EPS
-
ఈసారైనా కనీస పెన్షన్ పెరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ద్వారా అమలవుతున్న ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద ఇచ్చే కనీస పెన్షన్ పరిమితి పెంచాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. ఈ పథకం కింద అర్హత సాధించిన కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఇచ్చే కనీస పెన్షన్ కింద రూ.1000గా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈపీఎస్ ద్వారా అందే కనీస పెన్షన్ కార్మికుడి కుటుంబానికి ఏమాత్రం సరిపోవడం లేదు.దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సామాజిక పెన్షన్ పథకం కింద కూడా ఇంతకు రెట్టింపు స్థాయిలో ఇస్తుండటంతో... కనీసం ఆ మేరకైనా పెంచాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మిక శాఖకు పెద్ద ఎత్తున వినతులు సైతం సమర్పించాయి. పెన్షన్ పెంపు కోసం కార్మికులు పదేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.రూ.2 వేలతో ప్రతిపాదనలుదేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓలో నమోదైన ఎస్టాబ్లిష్మెంట్ (వాణిజ్య, వ్యాపార సంస్థ)లు 7.66 లక్షలు. ఈ సంస్థల పరిధిలో ప్రస్తుతం ఈపీఎఫ్ఓ చందాదారులుగా ఉన్న వారు 7.37 కోట్లు. వీరంతా ఈపీఎస్ కింద వాటా చెల్లిస్తున్న వారే. మరో 78.49 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కో పెన్షనర్ కనీస పెన్షన్ కింద రూ.వెయ్యి చొప్పున అందుకుంటున్నారు. అయితే ఈ పెన్షన్ కింద వచ్చే డబ్బులు కనీసం నెలవారీ బీపీ, మధుమేహంలాంటి దీర్ఘకాలిక వ్యాధుల మందుల ఖర్చులకూ చాలడం లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కనీస పింఛన్ పెంపు కోసం కార్మిక సంఘాలు కేంద్రంపై తీవ్రంగానే ఒత్తిడి చేస్తున్నాయి.మరోవైపు కనీస పెన్షన్ పెంపుకోసం ఏర్పాటైన కమిటీలు సైతం పెంపును సమర్థిస్తూ కేంద్రానికి నివేదికలు సమర్పించాయి. కనీస పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచాలంటూ ప్రతిపాదనలు సైతం పంపాయి. పెన్షన్ పెంపుతో తలెత్తే ఆర్థిక భారాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖ ద్వారా కొంత సాయం అందించాలన్న అంశాన్ని కూడా ప్రస్తావించాయి. కానీ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపని ఆర్థిక శాఖ... కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదనలను తిరస్కరించింది. చందాల రూపంలో రూ.65 వేల కోట్లు ప్రస్తుతం ఈపీఎఫ్ఓకు నెలవారీ చందాల రూపంలో ఏడాదికి రూ.65 వేల కోట్లు సమకూరుతోంది. అదేవిధంగా పెన్షన్ నిధి నిల్వలతో వచ్చే వడ్డీ సైతం భారీగా జమ అవుతోంది. అంతేకాకుండా ఈపీఎఫ్ఓ ద్వారా సెక్యూరిటీస్‌లో పెట్టుబడులతోనూ భారీగా ఆదాయం వస్తోంది. ఈ పరిస్థితుల్లో కనీస పెన్షన్ రెట్టింపు చేసినా ఆర్థిక భారం ఉండదనేది కార్మిక సంఘాల వాదన. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ సాయం లేకున్నా కనీస పింఛన్ పెంపుతో ఇబ్బందులు ఉండవని సంఘాల నేతలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో మరోమారు కనీస పెన్షన్ పెంచుతూ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఈపీఎఫ్ఓ ట్రస్టీలు సైతం సూచిస్తున్నారు. వచ్చే వారంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశం జరగనుంది. అందులోనైనా కనీస పెన్షన్‌పై తీర్మానం చేసి కేంద్ర కార్మిక శాఖకు సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే వాటిలో పెన్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. పెన్షన్(Pension) లెక్కలకు సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలుంటాయి. ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే పెన్షన్ ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే వచ్చే పెన్షన్ అధికంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తక్కువ సర్వీసు ఉంటే తక్కువ పెన్షన్ అందుతుందని గుర్తుంచుకోవాలి.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను నిర్వహిస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలిసుండాలి.పెన్షన్‌కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి పెన్షన్ విత్‌డ్రా చేసుకోవచ్చు.పెన్షన్ విధానంలో కనీసం నెలవారీ మొత్తం రూ.1,000 అందుతుంది.గరిష్ఠంగా అందే పెన్షన్ రూ 7,500.ఎలా లెక్కిస్తారంటే..ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 58 ఏళ్లకు చేరుకుని ఉండాలి.పెన్షన్ తీసుకోవాలనుకునే సమయం నుంచి గత 60 నెలల సగటు జీతం (నెలకు గరిష్టంగా రూ.15,000)ను పరిగణనలోకి తీసుకుంటారు.ఈపీఎస్‌కు మీరు కంట్రిబ్యూషన్ చేసిన మొత్తం సంవత్సరాల సంఖ్యను పెన్షనబుల్ సర్వీసు అంటారు. కింది ఫార్ములా ఉపయోగించి పెన్షన్ లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = పెన్షనబుల్ జీతం(రూ.15,000కు మించకుండా 60 నెలల సరాసరి)×పెన్షనబుల్ సర్వీస్/70ఉదాహరణకు, మీ పెన్షనబుల్ జీతం రూ.15,000, పెన్షనబుల్ సర్వీస్ 10 సంవత్సరాలు అయితే నెలవారీ పెన్షన్ కింది విధంగా ఉంటుంది.నెలవారీ పెన్షన్=15,000×10/70=2,143ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలుపదేళ్లలో విభిన్న కంపెనీలు మారితే..పెన్షన్ పొందాలంటే పదేళ్లు ఒకే కంపెనీలో పని చేయాలనే నిబంధనేం లేదు. పదేళ్లలోపు ఈపీఎస్ సర్వీసు అందుబాటులో ఉన్న విభిన్న కంపెనీల్లో పని చేసినా పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. అయితే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) మాత్రం యాక్టివ్‌గా ఉండాలి. కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి. ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త యజమాన్యం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) బ్యాలెన్స్ మీ మునుపటి యజమాని వద్ద ఉంటుంది. అయినప్పటికీ సర్వీస్ వివరాలు బదిలీ చేస్తారు. దాంతో మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేస్తారు. -
ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపు?
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్)ని పెంచాలని యోచిస్తోంది. ఈమేరకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.21 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఒకవేళ అనుకున్న విధంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత చేకూరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం.. (ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి: రూ.15,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.15,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,250ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,250 = రూ.1,750ఇదీ చదవండి: ‘తను నా కోసమే పుట్టిందనిపించింది’ప్రతిపాదిత విధానం ప్రకారం.. (వేతన సీలింగ్: రూ.21,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.21,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,749ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,749 = రూ.1,251కేంద్రం వేతన గరిష్ఠ పరిమితిలో మార్పులు తీసుకొస్తే గతంలో కంటే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఈపీఎఫ్ తగ్గుతుంది. -
EPFO: ఈపీఎస్‌పై కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్)కు సంబంధించి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే ఈపీఎస్-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి మొత్తం లెక్కలు మారవచ్చు.ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ వేతనంలో 12% మొత్తం నెలవారీ కంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ కార్పస్ కోసం ఈపీఎఫ్‌కు వెళుతుంది. యజమాన్యాలు కూడా ఇంతే మొత్తాన్ని జమచేస్తాయి. అందులో 8.33% ఈపీఎస్-95 కింద పెన్షన్ నిధికి వెళుతుంది. మిగిలిన 3.67% ఈపీఎఫ్‌కి జమవుతుంది. అయితే ఇప్పటివరకు యాజమాన్యాలు జమచేసే 8.33 శాతంపై ఎలాంటి వడ్డీ రావడంలేదు. ఈ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ వరకు ప్రతి నెలా జమవుతూ ఉంటుంది. ఉద్యోగి బేసిక్ జీతంలో రివిజన్ ఉంటే ఈ కంట్రిబ్యూషన్ మారవచ్చు. ఈపీఎఫ్ కార్పస్ కాలక్రమేణా పెరుగుతుంది. దీనిపై ఈపీఎఫ్‌వో నిర్ధిష్ట వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం ఇది సంవత్సరానికి 8.25% ఉంది. ఈ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే, ఈపీఎస్-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి ఈ మొత్తం లెక్కలు మారవచ్చు. మీడియా నివేదిక ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఒక పెన్షనర్ల సమూహం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కి అనుగుణంగా ఈపీఎఫ్ సంపదను లెక్కించాలని, పెన్షన్ కార్పస్‌పై సంవత్సరానికి 8% వడ్డీ రేటును నిర్ణయించాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది.ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్బీఐ స్పషల్ స్కీమ్'ది హిందూ' నివేదిక ప్రకారం.. ఎన్పీఎస్ మాదిరిగానే ఈపీఎస్ కూడా కాంట్రిబ్యూటరీ స్కీమ్ అని, జమయిన పెన్షన్ మొత్తం ఆధారంగా కాకుండా 'ఫిక్స్డ్ పెన్షన్ జీతం' ఆధారంగా లెక్కించాలని ఐటీఐ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (IRIROA) వాదిస్తోంది.ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లాగానే పని చేస్తుంది. ఈ కొత్త నిర్మాణం ప్రకారం, ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్‌పై ఏటా స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో పదవీ విరమణ నాటికి ఈ పెన్షన్ కార్పస్ భారీగా పెరుగుతుంది. -
లారస్ లాభం 55 శాతం డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు మధ్యంతర డివిడెండ్ రూ.1.2 చెల్లించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మార్చి త్రైమాసికంలో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం క్షీణించి రూ.103 కోట్లు నమోదు చేసింది. మార్జిన్స్ 7.5 శాతం సాధించింది. ఎబిటా 28 శాతం తగ్గి రూ.287 కోట్లు, ఎబిటా మార్జిన్ 20.8 శాతంగా ఉంది. ఈపీఎస్ రూ.1.9 నమోదైంది. టర్నోవర్ 3% తగ్గి రూ. 1,381 కోట్లకు వచ్చి చేరింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,041 కోట్ల టర్నోవర్‌పై రూ.790 కోట్ల నికరలాభం పొందింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో లారస్ షేరు ధర గురువారం 2.60 శాతం క్షీణించి రూ.292.25 వద్ద స్థిరపడింది. -
తమిళనాడు: అన్నాడీఎంకేలో డిప్యూటీ చిచ్చు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నేత ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్), అన్నాడీఎంకేలో ఆయన అనుకూల వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్లను రాజారత్నం మైదానంలో నిర్బంధించారు. నల్ల చొక్కాలతో అసెంబ్లీ ఎదుట నిహారదీక్షకు ఆయన సిద్ధపడిన క్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎకేం వర్గపోరులో డిప్యూటీ చిచ్చు రాజుకుంది. అన్నాడీఎంకేలోని ఒక వర్గ నేత అయిన పళని స్వామి.. పార్టీ తరపున డిప్యూటీ నేతగా తాజాగా ఆర్బీ ఉదయకుమార్‌ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్)ను డిప్యూటీ లీడర్‌గా తొలగించాలని, అసెంబ్లీలో ఓపీఎస్ సీటును తన పక్క నుంచి వేరే చోటుకి మార్చాలని స్పీకర్‌కు లేఖలు రాశారు పళనిస్వామి. అయినా చర్యలు లేకపోవడంతో.. స్పీకర్ చర్యను నిరసిస్తూ పళనిస్వామి నిరహార దీక్షకు దిగారు. దీంతో ఈపీఎస్ వర్గీయుల నినాదాల హోరుతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తతకు తెర లేపింది. ఈ క్రమంలోనే శాంతి భద్రతల పరిరక్షణకు పళనిని, ఆయన వర్గీయులను పోలీసులు అదుపులోకి ప్రత్యేక వాహనంలో తీసుకున్నారు. పళనిస్వామి వర్గంలోని ఉదయ్‌కుమార్‌ను తాజాగా అన్నాడీఎంకే ఉప నేతగా కార్యవర్గం ఎన్నుకుంది. మరోవైపు అసెంబ్లీలో తన పక్కన సీటులో పన్నీర్ సెల్వంను కూర్చోనివ్వొద్దంటూ స్పీకర్‌కు లేఖలు రాశారు పళనిస్వామి. ఈ విషయమై మంగళవారం అసెంబ్లీలో వాగ్వాదం చెలరేగగా.. మార్షల్స్ సాయంతో ఈపీఎస్‌ను ఆయన ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి స్పీకర్ బయటకు పంపించేశారు. ఇక సీటింగ్ విషయమై తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని.. ఆ అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ అప్పావు చెప్తున్నారు. అయితే పళనిస్వామి మాత్రం అధికార పార్టీ ఆదేశాలతోనే పన్నీర్ సెల్వం వర్గానికి స్పీకర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు మంగళవారం అసెంబ్లీలో గొడవ జరిగినప్పుడు.. పన్నీర్‌సెల్వం ప్రశాంతంగా పళనిస్వామి పక్క సీటులోనే కూర్చోవడం గమనార్హం. விடியா அரசின் அராஜகத்தை எதிர்த்து உண்ணாவிரத போராட்டம் நடத்திய எதிர்கட்சித் தலைவர் அண்ணண் திரு.@EPSTamilNadu அவர்கள் மற்றும் சட்டமன்ற உறுப்பினர்கள் கைது!! திராணியற்ற #திமுக அரசை வண்மையாக கண்டிக்கின்றேன்..#DMKFailsTN #TNAssembly #AIADMK #ValluvarKottam pic.twitter.com/a1FMffDzBD — Thiruverkadu S UDHAYA KUMAR (@tssudhayakumar) October 19, 2022 -
నీకు ఎలాంటి అధికారం లేదు: పళనిస్వామి బహిరంగ ప్రకటన
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. పన్నీర్ సెల్వంపై బహిరంగంగా తొలిసారి వ్యతిరేక కామెంట్లు చేశారు మాజీ సీఎం పళనిస్వామి. ఈ మేరకు పన్నీర్‌సెల్వంకు ఇక మీదట పార్టీ కో-ఆర్డినేటర్ కాదంటూ ఈపీఎస్ ఓ లేఖ రాశారు. ఇకపై ఓ.పన్నీర్‌సెల్వం.. అన్నాడీఎంకే పార్టీ కో-ఆర్డినేటర్ కాదని, ఇద్దరి ఆమోదం తర్వాత ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ భేటీ(జూన్ 23న) రసాభాసకు కారణం పన్నీర్ సెల్వమేనని పళని స్వామి ఆరోపించారు. 2021, డిసెంబర్ 1న పార్టీ రూపొందించిన ప్రత్యేక చట్టాలను పన్నీర్‌సెల్వం ఉల్లంఘించారని, జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా పోలీసులను.. కోర్టును ఆశ్రయించారని, భేటీలో గందరగోళంతో పాటు కీలక తీర్మానాల ఆమోదానికి కొందరు కార్యకర్తల ద్వారా అడ్డుతగిలారని.. కాబట్టి పన్నీర్‌సెల్వం ఇకపై అన్నాడీఎంకే పార్టీ కో ఆర్డినేటర్ కొనసాగే అర్హత లేదని పళనిస్వామి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. స్థానిక ఎన్నికలకు సంబంధించి.. అభ్యర్థుల పేర్లతో ఓపీఎస్ పంపిన లేఖను సైతం పళనిస్వామి పక్కనపెట్టారు. గడువు ముగిశాక పంపిన పేర్లను పరిశీలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు పళనిస్వామి. ఇదిలా ఉంటే.. పళనిస్వామి పంపిన లేఖలో తనను తాను పార్టీ హెడ్‌క్వార్టర్స్ సెక్రటరీగా పేర్కొనగా.. ఓపీఎస్‌ను కోశాధికారిగా(ట్రెజరర్) ప్రస్తావించారు. కిందటి ఏడాది ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలో పన్నీర్ సెల్వంను కో-ఆర్డినేటర్‌గా, పళనిస్వామిని జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎనుకున్నారు. అయితే పళనిస్వామి పార్టీ అధికారం అంతా ఒకరి చేతుల్లోనే ఉండాలని వాదిస్తుండగా, పన్నీర్‌సెల్వం మాత్రం పాత విధానం కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాడు. -
ఇక ఈపీఎఫ్ DOE అప్డేట్ కోసం కంపెనీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..!
గతంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ డబ్బుల కోసం చాలా మంది ఇబ్బందిపడేవారు. అయితే ఇప్పుడు అలాంటి సమస్య నుంచి ఉద్యోగులను సేవ్ చేసేవిధంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఏదేని సంస్థలో ఉద్యోగంలో చేరినప్పుడు, మానేసినప్పుడు పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఆ సంస్థ హెచ్ ఆర్'పై ఆధారపడవలసి వచ్చేది. ఎందుకంటే, ఉద్యోగంలో చేరినతేదీ, మానేసిన తేదీని నవీకరిస్తేనే పీఎఫ్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు అలా మార్చుకునే హక్కును ఈపీఎఫ్ సంస్థ ఉద్యోగికే కల్పించింది. మీరు ఇటీవల ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే, మీరు నిష్క్రమణ తేదీని దాఖలు చేయడానికి 2 నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పీఎఫ్‌లో యజమాని చివరి సహకారం అందించిన 2 నెలల తర్వాత మాత్రమే నవీకరించబడుతుంది. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం, మీ నిష్క్రమణ తేదీ నవీకరించకపోతే, మీరు మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు లేదా ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేయలేరు. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు మాత్రమే నిష్క్రమణ తేదీని నవీకరించే హక్కును ఇచ్చింది. ఇది ఉద్యోగులకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. Employees can now update their Date of Exit on their own. To know more about this process, click on this link & watch this video- https://t.co/skGJdcqFW9#EPFO@byadavbjp @Rameswar_Teli @PMOIndia @LabourMinistry @PIB_India @PIBHindi @MIB_India @mygovindia @PTI_News @wootaum — EPFO (@socialepfo) January 24, 2022 మొదట https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ ఓపెన్ చేయండి వెళ్లండి. ఇప్పుడు మెనూ బార్'లో ఉన్న'మేనేజ్' ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూలో Mark Exit అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎంపిక చేసిన ఎంప్లాయిమెంట్ డ్రాప్ డౌన్ నుంచి పిఎఫ్ అకౌంట్ నెంబరు ఎంచుకోండి. నిష్క్రమణ తేదీ, నిష్క్రమణకు గల కారణాన్ని కారణం నమోదు చేయండి. మీ ఆధార నెంబర్ కు లింకు అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ నమోదు చేయండి. ఆ తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అప్ డేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నిష్క్రమణ తేదీ విజయవంతంగా అప్ డేట్ అవుతుంది. (చదవండి: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయిన రేంజ్!) -
ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త.. ఇక ముందుగానే ఖాతాలోకి పెన్షన్!
ఈపీఎస్-95 పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ శుభవార్త తెలిపింది. ఇక నుంచి ఈపీఎఫ్ పెన్షనర్లు ప్రతి నెలా చివరి రోజున పెన్షన్ పొందనున్నట్లు సంస్థ పేర్కొంది. పెన్షన్ కోసం పింఛనుదారులు ప్రతినెలా 1 లేదా 5వ తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ నెల చివరిన రెండు రోజుల ముందుగానే పెన్షనర్ల బ్యాంకు ఖాతాలో డబ్బులో పడేలా పీఎఫ్ కమిసనర్ విశాల్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులకు విధి విధానాలను జారీ చేయాలని రీజనల్ పీఎఫ్ ఆఫీసులకు సూచించారు. పెన్షన్ చెల్లించే బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో ఇలా.. "పెన్షన్ డబ్బులు ప్రతినెలా 1 లేదా 5వ తేదీన కాకుండా నెలా చివరి రోజున(ఆ నెలకు ముందు) పెన్షన్ క్రెడిట్ చేయనున్నట్లు" ఉంది. చాలామంది పింఛనుదారులకు పెన్షన్ డబ్బులు గడువు తేదీన ఖాతాలో క్రెడిట్ కాకపోవడంతో ఈపీఎస్ పెన్షనర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పెన్షన్ డివిజన్ సమీక్షించింది. ఆర్బిఐ ఆదేశాలకు అనుగుణంగా అన్ని రీజనల్ ఆఫీసులు నెల చివరి పనిదినం నాడు లేదా అంతకు ముందు పెన్షనర్ ఖాతాలో నగదు క్రెడిట్ చేసే విధంగా బ్యాంకులకు సూచించాలని తెలిపింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 80 లక్షల మంది పెన్షన్ దారులకు మేలు జరగనుంది. తాజా నిబంధనలతో వారికి ముందుగానే పెన్షన్ అకౌంట్లో జమ అవుతుంది. ఉద్యోగుల పెన్షన్ స్కీం 1995 (ఈపీఎస్-95) పెన్షనర్లు అందరూ కూడా పెన్షన్ పొందడం కోసం ప్రతి సంవత్సరం జీవన్ ప్రమాన్ పత్రం(జెపిపి) లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక పెన్షన్ విషయంలో పెన్షన్‌దారులకు మేలు చేసేలా ఈపీఎఫ్ఓ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. కనీస పెన్షన్ పెంచే దిశగా ఆలోచిస్తోంది. (చదవండి: ప్లీజ్.. సాయం చేయండి: చైనా పంచన చేరిన తాలిబన్లు) -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త..!
ఈపీఎఎఫ్ఓ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డిసెంబరు 31 తరువాత కూడా ఈ-నామినేషన్ చేయవచ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి, ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కారణంగా చందాదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ-నామినేషన్ చేయడానికి ఎలాంటి గడువు తేదీ లేదు అని పేర్కొనడం కొసమెరుపు. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం చందాదారులు డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఈ రోజే నామినేషన్ దాఖలు చేయమని ఈపీఎఫ్ఓ ట్వీట్లో తెలిపింది. ఒకవేళ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయకపోతే బీమా డబ్బు, పెన్షన్ డబ్బుతో పాటుగా ఇతర ఈపీఎఫ్ ప్రయోజనాలను కోల్పోతారు. కొత్త నిబంధనల ప్రకారం, చందాదారుల ఆకస్మిక మరణం సంభవించినప్పుడు నామినేటెడ్ సభ్యులు మాత్రమే ఈపీఎఫ్ పొదుపును విత్ డ్రా చేయగలరు. Empower your family, file enomination. #EPFO pic.twitter.com/sY8EjuDjSs — EPFO (@socialepfo) December 29, 2021 ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి. యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?) -
13 సంవత్సరాల క్రితం ఆరోపణలు, రిలయన్స్‌కు ఊరట
న్యూఢిల్లీ: షేర్‌పై వచ్చే ఆర్జన (ఈపీఎస్– ఎర్నింగ్స్ పర్ షేర్) విషయంలో 13 సంవత్సరాల క్రితం ఆర్థిక ఫలితాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై దాఖలైన ఆరోపణలను ‘ఎటువంటి జరిమానా విధించకుండా’ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొట్టివేసింది. దీనికి రెండు అంశాలను సెబీ ప్రాతిపదికగా తీసుకుంది. అందులో ఒకటి... ఒక లిస్టెడ్ కంపెనీ ఫలితాల్లో ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే, ఆ కంపెనీపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తున్న చట్ట సవరణ 2019 మార్చి నుంచీ అమల్లోకి వచ్చింది. ఇక సెబీ పేర్కొన్న రెండవ అంశం (గ్రౌండ్) విషయానికి వస్తే... ఈ తరహా వివాదం, ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అప్పీలేట్ (శాట్) ఇచ్చిన తీర్పుపై అప్పీల్ ఒకటి సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. షేర్ వారెంట్స్ జారీ జరిగినప్పటికీ, 2007 జూన్ నుంచి 2008 సెప్టెంబర్ వరకూ త్రైమాసిక ఫలితాల స్టేట్మెంట్లు ఈపీఎస్‌ను ఒకే విధంగా కొనసాగించాయన్నది ఆర్‌ఐఎల్‌పై ప్రధాన ఆరోపణ. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ -
EPFO: ఈ-నామినేషన్ దాఖలు చేయకపోతే ఏడు లక్షలు రానట్లే?
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల భవిష్యత్ కోసం నియమించిన సంస్థ. ప్రతి నెల జీతం పొందిన వ్యక్తుల నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ రూపంలో ఈ సంస్థకు యాజమాన్యం కేటాయిస్తుంది. ఈపీఎఫ్ఓ తన సభ్యుల కోసం ఈ-నామినేషన్ దాఖలు చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ-నామినేషన్ దాఖలు చేయడం చాలా ముఖ్యం. ఒక సభ్యుడి మరణంపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), పెన్షన్ (ఈపీఎస్), ఇన్స్యూరెన్స్ (ఈడీఎల్ఐ) ప్రయోజనాలను సులభంగా పొందడానికి ఈ-నామినేషన్ దాఖలు చేయాలని ఈపీఎఫ్ఓ తన ఇటీవలి ట్వీట్ లో తెలిపింది. ఉద్యోగులకు నామినేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణిస్తే ఈడీఎల్ఐ కింద రూ.7 లక్షల వరకు నామినీకి అందుతాయి. ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారానే నామినేషన్ చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయనట్లయితే దిగువ పేర్కొన్న విధంగా చేయవచ్చు. File your e-nomination today to get Provident Fund (PF), Pension (EPS) and Insurance (EDLI) benefit online.#SocialSecurity #EPF #EDLI #Pension #ईपीएफओ #ईपीएफ@byadavbjp @Rameswar_Teli @PMOIndia @PIB_India @PIBHindi @MIB_India @DDNewslive @airnewsalerts @mygovindia @PTI_News pic.twitter.com/d2veK15fye — EPFO (@socialepfo) August 6, 2021 ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ అధికారిక లింక్ పై క్లిక్ చేయండి. (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) యుఎఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. -
పీఎఫ్ ఖాతా వల్ల కలిగే ఈ ప్రయోజనాలు గురుంచి తెలుసా?
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు అనేక పీఎఫ్ ప్రయోజనాలను కల్పిస్తోంది. ప్రతీ ఉద్యోగి ఖాతా నుంచి కొద్ది మొత్తం ప్రతీ నెల పీఎఫ్ ఎకౌంట్లో భద్రపరుస్తారు. ఇది కాకుండా ఉద్యోగ విరమణ తర్వాత కూడా నిర్ణీత మొత్తాన్ని పెన్షన్‌గా పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మనకు అండగా నిలుస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగులకు పిఎఫ్ ఖాతాలో బీమాతో సహా అనేక ఇతర సౌకర్యాలను అందిస్తుంది. అయితే వీటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పీఎఫ్‌పై రుణం తీసుకోవచ్చు పీఎఫ్ ఖాతాదారులు అందులో నగదు జమ చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ ఖాతా నుంచి రుణం తీసుకోవచ్చు. ఆర్ధిక అత్యవసర పరిస్థితిలో తీసుకున్న పీఎఫ్ రుణంపై విధించే వడ్డీ రేటు కూడా 1 శాతం మాత్రమే. అయితే, తీసుకున్న రుణ మొత్తాన్ని 36 నెలల్లోపు తిరిగి చెల్లించాలి. ఉచిత భీమా ఈడీఎల్ఈ పథకం కింద ఒక ఉద్యోగి మరణిస్తే పీఎఫ్ ఖాతాదారులకు అప్రమేయంగా 7 లక్షల వరకు ఉచిత బీమా లభిస్తుంది. గతంలో డెత్ కవర్ రూ.6 లక్షలు. ఈడీఎల్ఈ పథకం కింద పీఎఫ్ ఖాతాదారుడు డెత్ కవర్ కోసం ఎటువంటి బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. గృహ రుణం ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు కొనడానికి లేదా ఇంటిని నిర్మించుకోవడానికి పీఎఫ్ బ్యాలెన్స్‌లో 90 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. కాబట్టి, గృహ రుణాల కోసం పీఎఫ్ ఖాతాను ఉపయోగించుకోవచ్చు, భూమిని కూడా కొనుగోలు చేయవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ ఒక ఉద్యోగి అనారోగ్యంతో ఉంటే లేదా అతని కుటుంబంలో వైద్య అత్యవసర పరిస్థితి ఉంటే తన పీఎఫ్ నిధి నుంచి 50 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. పెన్షన్ సౌకర్యం పీఎఫ్ ఖాతాదారుడు 58 సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందటానికి అర్హులు. పెన్షన్ అర్హత పొందడానికి పీఎఫ్ ఖాతాలో కనీసం 15 సంవత్సరాల రెగ్యులర్ నెలవారీ పీఎఫ్ సహకారం ఉండాలి. మిగిలిన మొత్తం ప్రయోజనం యజమాని సహకారం నుంచి వర్తిస్తుంది. ఎందుకంటే అతని సహకారం 8.33 శాతం(12 శాతంలో) పీఎఫ్ ఖాతాదారుడి ఈపీఎస్ ఖాతాకు వెళుతుంది. చదవండి: పన్నెండు రూపాయలతో రూ.2 లక్షల ప్రమాద బీమా -
కరోనాతో మరణిస్తే డబ్బులు డ్రా చేయడం ఎలా?
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2.83 లక్షలు. కరోనాతో మరణించిన వారిలో ధనవంతుల నుంచి దినసరి కూలీల వరకు ఉన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు/ఖాతాదారులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్న సందేహాలు వస్తున్నాయి. సాధారణంగా పదవి విరమణ తర్వాత లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు జమ చేసిన ఉద్యోగి వాటా, యజమాని వాటా, వడ్డీ మాత్రమే కాకుండా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ పథకం కింద రూ.7 లక్షల వరకు బీమా డబ్బులు ఉద్యోగి కుటుంబ సభ్యులకు లభిస్తాయి. చనిపోయినవారి ఈపీఎఫ్ ఖాతా నుంచి వారి కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకోవడానికి నామినీ ఈపీఎఫ్ ఫారం 20 ద్వారా ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణను పొందవచ్చు. సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ -19 వల్ల చాలా మంది చనిపోతున్నందున, ఈ బీమా ప్రయోజనం మరణించిన వ్యక్తి కుటుంబానికి ఎంతో సహాయపడుతుంది. మరణించిన వ్యక్తికి నామినీ లేకపోతే, చట్టబద్ధమైన వారసుడు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ఫారం 20 నింపేటప్పుడు ఈపీఎఫ్ సభ్యుడి పేరు, తండ్రి / భర్త పేరు, సభ్యుడు చివరిగా పనిచేసిన సంస్థ పేరు & చిరునామా, ఈపీఎఫ్ ఖాతా సంఖ్య, చివరి పనిదినం, ఉద్యోగం మానెయ్యడానికి కారణం(మరణించిన సభ్యుడి విషయంలో “మరణం” పేర్కొనండి), మరణించిన తేదీ (dd / mm / yyyy), అతని / ఆమె మరణించిన రోజున సభ్యుడి వైవాహిక స్థితి వంటి వివరాలు నింపాలి. అలాగే, నామినీ/చట్టబద్ధమైన వారసుడు వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది. నామినీ/చట్టబద్ధమైన వారసుడు పేరు, తండ్రి / భర్త పేరు, లింగం, వయస్సు (సభ్యుడు మరణించిన తేదీ నాటికి), వైవాహిక స్థితి (సభ్యుడు మరణించిన తేదీ నాటికి), మరణించిన సభ్యుడితో సంబంధం, పూర్తి పోస్టల్ అడ్రస్ లాంటి వివరాలు వెల్లడించాలి. అలాగే, పోస్టల్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పొందాలనుకుంటే ఆ కాలమ్ టిక్ చేయాలి. లేదా అకౌంట్ ద్వారా పొందాలనుకుంటే అకౌంట్ వివరాలు, క్యాన్సల్డ్ చెక్ సబ్మిట్ చేయాలి. నామినీ/ హక్కుదారుడు ఆధార్ లింకైన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. క్లెయిమ్ ప్రాసెస్‌లో పలు దశల్లో ఎస్ఎంఎస్లు వస్తాయి. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పొందాలంటే క్యాన్సల్డ్ చెక్ ఇవ్వడం తప్పనిసరి. పూర్తి అడ్రస్ పిన్‌కోడ్‌తో సహా వెల్లడించాలి. ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి ఫామ్ 20 ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈపీఎఫ్, ఈపీఎస్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా రావాల్సిన డబ్బుల కోసం ఫామ్ 10C/D కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది. చదవండి: టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి -
మార్కెట్ల ఈ ర్యాలీ నిలుస్తుందా?
కొద్ది రోజులుగాదేశీ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ర్యాలీ కారణంగా షేర్లు అధిక ధర పలుకుతున్నాయని బ్రోకింగ్ సంస్థ జెఫరీస్ పేర్కొంటోంది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌లను అమలు చేస్తున్న నేపథ్యంలో పలు కంపెనీల లాభార్జన నీరసించనున్నట్లు తెలియజేసింది. దీంతో షేరువారీ ఆర్జన(ఈపీఎస్)లు డౌన్‌గ్రేడ్ కానున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 19.7 రెట్లు ప్రీమియంలో ట్రేడవుతున్నట్లు తెలియజేసింది. అంటే దాదాపు 2008 జనవరి గరిష్టాల స్థాయిలో మార్కెట్లు కదులుతున్నట్లు వివరించింది. 2008లో అంతర్జాతీయంగా చెలరేగిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా తదుపరి దశలో మార్కెట్లు పతనమైన విషయం విదితమే. రీసెర్చ్ నోట్లో జెఫరీస్ ఇంకా ఏమన్నదంటే..! 44 శాతం ర్యాలీ మార్చి కనిష్టం నుంచి నిఫ్టీ 44 శాతం ర్యాలీ చేసింది. 7,511 పాయింట్ల కనిష్టం నుంచి 10,813 పాయింట్ల వరకూ ఎగసింది. అయితే కోవిడ్-19 ప్రభావంతో ఇటీవల పలు కంపెనీల ఈపీఎస్‌లు డౌన్‌గ్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లలో కనిపిస్తున్న ర్యాలీ పటిష్టతపై సందేహాలు నెలకొనడం సహజం. ఇప్పటికే నిఫ్టీ ఈపీఎస్‌పై అంచనాలలో కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 28 శాతం.. వచ్చే ఏడాదిలో 14 శాతం చొప్పున నిఫ్టీ ఈపీఎస్‌పై డౌన్‌గ్రేడ్స్ వెలువడ్డాయి. ఈ ఏడాది తొలి త్రైమాసిక (ఏప్రిల్-జూన్) ఫలితాలు విడుదలయ్యాక ఈపీఎస్ అంచనాలు మరింత తగ్గే వీలుంది. నిధులు వెనక్కి ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితుల కారణంగా మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. యాంఫీ(AMFI) వివరాల ప్రకారం జూన్‌లో ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ. 1800 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఆరేళ్లలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. ఫండ్స్‌లోకి పెట్టుబడులు రావడానికి బదులుగా నిధుల ఉపసంహరణ జరగడం ప్రతికూల అంశం. అయితే మెరుగైన ఆర్థిక గణాంకాలు, ప్రపంచవ్యాప్తంగా రిస్క్‌లను ఎదుర్కొనగల సామర్థ్యం పెరగడం వంటి అంశాలు మార్కెట్లలో దిద్దుబాటు(కరెక్షన్)ను స్వల్ప కాలానికే పరిమితం చేయవచ్చు. నిర్మాణ రంగం పుంజుకోవడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం వంటి అంశాలు ర్యాలీకి బలాన్నిచ్చే వీలుంది. ఈ బాటలో ఇకపై సిమెంటుకు డిమాండ్, ఇంధన విక్రయాలు వంటివి ఊపందుకుంటే సెంటిమెంటు మరింత మెగుగుపడవచ్చు. ఇది ర్యాలీకి మరింత దోహదం చేయవచ్చు. ఫేవరెట్ స్టాక్స్ ప్రస్తుత మార్కెట్లో వేల్యుయేషన్స్‌పరంగా ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొంతమేర ఆకర్షణీయంగా ఉన్నట్లు జెఫరీస్ అభిప్రాయపడింది. -
హెక్సావేర్ లాభం 26 శాతం అప్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ నికర లాభం ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో 26 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ1లో రూ.138 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.175 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను సస్పెండ్ చేసింది. కరోనా వైరస్ కల్లోలంతో అనిశ్చితి నెలకొనడమే దీనికి కారణమని వెల్లడించింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో రూ.1,264 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది ఇదే క్వార్టర్లో 22 శాతం ఎగసి రూ.1,542 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 18 శాతం వృద్ధితో 2.3 కోట్ల డాలర్లకు, ఆదాయం 17 శాతం వృద్ధితో 21 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపింది. 26 శాతం పెరిగిన ఈపీఎస్... ఈ క్యూ1లో ఒక్కో షేర్ రాబడి(ఈపీఎస్) 26 శాతం వృద్ధితో రూ.5.86కు పెరిగిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వికాస్ కుమార్ జైన్ వెల్లడించారు. నిర్వహణ సామర్థ్యాలపై దృష్టి పెట్టటంతో ఒక్కో షేర్ రాబడి ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించకముందే వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రారంభించామని తెలిపారు. ఐటీ విభాగంలో 99 శాతం మంది, బీపీఎస్ విభాగంలో 80 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 19,998గా ఉందని, ఆట్రీషన్ రేటు 15.1 శాతమని పేర్కొన్నారు. నికర లాభం 26 శాతం పెరగడంతో హెక్సావేర్ టెక్నాలజీస్ షేర్ లాభపడింది. బీఎస్ఈలో ఈ షేర్ 3 శాతం లాభంతో రూ.296 వద్ద ముగిసింది. -
ప్రైవేట్ ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : పదవీవిరమణ అనంతరం పెద్దగా ప్రయోజనాలు అందుకోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఊరట లభించింది. ప్రైవేట్ ఉద్యోగులు సైతం రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ అందుకునేందుకు మార్గం సుగమమైంది. పూర్తిస్దాయి వేతనం ప్రాతిపదికన ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాలంటూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈపీఎఫ్‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులతో ప్రైవేట్ ఉద్యోగులకూ భారీగా పెన్షన్ అందుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు వారి వాస్తవ వేతనంపై కాకుండా రూ.15,000 వేతనం ప్రాతిపదికన పెన్షన్‌ను లెక్కగడుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు నిర్ణయంతో ఉద్యోగులకు వారి పూర్తి వేతనం ప్రాతిపదికన పెన్షన్‌ను లెక్కగట్టడంతో ఉద్యోగులు పదవీవిరమణ అనంతరం పెద్దమొత్తంలో పెన్షన్ అందుకునే వెసులుబాటు కలిగింది. ఇక సుప్రీం కోర్టులో ఈపీఎఫ్‌వో అప్పీల్ తిరస్కరణ నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ భారీగా పెరగనుండగా ప్రావిడెంట్ ఫండ్ వాటా తగ్గనుంది. అదనపు కంట్రిబ్యూషన్ అనేది పీఎఫ్‌కు కాకుండా ఈపీఎస్‌కు వెళ్తుంది. ఈపీఎస్ మదింపే కీలకం.. కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)ను ప్రారంభించింది. ఇందులో కంపెనీ ఉద్యోగి వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్ స్కీమ్‌లో జమచేయాలి. అయితే ఈ కంట్రిబ్యూషన్ ఉద్యోగి వాస్తవ వేతనంతో నిమిత్తం లేకుండా రూ.6,500లో 8.33 శాతానికి మాత్రమే పరిమితం. అంటే ఈపీఎస్ ఖాతాకు నెలకు గరిష్టంగా కేవలం రూ.541 మాత్రమే జమవుతాయి. ఇక 1996 మార్చిలో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేసింది. 2014 సెప్టెంబర్ 1న మళ్లీ ఈపీఎఫ్‌వో ఈపీఎస్ నిబంధనలను సవరించింది. ఉద్యోగి వేతనం ఎంతైనా రూ.15,000 ప్రాతిపదికన 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు జమ చేసుకోవచ్చని మార్పులు చేసింది. అంటే నెలకు గరిష్టంగా రూ.1,250 ఈపీఎస్ ఖాతాకు జమవుతుంది. మరోవైపు పూర్తి వేతనంపై పెన్షన్ అవకాశాన్ని ఎంపిక చేసుకుంటే గత ఐదేళ్ల వేతనం సగటు ప్రాతిపదికన పెన్షన్ ఉంటుందని పేర్కొంది. గత ఏడాది వేతనం సగటును పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యోగులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా నిబంధనలను పక్కనపెట్టిన కోర్టు పా విధానాన్నే అనుసరించాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఈపీఎఫ్‌వో సుప్రీం కోర్టుకు వెళ్లగా పూర్తిస్దాయి వేతనంపైనే పెన్షన్ లెక్కగట్టాలన్న హైకోర్టు వాదనను సమర్ధిసూ ఈపీఎఫ్ఓ అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తిరస్కరించింది. -
ఆ ఇద్దరూ డెంగ్యూ దోమల కన్నా డేంజర్!
సాక్షి, చెన్నై: రాజకీయ అనిశ్చితి వెంటాడుతున్న తమిళనాడులో తాజాగా డీఎంకే అధికార పత్రిక 'మురసోలి' ప్రచురించిన ఓ కార్టూన్ వివాదం రేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వాన్ని రక్తంతాగే దోమలుగా చిత్రిస్తూ.. 'ప్రజల రక్తం తాగడంలో డెంగ్యూ దోమలు మించిపోయిన ఇద్దరు ద్రోహులు' అంటూ మురసోలీ ఈ కార్టూన్ ప్రచురించింది. తమిళనాడులో ఇటీవల డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలడంతో ఈ అంశంపై అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే ప్రరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రతిపక్ష డీఎంకే వ్యూహ్యాలు 'డెంగ్యూ' కన్న ప్రమాదకరమని ఇటీవల అన్నాడీఎంకే విమర్శించింది. ఈ విమర్శకు బదులుగా డీఎంకే వేసిన ఈ కార్టూన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డీఎంకే ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి లాంటిదని, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని అన్నాడీఎంకే మంత్రి సెల్లు రాజా విమర్శించారు. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ విరుచుకుపడుతూ.. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ను 'డెంగ్యూ భాస్కర్'గా అభివర్ణించారు. ఈ మేరకు డీఎంకే పత్రిక కార్టూన్ కూడా వేసింది. -
అన్నాడీఎంకేలో కొత్త సంక్షోభం
-
అన్నాడీఎంకే: గ్రూపుల విలీనం ఖాయం!
చెన్నయ్: ఏఐఏడీఎంకే ఐక్యంగా నిలబడుతుందని, పార్టీలో ఏ కుటుంబ (శశికళ) జోక్యం ఉండబోదని పన్నీర్‌సెల్వం తేల్చిచెప్పారు. విలీనం ఖాయమని సంకేతాలు పంపారు. ఇక ఏఐఏడీఎంకేలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపుల మధ్య రాజీ ఫార్ములా ఖరారు కావడంతో ఎట్టకేలకు విలీన ప్రక్రియ కొలిక్కివచ్చింది. ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చిన మేరకు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి, ఆయన అనుయాయులు కొందరికి మంత్రిపదవులు దక్కనున్నాయి. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై వేటు వేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలన్న పన్నీర వర్గీయుల డిమాండ్‌కూ పళనిస్వామి అంగీకరించినట్టు సమాచారం.పార్టీ ఎన్నికలు జరిగే వరకూ స్టీరింగ్ కమిటీకి పన్నీర్ సెల్వం నేతృత్వం వహించేందుకు ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. కొద్ది కాలం పార్టీకి ఈపీఎస్, ప్రభుత్వానికి ఓపీఎస్ నాయకత్వం వహించేలా సర్ధుబాటు చేసుకున్నారు. ఏఐఏడీఎంకేలో ఇరు గ్రూపుల మధ్య ఎలాంటి రాజీ కుదిరినా స్తంభింపచేసిన పార్టీ ఎన్నికల గుర్తును ఎన్నికల కమిషన్ పునరుద్ధరించే అవకాశాలు మెరుగవుతాయి.విలీనం అనంతరం పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి శశికళను తొలగించే తీర్మానం ఆమోదిస్తారని సమాచారం. మరోవైపు ఈపీఎస్, ఓపీఎస్ గ్రూపుల మధ్య సయోధ్యకు బీజేపీ చొరవ చూపిన క్రమంలో ఈ పరిణామాలు 2019 ఎన్నికల్లో ఎన్డీఏకు ఉపకరించనున్నాయని భావిస్తున్నారు. దినకరన్ ఎమ్మెల్యేలతో మంత్రుల చర్చలు ఏఐఏడీఎంకే విలీనం ఖాయం కావడంతో, దినకరన్ మద్దతుదారులను తమవైపు తిప్పుకొనే దిశగా ఏఐఏడీఎంకే నేతలు పావులు కదుపుతున్నారు. పార్టీలో శశికళ ప్రమేయం లేకుండా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. ఇందుకోసం అన్నాడీఎంకే జాయింట్ కార్యదర్శి టీటీవీ దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలతో ఆరుగురు మంత్రులు ఒక ప్రత్యేక గదిలో సుమారు అరగంటపాటు రహస్యంగా చర్చలు జరిపారు. -
స్టాక్స్ వ్యూ
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బ్రోకరేజ్ సంస్థ: ఐడీబీఐ క్యాపిటల్ ప్రస్తుత ధర: రూ.847 ; టార్గెట్ ధర: రూ.1,027 ఎందుకంటే: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది. ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ3 కంటే 4% పెరిగింది. బట్లర్ అమెరికా ఏరోస్పేస్, జియోమెట్రిక్ కంపెనీల విలీనం, ఐబీఎం నుంచి లభించిన కొన్ని భాగస్వామ్య ఒప్పందాల కారణంగా ఆదాయం ఈ స్థాయిలో పెరిగింది. ఇబిటా మార్జిన్ 34 బేసిస్ పాయింట్ల వృద్ధితో 20 శాతానికి(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన పోల్చితే 12 శాతం వృద్ది నమోదైంది) పెరిగింది. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 21 శాతం వృద్ధితో రూ.16.5కు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10.5–12.5 శాతం రేంజ్లో పెరగగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఇబిటా మార్జిన్ 19.5–20.5% రేంజ్లో సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19గా ఉన్న 5 కోట్ల డాలర్లకు మించిన ఆదాయాన్నిచ్చే క్లయింట్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25కి పెరిగింది. గతంలోలాగానే ఇతర కంపెనీలు కొనుగోలు చేయడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. డాలర్‌తో రూపాయి మారకం బలపడడడం, వివిధ కంపెనీల కొనుగోళ్లకు నగదు నిల్వలు ఖర్చవడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, నిర్వహణ సామర్థ్యం పెంపుదలతో ఈ సమస్యల నుంచి కొంత మేరకు గట్టెక్కగలిగింది. రూ.300 కోట్ల పన్ను కేటాయింపుల రివర్సల్ కారణంగా ఈపీఎస్... అంచనాలను మించి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ 1% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఇక రెండేళ్లలో ఆదాయం 12%, ఈపీఎస్ 10.5% చొప్పున పెరగగలవని భావిస్తున్నాం. అలాగే ఇబిటా మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20.1 శాతంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీల్లో దీనికే అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎల్ అండ్ టీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,740 ; టార్గెట్ ధర: రూ.1,970 ఎందుకంటే: లార్సెన్ అండ్ టుబ్రో.. భారత్‌లో ఇంజినీరింగ్ అండ్ కన్స్ఠ్రక్షన్(ఈ అండ్ సీ) రంగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల్లో ఒకటి. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దశలో అధికంగా ప్రయోజనం పొందగలిగే కంపెనీల్లో ఇది కూడా ఒకటి.2015–16లో 12 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ)ని 18 శాతానికి పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. షిప్‌యార్డ్, పవర్ బీటీజీ, ఫోర్జింగ్స్ వంటి తయారీరంగ వ్యాపారాల్లో దీర్ఘకాలంలో మంచి వృద్ధిని సాధించగలిగే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్లుగా ఉన్న ఆర్డర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. ఫలితంగా కన్సాలిడేటెడ్ ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.65గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.76గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. మౌలిక, హైడ్రోకార్బన్స్, రక్షణ రంగాల నుంచి జోరుగా ఆర్డర్లను ఈ కంపెనీ సాధించగలదని భావిస్తున్నాం. ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈ అండ్ సీ) రంగంలో ప్రాజెక్ట్‌ల అమలు గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో మందకొడిగా ఉంది. ఈ రంగంలో ప్రాజెక్టుల అమలు పుంజుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ఆదాయం 15 శాతం వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ఆస్తుల విక్రయం ద్వారా రిటర్న్ ఆన్ ఈక్విటీ మెరుగుపరచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏడాదికి రూ.1,000 కోట్ల వరకూ నష్టాలు వస్తున్న కట్టుపల్లి పోర్ట్‌తో పాటు కొన్ని రోడ్డు ప్రాజెక్ట్‌లను కూడా విక్రయించాలని యోచిస్తోంది. ఫలితంగా ఆర్ఓఈ 2 శాతం పెరుగుతుందని అంచనా. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను నిర్ణయించాం. -
ట్విట్టర్ భలే బీట్ చేసింది!
ట్విట్టర్ తెలియని వారెవరూ ఉండరు. సామాజిక మాధ్యమంలో దీనికెంతో పేరుంది. అయితే కొన్ని క్వార్టర్లుగా కంపెనీ యూజర్ల బేస్ తగ్గి, లాభాలు రాక, నష్టాల్లో మునిగితేలుతోంది. ఈ కంపెనీని అమ్ముదామనుకుని శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, ఆర్థిక నష్టాలను తలకెత్తుకోవడానికి ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా ఎన్నో క్వార్టర్లలో నిరాశపరిచే ఫలితాలను ప్రకటించిన ట్విట్టర్ మొదటిసారి అంచనాలను అధిగమించింది. ఆదాయాలు, రాబడులలో అంచనావేసిన దానికంటే మెరుగ్గా బుధవారం తన ఫలితాలను ప్రకటించింది. ఈ కంపెనీ యాక్టివ్ యూజర్ల బేస్ నెలకు 328 మిలియన్లకు చేరినట్టు ట్విట్టర్ తెలిపింది. ఇది అంచనావేసిన దానికంటే ఏడు మిలియన్లు ఎక్కువని తెలిసింది. అదేవిధంగా గత క్వార్టర్ కంటే కూడా 9 మిలియన్లు ఎక్కువట. అదేవిధంగా కంపెనీ రెవెన్యూలు 548 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. ఒక్క షేరుపై ఆర్జించే ఆదాయం కూడా 11 శాతం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ రెండూ వాల్ స్ట్రీట్ అంచనావేసిన దానికంటే ఎక్కువని తెలిసింది. అయితే ఒక్కో షేరుపై ఈపీఎస్ 1 శాతం మాత్రమే ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు. అదేవిధంగా రెవెన్యూలు కూడా 511.9 మిలియన్ డాలర్లుగానే ఉంటాయని తెలిపారు. వీరి అంచనాలను ట్విట్టర్ బీట్ చేసింది. రోజువారీ వాడకం వరుసగా నాలుగో క్వార్టర్ లోనూ ఏడాది ఏడాదికి 14 శాతం పెంచుకున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే డైలీ యాక్టివ్ యూజర్ నెంబర్ ను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫలితాల ప్రకటనాంతరం ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 11 శాతం పైకి ఎగిశాయి. ట్వీట్లకు తేలికగా రిప్లై ఇవ్వడానికి, సంభాషణ కొనసాగించడానికి కంపెనీ పలు మార్పులను చేపట్టినట్టు డోర్సే చెప్పారు. సెర్చ్, బ్రౌజ్, లైవ్ కంటెంట్ అందించే సామర్థ్యాన్ని పెంచామన్నారు. -
మీరు ఇన్వెస్టర్‌గా రాణిస్తారా?
♦ షేర్లలో సక్సెస్‌కు వ్యాల్యూ ఇన్వెస్టింగ్ ప్రధానం ♦ వ్యాల్యూ ఇన్వెస్టర్లు చూసేవి చాలా అంశాలు ♦ డివిడెండ్ల నుంచి ఈపీఎస్దాకా చూశాకే నిర్ణయం ♦ ఎన్నాళ్లయినా ఉంచుకోదగ్గ షేర్లకే వీరి ఓటు ♦ వీరి సూత్రాల్ని అనుసరిస్తే దీర్ఘకాలంలో చక్కని లాభాలు నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి విషయ పరిజ్ఞానం కాస్త ఎక్కువే ఉండాలి. అప్పుడే ఎన్ని కల్లోలాలు వచ్చినా మంచి లాభాల్ని కళ్లచూడటం సాధ్యమవుతుంది. విలువైన స్టాక్స్‌ను ఎంచుకోవడంలోనే ఇన్వెస్టర్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. వ్యాల్యూ ఇన్వెస్టర్లు చేసేది ఇదే. వీరు విలువైన షేర్లను తమ పోర్ట్‌ఫోలియోలో ఉండేలా చూసుకుంటారు. ఏవి విలువైన షేర్లు, ఏవి కావన్న విషయం కూడా వీరికి బాగా తెలుసు. వేటిలో పెట్టుబడులు పెట్టాలి, వేటికి దూరంగా ఉండాలన్న విషయాల్లోనూ చాలా స్పష్టతతో ఉంటారు. వీరు అనుసరించే సూత్రాలను చూస్తే... నిజం! స్టాక్ మార్కెట్ ఒక పట్టాన అర్థం కాదు. కానీ చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్ గురించి తమకు బాగా తెలుసనే ఉద్దేశంతోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం... ఆ గొడవంతా తమకెందుకులే అనుకుని మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయిస్తుంటారు. నిజం చెప్పాలంటే... స్టాక్ మార్కెట్లో సక్సెస్‌కు కొలమానం... మనం సంపాదించే లాభాలే. అలాగని నెలలోనో, రెండు నెలల్లోనో తమ ఇన్వెస్ట్మెంట్లను రెట్టింపు చేసుకున్నవారు మాత్రమే సక్సెస్ అయినట్లు కాదు. పద్ధతిగా ఇన్వెస్ట్ చేస్తూ... దీర్ఘకాలంలో బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ రాబడి సంపాదించిన వారంతా విజయవంతమైనట్లే లెక్క. మరి దాన్ని సాధించటమెలా? మార్కెట్లలో సక్సెస్ కావటమెలా? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘వ్యాల్యూ ఇన్వెస్టింగ్’. అంటే విలువ కలిగిన షేర్లలో ఇన్వెస్ట్ చేయటమన్న మాట. అదెలాగో వివరించేదే ఈ కథనం... డివిడెండ్ చెల్లింపులు అవసరమైతే ఎన్నాళ్లయినా ఉంచుకోతగిన స్టాక్స్‌నే వీరు ఎంచుకుంటారు. ఇదో ప్రాథమిక సూత్రం. కంపెనీ షేరు ధర వాస్తవిక విలువ కంటే తక్కువకు ట్రేడ్ అవుతుంటే అది వీరి ఎంపికకు అర్హమైనది. కాకపోతే ఇలా విలువకు తగ్గట్టు రాణించని షేర్ల యాజమాన్యాలు వాటాదారులకు క్రమం తప్పకుండా ప్రతిఫలాలను అందించేవి అయి ఉండాలి. ఉదాహరణకు డివిడెండ్లు. అలా లేకుంటే తక్కువ విలువకు లభిస్తున్నా వాటిని ఎంపిక చేసుకోరు. అదే సమయంలో డివిడెండ్ చెల్లించనివి మంచి స్టాక్స్ అయినా... వాటిలో పెట్టుబడులకు కూడా వీరు దూరంగానే ఉంటారు. ఎందుకంటే వ్యాల్యూ ఇన్వెస్టర్లకు డివిడెండ్ అంటే ఎంతో మక్కువ. నిరంతరం డివిడెండ్ చెల్లింపులు చేసే స్టాక్స్‌కు వీరు అగ్ర ప్రాధాన్యమిస్తారు. షేరువారీ ఆర్జన (ఈపీఎస్) వ్యాల్యూ ఇన్వెస్టర్లు పాటించే మరో సూత్రం ఈపీఎస్. అంటే ఒక్కో షేరుకు వచ్చే ఆదాయమన్న మాట. కేవలం ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఈపీఎస్‌ను చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోరు. గత పదేళ్ల కాలంలో ఆ కం పెనీ ఈపీఎస్ ఎలా ఉన్నదనేది చూస్తా రు. ఈపీఎస్‌లో గనక క్రమానుగతంగా వృద్ధి ఉంటేనే అటువైపు చూస్తారు. గడిచిన 3, 5, 10 సంవత్సరాల్లో ఓ కంపెనీ ఈపీఎస్‌లో స్థిరమైన వృద్ధి లేకపోతే ఆ షేర్లను పక్కన పెట్టేస్తారు. ఈపీఎస్‌లో హెచ్చుతగ్గులున్నా వీరు ఇష్టపడరు. కొత్త వాటికి దూరం ఇటీవలే స్టాక్మార్కెట్లో లిస్టయిన షేర్లకు వీరు తక్కువ రేటింగ్ ఇస్తుంటారు. ఈ షేర్లు క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లిస్తున్నా, ఈపీఎస్‌లో వృద్ధి ఉన్నా సరే... వెంటనే వాటిలో ఇన్వెస్ట్ చేయకుండా కొంత సమయం తీసుకుంటారు. తమ సత్తా ఏంటో ఆయా కంపెనీలు నిరూపించుకునే వరకూ వాటిని తమ పోర్ట్ ఫోలియోలోకి చేర్చుకోరు. పోటీ ఇవ్వలేకుంటే పక్కకే వ్యాల్యూ ఇన్వెస్టర్లు చూసే మరో ప్రధానాంశం... అసాధారణమైన పోటీ సామర్థ్యం. అదే రంగంలోని ప్రత్యర్థి కంపెనీలను తట్టుకుని దీర్ఘకాలం పాటు తమ మార్కెట్ షేరును, లాభాలను కాపాడుకునే సామర్థ్యం గల వాటికే వీరు ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే ఈ సామర్థ్యాలే కంపెనీల ఈపీఎస్‌లో వృద్ధికి, నిరంతరాయ డివిడెండ్ చెల్లింపులకు కీలకంగా పనిచేస్తాయి. తీవ్రమైన పోటీని ఎదుర్కొనే కంపెనీలు తమ విక్రయాలపై వచ్చే లాభాల మార్జిన్లలో రాజీ పడాల్సి వస్తుంది. దాంతో ఆ ప్రభావం షేరు ధరపై ప్రతిఫలిస్తుంది. అందుకే ఆ రంగంలో తిరుగులేని కంపెనీలకు వీరు మొదట ఓటేస్తారు. ఉత్పత్తులకు ఆదరణ ఉంటేనే ఓ కంపెనీ కొత్తగా పళ్ల రసాలు లేదా శీతలపానీయాల వ్యాపారంలోకి అడుగుపెట్టిందనుకోండి. అటువంటి వాటిలో వీరు పెట్టుబడులు పెట్టరు. ఎందుకంటే అన్ని కంపెనీలూ కోకకోలా, పెప్సీ, పార్లేలు కాలేవు. కొత్త కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల ఆదరణ ఎలా ఉంటుంది? పోటీతో కూడిన మార్కెట్లో దీర్ఘకాలంలో అవి ఎలా రాణిస్తాయి? ఎలా నిలదొక్కుకుంటాయి? వంటి అంశాలను చూస్తారు. ఒకవేళ కొత్త కంపెనీ కోకకోలా మాదిరిగా అవతరిస్తే అప్పుడు వాటిని తమ పోర్ట్‌ఫోలియోలో భాగంగా చేసుకుం టారు. ఇందుకు ఉదాహరణ ప్రపంచ స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్‌గా పేర్కొనే వారెన్ బఫెట్... 2011లో ఐబీఎం షేరును తొలిసారి కొనుగోలు చేయడం. వాస్తవానికి ఈ కంపెనీ షేరు అంతకు ఎన్నో ఏళ్ల ముందు నుంచి అందుబాటులో ఉన్నదే. ప్రజాదరణ ఉన్నవాటికే తాము ఇన్వెస్ట్ చేసే కంపెనీల ఉత్పత్తులకు ప్రజాదరణ ఉండాలి. అటువంటివి తేలిగ్గా అమ్ముడుపోతాయి. ఈ తరహా ఉత్పాదనలున్న కంపెనీలు తన మార్కెట్ వాటాను కాపాడుకునేందుకు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఆయా ఉత్పత్తుల్లో నాణ్యత, ప్రత్యేకత, విభిన్నతే వాటిని రాణించేలా చేస్తాయి. ఉదాహరణకు యాపిల్ తరహా సంస్థలు. అధిక రుణాలుంటే ప్రతికూలమే! అధిక రుణాలతో వ్యాపారం చేసే కంపెనీలకు సైతం వ్యాల్యూ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారు. వీరు కంపెనీల బ్యాలెన్స్ షీట్లో చూసే అంశాల్లో తక్కువ రుణం– ఈక్విటీ నిష్పత్తి ఉందా లేదా అని. ఇలా ఉన్నవాటినే తమ లిస్ట్‌లో చేర్చుకుంటారు. ఎందుకంటే అధిక రుణాలతో వ్యాపారం చేసే కంపెనీలు ఏ కొద్దిగా తేడా వచ్చినా పూర్తిగా మునిగిపోతాయి. వ్యాపారం తగ్గినా, పోటీ తట్టుకోలేకపోయినా, రుణ భారం భరించలేని స్థాయికి చేరిపోయినా, ఆర్థిక సంక్షోభ తరహా పరిస్థితులు ఏర్పడినా వీటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. గత ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత మన దేశంలో మౌలిక రంగ కంపెనీల పరిస్థితి ఏమైందో గుర్తు చేసుకోండి. తక్కువ లాభాలున్న వాటికి దూరం ఇతర అంశాలన్నీ సానుకూలంగా ఉన్నా సరే..! కంపెనీల అమ్మకాల్లో లాభాల శాతం తక్కువగా ఉంటే ఆయా కంపెనీల షేర్లను వ్యాల్యూ ఇన్వెస్టర్లు ఎంచుకోరు. రిటైల్, టెలికం కంపెనీలు, ఎయిర్‌లైన్ కంపెనీల్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. వీటి వ్యాపారం భారీ స్థాయిలోను, లాభాలు తక్కువగానూ ఉంటాయి. టైమింగ్ చూశాకే... చివరిగా... వ్యాల్యూ ఇన్వెస్టర్లు సంప్రదాయవాదులే, రక్షణాత్మక ధోరణితోనే ఉంటారు. కానీ, బద్ధకస్తులు మాత్రం కాదు. పెట్టుబడులు పెట్టినా, ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నా సరైన సమయంలోనే చేస్తారు. -
పడితే కొనండి.. పెరిగినా అమ్మకండి
ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్ట స్థాయిల్లో కదులుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ స్టాక్ మార్కెట్ అందివ్వని విధంగా 22 శాతం లాభాలను మన సూచీలు అందించాయి. మార్కెట్ కొత్త శిఖరస్థాయిలకు చేరడంతో ఇక ఇక్కడ ఆగుతుందా లేక ఇంకా పెరిగే అవకాశం ఉందా అనేది చాలామంది ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే మన మార్కెట్లు అంత చౌకగా ఏమీ లేవు. 2014-15 రాబడులతో పోలిస్తే సెన్సెక్స్ 17 పీఈ వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది సెన్సెక్స్ సగటు గరిష్ట ఈపీఎస్ విలువ కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ వాస్తవ విలువకు దగ్గరగానే ఉంది. సెన్సెక్స్ ఈపీఎస్ విలువ ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇది వాస్తవ రూపంలోకి వస్తే 2015-16 కంపెనీల ఆదాయాలు భారీగా పెరుగుతాయి. సహజంగానే ఈ అంశాన్ని స్టాక్ మార్కెట్లు ముందుగా డిస్కౌంట్ చేసుకుంటూ పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అంతా సానుకూలమేట అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడి చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునే విధంగా చేస్తాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 101 డాలర్ల వద్ద కదులుతోంది. ఇది 100 డాలర్ల కిందకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే సబ్సిడీ భారం తగ్గి ద్రవ్యలోటు 4.7 శాతానికి కంటే దిగువకు చేరుతుంది. అంతేకాదు రుతుపవనాలు ఆలస్యంగానైనా కరుణించడంతో ముప్పుతప్పినట్లే. ఈ అంశాలన్నీ ఈ ఏడాది వృద్ధిరేటు 5.5 శాతానికి, వచ్చే ఏడాది 6.5 శాతానికి చేరుస్తాయి. 2015-16 ఆర్థిక ఏడాదికి వృద్ధిరేటు 6.5 శాతంగా అంచనా వేస్తే కంపెనీల ఆదాయాల్లో కనీసం 20 శాతం వృద్ధి అంచనా వేయొచ్చు. ఈ లెక్కన చూస్తే సెన్సెక్స్ ఈపీఎస్ 1,850గా ఉంటుంది. సెన్సెక్స్ చారిత్రక సగటు పీఈ నిష్పత్తి 16 లెక్కన అంచనా వేస్తే సెన్సెక్స్ 29,600 స్థాయికి ఎగబాకుతుంది. ఈ అంశాలన్నీ మార్కెట్లు 2015 ప్రారంభం నుంచే డిస్కౌంట్ చేసుకొని పెరగడం ప్రారంభిస్తాయని అంచనా వేస్తున్నాం. పడితే కొనండి సూచీలు గరిష్ట స్థాయిలో ఉండటంతో కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఈ కరెక్షన్కు దోహదం చేస్తున్నాయి. ఇలాంటి పతనం సమయంలో ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న షేర్లను ఎంపిక చేసుకొని కొనుగోలు చేస్తుం డండి. సహజంగా సెక్యులర్ బుల్ మార్కెట్ మధ్య మధ్యలో కొనుగోళ్లకు అవకాశం ఇస్తుంటుంది. మొదట్లో కొనలేక పోయిన వారు ఈ పతనాలను అందిపుచ్చుకోవాలి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్కరణల పేరుతో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు బాగా లాభాలు అందించాయి. అలా అని చెప్పి అన్ని షేర్లను కాకుండా ఆచితూచి ఎంపిక చేసుకోండి. ముఖ్యంగా లార్జ్‌క్యాప్‌కు చెందిన ఐటీ, ఫార్మా, సైక్లికల్స్ రంగాలకు చెందిన షేర్లను ప్రతీ పతనంలో కొనుగోలు చేస్తూ ఉండండి. దీర్ఘకాలం కొనసాగే సెక్యులర్ బుల్ మార్కెట్లో ‘పడితే కొనండి.. పెరిగినా అమ్మకండి’ అనే వ్యూహాన్ని అమలు చేయాలి.