dollar
-
యువత ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యుక్తవయస్కుల ఆరోగ్య సంరక్షణ కోసం మరిన్ని నిధులు వెచ్చించాలని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక సూచించింది. తద్వారా ప్రతీ డాలర్ వ్యయంపై 4.6 నుంచి 71.4 డాలర్ల స్థాయిలో ప్రతిఫలం లభిస్తుందని అంచనా వేసింది. ఇందుకోసం ప్రభుత్వం, ప్రవేటు రంగం నుంచి సహకారం అవసరమని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, మేటర్నల్, న్యూబోర్న్ అండ్ చైల్డ్ హెల్త్ (పీఎంఎన్‌సీహెచ్) సహకారంతో ఈ నివేదిక రూపొందించింది. యుక్త వయస్కుల (కౌమరదశ/10–19 ఏళ్లు) ఆరోగ్యంపై చేసే పెట్టుబడులతో జీడీపీ ఏటా 10 శాతం మేర పుంజుకుంటుందని అంచనా వేసింది. హెచ్‌పీవీ టీకా, టీబీ చికిత్స, మయోపియా గుర్తింపు–చికిత్సకు 2024–2035 మధ్య ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. 2024–2050 మధ్య కాలంలో విద్య, ఉపాధి, బాల్య వివాహాల తగ్గింపు, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని సూచించింది. ఇలా యుక్త వయసు్కల ఆరోగ్యంపై చేసే పెట్టుబడులతో పెద్ద ఎత్తన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అభిప్రాయపడింది. దేశ భవిష్యత్తులో కీలక పాత్ర.. ‘‘ఈ తరహా భవిష్యత్ పెట్టుబడులు దేశ జీడీపీని సగటున ఏటా 10 శాతం మేర పెరిగేలా చేస్తాయి.ప్రభుత్వం, ప్రైవేటు రంగం, పౌర సమాజం, కమ్యూనిటీలు, కుటుంబాలు కలసి ఏటా ఇందుకోసం చేసే 33 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏటా 476 బిలియన్ డాలర్ల ప్రయోజనాలు ఒనగూడతాయి’’అని ఈ నివేదిక తెలిపింది. ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాలను అరికట్టడంపై చేసే ప్రతీ డాలర్ పెట్టుబడికి 4.6 డాలర్ల నుంచి 71.4 డాలర్ల వరకు ప్రతిఫలం వస్తుందని పేర్కొంది. -
ట్రంప్ టారిఫ్ టెర్రర్
ముంబై: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య టారిఫ్ పెంపు భయాలకు తోడు అధిక వెయిటేజీ షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకటిన్నరశాతానికి పైగా కుప్పకూలాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మరింత ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 1,235 పాయింట్లు పతనమై 75,838 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి 23,025 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఏడు నెలల కనిష్టం. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,432 పాయింట్లు క్షీణించి 75,642 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లు పతనమై 22,976 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ 13 పైసలు బలహీనపడి 86.58 వద్ద స్థిరపడింది.⇒ అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. రియల్టీ ఇండెక్స్ 4.2% క్షీణించింది. కన్జూమర్ డ్యూరబుల్స్ 4%, సర్విసెస్, విద్యుత్, టెలికం, యుటిలిటీ ఇండెక్సులు 2.5% పడ్డాయి.నష్టాలకు 4 కారణాలు⇒ ‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్‌తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.⇒ దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్ (ఎర్కింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.⇒ జొమాటో (–11%)తో సహా అధిక వెయిటేజీ షేర్లు ఐసీఐసీఐ బ్యాంకు (–3%), ఎస్బీఐ (–2.57%), రిలయన్స్ (–2.50%), ఎంఅండ్ఎం (–2.25%) షేర్లు భారీగా క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ మొత్తం పతనంలో ఈ షేర్ల వాటాయే 640 పాయింట్లు. కాగా ఒక్క జొమాటో షేరు వాటా 150 పాయింట్లు కావడం గమనార్హం.⇒ విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దలాల్ స్ట్రీట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి. ఈ కొత్త ఏడాది జనవరి 20 నాటికి ఎఫ్ఐఐలు మొత్తం రూ.48,023 కోట్ల విలువైన భారత ఈక్విటీలు అమ్మేశారు. 7.5 లక్షల కోట్లు ఆవిరిమార్కెట్ భారీ పతనంతో సోమవారం ఒక్కరోజే రూ.7.52 లక్షల కోట్లు హరించుకుపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.424 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో అల్ట్రాటెక్(0.39%), హెచ్‌సీఎల్ టెక్(0.33%) మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. -
‘బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తాం’
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్(యూఎస్ డాలర్ విలువ తగ్గించేలా) ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓవల్ కార్యాలయంలో జరిగిన అధ్యక్ష పత్రాలపై సంతకాల కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యంలో యూఎస్ డాలర్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నించే ఏ బ్రిక్స్ దేశంపైనైనా 100 శాతం సుంకాన్ని విధిస్తామని హెచ్చరించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ దేశాలు ద్వైపాక్షిక, బహుపాక్షిక వాణిజ్యాల్లో స్థానిక కరెన్సీల వాడకాన్ని పెంచాలని యోచిస్తున్నాయి. ఈమేరకు ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ దేశాలు అనుసరిస్తున్న విధానాలను ట్రంప్ అమెరికా ఆర్థిక పరపతికి ప్రత్యక్ష సవాలుగా భావిస్తున్నారు. అందుకే ఆయన అమెరికాతో వాణిజ్యం చేసే బ్రిక్స్ దేశాలపై భవిష్యత్తులో 100 సుంకాలు విధిస్తామని స్పష్టం చేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇది హెచ్చరిక కాదు.. స్పష్టతట్రంప్ ఈమేరకు చేసిన ప్రకటలో తన హెచ్చరికను ముప్పుగా చూడరాదని తెలిపారు. ఈ అంశంపై స్పష్టమైన వైఖరిగా మాత్రమే చూడాలని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ డీ-డాలరైజేషన్ విషయంలో అమెరికా బలహీనమైన స్థితిలో ఉందని బైడెన్ సూచించినట్లు చెప్పారు. అయితే బ్రిక్స్ దేశాలతో అమెరికా వాణిజ్యం గణీనీయంగా ఉందని, వారు తమ ప్రణాళికలను(డీ-డాలరైజేషన్‌కు సంబంధించి) ముందుకు సాగలేరని ట్రంప్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘చాలా చెడ్డ దేశం’.. రాగానే ట్రంప్ చర్యలు షురూఆర్థిక స్థిరత్వానికి విఘాతంట్రంప్ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి దూకుడు సుంకాల విధానాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయని, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి విఘాతం కలిగిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. మరోవైపు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి ట్రంప్ దృఢమైన వైఖరి అవసరమని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. -
రూపాయి పడింది... ఫీజు భారం పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతుండటంతో, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారితో పాటు కొత్తగా ఎమ్మెస్ కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. యూఎస్ వెళ్లేందుకు అన్ని సన్నాహాలూ చేసుకున్న విద్యార్థులు అంచనాలు తారుమారవడంతో ఆందోళన చెందుతున్నారు. 2022 ఫాల్ సీజన్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్)లో డాలర్ విలువ రూ.79 కాగా ఇప్పుడది రూ.85.03కు ఎగబాకడం గమనార్హం. 2014లో డాలర్ (Dollar) విలువ రూ. 60.95 మాత్రమే కావడం గమనార్హం. రూపాయి (Rupee) విలువ తగ్గిపోవడంతో విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం గణనీయంగా పెరిగిపోతోంది. ట్యూషన్ ఫీజు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన భారానికి తగిన మొత్తం ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చు కోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రూపాయితో పోల్చు కుంటే డాలర్ విలువ గత రెండేళ్లలోనే 8 శాతం పెరగడం విద్యార్థులపై పెనుభారం మోపుతోంది. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలకు (part time jobs) అవకాశాలు సన్నగిల్లడంతో విద్యార్థులు భారత్‌లోని తల్లిదండ్రుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. 2025లో రూ.5.86 లక్షల కోట్ల భారంభారత్ నుంచి ఏటా సగటున 13 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. వీరిలో 38 శాతం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు కాగా 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో 2024లోఇది 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ. 4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2025లో ఇది రూ.5.86 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజుకే అదనంగా రూ. 2.40 లక్షల వ్యయంస్ప్రింగ్ (మార్చి నుంచి జూన్) సీజన్లో చదువుకు సన్నాహాలు మొదలు పెట్టినప్పుడు వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా విద్యార్థులు అంచనా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వసతి ఖర్చులు దీనికి అదనం కాగా.. మొత్తం మీద అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడదని రూ. 52 లక్షల వరకు వెళుతుందని అంచనా. ఉపాధి భరోసా ఏదీ?అమెరికా వెళ్లే విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం వెతుక్కుంటాడు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. చదవండి: త్వరలో హైదరాబాద్ – డాలస్ విమానంఇక్కడ అమెరికాతో పోల్చుకుంటే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు తెర్చారు. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. దీంతో విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితి ఊహించలేదు అమెరికా వస్తున్పప్పుడు రూ. 50 లక్షల వరకు అప్పు చేశా. రూపాయి విలువ పతనంతో ట్యూషన్ ఫీజు మొత్తం పెరిగింది. ప్రస్తుతం వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకే గదిలో నలుగురం ఉంటున్నాం. అయినా ఇబ్బందిగానే ఉంది. పార్ట్ టైం ఉద్యోగం చేసినా పెద్దగా ఆదాయం ఉండటం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. – పాయం నీలేష్ (అమెరికాలో ఎంఎస్ విద్యార్థి)వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా..యూఎస్ వెళ్లడానికి బ్యాంక్ లోన్ ఖాయమైంది. కానీ ఈ సమయంలోనే రూపాయి పతనంతో యూనివర్సిటీకి చెల్లించాల్సిన మొత్తం పెరిగింది. బ్యాంకు వాళ్లు అదనంగా లోన్ ఇవ్వనన్నారు. మిగతా ఖర్చుల కోసం నాన్న అప్పుచేసి డబ్బులు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. అమెరికా వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా. – నీలిమ (అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్న విద్యార్థిని)2014లో డాలర్ విలువ రూ.60.952022 (ఫాల్ సీజన్)లో రూ.792024 డిసెంబర్లో రూ.85.032025లో రూ.9 లక్షల వరకు అదనపు భారం! -
డాలర్ తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి
-
జారుడు బల్లపై రూపాయి
ముంబై: రూపాయి విలువ రెండో రోజూ జీవితకాల కనిష్టాన్ని తాకింది. డాలర్ మారకంలో 4 పైసలు బలహీనపడి 85.15 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న స్తబ్దత, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడటం మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 85.10 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 10 పైసలు పతనమై 85.21 వద్ద సరికొత్త జీవితకాల కనిష్టాన్ని తాకింది.‘‘నెలాఖరు, సంవత్సరాంతం కావడంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఎగసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత భారీ సుంకాలు విధించవచ్చనే భయాలూ నెలకొన్నాయి. మరోవైపు ఫెడ్ కఠిన పాలసీ అంచనాలు, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి’ అని మిరే అసెట్స్ విశ్లేషకుడు అనుజ్ చౌదరి తెలిపారు. కాగా, ట్రంప్ విజయం తర్వాత నుంచి డాలరుతో రూపాయి విలువ 104 పైసలు క్షీణించడం గమనార్హం. -
సుంకం విధిస్తే దాన్ని మళ్లీ డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీలోనే చెలిస్తారట సార్!
-
బ్రిక్స్ కరెన్సీ తెస్తే... 100 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్యపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన ఆయన తాజాగా భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర బ్రిక్స్ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బ్రిక్స్ కూటమి కొత్త కరెన్సీ తేవాలని చూస్తే సభ్య దేశాల దిగుమతులపై ఏకంగా వంద శాతం సుంకాలు విధిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తాజాగా సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.‘‘బ్రిక్స్ దేశాలు డాలర్ నుంచి వైదొలగాలని ప్రయత్నిస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని సృష్టించాలని చూస్తున్నాయి. ఆ ప్రయత్నాలు మానుకోవాలి. డాలర్‌కు బదులుగా కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోమని, మరే కరెన్సీకి మద్దతివ్వబోమని ప్రకటించాలి. లేదంటే ఆ దేశాలపై 100% సుంకాలు విధిస్తాం. అంతేకాదు అమెరికాతో వాణిజ్యానికి కూడా అవి స్వస్తి పలకాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. మెక్సికో, కెనడా, చైనా వస్తువులపై సుంకాలను భారీగా పెంచుతామని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.రష్యా, చైనా సుముఖత 2011లో ఏర్పాటైన బ్రిక్స్‌లో ఇటీవలే ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇథియోపియా, ఈజిప్ట్ కూడా చేరాయి. మరో 34 దేశాలు కూడా చేరడానికి ఆసక్తిగా ఉన్నాయి. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా 2023లో తెరపైకి తెచ్చారు. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా, డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసే ఉద్దేశంతో చైనా ఈ యోచనకు సుముఖంగానే ఉన్నాయి. అయితే బ్రిక్స్ కూటమి ఆర్థిక, భౌగోళిక విభేదాల కారణంగా కొత్త కరెన్సీకి అవకాశాలు చాలా తక్కువేనన్నది నిపుణుల మాట. -
పెరిగిన డాలర్ విలువ: ఆసియా దేశాలపై ఎఫెక్ట్!
యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తరువాత అమెరికా డాలర్ విలువ పెరుగుదల దిశగా పయనిస్తోంది.. గ్లోబల్ కరెన్సీలు పతనమవుతున్నాయి. ఈ ప్రభావం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల మీద ప్రభావం చూపుతోంది. అనేక ఆసియా దేశాలు ఈ ప్రభావానికి తీవ్రంగా లోనైనప్పటికీ.. భారతదేశం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని తెలుస్తోంది.గత దశాబ్ద కాలంలో.. భారత్ వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. ఇతర ఆసియా దేశాలతో పాటు చైనా ఆర్ధిక వ్యవస్థ మందగిస్తే.. ఆ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్ మీద కూడా పడుతుంది. రూపాయి విలువ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. దీనిని నిపుణులు 'ఎఫ్ఎక్స్ యుద్ధం' అని సంబోధించారు.గ్లోబల్ కరెన్సీ విలువల తగ్గుదల అనేది.. రాబోయే సంవత్సరాల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ (FX) మార్కెట్లలో ప్రపంచ అస్థిరతను రేకెత్తించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ డాలర్ బలపడటం అనేది ప్రపంచ కరెన్సీ మార్కెట్లో సవాళ్లను పెంచుతుందని చెబుతున్నారు.డాలర్ పెరుగుదలకు కారణం కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. సెప్టెంబరులో బేసిస్ పాయింట్ రేటు తగ్గింపుకు సంబంధించిన ఫెడ్ వ్యూహాత్మక పునరాలోచన అని కూడా తెలుస్తోంది. డాలర్ విలువ పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు కూడా దీనివైపు ఆకర్షితులవుతున్నారు.ట్రంప్ విజయం డాలర్‌కు అందించిన స్వల్పకాలిక మద్దతు మాత్రమే. కానీ ప్రపంచ కరెన్సీ మార్కెట్ సంక్లిష్టమైన స్థితిలో ఉంది. ముఖ్యంగా ఆసియా అంతటా.. చైనాతో సహా ఆర్థిక ఒత్తిళ్లకు గురవుతున్నాయి. ఎఫ్ఎక్స్ యుద్ధం తీవ్రతరం కావడం వల్ల వచ్చే నష్టాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రవిభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ గండి?
అక్టోబర్ 22 నుండి 24 వరకు మూడు రోజులపాటు రష్యాలోని కజాన్ పట్టణంలో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మొదలైన ఈ కూటమిలో అనేక దేశాలు చేరడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. మున్ముందు 130 దేశాలు చేరే అవకాశం ఉందని అంచనా. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది. బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. డాలర్‌కూ, బంగారానికీ సంబంధాన్ని తొలగించిన అమెరికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది.2024 సంవత్సర బ్రిక్స్ శిఖరాగ్ర సమావే శాలకు రష్యా అధ్యక్షత వహిస్తోంది. వివిధ దేశాల అత్యున్నత నాయకులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. బ్రిక్స్ విస్తరణ తర్వాత జరుగుతున్న కీలకమైన సమావేశం కాబట్టి, బ్రిక్స్‌లో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు, బ్రిక్స్ విస్తరణ కోసం యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడం మీద చర్చ ప్రధానంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థ స్థాపనను ప్రోత్సహించడం, శీతోష్ణస్థితి మార్పులను ఎదుర్కోవడం, ఇంధన సహకారాన్ని పెంపొందించడం, సప్లై చైన్‌ను రక్షించడం, దేశాల మధ్య శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉంటాయని ఒక కీలక చైనా పరిశోధకుడు వెల్లడించారు.ఎందుకీ ప్రత్యామ్నాయ వ్యవస్థ?అమెరికా డాలర్ ఆధిపత్యం కింద ప్రపంచం ఎనిమిది దశా బ్దాలుగా నలిగిపోతోంది. 1944లో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉని కిలోకి వచ్చిన ఈ వ్యవస్థపై పశ్చిమ దేశాలు కూడా ప్రబలమైన శక్తి కలిగి ఉన్నాయి. అమెరికా ఆధిపత్యంతో పాటు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచం బీటలు బారింది. ప్రపంచీకరణను చైనా చక్కగా వినియోగించుకుని అమెరికా, పశ్చిమ దేశాలను వెనక్కు కొట్టింది. అమెరికా స్వదేశీ విదేశీ అప్పు, ప్రమాదకరంగా 50 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరో వైపున చైనా ప్రపంచ రెండవ ఆర్థిక శక్తిగా ఎదిగి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతాలను నెలకొల్పుతోంది.ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల విశ్లేషణ ప్రకారం, బైడెన్ పదవీ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 15% కంటే తక్కువకి పడిపోయింది. 1999లో 21% కంటే ఎక్కువగా ఉన్నది, స్థిరమైన క్షీణత చూసింది. చైనా 18.76%తో పెద్ద వాటాను కలిగి ఉంది. దశాబ్దాల క్రితపు అమెరికా ఆధిపత్య ప్రపంచ క్రమం, నేటి వాస్తవాలకు తగ్గట్టుగా లేదు. సంపన్న దేశాలు, పేద దేశాలను అన్ని విధాలా అణిచివేస్తున్నాయి. ఈ కాలంలో అమెరికా 210 యుద్ధాలు చేసింది. 180 యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొంది. ప్రపంచ ప్రజలకు అమెరికా ఆధిపత్య కూటమిపై నమ్మకం పోయింది. అందుకే, ప్రపంచ ప్రజలందరి ప్రయోజనాలకు, సమానత్వానికి ఉపయోగపడేలా, ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నెలకొల్పాల్సిన, నేటి అసమాన ప్రపంచ క్రమాన్ని సమగ్రంగా సంస్కరించవలసిన అగత్యం ఏర్పడింది. బ్రిక్స్ తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో మొదలై(బ్రిక్), తర్వాత సౌత్ ఆఫ్రికాను కలుపుకొంది. అటుపై ఈజిప్ట్, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను భాగస్వామ్యం చేసుకుంది. ఇంకా అనేక దేశాలు చేరే అవకాశం ఉంది. 23 దేశాలు అధికారికంగా దరఖాస్తు పెట్టుకున్నాయి. కరేబియన్ దేశా లలో భాగమైన క్యూబా విదేశాంగ మంత్రి తాము కూడా బ్రిక్స్‌లో భాగం అవుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేఖ రాశారు. శ్రీలంక విదేశాంగ మంత్రి పాల్గొంటారని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు. ఒక విశ్లేషణ ప్రకారం, బ్రిక్స్‌లో 130 దేశాలు చేరే అవకాశం ఉంది. ఊపందుకున్న డీ–డాలరైజేషన్బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. ఈ ధోరణి వేగంగా పెరుగుతూ, ఆధిపత్య దేశాల ఆంక్షలకు, భూ భౌగోళిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక మంత్రి జాతీయ కరెన్సీలు, రష్యా రూబుల్‌ను బ్రిక్స్‌లో ఉపయోగిస్తు న్నామన్నారు. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటం తగ్గించే క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది.బ్రిక్స్ తర్వాత, మరో కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్’ (సీఐఎస్) కూడా డీ–డాలరైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మాల్దోవా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి తమ జాతీయ కరెన్సీలతో 85% సరిహద్దు లావాదేవీలను జరిపింది. వాణిజ్యంలో అమెరికా డాలర్‌ను ఉపయోగించడం నిలిపివేసింది. సీఐఎస్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం స్థానిక కరెన్సీలలో జరగడంతో, డాలర్ ఉపయోగం 85% తగ్గిపోయిందని బ్రిక్స్, సీఐఎస్ రూపకర్తల్లో కీలకమైన రష్యా ప్రకటించింది. శాశ్వతంగా అమెరికా డాలర్ పైన ఆధారపడటం తగ్గిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా చైనాల మధ్య గత ఏడాది జరిగిన 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో డాలర్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి, యువాన్ రూబుల్‌లలో కొనసాగించాయి.ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్లకు పైగా కరెన్సీని అమెరికా ప్రపంచ బ్యాంకింగ్ నెట్వర్క్ ‘షిఫ్ట్’ స్తంభింపజేసింది. ఇరాన్, వెనిజువేలా, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్ లాంటి అనేక దేశాల డాలర్ల డబ్బును అమెరికా భారీగా స్తంభింపజేసింది. ఇది వేగంగా డీ–డాలరైజేషన్‌కు దోహదం చేసింది. డాలర్ నుంచి గ్లోబల్ సౌత్ దూరంగా వెళ్ళింది. ఈ దేశాల మధ్య స్థానిక కరెన్సీ మార్పిడి బాగా పెరిగింది. రూబుల్‌ను ‘రబుల్’ (నిర్వీర్యం) చేస్తామంటూ రష్యాపై బైడెన్ విధించిన ఆంక్షలు బెడిసి కొట్టాయి. అమెరికా 1971లో నిక్సన్ కాలంలో డాలర్‌కూ బంగారానికీ మధ్య సంబంధాన్ని తొలగించింది. వాస్తవ ఉత్పత్తితో సంబంధం లేకుండా‘డాలర్ కరెన్సీ’ని పిచ్చి కాగితాల వలె ముద్రించింది. అమె రికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ‘అట్లాంటిక్ కౌన్సిల్’ ‘డాలర్ డామినెన్స్’ మీటర్ ప్రకారం, అమెరికా డాలర్ నిలువలలో బ్రిక్స్ దేశాల వాటా గణనీయంగా తగ్గి పోయింది. ‘స్విఫ్ట్’ (ప్రపంచవ్యాప్త అంతర్‌బ్యాంకుల ఆర్థిక టెలీ కమ్యూనికేషన్స్ వ్యవస్థ)కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ చెల్లింపుల వ్యవస్థ కట్టుదిట్టంగా రూపొందింది. బ్రిక్స్ చైనా కేంద్రంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ‘సీబీడీసీ’ ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ కరెన్సీతో ఇప్పటికే 60 దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో రిహార్సల్స్ జరిగాయనీ, మరిన్ని దేశాల మధ్య జరుగుతున్నాయనీ వివిధ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ఇండియా దారి?ఇజ్రాయిల్– పాలస్తీనా–హెజ్‌బొల్లా్ల(లెబనాన్) యుద్ధం వల్ల ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు చైనాకు తరలిపోవడం, విదేశీ బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడం వంటి కారణాలతో రూపాయి భారీగా పతనమైంది. రూపాయి మారకపు విలువ చరిత్రలో మొట్టమొదటిసారి అమెరికా డాలర్‌తో అత్యంత దిగువ స్థాయికి అంటే 84.08 రూపాయలకు పడి పోయింది. మంద గమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు చైనా ప్రకటించిన ద్రవ్య ఆర్థిక చర్యల తర్వాత విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారులు ‘ఇండియా స్టాక్స్ విక్రయించండి, చైనా స్టాక్స్ కొనండి’ అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. చైనా స్టాక్‌లు చౌకగా ఉండటం వల్ల ఇండియా డబ్బంతా చైనాకు తరలిపోతోంది.ప్రపంచ కరెన్సీగా ఉన్న డాలర్ అమెరికా ప్రయోజనాలకూ, ఇతర దేశాలపై భారీ ఆంక్షలుకూ పనికివచ్చింది తప్ప, మరే సమానత్వ ప్రయోజనమూ డాలర్లో లేదు. కాబట్టి బ్రిక్స్ కూటమితో కలిసి, అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయ విధానాలను, కరెన్సీని ఆవిష్కరించడం తప్ప, భారత్ బాగుకు మరో దారి లేదు.నైనాల గోవర్ధన్ వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్మొబైల్: 97013 81799 -
రక్షణరంగ బడ్జెట్‌ను మరింత పెంచిన చైనా
చైనా తన రక్షణరంగ బడ్జెట్‌ను నిరంతరం పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది చైనా తన రక్షణ బడ్జెట్‌ను 7.2 శాతం మేరకు పెంచింది. ఈ పెంపుతో ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 1.67 ట్రిలియన్ యువాన్లకు (231 బిలియన్ డాలర్లు.. ఒక బిలియన్ అంటే రూ. ఒక కోటి) చేరుకుంది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్‌కు అత్యధిక కేటాయింపులు చేస్తున్న రెండో దేశం చైనా. ఇది భారతదేశ బడ్జెట్ కంటే మూడు రెట్లు అధికం. రక్షణరంగాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే చైనా చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం చైనా భారీ రక్షణ బడ్జెట్. 2024కి భారతదేశ రక్షణ బడ్జెట్ రూ. 6,21,541 కోట్లు. ఇది దాదాపు $74.8 బిలియన్లు. అయితే 2024కి చైనా బడ్జెట్ సుమారు $232 బిలియన్లు. ఇది భారతదేశ బడ్జెట్ కంటే అత్యధికం. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన ఆర్మీ పీఎల్ఏను 2027 నాటికి ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే రక్షణ రంగ బడ్జెట్ పెరుగుదలకు కారణం. సైనికుల సంఖ్య పరంగా చైనా సైన్యం అతిపెద్దది. చైనా సైన్యంలో రెండు రాకెట్ దళాలు ఉన్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేషన్‌ను నిర్వహిస్తుంది. చైనా తన రాకెట్ బలగాన్నిరహస్యంగా విస్తరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. -
దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్
దీపావళికి కాస్త దిగి వచ్చి వినియోగదారులను ఊరించిన పసిడి ధర అనూహ్యంగా మళ్లీ పరుగందుకుంది. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల తరువాత డాలర్ ఇండెక్స్ 10-వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. నవంబర్ 11, 2022 నుండి అతిపెద్ద సింగిల్-డే క్షీణతకు దారితీసింది. ముఖ్యమైన ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలర్1.55 శాతం పడి 103.98కి చేరుకుంది. దీంతో బంగారంలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దేశీయంగా దేశీయంగా నవంబర్ 15న న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,190గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 400 రూపాయలు ఎగిసి ధర రూ.55,950 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.61,040 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే మంగళవారంతో పోలిస్తే బుధవారం హైదరాబాదులో కిలో వెండి ఏకంగా రూ.1700 పెరిగి రూ.77,700 పలుకుతోంది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,700గా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్‌తో గడువు ముగిసే గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర స్వల్పంగా పుంజుకుని రూ. 60,224 ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకుంది. స్పాట్ బంగారం ధర ప్రస్తుతం ఔన్స్‌కు1,965 డాలర్లకు పెరిగింది. MCXలో వెండి ధర కిలో రూ. 71,794 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో, వెండి ధర ఔన్సు దాదాపు 23 డాలర్లుగా ఉంది. రూపాయికి బలం అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 600పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 188 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా లాభాల్లోఉంది. డాలర్ బలహీనతతో రూపాయి 0.3 శాతం పెరిగి 83.08 వద్ద ట్రేడవుతోంది, సెప్టెంబర్ 8 నుండి దాదాపు రెండు నెలల తరువాత ఇదే అత్యధిక లాభం. -
తిరుపతిలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలో డాలర్స్ గ్రూప్‌పై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. డాలర్స్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ డాక్టర్ సి.దివాకర్‌రెడ్డి కార్యాలయం పాటు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దివాకర్‌రెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. పత్రాలను పరిశీలిస్తున్నారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో గురువారం ఉదయం మొదలైన ఐటీ అధికారుల సోదాలు రాత్రి తర్వాత కూడా కొనసాగాయి. గురువారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఆయన కుమారుడు జయవీర్ నివాసంలోనూ తనిఖీలు చేసి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే సాధా రణ తనిఖీల్లో భాగంగానే వీరి ఇళ్లలో సోదాలు చేపట్టినట్టు, కొన్ని పత్రాలను ఐటీ అధికారులు పరి శీలించి వెళ్లినట్టు సమాచారం. గురువారం రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో, బాలా పూర్లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ నేత, చిగు రింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ అధికా రులు సోదాలు చేప ట్టిన విషయం తెలిసిందే. కాగా కేఎల్ఆర్ నివాసం,కార్యాలయాల్లో శుక్రవారం మరో సారి తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులు తుక్కుగూడలోని కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. పలు డాక్యు మెంట్లతో పాటు కేఎల్ఆర్ను వెంటబెట్టుకుని నార్సింగ్ ఎన్సీసీ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. గంట పాటు అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి మాదాపూర్‌లోని కేఎల్ఆర్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి పొద్దు పోయే దాకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో గురువారం రాత్రే సోదాలు ముగిశాయి. ఇంట్లో లభించిన రూ.8 లక్షలు సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని, ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. తమను రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి
Today Gold and Silver Prices: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరింత దిగివచ్చాయి. గత కొన్ని సెషన్లుగా నేలచూపులు చూస్తున్న పసిడి ధర శుక్రవారం దేశవ్యాప్తంగా సుమారు 300 రూపాయలు క్షీణించింది. మూడు రోజుల్లో దాదాపు వెయ్యిరూపాయలు దిగి వచ్చింది. సెప్టెంబరు 26న రూ. 54,750గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర శుక్రవారం నాటికి రూ. 54 వేల స్థాయిని కోల్పోయి 53,650 స్థాయికి దిగి వచ్చింది. మూడు సెషన్లలో 1100 దిగివచ్చింది.హైదరాబాద్ మార్కెట్లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలు క్షీణించి రూ. 53,650గా ఉంటే…24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ. 58,530గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే వెండి మాత్రం వెయ్యి రూపాయలు పుంజుకుంది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ. 77500 ఉండగా, ఢిల్లీలో రూ.74,700 పలుకుతోంది. (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?)కాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. అలాగే దేశీయంగా కూడా పెళ్లిళ్ల సీజన్లో పుంజుకున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. -
డాలరు బలం: దిగొచ్చిన పసిడి, వెండి కూడా అదే బాటలో
Today Gold and Silver Prices: దేశీయ మార్కెట్లో వెండి బంగారం ధరలు మళ్లి దిగివస్తున్నాయి. గత కొన్ని సెషన్లుగా లాభ నష్టాల మధ్య బంగారం ధర బుధవారం మరింత పడింది. ద్రవ్యోల్బణం,పెరుగుతున్న వడ్డీ రేట్లు, డాలర్ బలం కారణంగా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి 280 రూపాయలు క్షీణించి రూ. 59,450 వద్ద ఉంది.అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 పతనమై 54,500వద్ద ఉంది. కిలో వెండి ధర 600 రూపాయలు తగ్గి 74, 200 గా ఉంది.హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి 59,450 గాను, 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి 54, 500 గాను ఉంది. అలాగే కిలో వెండి రూ. 77వేలు పలుకుతోంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.58,843 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో, ట్రాయ్ ఔన్స్‌కు 1,903.35 డాలర్లుగా ఉన్నాయి. వెండి కూడా 71,260 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ ఇండెక్స్‌లో బలం పుంజుకోవడంతో బంగారం ధరలు నిన్న ఏకంగా 1.59 శాతం నష్టపోయాయి.మరోవైపు గత రెండు సెషన్లుగా బలహీనంగా ఉన్న దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం పాజిటివ్‌గా ఉన్నాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా కొనుగోళ్లు పుంజుకోవడం లాభాల్లోకి మళ్లాయి. నిఫ్టీ 19700 పైకి, సెన్సెక్స్ 66వేల ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి కూడా స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. -
ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!
Gold and silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో శనివారం 10గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి రూ. 54,950కి చేరింది. అలాగే 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 59,950 వద్ద ఉంది. అ టు వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. దేశంలో కిలో వెండి ధర 300 రూపాయి ఎగిసి రూ. 75,800కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 79,300గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో 60వేల మార్క్‌ను దాటేసిన 10 గ్రాముల గోల్డ్ ధరలో గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో రానున్న ఫెస్టివ్ సీజన్ , దీపావళి పెళ్లిళ్ల ముహూర్తాల నేపథ్యంలో బంగారం కొనాలో, వెయిట్ చేయాలో తెలియని అనిశ్చితి వినియోగదారుల్లో నెలకొంది. ఫెడ్ వడ్డీరేట్లు ప్రస్తుతం యథాతథంగా ఉంచినప్పటికీ ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మరోసారి వడ్డీ వడ్డన ఉంటుందనే అంచనాల మధ్య పసిడి ధరలపై ఒత్తిడి కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు , జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు, ఫెడ్ వడ్డీరేటు, రూపాయి, డాలరు కదలికలపై భారతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రపంచ బంగారం డిమాండ్, వివిధ దేశాలలో కరెన్సీ విలువలు, ప్రస్తుత వడ్డీ రేట్లు , బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు కూడా దోహదం చేస్తాయి. -
రూపాయి హై జంప్: కారణం ఇదే!
Rupee rises దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో శుక్రవారం ఒక రేంజ్లో పుంజుకుంది. ఆరంభంలోనే 38 పైసలు పెరిగి 82.75 స్థాయిని తాకింది. చివరికి 19 పైసల లాభంతో 82.93 వద్ద ముగిసింది. గురువారం 2 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశాన్ని చేర్చడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. 2024 , జూన్ నుంచి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బాండ్ ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ బాండ్లను (IGBs) చేర్చనున్నట్లు ప్రకటించింది. దీన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ స్వాగతించింది. (సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ) ప్రధాన గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశాన్ని చేర్చడం వల్ల దేశ రుణ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ప్రవాహం భారీగా పెరగనుందని అంచనా. భారత ప్రభుత్వ బాండ్లను , బెంచ్‌మార్క్ ఎమర్జింగ్-మార్కెట్ ఇండెక్స్‌లో చేర్చాలని జేప్ మోర్గాన్ చేజ్ & కో తీసుకున్న నిర్ణయం, భారతదేశ డెట్ మార్కెట్ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని ఫారెక్స్ వ్యాపారులు భావిస్తున్నారు. రూపాయి ఎన్‌డిఎఫ్ మార్కెట్లలో సుమారు 0.42 శాతం వృద్ధి చెంది 82.80 స్థాయిలకు చేరుకోవడం మంచి పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. (దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైనాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టపోగా,నిఫ్టీ 19700 దిగువన స్థిరపడింది. అటు ఆరు కరెన్సీల బాస్కెట్‌తో గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగి 105.48కి చేరుకుంది. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.61 శాతం పెరిగి 93.87 డాలర వద్ద ఉంది. విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) గురువారం క్యాపిటల్ మార్కెట్లో నికర అమ్మకం దారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ3,007.36 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. (క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?) -
ఫెడ్ ఎఫెక్ట్: స్టాక్ మర్కెట్ పతనం, దిగివచ్చిన పసిడి
Today Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం కాస్త నెమ్మదించింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 150 తగ్గి రూ. 55,050గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర 180 రూపాయలు ఎ గిసి 60,050 వద్ద ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.78 వేలు పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. (డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా) ముఖ్యంగా ఫెడ్ వడ్డీరేట్లు యధాతథంగాఉంచడంతో డాలర్ బలంపుంజుకుంది. డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోతోంది. ఇక స్టాక్‌మార్కెట్ల విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 500పాయింట్లకుపైగా కుప్పకూలగా, 147 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 19800 స్థాయిని కూడా కోల్పోయి మరింత బలహీన సంకేతాలందించాయి. అటు ఆయిల్ రేట్లు భగ్గుమన్నాయి. -
బంగారం ధర దిగింది: కిలో వెండి ధర ఎలా ఉందంటే?
Today Gold and Silver Prices: అంతర్జాతీయ పరిణామాలు, డాలరు బలం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 160 రూపాయల తగ్గి రూ.59,840గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల ధర 150 రూపాయలు తగ్గి రూ. 54,850 వద్ద ఉంది. (వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు) అటు కిలోవెండి ధర 500రూపాయిలు క్షీణించి 77,500గా ఉంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు వరుగా రూ. 55 వేలు, రూ. 55150గాఉన్నాయి. కిలో వెండి ఢిల్లీలో రూ. 73500 పలుకుతోంది. (‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’) శనివారం ఉదయం పెరిగిన ధరలు ఆ తరువాత క్షీణించాయి. ఈ ధరల హెచ్చుతగ్గులకు అనేక రకాల కారకాలు ప్రభావితం చేస్తాయి.ప్రపంచ బంగారం డిమాండ్, వివిధ దేశాలలో కరెన్సీ విలువలు, ప్రస్తుత వడ్డీ రేట్లు , బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ హెచ్చు తగ్గులకు దోహదం చేస్తాయి. దీనికి తోడు గ్లోబల్ ఎకానమీ స్థితి , ఇతర కరెన్సీలతో డాలర్ బలంతో సహా గ్లోబల్ ఈవెంట్లు భారతీయ మార్కెట్లోని బంగారం ధరలను నిర్ణయిస్తాయి. (ఫెస్టివ్ సీజన్: మారుతి కార్లపై భారీ తగ్గింపు) -
ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు!
ఇప్పటి వరకు 'దినార్, రియాల్, ఫౌండ్, యూరో, డాలర్' వంటి ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీలను గురించి తెలుసుకుని ఉంటారు. అయితే ఈ కథనంలో ప్రపంచంలో టాప్ చీపెస్ట్ కరెన్సీలు ఏవి? ఇండియన్ కరెన్సీతో వాటికున్న వ్యత్యాసం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. చీపెస్ట్ కరెన్సీ కలిగిన టాప్ 5 దేశాలు.. 👉ఇరానియన్ రియాల్ (IRR) 👉వియత్నామీస్ డాంగ్ (VND) 👉సియెర్రా లియోనియన్ లియోన్ (SLL) 👉లావో/లావోషియన్ కిప్ (LAK) 👉ఇండోనేషియా రుపియా (IDR) ఇరానియన్ రియాల్ (IRR) ఇరాన్ కరెన్సీ ఇరానియల్ రియాల్ అనేది ప్రపంచంలో చీపెస్ట్ కరెన్సీలలో ఒకటి. అయితే ఇదే పేరుతో ఉన్న ఒమాని రియాల్ అనేది ప్రపంచంలో ఖరీదైన కరెన్సీలలో ఒకటిగా ఉంది. ఇండియన్ ఒక్క రూపాయి 511 ఇరానియల్ రియాల్స్‌కి సమానం. కాగా ఒక అమెరికన్ డాలర్ 42,275 ఇరానియల్ రియాల్స్‌కి సమానం అని తెలుస్తోంది. ఈ దేశంలో రాజకీయ అశాంతి, వ్యాపారం, తలసరి జీడీపీ కారణంగా ఈ దేశ కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంది. వియత్నామీస్ డాంగ్ (VND) వియత్నాం చారిత్రాత్మకంగా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ కింద పనిచేస్తోంది, అయితే ఆర్థిక వ్యవస్థను స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాగా ప్రస్తుతం తక్కువ విలువ గల కరెన్సీ కలిగిన దేశాల్లో ఇది కూడా ఒకటి. 291 వియత్నామీస్ డాంగ్స్ భారతీయ కరెన్సీ రూపాయికి సమానం. ఒక అమెరికన్ డాలర్ 24,085 వియత్నామీస్ డాంగ్స్కి సమానం. వియాత్నం ఆర్ధిక వ్యవస్థ 2024కి వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. సియెర్రా లియోనియన్ లియోన్ (SLL) ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్ తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటోంది. వినాశకరమైన అంతర్యుద్ధంతో సహా పశ్చిమ ఆఫ్రికాలో కుంభకోణాలు, అవినీతి కారణంగానే ఆ దేశ కరెన్సీకి విలువ తగ్గినట్లు సమాచారం. భారత రూపాయి 238 సియెర్రా లియోనియన్ లియోన్లకి సమానం, కాగా అమెరికన్ డాలర్ 19,750 సియెర్రా లియోనియన్ లియోన్లకి సమానం. ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే? లావో/లావోషియన్ కిప్ (LAK) 1952 నుంచి కూడా లావోషియన్ కిప్ కరెన్సీకి విలువ చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఒక ఇండియన్ రూపీ 239 లావోషియన్ క్లిప్‌లలో సమానం, ఒక అమెరికన్ డాలర్ 19,773 లావోషియన్ క్లిప్లకి సమానం కావడం విశేషం. కాగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో ఇది ఒకటిగా ఉంది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఊరుకున్నా.. ఈ రెండు బ్యాంకులు తగ్గలే.. వడ్డీ రేట్లు ఇలా! ఇండోనేషియా రుపియా (IDR) గత ఏడు సంవత్సరాలుగా ఇండోనేషియా రూపాయి విలువలో ఎలాంటి మెరుగుదల లేదు. విదేశీ మారక నిల్వలు క్షీణించడం, కరెన్సీని కాపాడుకోవడంలో సెంట్రల్ బ్యాంక్ వైఫల్యం కారణమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అయితే భారతీయ కరెన్సీ రూపాయికి 184 ఇండోనేషియా రూపాయలకు సమానం. అదే విధంగా ఒక అమెరికన్ డాలర్ 15,225 ఇండోనేషియా రూపాయలకు సమానం. ప్రస్తుతం పారిశ్రామిక కార్యకలాపాలలో ఇండోనేషియా కొంత వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది. -
వామ్మో! హీటెక్కుతున్న బంగారం ధరలు
Today Gold and Silver prices: బంగారం, వెండి ధరలు మళ్లీ మండుతున్నాయి. ఆల్ టై హై నుంచి కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ, డాలర్ బలంతో మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు వేగం పుంజకున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.54,750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 270పెరిగి రూ. 59,670 పలుకుతోంది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలోకు రూ. 200 పెరిగిన వెండి ధర కిలోకు 77. 100గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. MCX మార్కెట్లో వరుసగా రెండో రోజు జంప్ ఆగస్టు 29, మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం , వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 90 లేదా 0.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.58,949గా ఉంది.అదేవిధంగా, సెప్టెంబరు 5, 2023న మెచ్యూరయ్యే వెండి ఫ్యూచర్లు కూడా రూ. 162 లేదా 0.22 శాతం పెరిగి కిలోకు రూ. 73,700 వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధర స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 1,924.84కి చేరుకుంది, ఆగస్టు 10 నుండి అత్యధికం. అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,952.90 డాలర్ల వద్ద ఉన్నాయి. వెండి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 24.32 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడ్ సెప్టెంబర్ పాలసీ నిర్ణయం, ఆగస్ట్ లేబర్ మార్కెట్ డేటా ఆధారంగా బంగారం ధరలు కదలాడుతాయని మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయింది. సోమవారం నాటి ముగింపు 82.62 తో పోలిస్తే మంగళవారం 82.70 వద్ద ముగిసింది. -
ఊరట! పసిడికి ఫెడ్ బ్రేకులు: ఎంత తగ్గిందంటే..!
Today Gold Rate in Hyderabad అమెరికా ఫెడ్ మరోసారి రేట్ల పెంపునకే నిర్ణయించనుందన్న అంచనాల మధ్య డాలర్ బలపడుతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్ల నెమ్మదించాయి. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,943.30 డాలర్ల వద్ద ఉంది. అటు దేశీయంగా కూడా కూడా పసిడి పరుగుకు బ్రేక్‌లు పడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 వద్ద ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గి 59,450గా ఉంది. 80 వేల రూపాయల నుంచి దిగొచ్చిన కిలో వెండి ధర 76,900 వద్ద కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. (వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!) ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో (Today Gold Price in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 50 రూపాయలు క్షీణించి 54,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,550 పలుకుతోంది. అటు డాలర్ మరింత బలంపుంజుకున్నప్పటికీ, దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో లాభపడుతోంది. శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే10 పైసలు ఎగిసి 82.55వద్ద ఉంది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభం నష్టాలనుంచి కోలుకుని లాభాల్లోకి మళ్లాయి -
కేవలం రూ. 83కే ఇండిపెండెంట్ హౌస్.. ఎక్కడంటే?
ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, భూములు కొనాలన్నా ఎంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుందో అందరికి బాగా తెలుసు. ఆఖరికి అద్దెకు ఉండాలన్నా వేలకు వేలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కేవలం రూ. 100 కంటే తక్కువ అని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని ఒక ఇల్లు కేవలం ఒక డాలర్ కంటే తక్కువ (దాదాపు రూ. 83) అని తెలుస్తోంది. ఈ వార్త నిజమే అని చెబుతున్నారు. అది కూడా ఇండిపెండెంట్ హౌస్ కావడం గమనార్హం. ఇది 724 చదరపు అడుగుల విస్తీరణంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు బహుశా ఇదే అయి ఉంటుంది. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా! ఈ చీపెస్ట్ హౌస్ ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నట్లు, దీనిని 1956లో నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ ఇంటిని బాగు చేయడానికి కనీసం 25వేల నుంచి 45వేల డాలర్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని వేలం వేయనున్న జిల్లో సంస్థ పేర్కొంది. మొత్తానికి ఇల్లు ఎంత శిధిలావస్థలో ఉన్నా కేవలం రూ. 83 లభించడం చాలా అరుదైన విషయం. -
రూపాయి జోరు:మూడు వారాల గరిష్టానికి
Rupee hits over three week high: డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా మూడో రోజూ (ఆగస్ట్ 24న ) లాభాల్లో కొనసాగుతోంది. డాలర్ మారకంలో రూపాయి మూడు వారాల గరిష్ఠ స్థాయిని 82.47 వద్ద మునుపటి ముగింపుతో పోలిస్తే 0.26 శాతం పెరిగింది. బుధవారం 27 పైసలు పెరిగి 82.72 వద్ద క్లోజైన సంగతి తెలిసిందే. ఇంట్రాడేలో, కరెన్సీ గరిష్టంగా 82.46ను తాకింది. ఆగస్టు 2న చివరిగా కనిపించిన స్థాయి. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రెండు నెలల వ్యవధిలో రూపాయి ఈ స్థాయిలోపెరగడం విశేషం. చైనీస్ యువాన్ , జపనీస్ యెన్లలో పెరుగుదల , దేశీయ ఫండమెంటల్స్ సానుకూలంగా ఉండటం రూపాయికి సానుకూలంగా మారింది. ఐపీవో సంబంధ పెట్టుబడుల ప్రవాహం, దేశీ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, క్రూడాయిల్ రేట్లు తగ్గుతుండటం తదితర అంశాలు రూపాయి పెరగడానికి దోహదపడిందని నిపుణుల భావిస్తున్నారు. సమీకాలంలో 82 స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. -
వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!
Today Gold and Silver Price: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదల దీర్ఘకాలంగా కొనసాగవచ్చన్న అంచనాల మధ్య అంతర్జాతీ మార్కెట్లో పసిడి ధరలు పడిపోయాయి. దీంతో వరుసగా నాల్గో వారంలో కూడా దిగి వచ్చింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ తదుపరి రివ్యూలో కూడా వడ్డీ రేటు పెంపుదల ముందుకు సాగవచ్చని అంచనా. అలాగే తాజా డేటా ప్రకారం నిరుద్యోగ ప్రయోజనాల కోసం కొత్త క్లెయిమ్‌లను దాఖలు చేసే అమెరికన్ల సంఖ్య గత వారం పడిపోయింది. దీంతో లేబర్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగవచ్చని మరో అంచనా. అమెరికా 10-సంవత్సరాల ట్రెజరీ నోట్‌పై దిగుబడి ఆగస్ట్‌లో 4.2శాతం మార్కు కంటే పెరిగింది, 2007లో చివరిసారిగా ఈ స్థాయికిచేరింది. (బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్) గ్లోబల్‌గా గోల్డ్ ధర ఔన్స్ ధర 1918 డాలర్లకు పడిపోయిన బంగారం ధరలు ప్రస్తుతం 0.16 శాతం పెరిగి 1,919 డాలర్లు ట్రేడవుతున్నాయి, అటు సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగాపెరిగాయి. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) దేశీయంగా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా లాభపడుతున్నాయి. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం పుత్తడి రూ.59,170 వద్ద కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.54,150 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.59,070 పలుకుతోంది. వెండి కిలోధర 76,500 వద్ద కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. రూపాయి అమెరికా డాలరుతో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి నుండి కోలుకుంది. సోమవారం 5 పైసలు పెరిగి 83.05 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం 88.09 వద్ద కొనసాగుతోంది. అటు ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.73శాతం పెరిగి 85.42 డాలర్ల వద్దకు చేరుకుంది. -
ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..ఈ పతనం ఎందాక?
RupeeRecordLow దేశీయ కరెన్సీ రూపాయి అమెరికా డాలరు మారకంలో ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇటీవల బలహీనంగా ఉన్న రూపాయి డాలర్‌తో పోలిస్తే 83కి పడిపోయిన తరువాత మరింత పతనాన్ని నమోదు చేసింది. ఆగస్ట్ 17, గురువారం అక్టోబర్ నాటి రికార్డు కనిష్ట స్థాయి 83.29ని స్థాయికి దిగజారింది. అయితే శుక్రవారం ఆరంభంలో కొద్దిగా పుంజుకుని 83.11వద్ద కొనసాగుతోంది.మునుపటి ముగింపు 83.15 నుంచి 83.02 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. గురువారం 20 పైసలు క్షీణించి డాలర్‌తో కనిష్ట స్థాయి 83.15 వద్ద రికార్డు క్లోజింగ్‌ను నమోదు చేసింది. ఈ పతనం ఎందుకు రూపాయిపై పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. మున్ముందు ఆల్ టైమ్ కనిష్టానికి కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతోపాటు, డాలర్లో ఇటీవలి స్పైక్ మరియు ట్రెజరీ ఈల్డ్‌ల నేపథ్యంకూడా పనిచేస్తోంది. మరోవైపు చైనీస్ యువాన్ పతనం, ఎగుమతి పోటీతత్వంపై ఆందోళనల కారణంగా దేశీయ కరెన్సీనెగిటివ్గాఉందనిన మోతీలాల్ ఓస్వాల్‌లోని రీసెర్చ్ - కమోడిటీస్ & కరెన్సీల వైస్ ప్రెసిడెంట్ అమిత్ సజేజా అన్నారు. ఆగస్టు 11, 2023న విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్ నెలలో భారతదేశపు IIP 3.7 శాతం పడిపోయింది, ఇది మేలో 5.2 శాతంగా ఉంది. అలాగే ఆహార ధరల సెగ కారణంగా జూలై రీటైల్ ఇన్ఫ్లేషన్ 7.44శాతం వద్ద భారీగా పెరిగింది. ( 23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్, ధర ఎంతంటే?) చైనా యువాన్ క్షీణత చైనా యువాన్ పతనం స్థానిక రూపాయిపై కూడా ప్రభావం చూపింది. యువాన్ ఈ వారం 0.6శాతం మరియు ఈ సంవత్సరం 5.3శాతం క్షీణించింది. దేశం యొక్క విస్తారమైన ఆస్తి రంగంలో పెరుగుతున్న రుణ సంక్షోభం , ఆర్థిక పునరుద్ధరణ గురించి ఆందోళనలు యువాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ ఎవర్ గ్రాండే దివాల ప్రకటించడం, యూఎస్‌లోని అస్తుల రక్షణనిమిత్తం అక్కడి కోర్టును ఆశ్రయించడంమరింత ఆందోళన రేకెత్తించింది. (సంక్షోభం: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంచలనం) చమురు సెగ మరోవైపు ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.07శాతం పెరిగి 84.18కి డాలర్ల వద్దకు చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) బ్యారెల్‌కు 0.26శాతం పెరిగి 80.60 డాలర్ల స్థాయికి చేరింది. చేరుకుంది. దేశీయంగా, భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) నికర రూ.1,510.86 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIలు) నికర రూ.313.97 కోట్ల షేర్లను విక్రయించారు. -
పాకిస్తాన్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
దేశంలో రోజురోజుకు ఆర్థికంగా వస్తున్న మార్పుల కారణంగా బంగారం ధర రోజురోజుకూ మారుతూ రావడం సహజం. ఈ క్రమంలో ఇండియాలో బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు జోరుగానే ఉన్నాయి. అయితే పాకిస్తాన్లో మాత్రం భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి బలపడటంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం గణనీయంగా తగ్గాయి. కానీ శుక్రవారం తిరిగి కోలుకున్నాయి. ఇండియాలో పలు నగరాల్లో బంగారం ధరల కోసం క్లిక్ చేయండి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్థాన్ ప్రకారం, తులం (11.6638 grams) బంగారం ధర రూ.2,800 పతనమై రూ.220,200కి చేరగా, 10 గ్రాముల ధర రూ.2,401 క్షీణించి 10 గ్రాములకు రూ.188,786 వద్ద ఉంది. (బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!) ఇదీ చదవండి: అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత -
పసిడి కొనుగోలు దారులకు ఊరట: వెండి ఏకంగా రూ.1500 పతనం
Today Gold and Silver prices: బంగారం ధరలు కాస్త శాంతించి కొనుగోలుదారులకు ఊరటినిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి తులం రూ.55,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల పసిడి రూ.310 తగ్గి రూ.60,440 పలుకుతోంది. ఇదీ చదవండి: లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల పుత్తడి రూ.60,590గా ఉంది. అలాగే వాణిజ్యరాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,400 ఉండ, 24 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ.60,400 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి ధర 250 రూపాయలు క్షీణించి రూ.55,400 ఉంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 280రూపాయలు పడి రూ.60,440 స్థాయికి చేరింది. మరో వైపు వెండి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో కేజీ ధర ఏకంగా 1500 రూపాయలు తగ్గి రూ.80500 వద్దకు చేరింది. (చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్! కేంద్రం సీరియస్) ఇదీ చదవండి: నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు -
డాలరు Vs ఫెడ్: మరి బంగారం, వెండి ధరలు? ఇపుడు కొనడం మంచిదేనా?
Gold and Silver Price Today: బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా తాజాగా సోమవారం నాలుగు వారాల గరిష్టం నుంచి వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ రేట్ల పెంపు ఉండదనే అంచనాలతో పసిడి ధరలు తగ్గముఖం పట్టాయి. ఇటీవలి గరిష్టం ఔన్స్ ధర 1968 డాలర్ల నుండి వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం ఔన్సుకు 1950-1,953 డాలర్ల వద్ద కదలాడుతున్నాయి. అమెరికా డాలర్ 15 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత, గత వారం గత కొన్ని సెషన్లలో బంగారం ధరలు బాగా పుంజుకున్నాయి. అయితే, సోమవారం తెల్లవారుజామున జరిగిన డీల్స్‌లో,దేశీయ , అంతర్జాతీయ మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్‌ను చూసింది. ఎంసీఎక్స్ ఆగస్టు గడువు ముగిసిన గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల స్థాయిలకు రూ. 59,147 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో రూ. 59,130 స్థాయిలకు పడింది.అయితే విలువైన మెటల్ తక్కువ స్థాయిలలో కొనుగోళ్లతో రూ. 59,194 స్థాయిలను తాకింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం పుత్తడి ధరల పెరుగుదలకు దోహదపడింది. ద్రవ్యోల్బణ ఒత్తిడితో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చే ఆశలు పెట్టుబడిదారుల్లో ఉన్నాయి. ఇదే చర్య బంగారం ధరలకు ఊతమిస్తుంది. జూలై 26న జరగబోయే ఫెడ్ మానిటరీ పాలసీ మీటింగ్‌పై ప్రధానంగా అందరి దృష్టి ఉంది. ఇక దేశీయంగా బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల పుత్తడి రూ.55వేలు, 24 క్యారెట్ల బంగారం రూ.60వేల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,150గానూ, 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూ.60,150 గా ధర పలుకుతోంది. (ఇది కదా లక్ అంటే.. గంటలో కోటి!) హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు పలుకుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.60వేల వద్ద ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.81500 ఉన్నది ముంబై లో 10 గ్రాముల 24 క్యారెట్ల 999 బంగారం ధర రూ.5,9450 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, 10 గ్రాముల ఆభరణం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5,7250గా ఉన్నాయి.ఈ ధరలకు జీఎస్టీ అదనం. -
మళ్లీ పరుగందుకున్న పసిడి, వెండి అయితే ఏకంగా
July 14th Gold Silver Prices: దేశంలో వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. దేశీయ మార్కెట్లో తగ్గినట్టే తగ్గిన పసిడి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. అమెరికా డాలర్ బలహీనంగా ఉండటంతో బంగారం ధరలు పెరిగాయి. అటు వెండి కూడా భారీగా పెరిగింది.(జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్) 22క్యారెట్ల 10గ్రా. పసిడి రూ. 350 పెరిగి, రూ. 55,000కి చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 380 ఎగిసి రూ. 60,00కి చేరింది. ముంబై, కోల్‌కతా, కేరళ, బెంగళూరు, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,000, 24 క్యారెట్ల బంగారం రూ.60,000గా చేరడం గమనార్హం. అటు హైదరాబాద్మార్కెట్లో వెండి ధర ఏకంగా వెయ్యి రూపాయలు ఎగిసింది. ప్రస్తుంతం రూ.813మేర పెరిగి కిలో వెండి 81, 300 పలుకుతోంది. ఇదీ చదవండి: తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా? -
రూపాయి జోరు.. డాలరుతో పోలిస్తే బలపడిన రూపాయి
న్యూఢిల్లీ: డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ మరోసారి బలపడింది. 18 పైసలు పుంజుకుని 82.41 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్రితం ముగింపు 82.59తో పోలిస్తే తొలుత 82.42 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. తదుపరి డాలరుతో మారకంలో 82.32 వరకూ లాభపడింది. ఇంట్రాడే కనిష్టం 82.43కాగా.. చివరికి 82.41 వద్ద ముగిసింది. వెరసి గత రెండు రోజుల్లో 20 పైసలు బలపడింది. ఇందుకు ఈక్విటీ మార్కెట్లు లాభపడటం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సహకరించినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. డాలరుతో మారకంలో ఆసియా కరెన్సీలు పుంజుకోవడం సైతం రూపాయికి బలాన్నిచ్చినట్లు తెలియజేశాయి. -
July 8th 2023: మూడు నెలల కనిష్టానికి బంగారం ధర,మరింత పెరగకముందే కొనేద్దామా?
రోజుకు రోజుకు దిగి వస్తున్న పసిడి ధరలు కొనుగోలు దారులను ఊరిస్తున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ పెంపు ఆందోళన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈప్రభావం బంగారం ధరలపై కూడా చూపిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో బంగారం ధరలు కూడా దిగి వస్తున్నప్పటికీ భారీ ఒడిదుడుకులు మధ్య కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే జూన్ నెలలో బంగారం ధరలు ఏకంగా 3.3 శాతం మేర తగ్గాయి. బంగారం ధరలు జూలై నెల తొలి వారాన్ని పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారంతో ముగిసిన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రా. రూ.392 ఎగిసింది. అయితే ఎంసీఎక్స్‌లో బంగారం ధర దాదాపు రూ. 58,350 వద్ద మూడు నెలల కనిష్టానికి చేరిన తర్వాత మాత్రమే ఈ ర్యాలీ వచ్చింది. ధరల తగ్గుదల ఆగి పోయిందని భావిస్తున్నప్పటికీ రానున్న కాలంలో ఏ మాత్రం తగ్గినా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా కొనుగోళ్లకు ఉపయోగించు కోవాలని సూచిస్తున్నారు. అమెరికా జాబ్ డేటా ,అమెరికా డాలర్‌పై కూడా ఒత్తిడి తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రూ.400పెరిగి రూ. 54550 వద్ద ఉంది. అటు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రా. రూ. 59510 వద్ద ఉంది. అలాగే వెండి ధర కిలో వెయ్యి రూపాయలు ఎగిసి హైదరాబాద్‌లో రూ. 76700 పలుకుతోంది. -
డాలరు పైపైకి దిగొస్తున్న పసిడి: మరింత తగ్గుతుందా?
సాక్షి, ముంబై: బులియన్ మార్కెట్లో గత రెండు రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ముఖ్యంగా డాలరు పుంజుకోవడంతో బంగారం మరింత నష్టపోయాయి. డాలరు కనిష్ట స్థాయిలనుంచిపుంజుకోవడంతో బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఆషాడం కావడంతో పసిడి మెల్లగా దిగిస్తోంది. కొనుగోళ్లు స్తబ్దుగా ఉండటంతో గత రెండు రోజుల్లో బంగారం ధర దాదాపు 1000 రూపాయలు తగ్గింది. దేశీయంగా మంగళవారం బంగారం ధరలు 22 క్యారెట్ గ్రాము ధర రూ. 5,500 ఉండగా, 24 క్యారెట్ ధర గ్రాముకు రూ 6,000గా పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,00 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. (వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: వాళ్ల నోరు నొక్కేయండి అంతే!) ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,350 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,210గా చేరుకుంది. మరోవైపు ఇటీవల భారీగా క్షీణించిన కిలోవెండి కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయింది. కిలో వెండి 500 రూపాయిలు ఎగిసి 73,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మాత్రం రూ. 78,600 పలుకుతోంది. (50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం) ఎంసీఎక్స్ ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల రూ. 59,176 వద్ద స్వల్ప నష్టంతో ఉండగా, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 113 క్షీణించి రూ. 72,313 వద్ద ఉంది గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి 24.02 డాలర్ల వద్ద ,బంగారం ఔన్సు ధర1,954 డాలర్ల వద్ద ఉంది. కాగా డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయి నుండి పుంజుకుని ప్రస్తుతం 101.96 వద్ద ట్రేడవుతోంది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 0.12శాతం పెరిగింది.ఇది బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో 14 పైసలు క్షీణించి 82.08 వద్ద ఉంది. -
‘డాలర్ మిలియనీర్ల విదేశీ వలసలు తగ్గుతున్నాయి’
ఇండియా నుంచి పది లక్షల డాలర్ల (మిలియన్) మించిన సంపద ఉన్న ధనికులు పెట్టుబడులతో విదేశాలకు తరలిపోవడం క్రమంగా పెరుగుతోందని కిందటేడాది ఆందోళన వ్యక్తమైంది. నిజమే, కొత్తగా కోట్లాది రూపాయలు సంపాదించిన తెలివైన భారతీయులు స్వదేశం విడిచి ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాలకు తరలిపోవడం ఎవరికైనా మొదట దిగులు పుట్టిస్తుంది. కష్టపడి వ్యాపారాల ద్వారా సంపాదించిన వ్యక్తులు మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు పోగేసుకున్న తర్వాత కూడా తమకు అనుకూలంగా కనిపించే దేశాలకు పెట్టుబడుల ద్వారా వలసపోవడానికి అనేక కారణాలుంటాయి. తమ ఆర్జనపైన, విదేశాల్లో పెట్టే పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాలపైన భారత ప్రభుత్వం విధించే పన్నులు సబబుగా, హేతుబద్ధంగా లేవనే కారణంతో కొందరు పైన చెప్పిన డాలర్ మిలియనీర్లు విదేశాలకు వలసపోతుంటారు. మరి కొందరు మిలియనీర్లు ఇక్కడ కన్నా మెరుగైన సామాజిక జీవనశైలి సాధ్యమని భావించిన దేశాలకు పోయి స్థిరపడుతుంటారు. ఇలా రకరకాల కారణాలతో కొద్ది మంది కొత్త కోటీశ్వరులు ఇండియా నుంచి బయటకు పోతున్నారు. వలసపోయే మిలియనీర్ల సంఖ్య తగ్గడం శుభవార్తే! 2022లో దేశం నుంచి మిలియన్ డాలర్ల సంపన్నులు 7,500 మంది విదేశాలకు తరలిపోయారు. కాని, ఇలా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి బయటకు పోతున్న సంపన్నులను ఆకట్టుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా 2023లో ఇలాంటి ధనికుల సంఖ్య 6,500కు తగ్గుతుందని అంచనా. ఇలాంటి పెట్టుబడి వలసలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసే లండన్ కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ విడుదల చేసిన వివరాలు పై విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇండియా వదిలిపోవాలనుకునే భారత సంపన్నుల్లో ఎక్కువ మంది ఇష్టపడే దేశం ఆస్ట్రేలియా. తర్వాత స్థానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒకటైన దుబాయి. ఇప్పటికే దుబాయి మాదిరిగానే భారత సంతతి ప్రజలున్న సింగపూర్ పోయి స్థిరపడానికి కూడా కొందరు భారతీయులు ఉత్సాహపడుతున్నారని హెన్లీ అండ్ పార్టనర్స్ సర్వే చెబుతోంది. ఆస్ట్రేలియాలో 2023లో పెట్టుబడులతో వచ్చి స్థిరపడే విదేశీయులు గరిష్ఠంగా 5,200 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. డాలర్ మిలియనీర్ల వలసల్లో చైనాదే ప్రథమ స్థానం! 20వ శతాబ్దంలో 1978 నుంచీ ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన చైనా, 1991 నుంచీ పేదరికం నిర్మూలించి, సంపద సృష్టించడానికి కొత్త మార్గంలో ప్రయాణం మొదలెట్టిన ఇండియాలో కొత్త ఐడియాలతో, వినూత్న పరిశ్రమతో కొత్త డాలర్ మిలియనీర్లు ఏటా గణనీయ సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ సైజులో పెద్దదైన చైనా ఇలాంటి వలసల విషయంలో కూడా ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. 2023లో చైనా నుంచి 13,500 మంది కోటీశ్వరులు ఇతర దేశాలకు వలసపోతారని భావిస్తున్నారు. 2022లో ఈ సంపన్నుల సంఖ్య 10,800 మాత్రమే. అంటే ఏటా చైనా నుంచి బయటకు పోయే కొత్త ధనికుల (పది లక్షల అమెరికన్ డాలర్లకు మించిన సంపద ఉన్న హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్) సంఖ్య పెరుగుతుండగా ఇండియాలో వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తి ఇంగ్లండ్ నుంచి కూడా డాలర్ మిలియనీర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారట. ఇంకా ఈ తరహా దేశాల్లో రష్యా, బ్రెజిల్ కూడా ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి సంపన్నుల విదేశీ వలసల విషయంలో శుభపరిణామం ఏమంటే–ఇండియాలో మెరుగవుతున్న ఆర్థిక,సామాజిక పరిస్థితులను, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది భారతీయులు విదేశాల నుంచి వెనక్కి వచ్చి స్వదేశంలో స్థిరపడుతున్నారు. వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, అవకాశాల స్వర్గంగా భావించే అమెరికా నుంచి కూడా మిలియనీర్లు ఇతర దేశాలకు వలసపోవడం సాధారణ విషయంగా నేడు మారిపోయింది. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ. -
రూపాయి సింబల్ ₹, డాలర్ $, పౌండ్ £...వీటి వెనుక కథ ఏమిటంటే...
ప్రతీ దేశానికీ ఆ దేశపు ప్రత్యేక కరెన్సీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. మన దేశంలో మారకంలో ఉన్నది రూపాయి. దీని సింబల్ హిందీలోని 'र' అక్షరాన్ని పోలివుంటుంది. రూపాయిలోని ‘ర’ ను ఆధారంగా చేసుకుని ఈ సింబల్ రూపొందించారు. ఇక డాలర్ విషయానికొస్తే 'D' అక్షరంతో మొదలవుతుంది. అయితే దీనిని 'S'అక్షరం మాదిరిగా ఎందుకు రాస్తారు? పౌండ్ విషయంలోనూ ఇటువంటి సందేహమే వస్తుంది. ఇది 'L' అక్షరం మాదిరిగా కనిపిస్తుంది. ఇలా ఉండటం వెనుక కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా డాలర్, బ్రిటన్ పౌండ్ విషయానికొస్తే డాలర్ గుర్తు $, పౌండ్ గుర్తు £ గా కనిపిస్తుంది. మనదేశ కరెన్సీ రూపాయిలోని తొలి అక్షరం 'R'. దీనికి దేవనాగరిలోని 'र'కలిపి ₹గా రూపొందించారు. దీనిని ఉదయ్ కుమార్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ సింబల్ రూపకల్పనకు ప్రభుత్వం ఒక పోటీని నిర్వహించి, చివరికి ₹ చిహ్నాన్ని ఎంపిక చేసింది. డాలర్‌కు $ సింబల్ ఎలా వచ్చిందంటే.. హిస్టరీ వెబ్సైట్ రిపోర్టు ప్రకారం సౌత్ అమెరికాలో స్పానిష్ ఎక్స్ప్లోరర్స్కు భారీ మొత్తంలో వెండి లభ్యమయ్యింది.దీంతో స్పానిష్ ప్రజలు ఆ వెండితో నాణాలు తయారుచేయించుకోవడం ప్రారంభించారు. వీటిని peso de ocho అని అనేవారు. దీనికి షార్ట్ పదంగా 'pesos'అని పిలిచేవారు. అలాగే రాసేటప్పుడు దానిని ps అని రాసేవారు. మొదట్లో ఎస్ అక్షరంపై పి ఉంచారు. ఆ తరువాత పి అక్షరంలోని నిలువు గీతను మాత్రమే ఉంచి దానిని $ సింబల్‌గా మార్చారు. పౌండ్ సైన్ అలా ఎందుకుంటుందంటే... ఇప్పుడు పౌండ్ సైన్ £ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. లాటిన్ భాషల్ 1 పౌండ్‌ను Libra అని అంటారు. ఈ లిబ్రాలో L నుంచి స్టర్లింగ్ సింబల్ £ రూపొందింది. -
బంగారం పెరిగినా డాలరుకు ప్రాధాన్యం తగ్గదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగితే డాలరు ప్రాధాన్యం కోల్పోతుందనుకోవడం సరైన అంచనా కాకపోవచ్చని ఆర్థిక నిపుణుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తెలిపారు. డాలరు మారకం విలువ తగ్గినప్పుడల్లా బంగారం ధర పెరుగుతుందని, ఈ కారణంతో డాలరు పని ఇక అయిపోయిందనే పుకార్లు వినిపిస్తుంటాయని పేర్కొన్నారు. కానీ బలహీనపడిన ప్రతీసారీ అది పుంజుకుంటూనే ఉందని తెలిపారు. అత్యంత ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవహారాల్లో అమెరికాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఆ దేశానికి ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమేనని, డాలరుకు ఉన్న ప్రాధాన్యతకు సవాళ్లు ఎదురైనా తాత్కాలికమేనని 75 ఏళ్ల చరిత్ర చెబుతోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అనేక ఇతర కారణాల వల్ల బంగారానికి డిమాండు పెరిగేందుకు, ధర ఎగబాకేందుకు అవకాశాలున్నాయి గానీ డాలరు పతనం నిరంతరాయంగా జరగదని పలువురు ఆర్థికవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
‘డాలర్ ఫైనాన్సియల్ టెర్రరిస్ట్’..
అమెరికన్ డాలర్ ‘ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది’ అని చేసిన వ్యాఖ్యపై కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ తాజాగా వివరణ ఇచ్చారు. ఆ మాట తాను అనుకోకుండా అన్నానన్నారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘యూఎస్ డాలర్‌పై ఇటీవల జరిగిన చర్చలో నేను అనుకోకుండా "ఆర్థిక ఉగ్రవాది" అనే పదాలను ఉపయోగించాను. నా ఉద్దేశం ఏమిటంటే రిజర్వ్ కరెన్సీకి అసమాన శక్తి ఉంటుంది. అది నోస్ట్రో ఖాతా అయినా కావచ్చు. 500 బీపీఎస్ రేటు పెరుగుదల అయినా లేదా లిక్విడిటీ కోసం యూఎస్ డాలర్‌ను కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలైనా కావచ్చు’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు.. రిజర్వ్ డాలర్‌గా ఉన్న అమెరికన్ డాలర్ హోదా అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే శక్తిని ఇస్తుందన్నారు. చరిత్రలో కీలకమైన ఈ తరుణంలో ప్రపంచం కొత్త రిజర్వ్ కరెన్సీ కోసం వెతుకుతోందని తాను భావిస్తున్నట్లు కోటక్ ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. యూరప్, బ్రిటన్, జపాన్, చైనాతో సహా ఇతర దేశాలు తమ కరెన్సీలను రిజర్వ్ కరెన్సీలుగా పేర్కొనడానికి ముందస్తు అవసరాలు లేవని ఆయన అన్నారు. రూపాయి రిజర్వ్ కరెన్సీ కావాలంటే దేశం బలమైన సంస్థలను, వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. గత మార్చి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభం రూ. 3,495.6 కోట్ల వద్ద 26.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం 35 శాతం పెరిగి రూ.6,102.6 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు నాల్గవ త్రైమాసికంలో రూ.1,193.30 కోట్లకు తగ్గాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.1,736.71 కోట్లు. శాతాల పరంగా, నికర ఎన్పీఏ నికర అడ్వాన్స్లలో 0.64 శాతం నుంచి 0.37 శాతానికి మెరుగుపడింది. ఇదీ చదవండి: ATM Fraud Alert: ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త! -
పట్టు కోల్పోతున్న అమెరికన్ డాలర్
-
తగ్గినట్టే తగ్గి.. షాకిస్తున్న పసిడి
సాక్షి,ముంబై: గత కొద్దిరోజులుగాఆకాశనుంచి దిగొస్తూ మురిపించిప పసిడి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. రానున్న పెళ్లిళ్ల సీజన్లో ఊరట చెందాలనుకున్న పసిడి ప్రియులకు ఇది చేదు వార్త. తాజాగా గురువారం కూడా బంగారం, వెండి ధరలు వేగాన్ని అందుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ ధరతో పోలిస్తే హైదరాబాదులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 పలుకుతోంది. గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,175 గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,200కి చేరింది. ఇక ముంబై, కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600(గురువారం)గా ఉంది చెన్నైలో రూ. 52,350, ఢిల్లీ, జైపూర్ , లక్నోలో రూ. 51,750. మరోవైపు ఢిల్లీ, కోల్‌కతా, పూణేలో కిలో వెండి ధర రూ.66,800గా ఉంది. గ్లోబల్‌గా రాయిటర్స్ ప్రకారం, వడ్డీ రేట్లు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉంటాయనే పెట్టుబడిదారుల ఆందోళనలను గ్లోబల్ ఎకనామిక్ డేటా మరింత పెంచింది. డాలర్ పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఒక వారం గరిష్ట స్థాయికి చేరిన స్పాట్ బంగారం 0.2శాతం తగ్గి ఔన్సుకు 1,833.57 డాలర్ల వద్ద ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం నష్టంతో 1,840.50 డాలర్లుగా ఉంది. కాగా బుధవారం వరుసగా మూడవ సెషన్లో లాభంతో గత వారం నుండి బంగారం దాదాపుగా తన నష్టాలనుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. -
రికవరీకి అవకాశం
ముంబై: గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే అదానీ గ్రూప్ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతల కారణంగా భారీ లాభాలైతే ఉండకపోవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) డిసెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు, ఫిబ్రవరి ఆటో అమ్మకాలు, తయారీ, సేవారంగ పీఎంఐ డేటాను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు తదితర సాధారణ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ కఠిన ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు సంకేతాలు, రష్యా – ఉక్రెయిన్– అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తెరపైకి రావడంతో సూచీలు గడిచిన ఎనిమిది నెలల్లో ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్ల చొప్పున క్షీణించాయి. ‘‘వరుస నష్టాల మార్కెట్ వచ్చే వారం గట్టెక్కే వీలుంది. అయితే అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్లలో కరెక్షన్ ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా., సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో ట్రేడవొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ కీలక మద్దతు స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. అమ్మకాలు కొనసాగి బడ్జెట్ రోజునాటి కనిష్ట స్థాయి(17,353)ని కోల్పోతే 17,050 –17,000 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు. అనుకున్నట్లే రికవరీ కొనసాగితే 17,750–17,800 పాయింట్ల పరిధిలో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది’’ అని ఏంజెల్ వన్ సాంకేతిక నిపుణుడు రాజేశ్ భోంస్లే తెలిపారు. బుధవారం డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ ఐపీవో కొన్ని నెలల విరామం తర్వాత ప్రైమరీ మార్కెట్ మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థ డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ ఐపీవో మార్చి ఒకటిన మొదలవనుంది. శుక్రవారం ముగియనున్న ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.180 కోట్లను సమీకరించనుంది. ఇందుకు 39 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టింది. ధర శ్రేణిని సోమవారం కంపెనీ వెల్లడించనుంది. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 24 తేదీ నాటికి ఎఫ్ఐఐలు రూ.2,313 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు ఎన్‌సీడీఎల్ డేటా చెబుతోంది. అయితే ఈ ఏడాది జన వరి విక్రయాలు రూ.28,852 కోట్లతో పోలిస్తే అమ్మకాలు భారీగానే తగ్గాయి. ‘‘అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు వెలువడిన నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐ లు వైదొలుగుతున్నారు. అయితే దక్షిణ కొరి యా, తైవాన్, చైనా దేశాలు ఈక్విటీలు చౌకగా లభిస్తున్నందున ఇన్వెస్టర్లు ఈ దేశాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్(క్యూ3) జీడీపీ గణాంకాలు ఈ మంగళవారం(ఫిబ్రవరి 28) కేంద్రం వెల్లడిస్తుంది. అదేరోజున జనవరి ద్రవ్యలోటు డేటా వెలువడుతుంది. మార్చి ఒకటిన(బుధవారం) ఆటో కంపెనీలు ఫిబ్రవరి హోల్‌సేల్ అమ్మకాల వివరాలు, ఫిబ్రవరి తయారీ పీఎంఐ డేటా వెల్లడి అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం సేవారంగ పీఎంఐ డేటా విడుదల అవుతుంది. అదే రోజున ఆర్బీఐ ఫిబ్రవరి 24 తేదీన ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు డిసెంబర్ 19వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ఇక అంతర్జాతీయంగా నేడు(సోమవారం) యూరోజోన్ ఫిబ్రవరి ఎకనామిక్స్, సర్విసెస్, పారిశ్రామిక సెంటిమెంట్ వివరాలు వెల్లడికానున్నాయి. అమెరికా, యూరోజోన్‌తో పాటు ఇతర ప్రధాన దేశాల తయారీ రంగ డేటా మార్చి ఒకటిన(బుధవారం) విడుదల అవుతుంది. యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా మార్చి రెండో తేదీన వెల్లడి కానుంది. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. -
పసిడి పరుగు, మూడు నెలల్లోపే అంత పెరిగిందా..!
సాక్షి,ముంబై: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి. పసిడి ధర శుక్రవారం మరో రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాములకు రూజ56,850కి చేరుకున్నాయి. డాలర్ క్షీణత , ట్రెజరీ ఈల్డ్‌ల కారణంగా బంగారం 3 నెలల గరిష్టానికి చేరింది. నవంబర్ నుంచి ప్రారంభమైన బులియన్ ర్యాలీ మధ్య గ్యాప్ ఇచ్చినా మూడు నెలలోపే 6 వేల రూపాయలు ఎగియడం గమనార్హం. గ్లోబల్ సంకేతాలతో భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్లలో బంగారం ధరలు ఈరోజు మరో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎంసీఎక్స్ బంగారం ఫ్యూచర్లు 0.3శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 56,850కి చేరగా, వెండి కిలోకు రూ. 68,743కి పలికింది. అమెరికా ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరి 1న దాని రెండు రోజుల సమావేశం ముగింపులో ఫెడరల్ రిజర్వ్ ద్వారా స్ట్రీట్ ఒక చిన్న 25-బేసిస్-పాయింట్ వడ్డీ రేటు మాత్రమే పెంపు ఉంటుందన్న అంచనాలతో బంగారం లాభపడుతుంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర 58,710 వద్ద, వెండి కిలో ధర స్వల్పంగా తగ్గి రూ. 73500 వద్ద ఉంది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం, దేశంలో పెరిగిపోతున్న ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్) వరుసగా నాలుగో వారం కూడా పురోగమించాయి. డిసెంబర్ 2వ తేదీతో ముగిసిన వారంలో 11 బిలియన్ డాలర్లు పెరిగి 561.162 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్ 2021న దేశ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి బలహీనత, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ పరిమిత జోక్యం, తదితర కారణాల నేపథ్యంలో క్రమంగా 520 బిలియన్ డాలర్ల వరకూ దిగివచ్చాయి. ఒక దశలో వరుసగా ఎనిమిది నెలలూ దిగువబాటన పయనించాయి. కొంత ఒడిదుడుకులతో డిసెంబర్ 2తో గడచిన నెలరోజుల్లో ఫారెక్స్ పెరుగుదల ధోరణి ప్రారంభమైంది. తాజా గణాంకాలు విభాగాల వారీగా చూస్తే.. ►డాలర్ల రూపంలో పేర్కొనే వివిధ దేశాల కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 9.694 బిలియన్ డాలర్లు పెరిగి 496.984 బిలియన్ డాలర్లకు చేరాయి. ►పసిడి నిల్వలు 1.086 బిలియన్ డాలర్లు పెరిగి 41.025 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ►అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 164 మిలియన్ డాలర్లు తగి 18.04 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ►ఇక ఐఎంఎఫ్ వద్ద రిజర్వ్ పరిస్థితి 75 మిలియన్ డాలర్లు తగ్గి 5.108 బిలియన్ డాలర్లకు చేరింది. -
రూపాయికి మరో షాక్
ముంబై: డాలరు మారకంలో వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ నీరసించింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 65 పైసలు పతనమైంది. ఇది గత ఆరు వారాల్లోనే అత్యధిక నష్టంకాగా.. 4 వారాల కనిష్టం 82.50 వద్ద ముగిసింది. ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం మూడో రోజు డీలా పడగా.. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి అమ్మకాల బాట పట్టడం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ముడిచమురు ధరలు తిరిగి బలపడుతున్నాయి. తాజాగా లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.65 శాతం ఎగసి 83.22 డాలర్లను తాకింది. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 105.24కు పుంజుకుంది. కాగా.. రూపాయి సోమవారం 52 పైసలు కోల్పోయి 81.85 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. వెరసి మూడు రోజుల్లో రూపాయి 124 పైసలు పడిపోయింది! నేలచూపులోనే డాలరు, చమురు ధరల ప్రభావంతో రూపాయి వెనకడుగుతో ప్రారంభమైంది. ఒక దశలో 82.63 వరకూ పతనమైంది. 81.94 వద్ద ప్రారంభమైన రూపాయికి ఇదే ఇంట్రాడే గరిష్టంకావడం గమనార్హం! డాలరు మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే 10 శాతం క్షీణించింది. డాలరు ఇండెక్స్ 114 వద్ద రెండు దశాబ్దాల గరిష్టానికి చేరడంతో అక్టోబర్ 19న చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఈ స్థాయికి చేరువలో నిలవడం ప్రస్తావించదగ్గ అంశం!! -
వచ్చే ఏడాదీ రూపాయిపై ఒత్తిడి
ముంబై: రూపాయి వచ్చే ఏడాది కూడా డాలర్‌తో ఒత్తిళ్లను ఎదుర్కోవచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. డాలర్ మారకంలో 85 శ్రేణిని చేరుకోచ్చని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత చమురు ధరలు పెరిగిపోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు తదితర అంశాల ప్రభావంతో రూపాయి విలువ అక్టోబర్ 19న జీవిత కాల కనిష్ట స్థాయి 83కు తగ్గిపోవడం తెలిసిందే. ఆ స్థాయి నుంచి కోలుకుని ప్రస్తుతం 82 స్థాయిలో ట్రేడవుతోంది. ముంబైలో గురు వారం ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న పలువురు ఆర్థిక వేత్తలు స్పందిస్తూ.. కరెంటు ఖాతా లోటు విస్తరించినందున (జీడీపీలో 4 శాతానికి) ఇక ముందూ రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఎగుమతులు సైతం గత నెలలో క్షీణించడాన్ని ప్రస్తావించారు. వచ్చే ఏడాది డాలర్ మారకంలో రూపాయి 82–85 శ్రేణిలో చలించొచ్చని అంచనా వేశారు. రూ పాయి గరిష్టంగా 83, కనిష్టంగా 85కు చేరుకోవచ్చని ఐసీఆర్ఐఈఆర్ సీఈవో దీపక్ మిశ్రా, జేపీ మోర్గాన్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సాజిద్ చినాయ్ పేర్కొన్నారు. రూపాయి 80–82 రేంజ్లో ఉండొచ్చని ఎస్బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ అంచనా వేశా రు. ఐజీఐడీఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ రాజేశ్వరిసేన్ గుప్తా 84–85కు చేరుకోవచ్చన్నారు. -
బలహీన బాటలో రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీన బాటలో పయనిస్తోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 38 పైసలు బలహీనపడి, 81.64 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా కరెన్సీ పటిష్టత, దేశీయ ఈక్విటీల్లో మిశ్రమ ధోరణి రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. రూపాయి విలువ బుధవారం 35 పైసలు తగ్గి 81.26కు పడిపోయింది. గురువారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 81.62 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81.45 – 81.68 శ్రేణిలో కదలాడింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపా యి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. -
కొడిగడుతున్న డాలర్ దీపం
ఈ రోజున అమెరికా ప్రపంచంలోనే అత్యంత పెద్ద రుణగ్రస్త దేశం. ఆ దేశం మొత్తం అప్పు 31.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది ఆ దేశపు జీడీపీలో 126 శాతం. అమెరికా రుణభారంలో అతిపెద్ద వాటా జపాన్‌ది. తర్వాతి స్థానాలలో చైనా, బ్రిటన్ ఉన్నాయి. 1980 ముందు నుంచీ అమెరికా రుణభారం ప్రతి 8 సంవత్సరాలకు రెట్టింపు అవుతూ వస్తోంది. అమెరికా ఆర్థిక బలహీనతకు మరో ప్రధాన కారణం, విప రీతంగా డాలర్లను ముద్రిస్తూ ఉండటం. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2010 నాటికంటే 60 శాతం ఎదిగింది. కానీ ఫెడరల్ రిజర్వ్ ఇదే కాలంలో ముద్రించిన కరెన్సీలో 300 శాతం పెరుగుదల ఉంది. అంటే ఆర్థిక కార్యకలాపాల ద్వారా జరిగిన వృద్ధికంటే, కాగితం కరెన్సీ పెరుగుదల వల్ల వచ్చిన ‘వాపు’ ఎక్కువ! 2000 సంవత్సరం నాటికి ప్రపంచ ఎగుమతులలో అమెరికా వాటా 12.1 శాతం. నాడు చైనాకి సంబంధించి ఇది 3.9 శాతం. 2020 నాటికి పరిస్థితి తల్లకిందులైపోయింది. అంతర్జాతీయ ఎగుమతులలో చైనా వాటా 14.7 శాతంగానూ, అమెరికా వాటా 8.1 శాతంగానూ ఉంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయన్నమాట! 1980ల నుంచే మొదలైన అమెరికా ఆర్థికవ్యవస్థ పతనం నేడు పరాకాష్టకు చేరింది. ఇటువంటి బలహీనమైన దేశీయ ఆర్థిక పునాదులపై నిలబడే అమెరికా నేటి వరకూ అగ్రరాజ్యంగా చలామణి అయ్యింది. దీనం తటికీ కారణం ఆ దేశ కరెన్సీ అయిన డాలర్. 1944లో అంటే, రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న దశలోనే ప్రపంచదేశాలు తమ మధ్య లావాదేవీలకుగానూ రిజర్వ్ కరెన్సీ లేదా అంతర్జాతీయ కరెన్సీగా డాలర్‌ను ఆమోదించాయి. ఆ విధంగా బ్రిటన్ తాలూకు అగ్రదేశ స్థానాన్ని అమెరికా ఆక్రమించుకుంది. మూడు దశాబ్దాలకు పైబడి అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే బలమైనదిగా ఉండడం వలన కూడా డాలర్‌కు ఆ ప్రాభవం దక్కింది. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ డాలర్‌కు పునాదిగా బంగారాన్ని పొదివిన 1944 లోని బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం నుంచి వైదొలిగాడు. అయితే, చమురు ఉత్పత్తి దేశాలతో ఉన్న సాన్నిహిత్యంతో డాలర్ కరెన్సీకే చమురు అమ్ముతామని ఆ దేశాలతో అంగీకరింపజేయడం ద్వారా ప్రపంచ దేశాలకు డాలర్ అవసరాన్ని అట్టిపెట్టగలిగాడు. 1980ల అనంతరం అమెరికా ఆర్థిక వ్యవస్థలో తీవ్ర బలహీన తలు ప్రవేశించాయి. వీటిలో ప్రధానమైనది ఆ దేశంలోని పరిశ్రమలు ఔట్సోర్సింగ్ రూపంలో విదేశాలకు తరలివెళ్ళిపోవటం. ఈ క్రమం లోనే ప్రపంచదేశాల పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన చైనా ప్రపంచా నికి సరుకు ఉత్పత్తి ఫ్యాక్టరీగా రూపొందింది. మెక్సికో, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి అనేక చౌకశ్రమశక్తి ఉన్న దేశాలకు కూడా అమెరికా ఫ్యాక్టరీలు తరలిపోయాయి. ఫలితంగా ఆ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. సేవారంగం కూడా ఇంటర్నెట్ టెక్నాలజీ రంగ ప్రవేశం అనంతరం... ఔట్సోర్సింగ్ ప్రాజెక్టుల రూపంలో భారత్ వంటి ఆంగ్లం మాట్లాడగల నిపుణులు ఉన్న దేశాలకు తరలింది. మూలిగే నక్కపై తాటికాయలా సాంకేతిక ఎదుగుదల క్రమంలో మరమనుషుల రంగ ప్రవేశం వంటివి జరిగాయి. 1980ల నాటికే నాటి ముతకరకం రోబోటు ముగ్గురు కార్మికుల ఉపాధిని కొల్ల గొట్టేస్థాయిలో ఉంది. నేడు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎదుగుదల స్థాయిని చెప్పనవసరం లేదు. స్థూలంగా, ఉత్పత్తిరంగాలపై ఆధార పడి జీవించే అవకాశం ఇటు కార్మికులకూ, అటు ఉద్యోగులకూ కూడా లేకుండాపోయింది. ఈ క్రమంలోనే అమెరికా ఆర్థికవ్యవస్థ కేవలం తన కాగితం కరెన్సీ అయిన డాలర్‌పై లేదా స్పెక్యులేటివ్ రంగాలైన షేర్మార్కెట్లు, రియల్ ఎస్టేట్‌పై ఆధారపడటం పెరిగింది. దాంతోనే ముందుగా చెప్పినట్లు డాలర్ల ముద్రణ అపరిమితంగా పెరిగింది. ఈ పరిస్థితి రాత్రికిరాత్రే అమెరికాను అగ్రరాజ్యం పాత్ర నుంచి పడ దోసేయలేకపోయింది. దీనికి కారణం అమెరికా ప్రజానీకం విని మయం అత్యధికస్థాయిలో ఉండటమే. మరోరకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అనేకానేక దేశాలు అమెరికాకు సరుకులూ, సేవలను ఎగుమతి చేయడం ద్వారా తమ దేశాలలో ఉపాధి కల్పనను, ఆర్థిక ఎదుగుదలను పొందాయి. దీని వలన అటు ప్రధాన దిగుమతి దారుగా ఉన్న అమెరికాకు ఎగుమతులు చేసి మనుగడ సాగించే చట్రంలో ఇతర దేశాలు సుదీర్ఘకాలం ఉండిపోయాయి. కాగా, వాస్తవ ఉత్పత్తి లేని, డాలర్ల ముద్రణ మీద ఆధారపడిన అమెరికా ఆర్థికం ఇక ఎంతమాత్రమూ యధాతథంగా కొనసాగలేని పరిస్థితులు పుంజుకున్నాయి. మాయల ఫకీరు ప్రాణం చెట్టుతొర్రలో ఉన్నట్లుగా అమెరికా బలం దాని డాలర్లో ఉంది. దశాబ్దాలపాటు, తన డాలర్‌ను సవాల్ చేసిన దేశాలనూ, నేతలనూ అమెరికా నయానో భయానో కట్టడి చేసింది. ఈ క్రమంలోనివే... ఇరాక్‌పై యుద్ధం, లిబియాలో గడాఫీని తిరుగుబాటుతో అంతమొందించడం, ఇరాన్‌తో ఘర్షణ పడుతుండటం! రానురానూ అప్పులు పెరిగిపోతుండటం, యుద్ధాల కోసం మరింతగా ఖర్చుపెట్టలేని స్థితి ఏర్పడటం, అఫ్గాని స్తాన్, ఇరాక్లలో సైనిక పరాభవం వంటివన్నీ అమెరికా బలహీన తలను ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టాయి. ముఖ్యంగా అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైనిక దళాలు హడావిడిగా వైదొలిగిన తీరు, దాని మిత్ర దేశాలకు ఇక అమెరికా అండపై ఎంతమాత్రమూ ఆధారపడలేమనే పాఠాన్ని నేర్పాయి. ఇది ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో మరింతగా బోధపడింది. ఈ యుద్ధ క్రమంలో రష్యాను అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులకు అవసరమైన సమాచార వ్యవస్థ అయిన ‘స్విఫ్ట్’ నుంచి బహిష్కరించటం ద్వారా ప్రపంచ దేశాలకు అమెరికా ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చింది. కానీ అమెరికా డాలర్‌పై ఆధారపడితే ఏదో ఒక రోజు ఇటువంటి ఆర్థిక దిగ్బంధనమే మనకూ జరగొచ్చన్న పాఠాన్ని ప్రపంచదేశాలు నేర్చాయి. గత కొన్ని మాసాలుగా అమెరికా ఫెడరల్ బ్యాంకు తన వడ్డీరేట్లను పెంచుతోంది. ఫలితంగా డాలర్ కరెన్సీలో మదుపులు చేయడం, అంతర్జాతీయ మదుపుదారులకు లాభసాటిగా మార సాగింది. దాంతో వారు వివిధ దేశాల షేర్మార్కెట్లలో పెట్టిన పెట్టు బడులను ఉపసంహరించుకొని అమెరికా మార్కెట్లకు తరలిపోతు న్నారు. ఫలితంగా ఆయా దేశాల కరెన్సీల విలువలు పడిపోవటం, షేర్‌మార్కెట్ సూచీలు దిగజారిపోవడం జరుగుతోంది. అంటే అమె రికా డాలర్ చేతిలో తమ జుట్టును పెడితే అది తమకు ప్రమాదకర మని అన్ని దేశాలు నిర్ధారణకు వస్తున్నాయి. ఫలితంగానే గతంలో అమెరికాకు భారీ ఎత్తున అప్పులు ఇచ్చిన దేశాలన్నీ నేడు ఆ డాలర్ అప్పులను వదిలించుకుంటున్నాయి. అమెరికాకు అతిపెద్ద రుణదాత (ఇది అమెరికాకు ఎగుమతులను చేయడంతో పేరుకుపోయిన మొత్తం) అయిన జపాన్ ఇప్పటికే తన ఈ రుణంలోని 12 శాతాన్ని అమ్మేసుకుంది. ఇదే బాటలో నిన్నటి అనుంగు మిత్రదేశాలు సౌదీ అరేబియా 35 శాతం, ఇజ్రాయెల్ 20 శాతం అప్పులను అమ్మేసు కున్నాయి. సుమారు 71 దేశాలు డాలర్ కరెన్సీని, దాని రూపంలో అమెరికా చేసిన అప్పును వదిలించేసుకుంటున్నాయి. గతితర్కం (చలన సూత్రాలు) తాలూకు సూత్రీకరణ ప్రకారం ‘ఒక పరిణామం లేదా వస్తువు దాని ఆరంభ స్థానం నుంచి ముందుకు వెళ్తున్నకొద్దీ దాని తాలూకు వేగం పెరుగుతుంది’. ఇది అన్ని విష యాల్లోనూ జరిగేదే. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధినే చూస్తే– గత వంద సంవత్సరాల ప్రగతి కంటే తర్వాతి 20, 30 సంవత్సరాలలో జరిగిన పురోగమనం ఎక్కువ. తరువాతి ఐదు సంవత్సరాలలో మరింత వేగంగా ఈ పురోగతి జరిగింది. ఇదే సూత్రం సామాజిక, ఆర్థిక విషయాలకు కూడా వర్తించే వాస్తవం. కాబట్టి డాలర్ దిగ జారుడు వేగం మరింతగా పెరగటం ఖాయం. ఆర్థికపరంగా ఇదివరకే డొల్ల అయిన అమెరికా... డాలర్ ముద్రణపై కూడా ఆధారపడలేక కుదేలైపోగలదు. ఏకైక అగ్రరాజ్యంగా అమెరికా స్థానం ముగిసి పోగలదు! డి.పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు ‘ 98661 79615 -
ఎన్నాళ్లకెన్నాళ్లకు: భారీ లాభాల్లో రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి చాలా రోజుల తరువాత లాభాల్లోకి మళ్లింది. ఆరంభంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 67 పైసలు జంప్ చేసి 82.14 స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 50 పైసలు లాభంతో ట్రేడ్ అవుతోంది. మంగళవారం నాటి ముగింపు 82.72 పోలిస్తే డాలర్‌తో రూపాయి 82.20 స్థాయిని తాకింది. అటు డాలర్ ఇండెక్స్ సుమారు 109.75 వద్ద ఒక నెలలో దాని కనిష్ట స్థాయికి చేరింది. ఫలితంగా దేశీయ సావరిన్ బాండ్లు కూడా పెరిగాయి. ఈ పరిణామం రూపాయికి సానుకూలంగా మారింది. కాగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఫెడ్ వడ్డీరేటు పెంపు అంచనాల మధ్య డాలర్ బలహీనత కొనసాగుతోంది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 17750 పాయింట్లకు ఎగువన ట్రేడ్ అవుతోంది. -
రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?
ఒక దేశపు కరెన్సీ మారకం రేటు ఎందుకు తగ్గుతుంది? దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల విలువ సమానంగా ఉంటే, మారకాల సమస్య, ఎకౌంట్లు చూసుకునే సాంకేతిక సమస్య మాత్రమే. కానీ, 2 దేశాల మధ్య ఎగుమతులూ దిగుమతులూ సమానంగా వుండడం ఎప్పుడో గానీ జరగదు. ఇటీవల తరచుగా వినిపిస్తున్న ఒక వార్త: ‘డాలరుతో మారకంలో రూపాయి విలువ పడి పోతోంది’–అని. రూపాయి ‘మారకం విలువ రేటు’లో మార్పునకి కారణాన్ని తెలుసుకోవా లంటే, ‘మారకం’ అంటే ఏమిటో, ‘మారకం విలువ’ అంటే ఏమిటో ముందు తెలియాలి. సరుకుల ‘మారకం’ అంటే, ఒక వ్యక్తిగానీ, ఒక దేశంగానీ, ఒక సరుకుని బైటికి ఇచ్చి, ఇంకో సరుకుని బైటినించీ తీసుకోవడమే. సరుకుకి ‘మారకం విలువ’ అంటే, ఆ సరుకుని తయారు చేయడానికి పట్టిన శ్రమ కాలమే. ఎక్కువ శ్రమ జరిగితే ఎక్కువ విలువ, తక్కువ శ్రమకి తక్కువ విలువ. ఏ సరుకుని తయారు చేయడానికైనా, మొదట ప్రకృతిలో దొరికే సహజ పదార్థం ఏదో ఒకటి వుండాలి. ప్రకృతి సహజ పదార్థం మీద శ్రమ జరిగితే, ఏదో ఒక వస్తువు తయారవుతుంది. ఆ వస్తువుని అమ్మకానికి పెడితే, అదే ‘సరుకు’. ఒక సరుకు తయారు కావడానికి జరిగిన శ్రమని కొలవడానికి వున్న సాధనం అది జరిగిన ‘కాలమే’. గంటలో, రోజులో, నెలలో, సంవత్సరాలో! సరుకుని, మారకం కోసం ఇవ్వడం అంటే, దాన్ని అమ్మడమే. అప్పుడు ఆ సరుకు వల్ల ‘కొంత డబ్బు’ వస్తుంది. ‘డబ్బు’ అంటే, సరుకుని తయారుచేసిన శ్రమ కాలమే– అని గ్రహించాలి. డబ్బుకి వెనక, ఆధారంగా వుండేది బంగారం అనే లోహం! బంగారం కూడా ఇతర సరుకుల లాగే, మొదట గనుల్లో దొరికే సహజ పదార్థం తోటీ, దానిమీద జరిగే శ్రమల తోటీ తయారవుతుంది. మారకం విలువ రేటునీ, తర్వాత ఆ రేటులో మార్పునీ తెలుసుకోవడానికి, మొదట ఇంత వరకూ చూసిన విషయాలు చాలు. 2 దేశాల డబ్బుల మధ్య మారకం విలువ రేటు ఏర్పడడానికి ఆధారం – ఆ 2 దేశాల డబ్బుకీ వెనక వుండే కొంత కొంత బరువుగల బంగారాలే. డాలర్ దేశపు డబ్బు వెనక 4 గ్రాముల బంగారం వుందనీ, రూపాయి దేశపు డబ్బు వెనక 2 గ్రాముల బంగారం వుందనీ అనుకుందాం. అప్పుడు ఒక డాలరు= 2 రూపాయలు అవుతుంది. ఇది, ఆ రెండు దేశాల డబ్బులకు వున్న మారకం విలువ రేటు. ఇది, ఆ దేశాల డబ్బు వెనక వున్న బంగారాల కొలతల్ని బట్టే! ఈ కొలతలు మారడానికి, వేరే వేరే కారణాలు కూడా వుండొచ్చు. 2వ ప్రపంచ యుద్ధకాలం తర్వాత, డాలర్ దేశంలో (అమె రికాలో), ఆర్థిక పరిస్థితులు ఇతర దేశాలలో కన్నా ‘అభివృద్ధి’ చెంది వున్నాయి. ముఖ్యంగా, ఆ నాడు ఏ దేశంలోనూ లేనన్ని బంగారు నిల్వలు డాలరు దేశంలో వున్నాయి. దానివల్ల, డాలరు దేశపు ఆధిక్యం పెరిగింది. అప్పట్నించీ ‘అంతర్జాతీయ ధనం’గా డాలరుని దాదాపు అన్ని దేశాలూ అంగీకరిస్తూనే వున్నాయి. వేరు వేరు దేశాల మధ్య ఎగుమతులతో, దిగుమతులతో ‘విదేశీ వర్తకాలు’ జరుగుతూ వుంటాయి. ఒక దేశం ఇంకో దేశానికి కొంత డబ్బు ఇవ్వవలిసి వస్తే, ఆ డబ్బు లెక్కని, ఆ 2 దేశాల డబ్బులకూ వున్న మారకం రేటు ప్రకారమే లెక్క చూడాలి. ఒక దేశం నించి, ఆ రెండో దేశం డబ్బుకి ఎన్ని డాలర్లు వస్తాయో కూడా లెక్క చూసి, ఆ డబ్బుని డాలర్లలోనే చెల్లించాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఒక దేశపు కరెన్సీ మారకం విలువ రేటు ఎందుకు తగ్గుతుంది? దేశాల మధ్య ఎగుమతుల విలువలూ, దిగుమతుల విలువలూ సమానంగా వుంటే, వేరు వేరు దేశాల డబ్బు మారకాల సమస్య, కేవలం ఎకౌంట్లు చూసుకునే సాంకేతిక సమస్యగా మాత్రమే వుంటుంది. కానీ, 2 దేశాల మధ్య ఎగుమతులూ దిగు మతులూ సమానంగా వుండడం ఎప్పుడో గానీ జరగదు. భారత దేశం ఏ దేశానికి చెల్లించవలిసి వచ్చినా, సాధారణంగా డాలర్లలోనే చెల్లించాలి కాబట్టి, అప్పుడు భారత దేశానికి డాలర్లు అవసరం. ఆ డాలర్లు ఎంత మొత్తంలో కావాలీ – అనేది, భారత దేశం ఇతర దేశాలకు చేసిన ఎగుమతుల, దిగుమతుల విలువ ఎంతా– అనే లెక్క (కరెంట్ ఎకౌంటు) మీద ఆధార పడి వుంటుంది. గత కొంత కాలంగా, భారత దేశానికి దిగుమతుల కోసం (ఉదాహరణకి: క్రూడ్ ఆయిల్ కోసం) అయ్యే ఖర్చు ఎక్కువగా వుండడం వల్ల, భారత దేశం ఇతర దేశాల దిగుమతుల కోసం చెల్లించేదాన్ని ఎక్కువ డాలర్లలోనే చెల్లించాలి. కాబట్టి డాలర్లని కొనడం కోసం డాలర్లు అమ్మే కరెన్సీ మార్కెట్‌కి వెళ్ళాలి. డాలరు అనేది, బియ్యం లాంటి వాడకం సరుకు కాకపోయినప్పటికీ, అది కరెన్సీలను అమ్మే, కొనే మార్కెట్లో ఒక సరుకుగా అయింది. ఏ సరుకుకి అయినా, దాని సప్లై తక్కువగా వుంటే, అది దొరకడం కష్టం కాబట్టి దాని కోసం డిమాండ్ పెరిగి, దాని ధర పెరుగుతుంది. అలాగే, డాలర్లని కొనవలిసిన పరిస్థితిలో, దాని ధర తగ్గడమో, పెరగడమో జరుగుతుంది. ఈ దశలో, ఏ దేశం అయినా, ఇతర దేశాలకు చెల్లించవలిసిన దిగుమతుల డబ్బుని డాలర్లలోనే చెల్లించాలి కాబట్టి, డాలర్లకి డిమాండు ఎక్కువగా వుంటుంది. అప్పుడు డాలర్లని ఎక్కువ ధరలతో కొనాలి. అలాంట ప్పుడు ఒక డాలర్‌కి, గతంలో కంటే ఎక్కువ రూపాయిలు ఇచ్చి కొన వలిసి వస్తుంది. ఉదాహరణకి, డాలరు ధర పెరుగుతూ, పెరుగుతూ, కిందటి నెలలో 70 రూపాయిలు అయింది. ఆ ధర ఇప్పుడు 80 కూడా దాటేసింది. పత్రికల్లో, ‘‘డాలరు మిలమిల, రూపాయి వెల వెల!’’ అనే హెడ్డింగులు కనిపిస్తున్నాయి. అంటే, రూపాయి విలువ తగ్గుతూ, తగ్గుతూ పోతోంది. అంటే, డాలరుని ప్రతీసారీ ఎక్కువ రూపా యలతో కొనవలిసి వస్తోంది. అలా కొన్న డాలర్లని, దిగుమతుల చెల్లింపుల కోసం ఇవ్వాలి. రూపాయి దేశం, డాలర్ల కోసం, వేల వేల రూపాయల్ని ఖర్చు పెట్టెయ్యవలిసి వస్తుంది. (రూపాయి మారకం విలువ తగ్గిన ఈ సమస్య ఈ దేశంలోనే సరుకుల్ని కొనడానికి వర్తిస్తుందా? దీన్ని ఇక్కడ వివరించలేము.) ఈ సమస్యకు పరిష్కారం, వీలైనంత వరకూ ప్రతీ దేశమూ, తన దగ్గిరవున్న వనరులతో, కావలిసిన వస్తువుల్ని సొంతంగా తయారు చేసుకోవడమే! తప్పనిసరి వాటికోసం మాత్రమే వేరే దేశాల దిగుమతుల మీద ఆధారపడొచ్చు. కానీ, లాభాల కోసం పోటీపడే పెట్టుబడిదారీ విధానంలో, అది సాధ్యం కాదు. ఎందుకంటే, పెట్టు బడిదారుల మధ్య, ‘దేశంలో ఎన్ని సరుకుల్ని అమ్మగలం? విదేశాలకు ఎన్ని సరుకుల్ని అమ్మగలం?’ అనే ఒక సమష్టి ప్లానింగు వుండదు. సమష్టి ప్లానింగు వుండని చోట ఎగుమతులూ, దిగుమతులూ సమానంగా వుండవు. అలా వుండనప్పుడు మారకం రేట్లు కూడా స్థిరంగా వుండవు. రంగనాయకమ్మ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి -
రూపాయి మరోసారి ఢమాల్, తొలిసారి 83 స్థాయికి పతనం
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు కనిష్టానికి చేరింది. బుధవారం డాలరు మారకంలో ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ ఆ తరువాత నష్టాల్లోకి జారిపోయింది. ఏకంగా 61 పైసలు క్షీణించి తొలిసారి 83.01 స్థాయికి పతన మైంది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో సెషన్ల్లోనూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 59107 వద్ద,నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 17,512 వద్ద స్థిరపడ్డాయి. కాగా ఇటీవల రూపాయి పతనం స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి రూపాయి పడిపోవడం కాదు.. డాలర్ బలపడుతోందంటూ వ్యాఖ్యానించడం పలు విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. -
రూపాయి పతనంపై.. ఆందోళన అక్కర్లేదా?
‘‘భారత్ రూపాయి క్షీణించలేదు.కానీ వాస్తవానికి, అమెరికా డాలర్ బలపడింది’’ అంటూ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ అంశంపై తీవ్ర చర్చకు దారితీశాయి. ‘ఈ ప్రకటనలో తప్పేముంది’ అని కొందరు ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడితే, ‘ఈ ప్రకటన హాస్యాస్పదంగా ఉంది’ అంటూ కొందరు తమకు నచ్చిన విధంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇక ప్రతిపక్ష నాయకుల విమర్శలు సరేసరి. అయితే రూపాయి పతనంపై తక్షణం తీవ్ర ఆందోళన అక్కర్లేదన్న ధోరణితో సైతం ఆర్థికశాఖ వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలూ సీతారామన్ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆయా అంశాలపై ఒక్కసారి దృష్టి సారిస్తే.. 20 ఏళ్ల గరిష్ట స్థాయిలో డాలర్ ఇండెక్స్ అక్టోబర్ 10వ తేదీన ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 82.40 స్థాయి వద్ద స్థిరపడింది. ఆ రోజు 82.68 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభంకాగా, ఒక దశలో 82.69 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఇంట్రాడే, ముగింపు రెండూ రూపాయికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. నిజానికి డాలర్‌తో పాటు ఫారెక్స్ మార్కెట్లో వివిధ కరెన్సీలతో రూపాయి ట్రేడింగ్ జరుగుతుంది. అయితే అంతర్జాతీయ వాణిజ్య రంగంలో (రెండు ప్రపంచ యుద్ధాల విధ్వంసం, బ్రిటన్ తన బంగారం నిల్వల నుంచి భారీ వ్యయాల నేపథ్యంలో 1944 బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం ద్వారా ప్రపంచంలోనే అగ్రగామి రిజర్వ్ కరెన్సీగా హోదాను స్టెర్లింగ్ నుంచి అమెరికా డాలర్ పొందింది) డాలర్‌కు ఉన్న ప్రాభల్యం దృష్ట్యా ప్రధానంగా అగ్రరాజ్య కరెన్సీతో రూపాయి మారకపు ట్రేడింగ్ విలువపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరి న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఆరు కరెన్సీల విలువలతో కూడా డాలర్ ఇండెక్స్ కదలికలు ఉంటాయి. డాలర్ విలువను ఈ ఇండెక్స్ ప్రధానంగా నిర్దేశిస్తుంది. యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనాలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రాతిపదికన డాలర్ ఇండెక్స్ అక్టోబర్ 10వ తేదీన (మన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసిన రోజు) 20 సంవత్సరాల గరిష స్థాయిలో 113పైకి ఎగసింది. రెండు పాయింట్లు తగ్గినా ఇప్పుడూ దాదాపు అదే స్థాయిలో పటిష్టంగా ఉంది. డాలర్ ఇండెక్స్ పెరిగిందెంతో.. రూపాయి అంతే పడింది... దేశ 14వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన 2014 మే నెలలో రూపాయి విలువ దాదాపు 58 వద్ద ఉంది. ఈ లెక్కన 2022 అక్టోబర్ 10వ తేదీనాటికి చూస్తే, రూపాయి విలువ దాదాపు 42 శాతం పతనమైంది. ఇక అంతర్జాతీయంగా ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్‌ను పరిశీలిస్తే, ఇది 79 నుంచి ఏకంగా 113 స్థాయికి చేరింది. అంటే డాలర్ ఇండెక్స్ కూడా దాదాపు 43 శాతం ఎగసింది. భారత్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడ్డమే రూపాయి చరిత్రాత్మక పతనానికి కారణమని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, డాలర్ బలపడ్డమే ఆ కరెన్సీతో రూపాయి పతనానికి కారణమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చేస్తున్న వాదన బహుశా ఇందుకే కావచ్చు. కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, దేశంపై క్రూడ్ బిల్లు భారం, ద్రవ్యోల్బణం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు, డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాలు ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువకు చెక్ పెడుతున్నాయి. చర్యలూ కొనసాగుతున్నాయ్... డాలర్ మారకంలో రూపాయి తీవ్ర ఒడిదుడుకులను అడ్డుకోడానికి మరోవైపు ఆర్బీఐ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ, ఇందుకు ఫారెక్స్ నిల్వలను దాదాపు 100 బిలియన్ డాలర్లకు పైగా వినియోగించడం గమనార్హం. గత ఏడాది 642 బిలియన్ డాలర్లు ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు ప్రస్తుతం దాదాపు 545 బిలియన్ డాలర్లకు తగ్గిన విషయం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం కట్టడితోపాటు ఫెడ్ ఫెండ్ రేటు పెంపు నేపథ్యంలో వెనుదిరుగుతున్న విదేశీ పెట్టుబడులను నిలువరించడానికీ రెపో రేటు పెంపు దోహదపడనుంది. మే నుంచి 4 దఫాల్లో రెపో రేటును ఆర్బీఐ 190 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 5.9 శాతానికి ఎగసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఈ నేపథ్యంలో రష్యాపై అగ్రరాజ్యం ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యలో రూపాయిని వినియోగించే చర్యలకూ కేంద్రం శ్రీకారం చుట్టింది. దీనిపై స్పందన బాగున్నట్లు కూడా ఆర్థికశాఖ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆయా చర్యల నేపథ్యంలో ప్రస్తుతానికి రూపాయి పతనంపై తీవ్ర ఆందోళన అనవసరమని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదా? 2022లో రూపాయి 8 శాతం బలహీనపడితే, అందులో ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన తర్వాత పతనమే అధికం. డాలర్ మారకంలో ప్రస్తుత రూపాయి విలువ పతనంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వర్గాలు భరోసాను ఇస్తున్నాయి. ఇందుకు రెండు ప్రధాన కారణాలను ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. యూరోసహా పలు ఇతర కరెన్సీలతో రూపాయి బలోపేతం కావడం ఇందులో ఒకటి. డాలర్ ఇండెక్స్‌లో పలు దేశాల కరెన్సీలు భారీ పతనాన్ని చూడ్డం రెండవది. ఈ రెండు అంశాలూ రూపాయి పతన నష్టాన్ని భర్తీ చేస్తాయన్నది నిపుణుల వాదన. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, కమోడిటీ ఎకానమీ అయిన ఇండోనేసియా, బ్రెజిల్ కరెన్సీలు మాత్రమే భారత్ కరెన్సీకన్నా కొంచెం బాగుండడం గమనార్హం. డాలర్ ఎగువబాటకు కారణం.. ఇందుకు సంబంధించిన అంశాలను 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటి నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. అప్పటి ఆర్థిక సంక్షోభం, ఈజీ మనీ అందుబాటులో భాగంగా జీరో స్థాయికి ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం నేపథ్యంలో 2008లో డాలర్ ఇండెక్స్70 స్థాయికి పడిపోయింది. అటు తర్వాత అంతర్జాతీయ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సానుకూల పరిస్థితులు, ఫెడ్ ఫండ్ రేటు పెంపునకు సన్నాహాల నేపథ్యంలో 2010 నాటికి 90 స్థాయికి ఇండెక్స్ ఎగసింది. అనుకున్నమేరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పురోగతి లేకపోవడంతో 2011 మేనాటికి తిరిగి డాలర్ ఇండెక్స్ తిరిగి 72 స్థాయిని చూసినా, అటు తర్వాత ముందుకే సాగింది. ట్రంప్ పాలనా కాలంలో ప్రపంచ వాణిజ్య యుద్ధం, కరోనా వంటి సమయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి, కఠిన ద్రవ్య విధానానికి ఫెడ్ మొగ్గుచూపడం వంటి అంశాలు డాలర్ ఇండెక్స్‌ను బలోపేతం చేస్తూ వచ్చాయి. దీనికితోడు ప్రపంచంలో తీవ్ర సంక్షోభ సమయాల్లో వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా, సురక్షిత పెట్టుబడిగా డాలర్లోకి పెట్టుబడులూ డాలర్ ఇండెక్స్ ఎల్లప్పుడూ లాభపడే అంశం. భౌగోళిక ఉద్రిక్తతలకుతోడు, ఫెడ్ రేటు పెంపు ప్రస్తుతం డాలర్ బలానికి కలిసి వస్తున్న అంశాలు. – సాక్షి బిజినెస్ విభాగం -
రూపాయి ఓడిపోలేదు! జస్ట్ డాలర్ గెలిచిందంతే!
రూపాయి ఓడిపోలేదు! జస్ట్ డాలర్ గెలిచిందంతే! -
రూపాయి విలువ పతనం పై స్పందించిన కేంద్ర ఆర్ధికమంత్రి
-
జీవితకాల కనిష్టానికి రూపాయి
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం ఆగడం లేదు. డాలర్ మారకంలో సోమవారం పది పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 82.40 స్థాయి వద్ద స్థిరపడింది. ఉదయం 82.68 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఒక దశలో 82.69 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే రూపాయి విలువ రక్షించేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చనే అంచనాలతో కొంతమేర ఆరంభ నష్టాలు తగ్గాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటన సాగుతున్నందున ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకొనే సామర్థ్యం తగ్గిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ‘‘అమెరికాలో ఉద్యోగ గణాంకాలు నిరాశపరచడంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వేగవంతంగా ఉండొచ్చనే ఊహాగానాలతో డాలర్ బలపడింది. దీంతో రూపాయి విలువ కొత్త జీవితకాల కనిష్టానికి దిగివచ్చింది. రానున్న రోజుల్లో 81.50 – 83 శ్రేణిలో కదలాడొచ్చు’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు దిలీప్ పర్మార్ తెలిపారు. -
కుప్పకూలిన మార్కెట్, రూపాయి మరోసారి ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి అత్యంత కనిష్టానికి పడిపోయింది. డాలరు మారకంలో రూపాయి సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో 38 పైసలు కోల్పోయి 82.68 వద్ద ఆల్ టైం కనిష్టాన్ని తాకింది. రూపాయి వరుసగా రెండో సెషన్లో కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం తొలిసారి డాలర్‌తో పోలిస్తే రూపాయి 82 మార్కును తాకింది. శుక్రవారం ముగింపు 82.33తో పోలిస్తే, రెండో వరుస సెషన్లో కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పతనమైంది. అటు బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్ బెంచ్‌మార్క్‌లు బీఎస్ఈ , ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 సోమవారం 1 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 781 పాయింట్లు క్షీణించి 57,409 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 239 పాయింట్లు దిగజారి 17,074 వద్ద నిలిచింది.దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోల్ ఇండయా టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ , మారుతీ సుజుకీ ఇండియా, టైటాన్ లాభాల్లో ఉండగా టాటా మోటార్స్, హీరోమోటోకార్ప్, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్‌గా ఉన్నాయి. -
రూపాయి పతనం.. సామాన్యులపై ధరల భారం
న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ కొత్త రికార్డు స్థాయులకు పడిపోతుండటం .. ద్రవ్యోల్బణాన్ని ఎగదోయనుంది. దీనితో ముడి చమురు దిగుమతులు భారం కానున్నాయి. అలాగే కమోడిటీల రేట్లు కూడా పెరగనున్నాయి. ఫలితంగా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న 6 శాతం కన్నా అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం ఇంకా పెరగనుంది. రూపాయి పతనంతో వంటనూనెల దిగుమతుల బిల్లు ఎగియనుందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏఐ) ఈడీ బీవీ మెహతా తెలిపారు. ‘ఈ భారాన్ని అంతిమంగా వినియోగదారులకే బదలాయించాల్సి వస్తుంది. అయితే, నూనెగింజల ఎగుమతులు మాత్రమే కాస్త ఊరటనిచ్చే అవకాశం ఉంది. రూపాయి పతనంతో ఎగుమతులపరంగా ఆదాయం మెరుగుపడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్ ఏటా 13 మిలియన్ టన్నుల వంటనూనెలు దిగుమతి చేసుకుంటోంది. ఆగస్టులో 1.89 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను (గతేడాది ఆగస్టుతో పోలిస్తే 41 శాతం అధికం) దిగుమతి చేసుకుంది. మరోవైపు, కమోడిటీల రేట్లు తగ్గినా రూపాయి పడిపోవడం వల్ల ఆ మేరకు ప్రయోజనం లేకుండా పోతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. అటు, చారిత్రక గరిష్ట స్థాయుల నుంచి జూన్‌లో తగ్గిన తర్వాత అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఎస్బీఐ ఒక నివేదికలో తెలిపింది. ఆగస్టు తొలినాళ్లలో కాస్త పెరిగినప్పటికీ డిమాండ్ మందగమనంపై ఆందోళనల కారణంగా మళ్లీ నెల చివర్లో తగ్గాయి. ఇంధన అవసరాల్లో 85 శాతం భాగాన్ని భారత్ దిగుమతి చేసుకుంటోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయి 82ను చూసిన సంగతి తెలిసిందే. క్షీణత కొనసాగవచ్చు.. అటు వాణిజ్య లోటు, ఇటు సంస్థాగత ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ పెరుగుతున్న నేపథ్యంలో రూపాయిపై మరింత ఒత్తిడి కొనసాగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కేంద్ర బ్యాంకూ కూడా కరెన్సీ పతనాన్ని అడ్డుకోజాలదని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. రూపాయి క్షీణతను పరిమిత కాలం పాటు ఆర్బీఐ కొనసాగనిచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఆర్బీఐ కరెన్సీ అసెట్లు 75 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయాయని వివరించింది. ‘భారత్ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో.. కరెన్సీ నిర్దిష్ట కనిష్ట స్థాయి దగ్గర సెటిల్ అయిన తర్వాత నుంచి పెరగడం ఒక్కసారిగా నాటకీయంగా పుంజుకోవచ్చు‘ అని పేర్కొంది. రూపాయి క్షీణతకు కారణం డాలరు పటిష్టంగా ఉండటమే తప్ప దేశీయంగా ఫండమెంటల్స్ బలహీనంగా ఏమీ లేవని వివరించింది. -
ఆకాశానికి డాలర్, పాతాళానికి రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరింత పతనమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ 40 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 81.93ని తాకింది. ప్రస్తుతం 36 పైసలు కోల్పోయి 81.88 వద్ద కనొసాగుతోంది. డాలర్ బుధవారం సరికొత్త గరిష్టాలకు ఎగబాకడంతో దేశీయ కరెన్సీ కొత్త రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం, ట్రెజరీ దిగుబడులు పెరగడం వల్ల కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయిని అధిగమించింది. ద్రవ్యోల్బణ కట్టడికోసం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న వడ్డీ పెంపు నిర్ణయం డాలరుకు బలాన్నిస్తోంది. ఇదీ చదవండి : StockMarketOpening: మరింత కుదేలవుతున్న మార్కెట్లు -
కొత్త కనిష్టానికి రూపాయి
న్యూఢిల్లీ: అమెరికన్ డాలరు బలపడుతున్న కొద్దీ రూపాయి రోజురోజుకూ మరింతగా క్షీణిస్తోంది. సోమవారం మరో 58 పైసలు తగ్గి కొత్త ఆల్–టైమ్ కనిష్ట స్థాయి 81.67కి పతనమైంది. దీంతో దేశీ కరెన్సీ వరుసగా నాలుగు సెషన్లలో పతనమైనట్లయింది. ఈ వ్యవధిలో రూపాయి మారకం విలువ ఏకంగా 193 పైసలు పడిపోయింది. డాలరు బలపడుతుండటం, ఇన్వెస్టర్లు రిస్కులకు ఇష్టపడకపోతుండటం, దేశీ స్టాక్ మార్కెట్లో ప్రతికూల ధోరణి, విదేశీ నిధులు తరలిపోతుండటం, ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల వల్ల భౌగోళికరాజకీయ రిస్కుల భయాలు నెలకొనడం తదితర అంశాలు దేశీ కరెన్సీ పతనానికి కారణాలుగా ఉంటున్నాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 82 నిరోధం..: ఈ పరిస్థితుల్లో స్పాట్ మార్కెట్లో రూపాయి 81.20–81.80 శ్రేణిలో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ గౌరంగ్ సోమయ్య చెప్పారు. 82 వద్ద నిరోధం, 81.05 వద్ద నిరోధం ఉండగలదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
ఫెడ్ సెగ: రికార్డు కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: అమెరికా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా నష్టపోతోంది. ప్రస్తుతం 73 పైసలు కోల్పోయి 80.56 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. గురువారం ఆరంభంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ 42 పైసలు క్షీణించి 80.38కి చేరుకుంది. ఆ తరువాత మరింత క్షీణించింది. బుధవారం 79.98 వద్ద ముగిసింది. (StockMarketOpening: లాభనష్టాల ఊగిసలాట) మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 59301 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టంతో 17673 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడవసారి వడ్డీ రేట్లను 75 బీపీఎస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా డాలరు బలం పుంజుకుంది. ఫలితంగా ఆసియా కరెన్సీలు ఒత్తిడిలో ఉన్నాయి. భవిష్యత్తు ఇంధన డిమాండ్‌పై అనుమానాల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా క్షీణించాయి. ఇదిఇలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన అంతర్జాతీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. 3 లక్షల మంది సైనికుల పాక్షిక మొబిలైజేషన్ ప్రకటన ఉక్రెయిన్‌పై యుద్ధ తీవ్రతను పెంచుతోందని భావిస్తున్నారు. -
బంగారం: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో పసిడి రేట్లు కొనుగోలు దారులకు ఊరట నిస్తున్నాయి. బలపడుతున్న డాలర్ విలువ, ఫెడరల్ రిజర్వ్ భారీ వడ్డీ రేటు పెంపు అవకాశాల నడుమ బంగారానికి డిమాండ్ తగ్గింది. ఫలితంగా వరుసగా నాలుగో రోజు (సెప్టెంబర్ 16, 2022) బంగారం వెండి ధరలు పడిపోయాయి. దీంతో పసిడి ధర ఆరు నెలల కనిష్టానికి దిగి వచ్చింది. అయితే రానున్న ఫెస్టివ్ సీజన్, ముఖ్యంగా దీపావళికి నాటికి దేశంలో మరింత దిగి వచ్చే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. (Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్) తాజాగా సెప్టెంబర్ 17న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 400కు పైగా తగ్గింది. ప్రస్తుతం 5 వేల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉంది. అలాగే ఉదయం వెండి కిలో ధర రూ.600 మేర దిగి వచ్చింది. ఇపుడు స్వల్పంగా పుంజుకుని కిలో 56,700 వద్ద ఉంది. ఇక గ్లోబల్‌గా నిరాశపరిచిన అమెరికా సీపీఐ డేటా తర్వాత, బంగారంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అలాగే ఆగస్ట్‌లో యూఎస్ ద్రవ్యోల్బణం 8.1 శాతంగానమోదైంది.దీంతో వచ్చే నెలలో జరగబోయే ఫెడ్ సమావేశంలో 100 బీపీఎస్ వడ్డీ రేటు పెంపుపై ఊహాగానాలు నెలకొన్నాయి. దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర 10 గ్రాములకి 1,187 (2.35 శాతం) పతనమై 49,334 స్థాయికి చేరింది. స్పాట్ మార్కెట్లో గోల్డ్ ధర శుక్రవారం 1,654డాలర్ల వద్ద 2 సంవత్సరాల కనిష్టాన్ని తాకింది.చివర్లోకాస్త పుంజుకుని ఔన్సుకు 1,674 డాలర్లుగా ఉంది. బంగారం ధర పతనానికి గల కారణాలపై ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ తాజా పరిణామాలతో పెట్టుబడిదారులు అమెరికా డాలర్ వైపు మళ్లుతున్నారని, యుఎస్ ఫెడ్ సమావేశం ముగిసేవరకు ఈ రెండు ట్రిగ్గర్లు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయన్నారు. ఇదీ చదవండి: Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ దెబ్బ, కోర్టును ఆశ్రయించిన సంస్థ -
రెసిషన్ భయాలు: రుపీ మరోసారి క్రాష్
సాక్షి, ముంబై: గ్లోబల్ మాంద్యం భయాలతో డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి బలహీనపడింది ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ దేశాలకు కూడా ఆర్థిక కష్టాలు తప్పవనే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం ఆరంభంలోనే రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పడిపోయి 79.82 వద్దకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్ర బ్యాంకులు మాంద్యంలోకి వెళ్లవచ్చని తాజాగా హెచ్చరించాయి. దీనికి తోడు అమెరికాలోద్రవ్యోల్బణం స్థాయి కూడా ఊహించని రీతిలో ఉండటతో వచ్చేవారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటువడ్డన భారీగా ఉంటుందనే అంచనాలు ఇన్వెస్టర్లను సెంటిమెంట్‌ను దెబ్బ తీసాయి. గురువారం ముగింపు 79.7012తో పోలిస్తే, కీలకమైన 80 స్థాయికి అతి వేగంగా జారిపోతోంది. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు కూడా రూపాయి క్షీణతకు దారి తీసింది.సె న్సెక్స్ ఒక దశలో ఏకంగా 750 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు, అనంతరం 59500 దిగువకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా కీలకమైన మద్దతుస్థాయిని 18వేలను, ఆ తరువాత 17750 స్థాయిని కూడా కోల్పోయింది. -
స్టాక్‌మార్కెట్ క్రాష్, రుపీ రికార్డు కనిష్టం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లు కుప్పకూలింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 995 పాయింట్లు పతనమై 57842 వద్ద, నిఫ్టీ 295 పాయింట్ల నష్టంతో 17265 వద్ద కొన సాగుతున్నాయి. ఐటీ దిగ్గజాలు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ నష్ట పోతున్నాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్, మారుతి, నెస్లే లాభపడు తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)పై అందరి దృష్టి నెలకొని ఉంది. ఫలితంగా రిలయన్స్ కూడా నష్టాల్లో ఉంది. మరోవైపుడాలరు డాలరు మారకంలో రూపాయి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే 26 పైసలు పతనమై రికార్డు కనిష్టం 80.10 స్థాయిని టచ్ చేసింది. ప్రస్తుతం 80.02 వద్ద ట్రేడ్ అవుతోంది. -
దిగొస్తున్న చమురు ధర: రూపాయి పైపైకి
సాక్షి, ముంబై: ప్రపంచ ఇంధన ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోవడంతో దేశీయ కరెన్సీ రూపాయికి ఉత్సాహం వచ్చింది. డాలరు మారకంలో రూపాయి ఒక్కసారిగా 44 పైసలు జంప్ చేసింది. బుధవారం ట్రేడింగ్ ఆరంభంలో రూపాయి 79.32 వద్దకు చేరింది. శుక్రవారం సెషన్లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 79.74 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. (బుల్ దౌడు, 60వేల ఎగువకు సెన్సెక్స్) ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు ఆరు నెలల కనిష్ట స్థాయి నుండి కోలుకుంది. బుధవారం 0.34 శాతం పెరిగి 92.65 డాలర్లకు చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 0.06 శాతం క్షీణించి 106.44కి చేరుకుంది. అలాగే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం క్యాపిటల్ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఒక్క మంగళవారం ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 1,376.84 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఆగస్టు మొదటి రెండు వారాల్లో రూ. 22,452 కోట్ల మేర కొనుగోళ్లు చేయడం గమనార్హం. దీంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య దేశీయ ఈక్విటీలలో జోరు ఫారెక్స్ పెట్టుబడి దారుల దృష్టిని సానుకూలంగా మార్చిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లో కొనుగోలుదారుల మద్దతుతో సెన్సెక్స్ 60వేల వద్ద, నిఫ్టీ 18 వేల వైపు పరుగులు తీస్తోంది. ఇండిపెండెన్స్‌డే, పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా ఫారెక్స్ మార్కెట్లు వరుసగా సోమవారం, మంగళవారం పనిచేయలేదు. -
వరుసగా ఏడో సెషన్లో రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి
-
రూపాయి పతనంపై అందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి పతనంపై ఆందోళనలను తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. రూపాయి విలువ బాగానే ఉందని, అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ క్షీణతపై ‘మరీ’ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి (డీఈఏ) అజయ్ సేథ్ మంగళవారం స్పష్టం చేశారు. బ్రిటీష్ పౌండ్, జపాన్ యెన్, యూరో వంటి అనేక ప్రపంచ కరెన్సీల మారకంలో భారత కరెన్సీ మెరుగ్గా ఉందని అన్నారు. ఈ పరిస్థితి అమెరికా డాలర్‌తో పోలిస్తే ఈ కరెన్సీలలో భారత్ దిగుమతుల వ్యయాన్ని చౌకగా మార్చిందని కూడి వెల్లడించారు. ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది కూడా రాజ్యసభలో ఇదే తరహా ప్రకటన చేశారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే బలహీనపడినప్పటికీ బ్రిటిష్ పౌండ్, జపాన్ యెన్ యూరో వంటి ప్రధాన కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి బలపడిందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారకపు మార్కెట్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని, తీవ్ర అస్థిరత పరిస్థితులలో జోక్యం చేసుకుంటుందని ఒక లిఖితపూర్వక సమాధానంలో చతుర్వేది తెలిపారు. ఏప్రిల్–జూన్ క్వార్టర్ ప్రాతిపదిక పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జీడీపీ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం మేర నమోదవుతుందన్న ధీమాను రాజ్యసభలో వ్యక్తం చేశారు. కారణం ఏమిటంటే... ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రూపాయి భారీ పతనానికి కారణాన్ని వివరిస్తూ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును కఠినతరం చేయడం వల్ల డాలర్‌పై రూపాయి పతనమవుతోందని అన్నారు. ఫెడ్ ఫండ్ రేటు పెంపు వల్ల ప్రపంచవ్యాప్తంగా డాలర్లు అమెరికాకు ప్రవహిస్తున్నాయని అన్నారు. దీనితో పలు దేశాల కరెన్సీలు పతన బాట పట్టాయని వివరించారు. నిజానికి పలు ఇతర కరెన్సీలతో పోల్చితే భారత్ కరెన్సీ పతనం తక్కువేనని అన్నారు. దేశంలోకి ఫారెక్స్ భారీగా రావడానికి ఆర్బీఐ రెండు వారాల క్రితమే విస్తృతమైన చర్యలు తీసుకుందని ఆయన గుర్తుచేస్తూ, ఈ దిశలో అవసరమైన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. డాలర్ మారకంలో రూపాయి మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తీవ్ర ఒడిదుడుకుల నివారణకూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఇంట్రాడేలో 80 దాటిన రూపాయి ఇదిలాఉండగా, ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంట్రాడే ట్రేడింగ్‌లో మొదటిసారి 80 దాటిపోయి, 80.05ను తాకింది. అయితే చివరకు క్రితంతో పోల్చితే 6పైసలు బలపడి 79.92 వద్ద ముగిసింది. రూపాయి విలువ సోమవారం (18వ తేదీ) మొదటిసారి 80ని తాకి చరిత్రాత్మక కనిష్టాన్ని చూసింది. అయితే అటు తర్వాత తేరుకుని 79.98 వద్ద ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ చరిత్రాత్మక కనిష్ట ముగింపు 79.9975. గత గురువారం (14వ తేదీ 18 పైసలు క్షీణతతో) ఈ స్థాయిని తాకింది. 2022లో ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి 7.5 శాతం (563 పైసలు) నష్టపోయింది. -
పాతాళానికి రూపాయి, మరింత పతనం తప్పదా?
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి పాతాళానికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే తొలిసారి 80కి చేరుకుంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 79.9863 వద్ద ప్రారంభమై తర్వాత యుఎస్ డాలర్‌తో రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.05 నమోదు చేసింది. ఇంట్రా-డే రికార్డు కనిష్ట స్థాయి 80.0175ని తాకింది. సోమవారం 79.97 వద్ద ముగిసింది. పలు కేంద్ర బ్యాంకుల సమాశాలు, ముఖ్యంగా యూఎస్ పెడ్ రిజర్వ్ ట్రేడర్లు దృష్టి పెట్టారు. ఫలితంగా డాలరు బలం పుంజుకోవడంతో రూపాయి వరుసగా ఏడో సెషన్లో రికార్డు స్థాయికి చేరింది. ఈ స్థాయిలో మరింత క్షీణత తప్పదనే ఆందోళన ట్రేడర్లలో నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయ ఈక్విటీల నుండి రికార్డు మొత్తంలో దాదాపు 30 బిలియన్ల డాలర్లు పెట్టుబడులను విదేశీ మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. దీనికి తోడు చమురు ధరలు, క్షీణిస్తున్న కరెంట్-ఖాతా లోటుపై ఆందోళనలు కరెన్సీకి బలహీనతకు కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా బలహీనంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఏకంగా 700 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ నేడు ఆరంభంలో సుమారు 200 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం సూచీలు రెండూ ఫ్టాట్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు డిసెంబర్ 31, 2014 నుండి భారత రూపాయి దాదాపు 25 శాతం క్షీణించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు చెప్పారు. రూపాయి విలువ 63.33 నుండి జూలై 11, 2022 నాటికి 79.41కి తగ్గిందని ఆర్బిఐ డేటాను ఉటంకిస్తూ లోక్సభకిచ్చిన ఒక రాతపూర్వక సమాధానంలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం లాంటి గ్లోబల్ కారకాలు అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణాలని ఆమె చెప్పారు. ఇది కూడా చదవండి: లాభాలు పాయే, ఫ్లాట్‌గా సూచీలు -
పెట్రోడాలర్‌కు రష్యా చెక్..!
రష్యా–ఉక్రెయిన్ వార్... భూగోళంపై మరోసారి అణు యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధానికి అమెరికా, యూరప్ దేశాలు మళ్లీ తెరతీయడం... తన పక్కలో బల్లెంలా విస్తరిస్తున్న నాటో కూటమి... రష్యాను ఉక్రెయిన్‌పై ఉసిగొల్పేలా చేశాయి. రేపన్నదే లేదన్నట్లు, రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు... మిగతా ప్రపంచ దేశాలను మేల్కొలుపుతున్నాయి. ఈ ఉక్రెయిన్ వార్... ప్రపంచ భౌగోళిక రాజకీయాలను కొత్త మలుపు తిప్పడం ఖాయమని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ప్రపంచ పోలీసుగా, డాలర్ ఆధిపత్యంతో ఇన్నాళ్లూ శాసించిన అమెరికాకు రష్యా ఇచ్చిన కరెన్సీ షాక్ దిమ్మదిరిగిపోయేలా చేసింది. యుద్ధ భూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ పావులు కదపడంలో తమ సత్తా ఏంటో రష్యా అధినేత పుతిన్ పశ్చిమ దేశాలకు రుచి చూపిస్తున్నారు. పెట్రోడాలర్ పెత్తనానికి గండి పడటంతో పాటు ఆంక్షలు తిరిగి అమెరికా కూటమి మెడకే చుట్టుకుంటున్నాయి. అయితే, ఈ పరిణామం ప్రపంచ దేశాలను మరోసారి మాంద్యం కోరల్లోకి నెట్టేస్తోంది. అసలు పెట్రోడాలర్ సంగతేంటి? దీనికి రష్యా ఎలా చెక్ చెబుతోంది? ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా కరెన్సీ వార్‌గా ఎలా మారుస్తోంది? పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి బ్రిక్స్ కూటమి వ్యూహాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి అలా కదన రంగంలోకి వెళ్లొద్దాం రండి!! ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దాదాపు దశాబ్దం క్రితమే బీజం పడింది. ఉక్రెయిన్‌లో గత ప్రభుత్వానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పొగపెట్టి, తమ కీలుబొమ్మ లాంటి జెలెన్స్కీకి పట్టం కట్టిబెట్టాయి. తద్వారా నాటో దళాలను రష్యా గుమ్మం ముందు నిలబెట్టాలనేది పశ్చిమ దేశాల వ్యూహం. అంతేకాదు, ఉక్రెయిన్‌లోని రష్యా జాతీయులపై జెలెన్స్కీ సర్కారు చేస్తున్న అకృత్యాలు కూడా పుతిన్ కన్నెర్రకు కారణమే. దీనికితోడు ఉక్రెయిన్‌తో రష్యా గతంలో కుదుర్చుకున్న మిన్స్క్ ఒప్పందాన్ని జెలెన్స్కీ సర్కారు తుంగలో తొక్కింది. ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉంటామన్న హామీకి తూట్లు పొడుస్తూ... యూరోపియన్ యూనియన్, నాటో కూటమిలో చేరేందుకు తహతహలాడింది. ఉక్రెయిన్ నాటో చేరిక యత్నాలను విరమించుకోవాలన్న పుతిన్ సూచనలను పెడచెవిన పెట్టడంతో... ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్‌పై దండెత్తింది. మొదట్లో ఎడాపెడా దాడులతో విరుచుకుపడిన రష్యా... నెమ్మదిగా ఒక ప్రణాళిక ప్రకారం తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ను పూర్తిగా చేజిక్కించుకోవడంపై దృష్టిపెట్టింది. ఉక్రెయిన్‌కు నల్లసముద్రంతో పూర్తిగా తెగతెంపులు చేసి, భూ సరిహద్దులకే పరిమితం చేసేలా చకచకా ముందుకెళ్తోంది. ఇప్పటికే సుమారు 25% ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలోకి వచ్చినట్లు అంచనా. కాగా, పశ్చిమ దేశాల కూటమి బిలియన్ల డాలర్ల కొద్దీ ఆర్థిక సహాయాన్ని, అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపిస్తూ... రష్యాపై పరోక్ష యుద్ధం చేస్తోంది. మరోపక్క, నాటో దేశాలు గనుక నేరుగా ఉక్రెయిన్ కదన రంగంలోకి అడుగుపెడితే, దాన్ని రష్యాతో యుద్ధంగా పరిగణిస్తామని, అణు యుద్ధం తప్పదంటూ పుతిన్ ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాలంటూ తమ దళాలను సమాయత్తం చేశారు కూడా. మొత్తంమీద ఈ పరిణామాలు... ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆంక్షల అస్త్రం... రష్యా దాడి నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలన్నీ రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. రష్యాపై నేరుగా యుద్ధం చేసే పరిస్థితి లేక ఆర్థిక యుద్ధానికి తెరతీశాయి. వందల బిలియన్ల కొద్దీ రష్యా ప్రభుత్వ ఆస్తులు, ఆ దేశానికి చెందిన కుబేరుల ఆస్తులను సీజ్ చేశాయి. రష్యా ఎకానమీకి కీలకంగా నిలిచే క్రూడ్, గ్యాస్ ఎగుమతులపై నిషేధం విధించాయి. రష్యాను ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా ఏకాకిని చేయడమే లక్ష్యంగా బెదిరింపులకు దిగాయి. రష్యా సెంట్రల్ బ్యాంకుకు చెందిన 600 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారక నిల్వల్లో దాదాపు 300 బిలియన్ డాలర్లను అమెరికా, యూరప్ తదితర పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. తద్వారా రష్యాను ఆర్థికంగా దివాలా తీయించాలనేది వారి వ్యూహం. రూబుల్ ‘రబుల్’ కాదు.. డబుల్! ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టడంతోనే.. రష్యా ఆర్థిక కుంభస్థలాన్ని ఆంక్షల పంజాతో చీల్చి చెండాడేస్తామంటూ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ ఇలా పెద్దన్న కూటమి మొత్తం గొంతుచించుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అయితే, తమ ఆంక్షల దెబ్బకు రష్యా కరెన్సీ రూబుల్.. రబుల్ (పనికిరాని చెత్త)గా మారుతుందని డాలరు మారకంలో ఏకంగా 200కు పడిపోతుందంటూ సంచలన ప్రకటనలు కూడా చేశారు. వార్ మొదలయ్యేటప్పుడు దాదాపు 60 స్థాయిలో ఉన్న రూబుల్.. క్రూడ్, గ్యాస్ ఇతరత్రా ఎగుమతులపై నిషేధంతో ఒక్కసారిగా 140 స్థాయికి కుప్పకూలింది. దీంతో బైడెన్, పశ్చిమ దేశాలు ఇక రష్యా పనైపోయిందంటూ జబ్బలు చరుచుకున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. అగ్రరాజ్యం ఆడుతున్న ఆర్థిక చదరంగంలో పుతిన్lఅదిరిపోయే పావును కదపడంతో పశ్చిమ దేశాల గొంతులో మిసైల్ పడింది. రష్యా క్రూడ్, గ్యాస్‌కు డాలర్లలో చెల్లింపులను అంగీకరించబోమని, తమకు రూబుల్లో మాత్రమే చెల్లించాలంటూ పుతిన్ ఆదేశించారు. ఎందుకంటే రష్యా బ్యాంకులను అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్) నుంచి తొలగించడంతో రష్యాకు వచ్చే డాలర్లను ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా పోయింది. రష్యా ఇచ్చిన షాక్‌తో యూరోపియన్ దేశాలకు దిమ్మదిరిగిపోయింది. పుతిన్ ‘నో రూబుల్.. నో క్రూడ్–గ్యాస్’ అని కరాఖండిగా చెప్పేయడంతో ఇక చేసేది లేక రూబుల్ పేమెంట్‌కు చచ్చీచెడీ అంగీకరించాయి. ఈ దెబ్బకు డాలరుతో రూబుల్ విలువ అమాంతం పుంజుకోవడం మొదలైంది. 140 స్థాయి నుంచి మూడున్నర నెలల్లోనే∙దాదాపు 51 స్థాయికి బలపడింది. అంటే యుద్ధం ప్రారంభానికి ఉన్న స్థాయిని మించి రూబుల్ బలోపేతం అయింది. రష్యా ఆర్థిక పైఎత్తుకు అగ్రరాజ్య కూటమి చిత్తయింది. పెట్రోడాలర్ వ్యవస్థను అంతం చేయడమే లక్ష్యంగా పుతిన్ విసిరిన ‘రూబుల్’ పాచిక బాగానే పారిందని ఆర్థిక విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. అంతేకాదు, తమ విదేశీ రుణాల (డాలర్, యూరో)కు సంబంధించి చెల్లింపులను రూబుల్స్‌లో మాత్రమే చేస్తామని కూడా రష్యా ప్రకటించింది. ఇకపై గోధుమలు, ఎరువులు ఇతరత్రా ఉత్పత్తుల ఎగుమతులకు రూబుల్లో మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుందని కూడా తాజాగా పుతిన్ తేల్చిచెప్పడం గమనార్హం. తద్వారా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో డాలర్ అధిపత్యానికి గండిగొట్టాలనేది రష్యా అధినేత వ్యూహం. పెట్రోడాలర్ సంగతేంటంటే! 1970వ దశకంలో ప్రపంచం క్రూడ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పట్లాగానే ధరలు ఆకాశాన్నంటడంతో అమెరికా నుంచి జపాన్ దాకా పెట్రో ఉత్పత్తుల రేట్లు ఆల్‌టైమ్ గరిష్ఠాలను (అమెరికాలో గ్యాలన్ పెట్రోలు ధర 4 డాలర్లు) తాకాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియాతో అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంతో జరిపే చమురు క్రయవిక్రయాలకైనా అమెరికా డాలర్ల రూపంలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పేమెంట్ వ్యవస్థనే ‘పెట్రోడాలర్’గా వ్యవహరిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే, క్రూడ్‌ను ఉత్పత్తి చేసే దేశాలేవైనా డాలర్లు ఇస్తేనే క్రూడ్ అమ్ముతాయి. గడిచిన 50 ఏళ్లుగా ఈ పెట్రోడాలర్ సిస్టమ్ ఎదురులేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఏ దేశమైనా సరే డాలర్లను కొనాల్సి రావడంతో రిజర్వ్ కరెన్సీగా ‘డాలర్’ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా వాణిజ్యం జరిగేది క్రూడాయిల్లోనే కాబట్టే అరేబియా గల్ఫ్‌లో అమెరికా అన్ని యుద్ధాలు చేసింది. లిబియా, ఇరాక్, సిరియా సైతం పెట్రోడాలర్ పెత్తనానికి వ్యతిరేకంగా గొంతెత్తడం వల్లే అమెరికా వాటిని నామరూపాల్లేకుండా బాంబులతో నేలమట్టం చేసింది. అయితే, ఇప్పటిదాకా పుతిన్లాంటోడు అమెరికాకు తగలకపోవడంతో దాని ఆటలు బాగానే సాగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పుడు పుతిన్ పశ్చిమ దేశాలపై కరెన్సీ వార్‌కు సైతం తెరలేపారు. అంతర్జాతీయంగా బ్యాంకుల మధ్య లావాదేవీల కోసం ఉపయోగించే పేమెంట్ వ్యవస్థ ‘స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్)’ నుంచి వెలేస్తారని పుతిన్‌కు ముందే తెలుసు. దీనివల్ల రష్యా బ్యాంకులు స్విఫ్ట్ ద్వారా లావాదేవీలు జరపలేవు. రష్యా కంపెనీలకు తమ ఎగుమతులకు రావాల్సిన డబ్బులు రావు. దీంతో రష్యా రూబుల్ అస్త్రాన్ని ప్రయోగించింది. తమ క్రూడ్ గ్యాస్ ఉత్పత్తులకు రూబుల్ లేదంటే డాలర్ యేతర అసెట్లలో చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో క్రూడ్ మార్కెట్లు షేక్ అయ్యాయి. రష్యా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిదారు కావడమే దీనంతటికీ కారణం. ‘స్విఫ్ట్’కు షాక్... అమెరికా, యూరప్ ఆధిపత్యంలో ఉన్న స్విఫ్ట్ పేమెంట్ వ్యవస్థ నుంచి ప్రత్యామ్నాయం కోసం రష్యా, చైనా చాన్నాళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలెట్టాయి. స్విఫ్ట్ వ్యవస్థ అనేది డాలర్‌ను, అంతిమంగా అమెరికాను మాత్రమే బలోపేతం చేయడానికి పనిచేస్తోందనేది రష్యా, చైనాల వాదన. ఇప్పుడు ఉక్రెయిన్ వార్తో రష్యా పూర్తిగా స్విఫ్ట్ నుంచి వైదొలగడంతో.. తన క్రూడ్, గ్యాస్, ఇతరత్రా ఎగుమతుల కోసం రూబుల్–చైనా యువాన్, రూబుల్–ఇండియన్ రూపీ తదితర కరెన్సీల్లో చెల్లింపులకు రష్యా తెరతీసింది. అంటే రష్యా నుంచి దిగుమతుల కోసం జరిపే చెల్లింపులకు ఏ దేశమైనా తమ కరెన్సీలను డాలర్లలోకి మార్చాల్సిన పని లేకుండా నేరుగా రూబుల్స్‌లోకి మార్చుకుంటే సరిపోతుందన్న మాట. ఇప్పటికే రష్యా, చైనా తమ వాణిజ్యాన్ని రూబుల్–యువాన్ కరెన్సీలో చేసుకుంటున్నాయి. భారత్ కూడా రూపాయి–రూబుల్ పేమెంట్‌కు సిద్ధమవుతోంది. ఇరాన్, యూఏఈ, సౌదీ వంటి పలు దేశాలు కూడా తమ సొంత కరెన్సీల్లో లావాదేవీలకు ఓకే అంటున్నాయి. రష్యా, చైనా ఇప్పుడు స్విఫ్ట్ స్థానంలో ఎస్‌పీఎఫ్‌ఎస్ (సిస్టమ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజెస్)ను అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీన్ని రష్యా సెంట్రల్ బ్యాంక్ రూపొందించింది. ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను చైనాకు చెందిన క్రాస్–బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ (సీఐపీఎస్)తో అనుసంధానించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. అంతేకాదు, ఎస్పీఐఎఫ్ను బ్రిక్స్ కూటమి (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలన్నీ వాడుకునేలా కూడా తాజా బ్రిక్స్ సదస్సులో రష్యా ప్రతిపాదించింది. అలాగే, బ్రిక్స్ దేశాలకు కమోడిటీల ఆధారిత ప్రత్యేక రిజర్వ్ కరెన్సీని తీసుకురావడంపై తమ కూటమి కసరత్తు చేస్తోందని కూడా పుతిన్ ప్రకటించడం గమనార్హం. మరోపక్క, స్విప్ట్ నుంచి రష్యాను వెలేయడం అనేది యూరప్, అమెరికా ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఎందుకంటే స్విఫ్ట్ లావాదేవీల్లో అత్యధికంగా అమెరికా డాలర్‌లోనే సెటిల్ అవుతాయి. ఇప్పుడు రష్యా, చైనా గనుక స్విఫ్ట్ స్థానంలో ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను తీసుకొస్తే, పెట్రోడాలర్‌కు.. అంతిమంగా డాలర్ పెత్తనానికి గండి పడినట్లే. ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు కాగా, చైనా ప్రపంచంలో నంబర్ వన్ తయారీ వస్తువుల ఎగుమతిదారు. బ్రిక్స్‌తో సహా తమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా మిత్ర దేశాలను సైతం రష్యా ఈ కొత్త పేమెంట్ సిస్టమ్‌లోకి తీసుకొస్తే, పెట్రోడాలర్‌కు చెల్లుచీటీ తప్పదని పరిశీలకులు పేర్కొంటున్నారు. పశ్చిమ దేశాల పెత్తనానానికి చెల్లు! రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో భౌగోళిక రాజకీయాలు కూడా కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రపంచంలో 195 దేశాల్లో రష్యాపై ఆంక్షలు విధించిన అంతర్జాతీయ కమ్యూనిటీలో పట్టుమని 40 దేశాలు కూడా లేవు. అమెరికా, యూరప్ తదితర పశ్చిమ దేశాలు, కొన్ని అమెరికా మిత్ర దేశాలు మాత్రమే వీటిలో ఉన్నాయి. మిగతా ప్రపంచమంతా ఆంక్షలకు నో చెప్పింది. జీ7 అగ్ర దేశాల మొత్తం జనాభా 77.7 కోట్లు కాగా, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) జనాభా ఏకంగా 320 కోట్లు (ప్రపంచ జాభాలో 41%) కావడం విశేషం. 2030 నాటికి బ్రిక్స్ దేశాల జీడీపీ ప్రపంచ మొత్తం జీడీపీలో 50 శాతానికి చేరుతుందని అంచనా. బ్రిక్స్‌తో పాటు ఆఫ్రికా మొత్తం కనీసం ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండించలేదు కూడా. గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా యూఏఈ రష్యాకు అండగా నిలుస్తోంది. మిత్రదేశం సౌదీ కూడా అమెరికాకు ముఖం చాటేసింది. అంతేకాదు, యూఏఈ, భారత్ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి ఐక్యారాజ్యసమితిలో ఓటింగ్‌కు దూరంగా ఉండటం మరో విశేషం. అంటే అమెరికా కూటమి చెబుతున్న అంతర్జాతీయ కమ్యూనిటీకి అర్థమేంటి? ‘‘కొంతమంది పశ్చిమ దేశాల రాజకీయ విశ్లేషకులు చేసే ఘోరమైన తప్పేంటంటే... వారి శత్రువులను మనందరికీ శత్రువులుగా ఉంచాలనుకోవడం’’ అని నెల్సన్ మండేలా చేసిన వ్యాఖ్యలు పశ్చిమ దేశాల కుటిల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. అమెరికా ఇప్పుడు ఆడిస్తున్న ఈ భయంకరమైన సామ్రాజ్యవాద యుద్ధ చదరంగంలో రష్యన్లు కొన్ని పావులను కోల్పోతుండవచ్చు, అది వారికీ తెలుసు... అయితే అంతిమంగా వాళ్లు కోరుకుంటున్న ‘క్వీన్’ను మాత్రం చేజిక్కించుకోవడం ఖాయం. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమీకరణాలే ఇందుకు బలమైన నిదర్శనం అనేది విశ్లేషకుల మాట!! ధరదడ.. మాంద్యం భయం! ఇప్పటికే ధరలు మండిపోతున్న నేపథ్యంలో, రష్యా ఎగుమతులపై ఆంక్షలతో ప్రపంచ దేశాల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లయింది. రష్యా క్రూడ్, గ్యాస్‌పై నిషేధంతో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు దాదాపు 80 డాలర్ల స్థాయిలో ఉన్న ముడిచమురు ధర ఒక్కసారిగా 140 డాలర్ల స్థాయికి భగ్గుమంది. దీంతో అనేక దేశాల్లో పెట్రోలు బంకుల్లో హాహాకారాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ ఇలా ఒకటేంటి.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకాయి. ఉక్రెయిన్, రష్యాల నుంచి గోధుమలు, ఎరువులు, నూనెగింజలు వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. వెరసి, అగ్రరాజ్య కూటమి ఆడుతున్న ఆంక్షల గేమ్‌కు ప్రపంచ దేశాలు బలవుతున్నాయి. వీటన్నింటికీ తోడు దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడం కోసం అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా పెంచుతుందటంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ఒకపక్క, ధరాఘాతం, మరోపక్క, మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ.. ఇన్వెస్టర్లకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. యూరప్ గజగజ..! అమెరికా రెచ్చగొట్టడంతో రష్యా క్రూడ్, గ్యాస్‌పై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు.. తమ గొయ్యి తామే తవ్వుకున్నాయి. వాస్తవానికి యూరప్ మొత్తం క్రూడ్, గ్యాస్ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం పైనే. జర్మనీ తదితర కొన్ని దేశాలైతే ఏకంగా 60–80 శాతం క్రూడ్–గ్యాస్ అవసరాలకు రష్యాపైనే ఆధారపడ్డాయి. అంతేకాదు రష్యా నుంచి నేరుగా పైపు లైన్ల (నార్డ్‌స్ట్రీమ్) ద్వారా యూరప్ మొత్తానికి సరఫరా వ్యవస్థ ఉండటంతో అత్యంత చౌకగా కూడా లభించేది. అయితే, రష్యాపై ఆంక్షలతో ఈ చౌక క్రూడ్, గ్యాస్‌కు చాలా దేశాలు నో చెప్పాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి కొన్ని దేశాలు ప్రత్యామ్నాయం లేక రష్యా రూబుల్స్‌లోనే చెల్లించి దిగుమతులు చేసుకుంటున్నాయి. అయితే, నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్ నిర్వహణ, రిపేర్ల పేరుతో రష్యా గ్యాస్ ఎగుమతుల్లో దాదాపు సగానికిపైగా కోత పెట్టడంతో ఇప్పుడు యూరోపియన్ దేశాలు.. ముఖ్యంగా జర్మనీ గజగజలాడుతోంది. ఎందుకంటే యూరప్‌లో చలికాలం మొత్తం ఇళ్లలో వెచ్చదనం కోసం గ్యాస్ హీటర్లనే ఉపయోగిస్తారు. అంతేకాదు, యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో చాలా కంపెనీలు నడిచేది గ్యాస్‌తోనే. వీటికి గనుక గ్యాస్ సరఫరాలు తగ్గితే, మూతబడే పరిస్థితి నెలకొంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన బీఏఎస్ఎఫ్.. తమకు గ్యాస్ గనుక కోత పెడితే ప్లాంట్‌ను మూసేయాల్సి వస్తుందని ఇప్పటికే సంకేతాలిచ్చింది. రష్యా చౌక గ్యాస్‌ను కాదని, అమెరికా నుంచి భారీ ధరకు యూరప్ చేశాలు దిగుమతి చేసుకుంటుండటం మరో విచిత్రం. ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న అమెరికా... యూరప్ దేశాలనూ ఆర్థికంగా కకావికలం చేస్తోందని అక్కడి ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. ‘‘అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం. కానీ మిత్రుడిగా ఉండటం ప్రాణాంతకం’’ అంటూ అమెరికా రాజనీతిజ్ఞుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ ఎ. కిసింజర్ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద రష్యాపై ఎడాపెడా విధిస్తున్న ఆంక్షలు.. బ్యాక్‌ఫైర్ కావడంతో పశ్చిమ దేశాలు గిలగిలాకొట్టుకుంటున్నాయి. చైనా, భారత్‌కు ‘రష్యా క్రూడ్’ పంట! ఇదంతా ఒకెత్తయితే, ప్రపంచ క్రూడ్ వినియోగదారుల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న చైనా, భారత్‌కు రష్యా–ఉక్రెయిన్ వార్ కాసులు కురిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షల కారణంగా నిలిచిపోయిన వాణిజ్యాన్ని రష్యా.. బ్రిక్స్ దేశాలు, ఇతరత్రా మిత్ర దేశాలకు మళ్లిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలకు 30 శాతం మేర డిస్కౌంట్ రేటుకు క్రూడ్ ఇస్తుండటం విశేషం. ఉక్రెయిన్‌తో వార్ మొదలయ్యాక మూడు నెలల్లో రష్యా నుంచి చైనా రెట్టింపు స్థాయిలో 18.9 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురు, గ్యాస్, బొగ్గు కొనుగోలు చేసినట్లు అంచనా. ఇక భారత్ అయితే దాదాపు ఐదు రెట్లు అధికంగా 5.1 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్, బొగ్గు, ఇతర కమోడిటీలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. వార్ మొదలయ్యాక తొలి 100 రోజుల్లో క్రూడ్, గ్యాస్ ఎగుమతుల ద్వారా రష్యా ఆర్జించిన మొత్తం 98 బిలియన్ డాలర్లు. ఇందులో 61 శాతం అంటే దాదాపు 58 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులను యూరప్ దేశాలే చేసుకోవడం విశేషం. ఆంక్షలు ఎంతలా విఫలమయ్యాయో చెప్పేందుకు ఈ లెక్కలు చాలు! - శివరామకృష్ణ మిర్తిపాటి -
దిగుమతులకు రూపాయి సెగ
న్యూఢిల్లీ: రూపాయి విలువ క్షీణత ఎన్నో రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ముడిచమురు దగర్నుంచి, ఔషధాల ముడిసరుకు దిగు మతులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతుల వరకు అన్నీ భారంగా మారుతున్నాయి. అదేవిధంగా విదేశీ విద్య కోసం వెళ్లేవారు, విదేశీ పర్యటనకు వెళ్లేవారిపై మరింత ప్రభావం పడనుంది. డాలర్‌తో రూపాయి మారకం ఇటీవలే 8 శాతానికి పైగా క్షీణించడం గమనార్హం. రూపాయి విలువ క్షీణత ప్రభావం తక్షణం ఎదుర్కొనేది దిగుమతిదారులే. అంతకుముందు రోజులతో పోలిస్తే వారు దిగుమతుల కోసం మరింత మొత్తాన్ని వెచి్చంచాల్సి వస్తుంది. అదే సమయంలో ఎగుమతి రంగానికి రూపాయి విలువ క్షీణత కలిసొస్తుంది. డాలర్-రూపాయి మారకంలో వారికి మరిన్ని నిధులు లభిస్తాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. అక్కడి నుంచి అవి కొంత మేర తగ్గుముఖం పట్టాయి. కానీ, ఇదే కాలంలో రూపాయి విలువ క్షీణత.. చమురు ధరల తగ్గుదల ప్రయోజాన్ని తుడిచిపెట్టేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం రూ.79.99కు పడిపోగా, శుక్రవారం సైతం 79.91 వద్ద స్థిరపడింది. దిగుమతులే ఎక్కువ.. మన దేశ ముడిచమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవే కాకుండా వంట నూనెలు, బొగ్గు, ప్లాస్టిక్ మెటీరియల్, రసాయనాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఇలా దిగుమతి జాబితా పెద్దదిగానే ఉంది. దిగుమతుల్లో ప్రధానంగా ముడిచమురు వాటాయే ఎక్కువగా ఉంటోంది. వీటి కోసం అధిక మొత్తాన్ని చెల్లించుకోవాలి. ఉదాహరణకు ఆరు నెలల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ 74 స్థాయిలో ఉంది. ఇప్పుడు 80కు చేరింది. ఆరు నెలల్లోనే రూపాయి 8 శాతం విలువను కోల్పోయింది. కనుక ఆరు నెలల క్రితం కొన్న ఒక ఫోన్‌కు ఇప్పుడు మరింత మొత్తం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. రానున్న రోజుల్లో రూపాయి 82 స్థాయి వరకు వెళుతుందన్న అంచనాలు ఉన్నాయి. ముడిచమురుతోపాటు మొబైల్ ఫోన్లు, ఖరీదైన టీవీలు, సంపన్న కార్లు, కీలక ముడిపదార్థాల దిగుమతుల కోసం ఇప్పుడు 8 శాతం అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక ఈ పరిస్థితులు ఎగుమతిదారులకు, విదేశాల్లో సంపాదిస్తూ స్వదేశంలోని తల్లిదండ్రులకు నగదు పంపించే వారికి అనుకూలం. రూపాయి క్షీణించడం వల్ల మారకంలో మరిన్ని రూపాయలు వీరు పొందగలరు. జూన్ నెలలో దిగుమతులు 57 శాతం పెరిగి 66.31 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021 జూన్‌లో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 9.60 బిలియన్ డాలర్లు ఉంటే, 2022 జూన్ నెలలో 173 శాతం పెరిగి ఇది 26.18 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. రూపా యి బలహీనత వల్లేనని భావించాలి. విద్యుత్ అవసరాలకు బొగ్గును సైతం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జూన్ నెలలో చమురు దిగుమతుల విలువ రెట్టింపై 21.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వంట నూనెల దిగుమతులు 26 శాతం పెరిగి 1.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సబ్సిడీల భారం.. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోయిన ఎరువుల ధరల ప్రభావం మనమీదా పడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఎరువుల సబ్సిడీల బిల్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కోట్లకు చొరొచ్చన్న అభిప్రాయం నెలకొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీలకు కేంద్రం రూ.1.62 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఫారెక్స్ నిల్వల భారీ పతనం భారత్ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) జూలై 8వ తేదీతో ముగిసిన వారంలో (అంతక్రితం జూలై 1తో ముగిసిన వారంతో పోల్చి) భారీగా 8.062 డాలర్లు తగ్గి 580.252 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఎగుమతులకన్నా, దిగుమతులు పెరగడం, వెరసి వాణిజ్యలోటు భారీ పెరుగుదల, రూపాయి పతనాన్ని అడ్డుకోడానికి మార్కెట్లో ఆర్బీఐ పరిమిత జోక్యం వంటి అంశాలు ఫారెక్స్ నిల్వల తగ్గుదలకు కారణంగా కనబడుతోంది. 2021 సెపె్టంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. -
2022 ఆరంభం నుంచి రూపాయి ఎన్నిసార్లు, ఎంత పతనమైందంటే!
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పతనానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. వరుస రికార్డు పతనానికి చేరుతున్న రూపాయి గురువారం వరుసగా నాల్గవ సెషన్లో ఆల్ టైం కనిష్టాన్ని టచ్ చేసింది. 79.90 వద్ద కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం కనిష్ట స్థాయి 79.66ను తాకి, చివరికి రికార్డు కనిష్ట స్థాయి 79.62 వద్ద ముగిసింది. అంతేకాదు సమీప కాలంలో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 82 కి పడిపోవచ్చని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలు దేశీయ కరెన్సీని అతలాకుతలం చేశాయి. ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా వార్ తరువాత రూపాయి ఏకంగా 27 సార్లు అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి ఐదుసార్లు కొత్త జీవిత కాల కనిష్ట స్థాయిని తాకింది. 2022 ప్రారంభంలో డాలరకు 74 వద్ద ఉన్న రూపాయి డాలర్‌తో పోలిస్తే రూపాయి 6.4 శాతం నష్టపోయి 80 స్థాయికి చేరేందుకు అతి సమీపంలో ఉంది. మరోవైపు ఆరు కరెన్సీల గ్రీన్‌బ్యాక్‌ను కొలిచే డాలర్ ఇండెక్స్ సోమవారం 20 సంవత్సరాల గరిష్ట స్థాయి 107.74కి పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ డేటా తెలుపుతోంది. ఇకవైపు ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు బలం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, భారత కరెన్సీపై మరింత ఒత్తిడి పెంచుతోంది. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందన్న ఆందోళనలు, ద్రవ్యోల్బణం గణాంకాలు ఊహించిన దానికంటే భిన్నంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ పాలసీ మరింత కఠినంకానుందన్న అంచనాలు మధ్య డాలరుపై ఇన్వెస్టర్ల దృష్టి పెరిగింది. బుధవారం నాటి డేటా ప్రకారం జూన్‌లో అమెరికా వినియోగదారుల ధరల సూచిక 9.1 శాతంతో 41ఏళ్ల గరిష్టానికి పెరిగింది. ప్రపంచమాంద్య భయాలు, యూరప్‌లో ఇంధన సంక్షోభం తీవ్రతరం, దేశీయంగా కరెంట్ ఖాతా లోటు లాంటివి రూపాయిని దెబ్బ తీస్తున్నాయి. రూపాయి పతనం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ పతనాన్ని అడ్డుకోలే పోతున్నాయి. రూపాయిని రక్షించేందుకు బంగారం దిగుమతులపై పన్ను, స్పాట్ అండ్ ఫ్యూచర్స్ ఫారెక్స్ మార్కెట్లలో జోక్యం, ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను నేరుగా పెంచడానికి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాల కోసం రుపీ సెటిల్మెంట్ విధానాన్నిఇటీవల ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అయ్యయ్యో.. రూపాయి...ఈ పతనం ఎందాకా?
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయికి కష్టాలు తప్పడం లేదు. సోమవారం మరో రికార్డు కనిష్టానికి జారుకుంది. గ్లోబల్ మాంద్యం, ముడిచమురు సరఫరా, మార్కెట్లలో మిశ్రమ సెంటిమెంట్‌పై పెట్టుబడిదారుల ఆందోళన నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి 79.40 వద్ద ఆల్ లైం కనిష్టాన్ని నమోదు చేసింది. శుక్రవారం79.26 వద్ద ముగిసింది. గత రెండు వారాలుగా అత్యంత కనిష్ట స్థాయిలకు చేరుతున్న రూపాయి ప్రస్తుతం 80 మార్క్‌కు చేరువలో ఉండటం ఆందోళన రేపుతోంది. దేశీయ,అంతర్జాతీయ ద్రవ్యోల్బణ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థికవృద్ధి ఆందోళన, చమురు మార్కెట్లో అస్థిరత డాలర్‌కు బలాన్నిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు వరుసగా మూడు సెషన్ల లాభాలకు స్వస్తి చెప్పిన స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 325 పాయింట్లు క్షీణించి 54156 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 16137 వద్ద కొనసాగుతోంది. కాగా రోజుకు మరింత పతనమవుతున్న రూపాయని ఆదుకునేందుకు ఇటీవల ఆర్బీఐ కొన్ని చర్యల్ని ప్రకటించింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కొన్ని సవరణలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రపంచానికి మాంద్యం గుబులు, పడిపోతున్న రూపాయి విలువ!
ముంబై: ప్రపంచ దేశాలను మళ్లీ మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ఆందోళనలు, పలు దేశాల రుణ రేట్ల పెంపుతో ప్రపంచ వృద్ధిబాటలోంచి క్షీణతలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషణలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు తక్షణ మార్గంగా డాలర్ కనబడుతోంది. దీనితోపాటు ఫెడ్ కఠిన ద్రవ్య విధానంతో ప్రపంచవ్యాప్తంగా నిధులు డాలర్లలోకి వస్తున్నాయి. ఈ వార్త రాసే 11 గంటల సమయంలో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 106.50 డాలర్లపైన గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక పతనం కొనసాగుతోంది. మంగళవారం 38 పైసలు పతనమై 79.33 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 79.38 స్థాయిని కూడా చూసింది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కు మళ్లడం రూపాయి భారీ పతనానికి కారణమవుతోంది. ఈ రెండు స్థాయిలు రూపాయికి ముగింపు, ఇంట్రాడే కనిష్ట స్థాయిలు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లాభాల బాటన పయనిస్తుండగా, నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 35 డాలర్లు పతనమై (2 శాతం) 1,767కు చేరింది. క్రూడ్ 10 శాతం వరకూ పడిపోయి 100 డాలర్ల దిగువకు చేరింది. -
రూపాయి మహాపతనం, మరో కొత్త కనిష్టం
సాక్షి, ముంబై: రూపాయి మరో మహాపతనాన్ని నమోదు చేసింది. వరుస రికార్డు కనిష్టాలను నమోదు చేస్తున్న దేశీయ కరెన్సీ రూపాయి శుక్రవారం మరో ఆల్ టైం కనిష్టాన్ని రికార్డు చేసింది. యుఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి 79.11 వద్దకు చేరింది. వరుసగా ఆరో సెషన్లో కూడా రూపాయి విలువ దిగజారుతుండటం ట్రేడర్లను ఆందోళనకు గురి చేస్తోంది. గత సెషన్లో 3 పైసలు పడిపోయి రికార్డు స్థాయిలో 79.06 వద్ద ముగిసింది. మరోవైపు గత సెషన్లో దాదాపు 3 శాతం క్షీణించిన చమురు ధరలు ఈరోజు (శుక్రవారం) ప్రారంభ ట్రేడింగ్‌లోనే చుక్కలు చూపిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 83 సెంట్లు లేదా 0.8 శాతం పెరిగి 109.86 డాలర్లకు చేరుకుంది. అలాగే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 770 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 226 పాయింట్లు పతనమైంది. -
మన రూపాయి కాస్త బెటర్!
న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తున్నప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. గురువారం ఇక్క డ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రూపాయి విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగం. అందువల్ల ప్రపంచ పరిణామాల ప్రభావం మనపై కూడా తప్పకుండా ఉంటుంది. అయితే, డాలరు మారకంలో ఇతర దేశాల కరెన్సీల పతనంతో పోలిస్తే భారత కరెన్సీ మరీ అంతలా పడిపోలేదు. కొంత మెరుగైన స్థితిలోనే ఉంది’’ అని ఆమె చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో కూడా మిగతా కరెన్సీలతో పోలిస్తే రూపాయి కాస్త మెరుగ్గానే ఉందని పేర్కొనడం గమనార్హం. కొత్త కనిష్టాల బాటలోనే.. రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టాల బాటలోనే కొనసాగుతోంది. గురువారం డాలరు మారకంలో రూపాయి మరో పైసలు నష్టపోయి 79.06 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 79.07ను కూడా తాకింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఆందోళనల ప్రభావంతో డాలర్ ఇండెక్స్ బలపడుతుండటం, దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల తిరోగమనం, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతుండటం, ముడిచమురు ధరల పెరుగుదల వంటివి రూపాయి పతనానికి కారణంగా నిలుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లేకపోవడం మేలు చేస్తుంది! -
రూపీ రూబుల్ పేరు చెప్పి చైనీస్ యువాన్‌తో కానిచ్చేశారేంటీ!?
ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రష్యాతో వ్యాపార సంబంధాలు యూఎస్ డాలర్లలో కాకుండా ఇండియన్ రూపీ, రష్యా రూపీలతో జరిపేందుకు సన్నహకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా రష్యా నుంచి ఇండియాకు వస్తున్న ఓ బొగ్గు రవాణా ఒప్పందం రూపీ రూబుల్ ప్రయత్నాలకు చిన్న ఝలక్ ఇచ్చినట్టయ్యింది. ఇండియాలో అతి పెద్ద సిమెంట్ బ్రాండ్‌గా పేరొందిన ఆల్ట్రాటెక్ ఓ వివాస్పద నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆల్ట్రాటెక్ రష్యా నుంచి భారీ ఎత్తున బొగ్గును దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్ 5న ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రష్యా బొగ్గు కొనుగోలు కోసం ఎప్పటి లాగే యూఎస్ డాలర్లలోనూ లేదా ఇండియన్ రూపీలతో కాకుండా చైనీస్ కరెన్సీ యూవాన్లలో చెల్లించింపులు చేసినట్టు తెలుస్తోంది. ఈ దిగుమతి డీల్‌కు సంబంధించిన ఒప్పంద పత్రాల ప్రకారం రష్యా నుంచి 1,57,000 టన్నుల బొగ్గును అల్ట్రాటెక్ దిగుమతి చేసుకుంటోంది. ఈ డీల్‌కు సంధానకర్తగా దుబాయ్‌కి చెందిన సుయెక్ సంస్థ వ్యవహరించింది. తూర్పు రష్యాలోనే వానినో పోర్టు నుంచి మన దగ్గర కాండ్లా పోర్టుకు ఈ బొగ్గు రవాణా కానుంది. లక్షా యాభై ఏడు వేల టన్నుల బొగ్గు కొనుగోలు కోసం ఆల్ట్రాటెక్ 172,652,900 యూవాన్లు (25.81 మిలియన్లు) చెల్లించినట్టుగా ఉంది. గడిచిన ఇరవై ఏళ్లలో రష్యాతో జరిపే లావాదేవీల్లో ఇండియన్ కంపెనీలు చైనీస్ కరెన్సీలో చెల్లింపులు చేసిన దాఖలాలు లేవని అంతర్జాతీయ వ్యవహరాలను పరిశీలించే నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ లావాదేవీల్లో చైనీస్ యూవాన్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల డాలర్‌కు సమాంతరంగా యూవాన్ ఎదిగేందుకు అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యాపై అమెరికాతో సహా పశ్చిమ దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో డాలర్‌కు ప్రత్యామ్నయంగా ఇతర కరెన్సీలో లావాదేవీలు జరిపేందుకు రష్యా కూడా సముఖంగానే ఉంది. దీంతో రూపీ - రూబుల్ లావాదేవీల అంశం తెరపైకి వచ్చింది. ఇదింకా చర్చల దశలో ఉండగానే రూబుల - యువాన్ సంబంధం గట్టిపడటం అనేది మన విదేశాంగ విధానానికి కొంత వరకు మింగుడుపడని అంశమనే భావన నెలకొంది. చదవండి: కమర్షియల్ బొగ్గు గనుల వేలం..బిడ్స్ దాఖలు చేసిన 31 సంస్థలు! -
ఆగని రూపాయి పతనం, ఆర్బీఐ జోక్యం?
సాక్షి, ముంబై: డాలరు మారకంలో అంతకంతకూ దిగజారుతున్న దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం మరింత పతనమైంది. తాజాగా 78.96 వద్ద జీవితకాల కనిష్ట స్థాయి తాకింది. వరుసగా ఆరో సెషన్లో కూడా రికార్డు కనిష్టానికి చేరడంతో ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీ స్టాక్‌మార్కెట్లు, ఇతర ఆసియా కరెన్సీల నష్టాల ప్రభావంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 78.86 వద్ద బలహీనమైన నోట్‌తో ప్రారంభమైంది. అనంతరం మరింత క్షీణించి 11 పైసల నష్టంతో ఆల్ టైం కనిష్టం 78.96 స్థాయిని నమోదు చేసింది. ఈ స్థాయిలో మరింత పతనం తప్పదని ట్రేడర్లు భావిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి 1.87శాతం క్షీణించగా, ఈ ఏడాది 6.28 శాతం పతనం కావడం గమనార్హం.మరోవైపు ఈ పరిణామంపై ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చని అంచనాలు నెలకొన్నాయి. -
రూపాయి మరింత ఢమాల్! మున్ముందు మరింత కష్టం
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి కుదేలైంది. మంగళవారం 78.59 వద్ద తొలుత రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతకుముందు నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ప్రతి ఒక్కటి రికార్డు స్థాయిలో ముగిసిన రూపాయి తాజాగా 78.74 వద్ద సరికొత్త ఆల్ టైమ్ ఇంట్రా-డే కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆర్థిక మందగమన భయాలు, అంతర్జాతీయ మార్కెట్లు, చమురు ధరలు, ఎఫ్ఐఐల నిరంత అమ్మకాల కారణంగా ఇటీవల ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి జారిపోతున్న రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 78.53 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. అనంతరం మరింత క్షీణించి 51 పైసల నష్టంతో 78.74 స్థాయికి చేరింది. మునుపటి సెషన్లో రూపాయి నాలుగు పైసలు క్షీణించి 78.37 వద్ద రికార్డు ముగింపును నమోదు చేసింది. మరోవైపు దేశీయ మార్కెట్లలో ఎఫ్ఐఐల (ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) నిరంతర విక్రయాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి తెలిపారు. రష్యాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన ధరలకు ఊతమిస్తాయని, దీంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలపై ఒత్తడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఆగని రూపాయి ‘రికార్డు’ పతనం: ఆర్బీఐ ఏమందంటే
అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారిస్తుందని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర పేర్కొన్నారు. అయితే రూపాయి విలువ ఏ స్థాయిలో స్థిరపరచాలన్న అంశంపై ఎటువంటి లక్ష్యాన్ని ఆర్బీఐ నిర్ధేశించుకోలేదని ద్రవ్య విధాన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా గడచిన రెండు నెలల్లో బ్యాంకులకు తానిచ్చే (ఆర్బీఐ) రుణాలపై వసూలు చేసే వడ్దీరేటు రెపోను 90 బేసిస్ పాయింట్ల పెంచిన (0.40 శాతం, 0.90 శాతం) సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీలో పాత్ర కూడా సభ్యులు. ఈ నేపథ్యంలో ‘‘భారత్ ఎకానమీపై అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ప్రభావం’’ అన్న అంశంపై ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు పాత్ర వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిశీలిస్తే... ►రూపాయి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. డాలర్ ఎక్కడ ఉంటుందో అమెరికా ఫెడ్‌కి కూడా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచి్చతంగా చెప్పాలి. మేము రూపాయి స్థిరత్వం కోసం నిరంతరం గట్టి ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో పురోగతి ఉంటుందని ఆర్బీఐ విశ్వసిస్తోంది. రూపాయి విలువ స్థిరీకరణపై లక్ష్యం ఏదీ లేదుకానీ, తీవ్ర ఒడిదుడుకులను నివారించడనికి మాత్రం సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ► రూపాయి విలువ క్షీణతను పరిశీలిస్తే, ప్రపంచంలోని పలు దేశాల కరెన్సీలకన్నా తక్కువ స్థాయిలోనే మన కరెన్సీ క్షీణత ఉంది. 600 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వల శక్తి నుంచి పొందిన ప్రయోజనం ఇది. ►రూపాయి–రూబుల్ చెల్లింపు విధానం విషయానికి వస్తే, ప్రభుత్వం ఏది నిర్ణయించినా రిజర్వ్ బ్యాంక్ దానిని నిర్వహిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్ణయించాల్సిన అంశం. ►2021-22 మూడవ త్రైమాసికంలో (2021 అక్టోబర్-డిసెంబర్ మధ్య) 2.6 శాతంలో భారత్ కరెంట్ అకౌంట్‌లోటు (దేశంలోకి వచ్చి-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) సంబంధిత కాలం స్థూల దేశీయోత్పత్తిలో 2.6 శాతంగా ఉంది. నాల్గవ త్రైమాసికంలో ఇది 1.5 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఒడిదుడుకులను ఎదుర్కొనే విషయంలో భారత్ పటిష్ట స్థాయిని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ► 2021-22లో కరెంట్ అకౌంట్‌లోటు నామమాత్రంగా 1.2 శాతంగానే ఉంది. భౌగోళిక సవాళ్లు, వాణిజ్య సంబంధ అండకులు, దిగుమతుల డిమాండ్ పెరుగుదల వంటి పలు సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ విదేశీ నిల్వలు పటిష్ట స్థాయిలో కొనసాగుతున్న విషయాన్ని క్యాడ్ తెలియస్తోంది. ►ఇతర దేశాలతో పోలి్చతే భారత్ ద్రవ్య పరపతి విధానం ఇంకా సరళతరంగానే ఉంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు దిగివస్తుందని భావిస్తున్నాం. తదుపరి నెలల్లో మరింత దిగివస్తుందన్నది అంచనా. ప్రస్తుత పరిస్థితులు, కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల ఆధారంగా (బేస్‌లైన్) ఈ అంచనాలను వెలువరిస్తున్నాం. ► ప్రపంచం ద్రవ్యోల్బణం సవాళ్లలో ఉన్న నేపథ్యంలో...ప్రస్తుతం దాని కదలికలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. స్థూలంగా స్థాయిలను నిర్ధేశించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ► ద్రవ్యోల్బణం తగ్గుదల చాలా ‘కఠినంగా‘ ఉంటుంది. అయితే భవిష్యత్ ద్రవ్యోల్బణం పథాన్ని నిర్దేశించు కోవడంలో భారతదేశం విజయం సాధిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. తద్వారా ద్రవ్యోల్బణంపై యుద్ధంలో విజయం సాధిస్తుందని భావిస్తున్నాము. ద్రవ్యోల్బణంపై అందోళన అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్బీఐ ఈ నెల ప్రారంభ పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొంది. కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దుమీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్ కట్టడికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనా వేస్తోంది. దీంతోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉంది. ఇది ఖరీఫ్ పంట దిగుబడికి దోహదపడే అంశం. ఆయా అంశాల నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటురిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉంటుందని భావిస్తోంది. మొదటి త్రైమాసికంలో 7.5 శాతం, రెండవ త్రైమాసికంలో 7.4 శాతం, మూడవ త్రైమాసికంలో 6.2 నమోదయ్యే రిటైల్ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8 శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనావేసింది. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ మధ్య జరిగే పాలసీ సమీక్షలో కూడా రెపో రేటు పెంపు ఉంటుందన్న అంచనాలు వెలువడు తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు మరో ఒక శాతం పెరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. రూపాయి పతనం ఇదిలావుండగా, డాలర్ మారకంలో రూపాయి చరిత్రాత్మక పతనం రికార్డులు కొనసాగుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపుతో పోలిస్తే ఒకపైసా క్షీణించి 78.33 వద్ద ముగిసింది. రూపాయి గురువారం ముగింపు 78.32. శుక్రవారం ట్రేడింగ్‌లో 78.20 వద్ద ప్రారంభమైంది. 78.19ని చూసినా ఆ స్థాయికి మించి బలపడలేదు. ఇంట్రాడేలో 78.35ను కూడా చూసింది. చివరకు పైనా నష్టంతో 78.33 వద్ద ముగిసింది. తద్వారా ఇంట్రాడే, ముగింపుల్లో రూపాయి శుక్రవారం చరిత్రాత్మక కొత్త కనిష్టాలను చూసింది. రూపాయి వరుస పతనం ఇది ఎనిమిదవ వారం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగింపు కనబడని పరిస్థితి, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు ధోరణి, దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల బలహీన ధోరణి, విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకం దారులుగా కొనసాగడం వంటి అంశాలు రూపాయి రెండు నెలల పతన ధోరణికి కారణం. విదేశీ మారకద్రవ్య నిల్వలు @ 591 బిలియన్ డాలర్లు వారం వారీగా 6 బిలియన్ డాలర్ల డౌన్ కాగా, భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు జూన్ 17వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో (జూన్ 10) ముగిసిన వారంతో పోలి్చచూస్తే 6 బిలియన్ డాలర్లు తగ్గి 591 బిలియన్ డాలర్లకు చేరింది. జూన్ 10తో ముగిసిన వారంలోకూడా అంతక్రితం వారంతో పోల్చితే ఫారెక్స్ దాదాపు 4 బిలియన్ డాలర్లకుపైగా తగ్గడ గమనార్హం. ఆర్బీఐ తాజాగా శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 10వ తేదీతో ముగిసిన వారంలో డాలర్లు అధికంగా ఉండే ఫారెన్ కరెంట్ అసెట్స్ (ఎఫ్సీఏ) 5.362 బిలియన్ డాలర్లు తగ్గి, 526.882 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 258 మిలియన్లు తగ్గి 40.584 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) నిధులు మొత్తం 233 మిలియన్ డాలర్ల తగ్గి 18.155 బిలియన్లకు తగ్గాయి. ఐఎంఎఫ్ వద్ద నిల్వలు కూడా 17 మిలియన్ డాలర్లు తగ్గి 4.968 బిలియన్ డాలర్లకు చేరాయి. -
డాలరు మారకంలో దిగజారుతున్న రూపాయి విలువ
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి రోజురోజుకి క్షీణిస్తూ బుధవారం మరో కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్ల ఒడిదుడుకులు, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పుంజుకోవడంతో పాటు భారతదేశ కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం ఆందోళలు, తదితర కారణాల రీత్యా రూపాయి డాలర్‌తో బుధవారం 78.40 వద్ద ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఇంట్రా-డేలో గరిష్టంగా 78.13 కనిష్ట స్థాయి 78.40 మధ్య కదలాడింది. 78.13 వద్ద నిన్న(మంగళవారం) కనిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎఫ్ఐఐల అమ్మకాలు జోరు, దేశీయ ఈక్విటీలలో నష్టాల కారణంగా బుధవారం 27 పైసలు క్షీణించిన రూపాయి 78.40 (తాత్కాలిక) వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. 2011 తర్వాత మొదటిసారిగా 3శాతం దిగువకు పడిపోయింది. ఓవర్సీస్లో బలమైన గ్రీన్బ్యాక్ కూడా రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఆరు కరెన్సీల గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.05 శాతం బలపడి 104.48కి చేరుకుంది. ఇదిలా ఉంటే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత వరుసగా ఎనిమిదో నుంచి తొమ్మిది నెలల నుంచి దేశం నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం కూడా దేశీయ కరెన్సీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. జూన్‌లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు రూ. 38,500 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జూన్ 10, 2022తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 4.59 బిలియన్ డాలర్లు క్షీణించి 596.46 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ డేటా వెల్లడించింది. -
గ్లోబల్ ఆయిల్ సెగ: ఆయిల్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: గ్లోబల్‌గా చమురు ధరలు పడిపోవడంతో దేశీయమార్కెట్లో ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫెడ్ రేటు వడ్డీ రేటు భారీ పెంపు, గ్లోబల్‌గా ఇంధన డిమాండ్ తగ్గిపోవచ్చన్న భయాలతో శుక్రవారం ముడి చమురు నాలుగు వారాల కనిష్ట స్థాయికి 7 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి కనొసాగుతోంది. బ్యారెల్‌కు 125 డాలర్ల ఇటీవలి గరిష్ట స్థాయి నుండి 11 డాలర్లు తక్కువ. దీంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు శుక్రవారం 5 శాతానికి పైగా క్షీణించాయి. ముదురుతున్న ప్రపంచ మాంద్యం భయాలతో గతకొన్ని సెషన్లలో దాదాపు 10 శాతం పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఆయిల్ ఇండియా ఏకంగా 12శాతం, ఓఎన్జీసీ 7 శాతం కుప్పకూలాయి. మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ దాదాపు 19 శాతం, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ 18 శాతంపైగా క్షీణించింది. ఇంకా గోవా కార్బన్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ 6 - 8 శాతం వరకు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు 77.98 వద్ద బలంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది. మునుపటి సెషన్లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పురోగమించి 78.05 వద్ద స్థిరపడింది. అయితే, విదేశీ నిధుల తరలింపు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఊగిసలాట ధోరణి, డాలరు బలం కారణంగా లాభాలు పరిమితమవుతున్నట్టు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. మరోవైపు ఆరు కరెన్సీల బాస్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయి 104.38కి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.26 శాతం పడిపోయి 112.83డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్లో నికర విక్రయదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 7,818.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలును కోల్పోయాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి. -
భారీగా క్షీణించిన వెండి, బంగారం ధరలు, కారణం ఏమిటంటే
సాక్షి,ముంబై: ఇటీవలి కాలంలో ఆకాశానికి చేరిన బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్ల సంకేతాలతో దిగి వస్తున్నాయి. బంగారం ధరలతోపాటు వెండి ధర కూడా మంగళవారం క్షీణించింది. అంతర్జాతీయంగా ధరలు ఏడు రోజుల కనిష్టానికి చేరగా, దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా వెయ్యి రూపాయలు పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర 52,760 వద్ద ఉంది. వెండి ధర కిలోకి 1500 రూపాయలు క్షీణించి 61,500గా ఉంది. దేశీయ మార్కెట్లలో మే నెల అంతా వెండి బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రెండు రోజుల క్రితం నెల రోజుల గరిష్టాన్ని తాకిన పసిడి ధర ఈ రెండు రోజుల్లో రూ.1300 మేర తగ్గడం విశేషం. అటు ఎంసీఎక్స్ గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 0.4 శాతం క్షీణించి10 గ్రాముల ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.50,445కి చేరుకుంది. వెండి ధరలు కూడి ఇద్దే బాట పట్టాయి. జూలై ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గి కిలోకు రూ. 59,867 వద్దకు పడిపోయింది. యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేటును దాదాపు 50 బీపీఎస్ పాయింట్లు పెంచననుందని ఇదిడాలర్కు మరింత బలమని పెట్టబడిదారులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణకోసమే వడ్డీ రేటును పెంచనుందని అంచనా. ఇది పసిడి ధరలకు నెగిటివ్‌గా ఉంటుందని, ఈ స్థాయిలలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనాలో మాంద్యం భయాలు, రికార్డు స్థాయికి బలపడుతున్న డాలరు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక వారం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు తాజా కోవిడ్ ఆంక్షలతో గ్లోబల్‌గా ఆయిల్ ధరలు లాభనష్టాల మధ్య ఊగిస లాడాయి. గత సెషన్లో 78.03 వద్ద స్థిరపడిన దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం అమెరికా డాలర్‌తో 78.02 వద్ద ప్రారంభమై 77.98 వద్ద ముగిసింది. ఇక డాలర్ 20 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అటు స్టాక్మార్కెట్లో సోమవారం నాటి బ్లడ్ బాత్ ఛాయలు మంగళవారం కూడా కనిపించాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిస లాడిన సూచీలు చివరకు కనీస మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. -
కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న రూపాయి!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయిల నుంచి 21 పైసలు కోలుకుంది. 77.50 వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం జీవితకాల కనిష్టం 77.71కి పడిపోయింది. బుధవారం 77.58 వద్ద ప్రారంభమైంది. 77.50–77.62 శ్రేణిలో తిరిగింది. కొన్ని బ్యాంకులు డాలర్ల విక్రయం రూపాయికి కొంత మేర కలిసివచ్చింది. అయితే ఇది తాత్కాలిక ధోరణి అని, రూపాయి బలహీనతే కొనసాగుతుందని నిపుణుల అంచనా. -
రూపాయి ఢమాల్..డాలర్‌కి జోష్!
జాతీయ, అంతర్జాతీయ పరిణాలు దేశీయ కరెన్సీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలరు మారకంలో దేశీయ కరెన్సీ విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. పీటీఐ కథనం ప్రకారం..సోమవారం అమెరికా డాలరుతో పోలిస్తే భారత కరెన్సీ విలువ పతనమైంది. 60పైసలు తగ్గి 76.90 నుండి 77.50 వద్ద ట్రేడింగ్‌తో ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 77.17 వద్ద దిగువన ప్రారంభమైంది. చివరికి దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 60 పైసలు తగ్గి 77.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్లో రూపాయి తన జీవితకాల కనిష్ట స్థాయి 77.52కి చేరుకుంది. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి ఆందోళనల ఫారెక్స్ మార్కెట్‌పై పడిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల పెంపు కారణంగా డాలర్ రెండు దశాబ్దాలలో అత్యధిక స్థాయికి చేరుకుంది. అదనంగా, చైనాలో కఠినమైన లాక్డౌన్, మూడవ నెలలో ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిస్పందనగా రష్యా చమురును నిషేధించాలనే యూరప్ ప్రణాళిక, వస్తువుల ధరలను పెంచడం వల్ల ఆర్థిక వృద్ధి ప్రమాదాలు మందగించడం డాలర్ రేటు పెరగుదలకు ఊతమిచ్చింది. -
రూపాయి మళ్లీ రివర్స్‌గేర్..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 25 పైసలు నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 76.42 వద్ద ముగిసింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్లలో నష్టాల్లో నడిచిన రూపాయి, బుధ, గురు వారాల్లో కొంత తేరుకుని 33 పైసలు లాభపడింది. అయితే మళ్లీ మూడవరోజు యథాపూర్వం నష్టాలోకి జారింది. దేశం నుంచి విదేశీ మారకపు నిల్వలు వెనక్కు మళ్లడం, డాలర్ ఇండెక్స్ (101) 25 నెలల గరిష్ట స్థాయికి చేరడం, మేలో జరిగిన ఫెడ్ ఫండ్ సమీక్షలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల (ప్రస్తుతం 0.25–0.50 శాతం శ్రేణి) వడ్డీరేటు పెరుగుతుందన్న వార్తలు రూపాయి బలహీనతకు ప్రధాన కారణం. డాలర్ మారకంలో శుక్రవారం రూపాయి ట్రేడింగ్ 76.31 వద్ద రూపాయి ప్రారంభమైంది. 76.19 గరిష్ట–76.50 కనిష్ట స్థాయిల్లో తిరిగింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ మార్చి 8వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్టం 77.05 స్థాయిని చూస్తే, ముగింపులో 77గా ఉంది. రూపాయికి ఇవి రెండు చరిత్రాత్మక స్థాయిలు. తాజా అనిశ్చిత పరిస్థితులు రూపాయి బలహీనతకే దారితీస్తాయని నిపుణులు భావిస్తున్నారు. చదవండి👉🏼: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు -
మూడోరోజూ..రూపాయి ‘బాహుబలి’
ముంబై: రూపాయి విలువ వరుసగా మూడోరోజూ బలపడింది. డాలర్ మారకంలో 24 పైసలు ఎగసి 75.29 వద్ద స్థిరపడింది. ఇటీవల దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు)పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడింది. ఈ అంశాలు మన కరెన్సీకి కలిసొచ్చాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 75.54 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.27 స్థాయి వద్ద గరిష్టాన్ని అందుకుంది. క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు, భౌగోళిక అనిశ్చితుల ఆందోళనలతో లాభాలు పరిమితమైనట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ‘‘రష్యాపై ఆంక్షల విధింపు ప్రభావం, షాంఘైలో లాక్డౌన్ విధింపుతో చైనా వృద్ధి అవుట్‌లుక్ అంచనాలతో పాటు ఆర్బీఐ ద్రవ్యపాలసీ నిర్ణయాలు రానున్న రోజుల్లో రూపాయి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి’’ అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ కమోడిటీ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్దేవ్ తెలిపారు. -
భారత్‌కు ఆ సత్తా ఉంది,రష్యాతో పెట్టుకోవద్దు..అలా చేస్తే అమెరికాకే నష్టం!
ముంబై: ఎకానమీకి సాధారణంగా ప్రయోజనం చేకూర్చే మూలధన ప్రవాహాలు ఒక్కొక్కసారి నష్టాలకూ దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని కూడా ఆమె వివరించారు. కోవిడ్–19 సంక్షోభం ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోపీనాథ్ మాట్లాడుతూ, మూలధన ప్రవాహాల నుండి వచ్చే నష్టాలను తగ్గించడానికి భారత్ పలు రక్షణాత్మక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. మూలధన ప్రవాహాలకు సంబంధించి సంస్కరణలు, నిర్వహణ అనే అంశంపై విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ ఫ్లోస్‌కు సంబంధించి ‘అధ్యయనం ఆధారంగా’ పలు సలహాలను ఇచ్చారు. ఈ అంశాల గురించి ఆమె ఏమన్నారంటే... ►మూలధన ప్రవాహాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. తద్వారా అవసరమైన పెట్టుబడలు అందుతాయి. ఎకానమీకి కొన్ని విధానాలు వచ్చే నష్టాలకు ఎదుర్కొనడానికి దోహదపడతాయి. భారతదేశానికి కూడా ఇదే తరహా ప్రయోజనాలు అందుతున్నాయి. ►అయితే నష్టాలూ ఇందులో ఇమిడి ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే, మూలధన ప్రవాహాల విషయంలో దేశంలో ఇప్పటికే భారీగా పరిమితులు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం మారినప్పుడు భారత ప్రభుత్వం ఈ పరిమితులను చాలా చురుగ్గా ఉపయోగిస్తుంది. కార్పొరేట్లు చేసే అంతర్జాతీయ రుణాల మొత్తంపై పరిమితులు విధించడం ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం. ► పటిష్ట విధానాలు, నియంత్రణలతో భారత్ దాని క్యాపిటల్ అకౌంట్ వ్యవస్థను సరళీకృతం చేసే ప్రక్రియలో ఉంది. భారత్ ఫైనాన్షియల్ మార్కెట్లు, సంస్థలు పరిపక్వతతో కూడిన నియంత్రణలో ఉండడం వల్ల దేశం మరిన్ని రూపాల్లో క్యాపిటల్ ఫ్లోస్‌ను అనుమతించే వీలుంది. ►అంతర్జాతీయంగా మహమ్మారి ప్రారంభంలో మేము చూసిన ‘నాటకీయ’ మూలధన ప్రవాహాలు మళ్లీ ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం తరువాత కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థలపై చూపే ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలపై ఆయా దేశాల విధాన నిర్ణేతలు సమగ్ర విశ్లేషణ జరుపుకోవాల్సి ఉంటుంది. ► తీవ్ర ఆర్థిక సంక్షోభం తర్వాత, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వడ్డీ రేట్లు చాలా కాలంగా తక్కువగా ఉన్నందున, అధిక రాబడుల కోసం వర్ధమాన మార్కెట్లకు మూలధనం ప్రవహించింది. కొన్ని దేశాల్లో ఇది విదేశీ కరెన్సీలో ఆయా దేశాల అంతర్జాతీయ రుణాన్ని క్రమంగా పెంచడానికి దారితీసింది. విదేశీ కరెన్సీ ఆస్తులు లేదా హెడ్జ్‌ల ద్వారా పరిష్కారింపలేని స్థాయికి కొన్ని దేశాల ఫైనాన్షియల్ వ్యవస్థలను అస్థిరపరిచే స్థాయికి ఇది చేరింది. ►సరళతర వడ్డీరేట్ల వ్యవస్థ తిరోగమనం పట్టిన సందర్భాల్లో వర్ధమాన దేశాల మార్కెట్లలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు దారితీసింది. అటువంటి గత అనుభవాలు, పరిశోధనల నుండి ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే, కొన్ని పరిస్థితులలో స్థూల ఆర్థిక వ్యవస్థను అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి దేశాలు క్యాపిటల్ ఫ్లోస్‌పై తగిన ముందస్తు జాగ్రత్తలు, విధి విధానాలు తప్పనిసరిగా రూపొందించుకోవాలి. ఏదైనా అనుకోని పరిస్థితుల తలెత్తినప్పుడు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలు ఆర్థిక సంక్షోభం తీవ్రతను తగ్గిస్తాయి. ►అంతర్జాతీయ రుణ బాధ్యతలు క్రమంగా పెరుగుతూ ఉండడం వల్ల అనుకోకుండా ఆర్థిక స్థిరత్వానికి వచ్చే నష్టాలను ఈ అధ్యయనం వివరిస్తోంది. అంతర్జాతీయ విదేశీ మారకద్రవ్యానికి సంబంధించి అసమతుల్యతను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ►అసమతౌల్య క్యాపిటల్ ఇన్‌ఫ్లో పెరుగుదలను ఎలా గుర్తించాలి? మూలధన ప్రవాహాలను సరళీకరించడం అవసరమా? కాదా? అని నిర్ణయించుకోవడంతో సహా ఇందుకు సంబంధించి అన్ని అంశాలపై విధాన సలహాలు, ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని నివేదిక విశ్లేషణాంశాలు అందిస్తాయి. డాలర్ ఆధిపత్యానికి ‘ఆంక్షలు’ గండి ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై విధిస్తున్న ఆంక్షలు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని గీతా గోపీనాథ్ విశ్లేషించారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డాలర్ తక్కువ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధాన ప్రపంచ కరెన్సీగా కొనసాగడంలో ఎటువంటి అవరోధం ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత ‘విచ్ఛిన్నం’ చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. భౌగోళిక ఉద్రిక్తత నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ వినియోగమూ పెరిగే వీలుందని విశ్లేషించారు. ‘‘యుద్ధం నేపథ్యంలో క్రిప్టోకరెన్సీల నుండి స్టేబుల్కాయిన్లు– సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వరకు డిజిటల్ ఫైనాన్స్ ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల డిజిటల్ ఫైనాన్స్‌పై అంతర్జాతీయ నియంత్రణ ప్రస్తుతం అవశ్యం’’ అని ఆమె అన్నారు. ఇక రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల విభిన్న దేశాలు, దేశీయ గ్రూపుల మధ్య ప్రత్యేక వాణిజ్య అవగాహనలు, చిన్న కరెన్సీ బ్లాక్‌లు ఆవిర్భవించే అవకాశం ఉందని ఆమె అన్నారు. -
సంపద పెరిగింది.. సంతోషం తగ్గింది!
ముంబై: దేశీయంగా డాలర్ మిలియనీర్ల (రూ. 7 కోట్ల పైగా వ్యక్తిగత సంపద ఉన్న వారు) సంఖ్య 2021లో 4.58 లక్షల కుటుంబాల స్థాయికి చేరింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. హురున్ రిపోర్ట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026 నాటికి భారత్‌లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 30 శాతం పెరిగి 6 లక్షల కుటుంబాల స్థాయికి చేరనుంది. ముంబైలో అత్యధికంగా 20,300 కుటుంబాలు, ఢిల్లీలో 17,400, కోల్‌కతాలో 10,500 కుటుంబాలు డాలర్ మిలియనీర్ల కేటగిరీలో ఉన్నాయి. మరోవైపు, ఇటు వ్యక్తిగత అటు వృత్తిగత జీవితాల్లో సంతోషంగా ఉన్న వారి సంఖ్య మాత్రం 72 శాతం నుంచి 66 శాతానికి తగ్గింది. ఈ అంశానికి సంబంధించి హురున్ నిర్వహించిన సర్వేలో 350 మంది డాలర్ మిలియనీర్లు పాల్గొన్నారు. ‘భారత మార్కెట్లో అడుగు పెట్టడానికి లేదా ఇప్పటికే ఉన్న తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి లగ్జరీ బ్రాండ్లు, సర్వీస్ ప్రొవైడర్లకు వచ్చే దశాబ్ద కాలంలో ఎన్నో అర్థవంతమైన అవకాశాలు లభించగలవు‘ అని హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రిసర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు. 130 కోట్ల పైగా జనాభా గల దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కుబేరులపై హురున్ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్‌లోని టాప్ 100 మంది సంపన్నుల సంపద ఏకంగా 775 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో ప్రపంచం మొత్తం మీద కడు పేదరికంలోకి జారిపోయే వారి సంఖ్యలో దాదాపు సగభాగం (4.6 కోట్ల మంది) భారత్‌లోనే ఉంటారని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. సర్వేలోని ఇతర విశేషాలు.. ► పన్నులు చెల్లించడమనేది తమ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా భావించే వారి సంఖ్య.. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతుకన్నా తక్కువే ఉంది. ► సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అభిప్రాయపడిన వారి సంఖ్య కేవలం 19 శాతమే. ► మూడింట రెండొంతుల మంది తమ సంతానాన్ని ఉన్నత విద్య కోసం విదేశాలు పంపించేందుకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఫేవరెట్ గమ్యంగా అమెరికా ఉండగా, బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► ఇక వినియోగంపరమైన అంశాల విషయానికొస్తే.. నాలుగో వంతు మంది తమ కార్లను ప్రతి మూడేళ్లకోసారి మార్చేస్తున్నారు. చాలా మందికి మెర్సిడెస్ బెంజ్ కార్లు ఫేవరెట్‌గా ఉంటున్నాయి. ఇంకా మిలియనీర్లకు అత్యంత ఇష్టమైన హాబీల్లో.. వాచీల కలెక్షన్ కూడా ఉంది. సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది.. తమ దగ్గర కనీసం నాలుగు వాచీలైనా ఉన్నట్లుగా తెలిపారు. మళ్లీ వీటిలో రోలెక్స్ అత్యంత ఇష్టమైన బ్రాండ్‌గా ఉంది. ► ఆతిథ్యానికి సంబంధించి అత్యధిక శాతం మంది ఇష్టపడే హోటల్‌గా ఇండియన్ హోటల్స్‌కి చెందిన తాజ్, ఫేవరెట్ ఆభరణాల రిటైలర్‌గా తనిష్క్ (రెండూ టాటా గ్రూప్‌నకు చెందివే) అగ్రస్థానంలో ఉన్నాయి. లగ్జరీ ఉత్పత్తుల బ్రాండ్ లూయి విటన్, ప్రైవేట్ జెట్ బ్రాండ్ గల్ఫ్‌స్ట్రీమ్.. అత్యధిక శాతం మంది డాలర్ మిలియనీర్లకు ఫేవరెట్‌గా ఉన్నాయి. ► చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగిస్తున్న డాలర్ మిలియనీర్ల సంఖ్య 2021లో రెట్టింపై 36 శాతానికి చేరింది. -
రూపాయి ‘బాహుబలి’
ముంబై: డాలర్‌తో రూపాయి మరికొంత బలపడింది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం రోజుతో పోలిస్తే 29 పైసలు లాభంతో 74.42 వద్ద ముగిసింది. ఈ ఏడాది నవంబర్ 24 తర్వాత రూపాయి తిరిగి గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఏడాది చివర్లో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలను చేపట్టడం రూపాయికి బలాన్నిచ్చింది. స్థానికంగా కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, ఆసియా కరెన్సీలు సైతం బలంగా ఉండడం సానుకూల సెంటిమెంట్‌కు దారితీసినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. ‘‘రానున్న రోజుల్లో విదేశీ పెట్టుబడులు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, ఎగుమతిదారులు ఏడాది చివర్లో అమ్మకాలు చేపట్టడంతో డాలర్ నెల గరిష్టానికి చేరింది. సెంట్రల్ బ్యాంకు జోక్యం చేసుకోకుండా వేచి చూసే ధోరణితోనే ఉంది. చదవండి:2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..! -
డాలర్ల రాకపై రూపాయి భరోసా
ముంబై: దేశానికి మరింత భారీగా డాలర్లు వస్తా యన్న భరోసా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 40 పైసలు బలపడి 73.29కి చేరింది. గడచిన రెండు నెలల్లో (జూన్ 14 తర్వాత) రూపాయి ఈ స్థాయికి బలోపేతం కావడం ఇదే తొలిసారి. వడ్డీరేట్లు సమీపకాలంలో పెంచే అవకాశాలు లేవని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ సంకేతాలు డాలర్ బలహీనతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 73.20 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాలతో 92.29 వద్ద ట్రేడవుతోంది. భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ముగింపు 73.69. సోమవారం 73.46 వద్ద ప్రారంభమైంది. 73.21 గరిష్ట–73.54 కనిష్ట శ్రేణిలో కదలింది. గడచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి లాభపడుతూ వస్తోంది. డాలర్‌పై ఈ రోజుల్లో 95 పైసలు లాభపడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
రూపాయి.. అధరహో
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 53 పైసలు బలపడి 73.69 స్థాయికి చేరింది. గడచిన 10 వారాల్లో రూపాయి ఇంత స్థాయిలను చూడ్డం (జూన్ 16 తర్వాత) ఇదే తొలిసారి. సరళతర ఆర్థిక విధానాలనే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కొనసాగిస్తుందన్న అంచనాలు, ఈక్విటీ మార్కెట్ల బులిష్ వైఖరి వంటి అంశాలు రూపాయి భారీగా బలపడ్డానికి కారణమని నిపుణుల అంచనా. ఫారెన్ బ్యాంకుల డాలర్ అమ్మకాలు, దేశంలోకి విదేశీ నిధులు భారీగా వస్తాయన్న అంచనాలు కూడా రూపాయి బలోపేతానికి కారణం. రూపాయి గురువారం ముగింపు 74.22. దీనితో పోల్చితే శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాలతో 74.17 వద్ద ప్రారంభమైంది. వారంలో రూపాయి 70 పైసలు బలపడింది. ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 73.78 వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ 93పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). చదవండి : వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా -
రూపాయి.. అధరహో
ముంబై: చాలా రోజుల తర్వాత డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడింది. విదేశీ ఇన్వెస్టర్లు నుంచి పెట్టుబడుల వరద పారడంతో రూపాయి క్రమంగా బలం పుంజుకుంది. డాలర్ మారకంతో పోల్చితే 17 పైసలు లాభపడింది. గత కొంత కాలంగా ఇండియన్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఆల్‌టైం హైలను తాకినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బుధవారం ఒక్క రోజే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 238 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మరోవైపు అమెరికా మార్కెట్లో డాలర్ ఒడిదుడులకు లోనవుతోంది. ఫలితంగా గురువారం మార్కెట్లో డాలర్లతో పోల్చితే రూపాయి గణనీయంగా బలపడింది. ఏకంగా 17 పైసల వరకు విలువను పెంచుకుని 74.27 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకు ముందు డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.44 దగ్గర కొనసాగింది. -
కోట్ల ఆస్తిని కేవలం ఒక్కడాలర్‌కే అమ్మాడు, ఎందుకో తెలుసా?
కోట్ల విలువైన ఆస్తిని ఎవరైనా రూపాయిలకే అమ్ముతారు. ఇదిగో ఈ పెద్ద మనిషి అలాగే అమ్మాడు. కోట్ల విలువైన సెలూన్ షాప్‌ను తన షాపులో పనిచేసే ఉద్యోగికి కేవలం డాలర్ (ఇండియన్ కరెన్సీలో రూ.74.91)కే అమ్మాడు. ఇటలీకి చెందిన పియస్ 1965లో రోడ్ సైడ్ చిన్న బార్బర్ షాప్ నుంచి ప్రముఖ హెయిర్ సెలూన్ ఓనర్ దాకా ఎదిగారు. ఓవైపు కుటుంబ పోషణ కోసం ఎయిర్ సెలూన్ బిజినెస్ రన్ చేస్తూ.. పార్ట్ టైమ్‌లో తనకెంతో ఇష్టమైన సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తుండేవారు. సరిగ్గా అదే సమయంలో అంటే 15ఏళ్ల క్రితం ఓ రోజు పియస్‌కు కాథీ మౌరా అనే స్కూల్ విద్యార్ధిని 'అంకుల్ నాకు జాబ్' కావాలని ఫోన్ చేసింది. కాథీ మౌరా స్కూల్ డేస్‌లో పార్ట్ టైమ్ జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఆమె స్కూల్ విద్యార్ధి కావడం, పైగా అనుభవం లేదని చాలా మంది జాబ్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఎక్కడ జాబ్ దొరక్కపోవడంతో కాథీకి ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి తాను చదివే స్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ను తనకు జాబ్ చూడాలని కోరింది. దీంతో సదరు టీచర్ పియస్ ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆ తరువాత పియుస్ కు కాథీ ఫోన్ చేయడం, పియుస్కు చెందిన హెయిర్ సెలూన్లో జాయిన్ అవ్వడం ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే పియుస్ ఎయిర్ సెలూన్‌కు కాథీ ఓనర్ అయ్యింది. ఎలా అంటారా? ఈ 15 ఏళ్ల నుంచి కాథీ మౌరా హెయిర్ సెలూన్లో మంచి ఎంప్లాయిగా, హెయిర్ స్టైలిష్‌గా మంచి పేరు సంపాదించింది. అయితే వయస్సు రిత్యా పియుస్ తన హెయిర్ సెలూన్‌ను అమ్మాలని అనుకున్నాడు. అది కూడా తన హెయిర్ సెలూన్లో పనిచేసే కాథీకి. కేవలం ఒక్కడాలర్‌కే. పియుస్ ఇన్నేళ్లు అపురూపంగా చూసుకున్న తన సెలూన్‌ను కాథీ చేతిలో పెట్టాడు. ఈ సందర్భంగా పియుస్ మాట్లాడుతూ.. 'కాథీ చాలా మంచి అమ్మాయి. పైగా మంచి హెయిర్ స్టైలిష్ట్. 15ఏళ్లు నాతోనే పనిచేసింది. ఆమెకు కృతజ్ఞతగా హెయిర్ సెలూన్ ను అమ్మేశాను'. కానీ ఒక్కడాలర్‌కే సెలూన్ అమ్మడంపై కాథీ ఒప్పుకోలేదని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఉద్యోగిని పట్ల చూపిన ప్రేమపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చదవండి : దేశంలో బంగారం ధరలపై డిస్కౌంట్, తొలిసారి ఇలా -
ఫెడ్ ఎఫెక్ట్: రుపీ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి భారీ పతనాన్ని నమోదు చేసింది. డాలరు మారకంలో 74.08 వద్ద స్థిరపడింది. ఏప్రిల్ 7 తరువాత ఇదే ఎక్కువ నష్టం. డాలర్ సూచిక 0.29శాతం పెరిగి 91.39 కు చేరుకుంది. బుధవారం రూపాయి 73.32 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.(బ్యాంక్స్, మెటల్ దెబ్బ: నష్టాల ముగింపు) యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 33 పైసలు క్షీణించి 73.65 వద్దకు ప్రారంభమైంది. ఊహించిన దానికంటే ముందుగానే యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాల మధ్య డాలరువైపు ఇన్వెస్టర్ల పెట్టుబడులు మళ్లాయి. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనమైన నోట్‌తో ప్రారంభమైందని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ తెలిపింది. మరోవైపు బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.60శాతం పడి73.94 డాలర్లకు చేరుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు కూడా దిగి వచ్చాయి. ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. చివరకు సెన్సెక్స్ 179 పాయింట్లు క్షీణించి 52323 వద్ద,నిఫ్టీ 76 పాయింట్లు పతనమై 15691 వద్ద ముగిసాయి. చదవండి: కరోనా సంక్షోభం: గూగుల్ మరోసారి భారీ సాయం -
కరోనా సెగ : రుపీ ఢమాల్
సాక్షి,ముంబై: కరోనా మహమ్మారి ప్రకంపనలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి భయాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లో భారీ సెల్ ఆఫ్ కనిపించింది. ఫలితంగా 1400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 48 వేల దిగువకు పడి పోయింది. అటు ఫారెక్స్మార్కెట్లో దేశీయ కరెన్సీ రూపాయి కూడా భారీ నష్టాలను మూటగట్టుకుంది. డాలరు మారకంలో ఏకంగా 52 పైసలు క్షీణిచి 74.87 స్థాయికి చేరింది. శుక్రవారం రూపాయి 74.35 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.10 శాతం పెరిగి 91.64 వద్ద ఉంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ధరలు బలహీనపడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ 0.37 శాతం పడిపోయి 66.52 డాలర్లకు చేరుకుంది. (దలాల్ స్ట్రీట్‌లో కరోనా ప్రకంపనలు) కాగా దేశంలో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి రోజువారీ కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్‌దిశగా అడుగులు వేస్తోంది. వరుసగా ఐదో రోజు రెండున్నర లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో మరో 2,73,810మంది కరోనా బారిన పడగా, గడిచిన 24 గంటల్లో 1619 మంది కరోనాతో మరణించారు. (మరో దఫా ‘ఉద్దీపన’ చర్యలు: రాజీవ్ కుమార్) -
మరింత క్షీణించిన రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లోకి జారుకుంది. బుధవారం రూపాయి ఒక నెలలో కనిష్ట స్థాయికి బలహీనపడింది. యుఎస్ బాండ్ దిగుబడి పెరిగిన నేపథ్యంలో డాలర్ లాభపడుతోంది. దీంతో ఫారెక్స్ ట్రేడర్లు రూపాయిలో అమ్మకాలకు దిగారు. దీంతో డాలర్ మారకంపోలిస్తే మన కరెన్సీ 73.52 ట్రేడింగ్‌ను ఆరంభించింది. మంగళవారం నాటి ముగింపు 73.38 తో పోలిస్తే 73.59 స్థాయి వద్ద రూపాయి మార్చి1 నాటికి స్థాయిని టచ్ చేసింది. అమెరికా బాండ్ దిగుబడి పుంజుకున్న నేపథ్యంలో రూపాయ విలువ నెల కనిష్టానికి పడిపోయింది. భవిష్యత్తులో మరింత పడిపోవచ్చని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా డాలర్లకు డిమాండ్ బావుందని వ్యాపారులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో పతనమైన స్థాయికి పతనంకానుందని స్టాండర్డ్ చార్టర్డ్ పిఎల్‌సిలో పారుల్ మిట్టల్ సిన్హా అంచనా వేశారు. 76.5 వద్ద ఏడాది కనిష్టానికి చేరనుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు రూపాయి విలువను ప్రభావితం చేయనున్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా బలహీనంగా కొనసాగుతున్నాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ప్రస్తుతం 455 పాయింట్లు క్షీణించి 49698 వద్ద 49700 స్థాయిని కోల్పోయింది. అలాగే నిఫ్టీ కూడా 103 పాయింట్ల నష్టంతో 14741 వద్ద ట్రేడ్ అవుతోంది. -
దిగి వస్తున్న బంగారం ధరలు
సాక్షి, ముంబై: బంగారం ధరలు మరింత దిగి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆల్‌టైం గరిష్టంనుంచి క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్ప క్షీణతను నమోదు చేయగా వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. నేడు (మార్చి 31న) మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో, జూన్ ఫ్యూచర్స్ 0.9 శాతం తగ్గి 10 గ్రాములకు 44,304 రూపాయల ట్రేడవుతున్నాయి. మే వెండి ఫ్యూచర్స్ 0.84 శాతం తగ్గి కిలోగ్రాము 62,595 వద్ద ట్రేడవుతున్నాయి. (నయా ట్రెండ్: కారు అలా కొనేస్తున్నారట!) తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలోకూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు 24 క్యారెట్ల పసిడి ధర రూ.380 తగ్గి,10 గ్రాములు రూ.45,110 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,350కి పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి కిలో ధర రూ.68,700 వద్ద మార్కెట్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,4400 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,490 వద్ద మార్కెట్ అవుతోంది. రూ .44,300- 44,100 స్థాయిల వద్ద బంగారానికి మద్దతు ఉంటుందని రూ .44,660-44,800 స్థాయిల వద్ద రెసిస్టెన్స్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండికి 62,800-62,500 రూపాయల మద్దతు, 63,600-64,000 స్థాయిలలో ప్రతిఘటన ఉందని నిపుణులు అంటున్నారు. రూపాయిలో బలహీనత ఉన్నప్పటికీ, వెండి బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయి. అటు డాలర్ బలం పుంజుకుని నాలుగున్నర నెలల గరిష్ట స్థాయికి చేరుకుని 93 మార్కును దాటింది. అమెరికా బాండ్ దిగుబడి పుంజుకున్న నేపథ్యంలో రూపాయ నెల కనిష్టానికి చేరింది. భవిష్యత్తులో మరింత పడిపోవచ్చని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా డాలర్లకు డిమాండ్ బావుందని వ్యాపారులు భావిస్తున్నారు. (హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే) అంతర్జాతీయ మార్కెట్లలోనూ బులియన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ బంగారం ధరల 0.1 శాతం తగ్గి ఔన్సుకు 1,683.56 డాలర్లకు చేరుకుంది. వెండి 24.01 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, ప్లాటినం 0.5 శాతం పెరిగి 1,160.05 డాలర్లకు, పల్లాడియం 0.7 శాతం పెరిగి 2,607.04 డాలర్లకు చేరుకుంది. చైనాలో ఫ్యాక్టరీ కార్యకలాపాల డేటా కారణంగా బంగారం రేట్లు మరింత పడిపోయాయని రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించిన మల్టీ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
డాలర్ దెబ్బతో రూపీ ఢమాల్
సాక్షి, ముంబై: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ 34 పైసలు క్షీణించింది. ప్రధానంగా అమెరికా కరెన్సీ డాలరు పుంజుకోవడం, ముడి చమురు ధరలు పెరగడంతో డాలరుతో పోలిస్తే రూపాయి 34 పైసలు తగ్గి 72.85 స్థాయికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 0.01 శాతం పెరిగి 92.94 కు చేరుకుంది. శుక్రవారం రూపాయి 72.51 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 870 పాయింట్లు ఎగియగా,నిఫ్టీ 263పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. హోలీ కారణంగా ఫారెక్స్ మార్కెట్ సోమవారం పనిచేయని సంగతి తెలిసిందే. (మెటల్ షైన్ : సెన్సెక్స్ 800 పాయింట్లు జంప్) -
మూడో రోజూ రూపాయి వీక్
ముంబై: వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ బలహీనపడింది. డాలరుతో మారకంలో 23 పైసలు క్షీణించి 73.25 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొలుత 11 పైసలు తక్కువగా 73.13 వద్ద నీరసంగా ప్రారంభమైంది. అయితే తదుపరి కోలుకుని ఇంట్రాడేలో 72.93 వద్ద గరిష్టానికి చేరింది. ఆపై బలహీనపడుతూ ఒక దశలో 73.29కు చేరింది. చివరికి 73.25 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో 53 పైసలు కోల్పోయింది. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో అమ్మకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరు ఇండెక్స్ బలపడుతూ వస్తోంది. తాజాగా 0.3 శాతం ఎగసి 92.22కు చేరింది. దీంతో రూపాయి నీరసిస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ సెనేట్ 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, ఉపాధి గణాంకాలు పుంజుకోవడం, బాండ్ల ఈల్డ్స్ బలపడటం, అధిక క్రూడ్ ధరలు వంటి అంశాలతో డాలరు దాదాపు 4 నెలల గరిష్టానికి చేరింది. -
మళ్లీ రూపాయి పతనం
సెకండ్ వేవ్‌లో భాగంగా పలు యూరోపియన్ దేశాలతోపాటు.. యూఎస్‌లోనూ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో దేశీ కరెన్సీకి సైతం ఆ సెగ తగులుతోంది. దీంతో వరుసగా రెండో రోజు డాలరుతో మారకంలో రూపాయి పతన బాటలో సాగుతోంది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 30 పైసలు(0.4 శాతం) కోల్పోయి 74.40ను తాకింది. ఆగస్ట్ 27 తదుపరి ఇది కనిష్టంకాగా.. గురువారం రూపాయి సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు చేరిన విషయం విదితమే. గురువారం డాలరుతో మారకంలో రూపాయి 23 పైసలు క్షీణించి 74.10 వద్ద ముగిసింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లకు సెలవుకాగా.. యూఎస్ కాంగ్రెస్‌లో ప్యాకేజీకి ఆమోదముద్ర పడకపోవడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడుతూ వస్తోంది. ఇది రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. ఇదీ ప్రభావం కరోనా వైరస్ కట్టడికి వీలుగా బ్రిటన్ బాటలో తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలలోనూ ఆంక్షలు విధిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి దెబ్బతగలనున్న అంచనాలు బలపడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు, ముడిచమురు ధరలు పతన బాటలో సాగుతుంటే.. సంక్షోభ సమయాల్లో పెట్టుబడులను ఆకట్టుకునే పసిడి మెరుస్తోంది. దీనికితోడు ఈ వారంలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుండటం, అధ్యక్ష ఎన్నికలు వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. సమీపకాలంలో రూపాయికి 74.95 వద్ద గట్టి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని ఐఎఫ్ఏ గ్లోబల్ సీఈవో అభిషేక్ గోయెంకా అంచనా వేశారు. ఇదేవిధంగా 73.65 వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. -
అన్‌లాక్ 5.0 : రుపీకి జోష్
సాక్షి, ముంబై : అన్‌లాక్ 5.0 సడలింపులు, దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి బాగా పుంజుకుంది. డాలరు మారకంలో రూపాయి 63 పైసలు ఎగిసింది. బుధవారం 73.76 వద్ద ముగిసిన రూపాయి గురువారం ఆరంభంలోనే 22 పైసలు ఎగిసింది. ఆనంతరం మరింత లాభపడి 73.14 వద్ద ఉత్సాహంగా ముగిసింది. అటు దేశీయ కీలక సూచీలు ఆరంభం నుంచి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 635 పాయింట్లకుపైగా ఎగిసి 38 700 ఎగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 173 పాయింట్ల లాభంతో 11500 సమీపంలో ఉంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్, బజాజ్ ఫిన్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్, టెక్ మహీంద్ర భారీగా లాభపడుతున్నాయి. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లాంటి సినిమా రంగ షేర్లలో కొనుగోళ్ల సందడి నెలకొంది. -
ఈక్విటీ షాక్ : 20 పైసలు క్షీణించిన రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం నష్టాల్లో ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల బలహీనత నేపథ్యంలో రూపాయి 20 పైసలు నష్టపో్యింది. అమెరికా డాలరు మారకంలో రూపాయి 20 పైసలు క్షీణించి 73.58 వద్ద ముగిసింది. 73.50 వద్ద బలహీనంగా ట్రేడింగ్ ను ఆరంభించి,ఆ తరువాత మరింత పతనమై 73.64 కనిష్టాన్ని నమోదు చేసింది. .డాలర్‌తో పోలిస్తే సోమవారం 7 పైసల లాభంతో 73.38 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అటు డాలర్ ఇండెక్స్ 0.04 శాతం నష్టంతో 93.61 వద్దకు ఉంది. ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్ కు 0.65 శాతం పెరిగి 41.71 డాలర్లకు చేరుకుంది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో వరుసగా నాలుగవ సెషన్ లో కూడా నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు కుప్పకూలి 37734 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11153 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో కీల సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. ప్రధానంగా ఆటో షేర్లు భారీగా నష్టపోగా, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్, రియాల్టీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు ఒక్కో శాతానికి పైగా పడిపోయాయి. మరోవైపు, ఐటీ, ఫార్మాలాభపడ్డాయి. జీ, గెయిల్, అదానీ పోర్ట్స్, భారతి ఇన్ ఫ్రా టెల్, టాటా మటార్స్, ఇండస్ ఇండ్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ లూజర్స్ గాఉన్నాయి. హెచ్‌సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ సిప్లా, డాక్టర్ రెడ్డీస్ , భారతి ఎయిర్టెల్, ఎస్ బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ లాభాలను ఆర్జించాయి. -
డాలర్ బలం – రూపాయి బలహీనం
ముంబై: ఆరు కరెన్సీలతో (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ట్రేడయ్యే– డాలర్ ఇండెక్స్ బలోపేతంకావడం రూపాయి సెంటిమెంట్‌పై బుధవారం ప్రభావాన్ని చూపింది. ఇంటర్ బ్యాంక్ పారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు బలహీనపడి 73.03 వద్ద ముగిసింది. కరోనా తీవ్ర సవాళ్లు విసరడానికి కొద్ది రోజుల ముందు– మార్చి మధ్యస్థంలో 52 వారాల గరిష్టం 104 వరకూ వెళ్లిన డాలర్ ఇండెక్స్, అటు తర్వాత తీవ్ర ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో క్రమంగా తగ్గుతూ మంగళవారం 52 వారాల కనిష్టం 91.73ను చూసింది. అయితే బుధవారం వెలువడిన అమెరికా తయారీ పరిశ్రమ ఇండెక్స్ ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడంతో డాలర్ కనిష్ట స్థాయిల నుంచి కొంత కోలుకుంది. ఇది రూపాయి సెంటిమెంట్‌పై స్వల్ప ప్రభావాన్ని చూపినట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. అయితే భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల రాక కొనసాగడం, స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగితే, రూపాయి మరింత బలపడే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం భారీగా 73 పైసలు లాభపడి 72.87 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
73 పైసలు లాభపడిన రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయిమంగళవారం భారీగా పుంజుకుంది. డాలరు మారకంలో 73 పైసలు ఎగిసి 72.87 వద్ద ముగిసింది. తద్వారా డాలరుతో కీలకమైన 73 స్థాయిని అధిగమించింది. ఈక్విటీ మార్కెట్ల బలానికి తోడు, డాలరు బలహీనత నేపథ్యంలో ఫారెక్స్ ట్రేడర్లు కొనుగోళ్లు కరెన్సీకి ఊతమిచ్చాయి. ద్రవ్యతపై ఒత్తిడిని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ చర్యలను ప్రకటించడంతోసెంటిమెంట్ బలపడిందని వ్యాపారులు తెలిపారు. 73.18 వద్ద ప్రారంభమైన రూపాయి అనంతరం మరింత పుంజుకుంది. 72.75 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని, 73.19 వద్ద కనిష్టాన్నితాకింది. చివరకు 72.87 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.25 శాతం తగ్గి 91.91 వద్దకు చేరింది. మరోవైపు లాభాలతో రోజంతా ఉ త్సాహంగా కొనసాగిన సెన్సెక్స్ 272 పాయింట్లు ఎగిసి 38900 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 11470 వద్ద ముగిసింది. -
రూపాయికి ‘శక్తికాంత్’ బలం
ముంబై: కరోనా నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనడంలో తమ వద్ద ఉన్న అస్త్రాలు అయిపోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ చేసిన ప్రకటన భారత కరెన్సీ– రూపాయికి బలాన్ని ఇచ్చింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 48 పైసలు బలపడింది. 73.82 వద్ద ముగిసింది. దేశంలోకి కొనసాగుతున్న విదేశీ నిధుల ప్రవాహం, దేశీయ సానుకూల ఈక్విటీ మార్కెట్, ఆరు కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ బలహీనత వంటి అంశాలూ రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 74.30 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. 73.81–74.36 శ్రేణిలో కదలాడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
ఆరు నెలల గరిష్టానికి మార్కెట్
బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల కొనుగోళ్ల జోరుతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 52 పైసలు పుంజుకొని 74.32కు చేరడం, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, వినోద రంగ పరిశ్రమ (సినిమా హాళ్లు తెరవడానికి)మరిన్ని వెసులుబాట్లు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటం, మూడు ప్రైవేట్ బ్యాంక్‌లను ఎఫ్టీఎస్ఈ గ్లోబల్ ఇండెక్స్‌లో చేర్చడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 38,799 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 11,466 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అప్రమత్తత అవసరం... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ లాభాలు అంతకంతకూ పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 460 పాయింట్లు, నిఫ్టీ 125 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. నిధుల వరద పారుతుండటంతో మార్కెట్ జోరుగా పెరుగుతోందని, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్మా చికిత్సకు అమెరికా ఎఫ్‌డీఏ ఓకే... కరోనా వైరస్ సోకిన రోగులకు ప్లాస్మా చికిత్స చేయడానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ను ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోవడానికి కొన్ని నిబంధనలను సడలించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఫలితంగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్‌ను ఉపయోగించే అవకాశాలున్నాయి. ఈ రెండు అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఆసియా మార్కెట్లు 1 శాతం యూరప్ మార్కెట్లు 2 శాతం రేంజ్లో లాభపడ్డాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 3.5% లాభంతో రూ.1,387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. హీరో మోటొకార్ప్, ఆఫిల్ ఇండియా, ఇమామి, సనోఫి ఇండియా, ఎస్ఆర్ఎఫ్, ఆర్తి డ్రగ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ముంబై ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్ట్‌లో 74 శాతం వాటాను రూ.15,000 కోట్లకు కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 7 శాతం లాభంతో రూ.249 వద్ద ముగిసింది. ఈ గ్రూప్‌లోని ఇతర షేర్లు కూడా లాభపడ్డాయి. ► రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ. 1 ముఖ విలువ పది షేర్లుగా విభజన చేసిన నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేర్ ఇంట్రాడేలో 10 శాతం ఎగసింది. చివరకు 0.36 శాతం లాభంతో రూ.2,178 వద్ద ముగిసింది. ► దాదాపు 450కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, రెప్కో హోమ్ ఫైనాన్స్, అరవింద్ ఫ్యాషన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
18 పైసలు ఎగిసిన రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీలలో భారీగా కొనుగోళ్లతో దేశీయ కరెన్సీ శుక్రవారం లాభాల్లో ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 18 పైసలు పెరిగి 74.84 వద్ద స్థిరపడింది. అంతకుముందు 75.02 వద్ద ముగిసిన రూపాయి పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలం, డాలరు బలహీన నేపథ్యంలో లాభాల్లో ముగిసింది. ముడి చమురు ధరలను పతనంకూడా రూపాయికి మద్దతిచ్చినట్టు ఫారెక్స్ వ్యాపారులు చెప్పారు. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.29 శాతం క్షీణించింది 44.77 డాలర్లకు , డాలర్ ఇండెక్స్ 0.17 శాతం పెరిగి 92.95 వద్దకు చేరింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ దాదాపు 300 పాయింట్ల మేర లాభాల్లో ఉంది. సెన్సెక్స్ 296 పాయింట్లుఎగియగా, నిఫ్టీ 86 పాయింట్లు లాభపడి 11390 వద్ద కొనసాగుతోంది. -
బర్త్‌డే కేకులో డబ్బులే డబ్బులు...
పుట్టినరోజు అంటేనే కేక్ కటింగ్, ఈ తంతు ముగియగానే ఇష్టమైన వారు కానుకలు సమర్పించుకుంటారు. అయితే ఈ రెండూ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇక్కడ చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఓ తండ్రి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం అతని కుటుంబం కేక్ సిద్ధం చేసింది. అయితే కేక్ కట్ చేయనివ్వలేదు. ఎందుకంటే ఆ కేక్‌లోనే అసలు సిసలైన గిఫ్ట్ ఉంది. దీంతో కేక్ పైన ఉన్న హ్యాపీ బర్త్‌డే టాపర్‌ను బయటకు తీస్తుండగా దాని చివరన నోట్ల కట్టలు కనిపించాయి. లాగుతూ ఉన్నంత సేపు అవి వస్తూనే ఉన్నాయి. ఆ డాలర్ల కట్టలు కేకులో తడవకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లో పెట్టారు. ఇక ఈ నోట్ల కట్టలను తీస్తున్న ఆ తండ్రి ఆనందం చెప్పనలవి కాదు. చిన్నపిల్లాడిలా గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. (స్వీట్ షాక్) "నాకు తెలుసు, మీరు నన్ను తప్పకుండా సంతోషపెడ్తారని.." అంటూ ఏకంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే అతను నోట్లు లాగే క్రమంలో కేక్ ఏమాత్రం దిబ్బతినకపోవడం గమనార్హం. ఈ వీడియోను అతని కూతురు టోనీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ఈ రోజు నాన్నగారి పుట్టిన రోజు. ప్రతి బర్త్‌డేకు ఆయన ఒక్కటే కోరుకుంటారు. అదే డబ్బు. అందుకే ప్రతి ఏడాది ఆయన్ను అదే డబ్బులతో ఎన్నోరకాలుగా సర్ప్రైజ్ చేసేందుకు నా సోదరి, తల్లి ప్రయత్నిస్తూనే ఉంటారు" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "కేకులో అంత డబ్బు ఎలా పెట్టారో'నని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అతని ఆనందాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతూ.. 'నేను కూడా మా నాన్నకు ఏది కావాలో తెలుసుకుని తప్పకుండా ఇస్తాను" అంటున్నారు. (వైరల్: బట్టలు చిరిగేలా కొట్టుకున్నారు) My dads birthday is today. Each birthday he wants the same thing. Cash. Each birthday my sister and mom find a different way to surprise him with it. pic.twitter.com/qRmzbqnXDP — Toe Knee (@toekneerlynos) July 27, 2020 -
వ్యాక్సిన్ ఆశలు : ఎగిసిన రూపాయి
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి లాభాల్లో ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల దన్ను, డాలరు బలహీనత నేపథ్యంలో మంగళవారం డాలరు మారకంలో రూపాయి 17 పైసలు 74.74 వద్ద స్థిరపడింది. 74.79 వద్ద పాజిటివ్ నోట్‌తో ట్రేడింగ్‌ను ఆరంభించిన రూపాయి ఇంట్రా-డే గరిష్ట స్థాయి 74.73 ని, 74.87 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి మునుపటి సెషన్‌లోని 74.91తో పోలిస్తే 74.74 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.03 శాతం పడిపోయి 95.80కి చేరుకుంది. (భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్) సానుకూల దేశీయ ఈక్విటీలు, కోవిడ్-19 వ్యాక్సిన్ ఆశలు రూపాయికి మద్దతు ఇచ్చాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. మరోవైపు సెన్సెక్స్ 557 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 156 పాయింట్ల లాభంతోనూ కొనసాగుతున్నాయి. కాగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ మొదటి దశ మానవ పరీక్షల ఫలితాలపై ఆశావహ ధోరణి వ్యక్తమైంది. అలాగే భారత దేశ తొలి వ్యాక్సిన్ కోవాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
నష్టాల్లో ముగిసిన రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, డాలరు బలం, ఈక్విటీల భారీ నష్టాల కారణంలో రూపాయి ఆరంభంలోనే నష్టపోయింది. అనంతరం డాలరు మారకంలో 16 పైసలు క్షీణించి 75.35 వద్దకు చేరుకుంది. చివరికి 23 పైసలు నష్టంతో 75.41వద్ద స్థిరపడింది. సోమవారం 75.19 వద్ద ముగిసింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులకు తోడు 6.09 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం, ప్రధానంగా ఆహార వస్తువుల ధరల భారీగా పెరగడం, డాలరు బలం లాంటి అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేశామని ఫారెక్స్ ట్రేడర్లు భావిస్తున్నారు. సీపీఐ గణాంకాల ప్రకారం జూన్ లో ఆహార ద్రవ్యోల్బణం 7.87 శాతం పెరిగింది. అటు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 1.81 శాతం క్షీణించింది. మేనెలలోఇది 3.21 శాతంగా ఉంది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.01 శాతం పడి బ్యారెల్‌కు 41.86 డాలర్లకు, డాలర్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగి 96.56 వద్దకు చేరుకుంది. అటు సెన్సెక్స్800 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో 10602 వద్ద కొనసాగుతోంది. అటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 23,727 కు పెరగ్గా, కేసుల సంఖ్య 9 లక్షలను దాటింది. -
ఎగిసిన రూపాయి
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌గా ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 75.20 వద్ద ప్రారంభమైంది. అనంతరం మరింత ఎగిసి 74.92 ను తాకింది. గత సెషన్ ముగింపుతో పోలిస్తే 16 పైసలు పెరిగింది. శుక్రవారం 75.20 వద్ద స్థిరపడింది. సానుకూల దేశీయ ఈక్విటీలు, డాలరుబలహీనత నేపథ్యంలో రూపాయికి మద్దతు లభిస్తోందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) డేటాకోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారన్నారు. డాలర్ ఇండెక్స్ 0.19 శాతం పడిపోయి 96.46 కు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.72 శాతం పడిపోయి బ్యారెల్ ధర 42.93 డాలర్లకు చేరుకుంది. మరోవైపు సెన్సెక్స్ 400 పాయింట్లు ఎ గిసి 37వేల స్థాయిని తాకింది. ప్రస్తుతం ఈ స్థాయినుంచి వెనక్కి తగ్గిన సెన్సెక్స్ 200 పాయింట్ల లాభాలకు పరిమితమైంది. నిఫ్టీ కూడా ఇదేబాటలో ఉంది. -
రూ.49,000 దిగువకు బంగారం
దేశీయ మల్టీకమోడిటీ ఎక్చ్సేంజ్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర రూ.49000 దిగువున కదలాడుతోంది. ఎంసీఎక్స్‌లో శుక్రవారం ఉదయం సెషన్లో 10గ్రాముల బంగారం ధర రూ.15ల స్వల్ప లాభంతో రూ.48893 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. ఈ వారంలో రూ.49,348 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకిన తర్వాత, బంగారం ధర ముందుకు కదిలేందుకు సంశయిస్తోంది. కోవిడ్-19 కేసులు శరవేగంగా పెరుగుతున్నప్పటికీ.., ఆర్థికవ్యవస్థ రికవరీ ఆశలతో ఈక్విటీ మార్కెట్లలో ఇప్పటికీ కొంత సానుకూల వాతావరణం నెలకొనే ఉంది. ఫలితంగా నేడు బంగారం ధర పరిమితి శ్రేణిలో కదలాడుతున్నాయి. నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి ఔన్స్ బంగారం ధర రూ.281లు నష్టాన్ని చవిచూసి రూ.48878 వద్ద ముగిసింది. పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలహీనతలు రానున్నరోజుల్లో బంగారానికి డిమాండ్‌ను పెంచుతాయని బులియన్ నిపుణులు భావిస్తున్నారు. బంగారానికి అప్‌సైడ్‌లో రూ.49,050-49,300వద్ద కీలక నిరోధ స్థాయిని కలిగి ఉంది. డౌన్‌సైడ్‌లో 48,330 వద్ద కీలక మద్దతు ధర ఉందని వారు అంచనా వేస్తున్నరు. అంతర్జాతీయంగా స్వల్ప లాభాల్లో: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర శుక్రవారం స్వల్పలాభంతో ట్రేడ్ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ బంగారం ధర 2.50డాలర్లు స్వల్పంగా పెరిగి రూ.1,806.30 వద్ద ట్రేడ్ అవుతోంది. అర్థిక అగ్రరాజ్యమైన అమెరికాలో గురువారం ఒక్కరోజే అత్యధికంగా 60వేల కరోనా కేసులు నమోదు కావడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక చర్యల్లో భాగంగా బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపారు. -
రికార్డుస్థాయి వద్ద బంగారంలో లాభాల స్వీకరణ
నిన్నటిరోజు జీవితకాల రికార్డు స్థాయికి ఎగిసిన బంగారం ధరలో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా నేటి ఉదయం సెషన్లో ఎంసీఎక్స్‌లో స్వల్పంగా రూ.64 నష్టపోయి రూ.48,070 వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా కేసులు సంఖ్య అంతర్జాతీయంగా పెరుగుతుండటంతో ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి రక్షణాత్మక సాధనమైన బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో నిన్నటి రోజున దేశీయంగా బంగారం ధర ఒక దశలో రూ.357 లాభపడి రూ.48589 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. అయితే గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి రూ.98 నష్టంతో రూ.48,134 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా 8ఏళ్ల గరిష్టం వద్ద స్థిరంగా: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గురువారం 8ఏళ్ల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ అనూహ్యంగా ర్యాలీ చేయడం ఇందుకు కారణం అవుతోంది. నేడు ఆసియా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1డాలరు స్వలలాభంతో 1,774.25 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరికి ఫెడ్ రిజర్వ్ మరోసారి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తారనే ఆశలతో డాలర్ ఇండెక్స్ బలపడింది. డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు రిస్క్ అసెట్స్‌లైన ఈక్విటీల వైపు మొగ్గచూపడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. అయితే కోవిడ్-19 కేసులు రెండో దశ ప్రారంభం కావడంతో పాటు ఐఎంఎఫ్ అంతర్జాతీయ వృద్ది అవుట్‌లుక్‌ను తగ్గించడం తదితర కారణాలతో రానున్న రోజుల్లో బంగారం తిరిగి ర్యాలీ చేసేందుకు అవకాశాలున్నాయని బులియస్ పండితులు చెబుతున్నారు. నిన్నటి రాత్రి అమెరికా మార్కెట్ ముగిసే సరికి ఔన్స్ బంగారం ధర దాదాపు 7డాలర్ల నష్టంతో 1775 డాలర్ల వద్ద స్థిరపడింది. -
కరోనా : బంగారం మరో రికార్డు
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల మధ్య, బంగారం ధర మరోసారి కొత్త గరిష్టాన్ని తాకింది. కోవిడ్-19 కేసులు తిరిగి పుంజుకుంటూ ఉండటంతో ఆర్థిక పునరుద్ధరణపై ఆందోళనల నేపథ్యంలో పెట్టుబడులు పుత్తడివైపు మళ్లాయి. అంతర్జాతీయంగా రికార్డు ధర పలికిన పసిడి దేశీయంగా కూడా అదే బాటలో పయనించింది. ఫలితంగా బుధవారం 10 గ్రాముల ధర 48,420 రూపాయల వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. 10 గ్రాములకు మంగళవారం నాటి ముగింపు 48,232 రూపాయలతో పోలిస్తే నేడు 48,333 రూపాయల వద్ద ప్రారంభమైంది. అనంతరం మరింత ఎగిసి కొత్త రికార్డును తాకింది. ఇక దేశీయంగా 22 క్యారెట్ల బంగారం ఢిల్లీలో 10 గ్రాములకు 46,800 రూపాయలు కాగా, 24 క్యారెట్ల రిటైల్ ధర 48000 రూపాయలు పలుకుతోంది. అయితే వెండి ధర స్వల్పంగా తగ్గి కిలో ధర 48716 రూపాయలు వద్ద వుంది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్ 1773 డాలర్ల వద్ద ఎనిమిది సంవత్సరాల గరిష్టస్థాయిని తాకింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం భయాలతో డాలరు బలహీనపడింది. దీంతో బంగారం ధర 2012 మార్చి స్థాయికి చేరుకుందని విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయంగా బంగారు ధర పరుగు కొనసాగుతుందని, మహమ్మారి విస్తరణ, మరోసారి లాక్డౌన్ కు దారితీస్తుందనే భయం కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారంవైపు మొగ్గుతున్నారన్నారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లోని బలహీనత బంగారానికి డిమాండ్ పెంచుతోందని అనుజ్ గుప్తా (డివిపి-కమోడిటీస్ అండ్ కరెన్సీ రీసెర్చ్, ఏంజెల్ బ్రోకింగ్) తెలిపారు. త్వరలోనే ఔన్సు ధర 1,800 డాలర్ల నుండి 1,830 డాలర్ల స్థాయిలను తాకనుందని అంచనా వేశారు. -
రూపాయి జోరు : 37 పైసలు జంప్
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా రెండో రోజు కూడా స్థిరంగా ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ర్యాలీకి తోడు డాలరు బలహీనత నేపథ్యంలో మంగళవారం డాలరు మారకంలో రూపాయి పాజిటివ్ గా ట్రేడింగ్ ను ఆరంభించింది. చివరకు 37 పైసల లాభంతో 75.66 వద్ద ముగిసింది. (ఐటీ షేర్లకు ట్రంప్ షాక్ : రికవరీ) ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో రూపాయి 75.86 వద్ద బలంగా ప్రారంభమైంది. రోజులో 75.65 గరిష్ట స్థాయికి, 75.89 వద్ద కనిష్టానికి చేరుకుంది. నిన్న (సోమవారం) 76.02 వద్ద ముగిసింది. ఆరు కరెన్సీల గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.13 శాతం తగ్గి 96.91 వద్దకు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ 0.67 శాతం పెరిగి 43.37 డాలర్లకు చేరుకుంది. అటు సెన్సెక్స్ 550 పాయింట్లు పైగా ఎగియగా, నిప్టీ 10460 ఎగువన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. -
కరోనా : రూపాయి బలహీనం
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్ల బలహీనం, డాలరు స్థిరత్వం నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి నష్టాల్లో ముగిసింది. డాలరు మారకంలో ఆరంభంలో రూపాయి మారకం విలువ 23 పైసలు క్షీణించి 76.17 కు చేరింది. చివరకు 19 పైసలు క్షీణించి 76.03 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఏప్రిల్ 28 తర్వాత దేశీయ కరెన్సీ తొలిసారిగా 76 స్థాయిని అధిగమించింది. శుక్రవారం రూపాయి 75.84 వద్ద ముగిసింది. కరోనా వైరస్ కు పూర్తిగా అడ్డుకట్ట పడలేదన్న ఆందోళనకు తోడు వ్యాక్సిన్ ఆలస్యంలాంటివి సెంటిమెంట్ ను బలహీనపర్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అనిశ్చితి కారణంగా రూపాయి 76.50 స్థాయికి చేరవచ్చని 75.50 వద్ద కీలకమైన మద్దతు ఉందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ కరెన్సీ హెడ్ రాహుల్ గుప్తా పేర్కొన్నారు. బ్యారెల్ ధర 35.59కు చేరింది. గోల్డ్ కూడా అంతర్జాతీయ మార్కెట్లో దిగి వచ్చింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 1721 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు స్టాక్ మార్కెట్లలో బలహీనత కొనసాగుతోంది. సెన్సెక్స్ 424 పాయింట్ల నష్టంతో 33352 వద్ద, నిఫ్టీ119 పాయింట్లు కోల్పోయి 9853 వద్ద కొనసాగుతున్నాయి. -
ఎఫ్ఐఐల రాకతో రూపాయిలో స్థిరత్వం
గత రెండు నెలలుగా భారీ పతనాన్ని చవిచూసిన రూపాయి ఇటీవల సిర్థత్వాన్ని సంతరించుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెసర్లు తిరిగి కొనుగోళ్లు జరపడం ఇందుకు కారణమని ఫారెక్స్ విశ్లేషకులంటున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పతనం, ఫారెక్స్ నిల్వలు వరుసగా 5వారంలోనూ కొత్త జీవితకాల గరిష్టానికి చేరుకోవడం లాంటి అంశాలు రూపాయి స్థిరమైన ట్రేడింగ్‌కు కారణమైనట్లు వారు చెప్పుకొచ్చారు. ఎక్చ్సేంజ్ రేట్ స్థిరత్వం అనేది అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అత్యంత కీలకమైన అంశం. మూలధన కేటాయింపు నిర్ణయాలలో ఇది చెప్పుకొదగిన పాత్ర పోషిస్తుంది. లాక్డౌన్ ప్రకటించిన తరువాత, కరెన్సీ ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటలకు వరకే కుదించారు. ‘‘ కొన్ని ప్రత్యేక కారణాల కలయికలు రూపాయి స్థిరమైన రాణింపునకు తోడ్పాటును అందించాయి. అంతర్జాతీయంగా చైనా యువాన్ బలపడటం, డాలర్ ఇండెక్స్ పతనం దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐ ప్రవాహాలు పెరిగేందుకు సహకరించాయి. ఇటీవల పెద్ద కార్పొరేట్ సంస్థలు వాటా అమ్మకాలతో పాటు రైట్స్ ఇష్యూలు, ఎఫ్‌డీఐలు స్థానిక కరెన్సీకి డిమాండ్‌ను పెంచాయి. దీంతో ఎఫ్‌పీఐలు స్థానిక మర్కెట్లలో నిధుల సమీకరణను ప్రారంభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు రైట్స్ ఇష్యూ, క్యూఐపీల పద్దతిలో 9బిలియన్ డాలర్లను సమీకరించాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెసర్లు రూపాయి ఆధారిత ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి డాలర్లను తీసుకువచ్చారు.’’ అని గ్లోబల్ ట్రేడింగ్ సెంటర్ విశ్లేషకుడు కునాల్ శోభిత తెలిపారు. దాదాపు 2నెలల తర్వాత లాక్డౌన్ సడలింపులతో ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ ఇన్వెస్టర్లు రిస్క్-అసెట్స్‌లైన ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు గడచిన 7రోజుల్లో 3బిలియన్ డాలర్ల కొనుగోళ్లు చేశారు. మార్చి నెలలో దాదాపు 7.7బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపారు. ఏప్రిల్‌లో అర బిలియన్ డాలర్లుగానూ ఉన్నాయి. తైవాన్, సౌత్ కొరియా దేశాల ఈక్విటీ మార్కెట్లలో జరిపిన కొనుగోళ్ల కంటే అధికంగా ఉండటం విశేషం. ‘‘కరోనా వైరస్ అంటువ్యాధి భయాందోళనలు క్రమంగా అంతరించిపోతుండటం ఇన్వెసర్లకు కలిసొస్తుంది. త్వరలో వ్యాపారాలు సాధారణ స్థాయికి చేరుకొవచ్చనే ఆశావమన అంచాలు వారిలో నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తి కట్టడికి భారత్ తీసుకుంటున్న చర్యలు రూపాయి స్థిరత్వం పొంది డాలర్లను పొందడంలో సహాయపడుతుంది.’’ అని కోటక్ సెక్యూరిటీస్‌లో రూపాయి అనలిస్ట్ హెచ్ అనిక్ద బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఫారెన్ ఎక్చ్సేంజ్ నిల్వలు వరుసగా 5వారం కొత్త గరిష్టానికి చేరుకుంది. మార్చి 29తో ముగిసిన వారంలో మొత్తం 493 బిలియన్ డాలర్ల విలువైన నిల్వలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ డాలర్ల కొనుగోలు చేయడంతో నిల్వలు పెరినట్లు డీలర్లు చెబుతున్నారు. -
ఆరు రోజుల లాభాలకు బ్రేక్
ఆరు రోజుల ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ కారణంగా గురువారం స్టాక్ మార్కెట్ పతనమైంది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, మన దగ్గర కరోనా కేసులు పెరుగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం... ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ తదితర బ్లూ చిప్ షేర్లు పెరగడంతో నష్టాలు తగ్గాయి. సెన్సెక్స్ కీలకమైన 34,000 పాయింట్లపైన నిలదొక్కుకోలేకపోయినా, నిఫ్టీ మాత్రం 10,000 పాయింట్లపైననే ముగిసింది. రోజంతా 599 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 129 పాయింట్ల పతనమై 33,981 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 10,029 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కార ణంగా సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీని రద్దు చేయాలన్న పిటీషన్‌పై ఆర్థిక శాఖ వివరణను సుప్రీం కోర్టు కోరింది. దీంతో బ్యాంక్ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్, ఆర్థిక రంగ, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోయాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ► ఏషియన్ పెయింట్స్ షేర్ 5% నష్టంతో రూ.1,633 వద్ద ముగిసింది. ► రైట్స్ ఇష్యూ విజయవంతం కావడంతో రిలయన్స్ షేర్ 2.4% లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని(10.68 లక్షల కోట్లు) దాటింది. ► అమెజాన్ సంస్థ 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదన్న వార్తలతో భారతీ ఎయిర్టెల్ షేర్ 4% లాభంతో రూ. 573వద్ద ముగిసింది. ► హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో 2 శాతం వాటాకు సమానమైన 4 కోట్ల ఈక్విటీ షేర్లను ఇంగ్లాండ్‌కు చెందిన స్డాండర్డ్ లైఫ్ రూ.1,985 కోట్లకు బహిరంగ మా ర్కెట్ లావాదేవీల్లో విక్రయించింది. బీఎస్ఈలో ఈ షేరు 3.2% లాభంతో రూ.518 వద్ద ముగిసింది. -
మోదీ బూస్ట్ : ఎగిసిన రూపాయి
సాక్షి, ముంబై : కరోనా సంక్షోభంనుంచి దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో దేశీయ కరెన్సీ భారీగా లాభపడింది. మంగళవారం డాలరు మారకంలో రూపాయి 75.57 వద్ద ప్రారంభమై అనంతరం పుంజుకుంది. చివరకు 18 పైసలు లాభపడి 75.36 వద్ద ముగిసింది. అంతకుముందు 75.54 వద్ద స్థిరపడింది. ముడి చమురు బ్రెంట్ ఫ్యూచర్స్ 2.14 శాతం పెరిగి బ్యారెల్‌కు 39.14 డాలర్లకు చేరుకుంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.27 శాతం తగ్గి 97.57 వద్దకు చేరుకుంది. సానుకూల దేశీయ ఈక్విటీలు, బలహీనమైన అమెరికన్ డాలర్, విదేశీ నిధుల ప్రవాహం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్ పాజిటివ్‌గా వుందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. మరోవైపు వరుసగా ఐదవ సెషన్లో కూడా లాభపడుతున్న దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా ఆరంభ లాభాల తో పోలిస్తే ప్రధానిమోదీ ప్రకటన తరువాత బాగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 557 పాయింట్లు లాభంతో 33861వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు ఎగిసి 9994 వద్ద పటిష్టంగా ఉన్నాయి. -
లాక్డౌన్ సడలింపులు : రుపీ జంప్
సాక్షి, ముంబై: వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు, కరోనా వైరస్ కట్టడికి విధించిన రెండు నెలల లాక్డౌన్ నుంచి సడలింపుల నేపథ్యంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందన్న ఆశల మధ్య దేశీయ కరెన్సీ రూపాయి లాభాలతో ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 75.35 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75.29 ను తాకింది. చివరకు 75.47 వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్లో 75.62 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ సంకేతాలకు తోడు, దేశీయంగా లాక్డౌన్ సడలింపులతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా ర్యాలీ అయ్యాయి. కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసి కీలక సూచీ సెన్సెక్స్ 1250 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ కూడా 9900 స్థాయిపైకి చేరింది. అయితే ఆఖరి గంటలో అమ్మకాలతో ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గిన సెన్సెక్స 879 పాయింట్ల లాభంతో 33303 వద్ద, నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 9826 వద్ద ముగిసాయి. అన్ని రంగాలు లాభాలనార్జించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్సియల్స్, ఆటో, మెటల్ రంగాలు లాభాలతో కళ కళలాడాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ , బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. (సీనియర్లకు షాకివ్వనున్న ఇన్ఫోసిస్) -
14 పైసలు ఎగిసిన రూపాయి
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌గా ముగిసింది. గురువారం నాటి నష్టాలతో పోలిస్తే నేడు (శుక్రవారం) డాలరు మారకంలో 14 పైసలు ఎగిసి 75.62 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 75.71 వద్ద ప్రారంభమై అనంతరం పుంజుకుంది. విదేశీ నిధుల ప్రవాహం, అమెరికా కరెన్సీ డాలరు బలహీనత పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచిందని ఎనలిస్టులు చెప్పారు. జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి గణాంకాల కోసం ఫారెక్స్ వ్యాపారులు, పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారన్నారు. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభం నష్టాలనుంచి కోలుకున్నాయి. ఆరంభంలోనే 300 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు మిడ్ సెషన్ నుంచి క్రమంగా పుంజుకున్నా లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అయినప్పటికీ సెన్సెక్స్ 32200 స్థాయికి ఎగువన, నిఫ్టీ 95 వందల పాయింట్ల ఎగువకు చేరడం విశేషం. -
రూ.75కే మీడియా సంస్థ అమ్మకం!
వెల్లింగ్టన్: కరోనా మహమ్మారి దెబ్బకు రెవెన్యూ పడిపోయి మీడియా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘స్టఫ్’. ఎన్నో జాతీయ దినపత్రికలను ప్రచురిస్తూ, స్టఫ్ పేరుతోనే ఎంతో ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థను.. కేవలం డాలర్‌కే (మన రూపాయిల్లో రూ.75) కంపెనీ సీఈవో సినేడ్ బౌచర్‌కు విక్రయిస్తున్నట్టు మాతృ సంస్థ నైన్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఈ డీల్ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. స్టఫ్‌లో 400 జర్నలిస్టులు సహా 900 మంది పనిచేస్తున్నారు. ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్ చోటు చేసుకుంది. -
ఆర్బీఐ రేట్ కట్ : రూపాయి బలహీనం
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు తగ్గింపు చర్య పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను బలహీన పర్చడంతో దేశీయ కరెన్సీ రూపాయి కుప్పకూలింది. డాలరు మారకంలో రూపాయి విలువ శుక్రవారం 34 పైసలు తగ్గి 75.95 వద్ద స్థిరపడింది. తద్వారా మరోసారి 76 కనిష్ఠ స్థాయికి చేరువైంది. గురువారం 75.61 వద్ద ముగిసింది. మార్కెట్వర్గాల అంచనాలకు అనుగుణంగా వడ్డీరేట్లలో కోత లేకపోవడం మార్కెట్లను నిరాశపర్చాయి.దీంతో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 75.72 వద్ద బలహీనంగా ప్రారంభమైనా రూపాయి అనంతరం మరింత క్షీణించి చివరికి 75.95 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీల బలహీనతకు తోడు, అమెరకా డాలరు బలం, దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రభావాన్ని చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. ఇక కమోడిటీ విషయానికి వస్తే జూన్ కాంట్రాక్ట్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.46,690గా ఉంది. (ఆర్బీఐ దెబ్బ: మార్కెట్ల పతనం) ఆర్బీఐ రేటు కట్ ఫారెక్స్ వ్యాపారులను ఉత్సాహపరచలేదని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ కరెన్సీ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు.. 40 పాయింట్ల రేట్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, రుణాల పూర్తి స్థాయి పునర్నిర్మాణాన్ని అందించలేదన్నారు. అలాగే 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ అంచనాలను వెల్లడించకపోవడం దెబ్బతీసిందని తెలిపారు. ఆయా రంగాల ఆధారంగా ప్రత్యేక చర్యలు తీసుకోవలసి ఉందని గుప్తా అన్నారు. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు) కాగా ఆర్బీఐ శుక్రవారం వడ్డీ రేట్లను తగ్గించింది, రుణాల చెల్లింపులపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. అలాగే నాలుగు దశాబ్దాల్లో మొదటిసారిగా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ప్రయత్నంలో బ్యాంకులకు కార్పొరేట్ ఎక్కువ రుణాలు ఇవ్వడానికి అనుమతించింది. -
మరోసారి బలహీనపడిన రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మళ్లీ బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్ళీ బలపడటంతో 4 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.71 వద్ద ప్రారంభమైంది. తద్వారా 4 రోజులుగా లాభాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం 72 పైసలు బలహీనపడి 75.80 వద్ద రూపాయి ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్లో (గురువారం) రూపాయి 75.09 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.31శాతం పెరిగి 99.38 కు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ కు 0.95 శాతం క్షీణించి 26.19 డాలర్లకు చేరుకుంది. (జియో మరో భారీ డీల్ ) దేశీయ ఈక్విటీలలో భారీ అమ్మకాలకు తోడు, దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు రూపాయి అమ్మకాలకు దారి తీస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. అటు దేశీయ స్టాక్ మార్కెట్లు 1700 పాయింట్ల భారీ పతనాన్ని నమోదు చేశాయి. దీంతో సెన్సెక్స్ 32 వేలకు దిగువకు చేరింది. నిఫ్టీ 479 పాయింట్లు కుప్పకూలింది. ప్రధానంగా ఆటో, మెటల్, బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు మళ్లీ 20 వేల స్థాయి దిగువన ట్రేడ్ అవుతోంది. ఫార్మ రంగం ఒక్కటే స్వల్పంగా లాభపడుతోంది. మరోవైపు బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. భారతదేశంలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 1300 కు పెరిగింది. సోమవారం నాటికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 42,500 కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 35 లక్షలు దాటగా, మరణాల సంఖ్య 2.47 లక్షలకు చేరుకుంది. మరోవైపు మరో రెండు వారాలపాటు దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగనుంది. (మద్యం షేర్లకు మినహాయింపు కిక్కు) చదవండి : రూపాయి రయ్..రయ్... -
రూపాయి రయ్..రయ్...
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి గురువారం వరుసగా నాలుగో రోజు కూడా భారీగా పుంజుకుంది. యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 63 పైసలు పెరిగి 75.03కు చేరుకుంది. బుధవారం నాటి ముగింపుతో ముగింపుతో పోలిస్తే 75.17 వద్ద కొనసాగుతోంది. దేశీయ ఈక్విటీ మర్కెట్ల లాభాలు, విదేశీఫండ్ల ప్రవాహంలాంటివి సానుకూలంగా పనిచేస్తున్నామని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. వరుసగా మూడు రోజుల లాభాలతో మూడువారాల గరిష్టానికి చేరిన రూపాయి బుధవారం 75.66 వద్ద స్థిరపడింది. మార్కెట్ గణాంకాల ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం 722.08 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అంతేకాదు మే 4 నుండి భారతదేశం అనేక రంగాలలో లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ తిరిగి ప్రారంభం కానుందనే ఆశ పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను బల పరుస్తోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. (కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు) ప్రధానంగా కరోనా వైరస్ బాధితుల్లో గిలియడ్ కు చెందిన యాంటి వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ సానుకూల ఫలితాలనిస్తోందన్న వార్త బలాన్నిస్తోందని రిలయన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. డాలర్ ఇండెక్స్ 0.02 శాతం పెరిగి 99.58 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 0.02 శాతం పెరిగి 99.58 వద్ద ట్రేడవుతోంది. దేశీయ కీలక సూచీ సెన్సెక్స్ 1072 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 300 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. గత మూడు సెషన్లుగా సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా ఎగియడం విశేషం. (కోవిడ్-19 కు మందు : లాభాల హై జంప్) కాగా భారతదేశంలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 1074 కు పెరిగింది కేసుల సంఖ్య గురువారం 33,050 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 31.93 లక్షలు దాటింది. మరణించిన వారి సంఖ్య 2.27 లక్షలకు చేరుకుంది. -
మూడు వారాల గరిష్టం : అయినా అనుమానమే
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ బుధవారం లాభాలతో ముగిసింది. డాలరు మారకంలో 3 వారాల గరిష్ట స్థాయిని తాకింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో సానుకూల సంకేతాల, డాలరు బలహీనత నేపథ్యంలో మంగళవారం నాటి ముగింపు 76.19 తో పోలిస్తే రూపాయి 76 స్థాయికి ఎగువకు చేరింది. ఆరంభంలోనే 35 పైసలు ఎగిసింది. చివరికి 52 పైసల లాభంతో 75.67 వద్ద ముగిసింది. లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ ఒప్పందానికి సంబంధించిన డాలర్ల ప్రవాహం భారత కరెన్సీ లాభాలకు దోహదపడిందని ఎమ్కే గ్లోబల్ పరిశోధకుడు హెడ్ రాహుల్ గుప్తా అన్నారు. అయితే రూపాయిలో బలం నిలబడదని , రాబోయే సెషన్లలో మళ్లీ 77 వైపునకు బౌన్స్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ భయాలతో బలహీనత కొనసాగుతుందని తెలిపారు. దాదాపు ఇదే అభిప్రాయాన్ని రెలిగేర్ బ్రోకింగ్ సంస్థకు చెందిన సుగంధ సచ్‌దేవా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ సంక్షోభంతో రూపాయి పతనమైందనీ, ఈ నష్టాల నుంచి కొంత విరామం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి రూపాయి పాజిటివ్ ధోరణి నిలబడుతుందా లేదా అనేది అంచనా వేయాల్సి వుందనీ, దేశీయ కరెన్సీ 75.20 - 76.60 మధ్య కదలాడుతోందని సచ్‌దేవా తెలిపారు అటు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 606 పాయింట్లు ఎగిసి 32720వద్ద, నిఫ్టీ 172పాయింట్లు లాభపడి 9553 వద్ద స్థిరంగా ముగిసాయి. (మూడో రోజూ లాభాలు: ఏడు వారాల గరిష్టం) చదవండి : ఈ ఏడాది ఐటీ కొలువులు లేనట్టే! రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్ -
కరోనా డ్రగ్ వైఫల్యం, రూపాయి బలహీనం
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి పతనాన్ని నమోదు చేసింది. డాలరు మారకంలో ఆరంభంలో రూపాయి 76.30 వద్ద ప్రారంభమై, అనంతరం మరింత బలహీన పడి 76.47 స్థాయిని టచ్ చేసింది. చివరకు 40 పైసలు క్షీణించి 76.46 వద్ద స్థిరపడింది. గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.06 వద్ద ముగిసింది. కరోనావైరస్ కోసం యాంటీవైరల్ డ్రగ్ వైఫల్యం వార్తల తరువాత మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడిందని ఫారెక్స్ వ్యాపారులు చెప్పారు. డాలర్ ఇండెక్స్ 0.31 శాతం పెరిగి 100.74 కు చేరుకుంది. అటు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో రోజంతా నష్టాల మద్య కదలాడిన సూచీలు రెండు రోజుల లాభాలను పోగట్టుకన్నాయి. చివరికి సెన్సెక్స్ 536 పాయింట్లు కోల్పోయి 31327 వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి 9154వద్ద ముగిసింది. (5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!) ప్రధానంగా కరోనా వైరస్ వ్యాధి నివారణలో యాంటీవైరల్ డ్రగ్ విఫలమైందన్న వార్తతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడిందని ఫారెక్స్ వ్యాపారులు చెప్పారు. కరోనావైరస్ కేసుల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ చెడ్డ వార్త అయినా రూపాయిని బలహీనపరుస్తోందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన కరెన్సీ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు. పెట్టుబడి దారులందరూ, కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఆవిష్కరణ కోసం ఎదురు చూస్తున్నారనీ, కానీ ఔషధాల అభివృద్ధిలో సందేహాలు సెంటిమెంట్ ను దెబ్బ తీస్తున్నాయని, దీంతో ఫారెక్స్ చంచలంగా మారిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 27 లక్షలకు పైగా చేరగా, భారతదేశంలో ఇది 23 వేలను దాటింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) చదవండి : రెండు రోజుల లాభాలకు స్వస్తి -
ఆర్బీఐ ప్రకటన : ఎగిసిన రూపాయి
సాక్షి, ముబై: దేశీయ రూపాయి గురువారం భారీగా పుంజుకుంది. డాలరు మారకంలో రికార్డు కనిష్టాలకు చేరుతున్న రూపాయి గురువారం 62 పైసలు లాభపడింది. దేశీయ ఈక్విటీల్లో లాభాలతో రూపాయి ఆరంభంలో 48 పైసలు లాభంతో 76.31 వద్దకు చేరింది. అనంతరం ఇంట్రా డేలో 76 స్థాయిని టచ్ చేసింది. చివరికి 62 పైసలు పెరిగి 76.06 వద్ద ముగిసింది. బుధవారం 76.68 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.08 శాతం పెరిగి 100.46 వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ ముడిచమురు 6.92 శాతం పెరిగి బ్యారెల్‌కు 21.78 డాలర్లకు చేరుకుంది. ముఖ్యంగా ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల అదనపు కొనుగోలును చేపట్టనున్నట్లు చెప్పడంతో పెట్టుబడిదారుల సెంటిమెంటు బలపడిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో 2020 ఏప్రిల్ 27 న ఓఎంఓ కింద ప్రభుత్వ సెక్యూరిటీలను ఒకేసారి రూ .10,000 కోట్లకు కొనుగోలు చేయనున్నామని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 483 పాయింట్ల లాభంతో 31863 వద్ద, నిఫ్టీ 126 పాయింట్లు ఎగిసి 9313 వద్ద పటిష్టంగా ముగిసాయి. -
ఆల్ టైం కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. మంగళవారం ఆరంభంలో 76.79 వద్ద బలహీనపడిన రూపాయి, అనంతరం డాలరు మారకంలో 30 పైసలు తగ్గి 76.83 కు చేరుకుంది. ముడి చమురు రికార్డు పతనం, దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు వెయ్యి పాయింట్లు కుప్పకూలడంతో రూపాయి మరోసారి భారీగా నష్టపోతోంది. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.53 వద్ద స్థిరపడింది. అటు డాలరు 100 స్థాయి మార్కును అధిగమించడంతో పెట్టుబడిదారులు రూపాయిలో అమ్మకాలకు దిగారని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. డాలర్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగి 100.15 కు చేరుకుంది. (ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం) చరిత్రలో మొదటిసారిగా యుఎస్ ముడి ఫ్యూచర్స్ మైనస్ లోకి పడిపోయింది. చమురు డిమాండ్ పతనం, కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ వారంలో కార్పొరేట్ ఆదాయాల ప్రకటన, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక నష్టం అంచనాలతో పెట్టుబడిదారుల అప్రమత్తత కొనసాగుతుందని పేర్కొంది. డబ్ల్యుటిఐ ముడి చమురు ఫ్యూచర్స్ రికార్డు పతనాన్ని నమోదు చేయగా, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.78 శాతం పడిపోయి బ్యారెల్‌కు 25.37 డాలర్లకు చేరుకుంది. అంతేకాకుండా, కరోనా కేసులు గణనీయంగా పెరగడం ఆర్థికవ్యవస్థపై భారం పడుతుందనే ఆందోళన ఉధృతమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 24.81 లక్షలకు పైగా కేసులు నమోదుగా భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 18,600 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా) -
రూపాయికి ఆర్బీఐ 'శక్తి'
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించిన చర్యలు ఊతమిచ్చాయి. కరోనా కల్లోలంతో ఇటీవలి రికార్డు పతనాన్ని నమోదు చేసిన రూపాయి డాలరు మారకంలో 45 పైసలు పుంజుకుంది. 76.59 వద్ద ప్రారంభమైన రూపాయి గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశం అనంతరం మరింత పుంజుకుని 76.42 గరిష్టాన్ని తాకింది. గురువారం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.87 కనిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. సానుకూల దేశీయ ఈక్విటీలు, డాలరు బలహీనతకు తోడు, ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య లభ్యత , ఆర్థిక పటిష్టతకు తీసుకున్న చర్యలు రూపాయికి మద్దతిచ్చినట్టు ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. మరోవైపు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర (బ్రెంట్ ఫ్యూచర్స్) 2.05 శాతం పెరిగి బ్యారెల్ 28.39 డాలర్లకు చేరుకుంది. (కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం) కోవిడ్-19 మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యవస్థలో తగిన ద్రవ్యత ఉండేలా చర్యలు ప్రకటించారు. ఆర్థిక మందగమనానికి వ్యతిరేకంగా లిక్విడిటీని పెంపు, క్యాష్ ఫ్లోకు మద్దతు లాంటి అదనపు చర్యలను ఆర్బిఐ ప్రకటించింది. నాబార్డ్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సిడ్బీ వంటి ఆర్థిక సంస్థలకు రూ .50 వేల కోట్ల రీ ఫైనాన్సింగ్ విండో, రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల లాంటి చర్యలను ఆర్బీఐ తీసుకుంది. మరోవైపు ఆర్బీఐ మీడియా సమావేశం వార్తలో దాదాపు వెయ్యి పాయింట్లకుపైగా ఎ గిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 563 పాయింట్ల లాభానికి పరిమితం కాగా నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 9149 వద్ద 9200 స్థాయి దిగువకు చేరింది. ప్రధానంగా ఎన్‌బీఎఫ్‌సీలకు అవసరమైన ద్రవ్య లభ్యతకోసం భారీ ఉద్దీపన ప్యాకేజీ కోసం ఎదురుచూసినట్టు ఐఎఫ్ఎ గ్లోబల్ వ్యవస్థాపకుడు సీఈవో, అభిషేక్ గోయెంకా అన్నారు. (రివర్స్ రెపో రేటు పావు శాతం కోత) చదవండి : 76.80 స్థాయికి పడిపోయిన రూపాయి -
76.80 స్థాయికి పడిపోయిన రూపాయి
సాక్షి,ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి బలహీనతకు అంతం లేకుండా పోతోంది. వరుస రికార్డు పతనంతో కుదేలవుతున్న రూపాయి గురువారం మరోసారి రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. డాలరు మారకంలో 36 పైసలు నష్టంతో 76.80 స్థాయిని తాకింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 76.75 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆపై ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 76.80కి చేరింది. బుధవారం 76.44 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర (బ్రెంట్ ఫ్యూచర్స్) 1.44 శాతం పెరిగి బ్యారెల్ కు 28.09 డాలర్లకు చేరుకుంది. కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందనే ఆందోళన నెలకొంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనంగా వుంది. అలాగే డాలరు బలం కూడా రూపాయి బలహీనతకు కారణమని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా భారతదేశంలో ఇప్పటివరకు 12,380 కేసులు నమోదయ్యాయి. (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది.. -
మరింత బలహీనపడిన రూపాయి
సాక్షి,ముంబై : డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. సోమవారం 76.29 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన రూపాయి మరో 5 పైసలు బలహీనపడి 76.34 స్థాయికి పడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనత నేపథ్యంలో ఇంట్రాడేలో 76.43 స్థాయిని తాకింది. గత గురువారం 76.54 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోయిన రూపాయి చివరకు 76.28 వద్ద ముగిసింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 10 శుక్రవారం కరెన్సీ మార్కెట్ పనిచేయలేదు. కోవిడ్-19 వ్యాప్తి, వైరస్ మరణాల ఆందోళన, ప్రపంచ ఆర్థిక మాంద్యంపై పెరుగుతున్న ఆందోళనలతో రూపాయి బలహీనపడుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. బలహీనత కొనసాగవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫారసు చేస్తోంది. డాలరు బలం ఆయిల్ ధరలు కనిష్టంనుంచి పుంజుకోవడంతో మరింత ఒత్తడి కనిపించడనుందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ కరెన్సీ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు. మరోవైపు తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం పుంజుకున్నాయి. 600 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం 71 పాయింట్ల నష్టాలకుపరిమితం కాగా, నిఫ్టీ 13 పాయింట్ల స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువకు చేరడం విశేషం. (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు) -
మరో రికార్డు కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరో రికార్డు కనిష్టానికి పతనమైంది. గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే కొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ప్రారంభంలో 23 పైసల లాభంతో 76.11వద్ద కొనసాగింది. అనంతరం లాభాలన్నీ ఆవిరై పోయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 76.55 స్థాయికి పతనమైంది. బుధవారం 76.34 వద్ద ముగిసింది. డాలర్ సూచీ కీలకమైన గ్లోబల్ కరెన్సీలతో పోలిస్తే 100.17వద్ద ఫ్లాట్‌గా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి దేశీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే ఆందోళనల మధ్య రూపాయి పతనం కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సెన్సెక్స్ 960 పాయింట్లు పైగా లాభంతో ట్రేడవుతోంది. కాగా భారతదేశంలో ఇప్పటివరకు 5,700 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 15 లక్షలకు పైగా పెరిగింది. చదవండి : లాభాల ప్రారంభం : ఫార్మా జోరు రుణాలపై వడ్డీరేటును తగ్గించిన హెచ్డీఎఫ్సీ -
కరోనా కల్లోలం : రూపాయి పతనం
సాక్షి, ముంబై : ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా వినిమయ డిమాండ్ భారీగా క్షీణిస్తోంది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మరోవైపు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో లాక్ డౌన్ నిబంధనలు పొడిగించనున్నారనే అంచనాల నేపథ్యంలో దేశీయ కరెన్సీరూపాయి బుధవారం మరింత క్షీణించింది. 75.83 వద్ద ప్రారంభమైన రూపాయి డాలరు మారకంలో 76 మార్కు దిగువకు పడిపోయింది. ఒక దశలో 76.36 ను తాకింది. చివరికి 74 పైసలు తగ్గి 76.37 వద్ద ముగిసింది. కరోనావైరస్ సంక్షోభం డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 6.98 శాతం క్షీణించింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, డాలరు బలం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు రూపాయిని దెబ్బతీశాయని విశ్లేషకులు తెలిపారు. ముడి చమురు ధరలు బ్యారెల్ కు 32 డాలర్లు పలికింది. ప్రపంచ బెంచ్ మార్క్ ముడి చమురు 3.6 శాతం తగ్గి 31.78 డాలర్లకు చేరుకుంది.డాలర్ ఇండెక్స్ ఆరు ప్రధాన కరెన్సీలతో గత ముగింపుతో పోలిస్తే బలంగా వుంది. (కరోనా భయాలు : మార్కెట్ల పతనం) మరోవైపు కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిపై పోరాటంలో భాగంగా 21 రోజుల లాక్ డౌన్ పదిహేనవ రోజుకు చేరింది. దేశంలోని వ్యాపారాలను, ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీసిన లాక్ డౌన్ ను వచ్చే వారం ప్రభుత్వం ఎత్తివేస్తుందా లేదా అనేదానిపై అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలనుంచి పతనమైన చివరికు నష్టాలతో ముగిసాయి. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ట్రేడింగ్ గంటలను కుదించారు. ఏప్రిల్ 17 వరకు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి. -
55 పైసలు ఎగిసిన రూపాయి
సాక్షి, ముంబై: కొత్త ఫారెక్స్ ట్రేడింగ్ గంటలు అమల్లోకి రావడంతో దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో భారీ పుంజుకుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలను అందిపుచ్చుకున్న భారతీయ రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే మంగళవారం 55 పైసల లాభంతో 75.63 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో రూపాయి 75.57 -75.99 మధ్య ట్రేడయింది. శుక్రవారం 76.13 వద్ద స్థిరపడింది. మహావీర్ జయంతి కారణంగా సోమవారం ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. ప్రపంచ ఆర్థిక మాంద్యం ఊహించిన దానికంటే ఎక్కువగా వుంటుందన్న అంచనాల మధ్య భారీ ఉత్పత్తి కోతలు అవసరమవుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద ముడి ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించడానికి అంగీకరిస్తారనే ఆశతో గ్లోబల్ ఆయిల్ ధరలు ఈ రోజు పెరిగాయి. ముడి చమురు 2.4 శాతం పెరిగి బ్యారెల్ కు 33.85 డాలర్లుగా వుంది. కీలకమైన హాట్స్పాట్లలో కరోనా వైరస్ వ్యాప్తి మందగించిన సంకేతాలపై గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా లాభపడ్డాయి. 2300 పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ 30వేల స్థాయిని టచ్ చేసింది. అలాగే నిఫ్టీ కూడా 700 పాయింట్లు ఎగిసి 8800 స్థాయిని తాకింది. కోవిడ్-19 విస్తరణ, దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి దేశం 21 రోజుల లాక్డౌన్ నేపథ్యంలో బాండ్లు , విదేశీ మారకద్రవ్యం ట్రేడింగ్ వేళ్లలో కీలక మార్పులను చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందులా ఉదయం 9 నుంచి సాయంత్రి 5 గంటల వరకు కాకుండా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకే పరిమితం చేసింది. అటే మార్కెట్ ట్రేడింగ్ గంటలను నాలుగు గంటలు తగ్గించింది. సవరించిన ట్రేడింగ్ వేళలు ఏప్రిల్ 17 వరకు అమల్లో వుంటాయి. -
కరోనా : 39 పైసలు క్షీణించిన రూపాయి
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి ఆందోళనలు దీర్ఘ కాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి నానాటికి తీసికట్టు చందంగా మారిపోతోంది. దీంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీన పడుతోంది. ఈ నేపథ్యంలోనే డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రుపీ శుక్రవారం మరింత బలహీన పడింది. ఆరంభంలోనే 39 పైసలు క్షీణించింది. ఉదయం ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.08 కు చేరుకుంది. మంగళవారం 75.66 వద్ద ముగిసింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.44 శాతం బలపడి బ్యారెల్ కు 28.91 డాలర్లకు చేరుకుంది.ముడి ఉత్పత్తిని తగ్గించడం ద్వారా రష్యా, సౌదీ అరేబియా ధరల యుద్ధానికి చెక్ పెట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడంతో ఆయిల్ ఫ్యూచర్స్ గురువారం 30 శాతానికి పైగా ఎగిసింది.మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఆరంభంలోనే 400 పాయింట్లు క్షీణించింది. కీలక సూచీలు రెండూ మద్దతు స్థాయిలను కోల్పోయాయి. వెంటనే కోలుకున్నప్పటికీ, తిరిగి భారీ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. చదవండి : అమ్మకాల ఒత్తిడి, 8200 దిగువకు నిఫ్టీ -
తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?
సాక్షి, ముంబై: ప్రపంచంలో తీవ్రమైన ఆర్థికమాంద్య పరిస్థితులు వచ్చేశాయన్న ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. దీర్ఘకాలిక మాంద్యం ఆందోళనలతో అంతర్జాతీయంగా బంగారు ధరలు లాభపడ్డాయి. దీంతో దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్ లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ మార్చి 30 న స్వల్పంగా 0.02 శాతం లాభపడిన పది గ్రాముల పుత్తడి ధర రూ. 43,580 వద్ద వుంది. అయితే జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.6 శాతం పడి రూ. 43,302 కు చేరుకుంది. ఇదే బాటలో పయనించిన వెండి ధర (మే ఫ్యూచర్స్) కిలోకు 3 శాతం క్షీణించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 39,758 వద్ద కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో, బంగారానికి సంబంధించిన ట్రేడింగ్ లో గత 12 ఏళ్లలో లేని విధంగా గత వారంలో ఉత్తమంగా నిలిచిందనీ, ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. బంగారం ధరలు క్షీణించిన ప్రతిసారీ పెట్టుబడిదారులు కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం వుందని ఎల్ కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అంచనా వేశారు. ట్రేడర్ల లాభాల స్వీకరణతో ఊగిసలాట ధోరణి ఉన్నప్పటికీ పది గ్రాముల ధర రూ. 39500 వద్ద సాంకేతిక మద్దతువుందని పేర్కొన్నారు. దేశీయంగా దిగి వచ్చిన ధర కరోనా మహమ్మారి విజృంభణతో కొనుగోళ్లు పడిపోవడంతో దేశీయంగా పసిడి ధర పతనమైంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ 1,925 తగ్గి 43,375కు చేరింది. అటు 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,940 రూ. 39,830కి పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.1,910కి తగ్గడంతో రూ.39,500కి పడిపోయింది. జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడమే బంగారం ధరలు తగ్గడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా కోవిడ్ -19 సంక్షోభంతో 2009 నాటి కంటే ఘోరమౌపమాంద్యంలోకి జారుకున్నామని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా మార్చి 27 నాటి విలేకరుల సమావేశంలో అన్నారు. కాగా భారతదేశంలో పసిడి ధర గత వారం 10 గ్రాములకు రూ. 3000 పెరిగాయి. మరోవైపు కరోనా సంక్షోభంతో చమురు ధరలు భారీగా క్షీణించాయి. సోమవారం బ్యారెల్ ధర 20 డాలర్లు దిగువకు చేరింది. అటు డాలరు ధర మార్చి 17న రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. గ్రీన్ బ్యాక్ ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలరు నేడు 0.34 శాతం స్వల్ప లాభంతో 98.69వద్ద వుంది. ఇలాగే దేశీయ కరెన్సీ వరుసగా రికార్డు పతనాన్ని నమోదు చేసింది. డాలరుమారకంలో 32 పైసలు పతనమై 75.21 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం 74.89 వద్ద ముగిసింది. -
కరోనా కాటు: రూపాయి పాతాళానికి
సాక్షి, ముంబై: డాలరు మారకంలో రూపాయి పాతాళానికి పడిపోయింది. వరుసగా అత్యంత కనిష్ట స్థాయికి దిగజారుతున్న దేశీయ కరెన్సీ సోమవారం మరో ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. ఏకంగా 95 పైసలు క్షీణించి 76.15 వద్దకు చేరింది. ఇది చారిత్రక కనిష్టం. దేశంలో కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరగడం, దేశీయ ఈక్విటీలలో భారీ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 75.90 కు క్షీణించింది. శుక్రవారం అమెరికా డాలర్‌తో 75.20 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్ (కోవిడ్ -19) మహమ్మారి కారణంగా ప్రపంచ, దేశీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో మునిగిపోతున్నందున పెట్టుబడిదారులలో ఆందోళన చెందుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 390 కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 400 కేసులు నమోదు కావడం ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందన్న ఆంచనాలు వ్యాపించాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.74 శాతం పడిపోయి బ్యారెల్‌కు 26.24 డాలర్లకు చేరుకుంది. ఆరు కరెన్సీల గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.52 శాతం తగ్గి 102.28 వద్దకు చేరుకుంది. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల దిగుబడి 6.31 శాతంగా ఉంది. కాగా దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ దాదాపు మూడు వేల పాయింట్లు, నిఫ్టీ 842 పాయింట్లు (10 శాతం లోయర్ సర్క్యూట్ ) పతనం కావడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపి వేశారు. చదవండి: మీరే అసలైన హీరో.. కరోనాపై పోరుకు రూ.100కోట్లు -
మరో రికార్డు కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: డాలరుమారకంలో రూపాయి మరోరికార్డు కనిష్టాన్నినమోదు చేసింది. ఇంటర్ బ్యాంకు విదేశీ మారక మార్కెట్లో, దేశీయ కరెన్సీ 74.82 వద్ద ప్రారంభమైంది. అనంతరం 74.72 స్థాయికి పుంజుకున్నా, చివరకు అమెరికా డాలర్‌తో పోలిస్తే 8 పైసలు తగ్గి 75.20 వద్ద స్థిరపడింది. గురువారం 75.12 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా, ఆర్బీఐతో సహా అన్ని కేంద్ర బ్యాంకులు ప్రమాదాన్ని తగ్గించడానికి , ఆర్థికవ్యవస్థ పటిష్టతకు చర్యలకు దిగుతున్నాయి. అయితే భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 (కరోనా వైరస్) కేసులు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఫలితంగా దేశీయ కరెన్సీ కనిష్టానికి చేరిందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు. కాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో నవల కరోనావైరస్ కేసులు శుక్రవారం 223 కి పెరిగాయి. గ్లోబల్‌గా మృతుల సంఖ్య 10వేలను దాటింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లు, ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అయితే దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 1,626 పాయింట్లు లేదా 5.75 శాతం పెరిగి 29,916 వద్ద, నిఫ్టీ 482 పాయింట్లు లేదా 5.83 శాతం ఎగిసి 8,745 వద్ద ముగిసింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ ఫ్యూచర్స్ 2.46 శాతం పెరిగి బ్యారెల్‌కు 29.17 డాలర్లకు చేరుకుంది. 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ల దిగుబడి 6.25 వద్ద ఉంది. -
రికార్డు కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీపై కూడా కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపుతోంది. డాలరుతో మారకంలో రూపాయి తొలిసారి 75 మార్క్ కిందికి పడిపోయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం రూపాయి తొలుత 74.95 వద్ద ప్రారంభమైంది. బుధవారం ముగింపు 74.25తో పోలిస్తే ఇది 70 పైసల నష్టం. అనంతరం మరింత దిగజారి ఏకంగా 81 పైసలు(1.1 శాతం) 75.08 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక కనిష్టం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలు, ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లతోపాటు.. ముడిచమురు, కరెన్సీలను సైతం దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం డాలరుతో మారకంలో రూపాయి 74.50 వద్ద రికార్డ్ కనిష్టాన్ని తాకింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ తాజాగా 100ను సైతం అధిగమించడంతో దేశీ కరెన్సీ బలహీనపడినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. బుధవారం రూపాయి నామమాత్రంగా 2 పైసలు నీరసించి 74.26 వద్ద నిలవగా.. మంగళవారం సైతం ఇదే ధోరణిలో 74.28 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలనుంచి భారీ రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 277 పాయింట్ల లాబంతో, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతోనూ కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ కనిష్టం నుంచి 2000, నిఫ్టీ 600, నిఫ్టీ బ్యాంకు 2100 పాయింట్లు పుంజుకోవడం విశేషం. -
56 పైసలు ఎగిసిన రూపాయి
సాక్షి, ముంబై: డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం భారీగా కోలుకుంది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో, రూపాయి 73.88 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన రూపాయి ఇంట్రాడే లో 73.55 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు డాలర్‌తో పోలిస్తే 73.61 వద్ద స్థిరపడింది. అంతకుముందు ముగింపుతో పోలిస్తే 56 పైసల పెరుగుదలను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనావైరస్) వేగంగా విస్తురిస్తున్న నేపథ్యంలో ఆర్థిక మందగమనం పెరుగుతున్న భయాల మధ్య మార్చి 9 న రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 74.17 వద్ద 17 నెలల కనిష్ట స్థాయి కు పడిపోయిన సంగతి తెలిసిందే. -
రూపాయి 65 పైసలు పతనం
సాక్షి,ముంబై: ప్రపంచ వృద్ధి ఆందోళనల నేపథ్యంలో అటు డాలరు, ఇటు రూపాయి భారీగా నష్టపోతున్నాయి. కోవిడ్-19 భయాలకు తోడు, దేశీయంగా ప్రైవేటు బ్యాంకు యస్ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అనూహ్య వడ్డీరేటు కోత నిర్ణయం కరెన్సీ ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి వృద్ధిని తాకవచ్చన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల డాలర్ సూచీ స్పాట్ మార్కెట్లలో 0.25 శాతం క్షీణించింది. దీంతో రూపాయి డాలరుమారకంలో శుక్రవారం ఏకంగా 65 పైసలు క్షీణించింది. 73.99 ట్రేడింగ్‌ను ఆరంభించి 74.06 కనిష్టానికి చేరింది. గురువారం డాలర్‌తో పోలిస్తే 73.33 వద్ద 6 పైసల లాభాలతో రూపాయి ముగిసింది. మూలధన మార్కెట్ల నుండి ఫారెక్స్ ప్రవాహం కొనసాగుతుండటం భారతీయ కరెన్సీని తాకిందని వ్యాపారులు తెలిపారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లుభారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకుపై పతనం కాగా, నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది. ఆల్ టైం గరిష్టానికి బంగారం ధర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) గురువారం నికర ప్రాతిపదికన రూ .2,476.75 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు మార్కెట్ డేటా ద్వారా తెలుస్తోంది. చమురు ధరలు 1.06 శాతం తగ్గాయి. దీంతో బంగారం ధరలు వరుసగా లాభపడుతూ శుక్రవారం ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. బంగారు ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముకు రూ. 200 పెరిగి 44,640 వద్ద కొత్త గరిష్టానికి తాకింది. చదవండి : బ్లాక్ ఫ్రైడే; సెన్సెక్స్1500 పాయింట్లు క్రాష్ -
ఫెడ్ ఎఫెక్ట్ : పుంజుకున్న రూపాయి
సాక్షి, ముంబై : కోవిడ్-19 విజృంభణ, ఆర్థిక ఆందోళన నేపథ్యంలో పెడరల్రిజర్వ్ వడ్డీరేటు కోతకు నిర్ణయించడంతో దేశీయ రూపాయికి బలమొచ్చింది. క్రూడ్ ధరలు ఎగిసి పడటంతో మంగళవారం కీలకమైన 73 స్థాయికి క్షీణించిన కరెన్సీ 16 నెలల కనిష్టానికి పడిపోయింది. 73.19 వద్ద ముగిసిన రూపాయి ఈ స్థాయినుంచి పుంజుకుని డాలరుమారకంలో రూపాయి 73.07 వద్ద ఆరంభమైంది. అనంతరం 34 పైసలు ఎగిసి రూ. 72.95ని తాకింది. ప్రస్తుతం 73.06 వద్దకొనసాగుతోంది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు కోత పెట్టింది ఫెడ్. దీంతో డాలరు బాగా బలహీనపడింది. -
33 పైసలు ఎగిసిన రూపాయి.. మళ్లీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లతోపాటు దేశీయ కరెన్సీ రూపాయికూడా మంగళవారం భారీగా పుంజుకుంది. సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే రూపాయి 72.50 వద్ద ప్రారంభ మైంది. అనంతరం 33 పైసలు పెరిగి 72.43 కు చేరుకుంది. కానీ ఈ లాభాలను నిలబెట్టుకోలేకపోయిన రూపాయి 72.64 వద్ద కొనసాగుతోంది. సోమవారం రూపాయి 72.76 ఏడాది కనిష్టం వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ ముడి చమురు ఫ్యూచర్స్ 2.41 శాతం పెరిగి బ్యారెల్‌కు 53.15 డాలర్లకు చేరుకుంది. అయితే బంగారం ధరలు ఫ్యూచర్స్ లో స్వలంగా తగ్గా, వెండి ధరలు పుంజుకున్నాయి. అటు దలాల్ స్ట్రీట్‌లో, ఇటు కరెన్సీ మార్కెట్లో కూడా కరోనావైరస్ ఆందోళన కొనసాగుతోంది. దీంతోపాటు ఢిల్లీలో ఒకటి, తెలంగాణా ఒక పాజిటివ్ కేసు నమోదుకావడంతో ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు నేడు సానుకూలంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్456పాయింట్లు పెరిగి 38,603 వద్ద, నిఫ్టీ 1590 పాయింట్లు పెరిగి 11,292 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) సోమవారం రూ. 1,354.72 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. కాగా చైనాలో విస్తరించిన కోవిడ్-19 క్రమంగా ప్రపంచదేశాలను చుట్టముడుతోంది. తాజాగా భారతదేశంలో మరో రెండు కరోనా వైరస్ బాధితులను గుర్తించినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. -
30 పైసలు క్షీణించిన రూపాయి
సాక్షి, ముంబై: కోవిడ్-19 (కరోనా వైరస్) ఆందోళనలు దేశీయ కరెన్సీరూపాయిని వెంటాడుతున్నాయి. సోమవారం నాటికి ప్రారంభ ట్రేడింగ్‌లో డాలరు మారకంలో రూపాయి ఏకంగా 30పైసలు క్షీణించింది. ముడి చమురు ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్ల అమ్మకాలతో రూపాయి 71.94కు చేరింది. శుక్రవారం రూపాయి 71.64 వద్ద స్థిరపడింది. ముడి చమురు ఫ్యూచర్స్ 2.51 శాతం పడిపోయి బ్యారెల్‌కు 57.03 డాలర్లకు చేరుకుంది. కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు మందగించి డిమాండ్ తగ్గవచ్చన్న అంచనాలతో ముడిచమురు ధరలు దాదాపు 3 శాతం పతనమయ్యాయి. అటు దేశీయస్టాక్‌మార్కెట్లు కూడా సోమవారం సుమారు 500 పాయింట్లు పతనమైనాయి. అటు దేశీయంగా పసిడి 24 క్యారెట్ల పది గ్రాములు ధర రూ.43165 వద్ద ఆల్‌టైం గరిష్టానికి చేరింది. న్యూయార్క్ కామెక్స్‌లో ఔస్స్(31.1 గ్రాములు) బంగారం ధర 1.2 శాతం పుంజుకుని 1669 డాలర్లకు చేరింది.పదేళ్ల ప్రభుత్వ బాండ్ల దిగుబడి 6.34 శాతంగా ఉంది. మరోవైపు చైనాలో కోవిడ్-19 వైరస్‌తో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 2,592 కు చేరింది. -
19 పైసలు ఎగిసిన రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. 15 పైసలు పెరిగి 71.21 డాలర్లకు చేరుకుంది. ఆ తరువాత 19 పైసలు పెరిగి 71.19 కు చేరుకుంది. ఈక్విటీ మార్కెట్లలో భారీ లాభాల ధోరణి రూపాయికి బలాన్నిస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే సోమవారం 71.36 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగాచమురు ధరలు మంగళవారం స్వల్పంగా పుంజు కున్నాయి. ముడిచమురు ధరలు, విదేశీ నిధుల ప్రవాహం, అమెరికన్ కరెన్సీని బలోపేతం దేశీయ కరెన్సీకి బలాన్నిస్తోందని ఫారెక్స్ వర్తకుల అంచనా. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ 2020 నేటి నుంచి (ఫిబ్రవరి 4) 6 వ తేదీవరకు తన ద్రవ్య విధాన కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ ఆందోళన నేపథ్యంలో పరపతి విధాన సమీక్ష కీలకం. -
14 పైసలు క్షీణించిన రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి నష్టాల్లో కొనసాగుతోంది. ఆరంభంలోనే డాలరుమారకంలో 71 రూపాయల స్థాయికి పడిపోయింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో పెట్టుబడిదారులు డాలరువైపు మొగ్గు చూపడంతో బుధవారం డాలర్‌తో 14 పైసలు నష్టపోయి 71.01 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. మంగళవారం 70.87 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ముడి చమురు బారెల్‌కు (ఫ్యూచర్స్) 0.25 శాతం తగ్గి 64.33 డాలర్లకు పడిపోగా, డాలర్ ఇండెక్స్ 0.02 శాతం తగ్గి 97.34 వద్దకు చేరుకుంది. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు చైనా దిగుమతులపై బిలియన్ డాలర్ల సుంకాలు అమల్లో ఉంటాయని నివేదికలు వెలువడిన తరువాత ఇతర ఆసియా కరెన్సీలతో పాటు రూపాయి బలహీనపడింది.మరోవైపు బుధవారం సంతకం చేయబోయే చైనాతో వాణిజ్య ఒప్పందంలో చైనా వస్తువులపై విధించిన సుంకాలను వెనక్కి తీసుకునే ఒప్పందం లేదని అమెరికా అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముడి చమురు ధరల క్షీణత అమెరికన్ కరెన్సీని బలహీనపరచడం దేశీయ కరెన్సీకి కొంతవరకు మద్దతు ఇస్తుండగా, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, విదేశీ ఫండ్ ప్రవాహాలు రూపాయిపై ప్రభావం చూపుతున్నాయని ట్రేడర్లు భావిస్తున్నారు. వ్యాపారులు తెలిపారు. -
రూపాయికి వరుస లాభాలు, ఈ వారంలో
సాక్షి,.ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా నాలుగో సెషన్లో కూడా బలపడింది. శుక్రవారం ఆరంభంలో డాలరు మారకంలో స్వల్పంగా వెనుకంజ వేసినా గణనీయంగా పుంజుకుంది. ఒక దశలో 70.86 గరిష్టాన్ని తాకింది. చివరికి 27పాయింట్ల లాభంతో రూ. 70.94 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు చల్లబడటంతో వరుసగా నాలుగవ సెషన్లో తన విజయ పరుగును కొనసాగించింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా రూపాయి 99 పైసలు పుంజుకోగా, ఈ వారంలో 1.19 శాతం ఎగిసింది. అంతర్జాతీయంగా ముడిచమురు బ్రెంట్ 0.03 శాతం తగ్గి బ్యారెల్‌కు 65.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ సూచిక 0.12 శాతం పెరిగి 97.57 వద్ద ఉంది. అటు స్టాక్‌మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 147.37 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 41,599.72 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 40.90 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 12,256 ముగిసింది. ఇంట్రా-డేలో 12,311 స్థాయిని టచ్ చేసింది. -
భారీగా పుంజుకున్న రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీరూపాయల గురువారం భారీగా పుంజుకుంది. డాలరుమారకంలో ఏకంగా 48 పైసలు ఎగిసింది. పెట్టుబడిదారుల కొనుగోళ్ల ఆసక్తితో గత నష్టాలనుంచి కోలుకుని 71.21 వద్ద ముగిసింది. బుధారం డాలర్‌తో పోలిస్తే రూపాయ 72 స్థాయికి పతనమై, చివరికి 71.70 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత తగ్గుముఖం పట్టనుందన్న అంచనాలతో డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగి 97.41 వద్దకు చేరుకుంది. అలాగే ముడిచమురు ధరలలో భారీ పతనం రూపాయికి బలాన్ని ఇచ్చిందని ఎనలిస్టులు చెబుతున్నారు. 71.60 కీలక మద్దతు స్థాయిని అని, అయితే రాబోయే సెషన్లలో 71.45-71.25 స్థాయి కీలకమని ఎల్కెపి సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతీన్ త్రివేది అన్నారు. కాగా అమెరికా ఇరాన్ ఇద్దరూ ఒకరితో ఒకరు యుద్ధానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు వెల్లడించాయి. కాగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలోని శాంతి వచనాలు గ్లోబల్ మార్కెటలకు ఊతమిచ్చాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 635 లాభపడగా, నిఫ్టీ 191 పాయింట్లు ఎగిసింది. -
మళ్లీ 72 స్థాయికి పడిపోయిన రూపాయి
సాక్షి, ముంబై: ఇరాన్-అమెరికా ఉద్రికత్తల నడుమ దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం బలహీనంగా ట్రేడింగ్‌ను ఆరంభించింది. మంగళవారం నాటి ముగింపు. 71.82తో పోలిస్తే డాలరుమారకంలో మరోసారి 72 స్థాయికి పోయింది. ప్రస్తుతం 20 పైసలు పతనమై 72.02 వద్ద ఉంది. మరోవైపు అమెరికా-ఇరాన్ టెన్షన్స్ నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇరాక్‌లోని అమెరికి సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి అనంతరం అంతర్జాతీయ బెంచ్‌మార్క్ క్రూడ్ ఆయిల్ ధర ఒకదశలో 70డాలర్లకు చేరింది. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది.అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, జీడీపీపై ప్రభుత్వ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసాయి. ఆరంభంలోనే 350 పాయింట్లకు పైగా సెన్సెక్స్ కుప్పకూలింది. నిఫ్టీ కీలకమైన 12వేల స్థాయిని కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 234 పాయింట్లు పతనమై 40609 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లునష్టంతో 11965 వద్ద కొనసాగుతోంది. ప్రదానంగా బ్యాంకింగ్,ఆటో, మెటల్ షేర్లలోఅమ్మకాల ఒత్తిడినెలకింది. మరోవైపు రూపాయి బలహీనతతో ఐటీ షేర్లు లాభపడుతున్నాయి. -
ఇరాన్ - అమెరికా ఉద్రిక్తత : కుదేలైన రూపాయి
ముంబై: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. బంగారం, క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా పడింది. దీంతో భారతీయ మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. చమురు ధరలు అంతకంతకు పెరగుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 31 పైసలు తగ్గి 72.11 వద్ద ట్రేడ్ అయింది. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రూపాయి 42 పైసలు పడిపోయిన శుక్రవారం ఒకటిన్నర నెలల కనిష్ట స్థాయి 71.80 వద్ద ముగిసింది. ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ సోలేమని హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గమంటున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి 72 స్థాయికి చేరింది. సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారన్ ఎక్స్చేంజ్లో డాలర్‌తో రూపాయి 72.03 వద్ద ప్రారంభమైం కాసేపటిటే 72.11కి పడిపోయింది. చివరికి 13పైసల నష్టంతో 71.93 వద్ద ముగిసింది. కాగా అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 70.59 (2.90 శాతం) పెరిగింది. మరోవైపు అమెరికా-ఇరాన్ యుద్ధ భయాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.సెన్సెక్స్ ఏకంగా 788, నిఫ్టీ 234 పాయింట్ల నష్టంతో ముగిసాయి. -
21 పైసలు ఎగిసిన రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్ ధోరణి కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే బుధవారం లాభాలతో ముగిసిన రూపాయి నేడు మరింత పుంజుకుంది. 21 పైసలు ఎగిసి 70.64 వద్ద కొనసాగుతోంది. అటు స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం ఆరంభ లాభాలనుంచి మరింత పుంజుకుని 158 పాయింట్లుపైగా ఎగిసిన సెన్సెక్స్ 40570 స్థాయి వద్ద కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 47 పాయింట్లు పుంజుకుని 11956 పాయింట్లను అధిగమించింది. -
రూపాయి... రెండు వారాల గరిష్టం @ 71.50
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం రెండు వారాల గరిష్టం 71.50 స్థాయికి చేరింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 24 పైసలు బలపడింది. అక్టోబర్ 17 తరువాత రూపాయి ఒకేరోజు 24 పైసలు బలపడ్డం ఇదే తొలిసారి. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ట్రేడింగ్‌లో 71.49–71.68 శ్రేణిలో తిరిగింది. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత పలు సానుకూల అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు బలపడింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ ముందుకు వెళ్లలేకపోయింది. చమురు ధర పెరుగుదల భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం.