family
-
Astrological remedies రుణ బాధలా? పరిహారాలివిగో!
తాహతుకుమించి అప్పులు చేస్తే ఎవరికైనా అనర్థమే. కుటుంబ ఆర్థిక పరిస్థితిని, అవసరాలను అర్థం చేసుకొని అప్పులు తీసుకోవడం ఉత్తమం. గత్యంతరం లేక అప్పు చేసిన వెంటనే దాన్ని తిరిగి చెల్లించడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. లేదంటే కష్టాలు తప్పవు. అవమానాలు, తప్పవు. అందుకూ ఆచితూచి వ్యవహరించాలి.రుణ భారం నుంచి బయటపడాలంటే కొన్ని( Astrological remedies ) టిప్స్అప్పులు లేనివారు అధికసంపన్నులు అంటారు. అయితే అప్పులు కొందరికి తప్పదు. అలా తరచు అప్పుల పాలవుతూ ఉంటే... ప్రతినెలా పున్నమి, అమావాస్య రోజుల్లో శ్మశాన వాటికలకు చేరువలో ఉండే శివాలయాన్ని దర్శించుకుని అక్కడి శివలింగానికి పంచామృతాభిషేకం చేయించాలి. దశముఖ రుద్రాక్షను ధరించాలి.అష్టగంధాల మిశ్రమంతో 108 రావి ఆకులపై ‘శ్రీరామ’ అని రాసి, వాటిని మాలగా తయారు చేసి ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ ఆలయంలో స్వామికి అలంకరణగా సమర్పించాలి. రాహు కేతువుల శాంతికి హోమం చేయించుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. హోమం పూర్తయిన తర్వాత హోమకుండం నుంచి సేకరించిన విభూదిని తెల్లని వస్త్రంలో మూటగా కట్టి, ఆ మూటను ఇంట్లో లేదా వ్యా΄ార ప్రదేశంలో డబ్బు భద్రపరచే చోట ఉంచాలి.వ్యాపారంలో తరచు సమస్యల కారణంగా రుణబాధ ఎదురవుతున్నట్లయితే, వ్యాపారం కోసం కొనే వస్తువులతో పాటు పిల్లల ఆట వస్తువులను కొన్ని కొని వాటిని చిన్నారులకు కానుకగా ఇవ్వండి.ఆకలితో ఉన్న వృద్ధులు, అంధులు, వికలాంగులు తారసపడినట్లయితే వారికి తృప్తిగా భోజనం పెట్టండి. – సాంఖ్యాయన నోట్: ఇవి కేవలం ఆస్ట్రాలజీపరంగా, అవగాహన కోసం అందించిన టిప్స్ మాత్రమే నని గమనించగలరు. -
Hyderabad: పిల్లల్ని చంపి దంపతుల బలవన్మరణం
-
హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు...
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచి్చనట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్‌నగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్‌రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు.గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కని్పంచారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కనిపించారు.దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్‌లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది. -
ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు (ఫోటోలు)
-
ఈ సమాజం ఎటు పోతోంది? రక్త బంధానికి నెత్తుటి మరకలు
-
గోవాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న యాంకర్ లాస్య మంజునాథ్ (ఫోటోలు)
-
మహాకుంభ్‌లో పుణ్య స్నానం ఆచరించిన టీమిండియా మాజీ బౌలర్ అశోక్ దిండా
-
ఫ్యామిలీతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో మన్మధుడు హీరోయిన్ అన్షు (ఫోటోలు)
-
అప్పుల బాధతో కుటుంబం అదృశ్యం?
శంషాబాద్ : అప్పుల బాధ భరించలేక కుటుంబంతో సహా ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలి్పన మేరకు..మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన డి.సుదర్శన్ వివాహనం అనంతరం అత్తగారిల్లు ఉన్న కర్మన్‌ఘాట్‌లో ఏడేళ్లు, ఆ తర్వాత శంషాబాద్ పట్టణంలో ఏడాది కాలం నివసించాడు. రెండు చోట్లా అప్పులు కావడంతో గత మూడేళ్లుగా నర్కూడ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల చీటీ డబ్బుల వసూలు కోసం ప్రభాకర్ అనే వ్యక్తి సుదర్శన్ ఇంటికి వెళ్లగా వారు ఇంట్లో కన్పించకపోవడంతో వారి తల్లికి విషయం తెలిపాడు. ఈ విషయమైన సుదర్శన్ సోదరుడు భానుప్రకాష్ అద్దె ఇంట్లో ఆరా తీయగా సుదర్శన్‌తో పాటు ఆయన భార్య తేజస్వి, ఇద్దరు కుమారులు ఇక్కడ ఉండడం లేదని వెల్లడైంది. ఈ నెల 18 నుంచి వారు ఇంట్లో లేరని తెలియడంతో భానుప్రకాష్ వారి కోసం అన్ని చోట్లా ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. అప్పుల ఒత్తిడి కారణంగానే ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భానుప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదివారం ఆమెకు రెస్ట్ ఇద్దామా..!
ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. ‘ప్రతీ క్షణం నీకోసం నువ్వు.. వారానికి ఒక్కరోజు నీ ఇల్లాలికి ఇవ్వు’ అన్నట్లు ఆదివారం ‘ఇల్లాలి’కి ఇంటి పనుల్లో సాయమందించాల్సిన అవసరం ఉంది. గంపెడు బాధ్యతలతో ఇంటి బండిని నడిపే ఆమెకు వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలంటున్నారు.. ఆదివారం ఇంటి, వంట పనుల్లో పాలు పంచుకుంటే అనుబంధం మరింత పెరిగే అవకాశమూ ఉంది. నవ్వులు విరియాలంటే..ఆమె ఆరోగ్యవంతురాలైతే.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమే. కుటుంబం సక్రమంగా నడవడానికి ఆమే ప్రధాన కారణం. అలాంటి ఇల్లాలికి వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలి. వారాంతంలో భార్య చేసే ఇంటి పనుల్లో ఓ చెయ్యి వేస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమెకూ విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్కలిగే ప్రయోజనాలుఇల్లాలిపై ప్రేమను చూపడంలో అతను ఇంటిపనుల్లో చేసే సహాయం కీలకం. ప్రతి పనిని భారంగా తీసుకోకుండా చేస్తున్నప్పుడు భర్త తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, పట్టించుకున్నాడో భార్య అర్థం చేసుకుంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు దోహద పడుతుంది. భర్త తన కష్టాలను మోస్తున్నాడని, తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని నమ్మకం ఏర్పడుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు, సంఘటనలతో ఇవి తలెత్తుతుంటాయి. వంట చేయడం, దుస్తులు ఉతికి ఆరబెట్టడం వంటి కొన్ని పనులు కలిసి చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయే అవకాశం ఉంది.ఇంటిపని మహిళలకే పరిమితమనే భావన నెలకొంది. కానీ, భార్యాభర్తలు ఇంటిపనులు పంచుకోవడం వల్ల దాంపత్యంలో సామరస్యం పెరుగుతుంది.పనులను షేర్ చేసుకున్నప్పుడు త్వరగా పూర్తవుతాయి. మిగిలిన సమయంలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు. అప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ప్రారంభిస్తారు.ఏమి చేయొచ్చంటే..ఇంట్లోని దుమ్ము దులపడం, వాక్యూమింగ్ చేయడం, నేలలను తుడవడం, బాత్రూం శుభ్రపరచడం, వంటగది శుభ్రపరచడం (పాత్రలు, కౌంటర్‌టాప్‌లు), కూరగాయలు కోయడం, భోజనం తయారీ, దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఆరాక మడతబెట్టడం, అవసరమైనప్పుడు ఇస్త్రీ చేయడం.పిల్లల సంరక్షణలో ఇలా..ఆ రోజు పిల్లలకు కూడా సెలవుదినం కావడం వల్ల స్నానం చేయించి దుస్తులు ధరింపజేయాలి.హోంవర్క్‌లో సహాయం చేయడం, ఆ రోజు పాఠశాలలో ఏదైనా కార్యక్రమం ఉన్నా హాజరు కావడం. ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడం, పచ్చిక కోయడం, తోటపని చేయడం.ఆదివారం ప్రత్యేకమైన వంటలు చేస్తారు...నా భర్త ఉద్యోగరీత్యా ఉదయమే వెళ్తారు. ఆదివారం సెలవు కావడంతో నాకు సహాయంగా ఉంటారు. కూరగాయలు తరగడం, బట్టలు ఉతికితే ఆరేయడం, వంటగదిని శుభ్రం చేయడం వంటి పనులు చేస్తారు. మా బాబుకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేసి స్వయంగా వడ్డిస్తారు. – సీత స్వప్న, పోచమ్మకుంట, హనుమకొండభాగస్వామికి విశ్రాంతినివ్వాలి..నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే భార్యకు వారాంతపు సెలవు దినంలో విశ్రాంతినివ్వాలి. ఇలా చేయడం వల్ల జీవితభాగస్వామి మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. వారాంతపు సెలవు దినంలో ఇంటిపని, గార్డెనింగ్, ఇంటి శుభ్రతలో నిమగ్నమవుతుంటాను. నేనే స్వయంగా పిల్లలకు ఇష్టమైన, ఆరోగ్యకరమైన వంటలు చేసి వడ్డిస్తాను. పిల్లలకు అవసరమైన వస్తువులు కొనిస్తాను. సంతోషంగా గడుపుతాను. – డాక్టర్ బీఆర్ శరవణభవ, ప్రొఫెసర్, హెడ్ ఫార్మ్ డీ, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హనుమకొండఇంటి పనుల్లో సాయంగా ఉంటాను..నా జీవితభాగస్వామితో కలిసి ఉదయమే దేవతారాధన చేస్తాను. అనంతరం మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, నిత్యవసర సరుకులు అందిస్తాను. నా భార్యకు ప్రతీ పనిలోనూ సాయంగా ఉంటాను. వారాంతంలో రుచికరమైన భోజనం సిద్ధం చేసుకొని హైదరాబాద్‌లో ఉన్న మా పిల్లల వద్దకు వెళ్తాం.– మునుగోటి రమేశ్, వరంగల్(చదవండి: ‘ఫాఫో పేరెంటింగ్’ అంటే..? నెట్టింట వైరల్) -
అక్కినేని ఇంట పెళ్లి సందడి.. వచ్చే నెలలో అఖిల్ వివాహం! (ఫోటోలు)
-
పాలవలస కుటుంబానికి జగన్ పరామర్శ (ఫోటోలు)
-
నిజామాబాద్: కుటుంబాన్ని బలిగొన్న కరెంట్
నిజామాబాద్, సాక్షి: బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాటాపూర్‌కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో.. భార్య, కొడుకుతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ టైంలో బోర్ మోటార్ కరెంట్ వైర్లు బయటకు వచ్చి.. ఆ కుటుంబ సభ్యులకు తగిలింది. దీంతో ఆ ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. -
ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!
ట్రక్‌లోనే పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. తినడం పడుకోవడం అన్ని అందులోనే. ఇలా ఎందుకు చేస్తున్నాడో వింటే విస్తుపోతారు. బడుగు జీవులు వెతలు ఇలానే ఉంటాయోమో కథ అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే..నాగ్‌పూర్ బుల్ధానా జిల్లాలోని సింద్ఖేడ్ రాజా తాలూకాలోని జానునా గ్రామానికి చెందిన ఏక్నాథ్ తుకారాం పవార్, అతని భార్య లలితా పవార్ గత పదేళ్లుగా తమ కుటుంబంతో కలిసి ట్రక్కులో ప్రయాణించడం, నివశించడం వంటివి చేస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. అయితే ఒక కుమార్తె మాత్రం గామ్రంలో బంధువుల వద్ద ఉంటున్నట్లు తెలిపాడు పవార్. విశేషం ఏంటంటే అతని భార్య కూడా ట్రక్కు నడపడంలో సహాయపడుతుంది. ఆ దంపతులు పూణే-నాగ్‌పూర్ మధ్య వస్తువులను రవాణా చేస్తుంది. కానీ ఆ ఆదాయంలో సగం డబ్బులు RTO, ట్రాఫిక్ పోలీసులకు ముట్టచెప్పాల్సిందే. అందువల్లే పవార్ కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్లు వాపోయాడు పవార్. తన కుటుంబానికి రోజుకు రెండు పూటలా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడించాడు పవార్. ఇక తాను ఈ ట్రక్‌ని 2023లో మహీంద్రా నుంచి రుణంపై కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇక ఆ రుణం నిమిత్తం ప్రతి నెల రూ. 68,500 దాక చెల్లించాల్సి ఉందని, అవన్నీ పోగా మిగిలేది ఏం ఉండదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నేపథ్యంలోనే తాను ఇలా ట్రక్‌లోనే నివాసం ఏర్పరుచుకున్నట్లు బాధగా చెప్పుకొచ్చాడు. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు ఆదా అవుతుందని చెప్పుకొచ్చాడు పవార్. (చదవండి: ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..) -
బంధువుల పెళ్లిలో ప్రభాస్ సిస్టర్స్.. రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడంటోన్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
‘కొడుకా శ్రీనివాసు.. కొరివి పెట్టేందుకైనా రాబిడ్డా..’
ఖానాపూర్(నిర్మల్): ‘కొడుకా శ్రీనివాసు.. 14 ఏండ్ల వయసులో బడికి పోతానని వెళ్లి 50 ఏండ్లు గడిసినయ్. నీకు తల్లి గుర్తుకు రావడం లేదా.. చావుకు దగ్గరైన. కొరివి పెట్టేందుకై నా రాబిడ్డా’ అని అజ్ఞాతంలో ఉన్న మవోయిస్తు తూము శ్రీనివాస్ తల్లి లచ్చవ్వ ప్రాధేయపడింది. మండలంలోని బావాపూర్(ఆర్) గ్రామంలోని లచ్చవ్వ కుమారుడు 50 ఏళ్ల క్రితం 14 ఏళ్ల వయస్సులో బోధన్‌లోని ప్రైవేట్ స్కూల్‌కు వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాకుండా మావోయిస్టుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు అతని తల్లిని ఎస్పీ జానకీ షర్మిల శుక్రవారం కలిసింది. వనం వీడి జనంలోకి రావాలని ఎస్పీ సాక్షిగా లచ్చవ్వ కుమరుడిని ప్రాధేయపడింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోరు కన్నా.. ఊరు మిన్నా.. మన ఊరికి తరలి రండి.. కార్యక్రమంలో భాగంగా జన జీవనంలోకి వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తల్లి లచ్చవ్వకు దుస్తులతోపాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐ సైదారావు, పెంబి ఎస్సై హనుమాండ్లు పాల్గొన్నారు. -
ఆకాశ ఎయిర్‌లో ప్రేమ్‌జీ ఫ్యామిలీ ఆఫీసు పెట్టుబడులు
టెక్ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ (Azim Premji), మణిపాల్ గ్రూప్ చీఫ్ రంజన్ పాయ్లకు చెందిన ఫ్యామిలీ ఆఫీసులు తాజాగా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లో ఇన్వెస్ట్ చేశాయి. ఇందుకు సంబంధించి క్లేపాండ్ క్యాపిటల్ (రంజన్ పాయ్), ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థ 360 వన్ అసెట్ తదితర ఇన్వెస్టర్ల కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది.ప్రమోటరు ఝున్‌ఝున్‌వాలా కుటుంబం కూడా మరింతగా మూలధనం సమకూర్చనున్నట్లు వివరించింది. ఎయిర్‌లైన్‌లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి ఇప్పటికే దాదాపు 40 శాతం వాటా ఉంది. కాగా పెట్టుబడి మొత్తం గురించి కానీ, ఎంత వాటాను విక్రయిస్తున్నది కానీ ఎయిర్‌లైన్ వెల్లడించలేదు. అయితే దాదాపు 125 మిలియన్ డాలర్లు సేకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.2023-24లో ఆకాశ ఎయిర్ నికర నష్టం రెండింతలు పెరిగింది. గత ఏడాది రూ.744 కోట్ల నుండి రూ.1,670 కోట్లకు చేరుకుంది. మరోవైపు దాని మొత్తం ఆదాయం 2022-23లో రూ.778 కోట్లతో పోలిస్తే 2023-24లో రూ.3,144 కోట్లకు చేరుకుంది. ఈ ఎయిర్‌లైన్‌లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబంతో పాటు ముగ్గురు దూబే సోదరులు వినయ్ దూబే, సంజయ్ దూబే, నీరజ్ దూబే దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నారు.గత ఏడాది జనవరిలో, ఆకాశ ఎయిర్ అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్‌తో 150 B737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇది గతంలో ఆర్డర్ చేసిన 76 మ్యాక్స్ విమానాలకు అదనం. 76 విమానాలలో 27 ఇప్పటికే ఎయిర్‌లైన్‌కు డెలివరీ అయ్యాయి. -
సెంచరీ హీరో అభిషేక్ శర్మ ఫ్యామిలీని చూశారా? (ఫోటోలు)
-
ఇండియన్ కి గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత టైం పడుతుంది..!
-
చుట్టూ పక్కల చూడరా..!
కర్నూలు(హాస్పిటల్): మానవ సంబంధాల పేరుతో మనిషన్నవాడు మాయమవుతున్నాడు. అందరూ బాగుంటేనే సమాజం అన్న ధోరణి నుంచి నా కుటుంబం బాగుంటే చాలనే ధోరణితో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో చివరికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలను సైతం దూరం చేసుకుంటున్నాడు. కేవలం భార్యాబిడ్డలు బాగుంటే చాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు పక్కింట్లో పెళ్లంటే ఆ వీధిలో ఉన్న వారందరూ తలోచేయి వేసి ఇంట్లో మనుషుల మాదిరిగా పనులు చేసేవారు. ఇప్పుడు అయిన వారు కూడా చుట్టపుచూపుగా వస్తున్నారు.అయిన వారు అందరూ ఉన్నా పనులన్నీ ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటున్నారు. పట్టణీకరణ పేరుతో మనుషులు దూరం అవుతున్నారు. కానీ ఇప్పటికీ పల్లెలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఒకప్పటి అనుబంధాలు, ఆత్మీయతలు కొనసాగుతుండటం గమనార్హం. ఉన్నత చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు మనుషులను దూరం చేయడానికా లేదా దగ్గర చేయడానికా అని ఆనాటి పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఎవ్వరికైనా ఏదైనా కష్టం వస్తే బంధువుల కంటే ముందు ఇరుగుపొరుగు వారే ముందుగా వచ్చి ఆదుకునేవారు. ఇంట్లో ఎవ్వరైనా చనిపోతే పక్కింటి వారే ఆ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్లలో, అద్దె ఇళ్లల్లో సైతం మృతదేహాన్ని ఉండనీయని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, చిన్న కుటుంబాలు ఏర్పడటం, చిన్నతనంలో పిల్లలను హాస్టల్లో, వృద్ధాప్యంలో పెద్దలను ఆశ్రమాల్లో ఉంచడంతో కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి. ఉన్నత చదువుల పేరుతో ఆధునికత సంతరించుకోవడంతో ఎవ్వరికి వారే అన్న రీతిలో సమాజంలో జీవిస్తున్నారు. నిలవని ప్రేమ వివాహాలు..తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో అధికమైంది. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటూ వేరుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లకే విడిపోయి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వారానికి రెండు, మూడు కేసులైనా అమ్మాయి మిస్సింగ్ అని నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల అధికంగా చూస్తున్న పోలీసులు చాలా మంది అమ్మాయిని వెతకడం అటుంచి రెండురోజులకు వారే వస్తారులే అన్న ధోరణితో మాట్లాడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను సర్దిచెప్పేవారు లేక రెండు, మూడేళ్లకే విడిపోతున్నారు. పోలీస్స్టేషన్లు, వన్‌స్టాప్ సెంటర్లు, ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఇలాంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించే ఉదంతాలు ఇటీవల అధికమయ్యాయి. కష్టమొస్తే భరోసానిచ్చే చేతుల్లేవు.. నాగరికత వెంట పరుగులు పెడుతున్న మనుషుల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో ఎవ్వరికి వారు వేరుగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అపార్ట్మెంట్లో 40కి పైగా కుటుంబాలున్నా.. కష్టమొస్తే పలకరించేవారు ఎవ్వరూ రాని పరిస్థితి నెలకొంది. కానీ పండుగలు, చిన్నచిన్న శుభకార్యాలు మాత్రం చేసుకుని ఎంజాయ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవ్వరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే అయిన వారే పలకరించే దిక్కులేదు. బంధువులు, స్నేహితులు సైతం సోషల్ మీడియాలో మాత్రమే పరామర్శలు చేస్తున్నారు. ఇంటికి వచ్చి ధైర్యం చెప్పేవారు కరువైపోయారు. పలకరించి ఎన్నాళ్లైందో.. ఒకప్పుడు ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండిపోయేవారు. సమయానికి భోజనం చేయాలన్న విషయం కూడా మరిచిపోయేవారు. కుటుంబంతో పాటు ఊళ్లో, సమాజంలో ముచ్చట్లు, రాజకీయాలు, సినిమాలు అన్నీ ఈ మాటల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు ఇంటికి ఎవ్వరైనా వస్తే ముఖస్తుతిగా పలకరించి రెండు నిమిషాలు మాట్లాడి వదిలేస్తున్నారు. ఎవ్వరి మొబైల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఎదురుగా ఉన్న వారిని పలకరించే సమయం లేకపోయినా ఎక్కడా కనిపించని వారిని సోషల్ మీడియాలో పలకరించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సమాజంలో ప్రస్తుతం మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో ఈసంఘటనలే నిదర్శనం.కర్నూలు (Kurnool) నగరానికే చెందిన రాజ్‌కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. మూడేళ్ల క్రితం అతని తల్లి అనారోగ్యంతో మరణించింది. విషయం తెలిసిన ఇంటి యజమాని మృతదేహాన్ని ‘మా ఇంట్లో ఉంచొద్దని, మీ బంధువుల ఇళ్లకు తీసుకెళ్లు’ అని గొడవ చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో తప్పనిసరై నగరంలోని తన సోదరుని ఇంటికి అప్పటికప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. నంద్యాల (Nandyala) పట్టణంలో ఇటీవల ఓ వ్యక్తి తన కుమారుడి వివాహం చేశారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎక్కువ మంది వస్తారని పెద్ద ఫంక్షన్ హాల్, పెళ్లి భోజనంలో రకరకాల స్వీట్లు, వంటకాలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి ముందు రోజు కూడా పెద్దగా బంధువులు, మిత్రులు రాలేదు. తలంబ్రాల సమయానికి హడావుడిగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి తెచ్చిన గిఫ్ట్‌లను చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆహార పదార్థాలు భారీగా మిగిలిపోవడంతో అనాథశ్రమానికి పంపించేశారు. ఎమ్మిగనూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పిల్లల చదువుల కోసం కర్నూలులో ఉంటున్నారు. ఆ వీధిలో అతను దాదాపు పదేళ్లుగా ఉంటున్నాడు. అయితే చుట్టు పక్కల వారితో ఇంత వరకు ఆయన మాట్లాడలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉదయాన్నే విధులకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం, కుటుంబీకులతో గడుపుతారు. పక్క ఇళ్లల్లో శుభకార్యం జరిగినా వెళ్లింది లేదు.. ఆపద వచ్చినా పలకరించింది లేదు. -
ఫ్యామిలీ వేకేషన్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ యాంకర్ రవి (ఫోటోలు)
-
ఫోటోలు షేర్ చేసిన అంబానీ ఫ్యామిలీ - స్పెషల్ అట్రాక్షన్‌గా రాధికా మర్చెంట్ (ఫోటోలు)
-
డొనాల్డ్ ట్రంప్ కుటుంబ వృక్షం: తల్లిదండ్రులు వలసదారులు..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేసి వైట్‌హౌస్‌కి మరోసారి కుంటుంబంతో తిరిగి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆయన కుటుంబసభ్యులు, వంశవృక్షం గురించి హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ట్రంప్ తల్లిదండ్రులు, అతని సోదర సోదరిమణలు ఎవరనేది వెలుగులోకి వచ్చింది. మరీ ట్రంప్ కుటుంబ వృక్షం ఏంటో ఓ లుక్కేద్దామా..!.డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తల్లిదండ్రులు వలసదారులు. తండ్రి ఫ్రెడ్ ట్రంప్(Fred Trump) కాగా, తల్లి మేరీ ట్రంప్(Mary Trump). ట్రంప్ తండ్రి జర్మన్ వలసదారుల కుమారడు. బ్రోంక్స్లో జన్మించిన ఆయన నిర్మాణ రంగానికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఇక తల్లి మేరి మాక్లియోడ్ ట్రంప్ లూయిస్ ద్వీపంలో జన్మించిన స్కాటిష్ వలసదారు. ఆమె కేవలం 50 డాలర్లు(రూ.40 వేలు)తో యూఎస్ వచ్చింది. బతకు భారం కావడంతో పనిమనిషిగా జీవనం సాగించేది. ఆ తర్వాత ఫ్రెడ్ ట్రంప్‌ని కలిసింది. ఇరువురు తొలిచూపులోనే ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు. వారు మేరియన్నే, ఫ్రెడ్ జూనియర్, ఎలిజబెత్, డోనాల్డ్ , రాబర్ట్. అయితే ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ పన్ను ఎగవేసి, ఫెయిర్ హౌసింగ్ చట్టం ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. అలాగే 1927లో, కు క్లక్స్ క్లాన్ మార్చ్‌లో పాల్గొన్నందుకు కూడా అరెస్టు అయ్యాడు.ట్రంప్ సోదర, సోదరీమణులు..పెద్ద అక్క మేరియన్నే ట్రంప్ బారీ..ఈమె దశాబ్దాలుగా యూఎస్ ఫెడరల్ న్యాయమూర్తిగా సేవలందించింది. ఆమెకు ఒక కుమారుడు విడ్ విలియం డెస్మండ్ ఉన్నాడు.ట్రంప్ అన్న ఫ్రెడ్ జూనియర్..ఈయనే పెద్దకొడుకు. ట్రంప్ తండ్రి కుటుంబ వ్యాపారాన్ని చూసుకునేవాడు. కొన్నాళ్లు పైలెట్‌గా కూడా పనిచేశారు. అయితే మద్యపాన వ్యసనానికి గురై కెరీర్ దెబ్బతింది. జస్ట్ 42 ఏళ్లకే మరణించాడు. ఈయనకు జూనియర్‌కు మేరీ ట్రంప్, ఫ్రెడ్ ట్రంప్ III అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.చిన్న అక్క ఎలిజబెత్ ట్రంప్ గ్రౌ1942లో జన్మించిన ఎలిజబెత్ కొన్నాళ్లు అమెరికా ఆర్థక సేవల బహుళ సంస్థ జేపీ మోర్గాన్‌లో చేశారు. డాక్యుమెంటరీ నిర్మాత జేమ్స్ గ్రౌను వివాహం చేసుకున్నార. పామ్ బీచ్‌లో నివశిస్తోంది. అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు.చిన్న తమ్ముడు రాబర్ట్ ట్రంప్డోనాల్డ్ విశ్వసనీయ మిత్రుడుగా వ్యవహరిస్తాడు. అదీగాక ట్రంప్ ఆర్గనైజేషన్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా. రెండు వివాహాల చేసుకున్నారు. ఒక కూమారుడుని దత్తత కూడా తీసుకున్నారు. ఆయన 2020లో మరణించారు.డోనాల్డ్ ట్రంప్ భార్యలు, పిల్లలఇవానా ట్రంప్ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (1949-2022), ఒక చెక్-అమెరికన్ వ్యాపారవేత్త. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె 2022లో మరణించింది.డొనాల్డ్ ట్రంప్ జూనియర్ (1977): ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్.ఇవాంకా ట్రంప్(Ivanka Trump (1981)): ఆమె గతంలో ట్రంప్‌కి మాజీ సీనియర్ సలహాదారు. జారెడ్ కుష్నర్ను వివాహం చేసుకున్నారు. ఆయన కూడా ట్రంప్ అధ్యక్ష పదవిలో కీలక సలహాదారు. వారికి ముగ్గురు పిల్లలు: అరబెల్లా, జోసెఫ్,థియోడర్.ఎరిక్ ట్రంప్ (1984): ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. లారా ట్రంప్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.రెండో భార్య మార్లా మాపుల్స్డోనాల్డ్ రెండవ భార్య మార్లా మాపుల్స్ (1963). ఆమె ఒక టెలివిజన్ నటి. వారికి ఒక కుమార్తె. టిఫనీ ట్రంప్టిఫనీ ట్రంప్ (1993): ఆమె జార్జ్‌టౌన్ లా గ్రాడ్యుయేట్.మూడో భార్య మెలానియా ట్రంప్ట్రంప్ ప్రస్తుత భార్య, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (1970). స్లోవేనియన్-అమెరికన్ మాజీ మోడల్. ఆమెకు ఒక కుమారుడు బారన్ ట్రంప్బారన్ ట్రంప్ (2006): ట్రంప్ చిన్న కుమారుడు. తల్లిదండ్రలతో కలిసి ఉంటున్నాడ. ప్రస్తతం ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు.ట్రంప్ అన్న పిల్లలు..మేరీ ట్రంప్ (1965): ఫ్రెడ్ జూనియర్ కుమార్తె. ఆము మనస్తత్వవేత్త, రచయిత్రి. కటుంబంపై విమర్శలు చేస్తుంటుందని సమాచారంఫ్రెడ్ ట్రంప్ III (1962): ఫ్రెడ్ జూనియర్ కుమారుడు.రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్‌గా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు.ట్రంప్ మనవరాళ్ళు, మనవళ్లు..అరబెల్లా, జోసెఫ్, థియోడర్ కుష్నర్ (కూతురు ఇవాంకా, జారెడ్ దంపతుల పిల్లలు)కై, డోనాల్డ్ III, ట్రిస్టాన్, స్పెన్సర్, క్లో ట్రంప్ (కుమారుడు డొనాల్డ్ జూనియర్ పిల్లలు).ఎరిక్, లారా ట్రంప్ ఇద్దరు పిల్లలు.ఇది అమెరికా అధ్యక్షుడి వంశ వృక్షం. చాలా పెద్దగానే ఉంది కదూ..!(చదవండి: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం: స్టైలిష్ లుక్‌లో మెలానియా ట్రంప్) -
అప్పు తీర్చలేదని.. రాక్షస వివాహం!
యశవంతపుర: ఓ మహిళ అప్పు తీర్చలేదని ఆమె కూతురిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆమెను తన కొడుక్కి పెళ్లి చేశాడో వడ్డీ వ్యాపారి. బెళగావి నగరంలోని తళకవాడి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ రాక్షస వివాహ ఘటన జరిగింది. వివరాలు.. ఒక మహిళ రూ.50 వేలును అప్పుగా తీసుకొంది. ఆమె సరిగ్గా వడ్డీని చెల్లించలేదు. దీంతో బంగారు ముక్కెరను లాక్కున్నాడు. ఆమె కూతురిని అపహరించి తన కుమారునికి వివాహం చేశాడు. అతడు బాలికపై బలవంతంగా లైంగికక్రియకు పాల్పడ్డాడు. న్యాయం చేయాలంటూ బాలిక శుక్రవారం బెళగావి తళకవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ కమిషనర్ యడా మార్టిన్ ఆదేశాలతో భర్త, అతని తల్లిదండ్రులు సహా మరికొందరిపై కేసు నమోదుచేసి బాలికను రక్షించారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. బాలిక చదువుకునేలా సాయం చేస్తామని కమిషనర్ తెలిపారు. -
అల్లుడికి 250 రకాల వంటకాలతో విందు
-
సినీ స్టార్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
రద్దీలో వద్దనుకున్నా.. అంతలో దుర్ఘటన
మద్దిలపాలెం: రద్దీగా ఉండడంతో క్యూలోంచి బయట వెళ్లిపోదాం అనుకున్నంతలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో తన భార్య రజని ప్రాణాలు కోల్పోయిందని భర్త గుడ్ల లక్ష్మారెడ్డి భోరుమంటూ విలపించారు. అప్పటి వరకూ ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా వెళ్తున్న సమయంలో రద్దీ అధికమవ్వడంతోపాటు గేట్లు తెరిచారని, దీంతో జనం ఒక్కసారిగా క్యూలో కదలడం పలువురి ప్రాణాలు పోవడానికి కారణమయిందని మద్దిలపాలేనికి చెందిన మృతురాలు రజని భర్త లక్ష్మారెడ్డి వాపోయారు. రెండు గంటల తర్వాత జాడ తెలిసింది ‘తొక్కిసలాటలో తప్పిపోయిన రజని కోసం వెతుకుతున్నా. ఎక్కడా జాడలేదు. దీంతో ఏం చేయాలో తెలియలేదు. నా చేతిలో ఫోన్‌కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే వున్న ఆటో డ్రైవర్ ఫోన్ ద్వారా కాల్ చేస్తున్న పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు. రెండు గంటల తర్వాత ఆస్పత్రిలో చేర్పింపిచారని సమాచారం అందింది. ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియక ఆటో ద్వారా అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి విగత జీవిగా పడి ఉంది’అంటూ బోరున విలపించారు. అమెరికా నుంచి హుటాహుటిన వచ్చిన హర్షవర్ధన్ రెడ్డి.. తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రజనీ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేడు అంత్యక్రియలు అమెరికా నుంచి మృతురాలి తమ్ముడు శనివారం విశాఖ వస్తున్నారు. అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని భర్త లక్ష్మారెడ్డి తెలిపారు. -
బార్లో అమ్మాయిలతో అసభ్య నృత్యాలు
సనత్‌నగర్: యువతులను ఎరగా వేసి..మందుబాబులకు కిక్కు పెంచి..అధిక బిల్లులు బాదుతున్న ఓ బార్ దోపిడీకి ఎస్ఓటీ పోలీసులు అడ్డుకట్ట వేశారు. 11 మంది యువతులతో పాటు 10 మంది బార్ సిబ్బంది, మందు బాబులను అదుపులోకి తీసుకుని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. మూసాపేట లక్ష్మీకళ థియేటర్ సమీపంలోని ఎవర్గ్రీన్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు కొంతమంది యువతులను ప్రత్యేకంగా నియమించుకుని..వారితో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు. మద్యం మత్తులో ఉన్న మందు బాబుల వద్ద అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు అనుమతులు లేకున్నా యువతులతో నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో 11 మంది యువతులను, 10 మంది బార్ సిబ్బంది, మద్యం ప్రియులను అదుపులోకి తీసుకున్నారు. బార్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
అంబానీ ఫ్యామిలీ న్యూ ఇయిర్ వేడుకలు.. సన్నిహితులతో సందడి (ఫోటోలు)
-
మహిళలను అవమానించేలా కూటమి చర్యలు
-
ఫ్యామిలీ ట్రిప్‌లో అనసూయ భరద్వాజ్.. ఫోటోలు వైరల్
-
నితీశ్ రెడ్డి కుటుంబంతో అనుష్క శర్మ.. ఫొటో వైరల్
-
శోకసంద్రంలో మన్మోహన్ భార్య గురుశరణ్ : ఆ ప్రేమ గుర్తు ఇంకా ఆమెతోనే!
భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ (RIP Manmohan Singh) అస్తమయంతో యావద్దేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి, ఇలా పలు హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అనేకమంది రాజకీయ నేతలు, ఆర్థికవేత్తలు నివాళులర్పిస్తున్నారు.సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన భారత్ ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరొందారు. పదేళ్ల పాటు మన్మోహస్ సింగ్ భారత దేశ ప్రధానిగా పనిచేసినప్పటికీ.. ఆయన కుటుంబం గురించి ప్రజలకు అంతగా తెలియదనే చెప్పాలి. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుమార్తెలు వారి సంబంధిత రంగాలలో విశేషమైన విజయాలు సాధించారు.92 ఏళ్ల వయసులో ఆయన ఆకస్మిక మరణం ప్రధానంగా ఆయన భార్య గురు శరణ్ కౌర్‌కి తీరని లోటు. ప్రశాంతమైన,గాంభీర్యంగా ఉండే ఆయన ప్రవర్తనతో మనందరికీ తెలిసిన వ్యక్తి అయితే, ఆయన వెనుకున్న నిజమైన శక్తి అతని భార్య గురుశరణ్ కౌర్. ఆయన వెన్నంటే వుంటూ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర ఆమెదే. పదవిలో 2019లో, మన్మోహన్ సింగ్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినపుడు ఆమె భర్తను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆయన ఆరోగ్యం కోసం గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలోమన్మోహన్ సింగ్ భోజనాన్ని స్వయంగా తయారు చేసి ప్యాక్ చేసి పంపేవారట. Wow !! So beautifully rendered this soulful Kirtan by Mrs.Gursharan Kaur, w/o Dr. Manmohan Singh ( former Prime Minister of India) pic.twitter.com/0HPVtxfzA0— Indu Kumari (@InduKumari1) November 5, 2023డా. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ (GursharanKaur) ఎవరు?మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ 1937, సెప్టెంబర్ 13; జలంధర్‌లో జన్మించారు. యాదృచ్చింగా మన్మోహన్ కూడా సెప్టెంబరు (1932, సెప్టెంబర్26) లోనే పుట్టారు. తండ్రి, సర్దార్ చత్తర్ సింగ్ కోహ్లీ, బర్మా-షెల్‌లో ఇంజనీర్. ఏడుగురు తోబుట్టువులలో ఈమె చిన్నది. 1958లో మన్మోహన్ సింగ్ , గురుశరణ్ కౌర్ వివాహం జరిగింది. మన్మోహన్ సింగ్ భార్య 2009లో ఫ్యాషన్ మ్యాగజీన్ వోగ్లో దర్శనమిచ్చారు. G-20 సమ్మిట్ సందర్భంగా ఏకైక ప్రథమ మహిళ. తన జట్టుకు రంగు వేసుకోకుండా, సహజత్వాన్ని మోసుకెళ్లిన మహిళగా వోగ్ ఆమెను గౌరవించింది. కౌర్ మంచి గాయని కూడా జలంధర్ రేడియోలో కూడా ఆమె కీర్తలను పాడారు. మన్మోహన్ సింగ్ లాగానే, గురుశరణ్ కౌర్ కూడా మృదుస్వభావి.చెక్కు చెదరని మారుతిగురుశరణ్ కౌర్ మన్మోహన్ సింగ్‌తో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. పెళ్లి అయిన కొత్తలో తమ వివాహబంధానికి గుర్తుగా కొనుక్కున్న మారుతి-800ని ఇప్పటికీ ఆమె వాడతారు. అయితే వీరిది ప్రేమ వివాహమా, కాదా అనేదానిపై స్పష్టత లేదు. కానీ వీరి సుదీర్ఘ ఆదర్శ దాంపత్యం ఒక ప్రేమ కావ్యం లాంటిదే.ముగ్గురు కుమార్తెలుమన్మోహన్ సింగ్, కౌర్ దంపతులకు కుమార్తెలు ముగ్గరు. వారు ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, దమన్ సింగ్. పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్ ప్రఖ్యాత చరిత్రకారురాలు. ఆమె అశోక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ డీన్. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర విభాగం హెడ్‌గా పనిచేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఆమె ప్రాచీన భారతీయ చరిత్ర, పురావస్తు శాస్త్రం, పొలిటికల్ ఐడియాస్‌పై విస్తృతంగా పరిశోధన జరిపారు. ఆమె రచనలలో ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మెడీవల్ ఇండియా, పొలిటికల్ వయొలెన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా వంటి పుస్తకాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.రెండో కుమార్తె అమృత్ సింగ్ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది. స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో ప్రాక్టీస్ ఆఫ్ లా ప్రొఫెసర్.రూల్ ఆఫ్ లా ఇంపాక్ట్ ల్యాబ్‌కు వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. యేల్ లా స్కూల్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీల నుంచి డిగ్రీలను పొందారు. హింస, ఏకపక్ష నిర్బంధ పద్ధతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై సైతం ఆమె తన గళం వినిపించారు.ఇక చిన్న కుమార్తె దమన్ సింగ్ మంచి రచయిత్రి . లోతైన వ్యక్తిగత, విశ్లేషణాత్మక రచనలకు ప్రసిద్ధి చెందిన నిష్ణాత రైటర్. దమన్ సింగ్ తన తల్లిదండ్రుల జీవితాలలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రతిబింబిస్తూ.. స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ది సేక్రేడ్ గ్రోవ్, నైన్ బై నైన్ సహా ఆమె ఇతర పుస్తకాలు కథకురాలిగా ఉన్నారు. దమన్ సింగ్ పుస్తకాలు, రచనలు ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రతిబింబిస్తాయి. ఆమె భర్త అశోక్ పట్నాయక్ 1983 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. -
క్రిస్మస్ వేడుకల్లో ఫ్యాషన్ ఐకాన్ 'నటాషా' ఫ్యామిలీ (ఫోటోలు)
-
‘బాహుబలి ఫ్యామిలీ’ నెట్టింట వైరల్, ఎవరీ గేమ్ ఛేంజర్!
ఒక భార్య, ఓ నలుగురో , ఐదుగురో కొడుకులు, కుమార్తెలు,20-30 మంది మనవలు మనవరాళ్లతో అలరారే కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటూ ఉంటాం. మరి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు , 578 మంది మనవళ్లు ఉన్న ఫ్యామిలీని ఏమని పిలవాలి? 12 మంది భార్యలా? 102 మంది సంతానమా అని నోరెళ్ల బెట్టకండి. నిత్యం ఆకలి , కరువుతో సతమతమయ్యే ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో ఉందీ బాహుబలి ఫ్యామిలీ.తూర్పు ఉగాండాలోని ముకిజాకు చెందిన 70 ఏళ్ల ముసా హసహ్య కసేరా (MusaHasahyaKasera) ఈ జెయింట్ ఫ్యామిలీకి మూల పురుషుడు. ఈయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. 'దిఇండోట్రెక్కర్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.1972లో 17 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకోవడంతో అతని పెళ్లిళ్ల పరంపర మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. వీరికి 102 మంది పిల్లలు పుట్టారు. అంటే ఒక్కో భార్యకు దాదాపు తొమ్మిది మంది. అంతేనా మరో 578 మంది వారసులకు తాత కూడా. దశాబ్దాలుగా, అతని కుటుంబం అలా విస్తరిస్తూ పోయింది. అతని పిల్లలు ఇప్పుడు 10 - 50 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. అతని భార్యలలో చిన్న ఆమెకు 35 ఏళ్ల వయస్సు. ఇపుడు ఈ సంతానం కడుపు నింపేందుకు నానా పాట్లు పడటమే కాదు, మనవలు,మనవరాళ్ల పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉందట ముసాకు. అందుకే ఒక రిజిస్టర్‌ను మెయింటైన్ చేస్తున్నారు.అతనికున్న ఆస్తల్లా శిథిలావస్థలో ఇల్లు. రెండు ఎకరాల భూమి. దీంతో ఇల్లు గడవక చాలా కష్టపడుతున్నామని వాపోయింది మూడో భార్య జబీనా. పిల్లలు, మనుమలు చేతికి వచ్చిన పని చేస్తారు. మరికొందరు కుటుంబం కోసం నీళ్లు కట్టెలు తీసుకురావడానికి వారి రోజులు గడుపుతారు. వీరందరూ కడుపు నిండా భోంచేయండం కూడా గగనమే. View this post on Instagram A post shared by Kailash Meena (@theindotrekker)మరోవైపు అతని ఆరోగ్యం క్షీణించడం, ఇంత పెద్ద ఇంటిని నిర్వహించడం కష్టంగా ఉండటంతో, అతని ఇద్దరు భార్యలు వెళ్లిపోయారు. టీచర్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు షాబాన్ మాజినో(30) కుటుంబ నిర్వహణలో సహాయం చేస్తాడు.దీంతో నెటిజన్లు ఛలోక్తులతో సందడి చేస్తున్నారు. 'ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసిన వ్యక్తి' ఒకరు, “ఇస్కో పరివార్ క్యోం బోల్తే హో ...? జిల్లా ఘోషిత్ క్యోం నహీ దేతే.” (వీళ్లని కుటుంబమని అంటారేంటి...జిల్లాగా ప్రకటించాలి) అంటూ వ్యాఖ్యానించారు. బాహుబలి ఫ్యామిలీ, తాతగారు గేమ్ ఛేంజర్ అంటున్నారు. -
కాలం మారింది.. నాన్నను మార్చింది
నాన్న.. అమ్మలా మారుతున్నాడు. కోపం చిరాకు లేదు.. ఎక్కువటైం పిల్లలతోనే!. కాలం తెచ్చిన మార్పు.. పిల్లలకు తండ్రితోనే ఎక్కువ సాన్నిహిత్యం!కుటుంబలో నాన్న అంటేనే ఒక ప్రత్యేక క్యారెక్టర్... నాన్న అంటే గాంభీర్యతకు ప్రతీక .. ఎప్పుడూ పనులు.. బాధ్యతలు.. కుటుంబ సమస్యలు.. అప్పులు.. వ్యవసాయం వంటి పనుల్లో బిజీ.. నాన్నను కలవాలంటేనే ముందుగా ప్రిపరేషన్ ఉండాలి. నాన్నతో మాట్లాడడం అంటే హైడ్మాస్టర్ దగ్గర నిలబడినట్లే.. నాన్న ఒక సీరియస్ క్యారెక్టర్... నాన్న వేలు పట్టుకుని నడిస్తే ఎంతబావున్ను.. నాన్న నన్ను తన భుజాలమీద ఎక్కించుకుని జాతరలో తిప్పుతూ.. జీళ్ళు కొనిపెడితే ఎంతబావుణ్ను... నాన్న పక్కన పడుకోబెట్టుకొని కబుర్లు.. కథలు చెప్పే రోజులు నాకు రావా ? ఇదీ సగటు తండ్రి క్యారెక్టరైజేషన్. దాదాపు 1990ల వరకూ నాన్న(Father) పరిస్థితి ఇదే.. ఇంట్లో అందరి బాధ్యతలూ మోస్తూ అందరికీ దూరంగా ఉండే ఒక సెమి విలనీ పాత్ర...ఎప్పుడూ పనులు.. బాధ్యతల్లో ఉంటూ అసలు పిల్లలతో టైం గడపడం.. వారిని ఆడించడం.. వారితో ముచ్చట్లు ఆడడం అనేది తనకు సంబంధం లేదనుకునే పాత్ర ఆయనది. కేవలం పిల్లల ఖర్చులు.. బట్టలు.. పుస్తకాలు.. జ్వరం వస్తే మందులు వంటివి తేవడం తప్పిస్తే పిల్లలతో టైం గడపడం అనేది తండ్రి డైరీలోలేదు. పిల్లలకు స్నానం చేయడం.. వారిబట్టలు మార్చడం .. ఇలాంటివి అంటే డాడీకి ఎన్నడూ అసలు పరిచయం లేని పనులు. నాన్న కేవలం కొన్ని బాధ్యతలు మోయడం తప్ప పిల్లలతో ప్రేమను పంచుకునే సందర్భాలు.. సన్నివేశాలు దాదాపు తక్కువే. అప్పట్లో అన్నీ ఉమ్మడికుటుంబాలు.. పిల్లలతో టైం గడపడం అనేది ఆయనకు తెలియని పని.. అలాంటివి అన్నీ అమ్మే చూసుకుంటుంది.. పిల్లల విషయంలో తండ్రిది ఎప్పటికీ గెస్ట్ పాత్ర మాత్రమే....కాలం మారింది .. నాన్నను మార్చింది1960 ల నుంచి 1990, 2000 వరకు నాన్నది అదే సీరియస్ పాత్ర.. కానీ రోజులు మారుతున్న కొద్దీ నాన్నలోని కాఠిన్యం కరిగిపోతూ వస్తోంది.. నాన్నలో కూడా అమ్మలాంటి సున్నితత్వం... పిల్లలపట్ల ఎనలేని ప్రేమ పొటమరిస్తున్నాయి. ఇవన్నీ కాలం తెస్తున్న మార్పులే. గ్లోబలైజేషన్ కారణంగా ఉపాధి అవకాశాలు పెరగడం.. ఉమ్మడికుటుంబాల ప్రాబల్యం తగ్గడం.. ఎక్కడికక్కడ ఉపాదివేటలో పట్టణాలకు వలసవెళుతున్న కుటుంబాలు(Families) అక్కడే స్థిరపడడం వంటివి నాన్న పాత్రలో మార్పులు తెస్తోంది. పట్టణానికి చేరిన నాన్న.. తన కుటుంబాన్ని తానే చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ తమ బిడ్డలకు సాయం చేసేందుకు బామ్మలు.. మామ్మలు లేరు.. తల్లి ఒక్కతీ పనులు చేసుకోదు .. చేసుకోలేదు.. దరిమిలా నాన్న కూడా అమ్మకు పనుల్లో తోడుగా నిలవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఈక్రమంలోనే నాన్న కూడా సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నాడు . గత పాతిక ముప్పై ఏళ్ళ క్రితం జనరేషన్లకు ఊహాకు కూడా అందని సేవలు ఇప్పుడు నాన్న తన బిడ్డలకు చేస్తున్నాడు. 1980ల్లో 43 శాతం మంది తండ్రులకు తమ పిల్లల \డైపర్లు మార్చడం అనేది తెలియదట ప్రస్తుతానికి అది 3 శాతానికి తగ్గింది. అంటే ఇప్పుడు తండ్రులు పిల్లల సేవల్లో(Father-Kids Relation) తల్లితోబాటు సమానంగా బాధ్యత తీసుకుంటున్నారట.నాన్నతోనే స్నేహం ఇప్పుడుఅప్పట్లో సీరియస్ పాత్రలో ఉండే నాన్న ఇప్పుడు పిల్లలపట్ల అత్యంత ప్రేమతో ఉంటున్నారట. పిల్లలకు కెరీర్ సంబంధ సలహాలు ఇవ్వడం.. వారికి సైకిల్.. బైక్.. నేర్పడం.. వేలు పట్టుకుని నడిపించడం.. సాధ్యమైనంత ఎక్కువటైం పిల్లలతో గడపడం.. కథలు చెప్పడం.. టూర్లకు తీసుకెళ్లడం.. పిల్లలకు స్నానం చేయించడం.. వాళ్లతో పడుకోవడం.. ఇలా ప్రతి పనిలోనూ నాన్న తోడుగా ఉంటున్నాడు.. అమ్మలా మారిపోతున్నాడు. గ్లోబలైజేషన్(Globalisation) తెచ్చిన మార్పులతో నాన్నల పాత్రల్లోనూ మార్పులు వస్తున్నాయి..:::సిమ్మాదిరప్పన్న -
క్రిస్మస్ వేడుకల్లో తారకరత్న ఫ్యామిలీ (ఫొటోలు)
-
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
అంతిమసంస్కారాలైన 25 ఏళ్లకు ఆమె తిరిగొస్తే..
ఆమె తన ఆచూకీని కోల్పోయి 25 ఏళ్లుగా ఆశ్రమంలో కాలం గడుపుతోంది. మరోవైపు ఆమె ఎక్కడి నుంచి ఈ ఆశ్రమానికి వచ్చిందన్న సంగతి ఆ ఆశ్రమ నిర్వాహకులకూ తెలియదు. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నగరానికి చెందిన కథనంఏళ్ల తరబడి ఆశ్రమంలో..పాతికేళ్ల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఆమె తన కుటుంబాన్ని కలుసుకోగలుగుతోంది. మండి పరిపాలన అధికారుల చొరవతో ఇది సాధ్యమయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు 25 ఏళ్ల క్రితమే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక వాసి సాకమ్మ కథ ఇది. పాతికేళ్ల క్రితం ఆమె కర్ణాటక(Karnataka) నుండి ఉత్తర భారతదేశయాత్రలకు వెళ్లి, అక్కడ తప్పిపోయింది. అప్పటి నుంచి ఆమె మండి జిల్లా సుందర్‌నగర్‌లోని భంగ్రోటు వృద్ధాశ్రమంలో ఉంటోంది.కన్నడలో మాట్లాడటంతో..మండి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి ఆశ్రమాలను సందర్శించి, అక్కడ సౌకర్యాలను పరిశీలిస్తుంటారు. దీనిలో భాగంగా అధికారి రోహిత్ రాథోడ్ ఇటీవల ఈ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సాకమ్మను చూసి, ఆమెతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమెకు హిందీ రాదని, కన్నడ భాష వచ్చని గుర్తించారు. దీంతో ఆమె కర్నాటకు చెందినదై ఉంటుందని భావించారు. వెంటనే ఆయన కన్నడ తెలిసిన ఒక అధికారిని పిలిపించి, ఆమెతో మాట్లాడించి పలు వివరాలు సేకరించారు.ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లి..తరువాత ఆ మహిళ చెబుతున్న వివరాలతో కూడిన ఒక వీడియో(Video)ను రూపొందించి కర్ణాటక ప్రభుత్వానికి పంపించారు. ఆ దరిమిలా ఆమె కుటుంబ సభ్యులను మండీ అధికారులు గుర్తించారు. కాగా 25 ఏళ్ల క్రితం ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లిన సాకమ్మ ఎంతకాలానికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దరిమిలా పోలీసులు అందించిన సమాచారం మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక మహిళను సాకమ్మగా భావించి, ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి, క్రమంగా ఆమెను మరచిపోయారు.చనిపోయిందనుకున్న తల్లి వస్తుండటంతో..అయితే ఇప్పుడు సాకమ్మ బతికే ఉందని తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా మండీ అధికారులతో మాట్లాడిన సాకమ్మ తనకు 25 ఏళ్ల క్రితం నాటి విషయాలు మాత్రమే గుర్తున్నాయని, తనకు చిన్న పిల్లలు ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం సాకమ్మ మతిస్థిమితం లేని స్థితిలో ఉంది. కాగా సాకమ్మకు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె బతికే ఉన్నారు. వారిందరికీ వివాహాలు కూడా అయిపోయాయి. సాకమ్మను తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka) ముగ్గురు అధికారులను హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీకి పంపింది. వారు సాకమ్మకు తీసుకుని కర్నాటకకు వచ్చి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇది కూడా చదవండి: ఆవి క్రిస్మస్ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు -
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్
-
తల్లి ప్రేమకు దూరమైన పసికందు
బొమ్మనహళ్లి: బళ్లారిలో బాలింతల మరణాల పరంపర మరువక ముందే బెంగళూరులో ప్రసవించిన ఓ మహిళ శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం అవయవ వైఫల్యం, ఇతర సమస్యలతో మరణించిన హృదయవిదారక ఘటన జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గర్జే గ్రామానికి చెందిన గర్భిణీ అనూష మృతితో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాలు...చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గర్జే గ్రామానికి చెందిన గర్భిణీ అనూషను తరికెరెలోని రాజ్ నర్సింగ్ హోంలో చేర్పించారు.సాధారణ ప్రసవం ద్వారా పాప పుట్టింది. కాన్పుకు ముందు స్కానింగ్ చేయగా కిడ్నీలో స్టోన్ ఉందని, డెలివరీ అయిన నెల తరువాత షిమోగాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో సర్జరీ చేశారని సమాచారం. అయితే పేగులు దెబ్బతిన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనూషను ఇంటికి తీసుకువచ్చిన తరువాత కాళ్లు, చేతులు వాపు కనిపించింది. మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా సమస్య లేదని వైద్యుడు చెప్పారు. అయితే ఆమె ఆరోగ్య క్షీణించడంతో స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారు కామెర్లు ఉన్నట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకువచ్చి నగరంలోని నాగరబావిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. లివర్ సమస్యకు మరో ఆపరేషన్ చేసి సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ, సర్జరీ అంటూ కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు దండుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అనూష స్పృహలో లేదు. ఆమెకు గుండె సమస్య ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది. నిరంతర చికిత్స, వైద్య పరిశీలన లేక పోవడంతో తన భార్య మరణించిందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. అనూష ఎలా చనిపోయిందనేది కూడా వైద్యులు చెప్పలేకపోతున్నారని ఆమె బంధువులు, భర్త రోదించారు. ఆమె మృతితో రోజుల బిడ్డ అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింత మృతి చెందడంపై ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. -
Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు
2024 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు అందరం సిద్ధమవుతున్నాం. ఈ నేపధ్యంలో 2024 ఎలా గడిచిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2024 భారతదేశంలోని పలు కుటుంబాలకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించింది.దేశవ్యాప్తంగా చాలామంది సెలవు రోజుల్లో తమ కుటుంబాలతో సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. యువత సాహసభరితమైన ప్రయాణాలు సాగించగా, వయసుపైబడినవారు ప్రశాంత వాతావరణాలకు చేరుకుని సేదతీరారు. అందమైన బీచ్‌లు, అద్భుతమైన పర్వతప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలలో ప్రయాణించేందుకు భారతీయులు మక్కువ చూపారు. వాటిలో 10 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోవా2024లో టాప్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ టూరిస్ట్ డెస్టినేషన్‌గా గోవా ప్రత్యేక స్థానం దక్కించుకుంది. గోవాలోని అందమైన బీచ్‌లు, చర్చిలు ఉన్నాయి. ఇక్కడి సంస్కృతి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుందిత. కుటుంబ సభ్యులతో సహా ఎంజాయ్చేసేందుకు గోవా అత్యుత్తమ ప్రదేశం. వినోద కార్యక్రమాలను ఆస్వాదించేందుకు, చారిత్రక కోటలను సందర్శించేందుకు, అత్యుత్తమ షాపింగ్‌కు గోవా పెట్టిందిపేరు.కేరళఒకవైపు సహజ సౌందర్యం, మరోవైపు ఘనమైన సంస్కృతికి కేరళ పెట్టిందిపేరు. ఇక్కడి ఆహారం ఆహారప్రియుల నోరూరింపజేస్తుందని చెబుతారు. కుటుంబంతో సహా చూడాల్సిన ప్రాంతాలెన్నో కేరళలో ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ వాటర్స్, తేయాకు తోటలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలు ఉత్సాహాన్ని రెండింతలు చేస్తాయి.కశ్మీర్కశ్మీర్.. ప్రకృతి అందాలకు నెలవు. కుటుంబ సభ్యులతో సహా సందర్శించేందుకు ఉత్తమ ప్రదేశం. గుల్మార్గ్లో స్కీయింగ్, స్నోబోర్డింగ్, బుల్ కార్ రైడ్లను ఆస్వాదించవచ్చు. శ్రీనగర్‌లోని అందమైన లోయలను, సరస్సులను సందర్శించవచ్చు.ముస్సోరీఉత్తరాఖండ్లోని అందమైన హిల్ స్టేషన్ ముస్సోరీ. కుటుంబసభ్యులతో సహా ఆనందంగా విహరించేందుకు అత్యుత్తమ ప్రదేశం ఇది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చు. కేబుల్ కార్ రైడ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. స్థానిక మార్కెట్లను సందర్శించవచ్చు.సిక్కింభారతదేశంలోని ఈశాన్య ప్రాంతమైన సిక్కిం సహజ సౌందర్యానికి నిలయంగా పేరొందింది. ఇక్కడి పురాతన మఠాలు దేశ ఘన చరిత్రను చాటిచెబుతాయి. ఇక్కడికి కుటుంబంతో సహా వచ్చే పర్యాటకులు వివిధసాహస కార్యకలాపాల్లో పాల్గొని ఆనందించవచ్చు.మనాలి హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రసిద్ధ హిల్ స్టేషన్ సాహసాలు చేసేవారికి, ప్రకృతిని ఇష్టపడేవారికి అత్యుత్తమ ఎంపిక. ఇక్కడ స్కీయింగ్, స్నోబోర్డింగ్,ట్రెక్కింగ్ మొదలైనవి కుటుంబ సభ్యులకు అమితమైన ఆనందాన్ని అందిస్తాయి. స్థానిక మార్కెట్లు మంచి షాపింగ్ అనుభూతులను అందిస్తాయి. డార్జిలింగ్పశ్చిమ బెంగాల్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ కుటుంబంతో సహా ఎంజాయ్ చేసేందుకు అనువైన ప్రదేశం. ఇక్కడి టాయ్ ట్రైన్ రైడ్ ఎంతో వినోదాన్నిస్తుంది. ఇక్కడి టీ తోటలు ఎవరినైనా సరే వావ్ అనిపించేలా చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తే ఆ అనుభూతి జీవితాంతం గుర్తుంటుంది.గుల్మార్గ్ కశ్మీర్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ స్కీయింగ్, స్నోబోర్డింగ్ ఇష్టపడేవారికి ఎంతో అనువైనది. కేబుల్ కార్ రైడ్లు, స్నో గేమ్‌లతో వినోదించవచ్చు. స్నోమెన్లను తయారు చేసి ఆనందించవచ్చు.జైసల్మేర్రాజస్థాన్లోని ఈ అందమైన ఎడారి నగరం.. కుటుంబ సభ్యులంతా కలసి సందర్శించినప్పుడు వారి ఆనందం రెట్టింపవుతుంది. ఒంటె రైడ్, ఎడారి సఫారీ, ఇక్కడి కోటలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ కుటుంబంతో సహా చూడాల్సిన అత్యుత్తు ప్రదేశం. ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక్కడి వంటకాలు అందరికీ నోరూరేలా చేస్తాయి. స్థానిక స్మారక చిహ్నాలు, మ్యూజియంలు, మార్కెట్లను కుటుంబ సభ్యులంతా కలసి చూసినప్పుడు వారి ఆనందం రెట్టింపవుతుంది. ఢిల్లీలో పలు థీమ్ పార్కులున్నాయి. ఇవి అత్యుత్తమ వినోదాన్ని పంచుతాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. చాటింగ్ స్టైలే మారిపోయిందే.. -
మనసుదోచే సొగశారీ..
స్కిన్‌టైట్ జీన్సులు, ట్యునీక్సూ, కుర్తీస్, నీలెంగ్త్ స్కర్టులు, పొట్టి నిక్కర్లూ.. లాంటి మోడ్రన్ ట్యూన్స్‌తో ఓ వైపు మమేకమైన నగర మహిళలు మరోవైపు ఇంకా పాత రాగంలో ‘శారీ’గమ పాడేస్తోందంటే.. చీర కట్టు మహిమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.. ఆధునిక కట్టుబాట్లు ఎలా ఉన్నా అప్పుడప్పుడూ సొగసిరి చీరకట్టి అన్న రీతిలో నగర మహిళలు తమ హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. డిసెంబర్ 21న శారీ దినోత్సవం నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం.. – సాక్షి, సిటీబ్యూరో‘చీర కట్టుకుంటే ఆ డిగ్నిటియే వేరు. నెలకోసారన్నా.. వార్డ్‌రోబ్‌లో నుంచి శారీ తీయాల్సిందే’ అంటోంది ఓ పీఆర్ కంపెనీలో పనిచేసే వాణి. సిటీలో విభిన్న వృత్తి ఉద్యోగాలు చేసే మహిళలు, యువతులు వృత్తి, బాధ్యతల కారణంగా రోజువారీ వినియోగం అంత సులభం కాకపోవడంతో ‘చీరకట్టు’ వీరికి మరింత అపురూపంగా మారిపోయింది. దీంతో సెలవు దినాల్లో, కుటుంబ వేడుకల్లో ఇలా వీలైనన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఎంచుకునే వస్త్రధారణగా మారింది. ప్రత్యేక సందర్భం వస్తే చీరకట్టాలి అనే రోజుల నుంచి చీరకట్టు కోసం సందర్భాన్ని సృష్టించుకునేంత ఆసక్తి నగరమహిళల్లో పెరిగిపోతోంది.కట్టు తప్పుతోంది.. రోజుల తరబడి టాప్లూ, ట్రౌజర్లతో కాలక్షేపం చేస్తూ వచ్చి ఒక్కసారిగా చీర కట్టుకోవాలంటే ఇబ్బందే కదా. అందుకే చీరకట్టడంలో నేర్పరితనం ఉన్నవారి సేవల మీద నగర మహిళలు ఆధారపడుతున్నారు. ‘ఫంక్షన్స్‌కి శారీ కాకుండా డ్రెస్సులతో వెళితే గిల్టీ ఫీలింగ్ వస్తోంది. అలాగని చీరకట్టాలని ప్రయత్నిస్తే సరిగా కుదరడం లేదు. అందుకే నేను అవసరమైనప్పుడల్లా చీరకట్టే వారిని పిలిపించుకుంటాను’ అని జూబ్లీహిల్స్‌లో నివసించే ఉమ చెబుతున్నారు. ఈ ‘కట్టు’ ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికి నిపుణులకు రూ.500 వరకూ చెల్లించడానికి పెద్దగా ఇబ్బంది పడడంలేదంటున్నారు ఆధునిక మహిళలు. ‘ఇటీవల చీర కట్టుకోవాలని ఆసక్తి బాగా పెరిగింది. అయితే మోడ్రన్ డ్రెస్సుల్లా నిమిషాల మీద వేసుకుని వెళ్లిపోడానికి కుదిరేది కాదు కదా. అందుకే అమ్మాయిలు మాత్రమే కాదు పెద్ద వయసు మహిళలు కూడా చీర కట్టుకోవడానికి మా సహకారం కోరుతున్నారు. అవసరమైన వారికి మేం ఇంటికే వెళ్లి సేవలు అందిస్తున్నాం’ అని చెబుతున్నారు శారీ డ్రేపర్‌గా రాణిస్తున్న సునీల.విభిన్న శైలిలో...చీరకట్టు విభిన్నరకాల శైలులు నగరంలో రాజ్యం ఏలుతున్నాయి. ‘జయప్రద స్టైల్, నూపుర్ స్టైల్, తానిదార్ స్టైల్.. ఇలా దాదాపు 35 రకాల శారీడ్రేపింగ్ స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. నా దగ్గరకు వచ్చే వారిలో అత్యధికులు నూపుర్స్టైల్ అడుగుతారు’ అని చెప్పారు శారీడ్రేపింగ్కు పేరొందిన సికింద్రాబాద్ వాసి జానీనులియా. నగరం విభిన్న సంస్కృతుల నిలయం కావడం, విభిన్న ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి నివసిస్తుండడం, ఈ కుటుంబాల మధ్య రాకపోకలు పెరగడంతో.. ఇతర ప్రాంతాల కట్టు బొట్టూ నేర్చుకోవాల్సి రావడం తప్పడం లేదు. ఆ క్రమంలోనే మార్వాడి, గుజరాతీ, బెంగాలీ.. తదితర చీరకట్టు శైలిని స్థానిక మహిళలు అనుసరిస్తుండడం సాధారణంగా మారింది. విభిన్న శైలులను అనుసరించాలనుకునేవారికి స్టైల్‌ను బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకూ రుసుముతో సేవలు అందించేవారు సైతం పుట్టుకొచ్చేశారు. బ్యూటీ విత్ డిగ్నిటీ..‘రెగ్యులర్ డ్రెస్సులంటే మొహం మొత్తేస్తోంది. మా కంపెనీలో ఏ చిన్న వేడుకైనా అందరూ చీరలు కట్టుకునే వస్తాం. ప్రత్యేకంగా ట్రెడిషనల్ డే వంటివి క్రియేట్ చేసుకుని మరీ చీరలు కడుతున్నాం’ అంటోంది సాఫ్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ. మోడ్రన్ డ్రెస్సుల దగ్గర ఆచితూచి ఖర్చుపెట్టే అమ్మాయిలు చీర విషయానికి వచ్చేసరికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారని నగరానికి చెందిన డిజైనర్ అవని చెబుతున్నారు. హఫ్ శారికే డిమాండ్..ఎన్ని రకాలు వచ్చినా నగరంలో అత్యధికుల్ని ఆకర్షిస్తున్నది మాత్రం హాఫ్‘శారీ’.. అంటే లంగా వోణి కాదు. లంగా వోణి లాంటి చీర అని అర్థం. అచ్చం హాఫ్శారీలా కనబడే శారీలు నగర మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వయసు తక్కువలా అనిపించేలా ఉండే వీటి పట్ల నగర మహిళలు ఆదరణ చూపుతున్నారని కలర్జ్ బ్యూటీ స్టూడియో నిర్వాహకురాలు శ్రావణీరెడ్డి చెప్పారు. అలాగే ధోతీ స్టైల్, గోచీ స్టైల్, లెహంగా స్టైల్.. ఇలా అనేక రకాల స్టైల్స్ నగరంలో సందడి చేస్తున్నాయి. ప్రొఫెషనల్ స్టెప్స్.. స్టైల్ టిప్స్విభిన్న రంగాల్లో ఉంటున్నవారు అందుకు తగ్గట్టుగా ఉండేందుకు చీరకట్టు కూడా ప్రత్యేకంగా ఉండేలా డిజైనర్లు సూచిస్తున్నారు. చీర మీద కొంగును సింగిల్స్టెప్ వేసే స్టైల్‌ని టీచర్ వృత్తిలో ఉన్నవారు ఎంచుకోవచ్చు. ఇదే స్టైల్లో పల్లు కొసని కుడి చేత్తో పట్టుకోవడం వల్ల డిజైన్ కొట్టొచి్చనట్టు కనబడుతుంది. హుందాగా కనిపించాలనుకున్నవారు డబుల్స్టెప్ను అనుసరించవచ్చు. ఇక అత్యధికులకు నప్పేది త్రీస్టెప్స్. పనులకు ఎలాంటి అడ్డంకీ రాకూడదనుకునే ఉద్యోగినులు, గృహిణులు.. అందరికీ ఇది ఓకె. కాస్త స్పైసీగా కనపడాలనుకుంటే మాత్రం ఫోర్స్టెప్స్, ఫైవ్స్టెప్స్.. ఇలా ఎంచుకోవాలి. పట్టు చీరలకు తప్పనిసరిగా ఆరు స్టెప్స్ ఉండాల్సిందే. అప్పుడే దానికి ఆకర్షణ. స్కూల్ డేస్ నుంచే కడుతున్నా.. శారీ కట్టడం స్కూల్ డేస్ నుంచే అలవాటు. అందుకే చీరకట్టు నాకు చాలా కంఫర్ట్బుల్ అనిపిస్తుంది. ఒక యాంకర్‌గా రకరకాల ప్రోగ్రామ్స్ కోసం రకరకాలుగా రెడీ అవుతుంటాను. అన్ని రకాల స్టైల్స్ ధరించడం అవసరం కూడా. అయితే నా మనసు ఎప్పటికీ చీరమీదే ఉంటుంది. రకరకాల బ్లౌజ్‌లు, జ్యువెలరీస్ జత చేసి వెరైటీ స్టైల్స్‌లో డ్రేప్ చేసుకోవచ్చు.. – మంజూష, యాంకర్ -
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా?
నేను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలోని ఇబ్బంది వల్ల వేరే ఉద్యోగం చూసుకున్నాను. ప్రస్తుతం ఉన్న కంపెనీలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేస్తాను అని అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. కానీ, రాజీనామా ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాము అని చెప్పారు. తీరా రాజీనామా చేసే సమయానికి ‘మేము రిలీవింగ్ ఇవ్వము. నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వము. అగ్రిమెంట్ ప్రకారం మూడేళ్లు పనిచేయాల్సిందే – అంటే ఇంకో 14 నెలలపాటు ఇక్కడే ఉండాలి అంటున్నారు.’ ఇదే కంపెనీలో పని చేస్తే నేను జీవితాన్ని కోల్పోతాను. ఎంతో హెరాస్మెంట్గా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. – ఒక ఐ.టీ. ఉద్యోగి, హైదరాబాద్అసలు మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కంపెనీ వారికి ఎందుకు ఇచ్చారు? అలా తీసుకునే హక్కు కానీ, తీసుకుని వారి వద్దనే ఉంచుకునే హక్కు కానీ ఎవరికీ లేదు. పరిశీలించిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు మీకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా కాదని ఎవరైనా చేస్తే అది చట్టరీత్యా తప్పు. ఐటీ కంపెనీలలో సాధారణంగా ఫ్రెషర్స్ గా వచ్చిన వారితో బాండు రాయించుకోవడం చూస్తుంటాము. కానీ, బాండు రాయించుకున్నంత మాత్రాన మీరు వారి వద్ద బానిసత్వం చేయాలి అని అర్థం కాదు. అలాంటి బాండ్లు అన్నివేళలా చెల్లవు కూడా. కంపెనీవారు మీకు ఏదైనా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి, (స్పెషల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ వంటివి) ఆ శిక్షణ ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటే, సదరు శిక్షణ నుంచి మీరు నేర్చుకున్న పని ఆ కంపెనీకి ఉపయోగకరం అయినప్పుడు మాత్రమే వారు ఇచ్చిన శిక్షణకు ప్రతిఫలంగా కొంతకాలం వారి వద్ద పనిచేయాలి అనే నిబంధన చెల్లుతుంది. అంతేకానీ ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గర ఇలాంటి బాండ్లు రాయించుకుంటే అవి చెల్లవు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు.కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్, సెక్షన్ 27 ఒక వ్యక్తిని తన వాణిజ్య/వ్యాపారాలు చేయడం వీలు లేదు అని రాసుకున్న ఏ అగ్రిమెంట్ అయినా కాంట్రాక్టు అయినా చెల్లవు. మీరు రాసుకున్న అగ్రిమెంట్/ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ లోని పదజాలాన్ని ఒకసారి పరిశీలించండి. మీరు లిఖితపూర్వక నోటీసు ఇచ్చి, నోటీసు సమయాన్ని పూర్తి చేసి ఆ కంపెనీని వదిలి వెళ్లవచ్చు. వీలుంటే ఒక లాయర్ని సంప్రదించి ఆ కాంట్రాక్టు చెల్లుతుందో లేదో చూసుకోండి. ఇదీ చదవండి: ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!ఐటీ ఉద్యోగి అయినప్పటికీ, మీరు చేసే పని గనుక లేబర్ యాక్ట్ పరిధిలోకి వస్తే, మీరు లేబర్ కోర్టును కూడా సంప్రదించవచ్చు. అలాగని అందరు ఐటీ ఉద్యోగులకూ లేబర్ చట్టాలు వర్తించవు. కొందరికి మాత్రమే వర్తిస్తాయి. ప్రత్యామ్నాయంగా మీరు సివిల్ కోర్టును మీరు ఆశ్రయించవచ్చు. కొంత సమయం పట్టినప్పటికీ మీకు సరైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసంsakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది : ఖాళీ బిందె
ఓ గ్రామంలోని చేదబావి దగ్గర ఇద్దరు మహిళలు వాదులాడుకుంటూ ఉన్నారు. ఒక మహిళ గట్టి గట్టిగా అరుస్తోంది. మాటలు పడుతున్న స్త్రీ కన్నీళ్ళు పెట్టుకుంది.దారినపోతున్న ఓ పండితుడు అది గమనించాడు.గట్టిగా మాట్లాడుతున్న మహిళతో ‘‘ఇలా అరవడం మంచిది కాదు’’ అని చెప్పబోయాడు.‘‘నోరు ఉన్న వాళ్ళదే కదా రాజ్యం!’’ అని బదులిచ్చింది అరిచిన మహిళ.చిన్న నవ్వు నవ్వాడు ఆ పండితుడు.ఖాళీగా ఉన్న బిందెను చేంతాడు సహాయంతో బావిలోకి పంపమన్నాడు. ‘అదెంత పని’ అని అనుకున్న ఆమె ఖాళీబిందెను సరసరా బావిలోకి వదిలింది. బిందెలో నీళ్ళు చేరాక పైకి లాగమన్నాడు. శక్తిని ఉపయోగిస్తూ బిందెను లాగడం ప్రారంభించింది.‘‘ఎలా ఉంది?’’ అని ప్రశ్నించాడు పండితుడు.‘‘బిందెలో నీళ్ళు ఉన్నాయి కదా, కాబట్టి బరువుగా ఉంది. కష్టంగా లాగుతున్నాను’’ అని సమాధానమిచ్చింది.‘‘ఖాళీ బిందెని బావిలోకి వదిలినంత సులభంగా మనం ఎదుటివారిని ఎన్నో మాటలనవచ్చు. కానీ ఆ మాటలు ఎదుటి వారి మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఆలోచించాలి. నీళ్ళు చేరాక ఖాళీ బిందె ఎలా బరువయ్యిందో, అలాగే మన మాటలు చాలా మంది మనసుల్ని బరువుగా చేస్తుంది.ఒంటికి తగిలిన గాయాలను కొన్నాళ్ళకు మరుస్తామేమో కానీ, మనసుకు తగిలిన గాయాల్ని అంత సులభంగా మరువలేము. ఆపైన, మనం ఎప్పుడు వారికి కనిపించినా మనం మాట్లాడిన మాటలే వారికి గుర్తుకు వస్తాయి. వారి మనసు బాధగా మూలుగుతుంది. విరిగిన మనసు అంత సులభంగా అతకదని తెలుసుకో. ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నించినా మనలోని మంచి వారికి కనిపించదు. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. మాటలు మన పెదాలు దాటితే అవి మన అధీనంలో ఉండవు. మాటలు అనడం తేలిక. మాటల పర్యవసానం చాలా భారం. దానికి ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు, మనుషుల్ని రాబట్టుకోవడం కష్టం, పోగొట్టుకోవడం సులభం’’ అని హితవు చెప్పాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదని గుర్తించిన ఆ మహిళ, అక్కడే కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతున్న స్త్రీని క్షమాపణలు కోరింది. ఇద్దరూ కలిసి నవ్వుతూ చేద బావిలోని నీళ్ళను చేదుకున్నారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
సినిమా కథలా జాకీర్ హస్సేన్ ప్రేమ వివాహం
ప్రముఖ తబలా విద్వాంసుడు, సంగీత స్వరకర్త జాకీర్ హుస్సేన్(73) కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఏడేళ్ల వయసులోనే జాకీర్ హుస్సేన్ తబలా వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. అభిమానులు, శ్రేయోభిలాషులకు జాకీర్ హుస్సేన్ వృత్తిపరమైన విజయాల గురించి తెలుసుకానీ, అతని వ్యక్తిగత వివరాలు అంతగా తెలియదు. జాకీర్ హుస్సేన్ ప్రేమకథ సినిమా స్టోరీని తలపిస్తుంది.జాకీర్ హుస్సేన్ కథక్ నర్తకి ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. ఆమె అతనికి మేనేజర్‌గా వ్యవహరించారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియా మిన్నెకోలాలకు 1978లో వివాహం జరిగింది. వీరికి అనిసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియాలు తొలిసారిగా 70వ దశకం చివరలో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో తబలా, కథక్‌లలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు కలుసుకున్నారు.జాకీర్ మొదటి చూపులోనే ఆంటోనియాను ఇష్టపడ్డారు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. కానీ ఆంటోనియా మిన్నెకోలా.. జాకీర్ హుస్సేన్‌ను ప్రేమించే విషయంలో వెనుకాడారు. అయితే జాకీర్ ఆమె కోసం ప్రతిరోజూ తరగతి గది బయట వేచి ఉండేవాడు. జాకీర్, ఆంటోనియాలు ఎనిమిదేళ్లు స్నేహం కొనసాగించిన అనంతర వివాహం చేసుకున్నారు. దీనికి ముందు కొంతకాలంపాటు డేటింగ్ చేశారు. ఈ విషయంలో ఇరుకుటుంబాల వారికి తెలుసు.ఆ సమయంలో జాకీర్‌కు సరైన ఆదాయం లేకపోవడంతో ఆంటోనియా తండ్రి ఈ వివాహానికి అభ్యంతరం తెలిపారు. ఇదిలా కొనసాగుతుండగానే జాకీర్, ఆంటోనియాలు 1979లో పెళ్లి చేసుకున్నారు. జాకీర్ ఒక ఇంటర్య్యూలో తాను తన కుటుంబంలోనివారికి భిన్నంగా మతాంతర వివాహంచేసుకున్నానని తెలిపారు. ఆంటోనియాను తాను వివాహం చేసుకుంటానంటే తన తల్లి అందుకు నిరాకరించారని, అయితే తన తండ్రి తమ రహస్య వివాహానికి సహకరించారని జాకీర్ వివరించారు. తరువాతి కాలంలో తన తల్లి ఆంటోనియాను కోడలిగా అంగీకరించారని తెలిపారు.జాకీర్ హుస్సేన్, ఆంటోనియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆంటోనియా అమెరికాలో ఉంటూ తమ కుమార్తెలను చూసుకుంటున్నారని గతంలో జాకీర్ తెలిపారు. జాకీర్ కెరియర్ కోసం, ఆయనకు అన్ని విషయాల్లో సహాయం అందించేందుకు ఆంటోనియా తన కెరియర్ను వదులుకున్నారు. జాకీర్ విదేశాలకు వెళ్లేటప్పుడు భావోద్వేగాలకు లోనయ్యేవారని ఆంటోనియా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భార్యాభర్తలుగా తామిద్దరం ఒకరి ఆచార వ్యవహారాలను, కుటుంబ విలువలను పరస్పరం గౌరవించుకుంటూ మెలుగుతున్నామని, తమ పిల్లలకు కూడా సదాచార లక్షణాలు నేర్పించామని ఆంటోనియా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
రూ.12వేల సాయానికి అర్హుల ఎంపిక ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూమిలేని ప్రతీ కుటుంబానికి ఏటా రూ.12వేల ఆర్థిక సాయాన్ని అందించే పథకానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన నేపథ్యంలో అర్హుల ఎంపికపై జోరుగా చర్చ సాగుతోంది. ఏడాదిలో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని, తొలి విడతగా ఈనెల 28న అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్లు భట్టి చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఎకరాకు ఏటా రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది.రైతులతోపాటు రైతు కూలీలకు కూడా సాయం అందజేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. గత సెపె్టంబర్లో రూ.12వేల సాయం ప్రకటన చేసిన భట్టి ఆదివారం ఖమ్మంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 28న తొలివిడతగా రూ. 6వేలు ఇస్తామని ప్రకటించారు. సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లో భూమిలేని పేదలను గుర్తించి, ఎంత మందికి పథకాన్ని అమలు చేయాలనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భూమిలేని పేదలు ఎందరు? రాష్ట్రంలో రైతు కుటుంబాలు 64 లక్షల వరకు ఉండగా, భూమిలేని కుటుంబాలు, కూలీ నాలీ చేసుకునే వారు కలిపి 50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. అయితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 53.06 లక్షల కుటుంబాల్లోని వారికి జాబ్‌కార్డులున్నాయి. వారిలో 34.52 లక్షల కుటుంబాల వారే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. జాబ్‌కార్డు ఉన్న వారిలో కూడా కొందరు చిన్న, సన్నకారు రైతులు ఉంటారు. అయితే, భూమిలేని కుటుంబాలను గుర్తించేందుకు ఇప్పటివరకు పూర్తిస్థాయి సర్వే ఏదీ జరగలేదు.2014లో జరిపిన సకుటుంబ సర్వే వివరాలు వెల్లడి కాకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణనతో కూడిన కుటుంబసర్వే ఇంకా పూర్తికాలేదు. అయితే మండలాల స్థాయిలో ఉన్న లెక్కల ప్రకారం సుమారు 40లక్షల కుటుంబాలను భూమిలేని కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఏ పథకానికైనా రేషన్‌కార్డును ప్రాథమిక అర్హతగా చెబుతున్న ప్రభుత్వం.. రైతు రుణమాఫీ తరహాలో కుటుంబంలో ఒక్కరినే ఇందుకు అర్హులుగా గుర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతుభరోసా పథకాన్ని వర్తింపజేస్తున్న ప్రభుత్వం.. ఈ పథకంలో లబ్ధి పొందని వారందరినీ భూమిలేని కు టుంబాలుగా పరిగణనలోకి తీసుకుంటుందేమోన ని రైతు కూలీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 30 లక్షల కుటుంబాలకు ఇచ్చినా..భూమిలేని కుటుంబాలను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన గుర్తించినా... కనీసం 30 లక్షల కుటుంబాలను అర్హులుగా తేల్చే అవకాశం ఉందని సమాచారం. ఈలెక్కన ఒక్కో కుటుంబానికి తొలివిడత రూ. 6వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేస్తే రూ.1,800 కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఈలెక్కన సంవత్సరానికి రూ. 3,600 కోట్లు అవసరమవుతాయి. అర్హుల గుర్తింపుపై స్పష్టత వస్తే ఈ లెక్కల్లో తేడా ఉండే అవకాశం ఉంది.అర్హులందరికీ ఇవ్వాలిసారంపల్లి మల్లారెడ్డి, సీపీఎం నేత కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని కుటుంబాలకు, రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. రైతు రుణమాఫీలో కోతలు పెట్టినట్టుగా ఈ పథకం కింద పేదలకు అన్యాయం చేయొద్దు. రాష్ట్రంలో 60 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 40 లక్షల కుటుంబాలు భూమి లేని పేదలే. వీరందరికీ ఆర్థిక సాయాన్ని అందించాలి. -
ఆ జత జాడీలు అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఏం మాయ చేశాయి..!
అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగానే, జత జాడీలు చైనాలోని ఒక కుటుంబాన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేశాయి. ఫొటోలో కనిపిస్తున్న ఈ రెండు జాడీలు చైనాకు చెందిన ఒక కుటుంబంలో గత శతాబ్దంగా ఉంటున్నాయి. పాతబడిన ఈ జాడీలను పనికిరాని వస్తువులుగా భావించి, ఆ కుటుంబం వారు వాటిని ఒక మూలన పడేశారు. అయితే ఈ జాడీలే తమకు కోట్లు కురిపిస్తాయని వారు ఊహించలేదు. అయితే, ఒక పురావస్తు నిపుణుడి సలహాపై, ప్రస్తుతం ఈ జాడీలను వారు వేలంలో పెడితే, అప్పుడే తెలిసింది వారికి ఈ జాడీల ప్రాముఖ్యత! పదహారో శతాబ్దానికి చెందిన చక్రవర్తి జియాజియ్ హయాంలో ఈ జాడీలను తయారు చేసినట్లు గుర్తించి, వాటిని 9.6 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 102 కోట్లు) కొనుగోలు చేశారు. అతి పురాతనమైన ఈ జాడీలను చైనీస్ మింగ్ రాజవంశం ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇవి వీరి దగ్గరకు ఎలా వచ్చాయో తెలియదు గాని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి నుంచి ఈ జాడీలు వారి ఇంటి వంటగదిలో నిరుపయోగంగా ఉంటున్నాయి. ఎగిరే చేపల డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ జాడీలను వారు కేవలం ఇంట్లో అలంకరణకు మాత్రమే వాడేవారట! అందుకే అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. (చదవండి: వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!) -
రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్, మోదీతో భేటీ : హుందాగా, అందంగా కరీనా (ఫోటోలు)
-
రచ్చకెక్కిన ‘మంచు’ గొడవ.. అర్ధరాత్రి చొక్కాలు చించుకుని ఫైటింగ్ (ఫొటోలు)
-
నటి లయ థ్యాంక్స్ గివింగ్ పార్టీ.. ఫ్యామిలీతో కలిసి (ఫొటోలు)
-
మేనమామలతో నాగచైతన్య.. దగ్గుబాటి స్పెషల్ (ఫోటోలు)
-
‘సుప్రీం’ తీర్పుతో 16 ఏళ్లకు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం
న్యూఢిల్లీ: సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు చొరవతో ఆ కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం లభించింది. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరు వారాల్లోగా ఆ కానిస్టేబుల్ కుమారునికి ప్రభుత ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.వివరాల్లోకి వెళితే యూపీలోని అలీఘర్ నివాసి వీరేంద్ర పాల్ సింగ్ తండ్రి శిశుపాల్ సింగ్ యూపీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయన 1995లో అనారోగ్యంతో మరణించాడు. ఆ సమయంలో అతని కుమారుడు వీరేంద్ర పాల్ సింగ్ మైనర్ కావడంతో, అతని తల్లి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.అయితే 13 సంవత్సరాల తరువాత మేజర్ అయిన వీరేంద్ర పాల్ సింగ్ 2008లో కారుణ్య నియామకం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో జాప్యం జరిగిన కారణంగా యూపీ ప్రభుత్వం ఆ దరఖాస్తును తిరస్కరించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరేంద్ర పాల్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై పునర్విచారణ జరపాలని హైకోర్టు సింగిల్ బెంచ్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాన్ని యూపీ ప్రభుత్వం పునరాలోచన చేసి, తిరస్కరించింది.కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయడంలో జరిగిన జాప్యాన్ని మన్నించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇలా కోర్టులో వాదప్రతివాదనలతో చాలా ఏళ్లు గడిచిపోయాయి. అయితే 2021లో అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా వీరేంద్రకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై పరిశీలించాలని కోరింది. యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. అయితే అది 2022లో దానిని తిరస్కరణకు గురయ్యింది. అతని కారుణ్య నియామకాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.దీనిపై యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టులో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సందీప్ మెహతాలు.. యూపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ, హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో తమకు లోపం కనిపించలేదని పేర్కొన్నారు. ఎటువంటి తప్పు లేకుండా 2010 సంవత్సరం నుండి ఈ కేసును కొనసాగిస్తున్నారని, తాము ఈ అప్పీల్‌ను స్వీకరించడానికి ఇష్టపడటం లేదని, దీనిని కొట్టివేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ ఉత్తర్వు కాపీ అందిన నాటి నుంచి ఆరు వారాల వ్యవధిలోగా ప్రతివాదికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానిస్టేబుల్ కుమారుని తరపున న్యాయవాది వంశజా శుక్లా వాదనలో పాల్గొన్నారు. కాగా కానిస్టేబుల్ శిశుపాల్ సింగ్ 1992లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అనారోగ్యానికి గురై, చికిత్స పొందుతూ కన్నుమూశాడు.ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
అంబానీ వారసుల గురించేనా?.. ఇలాంటి వారి గురించి కూడా తెలియాలి
ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ఓ వ్యక్తి చేసే ప్రయాణం కథాంశంగా రాబిన్ శర్మ రాసిన పుస్తకం The Monk Who Sold His Ferrari ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అదే చరిత్రలో.. గౌతమ బుద్ధుడు ఇలా రాజభోగాలను వదిలేసి సన్యాసం తీసుకున్నాడని చదువుకున్నాం. కానీ.. నిజ జీవితంలో ఇలా కోట్ల సంపదను వదిలేసి సన్యాసి జీవితం గడుపుతారా?. అయితే.. ఈ మోడ్రన్ డే సిద్ధార్థుడి కథ చదవాల్సిందే. శ్రీలంక- తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్. మలేషియాలో బిలియనీర్. ఆ దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఆయన ఒక్కగానొక్క కొడుకే పైన ఫొటోలో ఉన్న వెన్ అజన్ సరిపన్యో.👉మలేషియాలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న తండ్రిని.. ఆయనకున్న టెల్కాం, శాటిలైట్స్, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాదనుకున్నారు అజన్ సరిపన్యో. ఒకానొక టైంలో సీఎస్కే టీంకు స్పాన్సర్ చేసిన ఎయిర్‌సెల్ కంపెనీకి ఓనర్ ఈయన తండ్రే.👉రెండు పదుల వయసొచ్చేదాకా రిచ్చెస్ట్ పర్సన్ కొడుకుగానే తన ఇద్దరు సోదరీమణులతో లండన్‌లో పెరిగాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలపై అనర్గళంగా పట్టు సాధించారు. ఇక్కడ మరో విషయం.. ఈయన తల్లి మామ్వాజారోగీస్ సుప్రిందా చక్రబన్ థాయ్‌లాండ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తే. అయితే ఈ మూలాలే అతని జీవితాన్ని మార్చిపడేసింది.👉తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు అజన్ సరిపన్యో. వెళ్లేముందు ఆ ట్రిప్ సరదాగా సాగుతుందని భావించాడు. కానీ, అది అతని జీవితంలో ఊహించని మార్పు తెచ్చింది. అక్కడ ఆధ్యాత్మికత అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదే తన జీవిత పరమార్థం అనుకుని.. భోగభాగ్యాలను వదులుకుని సన్యాసం పుచ్చేసుకున్నాడతను.👉గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్ అవన్నీ వదులుకుని సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. వేల కోట్ల సంపదలో ఈ ఆనందం దొరకదంటాడాయన. మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ ఓ మఠాధిపతిగా ఉంటూనే.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ అభినవ బుద్ధుడు.👉తన ఆస్తులన్నీ అజన్ సరిపన్యోకు అప్పగించాలనుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుని భావించాడు ఆనంద్ కృష్ణన్. కానీ, అజన్ మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు. ఆ నిర్ణయం బాధించేదే అయినా అజన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆ తండ్రి గౌరవించాడు. 👉తండ్రి బాటలో అడుగులు వేసి వ్యాపారరంగంలో రాణిస్తున్న అంబానీ వారసుల గురించే కాదు.. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్న అజన్ గురించి కూడా ఈ ప్రపంచానికి తెలియాల్సిందే కదా. -
Bihar:మరో ‘కుటుంబ ఆధిపత్యం’.. ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు
గయ: బీహార్ రాజకీయాల్లో లాలూ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబాల తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. బీహార్‌లోని నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక స్థానమైన గయ ఇప్పుడు జితన్ రామ్ మాంఝీ కుటుంబానికి దక్కింది.గయా జిల్లాలోని ఇమామ్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి గతంలో జితన్ రామ్ మాంఝీ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన ఎంపీ అయిన తర్వాత ఈ స్థానం ఖాళీ కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ఆయన కోడలు, బీహార్ ప్రభుత్వ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ భార్య దీపా మాంఝీ విజయం సాధించారు. ఫలితంగా బీహార్ రాజకీయాల్లో జితన్ రామ్ మాంఝీ కుటుంబ పరపతి పెరిగింది. ఇప్పుడు ఆయన కుటుంబంలో ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.జితన్ రామ్ మాంఝీ కేంద్ర మంత్రిగా, ఆయన కుమారుడు సంతోష్ కుమార్ బీహార్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్నారు. ఇదే కుటుంబానికి చెందిన జ్యోతి మాంఝీ బారాచట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు దీపా మాంఝీ ఇమామ్‌గంజ్ ఎమ్మెల్యేగా అయ్యారు. జితన్‌రామ్ మాంఝీ 1980లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఘోర పరాజయం పాలవడంతో, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రిగా నియమించారు. ఏడాది తరువాత అతను కూడా రాజీనామా చేశారు.అనంతరం జితన్ రామ్ మాంఝీ 2015లో హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ పార్టీని స్థాపించి ఎన్డిఎలో చేరి ఇమామ్‌గంజ్ నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. 2015 నుండి మే 2024 వరకు ఇమామ్‌గంజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జూన్ 2024లో మొదటిసారిగా ఎంపీ అయ్యారు. గయ నుంచి ఎంపీ అయిన తర్వాత మోదీ కేబినెట్లో కూడా చోటు దక్కించుకుని ఎంఎస్ఎంఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: వామదేవుడి వృత్తాంతం -
గోవా ఐఎఫ్ఎఫ్ఐ ఈవెంట్లో అక్కినేని ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
‘పెళ్లాం చెబితే వినాలి'.. ఇది పుష్పగాడి మాటే కాదు..
‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా’ అని తాజాగా విడుదలైన ‘పుష్ప2’ ట్రైలర్లో హీరో అంటాడు. సానుకూల వివాహ అనుబంధంలో భార్య మాటకు విలువ ఇవ్వడం కుటుంబానికి మంచిది అంటారు నిపుణులు. ‘భార్య మాట వినే భర్త’ను లొంగుబాటుగా చెప్పే పితృస్వామ్య పరంపర ఉన్నా దాని వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు.కుటుంబ జీవనంలో కీలక నిర్ణయాలే కాదు మంచీ చెడూల్లో భార్య సలహా వినదగ్గది. కొన్ని పరిశీలనలు. ఒక వివాహబంధం విజయవంతం కావాలంటే ముందు వినడం నేర్చుకోవాలి’ అంటున్నారు ప్రవర్తనా నిపుణులు. ‘భార్యాభర్తలు మొదట ఎదుటి వారు ఏం చెప్తున్నారనేది ఓపిగ్గా వింటే చాలు ఆ బంధం సగం సఫలమైనట్టే’ అని వారు అంటున్నారు. మన సమాజంలో భార్య మాట వినే భర్త గురించి పరిహాసం ఆడటం ఉంది. ‘భార్యా విధేయుడు’ అంటూ గేలి చేసేవారు కూడా ఉంటారు. సమాజం ఇంత ముందడుగు వేసినా ‘భార్య మాట వినడంలో తప్పు ఏముంది’ అని ఆలోచించే పరిస్థితి లేదు. అమెరికాలో కొత్తగా పెళ్లయిన దాదాపు 130 జంటలను పరిశీలించిన ఒక జాన్ గోట్‌మ్యాన్ అనే సైకాలజిస్ట్ ‘భార్య చెప్పేది సానుకూలంగా వినే భర్త ఉన్న జంటలు సంతోషంగా గడపడం’ గమనించాడు. ‘అలాగని ఈ జంటల్లో భర్త మాట భార్య వినకపోవడం అంటూ లేదు. వారు ఎలాగూ వింటారు’ అంటాడు గోట్ మ్యాన్. భారతీయ సమాజంలో భర్తకు ఎదురు నిలవడం అందరు భార్యలు చేయరు. అయితే జోక్గానో, గొణుగుతున్నట్టుగానో, అనునయంగానో చెప్పే భార్యలు ఉంటారు. ‘అలాంటి భార్యలు చెప్పింది విని ముందుకు సాగే భర్త ఉన్న జంటలు కూడా ఇంచుమించు గొడవలు లేకుండా ఉంటున్నాయి’ అంటాడు గోట్‌మ్యాన్. భార్యాభర్తల్లో ‘అతను చెప్పేది ఏముందిలే’ అని భార్య అనుకున్నా ‘ఆమెకేం తెలుసు ఆమె ముఖం’ అని భర్త అనుకున్నా ఆ వివాహబంధం ప్రమాదంలో పడుతుంది. ఏ వివాహ బంధమైనా ఒకరి దృష్టికోణం నుంచి నడవదు. కాపురంలో తల్లి తరపు వాళ్లు, తండ్రి తరుపు వారు ఉంటారు. స్నేహితులు ఉంటారు. ఇద్దరి వేరు వేరు కెరీర్లు ఉంటాయి. అంటే ఒక సమస్యకు కచ్చితంగా కనీసం రెండు దృష్టికోణాలుంటాయి. భర్తలు కేవలం తమ దృష్టికోణమే సరైనది అనుకోకూడదు. ‘స్త్రీలు జాగ్రత్తగా అన్నీ గమనించి భర్తకు సూచనలు చేస్తారు. ఆ సూచనలను భర్త ఆమెతో చర్చించాలి. నా మాటే నెగ్గాలి అని తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం ఇద్దరికీ వస్తుంది’ అంటాడు గోట్‌మ్యాన్.భర్త తన స్పందన, అప్పులు, ఇచ్చిన హామీలు, కొన్న/కొనబోయే ఆస్తులు, పిల్లల కోసం పొదుపు, ఆరోగ్య విషయాలు... ఇవన్నీ భార్యకు తెలియచేస్తూ ఆమె సలహాను వినాల్సి ఉంటుంది. అలాగే భర్త ఇంట్లో లేనప్పుడు పిల్లల ప్రవర్తన, వారి కదలికలు, బంధువుల రాకపోకలు వచ్చే డిమాండ్లు ఇవన్నీ భార్య తప్పకుండా భర్తకు చేరవేయాలి. ముఖ్యంగా పిల్లలను కరెక్ట్ చేయాల్సిన అంశాలు భార్య లేవనెత్తినప్పుడు భర్త నిర్లక్ష్యం చేయరాదు.అవి సమస్యలు తెస్తాయి. అందుకే గతంలో స్త్రీల మాట చెల్లుబాటయ్యే సందేశం ఇస్తూ ‘పెళ్లాం చెబితే వినాలి’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ‘ఫైర్’లాంటి పుష్ప కూడా ‘పెళ్లాం మాట వినాలి’ అంటున్నాడు. భార్య సరైన సలహా ఇస్తే దానిని ఎందుకు వినకూడదు చెప్పండి? (చదవండి: హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!) -
YSRCP నేత పూనూరు గౌతమ్ రెడ్డి కుటుంబానికి నేతల పరామర్శ
-
వైఎస్సార్సీపీ నేత కుటుంబం కిడ్నాప్ కలకలం
రామకుప్పం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేత గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాపర్ల నుంచి వారిని పోలీసులు రక్షించారు. ఆ సమయంలో కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెద్దకురబలపల్లిలోని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.మూడు లగ్జరీ కార్లలో వచ్చిన ఆగంతకులు గన్లతో బెదిరించి గోవిందప్ప కుటుంబసభ్యుల్ని కారుల్లో ఎక్కించుకున్నారు. గోవిందప్ప, గంగమ్మ, మాధవమ్మ, సుబ్బక్క, సిద్ధప్ప, సోమశేఖర్, పునీత్‌లను కారుల్లో ఎక్కించుకుని రామకుప్పం వైపు బయలుదేరారు. తాము ఆదాయపన్ను అధికారులమని, మీ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదు అందిందని గోవిందప్పకు చెప్పారు. మీవద్ద దాచిన నగదు ఇస్తే పంచుకుని వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు. విజలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురాం కోసం వాకబు చేశారు. తన తమ్ముడు ఇంటివద్దే ఉన్నట్లు గోవిందప్ప చెప్పడంతో మళ్లీ పెద్దకురబలపల్లి వెళ్లారు. అక్కడ జయరఘురాం లేకపోవడంతో కార్లను రామకుప్పం వైపు తీసుకెళ్లారు. రామకుప్పంలోని వైఎస్సార్ సర్కిల్లో బీట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లను గమనించిన ఆగంతకులు కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాలని బాధితులను బెదిరించారు. ముందు రెండు కార్లను ఆపిన పోలీసులకు బాధితులు ఆవిధంగానే చెప్పారు. అయినా అనుమానించిన పోలీసులు అందరినీ కిందికి దించి ప్రశ్నించసాగారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్లలోని కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ సమయంలో వెనుక ఉన్న మూడోకారు వేగంగా ముందుకెళ్లిపోయింది. ఆ కారులో ఉన్న బాధితులు ఇద్దరిని రెండు కిలోమీటర్ల తరువాత కిడ్నాపర్లు వదిలేసి వెళ్లిపోయారు. చేతులు మారిన నగదే కారణమా? ప్రశాంతంగా ఉన్న రామకుప్పం మండలంలో కిడ్నాప్ అంశం ప్రజల్లో తీవ్రచర్చకు దారితీసింది. రైస్‌పుల్లింగ్ పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారాయని అందులో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగిందన్న చర్చలు సాగుతున్నాయి. దుండగులు కర్ణాటకకు చెందిన వారని తెలిసింది. పోలీసులు మాట్లాడుతుండగానే దుండగులు పరారవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటివారైనా వదిలిపెట్టం: కుప్పం సీఐ మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబం కిడ్నాప్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగా గోవిందప్ప తమ్ముడు జయరఘురాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. నగదు లావాదేవీలు, నగదు మార్పిడి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్ గంగాధరం. దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్ వర్డ్ గంగాధర్. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్ ఎం గంగాధర్‌కే దక్కుతుంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్) అని పేరు పెట్టారు. డాక్టర్ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్ టీమ్’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్ టీమ్‌ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదంఈ ఫ్యామిలీ ఫార్మింగ్ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం. ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ ప్రాంతాలలో వారి సొంత పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు. (గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం. డా. గంగాధరం -
థాయ్‌లాండ్ ట్రిప్‌లో ధోని కుటుంబం.. బీచ్ ఒడ్డున అలా (ఫొటోలు)
-
డబ్బు చేసే మాయ.. 34 ఏళ్ల ఎడబాటుని అమాంతం..!
కుటుంబానికి దూరమై కష్టాల కడలిలో బతుకును సాగించాడు. తనవాళ్లెవరో తెలియక నానా బాధలు పడ్డాడు. అలా 34 ఏళ్లు గడిచిపోయాయి. తీరా తన కుటుంబాన్ని కలుసుకుంటే.. మళ్లీ డబ్బు రూపంలో వచ్చిన స్వార్థం ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది. ఎంతలా అంటే.. కుటుంబాన్నే వద్దనుకునే దాకా!!. ఈ కథ వింటే.. డబ్బు బంధాలతో ఇంత ఘోరంగా ఆడుకుంటుందా..! అని ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన 37 ఏళ్ల యూ బావోబావో రెండేళ్ల ప్రాయంలో తన అమ్మమ్మ ఇంటి నుంచి అపహరణకు గురై మానవ అక్రమ రవాణదారుల ముఠా(హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్) చేతిలో చిక్కుకున్నాడు. అలా అక్కడ నుంచి ఓ ధనిక కుటుంబానికి విక్రయించబడ్డాడు. ఆ కుటుంబ సభ్యులు యు బాగోగులు చూడకపోగా.. హింసించింది. అయితే.. ఆ తర్వాత ఐదేళ్లకు మరో కుటుంబానికి దత్తతగా వెళ్లాడు. అలా 11వ ఏడు రాగానే మళ్లీ మరో కుటుంబం చెంతకు చేరాడు యూ. ఇక యు వాళ్లందరితో పడిపడి విసిగివేశారి బయటకొచ్చేశాడు. సరిగ్గా 19 ఏళ్లు రాగానే బీజింగ్‌కు చేరకుని అక్కడ డెలివరీ రైడర్‌గా స్థిరపడ్డాడు. అదే టైంలో.. తాను పుట్టిన కుటుంబం ఆచూకీ కోసం ఎంతగానో అన్వేషిస్తూ ఉన్నాడు. సరిగ్గా అతడి డీఎన్ఏ మ్యాచ్ అయిన కుటుంబ వివరాలు గురించి పోలీసులు తెలియజేయడంతో యూ ఆనందానికి అవధులు లేకుండాపోయింది. తన కుటుంబాన్ని కలుసుకుని తన తల్లి ఒడిలో సేదతీరాలనుకున్నాడు. కానీ, యుకి ఆ క్షణంలో తెలియలేదు ఈ భావోద్వేగభరిత ఆనందం ఎంతో కాలం నిలవదని. తీరా అక్కడకు వెళ్లాక యుకి..తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, తనకి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ తర్వాత యూ చేసిన స్ట్రీమింగ్ వ్యాపారం లాభాల బాటపట్టింది. అయితే తన కుటుంబ ఒత్తిడి మేరకు 60% ఆదాయాన్ని తన ఇద్దరు తమ్ముళ్లుతో పంచుకునేందుకు అంగీకరించాడు. అంత చేసినా.. యూకి తన మొత్తం సంపాదనలో న్యాయబద్ధంగా తనకు రావాల్సిన వాట వచ్చేది కాదు. పైగా కొత్తగా చేరువయ్యిన తోబుట్టువులు మా కుటుబంలోని వ్యక్తిగా అంగీకరిస్తున్నాం కాబట్టి నీ స్వార్జితంలో వాటా ఇవ్వాల్సిందే అని శాసించడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగక 'దత్తపుత్రుడు' అని పిలుస్తూ గేలి చేయడం వంటివి చేశారు. దీనికి తోడు తల్లి కూడా తన ఇద్దరు పిల్లలపై ప్రేమతో పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తూ.. యూని డబ్బులు కోసం వాడుకోవడం మొదలుపెట్టింది. దీంతో తీవ్ర నిరాశ నిస్ప్రుహలకు గురై..చివరికి కుటుంబాన్ని వదిలేద్దామన్న విరక్తికి వచ్చేశాడు. ఈ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా వివరించాడా వ్యక్తి. అంతేగాదు తన సంపాదనంత తనలా హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడ్డ బాధితుల కోసం ఖర్చు చేయాలనుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. డబ్బు ఎంత గొప్పదో.. అంత చెడ్డది అని కొందరు ఆ యూ పోస్ట్‌కు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!) -
డియోర్ బ్యాగ్‌పై క్లారిటీ.. ఎవరీ జయ కిషోరి
ఢిల్లీ: ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి సుమారు రూ.2 లక్షల విలువైన డియోర్ బ్యాగ్‌తో ఇటీవల ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీంతో నిరాడంబర జీవితం గడపాలని బోధనలు చేసే.. ఆమె ఇలా ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె ఖరీదై బ్యాగ్ వాడటంపై ఫాలోవర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై 29 ఏళ్ల జయ కిషోరీ తాజాగా స్పందించారు.‘‘నేను కూడా సాధారణ అమ్మాయినే. సాధారణమైన ఇంట్లోనే ఉంటున్నా. కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. యువత కష్టపడాలి. కష్టపడి డబ్బులు సంపాదించాలి. మంచి జీవితం కోసం ఖర్చు పెట్టుకోవాలి. కుటుంబానికి ఇవ్వాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాను. ఈ బ్యాగ్ కస్టమైజ్డ్. అందులో లెదర్ ఉపయోగించలేదు. కస్టమైజ్డ్ అంటే మన ఇష్ట ప్రకారం తయారు చేసుకోవచ్చు. దానిపై నా పేరు కూడా రాసి ఉంది. ...నేనెప్పుడూ లెదర్ వాడలేదు, వాడను కూడా. నేను దేనినీ వదులుకోలేదు. కాబట్టి నేను అలా చేయమని మీకు ఎలా చెప్పగలను?. నేను సన్యాసిని, సాధువు లేదా సాధ్విని కాదని మొదటి రోజు నుంచే స్పష్టంగా చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. జయ కిషోరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12.3 మిలియన్లకు ఫాలో అవుతున్నారు.Jaya Kishori ji Said I'm not BABa or SANT, I'm just ordinary girl !!Waah kya Acting hai phle Dharm k naam pr paisa chapo or fir ye gyaan do . waah DIDI waah 🫡 pic.twitter.com/bCQjD4zedE— Yogesh (@yogesh_xrma) October 29, 2024ఎవరీ జయ కిషోరి..యువ ఆధ్యాత్మిక వక్తగా జయ కిషోరి తన ప్రేరణాత్మక సందేశాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆమె ఆధ్యాత్మిక కథలు చెప్పటంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె వక్తనే కాకుండా సంగీత కళాకారిణీ, కథకురాలు కూడా. జయ కిషోరి 13 జూలై, 1996న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఓపెన్ స్కూల్ ద్వారా బి.కామ్ పూర్తి చేశారు. ఆమె ఫాలోవర్స్ ద్వారా 'ది మీరా ఆఫ్ మోడర్న్ వరల్డ్', 'కిషోరి జీ'గా ప్రసిద్ధి చెందారు. జయ కేవలం ఏడేళ్ల వయస్సులోనే బహిరంగంగా ఉపన్యాసం ఇవ్వటం ప్రారంభించారు. ఆమె తన 7 రోజుల నిడివి గల మానసిక కథ 'శ్రీమద్ భగవత్ గీత', 3 రోజుల నిడివి గల 'కథా నాని బాయి రో మేరో'తో గుర్తింపు పొందారు. మరోవైపు.. ఆమె శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆమె భజనలు యూట్యూబ్‌లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె జూలై 24, 2021న ‘జయ కిషోరి ప్రేరణ’ అనే కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఆమె ఛానెల్‌కు దాదాపు 9 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రసిద్ధ పాటల్లో ‘శివ్ స్తోత్ర’, ‘మేరే కన్హా’, ‘సాజన్ మేరో గిర్ధారి’ వంటివి ఉన్నాయి.చదవండి: టికెట్ నిరాకరణ, సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం.. ‘తగిన శాస్తి జరిగిందంటూ’... -
సిద్ధ గురువులు ప్రసాదించిన వరం యోగం
మన దేహం ఆలయం లాంటిది. అందుకే తమ దేహాన్నే ఒక పవిత్ర క్షేత్రంగా చేసుకుని సాధన చేసుకున్నారు చేసుకున్నారు యోగులు. శరీరమనే ఈ క్షేత్రంలో సుషుమ్న అనే ఏకైక దైవనాడి ఉంటుంది. శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉంటే అందులో సుషుమ్న నాడి ఒక్కటే దైవనాడి. నాడులు అంటే శరీరమంతటికీ శక్తిని ప్రసారం చేసే వాహికలు. యోగ శాస్త్రం మూడు శరీరాలను గురించి వివరిస్తుంది. భౌతిక దేహం, శక్తి దేహం, కారణ దేహం. ఈ మూడూ కలిసి పని చేస్తూ ఉంటాయి. భౌతిక శరీరానికి ఆహార అసమతౌల్యం కారణంగా అనేక రుగ్మతలు వచ్చినట్లు, శక్తి శరీరంలో లోపాల వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ప్రధానమైన అవయవాల పనితీరుకు, శక్తి శరీరానికి ప్రగాఢమైన సంబంధం ఉంటుంది. ఈ సకల సృష్టి విశ్వశక్తి పైనే ఆధారపడి ఉంటుంది. జీవులన్నీ నిద్రావస్థలో విశ్వం నుంచి శక్తిని గ్రహిస్తాయి. అయితే మానవులకు నిద్రలో స్వీకరించే శక్తి మాత్రమే సరిపోదు. ఇప్పటి వేగయుగంలో అదనపు శక్తి అవసరం. ఆ శక్తి కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది. వెన్ను పాము అడ్డంగా ఉన్న జీవులను తిర్యక్ జీవులని, వెన్నెముక నిలువుగా ఉన్న జీవులను మానవులనీ తెలియజేస్తుంది యోగ శాస్త్రం. జీవులన్నింటిలోకీ మానవుడు అగ్రగణ్యుడు. వజ్ర సమానమైన వెన్నెముక వల్లే మానవుడికి పరమోన్నతమైన స్థితికి చే రుకోగలిగే అద్భుతమైన శక్తిని, అవకాశాన్నీ ఈ సృష్టి ప్రసాదిస్తుంది. నిద్రాణంగా ఉన్న సుషుమ్న నాడి ఉత్తేజితమై, ఈ దివ్య నాడిలో కుండలిని జాగరణ జరిగి, మూలాధార చక్రం నుండి సహస్రారం చేరినప్పుడు మనిషికి దివ్యానంద స్థితి అనుభవంలోకి వస్తుంది. ఈ విధంగా జరిగినప్పుడు మానవ శరీరమే ఒక మహాÔ¶ క్తి క్షేత్రంగా మారుతుంది. భగవత్ తత్త్వాన్ని బాహ్యంగా గాక అనుభవ పూర్తిగా అర్థం చేసుకునే ఏకైక మార్గమే ధ్యానసాధన. సుషుమ్నా క్రియా యోగసాధన ద్వారా తక్కువ సమయంలోనే అ΄ారమైన శక్తిని స్వీకరించవచ్చు. సుషుమ్నా క్రియ యోగధ్యానం నాలుగు ప్రక్రియల కలయిక. ఈ సాధనకు ఎటువంటి కఠిన నియమాలూ లేవు. ఈ ధ్యానం మానవులందరి కోసం సిద్ధ గురువులు ప్రసాదించిన గొప్ప వరం. – ఆత్మానందమయి -
ఊరకరారు మహాత్ములు...
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో ఐదవది – ‘....నృయజ్ఞోతిథిపూజనమ్’. అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. నేను ఆహ్వానిస్తే నా ఇంటికి వచ్చినవాడు అతిథి. నేను ఆహ్వానించకుండా వచ్చినవాడు– అభ్యాగతుడు. అతిథి పూజనమ్...పూజించడం అంటే గౌరవించడం. ఇంటికి వచ్చినవారిపట్ల మర్యాదగా మెలుగుతూ గౌరవించి పంపడం నేర్చుకో... తన ఇంటికి వచ్చినవాడు గొప్పవాడా, నిరక్షరాస్యుడా, సామాన్యుడా అన్న వివక్ష గృహస్థుకు ఉండదు. భోజనం వేళకు వచ్చాడు. భోజనం పెట్టు. లేదా ఏ పండో కాయో లేదా కాసిని మంచినీళ్లయినా ఇవ్వు.. అన్ని వేళలా అన్ని పెట్టాలనేం లేదు. వచ్చిన వారిని ప్రేమగా పలకరించు. నీకూ పరిమితులు ఉండవచ్చు. వాటికి లోబడే ఎంత సమయాన్ని కేటాయించగలవో అంతే కేటాయించు. కానీ ఒట్టి చేతులతో పంపకు. పండో ఫలమో ఇవ్వు. లేదా కనీసం గుక్కెడు చల్లటి నీళ్ళయినా ఇవ్వు. నీకు సమయం లేక΄ోతే ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించు. అతిథి సేవతో గృహస్థు పాపాలు దహించుకు ΄ోతున్నాయి. కారణం – ఆయన ఏది పెడుతున్నాడో దానిని ‘నేను పెడుతున్నాను’ అన్న భావనతో పెట్టడు. వచ్చిన అతిథి నీ దగ్గరకు వచ్చి గుక్కెడు నీళ్ళు తాగాడు, ఫలహారం చేసాడు, భోజనం చేసాడు...అంటే అవి అతనికి లేక దొరకక రాలేదు నీదగ్గరికి. ఆయన హాయిగా అవన్నీ అనుభవిస్తున్న స్తోమత ఉన్నవాడే. కానీ ఆయన ఏదో కార్యం మీద వచ్చాడు. భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రాడు నీ ఇంటికి. అతిథి రూపంలో వస్తాడు. ఆ సమయంలో నీవిచ్చిన నీళ్ళు తాగవచ్చు, పట్టెడన్నం తినవచ్చు, బట్టలు కూడా పుచ్చుకోవచ్చు. కానీ ఆయన పుచ్చుకున్న వాడిగా ఉంటాడు. అలా ఉండి నీ ఉద్ధరణకు కారణమవుతాడు. అందునా నీవు పిలవకుండానే వచ్చాడు. అభ్యాగతీ స్వయం విష్ణుః– విష్ణుమూర్తే నీ ఇంటికి వచ్చాడని గుర్తించు. మహితాత్ములైనవారు, భాగవతోత్తములు, భగవద్భక్తి కలవారు నీ ఇంటికి వస్తే.. గృహదేవతలు కూడా సంతోషిస్తారు.అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం అతిథి పూజనమే. అతిథికి నీవు పెట్టలేదు. భగవంతుడే అతిథి రూపంలోవచ్చి నీదగ్గర తీసుకున్నాడు. అతిథిని మీరు విష్ణు స్వరూపంగా భావించి పెట్టినప్పుడు మీ అభ్యున్నతికి కారణమవుతుంది. మహాత్ములయినవారు మనింటికి వస్తూండడమే దానికి సంకేతం. శ్రీ కృష్ణుడి క్షేమ సమాచారం తెలుసుకురమ్మని వసుదేవుడు పంపిన పురోహితుడితో నందుడు ‘‘ఊరకరారు మహాత్ములు/ వారథముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం/గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా !’’ అంటాడు. అతిథి ఇంట అడుగు పెట్టడం అంత గొప్పగా భావిస్తుంది మన సమాజం.రామకార్యంమీద పోతున్న హనుమకు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమని అర్ధిస్తాడు. ఇప్పుడు వీలుపడదంటే...కనీసం ఒక్క పండయినా తిని కాసేపు విశ్రాంతయినా తీసుకువెళ్ళమంటాడు. ఇంటి ముందు నిలిచిన బ్రహ్మచారి ‘భవతీ భిక్షాందేహి’ అంటే... ఇంట్లో ఏవీ లేవంటూ ఇల్లంతా వెతికి ఒక ఎండి΄ోయిన ఉసిరికాయ తెచ్చి శంకరుడి భిక్షా΄ాత్రలో వేస్తుంది ఒక పేదరాలు. ఆ మాత్రం అతిథి పూజకే ఆమె ఇంట బంగారు ఉసిరికకాయలు వర్షంలా కురిసాయి. -
కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం
అంజలి ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగింది. తండ్రి ప్రధాన ఆదాయదారుడిగా ఉండగా, తల్లి ఇంటిని నిర్వహిస్తూ, పిల్లలను చూసుకునేవారు. ఇంట్లో ఎవరేం చేయాలనే విషయంలో స్పష్టత ఉండేది. ఈ వాతావరణంలో పుట్టి, పెరిగిన అంజలికి భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేశాక అంజలికి రాజుతో వివాహమైంది. రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండగా అంజలి హౌస్ వైఫ్ బాధ్యతలను ఆనందంగా స్వీకరించింది. ఇద్దరూ సంతోషంగా గడిపేవారు. ఒక బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకుంటూ ఇంటిపనులు చేయడం అంజలికి కష్టంగా ఉండేది. ఇద్దరు బిడ్డలు పుట్టాక అది మరింత కష్టంగా మారింది. ఉదయాన్నే లేచి రాజుకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల కార్యకలాపాలను నిర్వహించడం, ఇంటి పనులు చూసుకోవడంతో చాలా అలిసిపోయేది. రాజు కొంత సహాయం చేసినప్పటికీ అది అంజలి ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. దాంతో అంజలి చాలా ఒత్తిడిని అనుభవించేది. నిరంతర సమస్యలుక్రమక్రమంగా అంజలికి శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమ కూడా పెరిగింది. భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ మకూర్చే క్రమంలో అంజలి తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. తాను అనుభవిస్తున్న ఒత్తిడిని రాజుకు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఆమె తన అవసరాలను చెప్పగానే, రాజు వాటిని నిర్లక్ష్యం చేసేవాడు లేదా తప్పుగా అర్థం చేసుకునేవాడు. లేదంటే తాను ఆఫీసులో ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడో చిట్టా విప్పవాడు. అలా మాట్లాడుతుంటే అంజలి మనసు చివుక్కుమనేది. ‘ఇదేంటి ఈ మనిషి నేను చెప్పేది వినడు, నా కష్టం పట్టించుకోడు’ అనిపించేది. కాలం గడిచేకొద్దీ, కుటుంబంకోసం రాజు కష్టపడుతున్నా, అదే కుటుంబంకోసం తాను పడుతున్న కష్టాన్ని గుర్తించడంలేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించింది. రాజును కేవలం భర్తగా కంటే రూమ్మేట్ గా చూడటం ప్రారంభించింది. మరోవైపు భార్యగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని బాధపడేది. ఇది ఆమెను అపరాధభావనలోకి చెట్టింది. తనలో మరింత నిరాశను, అంతర్గత ఘర్షణను సృష్టించింది.ఇవన్నీ కలిసి అంజలి మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపాయి. ఆందోళన పెరిగింది. ఆత్మవిశ్వాసం తగ్గింది. నేను మంచి భార్యనైతే ఇలా ఆలోచించేదాన్ని కాదనే అపరాధభావం పెరిగి పెద్దదైంది. దాన్నుంచి బయటపడేందుకు ఇంటిపనుల కోసం మరింత సమయం వెచ్చించేంది. అది మళ్లీ ఆమె అలసటను, అసంతృప్తిని పెంచేది. దాంతో అప్పుడప్పుడూ రాజుపై అరిచేది, గొడవపడేది. అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. చికిత్స లక్ష్యాలు... పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అంజలి కౌన్సెలింగ్ కోసం మా క్లినిక్ కు వచ్చింది. తన మానసిక స్థితిని పూర్తిగా వివరించింది. తన ఆందోళనను తగ్గించడంతోపాటు, రాజుతో తన బంధాన్ని బలపరిచేందుకు సహాయం చేయాలని కోరింది. మొదటి సెషన్ లో ఆమెతో మాట్లాడాక, రెండో సెషన్ కు రాజుతో పాటు రావాలని సూచించాను. రెండో సెషన్ లో వారిద్దరితో మాట్లాడాక కౌన్సెలింగ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. అంజలి, రాజులు పరస్పర అవసరాలను, భావాలను, ఆందోళనలను వ్యక్తపరచడానికి అవసరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం. వైవాహిక బాధ్యతలు, భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా బంధాన్ని సరిదిద్దడం, సమాన భాగస్వామ్యాన్ని స్థాపించడం. కుటుంబ రోల్స్, బాధ్యతలు, భాగస్వామ్య భావనలను ప్రభావితం చేసే వ్యక్తిగత విలువలు, అంచనాలు, సామాజిక ప్రభావాలను అన్వేషించడం. •ఒత్తిడి, ఆందోళన, నిరాశను మేనేజ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ ను అభివృద్ధి చేయడం. చికిత్స సాగిన విధానంరాజు, అంజలి మధ్య బంధాన్ని, కమ్యూనికేషన్ ను మెరుగుపరిచేందుకు ప్రొటోకాల్ రూపొందించాను. అందులో మొదటిది I Sentences. అంజలి రాజును బ్లేమ్ చేయడం కాకుండా, తన భావాలను వ్యక్తం చేయడానికి ‘‘నేనిలా అనుకుంటున్నాను, నేనిలా ఫీలవుతున్నాను’’ అని ‘ఐ సెంటెన్సెస్’ ఉపయోగించడం ప్రారంభించింది. దాంతో రాజు తనను బ్లేమ్ చేస్తుందనే భావన లేకుండా ఓపెన్ గా వినడం మొదలుపెట్టాడు. రాజు అలా వినడం అంజలికి సంతృప్తినిచ్చింది. కుటుంబంలో ఏ పనులు ఎవరు చేయాలనే విషయంపై ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. వారానికోసారి ఈ అంశంపై ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అంగీకరించారు. ఇది అంజలిపై పని ఒత్తిడి భారాన్ని, ఒత్తిడికి లోనవుతున్నాననే భావనను అధిగమించడానికి ఉపయోగపడింది. వారానికోసారి ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి కష్టాన్ని మరొకరు శ్రద్ధగా ఆలకించడం, సహాయాన్ని ఆఫర్ చేయడం వారిద్దరి మధ్య బంధం, అనుబంధం పెరిగేందుకు సహాయపడింది. దీంతోపాటు మరికొన్ని థెరప్యూటిక్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఆరునెలల్లో వారి మధ్య బంధం బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ప్రశాంతంగా, ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066ww.psyvisesh.com -
బ్యాంకాక్‌లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
దసరా, దీపావళి సంబరాల్లో సమీరా రెడ్డి.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
-
Tata Family Tree: టాటా వంశవృక్షం ఇదే..
టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థగా గుర్తింపు పొందింది. టాటా గ్రూప్‌లో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా గ్రూప్ ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. టాటా గ్రూప్ 1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైంది. ఈ కంపెనీ అధిపతి రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు.టాటా గ్రూప్ వంశవృక్షాన్ని పరిశీలిస్తే ఈ కుటుంబంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. టాటా కుటుంబ వ్యాపారానికి రతన్ దొరబ్ టాటా పునాది వేశారు. ఆయనకు ఇద్దరు సంతానం. వారు బాయి నవాజ్‌బాయి రతన్ టాటా, నుస్సర్వాన్జీ రతన్ టాటా. నుస్సర్వాన్జీ ఒక పార్సీ పండితుడు. ఈ కుటుంబం నుంచి వ్యాపారంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. అతను 1822లో జన్మించి 1886లో మరణించారు. జంషెడ్జీ టాటానుస్సర్వాన్జీ టాటాకు ఐదుగురు సంతానం. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్జీ టాటా ఒకరు. అతను టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. టాటా గ్రూప్‌లోని స్టీల్ (టాటా స్టీల్), హోటళ్లు (తాజ్ మహల్) వంటి ప్రధాన వ్యాపారాలకు పునాది వేశారు. ఆయనను భారతీయ పరిశ్రమ పితామహునిగా పిలుస్తారు. అతని జీవిత కాలం 1839 నుండి 1904.దొరాబ్జీ టాటాదొరాబ్జీ టాటా జంషెడ్జీ టాటా పెద్ద కుమారుడు. జంషెడ్జీ టాటా తర్వాత టాటా గ్రూప్ వ్యాపారాన్ని ఆయనే చేపట్టారు. అతని జీవిత కాలం 1859-1932. టాటా పవర్ వంటి వ్యాపారాలను నెలకొల్పడంలో దొరాబ్జీ కీలక పాత్ర పోషించారు.రతన్ జీ టాటారతన్జీ టాటా జంషెడ్జీ టాటా చిన్న కుమారుడు. అతని జీవితకాలం 1871 నుండి 1918. అతను టాటా గ్రూప్‌నకు పత్తి- వస్త్ర పరిశ్రమల వంటి వ్యాపారాలను జోడించారు.జేఆర్డీ టాటాజేఆర్డీ టాటా పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా. అతని జీవితకాలం 1904-1993. ఇతను రతన్జీ టాటా, సుజానే బ్రియర్ల కుమారుడు. 50 ఏళ్లకు పైగా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా ఎయిర్‌లైన్స్‌ను జెఆర్‌డి టాటా స్థాపించారు. ఈ విమానయాన సంస్థ పేరు ఎయిర్ ఇండియా.నావల్ టాటానావల్ టాటా జీవిత కాలం 1904- 1989. ఇతను రతన్జీ టాటా దత్తపుత్రుడు. రతన్ నావల్ టాటా 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా, 2016-17మధ్యలో తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ , టెట్లీ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల కొనుగోలులో నావల్ టాటా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు.రతన్ టాటారతన్ టాటా జీవిత కాలం 1937 నుండి 2024. ఈయన నావల్ టాటా, సునీ కమిషరియట్ల కుమారుడు. రతన్ టాటా భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.నోయల్ టాటాకు ముగ్గురు కుమారులురతన్ టాటా వరుస సోదరుడు నోయెల్ టాటా ముగ్గురు సంతానం. వారు మాయా టాటా, నెవిల్లే టాటా, లియా టాటా. ఈ ముగ్గురూ టాటా గ్రూప్‌లో వేర్వేరు వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో -
ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం
ముంబై: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. రెండంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. చెంబూరులోని సిద్ధార్థ్ కాలనీలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణంలో మంటలు చెలరేగి.. పై అంతస్తుకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. మృతులను పారిస్ గుప్తా, నరేంద్ర గుప్తా, మంజు ప్రేమ్ గుప్తా, అనితా గుప్తా, ప్రేమ్ గుప్తా, విధి గుప్తా, గీతా గుప్తాగా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ప్రియుడి మోజులో.. ఆమె భర్తను ఏం చేసిందంటే? -
సింగర్ గీతామాధురి కొడుకుని చూశారా.. క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
ఆన్లైన్ బెట్టింగ్‌లకు కుటుంబం బలి
సాక్షి,నిజామాబాద్ జిల్లా:జిల్లాలోని ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో శనివారం(అక్టోబర్5) విషాదఘటన చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు.కొడుకు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోని అప్పుల పాలు కావడంతో తల్లి తండ్రితో పాటు హరీష్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు.కొడుకు హరీష్ ఆన్లైన్లో రూ.20 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం.ఈ అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు పొలం కూడా అమ్మారని, అయినా అప్పులు తీరకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య -
వన్ స్టేట్.. వన్ కార్డు
సాక్షి,హైదరాబాద్: ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ నగరంలోని 24 నియోజకవర్గాల్లోని ఒక్కో కాలనీలోనూ సర్వే జరుగుతోంది. ఇంతకీ ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డు కోసం జరుపుతున్న సర్వేలో ఏమేం సేకరిస్తారు? దీని వల్ల ప్రయోజనమేమిటి? తదితర అంశాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం వ్యక్తిగత గుర్తింపుగా ఎక్కడైనా ఆధార్‌ను అంగీకరిస్తున్నారు. కానీ ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ఎలాంటి కార్డులు లేవు. ఈ ఫ్యామిలీ కార్డుల ద్వారా కుటుంబాన్ని గుర్తించవచ్చు. అంటే రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ‘వన్ స్టేట్– వన్ కార్డ్’గా ఈ కార్డు ఉపకరిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి కార్డులున్నాయి. రాజస్థాన్‌లో జన్ ఆధార్ స్కీమ్ కింద 10 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీలు, 11 అంకెలతో కూడిన వ్యక్తిగత ఐడీలు ఇచ్చారు. హరియాణాలో పరివార్ పెహచాన్ పాత్ర (పీపీపీ) కింద 8 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీ కార్డులిచ్చారు. కర్ణాటకలో 12 అంకెలతో కూడిన ‘కుటుంబ’ ఐడీలను జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 12 అంకెలతో కూడిన డిజిట్ ఫ్యామిలీ కార్డును వినియోగిస్తున్నారు. అక్కడ రేషన్కార్డుగా దాన్నే వినియోగిస్తున్నారు. వ్యక్తిగత ఐడీలు.. తెలంగాణలో కుటుంబాన్ని ఒక యూనిట్‌గా గుర్తించేందుకు ఫ్యామిలీకార్డు ఉపకరిస్తుంది. కుటుంబంలోని అందరికీ ఒకే ఐడీ నంబర్ ఉండటంతో పాటు కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా వేర్వేరు ఐడీలిస్తారు. కుటుంబాల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా దేశంలోని అందరికీ ఆధార్ కార్డులిచ్చినట్లే రాష్ట్రంలోని అందరికీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులిస్తారు. కుటుంబంలోని మహిళల్లో పెద్ద వారిని కుటుంబ పెద్ద(హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ)గా గుర్తిస్తారు. వ్యక్తిగత ఐడీలు జారీ అయ్యాక మారవు. శాశ్వతంగా అవే ఉంటాయి. కుటుంబంలోని కుమారుల పెళ్లిళ్లు జరిగి కోడళ్లు వస్తే కుటుంబంలో కొత్త సభ్యులుగా చేర్చేందుకు, మరణించిన వారిని తొలగించేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబం చిన్న కుటుంబాలుగా విడిపోతే కొత్త కుటుంబంగా అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కుటుంబం మొత్తం కలిసి ఉన్న ఫొటో తీసుకుంటారు. నగరంలో 8వ తేదీ వరకు సర్వే జరిపి, 9న స్రూ్కటినీ చేసి 10వ తేదీన ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఒకే చోట అన్ని వివరాలు.. ప్రస్తుతం ఒక కుటుంబంలోని వారు వివిధ పథకాల కింద వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నప్పటికీ ఆ వివరాలు ఒకే చోట లేవు. ఈ డిజిటల్ కార్డులు వచ్చాక అన్ని వివరాలు ఒక్క మౌజ్ క్లిక్‌తో తెలియనున్నాయి. ప్రభుత్వానికి చెందిన 30 శాఖల సమాచారం సంబంధిత శాఖల ఉంది తప్ప ఒకదానికొకటి అనుసంధానంగా లేవు. కొత్త కార్డుల వల్ల ప్రజలకెదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయని, ఈ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ పనుల ప్రారం¿ోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సీఎం రిలీఫ్‌ఫండ్‌తో సహ ఒక కుటుంబం ఏ పథకాలు వినియోగించుకుంటుందో తెలుస్తుందన్నారు. అంతేకాదు.. హెల్త్ ప్రొఫైల్‌లో భాగంగా గతంలో చేయించుకున్న ఆరోగ్యపరీక్షల వంటి వివరాలు కూడా ఉండటం వల్ల మరోసారి ఆరోగ్య పరీక్షల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. -
అన్ని స్నేహాలూ గొప్పవి కావు
సారిక 28 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్. లీల తన చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నారు. లీలపై సారికకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇటీవలి కాలంలో లీలతో మాట్లాడిన ప్రతిసారీ సారిక తీవ్ర ఎమోషనల్ స్ట్రెస్ ను అనుభవిస్తోంది. ఆ విషయం లీలతో చెప్పలేక, తన స్నేహాన్ని వదల్లేక, తనలో తానే బాధపడుతోంది.సారిక తన ఆఫీసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు లీల ఆమెపై అసూయను వ్యక్తం చేసింది. ‘‘నువ్వెలా సక్సెసవుతున్నావో నాకు తెలియదా ఏంటి’’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ తన సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటుంది. వాటిని పరిష్కరించుకునేందుకు సారికను ఉపయోగించుకుంటోంది. ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉంటి పట్టించుకోకపోతే ‘‘కాస్త సక్సెస్ రాగానే నీకు కళ్లు నెత్తికెక్కాయే. నన్నసలు పట్టించుకోవడం లేదు, నా మాటే వినడం లేదు’’ అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతోంది. తాను ఎంత చేసినా లీల అలా మాట్లాడుతుండటంతో సారిక బాధపడుతోంది. లీలతో స్నేహం కొనసాగించాలా, వదిలేసుకోవాలో అర్థం కావడంలేదు.ఈ నేపథ్యంలో ‘కనెక్షన్ కార్నర్’ కాలమ్ తన దృష్టికి వచ్చింది. అన్ని ఆర్టికల్స్ చదివాక, తన సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీసుకు వచ్చి, తన సమస్య మొత్తం వివరించింది.‘‘నేనెంత పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నించినా నావల్ల కావడంలేదు సర్. లీలతో ఫ్రెండ్షిప్ టాక్సిక్ గా మారింది. నేను నిజంగానే తనతో సరిగా ఉండటంలేదేమోనని గిల్టీ ఫీలింగ్ వస్తోంది. నా మెంటల్ హెల్త్ దెబ్బతింటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.సారిక కష్టాలివీ... ⇒ లీలను కలిసిన ప్రతిసారీ తన సమస్యల చిట్టా విప్పుతుంది. వాటిని వినీవినీ సారిక మానసికంగా అలసిపోతుంది.⇒ సారిక సలహాలు పాటించకపోగా అవసరానికి తనకు సహాయపడటంలేదంటూ లీల పదే పదే మాట్లాడటం వల్ల సారిక అపరాధభావానికి లోనవుతోంది. అందువల్ల ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ⇒ సారిక తన ఆఫీసు విషయాలు లేదా తన సక్సెస్ గురించి చెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, అది ఎవరైనా సాధిస్తారంటూ తక్కువ చేసి మాట్లాడుతోంది. ⇒ సారిక సక్సెస్ పట్ల లీల ఆనందపడకపోగా అసూయను వ్యక్తం చేస్తోంది. అది సారికను నిరుత్సాహపరుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే లీల టాక్సిక్ ఫ్రెండ్షిప్ వల్ల సారిక మానసికంగా బాధపడుతోంది. అందుకే లీలతో స్నేహాన్ని కొనసాగించాలా, వద్దా అనే ఆలోచనలో పడింది.టాక్సిక్ స్నేహాలను వదిలించుకోవాలి... ఒక వ్యక్తి సంతోషంగా జీవించడంలో స్నేహాలది ప్రధాన పాత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని స్నేహాలు విషపూరితంగా ఉంటాయి. వాటివల్ల లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాంటి స్నేహాలను వీలైనంత దూరంగా ఉండటం లేదా త్వరగా వదిలించుకోవడం మంచిది. కొనసాగించక తప్పనిసరి పరిస్థితులుంటే ఆ మేరకు మనసును సిద్ధం చేసుకోవాలి. సారిక సమస్యను అర్థం చేసుకున్నాక ఆమెకు కౌన్సెలింగ్ ప్రారంభించాను. ⇒ ఏరోజుకారోజు తన ఫీలింగ్స్ ను డైరీలో రాయడం ద్వారా తన స్నేహాల్లో ఏవి సంతోషాన్నిస్తున్నాయో, ఏవి బాధపెడుతున్నాయో సారిక తెలుసుకుంది. ⇒ లీల కాల్ చేసిన ప్రతిసారీ పనులు పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిన అవసరం లేదని సారిక తెలుసుకుంది. వారానికి ఒకసారి, 15 నిమిషాలు మాత్రమే కలవాలని నిర్ణయించుకుంది. ⇒ తన గిల్టీ ఫీలింగ్ ను అధిగమించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు నిర్దేశించిన ఎక్సర్సైజ్ లను ప్రాక్టీస్ చేసింది. ⇒ మెడిటేషన్ ద్వారా తన మానసిక స్థితిని అదుపులో ఉంచుకొనడం ప్రారంభించింది. ⇒ రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఆందోళనకు పగ్గాలు వేయగలిగింది. ⇒ తనను సమర్థించే, ప్రోత్సహించే స్నేహితుల సంఖ్యను పెంచుకుంది. ⇒ లీల మాటల్లోని నెగెటివిటీని అధిగమించడం నేర్చుకుంది. ⇒ రోజూ పాజిటివ్ అఫర్మేషన్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా భావోద్వేగాలపై అదుపు సాధించగలిగింది. అలా సారిక కేవలం నాలుగు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది. లీలతో స్నేహం తెంపేసుకోకుండానే, ఆమె మాటల్లోని నెగెటివిటీని పక్కన పెట్టేయడం నేర్చుకుంది. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉండి, తన కెరీర్ పై మరింత దృష్టి సారించి, మరింత సక్సెస్ సాధించగలిగింది. మీకూ అలాంటి స్నేహాలుంటే వీలైనంత వరకూ తగ్గించుకోండి. అది మీ మానసిక ఆరోగ్యానికి ముఖ్యం.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
గుట్టు విప్పిన సమాధి..
‘తండ్రి సమాధి దగ్గర అన్నదమ్ముల తన్నులాట. ఉత్తరప్రదేశ్‌లోని అజీజ్పూర్లో జరిగిన ఈ సంఘటన ఊళ్లో వాళ్లందరినీ విస్మయానికి గురి చేసింది. శిథిలావస్థకు చేరిన తండ్రి సమాధికి మరమ్మతులు చేయాలని తమ్ముడు, అవసరంలేదు.. ఎలా ఉందో అలాగే ఉంచాలని అన్న పట్టుబట్టడంతో వాదన తగువుగా మారి, చేయి చేసుకోవడం వరకు వెళ్లింది. అన్న మొండిపట్టుపై అనుమానం వచ్చిన తమ్ముడు, అన్న మీద నిఘా పెట్టాడు. ఓ రాత్రివేళ అన్న.. తండ్రి సమాధి పక్కనున్న గుంతలోంచి ఒక కుండను తీసుకెళ్లడం తమ్ముడి కంటబడింది. అన్నకు ఎదురెళ్లి ఆ కుండను లాక్కొని చూశాడు. అందులో బంగారం ఉంది. హతాశుడయ్యాడు. అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ’ అంటూ చదువుకుపోతున్నాడు ఐటీ ఆఫీస్‌లో.. ఓ ఉద్యోగి.నవ్వుతూ ఆ వార్తను వింటున్న ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. వెంటనే తన కొలీగ్ చేతుల్లోంచి ఆ పేపర్ లాక్కొని తమ ఆఫీసర్ క్యుబికల్ వైపు పరుగెత్తినట్టే వెళ్లింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు అప్పటిదాకా వార్త చదివిన కొలీగ్. బాస్ దగ్గరకు వెళ్లిన ఆ మహిళా ఉద్యోగి ‘సర్.. మన లాస్ట్ రైడ్‌లో..’ అని ఏదో చెప్పబోతుండగా..‘లీవిట్ .. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఓ పెద్ద వ్యక్తిని ఇన్సల్ట్ చేసినట్టయింది. డిపార్ట్మెంట్ పరువుపోయింది’ అన్నాడు బాస్ అసహనంగా!‘సర్.. అతని సొంతూరులో.. ’ అని మళ్లీ ఆమె ఏదో చెప్పబోతుండగా.. ‘ఆ విషయాన్ని వదిలేయండి అన్నాను కదా..’ అన్నాడు ఫైల్లోంచి ముఖం బయటపెట్టకుండానే!‘అదికాదు సర్.. అతని సొంతూరు.. ’ అని తన మాటను పూర్తి చేయాలని ఆమె ప్రయత్నిస్తుండగా.. బాస్ మళ్లీ అడ్డుపడుతూ ‘సొంతిల్లు, బంధువుల ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదామ్లు అన్నీ సర్చ్ చేశాం. ఎక్కడా చిల్లి గవ్వ, చిరిగిన డాక్యుమెంట్ కూడా దొరకలేదు’ అన్నాడు కాస్త చిరాగ్గా. ‘బట్ సర్ అతని తండ్రి సమాధి సర్చ్ చేయలేదు కదా’ స్థిరంగా అన్నది ఆ ఉద్యోగిని. అప్పుడు తలెత్తి ఆమె వంక చూశాడు అతను. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.. ‘సర్.. ఆ బడాబాబు, రీసెంట్గా తన తండ్రి పదిహేనో వర్ధంతి సందర్భంగా.. తన పొలంలో ఉన్న తండ్రి సమాధిని రెనోవేట్ చేశాడని మొన్ననే పేపర్లో చదివాను. దాన్నో విశ్రాంతి మందిరంలా తీర్చిదిద్దాడని పేపర్లు తెగ పొగిడాయి’ అంటూ ఆగింది. ‘అయితే ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు. వెంటనే అతని చేతుల్లో తను లాక్కొచ్చిన పేపర్ పెట్టి, ఇందాక తన కొలీగ్ చదివిన వార్తను చూపించింది ఆమె. ఆ వార్త మీద దృష్టిసారించాడు ఆఫీసర్. రెండు నిమిషాల తర్వాత ‘యెస్.. ఎలా మిస్ అయ్యాం ఈ పాయింట్‌ని?’ అన్నాడు పేపర్‌ను మడిచేస్తూ!‘సర్.. ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు!’ అంది ఆమె ఉత్సాహంగా!నాలుగు రోజలకు.. బడాబాబు సొంతూరులోని పొలానికి చేరుకుంది ఐటీ టీమ్. పేపర్లు పొగిడినట్టే అది నిజంగానే సమాధిలా లేదు. వాచ్‌మన్ ఉన్నాడు. తామెవరో చెప్పి, ముందుకు మూవ్ అయ్యారు. ఆ సమాధిని పరిశీలిస్తుండగానే బడాబాబు తన పరివారంతో రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. కారు పార్క్ అవుతుండగానే హడావిడిగా కారు దిగి, పరుగెడుతున్నట్టుగా ఐటీ టీమ్‌ని చేరాడు. ‘మా కుటుంబానికి మాత్రమే పర్మిషన్ ఉన్న ప్లేస్ ఇది’ అంటూ బడాబాబు.. ఐటీ ఆఫీసర్ మీదకు పళ్లునూరుతుండగానే ‘కూల్ సర్, మీకు సంబంధించిన అన్ని చోట్లా ఇన్క్లూడింగ్ ఈ సమాధి.. సర్చ్ చేసుకునే పర్మిషన్ మాకుంది’ అంటూ అనుమతుల పత్రం చూపించాడు ఐటీ ఆఫీసర్. ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు బడాబాబు. పక్కనే ఉన్న అతని అíసిస్టెంట్తో ‘సర్కి మంచినీళ్లు’ అంటూ సైగ చేశాడు ఐటీ ఆఫీసర్. ‘నో థాంక్స్’ అంటూ కోపంగా అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాడు బడాబాబు. సమాధి చుట్టూ పరిశీలించారు ఐటీ వాళ్లు. అనుమానం ఉన్న చోటల్లా తట్టారు. ఏమీ కనిపించలేదు. రహస్య అరలేవీ తెరుచుకోలేదు. ఇదీ వృథా ప్రయాసే కాదు కదా అనుకుంటూ బడాబాబు వైపు చూశాడు ఐటీ ఆఫీసర్. అతని ముఖంలో చాలా కంగారు కనపడుతోంది. అయితే అంతా కరెక్ట్‌గానే జరుగుతోంది అనే భరోసాకు వచ్చాడు ఐటీ ఆఫీసర్. అతను అలా అనుకుంటున్నాడో లేదో.. ‘సర్’ అంటూ పిలిచాడు ఉద్యోగి. ఒక్క అంగలో అక్కడికి వెళ్లాడు ఆఫీసర్. సరిగ్గా సమాధికి ముందు ఫ్లోరింగ్‌లోని నాలుగు మార్బుల్స్ డిజైన్‌లో ఏదో తేడాగా ఉంది. చూపించాడు ఉద్యోగి. చూశాడు ఆఫీసర్. ప్రత్యేక డిజైన్లా కనపడుతోంది కానీ.. సమ్‌థింగ్ ఫిషీ అనుకున్నాడు. బడాబాబు వైపు చూశాడు. అతనిలో కంగారు ఎక్కువైంది. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లారిటీ వచ్చేసింది ఆఫీసర్‌కి.‘సర్..’ పిలిచాడు ఆఫీసర్. ‘ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు బడాబాబు. ‘కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ఇట్?’ అడిగాడు ఆఫీసర్. ‘ఓపెన్ చేయడానికి అదేమన్నా తలుపా?’ బడాబాబు సమాధానం.‘డోర్ అయితే మేమే ఓపెన్ చేసేవాళ్లం. ప్లీజ్ ఓపెన్ ఇట్..’ స్థిరంగా చెప్పాడు ఆఫీసర్. అట్టే బెట్టు చేయక జేబులోంచి రిమోట్ తీసి ఓపెన్ చేశాడు. టెన్ బై టెన్ సైజులోని నేలమాళిగ అది. అందులో అన్నీ లాకర్లే! డబ్బు, బంగారం, వెండి, బంగారు విగ్రహాలు, వజ్రాలు ఎట్సెట్రా చాలానే దొరికాయి. అయినా ఆ ఆఫీసర్ ముఖంలో విజయం తాలూకు ఆనవాళ్లు లేవు. ఎందుకంటే ఆయనకందిన లెక్కలో దొరికినవాటి లెక్క సగం కూడా లేదు. ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని, తిరుగు ప్రయాణమవుతూ ‘ఇంకేదో క్లూ మిస్ అయి ఉంటాం’ అనుకున్నాడు.ఇవి చదవండి: ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!? -
ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా నివాసం ఉండే అపార్ట్మెంట్ భవన సముదాయం ఇది. ఈ భవన సముదాయం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉంది. ఇందులో ఏకంగా ఇరవైవేల మందికి పైగా జనాలు నివాసం ఉంటున్నారు. మనుషులతో కిక్కిరిసిన ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ను పాశ్చాత్య మీడియా ‘హ్యూమన్ యాంట్‌హిల్’గా అభివర్ణిస్తోంది. అంటే, మనుషులు ఉండే చీమలపుట్ట అన్నమాట!ఈ భారీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో 25 అంతస్తుల్లో 3,708 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మాణం 2015లో పూర్తయింది. అప్పటి నుంచి జనాలు ఇందులోకి చేరడం మొదలుపెట్టారు. స్వల్పకాలంలోనే ఇది పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయే పరిస్థితికి చేరుకుంది. ఉచిత పార్కింగ్, కాంప్లెక్స్ లోపలే సెలూన్లు, కాఫీ షాపులు, నర్సరీ, పోస్టాఫీసు, సూపర్‌మార్కెట్ వంటి సమస్త సౌకర్యాలూ ఉండటంతో జనాలు ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు.ఇవి చదవండి: మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం! -
మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం!
ముఖ వర్చస్సును మెరుగుపరచే ఈ పరికరం అందానికి అసలైన సాధనం అంటున్నారు వినియోగదారులు. ఇది కళ్లచుట్టూ ఉండే వాపును, నల్లటి వలయాలను ఇట్టే తగ్గిస్తుంది. వయసుతో వచ్చే చర్మసమస్యలను వేగంగా రూపుమాపుతుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. సౌందర్యాన్ని కోరుకునే మహిళలకు ఇది మంత్రదండం లాంటిది.అర్గనామిక్ డిజైన్ ను కలిగి ఉన్న ఈ మెషిన్ చేతిలో చక్కగా ఇమిడిపోతుంది. ట్రీట్మెంట్కి అనువుగా ఉంటుంది. సుతిమెత్తని శరీరభాగాల్లో సులభంగా మూవ్ అవుతుంది. కళ్ల పక్కన ఇరుకైన ప్రదేశాల్లో అటు ఇటు కదిలించి మసాజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇందులోని క్రియోథర్మల్ టెక్నాలజీ వల్ల దీనిలో కూలింగ్‌తో పాటు హీటింగ్ మోడ్ కూడా ఉంటుంది. కోల్డ్ ట్రీట్మెంట్ మోడ్ చర్మాన్ని 50నిఊ వరకు చల్లబరుస్తుంది, ఇది రంధ్రాలను బిగించి, ముఖాన్ని కాంతిమంతం చేస్తుందిఇక హీట్ మోడ్ 108నిఊ వరకు చేరి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనికి ఉన్న క్యాప్‌ను తొలగించి, దీని హెడ్‌ను చర్మానికి ఆనించి, మెషిన్ ఆన్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెడ్ కలర్ హీట్ మోడ్‌ను, బ్లూ కలర్ కూల్ మోడ్‌ను సూచిస్తుంది. ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా కూడా వినియోగించుకోవచ్చు. ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసేటప్పుడు ఆన్లైన్లో పలు రివ్యూస్ చూసి తీసుకోవడం మంచిది.ఇవి చదవండి: పళ్ల చిగుళ్ల.. సమస్య! ఏ ట్రీట్మెంట్ వాడాలి? -
పళ్ల చిగుళ్ల.. సమస్య! ఏ ట్రీట్మెంట్ వాడాలి?
నాకు 3వ నెల. ప్రతిరోజు పళ్ల చిగుళ్ల నుంచి రక్తం కారుతోంది. భయపడి పళ్లు తోముకోవడం మానేస్తే నోటి నుంచి దుర్వాసన వస్తోంది. డాక్టర్ని కలిస్తే ఏ ట్రీట్మెంట్ చేయించుకోమంటారో అని భయంగా ఉంది. ఇలాంటి సమయంలో ఏ చికిత్స తీసుకోవాలి? – పద్మ, కొమరిపాలెంగర్భం దాల్చిన 3వ నెల నుంచే కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల పళ్ల చిగుళ్లు వాపు రావడంతో పాటు కొంచెం తిమ్మిరి, నొప్పిగా కూడా ఉంటాయి. ఈ నొప్పి వల్ల చాలామంది పళ్లు తోముకోవడం మానేస్తారు. దానితో వ్యర్థ పదార్థాలు పళ్ల మధ్య ఉండి ఇన్ఫెక్షన్ ఏర్పడి దుర్వాసన వస్తుంది. చాలామందికి రక్తస్రావం కూడా అవుతుంది.దీనిని చిగురువాపు అంటారు. దంత వైద్యుణ్ణి సంప్రదించాలి. దీనికి కొన్ని మౌత్‌వాష్ లోషన్స్, మెత్తటి కుచ్చు ఉన్న చిన్న బ్రష్‌లు వాడమంటారు తప్ప ఎటువంటి చికిత్సలూ ఉండవు. దంతవైద్యుణ్ణి కలిసినప్పుడు మీరు గర్భవతని చెప్పాలి. ఏ కారణంతో అయినా చికిత్స అవసరమైతే ఈ సమయంలో చేయరు. ఎక్స్‌రే కూడా సరికాదు. ప్రసవానంతరమే చికిత్స చేస్తారు. ఈలోపు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే తక్కువ మెతాదులో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు.దంత సమస్యలు రాకుండా మొదటి నెల నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2–5 నిమిషాల సమయం కేటాయించి రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ వాడాలి. తిన్న వెంటనే పళ్ల మధ్య వ్యర్థాలు లేకుండా నోటిని శుభ్రం చేసుకోవాలి. మొదటి మూడునెలల్లో వాంతులు ఎక్కువ ఉన్నవారు, వాంతి అయిన తర్వాత నోటిని మంచినీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల వాంతిలో ఉండే ఎసిడిటీ పళ్లను పాడు చేయకుండా ఉంటుంది.వాంతి అయిన వెంటనే ఎసిడిటీతో పళ్లు బాగా సున్నితంగా అవుతాయి. అందుకే గంట తరువాత బ్రష్ చెయ్యాలి. తీపి పదార్థాలు, చల్లని పానీయాలు తాగకూడదు. టీ, కాఫీ తాగిన తరువాత నోరు శుభ్రం చేసుకోవాలి. పండ్లు, కాయగూరలు, పెరుగు లాంటివి తీసుకోవాలి. ఆల్కహాల్ ఎక్కువ ఉన్న మౌత్ వాష్‌లు వాడకూడదు. ఏదైనా శస్త్రచికిత్స తప్పనిసరైతే 5–7 నెలలో చేస్తారు. చిగుళ్ల నుంచి రక్తస్రావానికి ఏ విధమైన మందులు అవసరం లేదు. చల్లని ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. డాక్టర్ని కలిసినప్పుడు మీ ఇబ్బందులు చెబితే దానిని బట్టి ఎప్పుడెప్పుడు సంప్రదించాలో సూచిస్తారు. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: కిడ్నీ రోగులకు ఉపశమనం హెల్త్ ట్రీట్..మెనోపాజ్ ఔషధంతో లివర్‌కు ముప్పు!మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కోసం ఉపయోగించే ఔషధం వల్ల లివర్‌కు ముప్పు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల తేలింది. మెనోపాజ్‌లో సర్వసాధారణంగా ఒంటి నుంచి వేడి ఆవిర్లు రావడం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల నుంచి ఉపశమనానికి ‘వియోజా’ మాత్రలను ఎక్కువమంది వాడుతుంటారు. ‘వియోజా’ మాత్రలలో ‘ఫెజోలినెటంట్’ అనే ఔషధం ఉంటుంది. ఇది నాన్‌హార్మోనల్ ఔషధం.ఈ ఔషధాన్ని దీర్ఘకాలం వాడినట్లయితే, లివర్‌కు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయని అమెరికాకు చెందిన ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వెల్లడించింది. ఇప్పటికే లివర్ సమస్యలు ఉన్న మహిళలు ఈ ఔషధాన్ని వాడకుండా ఉండటమే మంచిదని సూచించింది. వరుసగా నలబై రోజుల పాటు ఈ ఔషధం తీసుకున్న వారిలో లివర్ దెబ్బతినడాన్ని గుర్తించినట్లు ఎఫ్‌డీఏ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఈ ఔషధం లేబుల్‌పై ‘లివర్‌కు హానికరం’ అనే హెచ్చరికను జోడించనున్నట్లు తెలిపారు. -
ప్రెగ్నెంట్ సమయంలో.. ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటించాలి?
నాకు 3వ నెల. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ ఆహారం తినకూడదు. తింటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది. – హారిక, పెదపూడిగర్భధారణ సమయంలో రోజువారీ ఆహారాన్నే తినవచ్చు. ఇంటిలో తయారు చేసినది అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలామంది అపోహలతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా తినరు. సాధారణంగా మీరు తినే ఆహారమే ఇప్పుడు కూడా తినండి. మీరు ఎప్పుడూ తినని కొత్త ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను ఈ సమయంలో తినకండి. అవి మీ శరీరానికి సరిపడకపోతే వచ్చే ఇబ్బందులకు ఏమైనా మందులు వాడాల్సి వస్తే మంచిదికాదు. అందుకే కొత్తవి తినకండి.చాలామందికి గుడ్లు, మష్రూమ్స్, పల్లీలు, సోయా వల్ల ఎలర్జీలు వస్తాయి. పాశ్చరైజ్ చేయని చీజ్, పాలు, క్రీమ్ అసలు వాడకూడదు. వీటివల్ల ‘లిస్టెరియోసిస్’ ఇన్ఫెక్షన్ తల్లికి, బిడ్డకి వస్తుంది. మాంసాహారం తినేవారు చికెన్, మటన్లాంటివి బాగా ఉడికించి తినాలి. ఉడికించని మాంసంలో టాక్సోప్లాస్మా అనే పరాన్నజీవి ఉంటుంది. ఇది గర్భస్రావం, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. లివర్‌తో తయారు చేసే ఆహార పదార్థాలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం బిడ్డకి ప్రమాదం చేస్తుంది.గుడ్లు కూడా బాగా ఉడికించినవే తినాలి. తెల్లసొన అయితే ఇంకా మంచిది. బాగా ఉడికించని గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. దీంతో బిడ్డకు ప్రమాదం లేదు కానీ తల్లికి వాంతులు, నీళ్ల విరేచనాలు కావచ్చు. చేపలు తినేవారు కూడా బాగా ఉడికించిన సముద్రపు చేపలను తినొచ్చు. ఒకవేళ తింటే కొన్ని కాలుష్య కారకాలు బిడ్డకు హాని చేస్తాయి. ట్యూనా చేపలో పాదరసం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా తినకూడదు. ఆయిల్ ఎక్కువగా ఉండే చేపలు కూడా తినకూడదు. చాలామందిలో కాఫీ తాగడం మంచిదేనా అనే ప్రశ్న కూడా ఉంటుంది. నిజానికి మానేయడం మంచిది. కానీ అలవాటు ఉంది, తప్పకుండా తీసుకోవాలి అంటే రోజుకి 200 ఎంజీ కన్నా ఎక్కువ కాఫీ పొడిని తీసుకోకూడదు. అంటే ఒక కప్పు కాఫీ అని అర్థం. ఈ కెఫీన్ వేరే డ్రింక్స్‌లో కూడా ఉంటుంది. ఉదాహరణకి గ్రీన్ టీ లేదా మామూలు టీలో ప్రతి గ్రాముకు 75ఎంజీ కెఫీన్ ఉంటుంది. డార్క్ చాక్లెట్స్‌లో ప్రతి గ్రాముకు 10–25 ఎంజీ ఉంటుంది. కోలా డ్రింక్స్‌లో 40–80 ఎంజీ ఉంటుంది. ఫిల్టర్ కాఫీలో 140 ఎంజీ ఉంటుంది. అందుకే తాగకపోవడమే మంచిది. కనీసం మొదటి మూడునెలల్లో మానేయండి. పండ్లు, కూరగాయలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గర్భధారణ సమయంలో డాక్టర్ సూచించిన మేరకే విటమిన్ మాత్రలు వేసుకోవాలి. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు -
ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు
ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్దకోతులు మంచివే కానీ పిల్ల కోతులు నాలుగు మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్ళే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు, చేపలు నివసిస్తున్నాయి. చేపలు, తాబేళ్లు నీటి మీద తేలియాడగానే కోతులు చెట్ల పైనుంచి పండ్లు, కాయలు, ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి.‘కోతి నేస్తాలూ! మేము మీకు ఏ విధంగానూ అడ్డురావడం లేదు. మరి మీరెందుకు మమ్మల్ని నీటి పైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు?’ అని ఒకరోజు ఒక చేప ప్రశ్నించింది. ‘మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లల్లో పడుతున్నాయి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఓ పిల్లకోతి.‘చేప నేస్తాలూ! పిల్లకోతులు కావాలని అలా గిరాటు వేస్తున్నాయి. మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అంది ఓ తాబేలు.రోజురోజుకు కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం! తాబేళ్లు, చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వలన ఫెళ్లున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లల్లో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి..’ అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు, తాబేళ్లు బయటకు వచ్చాయి. ‘అయ్యో! పిల్ల కోతులు నీళ్లల్లో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడుదాం’ అంది ఒక తాబేలు.‘పిల్లకోతులూ! ఇలా మా వీపు మీద కూర్చోండి’ అంటూ నాలుగు పెద్ద తాబేళ్లు వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. ‘మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం’ అన్నాయి పిల్ల కోతులు. ‘అలాగే!’ అన్నాయి తాబేళ్లు.అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతణ్ణి చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమరచి ఉన్న చేపలు, తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి.‘ఈ రోజు నా అదృష్టం పండింది. చాలా చేపలు, తాబేళ్లు కూడా దొరికాయి’ అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు. ‘అయ్యో! మన నేస్తాలను ఇతను తీసుకెళ్లిపోతున్నాడు’ అని పిల్ల కోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుక్కుని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారుపడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట, వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను, తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్ల కోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం ఎప్పుడూ ఇలాగే ఒకరికి ఒకరం స్నేహంగా ఉండాలి’ అనుకున్నాయి అన్నీ! మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు సహాయపడతాడు. – కైకాల వెంకట సుమలత -
అవును... అది యాపిల్ కోతల పండుగ!
ఏటా శరదృతువు ప్రారంభంలో యాపిల్ కోతల కాలంలో అక్కడ పండుగ జరుపుకొంటారు. ఊరంతా భారీస్థాయిలో యాపిల్పండ్ల ప్రదర్శనలు కనిపిస్తాయి. కూడళ్లలో యాపిల్పండ్లతో తీర్చిదిద్దిన కళాఖండాలు కనువిందు చేస్తాయి. ఈ విలక్షణమైన పండుగ స్వీడన్లో సిమ్రిషామ్ మునిసిపాలిటీ పరిధిలోని కివిక్ ప్రాంతంలో జరుగుతుంది. ‘కివిక్ యాపిల్ మార్కెట్ ఫెస్టివల్’గా పేరుపొందిన ఈ పండుగకు స్వీడన్ నలుమూలల నుంచే కాకుండా, యూరోప్‌లోని పలు ఇతర దేశాల నుంచి కూడా జనాలు పెద్దసంఖ్యలో వస్తుంటారు.యాపిల్ కోతల పండుగ రోజుల్లో కివిక్ ప్రాంతంలోని పిల్లా పెద్దా అందరూ యాపిల్ తోటల్లోకి, శివార్లలోని చిట్టడవుల్లోకి వెళ్లి యాపిల్‌పండ్లను కోసుకొస్తారు. యాపిల్ బుట్టలు మోసుకుంటూ, సంప్రదాయ నృత్య సంగీతాల నడుమ ఊరేగింపులు జరుపుతారు. యాపిల్ విస్తారంగా పండే కివిక్ను ‘యాపిల్ కేపిటల్ ఆఫ్ స్వీడన్’ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి రకరకాల యాపిల్‌పండ్లు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.కివిక్లో జరిగే యాపిల్ పండుగను చూడటానికే కాకుండా, ఇక్కడి పురాతన రాతియుగం నాటి ఆనవాళ్లను, కాంస్యయుగానికి చెందిన మూడువేల ఏళ్ల నాటి శ్మశాన వాటికను, అందులోని ఆనాటి రాజు సమాధిని చూడటానికి కూడా పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు సిమ్రిషాన్ స్థానిక పరిపాలనా సంస్థ 1988 నుంచి ఇక్కడ యాపిల్ పండుగను వార్షిక వేడుకగా నిర్వహించడం ప్రారంభించింది. యాపిల్ పండుగ సందర్భంగా ఊళ్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఏడాది యాపిల్ పండుగ వేడుకలు సెప్టెంబర్ 28న మొదలయ్యాయి. ఈ వేడుకలు అక్టోబర్ 6 నాటితో ముగుస్తాయి. -
‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’
అ ర్థరాత్రి 2 దాటింది. ఉన్నట్టుండి ‘డా..రిన్.. సేవ్ మీ.. సేవ్ మీ’ అనే ఆర్తనాదాలు వినిపించసాగాయి. గాఢనిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన డారిన్, ఆ గొంతు.. కింద నిద్రపోతున్న తన భార్యదేనని గ్రహించి క్షణాల్లో ‘డార్లీ ఏమైంది?’ అంటూ మెట్లవైపు పరుగుతీశాడు. వెళ్తూ వెళ్తూ లైట్స్ ఆన్ చేశాడు. డార్లీ నొప్పితో రొప్పుతూ గుమ్మం నుంచి బయటికి పరుగులు తీయడం కనిపించింది. ఆమె చేతిలో రక్తమోడుతున్న కత్తి ఉంది. ఆమె పరుగు చూస్తుంటే, ముందు ఎవరో పారిపోతున్నట్లే అనిపించింది. డారిన్ వేగం పెంచాడు.ఇంటికి కాస్తదూరంలో డార్లీ ఆగడం చూసి ‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’ అంటూనే ఆమెను పరిశీలనగా చూశాడు. ఆమె దుస్తుల నిండా రక్తం, ఒంటి మీద కత్తిపోట్లు చూసి డారిన్కి వణుకు పుట్టుకొచ్చింది. ‘డ.. డా..రిన్ .. ఎవ..డో ఇంట్లోకొచ్చి, క.. కత్తితో దాడి చేసి పారిపోయాడు’ అంది డార్లీ వణుకుతున్న స్వరంతో. భార్య మాటలు వినగానే డారిన్ కు ఇంట్లో నిద్రపోతున్న పిల్లలు గుర్తొచ్చారు. ‘íపిల్లలు?!’ అని అరుస్తూనే క్షణాల్లో లోపలికి పరుగుపెట్టాడు. చేతిలోని కత్తి అక్కడే పారేసి, అతడి వెనుకే డార్లీ కూడా పరుగెత్తింది.డార్లీ అరుపులకు కంగారులో బయటికి పరుగు తీసినప్పుడు చూడలేదు కానీ హాల్ అంతా నెత్తుటిమయంగా ఉంది. చాలాచోట్ల మనిషి ఎర్రటి అడుగుజాడలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ పిల్లలు పడుకున్నవైపు వెళ్తుంటే, డారిన్ కి ప్రాణం పోయినట్లు అనిపించింది. ధైర్యం చేసి పిల్లల దగ్గరకు వెళ్లేసరికి ఇద్దరు కొడుకులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.అంబులెన్ ్స వచ్చేసరికే పెద్దకొడుకు ఆరేళ్ల డెవాన్ కన్నుమూశాడు. ఆసుపత్రికి వెళ్లేసరికి రెండో కొడుకు ఐదేళ్ల డామన్ చనిపోయాడు. ఆసుపత్రిలో ఉండగా అప్పటికే కత్తిగాయాలతో అల్లాడుతున్న డార్లీకి సీరియస్ అయిపోయింది. వెంటనే ఐసీయూలో పెట్టి డాక్టర్లు ఆమెకు చికిత్స మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఏ ప్రమాదానికి గురికానివారు ఇద్దరే మిగిలారు. ఒకరు డారిన్ , ఇంకొకరు మూడో కొడుకు డ్రేక్. (ఆ రాత్రి తండ్రితోనే నిద్రపోయాడు) వాడికి 9 నెలలు. దాంతో పోలీసుల కన్ను డారిన్ పైనే పడింది. అయితే 24 గంటలు గడవకముందే కథ అడ్డం తిరిగింది. డార్లీనే పిల్లల్ని చంపి, ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ఆధారాలు పుట్టుకొచ్చాయి.కత్తి మీద డార్లీ వేలిముద్రలు బలమైన సాక్ష్యాలయ్యాయి. ఇంటి లోపలికి చొరబడటానికి వీలుగా మనిషి పట్టేంత రంధ్రం ఓ తలుపు పక్కనే కనిపించింది. అయితే అక్కడ డార్లీ తల వెంట్రుకలు దొరకడంతో నేరం నుంచి తప్పించుకోవడానికి డార్లీనే ఆ రంధ్రాన్ని చేసుంటుందని అనుమానించారు. దాంతో ఆమె కోలుకోగానే అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు అధికారులు.‘‘ఆ రాత్రి కిల్లర్ నా పిల్లల్ని, నన్నూ పొడిచిన కత్తిని పడేసి పారిపోతుంటే, కంగారులో అదే కత్తిని నేను తీసుకుని వెంటపడ్డాను. వాడు గ్యారేజీ వైపు పారిపోయాడు’’ చెప్పింది డార్లీ. ‘సింక్‌లో రక్తం క్లీన్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, పిల్లల్ని పొడిచేశాక, తనని తాను జాగ్రత్తగా పొడుచుకోవడం కోసం డార్లీ సింక్ ముందు చాలాసేపు ఉందని, ఆ తర్వాత డ్రామాలో భాగంగా పైన నిద్రపోతున్న డారిన్ ని పిలవడం మొదలుపెట్టిందని, ఇంట్లోకి ఏ దుండగుడు రాలేదని నమ్మిన అధికారులు ఆమెను కోర్టుకెక్కించారు.సరిగ్గా మర్డర్స్ జరిగిన వారానికి డెవాన్ పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ తీసిన డెవాన్ బర్త్‌డే వీడియోలో సమాధి దగ్గర డార్లీ నవ్వడమే కోర్టుకు బలమైన ఆధారంగా మారింది. పైగా డార్లీకి డ్రేక్ పుట్టాక, మానసిక సమస్యలతో కొన్ని నెలలు డిప్రెషన్ లోకి వెళ్లిందనే పాయింట్ డిటెక్టివ్స్ నమ్మకానికి ఊతమైంది. దాంతో కోర్టు డార్లీకి మరణశిక్ష విధించింది.అయితే భర్త డారిన్ మాత్రం డార్లీ నిర్దోషి అని బలంగా నమ్మాడు. ‘అసలే డిప్రెషన్లో ఉన్న ఒక మనిషి తన ఇద్దరు పిల్లల్ని కళ్లముందే పోగొట్టుకున్నప్పుడు మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించాలి. అదేరోజు(బర్త్‌డే) ఉదయం తను చాలా ఏడ్చింది’ అంటూ డార్లీ కుటుంబం మొత్తం ఆమెకే మద్దతుగా నిలిచింది. దాంతో మరణశిక్షకు బ్రేక్స్ పడ్డాయి. మరోవైపు హత్యలు జరిగిన రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఒక నల్లటి వింత కారు డార్లీ ఇంటికి సమీపంలో ఆగి ఉండటం చూశామని కొందరు సాక్షులు చెప్పారు. డార్లీ అరుపులు వినిపిస్తున్నప్పుడే ఒక కారు స్టార్ట్ అయిన శబ్దం విన్నామని ఇంకొందరు పొరుగువారు చెప్పారు. పైగా అప్పటికే ఆ ప్రాంతంలో అనేక హింసాత్మక హత్యలు, అత్యాచారాలు జరిగాయి. కొందరు దుండగులు వేలిముద్రలు దొరక్కుండా చేతులకు గ్లోవ్స్ ఉపయోగించేవారు. ఆ క్రమంలోనే డార్లీ ఇరుక్కుని ఉంటుందని కొందరు, లేదంటే డార్లీపై కక్షతో ఎవరైనా ఆమెను ఇరికించారేమోనని ఇంకొందరు నమ్మడం మొదలుపెట్టారు.1996 జూన్ 6 రాత్రి, అమెరికా, టెక్సస్, రౌలెట్లో ఈ ఉదంతం జరిగింది. డార్లీ తన ఇద్దరు పిల్లల్ని చంపిందన్న నేరారోపణలతో నేటికీ జైల్లోనే ఉంది. టెక్నాలజీ పెరగడంతో కోర్టు డీఎన్ఏ పరీక్షలకు అనేకసార్లు ఆదేశించింది. అయితే, ఇప్పటికీ ఆ పరీక్షా ఫలితాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు విచారణలో భాగంగా అధికారులకు ఆ ఇంట్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల వేలిముద్రలు లభించాయి. వాటిని గ్యారేజీ తలుపు మీద, ఆ రాత్రి డార్లీ నిద్రపోయిన సోఫా మీద గుర్తించారు. అయినా డార్లీ విడుదల కాలేదు.ఇద్దరు కొడుకులకు జీవిత బీమా పాలసీ ఉన్నందుకే డార్లీ పిల్లల్ని చంపిందని ప్రాసిక్యూషన్ వాదించింది. నిజానికి డార్లీ డబ్బుకోసమే హత్యలు చేసుంటే, ఆమె భర్త డారిన్ పేరుమీద ఇంకా పెద్దమొత్తంలో జీవిత బీమా పాలసీ ఉందని, మరి అతడ్ని ఎందుకు చంపలేదనే వాదన డార్లీకి అండగా నిలిచింది. సుమారు 28 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. నేరం జరిగిన పదిహేనేళ్లకు డారిన్ తన భవిష్యత్తు కోసం డార్లీకి విడాకులిచ్చేశాడు. మూడో కొడుకు డ్రేక్ ఇప్పటికీ తల్లి తరçఫునే పోరాడుతున్నాడు. ఏదిఏమైనా ముద్దులొలికే చిన్నారుల్ని ఆ రాత్రి పొడిచి చంపిందెవరో? నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
John Floor: ఆ జంప్ విలువ అమూల్యం..!
పదహారేళ్ల వయసు.. కొత్తగా రెక్కలు విప్పుకుంటూ రివ్వున ఎగిరిపోవాలని, ప్రపంచాన్ని చుట్టిరావాలని కోరుకుంటుంది! కానీ ఆ ప్రాయంలోనే జరిగిన ఒక అనూహ్య ఘటన ఆ అమ్మాయి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన ఆ బాలికకు ఆపై నడవడమే అసాధ్యమైంది. పుట్టుకతో వచ్చిన లోపానికైతే జీవితంలో సన్నద్ధత వేరుగా ఉంటుంది. కానీ ఎదుగుతున్న వయసులో ఎదురైన ఆ పరిస్థితికి ఆమె చలించిపోయింది. పట్టరాని దుఃఖాన్ని అనుభవించింది. అయితే ఆ బాధతోనే కుంగిపోకుండా.. నిలిచి పోరాడాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె క్రీడలను ఎంచుకుంది. ఆ దారిలో తీవ్రంగా శ్రమించి శిఖరానికి చేరింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆ అథ్లెట్ పేరు ఫ్లోర్ జాన్. నెదర్లండ్స్‌కు చెందిన పారాలింపియన్. వరుసగా రెండు పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటింది.ఫ్లోర్ జాన్ స్వస్థలం నెదర్లండ్స్‌లోని పర్మెరెండ్పట్టణం. చిన్నప్పటి నుంచి చదువులో, ఆటల్లో మహా చురుకు. టీనేజ్‌కి వచ్చాక ఆ ఉత్సాహం మరింత ఎక్కువైంది. ఎక్కడ ఎలాంటి పోటీ జరిగినా అక్కడ వాలిపోయేది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో బహుమతి లేకుండా తిరిగొచ్చేది కాదు. ఆ ఉత్సాహంతోనే దూసుకుపోతూ, తన 17వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ.. బ్యాక్టీరియల్ బ్లడ్ ఇన్ఫెక్షన్కు గురైంది. ఆ కారణంగా ఆమె కుడి కాలు, చేతి వేళ్ల ముందు భాగానికి రక్తప్రసరణ ఆగిపోయింది. దాంతో హడావిడిగా ఫ్లోర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అసలు అలాంటి రక్త సమస్యతో ఆమె బతకడమే అసాధ్యం అనిపించింది.కాళ్లను తీసివేసి..వేర్వేరు శస్త్రచికిత్సల తర్వాత ఎట్టకేలకు డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారు. అయితే మరో షాకింగ్ విషయంతో వారు ముందుకొచ్చారు.. కుడి కాలును తొలగిస్తేనే ఇన్ఫెక్షన్ దరి చేరకుండా ఉంటుందని! ఒప్పుకోక తప్పలేదు. మోకాలి కింది భాగం నుంచి కుడి కాలును తీసేశారు. అదే తరహాలో రెండు చేతుల ఎనిమిది వేళ్లను కూడా గోళ్ల భాగం వరకు తొలగించారు. ఆ వయసులో ఇలాంటి పరిస్థితి ఎంత వేదనాభరితమో ఊహించుకోవచ్చు.ఫ్లోర్ పోరాడేందుకు సిద్ధమైంది. రీహాబిలిటేషన్ కేంద్రంలో కోలుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కార్బన్ ఫైబర్‌తో కృత్రిమ కాలును అమర్చారు. కానీ కొంతకాలానికి అదే ఆమెకు భారంగా మారింది. దానివల్ల తన సహజమైన కాలును కూడా కదపడం కష్టమైపోయింది. ఆ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. దాంతో ఈసారి తానే డాక్టర్లను సంప్రదించింది. తన రెండో కాలునూ తొలగించమని కోరింది. వైద్యులు నిర్ఘాంతపోయినా చివరకు ఒప్పుకోక తప్పలేదు. ఆపరేషన్‌తో ఆ రెండో కాలును కూడా తీసేశాక రెండు బ్లేడ్లే ఆమెను నిలబెట్టాయి.అథ్లెటిక్స్‌లోకి అడుగు పెట్టి..ఆ ఘటన తర్వాత ఫ్లోర్ సమయాన్ని వృథా చేయలేదు. ఏడాదిలోపే డచ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పారా అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ కార్యక్రమానికి హాజరైంది. అక్కడే ఆమె అథ్లెటిక్స్ను ఎంచుకుంది. ఫ్లోర్ ప్రతిభ, పట్టుదలను చూసిన కోచ్ గైడో బాన్సన్ ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుకు మెరుగులు దిద్దుకుంది. జాతీయ స్థాయిలో, యూరోపియన్ సర్క్యూట్లో ఫ్లోర్ వరుస విజయాలు సాధించి ఆపై ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌పై దృష్టిసారించింది.పారా క్రీడల్లోకి అడుగు పెట్టిన మూడేళ్ల లోపే ఆమె ఖాతాలో వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్ చేరడం విశేషం. 2015లో దోహాలో జరిగిన ఈవెంట్లో 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకుంది. 100 మీటర్ల పరుగులో ఆమె 12.78 సెకన్ల టైమింగ్‌తో కొత్త రికార్డు నమోదు చేయడంతో పాటు ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానానికి చేరింది. పారా అథ్లెట్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు రావడంతో ఫ్లోర్ ఆ తర్వాత లాంగ్‌జంప్‌కు మారింది. రెండు కాళ్లూ లేని అథ్లెట్ల కేటగిరీ టి62 లాంగ్‌జంప్‌లో రెండు వరల్డ్ రికార్డులు సృష్టించిన ఈ డచ్ ప్లేయర్ తొలిసారి ఈ విభాగంలో 6 మీటర్ల దూరాన్ని జంప్ చేసిన తొలి అథ్లెట్‌గా కూడా నిలిచింది. ఇదే జోరులో లాంగ్‌జంప్‌లోనూ రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణాలు ఫ్లోర్‌ను వెతుక్కుంటూ వచ్చాయి.ఒలింపిక్స్ పతకాలతో..లాంగ్‌జంప్‌కు మారక ముందు 2016 రియో ఒలింపిక్స్‌లో 100 మీ., 200 మీ. పరుగులో పాల్గొన్న ఫ్లోర్ పతకాలు సాధించడంలో విఫలమైంది. ఆ తర్వాత లాంగ్‌జంప్‌లో వరుసగా మూడు టోర్నీల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. అయితే మెడల్ గెలవడమే లక్ష్యంగా 2020 టోక్యో పారాలింపిక్స్‌కు సిద్ధమైంది. ఏడాది పాటు కఠోర సాధన చేసి స్వర్ణంతో తన కలను నిజం చేసుకుంది. గత మూడేళ్లుగా తన ఆటలో అదే పదును కొనసాగించిన ఈ అథ్లెట్ 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ తన పతకాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండో స్వర్ణాన్ని గెలుచుకొని సత్తా చాటింది. కమ్యూనికేషన్ సైన్సెస్ చదివిన ఫ్లోర్ ఇప్పుడు క్రీడాకారిణిగానే కాదు మోటివేషనల్ స్పీకర్‌గానూ తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తి పంచుతోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం -
రెక్కలు..
చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టిరంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునే సరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్లీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడి గంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు.చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళుతున్నవాళ్లు ఆగి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళుతున్నారు. ఉదయం తొమ్మిది అయి ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది.రాఘవ అదేమీ పట్టనట్టుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడి వైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళితే కుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ‘ఆగరా’ అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది ‘పోనీ వెధవనీ’ అని.వెధవా తను? టెన్త్‌లో ఎన్ని మార్కులొచ్చాయి. ఇంటర్లో ఎన్ని మార్కులొచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ ‘నువ్వే టాప్. క్యాంపస్ సెలక్షన్లో నీకు ఉద్యోగం వస్తుంది’ అనంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అందిగాని అది బోగస్‌దని తేలింది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు. చిన్న ఊరు. చిన్న ఉద్యోగం.చేతికందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధ ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. ‘దేశంలో అందరికీ ఉద్యోగాలొస్తుంటే నీకెందుకు రావడం లేదురా. ముప్పొద్దులా తింటూ ఫోను చూసుకుంటూ వుంటే ఎవడిస్తాడు’ అన్నాడు. బాధ కలిగింది. థూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాడు. ‘మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో. ప్రాజెక్ట్‌లో దూరడం చాలా కష్టంగా ఉంది’ అన్నారు. ఏ ఆశా మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్లి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి? దూకాలి. దూకాలంటే మాటలా?ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత. గుడ్డ పరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలు అంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక. పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతోంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన రెండు రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు ‘హాయ్’ అని పలకరిస్తే అది దాని రెండు రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత ‘చిలకమ్మా.. గుడి ఎటువైపుంది’ అనగానే కుడి రెక్కతో గుడి వైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి ఎక్కడుందో చెప్పు’ అనగానే తన ఎడమ రెక్కతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి, గుడి అంటే నీకు ఇష్టమా తల్లీ?’ అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది.తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజంపైన ఉన్న చిలకమ్మ కింద పడింది. ‘అయ్యో’ అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని రెండు కాళ్లలో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూచుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతిలోకి తీసుకుని దాని వీపు మీద నిమురుతూ మరల తన భుజం పైకి ఎక్కించుకుని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు.రాఘవ కళ్లల్లోని బాధను చూసి ‘మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాళ్లు పడిపోయాయి. కాళ్లు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలకమ్మ బాధ పడదు. సందడి చేయడం ఏ మాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మూగరు. జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు’ అన్నాడు తాత.ఆ మాటలకు చిలకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటు ఇటు రాస్తూ ముద్దాడింది. దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి? తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి, వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.నిజంగా అలా చేస్తే వాళ్లు ఏమైపోతారు? వాళ్లు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్లకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రులని తనే చంపుకున్నట్టు కదా... ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా?ఇంత ముసలివాడైన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే... యువకుడైన తనకీ నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ ‘చెరువులో దూకడానికి వచ్చావు గదా బాబూ’ అన్నాడు.రాఘవ ఉలిక్కి పడ్డాడు.‘నీకెలా తెలుసు?’ అన్నాడు.‘ఉదయమే చూశాను బాబూ నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్లు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబూ. నేను ముసలాణ్ణయినా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా.. వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు‘ అన్నాడు.రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు.‘ఈ జామకాయ తిను బాబూ’ అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ కాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ ‘అయ్యో.. నా దగ్గర పైసా కూడా లేదు తాతా’ అనగానే ‘మరేం పర్వాలేదు బాబూ’ అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు.‘కాయ చాలా రుచిగా ఉంది తాతా’‘ఊరవతల తోటలోవి బాబూ. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్లు. చేసుకోవాలని లేదు. ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకొని టౌన్‌కు తీసుకెళ్లి అమ్మితే ఇక్కడ పది రూపాయలకు అక్కడ యాభై వస్తాయి. నేనా చేయలేను’ అన్నాడు తాత.రాఘవకు ్రౖడైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. ‘తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాతా. తర్వాతి కథ నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్లోనే. నువ్వు తోడుండు చాలు’ అన్నాడు రాఘవ.‘ఏంటి బాబూ నువ్వనేది’‘అవును తాతా’ అన్నాడు రాఘవ.తాత కూడా చిరునవ్వు నవ్వాడు.‘ఏం చిలకమ్మా’ అన్నాడు.అది కిచకిచమని అంగీకారం తెలిపింది.ముగ్గురూ లేచి అక్కడ నుంచి కదిలారు. గుడి గంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలకమ్మ ముందుకు సాగిపోయారు. – నేదూరి భాను సాయి శ్రేయ -
Masaba Gupta: మసాబా.. మసాబా..
మసాబా గుప్తా.. ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక వైబ్రెంట్ వేవ్! ఆమె రాకముందు మన ఫ్యాషన్‌లో బిగ్ అండ్ బోల్డ్ ప్రింట్స్ అంతగాలేవు! ఇప్పుడవి చాలామంది సెలబ్రిటీస్‌కి మోస్ట్‌వాంటెడ్ క్యాజువల్స్‌గా మారి, వాళ్ల స్టయిలింగ్ వార్డ్రోబ్స్కి చేరిపోతున్నాయి. క్రెడిట్ గోస్ టు ‘హౌస్ ఆఫ్ మసాబా!’ కుడోస్ టు క్రియేటర్ మసాబా గుప్తా!నా స్కిన్ కలర్, నా జుట్టు తీరుతో చాలా అవమానాలు ఎదుర్కొన్నా! అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఏ రంగంలో అయినా ప్రతికూలతలు ఉంటాయి. వాటిని మనకు అనుకూలంగా మలచుకోగలగడమే సక్సెస్! అంటుంది మసాబా గుప్తా.మసాబా గుప్తా ఎవరో సినీ,క్రికెట్ ప్రియులు చాలామందికి తెలిసే ఉంటుంది. నటి నీనా గుప్తా, క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ కూతురు. చిన్నప్పుడెప్పుడూ ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలకనలేదు ఆమె. తండ్రిలా ఆటల మీదే ఆసక్తి చూపింది. టెన్నిస్ ప్లేయర్ కావాలని కష్టపడింది. తనకు పదహారేళ్లు వచ్చేటప్పటికి ఆ ఆసక్తి, ప్రయత్నం మ్యూజిక్, డాన్స్ మీదకు మళ్లాయి. లండన్‌లో ఆ రెండిటిలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఒంటరిగా ఉండలేక వాటిని మధ్యలోనే వదిలేసి ముంబై చేరుకుంది.వచ్చాక, యాక్టింగ్ ఫీల్డ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించింది. అది గమనించిన నీనా గుప్తా, ‘ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసే సంప్రదాయ సౌందర్య ప్రమాణాలు వేరు. నువ్వు అందులో సెట్ కావు. సో.. ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేయ్’ అంటూ బిడ్డను వెనక్కి లాగింది. ఏమాత్రం నిరుత్సాహపడక, తన క్రియేటివిటీని తన కాలేజ్ ఈవెంట్స్‌లో ప్రదర్శించసాగింది మసాబా. ఆ సమయంలోనే ఆమెలోని ఈస్తటిక్ సెన్స్, ఫ్యాషన్ స్పృహను కనిపెట్టిన ఫ్యాషన్ డిజైనర్, ఆథర్.. వెండెల్ రోడ్రిక్స్ ఆమెను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ప్రోత్సహించాడు. దాంతో మసాబా.. ముంబై, ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ(శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాక్రసే మహిళా విశ్వవిద్యాలయ్)లో అపరెల్ మాన్యుఫాక్చర్ అండ్ డిజైన్‌ను అభ్యసించింది.తను పూర్తిస్థాయిలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే టైమ్‌కి.. పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్ల జాడ అంతగా కనపడలేదు ఆమెకు. దాంతో ఆ రెండిటినే తన యూఎస్పీగా మార్చుకుని ‘హౌస్ ఆఫ్ మసాబా’ లేబుల్‌ని ఆవిష్కరించింది. ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనం. లేత రంగులు, ప్లెయిన్, చిన్న చిన్న డిజైన్స్‌నే ఎంచుకుంటున్న సెలబ్రిటీలకు మసాబా ప్రింట్స్æ వైబ్రెంట్‌గా తోచాయి. ఆ లేబుల్‌కి మారారు. ఆ అవుట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల అపియరెన్స్ రేడియెంట్గా కనిపించసాగింది.ప్రత్యేక స్టయిల్‌గా గుర్తింపురాసాగింది. అంతే ‘హౌస్ ఆఫ్ మసాబా’ బాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది. ఇంట్లో వేసుకోవడానికి మొదలు బీచ్‌లో వ్యాహ్యాళి, ప్రయాణాలు, సినిమాలు, పార్టీలు, ఫంక్షన్లు, అవార్డ్ ఈవెంట్స్ దాకా దేనికైనా మసాబా డిజైనర్ వేర్ కావాల్సిందే అని కోరుకునే స్థాయికి చేరుకుంది ఆ డిమాండ్! ఆ లిస్ట్‌లో సోనమ్ కపూర్, ప్రియంకా చోప్రా, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, విద్యా బాలన్, సొనాక్షీ సిన్హా, మీరా రాజ్‌పుత్ కపూర్, మౌనీ రాయ్, కరణ్ జోహార్ లాంటి మహామహులంతా ఉన్నారు. ‘హౌస్ ఆఫ్ మసాబా’ వెడ్డింగ్, రిసార్ట్ వేర్‌లోనూ సిగ్నేచర్ డిజైనింగ్‌ను మొదలుపెట్టింది. అంతేకాదు స్విమ్ వేర్, మెన్స్ వేర్, ఫ్యాషన్ జ్యూల్రీలోనూ తన నైపుణ్యాన్ని చూపిస్తోంది.ఇవి చదవండి: Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ! -
Ananda Nilayam: ఒకేచోట.. ఈ అష్టాదశ శక్తిపీఠాలు!
పురాణాల ప్రకారం, అమ్మవారిని ఆరాధించే దేవాలయాలలో ప్రశస్తమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. శివుడి అర్ధాంగి సతీదేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలను దర్శించుకుని, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని భక్తులు భావిçస్తుంటారు. రకరకాల కారణాల వల్ల కొంతమందికి శక్తిపీఠాల దర్శనభాగ్యం కరవవుతోంది. అలాంటివారికి అన్ని శక్తిపీఠాలను ఒకేచోట దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అష్టాదశ శ«క్తిపీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించారు.అది ఎక్కడో కాదు తెలంగాణ, సిద్దిపేట జిల్లా, కొండపాక గ్రామ శివారులోని ఆనంద నిలయంలో! గత ఏడాది నవంబరులో.. ఇక్కడి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో 18 శక్తిపీఠాలతో పాటు లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులనూ ప్రతిష్ఠించారు.గట్టు రాంరాజేశం గుప్త సంకల్పంతో..సిద్దిపేటకు చెందిన గట్టు రాంరాజేశం గుప్త అమ్మవారికి అపర భక్తుడు. అష్టాదశ శక్తి పీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఒకసారి, తన మనసులో మాటను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆనంద నిలయ వ్యూహకర్త కేవీ రమణాచారి ముందుంచారు. ఆయన ట్రస్ట్ సభ్యులతో చర్చించి, ఆనంద నిలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రాంరాజేశం రూ. 1.5 కోట్లను అందజేశారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాలను నిర్మించారు. అమ్మవార్ల రాతి విగ్రహాలను తమిళనాడులో తయారుచేయించారు. వీటిని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించారు.22 దేవాలయాలు..పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదిహేడు మనదేశంలో ఉండగా, శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. మన దేశంలో ఉన్న కామాక్షీదేవి (కంచి, తమిళనాడు), శృంఖలాదేవి (కోల్‌కతా, పశ్చిమబెంగాల్), చాముండేశ్వరీదేవి (మైసూరు, కర్ణాటక), జోగులాంబ (ఆలంపూర్, తెలంగాణ), భ్రమరాంబికాదేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), మహాలక్ష్మీదేవి (కొల్హాపూర్, మహారాష్ట్ర), ఏకవీరాదేవి (మాహుర్, మహారాష్ట్ర), మహాకాళీదేవి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), పురుహూతికాదేవి (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), గిరిజాదేవి (జాజ్‌పూర్, ఒడిశా), మాణిక్యాంబాదేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), కామాఖ్యాదేవి ( గౌహతి, అస్సాం), మాధవేశ్వరీదేవి (ప్రయాగ, ఉత్తరప్రదేశ్), వైష్ణవీదేవి (జమ్మూ, జమ్మూ– కశ్మీర్ రాష్ట్రం), మంగళగౌరీదేవి (గయ, బిహార్), విశాలాక్షీ (కాశి), సరస్వతీదేవి (శ్రీనగర్) రూపాలను కొండపాక శివారులోని ఆనంద నిలయంలో దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరకత లింగం, శివపార్వతులతో కూడిన 22 దేవాలయాలను నిర్మించడం విశేషం. ఆయా శక్తిపీఠాల్లో జరిగినట్లుగానే ఇక్కడా పూజాకార్యక్రమాలుంటాయి. ప్రతి పౌర్ణమికి హోమం, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు.సామాజిక సేవ.. ఆధ్యాత్మిక శోభ!ఆనంద నిలయంలో సామాజిక సేవతోపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సుమారు వంద ఎకరాల్లోని ఈ ట్రస్ట్‌లో ఒకవైపు వృద్ధాశ్రమం, మరోవైపు అనాథాశ్రమం, ఇంకోవైపు సత్యసాయి పిల్లల హృద్రోగ ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఉన్నాయి. భక్తులు, సామాజిక సేవకుల సందర్శనతో ఈ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. ఇది హైదరాబాద్‌కు 73 కిలోమీటర్లు, సిద్దిపేటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట, ఫొటోలు: కె సతీష్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్శక్తిపీఠాల్లో జరిగినట్టుగానే..ఇక్కడ పూజాకార్యక్రమాలన్నిటినీ శక్తిపీఠాల్లో మాదిరే జరుపుతాం. భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం పోస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు శివుడికి, మరకత లింగానికి రుద్రాభిషేకం చేస్తాం. – పురుషోత్తమ రామానుజ, అర్చకుడుఅందరికీ దర్శనభాగ్యం కలగాలని.. అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవటం కొందరికి సాధ్యపడకపోవచ్చు. అలాంటివారికి శక్తిపీఠాల దర్శనభాగ్యం అందాలనేది నాన్నగారి కోరిక. కేవీ రమణాచారి, ఇంకెంతో మంది దాతల సహకారంతో నేడు అది నెరవేరింది. – గట్టు అమర్నాథ్, రవి, శ్రీనివాస్అమ్మవారి అనుగ్రహం..కొండపాకలో అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం అమ్మవారి దయ. అమ్మవారి అనుగ్రహం, అందరి సహకారంతో దేవాలయ నిర్మాణాలు సాధ్యమయ్యాయి. – డాక్టర్ కేవీ రమణాచారి, ఆనంద నిలయ వ్యూహకర్తఇవి చదవండి: అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే.. -
మీరెప్పుడైనా.. ఈ మృత్యుసరోవరం గురించి విన్నారా!?
సముద్రంలో ఉన్న మృత్యుసరోవరం ఇది. సముద్రంలోకి దిగి చూస్తే, ఇది మామూలుగానే కనిపిస్తుంది గాని, ఇందులో ఈత కొట్టాలని సరదా పడితే మాత్రం, చావును కోరి కొనితెచ్చుకున్నట్లే! వంద అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మడుగులోని అత్యంత లవణీయత కలిగిన నీరు, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు దీనిని మృత్యుసరోవరంగా మార్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని తొలిసారిగా 2015లో కనుగొన్నారు. ఇందులో ఈదులాడేందుకు దిగి మరణించిన జంతువుల కళేబరాలను శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం సేకరించి, భద్రపరచారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్రంలోకి దిగి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు సముద్రం లోపలి భాగంలో ఈ మడుగులాంటి ప్రదేశం కనిపించింది. దాదాపు వంద అడుగుల విస్తీర్ణంలో బురదనీటితో నిండిన ఈ మడుగులోకి వెళ్లే పీతలు, మొసళ్లు వంటి జీవులు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వారు గమనించారు.సాధారణంగా సముద్రపు నీటిలో ఉండే ఉప్పదనం కంటే, ఈ మృత్యుసరోవరం నీటి ఉప్పదనం నాలుగురెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి కొద్ది జలచరాలు మాత్రమే ఇందులోని పరిస్థితులను తట్టుకుని మరీ బతకగలవని, మిగిలినవి ఇందులోకి దిగితే నిమిషాల్లోనే మరణిస్తాయని చెబుతున్నారు. దీనిని ‘హాట్ టబ్ ఆఫ్ డిస్పెయిర్’ అని, ‘జకూజీ ఆఫ్ డిస్పెయిర్’ అని అభివర్ణిస్తున్నారు.ఇవి చదవండి: గ్యాప్ ఇవ్వలా... వచ్చింది -
Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ!
ఎల్నాజ్ నౌరోజీ.. గ్లామర్, టాలెంట్ రెండూ ఉన్న నటి. ఇరాన్లో పుట్టింది. జర్మనీలో పెరిగింది. కెరీర్ వెదుక్కుంటూ భారత్‌కు చేరింది. సినిమా, సిరీస్‌లతో తగిన గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది! జర్మన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ, పంజాబీ, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది.మోడలింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా ఎల్నాజ్కు చిన్నప్పటి నుంచీ ఆసక్తి. అందుకే తన పద్నాలుగో ఏటనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ట్వల్త్ క్లాస్ పాస్ అయ్యాక, ఓ ఏడాది పాటు థియేటర్లో ట్రెయినింగ్ తీసుకుంది. పర్షియన్ డాన్స్, హిప్ హాప్, కథక్‌లోనూ శిక్షణ పొందింది.మోడలింగ్‌లో కొనసాగుతూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మోడలింగ్‌లో భాగంగా ఆసియా, యూరప్ దేశాలు చుట్టొచ్చింది. ఇండియాలో జరిగిన ఎన్నో యాక్టింగ్ వర్క్‌షాప్స్‌కి హాజరైంది. తనకు ఈ దేశం నచ్చడంతో ఇక్కడే స్థిరపడింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ లాంటి బాలీవుడ్ ఉద్దండులతో కలసి ఎన్నో టీవీ కమర్షియల్స్‌లో నటించింది.‘మాన్ జావో నా’ అనే పాకిస్తానీ మూవీలో, ‘ఖిదో ఖుండీ’ అనే పంజాబీ చిత్రంలో, పంజాబీ మ్యూజిక్ సెన్సేషన్ గురు రంధావా ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. కానీ ఎల్నాజ్ను దేశమంతటికీ పరిచయం చేసింది మాత్రం నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రడ్ గేమ్స్’ సిరీసే! తర్వాత జీ5లో స్ట్రీమ్ అయిన ‘అభయ్’సిరీస్‌లోనూ నటించింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తాజా సిరీస్ ‘రణ్నీతి: బాలాకోట్ అండ్ బియాండ్’ జియోసినిమాలో స్ట్రీమ్ అవుతోంది.‘జన గణ మన’ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకీ అడుగుపెట్టింది ఎల్నాజ్. ఇరానియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచీ ఆమెకు ఆఫర్లు వచ్చాయి. కానీ అక్కడున్న ఆంక్షల వల్ల వాటిని తిరస్కరించినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. "నాకు కొత్తకొత్త విషయాలను నేర్చుకోవడం చాలా ఇష్టం. అలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకొనే అవకాశం దొరుకుతూనే ఉంది ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో!" – ఎల్నాజ్ నౌరోజీఇవి చదవండి: పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’ -
పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’
‘దేవరపాలెం.. దేవరపాలెం..’ అంటూ కండక్టర్ కనకరాజు రాబోయే స్టాపులో దిగబోయే ప్రయాణికులను అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచాడు. కనకరాజు అరుపులకు కొంతమంది సీట్లలోంచి లేచి, హడావిడిగా తమ సామాన్లను తీసుకుంటున్నారు. ‘రావాలి.. రావాలి..’ అంటూ కనకరాజు వారిని మరింత వేగిరపెట్టాడు. కొంతమంది దిగిపోయాక, కొంతమంది ఎక్కారు. కనకరాజు టికెట్స్ కొట్టే కట్టర్‌తో ఎదురుగా ఉన్న ఇనుప రాడ్ మీద ‘రైట్.. రైట్..’ అంటూ గట్టిగా కొట్టాడు. అతను ఇచ్చిన శబ్దసందేశానికి బస్సు పొగలు చిమ్ముకుంటూ బయల్దేరింది.ఆ బస్టాపుకి కొద్దిదూరంలో వున్న ఒకావిడ మర్రిచెట్టు కింద కూర్చుని, బస్సులోంచి దిగుతున్న ప్రయాణికులను ఆత్రంగా చూడటం కనకరాజు కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చే ఆ బస్ కోసమే ఆమె రెండు పూటలా వస్తోంది. ఆమెకు సుమారుగా నలభై ఐదేళ్లుంటాయి. ఆమె కళ్ళు తీక్షణంగా మెరుస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే ఆమె క్రమం తప్పని దినచర్య!‘ఆమె ఎవరు? రోజూ ఎవరి కోసం ఎదురుచూస్తోంది?’ అనే ప్రశ్నలు ఆమెని చూసినప్పుడల్లా కనకరాజు మదిని తొలిచేస్తున్నాయి. కనకరాజు తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఓ పెద్దాయనకు టికెట్ కొడుతూ ‘బాబాయ్, ఎవరావిడ?’ తన మనసుని కుదిపేస్తున్న ప్రశ్నని అతని ముందు పెట్టాడు.‘ఆవిడో పిచ్చి మాలోకమయ్యా..!’ అతను ముక్తసరిగా బదులిచ్చాడు. కనకరాజు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కనకరాజు నిస్సత్తువగా హాల్లోని సోఫాలో వాలిపోయాడు. భర్త రాకను గమనించిన అతని భార్య సరోజ వంటగదిలోంచి వస్తూ ‘టీ పెట్టమంటారా?’ అని అనునయంగా అడిగింది.‘వద్దు సరోజా.. అలేఖ్యకి ఇప్పుడెలా వుంది? నిద్రపోతోందా?’ దుఃఖాన్ని గుండె లోతుల్లోనే దిగమింగుకుని నెమ్మదిగా అడిగాడు కనకరాజు.‘జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడంలేదు. ఏమి తిన్నా వాంతులు చేసుకుంటోంది. ఇప్పుడే పడుకుంది’ చెప్పింది సరోజ బాధని పంటితో బిగబట్టుకుని.కనకరాజుని ఈ మధ్యకాలంలో బాగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య తన ఎనిమిదేళ్ల కూతురి అనారోగ్యం! అతని కూతురు సంవత్సర కాలంగా అంతుచిక్కని కొత్త తరహా న్యుమోనియాతో నరకాన్నే చూస్తోంది. ఏడాదిగా స్కూలుకి కూడా పోవడంలేదు. తెలిసిన వాళ్లు చెప్పిన స్పెషలిస్టులందరికీ చూపించాడు. డాక్టర్లు సూచించిన అన్నిరకాల టెస్టులు చేయించాడు, చేయిస్తూనే వున్నాడు. ఫలితం మాత్రం శూన్యం!కనకరాజుకి ఎప్పటిలాగే ఆరోజు కూడా దేవరపాలెం బస్టాపు దగ్గర రెండు దఫాలూ అదే దృశ్యం ఎదురైంది. ఈసారి ఎవరినీ అడగకూడదని, తనే స్వయంగా ఆమెని కలిసి, విషయమేంటో ఆరా తీయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. తన సెలవు రోజున దేవరపాలెం వెళ్లాడు. బస్టాపు దగ్గర్లోని ఓ బడ్డీ కొట్టులో ఒక వాటర్ బాటిల్ కొంటూ, మర్రిచెట్టు కింద కూర్చున్న ఆవిడను చూపిస్తూ ‘ఎవరండీ ఆవిడ? రోజూ అక్కడ కూర్చుని, ఎవరి కోసం ఎదురు చూస్తుంది?’ అడిగాడు కాస్త చొరవతీసుకుని.‘ఆవిడా? ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయిన కొడుకు తిరిగొస్తాడని.. అవిడో పిచ్చిది సార్!’ క్లుప్తంగా బదులిచ్చాడతడు.‘ఈ మాత్రం చాలు. ఆమెని చేరుకోవడానికి’ అనుకుంటూ, ఆ పక్కనే వున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి బస్సు రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి. బస్సు వచ్చేటప్పుడు ఆమె కళ్లల్లో అదే వెలుగు. బస్సు వెళ్లిపోయిన మరుక్షణమే నిరాశగా ఇంటిదారి పట్టింది. కనకరాజు దూరం నుంచే ఆమెను అనుసరించసాగాడు. ఆమె వెళ్తూవెళ్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయింది. అదే.. తన నివాసం కాబోలు అనుకున్నాడు. అది ఓ సెంటు స్థలంలో కట్టిన చిన్న పాత పెంకుటిల్లు.కనకరాజు ధైర్యాన్ని కూడగట్టుకుని, మరో ఆలోచన చేయకుండా గబగబా ఆమె దగ్గరకు వెళ్లి ‘అమ్మా..! నా పేరు కనకరాజు. మీ బిడ్డకోసం ఎదురు చూస్తున్నారని విన్నాను. నేను డ్యూటీ మీద చాలాచోట్లకు తిరుగుతుంటాను. మీ అబ్బాయి గురించి వివరాలు చెప్తే, నా శాయశక్తులా వెతికిపెడతాను’ నిజాయితీగా తన మనసులోని మాటని ఆమె ముందు పెట్టాడు. ఆమె కనకరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఎవరు బాబూ మీరు? మీరు చెబుతున్నది నిజమేనా? నా బిడ్డ నిజంగా నా చెంతకొస్తాడా?’ ఆత్రంగా అడిగింది.‘అవునన్నట్లు’ తలూపాడు కనకరాజు. ఆమె మొహం ఒక్కసారిగా కాంతివంతమైంది.‘బాబూ.. నా కొడుకు పారిపోయి పదిహేనేళ్లు గడిసిపోనాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ యివ్వని భరోసాని యిత్తున్నావు. అందరూ నన్ను ‘పిచ్చిది’ అనేటోళ్లే గానీ, ఎవరూ యిలా చెప్పలేదు బాబూ..’ తన పట్టరాని సంతోషాన్ని, కన్నీళ్ల రూపేణా వ్యక్తపరచింది.ఆమె భావోద్వేగానికి కనకరాజు ఎంతోగానో చలించిపోయాడు. అతని కంట్లో కూడా నీళ్లూరాయి.‘మీ పేరెంటమ్మా..’ అడిగాడు. ‘ఎర్రయ్యమ్మ..’ చెప్పింది.మిగతా వివరాలూ అడిగాడు కనకరాజు. తన కొడుకు పేరు రాజు అని చెప్పింది ఆమె. పదేళ్లప్పుడు మాస్టారు కొట్టారని పుస్తకాల సంచిని అక్కడే విసిరికొట్టి, ఇంటికొచ్చేశాడట. కొడుక్కి బుద్ధి రావాలని రెండు దెబ్బలు వేసిందట ఎర్రయ్యమ్మ. అంతే..కోపంతో రాజు ఊరొదిలి పారిపోయాడు. అది మొదలు ఎర్రయ్యమ్మ పిచ్చిదానిలా చుట్టుపక్కల ఊళ్లే కాదు, సిటీలోని వీథులు, రోడ్లనూ గాలించిందట. తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ కొడుకు జాడ మాత్రం తెలియలేదు. అదో తీరని వెతగా మారిపోయింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ లోకం దృష్టిలో పిచ్చిదైపోయింది. ప్రభుత్వం అందిస్తోన్న ఫించనుతోపాటు రెండు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తను వుంటున్నది అద్దె ఇల్లే! అయితే ఒకప్పుడు అది తనదేనట. తాగుబోతు భర్త తన వ్యసనాల కోసం ఆ ఇంటిని అమ్మేశాడట. అయితే పెళ్లయిన మూడేళ్లకే చనిపోయాడట అతను. త్వరలోనే తన కొడుకు తనని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడని ఈమధ్యనే ఓ సాధువు ఆమెకు జోస్యం చెప్పాడట.ఆమె నోట ఆ వివరాలన్నీ విన్న కనకరాజు ‘ఎర్రయ్యమ్మా, అప్పుడెప్పుడో పారిపోయిన నీ కొడుకు ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఎలా గుర్తుపడతావు?’ అనుమానంగా అడిగాడు. అంతే.. ఆమె గబగబా ఇంట్లోకెళ్లి, పోస్టుకార్డు సైజులో వున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి తెచ్చి, ‘మా రాజుగాడి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ వుంది.. చూశావా బాబూ..?’ అంటూ ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోన్న పుట్టుమచ్చని చూపించింది.కనకరాజు ఆ ఫొటోని అడుగుదామనుకునేలోపే ఎర్రయ్యమ్మే ‘ఈ ఫొటో నీ దగ్గర ఉంచు బాబూ.. మా వాడిని గుర్తుపట్టడానికి.. ఇంకా ఇలాంటి ఫొటోలు నాలుగైదు నా దగ్గరున్నాయిలే’ అంటూ ఆ ఫొటోని కనకరాజు చేతిలో పెట్టింది.ఆ ఫొటోని భద్రంగా జేబులో పెట్టుకుంటూ, చిన్న కాగితం మీద తన మొబైల్ నెంబరు రాసి ఆమెకిచ్చాడు కనకరాజు. అలా ఎర్రయ్యమ్మకు అంతులేని విశ్వాసాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని నూరిపోసి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు.తర్వాత కొన్ని రోజులకే డిపోవారు కనకరాజు డ్యూటీ రూటు మార్చేయడంతో అతనికి ఎర్రయ్యమ్మను చూసే వీలు చిక్కలేదు. కూతురిని తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడం వల్ల కూడా అతనికి ఎర్రయ్యమ్మను కలిసే తీరిక దొరకలేదు. అలా రెండునెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎర్రయ్యమ్మే అతనికి ఫోన్ చేసింది తన కొడుకు ఇంటికి వచ్చేశాడంటూ! ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు కనకరాజు. డ్యూటీకి సెలవు పెట్టి, ఉన్నపళంగా దేవరపాలెం బయలుదేరాడు.కనకరాజుని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎర్రయ్యమ్మ.‘అయ్యా! మీరు చెప్పినట్టుగానే నా బిడ్డ నాకు దక్కాడు.. మీరు నా పాలిట భగమంతుడే! తమరు కలకాలం చల్లగా ఉండాలయ్యా..’ అంటూ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.‘నీ కొడుకు ఎక్కడమ్మా..?’అంటూ ఆత్రంగా అడిగాడు కనకరాజు.‘వంట సరుకులు కొనుక్కొత్తానని వెళ్లాడు బాబూ, వచ్చేత్తాడు..’ ఎర్రయ్యమ్మ అంటుండగానే ఓ పాతికేళ్ల యువకుడు రెండు చేతులతో రెండు సంచులను మోసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.అతను ఎర్రయ్యమ్మలాగే సన్నగా, పొడవుగా వున్నాడు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఏదో తేజస్సు ఆ కుర్రాడి ముఖంలో! ఎర్రయ్యమ్మ ‘రాజూ, నేను చెప్పానే, గొప్ప మనసున్న మారాజు అని.. ఈ బాబే’ అంటూ కొడుక్కి కనకరాజుని పరిచయం చేసింది.ఆ అబ్బాయి తన రెండు చేతులెత్తి కనకరాజుకి దండం పెట్టాడు. ఎర్రయ్యమ్మ, కొడుక్కి ఏదో చెప్తున్నట్టుగా సైగచేసింది. ఆ యువకుడు చెక్క బెంచీపై కూర్చున్న కనకరాజు కాళ్లకి నమస్కరించాడు.అనుకోని ఆ పరిణామానికి కనకరాజు బిత్తరపోతూ, ఆ కుర్రాడిని పైకి లేపుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. భోంచేసి వెళ్లాలని ఎర్రయ్యమ్మ పట్టుపట్టింది. భోంచేసి, వాళ్లిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకుని బస్సులో కూర్చున్న కనకరాజు మనసుకి ఎంతో ఊరటగా ఉంది. కానీ.. ఎక్కడో ఏదో తెలియని వెలితి!ఆ వెలితికి సాక్షీభూతంగా నిలిచిన ఓ సంఘటన కళ్ల ముందు కదుల్తూ అతన్ని రెండు వారాల వెనక్కు తీసుకువెళ్లింది.రాజు ఫొటోతో ఎర్రయమ్మ ఇల్లు దాటిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ కుర్రాడు కనిపించినా ఆ ఫొటోతో పోల్చి చూసుకోవడం కనకరాజు దినచర్యలో భాగమైపోయింది. అలా ఎర్రయ్యమ్మ వేదన గురించే ఆలోచిస్తోన్న కనకరాజుకి ఒకరోజు.. బస్సులో ఓ పాతికేళ్ల యువకుడు బేల ముఖంతో చిన్నగా శోకిస్తూ కనిపించాడు. అది చివరి ట్రిప్ కావడంతో బస్సంతా ఖాళీగావుంది. అతన్ని గమనించిన కనకరాజు, అతని పక్కనే కూర్చుని ‘ఏమైంది బాబూ.. అంతగా కుమిలిపోతున్నావు?’ అంటూ అనునయంగా అడిగాడు. ఆ అనునయానికి కదిలిపోయిన ఆ కుర్రాడు నెమ్మదిగా గొంతు విప్పాడు.‘నా పేరు డేవిడ్ రాజు. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మను చూడాలని, ఆమెతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ! మా అమ్మ గురించి నా శక్తి మేర చాలా సమాచారం సేకరించాను. అమ్మ నాకు తిండిపెట్టలేని దీనావస్థలో నన్ను మిషనరీ ట్రస్ట్‌లో వదిలేసిందట. ఏడాది పాటు అమ్మ ఆచూకీ కోసం చాలాచోట్లకి తిరిగాను. చాలామందిని కలిశాను. చిట్టచివరికి తన అడ్రస్ పట్టుకోగలిగాను. కానీ, నాలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సార్! తను ఓ నెల కిందటే ఎవరూలేని అనాథలా చనిపోయింది. నన్ను నిజంగానే అనాథని చేస్తూ..’ అంటూ బొటబొటా కన్నీళ్లుకార్చాడు.తను చదివిన ‘లా ఆఫ్ అట్రాక్షన్’ ప్రత్యక్షంగా ఎదురుకావడంతో మాటల్లో చెప్పలేని వింతానుభూతికి లోనయ్యాడు కనకరాజు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది జరిగితీరుతుంది!’ అని ఆ పుస్తకంలో చదివినట్టు జ్ఞాపకం. కుర్రాడి కళ్ల కిందుగా జారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ ‘నీకు అమ్మ ప్రేమ దక్కేటట్టు చేసే బాధ్యత నాది!’ అంటూ తిరుగులేని హామీనిచ్చాడు.ఆ కుర్రాడు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కుతూహలంగా కనకరాజు వైపు చూశాడు. ‘అయితే, నీ కుడి చెంప మీద చిన్న పుట్టుమచ్చ ఒక్కటే లోటు’ అన్నాడు కనకరాజు ఏదో ఆలోచిస్తూ!ఆరోజు ఆలా రెండు హృదయాల వేదనలను ‘ఒక సంతోష సాఫల్యం’గా రూపకల్పన చేశాడు కనకరాజు.ఎర్రయ్యమ్మ, రాజును కలిసిన కనకరాజు తన ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమైంది. మెయిన్ గేటు తీసి, లోనికి అడుగుపెడుతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అతని కూతురు ‘నాన్నా..’ అంటూ కిలకిలా నవ్వుతూ తనకేసి పరుగుతీస్తోంది లేడిపిల్లలా. పట్టరాని భావోద్వేగంతో కూతుర్ని చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. ఎదురుగా వస్తోన్న అతని భార్య, తల్లి ముఖాల్లో వెల్లివిరిసిన వసంతకాలపు వెలుగులు!ఆశ్చర్యంగా భార్య వైపు చూశాడు. ‘ఉదయాన్నే మీరు అలా వెళ్లారో లేదో.. ఎప్పుడూ తిననని మొండికేసే పిల్ల ‘ఆకలీ.. ఆకలీ..’ అంటూ ఒకటే గొడవ. జ్వరం ఉందేమోనని చూశాను. ఏదో మంత్రం వేసినట్టుగా పూర్తిగా మాయం! అప్పటికప్పుడు టిఫిన్ చేసి, వేడివేడిగా తినిపించాను. తిన్నప్పటి నుంచి ఒకటే అల్లరి! ఇల్లంతా ఉరుకులు, పరుగులు! ఉదయం నుంచి పది నిమిషాలకొకసారి ఏదో ఒకటి అడిగి తింటూనే ఉంది. ఒక్క వాంతి కూడా కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉందండీ..’అంటూ ఆమె సంబరంగా జరిగినదంతా చెప్పుకుపోయింది. ‘సాటి మనిషికి సాయం చేసే నీ తత్త్వమేరా నీ బిడ్డకు ఆయుష్షు పోసుంటుంది..!’ అంది కనకరాజు తల్లి, కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తల్లి మాటలకు చిన్నగా నవ్వేస్తూ, కూతురిని మురిపెంగా చూసుకుంటూ ఇంట్లోకి నడిచాడు కనకరాజు.ఎర్రయ్యమ్మని రాజు ఎలా చూసుకుంటున్నాడో తెలుసుకోవాలన్పించి, ఒకరోజు దేవరపాలెం వెళ్లాడు కనకరాజు. సాదరంగా ఆహ్వానించింది ఎర్రయ్యమ్మ. రాజు ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద సిటీకి వెళ్లాడని చెప్పింది. సాఫ్ట్వేర్ అయిన రాజు.. వారానికి ఒకటీ, రెండ్రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తుంటాడు. మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎర్రయ్యమ్మ కట్టూబొట్టూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీదకి బంగారం కూడా చేరింది. కొడుకు కోరిక మేరకు పాచిపనులకు స్వస్తి చెప్పింది.ఎర్రయ్యమ్మ చెప్పిన మరో విషయం రాజు మీద కనకరాజుకి తిరుగులేని నమ్మకాన్ని కలిగించింది. తన భర్త ద్వారా పోగొట్టుకున్న, ఒకప్పటి తన సొంతిల్లు అదే ఇప్పుడు అద్దెకున్న ఆ ఇల్లు, దాన్ని ఆనుకొని వున్న మరికొంత ఖాళీస్థలాన్నీ కొని, ఎర్రయ్యమ్మ పేరిట కాగితాలు రాయించాడని చెప్పింది. విన్న కనకరాజు తన ప్రయత్నం సంపూర్తిగా సఫలీకృతమైంది అనుకున్నాడు. మనసు నిండింది.‘ప్రతి జీవితానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలంటారు. నా జీవితానికిది చాలు!’ అనుకుంటూ బయల్దేరడానికి సమాయత్తమయ్యాడు కనకరాజు.కుర్చీలోంచి లేచిన కనకరాజు కాళ్లకి ఎర్రయ్యమ్మ నమస్కరించబోయింది. ఆ హఠాత్పరిణామానికి అతను బిత్తరపోయి దూరం జరుగుతూ ‘ఎర్రయ్యమ్మా, నేను నీ తమ్ముడు లాంటివాడిని. నువ్వు నా కాళ్లకు నమస్కరించడం ఏంటీ?’ అన్నాడు ఇబ్బందిపడుతూ.‘సాటిమనిషి కోసం ఆలోచించే తీరికలేని ఈ కాలంలో.. అనామకురాలైన ఈ ఎర్రయ్యమ్మ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకెరుకే బాబూ..! పారిపోయిన నా కొడుక్కి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. కానీ, వాడి ఛాతీ మీదున్న పాపిడి బిళ్లంత మరొక పుట్టుమచ్చ గురించి చెప్పలేదు! అది నీకు తెలియదు కదా బాబూ..’ అంటోన్న ఆమెకు బదులేం ఇవ్వాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనకరాజు.‘నా బాధ చూడలేక, నా కొడుకు రూపంలో ఈ అబ్బాయిని, నువ్వే పంపించావని నాకు ఎరుకే బాబూ! రాజు నా కడుపున కాయకపోయినా అంతకన్నా ఎక్కువే! ఇలాంటి మారాజు బిడ్డని నాకు చూపించినందుకు నీకు ఈ ఎర్రయ్యమ్మ జనమ జనమలకు రుణపడి ఉంటాది బాబూ..! నా కొడుకు మొన్ననే నీ గురించి ఓ మాట చెప్పినాడు.. ‘కండక్టర్’ అంటే నడిపించేవాడని అర్థమట! నువ్వు, నిజంగా మా బతుకులను నడిపించిన దేవుడివయ్యా..’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది.‘ఎర్రయ్యమ్మా.. నీ రాజును నీ దరికి చేర్చే క్రమంలో నిన్ను ఒక అబద్ధంతో మభ్యపెడుతున్నానని ఎంతో అపరాధభావానికి గురయ్యాను. ఆ వెలితిని కాస్త దూరం చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అన్నాడు కనకరాజు. తేలికపడిన మనసుతో తన ఇంటి దారి పట్టాడు. – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు.. ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. రంగపురి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తండ్రే కూతుళ్లను హత్య చేసి, ఆపై తాను విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ ఘటనలో సల్ఫా మాత్రలు తాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురు కూతుళ్లలో ఒక కుమార్తె అంధురాలు. మరో కుమార్తె కూడా అంగవైకల్యంతో బాధపడుతోంది. సంఘటనా స్థలంలో సల్ఫేట్ సాచెట్లను పోలీసులు గుర్తించారు. ఒక గదిలోని డబుల్ బెడ్‌పై కుమార్తెల మృతదేహాలు పడి ఉండగా, రెండో గదిలో తండ్రి మృతదేహం లభ్యమైంది. అయిదుగురి నోటి నుండి తెల్లటి నురగ వచ్చినట్లు కనిపిస్తోంది. వీరందరి మెడకు ఎర్రటి దారం కట్టివుంది.ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటి యజమాని, తండ్రి హీరాలాల్(50) కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, ఏడాది క్రితం అతని భార్య క్యాన్సర్‌తో మృతిచెందింది. ఈ నెల 24 నుంచి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టగా, వారికి లోపల ఐదు మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య -
Tech Talk: యూట్యూబ్‌లో.. ఈ ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయని మీకు తెలుసా!
క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ ఇన్నోవేటివ్ ఫీచర్లను ప్రకటించింది. కంటెంట్ క్రియేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ అధునాతన వీడియో జనరేషన్ టెక్నాలజీ, కమ్యూనిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి.వీయో ఇన్ డ్రీమ్ స్క్రీన్: షార్ట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ జనరేట్ చేయడం కోసం రూపొందించిన యూట్యూబ్ డ్రీమ్స్క్రీన్ ఫీచర్ ఇప్పుడు గూగుల్ డీప్‌మైండ్ వీయోను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ అప్‌గ్రేడ్ క్రియేటర్లకు సహజత్వంతో కూడిన బ్యాక్‌గ్రౌండ్, స్టాండ్‌లోన్ వీడియో క్లిప్‌లను క్రియేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. షార్ట్–ఫామ్ కంటెంట్ నాణ్యతను పెంచుతుంది.ఇన్స్పిరేషన్ ట్యాబ్ అప్‌గ్రేడ్: ఐడియాలు, టైటిల్స్, థంబ్ నెయిల్స్, ఔట్లైన్స్ను మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది.కమ్యూనిటీస్: ఈ సరికొత్త కమ్యూనిటీస్ ఫీచర్ ద్వారా క్రియేటర్లు, సబ్స్క్రైబర్లు వీడియోలు, టాపిక్స్ గురించి చర్చించుకోవచ్చు.ఆటో డబ్బింగ్: యూట్యూబ్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్‌ని విస్తరించనుంది. డబ్బింగ్ ఆడియో ట్రాక్‌లను ఆటోమేటిక్‌గా యాడ్ చేయడానికి క్రియేటర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది వీడియోలను ప్రపంచ ప్రేక్షలకు చేరువ చేస్తుంది. భాష అడ్డంకులు లేకుండా చేస్తుంది.హైప్ ఫీచర్: ‘హైప్’ ఫీచర్ ద్వారా ఔత్సాహిక క్రియేటర్లు కొత్త ఆడియెన్స్‌తో కనెక్ట్ కావచ్చు. అయిదు లక్షల కంటే తక్కువ చందాదారులు ఉన్న క్రియేటర్ల నుంచి వీడియోలను హైప్ చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది. చిన్న, మధ్యతరహా క్రియేయేటర్ల అభివృద్ధికి ఉపయోగపడే ఫీచర్‌ను తీసుకురావాలనే జెన్ జెడ్‌లోని అత్యధికుల విన్నపం మేరకు ‘హైప్’ ఫీచర్‌ని తీసుకువచ్చారు. గూగుల్ పిక్సెల్ 9ప్రో..డిస్ప్లే: 6.30 అంగుళాలు ; బరువు: 199 గ్రా.మెమోరీ: 128జీబి 16జీబి ర్యామ్/256జీబి 16జీబి ర్యామ్/ 512 జీబి 16జీబి ర్యామ్బ్యాటరీ: 4700 ఎంఏహెచ్ఫ్రంట్ కెమెరా: 42 ఎంపీడిజిటెక్ స్మార్ట్‌ఫోన్ జింబల్..బ్రాండ్: డిజిటెక్ బరువు: 400 గ్రా. కలర్: లైట్ గ్రే 3 క్రియేటివ్ ఆపరేషన్ మోడ్స్:ఆల్ ఫాలో మోడ్హాఫ్ ఫాలో మోడ్ ఆల్ లాక్ మోడ్పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ఇన్స్టా ‘రీల్స్’ (ఆండ్రాయిడ్) డౌన్లోడ్ చేయడానికి...‘వీడియో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించి ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ‘రీల్స్’ లింక్‌ను కాపీ చేసి యాప్‌లో పేస్ట్ చేయడం ద్వారా ఫోన్ గ్యాలరీలో డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ యూజర్లు ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవడానికి ‘ఇన్సేవర్:రీపోస్ట్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించవచ్చు. థర్డ్–పార్టీ యాప్‌లపై మీకు ఆసక్తి లేకపోతే ‘స్క్రీన్ రికార్డింగ్’ అనేది ఒక ఆప్షన్.కొత్త ఇమోజీలు..మన భావోద్వేగాలను వేగంగా వ్యక్తీకరించడానికి ఇమోజీ అనేది చక్కటి మార్గం. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఉత్సాహం... ఇలా ప్రతి భావోద్వేగానికి ఒక ఇమోజీ ఉంది. ఇప్పుడు ఉన్న ఎన్నో ఇమోజీలకు కొత్తగా మరో 8 యాడ్ కానున్నాయి. దీంతో ఇమోజీల ప్రపంచం మరింతగా విస్తరించనుంది.కొత్త ఇమోజీలను సృష్టించే బాధ్యత యూనికోడ్ స్టాండర్డ్ తీసుకుంటుంది. సార్క్ అధికారిక జెండా, పార, రూట్ వెజిటేబుల్, కంటికింద సంచులతో అలిసిపోయిన ముఖం, పెయింట్ స్పా›్లట్, చెట్టు కొమ్మ, వేలిముద్ర, హర్ప్(మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్)... ఇలాంటి కొత్త ఐకాన్లను యూనికోడ్ ఎనౌన్స్ చేసింది.ఇవి చదవండి: హెల్దీ డైట్.. క్యారమెల్ బార్స్! -
హెల్దీ డైట్.. క్యారమెల్ బార్స్!
మన ఆరోగ్యానికి కావలసిన ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఇతర పోషకాలు లభించే ఈ క్యారమెల్ బార్స్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా! ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ప్రయత్నించండి...కావలసినవి..కోకో పౌడర్ – అరకప్పు;మొక్కజొన్న పిండి– 1 1/4 కప్పు; చక్కెర పొడి– కప్పు;క్రీమ్– 4 టేబుల్ స్పూన్లు;వేరుశనగ పప్పు పలుకులు– పావు కప్పు;వాల్ నట్ పలుకులు – పావు కప్పు;క్యారమెల్ చిప్స్ – కప్పు;కండెన్స్డ్ మిల్క్ – ఒక టిన్ (14 ఓజెడ్);వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్;బటర్ – 3 టేబుల్ స్పూన్లు (ఉప్పు లేనిది)తయారీ..– ఒక పాత్రలో 2 టీ స్పూన్ల బటర్, చక్కెర వేసి బీటర్‌తో చిలకాలి. అందులో కోకో, మొక్కజొన్న పిండి కలిపి మళ్లీ చిలకాలి – ఒవెన్‌ను 350 డిగ్రీ ఫారన్‌హీట్‌లో వేడి చేయాలి. బేకింగ్ ట్రేలో మందపాటి పేపర్‌ను పరిచి అంచులకు సరిగ్గా సర్దాలి. – పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని పోసి సమంగా సర్ది ఒవెన్‌లో పెట్టి 15 నిమిషాల సేపు బేక్ చేసి ట్రేని బయటకు తీయాలి. – పాత్రలో 2 టేబుల్ స్పూన్ల బటర్, కండెన్స్డ్ మిల్క్, వెనిల్లా ఎసెన్స్ వేసి కలపాలి.– బేకింగ్ ట్రేలో బేక్ అయిన కోకో మిశ్రమం మీద కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని పోయాలి.– ఇప్పుడు ఆ ట్రేని మళ్లీ ఒవెన్‌లో పెట్టి పదినిమిషాల సేపు బేక్ చేయాలి.– ఇది వేడి తగ్గే లోపు వేరుశనగపప్పు పలుకులు, వాల్నట్ పలుకులను ఒక మోస్తరుగా వేయించి పక్కన పెట్టాలి.– క్యారమెల్ చిప్స్, క్రీమ్‌తో కలిపి కరిగించి అందులో ఉప్పు, వేయించిన గింజలను కలపాలి.– బేక్ చేసిన మిశ్రమం మీద క్యారమెల్, నట్స్ మిశ్రమాన్ని పై నుంచి పోసి చల్లారేలోపు స్లయిస్లుగా కట్ చేయాలి.– ఇవి గోరు వెచ్చగా తినవచ్చు, పూర్తిగా చల్లారిన తర్వాత కూడా తినవచ్చు.పోషకాలు: క్యాలరీలు – 285; ప్రోటీన్ – 4 గ్రాములు; కార్బొహైడ్రేట్లు – 40 గ్రాములు; చక్కెర – 28 గ్రాములు; ఫ్యాట్ – 14 గ్రాములు; సాచురేటెడ్ ఫ్యాట్ – 7 గ్రాములు; ఫైబర్ – 1.5 గ్రాములు; సోడియం – 180 మిల్లీగ్రాములు. – డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ఇవి చదవండి: తప్పును సరిదిద్దుకునే మార్గాలు..! -
తప్పును సరిదిద్దుకునే మార్గాలు..!
పర్యావరణం సమతుల్యత కోల్పోయింది. కాదు... పర్యావరణాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టేశాం. మన పనుల ద్వారా భూ ఆవరణాన్ని కాలుష్య కాసారంగా మార్చాం. ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నాం. ఈ పూట గడిస్తే చాలు అన్న ట్లుగా వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నాం. ప్రకృతి మాత మూలుగను పీల్చేస్తున్నాం. వెరసి... జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాడుకోవాల్సిన పర్యా వరణ వనరుల బడ్జెట్‌ను పరిమితికి మించి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో తెగ వాడేసుకుంటున్నాం.అవసరాలు తీర్చుకోవటానికి కాకుండా అత్యా శకు పోయి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ను ఆగస్టు 1 నాటికే పూర్తిగా కాజేసి... ఆ తర్వాత ప్రతి క్షణం ప్రకృతి మాత మూలుగను అదే పనిగా పీల్చేస్తున్నాం. దాంతో, తిరిగి తిప్పుకోలేని స్థితికి చేరిన భూగోళం గతి తప్పి సమతుల్యతను కోల్పోయింది. మొన్నటి వరకు గతమెన్నడూ ఎరుగనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇప్పుడేమో అతి భారీ కుండపోత వర్షాలు, భీకర వరదలు; ములుగు జిల్లాలో అభయారణ్యం నేలమట్టం కావటం... ఐక్య రాజ్యసమితి ప్రకటించి నట్లు ఇవన్నీ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’కి ప్రత్యక్ష నిదర్శనాలు. భూగోళం గతమెన్నడూ లేనంత ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశా ల్లోనూ గత 13 నెలలు అత్యంత అధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. భూతాపాన్ని పెంచ టంలో, భూగోళం ఆరోగ్యాన్ని క్షీణింప జేయటంలో వ్యవసాయం, ఆహార సరఫరా రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని గణాంకాలు చెబు తున్నాయి. మనుషులు, పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తోంది. మనం పండిస్తున్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు, ఫైటో న్యూట్రియంట్స్ భారీగా తగ్గి పోయాయి. భూగోళం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా క్షీణింపజేయటంలో పారిశ్రామిక వ్యవసాయ–ఆహార వ్యవస్థల పాత్ర చాలా ఉంది.2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం...క్లైమేట్ ఛేంజ్‌పై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన స్టాక్‌హోం రెజిలి యన్స్ సెంటర్ (ఎస్ఆర్సీ) సమాచారం ప్రకారం... ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగ తీరును బట్టి, భూతాపోన్నతిని బట్టి... భూగోళం ఆరోగ్యాన్ని 9 అంశాల ప్రాతిపదికగా అంచనా వేస్తారు. ఈ 9 అంశాల్లో ఆరింటిలో 2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం. ము ఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ఆరింటిలో ఐదింటికి కారణం వ్యవసాయం, ఆహార వ్యవస్థలేనని ఎస్ఆర్సీ తేల్చి చెప్పింది.నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నావెల్ ఎన్టిటీస్, నత్రజని/ఫాస్ఫరస్ వంటి రసాయనాల వాడకం... ఈ ఐదు అంశాల్లో పరిస్థితి విషమించటడానికి ఒకానొక మూల కారణం ముఖ్యంగా రసా యనిక/పారిశ్రామిక వ్యవసాయం, ఆహార వ్యవస్థ లేనని ఎస్ఆర్సీ నిర్ధారణకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమిలో 40 శాతం ఇప్పటికే సాగు యోగ్యం కాకుండాపోయి బంజరుగా మిగిలిపోయింది.ఈ ఖాళీ భూముల నుంచి, పంట లేని పొలాల నుంచి రీ రేడియేషన్ ప్రక్రియ ద్వారా సూర్యరశ్మి వాతావరణంలోకి పరావర్తనం చెందటం భూతాపోన్నతికి దోహదం చేస్తోంది. పారిశ్రామిక వ్యవసాయ క్షేత్రాల నుంచి వస్తు సరఫరా వ్యవస్థ చివరి గొలుసు వరకు (అగ్రీఫుడ్ సిస్టమ్స్) వెలువడే కర్బన ఉద్గారాలు క్లైమేట్ ఛేంజ్‌కు 34 శాతం మేరకు కారణభూతాలని గుర్తించాలి. తిరిగి ప్రాణశక్తిని పుంజుకొని సమతుల్యతను సంతరించుకోవడంలో భూగో ళానికి తోడుగా ఉండటానికి మార్గాలేవీ లేవా? తప్పకుండా ఉన్నాయన్నది నిపు ణులు చెబుతున్న గుడ్ న్యూస్. వాటిల్లో ఒకటేమిటంటే... పునరుజ్జీవన (ప్రకృతి/సేంద్రియ) వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమల్లోకి తేవటం! తద్వారా కొద్ది సంవత్సరాల్లోనే క్లైమేట్ సంక్షోభం నుంచి చాలా వరకు బయట పడొచ్చని సుసంపన్న అనుభవాలే తెలియజెబు తున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్, 86397 38658ఇవి చదవండి: నిదానమే.. ప్రధానం! -
నిదానమే.. ప్రధానం!
మేధాతిథి అనే తాపసుని పుత్రుడు చిరకారి. అతడు ఏ పనిని తొందర పడి చేయడు. చక్కగా అలోచించి చేస్తాడు. అందువలన అందరూ అతనిని చిరకారి అని పిలిచేవారు. ఒకసారి మేధాతిథికి భార్యపై బాగా కోపం వచ్చింది. కొడుకును పిలిచి ఆమెను చంపమని ఆజ్ఞాపించి అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. చిరకారి చాలా సేపు ఇలా ఆలోచించాడు..‘తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించటం మంచిది కాదు. అలాగని తల్లిని చంపటం యుక్తం కాదు. తల్లి నెలాగైనా కాపాడుకోవాలి. తల్లిదండ్రుల మధ్య పుత్రత్వం అనేది స్వేచ్ఛ లేనిదిగా ఉంది. నేను ఇద్దరికీ చెందినవాడను. ఈ క్లిష్ట పరిస్థితిలో వీరిద్దరిలో ఎవరిని వదులుకోవాలి? కొడుకు ఏ వయ సులో ఉన్నా తల్లి ప్రేమ, రక్షణ బాధ్యత ఒకే విధంగా ఉంటాయి. తల్లి లేకపోతే లోకం శూన్యమై పోతుంది. ఇంతటి పూజ్యురాలైన తల్లిని వధించటానికి నాకు చేతులెలా వస్తాయి?’ అనుకుంటూ చిరకారి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.‘మాతృ దేవోభవ’ అనే సూక్తి కూడా తల్లినే ప్రథమ దైవంగా భావించమని బోధించింది. చిరకారి తండ్రి మాట కాదనలేక, తల్లిని చంపలేక కత్తి చేత్తో పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా, మేధాతిథిలో పశ్చా త్తాప భావన మొదలైంది. చిన్న తప్పుకు కోపించి భార్యను చంపమని కొడుకుని ఆజ్ఞాపించాను. చిరకారి ఏ పనైనా దీర్ఘంగా అలోచించి కాని చేయడు. మాతృ వధకు పూనుకోకుండా తన పేరు సార్థకం చేసుకుంటే బాగుండును అనుకుంటూ ఇంటికి వస్తాడు. చిరకారి చేతిలో ఖడ్గాన్ని వదిలి తండ్రి పాదాలకు నమస్కరించాడు. భార్య కూడా ఆయనకు నమస్కరించింది. ఆయన వారిద్దరినీ దీవించాడు. ఏ పనైనా తొందరపడక, ఆలోచించి ధీరత్వంతో చేసేవాడు సమస్త శుభాలు పొందు తాడని మేధాతిథి చెబుతాడు.ధర్మరాజు కార్యాచరణలో అవసరమైనది బహు దీర్ఘ సమయమా? అత్యల్ప సమయమా అని భీష్ముని అడిగినప్పుడు ఆయన చిరకారి కథ చెప్పి అలా చేయమని చెబుతాడు. ఏ పనినైనా తొందరపాటుతో చేస్తే అనర్థాలు కలుగుతాయి. అలోచించి చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి అని సారాంశం. – డా. చెంగల్వ రామలక్ష్మి -
యువత... మరింత క్రియాశీలంగా!
కౌమారదశ అనేది మానవ అభివృద్ధిలో ప్రత్యేకమైన, క్లిష్టమైన దశ. మంచి ఆరోగ్యానికి దీర్ఘకాలిక పునాదులు వేయడానికి కీలకమైన దశ. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ‘ఫ్యూచర్ సమ్మిట్’లో ‘ట్రెండ్స్ ఇన్ అడల్సెంట్ హెల్త్: సక్సెస్ అండ్ చాలెంజెస్ ఫ్రమ్ 2010 టు ది ప్రజెంట్’ పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేశారు. కౌమరుల ఆరోగ్యం, అలవాట్లౖను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన నివేదిక ఇది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... కౌమారదశలో ఉన్న ఏడుమందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాథపడుతున్నారు. నిరాశ, ఆందోళన అనేవి వారిలో తీవ్రంగా కనిపిస్తున్నాయి.కౌమార బాలికలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది. కౌమారదశలో ఉన్న పదిమందిలో ఒకరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. యువతలో లైంగిక సంక్రమణ అంటువ్యాధులు పెరుగుతున్నాయని, హింసాత్మక ఘటనలు యువత శారీరక, మానసిక ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ నివేదిక చెబుతుంది. కౌమారుల ఆరోగ్యం, హక్కులను పరిరక్షించే చట్టాలను అమలు చేయాలని, పరిశోధన, విధాన రూపకల్పనలో యువత నిమగ్నం కావాలని అధ్యయన కర్తలు కోరుతున్నారు. యువత ఏం కోరుకుంటున్నారో నాయకులు వినాలని, వారు క్రియాశీల భాగస్వాములుగా, నిర్ణయాలు తీసుకునేవారిగా ఉండేలా చూడాలన్నారు.ఇవి చదవండి: Intips: ఈ పదార్థాలకు పురుగు పట్టకుండా.. ఇలా చేయండి! -
Intips: ఈ పదార్థాలకు పురుగు పట్టకుండా.. ఇలా చేయండి!
బియ్యం, గోధుమపిండి, కంది, పెసర, మినప్పప్పు లాంటì వాటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, చిన్న చిన్న కీటకాలు చేరుతాయి. వీటిని తింటే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు, కొన్నిసార్లు అలర్జీలు కూడా రావచ్చు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.ఎండు వెల్లుల్లి రెబ్బలు..పప్పు, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే, అందులో కొన్ని ఎండు వెల్లుల్లి రెబ్బలు కలపాలి. వెల్లుల్లి నుంచి వెలువడే గాఢమైన వాసన వల్ల పురుగులు పప్పు, బియ్యం గింజల వైపు రాలేవు.వాము కలపడం..బియ్యం డబ్బా లేదా బస్తాలో కాస్తంత వాము వేస్తే, అందులో పురుగులు పట్టవు. ఎందుకంటే వాము వాసన కూడా పురుగులకు పడదు.ఎండు మిరపకాయలు..బియ్యం లేదా గోధుమలు నిల్వ చేసేటప్పుడు, కాసిని ఎండు మిరపకాయలు ఉంచితే, పురుగు పట్టకుండా చాలాకాలం పాటు తాజాగా ఉంటాయి.వేపాకులు..వేపాకులకు ఉండే చేదు గుణం, ఘాటైన వాసన వల్ల పురుగులు దూరంగా ఉంటాయి. అందుకే, బియ్యం నిల్వ చేసే పాత్రలో కొన్ని వేపాకులు వేస్తే పురుగులు పట్టవు.మిరియాలు..బియ్యం నిల్వచేసే డబ్బాల్లో కొన్ని మిరియాలు వేస్తే, అందులో పురుగులు పట్టవు. మిరియాల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. వీటిని గోధుమల్లో కలిపి, వాటికి కూడా పురుగులు పట్టకుండా జాగ్రత్త పడొచ్చు.లవంగాలు..లవంగాల ఘాటు వాసనను పురుగులు, కీటకాలు భరించలేవు. అందుకే, బియ్యం నిల్వ ఉంచే పాత్రలో కాసిని లవంగాలు వేయాలి. లవంగ నూనె కూడా కీటకాలను దూరం చేస్తుంది.ఇవి చదవండి: ఇవి.. సహజసిద్ధ'మండి'! -
Harshitha: కామన్ మ్యాన్ ఫ్రెండ్..!
ఆలోచించాలేగానీ.. శతకోటి సమస్యలకు అనంత కోటి పరిష్కారాలు ఉంటాయి. మామయ్యను అనారోగ్యానికి గురి చేసిన సమస్యపై దృష్టి పెట్టిన హరిత ఆ సమస్యకు పరిష్కారం కనుక్కుంది. శాస్త్రప్రపంచంలో తొలి అడుగు వేసింది...పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన హర్షిత చిన్ననాటి నుంచి తెలివైన విద్యార్థి. జెడ్పీ హెచ్ఎస్ చందనాపూర్లో చదువుతుండేది. క్రమం తప్పకుండా బడికి వచ్చే హర్షిత ఒకసారి వరుసగా వారంరోజులు రాలేదు. ఆ తరువాత బడికి వచ్చిన హర్షితను సైన్స్ టీచర్‌తో పాటు క్లాస్ టీచర్‌గా ఉన్న సంపత్ కారణం అడిగారు.తన మామయ్య వెల్డింగ్ పనిచేస్తాడని, వెల్డింగ్ పొగ పీల్చి ఊపిరితిత్తులు జబ్బు పడ్డాయని, ఆయనకు సహాయంగా ఉండేందుకు స్కూలుకు రాలేదని చెప్పింది. ‘మామయ్య మరోసారి జబ్బు పడకుండా ఏదైనా చేయాలని ఉంది’ అని తన మనసులోని మాట చెప్పింది. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో హరిత ఒక హెల్మెట్ తయారుచేసింది. చిన్న ఫ్యాన్ అమర్చి రూపొందించిన ఈ హెల్మెట్ వెల్డింగ్ సమయంలో పొగను ముఖం వరకు చేరనివ్వదు. హరిత రూపొందించిన హెల్మెట్ చూసి సైన్స్ టీచర్ ఆశ్చర్యపోయారు. హరితను అభినందించారు.తొలుత ప్రోటోటైప్‌గా రూపొందించిన ఈ హెల్మెట్‌ను ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో మరింత మెరుగు పరిచింది. హెల్మెట్‌కు ఒక సెన్సార్ బిగించి, వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి ముఖం పైకి పొగ రాగానే హెల్మెట్‌పై ఉన్న ఫ్యాన్ దానంతట అదే తిరిగేలా డిజైన్ చేసింది. సిమెంటు, ఇటుక, పిండిమర.... మొదలైన పరిశ్రమలలో పని చేసే కార్మికులు, నిరంతరం దుమ్ములో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా రక్షణ ఇస్తుంది. దీనికి ‘కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ హెల్మెట్’గా నామకరణం చేసింది. ఈ హెల్మెట్ జపాన్ సకురా ఇంటర్నేషనల్ సైన్స్ప్రోగ్రాం, ఇండియన్ ఇంటర్నేషన్ ఇన్నోవేషన్ప్రోగ్రాం, ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ప్రోగ్రామ్లకు ఎంపికైంది.స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్‌బాటిల్.కరోనా టైమ్‌లో స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్ బాటిల్‌ను తయారు చేసింది హర్షిత. ఈ బాటిల్‌ను మూడు అరలుగా విభజించారు. మొదటి అరలో శానిటైజర్, రెండో అరలో తాగునీరు, మూడో అరలో సబ్బు/స్నాక్స్ పెట్టుకునేలా ఈ బాటిల్‌ను రూపొందించింది. ప్రతీ అరగంటకు ఒకసారి నీరు తాగే విషయాన్ని మనకు రెడ్‌లైట్‌తో లేదా వైబ్రేషన్, సౌండ్ సదుపాయాల ద్వారా గుర్తు చేస్తుంటుంది. హర్షిత కరీంనగర్‌లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్’లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. – బాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్ఇవి చదవండి: ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు! -
ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక యుగంలో అత్యంత ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా.. అది పుట్టించిన సెలబ్రిటీల హవా రానున్న రోజుల్లో మరింత పుంజుకోనుంది. నగరంలో సైతం పెద్ద సంఖ్యలో ఇన్ఫ్లుయెన్సర్లు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సోషల్ బీట్, ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ తాజాగా ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ గురించిన విశేషాలు వెల్లడించింది.నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా బ్రాండ్లు, 500 కంటే ఎక్కువ మంది క్రియేటర్స్– ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ ఏడాది చివరి నాటికి ఇన్ఫ్లుయెన్సర్ ఇండస్ట్రీ రూ.5,500 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. డిజిటల్ మీడియా పరిశ్రమలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ 11 శాతంగా లెక్కించింది. ఈ నివేదికను బ్రాండ్లకు వారి మార్కెటింగ్ అవసరంతో పాటు ఈ పరిశ్రమ ఏటా 25% పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.ఒకప్పుడు ఉచితంగానే..దాదాపు ఆరేళ్ల క్రితం తొలిసారి నేను ఇన్ఫ్లుయెన్సర్గా మారినప్పుడు కొన్ని బ్రాండ్స్ మార్కెటింగ్ కోసం సంప్రదించాయి. అయితే అప్పుడు మాకు నామమాత్రంగా ఖర్చులకు తప్ప పారితోíÙకం రూపంలో ఏమీ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం మంచి అమౌంట్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. నగరంలో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో రూ.లక్ష నుంచి రూ.కోటి దాకా డిమాండ్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. నాకు వస్తున్న బ్రాండ్స్‌ను బట్టి తొలుత ఫుడ్ ట్రావెలర్‌గా మాత్రమే ఉన్న నేను ఇప్పుడు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులతో సహా అనేక బ్రాండ్స్‌కు వర్క్ చేస్తున్నాను. – అమీర్, ఇన్ఫ్లుయెన్సర్ఇవి చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి.. -
Fashion: లైట్ కలర్స్‌తో.. లగ్జరీ లుక్!
తమ క్రియేటివ్ డిజైన్స్‌తో ఇతరులను అందంగా చూపే ఫ్యాషన్ డిజైనర్లు తమ కోసం వార్డ్ రోబ్‌ను ఎంత ఘనంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ విషయమై హైదరాబాద్‌లో మోడల్స్‌కి, ఫ్యాషన్ షోల కోసం డిజైన్స్ క్రియేట్ చేసే హేమంత్ సిరి ‘లెస్ ఈజ్ క్లాసీ’ అంటూ సింపుల్‌గా ఉండే తన వార్డ్ రోబ్‌ను పరిచయం చేస్తున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి చేనేతలు అంటే బాగా ఇష్టం ఉండేది. దీంతో మా అమ్మ, అమ్మమ్మల చీరలను నాకు అనువుగా డిజైన్ చేసుకునేదాన్ని. నేను డిజైన్ చేసిన దుస్తులను వేసుకున్నవారు అందంగా కనిపించాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. అయితే, నన్ను నేను కూడా బెస్ట్‌గా చూసుకోవాలి. నా విషయానికి వచ్చేసరికి కొన్ని ఎక్స్పర్మెంట్స్తో ΄ాటు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాను. మోడల్స్‌కి, ఫ్యాషన్ షోస్ కోసం డిజైన్ చేయడంలో ఫ్యాబ్రిక్, కలర్స్ మీద ప్రత్యేక దృష్టి పెడతాను. నాకోసం అయితే ఇండోవెస్ట్రన్ లుక్ ఉండేలా చూసుకుంటాను. కొంచెం ్ర΄÷ఫెషనల్గా ఉండాలి అనుకుంటే హ్యాండ్లూమ్ శారీస్ ఎంచుకుంటాను.లెస్ ఈజ్ క్లాసీ..ఏదైనా ఈవెంట్‌కి వెళ్లాలి అనుకుంటే ముందు నన్ను నేను తెలుపు, క్రీమ్ కలర్ డ్రెస్‌లో ఊహించుకుంటాను. అంతేకాదు, ఆర్గానిక్ కలర్స్, ఆర్గానిక్ ఫ్యాబిక్స్ర్తో సింపుల్‌గా ఫార్మల్ లుక్‌ని ఇష్టపడతాను. హెవీ శారీస్ అయినా సరే సింపుల్‌గా ఉండే బ్లౌజ్‌నే ఉపయోగిస్తుంటాను. లెస్ ఈజ్ క్లాసీ అనిపించేలా ఉంటాను.లగ్జరీ కలర్స్..పేస్టల్ కలర్స్‌లో లైట్ క్రీమ్, పింక్, గోల్డ్.. ఇష్టపడతాను. ఈ రంగులు ఒక లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటాయి. క్రీమ్ లేదా ఐవరీ అంటేనే లగ్జరీ కలర్స్. లైట్ బ్లూ, లైట్ గ్రీన్.. వంటివి డే ఫంక్షన్స్‌కి, లైట్ సిల్వర్, లైట్ క్రీమ్ డ్రెస్సులు, శారీస్ నైట్ ఈవెంట్స్‌కి వాడతాను.ప్రయాణాల్లో సౌకర్యం..ఖ΄్తాన్స్ ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. పలాజోలు, జీన్స్, లైట్, ఫ్లోరల్ కలర్ నీ లెంగ్త్ ఫ్రాక్స్ని ఉపయోగిస్తాను.బొట్టుతో గుర్తింపు..నా పర్సనల్ స్టైలింగ్‌లో బొట్టు సిగ్నేచర్ అయిపోయింది. ముందు స్టికర్స్ వాడేదాన్ని. ఆర్గానిక్ కలర్స్పైన గ్రిప్ వచ్చాక కుంకుమ తయారు చేసుకుని, వాడుతున్నాను. వివాహవేడుకల వంటి ఎంత పెద్ద ఈవెంట్ అయినా సింపుల్ జ్యువెలరీనే ఉపయోగిస్తాను’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్..
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన జీవన శైలి, మోడ్రన్ ఫ్యాషన్ హంగులను అందిపుచ్చుకోవడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిసిందే.. ముఖ్యంగా మోడ్రన్ ఆర్ట్స్‌కు నగరంలో విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే సిటీలో ట్రెండీ డ్యాన్స్ స్టెప్పులను ఆహ్వానిస్తున్నారు.. ఆస్వాదిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం నగరంలో డ్యాన్సింగ్‌లో ఎన్నో మార్పులు, విభిన్న టెక్నిక్స్ రూపుదిద్దుకున్నాయి. డ్యాన్స్‌లో వెస్ట్రన్ స్టైల్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుత తరుణంలో వేడుక ఏదైనా సరే.., అందులో స్టెప్పు లేనిదే కిక్కు రాదు. కార్పొరేట్ ఈవెంట్స్ మొదలు సినిమా ఫంక్షన్ల వరకు హిప్హాప్, జాజ్ వంటి ట్రెండీ స్టెప్పులతో నగరం నృత్యం చేస్తోంది. నృత్యాన్నే కెరీర్‌గా మార్చుకున్న ఎంతో మంది డ్యాన్సర్లకు ఈవెంట్స్ ఉపాధిగా మారాయి. ప్రైవేటు పార్టీలు మొదలు కొత్త సంవత్సర వేడుకల వరకు ఈ డ్యాన్స్ బృందాలకు డిమాండ్ పెరిగిపోయింది.టాలీవుడ్ టూ బాలీవుడ్..నగరం వేదికగా నిర్వహించే పలు ఈవెంట్లలో వెస్ట్రన్, బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. ఈ డ్యాన్స్ స్టెప్పులకు నగరవాసుల నుంచి వస్తున్న ఆదరణ అలా పెరిగిపోతుండటం విశేషం. ఇలాంటి డ్యాన్స్ నేరి్పంచడానికి నగరంలో ప్రత్యేకంగా డ్యాన్సింగ్ స్టూడియోలు సైతం నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, హోలీ వంటి సంబరాల్లో భాగంగా పలు క్లబ్స్‌లో నిర్వహించే వేడుకల్లో, మ్యూజిక్ కన్సర్ట్స్ ముఖ్యంగా సినిమా ఆడియో ఫంక్షన్లు ఇతర కార్పొరేట్ కార్యక్రమాలకు ఈ డ్యాన్సర్లను ఆహా్వనిస్తున్నారు. స్థానికంగానే కాకుండా సీజన్లలో ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి ప్రత్యేకంగా ఈ నృత్యకారులను నగరానికి ఆహా్వనిస్తున్నారు. అంతేగాకుండా ఈ మధ్యకాలంలో ప్లాష్ మాబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. నగరంలోని పెద్ద పెద్ద మాల్స్‌లో విరివిగా ప్లాష్మాబ్స్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు. పేజ్ త్రీ పీపుల్ నిర్వహించే ప్రైవేట్ పార్టీల్లో సాల్సా వంటి డ్యాన్సులను ఆస్వాదిస్తున్నారు. సిటీ నుంచి.. గోవా ఫెస్టివల్స్‌కు..సినిమాల్లో సైడ్ డ్యాన్సర్లుగా చేస్తూనే మిగతా సమయాల్లో ఇలాంటి ఈవెంట్స్‌లో బిజీగా ఉంటున్నారు డ్యాన్స్ ప్రేమికులు. ఇదో ఉపాధిగానూ, అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ వేదికగానూ డ్యాన్సర్లకు ఉపయోగపడుతుందని పలువురు డ్యాన్సర్లు పేర్కొన్నారు. నగరం నుంచి గోవా ఫిల్మ్ ఫెస్టివల్స్, నూతన సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలకు వెళ్తున్నామని వారు తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా నిర్వహించే మ్యూజిక్ కన్సర్ట్స్, నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దాండియా ఈవెంట్స్‌లో ఈ డ్యాన్సర్లను ముందస్తుగానే బుక్ చేసుకోవడం విశేషం. ఈ మధ్య కాలంలో సంగీత్స్లో డ్యాన్సర్లకు బాగా డిమాండ్ పెరిగింది. ప్రతీ సంగీత్‌లో కనీసం ఒక కొరియోగ్రాఫర్, తనతో పాటు నృత్య బృందం పాల్గొనడమే కాకుండా నిర్వాహకులకు శిక్షణ అందించి సంగీత్‌లో సందడి చేస్తున్నారు.అవకాశాలెన్నో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం డ్యాన్సర్లకు విభిన్న వేదికల్లో అవకాశాలు పెరిగాయి. మోడ్రన్ స్టెప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే చాలు.., స్ట్రీట్ డ్యాన్సింగ్ నుంచి సినిమా ఫంక్షన్ల వరకు ఎన్నో అవకాశాలు. నగరం వేదికగా పలు సినిమా ఆడియో ఫంక్షన్లు, కార్పొరేట్ నైట్ ఈవెంట్స్‌తో పాటు తదితర లైఫ్ స్టైల్ ఈవెంట్లలో డ్యాన్సర్‌గా పాల్గొన్నారు. అంతేగాకుండా గోవా వేదికగా జరిగే డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నారు. ఇలాంటి వేదికలు మారుతున్న డ్యాన్స్ కల్చర్పైన అవగాహన పెంచుతాయి. ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి అధునాతన డ్యాన్సింగ్ స్టెప్పులు నగరానికి ఈ మధ్య వస్తున్నాయి. – శ్రీకాంత్, కొరియోగ్రాఫర్, శ్రీస్ డ్యాన్స్ స్టూడియోస్సాల్సా సైతం..20 ఏళ్లుగా నగరం వేదికగా డ్యాన్స్‌లో వస్తున్న మార్పులను గమనిస్తున్నాను. సిటీలో ఎక్కువగా టాలీవుడ్, బాలీవుడ్, హిప్హాప్కు క్రేజ్ ఉంది. నగరంతో పాటు బెంగళూరు వంటి నగరాల్లో అప్పుడప్పుడూ జాజ్, ఫ్రీక్ స్టైల్ వంటివి సందడి చేస్తున్నాయి. ఇవే కాకుండా ప్రత్యేకంగా సాల్సా, బచ్చాటా వంటి డ్యాన్సులను ఆస్వాదించే నగరవాసులున్నారు. కొంత కాలం పాటు క్లాసికల్ సమ్మిళితమైన బిబాయింగ్ వంటి డ్యాన్సులనూ నగరవాసులు చేసేవారు. డ్యాన్స్ లేకుండా ఈవెంట్స్ లేవు అనేంతలా డ్యాన్స్ పరిణామ క్రమం మారింది. ఈవెంట్స్‌తో పాటు ఫ్రీక్, హిప్ హాప్ వంటి డ్యాన్స్ ఫెస్టివల్స్ సైతం నిర్వహిస్తుంటారు. – నాగేంద్ర, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
సరికొత్త బాణీలే.. భవిష్యత్తుకు బాటలు!
సాక్షి, సిటీబ్యూరో: సంగీత పరిశ్రమలో సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. జీ తెలుగు వేదికగా ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ షో సరిగమప 16వ సీజన్ ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత కోటి మాట్లాడుతూ.. దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు.ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని, ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్ఛమైన, సహజమైన సంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందని అన్నారు. ప్రముఖ లిరిసిస్ట్ శ్యామ్ క్యాసర్ల ఈ సీజన్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఎంపిక చేసిన మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా తీర్చిదిద్దేలా సానబెడతామని తెలిపారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఆయన చెప్పారు. ఈ సీజన్లో విలేజ్ వోకల్స్, సిటీక్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్, రమ్య, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.ఇవి చదవండి: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్ -
Nagalakshmi: సైక్లింగ్ ఫిఫ్టీస్!
సాక్షి, సిటీబ్యూరో: ఓ వయసు దాటాక సాధారణంగా ఇంట్లో ఉండి.. మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు.. లేదంటే పుణ్యక్షేత్రాలు చుట్టొస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమలోని చిన్ననాటి అభిలాషను నెరవేర్చుకుంటారు. ఆ కోవకే చెందుతారు.. డాక్టర్ నాగలక్ష్మి. నిమ్స్ నేచురోపతి విభాగాధిపతిగా పనిచేసిన ఆమె.. 50 ఏళ్ల వయసులో సైక్లింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా ఆ వయసులో కిలోమీటర్ దూరం నడిస్తేనే అలసిపోతుంటారు. కానీ డాక్టర్ నాగలక్ష్మి మాత్రం అలవోకగా కిలోమీటర్ల మేర సైకిల్‌పై ఎంచక్కా షికారు చేస్తూ, యూత్‌కు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు.ఉదయం నాలుగు గంటలకే..సైక్లిల్ అనగానే ఉదయం నాలుగు గంటలకే మెలకువ వస్తుందని, ఆ వెంటనే రెడీ అయి సైక్లింగ్ చేస్తుంటామని పేర్కొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో సైక్లింగ్ చేస్తామని వివరించారు. మంత్లీ చాలెంజ్లా పెట్టుకుని, 30 రోజులు 30 ప్రదేశాలు వెళ్లాలనే టార్గెట్ పెట్టుకుని మరీ సైక్లింగ్ చేశామని చెప్పారు.శారీరక, మానసిక ఆరోగ్యం..సైక్లింగ్‌తో ఎన్నో లాభాలు ఉంటాయని, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా, రోజంతా యాక్టివ్‌గా ఉంటామని నాగలక్ష్మి వివరించారు. అంతేకాకుండా హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయని, దీంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు.సైకిల్ అంటే ఎమోషన్..చిన్నప్పటి నుంచి తనకు సైకిల్ అంటే ఒక భావోద్వేగమని డా.నాగలక్ష్మి చెబుతున్నారు. చిన్నతనంలో తన తండ్రిని అడిగితే సైకిల్ కొనివ్వలేదని, అప్పటినుంచి ఆ కోరిక అలానే ఉండేదని చెప్పారు. చివరకు తన భర్త, పిల్లలు 50వ పుట్టిన రోజున సైకిల్ కొనిచ్చారని, అప్పటి నుంచి సైక్లింగ్ అలవాటుగా మారిందని వివరించారు. ఒక్కరోజు తాను 7 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లిన విషయాన్ని స్టేటస్ పెట్టుకోవడంతో తన స్నేహితులు ఆశ్యర్యపోయి.. ఆ తర్వాత చాలామంది తమ గ్యాంగ్‌లో కలిసిపోయి చాలా దూరం వెళ్తుండేవారని చెప్పారు. అనంతరం హ్యాపీ హైదరాబాద్ అనే సైక్లింగ్ గ్రూప్‌లో చేరామని వివరించారు. ఆ తర్వాత పైరేట్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో 14 మంది స్నేహితులతో గ్రూప్ ఏర్పాటు చేశామని, అప్పటినుంచి కొత్త వారిని కలుస్తూ.. వారితో ఐడియాలు పంచుకుంటూ సైక్లింగ్ చేస్తూ సరదాగా గడుపుతుండేవారిమని పేర్కొన్నారు.ఇవి చదవండి: డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..! -
ఏది అత్యుత్తమ మార్గం?
మార్గాలన్నీ సమాన ప్రాముఖ్యం కలిగినవే. ఎందుకంటే జీవాత్మను పరమాత్మునిలో చేర్చడమే ఈ అన్ని మార్గాల లక్ష్యం. మంచితనం విషయంలో ఉత్తమం, మధ్యమం, అథమం అనేవి సాపేక్ష పదాలు మాత్రమే. ఏ వ్యక్తికి ఏ మార్గం సులభంగా, మనస్సుకు నచ్చినట్లు ఉంటుందో అదే అతనికి ఉత్తమ మార్గం.వివిధ నదులు అనేక దిక్కుల నుంచి వేగంగా ప్రవహిస్తూ చివరగా సముద్రంలో కలిసిపోతాయి. అలాగే భక్తి, జ్ఞాన మార్గాల్లో పయనించే వాళ్లందరూ చివరిగా చేసే ప్రయత్నం ఒక్కటే. జీవుడు ఏ మూలం నుండి వచ్చాడో, ఆ మూలం లోనికి జీవుణ్ణి చేర్చడమే భక్తి, జ్ఞాన మార్గాల లక్ష్యం. కారణం గుర్తించు నీవు, నీ అంతరాత్మతో పొందిక కలిగి ఉన్నట్లయితే బాహ్య ప్రపంచం నీతో పొందికను కలిగి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో నీకు విరోధం కనిపించినట్లయితే అది నీ లోపల గల కల్లోలాలను బహిర్గతపరుస్తుంది. అందువల్ల బయట కల్లోలాలు సృష్టించబడతాయి.ప్రకృతి మాత రచించిన గొప్ప ప్రణాళికలో ప్రతి వస్తువునకూ సముచితమైన విలువ, ఉపయోగాలు ఉన్నాయి. దానికంటూ ప్రత్యేక స్థానం ఉంది. వేదాంతాన్ని అనుసరించి చూస్తే... ప్రకృతి ఎక్కడా కల్లోలాలను కలిగించదని అర్థమవుతుంది. కేవలం మానవుని మనస్సు మాత్రమే ఇటువంటి కల్లోలాలను సృష్టిస్తుంది. కల్లోలాలను గురించి ఎంత సులభంగా మాట్లాడతావో, నీవు వాటికి అంత ప్రాముఖ్యం ఇచ్చిన వాడవు అవుతావు.ప్రతి విషయానికీ ఏదో ఒక పరిణామం కారణం అనే విషయాన్ని గ్రహించి, ఏ కారణం వల్ల అది సంభవించిందో... అటువంటి మూల కారణాలను నీవు గుర్తించు. కారణం లేకుండగానే ఏదీ సంభవించదు అని గుర్తెరగాలి. నీవు జీవితంలో ఉన్నత ఆÔè యా లకు లోబడి నడచుకున్నప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది. అదే సమ యంలో నీవు ప్రశాంతంగా ఉండగలవు. కాబట్టి దృష్టిని ప్రక్కకు మళ్ళించకుండా, నీ జీవితాన్ని భక్తి, విశ్వాసాలతో భగవదర్పణ చేసి గడుపు. సదా భగవన్నామాన్ని స్మరించు.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని.. 'స్మార్ట్'గా తప్పించుకుందాం!
మొబైల్ ఫోన్ల వాడకానికి– క్యాన్సర్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5వేలకు పైగా అధ్యయనాలను సమీక్షించింది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిపింది. 1994 నుంచి 2022 సంవత్సరాల మధ్య ఉన్న అధ్యయనాలను తీసుకొని చేసిన సమీక్ష లో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగులోకి వచ్చాయి.ప్రపంచంలో 70 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల క్యాన్సర్ రాదు కానీ, అనేక నష్టాలు ఉన్నాయని స్పష్టం చేసింది. వాటిలో..– రీల్స్ విజృంభణ వల్ల ప్రతి 30 సెకన్లకు రీల్ చొప్పున మారుతూ ఫోన్‌ని అదేపనిగా చూస్తూనే ఉంటారు. దీంతో చూపు తగ్గుతోంది. – అర్ధరాత్రి దాటుతున్నా మొబైల్ నుంచి వెలువడే కాంతి వల్ల మన శరీరం నిద్రకు అవసరం అయ్యే హార్మోన్‌ను విడుదల చేయదు. దాంతో గాఢ నిద్ర పట్టక పనితీరు మందగిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. – మొబైల్ స్క్రీన్‌ను చూసే క్రమంలో కళ్లు ΄÷డిబారడం, చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కంటిచూపుపై ప్రభావం చూపుతాయి. – అదేపనిగా స్క్రీన్ చూడటం వల్ల కళ్లు, మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి, మానసిక ఆందోళన పెరుగుతుంది. – కొంతమంది టాయిలెట్‌కు వెళ్లినా, మంచం మీద పడుకున్నా ఫోన్ చూస్తూనే ఉంటారు. ప్రతి దానికీ మొబైల్‌పైనే ఆధారపడే వ్యసనాన్ని ‘నోమోఫోబియా’ అంటారు. అంటే, మొబైల్ లేకుండా ఉండలేకపోవడం. – అతిగా మొబైల్ వాడటం వల్ల పరధ్యానం వస్తుంది. చేస్తున్న పనిపై ఏకాగ్రత ఉండదు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ అధ్యయనం గడిచిన 20 ఏళ్లలో మానవుల సగటు ఏకాగ్రత 2.5 నిమిషాల నుండి 47 సెకన్లకు తగ్గిందని తేల్చింది. – ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతున్నాయి. ఆరుబయట ఆటలు తగ్గిపోతున్నాయి. నిద్ర, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సెల్ డేటా ప్రకారం కొన్నాళ్లుగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తతరం మళ్లీ బేసిక్ ఫోన్లను కొనడం ప్రారంభించిందనడానికి ఇదో ఉదాహరణ. మెదడును ఉపయోగించకుండా ఫోన్లపై ఆధారపడినట్లయితే మెదడు పనితీరు బలహీనంగా మారి, పరిణామంలో కూడా చిన్నదైపోతుందని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కంటే మన మెదడు చాలా వేగం, శక్తిమంతమైనది. అందుకే స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని స్మార్ట్‌గా తప్పించేద్దాం.ఇవి చదవండి: Health: మీకు తెలుసా.. అతి తిండీ కూడా అడిక్షనే! -
Health: మీకు తెలుసా.. అతి తిండీ అడిక్షనే!
నా వయసు 25 సం‘‘లు. కొన్ని నెలలుగా నేను విపరీతంగా తింటున్నాను. ఈ మధ్య 15 కేజీలు బరువు పెరిగాను. ‘స్ట్రెస్’కు లోనైనప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడు తినడం మరీ ఎక్కువ. ఎలాగైనా ఈ అతి తిండి అలవాటు నుండి బయటపడాలని ఉంది. మీరే ఏదైనా సలహా చెబుతారనే ఆశతో ఉన్నాను. – రజని, విశాఖపట్నంపండుగల్లాంటి ప్రత్యేక సందర్భాలలో కొంచెం ఎక్కువగా తినడం మనందరికీ మామూలే! మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, బహుశా మీరు ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనైనట్లు తెలుస్తుంది. 25–30 సం‘‘ల మహిళల్లోను, 40–45 సం‘‘ల పురుషుల్లోనూ ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నా. మెదడులోని రసాయనాలలో వచ్చే మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.అతి తక్కువ సమయంలో, ఫాస్ట్‌గా తినడం, కడుపు నిండినా ఆపుకోలేకపోవడం, బరువు పెరిగి గిల్టీగా ఫీలవడం, ఇన్ఫీరియారిటీకి, డిప్రెషన్‌కు లోనవడం జరుగుతుంది. ఒక విధంగా దీనిని ‘ఫుడ్ అడిక్షన్’ అనవచ్చు. మీలాంటి వారిలో మిగతా అడిక్షన్స్ లాగానే ఈ సమస్యను కూడా కొన్ని మందులతోను, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపి, జీవనశైలిలో మార్పులు, డైట్ కౌన్సెలింగ్‌తో మంచి మార్పులు తీసుకురావచ్చు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్’ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నా. సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్! -
Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్!
మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో సంభవించే రుతుక్రమ ముగింపును సూచిస్తుంది. హార్మోన్లు.. ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి తగ్గుదల వల్ల ఒంట్లో వేడి, మానసిక అలజడి, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది ‘ఇది ఈ సమయంలో సహజమే, భరించాలి మరి’ అని చెబుతుంటారు. అయితే, మెనోపాజ్ దశనూ ఆహ్లాదంగా గడిపేయాలంటే నిపుణులు సూచనలను పాటించడం మేలు.ప్రధానంగా శారీరక శ్రమ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎండార్ఫిన్ విడుదల ద్వారా మానసిక స్థితి బాగవుతుంది. ఎముకలను బలోపేతం చేయడం ద్వారా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో΄÷రోసిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి హాయినిచ్చే నిద్రను, పనిచేయగలిగే సామర్థ్యాన్నీ పెంచుతాయి. మెనోపాజ్ సమయం లో ఉపశమనం కలిగించే ఈ 8 వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి.1. వాకింగ్..నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడే ప్రభావ వంతమైన వ్యాయామం ఇది. జీవక్రియలు మందగించినప్పుడు ఇది కీలకంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నివారిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.2. యోగా..ఆందోళనను తగ్గించడంలో యోగా ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని యోగ భంగిమలు కీళ్ల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. విశ్రాంతిని, మంచి నిద్రను ΄÷ందడంలో సహాయపడతాయి.3. పవర్ ట్రెయినింగ్..మెనోపాజ్ వల్ల కలిగే కండరాల క్షీణతను ఎదుర్కోవడానికి పవర్ ట్రెయినింగ్ సహాయపడుతుంది. ఎముక సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియో΄÷రోసిస్ వంటి ఎముకల వ్యాధి వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.4. ఈత..మెనోపాజ్ దశలో స్విమ్మింగ్ అనేది శరీరమంతటికీ పనికి వచ్చే వ్యాయామంగా చెప్పుకోవచ్చు. ఇది కీళ్లపై సున్నితంగా పనిచేస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు ఉండి, రుతుక్రమం ఆగిన మహిళలకు చాలా ఉపశమనంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించే భావనను తగ్గించి, శరీరాన్ని చల్లబరచడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.5. పిలాటిస్..శరీర భంగిమలను సరిచేయడానికి ఉపకరించే ఆధునిక వ్యాయామ పద్ధతులను పిలాటిస్ అంటారు. ప్రత్యేక సాధనాల తో ఈ వ్యాయామాలు చేస్తారు. కండరాల బలాన్ని పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి సున్నితమైన కదలికల ద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా ఈ వ్యాయామాలు చేస్తారు.6. నృత్యం..చురుకుగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి డ్యాన్స్ ఒక ఆహ్లాదకరమైన మార్గం. డ్యాన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. సామాజికంగానూ నలుగురిని కలిసేలా చేస్తుంది. ఒంటరితనం భావాలను తగ్గిస్తుంది.7. తాయ్ – చి..తాయ్– చి వ్యాయామంలో కదలికలు నెమ్మదిగా ఉన్నా శారీరక ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం రుతుక్రమం ఆగిన మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.8. సైక్లింగ్..హిప్ కింది భాగానికి బలం చేకూరుతుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ వ్యాయామాలు మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఇవి చదవండి: ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..! -
Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని హరిణి.. హక్కుల చుక్కాని!
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య. ప్రధాని కావడానికి ముందు పార్లమెంట్ సభ్యురాలు. ఎంపీ కావడానికి ముందు లెక్చరర్. లెక్చరర్‌కు ముందు, లెక్చరర్ అయిన తరువాత స్త్రీవాదం, నిరుద్యోగం, లింగ వివక్ష... ఇలా ఎన్నో సామాజిక అంశాలపై హక్కుల కార్యకర్తగా తన గొంతును బలంగా వినిపించింది. సమస్యలు తెలిసిన... సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ప్రధాని అయితే ఆ పాలన దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చరిత్ర నిరూపించింది. ‘ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రయాణంతో శ్రీలంకలో మరో చరిత్ర మొదలుకానుంది’ అనే ఆశారేఖలు వెల్లివిరుస్తున్నాయి...కొలంబోలో పుట్టి పెరిగిన హరిణి అమరసూర్య హిందూ కాలేజ్, దిల్లీ యూనివర్శిటీలో బి.ఎ, సిడ్నీలోని మక్వరీ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ అండ్ డెవలప్మెంట్లో ఎం.ఎ, ఎడిన్‌బరో యూనివర్శిటీలో సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసింది. యూత్, పాలిటిక్స్, యాక్టివిజం, జెండర్, డెవలప్మెంట్, శిశు సంరక్షణ, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్... ఇలా ఎన్నో అంశాలపై లోతైన పరిశోధన చేసింది. పుస్తకాలు రాసింది. డిగ్రీ తరువాత శ్రీలంకలోని మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నెస్ట్’తో కలిసి పనిచేసింది హరిణి. ‘నెస్ట్’ వ్యవస్థాపకురాలైన సాలీ హులుగల్లే అట్టడుగు, అణగారిన వర్గాల కోసం పనిచేసింది. ‘నెస్ట్’ ద్వారా ఎంతో మార్పు తీసుకురాగలిగింది. ఆమె ప్రభావంతో మానసిక వైద్యశాలలలో ఎంతోకాలంగా దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న దీనులు, ఎవరూ పట్టించుకోని హెచ్ఐవీ బాధితులు, అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది హరిణి.చైల్డ్ ప్రొటెక్షన్, సైకలాజికల్ ప్రాక్టీషనర్‌గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన తరువాత శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరింది. యాక్టివిస్ట్‌గా ఉచిత విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. ‘ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్’ సభ్యురాలైన హరిణి లింగసమానత్వం నుంచి జంతుసంక్షేమం వరకు ఎన్నో అంశాలపై తన గళాన్ని వినిపించింది.ఇక రాజకీయాల విషయానికి వస్తే... 2019లో ‘నేషనల్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్’లో చేరిన హరిణి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) అభ్యర్థి అనురా కుమార దిస్సానాయకే తరఫున ప్రచారం చేసింది. 2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల తరువాత ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టింది. ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అత్యున్నత పదవి విషయంలో ‘సరిౖయెన వ్యక్తి’ అనే ప్రశంస చాలా తక్కువమందికి లభిస్తుంది. ఇలాంటి వారిలో 54 సంవత్సరాల హరిణి అమరసూర్య ఒకరు. ‘ప్రధానిగా ఆమె సరిౖయెన వ్యక్తి’ అనేది ఇప్పుడు చాలామంది నోట వినిపిస్తున్న మాట.సమాజం అనే పుస్తకాన్ని చదివి..హరిణికి ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఇష్టం. ‘ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఉంది’ అంటూ నాన్న స్నేహితుడైన మాజీ దౌత్యవేత్త దగ్గర తన మనసులో మాట బయటపెట్టింది. మొదట ఆయన ఎగతాళిగా నవ్వినా ఆ తరువాత మాత్రం ఆంగ్ల సాహిత్యంలోని ఎంతో మంది దిగ్గజ రచయితలను పరిచయం చేశాడు. వారి రచనలు చదువుతుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ‘ఆంగ్ల సాహిత్యంలోకి అడుగు పెట్టిన తరువాత నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. ఆ తరువాత కాలంలో సాహిత్య అధ్యయనం కంటే నా చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలనిపించింది’ అంటుంది హరిణి. పుస్తక ప్రపంచంలో కంటే సామాజిక ప్రపంచంలోనే ఆమెకు ఎక్కువ విషయాలు తెలిసాయి. నిరుద్యోగం నుంచి లింగ వివక్ష వరకు ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె ఉద్యమకారిణిగా ప్రయాణంప్రారంభించడానికి, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ‘సమాజం’ అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది.అవును... ఆమె దిల్లీ స్టూడెంట్!‘హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయిన హరిణి శ్రీలంక ప్రధాని కావడం మా కళాశాలకు గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. హరిణి సాధించిన విజయం మా కళాశాల చరిత్రలో మరో మైలురాయి. హిందూ కళాశాలలో హరిణి గడిపిన కాలం ఆమె నాయకత్వానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ. హరిణి హిందూ కాలేజీలో 1991 నుండి 1994 వరకు చదివింది. బాలీవుడ్ దర్శకుడు నళిన్ రాజన్సింగ్ హిందూ కాలేజీలో హరిణి బ్యాచ్ మేట్.‘కాలేజీ ఉత్సవాలు, చర్చలలో హరిణి చురుగ్గా పాల్గొనేది. ఆమె ప్రధాని స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది’ అంటున్నాడు నళిన్ రాజన్సింగ్.ఇవి చదవండి: మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ -
సిటీలో.. ఏఐ గేమింగ్ జోన్స్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత తరానికి అనుగుణంగా వస్తున్న నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగానే నగరంలో మొట్టమొదటి ఏఐ–గేమింగ్ జోన్ అడుగుపెట్టింది. దేశంలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ కంప్యూటర్ స్టోర్ విశాల్ పెరిఫెరల్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వేదికగా ఏఐ–గేమింగ్ జోన్ మంగళవారం ప్రారంభమైంది. డైరెక్టర్ రాహుల్ మల్హోత్రా, ఇంటెల్ ఇండియా సీనియర్ మేనేజర్ ఛానెల్ డి్రస్టిబ్యూషన్ అరుణ్ రాఘవన్ ఈ సెంటర్‌ను ప్రారంభించారు.ఏ రంగంలోని విద్యార్థులైనా సరే తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు దోహదపడేలా ఈ సెంటర్ రూపొందించడం విశేషం. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కలి్పస్తున్నట్లు, ఏఐ గేమింగ్ జోన్లో సదుపాయాలను వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటింగ్, ఏఐ–గేమింగ్ జోన్లో ప్రోగ్రామింగ్, ఏఐ డెవలప్మెంట్, గేమింగ్ తదితర విభాగాల్లో సేవలు పొందవచ్చు.ఐడీ కార్డులు తప్పనిసరి..నగరంలో ప్రతి విద్యార్థి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ ఏఐ–గేమింగ్ జోన్‌ను ఆవిష్కరించాం. ఈ ఉచిత సేవలు పొందడానికి, అధునాతన టెక్నాలజీ పై అవగాహన పెంచుకోవడానికి విద్యార్థులు తమ ఐడీ కార్డులను వెంట తీసుకురావాలి. ప్రస్తుత టెక్ యుగంలో విద్యార్థులు విజయాలను సాధించేందుకు ఈ ఏఐ–గేమింగ్ జోన్ ఎంతో ఉపయోగపడుతుంది. – విశాల్ పెరిఫెరల్స్, విశాల్ కంప్యూటెక్ డైరెక్టర్ వికాష్ హిసరియాఇవి చదవండి: తెలంగాణకు అలర్ట్.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు -
Horse Riding.. సాహసపు.. సవారీ..!
గుర్రపు సవారీ అనేదీ ఆటవిడుపు, సాహస క్రీడ, ప్రస్తుతం నగరంలో ఇదే ట్రెండ్‌గా మారుతోంది. యువతతో పాటు చిన్నపిల్లలు సైతం గుర్రపు సవారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై సవారీ చేస్తుంటే చూసి ముచ్చటపడుతుంటారు. యువతకు, వారి తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఈ కోవలోనే నాగోలు డివిజన్ పరిధి రాక్‌టౌన్ కాలనీలో నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్ గత కొన్నేళ్లుగా గుర్రపు స్వారీలో అనేక మందికి శిక్షణ ఇస్తూ మన్ననలను పొందుతోంది. – మన్సూరాబాద్మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి సాహసపు సవారీ సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన చిన్నారులకు మంచి ఫలితాలనిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, అశ్వాన్ని దూకించడం ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యలతో మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయి. అనేక మంది విదేశీయులు కూడ నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారు.సహసక్రీడతో జర జాగ్రత్త..గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రమాదాలు సంభవించినా కూడా రైడర్‌కు ప్రమాదం జరగకుండా శిక్షకులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుక నేలల్లో శిక్షణ ఇస్తుంటారు.ఎంపిక చేసిన గుర్రాలతో శిక్షణ..మా శిక్షణా కేంద్రంలో మొత్తం 13 గుర్రాలున్నాయి. పదేళ్ల పాటు సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా చికిత్స కోసం వచ్చే పిల్లల సేవలకు వినియోగిస్తాము. చిన్నపిల్లలతో మంచిగా మసలేందుకు, రౌతు తీరుని గమనించేందుకు గుర్రాలకు ముందే శిక్షణ ఇస్తాము. పిల్లల వైకల్యానికి అనుగుణంగా ఏ గుర్రంతో స్వారీ చేయాలనేది నిర్ణయించి శిక్షణ ప్రారంభిస్తాము. ప్రతి నెలా రాజస్థాన్ నుంచి వచ్చిన నిపుణులతో గుర్రాలకు నాడలను వేయిస్తాం. – నవీన్చౌదరీ, హార్స్ రైడింగ్ శిక్షకుడుమానసిక రుగ్మతలకు..చిన్నారుల్లో వివిధ మానసిక రుగ్మతలను నయం చేసేందుకు వివిధ వైద్య విధానాల్లో లొంగని వాటికి అరుదైన చికిత్సా విధానం హార్స్ రైడింగ్ అని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. మా పాపను గత కొన్ని నెలలుగా గుర్రపుస్వారీకి తీసుకొస్తున్నాను. గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. తనంతట తానుగా పనులు చేసుకుంటుంది. మెదడు, శారీరక ప్రక్రియ మెరుగ్గా అనిపిస్తుంది. మానసికంగా దృఢంగా తయారవుతుంది. – ఎన్.అపర్ణఇవి చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది? -
వర్తమానమే... నిజం!
అరణ్యంలో ఉన్న ఓ జ్ఞాని దగ్గరకు వెళ్లిన ఒక యువకుడు తనకు నిజమంటే ఏమిటో చెప్పాలని కోరాడు. వెంటనే జ్ఞాని ‘నిజం సంగతి ఇప్పటికి పక్కనపెట్టు. నేనడిగిన దానికి జవాబు చెప్పు. మీ ఊళ్ళో బియ్యం ధర ఎంతో చెప్పు’ అన్నాడు. అందుకు యువకుడు వినమ్రంగా ‘స్వామీ! నన్ను మన్నించండి. మర్యాద మరచి మాట్లాడుతున్నానని అనుకోకండి. ఇటువంటి ప్రశ్నలు ఇక మీదట నన్ను అడక్కండి. ఎందుకంటే నేను గతకాలపు దారులు మరచిపోయాను. గతానికి సంబంధించినంత వరకు నేను ఇప్పుడు మరణించాను. ఇదిగో ఇప్పుడు నడిచొ చ్చిన మార్గాన్ని కూడా నేను మరచిపోయాను’ అన్నాడు. ‘నువ్వు గత కాలపు భారాన్ని ఇంకా మోస్తున్నావా... లేదా అనేది తెలుసుకోవడానికే బియ్యం ధర ఎంతని అడిగాను. నువ్వు దానికి జవాబు చెప్పి ఉంటే వెంటనే నిన్ను ఇక్కడినుంచి పంపించేసేవాడిని. నిజం గురించి మాట్లాడటానికి తిరస్కరించే వాడిని’ అన్నాడు. ‘అయితే ఇపుడు చెప్పండి నిజమంటే ఏమిటో’ అని అడిగాడు యువకుడు.‘వర్తమానంలో బతకడం తెలీని మనిషిని ఓ తోటలోకి తీసుకు వెళ్ళి ఓ గులాబీ పువ్వుని అతనికి చూపించు. ఈ గులాబీ ఎంత అందమైనదో అని అతనితో అను. వెంటనే అతను దీని వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. సాయంత్రంలోపు వాడి రాలిపోతుంది అంటాడు. యవ్వనం ఎంతటి సుఖమైనదో చెప్పమని అడిగితే అది నిజమే కావచ్చు కానీ ముసలితనం త్వరగా వచ్చేస్తుందిగా అంటాడు. సంతోషం గురించి మాట్లాడితే అదంతా వట్టి మాయ అంటాడు. కానీ వర్తమానంలో బతకడం తెలిసిన వ్యక్తిని ఓ ఉద్యానంలోకి తీసుకు వెళ్తే అక్కడి రంగు రంగుల పువ్వులను చూపిస్తే వాటిని చూసి అతనెంతగా ఆనందిస్తాడో తెలుసా... ఎన్ని కబుర్లు చెప్తాడో తెలుసా! ఇవి చూడటానికి వచ్చిన దారులను గురించి ఆలోచించవలసిన అవసరమేముందంటాడు.రాలిపోయే పువ్వులైనా సరే ఇప్పుడు ఎంత ఆందంగా ఉన్నాయో అంటాడు. వికసించే పువ్వులు అందమైనవా... రాలిపోయే పువ్వులు అందమైనవా అని అడిగితే గతించిన కాలాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వర్తమానంలోని నిజాన్ని గ్రహించలేమంటాడు. అది నిజం. ఏది నిజమో అది ఈ క్షణంలో ఉంది. నిజమనేది గతించిన, రానున్న కాలాలకు సంబంధించినది కాదు. వర్తమానమే నిజమైన కాలం’ అని చెప్పాడు జ్ఞాని. యువకుడికి విషయం అర్థమైంది. ఆనందంగా వెనుతిరిగాడు. – యామిజాల జగదీశ్ -
Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా?
డెర్మోరెక్సియా... ఈ పదంలో డెర్మో ఉంది, కానీ ఇది చర్మ సమస్య కాదు. మానసిక సమస్య. ఒకరకంగా అనెరొక్సియా వంటిదే. సాధారణ బరువుతో ఉన్నప్పటికీ లావుగా ఉన్నామనే భ్రాంతికి లోనవుతూ సన్నబడాలనే ఆకాంక్షతో ఆహారం తినకుండా దేహాన్ని క్షీణింపచేసుకోవడమే అనెరొక్సియా. ఇక డెర్మోరెక్సియా అనేది చర్మం అందంగా, యవ్వనంగా, కాంతులీనుతూ ఉండాలనే కోరికతో విపరీతంగా క్రీములు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే డెర్మోరెక్సియా. ఇటీవల మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఆత్మవిశ్వాసానికి అందం కొలమానం కాదు! ‘అందం ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది’ అనే ప్రచారమే పెద్ద మాయ. సౌందర్య సాధనాల మార్కెట్ మహిళల మీద విసిరిన ఈ వల దశాబ్దాలుగా సజీవంగా ఉంది, ్రపాసంగిక అంశంగానే కొనసాగుతోంది. ఈ తరం మధ్య వయసు మహిళ ఈ మాయలో పూర్తిగా మునిగి΄ోయిందనే చె΄్పాలి. వార్ధక్య లక్షణాలను వాయిదా వేయడానికి, ముఖం మీద వార్ధక్య ఛాయలను కనిపించకుండా జాగ్రత్తపడడానికి యాంటీ ఏజింగ్ క్రీములను ఆశ్రయించడం ఎక్కువైంది. ఒక రకం క్రీము వాడుతూండగానే మరోరకం క్రీమ్ గురించి తెలిస్తే వెంటనే ఆ క్రీమ్‌కు మారి΄ోతున్నారు. వీటి కోసం ఆన్లైన్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. క్రమంగా ఇది కూడా ఒక మానసిక సమస్యగా పరిణమిస్తోందని చెబుతున్నారు లండన్ వైద్యులు.క్రీమ్‌ల వాడకం తగ్గాలి! లుకింగ్ యూత్‌ఫుల్, ఫ్లాలెస్ స్కిన్ కోసం, గ్లాసీ స్కిన్ కోసం అంటూ ప్రచారం చేసుకునే క్రీమ్‌లను విచక్షణ రహితంగా వాడుతూ యాక్నే, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గాఢత ఎక్కువగా ఉన్న గ్లైకోలిక్ యాసిడ్, నియాసినామైడ్, రెటినాల్, సాలిసైలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్స్ యాసిడ్స్ చర్మానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించడానికి చేసే ఎక్స్ఫోలియేషన్ విపరీతంగా చేయడం వల్ల చర్మం మరీ సున్నితమై΄ోతోంది. కళ్లచుట్టూ ఉండే చర్మం మీద ఈ క్రీమ్‌లను దట్టంగా పట్టించడం వల్ల ఆర్బిటల్ ఏరియాలో ఉండే సన్నని సున్నితమైన రక్తనాళాలు పలుచబడి వ్యాప్తి చెందుతాయి. దాంతో కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. డెర్మోరెక్సియాను గుర్తించే ఒక లక్షణం ఇది. డెర్మోరెక్సియాను నిర్ధారించే మరికొన్ని లక్షణాలిలా ఉంటాయి. – చర్మం దురదగా ఉండడం, మంటగా అనిపించడం, ఎండకు వెళ్తే భరించలేక΄ోవడం – తరచూ చర్మ వ్యాధి నిపుణులను కలవాల్సి రావడం, ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ సంతృప్తి కలగక΄ోవడం. – చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తరచూ అద్దంలో చూసుకుంటూ అసంతృప్తికి లోనవడం. తళతళ మెరిసే గ్లాసీ స్కిన్ కోసం చర్మం మీద ప్రయోగాలు చేయడం – షెల్ఫ్‌లో అవసరానికి మించి రకరకాల బ్యూటీ ్ర΄ోడక్ట్స్ ఉన్నాయంటే డెర్మోరెక్సియాకు దారితీస్తోందని గ్రహించాలి. మధ్య వయసు మహిళలే కాదు టీనేజ్ పిల్లల విషయంలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. పేరెంట్స్ గమనించి పిల్లలకు జాగ్రత్తలు చె΄్పాలి.ఓసీడీగా మారకూడదు..శరీరం అందంగా కనిపించట్లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండడం బాడీ డిస్మార్ఫోఫోబియా అనే మానసిక వ్యాధి లక్షణం. ముఖం క్లియర్‌గా, కాంతిమంతంగా కనిపించాలనే కోరిక మంచిదే. కానీ అది అబ్సెషన్‌గా మారడం ఏ మాత్రం హర్షణీయం కాదు. ఇది ఎంత తీవ్రమవుతుందంటే... అందంగా కనిపించడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ, ఆ ట్రీట్మెంట్లో ఎంత మంచి ఫలితం వచ్చినప్పటికీ సంతృప్తి చెందక΄ోవడం, తీవ్రమైన అసంతృప్తితో, ఎప్పుడూ అదే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకావడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది. మెదడు ఇదే ఆలోచనలతో నిండి΄ోయినట్లయితే కొంతకాలానికి ఆ సమస్యకు వైద్యం చేయాల్సి వస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆ గీతను అర్థం చేసుకోవాలి..ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ తాలూకు విషయమే ముఖ్యం. అంతే తప్ప వారి ముఖం ఎలా ఉంది అనేది పట్టించుకునే అంశం ఏ మాత్రం కాదు. అందం– ఆత్మవిశ్వాసం ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయనేది కొంతవరకే. ఆత్మవిశ్వాసానికి అందం గీటురాయి కానేకాదు. ఈ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా వయసుతోపాటు దేహంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు ప్రభావం చర్మం మీద కనిపిస్తుంటుంది. ఈ మార్పును స్వీకరించాల్సిందే. చర్మం కాంతిమంతంగా ఉండడం కోసం రసాయన క్రీములను ఆశ్రయించడం కంటే మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి, మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. – ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, హెచ్‌వోడీ, సైకియాట్రీ విభాగం, కాకతీయ మెడికల్ కాలేజ్ఇవి చదవండి: Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది! -
Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది!
లతిక సుథాన్ ఇల్లు కలువల కొలను. కమలాల సరస్సు. ఇంటి చుట్టూ నీరు, నీటిలో తేలుతూ పూలు. ఒకటి కాదు, రెండు కాదు. వంద రకాల కమలాలు, ఎనభై రకాల కలువలు వికసించిన సుమనిలయం ఆమె ఇల్లు. వాటిలో ఒకటి అత్యంత అరుదైన వెయ్యి రేకుల కమలం. ఇవన్నీ ఆమెకు చక్కటి ఆదాయ వనరుగా కూడా మారాయి. నెలకు నలభై వేల రాబడినిస్తున్నాయి. లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును తెచ్చాయి. విశ్రాంత జీవితాన్ని ఇంత సుగంధ భరితం చేసుకున్న లతిక ఒక స్కూల్ టీచర్. ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమైన ఉన్నన్ని రోజులూ తనకిష్టమైన మొక్కల పెంపకం అభిరుచిని పక్కన పెట్టాల్సి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత ఆమె తన హాబీకి మొగ్గ తొడిగింది. మొక్కలకు దూరంగా ఇరవై ఏళ్లు..లతిక సుథాన్ది కేరళ రాష్ట్రం, త్రిశూర్. ‘చిన్నప్పుడు మొక్కలతోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. కమలం విచ్చుకోవడాన్ని ఆసక్తిగా చూసేదాన్ని. ఒక్కో రెక్క విచ్చుకుంటూ ఉంటే అబ్బురంగా అనిపించేది. చదువు, పెళ్లి, ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగంతో ఇరవై ఏళ్లపాటు మొక్కలకు దూరమయ్యాను. ఉద్యోగం నుంచి 2018లో రిటైరయ్యాను. అప్పటి నుంచి ఇక మొక్కల మధ్య సీతాకోక చిలుకనయ్యాను. ప్రపంచంలో ఉన్న కలువలు, కమలాల జాతుల మీద ఒక అధ్యయనమే చేశాను. దేశంలోని వివిధ ్రపాంతాల నుంచి మొక్కలు తెచ్చి పెంచాను. అలాగే థాయ్‌లాండ్, వియత్నాం, జపాన్ దేశాల నుంచి కూడా తెప్పించుకున్నాను. పెంపకంలో మెళకువలు నేర్చుకోవడానికి అనేక వర్క్‌షాపులకు హాజరయ్యాను. వ్యవసాయాభివృద్ధి శాఖ నిర్వహించే సదస్సులకు వెళ్లి నిపుణుల సూచనలను తెలుసుకున్నాను’ అన్నారు లతిక.మొక్కల పాఠాలు..కమలాలు, కలువల్లో అరుదైన జాతులను సేకరించడం, వాటి పెంపకం గురించి మెళకువలు తెలుసుకోవడంతో ఆ మొక్కల పెంపకం గురించి ఉపన్యసించగలిగినంత పట్టు సాధించారు లతిక. పిల్లలకు పాఠాలు చెప్పిన ఆమె అనుభవం ఇప్పుడు మొక్కల పాఠాలు చెప్పిస్తోంది. ఈ పూల గురించి ఒక్క సందేహం వ్యక్తం చేస్తే చాలు... అనర్గళంగా వివరిస్తుంది. కమలాలు, కలువల మొక్కలు, గింజల కోసం హాస్పిటల్, హోటల్, రిసార్టుల నుంచి భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తుంటాయి. హాబీగా మొదలైన కమలాల పెంపకం మంచి లాభాలనిస్తూ ఆమెకు స్థానికంగా లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును కూడా ఇచ్చింది.ఇవి చదవండి: iSmart హోమ్స్ -
వారికి కూడా.. మీతో సమానమైన వాటా వస్తుంది!
నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లలూ తల్లి వద్దనే ఉంటారు. మా తండ్రి గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా? – శరత్ కుమార్, రాజమండ్రిమీ తండ్రి నుంచి మీకు సంక్రమించిన ఆస్తి ఆయన స్వార్జితమై ఉండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి ఉంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కూ ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది ఉంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది.అలాకాకుండా మీ తండ్రి గారికి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయి వుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేక వాళ్ల అమ్మతోనే ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఒకవేళ మీతో΄ాటు ఇతర సంతానం అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ అమ్మగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాయనమ్మ) ఉంటే వారికి కూడా మీతో΄ాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటా అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ ΄÷ందే హక్కు ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఇవి చదవండి: సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్ -
తొలగించింది వారే... హెచ్చరించింది వారే
సూరత్: నైట్ డ్యూటీలు ఉంటే.. రోజంతా కుటుంబంతో గడపవచ్చని భావించారు రైల్వేలైన్లను తనిఖీ చేసే ముగ్గురు ట్రాక్‌మెన్. దాంతో ఉద్దేశపూర్వకంగా ఫిష్‌ప్లేట్లను తొలగించి.. తామే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పెద్ద ప్రమాదాన్ని అరికట్టారనే పేరు వస్తుందని ఆశించారు. అధికారులు తమ అప్రమత్తతను మెచ్చునొని నైట్‌డ్యూటీలు వేస్తారనేది వారి ఆశ. కానీ రైల్వే నిపుణుల దర్యాప్తులో వారి నిర్వాకం బయటపడి అరెస్టయ్యారు. సూరత్ ఎస్పీ హోతేష్ జాయ్సర్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. సుభాష్ పొద్దార్, మనీష్ మిస్త్రీ, శుభమ్ జైస్వాల్‌లు ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్నారు. కొసాంబా– కిమ్ స్టేషన్ల మధ్య దుండగులెవరో ఎలాస్టిక్ క్లిప్‌లను, రెండు ఫిష్పేట్లను తొలగించారని, వాటిని పక్కనున్న మరో ట్రాక్‌పై పెట్టి రైలు పట్టాలు తప్పేలా చేయాలని చూశారని ఈ ముగ్గురు శనివారం వేకువజామున 5:30 గంటలకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. కిమ్ పోలీసుస్టేషన్లో కుట్ర కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడానికి ట్రాక్‌మెన్ పట్టాల వీడియోను పంపించారు. అంతకు కొద్ది నిమిషాల ముందు ఆ ట్రాక్ మీదుగా ఒక రైలు వెళ్లిందని రైల్వే అధికారులు పోలీసులకు తెలిపారు. ట్రాక్‌మెన్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన సమయానికి, రైలు వెళ్లిన సమయానికి.. మధ్య అవధి చాలా తక్కువగా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఫిష్‌ప్లేట్లను, ఎలాస్టిక్ క్లిప్‌లను తొలగించడం సాధ్యం కాదు. దాంతో పోలీసులు ట్రాక్‌మెన్ మొబైల్ ఫోన్లను పరిశీలించారు. శనివారం వేకువజామున 2:50 గంటలనుంచి 4:57 గంటలకు వరకు వీరు ట్రాక్ దృశ్యాలను చిత్రీకరించినట్లు తేలింది. దాంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టారు. రైలు ప్రమాదాన్ని నివారిస్తే.. అధికారులు సన్మానించి, ఇకపై కూడా నైట్‌డ్యూటీలో కొనసాగిస్తారని వీరు భావించారు. నైట్‌డ్యూటీలు ఉంటే.. మరుసటి రోజు ఆఫ్ దొరుకుతుందని.. రోజంతా కుటుంబంతో గడపొచ్చని వీరు భావించారు. వర్షాకాలానికి సంబంధించి తమవంతు నైట్‌డ్యూటీలు ముగింపునకు రావడంతో వీరి దుశ్చర్యకు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరైన సుభాష్ పొద్దారు ఈ ఐడియా ఇచ్చాడు. -
కళ‘నైనా’ కనని, కాలం చెల్లని : సహనం నుంచి సంకల్పబలం వరకు!
కొన్ని దశాబ్దాల క్రితం...నైనా దలాల్ వేసిన చిత్రాలు ఆనాటి కళాభిమానులకు షాకింగ్‌గా అనిపించాయి. ఆమె చిత్రాలు కాలం కంటే చా...లా ముందు ఉండడమే దీనికి కారణం.లండన్‌లో వెస్ట్రన్ ఆర్ట్‌ను అధ్యయనం చేసిన తొలి భారతీయ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన తొంభై సంవత్సరాల నైనా దలాల్ సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ న్యూ దిల్లీలోని ట్రావెన్ కోర్ హౌస్‌లో జరుగుతోంది. సాధారణ ప్రజల కథలను చెప్పడమే లక్ష్యంగా నైనా దలాల్ కుంచె సామాన్యుల జీవితాల్లోకి వెళ్లింది. ఆమె చిత్రాలలో నాస్టాల్జీయా తొంగి చూస్తుంది. View this post on Instagram A post shared by Galleriesplash (@galleriesplash) ‘నైనా దలాల్ ఆర్ట్ వర్క్‌ను చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు’ అంటారు కొద్దిమంది విశ్లేషకులు. కామన్వెల్త్ స్కాలర్షిప్ అందుకొని లండన్‌కు వెళ్లింది దలాల్. లండన్‌లో వెస్ట్రన్ ఆర్ట్‌ను అధ్యయనం చేసిన మొదటి భారతీయ ఆర్టిస్ట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. నైనా దలాల్ ప్రింట్ మేకింగ్ కోర్సులో చేరినప్పుడు చాలామంది ఆశ్చర్య΄ోయారు. ఎందుకంటే ప్రింట్ మేకింగ్ అనేది పురుషాధిక్య మాధ్యమంగా గుర్తింపు పొందింది. భారీ యంత్రాలతో పనిచేయాల్సి వచ్చేది. అయితే నైనా దలాల్ అసాధారణ ప్రతిభ ముందు అపోహలు నిలబడలేక పోయాయి. ఫెమినిజంకు సంబం«ధించి ఫస్ట్ వేవ్ బలాన్ని సంతరించుకుంటున్న కాలంలో, మన దేశంలోని మహిళా కళాకారులు ఫెమినిస్ట్ భావాలతో స్ఫూర్తి ΄÷ందుతున్న కాలంలో ఆమె తన కుంచెను బలమైన మాధ్యమంగా ఉపయోగించింది. మాతృత్వం నుంచి ఒంటరితనం వరకు తన చిత్రరచనకు నైనా ఎన్నో ఇతివృత్తాలు ఎంచుకుంది.బెంచీలు, బూట్లు, రాళ్లు, గోడలు, కొండలలాంటి నిర్జీవమైన వాటి నుంచి జంతువులు, పక్షుల వరకు ఆ చిత్రాలలో కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ వాటితో తమ జ్ఞాపకాలను పంచుకునేలా చేస్తాయి. ఆ జ్ఞాపకాలు ఒక వ్యక్తికి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. నైనా దలాల్‌ను ఇతర ప్రముఖ భారతీయ మహిళా కళాకారుల నుండి వేరు చేసిన అంశం ప్రింట్ మేకింగ్‌తో చేసిన లిథోగ్రాఫ్, కొలాగ్రాఫ్లు. 1960లో నైనా దలాల్ లండన్‌కు మకాం మార్చింది. ఇండియాలో ఉన్నప్పుడు స్పాన్సర్ షోల కంటే సొంత ఆర్ట్ షోలే ఎక్కువ చేసింది. ‘నైనా దలాల్ వివిధ మాధ్యమాల్లో వందలాది చిత్రాలను సృష్టించింది. ఈ ప్రదర్శన ఒక మినీ–రెట్రోస్పెక్టివ్ లాంటిది’ అంటున్నారునైనా దలాల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు.మహిళల గురించిన నా ఆలోచనలు కాలంతోపాటు మారుతూ వచ్చాయి. అవి నా చిత్రాల్లో ప్రతిఫలిస్తాయి. మహిళల్లో ఉండే సహనం నుంచి సంకల్పబలం వరకు ఎన్నో వెలుగులు నా చిత్రాల్లో కనిపిస్తాయి. నా కళలో కాల్పనిక విషయాలు కనిపించవు. నా చుట్టూ కనిపించే సాధారణ ప్రజల జీవితాలే కనిపిస్తాయి. శ్రామిక జీవుల గురించి చదివినప్పుడు, విన్నప్పుడు వారికి సంబంధించిన ఆలోచనలు నా మనసులో సుడులు తిరుగుతుంటాయి. ఆ అలజడిని నా చిత్రాల్లోకి తీసుకువస్తుంటాను. నా కళ వారికి గొంతు ఇస్తుందని అనుకుంటున్నాను.– నైనా దలాల్ -
తల్లిదండ్రులు... పొరుగువారు
మీరంతా తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నూ మిన్నూ కానని వారు, తమ గొప్పతనం గురించి విర్రవీగే వారిని అల్లాహ్ ఇష్టపడడు (దివ్య ఖుర్ ఆన్: 4:36) బంధువులు: నానమ్మ, తాతయ్య, పెదనాన్న, బాబాయి, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, పిన్నమ్మలు, వారి సంతానంతో మనం కలిసి మెలిసి ఉండాలి. పరస్పరం ఆదుకుంటూ... సహకరించు కుంటూ ... సేవ చేసుకుంటూ ఉండాలి. పోరపొచ్చాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అభిమానం, ఆ΄్యాయతలు కలిగి బంధుత్వాలను పటిష్టపరుచుకోవాలి. అనాథులు: వీరికి శాపనార్థాలు పెట్టకూడదు. తిట్ట కూడదు. కోపగించుకోకూడదు. ప్రేమగా, లాలనగా చూడాలి. మీరు మీ పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారో అంత ప్రేమతో గనుక ఈ అనాథ తల నిమిరితే మీ చేతికి ఎన్ని వెంట్రుకలయితే తగులుతాయో అన్నిపాపాలు క్షమించబడతాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.∙నిరుపేదలు: ఎవరైతే పేదరికంతో ఉండి కూడా అభిమానం వల్ల ఎవరి ముందూ చేయి చాపకుండా ఎవరి వద్ద బాకీ తీసుకోకుండా అంతలోనే ఇబ్బంది పడుతూ గడుపుతూ ఉంటారో అలాంటి వారిని నిరుపేదలు అంటారు. వారికి కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా ఇస్తామనే సామెతలా మసులుకోవాలి. పొరుగున ఉన్న బంధువులు: పొరుగున నిజంగా మన బంధువులు లేక బంధువులు కాని వారు ఉన్నా వారిని కూడా బంధువులు గానే పరిగణించాలి. అన్నారు మహనీయ ప్రవక్త.అపరిచితులైన పొరుగువారు: అంటే మనం ప్రయాణిస్తున్న సందర్భంగా పరిచయం లేని వారు. మన పక్కన కూర్చుంటారు. వారికి ఇబ్బంది కలిగించకూడదు. పోగ తాగుతూ, గుట్కా నములుతూ, జర్దా ΄ాన్ వేసుకుంటూ ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. వారికి కూర్చోవడంలో ఇబ్బంది కలగకుండా చూడాలి. అదేవిధంగా మనం బజారులో సరుకులు కొనడానికి వెళ్లినప్పుడు మన పొరుగున నిలబడిన వాళ్ళు సరుకులు కొంటూ ఉంటారు, వారు కూడా పొరుగువారే. వారు మంచి వస్తువులు ఏరుకుంటున్న సందర్భంగా మనం వారితో పోటీపడకుండా వారికే ప్రాధాన్యమిస్తే మనకు మంచే జరుగుతుంది.– అబ్దుల్ రషీద్ -
చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్
భావ్‌నగర్: గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని కోరినందుకు ఆ వైద్యుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. భావ్‌నగర్‌లోని సిహోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తలకు గాయమైన మహిళకు వైద్యులు చికిత్స అందిస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని అత్యవసర గదిలోని సీసీటీవీలో ఈ మొత్తం ఘటన అంతా రికార్డు అయింది. ఆ వీడియోలో మంచంపై ఉన్న మహిళ పక్కన కొంతమంది పురుషులు నిలబడి ఉండగా, డాక్టర్ జైదీప్‌సిన్హ్ గోహిల్ గదిలోకి వచ్చారు. వైద్యుడు వారిని చెప్పులను తీసివేయమని కోరాడు.ఇదీ చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో డాక్టర్‌పై దాడి చేశారు. ఆయనను కిందపడేసి మరీ కొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. మంచంపై పడుకున్న మహిళ, నర్సింగ్ సిబ్బంది నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు వైద్యుడిని కొడుతూనే ఉన్నారు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాలను పోలీసులు అరెస్ట్ చేశారు.Young Doctor assaulted at Sihor hospital in #Bhavnagar district;Altercation erupts over removing shoes. A verbal altercation turned violent when relatives of a female patient were instructed to remove their footwear before entering the emergency ward."#MedTwitter @JPNadda pic.twitter.com/b91PU6eECD— Indian Doctor🇮🇳 (@Indian__doctor) September 16, 2024 -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: పంచ మహాయజ్ఞం
పంచమహా యజ్ఞం అని ఐదు యజ్ఞాలు నిరంతరం జరిగే ప్రదేశం గహస్థాశ్రమం. గృహస్థాశ్రమ ప్రవేశం చేసినవారు ఈ ఐదింటిమీద శ్రద్ధపెట్టి ఉండాలి. అందుకే దీనిని యజ్ఞం అని వదిలేయకుండా మహాయజ్ఞం అని అన్నారు. సాధారణంగా యజ్ఞం అంటే అగ్నిముఖంగా హవిస్సును ఇవ్వడం ఉంటుంది. స్వాహాకారంతో అగ్నిహోత్రుడిని పిలిచి ఇచ్చిన హవిష్యాన్నం దేవతలకు అందచేయడానికి ..అని యజమాని సంకల్పం చేస్తాడు. కానీ అగ్ని ఆరాధనం పంచ యజ్ఞాలలో అంతర్భాగం అయినప్పటికీ ... మిగిలిన నాలుగింటినీ కూడా యజ్ఞాలనే పిలిచారు. వీటినే మహాయజ్ఞాలని అన్నారు. అలా అనడానికి కూడా ఒక కారణం ఉంది. దీనికి ప్రత్యేకంగా హోమశాలకానీ, ప్రత్యేకంగా మంత్రభాగం కానీ అవసరం లేకుండా ప్రతివారు కూడా శ్రద్ధతో అనుసరించాల్సిన విషయాలు ఈ ఐదింటిలో అంతర్లీనంగా ఉంటాయి. ‘‘నేను ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించినందుకు దీనిని ధన్యం చేసుకుని తరించడానికి ఈ ఐదు ఆలంబనాలు. వీటిని ఊతంగా చేసుకుని తరించాలి’’ అని గృహస్థు భావిస్తాడు. అందుకే ఇవి గృహస్థాశ్రమంలోనే నడుస్తాయి.వీటిలో మొదటిది – అధ్యాపనం బ్రహ్మయజ్ఞః–అంటారు. అధ్యాపనం అంటే బోధ చేయడం. బోధ చేయడాన్నే బ్రహ్మ విద్య.. అంటారు. బోధ దేనికి! మనిషి తరించడానికి ఇది మార్గాన్ని చెబుతుంది. సనాతన ధర్మం గొప్పతనం ఏమిటంటే.. అది ఏది పట్టుకోవాలో చెబుతుంది, ఏది పట్టుకోకూడదో చెబుతుంది. పట్టుకోకూడదన్నంత మాత్రం చేత అదంత సులభసాధ్యం కాదు కాబట్టి పట్టుకోకుండా ఉండడానికి ఎటువంటి మనస్తత్వాన్ని సాధించుకోవాలో ఇది బోధ చేస్తుంది. అది మన రుషుల ప్రత్యేకత.మనకు సంవత్సరం ఆరంభంలో అంటే సంవత్సరాదినాడు చేదుపచ్చడి తినిపిస్తారు. సంవత్సరం పూర్తి ఎప్పుడు.. అంటే చాంద్రమానంలో కాదు, ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య కాదు, సౌరమానంలో వచ్చే భోగి పండగను ప్రమాణం చేస్తారు. భీష్మ ఏకాదశి, కష్ణాష్టమి, మహాశివరాత్రి, శ్రీరామనవమిల లాగా తిథులతో కూడుకుని రాదు. భోగికి తిథి ఉండదు. దక్షిణాయనానికి చిట్టచివర వచ్చేది.. భోగిపండగ అవుతుంది. దక్షిణాయనం ఉ΄ాసనా కాలం. ఉపాసన కష్టంగా ఉంటుంది. పరిశ్రమ చేయడానికి, ఉపాసన చేయడానికి సిద్ధపడితే అది చేదు తినడం.. కష్టపడాలి కాబట్టి ఉగాది పచ్చడిని ప్రారంభంలో తినిపిస్తారు. కష్టపడడం దేనికి! తరించడానికి అవకాశం రావాలంటే ముందుగా ఈశ్వరుడు పెట్టుబడిగా ఇచ్చిన శరీరాన్ని సాధన ద్వారా సిద్ధపరచాల్సి ఉంటుంది.ఎవరు కష్టపడ్డారో, ఎవరు ఉగాదినాడు చేదు పచ్చడి తిన్నారో, వారు భోగినాడు పొంగల్.. మధుర పదార్థం తింటారు. అంటే భోగం అనుభవించే అర్హత పొందుతారు. ఏ ఉపాసన చేయకుండా, ఏ శాస్త్రాన్నీ పాటించకుండా, ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని ధన్యం చేసుకోకుండా భాగ్యం కావాలంటే సాధ్యం కాదు. ఇవన్నీ బోధించి గహస్థాశ్రమ ప్రవేశం చేయించి, అక్కడ విధివిధానాలు సక్రమంగా నిర్వర్తించేటట్లు బోధించడమే ..అధ్యాపన యజ్ఞం. అంటే ఒకరికి చెప్పడం.. అదెప్పుడు సాధ్యం. ముందుగా మన చదివి ఉంటేనే కదా.. దేనికోసం చదవాలి....అంటే ఇది మన కర్తవ్యం ఏమిటో మనం తెలుసుకోవడం కోసం ఉపయోగపడేది. -
ఈ వెరైటీ వంటకాలను ఓసారి ట్రై చేయండి..!
బ్రింజాల్ పిజ్జా..కావలసినవి..వంకాయలు– 3 లేదా 4 (కొంచెం పెద్ద సైజువి తీసుకుంటే పిజ్జాలు బాగా వస్తాయి)ఆలివ్ నూనె– 1 టేబుల్ స్పూన్బేబీ టమాటో– 2 (గుండ్రంగా కట్ చేసుకోవాలి)మోజరెలా చీజ్– అర కప్పువెల్లుల్లి తురుము, మిరియాల పొడి– తగినంతఉప్పు– తగినంత, తులసి ఆకులు– కొన్నితయారీ..– ముందుగా ఒక్కో వంకాయను శుభ్రం చేసుకుని గుండ్రంగా మూడు లేదా నాలుగు చక్రాల్లా కట్ చేసుకుని ఆలివ్ నూనెలో ముంచాలి.– అనంతరం వాటిని ఒక ట్రేలో వరుసగా పేర్చుకుని, వాటిపై కొద్దిగా మోజరెలా చీజ్ వేసి, ఐదు నిమిషాల పాటు ఓవెన్లో దోరగా బేక్ చేసుకోవాలి.– అనంతరం ముక్కలను బయటికి తీసి, వాటిపై మిరియాల పొడి, వెల్లుల్లి తురుము, చిన్నచిన్న టమాటో ముక్కలు, మోజరెలా చీజ్ చల్లుకోవాలి.– మరోసారి ఆ ట్రేను ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకోవాలి. వాటిని తులసి ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.పొద్దుతిరుగుడు లడ్డూ..కావలసినవి..పొద్దుతిరుగుడు గింజలు– 1 కప్పుబెల్లం తురుము– 1 కప్పునీళ్లు– పాకానికి సరిపడాకొబ్బరి తురుము– పావు కప్పునెయ్యి– 3 టేబుల్ స్పూన్లుతయారీ..– ముందుగా పొద్దుతిరుగుడు గింజలను నేతిలో దోరగా వేయించి, మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసుకుని పాకం పెట్టుకోవాలి.– చల్లారాక వడకట్టుకుని, అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పొద్దుతిరుగుడు గింజల పొడి, కొబ్బరి తురుము వేసుకుని, ముద్దలా చేసుకోవాలి.– అవసరం అయితే అదనంగా కాస్త నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.టమాటో హల్వా..కావలసినవి..టమాటోలు– 10, పంచదార– 1 కప్పునెయ్యి– అరకప్పు, బొంబాయి రవ్వ– ఒక కప్పునట్స్– రెండు గుప్పిళ్లు, ఫుడ్ కలర్– అభిరుచిని బట్టిఏలకుల పొడి– అర టీస్పూనుతయారీ..– ముందుగా టమాటోలను నీళ్లలో ఉడికించి చల్లార్చాలి. వాటిని మిక్సీలో వేసుకుని గుజ్జులా చేసుకుని, బౌల్లోకి వేయాలి.– ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి నట్స్, బొంబాయి రవ్వలను విడివిడిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.– ఇప్పుడు స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోయాలి.– నీళ్లు మరిగాక వేయించిన బొంబాయి రవ్వ, కొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి.– రవ్వ చిక్కబడుతున్న సమయంలో టమాటో గుజ్జు, పంచదార, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి.– ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఫుడ్ కలర్, ఏలకుల పొడి చల్లి, బాగా కలిపి దించేయాలి.– తరువాత బౌల్ లోపల కాస్త నెయ్యి రాసి, సగానికి పైగా హల్వాని వేయాలి.– తర్వాత నట్స్ చల్లుకుని, మిగిలిన హల్వా కూడా పైన వేసుకుని పరచుకోవాలి. గాలికి చల్లారి దగ్గరపడిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: -
ఆర్గానిక్ అ'డ్రెస్'!
సాక్షి, సిటీబ్యూరో: తినే తిండిలో మాత్రమే కాదు మనం ధరించే దుస్తుల్లోనూ రసాయనాల వినియోగం మితిమీరుతోంది. స్వచ్ఛంగా మెరిసిపోయే తెల్లని కాటన్ వస్త్రం తయారీలో కూడా ఆ రంగు కోసం కెమికల్స్ వాడతారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఆహారం తరహాలోనే ఆహార్యంపై కూడా పెరుగుతున్న శ్రద్ధ.. నగరవాసుల్లో ఆర్గానిక్ దుస్తుల పట్ల ఆసక్తికి కారణమవుతోంది.తిరిగే ప్రదేశం సహజమైన ప్రకృతి అందాలతో ఉండాలి తినే తిండి కూడా సహజమైనదే అయి ఉండాలి.. ధరించే దుస్తులు కూడా సహజసిద్ధమైన రీతిలో రూపొందించినవి కావాలి. లేకపోతే అనారోగ్యాలు ఎటు నుంచి దాడిచేస్తాయో తెలీదు.. ఈ స్పహ ఆధునికుల్లో పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని బ్రాండెడ్ దుస్తులు మార్కెట్లో కనిపిస్తుండగా.. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగాæ డిజైనర్లు కూడా ఆర్గానిక్ దుస్తులకు అడ్రస్‌గా మారుతున్నారు. అలాంటివారిలో సిటీ డిజైనర్ సంతోష్ ఒకరు. గతంలో పూణె ఫ్యాషన్ వీక్‌లో వీటిని ప్రదర్శించారాయన.కాస్ట్ లీ కాదు.. ధనవంతులు మాత్రమే సస్టెయినబుల్ ఫ్యాషన్ ను కొనుగోలు చేయగలరని అభిప్రాయం ఏర్పడింది. అయితే తెలివిగా షాపింగ్ చేయాలనుకునే ఎవరికైనా ఈ తరహా దుస్తులు అందుబాటులోనే ఉంటాయని అంటున్నారు డిజైనర్లు. ‘అందరూ అనుకున్నట్టు ఆర్గానిక్ ఫ్యాషన్ దుస్తులు మరీ ఖరీదైనవి ఏమీ కాదు. ఉత్పత్తి వ్యయం కూడా మీటర్‌కి రూ.వెయ్యిలోపే అవుతుంది. అయితే వీటి వాడకంపై ఫ్యాషన్ ప్రియుల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది’ అంటూ చెప్పారు నగరానికి చెందిన డిజైనర్ నయన్. సేంద్రియ పద్ధతిలో తయారు.. ఆధునిక వినియోగదారులు పర్యావరణ అనుకూల డిజైన్ ట్రెండ్లను అనుసరిస్తుండటంతో హానికరమైన రసాయనాలు, పురుగు మందులు లేకుండా ఉంటాయి సేంద్రియ పద్ధతిలో తయారైన వ్రస్తాలకు డిమాండ్ విస్తరిస్తోంది. ఉత్పత్తిదారులు సరళమైన, తటస్థ–రంగు దుస్తులు రూపొందిస్తున్నారు. వీటిలో తెలుపు, నలుపు క్రీం రంగులు కీలకమైనవి. కార్క్, వెదురు, జనపనార, ఆర్గానిక్ కాటన్, రీసైకిల్ కాటన్ లినెన్ సస్టెయినబుల్ ఫ్యాషన్ ఉత్పత్తిలో కీలకమైన ముడి పదార్థాలుగా మారాయి. సేంద్రియ పద్ధతిలో పత్తి లేదా జనపనార వంటి పర్యావరణ అనుకూల పదార్థాలతో రూపొందించిన జీన్స్ దుస్తులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించే స్వెటర్ల కోసం, ఉన్ని లేదా అల్పాకాతో తయారు చేసినవి అందుబాటులోకి వచ్చాయి.వ్యర్థాల రీసైక్లింగ్.. ఫ్యాషన్ పరిశ్రమలో వ్యర్థాలను తగ్గించడానికి అప్‌సైక్లింగ్ రీసైక్లింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. డిజైనర్లు కొత్త ప్రత్యేకమైన దుస్తుల వెరైటీల సృష్టి కోసం పాత వ్రస్తాలు, స్క్రాప్లు, దుస్తుల తయారీలో వాడగా మిగిలిపోయిన వాటిని సృజనాత్మకంగా పునర్నిరి్మస్తున్నారు. ఇది వ్రస్తాల జీవితచక్రాన్ని పొడిగించడంలో, వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతోంది. అలాగే స్లో ఫ్యాషన్ మూవ్మెంట్.. స్లో ఫ్యాషన్ అనే భావన పెరిగింది. వినియోగదారులు తమ ఫ్యాషన్ ఎంపికల విషయంలో కంటికి ఇంపుగా ఉండే దుస్తుల కన్నా ఒంటికి మేలు చేసేవే మిన్న అనే భావనకు వస్తున్నారు. ఎక్కువ కాలం ధరించగలిగే శాశ్వతమైన, మన్నికైన దుస్తులను ఎంచుకుంటున్నారు. మరో వైపు ఇది సంప్రదాయ హస్తకళ స్థానిక కళాకారులకు ఇది ఊతమిస్తోంది. సంప్రదాయ నేయడం, అద్దకం, ఎంబ్రాయిడరీ పద్ధతులను సంరక్షించడానికి ప్రోత్సహించడానికి బ్రాండ్లు కళాకారులతో కలిసి పనిచేస్తున్నాయి. ఇది సంప్రదాయ కళలను పునరుజ్జీవింపజేయడమే కాకుండా హస్తకళాకారుల పురోభివృద్ధి అవకాశాలను కూడా పెంచుతోంది."రసాయన రహితంగా పూర్తి ఆర్గానిక్ దుస్తుల తయారీ అనేది ఇప్పటికీ కొంత సాహసంతో కూడిన ప్రయోగమే అని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, డైతో తయారు చేసినవి తక్కువ షేడ్స్‌లో మాత్రమే లభ్యమవుతాయి. దేశంలో ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ నాచురల్ డైస్‌తో చేసిన దుస్తులు విక్రయిస్తున్నప్పటికీ.. అవి కూడా పూర్తిగా 100శాతం ఆర్గానిక్ అని చెప్పలేం. ఆర్గానిక్ దుస్తులకు కాటన్, లినెన్, పట్టు.. ఫ్యాబ్రిక్స్ మాత్రమే నప్పుతాయి. అలాగే ఈ దుస్తుల తయారీకి మిగిలిన వాటి తయారీతో పోలిస్తే పట్టే సమయం కూడా బాగా ఎక్కువ. ‘నేను రూపొందించిన ఆర్గానిక్ దుస్తుల తయారీలో ఫ్యాబ్రిక్ మొత్తం చేనేతలనే వినియోగించాను. సిద్ధిపేటలోని ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ సునంద ఈ ఫ్యాబ్రిక్స్ తయారీ చేయించారు. అదేవిధంగా ఉల్లిపాయ, పసుపు వంటి దినుసులతో పాటు చెట్ల ఆకులు, కాండం, వేర్లు.. వీటిని ఉపయోగించి ఆకుపచ్చ, విభిన్న రకాల బ్లూషేడ్స్, ఎల్లో, బ్రిక్ షేడ్స్‌తో కలర్స్ సృష్టించాం. కొంచెం డల్ ఫినిష్ ఉండే ఫ్యాబ్రిక్‌కి అత్యాధునిక డిజైనింగ్ వర్క్ జత చేసి ఆకట్టుకునేలా డ్రెసెస్ క్రియేట్ చేశాం. మొత్తం 20 డ్రెస్సెస్ క్రియేట్ చేస్తే.. 16 రకాల డిజైన్లను ఈ షోలో ప్రజెంట్ చేశాను’ అంటూ చెప్పారు సిటీ డిజైనర్ సంతోష్."నేచురల్ డై తయారీ యూనిట్ స్థాపించి..సింథటిక్ వంటి వ్రస్తాలు ఎంచుకుంటే అది పర్యావరణానికి హానికరమని, మన ఆరోగ్యానికి కూడా చేటు చేస్తుందనే స్పృహ నగరవాసుల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. అలాగే దుస్తుల తయారీలో వాడే కొన్ని మెటీరియల్స్ ఆక్సిజన్ నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కెమికల్ డైలను నివారించాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఆకులు తదితర సహజోత్పత్తుల ద్వారా తయారైన రంగుల వినియోగం పెంచాలి. నేచురల్ డైతో తయారైన.. పూర్తి సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్‌ను అందించేందుకు సిటీ శివార్లలో మా సొంత డైయింగ్ యూనిట్‌ను ప్రారంభించాం. – మమత తుళ్లూరి, డిజైనర్ఇవి చదవండి: ఇది.. మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ డివైస్! -
నిద్రలేమిని దూరం చేసే కళ్లజోడు.. ఎప్పుడైనా వాడారా..!?
ఈ కళ్లజోడును రోజూ ధరించినట్లయితే, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ప్రతిరోజూ సరైన వేళకు చక్కగా నిద్రపడుతుంది. ఆస్ట్రేలియన్ కంపెనీ ‘రీటైమ్’ ఈ హైటెక్ లైట్‌థెరపీ కళ్లజోడును తాజాగా ‘రీటైమర్–3’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడలాయిడ్లోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లియోన్ ల్యాక్ ‘రీటైమ్’ కంపెనీ కోసం ప్రత్యేకంగా ఈ కళ్లజోడును రూపొందించారు.ఈ కళ్లజోడును ధరిస్తే, దీని నుంచి నిర్ణీత తరంగదైర్ఘ్యంలో నీలి–ఆకుపచ్చ రంగులోని కాంతి కళ్ల మీద పడుతుంది. ఈ కాంతి కళ్ల అలసటను పోగొడుతుంది. దీని నుంచి వెలువడే కాంతి శరీర గడియారానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఫలితంగా, వేళకు చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఈ కళ్లజోడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఆరుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 179 డాలర్లు (రూ.15,021) మాత్రమే!ఎక్కడైనా వాడుకోగల పోర్టబుల్ ఏసీ..ఇది పోర్టబుల్ ఏసీ. దీనిని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇళ్లల్లోనే కాదు, పిక్నిక్లకు, ఫారెస్ట్ క్యాంపులకు వెళ్లేటప్పుడు తాత్కాలికంగా వేసుకున్న టెంట్లలో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. చైనాకు చెందిన ‘హావోరాన్’, ‘యిఫీలింగ్ డిజైన్ ల్యాబ్’లకు ఇంజినీర్లు ‘యూయీ’ పేరుతో ఈ పోర్టబుల్ ఏసీకి రూపకల్పన చేశారు. ఒకదానికి మరొకటి అనుసంధానమై రెండు భాగాలుగా ఉండే ఈ ఏసీని సూట్‌కేసులా ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు.ఏసీ భాగాన్ని టెంట్ లోపల లేదా గది లోపల పెట్టుకుని, ఏసీ అడుగున ఉన్న భాగాన్ని టెంట్ లేదా గది వెలుపల పెట్టుకుని, ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గది లేదా టెంట్ లోపల ఉన్న వేడిని బయటకు పంపి క్షణాల్లోనే చల్లబరుస్తుంది. అంతేకాదు, ఇది పనిచేసే పరిసరాల్లోకి దోమలు, ఇతర కీటకాలు చేరలేవు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే మిల్లీరోబోలు..డచ్ వైద్యశాస్త్రవేత్తలు రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే ఈ మిల్లీరోబోలను ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఇవి నేరుగా రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయి, సూచించిన దిశలో ముందుకు సాగుతూ, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన చోట ఏర్పడిన అవరోధాలను సునాయాసంగా తొలగించి, సజావుగా రక్తప్రసరణ జరిగేలా చేస్తాయి. నెదర్లండ్స్‌లోని ట్వంటీ యూనివర్సిటీ, రాడ్‌బోడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ మిల్లీరోబోలను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించారు.అయస్కాంతం ద్వారా వీటి కదలికలకు దిశా నిర్దేశం చేయడానికి వీలవుతుంది. ఈ మిల్లీరోబోల పనితీరుపై ఇంకా లాబొరేటరీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చినట్లయితే, గుండెజబ్బులు, పక్షవాతంతో బాధపడే చాలామంది రోగులకు చికిత్స చేసే పద్ధతి మరింత సులభతరమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
ఇది.. మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ డివైస్!
ఈరోజుల్లో సౌందర్యాభిలాషులకు తమ వయసును దాచే అద్భుతమైన పరికరాలు మార్కెట్లోకి చాలానే వస్తున్నాయి. ముడతలు, మచ్చలు, గీతలు లేకుండా చర్మానికి నిగారింపునిచ్చి, యవ్వనంతో కళకళలాడేలా మార్చే ఇలాంటి డివైస్‌లు వెంట ఉంటే, అందాన్ని కాపాడుకోవడం చాలా తేలిక. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ మెషిన్ అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రికల్ మజిల్ స్టిములేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది.ఈ ప్రొఫెషనల్ ఫేషియల్ మసాజర్ వడలిపోయిన చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, చర్మానికి ఉండే సహజ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి, చర్మం నిగారింపును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ పోర్టబుల్ మెషిన్ చూడటానికి టార్చ్లైట్లా కనిపిస్తుంది. రీచార్జ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనిలోని రెడ్ లైట్ థెరపీ చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు దెబ్బతిన్న కొలాజెన్ పొరను సరిదిద్దడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని బ్లూ కలర్ లైట్ థెరపీ మొటిమలను, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. దీనిలోని రెండు రకాల లైట్ థెరపీలకు మూడు స్థాయిల్లో వైబ్రేషన్ స్పీడ్‌ను కోరుకున్న విధంగా మార్చుకోవచ్చు. ఈ మెషిన్ ఆన్ అయిన ఆరు నిమిషాల్లో ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీని ధర 84 డాలర్లు (రూ.7,044) మాత్రమే!ఇవి చదవండి: అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం! -
అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం!
అందాలొలికే ఈ బొమ్మలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వీటిని పూర్తిగా పువ్వులు, ఆకులు, రెమ్మలతోనే రూపొందించినట్లు తెలుసుకుంటే, ‘సుందరం.. ‘సుమ’నోహరం’ అని ప్రశంసించక మానరు. కెనడాలో స్థిరపడిన జపానీస్ కళాకారుడు రాకు ఇనోయుయి రూపొందించిన ఈ ‘సుమ’నోహర కళాఖండాలు కొంతకాలంగా ‘ఆన్లైన్’లో హల్చల్ చేస్తున్నాయి. పూలు, ఆకులు, రెమ్మలను ఉపయోగించి, రాకు సృష్టిస్తున్న కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి.కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉంటున్న రాకు ఈ పూల కళను 2017లో సరదా కాలక్షేపంగా మొదలుపెట్టాడు. తన ఇంటి పెరట్లో మొక్కల నుంచి రాలిపడిన గులాబీలు, ఇతర పూల రేకులు, వాటి ఆకులు వృథాగా పోతుండటంతో, వాటిని ఎలాగైనా సద్వినియోగం చేయాలని ఆలోచించాడు. తొలి ప్రయత్నంగా పూలరేకులు, కత్తిరించిన రెమ్మల ముక్కలను ఉపయోగించి కీచురాయి బొమ్మను తయారు చేశాడు. కీచురాయి బొమ్మ ఫొటోలను సోషల్ మీడియాలో పెడితే, విపరీతంగా స్పందన వచ్చింది. ఇక అప్పటి నుంచి రాకు వెనుదిరిగి చూసుకోలేదు. నిరంతర సాధనతో తన కళకు తానే మెరుగులు దిద్దుకుంటూ, పూల రేకులు, ఆకులు, రెమ్మలతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందే స్థాయికి ఎదిగాడు.పూర్తిగా సహజమైన పూలు, పూల రేకులు, ఆకులు, పూలమొక్కల గింజలు, రెమ్మలు, కొమ్మలు మాత్రమే ఉపయోగించి, కార్టూన్ క్యారెక్టర్లు, చిలుకలు, కొంగలు, గుడ్లగూబలు వంటి పక్షులు, పులులు, సింహాలు, జింకలు వంటి జంతువులు, సీతాకోక చిలుకల వంటి కీటకాల బొమ్మలను జీవకళ ఉట్టిపడేలా తయారు చేయడంలో రాకు తన ఏడేళ్ల ప్రస్థానంలో అపార నైపుణ్యం సాధించాడు.ఈ కళాఖండాలను రూపొందించడానికి గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ఒక్కోసారి రోజుల తరబడి ఓపికతో పని చేయాల్సి ఉంటుందని రాకు చెబుతున్నాడు. ఆన్లైన్లో రాకు పేరుప్రఖ్యాతులు పెరగడంతో ప్రముఖ కంపెనీలు ఆర్డర్లు ఇచ్చి మరీ అతడి చేత తమ కంపెనీల లోగోలను ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుంటున్నాయి. ఈ పూల కళాఖండాలు ఎక్కువకాలం ఉండవు. త్వరగానే వాడిపోయి, వన్నె కోల్పోతాయి. అందుకే రాకు వీటి సౌందర్యాన్ని తన ఫొటోల ద్వారా శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు. వృక్షశాస్త్రవేత్త అయిన రాకుకు చిన్నప్పటి నుంచి కళాభిరుచి కూడా ఉండటంతో అతడు ఈ కళలో అద్భుతంగా రాణిస్తున్నాడు. -
Annu Patel: అన్నూస్ క్రియేషన్!
అన్నూ పటేల్.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్పెషల్ స్టయిల్ ఆమెది! ఆ స్పెషాలిటీకి బాలీవుడ్ ఫిదా అయింది! అటు ఫ్యాషన్‌లో.. ఇటు స్టార్స్ స్టయిలింగ్‌లో సీనియర్స్‌తో ఇన్స్పైర్ అవుతూ, తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్న ఆమె గురించి నాలుగు మాటలు ..అన్నూ పటేల్ స్వస్థలం గుజరాత్‌లోని వడోదర. ఫ్యాషన్‌గా ఉండటం, రకరకాల కలర్ కాంబినేషన్స్‌లో బట్టలు కుట్టించుకోవడమంటే ఆమెకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. కనుకే, ఫిజియోథెరపీలో చేరిన కొన్నాళ్లకే అది తన కప్ ఆఫ్ టీ కాదన్న విషయాన్ని గ్రహించింది. ఫ్యాషన్ మీదే మనసు పారేసుకుంది. ఆలస్యం చేయక, వడోదరలోని ఐఎన్ఐఎఫ్డీ (ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్)లో చేరింది. గ్రాడ్యుయేషన్ ఫస్టియర్‌లోనే ఆమె ఫ్యాషన్ ఐడియాస్కి ముచ్చటపడిన ఇన్స్టిట్యూట్ ఆమెకు ‘ద మోస్ట్ ఇన్నోవేటివ్ కలెక్షన్’ అవార్డ్నిచ్చింది. సెకండియర్‌లో ఉన్నప్పుడు ‘అన్నూస్ క్రియేషన్’ లేబుల్‌ను స్టార్ట్ చేసింది.ఆ చిన్న పట్టణంలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది కానీ.. డిజైనర్ వేర్కి డిమాండ్ ఎక్కడ? అందుకే మొదట్లో తను డిజైన్ చేసిన దుస్తులను ఇంటింటికీ వెళ్లి అమ్మి, డిజైనర్ వేర్ పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి మోజు కలిగేలా చేసింది. ఆ ప్రయత్నం.. ఆమె చదువైపోయేలోపు ఫ్యాషన్ మార్కెట్లో ‘అన్నూ క్రియేషన్’కి స్పేస్‌ని క్రియేట్ చేసింది. దాన్ని స్థిరపరచు కోవాలంటే తన లేబుల్‌కు ఒక స్పెషాలిటీ ఉండాలని ఆలోచించింది అన్నూ. ఈ దేశంలో పెళ్లికిచ్చే ప్రాధాన్యం స్ఫురణకు వచ్చింది.బ్రైడల్ వేర్ డిజైన్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటే తన మార్కెట్ ఎక్కడికీ పోదని తెలుసుకుంది. తన ఐడియాను అర్థం చేసుకునే టీమ్‌ని ఎంచుకుని డిజైనింగ్ మొదలుపెట్టింది. తొలుత సామాన్యులకే బ్రైడల్ వేర్ ఇచ్చింది. అవి అసామాన్యుల మనసునూ దోచాయి. దాంతో అన్నూ క్రియేషన్ సెలబ్రిటీల స్థాయికి చేరింది. బ్రైడల్ వేర్ చేస్తున్నప్పుడే అన్నూకి ఫ్యాషన్ మార్కెట్లో ఎత్నిక్ వేర్కీ స్పేస్ కనపడింది. ముందు తనకు, తన టీమ్‌కి క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్ చేసి, వాటిని ధరించి.. ఫొటో షూట్ చేయించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయసాగింది. అవీ సెలబ్రిటీల దృష్టిలో పడి అన్నూ బ్రాండ్‌కి క్యూ కట్టసాగారు.ఆ డిమాండ్‌ను చూసి ‘ఎఫ్ అండ్ ఎఫ్ (ఫ్రిల్ అండ్ ఫ్లేర్)’ పేరుతో క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్‌ను స్టార్ట్ చేసింది. ‘ఎఫ్ అండ్ ఎఫ్’ అంటే కుర్తీలు, ఇండో– వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌కి పర్ఫెక్ట్ బ్రాండ్ అనే ఫేమ్‌ని సంపాదించింది. తనే కొత్త అవుట్‌ఫిట్‌ని డిజైన్ చేసినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అన్నూ అలవాటు. అలా ఆమె డిజైన్స్ అన్నిటినీ ఫాలో అయిన కొందరు బాలీవుడ్ సెలబ్స్.. తమకు స్టయిలింగ్ చేయమని ఆమెను కోరారు. తొలుత అప్రోచ్ అయింది మలైకా అరోరా! ఆ తర్వాత కృతి ఖర్బందా, సోఫీ చౌధరీ, తారా సుతారియా, మౌనీ రాయ్, జాన్వీ కపూర్, హెజల్ కీచ్ వంటి వాళ్లంతా అన్నూ పటేల్ స్టయిలింగ్ క్లయింట్ల లిస్ట్‌లో చేరిపోయారు. ‘సామాన్యులకు డిజైన్ చేస్తున్నా, సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నా.. ఆయా స్థాయిల్లో అంతే ఎఫర్ట్స్ పెడతాను, అంతే కమిట్మెంట్తో ఉంటాను. నా డిజైనర్ వేర్ని.. నా స్టయిలింగ్‌ని కోరుకుంటున్న వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం. అది నాకు కోటి అవార్డులతో సమానం!’ అంటుంది అన్నూ పటేల్.ఇవి చదవండి: Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా! -
Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా!
సనమ్ సయీద్.. బ్రిటిష్ పాకిస్తానీ మోడల్, నటి, గాయని కూడా! ఉర్దూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రసిద్ధురాలు. మన దగ్గరా ఆమెకు ఘనమైన అభిమానగణం ఉంది. జీ5, హమ్ చానళ్ల వీక్షకులకు ఆమె సుపరిచితం.సనమ్ పుట్టింది లండన్‌లో. తన ఆరేళ్ల వయసులో ఆమె కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్లి, స్థిరపడింది. ప్రాథమిక విద్యాభ్యాసం కరాచీలో, ఉన్నత విద్యాభ్యాసం లాహోర్‌లో గడిచింది. ఫిల్మ్ అండ్ థియేటర్ స్టడీస్‌లో డిగ్రీ చేసింది.ఆమె తన పదహారవయేట నుంచి మోడలింగ్ మొదలుపెట్టింది. పదిహేడేళ్లప్పుడు ఎమ్‌టీవీ (పాకిస్తాన్)లో వీజేగా కనిపించింది.‘షికాగో’ అనే నాటకంతో రంగస్థల ప్రవేశం చేసింది. అందులోని ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాంతో ఆమెకు టీవీ సీరియల్స్‌లోనూ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ‘దామ్’ అనే సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటు నాటకాలు, అటు సీరియళ్లతో బిజీగా ఉన్న సమయంలో కోక్ స్టూడియో పాకిస్తాన్లో తన గళాన్ని వినిపించి.. తనలోని గాన ప్రతిభనూ చాటుకుంది.సనమ్ మల్టీటాలెంట్ ఆమెను వెండితెరకూ పరిచయం చేసింది ‘బచానా’ అనే ఉర్దూ సినిమాతో! ‘మాహ్ ఎ మీర్’, ‘దొబారా ఫిర్ సే’, ‘ఇశ్రత్ మేడ్ ఇన్ చైనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి.సనమ్‌ను మనకు ఇంట్రడ్యూస్ చేసి.. ఇక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టిన సీరియల్ ‘జిందగీ గుల్జార్ హై’. ఇది హమ్ టీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ ఆమెకు ఇండియన్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచింది.ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమెకున్న ఫేమ్‌ను చూసి ఓటీటీ కూడా ఆమెకు ప్లేస్ ఇచ్చింది.. ‘కాతిల్ హసీనాఓం కే నామ్’తో! ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది.మోడలింగ్, థియేటర్, టీవీ, సినిమా, ఓటీటీ, సింగింగ్.. ఇలా అడుగిడిన ప్రతి రంగంలో ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు దక్కాయి. అందులో ఒకటి ‘ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్’.'ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉండటం అనిర్వచనీయమైన ఆనందం. ఇండియన్స్ పరాయివాళ్లన్న భావన నాకెన్నడూ లేదు. ఎప్పుడో.. ఎక్కడో తప్పిపోయి.. వేరువేరు ఇళ్లల్లో పెరిగిన తోబుట్టువుల్లా తోస్తారు. ఇప్పుడు నా సీరియల్స్, సిరీస్‌తో వాళ్లను కలుసుకుంటున్నట్టనిపిస్తోంది.'ఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
ప్రెగ్నెన్సీ సమయంలో.. ఈ లక్షణాలు కనిపెట్టడమెలా?
నాకు ఏడవ నెల. నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే లక్షణాలను ఎలా కనిపెట్టాలి? ఎలాంటి పరీక్షలు చేస్తే తెలుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దివ్య శ్రీ, వికారాబాద్నెలలు నిండక ముందే ప్రసవించడం అనేది చాలామందికి అప్పటికప్పుడే మొదలవుతుంది. కానీ పదిమందిలో ఏడుగురికి ఏ ఇబ్బంది లేకుండా పురిటినొప్పులు తగ్గిపోతాయి. పూర్తిగా నెలలు నిండాకే డెలివరీ అవుతుంది. అయితే కొంతమందికి తరచూ నొప్పులు వచ్చి రక్తస్రావం, ఉమ్మనీరు పోవడం మొదలవుతుంది. ఇలా అయినప్పుడు సర్విక్స్ కూడా తెరుచుకుంటుంది. కాబట్టి నొప్పులు అదుపు చేయడం కష్టమవుతుంది. అలాంటి లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.డెలివరీ సురక్షితంగా అయ్యి బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండటానికి ముందస్తుగా అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇచ్చే సమయం దొరుకుతుంది. 37వారాల లోపు ఇలా జరిగితే, దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అంటారు. కొన్నిసార్లు 24–48 గంటలు నొప్పులు తగ్గే మందులు ఇవ్వొచ్చు. బిడ్డ ఊపిరితిత్తుల పరిపక్వత కోసం స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇన్ఫెక్షన్లు రాకుండా హై యాంటీబయాటిక్స్ ఇస్తారు. యూరిన్, వెజైనల్ స్వాబ్స్ టెస్ట్‌కి పంపి, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇలా తొందరగా నొప్పులు వచ్చాయా అని పరీక్షిస్తారు.పల్స్, బీపీ, బిడ్డ గుండె కొట్టుకోవడం ఎలా ఉన్నాయో చూస్తారు. స్కాన్‌లో బిడ్డ కదలికలు, రక్తప్రసరణను చూస్తారు. చాలామందికి నొప్పులు లేకుండా వాటర్ బ్రేక్ అయ్యి, వెజైనా నుంచి లీక్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే ఉమ్మనీరు పోతోంది, డెలివరీ ఎప్పుడైనా కావచ్చు అని అర్థం. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ నొప్పులు మొదలైనట్లయితే నెలలు పూర్తవకుండా పుట్టే బిడ్డను జాగ్రత్తగా చూసుకునే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలోనే డెలివరీ చేసుకోవాలి.నియోనాటాలజిస్ట్ కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో 24 వారాల నుంచి బిడ్డను జాగ్రత్తగా చూసే ఆధునిక పరికరాలు పెద్ద సెంటర్లలో ఉంటున్నాయి. తగిన శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సులు ఉండాలి. ప్రీమెచ్యూర్ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆ సమస్యలను తగ్గించడానికి తల్లికి ముందుగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. కొందరి విషయంలో ఉమ్మనీరు పోవడం మొదలైనా, ప్రసవం మొదలుకాకపోవచ్చు. అలాంటి వారిని ఆసుపత్రిలో ఉంచి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.ఉమ్మనీరు, రక్తప్రసరణ ఎలా ఉందో పరీక్షిస్తూ, తల్లికి బిడ్డకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేకపోతే 37 వారాల వరకు పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే బిడ్డకు తల్లి కడుపులో అందే పోషకాలను, వాతావరణాన్ని బయట పూర్తిగా ఇవ్వలేము. అందుకే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు గర్భంలో ఉంచేందుకే ప్రయత్నించాలి. తప్పనిసరి అనుకున్నప్పుడే డెలివరీ చేయాలి.ఇవి చదవండి: నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? -
నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నాకు 5వ నెల, నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. ఉద్యోగం చేస్తున్నాను. రెస్ట్‌లో ఉంటే కొంచెం బాగుంటోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుధ, రేణిగుంటప్రెగ్నెన్సీలో 3వ నెల దాటిన తరువాత చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇది మొదటి ప్రెగ్నెన్సీలో బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్‌కి పెల్విక్ లిగమెంట్స్ స్ట్రెచ్ అవటం వల్ల వస్తుంది. ఆ స్ట్రెచ్‌లో లోయర్ బ్యాక్, పెల్విక్స్ నొప్పి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. బరువులు ఎత్తకుండా ఉండటం, పడుకున్నప్పుడు వెన్నును మరీ వంచకుండా, కాళ్లను కదిలించడం ద్వారా ఒత్తిగిల్లడం, ఫ్లాట్ షూస్ వేసుకోవడం, ఆఫీస్‌లో కూర్చుని ఉన్నప్పుడు బ్యాక్‌ని స్ట్రెయిట్‌గా ఉంచి కూర్చోవడం చేయాలి.మెటర్నిటీ పిల్లోస్ కూడా వాడుకోవచ్చు. మసాజ్ వల్ల కూడా కొందరికి నొప్పి తగ్గుతుంది. కిందపడిన వస్తువులను మోకాలు మీద వంగి తీసుకోవడం, బ్యాక్ బెండ్ కాకుండా చూడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి ఎక్కువ ఉంటే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలి. కొన్ని ప్రీనేటల్ యోగా ఎక్సర్సైజ్ల వల్ల కూడా బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ట్రెయినర్ పర్యవేక్షణలో అవి పాటించాలి. ఒకవేళ నడుమునొప్పితో పాటు, ఫీవర్ ఉన్నా, బ్లీడింగ్, యూరిన్‌లో నొప్పి ఉన్నా, ఛాతీ భాగంలో నొప్పి ఉన్నా, వాటర్ బ్రేకింగ్ ఉన్నా అది చాలా ప్రమాదం. వెంటనే డాక్టర్‌ను కలవాలి.హెల్త్ ట్రీట్: హిస్టరెక్టమీతో ఇతర సమస్యలు..హిస్టరెక్టమీ శస్త్రచికిత్స తర్వాత మహిళలు తర్వాతి కాలంలో ఇతర సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఈ శస్త్రచికిత్సలో గర్భసంచిని, అండాశయాలను తొలగించడం వల్ల మహిళల ఆరోగ్యంపై అనేక దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని అమెరికన్ వైద్య నిపుణురాలు డాక్టర్ బ్రునిల్డా నజారియో చెబుతున్నారు.న్యూయార్క్‌లోని ఒబేసిటీ సొసైటీ లాటిన్ అమెరికన్ విభాగం చైర్‌పర్సన్‌గా ఉన్న డాక్టర్ బ్రునిల్డా ఇటీవల తన పరిశోధనలో తేలిన అంశాలను గ్లోబల్ వెల్నెస్ çసమిట్‌లో వెల్లడించారు. యూటరిన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మహిళలకు హిస్టరెక్టమీ చేయాల్సి వస్తుంది. ఈ చికిత్స తర్వాత మహిళల్లో గుండెజబ్బులు, రక్తపోటు, డెమెన్షియా, శరీరంలో కొవ్వు పెరిగి స్థూలకాయం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ బ్రునిల్డా నేతృత్వంలో జరిగిన పరిశోధనలో తేలింది.ఈ పరిశోధనలో భాగంగా 4,188 మంది మహిళలపై పరీక్షలు నిర్వహించి, విస్తృతంగా అధ్యయనం చేశారు. హిస్టరెక్టమీ చేయించుకోని మహిళలతో పోల్చుకుంటే, హిస్టరెక్టమీ చేయించుకున్న మహిళల్లోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో ముప్పయి ఐదేళ్లలోపు వయసులోనే హిస్టరెక్టమీ చేయించుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నట్లు గుర్తించారు.ఇవి చదవండి: ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి! -
ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి!
అవంతి రాజ్యాన్నేలే ఆనందవర్మకి ఒక్కడే కొడుకు. అతని విద్యాభ్యాసం పూర్తయ్యింది. వివాహం చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆనందవర్మ. ఆ మాట రాణితో అంటే, ఆమె ‘అవును.. పెళ్ళి అంగరంగవైభవంగా చేయాలి. ఎందుకంటే మనకు ఒక్కగానొక్క కొడుకాయే!’ అంది. అదే విషయాన్ని రాజు మంత్రితో చెబితే, ఆయనా రాణి అన్నట్లే అన్నాడు. బంధుగణమూ, రాజోద్యోగులూ ‘అవును ఆకాశమంత పందిరేసి, భూదేవంత అరుగేసి చేయాలి’ అన్నారు.రాజుగారు అందరిమాట మన్నించి కుంతల రాకుమారితో యువరాజు వివాహం కనీవినీ ఎరుగనంత వైభవంగా చేశాడు. ఆ వేడుకలు చూసిన రాజ్యంలోని ప్రజలంతా ‘ఇలాంటి పెళ్ళి ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగబోదు’ అంటూ పొగడటం ప్రారంభించారు. రాజుగారి ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆనందం అట్టేకాలం నిలవలేదు. ఒకరోజు చావు కబురు చల్లగా చెప్పాడు మంత్రి.. ఖజానా ఖాళీ అయిందని! ‘పరిష్కారం ఏమిటీ?’ అని రాజుగారు అడిగితే, ‘కొత్త పన్నులు వేసి ధనం రాబట్టడమే’ అన్నాడు మంత్రి. కొత్త పన్నులు విధించాడు రాజు. కొత్తగా పన్నులు వేసినపుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రాజుగారికి అలవాటు. అలా రాజు, మంత్రి ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరారు.పొద్దుపోయేసరికి రుద్రవరం అనే గ్రామం చేరారు. రాత్రికి అక్కడే సేదదీరి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభిద్దామనుకుని, గుడి వద్ద సందడిగా ఉంటే అక్కడికెళ్లారు. గ్రామాధికారి కూతురి పెళ్ళి జరుగుతున్నది. పట్టుమని వంద మంది అతిథులు కూడా లేరు. ‘అంత పెద్ద పదవిలో ఉండి ఇంత నిరాడంబరంగా పెళ్ళి చేస్తున్నాడేమిటీ?’ అని ఆశ్చర్యపోయి రాజుగారు గ్రామస్థుల్ని విచారించాడు. ‘ముందుగా మన రాజుగారిలాగే ఆడంబరాలకు పోయి గ్రామాధికారి తన కుమార్తె వివాహం ఘనంగా చేయాలనుకున్నాడు. ఖర్చులు లెక్కేస్తే లక్షవరహాలు దాటేటట్టు అనిపించింది. ఆయనకది ఇష్టంలేకపోయింది.పెళ్ళి నిరాడంబరంగా జరిపి, ఆ లక్షవరహాలతో ఊర్లో వైద్యశాల నిర్మిస్తే తరతరాలు సేవలందిస్తుందని ఆలోచించాడు. ఇదే విధంగా రాజుగారు కూడా ఆలోచించి ఉంటే అనవసర వ్యయం తగ్గివుండేది. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేసుంటే తరతరాలు రాజుగారి పేరు చెప్పుకునేవారు. ఆ విధంగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవారు. మాకు ఈ కొత్త పన్నుల బాధ తప్పేది’ అన్నారు నిష్ఠూరంగా. రాజుగారికి ఎవరో చెంప ఛెళ్ళుమనిపించినట్లయింది.ఆయన తిరిగి మంత్రితో రాజధాని చేరి, చర్చలు జరిపి కొత్త పన్నులను రద్దు చేశాడు. అంతఃపుర ఖర్చులు తగ్గించాడు. వేట, వినోద కార్యక్రమాల ఖర్చులూ తగ్గించాడు. పాలనలో అనవసర వ్యయాలను తగ్గించాడు. ఆ తర్వాత ఖజానా సులువుగానే నిండింది. అప్పటినుంచి ఆనందవర్మ ఏ కార్యక్రమాన్నయినా ఒకటికి పదివిధాలుగా ఆలోచించి చేయసాగాడు. ఆడంబరాలకు పోక పొదుపు పాటించసాగాడు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా మంచిపేరు సంపాదించుకున్నాడు. – డా. గంగిశెట్టి శివకుమార్ఇవి చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'? -
రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?
‘అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ?’ అంటూ పెద్దగా కలవరిస్తూ మంచం మీద నుంచి ఉలికిపడి లేచి కూర్చుంది జూడీ. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి ఒంటిగంటైంది. వేగంగా మంచం దిగి, పక్కనే ఉన్న గదికి వెళ్లి, లైట్ వేసి, రోండా(రోమ్) మంచం వైపు చూసింది. అక్కడ రోండా లేకపోవడంతో కంగారు కంగారుగా పరుగున వెనుకకు వచ్చి, తన మంచం మీద గాఢనిద్రలో ఉన్న భర్తను కుదిపి కుదిపి లేపింది. అతడు నిద్రమత్తులోంచి తేరుకోకముందే, ‘మన.. మన రో..మ్.. కనిపించడం లేదు బాబీ!.. మ..మంచం మీద లేదు.. నాకు చా..చాలా భయంగా ఉంది’ అంటూ తడబడుతూనే ఏడ్చేసింది జూడీ. బాబీకి మైండ్ బ్లాక్ అయ్యింది. ‘ఏం మాట్లాడుతున్నావ్ జూడీ?’ అన్నాడు కంగారుగా.‘మన.. మన రోమ్ చచ్చిపోయింది. ఉన్నట్టుండి లోయలో పడిపోయింది. తనకి ఊ.. ఊపిరి ఆడటం లేదు. నా కళ్లముందే.. నా కళ్లముందే పడిపోయింది’ వణుకుతున్న స్వరంతో చెప్పింది జూడీ. బాబీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పరుగున లేచి వెళ్లి, లైట్ ఆన్ చేశాడు. గడియారం వైపు చూసి, టేబుల్ మీద వాటర్ బాటిల్ అందుకుని, జూడీకి తాగించాడు. పక్కనే కూర్చుని, ఓదార్పుగా ‘జూడీ! మన రోమ్ ఇంట్లో ఎందుకుంటుంది? క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి నిన్నే వెళ్లింది కదా, రేపు ఉదయాన్నే వస్తానంది కదా?’ అని నిదానంగా గుర్తు చేశాడు. దాంతో జూడీ పూర్తిగా తేరుకుంది.అప్పటిదాకా బిడ్డ కోసం మెలితిరిగిన కన్నపేగు అదంతా పీడకల అని గుర్తించింది. అయినా తల్లి మనసు ఇంకా అల్లాడుతూనే ఉంది. ‘బా..బీ..! నాకు చాలా భయంగా ఉంది. నాకొచ్చింది కలే కాని, నా బిడ్డ(రోండా) ఏదో సమస్యలో ఉందని నా మనసు చెబుతోంది. అసలు తను ప్రాణాలతో ఉందా? ఇప్పుడే తనని చూడాలనుంది’ అంటూ ఏడ్చింది జూడీ. దాంతో బాబీ.. ‘పిచ్చిగా మాట్లాడకు. మన రోమ్‌కి ఏమీ కాదు. ఇప్పుడు టైమ్ చూడు, ఈ సమయంలో ఎక్కడికని వెళ్దాం? రేపు తనొస్తానన్న టైమ్‌కి రాకపోతే కచ్చితంగా మనమే వెళ్దాం సరేనా?’ అని నచ్చజెప్పాడు బాబీ.జూడీ, బాబీలకు చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి రోండాకి పంతొమ్మిదేళ్లు. చదువు పూర్తిచేసుకుని, మూడు నెలల క్రితమే ఉద్యోగం సంపాదించుకుంది. ‘ఆఫీస్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అటు నుంచి రాత్రికి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి, రేపు మధ్యాహ్నానికి వస్తా’ అని చెప్పి వెళ్లింది.ఉదయం 6 దాటేసరికి కాలింగ్ బెల్ మోగింది. జూడీ తలుపు తీసేసరికి ‘రోండా మీ అమ్మాయేనా?’ అడిగారు ఎదురుగా ఉన్న పోలీసులు. ‘అవును ఏమైంది?’ అంది జూడీ కంగారుగా. ‘మీ అమ్మాయి కారుకి యాక్సిడెంట్ అయ్యింది. ఆమె చనిపోయింది’ చెప్పాడు వారిలో ఒక అధికారి. జూడీకి గుండె ఆగినంత పనైపోయింది. ‘నో.. నో..!’ అంటూ అక్కడే ఉన్న వస్తువులన్నీ నేలకేసి కొట్టింది జూడీ. ‘నేను నమ్మను. నా బిడ్డకు ఏమీ కాదు. మీరు అబద్ధం చెబుతున్నారు. ఇది నా కల! నిజం కాదు’ అని అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. ఆ అరుపులకు లోపల నుంచి బాబీ పరుగున వచ్చి జూడీని పట్టుకున్నాడు. పోలీసులు మరోసారి అదే మాట చెప్పడంతో ఆ దంపతులు మార్చురీకి పరుగు తీశారు.పోస్ట్‌మార్టమ్‌లో మాత్రం రోండా బాడీలో బుల్లెట్ దొరికింది. కేవలం వెనుక సీట్లో కూర్చున్న వాళ్లే అలా కాల్చగలరని తేలింది. దాంతో యాక్సిడెంట్ కేసు కాస్త హత్య కేసుగా మారిపోయింది. కారు రోడ్డు పక్కకు ఒరిగినట్లు, డ్రైవర్ సీట్ వైపు డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు, కారుకి కాస్త దూరంలో రోండా నేలమీద బోర్లా పడి ఉన్నట్లు ఆ రాత్రే రెండు గంటల సమయానికి గుర్తించారు పెట్రోలింగ్ పోలీసులు.అపరిచితులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని రోండా, తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చే చాన్సే లేదని జూడీ, బాబీ నమ్మకంగా చెప్పారు. దాంతో రోండా పరిచయస్థులంతా విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో క్రిస్మస్ వేడుకల నుంచి రోండా ఎక్కడికి వెళ్లింది? ఎవరెవరిని కలసింది? ఇలా ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి పన్నెండున్నరకు తన స్నేహితురాలిని డ్రాప్ చేసిన రోండా.. పది మైళ్ల దూరంలో ఉన్న తన ఇంటికే ఒంటరిగా కారులో బయలుదేరిందని తేలింది. కారు, మృతదేహం రెండూ ఇంటికి అరమైలు దూరంలోనే దొరికాయి.అయితే ఆ రాత్రి అదే తోవలో వెళ్లిన ఒక సాక్షి ‘రోండా కారు దగ్గర ఒక నీలం కలర్ కారు చూశాను. అందులో ఇద్దరు యువకులు ఉన్నారు’ అని చెప్పాడు. మరో సాక్షి.. కారు ముందు వైపుకు.. రోండా వాలిపోవడం చూశానని, ఆమె పక్కనే ఓ యువకుడు ఉన్నాడని, అయితే అది క్రైమ్ సీన్ అనుకోలేదని, తాగిన మత్తులో ఉన్న ప్రేమజంటగా భావించి, ఆగకుండా వెళ్లిపోయానని చెప్పాడు. అంటే ఆ సమయానికే రోండా చనిపోయిందని, అప్పుడు కిల్లర్ రోండా పక్కనే ఉన్నాడని అధికారులకు అర్థమైంది. వెంటనే ఆ సాక్షుల అంగీకారంతో వారికి హిప్నాసిస్ టెస్ట్ చేసి, కిల్లర్స్‌లో ఒకడు ముదురు గోధుమరంగు జుట్టుతో, 5.10 అడుగుల ఎత్తు ఉంటాడని నిర్ధారించుకున్నారు. ఇక రోండా చిన్ననాటి స్నేహితుడు మైక్‌ని కూడా గట్టిగానే నిలదీశారు.నిజానికి రోండా చదువుల్లోనే కాదు, ఆటల్లోనూ ఫస్టే! ప్రతిదానిలోనూ దూసుకునిపోయే రోండా, తన మరణానికి నెల్లాళ్ల ముందు నుంచి చాలా వింతగా ప్రవర్తించిందట! ప్రతిదానికి భయపడటం, పగటిపూట కూడా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, రాత్రి సమయాల్లో మెలకువగా ఉండటం, అర్ధరాత్రి వేళ స్నానం చేయడం లాంటివి చేసేదట! సాధారణంగా ౖలñ ంగిక వేధింపులకు గురైనవారి ప్రవర్తన అలానే ఉంటుందని కొందరు సైకాలజిస్ట్‌లు.. అధికారులకు చెప్పారు.ఆ క్రిస్మస్ వేడుకలకు కూడా స్నేహితురాలు పట్టుబట్టడంతో రోండా బలవంతంగా వెళ్లిందని పేరెంట్స్ గుర్తు చేసుకున్నారు. ‘పెళ్లి అయిన వారిని ప్రేమించడం, వారితో రిలేష¯Œ షిప్లో ఉండటం తప్పా?’ అని రోండా తన తల్లిని పదేపదే అడిగేదట! స్నేహితులకు సలహా ఇవ్వడానికి అలా అడిగిందేమో అనుకుందట జూడీ. కానీ రోండా మరణం తర్వాత జూడీకి ‘రోండా జీవితంలో ఎవరైనా వివాహితుడు ఉన్నాడా? అతడే కిల్లరా?’ అనే అనుమానం మొదలైంది. ఇప్పటికీ జూడీ, బాబీ దంపతులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.1981 డిసెంబర్ 22, నార్త్ కరోలినాలోని మౌంటైన్ రోడ్లో ఆమె ఇంటికి అర మైలు దూరంలోనే హత్యకు గురైంది. నేటికీ హంతకులు ఎవరో తేలక ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. అయితే సరిగ్గా రోండా ప్రాణం పోయే సమయానికే.. నిద్రలో ఉన్న తల్లి జూడీకి ఎలా తెలిసింది? అనేది కూడా మిస్టరీనే! – సంహిత నిమ్మనఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్!
మూడేళ్ల క్రితం.. కెన్యాలోని నైరోబీలో అండర్–20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. స్ప్రింట్స్ పోటీలకు ముందు ఒక కుర్రాడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. అంతకు మూడు నెలల క్రితం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ రిలేల్లో అతను మంచి ప్రదర్శన కనబరచాడు. క్రీడల్లో పెద్దగా గుర్తింపులేని ఆఫ్రికా దేశం బోత్స్వానా నుంచి వచ్చాడు. ప్రతిభనే నమ్ముకుంటూ ఒక్కోమెట్టు ఎక్కాడు.‘ఆఫ్రికా బోల్ట్’ అంటూ క్రీడాభిమానుల ఆశీస్సులు అందుకున్నాడు. ఊహించని వేగంతో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయిన ఆ కుర్రాడు 21 ఏళ్ల వయసు వచ్చేసరికే వరల్డ్ ఫాస్టెస్ట్ అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకొని సత్తా చాటాడు. తమ దేశానికి ఈ మెగా క్రీడల చరిత్రలో తొలి పసిడి పతకాన్ని అందించాడు. రిలే పరుగులోనూ అతని వేగం వల్లే బోత్స్వానా దేశానికి మరో రజతమూ దక్కింది. అతని పేరే లెట్సిల్ టెబోగో.పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన కొద్ది రోజులకు ఒక కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు కొందరు టెబోగోను కలిసేందుకు బోత్స్వానాలోని అతని స్వస్థలం కాన్యేకు వచ్చారు. వారికి అతను తన సొంత పొలంలో పనిచేస్తూ కనిపించాడు. అదేదో ఫ్యాషన్ కోసమో సరదాగానో కాదు పూర్తిస్థాయి రైతులా శ్రమిస్తున్నాడు టెబోగో. ‘ఒలింపిక్స్ మెడల్ గెలిచినా, నా జీవనం మాత్రం ఇదే’ అని అతను చెప్పుకోవడం విశేషం. టెబోగో స్వర్ణంతో పారిస్ నుంచి తిరిగొచ్చాక బోత్స్వానా దేశం మొత్తం పండుగ చేసుకుంది. అతని విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు సెలవు ప్రకటించిన ఆ దేశాధ్యక్షుడు స్వయంగా వెళ్లి స్వాగతం పలకడంతో పాటు తాను కూడా డాన్స్ చేస్తూ తన ఆనందాన్ని ప్రదర్శించడం టెబోగో ఆట విలువను చూపింది.వరల్డ్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటి..నైరోబీ అండర్–20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత టెబోగో ఆగిపోలేదు. సరిగ్గా ఏడాది తర్వాత కొలంబియాలోని క్యాలీలో మళ్లీ ఈ టోర్నీ జరిగింది. అక్కడా గత ఏడాది ప్రదర్శనను పునరావృతం చేశాడు. మళ్లీ స్వర్ణం, రజతంతో మెరిశాడు. అంతే కాదు 100 మీటర్ల పరుగును 9.96 సెకన్లలో పూర్తిచేసి అండర్–20 స్థాయిలో ప్రపంచ రికార్డును సృష్టించడంతోపాటు కొద్దిరోజులకే తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. మూడు నెలల తర్వాత 9.94 సెకన్ల టైమింగ్‌తో అతని ఖాతాలో కొత్త రికార్డు నమోదైంది. అండర్–20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 100 మీ., 200 మీ.లలో వరుసగా రెండుసార్లు పతకాలు గెలుచుకోవడంతో దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌తో అతడిని పోల్చటం మరింతగా పెరిగింది.ఒలింపిక్స్ విజయం దిశగా..సాధారణంగా క్రీడల్లో జూనియర్ స్థాయిలోని జోరునే సీనియర్ స్థాయిలోనూ కొనసాగించడం అంత సులువు కాదు. స్థాయి మారడం, పోటీతోపాటు కొత్తగా బరిలోకి దిగుతున్నట్లుగా ఉండే ఒత్తిడి యువ ఆటగాళ్లను గందరగోళానికి గురిచేస్తాయి. టెబోగో కూడా అలాంటి స్థితినే ఎదుర్కొన్నాడు. అండర్–20 విజయాల ఉత్సాహంతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగిన అతను తొలి ప్రయత్నంలో తడబడ్డాడు. ఓటమి నుంచి నేర్చుకునే స్వభావమున్న అతను సరిగ్గా ఏడాది తర్వాత 2023 బుడాపెస్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తానేంటో చూపించాడు.100 మీటర్ల పరుగులో రజత పతకం గెలుచుకోవడంతో పాటు 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించాడు. ఇవి వరల్డ్ అథ్లెటిక్స్‌లో అతని స్థానాన్ని సుస్థిరం చేశాయి. పారిస్ ఒలింపిక్స్ ఫేవరెట్లలో ఒకడిగా నిలిపాయి. అయితే దురదృష్టవశాత్తు 100 మీటర్ల పరుగులో ఫైనల్ వరకు చేరగలిగినా అతని 9.86 సెకన్ల టైమింగ్ టెబోగోకు పతకాన్ని అందించలేకపోయింది. నిరాశ చెందలేదు. అంతే పట్టుదలగా మూడు రోజుల తర్వాతి 200 మీటర్ల పరుగుకు సన్నద్ధమయ్యాడు. 19.46 సెకన్ల టైమింగ్ నమోదుచేసి చాంపియన్‌గా నిలిచాడు. సగర్వంగా తన జాతీయ పతాకాన్ని ప్రదర్శించాడు.అమ్మ కోసం గెలిచి..‘నువ్వు ఎలాగైనా ఒలింపిక్స్ పతకం గెలవాలని అమ్మ మళ్లీ మళ్లీ చెప్పింది. ఆమె కోసమే ఈ పరుగు. ఆమెకే ఈ పతకం అంకితం!’ 200 మీటర్ల రేసు గెలిచాక టెబోగో భావోద్వేగంతో చెప్పిన మాటలవి. విజయం సాధించాక అతని కన్నీళ్లను చూస్తే ఆ గెలుపు ప్రత్యేకత కనిపిస్తుంది. టెబోగో ఈ స్థాయికి చేరడంలో అతని తల్లి ఎలిజబెత్ సెరాతివా పాత్ర ఎంతో ఉంది. ఆటలో ఓనమాలు నేర్పించడంతోపాటు అతను ఒక బలమైన అథ్లెట్‌గా ఎదగడంలో ఆమె అన్ని రకాలుగా అండగా నిలిచింది. జూనియర్ స్థాయిలో విజయాలతో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచే వరకు కూడా అమ్మ తోడుగా ఉంది.అయితే అతను ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే సమయంలోనే క్యాన్సర్‌తో 44 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఒలింపిక్స్‌లో 200 మీటర్ల ఈవెంట్లో చేతివేలి గోర్లపై తల్లి పేరు, తన షూస్‌పై తల్లి పుట్టిన తేదీ రాసుకొని అతను బరిలోకి దిగాడు. చనిపోయిన తేదీ రాయాలంటే తనకు ధైర్యం సరిపోలేదని చెప్పాడు. విజయానంతరం ఆ షూస్‌ను కెమెరాకు చూపిస్తూ టెబోగో కన్నీళ్లపర్యంతమయ్యాడు. 21 ఏళ్ల వయసులోనే ట్రాక్‌పై అద్భుతాలు చేస్తున్న ఈ బోత్స్వానా స్టార్ రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించగలడనడంలో ఎలాంటి సందేహం లేదు. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ! -
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
అంపశయ్య మీదనున్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు ‘పితామహా! లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ, పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు. ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా, పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లను గుర్తించడం ఎలా?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ‘ధర్మనందనా! నువ్వు అడిగిన సందేహానికి నేను పులి–నక్క కథ చెబుతాను’ అంటూ కథను మొదలుపెట్టాడు.‘పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. బతికినన్నాళ్లు క్రూరకర్మలు చేయడం వల్ల నక్కగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ఈ జన్మలో మంచిగా బతుకుదామని తలచి, అహింసావ్రతం చేస్తూ ఆకులు అలములు తినసాగాడు. ఇది చూసి అడవిలోని తోటి నక్కలు ‘ఇదేమి వ్రతం? మనం నక్కలం. ఆకులు అలములు తినడమేంటి? నువ్వు నక్కల్లో తప్పపుట్టావు. నీకు వేటాడటం ఇష్టం లేకుంటే చెప్పు, మేము వేటాడిన దాంట్లోనే కొంత మాంసం నీకు తెచ్చి ఇస్తాం’ అన్నాయి.పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క ‘తప్పపుట్టడం కాదు, తప్పనిసరిగా నక్కగా పుట్టాను. నాకు ఆకులు అలములు చాలు. నేను జపం చేసుకునే వేళైంది. మీరు వెళ్లండి’ అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది. నక్క అహింసావ్రతం చేçస్తున్న సంగతి అడవికి నాయకుడైన పులికి తెలిసింది. ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు.‘అయ్యా! నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది. నువ్వు నాతో వచ్చేయి. నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ, నన్ను మంచిదారిలో నడిపించు’ అని వినయంగా ప్రాధేయపడ్డాడు. ‘రాజా! చూడబోతే నువ్వు గుణవంతుడిలా ఉన్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు. నీతో రాలేను’ అని బదులిచ్చింది నక్క.‘నాతో రాకపోయినా, నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచీచెడ్డా చెబుతూ ఉండు’ కోరాడు పులిరాజు.‘పులిరాజా! నువ్వూ నేనూ స్నేహంగా ఉంటే, నీతోటి వాళ్లు అసూయ పడతారు. మనిద్దరికీ విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు తప్పదు. అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు’ బదులిచ్చింది నక్క.‘లేదు మహాత్మా! నీమీద ఎవరేం చెప్పినా వినను. అలాగని మాట ఇస్తున్నాను, సరేనా!’ అన్నాడు పులిరాజు. నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది.పులిరాజుకు నక్క మంత్రిగా రావడం మిగిలిన భృత్యులకు నచ్చలేదు. నక్క ఉండటం వల్ల తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి. చివరకు ఎలాగైనా నక్క పీడ విరగడ చేసుకోవాలని కుట్ర పన్నాయి. ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి, నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి.గుహలో మాంసం లేకపోయేసరికి పులిరాజు భృత్యులందరినీ పిలిచి వెదకమని నాలుగు దిక్కులకూ పంపాడు. వెదుకులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు. నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కుపుటాలను తాకింది. లోపలకు వెళ్లి చూస్తే, తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ కనిపించింది.‘ఎంత మోసం!’ పళ్లు పటపట కొరికాడు పులిరాజు.ఈలోగా మిగిలిన భృత్యులంతా అక్కడకు చేరి, ‘మహారాజా! మీరు స్వయంగా గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే, నక్క ఏమిటి? అహింసావ్రతమేమిటి? మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే గాని, దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు’ అన్నాయి.‘వెళ్లండి. ఈ ముసలినక్కను బంధించి, వధించండి’ ఆజ్ఞాపించాడు పులిరాజు.ఇంతలో పులిరాజు తల్లి అక్కడకు వచ్చింది. ‘ఆగు! వివేకం లేకుండా ఏం చేస్తున్నావు? భృత్యులు చెప్పేదంతా తలకెక్కించుకునేవాడు రాజుగా ఉండతగడు. అధికులను చూసి హీనులు అసూయపడతారు. ఇలాంటివాళ్ల వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే, తమ ఆటలు సాగవని దుష్టులైన భృత్యులు నాటకాలాడతారు. అలాంటివాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండాలి’ అని హితబోధ చేసింది.పులిరాజు తన భృత్యుల మోసాన్ని గ్రహించాడు. వెంటనే నక్కను పిలిచి, ‘మహాత్మా! నావల్ల పొరపాటు జరిగిపోయింది. మన్నించు. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను’ అని వేడుకున్నాడు.‘పులిరాజా! తెలిసిగాని, తెలియకగాని ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం. ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా, ఇక నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు’ అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. నిరాహారదీక్షతో శరీరం విడిచి, సద్గతి పొందింది.రాజు ఎన్నడూ చెప్పుడు మాటలకు లోబడకూడదు. మంచిచెడులను గుర్తెరిగి, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకుని మసలుకోవాలి’ అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు. – సాంఖ్యాయనఇవి చదవండి: రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా! -
జ్యూల్ థీఫ్.. సేల్స్ గర్ల్ శ్రమ!
‘వెల్ డన్! నీ సీనియర్స్‌ని బీట్ చేసి.. శాలరీ కన్నా డబుల్ అమౌంట్‌ని ఇన్సెంటివ్‌గా తీసుకుంటున్నావ్.. కంగ్రాట్స్’ అని ప్రశంసిస్తూ ఆమె చేతిలో ఓ ఎన్వలప్ పెట్టాడు మేనేజర్.‘థాంక్యూ సర్’ అని వినమ్రంగా బదులిచ్చి, బయటకు వచ్చింది. ఆమెకోసం బయట వెయిట్ చేస్తున్న కొలీగ్స్ ‘పార్టీ ఇస్తున్నావ్ కదా!’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. కుడిచేతితో ఆ ఎన్వలప్ కొసను పట్టుకుని మరో చివరను ఎడమ అరచేతిలో కొడుతూ ‘ఈ డబ్బు పార్టీ కోసం కాదు. నా ఫస్ట్ అసైన్మెంట్ జ్ఞాపకంగా దాచుకోడానికి’ అన్నది తనకు మాత్రమే వినిపించేలా! ‘ఏం సణుగుతున్నవ్ పిల్లా?’ వేళాకోళమాడింది ఆ గుంపులోని ఓ కొలీగ్. ‘ఈ మొహాలకు పార్టీనా.. అని అనుకుంటుందేమోలేవే’ అంది ఇంకో కొలీగ్. ‘అనుకోదా మరి.. ఫ్లూయెంట్ ఇంగ్లిష్, హిందీతో కస్టమర్స్‌ని కన్విన్స్ చేస్తూ తన సెక్షన్ జ్యూల్రీ సేల్స్‌ని పెంచిన ఆమె కాన్ఫిడెన్స్ ఎక్కడా.. ప్రతిదానికి భయపడుతూ ఇన్ఫీరియర్గా ఉండే మీరెక్కడా!’ అన్నాడు సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ‘అయ్యో.. అలా ఏం కాదన్నా! ఫస్ట్ శాలరీ.. వెరీ ఫస్ట్ ఇన్సెంటివ్ కదా.. దీన్ని మా ఇంట్లో వాళ్ల కోసమే ఖర్చుపెడదామనుకుంటున్నా!’ అందామె.ఆ సిటీలోనే అతిపెద్ద జ్యూల్రీ షాప్ అది. దానికున్న మూడు బ్రాంచెస్ని వరుసగా యజమాని ముగ్గురు కొడుకులు, కార్పొరేట్ ఆఫీస్‌ని యజమాని చూసుకుంటున్నారు. ఆమె మెయిన్ బ్రాంచ్‌లో పనిచేస్తోంది. నెల కిందటే జాయిన్ అయింది. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్‌తో నెల రోజులకే సీనియర్స్ కన్నా ఇంపార్టెన్స్‌ని సంపాదించుకుంది.మరో పదిహేను రోజులకు.. ఆ ఏటికే మేటైన అమ్మకాన్నొకటి అందించిందామె! మేనేజ్మెంట్ ఖుషీ అయిపోయి ఇంకో ఇన్సెంటివ్నిచ్చింది. వర్కింగ్ అవర్స్‌లో సెల్ ఫోన్‌ను క్యారీ చేసే అవకాశాన్ని కూడా! తర్వాత వారంలో మరో బిగ్ సేల్నిచ్చింది. ఈసారి మేనేజ్మెంట్ ఆమెను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోట్ చేసి.. క్యాష్, జ్యూల్రీ, గోల్డ్ బిస్కట్స్, డైమండ్స్ లాకర్స్ యాక్సెస్నిచ్చింది. అంతేకాదు ఆ షాప్ యజమాని ఇంట్లో జరిగే ఫంక్షన్లకూ ఆమెను పిలవసాగింది.. కుటుంబ సభ్యులకు సాయమందించడానికి. స్టాఫ్ అంతా ముక్కున వేలేసుకున్నారు.. ‘ఎంత ఎఫిషియెంట్ అయితే మాత్రం అంత నెత్తినపెట్టుకోవాలా?’ అని! ఎవరెలా కామెంట్ చేసుకున్నా యాజమాన్యానికి మాత్రం ఆమె ‘యాపిల్ ఆఫ్ ది ఐ’ అయింది. తరచుగా ఆమెను అన్ని బ్రాంచ్‌లు తిప్పుతూ అక్కడున్న సేల్స్ స్టాఫ్‌కి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించసాగింది. తనకున్న చొరవతో కార్పొరేట్ ఆఫీస్‌లోని కీలకమైన విషయాల్లోనూ నేర్పరితనం చూపించి, ఆ బాధ్యతల్లోనూ ఆమె పాలుపంచుకోసాగింది. అలా చేరిన రెణ్ణెళ్లకే ఆ షాప్ ఆత్మను పట్టేసింది. ప్రతి మూలనూ స్కాన్ చేసేసింది.ఒక ఉదయం.. పదిన్నరకు ఎప్పటిలాగే ఆ జ్యూల్రీ షాప్ అన్ని బ్రాంచ్‌లూ తెరుచుకున్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా. అన్నిచోట్లా ఒకేసారి దేవుడికి దీపం వెలిగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ నాలుగు చోట్లతోపాటు ఆ జ్యూల్రీ షాప్ యజమాని ఇంటికీ ఐటీ టీమ్స్ వెళ్లాయి. మెయిన్ బ్రాంచ్‌లో ఆమె సహా స్టాఫ్ అంతటినీ ఓ పక్కన నిలబడమన్నారు. సోదా మొదలైంది. ఆమె నెమ్మదిగా ఫోన్ తీసి స్క్రీన్ లాక్ ఓపెన్ చేయబోయింది. అది గమనించిన ఐటీ టీమ్‌లోని ఓ ఉద్యోగి గబుక్కున ఆమె ఫోన్ లాక్కుని, పూజ గదిలా ఉన్న చిన్న పార్టిషన్లోకి వెళ్లాడు.ఆ షాప్‌కి సంబంధించి రెయిడ్ చేసిన అన్ని చోట్లా దాదాపు అయిదు గంటలపాటు సోదాలు సాగాయి. పెద్దమెత్తంలో డబ్బు, బంగారం, డైమండ్స్ దొరికాయి. ఆ ఏడాది అతిపెద్ద రెయిడ్ అదే అనే విజయగర్వంతో ఉంది ఐటీ స్టాఫ్! ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని, ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేయసాగారు. మెయిన్ బ్రాంచ్‌లో కూడా అంతా పూర్తయి, ఆ టీమ్ ఆఫీసర్ ఫైనల్ కాల్ చేయబోతుండగా.. కౌంటర్ దగ్గర నుంచి మేనేజర్ గబగబా ఆ బ్రాంచ్ చూసుకుంటున్న యజమాని పెద్దకొడుకు దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే అతను అలర్ట్ అయ్యి.. ‘ఎక్స్క్యూజ్ మి సర్..’ అంటూ ఐటీ టీమ్ ఆఫీసర్ని పిలిచాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకునే ‘యెస్..’ అంటూ చూశాడు. ‘ఒక్కసారి ఇలా రండి’ అంటూ కౌంటర్ దగ్గరకు నడిచాడు. డయల్ చేసిన కాల్ని కట్ చేస్తూ ఫాలో అయ్యాడు ఆఫీసర్. మేనేజర్ వంక చూశాడు యజమాని పెద్ద కొడుకు. కౌంటర్ టేబుల్ మీదున్న కంప్యూటర్ స్క్రీన్‌లో అంతకు కొన్ని క్షణాల ముందే రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్లే చేశాడు మేనేజర్. పూజ గదిలో సోదా చేస్తున్న ఐటీ ఉద్యోగి ఒక సీక్రెట్ సేఫ్‌లో దొరికిన డైమండ్స్లోంచి ఒక డైమండ్‌ని జేబులో వేసుకోవడం కనిపించింది అందులో. చూసి నివ్వెరపోయాడు ఆఫీసర్. ఏం జరుగుతోందో అంచనా వేసుకుంటున్న ఆ ఉద్యోగి మొహంలో నెత్తరు చుక్క లేదు.‘సర్.. మీడియాను పిలవమంటారా?’ స్థిరంగా పలికాడు యజమాని పెద్ద కొడుకు. వెంటనే ఆ ఐటీ ఆఫీసర్ మిగిలిన చోట్లలో ఉన్న టీమ్స్‌కి ఫోన్ చేసి ‘రెయిడ్ క్యాన్సల్.. అంతా వదిలేసి వచ్చేయండి’ అన్న ఒక్క మాట చెప్పి గబగబా బయటకు నడిచాడు. అనుసరించింది టీమ్. వాళ్ల వంకే అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది ఆమె!పదేళ్ల కిందట జరిగిన రెయిడ్ ఇది. ఆమె ఐటీ న్యూ ఎంప్లాయీ. ఆ షాప్స్, ఆ యజమాని ఇంటికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి అందులో సేల్స్ గర్ల్‌గా చేరింది. చాకచక్యంతో ఫోన్ యాక్సెస్‌ను సంపాదించుకున్న ఆమె, డీటెయిల్స్ అన్నిటినీ స్కాన్‌చేసి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్కి పంపేది. వాటి ఆధారంగానే రెయిడ్ చేశారు. ఫోన్ చూస్తున్నట్టు నటించడం, దాన్ని లాక్కోవడం అంతా కూడా ఐటీ వాళ్ల డ్రామా, యాజమాన్యానికి అనుమానం రాకుండా! అంతా సవ్యంగానే జరిగేదే.. ఆ ఉద్యోగికి సేఫ్‌లోని డైమండ్స్‌ని చూసి ఆశ పుట్టకపోయుంటే! ఆ పార్టీషన్లో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని మరచిపోయి గబుక్కున డైమండ్‌ని జేబులో వేసుకుని దొరికిపోయాడు. అంత పెద్ద రెయిడ్ క్యాన్సల్ అవడానికి కారణమయ్యాడు.( ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు , వ్యక్తుల పేర్లు ఇవ్వలేదు. ప్రతివారం ఇలాంటి ఆసక్తికర కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.) – శరాది -
రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా!
తెలంగాణలోని రాతి కోటల్లో వరంగల్, భువనగిరి కోటల తర్వాత చెప్పుకోదగ్గది గాంధారి ఖిల్లా. అపారమైన బొగ్గు నిక్షేపాలతో విరాజిల్లుతున్న మంచిర్యాల జిల్లాలో.. వేల సంవత్సరాల క్రితమే మానవ జీవనం ఉన్నట్లు తెలియజేసే సజీవ సాక్ష్యం ఈ గాంధారి ఖిల్లా. మంచిర్యాల పట్టణానికి పన్నెండు కి.మీ. దూరంలో మందమర్రి మండలం, బొక్కలగుట్ట అడవుల్లో ఈ కోట ఉంది. గుట్టపైన నాగశేషుడి ఆలయం, శివుడు, ఏనుగు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు, ద్వారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఉన్నాయి. శత్రువుల రాకను పసిగట్టే నగారా గుండూ కనిపిస్తుంది. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం, కాలభైరవ విగ్రహాలు ఆకర్షిస్తాయి. గుట్ట పైన ‘సవతుల బావులు’, కాలువలు ఉన్నాయి. కింద నీటి చెలమలో ఎండాకాలంలోనూ నీటి ఊట పైకి వస్తుంది.చారిత్రక వైభవం..అరుదైన గోండ్వానా రాతి గుట్టలపైన మానవ నిర్మిత నీటి గుండాలతో అద్భుతమైన చారిత్రక సంపద కనిపిస్తుంది. ఈ గుట్టలను ఎవరు తొలిచారనేదానికి స్పష్టతలేదు. పూర్వయుగపు పనిముట్లు, చిత్రలేఖనాలు చరిత్రకారులకు లభ్యమయ్యాయి. కొన్ని ఆధారాల ప్రకారం ఆరవ శతాబ్దంలో కందారపురం పేరుతో గాంధారి కోట రాజధానిగా సోమదేవరాజు రాజరికం చేశారని తెలుస్తోంది. ఆయన కొడుకు మాధవ వర్మ కాకతీయుల మూల పురుషుడనే ప్రస్తావన సిద్ధేశ్వర, ప్రతాప చరిత్రలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. రాష్ట్రకూటుల సామంతుడైన మేడరాజు ఈ గాంధారి కోటను పటిష్ఠం చేశాడు. ఆయన పేరుతో ఉన్న మేడ చెరువు నేటికీ కనిపిస్తుంది. పద్మనాయక రాజులు రాచకొండ కేంద్రంగా పాలిస్తూ, వైష్ణవమతం వ్యాప్తికోసం పెద్దిరాజు అనంతరాజు, రఘు నాయకులు కోటలో హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దీన్ని ధ్రువీకరించే 15వశతాబ్దపు తెలుగు శాసనం ఉంది. పెద్దిరాజును పాండవుల పెద్దనాన్న ధృతరాష్ట్రుడిలా, పెద్దమ్మను ధృతరాష్ట్రుడి భార్య గాంధారిలా భావించి, ఈ కోటను ‘గాంధారి కోట’గా పిలిచారని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.శ.1300లో కథాగేయంగా ‘గాంధారి కథ’ రచన చేసినట్లు చరిత్రకారులు గుర్తించారు. కాని కవి విషయంలో స్పష్టత లేదు. నిజాం కాలంలో పన్ను వసూళ్ల కోసం స్థానిక గోండు మొకాశీలను నియమించుకున్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. 1928లో తొలిసారి గాంధారి కథను ప్రచురించినట్లు ఆధారాలున్నాయి. ఇప్పటికీ గిరిజన కథా గేయాల్లో, జానపదాల్లో ఈ కథ వినిపిస్తుంది.అరుదైనది..గుట్టను తొలిచి కట్టిన కోటగా గాంధారి ఖిల్లాకు దక్షిణ భారతదేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లోహయుగం నాటి ఆనవాళ్లున్నాయి. కాకతీయ, రాష్ట్రకూటుల కాలం నాటి చారిత్రక సంపద ఉంది. ఇలాంటి అరుదైన కోటలను రక్షించుకుంటే చారిత్రక సంపదతోపాటు, పర్యాటక వనరులనూ కాపాడినట్లవుతుంది. – డా.ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ చరిత్రకారుడు.పర్యాటక కేంద్రంగా..ఎంతో చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లాను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరచాలి. దానికి అవసరమైన ఏర్పాట్ల మీద ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – మేసినేని రాజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ నాయకపోడ్ సాంస్కృతిక కళాభివృద్ధి సంఘం. మాఘమాసం జాతర..అనాదిగా గాంధారి ఖిల్లా నాయక్‌పోడ్ తెగకు ఆరాధ్య ప్రాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో ఇదొక ప్రధాన గిరిజన తెగ. వీరిక్కడ ప్రతి మాఘమాసం (ఫిబ్రవరి) భక్తి, శ్రద్ధలతో జాతర జరుపుతారు. ఇది మూడురోజులు సాగుతుంది. మొదటిరోజు సాయంకాలం దేవతా మూర్తులను సదర్‌భీమన్న నుంచి గోదావరికి తీసుకొచ్చి, స్నానం చేయిస్తారు. ఆ రాత్రి ఆటపాటలతో గడిపి, మరుసటిరోజు మధ్యాహ్నం డప్పు చప్పుళ్లతో జాతర ప్రాంతానికి తీసుకెళ్తారు. చివరిరోజు ఖిల్లా పైభాగంలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్నాలు వేసి, నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. చరిత్రలో నాటి పాలకులు గాంధారి ఖిల్లాను అష్టదిగ్బంధనం చేసిన ఆనవాళ్లున్నాయి. దాని గుర్తుగా పాలకాయలు (కొబ్బరికాయలు), కోడిగుడ్లు, మేకలు, కోళ్లు (గతంలో దున్నపోతులను) బలి ఇచ్చే సంప్రదాయం నేటికీ ఈ జాతరలో కొనసాగుతోంది. దీనికి నాయక్పోడ్లే ప్రధాన పూజారులు. ముగింపులో జీడికోట వద్ద జరిగే దర్బార్(సభ)లో గిరిజనుల కష్టసుఖాలు, గాంధారి ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ జాతరకు మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు వస్తారు. జాతర తిరుగువారం మాత్రం నాయకపోడ్లే జరుపుకుంటారు.ప్రకృతి రమణీయతకు నెలవు..మంచిర్యాల వరకు రైల్లో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ కోటను చేరుకోవచ్చు. గుట్టపైకి మాత్రం కాలినడకనే వెళ్లాలి. కోట పరిసర ప్రాంతంలో చెప్పులతో అనుమతించరు. చుట్టూ అడవి, కాలువలు, చెరువులతో రమణీయంగా ఉంటుందీ ప్రాంతం. వన్యప్రాణుల నిలయం. ట్రెక్కింగ్‌కి అనువైన చోటు. పర్యాటకుల సౌకర్యాల కోసం ప్రణాళికలు వేసినా, అవి ముందుకు సాగలేదు. ఎన్‌హెచ్ 363ని ఆనుకుని గాంధారి వనం పేరుతో అటవీ శాఖ ఓ పార్కును అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. ‘పరేషాన్’ అనే సినిమాలో టైటిల్ సాంగ్ ‘గాంధారి ఖిల్లా కత్తవా’ అంటూనే మొదలవుతుంది. – ఆకుల రాజు, సాక్షి ప్రతినిధి, మంచిర్యాలఇవి చదవండి: Health: అంతా మెదడులోనే ఉంది.. -
Health: అంతా మెదడులోనే ఉంది..
మీ ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్లతో డీల్ చేయడం కష్టమనిపిస్తోందా? ‘అయ్యో, వాళ్లతో వేగలేక చస్తున్నాం’ అంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే.నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేది అనేకానేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు. ఎదురు మాట్లాడతారు. అందువల్లే ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు అవుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశం చేయడం అవసరం.మెదడులో అల్లకల్లోలం..టీనేజర్‌ను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులంటే కంటికి కనిపిస్తాయి. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా! నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలోని విపరీతాలకు కారణం. టీనేజ్‌లో మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు వేగాలతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (మెదడులో ముందుభాగం) టీనేజ్‌లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్, రివార్డ్స్‌ను నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది.పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలసి టీనేజర్ల ప్రవర్తనలో, భావోద్వేగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. తరచుగా కొత్త అనుభవాలను వెతకడానికి, రిస్క్స్ తీసుకోవడానికి, షార్ట్ టర్మ్ రివార్డ్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు.భావోద్వేగ నియంత్రణ కష్టం..ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల టీనేజర్లు మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు భయం, ఆందోళనను ప్రాసెస్ చేసే అమిగ్డలా చురుగ్గా ఉంటుంది. అది టీనేజర్లకు ఎదురయ్యే సవాళ్లు, బెదిరింపులకు అతిగా స్పందించేలా చేస్తుంది. ఇది భావోద్వేగ అస్థిరతకు కారణమవుతుంది. టీనేజర్ల మూడీనెస్, రెబలియస్నెస్కు కారణాలివే అని అర్థం చేసుకోవడం వల్ల వారిపై ముద్రలు వేయకుండా, వారిని చక్కగా డీల్ చేసేందుకు వీలవుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు..ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థ మధ్య పరస్పర చర్య టీనేజర్ల నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తార్కికంగా ఆలోచించి, పర్యవసానాలను అర్థం చేసుకోగలిగినప్పటికీ వారి నిర్ణయాలు తరచుగా ఫ్రెండ్స్ ప్రభావంతో ఎమోషనల్‌గా మారతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణం సోషల్ రివార్డ్ అందుకోవడమే ముఖ్యమవుతుంది.డోపమైన్ ప్రభావం.. టీనేజర్ల ప్రవర్తనలో మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆనందం, బహుమతితో అనుసంధానమైన డోపమైన్ గణనీయమైన మార్పులకు లోనవుతుంది. ఇది గుర్తింపు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, కొత్త అనుభవాల కోసం పరుగుపెట్టేలా చేస్తుంది. ఇదే డోపమైన్ వ్యసనాలు, ప్రమాదకర ప్రవర్తనలకూ కారణమవుతుంది. అందువల్ల ఈ వయసులో క్రీడలు, సృజనాత్మకత, సామాజిక పరిచయాలు అవసరం.టీనేజర్‌తో ఇలా ప్రవర్తించాలి..– మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్ప్రవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.– టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు, అది అవసరం కూడా. అయితే వారితో చర్చించి దానికి హద్దులను సెట్ చేయాలి.– ఎమోషన్స్‌ను ఎలా ప్రదర్శించాలో.. ఒత్తిడి, కోపం, నిరాశను ఎలా ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజర్‌కు చూపించాలి.– ఆలోచనలను పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా జడ్జ్ చేయకుండా ఉంటారనే భరోసా ఇవ్వాలి.– టీనేజర్లలో రిస్క్ టేకింగ్ ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి.– స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి.– తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి. మార్గనిర్దేశం చేయాలి.– తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలి. గైడెన్స్, సపోర్ట్ ఉండాలి.– టీనేజర్‌ను పెంచడం సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టిపెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలి.– మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి. స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: మెదడు.. మోకాల్లోకి.. -
మెదడు.. మోకాల్లోకి..
కలో.. భ్రమో.. రాత్రి తోకచుక్క కనపడింది. తోకచుక్క సంఘ సంస్కరణ ప్రయాణ పతాక కదా. ఏం జరుగుతుందో ఏం జరగదో.. మెలకువను స్వప్నించి నిద్రలోనే లేచినట్టు.. తిరిగినట్టు.. మాట్లాడినట్టు.. చీకటి తెరలు పూర్తిగా తొలగిపోలేదు. తెల్లవారిన సందడి ఇపుడిపుడే మేల్కొంటోంది. పలుచని మంచు పొగలా చుట్టుకుంటోంది.లేచాను. రోజూ లేచే ఉదయపు నడకల సమయమే. అడుగు ముందుకేశాను. ఒకరకమైన తూలింపు. పట్టించుకోలేదు. లుంగీ మడిచి బాత్రూమ్కు వెళ్ళాను. అపుడు చూశాను, మోకాలు కొద్దిగా వాచినట్లుంది. నొప్పి లేదు. ఎత్తుగా ఉబ్బిన చోట చేతితో నొక్కాను. మెత్తగా నునుపుదేరి ఉంది, రబ్బరు బంతిలా. ఏమైందీ? ఎక్కడైనా తగిలిందా? ఏదైనా కుట్టిందా? గిల్లి మాత్రం చూడలేదు. నడక దుస్తుల్లోకి మారాను. నడుస్తుంటే ఇబ్బందేమీ లేదు. సలుపు కూడా లేదు. ఆటల మైదానంలో పదిసార్లు వలయంగా తిరిగాను. రెండు కిలోమీటర్లు తిరిగినట్టు లెక్క. ‘అలా నడుస్తున్నారేంటీ? కాలు ఈడుస్తున్నట్టు..’ ఇంటికొస్తుంటే సుబ్బారాయుడు పలకరించాడు.‘ఏమీ.. లేదే..’ అన్నాను జాగ్రత్తగా అడుగులేస్తూ. ప్రతిక్షణం నడక దగ్గర్నుంచి మాట దగ్గర్నుంచి అందరికీ కావాలి. రోజువారీకి భిన్నంగా ఎవరూ ఉండకూడదు. ఉంటే ఒకటే ప్రశ్నలు.. ఎందుకు, ఏమిటి, ఎలా.. ఆరా! అరే.. ఎదురైన చాలామంది నడకల్లో ఏదో తేడా స్పష్టంగా కనబడుతోంది. కుంటి నడక కాదు గానీ నేలకు పాదం ఈడుస్తూ.. ఎవర్నీ అడగలేదు. తీరా ఇంట్లోకి చేరగానే ఉమ ఎదురొచ్చింది. ఆమె నడక తీరూ అలాగే ఉంది. ఉన్నట్టుండి నన్ను ఆట పట్టించడానికన్నట్టు గాలిలోకి ఎగిరింది. పైగా నవ్వుతోంది. ఆశ్చర్యంగా చూశాను. ‘ఏమీ లేదండి. నొప్పేం లేదు. అయితే నేలకు తాకించి నడుస్తుంటే బావుంది’ ఇంకేం ప్రశ్నలు వేయలేదు. మొత్తమ్మీద లోకమంతా తెలియని రాగమేదో ఆలపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి అంటుకునేదా? కాదేమో. స్నానానికి వెళ్ళినపుడు తేరిపారి పరిశీలనగా చూశాను. మోకాలు చిప్ప ఉబ్బి నల్లగా తాటికాయలా ఒకవిధమైన గరుకుగా మారింది. రెండో కాలు మామూలుగానే ఉంది. కూరగాయలు కొనడానికి మార్కెట్టుకెళ్ళాను. అందరూ తెలిసినవారే. కొంచెం పట్టుబట్టి జాగ్రత్తగా అడుగులేస్తూ తిరుగుతున్నాను. చాలామంది ముఖాలు నీరసంగా కనిపిస్తున్నాయి. ఏదో పోగొట్టుకుని దాచినా దాగని సత్యాన్ని మోస్తున్నట్టుగా భారంగా అడుగులేస్తున్నారు. లోకం వింతగా కనిపిస్తోంది.రెండురోజుల క్రితం రామంగాడి గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ ప్రతం చేయించిన పురోహితుడు కనిపించాడు. ఆయన పంచె ఎగదోసి మోకాలు చిప్ప కనిపించేలా ఎత్తి ఎత్తి అడుగులేస్తూ నడిచి వస్తున్నాడు. అసింటా అన్నట్టు దూరంగా జరుగుతూ అడుగులేస్తున్నాడు. ఆయనకు కూడా అదే చోటులో నల్లగా చర్మం చిట్లినట్లుగా ఉంది. మొన్నటి దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. వ్రతం అయిపోయింది. ఇక కథ చెప్పాలి. చెప్పడం మొదలెట్టగానే అది ఎప్పుడూ చెప్పే పాతకథ అని తెలిసిపోయింది. ఆగమని సైగ చేశాను.‘అయ్యా.. పురోహితులు గారూ.. మన్నించండి. ఎపుడూ అదే కథా? మీరు కథలో చెబుతున్న సముద్ర వ్యాపారాలు గట్రా ఇపుడు లేవు కదా. వ్రతం చేయకపోతే వచ్చే నష్టం మా రామం గాడికి వర్తించదు. వాడిది రియలెస్టేటు బిజినెస్. దానికి సంబంధించిన కథ అల్లి చెబితే సబబుగా అర్థవంతంగా ఉంటుంది. వాడు జాగ్రత్తలేవో పడతాడు. అలాగే సాఫ్టువేర్ ఇంజనీరు.. గవర్నమెంటు ఉద్యోగం.. సారా వ్యాపారం.. ఎగుమతులు దిగుమతులు, వాణిజ్యం.. వగైరాల కథలు రెడీమేడ్‌గా తయారుచేసుకుని ఉంచుకుని చెప్పొచ్చు కదా! ఎపుడూ పాత పురాణమేనా.. ఎవరు మెచ్చుకుంటారు?’ అన్నాను సూటిగా చూస్తూ.పురోహితుడు ఒక్కక్షణం మాట్లాడలేదు. ఎదుట వ్యక్తి చెప్పేవి కొందరికి సహించవు. అహం దెబ్బతింటుంది కాబోలు. రామాన్నీ నన్నూ చూస్తూ ఉండిపోయాడు. ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు. కాసేపటికి తేరుకున్నాడు. ఆ తర్వాత తనకు సహజసిద్ధమైన లౌక్యం ప్రదర్శించాడు.‘నిజమే సుమండీ.. మహ బాగా చెప్పారు. మీరన్నట్టుగా మహ బేషుగ్గా ఉంటుంది. మీరు చెప్పింది చక్కగా ఉంది. కానీ కథలెక్కడ్నుంచి వస్తాయండీ’ అంటూ దీర్ఘం తీస్తూ అన్నాడు. ఇందాక మొదలెట్టిన కథను తిరిగి చెప్పడం ప్రారంభించాడు. అంతేకాదు వెళుతూ వెళుతూ నా ముఖం కేసి చూసి నాలో ఏ దైన్యం సూచిక కనిపించిందో ఏమో ఒక ఉచిత సలహా విసిరాడు.‘ఏడు ఏలకులను పసువు గుడ్డలో చుట్టి దిండు కింద పెట్టుకుని పడుకోండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరూ బ్రహ్మాండమైన ఇంతకుమించిన గృహం కట్టుకుంటారు’ అన్నాడు. ఆయన వృత్తికి నేనేమైనా ఆటంకం కలిగించానా? ఏమో మరి. ఇది జరిగి మూడురోజులైంది. ఇంతలో ఇట్లాంటి మోకాలుతో కనిపించాడు. తిరిగొస్తుంటే కామేశ్వరరావు కనిపించాడు. వాళ్ళ అమ్మాయికి ఇంకా పెళ్ళి ఘడియలు రాలేదనుకుంటాడు. వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. భారం దేవుడి మీద వేసేశాడు. అసలు జరిగిందేమిటంటే కళ్యాణ యోగం గురించి ఒక జ్యోతిష్యుడ్ని సంప్రదించాడు. అతగాడేమో ‘రెండు సంవత్సరాలు ఆగాలి. ఈలోపు ఎంత ప్రయత్నించినా మీ అమ్మాయికి పెండ్లి చేయలేవు’ అని చెప్పాడట.అంతే ఇక మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో మంచి సంబంధాలు కోరి వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత కుజదోషమనీ వరనిరూపణ కుదరలేదనీ.. అదనీ ఇదనీ జాతకాల పిచ్చిలోపడి కాలయాపన చేసేశాడు. పోనీ ఆ జ్యోతిష్యుడు చెప్పిన ఆ రెండేళ్ళు ఊరుకుని తర్వాత కాలంలో గట్టి ప్రయత్నం చేస్తే ఈపాటికి కూతురుకు పెళ్ళి జరిగిపోయేదేమో. కార్యసాధనకు ప్రయత్నం తోడుగా ఉండాలి. గీచి గీచి జాతకాలు పట్టించుకుని చెడగొట్టుకుంటున్నాడు. పలకరించాను. చేతితో మోకాలు దగ్గర తడుముకున్నాడు. ఎత్తుగా గాలి బుడగలా కనిపిస్తోంది. అతని పరిస్థితి అర్థమైపోయింది.ఇంటికెదురుగా శంకరయ్య ఉన్నాడు. భార్య పేరు భారతమ్మ. బయటికెళితే చాలు ప్రతిరోజూ పెళ్ళాం ఎదురు రావాలి. వీధిలోంచి గట్టిగా రమ్మని అరుస్తాడు. ఇంటి లోపల ఎక్కడున్నా ముసిముసి నవ్వులు నవ్వుతూ చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చేస్తుంది భారతమ్మ. ఎదురురావడాన్ని మొగుడు ప్రసాదిస్తున్న అరుదైన గౌరవంగా భావిస్తుంది. ఆ అవకాశం ఇచ్చి అర్ధాంగి దగ్గర మంచి మార్కులు కొట్టి బంధం గట్టిగా ముడిపెట్టే చిట్కాను శంకరయ్య పాటిస్తున్నాడేమో. ఆవేళ చూద్దును కదా శంకరం కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఓహో .. అనుకున్నాను.జబ్బకూ మెడలోనూ తాయెత్తులు కట్టుకునే వీరయ్య, మెడనిండా ఏవో పసుపు, ఎరుపు రంగుల తాళ్ళూ, ఒంటి మీద కాషాయం దుస్తులూ ముఖం నిండా ఎర్రటి పెద్ద బొట్టూ నుదుటన విభూది పూసుకునే నారాయణ, రాహు కాలం, వర్జ్యం, ముహూర్తం చూసుకుంటే గానీ ఇల్లు కదలని వీరబాబు, ప్రతిరోజూ టెంకాయ కొట్టి దేవుని దర్శనం చేసుకునే సూరిబాబు, నలుపు ఎరుపు దుస్తుల్లో కనిపిస్తున్న సీజనల్ భక్తులు, నిత్యం నదీ స్నానం చేసే వీరభద్రాచార్యులు, దూరపు బంధువెవరో చనిపోతే నిష్ఠగా ఎండుగడ్డితో తలగడ చేసుకుని నేల మీద పడుకుంటూ మైల పడుతున్న రామచంద్రం.. వీళ్ళందరూ అదేరోజు తారసపడ్డారు. అందరూ మోకాలు వాచినవాళ్ళే.ఈవేళే ఎందుకు అకస్మాత్తుగా పాదాలు ఎగేస్తూ కనిపిస్తున్నారు? అసలు నేనెందుకు ఇదే బాధ అనుభవిస్తున్నాను? మనిషి నాగరీకం అయ్యే కొలదీ కొత్త కొత్త బలహీనతల్ని ఎందుకు మోస్తున్నాడు? తాతగారి నాన్నగారి బామ్మగారి భావాలతో కునారిల్లి సొంత ఆలోచనల్ని చంపుకుని బతకడం సరైనదేనా? ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఏ పని అయినా విజయం సాధిస్తుందనీ మూఢనమ్మకాలతో కాలాన్ని వృథా చేసుకోవడం తగదనీ ఎంతమందికి చెప్పగలం? ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాకు తత్వం బోధపడింది. నడవడికలో అమలు చేయాలి.ఉదయం తొమ్మిది గంటలు. బైకు తీసుకుని రోడ్డు మీదకు రాగానే తెల్లని బట్టలతో అచ్చమ్మ ఎదురు పడింది. నన్ను చూసింది. అశుభం అని తలచి వెనక్కి తిరిగి నిలబడింది. తన వల్ల ఎవరికీ మనసులో కూడా ఏ బాధా ఇబ్బంది కలగకూడదనే తలంపుతో చేసిన పని అది. ఆవిడెందుకలా చేసిందో తెలుసు. నేను ఊరుకుంటానా? నేనూ ఆగాను. వారగా తల తిప్పి చూసింది. ఆమె వంకే చూస్తున్నాను. ‘నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. మీరు ఎదురొస్తేనే ముందుకు వెళతాను. లేకపోతే ఇక్కడ్నుంచి కదలను’ అన్నాను. ఆమె కళ్ళు మెరిశాయి. ముఖంలో కాంతులు. గబగబా నా దగ్గరకొచ్చి నిలబడింది.‘నా బాబే.. నా నాయనే.. నా ఆయుస్సు కూడా పోసుకుని నిండు నూరేళ్ళూ సుఖసంతోషాలతో బతుకు తండ్రీ..’ అని తటాలున తన తలలోంచి తెల్ల వెంట్రుకను పీకి నా తలలో వేసి తెల్లని స్వచ్ఛమైన నవ్వుతో అనేక రకాలుగా దీవించింది. మనస్ఫూర్తిగా ఎదురొచ్చి ‘అంతా శుభమే జరుగుతుంది’ అంది. వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళ నుండో గుట్టగా దాచిన శుభాశీస్సుల బలం.. నాకొక్కడికే చెందుతుందనుకోడం ఎందుకు? దీవెనలు, ఆశీస్సులను ఒక సానుకూల దృక్పథ సంకేతంగానే చూడాలి. పాఠశాల చేరాను. మనసు ఎంతో ఎపుడూ లేనంత ఉల్లాసంగా ఉంది. రోజంతా నెగటివ్ భావనలు రానీయకుండా మసలుకున్నాను. నా వైపు నుండి కాకుండా ప్రతి వ్యక్తినీ అతని దృష్టి కోణంలోంచి పరిశీలిస్తున్నాను. నాలోని మార్పుకు నాకే ఆనందం అనిపించింది. హాయిగా ఉంది.మోకాలు వాపు విచిత్రంగా కొద్దిగా తగ్గింది. ఫలితం అపుడే కనిపించిందా? మనిషి నడవడికను బట్టే రోగాలొస్తాయి. ప్రవర్తనలు ఆలోచనలు దేహానికీ మససుకూ చెందినవేనా? ఖాళీ పీరియడ్‌లో మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతకీ నాకెందుకు మోకాలు వాచింది? తటాలున బుర్రలో ఒక వెలుగు.. మిత్రుడి బలవంతం మీద శంకుస్థాపన జరిగినరోజున కొబ్బరికాయ కొట్టడం గుర్తుకొచ్చింది. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏమీ గుర్తుకు రావడంలేదు.ఏదో అపసవ్యంగా ఉండే ఒక చెడు నమ్మకాన్ని మనసులో దూర్చే ఉంటాను. లేకపోతే ఎంతో కొంత శాస్త్రీయంగా ఆలోచించే నాకీ తిప్పలు ఎందుకొచ్చాయి? స్కూలు అయ్యింతర్వాత అట్నుంచి అటే జిల్లా పరిషత్‌కు వెళ్ళాల్సి వచ్చింది. కార్యాలయం హడావుడిగా ఉంది. క్యాంటీను నిండుగా ఉంది. ఉద్యోగుల్లో చాలామంది ఒక కాలు కుంటుకుంటూనో ఈడ్చుకుంటూనో మోకాలు నిమురుకుంటూనో నడుస్తున్నవారే. ఇంటికి చేరేటప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది. వాకిట్లోనే చిన్నాన్న ఎదురయ్యాడు. ఆందోళనగా ఉన్నాడు. నలిగిన ముఖం. నుదుటన చెరిగిన ఎర్రని నిలువు బొట్టు. చెదిరిన జుట్టు. కొద్దిగా కుంటుతూ దగ్గుతూ దగ్గరకొచ్చాడు.‘నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నీవేం కంగారుపడకు. పద.. పద.. లోపలికి..’చిన్నాన్న ఎప్పుడూ అంతే. ఏదీ సరిగ్గా చెప్పడు. విషయం కొస అందిస్తాడు. సాగదీసి గానీ అసలు సంగతి చెప్పడు. మా ఇద్దరిదీ ఒకే ఇల్లు. అన్నదమ్ముల పంపకం. ఇంట్లో వెనుక వైపు వాటాలో ఉంటాడు. భక్తిపరుడు. సకల సెంటిమెంట్లనూ గౌరవిస్తాడు. పాటిస్తాడు. రోజూ పంచాంగం చూస్తాడు. అడిగినవాళ్ళకు అడగనివాళ్ళకు మంచిచెడ్డలు చెప్పడమే పనిగా పెట్టుకుంటాడు. ఎవరింటికైనా వెళితే దిక్కుల్ని చూసి వాస్తు గురించి ఉచిత సలహాలిస్తాడు.‘ఏమైంది?’ గాభరాగా లోపలికెళ్ళాను. గుండెల మీద చేతులేసుకుని సీలింగు చూస్తున్నాడు నాన్న. నన్ను చూసి తల పక్కకు తిప్పి నీరసంగా నవ్వాడు. నోరు విప్పి నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుతున్నాడు. మాట స్పష్టంగా లేదు. దగ్గరగా ముఖం పెట్టి వినడానికి ప్రయత్నం చేశాను. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పలేకపోతున్నాడు. కాసేపటికి చూపు నిలబడిపోయింది. చిన్నాన్నకు అర్థమైంది. ‘ఒరేయ్.. రండి.. వాకిట్లో పడుకో పెడదాం..’ చిన్నాన్న ఉద్దేశం తెలిసింది. ఆయనకేసి కోపంగా చూశాను. చేయి అడ్డంగా పెట్టి వారించాను. ‘మీరాగండి, చిన్నాన్నా.. ఇక్కడ్నుంచి ఆయన్ని కదల్చడానికి వీల్లేదు. ఏమొచ్చింది మీకు? ఇప్పటి దాకా బాగానే ఉన్న వ్యక్తి.. ఇంతట్లోనే ఇంటికి చెడ్డ అయిపోయాడా?’ అన్నాను.‘ఏమంటున్నావు? నీకేమైనా తెలుస్తుందా? ఇంట్లో పోతే ఇల్లు పాడు పెట్టాల్సి వస్తుంది. నా మాట విను..’ బాబాయి హోదా, వయసు తెచ్చిన అధికారంతో నన్ను గదమాయించాడు. ఆయనను దూరంగా గది మూలకు తీసుకెళ్ళి చెప్పడం మొదలెట్టాను. ‘ఆయన ఇన్నాళ్ళూ ఉన్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో ఈ గదిలో ఆఖరి ఊపిరి తీసుకునే హక్కు ఆయనకు ఉంది. ఎక్కడికెళ్ళినా ఎంత రాత్రయినా చేరుకునే చోటు ఇది. నా ఊరూ నా ఇల్లూ అంటూ నిత్యం పలవరించేవాడు. మరోచోట నిద్ర పట్టదనేవాడు. మీరెన్నైనా చెప్పండి.. ఇక్కడ్నుంచి కదపడానికి ఒప్పుకోను. పొద్దుట దాక ఇక్కడే ఉంటారు’ స్థిర స్వరంతో చెప్పాను.‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. మాది కూడా. ఇదే ఇంట్లో నేనూ కాపురం ఉంటున్నానని గుర్తు పెట్టుకో. మంచి ఘడియలు కావు ఇవి. ఆరుమాసాలో సంవత్సరమో ఇల్లు మైల పడితే ఎక్కడికెళ్ళాలి? ఇంటి పెద్దగా చెబుతున్నాను. చెప్పింది చేయి’ అంటూ వంగి మోకాలు చిప్ప దగ్గర పాముకుంటూ నొక్కుకుంటూ అన్నాడు చిన్నాన్న.నేను రాజీ పడలేదు. పట్టుదలను వీడలేదు. ‘రోజులకు పేర్లు, తిథులు మనం కల్పించుకున్నవే. ఇందులో మంచి చెడ్డలంటూ ఉండవు. అన్ని రోజులూ ఒకలాంటివే. ఆయన ఇంట్లో ఆయన బతకడానికి ఎంత హక్కు ఉందో చావడానికీ అంతే హక్కు ఉంది. ఆ హక్కును కాపాడటానికి కొడుకుగా ఎంతకైనా తెగిస్తాను’ చివర మాట గట్టిగా అన్నాను. ఈ మాటలు పలికానో లేదో మోకాలు చిప్ప వాపు పూర్తిగా తగ్గిపోయింది. ఆయన మాటను విననని అర్థమైపోయింది. నసుక్కుంటూ వెళ్ళిపోయాడు.‘పెద్దాళ్ళు సరే కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులైపోతున్నారు. మనుషులు చేసిన దేవుళ్ళారా.. మీరెక్కడ? మిమ్మల్ని పోగుచేసి వ్యాపారం చేసే వాళ్ళనీ అసలు మూఢవిశ్వాసాల్ని ఎగదోసేవాళ్ళనీ వినియోగదారుల చట్ట పరిధిలోకి తీసుకు రావాలి. భవిష్యత్తు చెప్పేవాళ్ళకు చెప్పింది జరగనపుడు కఠినశిక్ష విధించి తీరాలి. కనీసం వందేళ్ళ తర్వాత కాలం వీటన్నింటినీ మాన్పుతుందనే నమ్మకం నాది’ అనుకుంటూ సన్నగా లోలోపల మూలిగాను. మామూలు స్థితికి వచ్చిన మోకాలును ప్రేమగా నిమిరాను. ఇంతట్లో మెలకువ తట్టి లేపింది. – దాట్ల దేవదానం రాజుఈ కథను వినడానికి ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి. ఇకపై ప్రతివారం ‘ఈవారం కథ’కు క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంటుంది.ఇవి చదవండి: సింగరేణి తంగలాన్..! -
సింగరేణి తంగలాన్..!
‘కేజీఎఫ్’, ‘తంగలాన్ ’ సినిమాలతో కర్నాటకలోని కోలార్ గోల్డ్ఫీల్డ్లో బంగారం అన్వేషణ ఎలా జరిగిందో చూపించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన కార్మికులు కొలార్ గనుల్లో ఎలా దగాపడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే అంశాలను మ్యాజిక్ రియలిజం ధోరణిలో ‘తంగలాన్’ సినిమా చూపించింది. బంగారు గనులపై గుత్తాధిపత్యం కలిగిన నియంతలకే రాకీ అనే యువకుడు ఎలా భాయ్‌గా మారాడనే అంశాన్ని వాస్తవ ఆధారిత కల్పితాలుగా ‘కేజీఎఫ్’ సినిమాలో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు లేకపోయినా, నల్ల బంగారంగా పిలుచుకునే సింగరేణి గనులు ఉన్నాయి. బొగ్గు తవ్వకాల కోసం గనుల యజమానులు కార్మికులను ఎలా రప్పించారో, కార్మికుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో, వారి ఆగడాలను కార్మికులు ఐక్యంగా పోరాడి ఎలా సాధించుకున్నారో ఓసారి చూద్దాం...మనదేశంలో బొగ్గు తవ్వకాలను బ్రిటిషర్లు ప్రారంభించారు. తొలి బొగ్గు గని 1774లో పశ్చిమ బెంగాల్‌లోని రాణీగంజ్‌లో మొదలైంది. మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 1889లో సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు గని మొదలైంది. స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇల్లెందు, బెల్లంపల్లి (1928), కొత్తగూడెం (1938)లలో బొగ్గు గనులు మొదలయ్యాయి. 1914, 1942లలో జరిగిన మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి బొగ్గు అవసరం బాగా పెరిగింది. దీంతో గనుల్లో పని చేసే కూలీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను నియమించింది. కాంట్రాక్టర్ల తరఫున ఏజెంట్లు పల్లెల్లో తిరుగుతూ, ప్రజలను సమీకరించి కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి గ్రామాలకు తీసువచ్చేవారు. అయినా, కూలీలు సరిపోకపోవడంతో అప్పటికే బొగ్గు గనుల రంగంలో అనుభవం ఉన్న బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ కార్మికులను ఇక్కడికి రప్పించేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ల పేరుమీదుగానే బొగ్గు గనుల ప్రాంతంలో సన్యాసి బస్తీ, గాజుల రాజంబస్తీ, గంగా బిషన్ బస్తీ, కూలీ లైన్, బర్మా క్యాంప్, మథుర బస్తీ, నాగయ్య గడ్డ, పంజాబ్ గడ్డ, కొత్తూరు రాజం బస్తీ, బాబు క్యాంపు, రడగంబాల బస్తీ తదితర పేర్లతో కాలనీలు ఏర్పాటయ్యాయి.చావుతో చెలగాటం..గాలి, వెలుతురు, నీరు వంటి కనీస సౌకర్యాలు కరువైన గనుల్లో పని చేయడమంటే చావుతో చెలగాటం ఆడటమే! 1928 మార్చి 12న ఇల్లెందులోని స్ట్రట్‌పిట్ మైన్ లో మీథేన్ లాంటి విషవాయువులు వెలువడటంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకేసారి 43 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత బెల్లంపల్లి, కొత్తగూడెంలోని బర్లిపిట్ గనిలో ఈ తరహా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు గనుల్లో మాడిమసైపోయారు.రక్తాలు కారుతుండగా..బొగ్గు వెలికి తీయడానికి కార్మికులు దొరక్కపోవడంతో మహిళలు, పిల్లల చేత కూడా పని చేయించేవారు. చెప్పులు లేకుండా బొగ్గు పెళ్లల మీదుగా నడుస్తూ, బావుల్లోకి దిగాల్సి వచ్చేది. గనిలోకి వెళుతుంటే పైకప్పు నుంచి నీరు కురిసేది. నీటితో పాటు వచ్చే బొగ్గు రజను చర్మానికి ఒరుసుకుపోయి గాయాలయ్యేవి. గాయాల బాధను భరిస్తూనే, పనిముట్లతో బొగ్గు బండలను కొట్టి చిన్న ముక్కలుగా చేసి తట్టల్లో నింపుకుని నెత్తిపై మోస్తూ పనిచేయాల్సి వచ్చేది. గనిలో విషవాయులు ఎప్పుడు వెలువడుతాయో, గని పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని దారుణ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కార్మికులు పనిచేసేవారు. ఇక కటిక చీకటితో ఉండే గనిలో దారి తప్పి అదృశ్యమైన వారి సంఖ్యకు అంతేలేదు.కాంట్రాక్టర్ల దోపిడీ..కార్మికులకు అరకొర జీతాలు చెల్లిస్తూ, వారితో కాంట్రాక్టర్లు బండెడు చాకిరీ చేయించే వారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా, పిల్లాపాపలు, మహిళలతో సహా బొగ్గు గనుల్లో రేయింబగళ్లు పనిచేయించేవారు. గనుల్లో ప్రమాదాలు, మరణాలు నిత్యకృత్యం. ఇక్కడ పని చేయలేక పారిపోయేందుకు ప్రయత్నించే వారిని కాంట్రాక్టర్ల గుండాలు వెతికి పట్టుకుని, చిత్రహింసలు పెట్టేవారు. ఇక మహిళలపై జరిగే అకృత్యాలకు అంతేలేదు.కాంట్రాక్టర్లకే నిజాం మద్దతు..బొగ్గు తవ్వకాల బాధ్యతలు చూస్తు్తన్న బ్రిటిషర్లకు, కార్మికులను అందిస్తున్న కాంట్రాక్టర్లకు రక్షణగా నిజాం పోలీసు వ్యవస్థ పనిచేస్తూ, కార్మికులను పీడించే కాంట్రాక్టర్లకు వెన్నుదన్నుగా నిలిచేది. కార్మికులు ఎటూ పారిపోకుండా రైల్వే స్టేషన్లలోను, ఊరి పొలిమేర్లలోను నిఘా పెట్టేది. తమకు జరిగే అన్యాయాలపై ఎవరైనా నోరు విప్పినా, పట్టించుకునే నాథులు ఉండేవారు కాదు. కాంట్రాక్టర్ల చేతిలో చిక్కి వెట్టిచాకిరి చేసే కార్మికులను ఆదుకునే వారూ ఉండేవారు కాదు.సాయుధ పోరాటం..రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక నిజాం రాజ్యంలో సాయుధ రైతాంగ పోరాటానికి అడుగులు పడ్డాయి. అదే సమయంలో సింగరేణిలో కార్మిక సంఘాలు పురుడు పోసుకున్నాయి. అలా నిజాం రైల్వే యూనియన్ (హైదరాబాద్), అజాంజాహీ మిల్ వర్కర్స్ (వరంగల్) యూనియన్ల తర్వాత 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ పేరుతో మూడో యూనియన్ ఏర్పడి, గనుల్లో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తు్తన్న నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.ప్రశ్నించిన శేషగిరి..నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో 1918 సెప్టెంబరు 24న జన్మించిన దేవనూరి శేషగిరిరావు అక్కడే విద్యాభాస్యం పూర్తి చేసుకుని ఉపాధి కోసం సింగరేణిలో అకౌంటంట్గా చేరి, కొత్తగూడేనికి మకాం మార్చారు. ఇక్కడి కార్మికుల కష్టాలు, కాంట్రాక్టర్ల దోపిడీని దగ్గరగా చూశారు. అన్యాయానికి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నారు. పొద్దంతా హెడాఫీసులో పని చేస్తూ, సాయంత్రం వేళ కార్మికవాడలకు వెళ్లి, వారితో కలసిపోయి, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, హక్కుల కోసం పోరాడేలా తయారు చేశారు. 1947లో రహస్య జీవితం గడుపుతున్న శేషగిరిని నిజాం పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక కేసు విచారణ కోసం అక్కడి నుంచి ఇల్లెందుకు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో డోర్నకల్‌లో ఆగారు. అక్కడ పోలీసుల నుంచి తప్పించుకున్న శేషగిరి విజయవాడ చేరుకున్నారు. అక్కడ గెరిల్లా యుద్ధతంత్రాలు నేర్చుకుని, వాటిని సింగరేణి ప్రాంతంలో అమల్లోకి తెచ్చారు. చివరకు 1948 ఫిబ్రవరి 15న భద్రాచలం సమీపంలో నెల్లిపాక దగ్గర జరిగిన ఎన్ కౌంటర్లో శేషగిరితో పాటు పాపయ్య, రంగయ్య అనే విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు.యూనియన్ కొమరయ్య..కొమరయ్య 1928లో ఇల్లెందులో జన్మించారు. కొత్తగూడెంలోని మెయిన్ వర్క్‌షాప్‌లో 1940లో టర్నర్‌గా చేరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 1947లో అరెస్టయి, సుమారు ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత 1948లో జైలు నుంచి విడుదలయ్యాక 1949 వరకు అజ్ఞాత జీవితం గడిపారు. ఇండియాలో నిజాం స్టేట్ విలీమైన తర్వాత చివరి శ్వాస వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారు. దీంతో ఆయన పేరే యూనియన్ కొమరయ్యగా కార్మికుల గుండెల్లో నిలిచిపోయింది. దేవనూరి శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యల తరహాలోనే సర్వదేవభట్ల రామనాథం, డాక్టర్ రాజ్‌బహదూర్, పర్సా సత్యనారాయణ, పులిపాక రాజయ్య, మఖ్దూం మొíహియుద్దీన్, వంగా రాజేశ్వరరావు, కారపెల్లి రాఘవరావు వంటి నాయకులు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారు.హక్కుల సాధన..కార్మికులు ఐక్యంగా సాగించిన పోరాటాల ఫలితంగా గనుల్లో కాంట్రాక్టు వ్యవస్థ రద్దయ్యింది. రోజుకు పన్నెండు గంటల పని స్థానంలో ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. బాలలతో పనులు చేయించడం ఆపించారు. మహిళలకు గనుల్లో కాకుండా ఉపరితలంలోనే పనులు ఇచ్చేలా మార్పులు తెచ్చారు. గనుల్లోకి కిరోసిన్ దీపాలు తీసుకుని వెళ్లడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సేఫ్టీ ల్యాంప్స్‌ను ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చారు. వేతనాలు పెరిగాయి. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణం/అంగవైకల్యం సంభవిస్తే నష్టపరిహారం ఇచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సాధించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన రాజకీయ పార్టీలకు అనుబంధంగా అనేక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పని చేశాయి.ప్రస్తుతం ఇలా..ఆరేడు దశాబ్దాలుగా కార్మికులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ప్రస్తుతం 39 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరి సగటు వేతం రూ. 70 వేలు ఉండగా, వీరిలో ప్రారంభ జీతం రూ.60 వేలు మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు అందుకునేవారు ఉన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నారు. చివరిసారిగా రూ. 2,220 కోట్లను కార్మికులకు అందించారు. సంస్థ పరిధిలో 40 వేల క్వార్టర్లు, 12 ఆస్పత్రులు, 20 వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. సర్వీసులో సింగరేణి కార్మికుడు అకస్మాత్తుగా చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది. సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు బీమా మొత్తం రూ. 30 లక్షలుగా ఉంది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షిప్రతినిధి, కొత్తగూడెంఇవి చదవండి: అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్! -
అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్!
ఉన్నది ఒకటే జీవితం! దాన్ని జీతానికి తాకట్టు పెడితే ఆర్జిస్తున్నామనే ఆనందం కూడా మిగలదు! ఉద్యోగం వేతనాన్నే కాదు చేస్తున్న పని పట్ల సంతృప్తినీ ఇవ్వాలి.. ఆస్వాదించే సమయాన్నుంచాలి.. మన జీవితాన్ని మనకు మిగల్చాలి! ఇది జెన్ జెడ్ ఫిలాసఫీ! అందుకే వాళ్లు రెజ్యుమే ప్రిపేర్ చేయట్లేదు. పోర్ట్‌ఫోలియో కోసం తాపత్రయపడుతున్నారు. వర్క్ స్టయిల్ని మార్చేస్తున్నారు. ఆఫీస్ డెకోరమ్ నుంచి ఫ్రేమ్ అవుట్ అవుతున్నారు. ముందుతరాల ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. మేనేజ్మెంట్కి ఆప్షన్ లేకుండా చేస్తున్నారు.‘చూసేవాళ్లకు కేర్ఫ్రీగా కనిపిస్తున్నామేమో కానీ చేసే పని పట్ల, మా ఫ్యూచర్ పట్ల క్లారిటీతోనే ఉంటున్నాం. జాబ్ అండ్ జిందగీ, ప్యాకేజ్ అండ్ ఫ్యాషన్ల మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసు మాకు. అందుకే మేము మా స్కిల్‌ని నమ్ముకుంటున్నాం.. లాయల్టీని కాదు’ అంటోంది జెన్ జెడ్ ప్రతినిధి, బిజినెస్ అనలిస్ట్ చిలుకూరు సౌమ్య.నిజమే.. తమకేం కావాలి అన్నదాని పట్ల జెన్ జెడ్‌కి చాలా స్పష్టత ఉంది. వాళ్లు దేన్నీ దేనితో ముడిపెట్టట్లేదు. దేనికోసం దేన్నీ వదులుకోవట్లేదు. నైపుణ్యం కంటే విధేయతకే ప్రాధాన్యమిస్తున్న సంస్థల్లో పని వాతావరణాన్ని మార్చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న నాటి నుంచి రిటైర్మెంట్ వరకు ఒకే సంస్థలో ఉద్యోగాన్నీడ్చే ముందు తరాల మనస్తత్వాన్ని ఔట్ డేటెడ్‌గా చూస్తున్నారు. తక్కువ సర్వీస్‌లో వీలైనన్ని జంప్‌లు, వీలైనంత ఎక్కువ ప్యాకెజ్ అనే ఐడియాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు.వాళ్ల రూటే వేరు..సంప్రదాయ జీవన శైలినే కాదు ట్రెడిషనల్ వర్క్ స్టయిల్‌నూ ఇష్టపడట్లేదు జెన్ జెడ్. ‘పదహారు.. పద్దెనిమిదేళ్లు చదువు మీద పెట్టి, తర్వాత లైఫ్ అంతా 9 టు 5 పనిచేస్తూ, కార్పొరేట్ కూలీలుగా ఉండటం మావల్ల కాదు’ అంటున్నారు బెంగళూరుకు చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ‘జెన్ జెడ్.. మాలాగా కాదు. వాళ్లు సంస్థ ప్రయోజనాల కోసం చెమటోడ్చట్లేదు. అలాంటి షరతులు, డిమాండ్లకూ తలొగ్గట్లేదు. వాళ్లకు పనికొచ్చే, వాళ్ల సామర్థ్యాన్ని నిరూపించుకునే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రైటింగ్, డిజైన్ లాంటి టాస్క్స్నే తీసుకుంటున్నారు. అంతే నిర్మొహమాటంగా గుర్తింపును, కాంప్లిమెంట్స్నూ కోరుకుంటున్నారు. కొలీగ్స్‌తో మాట్లాడినంత క్యాజువల్‌గా సంస్థ డైరెక్టర్‌తో మాట్లాడేస్తున్నారు. సీనియర్స్, సుపీరియర్స్ని ‘సర్’ అనో, ‘మేడమ్’ అనో పిలవడం వాళ్ల దృష్టిలో ఫ్యూడల్, ఓల్డ్ ఫ్యాషన్డ్. పేరుతో పిలవడాన్ని అప్ డేటెడ్‌గా, ఈక్వల్‌గా ట్రీట్ చేస్తున్నారు’ అని చెబుతున్నారు మిలేనియల్ తరానికి చెందిన కొందరు బాస్‌లు. దీన్నిబట్టి జెన్ జెడ్‌కి ఆఫీస్ మర్యాదల మీదా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు యజమాని – ఉద్యోగి సంబంధాన్ని సింపుల్‌గా ‘మీకు అవసరమైన పని చేసిపెడుతున్నాం.. దానికి చార్జ్ చేసిన డబ్బును తీసుకుంటున్నాం’ అన్నట్లుగానే పరిగణిస్తున్నారు తప్ప ఎలాంటి అటాచ్మెంట్లు, సెంటిమెంట్లకు చోటివ్వట్లేదు.40 కల్లా..చేసే ఉద్యోగం, జీతం, పని వేళలు, ఆఫీస్ వాతావరణమే కాదు ఎన్నాళ్లు పనిచేయాలనే విషయంలోనూ జెన్ జెడ్‌కి ఒక అవగాహన ఉంది. తర్వాత ఏం చేయాలనేదాని పట్లా ఆలోచన ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘జీవిక కోసం జీతం.. ప్యాషన్ కోసం జీవితం’ అని నమ్ముతున్నారు వాళ్లు. 35– 40 ఏళ్ల కల్లా రిటైర్మెంట్ అంటూ పెద్దవాళ్లు విస్తుపోయేలా చేస్తున్నారు. ‘మేము 60 ఏళ్లకు రిటైరైన తర్వాత కూడా ఏదో ఒక జాబ్ చేయాలని చూస్తుంటే మా పిల్లలేమో 35 – 40 ఏళ్ల వరకే ఈ ఉద్యోగాలు.. తర్వాత అంతా మాకు నచ్చినట్టు మేం ఉంటామని చెబుతున్నారు. ఆశ్చర్యమేస్తోంది వాళ్ల ధైర్యం, భరోసా, నమ్మకం చూస్తుంటే’ అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. 40 ఏళ్ల కల్లా రిటైరైపోయి తమకు నచ్చిన రంగంలో సెకండ్ కెరీర్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. దీనికోసం ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే అన్నిరకాల ప్రణాళికలు వేసుకుంటున్నారు. పొదుపుతో జాగ్రత్తపడుతున్నారు. సిప్‌లు,షేర్లలో మదుపు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలతో అప్డేట్ అవుతున్నారు. తమ లక్ష్యాలకు సరిపోయే ప్యాకేజ్ని కోట్ చేస్తూ అర్థిక సుస్థిరత కోసం ప్రయత్నిస్తున్నారు.రెజ్యుమే టు పోర్ట్‌ఫోలియో..ఒక వ్యక్తి కొన్నాళ్లు ఓడరేవులో పని చేస్తాడు. అక్కడి నుంచి చెరుకు తోటలకు కూలీగా వెళ్తాడు. ఇంకొన్నాళ్లు బడిలో పాఠాలు చెబుతాడు. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్‌గా కనపడతాడు. మరికొన్నాళ్లకు ఇంకో కొలువును చేపడతాడు. ఆఖరికి ఏ సైంటిస్ట్గానో, రాజకీయవేత్తగానో, రచయితగానో తన మజిలీ చేరుకుంటాడు. ఇలాంటివన్నీ సాధారణంగా పాశ్చాత్య నవలలు, ఆటోబయోగ్రఫీలు, సినిమాల్లో కనపడతాయి. కానీ ఈ ధోరణిని ఇప్పుడు జెన్ జెడ్‌లోనూ కనపడుతోంది. 60 ఏళ్లకు రిటైర్మెంట్నే కాదు రిటైర్మెంట్ వరకు ఒకే కొలువు అనే కాన్సెప్ట్‌నూ ఇష్టపడట్లేదు వాళ్లు. కెరీర్లో రెండుమూడు జంప్ల తర్వాత ఆఫీస్‌లో కూర్చొని చేసే జాబ్ కన్నా ఫ్రీలాన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఆదాయం పెరగడమే కాక, మనసుకు నచ్చిన పనిచేసుకునే అవకాశమూ దొరుకుతోంది అంటున్నారు.వివిధ రంగాల్లోని చాలామంది జెన్ జెడ్ ఉద్యోగులు పలు స్టార్టప్స్‌కి పనిచేస్తున్నారు, స్టార్టప్స్ నడుపుతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. వ్లాగర్స్, యూట్యూబర్స్‌గా కొనసాగుతున్నారు. అడ్వర్టయిజ్మెంట్ కాపీ రైటర్స్‌గా, ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌కి క్యురేటర్స్గా సేవలందిస్తున్నారు. యోగా టీచర్స్‌గా, అనువాదకులుగా, కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్నారు. వాయిస్ ఓవర్ చెబుతున్నారు. డిస్కవరీ, జాగ్రఫీ, యానిమల్ ప్లానెట్ లాంటి చానళ్ల కోసం పనిచేస్తున్నారు. డాక్యుమెంటరీలకు స్క్రిప్ట్స్ రాస్తున్నారు. ఎడిటింగ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ అందిస్తున్నారు. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైన్, మోడలింగ్‌లో ఉన్నారు. ఐడియా బ్యాంక్‌ని నిర్వహిస్తున్నారు. ఇలా ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో.. వైవిధ్యమైన పని అనుభవాలతో రెజ్యుమే ప్లేస్‌లో పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకుంటున్నారు. డబ్బుతోపాటు జాబ్ శాటిస్ఫాక్షన్ను పొందుతున్నారు.ఫిన్‌ఫ్లుయెన్సర్స్..40 ఏళ్లకే రిటైరై.. సెకండ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన వాళ్లు, రకరకాల ఉద్యోగాలతో ఫ్రీలాన్స్ చేçస్తున్న వాళ్లు ఆర్థిక క్రమశిక్షణలోనూ ఆరితేరుతున్నారు. పలు స్టార్టప్స్‌లో, సేవల రంగంలో పెట్టుబడులు పెడుతూ ఫిన్ఫ్లుయెన్సర్స్గా మారుతున్నారు.ఈ ధోరణికి కారణం.. ఇంటర్నెట్, ఏఐ లాంటి ఫాస్ట్‌మూవింగ్ టెక్నాలజీ, కరోనా పరిస్థితులు .. కెరీర్, ఆఫీస్ వర్క్‌కి సంబంధించి ఎన్నో మార్పులను తెచ్చాయి. అవి జెన్ జెడ్‌ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. వారి ఆలోచనా విధానాన్ని మారుస్తున్నాయి. ఈ మధ్య చోటుచేసుకున్న రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, తత్ఫలితంగా ఏర్పడ్డ ఆర్థికమాంద్యం, ఉద్యోగాల కోత వంటి పరిణామాలు కూడా ఆ ధోరణిని కొనసాగేలా చేస్తున్నాయి. దీనికి పేరెంటింగ్నూ మరో కారణంగా చూపుతున్నారు సామాజిక విశ్లేషకులు. ఇంజినీరింగ్, మెడిసిన్ తప్ప ఇంకో చదువు లేదు, మరో కెరీర్ కెరీర్ కాదనే పెంపకమూ ఫ్రీలాన్సింగ్, అర్లీ రిటైర్మెంట్ ట్రెండ్‌కి ఊతమవుతోందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.జెన్ జెడ్ ఫ్రీలాన్స్ వర్కింగ్ ట్రెండ్ మీద అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ‘అప్‌వర్క్ ఆన్లైన్ ఫ్రీలాన్స్ నెట్వర్కింగ్’ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. అనుగుణమైన పనివేళలు, ఆదాయ భరోసా ఉండటం వల్లే వాళ్లు ఏ రంగంలోనైనా ఫ్రీలాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. ఎక్కువమంది కోవిడ్ చరమాంకం నుంచి ఈ ఫ్రీలాన్స్ వర్క్ కల్చర్‌లో కొనసాగుతున్నారట. వాళ్లంతా వారానికి 40 గంటలు, పలురకాల పనుల్లో ఫ్రీలాన్స్ చేస్తున్నారు. కొందరేమో పనిచోట సీనియర్స్– జూనియర్స్, కుల, మత, జాతి, లింగ వివక్షను భరించలేక, ఆ వాతావరణం నుంచి దూరంగా ఉండటానికి ఫ్రీలాన్స్ని ఎంచుకున్నట్లు చెప్పారు. మరికొందరు వ్యక్తిగత జీవితం తమ చేతుల్లోనే ఉంటుందని, సొంతంగా ఎదిగే వీలుంటుందని ఫ్రీలాన్స్ చేస్తున్నట్లు తెలిపారు. టిక్‌టాక్ నిషేధం తర్వాత చాలామంది క్రియేటర్స్‌కి ఇన్స్టాగ్రామ్ ఓ ప్రత్యామ్నాయ వేదికగా మారడంతో వాళ్లంతా మళ్లీ ఫ్రీలాన్స్కి మళ్లారు. మైక్రోసాఫ్ట్, లింక్డిన్ డేటా ప్రకారం జెన్ జెడ్ ఫ్రీలాన్సర్స్.. సంస్థలు ఇచ్చే శిక్షణ మీద ఆధారపడకుండా సొంతంగా శిక్షణ తీసుకుని ఏఐ వంటి అధునాతన సాంకేతిక సౌకర్యాలను చాలా చక్కగా వాడుకుంటున్నారు. మిలేనియల్స్ మాదిరి జెన్ జెడ్.. లాప్‌టాప్‌ను, కంప్యూటర్ను ఎక్స్ట్రా ఆర్గాన్‌గా మోయట్లేదు. ఆఫీస్‌ను మొదటి ఇల్లుగా చేసుకోవట్లేదు. ఉన్న చోటు నుంచే తమ దగ్గరున్న డివైస్లోంచే పనిచేసుకుంటున్నారు.. ఆడుతూ.. పాడుతూ.. హ్యాపీగా! పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్నీ జెన్ జెడ్‌కి ఫ్రీలాన్సింగ్ ఇచ్చేలా కొందరు బిజినెస్ లీడర్లు ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కొన్ని సంస్థలూ ఆలోచిస్తున్నాయి.ఉరుకులు, పరుగులు నచ్చక..చదువైపోయిన వెంటనే అమెజాన్‌లో జాబ్ వచ్చింది. 9 టు 5 వర్క్ వల్ల పర్సనల్‌గా నేను బావుకుంటున్నదేమీ లేదని రియలైజ్ అయ్యాను. అందుకే లాస్టియర్ జాబ్ మానేసి ఫ్రీలాన్సర్‌గా మారాను. దీనివల్ల డబ్బుతో పాటు జాబ్ శాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతోంది. అంతేకాదు చుట్టుపక్కలవాళ్లకు తోచిన సాయం చేయగలుగుతున్నాను. నాకు ట్రావెల్, మ్యూజిక్ అంటే ఇష్టం. ఇప్పుడు టైమ్ నా చేతిలో ఉంటోంది కాబట్టి, మ్యూజిక్ షోస్ చేసుకుంటున్నాను. నాకు నచ్చిన చోటికి వెళ్తున్నాను. – కార్తిక్ సిరిమల్ల, హైదరాబాద్డబ్బును కాదు టైమ్‌ని చేజ్ చేస్తోందిజర్మనీలో మాస్టర్స్ చేసి, అక్కడే మంచి జాబ్ కూడా సంపాదించుకున్నాను. అయినా హ్యాపీనెస్ లేదు. ఆఫీస్‌లో అన్నేసి గంటలు చేసిన వర్క్‌కి ఎండ్ ఆఫ్ ద డే అంతే ఔట్పుట్ కనిపించలేదు! అంతే శ్రమ నాకు నచ్చిన దాని మీద పెడితే ఆ శాటిస్ఫాక్షనే వేరు కదా అనిపించింది! అందుకే ఇండియాకు వచ్చేసి, థీమ్ రెస్టరెంట్ పెట్టాను. ఆన్లైన్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాను. ఫ్యూచర్లో కొంతమంది ఫ్రెండ్స్‌మి కలసి మాకు నచ్చిన ఓ పల్లెలో కొంచెం ల్యాండ్ కొనుక్కొని మినిమలిస్టిక్ లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నాం. మా జెనరేషన్ డబ్బును చేజ్ చేయట్లేదు. టైమ్‌ని చేజ్ చేస్తోంది. – వుల్లి సృజన్, హైదరాబాద్టాక్సిక్ వాతావరణం..యూకేలో ఏంబీఏ చేశాను. కొన్ని రోజులు హెచ్ఆర్ జాబ్‌లో ఉన్నాను. కానీ ఆఫీస్‌లోని టాక్సిక్ వాతావరణం నచ్చక వదిలేశాను. నాకు ముందు నుంచీ ఫ్యాషన్, బ్యూటీ మీద ఇంట్రెస్ట్. అయితే జాబ్ వదిలేయగానే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. నాకు బ్యూటీపార్లర్ పెట్టాలనుందని చెప్పాను. పెళ్లి ఖర్చులకు ఎంతనుకున్నారో అందులో సగం నా బిజినెస్‌కి హెల్ప్ చేయమని అడిగాను. ఏడాదిలో పికప్ కాకపోతే పెళ్లికి ఓకే అనాలనే షరతు మీద డబ్బిచ్చారు నాన్న. ఇంకొంత లోన్ తీసుకుని పార్లర్ అండ్ స్పా పెట్టాను. ఏడాదిన్నర అవుతోంది. మంచిగా పికప్ అయింది. – ప్రత్యూష వావిలాల, కరీంనగర్. -
పదహారు ఏళ్లలోపు పిల్లలు.. సోషల్ మీడియాకు నో..!
పదహారు ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. యువతపై రకరకాల సైట్ల ప్రభావాన్ని ఆయన ‘విపత్తు’గా అభివర్ణించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లాంటి సైట్లలోకి లాగిన్ కావడానికి పిల్లల కనీస వయసు ఇంకా నిర్ణయించబడలేదు.ఇది 14 నుండి 16 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ‘సోషల్ మీడియా వ్యసనంగా మారిన పిల్లలను ఆటస్థలాలు, ΄÷లాలు, స్విమ్మింగ్ పూల్స్‌లో చూడాలనుకుంటున్నాను’ అంటున్నారు ప్రధాని. ‘సామాజిక మాధ్యమాలు సామాజిక హాని కలిగిస్తున్నాయి. యువత మనసులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. సోషల్ మీడియా దాటి బాహ్య ప్రపంచంలోకి వస్తే వారికి ఎన్నో అనుభవాలు సొంతం అవుతాయి’ అంటున్నాడు ఆంథోనీ ఆల్బనిస్.ప్రధాని నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు సైతం సమర్థించారు. ‘సోషల్ మీడియా సంస్థలు వయసు పరిమితి విధించాలి’ అని కోరుతున్నాడు ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్. ‘సోషల్ మీడియా సంస్థలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి’ అని ΄ాలక, ప్రతిపక్ష నేతలు కోరుకుంటున్నారు.ఇవి చదవండి: రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం..అప్ఘాన్ జిమ్ ఓనర్ మృతి -
‘భాషా’..! ఒక్క ప్రశ్న కాదు.. వందైనా ఓకే!
కేవలం 250 మంది మాట్లాడే భాష పేరు చెప్పగలరా? దాని నిర్మాణం ఏమిటి? ఎలా మాట్లాడుతారు, ఎలా రాస్తారో చెప్పగలరా? కొన్ని గంటల్లోనే ఆ భాషను అనువదించగలరా? ‘కష్టం’ అనేవాళ్లే ఎక్కువ. కాని కొందరు ఇష్టంగా ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్లోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. మన దేశం తరఫున ఈ పోటీలో పాల్గొన్న లక్ష్మీ, అనిమికా దత్తాలు పతకాలు గెలుచుకున్నారు...ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, భాషాశాస్త్ర నిపుణులను ఒకచోట చేర్చే అంతర్జాతీయ పోటీ. 2003లో ఇది మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల వ్యాకరణం, నిర్మాణం, సంస్కృతి, చరిత్రను విశ్లేషించడానికి, పజిల్స్‌ను సాల్వ్ చేయడం ద్వారా భాష సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ పోటీ అవకాశం కల్పిస్తుంది. సృజనాత్మకత, ఊహాశక్తిని మెరుగుపరచడానికి ఈ పోటీ ఉపకరిస్తుంది. భవిష్యత్తు భాషాశాస్త్ర నిపుణులను తయారుచేస్తుంది.‘భాష లేదా భాషాశాస్త్రంపై లోతైన పరిజ్ఞానం అవసరం లేదు. అత్యంత సవాలుతో కూడిన సమస్యలకు కూడా తార్కిక సామర్థ్యంతో, ఓపికతో పరిష్కారం కనుక్కోవచ్చు’ అంటుంది ఐవోఎల్. పోటీలో పాల్గొన్న వారికి ఇన్‌ఫుట్స్ ఇస్తారు. వాటి ఆధారంగా పజిల్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది.ఈ సంవత్సరం ‘ఐవోఎల్’కు బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ పోటీలో 38 దేశాల నుంచి 51 టీమ్‌లు పాల్గొన్నాయి. బ్రెజిల్ రాజధాని బ్రజిలియాలో జరిగిన 2024 ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్(ఐవోఎల్)లో మన దేశానికి చెందిన అనిమికా దత్తా ధర్, శ్రీలక్ష్మీ వెంకట్రామన్, ఫరాజ్ సిద్దిఖీ, అనన్య అగర్వాల్‌లు అద్బుత ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించారు.‘ఐవోఎల్ వెబ్సైట్లో గత ఒలింపియాడ్‌లో వచ్చిన ్రపాబ్లమ్స్ను సాల్వ్ చేస్తూ ్రపాక్టీస్ చేశాను’ అంటుంది పద్నాలుగు సంవత్సరాల శ్రీలక్ష్మీ. బెంగళూరులోని జైగోపాల్ రాష్ట్రీయ విద్యాకేంద్రలో చదువుతున్న శ్రీలక్ష్మీ ఐఐటీ కాన్పూర్ విద్యార్థి ఫరాజ్ సిద్దిఖీతో కలిసి కాంస్య పతకం సాధించింది. పదిహేడు సంవత్సరాల అనిమికా దత్తా ఈ ఒలింపియాడ్‌లో రజత పతకం గెలుచుకుంది. అనిమిక చెన్నై మ్యాథమెటికల్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధి. తృటిలో పతకం చేజార్చుకున్న అనన్య పతకం సొంతం చేసుకోకపోయినా బోలెడు ప్రశంసలు అందుకుంది.ఈ ఒలింపియాడ్‌లో పాల్గొన్న మన బృందానికి మైండ్–బ్లోయింగ్ వర్డ్ పజిల్స్ సవాలు విసిరాయి. ఇచ్చిన వ్యవధి ఆరు గంటలు. కొరియాక్(రష్యా), హడ్జా(టాంజానియా), కొమ్టో(పపువా న్యూ గినియా), దావ్ (బ్రెజిల్), యానువ్యవా(ఆస్ట్రేలియా)లాంటి మారుమూల భాషలకు సంబంధించిన పజిల్స్ ఇచ్చారు. ‘భాష నుంచి చారిత్రక సందర్భాలను నిర్వచించవచ్చు’ అంటున్న అనిమిక పపువా న్యూ గినియాకు చెందిన ఎన్డు భాషతో పాటు చారిత్రక విషయాల గురించి కూడా మాట్లాడగలదు. భాషాశాస్త్రం లోతుపాతుల గురించి పెద్దగా తెలియని అనిమిక ఆ శాస్తంపై ఆసక్తి పెంచుకోవడానికి పజిల్స్ కారణం.‘లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొనడం వల్ల కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యం పెరుగుతుంది’ అంటుంది శ్రీలక్ష్మి. ‘నా సాంస్కృతిక నేపథ్యమే నాకు స్ఫూర్తి’ అంటుంది అనన్య అగర్వాల్. ‘ఐవోఎల్’ బ్రెయిన్టీజర్ ఫీచర్లు సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఆ సంస్కృతి తెలియకపోతే పజిల్స్ పరిష్కరించడం కష్టం. ఉదాహరణకు ఈ సంవత్సరం ఫ్యామిలీ ట్రీ ఇచ్చారు. ఫరెమ్ ప్రజల గురించి తెలియకపోతే ఆ సమస్య పరిష్కరించలేము. ఫరెమ్ అనేవాళ్లు కొమ్జో భాష మాట్లాడే ప్రజలు. వివాహనికి సంబంధించిన వీరి ఆచారవ్యవహారాలు ఆసక్తిగా ఉంటాయి. ‘ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రవేశం అనేది సూక్ష్మస్థాయిలో విశ్లేషణకు, సృజనాత్మకంగా ఆలోచించడానికి ఉపకరిస్తుంది’ అనే విషయాన్ని ‘ఐవోఎల్’ పోటీలు చెప్పకనే చెబుతున్నాయి. బహు భాషలపై ఆసక్తి పెంచుకోవడానికి ప్రేరణను ఇస్తున్నాయి.మరింత సులువుగా...ఒక భాషకు సంబంధించిన వాక్యనిర్మాణం, వ్యాకరణం, ధ్వనులు... మొదలైన వాటిపై భాషాశాస్త్రం పనిచేస్తుంది. భాషాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తి ఊపందుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రధాన కారణం. జీపీటి–4, క్లాడ్, జెమినిలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) ఇందుకు ఉదాహరణ. మనిషి ఇచ్చే ఇన్పుట్స్, కమాండ్స్‌కు మెషిన్ అర్థం చేసుకోవడానికి మధ్య అంతరాన్ని పూడ్చడానికి నేచురల్ లాంగ్వేజ్ ్రపాసెసింగ్ సిస్టమ్స్ (ఎన్ఎల్పీ) అవసరం. ఎక్కువ సంఖ్యలో భాషాశాస్త్రవేత్తలు ‘ఎన్ఎల్పీ’ రిసెర్చ్‌లో భాగం అయితే సహజత్వ ప్రక్రియ మరింత సులువు అవుతుంది.ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..! -
క్యాబేజీతో క్రేజీగా...!
క్యా... బే... జీ! పిల్లలు ఈ జోక్‌ని సరదాగా ఎంజాయ్ చేస్తారు. సిబ్లింగ్స్ ఒకరినొకరు తిట్టుకోనట్లు తిట్టుకుంటారు. పొగడక తప్పనట్లు పొగుడుకుంటారు. క్యాబేజీ తినమంటే మాత్రం ముఖం చిట్లిస్తారు. వారానికి ఒకసారి క్యాబేజ్ తినమంటోంది ఆరోగ్యం. క్యాబేజీతో ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది?క్యాబేజ్ కుల్చా..కావలసినవి..గోధుమపిండి– పావు కేజీ;నూనె– 2 టీ స్పూన్లు;నీరు – ము΄్పావు కప్పు;ఉప్పు – పావు టీ స్పూన్;స్టఫింగ్ కోసం... క్యాబేజ్ – పావు కేజీ;నూనె – టేబుల్ స్పూన్;పచ్చిమిర్చి – 2 (తరగాలి);వాము – అర టీ స్పూన్;అల్లం తురుము – టీ స్పూన్;పసుపు – పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;జీలకర్ర పొడి– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;ఆమ్చూర్ – అరటీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్;నూనె – టేబుల్ స్పూన్.తయారీ..– గోధుమపిండిలో ఉప్పు, నీరు పోసి ముద్దగా కలిపి పైన నూనె వేసి అద్ది పలుచని వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి.– క్యాబేజ్‌ని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీటిలో వేసి ఐదు నిమిషాల సేపు ఉంచి తీయాలి. నీరు పోయిన తర్వాత తురమాలి.– వెడల్పు పెనంలో నూనె వేడి చేసి వాము గింజలు వేయాలి.– అవి చిటపటలాడిన తర్వాత క్యాబేజ్ తురుము, ఉప్పు వేసి కలిపి మంట తగ్గించి మూతపెట్టాలి.– ఏడెనిమిది నిమిషాలకు క్యాబేజ్ మగ్గుతుంది. అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించాలి.– ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, అల్లం, పసుపు, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా పొడులు వేసి కలిపి మూత పెట్టాలి.– రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించేయాలి. చల్లారే వరకు పక్కన పెట్టాలి.– ఈ లోపు గోధుమ పిండితో చపాతీలు చేయాలి. ఒక చపాతీ మీద ఒక గరిటె క్యాబేజ్ స్టఫింగ్ పెట్టి ఆ పైన మరో చపాతీ పెట్టి అంచులను చేత్తో అతికించాలి.– ఇప్పుడు క్యాబేజ్ సమంగా విస్తరించడానికి అప్పడాల కర్రతో జాగ్రత్తగా రోల్ చేస్తే అదే కుల్చా. ఇలాగే పిండి అంతటినీ చేయాలి.– ఇప్పుడు చపాతీల పెనం వేడి చేసి ఒక్కో కుల్చాను చపాతీలాగానే నూనె వేస్తూ రెండువైపులా కాలనివ్వాలి.– స్టఫింగ్ బరువుతో కుల్చా విరిగిపోకుండా జాగ్రత్తగా తిరగేయాలి.– వేడి కుల్చాలోకి వెన్న, పెరుగు మంచి కాంబినేషన్. కారంగా తినాలంటే నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి బాగుంటుంది.గమనిక: ఆమ్చూర్ పౌడర్ లేకపోతే తాజా మామిడి తురుము టీ స్పూన్ తీసుకోవాలి.క్యాబేజ్ డ్రై మంచూరియా..కావలసినవి..క్యాబేజ్ – 200 గ్రాములు (తరగాలి);ఉల్లిపాయ – 1 (పెద్దది, తరగాలి);క్యాప్సికమ్ – 1 (తరగాలి);క్యారట్ – 1 (తరగాలి);షెజ్వాన్ సాస్ – అర టేబుల్ స్పూన్;అల్లం తురుము – టీ స్పూన్; కశ్మీరీ మిరపొ్పడి– అర టీ స్పూన్;మిరియాల పొడి– పావు టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;శనగపిండి – 100 గ్రాములు;మైదా – 50 గ్రాములు;మొక్కజొన్న పిండి– 50 గ్రాములు;నూనె – వేయించడానికి తగినంత;గార్నిష్ చేయడానికి... క్యాబేజ్ తురుము – టేబుల్ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్.తయారీ..– వెడల్పు పాత్ర తీసుకుని అందులో నూనె మినహా మిగిలిన దినుసులన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి.– నీరు అవసరం లేదు, కూరగాయల్లోని నీటితోనే పిండి ముద్దగా అవుతుంది.– అరగంట తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి.– బాణలిలో నూనె మరిగించి పై మిశ్రమాన్ని చేతి నిండుగా తీసుకుని వేళ్లతో కొద్ది కొద్దిగా నూనెలో వదలాలి.– కాలి కొంచెం గట్టి పడిన తర్వాత చిల్లుల గరిటెతో అన్ని వైపులా బాగా కాలే వరకు తిరగేస్తూ కాలనివ్వాలి.– ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పరిచి మంచూరియా దోరగా కాలిన తర్వాత తీసి పేపర్ మీద వేయాలి.– వేడిగా ఉండగానే క్యాబేజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..! -
Pooja Bedi: ప్రతి విషాదం.. నన్ను దృఢం చేసింది!
సాక్షి, సిటీబ్యూరో, రాయదుర్గం: నా జీవితంలో చోటుచేసుకున్న ప్రతి విషాదం నన్ను దృఢంగా చేసిందని ప్రముఖ నటి పూజా బేడీ అన్నారు. గచ్చిబౌలో గురువారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె కాసేపు మీడియాతో ముచ్చటించారు. చాలా తెలుగు సినిమాల్లో నటించాను. మోహన్‌బాబు నుంచి జూ.ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల వరకూ అనేక సినిమాల్లో నటించాను.హైదరాబాద్ షూటింగ్ ప్రదేశాలను ఎంతగానో ఎంజాయ్ చేశాను. చారి్మనార్ గల్లీల్లో తిరిగాను, గాజుల దుకాణాలు ఆకట్టుకుంటాయి. స్థానిక పర్యాటక ప్రాంతాలను సందర్శించాను. ప్రత్యేకించి హైదరాబాద్ ధమ్ బిర్యానీకి పెద్ద ఫ్యాన్‌ను. అలాగే సలాడ్ కూడా ఇష్టం. వివిధ సందర్భాల్లో వచి్చనపుడు బిర్యానీతో పాటు హలీం తినడానికి ఇష్టపడతాను. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లే సమయంలో పెద్ద పెద్ద బాక్సుల్లో బిర్యానీ పార్శిల్స్ వచ్చేవి. తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవడం ఇష్టం అని తెలిపారు. అంతకు ముందు ఎఫ్ఐసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) గచి్చబౌలి చాప్టర్ సత్వ నాలెడ్జ్ సిటీలో ‘లిమిటేషన్ టు లిబరేషన్ అండ్ అన్‌లాక్ యువర్ ఇన్నర్ స్ట్రెంక్త్’ అనే అంశంపై ఫిల్మ్ స్టార్, వెల్నెస్ ఎవాంజెలిస్ట్ పూజా బేడితో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ ఛైర్పర్సన్ ప్రియా గజ్దర్, ఫ్లో సభ్యులు పాల్గొన్నారు.నేనెప్పుడూ ఏడవలేదు..విద్యార్థి దశలో నేను తరగతిలో ఫస్ట్ ఉండేదాన్ని. సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదు. మా అమ్మ మంచి డ్యాన్సర్. ఈ ఫీల్డ్‌లోకి వచ్చాక ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. గత కొన్నేళ్లుగా నా కుటుంబంలో ప్రతి ఆరు నెలలకూ చెడు వార్త వినాల్సి వచ్చింది. అమ్మమ్మ చనిపోయింది. నాకు ఇష్టమైన కుక్క మృతి చెందింది. తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయాను. నా తమ్ముడికి మరో సమస్య వచి్చంది. నాకు విడాకుల సమస్య. నేనెప్పుడూ ఏడవలేదు. విచారిస్తూ నా లక్ష్యాన్ని మర్చిపోలేదు. ఆత్మస్థైర్యం కోల్పోలేదు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాను. వెల్నెస్ సంస్థను నిర్మించాను. ప్రతి విషాదం నన్నో దృఢమైన వ్యక్తిని చేసింది. జీవితం చాలా చిన్నది. ఇదొక ప్రయాణం. అందరికీ సమస్యలు ఉంటాయి. జీవితంలో అవి ఒక భాగం మాత్రమే. వాటిని మనం ఎలా ఎదుర్కొంటామనేదే నిజమైన వ్యక్తిత్వం.అలా విముక్తి లభించింది..‘నా జీవితంలో ప్రతి విషాదం నన్ను బలమైన వ్యక్తిగా తయారు చేసింది. విడాకుల సమయంలోనూ 12 ఏళ్ల సంతోషమైన జీవితం కోసం 50 ఏళ్లు దయనీయంగా ఉండరాదనుకున్నా. అప్పుడు నాకు విముక్తి లభించింది’ అని తెలిపారు.ఇవి చదవండి: బ్లాక్‌బస్టర్ మూవీకి బంపరాఫర్.. కేవలం ఒక్క రోజు మాత్రమే! -
Fashion: మై వార్డ్రోబ్: క్రియేటివ్‌గా.. హుందాగా..!
మైండ్, బాడీ ఫిట్‌గా ఉంటే డ్రెస్సింగ్ కూడా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. ‘జిమ్‌లో వర్కవుట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే, మన వార్డ్రోబ్ మైండ్ ఎక్సర్సైజ్’ అంటున్నారు హైదరాబాద్ వాసి ఫిట్నెస్ ట్రైనర్ అనుప్రసాద్. జిమ్వేర్తో పాటు రెగ్యులర్, పార్టీవేర్ విషయంలో తీసుకునే స్పెషల్ కేర్ గురించి అనుప్రసాద్ మాటల్లో...‘‘ఉదయం ఏ డ్రెస్ వేసుకోవాలనేది ప్రతిరోజూ ఆలోచించేలా చేస్తుంది. అందుకే, క్యాజువల్ వేర్‌గా కొన్ని, సందర్భానుసారంగా వార్డ్రోబ్ను సెట్ చేసుకుంటాను. సాధారణంగా తక్కువ డబ్బులతో డ్రెస్ ఎంపిక చేసుకొని, రిచ్‌గా ఉండేలా కనిపించడానికి ప్లాన్ చేస్తుంటాను. ఇండోవెస్ట్రన్ డ్రెస్‌తోనూ హుందాతనాన్ని, మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్టైల్‌గా కనిపించవచ్చు. పెయింటింగ్స్ వేస్తుంటాను కాబట్టి కలర్ కాంబినేషన్స్ విషయంలో అవగాహన ఉంది. చాలా వరకు మ్యాచింగ్ గురించి ఆలోచన చేయను. శారీస్ మీదకు కాంట్రాస్ట్, క్రాప్‌టాప్స్, ష్రగ్స్ కూడా సెట్ చేస్తాను. కాటన్స్కి ఎక్కువ ్రపాధాన్యత ఇస్తాను. బెస్ట్ డ్రెస్డ్ అవార్డ్..మిసెస్ ఇండియా తెలంగాణ బెస్ట్ డ్రెస్డ్ ఈవెంట్ (2019)కి క్రియేటివ్‌గా ఆలోచించాలనుకున్నాను. శారీ, బ్లౌజ్‌కి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు.. మొదలైనవాటితో నేనే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేశాను. ఆ శారీనే కట్టుకున్నాను. రెండు వేల రూపాయల్లో ఆ శారీని తయారుచేసి, ప్రదర్శించి, అవార్డు దక్కించుకున్నాను.పూసలు గుచ్చి..లంగా ఓణీ, పట్టు చీరలు సంప్రదాయ వేడుకల సందర్భాలలో కట్టుకుంటాను. దీంట్లోనే ప్రత్యేకంగా కనిపించాలంటే బ్లౌజ్ సింగిల్ హ్యాండ్‌కి పూసల హారాలు లేయర్లు గుచ్చి, నాట్ చేస్తాను. దాదాపు నెలకు మూడు, నాలుగు ఈవెంట్లకు హాజరవుతుంటాను. అందుకు కొత్తదనం, నిండుదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.జిమ్ టీ షర్ట్స్..శారీస్‌కు సాధారణ బ్లౌజులే కాదు జిమ్‌కు వేసుకునే టీ షర్ట్స్ కూడా వాడతాను. బ్లాక్ క్రాప్‌టాప్ కాటన్ శారీకి వాడతాను. మంచి కలర్ కాంబినేషన్స్ ఉండేలా, సింపుల్ లుక్‌ని క్రియేట్ చేస్తాను. జిమ్‌లో మన కదలికలకు తగ్గినట్టు ఫ్లెక్సిబుల్ డ్రెస్ ఉండాలి. క్వాలిటీ కూడా చూడాలి. క్యాజువల్ వేర్‌గా జీన్స్, టీషర్ట్స్ మాత్రమే కాదు లాంగ్ స్కర్ట్స్ కూడా ఉపయోగిస్తాను.టై అండ్ డై చేస్తాను..వైట్ కాటన్ మెటీరియల్ తెప్పించుకొని, టై అండ్ డై టెక్నిక్‌తో కొత్త డిజైన్స్ సృష్టిస్తుంటాను. ఒక శారీకైతే వేరుశనగ గింజలను ముడివేసి, పెయింట్ చేశాను. త్రీడీ పెయింటింగ్స్ చేస్తుంటాను. ఏ వేస్ట్ మెటీరియల్ ఉన్నా దానిని అందంగా క్రియేట్ చేస్తాను. ఇండిపెండెంట్స్ డే వంటి అకేషన్స్‌కి ఎంచుకున్న శారీకి క్రాప్‌టాప్‌తో మ్యాచ్ చేశాను.జ్యువెలరీ తయారీ..తక్కువ ధరలో జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. కొంచెం సమయం కేటాయిస్తే చాలు అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీని మనమే ఇంకా తక్కువ ధరలో తయారుచేసుకోవచ్చు. బెల్ట్‌తో మరో స్టైలిష్ లుక్ వచ్చేలా చూసుకుంటాను. అలా.. క్లే జ్యువెలరీ, థ్రెడ్ జ్యువెలరీ నేనే తయారు చేసుకుంటాను’’ అని వివరించారు ఈ ఫిట్నెస్ ట్రైనర్.ఇవి చదవండి: 'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది! -
ఆయనకు స్త్రీ లాగా అలంకరించుకోవడం ఇష్టం!
మా ఆయన వయసు 27 ఏళ్లు. మా పెళ్లై ఏడాదయింది. ఒకరోజు రాత్రి నా దుస్తులు ధరించి అద్దంలో చూసుకుంటూ మురిసిపోవడం చూసి షాక్ తిన్నాను. ఏమిటిది అని అడిగితే అలా డ్రెస్ చేసుకుని ఆనందిస్తుంటానని చెప్పారు. నేనెంత గొడవ చేస్తున్నాన, ఆయన మాత్రం అప్పుడప్పుడు అలా చేస్తూనే ఉన్నాడు. రాత్రిపూట నా డ్రెస్ వేసుకుని, ఉదయం మార్చుకుని ఆఫీసుకు వెళుతున్నారు. ఇతరత్రా మేము హ్యాపీగానే ఉన్నాం కానీ ఈ అలవాటు ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని చాలా భయంగా ఉంది. మా వారి ఈ వింత ప్రవర్తనకు ఏదైనా పరిష్కారముందా?– సంధ్య, హన్మకొండమీ వారు ట్రాన్స్ వెస్టిజమ్ అనే ఒక అరుదైన సమస్యకు లోనయినట్లు అర్థమవుతోంది. పురుషుడు స్త్రీగాను, స్త్రీ– పురుషుడుగానూ అలంకరించుకుని లైంగికానందం పోందే ఈ వింత సమస్యకు ఒక ముఖ్య కారణం చిన్న వయసులో తల్లిదండ్రులు అమ్మాయిలు లేరని అబ్బాయిలకు గౌను, జడ వేసి పూలు పెట్టి అమ్మాయిలు లేని లోటును ఇలా తీర్చుకోవటం. మీ దాంపత్య జీవితం బాగానే ఉందన్నారు కాబట్టి కొంతవరకు నయం. మీరు ఆయనను ఎలాగైనా చికిత్సకు ఒప్పించగలిగితే సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో బిహేవియర్ మాడిఫికేషన్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లాంటి కొన్ని ప్రత్యేక మానసిక చికిత్సలు చేసి మీ వారిని ఆ ప్రవర్తన నుంచి బయట పడేయవచ్చు. కేవలం మందుల ద్వారా లేదా కౌన్సెలింగ్ ద్వారా ఇలాంటి వింత ప్రవర్తనను మార్చలేము. రెండూ అవసరమే.ప్రేమికుడు దూరమవుతాడేమో...నేను గత రెండు సంవత్సరాలనుండి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇప్పటివరకు సంతోషంగానే ఉన్నాం కానీ ఈ మధ్య నాలో ఒక కొత్త భయం మొదలయింది. తను ఇంకెవరితో అయినా కొత్తగా బంధాన్ని ఏర్పరుచుకుంటాడేమో అని.. ఈ ఆలోచన నుంచి నేను బయట పడలేక΄ోతున్నాను. దీనికి కారణం ఏంటి? ఎలా ఈ ఆలోచన నుంచి బయటపడాలి?– రాణి, జనగామమీలో ఏర్పడిన ఈ భయం కేవలం మీ ఊహ కావచ్చు. అకారణంగా కొందరిలో ఇలాంటి అభద్రతా భావాలు రావడం సహజమే! ఈ అభద్రత రావడానికి మీ రిలేషన్లో ఇటీవల ఏమైనా ఆ మార్పులు వచ్చాయా? లేక మీరు ఇంకేదైనా ఒత్తిడిలో ఉండి ఇలా ఆలోచిస్తున్నారా అని స్వయం పరిశీలన చేసుకోండి. మీ ప్రేమికుడితో మీ భయాన్ని పంచుకోండి. అతణ్ణి నొప్పించకుండా, నిందించకుండా ఎలాంటి సందర్భాలలో మీకీ భావాలు కలుగుతున్నాయో చెప్పడం ద్వారా అతను కూడా మీ బాధను అర్థం చేసుకుని, మీలోని ఫీలింగ్స్‌ను తగ్గించేందుకు తప్పకుండా సహకరిస్తాడు. మీ అభద్రత భావాన్ని అధిగమించాలంటే ఇద్దరూ కలిసి సమయాన్ని గడపటం, ఇద్దరికీ ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. దీనివల్ల మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు, ఏదైనా కొత్త హాబీ, ధ్యానం, వ్యాయామం లాంటివి చేయండి. ఇదే విషయం గురించి అతిగా ఆలోచించడం మానేసి, అతడిలో మీకు బాగా నచ్చిన విషయాలు లేదా అంశాలు ఏంటో ఒకసారి గుర్తుచేసుకోండి. దీర్ఘకాలం ΄ాటు ఉండే రిలేషన్షిప్స్లో అభద్రత కొంత సహజమే అయినప్పటికీ అది మిమ్మల్ని మరీ బాధించి, మనోవేదనకు గురి చేస్తుంటే మాత్రం ఒకసారి సైకియాట్రిస్ట్‌ను లేదా క్లినికల్ సైకాలజిస్టును మీ ఇద్దరూ కలిస్తే, మీలోని ఈ భయాన్ని, అభద్రతను తగ్గించి, మీ మధ్య సంబంధాన్ని మరింత బలపర్చేందుకు కౌన్సెలింగ్ ద్వారా తగిన సూచనలు, సలహాలు చేస్తారు. ఆల్ ద బెస్ట్!– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
‘పొగ’బెడుతున్నా...పొమ్మనలేమా?
నగరానికి చెందిన ఒక బహుళజాతి సంస్థలో ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తన యుక్తవయస్సు నుంచి ధూమపానం చేస్తున్నాడంటే... అతని ఆదాయంలో గణనీయమైన భాగాన్ని పొగాకుపై ఖర్చు చేస్తున్నట్లే అర్థం. ఉత్సుకత, తోటివారి ఒత్తిడితో, కుటుంబ సభ్యుడు ఒకరు పొగతాగుతున్నట్లు చూసిన తర్వాతే అతనికి ధూమపానం అలవాటు ప్రారంభమైంది. సామాజిక అలవాటుగా మొదలై, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఒక విధానంగా పరిణామం చెందింది. ఆరోగ్య ప్రమాదాలు తెలిసినప్పటికీ, దాన్ని విడిచిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, కష్టపడినా దాన్ని అతను ఆపలేకపోయాడు. ఇది ఒకరికే ప్రత్యేకమైనది కాదు; ఇది దేశంలోని లక్షలాది మందికి సంబంధించింది.నియంత్రణలో సవాళ్లెన్నో...భారతదేశంలో, ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన జనాభా కారణంగా పొగాకు నియంత్రణ సంక్లిష్టమైన సవాలును విసురుతుంది. పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల వల్ల వ్యక్తులు ఈ ఉత్పత్తులపై ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది వారి ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే అధిక పన్నులు అక్రమ పొగాకు వ్యాపారానికి కూడా ఆజ్యం పోస్తున్నాయి. మూడవదిగా చెపపుకోవాల్సింది పొగాకు వినియోగదారులు పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను అధికం అవుతున్నాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మరింత భారంగా మారుస్తుంది.పొగాకు వాడకంలో... రెండో స్థానం...ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి.. 2018 నాటికి 16 నుంచి 64 ఏళ్ల వయస్సు ఉన్న 250 మిలియన్ల మంది ధూమపానం చేస్తున్నారు. 2020 నాటికి 15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 27% మంది పొగాకుకు బానిసలని తేలింది.. పొగాకు వినియోగదారులతో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ముఖ్యంగా, చట్టబద్ధంగా ఉత్పత్తి చేస్తున్న సిగరెట్లు మొత్తం పొగాకు వినియోగంలో 8% మాత్రమే ఉండగా, మిగిలిన 92% బీడీలు పొగాకు నమలడం వంటి చౌకైన ఉత్పత్తులను వినియోగానిదే కావడం గమనార్హం.ఆడవారిలోనూ పెరుగుతున్న వినియోగం...జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019–21 ప్రకారం... పురుషులు స్త్రీల మధ్య పొగాకు వినియోగంలో గణనీయమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ... మరోవైపు ఆడవారిలో సైతం పొగాకు వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒత్తిడి మారుతున్న సామాజిక ఆర్ధిక పరిస్థితుల కారణంగా మగవారిలో ఇప్పటికీ పొగాకు వినియోగం గణనీయంగా ఉంది. పొగాకు వినియోగం ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఎక్కువగా ఉంది, వీరికి పొగాకు సంబంధిత హాని ఎక్కువగా ఉంటుంది. విషపూరిత పదార్థాలతో నిండి, ఫిల్టర్లు లేకపోవడం వల్ల బీడీలు సిగరెట్ కంటే ఎక్కువ హానికరమైనవి అయినప్పటికీ, బాగా వినియోగిస్తారు. . బీడీ ఉత్పత్తి మార్కెటింగ్ లపై పెద్దగా తనిఖీలకు అవకాశం లేదు. వీలు కల్పిస్తుంది. చౌకైన పొగాకు ఉత్పత్తుల విక్రయం పేదరికపు ఉచ్చును శాశ్వతం చేస్తుంది.ప్రత్యామ్నాయాలు లేక...మానలేక...యువకులలో (20–44 ఏళ్ల వయస్సులో) ధూమపానం ప్రాబల్యం ఆందోళనకరంగా ఉంది, ఇది శ్రామికశక్తిలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉందనేది మరవకూడదు. నికోటిన్ గమ్‌లు, ప్యాచ్‌లు, లాజెంజ్‌లు, హీట్–నాట్–బర్న్ వంటి ఇతర సాంకేతిక ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల 45% మంది యువకులు ధూమపానం లేదా పొగాకు నమలడం మానుకోలేకపోతున్నారని గత ఏడాది ఒక సర్వే తేటతెల్లం చేసింది. ‘హ్యూమన్–సెంట్రిక్ అప్రోచ్ టు టుబాకో కంట్రోల్’ నివేదికలోని సమీక్షకు స్పందించిన వారిలో 66% మంది 20–25 సంవత్సరాల మధ్య పొగాకును ఉపయోగించడం ప్రారంభించారని, వారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుకున్నామని గుర్తించారు.ఇది చదవండి: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!సమగ్రవిధానంతోనే పరిష్కారం...పొగాకు నివారణలో పొగాకు వినియోగానికి దోహదపడే సామాజిక సాంస్కృతిక కారకాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పొగాకుపై పూర్తి నిషేధం ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఇది పొగాకు సాగులో నిమగ్నమైన రైతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పన్ను ఆదాయాన్ని తగ్గిస్తుంది అక్రమ వ్యాపారాన్ని పెంచుతుంది. బదులుగా, విరమణ విద్య రెండింటిపై దృష్టి పెట్టి మరింత సమగ్ర విధానానికి మారాలి.అలాగే, 74% మంది ధూమపానం చేసేవారు, పొగాకు నమిలే వినియోగదారుల కుటుంబంలో పెద్దలు సైతం ధూమపానం అలవాటును కలిగి ఉన్నట్టు తెలుస్తోంది, ఈ పరిస్థితుల్లో వారికి సుదీర్ఘమైన మద్దతు అవసరం. సైన్స్ ఆధారిత పరిష్కారాలు, ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యావేత్తలు కమ్యూనిటీ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా, భారతదేశం పొగాకు వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు దానితో సంబంధం ఉన్న పేదరికం వ్యాధుల చక్రాన్ని అడ్డుకోవచ్చు. -
Health: వైట్.. రైటే! మేలు చేసే తెల్లటి ఆహారాలివి..
తెలుపు రంగులో ఉండే ఆహారాలు ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడుతుంటాయని పలువురు అభి్రపాయపడుతుంటారు. అందుకే ఆహారంలో తెల్లగా కనిపించే వాటిని పక్కన పెట్టాలంటూ కొందరు నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే తెల్లనివన్నీ కీడు చేసేవి కాదు. తెలుపు రంగులో ఉండే ఆహార పదార్థాల్లో బాగా పాలిష్ చేసిన బియ్యం (అయితే దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) దీనికి మినహాయింపు), చక్కెర, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం... ఈ మూడూ ఆరోగ్యానికి కొంత చేటు చేసేవే. అవి మినహాయిస్తే తెల్లటి రంగులో ఉండే అనేక ఆహార పదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్, వైట్ క్యాబేజీ, తెల్లవంకాయ, వైట్ మష్రూమ్స్ అనేవి ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే.మేలు చేసే తెల్లటి ఆహారాలివి..ఉల్లి, వెల్లుల్లి: తెల్లటివే అయినా తమ ఘాటుదనంతో క్యాన్సర్‌ను అవి తరిమి కొడతాయి. వాటిల్లోని అలిసిన్ అనే పోషకం (ఫైటో కెమికల్) అనేక రకాల క్యాన్సర్లను నివారించడమే కాదు... రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గిస్తుంది. పొట్ట, పెద్దపేగు మలద్వార క్యాన్సర్లతో పాటు అనేక రకాల క్యాన్సర్లతో పాటు గుండెజబ్బులను వెల్లుల్లి, ఉల్లి నివారిస్తాయి.కాలీఫ్లవర్ / వైట్ క్యాబేజీ: వీటిల్లో సమృద్ధిగా ఉండే ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు చురుకుదనాన్నీ ఇస్తాయి.తెల్లముల్లంగి: ఈ దుంప ఎరుపుతో పాటు తెల్లరంగులోనూ లభ్యమవుతుంది. దీన్ని చాలా శక్తిమంతమైన డీ–టాక్సిఫైయర్గా చెబుతారు. అంటే దేహంలో పేరుకున్న విషాలను బయటికి పంపి, కాలేయానికి చాలా మేలు చేస్తుందది. కామెర్లు వచ్చిన వాళ్లలో నాశమయ్యే ఎర్రరక్తకణాలను కాపాడటం ద్వారా కణాలన్నింటికీ పోషకాలూ, ఆక్సిజన్ సాఫీగా అందేలా తోడ్పడుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడదని చెప్పే దుంపకూరల్లో ముల్లంగికి మినహాయింపు ఉంటుంది. దానిలో ఉండే ఫైబర్ కారణంగా అది దేహంలోకి చక్కెర చాలా మెల్లగా విడుదలయ్యేలా చేయడం ద్వారా రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుతుంది. ముల్లంగిలోనూ క్యాన్సర్‌ను ఎదుర్కొనే యాంటీ–క్యాన్సరస్ గుణాలున్నాయి. వీటిలోని యాంటీఫంగల్ ్రపోటీన్ ‘ఆర్ఎస్ఏఎఫ్పీ2’ ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది.అలాగే తెల్లవంకాయ, తెల్ల మష్రూమ్స్ వ్యాధినిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. వాటిల్లోని బీటా–గ్లూకాన్స్ అని పిలిచే పాలీసాకరైడ్స్ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. తద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇక వాటిల్లో ఉండే ఎపిగల్లాకాటెచిన్ గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం క్యాన్సర్‌తో పాటు ఎన్నెన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది.ఇవి చదవండి: మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు! -
మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు!
ఆ వైద్యసమస్య పేరే ‘హౌజ్ మెయిడ్ నీ పెయిన్’! వైద్య పరిభాషలో ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’ అనే ఓ జబ్బుకు పనిమనిషి పేరు పెట్టడం విశేషం. వాడుక పేరుగా పనిమనిషి (మెయిడ్) పేరు పెట్టిన ఆ జబ్బును ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. ఇంటిని తుడిచే వారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడుస్తూ ఉండటంతో మోకాళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంది. అందుకే ఆ జబ్బుకు ఆ పేరు.అలాగని అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారందరిలో (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ)నూ ఆ జబ్బు కనిపిస్తుంది. ఇంకా చె΄్పాలంటే ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకు కూడా ఈ నొప్పి వస్తుంటుంది. ఇలా ఎంతోమందిలో ఆ జబ్బు కనిపిస్తున్నప్పటికీ దానికి ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరు స్థిరపడింది.చికిత్స...నొప్పి తొలిదశల్లో మోకాలికి ఐస్ పెట్టడం, పడుకునే/నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మోకాలి కింద దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేయాలి. ఆటగాళ్లకు లేదా ఇతరత్రా వృత్తుల్లోని వారికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులను ఇస్తారు. సూచిస్తారు. ఇక క్రీడాకారుల్లో ఈ సమస్య రాకుండా నివారించేందుకు ‘నీ–΄్యాడ్స్’ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు... మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్‌కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తుంటారు. -
Health: అనీమియా వద్దు... ‘ఐరన్’ లేడీలా ఉందాం!
రక్తహీనత పురుషులూ, మహిళలూ, చిన్నారులూ ఇలా అందరిలోనూ కనిపించే సమస్యే అయినా మహిళల్లో మరింత ఎక్కువ. భారతీయ మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలూ, కేస్ స్టడీస్ చెబుతున్నాయి. నెలసరి వంటి సమస్యలు మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేందుకు కారణమవుతున్నాయి. రక్తహీనత అంటే ఏమిటి, సమస్య పరిష్కారం కోసం మహిళలు అనుసరించాల్సిందేమిటి అనే విషయాలను చూద్దాం...ఎర్రరక్తకణాలు మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళ్తుంటాయి. వాటి సంఖ్య తగ్గడం వల్ల అన్ని అవయవాలకూ తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్‌లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం కారణం. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు.లక్షణాలు.. – అనీమియా లక్షణాలు కొందరు మహిళల్లో కాస్త తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోవడం వల్ల చర్మం పాలిపోయినట్లు కనిపించడం, గోర్ల కింద రక్తం లేనట్టుగా తెల్లగా కనిపించడాన్ని అనీమియాకు సూచనగా పరిగణించవచ్చు. అనీమియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు...– శ్వాస కష్టంగా ఉండటం– కొద్దిపాటి నడకకే ఆయాసం– అలసట– చికాకు / చిరాకు / కోపం– మగత– తలనొప్పి– నిద్రపట్టకపోవడం– పాదాలలో నీరు చేరడం– ఆకలి తగ్గడం– కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, చల్లగా మారడం– ఛాతీనొప్పి– త్వరగా భావోద్వేగాలకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణమేమిటో తెలుసుకోవాలి. అసలు కారణాన్ని తెలుసుకుని దానికి సరైన చికిత్స ఇస్తే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి అనంతర చికిత్స తీసుకోవాలి.జాగ్రత్తలు / చికిత్స..ఐరన్ పుష్కలంగా లభించే ఆహారం అయిన కాలేయం, ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైనవారు డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. ఇలాంటి టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ల సలహా మేరకు వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి.కారణాలు..మహిళలు తమ నెలసరి వల్ల ప్రతి నెలా రక్తాన్ని కోల్పోతుంటారు. కాబట్టి వాళ్లలో రక్తహీనతకు అది ప్రధాన కారణం. మరి కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. -
Health: క్రానిక్... పానిక్.. వేడివేడిగా బాడీ రిపేర్!
దేహంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశించడం గానీ లేదా ఏవైనా గాయాలైనప్పుడుగానీ ఆ హానికారక సూక్ష్మజీవులతో పోరాడి, శరీరాన్ని రక్షించుకునేందుకు రోగ నిరోధక వ్యవస్థ... ఇన్ఫ్లమేషన్ అనే స్వాభావికమైన చర్య జరిగేలా చూస్తుంది. తెల్లరక్తకణాలపై. దేహాన్ని రక్షించేందుకు అవసరమైన కొన్ని రసాయనాలను పంపుతుంది.గాయమైనప్పుడు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపురావడం, మంట అనిపించడం గమనించవచ్చు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ... ఆ గాయాన్ని మాన్పే పని మొదలుపెట్టిందనేందుకు నిదర్శనాలే ఆ గుర్తులు. ఉదాహరణకు ఒకరి వేలు తెగిందనుకుందాం. వెంటనే వ్యాధి నిరోధక వ్యవస్థ రంగంలోకి దూకుతుంది. తెగిన ప్రాంతం చుట్టూ ఎర్రబడి, వాపు వస్తుంది. తెగడంతో గాయమైన కణజాలాన్ని రిపేరు చేసేందుకు ఉపక్రమించాయన్నమాట.అలాగే జలుబు చేసినా లేదా దేహంలోకి జలుబు కలగజేసే వైరస్‌లాంటిది ఇంకోటి ఏదో ప్రవేశించిందంటే... దాన్ని తుదముట్టించేందుకు జ్వరం వస్తుంది. అంటే దేహం ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఆ వేడిమి సహాయంతో శత్రు వైరస్‌ను కాల్చేటందుకే దేహపు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే జ్వరం అనేది దేహం తాలూకు ఓ ‘ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్’ అన్నమాట.కొద్దికాలం పాటు మాత్రమే ఉండే ఇన్ఫ్లమేషన్ను ‘అక్యూట్ ఇన్ఫ్లమేషన్’ అనీ, అదే దీర్ఘకాలం పాటు కొనసాగితే దాన్ని ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ అని వ్యవహరిస్తారు. అక్యూట్ ఇన్ఫ్లమేషన్తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చుగానీ... చాలాకాలం పాటు ఉండే ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ మాత్రం ఒక్కోసారి చాలా ప్రమాదకరం.ఒక ఇన్ఫ్లమేషన్ చాలాకాలం పాటు కొనసాగుతోందంటే... శత్రువును ఎదుర్కొనేందుకు దేహం, దాని తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా, సుదీర్ఘకాలం పాటు అలర్ట్‌గా ఉన్నాయని అర్థం.ఓ వ్యక్తి అనారోగ్యకరమైన జీవనశైలితో జీవిస్తున్నా, అతడు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నా, అతడు తీసుకుంటున్న ఆహారం అంతగా ఆరోగ్యకరంగా లేకపోయినా... ఈ అంశాలన్నీ అతడిలోకి వ్యాధి నిరోధక వ్యవస్థపై ఒత్తిడి కలగజేస్తూ, దాన్ని ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచుతాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ సుదీర్ఘకాలం పాటు (క్రానిక్‌గా) కొనసాగుతుంది. అప్పుడా పోరాటం శత్రుకణాల మీద కాకుండా సొంత కణాల మీదే జరుగుతుండటం వల్ల... ఈ పోరులో ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటుంటాయి.ఉదాహరణకు ఓ వ్యక్తి తీసుకునే ఆహారంలో ్రపాసెస్డ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నా లేదా చక్కెరలను ఎక్కువగా తీసుకుంటున్నా అతడిలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. అది సుదీర్ఘకాలం కొనసాగుతున్నందు ఆరోగ్యవంతమైన కణాలనూ నాశనం చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సుదీర్ఘ ఇన్ఫ్లమేషన్స్తో ఆరోగ్యవంతమైన కణజాల వ్యవస్థలు దెబ్బతినడంతో అక్రమంగా గుండెజబ్బులు, డయాబెటిస్తో పాటు కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీయవచ్చు. ఇక ఆ ఇన్ఫ్లమేషన్ జీర్ణవ్యవస్థలో వస్తే అది ఆరోగ్యంపై రకారకాల దుష్ప్రభావాలను కలగజేయవచ్చు.ఓ వ్యక్తిలో అతడి జీర్ణవ్యవస్థ చాలా కీలకమైనది. ఆహారాన్ని జీర్ణం చేయడం ద్వారా అది దేహంలోని కోటానుకోట్ల (ట్రిలియన్లకొద్దీ) కణాలకు జీవశక్తిని అందజేయడం, అక్కడ వ్యర్థాలను తొలగించడం వంటి పనులు చేస్తుంది. ఈ జీర్ణవ్యవస్థే దేహానికి మేలు చేసే ట్రిలియన్లకొద్దీ సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)కు ఆవాసం. వీటినే గట్ మైక్రోబియమ్ అంటారు. ఒక వ్యక్తి తాలూకు మూడ్స్ (భావోద్వేగాల)కూ ఇవే కారణం. అతడి వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలోనూ ఇవే కీలకం. అన్నట్టు వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన కణజాలంలో 70 – 80 శాతం వరకు జీర్ణవ్యవస్థలోనే ఉండటమనే అంశం కూడా ఓ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థకు అతడి జీర్ణవ్యవస్థ ఎంతగా ఊతం ఇస్తుందో ఈ అంశం తెలియజేస్తుంది.ఇంతటి కీలకమైన జీర్ణవ్యవస్థలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే అది ‘లీకీ గట్ సిండ్రోమ్’ లాంటి ఎన్నో అనర్థాలకు దారితీయవచ్చు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఇలా పేగుల్లోని గోడలు చిట్లడం జరిగితే దేహంలోని ప్రమాదకరమైన విషపదార్థాలూ, జీర్ణం కాని వ్యర్థాలూ, బ్యాక్టీరియా.. ఇవన్నీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ మరింత ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తుంది. దాంతో సొంత వ్యాధినిరోధక వ్యవస్థే తన కణజాలంపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వంటి వ్యాధులూ, చర్మరోగాలు, కీళ్లనొప్పులు వస్తాయి. ఇక మానసిక సమస్యలైన డిప్రెషన్ వంటివీ రావచ్చు.జీర్ణవ్యవస్థలో వచ్చే ఇన్ఫ్లమేషన్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అయిన గట్ మైక్రోబియమ్ సమతౌల్యతను దెబ్బతీయవచ్చు. దాంతో కడుపుబ్బరం, మలబద్ధకం, నీళ్ల విరేచనాలు వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక అనారోగ్యాలు కనిపించవచ్చు. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడేందుకూ అవకాశముంది. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల ఇన్ఫ్లమేషన్... మళ్లీ ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మైక్రోబియమ్ సమతౌల్యత మరింత దెబ్బతినడం... ఈ విషవలయం ఇలా కొనసాగుతూ జీర్ణవ్యవస్థ మరింతగా దెబ్బతింటుంది. దాంతో జీర్ణవ్యవస్థ పనితీరూ దెబ్బతింటుంది.అందుకే జీర్ణవ్యవస్థ బాగుంటేనే వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషకరమైన భావోద్వేగలతో మూడ్స్ బాగుంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలిక (క్రానిక్) ఇన్ఫ్లమేషన్స్ సైతం తగ్గుతాయి. ఇతర దీర్ఘకాలిక జబ్బులు... అంటే గుండెజబ్బులు, ఊబకాయం, డయాబెటిస్ వంటివి నివారితమవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉందంటే... దేహమంతా ఆరోగ్యంగా ఉందనీ, వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా ఉందని అర్థం. -
Health: సొ'షై'టీ తెచ్చే.. యూరి'నారీ' ప్రాబ్లెమ్స్!
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. దీనికి తోడు బయటకు వెళ్లి పనిచేసే మహిళల్లో అంటే వర్కింగ్ ఉమెన్‌లో ఈ సమస్యలు మరింత ఎక్కువ. అంతేకాదు... ఈ సమస్యలు కేవలం వర్కింగ్ ఉమెన్లోనే కాకుండా స్కూళ్లు కాలేజీలకు వెళ్లే బాలికలు, యువతుల్లోనూ అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన వృత్తుల్లో ఉన్న మహిళల్లోనూ కనిపించవచ్చు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.గృహిణుల (హోమ్ మేకర్స్)తో పోలిస్తే బయటికి వెళ్లి పనిచేసే మహిళలు (వర్కింగ్ ఉమెన్) తమకు ఉన్న కొన్ని రకాల పరిమితుల కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుండటంతోపాటు మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా బయట వాళ్లకు వసతిలేని కారణంగా ఎక్కువసేపు ఆపుకుంటుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి...1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... మళ్లీ ఈ మూత్ర విసర్జన సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి రావడం. ఇవిగాక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా కిడ్నీల్లో రాళ్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది.ఎందుకీ సమస్యలు..సాధారణంగా వర్కింగ్ ఉమెన్ మూత్రవిసర్జన చేసే పరిస్థితి రాకుండా ఉండటం కోసం నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. సౌకర్యాలు బాగుండే కొన్ని పెద్ద / కార్పొరేట్ ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు.ఇక మూత్రవిసర్జన చేయాల్సివచ్చినప్పుడు బయటి రెస్ట్రూమ్/బాత్రూమ్లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనకు వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఇలా బిగబట్టడం చాలాకాలం పాటు కొనసాగితే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఆ సమస్యలేమిటో చూద్దాం.మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు (యూటీఐ) : మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... మూత్రపిండాలు దేహంలోని వ్యర్థాలను వడపోశాక, వ్యర్థాలను మూత్రం రూపంలో ఓ కండరనిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతాయి. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి.మూత్రాన్ని చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుతుంటే అక్కడ బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది. ఆ బ్యాక్టీరియా కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐ) వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అని అంటారు. ఇది కొంచెం సీరియస్ సమస్య.లక్షణాలు..మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాలని అనిపిస్తుండటం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.నిర్ధారణ పరీక్షలు..సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య మాటిమాటికీ వస్తుంటే అందుకు కారణాలు తెలుసుకునేందుకు కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. సాధారణంగా ∙సీయూఈ ∙యూరిన్ కల్చర్ ∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ ∙సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి) ∙సిస్టోస్కోప్ (యూటీఐ) ∙అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు చేస్తుంటారు. చికిత్స..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేస్తుంటారు. అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ఇంకా ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు.బ్లాడర్ సంబంధమైన సమస్యలు..యూరినరీ బ్లాడర్ దాదాపు 500 ఎమ్ఎల్ మూత్రం నిల్వ ఉండే సామర్థ్యంతో ఉంటుంది. మూత్రం చాలాసేపు ఆపుకునేవారికి రెండు రకాల సమస్యలొస్తుంటాయి. మొదటిది... అదేపనిగా ఆపుకుంటూ ఉంటే బ్లాడర్ కండరాలు క్రమంగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాంటప్పుడు 200 ఎమ్ఎల్ మూత్రం నిల్వకాగానే మూత్రవిసర్జన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంతగా ఆపుకుందామన్నా ఆగక... మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇక రెండో రకం సమస్యలో... తరచూ మూత్రాన్ని ఆపుకోవడం అలవాటైపోవడంతో మూత్రాన్ని ఆపేందుకు ఉపయోగపడే స్ఫింక్టర్ కండరాలు గట్టిగా బిగుసుకుపోతాయి. ఈ రెండు రకాల సమస్యల్లో బ్లాడర్ పనితీరు (బ్లాడర్ ఫంక్షన్) తగ్గుతుంది. కొన్నాళ్ల తర్వాత అర్జెంట్‌గా వెళ్లాల్సి రావడం... లేదా కొంతమందిలో పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్‌లో కొంత మిగిలిపోయుంటుంది. ఈ రకమైన సమస్యను ‘డిస్ఫంక్షనల్ వాయిడింగ్’ అంటారు.లక్షణాలు..మూత్రం వస్తున్న ఫీలింగ్ కలిగినప్పుడు మూత్రానికి వెళ్తే... స్ఫింక్టర్ కండరాలు బిగుసుకుపోయి, ఎంతకీ రిలాక్స్ కాకపోవడంతో మూత్ర విసర్జన ఓ సమస్యగా మారుతుంది. మూత్రం సాఫీగా తేలిగ్గా రాదు, మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది.నిర్ధారణ / చికిత్స..బ్లాడర్ ఫంక్షన్ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా నొప్పిని నివారించే మందులతోనూ, కండరాలను రిలాక్స్ చేసే ఔషధాలతో చికిత్స అందిస్తారు.మూత్రపిండాల్లో రాళ్లు..ఇవి అనేక కారణాలతో వచ్చినప్పటికీ వర్కింగ్ ఉమన్‌లో మాత్రం నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఇవి వస్తుంటాయి. ఎక్కువగా నీరు తాగని వారిలో వ్యర్థాలు స్ఫటికంలా మారడంతో ఇవి వస్తుంటాయి. ఇవి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. ఏర్పడ్డ స్ఫటికం సైజును బట్టి రకరకాల చికిత్సలు అవసరమవుతాయి.నివారణ / పరిష్కారాలు..ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వంటి చికిత్సలు తీసుకోవడం కంటే ఈ సమస్యల నివారణ కోసం జాగ్రత్తలు అవసరం. బయటకు వెళ్లిన మహిళల మూత్రవిసర్జనకు మనదగ్గర పెద్దగా వసతులు ఉండవు. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య కూడా. ఈ సమస్యతో వచ్చే మహిళలకు డాక్టర్లు కొంత కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా నివారణ చర్యలను తెలుపుతారు. అవి...– మహిళలకు బయటి బాత్రూమ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెరుకువీడి దేహ జీవక్రియలను అవసరమైనన్ని నీళ్లు తాగుతుండాలి. – మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి మినహా... వస్తున్నట్లు అనిపించగానే మూత్రవిసర్జనకు వెళ్లాలి.– మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొన్ని రకాల ఫాస్ట్‌ఫుడ్, యానిమల్ ్రపోటీన్, చీజ్, చాక్లెట్ల వంటివి వీలైనంత తక్కువగా తీసుకోవాలి. కొన్ని ఆహారాల కారణంగా కొందరిలో స్ఫటికాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాంటివారు తమకు సరిపడనివాటిని వాటికి దూరంగా ఉండాలి.ఇవి చదవండి: సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు