Gaza
-
గాజా ప్లాన్‌పై ట్రంప్ రివర్స్ గేర్
వాషింగ్టన్: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వాధీనం చేసుకుని పునర్ నిర్మిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది కూడా. గాజాలో ఉన్న లక్షల మంది పాలస్తీనా ప్రజలు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా తరలి వెళ్లాల్సిందేనని అన్నారాయన. అయితే.. హఠాత్తుగా ఆయన యూటర్న్ తీసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శిథిలమైన గాజాను పునర్ నిర్మించే ప్రణాళికలో భాగంగా ఎవరినీ బహిష్కరించమని ట్రంప్ ఇప్పుడు అంటున్నారు. బుధవారం ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్(Micheál Martin)తో ఆయన వైట్‌హౌజ్‌లో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గాజా నుంచి బహిష్కరణలు ఉండబోవని అన్నారు. ఈ సందర్భంగా.. యూఎస్ సెనెట్ మైనారిటీ నాయకుడు చక్ షూమర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారాయన. గతంలో ఆయన(చక్ షూమర్) యూదుడైనప్పటికీ.. ఇప్పుడు మాత్రం పాలస్తీనియన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కిందటి నెలలో ఇదే అంశంపై ఆయన తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి చర్చకు దారి తీశారు కూడా. అయితే.. గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్ అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణతో పాటు హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. అయితే ట్రంప్ గాజా ప్లాన్‌ను ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) తిరస్కరించింది. ప్రతిగా.. ఈజిప్ట్ ప్రతిపాదిస్తున్న ప్రణాళికకు మద్దతు ఇచ్చింది.గాజా యుద్ధం.. మధ్యలో ఐర్లాండ్గాజాలో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఐర్లాండ్‌కు మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. గతంలో.. గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతకు పాల్పడుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా ఓ కేసు వేయగా.. అందులో జోక్యం చేసుకోవాలని ఐర్లాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగాకిందటి ఏడాది డిసెంబరులో ఐర్లాండ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు టెల్అవీవ్(ISRAEL) ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో ట్రంప్-మార్టిన్ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక.. భవిష్యత్తు గాజా పేరిట ట్రంప్ పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియోనూ సైతం ట్రంప్ విడుదల చేయగా అది తీవ్ర విమర్శలకు తావు ఇచ్చింది. హమాస్ సంస్థ సైతం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది. గాజా పాలస్తీనాలో విడదీయలేని భాగమని.. కొనుగోలు చేసి.. అమ్మడానికి అదేం స్థిరాస్తి కాదని ప్రకటించింది. అదే సమయంలో ఆ వీడియోను సృష్టించిన డిజైనర్.. అది కేవలం పొలిటికల్ సెటైర్ మాత్రమేనని ప్రకటన చేశాడు. -
ట్రంప్ ఎత్తుకు అరబ్ దేశాల పైఎత్తు
కైరో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వా«దీనం ప్రతిపాదనకు అరబ్ దేశాలు చెక్ పెట్టాయి. ‘మిడిల్ ఈస్ట్ రివేరా’విజన్‌కు భిన్నంగా గాజా పునర్నిర్మాణ ప్రణాళికను విడుదల చేశాయి. 53 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనను అరబ్నాయకులు ఆమోదించా రు. యుద్ధానంతర ప్రణాళికను ఈజిప్టు ప్రతిపాదించింది, దీని ప్రకారం పాలస్తీనా అథారిటీ (పీఏ) పరిపాలన కింద గాజా పునర్నిర్మాణం జరుగుతుంది. గాజాను అమెరికా అ«దీన ప్రాంతంగా మార్చేందుకు ట్రంప్ చేసిన ప్రణాళికకు ఇది కౌంటర్. ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి మద్దతు తెలిపిన మరుసటి రోజే కైరోలో అరబ్ లీగ్ సదస్సు జరిగింది. ముగింపు సమావేశంలో ఈ గాజా పునర్నిర్మా ణం కోసం ‘సమగ్ర అరబ్ ప్రణాళిక’ను ఆయా దేశా ల నేతలు ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రణాళికకు అంతర్జాతీయ మద్దతుకు పిలుపునిచ్చారు. భూభాగ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు కోసం అన్ని దేశాలు, ఆర్థిక సంస్థల నుంచి సహకారాన్ని స్వీకరిస్తామని పేర్కొన్నారు. 112 పేజీల డాక్యుమెంట్ పాలస్తీనియన్ల తరలింపు, గాజాను అమెరికా పునర్నిర్మించాలన్న ట్రంప్ ఆకాంక్షకు ప్రత్యామ్నాయంగా ఈజిప్టు, జోర్డాన్, గల్ఫ్ అరబ్ దేశాలు దాదాపు నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నాయి. గాజా నుంచి పాలస్తీనియన్లను సామూహికంగా తరలించడాన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి. తామే ఆ బాధ్యతలు తీసుకున్నాయి. ‘గాజా పునర్నిర్మాణ ప్రణాళిక’పేరుతో 112 పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించాయి. గాజాను తిరిగి ఎలా అభివృద్ధి చేయనున్నారనే మ్యాప్‌లు, ఇల్లు, ఉద్యానవనాలు, కమ్యూనిటీ సెంటర్లకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ చిత్రాలతో తయారు చేశారు. అలాగే వాణిజ్య నౌకాశ్రయం, టెక్నాలజీ హబ్, బీచ్ హోటళ్లు, విమానాశ్రయం కూడా ఉన్నాయి. స్వాగతించిన హమాస్..శిఖరాగ్ర సమావేశం ప్రణాళికను, సహాయక చర్యలు, పునర్నిర్మాణం, పాలనను పర్యవేక్షించడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హమాస్ తెలిపింది. అంతేకాదు.. కమిటీలో తమ అభ్యర్థులను ఉంచబోమని ప్రకటించింది. అయితే పీఏ పర్యవేక్షణలో పనిచేసే కమిటీ విధులు, సభ్యులు, ఎజెండాకు తన సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. కమిటీలో ఉండబోయే వ్యక్తుల పేర్లను నిర్ణయించినట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ మంగళవారం రాత్రి తెలిపారు. పీఏకు నాయకత్వం వహిస్తున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మాట్లాడుతూ ఈజిప్టు ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని, పాలస్తీనా నివాసితులను తరలించని ఇలాంటి ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని ఆయన ట్రంప్‌ను కోరారు. పరిస్థితులు అనుకూలిస్తే అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల ప్రణాళికను సైతం హమాస్ స్వాగతించింది. తిరస్కరించిన అమెరికా.. అరబ్ నాయకులు ఆమోదించిన గాజా పునర్నిర్మాణ ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది, ఈ భూభాగంలోని పాలస్తీనా నివాసితులను పునరావాసం కల్పిచి, అమెరికా యాజమాన్యంలోని ‘రివేరా’గా మార్చే తన పాత విజన్‌కే అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారని తెలిపింది. గాజా ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదని, శిథిలాలు, పేలని ఆయుధాలతో కప్పబడిన భూభాగంలో నివాసితులు జీవించలేరని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావడానికి మరిన్ని చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు. తోసిపుచ్చిన ఇజ్రాయెల్.. ఈజిప్టు ప్రణాళికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. కాలం చెల్లిన దృక్పథాలతో ఉందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రక టనలో విమర్శించింది. పీఏఐ ఆధారపడటా న్ని తిరస్కరించింది. ప్రణాళిక హమాస్‌కు అధికారాలిచ్చేదిగా ఉందని ఆరోపించింది. హమా స్ సైనిక, పాలనా సామర్థ్యాలను నాశనం చే యడమే తమ లక్ష్యమని, ముందు హమాస్ సై నిక ఉపసంహరణకు అంగీకరించేలా చేయాల ని డిమాండ్ చేసింది. అది తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. -
శిథిలాల మధ్యే ఇఫ్తార్
ఖాన్ యూనిస్: ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎటు చూసినా శిథిలాల నడుమే గాజావాసులకు రంజాన్ పవిత్ర మాసం మొదలైంది. చాలామంది ఆత్మియులను కోల్పోయారు. ఇళ్లు లేవు. సరైన తిండి లేదు. బతకుపై భరోసాయే లేదు. అయినా వారిలో ఆశ మాత్రం ఉంది.సగం కూలిన ఇళ్లలో, తాత్కాలిక గుడారాల్లోనే రంజాన్(Ramadan)ఉపవాసాలు పాటిస్తున్నారు. ఎన్నటికీ తిరిగిరాని తమ ఆత్మియులను పదేపదే తలచుకుంటూ ఇఫ్తార్(Iftar) టేబుళ్ల వద్ద కన్నీటి పర్యంతమవుతున్నారు. కూలగా మిగిలిన ఇళ్లకే దీపకాంతుల తోరణాలు కట్టి కోల్పోయిన వెలుగులను తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.గాజాలో చరిత్రాత్మక ప్రార్థనా స్థలం గ్రేట్ ఒమారీ మసీదు శిథిలావస్థకు చేరింది. దాంతో మతపరమైన ప్రార్థనలకు కేంద్ర స్థలమంటూ కూడా లేకుండా పోయింది. చాలాచోట్ల ప్రార్థనా స్థలాలన్నీ విధ్వంసమయ్యాయి. అయినా కూలిన భవనాలు, శిథిలాల మధ్యే పాలస్తీనావాసులు ఎన్నో ఆశలతో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పండుగ అంటే ప్రార్థనలు. రంజాన్ షాపింగ్. బంధువులతో వేడుక. ఈసారి అవన్నీ లేకపోయినా గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉందని గాజావాసులు అంటున్నారు! ‘‘తరువాత ఏం జరుగుతుందోనన్న భయం ఇంకా ఉంది. అయినా గతేడాది కంటే ఈసారి మెరుగే’’అని చెబుతున్నారు కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, వీధి వ్యాపారులు అడపాదడపా కనిపిస్తున్నా ఎవరిని చూసినా ఆర్థిక ఇబ్బందులే! నుసిరాత్‌లో హైపర్ మాల్ వంటి సూపర్ మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. కానీ దీర్ఘకాలంగా జీవనోపాధే కోల్పోయిన వారిలో కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనే సామర్థ్యం కూడా కన్పించడం లేదు! రంజాన్ ఏకం చేస్తోంది ధైర్యంగా మళ్లీ పాలస్తీనా గడ్డపై కాలు పెట్టగలిగినందుకే గర్వపడుతున్నామని గాజావాసులు చెబుతున్నారు. ప్రపంచంలోని అందరు పిల్లల్లాగే తమ చిన్నారులూ సగర్వంగా, ఆనందంగా జీవించాలని ఆశిస్తున్నారు. ‘‘ఈ రంజాన్ మాసం మా అందరినీ ఏకం చేసింది. ఇంతటి యుద్ధం మధ్య కూడా మాకు ఆనందాన్ని, ఆశను అందిస్తోంది. దాడుల్లేకుండా సురక్షితంగా జీవించడమే మా ఏకైక ఆకాంక్ష’’అని ఖాన్ యూనిస్‌కు చెందిన అబూ ముస్తఫా చెప్పుకొచ్చాడు.కువైట్ సాయం... దక్షిణ గాజా నగరం రఫాలో రంజాన్ ఉపవాసాలుంటున్న 5,000 మంది పాలస్తీనియన్లకు కువైట్ ఇఫ్తార్ భోజనాలు అందించింది. సూర్యాస్తమయం ప్రార్థన పిలుపుతో వారంతా మైళ్ల పొడవున శిధిలాల మధ్య ఏర్పాటు చేసిన బల్ల వద్ద గుమిగూడి అన్నం, చికెన్‌తో ఉపవాస దీక్షను విరమిస్తున్నారు. యుద్ధానికి ముందు ఆ వీధి రంజాన్ రోజుల్లో ఎంతగా కళకళలాడుతూ ఉండేదో ఇఫ్తార్ ఏర్పాట్లకు సహకరిస్తున్న మలక్ ఫదా భారంగా గుర్తు చేసుకున్నారు.‘‘నాటి రోజులే నాకిప్పటికీ స్ఫూర్తి! ఈ వీధికి యుద్ధానికి ముందు మాదిరిగా మళ్లీ జీవం పోయడమే నా లక్ష్యం’’అన్నారామె. ఇటు వ్యక్తిగతంగా, అటు సామూహిక నష్టాల నుంచి, యుద్ధం చేసిన గాయాల నుంచి కోలుకునేందుకు పాలస్తీనియన్లు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా గాజాను వీడేదే లేదని రఫా వాసి మమ్దౌ అరాబ్ అబూ ఒడే కుండబద్దలు కొట్టాడు. ఏం జరిగినా తామంతా ఐక్యంగా ఉన్నామని, ఉంటామని, తమ దేశాన్ని విడిచి వెళ్లబోమని స్పష్టం చేశాడు. -
గాజాకు సాయం ఆపేసిన ఇజ్రాయెల్
టెల్ అవీవ్: హమాస్‌తో కాల్పుల విరమణ తొలి దశ ఒప్పందం శనివారం ముగిసిన నేపథ్యంలో గాజాలోకి మానవతా సాయాన్ని నిలిపేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒప్పందాన్ని పొడిగించాలంటే తమ ప్రతిపాదనలకు హమాస్ ఒప్పుకుని తీరాలని షరతు విధించింది. అందుకు హమాస్ ససేమిరా అనడంతో గాజాలోకి నిత్యావసర వస్తువులు, ఔషధాలు, ఇతరత్రా సరకుల రవాణాను ఇజ్రాయెల్ బలగాలు ఆదివారం అడ్డుకున్నాయి. దాంతో మానవతా సాయానికి హఠాత్తుగా అడ్డుకట్టపడింది. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ సాయం ఆపేయం చౌకబారు బెదిరింపు చర్య. తద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడుతోంది. తొలి దశ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘిస్తోంది’’ అని ఆరోపించింది. అమెరికా ఆదేశాల మేరకే గాజాకు సాయాన్ని ఆపేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. రంజాన్ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 దాకా పొడిగించాలన్న అమెరికా అభ్యర్థనకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఆ మేరకు తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఒప్పందంలో తదుపరి దశకు వెళ్లకుండా తొలి దశను పొడిగించడాన్ని హమాస్ తప్పుబట్టింది. తమ బందీల్లో సగం మందిని హమాస్ విడుదల చేస్తేనే రెండోదశ కాల్పుల విరమణకు సిద్ధపడతామని ఇజ్రాయెల్ చెబుతోంది. రెండో దశ చర్చల వేళ మరింతమంది బందీలను వదిలేయాలని డిమాండ్ చేసింది. శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించి, ఇజ్రాయెల్ గాజా నుంచి వెనుతిరిగితేనే మొత్తం బందీలను వదిలేస్తామని హమాస్ తేలి్చచెప్పింది. -
గాజా నుంచి వైదొలగబోం
ఖాన్ యూనిస్: గాజాలో శాంతిస్థాపన ప్రక్రియ మళ్లీ డోలాయమానంలో పడింది. గాజాలోని ఫిలడెల్ఫీ తదితర వ్యూహాత్మక ప్రాంతాల నుంచి తమ సైన్యం వైదొలగే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ గురువారం కుండబద్దలు కొట్టింది. ఆయుధాల స్మగ్లింగ్ తదితరాల నిరోధానికి ఇది తప్పనిసరి పేర్కొంది. నలుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ అధికారి ఒకరు ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. దాంతో తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ముగియనున్న వేళ ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలు అనుమానంలో పడ్డాయి. ఒప్పందం మేరకు ఫిలడెల్ఫీ తదితర ప్రాంతాల నుంచి వైదొలిగే ప్రక్రియకు ఇజ్రాయెల్ శనివారమే శ్రీకారం చుట్టాల్సి ఉంది. చర్చలు ముందుకు సాగాలంటే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగాల్సిందేనని హమాస్‌తో పాటు చర్చల మధ్యవర్తి ఈజిప్ట్ కూడా స్పష్టం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. హమాస్ మాత్రం రెండో దశ కాల్పుల విరమణపై చర్చలకు సిద్ధమని ప్రకటించింది. తమ వద్ద బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ ఇజ్రాయెలీలు విడుదలవ్వాలంటే చర్చలకు, ఒప్పందానికి కట్టుబడి ఉండటమే ఇజ్రాయెల్ ముందున్న ఏకైక మార్గమని పేర్కొంది. కాల్పుల విరమణ నుంచి వెనక్కి తగ్గే ఏ ప్రయత్నమైనా బందీలకు, వారి కుటుంబాలకు మరింత నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ చెరలో ఉన్న 600కు పైగా పాలస్తీనా ఖైదీలు కూడా గురువారం తెల్లవారుజామున విడుదలయ్యారు. దాంతో ఖాన్ యూనిస్‌లో ఆనందం నెలకొంది. ఆరు వారాల తొలి దశ కాల్పుల విరమణలో భాగంగా హమాస్ ఇప్పటిదాకా 25 మంది ఇజ్రాయెలీ బందీలను, 8 మృతదేహాలను అప్పగించింది. బదులుగా దాదాపు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. రెండో దశపై ఫిబ్రవరి తొలి వారంలోనే చర్చలు మొదలవ్వాల్సి ఉండగా ఇప్పటిదాకా ఎలాంటి పురోగతీ లేదు. హమాస్ తాజాగా అప్పగించిన నలుగురు ఇజ్రాయెలీల మృతుల్లో ఒకరు 2023 అక్టోబర్ 7న దాడిలోనే చనిపోయారు. మృతదేహాన్ని హమాస్ మిలిటెంట్లు గాజాకు తరలించారు. మిగతా ముగ్గురు సజీవంగా అపహరణకు గురయ్యారు. వారి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. హమాస్ వద్ద కనీసం మరో 59 మంది ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నట్టు చెబుతున్నారు. వారిలో 32 మందికి పైగా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. -
వెస్ట్ బ్యాంక్‌పై పట్టు బిగించిన ఇజ్రాయెల్
కబాటియా: గాజాలో హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడిక వెస్ట్ బ్యాంక్‌పై దృష్టి సారించింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన రెండు రోజుల్లో భారీగా సైన్యాన్ని ఇక్కడికి తరలించింది. శరణార్థులుగా మారిన పాలస్తీనియన్లను తిరిగి వెస్ట్ బ్యాంక్‌లోకి అడుగుపెట్టకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌ను క్రమేపీ విస్తరిస్తూ వచ్చింది. వెస్ట్ బ్యాంక్ నుంచి తమపై దాడులు పెరుగుతున్నందున ఈ ప్రాంతం నుంచి మిలిటెన్సీని రూపుమాపడమే లక్ష్యమని అంటోంది. అయితే, ఇక్కడున్న 30 లక్షల మందిని సైనిక పాలన కిందికి తేవడమే ఇజ్రాయెల్ ఉద్దేశమని పాలస్తీనియన్లు అంటున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరుగుతోందని, వేలాది మందికి నిలున నీడ కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 40వేల మంది పాలస్తీనయన్లు జెనిన్ వంటి పట్టణ ప్రాంత శరణార్థి శిబిరాలను ఖాళీ చేసి వెళ్లిపోయారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. దీంతో, అక్కడ కనీసం ఏడాదిపాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలని మిలటరీకి ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. పాలస్తీనియన్లను తిరిగి అక్కడికి రానిచ్చేది లేదని, ఉగ్రవాదాన్ని పెరగనివ్వబోమని చెప్పారు. అయితే, ఎంతకాలం పాలస్తీనియన్లను అడ్డుకుంటారో ఆయన స్పష్టం చేయలేదు. ఇజ్రాయెల్‌పై సాయుధ పోరుకు కేంద్ర స్థానంగా ఉన్న జెనిన్లోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులను పంపించింది. 2002 తర్వాత ఇజ్రాయెల్ ట్యాంకులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో సొంతప్రాంతాలను వదిలిన శరణార్థుల వారసులే ఈ శిబిరాల్లో ఉంటున్నారు. కాగా, దీర్ఘ కాలంపాటు ఇజ్రాయెల్ ఆర్మీ వెస్ట్ బ్యాంక్‌లో తిష్టవేయడం 2000 తర్వాత ఇదే మొదటిసారని ఐరాస కూడా అంటోంది. గాజాలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో వెస్ట్ బ్యాంక్‌లో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఇజ్రాయెల్ కూడా ఈ ప్రాంతంపై పదేపదే దాడులకు పాల్పడింది. ఇక్కడ కనీసం 800 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మిలిటెంట్లేనని ఆర్మీ పేర్కొంది. అయితే, గాజాతోపాటు లెబనాన్‌లోనూ యుద్ధం జరుగుతున్నందున సంకీర్ణ పక్షాల నుంచి వచ్చిన ఒత్తిడుల కారణంగా ప్రధాని నెతన్యాహూ వెస్ట్ బ్యాంక్‌లో మిలిటెన్సీ అణచివేత చర్యలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. 1967లో జరిగిన యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఈ మూడు ప్రాంతాలను కలిపి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్నది పాలస్తీనియన్ల చిరకాల వాంఛ. -
హమాస్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం.. వారం రోజుల్లో..
టెల్అవీవ్:గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఏ క్షణమైనా తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఒప్పందం ప్రకారం హమాస్ తమ వద్ద ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను శనివారం వదిలిపెట్టినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం 620 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టలేదు. తమ దేశానికి చెందిన మిగిలిన బందీలను వదిలిపెట్టేదాకా ఎవరినీ విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది.పాలస్తీనా ఖైదీలను జైలు నుంచి బయటికి తీసుకువచ్చి తిరిగి జైలులోకే పంపించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఆరుగురు బందీల విడుదల సమయంలో హమాస్ వ్యవహరించిన తీరు క్రూరంగా,అవమానకరంగా ఉందని ఇజ్రాయెల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి కూడా ప్రకటించింది. శనివారం బందీలను విడిచిపెట్టే సందర్భంగా గాజాలో ప్రత్యేకంగా వేసిన స్టేజిపై వారిని ప్రదర్శించి వేడుకలాగా చేయడంపై ఇజ్రాయెల్ అభ్యంతరం తెలిపింది.పైగా బందీల వెంటే ఆయుధాలు పట్టుకున్న ఉగ్రవాదులు ఉండడం సరికాదని పేర్కొంది.తొలి విడత గాజా కాల్పుల విరమణ ఒప్పందం కాల పరిమిత మరో వారం రోజుల్లో ముగియనుంది.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి వేలాది మందిని చంపడంతో పాటు కొందరిని వారి వెంట బందీలుగా తీసుకెళ్లారు.అనంతరం ఇజ్రాయెల్ గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో 45 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. -
విడుదల చేయకుంటే నరకమే
జెరూసలెం: గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ హమాస్ విడుదల చేయకపోతే నరక ద్వారాలు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ‘‘గాజా విషయంలో ఇజ్రాయెల్, అమెరికాలకు ఉమ్మడి వ్యూహం ఉంది. ఈ వ్యూహం వివరాలను ప్రజలతో పంచుకోలేం. హమాస్ సైనిక, రాజకీయ ఉనికిని నిర్మూలించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నరకం గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయో వివరాలను తాము చెప్పలేం. బందీలందరినీ విడుదల చేయకపోతే మాత్రం అవి ఖచ్చితంగా తెరుచుకుంటాయి. గాజాలో హమాస్ సైనిక సామర్థ్యాన్ని, దాని రాజకీయ పాలనను అంతమొందిస్తాం. బందీలందరినీ స్వదేశానికి తీసుకొస్తాం. గాజా నుంచి మరోసారి ఇజ్రాయెల్‌కు ముప్పు వాటిల్లకుండా చూస్తాం’’అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదివారం జెరూసలెం నగరానికి చేరుకుని అక్కడ నెతన్యాహుతో సమావేశమయ్యారు. అధ్యక్షుడు ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనపై అరబ్ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని రూబియో పునరుద్ఘాటించారు. ‘‘హమాస్ సైనిక లేదా ప్రభుత్వ శక్తిగా కొనసాగదు. హమాస్ అధికారంలో ఉన్నంత కాలం శాంతి అసాధ్యం. దానిని నిర్మూలించలేదు’’అని ఆయన ఉద్ఘాటించారు. రూబియో గానీ, నెతన్యాహు గానీ గాజా కాల్పుల విరమణ నిబంధనలను ప్రస్తావించలేదు. ఇరాన్‌పై ప్రత్యేక దృష్టి.. గాజా పరిస్థితితోపాటు ఇరాన్ గురించి నెతన్యాహు, రూబియో ప్రత్యేకంగా చర్చించారు. పశ్చిమాసియా మొత్తం సంక్షోభానికి ఇరాన్ కారణమని రూబియో, నెతన్యాహు ఆరోపించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా ఆపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలోని ప్రతి ఉగ్రవాద సంస్థ వెనుక, ప్రతి హింసాత్మక చర్య వెనుక, ఈ ప్రాంతంలో లక్షలాదిమంది ప్రజల శాంతి, సుస్థిరతకు ముప్పు కలిగించే ప్రతి ఘటన వెనుక ఇరాన్ ఉంది’’అని రూబియో వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ మద్దతుతో మిగిలిన పనిని పూర్తి చేస్తాం’’అని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ దాడి బందీల మార్పిడి కొనసాగుతుండగా ఆదివారం ఈజిప్టు సరిహద్దులోని రఫా సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. దాడిలో ముగ్గురు హమాస్ సాయుధులు మరణించారు. ఈ దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఒప్పందాన్ని విచ్చిన్నం చేసేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని హమాస్ ఆరోపించింది. కాల్పుల విరమణ మొదటి దశ మరో రెండు వారాల్లో ముగియనుంది. రెండవ దశ కోసం చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది.త్వరలో పాలస్తీనియన్ల తరలింపు: ఇజ్రాయెల్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా నుంచి పాలస్తీనియన్ల సామూహిక తరలింపు త్వరలో ప్రారంభమవుతుందని తాను ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ అతివాద ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ శనివారం రాత్రి చెప్పారు. రాబోయే వారాల్లో ఇది ప్రారంభమవుతుందని ఆశిస్తున్నానన్నారు. ‘‘వచ్చే 10 నుంచి 15 ఏళ్ల వరకు గాజాలో పాలస్తీనియన్లకు ఏమీ ఉండదు. హమాస్ తిరిగి యుద్ధానికి ప్రయతి్నస్తే గాజా అంతా జబాలియా లాగా మరుభూమిగా మారడం ఖాయం’’అని మంత్రి బజాలెల వ్యాఖ్యానించారు. గాజా నుంచి పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా తరలించడం మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరమని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను అంతర్జాతీయ న్యాయస్థానం ఇప్పటికే పరిశీలిస్తోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కాగా, రెండు అంతర్జాతీయ ట్రిబ్యునళ్లను నెతన్యాహు తప్పుబట్టారు. అంతర్జాతీయ న్యాయస్థానంపై ఆంక్షలు విధించినందుకు ట్రంప్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన అంతర్జాతీయ న్యాయ సంస్థలపై మరిన్ని సంయుక్త చర్యలు తీసుకోవాలని సూచించారు. -
హమాస్‌ను నిర్మూలించాల్సిందే
జెరూసలేం: హమాస్‌ను గాజా నుంచి తుడిచిపెట్టాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో స్పష్టం చేశారు. సైనికపరమైన లేదా ప్రభుత్వాన్ని నడిపే శక్తిగా హమాస్ ఎంతమాత్రం కొనసాగనివ్వబోమని చెప్పారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంగా, పరిపాలనా శక్తిగా, హింసకు పాల్పడతామంటూ బెదిరించే వ్యవస్థగా హమాస్ ఉన్నంత కాలం శాంతి నెలకొనడం అసాధ్యం. అందుకే హమాస్‌ను నిర్మూలించకతప్పదు’’ అని కుండబద్దలు కొట్టారు. హమాస్‌పై పోరుకు అరబ్ దేశాల సాయం కూడా కోరుతామన్నారు. ఎవరూ ముందుకు రాకుంటే సొంతంగా ఇజ్రాయెలే ఆపని పూర్తి చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగడంపై అనుమానంగా మారింది. దాని గడువు రెండు వారాల్లో ముగియనుంది. రెండో దశలో మిగతా బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉండటం తెలిసిందే. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాపై దాడులకు దిగింది. వీటిలో తమ ముగ్గురు పోలీసులు చనిపోయినట్లు హమాస్ తెలిపింది. -
షెడ్యూల్ ప్రకారమే బందీలను విడుదల చేస్తాం
కైరో: ఇజ్రాయెల్ బందీల విడుదల విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని హమాస్ తేల్చిచెప్పింది. మందుగా ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారమే బందీలకు విముక్తి కల్పిస్తామని స్పష్టంచేసింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులు తమతో చెప్పారని వెల్లడించింది. ఈ మేరకు హమాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం చూస్తే మరో ముగ్గురు బందీలు శనివారం విడుదల కాబోతున్నారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుందని హమాస్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమాస్ కొద్దిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. గాజాలో షెల్టర్లు నిర్మించుకొనేందుకు, విదేశాల నుంచి మానవతా సాయం సరఫరాకు అనుమతి ఇవ్వకపోతే బందీల విడుదలను ఆలస్యం చేస్తామని ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం బందీలను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, గాజాపై మళ్లీ దాడులు ప్రారంభమవుతాయని హమాస్‌ను హెచ్చరించారు. దీంతో హమాస్ మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హమాస్ ఇప్పటిదాకా 21 మంది బందీలను విడిచిపెట్టింది. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం 730 మంది పాలస్తీనా ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసింది. -
ఘర్షణాత్మక ఆలోచన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చినప్పటినుంచీ మీడియాకు కావలసినంత మేత దొరుకుతోంది. వలసదారులను తిప్పిపంపటంలో ఆ దేశం ఎంత అమానుషంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నదో అందరూ చూశారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటానికి సిద్ధపడాలంటూ కెనడాను కోరటం, గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని తమకు అమ్మేయాలని డెన్మార్క్‌ను అడగటం, పనామా కాల్వను అప్పగించాలని తాఖీదు పంపటం వగైరాలన్నీ తెలిసీ తెలియక మాట్లాడే మాటలుగా అందరూ కొట్టిపారేశారు. గాజాను స్వాధీనం చేసుకుని దాన్ని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కలిసి గత బుధ వారం మీడియాకు చెప్పడాన్ని సైతం అలాగే భావించారు. సాక్షాత్తూ వైట్ హౌస్ ప్రతినిధే ట్రంప్ వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదంటూ తోసిపుచ్చారు. అదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్నారు. కానీ ట్రంప్ మరోసారి జూలు విదిల్చారు. గాజా స్ట్రిప్ అమెరికాకు కూడా చెందదట. తానే సొంతం చేసుకుంటారట. గాజా పౌరులు నివాసం ఉండటానికి చుట్టూ ఉన్న జోర్డాన్, ఈజిప్టు, సౌదీ, టర్కీ తదితర పశ్చిమాసియా దేశాల్లో ఆరుచోట్ల మెరుగైన కాలనీలు నిర్మిస్తారట. గాజా పౌరులకు ఇక తిరిగొచ్చే హక్కే లేదట. విధ్వంసం తప్ప నిర్మాణం సంగతి తెలియని దేశానికి ఇలాంటి ఆలోచన రావటం వెనకున్న వ్యూహం చిన్నదేం కాదు. తనకు 7,000 కిలోమీటర్ల ఆవల దాదాపు 25 లక్షలమంది నివసించే ఒక ప్రాంతాన్ని ‘సొంతం’ చేసుకోదల్చుకున్నట్టు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన అధినేత ఒకరు ప్రకటించారంటే అదెంత వైపరీత్యమో, అంతకుమించి మరెంత దుస్సాహసమో అర్థం చేసుకోవచ్చు. 2023 అక్టోబర్ మొదలుకొని గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేవరకూ ఇజ్రాయెల్ సైన్యాలు అక్కడ టన్నులకొద్దీ బాంబులు జార విడిచినా... దారుణ హింసను చవిచూపినా, పసిపిల్లలూ, స్త్రీలతో సహా 47,000 మంది పౌరులను హతమార్చినా, లక్షలమందిని గాయపరిచినా ఆ ప్రాంతం లొంగిరాలేదు. హమాస్ ఆనుపానులన్నీ తెలిశాయని ఇజ్రాయెల్ చెప్పుకున్నా, ఆ సంస్థ అపహరించిన పౌరులందరినీ విడిపించటంలో అది పూర్తిగా విఫలమైంది. చివరకు హమాస్‌తో కుదిరిన ఒడంబడికతోనే వారంతా దశలవారీగా విడు దలవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఎంత మతిమాలినదో అమెరికా పౌరులు గ్రహించాలి. యుద్ధాలన్నిటినీ అంతం చేస్తానని వాగ్దానాలిచ్చి పీఠం అధిష్టించిన అధినేత కొత్త కుంపట్లు రాజేయటంలోని మర్మమేమిటో నిలదీయాలి. అమెరికాతో చెట్టాపట్టాలేసుకున్న పశ్చిమాసియా దేశాలు మాత్రమే కాదు... భద్రతామండలి దేశాలన్నీ ట్రంప్ ప్రతిపాదనను ఖండించాయి. సుతిమెత్తగానే అయినా ‘ఇది యుద్ధాల యుగం కాద’ని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 1948లో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు ప్రాణప్రతిష్ఠ చేసి పాలస్తీనా పేరిట వదిలిన ఒక చిన్న ప్రాంతాన్ని సైతం ఇప్పుడు ట్రంప్ ఆక్రమిద్దామని చూస్తు న్నారు. అంతరంగంలో ఏమనుకున్నా ‘రెండు దేశాల’ ఏర్పాటే సమస్యకు పరిష్కారమని పైకి చెబుతూ వచ్చిన అమెరికా... ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తన నైజాన్ని బయటపెట్టుకుంది. పాలకులెవరైనా, పైకి ఏం చెప్పినా అమెరికా విధానాలు యుద్ధాలకూ, ప్రత్యేకించి ఇజ్రాయెల్‌కు అనుకూలమైనవే. చరిత్ర వరకూ పోనవసరం లేదు. గత 15 నెలలుగా గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నర మేథం అమెరికా ఆశీస్సులు లేకుండా జరిగే అవకాశం ఉందా? రష్యాను కవ్వించి కయ్యా నికి కాలు దువ్వమని ఉక్రెయిన్ను ప్రోత్సహించి ఓడిపోక తప్పని యుద్ధంలోకి దాన్ని దించిన ఘనత గత పాలకుడు జో బైడెన్‌ది. ఒకప్పుడు సోవియెట్ బూచిని చూపి ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలకు దిగిన అమెరికా ఇవాళ ప్రపంచ దేశాలన్నిటినీ శత్రువులుగా చూస్తోంది. వేరే దేశాల సరుకులపై భారీ సుంకాలు మోపుతూ, వాటిని దివాలా తీయించటం ఒకవైపు... ‘నచ్చిన ప్రాంతం’ సొంతం చేసుకుంటానంటూ మరోవైపు ప్రపంచాన్ని ట్రంప్ అస్థిరతలోకి నెడుతున్నారు. ఈ సంస్కృతినే రష్యా, చైనాలు కొనసాగిస్తే ఏం జరుగుతుందో ఆయనకు అర్థమవుతున్నట్టు లేదు. ప్రపంచ దేశాలన్నీ తన జాగీరుగా ఆయన భావిస్తున్నారు. పొట్టచేతబట్టుకు వచ్చిన వలసదారులను అమెరికాలో నేరస్తు లుగా పరిగణించే ట్రంప్ తన విస్తరణవాద కాంక్షను ఏమనాలో, అందుకు శిక్షేమిటో చెప్పాలి. అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన జోర్డాన్, ఈజిప్టులు రెండూ ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 ట్రంప్ హుంక రింపులను తట్టుకుని నిలబడగలరా? అనుమానమే. ఎందుకంటే అమెరికానుంచి సైనిక, ఆర్థిక సాయం పొందుతున్న దేశాల్లో జోర్డాన్ది మూడో స్థానం. ఆ దేశానికి ఏటా 1,700 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుతుంది. 1,500 కోట్ల డాలర్లతో తర్వాతి స్థానం ఈజిప్టుది. అమెరికా నుంచి 17,200 కోట్ల డాలర్ల సాయం పొందుతూ ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రథమస్థానంలో వున్నా అదెంతో కాలం సాగకపోవచ్చు. 3,300 కోట్ల డాలర్లతో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. ట్రంప్‌కు మోకరిల్లితే ఈజిప్టు, జోర్డాన్ ప్రజలు మౌనంగా ఉండరు. ఇప్పటికే గాజా శరణార్థులతో నిండివున్న ఆ దేశాల్లో మరింతమందిని తీసుకొస్తామంటే ఆగ్రహజ్వాలలు మిన్నంటుతాయి. అందుకే అక్కడి పాలకుల స్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది. గాజాను పునర్నిర్మించాల్సిందే. సర్వం శిథిలమైన చోట మెరుగైన ఆవాసాలు ఏర్పాటు కావాల్సిందే. కానీ అదంతా అక్కడి పౌరుల చేతుల మీదుగా జరగాలి. అమెరికాతో సహా బయటి దేశాలకు అక్కడ కాలుమోపే హక్కులేదు. -
దక్షిణాఫ్రికాతో కయ్యానికి కారణాలేంటి?
కొత్తగా దక్షిణాఫ్రికాతో తగువు ప్రారంభించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అందుకు ఆరంభం ఫిబ్రవరి 3న జరిగింది. దానికి ఆయన చెప్తున్న కారణాలు మూడు: ఒకటి, అక్కడి శ్వేతజాతీయుల భూములను సిరిల్ రామఫోసా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్నది. రెండు– తెల్లవారిపట్ల వివక్ష చూపుతున్నది. మూడు– అమెరికాపై, దాని మిత్ర దేశాలపై అంతర్జాతీయంగా వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నది. ఇవిగాక, తెల్లవారి విషయంలో ‘చాలా చెడ్డ పనులు చేస్తున్నది’ అని కూడా అన్నారాయన. దక్షిణాఫ్రికాలోని తీవ్ర వాద శ్వేతజాతీయుల సంస్థలు కొన్ని తమపై ‘సామూహిక హత్యా కాండలు సాగుతున్నట్లు’ 1994లో అక్కడ వర్ణ వివక్ష (అపార్థీడ్’) ముగిసినప్పటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. ‘చెడ్డ పనులు’ అనటంతో ట్రంప్ ఉద్దేశం అదేనేమో తెలియదు.భూమి చట్టంతో మొదలు...ఈ విధమైన ఆరోపణలు చేసిన అమెరికా అధ్యక్షుడు ఆ విషయమై విచారణలు చేస్తున్నామనీ, అవి నిజమైతే దక్షిణాఫ్రికాకు తమ సహాయాన్ని నిలిపి వేయగలమనీ హెచ్చరించారు. ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకోవటం వేరు. అంతకన్నా ముందే సహాయం ఆపివేయటం వంటి చర్యలు మొదలై పోయాయి. జీ–20కి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రామఫోసా త్వరలో జొహాన్నెస్‌బర్గ్‌లో నిర్వహించనున్న శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనబోవటం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ప్రకటించేశారు. హెచ్ఐవీ చికిత్సల కోసం తాము చేసే ఆరోగ్య సహాయాన్ని ట్రంప్ ఆపివేశారు. దక్షిణాఫ్రికాలోనే పుట్టి పెరిగిన ట్రంప్ ముఖ్య సలహా దారు ఎలాన్ మస్క్, ట్రంప్ తరహా ఆరోపణలు, హెచ్చరికలు రెండు రోజులకొకసారి చేస్తున్నారు. దక్షిణాఫ్రికా శరణార్థుల కోసం శిబిరాలు సిద్ధం చేయాలంటూ ట్రంప్ తమ అధికారులను ఆదేశించారు కూడా! మరొకవైపు, అమెరికా అధ్యక్షుని ఆరోపణలలో ఎంతమాత్రం నిజం లేదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు తోసిపుచ్చారు. ఆఫ్రికాలోగల తీవ్రమైన భూమి సమస్యల దృష్ట్యా ‘నిరుపయోగం’గా ఉన్న భూముల స్వాధీనానికి రామఫోసా ప్రభుత్వం గత నెల ఒక చట్టం చేసింది. నిజానికి ఇటువంటి చట్టాన్ని స్వయంగా అమెరికా కూడా 5వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన విషయాన్ని రామఫోసా గుర్తు చేస్తున్నారు. ఇండియా మొదలైన అనేక దేశాలలోనూ ఈ చట్టాలు న్నాయి. ఇక తెల్లవారి పట్ల వివక్షలు, హత్యాకాండలున్నట్లు వారి సంస్థలు ఆరోపణలు చేయటం మినహా ఎటువంటి ఆధారాలూ చూపటం లేదు. ఈ మాట రామఫోసా ప్రభుత్వమే కాదు, దక్షిణాఫ్రి కాకు చెందిన ప్రజాస్వామిక శ్వేతజాతి వర్గాలు, పార్టీలు, పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు అంటున్నదే! అట్లాంటి దేమీ లేదని నేను స్వయంగా అక్కడికి వెళ్లినపుడు గమనించాను.అటువంటి స్థితిలో ట్రంప్ విపరీత వైఖరికి కారణమేమిటి? ప్రధానంగా ఆయన శ్వేతజాతి దురహంకారి కావటమనిపిస్తున్నది. తను మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు (2017–21) కూడా రక రకాల ఆరోపణలు చేశారు. అప్పటికి దక్షిణాఫ్రికాలో ఈ చట్టం లేదు. దక్షిణాఫ్రికాకు చెందిన శ్వేతజాతి తీవ్రవాద సంస్థలు తరచుగా అమె రికా సహా పాశ్చాత్య దేశాలకు వెళ్లి లాబీయింగ్‌లు చేస్తుండేవారు. వారి వాదనలను డెమోక్రాట్లు, రిపబ్లికన్ల ప్రభుత్వాలు పట్టించు కోలేదు. తమ వంటి లక్షణాలు గల ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వా తనే అందుకు విలువ ఇస్తున్నారు. ఇందుకు ఈసారి మరొక మూడు కారణాలు చేరాయి. ఒకటి– గాజాలో ఇజ్రాయెల్ మారణ కాండపై ప్రపంచంలో మొదట దక్షిణాఫ్రికాయే చొరవ తీసుకుని అంతర్జా తీయ న్యాయస్థానం (ఐసీజే)లో కేసు వేయటం. రెండు– అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి బహుళ ధ్రువ ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్న బ్రిక్స్ కూటమిలో దక్షిణాఫ్రికా భాగస్వామి కావటం. మూడు– ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీలో 30 శాతం భాగస్వామ్యాన్ని స్థానిక నల్లవారికి ఇవ్వాలన్న షరతు. వాస్తవానికి ఇటువంటి భాగ స్వామ్య నిబంధన అక్కడి టెలికాం లైసెన్సింగ్ చట్టంలో గతం నుంచి ఉంది. తనను మినహాయించాలన్నది మస్క్ వాదన. దానిని ట్రంప్ బలపరుస్తున్నారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వంనిరాకరిస్తున్నది.అన్నీ ఉన్నా వివక్షేనా?పోతే, 1994లో అపార్థీడ్, శ్వేతజాతి పాలన ముగిసిన 30 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఇటువంటి భూమి చట్టం ఎందుకు చేయవలసి వచ్చిందన్నది అర్థం చేసుకోవలసిన విషయం. యూరోపియన్లు దక్షిణాఫ్రికాకు రావటం 1600వ సంవత్సరంలో మొదలు కాగా, వారు భూములను అత్యధిక భాగం ఆక్రమించుకున్నారు. వేర్వేరు యూరోపియన్ల మధ్య కూడా కొంతకాలం ఆధిపత్య యుద్ధాలు జరగగా చివరకు అందరూ కలిసి 1948లో శ్వేతజాతి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంతకుముందే 1913, 1936లో భూమి చట్టాలు చేసి, మొత్తం భూములలో 87 శాతం తెల్లవారికి రిజర్వ్ చేశారు. ఆ పరిస్థితి 1994లో నల్లవారి ప్రభుత్వం ఏర్పడినా కొనసాగుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే, వివిధ కారణాల వల్ల ఆఫ్రికన్ రైతుల కొద్దిపాటి భూములు కూడా క్రమంగా శ్వేతజాతీయుల పరం కాసాగాయి. ఇది నేను అక్కడి ప్రభుత్వ రికార్డులను బట్టి స్వయంగా గమనించిన విషయం. ట్రంప్ తన ప్రకటనలో, తెల్లవారిలోని ఆఫ్రికానర్ల ప్రస్తావన ప్రత్యేకంగా చేశారు. హాలండ్, ఫ్రాన్స్ నుంచి వలస వచ్చిన జాతీయులను ‘ఆఫ్రికానర్లు’ అంటారు. అక్కడి జనాభాలో వారి శాతం కేవలం నాలుగు. భూములలో అధిక భాగం, ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన భాగం వారి అధీనంలోనే ఉన్నాయి. అయినా వివక్ష అని మాట్లాడతారు. ఉదాహరణకు అక్కడ నేనుమౌంటేన్ ఫాక్స్ అనే పేరిట గల డచ్ వారి వ్యవసాయ క్షేత్రాన్ని చూశాను. ఆ కుటుంబానికి 740 ఎకరాలకు పైగా ఉంది. సొంత వైన్ యార్డ్, అందులో పండించే ద్రాక్షతో సొంత బ్రాండ్ సారాయి ఉన్నాయి. కొన్ని వాహనాలతో రవాణా కంపెనీ ఉంది. ఒక మధ్య తరహా హోటల్, ఒక బొటిక్ ఉన్నాయి. అయినా తమ ఆఫ్రికానర్ల పట్ల వివక్ష ఉందని వాపోతూ హాలండ్‌కు తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు కారణం? తమ పిల్లవాడు ఇంజనీరింగ్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం వెళితే, అక్కడి కోటాల ప్రకారం ఆ ఉద్యోగం ఒక నల్లవాడికి ఇచ్చారట! అదీ వారనే వివక్ష. ఒక్కొక్కరి వద్ద వేలాది ఎకరాలుండటాన్ని, రహదారుల వెంట ఎంతదూరం వెళ్లినా కంచెలు వేసి పడావు పడటాన్ని చూశాను. పేదరికం వల్ల కొద్దిపాటి భూములు కూడా అమ్ముకుని నగరాలకు వలస వస్తూ చిల్లర పనులతో జీవిస్తున్న నల్లవారినీ కలిసి మాట్లాడాను.ఈ పరిస్థితులలో నల్లవారికి భూమి అన్నది తీవ్రమైన సమస్యగా ఉండిపోయింది. దానితో ముడిబడిన పేదరికం వల్ల అసంతృప్తి పెరుగుతున్నది. 30 ఏళ్ల తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) మొదటిసారిగా సొంత మెజారిటీ కోల్పోవటానికి ఇది ఒక ప్రధాన కారణం. అందువల్ల రామఫోసా ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటం అనివార్యమైంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు దక్షిణాఫ్రికా ‘మానవ హక్కులను హరిస్తున్న’దనే గొప్ప మాట అన్నారు. అపార్థీ డ్‌ను అమెరికా ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గాజా, కెనడా, గ్రీన్లాండ్, పనామా వంటి ఇతర దేశాలను ఆక్రమించుకోగలమని బాహాటంగా ప్రకటించే ట్రంప్, తెల్లవారి భూమి హక్కులంటూ ఇంతగా మాట్లాడటాన్ని బట్టి ఆయన తత్త్వం అర్థం చేసుకోవచ్చు.అయితే, తాము బెదిరి లొంగబోమనీ, తమ ప్రజలకు అవసర మైంది చేస్తామనీ రామఫోసా తమ పార్లమెంటులో స్పష్టం చేశారు. ఆ దేశం ఆఫ్రికా ఖండంలో పారిశ్రామికంగా అన్నింటికన్నా పెద్దది. బ్రిక్స్ కూటమిలో ప్రముఖ దేశం. ఇప్పటికే ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా ఖండాల దేశాలతో తగవుకు దిగిన ట్రంప్, ఆఫ్రికాలోనూ అదే ధోరణి చూపటం వల్ల అంతిమంగా అమెరికాకు కలగగల నష్టాల గురించి ఆలోచిస్తున్నట్లు లేదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శనివారం డెడ్‌లైన్
వాషింగ్టన్: గాజా స్ట్రిప్‌లో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలు, ఇతర దేశస్తులను శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా విడుదల చేయకపోతే హమాస్ అంతుచూస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి బందీలను విడుదల చేసి తీరాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, అందుకు ప్రతిగా బందీల విడుదల ప్రక్రియ ఆలస్యం కావొచ్చని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు.వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఒకటి, మూడు, నాలుగు, రెండు ఇలా కాదు.. మొత్తం బందీలందరినీ విడుదల చేయాలి. శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా బందీలు అందరూ విడుదలై మా చెంతకు చేరాలి. లేదంటే హమాస్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తాం. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుచేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశిస్తా’’ అని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ అది వాళ్ల ఇష్టం. నా వరకైతే బందీలను విడుదల చేయకుంటే వాళ్ల పనిపడతా. ఇక కాల్పుల విరమణ అంశంలో వాళ్ల కోణంలో తుది నిర్ణయం ఇజ్రాయెల్‌దే. బందీలను విడుదలచేయకపోతే నా మాటల్లోని తీవ్రత ఎంత అనేది హమాస్‌కు తెలిసేలా చేస్తా’’ అని అన్నారు.ఆలస్యంపై ఇజ్రాయెల్ ఆగ్రహంకాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందుకే బందీలను ఆలస్యంగా వదిలేస్తామన్న హమాస్ ప్రకటనను ఇజ్రాయెల్ తీవ్రంగా తప్పుబట్టింది. ఒప్పందాన్ని ఉల్లంఘించింది హమాసేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భద్రతా కేబినెట్‌తో సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నా నికల్లా బందీలను వదిలేయకుంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ హమాస్‌కు అల్టిమేటమిచ్చారు. మరోవైపు బందీల విడుదల నిలిపివేత ప్రకటన నేపథ్యంలో వారి కుటుంబాలు, మద్దతుదారులు టెల్ అవీవ్ లో ఆందోళనకు దిగారు. ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్టు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. 42 రోజుల ఒప్పందంలో మొదటి దశలో విడుదల కానున్న 33 మంది బందీల్లో 16 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. ఐదుగురు థాయ్ బందీలను కూడా అనధికారికంగా విడుదల చేశారు. -
హమాస్, గాజాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్టు కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు.పాలస్తీనాకు చెందిన గాజాపై డొనాల్డ్ ట్రంప్ తన మనసులోకి మాటను బయట పెట్టారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా ఆధ్వర్యంలో గాజాను పునర్ నిర్మించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఇందు కోసం గాజాను కొనుగోలు చేసి సొంతం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఇతరులకు కూడా అప్పగించవచ్చు. ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాం. హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై గాజా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతకుముందు కూడా గాజాపై ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి, అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి, భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతమున్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చు. తుపాకీ కాల్పులు, ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధర సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.ఈ మాటలపై, పాలస్తీనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే, తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురయ్యారు. అరబ్ దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను తప్పుబట్టాయి. ఈజిప్టు, జోర్డాన్ వంటి మిత్ర దేశాలు సైతం పాలస్తీనియన్ల తరలింపును వ్యతిరేకించాయి. ఇటువంటి చర్యవల్ల పశ్చిమాసియా సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టింది. ట్రంప్ ప్రకటన సమస్యాత్మకంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. జాతి నిర్మూలన ఆలోచన వద్దు: గుటేరస్ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పునరుద్ఘాటించారు. జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు. పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి, గాజా నుంచి ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘సమస్య పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో పరిస్థితిని మరింత దిగజార్చరాదు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం అత్యావశ్యకం. ఏ రూపంలో అయినా జాతి నిర్మూలన నివారించాలి’ అని పేర్కొన్నారు. ఆక్రమణలకు ముగింపు పలకాలన్నారు. గాజా అంతర్భాగంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా శాంతి సుస్థిరతలకు ఇదే అసలైన పరిష్కారమని నొక్కిచెప్పారు. -
ఆ కారిడార్ నుంచి వెనక్కు
టెల్ అవీవ్: హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా గాజాలోని కీలకమైన నెట్జరిమ్ కారిడార్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. ఉత్తర, దక్షిణ గాజా ప్రాంతాలను నెట్జరిమ్ కారిడార్ విడదీస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటం, ఆంక్షల కారణంగా లక్షలాదిమంది పాలస్తీనియన్లు దక్షిణ భాగంలో చిక్కుకుపోయారు. ఒప్పందంలో భాగంగా వీరిని నెట్జరిమ్ మీదుగా తిరిగి ఉత్తర గాజాలోకి వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. ఇందులో భాగంగానే బలగాల ఉపసంహరణ అమలైంది. అయితే, ఆదివారం ఎన్ని బలగాలు వెనక్కి వెళ్లిపోయిందీ ఇజ్రాయెల్ వెల్లడించలేదు. మొత్తం 42 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు సగం రోజులు గడిచాయి. ఒప్పందం ప్రకారం..22వ రోజైన ఆదివారం గాజాలో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలి. గాజాలోని దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తరం వైపు వెళ్లే పాలస్తీనియన్లను ఎలాంటి తనిఖీలు జరపకుండా ఇజ్రాయెల్ బలగాలు అనుమతించాల్సి ఉంటుంది. మొదటి విడతలో హమాస్ తమ వద్ద ఉన్న 33 మంది ఇజ్రాయెలీలను విడతల వారీగా విడిచిపెట్టాల్సి ఉంది.ఒప్పందం పొడిగింపు ప్రశ్నార్థకమేకాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇరుపక్షాలు మరోసారి చర్చలు ప్రారంభించాల్సి ఉంది. పొడిగింపుపై ఏకాభిప్రాయం కుదిరిన పక్షంలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న మొత్తం ఇజ్రాయెలీలకు, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వందలాది మంది పాలస్తీనియన్లకు స్వేచ్ఛ లభించనుంది. మళ్లీ చర్చలపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరచక పోవడంతో కాల్పుల విరమణ పొడిగింపు అంశం ప్రశ్నార్థకంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ కీలక మధ్యవర్తిగా ఉంది. ఈ దఫా చర్చలకు తక్కువ స్థాయి అధికారులను ఖతార్‌కు పంపనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను పొడిగించే అవకాశాలపై ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు పరిశీలకులు. ఈ వారంలో నెతన్యాహూ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఒప్పందంపై చర్చిస్తారని భావిస్తున్నారు. అయితే, ఈ సమావేశం ఎప్పుడు జరగనుందనే విషయంలో స్పష్టత రాలేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడులు జరిపి 250 మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుపోవడంతో ఇరుపక్షాల మధ్య యుద్ధం మొదలుకావడం తెలిసిందే. -
ఆ ముస్లిం దేశాన్ని కబ్జా చేస్తా..! ట్రంప్ ప్రకటనతో అలజడి
-
గాజాపై ట్రంప్ కన్ను
వాషింగ్టన్: సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వా«దీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాలో ఉంటున్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనావాసులు ఆ ప్రాంతాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. వారిని గాజా నుంచి శాశ్వతంగా తరలించి పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలే వారిని అక్కున చేర్చుకోవాలని తేల్చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం విశేషం. పాలస్తీనావాసులను గాజా నుంచి తరలించేందుకు, ఆ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకునేందుకు అమెరికాకు ఏం అధికారముందని ప్రశ్నించగా తన చర్య గాజా, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా అంతటికీ గొప్ప స్థిరత్వాన్ని తెస్తుందని ఆయన బదులిచ్చారు. గాజా స్వా«దీనానికి సైన్యాన్ని రంగంలోకి దించుతారా అని ప్రశ్నించగా, అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని బదులిచ్చారు. ఈ సందర్భంగా నెతన్యాహూ పదేపదే చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. ట్రంప్ ప్రకటనకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘ఈ నిర్ణయం చరిత్రను మార్చేస్తుంది. గాజాకు అద్భుతమైన భవిష్యత్తు అందిస్తుంది. ఇజ్రాయెల్‌కు ముప్పును శాశ్వతంగా తొలగిస్తుంది’’ అని ప్రకటించారు. ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయ పరిస్థితులను అల్లకల్లోలం చేసేలా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనను అక్కడి దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనా, సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, తుర్కియేతో పాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ కూడా దీన్ని ఖండించాయి. అమెరికాలో విపక్ష నేతలు కూడా ట్రంప్ ప్రకటనను దుయ్యబడుతున్నారు. గాజావాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఈజిప్‌్ట, జోర్డాన్, తుర్కియే తదితర అమెరికా మిత్ర దేశాలన్నీ ఇప్పటికే ముక్త కంఠంతో తిరస్కరించడం తెలిసిందే. గ్రీన్‌లాండ్‌ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, కెనడాను అమెరికాలో కలిపేస్తానని ట్రంప్ ఇప్పటికే పలు వివాదాస్పద ప్రకటనలు చేశారు. అంతర్జాతీయ ప్రాంతంగా గాజా అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఆకస్మికంగా గాజా స్వా«దీన ప్రకటన చేశారు. దీన్ని పశ్చిమాసియా గర్వించదగ్గ విషయంగా అభివరి్ణంచారు. ‘‘పశ్చిమాసియా నమ్మశక్యం కానంత గొప్ప ప్రదేశం. అద్భుతమైన తీర ప్రాంతం. గొప్ప వ్యక్తులతో నిండిన అందమైన ప్రదేశాల్లో ఒకటి. గాజాలో త్వరలో పర్యటిస్తా. ఇజ్రాయెల్ అంటే నాకిష్టం. అక్కడ, సౌదీ అరేబియాలో, పశ్చిమాసియా అంతటా పర్యటిస్తా. గాజాలో ఇప్పుడేమీ మిగల్లేదు. ఆ ప్రాంతమంతా మృత్యువుకు, విధ్వంసానికి చిరునామాగా, నరకకూపంగా మారింది. ప్రతి భవనమూ నేలమట్టమైంది. చిరకాలంగా శప్తభూమిగా ఉన్న గాజాను పూర్తిగా పునరి్నరి్మస్తాం. పేలని బాంబులు, ఆయుధాలను తొలగిస్తాం. ధ్వంసమైన భవనాలను తొలగించి ఆ ప్రాంతాన్నంతా చదును చేస్తాం. అక్కడ అపరిమితమైన ఉద్యోగాలందించేలా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాం. గాజావాసుల జీవన స్థితిగతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏ ఒక్క సమూహానికో కాకుండా అందరికీ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పాలస్తీనావాసులతో పాటు ప్రపంచం నలుమూలలకు చెందిన ప్రజలు అక్కడ నివసిస్తారు. లేదంటే ఆ ప్రాంతం వందల ఏళ్లుగా ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఏదైనా డిఫరెంట్‌గా చేయాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదైనా అద్భుతం చేయడానికి మాకు అవకాశముంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఇదేమీ అల్లాటప్పగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై చాలా ప్రముఖులు, ముఖ్యులతో లోతుగా చర్చించా. వారంతా నా ప్రతిపాదనను అమితంగా ఇష్టపడ్డారు. గాజాను సొంతం చేసుకుని అభివృద్ధి చేసి అపారమైన ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న అమెరికా ఆలోచనలను ఇష్టపడుతున్నారు’’ అని చెప్పారు. ‘‘గాజాలో దశాబ్దాలుగా మరణమృదంగం కొనసాగుతోంది. చంపుకోవడాలు లేకుండా ఆనందంగా ఉండగలిగే అందమైన ప్రదేశంలో వారికి శాశ్వతంగా పునరావాసం కల్పించగలిగితే చాలు. మరో దారి లేకే వారు గాజాకు తిరిగి వెళ్తున్నారు. ఎప్పుడు కూలతాయో తెలియని పై కప్పుల కింద బతుకీడుస్తున్నారు. దానికి బదులుగా అందమైన ఇళ్లలో సురక్షితంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం వారి ముందుంది. ఆ మేరకు చక్కని పునరావాసం పొందగలరని, ఇప్పుడు వద్దంటున్న దేశాల్లోనే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేయగలనని నమ్ముతున్నా’’ అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించదగ్గ మార్గం ఇదేనని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. ‘‘హమాస్‌ను నిర్మూలించాలన్న మా లక్ష్యాలను సాధించడానికి ట్రంప్ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చారు. ఇది యూదు జాతికి సాయపడుతుంది’’ అని చెప్పారు. ‘‘ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్న గాజాకు భిన్నమైన భవిష్యత్తును ట్రంప్ కాంక్షిస్తున్నారు. హంతక సంస్థ (హమాస్)ను నిర్మూలిస్తే అక్కడ శాంతి సాధ్యమే’’ అన్నారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందో లేదో చెప్పలేనన్నారు. బైడెన్ ప్రభుత్వం తమకు పెద్దగా సాయం చేయలేదని నెతన్యాహూ ఆక్షేపించారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు.అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగాట్రంప్ గాజా ప్రణాళిక గాజాను పునరి్నర్మించాలంటూ పది రోజుల క్రితమే పిలుపునిచ్చిన ట్రంప్ ఆ విషయమై ఎంత సీరియస్‌గా ఉన్నారో తాజా ప్రకటనతో ప్రపంచానికి తెలిసొచి్చంది. కానీ అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైన ఆయన గాజా ప్రణాళిక పశ్చిమాసియాను అతలాకుతలం చేయడమే గాక ప్రపంచ శాంతికి గొడ్డలిపెట్టుగా మారేలా కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్–హమాస్ పరస్పర బందీల విడుదల ప్రక్రియపైనా ప్రభావం చూపేలా ఉంది. ఒక దేశ జనాభాను బలవంతంగా నిరాశ్రయులను చేయడం అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధం. ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్లను తరిమేసి గాజాను యూదు స్థావరంగా మార్చుకోవాలని ఆశపడుతోంది. ట్రంప్ ప్రకటన కార్యరూపం దాలిస్తే 20 లక్షల మంది పాలస్తీనావాసులు శాశ్వత శరణార్థులుగా మారిపోతారు. -
గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
-
గాజాపై ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ట్రంప్.. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు. అనంతరం, గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగింపు దిశగా వెళ్లాలని చెప్పారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై నెతన్యాహూతో ట్రంప్ చర్చించారు. అనంతరం ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే.. అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పించవచ్చు అని తెలిపారు. ఇదే సమయంలో భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ పర్యటన సందర్భంగా గాజా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాను సందర్శించాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు.మరోవైపు.. ట్రంప్ నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. గాజాపై ట్రంప్ ప్రకటన చరిత్రను మారస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో, ఇరువురి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.Donald Trump just announced that the United States will be “taking over” Gaza and will “level” it to the ground.He said Palestinians should not live there anymore.This is GENOCIDE!!!! pic.twitter.com/dR1UcmhiTe— Morgan J. Freeman (@mjfree) February 5, 2025ఇదిలా ఉండగా.. గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు తీవ్రంగా ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్టు, జోర్డాన్, సౌదీఅరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈక్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకొని, అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. -
ట్రంప్‌కు అరబ్ దేశాల షాక్..!
కైరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరబ్ దేశాలు షాకిచ్చాయి. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత తాజాగా ట్రంప్ చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాలస్తీనాలోని గాజా పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ప్రజలు నివసించేందుకు అక్కడి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న పాలస్తీనీయులకు పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లలో పునరావాసం కల్పించాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఈమేరకు ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి.కాగా, గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 45 వేలమందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టంతో పాటు గాజాలో ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ప్రజల జీవనానికి కావల్సిన మౌలిక సదుపాయాలేవీ ఇప్పుడక్కడ లేవు. గాజా పునఃనిర్మాణానికి భారీగా నిధుల అవసరం ఉంది. తాజాగా ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో గాజా నుంచి చెల్లాచెదురైన అక్కడి వారు తిరిగి గాజాకు చేరుకుంటున్నారు. -
నెతన్యాహు.. ఇదేం కిరికిరి : హమాస్
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనా బందీల విడుదలను ఆలస్యం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. మా బందీలు సురక్షితంగా విడిచి పెట్టే వరకు.. పాలస్తీనా బందీలను విడుదల చేయడంలో ఆలస్యం చేయాలని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌తో పాటు ప్రధాని మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు’ అని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.ఫలితంగా,హమాస్ చరనుంచి ముగ్గురు ఇజ్రాయెల్ బందీలు సురక్షితంగా విడుదలవ్వగా.. 110 మంది పాలస్తీనా బందీలను ఇజ్రాయెల్ తమ అదుపులోనే ఉంచుకుంది. దీంతో చేసేది లేక 110 మంది బందీల విడుదలలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేలా హమాస్ మధ్యవర్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
గాజాలో కండోమ్‌ల పంపిణీకి నో..ట్రంప్ కీలక ఆదేశాలు
వాషింగ్టన్:అమెరికాలో ట్రంప్ యంత్రాంగం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులతో యుద్ధంతో విధ్వంసానికి గురైన గాజాలో కండోమ్‌ల పంపిణీకి ట్రంప్ సర్కారు నిధులు నిలిపివేసింది. గాజాలో కండోమ్‌ల పంపిణీకి గత బైడెన్ సర్కారు ఏకంగా 50 మిలియన్ డాలర్ల నిధులు కేటాయించడం గమనార్హం. అయితే ప్రభుత్వ ఖర్చులు తగ్గించే క్రమంలో ట్రంప్ గాజాలో కండోమ్‌ల పంపిణీకి బైడెన్ కేటాయించిన నిధుల పంపిణీ నిలిపివేశారని వైట్‌హౌజ్ తెలిపింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డీఓజీఈ కండోమ్‌ల నిధుల వ్యవహారాన్ని గుర్తించిందని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు.అయితే బైడెన్ ప్రభుత్వం నిజంగా కండోమ్‌లకు నిధులకు కేటాయించిందన్నదానికి వైట్‌హౌజ్ ఆధారాలు చూపకపోవకపోవడం చర్చనీయాంశమవుతోంది. బైడెన్ పేషీలో పనిచేసిన ఒక అధికారి ఈ విషయాన్ని కొట్టిపారేయడం గమనార్హం. కండోమ్‌లలో మండే వాయువులను నింపి ఆ బెలూన్లను హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి దక్షిణ ఇజ్రాయెల్‌పై వదిలేవారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఒక ఆసక్తికర పోస్టు చేయడం విశేషం. Explains why all condom orders were “Magnum” 😂 https://t.co/eKKRsfkgjY— Elon Musk (@elonmusk) January 28, 2025 -
‘‘ఏం తినేది..? ఎట్లా బతికేది??’’ హృదయ విదారక గాజా చిత్రాలు
-
వీడియో: బతుకు జీవుడా.. గాజాకు నడుచుకుంటూ లక్షల మంది..
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. వేల సంఖ్యలో మరణాలు, కోట్ల సంఖ్యలో ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది గాజా ప్రజలు తాము పుట్టిన భూమిని వదిలి శరణార్థి శిబిరాలకు వెళ్లారు.ఇప్పుడు యుద్ధం ముగిసిన నేపథ్యంలో మళ్లీ బతుకు జీవుడా అంటూ తమ నివాసాలకు చేరుకుంటున్నారు. పొట్టచేతపట్టుకొని ఎలా వెళ్లారో అలాగే, మళ్లీ తిరిగి వెళ్తుంటే అక్కడ తమకంటూ ఏమైనా మిగిలుందో లేదో తెలియని దుస్థితి వారిని వేధిస్తోంది. ఎలాబతకాలో తెలియని ఆందోళన వారి హృదయాలను బరువెక్కిస్తోంది. ఇవన్నీ ఆలోచించుకుంటూ లక్షలాది మంది గాజా ప్రజలు తమ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎన్నో ఆలోచనలు వారిని వెంటాడుతున్నాయి. కొన్ని లక్షల మంది గుంపు గాజా వైపు వెళ్తున్న దృశ్యాలను నెటిజన్లను కన్నీరుపెట్టిస్తున్నాయి.The Flag of Palestine is Raised above the people returning home to Northern Gaza after 15+ months! pic.twitter.com/inLghaC33G— Ryan Rozbiani (@RyanRozbiani) January 27, 2025కాగా, అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి గాజా ప్రజల పాలిట శాపమైంది. హమాస్ దాడితో ఇజ్రాయెల్ ప్రతి దాడి మొదలుపెట్టడంతో ఉత్తర గాజా నుంచి సుమారు 10 లక్షల మంది దక్షణాదికి తరలివెళ్లిపోయారు. శరణార్థి శిబిరాల్లో కాలం వెళ్లదీశారు. ఉత్తర ప్రాంతంలో బెంజమిన్ నెతన్యాహు సేనల దాడులతో ఆ ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి సౌకర్యాలు శిథిలమయ్యాయి. ఈ ఘర్షణలో హమాస్ అగ్రనాయకత్వం మొత్తం మృత్యువాతపడింది. ఈ నేపథ్యంలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో, వీరంతా స్వస్థలం బాటపడ్డారు.A million Palestinians returning to their destroyed homes and towns in the north of #Gaza this morning is the crystal clear response to those who still plot to uproot us from our homeland. There is only one direction of travel ahead of the Palestinian people after a 100 years of… pic.twitter.com/PsU7ip89jq— Husam Zomlot (@hzomlot) January 27, 2025 THE RETURN TO THE NORTH OF GAZA pic.twitter.com/qg5ddiqAre— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) January 27, 2025ఇదిలా ఉండగా..ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లు పునరావాసం కల్పించాలన్నారు. ఈ ప్రతిపాదన వారిని తమ సొంత ప్రాంతానికి శాశ్వతంగా దూరంగా చేస్తుందా? అనే ఆందోళనా వ్యక్తమైంది. ఇక పాలస్తీనా వాసులు తిరిగి రావడాన్ని హమాస్ విక్టరీగా అభివర్ణించుకుంది. “Don’t leave, don’t leave me” .. A little girl embraces her father after returning to the north of Gaza. pic.twitter.com/0T3AhoafyF— Eye on Palestine (@EyeonPalestine) January 27, 2025We are returning to the north of Gaza pic.twitter.com/IwRFKZ2hzV— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) January 27, 2025 -
పాలస్తీనా శరణార్థులను అక్కున చేర్చుకోండి
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సర్వం కోల్పోయి శరణార్థులుగా మారిన పాలస్తీనా పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. జోర్డాన్, ఈజిప్టుతోపాటు ఇతర అరబ్ దేశాలు వారికి ఆశ్రయ మివ్వాలని సూచించారు. వారి బాగోగులు చూసుకోవాలన్నారు. ఇజ్రాయెల్‌కు 2 వేల పౌండ్ల బరువైన బాంబుల సరఫరాను నిలిపివేస్తూ బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేశానని వెల్లడించారు. వాటిని శనివారమే ఇజ్రాయెల్‌కు అందజేశామని చెప్పారు.గాజాను శుభ్రం చేయాలి గాజా పూర్తిగా విధ్వంసానికి గురైన ప్రాంతమని, శిథిలాలను తొలగించి, శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కనుక ఎక్కువ మంది ప్రజలు బయటకు వెళితే కార్యాచరణ తేలికవుతుందన్నారు. గాజా పౌరులకు మరోచోట ఇళ్లు నిర్మించి ఇస్తే, అక్కడ వారు శాంతియుతంగా జీవనం సాగించగలరన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ కార్యాలయం ఇంకా స్పందించలేదు. మరోవైపు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌కు అమెరికా బాంబులు సరఫరా చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మిగిలిన బందిలందరినీ విడుదల చేయకపోతే హమాస్‌పై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. అసలు వ్యూహం అదేనా? పాలస్తీనా శరణార్థులు అరబ్ దేశాలు అనుమతించాలనడం, ఇజ్రాయెల్‌కు అమెరికా బాంబులు సరఫరా చేయడం వెనుక మరో వ్యూహం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బందీల విడుదల పూర్తయిన తర్వాత గాజా నుంచి పాలస్తీనా పౌరులను బయటకు తరలించి, హమాస్ స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయా లన్నదే అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం కావొచ్చని తెలుస్తోంది. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఆ రెండు దేశాలు యోచిస్తున్నాయి. -
హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీల విడుదల
గాజా: గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నలుగురు మహిళా బందీలను శనివారం హమాస్ విడుదల చేసింది. కరీనా అరీవ్, డానియెల్ గిల్బోవా, నామా లెవి, లిరి అల్బాజ్ అనే బందీలకు హమాస్ తమ చెర నుంచి విముక్తి కలిగించింది. ఇందుకు ప్రతిగా వందకు పైగా పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ తన జైళ్ల నుంచి విడిచిపెట్టనుంది.ప్రస్తుతం విడుదలైన ఇజ్రాయెల్ బందీలు మహిళా సైనికులు. గాజా సరిహద్దుకు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి వారిని 2023, అక్టోబర్ 7 దాడుల సందర్భంగా హమాస్ బంధించి తీసుకెళ్లింది. ఏడాదికిపైగా వారు హమాస్ చెరలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. తాజాగా ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకొచ్చిన హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. దీంతో రెడ్‌క్రాస్ తన వాహనాల్లో వారిని ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లింది. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్, వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది ఇజ్రాయెల్ బందీల్లో 33 మందికి హమాస్ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనియులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది.కాగా, 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాడులు చేశారు. ఈ దాడుల్లో 1200 మంది దాకా ఇజ్రాయెల్ సైనికులు, పౌరులు మృతి చెందారు. ఇంతేకాక వెళుతూ వెళుతూ 100 మందికిపైగా ఇజ్రాయెల్ వాసులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులు మొదలు పెట్టింది. ఈ దాడుల్లో 46వేల మంది దాకా పాలస్తీనా వాసులు మృతి చెందినట్లు సమాచారం. -
గాజా.. చెదిరిన స్వప్నం!
పదిహేను నెలల భీకర యుద్ధం ధాటికి అంధకారమయమైన గాజా స్ట్రిప్ వీధుల్లో ఎట్టకేలకు శాంతిరేఖలు ప్రసరించినా యుద్ధంలో జరిగిన విధ్వంసఛాయలు తొలగిపోలేదు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఎట్టకేలకు తుపాకుల మోత, క్షిపణుల దాడులు ఆగిపోయాయి. అయినాసరే అశాంతి నిశ్శబ్దం రాజ్యమేలుతూనే ఉంది. మిస్సైల్స్ దాడుల్లో ధ్వంసమైన తమ ఇళ్లను వెతుక్కుంటూ వస్తున్న పాలస్తీనియన్లకు ఏ వీధిలో చూసినా మృతదేహాలే స్వాగతం పలుకుతూ నాటి మారణహోమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. గాజా స్ట్రిప్‌పై వేల టన్నుల పేలుడుపదార్ధాలను కుమ్మరించిన ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల జనవాసాలను దాదాపు శ్మశానాలుగా మార్చేసింది. స్వస్థలాలకు కాలినడకన, గుర్రపు బళ్లలో చేరుకుంటున్న స్థానికులకు ఎటుచూసినా వర్ణణాతీత వేదనా దృశ్యాలే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటికింద స్థానికుల జ్ఞాపకాలతో పాటు కలలు కూలిపోయాయి. కొందరు ఆత్మియులను పోగొట్టుకుంటే.. మరికొందరు సర్వస్వాన్ని కోల్పోయారు. ప్రతి ముఖం మీదా విషాద చారికలే. కుప్పకూలిన వ్యవస్థలు గాజా స్ట్రిప్ అంతటా ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సగం ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. మిగిలినవి సైతం పాక్షింకంగానే పని చేస్తున్నాయి. వాటిల్లోనూ సాధారణ సూదిమందు, బ్యాండేజీ, కాటన్ వంటి వాటినీ అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యారోగ్య సంస్థలను మళ్లీ పునర్నిర్మించాల్సి ఉంది. రోడ్లు, మౌలిక సదుపాయాల పరిస్థితి మరీ అధ్వాన్నం. శిథిలాల తొలగించాక ఏర్పడిన కాలిబాటే ఇప్పడు అక్కడ రోడ్డుగా ఉపయోగపడుతోంది. సొంతిళ్లు బాంబుదాడిలో ధ్వంసమయ్యాక శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నాసరే పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వైమానిక బలగాలు వదిలేయలేదు. క్యాంప్‌లపై బాంబుల వర్షం కురిపించడంతో కళ్లముందే కుటుంబసభ్యులను కోల్పోయిన వారు ఇప్పుడు ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు.యుద్ధభయం వారిని ఇంకా వెన్నాడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారిని పట్టించుకున్న నాథుడే లేడు. యుద్ధం ఆగాక సహాయక, అన్వేషణా బృందాలు అవిశ్రాంతంగా కష్టపడుతూ మరో శ్రామికయుద్ధం చేస్తున్నాయి. శిథిలాల కింద మృతదేహాల నుంచి వెలువడుతున్న దుర్వాసన మధ్యే వాళ్లు శిథిలా తొలగింపు పనులు చేస్తున్నారు. ‘‘వీధిని చక్కదిద్దేందుకు ఏ వీధిలోకి వెళ్లినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. కూలిపోయిన భవనాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చు’’అని గాజా సిటీలోని 24 ఏళ్ల సివిల్ డిఫెన్స్ కార్మికుడు అబ్దుల్లా అల్ మజ్దలావి చెప్పారు. ‘నా కుటుంబం శిథిలాల కింద కూరుకుపోయింది, దయచేసి త్వరగా రండి’’అంటూ కాల్పుల విరమణ తర్వాత కూడా స్థానికుల నుంచి తమకు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయ ని సహాయక ఏజెన్సీ తెలిపింది. పునర్నిర్మాణానికి చాలా సమయం ధ్వంసమైన పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని గాజాలోని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థి సంస్థ ఉన్వ్రా తాత్కాలిక డైరెక్టర్ సామ్ రోజ్ తెలిపారు. ‘‘గాజాలో ఆవాస వ్యవస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ కుటుంబాలు, కమ్యూనిటీలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. సహాయక చర్యలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’’అని ఆయన పేర్కొన్నారు.ప్రజల అత్యవసర అవసరాలను తీర్చడానికి, గాజా ప్రజారోగ్య వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు తొలి 60 రోజుల ప్రణాళిక ఉందని, వేలాది మంది జీవితాన్ని మార్చేసిన గాయాలను మాన్పేందుకు సిద్ధమవుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ హనన్ బాల్కీ ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా గాజా స్ప్రిప్లో ఆస్పత్రులకు మరమ్మత్తు చేయడం, దాడుల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో తాత్కాలిక క్లినిక్‌లను ఏర్పాటు చేయడం, ప్రజల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని బాల్కీ వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్అణువణువునా విధ్వంసంయుద్ధం దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లను నిరాశ్రయులను చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 46,900 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,10,700 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. తమ సిబ్బందిలో 48 శాతం మంది ఇక ఈ ఘర్షణల బాధితులున్నారని, కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారని, ఇంకొందరు నిర్బంధంలో ఉన్నారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. గాజాలోని 85 శాతం వాహనాలు ధ్వంసమయ్యాయి. తమ 17 కార్యాలయాలు దెబ్బతిన్నాయని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది.ఆదివారం కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో స్థానికుల ముఖాల్లో ఆనందం వచ్చిచేరినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తే ఉన్న ఆ కాస్త ఆనందం కూరా ఆవిరయ్యే దుస్థితి దాపురించింది. గాజా అంతటా 60శాతం నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఐక్యరాజ్యసమితి గతంలో అంచనా వేసింది. చాలా ఆలస్యంగా కుదిరిన శాంతి ఒప్పందం అమలయ్యే నాటికి మరింతగా దాడులు జరగడంతో నేలమట్టమైన నిర్మాణాల సంఖ్య మరింత పెరిగింది. కూలిన ఇళ్ల కింద 10,000కు పైగా మృతదేహాలు ఉండొచ్చని ఏజెన్సీ అంచనావేస్తోంది.నెమ్మదిగా మొదలైన సాయం కాల్పులు ఇరువైపులా ఆగిపోవడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎలాగోలా తప్పించుకుని, గాయాలపాలుకాని స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద మృతులను అన్నింటినీ తొలగించడానికి కనీసం వంద రోజులు సమయం పడుతుందని అన్వేషణా బృందాలు అంచనావేస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అవసరమైన బుల్డోజర్లు ఇతర పరికరాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో వెలికితీత మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. దాడుల ధాటికి అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడటంతో పని దొరకడం కూడా కష్టంగా ఉంది.స్థానికులకు ఆదాయం కాదు కదా ఆశ్రయం కూడా లేకపోవడంతో గాజాలో బతకడం కూడా పెద్ద అస్తిత్వ పోరాటంగా తయారైంది. కాల్పుల విరమణ జరిగిన వెంటనే ఆహారం, నిత్యావసర వస్తువులు, ఔషధాలను మానవతా సంఘాలు అందించడం మొదలెట్టాయి. ఒక్క ఆదివారం రోజే 630 లారీల నిండా సరకులు గాజాలోకి ప్రవేశించాయి. సోమవారం మరో 915 లారీలు గాజాలోకి వెళ్లాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇంతటి భారీ స్థాయిలో మానవతా సాయం అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
కాల్పుల విరమణ నేటి నుంచే!
కైరో: ఇజ్రాయెల్ దాడులతో శిథిలమైన గాజాపై నేటి నుంచి శాంతిరేఖలు ప్రసరించనున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు. 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచిపెట్టనున్నారు. సాయంత్రం 4 గంటలతర్వాతే బందీల పరస్పర బదిలీ మొదలవతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరువైపులా బందీల కుటుంబసభ్యులు, బంధువుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తమ వారిని చూడబోతున్నామన్న ఆత్రుత వారిలో కన్పిస్తోంది. స్వేచ్ఛావాయువులు పీల్చబోతున్న వీళ్లందరికీ తక్షణ ఆహారంతో పాటు ఇతరత్రా సాయం అందించేందుకు మానవీయ సంస్థలు సిద్ధమయ్యాయి. అయితే ఇరువైపులా ఈ ప్రక్రియ ఎంత సజావుగా సాగుతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు, బందీల జాబితా అందజేసేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం అర్ధరాత్రి మెలిక పెట్టారు! -
గాజాలో శాంతి సాధ్యమేనా!
బాంబుల మోత ఆగుతుందంటే... తుపాకులు మౌనం పాటిస్తాయంటే... క్షిపణుల జాడ కనబడదంటే... ఇనుప డేగల గర్జనలు వినబడవంటే... నిత్యం మృత్యువు వికటాట్టహాసం చేస్తున్నచోట హర్షాతిరేకాలు వ్యక్తం కావటం సహజమే. అందుకే 15 నెలలుపైగా... అంటే 467 రోజులుగా రాత్రింబగళ్లు ప్రాణభయంతో కంటి మీద కునుకు లేకుండా గడిపిన గాజా ప్రజానీకం వీధుల్లోకొచ్చి పండుగ చేసుకున్నారు. అటు హమాస్ చెరలో మగ్గుతున్నవారి కుటుంబసభ్యులు సైతం ఆనందో త్సాహాలతో ఉన్నారు. ఇజ్రాయెల్–మిలిటెంట్ సంస్థ హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ ప్రతినిధులు బుధవారం రాత్రి ప్రకటించగానే ప్రపంచం, ప్రత్యేకించి పశ్చిమాసియా ఊపిరి పీల్చుకున్నాయి. ‘నేను దేశాధ్యక్షపదవి స్వీకరించబోయే జనవరి 20 నాటికి బందీలకు స్వేచ్ఛ లభించకపోతే సర్వనాశనం ఖాయమ’ని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పక్షం రోజుల నాడు ప్రకటించారు. ‘నా హెచ్చరిక ఫలించబట్టే కాల్పుల విరమణ ఒప్పందం సాకారమైంద’ని ఇప్పుడు ఆయన అంటుంటే... ‘నా అనుభవంలోనే అత్యంత కఠినమైన ఈ చర్చల ప్రక్రియను మొత్తానికి సుఖాంతం చేయగలిగాన’ని ప్రస్తుత అధ్య క్షుడు జో బైడెన్ చెబుతున్నారు. ఈ ఘనత ఎవరి ఖాతాలో పడాలన్నది తేలకముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మొండికేస్తున్నారు. తొలుత ఒప్పందాన్ని స్వాగతించిన ఆయనే ఇంకా తేలాల్సినవి ఉన్నాయంటున్నారు. ఒప్పందంపై ఆమోదముద్ర వేసేందుకు నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని నిలిపివేశారు. ఈలోగా నిన్న, ఇవాళ గాజాపై ఇజ్రాయెల్ సాగించిన బాంబు దాడుల్లో 19మంది పిల్లలు సహా 80 మంది చనిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందా లేదా, ఈ ప్రాంతంలో తాత్కాలికంగానైనా శాంతి నెలకొంటుందా అన్న అంశంలో సందిగ్ధత ఏర్పడింది. సుదీర్ఘకాలం ఘర్షణలతో అట్టుడికినచోట సాధారణ పరిస్థితులు ఏర్పడటం అంత సులభమేమీ కాదు. అందునా ఇజ్రాయెల్‌తో వైరమంటే మామూలుగా ఉండదు.ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 2023 అక్టోబర్ 7న విచ్చలవిడిగా కాల్పులు జరిపి 1,200 మంది పౌరులను హతమార్చటంతో పాటు, 251 మందిని బందీలుగా తీసు కెళ్లటంతో ఇదంతా మొదలైంది. హమాస్ మతిమాలిన చర్య తర్వాత ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో గాజా, వెస్ట్‌బ్యాంక్‌లపై సాగించిన దాడుల పర్యవసానంగా ఇంతవరకూ కొందరు హమాస్ కీలకనేతలతో పాటు 46,700 మంది పౌరులు చనిపోయారు. ఇందులో అత్యధికులు పిల్లలు, మహి ళలే. ఇతరులు నిత్యం చావుబతుకుల మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం జారవిడిచే కరపత్రాలు సూచించిన విధంగా ఎటు పొమ్మంటే అటు వలసపోతూ అష్టకష్టాలు పడుతున్నారు.తిండీ, నీళ్లూ కరువై, అంతంతమాత్రం వైద్య సదుపాయాలతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఒక్కోటి 42 రోజులు (ఆరు వారాలు)ఉండే మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలవుతుందా, మధ్యలో తలెత్తగల సమస్యలేమిటి అన్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాల్లేవు. హమాస్ చెరలో ఇంకా 94 మంది బందీలు మిగిలారని, వారిలో 34మంది మరణించివుండొచ్చని ఇజ్రాయెల్ అంచనా. తొలి దశ అమల్లోవుండగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగాలి. ఆ తర్వాత పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా 33 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది. ఒకసారంటూ ఒప్పందం అమలు మొదలైతే ఇరువైపులా ఉన్న బందీలను దశలవారీగా విడుదల చేస్తారు. గాజాకు భారీయెత్తున సాయం అందటం ప్రారంభమవుతుంది. ఒప్పందం ప్రకారం తొలి దశ కొనసాగుతున్న దశలోనే ఇజ్రాయెల్ రెండోదశ కోసం హమాస్‌తో చర్చించటం మొదలెట్టాలి. రెండో దశకల్లా బందీలతోపాటు దాడుల సందర్భంగా హమాస్‌కు చిక్కిన ఇజ్రాయెల్ ఆడ, మగ సైనికులు పూర్తిగా విడుదలవుతారన్నది అంచనా. అప్పుడు మొదలుకొని తొలి దశలో వున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వత కాల్పుల విరమణగా మారుతుంది. మూడో దశ అంతా పునర్నిర్మాణంపై కేంద్రీకరిస్తారు. హమాస్ బందీలుగా ఉంటూ మరణించినవారి మృత దేహాలను అప్పగించాలి. కేవలం మొదటి దశకు మాత్రమే ప్రస్తుత ఒప్పందం పరిమితమనీ... కొత్తగా చర్చలు జరిగాకే రెండు, మూడు దశలకు సంబంధించి తుది నిర్ణయం ఉంటుందనీ ఇప్పటికే నెతన్యాహూ ప్రకటించారు. తొలి దశ పూర్తయ్యాక మళ్లీ యుద్ధం తప్పదన్న హామీ ఇవ్వకపోతే తమ ఆరుగురు మంత్రులూ తప్పుకుంటారని తీవ్ర మితవాదపక్ష నాయకుడు, జాతీయ భద్రతా మంత్రి బెన్గివర్ హెచ్చరించటం తీసిపారేయదగ్గది కాదు. లెబనాన్‌లోని హిజ్బొల్లాతో ఉన్న రెండు నెలల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ ఇరువైపులా కాల్పులు జరగని రోజంటూ లేదు. ఆ ఒప్పందం కూడా ఈనెల 26తో ముగుస్తుంది. ఇప్పుడు హమాస్‌తో కుదిరిన ఒప్పందం గతి కూడా అలాగే ఉంటుందా అన్నది ప్రశ్నార్థకం.సిరియాలో అసద్ నిష్క్రమణ, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమైవుండటం, ఇరాన్ బల హీనపడటం, ట్రంప్ ఆగమనం వంటి పరిణామాలతో హమాస్‌లో పునరాలోచన మొదలయ్యాకే ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఎనిమిదినెలల నాడు దాదాపు ఇవే షరతులు ప్రతిపాదిస్తే ఆ సంస్థ తిరస్కరించటం గమనార్హం. మొత్తానికి పశ్చిమాసియా తెరిపిన పడటానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధి ప్రదర్శించటం అవసరం. దాడులతో ఎవరినీ అణిచేయలేమని ఇన్నాళ్ల చేదు అనుభవాల తర్వాతైనా ఇజ్రాయెల్ గుర్తిస్తే మంచిది. ఎన్ని లోటుపాట్లున్నా ఘర్షణలు అంతరించాలి. శాంతి చిగురించాలి. -
గాజా ఒప్పందం.. ఆఖరి నిమిషంలో కొర్రీలు!
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ఘనంగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఆఖరి నిమిషయంలో ఇటు ఇజ్రాయెల్.. అటు హమాస్‌లు ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ(Ceasefire Deal) ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు తమ కేబినెట్ సమావేశం ప్రస్తుతానికి జరగట్లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అందుకు హమాస్ చివరి నిమిషంలో పెట్టిన కొర్రీలే కారణమని ఆరోపించింది. ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.చివరి నిమిషంలో హమాస్(Hamas) ఉగ్రసంస్థ ఒప్పందంలో మార్పులు సూచించడమే అందుకు కారణమని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయితే ఆ కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. హమాస్ మాత్రం మధ్యవర్తులు తెచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం. పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఖతార్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తొలి ఫేజ్‌లో భాగంగా.. గాజాలో తాము బంధీలుగా ఉంచిన 33 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తారు. దానికి ప్రతిగా తమ దేశ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా బంధీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ఇదీ చదవండి: గాజా శాంతి ఒప్పందం ఘనత ఎవరిదంటే..అయితే.. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ (Israel) గాజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రకటన వెలువడినప్పటి నుంచి జరిగిన దాడుల్లో 71 మంది మరణించినట్లు గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. పైగా ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని, పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా.. మరికొందరికి గాయాలైనట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ ఆదివారం(జనవరి 19) నుంచి మొదలుకావాల్సిన ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకునే అవకాశం లేకపోలేదు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 15 నెలల యుద్ధంలో 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తూ వచ్చాయి. అటు అమెరికా.. ఇటు ఈజిప్ట్,ఖతారులు కొన్ని నెలలుగా కాల్పుల విరమణ చర్చలు జరుపుతూ వచ్చాయి.ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ టెలివిజన్ ముఖంగా చేసిన ప్రకటనతో.. పాలస్తీనాలో సంబురాలు జరిగాయి. ఇటు గాజా సరిహద్దులో శరణార్థ శిబిరాల్లో ఉన్నవాళ్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా మానవతా ధృక్పథంతో ముందకు సాగాలని, గాజా కోలుకునేందుకు అవసరమైన సాయం కోసం ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. గాజా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందన్న పరిణామంపై భారత్ సహా పలుదేశాలు స్వాగతించాయి. -
హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం, ఆ ఘనత ఎవరికంటే..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావడంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంధీలను విడిచిపెట్టడంతో(Gaza hostage release) పాటు కాల్పుల విమరణ ఒప్పందానికి సిద్ధపడడంతో ఇరువర్గాలను ట్రంప్ మెచ్చుకున్నారు. అయితే.. మరో ఐదు రోజుల్లో ఆయన వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. ఈలోపే గాజా యుద్ధం ముగింపు దిశగా అడుగు పడడాన్ని ఆయన తన విజయంగా అభివర్ణించుకుంటున్నారు.‘‘కిందటి ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మేం చారిత్రక విజయం సాధించాం. ఆ ఫలితమే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అని తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ ఉంచారు. నిబద్ధతతో కూడిన తన పరిపాలన.. శాంతి, సామరస్యంతో ప్రపంచానికి శక్తివంతమైన సంకేతాలను పంపిందని విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారాయన. ఇజ్రాయెల్ సహా మా మిత్రపక్షాలతో మేం(అమెరికా) సత్సంబంధాలు కొనసాగిస్తాం. అలాగే.. గాజాను మళ్లీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చబోం అని ఆయన రాసుకొచ్చారు.తాజాగా హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు.కాగా, హమాస్‌కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లార్చేందుకు అమెరికా సహా పలు దేశాలు నిర్విర్వామంగా కృషి చేస్తూ వస్తున్నాయి. గాజా శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్, ఖతార్‌ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ టైంలో(కిందటి ఏడాది మే చివర్లో) ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఖతార్ ద్వారా హమాస్‌కు సైతం ఆ ఒప్పందం చేరవేశారు. ఇక గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు, దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న వందలమంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ తలూపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే..మొదటి దశఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి.రెండో దశసైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి.మూడో దశగాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.అయితే.. బైడెన్ ప్రతిపాదించిన ఒప్పంద సూత్రాలకే ఇరు వర్గాలు అంగీకరించాయా? లేదంటే అందులో ఏమైనా మార్పులు జరిగాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మధ్యవర్తులు చెబుతున్న సమాచారం ప్రకారం.. తొలి దశలో యుద్ధం నిలిపివేతపై చర్చలను ప్రారంభించడంతో పాటు, ఆరు వారాల పాటు కాల్పుల విరమణ పాటించాలి. హమాస్ చెరలో బందీలుగా ఉన్న సుమారు 100 మందిలో 33 మందిని ఈ సమయంలో విడిచిపెట్టాలి’’ అని ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ప్రతినిధులు ధృవీకరించారు. ఈ ఒప్పందంపై గురువారం ప్రకటన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సన్నద్ధమవుతున్నారు.ఖతార్ పాత్ర ప్రత్యేకం.. కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్టులు మధ్యవర్తిత్వం వహించాయి. ఈక్రమంలో రెండుసార్లు కాల్పుల విరమణపై చర్చలు జరగ్గా అవి ఫలించలేదు. అయితే గాజాలో శాంతి స్థాపన కోసం ఖతార్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మొదటి నుంచి ఆసక్తికరంగా సాగాయి. 2012 నుంచి దోహాలో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నాల్లో ఖతార్ కీలకంగా వ్యవహరిస్తుందని తొలి నుంచి చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే ఖతార్ ఈ చర్చల్లో ముందుకు వెళ్లింది కూడా. అయితే ఒకానొక దశలో అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గింది. దీంతో మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలను ఖతార్ నిలిపివేసిందన్న కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఖతార్ వాటిని ఖండించింది. అదే సమయంలో దోహాలో హమాస్ కార్యకలాపాలను బహిష్కరించాలని అమెరికా ఇచ్చిన పిలుపును కూడా ఖతార్ పక్కన పెట్టి మరీ చర్చలకు ముందుకు తీసుకెళ్లి పురోగతి సాధించింది ఖతార్. గాజా బాధ్యత ఎవరిది?తాజా ఒప్పందంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఒప్పందం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వెనక్కుమళ్లుతాయా?.. లేకుంటే పాక్షికంగానే జరుగుతుందా?. భవిష్యత్తులో కాల్పుల విరమణ ఉల్లంఘన జరగకుండా ఉంటుందా? అన్నింటికి మించి.. యుద్ధంతో నాశనమైన గాజా ప్రాంతాన్ని ఎవరు పాలిస్తారు? దాని పునర్నిర్మాణానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది.ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ లాంఛనం పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరించనుంది. -
దయ్యాల కోసం అద్దె చెల్లించడమా..!
అక్కడ దయ్యాలు, భూతాలు ఉన్నాయంటే ఆ వైపు కూడా వెళ్లరు చాలామంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం దయ్యాల కోసమే అద్దె చెల్లించాడు. ఈజిప్టులోని కైరో వెలుపల అతి పురాతనమైన మూడు పిరమిడ్లు ఉన్నాయి. వీటిని ఈజిప్ట్ ప్రభుత్వం అద్దెకిస్తోంది. వాటిల్లో ఒకటి, అతిపెద్దది, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. అక్కడ దాదాపు మూడువేలకు పైగా దయ్యాలు, భూతాలు ఉన్నాయని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఆ దయ్యాలను చూడటానికే ప్రముఖ యూట్యూబర్ జేమ్స్ డొనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), వాటిని వంద గంటలకు అద్దెకు తీసుకున్నాడు. ‘బియాండ్ ది రికార్డ్స్’ పేరుతో భయంకర ప్రదేశాల్లోకి వెళ్లి, అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనల వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు తన భారీ అన్వేషణ కోసం ఈజిప్ట్‌లోని ఈ పిరమిడ్లను ఎంచుకున్నాడు.మరో వింత..ఈ విమానంలో ప్రయాణించాల్సిన పనిలేదు.. ‘ఈ వంద గంటల్లో స్నేహితులతో కలసి అక్కడ ఉండే అన్ని గదులు, సమాధులను చూసి, అక్కడే నిద్రించాలన్నది నా ప్లాన్. ఇందుకోసం, అవసరమైన అన్ని వస్తువులతో పాటు, పారానార్మల్ యాక్టివిటీ డివైజ్, ఇతర పరికరాలను తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు. కొంతమంది ఇది సాధ్యం కాదని కొట్టి పారేస్తుంటే, తను మాత్రం త్వరలోనే వీడియోతో సమాధానం చెబుతానంటున్నాడు. భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు..70 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్(Israel) జరిపిన దాడుల్లో70 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో 17 మంది దాకా మరణించారు.‘తెల్లవారుజామున రెండు గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. 14,15 మంది దాకా నివసించే మా పక్కనున్న ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంట్లోని వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు’అని పొరుగున ఉండేవారు తెలిపారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు.మరోవైపు గాజా(Gaza)లో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలకు అమెరికా ప్రభుత్వ సహకారం ఉంది. బందీల విడుదలకు ఒప్పుకోవాలని హమాస్‌ను మధ్యవర్తులు కోరుతున్నారు. అప్పుడే కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. -
ఈ ఏడాది.. పిల్లల పాలిట పెనుశాపమే!
పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా నిలిచింది 2024. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ తాజాగా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 15 నెలల్లో కనీసం 17,492 మంది బాలలు మరణించినట్లు తెలిపింది...! మునుపెన్నడూ లేనంతంగా ఎక్కువ మంది పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బలవంతంగా నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణలో మరణిస్తున్న, గాయపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాలలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భద్రత మాట పక్కకు పెడితే.. ప్రాథమిక అవసరాలు తీర్చుకునే అవకాశమూ ఉండటం లేదు. వాళ్లు ఆడుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడో మరిచారు. ఈ యుద్ధాలు పిల్లల హక్కులను హరిస్తున్నాయి. ఇక, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు, పోషకాహారం విలాసంగా మారాయి. ‘‘ప్రపంచంలో అనియంత్రిత యుద్ధాలకు ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు మనుగడ కోసం పోరాటమే చేస్తున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది దారుణం’’ అని యునిసెఫ్ డైరెక్ట్ కేథరిన్ రస్సెల్ వాపోయారు. గణాంకాలు చెబుతున్న విషాదాలు.. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో పిల్లలు 30 శాతం ఉన్నారు. వారిలో 47.3 కోట్ల మంది యుద్ధ ప్రభావింత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంతర్జాతీయ ఏజెన్సీ తెలిపింది. 1990లలో సుమారు 10 శాతం మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో ఉండగా ఇప్పుడది ఏకంగా రెట్టింపుకు, అంటే 19 శాతానికి పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా 2023 చివరి నాటికి 4.7 కోట్ల మంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 2024లో హై తీ, లెబనాన్, మయన్మార్, పాల స్తీనా, సూడాన్ నుంచి అత్యధికంగా శరణార్థులుగా వెళ్లారు. ప్రపంచ శరణార్థుల జనాభాలో సుమారు 40 శాతం బాలలే. ఆయా దేశాల్లో నిర్వాసితులయినవారిలో బాలలు 49 శాతమున్నారు. 2023 నుంచి ఇప్పటిదాకా 22,557 మంది పిల్లలపై రికార్డు స్థాయిలో 32,990కు పైగా తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లో అత్యాచారాలు, లైంగిక హింస పెచ్చరిల్లాయి. ప్రమాదకర స్థాయిలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యా మౌలిక సదుపాయాల విధ్వంసం, పాఠశాలల సమీపంలో అభద్రతా భావం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పిల్లల్లో పోషకాహార లోపం కూడా ప్రమాదకర స్థాయికి పెరిగింది. యుద్ధం పిల్లల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని పిల్లల్లో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ పెరిగింది. పిల్లల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. విచారం, భయం వంటి వాటితో బాధపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 10 మంది మృతి
-
వీళ్లు వ్యాక్సిన్ వేశారు.. వాళ్లు బాంబులు వేశారు!
గాజాలోని.. ఓ ఆస్పత్రి. 22 నెలల వయసున్న చెల్లెలు మిస్క్ తో కలిసి నాలుగు నెలలుగా ఆస్పత్రిలోనే ఉంటోంది మూడేళ్ల హనన్. ‘అమ్మేది?’, ‘కాళ్లెక్కడికి పోయాయి’పదే పదే అడిగే ఈ ప్రశ్న తప్ప వారి నోటినుంచి మరో మాటలేదు. ‘నాలుగు నెలలుగా మనమో పీడకలలో ఉన్నాం’అని చెబుతోంది పక్కనే ఉన్న వారి అత్త. బాంబు దాడిలో అమ్మ చనిపోయిందని, ఆ దాడిలోనే ఇద్దరి కాళ్లూ పోయాయని వాళ్లకు చెప్పలేక కుమిలిపోతోంది. ఇది గాజాలోని ఆస్పత్రుల్లో కనిపించే నిత్య దృశ్యం. మనుషులు వేరు.. అడిగే ప్రశ్నలు వేరు.. కానీ ఎవ్వరి దగ్గరా సమాధానాలు ఉండవు. తమ ప్రమేయం ఏమాత్రం లేకపోయినా.. జరుగుతున్న మారణహోమంలో ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులు వేలమంది. వైకల్యం పాలైనవారి లెక్కలు లేనేలేవు.గాజాలో తొలి పోలియో కేసు నమోదు కావడంతో ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు యుద్ధానికి విరామం ప్రకటించాలని సూచించింది. ఇజ్రాయెల్, గాజా రెండూ ఈ విరామాన్ని అంగీకరించాయి. సెపె్టంబర్ 2న కార్యక్రమం మొదలైంది. డేర్ ఎల్ బలాహ్‌లో ఉంటున్న షైమా అల్ దఖీ... ఉదయాన్నే లేచి తన ఇద్దరు కుమార్తెలు హనన్, మిస్్కను తీసుకెళ్లి టీకా ఇప్పించింది. మరుసటి రోజు కుటుంబం భోజనం చేసింది.. నిద్రించడానికి ఉపక్రమిస్తుండగా.. వాళ్ల ఇంటిపై బాంబు దాడి. ఈ ఘటనలో షైమా ప్రాణాలు కోల్పోయింది. భర్త మహ్మద్ అల్ దఖీతో సహా ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. హనన్ రెండు కాళ్ళను కోల్పోయింది. ఆమె శరీరమంతా గాయాలే. చిన్నారి మిస్క్ ఎడమ కాలు కోల్పోయింది. తలలో తీవ్ర రక్తస్రావమవ్వడంతో మహమ్మద్ రెండు వారాలపాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. భయానకంగా భవిష్యత్... మహమ్మద్ సోదరి షెఫా.. ఇద్దరు అమ్మాయిలను ఓదార్చడానికి ప్రయతి్నస్తోంది. ఇద్దరూ భయంతో వణికిపోతూ అత్తను పట్టుకునే ఉంటున్నారు. ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పి వారిని ఊరడిస్తోంది. కానీ.. భవిష్యత్‌లో పిల్లల పరిస్థితి ఏమిటి? తమ వయసులోని ఇతర పిల్లలను చూసి వీళ్లేమనుకుంటారు. లోకమంటే తెలియని మిస్్కకు అంత కష్టం కాకపోయినా.. తన కుటుంబానికి ఏం జరిగిందో కొంచెం అర్థమైన హనన్‌కు మాత్రం ఇది కష్టంగా ఉంది. పెరుగుతున్న బాధితులతో చికిత్స అందించడానికే సమయం సరిపోని వైద్యులకు చిన్నారులకు మానసికంగా మద్దతు ఇచ్చే అవకాశం అసలే లేదు. షెఫాతోపాటు షైమా తల్లిదండ్రులు, షెమా సోదరుడు అహ్మద్ పిల్లలను చూసుకుంటున్నారు. పిల్లలు బొమ్మలు కావాలంటున్నారు.. కానీ రొట్టెముక్క విలాసంగా మారిన చోట బొమ్మలు దొరకడం అసాధ్యం కదా! ఏచిన్న అవకాశం దొరికినా పిల్లలను సంతోషంగా ఉంచేందుకు కానుకలు తెస్తున్నారు. ఇతర పిల్లల కాళ్ల వైపు చూస్తూ.. ‘‘గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచే షైమా బిడ్డల గురించి భయపడింది. వారికి పోషకాహారం అందించడానికి ఎంతో శ్రమించింది. వారితోనే సమయం గడిపింది. వాళ్లు కావాలన్నది ఇవ్వడానికి ప్రయతి్నంచింది. పోలియో వ్యాక్సిన్ల ప్రకటన రాగానే.. పోలియో నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్స్ తన పిల్లలకు వేయించడమే కాదు.. బంధువులందరినీ ప్రోత్సహించింది. కానీ ఏం జరిగింది. పోలియో నుంచి రక్షణ లభించింది కానీ.. ఇజ్రాయెల్ వైమానిక దాడి వారి కాళ్లను తీసుకుంది. షైమాను పొట్టన పెట్టుకుంది. తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. హనన్ది నా కూతురు హలాది ఒకే వయసు. హలాను ఆస్పత్రికి తీసుకొచి్చనప్పుడు.. హనన్ భావాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. హలా కాళ్ల వైపు చూస్తూ, ఆ తర్వాత తన కాళ్లను చూసుకుంటూ ఉండిపోయింది. బాంబు దాడికి ముందు వాళ్లిద్దరూ కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఆసుపత్రి మంచంపై ఆడుకుంటున్నారు’’అంటూ కన్నీటి పర్యంతమవుతోంది షెఫా. వైద్యం కోసం ఎదురుచూపులు బాంబుదాడులతో గాజా ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయింది. చిన్నారులిద్దరూ పూర్తిగా కోలుకోవాలంటే గాజాలో ఇచ్చే చికిత్స సరిపోదు. వాళ్లకు కేవలం ప్రోస్థెటిక్స్ అమరిస్తే సరిపోదు. పిల్లలిద్దరిదీ ఎదిగే వయసు. వయసుతో పాటు ఎముక పెరుగుదల కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే నిరంతర పర్యవేక్షణ, శస్త్రచికిత్సలు అవసరం. చికిత్స కోసం గాజాను విడిచిపెట్టాల్సిన వ్యక్తుల జాబితాలో వాళ్ల పేర్లను చేర్చారు. ఇజ్రాయెల్ ఆమోదిస్తే తప్ప వారిని విడిచిపెట్టలేరు. ఆమోదం కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘నేను బూట్లెలా వేసుకోవాలి?’, ‘నేను ఆడుకోవడానికి పార్క్‌కు వెళ్లొద్దా?’అంటూ పిల్లలడిగే ప్రశ్నలకు బదులెవరు చెప్తారు? గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని నిశ్శబ్దంగా చూస్తున్న ప్రపంచాన్ని భవిష్యత్‌లో ఆ చిన్నారులు ఎలా చూస్తారు? అంతటా సమాధానం లేని ప్రశ్నలే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓవైపు చలి మరోవైపు ఆకలి
శీతాకాలం.. అంటేనే భూమిమీద ఉత్తరార్థ గోళానికి పండుగ వాతావరణం. ప్రపంచంలో మూడోవంతు జనాభా ఇప్పుడు హాలిడే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఉత్తరార్థగోళ చలి ప్రభావాన్ని నేరుగా చవిచూస్తే గాజా స్ట్రిప్ మాత్రం వేడుకలకు దూరంగా ఆకలితో పోరాటం చేస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా పండుగకు సిద్ధమవుతుంటే క్షిపణుల మోతలు, బాంబుల దాడులతో ధ్వంసమైన గాజా నిరాశ, ఆకలితో మరణపు అంచున ఒంటరిగా నిలబడింది. ఉత్తరార్ధ గోళంలోకి వచ్చిన శీతాకాలం గాజాలో మరింత విషాదాన్ని తెచ్చిపెట్టింది. చల్లని వాతావరణం, వర్షం గాజాలో నిరాశ్రయులైన 20 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షం కురిసింది. నిర్వాసితుల గుడారాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని కూలిపోయాయి. ఇది వేలాది నిరుపేద కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టింది. బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇళ్ల నుంచి కేవలం కట్టుబట్టలతో బయటపడ్డారు. కొందరు శిథిలాల నుంచి బట్టలు తెచ్చుకున్నారు. కానీ అత్యధిక శాతం పాలస్తీనియన్లకు ఆ అవకాశం లేకుండాపోయింది. చలికాలం రావడంతో ఒంటిని వెచ్చగా ఉంచే సరైన దుస్తులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీసం చెప్పులు కూడా కొనుక్కోలేని దుస్థితి. ఆకాశాన్నంటుతున్న ధరలు ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఒక కొత్త గుడారం 1,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక తాత్కాలిక షెల్టర్ వందల డాలర్లు ఖర్చవుతుంది. ఒక కొత్త దుప్పటి 100 డాలర్ల వరకు ఉంటుంది. బట్టల ధరలు మరింత పెరిగిపోయాయి. ఒక లైట్ పైజామా ధర ఇప్పుడు 95 డాలర్లు. ఒక కోటు వంద డాలర్లు. ఒక జత బూట్లు 75 డాలర్లు. చలి కాచుకోవడానికి సరిపడా ఇంధనం లేదు. ఇక 8 కిలోల గ్యాస్ ధర 72 డాలర్లకు చేరుకుంది. కలప ధర కొంచెం తక్కువ. కానీ పునరావాస శిబిరాల్లో ఉన్న ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు. విపరీతమైన డిమాండ్‌ను తీర్చడానికి గాజా అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లు వెలిశాయి. అక్కడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రబలుతున్న వ్యాధులు వెచ్చగా ఉంచేందుకు బట్టలు, ఇంధనం లేకపోవడంతో శీతాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. పోషకాహార లోపంతో బలహీనపడిన శరణార్థుల శరీరాలు విపరీతమైన భయం, బాంబుల గాయాలతో అలసిపోయాయి. అందుకే సాధారణ జలుబును కూడా వాళ్లు తట్టుకోలేక ఊరకనే జబ్బు పడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. బాంబు దాడిలో తీవ్రంగా గా యపడిన వారికి మాత్రమే వైద్యం అందుతోంది. ఔషధాలు, సిబ్బంది కొరతతో సాధారణ రోగాలకు వైద్యం అందించలేకపోతున్నాయి. పరిశుభ్రత దాదాపు అసాధ్యంగా మారడంతో వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. చలివాతారణంలో సరైన విద్యుత్, ఇతరత్రా వసతులు ఏక గుడారాల్లో నిర్వాసితులు సరిగా స్నానం చేయలేక తిప్పలు పడుతున్నారు. చివరకు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోలేని దైన్యం వాళ్లది. అత్యంత విలాసం.. రొట్టె ముక్క అక్టోబర్ నుంచి గాజాలోకి వచ్చే అంతర్జాతీయ మానవతా సహాయం కూడా చాలా తగ్గిపోయింది. గాజా స్ట్రిప్ మొత్తం వినాశకరమైన కరువును ఎదుర్కొంటోంది. డిమాండ్ పెరిగి సరకు రవాణా బాగా తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పైకి ఎగశాయి. ఒక బస్తా పిండి ధర ఇప్పుడు ఏకంగా 300 డాలర్లకు పైనే ఉంది. ఇతర ఆహార పదార్థాలు కూడా ప్రియమైపోయాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేట మాంసం, కోడి మాంసం కోరుకోవడం చాలా పెద్ద అత్యాశ కిందే లెక్క. ఒకప్పుడు కుటుంబాలకు జీవనాడి అయిన బేకరీలు ఇప్పుడు ముడి సరుకులు అందక మూతపడ్డాయి. ఒక రొట్టె దొరకడమే చాలా కష్టంగా మారింది. పిండి దొరికినా అది పురుగులమయం. ఒకవేళ పురుగులు లేకుంటే అప్పటికే అది ముక్కిపోయి ఉంటోంది. దీంతో ప్రజలు ఇప్పుడు తకాయా(ఛారిటీ సూప్ కిచెన్ల)పై ఆధారపడవలసి వస్తోంది. ఉదయం 11:00 గంటలకు ఇవి తెరిచే సమయానికి పంపిణీ కేంద్రాల ముందు జనం చాంతాడంత వరసల్లో క్యూ కడుతున్నారు. వేలాది మంది శరణార్థుల కుటుంబాలకు తమ పిల్లలను పోషించడానికి ఇవి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. భరించలేని మానసిక వేదన ఆకలి శారీరక బాధే అయినా మానసిక వేదన అంతులేకుండా ఉంది. 2 లక్షలకు మందికి పైగా పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. సరైన పౌష్టికాహారం లేక చిన్నారుల శరీరాలు ఎముకల గూడులాగా తయారయ్యాయి. వందలమంది చిన్నారులు సరైన తిండితిప్పలు లేక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. పిల్లలకు సరైన తిండికూడా పెట్టలేకపోతున్నామన్న బాధ తల్లిదండ్రులను విపరీతంగా వేధిస్తోంది. ఆకలితో చచ్చిపోతున్న పిల్లలను చూసి నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. కన్నపిల్లలు కడతేరిపోతుంటే కన్నవారి కష్టాలకు హద్దుల్లేకుండా పోయిది. అత్యంత క్రూరమైన ఈ పరిస్థితులను దూరం నుంచి చూస్తున్న పశి్చమదేశాలు నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం. భూతలంపై నడిమధ్యలోనే ఉన్నా చలి, ఆకలితో పాలస్తీనా సమాజం ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ మరణంకోసం ఎదురుచూస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజాలో శరణార్థులపై ఇజ్రాయెల్ దాడులు..26 మంది మృతి
గాజా:ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో పాలస్తీనా పౌరులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 26 మంది శరణార్థులు మృతి చెందారు. ఈమేరకు పాలస్తీనా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం(డిసెంబర్ 10) అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి.శరణార్థులు ఆశ్రయం పొందుతున్న శిబిరంపై దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపైనా దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 40 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. -
గుప్పెడు మెతుకుల దొరక్క.. గాజాలో మిన్నంటిన ఆకలి కేకలు (ఫొటోలు)
-
గాజాలో ఆకలి కేకలు
ఇజ్రాయెల్ దిగ్బంధంలో ఉన్న గాజాలో పాలస్తీనియన్లు పడుతున్న అంతులేని అగచాట్లకు నిదర్శనం ఈ ఫొటోలు. కనీసం ఆహారం సైతం దొరక్క వాళ్లు అలమటిస్తున్నారు. శుక్రవారం ఖాన్‌యూనిస్‌లోని శరణార్థి శిబిరం సమీపంలోని ఉచిత ఆహార పంపిణీ కేంద్రం వద్ద పాలస్తీనా మహిళలు, బాలికలు ఆహారం కోసం ఇలా పోటీ పడ్డారు. వారి దురవస్థ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తీవ్రత నేపథ్యంలో గాజాకు ఆహార పంపిణీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఐరాస సహాయ సంస్థలు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. దాంతో గాజావాసుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. యుద్ధ తీవ్రత నేపథ్యంలో చాలాకాలంగా వారంతా ఐరాస సాయంపైనే ఆధారపడి బతుకీడుస్తూ వస్తున్నారు. దాంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటడం ఖాయమంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంతటి కారుచీకట్లలోనూ ఒక కాంతిరేఖ మిణుకుమంటోంది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలైనట్టు హమాస్ ప్రతినిధి బస్సెమ్ నయీమ్ తాజాగా చెప్పారు. పరస్పరం బందీల విడుదలతో 14 నెలల పై చిలుకు యుద్ధానికి త్వరలోనే ముగింపు వస్తుందని ఆశిస్తున్నట్టు వివరించారు. -
నెతన్యాహు అరెస్టవుతారా?
వాషింగ్టన్: గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన నిజంగా అరెస్టవుతారా? అనే దానిపై చర్చ మొదలైంది. ఐసీసీలో మొత్తం 124 సభ్యుదేశాలున్నాయి. అయితే, అన్ని దేశాలూ ఐసీసీ ఆదేశాలను పాటిస్తాయన్న గ్యారంటీ లేదు. అరెస్టు విషయంలో అవి సొంత నిర్ణయం తీసుకోవచ్చు. నెతన్యాహు తమ దేశానికి వస్తే అరెస్టు చేస్తామని ఇటలీ ప్రకటించింది. నెతన్యాహుతోపాటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్ను హమాస్ నేతలతో సమానంగా ఐసీసీ పరిగణించడం సరైంది కాదని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో చెప్పారు. ఐసీసీ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఒకవేళ నెతన్యాహు తమ దేశ భూభాగంలోకి ప్రవేశిస్తే చేస్తామని పేర్కొన్నారు. నెతన్యాహు అరెస్టుపై మరికొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ఆచితూచి స్పందించాయి. ఐసీసీని తాము గౌరవిస్తామని, నెతన్యాహు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి క్రిస్టోఫీ లెమైన్ చెప్పారు. తమ వైఖరిని ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు. ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్ ఒక సాధారణ ప్రక్రియ అని, అది తుది తీర్పు కాదని స్పష్టం చేశారు. నెతన్యాహును అరెస్టు చేయబోమని ఇజ్రాయెల్ మిత్రదేశం జర్మనీ సంకేతాలిచ్చింది. ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ను హంగెరీ ప్రధానమంత్రి విక్టన్ ఓర్బన్ బహిరంగంగా ఖండించారు. నెతన్యాహు తమ దేశంపై స్వేచ్ఛగా పర్యటించవచ్చని సూచించారు. పాలస్తీనాకు మద్దతిచ్చే స్లొవేనియా దేశం ఐసీసీ నిర్ణయాన్ని సమర్థించింది. అరెస్టు వారెంట్‌కు స్లొవేనియా ప్రధానమంత్రి రాబర్ట్ గొలోబ్ మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిర్ణయాన్ని అమలు చేయడం అనేది రాజకీయపరమైన ఐచి్ఛకాంశం కాదని, చట్టపరమైన నిబంధన అని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్ చెప్పారు. ఐసీసీ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. ఇలాంటి అరెస్టు వారెంట్లతో పరిస్థితి మరింత విషమిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఐసీసీ గత ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసింది. కానీ, ఆయన ఇప్పటికీ అరెస్టు కాలేదు. ఐసీసీ సభ్యదేశాలకు పుతిన్ వెళ్లలేదు. -
44 వేలు దాటిన మరణాలు
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్‌తో 13 నెలలుగా సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 44,000 దాటిందని గాజా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో సాధారణ పౌరులు ఎంతమంది, హమాస్‌కు చెందిన వారెందరు అనేది గాజా ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా లెక్కించదు. కాకపోతే మృతుల్లో సగం కంటే ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి 44,056 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,04,268 గాయపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. వాస్తవ మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉండొచ్చని, మెడికోలు చేరుకొలేని ప్రదేశాల్లో శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మరణించారని వెల్లడించింది. మరోవైపు 17 వేల మంది పైచిలుకు హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. గత ఏడాది అక్టోబరు ఏడో తేదీన దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడితో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ జరిపిన ఈ మెరుపుదాడిలో 1,200 మరణించగా, 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకున్నారు. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్
ద హేగ్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది. నెతన్యాహు, గల్లాంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. గాజాలో 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20వ తేదీ దాకా నెలకొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహు, గల్లాంట్‌పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే గాజాలో భీకర యుద్ధానికి, సంక్షోభానికి కారణమయ్యారంటూ హమాస్ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. హమాస్ అగ్రనేతలు మొహమ్మద్ డెయిఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియేను అరెస్టు చేయాలని ఐసీసీ స్పష్టంచేసింది. అయితే, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియే ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడేం జరగొచ్చు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ట్రంప్ మార్కు కనిపించేనా!
దూకుడుకు, ఆశ్చర్యకర నిర్ణయాలకు పెట్టింది పేరైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠమెక్కనున్నారు. ఈ పరిణామం అమెరికా మిత్ర దేశాల్లో భయాందోళనలకు, శత్రు రాజ్యాల్లో హర్షాతిరేకాలకు కారణమవుతోంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’అన్నదే మూల సిద్ధాంతంగా సాగుతానని తేల్చి చెప్పిన ఆయన అదే ప్రాతిపదికన విదేశాంగ విధానాన్ని పునర్నర్మీస్తారా? అదే జరిగితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. గాజాపై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తికరం. ఉక్రెయిన్ యుద్ధం నాటో పుట్టి ముంచేనా? రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే చెప్పారు. అదెలా అని మీడియా పదేపదే ప్రశ్నిస్తే ఒక ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ సరిపెట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగించాలని, రష్యాతో ఆ దేశం శాంతి చర్చలు జరిపేలా చూస్తూనే షరతులు విధించాలని ట్రంప్ మాజీ జాతీయ భద్రతాధిపతులు ఇటీవల సూచించారు. నాటోలో ఉక్రెయిన్ ప్రవేశాన్ని వీలైనంత ఆలస్యం చేయడం ద్వారా రష్యాను తృప్తి పరచాలని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకడం, అమెరికా వనరుల వృథాను అరికట్టడమే తన ప్రాథమ్యమని స్పష్టంగా చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్లకు పైగా ఉక్రెయిన్‌కు బైడెన్ సర్కారు అందిస్తూ వచ్చిన భారీ ఆర్థిక, ఆయుధ సాయాలకు భారీగా కోత పడవచ్చని భావిస్తున్నారు. అంతేగాక యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా రష్యా, ఉక్రెయిన్ రెండింటిపైనా ట్రంప్ ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. స్వదేశంలో ఇమేజీ కోసం కనీసం తక్షణ కాల్పుల విరమణకైనా ఒప్పంచేందుకు ఆయన శాయశక్తులా ప్రయతి్నంచవచ్చు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా డిమాండ్‌కు ట్రంప్ అంగీకరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇది నాటోలోని యూరప్ సభ్య దేశాలకు రుచించని పరిణామమే. కానీ నాటో కూటమి పట్ల ట్రంప్ తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా వాటి అభ్యంతరాలను ఆయన పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇది అంతిమంగా నాటో భవితవ్యంపైనే తీవ్ర ప్రభావం చూపవచ్చు. నాటో కూటమి రక్షణ వ్యయం తీరుతెన్నుల్లో భారీ మార్పులకు కూడా ట్రంప్ శ్రీకారం చుట్టవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొరుకుడు పడని పశ్చిమాసియా గాజా యుద్ధం, ఇరాన్‌తో ఇజ్రాయెల్ ఘర్షణ, దానిపై హమాస్‌తో పాటు హెజ్»ొల్లా దాడులతో అగి్నగుండంగా మారిన పశ్చిమాసియాలో కూడా శాంతి స్థాపిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. తాను అధికారంలో ఉంటే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగేదే కాదని చెప్పుకున్నారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు, ఆ దేశంతో అణు ఒప్పందం రద్దు వంటి చర్యలకు ఆయన దిగవచ్చంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్‌పై ప్రతీకారం, హమాస్, హెజ్»ొల్లా తదితర ఉగ్ర సంస్థల నిర్మూలన విషయంలో నెతన్యాహు మొండిగా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు రక్షణ మంత్రినే ఇంటికి పంపించారు. కనుక ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే. నిజానికి ట్రంప్ విధానాలే పశ్చిమాసియాలో అస్థిరతకు దారి తీశాయన్నది ఆయన విమర్శకుల వాదన. వాటివల్ల పాలస్తీనియన్లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారంటారు. ఇజ్రాయెల్‌తో పాటు పలు అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు పాలస్తీనాను పూర్తిగా ఏకాకిని చేశాయి. ఇన్ని సంక్లిష్టతల నడుమ గాజా కల్లోలానికి ట్రంప్ చెప్పినట్టుగా తెర దించగలరా అన్నది వేచి చూడాల్సిన విషయమే. చైనా వ్యూహంలోనూ మార్పులు! అమెరికా విదేశాంగ విధానంలో చైనా పట్ల వైఖరి అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది ప్రపంచ భద్రత, వాణిజ్యంపైనే ప్రభావం చూపుతుంది. ట్రంప్ అధికారంలో ఉండగా చైనాను ‘వ్యూహాత్మక పోటీదారు’గా పేర్కొన్నారు. పలు చైనా దిగుమతులపై సుంకాలు విధించారు. దాంతో చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించింది. ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగానే కోవిడ్ వచ్చి పడింది. దాన్ని ‘చైనీస్ వైరస్’గా ట్రంప్ ముద్ర వేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. అనంతరం బైడెన్ సర్కారు కూడా చైనాపై ట్రంప్ సుంకాలను కొనసాగించింది. అమెరికాలో నిరుద్యోగం తదిరాలకు చైనా దిగుమతులను కూడా కారణంగా ట్రంప్ ప్రచారం పొడవునా ఆక్షేపించన నేపథ్యంలో వాటిపై సుంకాలను మరింత పెంచవచ్చు. అలాగే చైనా కట్టడే లక్ష్యంగా సైనికంగా, వ్యూహాత్మకంగా అమెరికా అనుసరిస్తున్న ఆసియా విధానంలోనూ మార్పుచేర్పులకు ట్రంప్ తెర తీసే అవకాశముంది. చైనా కట్టడికి దాని పొరుగు దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న బైడెన్ ప్రభుత్వ విధానానికి ఆయన తెర దించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్‌కు ఇబ్బందికర పరిణామమే. తైవాన్‌పై చైనా దాష్టీకాన్ని అడ్డుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని కూడా ట్రంప్ పదేపదే చెప్పారు. కనుక తైవాన్‌కు అమెరికా సైనిక సాయాన్ని కూడా నిలిపేయవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
డీఏపీకి ‘గాజా’ దెబ్బ
ఎక్కడో జరిగిన చర్య ఇంకెక్కడో ప్రతి చర్యకు కారణమవుతుందంటారు. హరియాణా రైతుల విషయంలో అది నిజమవుతోంది. ఏడాదిగా సాగుతున్న గాజా సంక్షోభం భారత్‌లో డీఏపీ కొరతకు దారి తీస్తోంది. హరియాణా రైతులు రోడ్డెక్కేందుకు కారణంగా మారుతోంది. హరియాణాలోని సిర్కా ప్రాంతంలో రైతులు వారం రోజులుగా రోడ్డెక్కుతున్నారు. రబీ సీజన్ వేళ తమకు సరిపడా డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్ఫేట్) ఎరువు సరఫరా చేయాలంటూ ఆందోళనకు దిగితున్నారు. పలు ఇతర జిల్లాల్లో కూడా రైతులు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద కొద్ది రోజులుగా బారులు తీరుతున్నారు. కొరత నేపథ్యంలో డీఏపీ మున్ముందు దొరుకుతుందో లేదోనని ఎగబడ్డారు. దాంతో పోలీసులు లాఠీచార్జీ చేసేదాకా వెళ్లింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఆవాలు, గోధుమ పంటల దిగుబడి బాగా రావాలంటే డీఏపీ తప్పనిసరి. ఆ మూడు రాష్ట్రాల్లో పంటలకు డీఏపీని విరివిగా వాడుతారు. పంటల నత్రజని, సల్ఫర్ అవసరాలను డీఏపీ బాగా తీరుస్తుంది. ఆ రాష్ట్రాల రైతులను డీఏపీ కొరత ఇప్పుడు తీవ్రంగా వేధిస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధంతో ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు డీఏపీ సరఫరాలో ఆలస్యానికి ప్రధాన కారణంగా మారాయి. గాజాలో ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం దెబ్బకు ప్రపంచ సరకు రవాణా గొలుసు అక్కడక్కడా తెగింది. దాంతో ఎరువుల దిగుమతిపై ఆధారపడిన భారత్ వంటి దేశాలకు కష్టాలు పెరిగాయి. ఏటా 100 లక్షల టన్నులు భారత్ ఏటా 100 లక్షల టన్నుల డీఏపీని వినియోగిస్తోంది. వీటిలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, కర్నాటకల్లోనూ డీఏపీ వాడకం ఎక్కువే. డీఏపీ లోటు ప్రస్తుతం ఏకంగా 2.4 లక్షల మెట్రిక్ టన్నులను దాటింది. దాంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డీఏపీ కష్టాలు మరింత పెరిగాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో విస్తరించి ఇరాన్, లెబనాన్, హెజ్»ొల్లా, హూతీలు ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఎర్రసముద్రంలో ఉద్రిక్తత పెరిగి అతి కీలకమైన ఆ అంతర్జాతీయ సముద్ర మార్గం గుండా సరకు రాకపోకలు బాగా తగ్గాయి. సరఫరాలపై హౌతీల దెబ్బ! సరకు రవాణా విషయంలో ఎర్రసముద్రం చాలా కీలకం. మద్యధరా సముద్రాన్ని సూయాజ్ కాల్వ ద్వారా హిందూ మహాసముద్రంతో కలిపేది అదే. అలాంటి ఎర్ర సముద్రంపై యెమెన్‌లోని హౌతీలు పట్టుసాధించారు. నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారారు. వాటిపై తరచూ దాడులకు తెగబడుతుండటంతో ఎర్రసముద్రం మీదుగా సరకు రవాణా బాగా తగ్గిపోయింది. దగ్గరి దారి అయిన సూయాజ్ ద్వారా రావాల్సిన సరకు ఆఫ్రికా ఖండాన్నంతా చుడుతూ కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మీదుగా తిరిగి రావాల్సి వస్తోంది. అలా ఒక్కో నౌక అదనంగా ఏకంగా 6,500 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా సరకు డెలివరీ చాలా ఆలస్యమవుతోంది. కేంద్రం దీన్ని ముందుగానే ఊహించింది. సెప్టెంబర్–నవంబర్ సీజన్లో ఎక్కువ ఎరువును అందుబాటు ఉంచాలని భావించినా ఆ స్థాయిలో సరకు దిగుమతి కాలేదు. దాంతో డీఏపీ కొరత అధికమైంది. భారత్ 2019–20లో 48.7 లక్షలు, 2023–24లో 55.67 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీని దిగుమతి చేసుకుంది. ప్రత్యామ్నాయంగా ఎన్పీకే డీఏపీకి బదులు నైట్రోజన్, పాస్ఫరస్, పొటా షియం (ఎన్పీకే) ఎరువును వాడాలని రైతులకు కేంద్రం సూచిస్తోంది. హరియాణాకు 60,000 మెట్రిక్ టన్నుల ఎన్పీకే కేటాయించామని, అందులో 29,000 టన్నులు రైతులకు అందిందని చెబుతోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడే డీఏపీ కొరత తప్పదన్న భయాందోళనలు తలెత్తాయి. గాజా సంక్షోభం పుణ్య మా అని అవి తీవ్రతరమవుతున్నాయి.ధరాభారం కూడా... అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్‌లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్‌కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్ సింగ్ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం.ధరాభారం కూడా... అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్‌లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్‌కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్ సింగ్ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం. -
ట్రంప్‌నకు పాలస్తీనా అధ్యక్షుడి ఫోన్.. ‘గాజాలో శాంతి కోసం రెడీ’
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ శుక్రవారం యూఎస్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా గాజాలో న్యాయమైన, సమగ్రమైన శాంతి కోసం పని చేయడానికి సంసిద్ధతను ట్రంప్‌నకు తెలియజేసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయానకి అబ్బాస్ అభినందనలు తెలియజేశారు.‘‘అంతర్జాతీయ చట్టాల ఆధారంగా న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించేందుకు ట్రంప్‌తో కలిసి పని చేసేందుకు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ప్రపంచంలోని సంబంధిత పార్టీలతో కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అబ్బాస్ ట్రంప్‌నకు తెలిపారు. దీంతో గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కృషి చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని ట్రంప్ తెలిపారు’’ అని పాలస్తీనా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే ట్రంప్ తన ప్రచారం సమయంలో గాజాలో యుద్ధం ముగించడానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.గత ఏడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో హమాస్, ఇజ్రాయెల్ బలగాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో 43,500 మంది గాజా ప్రజలు మృతిచెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.వేల మంది ప్రజలు గాజా నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. -
కన్నీటి వీలునామా
సెప్టెంబర్ 30న గాజాలో ఒక ఇంటి మీద ఇజ్రాయిల్ బాంబు వేసింది. ఆ ఇంటిలోని 10 ఏళ్ల పాప, ఆమె 11 ఏళ్ల సోదరుడు మరణించారు. తల్లిదండ్రులు వారిని అంతిమంగా సాగనంపి పాప నోట్‌బుక్ తెరిస్తే ఈ మరణాన్ని, ఇలాంటి మరణాన్ని ఊహించి, గాజాలో కొంతకాలంగా మరణించిన16,700 మంది పిల్లలతో పాటు తానూ చేరక తప్పదని తెలిసి ఆ పాప నోట్‌బుక్‌లో వీలునామా రాసి వెళ్లింది. ఆ వీలునామాలో తొలి వాక్యం ‘నేను చనిపోతే ఏడ్వొద్దు’ అని.గాజా పసిపిల్లలు జీవించి ఉన్నారంటే వారు చిరంజీవులయ్యారని కాదు. వారి ఊపిరి కాలం పొడిగింప బడిందనే అర్థం. ఇక్కడ చూడండి... జూన్ 10న గాజాలోని ఒక ఇంటి మీద బాంబు జారవిడిచింది ఇజ్రాయిల్. ఆ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఇరుగూ పొరుగూ కలిసి లోపల ఉన్న భార్యాభర్తల్ని వారి కుమారుడు 11 ఏళ్ల అహ్మద్‌ని కూతురు 10 ఏళ్ల రాషాను బయటకు తీసుకొచ్చారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఇజ్రాయిల్ ఆ ఇంటి మీద బాంబు ఎందుకు వేసింది? కారణం ఏమీ లేదు. మొన్నటి సెప్టెంబర్ 30 వరకూ కూడా ఆ కుటుంబం ఆకలిదప్పులతో వేదనలతో బతికింది. అయితే ఇజ్రాయిల్ తిరిగి సెప్టెంబర్ 30న మరో బాంబు అదే ఇంటి మీద వేసింది. కారణం ఏమిటి? ఏమీ లేదు. కాని దురదృష్టం.. ఈసారి రాషా, ఆమె సోదరుడు అహ్మద్ మృతి చెందారు. (ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు)తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో వారిని సాగనంపి తిరిగి వచ్చాక రాషా నోట్ పుస్తకంలో రాసిన తన వీలునామా కనిపించింది. అప్పటి వరకూ వారికి ఆ చిన్నారి అలాంటి వీలునామా రాసి ఉంటుందని తెలియదు. ఆ పాప అప్పటికే ఎందరో చిన్నపిల్లల మరణాలని చూసింది గాజాలో. మాట్లాడుకుంటుంటే వినింది. కనుక తాను కూడా చనిపోతానని భావించిందో ఏమో నోట్‌బుక్‌లో వీలునామా ఇలా రాసింది.రాషా రాసిన ఈ వీలునామాను ఆమె మేనమామ అసిమ్ అలనబి లోకానికి చూపించాడు. రాషా ఎందుకనో తాను మరణించి తన సోదరుడు బతుకుతాడని ఆశించింది. ఆమె సోదరుడు అహ్మద్ గడుగ్గాయి. అల్లరి చేసినా అందరూ వాణ్ణి ప్రేమించేవారట. గదమాయిస్తూనే దగ్గరికి తీసుకునేవారట. కాని ఆమెతో పాటు ఆ ముద్దుల సోదరుడు కూడా మరణించాడు. గాజాలో రోజూ వందలాది మంది పిల్లలు చనిపోతున్నారు. గాజాలో పిల్లల గుండెల్లో ఎన్ని మూగబాధలు చెలరేగుతున్నాయో దూరంగా నిశ్చింతగా ఉంటూ తమ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తున్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు.ఏ యుద్ధమైనా, ఎటువంటి ద్వేషమైనా, ఏ విషబీజాలైనా, ఎటువంటి వివక్ష అయినా అంతిమంగా ముందు పిల్లల్ని బాధిస్తుంది. పిల్లల్లో ఉండే కరుణను పెద్దలు ఎప్పటికైనా అందుకోగలరా?‘నేను చనిపోతే నా కోసం ఎవరూ ఏడ్వద్దు. ఎందుకంటే మీ కన్నీళ్లు నాకు నొప్పి కలిగిస్తాయి. నా దుస్తులు అవసరమైనవారికి ఇస్తారని భావిస్తాను. నా అలంకార వస్తువులు రాహా, సరా, జూడీ, బతుల్, లానాల మధ్య సమానంగా పంచాలి. నా పూసల పెట్టె ఇకపై పూర్తిగా అహ్మద్, రాహల సొంతం. నాకు నెలవారీ అలవెన్సుగా వచ్చే 50 షెకెల్స్ (ఒక షెకెల్ 22 రూపాయలకు సమానం) సగం రాహాకు, సగం అహ్మద్‌కు ఇవ్వండి. నా కథలు, నోట్ పుస్తకాలు రాహావి. నా బొమ్మలు బతూల్వి. మరోటి, మా అన్న అహ్మద్‌ను గదమాయించొద్దు. ఈ కోరికలు నెరవేర్చండి’... -
ఇజ్రాయెల్‌కు షాక్.. పాలస్తీనా కోసం రంగంలోకి సౌదీ అరేబియా
హమాస్, హోజ్బొల్లా ఉగ్రవాద సంస్థలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా, లెబనాన్, ఇరాన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది.ఈ క్రమంలో తాజాగా గాజా, లెబనాన్‌తో ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించేందుకు సౌదీ అరేబియా అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది. నవంబర్ 11న జరగనున్న ఈ సమ్మిట్ పాలస్తీనా రాజ్య స్థాపనపై దృష్టి సారించనుంది. రియాద్‌లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.ఈ శిఖరాగ్ర సమావేశం గత సంవత్సరం 2023 అరబ్-ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డీనరీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జరగనుంది. ఇది సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్‌పై ఎలా ఒత్తిడి తేవాలనే దానిపై ఈ సదస్సులో ఇస్లామిక్ దేశాలు చర్చించనున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, యుద్ధాన్ని ముగింపుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి ప్రధాన సమస్యలపై ఈ దేశాలు చర్చించనున్నాయి.కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక 2023లో జరిగిన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో గాజాపై దాడులను ఆపేందుకు, శాంతి స్థాపనకు కృషి చేసేందుకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, ఈజిప్ట్, ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, నైజీరియా, తుర్కియే వంటి ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ (ఓఐసీ) ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 7న హమాస్ తమ దేశంలోకి చొరబడి నరమేథానికి పాల్పడటంతో ఇజ్రాయేల్ ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాదిగా సాగుతున్న ఈయుద్ధం కారణంగా- గాజాలో 43,000 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో సగానికిపై మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 1,01,110 మంది గాయపడినట్లు పేర్కొంది. అయితే మృతుల్లో ఎంతమంది పౌరులు, మిలిటెంట్లు ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు. -
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 77 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని బీట్ లాహియాలో ఉన్న ఓ ఐదు అంతస్తుల నివాస భవనంపై దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 77 మంది పాలస్తీనియన్లు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది గాయపడ్డారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని ఉన్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ దాడిపై ఇంతవరకు ఇజ్రాయెల్ స్పందించకపోవటం గమనార్హం.BREAKING: The death toll has risen to 77, including 25 children, following the horrific Israeli massacre in Beit Lahiya, northern Gaza, according to local sources. The majority of the victims are from the Abu Nassr clan. pic.twitter.com/j660WyvzYK— 🇵🇸 Palestine Watermelons 🍉 (@PalestineMelons) October 29, 2024 శిథిలాల నుంచి మరింత మందిని బయటకు తీస్తున్నారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)పై ఇజ్రాయెల్ నిషేధం విధించటంపై ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇజ్రాయెల్ చర్య.. సహించరానిది, చట్టవిరుద్ధమైదిగా పేర్కొంటున్నారు. ఈ దాడిలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది -
ఇజ్రాయెల్ సైన్యం చెరలో గాజా ఆస్పత్రి సిబ్బంది
కైరో: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిరంతర దాడులకు తెగబడుతోంది. అయితే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర గాజాలోని ఆస్పత్రి సముదాయం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయి. అయితే ఈ ఆస్పత్రిని టార్గెట్ చేసి, దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ సైనికులు ఇక్కడి వైద్య సిబ్బందిని, కొంతమంది రోగులను తమ అదుపులోకి తీసుకున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో అనేక ఇళ్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా తెలిపింది. మరోవైపు గాజా స్ట్రిప్‌లోని బీట్ లాహియా ప్రాంతంలోని ఒక భవనంలో ఉన్న హమాస్ మిలిటెంట్లపై ఆయుధాలను ఉపయోగించి, దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసారం చేసిన ఫుటేజీలో ఇజ్రాయెల్ దళాలు అక్కడి నుంచి ఉపసంహరించుకున్న దృశ్యాలతో పాటు అనేక భవనాలు దెబ్బతిన్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. 70 మంది సభ్యుల ఆస్పత్రి బృందంలో 44 మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే ఆస్పత్రి డైరెక్టర్‌తో సహా 14 మందిని విడుదల చేసినట్లు సైన్యం తెలిపింది. కాగా ఆసుపత్రి నివేదికపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నిరాకరించారు. ఇది కూడా చదవండి: ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి -
గాజన్లే కవచాలు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోంది. యుద్ధ సమయంలో ఇళ్లు, సొరంగాల్లోకి ప్రవేశించడానికి పాలస్తీనా పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ‘మస్కిటో ప్రోటోకాల్’గా పిలిచే ఈ పద్ధతిని గాజాలోని ఇజ్రాయెల్ యూనిట్లన్నీ అవలంబిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనికుడే ఈ మేరకు వెల్లడించడం విశేషం. ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు దీన్ని ధ్రువీకరించారు. ఉత్తర గాజా, గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా... ఇలా గాజా అంతటా ఇదే పద్ధతిని అమలు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. – జెరూసలెంనిషేధం బేఖాతరుసైనిక కార్యకలాపాలలో పౌరులను ఇలా అనైతికంగా, అనుమాషంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్ధం. వెస్ట్ బ్యాంక్‌లో అనుమానిత మిలిటెంట్ల తలుపులను తట్టడానికి ఇజ్రాయల్ సైన్యం పాలస్తీనా పౌరులను ఉపయోగిస్తోందని హక్కుల సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు 2005లో ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించింది. దీన్ని క్రూరమైనదిగా, అనాగరికమైనదిగా అభివర్ణించింది. దాంతో ఈ విధానాలను మానుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం అప్పట్లో ప్రకటించింది. కానీ దాన్ని ఇంకా అమలు చేస్తున్నట్టు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గాజాలో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం మానవ కవచాలుగా ఉపయోగిస్తున్న మూడు ఫోటోలను ‘బ్రేకింగ్ ది సైలెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ మీడియాకు విడుదల చేసింది. ఉత్తర గాజాలో విధ్వంసకర పరిస్థితుల్లో ఇద్దరు సైనికులు ఓ పౌరుడిని ముందుకు తీసుకువెళుతున్న భయానక దృశ్యం ఒక ఫొటోలో ఉంది. మరో దాంట్లో మానవ కవచాలుగా ఉపయోగించే పౌరుల కళ్లకు గంతలున్నాయి. మూడో ఫొటోలో ఒక సైనికుడు బంధించిన పౌరుడిని కాపలా కాస్తున్నాడు.వెనుక నుంచి కాల్చారు..గాజాలో ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు కూడా దీన్ని ధ్రువీకరించారు. 20 ఏళ్ల మహ్మద్ సాద్ఇజ్రాయెల్ సైన్యం దాడుల తర్వాత ఉత్తర గాజా వీడి ఖాన్ యూనిస్ సమీపంలో తాత్కాలిక శిబిరంలో ఉంటున్నాడు. తనకు, తమ్ముళ్లకు ఆహారం కోసం బయటికొస్తే ఇజ్రాయెల్ సైన్యం పట్టుకుంది. ‘‘మమ్మల్ని జీపులో తీసుకెళ్లారు. 47 రోజుల పాటు రఫా సైనిక శిబిరంలో నిర్బంధించారు. నిఘా చర్యలకు ఉపయోగించారు. మాకు మిలటరీ యూనిఫాం ఇచ్చారు. తలపై కెమెరా పెట్టారు. మెటల్ కట్టర్ ఇచ్చారు. సొరంగాల్లో వెదికేటప్పుడు సాయానికి మమ్మల్ని వాడుకున్నారు. మెట్ల కింద వీడియోలు తీయాలని, ఏదైనా దొరికితే బయటికి తేవాలని చెప్పేవారు. ఒక మిషన్ కోసం పౌర దుస్తుల్లో తీసుకెళ్లారు. సైన్యం వదిలివెళ్లిన ట్యాంకును వీడియో తీయమన్నారు. నేను భయపడితే వీపుపై తుపాకీతో కొట్టారు. నేను ట్యాంకు వద్దకు వెళ్లగానే వెనుక నుంచి కాల్చారు. అదృష్టవశాత్తూ బయటపడ్డా’’ అంటూ వీపుపై తూటా గాయాలు చూపించాడు. 17 ఏళ్ల మొహమ్మద్ షబ్బీర్దీ ఇదే కథ. ఖాన్ యూనిస్‌లోని అతని ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. తండ్రి, సోదరిని చంపి అతన్ని బందీగా పట్టుకుంది. ‘‘నన్ను మానవ కవచంగా వాడుకున్నారు. కూల్చేసిన ఇళ్లలోకి, ప్రమాదకరమైన, మందుపాతరలున్న ప్రదేశాల్లోకి తీసుకెళ్లారు’’ అని షబ్బీర్ చెప్పుకొచ్చాడు.ఏమిటీ మస్కిటో ప్రోటోకాల్శత్రువులున్న చోటికి కుక్కను పంపడం, ట్యాంక్ షెల్ లేదా సాయుధ బుల్డోజర్తో దాడి వంటివి చేస్తారు. కానీ ఈ పద్ధతిలో తాము దాడి చేయాలనుకున్న చోటికి బందీలనో, శత్రు దేశ పౌరులనో ముందుగా పంపిస్తారు. అక్కడ పేలుడు పదార్థాలున్నా, శత్రువులు పొంచి కాల్పులు, పేలుళ్లకు పాల్పడ్డా ముందుగా వెళ్లినవారు చనిపోతారు. ఆ ముప్పు తొలగాక సైన్యం ప్రవేశిస్తుంది. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే ఈ పద్ధతిని ఇజ్రాయెల్ సైన్యం అమలు చేస్తోంది.డాక్టర్‌నూ వదల్లేదు...59 ఏళ్ల డాక్టర్ యాహ్యా ఖలీల్ అల్ కయాలీ ఓ వైద్యుడు. గాజాలో అతి పెద్ద వైద్య సముదాయమైన అల్ షిఫా ఆస్పత్రిలో వేలాది మంది శరణార్థులతో కలిసి ఉండేవారు. గత మార్చిలో ఇజ్రాయెల్ సైన్యం రెండు వారాల దాడిలో ఆసుపత్రి ధ్వంసమైంది. అప్పుడే కయాలీని సైన్యం పట్టుకుంది. ‘‘నాతో అపార్ట్మెంట్ భవనాలను, ప్రతి గదినీ తనిఖీ చేయించారు. అదృష్టవశాత్తూ వేటిలోనూ హమాస్ ఫైటర్లు లేరు. అలా 80 అపార్ట్మెంట్లను తనిఖీ చేశాక నన్ను వదిలేశారు’’ అని గుర్తు చేసుకున్నారు.మన ప్రాణాలు ముఖ్యమన్నారు.. ఉత్తర గాజాలో తమ యూనిట్ ఓ అనుమానాస్పద భవనంలోకి ప్రవేశించే ముందు ఇద్దరు పాలస్తీనా ఖైదీలను ముందుగా పంపినట్టు ఇజ్రాయెల్ సైనికుడే వెల్లడించాడు. ‘‘వారిలో ఒకరు 16 ఏళ్ల బాలుడు. మరొకరు 20 ఏళ్ల యువకుడు. ఇదేంటని ప్రశ్నిస్తే మన సైనికుల కంటే పాలస్తీనా యువకులు చనిపోవడం మంచిది కదా అని మా సీనియర్ కమాండర్ బదులిచ్చారు. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొని అలసిపోయాక పెద్దగా ఆలోచించడానికి కుదరదు. అయినా ఈ పద్ధతిని అనుసరించడానికి కొందరు సైనికులం నిరాకరించాం. ‘అంతర్జాతీయ చట్టాల గురించి ఆలోచించొద్దు. ముందు మన ప్రాణాలు ముఖ్యం’ అని కమాండర్ చెప్పారు’’ అన్నాడు. చివరికి ఇద్దరు పాలస్తీనియన్లను వదిలేశారని చెప్పుకొచ్చాడు. -
ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు జర్నలిస్టులు మృతి
బీరుట్/ఖాన్ యూనిస్: గాజాతోపాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లోని హస్బయా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని బీరుట్ కేంద్రంగా పనిచేసేత అరబ్ టీవీ అల్ మయాదీన్ కెమెరామ్యాన్ ఘస్సన్ నాజర్, టెక్నీషియన్ మహ్మద్ రిడా, హెజ్బొల్లా గ్రూపునకు చెందిన అల్ మనార్ టీవీ కెమెరామ్యాన్ విస్సమ్ కస్సిమ్‌గా గుర్తించారు. ఘటన సమయంలో ఆ భవనంలో ఏడు వేర్వేరు మీడియా సంస్థలకు చెందిన 18 మంది జర్నలిస్టులు ఉన్నారని లెబనాన్ సమాచార మంత్రి జియాద్ మకరీ చెప్పారు. ఇజ్రాయెల్ చర్యను ప్రణాళిక ప్రకారం చేపట్టిన హత్యాకాండగా అభివర్ణించారు. కుప్ప కూలిన భవనం ప్రాంగణంలో ప్రెస్ అనే స్టిక్కర్‌తో ధ్వంసమైన వాహనాలున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. ఆ సమయంలో తామంతా విశ్రాంతి తీసుకుంటున్నామని దాడి నుంచి సురక్షితంగా బయటపడిన అల్ జజీరా ఇంగ్లిష్ చానెల్ కరస్పాండెంట్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. గాజాపై యుద్ధం మొదలయ్యాక 128 మంది జర్నలిస్టులు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల రక్షణ కమిటీ తెలిపింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఒకే కుటుంబంలోని 36 మంది మృతిగాజాలోని ఖాన్‌యూనిస్ నగరంపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 38 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది చిన్నారులు సహా 36 మంది ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. -
గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని నుసెయిరత్ శరణార్థి శిబిరంలోని స్కూల్ భవనంపై గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది చిన్నారులు, 18 ఏళ్ల మహిళలున్నారని పాలస్తీనా వైద్య విభాగం తెలిపింది. ఘటనలో గాయపడిన మరో 42 మంది దగ్గర్లోని ఔదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించలేదు. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ తరచూ శరణార్థులు తలదాచుకుంటున్న స్కూల్ భవనాలపై దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన గాజాలోని హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 42 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు మృతి చెందారు. క్షతగాత్రులు లక్ష వరకు ఉంటారని అంచనా. తాము 17 వేల మంది హమాస్ మిలిటెంట్లను చంపేశామంటున్న ఇజ్రాయెల్ ఆర్మీ సంబంధిత ఆధారాలను మాత్రం వెల్లడించడం లేదు. హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య యుద్ధం కారణంగా గాజాలోని 23 లక్షల మందిలో 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆస్పత్రుల్లో మందుల కొరత ఉత్తర గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ తరచూ చేస్తున్న దాడులతో నివాసాలు నేలమట్టమవుతున్నా యి. వందల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాదిగా నిరాశ్రయులవుతున్నారు. మళ్లీ బలం పుంజుకుంటున్న హమాస్ సాయుధులే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. అయితే, ఈ దాడుల్లో గాయపడిన ఇంటెన్సివ్ కేర్‌లోని 14 మంది చిన్నారులు సహా సుమారు 150 మంది తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఉత్తర గాజాలోని కమాల్ అద్వాన్ ఆస్పత్రి డైరెక్టర్ హొసమ్ అబూ సయేఫ్ తెలిపారు. వైద్య సిబ్బంది, మందుల కొరత కారణంగా గంటకొకరు చొప్పు న తుది శ్వాస విడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.ముగ్గురు లెబనాన్ సైనికులు మృతి బీరుట్: ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం జరిపిన దాడిలో లెబనాన్ ఆరీ్మకి చెందిన ముగ్గురు చనిపోయారు. యటెర్ పట్టణంలో క్షతగాత్రులను తరలిస్తున్న ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు సిబ్బంది చనిపోయినట్లు ఆ దేశ ఆర్మీ ‘ఎక్స్’లో తెలిపింది. సెప్టెంబర్‌లో హెజ్»ొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య భీకర పోరు మొదలయ్యాక యటెర్పై దాడి జరగడం ఇది ఎనిమిదోసారని పేర్కొంది. -
నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ హతం: ఇజ్రాయెల్
జెరూసలేం: జజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత హషేమ్ సఫీద్దీన్ మృతి చెందాడు. మూడు వారాల క్రితం దక్షిణ బీరుట్ సబర్బ్‌లో ఇటీవల మృతిచెందిన హసన్ నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ తమ దాడుల్లో హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ధృవీకరించింది.‘‘సుమారు మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధిపతి హషీమ్ సఫీద్దీన్ , హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీ హుస్సేన్ హజిమా, ఇతర హిజ్బొల్లా కమాండర్లు మరణించినట్లు ధృవీకరించాం’’ ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే.. ఈ మరణాలకు సంబంధించి హెజ్బొల్లా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవటం గమనార్హం.#hashemsafieddine, Hezbollah's newly appointed leader, was killed in Israeli airstrikes on October 4 by #IDFThe body of Hashem #safieddine, #Hezbollah's new leader and successor to #Nasrallah, has been discovered#Israel #Beirut #Lebanon #Israel #IsraeliAirstrike #TelAviv pic.twitter.com/GjLlcQAvX2— know the Unknown (@imurpartha) October 22, 2024మూడు వారాల క్రితం దక్షిణ బీరుట్ శివారు దహియేహ్‌లో ఉన్న హెజ్బొల్లా ప్రధాన ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు చేశామని ఆలస్యంగా మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దళం పేర్కొంది. దాడి చేసిన సమయంలో 25 మందికి పైగా హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రధాన కార్యాలయంలో ఉన్నారని, అందులో ఏరియల్ ఇంటెలిజెన్స్ సేకరణకు బాధ్యత వహించే బిలాల్ సైబ్ ఐష్ కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.అక్టోబరు 8న, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. పేరు తెలపకుండా సఫీద్దీన్ మృతి చెందినట్లు ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దళాలు (హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లా ), నస్రల్లా స్థానంలో నియమించిన మరోనేతతో సహా వేలాది మంది ఉగ్రవాదులను అంతం చేశాం’ అని అన్నారు.చదవండి: హెజ్బొల్లా రహస్య బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు -
హమాస్ చీఫ్ బంకర్ చూస్తే షాక్ అవాల్సిందే.. భారీగా డబ్బు..
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో మృతి చెందారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఉన్న ఈ బంకర్లో వంటగది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సమాగ్రి, మిలియన్ డాలర్ల భారీ నగదు, పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్ ఉన్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.ఇక.. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి సిన్వార్ సూత్రధారి. ఆయన రఫాకు పారిపోయే ముందు ఈ బంకర్లోనే కొన్నిరోజులు గడిపినట్లు తెలుసోంది. ఇస్మైల్ హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్‌ను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపని దాడుల్లో సిన్వార్ మృతి చెందారు.Hamas' eliminated leader Yahya Sinwar was hiding in this underground tunnel months ago:Surrounded by UNRWA bags of humanitarian aid, weapons and millions of dollars in cash.He hid like a coward underground, using the civilians of Gaza as human shields. pic.twitter.com/0ylVjTCv7H— Israel ישראל (@Israel) October 20, 2024 ‘‘హమాస్ నుంచి తొలగించబడిన నేత యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. మానవతా సహాయం, ఆయుధాలు, మిలియన్ల డాలర్ల నగదుతో ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) బ్యాగులు ఉన్నాయి. ఆయన గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని, పిరికివాడిలా భూగర్భంలో దాక్కున్నారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎక్స్‌లో వీడియోను విడుదల చేసింది.Hamas leader Yahya Sinwar’s wife reportedly spotted with $32,000 Birkin bag as she went into hiding https://t.co/Dwqf0h7nTQ pic.twitter.com/JHZ5eMrYiZ— New York Post (@nypost) October 20, 2024 ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7 దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32వేల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ని తీసుకువెళ్లిన దృష్యం కనిపించింది.చదవండి: అక్టోబర్‌లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. -
ఉత్తర గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
డెయిర్ అల్–బలాహ్: ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీట్ లాహియా పట్టణంపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 87 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారితో ఉత్తర గాజాలోని ఆస్పత్రులు పోటెత్తాయని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ మౌనిర్ అల్–బర్‡్ష పేర్కొన్నారు.ఆస్పత్రులపై దాడులు ఆపాలి: ఎంఎస్ఎఫ్ఉత్తర గాజాలోని ఆసుపత్రులపై వారి దాడులను వెంటనే ఆపాలని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్ఎఫ్)ఇజ్రాయెల్ దళాలకు పిలుపునిచ్చింది. ఉత్తర గాజాలో రెండు వారాలుగా కొనసాగుతున్న హింస, నిర్విరామ ఇజ్రాయెల్ సైనిక చర్యలు భయానక పరిణామాలను కలిగిస్తున్నాయని ఎంఎస్ఎఫ్ ఎమర్జెన్సీ కోఆర్డినేటర్ అన్నా హాల్ఫోర్డ్ తెలిపారు. ఉత్తర గాజాలో శనివారం అర్థరాత్రి నుంచే ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిచిపోయింది. దీంతో దాడుల సమాచారమే కాదు సహాయక చర్యలు కష్టంగా మారాయని తెలిపారు. రహస్య పత్రాలపై అమెరికా దర్యాప్తుఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలను అంచనా వేసే రహస్య పత్రాలు లీకవడం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా దర్యాప్తు చేస్తోందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 1న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా దాడులను నిర్వహించడానికి ఇజ్రాయెల్ సైనిక ఆస్తులను తరలిస్తోందని యూఎస్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ఈ పత్రాలు సూచిస్తున్నాయి. సిన్వర్ హత్య తర్వాత గాజాలో కాల్పుల విరమించాలని అమెరికా ఇజ్రాయెల్‌ను కోరుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. తమ వాహనంపై ఇజ్రాయెల్సైన్యం చేసిన దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు లెబనాన్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్‌లో పౌరుల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా బీరుట్‌తోపాటు చుట్టుపక్కల కొన్ని దాడులను తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ను కోరారు.ఉత్తర గాజాలో భారీ ఆపరేషన్ ఉత్తర గాజాలోని జబాలియాలో ఇజ్రాయెల్ గత రెండు వారాలుగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అక్కడ తిరిగి చేరిన హమాస్ మిలిటెంట్లపై ఆపరేషన్ ప్రారంభించినట్లు సైన్యం తెలిపింది. యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ దళాలు జబాలియాకు తిరిగి వచ్చాయి. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత గత ఏడాది చివరి నుంచి ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టిన ఉత్తర గాజా యుద్ధంలో భారీ విధ్వంసాన్ని చవిచూసింది. -
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 33 మంది మృతి
గాజాలో హమాస్ అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. శుక్రవారం సాయంత్రం జబాలియా క్యాంప్‌లోని అనేక ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో సుమారు 33 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మృతిచెందిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. శిథిలాలు, భవనాల కింద చిక్కుకున్న అనేక మంది బాధితు ఉన్నారని పేర్కొంది. మొత్తం మరణాలు సంఖ్యల కూడా 50కి పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. బాంబుల దాడిలో 85 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. అయితే.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా స్పందించకపోవటం గమనార్హం.IT DOESN’T STOP #SaveNorthGaza At least 33 Palestinians were killed and 50 wounded in an Israeli strike on Jabalia refugee camp in north Gaza.Numbers expected to rise— Dr. Renee Levant (@ReneeLevant) October 19, 2024 అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్ సరిహద్దు గుండా హమాస్ విధ్వంసానికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌లో హమాస్‌ను అంతం చేయటమే టార్గెట్‌గా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటివరకు 42,500 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.చదవండి: సిన్వర్ మృతి వీడియోతో పాలస్తీనా కట్టలు తెగిన ఆగ్రహం -
కమాండర్లే చేతులెత్తేస్తే.. ట్రైనీ సైనికులు సిన్వార్‌ను మట్టుబెట్టారు
ఇజ్రాయెల్ దళాలు హమాస్ మాస్టర్‌మైండ్ యహ్యా సిన్వర్‌ను హతమార్చాయి. అయితే సిన్వర్ తర్వాత హమాస్‌కు ఎవరు సారథ్యం వహిస్తారు? అనే చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో సిన్వర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ గురించి ఆసక్తికర విషయంలో వెలుగులోకి వచ్చింది.గతేడాది పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1,200 మంది పౌరులు మరణించారు. 200 మందికి పైగా ప్రజలు కూడా బందీలుగా ఉన్నారు. ఈ దాడి ఇజ్రాయెల్ చరిత్రలో ఈ దాడి అత్యంత ఘోరమైనదని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్ కోసం అన్వేషిస్తుంది.సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ ఆర్మీ, ఇతర నిఘూ వర్గాలు సిన్వార్ జాడ కనిపెట్టలేకపోయాయి. అయితే గురువారం ఇజ్రాయెల్‌కు చెందిన ట్రైనీ సైనికులు దక్షిణ గాజాలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఓ భవంతిలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ట్రైనీ సైనిక సిబ్బంది డ్రోన్‌తో దాడులు జరిపారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో సిన్వార్ సైతం ఉన్నారు. ఏడాది కాలంలో ఆర్మీలో ఆరితేరిన సైనికులు సాధించలేని విజయాన్ని ట్రైనీ సైనికులు సాధించడంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. -
యుద్ధం రేపే ముగియవచ్చు.. ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఉగ్రవాద సంస్ధ హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యహ్యా సిన్వార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హమాస్ అగ్రనేతను ఎట్టకేలకు హతమార్చడంతో.. ఏడాది కాలంగా సదరు మిలిటెంట్ సంస్థతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ విజయం లభించినట్లైంది..యహ్య సిన్వార్ మృతి అనంతరం గాజా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలను వదిలి, బంధీలను విడిచిపెట్టినట్లైతే రేపటిలోగా యుద్ధం ముగుస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియో విడుదల చేశారు.చదవండి: ఇజ్రాయెల్ డ్రోన్ వీడియో.. హమాస్ సిన్వర్ ఆఖరి క్షణాలు ఇలాయహ్యా సిన్వార్ మరణించాడు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ధైర్య సైనికులు అన్ని రఫాలో మట్టుబెట్టారు. ఇది గాజాలో యుద్ధం ముగింపు కాదు. ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైంది. గాజా ప్రజలకు నాదొక చిన్న సందేశం.. హమాస్ తన ఆయుధాలను వదిలి ఇజ్రాయెల్ బందీలను తిరిగి అప్పగిస్తే ఈ యుద్ధం ముగియవచ్చు. మా పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తాం’ అని హెచ్చరించారు. కాగా హమాస్ మిలిటెంట్ సంస్థ అధినేత యహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందాని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని డీఎన్ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. Yahya Sinwar is dead.He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024 గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మారణకాండకు యహ్యా సిన్వర్నే మాస్టర్‌మైండ్. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. సుమారు 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ హతమార్చింది. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ ద్వారా ధ్రువీకరించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే దీనిపై హమాస్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
గాజాలో మృతదేహాలను పిక్కుతింటున్న వీధికుక్కలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతుంది. హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ యుద్ధంతో ఏడాదికాలంగా నలుగుతున్న గాజాలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో పాలస్తీనియన్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అయితే తాజాగా గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన మృతదేహాలను వీధికుక్కలు పిక్కుతుంటున్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ఆకలితో ఉన్న వీధికుక్కలు ఈ మృతదేహాలను తింటున్నాయని, దీని ద్వారా మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారుతోందని గాజాలోని ఉత్తర భాగంలో అత్యవసర సేవల అధిపతి ఫేర్స్ అఫానా వెల్లడించారు. ఉత్తర గాజా, జబాలియా ప్రాంతంలో హమాస్ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరుగుపతున్న వైమానిక, భూతల దాడులను ప్రస్తావిస్తూ. ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనియన్ల జీవితాలను సూచించే ప్రతిదాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారుతోందని, తమ పనులు సవ్యంగా చేయలేకపోతున్నామని తెలిపారు. ఉత్తర గాజాలో జరుగుతున్నది నిజమైన మారణహోమమని ఆయన అన్నారు.కాగా గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ మెరుపు దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. Oఇజ్రాయెల్‌లోకి చొచ్చుకుపోయిన హమాస్ ఉగ్రవాదులు అక్కడ 1200 మందిని బలితీసుకున్నారు. ఈ ఘటన తర్వాత గాజాలో ఇజ్రాయెల్ సైనిక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా స్ట్రిప్‌లో ఇప్పటి వరకు 42,409 మంది మరణించారు. వీరిలో అత్యధికంగా పౌరులే ఉన్నారు. మరో 99,153 మంది గాయపడ్డారు.గత 24 గంటల్లో ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో 65 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్ ఏజెన్సీ నిర్వహిస్తున్న గిడ్డంగి సహాయ కేంద్రంలో ఆహారం కోసం వెతుకుతున్న ఆకలితో ఉన్న నివాసితులపై సోమవారం ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయని తెలిపింది. -
సానుభూతి నుంచి ఛీత్కారం దాకా...
ఒకప్పుడు ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతటికీ ఎంతో ఇష్టం. అత్యద్భుతమైన నిఘా వ్యవస్థ, మాజీ ప్రధానులను సైతం జైలులో పెట్టగల న్యాయవ్యవస్థ, సరదాగా మాటలకు ఉపక్రమించే ప్రజల తీరు వంటి లక్షణాలన్నింటినీ మెచ్చుకునేవారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి గురైనప్పుడు కూడా ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ సానుభూతి ఉండింది. ఎంతైనా ఉగ్రవాద బాధితురాలు అనుకున్నారు. అయితే ఆ జ్ఞాపకాలేవీ ఇప్పుడు లేవు. బదులుగా ఇజ్రాయెల్ చేపట్టిన మానవ హననమే అందరి కళ్లల్లో మెదులుతోంది. తమను హింసలకు గురిచేసిన హిట్లర్ మాదిరిగానే తామూ పాలస్తీనీయులను హింసలు పెడుతున్నామని అంగీకరించేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కాకపోతే ఇదే అద్దంతో మరేదో చూపేందుకు ఇజ్రాయెల్ తాపత్రయ పడుతోంది. బ్రిటన్ మాజీ ప్రధాని హరాల్డ్ మెక్‌మిలన్‌కు రాజకీయాల్లో వారం రోజులంటే చాలా ఎక్కువ సమయం! ఇదే విధంగా హమాస్‌తో నడుస్తున్న యుద్ధం విషయంలో ఇజ్రాయెలీలు కూడా ఒక యుగమైందని అనుకుంటున్నారు. ఈ ఏడాది సమయంలో ఇజ్రాయెలీల ప్రపంచం మొత్తం తల్లకిందులైంది. తమ సంబంధాలన్నీ వాళ్లు కోల్పోయారు.గత ఏడాది అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ చేసింది అత్యంత భయంకరమైంది, ఆటవికమైంది. అది క్షమించరాని నేరం. సుమారు 1,200 మంది ఇజ్రాయెలీల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న హమాస్ ఆ రోజు ఇంకో 250 మందిని బందీలుగా చేసుకుంది. ఇజ్రాయెల్ మొత్తం ఈ ఘటనతో వణికిపోయింది. ఇజ్రాయెల్ పట్ల ఆ రోజు కొంతైనా సానుభూతి వ్యక్తమైంది. ఎంతైనా ఉగ్రవాద బాధితురాలు కదా అని అనుకున్నారు. కానీ, ప్రతీకారం పేరుతో ఏడాది కాలంలో ఇజ్రాయెల్ దమనకాండను పరిశీలిస్తే, హమాస్ అకృత్యాలు కూడా పేలవమై నవిగా అనిపించక మానవు. ఆడవాళ్లు, పిల్లలతోపాటు 42 వేల మంది పాలస్తీనియులు ఇప్పటిదాకా చనిపోయారు. ఇంకో లక్ష మంది గాయ పడ్డారు. గాజాలో 23 లక్షల మంది జనాభాకు నిలువ నీడ లేకుండా పోయింది. ఎటు చూసిన విధ్వంసపు ఆనవాళ్లే. అందుకేనేమో... ఏడాది క్రితం వరకూ ఇజ్రాయెల్‌పై ఉన్న సానుభూతి కాస్తా ధిక్కారంగానూ, ఛీత్కారంగానూ మారిపోయింది. అందరి దృష్టిలో ఇజ్రాయెల్ ఇప్పుడు దురాక్రమణదారుగా మారిపోయింది!హమాస్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కంకణం కట్టుకున్నారు. దశాబ్దాల పాలస్తీనా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడం ద్వారా తమకు మేలు జరుగుతుందని ఆశించారు. అయితే హమాస్ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటు కోవడమే కాకుండా, సైద్ధాంతికంగా మరింత బలం పుంజుకుందని చెప్పాలి.ఇంకో ముఖ్యమైన విషయం... నెతన్యాహూ గాజాపై చేస్తున్న యుద్ధం కాస్తా పాలస్తీనా అంశాన్ని అంతర్జాతీయ వేదిక పైకి చాలా బలంగా చేర్చింది. ఐక్యరాజ్య సమితిలోనూ పాలస్తీనాకు న్యాయం జరగాలన్న నినాదాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... అగ్రరాజ్యం అమెరికా విశ్వవిద్యాలయాల్లోనూ ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమాలు, ప్రదర్శనలు జరగడం గమనార్హం. నెతన్యాహూ ఈ పరిణామాలను బహుశా ఊహించి ఉండరు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నడిచిన గత 365 రోజుల్లో ఇర్లాండ్, స్పెయిన్ , నార్వేలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి. సౌదీ అరేబియా ఇంకో అడుగు ముందుకేసి ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల కోసం పాలస్తీనా సమస్య పరిష్కారాన్ని ఒక నిబంధనగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నోట పాలస్తీనా ఏర్పాటు మాట వస్తూనే ఉంది.పాలస్తీనా, ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి ఇప్పుడు అందరూ సూచిస్తున్న మార్గం ఆ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా విడగొట్టడం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని అందరూ మరచిపోతున్నారు. ఎందుకంటే వెస్ట్‌బ్యాంక్‌లో సుమారు ఏడు లక్షల మంది ఇజ్రాయెలీ వలసదారులు ఉంటున్నారు. గాజాలో తను చెప్పినట్టు నడుచుకునే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు నెతన్యాహూ శతథా ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు పాల స్తీనా దేశం ఎక్కడ ఏర్పాటు అవుతుంది? ఏడాది క్రితం... కనీసం ఆరు నెలల క్రితం కూడా పాలస్తీనీ యులు దేశం మొత్తం తమదే అన్నట్టుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. యూదులకు ఇది అస్సలు అంగీకారం కాదు. కారణం ఒక్కటే. తాము యుగాలుగా ఆశిస్తున్న తమదైన మాతృదేశం తమకు లేకుండా పోతుందని!ఎంత విచిత్ర పరిస్థితి? పాలస్తీనాకు న్యాయం జరగాలని మొట్టమొదటిసారి ప్రపంచం మేల్కొన్న సమయంలో అసలు ఆ న్యాయం ఏమిటన్నది కూడా తెలియని పరిస్థితి. రాజకీయ ఆలోచన లకు అతీతంగా అంతా మారిపోయింది. మరో దృక్కోణం ఒకటి ఉంది. ఇది ఇజ్రాయెలీలకు అంతగా రుచించకపోవచ్చు. ఆశ్చర్యంగానూ అనిపించవచ్చు. ఏడాది క్రితం వరకూ తమ దేశం పట్ల ఇతరులకు ఉన్న దృక్పథం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే... ఆక్రమణదారుడైనప్పటికీ బాధితు డిగా తనను తాను చిత్రీకరించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది మరి!2023లో ప్రజాభిప్రాయం ఒకదాన్ని సేకరించే ముందు కాలంలో ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతటికీ ఎంతో ఇష్టం. అత్యద్భుతమైన నిఘా వ్యవస్థ, మాజీ ప్రధానులను సైతం జైలులో పెట్టగల న్యాయ వ్యవస్థ, సరదాగా మాటలకు ఉపక్రమించే ప్రజల తీరు వంటి లక్షణా లన్నింటినీ మెచ్చుకునేవారు. అయితే ఆ జ్ఞాపకాలేవీ ఇప్పుడు లేవు. బదులుగా ఇజ్రాయెల్ చేపట్టిన మానవ హననం మాత్రమే అందరి కళ్లల్లో మెదలుతోంది. ఒకప్పుడు అభినందించిన ప్రజలే ఇప్పుడు ఛీత్కరించే పరిస్థితి. ఇజ్రాయెలీలకు ఈ విషయాలు తెలియవా? రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల చేతిలో ఊచకోతకు గురైన వాళ్లే కదా! హిట్లర్ మాదిరిగానే తామూ పాలస్తీనీయులను నానా హింసలూ పెడు తున్నామన్న విషయాన్ని అంగీకరించేందుకు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కానీ వాస్తవమైతే అదే! కాకపోతే ఇదే అద్దంతో మరేదో చూపేందుకు ఇజ్రాయెల్ తాపత్రాయపడుతోంది. హమాస్ నేత ఇస్మాయెల్ హనియే, హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లాల నాటకీయ హత్యలు ఇజ్రాయెలీల నిఘా వ్యవస్థ చురుకు దనానికి నిదర్శనంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. కానీ గత ఏడాది అక్టోబరులో నిఘా విభాగం వాళ్లు సిగ్గుతో తలదించుకున్నారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ చేసిన రక్తపు మరక అంత తొందరగా చెరిగిపోయేది కాదు. మరచిపోయేది, క్షమించదగ్గది కూడా కాదు. ఇజ్రాయెల్‌ను ఓ భిన్న దేశంగా చూపింది ఈ యుద్ధం. ఈ విషయాన్ని ఇజ్రాయెలీలు ఎంతవరకూ అంగీకరిస్తారన్నది చూడా ల్సిన విషయం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
స్కూలు, క్లినిక్‌లపై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్–బలాహ్/బీరుట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గురువారం ఒక స్కూలు, క్లినిక్‌లపై జరిగిన దాడుల్లో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. శరణార్థులు తలదాచుకుంటున్న డెయిర్ అల్– బలాహ్లోని స్కూలు భవనంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో 28 మంది చనిపోగా, 54 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి, ఏడుగురు మహిళలున్నట్లు అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శరణార్థులకు సాయం అందించే విషయమై ఓ సంస్థ ప్రతినిధులు శిబిరం నిర్వాహకులతో చర్చిస్తున్న సమయంలో భవనంపై దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ఉదయం 11.20 గంటల సమయంలో ఘటన జరిగినప్పుడు స్కూలు భవనంలో సుమారు 3 వేల మంది ఉన్నట్లు పాలస్తీనియన్ రెడ్ క్రీసెంట్కు చెందిన రిస్క్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ హిషామ్ అబూ హోలీ తెలిపారు. దాడి తీవ్రతకు మృతదేహాలు ముక్కముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడిపోయాయన్నారు. ఛిద్రంగా మారిన శరీర భాగాలనే ఏరి ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి భయానక పరిస్థితిని హిషామ్ వివరించారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారన్నారు. మొత్తం మూడంతస్తులకు గాను ఒకటో ఫ్లోర్లో శిబిరం పరిపాలన సిబ్బంది ఉండగా, మిగతా రెండంతస్తుల్లోనూ శరణార్థులే తలదాచుకుంటున్నారన్నారు. మొదటి అంతస్తు లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు భావిస్తున్నామన్నారు. కానీ, దాడి తీవ్రతకు రెండు, మూడు అంతస్తులు సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వివరించారు. మరో ఘటనలో..గాజా నగరం పశి్చమాన ఉన్న అల్–రిమల్ క్లినిక్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన లక్షిత దాడిలో ఆరుగురు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారని గాజాలోని అంబులెన్స్ సరీ్వస్ ప్రతినిధి పరేస్ అవాద్ తెలిపారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి: 11 మంది మృతి బీరుట్: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ గురువారం చేసిన రెండు వేర్వేరు దాడుల్లో 11 మంది మృతి చెందారని, 48 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రస్ అల్–నబాలో ఓ ఎనిమిది అంతస్తుల భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించగా.. అపార్ట్మెంట్ కిందిభాగం దెబ్బతింది. -
అభద్రతను పెంచుతున్న యుద్ధం
హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాలను నిరోధించ వలసిన ఐక్యరాజ్య సమితి లాంటివి నిర్వీర్యమైపోతున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐరాస సిబ్బందికే రక్షణ లేని పరిస్థితి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెతన్యాహూకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు ఆంక్షల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వైరి పక్షాలను చర్చల వేదికపైకి తేగలిగిన మధ్యవర్తులు కానరాని పరిస్థితి! ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన శత్రువులపై దాడిచేసే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ... దాని పౌరులు రోజు రోజుకూ అభద్రతాభావంలో కూరుకుపోతుండటం గమనార్హం.ఒక సంవత్సరం క్రితం, అక్టోబర్ 7న జరిగిన ఘటన ఉక్రెయిన్‌లో యుద్ధం నుండి ప్రపంచం దృష్టిని మళ్లించింది. నేడు, హమాస్ తీవ్రవాద దాడిపట్ల ఇజ్రాయెల్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా మారిపోయింది. దీనితో పోలిస్తే మిగతా వన్నీ అప్రధానంగానే ఉన్నాయి. దాదాపు 45,000 మంది, వీరిలో ఎక్కువగా పౌరులు మరణించారు. కనుచూపు మేర కాల్పుల విరమణ లేదు. పైగా వేగంగా పెరుగుతున్న సంఘర్షణ కారణంగా, పశ్చిమాసి యాను యుద్ధం చుట్టుముట్టే అవకాశం ఒక ప్రమాదకరమైన వాస్తవంగానే కనబడుతోంది. కొంత వరకు ఉక్రెయిన్ యుద్ధం, ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం... ప్రాంతీయ యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించే లేదా వాటికి ముగింపు పలికే సామర్థ్యం గల మధ్యవర్తులు కనిపించని ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నామనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.ఇజ్రాయెల్, ఇరాన్ లేదా అమెరికాను చేరుకోగల ఉపయోగ కరమైన పరోక్ష మార్గాలు కానీ లేదా వారిని సంధానించేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే లేదా పొడిగించే స్థితిలో అమెరికా ఉండవచ్చు, కానీ పశ్చిమాసియా విషయానికి వస్తే దాని నిస్సహాయత ఆశ్చర్యక రంగా ఉంది. ఈ ప్రాంతంలో పరిష్కారం కోసం ప్రపంచం వాషింగ్టన్ వైపు చూస్తూనే ఉంది, కానీ దాని స్వీయ అధ్యక్ష ఎన్నికల కారణంగా, అమెరికన్ బాడీ పాలిటిక్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం చూపే ప్రభావం కారణంగా అమెరికాకు పరిష్కారం సాధ్యం కావడం లేదు.మరోవైపున అగ్రరాజ్య స్థాయి కోసం ఎదురుచూస్తున్న చైనా మౌనం కూడా ఆసక్తి గొల్పుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా ఉండగా, ఎర్ర సముద్రం సంక్షోభం సమయంలో అది నిష్క్రియాపరత్వంతో వేచి ఉంటోంది. పైగా ఇతర చోట్ల ప్రపంచ సంక్షోభాలను తగ్గించే విషయంలో చైనా పాత్ర తక్కువే అని చెప్పాలి. ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మధ్యవర్తిత్వం వహించడంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. భారతదేశం ఇప్పటికీ అలాంటి కర్తవ్యా లను చేపట్టేంత శక్తిమంతమైన దేశంగా తనను తాను భావించడం లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతర సంస్థలు ప్రపంచ స్థాయిలో నిర్మాణాత్మక అసమానతలను కొనసాగించినప్పటికీ, సంస్థలు,నిబంధనలు లేని ప్రస్తుత ప్రపంచం అధ్వానంగానే ఉంటుంది.ఐక్యరాజ్యసమితిని పరిశీలిస్తే... అది రోగలక్షణంతో అసమర్థ మంతంగానూ, నిస్సహాయంగానూ మారిపోయినట్లుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలు... ఐరాస సిబ్బంది ఉన్న ప్రాంతా లలో కూడా బాంబు దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పోరాడుతున్న పక్షాలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ఇటీవల ధిక్కరించినట్లుగానే, మీడియా కూడా దాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదు.అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) ఉదంతాన్ని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్ ఆగ్రహ జ్వాలలకు గురవుతూ ఉండడం మాత్రమే కాకుండా... అమెరికా, ఐరోపాలోని ఇజ్రాయెల్ సన్నిహిత మిత్రుల అగ్రహాన్ని కూడా చవిచూస్తూ ఉంది. హాస్యాస్పదంగా, రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలనే విషయంపై ఆసక్తిగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అదే విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు మాత్రం ఐసీసీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. రెండు యుద్ధాలూ నైతిక పరిగణనలు వాడుకలో లేని ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇంకా, నైతిక రాజకీయం రోజువారీ ప్రభుత్వ ఆచరణలో చెడుకు చెందిన సామాన్యతను కొలిచేందుకు ఒక కొలమానాన్ని అందిస్తుంది. దేశీయ రాజకీయాలు లేదా అంతర్జాతీయ సంబంధాలలో, నైతిక ప్రమాణాలు లేనిదాని కంటే నైతిక ద్వంద్వ ప్రమాణాలు ఉత్తమం. ఆచరణలో లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, కొలత కోసం మనకు ఒక టేప్ అవసరం. ఈ యుద్ధంలో చెడుకు సంబంధించిన సామాన్యత విషయంలో అత్యంత కలతపెట్టే ఉదా హరణ ఏదంటే హమాస్ టెర్రరిస్టులను గాజా ప్రజలతో సమానం చేయడం– అలాంటి చట్రాలను మనం మౌనంగా ఆమోదించడం!ఏ రకంగా చూసినప్పటికీ ఇజ్రాయెల్ మరింత ఒంటరిగా, అభద్రతతో ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులు, దాని అసమాన ప్రతీకార చర్యలు జరిగి ఒక సంవత్సరమైంది. కానీ ఇజ్రాయెల్ అనుభూతి చెందుతున్న శాశ్వతమైన అభద్రతా భావం ఇప్పుడు పెరుగుతున్న ఒంటరితనంతో పాటు మరింత తీవ్రమైంది.ఇజ్రాయెల్‌కు తన శత్రువులను మరింత ఎక్కువ శక్తితో కొట్టే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సంపూర్ణ దుర్బ లత్వం కూడా స్పష్టంగా ఉంది. ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూపులుగా గాజా, ఇరాక్, లెబనాన్, సిరియా గురించి ఇజ్రాయెలీలు పిలుస్తున్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనేది ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు మరింత సురక్షితంగా ఉన్నారా అనేది సందేహమే. ఒక దేశం ఎంత శక్తిమంతమైన దేశమైన ప్పటికీ, నిశ్చయాత్మకమైన, సైద్ధాంతికంగా ప్రేరేపితులైన విరోధుల నుండి తనను తాను రక్షించుకోలేకపోతుంది, ప్రత్యేకించి దాని సొంత చర్యలు విరోధుల లక్ష్యాన్ని మరింతగా నిలబెడుతున్నప్పుడు అది అసలు సిద్ధించదు.నేడు ఇజ్రాయెల్ మరింత అభద్రతాభావంతో ఉండటమే కాకుండా ప్రపంచం సానుభూతిని కూడా కోల్పోతోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మితిమీరిన చర్యలకూ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకూ, ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లోని వారిచే వివిధ అంత ర్జాతీయ ఫోరమ్‌లలో సాధారణంగా ఆక్షేపించబడుతూ, విమర్శల పాలవుతోంది. గ్లోబల్ సౌత్ మద్దతుపై ఇజ్రాయెల్‌కు పెద్దగా పట్టింపు లేకపోయినా, ఇజ్రాయెల్ వైపు నిలిచిన యూరోపియన్, ఉత్తర అమె రికా మద్దతుదారులు కనీసం భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దక్షి ణాదిని విస్మరించడం కష్టం. అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్ కోసం బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో అమెరికా యువతరంలో ఇజ్రాయెల్‌కి చెందిన సమస్యపై, విభేదాలు పెరుగుతున్నాయి.మొత్తం మీద చూస్తే అబ్రహం ఒప్పందాలు ప్రమాదకరమైన స్థితిలో ఊగిసలాడుతున్నాయి, వీధుల్లో జనాదరణ పొందిన మనో భావాల ద్వారా నడపబడుతున్న యుద్ధ స్వభావం పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా, గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి, పాలస్తీనా ఉచ్చులోంచి బయటపడాలని కోరుకున్నప్ప టికీ అవి బలవంతంగా తిరిగి యుద్ధబాటలోకి వెళ్లవచ్చు కూడా.ఇజ్రాయెల్ ప్రభుత్వానికీ, ప్రజలకూ దీని అర్థం ఏమిటంటే పెరుగుతున్న అభద్రత, ప్రపంచ సానుభూతిని కోల్పోవడంతో పాటు కనికరం లేని విలన్లుగా ముద్ర వేయబడటమే. ఈ యుద్ధం నెతన్యా హుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలను కప్పిపుచ్చడమే కాకుండా ఇజ్రాయెల్ ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలను అణిచివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు తమను తాము ప్రజలుగా ఊహించుకునే భవిష్యత్తు ఇదేనా? గాజా ప్రజలకు ఇజ్రాయెలీలు ఏమి చేస్తున్నారో అది ఇజ్రాయెల్ ప్రజలుగా వారిపై కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంలోని మనకు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ’శ్వేత జాతీ యులు శ్వేతజాతీయులను చంపేస్తున్నారు’ అనేటటువంటి కేవల యూరోప్ సమస్యగా మాత్రమే విస్మరించడం సులభం. కానీ పశ్చి మాసియాలో యుద్ధం ప్రాథమికంగా భిన్నమైనది – అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఊహించని మార్గాల్లో మనపై ప్రభావం చూపుతుంది.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో భారత విదేశీ విధాన బోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో...) -
యుద్ధానికి ఏడాది పూర్తయిన వేళ...పరస్పర దాడులు
రెయిమ్ (ఇజ్రాయెల్)/బీరూట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పశి్చమాసియా దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా నిప్పుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్‌తో పాటు పోర్ట్ సిటీ హైఫాపై తెల్లవారుజామున ఫాది 1 క్షిపణులు ప్రయోగించింది. తమపైకి 130కి పైగా క్షిపణులు దూసుకొచి్చనట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ‘‘వాటిలో ఐదు మా భూభాగాన్ని తాకాయి. రోడ్లు, రెస్టారెంట్లు, ఇళ్లను ధ్వంసం చేశాయి’’ అని సైన్యం ధ్రువీకరించింది. పది మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దాంతో గాజా సరిహద్దు సమీప ప్రాంతాల్లోనే గాక టెల్ అవీవ్‌లో కూడా సైరన్ల మోత మోగింది. జనమంతా సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. దాంతో అటు లెబనాన్, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడింది. బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్పై భారీగా వైమానిక దాడులు చేసింది. బీరూట్‌లో పలుచోట్ల ఇళ్లు, నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. జనం కకావికలై పరుగులు తీశారు. దాంతో విమానాశ్రయం తదితర ప్రాంతాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. బరాచిత్లో సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న 10 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వైమానిక దాడులకు బలైనట్టు లెబనాన్ ప్రకటించింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో మరో 100 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా స్థానికులను తాజాగా హెచ్చరించింది. సరిహద్దుల వద్ద సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది. గాజాలో జాబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. దాంతో 9 మంది బాలలతోపాటు మొత్తం 20 మంది దాకా మరణించారు. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మేం విఫలమైన రోజు ఏడాది కింద హమాస్ ముష్కరులు సరిహద్దుల గుండా చొరబడి తమపై చేసిన పాశవిక దాడిని ఇజ్రాయెలీలు భారమైన హృదయాలతో గుర్తు చేసుకున్నారు. దేశమంతటా ప్రదర్శనలు చేశారు. టెల్ అవీవ్‌లో హైవేను దిగ్బంధించారు. ‘‘ప్రజల ప్రాణాల పరిరక్షణలో మేం విఫలమైన రోజిది’’ అంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జ్ హలెవీ ఆవేదన వెళ్లగక్కారు. -
హమాస్‌పై యుద్ధం ముగిస్తాం: నెతన్యాహు
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసినటువంటి మెరుపు దాడి మళ్లీ జరగకుండా చూసేందుకు దేశంలో భద్రతను మారుస్తున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ బలగాలు మెరుపుదాడి చేసిన ఘటనకు నేటితో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆనాటి దాడి జరగకుండా చూస్తామని ప్రధాని నెతన్యాహు సోమవారం కేబినెట్ ప్రసంగంలో పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.‘‘మేము మా ప్రాంతంలో భద్రతా మారుస్తున్నాం. మా పిల్లల, భవిష్యత్తు కోసం. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జరిగినవి దాడి మళ్లీ ఇంకెప్పడూ జరగకుండా చూస్తాం. అందు కోసం దేశ భద్రతలో సైతం వాస్తవ మార్పులు తీసుకువస్తాం’’ అని అన్నారు.ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1200 మందికిపైగా అమాయకుల మృతికి ప్రత్యేక సంతాప సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్), భద్రతా సిబ్బంది , రెగ్యులర్, రిజర్వ్, ఆర్మీ , పోలీసు, మొస్సాద్లోని సైనిక యోధుల వీరత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మీరు నిర్వహిస్తున్న పనిని పూర్తి చేయాలని తెలిపారు. హమాస్ చేతిలో మిగిలిన బందీలను గాజా నుంచి విడిపించాలని కోరారు.‘‘మేము నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తి చేసినప్పుడే హమాస్‌పై యుద్ధాన్ని ముగిస్తాం. గాజా హమాస్ పాలనను పడగొడుతాం. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను సురక్షితంగా తీసుకువస్తాం. గాజా నుంచి ఇజ్రాయెల్‌కు భవిష్యత్తులో వచ్చే ముప్పును అడ్డుకుంటాం’’ అని అన్నారు.చదవండి: ఏడు వైపులా శత్రువులతో పోరాడుతున్నాం -
హమాస్ దాడికి ఏడాది.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం
ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ బలగాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. అయితే.. అక్టోబర్ 7వ తేదీకి హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో హమాస్ దాడి మొదటి వార్షికోత్సవానికి ఒకరోజు ముందు ఇవాళ (ఆదివారం) మరోసారి.. ఉత్తర గాజా నుంచి పలు రాకెట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.‘‘అనేక రాకెట్లు ఉత్తర గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించినట్లు గుర్తించాం. అందులో ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్ సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. మిగిలినవి రాకెట్లు జనావాసాలు లేని బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి’’ అని సైన్యం తెలిపింది. ఇక.. హమాస్ బలగాలు.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో తమ సైన్యం మరింత అప్రమత్తంగా ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది.🚨Sirens sounding along Israel’s coast🚨 pic.twitter.com/ebdBsj0vNT— Israel Defense Forces (@IDF) October 6, 2024 గతేడాది అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి తమ పౌరులను విడిచిపెట్టే వరకు హమాస్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ టార్గెట్ ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో 41, 900 మంది పాలస్తీనా పౌరులు మృత్యువాతపడ్డారు. -
గాజాలో మసీదుపై ఇజ్రాయెల్ దాడులు.. 24 మంది మృతి
గాజా:ఓ పక్క లెబనాన్‌లో హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సేనలు మరోపక్క పాలస్తీనాలోని గాజాలోనూ దాడులు కొనసాగిస్తున్నాయి.ఆదివారం(అక్టోబర్6)సెంట్రల్ గాజాలో ఓ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 24మంది మరణించారు. మృతులంతా పురుషులేనని అధికారులు తెలిపారు.డెయిర్ అల్-బలాహ్ పట్టణంలోని అల్-అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదులో నిరాశ్రయులైన ప్రజలుంటున్నారు. ఆదివారం ఉదయం ఈ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 24మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.2023అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు గాజాలో దాదాపు 42వేల మంది మరణించారు.ఇదీ చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు -
ఇజ్రాయెల్ సర్జికల్ స్ట్రైక్.. హమాస్ గాజా చీఫ్ ఖతం
తమ శత్రువులను మట్టుబెట్టడమే లక్ష్యంగా హమాస్, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్లను అంతమొందించడమే టార్గెట్‌గా వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న నిరంతర దాడులతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానికి దాడుల్లో గాజాలోని హమాస్ ప్రభుత్వాధినేత రావి ముష్తాహా మరణించాడు. ఆయనతోపాటు మరో ఇద్దరు హమాస్ కమాండర్లు సయేహ్ సిరాజ్ సమేహ్ ఔదేహ్ మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. కానీ, కొన్ని నెలల క్రితమే తాము జరిపిన దాడుల్లో వారు చనిపోయినట్లు వెల్లడించింది. ‘సుమారు 3 నెలల క్రితం ఉత్తర గాజాలోని ఒక భూగర్భ సొరంగంపై ఐడీఎఫ్, ఐఎస్ఏ సంయుక్తంగా జరిపిన దాడిలో ముగ్గురు హమాస్ టాప్ కమాండర్లు మరణించారు. గాజాలోని హమాస్ ప్రభుత్వ అధిపతి రౌహి ముష్తాహా, హమాస్ పొలిటికల్ బ్యూరో, హమాస్ లేబర్ కమిటీ నాయకుడు ససయేహ్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ మెకానిజం కమాండర్‌సమేహ్ ఔదేహ్ చనిపోయారు’ అని ఐడీఎఫ్ తమ ఎక్స్ పేర్కొంది. అయితే హమాస్ మాత్రం ఇజ్రాయెల్ ప్రకటనను ధృవీకరించలేదు. -
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్
ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించడంతో పశ్చిమాసియా నిప్పు కణికలా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి నెలకొంది.ఈనేపథ్యంలో ఇరాన్- ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపై భారత్ ఆందోళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. ఇదే కాకుండా లెబనాన్, హౌతీ, ఎర్ర సముద్రంలో జరిగే ఏ సంఘర్షణ విస్తృతమయ్యే అవకాశాలపైనా ఆందోళన చెందుతోందని తెలిపారు.చదవండి: మధ్యప్రాచ్యంలో యుద్ద భేరీ..ఈ మేరకు యూఎస్ వాషింగ్టన్‌లోని థింక్ తాంక్ కార్నేగీ ఎండోమెంట్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిని ‘తీవ్రవాద చర్యగా’ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ దేశమైనా ప్రతిస్పందించడానికి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. అది ఎంతో ముఖమన్న జై శంకర్.. సంక్లిష్ట సమయంలో చర్చల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకూడదన చెప్పారు. చర్చలతో ఘర్షణలను ఆపవచ్చని నేను భావిస్తున్నట్లుఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 180 క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిలో చాలావాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. ప్రాణనష్టం వివరాలు తెలియనప్పటికీ- తమవైపు కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి. -
పాలస్తీనా మా సొంతం
న్యూయార్క్: గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక దాడులను పాలస్తీనా అథారిటీ చీఫ్ మహ్మూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా మా సొంతం. పాలస్తీనా నుంచి వెళ్లిపోవాల్సిన వారు ఎవరూ అంటే ఆక్రమణదారులు మాత్రమే’ అని ఆయన అన్నారు. గురువారం అబ్బాస్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన స్టేడియం వైపు వెళ్తుండగా కరతాళధ్వనులు, చప్పట్లు హాలంతా మారుమోగాయి. అర్థంకాని కేకలు వినిపించాయి. పోడియం వద్దకు చేరుకున్న అబ్బాస్..మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం..అంటూ ప్రసంగం మొదలుపెట్టారు.గాజాను, అక్కడి ప్రజలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న నరమేధాన్ని ఆపాలంటూ ప్రపంచ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గాజాను నివాసయోగ్యం కాకుండా చేస్తోంది. యుద్ధానంతరం ఏర్పడే గాజాను మేమే పాలిస్తాం. పాలస్తీనా మా మాతృ భూమి. మా తండ్రులు, తాతలది. అది ఎప్పటికీ మాదే. వెళ్లిపోవాల్సింది ఎవరైనా ఉంటే వారు ఆక్రమిత వడ్డీవ్యాపారులు మాత్రమే’అని వ్యాఖ్యానించారు. -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు
ఐరాస: మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. సోమవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని ప్రసంగించారు.ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’’ అని మోదీ సూచించారు. ‘‘నమస్కారం. ప్రపంచ మానవాళిలో ఆరో వంతుకు సమానమైన 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారి గళాన్ని విని్పస్తున్నా’’ అంటూ సాగిన ఐదు నిమిషాల ప్రసంగాన్ని పలు దేశాధినేతలు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఉగ్రవాదం పెనుముప్పు ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్ క్రైమ్ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘వీటిని సమూలంగా రూపుమాపాలంటే కేవలం మాటలు చాలవు. నిర్దిష్ట కార్యాచరణతో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించుకునేలా అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థ రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. గాడిన పెట్టేందుకే: గుటెరస్ ప్రారం¿ోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివరి్ణంచారు! సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కని్పంచడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’’ అన్నారు. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.పాలస్తీనా అధ్యక్షునితో భేటీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్ రాకుమారుడు షేక్ సబా ఖలీద్ అల్ సబా, నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో కూడా మోదీ సమావేశమయ్యారు. -
మీడియా సంస్థకు ఇజ్రాయెల్ సైనికుల వార్నింగ్
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌బ్యాంక్ రమల్లాలోని ఖతార్ బ్రాడ్‌కాస్టర్ అల్ జజీరా ఆఫీసులో ఆదివారం సోదాలు చేశారు ఇజ్రాయెల్ సైనికులు. ఒక్కసారిగా ముసుగులు ధరించిన ఇజ్రాయెల్ సైనికులు అల్ జజీరా భవనంలోకి ప్రవేశించారు. సిబ్బంది ఆఫీసులో ఉన్న కెమెరాలు తీసుకొని త్వరగా అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఛానెల్ ఆఫీసును మూసివేయాలని అల్ జజీరా నెట్వర్క్ వెస్ట్‌బ్యాంక్ బ్యూరో చీఫ్ వాలిద్ అల్ ఒమారీను ఆదేశించారు. ఛానెల్ ప్రసారాలను 45 రోజుల్లో పూర్తిగా నిలిపివేయాలని సైనికులు చెప్పగా.. ఆయన లైవ్‌లోనే చదివినట్లు స్థానిక మీడియా పేర్కొంది.HAPPENING NOW:Israeli soldiers are raiding Al Jazeera’s office in Ramallah and forcing it to stop broadcasting in the West Bank for 45 days.Israel is planning something terrifying across the West Bank, and doesn’t want the world to see. pic.twitter.com/mVr07W6A6M— sarah (@sahouraxo) September 22, 2024ఇక.. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తూ అల్ జజీరా కార్యకలాపాలను ఇజ్రాయెల్‌లో ప్రసారాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. మేలో నెలలో అల్ జజీరా.. తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్న జెరూసలేం హోటల్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఆదివారం ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.బలవంతంగా 45 రోజుల్లో ప్రసారాలు పూర్తిగా నిలిపివేయాలని నిషేధం విధించడాన్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇది మానవ హక్కులు, సమాచారాన్ని పొందే ప్రాథమిక హక్కును ఉల్లంఘించే నేరపూరిత చర్య అని అభివర్ణించింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ మీడియాపై కొనసాగిస్తున్న అణచివేత అంతర్జాతీయ, మానవతా చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.చదవండి: లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల విధ్వంసం -
గాజాలో 22 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్: గాజాలోని జైటూన్ ప్రాంతంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం జరిపిన దాడిలో కనీసం 22 మంది చనిపోగా మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో 13 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలున్నారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ స్కూల్లో హమాస్ కమాండ్ సెంటర్ నడుస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. రఫాపై దాడిలో మరో నలుగురు చనిపోయారని హమాస్ పేర్కొంది. -
గాజా యుద్ధం కొనసాగిస్తాం
గాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టపోయినా తమ పోరాటం కొనసాగిస్తామని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమకు తగినంత వనరులు ఉన్నాయని హమాస్ సీనియర్ నేత ఇస్తాంబుల్‌లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘‘ గాజాలో 11 నెలలకు పైగా యుద్ధం జరగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నష్టపోయినప్పటికీ మా పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటానికి మా వద్ద తగినంత వనరులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఘటన దాడులు కొనసాగించడానికి మేము అధిక సామర్థ్యాన్ని కలిగిఉన్నాం. అమరవీరులు ఉన్నారు, వారి త్యాగాలు ఉన్నాయి. ప్రతిఘటనలో కొత్త తరాలను చేర్చుకోవడం జరుగుతోంది. ఈ యుద్ధంలో మేము ఊహించిన దానికంటే.. ప్రాణనష్టం, యుద్ధ విస్తరణ తక్కువగానే జరిగింది’ అని అన్నారు.ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ‘11 నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ హమాస్ నేత స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.చదవండి: హమాస్ మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగదు: ఇజ్రాయెల్ -
అల్ మవాసీ మానవతా జోన్‌పై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్ బలాహ్: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడుల పర్వం ఆగడం లేదు. దక్షిణ గాజాలో వలసదారులకు ఆశ్రయం కలి్పస్తున్న మానవతా జోన్‌పై ఇజ్రాయెల్ దళాలు సోమవారం జరిపిన దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారని పాలస్తీనా అధికారులు ప్రకటించారు. ఖాన్ యూనిస్ పరిధిలోని అల్–మవాసీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. అయితే 40 మంది చనిపోయినట్లు తొలుత వార్తలొచ్చాయి. మానవతా జోన్లలో రహస్యంగా పనిచేస్తున్న హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉగ్రవాదులపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. క్షిపణి దాడుల్లో 20 గుడారాలు దగ్ధమయ్యాయని, పేలుడు ధాటికి 30 అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయని గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్న గాజా సివిల్ డిఫెన్స్ సభ్యులు ఇసుకను తవ్వుతున్న దృశ్యాలను హమాస్ మీడియా సంస్థ అల్ అక్సా టీవీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘200 పై చిలుకు నిర్వాసితుల గుడారాల్లో 20 ధ్వంసమయ్యాయి. వాటిలో ఉంటున్న కుటుంబాలు అదృశ్యమయ్యాయి’’ అని గాజా సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి మహమూద్ బస్సాల్ చెప్పారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇప్పటికీ దాడులు ఆపడం లేదని శరణార్థులు వాపోయారు. దాడి జరిగిన చోట తమ వాళ్లెవరూ లేరని హమాస్ పేర్కొంది. -
ప్రాణం... పణం అక్షర సమరం
ప్రమాదపు అంచున పనిచేసిన, ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధవార్తలను రిపోర్ట్ చేసిన సాహసికులైన ఎంతోమంది జర్నలిస్ట్‌ల గురించి తెలుసుకుందిపాలస్తీనా అమ్మాయి ప్లెస్తియ. వారి గురించి విన్నప్పుడల్లా....‘ఎంత కష్టం. ఎంత సాహసం!’ అనుకునేది.ఆ కష్టం, సాహసం తన స్వీయానుభవంలోకి రావడానికి ఎంతోకాలం పట్టలేదు.జర్నలిజంలో పట్టా పుచ్చుకున్న తరువాత హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ఆమెని ఆహ్వానించింది.హమాస్–ఇజ్రాయెల్ వార్‌ను రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్‌గా ప్రపంచానికి పరిచితం అయిన ప్లెస్తియ యుద్ధభూమిలో కత్తి అంచున నడక అంటే ఏమిటో తెలుసుకుంది. యుద్ధ బీభత్సాన్ని దగ్గరి నుంచి చూసింది. తాజాగా...‘అలాకాద్ అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరుట్’లో మీడియా స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి లెబనాన్‌కు వెళ్లింది. దాంతో ప్రముఖ జర్నలిస్ట్ కాస్తా మళ్లీ విద్యార్థిగా మారింది.‘యుద్ధకాలంలో భావోద్వేగాలకు అవకాశం లేదు. ఏడ్వడానికి కూడా టైమ్ దొరకనంతగా ఉరుకులు పరుగులు. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధం ఆగి΄ోతుందని మనసులో చిన్న ఆశ. అంతలోనే మరో పెద్ద విషాదాన్ని రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. పూర్తిగా నష్ట΄ోయాం. ఇంతకంటే ఎక్కువగా నష్ట΄ోయేది ఏమిటి అనిపించేది కొన్నిసార్లు’ గతాన్ని గుర్తు చేసుకుంది ప్లెస్తియ.గాజాలో యుద్ధవార్తలు కవర్ చేస్తున్న రోజుల్లో ప్లెస్తియకు నిద్రపోవడానికి కూడా టైమ్ దొరికేది కాదు. తిండి సరిగా ఉండేది కాదు. పెట్రోల్ కొరత వల్ల మీడియా వాహనం ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడం కష్టంగా ఉండేది. కొన్నిసార్లు టీమ్‌తో సంబంధాలు తెగిపోయేవి. కరెంట్ కష్టాలు, ఫోన్ కష్టాలు సరే సరి.‘ఈ రోజు సరే, రేపు బతికి ఉంటానా అని ఎప్పటికప్పుడు అనుకునేదాన్ని’ అంటూ గత రోజులను గుర్తు చేసుకుంది ప్లెస్తియ. వార్తలను కవర్ చేసేందుకు మొదట్లో మెడలో ఐడీ ట్యాగ్ వేసుకునేది. ప్రెస్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించేది. అయితే వీటివల్లే ఎక్కువ ప్రమాదం ఉందని గ్రహించి వాటికి దూరంగా ఉంది.‘ఈ రోజు ఏం కవర్ చేయాలి...అని ఎప్పుడూ ΄్లాన్ చేసుకోలేదు. కొన్నిసార్లు స్టోరీ కోసం వెదికేదాన్ని. మరికొన్ని సార్లు స్టోరీ నన్ను వెదుక్కుంటూ వచ్చేది’ అంటున్న ప్లెస్తియ రిపోర్టింగ్‌కు వెళుతున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చేవి. ఆ గండాల నుంచి అదృష్టశాత్తు బయటపడింది.గాజాలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు తనకు ప్రజల నుంచి రకరకాల స్పందనలు ఎదురయ్యేవి. కొందరు ఆ΄్యాయంగా పలకరించి బ్రెడ్, టీ ఇచ్చేవారు. ‘ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు వెరవకుండా మీ జర్నలిస్ట్‌లు పనిచేస్తున్నారు. మీ వల్లే మా బాధలు ప్రపంచానికి తెలుస్తున్నాయి’ అని ప్రశంసించేవాళ్లు.కొందరు మాత్రం...‘నేను జర్నలిస్ట్’ అని పరిచయం చేసుకోగానే భయపడేవారు. ‘ఇప్పటికే ఎంతోమంది జర్నలిస్ట్‌లు చని΄ోయారు. మా గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందు మీరు జాగ్రత్తగా ఉండండి’ అనేవాళ్లు. ‘నిజానికి నేను వారి దగ్గరికి జర్నలిస్ట్‌గా కంటే సాటి మనిషిగా వెళ్లాను. వారి బాధలను పంచుకున్నాను. ధైర్యం చె΄్పాను’ అంటున్న ప్లెస్తియ ఆశావాది. యుద్ధం లేని రోజులు, గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్ర΄ోయే రోజులు వస్తాయని, మాయమైపోయిన నవ్వుల పువ్వులు మళ్లీ వికసిస్తాయని, ‘యుద్ధం గతం మాత్రమే. వర్తమానం కాదు’ అని బలంగా నమ్మే రోజులు వస్తాయనే ఆశిస్తోంది ప్లెస్తియ. ఇజ్రాయెల్ సైనిక దాడి గురించి రిపోర్టింగ్ చేస్తూ మరణించిన జర్నలిస్ట్ షిరీన్ అబూ స్మారక స్కాలర్షిప్ ΄÷ందిన ప్లెస్తియ లెబనాన్‌లో స్టూడెంట్‌గా మరో ప్రయాణం మొదలుపెట్టింది. ఈ యువ జర్నలిస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. -
హమాస్ క్షీణత ఖాయం: ఇజ్రాయెల్
పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగున్నాయి. మరోవైపు.. ప్రపంచంలోని పలు దేశాలు హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బంధీ విడుదలకు సంధి ఒప్పందానికి ప్రయత్నిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఓ మిలటరీ వ్యవస్థలా ఎక్కువ కాలం కొనసాగలేదని పేర్కొన్నారు. తొలి దశలో ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్‌తో ఒప్పందానికి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో హమాస్‌తో ఒప్పందం ఓ వ్యూహాత్మక అవకాశంగా నిలుస్తుంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ బందీలను స్వదేశానికి తీసుకురావడమే సరైన నిర్ణయం. ఇజ్రాయెల్ ఆరు వారాల పాటు కాల్పుల విరామం తీసుకుని, బందీలను తిరిగి తీసుకురావడానికి ఒప్పందాన్ని ఆమోదించాలి. 11 నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా. హమాస్ గెరిల్లా యుద్ధంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్ కూడా హమాస్ మిలిటెంట్లతో తీవ్రంగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ పటిష్టమైన మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగుతుందనే నమ్మకం లేదు’’ అని అన్నారు.ఇక.. గాజాలో ఇజ్రాయెల్, హమాస్ జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తులు ప్రయత్నాలు సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక.. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటిరకదాదాపు 41 వేల మంది పాలస్తీనియలు మృతి చెందారు. -
గాజాపై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
గాజా: దక్షిణ గాజాగాపై ఇజ్రాయెల్ ట్యాంకులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడుతుంది. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ప్రధాన ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు చేస్తోంది. తాజాగా జరిపిన దాడిలో 40 మంది పౌరులు మరణించినట్లు గాజా అధికారులు తెలిపారు. దక్షిణ గాజా స్ట్రిప్మీద ఇజ్రాయెల్ సైన్యం ఉపరితల, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్,అల్ మవాసీ ప్రాంతాల మీద చేసిన దాడుల్లో గత 24 గంటల్లో 40మంది మరణించారని, మరో 60 మంది తీవ్రంగా గాయపడినట్లు గాజా సివిల్ డిఫెన్స్ అధికారి మహ్మద్ అల్ ముఘైర్ మీడియా సంస్థ ఏఎఫ్పీకి చెప్పారు. సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ మాట్లాడుతూ..స్థానిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు దాడులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, ఫలితంగా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు సహాయక చర్యలకు మరింత ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. గాజాపై దాడిని ఇజ్రాయెల్ సైన్యం అధికారంగా స్పందించింది. తాము ఖాన్ యునిస్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పనిచేస్తున్న హమాస్ ఉగ్రవాదులపై యుద్ధవిమానాలతో దాడి చేసినట్లు వెల్లడించింది. గాజా స్ట్రిప్‌లోని ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ప్రాంతాలు,సైన్యానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని,ఫలితంగా ఈ డాడులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేనా? -
గాజా సొరంగంలో ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు
దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో ఓ సొరంగంలో ఆరుగురి బంధీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు వీరిని బంధీలు గాజా తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్, అలెగ్జాండర్ లోబనోవ్, అల్మోగ్ సరుసి, ఒరి డానినో మృతదేహాలను ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. వీరు తాము స్వాధీనం చేసుకునే కొంత సమయం ముందు హమాస్ మిలిటెంట్ల చేతిలో దారుణంగా హత్యకు గురైనట్లు ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. దక్షిణ గాజాలోని భూగర్భ సొరంగం నుంచి 52 ఏళ్ల ఇజ్రాయెల్ బంధీ ఖైద్ ఫర్హాన్ అల్కాడిని సైన్యం రక్షించి వారం రోజులు గడవక ముందే ఒకేసారి ఆరుగురి మృతి దేహాలను స్వాధీనం చేసుకోవటం గమనార్హం. ఈ ఆరుగురిలో ఇజ్రాయెలీ-అమెరికన్ హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్ అన్నారు. గోల్డ్బెర్గ్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు రోజు.. గాజా యుద్ధాన్ని ముగించాలని బైడెన్ పిలుపునిచ్చారు. బందీల విడుదల, విధ్వంసమైన గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ కోసం పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో కొనసాగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.‘ గాజా ఒప్పందాన్ని ముగించగలమని భావిస్తున్నాం. ఇరువురు సంబంధిత ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు చెప్పారాయన.ఇదిలాఉండగా.. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 40,691 మంది మరణించగా.. 94,060 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చేసిన 1,200 మందిని మృతి చెందగా.. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లారు. -
Israel-Hamas war: గాజాలో 89 మంది మృత్యువాత
గాజా: గాజాలోని మధ్య, దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ బలగాలు 48 గంటల వ్యవధిలో జరిపిన దాడుల్లో 89 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో శనివారం ఒక్క రోజే 48 మంది మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. అల్ అహ్లీ అరబ్ ఆస్పత్రిపైనా దాడికి దిగిందని, ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు వివరించింది. రోగులు, వారి సంబంధీకులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారని పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్ ఆర్మీ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో శనివారం గాజాలో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. ఖాన్ యూనిస్ ఆస్పత్రిలో 10 మంది శిశువులకు టీకా వేశారని అధికారులు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ చుట్టుముట్టింది. నాలుగు రోజులుగా ఇక్కడ దాడులు జరుపుతున్న ఆర్మీ నగరాన్ని మిగతా ప్రపంచంతో సంబంధాలు లేకుండా తెంచేసింది. మిలటరీ జీపులు, సాయుధ బలగాల వాహనాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ధ్వంసమైన కాంక్రీట్ గోడలు, శిథిల భవనాలు దర్శనమిస్తున్నాయి. -
Israel-Hamas war: గాజాకు 3 రోజుల ఊరట
లండన్: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచి్చంది. గాజాలో పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇజ్రాయెల్ ఇందుకు అంగీకారం తెలిపిందని ఐరాస ప్రకటించింది. పాతికేళ్ల తరవాత గాజాలో ఓ బాలుడిలో పోలియో వ్యాధిని గుర్తించారు. దీని నివారణకు పిల్లలకు టీకా డ్రైవ్ నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించింది. దాంతో ఇజ్రాయెల్ ‘మానవతా విరామం’ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం మూడింటి దాకా యుద్ధవిరామం ఉండనుంది. ఇది విరామమే తప్ప కాల్పుల విరమణ కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మూడు దశల్లో డ్రైవ్... గాజా స్ట్రిప్ అంతటా సుమారు 6.4 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డబ్ల్యూహెచ్ఓ సీనియర్ అధికారి రిక్ పీపర్కోర్న్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్, యూఎన్ఆర్డబ్ల్యూఏ సహకారంతో పాలస్తీనా ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది గాజా మధ్య, దక్షిణ, ఉత్తర భాగాల్లో మూడు దశల్లో జరుగుతుంది. గాజాలో ఇప్పటికే 12.6 లక్షల ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (ఎన్ఓపీవీ 2) డోసులున్నాయి. త్వరలో మరో 4 లక్షల డోసులు రానున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 2,000 మందికి పైగా హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. గాజా లోపల వైరస్ వ్యాప్తిని నివారించడానికి స్ట్రిప్ అంతటా 90% వ్యాక్సిన్ కవరేజీ సాధించాలని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అందుకోసం అవసరమైతే మరో రోజు యుద్ధవిరామానికి ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరింది. గాజాలో 2022లో 99% పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. గతేడాది 89%కి తగ్గింది. యుద్ధం వల్ల వ్యాక్సిన్ వేయక అధిక సంఖ్యలో పిల్లలు పోలియో బారిన పడే ప్రమాదముందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లోని 6.5 లక్షలకు పైగా పాలస్తీనా బాలలను రక్షించడానికి అంతర్జాతీయ సంస్థలతో సహకరించేందుకు సిద్ధమని హమాస్ కూడా తెలిపింది. -
శాంతియత్నాలు ఆపొద్దు!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పరిసమాప్తికి భిన్న మార్గాల్లో జరుగుతున్న ప్రయత్నాలు కాస్తా ఆ రెండు పక్షాల మొండి వైఖరులతో స్తంభించినట్టే కనబడుతోంది. రష్యాపై మరిన్ని దాడులు జరిపితే అది చర్చలకు సిద్ధపడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తుండగా... దాన్ని పూర్తిగా లొంగ దీసుకునే వరకూ యుద్ధం ఆపే ప్రసక్తి లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి తాజాగా తేల్చిచెప్పారు. యుద్ధం మొదలయ్యాక రెండు దేశాలతోనూ ఐక్యరాజ్యసమితితోపాటు భిన్న సంస్థలూ, దేశాలూ చర్చలు సాగిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరికి వారు అంతిమ విజయం తమదేనన్న భ్రమల్లో బతుకున్నంత కాలం సమస్య తెగదు. అలాగని ఏదో మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నది వాస్తవం. ఉదాహరణకు హోరాహోరీ సమరం సాగుతున్నప్పుడు రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ నుంచి ఆహారధాన్యాలు, ఎరువులు, పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తుల ఎగుమతులు నిలిచి పోగా ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని రష్యా, ఉక్రెయిన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది. అప్పటికి యుద్ధం మొదలై ఆర్నెల్లు దాటింది. ఫలితంగా నిరుడు జూలై నాటికి దాదాపు మూడు న్నర కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఎగుమతయ్యాయి. ప్రపంచానికి ఆహార సంక్షోభం తప్పింది. ఇటీవలే ఈ రెండు దేశాల మధ్యా యుద్ధ ఖైదీల మార్పిడి కూడా జరిగింది. ఇరువైపులా చెరో 115 మంది సైనికులకూ చెర తప్పింది. తెర వెనక తుర్కియే సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తుండగా ప్రధాని మోదీ అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సందర్శించి ఇరు దేశాల అధినేతలతోనూ మాట్లాడారు. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లినప్పుడు ఆయన మరోసారి జెలెన్స్కీని కలవ బోతున్నారు. అలాగే అక్టోబర్‌లో బ్రిక్స్ సమావేశాల కోసం రష్యా వెళ్లబోతున్నారు. మోదీ ఉక్రెయిన్ వెళ్లినందుకు పుతిన్ కినుక వహించినట్టే, అంతక్రితం రష్యా వెళ్లినందుకు జెలెన్స్కీ నిష్ఠూరాలాడారు. ఇప్పటికైతే ఉక్రెయిన్ ఒకవైపు నువ్వా నేనా అన్నట్టు రష్యాతో తలపడుతున్నా... డ్రోన్లతో, బాంబులతో నిత్యం దాడులు చేస్తున్నా చర్చల ప్రస్తావన తరచు తీసుకొస్తోంది. రష్యా చర్చలకు వచ్చి తీరుతుందని జెలెన్స్కీ ఇటీవల అన్నారు. అయితే ఇదంతా ఊహలపై నిర్మించుకున్న అంచనా. నిరంతర దాడులతో రష్యాకు గత్యంతరం లేని స్థితి కల్పిస్తే... ఆ దేశం చర్చలకు మొగ్గుచూపుతుందన్నది ఈ అంచనా సారాంశం. నిజానికి నాటో దేశాలు నిరంతరం సరఫరా చేస్తున్న మారణా యుధాలతో, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ దాదాపు మూడేళ్లుగా తలపడుతూనే ఉంది. పర్యవనసానంగా గతంలో కోల్పోయిన కొన్ని నగరాలను అది స్వాధీనం చేసుకుంది కూడా! కానీ రష్యా ప్రతిదాడులతో అవి ఎన్నాళ్లుంటాయో, ఎప్పుడు జారుకుంటాయో తెలియని స్థితి ఉంది. అత్యుత్సాహంతో ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను, ఎఫ్–16 యుద్ధ విమానాలను తరలించిన అమెరికా నెలలు గడుస్తున్నా వాటి వినియోగానికి ఇంతవరకూ అనుమతినివ్వనే లేదు. ఉదాహరణకు ఉపరితలం నుంచి ప్రయోగించే సైనిక వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ (ఏటీఏసీఎం) 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవలీలగా ఛేదిస్తుంది. బ్రిటన్–ఫ్రాన్స్ సంయుక్తంగా రూపొందించిన స్టార్మ్ షాడో 250 కిలోమీటర్ల దూరంలోని దేన్నయినా ధ్వంసం చేస్తుంది. ఈ రకం క్షిపణుల్ని గగనతలం నుంచి ప్రయోగిస్తారు. మరోపక్క జర్మనీ తయారీ టారస్ క్షిపణి కూడా ఇటువంటిదే. పైగా ఇది అమెరికా తయారీ క్షిపణిని మించి శక్తిమంతమైంది. 500 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాన్ని గురిచూసి కొడుతుంది. ఇవన్నీ ఇంచుమించు ఏడాదిగా ఉక్రెయిన్ సైనిక స్థావరాల్లో పడివున్నాయి. ఎందుకైనా మంచిదని కాబోలు అమెరికా తన ఎఫ్–16లను నేరుగా ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా నెదర్లాండ్స్, డెన్మార్క్‌లకు పంపి వారి ద్వారా సరఫరా చేసింది. వీటి వినియోగానికి ఉక్రెయిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బ్రిటన్, ఫ్రాన్స్ పట్టుబడుతుండగా అమెరికాతోపాటు జర్మనీ కూడా ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే జరిగితే యుద్ధ తీవ్రత మరింత పెరిగి, రష్యా ఎంతకైనా తెగించే పరిస్థితి ఏర్పడొచ్చునని అమెరికా, జర్మనీ ఆందోళన పడుతున్నాయి. తన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తున్నా రష్యా నిర్లిప్తంగా ఉండిపోతుండగా ఈ అనవసర భయాలేమిటన్నది బ్రిటన్, ఫ్రాన్స్‌ల వాదన. కానీ ఒకసారంటూ ఎఫ్16లు వచ్చి పడితే, అత్యాధునిక క్షిపణులు విధ్వంసం సృష్టిస్తే రష్యా ఇలాగే ఉంటుందనుకోవద్దని పెంటగాన్ హెచ్చరిస్తోంది. తప్పనిసరైతే ఉక్రెయిన్ సరిహద్దుల ఆవల ఉన్న రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకోమంటున్నది. ఈమధ్య క్రిమియాపై దాడికి అనుమతించింది. కానీ కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప రష్యా నగరాల జోలికి పోవద్దని చెబుతోంది. అంతగా భయపడితే అసలు ఇలాంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు తరలించటం దేనికి? అవేమైనా ఎగ్జిబిషన్‌కు పనికొచ్చే వస్తువులా? వాటిని చూసి రష్యా ‘పాహిమాం’ అంటూ పాదాక్రాంతమవుతుందని అమెరికా నిజంగానే భావించిందా? యుద్ధం ఏళ్లతరబడి నిరంతరం కొనసాగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితి చేజారే ప్రమాదం ఉంటుంది. కనుక అమెరికా, పాశ్చాత్య దేశాలు వివేకంతో మెలగాలి. యుద్ధ విరమణకు సకల యత్నాలూ చేయాలి. దాడులతో ఒత్తిడి తెస్తే రష్యా దారికొస్తుందనుకుంటున్న ఉక్రెయిన్‌కు తత్వం బోధపడాలంటే ముందు అమెరికా సక్రమంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఉక్రెయిన్–రష్యా ఘర్షణ, గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతలు ఆగనంతవరకూ ప్రపంచం సంక్షోభం అంచున ఉన్నట్టే లెక్క. అందుకే ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలి. శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. -
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురి పాలస్తీనా ఉగ్రవాదుల మృతి
గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులను కొనసాగిస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు.. స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంటోంది. తాజాగా తమ సైన్యం చేతిలో ఐదుగురు పాలస్తీనా ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లోని ఓ మసీదులో దాక్కుకొని ఉన్న ఉగ్రవాదులను ఇజ్రాయెల్ దళాలు కాల్చిచంపినట్లు పేర్కొంది. ఈ ఐదుగురిలో ఒక స్థానిక కమాండర్ మహ్మద్ జాబర్ అలియాస్ అబూ షుజా ఉన్నట్లు ఇజ్రాయెల్ బలగాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చేసిన పలు దాడుల్లో అబూ షుజా హస్తం ఉన్నట్లు ఆర్మీ పేర్కొంది. జూన్‌లో జరిపిన భారీ కాల్పులకు అబూ షుజా ప్లాన్ చేసినట్టు తెలిపింది.అబూ షుజా గతంలోనే మృతి చెందినట్లు పలు నివేదికలు వెల్లండించాయి. అయితే పలువురు మిలిటెంట్ల అంత్యక్రియల్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. నూర్ షామ్స్ శరణార్థి శిబిరంలోని ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్ కమాండర్ మహ్మద్ జాబర్ మృతిపై పాలస్తీనా ఇంకా ధృవీకరించకపోవటం గమనార్హం. బుధవారం నుంచి పాలస్తీనాపై చేస్తున్న ఇజ్రాయెల్ దాడుల్లో 10 మంది ఫైటర్లు మృతి చెందినట్లు హమాస్ మలిటెంట్ సంస్థ పేర్కొంది. -
గాజాలో 20 మంది పాలస్తీనియన్లు మృతి
జెరూసలేం: గాజాపై మంగళవారం ఇజ్రాయెల్ దాడిల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాన్‌యూనిస్, డెయిల్ అల్ బలాహ్‌పై జరిగిన ఈ దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులున్నట్లు చెప్పారు. టుల్కారెమ్‌లోని నూర్‌షామ్స్ శరణార్థి శిబిరంపై దాడుల్లో ఐదుగురు చనిపోయారు. ఇజ్రాయెల్ ఆంక్షలతో గాజాలో 10 లక్షల మందికి నెల రోజులుగా కనీస సాయం కూడా అందడం లేదని ఐరాస తెలిపింది.హమాస్ చెర నుంచి బందీని కాపాడిన ఆర్మీహమాస్ చెరలో ఉన్న తమ పౌరుడిని మంగళవారం ఇజ్రాయెల్ ఆర్మీ కాపాడింది. గతేడాది అక్టోబర్ ఏడున గాజా సరిహద్దుల సమీపంలోని ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి 1,200 మందిని చంపడం, 250 మందిని బందీలుగా పట్టుకోవడం తెలిసిందే. వారిలో క్వాయిద్ ఫర్హాన్ అల్‌కాదీ(52) అనే వ్యక్తిని గాజా కాపాడినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. హమాస్ చెర నుంచి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 8 మందిని కాపాడింది. ఇంకా 110 మంది బందీలుగా ఉన్నట్లు భావిస్తున్నారు. -
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 36 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వరుస దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 36 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా పూర్తిగా ధ్వంసం అయినప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం తన దాడులను ఇంకా ఆపడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ దక్షిణ గాజా స్ట్రిప్‌లో ఏకకాలంలో పలు వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. గాజా ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఖాన్ యూనిస్ నగరంలో ఇద్దరు పిల్లలతో సహా ఒక కుటుంబంలోని 11 మంది సభ్యులు మృతిచెందారని నాసర్ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఖాన్ యునిస్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో మూడు వేర్వేరు దాడుల్లో 33 మంది మృతిచెందారని, వారి మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు.ఖాన్ యూనిస్‌కు దక్షిణంగా ఉన్న రహదారిపై జరిగిన దాడిలో మరో పదిహేడు మంది మృతిచెందారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2023, అక్టోబర్ 7న గాజాలో యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌తో పాటు మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. నాటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారదాడులు చేస్తూ వస్తోంది. -
కాల్పుల విరమణ: బైడెన్ వ్యాఖ్యలను ఖండించిన హమాస్
న్యూయార్క్: ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సమావేశం అనంతరం ఎయిర్‌పోర్టులో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి పాలస్తీనా( హమాస్) ఎనక్కి తగ్గుతోంది.కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ఒప్పందం కోసం సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరగుతుందో చూద్దాం. ఈ కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. అయితే బైడెన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించటం లేదని హమాస్ తెలిపింది. అదేవిధంగా తమకు జూలై 2న సమర్పించిన ఒప్పంద ప్రతిపాదన ఇటీవలి కొత్త ప్రతిపాదనకు చాలా విరుద్దంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త షరతులు, గాజా పట్ల నేర ప్రణాళికకు అమెరికా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. బైడెన్ చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పెట్టించేలా ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. కాల్పుల విరమణ, బంధీల విడుదలకు సంబంధించి విభేదాలు తలెత్తకుండా అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ చర్చల కోసం కసరత్తు చేస్తున్నారు. -
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఉన్న విభేదాలను తగ్గించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇదేవిధమైన సానుకూలతతో స్పందించాలని ఆయన హమాస్‌ను కోరారు. హమాస్ సంస్థ పెడుతున్న షరతులపై మాత్రం ఆయన ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. అలాగే, గాజా గుండా వెళ్లే ప్రధాన రహదారిపై పెత్తనం తమకే ఉండాలని ఇజ్రాయెల్ చేస్తున్న డిమాండ్‌పైనా ఆయన స్పందించలేదు. గతేడాది అక్టోబర్ నుంచి హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడం, బదులుగా గాజా నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ ఉపసంహరణ, ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ఖైదీల విడుదల వంటి కీలకాంశాలు మూడు దశల్లో అమలవుతాయి. బ్లింకెన్ సోమవారం టెల్అవీవ్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో రెండున్నర గంటలపాటు విస్తృతస్థాయి చర్చలు జరిపారు. అనంతరం బ్లింకెన్ మీడియాతో మాట్లాడారు. యుద్ధం కారణంగా పడుతున్న కడగండ్ల నుంచి పాలస్తీనియన్లకు విముక్తిని, హమాస్ చెరలో మగ్గుతున్న బందీలకు స్వేచ్ఛను ప్రసాదించే కాల్పుల విరమణ ఒప్పందం ఖరారుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. ‘ఇది నిర్ణయాత్మకంగా వ్యవహరించేందుకు ఎంతో అనువైన సమయం. శాంతిని, సుస్థిరతను సాధించేందుకు బహుశా ఇదే చివరి అవకాశం కావచ్చు’అని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు ఎవరూ ప్రయతి్నంచకుండా చూసుకోవడం కూడా అవసరమని ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలు మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తే ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. బ్లింకెన్ మంగళవారం కైరో చేరుకుంటారు. ఈజిప్టు, అమెరికా తదితర దేశాల మధ్యవర్తిత్వంతో కైరోలో చర్చలు జరుగుతున్నాయి. -
నెతన్యాహుపై హమాస్ సంచలన ఆరోపణలు
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన వైమానిక దాడుల్లో 29 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. గాజాలో ఉద్రిక్తతలు తగ్గించటంతో పాటు, కాల్పుల విరమణ ఒప్పందం ప్రయత్నాల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం.. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో దోహాలో రెండు రోజుల చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణపై కొంత సానుకూలంగా వ్యవహరించినట్లు తెలిపారు. మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త షరతులు విధించారని గాజా నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణను తిరస్కరించారని హమాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మధ్యవర్తుల ప్రయత్నాలను, ఒప్పందాన్ని అడ్డుకోవాలని ప్రధాని నెతన్యాహు చూస్తున్నారు. గాజాలో బంధీల జీవితాలకు పూర్తి బాధ్యత ఆయనదే’ అని హమాస్ ఆరోపించింది.ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. 2.3 మిలియన్ ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. భీకరమైన ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహార ఇబ్బందులు, పోలీయో వంటి వ్యాధలు ప్రబలుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. -
ట్రంప్ నాకేం ఫోన్ చేయలేదు: ఇజ్రాయెల్ ప్రధాని
టెల్అవీవ్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఓ కథనం వెలువడింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేలా ఇజ్రాయెల్‌ను ప్రోత్సహించేందుకు ట్రంప్ ఈ ఫోన్‌కాల్ చేసినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే.. తాజాగా ఈ కథనాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ‘‘ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నిన్న (బుధవారం).. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడలేదు’’ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.ట్రంప్.. ఫోన్ చేసిన హమాస్‌తో కాల్పుల విరమణ కోసం నెతన్యాహును పోత్సహించినట్లు యాక్సిస్ నివేదిక పేర్కొంది. మరోవైపు.. ఈ విషయంపై ట్రంప్ ప్రచార బృందం కూడా స్పందించకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఈజిప్ట్, అమెరికా, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇవాళ గాజా కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలను ఎక్కడ జరుపుతారనే విషయంపై స్పష్టత లేదు. -
గాజా: స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. వంద మంది మృతి
జెరూసలెం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపడంలేదు. తాజాగా తూర్పు గాజాలోని ఓ స్కూల్లో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది. ఉదయం ప్రార్థనల సందర్భంగా జరిగిన ఈ దాడిలో దాదాపు వంద మందికి పైగా ప్రజలు మరణించగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గత వారం గాజాలోని మూడు స్కూల్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో గాజావాసులు మరణించారు. గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడుల్లో వందల మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇందుకు ప్రతీకారంగా అప్పటినుంచి గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. -
కమలా హరీస్ ప్రచారంలో నిరసన.. ఆమె ఏమన్నారంటే?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ దూసుకువెళ్తున్నారు. బుధవారం మిచిగాన్‌లోని రోమోలస్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అయితే ర్యాలీలో కొంత మంది గాజాపై జరుగుతున్న యుద్దానికి వ్యతిరేకంగా నిరననలు తెలుపతూ నినాదాలు చేశారు. ‘గాజాలో మారణహోమం’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో విసిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ.. ‘మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. అందుకు నేను ఇక్కడి వచ్చి మీ ముందు ఉన్నాను. ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించము అవసరమే. కానీ ప్రస్తుతం నేను మాట్లాడుతున్నా కదా’అని అన్నారు. అయినా కూడా కొంతమంది గాజా యుద్ధం గురించి నినాదాలు చేయటం కొనసాగించారు. దీంతో ఆమె ఒకింత అసహనానికి గురయ్యారు. ‘ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో మీరు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాలని కోరుకుంటున్నారా. అలా అనుకుంటే నినాదాలు చేయండి. అలా కాకపోతే నేను మాట్లాడుతున్నాను వినండి’ అని అన్నారు. దీంతో నిరసన కారుల నుంచి నినాదాలు ఆగిపోయాయి. మరోవైపు.. గాజా అంశంపై అధ్యక్షుడు వ్యవహారించిన తీరు తమకు ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం డెమోక్రట్లలో ఉందని స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇక.. మిచిగాన్ మొత్తం 15 ఎలక్టోరల్ ఓట్లను కలిగి ఉంది. 2020 ఎన్నికల్లో 15 ఎలక్టోరల్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీకి పడ్డాయి. ఇక.. గతేడాది అక్టోబర్ 7న నుంచి గాజాపై ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకే ఇజ్రాయెల్ దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. -
టెల్అవీవ్లో కత్తిపోట్లు.. ఇద్దరి మృతి
జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్ కేంద్రంగా ఇరాన్ మద్దతుతో పనిచేసే హిబ్బుల్లా మిలిటెంట్ గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌పై మరోసారి బాంబుల వర్షం కురిపించింది.ఆదివారం(ఆగస్టు4) తెల్లవారుజామున ఉత్తరగాజాలోని టెంట్ క్యాంప్‌పై జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది చనిపోయారు. మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ శివార్లలో పాలస్తీనా మిలిటెంట్ ఒకరు జరిపిన కత్తిదాడిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లోని జనావాసాలపై హిజ్బుల్లా ఏ క్షణమైనా దాడులకు దిగవచ్చని సమాచారం. -
విస్తరిస్తున్న యుద్ధమేఘాలు
ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య యుద్ధం ఆగి, గాజా ప్రాంతంలో శాంతి నెలకొంటుందని నిన్నటి దాకా ఉన్న కొద్దిపాటి ఆశ ఇప్పుడు ఆవిరైపోయినట్టు అనిపిస్తోంది. హమాస్ సీనియర్ నేత ఇస్మాయిల్ హనియేను ఇరాన్ రాజధాని టెహరాన్‌లో బుధవారం గుట్టుచప్పుడు కాకుండా చంపిన తీరు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనియేను చంపింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించలేదు కానీ, ఆయన చనిపోవాలని ఇజ్రాయెలీల కన్నా ఎక్కువగా మరెవరూ కోరుకోరన్నది నిజం. మరోపక్క ఆ హత్యకు కొద్ది గంటల ముందే మంగళవారం లెబనాన్ రాజధాని బీరుట్లో ఇరాన్‌కు మిత్రపక్షమైన హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపు సీనియర్ మిలటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ ప్రాణాలు గాలిలో కలిశాయి. గత వారం (ఆక్రమిత) గోలన్ హైట్స్‌లో రాకెట్ దాడితో 12 మంది పిల్లల్ని పొట్టనబెట్టుకున్న ఆయనను మాత్రం అడ్డు తొలగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలా ఆ దేశ శత్రువులకు రెండు రోజుల్లో రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఇజ్రాయెల్ ఒప్పుదల మాటెలా ఉన్నా... ఇరాన్ నూతన అధ్యక్షుడి పదవీ స్వీకారోత్సవానికి హనియే వచ్చివుండగా జరిగిన ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధినాయకుడు అయతొల్లా ఖొమేనీ గర్జించారు. ప్రతిగా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు దిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ హెచ్చరించారు. వెరసి, వ్యవహారం ఇజ్రాయెల్ – ఇరాన్‌ల మధ్య నేరు ఘర్షణకు దారి తీస్తోంది. మొత్తం గాజా కథ మరో ప్రమాదకరమైన మలుపు తిరిగింది.అసలే సంక్లిష్టంగా ఉన్న పశ్చిమాసియా సంక్షోభం కాస్తా హనియే హత్యోదంతంతో మరింత సంక్లిష్టంగా మారింది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి పరిష్కారం కనుగొనాలని చేస్తున్న శాంతి ప్రయత్నాలకు తాజా ఘటన విఘాతం కల్పించింది. ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి చర్చలు జరుగుతున్నప్పుడు... ఒక పక్షం వాళ్ళు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తినే చంపేస్తే ఇక మధ్యవర్తి త్వం ఏం సఫలమవుతుంది? రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తున్న ఖతార్ పక్షాన ఆ దేశ ప్రధాని సరిగ్గా ఆ మాటే అన్నారు. ఆ మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. హనియేపై యుద్ధ నేరాలున్న మాట, అతనిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఇటీవలే వారెంట్ జారీ చేసిన మాట నిజమే. కానీ, హమాస్ గ్రూపులో మిలటరీ నేత యాహ్యా సిన్వర్ సహా ఇతర పిడివాదులతో పోలిస్తే రాజీ చర్చల విషయంలో రాజకీయ విభాగ నేత హనియే కొంతవరకు ఆచరణవాది అంటారు. ఇప్పుడు ఆయనే హత్యకు గురయ్యాడు గనక కథ మొదటికి వచ్చింది. కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం కుదిరినంత మాత్రాన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లబడతాయని గ్యారెంటీ లేదు కానీ, అసలు ఒప్పందమే లేకపోతే ఉద్రిక్తతలు తగ్గే అవకాశమే లేదు. మొత్తంగా ఈ ఘటన ఆ ప్రాంత సుస్థిరతనే దెబ్బ తీస్తూ, గాజా యుద్ధాన్ని చివరకు పెను ప్రాంతీయ ఘర్షణ స్థాయికి తీసుకెళుతోంది. అతిథిగా వచ్చిన మిత్రపక్షీయుణ్ణి భద్రత ఎక్కువగా ఉండే సమయంలోనే సొంతగడ్డపై, స్వకీయ గూఢచర్య వైఫల్యంతో పోగొట్టుకోవడం ఇరాన్‌కు తీరని తలవంపులే. ఖొమేనీ గర్జించినట్టు ఇరాన్ దీనికి బదులు తీర్చుకోవచ్చు. అదే జరిగితే ఇజ్రాయెల్ ప్రతిచర్యా తప్పదు. నిజానికి, ఆ మధ్య ఏప్రి ల్లో డెమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీలో తమ జనరల్స్ ఇద్దరిని హత్య చేసినప్పుడు ఇరాన్ తొలి సారిగా నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక దాడి జరిపింది. వందలాది క్షిపణులు ప్రయోగించింది. అదృష్టవశాత్తూ అప్పట్లో అది పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా పరిణమించలేదు. ప్రతిసారీ అలా ఆగుతుందనుకోలేం.తాజా ఘటనలతో యెమెన్ నుంచి హౌతీలు ఎర్రసముద్రంలో దాడులు ఇబ్బడి ముబ్బడి చేస్తారు. హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్‌ను చూస్తూ ఊరుకోదు. అసలు నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూపు చేసిన దుర్మార్గమైన దాడి ఇక్కడికి తెచ్చింది. అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం తప్పదనే భయాందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. చిత్రం ఏమిటంటే, ఏ పక్షమూ ఆ రకమైన యుద్ధం కోరుకోవడం లేదు కానీ, తమ చర్యలతో ఎప్పటి కప్పుడు కయ్యానికి కాలుదువ్వుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధం తీవ్రతరమయ్యే ముప్పు తప్పాలంటే ముందు గాజాలో కాల్పుల విరమణ జరగాలి.అయితే, వరస చూస్తుంటే హమాస్‌పై పూర్తి విజయమే లక్ష్యమన్న నెతన్యాహూ మాటలనే ఇజ్రాయెల్ ఆచరిస్తోందని అనిపిస్తోంది. పది నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఒక్క గాజాలోనే ఇప్పటికి 40 వేల మంది చనిపోయారు. ఇలాగే ముందుకు సాగితే యుద్ధం ఇతర ప్రాంతాలకూ విస్తరించి, మరింత ప్రాణనష్టం తప్పదు. మానవీయ సంక్షోభమూ ఆగదు. హనియే హత్యతో హమాస్ తల లేని మొండెమైంది. పగ తీర్చుకోవాలన్న ఇజ్రాయెల్ పంతం నెరవేరింది. ఇకనైనా ఆ దేశం ప్రతీకార మార్గం వీడి, రాజీ బాటను అనుసరించాలి. శాంతికి కట్టుబడ్డ మన దేశానికి సైతం ఆ ప్రాంతంలో యుద్ధంతో భారీ నష్టమే. అక్కడ 89 లక్షల మంది మన వలస కార్మికులున్నారు. పైగా, శాంతి, సుస్థిరత లేకుంటే నిరుడు ఢిల్లీ జీ–20 సదస్సులో ప్రకటించిన ‘ఇండియా– మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్’ (ఐఎంఈసీ) లాంటివి పట్టాలెక్కవు. ఇజ్రాయెల్, పాలెస్తీనాలు రెంటికీ మిత్రదేశంగా ఇరుపక్షాలనూ తిరిగి రాజీ చర్చలకు కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాలి. అధ్యక్ష ఎన్నికలతో తీరిక లేని అమెరికా సహా ఇతర దేశాలన్నీ ఒత్తిడి తెచ్చి అయినా సరే రెండువైపులవారినీ అందుకు ఒప్పించాలి. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో నడుం బిగించాలి. ఎందుకంటే, ఏ యుద్ధంలోనూ విజేతలుండరు. ప్రతిసారీ ప్రజలు పరాజితులుగానే మిగులుతారు. -
హమాస్ మిలటరీ చీఫ్ హతం.. ధృవీకరించిన ఇజ్రాయిల్
హమాస్‌పై పోరాటం చేస్తున్న ఇజ్రాయిల్‌కు భారీ విజయం దక్కింది. గాజాపై జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డెయిఫ్ మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ వెల్లడించింది. గత నెల జూలై 13న ఖాన్ యూనిస్ ప్రాంతంపై జరిపిన దాడిలో మహ్మద్ డెయిఫ్‌ను అంతమొందించినట్లు గురువారం ధృవీకరించింది. ‘జూలైలో గాజా దక్షిణ ప్రాంతంలో జరిపిన దాడిలో మహమ్మద్ డెయిఫ్ చనిపోయాడు. ఈ విషయాన్ని మేము ఇప్పుడు ధృవీకరిస్తున్నాం’ అని ఇజ్రాయిల్ ఆర్మీ ఎక్స్‌లో తెలిపింది. కాగా అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి మహ్మద్ డెయిఫే ప్రధాన సూత్రధారిగా ఇజ్రాయిల్ భావిస్తోంది.అయితే హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా ఇరాన్లో దారుణ హత్యకు గురైన మరుసటి రోజే ఇజ్రాయిల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియాతోపాటు సెక్యూరిటీ గార్డ్ సైతం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఇరాన్ ఆరోపిస్తుంది.ఇక జూలైలో ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయిల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 90 మంది మృతి చెందారు. మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్, మరో కీలక కమాండర్ రఫా సలామాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఆరోజు వీరు మరణించినట్లు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వీరిని హతం చేసినట్లు నిర్ధారించింది.ఎవరీ మహ్మద్ డెయిఫ్ గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ జరిపిన భారీ వైమానిక దాడి వెనక మహ్మద్ డెయిఫ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఈ మరణకాండలో ఇజ్రాయిల్‌కు చెందిన 1200 మంది మరణించారు. దాదాపు 250 మందిని హమాస్ తమ వద్ద బందీలుగా పట్టుకుంది. ఈ ఘటనే ఇజ్రాయెల్-హమాస్‌ల యుద్ధానికి దారితీసింది. డెయిఫ్ ఏళ్లుగా ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో 1965లో డెయిఫ్ జన్మించాడు. పూర్తి పేరు మహమ్మద్ డియాబ్ ఇబ్రహీం అల్ మస్రీ. 1980ల చివర్లో హమాస్‌లో చేరాడు. డెయిఫ్ హమాస్ మిలిటరీ యూనిట్ ‘అల్ కస్సం బ్రిగేడ్’లో పనిచేశాడు. హమాస్ బాంబుల తయారీ నిపుణుడు అయ్యాష్‌కు సన్నిహితుడు. అతడు ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమయ్యాక.. 2002లో హమాస్‌లోని మిలిటరీ వింగ్ బాధ్యతలు డెయిఫ్ చేపట్టాడు.హమాస్ వాడే ‘కస్సాం’ రాకెట్ల తయారీ వెనుక కీలక పాత్ర పోషించాడు. ఇజ్రాయెల్ దళాలకు తలనొప్పిగా మారిన గాజా టన్నెల్ నెట్వర్క్ నిర్మాణం వెనుక మాస్టర్ మైండ్ కూడా ఇతడే. ఇజ్రాయెల్ దళాలకు చిక్కకుండా ఎక్కువ సమయం ఆ సొరంగాల్లోనే గడుపుతాడని సమాచారం. ఇప్పటి వరకు డెయిఫ్‌పై ఇజ్రాయెల్ దళాలు ఏడుసార్లు దాడులు చేయగా ప్రతిసారీ తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షానికి రూపకర్త కావడంతో మరోసారి కోసం తీవ్రంగా జల్లెడ పట్టిన ఇజ్రాయెల్.. ఎట్టకేలకు అతడిని హతమార్చింది. -
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...!
గాజా నగరం. జనవరి మాసం. రాత్రి 10 గంటలు. ఎముకలు కొరికే చలి. ఇజ్రాయేల్ దాడులతో బాంబుల మోత మోగిపోతోంది. 34 ఏళ్ల ఆలా అల్ నిమర్. అప్పటికే నిండు గర్భిణి. నడిరోడ్డు మీద పురిటినొప్పులు పడుతోంది. నేపథ్యంలో దూరంగా బాంబుల మోతలు. అంబులెన్స్‌కు కాల్ చేయడానికి నెట్వర్క్ లేదు. ట్యాక్సీ కోసం వెళ్లిన భర్త అబ్దుల్లా ఇంకా తిరిగి రాలేదు. ‘ఎలాగైనా నేను ఆస్పత్రికి చేరుకున్నాకే ప్రసవించేలా చూడు తండ్రీ’ అన్న ఆలా వేడుకోళ్లు ఫలించలేదు. దాంతో నిస్సహాయురాలిగా రోడ్డు మీదే ప్రసవించింది. ట్యాక్సీ దొరక్క వెనక్కి పరుగెత్తుకొచ్చిన భర్త నెత్తుటి కూనను చేతుల్లోకి తీసుకున్నాడు. బొడ్డుతాడు కత్తిరించేందుకు కూడా ఏమీ లేదు. సోదరుడు తెచి్చన మెడికల్ కిట్‌లో ఉన్న కత్తెరతో బొడ్డుతాడు కత్తిరించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎట్టకేలకు ఓ కారు దొరికినా పెట్రోల్ అయిపోవడంతో అదీ ఆగిపోయింది. భర్త, సోదరుడు మొబైల్ ఫ్లాష్ లైట్‌తో దారి చూపుతుంటే పసికందును స్వెటర్లో చుట్టుకుని రక్తమోడుతూ గంటసేపు నడిచిందా పచ్చి బాలింత. దారంతా ‘హెల్ప్ హెల్ప్’ అని అరుస్తూనే ఉన్నారంతా. ఎట్టకేలకు ఓ మినీ బస్సు వారిని ఆస్పత్రి చేర్చింది. అప్పటికీ విపరీతమైన ని్రస్తాణతో ఆలా కళ్లు మూతలు పడ్డాయి. తెల్లవారి గానీ స్పృహలోకి రాలేదు. వెంటనే బిడ్డ కోసం తడుముకుంది. పాపాయి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పాక గానీ కుదుట పడలేదు. యుద్ధం మొదలయ్యాక అదే ఆమెకు అత్యంత సంతోషాన్నిచి్చన ఉదయం. పది నెలలు.. పదకొండు దాడులు... ఇది ఒక ఘటన మాత్రమే. గత అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన నాటినుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు. తల్లిదండ్రులను పోగొట్టు్టకుని అనాథలైన పిల్లలు. కళ్లముందే పిల్లలు మరణిస్తుంటే నిస్సహాయంగా చూసిన వృద్ధులు. తను ప్రసవించే నాటికన్నా యుద్ధం ఆగిపోవాలనిదేవుడుని వేడుకుంది ఆలా. అలా జరగకపోయినా నడి రోడ్డుపైనే ఈ లోకంలోకి వచి్చన తన చిన్నారి నిమాకు మాత్రం ఇప్పుడు ఆర్నెల్లు నిండాయి. నిమా ఆమెకు మూడో సంతానం. ముగ్గురు పిల్లలకు సరైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాననే బాధ ఆలాను వెంటాడుతోంది. పిల్లలకు రోజుకు కనీసం ఒక్క రొట్టె దొరకడమే గగనంగా ఉంది. పూటకు పావు రొట్టెతో సరిపుచ్చుకుని అర్ధాకలితోనే పడుకుంటున్నారు. యుద్ధం మొదలవగానే గాజాలోని జైటౌన్లో ఉన్న ఆలా ఇంటిపై తొలి దాడి జరిగింది. దాంతో బంధువుల ఇంటికి వెళ్లారు. అదీ బాంబు దాడులకు బలవడంతో పొరుగు వాళ్ల ఇళ్లకు. అలా ఈ పది నెలల్లో ఆలా కుటుంబం ఏకంగా పదకొండు బాంబుదాడులు తప్పించుకుంది. కాకపోతే అన్నిసార్లూ నిరాశ్రయమవుతూ వచి్చంది. ఆలా ఎనిమిది నెలల గర్భవతిగా ఉండగా ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు వారుంటున్న ఇంటిని చుట్టుముట్టాయి. అప్పుడు ఆలా కుటుంబంతో పాటు 25 మంది దాకా ఇంట్లో ఉన్నారు. కేవలం దైవకృప వల్లే ఆ దాడి నుంచి బతికి బట్ట కట్టామని గుర్తు చేసుకున్నారామె. నెలకే మరో బాంబుదాడి ఆమె 26 ఏళ్ల సోదరుడిని పొట్టన పెట్టుకుంది. ‘చీకటి రోజుల్లో మాత్రం ఆశల గానాలు ఉండవా!? ఉంటాయి. కాకపోతే చీకటిరోజుల గురించే ఉంటాయి’ అన్నారో ఫ్రెంచ్ నాటకకర్త. ఇంతటి యుద్ధ మధ్యంలో, అంతులేని విషాదాల పరంపరలో ఆలా కుటుంబాన్ని నడిపిస్తున్నది ఒకే ఒక్కటి.. చిన్నారి నిమా బోసినవ్వులు... 39,324 మంది మృతి... గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటివరకు 39,324 మంది మరణించారు. 90,830 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో 66 మంది మృతి చెందారు. 241 మంది గాయపడ్డారు. అక్టోబ రు 7న హమాస్ నేతృత్వంలోని దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,139 మంది మరణించడం, అది యుద్ధానికి దారితీయడం తెలిసిందే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజాలో స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 31 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్-అల్-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు ఇచ్చిన కొద్దిసేపటికే స్కూల్లోని ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిసింది. ఇది కాక మరో దాడిలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దాడుల ప్రభావంతో ఖాన్ యూనిస్ నగరం నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వెళుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తమ దేశంపై దాడి చేసినందుకు ప్రతీకారంగా అప్పటి నుంచి హమాస్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. -
గాజాపై ఇజ్రాయెల్ దాడులు అనాగరికం: ప్రియాంకా గాంధీ
ఢిల్లీ: గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. గాజా విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ తీరును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని ఆమె ఎక్స్ వేదికగా శుక్రవారం పిలుపునిచ్చారు.‘ఇజ్రాయెల్ పౌరులు కూడా హింస, ద్వేషాన్ని నమ్మరు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలి. ఇది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఇజ్రాయెల్ చర్యలు ఆమోదించదగినవి కావు. గాజాలో జరుగుతున్న భయంకరమైన మారణహోమం అందరూ ఖండించాలి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అనాగరికం. గాజాపై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని అనాగారికత, నాగరికత మధ్య ఘర్షణ అని అంటున్నారు. కానీ, ఆయన, ఆయన ప్రభుత్వమే చాలా అనాగరికమైంది’అని ప్రియాంకా గాంధీ అన్నారు.గత పది నెలల నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరివేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై యుద్దం చేస్తోంది. ఇప్పటివరకు 40 వేల మంది గాజా పౌరులు మృతి చెందారు. ప్రపంచంలోని పలు దేశాలు కాల్పుల విరమణ చేపట్టలాని కోరుతున్నా.. అమెరికా పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం గాజాపై యుద్ధాన్ని సమర్ధించుకోవటం గమనార్హం. -
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 15 మంది మృతి
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గాజా పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడి ప్రజలకు తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి.తాజాగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 15 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది. నెతన్యాహు యూఎస్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణపై చర్చ కూడా జరగనుంది.మరోవైపు గాజాలో పోలియో వైరస్ మరింతగా విస్తరిస్తోంది. గాజాలోని ప్రజలకు పారిశుద్ధ్య సేవలు కూడా అందడం లేదు. సెంట్రల్ గాజాలోని బురెజ్ శరణార్థుల శిబిరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది మృతిచెందారు. గాజా నగరాన్ని ఖాళీ చేసి దక్షిణం వైపు తరలివెళ్లాలని పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ సైన్యం గతంలోనే ఆదేశాలు జారీచేసింది. -
Israel-Hamas war: మృత్యుంజయుడు!
దెయిర్ అల్ బలా: మాటలకందని గాజా విషాదం కొన్ని అవాంఛిత అద్భుతాలకూ వేదికగా మారుతోంది. సెంట్రల్ గాజాలోని నజరేత్ సమీపంలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ భారీగా దాడుల్లో 24 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఓలా అద్నాన్ హర్బ్ అల్కుర్ద్ అనే 9 నెలల నిండు గర్భిణి కుటుంబమూ ఉంది. ఆ ఇంట్లో ఆరుగురు దాడికి బలవగా ఆమె తీవ్రంగా గాయపడింది. దాంతో హుటాహుటిన అల్ అవ్దా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయతి్నంచినా గాయాల తీవ్రతకు తాళలేక అద్నాన్ కన్నుమూసింది. కానీ కడుపులోని బిడ్డ మాత్రం బతికే ఉన్నట్టు వైద్యులకు అనుమానం వచి్చంది. అల్ట్రా సౌండ్ చేసి చూడగా చిన్నారి గుండె కొట్టుకుంటున్నట్టు తేలింది. దాంతో హుటాహుటిన సిజేరియన్ చేశారు. పండంటి మగ బిడ్డను విజయవంతంగా కాపాడారు. మృత్యుంజయునిగా నిలిచిన అతనికి మలేక్ యాసిన్ అని పేరు పెట్టినట్టు సర్జన్ అక్రం హుసేన్ తెలిపారు. చిన్నారి శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్ అందించారు. పరిస్థితి కాస్త మెరుగు పడగానే ఇంక్యుబేటర్‌లో ఉంచి హుటాహుటిన దెయిర్ అల్ బలాలోని అల్ అక్సా ఆస్పత్రికి తరలించారు. -
హృదయ విదారకం.. ఆ తల్లికి పురిటినొప్పి బాధల్లేవ్!
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి.. పురిటినొప్పులు పడని స్థితిలో ఉన్న తన తల్లి గర్భం చీల్చుకుని బయటకు వచ్చాడు. ఎందుకంటే.. అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది కాబట్టి. ఇదొక్క సంఘటనే కాదు.. 9 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇలాంటి విషాదకర దృశ్యాలెన్నో. హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ తాజాగా గాజాలో ఓ ఆస్పత్రిపై దాడులు జరిపింది. అక్కడ ప్రసవానికి సిద్ధంగా ఉన్న నిండు గర్భిణీ అయిన ఒలా అద్నన్ హర్బ్ అల్ కుర్ద్ తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలోనే ఆమె కన్నుమూసింది. అయితే.. https://t.co/LpqLJTuEpp #unido #hostages #ceasefire Gaza hospital says newborn saved from dead mother's wombHe was placed in an incubator and transferred to Al-Aqsa Hospital in Deir el-Balah.— chemTrailActivist (@chemTrailActivi) July 20, 2024వైద్యులకు ఆల్ట్రాసౌండ్లో కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినిపించింది. దీంతో.. అత్యవసరంగా ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటకు తీశారు. ఆ బిడ్డ బతకదని వైద్యులు తొలుత భావించారట. ఇంక్యూబేటర్లో పెట్టి డీర్ ఎల్-బలాహ్లోని మరో ఆస్పత్రికి తరలించారట. కానీ, ఏదో అద్భుతం జరిగినట్లు కోలుకుంటున్నాడని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కోలుకున్నాక వలంటీర్లకు ఆ బిడ్డను అప్పజెప్తామని తెలిపారు వాళ్లు. యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. -
గాజా: స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజా పట్టణంలో ఉన్న స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం(జులై 15) సెంట్రల్ గాజాలోని అబు అరబన్ ప్రాంతంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఈ దాడిలో స్కూలులో ఆశ్రయం పొందుతున్న గాజా వాసులు 15 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన గాజా వాసులు వేలాది మంది అబు అరబన్ స్కూల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో గాజా వాసులు ఆశ్రయం పొందుతున్న స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇది ఐదోసారి. ఈ దాడిపై ఇజ్రాయెల్ స్పందించింది. అబు అరబన్ స్కూల్ కేంద్రంగా ఇజ్రాయెల్ సైన్యంపై దాడులు జరుగుతున్నందునే తాము టార్గెట్ చేశామని తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగి వందలాదిమందిని చంపింది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. -
Israel-Hamas war: ఆగని దారుణ దాడులు
డెయిర్ అల్ బాలాహ్: గాజా భూతలంపై ఇజ్రాయెల్ గగనతల దాడులు ఆగట్లేవు. వరసగా రెండో రోజైన బుధవారం తెల్లవారుజామున సైతం సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్ బాలాహ్ పట్టణంపై ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడింది. ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించిన ‘సేఫ్ జోన్’లో తలదాచుకుంటున్న వారిపైనా దాడులు చేసింది. దీంతో ఈ దాడుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలుసహా 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. నుసేరాత్ శరణార్థి శిబిరంపై దాడిలో ఐదుగురు చిన్నారులుసహా 12 మంది చనిపోయారని అల్–అల్సా స్మారక ఆస్పత్రి ప్రకటించింది. డెయిర్ అల్ బాలాహ్ పట్టణంలోని మరో ఇంటిపై జరిగిన దాడిలో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు, నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రెండు ఇళ్లు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించిన ‘మానవతా రక్షిత ప్రాంతం’లో ఉండటం గమనార్హం. దోహాలో అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తులు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు కోసం సంధి ప్రయత్నాలు చేస్తున్నవేళ ఈ దాడులు జరగడం గమనార్హం. గాజా సిటీని ఖాళీచేయాలంటూ బుధవారం ఇజ్రాయెల్ ఆకాశం నుంచి కరపత్రాలను వెదజల్లింది. హమాస్ మిలిటెంట్లు మళ్లీ గాజాసిటీలో ఎక్కువవడంతో వారి నిర్మూలనే లక్ష్యంగా సాధారణ ప్రజలు నగరాన్ని ఖాళీచేసి దక్షిణంవైపు తరలిపోవాలని ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. -
నాలుగో రోజూ గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 27 మంది మృతి
ఇజ్రాయెల్ తన దాడులతో గాజాపై మరోమారు విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని పాలస్తీనా భూభాగంలోగల ఒక పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఈ దాడులలో 27 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు పాలస్తీనియన్లు ఈ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.నాలుగు రోజులుగా గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌కు సమీపంలోని అబాసన్‌లోని అల్-అవ్దా పాఠశాల గేట్ వద్ద ఈ దాడి జరిగింది. గతంలో జరిగిన మూడు దాడులకు తామే బాధ్యులమంటూ ఇజ్రాయెల్ పేర్కొంది. పాఠశాలలో దాక్కున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మూడు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే సైనిక అవసరాల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు ఇతర పౌర సౌకర్యాలను ఉపయోగిస్తున్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది. -
గాజా సంక్షోభంలో కీలక పరిణామం
వేల ప్రాణాలు బలిగొని.. లక్షల మందిని నిరాశ్రయులిగా మార్చేసి.. తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న గాజా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన హమాస్.. ఇప్పుడు ఇజ్రాయెల్ బందీల విడుదల చర్చలకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. ‘‘తొలి దశ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మా దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయిలను విడుదల చేస్తాం. అయితే ఒప్పందంలోకి ప్రవేశించేముందు ఒక షరతు. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ తప్పకుండా సంతకం చేయాలి’’ అని హమాస్ సీనియర్ కమాండర్ ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ కథనం ఇచ్చింది. మరోవైపు.. ఇజ్రాయెల్ ఓ అడుగు ముందుకు వేస్తే గాజా యుద్ధానికి తెర పడుతుందని ఇజ్రాయెల్-హమాస్ మధ్య దౌత్యం వహిస్తున్న పాలస్తీనా అధికారి ఒకరు తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందం ఇదే.. మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రూపొందించిన ఈ ప్రతిపాదనలో తాత్కాలిక కాల్పుల విరమణ, మానవతా సాయానికి అనుమతి, ఒప్పందంలో రెండో దశలోకి ప్రవేశించేంత దాకా ఇజ్రాయెల్ తన బలగాల్ని వెనక్కి తీసుకోవడం లాంటి అంశాలున్నాయి. దీంతో ఇజ్రాయెల్, హమాస్ తాజా ప్రతిపాదనకు ఎలా స్పందిస్తుందో చూడాలి. అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్ దక్షిణ సరిహద్దులోని నగరాలపై అన్ని మార్గాల నుంచి మీదుగా దాడులకు దిగడం.. ప్రతిగా గాజాపైకి ఇజ్రాయెల్ రక్షణ దళం దండెత్తడంతో ఈ సంక్షోభం మొదలైంది. గాజాలో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ బలగాలకు దాడులకు 38వేల మంది చనిపోయారు. సురక్షిత ప్రాంతాల పేరిట లక్షల మంది వలసలు వెళ్లారు. గాజా యుద్ధం ముగిసేందుకు.. ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి మళ్లేందుకు ఎలాంటి ఒప్పందానికైనా సిద్ధమని హమాస్ ప్రకటించింది. అయితే హమాస్‌ను శాశ్వతంగా తుడిచిపెట్టేంతదాకా యుద్ధం ఆపేది లేదని, కావాలంటే తాతల్కాలిక విరామం మాత్రమే ఉంటుందని చెబుతోంది. -
ఖాన్ యూనిస్‌ను వెంటనే ఖాళీ చేయండి.. ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భారీగా దాడులకు పాల్పడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ గాజాలోని రెండో అతిపెద్ద నగం అయిన ఖాన్ యూనిస్‌లో దాడుల స్థాయిని పెంచనున్నట్ల సమాచారం. ఈ మేరకు ఖాన్ యూనిస్‌లో ఉండే పాలస్తీనియన్లు వెంటనే ఖాళీ చేయాలని సోమవారం ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది పాస్తీనియన్లు ఇతర ప్రాంతాకు తరలివెళ్తుతున్నారు. దీంతో ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ ఆస్పత్రిలోని పేషెంట్లను సైతం ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలిస్తున్నారు. గతవారం ఉత్తర గాజాలోని షెజాయా నగరంలో ప్రజలకును ఖాళీ చేయమన్న ఇజ్రాయెల్ ఆర్మీ.. ఐదో రోజు కూడా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. దక్షిణ రఫా ప్రాంతంలో జరిగన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు మృతి చెందాడు.హమాస్‌ను అంతం చేసే దశలో ఇజ్రాయెల్ పురోగతి సాధింస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నాడు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా దాడుల తీవ్రత పెంచాలని ఆర్మీకి సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖాన్ యూనిస్‌లో మళ్లీ దాడులకు ఇజ్రాయెల్ ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ మిలిటెంట్లను అంతం చేయటంలో భాగంగా ఈ ఏడాది మొదట్లో ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉండే పాలస్తీనా ప్రజలు దక్షిణ గాజా నగరమైన రఫాకు తరలివెళ్లారు.అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1200 మృతి చెందగా.. 251 మందిని బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హామాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై విరచుకుపడుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పవరకు 37,900 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.చదవండి: ట్రంప్ విషయంలో కోర్టు తీర్పు ఎంతో ప్రమాదకరం: బైడెన్ -
హమాస్‌కు ఎదురు దెబ్బ.. ఇజ్రాయెల్ మెరుపు దాడిలో
హమాస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్‌కు చీఫ్ ఇస్మాయిల్ హనియే సోదరితో సహా అతని 10 మంది కుటుంబ సభ్యులు మరణించారని గాజా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని అల్ షాతీ శరణార్థి శిబిరంలోని హనియే నివాసంపై దాడి జరిగిందని హమాస్ పాలిత ప్రాంతం పౌర రక్షణ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు. శిథిలాల కింద అనేక మృతదేహాలు ఇంకా ఉన్నాయని, అయితే వాటిని వెలికితీసేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవని ఆయన అన్నారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది మృతదేహాలను సమీపంలోని గాజా సిటీలోని అల్ అహ్లీ ఆసుపత్రికి తరలించారు.దాడిలో చాలామంది గాయపడినట్లు నివేదించారు.కాగా,గాజాలో ఈద్ వేడుకల నుండి తిరిగి వస్తున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే పిల్లలు, మనవళ్లతో సహా 14 మంది చనిపోయారు. -
Israel-Hamas war: గాజాపై దాడులు... 42 మంది దుర్మరణం
ఖాన్ యూనిస్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. షతీ శరణార్థుల శిబిరం, పొరుగునున్న తుఫాపై శుక్ర, శనివారాల్లో జరిగిన దాడుల్లో కనీసం 42 మంది దుర్మరణం పాలైనట్టు పాలస్తీనా మీడియా విభాగం పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైన నాటినుంచి గాజాలో మృతుల సంఖ్య 37,500 దాటింది. దాదాపు లక్ష మంది దాకా గాయపడ్డారు’’ అని వివరించింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు పశ్చిమ రఫాలోకి మరింతగా చొచ్చుకొస్తున్నాయి. పైనుంచి యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు, గత అక్టోబర్ నుంచి నిరంతరాయంగా జరుగుతున్న దాడుల దెబ్బకు గాజాలో ఆరోగ్య వ్యవస్థ నేలమట్టమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్త ప్రకటించింది. ‘‘ఇప్పటిదాకా కనీసం 9,300 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బందీలుగా పట్టుకుంది. వారితో అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తోంది’’ అని పాలస్తీనా శనివారం ఆరోపించింది. -
‘గాజా యుద్ధ ముగింపునకు అత్యుత్తమ మార్గమిదే!’
వాషింగ్టన్: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో నిత్యనరకం చూస్తున్న ఇస్లాం పౌరులు.. ఇకనైనా ప్రశాంతంగా జీవించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముగిస్తేనే అది సాధ్యపడుతుంది. అందుకు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఉల్లంఘన ఒప్పందం ఒక్కటే అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం బక్రీద్(Eid ul Adha) సందేశం విడుదల చేశారు. ‘‘గాజా యుద్ధంతో ఎందరో అమాయకులు చనిపోయారు. అందులో వేల మంది చిన్నారులు ఉన్నారు. తమ కళ్ల ముందే తమ వాళ్లను పొగొట్టుకుని.. సొంత ప్రాంతాల నుంచి పారిపోయిన ముస్లింలు ఇంకెందరో. వాళ్ల బాధ అపారమైంది.. .. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. గాజాలో హింసకు ముగింపు పలకాలన్నా.. అంతిమంగా యుద్దం ముగిసిపోవాలన్నా ఇదే అత్యుత్తమ మార్గం అని బైడెన్ తన సందేశంలో స్పష్టం చేశారు.అంతేకాదు.. మయన్మార్‌లో రోహింగ్యాలు, చైనాలో ఉయిగర్లు.. ఇలా ఇతర ముస్లిం తెగల హక్కుల పరిరక్షణ కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. అలాగే.. సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగింపునకు శాంతిపూర్వకం తీర్మానం రూపకల్పన దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలిపారాయన. తన పరిపాలన ఇస్లామోఫోబోబియా, ఇతరత్ర రూపాల్లో ఉన్న పక్షపాత ధోరణిని ఎదుర్కొనేందుకు జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తోందని.. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా అరబ్, సిక్కు, దక్షిణాసియా అమెరికన్లపై కూడా ప్రభావం చూపెడుతుందని తన బక్రీద్ సందేశంలో బైడెన్ పేర్కొన్నారు.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే.. మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి. -
గాజాలో భారీ పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో యుద్ధం కొనసాగుతోంది. దక్షిణ గాజాలో చోటు చోసుకున్న పేలుడులో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దక్షిణ గాజాలోని రఫా నగరానికి సమీపంలో ఇజ్రాయెల్ సైనికులు ప్రయాణిస్తున్న నేమర్ వాహనం పేలటంతో ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.ఈ పేలుడు భారిగా సంభవించడంతో వాహనం పూర్తిగా దగ్ధం అయిదని, అదే విధంగా మృత దేహాలను గుర్తించటంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఎవరు జరిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే ఆ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు పేలుడు పరికరం అమర్చా? లేదా యాంటీ ట్యాంక్ మిసైల్‌ను నేరుగా ప్రయోగించారా? అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.❗🇵🇸⚔️🇮🇱 - An explosion in Rafah in southern Gaza killed eight Israeli soldiers in a Namer armored combat engineering vehicle, raising the Israel Defense Forces (IDF) death toll to 307 in the ground offensive against Hamas and operations throughout from the Gaza border. The… pic.twitter.com/5e1tiV6Hgb— 🔥🗞The Informant (@theinformant_x) June 15, 2024 శనివారం జరిగిన పేలుడులో 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందటం భారీ నష్టమని తెలిపారు. ఇక.. ఇప్పటివరకు 306 మంది ఇజాయెల్ సైనికులు మృతి చెందారని అన్నారు. మృతి చెందిన సైనికులకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాళులు అర్పించారు. సైనికుల భారీ నష్టంతో తన హృదయం ముక్కలైందని అన్నారు. అస్థిరమైన పరిస్థితులు నెలకొన్నా.. భారీ నష్టం జరిగినా యుద్ధ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. -
UNSC: బైడెన్ తీర్మానాన్ని స్వాగతించిన హమాస్
న్యూయార్క్: గాజా యుద్ధంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమతి భద్రతామండలిలో అగ్రరాజ్యం అమెరికా సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రష్యా మినహా మిగతా 14 భద్రతా మండలి సభ్య దేశాలు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని హమాస్ స్వాగతించింది. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు అమలు చేసే ప్రణాళికకు మద్దుతుగా ఉంటామని, అది కూడా పాలస్తీనా ప్రజలకు డిమాండ్లకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నామని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.మే 31న ఇజ్రాయెల్ చొరవతో మూడు దశల కాల్పుల విరమణ ప్రణాళికను రూపొందించినట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ‘ఈ రోజు మేము శాంతి కోసం ఓటు వేశాం’ అని ఐరాసలో యూఎస్ అంబాసిడర్ లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అన్నారు. ఇక ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది. హమాస్ కూడా ఈ తీర్మానాన్ని అంగీకరించాలని కోరింది. హమాస్, పాలస్తీనా మధ్య అంతర్జాతీయంగా కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాలు అంగీకరించనట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి శాంతి ఒప్పదం కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు అంతర్జాతీయ నేతలతో సమావేశం అయిన అనంతరం ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. ఇక.. ఈ తీర్మాణంపై రష్యా విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్ నుంచి వివరణాత్మక ఒప్పందాలు లేకపోవడాన్ని రష్యా ఎత్తిచూపింది. తీర్మానం ప్రకారం.. కాల్పుల విరణమ ప్రణాళిక మూడు దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడితో కూడిన కాల్పుల విరమణ ఉంటుంది. రెండో దశలో ఇరుపక్షాలు శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పలకాలి. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. మూడో దశలో గాజా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టే ప్రణాళికను అమలు చేయటం జరుగుతుంది. -
ఇజ్రాయెల్ ప్రధానికి షాక్.. వార్ కేబినెట్ మంత్రి రాజీనామా
హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులను తీవ్రం చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ వార్ కేబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. గాజాపై యుద్ధం చేయాలని దేశీయంగా వస్తున్న ఒత్తిడి కారణంగానే ఆయన నెతన్యాహు ప్రభుత్వం నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. యుద్ధం అనంతర ప్రణాళికను ప్రధాని నెతన్యాహు ఆమెదించపోవటం వల్లనే తాను రాజీనామా చేసినట్ల బెన్నీ గాంట్జ్ తెలిపారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న 8 నెలల యుద్ధ కాలంలో బెన్నీ గాంట్జ్ రాజీనామా ద్వారా నెతన్యాహుకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో నెతన్యాహు రైట్ వింగ్ పార్టీలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు.గాంట్జ్‌కు చెందిన ఇజ్రాయెల్ రెసిలెన్స్ పార్టీలోని మరో నేత గాడి ఐసెన్‌కోట్ వార్ కేబినెట్ నుంచి వైదోలిగారు. దీంలో కీలకమైన వార్ కేబినెట్లో ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు. వార్ కేబినెట్.. హమాస్‌పై చేస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యానికి ఆదేశాలు ఇవ్వటంలో కీలకమైన నిర్ణయలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.‘ప్రధాని నెతన్యాహు మమ్మల్ని నిజమైన విజయం వైపు వెళ్లనివ్వకుండా అడ్డకుంటున్నారు. అందుకే భరమైన హృదయంలో ఎమర్జెన్సీ కేబినెట్ నుంచి వైదొలుగుతున్నాం’ అని గాంట్జ్ అన్నారు. గాంట్జ్ రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.‘బెన్ని..యుద్ధాన్ని విడిచిపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఇది బలగాలను ముందుడి నడిపించే సమయం. రాజీనామా చేయోద్దని కోరుతున్నా’అని అన్నారు. కీలకమైన సమయంలో ఇంకా బంధీలను హమాస్ చెరనుంచి విడుదల కాకముందే ఇలా గాంట్జ్ రాజీనామా చేయటంపై నెతన్యాహు రైట్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
హమాస్ చెరలో బందీలుగా.. నలుగురిని కాపాడిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ -హమాస్ ఒప్పందం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న నలుగురు పౌరులను ఇజ్రాయెల్ సైన్యం సురక్షితంగా కాపాడింది. నుసిరత్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి..వారిని రక్షించినట్లు తెలిపింది.గత ఏడాది అక్టోబరులో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. నవంబర్‌లో కాల్పుల విరమణ సమయంలో దాదాపు సగం మంది విడుదలయ్యారు. ఇంకా 130 మందికిపైగా బందీలుగా ఉన్నారని తెలుస్తోంది.తాజాగా ఇజ్రాయెల్ సైన్యం హమాస్ చెరలో బంధీలుగా ఉన్న నోవా అర్గమణి, అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్‌లను రక్షించింది. గతేడాది అక్టోబరు 7న హమాస్ దాడి కారణంగా గాజాలో ఎనిమిది నెలల పాటు జరిగిన విధ్వంసకర యుద్ధం తర్వాత, హమాస్ ఉగ్రవాదులు అపహరించిన దాదాపు 250 మంది బందీలలో 116 మంది పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో మిగిలిపోయారు. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం వీరిలో కనీసం 40 మంది మరణించినట్లు సమాచారం. -
ప్రపంచాన్ని నిలదీస్తున్న యువత
పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ అమెరికాలోని నూటయాభై విశ్వవిద్యాలయలలో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఏప్రిల్ 2024లో కొనసాగిన నిరసన కార్యక్రమాల్లో బోధన–బోధనేతర ఉద్యోగులు కూడా విద్యార్థులతో పాటు భాగస్వాములయ్యారు. ఇందులో హార్వర్డ్, బర్రత్ హాల్, కొలంబియా, ప్రిన్స్టన్, న్యూయార్క్, యేల్ వంటి అన్ని అమెరికన్ యూనివర్సిటీల విద్యార్థులున్నారు. అయితే నిరసనలో చురుకుగా పాల్గొన్న పదమూడు మంది విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ డిగ్రీలివ్వకుండా ఆపేసింది. ‘గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలకు విద్యార్థులందరూ హాజరు కావచ్చు, కానీ, డిగ్రీలు రద్దయిన ఆ పదమూడు మందికి పట్టా ఇవ్వబడదు’– అని యూనివర్సిటీ ప్రకటించింది. నిరసన సెగలకు తట్టుకోలేక, కొన్ని యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లు వాయిదా వేసుకున్నాయి. కొన్ని మాత్రం నిర్వహించుకున్నాయి. నిర్వహించుకున్న వాటిలో హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒకటి. గాజా మీద దాడులు ఆపాల్సిందిగా, పాలస్తీనాను రక్షించాల్సిందిగా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం విద్యార్థులు కోరారు. తమ తమ క్లాసురూముల్లో నుండి ఆడిటోరియంలోని వేదిక మీదికి ఒక్కొక్కరుగా వరుస క్రమంలో క్రమశిక్షణతో నడిచి వస్తూ ‘ఫ్రీ గాజా నౌ’ ‘ఫ్రీ పాలస్తీనా నౌ’–గాజాకు స్వేచ్ఛనివ్వండి! పాలస్తీనాకు స్వేచ్ఛనివ్వండి! అని రాసి ఉన్న గుడ్డ, పేపర్ బేనర్లను ప్రదర్శిస్తూ వేదిక మీదకు నడిచివెళ్లారు. డిగ్రీలు తీసుకున్నారు. డిగ్రీ తీసుకున్న విద్యార్థుల నుండి కొందరికి మాట్లాడే అవకాశం ఇస్తారు. అలా మాట్లాడే వారిని విద్యార్థులే ఎన్నుకుంటారు. ఆ అవకాశం దక్కించుకుంది భారతీయ–అమెరికన్ విద్యార్థిని శ్రుతీ కుమార్. ఆమె ప్రసంగంలోని సారాంశం ఇలా ఉంది: ‘‘నేను తీవ్రంగా నిరాశ చెందాను. ఈ కేంపస్‌లో భావ వ్యక్తీకరణను శిక్షించడం జరిగింది. శాసనోల్లంఘన జరిగిందని శిక్షించడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ ఎక్కడున్నాయి? పదిహేను వందలమంది విద్యార్థులు మాట్లాడారు. పిటిషన్లు సమర్పించారు. ఐదు వందల మంది అధ్యాపకులు మాట్లాడారు. మా ఆక్రోశం, మా ఆవేదన హార్వర్డ్– నీకు వినిపిస్తోందా?గాజాలో జరుగుతున్న సంఘటనలతో మనం మన సమాజంలో నిలువుగా బలంగా విడిపొయ్యాం! మనకు తెలియని వారిలోని మానవత్వాన్ని మనం గుర్తించలేమా? మనకు భేదాభిప్రాయాలు ఉన్నంతమాత్రాన వారి వేదననూ, నొప్పినీ అర్థం చేసుకోలేమా? గాజాలో జరుగుతున్న మారణకాండను మేమెవ్వరం సమర్థించడం లేదు. భావ ప్రకటన, సంఘీ భావ ప్రకటన ఈ కేంపస్‌లో శిక్షలకు గురయ్యాయి. ఈ సెమిస్టర్లో ఈసారి నా పదమూడు మంది సహ విద్యార్థులకు డిగ్రీలు అందడం లేదు. వారు మాతో పాటు పట్టభద్రులు కాలేకపోతున్నారు. శాసనోల్లంఘన జరిగిందని– ఉద్యమిస్తున్న విద్యార్థుల పట్ల యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం మా విద్యార్థి లోకాన్ని ఎంతగానో బాధించింది. ఇంకా చెప్పాలంటే నలుపు, చామనచాయ చర్మం గల నాలాంటి విద్యార్థినీ విద్యార్థులకు ఇక్కడ వ్యక్తిగత భద్రత లేదు. మా పట్ల ఎందుకీ అసహనం? ఎందుకీ అణచివేత? హార్వర్డ్! మా మాటలు నీకు వినిపిస్తున్నాయా?’’అమెరికాలోని నిబ్రాస్కాలో పుట్టి పెరిగిన ఇరవైయేళ్ళ యువతి శ్రుతీ కుమార్, తన పదినిముషాల ప్రసంగంతో ప్రపంచాన్ని కదిలించింది. తన తోటి విద్యార్థులకు పట్టాలు రాకపోవడం పట్ల ఆవేదన తెలియజేస్తూ– గాజాపై జరుగుతున్న దాడుల గూర్చీ, నల్లచర్మం ఆధారంగా సాగుతున్న జాతి వివక్ష గూర్చీ ఆక్రోశిస్తూ మాట్లాడిన మాటలకు హార్వర్డ్ యూనివర్సిటీ ఆడిటోరియంలో, ఆడిటోరియం బయట ఉన్న వేలమంది, వేదిక మీద ఉన్న అధ్యాపకులతో సహా– అందరికందరూ లేచి నిలబడి కాంపస్ దద్దరిల్లిపోయేట్లు చప్పట్లు చరిచారు. ‘హార్వర్డ్ నీకు వినిపిస్తోందా?’ అని గద్గద స్వరంతో ఆమె ఆక్రోశించినపుడల్లా విద్యార్థులు పెద్దఎత్తున చప్పట్లు చరిచి ఆమెకు తమ సంఘీభావం తెలియజేశారు. అయితే ఆ ఆవేదన, ఆ ఆక్రందన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రాంగణానికే పరిమితం కాలేదు. ‘ప్రపంచమా! నీకు మా ఆక్రోశం, ఆవేదన వినిపిస్తోందా?– అని యువతరం ప్రశ్నిస్తున్నట్టు ప్రపంచ శ్రోతలకు అనిపించింది.సంఘసేవ పట్ల ఆసక్తి గల శ్రుతీ కుమార్, డాక్టర్ కోర్సును వదులుకుని, వైజ్ఞానిక శాస్త్ర చరిత్ర, ఆర్థిక శాస్త్రం చదువుకుని పట్టా సాధించారు. తమిళనాడు నుండి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ దక్షిణ భారత సంప్రదాయ కుటుంబం వారిది. మనదేశంలోనూ విద్యార్థి ఆందోళనలు జరుగుతున్నాయి. వెంటనే కులగణన జరిపించాలనీ, అందరికీ సమానంగా ఉద్యోగాల్లో అవకాశాలుండాలనీ హరియాణాలోని అశోక విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన సమ్మె, నిరసనలూ తక్కువవి కావు. ప్రపంచంలో యువతరం ప్రశ్నని బలోపేతం చేస్తూ ఉందన్న దానికి అన్ని చోట్లా జరుగుతున్న విద్యార్థి నిరసనలను సంకేతాలుగా చూడాలి!!డా‘‘ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత ‘ మెల్బోర్న్ నుంచి -
ఇజ్రాయెల్‌పై మాల్దీవ్స్ బ్యాన్
మాలె: గాజాపై చేస్తున్న దాడులను వ్యతిరేస్తూ.. నిరసగా ఇజ్రాయెల్‌పై ద్వీప దేశం మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశానికి రావడాన్ని నిషేధించింది. ఆదివారం నిర్వహించిన ‘పాలస్తీనాకు సంఘీభావం’ ర్యాలీలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రకటించారు.ఇజ్రాయెల్ పాస్‌పోర్టు కలిగిన పౌరులు ఇజ్రాయెల్‌కు రావడాన్ని నిషేధిస్తున్నామని అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు. అయితే దీనికి సంబంధించిన చట్టపరమైన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. పాలస్తీనాకు మాల్దీవుల సంఘీభావం పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని మొయిజ్జు ప్రకటించారు. ఇక.. గతంలో 1990లో ఇజ్రాయెల్ పౌరులపై విధించిన నిషేధాజ్ఞలు 2010లో ఎత్తివేసిన విషయం తెలిసిందే.గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంలో మాల్దీవులు ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆ దేశ పౌరులపై నిషేధం విధించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో అధ్యక్షుడు మొయిజ్జు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిషేధంపై ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి స్పందించారు. ఇజ్రాయెల్ పౌరులను మాల్దీవులకు వెళ్లవద్దని సూచించారు. అక్కడ ఏమైనా జరిగితే సాయం చేయటం కష్టమవుతుంది. అందుకే ఇజ్రాయెల్‌లోనే ఉండాలని తెలిపారు. -
తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే!
నోరు మూయించి పెత్తనం చేసే పాలకులు నోరు మూసుకుని బతికే ΄పౌరులు చరిత్ర నిండా ఉంటారు. కాని నోరు మూసుకొని ఉండటం చేతగాక అన్యాయాన్ని చూస్తూ ఉండలేక గొంతెత్తి గర్జించేవాళ్లు చరిత్రలో నిలబడిపోతారు. మన దేశ మూలాలున్న హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని శ్రుతి కుమార్– ఆ ప్రతిష్టాత్మక ్రపాంగణంలో గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా నోరు విప్పింది. ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. వెనుకంజ వేయని మానవత్వం చాటిన శ్రుతి కుమార్ పరిచయం, నేపథ్యం.హార్వర్డ్ యూనివర్సిటీ తన విద్యార్థుల గురించి సరిగ్గా అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉంటే బహుశా శ్రుతి కుమార్‌కు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ సెరెమొనీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు విశేషంగా హాజరయ్యి వేదిక మీద పట్టా అందుకుంటున్న తమ పిల్లలను హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రతి ఏటా ఈ సెర్మనీలో పట్టా పొందుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈసారి ప్రసంగం చేసే అవకాశం శ్రుతి కుమార్‌కు వచ్చింది. అక్కడే ఆమెకు గొంతెత్తే అవకాశం లభించింది.నిరసనల నేపథ్యంఅక్టోబర్ 7, 2023న హమాస్ సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేసి 1400 ఇజ్రాయిలీల మరణానికి కారణం కావడంతో బదులు తీర్చుకోవడానికి రంగంలో దిగిన ఇజ్రాయిల్ నేటికీ ఆగని బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇప్పటికి 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వీరిలో కనీసం ఇరవై వేల మంది స్త్రీలు, పసి పిల్లలు. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు మొదలైనా ఇజ్రాయిల్ మరింత దుర్మార్గంగా గాజాలోని ఆస్పత్రుల పై, స్కూళ్లపై దాడులు చేస్తుండటంతో ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. ఏప్రిల్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు ‘యాంటీ ఇజ్రాయిల్’ నిరసనలతో హోరెత్తాయి. యూనివర్సిటీలు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటికి 900 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వారిలో ఒక భారతీయ విద్యార్థిని కూడా ఉంది. అమెరికా యూనివర్సిటీలు తమ దగ్గర పోగయ్యే ఫండ్స్‌ను ఇజ్రాయిల్‌కు వంత పాడే బహుళ జాతి వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని, ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్. అంతే కాదు టెల్ అవివ్ (ఇజ్రాయిల్) యూనివర్సిటీతో కోర్సుల ఆదాన ప్రదానాలు చేసుకోవడం బంద్ చేయాలని కూడా డిమాండ్. ఏప్రిల్ 18న ఇదే విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు ఏకంగా మూడు చోట్ల పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దాంతో యూనివర్సిటీ కన్నెర్ర చేసి ‘వయొలేషన్ ఆఫ్ యూనివర్సిటీ పాలసీ’ కింద 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా శిక్షించింది. అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రుతి కుమార్ ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీని ఎంచుకుంది.ఆమె ఒక టోర్నడోబీభత్సమైన పిడుగుపాట్లకూ, టోర్నడోలకు పేరు పెట్టిన నెబ్రాస్కా (అమెరికా) రాష్ట్రంలో పుట్టిన కన్నడ మూలాలున్న అమ్మాయి శృతి కుమార్. అక్కడ విస్తారంగా సాగు చేసే జొన్నరైతుకు పెద్ద కూతురు ఆమె. చదువుతో పాటు ఆట, పాట, మాటలో కూడా ఆసక్తి చూపింది. మంచి వక్త. ‘నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ –2019’లో పాల్గొని ఐదవ ర్యాంకులో నిలిచింది. 2020లో ‘వాయిస్ ఆఫ్ డెమొక్రసీ’ పోటీలో మొదటి విజేతగా నిలిచి 30 వేల డాలర్లు గెలుచుకుంది. అంతేకాదు తన చదువుకు స్పాన్సర్ని కూడా. యోగాలో దిట్ట. ముందు నుంచి అన్యాయాల, అపసవ్యతల మీద వ్యతిరేకత తెలిపే అలవాటున్న శ్రుతి కుమార్‌కు హార్వర్డ్ అవకాశం ఇవ్వడంతో ఆ యూనివర్సిటీనే హెచ్చరించి ఖంగు తినిపించింది.తెలియనితనపు బలంహార్వర్డ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో శ్రుతి కుమార్ తన ప్రసంగానికి పెట్టుకున్న పేరు ‘తెలియనితనంలో ఉండే బలం’. ఆమె తన ప్రసంగం చేస్తూ ‘ప్రపంచంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ తెలిసి నోరు మెదపని వారి కంటే ఏమీ తెలియకనే అది అన్యాయమనే కేవలం గ్రహింపుతో బరిలోకి దిగి ఎదిరించే నాలాంటి విద్యార్థులకు ఉండే బలం పెద్దది’ అని అంది. ‘పసిపిల్లల వంటి అమాయకత్వంతో కొత్త జన్మెత్తి అన్యాయాలను ప్రతిఘటించడానికి ముందుకు రావాలనే’ అర్థంలో శ్రుతి కుమార్ మాట్లాడి హర్షధ్వానాలు అందుకుంది. ‘మన విశ్వవిద్యాలయ ్రపాంగణంలో భావ ప్రకటనా స్వేచ్చపట్ల వ్యక్తమైన అసహనాన్ని చూసి నేను చాలా నిరాశకు గురవుతున్నాను. 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా ఆపారు. దీనిని వ్యతిరేకిస్తూ పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదు వందల మంది అధ్యాపకులం ఖండించాం. విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. అయినా సరే వినలేదు. హార్వర్డ్, మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్, మా మాటలు వింటున్నావా?’ అని శ్రుతి గర్జించింది. ‘ఇప్పుడు గాజాలో జరుగుతున్న ఘటనల మీద క్యాంపస్ మొత్తంగా దుఃఖం, అనిశ్చితి, అశాంతి చూస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ఇటువంటి క్షణంలోనే తెలియనితనపు శక్తి కీలకమైన దవుతుంది’ అందామె.పర్యవసానాలను గురించి వెరవక శ్రుతి ఈ ప్రసంగం చేసింది. యూనివర్సిటీకి తాను ఇచ్చిన ప్రసంగం పేజీలలో లేనిదాన్ని మధ్యలో ఇమిడ్చి ధైర్యంగా మాట్లాడింది. నిజం చె΄్పాలంటే శ్రుతి అన్ని దేశాల విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తోంది. అన్నీ తెలిసి ఊరికే ఉండటం కన్నా, ఏమీ తెలియకనే ‘అన్యాయం’ అనిపించినప్పుడు వెంటనే గొంతెత్తాలని సందేశం ఇస్తోంది.ఆమె ప్రసంగంలో కొంత‘నేడు ఈ ఉత్సవం మనకు తెలిసినదాని కోసం చేస్తున్నారు. మనకు ఏం తెలుసో దానిని ప్రశంసిస్తున్నారు. కాని తెలియనితనపు బలం ఒకటుంటుంది. నేనిక్కడికి (హార్వర్డ్) వచ్చేవరకూ ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ అనే పాఠ్యాంశం ఉన్నదనేదే నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆ శాఖ నుంచి నేను గ్రాడ్యుయేట్ నయ్యాను. చరిత్రంటే మనకు తెలిసిన కథల గురించి ఎంత చదవాలో... తెలియని కథల గురించి కూడా అంత చదవాలని ఇక్కడే తెలుసుకున్నాను’(మరికొంతసేపు మాట్లాడి తన దుస్తులలో నుంచి చిన్న కాగితం తీసి ప్రధాన ప్రసంగానికి విరామం ఇచ్చి ఇలా మాట్లాడింది) ‘నా నాల్గవ సంవత్సరం చదువులో యూనివర్సిటీలో మా భావ ప్రకటనా స్వేచ్ఛ, మా నిరసన ప్రదర్శనా స్వేచ్ఛ నేరాలుగా మారిపోయాయి. నేనిక్కడ ఇవాళ మీ ముందు నిలబడి నా సహ విద్యార్థులైన పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. ఆ పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఇవాళ పట్టభద్రులు కాలేకపోతున్నారు. మన విశ్వవిద్యాలయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల వ్యక్తమైన అసహనం ఫలితం ఇది. దీనికి నేను చాలా నిరాశæ చెందుతున్నాను. పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదువందల మంది అధ్యాపకులం ఈ అసహనాన్ని ఖండించాం. యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. విద్యార్థులు మాట్లాడినా అధ్యాపకులు మాట్లాడినా అదంతా ఈ క్యాంపస్‌లో స్వేచ్ఛ గురించే. ΄పౌరహక్కుల గురించే. హార్వర్డ్... మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్... మా మాటలు వింటున్నావా?’(అని మళ్లీ ప్రధాన ఉపన్యాసంలోకి వచ్చింది) ‘ఒక జాతి అయిన కారణాన తనను లక్ష్యంగా చేసి దాడులకు గురి చేయడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. హింసా, మృత్యువూ మన కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. మనకు తెలియవలసిన అవసరం కూడా లేదు. మనం కూడగట్టి మాట్లాడటం అనేది మనకు తెలిసి ఉన్న విషయాల గురించే కానక్కరలేదు. మనకు తెలియనిదాని గుండా కూడా ప్రయాణించాలి’ అందామె.ప్రసంగం చివర ఎమిలీ డికిన్సన్ కవితా వాక్యాన్ని కోట్ చేసింది. ‘ప్రభాతం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతి తలుపూ తెరిచి పెడతాను’. -
Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి
గాజా: ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దాడులతో 24 గంటల వ్యవధిలో గాజాలో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ఇద్దరు పాలస్తీనా రెడ్ క్రీసెంట్ సొసైటీకి చెందిన పారా మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారని వివరించింది. టాల్ అస్–సుల్తాన్ ప్రాంతంలో జరిగిన బాంబుదాడిలో బాధితులకు సాయం అందించేందుకు వెళ్లగా వీరు గాయపడినట్లు వెల్లడించింది. తాజా మరణాలతో గతేడాది అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు కనీసం 36,224 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా మరో 81,777 మంది క్షతగాత్రులైనట్లు అంచనా. ఇలా ఉండగా, ఈజిప్టుతో సరిహద్దులు పంచుకుంటున్న గాజా ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం తెలిపింది. -
‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ వైరల్ ఫొటోపై ఇజ్రాయెల్ కౌంటర్
హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని రఫా నగరంపై దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం.. రఫాలో పాలస్తీనా పౌరులు తల దాచుకుంటున్న శిబిరాలపై భీకర వైమానిక దాడులకు తెగపడింది. ఈ దాడుల్లో 45 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు రెండువేల మంది గాయపడ్డారు. దీంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తమైంది.All eyes on #Rafah 🇵🇸 pic.twitter.com/bg3bAtl3dQ— The Palestinian (@InsiderWorld_1) May 27, 2024 ‘ఆల్ ఐస్ ఆన్ రఫా (అందరి దృష్టి రఫా పైన)’అని పాలస్తీనా శిబిరాలపై రాసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు షేర్ చేసి పాలస్తీనా పౌరులకు మద్దతుగా నిలిచారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను సెలబ్రిటీలు, నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. మరికొంత మంది నెటిజన్లు.. పాలస్తీనా పౌరులపై దాడులు ఆపేయాలని కోరారు.ALL EYES ON RAFAH pic.twitter.com/2dstfq7rWt— The Saviour (@stairwayto3dom) May 30, 2024 అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి వ్యక్తమైన ఆగ్రహం,వ్యతిరేకతపై తాజాగా ఇజ్రాయెల్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. ‘‘ మేము అక్టోబర్ 7 ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడులను మాట్లాడటం మానుకోము. అదేవిధంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను విడిపించుకునే వరకు మా పోరాటం ఆపము ’’ అని ‘వేర్ వర్ యువర్ ఐస్’అని చిన్నపిల్లాడి ముందు హమాస్ మిలిటెంట్ తుపాకి పట్టుకొని ఉన్న ఫొటోను షేర్ చేసి కౌంటర్ ఇచ్చింది.We will NEVER stop talking about October 7th. We will NEVER stop fighting for the hostages. pic.twitter.com/XoFqAf1IjM— Israel ישראל (@Israel) May 29, 2024‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ ఫొటో హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 45 మిలియన్ల మంది షేర్ చేశారు. భారతీయ సినీ సెలబ్రిటీలు సైతం తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫొటోను షేర్ చేశారు. ప్రియాంకా చోప్రా జోనస్, అలియా బట్, కరీనా కపూర్ ఖాన్, మధూరి దీక్షిత్, వరుణ్ దావన్, సమంత్ రుత్ ప్రభు తదితరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 36,050 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు 81,026 మంది గాయపడ్డారు. -
Israel–Hamas war: రఫాపై దాడుల్లో 45 మంది మృతి
టెల్అవీవ్: గాజా ప్రాంత నగరం రఫాపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో 45 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సగం మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులేనని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. తమ దాడుల్లో హమాస్ స్థావరం ధ్వంసం కాగా ఇద్దరు సీనియర్ మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఈ ఘటనను పొరపాటున జరిగిన విషాదంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు. రాత్రి వేళ జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తామని పార్లమెంట్లో ప్రకటించారు. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
ఇండియన్-అమెరికన్ విద్యార్థి హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ సభ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి శ్రుతి కుమార్ గాజా సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై చర్యపై నిరసన వ్యక్తం చేశారు. డజనుకు పైగా విద్యార్థుల డిప్లొమాలను తిరస్కరించే నిర్ణయంపై యూనివర్సిటీ నేతలను శ్రుతి విమర్శించారు.క్యాంపస్‌లో వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించింది. విద్యార్థులు , అధ్యాపకులు మాట్లాడుతున్నా, హార్వర్డ్, మాట వినడం లేదంటూ మాట్లాడింది. ఉద్వేగభరిత హావ భావాలతో, ఆవేదనతో చేసిన ఈప్రసంగానికి కొంతమంది అధ్యాపకులతో సహా అక్కడున్న ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. క్యాంపస్‌లో చప్పట్లు మారుమోగిపోయాయి. ఇంగ్లీషులో మాట్లాడేందుకు ఎంపికైన సీనియర్ స్పీకర్ శ్రుతి కుమార్, "ది పవర్ ఆఫ్ నాట్ నోయింగ్" పేరుతో సిద్ధం చేసిన ప్రసంగానికి బదులు మధ్యలో తాను రాసిపెట్టుకున్న మరో కాపీని తీసి ప్రసంగించడం మొదలు పెట్టింది. తానీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నందున, తన సహచరులను గుర్తించడానికి కొంత సమయం కేటాయించాలి అంటూ ఇజ్రాయెల్ ద్వారా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు అనుభవాలతోపాటు స్వయంగా తన అనుభవాలను కూడా పంచుకుంది.అలాగే దక్షిణాసియా వలస కుటుంబంలో పుట్టి, అమెరికాలోని హార్వర్డ్‌లో చేరిన తొలి వ్యక్తిగా నెబ్రాస్కా నుండి హార్వర్డ్ దాకా తన ప్రయాణం గురించి వెల్లడించింది. ఒకరికి తెలియని వాటిని గుర్తించడంలోని విలువ గురించి, ఈ ఆలోచన ఎదుగుదలకు, సానుభూతికి ఎలా దారితీసిందో వివరించింది. 2024లో గ్రాడ్యుయేట్ చేయకుండా నిషేధం విధించిన 13 మంది అండర్ గ్రాడ్యుయేట్ల గురించి ప్రస్తావించడం అక్కడి వారిలో భావోద్వేగాన్ని నింపింది. కాగా హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫ్యాకల్టీ వారికి డిగ్రీలు ఇవ్వడానికి అనుకూలంగా మెజారిటీ ఓటు ఉన్నప్పటికీ, పాలస్తీనాకు మద్దతుగా క్యాంపస్ నిరసనలలో పాల్గొన్న 13 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించారని హార్వర్డ్ క్రిమ్సన్ నివేదించింది. -
International Court of Justice: రఫాలో సైనిక చర్య ఆపండి
ది హేగ్: దక్షిణ గాజాలోని రఫా నగరంలో సైనిక చర్యను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ శుక్రవారం ఆదేశించింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవచ్చు. పాలస్తీనియన్లపై దాడుల విషయంలో అంతర్జాతీయంగా మద్దతు కోల్పోతున్న ఇజ్రాయెల్‌పై కోర్టు ఆదేశాలు మరింత ఒత్తిడిని పెంచుతాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో 10 లక్షల పైచిలుకు పాలస్తీనియన్లు రఫాకు వలస వచ్చారు. వీరిలో చాలామంది టెంట్లలో నివసిస్తున్నారు. రఫాపై ఇజ్రాయెల్ దృష్టి సారించడంతో మిత్రదేశం అమెరికాతో సహా పలుదేశాలు వారించాయి. ఈ వారమే మూడు యూరోప్ దేశాలు తాము పాలస్తీనాను స్వతంత్రదేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. హమాస్‌కు మిగిలిన చివరి సురక్షిత స్థావరంగా రఫా ఉందని, దానిపై దాడి చేస్తేనే వారిని తుడిచిపెట్టగలమని ఇజ్రాయెల్ అంటోంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) అధ్యక్షుడు నవాఫ్ సలామ్ తీర్పు వెలువరిస్తూ ‘రఫాలో సైనిక చర్యపై తాము వెలిబుచ్చిన భయాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తక్షణం రఫాలో సైనిక చర్య నిలిపివేయకుంటే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వారాల కిందట రఫాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీచేసింది. సైన్యాన్ని రఫా దిశగా నడిపించి కీలకమైన సరిహద్దు మార్గాన్ని తమ ఆ«దీనంలోకి తీసుకొంది. మానవతాసాయం అందడానికి రఫా క్రాసింగ్ అత్యంత కీలకం. అందుకే రఫా క్రాసింగ్‌ను తెరిచి ఉంచాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాలు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బే అయినా .. రఫాపై దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను నిలువరించలేవు. ఎందుకంటే ఐసీజే వద్ద తమ ఆదేశాలను అమలుచేయడానికి అవసరమైన పోలీసు, సైనిక బలగాలేమీ లేవు. -
గాజాలో జరుగుతోంది మారణహోమం కాదు: జో బైడెన్
న్యూయార్క్: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)నుంచి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, హమాస్ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు ఇవ్వాలని కోరిన చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులతో మారణ హోమం సృష్టిస్తుందన్న కరీం ఖాన్ ఆరోపణలను బెడెన్ తీవ్రంగా ఖండించారు. వైట్‌హౌజ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడారు.‘‘గాజాలో జరగుతున్నది.. మారణహోమం కాదు. అటువంటి ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాం. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడుల్లో ఇజ్రాయెల్ బాధిత పక్షంగా మిగిలింది. హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, కొందరు హమాస్ చెరలో ఇంకా బంధీలుగా ఉన్నారు. .. మేము(అమెరికా) ఇజ్రాయల్ రక్షణ, భద్రత కోసం కట్టుబడి ఉంటాం. హమాస్ మిలిటేంట్లను అంతం చేసేవరకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తాం. హమాస్ ఓడిపోవటమే మా లక్ష్యం. హమాస్‌ను ఒడించేందుకు ఇజ్రాయెల్ కోసం పనిచేస్తాం. హమాస్ నుంచి ఇజ్రాయెల్ బంధీల విడుదల విషయంలో వెనక్కి తగ్గము’’ అని బెడెన్ అన్నారు. మరోవైపు.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ జరగాలని బైడెన్ పేర్కొనటం గమనార్హం.గాజా, ఇజ్రాయెల్‌లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, హమాస్ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్ దీఫ్, ఇస్మాయిల్ హనియేహ్‌లు బాధ్యులని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ అన్నారు. వారికి అరెస్టు వారెంట్లు ఇవ్వాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. -
గాజాలో ముగ్గురి ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు స్వాధీనం
గాజాలో హమాస్ మిలిటెంట్లలను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు బంధీల మృత దేహాలను స్వాధీనం చేసుకుంది. ఈ విషయన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ(ఐడీఎఫ్) ఓ ప్రకటనలో వెల్లడించింది.‘అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడిన చేసిన సమయంలో షానీ లౌక్, అమిత్ బుస్కిలా , ఇత్జాక్ గెలెరెంటర్ సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పాల్గోన్నారు. ఆ సమయంలో దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లు వారిని చంపేసి.. మృతదేహాను తమతో పాటు గాజాకు తీసుకెళ్లారు’ అని ఐడీఎప్ అధికార ప్రతినిధి అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.‘గాజా స్ట్రిప్‌లో భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల బంధీలను తిరిగి తీసుకురావటమే ప్రధానమైన లక్ష్యంగా ప్రతి ఐడీఎఫ్ ప్రతి కమాండర్, సైనికుడు యుద్ధరంగంలో పోరాడుతున్నారు. ఇజ్రాయెల్ సేనలు సురక్షితంగానే ఉన్నాయి. ఆర్మీపై పుకార్లు వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు. నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మేము బంధీల కుటుంబాలకు సమాచారం అందిస్తాం. అర్వాత ప్రజలకు తెలియజేస్తాం’ అని డేనియల్ హగారి పేర్కొన్నారు. ఇక.. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై చేస్తున్న దాడిలో ఇప్పటివరకు 35, 272 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. -
USA: బొమ్మ శవాలతో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసన
న్యూయార్క్: గాజాలోని పాలస్తీనియన్లకు అనుకూలంగా ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని యూనివర్సిటీల విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పరిపాలన బోర్డులో పనిచేసే ఓ అధికారిణి సారా హబ్బర్డ్ ఇంటి ముందు విద్యార్థుల నిరసన కలకలం రేపింది. ఆమె ఇంటి ముందు సుమారు 30 విద్యార్థి నిరసనకారులు.. మూడు టెంట్లు వేసి.. నకిలీ శవాలు( బొమ్మలు), రక్తం మరకలతో కూడిన చిన్న పిల్లలు బొమ్మలను పెట్టి వెళ్లిపోయారు.pic.twitter.com/5eAWgS4hIT— Sarah Hubbard, Regent @umich (@RegentHubbard) May 15, 2024 వాటిని గమనించిన సారా హబ్బర్డ్ ఈ విషయాన్ని వరసు ట్వీట్లతో సోషల్‌మీడియాలో తెలిపారు. ‘బుధవారం ఉదయం 5.54 గంటలకు సుమారు 30 మంది ఇజ్రాయెల్ వ్యతిరేక మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థి నిరసనకారులు నేను ఉండే ఇంటిలోకి ప్రవేశించారు. ఇంటి ముందు మూడు టెంట్లు వేశారు. విచిత్రమైన బొమ్మలు, షీట్లు, మరికొన్ని వస్తులు పెట్టారు. యూనివర్సిటీలో పనిచేసే ప్రభుత్వ అధికారి ప్రైవేట్ ఇంటి ముందు ఇలా నిరసన తెలపటం ఆమోదయోగ్యం కాదు. ఈ విధంగా చేస్తే.. వారు అనుకున్న లక్ష్యాన్ని సంతృప్తి పరుచుకోలేరు’ అని సారా హబ్బర్డ్ ‘ఎక్స్’లో తెలిపారు.Nah. Those are sheets. The stuffed animals and doll crib are toys. https://t.co/5PJXixbgi6 pic.twitter.com/QDUsnNNIvG— Sarah Hubbard, Regent @umich (@RegentHubbard) May 15, 2024ఇక మరోవైపు.. ఇజ్రాయెల్ వ్యతిరేక విద్యార్థి నిరసనకారుల బృందం ఇర్విన్లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉండే ఓ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులు క్లాస్‌లను రద్దు చేసి.. పోలీసులకు సమాచారం అందించారు. గాజాలో హమాస్ బలగాలు లక్ష్యంగా అమాయకులైన పాలస్తీనా పౌరులై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున ఏప్రిల్‌లో నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసన పాల్గొన్న పలువురు విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. -
గాజాలో కూలుతున్న జ్ఞాన వ్యవస్థలు
ప్రపంచ బ్యాంకు ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’. అయితే గాజాలోని విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిలో నాశనమయ్యాయి. ఇప్పటివరకూ సుమారు 90 మందికి పైగా ప్రొఫెసర్లు ఈ దాడుల్లో మరణించారు. గాజా పిల్లల విద్యావకాశాలను నిర్మూలిస్తూ... పాఠశాలలు, పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు ధ్వంసమయ్యాయి. పాలస్తీనా విజ్ఞానం, జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం కంటే తక్కువేమీ కాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల ఆందోళనలకు కారణం అదే.గాజాలోని విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలపై ఇజ్రాయెల్ దాడి పాలస్తీనా విజ్ఞాన, పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు, మొత్తం 12 విశ్వవిద్యాలయాలు వైమానిక దాడులకు గురయ్యాయి. ఇజ్రాయెల్ లక్ష్యాలలో అల్–అజహర్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా (ఐయూజీ) ఉన్నాయి. దీని ఫలితంగా పాలస్తీనా అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు సంవత్సరాల తరబడి సాగించిన పరిశోధన ధ్వంసమైపోయింది.ఐయూజీ ప్రెసిడెంట్, వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సుఫియాన్ తాయెహ్, ఆయన కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయ క్యాంపస్‌పై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఐయూజీ అనేది గాజాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ. ప్రొఫెసర్ తాయెహ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరిశోధకుడు. అలాగే, కొనసాగుతున్న దాడిలో మరణించిన 90కి పైగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లలో ఐయూజీలో ఆంగ్ల సాహిత్యం బోధించే డాక్టర్ రెఫాత్ అలరీర్ మరొకరు.పాలస్తీనా విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 జనవరి 20 వరకు దాదాపు 4,400 మంది విద్యార్థులు మరణించారు, 7,800 మంది గాయపడ్డారు. 231 మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరణించారు, 756 మంది గాయపడ్డారు. అలాగే 378 ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలతోపాటు, గాజాలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నిర్వహణలోని పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 97 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలతోపాటు 35,000కు పైగా ప్రజలు మరణించారు.‘‘దాదాపు 90,000 మంది పాలస్తీనియన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు గాజాలోని విశ్వవిద్యాలయానికి హాజరు కాలేరు. 60 శాతానికి పైగా పాఠశాలలు, దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, లెక్కలేనన్ని పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. గాజా పిల్లలు, యువకుల విద్యావకాశాలను నిర్మూలిస్తూ, యూనివర్సిటీల డీ¯Œ లు, ప్రముఖ పాలస్తీనా పండితులతో సహా... వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చంపబడ్డారు’’ అని దక్షిణాఫ్రికా న్యాయపరమైన అంశాల ప్రతినిధి బ్లిన్నె నీ ఘ్రాలే అంతర్జాతీయ న్యాయస్థానంలో వెల్లడించారు.ప్రజల చిహ్నాలను, డాక్యుమెంట్ చరిత్రను తుడిచిపెడుతూ లైబ్రరీలు, ఆర్కైవ్‌లు, మ్యూజియంలతో సహా అనేక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా మేధావులు దీనిని ‘చరిత్ర నుండి పాలస్తీనా ఉనికిని తుడిచివేయడానికి’ చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. కెనడియన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్‌కు రాసిన లేఖలో కెనడాలోని మౌంట్ రాయల్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ ముహన్నద్ అయ్యాష్ దీనిని ‘రాజకీయ పటం నుండి పాలస్తీనాను తుడిచిపెట్టే ప్రయత్నం’గా పేర్కొన్నారు. ‘పాలస్తీనా విజ్ఞానం, విజ్ఞాన నిర్మాతలు మరియు జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం(ఎపిస్టెమిసైడ్) కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించారు.‘ఎపిస్టెమిసైడ్’ అంటే జ్ఞాన వ్యవస్థను చంపడం, మూగబోయేలా చేయడం, నాశనం చేయడం లేదా విలువ తగ్గించడం అని అర్థం. సోషియాలజిస్ట్ బోవెంచురా డి సౌసా శాంటోస్ ఈ పదాన్ని రూపొందించారు. ‘వలస పాలన, అణచివేత, మారణహోమాల కారణంగా అధీన సంస్కృతిలో సంభవించే విజ్ఞాన మరణంగా’ దీనిని ఆయన అభివర్ణించారు. ఇది సైనికపరంగా, సైద్ధాంతికపరంగా రెండు విధాలుగానూ ఉండొచ్చు. ఇది విముక్తి పేరుతో స్వాధీనం, శాంతి పేరుతో దురాక్రమణ, జీవన పవిత్రత పేరుతో జీవన విధ్వంసం, హక్కుల పరిరక్షణ పేరుతో మానవ హక్కులను ఉల్లంఘించే రూపంలో జరగవచ్చు.1948లో ఇజ్రాయెల్‌కు స్థానం కల్పించడం కోసం తాము వైదొలగాల్సి వచ్చిన తర్వాత పాలస్తీనియన్ విద్యావంతులైన ఉన్నతవర్గాలు పాలస్తీనా విద్యావ్యవస్థను పునర్నిర్మించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. వారు విద్యను తమ జీవితాలను పునర్నిర్మించడానికి, పురోగతిని సాధించడానికి ఒక చోదకశక్తిగా భావించారు. అర్థవంతమైన సాంస్కృతిక మార్పిడి, శాస్త్రీయ పురోగతి, చరిత్రపై అవగాహన, సృజనాత్మక సాహిత్య రచనలతో గాజాను పాలస్తీనా సమాజాన్ని అభివృద్ధి చేసే ప్రదేశంగా మార్చాలనే ఆశతో అనేక మంది పండితులు వివిధ ప్రాంతాల నుండి అక్కడికి వెళ్లారు. ఇందులో వారు విజయం సాధించారా లేదా అనేది చర్చనీయాంశం. కానీ కచ్చితంగా, పాలస్తీనా నేడు అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లను ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థుల తిరుగుబాటు వెనుక ఉన్న కారణం అదే. పాలస్తీనా విద్యాసంస్థల్లో జరుగుతున్న ప్రతిధ్వనులు విదేశాల్లోని క్యాంపస్‌లలో వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దురాక్రమణకు అమెరికా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర ద్రవ్య, సైనిక, దౌత్య, నైతిక మద్దతును నిరసిస్తూ అనేక విశ్వవిద్యాలయాలలో శిబిరాలు ఏర్పాటైనాయి. దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోకి పోలీసులను పిలిపించారు, 645 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలా మందిని తర్వాత విడుదల చేశారు. ఉన్నత స్థాయి కొలంబియా, బోస్టన్ విశ్వవిద్యాలయాలు నిరసనల కేంద్రాలుగా మారాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల నుండి 200 మందికి పైగా అరెస్టులు చేశారు. గాజాలో కాల్పుల విరమణ పిలుపులో గణనీయమైన సంఖ్యలో అధ్యాపకులు పాల్గొన్నారు లేదా మద్దతు ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పాలనాధికారులు విరుచుకుపడ్డారు, వారిలో కొందరిని బహిష్కరించారు.లాస్ఏంజిల్స్లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,ఇతర ప్రదేశాలలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనకారుల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పాలస్తీనా విద్యను విధ్వంసకరమైన విభజన దురదృష్టాల నుండి రక్షించడానికి ప్రపంచం తన స్వరాన్ని పెంచాలి. జ్ఞాన వ్యవస్థను నాశనం చేయడానికి వారాలు పడుతుంది. కానీ దానిని పునర్నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది.ఇజ్రాయెల్‌తో జట్టు కట్టిన దేశాలలోని కొన్ని విశ్వవిద్యాలయాలు దురదృష్టవశాత్తూ పాలస్తీనా సంస్థలతో విద్యా మార్పిడి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి విముఖత చూపాయి. మరోవైపు, ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాల విద్యార్థులను అంతర్జాతీయ సహకారానికి చెందిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి సాదరంగా స్వాగతించారు. ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాలు కెనడాకు చెందిన పోస్ట్–సెకండరీ సంస్థలతో ఇప్పటికే 60 విద్యా ఒప్పందాలను కలిగి ఉన్నాయి.ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోని విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలు, యూనియన్లు... అస్తవ్యస్తంగా ఉన్న పాలస్తీనా వ్యవస్థను పునర్నిర్మించడానికి వాగ్దానం చేయడంతో పాటు, యుద్ధాన్ని ముగించే వైపుగా ప్రజల అభిప్రాయాన్ని నిర్మించడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
హమాస్ బలగాలను అంతం చేయటమే లక్ష్యంగా.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఓ భారతీయ వ్యక్తి మృతి చెందినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ హాస్పటల్‌కు వెళ్తుతున్న క్రమంలో ఒక్కసారిగా జరిగిన దాడిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుతో ఉన్న మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఇక.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐక్యరాజ్య సమితికి చెందిన తొలి వ్యక్తి మరణంగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.మరణించిన వ్యక్తి ఐక్యరాజ్య సమితిలోని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగానికి( DSS) చెందిన భారతీయ వ్యక్తిగా తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి భారత దేశానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడని సమాచారం.Today a @UN vehicle was struck in Gaza, killing one of our colleagues & injuring another. More than 190 UN staff have been killed in Gaza.Humanitarian workers must be protected.I condemn all attacks on UN personnel and reiterate my urgent appeal for an immediate humanitarian…— António Guterres (@antonioguterres) May 13, 2024‘‘ఐక్యరాజ్య సమితి చెందిన డీఎస్ఎస్ విభాగంలోని సభ్యుడు మరణించటం చాలా బాధాకరం. ఈ ఘటనలో మరో సభ్యుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రఫాలోని యూరోపియన్ ఆస్పత్రికి తమ వాహనంలో వెళ్తున్న క్రమంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది’’ అని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెర్రెస్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.ఈ దాడి ఘటనను యూఎన్ఓ జనరల్ సెక్రటరీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ తీవ్రంగా ఖండించారు. యూఎన్ఓ సిబ్బందిపై జరిగిన అన్ని దాడులపై దర్యాప్తు చేస్తామని అన్నారు. అదేవిధంగా డిఎస్ఎస్ విభాగానికి చెందని సభ్యుడి మరణం పట్ల యూఎన్ఓ జనరల్ సెక్రటరీ గుట్రెస్ సంతాపం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. -
Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
టెల్ అవీవ్: ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపితే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం దాడుల్ని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్‌ను ఆక్రమించాయి. గాజా పోరులో ఈ ఆక్రమణ కీలక ఘట్టమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ రఫా క్రాసింగ్ నుంచే ఆదివారం రాత్రి హమాస్ దళాలు దక్షిణ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందడంతో ఐడీఎఫ్ తన ఆపరేషన్‌ను ప్రారంభించింది. రఫా క్రాసింగ్ ఆక్రమణ విషయాన్ని ఇజ్రాయెల్ తమకు తెలియజేసిందని ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అంతకు ముందు..రఫాపై సోమవారం ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న వేళ.. హమాస్ సంస్థ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విరమణ ఒప్పందం.. తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. మరోవైపు కాల్పుల విరమణ కోసం కైరోలో జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్ యథావిధిగా పాల్గొంటోంది. కొసమెరుపు ఏంటంటే.. ఆ చర్చలు కొనసాగుతున్న వేళలోనే ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశమై రఫాపై మిలిటరీ ఆపరేషన్‌కు పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమణతో రఫా క్రాసింగ్ మీదుగా ఈజిప్టు నుంచి గాజాకు చేరుకుంటున్న మానవతా సాయం ఆగిపోయిందని పాలస్తీనా క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ చర్యను పరిమితమైన ఆక్రమణగానే పేర్కొంటోంది. -
Israel-Hamas war: వర్సిటీల్లో 2,300 దాటిన అరెస్టులు
న్యూయార్క్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ అమెరికావ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న నిరసనలు ఆగట్లేవు. పోలీసులు వర్సిటీల్లో ఆందోళనకారులను చెదరగొట్టి తాత్కాలిక శిబిరాలను ధ్వంసం చేస్తున్నారు. ఏప్రిల్ 17న కొలంబియా వర్సిటీలో మొదలై అమెరికాలో 44 విశ్వవిద్యాలయాలు/ కాలేజీలకు పాకిన ఈ విద్యార్థి ఉద్యమంలో ఇప్పటిదాకా 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శుక్రవారం న్యూయార్క్ యూనివర్సిటీలో టెంట్లను ఖాళీచేసి వెళ్లాలని నిరసనకారులను పోలీసులు హెచ్చరించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో 133 మందిని అరెస్ట్‌చేశారు. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్‌తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్‌లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్‌చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్‌లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.తాజాగా ప్రఖాత్య హార్వర్డ్ యూనివర్సిలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హార్వర్డ్ యార్డ్‌లోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగువేశారు. అమెరికన్ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగరేయడం గమనార్హం. ఐవీ లీగ్ స్కూల్ క్యాంపస్‌లో కొనసాగుతున్న తమ ఆందోళనలను ముగించేందుకు నిరాకరించడంతో శనివారం ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు నిరసనకారులతో పోలీసులు ఉక్కుపాదం మోన్నారు. గత వారం న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. గత పదిరోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్‌ల సంఖ్య 900కు చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
గాజాలో శిథిలాల తొలగింపునకు 14 ఏళ్లు?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలవుతోంది. ఈ కాలంలో ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌పై బాంబులు వేసి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎక్కడ చూసినా శిథిల భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మైన్ యాక్షన్ సర్వీస్ (యూఎంఎన్ఏఎస్) సీనియర్ అధికారి పిహార్ లోధమ్మర్ మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్‌లో శిధిలాలను తొలగించడానికి సుమారు 14 ఏళ్లు పట్టవచ్చని ప్రకటించారు. జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా 37 మిలియన్ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని తెలిపారు.ఏడు నెలలుగా నిరంతర ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. దాడిలో ఉపయోగించిన 10 శాతం షెల్స్ పేలి ఉండకపోవచ్చని, ఇవి భవిష్యత్తులో ముప్పుగా మారవచ్చని అన్నారు. ఈ షెల్స్ భవన శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. గాజా స్ట్రిప్‌లో ప్రతిరోజు 100 ట్రక్కుల శిథిలాలను తరలిస్తున్నారని, ఇక్కడి ప్రతి చదరపు మీటరులో దాదాపు 200 కిలోల శిధిలాలు ఉన్నాయని వివరించారు.యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్‌ఆర్‌డబ్ల్యుఏ) ఒక ప్రకటనలో గాజాలో జీవన పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయని, రాఫా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌పై జరిపిన దాడిలో 34 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. 77 వేల మంది గాయపడ్డారు. -
Israel-Hamas war: పాలస్తీనియన్లకు అమెరికా విద్యార్థుల సంఘీభావం
వాషింగ్టన్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గాజాలో మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వందలాది మంది ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ముందస్తుగా అనుమతి లేకుండా వర్సిటీ ప్రాంగణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఒక్కరోజే 100 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో గతవారం విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది. క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలకు వ్యాపించింది. -
మానవతకు 200 రోజుల మచ్చ
ఒకటీ, రెండూ కాదు... ఆరు నెలలు దాటింది. మంగళవారంతో ఏకంగా రెండు వందల రోజులు గడిచిపోయాయి. అయినా, పాలెస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. సంక్షోభానికి పరిష్కా రమూ కనిపించడం లేదు. సామూహిక సమాధులు, కూలిన ఆస్పత్రులు, శిథిలాల కుప్పగా మారిన భవనాలు, ప్రాణాలు పోయిన వేలాది జనం, ప్రాథమిక వసతులు పూర్తి విధ్వంసంతో పాలెస్తీనా బావురుమంటోంది.తీవ్రవాద హమాస్ బృందం తమపై ఆకస్మికంగా దాడి చేసి, 250 మందిని బందీలుగా చేసుకొని, 1200 మంది ప్రాణాలు తీసినందుకు బదులుగా గత అక్టోబర్ 7న సైనిక చర్యకు దిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు 85 శాతం మంది ఇళ్ళు వదిలి పారిపోయారు. హమాస్ ఏరివేతకని చెబుతూ మొదలుపెట్టిన ఈ పాశవిక, ప్రతీకార దాడిలో ఇప్పటికి 14 వేల పైచిలుకు పసిపిల్లలతో సహా 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని లెక్క. నిజానికి, ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని సహాయక సంస్థల అంచనా. గాజా భూఖండపు ఉత్తర ప్రాంతంపై ఇటీవల ఎన్నడూ లేనంతగా శతఘ్నుల వర్షం కురిపిస్తూ, అక్కడ నుంచి జనాల్ని ఖాళీ చేయమంటున్న ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంత ప్రధాన నగరమైన రాఫాపై దాడికి సర్వసన్నద్ధమవుతుండడం తాజా విషాద పరిణామం. పశ్చిమాసియాలోని ఈ సంక్షోభం అంతకంతకూ పెద్దదవుతూ వచ్చింది. ఇరాన్ సైతం ఇటీవల ఇజ్రాయెల్‌తో ఢీ అనడం పర్యవసానాలపై ప్రపంచం భయపడాల్సిన పరిస్థితి తెచ్చింది. పాలెస్తీనా శరణార్థులకు ఉద్దేశించిన ఐరాస సహాయ సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) ఉన్నా దానికిప్పుడు నిధులు లేని దుఃస్థితి.ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి ఆ సంస్థ సిబ్బంది కొందరు సహకరించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. దాంతో ఆ సంస్థకు సహాయం అందిస్తున్న 16 దాతృత్వ దేశాలు నిధులు నిలిపివేశాయి. పర్యవసానంగా 45 కోట్ల డాలర్ల మేర నిధుల లోటు ఏర్పడి, వేలాది పాలెస్తీనియన్లు ఈ యుద్ధకాలంలో ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్వి నిరాధార ఆరోపణలని స్వతంత్ర పరిశీలనలో ఈ వారమే తేలింది. అమెరికా సహా ఇతర దేశాలు మానవతా అవసరంగా గుర్తించి, నైతిక బాధ్యతతో యూఎన్ ఆర్‌డబ్ల్యూఏకు ఆర్థిక సాయం పునరుద్ధరించాలని అరబ్ లీగ్ తాజాగా డిమాండ్ చేస్తున్నది అందుకే. ఇజ్రాయెల్ భీకర దాడుల అనంతరం గాజాలోని ప్రధాన ఆస్పత్రుల వద్ద 300కు పైగా మృతదేహాలతో బయటపడ్డ సామూహిక భారీ సమాధుల దృశ్యాలు సహజంగానే అంతర్జాతీయ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఇజ్రాయెలీ సైనికుల దాడుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిందడానికి సమాధుల్లో కట్టేసిన చేతులతో, వివస్త్రంగా కనిపిస్తున్న శవాలే ప్రత్యక్ష సాక్ష్యం. అనుమానాలకు తావిస్తున్న ఈ సమాధులపై పారదర్శకంగా, స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐరాస ఇప్పటికే డిమాండ్ చేసింది.యూరోపియన్ యూనియన్ సైతం బుధవారం అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆగని ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బాధిత పక్షం వైపు అంతర్జాతీయంగానూ క్రమంగా మొగ్గు కనబడుతోంది. పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడమే ప్రస్తుత సమస్యకు సత్వర పరిష్కారమని భావిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గాజా సమస్య అంతకంతకూ మానవతా సంక్షోభంగా పరిణమిస్తుండడంతో తాజాగా జమైకా ప్రభుత్వం పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనమనే ఐరాస నియమావళి పట్ల నిబద్ధతే ఈ నిర్ణయానికి ప్రేరణ అని జమైకా పేర్కొంది. ప్రతి 10 నిమిషాలకూ ఓ పసివాడు చనిపోవడమో, గాయపడడమో జరుగుతున్న పాలెస్తీనాలో, ఇప్పటికి కనీసం 75 వేల టన్నుల పేలుడు పదార్థాల తాకిడికి గురై 62 శాతం ఇళ్ళు ధ్వంసమైన భూభాగంలో, ఆహార కరవుతో 11 లక్షల మంది అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్న ప్రాంతంలో... సత్వరమే సంక్షోభాన్ని పరిష్కరించి, శాంతి స్థాపన జరపకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఒకప్పటి కీలకపాత్రధారి ఐరాస ప్రస్తుతం మాటలే తప్ప చేతలు లేక చేష్టలుడిగి చూస్తోంది.కాల్పుల విరమణకై ఈ ఆరునెలల్లో ఐరాస 4సార్లు తీర్మా నాలు చేసినా, అవన్నీ అగ్రరాజ్యాలు మోకాలడ్డడంతో వీగిపోవడం దురదృష్టం. ఐరాసలో అండగా నిలవడమే కాక, ఇజ్రాయెల్‌కు ఆయుధాలిస్తున్న అమెరికా ఆ దేశానికి ఇటీవలే 2600 కోట్ల డాలర్ల సాయం మంజూరు చేసి, శరణార్థులకేమో మొండిచేయి చూపడం పెద్దన్న ద్వంద్వనీతికి దర్పణం. గాజా పోరులో అమెరికా అధ్యక్షుడి విధానాలపై స్వదేశంలోనే నిరసనలు పెరిగాయి. పాలెస్తీనాకు అనుకూలంగా అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాల్లో వేలాది విద్యార్థులు వీధికెక్కడం విశేషం.పశ్చిమాసియాలో సమస్య పరిష్కారానికి అమెరికా, దాని భాగస్వాములు పాత కథ వదిలి, మళ్ళీ మథనం చేయాలి. భద్రత పరంగా ఇజ్రాయెల్‌కు ఉన్న ఆందోళనల్ని పోగొడుతూనే, పాలెస్తీనా ప్రజల ప్రత్యేక రాజ్య ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు సఫలమయ్యేలా అటు ఇరాన్‌నూ భాగస్వామిని చేసి, శాశ్వత పరిష్కారానికై పాశ్చాత్య ప్రపంచం కృషి చేయాలి.ఇరాన్ సైతం పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కోసం లెబనాన్, గాజా, సిరియా, యెమన్లలో పరోక్ష శక్తులకు ఆయుధాలు సమకూర్చి, అండగా నిలిచే పని మానుకోవాలి. ఇలా పాముల్ని పాలుపోసి పెంచడం ఉద్రిక్తతల్ని పెంచే పాపమని గుర్తించాలి. ఈ ప్రాంతంలో 90 లక్షల మంది మన ప్రవాసులున్నందు భారత్ సైతం ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో సత్సంబంధాల రీత్యా కీలక భాగస్వాముల్ని ఒక దగ్గరకు చేర్చి, పరిష్కారానికి యత్నించాలి. వాణిజ్యంలో, ఇంధన సరఫరాలో కీలకమైన పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే... ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. -
ముసుగులో గుద్దులాట కొనసాగేనా?
ఒకవైపు ఇజ్రాయెల్... మరోవైపు ఇరాన్, దాని భాగస్వాములు, ప్రచ్ఛన్న ప్రతినిధుల మధ్య సాగుతున్న ముసుగులో గుద్దులాటను ఒక స్థాయి వరకే కొనసాగించవచ్చు. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్ వైపుగా కమికేజ్ డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో ఆ తెర తొలగింది. తన ‘జియోనిస్ట్ శత్రువు’కు వ్యతిరేకంగా నాలుగున్నర దశాబ్దాల ఆవేశపూరిత వాగాడంబరం సాగించిన ఇరాన్ నిజానికి ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో లక్ష్మణరేఖను దాటినట్లయింది. ఇజ్రాయెల్ ప్రతీకారదాడి ఈ ప్రాంతాన్ని అగాథంలోకి తోస్తుంది. కానీ నిజంగా పరిస్థితి అలా ఉందా? మనం చాలా కాలంగా చూస్తున్న ముసుగులో గుద్దులాట నాటకంలో సరికొత్త అంకాన్ని చూస్తున్నామా అనేది ప్రశ్న. ప్రస్తుతం ఏడవ నెలలో అడుగుపెట్టిన గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, ఏ సమయంలో అయినా విస్తృతమైన ప్రాంతీయ పెనుమంటగా మారే ప్రమాదాన్ని కలిగివుంది. అయితే, పాలస్తీనా సమస్య పరిష్కారానికి మద్దతుగా ఇరాన్ తరచుగా చేసే తీవ్రమైన బెదిరింపుతో కూడిన ఆగ్రహ ప్రకటనలు, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న ఒక అంతర్లీన వాస్తవాన్ని దాచిపెడుతున్నాయి. దాని అత్యున్నత నాయకుడైన అయతొల్లా అలీ ఖొమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం వాస్తవానికి చాలా జాగ్రత్తగానూ, ప్రమాదాన్ని కోరి ఆహ్వానించని తత్వంతోనూ సాగుతోంది. పైగా ముఖాముఖి ఘర్షణకు అది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాడి నిరోధం దిశగా ఇరాన్ ఇష్టపడే విధానం ఏమిటంటే, స్నేహపూర్వకంగా లేని దేశాలకు హెచ్చరికలను పంపడానికి తన ప్రతినిధుల (ప్రాక్సీలు) ద్వారా అసమాన యుద్ధంలో దాని అధునా తన సామర్థ్యాలను అమలు చేయడమే. ఒక పాత హిందీ పాటలోలా ‘అర్థమయ్యేవాళ్లకు అర్థమైంది’ అనేది దాని కార్యచరణ సూత్రం. తెహ్రాన్ లేదా దాని ఖుద్స్ బలగాలను హమాస్ దాడులతో అనుసంధానించడానికి తగిన నిర్ధారిత సాక్ష్యాధారం లేనప్పటికీ, అక్టోబరు 7న హమాస్ చేసిన దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని చాలామంది ఊహించారు. గాజాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన విధ్వంసక దాడిని ప్రారంభించినప్పుడు, లెబనాన్ నుండి ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకోవడానికి హెజ్బొల్లాకు చెందిన యుద్ధంలో రాటుదేలిపోయిన క్యాడర్లను ఇరాన్ పంపుతుందనే ఆందోళన వాస్తవంగానే ఉండింది. అలాగే, గాజాలోని తన హమాస్ మిత్రపక్షానికి మద్దతు ఇవ్వడానికి ఇరాన్ రెండవ ఫ్రంట్‌ను ప్రారంభించవచ్చని కూడా భావించారు. ఏమైనప్పటికీ, ఆరు నెలల తరువాత కూడా, ఇరాన్, హెజ్బొల్లా రెండూ ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌లో తమ హద్దులలోనే కొనసాగుతూ అసౌకర్యమైన సమ తౌల్యాన్ని కొనసాగించాయి. హెజ్బొల్లా వద్ద ఉన్న మారణాయుధాలు ప్రధానంగా ఉత్తర ఇజ్రాయెల్‌లో ఇప్పుడు జనాభా లేని గ్రామాలు, స్థావరాలకు వ్యతిరేకంగా ఉపయోగించబడ్డాయి. దక్షిణాన కొన్ని మైళ్ల దూరంలో ఉన్న సైనిక, పౌర లక్ష్యాలు హెజ్బొల్లా క్షిపణుల పరిధిలో ఉన్నప్పటికీ వాటిని తాకలేదు. వివాదాన్ని హెజ్బొల్లా తీవ్రతరం చేస్తే లెబనాన్ పై భయంకరంగా స్పందిస్తానని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్, సిరియాలోని అగ్రశ్రేణి హెజ్బొల్లా సముదాయం, సైనిక సంపత్తి లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. అయితే హెజ్బొల్లాపై నేరుగా దాడి చేయడానికి ఇజ్రాయెల్ సైతం దూరంగానే ఉంది. సంవత్సరాల తరబడి ఇరాన్ చే జాగ్రత్తగా పోషించబడిన మరొక ప్రచ్ఛన్న శక్తి యెమెన్‌లోని హౌతీలు. ఎర్ర సముద్రంలోని సముద్ర మార్గాలలో వాణిజ్య నౌకలతో విధ్వంస క్రీడ ఆడటానికి తమ డ్రోన్ లను, క్షిపణులను హౌతీలు సానబెట్టారు. హౌతీల ఆయుధ నిల్వలు, శిక్షణ, వ్యూహాల మూలాల గురించి పెద్ద సందేహమేం లేదు. అయితే రింగ్‌మాస్టర్‌గా ఉండటంలోనే ఇరాన్ సంతృప్తి చెందుతూ, పశ్చిమ దేశాలు తనపట్ల శత్రు వైఖరితో కొనసాగితే విఘాతం కలిగించగలిగే ప్రభావాన్ని నిశ్శబ్దంగా నొక్కిచెప్పింది. అయితే, ఏప్రిల్ 1న డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యా లయానికి చెందిన కాన్సులర్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి... సిరియా, లెబనాన్ లలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన ఖుద్స్ బలగాల అధిపతి హసన్ మహ్దవీని చంపినప్పుడు ఆ పెళుసైన సమతుల్యత దెబ్బతింది. అత్యంత కచ్చితంగా తలపెట్టిన ఈ దాడి మహ్దవీతో పాటు ఆరుగురు స్వదేశీయులను కూడా మట్టు బెట్టడం, ఇరాన్ ప్రభుత్వాన్ని మండించింది. 2023 డిసెంబర్లో కూడా సిరియాలో ఇరాన్ సీనియర్ కమాండర్ అయిన సయ్యద్ రజీ మౌసావీని ఇజ్రాయెల్ హతమార్చింది. తెహ్రాన్ లోని అతివాదుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది కాబట్టే నాయకత్వం చేసే తీవ్రమైన ప్రతీకార బెదిరింపులు ఇప్పుడు గట్టి చర్యతో సరిపోలాల్సి ఉంది మరి. చివరికి ఏప్రిల్ 13న తాను తలపెట్టదలచిన సైనిక చర్య గురించి దాదాపు రెండు వారాల పాటు టెలిగ్రాఫ్ ద్వారా ఇరాన్ ప్రభుత్వం సూచిస్తూనే వచ్చింది. ఈద్–ఉల్–ఫితర్ ఉత్సవాలు ముగిసిన వెంటనే దాడి జరుగనున్నట్లు విçస్తృతమైన అంచనాలు వెలువడ్డాయి. అలాగే జరిగింది కూడా. ఈ ప్రాంతంలోని దేశాలకు 72 గంటల నోటీసు ఇచ్చామనీ, విమానాలను నిలిపివేయడానికీ, వారి పౌరులకు హెచ్చరి కలు జారీ చేయడానికీ భారత్ సహా ఇతర దేశాలకు తగినంత సమయం ఇచ్చామనీ ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్ ప్రయోగించిన ‘99 శాతం’ డ్రోన్లు, క్షిపణులను... బలీయమైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలు, అలాగే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్ ్స, ఆఖరికి జోర్డాన్ తో సహా అనేక మిత్రదేశాలు విజయవంతంగా అడ్డుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. 80కి పైగా డ్రోన్లు, ఆరు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటన ధ్రువీకరించింది. నెగెవ్ ఎడారిలోని ఒక ఇజ్రాయెలీ వైమానిక స్థావరంలో స్వల్పంగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతానికి, ఈ దాడి ఇరాన్ సామర్థ్యాలకు నిజమైన ప్రతిబింబం కాదు లేదా ఇజ్రాయెల్ వైమానిక రక్షణకు నిజమైన పరీక్ష కాదు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. గత వారాంతం వరకు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు గాజాలో జరుగుతున్న అనాలోచిత విధ్వంసం గురించీ, అక్కడి ప్రజల బాధల గురించీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కానీ ఇరాన్ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే, అమెరికా యంత్రాంగం ఇజ్రాయెల్‌కు తన ‘గట్టి మద్దతు’ను పునరుద్ఘాటించింది. భవిష్యత్ ప్రమాదాలను నిరోధించడానికి బ్రిటన్, ఫ్రాన్స్ తమ నావికా సంపత్తిని మోహరించాయి. శత్రుదుర్భేద్యమైనదని పేరొందిన ఇజ్రాయెల్ రక్షణ శక్తుల ఖ్యాతి అక్టోబరు 7న హమాస్ దాడితో కాస్త దెబ్బ తిన్నప్పటికీ, తాజాగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ లను, క్షిపణులను అధిక సంఖ్యలో తటస్థీకరించడంలో విజయం సాధించడం ద్వారా మళ్లీ తన్ను తాను నిలబెట్టుకోగలిగింది. గాజా ప్రస్తుతానికి మీడి యాలో పతాక శీర్షికలకు దూరంగా ఉంది. అంతేకదా! అమెరికా, భారత్, ఇతర దేశాలు తిరుగుదాడి పట్ల సంయమనం పాటించాలనీ, లేకుంటే అది మరింతగా పెరుగుతుందనీ హెచ్చరించడంతో నెత న్యాహు మళ్లీ కేంద్ర స్థానంలోకి చేరుకున్నారు. తన షాడో–బాక్సర్లు బలంగా పంచ్‌లు విసిరినందున, దాడుల నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నాననీ, అయితే ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగినట్లయితే తాను గట్టిగా ప్రతిస్పందిస్తాననీ ఇరాన్ సూచించింది. ఇక, ఇజ్రాయెల్‌లో రాజకీయ పార్టీలు నిలువునా చీలిపోయాయి. ప్రమాదకరమైన గీతను దాటినందుకు ఇరాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని రైట్ వింగ్ నాయకులు కోరుతున్నారు. ఇజ్రాయెల్ ప్రతిఘటనను ప్రారంభించడానికి ‘వెంటనే కదలాలి’ అని జాతీయ భద్రతా మంత్రి బెన్–గ్విర్ సూచించారు. మధ్యప్రాచ్యంలో భావితరాలు కూడా గుర్తుంచుకునేలా ఇజ్రాయెల్ గట్టిగా ప్రతిస్పందించాలని ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోత్రిచ్ పిలుపునిచ్చారు. బెన్నీ గాంట్జ్, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వంటి మితవాదులు తీవ్రమైన ప్రతి చర్యకు వ్యతిరేకంగా సలహా ఇచ్చారు. బదులుగా ఇరాన్‌కు వ్యతిరేకంగా వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచుకోవాలని సూచించారు. దేశ రాజకీయాలకు వ్యతిరేకంగా అమెరికా పెడుతున్న ఒత్తిడిని బేరీజు వేసుకుని, తీవ్ర పర్యవసానాలు కలిగివుండే ఒక ప్రతిస్పందనను నెతన్యాహు రూపొందించనున్నందున రాబోయే కొద్ది రోజులు కీలకం కానున్నాయి. నవదీప్ సూరి వ్యాసకర్త ఈజిప్ట్, యూఏఈల్లో భారత మాజీ రాయబారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రమాదపుటంచున...
ఇప్పటి దాకా ముసుగులో గుద్దులాటగా ఉన్న వ్యవహారం బట్టబయలైంది. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ పెద్దయెత్తున సాగించిన డ్రోన్, క్షిపణì దాడితో ఆ రెండు దేశాల మధ్య నాలుగు దశా బ్దాల పైగా లోలోపల సాగుతున్న కుమ్ములాట బయటపడింది. ముందుగా ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి, ఒక జనరల్ సహా పలువురు సైనికాధికారుల మృతితో అగ్గి రాజుకుంది. ప్రతీకారంగా గత శనివారం ఇరాన్ పంజా విసరడంతో వ్యవహారం ముదిరింది. యుద్ధం ఊసెత్తకపోయినా దెబ్బకు దెబ్బగా టెహరా న్పై తగిన చర్య చేపడుతామంటోంది టెల్ అవీవ్. అసలే అస్థిరతలో మునిగిన పశ్చిమాసియా ఈ శరవేగ పరిణామాలు, వ్యాఖ్యలతో ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధంలో చిక్కుకుపోవచ్చు. చాలాకాలంగా ఇరాన్ తన వ్యూహాత్మక లక్ష్యాలకై పరోక్ష సహకారం అందిస్తూ ప్రాంతీయ తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పౌరులపైన, వివిధ దేశాల్లోని ఇజ్రాయెల్ ఆస్తులపైన ప్రయోగిస్తూ వచ్చింది. అయితే, ఇజ్రాయెల్‌తో ఎన్నడూ నేరుగా ఘర్షణకు దిగలేదు. తెర వెనుక నుంచి తాను చేసినవి ఒప్పుకోనూ లేదు. ఇజ్రాయెల్దీ అదే పంథా. మూడేళ్ళ క్రితం ఇరాన్‌కు చెందిన ముగ్గురు అణుశాస్త్రవేత్తల హత్యలో తన పాత్రను ఆ దేశమూ అంగీకరించ లేదు, అలాగని ఖండించనూ లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులతో గాజా భూఖండం సంక్షోభంలో పడింది. సదరు హమాస్ దాడుల వెనుక ఇరాన్ పాత్ర గురించి కథలు కథలుంటే, అదే అదనుగా పాలెస్తీనీయుల గాజాను ఇజ్రాయెల్ సమూలంగా ధ్వంసం చేసేసింది. ఐరాస సహా ఎవరెన్ని చెప్పినా నెలల తరబడి ఇజ్రాయెల్ ఆగలేదు, గాజాపై దాడులు ఆపనూ లేదు. ఈ నేపథ్యం నుంచి తాజా ఘటనల్ని చూడాలి. చివరకిప్పుడు ఇరాన్ నేరుగా తన గడ్డ మీద నుంచే ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. కొన్ని దశాబ్దాలుగా పశ్చిమాసియాలో ఎన్నడూ లేనంతటి ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రయోగించిన 360 క్షిపణుల్లో చాలావాటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్‌ల సహకారంతో ఇజ్రాయెల్ నిలువరించగలిగింది. రాయబార కార్యాలయంపై దాడికి ప్రతిగా స్వీయ రక్షణ కోసమే తాము దాడి చేశామనీ, విషయం ఇంతటితో ముగిసిందనీ ఇరాన్ అంటోంది. ఇక, క్షిపణి దాడిని సమర్థంగా అడ్డుకున్నందున సంయమనం పాటించి, పరిస్థితి ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా చూడాలని అమెరికా సహా ఇతర మిత్రదేశాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అభ్యర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ సరేనన్నట్టు ఉంటూనే, ఇరాన్‌కు తగిన బదులిస్తామంటోంది. ఏమైనా ఇరాన్, ఇజ్రాయెల్‌లు దేనికది మధ్యప్రాచ్యంలో తమదే పై చేయి అని చూపేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగమే రెండు దేశాలూ ఇప్పుడు దాదాపు నేరుగా కయ్యానికి దిగడం! పశ్చిమాసియాలో పరిస్థితికి ఇరు దేశాల బాధ్యతా ఉంది. ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా పాలెస్తీనా భూభాగాల్ని బలవంతాన దిగ్బంధించి, కథ నడుపుతుంటే ప్రపంచపు పెద్దన్నలెవరూ ఎన్నో ఏళ్ళుగా పెదవి విప్పలేదు. పట్టించుకోకుండా వదిలేశారు. నిరుడు హమాస్ దాడితో ఇజ్రాయెల్ అహం దెబ్బ తిని, గాజాలో సామూహిక ఊచకోతకు దిగినప్పుడూ అమెరికా సహా ఎవరూ దాన్ని ఆపలేక పోయారు. ఇరాన్ సంగతికొస్తే, అదీ ఇష్టానుసారం వ్యవహరించింది. హెజ్బుల్లా, హమాస్, హౌతీల లాంటివన్నీ అది పరోక్షంగా పోషిస్తున్న పాములే. కొన్నేళ్ళుగా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమన్ లలో ఇరాన్ పరోక్ష సహకారంతో నడుస్తున్న ప్రాంతీయ తీవ్ర వాద మూకలను నిలువరించడమే ఇజ్రాయెల్, అమెరికాల పని అయింది. వెరసి, ఇరాన్, ఇజ్రాయెల్‌ల తప్పిదాలు, స్వార్థంతో పక్కన చేరిన దేశాలతో పశ్చిమాసియా చిక్కుల్లో పడింది. తాజా ఘటనలతో యుద్ధం అంచున నిల్చుంది. ప్రతి యుద్ధం ప్రపంచంలో అనిశ్చితిని పెంచేదే. మరీ ముఖ్యంగా, ప్రపంచానికి ఇంధన భాండా గారం లాంటి పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారితే ఇక చెప్పేదేముంది! తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్ – ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొన్నది అందుకే! వ్యవహారాన్ని తెగేదాకా లాగి, ప్రపంచం రెండు శిబిరాలుగా చీలితే కష్టం. ఇరాన్ దాడితో పని లేకుండా గాజాలో యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటోంది. అంటే, ఇరాన్ – ఇజ్రాయెల్ సంక్షోభం ముగియనే లేదని స్పష్టమవుతోంది. తక్షణమే అంతర్జాతీయ సమాజం బరిలోకి దిగి, ముందు గాజాలో దాడులు, పాలెస్తీనాలో అమాయక పౌరుల మరణాలు ఆగేలా చూడాలి. ఇజ్రాయెల్‌కు 66 శాతం మేర ఆయుధాలిస్తున్న అమెరికా, అలాగే ఇతర ఆయుధ సరఫరా దేశాలు తమ సరఫరాలు తగ్గించగలిగితే మేలు. అంతకంతకూ అంతర్జాతీయంగా తాను ఒంటరి అవుతున్నానని ఇజ్రాయెల్ గుర్తించాలి. ‘అబ్రహమ్ ఒడంబడికల’ ద్వారా మితవాద అరబ్ దేశాలు నెయ్యానికి ముందుకు రావడంతో దానికి కలి గిన ప్రయోజనం పోతుంది. అయినా, ఇంతకు ముందు, ఇకపైన కూడా మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లు రెండు ప్రధాన సైనిక శక్తులు. ఇరుపక్షాలూ లక్ష్మణరేఖ దాటాయి. వాటి మధ్య ఘర్షణ చివరకు యుద్ధంగా పర్యవసిస్తే అది రెంటికీ నష్టమే. కాబట్టి, మంకుపట్టు వీడి, వెనక్కు తగ్గాలి. ప్రస్తుత ఉద్రిక్తతను చల్లార్చాలి. పొంచివున్న పెను యుద్ధం ముప్పును నివారించాలి. పశ్చిమాసి యాలో ఉద్రిక్తతలు కొనసాగితే, ప్రపంచ చమురు సరఫరాలు సైతం అస్తవ్యస్తమై, ధరలు పెరుగు తాయి. రష్యా నుంచి చమురు సరఫరా కోసం ఎర్రసముద్రంపై ఆధారపడే మన దేశానికీ ఇబ్బందే. భారత్ సూచించినట్టు మళ్ళీ దౌత్యమార్గాన్ని ఆశ్రయించడమే అన్ని వివాదాలకూ పరిష్కారం. -
ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు
గాజా: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాలోని సెంట్రల్ గాజాలో దాడులు చేసింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమవుతున్న వేళ ఇజ్రాయెల్ గాజాలో భీకర కాల్పులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సెంట్రల్ గాజాలోని నో సైరాట్ ప్రాంతంలో శుక్రవారం వైమానిక దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైమానిక దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 25 మంది దాకా తీవ్ర గాయపడినట్లు తెలిపారు. మొత్తంగా గాజాలోని వివిధ ప్రాంతాల్లో కలిపి సుమారు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇదీ చదవండి.. ఇరాన్, ఇజ్రాయెల్ హైటెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
శిథిలాల కుప్ప ‘ఖాన్ యూనిస్’.. తిరిగి వస్తున్న ‘గాజా’ వాసులు
జెరూసలెం:పాలస్తీనా దక్షిణ గాజాలో ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. భీకర యుద్ధం కారణంగా కొంత కాలంగా తమ ప్రాంతానికి దూరంగా తలదాచుకున్న ఖాన్ యూనిస్ వాసులు ఇంటిబాట పట్టారు. సైకిళ్లు వేసుకుని, కాలి నడకన తమ సొంత ప్రాంతానికి తిరిగి వస్తున్నారు. అయితే వారికి అక్కడ ఏమీ మిగల లేదు. భవనాలన్నీ ధ్వంసమై శిథిలాల కుప్పలు మిగిలాయి. ఒకప్పుడు భారీ భవంతులతో కళకళలాడిన ఖాన్ యూనిస్ నగరం ప్రస్తుతం శిథిలాల కుప్పలతో నిండిపోవడాన్ని చూసిన వారు తమ నగరం ఇలా అయిపోయిందేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసిన బాంబులు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ఖాన్‌యూనిస్ జనాభా 14 లక్షలు. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా డిసెంబర్లో ఖాన్ యూనిస్ నగరంపైకి సేనలను ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పంపింది. హమాస్ ఉగ్రవాదులకు కేంద్రమైన నగరాన్ని మొత్తం ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదుల జాడ కోసం మొత్తం జల్లెడ పట్టారు. దాడులతో లక్షలాది మంది ఖాన్ యూనిస్ వాసులు నగరం విడిచి వెళ్లిపోయారు. మరో వైపు ఖాన్‌యూనిస్‌పై జరిపిన దాడుల్లో వేల మంది హమాస్ ఉగ్రవాదులను హత మార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇదీ చదవండి.. సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు -
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం.. నెతన్యాహు సంచలన ప్రకటన
జెరూసలెం: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమై ఆదివారం(ఏప్రిల్ 7)తో సరిగ్గా ఆరు నెలలు గడిచిన వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేసేదాకా గాజాలో కాల్పుల విరమణకు ఒప్పుకునేలేదని తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్ క్యాబినెట్ సమావేశానికి ముందు బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఒత్తిడి తమపై పెరుగుతున్నప్పటికీ హమాస్ గొంతెమ్మ కొరికలకు తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఈజిప్టులో తాజా రౌండ్ చర్చలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా, గతేడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూపు హమాస్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడమే కాకుండా కొంత మంది పౌరులను హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాను పూర్తిగా చిధ్రం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి.. ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు -
గాజా ఓటింగ్: అమెరికాపై ఇజ్రాయెల్ గుర్రు!
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌కు అమెరికా దూరంగా ఉండడంపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఈ క్రమంలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపుల్ల పడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రతిపాదించిన డిమాండ్‌ను అమెరికా వీటో ఉపయోగించి వీగిపోయేలా చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ ముందు నుంచే కోరింది. కానీ, అమెరికా పూర్తిగా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. దీంతో అగ్రరాజ్యంపై ఇజ్రాయెల్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శాంతి చర్చల కోసం తమ బృందాన్ని అమెరికాకు పంపించాలనుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ వెనక్కి తగ్గారు. దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంబంధించి చర్చల కోసం తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా ఇజ్రాయెల్‌ను ఆహ్వానించింది. అయితే తాజా పరిణామాలతోనే ఇజ్రాయెల్ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ తీర్మానం వల్ల ఇజ్రాయెల్‌తో సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని యుఎస్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇరాన్‌తో సహా పలు దేశాలకు దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత, రక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పూర్తి మద్దతును తెలియజేస్తున్నారని వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవన్ స్పష్టం చేశారు. ఇక.. గాజా కాల్పుల విమరణను తక్షణమే అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం డిమాండ్ చేసింది. భద్రతా మండలిలోని సమావేశానికి 14 దేశాల సభ్యులు హాజరుకాగా.. అందులో పదిమంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దీంతో ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలను వెంటనే విడిచిపెట్టాలని తెలిపింది. అయితే ఈ సమావేశంలో అమెరికా తీర్మానాన్ని ప్రతిపాదించకుండా ఓటింగ్‌కు దూరం ఉంది. అయితే కాల్పుల విరమణ చేపట్టాలని మాత్రం కోరింది. మొత్తంగా.. ఆమెరికా వ్యవహరించిన తీరుపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. -
గాజా కాల్పుల విరమణకు ఐరాస భద్రతా మండలి డిమాండ్
ఇజ్రాయెల్, పాలస్తీనా సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) డిమాండ్ చేసింది. ఇలా భద్రతా మండలి డిమాండ్ చేయటం తొలిసారి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని యూఎన్ఎస్సీ పేర్కొంది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా హాజరుకాకపోవటం గమనార్హం. భద్రతా మండలిలో 14 మంది సభ్యులు హాజరు కాగా.. అందులో 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘గాజా ప్రజలు తీవ్రంగా బాధ పడుతున్నారు. ఈ దాడులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమాంత్ర ఆలస్యం కాకుండా ఈ దాడులకు ముగింపు పలుకడమే మన బాధ్యత’ అని భద్రతా మండలి సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితిలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా తెలిపారు. మరోవైపు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికా వీటో ప్రయోగించాలని ఇజ్రాయెల్ ఆర్మీ కోరింది. అయితే పవిత్ర రంజామ్ మాసంలో గాజాలో కాల్పుల విరమణ జరగటం కోసమే అమెరికా భద్రతా మండలి సమావేశానికి గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 32 వేల మంది మరణించారు. ఇక.. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1160 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మొత్తం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లగా.. వారి చేతిలో ఇంకా 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇటీవల గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. -
గాజాలో కాల్పుల విరమణ.. ‘యూఎన్’లో వీగిన అమెరికా తీర్మానం
న్యూయార్క్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సభ్య దేశాల్లో 11 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానానికి అల్జేరియా వ్యతిరేకంగా ఓటు వేయగా గుయానా ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆకలితో అలమటిస్తున్న గాజా యుద్ధ బాధితులు మానవతా సాయం పొంందేందుకు వీలుగా ఆరు వారాల పాటు కాల్పుల విరణమణ పాటించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే దీనికి ప్రత్యామ్నాయ తీర్మానంపై ఓటింగ్ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శనివారం మళ్లీ సమావేశం కానుంది. తీర్మానంలోని చైనా, రష్యాలకు అభ్యంతరమున్న పదాలను మార్చినట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తాజా తీర్మానంలో పొందుపరిచినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మాస్కోలో ఐసిస్ మారణహోమం -
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌కు ఇజ్రాయెల్ కౌంటర్
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దళాలు జరిపిన మారణకాండకు ప్రతికారంగా ఆ దేశం.. గాజాపై దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ చేసి.. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందిచాలని ఆమెరికాతో పాటు పలు దేశాలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన ప్రజలను ఈ జాబితాలోని దేశాలు.. తమ దేశంలోకి అనుమతించవని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఆ జాబితాలో అల్జేరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం.. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్, ఇరాన్ దేశాలు శత్రు దేశాలు జాబితాలో ఉన్నాయి. ఈ అయితే ఈ దేశాలకు ఇజ్రాయెల్ పౌరులు.. వెళ్లాలంటే ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్‌కు వీసా ఫ్రీ దేశంగా కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉండటం గమనార్హం. We’re good pic.twitter.com/GmiwEzZGck — Israel ישראל 🇮🇱 (@Israel) March 14, 2024 అయితే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ పౌరులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశంలో ఓ రాష్ట్ర అధికారిక ట్విటర్ హ్యాండిల్ కౌంటర్ ఇచ్చింది. ‘మేం బాగున్నాం’ అని ‘ఎక్స్’లో రీట్వీట్ చేసింది. ఇక..2024 నాటికి ప్ఇజ్రాయెల్ దేశం రపంచంలో 171 దేశాల్లో వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్‌ను కలిగి ఉంది. అదేవిధంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇజ్రాయెల్ పాస్‌పోర్టు 20వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన పౌరులు చాలా యురోపీయన్ దేశాలుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్తారు. అదేవిధంగా లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు తమ పాస్‌పోర్టు ద్వారా సందర్శిస్తారు. ఇదీ చదవండి: స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి! -
యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని
ఇజ్రాయెల్‌తో యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని నియమితులయ్యారు. మొహమ్మద్ ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ తాజాగా ఆ దేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారు. ముస్తఫా చాలాకాలంగా అధ్యక్షుడు అబ్బాస్ వద్ద సలహాదారునిగా పని చేస్తుండడం గమనార్హం. అయితే.. ఈ ఎంపికపై పాలస్తీనాలో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం.. ప్రధానిగా ఉన్న మొహమ్మద్ శతాయే ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అప్పటి నుంచి అధ్యక్షుడు అబ్బాసే ప్రధాని పేషీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నమ్మకస్తుడు ముస్తఫాకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలని ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలోనే ఈ నియామకం చేపట్టినట్లు అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. అయితే.. అమెరికా ఒత్తిళ్లతోనే అధ్యక్షుడు ఈ నియామకం చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముస్తఫా నేపథ్యానికి వస్తే.. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆర్థికవేత్తగా.. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు. 2014లో గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత పునర్నిర్మాణ పనుల్లో ముస్తఫా భాగం కావడం గమనార్హం. అయితే.. కొత్త ప్రధాని అధికారాలు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో చాలా పరిమితంగానే ఉండనున్నాయి. ధ్వంసమైన గాజా స్ట్రిప్ పునర్నిర్మాణం, పలు వ్యవస్థల సంస్కరణల బాధ్యతలను ప్రధానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 2007 నుంచి గాజా స్ట్రిప్ హమాస్ నియంత్రణలోకి వెళ్లగా, వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధికారంలో ఉంది. గాజాలోని పరిస్థితుల్ని అమెరికా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నది తెలిసిందే. ఇక గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణకాండలో 1,200 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సుమారు 250 మందిని మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ భీకర దాడుల్లో పాలస్తీనా భూభాగంలో 31,000పైగా ప్రజలు మృతి చెందారు. -
సరైన కార్యాచరణ ఎక్కడ?!
నటన ఒక స్థాయికి మించితే బెడిసికొడుతుంది. తెరపై అతిగా నటిస్తే ఓవరాక్షన్ అంటారు. ఆ పనే నిజజీవితంలో చేస్తే వంచన అంటారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ 157 రోజులుగా అంతూ దరీ లేకుండా సాగుతోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా పరిగణించే రంజాన్ మాసం మొదలైనా మారణకాండ, విధ్వంసం ఆగటంలేదు. ఆకలితో అల్లాడుతున్న ప్రజానీకం అడపాదడపా వచ్చిపడుతున్న క్షిపణులకూ, బాంబులకూ పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికి 31,000 మంది పౌరులు ఈ దాడుల్లో మరణించారని పాలస్తీనా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతుండగా అందులో 13,000 మంది ఉగ్రవాదులున్నారని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ‘సంపూర్ణ విజయం’ సాధించేవరకూ విశ్రమించబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మంది పౌరులను అపహరించినప్పటినుంచీ గాజాపై దాడులు సాగుతూనేవున్నాయి. కిడ్నాప్ చేసినవారిలో 150 మందిని హమాస్ విడుదలచేసింది. ఇంకా 100 మంది వారి చెరలోనేవున్నారు. ఈ మానవ హననాన్ని నిలువరించటానికి తన పలుకుబడిని వినియోగించాల్సిన అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నంగా ద్విపాత్రాభినయం చేస్తూ తన నటనావైదుష్యాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాపై దాడులు నిలపాలనీ, కనీసం రంజాన్ మాసంలోనైనా కాల్పుల విరమణకు అంగీ కరించాలనీ నెతన్యాహూను కోరారు. మంచిదే. కానీ ఆయన లక్ష్యపెట్టిందెక్కడ? తన మాటకు విలువీయని దేశానికి బైడెన్ ఆయుధ సరఫరా ఎలా కొనసాగిస్తున్నారు? అమెరికాయే కాదు... దాని మిత్రదేశాలు కూడా ఈ ద్విపాత్రాభినయాన్ని అలవాటు చేసు కున్నాయి. ఇదే సమయంలో యుద్ధం ఆపాలంటూ వర్ధమాన దేశాలు తీసుకొస్తున్న తీర్మానాలకు భద్రతామండలిలో అమెరికా తన వీటో అధికారంతో గండికొడుతోంది. నెతన్యాహూపై బైడెన్ తరచు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఫాపై దాడికి పూనుకుంటే లక్ష్మణరేఖ దాటినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎవరిని వంచించటానికి ఈ హెచ్చరికలు? గాజా ప్రజల క్షేమంపై ఆయనకు నిజంగా ఆందోళనవుంటే దాని పొరుగు దేశమైన ఈజిప్టును ఒప్పించి గాజా పౌరులు సరిహద్దుదాటి తలదాచుకునేందుకు అనుమతించమని అడగొచ్చు. కానీ ఆయన ఆ పని చేయటం లేదు. ఈజిప్టుకు ఏటా అమెరికా 103 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో బైడెన్‌కు మంచి సంబంధాలున్నాయి. అయినా ఈ ప్రతిపాదన చేయరు. ఇందుకు బదులు ఆహార పొట్లాలు అందించటం మొదలెట్టారు. ఆ ఉద్దేశం వెనకున్న ఆంతర్యాన్ని కూడా అనేకులు తప్పుబడుతున్నారు. దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాలో పోర్టు నిర్మాణాన్ని మొదలుపెడతామని బైడెన్ ప్రకటించారు. ఇది ఆహార సరఫరా సులభం చేయటం కోసమని ఆయన చెబుతున్నా ఆ వంకన అక్కడ తిష్టవేయటమే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రా యెల్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మాట్లాడే మాటలు 31,000 మంది మరణించాక కూడా చెల్లుబాటవుతాయా? అయిదు నెలలు గడిచాక కూడా ఇంకా హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యమంటూ ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథాన్ని అమెరికా చూసీ చూడనట్టు వదిలేయటం సరైందేనా? హమాస్ తన దుందుడుకు చర్యలతో గాజా ప్రజలకు తీరని నష్టం చేసింది. దానిపై దాడి పేరుతో అదే పని ఇజ్రాయెల్ కూడా కొనసాగిస్తోంది. కానీ ఒకరి దాడిని ఉగ్రవాదంగా చిత్రీకరిస్తూ మరొకరిని అనునయిస్తూ, వేడుకుంటూ అదే సమయంలో వారికి కావల సిన ఆయుధ సామగ్రి అందిస్తూ కాలం గడపటం సరైందేనా? గాజాలో నాగరిక సమాజాలు ఏమాత్రం అంగీకరించటం సాధ్యంకాని ఉదంతాలు చోటుచేసు కుంటున్నాయి. గాజా పౌరులు ఆకలికి తట్టుకోలేక ఆకులు అలములు తింటున్నారు. కడుపు నింపు కోవటానికి పశుదాణా సైతం వినియోగిస్తున్నారు. నెలలు నిండకమునుపే గర్భిణులకు ప్రసవాలవు తున్నాయి. ఆ నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ కూడా సాధ్యం కావటం లేదు. అధిక రక్తస్రావంతో తల్లులు కన్నుమూస్తున్నారు. సకాలంలో మేల్కొని ఆపకపోతే ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా కూడా దోషిగా నిలబడాల్సివస్తుంది. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో దినదిన గండంగా బతుకుతున్న ఉక్రెయిన్‌కు ఇంతవరకూ అమెరికా ఒక్కటే 7,500 కోట్ల డాలర్ల సాయం అందించింది. నాటో సభ్య దేశాలు తమ వంతుగా మరింత సాయం అందిస్తున్నాయి. ఇందువల్ల రష్యా ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. అటు ఉక్రెయిన్‌కు కూడా ఒరిగేదేమీ వుండటం లేదు. లాభపడేది అమెరికా రక్షణ ఉత్పత్తుల కంపెనీలే. సాయం పేరుతో అందించేదంతా తిరిగి ఆ కంపెనీలకు చేరుతోంది. ఉక్రెయిన్ ఆ డబ్బుతో అమెరికా ఆయుధాలు, క్షిపణులు వగైరాలు కొంటున్నది. అటు ఉక్రెయిన్, ఇటు గాజా ఏకకాలంలో శ్మశానాలను మరపిస్తుండగా... రక్షణ ఉత్పత్తుల కంపెనీలు మాత్రం పచ్చగా వెలుగుతున్నాయి. పోనీ అమెరికా అయినా ప్రశాంతంగా వుంటున్నదా? కొన్ని దశాబ్దాలక్రితం పౌరహక్కుల కోసం చేతులు కలిపిన నల్లజాతీయులు, యూదులు ఇప్పుడు పరస్పరం దూషించుకుంటున్నారు. యూదులపై అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్నంతటినీ ఆపాలంటే గాజాతోపాటు ఉక్రెయిన్లోనూ ప్రశాంతత నెలకొనాలి. అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతుల్లోనేవుంది. ఇప్పుడు కావాల్సింది నటన కాదు... సరైన కార్యాచరణ. -
ఆస్కార్ రెడ్ కార్పెట్: ఆ స్టార్ల రెడ్ పిన్ కథేమిటి?
ఆస్కార్ 2024 సంరంభం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ సినిమా రంగంలో నోబెల్ అవార్డులుగాభావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్‌పై ప్రత్యేకంగా కనిపించారు. 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు స్టార్లు అంతా రెడ్ పిన్లు ధరించడం విశేషంగా నిలిచింది. వీరి ఫోటోలు వైరల్ గా మారాయి. భీకర బాంబుల దాడులతో దద్దరిల్లిన గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ వారంతా రెడ్ పిన్‌లను ధరించారు. అలాగే కాల్పుల విరమణకు పిలుపు నివ్వమని అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ను కోరుతూ ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇజ్రాయెల్, గాజాలో హింసను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ యుద్ధంలో వేలాదిమంది, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో శాంతిని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని 'పూర్ థింగ్స్' నటుడు రమీ యూసఫ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రతకో పిలుపునిస్తున్నామనీ, పాలస్తీనా ప్రజలకు శాశ్వత న్యాయం , శాంతి కలిగేలా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. అరచేతిలో ఒక నల్ల రంగు గుండెతో డిజైన్ చేసిన ఈ రెడ్ పిన్నులను ఆర్టిస్ట్4సీజ్ఫైర్ అనే సంస్థ తయారు చేసింది. -
నెతన్యాహూతో ఇజ్రాయెల్‌కు నష్టమే: బైడెన్
విలి్మంగ్టన్: గాజాలో హమాస్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. నెతన్యాహూ అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహూ దారుణంగా విఫలమవుతున్నారని ఆక్షేపించారు. బైడెన్ శనివారం మీడియాతో మాట్లాడారు. తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. హమాస్‌ను వేటాడే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని వెల్లడించారు. కానీ, సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చిచెప్పారు. గాజాలో మరణాల సంఖ్య ఇజ్రాయెల్ చెబుతున్నదానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. గాజాలో అమాయకుల మరణాలు ఇంకా పెరిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని బైడెన్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఎర్రసముద్రంలో హౌతీ దాడులు.. ఇద్దరి మృతి
దుబాయ్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండకు తీవ్రంగా తప్పుబడుతూ అందుకు ప్రతిగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌతీ దాడుల్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎర్ర సముద్ర పరిధిలోని గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద ఈ ఘటన జరిగింది. బుధవారం గ్రీస్ దేశానికి చెందిన బార్బడోస్ జెండాతో వెళ్తున్న వాణిజ్యనౌక ‘ట్రూ కాని్ఫడెన్స్’పై హౌతీలు మిస్సైల్ దాడి జరపగా నౌకలోని ఇద్దరు సిబ్బంది చనిపోయారు. ఇతర సిబ్బంది పారిపోయారు. నౌకను వదిలేశామని, అది తమ అదీనంలో లేదని చెప్పారు. తమ యుద్ధనౌకలపైకి హౌతీ రెబెల్స్ నౌక మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా విధ్వంసక నౌకలు రెచి్చపోయాయి. హౌతీలు ఉంటున్న యెమెన్ భూభాగంపై దాడి చేసి హౌతీ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసంచేసింది. హౌతీల దాడుల్లో మరణాలు నమోదవడంతో ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాల మధ్య సముద్ర రవాణా రంగంలో సంక్షోభం మరింత ముదిరింది. హౌతీలపై అమెరికా దాడులపై ఇరాన్ మండిపడింది. అమెరికా ఇంధన సంస్థ షెవ్రాన్ కార్ప్‌కు చేరాల్సిన కువైట్ చమురును తోడేస్తామని హెచ్చరించింది. రూ.414 కోట్ల విలువైన ఆ చమురును తీసుకెళ్తున్న నౌకను ఇరాన్ గతేడాది హైజాక్ చేసి తమ వద్దే ఉంచుకుంది. -
‘హమాస్’ అత్యాచారాలు.. యూఎన్ సంచలన నివేదిక
జెరూసలెం: గతఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి(యూఎన్) సంచలన విషయాలు వెల్లడించింది. అక్టోబర్ 7 దాడిలో ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో అక్కడి మహిళలపై అత్యాచారాలు జరిగాయనేందుకు కచ్చితమైన, ఆధారలతో కూడిన సమాచారం ఉందని యుద్ధంలో జరిగిన లైంగిక దాడులపై యూఎన్ నియమించిన ప్రమీల పాటెన్ బృందం తేల్చింది. హమాస్ బంధీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయని యూఎన్ బృందం తన నివేదికలో తెలిపింది. ఫిబ్రవరిలో పాటెన్తో పాటు నిపుణుల బృందం ఇజ్రాయెల్, వెస్ట్‌బ్యాంక్‌లో పర్యటించారు. గాజా సరిహద్దులోని ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ప్రాంతాలు నోవా మ్యూజిక్ ఫెస్టివల్ సైట్,రోడ్ 232, కిబుట్జ్ రెమ్లలో ఇజ్రాయెలీలపై రేప్‌లతో పాటు గ్యాంగ్ రేప్‌లు జరిగినట్లు రిపోర్టు వెల్లడించింది. చాలా వరకు కేసుల్లో ముందు రేప్ చేసి తర్వాత హత్య చేశారని తెలిపింది. చనిపోయిన మహిళల మృతదేహాలపైన కూడా రెండు చోట్ల అత్యాచారాలు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి బృందం తేల్చింది. ఈ అత్యాచారాలపై సాక్ష్యం చెప్పాల్సిందిగా బృందం కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. అత్యాచార ఘటనలపై యూఎన్ బృందం సభ్యులు మొత్తం 5వేల ఫొటోలు, 50 గంటల సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు రేప్‌కు గురైన బాధితులతో మాట్లాడారు. హమాస్ వద్ద బంధీలుగా ఉండి విడుదలైన వారిని పలువురిని ఇంటర్వ్యూ చేశారు. కాగా, అక్టోబర్ 7న ఇజజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ మెరుపు దాడులు జరిపి వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపి కొంత మందిని బంధీలుగా తమ వెంట తీసుకెళ్లింది. దీనికి ప్రతీకారంగా అప్పటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై భీకర దాడులు చేస్తోంది. గాజాను మొత్తం చిధ్రం చేసింది. అమెరికా కోరినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. ఇదీ చదవండి..హైతీలో తీవ్ర అరాచకం -
తక్షణమే కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం కారణంతో గాజాలో తీవ్ర ఆహార కోరత ఏర్పడింది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందిస్తూ.. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చింది. పాలస్తీనాలోని ప్రజలు అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. మానవతా సాయం పెంచాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. అలబామాలోని సెల్మాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హారిస్.. ‘గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడి పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయి. మానవత్వం మమ్మల్ని చర్య తీసుకోవడానికి బలవంతం చేస్తోంది. గాజాలోని ప్రజలకు సహయం పెంచడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కృషి చేయాలి’ అని కమలా హారిస్ అన్నారు. ‘హమాస్ కాల్పుల విరమణను కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ ఒప్పుకోవడానికి సిద్ధం ఉంది. కాల్పుల విరమణ డీల్ చేసుకోండి. బంధీలను వారి కుటుంబాలకు వద్దకు చేర్చండి. అదేవిధంగా వెంటనే గాజా ప్రజలకు కూడా శాంతి, సాయం అందించండి’ అని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఇక.. తమ వద్ద సజీవంగా ఉన్న ఇజ్రాయెల్ బంధీల పేర్లు వెల్లడించడానికి హమాస్ తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ స్థానిక మీడియా పేర్కొంటోంది. ఆదివారం కైరోలో జరిగిన గాజా కాల్పుల విరమణ చర్చలను ఇజ్రాయెల్ బాయ్‌కాట్ చేయటం గమనార్హం. -
Israel-Hamas war: గాజాకు అమెరికా మానవతా సాయం
వాషింగ్టన్: ఒకవైపు ఇజ్రాయెల్ భీకర దాడులు.. మరోవైపు ఆహారం దొరక్క ఆకలి కేకలు.. గాజాలో లక్షలాది మంది పాలస్తీనియన్ల దుస్థితి ఇది. వారికి సాయం అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచి్చంది. బాధితులకు మానవతా సాయం పంపిణీని ప్రారంభించింది. ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమెరికా సైన్యానికి చెందిన సి–130 సరుకు రవాణా విమానాల ద్వారా శనివారం ఉదయం గాజాలో 38 వేల ఆహార ప్యాకెట్లను జారవిడిచారు. 66 పెద్ద బండిళ్లలో ఈ ప్యాకెట్లను భద్రపర్చి, బాధితులకు చేరేలా కిందికి జారవిడిచారు. ఇందుకోసం జోర్డాన్ సహకారంతో మూడు విమానాలను ఉపయోగించినట్లు అమెరికా సైనికాధికారులు తెలిపారు. గాజాలో విమానం ద్వారా ఆహార పదార్థాలు అందించిన అనుభవం జోర్డాన్‌కు ఉంది. -
US: మళ్లీ నాలుక మడతబెట్టిన బైడెన్
వాషింగ్టన్: బైడెన్ మళ్లీ నాలుక మడతేశారు. ఒకటి చెప్పాలనుకుని మరొకటి చెప్పి ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థులకు మళ్లీ దొరికిపోయారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెమొక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్ ముందున్నారు. అయితే బైడెన్ వయసు చాలా ఎక్కువని, రెండోసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆయన పనికిరారని ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ డెమొక్రాట్లలో కూడా కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ తన మతిమరుపు, వృద్ధాప్యాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకోవడం ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోంది. తాజాగా శుక్రవారం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో వైట్‌హౌజ్‌లో బైడెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా ఇక నుంచి పాలస్తీనాలోని గాజాలో ఆహారపొట్లాలు విమానాల ద్వారా జారవిడుస్తుందని చెప్పబోయి ఉక్రెయిన్‌కు ఆహారం సప్లై చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అది ఉక్రెయిన్ కాదని, గాజా అని కొద్దిసేపటి తర్వాత వైట్‌హౌజ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. గత నెల మొదటి వారంలో కూడా ఈజిప్ట్ ప్రధాని అబ్దిల్ ఫట్టా పేరును ప్రస్తావిస్తూ ఆయనను మెక్సికో అధ్యక్షుడిగా పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. అయితే బైడెన్ డాక్టర్లు మాత్రం ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు అవసరమైన ఫిట్నెస్తో ఉన్నారని స్పష్టం చేయడం గమనార్హం. ఇదీ చదవండి.. కరువు కోరల్లో గాజా.. బైడెన్ కీలక ప్రకటన