Enforcement Directorate (ED)
-
Lilavati Hospital రూ. 1,200 కోట్ల స్కామ్, చేతబడులు : సంచలన ఆరోపణలు
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన, ప్రసిద్ధి చెందిన ఆసుపత్రులలో ఒకటి లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ . 1978లో నాలుగు దశాబ్దాల క్రితం ముంబైలో స్థాపించిన ఐకానిక్ హాస్పిటల్‌పై పెద్ద దుమారం రేగుతోంది. లీలావతి హాస్పిటల్ ట్రస్టీలు బ్లాక్ మ్యాజిక్ గురించి షాకింగ్ ఆరోపణలు చేశారంటూ జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.మనీకంట్రోల్ నివేదిక ప్రకారం ముంబైలోని ప్రతిష్టాత్మక లీలావతి హాస్పిటల్ (Lilavati Hospital)ను నిర్వహిస్తున్న లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌పై ట్రస్ట్‌లోని కొంతమంది . మాజీ ట్రస్టీలు దిగ్భ్రాంతికరమైన ఆర్థిక కుంభకోణం ఆరోపణలను గుప్పించారు అంతేకాదు రూ. 1,200 కోట్ల కుంభకోణం కేసు కూడా నమోదు చేశారు. ఈ ఆరోపణలలో మోసపూరిత ఆర్డర్లు, నిధుల దుర్వినియోగం నకిలీ సేకరణ లాంటివి ఉన్నాయి. ఫోర్జరీ, మోసం , పన్ను ఎగవేత ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆసుపత్రి కొనుగోళ్లకు సంబంధించి థర్డ్-పార్టీ డిస్ట్రిబ్యూటర్లతో అక్రమాలకు పాల్పడటం ద్వారా రూ.1,200 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించింది ట్రస్ట్‌లో సుదీర్ఘ న్యాయ పోరాటంలో భాగంగా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వ్యవస్థాపకుడి సోదరుడు విజయ్ మెహతా చేపట్టిన చర్యల్లో భాగంగా కిషోర్ మెహతా కుమారుడు ప్రశాంత్ మెహతా నేతృత్వంలో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తృతమైన ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయని ఫిర్యాదు దారులు ఆరోపణ. ఈ విషయంలో లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (LKMMT) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి , బాంద్రా పోలీస్ స్టేషన్లో విడివిడిగా ఫిర్యాదులు చేసింది. ఆసుపత్రి ప్రాంగణంలో పూర్వపు ట్రస్టీలు చేతబడులు (black magic) చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మానవ వెంట్రుకలు, బియ్యం, ఎముకలతో నిండిన ఎనిమిది కలశాలను గుర్తించినట్టు తెలిపారు. ప్రశాంత్ మెహతా , అతని తల్లి చారు మెహతా కార్యాలయంలో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు ఆరోపణలొచ్చాయని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు."మేము ఆడిట్లు చేపట్టాము మరియు ఫోరెన్సిక్ ఆడిటర్లు ఐదు కంటే ఎక్కువ నివేదికలను సమర్పించారు, ఇది ఈ చట్టవిరుద్ధమైన ట్రస్టీల బృందం రూ. 1,500 కోట్లకు పైగా డబ్బును స్వాహా చేసి దుర్వినియోగం చేసిందని స్పష్టంగా పేర్కొంది. ఈ డబ్బును మాజీ ట్రస్టీలు స్వాహా చేశారు, వీరిలో ఎక్కువ మంది NRIలు మరియు దుబాయ్ మరియు బెల్జియం నివాసితులు," అని LKMMT శాశ్వత నివాసి ట్రస్టీ ప్రశాంత్ మెహతా విలేకరులకు తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్లతో పాటు, గుజరాత్‌లోని లీలావతి ఆసుపత్రి నుండి విలువైన వస్తువుల దొంగతనం కేసులో మరో కేసు దర్యాప్తులో ఉందని మెహతా తెలిపారు .PMLA (మనీలాండరింగ్ నిరోధక చట్టం) నిబంధనల ప్రకారం ఈ ఆర్థిక నేరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగంగా స్పందించి, తగిన చర్య తీసుకోవాలని ఆయన కోరారు.ఇదిలా ఉండగా, ఆసుపత్రి మాజీ ట్రస్టీలు ముగ్గురుపై నమోదైన రూ.85 కోట్ల మోసం కేసుపై ముంబై పోలీసుల EOW దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు మంగళవారం తెలిపారు .LKMMT ఫిర్యాదు మేరకు గత ఏడాది డిసెంబర్ 30న బాంద్రా పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు EOWకి బదిలీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు.లీలావతి హాస్పిటల్లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారిక వెబ్సైట్ ప్రకారం. 1997లో లీలావతి హాస్పిటల్ కేవలం 10 పడకలు , 22 మంది వైద్యులతో ప్రారంభమైంది. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లో 323 పడకలు, అతిపెద్ద ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ICUలు) ఒకటి, 300 కంటే ఎక్కువ మంది కన్సల్టెంట్లు, సుమారు 1,800 ఉద్యోగుల బృందంతోపాటు, ప్రపంచంలోని అత్యంత అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతతో 12 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.ఒకే రోజులో, లీలావతి హాస్పిటల్ దాదాపు 1,500 మంది అవుట్ పేషెంట్లు , 200 మంది ఇన్ పేషెంట్లకు హాజరవుతారు, "సర్వేత్ర సుఖినః: సంతు, సర్వే సంతు నిరామయా", అంటే "అందరూ ఆనందంగా ... ఆరోగ్యంగా ఉండాలి", అనే నినాదంతో సేవలందిస్తోంది.కీర్తిలాల్ మెహతా ,అతని భార్య లీలావతి మెహతా 1997లో ఈ ఆసుపత్రిని స్థాపించారు. 1978లో, కీర్తిలాల్ మెహతా లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (LKMMT) అనే పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. కీర్తిలాల్ మెహతా కుమారుడు కిషోర్ మెహతా హాస్పిటల్ ప్రాజెక్ట్‌ను రూపొందించి,దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కిషోర్ మెహతా మరణం తరువాత, అతని భార్య చారు మెహతా ఈ ఆసుపత్రి బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఈ ట్రస్టీల మధ్య గత కొన్నేళ్లు వివాదాలు, కేసులు నడుస్తున్నాయి. -
మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్, ఆయన కుమారుడి చైతన్య భాఘేల్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు విషయమై 14 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో, మాజీ సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు వచ్చి చేరుకున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మాజీ సీఎం భూపేశ్ భాఘేల్, ఆయన కుమారుడి నివాసాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భిలాయ్ 3 మానసరోవర్ కాలనీలో ఉన్న మాజీ సీఎం బంగ్లాలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు మాజీ సీఎం ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రత కోసం హాజరైన సీఆర్పీఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | ED raids Congress leader Bhupesh Baghel's premises in Bhilai as part of a money laundering investigation against his son - Chaitanya Baghel - in an alleged liquor scam case.Chaitanya Baghel shares the Bhilai accommodation with his father and hence the premises are being… pic.twitter.com/AdUWic1y26— Press Trust of India (@PTI_News) March 10, 2025కేసు ఇదీ..ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ద్వారా నిందితులు సుమారు రూ.2వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (CSMCL) షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం టెండర్లు పిలుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సీఎస్‌ఎమ్‌సీఎల్ కమీషనర్, ఎండీల సహకారంతో తన సన్నిహితులైన వికాస్ అగర్వాల్, అర్వింద్ సింగ్‌లతో కలిసి బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున్న లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది.తర్వాత మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్‌పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్ వసూలు చేయడంతోపాటు ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. అలా, 2019 నుంచి 2022లో సుమారు రూ. 1,200 నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. 2022లో ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. #WATCH | Chhattisgarh | Enforcement Directorate (ED) is conducting searches at the residence of former Chief Minister and Congress leader Bhupesh Baghel's son in an ongoing money laundering case. (Visuals from Durg) pic.twitter.com/k5Gmgew4K4— ANI (@ANI) March 10, 2025 -
ఫాల్కన్ స్కాం కేసులో కీలక పరిణామం
-
పేటీఎంకు ఈడీ నోటీస్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పేటీఎం మాతృ సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’కు (ఓసీఎల్) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు జారీ చేసింది. వన్97 కమ్యూనికేషన్స్‌తోపాటు, సంస్థ చైర్మన్, ఎండీ విజయ్ శేఖర్ శర్మ, సబ్సిడరీ కంపెనీలైన లిటిల్ ఇంటర్నెట్, నియర్‌బై ఇండియాకు నోటీసులు జారీ అయ్యాయి. రూ.611 కోట్ల విలువకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్టు దర్యాప్తులో తేలడంతో న్యాయపరమైన చర్యలకు ముందు ఈడీ స్పెషల్ డైరెక్టర్ ఈ నోటీసు జారీ చేశారు. నియంత్రణ ప్రక్రియలు, చట్టబద్ధమైన మార్గా ల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని పేటీఎం అధికార ప్రతినిధి ప్రకటించారు. ఓసీఎల్ సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టి, విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని ఆర్బీఐకి వెల్లడించలేదని దర్యాప్తులో గుర్తించినట్టు ఈడీ ప్రకటించింది. ఆర్బీఐ నిర్దేశిత ధరల మార్గదర్శకాలను అనుసరించకుండా, ఓసీఎల్ సబ్సిడరీ అయిన లిటిల్ ఇంటర్నెట్ ప్రైవేటు లిమిటెడ్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అందుకున్నట్టు తెలిపింది. కాగా, ఈ రెండు కంపెనీలను తాము 2017లో దక్కించుకున్నామని, వీటికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన తమ సబ్సిడరీలు కాకముందు జరిగినవిగా పేటీఎం స్పష్టత ఇచి్చంది. పేటీఎం షేరు ఎన్ఎస్ఈలో 4% పడి, ఇంట్రాడే కనిష్టానికి (రూ.684) దిగజారింది. చివరికి 2 శాతం లాభంతో రూ.729 వద్ద ముగిసింది. -
ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా కేసులో రూ.7.98 కోట్ల ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా కేసులో రూ.7.98 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల మేరకు చేపట్టిన ఈ తాత్కాలిక జప్తులో 22 స్థిర, 8 చరాస్తులున్నాయి. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో నిందితుడు ఆశిష్ జైన్, అతని కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న రూ.6.52 కోట్ల విలువైన భూములు, రూ.1.46 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు సీజ్ చేసినట్లు ఈడీ బుధవారం పేర్కొంది. హైదరాబాద్ దోమలగూడలోని జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆశిష్ జైన్ డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు 2022లో ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆశిష్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి, రూ.3.72 కోట్ల నగదుతో పాటు ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్ గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2022, మే 4న ఎన్సీబీ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. జేఆర్ ఇన్ఫినిటీ, ఆశిష్ జైన్, అతని కుటుంబ సభ్యులపై దర్యాప్తు ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికా తదితర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా రహస్యంగా కంపెనీ ఆన్లైన్లో ఫార్మా మందులతో పాటు జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో అక్రమ దందా నడుపుతున్నట్లు తెలుసుకుంది. మెయిల్స్, వీఓఐపీ ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్స్ తీసుకుని డ్రగ్స్ సరఫరా చేసేవారని, క్రెడిట్ కార్డు, బిట్ కాయిన్స్ ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయని గ్రహించింది. అ్రల్ఫాజోలం, జోల్పిడెమ్, లోరాజెపామ్, క్లోనాజెపామ్, హైడ్రోకోడోన్, ఆక్సికోడోన్ తదితర సైకోట్రోపిక్ పదార్థాలను ట్యాబ్లెట్ల రూపంలో చట్టవిరుద్ధంగా ఎగుమతి చేస్తున్నారని విచారణలో తేలింది. జేఆర్ ఇన్ఫినిటీ ఏర్పాటుకు ముందే ఆశిష్‌జైన్, అతని కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో రూ.4.50 కోట్లు విదేశాల నుంచి వచి్చనట్లు తేల్చారు. ఇలా రూ.12.76 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లకు, స్థిరాస్తుల కొనుగోలుకు వె చ్చించినట్లు ఈడీ పేర్కొంది. -
రోబో సినిమా ఎఫెక్ట్.. దర్శకుడు శంకర్ రూ.10 కోట్ల ఆస్తులు జప్తు
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. తన దర్శకత్వం వహించిన రోబో సినిమా విషయంలో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ. 10 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ జప్తు చేసింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆయన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఒక సినిమా కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు వచ్చిన కేసులలో ఇలా స్థిరాస్తులను ఎటాచ్ చేయడం ఇదే తొలిసారని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.2010లో రోబో రిలీజైన విషయం తెలిసిందే. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ రెమ్యునరేషన్‌గా రూ.11.5 కోట్లు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
‘ఫాల్కన్’పై ఈడీ కన్ను
సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల ఆశ చూపించి అమాయకుల నుంచి ఏకంగా రూ.850 కోట్లు దోచుకున్న ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ (ఎఫ్ఐడీ) కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టనుంది. మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో సుమారు 7 వేల మంది నుంచి డిపాజిట్లను సేకరించి.. ఆ సొమ్మును సింగపూర్, దుబాయ్, యూఈఏ వంటి దేశాల్లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసుల దర్యాప్తులో తేలింది. మనీలాండరింగ్ ఉల్లంఘనల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఈడీకి లేఖ రాసినట్లు తెలిసింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి కొడుకే.. ప్రధాన నిందితుడు ఎఫ్ఐడీ చైర్మన్ అమర్దీప్ కుమార్ బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమారుడని పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌లో స్థిరపడిన అమర్ కుటుంబం బహుళజాతి కంపెనీలకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అందించే సంస్థను స్థాపించడం ద్వారా అమర్దీప్ వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. ఈ ఏజెన్సీకి దేశవ్యాప్తంగా 20,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. 2020లో అమర్దీప్ ఎఫ్ఐడీ సంస్థను స్థాపించి, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సామాన్యుల నుంచి డిపాజిట్లను సేకరించడం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న అమర్, సీఈఓ యోగేందర్ సింగ్, సీఓఓ ఆర్యన్ సింగ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. లుక్ ఔట్ సర్క్యులర్‌ను సైతం జారీ చేశారు. సామాన్యుల నుంచి సేకరించిన డిపాజిట్లను మళ్లించేందుకు నిందితులు కాయిన్ ట్రేడ్, బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, యుకియో రిసార్ట్, ప్రెస్టిజ్ జెట్స్, ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టిస్ వంటి 15 షెల్ కంపెనీలను స్థాపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. డిపాజిట్లను క్రిప్టోకరెన్సీతో సింగపూర్, దుబాయ్, యూఈఏ వంటి విదేశాల్లోని ఈ షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేల్చారు. అక్కడ్నుంచి నిందితుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు సొమ్ము చేరినట్లు గుర్తించారు. -
Supreme Court: నిందితుల్ని జైల్లోనే ఉంచడానికి పీఎంఎల్ఏ కేసులా?
న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదించారు. -
ఈడీ విచారణ జరిపించాల్సిందే: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణమైన మార్గదర్శి కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సివిల్ కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబుతో మాట్లాడుకోవాలే తప్ప తమపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు అని, ఆయన బీజేపీ కోసం పనిచేయడం లేదని చెప్పారు.మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ప్రసంగానికి ఎంపీ మిథున్‌రెడ్డి అడ్డుపడ్డారు. సీఎం రమేష్ అస్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. అంతకుముందు సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీని 2019–2024 మధ్య మార్చారన్నారు. మద్యం ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ షాపుల వైపు మళ్లిందని, ఐదేళ్లలో మొత్తం రూ.లక్షకోట్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరిగాయని, ఒక్క డిజిటల్ చెల్లింపు లేదని ఆరోపించారు. అన్ని మద్యం షాపుల ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రూ.30 వేలకోట్ల మద్యం కుంభకోణం చేసిందని ఆరోపించారు. ఇది రూ.2,500 కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణమన్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సీఎం రమేష్ వైఖరిపై మండిపడ్డారు. లోక్‌సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ప్రతీకారంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మిథున్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహంఏపీలో 2021–22 నుంచి మూడేళ్లలో 21.56 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద కేంద్రం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 2021–22లో 25,006 మెట్రిక్ టన్నులు, 2022–23లో 2,72,572 మెట్రిక్ టన్నులు, 2023–24లో 18,58,652 మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఏపీలోని 13,321 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తికేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వామిత్వ’ పథకంలో భాగంగా ఏపీలో 13,321 నోటిఫైడ్ జనావాస గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి జిల్లాలో 1045 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. స్వామిత్వ పథకం అమలు కోసం 2020 డిసెంబర్ 8న ఉప్పదం కుదుర్చుకుందని, 2025 పిబ్రవరి 11నాటికి రాష్ట్రంలోని 26జిల్లాల్లో ఈ మొత్తం డ్రోన్ సర్వే నిర్వహించామని తెలిపారు. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాలు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు కోసం రాష్ట్రానికి రూ.26.7 లక్షలు విడుదల చేశామన్నారు. ఆస్తి కార్డు ఫార్మాట్ రాష్ట్రం ద్వారా ఇంకా ఖరారు చేయని కారణంగా..వాటిని ఇంకా తయారు చేయలేదని పేర్కొన్నారు. -
ఈడీకి లక్ష జరిమానా- ప్రజలను వేధించొద్దని బాంబే హైకోర్టు హితవు
-
ఈడీకి రూ. లక్ష ఫైన్
ముంబై: బాంబే హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై అనవసరంగా మనీలాండరింగ్ కేసును చేపట్టినందుకు ఈడీని మందలించింది. ఈ కేసులో హైకోర్టు ఈడీకి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.ఎటువంటి బలమైన కారణం లేకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టిన నేపధ్యంలో బాంబే హైకోర్టు ఈడీకి జరిమానా విధించింది. ఈ సందర్భంగా కేంద్ర సంస్థలు చట్ట పరిధిలో పనిచేయాలని హైకోర్టు పేర్కొంది. పౌరులు అనవసరంగా వేధింపులకు గురికాకుండా ఉండేందుకు చట్ట అమలు సంస్థలకు సందేశం పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.వివరాల్లోకి వెళితే రాకేష్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్(Real estate developer)పై నిబంధనల ఉల్లంఘన, మోసం ఆరోపణలపై ఒక ఆస్తి కొనుగోలుదారు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్లో నమోదైంది. దీని ఆధారంగా రాకేష్ జైన్‌పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసి, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు ఆగస్టు 2014 నాటిది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక కోర్టు 2014 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. తాజాగా మంగళవారం (జనవరి 21) ఈ కేసులో రాకేష్ జైన్‌పై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది.జస్టిస్ జాదవ్ మాట్లాడుతూ ఇప్పుడు తనముందున్న కేసు.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(Anti-Money Laundering Act) అమలు ముసుగులో వేధింపులకు సంబంధించిన కేసుగా కనిపిస్తోందన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారునితో పాటు ఈడీ కూడా దురుద్దేశంతో చర్యలు చేపట్టిందని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఇందుకు కఠినమైన శిక్ష విధించాలన్నారు. ఈడీ వంటి కేంద్ర సంస్థలు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇలా పౌరులను వేధించడం తగదని సూచించింది.ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ముడా ఉచ్చు?
బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ముడా (muda scam) స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో (cm siddaramaiah) పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) ప్రకటించింది.మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా స్థిరాస్థుల్ని ఈడీ అటాచ్ చేసుకుంది. అటాచ్ చేసిన ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పనిచేస్తున్న వివిధ వ్యక్తుల పేరిట రిజిస్టరయినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా.. ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణికి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి నుంచి ముడా 3 ఎకరాల 16 గుంటల భూమిని మొదట రూ.3,24,700కు సేకరించిందని తెలిపింది. ఆ తర్వాత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని, వీటి విలువ రూ.56 కోట్లు ఉంటుందని వెల్లడించింది. బినామీల పేరుతో బీఎం పార్వతికి అక్రమంగా ముడా భూముల్ని కేటాయించడంలో నాటి ముడా మాజీ కమిషనర్ డిబి నటేష్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ వెల్లడించింది.బీఎం పార్వతితో పాటు పలువురు రియల్ ఎస్టేట్వ్యాపారులకు స్థలాల్ని కేటాయించినట్లు తేల్చింది. ఫలితంగా ఆ స్థలాల్ని భారీ మొత్తానికి అమ్మేలా ఒప్పందం జరిగినట్లుగా ఆధారాల్ని స్వాధీనం చేసుకుంది. ముడా ప్లాట్ల కేటాయింపు ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల బినామీలతో పాటు డమ్మీ వ్యక్తుల పేరు మీద జరిగినట్లు ఈడీ ఆరోపించింది.సోదాల్లో తమకు ప్లాట్లు కేటాయించినందుకు ప్రతిఫలంగా పలువురు అప్పటి ముడా చైర్మన్, ముడా కమీషనర్‌కు భారీ మొత్తంలో స్థిరాస్తుల్ని కట్టబెట్టినట్లుగా తమకు పలు ఆధారాలు లభించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.కాగా, గతంలో ముడా కమిషనర్‌గా పనిచేసిన జీటీ దినేష్‌కుమార్ బంధువుల పేరిట ఆస్తులు, లగ్జరీ వాహనాలు ఇతర కొనుగోళ్లకు సంబంధించి సహకార సంఘం ద్వారా డబ్బు మళ్లించినట్లు తేలిందని ఈడీ ఆరోపించింది.ఏమిటీ ముడా వివాదం? సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు వివాదానిది మూడు దశాబ్దాల పై చిలుకు నేపథ్యం. మైసూరు జిల్లా కెసెరె గ్రామంలో సీఎం భార్య పార్వతికి 3 ఎకరాల 16 గంటల భూమి ఉంది. దేవనార్ 3ఫేజ్ లేఔట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. పరిహారంగా 50:50 నిష్పత్తి పథకం కింద 2021లో మైసూర్‌లోని ఖరీదైన విజయనగర ప్రాంతంలో ఏకంగా 14 ఖాళీ ప్లాట్లను కేటాయించింది.‘‘పార్వతి నుంచి తీసుకున్న భూమి కంటే వీటి విలువ ఏకంగా రూ.45 కోట్లు ఎక్కువ. 50: 50 పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను సొంతం చేసుకుంది’’ అంటూ అబ్రహాం అనే ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి బహుమతిగా ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పగా ఇతరుల భూమిని అక్రమంగా లాక్కున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో పార్వతి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సిద్ధరామయ్యే సీఎం. ఆమెకు ప్లాట్లు కేటాయించాలని 2017లో ముడా నిర్ణయించింది.ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని విపక్షాలంటున్నాయి. సిద్ధరామయ్య మాత్రం, ‘‘నేను సీఎంగా ఉన్నంతకాలం పరిహారమివ్వడం కష్టమని అధికారులు చెప్పారు. 2021లో బీజేపీ హయాంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ప్లాట్లు కేటాయించారు’’ అని వాదిస్తున్నారు. -
హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?... ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
-
నిధులెందుకు మళ్లించారు?.. కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ) ఖాతాల్లోకి హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?, రేస్ నిర్వహణ ఒప్పందాలను అతిక్రమించి ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించాలని మీరు ఎందుకు ఆదేశించారు?, ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతి లేకుండానే నిధులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?, మీరు చెబితేనే అధికారులు నగదు బదిలీకి పాల్పడ్డారా?, విదేశీ కంపెనీకి నగదు చెల్లింపులో ఆర్బీఐ నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. ఈసీ అనుమతి తీసుకోవాలని మీకు తెలియదా?, ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి చేకూరిన లబ్ధి ఏంటి?.. అంటూ మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు ఏడు గంటలపాటు విచారణ కొనసాగింది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కేటీఆర్ 10.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన మొబైల్ ఫోన్‌ను అధికారులు సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేయించారు. అనంతరం మూడో అంతస్తులో జేడీ రోహిత్ ఆనంద్ ముందు ఓ న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నించింది. మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చారు. సాయంత్రం 5–30 గంటల వరకు విచారణ కొనసాగింది. రెండు డాక్యుమెంట్లు సమర్పించిన కేటీఆర్ఈ నెల 8, 9వ తేదీల్లో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అందజేసిన డాక్యుమెంట్ల ఆధారంగా కూడా ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అవసరమైతే మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్, ఆస్తుల వివరాలు ఆరా తీయగా, అన్నీ అందిస్తానని కేటీఆర్ తెలిపారు. అలాగే ఈడికి రెండు డాక్యుమెంట్లను (ఫార్ములా–ఈ పైన నీల్సన్ సంస్థ రూపొందించిన నివేదిక, తెలంగాణ ఈవీ పాలసీ –2020) ఇచ్చిన కేటీఆర్ అందుకు సంబంధించి వారి నుంచి రశీదు తీసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేసినట్లు వెల్లడివిశ్వసనీయ సమాచారం మేరకు.. కేటీఆర్ చాలా ప్రశ్నలకు విపులంగా సమాధానం ఇవ్వగా..నిధుల మళ్లింపు అంశం, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చిందన్న ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు దాటవేశారు. మరికొన్నింటికి ముక్తసరిగా జవాబులిచ్చారు. మంత్రిగా తనకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు. బిజినెస్ రూల్స్, ఆర్బీఐ నిబంధనల ప్రకారమే ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదనే ఎఫ్ఈవోకు చెల్లింపులు జరిపామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హెచ్ఎండీఏ బోర్డు నుంచి మంజూరైన రూ.45.71 కోట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని చెప్పారు. కేటీఆర్ చెప్పిన అంశాలన్నీ అధికారులు రికార్డ్ చేసినట్టు సమాచారం. ఎఫ్ఈఓ ప్రపోజల్స్ ఎవరు తీసుకొచ్చారు? కంపెనీనే నేరుగా సంప్రదించిందా? లేక ఇతర ప్రైవేట్ కంపెనీలు ఈ కార్ రేస్ ఫార్ములాను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయా? అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈవెంట్ నిర్వహణకు స్పాన్సర్‌గా అగ్రిమెంట్ చేసుకున్న ఏస్ నెక్సŠట్ జెన్ సంస్థ గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం. పటిష్ట బందోబస్తు .. ఉద్రిక్తతకేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఈడీ కార్యాలయంలోకి వెళుతున్న సమయంలో పార్టీ శ్రేణులు పెద్దపెట్టున జై తెలంగాణ నినాదాలతో ఆయన వాహనం వైపు దూసుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, మన్నె క్రిశాంక్, సుమిత్రానంద్, పావని గౌడ్, కీర్తిలత గౌడ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5–30 గంటలకు కేటీఆర్ తిరిగి వెళ్లే సమయంలోనూ కొందరు నాయకులు, కార్యకర్తలు అక్కడే ఉండి జై తెలంగాణ నినాదాలు చేశారు. -
లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో కేటీఆర్(KTR) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీపైనే కేటీఆర్‌ను ఈడీ(ED) ప్రశ్నించింది. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అడిగిన ప్రశ్ననే పదేపదే అడిగారు. ఎన్ని సార్లు అయినా విచారణకు వస్తానని చెప్పా. రేవంత్‌పై ఏసీబీ కేసు ఉందని.. నాపై ఏసీబీ కేసు బనాయించారు. రేవంత్‌పై ఈడీ కేసు ఉందని.. నాపై ఈడీ కేసు బనాయించారు.’’ అని ఆయన మండిపడ్డారు‘‘న్యాయ స్థానాలపై మాకు విశ్వాసం ఉంది. లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎన్ని ప్రశ్నలు అడిగిన సమాధానం చెబుతా. నేను ఎలాంటి తప్పు చేయలేదు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని, చట్టాలను గౌరవించే పౌరుడిని.. ఏ తప్పు చేయకపోయినా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు పెడితే విచారణ సంస్థలను గౌరవించి విచారణకు హాజరయ్యారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి ఈ రోజు విచారణకు పిలిస్తే హాజరయ్యాను. రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి.ఇదీ చదవండి: ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్..రెండు సంస్థలు ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తా. పూర్తిగా విస్తరణ సహకరిస్తాను అని చెప్పాను. తప్పకుండా నా నిజాయితీని రుజువు చేసుకుంటానని చెప్పాను. ఈ విచారణకు దాదాపు 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. నేను నిజాయితీపరుడ్ని.. ధైర్యంగా ఎదుర్కొంటా. 10 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయొచ్చు. పెన్షన్ ఇయ్యొచ్చు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే జడ్జి ముందు కూర్చుందాం. మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి న్యాయమూర్తి ముందు కూర్చుంటాం.. ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఒక 50 లక్షల రూపాయలతో ఓడిసిపోతుంది విచారణ. అనవసరంగా 10 కోట్ల ఖర్చు ఎందుకు?’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ.. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘‘జైలుకు వెళ్లడానికి కేటీఆర్ సిద్ధమవ్వాలి. 4 జతల డ్రెస్‌లు, టవల్, బ్లాంకెట్, హ్యాండ్ కర్చీఫ్. సోప్, అవకాయ, స్వెటర్ దగ్గర పెట్టుకోవాలి. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు (కటకటాల వెనుక కూడా ఫ్యాషన్ కీలకం), ఒక హాయిగా ఉండే వెచ్చని దుప్పటి, టవల్ (జైలులో కూడా పరిశుభ్రత ముఖ్యం), కర్చీఫ్(భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు), సబ్బులు(ఆ "క్లీన్ ఇమేజ్"ని కొనసాగించడానికి), ఒక ప్యాకెట్ ఊరగాయ(ఎందుకంటే జైలు భోజనం ఫైవ్ స్టార్ కాదు) తీసుకెళ్లండి.. స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటూ కేటీఆర్‌కు రాజా సింగ్ చురకలు అంటించారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. Karma doesn’t forgetI have been thrown in jail by both the Congress and BRS/TRS governments after they filed false cases against me. I know exactly how the game works.So, @KTRBRS ji, here’s a little checklist to pack before heading to jail:👉Four sets of clothes – fashion…— Raja Singh (@TigerRajaSingh) January 16, 2025 -
ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్
-
ఫార్ములా ఈ-రేస్ కేసులో కొనసాగుతున్న కేటీఆర్ ఈడీ విచారణ
-
Watch Live: ఈడీ ముందుకు కేటీఆర్
-
కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం..
ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణదాదాపు 7 గంటల పాటు కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీఫార్ములా- ఈ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్. కొనసాగుతున్న విచారణ.. ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటుగా విచారణ కొనసాగుతోందిమరోవైపు.. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన నెలకొంది. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కేటీఆర్ విచారణ సందర్బంగా ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసు వాహనాలల్లో వారిని తరలించారు. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. ఈడీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ విచారణ కోసం ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈడీ ఆపీసు వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మరోవైపు, ఈడీ ఆఫీసు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈడీ ఆఫీసుకు బయలుదేరిన కేటీఆర్గచ్చిబౌలి నివాసం నుంచి బయల్దేరిన కేటీఆర్మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం!ఏసీబీ విచారణ ముందు.. నందినగర్ నివాసంలో కీలక నేతలతో నేతలు చర్చలు జరిపిన కేటీఆర్ఇవాళ్టి విచారణకు మాత్రం గచ్చిబౌలి నివాసం నుంచే ఈడీ ఆఫీస్‌కు..ఈడీ విచారణ వేళ ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్ఫార్ములా-ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందిఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందిఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవుమంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తానుఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది...ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలిఅందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నానురాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది.కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందిఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతినయా పైసాకు లెక్క ఉందిమరి అలాంటి అప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందిఇలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుందికచ్చితంగా ఈ అంశం లో నిజమే గెలుస్తుంది... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయిఅప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఒంటరిగానే..ఈడీ విచారణకు కేటీఆర్(KTR) లాయర్లకు అనుమతి నిరాకరణ కేటీఆర్ ఒక్కరే విచారణకు హాజరుఇంతకు ముందు ఏసీబీ విచారణ టైంలో లాయర్ రగడకోర్టు అనుమతితో చివరకు లాయర్‌ను ఏసీబీ విచారణకు వెంట తీసుకెళ్లిన కేటీఆర్గతంలో ఇచ్చినా..కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో.. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా(FEMA) ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై దర్యాప్తు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిల విచారణ పూర్తిగత వారమే కేటీఆర్‌ను విచారించాల్సి ఉండగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంతో గడువు కోరిన కేటీఆర్దీంతో ఇవాళ(జనవరి 16న) విచారణకు రమ్మని పిలిచిన ఈడీతప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
ఈడీ విచారణకు వెళ్తున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రకటించారు. ఈ రేసు కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు కేటీఆర్ తెలిపారు. గతంలో విచారణకు పిలిచినప్పుడు కొంత సమయం కావాలని కేటీఆర్ కోరిన విషయం తెలిసిందే. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన. విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది. ఏసీబీ కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా వెనక్కు తీసుకోవాల్సి రావటంతో ఇక ఆయన విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీంతో ఈడీ విచారణపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
కేజ్రీవాల్‌కు మరింత టెన్షన్.. ఈడీ విచారణకు కేంద్రం అనుమతి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇంతలోనే కేజ్రీవాల్‌ను మరో కష్టం చుట్టుముట్టింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతి ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఈ అనుమతిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీకి అనుమతినిచ్చింది. ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌పై అభియోగాల నమోదుపై స్టే విధించింది. ఇందుకోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్ఏ కింద ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన అనుమతి లేకుండానే ట్రయల్ కోర్టు ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకుందని కేజ్రీవాల్ వాదించారు. సీబీఐ తర్వాత ఇప్పుడు ఈడీకి ఇందుకు అనుమతి లభించింది. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ గత ఏడాది ఆగస్టులో అవసరమైన ఆమోదం పొందింది. అయితే ఈడీ ఇందుకు ఇంకా ఆమోదం పొందలేదు. అయితే ఇప్పుడు హోం మంత్రిత్వ శాఖ స్వయంగా కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకునేందుకు అనుమతినిచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్లో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ 'సౌత్ గ్రూప్' నుండి లంచం తీసుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బృందం దేశ రాజధానిలో మద్యం అమ్మకాలు, పంపిణీని పర్యవేక్షించింది. 2021-22 సంవత్సరానికి ఢిల్లీ ఆప్ ప్రభుత్వం రూపొందించిన ఎక్సైజ్ విధానం నుంచి ఈ బృందం లబ్ది పొందిందనే ఆరోపణలున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి -
ఈనెల 16న ఈడీ ముందుకు కేటీఆర్
-
నేడు ఏసీబీ విచారణకు IAS అధికారి అరవింద్ కుమార్
-
కేటీఆర్‌కు బిగ్ షాక్.. వాట్ నెక్స్ట్?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కోరగా.. ఆ విషయంలోనూ ఊరట ఇవ్వలేదు. దీంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కేటీఆర్(KTR)కు ఊరట ఇచ్చింది. తీర్పు ఇచ్చేంతవరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని కోర్టు దర్యాప్తు సంస్థలకు సూచించింది. దీంతో ఇవాళ్టి వరకు ఎలాంటి చర్యలకు అవి ఉపక్రమించలేదు. మరోవైపు.. ఈ కారణం చూపిస్తూనే ఆయన దర్యాప్తు సంస్థల నుంచి విచారణ విషయంలో ఊరట కోరారు. అయితే తాజా తీర్పు నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ బీఆర్ఎస్(BRS Party) శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.కోర్టు తీర్పు అనంతరం బంజారాహిల్స్ నందినగర్(Nandi Nagar)లోని కేటీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. తీర్పు వేళ ఆయన సోదరి కవితతో పాటు హరీష్‌రావు, మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు అక్కడికి చేరుకుని కేటీఆర్‌తో మంతనాలు జరుపుతున్నారు. అయితే.. ఈ తీర్పును సవాల్ చేసే యోచనలో బీఆర్ఎస్ లీగల్ టీం ఉన్నట్లు సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల కాపీ ఇంకా అందలేదు. సాయంత్రంలోపు అందే అవకాశం ఉంది. అవి అందాక తదుపరి చర్యలపై ఆలోచన చేస్తాం అని లీగల్ టీం ప్రకటించింది. మరోవైపు..ఏసీబీ(ACB) ఇప్పటికే ఆయన్ని 9వ తేదీన విచారణకు రావాలంటూ రెండోసారి నోటీసులు పంపింది. తన వెంట లాయర్‌ను అనుమతించకపోవడంతో సోమవారం ఆయన విచారణకు హాజరుకాకుండానే ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణ టైంలోనే కేటీఆర్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఆయన్ని ఈ కేసులో ఈడీ సైతం విచారణ జరపాల్సి ఉంది. తాజాగా.. హైకోర్టు క్వాష్ కొట్టేయడంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: కేటీఆర్ క్వాష్ కొట్టివేత, హైకోర్టు ఏం చెప్పిందంటే.. -
కేవీరావుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్‌ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.సండూరు పవర్ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందినా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారుడిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందికేవీ రావు నాకు తెలియదు అని చెప్పానుఅతనికి నాకు ఎలాంటి సంబంధం లేదుకాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను తిరుమల కు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పానునేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధంమే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి రావు చెపుతున్నాడుకాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చునేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి అని కోరానురంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించిందినాకు సంబంధం లేదు అని చెప్పానునేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమేశ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పానుశరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారుకుటుంబ రీలేషన్ అని చెప్పానుకాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారులుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళానుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పానువిక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారువిక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదుసండుర్ పవర్ కంపెనిలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారుకొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను -
ఫార్ములా కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసులో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి మరింత సమయం కోరారు. దీంతో, ఈనెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు.ఫార్ములా ఈ-కారు రేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిన్న బీఎల్ఎన్ రెడ్డి, నేడు అరవింద్ కుమార్‌ను ఈడీ విచారించాల్సి ఉండగా.. హాజరయ్యేందుకు సమయం కావాలని వీరిద్దరూ కోరారు. మూడు వారాల సమయం కావాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. దీంతో, స్పందించిన ఈడీ.. రెండు వారాల సమయం కుదరదని చెప్పింది. ఈనెల 8వ తేదీన విచారణకు రావాలని బీఎల్ఎన్ రెడ్డికి మరోసారి ఈడీ.. నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈనెల 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో, వీరిద్దరూ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తకరంగా మారింది.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈనెల 7వ తేదీన ఈడీ అధికారులు విచారించనున్నారు. అయితే, కేటీఆర్.. ఈడీ వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక, కారు రేసులో విదేశీ కంపెనీకి నిధులు మళ్ళించడంపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్మెంట్ను కూడా ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కంటే ముందే ఏ2, ఏ3 అయిన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. కానీ, అనూహ్యంగా వారిద్దరూ తమకు సమయం కావాలని కోరారు. దీంతో, ఈడీ అధికారులు ముందుగా కేటీఆర్‌నే విచారించాల్సి వస్తోంది. -
ఈ-కార్ రేస్ కేసులో అధికారులకు ఈడీ మళ్లీ సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్ కేసులో అధికారులకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరుకావాలని హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి, అరవింద్‌కుమార్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే, నేడు ఈడీ విచారణకు వారు హాజరు కావాల్సి ఉండగా.. విచారణకు మరింత సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు. దీంతో 8, 9 తేదీల్లో హాజరుకావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది.తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. రేపు ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరవనున్నారు. ఈనెల ఏడో తేదీన కేటీఆర్.. ఈడీ ఎదుట హాజరు కానున్నారు.ఈ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్-ఏ1, ఐఏఎస్ అరవింద్ కుమార్-ఏ2, బీఎల్ఎన్ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ.55కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్ఈవోకు సంబంధించిన బదిలీలపై ఈడీ విచారించనుంది.ఇదీ చదవండి: రెండు రోజుల్లో సర్కార్ అవినీతి స్కాం బయటపెడతా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి -
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఈడీ విచారణ
-
కారు రేసు కేసులో ట్విస్ట్.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నేడు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన వెళ్లలేదు. విచారణకు మరింత సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు.ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు నేడు విచారించాల్సి ఉండగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని బీఎల్ఎన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి ఆయన మెయిల్ పంపారు. దీంతో, బీఎల్ఎన్ రెడ్డి మెయిల్‌కు ఈడీ సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో చెబుతామని అధికారులు చెప్పారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. రేపు ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరవనున్నారు. ఈనెల ఏడో తేదీన కేటీఆర్.. ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్-ఏ1, ఐఏఎస్ అరవింద్ కుమార్-ఏ2, బీఎల్ఎన్ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ.55కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్ఈవోకు సంబంధించిన బదిలీలపై నేడు ఈడీ విచారించనుంది. -
ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు
-
ఫార్ములా-ఈ కార్ల రేసు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఈడీ సమన్లు... వచ్చే నెల 7వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశం
-
‘ఫార్ములా–ఈ’ రేసు కేసు: 7న విచారణకు రండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌కు శనివారం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సహ నిందితు లుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బి.లక్ష్మీనరసింహారెడ్డి (బీఎల్ఎన్ రెడ్డి)లకు కూడా సమన్లు జారీ చేసింది. వీరిలో బీఎల్ఎన్ రెడ్డిని వచ్చే నెల 2న, అర్వింద్‌కుమార్‌ను 3వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముగ్గురినీ ఆయా తేదీల్లో శుక్రవారం వేర్వేరుగా సమన్లు జారీ చేసింది. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆ సమన్లలో పేర్కొన్నారు. ఏసీబీ కంటే దూకుడుగా.. హైదరాబాద్ నగరంలో ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఏ2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ3గా చేర్చింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఏసీబీ దర్యాప్తు కన్నా ఈడీ మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. నిందితులను విచారించేందుకు సమన్లు జారీ చేసింది. ఈడీ దర్యాప్తులో గుర్తించే అంశాల ఆధారంగా.. కేసులో ముందుకు వెళ్లనుంది. ఇదే సమయంలో ‘ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’ కింద కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిసింది. నిధుల మళ్లింపుపైనే ఈడీ ఫోకస్.. ఫార్ములా–ఈ కార్ రేస్ సీజన్–10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ విభాగం (ఎంఏయూడీ), ఫార్ములా–ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈవో (ఫార్ములా–ఈ ఆపరేషన్స్) సంయుక్తంగా సిద్ధమయ్యాయి. రేసు నిర్వహణకు సంబంధించి స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (90,00,000 బ్రిటన్ పౌండ్లు)ను ఎఫ్ఈవోకు చెల్లించేలా 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం చేసుకున్నారు. కానీ అంతకన్నా ముందే నిధులు చెల్లించాలంటూ సెప్టెంబర్ 25న తొలి వాయిదాగా 22,50,000 పౌండ్లు (మన కరెన్సీలో రూ.22,69,63,125), 29వ తేదీన రెండో వాయిదాగా 22,50,000 పౌండ్లు (అయితే పన్నులు, కమిషన్ కలిపి రూ.23,01,97,500) చెల్లించాలంటూ ఎఫ్ఈవో ఇన్వాయిస్లు పంపింది. దీనిపై అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేశారు. అక్టోబర్ 3న మొదటి వాయిదా కింద రూ.22,69,63,125, అక్టోబర్ 11న రెండో వాయిదా కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ మొత్తం హెచ్ఎండీఏ బోర్డ్ ఖాతా నుంచే బ్రిటన్‌కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. దీనిపై బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖకు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది. ఎవరి ఆదేశాలతో ఇది చేశారు?ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండీఏ రికార్డులపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. వీరి నుంచి సేకరించే అంశాల ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. -
ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. తాజాగా కారు రేసింగ్‌కు సంబంధించి ఏసీబీ.. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించింది. ఇదే సమయంలో ఈ కేసు వివరాలను ఏసీబీ అధికారులు ఈడీకి అందజేశారు.తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో వివరాలను ఈడీకి అందజేశారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఏసీబీ.. ఈడీకి అందించింది. ఇక, కొన్ని గంటల ముందే ఈడీ.. ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన కేటీఆర్ విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ -కారు రేసింగ్ కేసు విషయమై హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కీలక అంశాలను ప్రస్తావన చేసిన ఏసీబీ. కౌంటర్లోని విషయాలు.. కారు రేసింగ్‌లో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేర పూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని కౌంటర్లో పేర్కొంది. క్యాబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశాడు. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారు. దీని వలన హెచ్ఎండీఏకు 8 కోట్లు అదనపు భారం పడింది. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందని తెలిపింది.అలాగే, కేటీఆర్ వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏసీబీ స్పష్టం చేసింది. అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్‌పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపింది. రాజకీయ కక్షతోనో, అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామని చెప్పడం సరైనది కాదు. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారు. ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు ఆయనే చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున కేసు కొట్టివేయాలని కోరడం సరైంది కాదు. తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. -
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు
-
కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్(KTR)కు తాజాగా ఈడీ(enforcement Directorate) అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ.. కేటీఆర్ సహా అరవింద్ కుమార్‌కు సైతం నోటీసులు ఇచ్చింది.వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి తాజాగా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా వచ్చే నెల ఏడో తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేస్ (Formula E-Car Race) కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలోనే శుక్రవారం.. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో ‘కేటీఆర్ నాట్ టు అరెస్ట్’ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా.. న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించారు. -
కేంద్ర మంత్రి ఆప్తుడి ఇంట ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: హస్తినలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎల్జేపీ(రామ్ విలాస్ వర్గం) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన హులాస్ పాండేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసుకుంది. పాట్నా, బెంగళూరు, ఢిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాలతోపాటు బంధవుల ఇళ్లలోనూ తన బృందాలతో తనిఖీలు జరిపింది.ఆర్థిక లావాదేవీల అవకతవకలకు సంబంధించి.. హులాస్ పాండే(Hulas Pandey) మీద గతంలో చాలా ఆరోపణ వచ్చాయి. అయితే ఈడీ మాత్రం దాడులకు సంబంధించిన ప్రత్యేకమైన కారణాలను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. హులాస్ పాండే ఎల్జేపీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. పాండే గతంలో బీహార్ ఎమ్మెల్సీగా పని చేశారు. తొలినాళ్లలో నితీశ్ కుమార్(Nitish Kumar) జేడీయూలో పని చేసిన ఈయన.. తర్వాత ఎల్జేపీ(LJP)లో చేరారు. అప్పటికే పాండే.. చిరాగ్‌ల మధ్య మంచి స్నేహానుబంధం ఉంది. ఇక ఎల్జేపీలో చేరాక.. ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నింటిని ఇతనే చూసుకునేవారు. ఇదిలా ఉంటే.. 2012 నాటి హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పాండే పేరును చేర్చారు. దీంతో.. అనివార్య పరిస్థితుల మధ్య కిందటి ఏడాది డిసెంబర్లో ఎల్జేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పాండే రాజీనామా చేయాల్సి వచ్చింది. వివాదాస్పద ప్రకటనతో అప్పుడప్పుడు వార్తల్లోనూ నిలుస్తుంటారీయన.ఏమీటా కేసు..2012 జూన్ 1వ తేదీన రణ్వీర్ సేన అధినేత బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా భోజ్‌పుర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ జరిపిన సీబీఐ పాండే మీద సంచలన ఆభియోగాలు నమోదు చేసింది. ముఖియాకు పేరు వస్తుండడంతో తన రాజకీయ పలుకుబడి మసకబారిపోతుందనే భయంతోనే పాండే ఈ హత్య చేయించాడని పేర్కొంది. అయితే..పాండే మాత్రం ఆ ఆరోపణలను రాజకీయ కుట్రగా ఖండిస్తూ వస్తున్నారు. ఈలోపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సీబీఐ ఛార్జ్‌షీట్‌ను తప్పుబట్టింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. అయితే.. ఈ ఉదయం నుంచి ఆయనకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ(ED) బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా.. స్థానిక పోలీసుల సపోర్ట్ తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇదీ చదవండి: అయోధ్య గ్రేటర్ దేన్ ఆగ్రా! -
ఈనాడు చెవిలో ఈడీ చెప్పిందా?
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయంపై ‘ఈనాడు’ తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్లగక్కింది. 150 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఏటా రూ.3,000 కోట్లకు పైగా లాభాలను ఆర్జిస్తున్న కంపెనీ రూ.494 కోట్లు సమకూర్చుకోవడం కూడా పెద్ద వింత అయినట్లు ఒక విషపూరిత కథనాన్ని వండివార్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దర్యాప్తు అంతా ఈనాడుకు చెవిలో చెబుతున్నట్లుగా ‘‘రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?’’ అంటూ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.స్వయం ప్రతిపత్తి కలిగిన ఈడీ లాంటి సంస్థ దర్యాప్తు చేస్తున్న విషయాలే కాకుండా ఎవర్ని, ఎప్పుడు, ఎలా విచారిస్తారు...? వారిని ఏ ప్రశ్నలు అడుగుతారు? అనే వాటిని కథనంలో ప్రచురించడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజంగానే విషయాలను ఇలా బయటకు చెబుతుంటే ఆ దర్యాప్తు ఎంత పక్షపాతంతో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు! లేదంటే ఈనాడు తన అజెండాకు అనుగుణంగా ఈడీ పేరుతో ఈ కథనాలను వండివార్చి ఉండాలి. ఈ రెండింటిలో ఏది నిజమైనా ఈనాడు ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి అజెండాకు డప్పు కొడుతుందో ఊహించవచ్చు!!అది వ్యూహాత్మక పెట్టుబడిఅరో ఇన్ఫ్రా వ్యూహాత్మక పెట్టుబడిలో భాగంగా కాకినాడ డీప్ వాటర్‌పోర్టులో వాటాలు కొనుగోలు చేసింది. పోర్టులో 41 శాతం వాటాలను కేవీ రావు పూర్తి సమ్మతితోనే 2020లో విక్రయించడంతో పాటు ఆ వాటాల విలువ రూ.494 కోట్లను స్వీకరించారు. కాకినాడ డీప్‌వాటర్ పోర్టు దగ్గరలోనే కాకినాడ సెజ్‌ను రూ.1,700 కోట్లకు కొనుగోలు చేయడంతో పాటు ఆ సెజ్‌లో రూ.2,400 కోట్లతో మరో పోర్టును కూడా అరో ఇన్ఫ్రా నిర్మిస్తోంది. ఇదంతా వ్యూహాత్మక వ్యాపార ప్రణాళికలో భాగంగా జరిగింది.సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని అరబిందో సంస్థ భావించింది. భవిష్యత్‌లో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన ( రైట్ టు ఫస్ట్ రెఫ్యూజల్) ఒప్పందంలో ప్రధానాంశం. ఒకవేళ బెదిరించి ఉంటే మొత్తం పోర్టునే స్వాధీనం చేసుకుని ఉంటారు కదా! 41 శాతం వాటా కొనుగోలు తర్వాత కూడా పోర్టు యాజమాన్య హక్కులు కేవీరావు చేతిలోనే ఉన్నాయి కదా. ఆయన్ను నిజంగానే బెదిరించి ఉంటే అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్సŠచ్ంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ), నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(ఎన్ఏఎల్ఎస్ఏ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు.న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కేవీ రావుకు అభ్యంతరం ఉంటే వాటాల బదిలీ పూర్తయ్యేలోగా వివిధ దశల్లో ఎప్పుడైనా సరే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన ఏ దశలో కూడా ఫిర్యాదు చేయలేదు. అంటే ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలను విక్రయించారన్నది స్పష్టమవుతోంది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేశారంటే దీని వెనుక కుట్రను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆడిట్ సంస్థను ఎంపిక చేసేది ఆ శాఖ కార్యదర్శిప్రభుత్వాలు వివిధ విభాగాల్లో ఆడిటింగ్ నిర్వహించడం సాధారణం. ఏదైనా విభాగంలో ఆడిటింగ్ నిర్వహించాలంటే ఆ శాఖకు చెందిన కార్యదర్శి ఆడిటింగ్ సంస్థను ఎంపిక చేస్తారు. ఇక్కడ కూడా అదే విధంగా పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ అనే ఆడిటింగ్ సంస్థను ఎంపిక చేశారు. ఆ ఆడిటింగ్ సంస్థకు, విజయసాయిరెడ్డికి ఏమిటి సంబంధం? లేని సంబంధాలను అంటగట్టి మసిబూసి మారేడు కాయ చేయాలని, తద్వారా ఎల్లో గ్యాంగ్‌కు ప్రయోజనం కలిగించేందుకు ఈనాడు పడరానిపాట్లు పడుతోంది.తప్పుడు ఫిర్యాదు... వెంటనే కేసుఅనంతరం అసలు పాత్రధారి తెరపైకి వచ్చారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్‌పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు ఇప్పించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన అరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన నాలుగేళ్ల తరువాత ఫిర్యాదు చేయడం చంద్రబాబు పక్కా కుట్రను స్పష్టం చేస్తోంది. విచిత్రం ఏమిటంటే... కేవీ రావు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు చేసిన ఈ నెల 2నే సీఐడీ కేసు నమోదు చేసేయడం గమనార్హం ప్రైవేట్ ఒప్పందంతో ప్రభుత్వానికి ఏం సంబంధం?అరబిందో సంస్థ 150 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందింది. ఏటా రూ.72 వేల కోట్ల టర్నోవర్, రూ.3 వేల కోట్ల నికర లాభం నమోదు చేస్తోంది. ఆ వ్యాపార లావాదేవీ పూర్తిగా అరబిందో సంస్థ, కేవీ రావు మధ్య జరిగిన ప్రైవేట్ ఒప్పందం. అందులో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికిగానీ, ఇతరులకుగానీ ఎలాంటి సంబంధం లేదు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో తల దూర్చడం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దందా సాగిస్తుండటం విభ్రాంతికరం. రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం జోక్యం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతకుముందు జరిగిన ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది ?ప్రభుత్వ పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది బాబేకాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమేనన్నది అసలు వాస్తవం. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో ఏపీ ప్రభుత్వం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్ పోర్టును కారు చౌకగా కట్టబెట్టేశారు. కానీ తరువాత అసలు విషయం వెలుగు చూసింది. మలేషియా కంపెనీ ముసుగులో చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావు ఆ పోర్టును దక్కించుకున్నట్లు బయటపడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.అంతా బాబు కుట్ర స్క్రిప్టే...కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాను తెరపైకి తెచ్చి జనసేనలోని తన కోవర్ట్, మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కాకినాడ పర్యటనకు పంపారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్దకు చేరుకుని రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో డ్రామా పండించారు. యాంకరేజ్ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే వారు ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబునే కదా!! -
రేపు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులకు సమన్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఏ–2గా ఉన్న పురపాలకశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఏ–3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ సోమవారం సమన్లు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఏసీబీ నుంచి ఫార్ములా–ఈ కారు రేసు ఒప్పందాలకు సంబంధించి సేకరించిన పత్రాలు, ఎఫ్ఐఆర్తోపాటు బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. హెచ్ఎండీఏ సాధారణ నిధుల నుంచి యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు రూ.45,71,60,625 సొమ్మును విదేశీ కరెన్సీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు. దీంతో సదరు బ్యాంకు అధికారుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకు అధికారులను సైతం ప్రశ్నించనున్నారు. ఓవైపు ఈ కేసులో ఈడీ అధికారులు వేగం పెంచగా మరోవైపు తెలంగాణ ఏసీబీ సైతం కీలకాంశాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని.. కానీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు ఆదేశించడంతో ఆధారాల సేకరణపై ఏసీబీ దృష్టి పెట్టింది. తొలుత హెచ్ఎండీఏ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ వాంగ్మూలం నమోదుతో దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించనుంది. ఈడీ, ఏసీబీ దర్యాప్తులో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఏసీబీ సేకరించే పత్రాలు ఈడీకి ఉపయోగపడినట్లే ఈడీ దర్యాప్తులో మనీలాండరింగ్ కోణంలో ఏవైనా ఆధారాలు లభిస్తే ఈ కేసు మరో మలుపు తిరుగుతుందన్న చర్చ నడుస్తోంది. -
లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. మళ్లీ కేజ్రీవాల్ విచారణ
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం (డిసెంబర్ 21) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చారు.డిసెంబరు 5న ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను అనుమతి కోరింది. తాజాగా,లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చారు. దీంతో మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ విచారించనుంది.Delhi LG VK Saxena has given sanction to the Enforcement Directorate to prosecute AAP chief and Former Delhi CM Arvind Kejriwal in the excise policy case: LG OfficeOn December 5, the Enforcement Directorate sought permission for sanction of prosecution against Arvind Kejriwal.— ANI (@ANI) December 21, 2024 మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్,విడుదలమద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 13న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.మద్యం పాలసీ కేసు కథేంటీ?ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్‌సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి.రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. అరెస్టు చేసింది.ఇదే కేసులో కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు సైతం జైలు శిక్షను అనుభవించారు. బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా, కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈడీకి అనుమతివ్వడం చర్చాంశనీయంగా మారింది. -
ఫార్ములా కారు కేసులో ఈడీ, ఏసీబీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేస్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కోర్టును ఆశ్రయించడం కేసు తీవ్రతను మరింత పెంచింది.మరోవైపు.. ఈకేసులోకి ఈడీ ఎంటర్ కావడం ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ఈడీ ఈసీఐర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సెక్షన్లు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసుల వివరాల కోసం ఏసీబీకి ఈడీ లేఖ రాసింది.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. హెచ్ఎండీఏ, ఏంఏయూడీలోని మరి కొంత మందిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్‌ను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. ఎఫ్ఈవో నుంచి వచ్చిన ఈ-మెయిల్స్, ఎల్ఎఫ్ఏతో పాటు లావాదేవీల వివరాలు కూడా ఏసీబీ పరిశీలించనుంది. ఈ క్రమంలోనే నిందితులను ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. -
ఫార్ములా–ఈ ఫైర్!
రాష్ట్రంలో ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసు అంశం మంటలు రేపుతోంది. ఏసీబీ కేసు నమోదైన 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగడం, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈసీఐఆర్ నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ వ్యవహారం అసెంబ్లీని కూడా అట్టుడికించింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, అధికార కాంగ్రెస్ సభ్యుల విమర్శలతో సభ స్తంభించిపోయింది. ఫార్ములా–ఈ అంశంపై చర్చకు సిద్ధమని, సభలోనైనా సరే లేదా బీఆర్ఎస్ కార్యాలయానికి రమ్మన్నా సరే వస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసరగా.. కార్ల రేసు అంశంలో అణా పైసా అవినీతి జరగలేదని, కొందరు ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఏం లబ్ధి పొందారని ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది. దీనితో దూకుడు పెంచాలని నిర్ణయించిన ఏసీబీ.. అధికారులు, నిందితుల నుంచి వాంగ్మూలాలు తీసుకునేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇక ఈ అంశంలో రంగంలోకి దిగిన ఈడీ ... ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు’ నమోదు చేసింది. ‘ఫార్ములా–ఈ’పై ఈడీ కేసు నమోదుసాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏసీబీ పెట్టిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసింది. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నుంచి విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపు అంశంలో రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) గురువారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ‘ఫార్ములా–ఈ’కారు రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి పలు దఫాల్లో రూ.45,71,60,625 సొమ్మును యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు బదిలీ చేశారని పేర్కొంటూ.. మాజీ మంత్రి కేటీఆర్, మరో ఇద్దరు అధికారులను అందులో నిందితులుగా చేర్చారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో విచారణ కోసం ఈడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ శుక్రవారం ఏసీబీ డీజీ విజయ్‌కుమార్‌కు లేఖ రాశారు. విదేశీ కంపెనీతో జరిగిన నగదు లావాదేవీలు, ఇతర వివరాలన్నీ తమకు ఇవ్వాలని కోరారు. ఏసీబీ నుంచి అందిన వివరాల ఆధారంగా.. మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈసీఐఆర్ నమోదు చేశారు. అన్ని అంశాలను పరిశీలించి ‘ఫారిన్ ఎక్ఛ్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’కింద కూడా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీ..‘ఫార్ములా–ఈ’వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో... ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన అభియోగాలకు సంబంధించిన ఆధారాల సేకరణ, నిందితులు, కేసుతో సంబంధం ఉన్న వారి వాంగ్మూలాల నమోదుపై దృష్టిపెట్టారు. తొలుత ఈ అంశంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ నుంచి మరోమారు వివరాలు సేకరించనున్నారు. ఈ–కార్ రేసు నిర్వహణకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు, నిధుల చెల్లింపులు, ఇతర లావాదేవీల వివరాలు తీసుకోనున్నారు. హెచ్ఎండీఏ సాధారణ నిధుల నుంచి ఫార్ములా–ఈ రేసు నిర్వహణ కంపెనీ ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు నిధుల చెల్లింపునకు సంబంధించి.. అధికారుల మధ్య సంప్రదింపుల ఫైళ్లను పరిశీలించనున్నారు. కీలక డాక్యుమెంట్ల సేకరణతోపాటు ఎప్పటికప్పుడు వాటిని విశ్లేషించేలా దర్యాప్తు బృందం సభ్యులకు విధులు అప్పగించారు. ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రధాన నిందితుడు కేటీఆర్ ప్రధాన ప్రతిపక్షంలోని కీలక వ్యక్తి కావడంతో ఏసీబీ ఉన్నతాధికారులు నేరుగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు. కీలక ఆధారాల సేకరణ తర్వాత నిందితులకు నోటీసులు జారీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 30 వరకు అరెస్టు వద్దుసాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావుకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. అయితే కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్ (కేటీఆర్)కు సూచించింది. ఈ పిటిషన్‌పై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. లంచ్‌మోషన్ పిటిషన్ మేరకు.. ఫార్ములా–ఈ వ్యవహారంలో కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేరుస్తూ.. ఏసీబీ రెండు రోజుల క్రితం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ శుక్రవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ చేపట్టాల్సిన రోస్టర్ న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సెలవులో ఉండటంతో.. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ వద్ద విచారణ చేపట్టాలని న్యాయవాదులు ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు కోరారు. దీనిపై సీజే బెంచ్ అనుమతితో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జస్టిస్ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు.. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘2023 అక్టోబర్‌లో జరిగిన ఘటనపై 14 నెలలు ఆలస్యంగా ఈ నెల 18న సాయంత్రం 5.30 గంటలకు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే అవినీతి నిరోధక (పీసీ) చట్టంలోని సెక్షన్ 13(1)( ్చ), 13(2) కింద కేసు పెట్టడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులపై ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని లలితాకుమారి, చరణ్‌సింగ్ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని ఏసీబీ ఉల్లంఘించింది. ప్రొసీజర్ పాటించలేదు. ఎఫ్ఐఆర్ నమోదుకు 14 నెలలు ఎందుకు ఆగారో కారణాలు లేవు. నిందితులు వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి పొందారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండానే పీసీ యాక్ట్ సెక్షన్లు పెట్టారు..’’అని న్యాయమూర్తికి వివరించారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. 2022 అక్టోబర్ 25న ఫార్ములా–ఈ రేస్ నిర్వహణపై తొలి ఒప్పందం జరిగిందని.. 2023 అక్టోబర్‌లో నిధుల చెల్లింపు ఒప్పందం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని వివరించారు. నగదు చెల్లింపులో ప్రొసీజర్ పాటించలేదని ఏసీబీ పేర్కొనడం సరికాదని.. సీజన్ 9, 10, 11, 12 నిర్వహణ కోసం 2022లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. సీజన్ 9 నిర్వహణతో దాదాపు రూ.700 కోట్లు లాభం వచ్చిందని.. గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌ను నిలపడంలో ఫార్ములా–ఈ కీలక పాత్ర పోషించిందని, అంతర్జాతీయంగా పేరు వచ్చిందని వివరించారు. సీజన్ 10 నిర్వహణ నుంచి స్పాన్సర్ తప్పుకోవడంతో ప్రభుత్వమే ఆ బాధ్యతలు తీసుకుందని, అందులో భాగంగానే చెల్లింపులు జరిపిందని తెలిపారు. కానీ కొత్త ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించి రేసింగ్‌ను రద్దు చేసిందని.. రద్దుపై ఆర్బిట్రేషన్‌కు కూడా వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. రేసింగ్ జరిగి ఉంటే పెద్ద ఎత్తున లాభాలు వచ్చేవని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చామని ఏసీబీ పేర్కొందని, కానీ ఆ సంస్థపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని గుర్తు చేశారు. ఫిర్యాదుకు ముందే ప్రాథమిక విచారణ జరిపాంప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ అనేది ఎన్సైక్లోపీడియా కాదు. ఇది విచారణ ప్రారంభం మాత్రమే. అంతా ఎఫ్ఐఆర్లో ఉండదు. కొత్తగా నిందితులను చేర్చే అవకాశం ఉంటుంది. చార్జిషీట్లో మాత్రమే అన్ని వివరాలుంటాయి. ఫిర్యాదుకు ముందే ప్రాథమిక విచారణ జరిపాం. పిటిషనర్ ఎమ్మెల్యే కావడంతో గవర్నర్ నుంచి అనుమతి కూడా పొందాం. ఆ తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 2023 అక్టోబర్ 30న రెండో ఒప్పందం జరిగింది. కానీ అక్టోబర్ 3న (రూ.22,69,63,125 ప్లస్ పన్నులు అదనం), 11న (రూ.23,01,97,500 ప్లస్ పన్నులు అదనం).. అంటే ముందుగానే మొత్తం రూ.56 కోట్లు చెల్లింపులు చేశారు. రూ.700 కోట్లు లాభాలు వచ్చి ఉంటే స్పాన్సర్ ఎందుకు వెళ్లిపోతారు?’’అని ప్రశ్నించారు. ఫార్ములా–ఈ సంస్థకు డబ్బును విదేశీ కరెన్సీలో చెల్లించారని, దానితో హెచ్ఎండీఏపై అధిక భారం పడిందని తెలిపారు. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం రిజర్వుబ్యాంకు అనుమతి తీసుకోలేదని.. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదని వివరించారు. క్వాష్ పిటిషన్‌పై ఇంత అత్యవసరంగా విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కల్పించుకుని.. ‘‘పిటిషనర్ ఏం లబ్ధిపొందారు? ఎందుకు ఆ సెక్షన్లు పెట్టారు?’అని ప్రశ్నించారు. అదంతా దర్యాప్తులో తేలుతుందని ఏజీ బదులిచ్చారు. పిటిషనర్‌కు ఎలాంటి ఉపశమన ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు.ఎఫ్ఐఆర్ నమోదులో లోటుపాట్లు కేటీఆర్ తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం వాదిస్తూ.. ఫిర్యాదుకు ముందు విచారణ చేయడం కాదని, ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్కు ముందు ప్రాథమిక విచారణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని న్యాయమూర్తికి వివరించారు. ఫిర్యాదుకు ముందే విచారణ చేశామని, గవర్నర్ అనుమతి తీసుకున్నామని ఏజీ చెప్పడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎఫ్ఐఆర్ నమోదులో లోటుపాట్లు ఉన్నాయని, ప్రాథమిక విచారణ కూడా చేయలేదని పేర్కొన్నారు. సీఆరీ్పసీ సెక్షన్ 482 మేరకు హైకోర్టుకు ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు, అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకు విశిష్ట అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషనర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించారు. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజున రోస్టర్ న్యాయమూర్తి విచారణ చేపడతారని తెలిపారు. -
ఫార్ములా-ఈ రేసులు.. కేటీఆర్‌పై ‘ఈడీ’ కేసు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈకి సంబంధించిన లావాదేవీలను మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్‌తో పాటు ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు కొనసాగనుంది.కేసులో ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేటీఆర్‌పై ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది. కేటీఆర్‌తో పాటు మున్సిపల్ శాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌కుమార్,హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డిలపై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, ఫార్ములా ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు శుక్రవారం(డిసెంబర్ 20) సాయంత్రమే హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్‌ను ఫార్ములా ఈ కేసులో డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను 27 వరకు వాయిదా వేసింది. కేసు దర్యాప్తును ఏసీబీ కొనసాగించవచ్చని తెలిపింది. ఇంతలోనే కేటీఆర్‌పై ఇదే వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
రూ.22,280 కోట్ల ఆస్తుల పునరద్ధరణ
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆస్తులు పోగేసి వివిధ బ్యాంకులను మోసం చేసిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్థంగా చర్యలు తీసుకుంటోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకు రుణాలను ఎగవేసి పరారీలో ఉన్న విజయ్‌మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీతోపాటు వివిధ మోసాలకు పాల్పడిన వారికి చెందిన రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి బాధితులకు పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక నేరగాళ్లపై ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.సంపద రాబట్టేందుకు ఈడీ ప్రయత్నంనిధులకు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్లపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మంత్రి మాట్లాడారు. ‘ఆర్థిక నేరస్థులు బ్యాంకులను మోసం చేసి అక్రమంగా సంపాదించిన సంపదను తిరిగి రాబట్టేందుకు ఈడీ చాలా ప్రయత్నిస్తోంది. ప్రధాన కేసుల్లో పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ రికవరీ చేసింది. వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుద్ధరించాం. నీరవ్ మోదీ నుంచి రూ.1,052.58 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఈడీ అధికారులు తిరిగి అప్పగించారు. మెహుల్ చోక్సీకు చెందిన రూ.2,565.90 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వేలం వేయడానికి సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.ఎన్ఎస్ఈఎల్.. రూ.17.47 కోట్లు రికవరీవ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ సృష్టించే లక్ష్యంతో 2005లో ఏర్పాటు చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కుంభకోణంకు సంబంధించి రూ.17.47 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా మోసపోయిన పెట్టుబడిదారులకు తిరిగి ఈ డబ్బును ఇచ్చినట్లు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ఆధ్వర్యంలోని ప్రధాన కేసుల నుంచి కనీసం రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ విజయవంతంగా పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..బ్లాక్ మనీ చట్టంతో పెరిగిన సంఖ్య2015లో రూపొందించిన బ్లాక్ మనీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులను స్వచ్ఛందంగా బహిర్గతం చేస్తున్నట్లు తెలిపారు. విదేశీ ఆస్తులను ప్రకటించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2021-22లో 60,467 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకు పెరిగిందన్నారు. జూన్ 2024 నాటికి బ్లాక్ మనీ చట్టం కింద మొత్తం రూ.17,520 కోట్లకు సంబంధించి 697 కేసుల విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 163 ప్రాసిక్యూషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. పనామా పేపర్లు, పండోర పేపర్లు, హెచ్ఎస్బీసీ, ఐసీఐజే లీక్‌ల వంటి హైప్రొఫైల్ అంశాలకు సంబంధించి విచారణ సాగుతున్నట్లు స్పష్టం చేశారు. -
భూదాన్ స్కామ్.. ఈడీ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. జనార్థన్ రెడ్డితో పాటుగా మరో ముగ్గురిని కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు.రాష్ట్రంలో భూదాన్ భూముల కుంభకోణంపై ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. ఆయనతో పాటుగా మరో ముగ్గురిని ఈడీ అధికారులు విచారించనున్నారు. వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విచారణను హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆర్డీవో, ఎమ్మార్వోను విచారించి ఈడీ కీలక వివరాలను సేకరించింది.ఇదిలా ఉండగా.. మేడ్చల్ జిల్లాల్లో అమోయ్ కుమార్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ అధికారులు ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించారు. రూ.కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు కేటాయించడంపై ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతితోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన కీలక పత్రాల ఆధారంగా భూ ఆక్రమణలపై పూర్తి ఆధారాలను ఈడీ సేకరించి డీజీపీకి నివేదిక సమర్పించింది. -
సుప్రీం కోర్టు ఆమోదంతో రూ.4,025 కోట్ల ఆస్తులు అప్పగింత
సుప్రీం కోర్టు ఆమోదం మేరకు భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు చెందిన రూ.4,025 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు అందజేసింది. దీనికి సంబంధించి ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ తాజాగా వివరాలు వెల్లడించింది. ఎన్సీఎల్టీ ఆమోదం మేరకే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో మేజర్ వాటాలు కొనుగోలు చేసినట్లు గుర్తించడంతో ఆస్తులు అందజేస్తున్నట్లు పేర్కొంది.బ్యాంకు రుణ చెల్లింపుల్లో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై 2019లో భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆస్తులను జప్తు చేసింది. అంతకుముందు నెలలో ఆ రుణాలు చెల్లించలేక కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించింది. ఆ సమయంలో భూషణ్ పవర్ అండ్ స్టీల్ సమస్యకు సంబంధించి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ పరిష్కార ప్రణాళికను ఎన్సీఎల్టీ ఆమోదించింది. తర్వాత ఈడీ ఆస్తులను జప్తు చేసింది. ఎన్సీఎల్టీ ఆమోదంతోనే కంపెనీలో వాటాను చేజిక్కించుకునేందుకు బిడ్ వేసినట్లు సుప్రీం కోర్టులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్పష్టం చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.ఇదీ చదవండి: రైలు నుంచి కింద పడిన వస్తువులను ఈజీగా పొందండిలా..జేఎస్‌డబ్ల్యు స్టీల్‌ను 1982లో సజ్జన్ జిందాల్ స్థాపించారు. జిందాల్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (జిస్కో), జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్ (జేవీఎస్ఎల్) కలిసి జిందాల్ స్టీల్‌గా ఏర్పడ్డాయి. ఈ కంపెనీ యూఎస్‌లో ఏటా 35.7 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని అతిపెద్ద తయారీ యూనిట్ కర్ణాటకలోని విజయనగరలో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ ఉక్కు ఉత్పత్తి కేంద్రం. -
మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి ఈడీ బిగ్ షాక్
-
తెలంగాణలో పలు మెడికల్ కళాశాలల ఆస్తులు జప్తుచేసిన ఈడీ
-
మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం (నవంబర్21) విచారణ చేపట్టింది. మద్యం పాలసీ కేసు సంబంధించి ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే, ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.మద్యం పాలసీ కేసులో ఈడీ మద్యం పాలసీ కేసులో ఈడీ తాజాగా మరిన్ని ఆధారాల్ని సేకరించింది. సేకరించిన ఆధారాలతో అనుగుణంగా కేజ్రీవాల్‌ను విచారణ చేపట్టాలని కోరుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిశీలించింది. కేజ్రీవాల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రయల్ కోర్టు నిర్ణయం అనంతరం ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో ట్రయల్ కోర్టులో విచారణ కావాలని స్పష్టం చేసింది.దీంతో పలు మార్లు సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ స్పందించలేదు.ఈ తరుణంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. -
మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ స్కాంలో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ సీట్ల కేటాయింపులో గతంలో జరిగిన అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీల సిబ్బందిని విచారణకు పిలుస్తున్నారు. గురువారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుడు, చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు విచారణకు హాజరైనట్టు అధికారవర్గాల సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన లక్ష్మీనర్సింహారావును మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. ఏమిటీ కుంభకోణం? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి అనుబంధంగా ఉన్న 12 మెడికల్ కాలేజీల్లో పలు సీట్లను బ్లాక్ చేసి, అధిక ఫీజులకు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు గతేడాది (2023) జూన్‌లో సోదాలు జరిపారు. నీట్ పీజీ మెరిట్ ఆధారంగా కనీ్వనర్ కోటా లేదా ఫ్రీ సీట్ల కింద దాదాపు 45 సీట్లను ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యార్థులు ఎవరూ వర్సిటీలో అడ్మిషన్ కోసం ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదని విశ్వవిద్యాలయ అధికారులు గుర్తించారు. దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ 2022 ఏప్రిల్‌లో వరంగల్‌లోని మటా్వడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సీట్లను బ్లాక్ చేసి పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు ఉన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తులో భాగంగా 2023 జూన్ 22న బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ జిల్లా నగునూర్‌లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర్ మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, సూరారంలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పటాన్‌చెరులోని మహేశ్వర మెడికల్ కాలేజీ, చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీ, డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిపింది. అందులో భాగంగా దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు.. 12 కాలేజీలతో పాటు మరికొన్ని కాలేజీల యాజమాన్యాలకు కూడా సమన్లు జారీ చేసినట్టు తెలిసింది. అన్ని కాలేజీల ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం కాలేజీల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. -
ఈడీ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
పబ్లిక్ సర్వెంట్ల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్‌లకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. వీరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి తీసుకోకుండా ఈడీ కేసు నమోదు చేయడం, దానిని ఈడీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని తెలిపింది. అయితే భవిష్యత్తులో వీరి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతినిస్తే అప్పుడు కేసు విచారణకు స్వీకరించాలని ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చునంటూ సుప్రీంకోర్టు ఈడీకి సూచించింది. అయితే ఈ వెసులుబాటు ప్రతివాదులైన అధికారులు లేవనెత్తే న్యాయపరమైన అభ్యంతరాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలవి ‘ఈడీ ఫిర్యాదులోని అంశాలన్నింటినీ మేం క్షుణ్ణంగా పరిశీలించాం. ఇండియా సిమెంట్స్‌కు అదనంగా 10 లక్షల లీటర్ల నీటిని కేటాయించారన్నదే ఆదిత్యనాథ్ దాస్‌పై ఉన్న ఆరోపణ. ఫిర్యాదులోని ఆరోపణలు వాస్తవమనుకున్నా, నీటి కేటాయింపులు తన విధి నిర్వహణలో భాగంగానే చేశారు. ఇందూ టెక్ జోన్‌కు 250 ఎకరాలు కేటాయించారన్నది బీపీ ఆచార్యపై ఉన్న ఆరోపణ. ఇది కూడా నిజమనుకున్నా, ఆ నిర్ణయం కూడా విధి నిర్వహణలో భాగంగా తీసుకున్నదే. వారి విధి నిర్వహణకు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధం ఉంది. ఇద్దరు అధికారులు కూడా పబ్లిక్ సర్వెంట్లే. వీరికి సీఆర్పీసీ సెక్షన్ 197(1) వర్తిస్తుంది. ఈ సెక్షన్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు వచ్చే నేరాలకు సైతం వర్తిస్తుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలో ఏ నిబంధన కూడా సెక్షన్ 197(1)కు విరుద్ధంగా లేదు. అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు, చేపట్టిన చర్యలకు గాను అధికారులను ప్రాసిక్యూట్ చేయకుండా ఉండేందుకు ఈ సెక్షన్‌ను తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం అనుమతినిస్తే మాత్రం ప్రాసిక్యూట్ చేయవచ్చు. అయితే ఈ కేసులో అలా జరగలేదు. అయినప్పటికీ ఈడీ నమోదు చేసిన కేసును ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ నిమిత్తం తీసుకుంది. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదు. అందువల్లే బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్లపై కేసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.ఈడీ కేసుల పూర్వాపరాలుఇండియా అరబిందో, హెటిరో గ్రూపులకు జడ్చర్ల ఎస్ఈజెడ్లో 150 ఎకరాల భూమి కేటాయించడంలో అప్పటి ఏపీఐఐసీ ఎండీగా బీపీ ఆచార్య కీలక పాత్ర పోషించారంటూ ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అలాగే ఇందూ టెక్‌జోన్‌కు 250 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంలోనూ ఆచార్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌పై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ తమపై కేసులు నమోదు చేసిందని, అందువల్ల వాటిని కొట్టేయాలంటూ వారిద్దరూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులను కొట్టేస్తున్నట్లు 2019 జనవరి 21న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఈడీ 2019 జూలైలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. చివరిగా గత నెల 15న పూర్తి స్థాయి వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బుధవారం తన తీర్పును వెలువరించింది. a -
కేటీఆర్ చుట్టూ.. ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసింగ్ అంశంలో పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ–కార్ల రేస్ నిర్వహణ సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల సియోల్ పర్యటన సందర్భంగా రాజకీయ బాంబులు పేలబోతున్నాయంటూ చేసిన కామెంట్లు.. తాజాగా అర్వింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు.. కేటీఆర్ బావమరిది జన్వాడ నివాసంలో దాడులు.. కేటీఆర్ లక్ష్యంగా ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లు వంటి పరిణామాలన్నీ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న దిశగా వస్తున్న సంకేతాలే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా–ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే అర్వింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో ఆయన వెల్లడించే అంశాలే కీలకంగా మారనున్నాయి. రంగంలోకి ఈడీ? ఫార్ములా–ఈ రేసు అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏసీబీ కేసు రిజిస్టర్ చేసిన నేపథ్యంలో ఈడీ కూడా విచారణ చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఫార్ములా–ఈ రేసులో ఏం జరిగింది? హైదరాబాద్‌లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈవో, ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా–ఈ కార్ల రేస్ (సెషన్–9)కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా.. ప్రమోటర్ ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీనితో ప్రమోటర్ తప్పుకొన్నారు. 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా (సెషన్–10) ఈ–కార్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈవో తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా–ఈ నిర్వహణ హైదరాబాద్‌కు తలమానికంగా ఉంటుందని.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్‌లోనే కార్ రేస్‌ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్ఈవోకు స్పష్టం చేశారు. ఈ మేరకు రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్‌లో ఎఫ్ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణకోసం రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవోకు చెల్లించింది. ఉల్లంఘన అంటూ రేసు రద్దు చేసి.. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేసుపై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్ఈవో సెషన్–10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆర్థికశాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అర్వింద్‌కుమార్‌ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. ఆ మెమోకు అర్వింద్‌కుమార్ వివరణ ఇస్తూ.. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్ఈవోకు నిధులు విడుదల చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ.. పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. -
అమ్మో.. అమోయ్‌కుమార్!
సాక్షి, హైదరాబాద్: అమోయ్‌కుమార్.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో చేసిన అక్రమాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే కాదు అటవీ, రక్షణశాఖ, కాందిశీకుల భూములనూ తన అధికారాన్ని ఉపయోగించి ధారాదత్తం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహేశ్వరం మండలంలో భూదాన్భూములపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టడంతో ఆయన బారిన పడిన బాధితులు ఒక్కొక్కరుగా ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవైపు ఈడీ విచారణ చేస్తుండగానే.. మరోవైపు హైకోర్టు, అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు 52 ఎకరాల ప్రభుత్వ భూమిని పైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని తప్పుపడుతూ ఆ నిర్ణయాన్ని మంగళవారం కొట్టేయడం చూస్తుంటే.. కలెక్టర్‌గా ఆయన ప్రభుత్వానికి తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించారో తెలుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీపావళి తర్వాత అమోయ్‌కుమార్‌ను మరోసారి విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. – ఆదిబట్లలోని సర్వే నంబరు 44లోని సీలింగ్ భూములైన 18 ఎకరాలను కొంతమందికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వడం పూర్తిగా అధికార దుర్వినియోగమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. – శామీర్‌పేట మండలంలోని తూముకుంటలోని అటవీ భూములకు సంబంధించి సర్వే నంబరు 164లో మొత్తం 26 ఎకరాలను కూడా అన్యాయంగా కొంతమంది వ్యక్తులు, పరిశ్రమల పేరిట పెద్దవారికి ధారాదత్తం చేశారని రాఘవేందర్‌గౌడ్ డాక్యుమెంట్లతో సహా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. – సర్వే నంబరు 165/1, సర్వేనంబరు 1266లోని భూములను కూడా ఒకసారి పరిశీలించాలని అందులో పేర్కొన్నారు. 26 ఎకరాలను మరొకరి పేరిట చేయడమేకాక, మ్యుటేషన్ కూడా చేశారని, ఆ స్థలం అటవీశాఖ ఆ«దీనంలోనే ఉన్నా.. ఇలా మ్యుటేషన్ చేయడంతో వారు ఆ కాగితాలను వినియోగించుకొని రుణాలు కూడా తెచ్చుకున్నారని చెబుతున్నారు. 1953లోనే ఆ సర్వే నంబరులోని భూములు రిజర్వ్ ఫారెస్ట్ కోసం కేటాయించినట్టు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నా, వారసులం అంటూ కొందరు చేసుకున్న దరఖాస్తు ఆధారంగా వారికి ఆ భూములు ధారాదత్తం చేశారని ఆ ఫిర్యాదులో వివరించారు. ఆ భూమి తమదంటూ దరఖాస్తు చేసుకున్న వారసుల తండ్రి 1976లో చనిపోతే.. వారు 2017లో వచ్చి తమ భూమి అంటూ దరఖాస్తు చేసుకోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం వారసులకు భూములు అప్పగించే ముందు ఆ భూమిలో వారి ఆ«దీనంలో ఉందా.. వారు ఆ భూమిని సాగు చేస్తున్నారా.? రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం, దానిపై అభ్యంతరాలను ఆహా్వనించడం, సక్సెషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లను కోరడం, యుఎల్‌సీ, తదితర వాటిని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్న ఆ భూములు ఎవరి ఆ«దీనంలో ఉన్నాయో తెలుసుకోకుండా మ్యుటేషన్ చేశారని ఈడీకి ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. – 261, 273 తదితర సర్వే నంబర్లలోని భూములను కూడా అదే విధంగా అప్పగించారని పేర్కొన్నారు. కూకట్పల్లి సమీపంలోని హైదర్‌నగర్ దగ్గర మూడు ఎకరాల భూమిని కూడా అమోయ్‌కుమార్ ధరణిని అడ్డుపెట్టుకొని ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారన్నారు. – శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్‌మక్తలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా ఆ జాబితా నుంచి తొలగించి కొందరికి అప్పగించారని పేర్కొన్నారు. మరో పిటిషన్.. అమోయ్‌కుమార్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో గోపనపల్లిలో 50 ఎకరాలు, మాదాపూర్‌లో 5 ఎకరాలు, హఫీజ్‌పేటలో 20 ఎకరాలు, మోకిలలో 115 ఎకరాలు, వట్టినాగుల పల్లిలో 20 ఎకరాలు, గండిపేట ఖానాపూర్‌లో 150 ఎకరాలు, మియాపూర్‌లో 27 ఎకరాలు అన్యాక్రాంతం చేశారని బక్క జడ్సన్ మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడంలో ఆయనతోపాటు మాజీ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత రెవెన్యూ ముఖ్యకార్యదర్శిల పాత్ర ఉన్నట్టు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో వెలుగులోకి సరికొత్త విషయాలు
-
నిధుల మళ్లింపు నిజమే
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఎలా మొదలైంది.. నిధులు ఎలా మళ్లించారు.. ఎంత మొత్తంలో మళ్లించారు.. అందులో ఎవరెవరు ఉన్నారు.. ఎన్ని సూట్‌కేస్ కంపెనీలు ఏర్పాటు చేశారు.. ఏ ఏ దేశాల్లో ఆ కంపెనీలున్నాయి.. ఆ కంపెనీల ప్రతినిధులు ఎవరు.. వారికి, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును నడిపిన వ్యక్తులకు మధ్య సంబంధం ఏమిటి.. మళ్లించిన నిధులను తిరిగి ఎలా నగదు రూపంలో తీసుకున్నారు.. ఇలా పలు కీలక విషయాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ద్వారా పూసగుచ్చినట్లు బట్టబయలు అయ్యాయి. ఇకపై సాగనున్న దర్యాప్తులో ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దల పాత్ర నిగ్గు తేలనుంది.సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కనుసన్నల్లో సాగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈడీ సాగించిన దర్యాప్తులో మొత్తం రూ.151 కోట్ల మేర నిధులను పలు కంపెనీలకు మళ్లించినట్లు తేలింది. ఇందులో విదేశీ కంపెనీల ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలను సేకరించింంది. ఈ వివరాలన్నింటినీ ఇటీవల ఓ కేసులో హైకోర్టు ముందు ఉంచింది. ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్లించి, ఆ నిధులను తిరిగి డబ్బు రూపంలో ఎలా పొందారో ఈడీ తన కౌంటర్లోసు స్పష్టంగా వివరించింది. ఇప్పటి వరకు ఈడీ తన దర్యాప్తును ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు పరిమితం చేసింది. దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో ఇకపై స్కిల్ కుంభకోణంలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై దృష్టి సారించనుంది. అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎలా మొదలైంది.. ఏకపక్ష నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు.. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర, ఆయన జోక్యం, ఇతర అధికారుల పాత్రపై ఈడీ పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టనుంది. మళ్లించిన ప్రజాధనం చివరకు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరినట్లు సీఐడీ ఇప్పటికే ప్రాథమికంగా తేల్చిన నేపథ్యంలో ఈడీ ఈ అంశంపై కూడా లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది.ఇదీ కుంభకోణం..నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చేందుకు 2015లో చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినయ్ ఖన్వీల్కర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పందం ప్రకారం శిక్షణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ టెక్ అందించాలి. ⇒ ఈ ప్రాజెక్టులో మొత్తం ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో క్లస్టర్‌ను రూ.546.84 కోట్లతో ఏర్పాటు చేయాలి. దీని ప్రకారం మొత్తం వ్యయం రూ.3,281.40 కోట్లు. ఇందులో 90 శాతం నిధులు.. అంటే రూ.2,951 కోట్లను సీమెన్స్, డిజైన్ టెక్ భరిస్తాయి. మిగిలిన 10 శాతం అంటే రూ.330 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ⇒ అయితే సీమెన్స్, డిజైన్ టెక్‌లు తమ వాటా నిధులను ఇవ్వక ముందే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.330 కోట్లను ఆ కంపెనీలకు ఇచ్చేసింది. ఇదంతా కూడా అప్పటి మంత్రి మండలి ఆమోదం లేకుండానే జరిగిపోయింది. చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కిక్కురు మనకుండా ఆయన చెప్పినట్లు చేసేశారు.⇒ ఇదిలా ఉండగా 2018లో షెల్ కంపెనీ అయిన ఏసీఐ.. (అల్లాయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏసియా) లిమిటెడ్) నకిలీ బిల్లులు, ఇన్వాయిస్లు తయారు చేసి పలువురికి లబ్ధి చేకూరుస్తున్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. సుమన్ బోస్ తదితరులు తమ అక్రమ కార్యకలాపాలకు ఈ ఏసీఐ కంపెనీని వాడుకున్నారు. 2019లో ఈ మొత్తం కుంభకోణం గురించి పుణేకు చెందిన ఓ సామాజిక కార్యకర్త అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.⇒ ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణం మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో జరిగినట్లు తేలింది. దీంతో ఆయన్ను ఏ1గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కుంభకోణంపై ఈడీ కూడా దర్యాప్తు మొదలు పెట్టింది. 2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో స్కిల్ కుంభకోణంలో సీఐడీ తన దర్యాప్తును పక్కన పెట్టేసింది. అయితే ఈడీ తన దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది.స్కిల్ కుంభకోణానికి సంబంధించి హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన కౌంటర్ , సింగపూర్ కంపెనీలకు, యూకే బేస్డ్ కంపెనీలకు నిధుల మళ్లింపు ఇలా డిజైన్ టెక్ నుంచే నిధుల మళ్లింపు మొదలు.. ⇒ దర్యాప్తులో భాగంగా ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలను ఈడీ విశ్లేషించింది. డిజైన్ టెక్ నుంచి పొందిన నిధుల్లో దాదాపు రూ.58 కోట్లను స్కిల్లర్ ఎంటర్‌ప్రైజస్, ఆ తర్వాత ఏసీఐకి బదలాయించినట్లు ఈడీ గుర్తించింది. అక్రమ పద్ధతిలో వచ్చిన డబ్బును పలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు స్కిల్లర్ కంపెనీ వ్యవహారాలు చూసే వ్యక్తి శిరీష్ షా ఈడీ విచారణంలో అంగీకరించారు.⇒ స్కిల్లర్ నుంచి వచ్చిన సొమ్ముతో స్కిల్ డెవలప్మెంట్ సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి వస్తువులను గానీ, సేవలను గానీ అందించలేదు. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ నిధులను డిజైన్ టెక్ కంపెనీ స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్‌కు, స్కిల్లర్ తిరిగి ఆ నిధులను ఏసీఐకి బదలాయించినట్లు ఈడీ తేల్చి చెప్పింది. నిధుల మళ్లింపుకు సహాయ పడిన వారి వాంగ్మూలాలను ఈడీ రికార్డ్ చేసింది. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, వస్తువులు, సేవలు.. ఏవీ అందించలేదని వారు అంగీకరించారు. నకిలీ, కల్పిత పర్చేజ్ ఆర్డర్లు, ఇన్వాయిస్లు, తప్పుడు బిల్లులు సృష్టించినట్లు కూడా వారు ఈడీ ఎదుట ఒప్పుకున్నారు.⇒ ఏసీఐ నుంచి వచ్చిన నిధులను నగదు రూపంలో మార్చినట్లు కూడా వారు అంగీకరించారు. ఈ విషయాలన్నింటినీ ఎంట్రీ ప్రొవైడర్లయిన యోగేశ్ గుప్తా, మనోష్ కుమార్ జైన్ ఈడీ వద్ద నిర్ధారించారు. ఈ షెల్ కంపెనీలేవీ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌తో సంబంధం ఉన్న కంపెనీలు కాదని కూడా ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది.⇒ ఈ గొలుసు లావాదేవీల ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని యోగేశ్ గుప్తా, ముకుల్ అగర్వాల్‌కు అందచేసినట్లు సావన్ జాజూ ఈడీకి తెలిపారు. నగదు విషయంలో ముకుల్ చంద్ర అగర్వాల్.. యోగేశ్ గుప్తా వద్దకు వెళ్లినట్లు కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. బ్యాంకు ఖాతాల ద్వారా వచ్చిన నిధులను నగదు రూపంలో వీరు అందుకున్నట్లు కూడా స్పష్టమైంది. ⇒ ఏసీఐ మాత్రమే కాకుండా ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రో వెస్ట్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్‌లను నిధుల మళ్లింపు కోసం వాడుకున్నారు. ఇందుకు బోగస్ బిల్లులను చూపారు. తద్వారా స్కిల్లర్ నుంచి నేరుగా ని«ధులు పొందారు. ఇలా ఇప్పటి వరకు రూ.151 కోట్ల మేర నిధులను మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.ప్రజా ధనాన్ని మళ్లించేందుకే స్కిల్లర్ ఏర్పాటు స్కిల్లర్ తనకొచ్చిన నిధుల్లో నుంచి కొంత భాగం ముకుల్ అగర్వాల్‌కి చెందిన నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయించింది. అక్కడి నుంచి ఆ నిధులు ముకుల్ చంద్ర, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి, అతని నియంత్రణలో పని చేసే కంపెనీల ఖాతాల్లోకి చేరాయి. ముకుల్ చంద్ర అగర్వాల్ పలు కంపెనీలు ఏర్పాటు చేశారు. వాటన్నింటిపై తనకు నియంత్రణ ఉండేలా చూసుకున్నారు.ప్రభుత్వానికి చెందిన అత్యధిక భాగం నిధులు ఈ కంపెనీల మధ్యే సర్కులేట్ అయ్యాయి. సుమన్ బోస్ అవసరాల కోసమే ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ముకుల్ చంద్ర అగర్వాల్ ఈడీ ముందు అంగీకరించి, ఆ మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే సుమన్ బోస్ తన విదేశీ బ్యాంకు ఖాతాలను మూసేశారు. దీనిపై కూడా ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. పలు విదేశీ కంపెనీలతో బోస్‌కు సంబంధాలున్నాయన్న విషయం కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. నేరపూరిత చర్యల ద్వారా బదలాయించిన మొత్తాలను ఆ షెల్ కంపెనీల ద్వారా తిరిగి నగదు రూపంలో పొందిన విషయాన్ని కూడా ఈడీ గుర్తించింది. ప్రజాధనం దోచేసేందుకే సుమన్ బోస్ మిలాఖత్⇒ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకు నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్, టాలెంట్ ఎడ్జ్, ఏసీఐ, స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్, డిజైన్ టెక్ కంపెనీలు, వారి యజమానులతో కలిసి సుమన్‌బోస్ పని చేశారని సీమన్స్ నివేదిక స్పష్టం చేసింది. సీమెన్స్ ప్రస్తుత ఎండీ కూడా ఇందుకు సంబంధించిన సంభాషణలు, వాట్సాప్ చాట్లు, ఇతరత్రా పలు వివరాలను ఈడీకి అందజేశారు. డిజైన్ టెక్ వికాస్ ఖాన్వీల్కర్, సుమన్ బోస్‌ల మధ్య డబ్బు తరలింపును కూడా ఈడీ గుర్తించింది.⇒ ముకుల్ అగర్వాల్, సురేష్ గోయల్ తనకు సన్నిహిత మిత్రులన్న విషయాన్ని సుమన్ బోస్ ఈడీ ముందు అంగీకరించారు. డీసాల్ట్ ప్రస్తుత చిరునామా, ఎస్‌ఎస్‌ఆర్‌ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చిరునామా ఒకే విధంగా ఉంది. ఈ ఎస్‌ఎస్‌ఆర్‌ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సురేశ్ గోయల్ సతీమణి ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్నారు. పలు ఇతర కంపెనీలు కూడా ఇదే చిరునామాపై రిజిస్టర్ అయి ఉన్నాయి. నిధుల మళ్లింపు వ్యవహారంలో సుమన్ బోసే మాస్టర్ మైండ్, ఇందుకు ఖాన్వీల్కర్, సురేశ్ అగర్వాల్‌ల సాయం తీసుకున్నారు.⇒ సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న బెన్ రీసెర్చ్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ తులసీదాస్ శివ కుమార్‌కు చెందింది. ఇతను సీమెన్స్ సుమన్ బోస్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో సీమెన్స్లో పని చేశాడు. ఈ కంపెనీకి రూ.3,48,95,191 మళ్లించారు. మరో సింగపూర్ కంపెనీ అయిన ఇంక్ఫిష్ హాస్పిటాలిటీ పీటీఈ లిమిటెడ్‌కు రూ.74.51 లక్షలు, యూకేకు చెందిన ఎస్జీకే వరల్డ్ ఫోరెక్స్ లిమిటెడ్‌కు రూ.73.67 లక్షలు జమ చేశారు. ఈ మొత్తాలన్నీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీ) నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పొందిన నిధులు. నిధుల మళ్లింపులో కీలక వ్యక్తులు - సుమన్ బోస్ (స్కిల్ ప్రాజెక్ట్ రూపకర్త)- వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ (డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ)- ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ ఎంటర్‌ప్రైజస్ సిగ్నేటరీ, సుమన్ బోస్ సన్నిహితుడు, నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కీలక వ్యక్తి )- సురేష్ గోయల్ (సుమన్ బోస్ స్నేహితుడు, చార్టెడ్ అకౌంటెంట్, ముకుల్ అగర్వాల్ కోసం డబ్బు నిర్వహించిన వ్యక్తి)- శిరీష్ షా (ఏసీఐ వ్యవహారాలు చూసే వ్యక్తి, ఎంట్రీ ఆపరేటర్)- సావన్ కుమార్ జాజు (ఎంట్రీ ఆపరేటర్)- యోగేష్ గుప్తా (ఎంట్రీ ఆపరేటర్)- మనోజ్ కుమార్ జైన్ (ఎంట్రీ ఆపరేటర్)- తులసీదాస్ శివకుమార్ అలియాస్ టి.శివకుమార్ (సింగపూర్ – బెన్ రీసెర్చ్ పీటీఈ లిమిటెడ్, సుమన్ బోస్ సన్నిహితుడు)ఈడీ బయటపెట్టిన షెల్ కంపెనీలు...⇒ మెసర్స్ సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ)⇒ మెసర్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డీటీఎస్పీఎల్)⇒ స్కిల్లర్ ఎంటర్ప్రైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపీఎల్)⇒ అల్లాయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏసియా లిమిటెడ్ (ఏసీఐ) (షెల్ కంపెనీ)⇒ కాడెన్స్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీ (షెల్ కంపెనీ)⇒ ఈటీఏ గ్రీన్ బిల్డ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఎస్పీఎల్) (షెల్ కంపెనీ)⇒ ఎస్ఎం ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ప్రో వెస్ట్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ మెసర్స్ టాలెంట్ ఎడ్జ్ (షెల్ కంపెనీ)⇒ డిఅసాల్ట్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (డీఎస్ఐపీఎల్) (గతంలో బోస్, ముకుల్ అగర్వాల్, నరేష్ గోయల్ పని చేసిన కంపెనీ)⇒ ఎస్‌ఎస్‌ఆర్‌ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ కంపెనీలో సురేష్ గోయల్ భార్య డైరెక్టర్. డిఅసాల్ట్ సిస్టమ్స్ కంపెనీదీ ఇదే చిరునామా)⇒ బెన్ రీసర్చ్ పీటీఈ లిమిటెడ్ (సింగపూర్ కంపెనీ)⇒ ఇంక్ఫిష్ హాస్పిటాలిటీ పీటీఈ లిమిటెడ్ (సింగపూర్ కంపెనీ, ఈ కంపెనీకి నిధులు మళ్లించారు)⇒ ఎస్జీకే వరల్డ్ ఫోరెక్స్ లిమిటెడ్ (యూకే కంపెనీ, ఈ కంపెనీకి నిధులు మళ్లించారు) -
సరస్వతీ పవర్ వాటాల బదిలీపై షర్మిల వాదన అసంబద్ధం
సాక్షి, అమరావతి: సరస్వతీ పవర్ వాటాల బదిలీ విషయంలో షర్మిల చేస్తున్న అసంబద్ధ వాదనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సరస్వతీ పవర్ వాటాలను జప్తు చేయలేదన్న షర్మిల వాదనతో న్యాయ నిపుణులు విబేధిస్తున్నారు. ఈడీ.. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులన్నింటినీ జప్తు చేసిందని, చరాస్తుల్లోకి షేర్లు కూడా వస్తాయని వారు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీల చట్టం స్పష్టంగా చెబుతోందని పేర్కొంటున్నారు. కంపెనీల చట్టం సెక్షన్ 44 ప్రకారం షేర్లు, డిబెంచర్లను చరాస్తులుగా పరిగణిస్తారు. అందువల్ల సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసినందున, ఆ కంపెనీ షేర్లు కూడా జప్తులో ఉన్నట్లే. కాబట్టి హైకోర్టు జారీ చేసిన యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు సరస్వతీ పవర్ షేర్లకు కూడా వర్తిస్తాయి. షేర్లతో సహా జప్తులో ఉన్న ఏ ఆస్తులను కూడా ఇతరులకు విక్రయించడం గానీ, బదలాయించడం గానీ చేయడానికి వీల్లేదు. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసినట్లు ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా చెప్పింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుడులకు సంబంధించి నమోదైన కేసులో ఈడీ పలు ఆస్తులను జప్తు చేసింది. ఇందులో జగన్మోహన్రెడ్డి, ఆయన గ్రూపునకు చెందిన పలు కంపెనీలున్నాయి. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో సరస్వతీ పవర్‌కు చెందిన స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి. ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్మోహన్రెడ్డి, సరస్వతీ పవర్లతో సహా పలు గ్రూపు కంపెనీలు మనీలాండరింగ్ నిరోధక అప్పిలెట్ ట్రిబ్యునల్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన అప్పిలెట్ ట్రిబ్యునల్ 2019 జూలై 26న తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో సరస్వతీ పవర్ స్థిర చరాస్తులను ఈడీ జప్తు చేసినట్లు స్పష్టంగా పేర్కొంది. సరస్వతి పవర్ స్థిర, చరాస్తుల జప్తును తప్పుపట్టింది. ఆ జప్తు ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అప్పిలెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2019 అక్టోబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు అమలుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని హైకోర్టును కోరింది. ఈడీ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈడీ దాఖలు చేసిన అప్పీల్ తేలేంత వరకు ఆ రోజు నాటికి ఉన్న స్థితిని అన్ని రకాలుగా యథాతథంగా కొనసాగించాలంటూ 2019 డిసెంబర్ 2న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు ఈ రోజుకీ అమల్లో ఉన్నాయి. ఈ యథాతథస్థితి ఉత్తర్వుల గురించే జగన్మోహన్రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగా సరస్వతీ పవర్లో వాటాలను బదలాయించడం అంటే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నది న్యాయ నిపుణుల మాట. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు సలహా రూపంలో జగన్మోహన్రెడ్డికి స్పష్టంగా చెప్పారు. ఈ సలహాను జగన్ తన చెల్లి షర్మిల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ న్యాయ సలహాను ఆమె ముందుంచారు.జగన్‌ను ఉద్దేశపూర్వకంగా సమస్యల్లోకి నెట్టిన షర్మిల...కోర్టులో ఉన్న కేసులన్నీ తేలిన తరువాత వాటాలు బదలాయించుకోవచ్చునని షర్మిలకు జగన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వాటాలు బదిలీ చేస్తే తనకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని కూడా వివరించారు. అయితే చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్న షర్మిల తన అన్న జగన్ మాటలను పెడచెవిన పెట్టారు. ఆయన్ను న్యాయపరమైన సమస్యల్లోకి నెట్టేందుకే నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే సరస్వతీ పవర్లో ఉన్న వాటాలను అక్రమ పద్ధతిలో బదలాయించేశారు. అన్యాయమైన పని చేసిన షర్మిల మరోవైపు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. ఈడీ సరస్వతీ పవర్‌కు చెందిన భూములను మాత్రమే జప్తు చేసిందే కానీ, షేర్లను జప్తు చేయాలంటూ ఓ వాదనను తీసుకొచ్చారు. అందుకే వాటాలను బదలాయించినట్లు ఆమె చెబుతున్నారు. న్యాయ నిపుణులు మాత్రం ఆమె వాదన చట్ట విరుద్ధంగా ఉందని తేల్చి చెబుతున్నారు. షర్మిల దురుద్దేశపూర్వకంగా సృష్టించిన న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడేందుకే జగన్మోహన్రెడ్డి న్యాయపోరాటం ప్రారంభించారు. షేర్ల బదిలీల విషయంలో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసి, తన వాటాలను తనకు వెనక్కి తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.సరస్వతీ పవర్ షేర్లు జప్తులో లేవని ఎలా చెబుతారు..?హైకోర్టు న్యాయవాది మరక్కగారి బాలకృష్ణసరస్వతీ పవర్ షేర్ల బదిలీ విషయంలో షర్మిల వాదన చట్ట విరుద్ధంగా ఉంది. ఎవరు ఇస్తున్నారో గానీ ఆమెకు సరైన న్యాయ సలహాలు ఇవ్వడం లేదు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 44ను చదివితే షేర్లు అనేవి చరాస్తుల కిందకు వస్తాయి. ఇందుకు పెద్దగా లా చదువుకుని ఉండాల్సిన అవసరం కూడా లేదు. స్థిర, చరాస్తులను జప్తు చేసినప్పుడు, చరాస్తుల కిందకు వచ్చే షేర్లు కూడా జప్తులో ఉన్నట్లే. ఇందులో చర్చకు, వాదనకు ఆస్కారం ఏముంది? మనీలాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు సరస్వతి పవర్ షేర్లకు వర్తిస్తాయి. జప్తు ఉన్న షేర్లను విక్రయించుకోవచ్చునని ఏ చట్టం చెబుతుందో షర్మిలకే తెలియాలి. -
భూదాన్ భూముల భాగోతం..ఐఏఎస్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
సాక్షి,హైదరాబాద్: భూదాన్ భూముల భాగోతంపై ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఐఏఎస్ అమోయ్ కుమార్ శుక్రవారం ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం, ఆయనను ఈడీ అధికారులు బయటకు తీసుకెళ్లారు. తిరిగి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే ఈడీ కార్యాలయం నుంచి ఐఏఎస్ అధికారిని బయటకు తీసుకెళ్లిన ఈడీ అధికారులు సర్వే నెంబర్ 181,182 మహేశ్వరం మండలం నాగారంలోని భూములపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సుమారు 70ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతంపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. భూముల అక్రమ బదిలీ ఆరోపణలు మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై ఈడీ విచారణ చేపట్టింది. ఇక్కడ రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ పనిచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్రపై నిజానిజాలను తేల్చేందుకు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఇవాళ మూడో రోజు ఐఏఎస్ అమోయ్ కుమార్ ఈడీ ఎదుట హాజరయ్యారు. -
మూడేళ్లయినా చార్జిషీట్ ఎందుకు వేయలేదు?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై దర్యాప్తును అటకెక్కించిన సీఐడీని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టంది. 2021లో కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మూడేళ్లు దాటినా ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రధాన నిందితునిగా ఉన్న స్కిల్ డెలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీ ఉద్దేశపూర్వకంగానే మూలన పడేసిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు సైతం ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిన ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకుండా సీఐడీ చేస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం నిందితులకు వరంగా మారింది. ఈ కుంభకోణం మాస్టర్ మైండ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల్లో కొన్నింటిని హైకోర్టు సడలించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. బోస్ సరెండర్ చేసిన పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇచ్చేయాలని విశాఖపట్నం మొదటి అదనపు సెషన్స్ జడ్జిని ఆదేశించింది. రూ.25 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని బోస్‌ను ఆదేశించింది. విశాఖపట్నం కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాస్‌పోర్ట్‌ని సరెండర్ చేస్తానని హామీ ఇవ్వాలని బోస్‌ని ఆదేశించింది. ప్రయాణ వివరాలన్నింటినీ ముందస్తుగానే కింది కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజాధనం కొల్లగొట్టి విదేశాల్లో దాచారని ఈడీ వెల్లడిసుమన్ బోస్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బోస్ పలు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ఆ డబ్బును విదేశాలకు తరలించారని, అందువల్ల విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వొదని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావు హైకోర్టును కోరారు. దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుందని వివరించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ షరతులను సడలించడం సరికాదని గట్టిగా వాదించారు. -
బీజేపీ నియంత్రణలో ఈసీ, సీబీఐ, ఈడీ: రాహుల్
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. శనివారం రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగంపై ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. వీళ్ల దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ, పాలనాయంత్రాంగం, న్యాయపాలికసహా అన్ని వ్యవస్థలను అధికారంలోని బీజేపీ గుప్పిటపట్టింది. నిధులు, సంస్థలనూ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖాతాల స్తంభన కారణంగా నగదులేకపోయినా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడింది. కులగణనకు సామాజిక ఎక్స్‌రే తప్పనిసరి. వీటికి మోదీ అడ్డుతగులుతున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లేకపోయినా సరే మేం అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’అని రాహుల్ అన్నారు. -
TG: ఐఏఎస్ అధికారికి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులిచ్చింది. ఈ నెల 23లేదా24 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది.అమోయ్‌కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు.రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో చేసిన భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కలెక్టర్.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు -
హైదరాబాద్ రౌడీ షీటర్ కు ఈడీ షాక్
-
హైదరాబాద్ రౌడీ షీటర్ కు ఈడీ షాక్
-
సీఎం సిద్దరామయ్యపై కేసు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు.
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మైసూర్‌లోని ముడా కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేపట్టారు. 12 మంది అధికారుల బృందం శుక్రవారం ఉదయం ముడా కార్యాలయంలో సోదాలు చేసింది. దీంతోపాటు మైసూరులోని ఇతర ప్రాంతాల్లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ముడా చీఫ్‌గా కే మరి గౌడ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈడీ దాడులు చేపట్టింది. అయితే ఈ కుంభకోణంలో ప్రమేయమున్న అధికారులందరినీ ఏజెన్సీ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ముడా కమిషనర్ ఏఎన్ రఘునందన్ సహా సీనియర్ అధికారులు, ప్రత్యేక భూసేకరణ కార్యాలయానికి చెందిన సిబ్బందితో ఈడీ అధికారులు సమావేశం అయ్యారు. భూ కేటాయింపు కేసులో ముడా అధికారుల ప్రమేయాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు సంస్థ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.కాగా సీఎం భార్య బీఎం పార్వతికి విజయనగర్‌లోని అప్‌మార్కెట్ మైసూరు ఏరియాలో ఉన్న 14 ప్లాట్ల భూమిని అక్రమంగా కేటాయించిందన్న ఆరోపణలపై సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యసతీమణి పార్వతి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ముడా అధికారులు కూడా అంగీకరించారు. -
స్కిల్ స్కాం నిర్ధారించిన ఈడీ.. వణికిపోతున్న చంద్రబాబు..!
-
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్
దీని అర్థమేంటి చంద్రబాబూ..ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడిన నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్ చేశాం. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్, భారత్‌లో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్‌చంద్ అగర్వాల్, సురేశ్ గోయల్ బోగస్ ఇన్వాయిస్లతో నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించినట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. వారి బ్యాంకు ఖాతాలు, షేర్లు, స్థిరాస్తు లను జప్తు చేశాం. గతంలోనే డిజైన్‌టెక్‌కు చెందిన రూ.31.20 కోట్లను జప్తు చేశాం. వికాస్, సుమన్, ముకుల్, సురేశ్‌లను అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది. – ఈడీసాక్షి, అమరావతి: అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడం చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడ అని మరోసారి రుజువైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చడంతో మరోసారి ఫేక్ ప్రచారం చీప్ ట్రిక్‌ను టీడీపీ తెరపైకి తెచ్చింది. ఈడీ జారీ చేసిన అధికారిక ప్రకటననే ట్యాంపర్ చేస్తూ మరీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతోపాటు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేలా చేశారు. తద్వారా అబద్ధపు ప్రచారానికి రెక్కలు తొడిగుతూ తిమ్మినిబమ్మి చేసేందుకు యత్నించారు. అయితే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు ఈడీ స్పష్టం చేయడంతోపాటు, చంద్రబాబుతోపాటు తాము ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ తేల్చి చెప్పడంతో టీడీపీ ఎత్తుగడ బెడిసికొట్టింది. బోగస్ ఇన్వాయిస్లతో ప్రజాధనం కొల్లగొట్టారు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట భారీ అవినీతికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ ఓ ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. అంతేకాదు అసలు ఆ ప్రాజెక్ట్‌నే చేపట్టలేదని, పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టు బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేసినట్టు గుర్తించామని తెలిపింది. ఆ నిధులను సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్.. తమ సన్నిహితులు ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా అక్రమంగా దారి మళ్లించినట్టు వెల్లడించింది. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయాన్ని గుర్తించామని తెలిపింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ గతంలోనే అటాచ్ చేసింది. తాజాగా రెండో విడతగా మరో రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మంగళవారం అటాచ్ చేసింది. దాంతో ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టైంది.టీడీపీ ఫేక్ ట్రిక్ ఇదీ..⇒ స్కిల్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచేసరికి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఆయన అవినీతిని సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. దాంతోనే చంద్రబాబును గతేడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. సిట్ నివేదికతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ⇒ ప్రస్తుతం ఈడీ కూడా దర్యాప్తు వేగవంతం చేసి స్కిల్ స్కామ్‌లో నిధులు కొల్లగొట్టిన తీరును నిరూపిస్తోంది. తాను నిధులు కొల్లగొట్టడంలో పాత్రధారులుగా చేసుకున్న షెల్ కంపెనీల ప్రతినిధులు వికాస్ ఖన్విల్కర్, సుమన్‌బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇక రెండో విడతలో వికాస్ ఖన్విల్కర్, సుమన్ బోస్ ఆస్తులను అటాచ్ చేసింది. అదీ టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఆ కుట్రలో తన భాగస్వాముల ఆస్తులను అటాచ్ చేయడం చంద్రబాబును బేంబేలెత్తిస్తోంది. ⇒ ఇక ఈడీ తదుపరి చర్యలు తనపైనే అని ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తనకు అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఓ ఫేక్ ప్రకటనను సోషల్ మీడియాలో మంగళవారం రాత్రి నుంచి వైరల్ చేసింది. ఏకంగా ఈడీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలకు ముందు వెనుకా రెండు వాక్యాలు జోడించడం ద్వారా ట్యాంపర్ చేసి ఈ ప్రచారం చేయడం గమనార్హం. ⇒ ఈడీ పేరుతో రూపొందించిన ఆ ఫేక్ ప్రకటనను టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా కొన్ని ఇంగ్లిష్ పత్రికల్లోనూ ఆ తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేట్టు చేయడం చంద్రబాబు మార్కు మీడియా మేనేజ్మెంట్కు నిదర్శనం.ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఈడీ చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు టీడీపీ చేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. తాము చంద్రబాబుతోపాటు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ హైదరాబాద్ విభాగం అధికారులు మీడియాకు తేల్చి చెప్పారు. షెల్ కంపెనీల ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా పూర్తి కాలేదని కూడా ఈడీ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఫేక్ ట్రిక్‌తో తాము చేసిన తప్పుడు ప్రచార ఎత్తుగడ బెడిసి కొట్టడంతో బుధవారం ఉదయం నుంచి టీడీపీ మౌన ముద్ర దాల్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో సీఐడీ సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా చేసుకునే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబును ఏ–1గా సీఐడీ పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఇప్పటికే నిగ్గు తేల్చింది. స్కిల్ స్కామ్ కేసులో సిట్ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపించింది. అంటే చంద్రబాబు.. ఏ–1గా ఉన్న ఎఫ్ఐఆర్, చార్జిషీట్ ఆధారంగానే ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని స్పష్టమవుతోంది. మరో వైపు ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు అందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. అటువంటిది ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందని, టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరం. స్కిల్ కేసులో ఇప్పటికే పాత్రధారులైన షెల్ కంపెనీల ప్రతినిధుల బండారాన్ని బయటపెట్టిన ఈడీ.. ఇక అసలు సూత్రధారి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చేందుకు ఉద్యుక్తమవుతున్నట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
అది ‘క్లీన్ చిట్’ కాదు బాబు మెడకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఈడీ దర్యాప్తుతో ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి చెప్పారు. అయినా క్లీన్చిట్ ఇచ్చి పూలదండలు వేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.371 కోట్ల ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించి తిరిగి తన ఖజానాకు మళ్లించుకున్నారని, ఈడీ దర్యాప్తులో ఇదే కచ్చితంగా తేలుతుందని స్పష్టం చేశారు.సతీష్ కుమార్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్‌లో ఈడీ తాజాగా రూ.23.54 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తే.. దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచ్చిందని టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదమని అన్నారు. కేసులో చంద్రబాబును ముద్దాయిగా ఈడీ గుర్తించిందని, అందుకే అటాచ్మెంట్ రాగానే వణికిపోతున్నారని, అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని అన్నారు. ఈడీ ప్రెస్‌నోట్‌లో క్లీన్చిట్ విషయం లేకపోయినా, ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని చెప్పారు. క్లీన్చిట్ ఇవ్వాల్సింది కోర్టులని, విచారణ పూర్తి కాకుండానే క్లీన్ చిట్ వచ్చిందని ఎలా చెప్పుకుంటారని ప్రశి్నంచారు. నిందితులకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయని, వాటికి డబ్బులు ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబే 13 చోట్ల సంతకం పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం నిజం కాదా అని నిలదీశారు. బాబు సంతకం లేకుండా ప్రభుత్వ సొమ్ము ఎలా బయటకెళ్లిందన్నారు. ఆయన సంతకంతో ప్రభుత్వ సొమ్ము బయటకు పోయినప్పుడు చంద్రబాబు నేరస్తుడు కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు. అలా బయటకు వెళ్లిన సొమ్మును దారి మళ్లించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉంటే, ఈడీ క్లీన్చిట్ ఇచి్చందని ఎలా చెప్పుకుంటారని అన్నారు. -
శిల్పాశెట్టి దంపతులకు భారీ ఊరట కల్పించిన కోర్టు
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ కేసు విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి , రాజ్‌కుంద్రా దంపతులకు కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ మోసాలకు పాల్పడ్డారని వారి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా, ఫామ్‌హౌస్‌ను అక్టోబర్ 13వ తేదీలోపు ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో వాటిని సవాలు చేస్తూ.. కొద్దిరోజుల క్రితం ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. దీంతో శిల్పాశెట్టి దంపతులకు కాస్త ఊరట లభించింది.ఈ కేసు గురించి తాజాగా శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది ఇలా వివరణ ఇచ్చారు. 2017లో జరిగిన 'గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. శిల్పాశెట్టి దంపతుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. అయినా ఈడీ పరిధిలో ఈ కేసు లేదని చెప్పారు. అయినప్పటికీ తమ క్లయింట్స్ ఈ కేసు విషయంలో ఈడీ అధికారులకు సహకరిస్తారని పేర్కొన్నారు.బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం వాటి విలువ రూ. 150 కోట్లు పైమాటేనని అంచనా ఉంది. ఈ క్రమంలోనే వారి ఆస్తులను ఈడీ జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేసింది. -
ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్
-
అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?
-
‘ఆప్’ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
న్యూఢిల్లీ:పంజాబ్‌కు చెందిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం(అక్టోబర్7) సోదాలు జరిపింది. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్‌లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు జరిగాయి. ఈ సోదాలపై ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.పార్టీని చీల్చేందుకే ఎంపీ సంజీవ్అరోరాపై ఈడీ సోదాలు చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐలతో ఆప్ సభ్యులను ఆపలేరని, ఎవరినీ కొనలేరని, భయపట్టలేరని సిసోడియా పేర్కొన్నారు.వ్యాపారవేత్త కూడా అయిన ఎంపీ సంజీవ్ అరోరాపై దాడులతో తమ ధైర్యాన్ని దెబ్బతీయలేరని పార్టీకి చెందిన మరో ఎంపీ సంజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్ -
HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సమన్లు ఇచ్చింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1984- 2000 వరకు అజారుద్దీన్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.తన కెరీర్లో మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన ఈ హైదరాబాదీ.. సంప్రదాయ క్రికెట్లో 6215, యాభై ఓవర్ల ఫార్మాట్లో 9378 పరుగులు సాధించాడు. విజయవంతమైన బ్యాటర్‌గా పేరొందిన అజారుద్దీన్ కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. అయితే, ఫిక్సింగ్ ఆరోపణలతో అతడి కీర్తిప్రతిష్టలు మసకబారగా.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.ఈ క్రమంలో 2020 - 2023 మధ్యలో హెచ్‌సీఏలో దాదాపు రూ. 3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా.. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అజారుద్దీన్ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందాడు. -
ఈడీ కేసు ఎలా పెడుతుంది?
బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) తనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేయడంలో ఔచిత్యం ఏమిటని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘దేని ఆధారంగా మనీలాండరింగ్ కేసు పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. మా నుంచి సేకరించిన భూమికి పరిహారంగా ప్లాట్లు కేటాయించారు. అలాంటపుడు మనీలాండరింగ్ కేసుకు ఆస్కారం ఎక్కడిది? నాకు తెలిసి మనీలాండరింగ్ దీనికి వర్తించదు’ అని సిద్ధరామయ్య మంగళవారం అన్నారు.మైసూరులో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన 3.16 ఎకరాల భూమిని సేకరించిన ముడా పరిహారంగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో 14 ప్లాట్లకు ఆమెకు కేటాయించింది. ఇందులో అధికార దురి్వనియోగం, అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్య, పార్వతిలపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ సోమవారం సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసును నమోదు చేసిన విషయం విదితమే. ఈడీ కేసు నమోదైన కొద్దిగంటల్లోనే 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తానని పార్వతి ముడా కమిషనర్‌కు లేఖ రాశారు. తన భర్త పరువుప్రతిష్టలు, మానసిక ప్రశాంతత కంటే ఏ ఆస్తి కూడా తనకు ఎక్కువ కాదని ఆమె పేర్కొన్నారు. తనపై ద్వేష రాజకీయాలకు పార్వతి బాధితురాలుగా మారారని సిద్ధరామయ్య అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.14 ప్లాట్లు వెనక్కితీసుకున్న ముడా మైసూరు: పార్వతి అభ్యర్థన మేరకు ఆమెకు కేటాయించిన 14 ప్లాట్లను మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) మంగళవారం వెనక్కి తీసుకుంది. పార్వతితో చేసుకున్న సేల్డీడ్లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్వతి తనయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్ర తమకు లేఖను అందించారని, దాన్ని పరిశీలించి ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించామని ముడా కమిషనర్ ఎ.ఎన్.రఘునందన్ వెల్లడించారు. ఎవరైనా స్వచ్ఛందంగా ప్లాట్లను వదులుకుంటే.. వెనక్కి తీసుకోవచ్చనే నిబంధన ముడా చట్టంలో ఉందన్నారు. -
MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్
బెంగళూరు : కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన భూములను మైసూరు నగర అభివృద్ధి సంస్థకు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.దీనిపై స్పందించారు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. రాజకీయ విద్వేషాలకు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ముడా కేసు వివాదంలో సోమవారం సిద్ధరామయ్యపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. లోకాయుక్త ఆధారంగా కేసు నమోదైంది. ఈ తరుణంలో సిద్ధ రామయ్య భార్య ఓ లేఖను విడుదల చేశారు. అవినీతి మరక లేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 ప్లాట్లను తిరిగి ముడాకే ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. తన భర్త గౌరవం, ఘనతను మించి ఈ ఆస్తులు పెద్దవి కావని అన్నారు పార్వతి సిద్దరామయ్య.అవసరమైతే దర్యాప్తుకు సహకరిస్తానని, రాజకీయ రంగానికి దూరంగా ఉండే తనలాంటి మహిళలను వివాదాల్లోకి లాగొద్దని లేఖలో రాసుకొచ్చారు. అయితే, సిద్ధ రామయ్య ప్రకటనపై విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. విచారణ నుంచి బయట పడేందుకే ఈ డ్రామాలని ఆక్షేపించింది. ఏ తప్పు జరక్కపోయింటే ఎందుకు తిరిగి ఇస్తున్నారంటూ నిలదీశారు బీజేపీ నేతలు. దర్యాప్తులో వాస్తవాలు వస్తాయని ముందే ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు.అంతకుముందు ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాకిచ్చింది. ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. Karnataka CM Siddaramaiah''s wife Parvathi decides to return 14 controversial sites to MUDA— Press Trust of India (@PTI_News) September 30, 2024 -
నిర్మలకు ఊరట దర్యాప్తుపై హైకోర్టు స్టే
బెంగళూరు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట లభించింది. ఈడీని అడ్డం పెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారనే కేసులో నిర్మల, ఇతరులపై సాగుతున్న దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు సోమవారం స్టే విధించింది. నిందితుల్లో ఒకరైన బీజేపీ నేత నళిన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎం.నాగప్రసన్న దర్యాప్తుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 22కు వాయిదా వేశారు. ఆదర్శ్ ఆర్ అయ్యర్ చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్ కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈడీ అధికారులపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయసంహిత సెక్షన్ 384 (బెదిరించి డబ్బు గుంజడం), 120బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 34 కింద వీరిపై కేసు నమోదైంది. -
బరాజ్‌ల వైఫల్యంలో 20 మంది ఇంజనీర్లు!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి 20 మంది ఇంజనీర్లు బాధ్యులని జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ ప్రాథమికంగా తేలి్చనట్టు సమాచారం. ఈ బరాజ్‌లపై విచారణ జరిపిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో 10 మంది దాకా ఇంజనీర్లు బాధ్యులని తేలి్చంది. ఈ మేరకు విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను కాళేశ్వరం కమిషన్‌కు అందించింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అలసత్వం బరాజ్‌ల వైఫల్యానికి కారణాలని ఎన్ఫోర్స్మెంట్ తన నివేదికలో పేర్కొంది.పూర్తి నివేదిక అందించడానికి మరికొంతకాలం గడువు కావాలని విజిలెన్స్ నివేదించగా.. పత్రాలన్నీ ఇస్తే తామే వైఫల్యానికి కారణాలను తేల్చుకుంటామని కమిషన్ స్పష్టం చేయడంతో నెలాఖరుకల్లా నివేదిక అందించడానికి విజిలెన్స్ అంగీకరించింది. ఇక విచారణను తప్పుదోవ పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలతోపాటు, క్రిమినల్ కేసుల నమోదుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిషన్ యోచిస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన కేసులో ఉన్న ఇంజనీర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతులు కూడా ఇవ్వరాదని ప్రభుత్వానికి లేఖ రాయాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. చాలామంది అధికారులు అఫిడవిట్ రూపంలో దాఖలు చేసిన సమాచారంలో ఈ విషయాన్ని కమిషన్ గుర్తించింది. విచారణను తప్పుదోవ పట్టించడానికి వీరు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించినట్టు తేలింది.ఇక కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతో ముడిపడిన అన్నీ డాక్యుమెంట్లు అందించాలని నీటిపారుదలశాఖను మరోమారు కమిషన్ ఆదేశించింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్, ఎం–బుక్ (మెజర్మెంట్ బుక్)లు కూడా కమిషన్‌కు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండురోజులుగా జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈ రెండు బుక్‌లకు సంబంధించిన ప్రస్తావన పలు సందర్భాల్లో వచ్చింది. దీంతో క్రాస్ ఎగ్జామినేషన్‌లో పేర్కొన్న వివరాలు సరైనవా? కావా? అనేది నిర్ధారణ కావాలంటే కీలకమైన రెండు బుక్‌లను తెప్పించుకోవడమే మేలని కమిషన్ నిర్ణయించింది. కాళేశ్వరంపై ఇదివరకే కాగ్ నివేదిక ఇచి్చన నేపథ్యంలో ఆ అధికారిని పిలిపించి, సమాచారం సేకరించాలని కమిషన్ నిర్ణయించింది.40 మంది ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని.. విచారణలో భాగంగా మంగళవారం నుంచి శనివారం దాకా 40 మంది దాకా ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కమిషన్ నిర్ణయించింది.తాజా జాబితాలో మాజీ ఈఎన్సీతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.ఇంజనీర్లను పూర్తిగా ప్రశ్నించిన తర్వాత ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లకు కమిషన్ కబురు పంపనుంది. ఆ పిదప కీలక ప్రజాప్రతినిధులకు కూడా సమన్లు పంపించనుంది. ఇప్పటికే విచారణలో స్పష్టత వచి్చంది.లాయర్ లేకుండానే క్రాస్ ఎగ్జామినేషన్ లాయర్ లేకుండానే ఒంటరిగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది. వాస్తవానికి శుక్ర, శనివారాల్లో మొత్తం 18 మందిని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఒకవేళ కమిషన్ లాయర్‌ను సమకూర్చుకుంటే..ప్రతివాదులు కూడా లాయర్లనుతెచ్చుకుంటున్నారని, దీనివల్ల రోజుకు ఒక్కరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేమనే అభిప్రాయానికి కమిషన్ వచి్చంది. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో లాయర్లను అనుమతించడమంటే... విచారణ ప్రక్రియను మరింత జఠిలం, వాయిదా వేయడమే అవుతుందనే అభిప్రాయంలో కమిషన్ ఉంది. అయితే కమిషన్‌కు న్యాయవాదిని సమకూర్చడానికి ప్రభుత్వం ఇదివరకే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. -
బ్యాంకు ఖాతాల్లో ‘హవాలా’ లావాదేవీలు
పళ్లిపట్టు(తవిుళనాడు): యువకుల బ్యాంకు ఖాతాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించి నలుగురు యువకులను ఈడీ అధికారులు అరెస్టు చేసి బెంగళూరుకు తరలించి దర్యాప్తు ముమ్మరం చేసిన ఘటన తమిళనాడులోని పళ్లిపట్టులో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని పళ్లిపట్టు సమీపం కుమారాజుపేట దళితవాడకు చెందిన తమిళరసన్ (25), మెట్టూరుకు చెందిన అరవిందన్ (24), ప్రకాష్ (25)ల బ్యాంకు ఖాతాల్లో రూ.3కోట్లు అక్రమంగా జమ చేసినట్లు, గుర్తించి వారి అకౌంట్లు సీజ్ చేసిన బ్యాంకు అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. ముంబై. చెన్నై, బెంగళూరు, పాండిచ్చేరికి చెందిన ఈడీ అధికారుల బృందం 20 మంది గురువారం కుమారాజుపేట, మోట్టూరులో గురువారం ఉదయం నుంచి శుక్రవారం వేకువజాము వరకు దాడులు నిర్వహించి వారిని విచారించారు.తమిళరసన్ తమ్ముడు అజిత్‌కు సైతం సంబంధం ఉందని నిర్ధారించి నలుగురిని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. యువకుల ఖాతాల ద్వారా రూ.8 కోట్ల వరకు హవాలా డబ్బులు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన సూత్రధారులెవరూ అన్న కోణంలో ఈడీ విచారణ జరుపుతుంది. -
నీరవ్ మోదీ రూ.29.75 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన తాజా ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. రూ. 6,498 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసు విచారణలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈడీ జప్తు చేసిన వాటిల్లో స్థిరాస్తులు, ఇండియాలో బ్యాంకు బ్యాలెన్స్‌లు ఉన్నట్టు తెలిపారు.మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)-2002 కింద ముంబై జోనల్ కార్యాలయం ఈ జప్తులు చేపట్టింది. కాగా ఇంతకు ముందు భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీకి చెందిన రూ.2,596 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇవే గాక పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం (ఎఫ్ఈఓఏ)-2018 కింద ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మరో రూ.692.90 కోట్ల ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైలులో ఉన్నారు -
అభయ కేసు : సందీప్ ఘోష్ దంపతులు.. మహా ముదుర్లు
కోల్‌కతా: ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. అభయ ఘటన జరిగిన నేపథ్యంలో సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సందీప్ ఘోష్‌ను విచారిస్తుంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో సందీప్ ఘోష్‌కు చెందిన మూడు ఫ్లాట్లు, రెండు ఇళ్లు, ఒక ఫామ్‌హౌస్, ముర్షిదాబాద్‌లోని మరో ఫ్లాట్ డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఆర్జీకర్ ప్రిన్సిపల్‌గా సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీత ఘోష్ అదే కాలేజీకి చెందిన ఆస్పత్రిలో సీనియర్ వైద్యురాలిగా విధులు నిర్వహించనట్లు తేలింది.అనుమతి లేకుండా ప్రభుత్వ ఆస్తుల కొనుగోలుఆ సమయంలో సందీప్ ఘోష్ దంపతులు తమ పలుకుబడిని ఉపయోగించి భారీ మొత్తంలో అక్రమ ఆస్థుల్ని పోగేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆసక్తికర విషయం ఏంటంటే? ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే రెండు ప్రభుత్వ సిరాస్థుల్ని కొనుగోలు చేశారు.అనంతరం అందుకు అనుమతి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, 2021 సంవత్సరంలో డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో తన సతీమణి డాక్టర్ సంగీతా ఘోష్‌ని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారు’ అని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ట్రంప్‌పై హారిస్‌దే పై చేయిశుక్రవారం ఈడీ అధికారులు సందీప్ ఘోష్, ఆయన సన్నిహితులు, చెందిన ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నమోదైన కేసులో విచారణ కొనసాగుతోంది. అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుమరోవైపు అక్రమాస్తుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు మంగళవారం సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక,ఇదే అక్రమాస్తుల కేసులో సెప్టెంబర్ 2న సీబీఐ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది.ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది.అప్పటి నుంచి ఎనిమిది రోజుల కస్టడీకి పంపింది. తాజాగా ఆ గడువు ముగియడంతో కస్టడీ గడువును పొడిగించాలని అధికారులు సీబీఐ కోర్టును కోరారు. దీంతో కోర్టు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. -
సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. టీచర్ రిక్రూట్మెంట్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ అభిషేక్ బెనర్జీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబర్9)న సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తీరును సమర్థించింది. అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిందిఅభిషేక్ బెనర్జీ దంపతులపై ఈడీ కేసు ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన సతీమణి రుజీరా బెనర్జీ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. టీచర్ కుంభణంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ దంపతులకు పెద్దమొత్తంలో ముడుపులు అందాయని, కేసు విచారణ చేపట్టేందుకు ఢిల్లీకి రావాలని సమన్లు జారీ చేసింది. ఢిల్లీకి రాలేను.. మీరే కోల్‌కతాకు రండిఇదే అంశంపై ఈడీ జారీ చేసిన సమన్లపై అభిషేక్ బెనర్జీ స్పందించలేదు. కేసు దర్యాప్తు చేసేందుకు ఢిల్లీకి రావాలంటూ సమన్లు ఇవ్వడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణను కోల్‌కతాలోని తన నివాసంలోనే విచారించాలని, ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని..ఈడీని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా, విచారణ చేపట్టిన కోర్టు అభిషేక్ బెనర్జీ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఆయన ఢిల్లీలోనే ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.నిధులు మళ్లించే.. పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో గతేడాది ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో అభిషేక్ బెనర్జీ పేరును ప్రస్తావించింది. ఈడీ సమాచారం మేరకు.. ప్రభుత్వ పాఠశాలలో అక్రమ మార్గంలో ఉద్యోగం పొందేలా పలువురు అప్పటి అధికార టీఎంసీ నేతలకు డబ్బులు చెల్లించారు. ఆ నేతల్లో కుంతల్ ఘోష్ ఒకరు. కుంతల్ ఘోష్ తనకు అందిన ముడుపుల్ని అభిషేక్ బెనర్జీకి ఆర్థిక సంబంధిత వ్యవహారాలను నిర్వహించే సుజయ్ కృష్ణ భద్రకు అందించారు. ఆ డబ్బును ప్రైవేట్ కంపెనీలకు మళ్లించగా.. ఆ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్లలో ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా ఒకరని ఈడీ వెల్లడించింది. -
కోల్‌కతా డాక్టర్ కేసు: రంగంలోకి ‘ఈడీ’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించి పశ్చిమబెంగాల్లోని హౌరా, సోనార్పూర్, హుగ్లీ ప్రాంతాల్లో శుక్రవారం(సెప్టెంబర్ 6) ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది.హత్యాచారం జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాలేజీలో అక్రమాలు, మనీలాండరింగ్ వ్యవహారాల్లో ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. ఆర్జీకర్మెడికల్ కాలేజీ అక్రమాల సీబీఐ కేసులో సందీప్‌ఘోష్ అరెస్టయ్యారు. ఆయన ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. 8 రోజుల పాటు ఘోష్‌ను విచారించేందుకు కోర్టు సీబీఐకి అనుమతిచ్చింది. మరోవైపు మహిళా డాక్టర్ హత్యాచారం కేసును సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. ఇదీ చదవండి.. బలవంతంగా దహనం చేశారు -
Supreme Court: ఇంత కాఠిన్యమా?
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) కేసుల దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవసరానికి మించిన కాఠిన్యం చూపుతోందంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుల నుంచి జప్తు చేసే డాక్యుమెంట్లను వారికిచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ తలంటింది. ‘‘కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ డాక్యుమెంట్లను నిరాకరించడం సబబా? ఇది జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడం కాదా?’’ అంటూ అక్షింతలు వేసింది. పీఎంఎల్ఏకు సంబంధించిన ఒక కేసును న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎ.అమానుల్లా, జస్టిస్‌ఏజీ మసీతో ధర్మాసనం బుధవారం విచారించింది. ‘‘నిందితునికి సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు మీరు జప్తు చేయొచ్చు. అతనికి అవన్నీ గుర్తుండాలని లేదు కదా! అడిగితే ఇవ్వడానికి ఇబ్బందేమిటి? వేలాది పేజీల డాక్యుమెంట్లనైనా నిమిషాల్లో స్కాన్ చేసిన అందుబాటులోకి తేవచ్చు. దర్యాప్తు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడలేరా?’’ అని ప్రశ్నించింది. ‘‘క్లిష్టతరమైన విచారణ ప్రక్రియను ఎదుర్కొంటున్న నిందితునికి సొంత డాక్యుమెంట్లే ఇవ్వకపోవడం న్యాయమా? అత్యంత హీనం, అమానుషమని భావించిన కేసుల్లోనూ నిందితులను బెయిల్ దొరికిన సందర్భాలు బోలెడు! కానీ ఈ రోజుల్లో అమాంబాపతు కేసుల్లో కూడా బెయిల్ రావడం గగనంగా మారుతోంది. కాలం మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కేసుల్లో మేం (ధర్మాసనం) కఠినంగా ఉండొచ్చా? అది భావ్యమేనా?’’ అంటూ ఈడీని జస్టిస్ ఓకా నిలదీశారు. బెయిల్ కోసం, లేదా కేసే తప్పుడుదని నిరూపించేందుకు డాక్యుమెంట్లపైనే ఆధారపడే పరిస్థితుల్లో వాటిని పొందే హక్కు నిందితునికి ఉంటుందని స్పష్టం చేశారు. -
ఉత్కంఠ నడుమ ‘ఆప్’ ఎమ్మెల్యే అరెస్టు
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎమ్మెల్యే అమనతుల్లాఖాన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. వక్ఫ్ బోర్డులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఖాన్‌ను ఈడీ సోమవారం(సెప్టెంబర్2) అదుపులోకి తీసుకుంది. అమనతుల్లాఖాన్ అరెస్టుకు ముందు సోమవారం ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయమే తన ఇంటికి ఈడీ వచ్చిందని, తనను అరెస్టు చేస్తుందని ఎమ్మెల్యే ఖాన్ ఎక్స్ (ట్విటర్)లో పోస్టులు పెట్టారు. ఆయన చెప్పినట్లుగానే కొన్ని గంటల పాటు సోదాలు జరిపిన అనంతరం ఈడీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది. అయితే సోదాల సందర్భంగా ఈడీ అధికారులు మానవత్వం లేకుండా ప్రవర్తించారని, నాలుగు రోజుల క్రితమే క్యాన్సర్ సర్జరీ జరిగిన తన తల్లిని వేధించారని ఖాన్ తెలిపారు. రెండేళ్ల నుంచి తనపై తప్పుడు కేసుపెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బెయిల్ అంశాల్లో ఆలస్యమెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: బెయిల్ అంశాల్లో కౌంటర్ల దాఖలుకు ఆలస్యమెందుకో అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ కేవీ.విశ్వ నాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాద నలు వినిపిస్తూ.. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలు అని తెలిపారు. కేసులో సహ నిందితు డైన సిసోడియాకు బెయిల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా, ఈడీ కౌంటర్ దాఖలు చేయ లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ.రాజు ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. బెయిల్ అంశాల్లో కౌంటర్ల దాఖ లుకు ఆలస్యమెందుకు? కోర్టులో కేసు డైరీతోనే నిర్ణయం ఉంటుందంటూ ఈడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45లో కఠిన నిబంధనల నుంచి మహిళగా కవితకు మినహాయింపు ఉందని ముకుల్ రోహత్గి ప్రస్తావించగా... పీఎంఎల్ఏ కఠిన నిబంధనలు ఎందుకెలా వర్తి స్తాయో కింది కోర్టుల న్యాయమూర్తులు వివరణా త్మక కారణాలు తెలిపారని ధర్మాసనం వ్యాఖ్యాని ంచింది. కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వలేదో హైకోర్టు కారణాలు వివరించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమయంలో కవితకు మధ్యంతర ఊరట కల్పించాలని ముకుల్ రోహత్గి కోరగా. ధర్మాసనం నిరాకరించింది. ఈడీ బుధ వారం కౌంటర్ దాఖలు చేస్తే శుక్రవారం వాద నలు వినిపిస్తామని రోహత్గి తెలిపారు. దీంతో, ఈడీ తరఫు కౌంటర్ దాఖలు చేయడానికి గురు వారం వరకూ సమయం ఇవ్వాలని రాజు కోరగా, అదేరోజు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని, శుక్రవారం రిజాయిండర్ దాఖలు చేయా లని పిటిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. కాంగ్రెస్సే కవితకు బెయిల్ ఇప్పిస్తోందిఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ కుమ్మక్కు: బండి సంజయ్ మహేశ్వరం: కేసీఆర్ కూతురు కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందుకు సంబంధించిన కేసును కాంగ్రెస్ నుంచి కాబోయే రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీయే కోర్టులో వాదిస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాలలో మంగళవారం నిర్వహించిన సూర్యగిరి రేణుక ఎల్లమ్మ ఉత్సవాలకు హాజరైన సంజయ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. కేసీఆర్ సూచించిన వారికే రాష్ట్రంలో మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ సీట్లు వస్తున్నాయని తెలిపారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫాంహౌస్‌కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యానించారు. అభిషేక్ సింఘ్వీ అనుభవజ్ఞుడైన న్యాయవాది అని, ఆయన తెలంగాణ నుంచి ఎంపీ అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కోర్టుల్లో, పార్లమెంట్లో గట్టిగా వాదిస్తారనుకుంటే .. లిక్కర్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం వాదిస్తున్నారని ఎద్దేవా చేశారు. -
ఈడీ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పూర్తికాలపు డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ఈడీ తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయనను బుధవారం పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమించారు. నవీన్ ఇండియన్ రెవెన్యూ సరీ్వసు (ఐఆర్ఎస్) 1993 బ్యాచ్.. ఇన్‌కంట్యాక్స్ కేడర్‌కు చెందిన అధికారి. రాహుల్ నవీన్‌ను రెండేళ్ల కాలానికి, లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు (ఇందులో ఏది ముందైతే అది వర్తిస్తుంది) ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆదేశాలు జారీచేసింది. 57 ఏళ్ల నవీన్ 2019 నవంబరులో స్పెషల్ డైరెక్టర్‌గా ఈడీలో చేరారు. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం గత ఏడాది సెపె్టంబరు 15న ముగియడంతో.. నవీన్ అప్పటినుండి తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పన్ను వ్యవహారాల్లో నవీన్ నిపుణులు. తాత్కాలిక డైరెక్టర్‌గా నవీన్ వ్యవహరించిన కాలంలోనే మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ల సంచలన అరెస్టులు జరిగాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఎంటెక్ రాహుల్ నవీన్ బిహార్‌కు చెందిన వారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ చేశారు. మెల్బోర్న్ (ఆ్రస్టేలియా)లోని స్విన్బుర్నే యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆదాయపు పన్ను శాఖలో 30 ఏళ్లు పనిచేశారు. అంతర్జాతీయ ట్యాకేషన్స్పై నవీన్ రాసిన పలు వ్యాసాలను నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌లో ట్రైనీ ఐఆర్ఎస్ విద్యార్థులకు పాఠాలుగా బోధిస్తున్నారు. ‘‘ఇన్ఫ్మర్మేషన్ ఎక్చేంజ్ అండ్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ: టాక్లింగ్ గ్లోబల్ ట్యాక్స్ ఎవాషన్ అండ్ అవాయిడెన్స్’’ శీర్షినక నవీన్ రాసిన పుస్తకం 2017లో ప్రచురితమైంది. -
మళ్లీ ‘ఈడీ’ విచారణకు రాహుల్‌గాంధీ..?
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాహుల్, సోనియాగాంధీ ప్రధానవాటాదారులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. ఈ కేసులో చార్జ్‌షీట్ ఫైల్ చేసేముందు ఈడీ రాహుల్‌ను విచారించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.దర్యాప్తునకు ముగింపు పలికి కేసు విచారణకు వెళ్లాల్సిఉందని, ఇందుకోసం కేసుతో సంబంధమున్న అందరినీ చివరిసారిగా విచారించాలనుకుంటున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసులో మరో నిందితురాలిగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలుస్తుందా లేదా అన్నది తెలియాల్సిఉంది. కాగా, నేషనల్హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. -
ఎన్ఫోర్స్మెంట్.. సెటిల్మెంట్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పట్టుకొమ్మ లాంటి పన్నుల శాఖ.. కొన్నిరోజులుగా ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులతో కునారిల్లుతోంది. ముఖ్యంగా ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్న అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న వారిపై ఏకంగా ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం వెళ్లిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పన్నుల శాఖలో పాలన గాడి తప్పడం, ఎవరు ఏం చేస్తున్నారన్న దానిపై పర్యవేక్షణ కొరవడటంతో.. ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల రూపాయలు అధికారులు, వ్యాపారుల జేబుల్లోకి వెళుతున్నాయని అంటున్నాయి. మరోవైపు శాఖలోని అంతర్గత లావాదేవీల్లో కూడా అవినీతి గుప్పుమంటోందని, ఇటీవల జరిగిన ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పన్నుల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ.. ఈ ఆరోపణలు, విమర్శలపై ఫోకస్ చేశారు. మూడు రోజులుగా అన్నిస్థాయిల్లోని అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విభాగమే కీలకం పన్నుల శాఖ అదనపు కమిషనర్ నేతృత్వంలో డిప్యూటీ కమిషనర్లు, సీటీవోలు, డీసీటీవోలు, ఏసీటీవోలు కలిపి 20 మంది వరకు ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తుంటారు. రాష్ట్రంలో పన్ను కట్టాల్సిన వ్యాపారాలన్నింటిపై ఈ విభాగం నిఘా పెట్టాల్సి ఉంటుంది. తప్పుడు వేబిల్లులు చూపించి లేదా బిల్లులు లేకుండా జీరో వ్యాపారం చేస్తున్నవారు, వ్యాపార లావాదేవీలను తక్కువగా చూపించే డీలర్లు, తప్పుడు బిల్లులతో ఐటీసీ క్లెయిమ్ చేసుకునేవారు, కోట్ల టర్నోవర్ చేసి అకస్మాత్తుగా మాయమయ్యే వ్యాపారులపై నిఘా పెట్టి.. వారి నుంచి పన్నులు వసూలు చేసే బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ అధికారులదే. అయితే గత పదేళ్లలో ఈ విభాగంలో పనిచేసిన వారిలో చాలా మంది అధికారులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అవినీతి మరకలు కొత్తేమీ కాదు. కానీ ఈ విభాగంలో పనిచేస్తూ రిటైరైన ఏడేళ్ల తర్వాత కూడా ఓ అధికారి పింఛన్ ఇంతవరకు సెటిల్ కాలేదంటే.. ఏ స్థాయిలో ఆరోపణలు వచ్చాయో, ఎన్ని కేసులు అయ్యాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు దెబ్బకొడుతూ.. పెద్ద పెద్ద వ్యాపారులపై ఫోకస్ చేసి, వారి పన్ను చెల్లింపుల్లో తప్పులను పట్టుకుని, విచారణ పేరిట బెదిరించడం.. నామమాత్రంగా పన్ను కట్టించి, మిగతా మొత్తంలో కొంత కమీషన్‌గా జేబులో వేసుకోవడం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బందికి పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వారు ఎక్కడా దొరక్కుండా మ్యాన్యువల్ నోటీసులు ఇవ్వడం.. షోకాజ్ నోటీసు, డిమాండ్ నోటీసు వంటి వాటికి కూడా ఆన్లైన్ ఆథరైజేషన్ లేకుండా చేయడం ద్వారా తమ తతంగాన్ని పూర్తి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన క్షేత్రస్థాయి పరిశీలనలు, దాడులు, వాహనాల తనిఖీలు వంటివి పన్నుల శాఖలో మచ్చుకైనా కనిపించవు. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ విభాగంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు అధికారుల అవినీతి లీలలను వివరిస్తూ, చర్యలు తీసుకోవాలంటూ పన్నుల శాఖలోని వారే ప్రధాని కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గతంలో పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేసిన టీకే శ్రీదేవి అవకతవకలకు అడ్డుకట్ట వేసేలా చిన్న ప్రయత్నం చేస్తేనే నెలకు రూ.200 కోట్ల వరకు పన్ను రాబడి పెరిగిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అదే ఎన్ఫోర్స్మెంట్ పనితీరు సరిగ్గా ఉంటే ఏటా ఏడెనిమిది వేల కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావొచ్చని అంటున్నాయి. అందరూ హైదరాబాద్ చుట్టూనే.. పన్నుల శాఖ పరిధిలో సర్కిల్ స్థాయిలో కీలకంగా వ్యవహరించే సీటీవోల వ్యవహారం మరింత విస్తుగొలుపుతోంది. పదోన్నతులు పొంది శిక్షణలో ఉన్న వారు కాకుండా ప్రస్తుతం 85 మంది వరకు పన్నుల శాఖలో సీటీవోలుగా ఉన్నారు. వీరిలో 80 మందికిపైగా హైదరాబాద్‌లోనే పనిచేస్తుండటం గమనార్హం. కేవలం నలుగురైదుగురు సీటీవోలు మాత్రమే జిల్లాల్లో పనిచేస్తున్నారని.. హైదరాబాద్ తర్వాత పన్ను రాబడికి ప్రధాన కేంద్రాలైన వరంగల్, కరీంనగర్‌లలోనూ రెగ్యులర్ సీటీవోలు లేరని సమాచారం. హైదరాబాద్‌లో ఉంటే అటు ఆదాయం పెరగడంతో ఇటు శాఖాపరమైన ఒత్తిడి తగ్గుతుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఇక్కడే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారనే చర్చ పన్నుల శాఖలో జరుగుతోంది. కొనుగోళ్లలోనూ అవకతవకలు! పన్నుల శాఖలోని అంతర్గత లావాదేవీల్లోనూ భారీగా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల కొనుగోలు చేసిన 200 ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ అక్రమాలు జరిగాయని, దీనిపై కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిసింది. ‘శాఖ ఆడిట్‌లోని లోపాలతోపాటు, ఆదాయం తక్కువ వచ్చేందుకు కారణాలు, ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నారు? ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం తీసుకువచ్చారు?’అనే అంశాలపై ఆయన మూడు రోజులుగా వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్న అధికారుల వివరాలు సేకరిస్తున్న ఆయన.. త్వరలోనే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని పన్నులశాఖ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆడిట్లను పునఃసమీక్షించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని అంటున్నాయి. -
కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఈడీని ప్రశ్నించిన కోర్టు
ఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించింది. మీరు(ఈడీ) ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టుకు ఇచ్చిన బెయిల్‌ను ఈడీ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఈడీ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ విషయంలో నేను అయోమయంలో ఉన్నాను. మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు. కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్టు చేయాలనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించారు. అనంతరం విచారణను సెప్టెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా..మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. కాగా రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలను వినే వరకు కేజ్రీవాల్‌కు కల్పించిన బెయిల్ ఉపశమనంపై మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. -
‘లిక్కర్‌స్కామ్’లో పీకల్లోతులో సిసోడియా: సుప్రీంలో ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వవద్దని సుప్రీంకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వాదించింది. లిక్కర్‌స్కామ్‌లో మనీష్‌సిసోడియా పీకల్లోతు కూరుకుపోయారని ఈడీ తెలిపింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌విరాజు వాదనలు వినిపించారు. మనీష్‌సిసోడియాపై పెట్టిన కేసులు కల్పితం కాదని, ఆయనకు వ్యతిరేకంగా చాలా సాక్షాధారాలున్నాయని తెలిపారు. కేసు దర్యాప్తులో ఎలాంటి జాప్యం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మనీష్‌సిసోడియా ఈ కేసులో 17 నెలలుగా ఎందుకు జైలులో ఉండాలని ఆయన తరపు న్యాయవాది అభిషేక్‌మనుసింఘ్వి వాదించారు. వాదనల సందర్భంగా ఈడీ న్యాయవాది లిక్కర్ పాలసీ రూపకల్పన అని ప్రస్తావించినపుడు సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుంది. పాలసీ రూపకల్పనకు నేరం చేయడానికి మధ్య తేడా ఏంటో చెప్పాలని కోరింది. కాగా, మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్నారు. -
నాపై ఈడీ దాడులు.. చాయ్ బిస్కెట్లతో వెల్కమ్: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై సంచలన ఆరోపణలకు దిగారు. తనపై త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసే అవకాశం ఉందని అన్నారాయన. అందుకు తన చక్రవ్యూహ్ ప్రసంగమే కారణమని చెబుతూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. : రాహుల్ గాంధీనాపై ఈడీ దాడులు జరగొచ్చు. ఓ అధికారి నుంచి నాకు దానిపై సమాచారం వచ్చింది. జులై 29న నేను పార్లమెంటులో చేసిన ‘చక్రవ్యూహం’ స్పీచ్ కొందరికి నచ్చలేదు. ఈడీ విచారణ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.. అదీ ఛాయ్ బిస్కెట్లతో అని ఛమత్కారంగా ఓ సందేశం ఉంచారాయన. Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned. Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024 పార్లమెంట్లో ఈ మధ్య ప్రవేశపెట్టిన.. కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్‌సభ చర్చ జరిగింది. సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు సంధించారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండోదని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ.. ‘‘అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో.. ఇప్పుడు దేశాన్నీ అదే చేయబోతున్నారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారు. ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారు’’ అని రాహుల్ ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ నేత ఇంటిపై ఈడీ దాడులు
భివానీ: హర్యానాలోని భివానీ జిల్లాలో మైనింగ్ కాంట్రాక్టర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి దాడులు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మైనింగ్ కాంట్రాక్టర్ వేద్‌పాల్ తన్వర్, అతని సహచరుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇప్పుడు మరోమారు భివానీ, తోషమ్‌లోని మైనింగ్ కాంట్రాక్టర్ల ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేశారు.భివానీలోని సెక్టార్-13లో ఉంటున్న మైనింగ్ కాంట్రాక్టర్, కాంగ్రెస్ నేత సత్బీర్ రాటేరా నివాసంపై ఈడీ బృందం దాడులు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈడీ బృందం సత్బీర్ రాటేరా ఇంటిపై దాడులు చేసింది. సత్బీర్ రాటేరా తన భార్య పేరిట తోషమ్‌లోని ఖానాక్, దాడం ప్రాంతంలో మైనింగ్ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నారు. ఆయన బవానీఖేడా అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం. -
తెలంగాణలో గొర్రెల స్కాం.. విచారణలో ఏసీబీ దూకుడు
సాక్షి,హైదరాబాద్ : గొర్రెల స్కాం దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీపై వివరాలు కావాలని తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యకు లేఖ రాసింది. ఆ లేఖలో లబ్దిదారులు, అమ్మకం దారుడి వివరాలు, బ్యాంక్ అకౌంట్లు, డేటా ఆఫ్ గ్రౌండింగ్,ట్రాన్స్ పోర్ట్, ఇన్ వాయిస్‌లతో కూడా డేటా కావాలని ఆదేశించింది.ఇప్పటికే గొర్రెల స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. స్కీంకు సంబంధించిన సమగ్ర నివేదిక కావాలని కోరింది. అయితే ఇప్పటివరకు ఈడీకి నివేదిక అందలేదని తెలుస్తోంది.ఈడీ,ఏసీబీ లేఖలతో తలలు పట్టుకోవడం అధికారుల వంతైంది. దర్యాప్తు సంస్థల ఆదేశాలతో అధికారులు గొర్రెల స్కాంకు సంబంధించి వివరాల్ని సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లకు లేఖలు రాస్తున్నారు. రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టురాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. -
కేజ్రీవాల్ బెయిల్ నిలిపివేత.. సీజేఐకు 150 మంది న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ ఉత్తర్వులు ఆప్‌లోడ్ చేయడానికి ముందే ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఎలా సవాల్ చేసింది?, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఈడీ సవాల్‌పై ఎలా విచారణ చేపట్టి ఆర్డర్‌ను హోల్డ్‌లో ఉంచారు? బెయిల్ అమలును ఎలా నిలిపివేశారు? అని ప్రశ్నించారు. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని, ఇది న్యాయవాదుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందని 9 పేజీల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా న్యాయవాదుల సమర్పణలను న్యాయమూర్తులు తమ ఆదేశాలలో రికార్డ్ చేయడం లేదని న్యాయవాదులు ఆరోపించారు. ఇది కోర్టు చరిత్రలో మొదటిసారి అని, ఇది చాలా అసాధారణమైనదని పేర్కొన్నారు. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ సమయంలో చేసిన సమర్పణలను న్యాయవాదుల ముందు, కేసు వాయిదా వేయడానికి ముందు రికార్డ్ చేయాలని ఆదేశాలు జారీ చేయవలసిందిగా అభ్యర్ధించారు.బెయిల్ మంజూరులో జాప్యం గురించి ప్రస్తావిస్తూ.. ‘ముఖ్యంగా ఈడీ, సీబీఐకు సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తులు ఎక్కువ వ్యవధిలో విచారణ తేదీలు ఇస్తారు. బెయిల్ విషయాలను త్వరగా పరిష్కరించరు. న్యాయ సూత్రాలకు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హామీకి ఇది విరుద్ధం.ఈ దేశ ప్రజలు ఎంతో ఆశతో, విశ్వాసంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నమ్మకాన్ని న్యాయవ్యవస్థ, న్యాయ సంఘం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే మా ఆందోళనలను మీతో పంచుకుంటున్నాం. వీటిని త్వరగా సరిదిద్దుతారని ఆశిస్తున్నాం.’ అని లేఖలో ప్రస్తావించారు. -
BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చెందిన 1.2 కేజీల బంగారం సీజ్
-
‘ఓఎం’ గ్రూప్ చారిటీ సంస్థలో ఈడీ సోదాలు..
సాక్షి, హైదరాబాద్: దళిత, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పన పేరిట విదేశాల నుంచి కోట్ల రూపాయల విరాళాలు సేకరించి వాటి ద్వారా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆపరేషన్ మొబిలైజేషన్ (ఓఎం) సంస్థలో సోదాలు నిర్వహించారు. ఈనెల 21, 22 తేదీల్లో హైదరాబాద్, ఇతర 11 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఆపరేషన్ మొబిలైజేషన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ సంస్థ.. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్, జర్మనీ, ఫిన్లాండ్, ఐర్లండ్, మలేసియా, నార్వే, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, రుమేనియా, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాల్లోని దాతల నుంచి దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ ద్వారా రూ.300 కోట్ల మేర నిధులు వసూలు చేయడంపై తెలంగాణ సీఐడీ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓఎం సంస్థ వంద పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పిస్తున్నామంటూ విరాళాల రూపంలో వసూలు చేసిన డబ్బులను ఆస్తులను కూడబెట్టేందుకు, ఇతర అనధికార పనులకు వాడినట్టు అధికారులు గుర్తించారు. ఉచిత విద్య, ట్యూషన్ ఫీజుల పేరిట నెలకు ఒక్కో విద్యార్థికి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఓఎం సంస్థ వసూలు చేసినట్టు సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ సొమ్మును సదరు సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్టు వెల్లడైంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద వసూలు చేసిన నిధులకు సంబంధించి సైతం సరైన రికార్డులు లేవని తేలింది. ఈ అక్రమాలన్నింటిపైనా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఆస్తుల కొనుగోలు..ఈడీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓఎం గ్రూప్ ఆఫ్ చారిటీస్ పేరిట విదేశాల నుంచి సేకరించిన సొమ్ముతో సంస్థల్లోని కీలక ఆఫీస్ బేరర్స్ పేరిట తెలంగాణ, గోవా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.ఓఎం గ్రూపు సంస్థలకు సంబంధించిన ఎఫ్ఆర్సీఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) రిజిస్ట్రేషన్లు సైతం రెన్యువల్ చేయలేదని, ఓఎం బుక్స్ ఫౌండేషన్ సంస్థ పేరిట సేకరించిన విదేశీ విరాళాలు ఇతర సంస్థలకు రుణాలు ఇచ్చినట్టుగా చూపి దారి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఓఎం సంస్థలకు చెందిన ఆఫీస్ బేరర్స్ గోవాలో పలు డొల్ల కంపెనీలను సృష్టించి వాటిలో వారంతా ఉద్యోగులుగా చూపి, వేతనాల రూపంలోనూ డబ్బులు దండుకున్నట్టు తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా ఓఎం గ్రూప్ సంస్థ కీలక సిబ్బంది ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో బినామీ కంపెనీలకు సంబంధించిన పలు పత్రాలు, అనుమానాస్పద లావాదేవీల వివరాలు, డిజిటల్ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు వెల్లడించారు. -
హైదరాబాద్‌లో 11 చోట్ల ఈడీ సోదాలు
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆపరేషన్ మోబిలైజేషన్ గ్రూప్ పై 11చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని మోబిలైజేషన్ గ్రూప్ విదేశాల నుంచి రూ.300 కోట్ల విరాళాలు సేకరించింది. ఆ నిధుల్ని ఓం ఫౌండేషన్ పేరుతో దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణ, కేరళ మహారాష్ట్ర,కర్ణాటకలో ఈడీ సోదాలు జరిపారు.ఈ సోదాల్లో బినామీ పేర్లతో నిధుల్ని స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. -
బీఆర్ఎస్ టైటానిక్‌లా మునిగిపోతుంది
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో చోటుచేసుకున్న కుంభకోణాలపై విచారణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాక తప్పదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివిధ కేసుల్లో అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని ఆయన చెప్పారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్.. ఇలా వివిధ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు అందరూ కేసీఆర్ పేరే చెబుతున్నా రన్నారు. రాబోయేరోజుల్లో బీఆర్ఎస్కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం (సీఆర్ఎస్) ఖాయమన్నారు. టైటానిక్షిప్ మాదిరిగా బీఆర్ఎస్ నావ మునిగి పోతుందని అన్నారు. బీజేపీలోకి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, అలాగే నక్సలైట్లు, మరెవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు.శనివారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో రఘునందన్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే తాను క్షీరసాగర్ నుంచే పని మొదలుపెడతానని, దళితుల భూములను తిరిగి వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని చెప్పారు.మీడియా ప్రతి నిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు రఘునందన్‌రావు సమాధానాలిస్తూ.. నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపై స్పందిస్తూ.. ‘ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలు తప్పకుండా పాటిస్తా. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ తన అభిప్రాయం వెల్లడించారు’అని అన్నారు. జర్నలిస్ట్ యూనియన్ సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, ప్రధానకార్యదర్శి బింగిస్వామి పాల్గొన్నారు. -
కేజ్రీవాల్ ఏమైనా టెర్రరిస్టా: సునీతా కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు శుక్రవారం(జూన్21) చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సునీత మాట్లాడుతూ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయకముందే ఈడీ హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఈడీ దాఖలు చేసిన రద్దు పిటిషన్‌ను విచారించేదాకా బెయిల్ ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. -
కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలున్నాయి: ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. సాధారణ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంను కోర్టు ముందు హాజరుపరిచారు.ఈ సందర్బంగా కేజ్రీవాల్‌పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొన్నారు.‘ఈ కేసులో మనీలాండరింగ్ నేరంపై కోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా సహ నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ జరిగినట్లు కోర్టు విశ్వసిస్తోంది’ ఆయన పేర్కొన్నారు.పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. అంతేగాక సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.ఇక కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం కేసు ఆగస్టు 2022లో ప్రారంభమవ్వగా.. ఎన్నికలకు ముందు 2024 మార్చిలో కేజ్రీవాల్ అరెస్టు చేశారని అన్నారు. ఆయన అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు.మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
‘నగదు’పై ఈడీ ఫోకస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కుంభకోణం కేసుపై సమగ్ర దర్యాప్తునకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నగదు లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జరిగిన నిధుల లావాదేవీలు, గొర్రెల పంపిణీ, లబ్ధిదారుల వివరాలు, ఇతర పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ఈడీ ఇప్పటికే తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహ కార సంస్థ ఎండీకి లేఖ రాసింది. దీనిని అత్యవసరంగా పరిగణించి వివరాలు ఇవ్వాలని కోరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 54 కింద ఈడీ అధికారులు ఈ వివరాలను తీసుకోనున్నారు.ఈడీ అధికారులు వస్తారనుకున్నా..గొర్రెల పంపిణీ వ్యవహారం దర్యాప్తు కోసం ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం గొర్రె లు, మేకల సహకార అభివృద్ధి సంస్థకు రాను న్నట్టు ప్రచారం జరిగింది. ఈడీ అధికారులు వస్తున్నట్టు సంస్థ వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. కానీ కార్యాలయంలో సంస్థ ఎండీ, ఇతర ఉన్నతాధికారులెవరూ అందు బాటులో లేరని, వారు ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇవ్వడానికి వెళ్లారని పేర్కొన్నాయి. పలు అనివార్య కారణాలతోనే ఈడీ అధికారులు రాలేదని తెలిసింది. అధి కారులు ఇచ్చే సమాచారాన్ని విశ్లేషించేందుకు, ఆర్థిక లావాదేవీల్లోని లోపాలను గుర్తించేందు కు ఈడీ ఇప్పటికే ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. తగిన సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలో వివ రాలు సేకరించేందుకు ఈడీ అధికారులు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఏసీబీ కూడా దూకుడుగా..గొర్రెల పంపిణీ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సు మారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కీలక నిందితులుగా భావిస్తున్న రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి ఓఎస్డీ కల్యాణ్ కుమార్‌లను మూడు రోజుల పాటు కస్టడీకి తీ సుకుని విచారించారు.ప్రస్తుతం ఏసీబీ దర్యా ప్తు కీలక దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఏసీబీ నుంచి అవసరమైన సమాచారాన్ని కోరాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఎంతమేర అవినీతి జరిగింది? సొమ్మును ఎవ రెవరి ఖాతాల్లోకి, ఎలా మళ్లించారు? ఏయే బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా నిధులు మళ్లా యన్న వివరాలను తేల్చాలని యోచిస్తున్నట్టు సమాచారం. నగదు లావాదేవీలపై ఈడీ ము మ్మర దర్యాప్తు చేపడితే.. ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయోనన్న చర్చ జరుగుతోంది. -
గొర్రెల స్కాంపై ఈడీ స్పీడ్.. పశుసంవర్ధక శాఖకు అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ చర్చనీయాంశంగా మారింది. ఈ స్కామ్ విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయం చేరుకున్నారు.కాగా, గొర్రెల పంపిణీ గురించి ఈడీ అధికారులు ఇప్పటికే పశుసంవర్థక శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. సదరు లేఖలో 10 అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు. ఇక, గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా స్కామ్‌కు సంబంధించిన వివరాలను ఈడీ కోరింది.అయితే, రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక, ఈ స్కాంకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారు.. ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. -
బిగుస్తున్న ‘గొర్రెల’ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులు కేంద్రంగా ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు కొనసాగిస్తుండగా..మరోవైపు మనీలాండరింగ్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. కొనుగోలు చేసిన గొర్రెలనే మళ్లీ మళ్లీ కొన్నట్టు చూపడంతో పాటు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అప్పటి మంత్రి పేషీ కేంద్రంగా జరిగిన ఈ గోల్‌మాల్‌లో రూ.700 కోట్ల వరకు నిధులు దారి మళ్లినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం విదితమే. ఈ మొత్తం కుంభకోణంలో ఇప్పటివరకు ఏసీబీ అరెస్టు చేసిన అధికారుల విచారణతో పాటు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతమైతే, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? నిబంధనలు తుంగలోతొక్కి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నదెవరనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీఎంఎల్ఏ చట్టం కింద లేఖ గొర్రెల పంపిణీ పథకంలో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టుగా ఏసీబీ దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో.. ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశారు. వెంటనే కేసు దర్యాప్తు కోసం అవసరమైన వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ (టీజీఎస్జీడీసీఎఫ్ఎల్) ఎండీకి లేఖ రాశారు. మొత్తం తొమ్మిది అంశాలకు సంబంధించిన సమాచారం కోరారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 54 కింద లేఖ రాసిన ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ మాగిమై అరోకియారాజ్.. కోరిన సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించి అందజేయాలని సూచించారు. ఈ కుంభకోణంపై కేసు నమోదు చేయడం, ఆ వెంటనే వివరాలు కోరుతూ సంబంధిత శాఖకు లేఖ రాయడంతో ఈ కేసులో ఈడీ దూకుడు మీద ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లబ్ధిదారుల పేర్ల నుంచి చెక్కుల దాకా.. తెలంగాణలో ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 11 మధ్యకాలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు కోరారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, టీఎస్జీడీసీఎఫ్ఎల్ ద్వారా పంపిణీ అయిన చెక్కుల పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం కుంభకోణంలో కీలకమైన గొర్రెల రవాణా కాంట్రాక్టుదారుల వివరాలు, వారికి జరిగిన చెల్లింపులు, గొర్రెల దాణా కొనుగోలు వివరాలు కూడా ఈడీ కోరింది. అంతర్గతంగా జరిగిన అవినీతికి సంబంధించి అదనపు వివరాలు ఏమైనా ఉంటే ఇవ్వాలని లేఖలో సూచించారు. ఆ ఇద్దరూ చెప్పే విషయాలే కీలకం! గత ప్రభుత్వ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు. గొర్రెలను విక్రయించినా తమకు డబ్బులు ఇవ్వలేదని, తమ పేరిట ఎవరో డబ్బులు తీసుకున్నారంటూ ఏపీ రైతుల ఫిర్యాదు చేయడంతో మొదటిసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డా.రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చిలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పి.కృష్ణయ్యలను అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్ధ శాఖ మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్కుమార్ల అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. రాంచందర్, కల్యాణ్‌కుమార్‌లను కస్టడీకి తీసుకుని ఈ నెల 10 నుంచి 13 వరకు ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో వారు ఏసీబీకి ఏం చెప్పారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఎవరెవరున్నారనే దిశగా దర్యాప్తు ఈ మొత్తం కుంభకోణంలో ఈ ఇద్దరే కీలకంగా పనిచేశారా? ఇంకా ఎవరైనా వీరిద్దరికీ ఆదేశాలు ఇచ్చారా? అప్పటి మంత్రి పేషీలో ఇంకెవరెవరు ఉన్నారు? గొర్రెల కొనుగోలుకు ఎంతమంది బ్రోకర్లు పనిచేశారు? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా గొర్రెల పంపిణీ పథకం కొనుగోల్ మాల్ వ్యవహారాలకు సంబంధించి బ్రోకర్లు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం, ఒక్కో యూనిట్‌కు రూ.20 వేలు చేతులు మారినట్టు, ఒకసారి కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్నే మళ్లీ మళ్లీ కొనుగోలు చేసినట్టు చూపిస్తూ బిల్లులు పెట్టడం..గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి గొర్రెల కొనుగోలు చేయడంలో జరిగిన అక్రమాలు, పశుసంవర్ధకశాఖ లోని ఉద్యోగ సంఘాల నాయకులకు ఇందులో ఉన్న పాత్ర తదితర వివరాలు బహిర్గతం కావచ్చని అంటున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పట్టుబడితే మరికొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. -
గొర్రెల స్కామ్ పై ఈడీ ఫోకస్
-
ప్రచారానికి కేజ్రీవాల్ ఆరోగ్యం అడ్డురాలేదా?: కోర్టులో ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సాధారణ బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై న్యాయస్థానం మద్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యతిరేకించింది. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఆయన ఆరోగ్యం అడ్డురాలేదని పేర్కొంది.అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్ ప్రస్తుతం పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారని .. అక్కడ ప్రచారం చేసేందుకు ఆయన బెయిల్ ఇవ్వలేదని తెలిపారు. పంజాబ్‌లో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌కు ఆయన ఆరో గ్యం ఆటంకం కలిగించలేదని అన్నారు. ‘ఇప్పటి వరకు సీఎం చాలా ప్రచారం నిర్వహించారు. చివరి నిమిషయంలో బెయిల్ దాఖలు చేశారు. అయన ప్రవర్తన బెయిల్‌కు అర్హత కాదు’ అని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదపరి విచారణను జూన్1కు వాయిదా వేసింది.కాగా లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాలని ఆదేశించింది.అయితే, తీవ్రమైన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. రెగ్యులర్ బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చిందని, అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని వివరించింది. దీంతో ఈ కేసులో మధ్యంతర, సాధారణ బెయిల్‌ను కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
Lok sabha elections 2024: మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో
బక్తియార్పూర్/పాలీగంజ్/జగదీశ్‌పూర్(బిహార్): తాను సామాన్య వ్యక్తినికాదని, దేవుడు పంపించాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోమవారం బిహార్‌లో బక్తియార్పూర్, పాలీగంజ్, జగదీశ్పూర్ల్లో ఆయన ప్రచార ర్యాలీల్లో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలొచ్చాక బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై మోదీని ఈడీ ప్రశ్నించొచ్చు. అప్పుడాయన ‘నాకేమీ తెలీదు. దేవుడు పంపిస్తే వచ్చా. ఆయన చెప్పినట్లే చేశా’’ అని చెబుతారేమో’’ అంటూ ఎద్దేవా చేశారు. బిలియనీర్లకు సేవ చేయడానికే దేవుడు ఆయన్ను పంపాడా అంటూ మండిపడ్డారు. పాలీగంజ్‌లో రాహుల్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మీసా భారతి సహా డజనుకు పైగా నేతలు కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుంగింది. దాంతో రాహుల్ కాస్త పక్కకు నడవగా అక్కడా కుంగింది. వారంతా కింద పడబోయి తమాయించుకున్నారు.మోదీవి కూలదోసే కుట్రలు: ప్రియాంకసిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ వద్రా ఆరోపించారు. కాంగ్రా సమీపంలోని చంబాలో ఆమె కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. -
ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరికొందరిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషిటుపై ఈనెల 29న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవడంపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రెండోరోజూ మంగళవారం ఈడీ వాదనలు విన్నారు. ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా ఈ కేసులో కవిత పాత్రపై మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.శరత్‌రెడ్డి, బుచి్చబాబు, శ్రీనివాస్‌ల వాంగ్మూలం ఆధారంగా కుంభకోణంలో కవిత కింగ్‌పిన్‌గా వ్యవహరించిన ట్లు తెలిసిందన్నారు. హవాలా రూపంలో డబ్బులు తరలించడంలో ఎవరెవరి పాత్ర ఏంటనేది వివరించారు. వాదనల అనంతరం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషిటును పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఈ నెల 29న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి కావేరి బవేజా పేర్కొన్నారు. -
2014-22 మధ్య ఆప్ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ
న్యూఢిల్లీ: 2014 నుంచి 2022 కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం హోంమంత్రిత్వశాఖకు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA), ప్రజా ప్రాతినిధ్య చట్టం(RPA), ఇండియన్ పీనల్ కోడ్ (IPC) నిబంధనలను ఆప్ ఉల్లంఘించించి.. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్ కెనడా సహా వివిధ దేశాల్లో ఉన్న దాతల నుంచి ఆప్ ఈ మొత్తాన్ని స్వీకరించినట్లు ఈడీ వెల్లడించింది. అయితే విదేశీ దాతల వివరాలతోపాటు విరాళాలకు సంబంధించిన అనేక వాస్తవాలను ఈప్ దాచిపెట్టిందని ఈడీ ఆరోపించింది. దాతల వివరాలను తప్పుగా ప్రకటించడం, తారుమారు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్లు పేర్కొంది. ఆప్, పార్టీ నేతలు విదేశీ నిధుల సేకరణలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు తన దర్యాప్తుల్లో వెల్లడైందని ఆప్ తెలిపింది. అంతేగాక 2016లో కెనాడాలో నిధుల సేకరణ కార్యక్రమంలో సేకరించిన నిధులను, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌తో సహా పలువురు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఆరోపించింది. అనికేత్ సక్సేనా (ఆప్ ఓవర్సీస్ ఇండియా కోఆర్డినేటర్), కుమార్ విశ్వాస్ (ఒకప్పటి ఆప్ ఓవర్సీస్ ఇండియా కన్వీనర్), కపిల్ భరద్వాజ్ (అప్పటి ఆప్ సభ్యుడు), దుర్గేష్‌తో సహా వివిధ పార్టీ వాలంటీర్లు, కార్యనిర్వాహకుల మధ్య జరిగిన ఇ-మెయిల్‌లలోని విషయాల ద్వారా ఈ విషయాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. -
Supreme Court: ఎలాంటి మినహాయింపులు లేవు!
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌కు బెయిల్ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టంచేసింది. అయితే తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరిని స్వాగతిస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు బెయిల్ తర్వాత ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చేస్తున్న ప్రసంగాలను తప్పుబడుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదనలను, ప్రసంగాలను సమరి్థస్తూ కేజ్రీవాల్ తరఫు లాయర్లు చేసి వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. ‘‘ ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఏదైతే న్యాయంగా తోచిందో దానిని ఉత్తర్వుల రూపంలో మేం వెల్లడించాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడీ అభ్యర్థన తిరస్కరణ ‘‘ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే జూన్ రెండో తేదీన తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చెబుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోండి’’ అని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీనిపై కోర్టు..‘ అది అంతా ఆయన ఊహ మాత్రమే. ఈ విషయంలో మేం ఇకపై ఏమీ చెప్పదల్చుకోలేదు’’ అని ఈడీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ‘‘తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరికి అడ్డుచెప్పం. తీర్పుపై విమర్శలను మేం స్వాగతిస్తున్నాం. ’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఆయన ఏ రోజున లొంగిపోవాలనేది మా ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. ఇది స్వయంగా సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్. ఈ ఉత్తర్వు ద్వారానే చట్టం అమలవుతుంది’’ అని కోర్టు తెలిపింది. ‘‘ సొంత ఊహలతో బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘిస్తున్నారు. ఆయన ఏం చేద్దామనుకుంటున్నారు? వ్యవస్థకు చెంపపెట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అని సొలిసిటర్ జనరల్ ఆరోపించారు. ‘‘ ఆయన జూన్ రెండో తేదీన తప్పకుండా లొంగిపోవాల్సిందే. అయితే ఈ కేసు గురించి ఆయన మాట్లాడొచ్చు అనిగానీ మాట్లాడకూడదు అని గానీ మేం బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు’’ అని ధర్మాసనం వెల్లడించింది. అమిత్ షా సంగతేంటి?: కేజ్రీవాల్ లాయర్ ‘‘సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక ట్రీట్మెంట్ జరిగినట్లు అనిపిస్తోంది. ఈయన బెయిల్ ఇతరుల సాధారణ బెయిల్ మాదిరి కనిపించట్లేదు. నేనే కాదు దేశంలో చాలా మంది ఇలాగే భావిస్తున్నారు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్న మాటలను కేజ్రీవాల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోర్టుకు గుర్తు చేశారు. ఆయన సంగతేంటి?అని ప్రశ్నించారు. ఆ విషయం జోలికి తాము వెళ్లదల్చుకోలేదని ధర్మాసనం తెలిపింది. ‘‘ ఆప్‌కు ఓటేయకపోతే జైలుకు వెళ్లక తప్పదేమో అని కేజ్రీవాల్ అనలేదు. కావాలంటే ఆమేరకు కోర్టులో అఫిడవిట్ సైతం సమరి్పస్తాం’’ అని సింఘ్వీ తెలిపారు. మద్యం కేసులో కేజ్రీవాల్, ఆప్‌పై చార్జ్‌షీట్ వేస్తాం: ఈడీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో త్వరలోనే కేజ్రీవాల్, ఆప్‌పై చార్జ్‌షీట్ దాఖలుచేస్తామని సుప్రీంకోర్టుకు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తన అరెస్ట్‌ను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన సందర్భంగా కోర్టుకు ఈడీ ఈ విషయం తెలిపింది. ఈడీ కేసులో ఆప్‌ను నిందితుల జాబితాలో చేర్చుతామని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుకు సైతం ఈడీ తెలిపింది. అమిత్ షా వ్యాఖ్యలు అభ్యంతరకరం: కపిల్ సిబల్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో స్పెషల్ ట్రీట్మెంట్ జరిగి ఉండొచ్చని అమిత్ షా మాట్లాడటం చాలా అభ్యంతరకరమని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘ఈ వ్యాఖ్యల ద్వారా అమిత్ ఏకంగా సుప్రీంకోర్టు జడ్జీల ఉద్దేశాన్నే ప్రశ్నిస్తున్నారు. జనం ఇలా అనుకుంటున్నారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. జనం మాటను మీరు(అమిత్) నమ్మకపోతే ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం ఏమొచి్చంది? జనం మాటను మీరు నమ్మితే మీ అభిప్రాయంగానే ఇంటర్వ్యూలో చెప్పాలిగానీ జనాన్ని ఎందుకు మధ్యలో లాగుతారు?’’ అని నిలదీశారు. -
మనీలాండరింగ్ యాక్ట్‌లో ఈడీ అరెస్టుపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 19 ప్రకారం నిందితుడుని అరెస్ట్ చేసే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాలను సుప్రీంకోర్టు తగ్గించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేయకూడదని వెల్లడించింది. ఒకవేళ సదరు నిందితుడిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలంటే ఈడీ తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం పీఎంఎల్ కేసులో ఈడీ అరెస్ట్ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత.. కేసులో నిందితుడిగా చూపిన వ్యక్తిని సెక్షన్ 19 కింద అరెస్టు చేయడానికి ఈడీ అధికారులకు అధికారం ఉండద సుప్రీం పేర్కొంది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లకు నిందితుడు న్యాయస్థానం ఎదుట హాజరైతే దాన్ని కస్టడీలో ఉన్నట్లుగా పరిగణించకూడదని తెలిపింది‘ఈడీ ఫిర్యాదును దాఖలు చేసే వరకు నిందితులను అరెస్టు చేయని కేసుల్లో, ఆ తర్వాత కూడా వారిని అరెస్టు చేయకూడదు. ముందుగా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి సమన్లు జారీ చేస్తుంది. ఆ సమన్లకు నిందితులు స్పందించి కోర్టులో హాజరైతే వారు కస్టడీలో ఉన్నట్లు పరిగణించకూడదు. ఒకవేళ సదరు వ్యక్తి ప్రత్యేక కోర్టుకు సమాధానం ఇచ్చిన తర్వాత అతడిని కస్టడీలోకి తీసుకోవాలనుకుంటే.. దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని విశ్వసిస్తే విచారణకు అనుమతిస్తుంది’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భయన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.నిందితుడు కోర్టు సమన్లకు సమాధానం ఇవ్వడంలో విఫలమైతే మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 70 కింద అతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అది కూడా బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయి ఉండాలని తెలిపింది.కాగా పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19 ఈడీ అధికారులకు తన వద్ద ఆధారాల ఆధారంగా.. కేసులోని నిందితులను నేరుగా అరెస్ట్ చేసే అధికారాన్ని, స్టేట్మెంట్ రికార్డ్ చేసే అధికారాన్ని కల్పిస్తుంది. అయితే అరెస్ట్‌కు గల కారణాలను ఈడీ సంబంధిత వ్యక్తులకు వీలైనంత త్వారగా తెలియజేయాల్సి ఉంటుంది. -
కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌ను రద్దు చేసి, తిరిగి జైలుకు పంపాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీకోర్టు తోసిపుచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు ఓటేస్తే.. తాను తిరిగి జైలుకు వెళ్లాల్సిన పని లేదంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.దీనిపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈడీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ‘సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రచారంలో భాగంగా ఆప్‌కి ఓటు వేస్తే, తాను తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది కోర్టు విధించిన షరతులను స్పష్టంగా ఉల్లంఘించడమే. ఇది న్యాయవ్యవస్థకు చెంపదెబ్బగా పేర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మను స్పందిస్తూ.. పలువురు కేంద్ర మంత్రులు (పేర్లు ప్రస్తావించకుండా) తన క్లైయింగ్ కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై వ్యతిరేకంగా రకరకాల ప్రకటనలు చేశానే విషయాన్ని ఎత్తిచూపారు.ఇరుపక్షాల వాదనలపై కోర్టు స్పందిస్తూ.. కేజ్రీవాల్ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని, అదంతా అతని ఊహేనని ఈడీకి తెలిపింది. దానిపై తాము మాట్లాడటానికి ఏం లేదని పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి జైలుకు రావాలంటూ తాము స్పష్టమైన ఆదేశం ఇచ్చామని వెల్లడించింది. అదే ఈ కోర్టు నిర్ణయమని, తాము చట్టబద్ధమైన పాలన ద్వారా నడుచుకుంటామని స్పష్టం చేసింది.‘కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు, తమ తీర్పుపై విశ్లేషణను, విమర్శలను స్వాగతిస్తున్నాం. కానీ మేము ఈ విషయంలో జోక్యం చేసుకోము. మా ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. తిరిగి జైలుకొచ్చే తేదీలు వెల్లడించాం. మధ్యంతర బెయిల్ మంజూరుకు కారణాలు కూడా చెప్పాం’ అని పేర్కొంది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ కేసులో తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే24 వాయిదా వేసింది.కాగా ఇప్పటికే లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై మే 10న ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్ల విచారణను మే 24న చేపట్టనుంది. ప్రస్తుతం లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను మే 6న ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక మద్యం పాలసీకి సంబంధించి ఈడీ కేసులో మార్చి 15న, సీబీఐ కేసులో ఏప్రిల్11న కవిత అరెస్ట్ అయ్యారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ
-
Amit Shah: కేజ్రీవాల్‌కు స్పెషల్ ట్రీట్మెంట్ !
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ సాధారణ ‘ప్రక్రియ’లాగా లేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యానించారు. బుధవారం ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా పలు అంశాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..జడ్జీలు ఇది గమనించాలి‘‘కేజ్రీవాల్‌కు ఎన్నికల సందర్భంగా బెయిల్ రావడం చూస్తుంటే సుప్రీంకోర్టు ఆయన విషయంలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఈ మాట నేను అనట్లేదు. దేశవ్యాప్తంగా చాలా మంది ఇలాగే భావిస్తున్నారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే తాను మళ్లీ జైలు కెళ్లాల్సిన అవసరం రాదని బెయిల్ తర్వాత కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు పూర్తిగా కోర్టు ధిక్కారమే. ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే వాళ్లను సుప్రీంకోర్టు జైలుకు పంపదని ఆయన మాటల్లోని అసలు అర్థం. ఆయన మాటలు విన్నాక అయినా ఆయనకు బెయిల్ ఇచ్చిన జడ్జీలు.. కేజ్రీవాల్ బెయిల్‌ను ఎలా వాడుకుంటున్నారు, ఎంతగా దుర్వినియోగం చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి’’ అని షా విజ్ఞప్తిచేశారు.బెయిల్ తీర్పుపై..‘‘చట్టాన్ని ఏ కేసుల్లో ఎలా ఆపాదించాలో సర్వోన్నత న్యాయస్థానానికి బాగా తెలుసు. అయితే ఈ ఒక్క కేజ్రీవాల్ బెయిల్ విషయంలో మాత్రం కోర్టు ఇచ్చిన తీర్పు మిగతా తీర్పుల్లా సాధారణంగా అనిపించట్లేదు. దేశ జనాభాలో చాలా మంది మససుల్లో ఇలాంటి భావనే నెలకొంది. తిహార్ జైలు అమర్చిన కెమెరాల సీసీటీవీ ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. అది పూర్తిగా అబద్దం. ఎందుకంటే తిహార్ జైలు కేంద్రం అధీనంలో ఉండదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది అని వివరించారు.ప్రధానిగా మోదీ రిటైర్మెంట్పై‘‘వచ్చే ఏడాదికి మోదీకి 75 ఏళ్లు వస్తాయి. 75కి చేరినందుకు బీజేపీ నియమావళి ప్రకారం మోదీని పక్కనబెట్టి అమిత్‌షాను ప్రధాని చేయాలని చూస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అదంతా అబద్ధం. ఇప్పుడు, ఎప్పుడూ మోదీయే మా ప్రధాని అభ్యర్థి. మేం గెలిచాక 2029 ఏడాదిదాకా మోదీయే ప్రధానిగా కొనసాగుతారు. ఆయన సారథ్యం, మార్గదర్శకత్వంలోనే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తాం’’ అని అమిత్ అన్నారు. -
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
రాంచీ: జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్‌ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. రాంచీలోని ఈడీ హెడ్‌క్వార్టర్స్‌లో అలమ్‌ను మంగళవారం(మే14) తొమ్మిది గంటలు ఏకబిగిన ప్రశ్నించిన అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసింది.గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాల్లో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారంలో అలమ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ అలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌కుమార్ లాల్ పనిమనిషి ఇంట్లో రూ.37 కోట్ల లెక్కల్లోకి రాని నల్లధనం పట్టుబడిన విషయం తెలిసిందే. పనిమనిషి ఫ్లాట్‌లో గుట్టలుగుట్టలుగా నల్లధనం పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించడం గమనార్హం. -
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎ మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడినీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. మరో ఐదు రోజుల పాటు.. ఈ నెల 20 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా తెలిపారు.తీహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియా నేటితో కస్టడీ ముగియగా.. ఆయన వీడియో కాన్ఫరెస్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై దాఖలు చేసిన ఆప్పీల్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిసోడియాపై ఉన్న ఆరోపణలపై వాదనలను కోర్టు వాయిదా వేసింది.ఇక.. లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) గతేడాది మార్చి 9న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తిహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీపై ఉంటున్నారు.గత నెల 30న సిసోడియాకు రెండోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జడ్జి బవేజా కొట్టివేశారు. సిసోడియాకు బెయిల్ లభిస్తే ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మార్చడం, సాక్షులను ప్రభావితం చేయడం వంటి వాటికి పాల్పడే అవకాశముందని, ఈ కేసులో మనీష్ సిసోడియా చాలా కీలక నిందితుడని ఈడీ తెలిపింది. -
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
హేమంత్ సోరేన్‌కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్‌సిబల్
న్యూఢిల్లీ: భూ కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌సోరేన్‌కు త్వరలో ఊరట కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోరేన్ అరెస్టు అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం(మే13) జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సోరేన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మూడు రోజుల్లో స్పందించాలని ఈడీని సుప్రీంకోరింది. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున పిటిషన్‌పై విచారణ వేగవంతం చేయాలని సోరేన్ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సుప్రీం అంగీకరించింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కల్పించిన ఊరటనే హేమంత్ సోరేన్‌కు ఇవ్వాల్సిన అవసరం ఉందని సిబల్ సుప్రీంను కోరారు. అయితే ధర్మాసనం కేసును 20కి వాయిదా వేయబోతుంటే సిబల్ మళ్లీ జోక్యం చేసుకున్నారు. 20కి వాయిదా వేస్తే పిటిషన్ విత్‌డ్రా చేసుకుంటానని, తన క్లైంట్కు అన్యాయం జరుగుతుందని వాదించారు. దీంతో ధర్మాసనం పిటిషన్ విచారణను 17కు వాయిదా వేసింది. -
‘జైలును తప్పించుకునేందుకే పార్టీ ఫిరాయించాను’
ముంబై: మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గ శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్, జైలును తప్పించుకునేందుకే తాను శివసేన (యూబీటీ) నుంచి ఫిరాయించానని ప్రకటించి తన పార్టీని ఇరుకున పడేశారు. జోగేశ్వరిలోని సివిక్ ప్లాట్‌లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఈడీ ఆయనపై పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది.ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం మినహా తనకు వేరే మార్గం లేదని ఒక మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర వైకర్ పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు అత్యంత విధేయుడిగా రవీంద్ర వైకర్ పేరుగాంచారు. ఉద్ధవ్ థాకరే స్వయంగా వైకర్ నివాసానికి వెళ్లి బుజ్జగించారంటేనే ఆయనకు శివసేన (యూబీటీ) ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు.తన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో రవీంద్ర వైకర్ దిద్దుబాటుకు ప్రయత్నించారు. ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. శివసేన (యూబీటీ) నుండి వైదొలగే ముందు తాను ఉద్ధవ్‌తో మూడు సార్లు సమావేశమయ్యానని, తన ఇబ్బందులను తెలియజేశానని చెప్పారు.కాగా ముంబై నార్త్-వెస్ట్ స్థానంలో శివసేన (యూబీటీ)కి చెందిన అమోల్ కీర్తికర్‌తో వైకర్ పోటీలో ఉన్నారు. అమోల్ తండ్రి కీర్తికర్ ప్రస్తుతం ఇక్కడ సిటింగ్ ఎంపీ. ఈ లోక్‌సభ స్థానానికి ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
Aravind Kejriwal: నేను వచ్చేశా...
న్యూఢిల్లీ: త్వరలో తిరిగి వస్తానని చెప్పాను కదా! చెప్పినట్లే వచ్చేశా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇచి్చన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచి ఆశీస్సులందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తన శక్తిమేరకు పోరాడుతానని, తనకు 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. తాను ఎంతగానో విశ్వసించే హనుమంతుడి ఆశీర్వాదంతో జైలు నుంచి బయటకు వచ్చానని తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నానని, తనను చూడాలంటే ప్రజలు అక్కడికి రావాలని కేజ్రీవాల్ సూచించారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతారు. రోడ్ షోలో పాల్గొంటారు. ‘ఇండియా’ కూటమిలో హర్షాతిరేకాలు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరో నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తమ కూటమికి లాభిస్తుందని వారు చెప్పారు. సత్యమేవ జయతే అని ఆప్ నేతలు నినదించారు.‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ లభించిన ఈ విజయం మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేజ్రీవాల్ విడుదల న్యాయానికి ప్రతిబింబం. ఆయన రాకతో ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం అవుతుంది. ఈ ఎన్నికల్లో మా విజయావకాశాలు ఇంకా పెరుగుతాయి’’ – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘హనుమాన్జీ కీ జై.. ఇది ప్రజాస్వామ్య విజయం. లక్షలాది మంది ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులతో అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. వారందరికీ నా కృతజ్ఞతలు’’ – సునీతా కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిణామం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మన దేశం దృఢంగా వ్యవహరిస్తోంది’’ – శరద్ పవార్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత -
Delhi liquor scam: కేజ్రీవాల్‌కు ‘ప్రచార’ బెయిల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు పలు షరతులు విధించింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు వచ్చే నెల 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కేజ్రీవాల్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడం లేదా జైలు నుంచి విడుదల చేయడం వంటి అంశాల్లో సదరు నిందితుడికి సంబంధించిన ప్రాధాన్యతలు, అతడి చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. వాటిని విస్మరించడం పొరపాటే అవుతుందని ఉద్ఘాటించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అని గుర్తుచేసింది. కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ కాలేదు కేజ్రీవాల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనడంలో సందేహం లేదని.. కానీ, ఆయన ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని, ఆయనకు గతంలో నేర చరిత్ర లేదని, సమాజానికి ఆయన వల్ల ముప్పు సంభవించే పరిస్థితి కూడా లేదని వివరించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనా? అది చెల్లుబాటు అవుతుందా? అని ప్రశి్నస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై ఇంకా తుదితీర్పు వెలువడలేదని వెల్లడించింది. కేజ్రీవాల్ కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంది కాబట్టి అతడికి బెయిల్ ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలించామని తెలియజేసింది. నిందితులకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తనకున్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతి కేసుకు సంబంధించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కోర్టులు మధ్యంతర బెయిల్ ఇస్తుంటాయని పేర్కొంది. 21 రోజులు బెయిలిస్తే పెద్దగా తేడా ఉండదు తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వివరించింది. కేజ్రీవాల్ అప్పీల్ తమవద్దే పెండింగ్‌లో ఉందని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలంటూ ఆయనను ఆదేశించడం సరైంది కాదని భావించామని పేర్కొంది. తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ లెక్కచేయలేదని, అందుకే అరెస్టు చేశామంటూ ఈడీ లేవనెత్తిన వాదనపై ధర్మాసనం స్పందించింది. ఇందులో ఇతర కోణాలు కూడా చూడాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని ప్రస్తావించింది. మద్యం కుంభకోణంలో దర్యాప్తు 2022 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉందని, కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని, ఇప్పుడు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకేజ్రీవాల్కు వచ్చే నెల 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ కేసు మెరిట్‌పై అభిప్రాయాల వ్యక్తీకరణగా చూడొద్దని సూచించింది. తిహార్ జైలు నుంచి విడుదలసుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీసంఖ్యలో గుమికూడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేజ్రీవాల్ తన కాన్వాయ్‌తో జైలు నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, కుమార్తె హర్షితా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు. సుప్రీంకోర్టు షరతులివే.. 1. రూ.50,000 బెయిల్ బాండు సమరి్పంచాలి, అంతే మొత్తం పూచీకత్తును తిహార్ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలి. 2. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు అధికారిక కార్యాలయంలో గానీ, ఢిల్లీ సచివాలయంలోని గానీ అడుగు పెట్టరాదు. 3.లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు 4. మద్యం కుంభకోణం కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని, సాక్షులతో భేటీ కావడం, సంప్రదింపులు జరపడం వంటివి చేయొద్దు. 5. మద్యం కేసుతో సంబంధం ఉన్న అధికారిక ఫైళ్లను చూడొద్దు. -
Enforcement Directorate (ED): ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. అలాగే అది చట్టపరమైన హక్కు కూడా కాదని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న కారణంతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ నాయకులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు గతంలో ఉన్నాయని, ప్రచారం చేసుకోవడానికి వారికి కోర్టులు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్లో ప్రస్తావించింది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కేవలం ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇచి్చన ఉదంతాలు కూడా లేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని ఉద్ఘాటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం చట్ట ముందు అందరూ సమానమేనన్న నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించింది. అదేకాకుండా ఇప్పుడు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇలాంటి వెసులుబాటు కోరే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచి్చంది. కేజ్రీవాల్‌పై అతి త్వరలో ఈడీ చార్జిషీట్ ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవక ల సంబంధ కేసులో ఈడీ అతి త్వరలో ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చార్జిషీట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర నిందితుల పేర్లతో అదనంగా మరిన్ని వివరాలు, ఆస్తుల గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. మద్యం కుంభకోణంలో ఈడీ ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేసింది. ఇప్పటికే ఆరు చార్జిషీట్లు దాఖలు చేసింది. మరో నాలుగైదు రోజుల్లో దాఖలు చేయబోయే చార్జిషీట్ ఏడోది కానుంది. -
కేజ్రీవాల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించనుంది. ఈ క్రమంలో తాజాగా కేజ్రీవాల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల్లో ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ పేర్కొంది. కనీసం రాజ్యాంగపరమైన లేదా చట్టబద్దమైన హక్కు కూడా కాదని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రచారం కోసం ఏ రాజకీయ నాయకుడికి బెయిల్ మంజూరు కాలేదని తెలిపింది. తన పార్టీ అభ్యర్థుల కోసం కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు పంపడం జనాల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని అభిప్రాయ పడింది.అయితే కేజ్రీవాల్ పిటిషన్‌ను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు.. కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రి అని, ఆయన అలవాటు పడిన నేరస్థుడు కాదని పేర్కొంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వద్దని ప్రశ్నించింది. అంతేగాక ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. సీఎం బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. -
కేజ్రీవాల్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేజ్రీవాల్‌పై తొలి ఛార్జ్‌షీట్ రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ కేసులో కేజ్రీవాల్‌ను తొలిసారి నిందితుడిగా పేర్కొననున్నట్లు తెలిపాయి. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్‌ను ‘కీలక కుట్రదారు’గా (kingpin)పేర్కొంటూ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను ఈడీ అధికారులు శుక్రవారం కోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం.కాగా లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు రానుంది. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. -
గుట్టలుగా... అవినీతి కట్టలు
ఆరు కౌంటింగ్ మిషన్లు... పదుల కొద్దీ సిబ్బంది... 12 గంటల పైగా లెక్కింపు... 32 కోట్లకు పైగా విలువైన నగదు... దాదాపు అన్నీ అయిదొందల నోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని గాడీఖానా చౌక్‌లోని ఆ చిన్న రెండు బెడ్రూమ్ల ఫ్లాట్‌లో అంత పెద్ద మొత్తం, పెద్ద పెద్ద సంచీల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయని ఎవరూ ఊహించరు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పేరుకుపోయిన అవినీతికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాటి సోదాల్లో ఎదురైన దృశ్యాలే కళ్ళుచెదిరే సాక్ష్యాలు. సదరు శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంట, ఆ కార్యదర్శికి పనివాడి ఫ్లాట్‌లో, ఇతరుల వద్ద సోదాల్లో మొత్తం కలిపి రూ. 35 కోట్ల పైనే బయటపడేసరికి అంతా అవాక్కయ్యారు. అంతలేసి ధనం లెక్కాపత్రం లేకుండా ఎవరింట్లోనైనా ఉందంటే, అది అక్రమధనం కాక మరేమిటి? ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్ఏ) కింద వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక, మంగ ళవారం రాంచీలో మరో 5 చోట్ల సోదాలు జరిపితే, ఓ కాంట్రాక్టర్ వద్ద 1.5 కోట్లు దొరికాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్... ఇలా ప్రాంతాలు, ప్రభుత్వాలు ఏవైనా సోదా చేస్తే చాలు... నల్లధనం విశ్వరూపం గుట్టల కొద్దీ కట్టల రూపంలో సాక్షాత్కరిస్తున్న తీరు ఆందోళనకరం.జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పై నుంచి కింద దాకా సమస్తం అవినీతిమయమేనని ఈడీ మాట. తీగ లాగితే డొంకంతా కదలడానికి తాజా కేసు ఉదాహరణ. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర∙గ్రామీణాభివృద్ధి శాఖలో ఛీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కేవలం పదివేల రూపాయల లంచం తీసుకున్నందుకు జరిగిన ఆ అరెస్టు కథ చివరకు అనూహ్యంగా ఇంత పెద్ద కరెన్సీ గుట్టు విప్పింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చిన్నస్థాయిలోనే ఉన్నప్పటికీ, అవినీతి పరులైన ఉద్యోగులు నిఘా సంస్థల కంటబడకుండా తమ అక్రమార్జనను ఎలా తరలిస్తున్నదీ వీరేంద్రరామ్ విచారణలో తెలిసింది. సంక్లిష్టమైన అవినీతి వ్యవస్థలో తాను, తన లాంటి అధికారుల కోటరీ ఎలా భాగమైనదీ, టెండర్ల ప్రక్రియ సందర్భంగా లంచం సొమ్మును వివిధ మార్గాల్లో తరలించే పద్ధతీ ఆయన బయటపెట్టారు. ఆ వివరాలకు తగ్గట్లే... గ్రామీణాభివృద్ధి శాఖలో విస్తృతంగా అవినీతి సాగుతోందని గ్రహించిన ఈడీ తగిన చర్య చేపట్టాల్సిందిగా గత ఏడాది మేలోనే రాష్ట్ర సర్కారుకు గోప్యంగా లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్దగా స్పందించలేదు. పైగా, నిఘా నీడలోని అవినీతి అధికారుల చేతిలోనే ఆ లేఖ పడడం విడ్డూరం.తిరుగులేని సాక్ష్యాధారాలు లభించడంతో గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్ సహా పలువురు కీలక అనుమానితులపై ఈ సోమవారం ఈడీ దాడులు జరిపింది. కాంట్రాక్టులు ఇస్తూ అవినీతి ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ, లాల్ కోట్లు కూడ బెట్టారట. లాల్ పనివాడి ఇంట్లో ఏకంగా రూ. 32 కోట్ల పైగా డబ్బు గుట్టలుగా దొరకడంతో వ్యవహారం సంచలనమైంది. ఇదికాక, మరో వ్యక్తి ఇంట్లో మరో 3 కోట్లు దొరికిందంటే, అక్కడి ప్రభుత్వ శాఖలో ఏ స్థాయిలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోంది. ఈడీ దాడుల్లో లభించిన దస్తావేజులను బట్టి ముందుగా ఊహించిట్టే ఇందులో మంత్రి గారి హస్తం ఉండనే ఉందని రుజువవుతోంది. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది. జార్ఖండ్‌లోని పాకూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డెబ్భై ఏళ్ళ ఈ సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ ప్రశ్నించడమే ఇక బాకీ. పనివాడినీ, అతని ఇంటిని అవినీతి సొమ్ముకు గిడ్డంగిగా మార్చిన వ్యక్తిగత కార్యదర్శినీ అరెస్ట్ చేసినా అమాత్యవర్యులు అదరక, బెదరక అమాయకత్వం ప్రకటిస్తుండడం విడ్డూరం. జార్ఖండ్‌లోని చంపాయ్ సోరెన్ ప్రభుత్వంపై పడ్డ ఈ అవినీతి మచ్చ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి బాగా అంది వస్తోంది. కాంగ్రెస్‌కు పెద్దదిక్కయిన గాంధీ కుటుంబానికి సన్నిహితులైన వారి ఇళ్ళల్లోనే గతంలోనూ, మళ్ళీ ఇప్పుడూ... ఇంత భారీగా అక్రమ ధనం లభించడాన్ని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావిస్తున్నారు. అవినీతిని ఆపడానికి తాను ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమను విమర్శిస్తున్నాయని ఆయన వాదన. కాగా, ఇదంతా ప్రత్యర్థులే లక్ష్యంగా మోదీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తు సంస్థల దుర్వినియోగమని ప్రతిపక్ష కూటమి ఆరోపణ. గత డిసెంబర్లో జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన ఒడిశా మద్యం డిస్టిలరీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపితే, కనివిని ఎరుగని రీతిలో రూ. 350 కోట్ల పైగా మొత్తం దొరికిన సంగతి తెలిసిందే. పరస్పర ఆరోపణలెలా ఉన్నా, ఈ ఘటనలన్నీ ప్రమాదకరమైన పరిణామాన్ని సూచిస్తు న్నాయి. అక్రమధనంపై దీర్ఘకాలంగా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతూనే ఉంది. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అయినా సమస్య తీరకపోగా, కొత్తవి బయటపడడం పెను సవాలు. అవినీతిని అంతం చేసి, అక్రమధనాన్ని అందరికీ పంచిపెడతామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు గత పదేళ్ళుగా గద్దె మీదే ఉన్నారు. అవినీతి, కుటుంబ పాలనపై పోరాటమని చెబుతూనే వస్తున్నారు. ఫలితం శూన్యం. పెద్దనోట్ల రద్దు లాంటివి ఎంత విఫలయత్నాలో అర్థమవుతూనే ఉంది. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో నిందితులైన నేతలు సైతం జెండా మార్చి, కాషాయం కప్పుకుంటే పరమ పునీతులైపోతున్న పరిస్థితులూ చూస్తున్నాం. ఏలికల చేతుల్లో ఏజెన్సీలు, పీఎంఎల్ఏ లాంటి అసమంజస కఠిన చట్టాలున్నా సమస్య తీరకపోవడానికి కారణమేమిటో ఆలోచించాలి. ఇవాళ వ్యాపారం, రాజకీయాలు, సమాజం ఏ స్థితికి చేరాయో గ్రహించాలి. నేతలు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ఒకరి కోసం ఒకరు నడిచే తీరు దేశానికి క్షేమం కాదు. ఎన్నికల వేళ ఈ అక్రమధనం పెనుసమస్య. దాని పర్యవసానాలు ఎన్నికలపైనే కాదు, ఆ తర్వాతా ఉంటాయని విస్మరించరాదు. -
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
రాంచీ: కాంగ్రెస్ నేత, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) పనిమనిషి ఇంట్లో బ్యాగుల కొద్దీ నోట్ల కట్టలు బయటపడటం సంచలనం రేపుతోంది. సోమవారం రాంచీలోని గడీఖానా చౌక్‌లోని పనిమనిషి జహంగీర్ ఆలం ఫ్లాట్‌లో సోదాలు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బయటపెట్టారు. మంత్రి ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారని చెబుతున్నారు. దాదాపుగా అన్నీ రూ.500 నోట్ల కట్టలు కాగా, కొన్ని ఆభరణాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు 17 గంటలపాటు లెక్కించిన సొమ్ము రూ.35.23 కోట్లుగా తేలిందన్నారు. ఆరు యంత్రాలతో లెక్కింపు కొనసాగుతోందని చెప్పారు. మొత్తం ఆరు చోట్ల సోదాలు జరపగా మరో చోట రూ.3 కోట్ల నగదు బయటపడినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామంపై కాంగ్రెస్‌కు చెందిన మంత్రి ఆలం స్పందిస్తూ.. ప్రభుత్వం నాకు సమకూర్చిన ప్రైవేట్ కార్యదర్శికి చెందిన ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు టీవీల్లో చూశానన్నారు. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. గత ఏడాది అరెస్ట్ చేసిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ రిటైర్డు చీఫ్ ఇంజినీర్ వీరేంద్రకుమార్ రామ్‌పై ఉన్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా దాడులు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో రామ్‌కు చెందిన రూ.39 కోట్ల ఆస్తులను సైతం అటాచ్ చేసింది. -
జార్ఖండ్‌లో ఈడీ సోదాలు.. భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు
రాంచీ: జార్ఖండ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. సోమవారం రాంచీలోని పలుచోట్ల ఈడీ సోదాలు చేపట్టగా.. మంత్రి అలంగీర్ సన్నిహితుడి ఇంట్లో సుమారు రూ. 25 కోట్ల భారీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.జార్ఖండ్ మంత్రి అలంగీర్ సన్నిహితుల ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి అలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజయ్ లాల్ ఇంట్లోని గది నిండా ఉన్న భారీ నోట్ల కట్టలను ఈడీ స్వాధీనం చేసుకుంది. 70 ఏళ్ల అలంగీర్ ఆలం పాకూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్నారు.‘‘జార్ఖండ్‌లో అవినీతి అంతం కావటం లేదు. ఈ డబ్బును ఎన్నికల్లో పంచాలని ప్రణాళిక వేశారు. దీనిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతూల్ సహదేవ్ అన్నారు. -
బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
హత్నూర(సంగారెడ్డి) /జిన్నారం (పటాన్చెరు): బీజేపీతో జోడి లేకపోతే ఈడీ కేసులు బనాయిస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్, గుమ్మడిదల, జిన్నారం మండలం బొల్లారం మునిసిపాలిటీలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రసంగిస్తూ బీజేపీతో తాము కలవకపోవడంతోనే ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసులు బనాయించి జైల్లో పెట్టారని, కేసులకు భయపడేది లేదన్నారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు నిధులు రాలేదని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడం కోసమే బీజేపీ ప్రయతి్నస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఏకంగా భార్యాభర్తలను విడదీసి ఓట్లు వేయించుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ అయిన బాండ్ పేపర్లాంటిదని, బాండ్ పేపర్ రిజెక్ట్ అయితే కేసులు ఎలా నమోదు చేస్తారో ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఏ ఒక్కరోజు పాల్గొనని రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. జై తెలంగాణ అన్న ఉద్యమకారులపై రైఫిల్ పట్టుకొని దాడి చేసిన రేవంత్‌రెడ్డికి ఈరోజు తెలంగాణ గుర్తుకొచి్చందా అని ప్రశ్నించారు. -
Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకొని వేధించడానికి వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచి్చన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచి్చన సాధారణ సమ్మతిని బెంగాల్ ప్రభుత్వం 2018 నవంబర్ 16న ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. కొన్ని నెలల క్రితం బెంగాల్లో ఈడీ అధికారుల బృందంపై జరిగిన దాడిపై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. సందేశ్‌ఖాలీ అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై బెంగాల్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే సీబీఐ తమ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసులు దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 131 కింద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. బెంగాల్లో కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. సీబీఐపై ప్రభుత్వæ నియంత్రణ ఉండదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. -
కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ కేసులో మే 2న తీర్పు వెల్లడించనుంది. అదే విధంగా ఈడీ కేసులో బెయిల్‌పై మే6న తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. కాగా మే7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది.ఈడీ వాదనలుపీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశాంఅక్రమంగా అరెస్ట్ చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదుఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగింది.రూ. 581 కోట్ల రూపాయలు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారు.అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారు.దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం జరిగింది.ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కింది. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు.పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారు.విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారు.విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.అసాధారణ లాభాలు గడించారు.బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారు.ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కలేదు.ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం అందింది.మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక స్టేట్మెంట్ ఇచ్చారు.అరవింద్ కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటేరియట్ కలిశారు. కవిత ను కలవాలని కేజ్రీవాల్ చెప్పారని మాగుంట చెప్పారు.కవితను కలిసినప్పుడు 100 కోట్లు ఆప్ కి ఇస్తే ఢిల్లీ మద్యం వ్యాపారం ఇస్తారని ఆమె చెప్పింది.అందులో 25 కోట్లు కవిత మనిషి బుచ్చిబాబుకు మాగుంట చెల్లించారు.ఎల్ 1 లైసెన్స్‌లో మేజర్ షేర్ దక్కించుకేందుకు కవిత ప్రయత్నించారు.అయితే, సమీర్ మహేంద్రకు 33, మాగుంట 33, కవిత 33 శాతం వాటాలను పొందారు.బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ మెసేజ్‌లో ఈ సాక్షాలు దొరికాయి.మాగుంట రాఘవ అప్రూవర్ గా మారి అన్ని విషయాలను ధృవీకరించారు.ఒకసారి 15 కోట్లు, మరోసారి 10 కోట్లు బుచ్చిబాబుకు, అభిషేక్ బోయినపల్లి కి మాగుంట సిబ్బంది ఇచ్చారుఅనుకూలంగా లిక్కర్ పాలసీ తయారీ కోసం ఈ లంచాలు ఇచ్చారుకోర్టు అనుమతి తోనే నిందితులు అప్రూవర్ గా మారారుఅప్రూవర్ను ప్రలోభ పెట్టారని అనుమానిస్తే అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టడమే. అప్రూవర్లపై చేస్తున్న ఆరోపణలు ప్రచారం కోసం చేస్తున్న రాజకీయ వాదనలే తప్పు వాటిలో పస లేదు.ఎవరు ఎవరికి ఎలక్టొరల్ బాండ్స్ ఇచ్చారనేది ఈ కేసులో అనవసరం.చట్టం ప్రకారమే ఈ కేసు ముందుకి వెళ్ళాలి.అనేక సార్లు అరుణ్ పిళ్లై స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చారు.ఈడీ బెదరించిందని ఎప్పుడూ చెప్పలేదు.కవితకు నోటీసు ఇచ్చిన తర్వాతే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారుకవిత ఒత్తిడితోనే ఆరు నెలల తర్వాత అరుణ్ పిళ్లై వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు ఈడీ బెదిరిస్తే , అప్పుడే వెనక్కి తీసుకోకుండా ఆరు నెలలు తర్వాత వాంగ్మూలం వెనక్కి తీసుకుంటారా ?కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చి బాబు స్టేట్మెంట్ ఇచ్చారుదీని ద్వారా విజయ్ నాయర్ తో కలిసి లిక్కర్ పాలసీ తయారు చేశారుపబ్లిక్ లోకి రాకముందే లిక్కర్ పాలసీ వీరికి వచ్చిందికవిత చెప్పిన అంశాలే మద్యం పాలసీలో పెట్టారుకవిత బంధువు మేకా శరణ్ ను ఇండో స్పిరిట్ లో ఉద్యోగిగా పెట్టారుఉద్యోగానికి హాజరు కాకుండా జీతం తీసుకున్నారువిచారణ కోసం పిలిస్తే ఏడెనిమిది రోజుల పాటు మిస్ అయ్యాడుఈ కేసుకు సంబంధించి అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారుహవాలా ఆపరేటర్స్ వాంగ్మూంలాలు ఇచ్చారుకవిత ఇచ్చిన 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారుఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదుతన ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని కవిత పొంతన లేని సమాధానాలు చెపుతున్నారుపని మనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు?ఫోన్లు ఇవ్వాలని కోరిన వెంటనే డేటా ఫార్మాట్ చేశారుసాక్ష్యాలు ధ్వంసం చేశారు, సాక్షులను బెదిరించారుకాగా మంగళవారం మధ్యాహ్నం సైతం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ నేటికివాయిదా వేశారు. మరోవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నాటి వాదనలు..ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.డీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు.ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. వాదనల తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సిబిఐ కేసులో మే 2న, ఈడీ కేసులో మే 6న తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. మే 7న కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
జైల్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్.. ఈడీకి స్పెషల్ కోర్టు కీలక ఆదేశాలు
మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ గత వారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జార్ఖండ్ ప్రత్యేక పీఎంఎల్ఏ (ప్రివెంటివ్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈడీ ప్రత్యుత్తరం ఇచ్చేందుకు తమకు రెండు వారాలు సమయం కావాలని కోరింది. అయితే ఈడీ నిర్ణయాన్ని సోరెన్ తరుపు న్యాయవాదులు కపిల్ సిబల్, అరుణాభ్ చౌదరి తప్పుబట్టారు. రెండు వారాల సమయం వల్ల తన క్లయింట్ ఎన్నికల ప్రచారానికి దూరం కావాల్సి వస్తుందని వాదించారు. ఇరుపక్ష వాదనలు విన్న కోర్టు సోరెన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యుత్తరం ఇచ్చేందుకు ఈడీకి వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 1న చేపట్టనుంది. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి సోరెన్‌ను ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు: కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్‌టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది , అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కామ్‌లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని సౌత్ గ్రూప్‌నకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్‌లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్‌లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి -
మూడు మామిడి పండ్లే తిన్నా.. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ వాదన
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. -
‘ఆయనేమైనా నేరస్థుడా? గ్యాంగ్‌స్టరా?’.. కోర్టులో కేజ్రీవాల్ తరుపు న్యాయవాది
న్యూఢిల్లీ : తనకు తీహార్ జైల్లోనైనా డయాబెటీస్ ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజ్వర్‌లో ఉంచింది. ఏప్రిల్ 22న తీర్పును వెలువరించనుంది. మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ గత కొన్నేళ్లుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్ పడిపోతున్నాయని, ట్రీట్మెంట్ తీసుకునేందుకు వైద్యుల వీడియో కన్సల్టేషన్ కావాలని ఇప్పటికే పలు మార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వచ్చింది. కేజ్రీవాల్‌పై కుట్ర అయితే కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వకపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు,ఆప్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సులిన్ ఇవ్వకుండా కేజ్రీవాల్‌ను చంపేందుకు జైల్లో కుట్రజరుగుతోందని ఆప్ నేత అతిషి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులో కేజ్రీవాల్ మరో పిటిషన్ ఈ తరుణంలో తనకు ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈడీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఈడీ ఆరోపణల్ని తోసుపుచ్చిన న్యాయవాది కేజ్రీవాల్ జైలులో కేవలం మూడుసార్లు మామిడి పండ్లను తిన్నారని, నవరాత్రి ప్రసాదంగా ఆలూ పూరీని సేవించారని కోర్టుకు తెలిపారు. మెడికల్ బెయిల్ పొందేందుకు ఆప్ అధినేత హై షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలను తోసిపుచ్చారు. మూడు మామిడి పండ్లే తిన్నది కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఇన్సులిన్ వేసుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్థనపై సింఘ్వీ కోర్టులో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఇప్పటి వరకు 48 సార్లు ఇంటి నుంచి పంపిన భోజనం చేశారు. గ్లైసెమిక్ ఇండెక్స్ వ్యాల్యూ ఆధారంగా మూడు మామిడి పండ్లను మాత్రమే తిన్నారు. మామిడి (51) ,వైట్ రైస్ (73) లేదా బ్రౌన్ రైస్ (68) కంటే తక్కువగా ఉంది అని సింఘ్వీ కోర్టులో వాదించారు. కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న స్వీట్లను తింటున్నారన్న ఈడీ ఆరోపణలపై సంఘ్వీ స్పందించారు. సీఎం ఆరుసార్లు షుగర్ లేని స్వీట్లు తిన్నారని, షుగర్ లేకుండా టీ తాగేవారని, షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లను వాడారని ఆయన అన్నారు. హాస్యాస్పందంగా ఈడీ తీరు మామిడి పండ్లు తిని మెడికల్ బెయిల్ తీసుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాంటూ ఈడీ చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని సింగ్వీ అన్నారు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ నేరస్థుడా? గ్యాంగ్‌స్టరా? సంఘ్వీ ప్రశ్నించారు. ఆయన ఇప్పటి వరకు 15 నిమిషాల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుల సాయంతో ట్రీట్మెంట్ తీసుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. ఓసారి మీరే వైద్యులు కేజ్రీవాల్‌కు సూచించిన ఆహారాన్ని చూడండి. ఇందులో తియ్యని పండ్లు, లేదా ఇతర తీపి పదార్ధాల గురించి ప్రస్తావించలేదు’ అని కోర్టుకు విన్న వించుకున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఏప్రిల్ 22న వెలవరించనుంది. #WATCH | Delhi: Ramesh Gupta, the lawyer for Delhi CM Arvind Kejriwal in the liquor policy case, says, "We have moved a petition requesting the Court to allow Mr Kejriwal to consult his doctor who has been treating him for the last many years. But that request was opposed by the… pic.twitter.com/FDc50cS04t — ANI (@ANI) April 19, 2024 -
‘కేజ్రీవాల్‌ను మూడోసారీ ఓడించలేకపోతే చంపేద్దాం.. ఇదీ వారి కుట్ర’
న్యూఢిల్లీ, సాక్షి: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, రాష్ట్ర మంత్రి అతిషి ఆరోపించారు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అయిన కేజ్రీవాల్ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని తెలిపారు. మద్యం పాలసీ స్కామ్ ఆరోపణలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. తాజాగా కేజ్రీవాల్ తన రెగ్యులర్ డాక్టర్‌తో వీడియో సంప్రదింపుల కోసం చేసిన అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించిన అనంతరం ఆప్ నేతల నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. ‘అరవింద్ కేజ్రీవాల్‌ను మూడు ఎన్నికల్లో (మూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు) బీజేపీ ఓడించలేకపోతే, ఆయన్ను జైల్లో ఉంచి చంపేందుకు పథకం పన్నుతోంది’ అని అతిషి అన్నారు. "అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారని అందరికీ తెలుసు. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారు" అని ఆమె పేర్కొన్నారు. ‘ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్న వ్యక్తి మాత్రమే అంత ఇన్సులిన్ తీసుకుంటాడు. కావాలంటే ఏ డాక్టర్నైనా అడగండి.. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి కోర్టు అనుమతించింది’ అన్నారు. అయితే బీజేపీ తన అనుబంధ సంస్థ (ఈడీ) ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈడీ పదే పదే అబద్ధాలు చెబుతోందని అని ఆమె కోర్టులో ఏజెన్సీ వాదనలను తిప్పికొట్టారు. తన వైద్యుడితో సంప్రదింపు కోసం చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని మామిడిపండ్లు, స్వీట్లను కేజ్రీవాల్ తింటున్నారని, చక్కెర కలిగిన టీ తాగుతున్నారని ఈడీ వాదించింది. దీనికి కౌంటర్ ఇస్తూ ఇది పూర్తిగా అబద్ధమని, డాక్టర్ సూచించిన స్వీటెనర్ తోనే టీ, స్వీట్లను కేజ్రీవాల్ తీసుకున్నారని అతిషి చెప్పుకొచ్చారు. -
సీఎం కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర: ఈడీ ఆరోపణలపై ఆప్ కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం కావాలనే మామిడిపండ్లు, స్వీట్లు వంటి తియ్యటి పదార్ధాలు తింటున్నారంటూ ఈడీ చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఈడీ తప్పులు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది.. సీఎం కేజ్రీవాల్‌ను జైల్లో చంపడానికి కుట్ర జరుగుతోందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అని.. పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఇన్సులిన్ ఇవ్వడం లేదని విమర్శించారు. ‘సీఎం కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహ వ్యాధిగ్రస్తుడని అందరికీ తెలుసు.. అతను గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. తన షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటాడు. ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్నవారు మాత్రమే ఇంత ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటారు. అందుకే కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి అనుమతించింది. కానీ బీజేపీ తన జేబు సంస్ధ ఈడీ సాయంతో అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. ఆయనకు ఇంటి నుంచి ఆహారం అందకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్ స్వీట్ టీ తాగుతున్నారని, స్వీట్లు తింటున్నారని ఈడీ చెప్పడం పూర్తి అబద్ధం.. కేజ్రీవాల్‌జీకి డాక్టర్ సూచించిన స్వీటెనర్తో టీ,స్వీట్లకు అనుమతి ఉంది. ఇది డయాబెటిక్ రోగులకు ఇవ్వబడే తక్కువ కేలరీల స్వీటెనర్. కేజ్రీవాల్ తన బ్లడ్ షుగర్ స్థాయిని పెంచుకోవడానికి అరటిపండ్లు తింటున్నాడన్న ఈడీ ఆరోపణలు అతిషి తప్పుబట్టారు. ‘నేను ఈడీకి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మధుమేహ వైద్యుడితో మాట్లాడండి. రోగులకు అరటిపండు, కొన్ని రకాల టోఫీ లేదా చాక్లెట్ ఎల్లప్పుడూ వారితో ఉంచుకోమని చెబుతారు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు లేదా జైలులో ఉన్నప్పుడు అతను ఎప్పుడూ ఏదో ఒక రకమైన టోఫీ, అరటిపండు అతనితో కలిగి ఉండాలని కోర్టు ఉత్తర్వులో స్పష్టంగా రాసి ఉంది’ అని తెలిపారు. చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. దిల్లీ సీఎం అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. కేజ్రీవాల్‌కు ఇంటి భోజనానికి అనుమతి ఉండటంతో ఆయన నచ్చిన ఆహారం తీసుకుంటున్నారని తెలిపింది. టైప్-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారని తెలిపింది. ఇలాంటివి తింటే షుగర్‌లెవల్స్ పెరుగుతాయని ఆయనకు తెలిసే.. ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందడం కోసం ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. రోజుకు రెండుసార్లు కేజ్రీవాల్ షుగర్ లెవల్స్‌ను వైద్యులు చెక్ చేస్తున్నారని ఈడీ వెల్లడించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్ ఛార్ట్‌పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తిహాడ్ జైలు అధికారులను ఆదేశించింది. అనంతరం పిటీషన్‌పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
జైల్లో కేజ్రీవాల్ కావాలనే అవి తింటున్నారు: ఈడీ
ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. మార్చి 21న అరెస్ట్ అయిన తరువాత మార్చి 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవల షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని.. క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి కావాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని ఈడీ గురువారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగానే స్వీట్స్ తిని షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారు. షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలను చూపుతూ బెయిల్ పొందాలంకునుటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ ఈడీ సమర్పణల మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. -
శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు జప్తు.. ఆ మోసం వల్లే!
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాకు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. ఇందులో శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉంది. అలాగే రాజ్‌కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్ చేసినట్లు వెల్లడించింది. అమాయక జనాలను మోసం చేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ తనవద్దే బిట్కాయిన్లు ఈ ముగ్గురూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ మోసం వెనక ఉన్న మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్(ఈయన 2022లోనే చనిపోయారు) గతంలో రాజ్‌కుంద్రాకు 285 బిట్కాయిన్లు ఇచ్చాడు. దీనితో రాజ్‌కుంద్రా ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావించాడు. ఇప్పటికీ ఆ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, దాని విలువ రూ.150 కోట్లుగా ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను జప్తు చేసింది. చదవండి: కొత్తింట్లోకి బుల్లితెర జంట గృహప్రవేశం -
‘ఉగ్రవాదిని కాదు.. నేను అరవింద్ కేజ్రీవాల్‌ని’
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశానికి, ఢిల్లీ ప్రజలకు కోసం ఒక కుమారుడుగా, సోదరుడుగా పనిచేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. తీహార్ జైలు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని మీడియాకు సంజయ్ సింగ్ వెల్లడించారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్. నేను ఉగ్రవాదిని కాదు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేను పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌ను తీహార్ జైల్లో గ్లాస్ గోడ ద్వారా కలిశాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్‌పై ఎంత ద్వేషం పెంచుకున్నారో తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం’ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారన్నారు. 24 గంటలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ‘జైలులో ఉన్నది సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఓ మట్టి మనిషి.. అయన్ను ఎంత విచ్ఛినం చేయాలని చూసినా అంతే బలంగా తిరిగి వస్తారు. తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ కలసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇది మనందరికీ చాలా ఉద్వేగభరితమైన విషయం. ప్రధాని మోదీ, బీజేపీకి సిగ్గు చేటు’ అని సంజయ్ సింగ్ అన్నారు. ‘ప్రధాని మోదీ సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల పథకం ఉత్తమమైనది అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోదీ సుప్రీ కోర్టు తీర్పును అవమానించారు. మోదీ సుప్రీం కోర్టుక, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. -
కవితకు బ్యాడ్ టైమ్.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఢిల్లీ: నేడు ఈడీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవులో ఉండటం బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఈనెల 22వ మధ్యాహ్నం పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఇక, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లో భాగంగా కవిత.. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. అలాగే, నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పుకొచ్చారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. మరోవైపు.. కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి..‘కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని, ఆప్-సౌత్ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారు. లిక్కర్ స్కాంలో భాగంగా రూ.100కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారు. కిక్ బ్యాగ్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారు. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీజ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను డిలీట్ చేశారు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తపడ్డారు. కవితా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. అరుణ్‌ను బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేయగలరు. సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదు’ అని కోరుతున్నారు. -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీకి సుప్రీం నోటీస్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ లోగా సమాధానమివ్వాలని ఈడీని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీన చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలన్న అభిషేక్ సింఘ్వి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9వ తేదీన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన 15 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా వర్చువల్‌గా విచారణ చేపట్టారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే కేసులో బీఆర్ఎస్ నేత కె.కవిత తదితర నిందితుల కస్టడీ గడువు కూడా అదే రోజుతో ముగుస్తోందని ఆమె తెలిపారు. -
Rahul Gandhi: రాజ్యాంగ సంస్థలు మోదీ సొత్తు కాదు
వయనాడ్/నీలగిరి: సీబీఐ, ఈడీ మొదలుకుని కేంద్ర ఎన్నికల సంఘం దాకా ప్రతి రాజ్యాంగబద్ద సంస్థల్లోకి తమ వారిని జొప్పిస్తూ ప్రధాని మోదీ వాటిని తన సొంత ఆస్తులుగా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేరళలోని సొంత ఎంపీ నియోజకవర్గం వయనాడ్‌లో ప్రచారంలో భాగంగా సోమవారం వల్లిమండలో రోడ్‌షో నిర్వహించి అక్కడి పార్టీ కార్యకర్తలు, ఓటర్లనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటనీ బీజేపీ హస్తగతం చేసుకుంటున్న తీరు మీకందరికీ అర్థమయ్యే ఉంటుంది. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఇలా ప్రతి రాజ్యాంగబద్ధ విభాగంలోనూ తమ అస్మదీయులను జొప్పించడంలో ఆర్ఎస్ఎ‹స్, బీజేపీ బిజీగా ఉన్నాయి. అవే రాజ్యాంగబద్ధ సంస్థల పరిరక్షణ కోసం విపక్షాల ‘ఇండియా’ కూటమి పాటుపడుతోంది. ఇవి ఎవరి సొంత సంస్థలుకావు. ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తులు అస్సలు కావు. ఇవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడివి. రాజ్యాంగాన్ని సవరించబోతున్నట్లు ఒక బీజేపీ ఎంపీ ఇటీవలే ప్రకటించారు. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. రాజ్యాంగాన్ని తమకు నచి్చనట్లు మార్చేసి జాతి సమున్నత ఆశయాలను సమాధిచేయాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. ‘‘ కేరళను నాగ్‌పూర్(ఆర్ఎస్ఎస్ ప్రధానకేంద్రం) పాలించకూడదు. సొంత పట్టణాలు, పల్లెల నుంచే పరిపాలన సాగాలి. కేరళ ప్రజలకు ఏం కావాలో, వాళ్లేం ఆశిస్తున్నారో ఢిల్లీ(మోదీ సర్కార్)కి ఎలా తెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు. ‘‘ఎంతోకాలంగా డిమాండ్‌చేస్తున్నా సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ వయనాడ్ జిల్లాలో ఇంతవరకు ఒక్క వైద్యకళాశాలను ఏర్పాటుచేయలేదు. యూడీఎఫ్ ప్రభుత్వం వస్తేగానీ కాలేజీ రాదేమో’’ అని విమర్శించారు. ‘ఇంతటి అందమైన ప్రదేశం వయనాడ్‌లో ఓ వారం పది రోజులు గడపమని మా అమ్మ(సోనియా)కు చెప్పా. ఆమెకు అతి ఉక్కబోత పడదు. భువిపైనే అందమైన ప్రదేశాన్ని మిస్ అవుతున్నావని గుర్తుచేశా’’ అని రాహుల్ అన్నారు. రాహుల్ హెలికాప్టర్లో తనిఖీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి రాహుల్ వచ్చినపుడు ఆయన ప్రయాణించిన హెలీకాప్టర్‌లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లైయింగ్ స్వా్కడ్ తనిఖీల్లో ఎలాంటి చట్టవ్యతిరేక వస్తువులు లభించలేదు. -
కవితకు వార్నింగ్ ఇచ్చిన జడ్జి.. కారణం ఇదే..
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీంతో సీబీఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఉదయం కవితను సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సీబీఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో సీబీఐ తన వాదనలు వినిపిస్తూ.. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమె విచారణకు సహకరించలేదని వెల్లడించింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరగా.. కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది. ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం, కవిత బయటకు వస్తూ సీబీఐపై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కవిత.. ‘‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ అడిగిందే.. లోపల సీబీఐ అడుగుతోంది. ఇందులో కొత్తది ఏమీ లేదు’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. మార్చి 15వ తేదీన ఈడీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితను సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు వచ్చిన వాంగ్మూలం, వాట్సాప్ చాట్స్‌పై సీబీఐ కవితను ప్రశ్నించింది. ఈ సందర్బంగా కవిత విచారణను సీబీఐ వీడియో రికార్డు చేసింది. మరోవైపు.. ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావులు నిన్న(ఆదివారం) కవితతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా, ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. ఇక, రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. -
కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న(సోమవారం) విచారించనుంది. సుప్రీంకోర్టు జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఉదయం 10:30 గంటలకు దీనిపై విచారణ జరపనుంది. కాగా తనను ఈడీ అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించడంపై గతంలో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీఎం అరెస్టును సమర్థించేందుకు ఈడీ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. అరెస్టు విషయంలో దర్యాప్తు సంస్థను నిందించలేమని పేర్కొంది. ఈ మేరకు కేజ్రీవాల్ పిటిషన్‌ను ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మరుసటి రోజే కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై మార్చి 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. తర్వాత కొన్ని రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించింది. అనంతరం కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ రిడ్‌లో విధించడంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. చదవండి: కేజ్రీవాల్‌ను సునీత కలిస్తే తప్పేంటి?: సంజయ్ సింగ్ -
కేజ్రీవాల్‌ను సునీత కలిస్తే తప్పేంటి?: సంజయ్ సింగ్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మానీలాండరింగ్ అభియోగాల కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వకపోవటంపై ఆప్ నేత సింజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జైలు కిటికీ వద్దనే కలవడాకి అనుమతించటం చాలా అమానవీయమని అన్నారు. సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘భయంకరమైన నేరాలకు పాల్పడినవారిని సైతం తమ బ్యారక్‌లలో సమావేశాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. మూడుసార్లు సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్‌ను మాత్రం జైలు రూం గ్లాస్ కిటికీ వద్ద కలవమనటం సరికాదు. ఎందుకు ఇంత అమానవీయం?. సునితా కేజ్రీవాల్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వ్యక్తిగతంగా సమావేశం అవుతానని అప్పీల్ కూడా చేసుకున్నారు. తీహార్ జైలు అధికారులు రూంలో వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం జైలు రూం కిటికీ వద్ద కలవడానికే మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇది సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అవమానించటమే కాకుండా నైతిక విలువలను ఉల్లంఘించటం’ అని తీహార్ జైలు అధికారులపై సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి సమావేశం కావడాన్ని సంజయ్ సింగ్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రద్దు చేసుకున్నారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ ఆరోపణలపై సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీ నుంచి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
ఆమే సూత్రధారి.. పాత్రధారి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకానొక సమయంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డిలను కవిత భయపెట్టినట్లు కోర్టుకు తెలిపింది. కుంభకోణంలో కవితను సూత్రధారి, పాత్రధారిగా పేర్కొంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కవితను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మూడు రోజులపాటు కవితను సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. విజయ్నాయర్కు హవాలా రూపంలో డబ్బులు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను శుక్రవారం అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఐదు రోజుల పాటు కవిత కస్టడీ కోరుతూ సీబీఐ, సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈడీ తరఫు న్యాయవాది పంకజ్ వాదనలు వినిపిస్తూ.. ‘లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ఒక నిందితుడైన విజయ్ నాయర్ (కేజ్రీవాల్ అనుచరుడు)కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మరో నిందితుడైన దినేష్ అరోరా ద్వారా హవాలా రూపంలో చెల్లించారు. ఈ నేరపూరిత కుట్రకు అనుగుణంగా ఇండో స్పిరిట్స్‌లో 65 శాతం వాటా, రూ.29.29 కోట్లను సౌత్‌గ్రూపులోని నిందితులకు బదిలీ చేశారు. గోవా ఎన్నికల సమయంలో ఆప్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూ.44.45 కోట్లు వినియోగించారు. కవిత మాజీ ఆడిటర్ బుచి్చబాబు ఫోన్ వాట్సాప్ చాట్లు, భూ కొనుగోలు ముసుగులో సొమ్ము లావాదేవీలు బహిర్గతం అయ్యాయి. ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వడానికి పన్నిన నేరపూరిత కుట్రలో కల్వకుంట్ల కవిత కీలక పాత్రధారిగా ఉన్నట్లు సదరు భూ కొనుగోలు డీల్ ద్వారా వెల్లడైంది..’అని చెప్పారు. కవితతో మద్యం వ్యాపారి భేటీ దక్షిణాదికి చెందిన ఓ మద్యం వ్యాపారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని వెల్లడైంది. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రిని వ్యాపారి కోరగా.. ఎమ్మెల్సీ కవిత సంప్రదిస్తారని కేజ్రీవాల్ చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. తర్వాత సదరు వ్యాపారి కవితతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు సమకూర్చాల్సి ఉందని, దాంట్లో రూ.50 కోట్లు సదరు వ్యాపారి అందజేయాల్సి ఉంటుందని, తద్వారా మీరు వ్యాపార భాగస్వామి అవుతారని కవిత ఆయనకు తెలిపారు. అనంతరం బుచి్చబాబు డిమాండ్ మేరకు తన కుమారుడి ద్వారా కవిత అనుచరులకు రూ.25 కోట్లు వ్యాపారి చెల్లించారు. ఈ చెల్లింపులకు గానూ వ్యాపారి కుమారుడికి ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం వాటా దక్కింది. విజయ్నాయర్కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు చెల్లించినట్లుగా మరో నిందితుడు అభిషేక్ బోయినపల్లి తనకు చెప్పాడని అప్రూవర్ దినేష్ అరోరా తన వాంగ్మూలంలో వెల్లడించాడు. అభిõÙక్ బోయినపల్లి ఆదేశాల మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా నగదు బదిలీ చేసినట్లు అప్పటి కవిత పీఏ అశోక్ కౌశిక్ చెప్పాడు. కౌశిక్ ద్వారా రూ.25 కోట్లు బదిలీ అయినట్లు రికార్డులు నిర్ధారించాయి. ఇండో స్పిరిట్స్‌లో తన ప్రాక్సీ అరుణ్ పిళై ద్వారా కవిత భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు బుచ్చిబాబు ఫోను ద్వారా వెల్లడైంది..’అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. భూ కొనుగోలు డీల్ ముసుగులో రూ.14 కోట్లు! భూ కొనుగోలు డీల్ ముసుగులో శరత్‌చంద్రారెడ్డికి చెందిన సంస్థల ఖాతాల నుంచి కల్వకుంట్ల కవితకు రూ.14 కోట్లు చేరాయి. నగదు బదిలీ ఒప్పందం అయితే జరిగింది కానీ అసలు భూమి బదిలీ కాలేదు. డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించడానికి శరత్‌చంద్రారెడ్డి ఆసక్తి చూపకపోవడంతో ఢిల్లీ, తెలంగాణలో వ్యాపారాలు దెబ్బతీస్తానని కవిత బెదిరించినట్లు వెల్లడైంది. పలువురు స్టేట్మెంట్ల ఆధారంగా కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత ఒకరిగా తేలింది. దీంతో ఆమెను నిందితురాలిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. తర్వాత కోర్టు అనుమతితో కవితను ఈ నెల 6న తీహార్ జైలులో విచారించాం. కుంభకోణంలో తన పాత్ర గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు. ఐదు రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి..’అని పంకజ్ చెప్పారు. న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారు: కవిత న్యాయవాది కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతరత్రా రూపంలో ఇప్పటికే తమ వద్ద ఉన్న అంశాలతో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థ చూపిన కస్టడీ కారణాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయన్నారు. కవిత విషయంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించిన నేపథ్యంలో సీబీఐ పిటిషన్ కొట్టివేయాలని కోరారు. కవిత పిటిషన్ కొట్టివేత ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి కావేరి బవేజా.. తొలుత సీబీఐ పిటిషన్లో తీర్పు రిజర్వు చేశారు. మధ్యాహ్నం కవిత దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను విచారించారు. కవిత పిటిషన్‌ను కొట్టివేస్తూ 22 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. ‘వాస్తవాలు, కేసు పరిస్థితులు, వాదనలు పరిశీలించాక కవితను ఈ నెల 15 వరకూ సీబీఐ కస్టడీకి అనుమతిస్తున్నా. సీబీఐ అరెస్టును రద్దు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నా. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీ టీవీ పర్యవేక్షణలో కవితను విచారించాలి. ప్రతిరోజూ సాయంత్రం 6– 7 గంటల మధ్య అరగంట సేపు తన న్యాయవాది మోహిత్‌రావుతో మాట్లాడే అవకాశం కవితకు ఇవ్వాలి. భర్త అనిల్‌కుమార్, సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు, పీఏ శరత్‌చంద్రలు ఆ సమయంలోనే 15 నిమిషాలు మాట్లాడొచ్చు. నిందితురాలికి ఇంటి భోజనం, జపమాల, దుస్తులు, మేట్రస్, బెడ్ షీట్లు, తువ్వాళ్లు, దిండులను సీబీఐ అధికారులు అనుమతించాలి. ఆమె కోరిన పుస్తకాలు అనుమతించాలి..’అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
కవితను అరెస్టు చేసిన సీబీఐ.. ప్రత్యేక కోర్టులో సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తాము కవితను అరెస్టు చేసినట్లు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు తెలిపారు. దీంతో కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరఫు న్యాయవాది నితీష్ రాణా.. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం రంజాన్ సెలవు నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌కుమార్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని చెప్పారు. దీనిని శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్టు అన్యాయమని, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇదే విషయం శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావిస్తామని చెప్పారు. కస్టడీ కోరనున్న సీబీఐ! రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో సీబీఐ శనివారం కవితను తీహార్ జైలులో ప్రశ్నించిన విషయం విదితమే. మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో వాట్సాప్ చాట్లు, భూ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై కవితను ప్రశ్నించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఆమెను అరెస్టు చేసిన నేపథ్యంలో విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టును కోరనున్నట్లు తెలిసింది. -
లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సీబీఐ తమ అదుపులోకి తీసుకుంది. కాగా లిక్కర్ స్కాంకు సంబంధించి ఇటీవల తీహార్‌లో జైలులోనే కవితను సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ ఆరోపిస్తుంది. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌పై సీబీఐ దృష్టి పెట్టింది. వంద కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేస్తోంది. సౌత్ గ్రూపుకు ఆప్‌కు మధ్య కవిత దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఐపీసీ 120బి కింద కుట్ర కోణంలోనూ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే కవితను అరెస్ట్ చేసినట్టు సీబీఐ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కవితను జ్యుడీషియల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్ తరలించారు. రేపు(శుక్రవారం) కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ కస్టడీకి తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. ఇక లిక్కర్ స్కాం కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇక, లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఈడీ కస్టడీలో ఉన్నారు. చదవండి: నన్ను బలి పశువును చేశారు.. కల్వకుంట్ల కవిత లేఖ -
సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీపై వేటు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీ భిభవ్ కుమారుపై వేటు పడింది. ఢిల్లీ డైరెక్టరేట్ ఆప్ విజిలెన్స్ గురువారం ఆయన్ను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ వైవీవీజే రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. భిభవ్ కుమార్‌పై నమోదైన కేసు, తాత్కాలిక నియామకానికి సంబంధించి సెంట్రల్ సివిల్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి నియమించినందకు ఆయన విధులను రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2007లో తన విధలు నిర్వమించకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడటంతో భిభివ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిపై నోయిడా డెవలప్మెంట్ అథారిటీలో పని చేసే మహేష్ పాల్ అనే ప్రభుత్వ అధికారి కేసు నమోదు చేశాఉ. దీంతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్‌బుక్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పరిపాలనపరమైన చర్యలో భాగంగా భిభవ్ కుమార్‌ను సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీగా తొలగించారు. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం భిభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. అదే విధంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద భిభవ్ కుమార్ వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ తన అరెస్ట్ అక్రమమని, ఈడీ అరెస్ట్‌ను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌పై విచారణను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.