్స్, బాదంపప్పులు 10 తింటాను. లేదా స్క్రాంబుల్డ్ ఎగ్స్ గాని, బనానాలో స్కిమ్డ్ మిల్క్, ఓట్స్ వేసి గాని తీసుకుంటా. ఫంక్షన్లకు వెళితే తప్ప రైస్ తీసుకోను. ప్రొటీన్ బార్స్ బాగా తీసుకుంటా. వర్కవుట్ తర్వాత గ్రీన్ టీ తప్పనిసరి. మధ్యాహ్నం భోజనంగా ఒంటి గంటకు గ్రిల్డ్ చికెన్ లేదా వెజ్ కర్రీతో 3 రోటీలు, సాయంత్రం 4 లేదా 5గంటలకు బిగ్ బౌల్‌తో ఫ్రూట్స్, రాత్రి 7.30లోగా ప్రొటీన్ బార్, లేదా ఓట్స్, క్వినోవా ఉంటుంది. ఒక గ్లాస్ బట్టర్ మిల్క్ తాగుతా. ఆదివారం డైట్‌కి హాలిడే. చాక్లెట్ ఐస్‌క్రీమ్స్‌తో సహా నచ్నినవన్నీ టేస్ట్చేస్తా. -
అధ్వానంగా డైట్, సీటీఈ కాలేజీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కాలేజీలు అధ్యాపకుల్లేక అధ్వానంగా తయారయ్యాయని, బోధన దెబ్బతిందని ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్), కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈ) కాలేజీల ప్రిన్సిపాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా శిక్షణ కాలేజీల పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ జాయింట్ రివ్యూ మిషన్ ప్రతినిధులు శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ఉపాధ్యాయ విద్యా కాలేజీల ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి అధికారులతో సమావేశమయ్యారు. కాలేజీల్లో పరిస్థితి, బోధన, బోధనేతర సిబ్బంది కొరత, వసతులు తదితర అంశాలపై చర్చించారు. అయితే అధ్యాపకుల నియామకాలు లేక డైట్, సీటీఈల్లో బోధించేవారు లేకుండా పోయారని ప్రిన్సిపాళ్లు పేర్కొనట్లు తెలిసింది. పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని, భవిష్యత్తులో ఉపాధ్యాయులయ్యే అభ్యర్థులకే బోధించే వారు కరువయ్యారని వివరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేంద్ర జాయింట్ రివ్యూ మిషన్ (జేఆర్ఎం) బృందం జిల్లాల్లో పర్యటించి కాలేజీల పరిస్థితిని తెలుసుకోనుంది. ఇందులో భాగంగా ఈనెల 12న కరీంనగర్, 13వ తేదీన వరంగల్ జిల్లాల్లోని డైట్, సీటీఈలను సందర్శించే అవకాశం ఉంది. జేఆర్ఎం బృందానికి సమస్యల స్వాగతం రాష్ట్రంలో 10 జిల్లా ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థ (డైట్)లు, 3 బీఎడ్ కాలేజీలు, ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ (ఐఏఎస్ఈ) ఉన్నాయి. వాటిల్లో 375 మంజూరైన పోస్టులు ఉండగా, 77 పోస్టుల్లోనే అధ్యాపకులు ఉన్నారు. మరో 298 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. ఇక ఎస్సీఈఆర్టీలోనైతే 32 పోస్టులు ఉంటే 27 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం ఒక్క ప్రొఫెసర్, ముగ్గురు లెక్చరర్లు, తాత్కాలిక సిబ్బందితో పరిశోధనలను మమ అనిపించేస్తోంది. హైదరాబాద్‌లోని డైట్లో ప్రిన్సిపాల్ సహా 30 మంది అధ్యాపకులు పని చేయాల్సి ఉండగా ఒక్కరూ లేరు. ఇన్చార్జి ప్రిన్సిపాల్, తాత్కాలిక సిబ్బందితోనే ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేశామనిపించేస్తున్నారు. ఆదిలాబాద్ డైట్లో 24 మంది పని చేయాల్సి ఉండగా ఒక్కరూ లేరు. మెదక్ డైట్లో 30 మంది ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురే పని చేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అయితే ఐదుగురు చొప్పున అధ్యాపకులతో డైట్లు కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్‌లోని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కాలేజీలో ఒక్కరే ఉండగా, మహబూబ్‌నగర్ బీఎడ్ కాలేజీలో నలుగురు, వరంగల్ బీఎడ్ కాలేజీలో ఆరుగురే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. ఇక ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ వర్సిటీల్లోని బీఎడ్ కాలేజీల్లోనూ పోస్టుల భర్తీని పట్టించుకున్న వారు లేరు. ప్రభుత్వ కాలేజీల్లో అధ్యాపకులు ఉన్నదే అరకొర అయితే అందులోనూ 19 మంది అధ్యాపకులు ఉప విద్యాధికారిగా డిప్యూటేషన్లపై కొనసాగుతున్నారు. -
పీచు తింటే పీస్ ఉంటుంది
మన డైట్లో పీచు పదార్థాలు ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొబ్బరి పీచు తీసుకుని గిన్నెల్లో జిడ్డు తోమేసినట్టు... పీచు పదార్థం కడుపు అనే గిన్నెని శుభ్రం చేసేస్తుంది. ఫన్నీ థింగ్ ఏంటంటే... పీచు పదార్థాల్లో పోషక విలువలు తక్కువ, పీచు ఎక్కువ ఉన్నా... శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి, అనారోగ్యాల నుంచి కాపాడటానికి... చాలా విలువలున్నాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చెయ్యడానికి, డయాబెటిస్‌ని దూరంగా ఉంచడానికి బరువు తగ్గించడానికి... ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అంతేకాదు... మలబద్ధకం వల్ల వచ్చే బుద్ధి బద్ధకాన్నీ ఫ్లష్ చేసేస్తుంది. అందుకే... పీచు తినండి. పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోండి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్... ఇలాంటి పోషకాలన్నీ శరీరానికి తప్పనిసరిగా తగిన మోతాదుల్లో అవసరమే. ఆహారంలో ఇవన్నీ ఉన్నా, పీచుపదార్థాలు తగినన్ని లేకుంటే మాత్రం ఆరోగ్యం వికటించి గుండె పీచు... పీచుమనడం ఖాయం. ఇంతకీ ఈ పీచుపదార్థాలేమిటి? ఇవేమైనా శక్తినిస్తాయా? కండబలాన్నిస్తాయా? గుండెబలాన్నిస్తాయా? ఎందుకు వీటిని తీసుకోవాలి... అనుకుంటున్నారా? నిజమే! ఇవి తక్షణమే శక్తినివ్వవు. కండబలాన్నీ, గుండెబలాన్నీ ఇవ్వవు. ఇతర పదార్థాల్లా కనీసం జీర్ణమైనా కావు. అయినా, మన ఆరోగ్యం సజావుగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. పీచుపదార్థాలే లేకుంటే, మనం తిన్న ఆహారంలో జీర్ణమైపోయినవి జీర్ణమైపోగా, మిగిలిన వ్యర్థాలు బయటకుపోయే వీలే ఉండదు. కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపాలంటే పీచుపదార్థాలను తీసుకోక తప్పదు. కరిగేవీ... కరగనివీ... ఆహారంలోని పీచుపదార్థాలను నాన్-స్టార్చ్ పాలీశాచరైడ్స్ (ఎన్ఎస్పీ) అంటారు. ఇవి శాకాహార పదార్థాల్లో ఉంటాయి. వీటిలో సెల్యులోజ్, సెమీసెల్యులోజ్, పెక్టిన్స్, లిగ్నిన్స్, గమ్స్, మ్యూకిలేజెస్, బీటా-గ్లుకేన్స్ వంటి రకరకాల పీచుపదార్థాలు ఉంటాయి. అయితే, వీటిని స్థూలంగా నీటిలో కరిగే పీచుపదార్థాలు, నీటిలో కరగని పీచుపదార్థాలుగా విభజిస్తారు. నీటిలో కరిగే పీచుపదార్థాలు నీటిలో కలిసిన తర్వాత జెల్‌లాంటి మెత్తని పదార్థంగా మారుతాయి. ఇవి రక్తపోటును అదుపు చేయడంలోను, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలోను ఉపయోగపడతాయి. ఓట్స్, బీన్స్, వేరుశెనగలు, ఆపిల్స్, పుల్లని పండ్లు, క్యారట్లు, బార్లీ వంటి వాటిలో కరిగే పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇక నీటిలో కరగని పీచుపదార్థాలు మన జీర్ణకోశంలోని వ్యర్థాల కదలికకు దోహదపడతాయి. ఇవి మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. మలబద్ధకంతో బాధపడేవారికి నీటిలో కరగని పీచుపదార్థాలు చాలా ఉపయోగపడతాయి. పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజలు, బీన్స్, క్యాలీఫ్లవర్, బంగాళదుంపలు వంటి కూరగాయల్లో నీటిలో కరగని పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్, బీన్స్ వంటి శాకాహార పదార్థాల్లో రెండురకాల పీచుపదార్థాలూ ఉంటాయి. శరీరానికి పీచుపదార్థాలు పుష్కలంగా అందాలంటే రకరకాల శాకాహార పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. పులిసి మెలిసి... ఆహారంలో కలిసిమెలిసి పేగుల్లో ప్రయాణించే కొన్నిరకాల పీచుపదార్థాలు జీర్ణకోశంలోని బ్యాక్టీరియా ప్రభావంతో పులుస్తాయి. ఇలాంటి పులిసే పీచుపదార్థాలు ఎక్కువగా పళ్లు, కూరగాయలు, గింజలు, ఓట్స్ వంటి పదార్థాల్లో ఉంటాయి. పులిసే పీచుపదార్థాలు జీర్ణకోశంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కాపాడతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొలెస్టరాల్ స్థాయిని కాపాడటంతో పాటు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం నిలకడగా ఉండేలా దోహదపడతాయి. వీటికి భిన్నంగా గోధుమలు, ఓట్స్, బార్లీ వంటి పొట్టుధాన్యాల్లో ఉండే పీచుపదార్థాలు పెద్దగా పులవవు. అయితే, ఇవి మలబద్ధకాన్ని నివారించడానికి గణనీయంగా దోహదపడతాయి. రెసిస్టెంట్ స్టార్చ్ రెసిస్టెంట్ స్టార్చ్... ఇది దాదాపు పిండిపదార్థం. దీనిని పూర్తిస్థాయి పీచుపదార్థంగా పరిగణించరు. అయినా, ఇది కూడా పీచుపదార్థం తరహాలోనే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు దోహదపడుతుంది. పొట్టుధాన్యాలు, గింజలు, అరటికాయలు, బంగాళదుంపలు, పప్పులలో రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది. రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణకోశంలో ఉండే బ్యాక్టీరియా ప్రభావం వల్ల ఫ్యాటీయాసిడ్స్‌గా మారుతుంది. ఈ ఫ్యాటీయాసిడ్స్ రక్తంలో కలిసి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇదీ మేలు పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా కాపాడుకోవచ్చు. కొలోన్ కేన్సర్ వంటివి రాకుండా చూసుకోవచ్చు. పులిసేరకానికి చెందిన పీచుపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. వీటివల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీటిలో కరగని పీచుపదార్థాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని అదుపు చేస్తాయి. ఫలితంగా టైప్-2 డయాబెటిస్ సోకే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తాయి. పీచుపదార్థాలను పుష్కలంగా తీసుకుంటే, త్వరగా కడుపు నిండినట్లవుతుంది. చాలాసేపటి వరకు ఆకలి వేయదు. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే, శరీరంలో అనవసరపు కొవ్వుచేరే అవకాశాలు దాదాపు ఉండవు. పీచు ప్రణాళిక చాలాకాలంగా పీచుపదార్థాలు దాదాపు లేని ఆహారం తినేవాళ్లు అకస్మాత్తుగా ఒకేసారి పుష్కలంగా పీచుపదార్థాలతో కూడిన ఆహారం తినడం ప్రారంభిస్తే, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అలాంటి వాళ్లు తమ ఆహారంలో పీచుపదార్థాల మోతాదును పెంచుకుంటూ పోవాలి. రోజుకు ఐదుగ్రాముల పీచుపదార్థాలు అదనంగా అందేలా, ప్రతిరోజూ పెంచుకుంటూ పోతే, వారం రోజుల్లోగా తగినన్ని పీచుపదార్థాలు ఆహారం ద్వారా తీసుకోవడం అలవాటవుతుంది. పీచు పదార్థాలను సప్లిమెంట్ల ద్వారా తీసుకునే బదులు సహజసిద్ధమైన ఆహార పదార్థాల ద్వారానే తీసుకోవడం మంచిది. సగటున రోజుకు పాతిక గ్రాముల పీచుపదార్థాలు అందేలా చూసుకోవాలంటే, ఇలాంటి ఆహార ప్రణాళికను అనుసరిస్తే చాలు... ఉదయం చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం, ఏదైనా ఒక పండు 5 గ్రాములు మధ్యాహ్నం మల్టీగ్రెయిన్ చపాతీ, బ్రౌన్‌రైస్,ఆకుకూరలు, కూరగాయలతో 5 గ్రాములు సాయంత్రం మొలకెత్తిన గింజలు, ఉడికించిన రాజ్మా, శనగలు వంటివి, వెజిటబుల్ సలాడ్ 5 గ్రాములు రాత్రి మల్టీగ్రెయిన్ చపాతీ, ఆకుకూరలు, కూరగాయలతో... 5 గ్రాములు ఏవైనా పళ్ల ముక్కలు ఒక కప్పు లేదా ఫ్రూట్సలాడ్ 5 గ్రాములు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో 7 గ్రాముల వరకు పీచు పదార్థాలు ఉంటాయి. రోజువారీ ఆహారంలో పీచుపదార్థాలు తగ్గినట్లయితే, అవిసెగింజలను తీసుకోవచ్చు. వీటిని నేరుగా లేదా మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. పీచు ఫ్యాక్ట్స్ మాంసాహారంతో పోల్చితే శాకాహారంలో పీచు ఎక్కువ. కొన్ని ప్రత్యేక చికిత్సలలో తప్పించి, పీచును ఆహారం ద్వారా మాత్రమే పొందాలి. ఆరోగ్యరక్షణకు తోడ్పడే గ్జెనో బయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు, సైటో ఈస్ట్రోజన్లు పీచునుండి లభిస్తాయి. ఫైబర్ టిప్స్ భోజనం చేశాక ఏదైనా ఒక పండు తినండి. తొక్కతోపాటు తినగలిగే పండు ఏదైనా దానిని తొక్కతో పాటే తినండి. ఆహారంలో కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఒకే రకం ఆకుకూరలు, కాయగూరలు కాకుండా వేర్వేరు రకాలు, పండ్లు తీసుకోండి. హోల్‌మీల్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోండి. - సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: సుజాతా స్టీఫెన్, సీనియర్ న్యూట్రిషనిస్ట్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
కార్డియాలజీ కౌన్సెలింగ్
మంచి జీవనశైలితో గుండెపోటును నివారించలేమా? క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, మంచి ఆహారం మాత్రమే తీసుకోవడం, వంటి మంచి జీవనశైలి పాటించడం వల్ల ఆరోగ్యానికి ఒనగూరేదేమీ లేదనీ, కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటూ, చాలా ఆరోగ్య నియమాలు పాటించేవారికి కూడా హార్ట్ఎటాక్స్ వస్తుంటాయనీ, కాబట్టి నిశ్చింతగా మనసుకు తోచింది తిని, తాగి, ఆనందించడం వల్లనే ఆరోగ్యం బాగుంటుందని ఇటీవలే తాను చదివానని వాదిస్తున్నాడు. అలా ఆనందంగా ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందనే అతడి వాదన. ఒక డాక్టర్‌గా మీ అనుభవంతో అతడి వాదన గురించి మీరేమంటారు? - సుధాకర్‌రావు, కరీంనగర్ క్రమబద్ధమైన జీవితాన్ని పాటించలేనివారు, స్వీక క్రమశిక్షణతో ఉండలేనివారు తమ సౌలభ్యం కోసం కొన్ని వాదనలు చేసినంత మాత్రాన మంచి జీవనశైలీ మార్గాల గొప్పదనం తగ్గదు. కానీ అతడు చెప్పినట్లుగా సంతోషంగా ఉండటం, ఆనందంగా జీవించడం, ఎలాంటి ఒత్తిడినీ మనసు మీదికి తీసుకోకపోవడం అనే మాట మాత్రం వాస్తవం. దీనికి మంచి ఆరోగ్యనియమాలు తోడైతే మరింత ఉపయోగమే గానీ, నష్టం ఉండదు. మంచి ఆరోగ్యనియమాలు పాటించడం, అత్యుత్తమమైన జీవనశైలి మార్గాలను అనుసరించడం, క్రమం తప్పక వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయంపై 11 ఏళ్ల పాటు ఓ అధ్యయనం చేశారు. మంచి జీవనశైలి (అంటే మంచి ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం) వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయన్న విషయాన్ని శాస్త్రీయంగా పరిశోధించి, మనకు అందించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. {Mమం తప్పకుండా (వారానికి కనీసం 5 రోజులపాటైనా రోజుకు 45 నిమిషాల చొప్పున) వ్యాయామం చేయడం వల్ల 30 శాతం గుండె జబ్బులు నివారితమౌతాయి. జంక్‌ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ లాంటివి మానేసి కేవలం మంచి పోషకాలు ఉండే ఆహారాలు స్వీకరించడం, వేళకు తినడం వంటి నియమాలు పాటించడం వల్ల 18 శాతం గుండెజబ్బులను నివారించవచ్చు. స్థూలకాయం లేకుండా చూసుకోవడం, నడుము చుట్టుకొలత 37 అంగుళాల లోపే ఉంచుకోగలిగితే 12% గుండెజబ్బులను నివారించవచ్చు. ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ, పై నియమాలు పాటిస్తే 80 శాతం గుండెజబ్బులను సమర్థంగా నివారించవచ్చు. అయితే ఈ నియమాలను కేవలం ఒక శాతం మంది వ్యక్తులు మాత్రమే పాటిస్తున్నారని అదే అధ్యయనంలో తేలింది. మీరు స్వీయనియంత్రణతో, క్రమశిక్షణతో ఉంటూ, ఆనందంగా కూడా ఉండగలిగితే అది గుండెజబ్బుల విషయంలోనే కాకుండా, అనేక వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్ -
జింకు ఎక్కువైతే కిడ్నీలో రాళ్లు..
మన ఆహారంలో జింకు కీలక పోషక పదార్థమనే సంగతి తెలిసిందే. ఆహారంలో జింకు తక్కువైతే ఎదుగుదల లోపాలు, వెంట్రుకలు రాలడం, రోగ నిరోధక శక్తి క్షీణించడం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం, చర్మ ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయనే విషయం కూడా చాలామందికి తెలిసిందే. అయితే, అవసరమైన మోతాదు కంటే జింకు ఎక్కువైతే కిడ్నీల్లో క్రమంగా రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి తక్కువగా నీరు తాగడం, ఉప్పు, చక్కెర మితిమీరి వాడటం, వ్యాయామం లేకపోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు ఉందంటున్నారు. కాల్షియం సహా ఇతర ఖనిజాలతో జింకు కలిసిపోయి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతోందని కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. -
రక్త పోటు... హెల్త్‌కి చేటు
ఇటీవల మన మారుతున్న జీవనశైలి, మనం అనుభవిస్తున్న వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఉద్వేగాలు, మనం తింటున్న ఆహారం... ఇవన్నీ కలగలసి మనకు తెలియకుండానే రక్తపోటును పెంచేస్తున్నాయి. సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు రూపంలో మనకు ఉండాల్సిన బీపీ కొలత 120/80 మాత్రమే. కానీ అనేక అంశాలు దీన్ని ప్రభావితం చేస్తుండటంతో మనకు రక్తపోటు పెరుగుతుంది. కానీ ఆ విషయమే మనకు తెలియదు. దాంతో రక్తపోటు మన దేహంలోని అవయవాన్నైనా దెబ్బతీయవచ్చు. మెదడునూ, నాడీవ్యవస్థనూ, కళ్లను, గుండెనూ, మూత్రపిండాలను... ఇలా చాప కింది నీరులా అది దేన్ని దెబ్బతీసినా ఆ పరిణామాలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నేడు ప్రపంచ హైపర్‌టెన్షన్ దినం సందర్భంగా మనం అలాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండటం ఎలాగో చూద్దాం రండి! దేశంలో రక్తపోటు తీవ్రతను గమనించారా? ఇటీవలే ‘పబ్మెడ్’లో ప్రచురితమైన వివరాల ప్రకారం 33 శాతం మంది నగరవాసులూ, 25 శాతం మంది పల్లెవాసులూ హైబీపీతో బాధపడుతున్నారు. కానీ చిత్రమేమిటంటే... ఈ సంఖ్యలోనూ తాము రక్తపోటుతో బాధపడుతున్నా తమకు ఆ కండిషన్ తెలిసిన వారు చాలా తక్కువ. అంటే పల్లెల్లో రక్తపోటుతో బాధపడుతున్నవారిలో 25 శాతం మందికి తమకు హైబీపీ ఉందని తెలిస్తే, పట్టణాల్లో అవగాహన ఒకింత ఎక్కువ కావడం వల్ల అది 38 శాతం. అయినా మిగతావాళ్లందరికీ తామెంత ప్రమాద స్థితిలో ఉన్నారో తెలియనే తెలియదు. ఒత్తిడే ప్రథమ శత్రువు... హైబీపీ రావడానికి ప్రధాన కారణం... మనం జీవితంలో అనుభవించే ఒత్తిడే. ఇటీవల ఒత్తిడి మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది వృత్తిపరమైనదే అయినా, కుటుంబపరమైన కారణంగా ఉద్వేగభరితమే అయినా, మానసిక-శారీరకమైన అన్ని కారణాలూ హైబీపీ వైపునకే దారితీస్తున్నాయి. ఫలితంగా గుండెజబ్బులూ, పక్షవాతాలూ, మూత్రపిండాలు పనికిరాకుండా పోవడం, చివరగా ఒక దశలో మృత్యువు... ఇలా అన్ని అనర్థాలకూ హైబీపీ కారణమవుతోంది. హైబీపీని అనుమానిస్తుంటే ఈ పరీక్షలు చేయించుకోండి... పూర్తిస్థాయి మూత్ర పరీక్ష ( కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) హీమోగ్లోబిన్ పాళ్లు రక్తంలో పొటాషియమ్ స్థాయి బ్లడ్ యూరియా అండ్ క్రియాటిన్ లెవెల్స్ ఈసీజీ కిడ్నీ సైజ్‌ను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ అబ్డామిన్ పరీక్ష రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకునే రాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్ష మరికొన్ని ప్రత్యేక పరీక్షలు : అత్యధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో తెలుసుకోడానికి మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరం. అవి... 24 గంటలలో మూత్రంలో పోయే ప్రోటీన్లు, క్రియాటిన్ పాళ్లు తెలుసుకునే పరీక్ష (మూత్రంలో పోయే ప్రోటీన్ల సంఖ్యను ఇటీవల కేవలం ఒక శాంపుల్తోనే తెలుసుకునే పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి) కిడ్నీ బయాప్సీ మూత్రపిండాల్లోని రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ రీనల్ యాంజియోగ్రామ్. ప్రత్యేక పరీక్షలు ఎవరికి అవసరం ఈ పరీక్షలన్నీ అందరికీ అవసరం కాకపోవచ్చు. కానీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటున్నప్పుడు ఎప్పుడూ అది 120 / 80 కంటే ఎక్కువే ఉంటున్నవారికీ కుటుంబ చరిత్రలో రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి డయాబెటిస్ పేషెంట్లు అందరికీ కాళ్లలో, పాదాల్లో వాపు వస్తున్నవారికీ రక్తపోటు అదుపు చేయడానికి రోజూ రెండు కంటే ఎక్కువ మందులు ఉపయోగిస్తున్నవారికీ ముప్ఫయి ఏళ్ల వయసు రాకముందే రక్తపోటు వచ్చిన వారికి, రక్తపోటు కనుగొని ఐదేళ్లు దాటిన వారికి తీవ్రమైన తలనొప్పి వస్తున్నవారు, రక్తపోటు పెరగడం వల్ల గుండెదడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడే వారికి పైన పేర్కొన్న పరీక్షలు అవసరం. రక్తపోటు నివారణ ఇలా... ఒత్తిడిని గణనీయంగా తగ్గించుకోండి రోజూ 7-8 గంటల పాటు నిద్రపోండి ఆహారంలో ఉప్పు పాళ్లను గణనీయంగా తగ్గించండి ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఉప్పు ఎక్కువగా వాడే బేకరీ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి టాబ్లెట్లూ (ఓవర్ ద కౌంటర్ తీసుకుని) వాడకండి. రక్తపోటు వల్ల వచ్చే అనర్థాలు గుండెపోటు రావడం, గుండె ఫెయిల్యూర్ కిడ్నీ దెబ్బతినడం పక్షవాతం ఆయుఃప్రమాణం (లైఫ్ స్పాన్) తగ్గడం కిడ్నీ దెబ్బతింటే డయాలసిస్ వంటివి చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియలు కావడంతో పాటు దాత దొరకడమూ చాలా కష్టం. పై అంశాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రక్తపోటు ఉన్నవారు తమ హైబీపీని అదుపులో ఉంచుకోడానికీ, ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మంచి జీవనశైలిని పాటించాల్సిన అవసరం ఉంది. ఆహారంతోనే రక్తపోటు నియంత్రణ ‘డ్యాష్’ అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాల్సింది. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియువూవళిని ’డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లకు పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా ఇవ్వాలి. వాటిలో పొటాషియుమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి ఆ ఆహారం తీసుకోవడం ప్రధానం. అలాగే వాళ్లకు క్యాల్షియుం కూడా అవసరం. అరుుతే ఇందుకోసం వాళ్లు కొవ్వు పాళ్లు (వెన్నపాళ్లు) తక్కువగా ఉన్న పాలూ, పాల ఉత్పాదనలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఉప్పు పాళ్లను తగ్గించాలి. బరువు పెరక్కుండా చూసుకోవాలి. హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానంలోనూ (లైఫ్స్టైల్లో) వూర్పులు విధిగా పాటించాల్సి ఉంటుంది. అంటే... ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ఆపేయూలి. బరువు పెరగకుండా శారీరక కార్యకలాపాలు (ఫిజికల్ యూక్టివిటీస్) ఉండేలా చూసుకోవాలి. డాక్టర్ పి. రాజేంద్రకుమార్ జైన్ డెరైక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆహారంపై 10 అపోహలు... వాస్తవాలు
మనం రోజూ తినే ఆహారం గురించి మనకు తెలిసిన విషయాలు తక్కువ. పైగా అందులోనే బోలెడన్ని అపోహలూ, తప్పుడు అభిప్రాయాలు. మనం రోజూ తినే ఆహారంపై ఉన్న అపోహలు తొలగించుకొని, వాస్తవాలు తెలుసుకుందాం. అపోహ: బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుంది. వాస్తవం: బాగా పక్వానికి వచ్చిన బొప్పాయి పండును తినడం గర్భవతులకు మేలు చేస్తుంది. కానీ పూర్తిగా పండని, లేదా బాగా పచ్చిగా ఉన్న బొప్పాయిలో ‘పపాయిన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ గర్భసంచిని ముడుచుకుపోయేలా ప్రేరేపించి కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసేలా చేయవచ్చు. అందుకే గర్భవతులు పచ్చికాయ తినకూడదు. అపోహ: గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ తప్పదా? వాస్తవం: పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉండే మాట వాస్తవమే. ఒక గుడ్డులో 211 మి.గ్రా. ఉంటుంది. కొలెస్ట్రాల్ మోతాదులు ఎంతగానో మించితేనే అప్పుడవి రక్తప్రవాహానికి అడ్డుపడతాయి. అంతేగానీ ఒక గుడ్డులో ఉన్న పచ్చసొనకు రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పరిచేంత కొవ్వు ఉండదంటున్నారు పెన్స్ స్టేట్ యూనివర్సిటీ నిపుణులు. అపోహ: నిమ్మజాతి పండ్లు అయిన నిమ్మ, నారింజ, బత్తాయితో పాటు జామ పండు తింటే జలుబు చేస్తుంది. వాస్తవం: నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి పాళ్లు ఎక్కువ. జలుబు చేయడం అన్నది వైరస్ వల్ల జరిగే పరిణామం. దీన్ని మన వ్యాధి నిరోధకశక్తి ఎదుర్కొని అదుపు చేస్తుంది. అలా ‘విటమిన్-సి’ని సమకూర్చి ఇమ్యూనిటీ పెంచే గుణం నిమ్మజాతిపండ్లతో పాటు జామకూ ఉంది. అపోహ: గర్భవతులు పాలు తాగడం వల్ల బిడ్డ తెల్లగా పుడతాడు. కాఫీ లేదా టీ తాగితే బిడ్డ మేనిచాయ ఒకింత తగ్గవచ్చు. వాస్తవం: ఇది పూర్తిగా తప్పు. బిడ్డ రంగును కేవలం జన్యు వులు నిర్ణయిస్తాయి. గర్భవతులు పాలు తాగడం వారి ఆరోగ్యానికి మేలు చేసే విషయం కాబట్టి పాలు తాగడం మంచిదే. కాఫీ, టీ తీసుకున్నా బిడ్డ రంగు మారడు. అపోహ: కాకరకాయ తింటే డయాబెటిస్ తగ్గుతుంది. వాస్తవం: కాకరలోని పోషకాలైన కరాటిన్, మమోర్డిసిన్ అనే పదార్థాలకు రక్తంలోని చక్కెరపాళ్లను తగ్గించే సామర్థ్యం ఉంది. వాటి గింజలలో పాలీపెప్టైడ్-పీ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్థం ఉంటుంది. అయితే కేవలం కాకర తినడం వల్ల చక్కెర అదుపులో ఉండదు. డయాబెటిస్ రోగులు చక్కెరను నియంత్రించే మందులు వాడాల్సిందే. అపోహ: పాలకూర, టమాట కలిపి తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. వాస్తవం: కిడ్నీల్లో ఏర్పడే రాళ్లలో అనేక రకాలు ఉంటాయి. వాళ్లు చాక్లెట్లు వంటివీ తినకూడదు. జన్యుకారణాల వల్ల ఇలా కొన్ని పదార్థాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నవారు మినహా, మిగతా వాళ్లంతా మంచి ఆరోగ్యం కోసం పాలకూర, టమాట నిర్భయంగా, నిశ్చింతగా తినవచ్చు. అపోహ: బ్రేక్‌ఫాస్ట్‌గా టిఫిన్ కంటే పండ్లు తినడమే మేలు. వాస్తవం: రాత్రి భోజనం పూర్తయ్యాక సుదీర్ఘమైన వ్యవధి తర్వాత మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తింటాం. ఇంత వ్యవధి తర్వాత తినే ఆహారం కేవలం పండ్లూ, ఫలాలకు బదులుగా బలవర్థకమైన ఆహారం అయితే మంచిది. పైగా ఉదయం తినే ఆహారం కొంత ఘనంగా ఉండటం వల్ల రోజంతా చేసే పనులకు తగిన శక్తి వస్తుంది. అపోహ: రాత్రివేళ పెరుగు తినడం వల్ల ఉదయం విరేచనం సుఖంగా జరగదు. వాస్తవం: నిజానికి పెరుగు అనేది కడుపులోకి వెళ్లకముందునుంచే జీర్ణమవుతుండే ఆహారం. ఈ కారణం వల్ల పెరుగు ప్రీ-డెజెస్టైడ్ ఆహారం కాబట్టి రాత్రి తిన్నతర్వాత మరింత తేలిగ్గా జీర్ణమవుతూ ఉంటుంది. కాబట్టి పెరుగు తినడం వల్ల ఉదయం మలబద్దకం రాదు. అపోహ: గర్భవతులు ఎక్కువగా ద్రాక్ష తినడం మంచిది. వాస్తవం: గర్భవతులు ద్రాక్షపండ్లను తినడం అంత మంచిది కాదు. ద్రాక్ష కాస్త ఆమ్లగుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ‘హార్ట్ బర్న్’ ఎక్కువగా కనిపిస్తుంది. ద్రాక్షలో రెస్వెరట్రాల్ అనే పోషకాలు గర్భవతుల్లో హార్మోన్ల అసమతౌల్యతకు దారితీసి వారికి హాని చేయవచ్చు. అందుకే ద్రాక్ష తక్కువగా తినడం మేలు. అపోహ: ఏదైనా శస్త్రచికిత్స తర్వాత శనగపప్పు తింటే చీము పడుతుంది. వాస్తవం: శనగపప్పుకూ, చీము పట్టడానికీ ఎలాంటి సం బంధం లేదు. చీము పట్టడం గాయాలను మాన్పేందుకు తెల్లరక్తకణాలు, హానికారక బ్యాక్టీరియాతో పోరాడటం వల్ల జరిగేదే తప్ప... శనగపప్పు వల్ల కాదు. పప్పులు తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. -
బెటర్ గార్డ్
రీడర్స్ కిచెన్ తీపి చేదులు కలిస్తేనే జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది అంటారు పెద్దలు. ఆహారం కూడా అంతే. తీపితో పాటు చేదు కూడా అప్పుడప్పుడూ తగులుతూ ఉంటేనే ఆహారంలోని మాధుర్యం అర్థమవుతుంది. అయినా సరిగ్గా వండాలే కానీ... కాకరలోని చేదు కూడా జిహ్వకు తీయగానే తగులుతుంది అంటున్నారు మన పాఠకులు కొందరు. కాకరకాయతో మీదైన ఓ వెరైటీ వంటకాన్ని రాసి పంపమని కోరగానే అందరూ ఎంతో ఉత్సాహంగా పంపించారు. వాటిలో నాలుగు ఉత్తమ వంటకాలు ఈవారం ‘రీడర్స్ కిచెన్’లో మీకోసం... 1. కాకరకాయ వడలు కావలసినవి: కాకరకాయలు - 2, మైదా - అర కప్పు, కార్న్‌ఫ్లోర్ - 2 చెంచాలు, పెరుగు - అరకప్పు, ఉల్లిపాయ - 1, తరిగిన పుదీనా - 2 చెంచాలు, తరిగిన కొత్తిమీర - 2 చెంచాలు, కారం - 2 చెంచాలు, వేయించిన వేరుశనగల పొడి - 2 చెంచాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా, గరం మసాలా - అర చెంచా, ధనియాల పొడి - అర చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా తయారీ: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, గుండ్రని చక్రాల్లా కోసుకోవాలి; ఓ బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి; ఈ మిశ్రమంలో కాకరకాక ముక్కల్ని వేసి అరగంటపాటు ఉంచాలి; ఆ తర్వాత మైదా, కార్న్‌ఫ్లోర్, వేరుశనగ పొడి, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వడల పిండి మాదిరిగా కలుపుకోవాలి; స్టౌమీద బాణలి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి; వేడెక్కాక... పిండిని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించాలి. 2. కాకరకాయ టిక్కీ కావలసినవి: కాకరకాయలు (పెద్దవి) - 2, క్యారెట్ - 1, బఠాణీలు - పావుకప్పు, బియ్యపు పిండి - 1 కప్పు, బొంబాయి రవ్వ - పావుకప్పు, కొత్తిమీర - పావుకప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, ధనియాల పొడి - 1, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా తయారీ: క్యారెట్‌ను తురుముకుని పక్కన పెట్టాలి; బఠాణీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేయాలి; ఉల్లిపాయల్ని, గింజలు తీసేసిన కాకరకాయల్ని వేర్వేరుగా మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి (మరీ మెత్తగా అవ్వకూడదు); ఓ బౌల్లో ఉల్లి ముద్ద, కాకరకాయ ముద్ద, బఠాణీ-కొత్తిమీర-పచ్చిమిర్చి ముద్ద, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి; తర్వాత బియ్యపు పిండి, బొంబాయి రవ్వ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి; ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, టిక్కీల్లాగా ఒత్తుకోవాలి; స్టౌ మీద అట్ల రేకు పెట్టి, కాసింత నూనె వేసి, రెండు వైపులా ఎరుపురంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి. 3. కాకరకాయ ఉల్లికారం కావలసినవి: కాకరకాయలు - 4, ఉల్లిపాయలు (పెద్దవి) - 2, ఎండుమిర్చి - 7, జీలకర్ర - 2 చెంచాలు, నువ్వులు - 2 చెంచాలు, చింతపండు - నిమ్మకాయంత, ఉప్పు - తగినంత, నూనె - తగినంత తయారీ: ముందుగా మిక్సీలో ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి; కడాయిలో కొద్దిగా నూనె వేసి, ఉల్లిపాయ పేస్టును పచ్చి వాసన పోయేవరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి; కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, నాలుగు పాయలుగా చీలి, గింజలు తీసేయాలి; తర్వాత ఈ కాయల్లో ఉల్లిపాయ పేస్టును కూరాలి; స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి; అప్పుడప్పుడూ కలుపుతూ సన్నని మంట మీద వేయించుకోవాలి; ఎరుపురంగులోకి మారాక ఓ ప్లేటులోకి తీసుకుని, పైన నువ్వుల్ని చల్లి వడ్డించాలి. 4. కాకరకాయ పోళీ కావలసినవి: కాకరకాయలు - పావుకిలో, ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చి శనగపప్పు - 2 చెంచాలు, ధనియాలు - 2 చెంచాలు, వేయించిన కొబ్బరిపొడి - 2 చెంచాలు, వేయించిన నువ్వుల పొడి - 2 చెంచాలు, మెంతులు - 1 చెంచా, చింతపండు గుజ్జు - 4 చెంచాలు, బెల్లం తరుగు - 1 చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - తగినంత తయారీ: స్టౌమీద బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేయాలి; వేడెక్కాక గుండ్రంగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి; పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి; బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి; బ్రౌన్ కలర్ వచ్చాక కాకర కాయ ముక్కలు వేయాలి; రెండు నిమిషాలు వేయించాక... మిక్సీ పట్టిన పొడితో పాటు కొబ్బరిపొడి, నువ్వుల పొడి కూడా వేయాలి; కాస్త మగ్గాక బెల్లం తరుగు, చింతపండు గుజ్జు వేసి, కొద్దిగా నీరు పోసి కలిపి మూతపెట్టాలి; నీరు ఇగిరిపోయి బాగా దగ్గరగా అయ్యేవరకూ సన్నని మంటమీద ఉడికించుకుని దించేసుకోవాలి. కాకరలో పోషకాలు ఎక్కువే! కాకరకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. బీ1, బీ2, బీ3, సీ విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫైబర్ మెండుగా ఉంటాయి. బ్రకోలీ కంటే రెండు రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్, పాలకూరలో కంటే రెండు రెట్లు ఎక్కువ కాల్షియం, అరటిపండులో కంటే రెండు రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటాయి. ఇందులో ఉండే ‘పోలీపెప్టైడ్ పి’.. ఇన్సులిన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. అందుకే మధుమేహ రోగులు తరచుగా తినాలి. కాకరకు ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు... కడుపులో మంట, గుండె మంట, అల్సర్ల వంటివి తగ్గుతాయి. అయితే గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు కాకరను తినకపోవడం ఉత్తమం. ఇందులో ఉండే క్వినైన్, మోరోడైసిన్, సపోనిక్ గ్లైకోసైడ్స్ వంటివి పడక కొందరికి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. స్వల్ప మోతాదులో ఉండే విషపూరిత టాక్సిన్లు కడుపునొప్పి, వాంతులు, డయేరియా, నరాల బలహీనత తదితర ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి వండే ముందు ఓ పది నిమిషాలు ఉప్పునీటిలో నానబెట్టి వండుకుంటే మంచిది. - సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ రీడర్స్ కిచెన్ ఇంతవరకూ సాక్షి ‘ఫ్యామిలీ’ అందించిన వైవిధ్యభరితమైన వంటకాలను చూశారు, నేర్చుకున్నారు, వండుకుని ఆస్వాదించారు. ఇక ఇప్పుడు మీ రుచులను అందరికీ అందించే సమయం ఆసన్నమైంది. ప్రతివారం మేము అడిగే ప్రధాన దినుసుతో మీదైన వంటకాన్ని వివరంగా రాసి, దాని ఫొటోను, మీ ఫొటోను జతచేసి మాకు పంపించండి. కూర, వేపుడు, స్వీట్, స్నాక్ ఏదైనా సరే... మీరు పంపే వంటకం వినూత్నంగా, వైవిధ్యంగా ఉంటే దాన్ని కుకరీ పేజీలో ప్రచురిస్తాం. అయితే ప్రతివారం బుధవారానికల్లా మీ వంటకం మాకు అందాలి. ఈ వారం ‘పచ్చి మామిడికాయ’తో ఓ వెరైటీ వంటకాన్ని పంపించండి. అది కచ్చితంగా మీరు కనిపెట్టిన వంటకమై ఉండాలన్న విషయం మర్చిపోకండి. మా చిరునామా: రీడర్స్ కిచెన్, సాక్షి దినపత్రిక, 2-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34 ఈ మెయిల్: sakshi.cookery@gmail.com -
యవ్వనంలోనూ...అరుగుతున్నాయ్ కీళ్లు
నేడు వరల్డ్ ఆర్థరైటీస్ డే పాతికేళ్లకే కీళ్లనొప్పులు.. గ్రేటర్లో పెరుగుతున్న ఆర్థరైటీస్ బాధితులు అధిక బరువు, పోషకాహార లోపమే కారణమంటున్న నిపుణులు సాక్షి, సిటీబ్యూరో: కీళ్ల నొప్పులు ఒకప్పుడు ఆరుపదుల వయసు దాటిన వారిలోనే కన్పించేవి. కానీ మారిన జీవన స్థితిగతులు, తీసుకునే ఆహారం దృష్ట్యా ప్రస్తుతం అన్ని వయస్సుల వారిని వేధిస్తోంది. యువతే కాదు పిల్లలు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతుండడం బాధాకరం. బాధితుల్లో 70 శాతం మంది మహిళలు, 30 శాతం పురుషులు ఉంటున్నారు. 10-15 శాతం వరకు పిల్లలు కూడా ఉండటం ఆందోళనకరం. గత పదేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక బరువు, మారిన ఆహారపు అలవాట్లు, పోషకాహారలోపం, పిల్స్వాడటమే ఇందుకు కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం ‘వరల్డ్ ఆర్థరైటీస్ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. రుమటాయిడ్ ఆర్థరైటీస్ బాధితులే అధికం.. నగరంలో వివిధ రకాల కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారిపై కిమ్స్ ఆస్పత్రి రుమాటాలజీ విభాగం ఇటీవల ఓ సర్వే నిర్వహించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. గత ఐదేళ్లలో ఆస్పత్రికి వచ్చిన 10 వేల మందిపై పరిశోధన చేయగా, వీరిలో రుమటాయిడ్ ఆర్థరైటీస్ (కీళ్లనొప్పి)తో 29 శాతం, ఆస్టీయో ఆర్థరైటీస్(మోకాలు, మోచేతి కీళ్లలోని గుజ్జు అరిగిపోవడంతో వచ్చే నొప్పి)తో 17 శాతం, సొరియాటిక్ ఆర్థరైటీస్(చర్మం పొడుసుబారిపోవడం)తో 8 శాతం, లూపస్(ముఖంపై సీతాకొక చిలుకలా మచ్చలు ఏర్పడటం)తో 7 శాతం, ఎంకైలోజింగ్ స్పాండిలైటీస్(వెన్నెముఖ, నడుం వంగిపోవడం)తో 4 శాతం, ఆస్టియో పోరోసిస్(ఎముకల్లో సాంద్రత తగ్గడం వల్ల అవి విరిగిపోవడం)తో 3 శాతం, గౌట్(రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాలిబొటన వేలిపై నొప్పి)తో మరో 3 శాతం మంది బాధపడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని కిమ్స్ రుమటాలజీ విభాగాధిపతి డాక్టర్ శరత్చంద్రమౌలి వీరవల్లి వెల్లడించారు. ఆర్థరైటీస్ మహిళల్లో హృద్రోగ సమస్యలు.. నగరంలోని ఆర్థరైటీస్తో బాధపడుతున్న 800 మంది వివరాలు సేకరించి, ఆరోగ్యంగా ఉన్న మరో 800 మందితో వయసు, లింగ, నిష్పత్తి, స్మోకింగ్ , నడుం చుట్టూ కొలత, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ మెల్లటస్, బాడీ మాస్ ఇండెక్స్, బీపీ, షుగర్, ఆధారంగా అధ్యయనం చేయగా ఈ విషయం బయట పడిందని డాక్టర్ శరత్చంద్రమౌలి స్పష్టం చేశారు. 25-46 ఏళ్లలోపు వారిని ఎంపిక చేయగా వీరిలో 666 మంది మహిళలే. రుమటాయిడ్ ఆర్థరైటీస్ రోగులను సాధారణ ప్రజలతో పోలిస్తే వారిలో 2-3 శాతం కార్డియో వాస్క్యులర్ ప్రమాదం ఉన్నట్టు తేలింది. వైట్ కాలర్ ఉద్యోగులే అధికం.. శరీరానికి కనీసం ఎండ కూడా తగలకుండా 24 గంటలు ఏసీల్లో కూర్చోని పని చేస్తున్న వారు ఆర్థరైటీస్ బారినపడుతున్నారు. ఇందులో ఐటీ, అనుబంధ రంగాల్లోని ఉద్యోగులతోపాటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగులు ఉన్నారు. అదీగాక కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు సైతం కీళ్ల నొప్పుల బాధితులుగా మారుతున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. మహిళలు ఎక్కువగా లూపస్ సమస్యను ఎదుర్కొంటుంటే, పురుషులు ఎంకైలోజింగ్ స్పాండిలైటీస్తో బాధపడుతున్నారు. - డాక్టర్ శరత్చంద్రమౌలి వీరవల్లి, చీఫ్ రుమాటాలజిస్ట్, కిమ్స్ -
నీరసంతో తల తిరుగుతుంటే...
గృహవైద్యం వయసుతో నిమిత్తం లేకుండా చాలామందికి తరచుగా కానీ అప్పుడప్పుడూ కానీ, తల తిరుగుతుంటుంది. ఇందుకు ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆహారాన్ని తక్కువసార్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. అలా చేసినప్పుడు జీర్ణక్రియ సక్రమంగా జరగడంతోపాటు రోజంతా శక్తి విడుదల అవుతుంటుంది. పుల్లని పండ్లను తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో తల తిరిగినట్లుండే వాళ్లు రోజుకు రెండు బత్తాయి లేదా కమలాపండ్లను తీసుకోవాలి. అలాగే నిమ్మకాయను దగ్గర ఉంచుకుని వాసన పీలుస్తుంటే తల తిరగడం, వాంతి వస్తున్న భావన కలగవు. ఆహారంలో ఐరన్ పుష్కలంగా లభించడానికి ఆకుకూరలు, కాయగూరలు, కోడిగుడ్లు తీసుకోవాలి. అయినప్పటికీ ఐరన్‌లోపంతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ సలహాతో ఐరన్ మాత్రలు తీసుకోవాలి. దేహంలో ‘సి’ విటమిన్ లోపిస్తే ఆహారంలో తీసుకున్న ఐరన్ దేహానికి పట్టదు. కాబట్టి ఐరన్ లోపాన్ని పరిష్కరించుకోవడానికి పుల్లటి పండ్లను తినాలి. ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆహారాన్ని వేళ తప్పించరాదు. ఒకవేళ భోజనం చేయాల్సిన సమయానికి భోం చేయడం కుదరకపోతే ఒక పండు లేదా బలవర్ధకమైన చిరుతిండి అయినా తినాలి. -
వెంట్రుకలు చిట్లుతున్నాయి..
నా జుట్టు బాగా పొడిబారి, వెంట్రుక మధ్య నుంచి చిట్లుతోంది. వెంట్రుకల చివర్లు బాగా దెబ్బతిన్నాయి. ఇంట్లోనే చేసుకోదగిన చిట్కాలు చెప్పండి. - క్షేత్ర, ఇ-మెయిల్ శిరోజాలకు తగినంత ప్రొటీన్ అందనప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముందుగా ప్రొటీన్లు ఉన్న ఆహారంపై దృష్టిపెట్టండి. కోడిగుడ్డు, బాదంపప్పు ... వంటివి రోజూ తగు మోతాదులో తీసుకోండి. జుట్టు బాగా పొడిబారడం వల్ల చిట్లుతోందని గ్రహించండి. చిట్లిన వెంట్రుకలను కత్తిరించక అలాగే వదిలేయడం వల్ల చివర్లు పెరిగి, వెంట్రుక మధ్యలోకి విరిగినట్టుగా కనిపిస్తోంది. మీరు తల దువ్వుకోవడానికి కలపతో తయారుచేసిన వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనను వాడండి. మాడు నుంచి, కింది వరకు జుట్టులో చిక్కులు లేకుండా దువ్వండి. దీని వల్ల మాడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. లోహంతో తయారైన హెయిర్ పిన్స్‌ను ఉపయోగించకుండా వెడల్పాటి రబ్బర్ బ్యాండ్స్ వాడండి. మాడుకు కాకుండా వారానికి ఒకసారి పెరుగుతో జుట్టుకు ప్యాక్ వేసి, వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. ఈ జాగ్రత్తలు మీ శిరోజాలను ఆరోగ్యవంతంగా మారుస్తాయి. నాకు ముక్కుపైన మాత్రమే మొటిమలు ఎక్కువ అవుతున్నాయి. దీని వల్ల ముక్కు ఎర్రగా కనిపిస్తుంటుంది. మొటిమల లోపల పస్ కూడా ఉంటుంది. మచ్చలు కూడా ఉన్నాయి. - వి.సౌమ్య, విశాఖపట్నం మీకు ముక్కు మీద నూనె గ్రంథులు ఎక్కువ స్రవిస్తున్నాయి. శుభ్రపరుచుకోకపోవడం వల్ల మొటిమల సమస్య పెరుగుతోంది. మొటిమల్లోని పస్ తీయకండి. అలా చేస్తే మచ్చలు ఏర్పడతాయి. మార్కెట్లో డెర్మలాజికల్ స్పా రెమెడీ క్రీమ్ దొరుకుతుంది. ఈ క్రీమ్‌ను రోజుకు రెండుసార్లు రాయండి. -
పైకి తన్నే గ్యాస్..పగబట్టే ఆసిడ్!!
గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిప్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ఎంత ఆరోగ్యవంతుడికైనా... కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ... ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో వ్యక్తి కిందామీదా అయిపోతాడు. ఒక్కోసారి గ్యాస్ పైకి తన్నే సమయంలో గుండె వద్ద ఇబ్బంది కలిగిస్తూ గుండెపోటేమో అనుకునేంత ఆందోళనకు గురిచేస్తుంది. అర్జెంటుగా ఆసుపత్రికి రప్పిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే ఆసిడ్ ఉత్పత్తి జరిగి గ్యాస్‌లా పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టే ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’ (జీఈఆర్డీ) అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. సమస్య వస్తుందిలా... మనం తిన్న ఆహారం ఒక సన్నటి ఆహారనాళం (ఫుడ్ పైప్) ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఈ ఫుడ్ పైప్ సాధారణంగా తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర అంగుళాల పొడవుంటుంది. ఇది కడుపు/ఆహారకోశం (స్టమక్) లోకి దారితీస్తుంది. ప్రతి ఒక్కరికీ ఆహారనాళం, ఆహార కోశం... ఈ రెండింటి జంక్షన్లో ఆహారం పైకి వెళ్లకుండా ఒక మెకానిజం ఉంటుంది. కడుపులోకి ఆహారం వచ్చిన తర్వాత అక్కడి నుంచి జీర్ణమయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆసిడ్ పైకి ఎగజిమ్ముతున్నా, ఆహారం జీర్ణం కావడానికి తగినంత ఆసిడ్ అక్కడ లేకపోయినా, దాన్ని భర్తీ చేసేందుకు మరింత ఆసిడ్ ఉత్పన్నం అవుతుంది. దాంతో అది కడుపు కండరాల మీద ప్రభావం చూపి, అక్కడ స్టమక్ అల్సర్ (కడుపులో పుండ్లు) వచ్చేలా చేస్తుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితికి దారి తీయకపోయినా, రోజువారీ పనులకు ఆటంకంగా పరిణమిస్తుంది కాబట్టి... ఈ సమస్య రాకుండా చూసుకోవడమే మంచిది. రూల్ అవుట్ చేసుకోవాలి ఇలా... కొందరిలో ఛాతీ నొప్పిగా అనిపించి, ఆ నొప్పి ఛాతీ కింద ఉండే ఎముక కింద చిక్కుపడిపోయినట్లుగా వస్తుంటుంది. ఫలితంగా దాన్ని గుండెనొప్పితో ముడివేసి చాలామంది ఆందోళన పడుతుంటారు. ఈ నొప్పి గుండెను ఒత్తినట్లుగా అనిపిస్తుండటంతో గుండెపోటుగా పొరబడతారు. కాబట్టి ఈ రెండింటి లక్షణాలూ చూసి అది గుండెపోటు లేదా యాంజైనా కాదని నిర్ధారణ చేసుకోవడం ప్రధానం. కడుపులో అల్సర్స్‌కు మరో కారణం... కడుపు కండరాల్లో హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆసిడ్స్ ఎక్కువగా స్రవించడం ద్వారా వచ్చే పెప్టిక్ అల్సర్స్‌కు ఈ బ్యాక్టీరియా కూడా ఒక కారణం. ఇలా ఆసిడ్ పైకి చిమ్మే వారిలో హెచ్.పైలోరీ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడం అవసరం. ఒకవేళ ఉంటే వారికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. జీఈఆర్డినీ ప్రేరేపించే అంశాలు (రిస్క్ ఫ్యాక్టర్స్) ఆహారం తీసుకునే విధానం (ఈటింగ్ ప్యాటర్న్): తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల కడుపుపై పడే భారం కూడా తగ్గుతుంది. అయితే కొందరు చాలాసేపు ఆహారం తీసుకోకుండా, ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తినేస్తుంటారు. ఆ తర్వాత వెంటనే పక్కలకు ఒరగడం, నిద్రకు ఉపక్రమించడం చేస్తుంటారు. దీంతో గుండెలో మంట రావడానికి అవకాశం ఎక్కువ. గర్భం ధరించడం (ప్రెగ్నెన్సీ): గర్భవతులకు ‘జీఈఆర్డీ’ రిస్క్ ఎక్కువ. ప్రధానంగా ఆఖరి మూడు మాసాల్లో ఈ సమస్యకు అవకాశం ఎక్కువ. వారిలో పెరిగే పిండం ఆహార కోశానికి అవసరమైన ఖాళీని తగ్గిస్తుంది. దాంతో ఆహారం పైకి ఎగజిమ్మి గుండెలో/ఛాతీలో మంట కనిపిస్తాయి. ఇంకా... స్థూలకాయం, పొగతాగే అలవాటు, ఆల్కహాల్ దురలవాటు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా రిఫ్లక్స్‌కు కారణాలే. అయితే... పైన పేర్కొన్న ఏ ఒక్క అంశమో కాకుండా... కొన్ని సార్లు అనేక అంశాలు కలగలిసి ఈ రిస్క్‌ను పెంచుతాయి. ఇక పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం... ఈ రెండూ చేసేవారికి రిఫ్లక్స్ రిస్క్‌తో పాటు జీర్ణాశయంలో క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువని గ్రహించాలి. జీఈఆర్డీ తదుపరి పరిణామాలు సాధారణ సమస్యగా మొదలయ్యే జీఈఆర్‌డీని నియంత్రించుకోకపోతే ఇతర పరిణామాలకు కారణం కావచ్చు. అవి... జీర్ణకోశం ఒరుసుకుపోవడం (ఎరోసివ్ ఈసోఫేజైటిస్) జీర్ణకోశం ఇరుకుగా మారడం (ఈసోఫేజియల్ స్ట్రిక్చర్) బారెట్స్ ఈసోఫేగస్ ’(అంటే... క్రమంగా అది ఈసోఫేజియల్ క్యాన్సర్‌కు దారితీయడం. అయితే అదృష్టవశాత్తూ... భారతీయుల్లో ఈ కండిషన్ చాలా అరుదు). కడుపులో అల్సర్స్‌కు మరో కారణం... కడుపు కండరాల్లో హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆసిడ్స్ ఎక్కువగా స్రవించడం ద్వారా వచ్చే పెప్టిక్ అల్సర్స్‌కు ఈ బ్యాక్టీరియా కూడా ఒక కారణం. ఇలా ఆసిడ్ పైకి చిమ్మే వారిలో హెచ్.పైలోరీ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడం అవసరం. ఒకవేళ ఉంటే వారికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. సమస్యను తీవ్రతరం చేసే మందులు కొన్ని రకాల మందులు ఆసిడ్‌ను పైకి ఎగజిమ్మేలా చేస్తుంటాయి. ఉదాహరణకు నొప్పినివారణ మందులు/ఎన్ఎస్ఏఐడీ మందులు (పెయిన్ కిల్లర్స్/నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వంటివి ఆసిడ్ ఎక్కువగా పుట్టేలా చేసి కడుపులో అల్సర్స్‌ను పెంచుతాయి. వాటిని వాడాల్సి వచ్చినప్పుడు వాటి తీవ్రతను తగ్గించడానికి కొన్ని రక్షణ మందులనూ డాక్టర్లు సూచిస్తుంటారు. ఆయుర్వేదంలో పరిష్కారం ఇలా... ఇంగ్లీషులో జిఇఆర్డి అని పిలిచే ఈ వ్యాధి ఆయుర్వేదంలో అమ్లపిత్తం లక్షణాలను కలిగి ఉంటుంది. అమ్లపిత్తం తగ్గడానికి ఆయుర్వేద మార్గం ఇలా... ఆహారం: అల్పాహారమైనా, భోజనమైనా ప్రతిరోజూ నియమిత వేళల్లోనే స్వీకరించాలి. పులుపు, ఉప్పు, కారం పూర్తిగా మానెయ్యండి. తీపి పదార్థాలు, నూనె పదార్థాలు బాగా తగ్గించండి. ప్రతి రెండు గంటలకు ఒక లీటరు నీళ్లు తాగండి. అల్పాహారంలో ఇడ్లీ మంచిది. మొలకలు, గ్రీన్‌సలాడ్స్ కూడా తీసుకోండి. ఆవుపాలు, ఆవుమజ్జిగ వాడండి. బొంబాయిరవ్వ, బార్లీ, రాగులు మున్నగు వాటితో చేసిన జావ అప్పుడప్పుడూ తాగాలి. మందులు: లఘుసూతశేఖర రస (మాత్రలు): ఉదయం 2, రాత్రి 2 అవిపత్తికర చూర్ణం: మూడుపూటలా ఒక్కొక్క చెంచా (నీటితో) శుక్తిన్ (మాత్రలు ): ఉదయం 1, రాత్రి 1 గమనిక: అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతర వ్యాధులుంటే, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ప్రతిరోజూ పరగడుపున ఒక అరటిపండు తినడం ఈ సమస్యకు మంచిది. పరిస్థితిని మెరుగుపరిచే చిట్కాలు జీఈఆర్డీ కండిషన్ కనిపిస్తున్న వారు తక్కువ కొవ్వు ఉండే ఆహారాలు తీసుకోవాలి. మాంసాహారం ఇష్టమైన వారు తక్కువ కొవ్వు ఉండే చికెన్ (పౌల్ట్రీ), చేపల వంటి వైపునకు మొగ్గుచూపాలి. ఇక పాలలోనూ కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పాదనలను వాడాలి. అంటే స్కిమ్డ్ మిల్క్ వంటివి. పుల్లటి పండ్లు... అంటే నారింజ, నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, టమాటాలకు కాస్త దూరంగా ఉండాలి. సాధారణ నివారణ ప్రక్రియలు ఈ జబ్బుకు నివారణ చాలా సులభం. జీవనశైలిలో మార్పులతో దీన్ని ప్రాథమికంగా నివారించుకోవచ్చు. ఆ మార్గాలు కూడా చాలా సులభం. అవి... వేళకు తినడం, కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం, రోజూ తీసుకునే కాఫీ, టీ వంటి పానీయాలు పరిమితంగానే తీసుకోవడం, చాక్లెట్లు చాలా తక్కువగా తీసుకోవడం, ఈ జబ్బు ఉన్నట్లు గమనిస్తే ఉల్లి, వెల్లుల్లి, పెప్పర్మింట్ వంటివాటిని తక్కువగా తీసుకోవడం, పొగతాగడం, మద్యపానాన్ని పూర్తిగా మానే యడం, శీతల పానీయాలు, కోలా డ్రింక్స్ కూడా మానేయాలి. వ్యాధి నిర్ధారణ అడపాదడపా ఛాతీలో మంటగా అనిపించడం అందరిలోనూ జరిగేదే. అయితే ఈ ఇబ్బంది పదే పదే కనిపిస్తుంటే జీఈఆర్డీగా అనుమానించి డాక్టర్‌ను సంప్రదించాలి. సాధారణంగా యాంటాసిడ్స్ వాడగానే ఉపశమనం కలుగుతుంటే అది జీఈఆర్డీ అని నిర్ధారణ జరిగినట్లే. దీని ద్వారానే కొన్నిసార్లు డాక్టర్లు కొన్ని మందులు ఇచ్చి చూసే ధోరణితో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మందులు ఇస్తారు. దీనిద్వారా 80 శాతం నుంచి 90 శాతం మందిలో వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. కొందరిలో మరింత నిర్దిష్టత కోసం కొన్ని ల్యాబ్ పరీక్షలు, ఎండోస్కోపీ అవసరం కావచ్చు. గొంతులో కనిపించే లక్షణాలు చాలా అరుదుగా కొందరిలో గొంతు బొంగురుగా (హోర్స్‌నెస్) కనిపిస్తుంది. దాంతో గొంతు మారుతుంది. మాటిమాటికీ గొంతు సవరించుకుంటూ ఉండాల్సి రావడం కూడా చూడవచ్చు. మింగడంలో ఇబ్బందినీ గమనించవచ్చు. గొంతులో మంట, దీర్ఘకాలికంగా దగ్గు వంటివీ కనిపిస్తాయి. ఆసిడ్ పైకి చిమ్మడానికి కారణాలు... ఆహార సంబంధమైనవి... ఈ సమస్యకు అనేక కారణాలున్నాయి. ఉదాహరణకు మనం రోజూ తినే ఆహారంలో కొన్ని స్వాభావికంగానే ఆసిడ్‌ను పెంచేవి ఉంటాయి. దాంతోపాటు మనం చేసే పనుల్లో కూడా గుండెమంటకు దోహదం చేసేవీ ఉంటాయి. ఉదాహరణకు బరువులు లేపడం, పక్కలకు ఒరగడం, కడుపునిండా తిని, వెంటనే పడుకోవడం. మరికొన్ని ప్రధాన కారణాలు... మనం తీసుకునే ఆహారంలో కొవ్వు, ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండటం. పీచు తక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్ తీసుకోవడం. ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం శరీర (జీర్ణకోశ) నిర్మాణపరమైనవి... మన ఆహారనాళం, అన్నవాహిక లేదా జీర్ణకోశంలోకి వెళ్లే జంక్షన్లో ఒక మూత (స్ఫింక్టర్) లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్యపరిభాషలో ‘లెస్’ అని పిలుస్తారు. జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారం పైకి రాకుండా ఈ లెస్ అడ్డుపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి మెతుకులు రావడం, గ్యాస్, ఆసిడ్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ‘లెస్’ అనే ఆ నిర్మాణం సరిగా పనిచేయాలంటే కడుపు కండరాలు మృదువుగా ఉండాలి, అక్కడి హార్మోన్లు సక్రమంగా స్రవించాలి. ఒకసారి కడుపులోకి ఆహారమంతా చేరుకున్న తర్వాత ఆ స్ఫింక్టర్ పూర్తిగా మూసుకుపోవాలి. లేదంటే ఈ లెస్ అనే నిర్మాణం బలహీన పడి ఆసిడ్ పైకి ఎగజిమ్ముతుంది. ఓ విచిత్రం... ఇంకా కొనసాగుతున్న అధ్యయనం కడుపులో అల్సర్స్‌కు కారణంగా భావించే హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా... నిజానికి ఆసిడ్ ఉత్పత్తిని నియంత్రిస్తూ ఉండాలి. అలా అదనపు ఆసిడ్ పైకి చిమ్మకుండా చూసే రక్షణ బాధ్యత కూడా ఆ బ్యాక్టీరియాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ సూక్ష్మజీవులను తుదముట్టించడానికి ఇచ్చే యాంటీబయాటిక్ చికిత్స ‘రిఫ్లక్స్’ను ఇంకా ప్రేరేపిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కడుపులో అల్సర్స్‌కు యాంటీబయాటిక్ చికిత్సనే ప్రొటోకాల్‌గా గుర్తిస్తున్నందు వల్ల ఇంకా ఇదే చికిత్స కొనసాగుతోంది. అయితే హెచ్.పైలోరీ బ్యాక్టీరియా కోసం యాంటీబయాటిక్స్ ఇవ్వడం సరైనదేనా, ఇది ఆసిడ్ రిఫ్లెక్స్‌ను పెంచుతుందా అన్న అంశంపై ఇంకా అధ్య యనాలు కొనసాగుతున్నాయి. గృహవైద్యం అప్పుడే పెరుగు చిలికిన మజ్జిగ తీసుకోవడం మంచి గృహవైద్యం. తాజా మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్‌తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ-బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. రాబోయే మరో కొత్త చికిత్స రేడియో ఫ్రీక్వెన్సీ: ఒక సూది లాంటి ఉపకరణం నుంచి వెలువడే రేడియో తరంగాల ద్వారా ‘లెస్’ స్ఫింక్టర్‌లో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసి, అంతా ఆరోగ్యవంతమైన రీతిలో ఉండేలా చేస్తారు. ఇలా చేసే ప్రక్రియలో వెలువడ్డ వేడి తరంగాలు అక్కడి చెడిపోయిన కండరాలను భస్మం చేయడం లేదా అక్కడ అడ్డదిడ్డంగా పనిచేస్తున్న నరాలను కాల్చేయడం చేసి, అంతా ఆరోగ్యవంతమైన భాగాలే పనిచేసేలా ఈ ప్రక్రియ చూస్తుంది. భవిష్యత్ చికిత్సల విషయంలో రాబోయే మార్పులు ఎండోస్కోపిక్ మార్గాల ద్వారా చేసే చికిత్సలతో ఉపశమనం మాత్రమే కలుగుతుందని, లక్షణాలు మాత్రమే తగ్గుతాయని భావిస్తున్న పరిశోధకులు ఇప్పుడు మరింత ప్రభావపూర్వకమైన చికిత్సల దిశగా పరిశోధిస్తున్నారు. ఇందులో భాగంగా యాంటీ రిఫ్లక్స్ మెడికేషన్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇవి ప్రస్తుతం ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తున్న లాపరోస్కో పిక్ ఫండప్లికేషన్స్ కంటే ప్రభావవంతమైనవిగా ప్రస్తుతం కనిపించనప్పటికీ దీర్ఘకాలంలో సత్ఫలితాలనే ఇస్తాయని భావిస్తున్నారు. మరో కొత్త మార్గం ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ సూచరింగ్ రిఫ్లక్స్ సమస్యను అధిగమించడానికి మరో మార్గం వదులైన లెస్ స్ఫింక్టర్‌కు కుట్లు వేయడం. ఈ ప్రక్రియలో ఎండోస్కోపీ చికిత్సలో భాగంగా ఒక చిన్న (మీనియేచర్) కుట్టు మిషన్‌ను లెస్ స్ఫింక్టర్ వద్దకు పంపి, అక్కడ దానికి కుట్లు వేసి, టైట్ చేస్తారు. దీనివల్ల ఆహారం పైకి తన్నకుండా ఉంటుంది. ఈ మొబైల్ కుట్టుమిషన్‌ను అక్కడికి పంపే ప్రక్రియలో ఎక్కడా శరీరాన్ని కోయాల్సిన అవసరం ఉండదు కాబట్టి కుట్లూ అవసరం పడవు. అలాగే అనస్థీషియా కూడా అవసరం ఉండదు. రాత్రిపూట కనిపించే జీఈఆర్డీ నివారణ ఇలా... కొందరిలో ఈ సమస్య రాత్రిపూట ఎక్కువగా ఉండి నిద్రలేకుండా చేస్తుంటుంది. ఇలాంటి రోగుల్లో చాలామందిఅది తీవ్రమైన గుండెజబ్బుగా అనుమానించి ఆందోళన పడటమూ సాధారణమే. ఇలాంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రాత్రిపూట ఆలస్యంగా తినకూడదు. రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరం నడవాలి రాత్రిపూట చిరుతిండ్లను మానేయాలి రాత్రి నిద్రకు ముందర రెండుగంటల పాటు ఏమీ తినకూడదు. పక్కమీదకు వెళ్లగానే ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి మీ తల వైపు భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మీ పక్కను సర్దుకోండి. ఇలా రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారు వీలైతే ఒక మెత్త (దిండు)ను ఎక్కువగా పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండును తల కింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉండేలా చూసుకోవడం మంచిది. చికిత్స అన్నిటి కంటే ముఖ్యమైన నివారణ అయిన జీవనశైలిలో మార్పు తర్వాత కూడా ఫలితం కనిపించకపోతే ఆసిడ్‌ను నియంత్రించే మందులు వాడటం అవసరం. ఈ మందులు మనలో ఆసిడ్ ఉత్పత్తిని తగ్గించడం మాత్రమే కాకుండా లెస్ స్ఫింక్టర్ పనితీరును మెరుగుపరచడం, ఈసోఫేగస్, కడుపు కండరాలు సక్రమంగా స్పందించేలా / పనిచేసేలా చేస్తాయి. ఆ తర్వాత హెచ్2 బీటా బ్లాకర్స్, ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతోనూ చికిత్స చేస్తారు. ఇవి ప్రభావవంతంగా పనిచేయడానికి కనీసం 6 నుంచి 12 వారాల వ్యవధి పట్టవచ్చు. శస్త్రచికిత్స ఇక జీవనశైలిలో మార్పులు, మందులు పనిచేయకపోతే శస్త్రచికిత్స గురించి ఆలోచించాల్సి ఉంటుంది. చాలా చిన్నవయసులోనే దీర్ఘకాలిక జీఈఆర్డీతో బాధపడుతూ, జీవితాంతం మందులు వాడాల్సిన సందర్భాల్లో శస్త్రచికిత్స గురించి ఆలోచించాల్సి రావచ్చు. డాక్టర్ ఐతా శ్రీవేణు, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సిగ్నస్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్, మియాపూర్, హైదరాబాద్ - డా. విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద నిపుణులు