Dil raju
-
నిర్మాతలని టెన్షన్ పెడుతున్న అట్లీ రెమ్యూనరేషన్..
-
ఏప్రిల్‌లో గ్రాండ్‌గా ‘గద్దర్’ అవార్డులు.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ఏప్రిల్‌లో ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Dil Raju) తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికో సినిమా చొప్పున గద్దర్ అవార్డు( Gaddar Awards)ను ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది . తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత 2014 నుంచి ప్రతి సంవత్సరం బెస్ట్ ఫిల్మ్ అవార్డు 2023 వరకు ఇవ్వనున్నాం.నంది అవార్డ్స్ కు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అలాగే చిన్న చిన్న మార్పులతో గద్దర్ అవార్డ్స్ కూడా అలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. వారం రోజుల్లో అవార్డులను జ్యూరీ ఫైనల్ చేస్తుంది. గద్దర్ అవార్డు నమునా కూడా సిద్ధం అవుతోంది. ఏప్రిల్‌లో అంగరంగ వైభవంగా సినిమా అవార్డుల వేడుక నిర్వహిస్తాం. సినిమా అవార్డుల అంశాన్ని వివాదం చేయొద్దని కోరుతున్నాను. గతంలో సింహా అవార్డుల కోసం అమౌంట్ పే చేసిన వారికి ఎఫ్డీసీ నుంచి తిరిగి చెల్లింపులు అవుతాయి. పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో కూడా గౌరవ అవార్డులు ఇస్తాం’ అని దిల్ రాజు చెప్పారు. -
బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
దిల్ రాజు అండతో రెచ్చిపోనున్న రౌడీ..!
-
రీరిలీజ్ సినిమాకి 10 థియేటర్స్ ఫుల్!
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాసిక్ బ్లాక్ బస్టర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'( Seethamma Vakitlo Sirimalle Chettu). శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు(Dil Raju) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని మార్చి 7న గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రీరిలీజ్ కోసం మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు వెంకీ మామ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వెంకీ, మహేశ్‌ల బ్రో కెమిస్ట్రీని మళ్లీ థియేటర్స్‌లోనే చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 10 థియేటర్స్‌లో ఫుల్ అయిపోయాయట. రీరిలీజ్‌కి ఈ స్థాయిలో టికెట్స్ బుక్ కావడం రికార్డు అంటున్నాడు దిల్ రాజు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..మార్చి7 శుక్రవారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ చేస్తున్నాం. తొలిప్రేమ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఐదేళ్ళు సినిమా రైట్స్ మా వద్ద ఉండేవి. మాకు ఎప్పుడు డబ్బులు తక్కువ ఉన్న సినిమాని రీరిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేవి. అవన్నీ మిరాకిల్స్ డేస్. అలాగే ఇప్పుడు కూడా రీరిలీజ్ పెడితే ఆడియన్స్ చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీరిలీజ్ కి సంబధించి అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆల్రెడీ ఓటీటీ లో ఉంది. జనం చుసేశారు. అయినప్పటికీ మళ్ళీ థియేటర్స్ కి వస్తున్నారంటే.. మంచి కంటెంట్ మళ్ళీ చూద్దామని వస్తున్నారు. మహేష్ గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు థియేటర్ కి వచ్చి మళ్ళీ బ్రదర్స్ మధ్య వుండే మూమెంట్స్ ని మళ్ళీఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్స్ ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా వుంది. మంచి సినిమాలు తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారని రీరిలీజ్ లు ప్రూవ్ చేస్తున్నాయి. ఆంద్రలో డే వన్ అరవై డెబ్బై శాతం అడ్వాన్స్ బుకింగ్స్ వున్నాయి. ఫ్రైడేకి అవి ఫుల్స్ అయిపోతాయి. సుదర్శన్ 35ఎంఎం సెకండ్ డే కూడా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి. రీరిలీజ్ హ్యాపీనెస్ ఈ సినిమా ద్వారా కనిపిస్తోంది. నేనూ వెళ్లి మార్చి 7న సుదర్శన్ 35ఎంఎం లో మార్నింగ్ ఎనిమిది గంట షో చూస్తాను. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తోంది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి'అన్నారు. -
విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్.. లీక్ చేసిన దిల్ రాజు!
దిల్ రాజు(Dil Raju) నిర్మాణ సంస్థలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా బాగుందని టాక్ వచ్చినా సరే.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. కనీసం ఒపెన్సింగ్స్ రాబట్టలేకపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి దిల్ రాజు బ్యానర్లోనే మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ‘రాజావారు రాణివారు’ఫేం రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పనులు సైలెంట్‌గా ప్రారంభం అయ్యాయి. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి. కానీ వాస్తవం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఓ ఈవెంట్ పెట్టి టైటిల్ అనౌన్స్ చేద్దాం అనుకున్నారట. కానీ ఈ లోపే దిల్ రాజు సినిమా టైటిల్‌ని ప్రకటించి మేకర్స్‌కి షాకిచ్చాడు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీరిలీజ్ సందర్భంగా బుధవారం నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాల అప్డేట్స్ గురించి చెబుతూ ఆ వరుసలోనే విజయ్ దేవరకొండ చిత్రానికి 'రౌడీ జనార్ధన్' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. అయితే ఈ టైటిల్‌ని ఇంతవరకు ప్రకటించలేదనే విషయం దిల్ రాజు మర్చిపోయారు. మీడియా ప్రతినిధి ఆ విషయాన్ని గుర్తు చేయడంతో దిల్ రాజుతో పాటు మిగతావాళ్లు కూడా ఘొల్లున నవ్వేశారు. ఈ చిత్రంతో పాటు ‘బలగం’ వేణు దర్శకత్వంలో కూడా దిల్‌రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌ని ఖరారు చేవారు. -
దాన్ని అడ్డుకోవాలంటే ఓ ఉద్యమం చేయాలి: దిల్ రాజు కామెంట్స్
సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న పైరసీపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఎవరి సినిమాపై ఎఫెక్ట్ పడుతుందో వారు మాత్రమే పైరసీ గురించి మాట్లాడుతున్నారని వెల్లడించారు. పైరసీ గురించి శుక్రవారం మాట్లాడితే సోమవారానికే మర్చిపోతున్నారని అన్నారు. పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.దిల్ రాజు మాట్లాడుతూ..' ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వారే పైరసీపై మాట్లాడతారు. ఈ విషయాన్ని శుక్రవారం మాట్లాడితే.. సోమవారానికి మర్చిపోతున్నారు. దానికి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం కావాలి. ఎఫ్డీసీ ఛైర్మన్‌గా నేను లీడ్ చెస్తాను . నిర్మాతలందరు కలిసి రావాలి. డబ్బులు పోయేవి నిర్మాతలవే కాబట్టి అందరూ మేల్కోవాలి. సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నవారు కూడా ముందుకు రావాలి. నేను నిర్మాతగా, పంపిణీదారుడిగా వన్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటా. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన, నితిన్ ఎల్లమ్మ సినిమాల స్క్రిప్ట్ లు సిద్దంగా ఉన్నయి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.' అని వెల్లడించారు.కాగా.. సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న పైరసీ అనే భూతం ఎప్పటి నుంచో పట్టి పీడిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, తండేల్, విదాముయార్చి సినిమాలు సైతం పైరసీ బారినపడ్డాయి. గేమ్ ఛేంజర్ సినిమాను ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. ఈ సంఘటనపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే తండేల్ మూవీని పైరసీ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని నిర్మాత బన్నీ వాసు హెచ్చరించారు. -
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రీరిలీజ్ ట్రైలర్ విడుదల
టాలీవుడ్లో చాలా ఏళ్ల తర్వాత మల్టీస్టారర్ మూవీగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ 2013లో విడుదలైంది. అయితే, సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ మూవీ మార్చి 7న రీరిలీజ్ కానున్నడంతో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ అడ్డాల కథతో పాటు దర్శకత్వం వహించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.వెంకటేష్, మహేష్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి చేసిన సినిమా కావడంతో అప్పుట్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా ఏళ్ల తర్వాత మల్టీస్టారర్ ట్రెండ్‌కు ఈ మూవీ కొత్త ఊపిరిపోసింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 55 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో సీతగా అంజలి పాత్ర ప్రధానంగా హైలెట్ అయిందని చెప్పవచ్చు.‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రధాన విశేశాలుఈ చిత్రంలో వెంకటేష్, మహేశ్ బాబు అన్నదమ్ములుగా అదరగొట్టేశారు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటించారు. వీరికి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్, అమ్మ పాత్రలో జయసుధ మెప్పించారు. అమ్మమ్మ పాత్రలో ప్రముఖ హిందీ నటి రోహిణీ హట్టంగడి కనిపించారు.ఇందులో మహేశ్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.అప్పటిదాకా ప్రముఖ గాయని చిన్మయిచే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకున్న సమంత ఈ చిత్రం నుంచి తనే తన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.దాదాపు 20 ఏళ్ల తర్వాత నిర్మించబడిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడమే కాక ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల కలెక్షన్లను సాధించింది. మగధీర (2009), దూకుడు (2011), గబ్బర్ సింగ్ (2012) తర్వాత ఈ సినిమా అత్యంత భారీ కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది.ఈ చిత్రం 4 నంది అవార్డులను సొంతం చేసుకుంది.ఉత్తమ కుటుంబ కథా చిత్రంతో పాటు ఉత్తమ సహాయ నటుడు (ప్రకాష్ రాజ్), ఉత్తమ గేయ రచయిత (సిరివెన్నెల సీతారామశాస్త్రి-మరీ అంతగా), ప్రత్యేక బహుమతి (అంజలి) నంది అవార్డ్స్ అందుకున్నారు.2013 సైమా అవార్డ్స్: ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ గీత రచయిత (అనంత శ్రీరామ్ -సీతమ్మ వాకిట్లో) -
ఈ ఫొటోలో నలుగురు డైరెక్టర్స్.. ఎవరో కనిపెట్టారా?
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు వస్తూనే ఉంటారు. అలా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సుకుమార్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అవునా అని ఆశ్చర్యపోకండి. ఇంతకీ ఏంటా సినిమా?స్వతహాగా సుకుమార్ లెక్కల మాస్టర్. కానీ సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత వివి వినాయక్ దగ్గర 'దిల్' సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఈ మూవీ నిర్మించిన దిల్ రాజు.. సుకుమార్ ని 'ఆర్య'తో డైరెక్టర్ గా పరిచమయ్యాడు. (ఇదీ చదవండి: కథ కనిపెట్టు.. ఈ బైక్ గిఫ్ట్ పట్టు: హీరో కిరణ్ అబ్బవరం)పైన ఫొటో విషయానికొస్తే.. దర్శకుడు వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు కాకుండా మిగతా వారిలో సుకుమార్ గురించి మనకు తెలుసు. వాళ్లు కాకుండా దర్శకులు వాసువర్మ (జోష్ సినిమా), డాలీ (గోపాల గోపాల సినిమా), రచయిత వేమారెడ్డి ఉన్నారు.చాన్నాళ్ల తర్వాత 'దిల్' టీమ్ అంతా ఇలా డైరెక్టర్ వివి వినాయక్ ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. అదికాస్త వైరల్ అవుతోంది. ఇదే టైంలో వినాయక్ ఇలా అయిపోయారేంటి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?) -
మళ్లీ దిల్ - డీజే కాంబో
-
కల్ట్ దర్శకుడు.. ఏడేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా!
తెలుగులో ప్రేమకథా సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'తొలిప్రేమ', 'డార్లింగ్' కచ్చితంగా ఉంటాయి. వీటిని తీసిన దర్శకుడు కరుణాకరన్. కెరీర్ ప్రారంభం నుంచి తెలుగులోనే మూవీస్ చేశాడు. 2018 తర్వాత ఒక్క ప్రాజెక్ట్ చేయలేకపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్?)ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఇకపై కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తానని కొన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలోనే కరుణాకరన్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. తను ఎప్పుడూ తీసే ప్రేమకథా చిత్రమే ఇదని తెలుస్తోంది.దిల్ రాజు వారసుడు ఆశిష్ నే హీరోగా పెట్టి ఈ సినిమా తీయబోతున్నారని టాక్. ఆశిష్ కథ విని ఓకే చెప్పాడని, ఇంకా దిల్ రాజు స్టోరీ ఓకే చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఒకవేళ దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు ఏడేళ్ల తర్వాత మరో తెలుగు సినిమా తీసినట్లు అవుతుంది. చివరగా మెగాహీరో సాయితేజ్ తో 'తేజ్ ఐ లవ్యూ' తీశాడు కరుణాకరన్. కానీ అది ఘోరంగా ఫెయిలైంది. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
ప్రభాస్ సినిమా.. సుప్రీకోర్టులో నిర్మాతకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు రెండు వారాల పాటు స్టే విధించింది. అంతేకాక తదుపరి విచారణ వరకు దిల్ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ‘నా మనసు నిన్ను కోరే నవల‘ఆధారంగా ‘మిస్టర్ పర్ఫెక్ట్‘అనే సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న సిటీ సివిల్ కో ర్టు.. సాక్ష్యాలను పరిశీలించి 2019లో దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ జె.బి. పార్ధీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాద నలు విన్న ధర్మాసనం తదుపరి విచార ణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. అప్పటి వరకు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయానికొస్తే.. ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం 2011లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
'గేమ్ ఛేంజర్'తో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లోకి వచ్చి వెళ్లిపోయి కూడా చాలారోజులు అయిపోయింది. అయితే, ఈ సినిమాలో పనిచేసిన కొందరు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.గేమ్ ఛేంజర్ సినిమాలో పనిచేసినందుకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ గుంటూరు పోలీస్ స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ కోసం కో డైరెక్టర్‌గా పనిచేసిన స్వర్గం శివతో ఒప్పందం చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో విజయవాడ, గుంటూరు నుంచి చాలామందితో పాటు హైదరాబాద్ వెళ్లి షూటింగ్లో పాల్గొంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు చెప్పుకొచ్చారు. స్వర్గం శివ తమకు రూ.1200 వంతున ఇస్తానని ఒప్పుకొని చాలా రోజులుగా డబ్బులు ఇవ్వట్లేదని వాపోయారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు వద్దకు తీసుకెళ్లాలని మీడియాను కోరారు. ఇందులో దిల్ రాజు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆర్టిస్ట్ తరుణ్, ఇతరులు కోరారు. తమను మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా టీం తమను మోసం చేసిందని పోలీస్ స్టేషన్లో ఆర్టిస్టుల ఫిర్యాదు గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుండి హైదరాబాద్ కి 350 మంది వెళ్లామని, కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు రూ.1200 ఇస్తానని ఒప్పుకొని డబ్బులు ఇవ్వట్లేదని గుంటూరు పోలీస్ స్టేషన్లో… pic.twitter.com/39etzw3mTb— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం.. హిందీ రీమేక్?
వెంకటేశ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేయాలని చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు ప్లాన్ చేస్తున్నారని, ఈ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారనే టాక్ తెరపైకి వచ్చింది.ఈ హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్(Akshay Kumar) అయితే బాగుంటుందని ‘దిల్’ రాజు భావిస్తున్నారట. కెరీర్లో ఇప్పటికే ఎన్నో దక్షిణాది సినిమాల హిందీ రీమేక్స్‌లో నటించిన అక్షయ్ కుమార్ మరి... ఈ రీమేక్ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
Barabar Premistha : ఆకట్టుకుంటున్న ఆటిట్యూడ్ స్టార్ ‘రెడ్డి మామ’ సాంగ్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ‘రెడ్డి మామ’ అంటూ హుషారుగా సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించారు. నకాష్ అజిజ్, సాహితి చాగంటి ఆలపించగా.. ఆర్ఆర్ ధృవణ్ మంచి ఊపున్న బీట్‌ను అందించారు. ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని దిల్ రాజు మెచ్చుకున్నారు. చిత్రయూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు. త్వరలోనే రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. -
‘నారి’..ఓ మంచి ప్రయత్నం : దిల్ రాజు
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా "నారి". మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. "నారి" సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ - మహిళల గురించి ఒక మంచి కథతో "నారి" సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలాంటి మంచి ప్రయత్నం చేయడం సంతోషకరం. ఆమని గారు మావిచిగురు, శుభలగ్నం లాంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అలాగే మా సంస్థలో ఎంసీఏ, శ్రీనివాస కల్యాణం మూవీస్ లో నటించారు. "నారి" సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ఈ టీమ్ కు సజెస్ట్ చేస్తున్నా. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.నటి ఆమని మాట్లాడుతూ - ఈ రోజు మా "నారి" సినిమా ట్రైలర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. వాళ్ల బ్యానర్ లో నేను శ్రీనివాస కల్యాణం, ఎంసీఎ మూవీస్ చేశాను. అప్పటి నుంచి బిజీగానే ఉంటున్నాను. వారి బ్యానర్ లో మరిన్ని మూవీస్ చేయాలని అనుకుంటున్నా. "నారి" సినిమా మహిళల గొప్పదనం చెప్పేలా మా దర్శకుడు సూర్య వంటిపల్లి రూపొందించారు. ఈ మూవీలో ఇంతమంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన సూర్య గారికి థ్యాంక్స్. ప్రతి మహిళ చూడాల్సిన చిత్రమిది. మహిళ జీవితంలో పుట్టినప్పటినుంచి అన్నీ కష్టాలే. అది అర్థం చేసుకున్న వాళ్లు కొద్దిమందే ఉంటారు. ఈరోజు సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ మూవీ. నేను ఈ క్యారెక్టర్ లో ఎంతో ఇన్వాల్వ్ అయి నటించాను. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న రిలీజ్ అవుతున్న మా "నారి" సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు. -
‘నారి’ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ విక్టరీ వేడుక (ఫొటోలు)
-
ఓటీటీలో 'గేమ్ ఛేంజర్'.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. అయితే, సినిమా విడుదల రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కలెక్షన్ల పోస్టర్ విషయంలోనూ తప్పుడు లెక్కలు వేశారంటూ పెద్ద ఎత్తున నెట్టింట ట్రోల్ జరిగిన విషయం తెలిసిందే.సినిమా విడుదలైన నెల రోజుల్లోనే గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రం విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని డీల్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్కు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకున్న సమయం కంటే ముందే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని అమెజాన్ విడుదల చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, హిందీ వర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఐటీ ఎదుట దిల్ రాజు
-
ఐటీ ఆఫీస్‌లో ముగిసిన దిల్ రాజు విచారణ
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఎదుట విచారణలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఆయన్ను ఐటీ అధికారులు విచారించారు. ఈ మధ్య కాలంలో తన బ్యానర్ నుంచి విడుదలైన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన వ్యాపారాల అకౌంట్స్ అన్నీ అధికారులు తణిఖీలు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. విచారణ అనంతరం బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయం నుంచి దిల్ రాజు తిరిగి వెళ్లిపోయారు. అయితే, ఆయన్ను మరోసారి విచారిస్తారా..? లేదా..? అనే విషయం గురించి ఎలాంటి సమాచారం లేదు. -
ఐటీ అధికారుల ఎదుట హాజరైన నిర్మాత దిల్ రాజ్
టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఎదుట హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం సుమారు నాలుగురోజుల పాటు ఆయన ఇళ్లు, ఆఫీసులలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన వ్యాపారాలకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ అధికారులు తణిఖీలు చేశారని దిల్ రాజు కూడా చెప్పారు. అయితే, అదే సమయంలో దిల్ రాజు వ్యాపారాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఐటీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన వ్యాపారాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో తన సినిమాలకు అయిన ఖర్చు ఎంత..? ఎగ్జిబిటింగ్ లెక్కలతో పాటు మూవీ విడుదల తర్వాత వచ్చే లాభాల వ్యవహారంపై ఐటీ అధికారలు ఆరా తీయనున్నారు. సంక్రాంతి సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలను దిల్ రాజు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలోనే ఆయనపై ఐటీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. దిల్ రాజ్‌తో పాటు పలువురు నిర్మాత, దర్శకుడు ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహించింది.ఐటీ సోదాలు అంశంలో ఎవరూ ఎక్కువగా ఊహించుకొవద్దని దిల్ రాజు గతంలోనే అన్నారు. ఎలాంటి హాడావుడి లేకున్నా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో అంతా ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కొనసాగుతుంది అన్నారు. దీంతో వ్యాపారా ట్రాన్సాక్షన్సె కూడా ఆన్లైన్ జరుగుతున్నాయి అన్నారు. అయితే, ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారని ఆ సమయంలో తమ ఆడిటర్స్ వెళ్లి కలుస్తారని దిల్ రాజు తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం వారు వెళ్లినట్లు తెలుస్తోంది. -
వసంత పంచమి.. అక్షరాభ్యాసం
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే బాసర గోదావరి నదీతీరంలో భక్తులు కనిపించారు. పుణ్యస్నానాలు ఆచరించి, సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు కుటుంబ సమేతంగా బాసరకు వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించారు. సాయంత్రం కలెక్టర్ అభిలాష అభినవ్ వసంత పంచమి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ జానకీషర్మిల బందోబస్తును పర్యవేక్షించారు. కాగా, సోమవారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తులకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు. -
'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ల పోస్టర్‌పై దిల్ రాజు కామెంట్స్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, అదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ నిర్మాత దిల్ రాజుపై నెటిజన్లు కామెంట్ చేశారు. ఇదే సమయంలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే నాడు కేవలం రూ. 80 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టిందని పలు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ గురించి ఆయన రెస్పాండ్ అయ్యారు.‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయం అందుకోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పేరుతో మేకర్స్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ నిర్మాత దిల్ రాజుకు ఒక ప్రశ్న ఎదురైంది. సంక్రాంతి పండుగ సమయంలో మీరు రెండు సినిమాలు విడుదల చేస్తే.. ఒక సినిమాకు మొదటిరోజు కలెక్షన్ల వివరాలు మాత్రమే చెప్పి.. రెండో సినిమాకు చాలా పోస్టర్లతో ఆ వివరాలు చెప్పడం వెనుకున్న కారణం ఏంటి అని విలేఖరి ప్రశ్నించారు. అందుకు దిల్ రాజు కాస్త అసహనంగానే ఇలా చెప్పారు. 'ఈ విషయంలో మాకు కొన్ని బలహీనతలు ఉంటాయి. మీకు కూడా (మీడియా) తెలుసు కదా..! మళ్లీ నన్నెందుకు అడుగుతున్నారు. ప్రతి సినిమా కలెక్షన్ల వివరాలు మీ వద్దే ఉంటాయని అందరూ అంటున్నారు. ఇక నుంచి కలెక్షన్ల వివరాలు కూడా మీరే ప్రకటించండి.' అని అసహనంగా దిల్ రాజు అన్నారు. అయితే ఇదే సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా కలెక్షన్స్ పోస్టర్స్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. మేకర్స్ విడుదల చేస్తున్న కలెక్షన్ల పోస్టర్స్‌ను చూసి ప్రేక్షకులు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.pic.twitter.com/NVwAIJW0HG— Out of Commentary (@OutofContestTel) February 1, 2025 -
భీమవరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరాలు (ఫొటోలు)
-
ఐటీ సోదాలపై దిల్ రాజు స్పందన
-
ఐటీ రైడ్స్‌పై స్పందించిన నిర్మాత 'దిల్ రాజు'
టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసంలో ఐటీ అధికారుల సోదాలు దాదాపు ముగిశాయి. గత ఐదురోజులుగా ఆయన ఇళ్లు, ఆఫీసులలో సోదాలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఐటీ సోదాలు గురించి ఆయన రియాక్ట్ అయ్యారు.'ఐటీ రైడ్స్ జరిగినప్పుడు మా వద్ద రూ. 20 లక్షలు ఉన్నాయి. మా అకౌంట్ బుక్స్ అన్నీ ఐటీ అధికారులు చెక్ చేశారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇలాంటి ఐటీ సోదాలు సర్వసాధారణం. మా దగ్గర డబ్బు , డాకుమెంట్స్ తీసుకున్నారని వార్తలు వేశారు. అందులో నిజం లేదు. గత ఐదేళ్ల నుంచి నేను ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టలేదు. నా దగ్గర డబ్బు, ఆస్తి పత్రాలు వంటివి దొరకలేదు. అయితే, నా దగ్గర నుంచి రూ. 5 లక్షలు, శిరీష్ దగ్గర నుంచి రూ. 4.50 లక్షలు ఐటీ అధికారులు తీసుకున్నారు. మేము క్లీన్‌గా ఉండొచ్చు.. కానీ, మా దగ్గర డబ్బు తీసుకున్న వారు కూడా క్లీన్‌గా ఉండాలి కదా. 2008లో ఒకసారి నా ఆఫీసులో సెర్చ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరిగింది. మా అకౌంట్స్ అన్నీ చెక్ చేసిన ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు ఆశ్చర్యపోయారు. దిల్ రాజు దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేశాం. కానీ, ఇక్కడ అన్ని లెక్కలు నీట్‌గా ఉన్నాయని వారే చెప్పారు. మా అమ్మ కు సడెన్‌గా దగ్గు వస్తే హాస్పిటల్ తీసుకెళ్లాం. కానీ, హార్ట్ అటక్ అని ప్రచారం చేశారు. అందులో ఎలాంటి నిజం లేదు. సినిమా ఇండస్ట్రీలో చాలామందిపై ఐటీ రైడ్స్ జరిగాయి. నన్ను ఎవరు టార్గెట్ చేయలేదు.' అని ఆయన అన్నారు.కలెక్షన్స్ ఎక్కువ చెప్పడం తప్పే: దిల్ రాజుఐటీ సోదాలు అంశంలో ఎవరూ ఎక్కువగా ఊహించుకొవద్దని దిల్ రాజు అన్నారు. ఎలాంటి హాడావుడి లేకున్నా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో అంతా ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కొనసాగుతుంది అన్నారు. దీంతో వ్యాపారా ట్రాన్సాక్షన్సె కూడా ఆన్లైన్ జరుగుతున్నాయి అన్నారు. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయి కదా అని గుర్తు చేశారు. సినిమాల కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించటంపై ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడాతామని దిల్ రాజు పేర్కొన్నారు. ముమ్మాటికి ఈ విధానం తప్పు అని అన్నారు. అందరూ ఈ తీరు మార్చుకొవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారని ఆ సమయంలో తమ ఆడిటర్స్ వెళ్లి కలుస్తారని దిల్ రాజు తెలిపారు. -
దిల్‌రాజు వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలపై వరుసగా నాలుగో రోజూ ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. మంగళవారం నుంచి పలువురు టాలీవుడ్ నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తులు, ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ సహా పలువురి ఇళ్లలోనూ గురువారం వరకు సోదాలు జరిగాయి.దిల్ రాజు ఇంట్లో మాత్రం ఐటీ సోదాలు శుక్రవారంతో ముగిశాయి. 5 రోజుల సెర్చ్ వారెంట్‌తో ప్రారంభించిన సోదాలకు సంబంధించి శుక్రవారం దిల్ రాజు వాంగ్మూలం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని స్వా«దీనం చేసుకున్నారు. గేమ్‌ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా ఇటీవల నిర్మించిన సినిమాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది.డాకు మహారాజ్ సినిమాకు దిల్‌రాజు డి్రస్టిబ్యూటర్‌గా ఉండటంతో ఆ సినిమా కలెక్షన్లపైనా కొన్ని వివరాలు తీసుకున్నట్టు సమాచారం. అనంతరం పలు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, సినిమాలకు ఖర్చు చేసిన సొమ్ము, వచ్చిన లాభాలు వంటి అంశాలపై ఐటీ అధికారులు దిల్ రాజుతోపాటు ఎస్వీసీ ఆడిటర్, అకౌంటెంట్ వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలకు సంబంధించి వివరణ కోరినట్లు సమాచారం. సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలుసినీ ప్రముఖుల ఇళ్లలో నాలుగు రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు.. శనివారం తెల్లవారుజామున ముగిశాయి. ఈ సోదాల్లో కీలక ాడాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఎస్వీసీ ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, ఆఫీసులలో నాలుగోరోజు కూడా ఐటీ సోదాలు(Income Tax Officer) జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన ఆఫీస్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకెళ్లారు.దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళా అధికారి సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం నుంచి వారు తాజాగా సాగర్ సొసైటీలోని తన ఎస్వీసీ కార్యాలయానికి వెళ్లారు. తమ వాహనంలోనే దిల్ రాజును వారు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్వీసీ ఆఫీస్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. వారు నిర్మించిన పలు సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైడ్స్ గురించి అధికారులు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. -
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.టాలీవుడ్‌పై టార్గెట్తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్‌లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సుకుమార్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ వ్యవహారంపై దిల్‌రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు రెండోరోజూ కొనసాగాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల కార్యాలయాలు, కొందరు సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి మొదలైన సోదాలు, బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించే వారిపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అధికారులు 55 బృందాలుగా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు సాగించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. దిల్‌రాజు, ఆయన కూతురు హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లు, మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సినీ ఫైనాన్షియర్స్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఐటీ దాడులపై దిల్‌రాజు స్పందించారు. తన ఒక్కరి ఇళ్లు, కార్యాలయాల్లోనే సోదాలు జరగడం లేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తంపై జరుగుతున్నాయని తెలిపారు. -
మొత్తం ఇండస్ట్రీ పై రైడ్లు జరుగుతున్నాయి: దిల్‌రాజు
-
ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు
తన ఇంటిపై ఐటీ శాఖ అధికారుల జరుపుతున్న సోదాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)స్పందించారు. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైన మాత్రమే జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వారికి తనతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం సహకరిస్తున్నామని అని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం మొదలైన ఈ సోదాలు.. బుధవారం కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్(sukumar) ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు(IT Rids) నిర్వహించారు. . శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.వెలుగులోకి కీలక ఆంశాలు..ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లు వస్తుంది. ఈ సినిమా వారం రోజుల్లో రూ.203 కోట్లు వసూళ్లు సాధించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వచ్చిన లాభాలకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. -
డైరెక్టర్ సుకుమార్ ఇంట ఐటీ రైడ్స్
చిత్ర పరిశ్రమపై ఆదాయ పన్నుశాఖ అధికారులు గురి పెట్టారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన నిర్మాతలు, దర్శకుల ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా నేడు ఐటి సోదాలు జరుగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే మొదలైన ఈ ప్రక్రియే రెండో రోజు కూడా కొనసాగుతుంది. గత రెండు నెలల్లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.దిల్ రాజ్ కూతురు ఇంట్లో సోదాలుదిల్ రాజ్ కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆమె సమక్షంలో డిజిటల్ లాకర్లను ఐటి అధికారులు ఓపెన్ చేశారు. మరికొద్ది సేపట్లో ఆమెకు సంబంధించిన బ్యాంకు లాకర్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి హన్సితా రెడ్డి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. -
చిత్ర పరిశ్రమలో ఐటీ సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ (Income Tax Officer) అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. సంక్రాంతి రేసులో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలయ్యాయి. రీసెంట్గా మేత్రీ మేకర్స్ నిర్మించిన పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్‌లను తాజాగా ఐటీ అధికారులు విచారించారు. వారు నిర్మించిన పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను రాబట్టినట్లు ఐటీ గుర్తించింది. అయితే, వసూళ్లు తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు జరగలేదని అధికారులు కనుగొన్నారు. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను వారు పరిశీలిస్తున్నారు.నిర్మాత దిల్ రాజ్, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహ రెడ్డి , నిర్మాత శిరీష్ ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వారి నిర్మాణ సంస్థ నుంచి భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి. రెండు మూవీల ఆదాయ వ్యయాలపై ఐటీ అధికారలు విచారిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. -
'పుష్ప2, గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటనపై ఐటీ అధికారుల ఫోకస్
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ(Income Tax Officer) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.సినిమాల ఆదాయం లెక్కలపై ఫోకస్ ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్‌రాజు నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలకు అయిన ఖర్చు, వచ్చిన వసూళ్లు తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. దిల్‌రాజు ఇంటితోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను, ఐటీ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లను ఐటీ అధికారులు స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. (ఇదీ చదవండి: సైఫ్ అలీఖాన్‌కు రక్షణగా 'జై లవకుశ' నటుడి టీమ్)ఇక పుష్ప–2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు చెందిన మైత్రీ నవీన్, యలమంచిలి రవిశంకర్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. పుష్ప–2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఐటీ చెల్లింపులకు సంబంధించి అధికారులు పలు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా పుష్ప2(Pushpa 2) , గేమ్ ఛేంజర్(Game Changer Movie) కలెక్షన్ల ప్రకటనతో అందుకు సంబంధించిన చెల్లింపుల వివరాల గురించి వారు పరిశీలించినట్లు తెలుస్తోంది.సాధారణంగా జరిగే సోదాలే: దిల్‌రాజు భార్య వైగారెడ్డి తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు దిల్‌రాజు సతీమణి వైగారెడ్డిని తమ కారులో తీసుకెళ్లారు. దిల్‌రాజు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు. బ్యాంకు లాకర్లను పరిశీలించిన అనంతరం ఆమెను తిరిగి అదే వాహనంలో ఇంటివద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఐటీ సోదాలపై వైగారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవి సాధారణంగా జరిగే సోదాలు మాత్రమేనని చెప్పారు. బ్యాంకు ఖాతాల వివరాలు కావాలని అధికారులు అడిగారని, అవి ఇచ్చామని, బ్యాంకు లాకర్లు తెరిచి చూపించామని తెలిపారు. -
దిల్ రాజు, ఆయన సోదరుడు, కుమార్తె నివాసాల్లో ఐటీ సోదాలు
-
నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు
-
నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్‌రాజు ఆఫీస్, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్‌రాజు సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.కాగా, సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాము’ సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బడా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్ రాజు.. డిస్టిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారారు.బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం : దిల్ రాజు భార్యదిల్ రాజు భార్య తేజస్వినిని అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తేజస్విని మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం’’ అని ఆమె చెప్పారు.మెత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ తనిఖీలుమెత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మైత్రీ నవీన్, సీఈవో చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 వరల్డ్ వైడ్‌గా దాదాపు 1850 కలెక్షన్లు రాబట్టింది. సింగర్ సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థలో కూడా సోదాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్.. రిలీజ్ అప్పుడేనన్న అనిల్ రావిపూడి! -
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
-
టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న రూమర్స్.. మళ్ళీ దిల్ రాజు తో రామ్ చరణ్ సినిమా..
-
దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలబడింది. దీంతో దిల్ రాజు (Dil Raju) కోసం చరణ్(Ram charan) ఒక కీలకనిర్ణయం తీసుకున్నారట. కొత్త ఏడాదిలో సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ విన్నర్‌గా వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) చిత్రం నిలిచింది. సినిమా విడుదలైన రెండో రోజే సుమారు 250కి పైగా స్క్రీన్స్‌ను పెంచారు. తర్వాత బాలకృష్ణ (డాకు మహారాజ్) కూడా మంచి కలెక్షన్సే అందుకుంది. ఇప్పుడు ఎటొచ్చి కూడా రామ్ చరణ్- దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్‌కు కష్టాలు తప్పలేదు. ఫైనల్‌గా నిర్మాతకు ఎన్ని కోట్లు నష్టం అనేది తేలాల్సి ఉంది. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనుకున్నంత రిటర్న్ వచ్చేలా లేదని తేలిపోయింది.సుమారు పదేళ్ల క్రితం దిల్ రాజు బ్యానర్లో ఎవడు సినిమాలో రామ్ చరణ్ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అనుకున్నంత సమయంలో పూర్తి కాలేదు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా పూర్తి అయ్యేసరికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. దీంతో బడ్జెట్ భారీగా పెరిగింది. అయినప్పటికీ ఖర్చు పెట్టే విషయంలో దిల్ రాజు ఎక్కడా కూడా తగ్గలేదు. సినిమాపై ఆయన పూర్తి నమ్మకంతోనే కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్ మరోలా అయింది. ఈ మూవీతో దిల్ రాజు ఏ మేరకు నష్టాలు భరించబోతున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. (ఇదీ చదవండి: జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి)ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా ఆయన నిర్మించారు కాబట్టి కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. అయితే, రామ్ చరణ్ కూడా దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఆయన బ్యానర్లోనే మరో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మంచి కథతో గేమ్ ఛేంజర్ నష్టాన్ని పూరించాలని చరణ్ ఉన్నారట. కొద్దిరోజుల తర్వాత అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో మొదట డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా ఉంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా లైన్లో ఉంది. ఈ చిత్రాల తర్వాత తప్పకుండా దిల్ రాజుతో మూవీ ఉంటుందని సమాచారం. -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పార్టీలో మహేశ్‌బాబు (ఫొటోలు)
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'గేమ్ ఛేంజర్' ప్రసారం చేసిన కేబుల్ ఆపరేటర్ ఆరెస్ట్
గేమ్ ఛేంజర్(Game Changer) చిత్రాన్ని తమ లోకల్ ఛానెల్లో (local channel) ప్రసారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. అయితే, ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చి వారం గడవక ముందే కొందరు పైరసీ కాపీని తమ లోకల్ ఛానల్స్‌లలో ప్రసారం చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ ఆగ్రహం చెందడమే కాకుండా పోలీసులను ఆశ్రయించింది. దీంతో గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తాజాగా ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు.గేమ్ ఛేంజర్ విడుదలైన వెంటనే ఈ చిత్రం పైరసీ బారిన పడింది. నెట్టింట ఈ సినిమాకు సంబంధించిన లింకులు భారీగా షేర్ అయ్యాయి. అయితే, కేబుల్ నెట్‌వర్క్‌లో కూడా ఈ చిత్రం ప్రసారం అవతుందని కొందరు స్క్రీన్ షాట్స్ తీసి చిత్ర నిర్మాణ సంస్థకు ట్యాగ్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై చాలామంది ప్రముఖులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. (ఇదీ చదవండి: మహానగరంలో బాలీవుడ్ ప్రముఖలపై జరిగిన దాడులు ఇవే)ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.కొందరు ఏకంగా చిత్ర నిర్మాణ సంస్థనే బెదిరించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. వారిపై కూడా చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని, సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే, ఈ కలెక్షన్లపై కూడా నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కలెక్షన్ల వివరాలు తప్పుగా చెప్పారని పలువురు నెటిజన్లు విమర్శించారు. -
'గేమ్ చేంజర్'టీమ్‌కి భారీ షాక్.. ఆన్లైన్లో పైరసీ ప్రింట్ !
సినిమా అనేది కోట్ల బిజినెస్. పెద్ద పెద్ద సినిమాలకు వందల కోట్లు ఖర్చు అవుతుంటాయి. అలాంటి సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో వదులుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ పైరసీని అడ్డుకునేందుకు చిత్ర పరిశ్రమ చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఆ కేటుగాళ్లను అడ్డుకోలేకపోతుంది. తాజాగా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాకు కూడా పైరసీ బారిన పడింది. సినిమా రిలీజైన రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీనిపై చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది.మూడేళ్ల కష్టం.. నిమిషాల్లో లీక్కోట్లకు కోట్ల రూపాయల ఖర్చుచేసి గ్లోబల్ రేంజ్లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన 'గేమ్ చేంజర్ విడుదల రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉందని చిత్రబృందం ఆరోపిస్తుంది.డబ్బు కోసం బెదిరింపులు..'గేమ్ చేంజర్' విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయట. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగారని . 'గేమ్ చేంజర్' విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత హెచ్డీ ప్రింట్ లీక్ చేయడమే కాదు... టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు.45 మందిపై ఫిర్యాదు'గేమ్ చేంజర్' చిత్ర బృందాన్ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది టీం. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి 'గేమ్ చేంజర్' మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.సోషల్ మీడియా (ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్) పేజీలలో ఒక పథకం ప్రకారం 'గేమ్ చేంజర్' మీద పలువురు నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. సదరు పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు. త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలియచేశారు. -
సారి..నన్ను వదిలేయండి: Dil Raju
-
తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు
సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ దిగిపోగా రేపు డాకు మహారాజ్ ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు గేమ్ ఛేంజర్, ఇటు సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు సినిమాలకు దిల్ రాజే నిర్మాత. అందుకే క్షణం తీరిక లేకుండా ప్రమోషన్ల కోసం అటూ ఇటు పరుగులు తీస్తున్నారు.నిజమాబాద్‌లో ఈవెంట్ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తన సొంత జిల్లా నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈసారి స్పీచ్ మామూలుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్ అయిపోవాలని యాంకర్ శ్రీముఖి కోరడం.. ఇప్పుడు చూడు, నా తడాఖా చూపిస్తా అన్న రేంజ్లో దిల్ రాజు రెచ్చిపోవడం జరిగాయి. ఈ క్రమంలోనే స్టేజీపై హుషారుగా మాట్లాడాడు.దిల్ రాజు హుషారైన స్పీచ్స్టేజీపై ఉన్న హీరో వెంకటేశ్‌ను చూస్తూ.. సర్, మా నిజామాబాద్‌ల తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవల్ ఉంటుంది. మా వోళ్లకు (తెలంగాణ ప్రజలకు) సినిమా అంటే అంత ఆసక్తి ఉండదు. అదే ఆంధ్రకు వెళ్తే సినిమాకు స్పెషల్ వైబ్ ఇస్తారు. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు అని స్పీచ్ దంచుకుపోయాడు. ఆయన స్పీచ్‌కు అక్కడున్నవారు చప్పట్లు కొట్టినా సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. తెలంగాణవాసి అయ్యుండి మన ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడతాడా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై దిల్ రాజు (Dil Raju) స్పందించాడు.(చదవండి: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట)దావత్ గురించి మాట్లాడా..మొన్నీ మధ్య నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశాం. నిజామాబాద్ పట్టణంలో పెద్దగా సినిమా ఈవెంట్లు జరగవు. అప్పట్లో ఫిదా సక్సెస్ మీట్ చేశాం.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేది చేశాం. నిజామాబాద్వాసిగా ఆ జిల్లాతో నాకున్న అనుబంధం అలాంటిది! అందుకే అక్కడ ఈ మూవీ ఈవెంట్ చేశాం. అప్పుడు నేను మన కల్చర్‌లో ఉండే దావత్ గురించి మాట్లాడాను. తెల్ల కల్లు, మటన్ గురించి మాట్లాడాను. నా మాటలతో తెలంగాణవాళ్లను అవమానించానని, తెలంగాణను హేళన చేశానని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.క్షమించండినా ఉద్దేశమేంటో అదే స్పీచ్‌లో చెప్పాను. మన కల్చర్, దావత్ నేను మిస్ అవుతున్నాను.. సంక్రాంతికి నా రెండు సినిమాలు రిలీజయ్యాక తెలంగాణ దావత్ చేసుకోవాలనుందని చెప్పాను. మన విధానాలను నేను అభిమానిస్తాను. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే క్షమించండి అని చెప్పుకొచ్చాడు.ఎలా అనుకున్నారు?నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో ఫిదా సినిమా షూటింగ్ చేశాం. మనం కుటుంబానికి ఎంత విలువిస్తాం, మన కల్చర్ ఏంటనేది ఆ మూవీలో చూపించాం. ఫిదా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టయిందో తెలుసు. అలాగే బలగం చిత్రాన్ని కూడా అందరూ గుండెకు హత్తుకున్నారు. తెలంగాణవాసిగా మన రాష్ట్రాన్ని అభిమానించే నేను హేళన చేస్తానని ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. మీ మనో భావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. రాజకీయాల్లోకి లాగకండిఎఫ్డీసీ చైర్మన్‌గా సినిమాకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ హైదరాబాద్‌లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఉంచుతాను. తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. నన్ను రాజకీయాల్లోకి లాగకండి. ఎఫ్డీసీ సినిమాకు సంబంధించిందే కానీ రాజకీయాలకు సంబంధించినది కాదు. ఎఫ్డీసీ, నేను సినిమాలకే ఉపయోగపడతాం. అవసరంలేని విషయాల్లో నన్ను లాగొద్దని కోరుతున్నాను అన్నాడు. #DilRaju garu has spoken out about the Nizamabad incident, offering his sincere apologies to anyone who may have been hurt. He has requested not to associate him with politics in any way. pic.twitter.com/X9W3grU8O0— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025 చదవండి: ప్రభాస్ పెళ్లి ఎవరితో.. రివీల్ చేసిన రామ్ చరణ్ -
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
'గేమ్ ఛేంజర్' మొదటిరోజు కలెక్షన్స్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించే ప్రముఖ సంస్థలు కూడా ఇప్పటికే గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ రిలీజ్ చేశాయి. కానీ, వారి ఊహలకు కూడా అందని విధంగా రామ్ చరణ్ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు దిల్ రాజు నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్‌తో గేమ్ ఛేంజర్ లెక్కల వివరాలను ప్రకటించింది.రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పుష్ప2 రూ. 294 కోట్లతో టాప్ వన్‌లో ఉంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ రూ. 223 కోట్లు, బాహుబలి2 రూ. 210 కోట్లు, కల్కి 2898AD రూ. 191 కోట్లుతో ఉంటే.. గేమ్ ఛేంజర్ రూ. 186 కోట్ల కలెక్షన్స్‌తో టాప్ ఫైవ్‌లో చేరిపోయింది. ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే.బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల లెక్కలు ఇలా'గేమ్ ఛేంజర్' తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్ ఛేంజర్ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.(ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ)గేమ్ ఛేంజర్ సినిమా మొదటిరోజే ప్రేక్షకులను నిరుత్సాహ పరచడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడింది అనేది అందరి అభిప్రాయం. దీంతో మొదటిరోజు రూ. 100 కోట్లు కూడా దాటడం కష్టం అని భావించారు. అయితే, తాజాగా చిత్ర యూనిట్ మాత్రం రూ. 186 కోట్లు ఫస్ట్ డే రాబట్టినట్లు పోస్టర్ విడుదల చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అపద్దం చేప్పడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎకంగా రూ. 100 కోట్లు పెంచడం ఏంటయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కనీసం కాస్త నమ్మేలా కలెక్షన్స్ ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇంకో రూ. 100 కోట్లు కలిపి పుష్ప2 రికార్డ్ బద్దలు అయిపోయిందని పోస్టర్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కదా అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.King size entertainment unleashes in theatres 🔥#GameChanger takes a blockbuster opening at the BOX OFFICE 💥💥#BlockbusterGameChanger GROSSES 186 CRORES WORLDWIDE on Day 1 ❤🔥Book your tickets now on @bookmyshow🔗 https://t.co/ESks33KFP4Global Star @AlwaysRamCharan… pic.twitter.com/NqiqvscgR8— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025Bro this is to much lie ki koda limit untadi bro dill raju garu— Balayya USA Fans (@BalayyaUsa) January 11, 2025Sare, ippudu original collections cheppandi...— నాని (@nani_SSMBfan) January 11, 2025Bayata rc midha jalikuda poindhi i poster chusi 😂😂😂— Ⲛ𝐚ᥒꭵ𝑇𝐚𝑟𝐚ķᵀᴹ (@taraknani_) January 11, 2025100 cr fake Ela chesaraa 🙏 only mega ke sadhyam 🙏— NTR ADMIRE 🌊 (@NTRADMIRE) January 11, 2025 -
గేమ్ ఛేంజర్ టిక్కెట్ల విక్రయం...ఏ రాష్ట్రంలో ఎంతంటే...
చిత్రం విడుదలకు కేవలం ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలింది. రిలీజ్‌కు సంబంధించి కౌంట్‌డౌన్ ముగియనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మరో అద్భుతమైన పాత్రలో తమ ఫేవరెట్ స్టార్‌ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏ పెద్ద స్టార్ సినిమా విడుదల ముందైనా సర్వసాధారణంగా జరిగేవే. అవన్నీ అలా ఉంచితే... ఇటీవల భారీ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా చర్చకు నోచుకుంటున్నాయి. గత కొంత కాలంగా భారతీయ సినిమాలకు సంబంధించి హిట్స్, ఫ్లాప్స్ అన్నీ వసూళ్లతోనే ముడిపడడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్ గురించి కూడా సినిమా వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి భారీగా హైప్ వచ్చినప్పటికీ అడ్వాన్స్ టిక్కెట్ల విక్రయం ప్రకారం చూస్తే ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. భారీ సంచలన చిత్రాల దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ ల కలయికే ఓ సెన్సేషన్ కావడంతో ఈ టాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ అందరి దృష్టినీ ఆకర్షించింది, అయితే కనపడుతున్న స్పందన మాత్రం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా డైరెక్టరే అని పలువురు భావిస్తున్నారు. ఊహించిన దానికన్నా శంకర్ ప్రేక్షకుల్లో తన పట్ల ఆదరణ తగ్గించుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. అదే సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు శంకర్ అంటే పెద్ద బ్రాండ్, కానీ ఇటీవల ఈ డిఫరెంట్ సినిమాల ఫిల్మ్ మేకర్ తన క్రేజ్‌ను కోల్పోయాడు. అతని సినిమాలు గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాయి ఆయన చివరి సినిమా భారతీయుడు 2 ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో మనం చూశాం.కలెక్షన్లలో వ్యత్యాసం..చెబుతోంది అదే...సినిమా విడుదలకు మరో రోజు మిగిలి ఉండగా...గురువారం ఉదయం 10 గంటల నాటికి గేమ్ ఛేంజర్ 1వ రోజు మన దేశంలో దాదాపు 5 లక్షలకు పైగా టిక్కెట్లను విక్రయించిందని సమాచారం. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ విలువ 14.83 కోట్ల గ్రాస్ (బ్లాక్ చేసిన సీట్లు మినహా)కు చేరింది. ఇప్పటివరకు దాదాపు 8,000 షోలు లిస్ట్ చేశారు. తర్వాత వాటి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.ఆంధ్రలో టాప్..తమిళనాడులో డ్రాప్...రాష్ట్రాల వారీగా చూస్తే టిక్కెట్ల విక్రయంలో ఆంధ్రప్రదేశ్ భారీ తేడాతో ముందంజలో ఉంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే గేమ్ ఛేంజర్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 8.72 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ 3.06 కోట్లు, కర్ణాటక 1 కోటి ఉన్నాయి. విశేషం ఏమిటంటే తమిళనాట ఇంకా 1 కోటి మార్కును సైతం ఈ సినిమా టచ్ చేయలేదు, విచిత్రంగా తమిళనాడుకు చెందిన టాప్ డైరెక్టర్ శంకర్ సినిమా అయినప్పటికీ అక్కడ ఈ పరిస్థితి ఉండడం షాకింగ్ అనే చెప్పాలి. శంకర్ పట్ల జనాదరణ ఎంతగా తరిగిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.గుంటూరు కారం కన్నా..ఘాటు తక్కువే...రామ్ చరణ్ నటించిన సినిమా బుకింగ్స్ విలువ గురువారం ముగిసే సరికి 20 కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు, కానీ అప్పటికీ ముందస్తు అంచనాలను ఇది అందుకోవడం లేదనే చెప్పాలి. ఇంత భారీ చిత్రంగా పేర్కొనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను సైతం బీట్ చేయడంలో ఇది ఖచ్చితంగా విఫలమవుతుంది, గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మొదటి రోజు 24.90 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. -
తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ వేడుకలో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Desapati Srinivas) తప్పుబట్టారు. ఇలాంటి వేదికలపై తెలంగాణ కల్చర్‌ను తప్పుగా చూపుతూ చులకనగా మాట్లాడటమేంటి అంటూ ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు తెలంగాణలో సినిమా వ్యాపారాన్ని మానుకోవాలని ఆయన కోరారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా తెలంగాణలో గేమ్ ఛేంజర్ సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు నిర్ణయాన్ని తప్పపట్టారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయిందని రసమయి అన్నారు.ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్), వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) చిత్రాలు రేసులో ఉన్నాయి. అయితే, ఈ రెండు సినిమాలలో జనవరి 14న విడుదలకానున్న కానున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. 'మా నిజమాబాద్‌లో తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవెల్లో ఉంటుంది. మావోళ్లకు( తెలంగాణ) సినిమా అంటే అంత వైబ్ ఉండదు.. ఆంధ్రకు వెళ్తే సినిమాకు ఓ స్ఫెషల్ వైబ్ ఇస్తారు.. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు’ అని వెంకటేశ్‌తో దిల్ రాజు అన్నారు. ఇప్పుడు అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.కల్లు , మాంసం దుకాణాలు పెట్టుకోండి: ఎమ్మెల్సీ'తెలంగాణ ఉద్యమంలో దిల్ రాజు ఎప్పుడూ కలిసిరాలేదు. ఒక్కరోజు కూడా ఇక్కడి ప్రజల కోసం ఆయన అండగా నిలబడలేదు. తన సినిమా ప్రమోషన్ కోసం తెలంగాణను తక్కువ చేస్తూ తాజాగా దిల్ రాజు మాట్లాడారు. తెలంగాణలో సినిమాలకు వైబ్ లేదంటూ ఇక్కడి కల్చర్‌ను చులకన చేశారు. అలాంటప్పుడు తెలంగాణలో సినిమాలు చేయడం మానుకోని.. కల్లు , మాంసం దుకాణాలు పెట్టుకోండి. ఇక్కడ మీ సినిమాలకు టికెట్ల ధరల పెంపు కోసం సీఎం రేవంత్‌ను అడిగి ప్రత్యేకంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెండు నాల్కల ధోరణి కూడా మరోసారి బయట పడింది. సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల గురించి గతంలో వారు చెప్పిన మాట మీద నిలబడలేదు. ఈ విషయంలో మంత్రి కోమటి రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మాట మీద నిలబడని ఈ ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలి. దిల్ రాజు కోసం సినిమా టికెట్స్ ధరలు పెంచారు. దిల్ రాజు మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి.' అని కామెంట్ చేశారు.దిల్ రాజుకు ఎంతకు అమ్ముడు పోయారు: రసమయిసీఎం రేవంత్‌రెడ్డి, దిల్ రాజులపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు ,బెనిఫిట్ షో లపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమా గేమ్ ఛేంజర్‌కు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం వెనక మతలబు ఏమిటి అనేది ప్రజలకు చెప్పిండి. సీఎం రేవంత్ దిల్ రాజుకు ఎంతకు అమ్ముడు పోయారు..? ఆరు గ్యారంటీలపై మాట తప్పినట్టే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై సీఎం మాట తప్పారు. దిల్ రాజు తెలంగాణ ప్రజలను తన మాటలతో అవమాన పరిచారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి బెనిఫిట్ షోలపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం తెలుసు కానీ, సీఎం రేవంత్‌కు పాలన చేత కావడం లేదు. ప్రతి అంశంపై సీఎం యూ టర్న్ తీసుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.' అని ఆయన అన్నారు. -
‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్
-
తెల్ల కల్లు, మటన్ ముక్క.. దిల్ రాజు కామెంట్స్ వైరల్
ఈ సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే వాటిల్లో డాకు మహారాజ్ మినహా మిగతా రెండు సినిమాలకు దిల్ రాజే(Dil Raju) నిర్మాత. జనవరి 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలో ఫుల్ బిజీ అయిపోయారు. ఒక పక్క ఇంటర్వ్యూలు ఇస్తునే మరోపక్క ప్రీరిలీజ్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లను నిర్వహిస్తూ రెండు సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడు.ఈ ప్రయత్నం దిల్ రాజు ఫూర్తిగా సఫలం అయ్యాడు. తన రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేశాడు.(చదవండి: అలాంటి ప్రశ్నలు అడగొద్దని చెప్పానుగా.. రజనీ అసహనం)ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunam Movie) అనే సినిమా విషయంలో ముందు నుంచి దూకుడుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒకపక్క అనిల్ రావిపూడి, మరోపక్క వెంకటేశ్ సినిమా ప్రమోషన్స్‌ని తమ భుజాన వేసుకున్నారు. అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా నిజమాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..ఆంధ్రాలో సినిమాలకు వైబ్ ఉంటే.. తెలంగాణలో కల్లు, మటన్ కు వైబ్ ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అసలేం జరిగిదంటే..సినిమా గురించి మాట్లాడేందుకు దిల్ రాజు స్టేజ్ ఎక్కగానే.. ‘సర్.. స్పీచ్ మాములుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్ అయిపోవాలి’ అంటూ యాంకర్ శ్రీముఖి రిక్వెస్ట్ చేసింది. దిల్ రాజు అదే జోష్‌లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెచ్చిపోయారు. ‘ఏం దావత్ చేద్దామా..? చెట్లళ్లలకు పోదామా..? అని ఆడియన్స్‌ని అడిగాడు .ఆ తర్వాత స్టేజ్ పైనే ఉన్న వెంకటేశ్(venkatesh)ని చూస్తూ.. ‘సర్ మా నిజమాబాద్‌లో తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవెల్లో ఉంటుంది. మావోళ్లకు( తెలంగాణ) సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు.. ఆంధ్రకు వెళ్తే సినిమాకు ఓ స్ఫెషల్ వైబ్ ఇస్తారు.. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు’ అని దిల్ రాజు అనడంతో హీరోతో సహా ఆడియన్స్ అంతా గట్టిగా నవ్వారు.ముచ్చటగా మూడో చిత్రం..విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రమే ‘సంక్రాంతికి వస్తున్నాం’. అంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి. బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ తీసిన తర్వాత అనిల్ నుంచి వస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా రిలీజైన ఈ చిత్రం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వెంకీ, అనిల్ తరహా కామెడీతో ట్రైలర్‌ని కట్ చేశారు. ట్విస్ట్‌లు, థ్రిల్స్, యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిజామాబాద్‌లో పెట్టిన తన సినిమా కార్యక్రమంలో జనాల రెస్పాన్స్ పెద్దగా లేదని తెలంగాణలో సినిమాల కంటే కల్లు, మటన్ అంటే వెంటపడతారని మాట్లాడిన దిల్ రాజు pic.twitter.com/5W2AOhgDWG— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025 -
‘సంక్రాంతి..’చూడండి..మాములుగా ఉండదు: వెంకటేశ్
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసి, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చె΄్పారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని సోమవారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ–‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రం తీశాడు అనిల్. మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి.. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గేమ్ చేంజర్, ‘డాకు మహారాజ్’ సినిమాలు కూడా విజయం సాధించాలి. ‘దిల్’ రాజు, శిరీష్‌లతో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చూడండి.. మామూలుగా ఉండదు’’ అన్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ లో ఇంతకు ముందు ఫిదా వేడుక చేశాం. అనిల్ నిజామాబాద్ లో వేడుక చేద్దామని అన్నారు. వెంకటేష్(Venkatesh) గారు అనిల్ శిరీష్ వారి భుజాన వేసుకొని 72 రోజుల్లో ఇంత పెద్ద సినిమాని ఫినిష్ చేశారు. పూర్తిస్థాయిలో ఓ సినిమా వేడుక నిజామాబాద్ లో జరగడం ఇదే ఫస్ట్ టైం. సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.1980లో ఇక్కడ రూపాయి టికెట్ తో నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం. అలా సినిమాలపై ఇష్టం ఏర్పడింది. మా 58వ సినిమా ఈవెంట్ ఇక్కడ చేయడం మాకు చాలా గర్వంగా వుంది. ఎంతోమంది హీరోలు, దర్శకులు సపోర్ట్ చేస్తే ఈ స్థాయిలో వున్నాం. అనిల్ మా బ్యానర్ లో ఆరు సినిమాలు చేసి ఒక పిల్లర్ లా నిలబడ్డారు. తను ఒకొక్కమెట్టు ఎదుగుతూ టాప్ డైరెక్టర్ గా అయ్యారు. ఈ ఏడాది మా సంస్థకు బ్లాక్ బస్టర్ పొంగల్ ఇయర్. పాన్ ఇండియా సినిమా గేమ్ చెంజర్ 10న రిలీజ్ అవుతుంది. మా బ్యానర్ లో ఎఫ్ 2 ఎఫ్ 3 లాంటి సూపర్ హిట్స్ చేసిన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తున్నాం సినిమా జనవరి 14న వస్తోంది. అలాగే డాకు మహారాజ్ ని నైజంలో మేము రిలీజ్ చేస్తున్నాం. అందుకే ఇది మాకు బ్లాక్ బస్టర్ పొంగల్. ఐశ్వర్య రాజేష్ సహజంగా నటించింది. ఆ పాత్ర చాలా నచ్చుతుంది. మీనాక్షి(Meenakshi Chaudhary) పోలీస్ క్యారెక్టర్ అలరిస్తుంది. రామానాయుడు గారు నిర్మాతగా చరిత్ర సృష్టించారు. వెంకటేష్ గారి కలియుగ పాండవులు ఫోటో చూసి ఆయనకి ఫ్యాన్ అయ్యాను. సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యాను. వారిద్దరూ నా అభిమాన హీరోలు. వెంకటేష్ గారు వుంటే నిర్మాత సెట్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయనే అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. మా బ్యానర్ లో నాలుగు సినిమాలు చేసిన హీరో వెంకటేష్ గారు. నిర్మాతని ప్రేమగా చూసుకునే హీరో ఆయన. వెంకటేష్ గారికి థాంక్ యూ సో మచ్. అనిల్ అద్భుతంగా సినిమా తీశాడు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్. పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అన్నీ పేర్చుకొని సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తీసుకురాబోతున్నాడు అనిల్. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ వెరీ మచ్' అన్నారు. ‘ట్రైలర్ లో చూసింది ఇంతే సినిమాలో చాలా చాలా వుంది. ఇది టిపికల్ జోనర్ సినిమా. వెంకటేష్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సినిమాలో చాలా ట్విస్ట్ లు టర్న్స్ వుంటాయి. ఖచ్చితంగా పండక్కి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. దిల్ రాజు గారి బ్యానర్ లో ఇది నా ఆరో సినిమా. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరూ సపోర్ట్ గా నిలుచారు. ఐస్వర్య, మీనాక్షి చాలా చక్కగా నటించారు. వెంకటేష్ గారు మనందరికీ నచ్చే వెంకీ మామ. ఆయన కెరీర్ లో చాలా గొప్ప పాత్రలు చేశారు. ఆయన కెరీర్ లో ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. వెంకటేష్ గారు ప్రాణం పెట్టి పని చేస్తారు. ప్రమోషన్స్ లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయనకు థాంక్ యూ. మా టీం అందరికీ థాంక్ యూ. థాంక్ యూ నిజామాబాద్. సంక్రాంతికి మీ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకొని థియేటర్స్ కి వచ్చేయండి. కడుపుబ్బా నవ్వించి బయటికి పంపుతాం. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం డోంట్ మిస్. థాంక్ ' అన్నారు -
వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ HD మూవీ స్టిల్స్
-
నిజామాబాద్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తెలంగాణలో టికెట్ రేట్లపై దిల్ రాజు హాట్ కామెంట్స్
-
'గేమ్ ఛేంజర్' కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: దిల్ రాజు
తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ల ధరల పెంపుపై ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న గేమ్ ఛేంజర్ (Game Changer) చిత్రానికి తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెంపు కోసం ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) మరోసారి కలుస్తానని తెలిపారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారేమోనని ఆశిస్తున్నట్లు దిల్ రాజు పేర్కొన్నారు.చిత్రపరిశ్రమ అభివృద్ధికి సీఎం కూడా చాలా ముందు చూపుతో ఉన్నారు కాబట్టి ఒక నిర్మాతగా టికెట్ రేట్ల పెంపుపై తన ప్రయత్నం చేస్తానని దిల్ రాజు అన్నారు. టికెట్ రేటు పెంచడం వల్ల 18 శాతం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కూడా అందుతుందని ఆయన గుర్తు చేశారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలకు ప్రభుత్వాల నుంచి సహాయం ఉండాలని ఆయన కోరారు. ఈ విషయంలో గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశాయి అన్నారు. (ఇదీ చదవండి: సీఎం రేవంత్ రెడ్డిని మరిచిపోయిన మరో తెలుగు హీరో)తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటూ అన్నీ ఇస్తాను అన్నారు. ఆ ఆశతోనే మళ్లీ ముఖ్యమంత్రిని కలుస్తానని దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ నుంచి భారీ స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అందుకోసం బడ్జెట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. నేడు టాలీవుడ్ సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని ఆయన అన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు దిల్ రాజు సాయంరాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటున్న క్రమంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఈ ఘటనపై నిర్మాత దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు. ఆ రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సహాయం చేసి ఆదుకుంటానని ఆయన ప్రకటించారు. భవిష్యత్‌లో కూడా వారికి అండగా నిలుస్తానని దిల్ రాజు చెప్పారు.ఏపీలో గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు ఇలారామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10న తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్ షో వేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది. అయితే, మొదటి రోజు 4గంటల ఆట నుంచి టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్ థియేటర్స్‌లలో రూ.135 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. ఫస్ట్ డే నాడు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ రోజుకు 5 షోలు ఉండనున్నాయి. పెంచిన ధరలు 23వ తేదీ వరకు ఉంటాయి. -
రాజమౌళి, శంకర్ ఇద్దరూ టాస్క్ మాస్టర్లే : రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు.జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్(Ram Charan) మాట్లాడుతూ.. ‘శంకర్ గారితో సినిమా చేయడం నా అదృష్ణం. ఆర్ఆర్ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు గారు నాకు శంకర్ గారి సినిమా గురించి చెప్పారు. శంకర్ గారు కథ చెబుతారు వినండి అని దిల్ రాజు గారు అన్నారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ గారు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతీ దాన్ని ఎంతో పర్ఫెక్ట్గా చేయాలని చూస్తుంటారు. (చదవండి: 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. ఐదు నిమిషాలే వృథా!)రాజమౌళి గారు, శంకర్ గారు ఇద్దరూ కూడా టాస్క్ మాస్టర్లే. సెట్లోకి నేను వచ్చినప్పుడు నన్ను కాకుండా నా హెయిర్‌ను చూశారు. ఆయన అనుకున్న దాని కంటే ఓ ఐదు శాతం తగ్గింది. అంత తీక్షణంగా ఆయన ప్రతీ ఒక్క విషయాన్ని పరిశీలిస్తుంటారు. ఆయనతో పని చేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య గారు అద్భుతంగా నటించారు. కియారా(kiara advani)తో నేను చేసిన డ్యాన్సులు, పాటలు అందరినీ అలరిస్తాయి. మేం డల్లాస్‌లో చేసిన ఈవెంట్‌కు అంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. డల్లాస్‌లో మాకు అపరమితమైన ప్రేమ లభించింది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ కోసం ఏదైనా కొత్తగా చేద్దామని డల్లాస్‌లో ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. డల్లాస్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ చిత్రంలో ఐదు పాటలుంటాయి. ఈ పాటలకు 75 కోట్లు ఖర్చు అయ్యాయి. ఒక్కో పాట పది రోజులకు పైగా చిత్రీకరించారు. అన్నీ కూడా శంకర్ మార్క్‌లోనే ఉంటాయి. నా బ్యానర్లో ఇది 50వ సినిమా. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున నిర్మించాలని అనుకున్నాం. ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. అప్పుడే ఈ సినిమా రామ్ చరణ్‌కు అయితే బాగుంటుందని అనుకున్నా. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్‌కు థాంక్స్’ అని అన్నారు.ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. శంకర్ గారు, రామ్ చరణ్ గారితో పని చేయడం నాకు గర్వంగా అనిపిస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్‌గా ఎదిగారు. చాలా మంచి యాక్టర్. ఈ చిత్రంలో ఐఏఎస్ రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. కియారా, రామ్ చరణ్ చేసిన పాటలు, డ్యాన్సులు అదిరిపోతాయి. ఈ చిత్రంలో నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. మేం సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు. జనవరి 10న ఈ సినిమా ఏంటో మీకు తెలుస్తుంది’ అని అన్నారు. -
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer Movie) వచ్చేవారమే రిలీజ్ కానుంది. సంక్రాంతి కంటే ముందుగానే జనవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. శనివారం (జనవరి 4న) ముంబైలో గేమ్ ఛేంజర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు చరణ్, ఎస్జే సూర్య, దిల్ రాజు ఇలా అందరూ విచ్చేశారు. కానీ హీరోయిన్ కియారా మాత్రం ఎక్కడా కనిపించలేదు.ఈవెంట్‌కు డుమ్మా.. ఎందుకంటే?తను ఆస్పత్రిపాలైందని, అందుకే ఈవెంట్‌కు రాలేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై కియారా టీమ్ క్లారిటీ ఇచ్చింది. తను బాగానే ఉందని తెలిపింది. నాన్‌స్టాప్‌గా పని చేస్తుండటం వల్ల కియారాను విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని, అందుకే తను ఈవెంట్‌కు హాజరవలేదని వివరణ ఇచ్చింది.ఐదు పాటల కోసం..ఇదిలా ఉంటే ఈ సమావేశంలో నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర విషయం బయటపెట్టాడు. 'ఈ సినిమాలో ఐదు పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాం. నానా హైరానా పాట కోసం న్యూజిలాండ్‌లో పదిరోజులు షూట్ చేశాం. రా మచ్చా రా పాట కోసం వైజాగ్, అమృత్సర్ వెళ్లాం. రిహార్సల్స్ అన్నీ కలిపితే రూ.75 కోట్ల కన్నా ఇంకా ఎక్కువే అవుతుంది' అని చెప్పుకొచ్చాడు.వీరి కాంబినేషన్లో రెండో మూవీశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అంజలి, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రెండు గంటల 45 నిమిషాల నిడివితో రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. ఇదిలా ఉంటే విజయవాడలో 256 అడుగులతో రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. దేశంలో అతి పెద్ద కటౌట్‌గా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్‌లో ఇది చోటు దక్కించుకుంది. After #Prabhas #Yash Now #Ramcharan Entered SIMPLE and HUMBLE in NORTH Event [#GameChanger] 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/BgDeNDIf4k— GetsCinema (@GetsCinema) January 4, 2025 చదవండి: గోవిందాను పెళ్లి చేసుకోవాల్సిందన్న హీరోయిన్.. నటుడి భార్య ఏమందంటే? -
పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!
‘ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పొతే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. పక్కనోడి పనిలో తలదూర్చి, అతన్ని ఇబ్బంది పెట్టి, ఆయన పనిని ఆయన చేయనివ్వకుండా, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా చేస్తే ఫలితాలు తారుమారు అవుతాయి’.. కొరటాల చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. కట్ చేస్తే.. దర్శకుడు శంకర్ కూడా ఇప్పుడు అదే ఫీలింగ్‌లో ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.శంకర్ షణ్ముగం.. టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న దర్శకుల్లో ఒకడు. అందులో ఎలాంటి డౌటు అక్కర్లేదు. కానీ, రైటర్ సుజాత(ఎస్.రంగరాజన్) మరణంతో ఆయనకు కుడి భుజం పోయినంత పనైంది. అప్పటిదాకా సెన్సేషన్ బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. ఘోరంగా తడబడుతూ వరుస ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది. అలాంటి బ్యాడ్ ఫేజ్‌లో విజయ్‌తో సినిమా తప్పింది. ఆపై వెంటనే రాం చరణ్‌తో సినిమా అనౌన్స్ అయ్యింది. గుడ్. శంకర్ సినిమా అంటే కేవలం పాటలకే కోట్లు ఖర్చవుతుంది. మరి అంత భరించే నిర్మాత ఎవరు?. వెంటనే తెరపైకి వెంకట రమణారెడ్డి(దిల్ రాజు) పేరొచ్చింది. వెరీ గుడ్. ఈ మధ్య శంకర్ సినిమాల్లో సుజాత టచ్ లేకపోవడంతో కథలతో పాటు డైలాగుల్లోనూ డెప్త్ లేకుండా పోయింది. అందుకోసం చిరు, బాలయ్య, పీకేలాంటి స్టార్లకు డైలాగులు రాసే సాయి మాధవ్ బుర్రాను తీసుకున్నారు.. వెరీ వెరీ గుడ్. శంకరే స్వయంగా అడిగాడో లేకుంటే శంకర్ మీద నమ్మకం లేకపోవడం వల్లనో మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రాసిన కథతో సినిమా తీసేశారు. ప్చ్.. ఇక్కడ కట్ చేస్తే..సాధారణంగా తాను ఎంత గ్రాండ్‌గా సినిమా తీసినా రెండు, మూడేళ్లకు మించి టైం తీసుకోడు శంకర్(Director Shankar). అలాంటిది గేమ్ ఛేంజర్ కోసం నాలుగేళ్ల టైం తీసుకున్నారు. 2021 సెప్టెంబర్ టైంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలైతే.. 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అయితే ఈ గ్యాప్‌లో ఇండియన్-2, ఇండియన్-3లపై కూడా ఆయన పని చేయడం.. అంతకు ముందు 2.0 తర్వాత ఆరేళ్ల గ్యాప్ రావడంతో లెక్క సరిపోయిందనుకుందాం. మరి 2024 సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన గేమ్ ఛేంజర్.. ఎందుకు పోస్ట్‌పోన్ అయినట్లు?. ఎంత పోస్ట్ ప్రొడక్షన్ పనులైనా, ఇతరత్ర కారణాలైనా.. మరీ ఏడాదిపాటు టైం పడుతుందా?. గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడంటూ ఆ మధ్య రేగిన పుకార్లు కొంపదీసి నిజం కాదు కదా?. .. టీఎఫ్ఐ(TFI)లో జరిగే పరిణామాలపై సోషల్‌మీడియాలోనూ, సగటు సినీ అభిమానుల్లోనూ ఓ చర్చ నడుస్తుంటుంది. కథ దగ్గరి నుంచి హీరోయిన్ల ఎంపిక, ఆఖరికి దర్శకత్వంలోనూ కొందరు హీరోలు, పెద్దలు వేలు పెడుతుంటారని!. నిప్పు లేనిదే పొగ రాదు కదా. అయితే గేమ్ ఛేంజర్‌కు అదనంగా ‘రాజకీయ జోక్యం’ తోడైందన్న అనుమానాలు చిత్ర ట్రైలర్ చూశాక కలగకమానదు.గేమ్ ఛేంజర్(Game Changer) ఓ పొలిటికల్ థ్రిల్లర్ అనే విషయం ట్రైలర్ చూస్తే ఎవరి అర్థమైపోతుంది. అయితే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో చిత్ర నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్లు ఆసక్తికరంగా.. అంతే అతిగా అనిపించాయి కూడా. శంకర్ ఎప్పుడో నాలుగేళ్ల కింద రాసుకున్న కథలో సీన్లు.. ఏపీ రాజకీయాల్లో రియల్‌గా జరిగాయట!. వాటినే తెర మీద ఆడియొన్స్ చూడబోతున్నారట. రాజకీయ పార్టీ స్థాపన, ఈవీఎంల అంశం, పొలిటికల్ నేతల పేర్లు, ఎన్నికల్లో గెలుపు, రేషన్ బియ్యం, అవినీతి మీద పోరాటమంటూ డైలాగులు.. ఇవన్నీ పరిణామాలు ఈ మధ్య ఏడాదికాలంలో చూసినవే కదా!. వీటిల్లో పవన్ రిఫరెన్స్‌లు, పైగా ఏపీ కూటమికి సరిపోయేవే ఉన్నాయి కదా. అలాంటప్పుడు తనది కాని కథలో శంకర్ ఇవన్నీ నాలుగేళ్ల కిందటే ఎలా జొప్పించి ఉంటాడంటారు?. ఇవి ఎవరినో ప్రత్యేకంగా మెప్పించడానికి జొప్పించినట్లు లేదు!.పోనీ.. దిల్ రాజ్(Dil Raju) అతిశయోక్తికి పోయి ఆ కామెంట్ చేసి ఉంటాడు అనుకున్నా.. రేపు థియేటర్లలో సినిమా చూసే ఆడియొన్స్‌కు అర్థం కాదని అంటారా?. ఏది ఏమైనా తెలంగాణలో ఎఫ్డీసీ చైర్మన్‌గా ఉన్న దిల్‌రాజు.. రాజకీయాల కోసం సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దంటూ కోరడం, అదే సమయంలో ఏపీకి వెళ్లి మరీ పవన్‌ను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇక ఎలాగూ ఏపీలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ హాజరుకానున్నారు. ఆ ఈవెంట్లో పొలిటికల్‌గా జాకీలు పెట్టి లేపే ప్రోగ్రాం ఉండక పోదు!. ఇదంతా చూస్తుంటే.. ‘‘జనానికి ఇప్పుడు నీ అవసరం ఉంది. పగిలేకొద్దీ గ్లాసు పదునెక్కుద్ది’’ తరహా సంభాషణల్లాగే.. గేమ్ ఛేంజర్‌లో ‘సీజ్ ద షిప్’ లాంటి రిఫరెన్స్‌లు, డైలాగులు వగైరాలాంటివి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇవన్నీ ఎందుకు అసలు సినిమానే ఆయనతో తీసి ఉంటే సరిపోయేది కదా!. -
‘గేమ్ ఛేంజర్’ HD మూవీ స్టిల్స్
-
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అవి చూడగానే తొడ గొట్టాలనిపించింది'.. గేమ్ ఛేంజర్‌పై దిల్ రాజు కామెంట్స్
గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. శంకర్ డైరెక్షన్ విజన్ టీజర్, సాంగ్స్ చూస్తేనే తెలుస్తోందన్నారు. ఈ సినిమాలో అన్ ప్రిడిక్టబుల్ సీన్స్ చాలా ఉంటాయని తెలిపారు. ప్రసాద్ ల్యాబ్‌కెళ్లి రెండు రీల్స్ చూశా.. అవీ చూశాక తొడ గొట్టాలని అనిపించిందన్నారు. ఈ నెల 10 తేదీ వరకు మీలాగే మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని దిల్ రాజు అన్నారు.దిల్ రాజు మాట్లాడుతూ..'ఒక తమిళ్ సినిమాని పాన్ ఇండియా చేసిన శంకర్ గారికి, తెలుగు సినిమాని గ్లోబల్ సినిమా చేసిన రాజమౌళి గారికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున కృతజ్ఞతలు. మా లాంటి వారికి ఎంతో ధైర్యాన్నిచ్చారు. శంకర్ విజన్ ఒక్కో స్టెప్‌గా చూపిస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు కేవలం 40 నుంచి 50 శాతం వరకే చూపించాం. నిన్ననే ప్రసాద్ ల్యాబ్‌లో రెండు రీల్స్ చూసి తొడ గొట్టాలనిపించింది. జెంటిల్మెన్, భారతీయుడు, శివాజీ లాంటి శంకర్ సినిమాలు కమర్షియల్ హిట్స్. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో డైరెక్ట్‌గా సినిమా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరుగుతుంది. మా సినిమాకు లాభాలు కచ్చితంగా వస్తాయని' అన్నారు.(ఇది చదవండి: 'కలెక్టర్‌కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి)కాగా.. శంకర్- రామ్ చరణ్ డైరెక్షన్లో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'కలెక్టర్‌కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie). స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ పాటలకు సంబంధించి మూవీ టీమ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను (Game Changer Trailer)మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)తాజాగా రిలీజైన గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ స్టోరీగానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఫైట్స్, డైలాగ్స్ మెగా ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌లో అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్.. నేను చనిపోయే వరకు ఐఏఎస్' అనే డైలాగ్ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'అర్థమయిందిరా.. రా కి రా.. సర్ కి సర్..' అనే డైలాగ్ ఎస్జే సూర్యతో చెప్పే డైలాగ్ మెగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న గేమ్ ఛేంజర్ ట్రైలర్లో ఫైట్స్, విజువల్స్‌లో డైరెక్టర్ శంకర్ మార్క్ కనిపిస్తోంది. (ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. కేవలం పాటలకే అన్ని కోట్లా!)ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కావడంతో కోలీవుడ్‌లోనూ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ హీరో ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ పొంగల్ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. -
గేమ్ ఛేంజర్ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..?
రామ్‌చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’ విడుదలకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. కేవలం వారం రోజుల్లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గురువారం సాయంత్రం 5.04 గంటలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను రీలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా పూర్తి రన్‌టైమ్ ఎంతో సెన్సార్ ప్రకటించింది.గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రన్‌టైమ్ 2:45 గంటలు ఉందని సెన్సార్ బోర్డ్ తెలిపింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి, నవీన్‌చంద్ర, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం సాయంత్రం 2.43 నిమిషాల నిడివితో ట్రైలర్ విడుదల కానుంది. దీంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ కావడం గ్యారెంటీ అంటూ అభిమానులు ఆశిస్తున్నారు. 'వినయ విధేయ రామ'చిత్రం తర్వాత రామ్ చరణ్– కియారా అద్వానీ రెండోసారి జోడీగా నటించారు. రెమ్యునరేషన్ తగ్గించుకున్న చరణ్.. కారణం ఇదేనా..?ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుంది. సుమారు మూడేళ్ల తర్వాత ఆయన నుంచి సినిమా విడుదల కానుంది. దీంతో గేమ్ ఛేంజర్‌పై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఈ సినిమా కోసం చరణ్ తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు దర్శకుడు శంకర్ కూడా చాలా తక్కువ మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. చరణ్ రూ. 60 కోట్లు, శంకర్ 30 కోట్లు మాత్రమే తమ రెమ్యూనరేషన్లుగా తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. అయితే, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే, రామ్ చరణ్ ఏ సినిమాకు అయిన ఓకే చెబితే.. ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే తన రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ ఉంది. ఆయన అడ్వాన్సులు వంటివి తీసుకోరట. అదే ఆయనకు ఇప్పుడు మైనస్ అయిందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా 2024లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఈ కారణం వల్ల ముందుగా అనుకున్న తన రెమ్యునరేషన్‌ను చరణ్ తగ్గించుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం అవుతుంది. -
వెంకీ మామ పాత్రల్లో హీరోయిన్స్.. వీరిద్దరిని గుర్తు పట్టారా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రంలో వెంకీ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే అందరిలా రోటీన్‌గా కాకుండా కాస్తా డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల సాంగ్ రిలీజ్ సమయంలోనూ అందరికంటే భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఈ సారి ఏకంగా వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలను ఎంచుకున్నారు. అదేంటో మీరు చూసేయండి.ఈ మూవీ మీనాక్షి చౌదరి, ఐశ్వర్వ రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా వీరిద్దరిని వెంకీ గెటప్‌లోకి మార్చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరిని వెంకీ చిత్రం బొబ్బిలి రాజాలో రాజా పాత్ర గెటప్‌లో ముస్తాబు చేశారు. అలాగే ఐశ్వర్య రాజేశ్ వెంకటేశ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం చంటి పాత్ర గెటప్‌లో సందడి చేసింది. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఇద్దరు హీరోయిన్లు వెంకీ మామ వేషధారణలో డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడి జయం మనదేరా చిత్రంలోన మహదేవ నాయుడు పాత్ర, ఘర్షణ చిత్రంలోని డీసీపీ రామచంద్ర పాత్రలో దిల్ రాజు సందడి చేశారు.కాగా.. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ కూడా విడుదలైంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. Let's celebrate the new year with a very special interview, "VENKY MAMAs tho #SankranthikiVasthunam" ❤️🔥Presenting @aishu_dil as CHANTI from #CHANTI 😍Stay tuned for the next one and keep guessing 😉#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/jYNxMrAbGl— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 Ayyo Ayyo Ayayyoooo 😄Presenting @Meenakshiioffl as RAJA from #BobbiliRaja 😍Stay tuned for the next one and keep guessing 😉#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/btrn9IedG6— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 -
రాజకీయాల కోసం చిత్ర పరిశ్రమను వాడకండి: దిల్ రాజు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. రాజకీయ దాడి, ప్రతి దాడులకు చిత్రపరిశ్రమను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు. ‘సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదు.. అందరికీ తెలిసే జరిగింది. తెలుగు చిత్రపరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్రపరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ అభివృద్ధి పయనంలో చిత్రపరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కోరారు.హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని చిత్రపరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించాం. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోన్న చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం’ అని దిల్ రాజు ట్వీట్ చేశారు. కాగా, ఓ మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ రెడ్డి కేవలం ప్రచారం కోసమే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయించాడని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సినిమా వాళ్ల గురించి అసెంబ్లీ అలా మాట్లాడారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి.. సినిమా వాళ్లతో సెటిల్ చేసుకొని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు.pic.twitter.com/m6VhQmda0C— Chairman - Film Development Corp (@TGFDC_Chairman) December 31, 2024 -
డిప్యూటీ సీఎం పవన్‌తో దిల్ రాజు భేటీ.. ఈ అంశాలపైనే చర్చ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమరావతిలో భేటీ అయ్యారు. తాను నిర్మించిన 'గేమ్ ఛేంజర్' సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో వారిద్దరి భేటీ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు విజయవాడలో సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమం ఏర్పాటు గురించి పవన్‌తో దిల్ రాజు చర్చించనున్నారు.తెలంగాణలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో బెనిఫిట్‌షోలు, టికెట్ ధరల పెంపు వంటి అంశాలు ఉండవని ఆయన క్లియర్‌గా చెప్పేశారు. దీంతో సంక్రాంతి సినిమాలపై భారీగా ప్రభావం పడింది. ఈ క్రమంలో దిల్ రాజు- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్' జనవరి 10న విడుదల కానుంది. తెలంగాణలో ఈ చిత్రానికి ఎలాంటి బెనిఫిట్‌షోలు, టికెట్ ధరల పెంపు ఉండదు. దీంతో కనీసం ఏపీలో అయినా ఈ సౌలభ్యం పొందాలని చిత్ర యూనిట్ భావించింది. ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ఏపీలో టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వాలని ఆయన్ను కోరనున్నట్లు సమాచారం. జనవరి 4,5 తేదీలలో విజయవాడలో గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేలా చూడాలని పవన్‌ను కోరనున్నారు. ఈ భేటీ అనంతరం దిల్ రాజు పూర్తి విషయాలు ప్రకటించే అవకాశం ఉంది. -
విజయవాడ : 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ కటౌట్ వరల్డ్ రికార్డ్.. ట్రైలర్ డేట్ ప్రకటించిన దిల్ రాజు
రామ్ చరణ్ ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాదికి సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఏపీలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. విజయవాడలో దాదాపు 256 అడుగులతో ఏర్పాటు చేసిన కటౌట్‌ను నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ భారీ కటౌట్‌కు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ సందర్భంగా దిల్ రాజుకు అవార్డ్‌ను అందజేశారు. కాగా.. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఈ కటౌట్‌ను సిద్ధం చేశారు.ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..' జనవరి 1న గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ట్రైలర్ చూస్తే ఈ సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది. గేమ్ ఛేంజర్‌లో రామ్‌చరణ్ నట విశ్వరూపం చూస్తారు. రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేసిన మెగా అభిమానులకు నా ధన్యవాదాలు' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. -
ఇండియా బిగ్గెస్ట్ 'రామ్ చరణ్' కటౌట్.. ఆవిష్కరించనున్న గేమ్ ఛేంజర్ టీమ్
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను విజయవాడలో ఆయన ఫ్యాన్స్ ఆవిష్కరించనున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధించాలని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో డిసెంబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకు చిత్ర యూనిట్ ఆవిష్కరించనుంది.256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ లుక్‌తో కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ దేశంలోనే అతి పెద్దదని మెగా అభిమానులు చెబుతున్నారు. ఆదివారం నాడు హెలికాప్టర్‌తో కటౌట్‌కి పూలభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గేమ్ ఛేంజర్ చిత్ర బృందంతో పాటు నిర్మాత దిల్ రాజు హాజరు కానున్నారు. ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసేందుకు సుమారు ఐదురోజులగా అభిమానులు కష్టపడ్డారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేలకు పైగానే ఫ్యాన్స్ రావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం పూర్తి అనుమతులు తీసుకున్నట్లు రామ్ చరణ్ అభిమానులు వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగ జనవరి 10న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. -
బెనిఫిట్ షోలు లేనట్టేనా..?
-
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలుస్తుందని దిల్ రాజుకు చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీ పెద్దల మధ్య సమావేశం జరగడం శుభసూచకమని పోస్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని, నాయకత్వాన్ని అభినందిస్తున్నామని తెలిపింది. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది. సినిమా షూటింగ్‌లకు హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కట్టుబడి ఉన్నారని రాసుకొచ్చింది. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.కాగా.. ఇవాళ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎంతో భేటీలో పలు అంశాలపై చర్చించారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భేటీ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.We are delighted with the fruitful meeting held today between the Telangana Government and representatives of the Telugu Film Industry facilitated by the Film Development Corporation of Telangana.We deeply appreciate the visionary leadership of our Honourable Chief Minister Sri…— Sri Venkateswara Creations (@SVC_official) December 26, 2024మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. గ్లోబల్ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల దిశగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి దూరదృష్టికి ఇండస్ట్రీ ఎల్లప్పుడు మద్దతుగా ఉంటుందని పేర్కొంది.అలాగే సామాజిక సమస్యలపై అవగాహన పెంచడంలో ప్రభుత్వానికి మద్దతుగా ఇండస్ట్రీ పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మద్దుతుగా ఉంటామని మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. మన సమాజ ఉజ్వల భవిష్యత్తు కోసం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చింది. We sincerely thank the Government of Telangana, Honorable Chief Minister Shri @revanth_anumula Garu, Cinematography Minister @KomatireddyKVR Garu, and Deputy Chief Minister @Bhatti_Mallu Garu for their visionary leadership and steadfast encouragement towards the growth of the…— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2024 -
సీఎంతో సినీ పెద్దల భేటి.. దిల్ రాజు ప్లాన్ బెడిసికొట్టిందా?
సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో తెలుగు పరిశ్రమలో అలజడి మొదలైంది. ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ప్రజాప్రతినిధులు పదునైన కామెంట్లు చేస్తున్నా సరే ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. భవిష్యత్‌లో బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు అనేది ఉండదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య దూరం పెరుగుతుందనే వాదన అందరిలోనూ మొదలైంది. మరోవైపు సంక్రాంతికి భారీ సినిమాలు రానున్నాయి. ఇందులో మెగా హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం కూడా ఉంది. ఈ మూవీ కోసం నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ పెట్టారు. ఈ సినిమా విడుదల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పవచ్చు.కొద్దిరోజుల క్రితం ఎఫ్డీసీ ఛైర్మన్‌గా దిల్‌రాజు నియామకం అయ్యాక పుష్ప చేసిన డ్యామేజీకి ‘గేమ్ ఛేంజర్’ అవుతారని అందరూ భావించారు. దానిని నిజం చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు తాను మధ్యవర్తిగా ఉంటానని ఆయన అన్నారు. అందులో భాగంగానే అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్‌తో ఆయన సమావేశం అయ్యారు. చిత్రసీమ అభివృద్ధికి, సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆ సమయంలో దిల్ రాజు ప్రకటించారు. స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి బయటకొచ్చిన తర్వాత దిల్ రాజు ఇచ్చిన స్టేట్ మెంట్ కావడంతో గేమ్ ఛేంజర్‌కు బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉంటాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.తాజాగా ఇండస్ట్రీ సమస్యల పేరుతో సీఎం రేవంత్‌తో సినీ పెద్దల మీటింగ్‌ను దిల్‌రాజ్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదని సీఎం ప్రకటించడంతో ఆ ఎఫెక్ట్ మొదట గేమ్ ఛేంజర్ మీద పడుతుందని దిల్ రాజు భావించారు. ఈ భేటీతో గేమ్ ఛేంజర్‌కు ప్రత్యేక అనుమతులు పొందవచ్చని ఆయన అడుగులు వేసినట్టు కనబడింది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు దిల్ రాజు బడ్జెట్ పెట్టారు. గేమ్ ఛేంజర్‌కు బెనిఫిట్‌షోలు, టికెట్ల ధరలు పెంపు లేకుంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి ఎలాగైనా సరే బయటపడేందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించేందుకు ఆయన ప్రయత్నం చేశారని తెలుస్తోంది.తాజాగా సీఎంతో జరిగిన సమావేశంలో టికెట్ల రేట్లు పెంపుతో పాటు బెనిఫిట్‌షోల గురించి కూడా చర్చ వచ్చిందట. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం తాను అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటున్నానని.. అందులో తగ్గేదే లేదని ఆయన అన్నారట. చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా సీఎంను ఒప్పించే ప్రయత్నం చేశారట. అయినప్పటికీ, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్ల పెంపు ఉండదని రేవంత్ క్లియర్‌గా చెప్పేశారట. అంతే కాదు ప్రీరిలీజ్‌లు, సినిమా ఫంక్షన్లు, అభిమానుల గేదరింగులకు అనుమతులు ఉండాలంటే పక్కాగా నిబంధనలు పాటించాలని చెప్పారట. సినిమా పెద్దలు ఎంత ప్రయత్నించినా సీఎం రేవంత్ మాత్రం ‘తగ్గేదే లే’ అన్నారని సమాచారం. మొత్తానికి సీఎం రేవంత్ పైచేయి సాధించారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అందులో నిజం లేదు.. సీఎంతో భేటీ తర్వాత 'దిల్ రాజు' వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసిన అనంతరం ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు, పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన అన్నారు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఇండస్ట్రీతో ప్రభుత్వం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు దిల్ రాజు అన్నారు.గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం హీరోలు, హీరోయిన్లు తమ వంతుగా పాటు పడుతారని దిల్ రాజు అన్నారు. ఐటీ, ఫార్మాతో సమానంగా సినిమా పరిశ్రమ కూడా ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమాలు నిర్మించేలా పాటుపడాలని సీఎం సూచించినట్లు దిల్ రాజు అన్నారు. తెలంగాణలో సామాజిక అంశాలలో నటీనటులు ఇక నుంచి పాల్గొంటారని ఆయన అన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్‌షోలు వంటి అంశాలు చాలా చిన్నవని ఆయన అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో తమ సమావేశం సానుకూలంగానే జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఇండస్ట్రీ పనిచేస్తుందని ఆయన అన్నారు. కొన్ని సంఘటనల వల్ల చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి దూరం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. త్వరలో తామందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకుని సినిమా పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అవసరాలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. రూమర్స్‌పై స్పందించిన దిల్ రాజు..సీఎంతో భేటీ తరువాత పలు మాధ్యమాల్లో వస్తున్న ఫేక్ వార్తలపై దిల్ రాజు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. అరశాతం కూడా నెగిటివ్ లేదని.. సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. బెనిఫిట్స్ షోలు టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదని.. పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు చూపించలేదని అన్నారు. బౌన్సర్స్ విషయంలో ప్రతిదీ అకౌంటబిలిటీగా ఉండాలని డీజీపీ సూచించినట్లు దిల్ రాజు వెల్లడించారు. -
సీఎం రేవంత్‌తో భేటీ.. అందుకే చిరంజీవి రాలేదు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలుగు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు నాగార్జున, వెంకటేశ్, కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఈ విషయంలో సినీ హీరోలదే బాధ్యత: సీఎం రేవంత్)అయితే ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉండే చిరంజీవి(Chiranjeevi) మాత్రం సీఎం భేటీకి దూరంగా ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాడు. చిరంజీవి కావాలనే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి దూరంగా ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏంటంటే.. ప్రస్తుతం చిరంజీవి హైదరాబాద్‌లోనే లేరు. అందుకే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేదని ఆయన పీఆర్ వర్గాలు చెబుతున్నాయి.స్నేహం కోసం చెన్నై.. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా చిరంజీవి ముందు ఉండేవాడు. గతంలో అనేక సార్లు ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల టాలీవుడ్లో జరుగుతున్న పరిమాణాలు అందరికి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం..అసెంబ్లీలో సీఎం రేవంత్ సినీ స్టార్లపై కామెంట్స్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు రంగంలోకి దిగి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించాడు. అయితే ఈ భేటీలో చిరంజీవి కూడా పాల్గొంటారని ప్రచారం జరిగింది. నిన్నటి వరకు చిరంజీవి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం చిరంజీవి చెన్నై వెళ్లారు. అక్కడ తన స్నేహితుడి కొడుకు పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు. ఆ కారణంతోనే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేకపోయాడని ఆయన పీఆర్ టీమ్ చెప్పింది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం రేవంత్‌తో సీనీ ప్రముఖుల భేటీ (ఫోటోలు)
-
అది దా సారు!
హీరోయిన్ మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సః కుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ కిరణ్ హీరోగా నటిస్తున్నారు. హెచ్. మహాదేవ గౌడ, హెచ్. నాగరత్న నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ‘అది దా సారు...’ పాట లిరికల్ వీడియోను నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం ఇవ్వగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘కుటుంబ నేపథ్యంలో వస్తున్న మా ‘సః కుటుంబానాం’ టైటిల్‌తోనే అంచనాలు పెంచేసింది. ‘అది దా సారు...’ పాటలోని లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మధు దాసరి, ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్: రోహిత్ కుమార్ పద్మనాభ, లైన్‌ప్రొడ్యూసర్: అంకిత్ కనయ్. -
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటి.. ముహుర్తం ఫిక్స్!
సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్న సినీ పెద్దలు గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఈ భేటీకి టాలీవుడ్ తరఫున ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, హీరో వెంకటేశ్ కుడా హాజరు కానున్నారు.గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దిల్‌రాజుతో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా హాజరవుతారని సమాచారం. సంధ్య థియేటర్ ఘటనతో పాటు సినిమా పరిశ్రమ సమస్యలపై కూడా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు. -
శ్రీ తేజ కుటుంబానికి రూ.2 కోట..
-
కిమ్స్ ఆస్పత్రికి దిల్ రాజు, అల్లు అరవింద్
-
సంక్షోభం.. సినీ రంగానికా? రాజకీయానికా?
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప -2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయం చిలికి,చిలికి గాలివానగా మార్చడానికి రాజకీయ నేతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. సినీ పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం చూపించేలా పరిస్థితులు ఏర్పడుతుండడం దురదృష్టకరం. వేలాది మందికి ఆధారంగా ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి.. కొత్త సంవత్సరంలో సంక్రాంతి(Sankranti) సందర్భంగా విడుదల కావల్సి ఉన్న సినిమాలపై ఈ ఉదంతం.. పరిణామాల ప్రభావం పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. దానికి కారణం వీరిలో కొందరు భారీ వ్యయంతో సినిమాలు తీయగా, ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షో లు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించం అని ప్రకటించడమే అని చెబుతున్నారు. వినోద మాద్యమ రంగంలో వచ్చిన అనేక మార్పుల ప్రభావం ఆ పరిశ్రమను అతలాకుతలం చేస్తోందని చెప్పవచ్చు. ఆ దశలో అల్లు అర్జున్ ఘటన వ్యవహారాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది రేవంత్ ఈగో సమస్యగా మారినట్లుగా ఉంది. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ ప్రముఖులను తప్పుపట్టారు. అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండి ఇంటికి వస్తే సినీ ప్రముఖులు, ఇతరులు క్యూ కట్టి పరామర్శిస్తారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. తొక్కిసాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ఆస్పత్రిలో ఉంటే ఎందుకు పరామర్శించ లేదని ఆయన అన్నారు. నిజమే!ఆ బాలుడిని పరామర్శించాలని చెప్పడం తప్పు లేదు.కాని ఆ కారణంగా అర్జున్ ఇంటి వద్దకు వెళ్లడం తప్పన్నట్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అంత సముచితంగా లేదు.పైగా కాలు పోయిందా?చేయి పోయిందా? కిడ్నీ పోయిందా?ఏమి జరిగిందని అర్జున్ వద్దకు వెళ్లారని ప్రశ్నించడం మరీ తప్పు అని చెప్పకతప్పదు. తమకు సంబంధించిన వ్యక్తి తప్పు చేసినా, చేయకపోయినా, ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన సన్నిహితులు,అదే రంగానికి చెందినవారు వెళ్లి పలకరించి వస్తుంటారు.అంతెందుకు! ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి బెయిల్ పై జైలు నుంచి విడుదల అయినప్పుడు జైలువద్దకు వచ్చినవారితో కలిసి ఆయన ర్యాలీనే తీశారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ పై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేసి పశ్చాత్తాప్తం ప్రకటించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోరు పారేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. అల్లు అర్జున్ ఆంధ్రా వెళ్లిపోవాలట..! ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యాపారాలు చేయాలట!. ఇలాంటి వ్యాఖ్యలను రేవంత్ సమర్దిస్తారా? సమర్దించరు. ఎందుకంటే స్వయానా ఆయన అల్లుడు ఆంధ్రకు చెందినవారన్న సంగతి తెలిసిందే. ఈ మాత్రం సోయ లేకుండా భూపాల్ రెడ్డి వంటి వారు వ్యర్ద ప్రసంగాలు చేస్తే అది కాంగ్రెస్ కు మరింత చేటు తెస్తుంది. మంత్రి సీతక్క అయితే.. పుష్ప సినిమాకుగానూ అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. అది తప్పయితే.. రేవంత్ ప్రభుత్వం ఆ సినిమాకు బెనిఫిట్ షోలు, ధరల పెంపుదలకు ఎందుకు అనుమతి ఇచ్చింది?. ఆ మాటకు వస్తే నక్సల్స్ కు సానుభూతిగా కొన్ని సినిమాలు వచ్చాయి.వాటిలో కొన్నిటికి అవార్డులు కూడా లభించాయి. కాని నక్సల్స్ ను ఏ ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా?. సీతక్క(Seethakka) ఎందుకు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చారు?. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే సరిపోదని గుర్తించాలి. ఇదే టైంలో.. 👉బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, రఘునందన్ తదితరులు అల్లు అర్జున్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని,పగ పట్టినట్లు వ్యవహరిస్తోందని కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నా.. బీజేపీ వాళ్లే దీనిని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు కస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యత్నిస్తోంది. భవిష్యత్తులో అల్లు కుటుంబాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది చూడాలి. ఇక.. అర్జున్ పై కాంగ్రెస్ కాక తగ్గించకపోతే.. ఆ దిశగా అడుగులు పడ్డా ఆశ్చర్యం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అర్జున్ దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వానికి మంటపుట్టించింది. అది అర్జున్ కు ఉన్న స్వేచ్చ అని ప్రభుత్వం భావించలేదు. పోలీసు ఉన్నతాధికారులంతా రంగంలో దిగి అర్జున్ ఏదో ఘోరమైన నేరం చేశారని చెప్పడానికి యత్నించారు. లేకుంటే ఈ కేసులో పదివేల వీడియోలు సేకరించవలసినంత అవసరం ఏముంది?. ఎక్కడో చోట అర్జున్ తప్పు దొరకకపోదా? అని వెతికారన్నమాట. దీనిని ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టగా భావించారన్నమాట!. ఇదే సందర్భంలో.. 👉పోలీసులు సంధ్య థియేటర్ వద్ద అర్జున్ కు స్వాగతం చెప్పిన రీతిలో వ్యవహరించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఒక సస్పెండెడ్ పోలీస్ అధికారి అయితే మరీ రెచ్చిపోయి ఆంధ్ర-తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం, అర్జున్ నటన గురించి వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమవారికి ఇచ్చిన భూముల ప్రస్తావన తేవడం, ఏకంగా తాటతీస్తాం,తోలు తీస్తాం అని హెచ్చరించడం శోచనీయంగా ఉంది. అర్జున్ కు పోలీసులు నోటీసు ఇచ్చి మూడున్నర గంటలు విచారించడం కూడా వేధింపులో భాగమే అనే అభిప్రాయం కలుగుతుంది. పైగా అర్జున్ ‘‘అలా జవాబిచ్చారు..ఇలా సమాధానం ఇచ్చారు..’’ అంటూ లీకులు ఇచ్చిన తీరు కూడా దీనిని ధృవపరుస్తుంది. ఏపీలో రెడ్ బుక్(Red Book) రాజ్యాంగం మాదిరి తెలంగాణలో కూడా పోలీసులు ప్రజల తోలు తీసే రాజ్యాంగం వచ్చిందేమో తెలియదు.మరో వైపు కొందరు ఓయూ జేఏసీ పేరుతో అర్జున్ ఇంటిపై దాడి చేయడం మరింత దారుణం. పేరుకు జేఏసీ అయినా.. అక్కడకు వెళ్లినవారంతా కాంగ్రెస్ వారేనని సోషల్ మీడియాలో ఆధార సహితంగా వీడియోలు వచ్చాయి. దీనిని ఖండించి , ఏకోన్ముఖంగా నిరసన చెప్పవలసిన సినిమా పరిశ్రమ పెద్దలు జడిసిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ శాసనసభలో చేసిన విమర్శలతో వీరంతా భయపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే.. 👉అర్జున్ ఇంటిపై దాడి చేసినవారు అరాచకంగా రాళ్లు వేసి,పూలకుండీలు మొదలైనవాటిని ధ్వంసం చేసినా ఇంటిలో పనిచేసేవారిపై దౌర్జన్యానికి దిగినా సినీ ప్రముఖులు మాత్రం నోరు మెదపలేదు. అర్జున్ కు ,ఆయన తండ్రి అరవింద్ కు సంఘీబావం తెలపలేదు. ఇది పరిశ్రమ బలహీనతగా ఉంది. రేవంత్ కూడా అర్జున్ ఇంటిపై దాడిని నేరుగా ఖండించకుండా, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నానని ప్రకటన ఇవ్వడం ద్వారా ఆయనలో ఇంకా కోపం తగ్గలేదని చెప్పకనే చెప్పారనుకోవాలి.. ఇదే సందర్భంలో సడన్ గా బెనిఫిట్ షో లు రద్దు చేస్తామని సీఎం చెప్పడం సినీ పరిశ్రమ ప్రముఖులలో గుబులు రేపుతోంది. వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో ప్రముఖ నటుడు వెంకటేష్ తదితరుల సినిమాలు విడుదల కావల్సి ఉంది. వీటిలో ఒక సినిమాకు ఐదువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయిందట!. అలాగే మరో సినిమాకు 150 కోట్లు ఖర్చు పెట్టారట!. ఈ భారీ బడ్జెట్ సినిమాలకు స్పెషల్ షో లు, ధరల పెంపు,బెనిఫిట్ షో లు వంటివి లేకపోతే.. సత్వరమే వారు పెట్టిన పెట్టుబడి రావడం కష్టం అయిపోతుంది. 👉ప్రముఖ నిర్మాత ,తెలంగాణ చలనచిత్రాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రేవంత్ ను ఒప్పించి మళ్లీ బెనిఫిట్ షో లు, ధరల పెంపుదలకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకువస్తారన్న ఆశతో ఉన్నారట!. అందుకే ఇప్పుడు అర్జున్ తప్పుచేసినా, చేయకపోయినా.. ఆ ఘటన జోలికి వెళ్లకపోవడం బెటర్ అని భావిస్తున్నారట!. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ ధరల గురించి చర్చించి, షూటింగ్ లు కూడా జరిపేలా షరతులు పెడితే.. ఇంకేముంది సినిమావారిపై దాడి చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటివారు కాని, ఇటు ఎల్లో మీడియా కాని ఇప్పుడు నోరు మెదపడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించి విందు ఇచ్చి పంపితే, ఆయనకు ఏదో అవమానం జరిగిందంటూ కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు స్వయానా చిరంజీవి మేనల్లుడు ఇంటిపైనే దాడి జరిగితే పవన్ కల్యాణ్‌తో సహా ఎవరూ నోరు విప్పడం లేదు. ఎందుకంటే.. పవన్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే ఉంటాయి కాబట్టి.👉నిజంగానే రేవంత్ తననిర్ణయానికి కట్టుబడి ఉంటే ఒకరకంగా ప్రయోజనం, మరో రకంగా నష్టం వాటిల్లవచ్చు. నిర్మాతలు చిన్న బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్దం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెంచాలని కోరవలసిన అవసరం ఉండదు. కానీ అగ్ర నిర్మాతలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ ఇది ముదిరితే సినీ పెద్దలు రేవంత్ ప్రభుత్వంపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు చేయవచ్చు!. అంతేకాక తాము ఇక్కడ షూటింగ్ లు చేయలేమని,వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని ప్రకటించినా, రేవంత్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందువల్ల పరిశ్రమకు ఇబ్బంది రాకుండా, అలాగే ప్రేక్షకులకు సౌలభ్యంగా రాజీ కుదుర్చుకోవడం మంచిదని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కావాలని ఎవరూ చేయరు
రాంగోపాల్‌పేట్: పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతిచెందడం దురదృష్టకరమని ప్రముఖ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు అన్నారు. అయితే ఇలాంటి ఘటనలను ఎవరూ కావాలని చేయరని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఉదంతాలు మళ్లీ జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంగళవారం దిల్‌రాజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య సమస్యల్లేకుండా చూసుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు ఎఫ్డీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని ఆయన చెప్పారు.రెండు, మూడు రోజుల్లో పరిశ్రమ పెద్దలతో సహా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడతానని.. సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన హామీ ఇచ్చారు. మరోసారి సీఎం కలవడంతోపాటు హీరో అల్లు అర్జున్ను కూ డా కలిసి అన్ని విషయాలు తెలుసుకుంటానన్నారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటాం.. శ్రీతేజ్‌కు వెంటిలేటర్ తొలగించి రెండు రోజులైందని.. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు దిల్‌రాజు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉండటం వల్ల తాను ఇక్కడికి రాలేకపోయానని.. సీఎంను మంగళవారమే కలిశానన్నారు. తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకొనే బాధ్యతను ప్రభుత్వం, సినీ పరిశ్రమ తీసుకుంటుందన్నారు. బాలుడి తండ్రి భాస్కర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారని.. అవసరమైతే సినీ పరిశ్రమలో ఉద్యోగం కల్పిస్తామని దిల్‌రాజు తెలిపారు.కళ్లు తెరిచిన శ్రీతేజ్కొద్దిగా స్పర్శ కూడా తెలుసుకుంటున్నట్లు వైద్యుల వెల్లడిరాంగోపాల్పేట్: సంధ్య థియేటర్లో జరిగిన తొక్కి సలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి కోమాలో ఉన్న బాలుడిని వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. దీంతో అతను కాస్త కోలుకోవడంతో రెండు రోజుల క్రితం వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం అతను సొంతంగానే శ్వాస తీసుకుంటుండటంతోపాటు కళ్లు తెరిచి చూస్తున్నాడని.. కొద్దిగా స్పర్శ కూడా తెలుసుకోగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు. అయితే ఇంకా కుటుంబ సభ్యులను గుర్తించట్లేదని.. మాటలకు ప్రతిస్పందించట్లేదని చెప్పారు. గత మూడు రోజులుగా నాసోగ్యా్రస్టిక్ ట్యూబ్ ద్వారా అందించే ఆహారాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు. థియేటర్ లోపల ఏమి జరిగిందో తెలియదు: భాస్కర్ సంధ్య థియేటర్ లోపల ఏమి జరిగిందో తనకు తెలియదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మీడియాకు చెప్పారు. తాను కుమార్తెతో కలిసి థియేటర్ బయట నుంచి భార్యకు ఫోన్ చేయగా లోపల ఉన్నట్లు చెప్పిందని.. ఆ కొద్దిసేపటికే తొక్కిసలాటలో మరణించినట్లు తెలిసిందన్నారు. ఇంతవరకు తాను ఆస్పత్రికి బిల్లులేవీ చెల్లించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మైత్రీ మూవీస్ రూ. 50 లక్షలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయనకు చెందిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ. 25 లక్షలు, హీరో అల్లు అర్జున్ నుంచి రూ. 10 లక్షలు తనకు అందాయన్నారు. అల్లు అర్జున్ మేనేజర్ తదితరులు నిత్యం శ్రీతేజ్ ఆరోగ్యం గురించి తనను సంప్రదిస్తున్నారని చెప్పారు. అలాగే దర్శకుడు సుకుమార్ రెండుసార్లు వచ్చి కలిశారని తెలిపారు. ఘటన జరిగిన రెండవ రోజు అల్లు అర్జున్ అరెస్టు అవుతున్నాడని సానుభూతితోనే నేను కేసు వాపసు తీసుకుంటానని చెప్పినట్లు తెలిపారు. -
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు
సాక్షి, హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను నిర్మాత, టీఎఫ్‌డీసీ (Telangana Film Development Corporation) చైర్మన్ దిల్‌రాజు (Dil Raju) మంగళవారం పరామర్శించారు. ప్రస్తుతం శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, రేవతి కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సీఎంను కలుస్తాంరేవతి భర్త భాస్కర్‌కు సినీ ఇండస్ట్రీలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్‌ను కలిసి భాస్కర్ కుటుంబానికి ఏం చేయాలనేది చర్చించామన్నారు. సినీ పరిశ్రమ పెద్దలందరం కలిసి సీఎంని రెండు రోజుల్లో కలుస్తామని, ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడతామన్నారు. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun)ను కూడా కలుస్తానని తెలిపారు. సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని స్పష్టం చేశాడు.శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడుశ్రీ తేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ.. నా కుమారుడు శ్రీతేజ్ 20 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. 48 గంటల క్రితం వెంటిలేటర్ తీసేశారు. కొంత స్పర్శ ఉంది, కళ్ళు తెరుస్తున్నాడు. శ్రీ తేజ్ కోలుకోవడానికి టైం పట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ మనుషులు, సుకుమార్ ఫ్యామిలీ కూడా ప్రతిరోజూ శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. మా వల్ల హీరో అరెస్ట్ అవుతున్నాడని తెలిసి ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వచ్చి భరోసా ఇచ్చారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలు ప్రకటించారు, కానీ మాకు రూ.10 లక్షలే అందింది. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థవారు రూ.50 లక్షలు ఇచ్చారు అని తెలిపారు.ఏం జరిగింది?కాగా డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 (Pushpa 2 Movie) ప్రీమియర్స్ ఏర్పాటు చేయగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు 20 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు థియేటర్ సిబ్బందితో పాటు అల్లు అర్జున్, అతడి టీమ్‌పైనా కేసు నమోదు చేశారు.చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ను ఎన్నిగంటలు ప్రశ్నించారంటే? -
తగ్గని శంకర్.. పెరిగిన బడ్జెట్, ‘ గేమ్ ఛేంజర్’పై 300 కోట్ల భారం!
టాలీవుడ్ సినిమా బడ్జెట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. పదేళ్ల కిందట రూ.30, 50 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తేనే అది భారీ బడ్జెట్ మూవీ అనేవారు. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆ స్థాయిలో ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చిన్న హీరోలు సైతం రూ.50 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసుకున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాల బడ్జెట్‌కు అయితే లెక్కే లేదు. మినిమం రూ.150-200 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే. కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. అందుకే నిర్మాతలు పెద్ద హీరోలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. త్వరలోనే టాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కాబోతుంది. అదే గేమ్ ఛేంజర్(Game Changer).దిల్ రాజు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రానికి శంకర్(shankar) దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్. మూడేళ్ల క్రితం ఈ సినిమాకి బీజం పడింది. కరోనాతో పాటు ఇతర కారణాలతో సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. పబ్లిసిటీ, రెమ్యునరేషన్స్తో కలిసి చూస్తే.. ఈ సినిమాకు రూ.500 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. శంకర్ సినిమాలు అంటేనే బడ్జెట్‌కు పరిమితులు ఉండవనే విషయం తెలిసిందే. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కారు. పాటలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. పాటలతో పాటు కొన్ని సీన్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది.రూ.300 కోట్ల భారంగేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఎవరూ చేయని రీతిలో ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు మేకర్స్. అమెరికాలో భారీ ఈవెంట్ నిర్వహించడంతో గేమ్ ఛేంజర్‌పై మరింత హైప్ పెరిగింది. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ.200 కోట్ల వరకు నాన్ థియేటర్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. థియేటర్ నుంచి 300 కోట్లకు పైగా రాబడితే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది కాబట్టి.. హిట్ టాక్ వస్తే వీకెండ్లోనే ఆ సంఖ్యను దాటేయ్యొచ్చు. కానీ ఒకవెళ తేడా కొడితే మాత్రం అంత మొత్తం రాబట్టడం చాలా కష్టమే. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు రూ.150 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. మరో రూ.150 కోట్ల తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, ఓవర్సీస్ నుంచి రావాలి.దిల్ రాజు ప్లాన్ ఏంటి?సినిమాను నిర్మించడమే కాదు.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ దిల్ రాజు దిట్ట. తనదైన శైలీలో ప్రమోషన్స్ చేసి యావరేజ్ సినిమాను కూడా హిట్ చేయించగలడు.గతంలో చాలా సినిమాలు దిల్ రాజు ప్రమోషన్స్ వల్లే మంచి కలెక్షన్స్‌ని రాబట్టాయి. ఇక తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్‌పై దిల్ రాజు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రిలీజ్‌ని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసి మంచి పనే చేశాడు. పండగ సీజన్లో యావరేజ్ టాక్ వచ్చినా సరే.. కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే దిల్ రాజు కాస్త లేట్ అయినా..రిలీజ్‌ని సంక్రాంతికి మార్చాడు. ఇక నైజాంతో పాటు వైజాగ్‌లోనూ ఆయనే సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. మిగతా ప్రాంతాల్లో తన రెగ్యులర్ బయ్యర్లుకు సినిమాను అప్పజెప్పాడు. సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. ఈజీగా బ్రేక్ ఈవెట్ దాటేస్తుంది. ఇక హిందీలో బాగా ఆడితే మాత్రం.. దిల్ రాజు పంట పండినట్లే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. -
డల్లాస్‌లో ఘనంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ నుంచి 'దోప్' సాంగ్ రిలీజ్
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి మరో పాట రిలీజైంది. 'దోప్' అనే లిరిక్స్‌తో సాగుతూ మంచి కలర్ఫుల్గా ఉంది. కాకపోతే చాలావరకు ఇంగ్లీష్ లిరిక్స్ వినిపించాయి. ఒకటో రెండో తెలుగు పదాలు కనిపించాయి. విజువల్‌గా చూసుకుంటే మాత్రం చాలా రిచ్‌గా ఉంది.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)తమిళ దర్శకుడు శంకర్ తీసిన ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. అమెరికాలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన 'రా మచ్చా', 'నానా హైరానా', 'జరగండి' పాటలు అలరించగా.. ఇప్పుడొచ్చిన పాట కూడా మెల్లగా జనాలకు అలవాటు కావొచ్చనిపిస్తోంది.జనవరి 10న థియేటర్లలో 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజ్ కానుంది. ఇందులో చరణ్ సరసన కియారా అడ్వాణీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు నటించారు. దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతికి బిగ్ స్క్రీన్స్‌పైకి రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు) -
టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్ రాజు.. సీనీ ప్రముఖుల అభినందనలు (ఫొటోలు)
-
ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచింది: దిల్ రాజు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు(వెంకట రమణ రెడ్డి) బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవకాశమిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు.తెలుగు సినిమా పూర్వ వైభవం తీసుకురావడానికి అందరి సహకారం అవసరమని దిల్ రాజు అన్నారు. తెలంగాణా సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాతనే గుర్తింపు వచ్చిందని.. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.కాగా.. ఈ రోజు దిల్ రాజు పుట్టినరోజు కావడం మరో విశేషం. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చే ఏడాది పొంగల్‌కు విడుదల కానున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు చిత్రానికి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
నిర్మాత దిల్ రాజుకు గౌరవం
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ఆయన్ని నియమిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.టాలీవుడ్లో ఎన్నో విజయవంతమై చిత్రాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా దిల్ రాజుకు మంచి గుర్తింపు ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు నిర్మిస్తూ కొత్త వారికి కూడా అనేకమందికి ఛాన్సులు కల్పిస్తారనే విషయం తెలిసిందే. ఇండిస్ట్రీలోకి కొత్తగా వస్తున్న వారిని ప్రొత్సహిస్తూ ఆయన పలు కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభంచారు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు తాను 'దిల్ రాజు డ్రీమ్స్' పేరుతో కొత్త బ్యానర్ క్రియేట్ చేస్తున్నామని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. దీని కోసం ఆయన ఒక వెబ్‌సైట్‌ను కూడా త్వరలో లాంచ్ చేయనున్నారు. ముఖ్యంగా ఈ బ్యానర్ కొత్త వారికి ఎక్కువగా ఉపయోగపడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.TFCC అధ్యక్షుడిగా దిల్ రాజుతెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) అధ్యక్షుడిగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో దిల్ రాజు విజయం సాధించారు. ఆ ఎన్నికల ద్వార 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ ఆ సమయంలో బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. -
18 ఏళ్ల తర్వాత 'సంక్రాంతి' కోసం సాంగ్ పాడిన రమణగోగుల
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ ఈసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఈ పాటను ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 2025 సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్
-
గ్రాండ్‌గా దిల్ రాజు మనవరాలు ఇషిక శారీ ఫంక్షన్ (ఫోటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధానం అమలవుతుంది: దిల్ రాజు
సినిమా రివ్యూల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌పై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ ఇండస్ట్రీలో వారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా దానిని అమలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయా పడ్డారు.సినిమా విడుదలైన తర్వాత థియేటర్ల వద్దకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, రివ్యూలు ఇచ్చేవారిని అనుమతించకూడదని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి రివ్యూస్ వల్ల ఇండస్ట్రీ చాలా ఎక్కువగానే నష్టపోతుందని వారు తెలిపారు. దీనిని అరికట్టాలంటే థియేటర్ యజమానులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. థియేటర్ ముందు రివ్యూస్ చెప్పేవారిని లోపలికి అనుమతించకూడదని నిర్ణయించారు.దిల్ రాజు నిర్మించిన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల తేదీని ప్రకటించే కార్యక్రమంలో ఇదే విషయం గురించి ఆయన మాట్లాడారు. 'కోలీవుడ్‌లో వారు తీసుకున్న నిర్ణయం విజయవంతమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలా అమలయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయంలో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేము. ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకుని ఫైనల్‌గా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఇక్కడి ఎగ్జిబిటర్లు అలాంటి రివ్యూలను అరికట్టాలని సిద్ధంగా ఉన్నారట' అని దిల్ రాజు పేర్కొన్నారు. -
విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
దిల్ రాజు చేతుల మీదుగా ‘పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ స్టూడియో’ ప్రారంభం
-
కొత్తవారి కోసమే దిల్ రాజు డ్రీమ్స్: ‘దిల్’ రాజు
‘‘చిత్ర పరిశ్రమలో కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించేందుకే ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు, రచయితలు.. ఇలా ఆసక్తి ఉన్న ఎవరైనా మా టీమ్‌ని సంప్రదించవచ్చు. ఇందుకోసం నా బర్త్‌డే(డిసెంబరు 18) లేదా జనవరి 1న వెబ్ సైట్‌ను ప్రారంభిస్తాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ‘దిల్ రాజు డ్రీమ్స్’ లోగోను ఆయన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఇండస్ట్రీలో చాలా చిత్రాలు వస్తున్నట్టుగా, పోయినట్టుగా కూడా ఎవరికీ తెలీదు. ఎంత డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుసు.అందుకే ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయాలని, ప్రతిభ ఉన్న కొత్తవారికి సరైన వేదిక ఉండాలని ‘దిల్ రాజు డ్రీమ్స్’ను స్థాపించాను. ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు ‘దిల్ రాజు డ్రీమ్స్’ ద్వారా రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ సంస్థ కార్పోరేట్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ పనిచేసే వారందరికీ జీతాలు ఇస్తాం. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తాం.. వాటిలో కచ్చితంగా రెండు అయినా హిట్ కావాలని షరతు విధించాను. మంచి ప్రతిభావంతులకు నా బ్యానర్లో సినిమా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సిఫారసులు ఉండవు. అందరూ వెబ్ సైట్ ద్వారానే సంప్రదించాలి’’ అని తెలిపారు. -
ఎవరి కోసం ఎవరూ రారు.. అది మాత్రమే మాట్లాడాలి: దిల్ రాజు హాట్ కామెంట్స్
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిరణ్ అబ్బవరం క మూవీ సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన టాలెంట్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ సపోర్ట్ చేయరని అన్నారు. కిరణ్ అబ్బవరం మాట్లాడిన వీడియో చూశానని తెలిపారు. ఇదంతా నీ కష్టం వల్లే సాధ్యమైందని దిల్ రాజు ప్రశంసించారు. అంతేకానీ ఇక్కడ ఎవరి కోసమో మీరు వెయిట్ చేయవద్దని కోరారు. నీ దగ్గర టాలెంట్ ఉందని.. ట్రోల్స్ గురించి మరోసారి అలా ఎమోషనల్ కావొద్దని కిరణ్ అబ్బవరంకు దిల్ రాజు సూచించారు.ఎవరూ సపోర్ట్ చేయరు..ఇటీవల మరో టాలీవుడ్ హీరో రాకేశ్ వర్రే సైతం చిన్న హీరోలకు సెలబ్రిటీ స్టార్స్ ఎవరూ సపోర్ట్ చేయడం లేదని మాట్లాడారు. తాను ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం గురించి కూడా దిల్ రాజు ప్రస్తావించారు. మీ టాలెంట్, హార్డ్ వర్క్‌ను నమ్ముకోండి తప్ప.. ఇక్కడ ఎవరినీ ఎవరూ సపోర్ట్ చేయరు.. అలాగే వెనక్కి కూడా లాగరని ఆయన అన్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని.. సక్సెస్ వస్తే మాలాంటి వాళ్లు వచ్చి అభినందిస్తామని దిల్ రాజు కామెంట్స్ చేశారు.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'క'. తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలైంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత దిల్ రాజు పాల్గొని మాట్లాడారు. కాగా.. ఈ చిత్రానికి సుజిత్, సందీప్ ద్వయం దర్శకత్వం వహించారు.ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా...కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - 'మా "క" సక్సెస్ మీట్‌కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద సక్సెస్ ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలు ఆ నంబర్స్ మారిపోవడానికి. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను' అని అన్నారు. -
'గేమ్ చేంజర్' టీజర్.. అక్కడ గ్రాండ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేసింది. ఆపై ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో టీజర్ లాంచ్ కానుంది. నవంబర్ 9న గ్రాండ్‌గా గేమ్ చేంజర్ టీజర్‌ను విడుదల చేయనున్నారు.భారీ అంచనాలున్న గేమ్ చేంజర్ టీజర్ ఈవెంట్‌కు రామ్ చరణ్, కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ‘జరగండి జరగండి.. ’, ‘రా మచ్చా రా..’ సాంగ్స్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ నెల 9న టీజర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రంపై అంచనాలు మరింత రేంజ్లో పెరగనున్నాయి. టీజర్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలక్షన్స్‌ను నిబద్ధతతో నిర్వహించే ఆఫీసర్‌గా మెప్పించనున్నారు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. Ready, Set... Command 😎Get ready for #GameChanger ‘s charge in Lucknow ❤️🔥🧨#GameChangerTeaser launch event on 9th NOVEMBER in Lucknow, UP.#GameChanger takes charge in theatres on JAN 10th ❤️🔥Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @iam_SJSuryah… pic.twitter.com/gq9LXHCs1y— Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2024 -
శ్రీవారి సేవలో దిల్‌రాజు దంపతులు.. వీడియో వైరల్!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయాన్నే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సతీసమేతంగా తిరుమల వెళ్లిన ఆయనకు ఆలయ పూజారులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వస్తోన్న గేమ్ ఛేంజర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. డిసెంబర్లోనే రావాల్సిన గేమ్ ఛేంజర్.. చిరంజీవి విశ్వంభర పొంగల్ పోటీ నుంచి తప్పుకోవడంతో రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు. కాగా.. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. Ace Producer #DilRaju along with his family visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!!🙏✨#GameChanger #TeluguFilmNagar pic.twitter.com/v11nYzY8Lk— Telugu FilmNagar (@telugufilmnagar) October 24, 2024 -
పొంగల్ పోరు.. సీన్ మారుతోంది!
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే చాలా స్పెషల్. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి దాదాపు అన్ని సినిమాల వసూళ్లు బాగుంటాయి. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు, దర్శక – నిర్మాతలు వారి సినిమాలను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని పోటీ పడుతుంటారు. కానీ ఫైనల్‌గా బెర్త్ కొంతమందికే దొరుకుతుంది. 2025 సంక్రాంతి సమయం సమీపిస్తున్న తరుణంలో సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఆయా చిత్రబృందాలు రెడీ అవుతున్నాయి. కానీ ఆల్రెడీ సంక్రాంతికి ప్రకటించిన సినిమాలు థియేటర్స్‌లోకి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో వేరే సినిమాలు సంక్రాంతికి సై అంటున్నాయి. ఇలా సంక్రాంతి సినిమా సీన్ మారుతోంది. ఇక 2025 సంక్రాంతి బాక్సాఫీస్ పోరులోకి వెళదాం.సంక్రాంతికి వస్తున్నాం... కానీ! ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే వర్కింగ్ టైటిల్‌ని పెట్టుకుని మరీ వెంకటేశ్ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నారంటే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని యూనిట్ ఎంతటి కృతనిశ్చయంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, అతని భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మరో చిత్రం ‘గేమ్ చేంజర్’ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సంక్రాంతి పండక్కి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా స్పేస్ ఉంటుంది కాబట్టి తమ బేనర్లోని ఈ రెండు చిత్రాలనూ ‘దిల్’ రాజు పండగ బరిలో దింపుతారని ఊహించవచ్చు. ఆఫీసర్ వస్తారా? ఈ ఏడాది సంక్రాంతి సమయంలో రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్స్‌లోకి రావాల్సింది. కానీ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల నిర్మాతల రిక్వెస్ట్, వివిధ సమీకరణాల నేపథ్యంలో ‘ఈగల్’ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకుని, ఫిబ్రవరిలో విడుదలైంది. దీంతో 2025 సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని రవితేజ ప్లాన్ చేశారు. రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ, హీరో రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో రవితేజ భుజానికి గాయమైంది. దాంతో ఈ సినిమా చిత్రీకరణ సజావుగా సాగలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? లేదా అనే విషయంపై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. ‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరి పాత్రలో రవితేజ నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. గేమ్ చేంజర్ రెడీ సంక్రాంతి బరికి సిద్ధమయ్యారు రామ్‌చరణ్. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తొలుత 2024 క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు ‘దిల్’ రాజు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాల ట్రేడ్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ సూచనల మేరకు ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్‌ను 2024 క్రిస్మస్ నుంచి 2025 సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా నిర్మాత ‘దిల్’ రాజు ఇటీవల ఓ వీడియోలో వెల్లడించారు. 2025 జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక ‘గేమ్ చేంజర్’ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, నవీన్‌చంద్ర, ఎస్జే సూర్య, జయరాం, సునీల్, ప్రియదర్శి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ఇది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ల విధులు, హక్కులు, వారికి ఉండే ప్రత్యేక అధికారాలు వంటి అంశాల నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ ఉంటుందని టాక్.నార్త్ ఇండియాలో... ఈ సంక్రాంతి పండక్కి బాలకృష్ణ 109వ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. కేఎస్ రవీంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ దీపావళి సందర్భంగా టైటిల్, రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తారని, కథకు నార్త్ ఇండియా నేపథ్యం ఉంటుందని, విలన్‌గా బాబీ డియోల్, ఓ పోలీసాఫీసర్ పాత్రలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మజాకా ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌లో ‘మజాకా’ సెలబ్రేషన్స్ ఖాయం అంటున్నారు హీరో సందీప్ కిషన్. రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తీసిన నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్న చిత్రం ఇది. మహేంద్రగిరి దేవాలయం సంక్రాంతి వంటి పెద్ద పండక్కి మీడియమ్, స్మాల్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. ప్రతి సంక్రాంతికి ఇలాంటి చిత్రాలు రెండు అయినా వస్తుంటాయి. ఏ చిత్రం ఆడియన్స్‌కు నచ్చితే అది పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ కోవలో వస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సుమంత్ హీరోగా, బ్రహ్మానందం మరో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ఇది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు నిర్మిస్తున్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది.2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ కావాల్సింది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. కానీ ‘విశ్వంభర’ జనవరి 10న రిలీజ్ కావడం లేదు. ‘విశ్వంభర’ సినిమా వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని, రామ్‌చరణ్– ‘దిల్’ రాజుగార్ల కోసం చిరంజీవిగారితో మాట్లాడి ‘విశ్వంభర’ రిలీజ్‌ను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నారు. ఇక ‘విశ్వంభర’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది.అలాగే 2025 సంక్రాంతి సందర్భంగా తాను హీరోగా నటించే ఓ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందన్నట్లు నాగార్జున గతంలో పేర్కొన్నారు. కానీ ఇది సాధ్యపడేలా లేదు. అయితే నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ ఓటీటీ డీల్స్, పర్ఫెక్ట్ రిలీజ్ డేట్స్ వంటి అంశాలను పరిశీలించుకుని ‘తండేల్’ సినిమా సంక్రాంతి రిలీజ్‌పై చిత్రయూనిట్ ఓ స్పష్టతకు వస్తారట. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ బాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో స్ట్రయిట్ చిత్రాలతో పాటు ఒకటీ లేదా రెండు తమిళ హీరోల చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. ఇలా 2025 సంక్రాంతికి అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్స్‌లోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ క్యారెక్టర్లో మూడు వేరియేషన్స్ ఉంటాయి. – ముసిమి శివాంజనేయులు -
వేణు ‘ఎల్లమ్మ’ కష్టాలు తీరినట్లేనా?
‘బలగం’ సినిమాకి ముందు ఇండస్ట్రీలో వేణుకి ఉన్న ఇమేజ్ వేరు. అప్పటి వరకు వేణు అంటే కమెడియన్ మాత్రమే అని అందరికి తెలుసు. ఆయనలో ఓ గొప్ప దర్శకుడు దాగి ఉన్నాడనే విషయం ‘బలగం’ రిలీజ్ ముందు వరకు తెలియదు. అందరికి లాగే తాను కూడా సరదా కోసం మెగాఫోన్ పట్టారని అంతా అనుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత వేణు టాలెంట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. తొలి సినిమాతో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించాడు. ఆ హోదాను వేణు అలాగే కాపాడుకోవాలి అంటే..కచ్చితంగా ‘బలగం’కి మించిన సినిమాను తీయాలి. ఆ విషయం వేణుకి కూడా బాగా తెలుసు. అందుకే కాస్త సమయం తీసుకొని మరోసారి తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలంగాణ ‘కాంతార’బలగం తరహాలోనే వేణు మరోసారి పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న కథతో ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారట. వేణు కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా ముఖ్యం అందుకే చాలా జాగ్రత్తగా ఈ కథను రాసుకున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ కథను రెడీ చేశాడట వేణు. కాంతార తరహాలోనే ఈ కథకి కూడా బలమైన క్లైమాక్స్ ఉంటుందట.నాని టు నితిన్‘ఎలమ్మ’ కథను పలువురు హీరోలకు వినిపించాడట వేణు. ప్రతి ఒక్కరు బాగుందనే చెప్పారట. తొలుత నానికి కథ చెప్పాడట. ఆయనకు విపరీతంగా నచ్చిందట. అయితే అప్పటికే తెలంగాణ నేపథ్యంలో ‘దసరా’ సినిమా ఒప్పుకోవడంతో ‘ఎల్లమ్మ’ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత ‘హను-మాన్’ హీరో తేజ సజ్జను అనుకున్నారట. కానీ ఈ వయసులోనే అంత పెద్ద పాత్రను పోషించలేని తేజ వెనక్కి తగ్గారు. వరుణ్ తేజ్ కూడా కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారట. వీరందరికి కంటే ముందే హీరో నితిన్‌కి ఈ కథ చెప్పాడట వేణు. అయితే దిల్ రాజు బ్యానర్లో వరుస సినిమాలు చేస్తున్నాని..మళ్లీ ఇప్పుడు అదే బ్యానర్లో చేస్తే బాగోదని చెప్పాడట. కానీ మళ్లీ ఈ కథ చివరికి నితిన్ వద్దకే చేరిందట. ఆయన అయితేనే వేణు రాసుకున్న పాత్రకు న్యాయం చేస్తాడని భావించి.. దిల్ రాజు ఒప్పించారట. నితిన్ ప్రస్తుతం ‘తమ్ముడు’, ‘రాబిన్‌వుడ్’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన వెంటనే ‘ఎల్లమ్మ’ సెట్లోకి అడుగుపెడతారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
‘నాగబంధం’ సినిమాకు క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
అమర్దీప్ హీరోగా 'నా నిరీక్షణ'.. సినిమా లాంచ్ (ఫోటోలు)
-
సంక్రాంతి బరిలో..?
‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అంజలి, ఎస్జే సూర్య, సునీల్, జయరాం, ప్రియదర్శి, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ‘గేమ్ చేంజర్’ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబరులో విడుదల చేయనున్నట్లుగా ఇటీవల ‘దిల్’ రాజు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... ‘గేమ్ చేంజర్’ వాయిదా పడిందా? ఒకవేళ పడితే వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
సోషల్ మీడియాలో వేట్టైయాన్పై ట్రోల్స్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే టాలీవుడ్లో రజినీకాంత్‌కు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంది. దీంతో టాలీవుడ్‌లోనూ వెట్టైయాన్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందులో తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై అప్పుడే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ నెగెటివ్ ట్రోలింగ్ మొదలెట్టారు. మరోవైపు తెలుగులో ఈ మూవీని ఏషియన్, దిల్‌రాజు సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో తమిళ టైటిల్ ఉండడంపై సోషల్ మీడియాలో చర్చ జరగడంపై ఆయన స్పందించారు.దిల్ రాజు మాట్లాడుతూ.. 'పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కొన్ని టైటిల్ విషయంలో సమస్యలు ఉంటాయి. గేమ్ ఛేంజర్ విషయలో కూడా రెండు, మూడు భాషల్లో ఇబ్బంది ఎదురైంది. సోషల్ మీడియాలో రజనీకాంత్ వెట్టాయన్ బాయ్ కాట్ ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే వెట్టయాన్ అనే టైటిల్ తెలుగులో కాంట్రవర్సీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా గ్లోబల్ అయిపోయింది. సాధ్యమైనంత వరకు టైటిల్స్ లోకల్ పేరుతో పెడుతున్నారు. లేని పక్షంలో అదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. సినిమాని సినిమాగా చూడండి' అని అన్నారు.నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ …'తెలుగులో చాలా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమాలు కూడా చాలా ఇతర భాషల్లో డబ్ అవుతున్నాయి. వన్ ఇండియా వన్ నేషన్ అంటున్నారు కదా. తెలుగు వెట్టయాన్ అందరూ వచ్చి చూడండి' అని అన్నారు. దగ్గుబాటి రానా మాట్లాడుతూ … 'రజినీకాంత్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుంది. డైరెక్టర్ మీద ఇష్టంతో ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ నటించారు. ఈ రోజు మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం చూస్తోంది. ట్రోల్స్ అనేవి టైం పాస్ లాంటివని అన్నారు. -
ఆ కిక్కు వేరేలా ఉంటుంది: ‘దిల్’ రాజు
‘‘గుణశేఖర్‌గారి మొదటి చిత్రం ‘లాఠీ’ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయన ఎన్నో విజయాలు, పరాజయాలు చూశారు. ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చే సక్సెస్, ఆ విజయం ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. కొత్తవాళ్లతో ఆయన తీస్తున్న ‘యుఫోరియా’ మూవీ పెద్ద హిట్ అవ్వాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రల్లో, నటి భూమిక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రం గ్లింప్స్‌ను నిర్మాతలు ‘దిల్’ రాజు, కేఎల్ దామోదర ప్రసాద్ విడుదల చేశారు.ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. వాటి స్ఫూర్తితో ‘యుఫోరియా’ కథ అనుకున్నాను. ఈ కథని నా కుమార్తె నీలిమకు చెబితే.. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని చెప్పింది. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో తొంభై శాతం కొత్త వాళ్లే కనిపిస్తారు. ఇప్పటి వరకు అరవై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని తెలిపారు. ‘‘చక్కగా తెలుగు మాట్లాడే వాళ్లని, థియేటర్ ఆర్టిస్టుల్ని ఈ సినిమాకు తీసుకున్నాం’’ అన్నారు నీలిమ గుణ. ‘‘గుణశేఖర్‌గారి దర్శకత్వంలో ‘యుఫోరియా’ లాంటి మంచి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని విఘ్నేష్, శ్రీనిక రెడ్డి, పృథ్వీ రాజ్, లిఖిత చెప్పారు. -
నిర్మాతలకు వచ్చే ఆ కిక్కే వేరు: ‘దిల్’ రాజు
‘‘కొత్త సినిమాలు బాగా ఆడినప్పుడు నిర్మాతలకు వచ్చే ఆ కిక్కే వేరు. ‘కమిటీ కుర్రోళ్ళు’ లాంటి చిత్రాలు సక్సెస్ చూసినప్పుడు ఇంకా చాలామంది నిర్మాతలు కొత్త తరహా సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. అప్పుడే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర స్టూడియోస్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ నటించిన ఈ చిత్రంతో యదు వంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు.ఈ ఏడాది ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం యాభై రోజులను పూర్తి చేసుకుంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన 50 డేస్ సెలబ్రేషన్స్‌కి ‘దిల్’ రాజు హాజరయ్యారు. నిహారిక మాట్లాడుతూ–‘‘ ఓ మంచి సినిమా తీస్తున్నామనుకున్నాం. కానీ, 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందనుకోలేదు. ‘దిల్’ రాజుగారు నాకు స్ఫూర్తి. ఆయనలా డిఫరెంట్, కమర్షియల్ సినిమాలు చేయాలని ఉంది’’ అని తెలిపారు. ‘‘నా తొలి సినిమా 50 రోజుల వేడుక జరుపుకోవడం హ్యాపీ’’ అని పేర్కొన్నారు యదు వంశీ. ‘‘సినిమాను సహజంగా తీసే యదువంశీకి ఇంకా మంచి పేరు రావాలి’’ అని నిర్మాత ఫణి అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు నాగబాబు మాట్లాడారు. -
నైజాంలో అల్ టైం రికార్డ్స్.. కొట్టిన దేవర
-
గేమ్ ఛేంజర్ గురించి ఎవరు ఊహించని అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు
-
వర్షాల ఎఫెక్ట్.. వాయిదా పడిన సుహాస్ సినిమా
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. అవసరముంటే తప్పితే జనాలు పెద్దగా బయటకు రావట్లేదు. ఈ వర్షం వల్ల గతవారం థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమాకు పెద్ద దెబ్బ పడింది. బాగుందనే టాక్ వచ్చినప్పటికీ వర్షం వల్ల కలెక్షన్స్ పడిపోయాయి. 5 రోజుల్లో రూ.65 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ భారీ విరాళం.. మీరు విన్నది నిజం కాదు!)ఇలా వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలతో పాటు తెలుగు స్టార్ హీరోలు చాలామంది లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మాణ సంస్థ తీసిన 'జనక అయితే గనక' సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.లెక్క ప్రకారం సెప్టెంబరు 7న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. ముందు రోజు ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇంతలోనే మరోసారి తెలుగు రాష్ట్రాలకు వర్షం పోటెత్తనుందనే హెచ్చరిక వచ్చింది. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయని అంటున్నారు. దీనిబట్టి చూస్తే వాయిదా వేసి మంచి పనే చేశారనిపిస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!) -
దిల్ రాజు వాట్సాప్ చాట్ బయటపెట్టిన సుహాస్!
చిన్న సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. ఎంత ప్రచారం చేసినా..కొన్ని చిన్న చిత్రాలు రిలీజ్ అయిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. అందుకే మేకర్స్ డిఫరెంట్ వేలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రాంక్ వీడియోలు చేస్తూ..కాంట్రవర్సీ క్రియేట్ చేసి సినిమా పేరును ప్రేక్షకులను చేరవయ్యేలా చేస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్స్ కూడా డిఫరెంట్‌గానే ప్లాన్ చేస్తున్నారు. తాజాగా హీరో సుహాస్ తన కొత్త సినిమా ప్రచారం కోసం ఏకంగా దిల్ రాజు వాట్సాప్ చాట్నే బయటపెట్టాడు.ప్రీమియర్ షో ఫిక్స్!సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. సందీర్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక రోజు ముందు అంటే.. సెప్టెంబర్ 6న ప్రీమియర్ షో వేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ..నిర్మాత దిల్ రాజుతో చేసిన వాట్సాప్ చాట్‌ని హీరో సుహాస్ బయటపెట్టాడు.వాట్సాప్ చాట్‌లో ఏముందంటే..సుహాస్: సర్ మనం ప్రీమియర్ షో వేస్తే బాగుంటుంది. ఈ మధ్య ప్రీమియర్స్ వేసిన సినిమాలన్నీ బాగా వర్కౌట్ అవుతున్నాయి.దిల్ రాజు: చూడాలి సుహాస్. ఇప్పటికిప్పుడు అంటే ప్లాన్ చేయాలి. చెక్ చేసి చెబుతా.సుహాస్: ఈ నెల 6న సాయంత్రం ఏఎంబీ, నెక్సెస్ ఇలా అన్ని ఓపెన్ చేద్దాం సర్.దిల్ రాజు: కొంచెం టైమ్ ఇవ్వు సుహాస్.. చెప్తా.సుహాస్: వాయిస్ రికార్డుదిల్ రాజు: 6న కన్ఫామ్ సుహాస్. ప్రీమియర్స్ వేసేద్దాంసుహాస్: క్లాప్ కొడుతున్న ఎమోజీThat's how @ThisIsDSP Garu helped us 🤗❤️#JanakaAitheGanaka premieres on September 6th 🤗#JAGOnSeptember7th pic.twitter.com/i1Kog2gh2y— Suhas 📸 (@ActorSuhas) September 3, 2024 -
‘జనక అయితే గనక’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మా లైన్ దాటలేదు: ‘దిల్’ రాజు
‘‘దిల్’ రాజు ప్రోడక్షన్ అంటే కుటుంబంతో కలిసి చూసే సినిమా ఉంటుంది. అయితే ‘జనక అయితే గనక’ కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ మా బేనర్ లైన్ దాటకుండా తీశాం’’ అన్నారు ‘దిల్’ రాజు. సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. సందీర్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘చేస్తున్న ప్రతి సినిమాకీ ఒక్కో మెట్టు ఎక్కుతున్న సుహాస్ కొత్త కథలు ఎంచుకుంటున్నాడు. సుహాస్ అంటే మినిమమ్ గ్యారెంటీ అని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా అంటున్నారు. ఇక చిన్న సినిమాలకు ప్రీమియర్లు కలిసి వస్తున్నాయి. మేం సెప్టెంబర్ 6న ప్రీమియర్లు వేస్తున్నాం.ఈ సినిమా చూశాక వినోదంతో పాటు మంచి సందేశం ఇచ్చారనే ఫీల్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని అన్నారు. ‘‘ప్రశాంత్ నీల్‌కి ఈ కథ తెలుసు... చాలా బాగుందన్నారు’’ అని సందీప్ రెడ్డి చెప్పారు. ‘‘ఈ సినిమాని ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నానని ‘దిల్’ రాజుగారితో చెబితే ఓకే అన్నారు’’ అని సుహాస్ తెలిపారు. ఎడిటర్ కోదాటి, సంగీతదర్శకుడు విజయ్ బుల్గానిన్ పాల్గొన్నారు. -
దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
ఈశ్వర్ సినిమాలొ ప్రభాస్ ఫ్రెండ్, మూగవాడిగా నటించి తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు హను కోట్ల. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తగిన పాత్ర కోసం ఎదురుచూశారు.. ఇప్పుడు ‘ది డీల్’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం కాబోతున్నాడు. సిటడెల్ క్రెయేషన్, డిజిక్విస్ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరో, దర్శకుడు డాక్టర్ హను కోట్ల పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండు బాగాలు గా రాబోతున్న ఈ మూవీ మొదటి భాగం మొత్తం హైదరాబాద్ లో.. కొంత మలేషియాలో చిత్రికరించామని, మలి భాగాన్ని మొత్తం మలేషియలో షూటింగ్ చేసి చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ చిత్రం మొదటి భాగం దసరాకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ లుగా చందన, ధరణి ప్రియా నటించగా రఘు కుంచె, రవి ప్రకాష్, మహేష్ పవన్, గిరి, వెంకట్ గోవాడ, శ్రీవాణి, సుజాత దిక్షిత్, సురభి లలిత ముఖ్య పాత్రలు పోషించారు. -
గేమ్ ఛేంజర్ వాయిదా.. దిల్ రాజు ఏమన్నారంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.అయితే గత కొద్ది రోజులుగా గేమ్ ఛేంజర్ వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు పలు వేదికలపై మాట్లాడుతూ క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్ ఛేంజర్ వాయిదా పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాజాగా మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ ఈవెంట్‌కు హాజరైన దిల్‌రాజు మరోసారి రిలీజ్ డేట్‌పై స్పందించారు. ఈ సినిమాను వాయిదా వేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది క్రిస్మస్కే సినిమా విడుదలవుతుందని వెల్లడించారు.దిల్ రాజు మాట్లాడుతూ..' ఇప్పటికే గేమ్ ఛేంజర్ షూట్ కంప్లీట్ చేశాం. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ సినిమా శంకర్ సర్, రామ్‌చరణ్ ఇమేజ్ను మార్చేస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఇది రాజకీయాలు, సామాజిక కథాంశంగా తెరకెక్కించాం. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. శంకర్ ఇంతకుముందు ఇలాంటి సినిమా చేశారు. కానీ రోబో తర్వాత తన కథా శైలిని మార్చారు. చాలా కాలం తర్వాత గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇందులో ఐదు పాటలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటాయి. సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.అయితే ఈ ఏడాది క్రిస్మస్కు అమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' కూడా విడుదల కానుంది. అంతేకాకుండా డిసెంబర్ 20న హాలీవుడ్ చిత్రం 'ముఫాసా: ది లయన్ కింగ్', వరుణ్ ధావన్ మూవీ 'బేబీ జాన్' వరుసలో ఉన్నాయి. -
గేమ్ ఛేంజర్ సెట్లో ఈ సినిమా గురించే చర్చ: దిల్ రాజు కామెంట్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ 'సరిపోదా శనివారం'. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. దసరా, హాయ్ నాన్న తర్వాత నాని నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆర్జే సూర్య గురించి ప్రస్తావించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'గేమ్ ఛేంజర్ షూటింగ్లో ఎక్కువగా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. గ్యాప్ వచ్చినప్పుడల్లా నానికి, ఎస్జే సూర్య మధ్య సీన్స్ గురించి చెప్పేవారు. నానికి కూడా విలన్‌గా ఎస్జే సూర్య దొరకడం చూస్తుంటే ఫుల్ మజా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ చేస్తున్నందుకు ఎస్జే సూర్యకు థ్యాంక్స్. సరిపోదా శనివారం చిత్రంలో నాని, ఎస్జే సూర్య, ట్రైలర్ చాలు. ఈ మూవీ దసరాను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.' అని అన్నారు. "Aug 29th na #Nani garu malli #Dasara records anni badhalu kodtaru ani korukuntunna"💥Producer #DilRaju garu at the #SaripodhaaSanivaaram Press Meet ❤️🔥 #NaturalStarNani #SJSuryah #YouWeMedia pic.twitter.com/YsmDl6nxtL— YouWe Media (@MediaYouwe) August 21, 2024 -
దిల్ రాజు వ్యాఖ్యలపై బన్నీ వాసు రియాక్షన్
-
ప్రేక్షకులను మేమే చెడగొట్టాం.. దిల్ రాజు వ్యాఖ్యలపై బన్నీ వాసు రియాక్షన్
టాలీవుడ్లో సినిమా మనుగడ గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా థియేటర్‌కు ప్రేక్షకులు రాకుండా తామే చెడగొట్టామని తాజాగా ఆయన కామెంట్ చేశారు. సినిమా బాగున్నా వెంటనే ఓటీటీలోకి సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్ వైపు వెళ్లడం మానేశారు అనేది ఈ మధ్య ఎక్కువగా చర్చ జరుగుతుంది. దిల్ రాజు చేసిన వ్యాఖ్యల గురించి నిర్మాత బన్నీ వాసు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.‘ఆయ్’ మూవీ సెలబ్రేషన్స్‌లో బన్నీ వాస్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియా వారి నుంచి ఆయనకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే 'మీరు ఇంట్లో కూర్చోండి నాలుగు వారాలకే ఓటీటీలో సినిమా విడుదల చేస్తాం.' అని దిల్‌రాజు వ్యాఖ్యానించారు కదా దీనిపై మేరేమంటారు అని ఒకరు ప్రశ్నించగా.. బన్నీ వాసు ఇలా చెప్పుకొచ్చారు. 'ఇండస్ట్రీలో ఎవరెన్ని బాధలు పడినా, ఏం చేసినా ఐక్యత లేకుంటే ఏమీ చేయలేం. ఈ అంశంపై ఛాంబర్ నుంచి లేదా ఇంకెవరైనా రూల్స్ పెడితే జరిగే పని కాదు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసికట్టుగా కూర్చొని చర్చించాలి. బాలీవుడ్లో మాదిరి 8 వారాల కన్నా ముందే సినిమా ఓటీటీలో విడుదల చేస్తే.. థియేటర్లు ఇవ్వమని షరతులు పెట్టారు. అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా తీసుకుంటే సరిపోతుంది.' అని ఆయన అన్నారు.ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే తప్పకుండా ఏదైనా సందర్భం ఉండాలని బన్నీ వాసు అన్నారు. రీసెంట్గా మహేశ్ బాబు పుట్టినరోజు కారణం వల్ల 'మురారి'కి భారీ కలెక్షన్స్ వచ్చాయి. అలా ప్రేక్షకుల్లో ఒక మూడ్ క్రియేట్ అయితేనే థియేటర్‌కు వస్తారు. తమ 'ఆయ్' మూవీకి భారీగా పబ్లిసిటీ చేసినప్పటికీ సాధారణ రోజుల్లో విడుదల చేస్తే ఉపయోగం ఉండేది కాదు. కేవలం 25శాతం లోపే ఓపెనింగ్ వచ్చేది. కానీ, ఆగష్టు 15 నుంచి వరుస సెలవులు ఉండటం వల్ల సినిమాకు అడ్వాంటేజ్ దక్కింది. అందుకే ఆయ్ సినిమాకు 45 శాతం ఓపెనింగ్ జరిగిందని బన్నీ వాసు పేర్కొన్నారు. కలెక్షన్ల పరంగా కూడా తమకు గ్రాస్ మాత్రమే కనపడుతుంది కానీ, షేర్ కనిపించడంలేదని ఆయన అన్నారు. గతంలో మాదిరి థియేటర్లలో పరిస్థితిలు ఇప్పుడు లేవని బన్నీ వాసు అన్నారు. -
నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. రేసులో ఎవరున్నారంటే
టాలీవుడ్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సందడి మొదలైంది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్ రాజు పదవి కాలం ముగిసింది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం నేడు (జులై 28) ఉదయం 11 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయి. అయితే, ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌కు చెందిన సభ్యులలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. గతేడాది నిర్మాతల సెక్టార్ నుంచి సి.కల్యాణ్ ఫ్యానల్‌పై 17 ఓట్ల తేడాతో దిల్ రాజు గెలుపొందారు.టీఎఫ్‌సీసీ అధ్యక్ష పదవి రేసులో ఈసారి డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి ఠాగూర్ మధు (నెల్లూరు), భరత్ భూషణ్ (విశాఖపట్టణం) బరిలో ఉన్నారు. బైలా ప్రకారం ఒక ఉపాధ్యక్ష పదవిని నిర్మాతల నుంచి ఎన్నుకోవాల్సివుంది. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్ , వైవీఎస్ చౌదరి పోటీలో ఉన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు వంటి నాలుగు సెక్టార్స్‌లోని సభ్యులు ఓటు హక్కును ఉపయోగించుకుంటారు.వీరిలో అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకోనున్నారు. 25 ఓట్ల మెజార్టీ ఎవరికి వస్తే వారే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నిక అయినట్లు ప్రకటిస్తారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఓటింగ్ జరుగుతుంది. -
పొలిమేర-2 నిర్మాతకు బెదిరింపులు.. దిల్ రాజుకు ఫిర్యాదు!
సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో గతేడాది సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేశారు. పొలిమేర-2 సైతం థియేటర్లలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు సినిమాలు హిట్ కావడంతో పొలిమేర-3 కూడా ఉంటుందని ప్రకటించారు.అయితే తాజాగా పొలిమేర 2 చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజుకు లేఖ రాశారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, అతడి టీమ్ నుంచి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.నిర్మాత గౌరీ కృష్ణ తన లేఖలో రాస్తూ..'ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. నాకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రసన్న కుమార్ తన అధికారన్ని దుర్వినియోగం చేసి.. నన్ను బెదిరించి ఒత్తిడితో సంతకాలు చేయించడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా వంశీ నందిపాటి నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. నేను పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఒప్పందం మేరకు వంశీ నందిపాటికి ఇచ్చా. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. కానీ వంశీ నందిపాటి ఇప్పటివరకు లాభాల్లో ఎలాంటి వాటా ఇవ్వలేదు. ఆయన నా వద్ద నుంచి ఖాళీ చెక్కులు, సంతకాలు చేసిన లేఖలు, ఖాళీ బాండ్ పేపర్లు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నన్ను సంప్రదించకుండానే పొలిమేర -3 సినిమాను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి మరో నిర్మాతకు రాకూడదు. ఫిల్మ్ ఛాంబర్‌పై న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది' అని ప్రస్తావించారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే తనను బెదిరిస్తున్నారంటూ గౌరీ కృష్ణ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
భార్య–భర్త–మధ్యలో మాజీ ప్రేయసి
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో కొత్త సినిమా షురూ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందుతున్న 58వ చిత్రమిది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌కి జోడీగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. వెంకటేశ్–మీనాక్షీ చౌదరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ‘‘హీరో, అతని భార్య, మాజీ ప్రేయసి... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. హీరో– దర్శక–నిర్మాతల కాంబినేషన్లో ఇప్పటికే రెండు బ్లాక్బస్టర్లు రావడంతో మూడో చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు మునుపెన్నడూ కలగని అనుభూతిని అందించడానికి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు’’ అన్నారు మేకర్స్. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, వీకే నరేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సమీర్ రెడ్డి. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆ అవకాశమే లేదు!
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పేరు చెప్పగానే ఫ్యాన్స్ డీలా పడిపోతారు. ఎందుకంటే అప్పుడెప్పుడో కరోనా టైంలో ప్రకటన వచ్చింది. దీంతో ఆహా ఓహో అనుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇంకా సెట్స్ మీదే ఉంటోంది. శంకర్ ఒకేసారి రెండు మూవీస్ చేయడం వల్లే ఈ చిక్కొచ్చిపడింది. ఇప్పుడు 'భారతీయుడు 2' రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన తర్వాత మూవీ గురించి దర్శకుడు శంకర్ అప్డేట్ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)'గేమ్ ఛేంజర్' మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని అన్నారు. 'భారతీయుడు 2' రిలీజైన వెంటనే ఆ పనిమీదే ఉంటానని చెప్పుకొచ్చాడు. అలానే ఈ రెండు చిత్రాలకు అస్సలు పోలికే లేదని క్లారిటీ ఇచ్చాడు. 'గేమ్ ఛేంజర్' విషయంలో రెండో భాగం లాంటిది ఏం ఉండదని, ఆ స్టోరీ స్కోప్ లేదని పేర్కొన్నాడు. దీంతో చరణ్ మూవీకి సీక్వెల్ ఏం ఉండదని స్పష్టత వచ్చేసింది.'గేమ్ ఛేంజర్'లోని రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ అంతా ఇప్పటికే పూర్తయింది. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటిస్తాడు. నవంబరులో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా అదే టైంలో అంటే దీపావళికి 'గేమ్ ఛేంజర్' థియేటర్లలోకి రానుందని అంటున్నారు. ఒకవేళ ఈ తేదీ మిస్సయితే క్రిస్మస్ మాత్రం పక్కా అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. (ఇదీ చదవండి: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్)10-15 Days Shoot Pending. #GameChanger. pic.twitter.com/sROnvfAWIY— Johnnie Walker (@Johnnie5ir) July 1, 2024 -
సతీమణితో దిల్ రాజు.. నెట్టింట ఫోటోలు వైరల్
-
దిల్ రాజు కు దిల్ లేకుండా చేస్తున్న మూవీస్..
-
అక్టోబర్‌లోనే 'గేమ్ ఛేంజర్' వస్తాడు: హన్షిత
రామ్‌చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో చరణ్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు ఉన్న దిల్ రాజు భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అయితే, తాజాగా ఆయన కూతురు, నిర్మాత హన్షిత అక్టోబర్‌లో రిలీజ్ కావచ్చని చెప్పారు.తిరుమల శ్రీవారిని తాజాగా దర్శించుకున్న హన్షిత మీడియాతో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ అక్టోబర్‌లో రిలీజ్ అవుతుందని చెప్పారు. చాలా డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కినట్లు ఆమె పేర్కొన్నారు. దిల్ రాజు సెప్టెంబర్‌లో విడుదల అవుతుందని చెబితే.. హన్షిత మాత్రం అక్టోబర్ అని క్లారిటీ ఇచ్చేశారు. అంటే దసరా టార్గెట్‌గా గేమ్ ఛేంజర్ ఉండవచ్చని తెలుస్తోంది. దసరా బరిలో అక్టోబర్ 10వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' కూడా ఉంది. దసరా సెలవులు ముగియగానే గేమ్ ఛేంజర్ రిలీజ్ కావచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం రెండూ దసరా సెలవులను టార్గెట్ చేసుకునే ప్రేక్షకుల ముందుకు రావచ్చని అభిప్రాయపడుతున్నారు.దేవర వాయిదా పడుతుందా..?తాజాగా దిల్ రాజు కూతురు హన్షిత చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే దేవర వాయిదా పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం దేవరకు సంబంధించి షూటింగ్ చాలా భాగం మిగిలివున్నట్లు సమాచారం. షూటింగ్ తర్వాత కూడా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ కూడా భారీగానే ఉంటుంది. ఒకవేళ దేవర మళ్లీ వాయిదా పడితే ఆక్టోబర్ 10ని తన మిత్రుడు రామ్ చరణ్‌కు తారక్ ఇవ్వచ్చని ఇండస్ట్రీలో టాక్. జూలై నెలాఖరులోగా గేమ్ ఛేంజర్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, దేవర యూనిట్ మాత్రం దసరా బరిలోనే ఉంది. అధికారికంగా వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు ఎలాంటి బిజినెస్‌లు లేవని.. చనిపోయే వరకు సినిమాలే చేస్తానని అన్నారు.దిల్ రాజు మాట్లాడుతూ.. 'మేము 25 ఏళ్లు కష్టపడితేనే వచ్చిన బ్రాండ్ ఇది. ఎస్వీసీ(శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్) కానీ, డీఆర్పీ(దిల్ రాజు ప్రొడక్షన్స్) కానీ అంతా ఈజీగా వచ్చింది కాదు. నాకు సినిమా తప్ప ఎలాంటి బిజినెస్‌లు లేవు. ప్రతి నిమిషం సినిమా కోసం పనిచేశా. నాకు సినిమా తప్ప వేరేది ఏది ఎక్కదు. చాలా మంది నన్ను అడుగుతుంటారు. మీరు ఏదైనా బిజినెస్ చేయొచ్చు కదా అని. నాకు సినిమా బిజినెస్‌లు ఉంటే చెప్పండి. అంతే కానీ వేరే వాటి గురించి మాట్లాడొద్దు అని ఒకటే మాట చెబుతా. నేను చచ్చేవరకు సినిమాలే చేస్తా. సినిమా తప్ప నా నోటి నుంచి మరేది రాదు.' అని మాట్లాడారు. కాగా.. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. అనంతరం మాట్లాడుతూ..'హర్షిత్ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్‌కు వెళ్లేది. కానీ సినిమా రంగంలోకి వస్తుందని ఊహించలేదు. వీరిద్దరు కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా బలగంతో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. లవ్ మీతో అరుణ్‌కు ఛాన్స్ ఇచ్చారు. మరికొన్ని సినిమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం' అని అన్నారు. -
వైష్ణవి చైతన్య లేటెస్ట్ మూవీ అప్డేట్
-
‘లవ్ మీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
-
Allu Arjun HD Photos: ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మీ అమూల్యమైన ఓటుతో ఆయన్ను గెలిపించండి: దిల్ రాజు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియతో పాటుగా ఎన్నికల ప్రచారం కూడా పీక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా నటులు విశాల్, భాను చందర్, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు వంటి స్టార్స్ అందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతూ మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగుతారని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ వారందరు కూడా పలు వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ దిగ్గజ నిర్మాతగా కొనసాగుతున్న 'దిల్ రాజు' తాజాగా ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా ఎన్నికలో బరిలో ఉన్న తన మిత్రుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డిని గెలిపించాలని కోరుతూ దిల్ రాజు ఇలా చెప్పుకొచ్చారు. 'బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నో మంచి పనులు ఒంగోలు కోసం చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ గారి కేబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతృత్వంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఇప్పటి వరకు ఐదుసార్లు ఒంగోలు నుంచి బాలినేని గెలిచారు. అనేక అభివృద్ధి పనులతో ఒంగోలు పట్టణాన్ని ముందంజలో ఉంచారు.ఇప్పుడు ఆరోసారి ఒంగోలు నుంచి ఎన్నికల బరిలో బాలినేని ఉన్నారు. ఆయన్ను తప్పకుండా అక్కడి ప్రజలు గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. కొద్దిరోజుల క్రితం బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారి మీద ఒక డాక్యుమెంటరీని తీశాను. అందులో ఆయన రాజకీయ ప్రస్థానంతో పాటు ఒంగోలు కోసం ఆయన ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరూ తెలుసుకోవచ్చు. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ నందు అందుబాటులో ఉంది. మీ అమూల్యమైన ఓటు బాలినేని శ్రీనివాసులుకు వేస్తారని ప్రార్థిస్తున్నాను. అని ఆయన కోరారు. దిల్ రాజు మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. Ace Producer #DilRaju Supports YCP ongole Mla Candidate #BalineniSrinivasReddy pic.twitter.com/d6mtAKZxHH— cinee worldd (@Cinee_Worldd) April 24, 2024 -
పవన్ బాక్ మనీ దందా.. ఐటీకి దిల్ రాజు ఫిర్యాదు
-
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్‌గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్‌గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్‌ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
'లవ్ మీ' మూవీ ఆడియో వేడుక (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. థియేటర్లు ఫుల్!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. ఉగాది, రంజాన్ పండుగలు వెంటవెంటనే రావడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఇవాళ ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణలోని థియేటర్స్, మల్టీప్లెక్సుల వద్ద హౌస్ ఫుల్ బోర్డులే దర్శమిస్తున్నాయి. వరుసగా సెలవులు రావడంతో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద రద్దీ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లోనూ ఫ్యామిలీ స్టార్‌కు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది. సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం కాగా.. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత స్వయంగా థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ నుంచి రివ్యూ తీసుకున్నారు. నెగెటివ్ రివ్యూలపై ఆయన మండిపడ్డారు. ఇలా చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదని అన్నారు. -
రియల్ 'ఫ్యామిలీ స్టార్' ఇంటికి వెళ్లిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా బాగున్నప్పటికీ కొందరు కావాలనే విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి సినిమా బాగాలేదని విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయినా కూడా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అందుకే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ప్రతి కుటుంబంలో ఒకరు తన వారందరి కోసం కష్టపడుతూనే ఉంటారు. అందుకోసం ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు. ఇదే పాయింట్‌తో సినిమా ఉంది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు ముందే చెప్పారు. సినిమా విడుదలకు ముందు దిల్ రాజు ప్రమోషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న ప్రశాంత్ అనే యువకుడు వారి కుటుంబంలో 'ఫ్యామిలీ స్టార్'గా తన చెల్లెలు ఉన్నారని చెప్పాడు. వారి కుటుంబం కోసం దివ్యాంగురాలైన ఆమె పడిన కష్టాన్ని ఆ యువకుడు దిల్ రాజు ముందు చెప్పాడు. దీంతో దిల్ రాజు కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. సినిమా విడుదల తర్వాత తప్పకుండా మీ ఇంటికి వస్తాను.. ఆ రియల్ ఫ్యామిలీ స్టార్‌ను కలుస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్‌లోని సూరారంలో ఉన్న ఆ యువకుడి ఇంటికి దిల్ రాజు, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురాం వెళ్లారు. ఆ కుటుంబాన్ని సర్ప్రైజ్ చేశారు. కొంత సమయం పాటు ఆ కుటుంబ సభ్యులందరితో సరదాగ వారు గడిపారు. దివ్యాంగురాలైన ఆమె తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అడ్డుగా ఉన్నా చదువును పూర్తి చేసి ఉద్యోగం రాకపోతే కిరాణ షాపును నడపడం ఆపై ఎంతో కష్టపడి అమెజాన్‌లో ఉద్యోగం తెచ్చుకోవడం.. దాంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వంటి అంశాలను ఆ యువకుడు పంచుకున్నాడు. ఆ వీడియో ఇప్పడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. Team of #TheFamilyStar meets and salutes a real life FAMILY STAR ✨ The movie is all about celebrating our dearest ones, our family stars ❤🔥 Book your tickets for the perfect 𝗦𝗨𝗠𝗠𝗘𝗥 𝗙𝗔𝗠𝗜𝗟𝗬 𝗘𝗡𝗧𝗘𝗥𝗧𝗔𝗜𝗡𝗘𝗥 now! 🎟️ https://t.co/lBtal2uGnv@TheDeverakonda… pic.twitter.com/18wi88fPwf — Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2024 -
ఎందుకురా మా వాడి వెంట ఇలా పడ్డారు.. ? విజయ్ మేనమామ కామెంట్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా బాగున్నప్పటికీ సోషల్‌మీడియాలో మరోవైపు నెగెటివ్ ప్రచారం చేయడంపై నిర్మాత దిల్ రాజు ఇప్పటికే స్పందించారు. మేము కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదని ఆయన కోరారు. ఇలాంటి పద్ధతి కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి కూడా రావచ్చని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని కూడా నెగెటివ్ ప్రచారంపై ఇలా రియాక్ట్ అయ్యారు. 'ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారు. ఇంత కసా ? ఇంత ఓర్వలేని తనమా ? లేక మావోడి కటౌట్ చూసి భయమా ? ఒక మంచి విలువలతో , సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలటం లేదు.మీ నెగటివ్ బ్యాచ్‌కు వాడంటే (విజయ్ దేవరకొండ) ఎలాగూ పడదు. కానీ ఆ ఇష్టపడేవాళ్లని కూడా సినిమాకి రానివ్వకుండా చేస్తున్నారేంటిరా బాబు. ఐనా ఇంకే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకి మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరుతెచ్చుకుంటే తప్పా.. ?' అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Yash Rangineni (@yashrangineni) -
'అలా చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదు'.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ముఖ్యంగా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంటోంది. అయితే మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడంపై దిల్ రాజు స్పందించారు. మే కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి వస్తుందని దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దిల్ రాజు మాట్లాడూతూ..'ఈ సినిమాను చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. కొంతమంది కావాలని నెగెటివ్ వైబ్‌లో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన ఒకలా ఉంటే.. సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ స్ప్రెడ్ చేయడం బాధాకరం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా రీచ్ అయింది. మేము మంచి సినిమానే తీశాం. మంచిగా తీయలేదంటే దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. నేను కలిసిన వాళ్లు చాలామంది బయట ఎందుకు ఇంత నెగెటివ్ ఉంది? అని అడుగుతున్నారు. కొందరు కాల్ చేసిన సినిమా చాలా బాగుంది అంటున్నారు. మంచి సినిమానా? కాదా? అనేది మీరు థియేటర్‌కు వస్తే మీకే తెలుస్తుంది.' అని అన్నారు. నెగెటివ్ ప్రచారంపై మాట్లాడుతూ.. 'కేరళలో కోర్ట్ మొదటి మూడు రోజుల వరకు రివ్యూ ఇవ్వకుండా తీర్పు ఇచ్చారట. అలాంటిది మన దగ్గర వస్తే బాగుంటుంది. లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకడం కష్టం. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది నిర్మాతలే. ఎంతో కష్టపడి చేసే సినిమాను ఆడియన్స్ థియేటర్‌కు రాకుండా చేయడమనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇలాగే జరిగితే పోను పోను ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇక సినిమాలు ఏం తీస్తాంలే అన్న ఫీలింగ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ పద్ధతి ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు' అని అన్నారు. -
'ఫ్యామిలీ స్టార్' మూవీ ట్విటర్ రివ్యూ
విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గీతా గోవిందం హిట్ తర్వాత విజయ్‌తో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మిస్తారు అని ఆయన పట్ల మంచి గుర్తింపు ఉంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా సినిమా పేరులోనే ఆ ఫ్లేవర్‌ను పెట్టారు. అందుకే ఈ సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగింది. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ -పరశురామ్ ఆ హిట్ మ్యాజిక్‌ను మ్యాజిక్ రిపీట్ చేశారా, లేదా అనేది నేడు తేలిపోయింది. ఫ్యామిలీ స్టార్ సినిమాపై ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో బయటకు వచ్చేసింది. ఇప్పటికే అమెరికాలో తొలి ఆట పూర్తి అయింది.ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను ఆలోచింపచేసే సినిమా అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కానీ మాస్ కమర్షియల్ మైండ్‌సెట్‌తో థియేటర్‌కు వెళ్లకండి అంటూ అతను ట్వీట్ చేశాడు. టైటిల్‌కు తగ్గట్లు కంప్లీట్ ఫ్యామిలీ బొమ్మ అని చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టేశాడని, ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని అన్నాడు. ఈ సినిమాలో విజయ్, మృణాల్ జోడీ చాలా కలర్ఫుల్గా ఉందని తెలిపాడు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ పాత్రను చూస్తుంటే.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ పాత్రనే గుర్తుకొస్తుందని మరోక నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందని.. సెకండాఫ్ కొంచెం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని ఆయన చెప్పుకొచ్చాడు. అక్కడక్కడ టీవీ సీరియల్ ఫీలింగ్ వస్తుందని కూడా ఆయన పేర్కొన్నాడు. సినిమా ఫస్టాఫ్ కమర్షియల్ అంశాలతో ప్లాన్ చేసిన దర్శకుడు..సెకండాఫ్‌లో మాత్రం ఎమోషనల్ ట్రాక్‌ను ఎంచుకుని మంచిపని చేశాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ సీన్స్ బాగా ఉన్నాయిని తెలిపాడు. కుటుంబం కోసం మిడిల్ క్లాస్ వారు ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని చక్కగా చూపించారని ఆయన తెలిపాడు. గీత గోవిందం సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్, కామెడీ.. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ పెద్దగా ఆ కట్టుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో కథ, డైలాగ్స్ అంతగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు. ఫస్టాఫ్ కాస్త బాగున్నా.. సెకండాఫ్ చాలా బోరింగ్‌గా ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ అందరినీ మెప్పించడం కష్టమని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్ మాత్రం చెప్పుకొతగిన విధంగా లేదని పేర్కొన్నాడు. అనవసరమైన రిపీటెడ్ సీన్స్‌తో సినిమా ఓపికకు పరీక్ష పెడుతుందని అంటున్నారు. విజయ్, మృణాల్ తప్ప మిగిలిన నటీనటుల పర్ఫామెన్స్ కూడా అంత గొప్పగా లేదని చెబుతున్నారు. జయ్ అభిమానులతో పాటు మిడిల్ క్లాస్ అభిమానులకు బాగా నచ్చే సినిమా అని ఎక్కువ మంది చెబుతున్నారు. #FamilyStar Review : The first part of the film is enjoyable and has a strong commercial vibe. The second half picks up more of a playful tone . Emotion connects well with the audience Second Half > First Half Impressive performance by Rowdy @TheDeverakonda & @mrunal0801… pic.twitter.com/OM4PmclYHa — Let's X OTT GLOBAL (@LetsXOtt) April 4, 2024 #FamilyStar so flat and underwhelming. Avg 1st half, rubbish 2nd half. Nothing impresses and no standout plot points or performances. Boredom Max, went with low expectations still annoyed. VD with another poor choice. I'd rather watch Liger, super disappointed. Parasu b2b bombs👎 https://t.co/kPxDTCGLUW pic.twitter.com/5vbZM5C5zY — PushpaBhav (@ThaggedheeLe) April 4, 2024 #FamilyStar Decent 1st half My rating:⭐⭐⭐/5#FamilyStarReview#FamilyStarBookings #FamilyStarOnApril5th #FamilyStarArrivingTomorrow pic.twitter.com/h7Lmjt9fAV — Ronak yadav (@Prakash0617640) April 5, 2024 #FamilyStar feels like a rerun of Gemini TV's Radhika serials. Lead chemistry shines, but can't rescue the sinking ship. Patchy editing adds to the irritation. Seems like the director's main goal is a funded holiday in the US, courtesy of the producer..Skip the pain 😢 pic.twitter.com/B6ncLYzmnN — Swathiiii 🌸 (@Swathi_Prasad96) April 4, 2024 #FamilyStarReview : a film that is as clueless as tv serials background music. We have no words to talk about it. Especially the second half of the film is complete trash. We recommend you to watch #Projectz & #ManjummelBoys you know #FamilyStar is notworth pic.twitter.com/CY20tMG2pl — Theinfiniteview (@theinfiniteview) April 5, 2024 Show completed :- #FamilyStar #VijayDeverakonda My rating 2.5/5 Positives :- 1st half Fight scenes Mrunal thalur 😍😍😍 Negatives :- 2nd half too laggy No high moments Final verdict- One time watch with family pic.twitter.com/KrYjhaLLBP — venkatesh kilaru (@kilaru_venki) April 4, 2024 #FamilyStar is an inferior template rom-com family movie that has a few time-pass moments but no real emotional connection nor feel good moments. First half is underwhelming and feels like a serial until the pre-interval. Second half starts on a more fun note but quickly turns… — Venky Reviews (@venkyreviews) April 4, 2024 -
'దిల్ రాజుపై నెగెటివ్ ట్రోల్స్'.. ఫ్యామిలీ స్టార్ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్లో అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా చిత్రయూనిట్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు సమాధానలిచ్చారు. గతంలో మీపై వచ్చిన నెగెటివ్ ట్రోల్స్‌ను మీరేలా అధిగమించారు? అనే ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సరిచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. 'నా మీద మీమ్స్ వచ్చాయనే విషయంపై నాకు అవగాహన కూడా లేదు. నేను ఓ ఇంటర్వ్యూలో నా పెళ్లి గురించి ప్రస్తావించా. దాని గురించి మస్తుగా చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తు పట్టేవాళ్లు దాదాపు ఒక కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్ పెట్టినవాళ్లు ఒక పదివేల మంది ఉంటారు. కాబట్టి వాళ్ల గురించి ఆలోచిస్తే మిగిలినవాళ్లకు దూరమవుతా. మనం నెగెటివ్ వైబ్‌లో బతుకుతున్నాం. ఇంట్లో కూడా అలానే ఉంటున్నాం. అలా మనకు తెలియకుండానే హెల్త్‌ను పాడు చేసుకుంటాం. ఆ నెగెటివ్‌ను మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. అవేమైనా నన్ను చంపేస్తాయా? చంపలేవుగా. పాసింగ్ క్లౌడ్స్ పోయాక మనకు క్లియర్‌గా ఆకాశమే కనిపిస్తుంది. మనం స్కై లాంటి వాళ్లం. క్లౌడ్స్‌కు భయపడితే ఎలా? ' అని అన్నారు. "Trolls are like passing clouds, but I'm like the sky" Ace Producer #DilRaju responds to trolls on his personal life, giving a befitting reply 🙌#TheFamilyStar #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Fuwifsq0NQ — Telugu FilmNagar (@telugufilmnagar) April 4, 2024 -
అహంకారం అనుకున్నా సరే...
‘‘నా సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలనే నా కల నా నాలుగో సినిమా ‘గీత గోవిందం’తో నిజమైంది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. అనంతరం నేను నటించిన మరో సినిమా రెండు వందల కోట్ల వసూళ్లు సాధిస్తుందని చెప్పాను... కానీ, సాధించలేదు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తాను. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే.. కానీ ఇది నా మీద నాకున్న నమ్మకం, విశ్వాసం. ఇక ఈ సమ్మర్‌కు మా టీమ్ నుంచి మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ ‘ఫ్యామిలీ స్టార్’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మన కుటుంబంలోని భావోద్వేగాలతో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’’ అన్నారు. ‘‘మా సినిమా కథలోని భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు పరశురామ్ పెట్ల. -
దిల్ రాజుపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం..!
-
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ స్టిల్స్
-
Family Star Press Meet: ‘ఫామిలీ స్టార్’ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
ఇదొక కొత్త ప్రయత్నం
ఆశిష్, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘లవ్ వీ’. ‘ఇఫ్ యు డేర్’ (నీకు ధైర్యం ఉంటే...) అనేది ఉపశీర్షిక. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రావాలి రా..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదబాద్‌లో జరిగింది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను చెబోలు అమల, గోమతీ అయ్యర్, అదితీ భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్విన్, సాయి శ్రేయ ఆలపించారు. ‘‘ఓ ఘోస్ట్ లవ్‌స్టోరీ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రం యూనిట్ పేర్కొంది. ‘‘లవ్ మీ ఒక కొత్త ప్రయత్నం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
తెలుగు హీరోలకు ఎక్కువ పారితోషికం? దిల్ రాజు ఏమన్నారంటే?
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిత సమర్పణలో దిల్‌రాజు, శిరీష నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు చిత్రయూనిట్ చైన్నెలోని ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. త్వరలో తమిళ సినిమా చేస్తా అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఇటీవల తాను నటించిన ఖుషీ చిత్రం మంచి విజయం సాధించిందన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల మందుకు రానున్నామన్నారు. గీతగోవిందం చిత్రం తరువాత పరశురామ్ దర్శకత్వంలో తాను నటించిన చిత్రం ఇదని చెప్పారు. మంచి కుంటుంబ కథా చిత్రంగా ఈ ఫ్యామిలీస్టార్ ఉంటుందన్నారు. తదుపరి గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. త్వరలోనే తమిళ చిత్రం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. పలువురు దర్శకుల కథలు వింటున్నట్లు చెప్పారు. తెలుగు హీరోలకు ఎక్కువ పారితోషికం? నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. తాను ఇంతకు ముందు విజయ్ హీరోగా నిర్మించిన వారిసు చిత్రం మంచి విజయాన్ని సాధించిందని, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఫ్యామిలీస్టార్ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. పేద, గొప్ప ప్రతి ఇంట్లోనూ ఒక ఫామిలీస్టార్ ఉంటారని, అలాంటి కథే ఈ చిత్రం అన్నారు. ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండను రౌడీస్టార్ అని అంటున్నారని, ఈ చిత్రం తరువాత ఫ్యామిలీస్టార్ అంటారని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో థింక్స్ స్టూడియోస్ తరుణ్ విడుదల చేస్తున్నారని చెప్పారు. తెలుగులో హీరోలకు అధిక పారితోషికం ఇస్తారనే విషయాన్ని తాను అంగీకరించనని, దేనికైనా ఒక లెక్క ఉంటుందని, దాన్ని బట్టే పారితోషికం ఉంటుందని పేర్కొన్నారు. Team #FamilyStar addresses the Tamil media in Chennai during the trailer launch event of the film ✨#FamilyStarTrailer in Tamil Out Now! ▶️ https://t.co/MplFAq19fl Grand release on April 5th 💥#FamilyStarOnApril5th@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan… pic.twitter.com/9H7fXFnbYJ — Sri Venkateswara Creations (@SVC_official) March 29, 2024 చదవండి: డేనియల్ బాలాజీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. సంపాదించిన డబ్బంతా ఏమైంది? -
‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్‌చరణ్ (ఫొటోలు)