East godavari
-
శరవేగంగా గ్రీన్‌ఫీల్డ్ హైవే
దేవరపల్లి: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మీస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎక్కడా గ్రామాలను తాకకుండా పచ్చని పంట పొలాల మధ్య నుంచి దీనిని నిర్మీస్తున్నారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు రవాణా సదుపాయం మెరుగుపడడంతో పాటు సమయం, దూరం ఆదా అవుతాయి. 162 కిలోమీటర్ల పొడవు... రూ.2,200 కోట్ల వ్యయం తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకూ రూ.2,200 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సుమారు 162 కిలోమీటర్ల పొడవున ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మీస్తోంది. ఇది పూర్తయితే దేవరపల్లి – ఖమ్మం మధ్య సుమారు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణానికి 2022 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ హైవే నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా అధిక వర్షాలు, తుపానుల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఆంధ్రాలో హైవే సాగుతుందిలా.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి సమీపంలోని రేచర్ల నుంచి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి టి.నర్సాపురం, వేపుగుంట, గుర్వాయగూడెం, బొర్రంపాలెం, జంగారెడ్డిగూడెం వద్ద మద్ది ఆంజనేయస్వామి ఆలయం సమీపాన ఎర్రకాలువ మీదుగా కొయ్యలగూడెం మండలం రాజవరం, యర్రంపేట, దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం,గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల మీదుగా దేవరపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిని కలుస్తుంది. జంగారెడ్డిగూడెం వద్ద పుట్లగట్లగూడెం–గుర్వాయగూడెం వద్ద జంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 83 ఎకరాలు సేకరించారు. ఖమ్మం–దేవరపల్లి మధ్య 8 టోల్‌ప్లాజాలు, 51 మైనర్, 9 మేజర్ బ్రిడ్జిలు నిర్మీస్తున్నారు. ఉమ్మడి ‘పశ్చిమ’లో 72 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హైదరాబాద్‌కు చెందిన డెకెం సంస్థ చేపట్టింది. తెలంగాణలో ఖమ్మం నుంచి రేచర్ల వరకూ ఒకే ప్యాకేజీగా పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 72 కిలోమీటర్ల పొడవును మూడు ప్యాకేజీల్లో ఈ పనులు జరుగుతున్నాయి. సేకరించిన భూములకు రైతులందరికీ పరిహారం అందించారు. భూసేకరణకు అడ్డంకులు గ్రీన్‌ఫీల్డ్ హైవేకి అవసరమైన భూసేకరణకు కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద బ్రేక్ పడింది. ఆ గ్రామానికి చెందిన రైతు కోర్టుకు వెళ్లడంతో మూడెకరాల భూసేకరణ నిలిచిపోయింది. న్యాయస్థానం తీర్పు రిజర్వులో పెట్టి దాదాపు ఏడాది కావస్తోంది. తీర్పు కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.రూ.2 కోట్లకు ఎకరం ధరఇప్పటికే రెండు హైవేలు ఉండటం, మరో హైవే వస్తుండటంతో దేవరపల్లి ప్రాంతంలో ఇప్పటికే భూముల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. ఎకరం రూ.2 కోట్లు పైగా పలుకుతోంది. మూడు జాతీయ రహదారులు అందుబాటులోకి రావడంతో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. పంట ఉత్పత్తులను దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు రవాణా చేయడం ద్వారా రైతులు గిట్టుబాటు ధర పొందే అవకాశం కలుగుతుంది.ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి రైతులు హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా నిమ్మ, అరటి, కోకో, జీడిగింజల వంటి పంట ఉత్పత్తులు వస్తుంటాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని నిర్మాణ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకూ సాధారణ జంక్షన్‌గా ఉన్న దేవరపల్లి ఇప్పుడు మూడు జాతీయ రహదారుల జంక్షన్‌గా కొత్త రూపు సంతరించుకుంటోంది. కోల్‌కతా– చెన్నై 16వ నంబర్ జాతీయ రహదారి దేవరపల్లి మీదుగానే సాగుతోంది. అలాగే, దేవరపల్లి – ఖమ్మం జిల్లా తల్లాడ మధ్య ఇప్పటికే 316డి హైవే ఉంది.ఇప్పుడు కొత్తగా దేవరపల్లి – ఖమ్మం మధ్య కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మీస్తున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారిని దేవరపల్లి వద్ద గోపాలపురం రోడ్డులోని డైమండ్ జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో మూడు హైవేలు కలుస్తూండటంతో వాటిని విభజిస్తూ నూతన టెక్నాలజీతో అవుటర్ రింగ్ రోడ్డు (డ్రమ్‌ఫుట్) నిర్మీస్తున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి ప్రభుత్వం సుమారు 1,100 ఎకరాలు సేకరించింది. 85 శాతం పూర్తి ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ రేచర్ల నుంచి గుర్వాయగూడెం వరకూ 85 శాతం, అక్కడి నుంచి దేవరపల్లి వరకూ 65 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. దేవరపల్లి వద్ద డ్రమ్‌ఫుట్ నిర్మాణం జరుగుతోంది. మొత్తంగా 85 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే జూన్ నాటికి ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. – సురేంద్రనాథ్, పీడీ, నేషనల్ హైవేస్, రాజమహేంద్రవరం -
హై అలర్ట్.. చికెన్ తినడం తగ్గించాలి.. ఆ జిల్లాలో రెడ్‌జోన్
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్‌గా ల్యాబ్‌లో నిర్ధారణ అయ్యింది. కానూరు పది కిలోమీటర్ల పరిధిలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒక కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వై లెన్స్ జోన్ ఏర్పాటు చేశారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు.కానూరు కేంద్రంగా 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని అధికారులు సూచించారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్(95429 08025) ఏర్పాటు చేశారు.రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించాయి. తొలుత నాటుకోళ్లు.. ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్.. చివరకు కోళ్లఫారాలనే చుట్టేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 30 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క నిడదవోలు నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్రమత్తమైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ.. నివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేకరించి విజయవాడలోని రాష్ట్ర స్థాయి పశువ్యాధి నిర్ధారణ శాలతో పాటు భోపాల్‌లోని హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు పంపింది.తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ఎవియాన్ ఇన్‌ఫ్లూయింజ్(హెచ్5ఎన్1)గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు సోమవారం భోపాల్ ల్యాబ్ నుంచి రిపోర్టు రాగానే సమాచారాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య సంస్థతో పాటు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్‌కు అందించారు.వైరస్ నిర్ధారణ అయిన ఉభయగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పశుసంవర్ధక శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల్లో లేయర్, బ్రాయిలర్ కోళ్ల ఫారాల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలానికి రెండు చొప్పున ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి బర్డ్‌ఫ్లూను ఎదుర్కోడానికి సమాయత్తం చేశారు. -
అనపర్తిలో అధికార పార్టీ నేతల అరాచకం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో అధికార పార్టీ నేతలు అరాచకానికి తెరతీశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆలయం ప్రారంభించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అనపర్తి కొత్తూరులో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.20 లక్షల వ్యయంతో ఆలయం నిర్మించారు.విగ్రహ ప్రతిష్ట ఇవాళ జరగాల్సి ఉండగా, నోటీసులు అందచేసిన అధికారులు విగ్రహ ప్రతిష్ట నిలుపుదల చేయించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఆహ్వానం లేకపోవడం వల్లే ఆలయాన్ని ప్రారంభించనివ్వడం లేదని స్థానికులు అంటున్నారు. ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తూరు వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. 144 సెక్షన్ విధించారు. -
రాజమండ్రి ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం తప్పింది. మధురపూడి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కొంతభాగం పాక్షికంగా కూలింది. నిర్మాణ సమయంలో ఐరన్ గ్రిల్స్ కిందపడిపోయాయి. కూలిన సమయంలో కార్మికులు లేకపోవడంతో ముప్పు తప్పింది. -
Sankranti Special: సంక్రాంతి పిండి వంటలకు ఫిదా
-
చంద్రబాబు సీఎంగా ఉంటే అంతే.. టీటీడీ బోర్డు రద్దుకు మార్గాని భరత్ డిమాండ్
తూర్పు గోదావరి, సాక్షి: తిరుపతి తొక్కసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాకాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘తిరుపతి ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దారుణం..అత్యంత బాధాకరమైన విషయం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస వసతులు కూడా అందించకుండా అలా ఎందుకు బంధించినట్లు?. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారు?. ఇక్కడ టీటీడీ ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. టీటీడీ దేవస్థానమో(TTD Board) లేదంటే రాజకీయ పార్టీ కార్యాలయమో అర్థం కావడం లేదు.చంద్రబాబు(Chandrababu)కు సంబంధించిన అనే కార్యక్రమాల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాలు 29 మంది ప్రాణాలు కోల్పోయారు . క్రౌడ్ మేనేజ్మెంట్ చంద్రబాబు జమానాలో సాధ్యం కాదా?. అదే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.తిరుపతి(Tirupati) మరణాలకు బాధ్యత ఎవరిది?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ బాధ్యత టీటీడీకి వదిలేశారు. అయితే క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించటం దారుణం. అసలు 1,20,000 టోకెన్లు జారీ చేయాలని భావిస్తే ఆన్లైన్లో ఎందుకు చేయలేదు. చిన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదు ఇది మొత్తం వ్యవహారానికి టిటిడి బోర్డు బాధ్యత తీసుకొని పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వం బోర్డును రద్దు చేయాలి. ఇది హిట్లర్ నియంత పాలన కాదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం చంద్రబాబు గుర్తించాలి. తిరుపతి ఘటనను చీకటి రోజుగా కింద భావించాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి అని మార్గాని భరత్ అన్నారు. -
ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ వేధింపులతో మహిళా వాలంటీర్ సూసైడ్
-
టీడీపీ నేతల బరితెగింపు
-
పోతవరంలో టీడీపీ నేతల బరితెగింపు
తూర్పుగోదావరి జిల్లా: రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రతీ రోజూ టీడీపీ నేతల బరితెగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం పోతవరంలో టీడీపీ నేతలు బరి తెగించారు. వైఎస్సార్సీపీకి చెందిన సానుభూతిపరుల భూమిని దోచుకునేందుకు కుట్ర చేశారు. గందదిపాము రాజ్‌కుమార్‌కు చెందిన భూమిని చిడిపి గోపీ అతని అనుచరులతో కలిసి దోచకునేందుకు ప్రణాళిక రచించారు. దీనిలో ాగంగా తనపై విచక్షణారహితంగా దాడికి దిగాడని గందిపాము రాజ్‌కుమార్ ఆరోపిస్తున్నాడు.తనపై దాడికి దిగిన వారిలో చిడిపి గోపీతో పాటుగా అతని అనుచరులైన మాజీ ఎంపీటీసీ కళావతి, ఏసునాదం, నేకూరి అబ్బులు, కళావతి అల్లుడు ఉన్నారన్నాడు. ఇదే విషయంపై గోపీ అతని అనుచరులు తరచు వేధిస్తున్నారని బాధితుడువాపోతున్నాడు. తన పొలం ఇవ్వకపోతే దాడి చేయడమే కాకుండా కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు విలపిస్తున్నాడు.చిడిపి గోపీ అతని అనుచరులు దాడిలో తీవ్ర గాయాలైన తాము తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధిత కుటుంబ స్పష్టం చేసింది. ఈ దాడిపై ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలతో పాటు ఎమ్మెల్సీ రిపోర్ట్ పంపించినా పోలీసులు కేసు నమోదు చేయడంలో తాత్సారం చేస్తున్నారన్నారు. తనకు తన కుటుంబానికి చిడిపి గోపీ నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు పేర్కొన్నాడు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు బాధితుడు.వైఎస్సార్సీపీ నేత పొలాన్ని తవ్వేసిన పచ్చమూకలు నిన్న(ఆదివారం)పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దుర్గి మండలం కోలగొట్లలో వైఎస్సార్సీపీ నేత కన్నెబోయిన నాసరయ్య పొలాన్ని జేసీబీలతో మట్టిని తవ్వేసి తరలించుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతల బెదిరింపులతో కన్నెబోయిన నాసరయ్య ఊరు వదిలి బయటకు వచ్చి నివసిస్తున్నారు. టీడీపీ నాయకుల దందాను వీఆర్వో దృష్టికి తీసుకువెళ్తే.. టీడీపీ నేతలను సంప్రదించమంటూ సలహా ఇస్తున్నారని నాసరయ్య మండిపడుతున్నారు.ప్రోక్లైన్లతో నాసరయ్య పొలంలో పెద్ద పెద్ద గోతులు పెడుతూ టీడీపీ నేతలు మట్టి తీసుకెళ్లిపోయారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి మరోసారి పొలంలో తవ్వకాలు మొదలుపెట్టిన టీడీపీ రౌడీలు.. భారీగా మట్టి తరలిస్తున్నారు. ప్రభుత్వం మాదంటూ.. పోలీసులు, కలెక్టర్ గాని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో అధికారులు చేతులెత్తేశారు. -
తూర్పుగోదావరి జిల్లాలో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
-
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
-
విషాదం.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి..!
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ రేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ గుర్తించారు.ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మరణంతో రెండు కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రితో కలిపి పళ్ల వ్యాపారం చేస్తున్న చరణ్ మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఇప్పటివరకు బాధిత కుటుంబాలను సినీ ప్రముఖులు కానీ, అధికారులు కానీ పరామర్శించలేదని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు. -
AP: కళ్యాణ మండపంలో రేవ్ పార్టీ.. ఐదుగురు మహిళలు అరెస్ట్
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ ఘటన కలకలం రేపింది. న్యూ ఇయర్ సందర్భంగా కళ్యాణ మండపంలో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో రేవ్ పార్టీలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం బూరుడుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో రేవ్ పార్టీ జరుగుతోంది. దీనిపై సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున రేవ్ పార్టీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో రేవ్ పార్టీలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే, న్యూ ఇయర్ సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన వారిగా సమాచారం. వారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, రేవ్ పార్టీ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
AP: పోలీసులు బకరా.. సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా డాన్ పరారీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. ముఠా సభ్యులు పోలీసుల అదుపులోకి ఉన్న నిందితుడి తప్పించారు. దీంతో, నడిరోడ్డుపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..దొంగ నోట్ల కేసులో భీమవరంలో ఉన్న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు శుక్రవారం రాత్రి శ్రీకాకుళం బయలుదేరారు. అదే సమయంలో పోలీసు వాహనాన్ని రెండు కార్లు, నాలుగు బైకులు వెంబడించాయి. కొంత దూరం వరకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో రాజమండ్రిలోని వీఎల్‌పురం వద్ద నిందితుడిని తీసుకెళ్తున్న శ్రీకాకుళం పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. సినిమా ఫక్కీలో ఈకేసులో ఉన్న నిందితుడిని వారు తప్పించి.. తమ కారులో తీసుకెళ్లారు.అనంతరం, సదరు పోలీసులు.. 100కు కాల్ చేసి ఈ విషయాన్ని రాజమండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో, కేసు నమోదు చేసిన రాజమండ్రి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను వెంబండించిన కార్ల నెంబర్లను సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దొంగ నోట్ల ముఠా డాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
శివయ్య ప్రీతికి ‘శంఖు’ నాదం : దంపతులకు అవార్డు
రాజమహేంద్రవరం రూరల్: శివయ్యను ప్రసన్నంచేసుకునేందుకు భక్తులు అనేకమార్గాలను అనుసరిస్తారు. శంఖాన్ని ఏకబిగిన పూరిస్తూ మహాదేవుడిని ఆనందింపచేస్తారు మరికొందరు. శ్వాసను బిగించి ఏకధాటిగా దాదాపు ఇరవై నిముషాల పాటు శంఖాన్ని పూస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తున్న ఎస్పీఎఫ్ కమాండెంట్ నర్సింహరావు, అలివేలు మంగాదేవి దంపతులకు ఆధ్మాత్మిక సంపూర్ణత్వంతో పాటు, భౌతికంగా కూడా అవార్డులు వరిస్తున్నాయి. వీరు చేసే ఆధ్యాత్మిక సేవ అవార్డుల కోసం కాకపోయినప్పటికీ శంఖనాదంలో వీరి నిపుణతకు హైదరాబాదుకు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కామధేను –2024 అవార్డ్స్‌లో భాగంగా జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం (డిసెంబరు 14) హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో నరసింహారావు దంపతులు ఈపురస్కారాన్ని అందుకోనున్నారు.ఈ సందర్భంగా తమ ఆధ్యాత్మిక మార్గం, శంఖునాదం సాధన గురించి నర్సింహరావు మాటల్లో.. డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పి.గన్నవరం తమ స్వగ్రామం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఏపి ప్రత్యేక రక్షణ దళం(ఏపీఎస్పీఎఫ్) కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా. తన భార్య అలివేలు మంగాదేవి గృహిణి. తమకు శివుడు అంటే ఎనలేని భక్తి. తాను 1989లో పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతంలో సరిహద్దు భద్రత దళంలో పనిచేసే సమయంలో బెంగాలీ పూజారి చక్రవర్తి వద్ద శంఖం పూరించడంలో మెలుకువలు నేర్చుకున్నాను. అదే స్పూర్తితో తన భార్య మంగాదేవికి కూడా ఈ విద్యలో పట్టుసాధించారు. దీంతో తమకు ‘అఖండ శంఖారావ యుగళం’గా పేరొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళ,తమిళనాడు ,కర్ణాటక, డిల్లీ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో 35 ఏళ్లుగా సొంత ఖర్చులతో ఇంతవరకు నాలుగువేలకు పైగా కార్యక్రమాలు తమ శంఖారావంతో ఆరంభమయ్యాయంటారు ఈ దంపతులు ఇంకా గోదావరి,కృష్ణాపుష్కరాలు, ఇబ్రహీంపట్నం పవిత్ర నదీసంగమ అనుసంధానం వంటి పెద్దపెద్ద కార్యక్రమాల్లో శుభసూచికంగా అఖండ శంఖారావం పూరించాం. ఈసందర్బంగా పలు సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లు, అవార్డులు, సత్కారాలు, సువర్ణ ఘంటాకంకణాలు లభించాయన్నారు. ఇదంతా కేవలం సాధనతోనే సాధ్యమైందని, పదేళ్లపాటు దీన్ని సాధన చేశామని నరసింహారావు దంపతులు పేర్కొన్నారు. -
పులి సాగర్‌పై దాడి ఘటన.. పీఎస్‌లో మార్గాని భరత్ ఫిర్యాదు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రికి చెందిన దళిత యువకుడు పులి సాగర్‌పై జరిగిన దాడి ఘటనపై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో బంధించి సీఐ దాష్టీకంపై ఆయన మండిపడ్డారు. దళితులపై కూటమి సర్కార్ వేధింపుల పట్ల భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పులి సాగర్‌కు జరిగిన అన్యాయంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని భరత్ తెలిపారు.కాగా, రాజమండ్రి పోలీసుల చేతిలో దారుణంగా హింసించబడ్డ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉదంతంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. బాధితుడు పులి సాగర్‌కు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను ఆదేశించారాయన.రెండురోజుల క్రితం పులిసాగర్‌ను కొందరు వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో.. రాజమహేంద్రవరం పోలీసులు తనతో ఎంత అవమానవీయంగా వ్యవహరించారో జగన్‌కు సాగర్ వివరించాడు. అయితే సాగర్‌కు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. పోలీసుల తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. -
‘కూటమి సర్కార్ లిమిట్స్ దాటిపోయింది.. మనం ఏపీలోనే ఉన్నామా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లో చిత్ర హింసలు పెడుతోంది. అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? లేదా? అని ప్రశ్నించారు.అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. దళిత యువకుడిపై అక్రమ కేసు బనాయించి హింసించారు. వర్షాలతో రాజమండ్రి రోడ్లు మునిగిపోతే ప్రశ్నించకూడదా?. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే హింసించారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. బాజీలాల్ అనే సీఐ దళిత యువకుడిని దారుణంగా కొట్టారు. దుస్తులు ఊడతీయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోపెట్టారు. పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.అక్రమ కేసులపై బాధితుడు పులి సాగర్ మాట్లాడుతూ.. వర్షానికి కాలనీలో నీళ్లు నిలిచిపోతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాను. అనంతరం, పోలీసులు స్టేషన్‌కు పిలిచి పచ్చి బూతులు తిట్టారు. చంపేస్తామని బెదిరించి పోలీసు స్టేషన్లో బట్టలూడదీశారు. పీక కోసి రైలుపట్టాలపై పడేస్తానని ప్రకాష్‌నగర్ సీఐ బెదిరించారు. గోదావరిలో పడేస్తామని సీఐ దూషించారు. కానిస్టేబుల్‌తో దుస్తులు ఊడతీయించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దుస్తుల్లేకుండా లాకప్‌లో కూర్చోపెట్టారు. మహిళా పోలీసుల ఎదుట నా పరువు తీశారు. విద్యావంతుడినైనా నన్ను ఇంత చిత్రహింసలకు గురి చేయటం ఎందుకు?. నాకు ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. దళితులు అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకన భావమే. చంద్రబాబు దళిత వ్యతిరేకి. సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్పేంటి?. సాగర్‌ను బండబూతులు తిట్టి, బట్టలు విప్పిన సీఐపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది?. కూటమి పాలనలో కులం పేరుతో దూషణలు, దళిత వ్యతిరేక భావనలు ఉన్నాయి. కూటమి సర్కార్ పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది. బాధితుడు సాగర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడుతామని చెప్పారు. రైలు కింద అతని తలకాయ పెడతానని బెదిరించారు. తాడు కట్టి గోదావరిలో వేస్తామనటం ఏంటి?. సీఐ బాజీలాల్ని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయంపై స్పందించాలి. పెద్ద ఎత్తు ఉద్యమం చేస్తాం. దళిత అధికారులపై కూడా కక్ష కట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న తప్పులను ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతారా?. దళితుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతున్నారు. దళిత అధికారులు, దళిత మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దళితులకు బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. పులి సాగర్ విషయంలో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం అని హామీ ఇచ్చారు. -
మాకు అడ్డుచెప్పేదెవరు.. జనసేన నేతల కొత్త దందా!
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి పాలనలో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారం తమదే అన్న భావనలో తాము ఏది చేసినా చెల్లుతుందని కబ్జాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నేతలు తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా దోపీడీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అడ్డు చెప్పిన వారిని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. పోలవరం కాలువ గట్లపై జనసేన, టీడీపీ నేతలు మట్టిని తవ్వేస్తున్నారు. ఈ క్రమంలో పచ్చ నేతల దోపిడీని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మరింత రెచ్చిపోయిన ఎల్లో బ్యాచ్.. అడ్డు వచ్చిన స్థానికులనే చంపేస్తామని బెదిరింపులకు దిగారు.అయితే, స్థానికంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల నుంచి పోలవరం గట్లను కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
పచ్చ పీతతో మత్స్యకారులకు కాసుల వర్షం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకారులకు ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన పసుపు పచ్చ పీతకు మళ్లీ పూర్వ వైభవం రానున్నది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికున్న డిమాండ్.. సాగు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పీతల సాగు ప్రోత్సాహానికి ప్రణాళిక సిద్ధంచేసింది. దీనిలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పచ్చపీతల హేచరీ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించి నిధులు మంజూరు చేసింది. త్వరలో ఇది సాకారం కాబోతోంది. – సాక్షి, అమలాపురం విదేశాల్లో డిమాండ్పచ్చ పీత (పసుపు పీత)కు అమెరికా, చైనా, థాయ్‌లాండ్, సింగపూర్‌లో మంచి డిమాండ్ ఉంది. ఔషధ గుణాలు కలిగిన వృక్షజాతులు పెరిగే చిట్టడవి (మడ అడవులు)లో అధికంగా ఇది దొరుకుతుంది. దీనిలో రాగి, ఫాస్ఫరస్, ఒమేగా–3 అధికంగా ఉంటాయి. వీటిని వినియోగిస్తే గుండె సమస్యలు, అల్జీమర్స్ (మతిమరుపు) లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, కొత్తపాలెం, పండి, పొర, ఐ.పోలవరం మండలం భైరవపాలెం, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చినవలసల, పెదవలసల, చినబొడ్డు వెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం, గాడిమొగ, రామన్నపాలెం గ్రామాల మత్స్యకారులు ఎక్కువగా పీతల వేట చేస్తారు.ఏటిమొగతోపాటు నదీపాయలు సముద్ర సంగమ ప్రాంతాలు, తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడే పర్ర భూముల్లో వీటి లభ్యత అధికం. వీటిని తొలుత చెన్నై, కోల్‌కతా నగరాలకు, అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతవుతాయి.తగ్గిన లభ్యత.. పెరిగిన ధరచమురు సంస్థల కార్యకలాపాలు, ఆక్వా చెరువుల వ్యర్థాలవల్ల పీత లభ్యత తగ్గిపోతోంది. గడిచిన ఐదేళ్లుగా దీని లభ్యత చాలా అరుదుగా మారిపోయింది. గతంలో రోజుకు ఐదు టన్నుల నుంచి ఆరు టన్నుల వరకు పీత చెన్నై వెళ్లి అక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతయ్యేది. ఇప్పుడు రోజుకు అర టన్ను కూడా పీత లభ్యత లేదు. మూడేళ్ల క్రితం పచ్చ పీత కేజీ ధర రూ.500ల వరకు ఉండేది. ఇప్పుడు కేజీ రూ.1100 నుంచి రూ.2 వేల వరకు పలుకుతోంది.సాగుకు ఊతమిచ్చేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలుఅంతర్జాతీయంగా డిమాండ్ ఉండడం.. స్థానికంగా పసుపు పచ్చపీత లభ్యత చాలా తక్కువగా ఉండడంతో కోనసీమ జిల్లాలో కొంతమంది రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేపట్టారు. కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున సాగుచేశారు. వైరస్ సోకడంతో పీత ఎదుగుదల ఆశించిన స్థాయిలో రావడంలేదు. పీత పిల్లలు (సీడ్)ను తమిళనాడులోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఆఫ్ ఆక్వా కల్చర్ వద్ద ఉన్న హేచరీ నుంచి తీసుకొస్తున్నారు.పిల్లకు రూ.12, రవాణాకు రూ.మూడు చొప్పున ఒక పీత పిల్లకు రూ.15 వరకు అవుతోంది. అది కూడా ఆర్డరు ఇచ్చిన నాలుగు నుంచి ఆర్నెల్లపాటు పీత సీడ్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక పీత పిల్లలు ఒకదానిని మరొకటి తినే గుణం ఉండడం, సుదూర ప్రాంతం నుంచి రవాణావల్ల నలిగిపోయి పెద్దఎత్తున చనిపోతున్నాయి. ఈ కారణంగా రైతులు సాగుకు ముందుకు రావడంలేదు. వెనామీ తరహాలో విదేశీ మారకద్రవ్యం అధికంగా వచ్చే అవకాశమున్నందున తీరంలో పీతల సాగు ప్రోత్సహించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా కాట్రేనికోన మండలం చిరయానాం వద్ద ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఇక్కడ అధునాతన పద్ధతిలో హేచరీ ఏర్పాటుచేసేందుకు రూ.3.75 కోట్ల మంజూరుకు అనుమతిచ్చింది. ఎన్నికలవల్ల ఆలస్యమైన హేచరీ నిర్మాణ పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి.ఇక్కడ ఏడాదికి పది లక్షల పీత పిల్లలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో నాలుగు నుంచి ఆర్నెలల్లో ఇక్కడ ఉత్పత్తి మొదలయ్యే అవకాశముంది. తమిళనాడులోనిది మొదటిది కాగా.. దేశంలో ఇది రెండో హేచరీగా గుర్తింపు సంతరించుకోనుంది. హేచరీ నుంచి పచ్చపీత పిల్ల ఉత్పత్తి మొదలైతే తీరంలో పీతల సాగుకు ఊతం లభించినట్లవుతుందని మత్స్యకారులు, ఆక్వా రైతులు ఆశలు పెట్టుకున్నారు. -
తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు యువకులు మృతి
సాక్షి,తూర్పుగోదావరి: ఉండ్రాజవరం మండలం తాటిపర్రులో విషాదం చోటుచేసుకుంది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాకుతో నలుగురు యువకులు మృతి మృతిచెందారు. మరో యువకుడు కోమటి అనుమంతురావు అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గొల్ల వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. కాగా, తాటి పర్రు విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ
తూర్పుగోదావరి, సాక్షి: నిడదవోలు టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్‌కు నిరసన సెగ తగిలింది. తమను పట్టించుకోవటం లేదని మంత్రిని టీడీపీ నేతులు నిలదీశారు. మంత్రి దుర్గేష్ ఎదుటే టీడీపీ, జనసేన నేతలు ఘర్షణకు దిగారు. -
తూ.గో.: టీ పొడి అనుకుని పురుగుల మందు కలపడంతో..
తూర్పు గోదావరి, సాక్షి: రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. టీ పొడి అనుకుని ఓ వృద్ధురాలు పాలలో పురుగుల మందు కలపడంతో.. భర్తతో సహా ప్రాణం విడిచింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పాయమ్మ(70)కు కళ్లు సరిగ్గా కనిపించవు. దీంతో టీ పొడి అనుకుని పురుగుల మందును పాలలో కలిపింది. ఆ టీ తాగి భర్త వెలుచూరి గోవింద్(75), ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ దంపతులు కన్నుమూశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
AP: దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మంగళవారం(సెప్టెంబర్10) అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళుతున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిలకావారి పాకల వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. జీడి గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతులను నిడదవోలు మండలం తాడిమళ్ల వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 10 మంది ఉన్నారు. డీసీఎం కేబిన్‌లో ఉన్నవారికి మాత్రం ఏమీ కాలేదు.ఇదీ చదవండి.. మాకు అడ్డొస్తే చంపేస్తాం -
మట్టిలో మాణిక్యం..! ఈ బుడ్డాడు మామూలోడు కాదు
-
రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
కొవ్వూరు: దేచెర్ల గ్రామ సమీపంలోని చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం గౌరీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బడుగు రాజారత్న (47) మృతి చెందారు. ఏడాదిన్నర కుమార్తెకు అనారోగ్యంగా ఉండడంతో సెలవులో ఉన్న ఆమె శనివారమే విధులకు హాజరయ్యారు. అయితే కుమార్తె ఏడుస్తోందని సమాచారం రావడంతో స్వస్థలమైన రాజమహేంద్రవరం బయలుదేరారు. గౌరీపట్నంలో ఎక్స్‌ప్రెస్‌లు ఆపకపోడంతో ఐ.పంగిడి వెళ్లి రాజమహేంద్రవరానికి బస్సు ఎక్కాలని భావించారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడు కేదాటి ఫణిశేఖర్‌ను సాయం కోరడంతో ఆయన రాజారత్నను తీసుకుని మోటారుసైకిల్‌పై ఐ.పంగిడి బయలుదేరారు. దేచెర్ల చెరువు సమీపంలో బురద మట్టి కారణంగా వాహనం అదుపు తప్పింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ.. రాజారత్న తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. రాజారత్న భర్త రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కర్రి శ్రీహరిరావు తెలిపారు. -
‘చంద్రబాబు కన్నా డ్రామా చేసేవారే నయం’
సాక్షి, రాజమండ్రి: వరద బాధితులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘వరద బాధితులకు ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయటం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫొటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో పరిహారం, రేషన్, అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నీటి మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలి. లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. .. వాలంటీర్లకు పదివేల రూపాయలు స్టైఫండ్ ఇస్తానని చెప్పి వ్యవస్థనే నిర్మూలించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నిరుద్యోగ భృతి ఊసేత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీలు ఎత్తెస్తాడేమో అనిపిస్తుంది. తల్లికి వందనం పథకానికి మంగళంపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కన్నా డ్రామాలాడే వాడే నయం. ప్రజలను దారుణంగా వంచిస్తున్నారు. సంపద సృష్టిస్తామన్నారు.. ఇప్పటివరకు ఏమి సృష్టించలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా ఎక్కడుంది. సహాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. .. ఇసుక కొండలు ఏమైపోయాయి. ఇసుక గుట్టలను స్థానిక ఎమ్మెల్యేలు మింగేశారు. నాలుగు రోజుల్లోనే బకాసురుల్ల మింగేశారు. స్థానిక ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోనే రూ. 10 కోట్లఇసుక మింగేశారు. ఉచిత ఇసుక ఎవరికిచ్చారు? రాజమండ్రి వ్యాప్తంగా సెటిల్మెంట్ బ్యాచ్‌లే నడిపిస్తున్నాయి. పేకాట క్లబ్ నడుపుకుంటామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాళ్లే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలి? జిల్లా పోలీసు అధికారులను పేకాట డబ్బులు నడుపుకుంటామని ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. ఇదెక్కడి ప్రభుత్వం. గతంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇసుక వల్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతి వ్యాపారి వద్దకు వెళ్లి కమిషన్ కట్టమని ఒత్తిడి తీసుకొస్తున్నారు’అని భరత్ అన్నారు. -
గోదారి సీనుంటే.. బొమ్మ బ్లాక్‌బస్టరే..
తాళ్లపూడి: వయ్యారి గోదారి పరవళ్లు.. ఒంపులు తిరిగిన గోదారి గట్లు.. ఆపైనుండే గుడి గోపురాలు.. నీటి మధ్య ఇసుక తిన్నెలు.. లంకలు.. సూర్యోదయాస్తమయ వేళల్లో గోదారమ్మ నుదుటిన అలదుకునే సిందూరం.. పావన నదిపై నీలి మేఘాలంకరణలు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నని చెప్పేది గోదారోళ్ల సౌభాగ్యం. భౌతిక నేత్రంతో చూసే భాగ్యం ఇక్కడివారిదైతే.. ఇవే దృశ్యాలను వెండితెరపై చూసి అచ్చెరువొంది.. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాలను సందర్శించాలని భావించేవారెందరెందరో.. కొంత కళాత్మక దృష్టి.. ఒకింత భావుకత.. మరికొంత రసరమ్యమైన మనసు.. వీటికి తోడు భావగర్భితమైన కెమెరా కన్ను.. చాలు.. ఓ సుందర దృశ్య కావ్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి. ఇలాంటి మనసున్న దర్శక, నిర్మాతలెందరో మన గోదావరిని అమ్మగా.. కొంటె కోణంగిగా.. వయ్యారిభామగా.. పడుచు పిల్లగా.. మరెన్నో విధాలుగా వెండి తెరపై ప్రపంచానికి చూపించి వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన కథలకు నేపథ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలను ఎన్నుకుని ఎనలేని కీర్తిని గడించారు. తెలుగు సంస్కృతికి ప్రతీకలు గోదావరి జిల్లాలు. ఇక్కడి ప్రజల వాడుక భాషే ‘చిత్ర’ భాషగా వ్యవహరిస్తారు. ఇక్కడి ఆచార వ్యవహారాలే ప్రామాణికంగా భావిస్తారు. దర్శక దిగ్గజాల్లో ఒకరైన నాటి ఆదుర్తి సుబ్బారావు నుంచి నేటి శేఖర్ కమ్ముల వరకూ ఎందరో గోదావరి అందాలతో వారి చిత్రాలను సుసంపస్నం చేసుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు వంటి అగ్ర దర్శకులే కాక.. ఈ ప్రాంతానికే చెందిన వంశీ తీసిన చాలా సినిమాలు గోదావరి నది నేపథ్యంగా సాగినవే. వారిలో చాలా మందికి పాపికొండల నుంచి అంతర్వేది వరకూ ఎన్నో ప్రాంతాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరిస్తే చాలు.. ఆ చిత్రం హిట్టు కొట్టేస్తుందనేది గట్టి నమ్మకం కొవ్వూరు పరిసరాల్లో.. ముఖ్యంగా కొవ్వూరు మండలంలోని గోష్పాద క్షేత్రం, కుమారదేవం, ఆరికిరేవుల, తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం పరిసర ప్రాంతాల్లో గోదావరి తీరాన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. వేగేశ్వరపురంలో గోదావరి ఒడ్డున ఉన్న ఆంజనేయుని ఆలయం రేవు, బల్లిపాడు ఇసుక ర్యాంపు లంకలు, మలకపల్లిలోని కుంటముక్కల వారి గృహంలో అనేక సినిమాల్లో చాలా సన్నివేశాలే చిత్రీకరించారు. 👉వేగేశ్వరపురంలో చిరంజీవి నటించిన రక్తసింధూరంలోని ఓ పాటను, రామ్‌చరణ్, సమంత నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలను తాడిపూడి, వేగేశ్వరపురం గోదావరి లంకల్లో చిత్రీకరించారు. 👉 నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తాళ్లపూడిలోనే తీశారు. 👉 సాయికుమార్, ఆయన కుమారుడు ఆది కథా నాయకుడిగా నటించిన చుట్టాలబ్బాయ్ చిత్రంతో పాటు, మంచు మనోజ్, రెజీనా నటించిన శౌర్య చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఇక్కడే తెరకెక్కించారు. 👉 నాగార్జున, అనుష్క నటించిన ఢమరుకం చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను గోదావరి నది ఒడ్డున ఆంజనేయస్వామి గుడి వద్ద తీశారు. ప్రత్యేకంగా రుషుల కోసం ఒక సెట్ వేసి వారం రోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేశారు. 👉 సుమంత్ నటించగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి, వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన సరదాగా కాసేపు చిత్రంలో కారులో వెళ్లే పాటను ఇక్కడే చిత్రీకరించారు. 👉 జగపతిబాబు, ప్రియమణి నటించిన పెళ్లైన కొత్తలో చిత్రంలో వారి స్నానపు సన్నివేశాన్ని ఇక్కడే తెరకెక్కించారు. 👉 ప్రక్కిలంకలో కృష్ణ నటించిన పాడిపంటలుతో పాటు, చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ ఈ ప్రాంతంలో చిత్రీకరించినవే. 👉 శ్రీకాంత్, చార్మి నటించిన చిత్రంలోని ఓ పాటను, శివాజీ హీరోగా నటించిన మిస్టర్ ఎర్రబాబులో మిత్రులతో కలిసి కథానాయికను ఆయన పరిచయం చేసుకునే సన్నివేశాన్ని, సునీల్‌పై హాస్య సన్నివేశాలను, ఆలీ నటించిన ఆషాఢం పెళ్లికొడుకులో ఒక పాటను ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరించారు. 👉 కేవలం సినిమాలే కాకుండా కొన్ని ధారావాహికలు సైతం ఇక్కడి గోదారి ప్రాంతాల్లో చిత్రీకరించారు. హిట్ చిత్రాల భవనం సుమారు 110 ఏళ్ల క్రితం మలకపల్లిలో ఆ గ్రామానికి చెందిన కుంటముక్కల వీరభద్రరావు, వెంకటాద్రి, జానకిరామయ్య లోగిలిని అత్యాధునికంగా నిర్మించారు. ఈ గృహంలో సినిమా తీస్తే హిట్ గ్యారెంటీ అని చిత్రరంగ ప్రముఖుల్లో గట్టి నమ్మకం. 👉 జంధ్యాల దర్శకత్వంలో 1985లో వచ్చిన సీతారామకల్యాణం చిత్రం ఎక్కువ భాగం ఈ ఇంట్లోనే తీశారు. 👉 ఆ చిత్రం విజయం సాధించడంతో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో డి.సురే‹Ùబాబు నిర్మాతగా బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలిరాజా చిత్రంలోని కీలక సన్నివేశాలను కూడా ఈ ఇంట్లోనే తెరకెక్కించారు. 👉 అలాగే క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, బాలకృష్ణ నటించిన సీతారామ కల్యాణం, నరేష్ నటించిన ప్రేమచిత్రం.. పెళ్లి విచిత్రం, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శోభన్‌బాబు నటించిన ఏవండీ ఆవిడ వచ్చింది, ఇంకా.. సీతారత్నం గారి అబ్బాయి, తాళి తదితర చిత్రాలన్నీ విజయం సాధించాయి. 👉 ఇదే గ్రామంలో దివంగత కుంటముక్కల భాస్కరరావు గృహానికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రేమవిజేత అనే చిత్రం, రజనీకాంత్ నటించిన తమిళ సినిమా, జగదాంబ టూరింగ్ టాకీస్ తదితర సినిమాల్లో చాలా సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. అప్పట్లో డి.రామానాయుడు ఇక్కడి గ్రంథాలయానికి రూ.30 వేల విరాళం అందజేశారు. దీంతో గ్రామస్తులు ఆ భవనానికి మరమ్మతులు చేసి, రామానాయుడు గ్రంథాలయంగా పేరు పెట్టారు. రామచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తాజాగా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు.150 ఏళ్ల నాటి సినిమా చెట్టుకుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్టుకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ సుమారు 200 పైగా సినిమాల షూటింగ్‌లు జరిగాయి. దీంతో, దీనికి ‘సినిమా చెట్టు’గా పేరొచ్చింది. ఇక్కడ సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ చిత్రసీమలో స్థిరపడిపోయింది. ఈ నమ్మకంతోనే ఒక్క సీన్ అయినా ఈ చెట్టు కింద తీస్తారు. మొదటిగా కృష్ణ హీరోగా 1975లో పాడిపంటలు ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, శోభన్‌బాబు, బాలకృష్ణ, మోహన్‌బాబు, సుమన్, మహే‹Ùబాబు, రామ్‌చరణ్, రాజశేఖర్, నాని తదితర హీరోలతో పాటు, దర్శకులు వంశీ, రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, సుకుమార్ ఈ చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడం సెంటిమెంట్‌గా భావిస్తారు.షూటింగ్‌ల అడ్డా.. గోష్పాద క్షేత్రం కొవ్వూరు గోష్పాద క్షేత్రం పలు హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. జూనియర్ ఎనీ్టఆర్, భూమిక నటించిన హిట్ చిత్రం సింహాద్రిలో ఇంటర్వెల్ సీన్ ఇక్కడే తీశారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో 100 పర్సంట్ లవ్‌తో పాటు గుండెల్లో గోదారి, బెండు అప్పారావు ఆర్ఎంపీ తదితర అనేక చిత్రాలు ఇక్కడ తీశారు. ఇలా గోదావరి తీరంలో ఏటా చాలా చిత్రాల షూటింగులు జరుగుతూనే ఉంటాయి. -
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావది: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణ బాబు మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. నేడు తెల్లవారుజామున కృష్ణబాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా 1953లో పాలకొల్లులో జన్మించిన కృష్ణబాబు.. కొవ్వూరు నియోజకవర్గంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు(1983,1985, 1989, 1994) నాలుగుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో ఓటమి చెందిన ఆయన తిరిగి 2004లో అయిదవసారి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణబాబు దూరంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా కృష్ణబాబు పేరొందారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ప్రస్తుతం స్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. -
‘నన్ను కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?’: మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి, సాక్షి: నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించాం. ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. మా నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. వందమంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు.హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. దళితురాలినైన నన్ను కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్?. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు.టీడీపీ శ్రేణుల దాడుల్లో.. మా కార్యకర్తలు నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఒకరికి తల పగలటంతో కుట్లు సైతం పడ్డాయి. టీడీపీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులు చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నారు అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
-
CM Jagan : ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
సాక్షి, తూర్పుగోదావరి: సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది. గోదావరి జిల్లాల్లో జన జాతరను తలపిస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ తరలివచ్చిన జన సందోహంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నడినెత్తిన సూరీడు 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో నిప్పులు చెరుగుతున్నా లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడాలని, ఆయనతో మాట కలపాలని రోడ్డుకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. ఆయనకు అప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో దారిపొడవునా సీఎం వైఎస్ జగన్ కోసం జనం వేచి చూసి మరీ స్వాగతం పలికారు. సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ జరగనుంది దిక్కులు నాలుగే. కానీ ‘తూర్పు’ ఓ ప్రత్యేకత ఉంటుంది! ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే మరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘తూర్పు’ గోదావరి స్పెషాలిటీ ఏంటన్నది.. మనమిప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు... ఈ జిల్లాపై పట్టు అధికారానికి మెట్టు అని చరిత్ర ఇప్పటికే చాలాసార్లు చెప్పింది! అలాంటి ‘తూర్పు’లో జగనన్న ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొత్త చరిత్రను లిఖిస్తోంది బస్సు యాత్ర ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు! కాదూ కూడదు.. మాకు రుజువు కావాలంటున్నారా? చాలా సింపుల్... సీఎం జగన్ బస్సు యాత్రను దగ్గరగా ఫాలో కండి.. అభిమానంతో ఉప్పొంగిపోతున్న ప్రజలను చూడండి. ఇవ్వాళ రంగంపేటలో మొదలైన యాత్ర, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు చేరుకుంటుంది. ఇక్కడ కొద్దిసేపు భోజన విరామం. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్ , కత్తిపూడి బైపాస్ , తుని బైపాస్ , పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్లకు రాత్రి వరకు చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. సీఎంను కలవడానికి ప్రజలు పోటీ పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సామర్లకోట వద్ద పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సుయాత్రకు జనం ఆత్మీయ స్వాగతం పలికారు. సామర్లకోటలో మిట్టమధ్యాహ్నపు మండుటెండల్లోనూ అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి కోసం జనం బారులు తీరారు. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద 12:20గంటలకు బస్సు యాత్ర చేరుకుంది. స్థానికులకు అభివాదం చేసిన సీఎం జగన్.. కొద్దిసేపు వారిని కలిసారు. మధ్యాహ్నం 12.37గంటల నుంచి12.48 వరకు సామర్లకోట ఫ్లైఓవర్ పై బస్సు యాత్ర సాగింది. సామర్లకోట ఉన్డూరు క్రాస్ కు 12.48 గంటలకు చేరుకున్నారు సీఎం జగన్. సామర్లకోట అచ్చంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మహిళలు కోరడంతో ముఖ్యమంత్రి జగన్ బస్సును కొద్దిసేపు నిలిపివేశారు. కిందికి దిగి మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. కాకినాడ జిల్లాలో కొందరు మహిళలు సీఎం జగన్ బస్సు యాత్రకు గుమ్మడికాయలతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని, క్షేమంగా ఉండాలని సీఎం జగన్‌ను దీవించారు. -
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు. మేమంతా సిద్ధం 18వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 19) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఎస్టీ రాజపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
ఉమ్మడి ‘తూర్పు’లో అభివృద్ధి వికాసం
సాక్షి ప్రతినిధి, కాకినాడ:/సాక్షి, రాజమహేంద్రవరం/అమలాపురం: తూర్పు గోదావరికి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతే వేరు. గడచిన ఐదేళ్ల ప్రగతితో ఆ జిల్లా స్వరూపమే మారిపోయింది. పట్టణాలతో పోటీపడేలా పల్లెల్లో సైతం పారిశ్రామికీకరణకు పునాదులు పడ్డాయి. రూ.299.40 కోట్లతో రోడ్లు, భవన నిర్మాణాలు చేపట్టారు. రూ.229.40తో పనులు మొదలయ్యాయి. మరో 33 రోడ్లను రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండో దశలో రూ.26.37 కోట్లతో పనులు చేపట్టారు. కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి రూ.580.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోనసీమ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. దీనికోసం ఈ ఏడాది రూ.300 కోట్లు నిధులు వచ్చాయి. అయినవిల్లి మండలంలో రూ.300 కోట్లతో 440/132 కేవీ మెగా విద్యుత్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలు గోదావరిపాయ దాటాల్సిన అవసరం లేకుండా రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి. ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులో వృద్ధ గౌతమీ, గౌతమీ నదీ పాయల మధ్య పశువుల్లంక మొండి రేవు వద్ద రూ.49 కోట్లతో వంతెనను సీఎం జగన్న్పూర్తి చేయడంతో 16 గ్రామాల్లోని 8 వేల మందికి సౌకర్యం కలిగింది. 2023, 2024 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు. గతేడాది ఎకరాకు 32 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 38 నుంచి 45 బస్తాలు పండించారు. ఏటా ఖరీఫ్ సీజ¯న్లో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రాజమహేంద్రి రాత మారింది ♦ రూ.423 కోట్లతో నాలుగున్నరేళ్లలో నగర రూపురేఖలు మారిపోయాయి. ♦ నవరత్నాలుతో జిల్లా వ్యాప్తంగా 33 పథకాలతో ప్రజలకు మేలు జరిగింది. రికార్డు స్థాయిలో రూ.25,436 కోట్లు వెచ్చించారు. ♦ నాడు–నేడులో 1069 పాఠశాలల భవనాలకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ♦ గృహాల కోసం 68,518 మందికి రూ.1233.34 కోట్లు వెచ్చించారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు విడుదలయ్యాయి. ♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ.25,436 కోట్లు వెచ్చించింది. ♦ రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో ఏర్పాటైన మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ♦ 1.46 లక్షల మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. తొలి దశలో రూ.113.48 కోట్లతో 63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ♦ అనపర్తి బలభద్రపురంలో రూ.2500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా పరిశ్రమతో 2500 మందికి ఉపాధి లభించింది. ♦ గోకవరం మండలం గుమళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. 210 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ♦ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి వద్ద రూ.1,350 కోట్లతో త్రివేణి రెన్యువబుల్స్ ఆధ్వర్యంలో సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2400 మందికి ఉద్యోగాలు దక్కాయి. ♦ నల్లజర్ల మండలం పోతవరంలో రూ.50 కోట్లతో జాగృతి బయోటెక్ ప్రైవేటు సంస్థ బయోటెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. ♦ ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాడు–నేడులో రూ.9.21 కోట్లు మంజూరు ♦ గడప గడపకు మన ప్రభుత్వంలో ఎదురైన సమస్యల్లో రూ.72.88 కోట్ల నిధులతో 1,102 పనులకు పరిష్కారం. ♦‘నాడు– నేడు’ మొదటి విడతలో రూ.104.96 కోట్లతో 436 పాఠశాలలు, రెండో విడతలో రూ.257 కోట్లతో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి. ♦ పేదలందరికీ ఇళ్లు రెండు విడతల్లో 34,454 ఇళ్లకు రూ.62,017 కోట్లు కేటాయింపు. ♦ జల జీవన్ మిషన్‌లో రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం. ♦ జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో కుళాయిల కోసం రూ.45.75 కోట్లు కేటాయింపు. ♦ ఇంటింటికీ గోదావరి జలాలందించేందుకు రూ.1,650 కోట్లు కేటాయింపు ఫుడ్ ప్రాసెసింగ్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీల్లో కల్పిస్తున్న ఉపాధి ఇలా 2019– 20లో 265 యూనిట్లతో 1707 మందికి 2020–21లో 119 యూనిట్లతో 978 మందికి 2021–22లో 720 యూనిట్లతో 4254 మందికి 2022–23లో 2412 యూనిట్లతో 9455 మందికి -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 18వరోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననాయకుడికి అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. నుదిటిపై గాయం మానకపోయినా.. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో సీఎం జగన్ తన బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు. మేమంతా సిద్ధం 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
అనపర్తిలో ఆగ్రహ జ్వాల! స్పందించని బాబు తీరు..
తూర్పుగోదావరి: నోటి దగ్గర కూడు లాగేసుకుంటే ఎలా ఉంటుంది? చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసేసుకుంటే వారికి ఎంత కోపం వస్తుంది? సరిగ్గా అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ఆరంభించారు. తదనంతర పరిణామాల్లో టీడీపీ, జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరింది. చంద్రబాబు వెళ్లి బీజేపీ నేతలతో బేరసారాలు సాగించడమే కాకుండా.. వారడిగిన స్థాయిలో సీట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అనపర్తి సీటును బీజేపీకి సమర్పించుకున్నారు. దీంతో తాజాగా ఇక్కడి నుంచి విపక్ష కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన ములగపాటి శివరామకృష్ణంరాజు పేరు ప్రకటించారు. కనీసం రామకృష్ణారెడ్డికి మాటమాత్రంగా కూడా ఈ విషయం చెప్పలేదు. ఈ పరిణామాలు అనపర్తి టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చి టికెట్టు లాగేసుకోవడంతో వారు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా రచ్చ వాస్తవానికి అనపర్తి టికెట్టుపై నియోజకవర్గ టీడీపీలో నాలుగు రోజులుగా రచ్చ జరుగుతోంది. ఈ సీటును బీజేపీకి కేటాయిస్తున్నారంటూ వార్తలు రావడంతో కొద్ది రోజులుగా టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. దీనిపై అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ ఎన్నికల ప్రచారం చేయవద్దంటూ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను వారు అడ్డుకున్నారు. తొలిగా బిక్కవోలు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రామకృష్ణారెడ్డిని ప్రచారం చేయవద్దంటూ నిలిపివేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులకు రాజీనామాలు చేస్తూ సోమవారం రాజమహేంద్రవరంలో ఉన్న టీడీపీ జోన్–2 కో ఆర్డినేటర్ రావు వెంకట సుజయ కృష్ణ రంగారావుకు లేఖలు అందజేశారు. అలాగే మంగళవారం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ధర్నా చేశారు. బుధవారం పెదపూడిలో నిరసన చేపట్టారు. అదే రోజు సాయంత్రం బీజేపీ అభ్యర్థిగా శివరామ కృష్ణంరాజు పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదే రోజు రాత్రి ఇద్దరు యువకులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. ఈ క్రమంలో రామవరంలోని ఆయన నివాసానికి టీడీపీ శ్రేణులు గురువారం పెద్ద ఎత్తున చేరుకున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికై నా టీడీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసి, రామకృష్ణారెడ్డికే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నలభై సంవత్సరాలుగా నియోజకవర్గంలో టీడీపీని మోస్తున్న నల్లమిల్లి కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కట్టప్ప రాజకీయాలు చేయద్దంటూ చంద్రబాబును తీవ్రంగా దూషించారు. టీడీపీ ఎన్నికల ప్రచార కరపత్రాలు, పార్టీ జెండాలను కుప్పగా పోసి తగులబెట్టారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇన్నాళ్లూ తాను పడిన కష్టం నిష్ప్రయోజనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తిరిగి ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు తగు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇంత తంతు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు కానీ, ఇతర పెద్దలు కానీ స్పందించకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపండి అనపర్తి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి దిగజారుడు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం కేటాయించకపోతే ఆ పార్టీ శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలే తప్ప, రామవరంలో చేస్తే ఉపయోగమేమిటని, ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విలేకర్లతో మాట్లాడుతున్న ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి పొత్తుల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే సీటు బీజేపీకి కేటాయించడం ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమని, చంద్రబాబు నిర్ణయమని అన్నారు. తనకు టికెట్టు రాకుండా స్థానిక వైఎస్సార్ సీపీ కుట్రలు చేస్తోందని రామకృష్ణారెడ్డి ఆరోపించడం.. ఆడలేక మద్దెల ఓడు సామెతను గుర్తు చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా తనకు తగిలే ఎదురు దెబ్బను వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఆపాదించడం రామకృష్ణారెడ్డికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తనకు టికెట్టు రాకుండా వైఎస్సార్ సీపీ నేతలు రూ.20 కోట్లకు బేరసారాలు నడిపారంటూ ఆయన పేర్కొనడం విడ్డూరంగా ఉందని, ఎవరైనా అధిక మొత్తంలో నగదు ముట్టజెపితే అమ్ముడుపోయే స్థితిలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారా అని కృష్ణారెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ల కిందట బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో చేసిన అసత్య ప్రమాణం, ఇటీవల అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారికి సంబంధించి అవహేళనగా మాట్లాడిన ఫలితమే నేడు రామకృష్ణారెడ్డికి పట్టిన దుస్థితి అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని కర్మఫలాలు అనుభవించక తప్పదని కృష్ణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ వారా కుమారి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చిర్ల వీర రాఘవరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇవి చదవండి: బాబు పొత్తు ధర్మం చిత్తు చిత్తు? -
అన్నదాతలకు అండగా రైతుభరోసా కేంద్రాలు
-
జవహర్ వద్దు అంటూ టీడీపీ నేతల నినాదాలు
-
అందుకే చంద్రబాబు, పవన్ భయపడుతున్నారు: మంత్రి వేణు
సాక్షి, తూర్పుగోదావరి: కుల గణనపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలని, అవగాహన రాహిత్యంతో పవన్ కులగణనపై వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేస్తున్నాం. బీహార్‌లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కులగణన జరుగుతుంది. రాష్ట్ర పౌరుల సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముంది?. చంద్రబాబు, పవన్ కుల గణనతో భయపడుతున్నారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కులగణన ఎక్కడ జరగలేదు. ఏపీలో మాత్రమే సాహసోపేతంగా చేస్తున్నాం’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. సామాజిక, న్యాయ, రూప శిల్పం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజున రాష్ట్రంలో కులగణన చేపట్టాం. రాష్ట్రంలో 67 శాతం కుల గణన పూర్తైంది. కోటి 20 లక్షల కుటుంబాలకు ఇప్పటికే కులగణన పూర్తయింది. కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను మోసం చేయడానికే టికెట్లు ముందు ప్రకటించారు. చంద్రబాబు ఎనౌన్స్ చేసే సీట్ల సంఖ్యకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ అదే సంఖ్య ప్రకటించే ధైర్యం ఉందా?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘15 లేదా 20 సీట్లలో పవన్ కళ్యాణ్ దిగజారి పోటీ చేస్తారు. అంతకు మించి ఏమీ లేదు. సీఎం జగన్‌ని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు తప్పితే ప్రజలపై చిత్తశుద్ధి లేదు’’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్ మరో నాటకం -
Prabhala Teertham 2024 Photos: కోనసీమ జిల్లాలో కన్నుల పండువగా ప్రభల తీర్థం (ఫొటోలు)
-
తూర్పుగోదావరి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముద్దిపాటి వర్సెస్ మళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య ముసలం పుట్టింది. నియోజకవర్గం ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కార్ ర్యాలీ చేపట్టారు. 500 కార్లతో గోపాలపురం నుంచి అమరావతికి టీడీపీ నాయకులు బయలుదేరారు. చంద్రబాబు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీని మూడు ముక్కలు చేశారంటున్న నేతలు.. ఒంటెద్దు పోకడలతో మద్దిపాటి వ్యవహరిస్తున్నారంటూ మండి పడుతున్నారు. మద్దిపాటిని అభ్యర్థిగా ప్రకటిస్తే రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపుతామని నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
East Godavari: జైత్రయాత్రలా సామాజిక బస్సు యాత్ర
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. 42వ రోజు బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర సాగింది. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. ఊసరవెల్లి చంద్రబాబు: మంత్రి మేరుగ నాగార్జున ఊసరవెల్లి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు. రాజ్యాంగబద్ధమైన అవకాశాలు రాకుండా చేశారు. చంద్రబాబు హయాంలో బీసీ ఎస్సీలపై అనేక దాడులు పాల్పడ్డారు. కులం, మతం, వర్గం, పార్టీ తారతమ్యం లేకుండా అందరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు. పేదల పిల్లలకు కార్పొరేట్ విద్య చదివించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వమిది. పేదలకు 31 లక్షలు ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ జగన్‌కే జనం పట్టం: మంత్రి తానేటి వనిత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సీఎం జగన్ హయాంలో సామాజిక న్యాయం జరిగింది. అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతుంది. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించి పేదరికాన్ని దూరం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు బురద జల్లుతున్నారు. పిల్లలకు అందించే ట్యాబులపై కూడా బురద జల్లుతున్నారు. జగనన్న అందిస్తున్న పాలనలో కంటెంట్ ఉంది.. అందుకే ఆయన కటౌట్‌తో సాధికార బస్సు యాత్రలు చేయగలుగుతున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్‌కే జనం పట్టం కడతారు ఇది ప్రజలు గ్రహించాలి: ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు కావాలా.. ప్రేమను పంచుతున్న జగన్ కావాలా అన్న విషయాన్ని జనం తెలుసుకోవాలి. మరో ఐదేళ్లు జగనన్నకు అవకాశం ఇస్తే విద్య, వైద్యం మౌలిక సదుపాయాలు అద్భుతంగా రూపొందుతాయి. -
తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొట్టాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. రెండుకార్లలో కలిపి మరో 8మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులను దివ్యప్రియ(25), రమాదేవి (50), గనిష్క (19 నెలలు)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు సైతం సహాయక చర్యలో పాల్గొన్నారు. చదవండి: TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్సైట్లో చలాన్లు కడితే ఇక అంతే.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు… pic.twitter.com/C48xYsOfY2— Telugu Scribe (@TeluguScribe) January 2, 2024 -
తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. 85 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్టు సమాచారం. శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు. ఏలూరులో కరోనా మరో కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఆరుగురికి ర్యాoడమ్ టెస్టులు చేసిన వైద్యులు.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు వైద్యులు పంపించారు. పాజిటివ్ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రజలు ఆందోళన పడొద్దని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్లి రాలేదని స్పష్టం చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారినపడ్డారు. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్ లేనిదే ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. కోవిడ్ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
సామాజిక న్యాయానికి చాంపియన్..సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి : ఏ ముఖ్యమంత్రి జగనన్నలాగా సామాజిక న్యాయం పాటించలేదని హోం మంత్రి తానేటి వనిత కొనియాడారు. జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరణలో చూపారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌లతో కలిసి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ ఉండకూడదని అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. గతంలో మన పిల్లల కోసం ఆలోచించిన సీఎంను చూశారా? సీఎం జగన్మోహన్ రెడ్డి మన బిడ్డల చదువులు, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం చేయూత, కాపు నేస్తం, ఇచ్చారు. అగ్ర వర్ణాల్లో ఉన్న పేదలను గుర్తించిన సీఎం మన జగనన్న 32లక్షల ఇళ్ళ స్థలాలు ఉచితంగా ఇచ్చారు. మహిళకు పుట్టింటి కానుకగా ఇంటి స్థలాన్ని ఇచ్చారు’అని వనిత చెప్పారు. గ్రామ సచివాలయం వ్యవస్థతో జగనన్న పాలన మన ముంగిటకు చేర్చారు. ప్రజల్లోకి వెళ్ళలేక ప్రతి పక్షాలు.. చిన్న పిల్లల ట్యాబ్‌లపై బురద చల్లుతున్నారు. ట్యాబ్‌లను సైతం రాజకీయలకు వాడుకుంటున్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవవచ్చు కానీ పేదలు చదవ కూడదా...?దళితులకు పెద్ద పీట వేస్తూ నన్ను హోం మంత్రిని చేశారు’అని వనిత తెలిపారు. మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. ‘మహిళా సాధికారితకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు.చంద్ర బాబు ఒక అబద్ధం. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడు. వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే దానిలో కోతలు పెట్టాడు. రైతులు, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరు చెప్పి మోసం చేశాడు. 2లక్షల 60వేల కోట్ల రూపాయలను పేదలకు ఇచ్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి’అని అన్నారు. మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. ‘ఏపీలో 11శాతం ఉన్న పేదరికాన్ని ఆరు శాతానికి సీఎం జగన్మోహన్రెడ్డి తగ్గించారు. దోపిడీ దారులు చంద్రబాబు హయాంలో ఉండేవారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మ ఒడితో పిల్లలను బడిబాట పట్టేలా చేశారు. రూ.65వేల కోట్లు పిల్లల విద్యకు ఖర్చు పెట్టారు. పెత్తందారులు, ఎల్లో మీడియా, చంద్రబాబు పేద పిల్లల విద్య పై విషం చిమ్ముతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేసింది సీఎం జగన్మోహన్రెడ్డి’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..అమరావతిపై బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రశ్నలు -
నేడు విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా జనం నీరాజనాలు పలుకుతున్నారు. నివారం సామాజిక సాధికార యాత్ర విశాఖ జిల్లాలో విశాఖపట్నం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు చేసిన మేలును ఆ వర్గానికి చెందిన మంత్రులు, నేతలు ప్రజలకు వివరించనున్నారు. -
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్ (ఫోటోలు)
-
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకున్న సీఎంకు వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. చదవండి: ‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ -
క్షుద్ర పూజల కలకలం.. నర బలి ఇచ్చారా..?
తూర్పు గోదావరి: మండలంలోని వెదురుపాకలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కంచి వెంకటరమణ (38) పాల వ్యాపారం చేస్తు న్నాడు. శుక్రవారం రాత్రి పాలకేంద్రం వద్ద వ్యాపారం ముగిసిన అనంతరం ఇంటికి చేరుకోలేదు. రాత్రి 9 గంటల తర్వాత కూడా రాకపోవడంతో వెంకట రమణ కు భార్య విజయలక్ష్మి కాల్ చేయగా ఫోన్ కలవలేదని సమాచారం. ఇదిలా ఉండ గా శనివారం ఉదయం వెదురుపాక నుంచి ఆరికరేవుల వెళ్లే దారిలో వెంకట రమణ పంట బోదెలో పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి, ఇంటికి సమాచారం అందించారు. అతడి మృతదేహం కాలువలో పడి ఉండగా, మోటార్ సైకిల్ వంతెనపై ఉంది. అక్కడకు సమీపంలోనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండటం స్థానికంగా అలజడి రేపింది. తలపై బలమైన గాయం వెంకట రమణ తలపై బలమైన గాయం ఉండటంతో అతడిని ఎవరైనా హత్య చేసి కాలువలో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఎవరైనా అతడిని హత్య చేశారా? లేక హత్య చేసి, కేసును తప్పుదోవ పట్టించడానికి క్షుద్ర పూజలు చేసినట్లు సృష్టించారా అనేది మిస్టరీగా మారింది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై జి.నరేష్, ఏఎస్సై పి.వెంకటేశ్వరరావులు సిబ్బందితో సంఘటన స్థలాని కి చేరుకుని విచారణ చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, మండపేట రూరల్ సీఐ కె.శ్రీధర్ కుమార్ కూడా అక్కడకు చేరుకున్నారు. వెంకట రమణకు ఎవరితోనైనా పాత కక్షలున్నాయా, వివాహేతర సంబంధం వంటి కారణాలు, రాత్రి షాపు మూసేసిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు, అతడి వెంట ఎవరున్నారు, ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉండి ఉంటుంది, హత్యకు అసలు కారణాలేమై ఉంటాయనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. వెంకట రమణకు భార్య విజయలక్షి్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శుక్రవారం రాత్రి వరకూ అందరితో మాట్లాడిన అతడు ఉదయానికి విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాము ఎలా జీవించాలని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సంఘటనపై భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. -
విధుల్లో చేరిన రాజమండ్రి జైలు సూపరిండెంట్ రాహుల్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ విధుల్లోకి చేరారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో సూపరిండెంట్ రాహుల్ విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే పచ్చ మీడియా విపరీతార్థాలు తీసింది. దీంతో పచ్చ మీడియా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి(46) ఈ నెల 15న మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు. -
గోదావరి అందాలు.. ఒక్కసారి చూస్తే మైమరిచిపోవాల్సిందే!
కోనసీమ అందాల సీమ. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని.. సప్త నదీపాయల మధ్య కొలువైన సీమ. పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే చేలు, కొబ్బరితోపులు, గోదావరి నదీపాయలు, వంపులు తిరుగుతూ పారే పంట కాలువలు, తెరచాప పడవలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మడ అడవులు, గోదావరి మధ్య లంక గ్రామాలు, మండువా లోగిళ్లు, రైతుల మకాంలు.. వీటన్నింటికీ మించి ఆత్మీయత, మమకారంతో కలిసిన ఆతిథ్యం ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమ పర్యాటకులకు స్వర్గధామం. రైతులు, కూలీలు, మత్స్యకారులు, మహిళల జీవనం విధానం, కట్టూబొట్టూ, పండగలు, పబ్బాలు, జాతరలు.. ఇలా ఇక్కడ అన్నింటా ఒక ప్రత్యేక ముద్ర. ఇటీవల కాలంలో గోదావరి, సముద్ర తీరంలో వెలుస్తున్న రిసార్ట్స్, రైతుల పొలాల వద్ద ఫామ్ హౌస్‌లు, పర్యాటక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి చర్యల కారణంగా కోనసీమకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ‘సప్త’వర్ణాల కోనసీమ.. పర్యాటకంగా కూడా ‘సప్త’రకాలుగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 27 ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా కథనం. ఆధ్యాత్మికంగా.. ఆధ్యాత్మిక రంగంలో కోనసీమ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. లెక్కలేనన్ని ఆలయాలు, పురాణ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కోనసీమ సొంతం. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక విమానాలలో భక్తులు వస్తున్నారు. వీటితోపాటు అంతర్వేది లక్ష్మీ నర్శింహస్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ విఘేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. బౌద్ధులు.. రాజుల చారిత్రక ఆనవాళ్లు చారిత్రాత్మక ప్రదేశాలలో పర్యాటకానికి వస్తే రామచంద్రపురంలో 17వ శతాబ్ధం నాటి కోట ఉంది. మామిడికుదురు మండలం ఆదుర్రులో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ధం నాటి పురాతన బౌద్ధ స్థూపాలున్నాయి. కపిలేశ్వరపురం జమీందార్ల పురాతన భవనాలు, రాజుల కోటలను తలపించే మండువా లోగిళ్ల ఇళ్లు పర్యాటకులకు ముచ్చటగొల్పుతాయి. అగ్రి టూరిజం పర్యాటకంలో ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది అగ్రి టూరిజానికే. దేశంలో కేరళలో మొదలైన ఈ పర్యాటకం విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ఐటీ వంటి రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు అగ్రి టూరిజం బాట పడుతున్నారు. ఇటువంటి వారికి కోనసీమ అగ్రి టూరిజం ఒక అద్భుతం. పచ్చని తివాచీ పరచినట్టు ఉండే వరిచేలు, కొబ్బరి, అరటి తోటలు, లంక గ్రామాల్లో పలు రకాల పంటలు, పాడి, ఆక్వా చెరువులు, తోటల్లోని రైతుల మకాం (వ్యవసాయ శాలలు) విశేషంగా ఆకర్షిస్తాయి. గోదావరి హొయలు గోదావరి నదీ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. నది మధ్యలో లంక గ్రామాలు, వాటిలో సాగయ్యే పంటలు, ఇసుక తిన్నెలు, చెంగుచెంగున ఎగిరే కృష్ణ జింకలు, తెరచాప పడవలు, పంటులు, హౌస్బోట్లపై సాగే ప్రయాణం, నదీపాయలపై వంతెనలు.. గోదావరి కాలువలకు లాకులు,ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి హొయలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మైమరపించే మడ అడవులు ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి అంతర్వేది సముద్ర తీరం వరకు నదీపాయలతోపాటు, మురుగునీటి కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఉన్న మడ అడవులలో పర్యాటకం అద్భుతమనే చెప్పాలి. నదీ, కాలువ పాయల మధ్య మడ అడవులు మీదుగా సాగే ప్రయాణం మధురానుభూతిని పంచుతుంది. ఆతిథ్యం అద్భుతం అతిథి మర్యాదంటేనే గోదావరి జిల్లాలు. మరీ ముఖ్యంగా కోనసీమ ఆహారం.. అతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీర్చే రకరకాల స్వీట్లు, హాట్లు, టిఫిన్లు, బిర్యానీలు, మాంసహార కూరలు ఎన్నో.. ఎన్నెన్నో. ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవా, మినప రొట్టి, చెరుకుపానకం, పెసరెట్టు ఉప్మా, పనస పొట్టు కూర, ముద్దపప్పు.. గుమ్మడి పులుసు, ఉల్లి గారెలు... నాటు కోడి కూర, చుక్కపీత ఇగురు.. పులసల పులుసు ఇలా ఎన్నో రకాల వంటకాలు పర్యాటకులను లోట్టలు వేయిస్తాయి. -
తూర్పుగోదావరి ప్రజలు వైఎస్ పాలన గురించి..!
-
మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం.. దూరం పెట్టడంతో!
తూర్పు గోదావరి: తనను తీసుకువెళ్తున్నది మేకవన్నె పులి అని.. అభం శుభం తెలియని ఆ చిన్నారి మనస్సుకు అర్థం కాలేదు.. నిలువెల్లా కాపట్యం నిండిన ఆ క్రూరుడు తనను కబళించేస్తాడని ఏ మాత్రం అనుకోలేదు.. బంధువే కదా అనుకుంటూ ఆ దుర్మార్గుడిని నమ్మింది.. మాయమాటలు విని, అతడితో వెళ్లింది.. చివరకు ఆ దౌర్భాగ్యుడి చేతుల్లో అత్యంత క్రూరంగా హతమారిపోయింది. పెద్దాపురం పట్టణంలో సంచలనం రేపిన బాలిక హత్యకు కారకుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన దంపతులు ద్రోణ వీర్రాజు, జ్యోతి కొన్నాళ్ల కిందట మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో జ్యోతి తన పదేళ్ల కుమార్తె ప్రవీణ కుమారి అలియాస్ మానస, తన తల్లి సునీతతో కలసి పట్టణ శివారులోని ఎన్టీఆర్ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన బత్తిన నాని జ్యోతికి సమీప బంధువు. వరుసకు మేనల్లుడు అవుతాడు. ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి, కొనసాగుతోంది. అయితే, తన కుమార్తె ఎదుగుతోందని, ఇంటికి రావడం సరికాదని అంటూ కొన్నాళ్లుగా నానిని జ్యోతి దూరం పెడుతోంది. అది తట్టుకోలేని నాని తమ సాన్నిహిత్యానికి అడ్డంగా ఉన్న మానసను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ప్రణాళిక సిద్ధం చేశాడు. అందులో భాగంగా బయటకు తీసుకువెళ్తానని ఈ నెల 19వ తేదీన మానసకు చెప్పాడు. బంధువే కావడంతో అతడి మాటల్ని ఆ బాలిక నమ్మింది. మానసను తన బైక్‌పై ఎక్కించుకున్న నాని, స్థానిక కట్టమూరు పుంత రోడ్డులోకి తీసుకువెళ్లి, ముందే వేసుకున్న పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు చెబుతున్నారు.బయటకు వెళ్లిన మానస ఎంతకూ ఇంటికి రాకపోవడంతో జ్యోతి ఈ నెల 20వ తేదీన పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న నానిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టేందుకు ప్రయతి్నంచారు. చివరకు అతడు పరారీలో ఉన్నాడని గుర్తించారు. మరోవైపు బాలిక ఆచూకీ కోసం కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కట్టమూరు పుంతలో బాలిక మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆ బాలిక మృతదేహం పూర్తిగా పాడైపోయింది. కుక్కలు ఈడ్చుకు రావడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. చివరకు దుస్తుల ఆధారంగా ఆ మృతదేహం మానసదేనని గుర్తించారు. చిన్నారి మృతదేహానికి పెద్దాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మానస హత్యకు కారకుడైన నాని ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతడిని పట్టించిన వారికి రూ.10 వేల పారితోíÙకం అందిస్తామని ప్రకటించారు. డీఎస్పీ లతాకుమారి నేతృత్వంలో సీఐ అబ్దుల్ నబీ, ఎస్సై సురే‹Ùలు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వై.ఎస్.రాజశేఖరరెడ్డి దీవెన వలన మేము ఇలా ఉన్నాం
-
చిట్టితల్లికి ఆరోగ్య భరోసా.. చెల్లెమ్మ కళ్లలో ఆనందం
సాక్షి, రాజమహేంద్రవరం: చెప్పాడంటే.. చేస్తాడంతే. మాటిచ్చాడంటే నెరవేరుస్తాడంతే. అది సంక్షేమ పాలనలో అయినా.. కష్టంలో ఉన్నవాళ్లకి అందించే భరోసా విషయంలోనైనా. ఎనిమిది నెలల కిందట తన బిడ్డతో సాయం కోసం వచ్చిన ఓ చెల్లెమ్మ ముఖంలో ఇప్పుడు చిరునవ్వు పూయించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆమెకు మానసికంగా ధైర్యం.. చిన్నారికి క్రమం తప్పకుండా చికిత్స అందుతుండడంలో సీఎం వైఎస్ జగన్ ఉదారత ఉంది. శనివారం నిడదవోలు పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ని చిన్నారి శాంతి కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా పాప ఆరోగ్యం కోసం వాకబు చేశారాయన. గత 8 నెలల(సీఎం జగన్ భరోసా ఇచ్చినప్పటి నుంచి) సమయంలో పాప డయానా శాంతికి అందిన వైద్యం వివరాలన్నింటి గురించి కలెక్టర్ మాధవీలత వివరించారు. వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాయని, ప్రాథమిక పరీక్ష, రక్త నమూనా కోసం శాంతిని ఆరుసార్లు ఢిల్లీకి పంపామని, జెనెటిక్స్ పరీక్ష కోసం రక్త నమూనాలను నొవార్టిస్ కంపెనీ సింగపూర్, అమెరికాకు పంపినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నింటిలో సానుకూల ఫలితాలు రావడంతో.. మూడు వారాల్లో పాప కోసం ఇంజెక్షన్(రూ 16 కోట్ల ఖరీదు చేసేది) వచ్చే అవకాశం ఉందని ఆమె వివరించారు. డయానా శాంతి ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్-2’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన జిల్లా పర్యటన సంద్భంగా శాంతి తల్లి సూర్యకుమారి, సీఎం జగన్‌ను కలిసి తన గోడును వెల్లబోసుకుంది. ఆ సమయంలో తక్షణ ఆర్థిక సహాయం గా రూ. లక్ష అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాదు.. ప్రతి నెలా రూ.5 వేల వైఎస్ఆర్ నవశకం ఆరోగ్య పింఛను సైతం అందేలా చూడాలని అధికారులకు చెప్పారు. అదే సమయంలో.. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న ఆ కుటుంబానికి ఆసరా అందించేందుకు సూర్య కుమారికి నిడదవోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. చదవండి: కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది: సీఎం జగన్ -
మీ వల్ల మా అమ్మ క్యాన్సర్ నుండి కోలుకుంది జగనన్నా..
-
10 ఏళ్లుగా వ్యవసాయం..బైక్ ట్రాలీ వాడకంతో తగ్గిన కూలీల ఖర్చు
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన జుజ్జవరపు సతీశ్ గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కొబ్బరి తోటలో ఐదంచెల సాగు ద్వారా ఎకరానికి ఏటా రూ.1,05,000 నికరాదాయం పొందుతున్నారు. మోటార్ బైక్‌తో నడిచే ట్రాలీని, బైక్‌తో నడిచే స్ప్రేయర్‌ను తానే తయారు చేయించుకోవటం ద్వారా కూలీల ఖర్చును భారీగా తగ్గించుకోవటం ఆయన ప్రత్యేకత. రైతుసాధికార సంస్థలో మాస్టర్ ట్రైనర్‌గా పనిచేస్తూ ఇతర రైతులకు మార్గదర్శకుడిగా మారారు. ఆయన స్ఫూర్తితో కురుకూరు గ్రామానికి చెందిన సుమారు పాతిక మంది రైతులు 300 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. రిటైర్డ్ ఐసిఏఆర్ ఉద్యోగుల సంఘం సి.హెచ్. రవీందర్‌రెడ్డి బెస్ట్ ఫార్మర్ అవార్డుతో సతీశ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో సత్కరించటం విశేషం. కొబ్బరి తోటలో ఐదంచెల అంతర పంటలను ఆయన సాగు చేస్తున్నారు. మొదటి లేయర్‌గా 27“27 అడుగులకు కొబ్బరి, రెండో లేయర్‌గా కొబ్బరి చెట్ల మధ్యలో 13.5“10 అడుగులలో కోకో సాగు చేస్తున్నారు. మూడో లేయర్లో 7“7 అడుగులలో వక్క మొక్కలు వేశారు. నాలుగో లేయర్లో వక్క మొక్కలకు మిరియాలు పాకిస్తున్నారు. ఐడో లేయర్ గా ఎండ పడే చోట ఫైనాపిల్ మొక్కలు నాటారు. కొబ్బరి మొక్కలు లేని చోట్ల జాజికాయ మొక్కలు నాటారు. ప్రతి 10 రోజులకు జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పిచికారీ కోసం టైప్ 2 సూపర్ జీవా మృతం వాడుతున్నారు. సాధారణంగా జీవామృతం తయారీకి ప్రతి సారీ ఆవు పేడ, మూత్రం అవసరం ఉంటుంది. అయితే, టైప్ 2 జీవామృతం తయారీకి ఒకసారి పేడ, మూత్రం వాడితే చాలు, ఆ తర్వాత 6 నెలల వరకు ఆ అవశేషాలకు 200 లీటర్ల నీటికి లీటరు జీవన ఎరువులతో పాటు బెల్లం జోడిస్తూ మళ్లీ మళ్లీ జీవామృతాన్ని తయారు చేసుకొని వాడటం వల్ల అదే ఫలితాలు వస్తున్నాయన్నారు. జీవామృతం వడపోతకు తాను రూపొందించిన ఆటోమేటిక్ ఫిల్టర్ సిస్టమ్‌ను మరో 20 మంది రైతులు 200 ఎకరాల తోటల్లో వాడుతున్నారని సతీశ్ (90107 42459) తెలిపారు. బైక్ ట్రాలీ ఖర్చు రూ. పది వేలు ద్విచక్ర మోటారు వాహనానికి వెనుక కట్టుకొని బరువులు లాక్కెళ్లేందుకు వీలుగా ఐదేళ్ల క్రితం సతీశ్ బైక్ ట్రాలీని సొంత ఆలోచనతో తయారు చేయించుకొని వినియోగిస్తున్నారు. ఎరువులు వేయటం వంటి పనులకు ఎకరానికి 8–10 మంది కూలీలు అవసరమవుతారని బైక్ ట్రాలీ ఉండటం మూలాన ఇద్దరు కూలీలతోనే వేగంగా పని పూర్తవుతోందని సతీశ్ తెలిపారు. బైక్ ఇంజన్‌తోనే జీవామృతం, పంచగవ్య, ఇతర ద్రావణాలు, కషాయాలను సైతం సులువుగా పిచికారీ చేయగలుగుతున్నానని తెలిపారు. బైక్ ట్రాలీ తయారీకి రూ. పది వేలు ఖర్చయ్యిందని, ఈ ఐదేళ్లలో దాని ద్వారా దాదాపు రూ. 2 లక్షల వరకు డబ్బు ఆదా అయ్యిందన్నారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయం సులువు కావటం వల్ల ఇతర రైతులు సైతం స్ఫూర్తిని పొందుతున్నారన్నారు. తనను చూసి పాతిక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టారన్నారు. జీవామృతాన్ని ఫిల్టర్ చేయటం, పిచికారీ చేయటం వంటి పనుల్లో కూడా మనుషుల ప్రమేయం తగ్గించే ఫిల్టర్ వ్యవస్థను నిర్మించటం వల్ల వడకట్టే పని సులువైపోయిందని, పిచికారీ చప్పున పూర్తవుతోందన్నారు. బైక్ స్ప్రేయర్ ద్వారా ఎకరంలో అర గంటలోనే పిచికారీ పూర్తవుతోందన్నారు. టైప్ 2 సూపర్ జీవామృతం తయారీ పద్ధతి రైతులకు వెసులుబాటుగా ఉందన్నారు. సేంద్రియ సాగుపై రైతు సదస్సులు ‘నాబార్డు’ సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో సేంద్రియ సాగు పద్ధతులు, కషాయాలు/ ద్రావణాల తయారీ, విలువ జోడింపుపై తెలంగాణలో రైతులకు అవగాహన సదస్సులు జరగనున్నాయి. 9న కరీంనగర్ జిల్లా చొప్పదండి మం., పెద్దకురుంపల్లిలోని మల్లిఖార్జున రెడ్డి తోటలో, 10న జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లోని ఎడమల మల్లారెడ్డి తోటలో, 11న పెద్దపల్లి జిల్లా రామగిరి మం., కల్వచర్లలోని యాదగిరి శ్రీనివాస్ తోటలో (ఉ.10 గం.–సా. 4 గం.) సదస్సులు జరుగుతాయి. పాల్గొనదలచిన రైతులు తప్పనిసరిగా ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు.. 70939 73999 (వెంకట్‌రెడ్డి). అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. -
పాదయాత్రలో లోకేశ్ అత్యుత్సాహం.. సైగ చేయడంతో..
నల్లజర్ల: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో శుక్రవారం ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర పలు గ్రామాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. పోతవరంలో ప్రారంభమైన పాదయాత్ర కవులూరు, చీపురుగూడెం, తిమ్మన్నపాలెంలలో జరిగింది. తిమ్మన్నపాలెం జంక్షన్లో సీఎం ఫ్లెక్సీని చూసిన లోకేశ్.. యువగళం సభ్యుడికి సైగ చేయడంతో ఆ వ్యక్తి సీఎం ఫ్లెక్సీని మూడొంతులకుపైగా చింపేశాడు. విషయం తెలియడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఫ్లెక్సీ చింపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ రజనీ, డీఎస్పీ వర్మ తదితరులు హామీ ఇచ్చారు. వెంటనే అదే ప్రదేశంలో కొత్త ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉన్నా పలుమార్లు టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం శాంతించిన కార్యకర్తలు సీఎం జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సాయంత్రం పాదయాత్ర నల్లజర్ల జంక్షన్‌కు వచ్చేసరికి సొసైటీ అధ్యక్షుడు కారుమంచి రమేష్ ఇంటి ముందు నిలబడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై యువగళం సభ్యుడు పిడిగుద్దులు గుద్దాడు. దీనిపై కార్యకర్తలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. చదవండి: ఐటీ దర్యాప్తు తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్: రూ. 31.25 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని తెలుగు లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తూర్పగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు సుమారు ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద,రెండొందలు,అయిదొందలు సహా చెలామణిలో ఉన్న నోట్లతో అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు. అలాగే బ్యాంకుల నుంచి కూడా కొత్త నాణేలు తీసుకొని అలంకరించడం మరో ప్రత్యేకత. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము ప్రతి ఏడాది కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. సుమారు 30 రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేశారు. ఇక గతంలోనూ సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర వేడుకల్లో అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరిస్తూ ఈ ఆలయ కమిటీ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ఇలా ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరించడం అందర్నీ ఆకట్టుకుంది. -
సన్నాయి మేళంలో రాణిస్తున్న మండపేట మహిళలు
మండపేట: హిందూ సంప్రదాయంలో డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. శుభకార్యాలు, వేడుకలకు సన్నాయి మేళం తప్పనిసరి. నాదస్వరం పేరు చెప్పగానే పురుష కళాకారులే గుర్తుకు వస్తారు. అందుకు భిన్నంగా మగవారికి దీటుగా డోలు, సన్నాయిని వినసొంపుగా వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన మహిళా కళాకారులు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఈ గ్రామంలో ఏకంగా పది మందికి పైగా మహిళా కళాకారులుండగా.. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఏడిదలోని వెంటూరి సాహెబ్ కుటుంబం డోలు, సన్నాయి వాయిద్యానికి ప్రసిద్ధి. తమ ఇంట ఈ కళకు 80 ఏళ్ల క్రితం ఆయనే ఆజ్యం పోశారు. సాహెబ్ తదనంతరం ఆయన కుమారులు, మనవలు, మునిమనవలు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. తిరుపతి బ్రహ్మోత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీతారలు, ప్రముఖుల ఇళ్లలో జరిగే వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చి గ్రామానికి గుర్తింపు తెచ్చారు. ఎంతోమంది కళాభిమానులు వీరి నైపుణ్యానికి మెచ్చి గండపెండేరాలు, సింహతలాటాలు, బంగారు కడియాలతో సత్కరించారు. గత ఐదు తరాల్లో 25 మందికి పైగా సాహెబ్ కుటుంబీకులు నాదస్వర కళను నేర్చుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత తరంలో మేము సైతం అంటూ ఆ ఇంట మహిళలు వాయిద్య కళలో రాణిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణ సన్నాయి మేళంలో వాయిద్య పరికరాలు డోలు, సన్నాయి, చిన్న హార్మోనియం (శ్రుతి బాక్స్), తాళం ఉంటాయి. ఆరుగురి నుంచి ఎనిమిది మంది వరకూ సభ్యులుంటారు. సాధారణంగా పురుష కళాకారులే ఆయా వాయిద్యాలను వాయిస్తూంటారు. అయితే ఏడిద సన్నాయి మేళంలో మహిళా వాయిద్య కళాకారులు ప్రత్యేక ఆకర్షణ. గ్రామంలోని సాహెబ్ కుటుంబానికి చెందిన మూడు సన్నాయి మేళం బృందాలుండగా.. వీటిలో పది మందికి పైగా మహిళా కళాకారులే ఉండటం గమనార్హం. సాహెబ్, తర్వాత ఆయన తనయులు, మనవలు ఎంతో మందికి డోలు, సన్నాయి వాయించడంలో శిక్షణ ఇస్తున్నారు. వారితో పాటు తమ ఇంట్లోని ఆడపిల్లలకు కూడా నేర్పిస్తూంటారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సన్నాయి మేళంలో మహిళలు కూడా భాగస్వాములయ్యారు. మగవారితో సమానంగా డోలు, సన్నాయి అలవోకగా వాయిస్తూ వివిధ వేడుకలకు మరింత శోభను తీసుకువస్తున్నారు. కుటుంబ పోషణలో చేదోడువాదోడవుతున్నారు. అంతా ఒకటే కుటుంబం ఎక్కడ ప్రదర్శన ఉంటే అక్కడకు బృందంలోని తమ కుటుంబ సభ్యులతో కలిసి వీరు వెళ్తూంటారు. గత పదేళ్లలో ఉభయ రాష్ట్రాలతో పాటు రాజాస్తాన్‌లో వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో జరిగిన వివాహాది శుభకార్యాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మండపేట, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వేడుక జరిగినా మహిళలతో డోలు, సన్నాయి మేళం ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. దీంతో మహిళా వాయిద్య కళాకారుల ప్రాధాన్యం పెరిగింది. చదువుతో పాటు తమ ఇంట ఆడపిల్లలకు వాయిద్య కళలో శిక్షణ ఇస్తూంటామని కళాకారుడు వెంటూరి మీరా సాహెబ్ (చిన్న) తెలిపారు. సరదాగా చేసిన సాధనే ఉపాధి అయ్యింది నా చిన్నతనంలో ఏడిదలో మా తండ్రి సత్యనారాయణ చాలా మంది పిల్లలకు శిక్షణ ఇచ్చేవారు. వారితో పాటు నేనూ సరదాగా సన్నాయి వాయిద్యం నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ విద్యే మాకు మంచి గుర్తింపు తెచ్చింది. కుటుంబ పోషణకు ఆసరా అవుతోంది. – డి.సీతారత్నం, వాయిద్య కళాకారిణి, మండపేట ఎంతో గౌరవంగా చూస్తారు తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జరిగిన బ్రహ్మోత్సవాలు, శుభకార్యాల్లోను, సినిమా హీరోలు, రాజకీయ నాయకులకు సంబంధించిన వివిధ వేడుకల్లోను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాం. ఆయా చోట్ల నిర్వాహకులు మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తుంటారు. – వెంటూరి రమాదేవి, వాయిద్య కళాకారిణి, ఏడిద గ్రామానికి గుర్తింపు తెచ్చారు డోలు, సన్నాయి కళలో వెంటూరి సాహెబ్ కుటుంబం రాష్ట్ర స్థాయిలో మా గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చారు. ప్రత్యేకంగా పురుషులతో సమానంగా మహిళలు ఈ కళను నేర్చుకుని కుటుంబ పోషణలో భాగస్వాములు కావడం అభినందనీయం. – బూరిగ ఆశీర్వాదం,సర్పంచ్, ఏడిద -
పేలిన పెట్రోల్ బంక్.. ఎగసిపడిన మంటలు
సాక్షి, తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పేలింది. పేలడు ధాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు భయబాంత్రులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. తొస్సిపూడి గ్రామంలోని ఇండియన్ బంక్ ప్రక్కన ఉన్న షెడ్డులో బాణాసంచా నిల్వ ఉంచారు. అనుకోకుండా బాణాసంచా పేలుడు సంభవించడంతో ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కూడా బ్లాస్టయింది. ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో పెద్దగా జనసంచారం లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనలో బంక్ ప్రక్కన వున్న గాయత్రి రైస్ మిల్ స్వల్పంగా ధ్వంసమైంది. బంక్ పేలుడుతో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల మూడు గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు. -
ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా విషాదం చోటుచేసుకుంది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద బ్రిడ్జిపై నుంచి ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఏపీ 39 హెచ్ఆర్0907 నెంబర్ గల బలేనో కారు ఏజెన్సీ మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. జిల్లాకు చెందిన 10 మంది స్నేహితులు రెండు కార్లలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. రుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఓ కారు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. స్థానికంగా ఉండే పాత, కొత్త వంతెనల మధ్యలోని కాల్వలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు మృతిచెందారు. మృతులను ఉదయ్ కిరణ్, హర్ష వర్ధన్, హేమంత్గా గుర్తించారు. గాయపడిన మిగతా ముగ్గురిని రాజమంత్రి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురు యువకులు ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో బీ టెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. -
పెరూ పుంజు.. వచ్చెనండి.. కాసులు తెచ్చెనండీ!
కోనసీమలో ఒక కొబ్బరి చెట్టునో, ఒక గేదెనో.. ఒక ఎకరం భూమినో నమ్ముకుని ఆదాయం పొందుతూ ఏదోలా బతికేద్దామని అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ తాను అలా అనుకోలేదంటున్నారు పెన్మెత్స రామ సత్యనారాయణరాజు అలియాస్ ఈస్ట్ గోదావరి రామరాజు. నేడు భూములు, పశువులు, కొబ్బరి చెట్ల వల్ల ఆదాయం అంతగా లభించక కొంతమంది ఉన్నత చదువులతో ఉన్నత రంగాలకు వెళ్లిపోతున్నారు. కానీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన ఈ యువకుడు కేవలం ఒక కోడిపుంజును నమ్ముకున్నాడు, తద్వారా దండిగా ఆదాయం సంపాదిస్తున్నాడు. – మలికిపురం ఈస్ట్ గోదావరి రామరాజు (32) బీటెక్ పూర్తి చేశారు. తండ్రి వేంకటేశ్వరరాజు రెండేళ్ల క్రితం కరోనాతో మృతి చెందడంతో అప్పటి నుంచి కుటుంబం కోసం ఉద్యోగం ఆలోచన విరమించుకుని రామరాజు బట్టేలంకలోనే ఉంటున్నారు. ఈయనకు ఇదే మండలం ఇరుసుమండ గ్రామంలో 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అదీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి పంచుకోగా వచ్చింది. దీని ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో కోనసీమలో పలువురు చేస్తోన్న మాదిరిగానే రామరాజు దేశవాళీ కోడిపుంజులు పెంచుతూ సంక్రాంతి సమయంలో అమ్ముతు ఉంటారు. ఇందులోనూ అంతంత మాత్రంగానే ఆదాయం వస్తుండటంతో ఆయన సరికొత్త ఆలోచన చేశారు. పుంజుకూ వీసా..! అమెరికాలో పరిచయమున్న వారి ద్వారా రామరాజు ‘పెరూ’ జాతి కోడిపుంజును అక్కడి ధర రూ.1.40 లక్షలకు 2020 జూన్‌లో కొనుగోలు చేశారు. పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులకు ప్రత్యేకంగా వీసా ఖర్చులతో పాటు విమానంలో ప్రయాణానికి అదనంగా టికెట్‌ను కొనుగోలు చేసి ఆ కోడిపుంజును అమెరికా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారైన కారులో ఇరుసుమండలోని రామరాజు కొబ్బరి తోటలోకి పుంజు చేరింది. ఈ పుంజును అన్నీ కలుపుకొని ఇక్కడకు తీసుకురావడానికి రామరాజుకు రూ.2.85 లక్షలు ఖర్చయ్యింది. అప్పటి నుంచీ ఈ పెరూ జాతి కోడిపుంజును రాజభోగాలతో రామరాజు మేపుతున్నారు. మేలు రకాలయిన దేశవాళీ పెట్టల క్రాసింగ్ ద్వారా దీని సంతానం విపరీతంగా పెరిగింది. ఈ జాతి పుంజులు పందాల్లో విశేష ప్రతిభ చూపడంతో దీని బ్రీడ్‌కు డిమాండ్ పెరిగింది. రామరాజు కోడిపుంజులను పెంచడం లేదు. వీటి పిల్లలను 3 నెలల వయసు వచ్చే వరకు మాత్రమే పెంచి అనంతరం ఒక్కో పిల్లను రూ.10,000కు పైగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.41.60 లక్షల ఆదాయం వచ్చినట్లు రామరాజు చెప్పారు. దీనిలో నెలకు రూ.25 వేల చొప్పున ఖర్చవుతుందని, రూ.35.60 లక్షలు మిగిలిందని వెల్లడించారు. దండిగా ఆదాయం ప్రస్తుతం కొబ్బరి ఆదాయం తోటల నిర్వహణకే సరిపోతోంది. దీంతో ఇలా ప్రయోగం చేసి ఈ కోడిపుంజును దింపాను. రెండేళ్లలో రూ.41.60 లక్షల షేర్ వచ్చింది. నిర్వహణ ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగా ఉంటుంది. ఏడాదికి రూ.10 లక్షలు పైగా మిగులుతుంది. – పెన్మెత్స రామ సత్యనారాయణ రాజు, బట్టేలంక -
గోదావరిలో పెరుగుతున్న వరద
సాక్షి, రాజమహేంద్రవరం: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉపనదులైన ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరులో వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరిలోకి వరద పెరుగుతోంది.పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.050 మీటర్లకు నీటిమట్టం పెరిగింది.వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్‌వే గేట్ల నుంచి 3 లక్షల15 వేల791 క్యూసెక్కుల వరద నీటినిదిగువకు విడుదల చేశారు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం సాక్షి, విశాఖపట్నం: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. గురువారం నాటికి ఇది వాయవ్య బంగాళాఖా తం, దాని సరిహద్దులో ఉన్న పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. ఈ ఫలితంగా గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి వర్షాల ఉద్ధృతి పెరగనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని తెలిపింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
East Godavari Famous Temples: తూర్పుకు వెళ్తే ఇంత మంది దేవుళ్లను చూడవచ్చా? (ఫొటోలు)
-
అదిరిందయ్యా.. పిల్ల రొయ్య!
పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంలో రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడి సముద్ర జలాలు, గాలి రొయ్యల లార్వా ఉత్పత్తికి, రొయ్య పిల్ల పెరుగుదలకు అనువుగా ఉండటంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా వందలాది హేచరీలు (రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు) అభివృద్ధి సాధించాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంతంలో 314 హేచరీలు ఉండగా.. ఏటా ఇక్కడ 60 బిలియన్ల రొయ్య పిల్లలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, కేరళ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలకు రొయ్య పిల్లలు (ష్రింప్ సీడ్) ఎగుమతి అవుతున్నాయి. లక్ష మందికి ఉపాధి హేచరీలు, రొయ్యల చెరువులు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే కేవలం లక్ష మందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో హేచరీలో వివిధ పనులకు గాను సుమారు 150 మంది వరకు ఉపాధి పొందుతుండగా.. రొయ్యల చెరువుల నిర్వహణలో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఇక రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లలో ఒక్కో యూనిట్లో 500 నుంచి 1000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 50 వరకు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు ఐస్ ఫ్యాక్టరీలు, రవాణా ప్యాకింగ్ యూనిట్లలో వేలాది మందికి ఉపాధి కలుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పురోగమనం రాష్ట్రవ్యాప్తంగా 70 ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేసి నాణ్యమైన మత్స్య సంపదను విక్రయించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. 10 ఎకరాలలోపు ఆక్వా చెరువులున్న రైతుల కు యూనిట్ కేవలం రూ.1.50కే సబ్సిడీ విద్యుత్ అందిస్తోంది. 10 ఎకరాలకు పైబడి ఉన్న వారికి యూనిట్ విద్యుత్ రూ.3.85కే ఇస్తోంది. ఆక్వా ఎగుమతులు సక్రమంగా నిర్వహించడాని కి ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేస్తోంది. ఆక్వా రైతులకు అండగా ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ఆక్వా రైతులకు తగిన అండ లభిస్తోంది. దీంతో తీర ప్రాంతంలో రొయ్యల సాగు, హేచరీలు బాగా పెరిగాయి. ఆక్వా ఉత్పత్తులు గణనీయంగా పెరగడానికి ప్రభుత్వ ప్రోత్సాహం దోహదం చేస్తోంది. – సత్యనారాయణ, జేడీ మత్స్య శాఖ, కాకినాడ హేచరీలకు ఎల్టీ కేటగిరీగా మార్చాలి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 314 వరకు హేచరీలు ఉన్నాయి. ఏటా 60 బిలియన్ల రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. ఇటీవల రొయ్యల ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షలు తీవ్ర ఇబ్బంది కలిగించగా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంది. హేచరీలకు విద్యుత్ వినియోగం చాలా అవసరం. గతంలో ఎల్టీగా ఉండే వాటిని హెచ్‌టీ చేయడం వల్ల అదనపు భారం పడింది. హేచరీలు 8 నెలలు పని చేస్తే 4 నెలలు మూతపడి ఉంటాయి. పని చేసే సమయంలో విద్యుత్ భారంగా మారగా పని చేయని సమయంలోనూ మినిమం బిల్లులు వేయడం వల్ల ఆర్థిక భారం పడుతోంది. – సత్తి వీర్రెడ్డి, అధ్యక్షుడు, ఆలిండియా ష్రింప్ హేచరీస్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ -
త‘లుక్’మనేలా
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (రుడా) అడుగులు వేస్తోంది. ఆయా గ్రామాల్లో అందివస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజా ప్రయోజన, ఆరోగ్య రక్షణ, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పే పనులకు ప్రాధాన్యం ఇస్తోంది. మొక్కల పెంపకం, సంరక్షణతో పాటు గ్రామాల పేర్లను సూచించే నేమ్‌బోర్డులను అ«దునాతనంగా రూపొందించి ఏర్పాటు చేస్తోంది. 66 పనులకు రూ.26.84 కోట్ల నిధులు వ్యయం చేస్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని కొన్ని పనులు పురోగతిలో ఉండగా.. మరికొన్ని టెండరు దశలో ఉన్నాయి. రాజమహేంద్రవరాన్ని ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దిన రుడా తన పరిధిలోని గ్రామాలకు పట్టణ శోభను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పనులను రుడా వీసీ బాలస్వామి ఎప్పటికప్పుడు పర్యవేక్షిన్నారు. సుందరీకరణ పనులు ఇలా.. రుడా పరిధిలో నిర్వహించే పనుల్లో సుందరీకరణ, వాకింగ్ ట్రాక్‌లు, రివిట్‌మెంట్‌తో కూడిన వాటర్ బాడీ, బీచ్ ఫ్రంట్ నిర్వహణ పనులకు మొదటి ప్రాధాన్యత కల్పి స్తున్నారు. నియోజకవర్గాల వారీగా మచ్చుకుకొన్ని పరిశీలిస్తే.. అనపర్తి: బలభద్రపురంలో రూ.1.65 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రివిట్‌మెంట్‌తో కూడిన వాటర్ బాడీ పనులు పూర్తి చేసింది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా నీటితో కూడిన పార్క్, వాకింగ్ ట్రాక్, ప్రజలు సేదతీరేందుకు పచ్చదనం పెంపొందించే పనులు ప్రారంభించింది. కొవ్వూరు: గోష్పాద క్షేత్రం సమీపంలోని కొవ్వూరు కట్ట వెంబడి రివర్ ఫ్రంట్ రూపుదిద్ది భక్తులకు స్వాంతన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పచ్చదనం పెంపొందించి అందులో వివిధ జంతువుల నమూనా విగ్రహాలు వరద నీటికి తట్టుకునే స్థాయిలో తయారు చేస్తున్నారు. ఇందుకు రూ.కోటి వెచి్చంచనున్నారు. రూ.32.86 లక్షలతో అధునాతన విద్యుత్ స్తంభాలు, దీపాలు అమర్చనున్నారు. ‘ఐ–లవ్ కొవ్వూరు’ చిహ్నాన్ని సెల్ఫీ పాయింట్‌గా ఆధునీకరించనున్నారు. గోపాపురం: దేవరపల్లి మెయిన్ రోడ్ నుంచి గోపాలపురం వరకు రూ.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ పనులు పురోగతిలో ఉండగా.. మరో మరికొన్ని టెండర్ స్టేజ్‌లో ఉన్నాయి. నిడదవోలు: చిన్న కాశీ రేవు నుంచి గూడెం గేటు వరకు రహదారి నిర్మాణానికి రూ.కోటి వెచి్చంచనున్నారు. రాజమహేంద్రవరం సిటీ: నగరంలో రూ.30 లక్షలతో జగనన్న ఉమెన్స్ హెవెన్, రూ.12 లక్షలతో ఆజాద్‌చౌక్, ఎల్ఈడీ లైట్లు, రూ.6 లక్షలతో పుష్కరఘాట్ వద్ద దుస్తులు మార్చుకునే గది నిర్మాణం పూర్తయింది. రూ.37.50 లక్షలతో జీఎన్టీ రోడ్డులో మొక్కల పెంపకం, కుండీలు, మొక్కల నిర్వహణ, రూ.2 కోట్లతో హెవలాక్ బిడ్జి వద్ద రంగుల విద్యుత్ దీపాలు, రూ.2 కోట్లతో కంబాలచెరువు పార్కులో మ్యుజికల్ ఫౌంటేన్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరికొన్ని టెండరు దశలో ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్: శాటిలైట్ సిటీ డి–బ్లాక్ వద్ద రూ.50 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం, రూ.38.50 లక్షలతో కోలమూరు వద్ద అప్పన్నచెరువు పార్క్ అభివృద్ధి, రూ.47.50 లక్షలతో ధవలేశ్వరం పాంచాయతీలో ఓపెన్ జిమ్, వాకింగ్‌ట్రాక్ పనులు టెండరు దశలో ఉన్నాయి. కోనసీమజిల్లా: ఆత్రేయపురం వార్ఫ్ రోడ్డు వద్ద రూ.1.50 కోట్లతో రివర్ ఫ్రంట్, రూ.31 లక్షలతో రావులపాలెం జంక్షన్ వద్ద క్లాక్‌టవర్ అభివృద్ధికి టెండర్లు ఆహా్వనిస్తున్నారు. వాడపల్లి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.41.70 లక్షల వ్యయంతో ఆధ్యాతి్మకను సూచించే త్రిశంకు ఆకారంలో విద్యుత్ దీపాలు అమర్చే పనులు పురోగతిలో ఉన్నాయి. రావులపాలెం: కొమర్రాజులంక గ్రామంలో రూ.50 లక్షలతో పార్క్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి టెండర్లు ఆహ్వానిస్తున్నారు. విస్తృతంగా సుందరీకరణ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశానికి అనుగుణంగా రుడా పరిధిలోని ప్రాంతాల్లో సుందరీకరణ, ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నాం. స్థానికఎమ్మెల్యేల అభ్యర్థనల మేరకు, రుడా నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడుతున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదన్న ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో చేపడుతున్న పనులను చూసైనా బుద్ధి వస్తుందని భావిస్తున్నాం. –మేడపాటి షర్మిలారెడ్డి, చైర్పర్సన్ రుడా రాజానగరంలో ‘జిమ్’దాబాట్ రాజానగరం నియోజకవర్గంలో గాదరాడ, బూరగపూడి, శ్రీరంగపట్నం గ్రామాల్లో రూ.20.30 లక్షల వ్యయంతో యువతకు ఫిట్నెస్ పెంపొందించే జిమ్‌ల నిర్మాణం పూర్తయింది. విమాన ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ఎయిర్పోర్ట్ రోడ్డు వెంబడి ఉన్న సెంట్రల్ లైటెనింగ్ పోల్స్‌కు రూ.55 లక్షలతో ఎల్ఈడీ మోటిఫ్ ఏర్పాటు. రూ.2 కోట్లతో కోరుకొండ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్‌స్టాప్ పునరుద్ధరణకు మార్గం సుగమం కానుంది. పుణ్యక్షేత్రం వద్ద బర్డ్స్ పార్క్, ‘ఐ లవ్ రాజానగరం’, గ్రామ పేరు సూచించే సైన్‌బోర్డు పనులు టెండరు దశలో ఉన్నాయి. -
20 ఏళ్ల క్రితం కువైట్‌కు వెళ్లింది.. ఇప్పుడు భారత్‌కు తిరిగొచ్చింది
తూర్పు గోదావరికి చెందిన మూరి పద్మావతి(64) దీనగాధ ఇది.. 20 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆమె కువైట్‌కు వెళ్లింది. అయితే ఓ కంపెనీ చేసిన ఫ్రాడ్‌వీసా కారణంగా ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కువైట్‌లో బట్టలు అమ్మి జీవనం సాగించేది. కరోనా సమయంలో అనారోగ్యానికి గురై,రెసిడెన్సీ కూడా లేని కారణంగా ఆసుపత్రికి కూడా పోలేని పరిస్ధితిలో బంధువులు ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడింది. అదే సమయంలో బొంబాయికి చెందిన మహమ్మద్ యూనుస్ అనే యువకుడు అన్నీ తానై సొంత తల్లిలా చూసుకున్నాడు. పద్మావతి విషయం వైఎస్సార్సీపీ కువైట్ సీనియర్ నాయకులు ఆకుమూర్తి లాజరస్.. APNRTS డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్. కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎంబసీ అధికారుల సహాయంతో భారత్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఇన్నేళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. -
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి తూర్పుగోదావరి జిల్లా: అనంతపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు రెండేళ్ల చిన్నారి ఉంది. చదవండి: పెద్దల ముందే నరికి చంపాడు.. -
మహానాడు సాక్షిగా టీడీపీలో పొలిటికల్ వార్.. ఆయన ప్లాన్ ఏంటి?
తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడితో పాటు ఆయన తమ్ముడు కృష్ణుడు కూడా బాగా పాపులర్. తునిలో అన్న ఓటమి తర్వాత తమ్ముడు కూడా రెండు సార్లు ఓడిపోయాడు. తమ్ముడితో లాభం లేదని భావించిన యనమల తన కూతురిని తుని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అన్న చేసిన ద్రోహంతో రగిలిపోతున్న కృష్ణుడు ప్రతీకారానికి సిద్ధమవుతున్నారు. ఇంతకీ యనమల కృష్ణుడి ప్లాన్ ఏంటి?.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని నుండి ఆరు సార్లు గెలిచిన యనమల రామకృష్ణుడు తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత స్థానానికి చేరుకున్నారు. 2009లో ఓటమి తర్వాత యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. యనమల రామకృష్ణుడు అధికార పదవుల్లో ఉన్నంతకాలం.. తుని నియోజకవర్గంలో ఆయన తమ్ముడు కృష్ణుడి హవా కొనసాగింది. అన్న స్థానంలో తుని నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన కృష్ణుడిని రెండు సార్లు అక్కడి ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టారు. మూడో సారి పోటీ చేద్దామని అనుకుంటుంటే.. అన్న యనమల తన కుమార్తె దివ్యను తుని ఇన్‌ఛార్జ్‌గా నియమించి.. తమ్ముడికి షాక్ ఇచ్చారు. అన్న నిర్ణయంతో తమ్ముడు కుంగిపోయారు. ఇన్ఛార్జ్ పదవి పోవడంతో వచ్చే ఎన్నికల్లో సీటు గల్లంతే అని ఆందోళన చెందుతున్నారు. అన్న నియోజకవర్గంలో లేకపోయినా.. పార్టీని నిలబెట్టుకుంటూ వస్తుంటే.. ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి తీసేస్తారా అని కృష్ణుడు రగిలిపోతున్నారు. అన్నపై ప్రతీకారం తీర్చుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు. పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే తమ్ముడిని బుజ్జగించి దారికి తెచ్చుకున్నారు యనమల రామకృష్ణుడు. అయితే పైకి బాగానే ఉన్నప్పటికీ లోలోన రగలిపోతున్న కృష్ణుడు అవకాశం రాగానే తన కోపాన్ని చూపించారు. ఇటీవల కాకినాడలో జరిగిన టీడీపీ మిని మహనాడుకు డుమ్మా కొట్టారు. మినీ మహానాడుకు హాజరు కాకపోవడంపై కొందరు నేతలు ప్రశ్నించగా.. తన అన్న కుమార్తె దివ్య ఇన్ఛార్జ్ హోదాలో హాజరైనపుడు.. తనతో పనేముందని వారిని ప్రశ్నించారట కృష్ణుడు. చాలా కాలంగా అన్న స్థానంలో పార్టీలో పలుకుబడి పెంచుకున్న యనమల కృష్ణుడు.. ఇక పార్టీతో పని లేకుండా సొంతంగా ఇమేజ్ పెంచుకోవాలని నిర్ణయించుకున్నారట. అన్నచాటు తమ్ముడిగా ఉండకుండా.. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటేనే గుర్తింపు ఉంటుందని తన సన్నిహితులు వద్ద చెబుతున్నారట కృష్ణుడు. అందుకే నియోజకవర్గంలో సొంత ఇమేజ్‌తో ఎదగాలనుకుంటున్నానని చెప్పారటా. మొత్తం మీద తునిలో అన్న తీసుకున్న నిర్ణయం తమ్ముడుకి జ్ఞానోదయం కలిగించిందని తుని తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు. ఇదిలా ఉంటే కూతురిని తునిలో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ టీడీపీ ఆఫీస్ పెట్టేందుకు యనమలకు భవనం దొరకడం లేదని టాక్. భవనం అద్దెకు ఇస్తే రెంట్ ఇస్తారా లేదో అన్న అనుమానంతో పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని ఎవరూ అద్దెకు ఇవ్వడం లేదని సమాచారం. యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె దివ్య తునిలో ఉండేది తక్కువ. కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లోనే ఎక్కువగా ఉంటారు. అందుకే కృష్ణుడు మద్దుతు లేని రామకృష్ణుడి కోసం పార్టీ ఆఫీస్‌కు భవనం అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించడంలేదంటున్నారు. మరి అన్నదమ్ముల సవాళ్ళు చివరికి పార్టీని ఏ తీరానికి చేరుస్తాయో అని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. తగ్గేదేలే అంటూ పచ్చ బ్యాచ్‌కు కౌంటర్! -
తెగేసి చెబుతున్న తెలుగు తమ్ముళ్లు.. గోపాలపురం టీడీపీలో ఏం జరుగుతోంది?
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. ఇన్చార్జ్గా ఉన్న నేతను తప్పించి మరొకరిని నియమించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పై చేయి సాధించేందుకు రెండు వర్గాలు హోరా హోరీ తలపడుతున్నాయి. ఏ వర్గమూ బెట్టు వీడకపోవడంతో.. అంతంత మాత్రంగా ఉన్న కేడర్ రెండు వర్గాల మధ్య నలిగిపోతోంది. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గోపాలపురం తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు కాక రేపుతోంది. నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ ని మార్చినప్పటి నుండి ఇక్కడ అసమ్మతి సెగలు రగులుతున్నాయి. గోపాలపురం ఇన్చార్జి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పనితీరుపై విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు ఆయన స్థానంలో మద్దిపాటి వెంకటరాజును నియమించారు. దీంతో గోపాలపురంలో ముప్పిడి, మద్దిపాటి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. కొత్త ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు తమను పట్టించుకోవడంలేదని, తనకు కావాల్సిన వారికే పదవులు ఇచ్చుకుంటున్నారని ముప్పిడి వర్గం మండిపడుతోంది. ఇన్ చార్జ్ గా మద్దిపాటిని తప్పించి మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావునే మళ్ళీ కొనసాగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం రోజే దేవరపల్లిలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. తాజాగా ద్వారకా తిరుమల మండలంలో కూడా మద్దిపాటికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మద్దిపాటి వెంకట్రాజు తీరుపై నియోజకవర్గ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కొంత మంది బడా నాయకుల్ని వెంట బెట్టుకుని మద్దిపాటి రాజకీయం చేస్తున్నాడని, గ్రామాల్లో యువకులకు పెత్తనమిచ్చి, నాయకులను అసమర్థులుగా తయారుచేశాడని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని సీనియర్లు మండిపడుతున్నారు. మంగళగిరి కార్యాలయంలో 200 మంది నాయకులు, కార్యకర్తలు మద్దిపాటి నాయకత్వాన్ని వ్యతిరేకించినా అర్ధరాత్రి 12 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అతడినే ఇన్చార్జిగా ప్రకటించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంతా పార్టీ కోసం కష్టపడుతున్నామని, డబ్బు తగలేసుకుని పార్టీని నిలబెట్టుకుంటున్నా విలువలేకుండా చూస్తున్నారంటూ వాపోతున్నారు. రాజమండ్రి మహానాడు పూర్తయినందున త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇన్చార్జి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు. పార్టీ కోసం శ్రమిస్తున్నవారిని పట్టించుకోవడంలేదని, ఇన్చార్జ్ నియామకం విషయంలో అందరికీ అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్తితిని అధిష్టానానికి తెలియచేద్దామని, తమ కష్టాన్ని పరిగణలోకి తీసుకోకపోతే అప్పుడే తగిన నిర్ణయం తీసుకుందామని మద్దిపాటి వెంకటరాజును వ్యతిరేకిస్తున్న వర్గం నిర్ణయించుకుంది. చంద్రబాబు నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గోపాలపురం తెలుగుతమ్ముళ్ళు తెగేసి చెబుతున్నారు. చదవండి: అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి రియాక్షన్ -
మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు కన్నుమూత
సాక్షి, కాకినాడ: మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు (66) ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2004 నుండి 2009 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు దొమ్మేటి వెంకటేశ్వరరావు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తుడిగానూ ఈయనకు ఒక పేరుంది. గతంలో డీసీసీ అధ్యక్షుడిగానూ దొమ్మేటి పని చేశారు. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర సమయంలో.. వెంకటేశ్వరరావు కలిసి తన మద్దతును ప్రకటించారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. దొమ్మేటి వెంకటేశ్వరావు ఫౌండేషన్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ కన్నమూయడం గమనార్హం. దొమ్మేటి మృతి పట్ల ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇదీ చదవండి: చంద్రబాబు వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసన -
టీడీపీ మహానాడు ప్రాంగణంలో ‘గాలి దుమారం’
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద గాలి దుమారంతో టెంట్లు కూలిపోవడంతో పాటు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. నేతలు మాట్లాడుతుండగానే వర్షం కురుస్తుండటంతో ప్రాంగణం నుంచి కార్యకర్తలు వెళ్లిపోతున్నారు. కాగా, నిన్న(శనివారం) మహానాడు ప్రాంగణంలో ఆ పార్టీకి చెందిన నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గతంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఒక హోటల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వెంకటేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణలో ‘పార్టీ లేదు.. బొక్కా లేద’ని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. అదే వెంకటేశ్వరరావు.. మహానాడుకు హాజరై కార్యకర్తల మధ్య నుంచి లోకేశ్‌ను పిలిచి తిట్టడం చర్చనీయాంశమైంది. కొందరు కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ‘నా జీవితం నాశనమైంది. మీవి కూడా అలా కాకుండా చూసుకోండి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని, న్యాయం చేయమని అడిగితే లోకేశ్ పట్టించుకోలేదన్నాడు. చదవండి: చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు : పోసాని -
టీడీపీ మహానాడులో లోకేష్‌కు షాకిచ్చిన కార్యకర్త
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి టీడీపీ మహానాడులో నారా లోకేష్‌కు కార్యకర్త షాకిచ్చాడు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని లోకేష్‌ను నిలదీశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ లోకేష్‌ను కార్యకర్త వెంకటేశ్వరరావు అడ్డుకున్నాడు. కార్యకర్తను పట్టించుకోకుండా లోకేష్ వెళ్లిపోయారు. దీంతో మహానాడు ప్రాంగణంలోనే వెంకటేశ్వరరావు నిరసనకు దిగాడు. చదవండి: పచ్చి రాజకీయ రాక్షసుడిగా మారిపోయిన రామోజీ -
లోన్ యాప్ నిర్వాహకులను పట్టుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు
-
వీడియో: వైఎస్సార్ సీపీ నేత భవానీశంకర్ హత్య
-
మళ్లీ కులపిచ్చి బయటపెట్టుకున్న చంద్రబాబు
సాక్షి, తూర్పుగోదావరి: రాజకీయాల్లో కులపిచ్చికి బాబు బ్రాండ్ అంబాసిడర్.. ఆయన కులపిచ్చి ఏ రేంజ్లో ఉంటుందో మరోసారి గోదావరి జిల్లాల పర్యటనలో బయటపెట్టుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పరామర్శ పేరుతో వెళ్లిన చంద్రబాబు.. సిల్లీ రాజకీయాలకు తెరతీశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాట కోటేశ్వరంలో చంద్రబాబు కులపిచ్చి బయటపడింది. కష్టాన్ని చెప్పుకునేందుకు వచ్చిన రైతును కులం పేరుతో చంద్రబాబు అవమానించారు. కులం ఏంటని రైతును అడిగిన చంద్రబాబు.. మళ్లీ కులపిచ్చి తన బయటపెట్టుకున్నారు. చంద్రబాబు తీరుపై జనం మండిపడుతున్నారు. చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! -
మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): నగరంలోని తిలక్ రోడ్డు షిరిడీ సాయి మార్గ్ జంక్షన్లో నిర్మాణ దశలో ఉన్న డ్రెయినేజీలో గత వారం రోజుల కిందట దురదృష్టవశాత్తు కాలు జారి పడి మృతిచెందిన ఏరుకొండ నాగేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు కుటుంబానికి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ఎంపీ భరత్ గురువారం అందజేశారు. అలాగే డ్రెయినేజీ కాంట్రాక్టర్ తరపున మరో రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సహాయ సహకారాలను బహిర్గతం చేయకూడదని, కానీ ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు కొంతమంది శవ రాజకీయాలు చేయడం వల్ల చెప్పక తప్పడం లేదన్నారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స జరిగిన సంఘటన దురదృష్టకరం.. మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.. తప్పిస్తే ఇటువంటి విషాదకర సంఘటనలను తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం మంచిది కాదన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జరిగిన ఈ సంఘటనను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని.. ఆయన చాలా బాధపడ్డారన్నారు. మృతుని ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఎంపీ వెంట నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, బొమ్మన జయ్ కుమార్, కొత్త బలమురళి, కంతారం పాటిల్,సీరపు నగేష్ చంద్రరెడ్డి, దుంగ సురేష్, తదితరులు ఉన్నారు. చదవండి: హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
దోషులు ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి తానేటి వనిత
సాక్షి, తూర్పుగోదావరి: అమరావతి భూముల కుంభకోణంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుకు ప్రభుత్వం చేసిన అప్పీల్ ను పరిగణనలోకి తీసుకుని మళ్లీ విచారణ జరిపించండని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, స్వాగతిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ అవినీతికి సంబంధించి సిట్ ఏర్పాటుపై 'స్టే' విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరగకపోతే దర్యాప్తును ప్రాథమిక దశలోనే ఎందుకు అడ్డుకున్నారని హోంమంత్రి ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే? గత ప్రభుత్వంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం, దళితుల అసైన్డ్ ల్యాండ్స్, ఔటర్ రింగ్ రోడ్డులో అవకతవకలు, భారీ ప్రాజెక్టుల్లో నిబంధనల ఉల్లంఘనలు తదితర అంశాలపై వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్న సమయంలో హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై గత ప్రభుత్వంలోని నాయకులు స్టే తెచ్చుకోవడం జరిగిందన్నారు. ప్రాథమిక విచారణలో ఉండగానే హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని.. గత ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి, ఏ అక్రమాలు జరగకపోతే విచారణ ఎదుర్కొవడానికి ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు. తప్పు చేశామని భయం ఉండబట్టే స్టే తెచ్చుకున్నారన్నారు. విచారణను ఎదుర్కొని వాళ్ల నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ప్రాథమిక విచారణలో ఉండడానే హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. గతంలో కూడా ఈ అంశంపై మంత్రివర్గ ఉప సంఘం వేసినప్పుడు భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక ఆ విషయాలన్నీ అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిపి ప్రజల దృష్టికి తీసుకొచ్చామన్నారు. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో జరిగిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా విచారణ చేస్తామన్నారు. దోషులు ఎవరూ తప్పించుకోలేరని, ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తానేటి వనిత తెలిపారు. -
భారతమాలకు రహదారులు
సాక్షిప్రతినిధి, కాకినాడ: భారతమాల ప్రాజెక్టు వేగం పుంజుకుంది. గడువులోగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడేలా రూపొందించిన ఈ ప్రాజెక్టుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు, తొండంగి సమీపాన గేట్‌వే ఆఫ్ పోర్టు కాకినాడను ఒకపక్క విశాఖపట్నం, మరోపక్క ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు మూడు జాతీయ రహదారులను భారతమాల ప్రాజెక్టు కింద నాలుగు వరుసలుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒకటి లేదా, రెండేళ్లలో పనులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ గట్టిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా భూ సేకరణ, టెండర్ల ఖరారు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వడివడిగా.. కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు 13.20 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఏడాది వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో పనుల వేగం పెంచారు. ఇక్కడ భూసేకరణ అవసరం లేకుండానే ఉన్న రోడ్డునే నాలుగు లేన్లుగా ఆధునీకరిస్తున్నారు. టెండర్లు ఖరారు కావడంతో రూ.90 కోట్ల అంచనాతో పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుత రోడ్డును ఇరువైపులా వెడల్పు చేస్తూ నాలుగు వరుసలుగా చేపట్టడంలో అధికారులు నిమగ్నమయ్యారు. అవుటర్ రింగ్ రోడ్డు తరహాలో.. ♦ కాకినాడ వాకలపూడి లైట్‌హౌస్ నుంచి అన్నవరం మీదుగా కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారితో అనుసంధానించనున్నారు. ♦ 40.32 కిలోమీటర్లు నిడివి కలిగిన ఈ నాలుగు వరుసల జాతీయ రహదారిని తొలుత రూ.776.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ♦ కాకినాడ పోర్టు, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి, కాకినాడ గేట్‌వే పోర్టు, ఉప్పాడ ఫిష్షింగ్ హార్బర్ మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్లనుంది. ♦ వాకలపూడి జంక్షన్లో ఒక ఫ్లై ఓవర్, అన్నవరం, కాకినాడ సెజ్, హార్బర్ల వద్ద అండర్‌పాస్‌లను నిర్మించాల్సి ఉంటుంది. ♦ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు తరహాలో ఈ జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ♦ ఇప్పుడు రహదారి అంచనా వ్యయం రూ.1400 కోట్లకు పెరిగింది. ♦ ఎక్కువగా భూ సేకరణ చేయాల్సి వస్తోంది. ఇందుకు రూ.160 కోట్లకుగాను ఇప్పటికే రూ.56 కోట్లు విడుదల చేశారు. ♦ రెండేళ్లలోపు అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ♦ తొండంగి, శంఖవరం, యు కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాల్లోని 21 గ్రామాల మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంది. చకచకా భూసేకరణ ఉమ్మడి తూర్పులో పారిశ్రామికాభ్యున్నతికి సామర్లకోట–అచ్చంపేట జాతీయ రహదారి బాటలు వేయనుంది. రూ.395.60 కోట్ల అంచనాతో 12.25 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి కోసం 33 ఎకరాల ప్రైవేటు భూమి, 21 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమవుతోంది. ఇందుకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ హైవేలో సగం గ్రీన్‌ఫీల్డ్ (పొలాల మధ్య) ఉంటుంది. కాకినాడ–పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని రాక్ సిరామిక్స్ వద్ద ప్రారంభమై ఎఫ్‌సీఐ గోడౌన్స్, సుగర్ ఫ్యాక్టరీ, కెనాల్ రోడ్డు మీదుగా ఉండూరులో ఇది కలవనుంది. అచ్చంపేట జంక్షన్లో ఒక ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది. చురుగ్గా భూ సేకరణ చేపడుతున్నారు. 13 కిలోమీటర్ల మేర పనులు మొదలయ్యాయి. 33.92 హెక్టార్ల భూమి సేకరించి ఏడాదిలోపు ఈ హైవే పనులను పూర్తి చేయనున్నారు. ఈ రహదారి సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల్లో ఆరు గ్రామాల మీదుగా ప్రయాణిస్తుంది. నాలుగు వరుసల మూడు ప్రధాన జాతీయ రహదారులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో తీరానికి అనుసంధానమవుతుంది. తద్వారా పారిశ్రామిక ప్రగతికి మార్గం సుగమమం అవుతుంది. -
చిన్నారి వైద్యం కోసం ఉదారంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్
-
చిన్నారి వైద్యం కోసం ఉదారంగా స్పందించిన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: చిన్నారి వైద్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారంగా స్పందించారు.. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ల డయానా శాంతి ‘స్పైనల్ మస్క్యులర్‘ వ్యాధితో బాధపడుతోంది. జనవరి 3న సీఎం జగన్ రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా కలిసి తగిన సహాయం అందించాల్సినదిగా విజ్ఞప్తి చేశారు. డయానా శాంతి ఆరోగ్య పరిస్థితి విని స్పందించిన సీఎం.. ఎయిమ్స్‌లో తగిన వైద్య సేవలు అందచేసేందుకు చొరవ తీసుకున్నారు. పాప మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని ఆదేశించినట్లు లెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. అంతేగాక నెలకూ రూ.10 వేల పెన్షన్, అవుట్ సోర్సింగ్ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇవ్వడం జరిగిందని కలెక్టర్ వివరించారు. కాగా, ముఖ్యమంత్రి బుధవారం నిడదవోలు వచ్చిన సందర్భంగా డయానా తల్లి సూర్యకుమారి వైఎస్ జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అయితే తన కుమార్తె వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీకి వెళ్లి రావడం చాలా ఖర్చుతో కూడుకున్నట్లు సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన సీఎం.. ప్రభుత్వ పరంగా సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీకి వెళ్లి రావడానికి అవసరమైన చేయూతను అందచేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం రూ.2 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. యూఎస్ఏ నుంచి పాప వైద్యానికి సంబంధించి రిస్డిప్లం (risdiplam) IT gene therapy) ఇంజెక్షన్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఈ ఇంజెక్షన్ సుమారు రూ.14 కోట్ల రూపాయల ఖరీదు ఉన్న నేపథ్యంలో అందులో భాగంగా కొద్ది నెలల పాటు పాప వైద్య పరీక్షలు నిర్వహించవలసి ఉందన్నారు. తగిన వైద్య సేవలు పొందేందుకు వీలుగా న్యూఢిల్లీకి వెళ్లి రావడం కోసం విమాన ప్రయాణం ఖర్చులు, వసతి తదితర ఖర్చుల తగిన ఆర్థిక సాయానికి సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ మాధవీలత వెల్లడించారు. చదవండి: ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ -
ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ
సాక్షి, తూర్పుగోదావరి: గత ఏడాది వ్యవధిలో 77 వేల కేసులు తగ్గించామని, రాష్ట్రంలో పోలీసు శాఖపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన రాజమండ్రిలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మహిళా పోలీసులతో చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ‘‘శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల పని అని, ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతామని డీజీపీ ప్రశ్నించారు. నిర్దేశించిన ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాలని సూచించాం. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: ఏపీ సర్కార్‌పై ఐరాస శాశ్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ బృందం ప్రశంసలు -
తూర్పుగోదావరిలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, నిడదవోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు నిడుదవోలు చేరుకుంటారు. 11 గంటలకు నిడుదవోలు గాంధీనగర్‌లో సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. అనంతరం 11.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: దుష్టచతుష్టయానికి దత్తపుత్రుడు జతకలిశాడు: సీఎం జగన్ -
ఫేస్బుక్ లవ్‌స్టోరీ.. అన్నవరంలో పెళ్లి చేసుకుని..
నల్లజర్ల(తూర్పుగోదావరి): తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ ప్రేమజంట శనివారం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరుకు చెందిన సంకుల గాయత్రి బీఎస్సీ పూర్తిచేసి మంగళగిరిలోని ఓ కంప్యూటర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన కాజ గణపతి నల్లజర్ల మండలం అనంతపల్లిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. వారిద్దరూ ఫేస్బుక్లో స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు గాయత్రికి బయట సంబంధాలు చూస్తున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరేమోనని భావించి వారిద్దరూ శనివారం అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన గాయత్రి తరఫు పెద్దలు మండిపడి చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ గాయత్రి నల్లజర్ల ఎస్ఐ నరసింహమూర్తికి శనివారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఆదివారం ఇరువురి పెద్దలను పిలచి మాట్లాడతామని ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. చదవండి: యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్ -
ఆత్రేయపురం పూతరేకులకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
రాజమహేంద్రవరం డెస్క్: ఆత్రేయపురం.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది పూతరేకు. ఈ పేరు వింటేనే నోరూరుతుంది. రుచిలో.. రూపంలో దీనికేదీ సాటి రాదు. ఆత్రేయపురంలో పుట్టి ఆ ప్రాంతానికి ఓ బ్రాండ్ ఇమేజిని తెచ్చిపెట్టింది అందుకే. వందేళ్లకు పైబడిన చరిత్రను సొంతం చేసుకున్న ఆత్రేయపురం పూతరేకులకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇందుకోసం విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వ విద్యాలయం సహకారంతో సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ఇప్పటికే దరఖాస్తు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే మూడు నెలల్లోనే చెన్నైలోని జీఐ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఆత్రేయపురం పూతరేకులకు గుర్తింపు జారీ అవుతుంది. దీంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది. పూతరేకులకు స్ఫూర్తి పూర్వం మైసూరుకు చెందిన ఒక మహిళ ఆత్రేయపురం కోడలిగా వచ్చింది. అప్పట్లో అన్నం వారుస్తుండగా వచ్చిన గంజి కుండపై పడి, రేకుగా వచ్చింది. దానిని చూసి విస్తుపోయిన ఆమె సరదాగా పంచదారతో కలిపి తిని ముచ్చట పడింది. అలా ఆవిర్భవించిందే పూతరేకు. తొలినాళ్లలో క్షత్రియ మహిళలు ఈ రేకు తయారు చేసి, పంచదార అద్దేవారు. కాలక్రమంలో ఇతర వర్గాల మహిళలు కూడా ఈ రేకు తయారీ నేర్చుకున్నారు. ఉపాధిగా మార్చుకున్నారు. ఒక్క ఆత్రేయపురంలోనే సుమారు 400 కుటుంబాలు పూతరేకుల తయారీపై ఆధారపడ్డాయి. ఇతర ప్రాంతాలతో కలుపుకొంటే రెండు వేల మందికి పైగా మహిళలు ఈ రేకుల తయారీలో ఆరితేరిపోయారు. మనం ఎక్కడ పూతరేకు తిన్నా ఆ రేకు ఆత్రేయపురానిదేనని ఘంటాపథంగా చెప్పొచ్చు. కాలానుగుణంగా ఎన్ని సోకులో.. తొలినాళ్లలో ఒక్క పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు. ఇవి తెల్లగా మెరిసిపోతూ.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేవి. కాలానుగుణంగా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇందులోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లంతో తయారు చేస్తున్నారు. మధుమేహ బాధితుల కోసం షుగర్ ఫ్రీగా అమ్ముతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి డ్రైఫూట్స్నూ కలుపుతున్నారు. అసలు రుచి మారినా.. కొత్త రుచితో ఉన్న పూతరేకులను ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. ఈ రుచులను ఆస్వాదిస్తున్నారు. స్వీట్స్ ప్రియులను ఆకట్టుకోవడానికి బోర్న్‌విటా, హార్లిక్స్ వంటివి చల్లుతూ కొత్త ఫ్లేవర్లు తయారు చేస్తున్నారు. రేకుల వెనుక రెక్కల కష్టం సాధారణంగా మనం స్వీట్‌స్టాల్‌లో పూ తరేకుల ప్యాకెట్ రేటు అడగ్గానే కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ రేకుల తయారీదారుల మాటలు వింటే వా రికి పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. గట్టిగా రోజంతా కష్టపడితే రూ.300 సంపాదిస్తున్నానని ఆత్రేయపురానికి చెందిన ఓ మహిళ చెప్పింది. మరికొందరు కూడా ఇదే తరహా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యాపారులు వీరికి కొద్దోగొప్పో రుణం ఇచ్చి, తక్కువ కూలికే రేకులు తయారు చేయించుకుంటున్న వైనాలూ ఉంటున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా తయారీ మహిళల నోట తీపి మాటలు మాత్రం వినిపించకపోవడం కొంత బాధ కలుగుతుంది. వీరందరినీ ఒక తాటి మీదకు తీసుకువస్తే మార్కెట్‌నూ శాసించగలుగుతారు. ఒకే తరహా రేటూ పొందగలుగుతారు. పూతరేకుల కబుర్లు ♦దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కోనసీమలో తయారైన పిండి వంటలతో పాటు ఆత్రేయపురం పూతరేకులను అప్పటి ప్రధాని వాజ్‌పేయ్‌కు రుచి చూపించారని ఇక్కడి ప్రజలు గర్వంగా చెబుతారు. ఆత్రేయపురం పూతరేకుల ఖ్యాతిని మరింత వ్యాప్తి చేసేలా తపాలా శాఖ గత ఏడాది ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది. ♦రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ, భవానీ ల్యాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) నేతృత్వంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కోసం 10 మీటర్ల పూతరేకు తయారు చేసింది. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంపాదించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలో అధికారికంగా సర్టిఫికెట్ జారీ కానుంది. ♦చాలా సినిమాల్లో పూతరేకుల ప్రస్తావన కనిపిస్తుంది. దిగ్గజ బాలీవుడ్ నటుడు అమ్రీష్‌పురీకి అత్యంత ఇష్టమైన వాటిలో పేపర్ స్వీట్ (పూతరేకును ఆయన ముద్దుగా పిలుచుకునే పేరు) ఒకటని చెబుతారు. ఏకతాటి మీదకు రావాలి ఆత్రేయపురానికి విశిష్ట ఖ్యాతి ఆర్జించి పెడుతున్న పూతరేకుల తయారీలో మహిళలదే కీలక పాత్ర. ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న వీరందరూ ఒకే తాటి పైకి రావాల్సిన అవసరముంది. నాణ్యత, మార్కెట్ విషయంలో ఏకాభిప్రాయానికి రావాలి. అప్పుడే వీరికి శ్రమకు తగ్గ ప్రతిఫలం వస్తుంది. తలోదారిలో తయారు చేసుకుంటూ పోతే మార్కెట్‌ను శాసించలేని పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో మార్పు రావాలి. – గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం ప్రోత్సాహం అందించాలి చాలా కాలం నుంచి పూత రేకులు తయారు చేస్తున్నాం. మా ముందు తరాల నుంచీ ఇదే చేస్తున్నాం. పేద మహిళలు చాలా మంది రేకులు తయారు చేస్తున్నారు. సరైన కూలి కూడా రావడం లేదు. ఎంతో ఓపికగా చేయాల్సిన పని ఇది. బ్యాంకులు ముందుకొచ్చి రుణాలు మంజూరు చేయాలి. ప్రోత్సాహం అందించాలి. – జి. నాగమణి, ఆత్రేయపురం -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
తుని: పాయకరావుపేట మండలం నామవరం–తుని రైల్వేస్టేషన్ మధ్యలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై ఎస్కే అబ్దుల్ మారూఫ్ తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న రైలును గమనించకుండా పట్టాలు దాటుతున్న 45 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బంగారపు రంగు ఫుల్ చేతుల చొక్కా, నీలం రంగు గడుల లుంగీ ధరించి ఉన్నాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. -
బియ్యం లోడు లారీ అపహరణ
యానాం: కేరళ రాష్ట్రానికి రూ.15లక్షల విలువ చేసే ఉప్పుడు బియ్యం లోడుతో యానాం నుంచి వెళ్లిన లారీని అపహరణ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పీసీఆర్సెల్ ఎస్సై కట్టా సుబ్బరాజు నేతృత్వంలోని యానాం పోలీస్ క్రైమ్‌టీమ్ సిబ్బంది గణేష్, జాంటీ, దుర్గారావు చాకచక్యంగా కేసు ఛేదించారు. నిందితులైన లారీ డ్రైవర్ బాబు, రాజకలైలను శుక్రవారం అరెస్ట్ చేసి యానాం సబ్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని ఎస్సై శేరు నూకరాజు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అడివిపొలం గ్రామంలోని గాయత్రి రైస్‌మిల్లు నుంచి ఈ నెల 2వ తేదీన 28టన్నుల ఉప్పుడు బియ్యం లోడుతో కేరళ రాష్ట్రానికి లారీ బయలుదేరింది. 6వ తేదీకి కేరళ చేరుకోవాల్సి ఉన్నప్పటికి చేరుకోకపోవడంతో సంబంధిత రైస్‌మిల్లు యజమాని చౌదరి యానాం పోలీసులకు ఈ నెల 15న ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి గాలించగా ఖాళీ లారీ తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద ఉన్నట్లు కనుగొన్నారు. దానిని స్వాఽధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. -
చోరీల్లో అతని స్టయిలే వేరు!
దొరికిన సొత్తులో కొంతే దోచుకుంటాడు పట్టపగలు దొంగతనాల్లో సిద్ధహస్తుడు మూడు కేసుల్లో రూ.6.75 లక్షల సొత్తు స్వాధీనం అమలాపురం టౌన్: అందరి దొంగల్లా కాకుండా అతని చోరీ విధానంలో కొన్ని ప్రత్యేకతలను పోలీసులు గుర్తించారు. అమలాపురంలోని మూడు ఇళ్లలో పట్టపగలే చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డ కాకినాడ ఇంద్రపాలేనికి చెందిన తంగెళ్ల సోమేష్ శ్రీకాంత్‌ను విచారిస్తున్నప్పుడు అతని చోరీల టెక్నిక్ పోలీసులకు తెలిసింది. నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. రూ.6.75 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వై.మాధవరెడ్డి, పట్టణ సీఐ ఎస్‌సీహెచ్ కొండలరావు, పట్టణ ఎస్సై జి.హరీష్‌కుమార్ అతని చోరీల చిట్టాను వివరించారు. బీఎస్సీ చదివి ఉద్యోగం చేస్తూ... శ్రీకాంత్ బీఎస్సీ చదివాడు. మెడికల్ రిప్రజంటేటివ్ ఉద్యోగం చేస్తూనే చోరీలకు అనువైన ఇళ్లను ఎంచుకునేవాడు. ఈ చోరీల్లో దొరికిన బంగారు నగల్లో కొన్నింటినే దొంగిలించి బీరువా తలుపులు యథావిధిగా వేసేవాడు. ఆ ఇళ్ల యాజమానులు వచ్చి చూసుకుంటే పోయిన సొత్తు ఇంట్లో ఎవరో తెలుసున్న వారే చోరీ చేశారన్న అనుమానం కలిగించేలా జాగ్రత్తలు తీసుకొనేవాడు. అమలాపురంలో చేసిన మూడు చోరీల్లో శ్రీకాంత్ కాజేసిన రూ.6.05 లక్షల విలువైన 116.470 గ్రాముల బంగారు నగలు, రూ.70 వేల నగదును అతని నుంచి పోలీసులు రికవరీ చేశారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ శ్రీకాంత్ తన ఉద్యోగాన్ని తన చోరీలకు అనువుగా ఉపయోగించుకున్నాడు. కాకినాడ టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇతనిపై నాలుగు చోరీ కేసులు ఉన్నాయి. ఈ చోరీలు కూడా పట్టపగలే చేశాడు. ఈ నాలుగు కేసుల్లోనూ నాలుగుసార్లు జైళ్లకు వెళ్లి శిక్షలు అనుభవించాడు. ఎస్పీ అభినందన ఈ చోరీ కేసులను త్వరితగతిన ఛేదించిన పట్టణ ఎస్సై హరీష్‌కుమార్, సీసీఎస్ ఏఎస్ఐ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు గుబ్బల సాయి, లంకాడి శ్రీను, రేవు ప్రసాద్, అరిగెల శుభాకర్, బొక్కా ప్రసాద్, క్లూస్ టీమ్ ఎస్ఐ ఐ.ప్రవీణ్, హెచ్‌సీ శ్రీనును జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ మాధవరెడ్డి, సీఐ కొండలరావు అభినందించారు. -
పదిండి ముందుకు
రాయవరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మరో 40 రోజుల్లో (ఏప్రిల్ 3–18) విద్యార్థులు ఎదుర్కోనున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధ్యమే. ఈ ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,205 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 69,124 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో ఎలా సన్నద్ధం కావాలో సబ్జెక్టు నిపుణులు సూచిస్తున్నారు. సమయం కీలకం ఈ 40 రోజుల్లో రోజుకు ఏడు గంటల చొప్పున చదివితే పదిలో ఏడు సబ్జెక్టులకు 40 గంటల చొప్పున సరిపోతుంది. ప్రణాళిక సిద్ధం చేసుకుంటే సీ, డీ గ్రేడుల్లోని విద్యార్థులు ఉత్తీర్ణత..ఏ, బీ గ్రేడుల్లోని వారు ఆశించిన మేరకు మార్కులు సాధించే అవకాశముంటుంది. గణితం సాధన చేయాల్సిందే. 1,2,4 మార్కుల ప్రశ్నలకు చాయిస్ లేదు. 8 మార్కుల ప్రశ్నలకు మాత్రమే చాయిస్ ఉంటుంది. ఒక మార్కు ప్రశ్నలపై దృష్టి సారిస్తే ఏ,బీ గ్రేడ్ విద్యార్థులు 95కు పైగా మార్కులు సాధిస్తారు. సీ,డీ గ్రేడ్ విద్యార్థులు గ్రాఫ్‌లు, నిర్మాణాలు, పటాలపై దృష్టి సారిస్తే కనీసం 15 మార్కులు సాధిస్తారు. సమితులు, సంభావిత, సాంఖ్యకశాస్త్రం, త్రికోణమితి, వాస్తవ సంఖ్యలు శ్రద్ధగా చదివితే సీ,డీ గ్రేడ్ విద్యార్థులు ఉత్తీర్ణత పొందుతారు. ప్రశ్న పత్రం మొత్తం 33 ప్రశ్నలుంటాయి. సూత్రాలపై పట్టు సాధిస్తే గణితమంత సులువైన సబ్జెక్టు మరోటి ఉండదు. – పతివాడ రవిశంకర్, ఎస్ఏ(గణితం), జెడ్పీహెచ్ఎస్, కొమరిగిరి, యు.కొత్తపల్లి మండలం విశ్లేషణాత్మకంగా రాయాలి తెలుగులో రామాయణంపై అవగాహన కలిగి ఉండాలి. సంఘటనలను క్రమంలో అమర్చగలిగి ఉండాలి. కంఠస్థం చేయకుండా చదివి ఆలోచించడం, సృజనాత్మకతల వల్ల మంచి మార్కులు పొందవచ్చు. పాఠ్యాంశంలోని స్టార్ గుర్తున్న పద్యాలను ఎక్కువసార్లు రాసి సాధన చేయాలి. చక్కని చేతిరాత, వ్యాకరణంపై పట్టు సాధించాలి. లేఖా ప్రక్రియ సాధన చేస్తే సులభంగా మార్కులు సంపాదించవచ్చు. సమాసాలు, సంధులు, అలంకారాలు, వాక్యాల్లో రకాలపై పట్టు సాధించాలి. అవగాహన–ప్రతిస్పందనలో 32, భాషాంశాల్లో 32, వ్యక్తీకరణ, సృజనాత్మకతకు 36 మార్కులు ఉంటాయి. – బీఎస్ సునీతాలక్ష్మి, ఎస్ఏ(తెలుగు), జెడ్పీహెచ్ఎస్, ద్రాక్షారామం మ్యాపులతో మంచి గ్రేడింగ్ ’సోషల్‌లో పట్టికలు, గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింటింగ్, సమాచార విశ్లేషణ సాధన చేయాలి. 1–12 ప్రశ్నల వరకు ఒక్క మాటలో సమాధానం రాసే ప్రశ్నలున్నాయి. సబ్జెక్టుపై పట్టును సాధిస్తే వీటిని సులువుగా ఆన్సర్ చేయవచ్చు 13 నుంచి 20 వరకు రెండు మార్కుల ప్రశ్నలు, 21–28 వరకు నాలుగు మార్కుల ప్రశ్నలుంటాయి. 29–33 వరకు ఎనిమిది మార్కుల ప్రశ్నలుంటాయి. 29–32 వరకు ఇంటర్నల్ చాయిస్ ఉంది. మ్యాప్ పాయింటింగ్‌లో పాఠ్యాంశం చివర ఉన్న ప్రశ్నలను యథాతధంగా ఇవ్వకుండా విద్యా ప్రమాణాలను పరీక్షించేలా ఇస్తారు. – గరగ సీతాదేవి, ఎస్ఏ(సోషల్), జెడ్పీహెచ్ఎస్, రాయవరం భౌతిక శాస్త్రం భయానకం కాదు ’భౌతిక, రసాయన శాస్త్రం కలిపి 50 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. భౌతికశాస్త్రంలో కాంతి, విద్యుత్ యూనిట్లు, సూత్రాల ఉత్పాదన, గణన, నిత్యజీవిత వినియోగం, భేదాలపై దష్టి పెట్టాలి. రసాయన శాస్త్రంలో కర్బన సమ్మేళనాలు, సమీకరణాలు, పరమాణు నిర్మాణం, లోహ సంగ్రహణ శాస్త్రం, మూలకాల వర్గీకరణ, ఆమ్లాలు, క్షారాలు యూనిట్లపై పట్టు సాధించాలి. శాస్త్రవేత్తల విశేషాలను గుర్తుంచుకోవాలి. ప్రయోగాలు, డయాగ్రమ్స్‌పై దృష్టి సారించాలి. – డి.ప్రియదర్శిని, ఎస్ఏ(పీఎస్), జెడ్పీహెచ్ఎస్, పెద్దాపురప్పాడు, కరప మండలం జీవశాస్త్రాన్ని ఇష్టంగా చదవాలి ఈ ఏడాది పీఎస్, బయాలజీ ఒకే పేపరు ఉంటుంది. పార్ట్–ఎ పీఎస్ 50, పార్ట్–బి బయాలజీ 50 మార్కులకు ఉంటుంది. 17 నుంచి 33వ ప్రశ్న వరకు బయాలజీ ప్రశ్నలుంటాయి. ప్రయోగాలు, భేదాలు, చిత్రపటాలు, టేబుల్స్‌పై అవగాహన ఉండాలి. చిత్రపటాలు, ప్రయోగశాల కృత్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. భాగాలు గుర్తించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషణ చేసేలా, రెండు విషయాలను పోలుస్తూ బేధాలను రాయమంటూ ఒక ప్రశ్న కచ్చితంగా వస్తుంది. పాఠ్యాంశంపై, శాస్త్రవేత్తల పరిశోధనలపై పట్టు సాధించేలా అభ్యసనం చేయాలి. సమాధానాలు పాయింట్ల రూపంలో రాస్తే మంచిది. – మేకా రామలక్ష్మి, ఎస్ఏ(బయాలజీ), శ్రీగౌతమి మున్సిపల్ హైస్కూల్, మండపేట ఆంగ్లంలో గ్రామర్ కీలకం ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లలో 1–35 వరకు ప్రశ్నలుంటాయి. సెక్షన్–ఎలో మూడు పాసేజ్‌లు పాఠ్యాంశం నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. వీటికి 30 మార్కులు వస్తాయి. పాఠ్య పుస్తకంపై అవగాహనతో 30 మార్కులు సులభంగా సాధించవచ్చు. సెక్షన్–బిలో 16వ ప్రశ్న నుంచి 32వ ప్రశ్న వరకు 17 ప్రశ్నలు 40 మార్కులకు ఇస్తారు. పాఠ్య పుస్తకంలోని గ్రామర్, ఒకాబ్లరీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి పాఠ్యాంశం వెనుక ఉన్న గ్రామర్, ఒకాబ్లరీ చదవడం ద్వారా 40 మార్కులు సాధించే వీలుంది. సెక్షన్–సిలో 33–35 వరకు ఇచ్చే ప్రశ్నలతో విద్యార్థుల్లోని క్రియేటివ్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. లెటర్ రైటింగ్, కాన్వర్సేషన్, డైరీ ఎంట్రీ, ఎడిటర్ లెటర్, బ్రయోగ్రాఫికల్ స్కెచ్, ఇచ్చిన గ్రాఫ్ లేదా చార్ట్‌కి పేరాగ్రాఫ్ రాయడం చేయాలి. వీటిపై పట్టు సాధిస్తే 30 మార్కులు సాధించే వీలుంది. – రాయి వెంకటేశ్వరరావు, ఎస్ఏ(ఇంగ్లిష్), జెడ్పీహెచ్ఎస్, భీమనపల్లి, ఉప్పలగుప్తం మండలం ఉత్తీర్ణతలో రాజసం హిందీలో ఉత్తీర్ణతకు 20 మార్కులే ఉండటంతో భాషపై కొంత అవగాహన ఉంటే పాస్ కావొచ్చు. చదవడం, రాయడం, బాగా సాధన చేయాలి. రోజూ అరగంట హిందీకి కేటాయిస్తే 80 శాతం మార్కులు సాధించవచ్చు. గ్రామర్ ఉన్న 1–12 ప్రశ్నలు (థింకింగ్ స్కిల్స్) పాఠానికి మినిమమ్ ఐదు ప్రాక్టీస్ చేయాలి. రోమన్–2లో పద్యం నుంచి ఒకటి, గద్యం నుంచి మూడు పాసేజ్‌లు ఇస్తారు. అవగాహన చేసుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. రోమన్–3లో పద్యం నుంచి కవి పరిచయం, గద్యం నుంచి రచయిత పరిచయం రాయాలి. రోమన్–4లో ఎనిమిది షార్ట్ ఆన్సర్ ప్రశ్నలుంటాయి. రోమన్–5 నుంచి చాయిస్ ఇస్తారు. పద్యాల నుంచి రెండు ఇస్తే ఒకటి, గద్యం నుంచి రెండు ఇస్తే ఒకటి రాయాలి. రోమన్–6లో చాయిస్ ఉంటుంది. – ఆర్.ప్రతాప్‌రెడ్డి, ఎస్ఏ(హిందీ),జెడ్పీహెచ్ఎస్, కాతేరు, రాజమహేంద్రవరం రూరల్ మండలం -
26 నుంచి జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియెట్ జనరల్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆ వివరాలను ఇంటర్ బోర్డు ఆర్ఐవో ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం శుక్రవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 142 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ నాన్ జంబ్లింగ్ విధానంలో పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ పరీక్షలకు బోటనీ, జువాలజీ విభాగాల్లో 9 వేల 794 మంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 32,289 మంది పరీక్షలు రాయనున్నారు. వోకేషనల్ విభాగంలో రెండో దశ ప్రాక్టికల్ పరీక్షలు 41 కేంద్రాల్లో జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు వివిధ స్థాయిల్లో స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్స్‌లో ఈ పరీక్షలు జరగనున్నాయి. -
ఇంతకూ చనిపోయింది ఎవరు?
రాయవరం: పచ్చని పంట పొలాల మధ్య..ప్రశాంతంగా ఉండే వాతావరణంలో..గడ్డివామిలో కాలిన స్థితిలో కన్పించిన మృతదేహం కలకలం రేపింది. రాయవరం మండలం మాచవరం–పసలపూడి ప్రధాన గ్రామాల మధ్య శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వెలుగు చూసిందిలా.. మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య మండపేట–కాకినాడ ప్రధాన రహదారిని ఆనుకుని పంట పొలం ఉంది. పంటపొలాన్ని ఆనుకుని ఉన్న దిమ్మపై పాడుబడిన మోటార్ షెడ్ ఉంది. ఈ షెడ్‌ను ఆనుకుని ఉన్న చిన్న గడ్డివాములో పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న మృతదేహం కౌలు రైతు కురుపూడి గోవిందు కంటబడింది. పొలం యజమాని ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై పీవీవీఎస్‌ఎన్ సురేష్ సిబ్బందితో వచ్చి పరిశీలించి, విషయాన్ని మండపేట రూరల్ సీఐ శివగణేష్‌కు తెలిపారు. డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, సీఐ శివగణేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహమెవరిది? అక్కడ లభించిన చేతికి వేసుకునే గాజుల ముక్కలు, మహిళలు వేసుకునే పాదరక్షల ఆధారంగా మహిళ మృతదేహంగానే భావిస్తున్నారు. ఎక్కడ నుంచైనా మహిళను తీసుకుని వచ్చి ఇక్కడ హత్య చేసి, గడ్డివాములో మృతదేహాన్ని కాల్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వార్త ఆనోటా ఈనోటా తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్ ఆధారాల సేకరణ క్లూస్‌టీమ్ ఎస్సై ఎస్.ప్రశాంతి ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడ ఉన్న ఆధారాలను సేకరించారు. పోలీసు జాగిలం ఘటనా స్థలిని దగ్గరలో ఉన్న మరో పంట దిమ్మ వరకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చింది. పోలీసులు ప్రధానంగా మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు. మృతదేహాన్ని మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. లంచం తీసుకున్న కేసులో అటవీ అధికారికి మూడేళ్ల జైలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లంచం తీసుకున్న కేసులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కుంజమ్ భాస్కరరావుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఏబీసీ కోర్టు స్పెషల్ జడ్జి యూ.ప్రసాద్ శుక్రవారం తీర్పునిచ్చారు. కాకినాడ రేంజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భాస్కరరావు ద్రాక్షారామాకు చెందిన సుంకర వేణుగోపాల్ కలప డిపో వద్ద సీజ్ చేసిన బిల్ బుక్స్, పర్మిట్, బిల్స్ తిరిగి ఇచ్చేందుకు, సీ ఫీజు సొమ్ము తగ్గించేందుకు 2010 జనవరి 23న రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై వేణుగోపాల్ ఏసీబీ ఆధికారులను ఆశ్రయించగా వారు వలపన్ని అతనిని పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో ఏసీబీ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. రూ.5 వేలు చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు అమలు చేస్తారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శేషయ్య వాదించారు. ఏసీబీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీహెచ్ సౌజన్య పర్యవేక్షించారు. -
మహిళా ఉద్యోగిపై దాడి: ఉన్నతాధికారుల విచారణ
ఆలమూరు: ఆలమూరుకు చెందిన మహిళా ఉద్యోగి జి.యమునపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఎస్సీపేటలో నివాసం ఉంటున్న యమునను పెళ్లి చేసుకుంటానంటూ కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన తాళ్ల గోయల్ సుఖిరాజు వేధిస్తున్నాడు. ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన యమునపై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఈ నెల 19వ తేదీ రాత్రి యమున నివాసముంటున్న ప్రాంతానికి వచ్చి దాడి చేశాడు. ఈ దాడిలో శరీరానికి, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యుల సహకారంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అత్యవసర చికిత్స తీసుకుంది. అనంతరం గ్రామానికి వచ్చి ఆలమూరు పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన ఎస్సై శివప్రసాద్ తాను రూపొందించిన తుది నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందించారు. దీనిపై కలెక్టర్ హిమాన్షుశుక్లా సత్వరమే స్పందించి ఆర్డీఓ ఎం.ముక్కంటి, పీడీ జి.సత్యవేణి, సీడీపీఓ ఎ.గజలక్ష్మి, ఎస్సై ఎస్.శివప్రసాద్‌తో కూడిన బృందాన్ని పంపి శుక్రవారం పూర్తి స్థాయి విచారణ జరిపించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమెకు చికిత్సను చేయిస్తున్నారు. బాధితురాలు ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామ సచివాలయం–2లోని విలేజ్ క్లీనిక్‌లో సీహెచ్‌ఓగా పనిచేస్తుండగా, సుఖిరాజు ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఎస్సై శివప్రసాద్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటన దురదృష్టకరం సీహెచ్‌ఓగా పనిచేస్తున్న యమునపై దాడి దురదృష్టకరమని పెదపళ్ల పీహెచ్సీ వైద్యాధికారి పి.భవానీశంకర్ వ్యాఖ్యానించారు. ఆలమూరులోని ఆమె నివాసంలో శుక్రవారం పరామర్శించి ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒక మహిళ ఉద్యోగిపై దాడి చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
కొంప ముంచిన ‘చంద్రబాబు’ టూర్.. ‘సీట్లు’ సితారయ్యేలా సిగపట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీని బలోపేతం చేస్తామంటూ వచ్చిన చంద్రబాబు తమను గోదాట్లో ముంచి పోతున్నట్టుగా ఉందని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సీట్లకు సెగ పెట్టేందుకే ఆయన వచ్చినట్టుగా ఉందని నియోజకవర్గ ఇన్చార్జిలు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటన వల్ల ప్రయోజనం మాట దేవుడెరుగు.. కొత్త సమస్యలతో తల బొప్పి కట్టిందంటున్నారు. చంద్రబాబు పర్యటనలో టీడీపీ విభేదాలు రచ్చకెక్కి సిట్టింగ్‌ల సీట్లకు సెగ తగిలింది. తొలి రోజు బుధవారం రాజానగరంలో మొదలైన విభేదాలు చివరి రోజైన శుక్రవారం పెద్దాపురంలో కూడా కొనసాగాయి. అధినేత పర్యటనతో సీన్ రివర్స్ అయ్యిందని ఇన్చార్జిలు తల పట్టుకుంటున్నారు. వర్గ విభేదాలపై నియోజకవర్గ కార్యకర్తల సమీక్షల్లో చంద్రబాబు దాటవేశారని క్యాడర్ పెదవి విరుస్తున్నారు. రాజానగరంలో కేరాఫ్ లేదు చంద్రబాబు తీరుతో నొచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ టీడీపీ రాజానగరం ఇన్చార్జి పదవికి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తప్పుకున్న తరువాత ఆ పార్టీకి అక్కడ దిక్కు లేకుండా పోయింది. మరొకరిని ప్రకటిస్తారని ఎదురు చూశారు. పుట్టి మునిగిపోతున్న పార్టీ బరువు మోయడానికి నాయకులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ తరుణంలో తమ సామాజికవర్గానికే సీటు ఇవ్వాలంటూ బీసీకి చెందిన బార్ల బాబూరావు అసమ్మతి గళం వినిపించారు. పెందుర్తి అనుయాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు తనకాల నాగేశ్వరరావు, వ్యతిరేక వర్గం నుంచి బర్ల బాబూరావు మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ఎవరూ దిక్కులేక ఇన్చార్జిగా తమ నేతనే కొనసాగిస్తున్నారని పెందుర్తి వర్గం బాహాటంగా చెప్పడమే వివాదానికి కారణమైంది. అందుకే కోరుకొండలో చైతన్య రథం పైకి చంద్రబాబు పిలిచినా పెందుర్తి వెళ్లలేదని తెలిసింది. వర్మా.. ఇదేం ఖర్మ! పిఠాపురం టీడీపీలో తిరుగులేని నాయకుడిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే, ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు తొలిసారి పెద్ద షాక్ తగిలింది. ఆయన వ్యవహార శైలితో విసుగెత్తిపోయిన వారందరూ ఒక్కటై జగ్గంపేటలో చంద్రబాబును కలిసి అసంతృప్తి గళం వినిపించారు. ఇక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది. జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, దుడ్డు నాగు, కుంపట్ల సత్యనారాయణ తదితరులు వర్మతో విభేదిస్తున్నారు. ఈ వర్గానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. వర్మ అసంతృప్తి వాదులు బాబును కలవడానికి నవీన్ ఆశీస్సులు లేకపోలేదని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరొచ్చినా నవీన్ కలుపుతారని ఆ వర్గం సమర్థించుకుంటోంది. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న పిఠాపురం నుంచి ఆ సామాజికవర్గ నేతలు నవీన్‌ను ప్రతిపాదిస్తున్నారు. అందుకే 40 కార్లలో వెళ్లి, వర్మకు సీటిస్తే పని చేసేది లేదని ఆయన వ్యతిరేకులు తమ అధినేతకు తెగేసి చెప్పారు. వర్మ సీటుకు ఎసరు పెట్టేందుకు చర్యలు మొదలయ్యాయని వినికిడి. మాజీ ఎమ్మెల్యే వర్మకు వ్యతిరేకంగా గళం విప్పిన తమ్ముళ్లు ప్రత్తిపాడులో రోడ్డెక్కిన నిరసన టీడీపీ ప్రత్తిపాడు ఇన్చార్జి వరుపుల రాజాకూ నిరసన సెగ తాకింది. రాజాను తప్పించాలంటూ ఆ పార్టీ నేతలు ఏలేశ్వరం మెయిన్ రోడ్డులో ఎనీ్టఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించే వరకూ వెళ్లారు. బీసీ నేత పైల సుభాష్ చంద్రబోస్‌కు టిక్కెట్టు ఇవ్వాలంటూ ఏపూరి శ్రీను, రొంగల సూర్యారావు తదితరులు రచ్చ చేశారు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అంతా సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూయేనని రాజా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతుల మద్దతు లేకుండా బోస్ అంతటి సాహసం చేయలేరని అంటున్నారు. గత ఎన్నికల్లో నెహ్రూ తనయుడు, పార్టీ ప్రస్తుత కాకినాడ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కు ఎంపీ సీటు రాకుండా రాజా అడ్డు పడ్డారనే చర్చ పార్టీలో ఉంది. పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ద్వారా మంత్రాంగం నడిపినందువల్లనే ఇప్పుడు బోస్ ద్వారా రాజాపై తాజాగా ప్రతీకారం తీర్చుకున్నారని తెలుస్తోంది. బోస్‌కు ప్రమాదం జరిగితే జ్యోతుల పరామర్శకు రావడం, జగ్గంపేటలో నవీన్ పాదయాత్రకు బోస్ తరచూ వెళ్లి మద్దతు తెలపడం వీరి అవగాహనను చాటుతున్నాయి. రాజప్పా.. మాకొద్దప్పా.. కాకినాడ జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప. చంద్రబాబు పక్కన ఉండగానే ఈయనకు పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తాకింది. రోడ్‌షో వేట్లపాలెం వెళ్లేసరికి మాజీ ఎమ్మె ల్యే దివంగత బొడ్డు భాస్కరరామారావు వర్గీయులు ‘టీడీపీ ముద్దు – చినరాజప్ప వద్దు’ అంటూ నిరసనకు దిగారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి తిరుగులేని నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన భాస్కర రామారావు స్థానే చినరాజప్ప రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. మూడోసారి చినరాజప్పను ఎమ్మెల్యేను చేయాలని గురువారం రాత్రి పెద్దాపురంలో బాబు ప్రకటించారు. చదవండి: టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే.. దీంతో ఆశవహుల్లో అసంతృప్తి రాజుకుంది. పెద్దాపురం టిక్కెట్టు రేసులో చినరాజప్ప కాకుండా బొడ్డు సామాజికవర్గం నుంచి వెంకట రమణ, గుణ్ణం చంద్రమౌళి ఉన్నారు.æ చంద్రబాబు ప్రకటన ఆ వర్గీయుల్లో అసంతృప్తి రాజేసింది. వేట్లపాలెంలో తన కళ్లెదుటే చోటు చేసుకున్న ఈ పరిణామంతో అవాక్కైన చంద్రబాబు.. ఇది పద్ధతి కాదు అంటూనే దివంగత భాస్కర రామారావు సేవలను కొనియాడుతూ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా ‘రాజప్పా గోబ్యాక్’ అంటూ వ్యతిరేకులు నినాదాలు చేశారు. మొత్తంమీద చంద్రబాబు మూడు రోజుల పర్యటనతో నియోజకవర్గ ఇన్చార్జిలు కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారయ్యారు. -
షాకింగ్ ఘటన.. స్నేహితుడి భార్యను కాపాడబోయి..
నిడదవోలు రూరల్(తూర్పుగోదావరి జిల్లా): క్షణికావేశంలో కాలువలోకి దూకిన స్నేహితుడి భార్యను కాపాడబోయి ప్రమాదవశాత్తూ యువకుడు మృతిచెందినట్లు పట్టణ ఎస్సై పి.నాగరాజు గురువారం తెలిపారు. నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కాపకాయల నరేంద్రకుమార్ (31) గతంలో ఒక ప్రైవేట్ సెల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తున్నాడు. నరేంద్రకుమార్ స్నేహితుడు కొవ్వూరుకు చెందిన జావిద్ బాషా(చోటు)కు అతని భార్య దేవికి మనస్పర్థలు వచ్చాయి. దీంతో నరేంద్రకుమార్ భార్యాభర్తలను ఈ నెల 14వ తేదీన శెట్టిపేట తీసుకువచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా గొడవలు పెరగడంతో భార్య దేవి.. శెట్టిపేట పవర్‌ప్లాంట్ వద్ద బుధవారం తెల్లవారుజామున వంతెనపై నుంచి కాలువలోకి దూకేసింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో కాలువలోకి దిగిన నరేంద్రకుమార్ ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా నరేంద్రకుమార్ మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి నాగతులసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: వివాహితతో సహజీవనం.. అసలు విషయం తెలిసి షాకయిన మహిళ -
బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్ చేప
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: మండలంలోని ఏపీత్రయం శివారు బిక్కవోలు డ్రెయిన్‌లో గురువారం మధ్యాహ్నం డాల్ఫిన్ చేప స్థానికులకు చిక్కిందని తహసీల్దార్ టి.సుభాష్, జిల్లా ఫారెస్ట్ అధికారి ఐవీకే రాజు తెలిపారు. బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్ చేప కనిపించడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. అక్కడికి వెళ్లి స్థానికుల సహాయంతో ఏపీత్రయం వంతెన సమీపంలో డాల్ఫిన్ చేపను ఆ డ్రెయిన్‌లో విడిచిపెట్టామన్నారు. కొంతసేపటికి అది నీటిలో మునిగిపోయిందన్నారు. జాలర్లు వెదకగా అది చనిపోయినట్లు గుర్తించారు. డాల్ఫిన్ 150 కేజీల బరువు, 1.5 మీటర్ల పొడవు ఉందన్నారు. ఇది సముద్రంలో నుంచి ఇంద్రపాలెంలో గల ఉప్పుటేరు మీదుగా బిక్కవోలు డ్రెయిన్‌లోకి వచ్చి ఉంటుందని తెలిపారు. నిబంధనల ప్రకారం డాల్ఫిన్‌కు శుక్రవారం పోస్టుమార్టం చేస్తారన్నారు. గ్రామంలోని ఏటిగట్టు వద్ద ఉన్న డాల్ఫిన్‌ను చూడటానికి జనం ఎగబడ్డారు. వీఆర్వో జి.అంచిబాబు, ఫారెస్ట్ అధికారులు సిద్ధార్థ, ఉపేంద్రరెడ్డి, వసంతకుమారి పాల్గొన్నారు. చదవండి: రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగింది? -
Viral Wedding Card: వి‘వాహ్’ శుభలేఖ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్
రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖ అచ్చు వేయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఏడిద వెంకటేష్. తన చిన్న కుమార్తె పెళ్లికి పరిమాణంలో.. రూపంలో అచ్చం రెండు వేల రూపాయల నోటును పోలినట్లుంది పెళ్లి కార్డు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అక్షరాలుండే చోట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్ అనే పదముంది. ‘మేము ఇరువురం వివాహం చేసుకుంటున్నాం.. జీవితపు చివరి శ్వాసవరకూ కలసి ఉంటామని వాగ్దానం చేస్తున్నాం’ అని సింపుల్‌గా సారాంశం ఉంది. నోటుకు మరోవైపు పెళ్లి వివరాలు ముద్రించారు. కొందరికి శుభలేఖ చేతిలో పెడుతుంటే నిజంగా రెండు వేల నోటు అనుకుని నోటు తీసుకునేందుకు మొహమాటపడ్డారు. శుభలేఖేనని తెలుసుకుని వారి సృజనశైలిని మెచ్చుకున్నారు. కాగా, 2017లో వెంకటేష్ తన పెద్ద కుమార్తె పెళ్లికి ఆహ్వాన పత్రికను బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో ముద్రించి ఆకట్టుకున్నారు. తక్కువ ఖర్చు, సృజనాత్మకత కోసమే తాను ఇలా చేశానని వెంకటేష్ ‘సాక్షి’కి తెలిపారు. – రాజమహేంద్రవరం సిటీ -
పవన్‌కు బాబు పేరు తప్ప ఏదీ గుర్తుండదేమో!
సాక్షి, తూర్పుగోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వరుసగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదనే విషయాన్ని పవన్ కల్యాణ్ ముందే ఒప్పేసుకున్నాడంటూ కామెంట్ చేశారాయన. ‘‘ఐటీ శాఖ మంత్రి పేరు నీకు తెలియదు. కనీసం భార్యల పేర్లైనా గుర్తున్నాయా?.. గుర్తుపెట్టుకోవాలి కదా!. బహుశా ప్యాకేజీ ఇచ్చిన చంద్రబాబు పేరు మినహా ఎవరి పేరు నీకు గుర్తుండదేమో?’’ అంటూ పవన్‌పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ. ‘కాపుల కులాన్నంతా మూట కట్టి తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేద్దామనే ఆలోచన ఏమో నీది. వైఎస్ఆర్సీపీ తప్ప బీజేపీ , సీపీఐ, సీపీఎం , బీఎస్పీ తో పాటు అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నావ్. ఈసారి నీ బెండు తీయడం ఖాయం. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసేసుకో.. ఇవ్వాల్సిన అందరికీ భరణాలు ఇచ్చేసేయ్’ అంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. ముత్తైదువులను పక్కన కూర్చోబెట్టుకుంటావు అందులోకి ఒక వెన్నుపోటు దారుడు ఉంటాడు అంటూ పరోక్షంగా బాబుపై సెటైర్ సంధించారు. పవన్ కల్యాణ్ ను రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల పేర్లు చెప్పమనండి. నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను అని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అద్భుతమైన ప్రజా మోద కార్యక్రమాల వల్ల 2024లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. అంతకు పవన్ తీరును ఎండగడుతూ ట్విటర్లో మంత్రి గుడివాడ ట్వీట్లు చేశారు. "నాకు తెలిసింది పోరాటమే.. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే.." క్యా బాత్ హై ..! @PawanKalyan — Gudivada Amarnath (@gudivadaamar) January 12, 2023 అమ్మను తిట్టారని ఏడ్చి, అలగా జనం అన్నారని ఏడ్చి ఆఖరికి వాళ్ల పల్లకినే మోస్తూన్న పవన్ కళ్యాణ్ ని బానిస అనక బాహుబలి అంటారా? #PackageStarPK — Gudivada Amarnath (@gudivadaamar) January 12, 2023 -
పక్క పక్క పోర్షన్లు.. అత్తపై అల్లుడి దాడి.. కారణం ఏమిటంటే?
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): భార్యాభర్తల గొడవ నేపథ్యంలో అడ్డువెళ్లిన అత్తను ఊచతో అల్లుడు దాడిచేసి గాయపరిచిన సంఘటన నారాయణపురంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపురానికి చెందిన నరుకుర్తి కాంతం, కుమార్తె దుర్గావేణి, అల్లుడు నారాయణ ఒకే ఇంటిలో పక్క పక్క పోర్షన్లలో నివసిస్తున్నారు. అయితే శనివారం నారాయణ, దుర్గావేణి గొడవ పడుతుండగా పక్కనే ఉన్న కాంతం వారి మధ్యకు వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు నారాయణ.. కాంతంపై ఇనుపఊచతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె పొట్టపై గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాంతం ఫిర్యాదు మేరకు ప్రకాశం నగర్ ఎస్సై ప్రేమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వివాహితతో సహజీవనం.. కుమార్తెలపై కన్నేసి.. -
తెలుగు పాటకు వెస్ట్రన్ జోడించే రామ్మిరియాలా.. చౌరస్తా బ్యాండ్ కథ ఇదే!
గొంతు విప్పితే డీజే తలొంచాల్సిందే. యువతను ఉర్రూతలూగిస్తున్న గాత్రం. గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడిగా రాణిస్తున్న కోలంక ..యువకుడు రామ్ మిరియాల. పిఠాపురం: ఆయన పాడితే అది పక్కా లక్ష్మీపటాస్ బాంబ్లా పేలుతుంది. గళం విప్పితే డీజేను మించి రీసౌండ్ వస్తుంది. పల్లె నుంచి పట్నం వరకూ అందరూ మెచ్చే పాట అతనిది. చౌరస్తాలో గట్టిగా కేక వేస్తే జనం గుమ్మిగూడాల్సిందే. ఒక్కసారి ఆయన పాట వింటే ఫిదా అవ్వాల్సిందే. ఆయనే వర్ధమాన సింగర్ రామ్ మిరియాల. చిట్టి నీ నవ్వంటే.. అని గొంతు విప్పితే అందరూ కోరస్ పాడారు. మాయా.. అంటూ పాడితే పాటల అభిమానులు ఆయన మాయలో పడిపోయారు. డీజే టిల్లు... అని రాగం అందుకుంటే తీన్మార్ స్టెప్లు వేశారు. బీమ్లా నాయక్ వంటి టైటిల్ సాంగ్‌తో కుర్రకారును ఒక ఊపు ఊపేశాడు. తెలుగు పాటకు వెస్ట్రన్ జోడించే తీరును చూసి మంత్రముగ్దులయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కోలంకలో రైతు కుటుంబంలో పుట్టిన రామ్ ఇంటర్ వరకు పిఠాపురంలో చదివారు. బీకాం హైదరాబాద్‌లో చదివారు. సొంత ఊరిలో వేరే పేర్లతో పిలిచినా సినిమా రంగానికి రామ్ మిరియాలగానే పరిచయమయ్యారు. చదువు పూర్తయ్యాక ఒక కార్పొరేట్ కంపెనీలో ట్యాక్స్ కన్సల్లెంట్గా చేరారు. పాటే ప్రాణమైన రామ్ తర్వాత తన అభిరుచికి తగ్గట్టుగా రేడియో మిర్చిలో ప్రోమో ప్రొడ్యూసర్‌గా చేరారు. స్నేహితులతో కలిసి చౌరస్తా బ్యాండ్‌ను ప్రారంభించారు. రెండు యాసల్లో సునాయాసంగా.. ఇది యువతను ఉర్రూతలూగించింది. యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌ను సంపాదించి పెట్టింది. అందరితో స్టెప్పులేయించింది. అనతి కాలంలోనే రామ్ మంచి సింగర్‌గా రాణించారు. ప్రస్తుతం పెద్ద పెద్ద బ్యానర్ సినిమాల్లో పాటలు పాడే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఫ్లూట్ వాయించడంలో ఈయనకు మంచి ప్రావీణ్యముంది. ఎవరైనా తమది కాని యాసలో మాట్లాడాలన్నా.. పాట పాడాలన్నా కష్ట పడాలి. రామ్ మాత్రం ఆంధ్ర, తెలంగాణ మాండలికాల్లో సునాయాసంగా పాటలు పాడుతున్నారు. హైదరాబాద్ వెళ్లి సుమారు 20 ఏళ్లు ఉండడంతో పాటు అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఎక్కువ కాలం ఉండటంతో రెండు యాసల్లోనూ పాటలు పాడడం కొంత సులభమైందంటారు రామ్. చిట్టి నీనవ్వంటే. సాంబశివా నీదు మహిమ, సిలకా ఎగిపోయావా అంటూ ఈ మూడు పాటలు పాడింది ఆయనే. కానీ మూడు పాటల్లో మూడు వేర్వేరు గొంతులు వినిపించినట్టుంటాయి. పాటకు తగ్గట్టుగా గొంతును ట్యూన్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ప్రతీ పాట ఆణిముత్యామే.. ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా.. కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా’ అంటూ రామ్ కరోనా సమయంలో పాడిన పాట జనం గుండెలను హత్తుకుంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం, మారేడుమిల్లి మీదుగా కోలంక వస్తూ మార్గంలో ఎదురయ్యే పరిస్థితులను ‘ఊరెళ్లి పాతా మామా.. ఊరెళ్లి పోతా.. ఎర్ర బస్సెక్కి మళ్లీ తిరిగెళ్లిపోతా’ అంటూ పాటగా మలిచారు. ‘చూపుకేమో శ్రీదేవి.. వగలుపోయే వయ్యారి.. భాషలన్నీ ఇడిసేసి.. నన్ను ఒగ్గేసిపోనాది’ అంటూ ఓ ప్రేమికుడి వ్యధను గొంతులో పలికించి కేరీర్లో తొలి పాటకు శ్రీకారం చుట్టారు. గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ వంటి వారు రాసిన పాటలు పాడి మైమరిపింపజేశారు. పేరొందిన సింగర్లతో కలిసి పాడే అవకాశాలను దక్కించుకుంటున్నారు. సంగీతమంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి సంగీతంపై మమకారం. ఈ ఉత్సాహంతోనే ప్త్రెవేటు సాంగ్స్పాడాను. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి హీరోల సినిమాలకు పాటలు పాడాను. డీజే టిల్లు–2 సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాను. సినిమా పాటల అవకాశాలు పెరుగుతున్నాయి. ఎవరు ఏ రంగంలో ఏది సాధించాలన్నా ముందు పట్టుదల ఉండాల్సిందే. అందరి సహకారంతో ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో నిలదొక్కుకుంటున్నా . ‘ఊరెళ్లి పాతా మామ..పాట నాకు చాలా ఇష్టం. మనసు పెట్టి రాశాను. చాలా మంచి గుర్తింపు తెచ్చింది. – రామ్ మిరియాల, సంగీత దర్శకుడు, సింగర్ -
కనికరించిన పింఛన్!
పెరవలి: ఆమె పేరు దోనెల కృష్ణవేణి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లి. 35 ఏళ్ల వయసున్న ఆమె పుట్టుకతో దివ్యాంగురాలు(మూగ,చెవుడు). అవివాహితురాలైన ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. పేద కుటుంబం. తండ్రి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృష్ణవేణికి వికలాంగ పింఛన్ కోసం ఏళ్ల తరబడి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలో వైకల్యం 30 శాతమేనంటూ తిరస్కరించారు. జన్మభూమి కమిటీలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు ఇక ప్రయత్నాలు మానుకున్నారు. అయితే వీరి విషయం తెలుసుకున్న పెరవలి ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్ చొరవ తీసుకుని ఎంపీడీవో రమేష్‌కు చెప్పి కృష్ణవేణి వికలాంగ పింఛన్ దరఖాస్తును ఆన్లైన్ చేయించారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్నాయుడి దృష్టికి కూడా ఈ విషయాన్ని ఎంపీపీ తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఈ దరఖాస్తును తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత దృష్టికి తీసుకెళ్లి పింఛన్ మంజూరు చేయించారు. బుధవారం ఖండవల్లిలో నిర్వహించిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తల్లి లక్ష్మీపార్వతితో కలసి కృష్ణవేణి పింఛన్ అందుకుంది. ఆ సమయంలో తల్లీ కూతుళ్ల ముఖాల్లో చెప్పలేని ఆనందం తొణికిసలాడింది. సభలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ‘ఈ రాష్ట్రానికి జగనే సీఎంగా ఉండాలి.. అప్పుడే మాలాంటోళ్లకి మేలు జరుగుతుంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. -
నూతన వధువరుల వినూత్న ఆలోచన.. కుటుంబాలను ఒప్పించి..
నిడదవోలు(తూర్పుగోదావరి): పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తన పెళ్లి సందర్భంగా అవయవ దానంపై అందరి దృష్టి పడేలా చేసి అవగాహన కల్పించాలనుకున్నాడు. కాబోయే భార్యతో ఈ విషయం పంచుకున్నాడు. ఆమె సరే అంది. ఇంకేముంది తమతోపాటు ఓ సామాజిక బాధ్యతకూ పెళ్లిరోజున పెద్దపీట వేసేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు. ఇరువురూ పెద్దలు ముందుకు రావడంతో 60 మంది అవయవదాన హామీ పత్రాలను ఇచ్చే ఘట్టానికి నిడదవోలులో వివాహ వేడుక వేదిక కానుంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన సతీశ్‌కుమార్ చిన్నప్పటి నుంచి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. దొమ్మేరు గ్రామానికి చెందిన యువతి సజీవ రాణితో ఇటీవల ఇతనికి పెళ్లి కుదిరింది. వివాహం రోజున సతీశ్ కుమార్ తనతో పాటు బంధువులు, స్నేహితులు కలసి ఇచ్చే అవయవ దాన హమీ పత్రాలే తన వివాహానికి పెద్ద బహుమానమని చెప్పాడు. వారంతా ఇందుకు అంగీకరించారు. కాబోయే జీవిత భాగస్వామి కూడా సతీష్ ఆలోచనను మెచ్చుకుంది. తాను కూడా అవయవదాన హామీ పత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. నిడదవోలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్యాణ మండపంలో గురువారం ఈ నవ దంపతుల వివాహ వేడుక జరుగుతుంది. 60 మంది అవయవదాన హామీ పత్రాలు ఇవ్వడానికి ముందుకు రావడంపై సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ గూడూరు సీతామహలక్ష్మి (విశాఖపట్నం) సంతోషం వ్యక్తం చేశారు. ఆమె స్వయంగా పెళ్లికి హాజరై అవయవదాన హామీ పత్రాలు స్వీకరించనున్నారు. పెళ్లి పత్రికలో అవయవదానం చేయండి–ప్రాణదాతలు కండి అని ముద్రించడం అందరినీ ఆలోచింపజేసింది. అవయవదాన ఆవశ్యకతను విస్త్రతంగా ప్రచారం చేస్తున్న కొత్త దంపతులను పలువురు అభినందిస్తున్నారు. చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే.. ఓ బాలుడి మరణం కదిలించింది వేలివెన్నులో పదేళ్ల బాలుడు కిడ్నీ పనిచేయక చనిపోయాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స దశలో బాధిత బాలుడికి కిడ్ని దానం చేయడానకి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాలుడు చనిపోయాడు. ఈ విషయం తెలిసి చాలా బాధ పడ్డాను. అప్పటి నుంచి అవయవదానం అవసరాన్ని గ్రహించాను. చేతనైన మేర దీనిపై ప్రచారం చేస్తున్నాను. నాపెళ్లి శుభలేఖలో కూడా ఇదే అంశాన్ని నినాదంగా ప్రచురించాను. కాబోయే భార్య సజీవరాణికి చెప్పగానే పెద్ద మనసుతో అంగీకరించింది. ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు నా స్నేహితులు 60 మంది అవయవదాన హామీపత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. – సతీశ్‌కుమార్, వేలివెన్ను, ఉండ్రాజవరం మండలం ఆయన ఆలోచన నచ్చింది నిశ్చితార్థానికి ముందు సతీశ్‌కుమార్ అవయవదానం గురించి చెప్పారు. ఇంత మంచి సేవా కార్యక్రమానికి వివాహం వేదిక కావడం సంతోషం అనిపించింది. అవయవదానంపై మా కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు. వారంతా అవయవదానానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో అవయవదానంపై ఇద్దరం కలిసి ప్రచారం చేస్తాం. – సజీవరాణి, దొమ్మేరు, కొవ్వూరు మండలం -
రిపోర్ట్‌లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..
నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా): అగ్నిసాక్షిగా పెళ్లాడి, తోడునీడగా నిలుస్తానంటూ ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడిగా మారాడు. భార్యను హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోస్టుమార్టం నివేదికలో అసలు గుట్టు తేలడంతో.. తొలుత అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిని హత్యగా మార్చారు. నల్లజర్ల సీఐ లక్ష్మణరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లజర్లకు చెందిన బుసనబోయిన నాగేశ్వరావు, లక్ష్మి దంపతుల కుమార్తె తేజశ్రీకి చిన్నాయగూడేనికి చెందిన సంకుల రాంబాబుతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 13 నెలల పాప నందినీ సాయిదుర్గ ఉంది. ఏ పనికీ వెళ్లకపోవడంతో రాంబాబును అత్తింటివారు నల్లజర్ల తీసుకువచ్చి ఆటోమొబైల్ షాపులో గుమస్తాగా పెట్టారు. ఇటీవల దురలవాట్లకు బానిసైన రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్య తేజశ్రీని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. దీనికితోడు తేజశ్రీకి శరీరంపై ఎలర్జీ రావడంతో డాక్టర్ వద్దకు తీసుకువెళ్లకుండా సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఒక రోజు పురుగు మందు తీసుకువచ్చి తాగుతావా లేదా అంటూ ఒత్తిడి చేశాడు. ఈ నెల 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తేజశ్రీని రాంబాబు దవడపై కొట్టాడు. దీంతో సొమ్మసిల్లి పడిపోయిన భార్యను గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఏమీ తెలియనట్టు ఆమే ఫ్యానుకు ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించాడు. అప్పట్లోనే కుటుంబ సభ్యులు అతడిని అనుమానించారు. తేజశ్రీ మృతిపై పోలీసులు అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసు విచారణలో రాంబాబే తన భార్యను గొంతు నులిమి హత్య చేసినట్టు వెల్లడైంది. దీంతో రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: అన్నా చెల్లెళ్ల ముసుగులో సహజీవనం.. ఫ్లాట్ అద్దెకు తీసుకుని.. చివరికి.. -
ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. మియాపూర్‌లో కాపురం.. చివరికి భర్త షాకింగ్ ట్విస్ట్
నల్లజర్ల(తూర్పుగోదావరి): కాపురానికి తీసుకెళ్లాలని ఓ మహిళ తన భర్త ఇంటి ముందు గురువారం ఆందోళనకు దిగింది. పెద్దల సమక్షంలో ఈ నెల 19 వరకు భర్త తండ్రి గడువు కోరడంతో తన నిరసనను విరమించింది. వివరాలిలా ఉన్నాయి. నల్లజర్ల మండలం చీపురుగూడెంకు చెందిన వసంతాడ అనిల్‌కుమార్, అశ్వారావుపేట మండలం నారాయణపురానికి చెందిన తమ్మిలేటి నాగరాణి నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలసి చదువుకున్నారు. నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. చదువు పూర్తయ్యాక సికింద్రాబాద్ ఆర్య సమాజంలో గతేడాది డిసెంబర్ 17న వివాహం చేసుకున్నారు. ఐదునెలలు మియాపూర్‌లో కాపురం చేశారు. అతనికి చెన్నైలో ఉద్యోగం వచ్చింది. దీంతో అతను చైన్నైకు మకాం మార్చాడు. ఆరుమాసాలుగా మొహం చాటేస్తూ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అప్పట్లో నాగరాణి హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. త్వరలో వచ్చి నాగరాణిని తీసుకెళతానని అనిల్ లిఖిత పూర్వక హామీ ఇచ్చాడు. అయినా తీసుకెళ్లలేదు. దీంతో గత నెల 10వ తేదీన అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌లో నాగరాణి ఫిర్యాదు చేసింది. కొంతగడువు కావాలని కోరడంతో పోలీసులు నచ్చజెప్పారు. అయినా అనిల్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మహిళా సంఘ నాయకులతో నాగరాణి గురువారం సాయంత్రం చీపురుగూడెంలో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. గ్రామసర్పంచ్ గాలింకి రాంబాబు, పెద్దలు జాలిది రవి, కొరపాటి గంగరాజుల సమక్షంలో ఇరువర్గాలతో మాట్లాడారు. ప్రస్తుతం అనిల్‌కుమార్ చెన్నైలో ఉన్న దృష్ట్యా అతనిని స్వగ్రామానికి రప్పిస్తామని ఈ నెల 19 వరకు గడువు కావాలని తండ్రి వసంతాడ వెంకటేశ్వరావు కోరడంతో పెద్దలు నాగరాణికి లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. ఆమె తరఫున రాష్ట్ర గిరిజన మహిళా సంఘ నాయకురాలు మడకం లక్ష్మి, బి.రమాదేవి, బి.సరస్వతి, దాసరి రేవతితో పాటు పోలవరం నియోజకవర్గం నుంచి మరో 20 మంది మహిళా నాయకులు పాల్గొన్నారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఎంత పనిచేశాడంటే? -
తప్పిపోయిన పిల్లి దొరికింది
తూర్పు గోదావరి: తమ బిడ్డలో పెద్దలో తప్పిపోతే వారి గురించి వెతకడం అందరికీ తెలిసిందే. అలాగే కుక్కలు, ఆవులు, గేదెల వంటివి తప్పిపోయినా వాటి కోసం యజమానులు గాలిస్తారు. ఇదే కోవలో ఓ పెంపుడు పిల్లి తప్పిపోవడం.. దాని యజమానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ వివరాలివీ.. మలికిపురానికి చెందిన వ్యాపారి జాన భగవాన్ పెంపుడు పిల్లి శుక్రవారం తప్పిపోయింది. పర్షియన్ జాతికి చెందిన ఈ పిల్లిని ఆయన హైదరాబాద్‌లో రూ.50 వేలకు కొనుగోలు చేసి పెంచుతున్నారు. శుక్రవారం ఇంటి తలుపులు తీసి ఉండడంతో అది బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. దీంతో ఆయన తన పెంపుడు పిల్లి తప్పిపోయినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. గ్రామానికి చెందిన కొంతమంది అది చూసి.. ఆ పిల్లిని కుక్కలు దాడి చేస్తుండగా రక్షించామని.. ఎవరిదో తెలియక రాజమహేంద్రవరం పంపే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. దీంతో వారి వద్దకు భగవాన్ శనివారం వెళ్లి తన పిల్లిని తెచ్చుకున్నారు. -
Chandrababu Naidu: ఇదేం ఖర్మరా 'బాబూ'
సాక్షి, కాకినాడ: స్వపక్ష నేతల మధ్య వైషమ్యాలను చక్కదిద్ద లేక చేతులెత్తేసిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటూ బయలుదేరడం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై బురదజల్లే ఎత్తుగడతో తలపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం ప్రజా స్పందన లేక అభాసుపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నాయకుడు ‘రాష్ట్రానికి ఇదేమి ఖర్మ’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ నినాదంతో గురువారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నారు. కొత్త నినాదం మాట దేవుడెరుగు.. కనీసం ఆయన పర్యటించే నియోజకవర్గాల పరిధిలోనైనా పార్టీ అంతర్యుద్ధాలను చక్కదిద్దారా అంటే అదీలేదు. ప్రజల నుంచి స్పందన లేక టీడీపీ అధినేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చాన్నాళ్లుగా ముఖం చాటేశారు. తెలుగు తమ్ముళ్లు వర్గాల బాట పట్టిన చోటే ఆయన తన పర్యటనకు శ్రీకారం చుట్టడంపై పార్టీ వర్గాలూ విస్తుపోతున్నాయి. పర్యటన సాగే కొవ్వూరు, నిడదవోలుతో పాటు పొరుగున ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో తమ్ముళ్ల తగువులతో పార్టీ ఇప్పటికే మూడు ముక్కలైంది. సొంత సామాజికవర్గ నేతలు మాటలు ఆధారంగా ఏకపక్షంగా ఇన్చార్జిలను మార్చేయడం ఈ వివాదాలకు ఆజ్యం పోసింది. గోపాలపురం– కయ్యాలకాపురం గోపాలపురంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ముప్పిడి వెంకటేశ్వరరావును ఉన్నపళంగా ఇన్చార్జి నుంచి తొలగించాలరని ఎస్సీ సామాజికవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ ఇన్చార్జిగా మద్దిపాటి వెంకట్రాజును చంద్రబాబు నియమించారు. దీనిపై ముప్పిడి వర్గం బాబును కలిసింది. కారణం చెప్పాలంటూ నిలదీసింది. వచ్చే ఎన్నికల్లో మద్దిపాటే పోటీచేస్తారని ఆయన ప్రకటించారు. పర్యవసానంగా విభేదాల అగ్గి మరింత రాజుకుంది. వీరిద్దరూ తలోదారి పట్టినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఈ వైరుధ్యాల మధ్య జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాజీ ఎమ్మెల్యే ముప్పిడికి మద్ధతుగా నిలవడం చర్చనీయాంశమైంది. సంజాయిషీ కూడా అడకుండా కరివేపాకులా తీసిపడేసినందుకు సరైన సమయంలో సరైన రీతిలో స్పందించేందుకు ముప్పిడి వర్గం గుట్టుగా పావులు కదుపుతోంది. నిడదవోలులో తలోదారి వైఎస్సార్సీపీ రాకతో అడ్రస్ గల్లంతైన నిడదవోలుకు చంద్రబాబు రానున్నారు. గత ఎన్నికల్లో 21వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు ఇక్కడ బాధ్య తలు అప్పగించవద్దంటూ ఆవిర్భావం నుంచి పార్టీ నేతలు మొత్తుకున్నారు. ఓటమి తరువాత బూరుగుపల్లి పార్టీని చాప చుట్టేసి కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఆయన రావడాన్ని పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. మూడేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ హడావిడి చేయడం ద్వితీయ శ్రేణికి రుచించడం లేదు. మున్సిపాలిటీలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోయింది. గత ఎన్నికల్లో చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డ కుందూరు సత్యనారాయణ శేషారావుకు వ్యతిరేకంగా ఒక గ్రూపుతో టిక్కెట్టు కోసం పావులు కదుపుతున్నారు. పార్టీ ద్వితీయ శ్రేణిలో మెజార్టీ నేతలు టిక్కెట్టు తెచ్చుకుంటే పనిచేస్తామని తెరవెనుక శేషారావుకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఈ రెండు గ్రూపుల పంచాయతీ గురువారం చంద్రబాబు వద్దకు వెళ్లేలా ఉంది. కొవ్వూరు.. విభేదాల జోరు ఎస్సీలకు రిజర్వు అయిన కొవ్వూరులో గత ఎన్నికల్లో టీడీపీ ఘెరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతోంది. చంద్రబాబు గురువారం తన కార్యక్రమాన్ని కొవ్వూరు నుంచే శ్రీకారం చుడుతున్నారు. ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిని కూడా నియమించుకోలేని దీనావస్థ ఉంది. కొవ్వూరులో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి తమను అవమానానికి గురిచేశారని ఎస్సీ సామాజికవర్గీయులు గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వంగలపూడి అనిత పత్తా లేకుండా పోయారు. 2014లో గెలిచి మంత్రి అయిన కేఎస్ జవహర్‌ను గత ఎన్నికల్లో పక్కనపెట్టారు. జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా కొవ్వూరు పార్టీ వ్యవహారాలకు ఆయన్ను దూరం పెట్టారు. పెండ్యాల అచ్చిబాబు ఆధిపత్యం తగ్గకూడదనే దోరణిలో చంద్రబాబు ఉన్నారంటూ ద్వితీయశ్రేణి గర్హిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ‘ఇదేం ఖర్మరా.. బాబు’ అంటూ పార్టీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నాయి. బూత్ కమిటీలు వేసే పరిస్థితే లేదు చంద్రబాబు ఏలూరులో ప్రవేశించగానే ప్రజలందరూ ఇదే ఖర్మరా బాబు అని అనుకుంటున్నారు. బూత్ కమిటీలు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి ఆ పార్టీ క్యాడర్ దూరంగా ఉంది. జగన్ పాలనలో ప్రజలందరూ సంక్షేమ పథకాలు అందుకుని ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి ఏంచెప్పి మభ్య పెడతారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోవడానికి జనాలు సిద్ధంగా లేరు. – రాజమహేంద్రవరంలో మీడియాతో మంత్రి రోజా -
ఆ రైళ్లను ఆపండి.. రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఎంపీ భరత్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పలు ప్రధానమైన రైళ్లు హాల్టులు, స్టాప్లకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈవో వీకే త్రిపాఠిని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోలను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి నగర ప్రాధాన్యత, సుదూర ప్రాంతాల నుండి నిత్యం ఇక్కడకు వచ్చే వ్యాపార, వాణిజ్య, యాత్రికులకు కావలసిన రైళ్లు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని ఎంపీ భరత్ త్రిపాఠికి తెలిపారు. హౌరా టు శ్రీ సత్య సాయి నిలయం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం టు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం - పూణే ఎక్స్‌ప్రెస్, చెన్నై-జాల్పిగురి సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కామాక్య యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి హెచ్ డబ్ల్యూ హెచ్ ఎక్స్‌ప్రెస్‌లు హాల్ట్స్, స్టాప్స్‌కు అనుమతి కోరారు. విమానాశ్రయం, ఓఎన్జీ బేస్ కాంప్లెక్స్, ఏపీ పేపర్ మిల్స్, జీఎస్కే హార్లిక్స్, మూడు గ్యాస్ పవర్ ప్రాజెక్ట్స్ తదితర అనేక పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కూడా రాజమండ్రికి చేరువలోనే ఉందన్నారు. విశాఖపట్నం- విజయవాడ నగరాలకు మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రంగా రాజమండ్రి నగరం అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. టూరిజం హబ్ గా శరవేగంగా రాజమండ్రి, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే యాత్రికులకు, టూరిస్టులకు, వ్యాపార, వాణిజ్య, వివిధ రంగాల వారికి అనువైన విధంగా రైళ్లు సదుపాయం లేకపోవడంతో చాలా కష్టంగా ఉంటోందని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠికి వివరించినట్టు ఎంపీ భరత్ తెలిపారు. అలాగే కొవ్వూరు రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లకు హాల్ట్స్, స్టాప్స్ ఆపివేశారని, వాటిని కూడా పునరుద్ధరించాలని త్రిపాఠిని కోరినట్లు ఎంపీ భరత్ తెలిపారు. బొకారో, సింహాద్రి, తిరుమల, తిరుపతి-పూరి, సర్కార్, కాకినాడ- తిరుపతి, మచిలీపట్నం- విశాఖ, రాయగడ-గుంటూరు, బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్ లను పునరుద్ధరించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. కొవ్వూరు, గోపాలపురం, తాళ్ళపూడి, పోలవరం మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలు కొవ్వూరు రైల్వే స్టేషను నుండి ప్రయాణం చేయాలని, అటువంటిది రైళ్ల హాల్ట్స్, స్టాప్స్ లేకపోవడంతో మరో 15 కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణించి రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు రావలసి వస్తోందన్నారు. నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించి, ఆరు నెలలు పరిశీలించాలని.. అప్పటికీ రైల్వే శాఖకు తగిన ఆదాయ వనరులు రాకుంటే మీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవచ్చని త్రిపాఠికి ఎంపీ భరత్ సూచించారు. అలాగే అనపర్తి, నిడదవోలులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి నుండి లోకల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కొనసాగించమని కోరినట్టు ఎంపీ భారత్ వివరించారు. తన అభ్యర్థనలపై రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠి సానుకూలంగా స్పందించారని ఎంపీ భరత్ తెలిపారు. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
సూపర్ స్టార్ కృష్ణ మేకప్ లేకుండా నటించిన చిత్రం ఏమిటో తెలుసా?
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం)/అమలాపురం టౌన్/ఆత్రేయపురం/అన్నవరం/కొత్తపేట/కరప: సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా ‘సాహసమే ఊపిరి’గా వెండి తెరపై ఎన్నో రికార్డులను నెలకొల్పిన తమ నటశేఖరుడు.. మా ‘మాయదారి మల్లిగాడు’ ఇక లేడనే విషయం తెలుసుకుని కంటతడిపెట్టారు. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, అద్భుత విజయాలు ఆవిష్కరించి.. సినీ ‘సింహాసనం’పై మహానటుడిగా వెలుగొందిన కృష్ణతో తమ ప్రాంతానికి.. తమకు ఉన్న అనుబంధాన్ని స్మరణకు తెచ్చుకున్నారు. నటశేఖరుడు తన సినీ ప్రస్థానం ఆరంభంలోనే జిల్లాతో అనుబంధం ఏర్పరుచుకున్నారు. గోదావరిని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రాజమహేంద్రవరం ముుద్దుబిడ్డ. ఈయన 1965లో నిర్మించిన ‘తేనె మనసులు’ చిత్రం ద్వారా కృష్ణ సినీతెరకు హీరోగా పరిచయమై.. అందరి మనస్సుల్లో చోటు సంపాదించారు. ఆ చిత్రంలో ఆయన సరసన నటించిన సుకన్య కూడా మన రాజమహేంద్రవరానికి చెందిన ఆరి్టస్టే. ఈ రకంగా ఆయన తొలి హిట్ వెనుక గోదావరి ప్రభావముంది. ‘సాక్షి’ ఓ టర్నింగ్ పాయింట్.. గోదావరి ప్రాంతానికి చెందిన బాపు తీసిన ‘సాక్షి’ చిత్రం కృష్ణ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఈ సినిమాలో కృష్ణ సినిమా పూర్తయ్యే వరకూ మేకప్ లేకుండానే నటించారు. మానవత్వం మీద నమ్మకం గల పల్లెటూరి అమాయకుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. విజయనిర్మలతో నటించిన తొలి చిత్రం కూడా ఇదే. ఈ చిత్ర నిర్మాణం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 20 రోజులకు పైగా సాగింది. తర్వాత వరుస విజయాలతో చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ దూసుకుపోయారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం షూటింగ్ రామచంద్రపురం పరిసరాల్లో ఎక్కువ కాలమే సాగిందని ఇక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, భోగిమంటలు, దొరగారికి స్వాగతం, నేనంటే నేనే వంటి తదితర చిత్రాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే షూటింగ్ జరిగాయి. స్వాతంత్ర వీరుడా...స్వరాజ్య బాలుడా..! అల్లూరి సీతారామరాజు సినిమా చిత్రీకరణ ఈ ప్రాంతంపై చెరగని ముద్ర వేసుకుంది. 1974లో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీతో పాటు అన్నవరం పరిసరాలను తొలిసారిగా తెరకెక్కించారు కృష్ణ. తెలుగు వీర లేవరా ’ పాటలోని ‘స్వాతంత్ర వీరుడా స్వరాజ్య బాలుడా! అనే చరణాన్ని సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో చిత్రీకరించారు. ఆ పాట కోసం రాజమహేంద్రవరం, కడియం నుంచి రెండు లారీల పూలు రత్నగిరికి తీసుకువచ్చి అల్లూరి సీతారామరాజు పాత్రధారి కృష్ణ మీద చల్లారు. 1980 నాయుడు గారి అబ్బాయి షూటింగ్ కూడా అన్నవరంలోనే జరిగింది. కృష్ణ, అంబిక మధ్య ఒక పాట సత్యదేవుని ఆలయ ప్రాంగణం, పంపా నది, మిస్సెమ్మ కొండ పరిసరాల్లో చిత్రీకరించారు. నాయుడు గారి అబ్బాయి సినిమా షూటింగ్ సమయంలో పలువురు దేవస్థానం ఉద్యోగులు కృష్ణతో ఫొటో దిగారు. కృష్ణ అంటే అభిమానమే వేరు అభిమానులను నటశేఖరుడు గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు. రామచంద్రాపురంలోని రాజు గారి కోటలో ఊరికి మొనగాడు సినిమా షూటింగ్ సమయంలో ఎక్కడెక్కడి నుంచో అభిమానులు వచ్చి పడిగాపులు కాసేవారు. మనసున్న కృష్ణ వారందరికి భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేవారు. భోజనం చేశాక వెళ్లాలని చెప్పేవారని నాటి తరం అభిమానులు చెబుతారు. ఈ సినిమా విజయవంతమైనప్పుడు తమకు వాచీలు బహూకరించారని అభిమాన సంఘం నాయకులు మననం చేసుకుంటున్నారు. గలగల పారుతున్న గోదారిలా 1974లో కోనసీమలో ‘గౌరి’ చిత్రం షూటింగ్ 30 శాతం పచ్చని సీమలోనే సాగింది. కృష్ణ, జమున ఈ చిత్రానికి హీరో హీరోయిన్లు. పి.గన్నవరం వద్ద వైనతీయ నదీ పాయపై హీరోయిన్ జమునకు కృష్ణ సైకిల్ నేర్పిస్తుండగా ఓ పాట చిత్రీకరించారు. ‘గల గల పారుతున్న గోదారిలా’ పాటను కూడా ఇక్కడి పరిసరాల్లోనే చిత్రీకరించారు. అప్పట్లో కృష్ణ కోనసీమలో దాదాపు 10 రోజుల బస చేశారు. డిగ్రీ విద్యారి్థగా 30 ఏళ్ల క్రితమే కృష్ణ చేతుల నుంచి వర్ధమాన కవిగా అవార్డు అందుకున్నానని అమలాపురానికి చెందిన కవి, రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కార గ్రహీత ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఆయనతో తనకున్న కొద్దిపాటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పులిదిండిలోనే దండిగా షూటింగ్ 1967లో కృష్ణ హీరోగా తీసిన ‘సాక్షి’ సినిమాను ఆత్రేయపురం మండలంలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. అవుట్ డోర్ షూటింగ్ పులిదిండిలో జరిగింది. ఈ సినిమా చిత్రీకరణకు ముందు కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ, దర్శకుడు బాపు సినిమాకు తమ ఊహలకు తగ్గ గ్రామం ఎంపిక చేయాలని తమ బాల్యమిత్రుడు బీవీఎస్ రామారావును కోరారు. ఆయన రాజమండ్రి వచ్చి ఇరిగేషన్ కాంట్రాక్టర్ కలిదిండి రామచంద్రరాజుకు సూచించారు. దీంతో బాపు, రమణల ఊహకు తగ్గట్టుగా పులిదిండిని ఎంపిక చేశారు. ఇక్కడే చాలా వరకు షూటింగ్ చేశారు. గ్రామంలోని మీసాల కృష్ణుడి ఆలయంలో కూడా చిత్రీకరించారు. ఎనలేని అభిమానం నాకు కృష్ణ అంటే ప్రాణం. జిల్లాలో ఎక్కడ షూటింగ్ జరుగుతోందని తెలిసినా వెళ్లిపోయేవాడిని. ఏటా మా గ్రామంలో ఆయన పుట్టిన రోజు వేడుక నిర్వహిస్తాను. మమ్మల్ని ఆప్యాయంగా పలకరించేవారు. పద్మాలయ స్టూడియోలో ఆయనను కలిసిన రోజు ఎప్పటికీ మరిచిపోను. కలిసిన ప్రతిసారీ అన్నవరం ప్రసాదం అందజేసేవాడిని. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. – సలాది కృష్ణ, అభిమాన సంఘ అధ్యక్షుడు, ప్రత్తిపాడు, కాకినాడ జిల్లా -
తమ్ముళ్లతో బాబు బంతాట.. ఇన్‌చార్జ్‌లకు పొగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా చంద్రబాబు తీరు ఉందని తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి, ఇప్పుడు నిందలు తమపై నెట్టేస్తున్నారని ఆ పార్టీ ముఖ్య నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఒకప్పటి కంచుకోటలు వైఎస్సార్సీపీ ముందు నిలవలేక కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గాల్లో టీడీపీ ఉనికి కోసం పాకులాడే దయనీయ స్థితికి చేరుకుంది. పార్టీ రహితంగా అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యానిఫెస్టోను 95 శాతం అమలు చేయడంతో ప్రధాన ప్రతిపక్షం విలవిలలాడుతోంది. దీంతో నానా యాతనా పడుతున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలకు అధినేత చంద్రబాబు నుంచి సరైన దన్ను లభించడం లేదు. ఓటమికి తప్పంతా తమదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం వీరికి ఇబ్బందిగా పరిణమించింది. కాకినాడలో కాక జిల్లాలోని పలు నియోజకవర్గ ఇన్చార్జిలకు పొగబెడుతున్నారని టీడీపీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల ఉన్న ఇన్‌చార్జిలనూ మార్చేస్తే మరికొన్నిచోట్ల నాథుడు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సగానికి సగం నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే టీడీపీ పరిస్థితి మరింత దిగజారిపోయిందనే నివేదికలు ఆ పారీ్టకి మింగుడుపడటం లేదు. జంట నియోజకవర్గాలైన కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌లో మూడు గ్రూపులు, ఆరు వర్గాలు అన్నట్టు పార్టీ ముక్కలైంది. నగరంలో పార్టీ వర్గాలుగా విడిపోవడానికి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటెద్దు పోకడలే కారణమని సుంకర వర్గం ఆరోపిస్తోంది. కొండబాబు, మాజీ మేయర్ సుంకర పావని వర్గాల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. కొండబాబుకు ఉద్వాసన పలికి, ఇన్చార్జిగా పావనిని నియమించారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడంతో వర్గపోరు ఇటీవల రచ్చకెక్కింది. కాకినాడ రూరల్ టీడీపీలోనూ రెండు వర్గాలు నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షి్మ, సత్తిబాబు దంపతుల నిర్వాకంతో పార్టీ ఖాళీ అయిపోయిందని వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. ఇదంతా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వర్గం చేస్తున్న దు్రష్పచారమని సత్తిబాబు వర్గం అంటోంది. చినరాజప్ప ప్రోద్బలంతో జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్, పెంకే శ్రీనివాసబాబా ఇన్చార్జి కోసం చేస్తున్న ప్రయత్నాలతో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి.\ ‘తూర్పు’లో కీచులాటలు రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై ఇటీవల చంద్రబాబు తలంటేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశావ్, అ«ధికారంలో ఉండగా అనుభవించి ఇప్పుడు గాలికొదిలేస్తావా?’ అని చీవాట్లు పెట్టిన విషయం ఆ పార్టీ అనుకూల మీడియాలోనే బహిర్గతమైంది. దీంతో పార్టీని పట్టించుకోని పెందుర్తిని పక్కన పెట్టాలనే వాదనను నేతలు తెరపైకి తీసుకువచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సిటీపై ఇప్పటికీ ఆశ తగ్గక పోవడంతో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో విభేదాలు కొనసాగుతున్నాయి. సిటీలో ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పార్టీ సీనియర్ గన్ని కృష్ణ మూడో వర్గం ఎలానూ ఉండనే ఉంది. గోపాలపురంలో ఇన్చార్జి మార్పు పెను ప్రకంపనలనే సృష్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి మద్దిపాటి వెంక్రటాజుకు బాధ్యతలు అప్పగించడంతో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. వెంకటేశ్వరరావుకు జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ముప్పిడి, వెంకట్రావుల మధ్య తాడేపల్లిగూడెంలో జరిగిన పార్టీ జిల్లా సమావేశంలో వైషమ్యాలు రచ్చకెక్కి చివరకు ఆ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. బాబు సైతం వెంకట్రాజుకు మద్దతు తెలపడంతో నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీని గ్రూపు తగదాలు వెంటాడుతున్నాయి. మాజీ మంత్రి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కేఎస్ జవహర్ కొవ్వూరులోనే ఉంటున్నా స్థానికంగా నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇక్కడి నాయకులు చక్రం తిప్పుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత అడ్రస్ లేకుండా పోవడాన్ని క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి ద్విసభ్య కమిటీని నియమించడాన్ని జవహర్ వర్గం వ్యతిరేకిస్తోంది. కోనసీమ జిల్లాలో దిక్కెవరు? డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు దాదాపు పొగ పెట్టినట్టేనని భావిస్తున్నారు. ఆనందరావును మాజీ హోంమంత్రి చినరాజప్ప వర్గం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఆయనకు ప్రత్యామ్నాయంగా చినరాజప్ప వర్గం పరమట శ్యామ్‌ను ఇన్చార్జిని చేయాలనే ప్రయత్నాలు ఆ పార్టీలో అగ్గి రాజేశాయి. పి.గన్నవరంలో పారీ్టకి కేరాఫ్ అడ్రస్ లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి అనంతరం ఇక్కడ టీడీపీ చుక్కాని లేని నావలా మారింది. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గం బాధ్యతలను ప్రస్తుతానికి టీడీడీ మాజీ సభ్యుడు డొక్కా నాథ్‌బాబు చూస్తున్నారు. ఇన్చార్జి పదవి కోసం రాజమహేంద్రవరంలో స్థిరపడిన మందపాటి కిరణ్‌కుమార్ వెంపర్లాడటాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరులకు ఇస్తే తాడోపేడో తేలుస్తామంటూ డజను మంది మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు వారం వారం భేటీ అవుతున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా దాదాపు పి.గన్నవరం పరిస్థితే కనిపిస్తోంది. టీడీపీ ఇక్కడ ఖాళీ అయిపోవడంతో కొత్తపేట నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇక్కడ ఉనికి కోసం టీడీపీ ఆపసోపాలు పడుతోంది. -
వస్త్ర దుకాణంలో పరిచయం... యువతిని నమ్మించి, కోరిక తీర్చుకుని..
కొవ్వూరు(తూర్పుగోదావరి): నమ్మించి, ఓ యువతిని మోసగించిన అభియోగంపై రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కొండ్రు ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాడపల్లికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, సమీపంలోని స్టూడియోలో ప్రేమ్‌కుమార్ పనిచేసేవాడు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటూనంటూ ప్రేమ్‌కుమార్ ఆమెను నమ్మించి, తన అవసరం తీర్చుకున్నాక మొహం చాటే శాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. -
ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఆరు నెలల క్రితం మే నెలలో దావోస్ వెళ్లినప్పుడు నన్ను గుర్నానీ కలిశారు. ఆయన నాతో మాట్లాడుతూ.. ‘టెక్నాలజీ వైపు వేస్తున్న అడుగులకు ఎలాగూ ఊతమందిస్తున్నాం. మరోవైపు నా కుమారుడు ఇథనాల్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు. ఈ ప్లాంట్ ఎక్కడ పెట్టాలా.. అని ఆలోచిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల వైపు చూసి ఆలోచిస్తున్నారు. మన (ఏపీ) రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది’ అని నన్ను అడిగారు. రాష్ట్రంలో ఏ రకంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామో చెప్పాం. మన రాష్ట్రానికి రావాలని ఆహ్వానం పలికాం. అప్పటి నుంచి ఇప్పటికి కేవలం ఆరే ఆరు నెలలు. అంతలోనే పరిశ్రమకు భూములివ్వడం దగ్గర నుంచి.. కావాల్సిన అనుమతులన్నీ మంజూరు చేసి, ఈ రోజు భూమిపూజ చేసుకుంటున్నాం. ఇదీ మన రాష్ట్రంలో జ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు నిదర్శనం. రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్న ఎంఎన్‌సీలు కూడా పలు రాష్ట్రాలను పరిశీలించినప్పుడు వాటికి తొలుత మన రాష్ట్రమే కనిపిస్తోంది. అందువల్లే ఏపీపై ఆసక్తి కనబరుస్తున్నాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుమ్మళ్లదొడ్డి నుంచి సాక్షి ప్రతినిధి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు మన ప్రభుత్వం సింగిల్ విండోలోనే అనుమతులు ఇస్తున్నందున ఎంతో మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంపై అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే పారిశ్రామిక దిగ్గజం అస్సాగో భారీ పెట్టుబడితో ఇక్కడ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శుక్రవారం ఆయన కంపెనీ సీఎండీ, సీఈఓ ఆశీష్ గుర్నానీ.. తండ్రి, టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశీష్గుర్నాని, సీపీ గుర్నానీలను దావోస్‌లో కలిసి మాట్లాడి.. ఆరు నెలలు తిరక్కుండానే గుమ్మళ్లదొడ్డిలో ఇథనాల్ పరిశ్రమకు భూమి పూజ చేసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏముంటుందని అన్నారు. మన పిల్లలకే ఉద్యోగాలు ► ఈ ప్లాంట్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేసిన అస్సాగో ఇండస్ట్రీస్ ఎండీ, సీఈఓ ఆశీష్ గుర్నాని, ఆయనకు అన్ని విధాలా మార్గదర్శకత్వం వహిస్తున్న తండ్రి, టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని, ఇక్కడికి విచ్చేసిన ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు.. అందరికీ హృదయ పూర్వక అభినందనలు. ► టెక్ మహీంద్రా.. పెద్ద సాప్ట్వేర్ కంపెనీ అనే విషయం మనందరికీ తెలుసు. ఈ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ సీఈఓ సీపీ గుర్నానీ కుమారుడు అశీష్ గుర్నానీ ఆధ్వర్యంలో ఇక్కడ 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ► ఈ ప్లాంట్‌తో 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. వాటిలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం తీసుకురావడంతో చదువుకున్న మన పిల్లలకు మంచి జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా రైతులకు, వ్యవసాయాధారమైన ఈ ప్రాంతానికి చాలా మేలు చేస్తుంది. ► తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు ధాన్యం రంగు మారిపోవడమే కాకుండా ముక్కిపోవడం, బియ్యం విరిగిపోయే పరిస్థితులు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సమస్యలకు ఈ ప్లాంట్ పరిష్కారం చూపిస్తుంది. ► బ్రోకెన్ రైస్‌తో పాటు నూకలు, మొక్కజొన్న.. ఈ రెండింటి ఆధారంగా ఈ ఇథనాల్ ప్లాంట్ పని చేస్తుంది. దానివల్ల మన రైతులకు మేలు జరుగుతుంది. రంగు మారిన, విరిగి పోయిన ధాన్యానికి కూడా మంచి రేటు ఇప్పంచగలిగే గొప్ప అవకాశం ఉంటుంది. ఈ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతిలో నిర్మిస్తుండటంతో కాలుష్యానికి అవకాశాలు చాలా తక్కువ. ఈ ప్లాంటుతో పాటు బై ప్రొడక్ట్ కింద హైక్వాలిటీ ప్రోటీ¯న్ పశువుల దాణా, చేపల మేత, కోళ్ల దాణా వంటి ఫీడ్ అందుబాటులోకి వస్తుంది. మరిన్ని పరిశ్రమలకు రాచబాట ► త్వరితగతిన ఇక్కడ ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక వేత్తల వద్ద, రకరకాల ఫోరమ్‌ల వద్ద మన రాష్ట్రంలో జరుగుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ప్రస్తావించే అవకాశం, పరిస్థితులు వస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ పరిశ్రమలు గుర్నానీ ద్వారా మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. ► ప్రతి అంశంలో మేం మీకు తోడుగా ఉంటామని గుర్నానీకి మాట ఇస్తున్నాను. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా మా పిల్లలకు మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా చేయడానికి మీరు అంబాసిడర్లా ఉండండి. ► ఏలేరు కుడి కాలువ నిర్మాణం గురించి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇందాకే అడిగారు. దానికి దాదాపు రూ.50 కోట్లు అవుతుంది. ఈ పనులకు ఈ వేదికపై నుంచే అనుమతి మంజూరు చేస్తున్నా. ఈ పనుల ద్వారా 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందుతాయి. రైతులు, ప్రజలకు మంచి జరుగుతుంది. ► అస్సాగో ఇండస్డ్రియల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ అశిష్ గుర్నాని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, చింతా అనురాధ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఆపలేరు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కళ్లెదుటే కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుకట్ట పడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం లేదు.. అభివృద్ది జరగడం లేదు.. పరిశ్రమలు తరలిపోతున్నాయని ఒక మాజీ మంత్రి సీఎంకు లేఖ రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి వస్తే, ఇది మా ప్రాంతానికి వద్దు.. మాకు అవసరం లేదని లేఖలు రాశారు. ఇదీ వాళ్ల దుర్బుద్ధి. జరుగుతున్న అభివృద్ధి, తరలి వస్తున్న పారిశ్రామికవేత్తలను చూసి ఓర్వలేక రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా వారు అడుగులు వేస్తున్నారు. లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడుల కార్యచరణతో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి 30 సెకన్లలో సీఎం అంటే ఏమిటో తెలిసింది.. సీఎం జగన్మోహన్రెడ్డి.. మహానేత రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పీపుల్ ఓరియంటెడ్, సోషల్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ విధానంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచారు. పరిశ్రమకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడంతో నా కుమారుడు అశిష్ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనడంలో సందేహమే లేదు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌తో కేవలం 30 సెకన్లు మాత్రమే మాట్లాడాము. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా అమలు చేస్తారని, యువత ఉపాధికి ఏ రకంగా వినియోగిస్తారని అడిగాను. ఆ సమయంలోనే రాష్ట్ర అభివృద్ధి పట్ల సీఎం అంకితభావం తెలిసింది. ఈ ప్రాంతంలో యువత, పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్న లక్ష్యం.. సంకల్పం తెలియజేశారు. దావోస్‌లో చెప్పిన మాట ప్రకారం కేవలం ఆరు నెలలల్లోనే అన్ని అనుమతులు ఇచ్చారు. ఇదీ సీఎం నిబద్ధత, నిజాయితీకి నిదర్శనం. తొలిసారి ఒక పరిశ్రమ స్థాపనకు ఆసక్తి చూపించిన నా కుమారుడు కూడా జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నా. ఇందుకు సరైన వేదిక ఆంధ్రప్రదేశ్ అని భావించి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. – సీపీ గుర్నానీ, టెక్‌మహీంద్రా ఎండీ, సీఈఓ చదవండి: రాళ్లు విసిరించుకోవడం చంద్రబాబుకు సాధారణమే: మంత్రి జోగి రమేష్ -
రంగుమారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుంది: సీఎం జగన్
-
కాలానుగుణ వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి
తూర్పు గోదావరి (రంగంపేట): కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై అవగాహన పెంచుకుని నివారణకు జాగ్రత్తలు పాటించాలని సత్యసాయి సేవా సంస్ధల జిల్లా అధ్యక్షుడు బలుసు వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక సత్యసాయి మందిరం వద్ద శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చెవి, ముక్కు, గొంతు, ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీసత్యసాయి సరస్వతి చెవి, ముక్కు, గొంతు వైద్యశాల డాక్టర్ పి. ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 50 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ సమన్వయ కర్త సుక్కిరెడ్డి సాయి సుధాకర్, రంగంపేట సజ్జోన్ కనీ్వనర్ మల్రెడ్డి వీర్రాజు, గరిమెళ్ళ అరుణ, సేవా సంస్థ కనీ్వనర్లు టి.గోవిందరాజులు, కె.వెంకట అమర్నాధ్, చావా బోధియ్య, ఉండవిల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏం జరిగిందో ఏమో.. పెళ్లైన ఏడు నెలలకే షాకింగ్ నిర్ణయం..
సీతానగరం(తూర్పుగోదావరి): ఏమి జరిగిందో ఏమో పెళ్లైన ఏడు నెలలకే ఆమె తన జీవితాన్ని చాలించింది. మండలంలోని సింగవరానికి చెందిన సుంకర ధరణి (19) ఆదివారం తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై కె.శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు తండ్రి గతంలో మరణించగా, తల్లి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని వెళ్లింది. మృతురాలు ధరణి అమ్మమ్మ పోకల వెంకటలక్ష్మి వద్ద తన అన్న దుర్గాప్రసాద్‌తో ఉంటోంది. చదవండి: రెండున్నరేళ్ల క్రితం పెళ్లి.. మహిళ దారుణహత్య.. ఆ ఇంట్లో ఏం జరిగింది? ఈ ఏడాది మార్చిలో రాపాకకు చెందిన మైలవరపు అంజనేయులతో వివాహం అయింది. రెండు నెలల క్రితం భర్త ఆంజనేయులు కువైట్ వెళ్లాడు. అన్నయ్య దుర్గాప్రసాద్ తాపీ పనిలోకి వెళ్లగా, ఉదయం 11 గంటలకు కార్తిక ఉపవాసం ఉన్న ధరణి తనకు కడుపునొప్పి వస్తోందని అమ్మమ్మకు చెప్పగా పడుకోమని చెప్పింది. అమ్మమ్మ కొంత సమయం తరువాత గదిలోకి వెళ్లగా చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. ఆత్మహత్య చేసుకున్న మనుమరాలను చూసి ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న ఎస్సై వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శుభశేఖర్ తెలిపారు. -
తూర్పుగోదావరి జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
-
కుమ్మరి వృత్తి.. దక్కని తృప్తి.. సాంప్రదాయాన్ని వదులుకోలేక..
తాళ్లపూడి(తూర్పుగోదావరి): దీపావళి వస్తుందంటే చాలు కుమ్మర్లకు చేతి నిండా పని, వీధులన్నీ మట్టి ప్రమిదలతో కళకళలాడుతూ ఉంటాయి. ప్రమిదలు, చిచ్చు బుడ్లు తదితర తయారీలో వారంతా నిమగ్నమై ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ కుమ్మర్లకు ఆదరణ తగ్గింది. సీజన్లో తప్ప మిగతా రోజుల్లో పని లేక ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, ప్రజల అభిరుచులు మారడంతో మట్టి పాత్రల వినియోగం తగ్గడంతో కుమ్మర్లకు పని లేకుండాపోతోంది. ఆర్థికంగా అవస్థలు తప్పడంలేదు. దీంతో వారు వలసపోతున్నారు. తాతల కాలం నుంచి వస్తున్న కులవృత్తిని, సాంప్రదాయాన్ని వదులుకోలేక పలువురు ఈ పనులే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు ఈ వృత్తినే నమ్ముకొని.. ఆధునిక కాలంలో మట్టి పాత్రలకు బదులు స్టీల్, రాగి, కంచు, సీవండి, ప్లాస్టిక్ తదితర వాటిని వినియోగిస్తున్నారు. దీంతో కుమ్మరులు ఉపాధిని కోల్పోతున్నారు. కొవ్వూరు నియోజక వర్గంలో సుమారు 4 వేల మంది వరకూ కుమ్మర్లు ఉండేవారు. ప్రస్తుతం 400 మంది ఉన్నారు. తాళ్లపూడి మండలంలో సుమారు 150 నుంచి 200 కుటుంబాలు వరకూ ఉండేవి. ప్రస్తుతం కేవలం 25 కుటంబాలు వారు మాత్రమే కుమ్మర వృత్తిని కొనసాగిస్తున్నారు. వేగేశ్వరపురంలో 13 కుంటుబాలు, తాళ్లపూడిలో నాలుగు కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి తగిన ప్రొత్సాహం మాత్రం లభించడం లేదు. పెద్దేవం, అన్నదేవరపేట, తిరుగుడుమెట్ట, రాగోలపల్లి తదితర గ్రామాల్లో కుమ్మర్లు ఉన్నారు. వారు పురాతన శాలలపై ఆధారపడకుండా ఇటీవల కరెంట్ శాలలు రూ.20 వేలు పెట్టి సొంతంగా కొనుక్కున్నారు. వాటిపై కేవలం ప్రమిదలు, చిచ్చుబుడ్లు మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. పెరిగిన ముడిసరుకుల ధరలు మట్టి వస్తువులు తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరిగాయి. ఆవ శాలలో కాల్చడానికి మట్టి, ఊక, వంట చెరకు ధరలు గతంలో కంటే రెట్టింపయ్యాయి. ఖర్చులు పోగా వచ్చే లాభం సరిపోవడంలేదని కుమ్మర్లు వాపోతున్నారు. వేసవిలో కుండలు చేయడం ద్వారా ఇతల మట్టి పాత్రలు కుడా తయారు చేస్తున్నారు. ఈ దీపావళికి వివిధ ఆకృత్తుల్లో ఆకర్షణీయంగా ప్రమిదలు తయారు చేస్తున్నారు. 1000 ప్రమితలు రూ.850 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. 100 చిచ్చుబుడ్లు రూ.500 నుంచి రూ.600 వరకూ కొనుగోలు చేస్తున్నారు. అది కూడా కొందరు వ్యక్తులు ముందుగా కాంట్రాక్ట్ కుదుర్చుకుని చేయించుకుంటున్నారు. ఏటా దీపావళి సీజన్ నుంచి కార్తిక మాసం సీజన్లో మాత్రమే కొంత ఉపాధి దొరుకుందని కుమ్మర్లు వాపోతున్నారు. కుమ్మరిని ప్రోత్సహించాలి ఇటీవల కురిసిన వర్షాలకు దీపావళి సీజన్లో పని చేయడానికి అవకాశం లేదు. కుమ్మరి వృత్తిని ప్రోత్సాహించాలి. నేను రూ.20 వేలు పెట్టి కరెంట్ శాల కొన్నాను. మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. దీనివల్ల లాభాలు రావడంలేదు. కుటుంబం అంతా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం రుణాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయం చేయండి. – శ్రీకాకోళపు పద్మ, వేగేశ్వరపురం దీపావళి సీజన్లోనే పని మారుతున్న రోజుల్లో కుమ్మరి వృత్తికి ఆదరణ కరువైంది. దీపావళి సీజన్లో మాత్రమే పని ఉంటోంది. మిగతా రోజుల్లో ఉండదు. ఆర్థికంగా నిలదొక్కుకోలేక కుమ్మర వృత్తిని చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో ఇతర పనులకు వెళ్లక తప్పడం లేదు. ప్రభుత్వం కరెంట్ శాలలు, ఇతర పనిముట్లపై సబ్సిడీ ఇవ్వాలి. మమ్మల్ని ఆదుకోవాలి. – శ్రీకాకొళపు వెంకటేశ్వరరావు, వేగేశ్వరపురం -
సీఎం జగన్‌ది అభివృద్ధి.. మరి చంద్రబాబుది?
సాక్షి, తూర్పు గోదావరి: నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు.. అక్కడ కూడా నిరసనే స్వాగతం పలికింది. అమరావతి రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్ర స్టేట్ ముద్దు అంటూ వివిధ స్లొగన్స్ తో పోస్టర్లు ఏర్పాటు చేశారు నాయకులు. జగన్(సీఎం జగన్‌ను ఉద్దేశించి..)ది స్టేట్ గురించి ఆలోచన అని, చంద్రబాబుది(ప్రతిపక్ష నేత చంద్రబాబు) రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన అని అందులో పేర్కొన్నారు. జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి అయితే.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి అని, జగన్‌ది సమైక్యవాదం అని, చంద్రబాబుది భ్రమరావతి నినాదం అని, జగన్‌ది అభివృద్ధి మంత్రం అయితే.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అని.. ఇలా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా.. జై అమరావతి నినాదానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను ఖుల్లాగా ప్రచురించారు. -
ఏడు కోట్ల మంది వీక్షకులు.. మంగారాణి యూట్యూబ్ చానల్.. లెసెన్స్.. అదుర్స్
కంబాలచెరువు(రాజమహేంద్రవరం)తూర్పుగోదావరి: స్థానిక శ్రీనాగరాజా నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మోటూరి మంగారాణి అరుదైన ఘనత సాధించారు. విద్యార్థులకు సులువైన బోధన దిశగా ‘మంగారాణి లెస్సన్స్’ పేరుతో ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్‌కు సుమారు 100కు పైగా దేశాల్లో ఏడు కోట్ల మంది వీక్షకులతో పాటు రెండు లక్షల మంది సభ్యులు చేరారు. ఒక ఉపాధ్యాయ యూట్యూబ్ చానల్‌కు రెండు లక్షల మంది సభ్యులు ఉండడం చాలా అరుదు. చదవండి: అలా గిన్నిస్ రికార్డు ‘అల్లు’కుపోయారు మంగారాణి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో గేయాలు, యానిమేషన్ చిత్రాలతో వీడియో పాఠాలను రూపొందించి తన యూట్యూబ్ చానల్ ద్వారా అనేక మంది ఉపాధ్యాయులకు అందజేస్తున్నారు. ఈ పాఠాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం ప్రారంభించిన దీక్ష ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ప్రస్తుత నూతన పాఠ్యపుస్తకాల్లోని క్యూఆర్ కోడ్లతో కూడా మంగారాణి అనుసంధానించారు. ఈ సందర్భంగా మంగారాణిని అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. -
వారసత్వ కట్టడంగా ధవళేశ్వరం బ్యారేజ్
సాక్షి, అమరావతి/సత్తెనపల్లి/ధవళేశ్వరం: గోదావరి డెల్టాను 160 ఏళ్లుగా సస్యశ్యామలం చేస్తూ.. భారతదేశపు ధాన్యాగారంగా నిలిపిన ధవళేశ్వరం బ్యారేజ్ (సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట) మణిహారంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా బ్యారేజ్‌ను ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) గుర్తించింది. చదవండి: డాక్టరమ్మ గొప్ప మనస్సు.. రూ.20 కోట్ల భారీ విరాళం ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని ఆ్రస్టేలియాలోని అడిలైడ్‌లో జరుగుతున్న ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌లో గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిలకు ఆ సంస్థ చైర్మన్ ప్రొ.ఆర్. రగబ్ రగబ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నీటిపారుదలరంగ నిపుణులు, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పాల్గొన్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు దక్కినట్లయిందని నిపు ణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేశంలో నాలుగు కట్టడాలకు గుర్తింపు పురాతన కాలం నుంచి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తిస్తోంది. ఈసారి అడిలైడ్‌లో జరుగుతున్న 24వ కాంగ్రెస్‌లో ప్రపంచవ్యాప్తంగా 22 ప్రాజెక్టులను గుర్తించగా.. ఇందులో దేశంలోని నాలుగు ప్రాజెక్టులకు స్థానం దక్కింది. వీటిలో రాష్ట్రంలో ధవళేశ్వరం బ్యారేజ్, తమిళనాడులోని లోయర్ ఆనకట్ట, ఒడిశాలోని బైతరణి, రుషికుల్య ప్రాజెక్టులున్నాయి. ఇక 2019లో ఇండోనేషియాలో జరిగిన 23వ కాంగ్రెస్‌లో రాష్ట్రంలోని కేసీ (కర్నూల్–కడప) కెనాల్ (కర్నూల్ జిల్లా), కంబం చెరువు (ప్రకాశం జిల్లా), పోరుమామిళ్ల చెరువు (వైఎస్సార్ జిల్లా)లను ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించింది. ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు గోదావరి డెల్టాకు 160 ఏళ్లుగా సాగు, తాగునీరు అందిస్తూ దేశ ధాన్యాగారంగా గోదావరి డెల్టా భాసిల్లడానికి కారణమైన ధవళేశ్వరం బ్యారేజ్‌ను మంత్రి అంబటి రాంబాబు, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిల సూచనల మేరకు ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా గుర్తించాలని ఐసీఐడీకి పంపాం. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పోటీలో ధవళేశ్వరం బ్యారేజ్‌ను ఐసీఐడీ ఎంపిక చేసింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు లభించింది. శతాబ్దాల క్రితం రాజులు నిరి్మంచిన చెరువులు, ఆనకట్టలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నాయి. అందులో పెద్దతిప్పసముద్రం, వ్యాసరాయసముద్రం, రంగరాయ సముద్రం, బుక్కపట్నం, రాయల చెరువులు ప్రధానమైనవి. వాటికి కూడా ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా గుర్తింపు తేవడానికి ప్రయత్నిస్తాం. – వాసుదేవరెడ్డి, డీఈ, జలవనరుల శాఖ -
పాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): పాలన వికేంద్రీకరణపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత,ఎమ్మెల్యేలు, మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మేధావులు చెప్పిన అంశాలను పక్కనపెట్టి.. రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 6లో ప్రస్తావించిన అనేక అంశాలు పరిశీలించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గౌరవిస్తే బాగుండేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మేధావులు చెప్పిన అంశాలను పక్కనపెట్టి అమరావతి రాజధానిగా చంద్రబాబు పెట్టారన్నారు. రాజధాని అత్యంత ప్రాధాన్యత అంశం.. అందుకే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని రాజధాని ఏర్పాటు చేయాల్సిందని కమిషన్ చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం: మార్గాని భరత్ వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. అమరావతి కోసం లక్ష కోట్లు బడ్జెట్ కావాలన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష. రాజాధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం అని ఎంపీ అన్నారు. -
బాహుబలి అంటే ఈయనే.. భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన భర్త
గోదారోళ్ళు అంటే భక్తి, ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు. ఊరికే మాటలు చెప్పడం కాదు చేతలతో చూపిస్తుంటారు. తాజాగా తన భార్యపై ఉన్న ప్రేమను ఓ భర్త ఇలా చూపించుకున్నాడు. ఆయన చేసిన పని చూసి పలువురు ప్రశంసలతో ముంచెత్తుతూనే ఆశ్చర్యానికి లోనవుతున్నారు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు) లావణ్య దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. ఈ క్రమంలో దర్శనం కోసం కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ సరదగా నడుస్తున్నారు. ఇంతలో.. వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య మీరు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని మెట్లు ఎక్కండి అంటూ సరదాగా సవాల్ చేసింది. దీంతో, భార్య సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్న సత్తిబాబు.. ఆమెను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే మిగిలిన భక్తులు ఫొటోలు, వీడియోలు తీయడానికి పోటీపడ్డారు. అయితే, పెళ్లైన కొత్తలో ఇలాంటి ప్రేమలు సర్వసాధారణమే అని కొట్టి పడేయకండి. వీరికి పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో చెబితే ఆశ్చర్యపోవాల్సిందే. వీరిద్దరికీ 1998లో వివాహం జరిగింది. అంటే ఇరవై నాలుగేళ్లు. ఇక్కడ మరో విశేషం ఎంటంటే.. వీరి ఇద్దరమ్మాయిలకూ పెళ్లిళ్లు కూడా చేశారు. తాత, అమ్మమ్మలు కూడా అయిపోయారు. కాగా.. వీరి పెద్ద అల్లుడు గురుదత్త(చందు)కు మంచి సాప్ట్ వేర్ ఉద్యోగం వస్తే పుట్టింటి, అత్తంటి వారందరనీ తిరుమల తీసుకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఉద్యోగం రావడంతో బస్సులో నలభై మందిని తిరుపతి తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే సత్తిబాబు ఈ సాహసం చేశాడు. ఇక, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందరో యువ జంటలకు సవాల్ విసురుతోంది. అలాఅని.. తొందరపడి ఈ సాహసానికి అందరూ ప్రయత్నించకండోయ్.. తేడా వస్తే అసలుకే ఎసరు వస్తుంది. -
ఏడు పేజీల సూసైడ్ నోట్.. కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య
సాక్షి, రాజమండ్రి (తూర్పుగోదావరి జిల్లా): రాజమండ్రి రూరల్ రాజవోలులో తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో సహా చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తండ్రి మృతదేహం కూడా లభించింది. రాజమండ్రిలో ఆడిటర్‌గా పని చేస్తున్న సత్య కుమార్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిత (12), చిన కుమార్తె అద్విత (7)తో కలసి నిన్న సాయంత్రం రాజవోలు చెరువు వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చి, చెరువులోకి దూకి ఆత్మహత్యకు పడ్డారు. చదవండి: ‘తలపోటుగా ఉంది.. మాత్ర తెచ్చుకుంటా’.. ఇంతలోనే బిగ్ షాక్ పనిలో ఉన్న ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఏడు పేజీల సూసైడ్ నోట్‌ని కూడా వాహనం వద్ద ఉంచారు. ఈ ఘటనకు పాల్పడుతున్న సమయంలో సత్య కుమార్ భార్య విశాఖ వెళ్లినట్టు తెలుస్తోంది. భర్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందిన భార్య బంధువులకు ఫోన్ చేయడంతో సమాచారం తెలిసింది. సంఘటన స్థలానికి వచ్చిన ఆమె భర్త, పిల్లల మృతదేహాలను చూసి బోరున విలపిస్తోంది. పిల్లలపై ఉన్న మక్కువతోనే సత్యకుమార్ పిల్లల్ని కూడా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఇప్పటికే మిస్సింగ్ కేసు నమోదు చేసిన బొమ్మూరు పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. -
హిజ్రాలను టార్గెట్ చేసిన 10 మంది యువకులు.. మూడు నెలలుగా..
తాళ్లరేవు(తూర్పుగోదావరి): యానాంలో తమపై దాడికి పాల్పడడంతో పాటు చంపుతామని బెదిరించిన యువకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ హిజ్రాలు శనివారం కోరంగి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. సుమారు 100 మందికి పైగా హిజ్రాలు జాతీయ రహదారి 216లో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం తాము పట్టి ఇచ్చిన నిందితులను వదిలేస్తారా అంటూ పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. స్టేషన్లోకి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డంగా కూర్చోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చదవండి: వేరే మహిళలతో భర్త వివాహేతర సంబంధం.. భార్య షాకింగ్ నిర్ణయం ఎస్సై టి.శివకుమార్ ముగ్గురు యువకులపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో హిజ్రాలు శాంతించారు. అయితే కేసు నమోదు చేసేవరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని చెప్పడంతో అదనపు బలగాలను రప్పించారు. ఈ సందర్భంగా బాధిత హిజ్రాలు ఐశ్వర్య, లిథియా తదితరులు విలేకర్లతో మాట్లాడుతూ పొట్టకూటి కోసం యానాం ప్రాంతంలో సంచరిస్తున్న తమపై పది మంది యువకులు మూడు నెలలుగా మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. ఆపరేషన్ చేయించుకున్న ఒకామెపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నందుకు కర్రలు, కత్తులతో దాడిచేసి గాయపరచడంతో పాటు తమ వద్ద సెల్ఫోన్లు, మనీపర్స్‌లు కూడా లాక్కుని వెళ్లారని ఆరోపించారు. హిజ్రాలపై దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి యానాంకు చెందిన కొల్లు మరిడయ్య, ఆకుల సాయిప్రసాద్, మొగలి నానిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. -
గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ
సాక్షి, రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరదతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో.. కనకాయలంక, టేకిశేట్టిపాలెం, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజేవేలు నీట ముగిగాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో కొండ వాగులు, శబరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నేపథ్యంలో విపత్తుల శాఖ ముంపు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. నిరంతరం స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి వరద ఉధృతిపై పర్యవేక్షణ జరుగుతోంది. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు.. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి సైతం వరద కొనసాగుతోంది. దీంతో, అధికారులు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక, శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 3.23 లక్షలుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ‘పుష్ప అంటే ఫ్లవరనుకొంటివా.. ఫై..రు..’ అంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చెప్పిన డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో అల్లు అర్జున్‌ది గంధపు చెక్కల స్మగ్లర్ పాత్ర. ఈ సినిమా రావడానికి దశాబ్దాల కిందటే కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసి.. ఆ రాష్ట్రాల సరిహద్దుల్లోని సత్యమంగళం అడవుల్లో సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని.. యథేచ్ఛగా గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్‌కు పాల్పడుతూ, మారణహోమానికి సైతం తెగించిన వాడు వీరప్పన్. అటువంటి వీరప్పన్‌కు ముచ్చెమటలు పట్టించి, సజీవంగా బంధించిన ధీశాలి.. పందిళ్లపల్లి శ్రీనివాస్ మన గోదారమ్మ ముద్దుబిడ్డ కావడం విశేషం. సోమవారం ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. చదువు.. ఉద్యోగం.. పందిళ్లపల్లి అనంతరావు, జయలక్ష్మి దంపతులకు 1954 సెప్టెంబర్ 12న కాకినాడలో శ్రీనివాస్ జన్మించాడు. రాజమహేంద్రవరం ఫిషర్స్ కాలనీ పాఠశాలలో ప్రాథమిక విద్య చదివాడు. 1975–77లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చదివి, బంగారు పతకం సాధించాడు. 1978లో యూపీఎస్సీ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడైన శ్రీనివాస్ 1979లో ఇండియన్ ఫారెస్టు సరీ్వస్(ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం 1981లో కర్ణాటక కేడర్ అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. చామరాజనగర్‌లో అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌గా తొలి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. కర్ణాటకలో శ్రీనివాస్ చెల్లెలు ఆదివారం ప్రారంభించిన కాంస్య విగ్రహం అదే ఏడాది స్మగ్లింగ్ నిరోధక బాధ్యతలతో చిక్‌మగళూరు కేంద్రంగా డిప్యూటీ ఫారెస్టు కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందాడు. ఈ విధులను శ్రీనివాస్ చాలా శ్రద్ధతో నిర్వహించాడు. సత్యమంగళం అడవుల్లో ఏనుగులను చంపి, వాటి దంతాలను అక్రమ రవాణా చేస్తున్న వీరప్పన్‌ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు. నిజాయితీ గల అధికారిగా అటవీ గ్రామాల్లో ప్రజల మన్ననలు చూరగొన్నాడు. 1985లో వీరప్పన్‌ను సజీవంగా పట్టుకుని, మైసూరు జిల్లా బూదిగపాడు అటవీ శాఖ అతిథి గృహంలో బంధించాడు. అయితే వీరప్పన్ తప్పించుకు పారిపోయాడు. సహాయ నిరాకరణ, సత్యాన్వేషణ స్మగ్లింగ్ కార్యకలాపాలతో చెలరేగిపోతున్న వీరప్పన్‌కు అడ్డుకట్ట వేసేందుకు శ్రీనివాస్.. సాధారణంగా నేరస్తులను పట్టుకునే వ్యూహాలకు భిన్నంగా గాంధేయవాద పద్ధతులైన సహాయ నిరాకరణ, సత్యాన్వేషణ వంటివి అమలు చేశారు. వీరప్పన్‌కు అటవీ ప్రాంతంలో ఉన్న ఆదరణను దెబ్బ తీయడానికి ప్రజలను చైతన్యవంతులను, అక్షరాస్యులను, సంపాదనాపరులను చేశారు. పీహెచ్‌సీలు, పాఠశాలలు నెలకొల్పారు. రోడ్లు అభివృద్ధి చేశారు. మంచినీటి సౌకర్యాలు కల్పించారు. వీరప్పన్ స్వగ్రామమైన గోపీనాథంలో ప్రజల ఇష్టదైవం మారియమ్మన్ ఆలయాన్ని కట్టించాడు. ఈ నేపథ్యంలో వీరప్పన్ పట్ల ప్రజల్లో ఏర్పడిన నమ్మకం క్రమంగా సడలిపోసాగింది. లొంగిపోయిన నేరస్తులకు శ్రీనివాస్ పునరావాసం కల్పించారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధునాతన సౌకర్యాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ‘వాచ్ టవర్లు‘ ఏర్పాటు చేశారు. అటవీ ఉద్యోగులు నివసించడానికి, విధులకు అందుబాటులో ఉండడానికి చామరాజనగర్‌లో ‘ఫారెస్టు కాంప్లెక్స్’ నిర్మించారు. అనుచరులను దెబ్బ తీయడం, వెతుకులాట పెంచడం, ఉద్యోగులు మరింత సమర్థంగా పని చేసేలా చేయడం వంటి చర్యలతో వీరప్పన్ అక్రమ రవాణాను దెబ్బ తీశారు. తమ్ముడు, చెల్లెళ్లతో శ్రీనివాస్ (పాతచిత్రం) నమ్మించి.. హతమార్చి.. శ్రీనివాస్ ముమ్మర వ్యూహాలతో వీరప్పన్‌కు ఎటూ పాలు పోలేదు. దీంతో ఆయనను వంచించి, దెబ్బ తీయడానికి సిద్ధమయ్యాడు. శ్రీనివాస్ ఒంటరిగా వస్తే లొంగిపోతానని సహచరుడు అర్జున్‌తో వీరప్పన్ కబురు పంపాడు. ఆ మాటలు నమ్మిన శ్రీనివాస్.. 1991 నవంబర్ 10వ తేదీ తెల్లవారుజామున గోపీనాథం సమీపంలోని నెమళ్లకొండ వద్దకు వెళ్లారు. అప్పటికే వీరప్పన్ సూచనలను అందుకున్న అతడి అనుచరుడు పలాండీ.. తుపాకీతో శ్రీనివాస్‌ను కాల్చి చంపాడు. ఆయన వెన్నంటి వచ్చిన మరో ముగ్గురు అటవీ ఉద్యోగులను కూడా దారుణంగా హతమార్చారు. చనిపోయిన తరువాత కూడా శ్రీనివాస్ ఎక్కడ లేచి వస్తోడోననే భయంతో వీరప్పన్.. మొండెం నుంచి తల నరికి అడవుల్లోకి తీసుకుపోయాడు. దీనినిబట్టి వీరప్పన్‌కు చావు భయాన్ని శ్రీనివాస్ ఎంతలా చూపించారో అర్థం చేసుకోవచ్చు. చాలా గర్వంగా ఉంది శ్రీనివాస్ మా అన్నయ్య అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నీతి, నిజాయితీకి మారు పేరుగా నిలిచారు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలయినా సరే ఇప్పటికీ జనం గుర్తు పెట్టుకుంటున్నారంటే ఆయనపై అభిమానం, ప్రేమ వెలకట్టలేనిది. మా అన్నగారంటే నాకు, నా ఇద్దరు చెల్లెళ్లకు చాలా ఇష్టం. – పందిళ్లపల్లి సత్యనారాయణ, సోదరుడు దైవంతో సమానంగా.. శ్రీనివాస్ చిత్రపటాన్ని మారియమ్మన్ గుడిలో స్థానికులు, ఆయన అభిమానులు దైవంతో సమానంగా ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. ఆయనను వీరప్పన్ హతమార్చిన చోట స్మారక స్థూపం నిర్మించారు. మరణానంతరం శ్రీనివాస్‌కు కేంద్ర ప్రభుత్వం 1992లో కీర్తిచక్ర పురస్కారం ప్రకటించింది. యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన పందిళ్లపల్లి శ్రీనివాస్ పేరును రాజమహేంద్రవరంలో ఒక వీధికి పెట్టారు. శ్రీనివాస్ జీవిత చరిత్రను కొత్తగా శిక్షణకు వచ్చే ఐఏఎస్, ఐపీఎస్‌లకు బోధిస్తున్నారు. శ్రీనివాస్ చనిపోయిన 10వ తేదీని జాతీయ అటవీ అధికారుల అమరవీరుల సంస్మరణ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్‌లో.. తన ఉద్యోగ బాధ్యతలు కొనసాగిస్తూనే అడవుల్లో కార్చిచ్చు, కాలిపోతున్న అడవుల పరిరక్షణ చర్యలపై పరిశోధనకు శ్రీనివాస్ 1985లో అమెరికా వెళ్లాడు. అక్రమ రవాణాను నిరోధించేందుకు, వీరప్పన్‌ను పట్టుకునేందుకు కర్ణాటక – తమిళనాడు ప్రభుత్వాలు సంయుక్తంగా టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాయి. అందులో ప్రత్యేకాధికారిగా శ్రీనివాస్‌ను నియమించారు. దీంతో ఆయన అమెరికా నుంచి తిరిగి మన దేశం వచ్చారు. వస్తూ వస్తూ సొంతూరైన రాజమహేంద్రవరం వెళ్లకుండా నేరుగా కర్ణాటక వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. చదవండి: సంస్థాన వారసుడు.. మొగల్తూరు మొనగాడు -
అనంతబాబుపై కేసుల వివరాలివ్వండి: హైకోర్టు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉన్న కేసులు, కింది కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్, మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఉత్తర్వులు జారీచేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనితోపాటు 90 రోజుల్లో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనందుకు తనకు డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం జస్టిస్ రవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ స్వయంగా చెప్పిన వివరాలు తప్ప హత్య విషయంలో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో లోపాలున్నాయన్న కారణంతో కింది కోర్టు దానిని తిరస్కరించిందన్నారు. బెయిల్ మంజూరు చేస్తూ ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. మరోవైపు.. ఈ వ్యాజ్యాల్లో మృతుడు తల్లి నూకరత్నం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, అనంతబాబుకు నేరచరిత్ర ఉందని.. ఆయనపై పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి, పిటిషనర్‌పై ఉన్న కేసులు, అతనిపై దాఖలు చేసిన చార్జిషీట్ వివరాలతో పాటు మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. లొంగిపోయిన అనంతబాబు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): తాత్కాలిక బెయిల్ గడువు ముగియడంతో ఎమ్మెల్సీ అనంతబాబు శుక్రవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోయారు. గత నెలలో అనంతబాబు తల్లి చనిపోవడంతో కోర్టు ఆయనకు ఈ నెల 9 వరకు బెయిల్ ఇచ్చింది. గడువు ముగియడంతో ఆయన జైలు అధికారుల ముందు హాజరయ్యారు. ఇదీ చదవండి: ఐవోబీ మాజీ ఉద్యోగులకు ఐదేళ్ల జైలు -
ఆ ఘటనపై చలించిపోయిన సీఎం జగన్.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి/తూర్పుగోదావరి: ఆన్లైన్ లోన్ యాప్ బారినపడి రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు నాగసాయి(4), లిఖిత(2) ఇద్దరికి చెరో రూ.5 లక్షల సాయం అందించాలని సీఎం ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మాధవీలతకి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య కాగా, అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు గత కొంతకాలంగా రాజమహేంద్ర వరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్‌గా, అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం ఇంటి అవసరాల నిమిత్తం సెల్‌ఫోన్ ద్వారా లోన్ యాప్‌లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అయితే అది సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో లోన్ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్ తరచూ ఫోన్ చేసి వేధించేవారు. ‘మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి.. అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం’ అని బెదిరించారు. అంతేకాకుండా దుర్గాప్రసాద్ బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో లోన్ యాప్‌ల ఆగడాలపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
కంబాలచెరువు(రాజమహేంద్రవరం)\తూర్పుగోదావరి: కుటుంబ అవసరాల కోసం లోన్ యాప్‌లో రుణం తీసుకున్న దంపతులు నిర్వాహ కుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు గత కొంతకాలంగా రాజమహేంద్ర వరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్‌గా, అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చదవండి: లోన్‌యాప్స్ లోగుట్టు: తొందర పడ్డారో.. ఇక అంతే సంగతులు కాగా కొద్దిరోజుల క్రితం ఇంటి అవసరాల నిమిత్తం సెల్‌ఫోన్ ద్వారా లోన్ యాప్‌లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అయితే అది సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో లోన్ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్ తరచూ ఫోన్ చేసి వేధించేవారు. ‘మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి.. అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం’ అని బెదిరించారు. అంతేకాకుండా దుర్గాప్రసాద్ బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెందారు. తరచూ లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 5న పిల్లలను ఇంటిలో వదిలేసి బయటకు వచ్చిన దంపతులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి గట్టుపై అదే రోజు రాత్రి ఒక లాడ్జిలో దిగారు. కొద్ది సమయం తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. బం«ధువులకు ఫోన్ చేసి తాము చనిపోతున్నామని చెప్పారు. విషయం తెలిసిన బంధువులు అదే రోజు అర్ధరాత్రి సమయానికి లాడ్జి వద్దకు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న భార్యాభర్తలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు సోమరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రహ శకలం కనుగొన్న విద్యార్థిని.. అరుదైన రికార్డు సొంతం
నిడదవోలు(తూర్పుగోదావరి జిల్లా): నిడదవోలుకి చెందిన పదో తరగతి విద్యార్థి కుంచాల కైవల్యరెడ్డి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆ్రస్టాయిడ్ బెల్ట్‌లో గ్రహ శకలం 2021 సీఎం37ను కనుగొన్నది. నాసా భాగస్వామ్య సంస్థ అయిన అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఈ గ్రహశకలాన్ని కనిపెట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ సంబంధిత ధ్రువీకరణపత్రాన్ని కైవల్యకు అందజేసింది. చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.. పాన్‌స్టార్స్ టెలిస్కోప్ సాయంతో తీసిన అంతరిక్ష ఛాయా చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విశ్లేషించడం ద్వారా ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు కైవల్య తెలిపింది. ఢిల్లీకి చెందిన స్వచ్ఛంధ సంస్థ స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సమీర్ సత్యదేవ్ వద్ద కైవల్యరెడ్డి శిక్షణ తీసుకుని ‘గామా’ టీం పేరు తో శకలాన్ని గుర్తించింది. గతంలో కైవల్య 2020 పీఎస్ 24 అనే మెయిన్ బెల్ట్‌లో ఉన్న గ్రహశకలాన్ని కనుగొనడంతో సీఎం వైఎస్ జగన్ ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. రెండో గ్రహశకలం కనుగొన్న కైవల్యని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి అభినందించారు. -
ఏపీ: బల్క్ డ్రగ్ పార్క్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, తూర్పు గోదావరి: రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది కేంద్రం. ఈ మేరకు బల్క్ డ్రగ్ పార్క్‌కు ఆమోదం తెలుపుతూ ఏపీకి కేంద్రం లేఖ రాసింది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడ్డాయి. ఇదీ చదవండి: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు! -
పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్ నిర్ణయం..
కొత్తపల్లి (తూర్పుగోదావరి): ఒక వివాహిత మృతికి కారణమైన ఐదుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్టు ఆదివారం పోలీసులు తెలిపారు. కొండెవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి రాంబాబుకు జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామానికి చెందిన శిరీష(29)కు రెండేళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలంగా కుటుంబ సభ్యులు ఆమెను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. చదవండి: ఎవరు? ఎందుకు? మనస్థాపానికి గురైన శిరీష శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోదరుడు బుర్రే క్రాంతి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త మేడిశెట్టి రాంబాబు, అత్తమామలు నాగమణి, నారయ్య, ఆడపడుచు భవాని, ఆమె భర్త సత్యానందంపై వరకట్నం వేధింపుల కేసును నమోదు చేశారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తహసీల్దారు ప్రసాద్ పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. కొండెవరంలో రాంబాబు ఇంటిని డీఎస్పీ భీమారావు పరిశీలించారు. ఆయన వెంట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై అబ్దుల్ నబీ ఉన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్
సాక్షి, తూర్పుగోదావరి: ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరైంది. మూడు రోజుల పాటు రాజమండ్రి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న(ఆదివారం)అనంతబాబు తల్లి మంగారత్నం మృతిచెందిన సంగతి తెలిసిందే. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనంతబాబుకు ఈ నెల 25 సాయంత్రం వరకూ న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. చదవండి: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం -
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని.. సొంతూరిలో గాడిదల ఫారం.. ఆదాయం ఎంతో తెలుసా?
రాజానగరం(తూర్పుగోదావరి): ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడవడైననేమి ఖరము పాలు.. అన్నాడు వేమన. ఆయన ఇప్పటి కాలంలో ఉంటే గాడిద పాలకు ఉన్న డిమాండ్ చూసి తన పద్యాన్ని సవరించుకునేవాడేమో.. నిజమే మరి..! ఆవు పాలు, గేదె పాలకు కూడా లేనంతగా గాడిద పాల ధర లీటరుకు రూ.7,500 వరకూ పలుకుతోంది. ఈ డిమాండ్‌ను తనకు ఉపాధిగా మలచుకున్నారాయన. విదేశాల్లో లక్షల రూపాయల జీతాన్ని.. సాప్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని సొంతూరిలో డాంకీ ఫారం పెట్టాడు రాజమహేంద్రవరానికి చెందిన నరాల వీర వెంకట కిరణ్‌కుమార్. ఇందుకు దారి తీసిన పరిస్థితులను ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..? ‘‘మాది రాజమహేంద్రవరం. ఎమ్మెస్సీ చదువుకున్నాను. యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఓ కంపెనీ మారాను. బెంగళూరు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండేది. రోగ నిరోధక శక్తి కోసం అందరూ నానారకాలుగా తాపత్రయ పడేవారు. ఇందుకు గాడిద పాలు బాగా ఉపయోగపడతాయని చెప్పేవారు. కొందరు ఇంటింటికీ గాడిదలను తిప్పుతూ చిన్నపాటి గ్లాసులతో పాలు అమ్మేవారు. మా అబ్బాయి ఆస్త్మా ఉండేది. గాడిద పాల వల్ల ఇది తగ్గుతుందని తెలుసుకున్నాను. ప్రయోజనం కనిపించింది. గాడిద పాలకు ఉన్న డిమాండును సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. డాంకీ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకున్నాను. వెంటనే కాతేరులోని మా ఫ్రెండ్ జీవీ రాజుతో నా ఆలోచన షేర్ చేసుకున్నాను. ఉద్యోగాన్ని వదులుకున్నాను. గాడిడల పెంపకంపై శిక్షణ తీసుకున్నాం. రాజానగరం మండలం మల్లంపూడిలో 30 ఎకరాలు లీజుకు తీసుకున్నాం. అక్షయ డాంకీ ఫారం గత నెలలో ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఇందులో నా స్నేహితుడి కుమార్తె నవ్య కూడా పార్టనర్‌గా చేరారు. ఆమె ఢిల్లీ ఐఐటీలో ఫస్టియర్ చదువుతున్నారు. చదువుకు ఆటంకం కలగకుండా చదువు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ఫారం ఇలా.. అక్షయ డాంకీ ఫారంలో ప్రస్తుతం 120 గాడిదలు ఉన్నాయి. టోక్యో దేశానికి చెందిన యుథోపియన్ బ్రీడ్ అచ్చు గుర్రంలా ఉంటుంది. దీని ఖరీదు రూ.5 లక్షలు. ఇది రోజుకు లీటరున్నర పాలు ఇస్తుంది. రాజస్తాన్‌కు చెందిన హాలారీ రకం రోజు 750 మిల్లీలీటర్ల పాలు ఇస్తుంది. దీని ఖరీదు రూ.80 వేలు పైనే. మా ఫారంలో రోజుకు 30 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి శనివారం 300 లీటర్లు హైదరాబాద్ పంపిస్తున్నాం. రోజు విడిచి రోజు కాకినాడ మీదుగా 20 లీటర్ల పాలను కాస్మెటిక్ కంపెనీలకు రవాణా చేస్తున్నాం. పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి గాడిద పిల్లలను కూడా విక్రయిస్తున్నాం. పాల పొడి, పనీరు కూడా అమ్ముతున్నాం. మద్య వ్యసనం నుంచి విముక్తి కల్పించే ఔషధంలో గాడిద మూత్రం ఉపయోగపడుతుంది. ఇందుకోసం సూరత్, మహారాష్ట్రలకు వారం వారం గాడిద మూత్రం పంపిస్తున్నాం. ఎన్నో రకాల విటమిన్లు గాడిద పాలలో విటమిన్ ఎ, బి, సి, డితో పాటు కాల్షియం ఉంటుంది. కొవ్వు శాతం తక్కువ. ఎక్కువ కేలరీలు లాక్టోస్ రూపంలో ఉండే కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తాయి. రోజుకు పది మిల్లీలీటర్ల గాడిద పాలు తాగితే ఎన్నో ఫలితాలుంటాయి. ఆవు, గేదెల పాల కంటే గాడిద పాలు కాస్త పలుచగా ఉంటాయి. రుచిలో కొబ్బరి పాలను తలపిస్తాయి. విదేశాల్లో గిరాకీ ఎక్కువగానే ఉంది. యూరప్ దేశాల్లో ఆహార పదార్థాలు, పానీయాల తయారీ, కాస్మెటిక్స్ తయారీలో వాడుతుంటారు. గాడిదలకు నిరంతరం డాక్టర్ అరుణ వైద్య సేవలు అందిస్తున్నారు. గాడిదలు ఉదయం, సాయంత్రం స్వేచ్ఛగా తిరిగేందుకు 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాం. రోజుకు 25 కిలోల పచ్చగడ్డి అవసరమవుతోంది. సొంత ప్రాంతంపై మమకారంతో ఇక్కడ ఇలా డాంకీ ఫారం పెట్టాను’’ అని కిరణ్‌కుమార్ వివరించారు. -
ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించాలి అదే నా చివరి కోరిక..
తూర్పు గోదావరి: మండలంలోని నీలపల్లికి చెందిన యువతి ఐదు రోజుల క్రితం అదృశ్యమైందని, కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నామని కోరంగి ఎస్సై టి.శివకుమార్ బుధవారం తెలిపారు. ఎం.ఎస్.శర్మ దంపతుల 22 ఏళ్ల కుమార్తె ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఇంటినుంచి వెళుతూ యువతి రాసిన సూసైడ్ నోట్ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తోంది. ఇద్దరి యువకుల వేధింపుల వల్ల మనోవేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ నోట్లో పేర్కొంది. యానాం గోదావరిలోగాని, కోరంగి గోదావరిలో గాని దూకి తాను చనిపోతానని, తన కోసం గాలించవద్దని తెలిపింది. దీంతో యువతి తండ్రి ఆందోళన చెందుతూ యానాం, కోరంగి గోదావరి ప్రాంతాలలో తీవ్రంగా గాలించి, ఆచూకీ లభించకపోవడంతో కోరంగి పోలీసులకు 13 తేదీన ఫిర్యాదు చేశారు. కలకలం రేపుతున్న వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో ఒక యువకుడు ఆ యువతి ఫొటోలను తగులబెడుతూ, ఆమె చనిపోకపోతే నేనే చంపేస్తానని చెప్పడం కలకలం రేపుతోంది. ఆ యువకుడు ఎవరు, సూసైడ్ నోట్లో యువతి పేర్కొన్న ఇద్దరి పేర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్‌నోట్‌లో గోదావరిలో దూకి చనిపోతానని పేర్కొనడం, కొంతమంది గోదావరి పరీవాహక ప్రాంతంలో యువతిని చూసినట్లుగా చెప్పడంతో గోదావరిలో విస్తృతంగా గాలించినట్లు ఎస్ఐ తెలిపారు. సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని, అదే నా చివరి కోరిక అని యువతి పేర్కొంది. కాగా తమ కుమార్తెను ఆ ఇద్దరు యువకులే కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు. తమకు ఇద్దరు పిల్లలని మూడేళ్ల వయసులోనే కాలువలో పడి తమ కుమారుడు మృతి చెందాడని, తమకు అండగా ఉంటుందనుకున్న కుమార్తె ఈ రకంగా కనిపించకపోవడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. -
నాన్ వెజ్ ప్రియులకు షాక్..పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?
మండపేట(కోనసీమ జిల్లా): శ్రావణ మాసంలోను చికెన్ ధర దిగి రావడం లేదు. రూ.300కు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. పెరిగిన మేత ధరలతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణతో పాటు జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? రోజూ 3.2 లక్షల కిలోల వినియోగం తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సాధారణంగా 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఆయా జిల్లాల్లోని రాజానగరం, ఆలమూరు, కోరుకొండ, గోకవరం, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 440 ఫామ్‌ల వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి వస్తాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తికమాసం పూజల నేపథ్యంలో శ్రావణమాసం నుంచి కార్తికమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి డిసెంబరు వరకు అన్‌సీజన్‌గా భావించి కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కోళ్లకు ఆహారంగా అందించే మొక్కజొన్న, సోయా తదితర మేత ధరలు కొద్ది నెలలుగా దిగిరావడం లేదు. అన్ని మేతలు మిక్స్‌చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.30 నుంచి రూ.50కి పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుంది. ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడికి రూ.110 వరకు ఖర్చవుతుందంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది కోళ్ల రైతులు కమీషన్‌పై కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించేందుకు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాగా కంపెనీలు ఇస్తున్న కమీషన్ సరిపోవడం లేదంటూ ఇటీవల సమ్మె చేయడం కొత్త బ్యాచ్‌లపై కొంత ప్రభావం పడిందంటున్నారు. స్థానికంగా కోళ్ల పెంపకం తగ్గడంతో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, తెలంగాణలోని ఖమ్మం, ఆశ్వారావుపేట, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో శ్రావణమాసమైనప్పటికి ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. బుధవారం స్కిన్లెస్ కిలో రూ.300కు చేరగా, లైవ్ కిలో రూ.160 వరకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు. మేత ధరలు తగ్గితేనే కొత్త బ్యాచ్‌లు అన్ సీజన్, మేత ధరలకు భయపడి చాలామంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. జిల్లాలో అవసరమైన కోళ్లు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతితో ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
గంటా సన్నిహితుడి మిత్రుడు అదృశ్యం
దొండపర్తి (విశాఖ దక్షిణ), కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అదృశ్యం కావడం కలకలం రేపింది. విశాఖ కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ చంద్రశేఖర్ (60) గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్కడున్న క్రేటా కారు (ఏపీ 39 ఈక్యూ 9999) వద్ద ఓ లేఖ లభ్యమైంది. చదవండి: అత్తపై కోడలు భారీ స్కెచ్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు బట్టబయలు ఆయన గోదావరిలో దూకి చనిపోయాడా? లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఉదయం అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ కారు ఆగి ఉండటాన్ని గుర్తించి స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాలు, గోదావరిలో గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. రూ.12 కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయి.. విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిర్లంపూడి లేఅవుట్ ‘ది పామ్స్’ అపార్ట్మెంట్లో చంద్రశేఖర్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు, ఇటీవల చనిపోయిన నలంద కిషోర్‌కు ఆయన స్నేహితుడని తెలుస్తోంది. చంద్రశేఖర్ సుమారు రూ.12 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇందులో రూ.6 కోట్లు మధ్యవర్తిగా ఇతరులకు ఇప్పించి ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. చంద్రశేఖర్ అదృశ్యంపై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఆయన నివాసంలో ప్రస్తుతం ఎవరూ లేరని తెలుస్తోంది. -
చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ..
అమ్మా! నక్షత్రాలు పగలంతా ఎక్కడికి వెళ్తాయి? నాన్నా! చందమామ రోజుకోరకంగా ఉంటాడెందుకు? తాతయ్యా! చందమామ దగ్గరకు ఏ విమానంలో వెళ్లాలి? రాకెట్లో వెళ్తే నిజంగా... చందమామను తాకవచ్చా! బాల్యానికి ఇలాంటి సందేహాలెన్నో! నేను రాకెట్లో చందమామ దగ్గరకు వెళ్తా. ఇలాంటి తీర్మానాలు మరెన్నో!! ఆ తీర్మానాన్ని నిజం చేస్తానంటోంది కైవల్య. ఆ బాటలో ఇప్పటికే కొన్ని అడుగులు వేసింది. ఇస్రో స్పేస్ క్విజ్‌లో విజేతగా నిలిచింది. అంతరిక్షాన్ని ఔపోశన పడుతోంది ఈ చుక్కల్లో చంద్రిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో ఓ పట్టణం నిడదవోలు. ఆ పట్టణంలో పదో తరగతి విద్యార్థిని కైవల్య. వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఇస్రో గత ఏడాది తణుకు పట్టణంలో నిర్వహించిన స్పేస్ క్విజ్, వృక్తృత్వం, సైన్స్ ఫేర్లలో పాల్గొన్నది. ఆశ్చర్యంగా మూడింటిలోనూ ప్రథమ స్థానమే. ఈ ఏడాది ఇస్రో –నాసాలకు అనుబంధంగా ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ ఆస్టరాయిడ్ డే (జూన్ 30) సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతినిధిగా హాజరైంది. అనేక విభాగాల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచింది. వచ్చే ఏడాది జరిగే నాసా ఒలింపియాడ్ పరీక్షలకు అర్హత సాధించింది. ఆస్టరాయిడ్‌ను గుర్తించి ‘స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్’ అంబాసిడర్స్ బృందంలో సభ్యత్వాన్ని సాధించింది. తనకు అంతరిక్షం పట్ల ఆసక్తి రేకెత్తడం, అమ్మానాన్నలు తనకు అవసరమైన వనరులను సమకూర్చడం గురించిన అనుభవాలను సాక్షితో పంచుకుంది కైవల్య. ‘‘మా నాన్న శ్రీనివాసరెడ్డి, అమ్మ విజయలక్ష్మి. నాన్న పంచాయితీ ఈవో. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతోంది. అమ్మకు సామాజిక దృక్పథం ఎక్కువ. దాంతో చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకంగా పెంచిందనే చెప్పాలి. థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు తొలిసారిగా ఆస్ట్రానమీ గురించి ఆసక్తి కలిగింది. నా ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉండేది అమ్మ. ఖగోళశాస్త్రం మీద నా ఆసక్తి గమనించిన అమ్మ నా కోసం ఎన్సైక్లోపీడియా బుక్స్ తెచ్చింది. ఫోర్త్ క్లాస్ హాలిడేస్‌లో వాటిని చదివాను. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఈ రంగం మీద బాగా ఫోకస్ పెట్టాను. జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఆరు పుస్తకాలు కంఠతా పట్టినట్లు స్టడీ చేశాను. ఆ బుక్స్‌లో చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. కానీ ఆస్ట్రానమీ సబ్జెక్ట్ నన్ను కట్టిపడేసేది. చదివేకొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు ఎంతోమంది ఖగోళాన్ని అధ్యయనం చేశారు. విశ్వంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. వాళ్లు తెలుసుకున్న విషయాలన్నింటినీ పుస్తకాల్లో రాశారు. వేలాది పేజీల్లో ఉన్న సమాచారం అంతా కూడా విశ్వంలో మనం తెలుసుకోవలసిన విషయాల్లో ఒక్క శాతం ఉంటుందేమో! పోటీలే పాఠాలు! మనకు మనంగా చదువుతూ ఉంటే మనకు అంతా తెలిసిపోయిందనుకుంటాం. పోటీల్లో పాల్గొంటే కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ రంగంలో ఇంకా ఏయే పుస్తకాలున్నాయో తెలుస్తుంది. ఎన్ని వెబ్సైట్లలో ఈ సమాచారం లభిస్తుందో తెలుస్తుంది. ఇందుకోసమే రూపొందిన సాఫ్ట్వేర్లు తెలుస్తాయి. నేను ఇప్పటివరకు 30కి పైగా కాంపిటీషన్లలో పాల్గొన్నాను. నా కెరీర్ కూడా ఇందులోనే అని నిర్ణయించేసుకున్నాను కూడా. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఖగోళశాస్త్రంలోనే చేయాలనుకుంటున్నాను. ఐఐటీ ఖరగ్‌పూర్, ఎమ్ఐటీ చెన్నై, బెంగుళూరు– స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వంటి వాటిల్లో సీటు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. డాన్స్‌కు ఇక దూరమే! నాకు పెయింటింగ్, పియానో ప్లే చేయడంతోపాటు కరాటే, క్లాసికల్ డాన్స్ కూడా ఇష్టం. స్టడీస్‌కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి డాన్స్ ప్రాక్టీస్ చేయడం కుదరదు. మిగిలినవన్నీ కంటిన్యూ చేస్తాను. స్పేస్ పోర్ట్ ఫౌండేషన్ అంబాసిడర్ టీమ్‌లో మెంబర్‌గా స్కూళ్లకు వెళ్లి అవగాహన తరగతుల్లో స్పేస్ గురించి వివరిస్తున్నాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే. ‘మనం అమ్మాయిలం కదా, ఈ ఫీల్డ్ ఎలా’ అనే సందేహాలు వద్దు. ఆసక్తి ముఖ్యం. సాధించాలనే కోరిక, చేయగలమనే నమ్మకం ఉంటే మనం చేసి తీరుతాం. అయితే ఇలాంటి రంగంలో ఎదగాలంటే పేరెంట్స్, టీచర్స్ సహకారం చాలా ఉండాలి. మా పేరెంట్స్‌కి, టీచర్స్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని చెప్పింది కైవల్య. అంతరిక్ష అధ్యయనం: కుంచాల కైవల్యారెడ్డి, నిడదవోలు ఆస్టరాయిడ్ డిస్కవరీలో ఒక ఆస్టరాయిడ్ని గుర్తించాను. అంతరిక్షాన్ని పాన్స్టర్ టెలిస్కోప్‌తో పరిశీలిస్తూ, మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఫొటోలను పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ ఫొటోలను స్టడీ చేసి కదలికలను గుర్తించడమే ఈ డిస్కవరీ. జర్మనీ– కెనడాల్లోని అంతరిక్ష పరిశోధక సంస్థలు నిర్వహించాయి. నేను ఒక ఆస్టరాయిడ్‌ను గుర్తించాను. గుర్తించిన వెంటనే ‘ఎస్ఐఎఫ్ జీరో వన్ వన్...’ ఇలా ఒక టెంపరరీ నేమ్ ఇస్తాం. ఇలాంటి డిస్కవరీలన్నింటినీ క్రోడీకరించేటప్పుడు సీనియర్ సైంటిస్టులు ఒక పేరును ఖరారు చేస్తారు. ఆ ఆస్టరాయిడ్‌ను గుర్తించిన వారిలో నా పేరు రికార్డ్స్‌లో ఎప్పటికీ ఉంటుంది. జూలై 25వ తేదీన వరŠుచ్యవల్ మీటింగ్‌లో సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఆ కాంపిటీషన్లో ఎనభైకి పైగా దేశాల నుంచి పార్టిసిపేషన్ ఉంది. వారిలో యూఎస్, యూకేలకు చెందిన కొందరు టీచర్స్‌తో టచ్‌లో ఉన్నాను. వారితో సంభాషణ నాలెడ్జ్ షేరింగ్‌కి బాగా ఉపయోగపడుతోంది. – గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన పాలకొల్లుకు చెందిన జాహ్నవి
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జాహ్నవి దంగేటి
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం కలిశారు. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్నవి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి.. పైలెట్ ఆస్ట్రొనాట్ అవ్వాలన్న తన కోరికను వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. చదవండి: వరద బాధితులందరికీ న్యాయం చేస్తాం: సీఎం జగన్ భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు సీఎంకి వివరించింది. జాహ్నవి విజ్ఞప్తిపై సీఎం జగన్.. సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జాహ్నవి కుటుంబ సభ్యులు ఉన్నారు. చదవండి: అమ్మమ్మ కథలు.. అస్ట్రోనాట్ కలలు -
కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
పుచ్చకాయలవారి పేట: గ్రామంలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం జగన్ ఆరా
-
బూరెలలంక: స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం జగన్
-
వరద నష్టంపై అంచనాలు పూర్తి కాగానే ఆదుకుంటాం: సీఎం జగన్
-
ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి: సీఎం జగన్
-
అంబేద్కర్ కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
05: 30PM ►రాజోలు మండలం మేకలపాలెంలో సీఎం జగన్ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను గ్రామస్తులు సీఎం దృష్టికి తీసుకురాగా.. సమస్యలన్నింటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 04: 10PM ►అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మేకలపాలెంకు సీఎం జగన్ చేరుకున్నారు. కరకట్టవాసి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. మేకలపాలెంలో ఏటిగట్టును పరిశీలించారు. 03: 30PM ►కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాడ్రేవుపల్లికి చేరుకున్నారు. కాసేపట్లో రాజోలు మండలం మేకలపాలెంకు వెళ్లనున్నారు. అక్కడ వరద బాధితులను సీఎం పరామర్శించనున్నారు. 02: 30PM ►అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను నేరుగా కలిసి పరామర్శిస్తున్నారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. 12: 58PM ►అరిగెలవారిపేటకు చేరుకున్న సీఎం జగన్ ►అరిగెలవారిపేట వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ ►అరిగెలవారిపేటలో వంతెన నిర్మిస్తానని సీఎం జగన్ హామీ 12:01PM ►పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ ►నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్ ►సీఎం జగన్ జేబులోంచి పెన్ తీసుకున్న 8 నెలల బాబు ►8 నెలల బాబుకు తన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్ ►శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను అడిగిన సీఎం జగన్ ►కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చని అడిగిన సీఎం జగన్ ►వాలంటీర్లు బాగా పనిచేశారని సీఎంకు చెప్పిన వరద బాధితులు 11: 20AM ►ట్రాక్టర్లో లంక గ్రామాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ 11:15AM ►పంటుపై లంక గ్రామాలకు చేరిన సీఎం జగన్ 11: 06 AM ►పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్తున్న సీఎం జగన్ 10:34 AM ►పి.గన్నవరం మండలం జి. పెదపూడి చేరుకున్న సీఎం జగన్ ►జి. పెదపూడిలో కురుస్తున్న భారీ వర్షం ►వర్షంలోనే వరద బాధితులకు వద్దకు సీఎం జగన్ 9: 45AM డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్ ► అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. ► అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ► అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు. ► అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుని.. వరద బాధితులతో సమావేశం అవుతారు. ► అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. ► రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. వరద బాధితుల పరామర్శ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డా.బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రేమ జంటను విడదీసిన విధిరాత
తూర్పు గోదావరి (పిఠాపురం): డిగ్రీ పూర్తి చేసుకున్న యువకుడు, ఇంటర్ చదివిన యువతి ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో లేదో అన్న అనుమానంతో తామే పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని బయలుదేరారు. కానీ రోడ్డు ప్రమాద రూపంలో విధి వారిని విడదీసింది. పిఠాపురం సమీపంలో రాపర్తి సెంటర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట తీవ్ర గాయాల పాలవ్వగా ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. పిఠాపురం పట్టణ ఎస్సై శంఖరరావు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జగన్నాథపురానికి చెందిన పాలెపు గణేష్ అదే ప్రాంతానికి చెందిన దీప్తి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం రాత్రి తాము అన్నవరం వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా రు. మోటారుసైకిల్‌పై గురువారం అర్ధరాత్రి బయలు దేరారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పిఠాపురం రాపర్తి సెంటర్‌కు వచ్చే సరికి 216 జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను వీరి వాహనం బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 108లో తరలించారు. గణేష్ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీప్తి చికిత్స పొందుతోంది. కాగా తమ కుమారుడిని ఎవరో వ్యక్తులు చంపేశారని మృతుడి తల్లి లక్ష్మి పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
గోదావరి వరదలు.. ఏ హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు?
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వరదల వేళ ముందస్తుగా చేస్తున్న హెచ్చరికలే ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ హెచ్చరికల ఆధారంగానే ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్దదైన గోదావరి నదికి జూలై నెలలో వచ్చే వరదలు సాధారణంగా పెద్దగా ప్రభావం చూపవు. చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్ అందుకు భిన్నంగా ఈసారి గోదావరి మహోగ్రరూపమెత్తి ప్రజలను భయపెడుతోంది. ఎగువన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉప నదులైన మంజీరా, ప్రాణహిత, వార్ధా, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, పెన్‌గంగ వంటివి పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీరంతా చేరడంతో గోదావరి కూడా ఉప్పొంగిపోతోంది. మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గత ఎనిమిది రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. శనివారం నాటికి కాటన్ బ్యారేజీ వద్దకు 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరింది. ఆదివారం నిలకడగా ఉన్నప్పటికీ దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. రాత్రి నుంచి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ.. ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో వరద ప్రమాద హెచ్చరికలు ఎంతో తోడ్పడుతున్నాయి. గోదావరిపై ధవళేశ్వరం వద్ద 1847 – 1852 మధ్య సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మించిన బ్రిటిష్ పాలకులు 1855లో రివర్ కన్జర్వెన్సీ చట్టం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దీని ఆధారంగానే వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పేరూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ నీటి ప్రవాహాలను అధికారికంగా గంటగంటకూ ప్రకటిస్తూంటారు. గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూంటారు. వీటి ఆధారంగానే బ్యారేజీకి దిగువన ప్రజలను అప్రమత్తం చేస్తారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రక్రియ బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ జరుగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 10 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడతారు. ఫ్లడ్ కన్జర్వేటర్‌గా హెడ్ వర్క్స్ ఈఈ వ్యవహరిస్తారు. గోదావరిలో నాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు. శాశ్వత, తాత్కాలిక ఫ్లడ్ స్టోర్స్‌లో సామగ్రిని చెక్ చేసుకుంటారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉంటారు. రెండో ప్రమాద హెచ్చరిక బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 13 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను విడుదల చేస్తారు. బ్యారేజీ దిగువన ఉన్న వందలాది లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు వెంటనే విధుల్లో చేరాలి. మూడో ప్రమాద హెచ్చరిక బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 17.75 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 17.50 లక్షలు ఆపైన వచ్చిన మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే బ్యారేజీ దిగువన గోదావరి లంకలు నీట మునుగుతాయి. ఈ హెచ్చరిక ప్రకటించిన వెంటనే ఫ్లడ్ డ్యూటీ అధికారులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో 24 గంటలూ డ్యూటీ నిర్వహించాలి. గోదావరిపై రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. ఫ్లడ్ కన్జర్వేటర్‌గా ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వరద బాధితుల పునరావాసం, ప్రమాద నివారణ చర్యలు ఆరంభిస్తారు. రివర్ కన్జర్వెన్సీ చట్టంతోనే.. బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ వరద ప్రమాద హెచ్చరికల జారీకి బ్రిటిష్ కాలం నాటి రివర్ కన్జర్వెన్సీ చట్టాన్నే అనుసరిస్తున్నారు. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ఈ హెచ్చరికలు జారీ చేస్తారు. వీటి వల్లే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడం సాధ్యమవుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను రెడ్ అలర్ట్‌గా చెప్పవచ్చు. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, రిటైర్డ్ ఎస్ఈ, హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం -
వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియామకం
Live Updates: 6:00 PM గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ సమగ్ర సమీక్ష. ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటుచేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించిన సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియామకం వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలని సీఎం జగన్ ఆదేశం 4: 24 PM ►గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే పూర్తి చేసుకుని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► వరద సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం వైఎస్ జగన్ ►గోదావరి వరద ఉదృతి, సహాయక చర్యలపై సమీక్ష ►ఆయా జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం ► గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్షించనున్నారు. ► విశాఖపట్నంలో వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బయలుదేరారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం.. ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం వరదలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. ఇక గురువారం ఉదయం నాటి గోదావరి వరద పరిస్థితి గురించి సీఎం ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ►రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ సహా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్లు వారు వివరించారు. దాదాపు 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముందన్నారు. ►ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని.. అలాగే, వారికి తగిన సౌకర్యాలను కల్పించాలన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరద వేగాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు?
సాక్షి అమలాపురం: గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో తగ్గుతున్నా... ధవళేశ్వరంలో పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన లంకల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి.. దిగువకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ముందుగానే అంచనాకు వస్తారు. మూడు దశల్లో కచ్చితమైన అంచనాకు వస్తుంటారు. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తొలిదశలో గోదావరి నదికి క్యాచ్మెంట్ ఏరియాలో కురిసే వర్షాల ఆధారంగా గోదావరికి వచ్చే వరదపై అధికారులకు అంచనా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా ఏకంగా 3,12,812 స్క్వేర్ మీటర్లు. ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో విస్తరించింది. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాల వివరాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీబ్ల్యూసీ) పంపిస్తోంది. మహారాష్ట్రలోని క్యాచ్మెంట్ ప్రాంతంలో భారీగా కురిసినా నేరుగా వరద ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చే అవకాశం తక్కువ. మధ్యలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నందున ఆలస్యమవుతోంది. అదే తెలంగాణలోని వరంగల్, ఏటూరి నాగారం, మంచిర్యాలా, మణుగూరు, ఇచ్చంపల్లి, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తక్కువ సమయంలోనే ధవళేశ్వరం వద్ద ఉధృతి కనిపిస్తోంది. కాళేశ్వరం టూ ధవళేశ్వరం క్యాచ్మెంట్ ఏరియాలో వర్షంతో వచ్చే అంచనాతోపాటు రెండవ దశలో గోదావరి, ఉప నదుల మీద ఏర్పాటు చేసిన గేజ్ స్టేషన్ల వద్ద రీడింగ్‌ల ద్వారా వరద అంచనా వేస్తారు. వరదపై చాలా వరకు పక్కాగా లెక్క వస్తోంది. ప్రధానంగా భద్రాచలం గేజ్ స్టేషన్ వద్ద ఉన్న నీటి పరిణామాన్ని బట్టి ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం తేలుతోంది. ఆయా గేజ్ స్టేషన్ల దూరాన్ని బట్టి ధవళేశ్వరం బ్యారేజీకి వరద వచ్చేందుకు పట్టే సమయం తేలుతోంది. గోదావరిపై పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం వద్ద, కొత్తగా కాపర్డామ్, పోలవరం వద్ద, అలాగే ఉప నది శబరిపై కుంట, కొయిడాల వద్ద గేజ్ స్టేషన్లు ఉన్నాయి. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరద వచ్చేందుకు 18 గంటల సమయం పడుతోంది. గేట్ల నుంచి వెళ్లే నీటి పరిమాణంతో వరద లెక్క మూడవ దశలో వరద లెక్క ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తేలుతోంది. బ్యారేజ్ స్పిల్ లెవిల్ మీద 10.67 స్పిల్ లెవిల్ మీద ఎంత ఎత్తున నీరు వచ్చిందో చూస్తారు. మొత్తం 175 గేట్లు ఉండగా, ఎన్ని గేట్లు ఎత్తారు, గేట్ల మధ్య పొడవు, వెడల్పును పరిగణలోకి తీసుకుని ఒక సెకనుకు ఎన్ని క్యూసెక్కులు వెళుతోంది లెక్క కడతారు. గాంధీ గడియారం... పేపర్ బాల్స్ ఇప్పుడంటే బ్యారేజీకి వచ్చే వరదపై కచ్చితమైన అంచనాకు సాంకేతికంగా పలు పరికరాలను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు వరద ప్రవాహాన్ని, వేగాన్ని కొలవడం అధికారులకు కత్తిమీద సామే. ఇందుకు వారు గాంధీ గడియారం, పేపర్ బాల్స్ (పేపర్లతో చుట్టిన బంతి)ని వినియోగించేవారు. ‘పేపర్‌ను ఉండగా చుట్టి బ్యారేజీ ఎగువ వైపు వేసేవాళ్లం. బ్యారేజీ దిగువకు ఎంతసేపటిలో వచ్చిందనేది తెలుసుకోవడానికి గాంధీ గడియారాన్ని ఉపయోగించేవాళ్లం. ఈ సమయాన్ని నమోదు చేయడం ద్వారా వరద వేగాన్ని గుర్తించే వాళ్లం’ అని ఇరిగేషన్ రిటైర్డ్ ఇన్చార్జి ఎస్ఈ, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ‘సాక్షి’కి తెలిపారు. -
Andhra Pradesh: మరో రెండ్రోజులు వర్షాలే
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ప్రస్తుతం ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ తీవ్రరూపం దాల్చకపోయినా అల్పపీడనంగానే 4, 5 రోజులపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే రెండ్రోజులు ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం అల్లూరి జిల్లాలో 1.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు మండలం బోరంగులలో 5.3 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది. అరకు లోయ, పాడేరు, చింతూరు, హుకుంపేటలలో 3 నుంచి 3.5 సెం.మీ. వర్షం పడింది. వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నస్రత్ మండ్రూప్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268), విజయవాడ–బిట్రగుంట–విజయవాడ (07978/07977) రైళ్లు ఈ నెల 11 నుంచి 13 వరకు పూర్తిగా రద్దు చేశారు. కాకినాడ పోర్టు–విజయవాడ (17258) ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 11 నుంచి 13 వరకు రాజమండ్రి నుంచి బయలుదేరి, విజయవాడ వరకు నడుస్తుంది. విజయవాడ–కాకినాడ పోర్టు (17257) ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 11 నుంచి 13 వరకు విజయవాడలో బయలుదేరి, రాజమండ్రి వరకు నడుస్తుంది. భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 3077 కాకినాడ ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్: 0884 2368100 పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్: 9606363327 -
అమర్నాథ్ యాత్రలో మరో ఏపీ మహిళ మృతి