Fire Accident
-
ఇంగ్లండ్ తీరంలో రెండు నౌకలు ఢీ
లండన్: ఇంగ్లండ్ తూర్పు తీరంలో ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక ఢీకొన్న ఘటనలో రెండు ఓడలకు మంటలు అంటుకున్నాయి. హల్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం 9.48 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు నౌకల్లోని మొత్తం 37 మందిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చినట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారని స్థానిక ప్రజా ప్రతినిధి గ్రాహం స్టువార్ట్ చెప్పారు. వీరిలో తీవ్రగాయాలతో ఉన్న ఒకరిని ఆస్పత్రిలో చేర్పించారన్నారు. గ్రీస్ నుంచి వచ్చిన అమెరికాకు చెందిన ఎంవీ స్టెనా ఇమాక్యులేట్ పేరున్న ఆయిల్ ట్యాంకర్ గ్రీమ్స్‌బీ పోర్టులో లంగరేసి ఉంది. అదే సమయంలో, స్కాట్లాండ్ నుంచి నెదర్లాండ్స్‌లోని పోటర్‌డ్యామ్ వైపు వెళ్తున్న పోర్చుగల్ సరుకు నౌక సొలొంగ్ దానిని ఢీకొట్టింది. దీంతో, రెండు ఓడల్లో మంటలు చెలరేగాయి. సరుకు ఓడలో సోడియం సైనైడ్ అనే విషపూరిత రసాయన కంటెయినర్లు ఉన్నట్టు సమాచారం. బ్రిటన్ మారిటైం కోస్ట్‌గార్డ్ ఏజెన్సీ ఆ ప్రాంతానికి లైఫ్బోట్లను, రెస్క్యూ హెలి కాప్టర్‌ను పంపించింది. నౌకల్లో నుంచి బయటకు దూకిన వారిని లైఫ్బోట్లలో రక్షించి ఒడ్డుకు చేర్చారు. కాగా, స్టెనా ఇమాక్యులేట్ ఓడలో జెట్–ఏ1 ఇంధనం రవాణా అవుతోందని అమెరికాకు చెందిన మారిటైం మేనేజ్మెంట్ సంస్థ క్రౌలీ తెలిపింది. సరుకు నౌక ఢీకొట్టడంతో ట్యాంకర్ దెబ్బతిని ఇంధనం లీకైంది. దీంతో మంటలు వ్యాపించడంతోపాటు పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు వెల్లడించింది. ట్యాంకర్ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు క్రౌలీ వివరించింది. అమెరికా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని ఈ సంస్థ సరఫరా చేస్తుంది. -
Hyd: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీ మదీనా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘన్సీ బజార్ లోని హోల్ సేల్ క్లాత్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. ఆ ఐదంతస్తుల భవనంలో చిక్కుకున్న వారిని రక్షించే యత్నం చేస్తున్నారు. -
విశాఖ కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో, కైలాసగిరిపై ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. విశాఖలోని కైలాసగిరిపై శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అయితే, కైలాసగిరిపై వ్యాపారస్తులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు పర్యాటకులు చెబుతున్నారు. శుక్రవారం పాత టైర్లను తగలబెట్టడంతోనే మంటలు అంటుకున్నట్టు పలువురు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆరోపిస్తున్నారు. భద్రతను గాలికి వదిలేసినట్టు తెలిపారు. -
పాతబస్తీ బహదూర్‌పురాలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బహదూర్‌పుర క్రాస్ రోడ్డులో స్థానికంగా ఉన్న లారీ మెకానికల్ వర్క్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదం ధాటికి పక్కనే మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. అయితే, అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. -
కాకినాడ బాలాజీ ఎక్స్‌పోర్ట్‌లో భారీ పేలుడు
-
మూడు ప్రాణాలు బలి
మణికొండ(హైదరాబాద్): గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ పాషా కాలనీలో శుక్రవారం సాయంత్రం విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కారులోని గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మరింత ఉద్ధృతమై భవనంలోని మొదటి అంతస్తుకు వ్యాపించడంతో కిచెన్ గదిలోని రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఓ గదిలో ఇరుక్కుపోయిన ఉస్మాన్‌ఖాన్ తల్లి జమిలాఖాతమ్ (78), అతని తమ్ముడి భార్య శాహినా ఖాతమ్ (38), తమ్ముడి కూతురు సిజ్రా ఖాతమ్ (4)లు ఊపిరి ఆడకపోవడంతో గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందికి దూకి.. మంటల నుంచి తప్పించుకునేందుకు చుట్టుపక్కల వారు బాధితుల ఇంటి ముందు పరుపులు వేయగా.. ఉస్మాన్‌ఖాన్ తమ్ముడు యూసుఫ్‌ఖాన్, కుమారుడు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకారు. దీంతో యూసుఫ్ ఖాన్ కాలు విరిగింది. గాయపడిన యూసుఫ్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్ని మాపక శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్లాట్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. అగి్నమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత పైఅంతస్తుకు వెళ్లి గోడలకు రంగులు వేసే జూల ద్వారా ఇద్దరిని సురక్షితంగా కిందికి తీసుకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు మొదటి అంతస్తు నుంచి దూకి, ఇద్దరు జూల ద్వార కిందికి వచ్చి ప్రాణాలను కాపాడుకోగా.. ఇద్దరు మహిళలు, బాలిక మృతి చెందారు. ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
Narsingi : అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ : నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.పోలీసుల వివరాల మేరకు నార్సింగిలోని స్థానికంగా పాషా నగర్ కాలనీలోని జీ ప్లస్ టూ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్క్ చేసి ఉన్న కారులో మంటలు వ్యాపించాయి. కారులో వేడి తీవ్రత కారణంగా మంటలు భవనం మొత్తం వ్యాపించాయి.అగ్ని ప్రమాదంతో భవనంలో నివాసం ఉంటున్న ఇద్దరు పిల్లలు కిందకి దూకారు. మంటల దాటికి గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు జమీలా, సహానా,నాలుగేళ్ల చిన్నారి షీర్జా మరణించారు.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
దేవుడి దీపమే.. ఆ ఇంటికి శాపమైంది
శ్రీకాకుళం జిల్లా: ఆ కుటుంబానికి దీపమే శాపమైంది. కష్టార్జితాన్నంతా బూడిద చేసింది. వజ్రపుకొత్తూరు మండలం కొండవూరుకు చెందిన అడ్డి రమణ, విమల దంపతులు బుధవారం మహా శివరాత్రి పర్వదినాన ఇంట్లో దేవుడికి దీపం వెలిగించి శివాలయానికి వెళ్లారు. తిరిగి వచ్చే లోగా అగ్ని ప్రమాదం సంభవించడంతో తీరని నష్టం వాటిల్లింది. అప్పు తీర్చేందుకు తెచ్చిన రూ.1.15 లక్షల నగదు కాలిపోయింది. మూడు తులాల బంగారం, వెండి, విలువైన పత్రాలు, ఎల్ఐసీ పాలసీ బాండ్లు, దుస్తు లు, ఇతర సామగ్రి బూడిదైపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కష్టార్జితం కాలిపోయింది.. మంకినమ్మ దాసుడైన అడ్డి రమణ.. కౌలు రైతు. భార్యాబిడ్డలతో కలిసి రేకుల ఇంట్లోనే నివాసముంటున్నాడు. గ్రామంలో ఓ వ్యక్తికి లక్ష రూపాయలు బాకీ ఉండటంతో గేదెలు అమ్మాడు. రూ.1.15 లక్షలు రావడంతో ఇంటిలోని దేవుడి మూల దాచిపెట్టాడు. రేపోమాపో అప్పు తీర్చుదామనుకోగా ఇంతలో ప్రమాదం జరగడడంతో లబోదిబోమంటున్నాడు. కాగా, ఈ ప్రమాదంలో కొంత సొమ్ము పాక్షికంగా కాలిందని, బ్యాంక్ అధికారులు స్పందించి చెల్లుబాటేయ్యేలా చూసి బాధితుడిని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కొల్లి భాస్కరరావు కోరారు. ఇదే విషయాన్ని వీఆర్ఓ, తహసీల్దార్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. -
విశాఖలోని హోటల్ డాడీ గ్రాండ్ లో అగ్నిప్రమాదం
-
కారులో మంటలు
-
4 లక్షల ఎకరాల్లో ఫ్రీహోల్డ్ రద్దు
మదనపల్లె: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో, నిబంధనలకు విరుద్ధంగా చేసిన 4 లక్షల ఎకరాల భూములను రద్దు చేసినట్లు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా అన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అగ్నిప్రమాద ఘటన తర్వాత ఆధునికీకరించిన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...గతేడాది జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు 2,400 ఫైళ్లు కాలిపోయాయన్నారు. ఈ ఫైళ్లకు సంబంధించి ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లో లింకుల ద్వారా వాటిని రీ క్రియేట్ చేశామని చెప్పారు. 22(ఏ) ఫైల్స్‌కు సంబంధించి విచారణ జరుగుతోందన్నారు. ప్రమాద ఘటన జరిగిన తర్వాత మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో బాధితులు తనకు 480 అర్జీలు సమర్పించారని, వాటిలో 80 శాతం వరకు పరిష్కరించామని తెలిపారు. మిగిలిన 20 శాతం కోర్టు కేసులు, ఆర్వోఆర్, వెరిఫికేషన్స్ కారణంగా నిలిచిపోయాయని, త్వరలో వాటినీ పరిష్కరిస్తామన్నారు. సబ్ కలెక్టరేట్ అగ్నిప్రమాద ఘటన దర్యాప్తు మరింత లోతుగా జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఫ్రీహోల్డ్ భూముల్లో 25 వేల ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. వాటిలో 8 వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామని, వాటిని రద్దుచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. -
Delhi: చుట్టుముట్టిన అగ్ని కీలలు.. రెండో అంతస్థు నుంచి దూకి..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని నాంగ్లోయీలోని ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భవన్నాన్నంతటినీ చుట్టుముట్టాయి. మంగళవారం పొద్దుపోయాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భవనంలో ఉంటున్నవారంతా భయాందోళనలకు లోనయ్యారు. అయితే వారంతా అప్రమత్తమై, తమ బాల్కనీలలోనికి చేరుకుని ఒక్కొక్కరుగా రెండో అంతస్థు నుంచి దూకారు. ఈ నేపధ్యంలో వారంతా గాయాలపాలయ్యారు. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమేమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు. देखिए एक घर में लगी भयंकर आग,एक शख़्स दूसरी मंज़िल से कूद पड़ा आग लगने की घटना दिल्ली नांगलोई फोन मार्किट कल देर रात की है , जिसका वीडियो सामने आया है बताया जा रहा है गैस लीक होने की वजह से एक घर की पहली मंजिल पर आग लग गई थी,दूसरी मंज़िल पर से एक व्यक्ति ने छलांग लगा दी जो घायल… pic.twitter.com/MvwtDgwzua— Lavely Bakshi (@lavelybakshi) February 18, 2025ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో భవనంలో ఎగసిపడుతున్న మంటలను, బాల్కనీలో నుంచి దూకుతున్నవారిని చూడవచ్చు. అలాగే అక్కడే ఉన్న ఫైర్ బ్రిగేడ్ మంటలు ఆపే ప్రయత్నం చేయడాన్ని కూడా గమనించవచ్చు. భవనంలో వ్యాపించిన మంటల నుంచి మొత్తం ఆరుగురు రెండో అంతస్థు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ -
రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్నిప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా : రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్లో మంటలు చెలరేగాయి. కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి ఎగిసి పడుతున్నాయి. మంటలు వ్యాపించడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతైన పండ్లు నిల్వ ఉంచిన షెడ్డు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది.ఇతర షాపులకు వ్యాపించకుండా మంటల్ని పండ్ల వ్యాపారులు, స్థానికులు అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. -
విజయవాడ జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)
-
ఎలక్ట్రికల్ షాపులో మంటలు!
జనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులోని జై భవానీ ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ దుకాణంలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. రాత్రి 10.30 గంటలకు వ్యాపారి షాపు మూసివేసి పైఅంతస్తులో ఉన్న ఇంటికి వెళ్లి పోయారు. పది నిమి షాల వ్యవధిలోనే షట్టర్ లోపల నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించి అలర్ట్ చేశారు. అప్పటికే దుకాణం లోపల నుంచి మంటలు ఎగసి పడ్డాయి. పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా.. సమీప దుకాణాలకు మంటలు వ్యాప్తి చెందే క్రమంలో బోరు మోటారు పైపులతో మంటలను చల్లార్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మెకానిక్, టైర్లు, ఆటో మొబైల్, తదితర షాపుల వరకు స్వల్ప మంటలు వ్యాప్తి చెందడంతో దుకాణదారులు ఆందోళన చెందారు. పది నిమిషా ల లోపు జనగామ ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే కెమికల్‌తో వాటర్ స్ప్రే చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ఫైర్ ఇంజిన్ కూడా రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో రూ.50లక్షల వరకు నష్టం జరగవచ్చని అంచనా. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ పండేరి చేతన నితిన్, సీఐలు దామోదర్‌రెడ్డి, అబ్బయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఎస్సైలు రాజేష్, రాజన్‌బాబు, సిబ్బంది, ఫైర్ సేఫ్టీ అధికారులకు సహకారం అందించారు.కుటుంబ సభ్యులు సేఫ్మంటలు చెలరేగిన సమయంలో జై భవానీ దుకాణం కుటుంబ సభ్యులు, అందులో పని చేసే సుమారు 15 మంది కార్మికులు పై అంతస్తులోనే ఉన్నారు. మంటలు పైకి చేరుకునే లోపే వారిని వెనక భాగం నుంచి కిందకు దింపడంతో అంతా సేఫ్‌గా బయట పడ్డారు. దుకాణం లోపల ఎగసి పడుతున్న మంటలు ఆర్పేందుకు షట్టర్లను పగుల గొట్టారు. జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మి, విజయ షాపింగ్ మాల్స్ దగ్ధమైన సంఘటన మరువక ముందే... జైభవానీ షాపులో మంటలు చెలరేగడం వ్యాపారులతో పాటు పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. -
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్లో బుధవారం మధ్యాహ్నం సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల కారణంగా సమీప నివాసాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. -
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
-
HYD: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని మదీనా, అబ్బాస్ టవర్స్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.వివరాల ప్రకారం.. పాతబస్తీలోని దివాన్‌దేవిడిలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మదీనా, అబ్బాస్ టవర్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో భవనం నాలుగో అంతస్తులోని వస్త్ర దుకాణం నుంచి వచ్చిన మంటలు.. పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి.ఎగిసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి: జిల్లాలోని మైలర్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో పోలీసులకు,ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలువ్యాపించడంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగింది ప్లాస్టిక్ కంపెనీలో కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మంటలపై విచారణ
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద రోడ్డు వెంబడి ఏర్పడిన మంటలపై తాడేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం విచారణ చేపట్టారు. దీన్లోభాగంగా గుంటూరు జిల్లా లా అండ్ ఆర్డర్ ఎస్పీ రవికుమార్, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు పర్యవేక్షణలో గుంటూరు జిల్లా ఎఫ్ఎస్ఎల్ బృందం, ఫోరెన్సిక్ బృందాలు మంటలు ఏర్పడిన ప్రాంతం వద్ద ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు, ఎస్ఐలు ఖాజావలి, జె. శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్కులో మంటలు చెలరేగడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాడేపల్లి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి చెప్పారు. తరచూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవ చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతకు భంగం కలిగేలా నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం
లక్నో: కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంపై ఎస్పీ సర్వేష్ కుమార్ స్పందించారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కొద్ది రోజల క్రితం సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఓ గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంట్లు ఆహుతయ్యాయని పోలీసులు తెలిపారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. #WATCH | Prayagraj | The Fire that broke out in Sector 18, Shankaracharya Marg of Maha Kumbh Mela Kshetra has been brought under controlThere has been no loss of lives. The reason behind the fire is under investigation..." says SP city Sarvesh Kumar Mishra pic.twitter.com/SBshdMCkrT— ANI (@ANI) February 7, 2025అంతకుముందు .. ఇదే కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలతో అప్రమత్తమైన సీఎం యోగీ సర్కార్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ వరుస ప్రమాదాలు జరుగుతుండడంపై యోగీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
హద్దులు మీరిన అభిమానం.. థియేటర్లోనే అరాచకం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిత్ తిరుమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో తలా అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద బాణాసంచా కాలుస్తూ అభిమాన హీరో సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.రిలీజ్ మొదటి రోజు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఓవరాక్షన్ చేశారు. ఏకంగా థియేటర్ లోపల బాణాసంచా పేల్చి అరాచకం సృష్టించారు. మరికొందరు అభిమానులైతే థియేటర్ వెలుపల పోలీసులతో గొడవపడ్డారు. కొందరు ఫ్యాన్స్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అగ్నిప్రమాదం జరిగి ఉంటే..అజిత్ కుమార్ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్స్ మండిపడుతున్నారు. థియేటర్ వెలుపల బాణాసంచా కాల్చి సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఉంటే మీ అందరి ప్రాణాలు పోయేవని హెచ్చరిస్తున్నారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా హీరోపై అభిమానం ఉండాలే కానీ.. అది ప్రాణాలు తీసేలా ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.Sambavam pannitanuga😭😭😭#VidaaMuyarchi #VidaaMuyarchiBookings https://t.co/GI1XfPHbM3 pic.twitter.com/yvQucbNe82— 𝓐𝓻𝓪𝓿𝓲𝓷𝓭❤️ (@_Aravind_15) February 5, 2025 -
వైఎస్ జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం.. భద్రతా లోపమే కారణం?
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం, రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరోసారి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ప్రమాదం కొందరు ఆకతాయిల కారణంగానే జరిగినట్టు తెలుస్తోంది. భద్రతాలోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టు వైఎస్సార్సీపీ చెబుతోంది.గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్లో మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం ఒకసారి, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మంటలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్సీపీ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో వైఎస్ జగన్‌కు ఇంటి వద్ద భద్రతా లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ భద్రతపై ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ భద్రత విషయంలో ఉదాసీనత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. వైయస్ జగన్ గారి ఇంటి వద్ద అగ్నిప్రమాదం. సాయంత్రం మరియు రాత్రి మంటలు ఎగసిపడ్డాయి.@ysjagan గారి భద్రతపై ప్రజలు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/tst2y6stCq— YSR Congress Party (@YSRCParty) February 5, 2025 -
బాపట్ల జిల్లా పర్చూరులోని ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
-
చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ కంపెనీలో మంటలు ఒక్కసారిగా చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో కెమికల్ వాసనలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. రియాక్టర్లు పేలడంతో ఓ బిల్డింగ్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. దాంతో పాటు కెమికల్ వాసనలకు భరించలేక స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. -
Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!
పారిస్ ఫ్యాషన్ వీక్ 2025లోభారతీయ ఫ్యాషన్ పరిశ్రమలో ప్రముఖుడైన డిజైనర్ గౌరవ్‌గుప్తా ప్రత్యేక కలెక్షన్‌తో అలరించాడు. ఢిల్లీకి చెందిన ఈ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదాన్నే థీమ్ గా మల్చుకుని ఫ్యాషన్ వీక్‌లో తన దుస్తులను ప్రదర్శించాడు. భార్య నవ్‌కిరత్ సోధి అగ్ని ప్రమాదాన్నే 'అక్రాస్ ది ఫైర్' థీమ్ గా కోచర్ కలెక్షన్‌ను ప్రదర్శించాడు. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గౌరవ్ గుప్తా కలెక్షన్‌కు వ్యక్తిగత విషాదం ఎలా ప్రేరణనిచ్చింది తెలుసుకుందాం.ఒక చిన్న కొవ్వొత్తి గౌరవ్, నవ్‌కిరత్ జీవితాలను పెద్ద ప్రమాదంలోకి నెట్టేసింది. ఎనిమిది నెలల క్రితం అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో గౌరవ్ గుప్తా భార్య నవ్‌కిరత్ దాదాపు మరణానికి చేరువైంది. ఆమె శరీరం 55 శాతం కాలిపోయింది. ఆమె బతికే అవకాశం 50 శాతం అని వైద్యులు చెప్పారు. అయినా నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని విజేతగా నిలిచింది. ఈ ప్రమాదంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నించి గౌరవ్ కూడా గాయపడ్డాడు. ఢిల్లీలోని అటెలియర్ ధ్వంసమైంది. కొంత ఆస్తినష్టం కూడా జరిగింది. కట్ చేస్తే..మొక్కవోని ధైర్యంతో, అద్భతమైన కలెక్షన్‌తో ప్యాషన్వీక్లో అబ్బుర పర్చారు. ఈ ప్రమాదం కారణంగానే గత సంవత్సరం పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గౌరవ్ గుప్తా పాల్గొనలేకపోయాడు. కానీ ఈ సారి వేగంగా పుంజుకని తన స్టైల్‌తో అందరి అంచనాలను మించిపోయాడే. తన జీవితభాగస్వామి నవ్‌కిరత్ సోధి ద్వారా 2025 ఫ్యాషన్ వీక్ పూర్తి న్యాయం చేశాడని ఫ్యాషన్ నిపుణులు కొనియాడటం గమనార్హం. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)ఈ ఈవెంట్లో నవ్‌కిరత్ సోధి ప్రత్యేకంగా నిలిచింది. క్రీమ్-హ్యూడ్ డ్రెప్డ్ కార్సెట్ గౌనులో రన్‌వేపై వాక్ చేసింది. ఈ సమయంలో ఆమె శరీరంపై కాలిన గాయాల తాలూకు మచ్చలు కనిపించినపుడు అందరి కళ్లు గౌరవా భిమానాలతో చెమర్చాయి. నవకిరత్ కేవలం కలెక్షన్‌ను ప్రేరేపించడమే కాదు. ఆమె ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేచి సాధికారత క్షణాలను ప్రపంచానికి చూపించి ప్రశంసలు అందుకుంది. View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial) "ఆమె ఒక పోరాట యోధురాలు . ప్రాణాలతో బయటపడినది... ఆమె ఒక దేవత" అని గౌరవ్ తన అధికారిక పేజీలో షేర్ చేసిన భావోద్వేగ వీడియోలో పేర్కొన్నాడు. నవ్‌కిరత్ సుదీర్ఘ ప్రయాణం తమ జీవితాలను మార్చడమే కాకుండా, ఒక సృజనాత్మక దృష్టిని మిగిల్చిందన్నాడు. View this post on Instagram A post shared by The Wedding Collective (@theweddingcollectiveofficial)దేశీయంగా అంతర్జాతీయ A-లిస్టెడ్ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్‌గుప్తా. తాజా ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్లో తన కలెక్షన్స్‌ను ప్రదర్శించాడు. జర్డోజీ, డబ్కా , నక్షి లాంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎక్కువ. రాహుల్ మిశ్రా ,వైశాలి ఎస్ తర్వాత ఈ కోచర్ వీక్‌లో ప్రజంట్ చేస్తున్న మూడవ డిజైనర్ గౌరవ్ గుప్తా కావడం విశేషం. 2004లో, అతను తన సోదరుడు సౌరభ్ గుప్తాతో కలిసి తన లేబుల్‌ని స్థాపించాడు. తరువాత ఇస్తాంబుల్‌లోని ఒక కంపెనీకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. చివరికి భారతదేశానికి తిరిగి వచ్చి, 2006లో అధికారికంగా తన లేబుల్‌ను ప్రారంభించాడు.2006లో ఇండియా ఫ్యాషన్ వీక్‌లో "అత్యంత వినూత్న ప్రదర్శన"గా ప్రశంసలందుకున్నాడు.2009లో, తన తొలి స్టోర్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించాడు. ముంబై,హైదరాబాద్, కోల్‌కతా లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో అతని ఫ్లాగ్షిప్ స్టోర్లున్నాయి.2017లో, భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత వస్త్రాన్ని రూపొందించడానికి గౌరవ్ వోగ్ IBM కాగ్నిటివ్ సిస్టమ్ వాట్సన్‌తో కలిసి పనిచేశాడు. 2022లో, గౌరవ్ గుప్తా బ్రైడ్ - పెళ్లి దుస్తుల్లోకి ప్రవేశించాడు. లిజ్జో, మేగాన్ థీ స్టాలియన్ , దీపికా పదుకొనే , ప్రియాంక చోప్రా , మేరీ జె. బ్లిగే, జెన్నిఫర్ హడ్సన్, సావీటీ, థాలియా, కైలీ మినోచ్యుల్, వయోలెట్, ఒలిట్వియా, ఒలిట్వియా లాంటివి దేశవిదేశాల్లో ప్రజాదరణ పొందాయి. 2022లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోసం డిజైన్ చేసిన దుస్తులు హైలైట్ అయ్యాయి.2023లో జరిగిన పారిస్ హాట్ కోచర్ వీక్‌లో గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన అద్భుతమైన లెమన్ గ్రీన్ గౌనును అమెరికన్ రాపర్ కార్డి బి,చైనీస్ నటుడు ఫ్యాన్ బింగ్‌బింగ్ ధరించడం విశేషం. ఇదీ చదవండి : పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ -
కుంభమేళాలో మరో తొక్కిసలాట!
మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో పుణ్యస్నానాల కోసం వేచి ఉన్న భక్తులపై వెనకవైపు భక్తులు పడటంతో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారన్న వార్తలో కొంత నిగూఢార్థం ఉందని ఆలస్యంగా వెల్లడైంది. మరణాలన్నీ ఈ సంగం ఘాట్ వద్దే సంభవించలేదని కొన్ని సమీపంలోని ఝాసీ ఘాట్ వద్ద సంభవించాయన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగం ఘాట్‌లో భారీ తొక్కిసలాట జరిగిన కొద్దిసేపటి తర్వాత ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట జరిగిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంగం ఘాట్ విషాదం నుంచి భక్తులు తేరుకునేలోపే మరోచోట కూడా తొక్కిసలాట జరిగిందన్న వార్త తెలిస్తే భయంతో భక్తులు వెనుతిరగడమో, గందరగోళంతో పరుగెత్తడమో చేస్తే మళ్లీ సంగం ఘాట్‌లో మరో అపశృతి చోటుచేసుకుంటుందన్న అనుమానంతో అధికారులు ఈ విషయాన్ని వెంటనే బయటకు చెప్పలేదని తెలుస్తోంది. భక్తులను శాంతపరచడమే తమ ముఖ్య ఉద్దేశమని అక్కడి అధికారులు చెప్పారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంగం ఘాట్‌కు ఉత్తరాన కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంగ ఒడ్డుకు ఆవలివైపు ఈ ఘాసీ ఘాట్ ఉంది. సంగం ఘాట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఝాసీ ఘాట్‌లో దాదాపు ఉదయం ఆరు గంటలకు తొక్కిసలాట జరిగింది. మధ్యాహ్నం దాకా మృతదేహాలు అక్కడే! ‘‘ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిన భక్తుల మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. ఉదయం ఆరు గంటలకు తొక్కిసలాటలో చనిపోతే మధ్యాహ్నం 1.30 గంటలకు మృతదేహాలను ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. తొక్కిసలాట జరిగిన నాలుగు గంటల తర్వాత ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చింది. అప్పటికే అక్కడి భీతావహ పరిసరాలను తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధిస్తున్న జనాలను పోలీసులు వారించారు’’అని ఝాసీ ఘాట్‌లో హల్దీరామ్ దుకాణం నడుపుతున్న నేహా ఓఝా స్థానిక మీడియాతో చెప్పారు. ‘‘ఊహించనంతగా భక్తులు వచ్చారు. అడ్డుగా ఉన్న కర్ర బ్యారీకేడ్లను విరగ్గొట్టి ముందుకు రావడంతో ఘోరం జరిగింది. ఇదే అదనుగా అక్కడ నిద్రిస్తున్న వాళ్లకు చెందిన ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కొందరు కొట్టేశారు’’అని ప్రత్యక్ష సాక్షి హర్షిత్ అన్నారు. ‘‘మా దుకాణం చుట్టూతా ఒక్కసారిగా జనం పోగయ్యారు. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. మా దుకాణంలోకీ జనం చొచ్చుకొచ్చారు. ఇదే అదనుగా ఎవరో మా హల్దీరామ్ దుకాణం క్యాష్ కౌంటర్ నుంచి రూ.1,80,000 కొట్టేశారు. ఇక్కడ గుట్టలుగా పడి ఉన్న భక్తుల బ్యాగులు, చెప్పుల కుప్పల నుంచే కొందరు వృద్ధుల మృతదేహాలను బయటకు తీశారు. నా ముందే ఈ టెంట్లో ఇద్దరు చనిపోయారు’’అని నేహా ఓఝా చెప్పారు. ‘‘వెంటనే ఝాసీ ఘాట్‌కు అంబులెన్సు వచ్చే సౌకర్యం కూడా లేదు. ఏ సాయం అందాలన్నా నది ప్రవాహం మీదుగా పడవల్లో వచ్చి సాయపడాల్సిందే’’అని మరో ప్రత్యక్ష సాక్షి మెయిన్ బహదూర్ సింగ్ చెప్పారు. ‘‘బస్సులో వచి్చన ఒక 20 మంది యువకులు బ్యారీకేడ్లను విరగొట్టి, అందర్నీ తోసేసి ముందుకెళ్లారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది’’అని మరో ప్రత్యక్ష సాక్షి అయిన ఒక సాధువు చెప్పారు. ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట కారణంగా ఏర్పడిన చెత్తను తొలగించేసరికి సాయంత్రం ఆరు అయిందని ఒక కార్మికుడు చెప్పారు. అగ్నిప్రమాదంలో 15 టెంట్లు దగ్ధం మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరోసారి అగ్నప్రమాదం సంభవించింది. సెక్టార్ 22 సమీప ఛామన్గంజ్ చౌకీ వద్ద చెలరేగిన అగ్నికీలల్లో 15 టెంట్లు కాలిపోయాయని ప్రధాన అగ్నిమాపక దళ అధికారి(కుంభ్) ప్రమోద్ శర్మ చెప్పారు. విషయం తెలియగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటల్ని ఆర్పేశారు. సరైన రోడ్డు మార్గంలేకపోవడంతో త్వరగా ఘటనాస్థలికి చేరుకోవడం కష్టంగా మారింది. అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదని అధికారి స్పష్టంచేశారు. కలిపోయిన టెంట్లు కుంభమేళాలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినవి కాదని, అక్రమంగా వెలిశాయని వెల్లడించారు. అగ్నికీలలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు మొదలెట్టారు. -
మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
ప్రయాగ్‌రాజ్: మహా కుంభామేళాలో మరో అపశృతి చోటుచేసుకుంది. కుంభామేళా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఎగసిపడుతున్న మంటల ధాటికి టెంట్లు కాలిపోతున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెలుస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే మరో ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం కుంభమేళా జరుగుతున్న సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటల ధాటికి అక్కుడున్న టెంట్లు కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, వరుస ప్రమాదాల నేపథ్యంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. प्रयागराज महाकुंभ महाकुंभ 2025 फिर से आग। झूसी छतनाग घाट नागेश्वर घाट सेक्टर 22 के पास महाकुंभ मेले में लगी भीषण आगमहाकुंभ के सेक्टर 22 में भीषण आग लगने से कई टेंट जलकर हुए राख pic.twitter.com/wvYZQWyIbC— Gaurav Shukla (@shuklaagaurav) January 30, 2025ఇదిలా ఉండగా.. కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 60 మంది భక్తులు త్రీవంగా గాయపడ్డారు. ఇక, కొద్దిరోజుల క్రితమే కుంభమేళా వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంట్లు ఆహుతయ్యాయని తెలిపారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.प्रयागराज महाकुंभ मेला क्षेत्र में लगी भीषण आग की घटना अत्यंत दुर्भाग्यपूर्ण है। प्रशासन से अपील है कि राहत और बचाव कार्य में तुरंत तेजी लाएं। #KumbhMelapic.twitter.com/sbp6bOeb1X— Hansraj Meena (@HansrajMeena) January 30, 2025సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మహా కుంభమేళాలోని సెక్టార్ 19 వద్ద గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఆ మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయి. కుంభమేళా (Kumbh Mela) వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా అప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశాయి. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పోలీసులు తెలిపారు. -
చిచ్చు రాజేసిన ఎండుగడ్డి.. 150 వాహనాలు అగ్నికి ఆహుతి
బెంగళూరు : శ్రీరామ్ పురాలో (srirampura) భాగీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 150 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. బెంగళూరు (bangalore) పోలీసు వివరాల మేరకు.. బెంగళూరు సిటీ పోలీసులు వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల్ని జక్కరాయనకెరె ప్రాంతంలో రెండెకరాల స్థలంలో పార్క్ చేస్తుంటారు.ఈ నేపథ్యంలో బుధవారం వాహనాలు పార్క్ చేసిన ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పార్క్ చేసిన వాహనాల్లో 150 వాహనాలు దహనమైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు ఫైరింజన్లను ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు రెండుగంటల పాటు నిర్విరామంగా ప్రయత్నించారు. ఇక అగ్నికి ఆహుతైన వాహనాల్లో 130 ద్విచక్రవాహనాలు,10 ఆటోలు, పది కార్లు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న శ్రీరామ్ పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఎండిన గడ్డి కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. కేసు విచారణ కొనసాగుతోంది.Massive fire in Bangalore. Somewhere north of BTM#Bangalore #fireaccident #Bengaluru pic.twitter.com/xEkxCRRYQt— Shashank Shekhar (@qri_us) January 29, 2025 -
కన్నతల్లి కన్నీటి వ్యథ
హైదరాబాద్: పీపుల్స్ ప్లాజా వేదికగా గత ఆదివారం భారతమాత ఫౌండేషన్ (Bharat Mata Foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత మాత మహా హారతి’ కార్యక్రమంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం (Fire Accident) ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన అజయ్ మృతదేహం మంగళవారం లభించగా.. ఇదే ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న గణపతి అనే యువకుడు కూడా మంగళవారం మృతిచెందాడు. రెండు రోజులుగా గాలింపు..నాగారంకు చెందిన అజయ్ మిస్సింగ్ అయ్యాడని కుటుంబ సభ్యులు సోమవారం (Monday) తెల్లవారుజామున లేక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం నుంచి బోటు ప్రమాదం జరిగిన ప్రదేశం, ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు, లేక్ పోలీసులు, లుంబీపార్క్ బోటింగ్ సిబ్బంది మరోసారి గాలింపు చేపట్టగా మంగళవారం సాయంత్రం సంజీవయ్య పార్కు వద్ద ఉన్న భారీ జాతీయ జెండా సమీపంలో మృతదేహం లభ్యమైంది. అజయ్ కుటుంబంలో విషాదంకన్నబిడ్డ క్షేమంగా ఉంటాడని గంపెడాశతో ఎదురు చూసిన అజయ్ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. రెండు రోజులుగా హుస్సేన్ సాగర్ వద్దే పడిగాపులు కాస్తున్న ఆ కుటుంబ సభ్యులకు మంగళవారం సాయంత్రం మృతదేహం దొరికిందని తెలియగానే.. తల్లిదండ్రులు జానకిరాం, నాగలక్ష్మి దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. తూ.గో జిల్లా నుంచి వచ్చిన..టాటా ఏస్ డ్రైవర్ గణపతి (22) తూర్పు గోదావరి జిల్లా నుంచి బాణసంచా కాల్చే టీంతో కలిసి వచ్చాడు. ఆ సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలపాలై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. అనుమతి తీసుకున్నారా?కాగా సాధారణంగా బాణసంచా కాల్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆదివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో మహా హారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. లుంబినీ పార్కు మేనేజర్, బోటింగ్ ఇన్చార్జి, ఇతర అధికారుల అనుమతితో బోటులో బాణసంచా కాల్చేందుకు వెళ్లినట్లు తెలిసింది.బాణసంచా కాలుస్తుండగా..మహా హారతి ఇచ్చే క్రమంలో హుస్సేన్ సాగర్‌లో బోటులోంచి బాణసంచా కాలుస్తుండగా మంటలు అంటుకున్నాయి. దీంతో బోట్లో ఉన్న వారంతా నీటిలోకి దూకేశారు. ఈ క్రమంలో నీటిలోకి దూకిన వారిలో నాగారంకు చెందిన సిల్వేరు అజయ్(21) గల్లంతయ్యాడు. అదే బోటులో మంటల తాకిడికి తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ గణపతి (22) మంగళవారం ఉదయం మృతిచెందాడు. దీంతో ఈ సంఘటనలో ఇద్దరు మృత్యువాత పడటం విషాదాంతంగా మారింది. చదవండి: ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యరెండు రోజులుగా బోటింగ్ నిలిపివేతసాగర్లో బోటింగ్‌లో మంటలు చెలరేగి యువకుడు గల్లంతైన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో సాగర్‌లో బోటింగ్ నిలిపివేశారు. బోటింగ్ సిబ్బంది మొత్తం అజయ్ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. -
ట్యాంక్ బండ్ ఘటనలో ఒకరి మృతి
హైదరాబాద్, సాక్షి: హుస్సేన్ సాగర్ లో జరిగిన బోటు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గణపతి చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. రిపబ్లిక్ డే నాడు భరతమాత మహాహారతి కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుని బోట్లు దగ్ధం కావడం తెలిసిందే. అయితే ప్రమాదంలో గణపతి తీవ్ర గాయాలతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఈ రోజు ఉదయం అతను కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. గణపతి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా అని, దాదాపు 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరోవైపు కార్యక్రమానికి వెళ్లి కనిపించకుండా పోయిన అజయ్(21) కోసం హస్సేన్ సాగర్ ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
హుస్సేన్ సాగర్ బోటులో అగ్ని ప్రమాదం
-
అజయ్ కోసం హుస్సేన్ సాగర్‌లో గాలింపు
హైదరాబాద్, సాక్షి: ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటన తర్వాత అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్‌లో రెండు బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు గాలింపు చేపట్టారు. మరోవైపు.. యువకుడి తల్లిదండ్రుల రోదనలతో ఈ ప్రాంతం మారుమోగుతోంది. కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్(21)గా నిర్ధారణ అయ్యింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి భరతమాత మహా హారతి కార్యక్రమం కోసం అజయ్ ట్యాంక్ బండ్‌కు వచ్చాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. మరోవైపు.. అతని ఆచూకీ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అజయ్‌కు ఈత రాదని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉదయం నుంచి గజఈతగాళ్లతో సాగర్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.ఘటనపై కేసు నమోదుహుస్సేన్ సాగర్‌లో భారతమాత హారతి అపశ్రుతి ఘటనపై కేసు నమోదయ్యింది. బోటు టూరిజం ఇన్‌ఛార్జి ప్రభుదాస్ ఫిర్యాదుతో లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆదివారం భరతమాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు. అనంతరం ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. -
ట్యాంక్ బండ్ బోటులో మంటలు.. స్పాట్ లోనే ఏడుగురికి..
-
కుంభమేళాలో మళ్లీ అగ్ని ప్రమాదం
మహాకుంభ్ నగర్(యూపీ): ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం చోటుచేసుకున్న ఘటనలో రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసికి చెందిన ఓ కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఫైర్ అధికారి వివరించారు. అందులోని వారందరినీ కాపాడి, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చామన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈ నెల 19న మహాకుంభ్ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 18 క్యాంపులు భస్మీపటలమయ్యాయి. మంటలను సకాలంలో ఆర్పివేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒకటిన 73 దేశాల దౌత్యవేత్తల రాకరష్యా, ఉక్రెయిన్ సహా 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు మహాకుంభ్ మేళాలో మొదటిసారిగా పుణ్యస్నానాలు చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన వీరంతా రానున్నారని మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం విదేశాంగ శాఖ యూపీ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసిందన్నారు. జపాన్, అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలండ్, బొలీవియా తదితర దేశాల దౌత్యాధికారులు పాల్గొంటారని చెప్పారు. బోట్లో సంగం వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారన్నారు. అనంతరం, అక్షయ్వట్, బడే హనుమాన్ ఆలయాలను దర్శించుకోనున్నారు. డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో వీరికి మహాకుంభ్ ప్రాశస్త్యాన్ని వివరించనున్నామన్నారు.సొంత అఖాడాకు సీఎం యోగి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని తన సొంత శ్రీ గురు గోరక్షా నాథ్ అఖాడాను సందర్శించారు. ధర్మ ధ్వజ్‌కు స్వయంగా ఉత్సవ పూజ జరిపారు. ఈ సందర్భంగా సీఎం యోగి దేశం నలుమూలల నుంచి మహాకుంభ్‌కు విచ్చేసిన సిద్ధ యోగులతో చర్చలు జరిపారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది గురు గోరక్షా నాథ్ సంప్రదాయాన్ని కొనసాగించే సీఎం యోగి సొంత అఖాడా అని యోగి మహాసభ ప్రత్యేక ఉపాధ్యక్షుడు మహంత్ బాలక్ నాథ్ యోగి చెప్పారు. యోగుల బసకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లున్నాయన్నారు. -
Mahakumbh: కారులో మంటలు.. అగ్నిమాపక దళం అప్రమత్తం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. తాజాగా కుంభమేళా ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ పార్క్ చేసిన ఒక కారు నుంచి మంటలు వెలువడ్డాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కారు సగం మేరకు దగ్ధమైపోయింది.ఈ సంఘటన గురించి అగ్నిమాపక అధికారి విశాల్ యాదవ్ మాట్లాడుతూ ‘అనురాగ్ యాదవ్ అనే వ్యక్తి నుండి మాకు కాల్ వచ్చింది. ఒక కారు మంటల్లో చిక్కుకుందని ఆయన తెలిపారు. వెంటనే వెళ్లి మంటలను అదుపులోనికి తెచ్చాం. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు’ అని తెలిపారు. కాగా కొన్ని రోజుల క్రితం ఇదే కుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాటి సంఘటనలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే గీతా ప్రెస్‌కు నష్టం వాటిల్లింది. ఈ ఘటన దరిమిలా ఎల్పీజీ భద్రతపై అధికారులు ఒక ప్రత్యేక సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎల్పీజీ లీకేజీ వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. కాగా మహా కుంభమేళా ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, దానిని ఎదుర్కొనేందుకు రెస్క్యూ టీమ్ 24 గంటలూ అందుబాటులో ఉంది. ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
ఏలూరులో భారీ అగ్నిప్రమాదం.. 20 గుడిసెలు దగ్ధం
-
ఏలూరు: మంటల్లో దగ్దమైన నివాసాలు.. పలువురికి గాయాలు
సాక్షి, మండవల్లి: ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇళ్లలోకి దోమలు రాకుండా వెలిగించే అగర్బత్తి కారణంగా మంటలు చెలరేగడంతో 20 గుడిసెలు కాలిపోయి.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను వెంటనే కైకలూరు ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని మండవల్లి మండలం భైవరపట్నం ప్రత్తిపాడు స్టేజీ వద్ద 20 ఏళ్లుగా నెల్లూరుకు చెందిన కొంత మంది పిట్టలు కొట్టే వాళ్లు నివసిస్తున్నారు. స్థానికంగా ఉండే ఆక్వా చెరువులపై నాటు తుపాకీలతో పిట్టలను బెదిరిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. కాగా, శుక్రవారం రాత్రి 9.45 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ క్రమంలో అక్కడ గుడిసెలో నిద్రిస్తున్న షారుక్‌ఖాన్, వంశీ, అను, కార్తీక్, విక్కీలతోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒక బాలుడు, మరో మూడేళ్ల చిన్నారి ఉన్నారు.అయితే, పిట్టలను బెదిరించడానికి ఉపయోగించే మందుగుండు సామగ్రికి నిప్పు అంటుకోవడంతోనే పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దఎత్తున మంటలు, పొగతో పక్కనే ఉన్న 20 గుడిసెలకు క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్ధం వచ్చింది. ఎడిసిపడిన మంటల కారణంగా గుడిసెల్లోని వస్తువులు, పక్కనే ఉన్న వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.పత్తాలేని అగ్నిమాపక సిబ్బంది.. పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందుతున్నా వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకోలేదు. ఆకివీడు నుంచి గంటన్నర తర్వాత వచ్చిన వాహనం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను తరలించాల్సిన దుస్థితి నెలకొంది. -
మహేంద్ర షోరూమ్‌లో అగ్ని ప్రమాదం
-
Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీప నగరాలకు వ్యాపిస్తున్నాయి. బుధవారం నాడు ఈ మంటలు మరింతగా చెలరేగి, భారీ నష్టాలను కలిగించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం లాస్ ఏంజిల్స్ కౌంటీలో మరోసారి అటవీ మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. కాస్టిక్ సరస్సు సమీపంలోని కొండ ప్రాంతంలో ముందుగా మంటలు చెలరేగాయి. ఇప్పుడవి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి.మరోమారు చెలరేగిన ఈ మంటలు కేవలం రెండు గంటల్లోనే 5,000 ఎకరాల ప్రాంతాన్ని దగ్ధం చేశాయి. శాంటా అనాలో వీచే గాలులు మంటలు చెలరేగడానికి కారణంగా నిలిచాయి. మంటల నుండి వచ్చే పొగ కారణంగా పెద్ద నల్లటి మేఘాలు ఏర్పడుతున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ మంటల కారణంగా ఏ ఇల్లు లేదా వ్యాపారం దెబ్బతినలేదు. కానీ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 19 వేల మందిని అక్కడి నుంచి తరలిస్తున్నారు.ఈ నెల ప్రారంభంలో చెలరేగిన మంటల కారణంగా లాస్ ఏంజిల్స్ కౌంటీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. తాజాగా శాన్ డియాగో, ఓషన్‌సైడ్ సమీపంలో దక్షిణాన మంటలు చెలరేగుతున్నాయని అధికారులు తెలిపారు. వీటిని అగ్నిమాపక శాఖ అదుపు చేసిందన్నారు. లాస్ ఏంజిల్స్‌లో వీస్తున్న గాలుల కారణంగా మంటలు పదే పదే ఎగసిపడుతున్నాయి. లాస్ ఏంజిల్స్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అక్కడ గంటకు 20 నుండి 30 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.దీని కారణంగా మంటలను ఆర్పడం అగ్నిమాప దళానికి, వైమానిక దళానికి ఇబ్బందిగా మారింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు వారి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 22 వేల ఇళ్లు బూడిదయ్యాయి.ఇది కూడా చదవండి: వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లయిపోయి.. -
షాద్ నగర్ పరిధిలోని BRS ఆయిల్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
-
Turkey: రిసార్ట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి
ఇస్తాంబుల్: టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. టర్కీలోని స్కీ రిసార్ట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 66 మంది దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని టర్కీ ఇంటరీయర్ మినిస్టర్ అలీ యెర్లికాయ ధృవీకరించారు.స్కీ ిరిసార్ట్లో ఘోర అగ్ని ప్రమావం చోటు చేసుకుని 66 మంది మృతి చెందగా, 55 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ఇది అత్యంత విషాదకర ఘటన’ అని పేర్కొన్నారు.క్యాపిటల్ అంకారాకు 100 మైళ్ల దూరంలో ఉన్న కార్తాల్కాయా స్కీ రిసార్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3.27 ని.లకు ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి
టర్కీలోని ఒక రిసార్ట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య టర్కీలోని ఒక స్కీ రిసార్ట్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. 32 మంది గాయాలపాలయ్యారు. అతికష్టం మీద అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బోలు ప్రావిన్స్‌లోని కర్తల్కాయ రిసార్ట్‌లోని ఒక రెస్టారెంట్లో రాత్రిపూట మంటలు చెలరేగాయని టర్కీ మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. భయంతో భవనం నుంచి దూకి, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గవర్నర్ అబ్దుల్ అజీజ్ అయిదిన్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ హోటల్లో 234 మంది అతిథులు బస చేస్తున్నారని, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు చెలరేగినప్పుడు తాను నిద్రలో ఉన్నానని, అయితే ప్రమాదాన్ని గుర్తించి, భవనం నుండి తప్పించుకోగలిగానని హోటల్ సిబ్బంది నెక్మీ కెప్సెట్టుటన్ తెలిపారు. తాను బయటపడ్డాక 20 మంది అతిథులు హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు సహాయం అందించానని తెలిపారు.హోటల్ బయట ఉన్న కలప కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. కర్తాల్కాయ అనేది ఇస్తాంబుల్‌కు తూర్పున 300 కిలోమీటర్లు (186 మైళ్ళు) దూరంలో ఉన్న కొరోగ్లు పర్వతాలలోని స్కీ రిసార్ట్. 30 అగ్నిమాపక యంత్రాలు, 28 అంబులెన్స్‌లతో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: ట్రంప్ నిర్ణయాలు.. అంతర్జాతీయంగా అమెరికాకు దెబ్బ? -
కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)లో ఆదివారం(జనవరి19) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి సెక్టార్ 19లో భక్తులు, సాధువుల కోసం వేసిన గుడారాల్లో రెండు వంట గ్యాస్ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలి మంటలు చెలరేగాయి. దీంతో గుడారాల్లోని భక్తులు భయంతో పరుగులు తీశారు. మొత్తం ముప్పై దాకా గుడారాలు మంటల్లో దగ్ధమయ్యాయి.అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల ధాటికి గుడారాల్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. కుంభమేళాకు ఆదివారం ఒక్కరోజు 17 లక్షల మంది భక్తులు విచ్చేశారు. ఇప్పటివరకు 7 కోట్లకుపైగా భక్తులు కుంభమేళాకు విచ్చేసి పవిత్ర స్నానమాచరించారు. #WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. Fire tenders are present at the spot. More details awaited. pic.twitter.com/dtCCLeVIlN— ANI (@ANI) January 19, 2025యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ఆదివారం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి, మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. -
Uttar Pradesh: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లోని ప్రాంతంలోని ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక మహిళ సజీవదహనమయ్యింది.ఒక కుటుంబంలోని నలుగురు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఘటన కాంచన్ పార్క్ కాలనీలో జరిగింది.ఈరోజు (ఆదివారం) ఉదయం 7 గంటల సమయంలో పీఆర్వీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక మహిళ సజీవ దహనమయ్యింది. వారు తీవ్రంగా కాలిపోవడంతో పాటు ఊపిరాడక విలవిలలాడిపోతూ ప్రాణాలొదిలారు.అగ్నిమాపక దళం బృందం మంటలను అదుపు చేసింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మంటలను ఆర్ఫిన అగ్నిమాపక దళం ఇంటి గోడను పగలగొట్టి, ఇంట్లో చిక్కుకున్న ఒక మహిళ ముగ్గురు పిల్లలను రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి మరింత విషమంగా ఉందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ -
హైదరాబాద్ హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విషాదం
-
హైదరాబాద్ షేక్ పెట్ లో అగ్నిప్రమాదం
-
ఖమ్మం మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి,ఖమ్మంజిల్లా: ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో బుధవారం(జనవరి15) అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డ్ షెడ్డులో పత్తిబస్తాలు తగలబడ్డాయి. ఓ లాట్ పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతుండడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలి పోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కాగా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో పత్తి దగ్ధంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మంటలను తక్షణమే అదుపులోకి తేవాలని అధికారులకు తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్,మార్కెట్ అధికారులతో మాట్లాడి తుమ్మల వివరాలు తెలుసుకున్నారు. -
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు
-
తిరుమల లడ్డూ కౌంటర్లో మంటలు
-
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే. అయితే.. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు. -
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ప్రముఖ బుల్లితెర నటి రూపల్ త్యాగి తెలిపింది. చదువు కోసం వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది. ఇటీవల దాదాపు నెల రోజులు పాటు అక్కడే ఉన్నానని వెల్లడించింది. తాను స్వదేశానికి విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగలు చూశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉంటుందని ఊహింలేదన్నారు. తాను చూసిన ప్రదేశాలు బూడిదగా మారడం చూసి హృదయ బద్దలైందని విచారం వ్యక్తం చేసింది.రూపల్ త్యాగి మాట్లాడుతూ.. "పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ అగ్ని ప్రమాదాలు సాధారణమే. కానీ అది అంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నేను విమానం నుంచి పొగను చూశా. అప్పుడే ఇక్కడ ప్రమాదాలు మామూలే అని అనుకున్నా. కానీ నేను ముంబయిలో దిగే సమయానికి కార్చిచ్చు వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అప్పుడే తెలిసింది. నేను చూసిన ప్రదేశాలు ప్రతిదీ కాలిపోయాయని నాకు తెలిసింది. దృశ్యాలను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించింది. తాను ఇంటికి తిరిగి వచ్చే ముందు అదే రోడ్డులో కారులో ప్రయాణించా. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అదృష్టవశాత్తూ నా స్నేహితులందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. నేను వారి గురించి ఆందోళన చెందుతున్నా. సమయానికి బయలుదేరి ప్రాణాలు దక్కించుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో నా స్నేహితులతో లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రకృతి కోపాన్ని చూసి చలించిపోయా' అని అన్నారు.ఇలాంటి సంఘటనలు మన జీవితాలు ఊహించని విధంగా మార్చేస్తాయని రూపల్ త్యాగి అన్నారు. ఒక్క రోజులోనే నగరం కాలిపోతుందని ఎవరూ ఊహించరు.. ఇది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పింది. మన జీవితంలో ప్రతి రోజు పూర్తిగా అస్వాదించాలనేన ఆలోచన మంచిదే.. ఎందుకంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన ప్రజలు త్వరలోనే కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.కాగా.. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు వేలమంది నిరాశ్రయులయ్యారు. అడవిలో ఏర్పడిన మంటలు గాలి ధాటికి విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 వేలకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా.. రూపల్ త్యాగి బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. బాలీవుడ్లో కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్, హమారీ బేటియాన్ కా వివాహ్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. -
'ఆ దేవుడి దయతో బతికిపోయాం'.. విషాదంపై హీరోయిన్ ట్వీట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా విచారం వ్యక్తం చేసింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తన కలలో కూడా ఊహించలేదని అన్నారు. మా పొరుగువారంతా ఇలా బాధపడతారని అనుకోలేదంటూ ట్వీట్ చేశారు ప్రీతి జింటా. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.ప్రీతి జింటా తన ట్వీట్లో రాస్తూ.' లాస్ ఎంజిల్స్‌లో మా చుట్టూ ఉన్న వారిని మంటలు నాశనం చేసే రోజు వస్తుందని నేను ఊహించలేదు. నేను బతికుండగా ఇలాంటి విషాదం చూస్తానని అనుకోలేదు. నా స్నేహితులు, కుటుంబాలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. మన చుట్టూ ఉన్నవారికి జరిగిన విధ్వంసం చూసి నా హృదయ బరువెక్కింది. అక్కడి విధ్వంసం చూస్తుంటే ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి విషాదం సమయంలో మేమ సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ మంటల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గాలి త్వరలోనే తగ్గి మంటలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నా. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి సహాయం చేస్తున్న అగ్నిమాపక శాఖ, అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ సురక్షితంగా ఉండండి' అని పోస్ట్ చేశారు.కాగా.. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఇళ్లు మంటల్లో బూడిదయ్యాయి. ఈ మంటలు దాదాపు వెయ్యి ఎకరాలకు వ్యాపించాయి. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు లక్షకు పైగా నిరాశ్రయులయ్యారు. ఈ విషాద ఘటనలో దాదాపు 13 మంది మరణించగా.. 12,000 కంటే ఎక్కువ ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.కాగా.. నటి ప్రీతి జింటా అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో తన భర్త జీన్ గూడెనఫ్‌తో కలిసి అక్కడే నివసిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. 2016లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్‌తో రిలేషన్లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. తాజాగా అమెరికాలో వీరు నివసిస్తున్న లాస్ ఎంజిల్స్లోనే కార్చిచ్చు ఘటన జరగడంతో ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేస్తోంది.కాగా.. ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. I never thought I would live to see a day where fires would ravage neighbourhoods around us in La, friends & families either evacuated or put on high alert, ash descending from smoggy skies like snow & fear & uncertainty about what will happen if the wind does not calm down with…— Preity G Zinta (@realpreityzinta) January 11, 2025 -
కార్చిచ్చుపై ప్రెస్మీట్లో ముత్తాతనయ్యానని జో బైడెన్ ప్రకటన
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్‌తో పాటు దక్షిణ కాలిఫోర్నియా మొత్తాన్ని భీకర కార్చిచ్చు చుట్టుముట్టి పెను నష్టం చేస్తున్న విషయం తెలిసిందే. దాని ధాటికి ఇప్పటికే లక్షన్నర మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇళ్లతో పాటు సర్వం బుగ్గి పాలై భారీగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా లాస్ ఏంజెలెస్‌లో హాలీవుడ్ తారలతో పాటు ప్రముఖులుండే అతి సంపన్న ఆవాసాలు పెద్ద సంఖ్యలో అగ్నికి ఆహుతిగా మారాయి. ఈ విపత్తుపై స్థానిక శాంటా మోనికాలో బైడెన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉన్నట్టుంది వ్యక్తిగత ప్రకటన చేశారు. తనకు ముని మనవడు పుట్టాడని చెప్పుకొచ్చారు. ‘ఈ ప్రతికూల వార్తల నడుమ ఒక శుభవార్త. ఈ రోజే నేను ముత్తాత అయ్యాను. చాలా కారణాలతో నాకీ రోజు గుర్తుండిపోతుంది‘ అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘పేరుకేమో అగ్ర రాజ్య అధ్యక్షుడు. కనీసం ఎక్కడేం మాట్లాడా లో తెలియదా?‘ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మంటల్లో బైడెన్ కుమారుని ఇల్లు కూడా బుగ్గిగా మారినట్టు వార్తలొచ్చాయి. ‘అది పూర్తిగా కాలిపోయిందని తొలుత చెప్పారు. బానే ఉందని ఇప్పుడంటున్నారు‘ అంటూ ఈ వార్త లపై బైడెన్ స్పందించారు.ప్రెస్ మీట్‌కు ముందే...మీడియా సమావేశానికి ముందే బైడెన్ స్థాని క ఆస్పత్రిలో ముని మనవడిని చూసి వచ్చారు. ఆ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పదవిలో ఉండగా ముత్తాత అయిన తొలి అమెరికా అధ్యక్షునిగా కూడా 82 ఏళ్ల బైడెన్ రికార్డు సృష్టించడం విశేషం. పెద్ద వయసులో అధ్యక్షుడు అయిన రికార్డు ఆయన పేరిటే ఉండటం తెలిసిందే. 77 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పుడా రికార్డును తిరగరా యనున్నారు. ఈ నెల 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. -
చింటూని వదలొద్దు! నేను లిఖిత చచ్చిపోతున్నాం
ఘట్కేసర్: ప్రేమ విషయం ఇంట్లో చెబుతానని ఓ వ్యక్తి వేధించడంతో ప్రేమ జంట బలైంది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్స్పెక్టర్ పరశురాం, బంధువులు తెలిపిన వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన పర్వతం అంజయ్య కుమారుడు పర్వతం శ్రీరామ్ (25) బతుకుదెరువు నిమిత్తం 15 ఏళ్ల క్రితం బీబీనగర్ మండలం జమీలాపేటకు వెళ్లి స్థిరపడ్డారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి సమీపంలో సైకిల్ దుకాణం నడుపుతున్నాడు. చౌదరిగూడకు చెందిన ఇంటర్ చదివే ఓ మైనర్ బాలికను శ్రీరామ్ ప్రేమించాడు. బ్లాక్మెయిల్ చేసిన దగ్గరి బంధువు... శ్రీరామ్‌తో ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెబుతానని బాలిక దగ్గరి బంధువు, అన్న వరుసైన చింటు (22) బ్లాక్మెయిల్ చేసి వీరివద్ద రూ. 1,35,000 తీసుకున్నాడు. ఇంకా డబ్బు ఇవ్వాలని కాలేజ్ దగ్గరికి వెళ్లి బాలికను వేధించడమే కాకుండా, బంగారు ఉంగరం ఇవ్వాలని కోరాడు. చింటు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని, చివరికి ప్రియుడికి విషయం తెలిపింది. అదే విధంగా కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని, ప్రేమ ఓడిపోవద్దని వారం కిందటే వారిద్దరు మరణించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం షాపింగ్ వెళ్లాలని శ్రీరామ్ తన స్నేహితుడి దగ్గర ఎర్టిగా కారును తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం ప్రేమ వ్యవహారం, బ్లాక్మెయిల్ విషయాన్ని వివరిస్తూ బాలిక తండ్రికి ‘అంకుల్’ అని సంబోధిస్తూ సూసైడ్ నోట్ రాసి, తన అన్న కుమారుడికి వాట్సాప్ ద్వారా పంపించాడు. అనంతరం ఎర్టిగా వాహనంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ ఘనాపూర్ సమీపంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద కారులోనే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంటలకు తాళలేక శ్రీరామ్ కారు డోరు తెరుచుకొని సర్వీస్ రోడ్డు ఫుట్‌పాత్‌పై పడి మృతిచెందాడు. బాలిక కారు ముందు సీటులో కూర్చొని గుర్తు పట్టలేని మాంసం ముద్దలా కాలి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పారు. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి ఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో మంటలు.. అక్కాచెల్లెళ్ల దుర్మరణం
పర్చూరు (చినగంజాం): ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో పెనువిషాదం నింపింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అక్కాచెళ్లెల్ల ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో నియోజకవర్గ కేంద్రం పర్చూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. పర్చూరు గ్రామంలోని రామాలయం వీధిలో దాసరి వెంకటేశ్వర్లుకు చెందిన రేకుల షెడ్డు ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పురవ్వలు చెలరేగి ఇంట్లోని దుస్తులు, వస్తువులకు, గ్యాస్ సిలిండర్‌కు నిప్పంటుకొని సోమవారం అర్ధరాత్రి గం.1.30 సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఊహించని ఘటనతో అనారోగ్యంతో ఉన్న ఇద్దరు ఆడబిడ్డలు దాసరి నాగమణి (34), దాసరి మాధవీలత (23) మంటల్లో కాలి మృతిచెందడం, వారిని రక్షించుకునే ప్రయత్నంలో తల్లి లక్ష్మీరాజ్యం తీవ్రగాయాలపాలై ఆస్పత్రి పాలవడం పర్చూరు వాసులను కంటతడి పెట్టించింది. నాగమణి పక్షవాతంతో మంచానికే పరిమితమవగా, మాధవీలత ఫిట్స్ వ్యాధితో బాధపడుతోంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను అర్ధరాత్రి మృత్యువు కబళించడాన్ని తలుచుకొని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్‌వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ప్రమాద ఘటన తెలిసి ఇంటికి చేరుకున్న తండ్రి వెంకటేశ్వర్లు గుండెలవిసేలా విలపించడం చూపరులను కలచివేసింది.ఘటనా స్థలాన్ని సందర్శించిన చీరాల డీఎస్పీ..ఘటనా ప్రాంతాన్ని చీరాల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం, విద్యుత్ మీటరు కన్పించకుండా ఉండటంతో ఆయన విద్యుత్ శాఖ ఏడీఈ రమేష్‌ని పిలిపించి పరిశీలించాలని, పూర్తి విచారణ చేయాల్సిందిగా కోరారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. లేక దోమల కాయిల్ వలన నిప్పంటుకొని ప్రమాదం సంభవించిందా అనేది క్లూస్ టీంని రప్పించి విచారణ చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఆయన వెంట పర్చూరు ఇన్చార్జ్ ఎస్ఐ డి.రత్నకుమారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలిఆదివారం అర్ధరాత్రి 1.15 నిమిషాల నుంచి 1.30 నిమిషాల్లోపు మంటలు చెలరేగాయి. ఆ సమయంలో చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దాదాపు 45 నిమిషాల పాటు వారు కనీసం ఫోన్ కూడా ఎత్తే పరిస్థితిలో లేరని తెలిసింది. అటు తరువాత సమాచారం అందుకున్న సిబ్బంది వేకువజామున 3.25 నిమిషాలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపులోనే ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లకు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున లేవడంతో తో అగ్నికి ఆహుతవుతున్న మహిళలను కాపాడే సాహసాన్ని స్థానికులు చేయలేకపోయారు. స్థానికంగా నీటిని తెచ్చి పోసే ప్రయత్నం జరిగినా అవి సరిపోలేదు. అర్ధరాత్రి కావడంతో అక్కడికి ప్రజలు ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది రాలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి ఉంటే ఇద్దరిలో ఒకరినైనా కాపాడుకొనే వారమని స్థానికులు చెబుతున్నారు. -
కారులో ఇద్దరి సజీవ దహనం ఘటనలో ట్విస్ట్ !
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో సోమవారం(జనవరి6) సాయంత్రం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమైన కేసు కొత్త మలుపు తిరిగింది. కారులో ఉన్నది ప్రేమికులైన యువతీ యువకులని తెలుస్తోంది. కొందరు యువకుల వేధింపులు భరించలేక వారు ఆత్మహత్యాయత్నం చేస్తుండగా కారులో మంటలు చెలరేగి కాలిపోయారని సమాచారం.తొలుత ఇది ప్రమాదమే అనుకున్నప్పటికీ ఘటనపై పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో అసలు విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పివేసింది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ వాహనం బీభత్సం -
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
-
హైదరాబాద్: మినర్వా కిచెన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మినర్వా కిచెన్ హోటల్లో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా.. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఘోర ప్రమాదం
పెళ్లకూరు: తిరుపతి జిల్లాలోని ఓ స్టీల్ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. పలువురు గాయపడినట్లు చెబుతున్నారు. జిల్లాలోని పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బ్లాస్ట్ ఫర్నేస్ భారీ శబ్దంతో పేలిపోయి, మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. భారీ పేలుళ్లతో పెన్నేపల్లి గ్రామం దద్దరిల్లింది. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు పెద్దపెట్టున కేకలు పెడుతూ బయటకు పరుగులు తీశారు. ఫర్నేస్ సమీపంలో పనిచేస్తున్న వారిలో ఐదుగురు చనిపోయి ఉంటారని కార్మికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను స్థానికులు, పోలీసులు నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశ్రమ మేనేజర్ సుబ్రహ్మణ్యం రెడ్డి ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన తర్వాతే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది బయటపడ్డారు అనే వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకున్నప్పటికీ, ప్రమాదం జరిగిన యూనిట్లోకి ప్రవేశించడానికి సాహసించడం లేదు. పరిశ్రమలో ఉన్న మరో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పేలితే భారీ ప్రమాదం ఉంటుందన్న భయంతో ఎవరూ లోపలికి ప్రవేశించడంలేదు. కార్మికులు అంతా ఇతర రాష్ట్రాల వారే. వారు తెలుగు మాట్లాడలేకపోవడంతో ఏం చెబుతున్నారో పోలీసులకు అర్థం కావడంలేదు. పంచాయతీ అనుమతులు లేకుండా ఈ కంపెనీలో రెండో యూనిట్ ఏర్పాటు చేశారంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. -
మాదాపూర్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.ఆఫీస్‌లోని యూపీఎస్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించిందని ఫైర్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. సెలవు కావడంతో ఆఫీస్‌లో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేద. మంటలు చెలరేగడంతో మిగిలిన కార్యాలయాల్లోని సిబ్బంది కూడా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. -
Hyd: కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి: హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. మంగళవారం సాయంత్రం వేళ కొండాపూర్‌లో(Kondapur)ని గాలక్సీ అపార్ట్మెంట్ తొమ్మిదొవ అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి తీవ్రరూపం దాల్చాయి.అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలినప్పుడు ఇంట్లో ఒకరు ఉన్నట్లు సమాచారం. అయితే ఆ మహిళ బాల్కనీలో ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. ప్రధానంగా ముందు సదరు మహిళను కిందకు దింపే ప్రయత్నాలు ప్రారంభించారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద అగ్ని ప్రమాదం
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అమరారాజ బ్యాటరీ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా ఉద్యోగులు అక్కడి నుంచి పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం వద్ద నిర్మాణంలో ఉన్న అమరారాజా బ్యాటరీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వెంటనే.. మూడో అంతస్తులోకి వ్యాపించాయి. దీంతో, అక్కడ పనిచేస్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
Hyderabad: మాదాపూర్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న ప్రాంతంలో ఖానామెట్‌లోని మీనాక్షి టవర్స్‌లో మంటలు చెలరేగాయి. దాంతో అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మూడు ఫైరింజన్ల సాయంతో మంటలతో అదుపు చేస్తున్నారు. -
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
-
హైదరాబాద్ మాదాపూర్ లో అగ్ని ప్రమాదం
-
మాదాపూర్: ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఐటీ కంపెనీ ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం..మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ బిల్డింగులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో పలు ఐటీ కంపెనీలు ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
వీడియో: భయానక అగ్ని ప్రమాదం.. పలువురు సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సీఎన్జీ ట్యాంకర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. 20 మంది గాయపడ్డినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆపి ఉంచిన సీఎన్జీ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ టెండర్లు చేరుకున్నాయి.जयपुर के अजमेर रोड भांकरोटा स्थित DPS स्कूल के सामने अलसुबह सीएनजी गैंस टैंकर में आग लगने से भीषण हादसा, कई वाहनों में आग लगने की सूचना. कई लोगों के झुलसने की सूचना.#Jaipur #Rajasthan pic.twitter.com/RjxNYyoNEA— Surendra Gurjar (@S_Gurjar_11) December 20, 2024ఘటనా స్థలంలో 22 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి.. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.#WATCH | Jaipur, Rajasthan | Jaipur DM, Jitendra Soni says, "4 people have died (in the incident). Around 40 vehicles caught the fire. Fire brigade and ambulances have reached the spot. The relief work is underway. The fire has been doused off and only 1-2 vehicles are left.… https://t.co/5l1uNq2lUd pic.twitter.com/p3XDxSJQto— ANI (@ANI) December 20, 2024 ప్రమాద స్థలికి సీఎం..ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా ప్రమాద స్థలికి చేరుకోనున్నారు.VIDEO | Rajasthan: A gas tanker caught fire on Ajmer Road in #Jaipur earlier today. Several vehicles were also gutted in fire. More details are awaited.#JaipurNews (Full video available on PTI videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/kIJcm3AQRJ— Press Trust of India (@PTI_News) December 20, 2024 -
మాదన్నపేటలో భారీ అగ్నిప్రమాదం
-
ఓల్డ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్ డివిజన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మాదన్నపేటలో ఓ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటలకు తోడుగా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజిన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తుంది. -
ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురి సజీవదహనం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఘోర అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కథువాలోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం కారణంగా మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
తప్పిన ముప్పు.. నడిరోడ్డుపై డీజిల్ ట్యాంకర్ బోల్తా
చిలకలగూడ: ట్రాఫిక్ రద్దీ ప్రాంతంలో నడిరోడ్డుపైన ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో అటు పోలీసులు..ఇటు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ట్రాఫిక్, హైడ్రా, ఫైర్ విభాగాలు చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించాయి. వివరాల్లోకి వెళ్తే..చిలకలగూడ ట్రాఫిక్ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డబావి వద్ద సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో లోడుతో వెళ్తున్న డీజల్ ట్యాంకర్ వెనుక టైర్ పగిలి.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో డీజిల్ లీకై రోడ్డుపై ప్రవహించింది. నిప్పు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్‌కుమార్, చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు స్పందించి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వెంటనే ఫైరింజన్లను రప్పించి మంటలు అంటుకోకుండా భారీగా ఫోమ్‌ను స్ప్రే చేయించారు. మూడు క్రేన్ల సాయంతో బోల్తా పడిన ట్యాంకర్‌ను అక్కడి నుంచి తొలగించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది సాయంతో రహదారులపై పడిన డీజిల్‌పై మట్టిపోయించారు. వాహనదారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. సుమారు మూడున్నర గంటలు శ్రమపడి పరిస్థితిని చక్కదిద్దారు. ట్యాంకర్ వాహనం డ్రైవింగ్ చేస్తున్న మల్లాపూర్‌కు చెందిన చంద్రశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనుమానం వచి్చన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ చంద్రశేఖర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా, మద్యం తాగి వాహనం నడిపినట్లు నిర్ధారణ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో 105 బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్)పాయింట్లు వచ్చాయి. దీంతో చంద్రశేఖర్‌పై గోపాలపురం లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులను పలువురు అభినందించారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఘటన స్థలానికి చేరుకుని తన వంతు సాయం అందించారు. -
తమిళనాడులోని దిండిగల్ లో ఘోర అగ్ని ప్రమాదం
-
తమిళనాడు: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పలువురు మృతి
చెన్నై: తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా చిన్నారి సహా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని దిండిగుల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా మొదట ఆసుపత్రి భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అనంతరం, భవనం మొత్తానికి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టెండర్స్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రి భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. దీంతో, ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 మంది రోగులు ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన, అస్వస్థతకు గురైన రోగులను 50 అంబులెన్స్‌ల సాయంతో ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.#TamilNadu : #HospitalFireAt least 6 people, including a child and 3 women died and 6 others were injured, after a #fire broke out at a four-story private Hospital in #Dindigul on Thursday night.Reportedly the victims succumbed to suffocation caused by the thick #smoke that… pic.twitter.com/2Iac9Qt5Gh— Surya Reddy (@jsuryareddy) December 12, 2024 -
నాంపల్లి రైల్వేస్టేషన్‌కు తప్పిన పెను ప్రమాదం
సాక్షి,హైదరాబాద్:నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బుధవారం(డిసెంబర్ 11) పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ నుంచి పెట్రోల్ అన్లోడ్ చేస్తున్న సమయంలో ఉత్పన్నమైన రాపిడ్ ఫోర్స్‌తో మంటలంటుకున్నాయి. మంటలను ఆర్పడానికి సిబ్బంది ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపు చేసింది. బంక్ పక్కనే నాంపల్లి రైల్వేస్టేషన్ ఉండడంతో స్థానికులు కంగారు పడ్డారు. అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
నిద్రించడానికి స్థలం లేదని వాహనాలకు నిప్పంటించాడు
హైదరాబాద్: రెండ్రోజుల క్రితం చాదర్‌ఘాట్ మెట్రోస్టేషన్ పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనాలు దగ్ధం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహా రాష్ట్రకు చెందిన జాకీర్ మహ్మద్ (32) ఎనిదేళ్ల క్రితం నగరానికి వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడి ఫుట్‌పాత్‌లపైనే నిద్రిస్తున్నాడు. తాను నిద్రించడానికి పార్కింగ్ వాహనాలు ఇబ్బందిగా మారాయని వాటికి నిప్పంటించాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆదివారం అక్బర్‌బాగ్ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మెట్రో స్టేషన్.. మెరిసెన్..ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా చిత్రాన్ని రద్దీ ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రదర్శిస్తున్నారు. ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయ కేతనం’ అంటూ తెలంగాణ స్ఫూర్తిని అంది పుచ్చుకుంటూ హైదరాబాద్‌లోని మొత్తం 25 మెట్రో స్టేషన్లలో కొత్తగా రూపొందించిన ‘తెలంగాణ తల్లి’ చిత్రాలను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో స్టేషన్ల పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందమైన విద్యుద్దీపాల అలంకరణతో ప్రధానం మెట్రో మార్గాలు నగరవాసులను విశేషంగా అలరిస్తున్నాయి. -
అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి
నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి.. ఇది ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోగల ఒక ప్రధాన క్యాథలిక్ చర్చి. దీనిని నోట్రే డామ్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. ఐదేళ్ల క్రితం ఈ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటల కారణంగా చర్చి తీవ్రంగా దెబ్బతింది.నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి ప్రత్యేక నిర్మాణశైలి, మతపరమైన ప్రాముఖ్యత, చారిత్రక సంఘటనల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ చర్చిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పారిస్‌కు తరలి వస్తుంటారు.నోట్రే డామ్ నిర్మాణం 12వ శతాబ్దంలో ప్రారంభమై, 14వ శతాబ్దంలో పూర్తయింది. చర్చి గోపురం గోతిక్ శైలిలో నిర్మితమయ్యింది. ఇది ఆకాశం అంత ఎత్తుకు ఉన్నట్లు కనిపిస్తుంది.ఈ చర్చి నిర్మాణాన్ని 1163లో బిషప్ మారిస్ డి సుల్లీ చేపట్టారు. 1345లో ఈ చర్చిని ప్రారంభించారు. చర్చి వెలుపలి భాగంలో ఉన్న గార్గోయిల్లు ప్రత్యేకమైన శిల్పశైలిలో కనిపిస్తాయి.నోట్రే డామ్ కాథలిక్ చర్చి క్యాథలిక్ మతాన్ని అనుసరించేవారికి ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. ఇక్కడ తరచూ మతపరమైన వేడుకలు జరుగుతుంటాయి.ఈ చర్చి కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు. చరిత్ర, కళ, సంస్కృతికి చిహ్నంగానూ నిలిచాయి. ఈ చర్చి నెపోలియన్ పట్టాభిషేకం, జోన్ ఆఫ్ ఆర్క్ పునరుద్ధరణలాంటి పలు చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.2029, ఏప్రిల్ 15న నోట్రే డామ్ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చర్చి ప్రధాన గోపురం, పైకప్పు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తదనంతరం చర్చికి మరమ్మతులు చేపట్టారు. అదే రీతిలో పునర్నిర్మించడానికి సమయం పట్టింది.ఈ చర్చి విశిష్ట వాస్తుశిల్పం, చారిత్రక ప్రాముఖ్యత రీత్యా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది. అగ్ని ప్రమాదం తర్వాత పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాక చర్చి ఇప్పుడు తిరిగి అద్భుతమైన రూపంలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
మలక్‌పేట్ మెట్రో వద్ద అగ్ని ప్రమాదంలో కుట్ర.. స్పాట్లో పెట్రోల్ డబ్బాలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించింది. మంట్లలో ఐదు బైకులు కాలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో, చాదర్ ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్, కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల ప్రకారం.. మలక్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైకుల వద్ద మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో, ఐదు బైకులు మంటల్లో కాలిపోయినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.ఇక, మలక్‌పేట్ మెట్రో వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం ఉందని పోలీసులు గుర్తించారు. బైకులు మంటల్లో కాలిపోయిన స్థలంలో పెట్రోల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. ఈ క్రమంలో మెట్రోస్టేషన్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
వారణాసి రైల్వే స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం.. 200 బైక్‌ల దగ్ధం
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వాహనాల పార్కింగ్ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చేలరేగడంతో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసు శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. 12 ఫైర్ ఇంజన్లు జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల సాయంతో దాదాపు 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 200 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దగ్ధమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని అధికారులు తెలిపారు. -
మంటల్లో కాలేజీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి,బాపట్లజిల్లా: చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ప్రైవేటు కాలేజి బస్సు దగ్ధమైంది. రేపల్లెకు నర్సింగ్ కాలేజీ విద్యార్థులను తీసుకువెళ్తుండగా బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అప్రమత్తమై బస్సును డ్రైవర్ ఆపేశారు. వెంటనే విద్యార్థులను బస్సు డ్రైవర్ దింపేశారు. విద్యార్థులందరూ దిగిన తర్వాత కాలేజీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తత వల్లే తాము పప్రాణాలతో మిగిలామని విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.ఇదీ చదవండి: మా పాపకు అన్యాయం జరిగింది -
దామగుండం అడవిలో భారీ అగ్ని ప్రమాదం
పూడూరు: వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయనున్న దామగుండం అటవీ ప్రాంతంలో గురువారంరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 నుంచి 30 ఎకరాల మేర అడవి కాలి బూడిదైంది. ఇది ప్రమాదామా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూడూరు మండల పరిధిలో 2,900 ఎకరాల మేర దామగుండం అటవీ ప్రాంతం ఉంది. ఈ స్థలాన్ని ప్రభుత్వం నేవీ రాడార్ ఏర్పాటుకు కేటాయించగా, ఇటీవల భూమి పూజ చేశారు.అడవి చుట్టూ రోడ్డు, ప్రహరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా రాత్రి అడవిలో భారీగా మంటలు చెలరేగాయి. అడవి సరిహద్దులోని వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే వందూరుతండా సమీపంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో అగి్నమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చేలోపల దాదాపు 20 నుంచి 30 ఎకరాల అడవి కాలిపోయింది. ఈ ప్రాంతంలో చుట్టు పక్కల రైతులు, కాపరులు తమ పశువులను మేపుతుంటారు. ఈ నేపథ్యంలో ఎవరైనా కావాలనే అడవికి నిప్పు పెట్టారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాడార్ స్టేషన్ కోసం భూమి పూజ చేసిన స్థలానికి ఎదురుగా వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థల సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వీడియోలను స్థానికంగా ఉండే సత్యానందస్వామి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఎఫ్ఆర్ఓ శ్యాంమ్కుమార్, నేవీ అధికారి మల్లికార్జునరావు, పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, చన్గోముల్ ఎస్ఐ ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. సత్యానందస్వామి ఉంటున్న ఆశ్రమానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. -
రెండ్రోజుల క్రితమే గృహ ప్రవేశం.. అంతలోనే అగ్ని ప్రమాదం
రెండ్రోజుల క్రితం ఆనందంగా బంధు మిత్రులను పిలుచుకుని గృహ ప్రవేశం చేశారు. సొంతింటి కల నెరవేరిందని సంబరపడ్డారు. అంతలోనే కలల సౌధం కాలిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈఐపీఎల్ కార్నర్‌స్టోన్ గేటెడ్ కమ్యూనిటీలోకి కొందరు చేరుతున్నారు. అందులోని 8వ అంతస్తు 804 ఫ్లాట్‌ను ఐటీ ఉద్యోగి సంతోష్ కొనుగోలు చేశారు.రెండు నెలలుగా ఇంటిరీయర్ పనులు చేయించారు. సోమవారం గృహ ప్రవేశం చేశారు. మూడు రోజుల పాటు కొత్త ఫ్లాట్‌లోనే నిద్ర చేశాక పూర్తి స్థాయిలో సామాన్లతో ఇక్కడకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. కిచెన్‌లో పూజ చేసి వెలిగించిన దీపం బుధవారం దాని కింద ఉన్న దుస్తులకు అంటుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు దీపాన్ని ఆర్పకుండా భయంతో బయటికి పరుగులు తీశారు. దీంతో మంటలు వ్యాపించడంతో ఫ్లాట్ మొత్తం కాలిపోయింది. మంటలను ఆర్పిన సిబ్బంది... కిచెన్‌లో మొదలైన మంటలను చూసి బయటకు పరుగులు తీసిన ఇంటి యజమాని, బంధువులు మెయింటెనెన్స్ వారికి అగ్ని ప్రమాదం విషయం చెప్పారు. సెక్యూరిటీ, మెయింటెనెన్స్ సిబ్బంది వెంటనే నీటిని చల్లి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఫ్లాట్ మొత్తం వుడ్ వర్క్‌తో పాటు కాలి బూడిదయ్యింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మరోసారి నీటిని చల్లారు. చదవండి: సరోగసీ కోసం వచ్చి.. ఆపై పారిపోదామనుకొని..పది రోజుల క్రితం పక్క గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో ఇదే మాదిరిగా అగ్ని ప్రమాదం జరగటంతో ఇందులోని నివాసితులకు అలాంటి పరిస్థితి ఎదురయినపుడు మంటలను ఎలా ఆర్పాలి? ఫైర్ గ్యాస్‌ను ఎలా ఉపయోగించాలి? నీటి లభ్యత ప్రతి ఫ్లాట్‌కు ఎలా వస్తుంది? అనే విషయంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. అయినా బుధవారం వాటిని పట్టించుకోకపోవటంతో ప్రమాదం సంభవించిందని మెయింటెనెన్స్ ఇన్చార్జి గిరి తెలిపారు. -
హైదరాబాద్ లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు.. భారీగా ఆస్తినష్టం
-
అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.వివరాల ప్రకారం.. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలో అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఎంబీ-2 బ్లాక్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే, రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఇక, రియాక్టర్ పేలిన ఘటన కారణంగా పారిశ్రామికవాడ ఉలిక్కిపడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
రామాంతపూర్ వివేక్ నగర్ లో పేలిన బ్యాటరీ బైక్
-
హైదరాబాద్ జీడిమెట్లలో ఆరని మంటలు
-
ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
జీడిమెట్ల: జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తాకిడికి పరిశ్రమలోని మూడు ఫోర్లు దగ్ధమయ్యాయి. ఓ భవనం కుప్పకూలింది. అగ్నిప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఫేజ్–5 దూలపల్లి రోడ్డులో సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పేరిట ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నాడు.పరిశ్రమ గ్రౌండ్ ఫ్లోర్ సహా మరో రెండు ఫ్లోర్లు ఉండగా ఆపైన పెద్ద రేకుల షెడ్డు నిర్మించారు. పరిశ్రమలో మొత్తం 500 మంది కార్మికులు ఉండగా.. మంగళవారం జనరల్ షిఫ్ట్‌లో దాదాపు 200 మంది ఉన్నారు. మధ్యాహ్నం పరిశ్రమ మూడో అంతస్తులోని రేకుల షెడ్డులో కొంతమంది కారి్మకులు ఆర్పీ (రీప్రాసెసింగ్) మెషీన్ వద్ద పనులు చేస్తున్నారు. 12.30 గంటల ప్రాంతంలో రేకుల షెడ్డులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కార్మికులు బతుకు జీవుడా అంటూ కిందకు పరుగులు తీశారు. శ్రమించిన 50 మంది ఫైర్ సిబ్బంది.. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో భారీగా మంటలు అలుముకున్నాయి. ప్రమాద తీవ్రతను గమనించిన అగ్నిమాపక శాఖ అధికారి శేఖర్‌రెడ్డి ఉన్నతాధికారులకు వివరించడంతో 8 వాహనాలు పరిశ్రమ వద్దకు చేరుకున్నాయి. దాదాపు అయిదు ఫైర్ స్టేషన్ల నుంచి వచ్చిన 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. మూడో అంతస్తులోకి నీటిని చిమ్మడం కష్టంగా మారడంతో బ్రాంటోసై్కలిఫ్ట్ను తెప్పించారు. మంటలు అర్ధరాత్రి వరకు కూడా అదుపులోకి రాలేదు. పైనుంచి కింది అంతస్తు వరకు వ్యాపించిన మంటలు.. పరిశ్రమ విశాలంగా ఉండటంతో పాటు లోపల పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బ్యాగులు నిల్వ ఉన్నాయి. పైన ఆర్పీ యంత్రం వద్ద అంటుకున్న మంటలు ఒక్కో అంతస్తు నుంచి నేరుగా కింది అంతస్తు వరకు వ్యాపించాయి. పరిశ్రమ భవనం మంటల తాకిడికి రెండో అంతస్తు గోడలు కూలిపోయాయి. అగ్ని ప్రమాదం సమాచారం అందడంతో ఘటనా స్థలికి బాలానగర్ ఏసీసీ హన్మంతరావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లే‹Ù, ఎస్ఐలు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. -
Fire Accident : జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
-
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. ఇంకా అదుపులోకి రాని మంటలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి పారిశ్రామికవాడలోని ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం లేదు. అంతకంతకూ మంటలు పెరుగుతున్నాయి. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ మంటలు వ్యాపించాయి. చుట్టూ పక్కల పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 2 0ట్యాంకర్లతో నీటి సరఫరా చేశారు. నాలుగున్నర గంటలకు పైగా భవనం మంటల్లోనే ఉంది. ఏడు ఫైర్‌ఇంజిన్లు, 40 వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. పరిశ్రమలోని మొదటి అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వినియోగించే ముడి సరుకు ఉండడంతో మంటలు అదుపుచేయడం కష్టంగా మారింది. రాత్రి కావడంతో సహయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. -
బీబీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నిప్పురవ్వలు ఎగిసి
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందూస్థాన్ శానిటరీ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గోడౌన్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రైతులు గడ్డి తగులబెట్టారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు ఎగిరి గోడౌన్‌లోని కాటన్ బాక్స్‌లపై పడ్డాయి. దీంతో మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. -
ఈవీ బైక్ షోరూం యజమాని అరెస్టు
బనశంకరి: బెంగళూరులోని రాజ్‌కుమార్ రోడ్డులో ఎలక్ట్రిక్ బైక్ షోరూం అగ్నిప్రమాదం ఘటనలో షోరూం యజమాని పునీత్, మేనేజర్ యువరాజ్‌ని బుధవారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మంటలు వ్యాపించి పెద్దసంఖ్యలో వాహనాలు, షోరూం మొత్తం కాలిపోయాయి. స్కూటర్లలోని బ్యాటరీలు పేలిపోవడంతో మంటలు ఇంకా విజృంభించాయి. మంటలను చూసి ప్రియా అనే ఉద్యోగిని తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చివరకు మంటలు వ్యాపించి ఆమె సజీవ దహనమైంది. మరికొందరు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రియ బుధవారమే 27వ పుట్టిన రోజును జరుపుకోవాల్సి ఉంది, అంతలోనే ఘోరం జరిగింది. తన కూతురి భద్రత గురించి షోరూం సిబ్బంది పట్టించుకోలేదని ఆమె తండ్రి ఆర్ముగం విలపించాడు. పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది షోరూంని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.ఇష్టపడి కొంటే.. బూడిదైందికృష్ణరాజపురం: ఎంతో మురిపెంగా కొన్న ఈవీ స్కూటర్.. అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఆ దంపతుల బాధకు అంతులేదు. మంజునాథ్ అనే వ్యక్తి ఇటీవల రూ.70 వేలకు రాజాజీనగరలోని షోరూంలో ఓ బ్యాటరీ స్కూటర్ని కొన్నారు. పికప్ లేదని, సర్వీసింగ్ చేసివ్వాలని షోరూంలో వదిలారు. సర్వీసింగ్ చేసి బైక్‌ను సిబ్బంది సిద్ధం చేశారు. అయితే బైక్‌ను తీసుకెళ్లేలోగా మంగళవారం సాయంత్రం షోరూంలో అగ్నిప్రమాదం జరిగి ఆయన స్కూటర్ కూడా మంటల్లో కాలిపోయింది. తమకు షోరూంవారు పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. -
Hyderabad: పేలిన రిఫ్రిజిరేటర్ సిలిండర్
మణికొండ: రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు రావడంతో అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ కిచెన్, హాల్, బెడ్రూం వరకు వ్యాపించడంతో అందులోని వ్యక్తులు హాహాకారాలు చేస్తూ కిందకు పరుగులు తీశారు. గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు స్థలంలో పార్కును అభివృద్ధి చేయటంతో అగ్నిమాపక వాహనాలు ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ వరకు సకాలంలో చేరలేక పోయాయి. మణికొండ మున్సిపాలిటీ, పుప్పాలగూడలోని గోల్డెన్ ఓరియల్ కమ్యూనిటీలోని బీ బ్లాక్ మూడో అంతస్తులోని 301 ఫ్లాట్‌లో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఫ్రిడ్జిలోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో వంట గది మొత్తం అంటుకుని మిగతా గదులకూ వ్యాపించాయి. మంటలు వంట గ్యాస్ సిలిండర్‌కూ అంటుకోవటంతో పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఇంటి యజమాని వెంకటరమణతో పాటు మిగతా నలుగురు కుటుంబ సభ్యులు భయభ్రాంతులతో కిందకు వచ్చేశారు. చుట్టు పక్కల వారు సైతం నిద్రనుంచి మేల్కొని అగి్నమాపక శాఖకు సమాచారం ఇచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అపార్ట్మెంట్ వరకూ వెళ్లలేక పోయిన ఫైరింజిన్.. గోల్డెన్ ఓరియల్లో రెండు బ్లాక్‌ల మధ్య ఉన్న రోడ్డును పార్కుగా మార్చారు. సకాలంలోనే గేటు వద్దకు చేరుకున్న మూడు ఫైరింజిన్లు ఫ్లాట్ వద్దకు చేరుకోలేక 300 మీటర్ల దూరంలోనే నిలిచిపోయాయి. దీంతో ఫ్లాట్ పూర్తిగా కాలిపోయిందని అగ్నమాపక శాఖ అధికారులు తెలిపారు. మంటలు ఫ్లాట్ మొత్తం వ్యాపించి విలువైన గృహోపకరణాలతో పాటు దుస్తులు, నగదు కాలిపోవటంతో రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఫ్లాట్ యజమాని తెలిపారు. ఫ్లాట్ వద్దకు చేరుకునేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది గంట పాటు ప్రయత్నం చేసినా సఫలం కాక పక్క బ్లాక్ నుంచి నీటిని చల్లి మంటలను ఆర్పారు. కాగా.. స్థానికులు అంతలోపే పక్క ఫ్లాట్ల నుంచి పైపులను వేసి సాధ్యమైనంత వరకు మంటలను ఆర్పారు.కేసు నమోదు గోల్డెన్ ఓరియల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇంటి యజమాని వెంకటరమణ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యూపీ ఆస్పత్రి ఘటన.. దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలోని ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీ వైద్యవిద్య డీజీ నేతృత్వంలో దర్యాప్తు జరపనుంది. కాగా,ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవదహనం -
ఝాన్సీ ఆసుపత్రి విషాదం.. డిప్యూటీ సీఎంకి వీఐపీ వెలకమ్
ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాల ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించి పది మంది నవజాత శిశువులు సజీవదహనమవ్వడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. ఈ విషాదం వేళ ఆస్పత్రికి వర్గాలు వ్యవహరించిన తీరుపై విమర్శలకు దారితీసింది. ఝాన్సీ ఆసుపత్రికి ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ వస్తున్నారని తెలిసి... ఆయన రాక ముందే సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేసి, సున్నం చల్లడం వంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. బీజేపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టింది.ఓవైపు అగ్నిప్రమాదంలో చిన్నారులు మృత్యువాత పడి.. వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. మరోవైపు ఉప ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికేందుకు రోడ్లు శుభ్రం చేసి, సున్నం చల్లుతున్నారంటూ కాంగ్రెస్ మండిపింది. . అప్పటి వరకు మురికి కూపంలా ఉన్న ఆస్పత్రి ఆవరణను డిప్యూటీ సీఎం రాక వేళ శుభ్రం చేశారని స్థానికులు తెలిపినట్లు పేర్కొంది. మంటల్లో చిన్నారులు చనిపోతే.. ఈ ప్రభుత్వం తన ఇమేజ్ను కాపాడుకోవడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని, ఇది సిగ్గుచేటని మండిపడింది.BJP सरकार की संवेदनहीनता देखिए।एक ओर बच्चे जलकर मर गए, उनके परिवार रो रहे थे, बिलख रहे थे। दूसरी तरफ, डिप्टी CM के स्वागत के लिए सड़क पर चूने का छिड़काव हो रहा था।परिजनों का यहां तक कहना है कि पूरे कम्पाउंड में गंदगी फ़ैली हुई थी, जो डिप्टी CM के आने से पहले ही साफ की गई।… pic.twitter.com/M1sk8SAa0E— Congress (@INCIndia) November 16, 2024యూపీలోని ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి, నిర్లక్ష్యానికి నిలయాలుగా మారాయని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. చిన్నారులను రక్షించడానికి ఆస్పత్రిలో ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఆరోపించింది. ప్రజలు చనిపోతున్నా ఆ పార్టీకి ఏమీ పట్టదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జుహీ సింగ్ విమర్శించారు. కాగా ఆసుపత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటల వ్యాపించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రిలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితేవిద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. ఈ దుర్ఘటనలో పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అయితే మంటలు చెలరేగిన వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు కనిపించడంతో పాటు సేఫ్టీ అలారాలు కూడా మోగలేదు. 2020లో ఎక్స్టింగ్విషర్ల గడువు ముగిసినట్లు గుర్తించారు. -
Jhansi Hospital Fire: ముగ్గురు చిన్నారులను కాపాడి.. సొంత కుమారుడు ఏమయ్యడో తెలియక..
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గల మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవదహనమ్యారు. ముక్కుపచ్చలారని తమ చిన్నారుల మృతిని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. బాధితులలో ఒకరైన మహోబా నివాసి కులదీప్‌కు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. శుక్రవారం రాత్రి మెడికల్ కాలేజీలోని శిశు వార్డులో అగ్నిప్రమాదం నుండి ముగ్గురు పిల్లలను రక్షించిన కులదీప్ తమ శిశువును రక్షించుకోలేకపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించగా, 16 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు.10 రోజుల క్రితమే కులదీప్‌కు కుమారుడు జన్మించాడు. సాధారణ పరీక్షల కోసం ఆ శిశువును ఆసుపత్రిలో ఉంచారు. ప్రమాదం జరిగిన సమయంలో కులదీప్‌తో పాటు అతని భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్నారు. ఇంతలో వారి కుమారుడు ఉంటున్న వార్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కులదీప్ వార్డులోకి వెళ్లి ముగ్గురు చిన్నారులను రక్షించాడు. ఈ నేపధ్యంలో అతని చేతికి కాలిన గాయమయ్యింది.తరువాత కులదీప్ తన కుమారుడిని బయటకు తీసుకురావాలనుకున్నాడు. అయితే వార్డులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. తన కుమారుడు వార్డులో ఎలా ఉన్నాడో తెలియక తల్లడిల్లిపోయాడు. అక్కడి పరిస్థితులను చూసి కులదీప్ భార్య కన్నీటి పర్యంతమయ్యింది. తమ కుమారుడెక్కడున్నాడో తెలియక కులదీప్ దంపతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఇది కూడా చదవండి: Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’ -
Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’
ఝాన్సీ: యూపీలోని ఝాన్సీలోగల మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం దరిమిలా ఆస్పత్రి పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన కృపాల్ సింగ్ రాజ్‌పుత్ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ‘అనారోగ్యంతో బాధ పడుతున్న నా మనుమడిని ఆస్పత్రిలో చేర్పించాను. పిల్లాడు ఉంటున్న వార్డులో శుక్రవారం రాత్రి 10 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆ గదిలోనికి వెళ్లాను. ఆ వార్డులోని 18 పడకలపై 50 మందికిపైగా పిల్లలున్నారు. ఒక బెడ్‌పై ఆరుగురు శిశువులు ఉన్నారు. చుట్టూ మంటలు వ్యాపించాయి. అతికష్టం మీద 25 మంది పిల్లలను బయటకు తీసుకు వచ్చాను. నేను చూస్తుండానే 10 మంది శిశువులు కాలి బూడిదయ్యారు. నా కుమారుడు క్షేమంగానే ఉన్నాడు’ అని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న 25 మంది చిన్నారులను ప్రాణాలతో కాపాడిన కృపాల్ సింగ్‌ను ఆసుపత్రి సిబ్బంది, ఇతరులు అభినందనలతో ముంచెత్తారు. కాగా వైద్య కళాశాలలో కేవలం 18 పడకలపై 54 మంది చిన్నారులకు చికిత్స అందించడాన్ని చూస్తుంటే ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని తెలుస్తోంది. అలాగే అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఇంతటి దారుణ పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బ్రిజేష్ పాఠక్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Medical College Fire: చిన్నారుల మృతి హృదయవిదారకం: ప్రధాని మోదీ -
UP Fire Accident: ఆ నర్సు వల్లే ఈ ఘోరం?
లక్నో: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ వైద్య కళాశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం.. పది మంది పసికందుల్ని బలిగొనడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణం ఏంటన్నది తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. శనివారం సాయంత్రంకల్లా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోపు విస్తుపోయే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆక్సిజన్ సిలిండర్ పైప్‌ను కనెక్ట్ చేస్తున్న సమయంలో ఓ నర్సు నిర్లక్ష్యంగా అగ్గిపుల్ల వెలిగించినట్లు తెలిపిన ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం దర్యాప్తు తర్వాతే కారణంపై ప్రకటన చేస్తామని అంటున్నారు. ఆపద్భాందవుడిలా భగవాన్ దాస్!హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్ దాస్ తన కొడుకును ఇదే ఆస్పత్రిలో చేర్చాడు. ప్రమాదం నుంచి తన కొడుకుతో పాటు మరికొందరు చిన్నారులను దాస్ రక్షించాడని పక్కన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ‘‘ఆ నర్సు అగ్గిపుల్ల వెలగించగానే.. ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. అక్కడంతా మంటలు అంటుకున్నాయి’’ అని దాస్ చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే దాస్ ఓ గుడ్డలో నలుగురు పసికందుల్ని చుట్టి.. తన వీపుకి కట్టుకుని బయటకు తీసుకొచ్చాడని అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. అగ్ని కీలలు ఎగసి పడ్డాక.. ఆస్పత్రిలోని సేఫ్టీ అలారంలు మోగకపోవడంతో చిన్నారుల తరలిపు ఆలస్యం అయ్యిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.అయితే.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్ పాథక్.. బాధితులకు న్యాయం జరిగి తీరుతుందని చెబుతున్నారు. సిలిండర్ కాన్సెంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారని, ఒకవేళ మానవ తప్పిదం జరిగి ఉంటే ఎవరినీ వదలబోమని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారాయన. ఘటనపై మూడంచెల దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు.నెట్టింట దయనీయమైన దృశ్యాలుశుక్రవారం రాత్రి 10.30గం.-10.45గం. మధ్య ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి చిన్నపిల్లల వార్డులో (neonatal intensive care unit..NICU) అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వెంటనే అక్కడ బీతావహ వాతావరణం నెలకొంది. పసికందుల్ని రక్షించేందుకు ఆస్పత్రి సిబ్బందితో పాటు తల్లిదండ్రులు పరుగులు తీసిన దృశ్యాలు, ఆ పసికందుల మృతదేహాల వద్ద రోదిస్తున్న దృశ్యాలు.. ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో నవజాత శిశువులు 10 మంది సజీవ దహనం కాగా, మరో 16 మంది ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 54 మంది ఆ వార్డులో చికిత్స పొందుతుండగా.. అందులో 44 మంది నవజాత శిశువులే కావడం గమనార్హం.ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం, గాయపడ్డవాళ్లకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ఘటనపై నివేదికను 12 గంటల్లో సమర్పించాలని డీజీపీ ఆదేశించారాయన. మరోవైపు.. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. -
ఘోరాతి ఘోరంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఝాన్సీ: యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి హృదయ విదారకమన్నారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా విచారం వ్యక్తం చేశారు.పీఎం మోదీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. పిల్లలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖాన్ని భరించే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది’ అని దానిలో పేర్కొన్నారు.రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా.. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు బాధిత తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. हृदयविदारक! उत्तर प्रदेश में झांसी के मेडिकल कॉलेज में आग लगने से हुआ हादसा मन को व्यथित करने वाला है। इसमें जिन्होंने अपने मासूम बच्चों को खो दिया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर से प्रार्थना है कि उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। राज्य सरकार की…— PMO India (@PMOIndia) November 16, 2024తక్షణ పరిహారం రూ. 5 లక్షలుఈ ఘటనపై యూసీ సీఎం యోగి విచారం వ్యక్తం చేస్తూ, మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మృతుల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన చిన్నారులకు రూ.50 వేలు చొప్పున సాయం అందించాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్ని ప్రమాదం జరిగిన మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటనపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం -
యూపీ విషాదం.. మంటలు చెలరేగినా మోగని అలారం!
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోగల లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 10 మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన అనంతరం ఆస్పత్రికి సంబంధించిన పలు లోపాలు బయటపడ్డాయి. లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరినీ అప్రమత్తం చేసేందుకు సేఫ్టీ అలారం అమర్చారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో ఆ సేఫ్టీ అలారం మోగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వార్డులో పొగలు వ్యాపించడాన్ని గమనించినవారు కేకలు వేయడంతో ప్రమాదాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. సేఫ్టీ అలారం మోగి ఉంటే రెస్క్యూ ఆపరేషన్ త్వరగా జరిగేదని స్థానికులు అంటున్నారు.నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే చుట్టుపక్కలకు వ్యాపించాయి. దీంతో ఎవరూ లోపలికి వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది కూడా లోనికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. వారు వార్డు కిటికీ అద్దాలను పగులగొట్టి, లోపలికి చేరుకుని మంటలను అదుపు చేస్తూనే, శిశువులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు.ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో రెండు యూనిట్లు ఉన్నాయి. ఒక యూనిట్ లోపల, మరొకటి వెలుపల ఉంది. ముందుగా అగ్నిమాపక సిబ్బంది బయట ఉన్న వార్డులోని నవజాత శిశువులను వెలుపలికి తీసుకువచ్చారు. ఇంతలోనే మంటలు లోపలి వార్డులోకి ప్రవేశించడంతో అక్కడున్న పిల్లలు తీవ్రంగా కాలిపోయారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు తగిన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఝాన్సీ లోక్‌సభ ఎంపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఆయన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 16 మంది చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఎస్ఎస్పీ సుధా సింగ్ తెలిపారు.ఇది కూడా చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం -
అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం
-
యూపీలో ఘోర అగ్ని ప్రమాదం
-
యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుని, 10మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతులలో రోజుల వయసు కలిగిన నవజాత శిశువులు కూడా ఉన్నారు.ఘటన జరిగిన సమయంలో ఎన్ఐసీయూలో మొత్తం 54 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌లో విద్యుత్ షార్ట్ జరిగింది. వెంటనే మంటలు చెలరేగాయి. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతరత్రా సామాగ్రి అగ్నికి ఆహుతయ్యింది. చిన్నారుల మృతితో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం నెలకొంది. #WATCH | Uttar Pradesh: A massive fire broke out at the Neonatal intensive care unit (NICU) of Jhansi Medical College. Many children feared dead. Rescue operations underway. More details awaited.(Visuals from outside Jhansi Medical College) pic.twitter.com/e8uiivyPk3— ANI (@ANI) November 15, 2024సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం రంగంలోకి దిగి మంటలను ఆపేందుకు ప్రయత్నించింది. ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్ పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీచేశారు.जनपद झांसी स्थित मेडिकल कॉलेज के NICU में घटित एक दुर्घटना में हुई बच्चों की मृत्यु अत्यंत दुःखद एवं हृदयविदारक है।जिला प्रशासन तथा संबंधित अधिकारियों को युद्ध स्तर पर राहत एवं बचाव कार्यों को संचालित कराने के निर्देश दिए हैं।प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्माओं…— Yogi Adityanath (@myogiadityanath) November 15, 2024ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆరోగ్య మంత్రి అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఉదంతంపై విచారణ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి కారణమేమిటనేది తెలుస్తుందన్నారు. నవజాత శిశువులు మరణం దురదృష్టకరమని, ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. VIDEO | Uttar Pradesh: Rescue operation continues at Jhansi Medical College where a fire broke out on Friday. #Fire #Jhansifire(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/TFras9L3jz— Press Trust of India (@PTI_News) November 15, 2024చిన్నారుల మృతదేహాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని, ఏడుగురి చిన్నారుల మృతదేహాలను గుర్తించామని తెలిపారు. నవజాత శిశువులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని బ్రజేష్ పాఠక్ హామీనిచ్చారు. ఈ ఆసుపత్రిలో గత ఫిబ్రవరిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందని, జూన్‌లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారన్నారు. అయినా ఈ దుర్ఘటన జరగడం విచారకరమన్నారు. ఇది కూడా చదవండి: HYD: అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం.. -
HYD: అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గోల్డెన్ ఒరియా అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో, అపార్ట్‌మెంట్‌వాసులు బయటకు పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి మంటలు వ్యాపించాయి. దీంతో, భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు పక్కనే ఉన్న మరో ఇంటికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గ్యాస్ లీక్ కావడమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం కారణంగాలో అపార్ట్మెంట్లో పలువురి విలువైన వస్తువులు, దుస్తులు కాలిపోయాయి. దాదాపు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. -
హైవేపై కంటైనర్‌లో అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బైపాస్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది నెక్సాన్ కార్లు దగ్ధమైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. జహీరాబాద్ బైపాస్ వద్ద కార్లను తరలిస్తున్న కంటైనర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో నాలుగు నెక్సాన్ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెస్తున్నారు. కంటైనర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..
-
నందిగామలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నందిగామ కాంసన్ హైజెన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని కాంసన్ హైజెన్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసు ధికారులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. -
ఔటర్ రింగురోడ్డుపై కారు దగ్ధం
-
పెట్రోల్‌బంక్ వద్ద లారీలో మంటలు.. తప్పిన ముప్పు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా:రాజమండ్రి శివారు దివాన్ చెరువులో ఆదివారం(నవంబర్ 3) పెద్ద అగ్ని ప్రమాదం తప్పింది.పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది.వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటల్లో లారీ పాక్షికంగా దగ్ధమైంది. లారీ కేబిన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. లారీలో నుంచి మంటలు పొగ ఎగిసిపడడంతో స్థానికులు పరుగులు తీశారు.ఇదీ చదవండి: పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం -
అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం
హౌరా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో దీపావళి వేళ పెను ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కాలుస్తున్న సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఇంటినంతా చుట్టుముట్టాయి. ఈ సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారి కూడా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హౌరాలోని ఉల్బీరియా ప్రాంతంలో శుక్రవారం బాణాసంచా కాలుస్తున్న సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న దుకాణానికి కూడా అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ముగ్గురు చిన్నారులు తీవ్రంగా కాలిపోయి మృతి చెందారు. ఉలుబేరియా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 27లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఈ ప్రాంతానికి చెందిన చిన్నారులు బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వలు పక్కనే ఉన్న బాణసంచా సామగ్రిపై పడటంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరు బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను తానియా మిస్త్రీ, ఇషాన్ ధార, ముంతాజ్ ఖాతూన్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు -
విశాఖలో భారీ అగ్నిప్రమాదం..
-
విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జైల్ రోడ్డులోని ఎస్బీఐలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సబ్బంది మంటలు ఆర్పుతున్నారు. -
Noida: బాంక్వెట్ హాల్లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి
లక్నో: గ్రేటర్ నోయిడాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడా సెక్టార్-74లోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం పదిహేను అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయని ఓ అధికారి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని చెప్పారు. అగ్ని ప్రమాదంలో పర్మీందర్ అనే ఎలక్ట్రీషియన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.‘బాంక్వెట్ హాల్ ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉంది. తెల్లవారుజామున 3:30 గంటలకు, నోయిడా సెక్టార్ 74లోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్లో మంటలు చెలరేగినట్లు మాకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న 15 నిమిషాల్లోనే 15 ఫైర్ టెండర్లు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కోట్ల విలువైన బాంక్వెట్ హాల్ అగ్నికి ఆహుతైంది’ అని నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ తెలిపారు.#WATCH | UP | Lotus Grandeur banquet hall located in Noida's sector 74 was gutted in a fire which broke out late last night. The banquet hall was currently under renovation. As per Police, one person died in the incident. pic.twitter.com/R4pEti1MdB— ANI (@ANI) October 30, 2024 -
అమెరికాలో బ్యాలెట్ డ్రాప్బాక్స్లకు నిప్పు
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లకు నిప్పు పెట్టారు. సోమవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒరెగాన్లోని పోర్ట్‌లాండ్‌లో మూడు బ్యాలెట్ డ్రాప్‌బాక్స్‌లు కాలిపోగా, వాషింగ్టన్, వాంకోవర్‌లో పెద్దసంఖ్యలో దగ్ధమైనట్లు వార్తలొచ్చాయి. అక్టోబర్ 8వ తేదీన వాంకోవర్‌లో జరిగిన ఘటనలో బ్యాలెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ డ్రాప్ బాక్సులకు నిప్పు పెట్టారని పోర్ట్లాండ్ పోలీస్ అసిస్టెంట్ ఛీఫ్ అమాండా మెక్‌మిల్లన్ తెలిపారు. వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్రాల్లో జరిగిన ఈ చర్యలపై గుర్తుతెలియని నిందితులపై విధ్వంసక పరికరాన్ని కలిగి ఉండటం, ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వాంకోవర్‌లో సోమవారం బ్యాలెట్ డ్రాప్ బాక్సుల నుంచి పొగలు వస్తుండటంతో పోలీసులు బ్యాలెట్ బాక్స్ పక్కన ఉన్న అనుమానాస్పద పరికరాన్ని తొలగించారు. ఒరెగాన్లోని పోర్ట్‌లాండ్‌లో బ్యాలెట్ బాక్స్‌లో సోమవారం ఉదయం ఇలాంటి మరో ఘటనే జరిగింది. ఈ ఘటనలో మూడు బ్యాలెట్లు మాత్రమే దెబ్బతిన్నాయని, మరోసారి ఓటు వేసేలా ఆ ఓటర్లను సంప్రదిస్తామని కౌంటీ ఎన్నికల డైరెక్టర్ తెలిపారు. తమ బ్యాలెట్ లెక్కలోకి వచ్చిందో లేదో స్టేటస్‌ను ఆన్లైన్లో చెక్‌చేసుకుని, పరిగణనలోకి రాకపోతే ప్రత్యామ్నాయం కోసం అభ్యర్థించాలని వాషింగ్టన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్యాలయం ఓటర్లకు సూచించింది. వాంకోవర్‌లో డెమొక్రటిక్ ప్రతినిధి మేరీ గ్లూసెన్కాంప్ పెరెజ్, రిపబ్లికన్ ప్రత్యర్థి జోకెంట్ బరిలో ఉన్నారు. బ్యాలెట్ డ్రాప్ బాక్సులకు పోలీసులు రాత్రిపూట రక్షణగా ఉండాలని గ్లూసెన్కాంప్ పెరెజ్ డిమాండ్ చేశారు. ఫీనిక్స్‌లో గురువారం మెయిల్‌బాక్స్‌ను తగలబెట్టిన ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 20 బ్యాలెట్లు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వాషింగ్టన్ రాష్ట్రంలో చట్టబద్ధమైన, నిష్పాక్షిక ఎన్నికలకు విఘాతం కలిగించే అతివాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అమెరి కా విదేశాంగ మంత్రి స్టీవ్ హాబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లందరూ సురక్షితంగా ఎన్నికల్లో పాల్గొనేలా చూసే అధికారుల సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందన్నారు. -
జనగాంలో భారీ అగ్ని ప్రమాదం.. 20 కోట్ల ఆస్తి నష్టం (ఫొటోలు)
-
Hyderabad: క్రాకర్స్ షాపులో అగ్ని ప్రమాదం
సుల్తాన్‌బజార్: బొగ్గులకుంటలోని పరస్ ఫైర్వర్క్స్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. గౌలిగూడ నుంచి నాలుగు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. క్రాకర్స్‌కు నిప్పు అంటుకుని భారీ శబ్దాలు రావడం, మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్కల ఉన్నవాళ్లు భయాందోళనతో పరుగులు తీశారు. దట్టమైన పొగతో అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బొగ్గులకుంట చౌరస్తా నుంచి కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు ట్రాఫిక్‌ను మళ్లించారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటా? లేక మానవ తప్పిదమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. దు కాణం పక్కన ఉన్న బిల్డింగ్‌కు కూడా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న తాజా టిఫిన్ సెంటర్‌కు సైతం మంటలు వ్యాపించాయి. గౌలిగూడ ఫైర్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని అగి్నమాపక బృందం మంటలను ఆరి్పంది. క్రాకర్స్ కొనుగులుదారుల వాహనాలు కూడా అగ్నికి ఆహుతి కావడం ఆందోళనకు కలిగిస్తోంది. -
Hyderabad: పెట్రోల్ పోస్తుండగా నిప్పుపెట్టిన ఆకతాయి
మల్లాపూర్: మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోలు పోస్తుండగా ఓ ఆకతాయి నిప్పు అంటించిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆరి్పవేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, ఎస్ఐ మైబెలి తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్ ఓల్డ్ మీర్‌పేట్‌కు చందన్‌కుమార్ (19) తన స్నేహితులతో కలిసి యాక్టివా ద్విచక్రవాహనంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు.అదే సమయంలో సిబ్బంది వేరే కస్టమర్‌కు బాటిల్లో పెట్రోల్ పోస్తుండగా చందన్‌కుమార్ సడన్‌గా జేబులోంచి లైటర్ తీసి వెలిగించాడు. ‘అంటించమంటారా..’ అంటూ పెట్రోలు నింపుతున్న సిబ్బంది దగ్గరకు వచ్చి అంటించాడు. దీంతో గన్‌కు మంటలు అంటుకున్నాయి. తీవ్ర భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ ఫోమ్‌తో మంటలు ఆరి్పవేశారు. దీంతో పెట్రోల్ బంక్‌లో ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా..చందన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. గంజాయి మత్తులో ఉన్న యువకులు..హైదరాబాద్ - నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలువెంటనే మంటలను ఆర్పిన పెట్రోల్ బంక్… pic.twitter.com/IVmrhJPfdy— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024 -
రాజధానిలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోగల ఓ ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పోలీసులు ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం వసంత్ కుంజ్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో పేలుడు సంభవించింది. కొద్దిసేపటికే మంటలు ఇంటినంతా చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పి లోపలికి ప్రవేశించారు. శరీరం కాలిపోయి అపస్మారక స్థితిలోకి చేరిన బాధితులను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.మూడు రోజుల క్రితం కూడా ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పాఠశాల సమీపంలో పేలుడు సంభవించింది. రోజులు గడుస్తున్నా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఈ పేలుడు శబ్ధం దాదాపు 30 అడుగుల దూరం వరకు వినిపించగా, 250 అడుగుల మేర పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుడుపై ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ, నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: మద్యంపై పోరులో మహిళల విజయం..! -
పూణె మెట్రో స్టేషన్లో మంటలు
పూణె: మహారాష్ట్రలోని పూణెలోని ఒక మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం ఘటనా స్థలికి చేరుకుని, మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని మెట్రో అధికారులు తెలిపారు.పూణెలోని మండై మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్‌లో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన మెట్రో అధికారులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.ఐదు అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఐదు నిమిషాల వ్యవధిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మెట్రో స్టేషన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ఒక ట్వీట్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. మెట్రో స్టేషన్లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. पुणे के मेट्रो स्टेशन में लगी आगमहाराष्ट्र के पुणे में मंडई मेट्रो स्टेशन के ग्राउंड फ्लोर पर रविवार आधी रात को आग लग गई, हालांकि घटना में कोई घायल नहीं हुआ. फायर विभाग के मुताबिक, वेल्डिंग के दौरान फोम में आग लगने से यह घटना घटी.#Maharashtra | #pune | #fireaccident | #fire pic.twitter.com/V8lBA4hdTV— NDTV India (@ndtvindia) October 21, 2024ఇది కూడా చదవండి: పిరమిడ్‌పై పక్షుల వేట -
బ్యాంకు లాకర్లో డబ్బు కాలిపోతే తిరిగిస్తారా..?
సంపాదించిన డబ్బు, బంగారం, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రపరిచేందుకు బ్యాంకులు లాకర్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి బ్యాంకు కాలిపోతే మన డబ్బు, బంగారంకు ఎవరు బాధ్యత వహిస్తారనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా. ఎలాగో ఆ డబ్బంతా బ్యాంకు లాకర్లో ఉంచాం కాబట్టి బ్యాంకే దానికి పూర్తి బాధ్యత వహిస్తుందని అనుకుంటాం. కానీ నిబంధనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.ఉదాహరణకు సునిల్ ఏడాదికి రూ.3000తో బ్యాంకు లాకర్ రెంట్ తీసుకున్నాడు. ఆ లాకర్లో 300 గ్రాముల బంగారం(ప్రస్తుత ధర ప్రకారం దాని విలువ సుమారు రూ.18 లక్షలు) ఉంచాడు. తానుంటున్న ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. దాంతో తాను కష్టపడి సంపాదించిన డబ్బు రూ.10 లక్షలు కూడా ఆ లాకర్లో పెట్టాడు. కొన్ని రోజులు గడిచాక తనకు డబ్బు అవసరం ఉండి బ్యాంకుకు వెళ్లి లాకర్ తాళం తీసిన సునిల్ షాక్‌కు గురయ్యాడు. తాను లాకర్లో ఉంచిన రూ.10 లక్షలు చెదలు పట్టింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా పాడయ్యాయి. వెంటనే బ్యాంకు సిబ్బందికి విషయం చెప్పాడు. కానీ నిబంధనల ప్రకారం తనకు డబ్బు తిరిగి చెల్లించడం కుదరదని చెప్పారు. ఒకవేళ బంగారం పోతే మాత్రం నిబంధనల ప్రకారం..ఏటా తాను చెల్లిస్తున్న రూ.3000కు 100 రెట్లు అంటే రూ.3,00,000 వరకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. అంతకు మించి విలువైన బంగారం అందులో ఉన్నా రూ.మూడు లక్షలే చెల్లించేలా నిబంధనలున్నాయని వివరించారు.బ్యాంకులు లాకర్ రూమ్‌కు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తాయి. 24*7 కెమెరా సదుపాయం ఉంటుంది. భద్రత కోసం అలారం సౌకర్యం ఏర్పాటు చేస్తారు. లాకర్ల భద్రతకు సంబంధించి బ్యాంకులు పటిష్ట చర్యలే పాటిస్తాయి. కానీ ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే మాత్రం తదుపరి పర్యవసనాలకు కస్టమర్లు సిద్ధంగా ఉండాల్సిందే.ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!డబ్బును లాకర్లు, బీరువాలో ఉంచడం వల్ల కాలంతోపాటు దాని విలువ తగ్గిపోతుంది. నిత్యం ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా ఏటా సుమారు 5-6 శాతం మేర డబ్బు విలువ పడిపోతుంది. కాబట్టి దీర్ఘకాల పెట్టుబడులు ఎంచుకుని అందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఎఫ్డీ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు..వంటివి ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు. -
టాటా కంపెనీకి షోకాజ్ నోటీసులు
ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ హెల్త్ అండ్ సేఫ్టీ (డీఐఎస్‌హెచ్) టాటా ఎలక్ట్రానిక్స్‌కు షోకాజ్ నోటీసు అందజేసింది. గత నెల 28న తమిళనాడులోని టాటా యూనిట్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి వివరణ ఇవ్వాలని డీఐఎస్‌హెచ్ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కంపెనీ ప్రతినిధులు వారంలోపు స్పందించాలని తెలిపింది.ఫ్యాక్టరీల చట్టం ప్రకారం..ఫ్యాక్టరీ వ్యవహారాలపై అంతిమ అధికారం కలిగి ఉన్న వ్యక్తి కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టప్రకారం ఆ వ్యక్తిని ‘ఆక్యుపైయర్’గా పరిగణిస్తారు. కంపెనీ డైరెక్టర్లు లేదా సంస్థ ప్రతిపాదించిన వ్యక్తి ఈ హోదాలో ఉండవచ్చు. కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆక్యుపైయర్ తెలియజేయాల్సి ఉంటుంది. ప్రమాదానికిగల కారణాలు చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగిందో వివరించడానికి కంపెనీకి ఒక అవకాశం కల్పించడం కోసం ఇలా ఈ షోకాజు నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..ఇప్పటికే డీఐఎస్ఎహెచ్ ప్రమాదానికిగల కారణాలను అంచనా వేసిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. తమిళనాడు హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్‌కు చెందిన యానోడైజింగ్ ప్లాంట్‌లో థర్మోస్టాట్ నియంత్రణ వైఫల్యం కారణంగా మంటలు చెలరేగాయని కంపెనీ అధికారులు చెప్పారు. ఈ యూనిట్లో యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది. -
కళ్లెదుటే కన్నకొడుకు సజీవ దహనం.. పాపం ఆ తల్లి..
మానకొండూర్: ఆరేళ్ల బాలుడు మిట్టమధ్యాహ్నం ఇంట్లో గాఢనిద్రలో ఉన్నాడు.. హఠాత్తుగా శరీరానికి వేడి తాకింది. నిద్రలోంచి తేరుకున్న ఆ చిన్నారి చుట్టూ మంటలు.. అమ్మా.. అమ్మా.. అంటూ హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు మరోగదిలోకి పారిపోయాడు. ఇంటి ఆవరణలో కొంత దూరంలో ఉన్న తల్లి మంటలను గమనించింది. కొడుకును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ విషాదంపై స్థానికులు తెలిపిన వివరాలివి.ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన అగ్గిడి రాజు, అనిత దంపతులకు రితిక, కొడుకు సాయికుమార్ (6) సంతానం. సాయికుమార్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రాజు ఆటో డ్రైవర్, అనిత కూరగాయలు అమ్ముతుంది. దీంతోపాటు సీజన్లో టార్పాలిన్లు (పరదాలు) కిరాయికి ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో కూలర్ వేసుకుని సాయికుమార్ నిద్రిస్తున్నాడు. అనిత, రితిక ఇంటికి కొంతదూరంలో చెట్టు కింద కూర్చుకున్నారు. విద్యుదాఘాతంతో ఇంటి ఎదుట పందిరికి మంటలు అంటుకుని ఇంట్లోని టార్పాలిన్లకు వ్యాపించాయి.నిద్రలో ఉన్న సాయికుమార్ గమనించి ‘అమ్మా.. అమ్మా.. మంటలు’అంటూ ఏడుస్తూ అరిచాడు. గమనించిన తల్లి అనిత ఇంటి వద్దకు పరుగు తీసింది. అప్పటికే మంటలు ఎగిసిపడుతున్నాయి. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో ఆమెకూ గాయాలయ్యాయి. మంటలు మరింత వ్యాపించడంతో బాలుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు.. ఇంట్లోని మరోగదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్యస్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక శకటం చేరుకుని, మంటలార్పగా.. అప్పటికే మంటల వేడి తాళలేక, పొగతో ఊపిరి ఆడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లెదుటే మంటల్లో కాలిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మానకొండూర్ ఇన్చార్జి సీఐ స్వామి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థుల మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం బ్యాంకాక్‌లో విద్యార్థుల బస్సులో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదలో బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు స్వల్పంగా గాయాలు అయినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మృతదేహాలను కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.Thailand School bus Fire Update-Initially...there were 10 fatalities.! and many injured. #Bangkok #โหนกระแส #ไฟไหม้ #ไฟไหม้รถบัส #Thailand #Schoolbus #Fire #ประเทศไทย #รถดับเพลิง pic.twitter.com/lVgc9LZdLy— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024 ట్రల్ ఉథాయ్ థాని ప్రావిన్స్ నుంచి స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్తున్న సమయంలో బ్యాంకాక్ ఉత్తర శివారు ప్రాంతమైన పాతుమ్ థాని ప్రావిన్స్ వద్ద మధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయని రవాణా మంత్రి సూర్యా జుంగ్రుంగ్రూంగ్కిట్ తెలిపారు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించటం పూర్తి చేయనందున మరణాల సంఖ్యను ఇంకా ధృవీకరించలేకపోయారని మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ మీడియాకు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారి సంఖ్య ఆధారంగా ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు.School bus after fire. #ไฟไหม้รถบัสที่วิภาวดี #ไฟไหม้รถบัส #ไฟไหม้ #รถบัสไฟไหม้ #รถบัส #โหนกระแส #Thailand #Schoolbus #ประเทศไทย https://t.co/UdnhJSiPCb— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024ఈ ఘటనపై ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా ఎక్స్‌లో స్పందించారు. ‘ఈ ప్రమాదంలో గాయపడినవారికి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తాం’’ అని అన్నారు. విద్యార్థుల వయస్సు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. బస్సు టైర్లలో ఒకటి పేలడంతో అదుపుతప్పి.. మంటలు చెలరేగాయని సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు పోలీసులకు తెలిపారు.చదవండి: హిజ్బుల్లా నస్రల్లా హత్య ప్లాన్.. బంకర్లోకి విషవాయువులు! -
విశాఖలో నడిసంద్రంలో అగ్నిప్రమాదం, బోటు దగ్ధం
-
ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్లు అత్యవసరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించకుండా ఫార్మా పరిశ్రమలు ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్లతో పాటు అలారం వ్యవస్థను తప్పకుండా ఏర్పాటుచేసుకోవాలని ఫార్మా ప్రమాదాలపై ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ అభిప్రాయపడుతోంది. సాల్వెంట్ ట్యాంకర్ లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ మొత్తం పెట్రోల్ బంకుల తరహాలో ఎర్త్ రైట్ సిస్టమ్ ద్వారా నిర్వహించాలని కూడా స్పష్టంచేస్తోంది. ఈ మేరకు రెండ్రోజుల పాటు విశాఖ అచ్యుతాపురం సెజ్, రాంకీ ఫార్మాలోని వివిధ యూనిట్లను పరిశీలించడంతో పాటు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిటీ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సెజ్లల్లో ఉన్న ప్రతి ఫార్మా కంపెనీలో భద్రతాపరమైన లోటుపాట్లు స్పష్టంగా ఉన్నట్లు ఈ ఉన్నతస్థాయి కమిటీ గుర్తించింది. మొత్తం ఏడు విభాగాలకు సంబంధించిన అంశాలతోనూ, ఫార్మా కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరించిన వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి త్వరలో అందజేయనుంది. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆగస్టు 21న జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా.. 39 మంది క్షతగాత్రులైన విషయం తెలిసిందే. రెండ్రోజుల వ్యవధిలోనే పరవాడ సినర్జీస్ కంపెనీలో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ రెండు ప్రమాదాలు ఎలా జరిగాయి? ఇలాంటివి పునరావృతం కాకుండా నిబంధనలు ఎలా కఠినతరం చెయ్యాలనే అంశాలపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా ఆధ్వర్యంలో హైలెవల్ కమిటి జిల్లాలోని సెజ్‌లలో పర్యటించింది. ప్రమాదం జరిగిన కంపెనీలతో పాటు సెజ్లని పరిశీలించింది. అనంతరం.. ఆయా విభాగాల అధికారులు, ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు కోణాల్లో హైలెవల్ కమిటీ నివేదిక సిద్ధంచేసింది. ఒకటి.. జరిగిన ప్రమాదానికి గల కారణాలు, రెండు.. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, మూడు.. పరిశ్రమలు అవలంబించాల్సిన అత్యాధునిక విధానాల్ని సూచిస్తూ సమగ్ర నివేదిక సిద్ధంచేసింది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ౖఫైర్, డ్రగ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఏపీపీసీబీ, బాయిలర్స్ విభాగాల నుంచి సలహాలతో నివేదికని తయారుచేశారు.నివేదికలో ముఖ్యమైన అంశాలు» ప్రతి ఫార్మా పరిశ్రమ.. అడ్వాన్స్డ్ విధానాలు అవలంబించాలని హైలెవల్ కమిటీ సూచనలు చేసింది. అవి.. రియాక్టర్లు వినియోగించే ఫార్మా కంపెనీలు కచ్చితంగా రివర్స్ చార్జింగ్ మెకానిజమ్ని ఏర్పాటుచేసుకోవాలి. దీనివల్ల పొరపాటున మండే స్వభావం ఉన్న రసాయనాలు లీకైతే ఘన పదార్థాలు రియాక్టర్‌లోని మ్యాన్‌హోల్ ద్వారా పంపించి.. ఘన పదార్థంగా మార్చే అవకాశం ఉంటుంది.» నిర్ధిష్ట రసాయనాల్ని అవసరమైన పరిమాణాల్లోనే నిల్వ ఉంచేందుకు ప్రయత్నించాలి. సాల్వెంట్స్ లోడింగ్ అన్లోడింగ్ చేసేందుకు కచ్చితంగా ఎర్త్ రైట్ సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఫార్మా కంపెనీలో ఉన్న క్లోజ్డ్ రూమ్‌లలో ఫిక్స్డ్ ఆక్సిజన్ మీటర్లు ఏర్పాటుచేయాలి.» ఫార్మా కంపెనీల్లో అన్ని ఎలక్ట్రికల్ ప్యానెల్లు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు దూరంగానే అమర్చుకోవాలి. ప్యానెల్ ప్రాంతానికి సమీపంలో సాల్వెంట్స్ నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలి.» సిబ్బంది వివరాలు ప్యానెల్ ప్రాంతానికి సమీపంలోనే ప్రదర్శించాలి. అక్కడ స్మోక్, హీట్ డిటెక్టర్లు అందుబాటులో ఉంచాలి.» ఎలక్ట్రికల్ ప్యానెల్ ఏరియాల్లో ఆటోమేటిక్ అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ అందుబాటులో ఉంచాలి. -
రామ రామ.. రథానికి నిప్పు
సాక్షి టాస్‌్కఫోర్స్: గుళ్లు, రథాలు వాళ్లే ధ్వంసం చేస్తారు.. గిట్టని వారిపై ఆ నింద వేస్తారు. వాళ్లే అపచారాలు చేస్తారు.. ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తారు. ఆలయాల ప్రతిష్టను వాళ్లే మంటగలుపుతారు.. ఎదుటి పక్షం వారికి నేరం అంటగడతారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ పెద్దల తీరిది. నాటి గోదావరి పుష్కరాలు మొదలు.. నేటి తిరుమల లడ్డూ వరకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాషీ్టకాలివి. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని దుష్ప్రచారం చేసి, ప్రజల్లో చులకనవుతున్న టీడీపీ పెద్దలను.. ఆ వివాదం నుంచి గట్టెక్కించడానికి ఆ పార్టీ నేతలు మరో ఘాతుకానికి తెరలేపారు.'ఇందుకు అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ రామాలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. సుమారు మూడున్నర వేల మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో ఏటా శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల వారిని ఊరేగించే రథానికి నిప్పు పెట్టించారు. ఈ నెపాన్ని ప్రత్యర్థులపై వేసి.. రాజకీయంగా లబ్ధి పొందాలని విఫలయత్నం చేసినా, ఈ దుర్మార్గానికి పాల్పడింది టీడీపీ వారేనని గ్రామమంతా కోడై కూస్తుండటంతో తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు.స్థానికుల కథనం మేరకు.. హనకనహళ్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి, శ్రీరామాలయాలు ఊరి నడి»ొడ్డున పక్కపక్కనే ఉన్నాయి. ఈ ఊళ్లో ప్రజలు శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు సీతారాముల వారిని రథంపై ఊరేగిస్తారు. అనంతరం రథాన్ని ఆలయం పక్కనే ఉన్న షెడ్డులో ఉంచుతారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఇద్దరు వ్యక్తులు షెడ్డు తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. రథంపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఎదురింటిలో ఉండే అనసూయమ్మ అదే సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు రావడంతో రథమున్న షెడ్లో నుంచి మంటలు రావడం గమనించింది. వెంటనే ఆమె.. తన మామ ఎర్రిస్వామికి విషయం చెప్పింది. ఆయన ఇరుగు పొరుగు వారిని నిద్ర లేపి మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగం రథం కాలిపోయింది. అలజడి రేగడంతో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలంతా ఆలయం వద్దకు తరలివచ్చారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఘటన స్థలానికి చేరుకున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, పలువురు పోలీసు, దేవదాయ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించారు. కాగా, దుండగులిద్దరూ టీడీపీకి చెందిన వారని, ఉద్దేశ పూర్వకంగానే రథానికి నిప్పుపెట్టినట్లు పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు. ముమ్మాటికీ ఇది టీడీపీ పనే.. ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరే కీలకమని భావిస్తున్నారు. అయితే వీరిద్దరినే అదుపులోకి తీసుకుంటే అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని, మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా చూపుతూ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో టీడీపీ వారిని తప్పించి అమాయకులను బలి చేయాలని చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ పెద్దలు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఇద్దరితో ఈ దుర్మార్గ పని చేయించిన వారెవరో కూడా స్పష్టం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాములోరి రథం దగ్ధం ఘటనలో బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. మంగళవారం ఉదయం వారు సంఘటన స్థలాన్ని సందర్శించి.. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, ఆర్డీఓ రాణీసుస్మితను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు స్పష్టమవుతోందని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఆలయాల వద్ద, ఆలయాల పరిసర ప్రాంతాల్లో రథాలున్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.సమగ్రంగా దర్యాప్తు చేయండి: సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనకనహాల్‌లో రాములోరి రథం దగ్ధం కావడంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులకు సీఎం సూచించారు. -
చమురు ట్యాంకర్‌కు మంటలు
ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడులకు గురైన ‘సోయూనియన్’ అనే 900 అడుగుల భారీ చమురు ట్యాంకర్ ఇది. ఆగస్ట్ 21వ తేదీన ట్యాంకర్‌కు అంటుకున్న మంటలు ఇప్పటికీ చల్లారలేదు. ఇందులోని 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు లీకైతే మునుపెన్నడూ లేనంతగా సముద్ర పర్యావరణానికి హాని కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, సాధ్యమైనంత మేర ట్యాంకర్‌లోని చమురును తరలించే అత్యంత క్లిష్టమైన ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. గ్రీస్‌కు చెందిన ఈ నౌక యాజమాన్యం ఈ విషయంలో సౌదీ అరేబియా సాయం కోరింది. అప్పటి వరకు మరిన్ని దాడులు జరగకుండా గ్రీస్, ఫ్రాన్సు నౌకలు ‘సోయూనియన్’కు కాపలాగా ఉన్నాయి. -
రజినీకాంత్ మూవీ షూటింగ్ లో పేలిన లిథియం కంటైనర్
-
విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న కంటైనర్ టెర్మినల్ లో అగ్నిప్రమాదం
-
ముంబైలో అగ్ని ప్రమాదం.. 13 మందికి గాయాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఘట్కోపర్ ప్రాంతంలోని ఏడంతస్తుల భవనంలో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయి.ఈ ప్రమాదంలో 13 మంది వ్యక్తులు గాయపడగా.. వారిని సమీప ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మొత్తం.. 90 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.ఘట్కోపర్ ఈస్ట్‌లోని రమాబాయి అంబేద్కర్ నగర్ మగస్వర్గియ హౌసింగ్ సొసైలో ఈ మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన 90 మంది బిల్డింగ్ మెట్ల ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో 13 మంది గాయపడ్డారని ముంబై అగ్నిమాపక దళం తెలిపింది. వారిని రాజావాడి ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ఉమెన్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. ఇద్దరు యువతుల మృతి
చెన్నై: తమిళనాడులోని మధురైలో ఘోరం జరిగింది. ఓ లేడీస్ హాస్టల్ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఇద్దరు యువతులు చనిపోయారు. పొగతో ఊపిరి ఆడక వీళ్లు మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాట్రంపళయం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో తెల్లవారుజాము ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దాని దగ్గర నిద్రిస్తున్న ఇద్దరు యువతులు చనిపోయారు. వీళ్లలో ఒక యువతి స్థానికంగా టీచర్‌గా పని చేస్తున్నారు మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఘటనా సమయంలో హాస్టల్లో 40 మందికి పైగా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫ్రిడ్జ్ పేలి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.மதுரை பெண்கள் விடுதியில் தீ விபத்து.. ஆசிரியை உள்பட 2 பெண்கள் உயிரிழப்பு.. https://t.co/zm7evboOMe #madurai— Top Tamil News (@toptamilnews) September 12, 2024ఇదీ చదవండి: వృద్ధురాలి గొంతు కొరికి, ఆపై.. -
బడిలో మంటలు.. చిన్నారుల సజీవదహనం
తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రైమరీ స్కూల్లో మంటలు చెలరేగి చిన్నారులు సజీవ దహనం అయ్యారు. మరణించవాళ్లంతా 5 నుంచి 12 ఏళ్లలోపువాళ్లే కావడం గమనార్హం. ప్రమాద తీవ్రతను మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.కెన్యాలో తూర్పు ఆఫ్రికా వెంట పాఠశాలల్లో గత కొంతకాలంగా అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాజధాని నైరోబీకి 170కిలోమీటర్ల దూరంలో.. మధ్య కెన్యా నైయేరీ కౌంటీలో ఘోరం చోటు చేసుకుంది.హిల్‌సైడ్ ఎండారషా ప్రైమరీ పాఠశాల వసతి గృహంలో గత అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు చిన్నారులు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు.తీవ్రంగా గాయపడిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అధికారులు ఇంకా ఓ అంచనాకి రాలేదు. #BREAKINGTragic news from Kenya as at least 17 children have lost their lives in a devastating fire at Hillside Endarasha Academy in Kieni, Nyeri.Bodies were burned beyond recognition.#Kenya #SchoolFire #HillsideEndarasha #Tragedy #BreakingNewspic.twitter.com/sDskxUYBxQ— Mr. Shaz (@Wh_So_Serious) September 6, 2024 మృతదేహాలు గుర్తుపట్టలేనంతంగా కాలిపోయాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఘటనపై అధ్యక్షుడు విలియమ్ రుటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ స్కూల్లో సుమారు 800 చిన్నారులు వసతి పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 17 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల తొలగింపు తర్వాత మరిన్ని మృతుల సంఖ్యపై స్పష్టత రావొచ్చని అధికారులు అంటున్నారు. గతంలో.. 2016లో నైరోబీలోని ఓ బాలికల పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మరణించారు. 1994లో టాంజానియాలోని కిలిమంజారో రీజియన్‌లో ఓ స్కూల్లో మంటలు చెలరేగి 40 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. -
HYD: పిస్తాహౌజ్లో అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిస్తాహౌజ్ హోటల్లో శుక్రవారం(సెప్టెంబర్6) ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. కిచెన్‌లో మంటలు చెలరేగాయి. మంటలతో చుట్టుపక్కల వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. పక్కనే హాస్పిటల్ ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
సీతారాంబాగ్ లో అగ్నిప్రమాదం
-
మృత్యుఘోష.. అచ్యుతాపురం సెజ్‌లో భారీ విస్ఫోటం
సాక్షి, అనకాపల్లి, అచ్యుతాపురం: అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. మధ్యాహ్నం 2.15 గంటలు.. భోజన విరామం.. ఇటు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్నవారు.. అటు రెండో షిఫ్ట్ కోసం వస్తున్న కార్మికులతో అక్కడంతా కోలాహలంగా ఉంది. అకస్మాత్తుగా భారీ పేలుడు.. ఏడంతస్తుల భవనం చిగురుటాకులా కంపించింది. చుట్టూ కిలోమీటర్ మేర దట్టమైన పొగలు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు.. మాసం ముద్దలు.. ఒలికిన రసాయనాలు.. ఫ్లోరంతా రక్తపు చారికలు, హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. భవనం కిందనున్నవారు చూస్తుండగానే తమ సహచరుల శరీర భాగాలు గాల్లో ఎగురుతూ కనిపించాయి. కొన్ని మృత దేహాలు యంత్రాలకు, చెట్లకు వేలాడుతున్నాయి. దట్టమైన పొగల మధ్య నుంచి బయటకు పరుగులు తీస్తున్న కార్మీకులకు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఎసైన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో 17 మంది మరణించారు. సుమారు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎసైన్షియా కంపెనీ ప్రధాన కార్యాలయంలో రియాక్టర్ పేలిపోవడంతో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా ఎందరున్నారో.. రక్తపు ముద్దలు, శరీర భాగాలు ఎవరివో తెలియని విషాద పరిస్థితి నెలకొంది. పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో హెచ్‌పీసీఎల్ తర్వాత ఆ స్థాయిలో కార్మీకులు/సిబ్బంది ఈ దుర్ఘటనలోనే చనిపోయినట్లు చెబుతున్నారు. పెను విషాదం చోటు చేసుకున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బాధితులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమవారి సమాచారం కోసం కంపెనీ ముందు ఆతృతగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల బంధువులు పేలుడు ధాటికి తునాతునకలు.. సెజ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఎసైన్షియాలోని మూడో ఫ్లోర్లో 500 కిలోల సామర్ధ్యం గల రియాక్టర్ పేలిపోవటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి మృతదేçహాలు తునాతునకలుగా చెల్లాచెదురయ్యాయి. చెట్ల కొమ్మలపై.. శ్లాబ్ కింద నుజ్జు నుజ్జుగా కనిపించాయి. ప్రమాదం ధాటికి ఫార్మా కంపెనీ పరిసరాల్లో భీతావహ పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా ముగ్గురు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో, ఒకరు ఉషాప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రమాద స్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. భోజన విరామం కావడంతో.. ఎసైన్షియా కంపెనీలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు 14 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో గోడలు పగిలి దూరంగా పడిపోయాయి. ఫ్యాక్టరీలో రెండు షిప్ట్‌లలో 381 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. భోజన విరామం కావడంతో పేలుడు సంభవించినప్పుడు ఉద్యోగులు తక్కువ సంఖ్యలో విధుల్లో ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అగ్ని ప్రమాదంలో 60 మంది కార్మికులు, ఉద్యోగులు చిక్కుకున్నారు. సాల్వెంట్ మిశ్రమంలో రియాక్షన్‌తో.. అచ్యుతాపురం సెజ్‌లో రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ సెజ్‌లోని ప్లాట్ నం 11, 11ఏ, 12, 12ఏలో 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. కంపెనీలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్ధాలు (టానిక్‌లు, డ్రాప్స్), బల్క్ డ్రగ్స్, స్పిరిట్ అండ్ సాల్వెంట్స్ తయారీ, సప్లయింగ్ చేస్తున్నారు. సాల్వెంట్‌లో రియాక్షన్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. రసాయన మిశ్రమం కలిసే రెండో రియాక్టర్లో ఈ పేలుడు సంభవించింది. మృతదేహాలు మూట గట్టి..ముక్కలుగా చెల్లాచెదురైన మృతదేహాలను మూటగట్టి గుట్టు చప్పుడు కాకుండా కేజీహెచ్‌కు సుమారు 15 ప్రైవేట్ అంబులెన్స్‌ల్లో రాత్రి 9 గంటల తరువాత తరలించారు. మీడియా ప్రతినిధులు, బాధితుల కుటుంబ సభ్యులు లోపలకి వెళ్లకుండా సెక్యూరిటీ పెంచారు. గాయపడ్డ వారి వివరాలు తెలుసుకునేందుకు కనీసం అంబులెన్స్‌ల వద్దకు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుని పోలీసులను భారీగా మోహరించారు.⇒ మొత్తం మృతులు 17 మంది. 9 మంది ఆచూకీ తెలియడం లేదు.⇒ ప్రమాదం జరిగినప్పుడు అణుబాంబు పేలినంత భారీ శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 10 నిమిషాలపాటు చెవులు గింగుర్లు ఎత్తిపోయాయన్నారు.⇒ పేలుడు కంటే భవనం కూలడంతో శిథిలాల మధ్య చిక్కుకొని ఎక్కువమంది మరణించారు.మా వాళ్లేమయ్యారో..!రాంబిల్లి (యలమంచిలి): అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ప్రమాదం నేపథ్యంలో పలువురు కార్మీకుల ఆచూకీ తెలియకపోవడంతో కంపెనీ వద్ద వారి బంధువులు ఆందోళనకు దిగారు. తమ వారి వివరాలు చెప్పాలని పోలీసులను, కంపెనీ ప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నా కనీస స్పందన లేదని వాపోతున్నారు. బతికే ఉన్నారో.. చనిపోయారో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపిక, డీఐజీ గోపీనాథ్ జెట్టీ తదితరులు బయటకు వెళ్లకుండా మెయిన్ గేట్ వద్ద అడ్డుకుని బైఠాయించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాద స్థలికి రాత్రి 11 గంటల సమయంలో వస్తారనే సమాచారంతో బాధితుల కుటుంబీకులు, బంధువులు ఆకలి దప్పులు మరిచి అక్కడే కూర్చున్నారు. కంపెనీ వెనుక గేటు నుంచి మృతదేహాలను రహస్యంగా తరలిస్తున్నట్లు తెలియడంతో కొందరు అక్కడకు చేరుకుని బైఠాయించారు. కనీసం మృతదేహాలను కూడా చూపలేదని, అన్నింటినీ మూటకట్టి గుట్టుగా తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పరిహారం ప్రకటించే వరకు మృతదేహాలను తీసుకెళ్లబోమని బంధువులు కేజీహెచ్ ఎదుట అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.అమెరికాలో కంపెనీ ఏర్పాటు..ఎసైన్షియా లైఫ్ సైన్సెస్ కంపెనీ 2007లో అమెరికాలోని సౌత్ విండ్సర్‌లో స్థాపించారు. కంపెనీ తన కార్యకలాపాలను అమెరికాతో పాటు హైదరాబాద్, విశాఖపట్నంలో నిర్వహిస్తోంది. యాదగిరి పెండ్రి దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నారు. యాదగిరి పెండ్రి 15 యూఎస్ పేటెంట్స్ పొందారు. ఈ కంపెనీ 2016లో విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో రిజిస్టర్ అయ్యింది. 2018లో కార్యకలాపాలను ప్రారంభించింది. వివిధ రకాల సిరప్‌లతో పాటు కొత్త ఔషధాల కోసం ప్రయోగాలు నిర్వహిస్తుంటారు.కేజీహెచ్‌కు 13 మృతదేహాలుమహారాణిపేట (విశాఖ): ప్రమాదంలో మరణించిన 13 మంది మృతదేహాలను బుధవారం రాత్రి విశాఖపట్నం కేజీహెచ్ శవాగారానికి తీసుకొచ్చారు. ప్రమాదంలో తునాతునకలైన శరీరభాగాలను మూటలు కట్టారు. దీంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఎవరిది ఏ కాలో.. ఎవరిది ఏ చెయ్యో తెలియడం లేదు.మృతుల వివరాలు1. నీలపు రామిరెడ్డి (49), అసోసియేట్ జనరల్ మేనేజర్/అసోసియేట్ డైరెక్టర్, కొత్త వెంకోజీపాలెం, విశాఖపట్నం2. హంస ప్రశాంత్ (34), సీనియర్ ఎగ్జిక్యూటివ్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా3. మహంతి నారాయణరావు (34), అసిస్టెంట్ మేనేజర్/టీమ్ లీడర్, అర్తమూరు, గరివిడి, విజయనగరం జిల్లా4. కొప్పర్తి గణేష్‌కుమార్ (33), సీనియర్ ఎగ్జిక్యూటివ్, జువ్వలదొడ్డి, బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా5. చల్లపల్లి హారిక (22), ట్రైనీ ఇంజనీర్, రమణయ్యపేట, కాకినాడ6. పైడి రాజశేఖర్ (23) ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్, వంజంగి, ఆముదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా7. మారిశెట్టి సతీశ్ (31), సీనియర్ ఎగ్జిక్యూటివ్, పాశర్లపూడి, తూర్పుగోదావరి జిల్లా8. మొండి నాగబాబు (36), అసిస్టెంట్ మేనేజర్, సామర్లకోట9. నాగేశ్వర రామచంద్రరావు (47), అసిస్టెంట్ మేనేజర్/టీమ్ లీడర్, కూర్మన్నపాలెం, విశాఖ10. వేగి సన్యాసినాయుడు (53), హౌస్ కీపింగ్ బాయ్, అనకాపల్లి11.ఎల్లబిల్లి చిన్నారావు (27), పెయింటర్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా12.జవ్వాది పార్థసారధి (27), ఫిట్టర్, పార్వతీపురం13. పూడి మోహన్దుర్గా ప్రసాద్, హౌస్ కీపింగ్ బాయ్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా14.జె.చిరంజీవి (25)15.బి.ఆనందరావు (35)16. ఎం. సురేంద్ర, అశ్వారావుపేట, ఖమ్మం 17. పి.వెంకటసాయి (28)అంబులెన్సులేవీ..ఎసైన్షియాలో ప్రమాదం జరిగాక సుమారు గంటన్నర వరకూ కూడా అంబులెన్స్‌లు కూడా రాలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో కంపెనీ బస్సుల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సకాలంలో అంబులెన్స్ వచ్చి.. సరైన ఆసుపత్రిలో వైద్యం అందించి ఉంటే ఒకరిద్దరైనా బతికే అవకాశం ఉండేది. అలాగే అంబులెన్స్‌లు లేకపోవడంతో విశాఖలోని కేజీహెచ్‌కు కూడా క్షతగాత్రులను తరలించలేని పరిస్థితి ఏర్పడింది. తరువాత వచ్చిన పది అంబులెన్స్‌లు మృతదేహాలను తరలించడానికే పనికొచ్చాయి.ప్రమాదానికి కారణమిదే..రియాక్టర్లలో ఆర్గానిక్ కాంపౌండ్స్లో కర్బన రసాయనాలను కలిపే సమయంలోనే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్థారించారు. రియాక్టర్ నుంచి మరో రియాక్టర్కి మిశ్రమం పంపిస్తున్న సమయంలో వ్యాపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్ జరిగింది. అంటే.. ఒక రియాక్టర్‌లోని మిశ్రమం అక్కడ ఉన్న ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకి చేరుకోవడం వల్ల ఆవిరి తీవ్రత పెరిగింది. ఈ ఆవిరి పరిమాణం రియాక్టర్లో ఎక్కువ కావడంతో ఒత్తిడి తారస్థాయికి చేరుకుని ఒక్కసారిగా పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. ప్రమాదానికి అసలు కారణాలపై లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.నాతో ఉన్న ముగ్గురు చనిపోయారు భోజనం చేసి బ్లాక్‌లోకి వచ్చాను. అప్పుడే భారీ శబ్దం వినిపించింది. ఆ ధాటికి తూలిపోయి కింద పడిపోయాను. లేచి చూస్తే చుట్టూ పొగ.. కష్టంతో కళ్లు తెరిచి చూస్తే నాతోపాటు ఉన్న ముగ్గురు చనిపోయారు. – బి.రాజారావు, వెంకటాపురంఫ్యామిలీకి చెప్పలేదు మాది హనుమకొండ. కంపెనీ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చా. పేలుడుతో ఏమైందో తెలుసుకునే లోపే శ్లాబ్ పెచ్చులు వేగంగా వచ్చి తలకు తగిలి కుడి వైపు గాయాలయ్యాయి. కంగారు పడతారని కుటుంబ సభ్యులకు ఇంకా ఏమీ చెప్పలేదు.– ప్రభాత్మా అన్నయ్య మృతదేహాన్ని చూపట్లేదుమా అన్నయ్య బీఎన్ రామచంద్రరావు (48) ఇక్కడే పనిచేస్తున్నాడు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే కంపెనీ దగ్గరికి వచ్చా.. అన్నయ్య జాడ తెలియట్లేదు. కంపెనీలో అడిగితే చనిపోయాడని, ఆస్పత్రికి పంపించామని చెబుతున్నారు. కనీసం మృతదేహాన్ని కూడా చూపట్లేదు.– వెంకటలక్ష్మి, అచ్యుతాపురం కళ్లకు ఏమైందో.. మాది విజయనగరం జిల్లా ఎస్.సీతారామపురం. కంపెనీలో నిర్వహణ పనులు చేస్తుంటా. రోజులానే ఈ రోజూ కంపెనీకి వచ్చా. ప్రమాదంలో కళ్లలో ఏదో లిక్విడ్ పడి, రెండు కళ్లూ కనిపించట్లేదు. ముఖమంతా గాయాలతో రక్తపు మరకలయ్యాయి. కళ్లు కనిపిస్తాయో, లేదో కూడా తెలియట్లేదు. – కలిశెట్టి చంద్రశేఖర్సరైన వైద్యం అందట్లేదుచాలా మంది తలకు, కళ్లకు దెబ్బలు తగిలాయి. మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో చేర్చి చాలా గంటలైనా.. వైద్యం మాత్రం సరిగా అందట్లేదు. ఎక్కువ మంది క్షతగాత్రులందరినీ ఒకే ఆస్పత్రిలో చేర్చడంతో ఆ స్థాయిలో వైద్య సిబ్బంది లేరు. – కె.నారాయణరావు, అసిస్టెంట్ మేనేజర్ -
కుట్ర ‘కీలలు’..
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి రాయచోటి: కళేబరం కనిపిస్తే చాలు రాబందులు వాలిపోయినట్లుగా.. రాష్ట్రంలో ఎక్కడైనా చిత్తు కాగితాలు కాలితే చాలు టీడీపీ కూటమి పెద్దలు అక్కడ వాలిపోతున్నారు. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏవో అక్రమాలు జరిగిపోయాయంటూ నిరాధార ఆరోపణలతో రాద్ధాంతం చేస్తున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే ఈ రాజకీయ హైడ్రామాకు నేతృత్వం వహిస్తుండగా.. ఆయన మంత్రివర్గ సహచరులు, టీడీపీ కూటమి నేతలు ఆయనకు తందానా అంటున్నారు. టీడీపీ సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారన్నది తేటతెల్లమవుతోంది. మదనపల్లి, తిరుపతి, లేదా ధవళేశ్వరం.. ఇటీవల ఇక్కడ చోటుచేసుకున్న ఏ అగ్నిప్రమాదాన్ని చూసినా కూటమి నాటకాలు బయటపడుతున్నాయి. మదనపల్లిలో కొండను తవ్వి తుస్సుమన్నారు.. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై కొండను తవ్వినంత పనిచేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలుకను కూడా పట్టుకోలేకపోయింది. షార్ట్ సర్క్యూట్‌వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసు అధికారులు, నిఘా వర్గాలు ఆ రోజు ఉదయాన్నే తనకు చెప్పినట్లు సీఎం చంద్రబాబే వెల్లడించారు. కానీ, ఆ ఉదంతాన్ని అవకాశంగా చేసుకుని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వేధించాలని ఆయన భావించారన్నది స్పష్టమైంది. అందుకే డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను మదనపల్లికి హుటాహుటిన పంపారు. ఇద్దరు ఆర్డీఓ స్థాయి అధికారులను అరెస్టుచేయడంతోపాటు సీఐడీ విచారణకు ఆదేశించారు. కానీ, టీడీపీ ప్రభుత్వ కుట్రలపై తీవ్రంగా స్పందించిన ఎంపీ మిథున్‌రెడ్డి.. ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసరడంతో అంతవరకు హడావుడి చేసిన ప్రభుత్వం తోకముడిచింది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుందో.. ప్రశ్న–1: తహశీల్దార్ కార్యాలయం నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయానికి.. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు ఫైళ్ల ప్రక్రియ అంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉండే ఫైళ్లన్నీ కూడా ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఉంటాయి. మరి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను దగ్థంచేస్తే ఆధారాలు నాశనం చెయ్యొచ్చని ఆర్డీఓ స్థాయి అధికారులు ఎందుకు భావిస్తారు? అంటే ఆ ఆరోపణలన్నీ నిరాధారమే కదా!? ప్రశ్న–2: రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మొత్తం 2,440 ఫైళ్లున్నాయి. అగ్నిప్రమాదాన్ని గుర్తించగానే 740 ఫైళ్లు దగ్థం కాకుండా నివారించారు. మిగిలిన 1,700 ఫైళ్లలో ఇప్పటికే 90 శాతం ఫైళ్లను పునరుద్ధరించారు. మిగిలిన వాటిని కూడా రిట్రీవ్ చేస్తారు. ఇలా ఫైళ్లన్నీ భద్రంగా ఉంటే ఇక అందులో కుట్ర కోణం ఎక్కడుంది!? తిరుపతిలో విజిలెన్స్ చేతులెత్తేయడంతోనే.. ఫైళ్లు, కీలకపత్రాలు కాల్చేశారంటూ టీడీపీ కూటమి నేతలు తమ రెండో డ్రామాకు తిరుపతిని వేదికగా చేసుకున్నారు. టీటీడీ పరిపాలన భవనంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ విభాగంలో ఈనెల 17 సాయంత్రం సంభవించిన చిన్న అగ్నిప్రమాదానికి రాజకీయ రంగు పులిమారు. కానీ, కేవలం చిత్తు కాగితాలే కాలిపోయాయని.. అంతకుమించి ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరి టీడీపీ కూటమి నేతలు ఎందుకు రాద్ధాంతం చేశారంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 72మంది అధికారులు, ఇతర సిబ్బందిని విచారించినా ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయింది. దీన్ని కప్పిపుచ్చేందుకే ఫైళ్ల దగ్థం నాటకం. ధవళేశ్వరంలోనూ చిత్తు కాగితాల చెత్త రాజకీయం.. మదనపల్లి, తిరుపతి తర్వాత టీడీపీ కూటమి పెద్దల హైడ్రామా సీను తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి మారింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలో జిరాక్స్ కాగితాలు, చిత్తు కాగితాలను అక్కడి సిబ్బంది ఉన్నతాధికారుల అనుమతితోనే కాల్చివేశారు. వీటిల్లో విలువైన పత్రాలు ఏమీలేవని సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. కానీ, మంత్రి కందుల దుర్గేశ్ మాత్రం అత్యుత్సాహంతో దీనికి రాజకీయ రంగు పులిమారు. భూ నిర్వాసితులకు పరిహారంలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారంటూ నోటికొల్చినట్లు నిరాధార ఆరోపణలు చేశారు. నిజానికి.. కాల్చినవన్నీ చిత్తు కాగితాలేనని జిల్లా అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పుడీ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వం కిక్కురుమనడంలేదు. ఘటన జరిగిన రెండ్రోజుల తరువాత కూడా అధికారులు ఏమీ చెప్పడం లేదంటే అన్నీ భద్రంగా ఉన్నట్లే కదా. ఫ్రీ హోల్డ్ భూముల ఆరోపణల్లోనూ బోల్తా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం జిల్లాలో ఏకంగా రెండువేల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల కుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ కూటమి నేతలు తెగ దు్రష్పచారం చేశారు. తాజాగా.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆ ప్రాంతంలో పర్యటించి కేవలం 138 ఎకరాలే ఫ్రీహోల్డ్ కింద నమోదయ్యాయని తెలిపారు. 20ఏళ్లు దాటిన అసైన్డ్ భూములను కొనుగోలు చేసేందుకు చట్టం అనుమతిస్తుందని కూడా ఆయన తేల్చిపారేశారు. అంటే.. ఎన్నికల ముందు టీడీపీ కూటమి నేతలు రాజకీయ కుట్రతోనే దు్రష్పచారం చేశారన్నది తేలిపోయింది. ఇలా.. ఈ ఉదంతాలన్నింటి వెనుక ఎలాంటి కుట్రలేదని ప్రాథమిక విచారణలో నిగ్గు తేలినప్పటికీ చంద్రబాబు మాత్రం పక్కా కుట్రతో.. తన సహజ లక్షణంతో పదేపదే తప్పుడు అరోపణలు చేస్తున్నారు. -
పాతబస్తీలో అగ్ని ప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కామటిపురాలోని ఓ డెకరేషన్ షాపులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అయిదు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తోంది. భవనంలో ఉన్నవారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. చుట్టుపక్కలా ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకుంది. -
విశాఖ బీచ్ రోడ్డు డైనోసర్ పార్క్ లో అగ్నిప్రమాదం..
-
విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,విశాఖ : విశాఖ బీచ్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న డైనో పార్క్ రెస్టోకేఫ్లో మంటలు చెలరేగాయి. మంటల దాటికి రెస్టారెంట్ కాలిబూడిదైంది. దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జీవీఎంసీ నుంచి స్థలాన్ని లీజ్‌కు తీసుకొని డైనో పార్క్ రెస్టోకేఫ్ను నిర్వాహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
సాక్షి,విశాఖపట్నం: విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంలో సిబ్బంది, పేషెంట్స్ బయటకు పరుగులు తీశారు. ఇక, ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.వివరాల ప్రకారం.. విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఆరో అంతస్తులోని అడ్మిన్ బ్లాక్‌లో మొదట మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ బయటకు వస్తోంది. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది భవనంలో ఉన్న పేషంట్స్‌ను బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఆసుపత్రిలోకి ఇతర బ్లాక్‌ల్లోకి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక, ఈ ప్రమాదంలో రోగులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
విశాఖలో కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
వెంకోజిపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: వెంకోజిపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం ధాటికి పొగ దట్టంగా అలుముకుంది. ఆసుపత్రి సెల్లార్లో యూపీఎస్ బ్యాటరీలు పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది.దట్టంగా పొగ వ్యాపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. -
టార్గెట్ పెద్దిరెడ్డి!
సాక్షి, అమరావతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబుకు రాజకీయంగా సవాల్‌గా మారిన చిరకాల రాజకీయ ప్రత్యరి్థ, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని మానసికంగా వేధించి క్షోభకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు పథకం వేసినట్లు వెల్లడవుతోంది. ఈ క్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తూ రాజకీయ కక్ష సాధింపులకు తెర తీశారు. ఘటన జరిగిన వెంటనే డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్లను హుటాహుటిన హెలికాఫ్టర్‌లో పంపడం ద్వారా తన ఉద్దేశాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని డీజీపీ అదే రోజు మదనపల్లెలో ఏకపక్షంగా ప్రకటించేశారు. అయితే ఎలా సంభవించిందన్నది వారం రోజులైనా చెప్పలేకపోవడం సందేహాస్పదంగా మారింది. సాధారణ పొరపాటుతోనో, నిర్లక్ష్యం కారణంగానో అగ్ని ప్రమాదం సంభవించినట్లు దర్యాప్తులో దాదాపుగా తేలినా ఆ విషయాన్ని వెల్లడిస్తే పెద్దిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసు బనాయించడం సాధ్యం కాదని ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. బాబు చేతిలో కీలుబొమ్మ సిసోడియా...! అగ్ని ప్రమాదం కేసును పెద్దిరెడ్డి కుటుంబానికి అంటగట్టడం సాధ్యం కాదని పోలీసులు తేల్చడంతో తీవ్ర అసహనానికి లోనైన సీఎం చంద్రబాబు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను రంగంలోకి దించారు. 22ఏ జాబితాలోని నిషేధిత భూముల వివరాలు, రెవెన్యూ శాఖ ఇతర ఫైళ్లు దగ్ధమైనట్లు నిర్ధారించి తదనుగుణంగా కుట్రకు పదును పెట్టాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. మరోవైపు కుట్ర కోణంలో రెండో అంకానికి తెర తీశారు. పెద్దిరెడ్డి కుటుంబం బాధితులంటూ టీడీపీ నేతలు ఎంపిక చేసిన వారితో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేయిస్తున్నారు. వీటిల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నది ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. కుటుంబ ఆస్తి వివాదాలు, కోర్టుల విచారణలో ఉన్న అంశాలపైనే ఫిర్యాదులు చేస్తున్నారు. సోదాలు.. వేధింపులు పెద్దిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కనీస ఆధారాలు కూడా లభించకపోవడంతో చంద్రబాబు పోలీసులపై చిందులు తొక్కుతున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు వైఎస్సార్సీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులను సోదాల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నివాసంలో కూడా సోదాలకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు కొద్ది రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఫైళ్లన్నీ భద్రం.. 22ఏ జాబితాలోని ఫైళ్లు, ఇతర భూముల ఫైళ్లను గల్లంతు చేసేందుకే అగ్ని ప్రమాదం సృష్టించారని నమ్మించేందుకు ప్రభుత్వ పెద్దలు వేసిన పథకం ఇప్పటికే బెడిసికొట్టింది. మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలో 11 మండలాలున్నాయి. 22ఏ జాబితా, ఇతర భూముల ఫైళ్లు ఆయా మండలాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపుతారు. కలెక్టరేట్‌కు కూడా కాపీ పెడతారు. ఈ ప్రక్రియ దాదాపు ఆన్లైన్లోనే సాగింది. హార్డ్ కాపీలు పంపినా సంబంధిత ఫైళ్ల కాపీలన్నీ కూడా ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో భద్రంగా ఉన్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లన్నీ భధ్రంగా ఉన్నాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియానే సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రాథమికంగా నిర్థారించారు. సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తం 2,440 ఫైళ్లు ఉన్నాయి. అగ్ని ప్రమాదం సంభవించగానే 740 ఫైళ్లు దగ్దం కాకుండా నివారించారు. మిగిలిన 1,700 ఫైళ్లలో ఇప్పటికే 90 శాతం ఫైళ్లను రిట్రీవ్(పునరుద్ధరించారు) చేశారు. మిగిలిన 10శాతం ఫైళ్ల వివరాలను పరిశీలిస్తున్నారు. వాటిని కూడా రిట్రీవ్ చేస్తారు. కలెక్టరేట్‌తోపాటు సబ్ కలెక్టరేట్ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ అన్ని ఫైళ్లు భద్రంగా ఉన్నాయి. ఫైళ్లు అన్నీ భద్రంగా ఉంటే ఇక అందులో కుట్ర కోణం ఎక్కడ ఉంది ? -
ఢిల్లీలో మరో ప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.. పలువురికి గాయాలు
దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో గల ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన ప్రమాదాన్ని మరచిపోకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఐఎన్ఏ మార్కెట్లో ఫాస్ట్‌ఫుడ్ దుకాణం, రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులంతా భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఘటన ఈరోజు (సోమవారం) తెల్లవారు జామున చోటుచేసుకుంది.ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు మంటలను నియంత్రించే పనిలో ఉన్నాయి. ఈ ప్రమాదంలో కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి మనోజ్ మెహ్లావత్ మాట్లాడుతూ నేటి(సోమవారం) ఉదయం 3:20 గంటలకు మంటలు చెలరేగాయని, ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నామని తెలిపారు. చైనీస్ ఫుడ్ కార్నర్‌తో పాటు ఒక రెస్టారెంట్లో మంటలు చెలరేగాయని, ఘటన జరిగిన సమయంలో ఫాస్ట్ ఫుడ్ కార్నర్లో ఐదారుగురు ఉన్నారని తెలిపారు. వారంతా గాయపడ్డారని అన్నారు. #WATCH | Delhi: Fire broke out at a fast food restaurant in INA market. 8 fire tenders at the spot. Parts of the roof of the restaurant have collapsed. 4 to 6 people have been injured: Delhi Fire service pic.twitter.com/glnFOXqg60— ANI (@ANI) July 28, 2024 -
పచ్చ మీడియా డైరెక్షన్..పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటన అనంతరం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఫైళ్లు కాలిపోతే రెవెన్యూ కార్యాలయాల్లో డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా? ఆర్డీవో, సీసీఎల్ఏ కార్యాలయాల్లో సంబంధిత రికార్డులు భద్రంగానే ఉంటాయి. కనీసం ఫైళ్ల వెరిఫికేషన్ చేయకపోవడం.. ఉన్నతాధికారులను హుటాహుటిన హెలికాఫ్టర్‌లో పంపి అక్కడేదో జరిగిపోయిందనే అనుమానాలు రేకెత్తించడం.. అనుమానితుల పేరుతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు, విచారణ పేరుతో బెదిరించడం.. ప్రజలను రెచ్చగొట్టడం.. పూర్తిగా ఓ వర్గం మీడియా డైరెక్షన్లో దర్యాప్తు సాగడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.» ఘటన జరిగిన మర్నాడే ఈనెల 22న సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్వయంగా డీజీపీ, సీఐడీ చీఫ్‌లు హెలికాప్టర్లో మదనపల్లె చేరుకుని విచారణ చేపట్టారు. కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య రహస్యంగా విచారణ చేపట్టినట్లు చెబుతున్నా ఆ వివరాలన్నీ ఎల్లో మీడియాకు లీక్ కావడం గమనార్హం. ఆ కథనాల ఆధారంగా దాడులు, విచారణలు సాగుతుండటంతో ఇక విచారణ ఎంత నిష్పాక్షపాతంగా సాగుతుందో ఊహించవచ్చు. డీజీపీ, సీఐడీ చీఫ్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా మీడియాను అనుమతించని పోలీసులు టీడీపీ నేతల కార్లను మాత్రం సాదరంగా లోపలికి పంపారు. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు వారు వచ్చినట్లు స్పష్టమవుతోంది. » విచారణ మొదలైన తొలిరోజు సాయంత్రం ఎల్లో మీడియాను మాత్రమే లోపలకు అనుమతించారు. అంతకుముందు టీడీపీ నేతలను లోపలకు పంపారు. వారితో ఉన్నతాధికారులు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. » అటు వార్తలు.. ఆపై దాడులు ఎల్లో మీడియాలో వైఎస్సార్ సీపీ నాయకుల గురించి వార్తలు రావడమే ఆలస్యం పోలీసులు దాడులు, తనిఖీలకు దిగుతున్నారు. ఈనెల 23న వైఎస్సార్సీపీకి చెందిన మాధవరెడ్డిపై ఈనాడులో వార్త రాగానే పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. అదే పత్రికలో ఈనెల 25న వైఎస్సార్సీపీకి చెందిన మరోనాయకుడు బాబ్జాన్ గురించి కథనం ప్రచురించడంతో పోలీసులు ఆయన ఇంటిపై దాడులకు దిగి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. మాజీ ఎమ్మెల్యేను విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ 28న పరోక్షంగా నవాజ్ బాషానుద్దేశించి కథనాన్ని వెలువరించడంతో ఉదయమే పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు తనిఖీల పేరుతో హడావుడి సృష్టించారు. » శనివారం మదనపల్లె మున్సిపల్ వైస్‌చైర్మన్ జింకా వెంకటా చలపతి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి తర్వాత వదిలేశారు. మరో నాయకుడు బండపల్లి అక్కులప్ప విచారణ హాజరు కాగా ఎల్లో మీడియాలో హంగామా సృష్టించారు.ఎలాంటి తప్పు చేయలేదు – మాజీ ఎమ్మెల్యే నవాజ్బాషాఐదేళ్ల పదవీకాలంలో ఎక్కడా కబ్జాలు, అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి తప్పు చేయలేదని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా స్పష్టం చేశారు. శనివారం రాత్రి తాను బెంగళూరులో ఉన్న సమయంలో 22(ఏ) నిషేధిత భూముల బదలాయింపులకు సంబంధించిన ఆరోపణలపై తన నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. తాను ఆదివారం ఉదయం వస్తున్నట్లు చెప్పి తనిఖీలకు సహకరించినట్లు తెలిపారు. రెవెన్యూ, ప్రభుత్వ శాఖల్లో అవినీతికి తావు లేకుండా వైఎస్సార్ సీపీ హయాంలో పారదర్శక పాలన అందించినట్లు గుర్తు చేశారు. ఎక్కడా తలదించుకునేలా వ్యవహరించలేదన్నారు.పెద్దిరెడ్డి పీఏ ఇంట్లో సోదాలుటాస్క్ఫోర్స్: మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్న పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ నివాసంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో పది మంది పోలీసులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్.. అగ్నిప్రమాదం కేసుకు రాజకీయ రంగు
సాక్షి, అన్నమ్మయ్య జిల్లా: మదనపల్లె అగ్నిప్రమాదం కేసులో పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా విచారణ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లె అగ్నిప్రమాదం కేసు పేరుతో విచారణ చేపట్టారు.అగ్నిప్రమాదం కేసు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అగ్ని ప్రమాదం కేసుకి ఒక్క పూటలోనే రాజకీయ రంగు పులిమిన సీఎం చంద్రబాబు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్‌గా కేసును మలిచారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజకీయ కోణంలోనే పోలీసుల విచారణ చేస్తున్నారు. రికార్డులు కాలితే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే కారణమంటూ విచారణ చేస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులందరినీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భారీ పోలీసు బలగాలతో విచారణ చేస్తున్నారు. ముందు 982 ఎకరాల ఫైళ్లు దగ్ధమంటూ హడావుడి చేసిన పోలీసులు.. తీరా ఆ 982 ఎకరాల పుంగనూరు రికార్డులు సెటిల్ మెంట్ ఆఫీసర్ దగ్గరే ఉన్నట్టు విచారణలో తేలింది. తాజాగా 22ఏ రికార్డుల దగ్ధమంటూ అడ్డగోలు విచారణ ప్రారంభించారు. రాజకీయ కక్ష సాధింపుకి ఫైళ్ల దగ్ధం కేసును వాడుకుంటున్న అధికార పార్టీ.. సహేతుకమైన ఫిర్యాదు లేకుండా ఇష్టానుసారంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు వేధింపులకు దిగుతున్నారు. -
ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం
-
మెక్సికోలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
మెక్సికోలోని ఓ మద్యం ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జాలిస్కోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా పేలుడు సంభవించి, తరువాత ఫ్యాక్టరీ అంతటా మంటలు చెలరేగాయి. రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పేందుకు, బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర పౌర రక్షణ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రమాద వివరాలను తెలియజేసింది. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులంతా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని ఏజెన్సీ తెలిపింది. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో నిపుణులు ఉన్నారని రాష్ట్ర పౌర రక్షణ శాఖ డైరెక్టర్ విక్టర్ హ్యూగో రోల్డాన్ తెలిపారు. -
ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం..
-
HYD: అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి, పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఓ చిన్నారి మృతిచెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పాతబస్తీలోని కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటేశనగర్‌లో సోఫా తయారీ గోదాంలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. మూడు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో సోఫా తయారీ గోదాం ఉండటంలో మంటలు భవనం పైఅంతస్తులోకి వ్యాపించాయి. భారీగా ఎగిసిపడిన మంటలు ఫస్ట్ ఫ్లోర్‌కు వ్యాపించండంతో భవనంలో నివాసం ఉంటున్న 25 మంది మంటల్లో చిక్కుకుపోయారు.అనంతరం, స్థానికులు మంటలు అర్పే ప్రయత్నం చేయగా కొందరు మంటలను నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో భవనంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్, నాగరాణి దంపతులు, శివప్రియ, హరిణి గాయపడ్డారు. ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో శ్రీనివాస్ పెద్ద కూతురు శివప్రియ(10) మృతిచెందింది. ఇక, ఘటనలో మరో ఎనిమిదికి గాయాలు కావడంతో వారికి చికిత్స జరుగుతోంది. కాగా, భవనం మొదటి అంతస్తులో సోఫాల తయారీ గోడౌన్ ఉంది. రెండు, మూడు అంతస్తుల్లో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భవనాన్ని మంటలు చుట్టు ముట్టడంతో ఓ వ్యక్తి తప్పించుకునేందుకు పైనుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు.భవనం కింద భాగంలో ఫోమ్ మెటిరియల్ నిల్వ ఉంచడంతో షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలతో పాటు పొగలు దట్టంగా అలుముకోవడంతో చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో భవనం మొత్తం కాలిపోయింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంటలు చెలరేగుతూరే ఉన్నాయి. గోడౌన్ యజమాని ధనుంజయ్ పరారీలో ఉన్నాడు. -
మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం
సాక్షి రాయచోటి/బి.కొత్తకోట/మదనపల్లె/సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆదివారం అర్థరాత్రి అగి్నప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏఓ ఛాంబర్ కుడివైపు సెక్షన్లు పూర్తిగా.. ఎడమవైపు సెక్షన్లు కొంతమేర దగ్థమయ్యాయి. అలాగే, వీటికి ఎదురుగా ఉన్న విభాగాలూ మొత్తం కాలిపోయాయి. ఈ విభాగాల్లోని రికార్డులు, కంప్యూటర్లు దగ్థమయ్యాయి. తీవ్రస్థాయిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. దీనిపై సోమవారం సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. ఘటనపై కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నపళంగా హెలికాప్టర్లో మదనపల్లెకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలకు పైగా జరిపిన తనిఖీల్లో ఏపీఎస్పీడీసీఎల్, ఫోరెన్సిక్ ల్యాబ్, పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా ప్రమాదానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు విద్యుత్ సరఫరా వైర్లు, మీటరు, ఇతర విద్యుత్ పరికరాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా వైరింగ్ కొన్నిచోట్ల కాలిపోయినట్లు గుర్తించారు. అలాగే, సీఐడీ, ఇంటెలిజెన్స్, శాంతిభద్రతల విభాగం, పోలీసు అధికారులూ విచారణ జరిపారు. ప్రమాదంపై విద్యుత్ శాఖాధికారులు, తహశీల్దార్లు, ఉద్యోగులనూ విచారించారు. అంతేకాక.. ఈ ఘటనపై విచారణకు పది బృందాలను ఏర్పాటుచేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పై దృష్టిపెట్టారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి డాగ్‌స్కా్వడ్‌లు.. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి ఫోరెన్సిక్ విభాగం నిపుణులను రప్పించారు.అధికారుల హడావుడితో హైటెన్షన్.. అంతకుముందు.. సోమవారం ఉదయమే పోలీసులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కొద్దిమంది అధికార పార్టీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులను మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఇక అగి్నప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆవరణకు చేరుకోవడం.. ఎక్కడలేని హడావుడి నెలకొనడంతో సబ్‌కలెక్టరేట్ చుట్టుపక్కల హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై చర్చించుకునేందుకు ఎవరూ సాహసించడంలేదు. ఎవరితో ఏం మాటా్లడితే ఏం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.అవసరమైతే కేసు సీఐడీకి బదిలీ: డీజీపీ అనంతరం.. డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. అగి్నప్రమాదంపై వీఆర్ఏ డీటీకి తెలపడం, ఆమె ఆర్డీఓకి చెప్పడం.. ఆయన ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపుచేశారన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. అవసరాన్ని బట్టి సీఐడీకి కేసు బదిలీచేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రెవెన్యూ శాఖలోని 25 అంశాలకు చెందిన రన్నింగ్ ఫైల్స్ దగ్థమైనట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. అలాగే, దగ్థమైన రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ల నుంచి తిరిగి పునరుద్ధరిస్తామని వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.