Gaza Strip
-
గాజా అమ్మకానికి లేదు
ఎడిన్బర్గ్: గాజా స్ట్రిప్‌ను ఖాళీ చేయించి అందమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాలస్తీనియన్లు ప్రతీకార చర్యలకు దిగారు. స్కాట్లాండ్లో ట్రంప్‌కు చెందిన టర్న్బెర్రీ గోల్ఫ్ రిసార్ట్‌ను ధ్వంసం చేశారు. శనివారం తెల్లవారుజామున నిరసనకారులు రిసార్ట్‌లోకి చొరబడ్డారు. గోల్ఫ్ హోల్స్‌ను నాశనం చేశారు. ఓపెన్ చాంపియ్íÙప్స్‌లో ఉపయోగించే వస్తువులు, ప్రదేశాలను పాడు చేశారు. అక్కడి పచ్చికబయళ్లపై ‘గాజా అమ్మకానికి లేదు’ అని తెల్లని పెయింట్‌తో రాశారు. రిసార్ట్ క్లబ్‌హౌస్ భవన గోడలపై ఎరుపు రంగు చల్లారు. ఇది తమ పనేనని ‘పాలస్తీనా యాక్షన్’ అనే సంస్థ ప్రకటించుకుంది. ‘‘గాజాపై ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ పని చేశాం. గాజాను తన సొంత ఆస్తిలా పరిగణిస్తామంటే ఒప్పుకోం. ఇది తెలియజేప్పేందుకు, ట్రంప్ ఆస్తికి భద్రత లేదని నిరూపించేందుకు రిసార్ట్‌పై దాడి చేశాం. గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌కు, అమెరికాకు వలసరాజ్యంగా మార్చే యత్నాలను అడ్డుకుంటాం’’ అని ప్రకటించింది. దాడిని పిల్లచేష్టగా రిసార్ట్ వర్గాలు కొట్టిపారేశాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక గోల్ఫ్‌కోర్సుల్లో టర్న్బెర్రీ ఒకటి. ఇక్కడ నాలుగుసార్లు ఓపెన్ ఛాంపియన్íÙప్ జరిగింది. 2014లో ట్రంప్ కొనుగోలు చేసినప్పటి నుంచీ ఇక్కడ ఓపెన్ రొటేషన్‌ను అమలు చేయడం లేదు. -
‘‘అయ్యా ట్రంప్.. ఇలాంటి బతుకులెందుకు?’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజన్‌పై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. తాజా ‘ట్రంప్ గాజా’ అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహాజనితమైన గాజా.. వాస్తవాలను ఏమాత్రం దాచిపెట్టలేదని.. అక్కడి ప్రజలు కోరుకునేది అలాంటి బ్రతుకులు కానేకాదని పలువురు మండిపడుతున్నారు.ఆకాశన్నంటే భవనాలు, లగ్జరీ ఓడలు, రాత్రిపూట బంగారు వర్ణంలో మెరిసి పోయే గాజా, నియంతృత్వ ధోరణిని ప్రతిబింబించేలా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బంగారు విగ్రహాలు, మధ్యలో ఏదో తింటూ కనిపించే ఇలాన్ మస్క్, డబ్బులు వెదజల్లే పిల్లలు, అటు పబ్‌లో డ్యాన్సర్లతో.. ఇటుపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహూతో ట్రంప్ చొక్కాల్లేకుండా సేదతీరుతున్న దృశ్యాలను.. వెరసి విలాసవంతమైన ప్రాంతంగా ఉన్న గాజా వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు.Holy Shlit. President Trump just posted Trump Gaza on his Truth Social account. 🤣🤣🤣 pic.twitter.com/o44mmbtyk8— Based DK (@Back_2TheMiddle) February 26, 2025అయితే ట్రంప్ గాజా పేరుతో విడుదలైన ఆ ఏఐ జనరేటెడ్(AI Generated Video) వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది గాజా ప్రజలను ప్రతిబింబించేలా ఎంతమాత్రం లేదని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బసీమ్ నయీమ్ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ట్రంప్ మరోసారి గాజా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. గాజా ప్రజలు కోరుకుంటోంది ఛిద్రమైన ఈ ప్రాంత పునర్మిర్మాణం. అలాగే తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని. అంతేగానీ బంధీఖానాల్లో ఉండాలని కాదు. మేం పోరాడేది బంధీఖానాల్లో పరిస్థితులు మెరుగుపడాలని కాదు. అసలు జైలు, జైలర్ లేకుండా చూడాలని’’ అని నయీమ్ అంటున్నారు.మరోవైపు ఈ వీడియోలో మస్క్, నెతన్యాహూ ప్రస్తావించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాలో మానవతా సాయం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ట్రంప్ పక్కనపెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. 👉2023 అక్టోబర్ 07వ తేదీన హమాస్(Hamas) సంస్థను ఇజ్రాయెల్‌పై మెరుపు మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడుల్లో 1,200 మంది మరణించారు. అయితే ప్రతిగా హమాస్ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు జరుపుతూ వచ్చింది. ఇప్పటిదాకా ఈ దాడుల్లో 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా.. ఇందులో పిల్లల సంఖ్యే అధికంగా ఉంది. మరోవైపు.. ఈ యుద్ధ వాతావరణంతో 90 శాతం గాజా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో గాజాకు అంతర్జాతీయ సాయం అందడం కూడా కష్టతరంగా మారగా.. ఆ సాయం అందక పలువురు చనిపోవడం గమనార్హం.👉ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పలు విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న బంధీలను హమాస్.. పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం పూర్తైతే హమాస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. 👉మరోవైపు.. గాజా పునర్మిర్మాణం కోసం ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న 21 లక్షల మంది పాలస్తీనా ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించేసి(వెలేసి).. గాజాను అతి సుందర విలాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆ బాధ్యతలు అమెరికానే తీసుకుంటుందని అంటున్నారాయన. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్ధతు ప్రకటించగా.. అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. గాజా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్‌లో మార్చి 4వ తేదీన ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: సారీ.. ఆయన కింద పని చేయలేం! -
పాలస్తీనియన్లకు ఆశ్రయం కోసం జోర్డాన్‌పై ట్రంప్ ఒత్తిడి
వాషింగ్టన్: గాజా స్ట్రిప్ స్వాదీనం ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత వేగవంతం చేశారు. గాజా స్ట్రిప్ నుంచి పంపేయడంతో శాశ్వతంగా నిర్వాసితులయ్యే పాలస్తీనియన్లకు మీ దేశంలో ఆశ్రయం కల్పించాలని జోర్డాన్ రాజు అబ్దుల్లాపై ట్రంప్ ఒత్తిడి పెంచారు. మంగళవారం శ్వేతసౌధంలో అబ్దుల్లాతో ట్రంప్ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. నివాసితు లను తరలించడంతోపాటు యుద్ధంతో దెబ్బతిన్న గాజాను పశ్చిమాసియాలో అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న తన ఆలోచనను వదలుకోబోనని ట్రంప్ సంకేతం ఇచ్చారు. గాజాను కొనడం లేదని, ఏకంగా స్వా«దీనం చేసుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘గాజా స్ట్రిప్‌ను తీసుకుంటాం. పశి్చమాసియాలో ప్రజలకు చాలా ఉద్యోగాలు కల్పించబోతున్నాం’’అని ట్రంప్ పేర్కొన్నారు. గాజా నిర్వాసితులకు ఆశ్రయం కల్పించడానికి జోర్డాన్, ఈజిప్ట్ లు అంగీకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘జోర్డాన్‌లో మాకు కొంత భూమి ఉంటుందని నేను నమ్ముతున్నాను. చర్చలు పూర్తయిన అనంతరం పాలస్తీనియన్లు సంతోషంగా, సురక్షితంగా జీవించడానికి చోటు లభిస్తుందని అనుకుంటున్నా’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్థిక, సైనిక సహాయం కోసం అమెరికాపై జోర్డాన్, ఈజిప్ట్ ఆధారపడటమే ట్రంప్ అంత బలంగా చెప్పడానికి కారణం. అయితే... జోర్డాన్‌కు సహాయాన్ని నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్ అన్నారు. మద్దతు ఇస్తున్నామన్న వంకతో ఈ దేశాలను బెదిరించాలని భావించట్లేమని చెప్పారు. ‘‘మేము జోర్డాన్‌కు, ఈజిప్టుకు సహాయాన్ని అందిస్తాం. ఆ సాకుతో బెదిరించాల్సిన అవసరం లేదు. మేం అలాంటి భావజాలానికి అతీతులం అనే అనుకుంటున్నాం’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పాలస్తీనియన్లను తమ భూభాగంలోకి తరలించే ప్రక్రియకు రాజు అబ్దుల్లా సుముఖంగా ఉన్నట్లు కనిపించలేదు. ట్రంప్ ప్రణాళికను సమరి్థంచకుండా, వ్యతిరేకించకుండా అసౌకర్యంగా కనిపించారు. తన దేశానికి ఏది మంచిదో అది చేస్తానని అబ్దుల్లా అన్నారు. గాజాలో అనారోగ్యంతో బాధపడుతున్న 2,000 మంది చిన్నారులను మాత్రం చికిత్సచేయించేందుకు జోర్డాన్‌కు తీసుకెళ్తామని రాజు చెప్పారు. రాజు నిర్ణయంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. పాలస్తీనియన్లను నిర్వాసితులను చేసే ప్రయత్నాలను తాను వ్యతిరేకినని రాజు అబ్దుల్లా గతంలోనూ వ్యాఖ్యానించారు. ‘‘ఇది ఏకీకృత అరబ్ వైఖరి’’అని తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ‘‘పాలస్తీనియన్లను ఇంకెక్కడికీ పంపేయకుండానే గాజా స్ట్రిప్‌ను పునర్ నిర్మించాలి. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి’’అని ఆయన అన్నారు. గాజా అంశంలో అమెరికా కొత్త అధ్యక్షుడు తన ప్రణాళికలను వెల్లడించాక అగ్రరాజ్య అధ్యక్షుడితో భేటీ అయిన తొలి అరబ్ నేత అబ్దుల్లా కావడం గమనార్హం. ఇరువురు నాయకులు ఇతరత్రా అంశాల్లో ఒకరికొకరు స్నేహపూర్వకంగా మెలిగారు. అయితే గాజా గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజు అబ్దుల్లాను ఇబ్బందికర స్థితిలోకి నెట్టాయి. డోలాయమానంలో కాల్పుల విరమణ ట్రంప్ గాజా ప్రతిపాదన ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపులో కొత్త సమస్యను తీసుకొచ్చింది. గాజాపై దాడులను నిలిపివేసే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, తదుపరి నోటీసు వచ్చే వరకు బందీలను విడుదల చేయడం నిలిపివేస్తున్నట్లు హమాస్ సోమవారం తెలిపింది. బందీలందరినీ శనివారం మధ్యాహ్నంలోగా విడుదల చేయకపోతే మీ అంతు చూస్తానని ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హమాస్ ఏ విధంగా స్పందిస్తుంది, దానికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది?. అప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తు ఏమిటనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. సర్వత్రా వ్యతిరేకత గాజా స్వా«దీనం, పాలస్తీనియన్లను తిరిగి గాజాకు అనుమతించబోమంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాజాను స్వా«దీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందన కోరుతూ ఫిబ్రవరి 7 నుంచి 9 తేదీలలో రాయిటర్స్/ఇప్సోస్ అమెరికాలో ఒక సర్వే నిర్వహించింది. గాజాను అమెరికా స్వా«దీనం చేసుకుని అక్కడ నివసిస్తున్న పాలస్తీనియన్లను తరలించే ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతి నలుగురు అమెరికన్లలో ముగ్గురు చెప్పారు. అంటే.. 74 శాతం మంది అమెరికన్ల అభిప్రాయం ఇదే. ఈ అంశంపై రిపబ్లికన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గాజా స్వా«దీన ప్రకటనను 55 శాతం మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. 43 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. -
‘‘ఏం తినేది..? ఎట్లా బతికేది??’’ హృదయ విదారక గాజా చిత్రాలు
-
హమాస్‌తో డీల్.. నెతన్యాహు వ్యాఖ్యల అర్థమేంటి?
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. అనూహ్యంగా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చాయి. కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు. ఈ సమయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఇది పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో నిర్బంధించబడిన ఇజ్రాయెల్ బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవడంలో సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారని ఆయన కార్యాలయం తెలిపింది.ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి వీలు కలుగుతుంది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. కొన్నినెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.ఇక, అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయలయ్యారు. -
గాజాలో శాంతి.. ఇజ్రాయెల్, హమాస్ కీలక అంగీకారం
దోహా: యుద్ధం, మానవీయ సంక్షోభంతో 15 నెలలుగా అట్టుడుకుతున్న గాజా(Gaza)కు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. మరోసారి తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్(Israel), హమాస్(Hamas) అంగీకరించాయి. ఖతార్ రాజధాని దోహాలో వారాల తరబడి జరిగిన చర్చల అనంతరం బుధవారం ఎట్టకేలకు ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కనీసం ఆరు వారాల పాటు యుద్ధానికి విరామం ప్రకటిస్తారు.ఇక, యుద్ధానికి పూర్తిగా తెర దించే దిశగా చర్చలను ముమ్మరం చేస్తారు. అంతేగాక హమాస్ తన వద్ద వంద మంది ఇజ్రాయెల్ బందీల్లో కనీసం 30 మందికి పైగా విడతలవారీగా వదిలేయనుంది. బదులుగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది. దాంతోపాటు గాజాలో నిర్వాసితులైన వేలాది మంది స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తుంది. అంతేగాక గాజాకు కొద్ది నెలలుగా పూర్తిగా నిలిపేసిన అంతర్జాతీయ మానవతా సాయాన్ని పూర్తిస్థాయిలో అనుమతిస్తుంది. ఈ మేరకు ఇరు వర్గాలూ అంగీకరించినట్టు చర్చల్లో పాల్గొన్న ముగ్గురు అమెరికా ఉన్నతాధికారులు, హమాస్ ప్రతినిధి తెలిపారు. దీనిపై దోహా త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తుందని చెప్పారు.ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం మాత్రం ఒప్పందం విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దానికి కేబినెట్ ఆమోదముద్ర పడాల్సి ఉంటుందని పేర్కొంది. తాను ప్రమాణస్వీకారం చేసే లోపే గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు ఇటీవలే అల్టిమేటమివ్వడం తెలిసిందే. లేదంటే తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరోవైపు గాజాపై మంగళవారం ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలతో సహా 18 మంది మరణించారు. Israel and Hamas have reached a landmark agreement to cease hostilities in Gaza and exchange Israeli hostages for Palestinian prisoners.This breakthrough comes after months of intense negotiations facilitated by Egyptian and Qatari mediators,with the support of the United States. pic.twitter.com/EtPZK69F48— Unfunny Media (@Unfunny_Media) January 16, 2025 -
ఇజ్రాయెల్ ప్లాన్ సక్సెస్.. హమాస్‌కు కోలుకులేని ఎదురుదెబ్బ
జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ నేతల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా పోలీస్ చీఫ్ టార్గెట్‌గా జరిగిన దాడుల్లో కీలక నేత సహ 68 మంది మృతి చెందారు. ఈ మేరకు వైమానిక దాడులను ఇజ్రాయెల్ సైతం ధృవీకరించింది.గాజా సిటీపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 68 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో హమాస్ పోలీస్ చీఫ్ హసామ్ షాహ్వాన్‌తో పాటు.. మరో కీలక హమాస్ నేత మహమ్మద్ సలాహ్ కూడా ఉన్నారు. షాహ్వాన్ లక్ష్యంగా తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. పోలీస్ చీఫ్ హసామ్ మృతి కారణంగా హమాస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కీలక నేతగా ఉన్నారు. తాజా దాడిలో మరణించిన వారిలో పౌరులే ఎక్కువ మంది ఉన్నారు.అయితే, ఇజ్రాయెల్ పౌరులు ఆశ్రయం ఉంటున్న అల్-మవాసి జిల్లాను మానవతా జోన్‌గా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఈ కారణంగానే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక, కొత్త ఏడాదిలో రెండు రోజులు ముగిసిన వెంటనే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.ఇదిలా ఉండగా.. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధంలో 45,500 మందికి పైగా పాలస్తీనియన్లను మరణించారు. గాజాలోని 2.3 మిలియన్ల మంది ప్రజలు సిటీని విడిచివెళ్లిపోయారు. ఇదే సమయంలో హమాస్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. మరో 251 మంది ఇజ్రాయెల్ పౌరులను గాజా వద్ద బంధీలుగా ఉన్నారు. -
సరైన బట్టల్లేక.. దుప్పట్లు లేక..
యుద్ధంతో అతలాకుతమైన గాజాను ఇప్పుడు చలి పులి చంపేస్తోంది. ముఖ్యంగా చలి నుంచి దాచుకోవడానికి వెచ్చని దుస్తులు లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక గాజా స్ట్రిప్‌లో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఆహారం, ఇంధనం, మందులు, మౌలిక సదుపాయాలు లేక గాజాలోని కుటుంబాలు వణికిపోతున్నాయి. కళ్లముందే పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. డెయిర్ అల్–బలాహ్: ఓవైపు యుద్ధంతో విధ్వంసమైన గాజాను ఇప్పుడు చలి వణికిస్తోంది. చలి తీవ్రత బాగా పెరగడంతో రక్షించుకోవడానికి సరైన బట్టలు, దుప్పట్లు లేకపోవడంతో వారం రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు. బాంబు దాడుల నుంచి తప్పించుకుని వచ్చామని, ఇక్కడ చలికి పిల్లల ప్రాణాలు పోతున్నాయని తన నవజాత శివువును పోగొట్టుకున్న యహ్యా అల్–బత్రాన్ రోదిస్తున్నాడు. కొద్దిరోజుల కిందే చనిపోయిన తన చిన్నారి దుస్తులను చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా పూర్తిగా నిరాశ్రయులైన బత్రాన్ కుటుంబం పదేపదే కొత్త ప్రాంతాలకు వలసపోతూ చివరకు డేర్ ఎల్–బాలాహ్లోని చిరిగిపోయిన దుప్పట్లు, బట్టలతో చేసిన తాత్కాలిక గుడారానికి చేరింది. అతని భార్య నెలలు నిండకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు జుమా దక్షిణ గాజాలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతుండగా.. అలీ కొంత ఆరోగ్యంగా ఉండటంతో ఇంక్యుబేటర్ నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఖర్జూరం తోటలో నివసిస్తున్న వందలాది మంది మాదిరిగానే, వారు భారీ వర్షాలు, ఎనిమిది డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య పిల్లలను వెచ్చగా ఉంచడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా దుప్పట్లు లేవు. తగిన దుస్తులు లేవు. ‘‘చలికి తట్టుకోలేక నా బిడ్డ శరీరం మొత్తం గడ్డకట్టడం, అతని చర్మం నీలం రంగులోకి మారింది. నా కళ్లముందే చలిపులి అతని ప్రాణాలుతీసింది’’అంటూ ఆ తల్లి కంటతడి పెట్టుకుంది. వర్షంలో తడిసిన చాపపై కూర్చొని చిరిగిపోయిన దుప్పట్లును కప్పి దగ్గరకు పట్టుకుని తన ఇద్దరు పిల్లలను కాపాడుకుంటున్నాడు బత్రాన్. ఎండిపోయిన రొట్టె, స్టవ్ మీద చిన్న కుండలో ఉన్న వేడి నీళ్లు. ఒక రోజుకు వాళ్లకవే ఆహారం. 20 లక్షల మంది భద్రతకు ముప్పు గాజా స్ట్రిప్‌లో వేలాది ఇతర కుటుంబాల ఆహారం, ఇంధనం, ఔషధాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉంటున్న మహమూద్ అల్–ఫాసిహ్ మూడు వారాల వయసున్న తన కూతురును కోల్పోయాడు. వారి కుటుంబం అల్–మవాసి బీచ్ సమీపంలోని చిన్న గుడారంలో ఉంటుండగా చలికి శిశువు గడ్డకట్టుకుపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. తీవ్రమైన హైపోథెరి్మయా వల్ల చిన్నారి గుండె హఠాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయిందని నాజర్ ఆసుపత్రి అత్యవసర, పిల్లల విభాగం డైరెక్టర్ అహ్మద్ అల్ ఫరా తెలిపారు. చలితో మరో 20 రోజుల పసికందు ఆయేషా అల్ ఖాస్సాస్ మృతి చెందింది. ‘‘మీరు ఇంకా గాజా స్ట్రిప్‌లో ఉన్నారంటే ఇజ్రాయెల్ బాంబుదాడులతో మరణించాలి లేదంటే ఆకలితోనో, చలికో చచ్చిపోతారు’’అంటూ దుఃఖిస్తున్నారు ఆయేషా తల్లిదండ్రులు. రాబోయే రోజుల్లో మరింత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దారుణ పరిస్థితి దాపురిస్తుందని గాజాలోని హమాస్ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది నిర్వాసితులైన 20 లక్షల మంది భద్రతకు ముప్పు. ఈ వాతావరణ తీవ్రతకు శిశువులు, వృద్ధులు మరణించే అవకాశం ఉందని డాక్టర్ ఫరా హెచ్చరించారు. -
గాజాపై దాడులు... 22 మంది దుర్మరణం
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని పాలస్తీనియన్లు కనీసం తాగునీరు కూడా దొరకని దుర్భర పరిస్థితుల్లో అల్లాడుతున్నా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను యథేచ్ఛగా సాగిస్తోంది. శనివారం రాత్రి మొదలైన వైమానిక దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో ఐదుగురు చిన్నారులు సహా 22 మంది మృత్యువాతపడ్డారు. గాజా నగరంలోని శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాలపై జరిగిన దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది చనిపోయారు. అయితే, అక్కడ హమాస్ మిలిటెంట్లున్నారని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. డెయిర్ అల్–బలాహ్ నగరంలోని ఓ ఇంటిపై శనివారం రాత్రి జరిగిన మరో దాడిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిదిమంది మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మరో ఆరుగురు చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా, గాజాలో స్వల్ప సంఖ్యలో ఉన్న క్రైస్తవులు క్రిస్మస్ ముందస్తు వేడుకలు జరిపేందుకు ఆ ప్రాంతంలోకి ఆదివారం కార్డినల్ పియెర్బటిస్టా పిజ్జబల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ అనుమతించింది. వేడుకలు జరుగుతుండగా ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ డ్రోన్లతో పహారా కాసింది. ఇజ్రాయెల్ ఆంక్షల వల్ల బిషప్ గాజాలోకి వెళ్లలేకపోయినట్లు పోప్ ఫ్రాన్సిస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ట్రంప్‌కు నెతన్యాహూ ఫోన్
జెరుసలేం: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. హమాస్‌పై యుద్ధంలో విజయం సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సిరియా పరిస్థితులపై తన వైఖరిని ట్రంప్‌తో పంచుకున్నారు. సంభాషణలోని కీలకాంశాలను వివరిస్తూ నెతన్యాహు ఓ వీడియో ప్రకటన షేర్ చేశారు. ‘‘శనివారం సాయంత్రం జరిగిన సంభాషణలో ఇరువురం పలు అంశాలపై చర్చించాం. సంభాషణ చాలా స్నేహపూర్వకంగా సాగింది. ఇజ్రాయెల్ విజయాన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నాం. బందీల విడుదలకు మేం చేస్తున్న ప్రయత్నాల గురించి సుదీర్ఘంగా చర్చించాం. బందీలతో పాటు మృతులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ అహర్నిశలు కృషి చేస్తుంది’’ అని చెప్పారు. אמרתי שנשנה את המזרח התיכון וזה מה שקורה. סוריה היא לא אותה סוריה. לבנון היא לא אותה לבנון. עזה היא לא אותה עזה. איראן היא לא אותה איראן. pic.twitter.com/IFVso1czkH— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) December 15, 2024సిరియాతో ఘర్షణ ఇప్పట్లో లేదుసిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు కూలదోశాక అక్కడి పరిస్థితిని నెతన్యాహు ప్రస్తావించారు. ‘‘సిరియాతో ఘర్షణపై మా దేశానికి ఏ ఆసక్తీ లేదు. పరిస్థితులను బట్టి స్పందిస్తాం’’ అన్నారు. హెజ్బొల్లాకు సిరియా గుండా ఆయుధాల రవాణాకు అనుమతించడాన్ని ఖండించారు. -
ఐసీసీ నోటీసులపై నెతన్యాహు సీరియస్.. తప్పుడు సంకేతమే..
జెరూసలేం: గాజాలో యుద్ధం నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలో వారెంట్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది యూదుల వ్యతిరేక నిర్ణయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఐసీసీ అరెస్ట్ వారెంట్‌పై నెతన్యాహు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కోర్టు నిర్ణయం ఇజ్రాయెల్ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది. నేను ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన వ్యక్తిని. నేను, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టు తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఇజ్రాయెల్ దేశ పౌరుల ప్రాణాలను కాపాడేందుకు మా శక్తి మేరకు మేము పనిచేశాం. కోర్టు తీర్పు యూదులకు వ్యతిరేకంగా ఉంది’ అంటూ విమర్శలు చేశారు.అంతకుముందు.. నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది.The antisemitic decision of the international court in The Hague is a modern Dreyfus trial, and it will end the same way. pic.twitter.com/e1l8PMghrB— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 21, 2024 ఒంటరైన నెతన్యాహు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
యుద్ధం ఆపేస్తేనే ఒప్పందం
జెరూసలేం: గాజా స్ట్రిప్‌లో యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్‌తో బందీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ స్పష్టం చేసింది. యుద్ధం ముగియకుండా, ఖైదీల మార్పిడి జరగదని హమాస్ తాత్కాలిక చీఫ్ ఖలీల్ అల్ హయా బుధవారం పేర్కొన్నారు. దురాక్రమణకు ముగింపు పలకకుండా బందీలను ఎందుకు వదిలేస్తామని ఆయన ప్రశ్నించారు. యుద్ధం మధ్యలో ఉండగా తమ వద్ద ఉన్న బలాన్ని మతి స్థిమితం లేని వ్యక్తి కూడా వదులుకోడని వ్యాఖ్యానించారు. సంప్రతింపులను పునరుద్ధరించడానికి కొన్ని దేశాలు, మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నాయని, తాము ఆ ప్రయత్నాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యుద్ధం ఆపడానికి ఆక్రమించినవారు నిబద్ధతతో ఉన్నారా? లేదా అనేది ముఖ్యమని హయా చెప్పారు. చర్చలను బలహీనపరిచే వ్యక్తి నెతన్యాహు అని రుజువవుతోందన్నారు. మరోవైపు బేషరతుగా శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా బుధవారం వీటో చేసింది. కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టంగా కోరే తీర్మానానికి మాత్రమే అమెరికా మద్దతు ఇస్తుందని ఐరాసలో అమెరికా రాయబారి స్పష్టంచేశారు. ఒప్పందానికి ఇరుపక్షాలు సుముఖత చూపకపోతే మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేస్తామని హమాస్, ఇజ్రాయెల్‌కు తెలియజేశామని కాల్పుల విరమణ మధ్యవర్తి అయిన ఖతార్ ప్రకటించింది. దోహాలోని హమాస్ రాజకీయ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయలేదని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ నవంబర్ 19న ప్రకటించారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వ ప్రయత్నాలను సులభతరం చేయడానికి హమాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అల్ అన్సారీ చెప్పారు. అయితే హమాస్‌ను బహిష్కరించాలని ఖతార్‌ను అమెరికా కోరిందని, దోహా ఈ సందేశాన్ని హమాస్‌కు చేరవేసిందని వార్తలు వచ్చాయి. ఈజిప్టు ప్రతిపాదనను స్వాగతించిన హమాస్ గాజా స్ట్రిప్‌ను నడపడానికి అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రత్యర్థి ఫతా ఉద్యమంతో కలిసి ఒక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్టు చేసిన ప్రతిపాదనను హమాస్ స్వాగతించింది. యుద్ధం ముగిశాక గాజాను ఈ కమిటీ నడిపించి, సమస్యలను పరిష్కరిస్తుందని హయా చెప్పారు. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదన్నారు. యుద్ధం తరువాత గాజాను పాలించడంలో హమాస్ పాత్రను ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
సిరియా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు.. భారీగా ప్రాణ నష్టం
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 15 మంది చనిపోయినట్టు సిరియా స్టేట్ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రధాన కార్యాలయాలు, సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. సిరియా రాజధానికి పశ్చిమాన ఉన్న మజ్జే, ఖుద్సాయా శివారులో ఉన్న భవనాలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 15 మంది మరణించినట్టు స్థానిక మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది.ఇజ్రాయెల్ కొన్నేళ్లుగా సిరియాలో ఇరాన్ సంబంధిత లక్ష్యాలపై దాడులు చేస్తోంది. అయితే, గాజా యుద్ధానికి దారితీసిన ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గత ఏడాది అక్టోబర్ 7 దాడి చేసినప్పటి నుండి డెమాస్కస్‌లో దాడులను వేగవంతం చేసింది. హిజ్బొల్లాకు చెందిన కమాండర్లు, రివల్యూషనరీ గార్డ్లు మజ్జేలో నివసిస్తున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. 🔶 Reports: The IDF attacked the Almazehh neighborhood in Damascus - shortly after a senior Iranian adviser landed in the cityAccording to reports, in the last few minutes the Air Force carried out an airstrike in the Almazzeh neighborhood .. pic.twitter.com/hMnhuiAJzq— Monika (@Monika_is_His) November 14, 2024 ఇదిలా ఉండగా.. హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్‌లో హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 47కి పెరిగింది. ఓ గ్రామంలో జరిగిన దాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 🇮🇱🇸🇾 Israel wipes out an entire neighborhood in Damascus, Syria pic.twitter.com/TarWpmw8We— HOT SPOT (@HotSpotHotSpot) November 14, 2024 -
యుద్ధం వేళ ఇజ్రాయెల్ నెతన్యాహు సంచలన నిర్ణయం
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ బెంజిమెన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. గాజాలో యుద్ధం మొదలు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్న కారణంగా ఆయనను విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ..‘యుద్ధం సమయంలో ప్రధానికి, రక్షణశాఖ మంత్రికి మధ్య పూర్తి నమ్మకం అవసరం. మొదట్లో అలాంటి నమ్మకమే ఉండేది. దాడుల్లో సందర్బంగా ఎన్నో సానుకూల ఫలితాలు సాధించాం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అలాంటిది జరగడం లేదు. ఇద్దరి మధ్య అంతరాలు పెరిగాయి. విశ్వాసం సన్నగిల్లింది అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో గాలంట్ స్థానంలో తన విశ్వాసపాత్రుడు, విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌ను నియమించనున్నారు. విదేశాంగశాఖను గిడియాన్ సార్‌కు అప్పగించారు. తన మాజీ ప్రత్యర్థి అయిన గిడియాన్‌కు నెతన్యాహు ఇటీవలే తన కేబినెట్లో చోటిచ్చారు. అయితే, గాలంట్‌పై నెతన్యాహు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ఇదిలా ఉండగా.. గత ఏడాది మార్చిలోనూ ఒకసారి గాలంట్‌ను తొలగించేందుకు యత్నించగా.. నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు జరిగాయి. ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థలో మార్పుల కోసం నెతన్యాహు ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాన్ని యోవ్ గాలంట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణంగా వారి మధ్య వైరం మొదలైనట్టు సమాచారం. -
అధ్యక్ష ఎన్నికల వేళ.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో మారణహోమం జరుగుతోంది. వందల, వేల సంఖ్యలో ప్రజల బలైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును కోరారు. వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇక, గతంలోనూ గాజాలో యుద్ధం ముగింపు గురించి నెతన్యాహుకు ట్రంప్ ప్రతిపాదించారు. ఇటీవల కూడా ఆయన నెతన్యాహుతో ఈ విషయం గురించి మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. నవంబర్ ఐదో తేదీన అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరిద్దరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. ఇక, ఇజ్రాయెల్ విషయంలో కమలా హారీస్ కూడా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
దాడులను తట్టుకోలేరు.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్
జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడి చేయాలని చూస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్ దాడులపై తాజాగా ఇజ్రాయెల్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హెర్జి హలేవీ స్పందించారు. ఈ సందర్బంగా హలేవీ మాట్లాడుతూ..‘ఇరాన్ ప్రతిదాడి చేస్తే మా దెబ్బ ఇంకా గట్టిగా ఉంటుంది. ఇరాన్‌ను ఎలా చేరుకోవాలో మాకు తెలుసు. మరోసారి దాడి చేస్తే ఇరాన్‌ను ఎలా గట్టిగా దెబ్బ కొట్టాలో మా దగ్గర ప్లాన్ ఉంది. ప్రస్తుతం కావాలనే కొన్ని లక్ష్యాలను పక్కన పెట్టాము. వాటిపై మరో సందర్భంలో గురిపెడతాము. ఆ సమయంలో ఇజ్రాయెల్ దాడులను తట్టుకోలేరు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇదే సమయంలో హమాస్ చీఫ్ హసన్ నస్రల్లా స్థానంలో డిప్యూటీ హెడ్ నయీమ్ ఖాసీమ్‌ను ఎంపిక చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హిజ్జుల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ స్పందించారు. ఈ సందర్బంగా గల్లంట్ మాట్లాడుతూ.. నయీమ్ ఖాస్సెమ్ నియామకం తాత్కాలికం మాత్రమే. అతను ఎక్కువ కాలం ఉండలేడు. అతడికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది అని చెప్పారు. గత నెలలో దక్షిణ బీరుట్లో ఇజ్రాయెల్ దాడిలో నస్రల్లా చనిపోయిన విషయం తెలిసిందే.మరోవైపు.. గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది మంది మృతి చెందారు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజా వ్యాప్తంగా 143 మంది, లెబనాన్‌లో 77 మందికి పైగా మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక, లెబనాన్‌లో భూతల దాడులకు వెళ్లి 33 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.🎥 Video is in Hebrew 🇮🇱Chief of the General Staff, LTG Herzi Halevi, visited the "Ramon" Airbase today and met with pilots and the ground crews who were involved in the recent strikes against.Halevi warned, "If Iran makes the mistake of launching another missile barrage at… pic.twitter.com/bH61AwMQX5— 🇮🇱 Am Yisrael Chai 🇮🇱 (@AmYisraelChai_X) October 30, 2024 -
అక్టోబర్‌లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. ఇజ్రాయెల్ వీడియో
జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతిచెందాడు. అయితే, గతేదాడి అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు ముందు సిన్వర్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ ఆరో తేదీన సిన్వర్ సొరంగంలోకి వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇజ్రాయెల్ వీడియో ప్రకారం.. సిన్వర్, అతడి కుటుంబ సభ్యులు కొన్ని వస్తువులతో సొరంగంలోకి వెళ్లడం కనిపిస్తుంది. ఇదే సమయంలో వారికి కావాల్సిన సామాగ్రిని సొరంగంలోకి తీసుకెళ్లినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సిన్వర్ సొరంగంలో దాక్కున్నట్టు స్పష్టం చేసింది. అక్కడి నుంచే ఇజ్రాయెల్‌పై దాడులకు ప్లాన్ చేసినట్టు ఆరోపించింది.మరోవైపు.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ మేరకు హమాస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర గాజాలో బీట్ లాహియా పట్టణంలోని భవనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దళాలు పౌర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడంతో పాటు ఆసుపత్రులను ముట్టడించి బాధితులకు అందాల్సిన వైద్యం, ఆహార సామగ్రిని అడ్డుకుంటున్నాయని అక్కడి నివాసితులు, వైద్యాధికారులు ఆరోపించారు.🎥DECLASSIFIED FOOTAGE:Sinwar hours before the October 7 massacre: taking down his TV into his tunnel, hiding underneath his civilians, and preparing to watch his terrorists murder, kindap and rape. pic.twitter.com/wTAF9xAPLU— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 19, 2024 -
హమాస్ సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్, చేతి వేలు కత్తిరించి..
జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యం చేతిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతిచెందాడు. ఈ క్రమంలో సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సిన్వర్ తలపై బుల్లెట్ గాయం, ఎడమ చేతికి ఒక వేలును కట్ చేసినట్టు రిపోర్టులో వెల్లడించారు. బుల్లెట్ గాయంతోనే సిన్వర్ చనిపోయినట్టు నిర్ధారించారు.ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా హమాస్ అధినేత సిన్వర్ మృతదేహానికి డాకట్ర్ చెన్ కుగేల్ పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ క్రమంలో తలపై బుల్లెట్ గాయం ఉందని, దాని కారణంగానే అతడు మరణించి ఉంటాడని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా సిన్వర్ ఎడమ చేతికి ఐదు వేళ్లలో ఒక వేలు లేదని తెలిపారు. దీంతో, రిపోర్టు సంచలనంగా మారింది.అయితే, దాడుల్లో చనిపోయిన వ్యక్తి సిన్వర్ అవునా.. కాదా? అని నిర్ధారించుకునేందుకే అతడి వేలిని ఇజ్రాయెల్ సైన్యం కత్తిరించినట్టు కథనాలు వెలువడ్డాయి. ఖైదీల మార్పిడి ఒప్పందంలో 2011లో విడుదలయ్యే వరకు సిన్వర్ రెండు దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ జైలులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆనాటి ప్రొఫైల్‌తో డీఎన్ఏ నిర్ధారణ కోసం అతని వేలును కత్తిరించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. అతడి దంతాలను కూడా కత్తిరించినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. Live Updates: Autopsy Shows Hamas Leader Was Killed by a Gunshot to the HeadYahya Sinwar was earlier hit in the arm during a firefight with Israeli soldiers, according to the Israeli doctor who oversaw the autopsy.The leader of Hamas, Yahya Sinwar, was killed by a gunshot wound…— Brent Erickson (@BErickson_BIO) October 18, 2024 ఇదిలా ఉండగా.. హమాస్ చీఫ్ సిన్వర్ చనిపోవడానికి ముందు అతడు ఉన్న పరిస్థితిని ఇజ్రాయెల్ సైన్యం ఓ డ్రోన్ ద్వారా రికార్డు చేసింది. మరణానికి ముందు సిన్వర్ ఓ శిథిల భవనంలో సోఫా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అప్పటికే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయాల నుంచి రక్తం కారుతోంది. కూర్చున్న చోటు నుంచి లేవలేని నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. శరీరమంతా దుమ్ము కప్పేసి ఉంది. అలాంటి పరిస్థితిలో.. తనవైపుగా వస్తున్న డ్రోన్‌పైకి కర్రలాంటి ఓ వస్తువును విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🇵🇸 Incredible footage: Yahya Sinwar, covered in dust, all his comrades just killed, arm amputated and close to death, hurls a projectile at an Israeli drone in a final act of defianceIsraelis are ridiculing this as a pathetic end, but I'm not sure the world will see it that way pic.twitter.com/I0gdAQhQ0L— Keith Woods (@KeithWoodsYT) October 17, 2024 -
ఇజ్రాయెల్ విధ్వంసం.. హమాస్ చీఫ్ మృతి!
హమాస్‌ను ఇజ్రాయెల్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే హమాస్‌కు చెందిన పలువురు కీలక నేతలను ఇజ్రాయెల్ హత మార్చింది. ఇక, తాజాగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ కూడా మరణించినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి.గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహకర్త అయిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో హమాస్ సొరంగాల వ్యవస్థపై భీకర దాడులు చేసింది. సొరంగాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి హమాన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. అయితే, ఈ సొరంగాల్లో సిన్వార్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. Israel claims to have killed Yahya Sinwar in the Gaza StripBut nothing has been confirmed yet, as soon as it is confirmed, we will inform you pic.twitter.com/5xWYZpWJ69— Mustafa Gujjar (@MGujjar94) September 22, 2024అయితే, ఈ మధ్య కాలంలో అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా బలగాలు సిన్వార్ చనిపోయినట్టు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఐడీఎఫ్ కూడా అతడు గాయపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కొని ఉంటున్నాడా అని నిర్ధారించుకోలేకపోతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా ఒకవేళ సిన్వార్ చనిపోయినా.. ఇప్పటివరకు బలపర్చే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు. ఏదేమైనా.. ఇజ్రాయెల్ చెబుతున్నట్టు ఒకవేళ సిన్వార్ కనుక మరణించి ఉంటే మాత్రం హమాస్‌కు కోలుకులేని దెబ్బ తగలినట్టే అవుతుంది.Spotted: Yahya Sinwar running away and hiding in his underground terrorist tunnel network as Gazan civilians suffer above ground under the rule of Hamas terrorism. There is no tunnel deep enough for him to hide in. pic.twitter.com/KLjisBFq1f— Israel Defense Forces (@IDF) February 13, 2024 #Breaking Reports that Israel is investigating whether Hamas chief Yahya Sinwar was killed in IDF strikes in Gaza. There is no clear intelligence to support the claim. Discussions are taking place as to whether Sinwar's communications have been cut off or he has been ki||ed. pic.twitter.com/Jkif0b9HmH— GLOBAL BREAKING NEWS (@tararnews) September 23, 2024ఇది కూడా చదవండి: ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు -
యుద్ధానికి ముగింపు పలకాలి
ఫిలడెల్ఫియా: గాజా స్ట్రిప్‌లో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ ఇకనైనా మారణహోమం ఆపాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ సాయుధుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందమే గాజా్రస్టిప్ సమస్యకు అసలైన పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. గాజాలోని ప్రతి ఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కాల్పుల విరమణకు ఇరు పక్షాలు ముందుకు రావాలని ఆమె అభిలషించారు. ఫిలడెలి్ఫయాలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ (ఎన్ఏబీజే)సమావేశంలో కమల పాల్గొని ప్రసంగించారు. దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో బదులిచ్చారు. హైతీలు ఇంటి పెంపుడు జంతువులను తింటున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను, వలసదారులను సామూహిక బహిష్కరణ చేస్తామని ట్రంప్ ఇచి్చన హామీని హారిస్ తప్పుబట్టారు. ‘ట్రంప్ ద్వేషపూరిత వ్యాఖ్యలు హానికరం. ఇలాంటి వాటిని సహించకూడదు’అని అన్నారు. ఆర్థిక అంశాలపైనా ఆమె విస్తృతంగా మాట్లాడారు. ‘‘అమెరికన్లను ప్రభావితం చేసే పెద్ద సమస్యలలో సరిపడా గృహాలు లేకపోవడం కూడా ఒకటి. నేనుఅధ్యక్షురాలిగా ఎన్నికైతే గృహాల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తా. చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 6,000 డాలర్లకు విస్తరిస్తాం. దీంతో అమెరికన్లు తమ ఆదాయంలో ఏడు శాతం కంటే ఎక్కువ మొత్తాలను పిల్లల సంరక్షణకు చెల్లించాల్సిన అవసరం లేదు’’అని కమల వ్యాఖ్యానించారు. కమలకు నల్లజాతీయుల బాసట 2020 అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయుల్లో ఏకంగా 92 శాతం మంది అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు పలికారు. రిపబ్లికన్ పార్టీ తరఫున నాటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు కేవలం 8 శాతం మంది నల్లజాతీయులే మద్దతు పలికారు. ఈ సారిసైతం అదే సరళి కనిపిస్తోంది ఎన్ఏఏసీపీ సర్వే తేలి్చంది. ఇటీవల విడుదలైన ఎన్ఏఏసీపీ సర్వే ప్రకారం 63 శాతం మంది నల్లజాతి ఓటర్లు కమలా హారిస్‌కు మద్దతు పలికారు. గతంతో పోలిస్తే డెమొక్రటిక్ పార్టీ నుంచి నల్లజాతీయులు కాస్తంత దూరం జరిగారని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ నల్లజాతీయుల మెజారిటీ మద్దతు కమలకే దక్కడం విశేషం. ఈసారీ పోటీలో నిలిచిన ట్రంప్‌కు కేవలం 13 శాతం మంది నల్లజాతీయులు మద్దతుగా నిలబడినట్లు సర్వే వెల్లడించింది. పెన్సిల్వేనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో నల్లజాతీయుల మద్దతు నిర్ణయాత్మకంగా ఉంటుంది. పెన్సిల్వేనియా అత్యంత కీలకమైన రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం ఎన్ఏబీజేకు ఉందని చెబుతారు. దీంతో వీరిని ఎలాగైనా తమ వైపునకు తిప్పుకోవాలని కమలా హారిస్, ట్రంప్ ఇద్దరూ చెమటోడుస్తున్నారు. అయితే గతంలో ట్రంప్ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యల కారణంగా ఇప్పటికీ నల్లజాతీయుల మద్దతు కూడగట్టడం ఆయనకు సంక్లిష్టంగా తయారైంది. జార్జియాలో మూడు వంతుల మంది నల్లజాతీయులే కావడంతో ఇక్కడా వారి ఓటు నిర్ణయాత్మకంగా మారింది. -
Israel Hezbollah War: పేజర్లో 3 గ్రాముల పేలుడు పదార్థం!
లెబనాన్, సిరియాల్లో పేజర్ల అనూహ్య పేలుళ్లతో గతంలో ఎన్నడూలేనంతగా తొలిసారిగా పేజర్లపై చర్చ మొదలైంది. మంగళవారం నాటి ఘటనలో లెబనాన్, సిరియాల్లో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 12కు పెరిగింది. ఇందులో ఇద్దరు చిన్నారులుసైతం ఉన్నారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు. అసలు ఏమిటీ పేజర్లు? అవి ఎలా పనిచేస్తాయి? వాటిల్లోకి పేలుడు పదార్థం ఎలా వచ్చి చేరింది? తదతర అంశాలను ఓసారి చూద్దాం.ఫోన్లో నిఘా భయం.. అందుకే పేజర్గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు బాసటగా నిలుస్తూ లెబనాన్‌లోని హెజ్బొల్లా.. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. తమ వ్యూహాలు ఇజ్రాయెల్‌కు చిక్కకుండా ఉండేందుకు హెజ్బొల్లా ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఫోన్ల ద్వారా సున్నిత, రహస్య సమాచార మార్పిడి జరిగితే ఇజ్రాయెల్ పసిగట్టే ప్రమాదం ఉందని గ్రహించి ఫోన్లకు స్వస్తి పలికింది. వెంటనే ఫోన్లను పగలగొట్టి పాతిపెట్టాలని హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి హసస్ నస్రల్లామ్ తమ సభ్యులకు ఫిబ్రవరి 13న పిలుపునిచ్చారు. ఫోన్లకు బదులు పేజర్ వాడాలని సూచించారు. పేజర్లో సమాచారం అత్యంత సురక్షితంగా, భద్రంగా ఉంటుందని వారి నమ్మకం. దీంతో యుద్ధక్షేత్రంలో ఉండే సైనికులు మొదలు సహాయక సేవల్లో ఉండే వైద్యుల వరకు వివిధ విభాగాల సభ్యులు పేజర్ వాడటం మొదలెట్టారు. వీరి కోసం ఈ ఏడాది ప్రారంభంలో కొత్త పేజర్లను విదేశాల నుంచి తెప్పించారు. పోలీసు, అగ్నిమాపక శాఖలు సహా పలు అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బంది తక్షణ హెచ్చరికల కోసం పేజర్లపై ఆధారపడుతున్నారు.బ్రాండ్ మాదే.. ఉత్పత్తి మాది కాదు లెబనాన్‌లో పేలుళ్లకు ఉపయోగించిన పేజర్ ఏఆర్–924 రకానికి చెందినది. ఈ ఏడాది ప్రారంభంలో 5,000 పేజర్లను హెజ్బొల్లా ఆర్డర్ చేసింది. తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో సంస్థ నుంచి ఏఆర్–924 పేజర్లను తెప్పించినట్లు లెబనాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి స్థాయిలోనే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ రంగంలోకి దిగి ప్రతి పేజర్లో 3 గ్రాముల బరువైన పేలుడు పదార్థాన్ని మదర్‌బోర్డులో అమర్చిందని హెజ్బొల్లా, లెబనాన్ భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి. పేల్చేందుకు శత్రువు పంపిన కోడ్‌ను మదర్ బోర్డ్ అందుకున్నాక పేజర్లోని పేలుడు పదార్థం క్రియాశీలమై పేలిందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేజర్లను నెలల తరబడి వాడుతున్నా వాటిలోని పేలుడు పదార్థాన్ని హెజ్బొల్లా వర్గాలు గుర్తించకపోవడం తీవ్ర భద్రతావైఫల్యంగా చెబుతున్నారు. ఆ పేజర్లను మొదట్లో స్కాన్ చేసినపుడు ఎలాంటి పేలుడు పదార్థం జాడ కనిపించలేదని వారు చెబుతున్నారు. అయితే ఈ పేజర్లను హంగేరీకి చెందిన ‘బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ’ అనే సంస్థ రూపొందించిందని ఆ బ్రాండ్ యజమాని గోల్డ్ అపోలో వ్యవస్థాపకుడు హుసు చింగ్–కువాంగ్ తెలిపారు. ‘ఏఆర్–924 అనే బ్రాండ్ మాత్రమే మాది. ఆ బ్రాండ్ పేరుతో ఉన్న ఉత్పత్తి మాది కాదు. ఆ బ్రాండ్ పేరును వాడుకునేందుకు బీఏసీకి అనుమతి ఇచ్చాం. ఈ మేరకు మూడేళ్లక్రితం ఒప్పందం కుదిరింది’’ అని చింగ్కువాంగ్ బుధవారం చెప్పారు. అయితే బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ అనేది ఒక డొల్లకంపెనీ అని వార్తలొచ్చాయి. హంగేరీలోని బుడాపెస్ట్ నగరంలో సంస్థ ప్రధాన కార్యాలయం ఒక జనావాస అపార్ట్మెంట్లో ఉంది. అక్కడ ఒక కిటికీకి బీఏసీ కన్సల్టింగ్ అనే స్టిక్కర్ తప్పితే అక్కడ ఏమీ లేదని అసోసియేటెడ్ ప్రెస్ పాత్రికేయులు తేల్చారు.గతంలోనూ సాంకేతికతను వాడిన ఇజ్రాయెల్పేజర్కాకుండా గతంలో ఇలాగే వస్తువుల్లో పేలుడు పదార్థాలను అమర్చి శత్రువులను అంతంచేసిన చరిత్ర మొస్సాద్‌కు ఉంది. టెక్నాలజీ సాయంతో పేలుళ్లు జరిపిన సుదీర్ఘ చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. 1996లో హమాస్ కీలక బాంబ్మేకర్ యాహ్యా అయాస్ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ పేలుడు పదార్థాన్ని మొబైల్ ఫోన్లో అమర్చింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ షిన్‌బెట్ గతంలో యాహ్యా ఫోన్లో 15 గ్రాముల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని నింపింది. తండ్రికి అయాష్ ఫోన్ కాల్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడేది అయాష్ అని నిర్ధారించుకున్నాక దానిని పేల్చి అయాస్ను అంతంచేశారు. రిమోట్ ద్వారా నియంత్రించే కృత్రిమమేధతో పనిచేసే మిషిన్గన్తో ఇరాన్ అణు శాస్త్రవేత్త, ఉప రక్షణ మంత్రి మోసెన్ ఫక్రిజాదేను 2020లో హతమార్చింది. ఇజ్రాయెల్ 2021లో ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖకు చెందిన సర్వర్లను హ్యాక్ చేసి దేశవ్యాప్తంగా చమురు సరఫరాను స్తంభింపజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌లోని రెండు ప్రధాన గ్యాస్ పైప్లైన్లను పేల్చి పలు నగరాల సేవలకు అంతరాయం కలిగించింది. జూలైలో టెహ్రాన్‌లోని ఒక అతిథిగృహంలోని గదిలో నెలల క్రితమే శక్తివంతమైన బాంబును అమర్చి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియాను హతమార్చింది.– నేషనల్ డెస్క్, సాక్షి -
Israel Hezbollah War: నిన్న పేజర్లు నేడు వాకీ టాకీలు
బీరుట్: వాకీటాకీలు, సౌర విద్యుత్ వ్యవస్థల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. గాజా స్ట్రిప్‌పై భీకర భూతల, గగనతల దాడులతో తెగబడిన ఇజ్రాయెల్ తాజా తన లక్ష్యాన్ని లెబనాన్ వైపు తిప్పిందని బుధవారం నాటి అనూహ్య పేలుళ్ల స్పష్టమైంది. హెజ్బొల్లా సాయుధులు విరివిగా వాడే పేజర్లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో బుధవారం వాకీటాకీలు, సౌరవిద్యుత్ వ్యవస్థలు పేలిపోయాయి. ఈ అనూహ్య పేలుళ్ల ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 450 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పేజర్ల పేలుళ్లతో 13 మంది చనిపోయి 2,800 మంది రక్తమోడిన తరుణంలో మరో ‘సాంకేతిక’ పేలుళ్ల పర్వానికి దిగి ఇజ్రాయెల్ కొత్త యుద్ధతంత్రానికి తెరలేపిందని అంతర్జాతీయంగా విశ్లేషణలు వెల్లువెత్తాయి. గాజా స్ట్రిప్‌లో దాదాపు మొత్తం భూభాగాన్ని జల్లెడపట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు తన లక్ష్యాన్ని లెబనాన్‌కు మార్చుకుందని తాజా ఉదంతం చాటుతోంది. అంతిమయాత్ర వేళ పేలుళ్లు పేజర్ల పేలుళ్లలో మరణించిన ముగ్గురు హెజ్బొల్లా సభ్యులు, ఒక చిన్నారి అంతిమయాత్రలు బీరుట్ శివారులోని దహియేలో కొనసాగుతున్నపుడే వాకీటాకీలు పేలడం గమనార్హం. ‘‘బీరుట్లో చాలా చోట్ల వాకీటాకీలు పేలాయి. ఎల్రక్టానిక్ పరికరాలు పేలిన ఘటనల్లో 9 మంది చనిపోయారు’’ అని లెబనాన్ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. బీరుట్ నగరంతోపాటు లెబనాన్‌లో చాలా చోట్ల పేలుళ్లు జరిగాయని హెచ్»ొల్లా ప్రతినిధులు చెప్పారు. వాయవ్య తీర పట్టణమైన సిడాన్లో ఒక కారు, ఒక మొబైల్ ఫోన్ దుకాణం వాకీటాకీల పేలుడుకు ధ్వంసమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రక్తమోడుతూ వందలాది మంది ఆస్పత్రులకు పోటెత్తుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో కనిపించాయి. ‘‘ఇలాంటిది నేనెప్పడూ చూడలేదు. గాయపడిన వారిలో చాలా మందికి చేతివేళ్లు తెగిపోయాయి. కళ్లు దెబ్బతిన్నాయి’’ అని బీరుట్‌లోని దీయూ ఆస్పత్రిలో వైద్యురాలు నౌర్ ఎల్ ఓస్తా చెప్పారు. ‘‘ వరుస అనూహ్య పేలుళ్లతో ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి ఆజ్యంపోస్తున్నాయి’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు.దాడికి ఇదే సరైన సమయమా? వేలాది మంది హెజ్బొల్లా సైనికులు గాయాలపాలై ఆస్పత్రులకు పరిమితమయ్యారు. పేజర్ల పేలుడుతో హెజ్బొల్లాలో కమ్యూనికేషన్ నెట్వర్క్ కోలుకోనంతగా దెబ్బతింది. వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లతో పౌరుల్లో ఆందోళనల నడుమ దేశంలో శాంతిభద్రతలపై లెబనాన్ దృష్టిపెట్టాల్సిఉంది. ఈ తరుణంలో దాడి చేస్తే శత్రువును భారీగా దెబ్బ కొట్టవచ్చని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ గడ్డపై వరుస పేలుళ్లతో ఆగ్రహించిన లెబనాన్, హెజ్బొల్లా సాయుధాలు దాడులకు తెగబడొచ్చన్న ఇజ్రాయెల్ భావించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా లెబనాన్ సరిహద్దు ప్రాంతాలకు ఇజ్రాయెల్ అదనపు బలగాలను తరలించింది. అక్టోబర్ 8న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దమనకాండ మొదలైననాటి నుంచి ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా రాకెట్, డ్రోన్ దాడులు చేస్తోంది. ఉద్రిక్తతలను ఆపండి: ఐరాస లెబనాన్ వాకీటాకీల పేలుళ్ల ఘటనపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తచేసింది. ‘‘ పరిస్థితి చేయిదాట కుండా ఇరు పక్షాలు సంయమనం పాటించాలి’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ‘‘ బందీలను విడిచిపెట్టి శాంతి స్థాపనకు కట్టుబడాలి. ఎల్రక్టానిక్ పరికరాల పేలుళ్లకు పాల్పడటం చూస్తుంటే ఇది భారీ సైనిక చర్యకు కసరత్తులా తోస్తోంది’’ అని గుటెరస్ వ్యాఖ్యానించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డ్యుజారిక్ చెప్పారు. యుద్ధంలో కొత్త దశ మొదలైంది: ఇజ్రాయెల్వాకీటాకీల ఉదంతం తర్వాత రమాట్ డేవిడ్ వైమానిక స్థావరంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్ మాట్లాడారు. ‘‘ యుద్ధంలో కొత్త దశకు తెరలేపుతున్నాం. యుద్ధక్షేత్ర కేంద్ర స్థానం ఉత్తరం నుంచి దిశ మార్చుకుంటోంది. మాకు ఇప్పుడు స్థిరత్వం అవసరం. బలగాలు, వనరులను వేరే లక్ష్యం వైపు వినియోగించే అవకాశముంది. బుధవారం అద్భుత ఫలితాలు సాధించాం’’ అని సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అత్యున్నత స్థాయి భద్రతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. హెజ్బొల్లాపై అదనపు దాడులకు సిద్ధమవుతున్నామని చెప్పారు. దీంతో లెబనాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోందని అర్థమవుతోంది. కాగా, వరుస పేలుళ్లపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలని ఐరాస మానవహక్కుల సంస్థ చీఫ్ వోకర్ టర్క్ డిమాండ్‌చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
గాజాపై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
గాజా: దక్షిణ గాజాగాపై ఇజ్రాయెల్ ట్యాంకులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడుతుంది. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ప్రధాన ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు చేస్తోంది. తాజాగా జరిపిన దాడిలో 40 మంది పౌరులు మరణించినట్లు గాజా అధికారులు తెలిపారు. దక్షిణ గాజా స్ట్రిప్మీద ఇజ్రాయెల్ సైన్యం ఉపరితల, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్,అల్ మవాసీ ప్రాంతాల మీద చేసిన దాడుల్లో గత 24 గంటల్లో 40మంది మరణించారని, మరో 60 మంది తీవ్రంగా గాయపడినట్లు గాజా సివిల్ డిఫెన్స్ అధికారి మహ్మద్ అల్ ముఘైర్ మీడియా సంస్థ ఏఎఫ్పీకి చెప్పారు. సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ మాట్లాడుతూ..స్థానిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు దాడులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, ఫలితంగా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు సహాయక చర్యలకు మరింత ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. గాజాపై దాడిని ఇజ్రాయెల్ సైన్యం అధికారంగా స్పందించింది. తాము ఖాన్ యునిస్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పనిచేస్తున్న హమాస్ ఉగ్రవాదులపై యుద్ధవిమానాలతో దాడి చేసినట్లు వెల్లడించింది. గాజా స్ట్రిప్‌లోని ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ప్రాంతాలు,సైన్యానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని,ఫలితంగా ఈ డాడులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేనా? -
భగ్గుమన్న ఇజ్రాయెల్.. ప్రధాని నెతన్యాహూ క్షమాపణలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాజాలోని సొరంగంలో లభ్యమైన ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో విఫలమైనందుకు బెంజమిన్ సోమవారం క్షమాపణలు కోరారు. ‘బందీలను సజీవంగా తిరిగి తీసుకురానందుకు నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మేము ప్రయత్నించాం కానీవిజయం సాధించలేదు. దీనికి హమాస్ చాలా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది.’ అని నెతన్యాహు విలేకరుల సమావేశంలో చెప్పారు.కాగా శనివారం గాజాలోని రఫా ప్రాతంలోని భూగర్భ సొరంగంలో ఆరుగురు ఇజ్రాయిల్ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆదేశ సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.మృతదేహాలు గాజా సరిహద్దు సమీపంలోని కిబ్బట్జ్ కమ్యూనిటీకి చెందిన కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, అల్మోగ్ సరుసి, ఒరి డానినో, యుఎస్-ఇజ్రాయెలీ హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్, రష్యన్-ఇజ్రాయెలీ అలెగ్జాండర్ లోబనోవ్గా గుర్తించారు. వీరిని అక్టోబర్ 7న మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసిన హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేశారు.హమాస్ చెరలోని ఆరుగురు బందీల మృతదేహాలు రఫాలోని ఓ సొరంగంలో లభ్యం కావడంతో నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా సోమవారం ఇజ్రాయెల్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ వీధుల్లో ఆందోళనకారులు కదం తొక్కారు. తమ ఆప్తులు 11నెలల నుంచి బందీలుగా ఉన్నప్పటికీ వారిని వెనక్కు తేవడంలో నెతన్యాహు విఫలమయ్యారంటూ ఆరోపించారు.ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడుదల చేసేలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్‌కు చెందిన మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుయే కారణమన్న కోణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. హమాస్‌తో బందీల విడుదల ఒప్పందం, కాల్పుల విరమణ కోసం నెతన్యాహు తగినంతగా పనిచేయడం లేదని అన్నారు. -
ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడ్డ హిజ్బుల్లా
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రికత్తంగా మారాయి. ముఖ్యంగా హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత పరిస్థితులు మరింత జఠిలమయ్యాయి. ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న హనీయాను ఇరాన్లో కోవర్ట్ ఆపరేషన్‌తో అంతమొందించింది. అందుకు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ప్రయాత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ నగరంపై డజన్ల కొద్దీ కటియుషా రాకెట్లను ప్రయోగించింది. వాటిల్లో కొన్నింటిని ఇజ్రాయెల్ నిలువరించింది. ఇక ఈ దాడిపై హిజ్బుల్లా అధికారిక ప్రకటన చేసింది.కేఫర్ కేలా, డెయిర్ సిరియాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిందని, ఫలితంగా ఆ ప్రాంతాల పౌరులు గాయపడ్డారని, అందుకే తాము కటియుషా రాకెట్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. వరుస పరిణామాలపై ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పారిపోతామంటే ప్రాణభిక్ష పెడతామని కాదంటే అంతు చూస్తామని హెచ్చరిస్తోంది. అమెరికా సాయం కూడా తీసుకుంటుంది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికాఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు రక్షణగా, దానికి సాయం చేసేందుకు ఆ ప్రాంతంలో అదనపు యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను మోహరిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ చెప్పింది. అదే సమయంలో ఇరాన్ మద్దతు ఇస్తున్న హిజ్బుల్లా ప్రాభవం ఎక్కువగా ఉన్న లెబనాన్‌ను ఖాళీ చేయమని పాశ్చాత్య దేశాలు తమ పౌరులకు సలహా ఇచ్చాయి. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ఈ ప్రాంతానికి రాకపోకల్ని నిలిపివేశాయి. స్కూల్‌పై దాడి వెనువెంటనే హమాస్ చీఫ్ హతంటెహ్రాన్లో హనియా హత్య, బీరూట్‌లో హిజ్బుల్లా మిలిటరీ చీఫ్ ఫువాద్ షుక్ర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించినట్లు కొద్ది సేపటికే హిజ్బుల్లా కటియుషా రాకెట్లను ప్రయోగించింది. ఇప్పటికే హిజ్బుల్లా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. జులై 14న నుసిరత్ శరణార్థి శిబిరంలోని అబు ఒరేబన్ పాఠశాలపై జరిపిన దాడిలో 17 మంది పిల్లలు మరణించగా,80 మంది గాయపడ్డారు. స్కూల్‌పై దాడి తర్వాతనే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీ, హిజ్బుల్లా మిలిటరీ చీఫ్ ఫువాద్ షుక్ర్‌ను హతమార్చి ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. -
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియోహ్ హతం
జెరూసలేం: హమాస్‌పై ఇజ్రాయెల్ దాడుల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ మృతిచెందాడు. జియోనిస్ట్ దాడిలో ఇస్మాయిల్ మృతిచెందినట్టు పాలస్తీనా గ్రూప్ ప్రకటించింది. ఇక, ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని బృందం తెలిపింది.కాగా, ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ మృతిచెందాడు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ ఇరాన్ రాజధానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా టెహ్రాన్‌లోని అతని నివాసంపై జియోనిస్ట్‌లు దాడి చేయడంతో ఆయన మృతిచెందినట్టు పాలస్తీనా గ్రూప్ తెలిపింది. ఈ దాడిలో ఇస్మాయిల్‌తో పాటు అతడి బాడీగార్డ్ కూడా మరణించినట్టు చెప్పుకొచ్చింది.కాగా, ఇస్మాయిల్ ముగ్గురు కుమారులను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇస్మాయిల్ కుమారులు మృతిచెందారు. BREAKING | The Iranian Revolutionary Guard announces the death of Ismail Haniyeh, head of the political bureau of the resistance in an lsraeli raid executed in Tehran. pic.twitter.com/wqq1fYQr5n— TIMES OF GAZA (@Timesofgaza) July 31, 2024 -
ఇజ్రాయెల్ అటాక్ సక్సెస్.. హిజ్బుల్లా టాప్ కమాండర్ హతం
జెరూసలేం: గాజాలోని హిజ్బుల్లా మిలిటరీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బులా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్‌ను హతమారిచ్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కింది. కాగా, ఆక్రమిత గోలన్ హైట్స్‌పై రాకెట్ దాడికి ఫువాద్ కారణమని ఇజ్రాయెల్ చెబుతోంది.ఇజ్రాయెల్ మిలటరీ తెలిపిన వివరాల ప్రకారం..హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ సీనియర్ కమాండర్ ఫువాద్ షుక్ర్ మృతిచెందాడు. బీరుట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అతడు మరణించాడు అని తెలిపింది. ఇక, ఇటీవల సాకర్ మైదానంలో దాడుల్లో 12 మంది చిన్నారుల మరణాలకు కారకుడు ఫువాద్ అని ఇజ్రాయెల్ పేర్కొంది. గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడులకు షుక్ర్ నాయకత్వం వహించాడని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అడ్మిరల్ డేనియల్ హగారీ మాట్లాడుతూ.. ఫువాద్ షుక్ర్ హిజ్బుల్లా ఉగ్రవాదుల్లో ఎంతో సీనియర్ వ్యక్తి. అతడి నేతృత్వంలోనే హిజ్బుల్లా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్‌లో అనేక మంది మరణాలకు అతడే కారణం. హిజ్బుల్లాకు సంబంధించి గైడెడ్ క్షిపణులు, క్రూయిల్ క్షిపణులు, యాంటీ-షిప్ రాకెట్స్, అధునాతన ఆయుధాలు అతడి ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు.ఫువాద్ షుక్ర్‌పై అమెరికా రివార్డు..లెబనాన్ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో దీర్ఘకాలంగా షుక్ర్ పనిచేస్తున్నాడు. సంస్థ ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లాకు సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. 1983లో బీరుట్‌లోని అమెరికా మెరైన్ కార్ప్స్ బ్యారక్స్‌పై దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఆనాటి ఘటనలో 24 మంది అమెరికా సైనిక సిబ్బంది మృతి చెందారు. షుక్ర్ గురించి సమాచారం అందించిన వారికి అయిదు మిలియన్ల రివార్డు అందిస్తామని అమెరికా ప్రకటించింది. Fuad Shukr: the man who killed 12 children in a soccer field on Saturday and is responsible of 30 years of Hezbollah terrorist attacks. pic.twitter.com/RuHO0W2py6— Israel Defense Forces (@IDF) July 30, 2024ఇదిలా ఉండగా.. లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాట్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ దాడికి ప్రతిగా హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. మరిన్ని దాడులు ఉంటాయని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తు చర్యలపై ఇజ్రాయెల్ చర్చలు రాకెట్ దాడికి హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. -
ఇజ్రాయెల్‌కు హెచ్చరిక.. టర్కీ సంచలన నిర్ణయం!
అంకారా: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. గాజాపై r/ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే గాజా ప్రజలకు సాయం చేసేందుకు తాము ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తామని ఎర్డోగాన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.కాగా, తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎర్డోగాన్.. గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలస్తీనా ప్రజలకు అండగా టర్కీ అండగా నిలుస్తుందన్నారు. అలాగే, టర్కీ గతంలో లిబియా నాగోర్నో-కరాబాఖ్‌లలో ప్రవేశించినట్టుగా ఇజ్రాయెల్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌లోకి వెళ్తే కనుక వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయి అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఎర్డోగాన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. కాగా 2020లో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన లిబియా జాతీయ ఒప్పందానికి మద్దతుగా టర్కీ సైనిక సిబ్బందిని లిబియాకు పంపింది.ఇదిలా ఉండగా.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్-అల్-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. వీరి మృతదేహాలను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. -
దాడులపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుకు కమలా హారీస్ హెచ్చరిక!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నెతన్యాహు గాజాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని కమలా హారీస్ కోరారు. యుద్ధం కారణంగా సాధారణ ప్రజలు మృతిచెందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, ఇజ్రాయెల్ ప్రధాని నిన్న అమెరికాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి క్యాపిటల్ హౌస్‌లో ప్రసంగించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్, అమెరికా మధ్య పరస్పర సహకారం ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో నెతన్యాహుతో కమలా హారీస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమలా హారీస్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగా గాజాలో జరిగిన ప్రాణనష్టంపై తనకు తీవ్ర ఆందోళన కలుగుతోందన్నారు. ఇదే సమయంలో గాజాతో శాంతి ఒప్పందాన్ని కుదర్చుకోవాలని కోరారు. గత తొమ్మిది నెలలుగా గాజాలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో మంది చిన్న పిల్లలు సైతం మృతిచెందారు. సాధారణ పౌరులు ఆకలితో అలమటించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలపై దాడులను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. దారుణాలకు చూస్తూ సైలెంట్‌గా ఉండబోమని హెచ్చరించారు. ఇక, గాజాకు మానవతాసాయం అందించేందుకు అనుమతించాలని నెతన్యాహును కోరారు. ఇక, అంతుకుముందు.. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడిన నెతన్యాహు.. హమాస్‌పై పోరు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. తుది విజయం లభించే వరకు పోరు తప్పదంటూ ఆవేశంతో ప్రసంగించారు. ఈ తరుణంలో తాజా కమలా హారిస్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. Today, I had a frank and constructive meeting with Prime Minister Netanyahu about a wide range of issues, including my commitment to Israel’s security, the importance of addressing the humanitarian crisis in Gaza, and the urgent need to get the ceasefire and hostage deal done. pic.twitter.com/tgiSTPQJdL— Vice President Kamala Harris (@VP) July 26, 2024 అయితే, నెతన్యాహు అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా పాలస్తీనా మద్దతుదారులు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. క్యాపిటల్ హౌస్ వద్ద ధర్నాలు చేశారు. క్రిమినల్ నెతన్యాహు అంటూ నినాదాలు చేశారు. గాజాపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో, క్యాపిటల్ హౌస్ వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. -
హమాస్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ దాడుల్లో 71 మరణాలు
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. హమాస్ కీలక నేతలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 71 మంది మృతిచెందారు. మరో మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది.కాగా, హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్, మరో కీలక కమాండర్ రఫా సలామాలే లక్ష్యంగా తాజాగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ క్రమంలో ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 71 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇదే సమయంలో మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. అయితే, ఈ దాడిలో హమాస్ నేతల ప్రస్తుత పరిస్థితి మాత్రం తెలియడం లేదు. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి మహమ్మద్ డెయిఫేనన్న వాదనలు ఉన్నాయి. Gotcha!#Hamas military commander & architect of the Oct7 atrocities, Mohammed Deif, is no longer a problem. pic.twitter.com/JhXFVy7Lne— ✡Israel and Stuff✡🎗️ (@IsraelandStufff) July 13, 2024 ఇదిలా ఉండగా.. ఉత్తర రఫా నుంచి ఖాన్ యూనిస్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం వేలాదిమంది పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ ప్రాంతంపైనే ఇజ్రాయెల్ తాజాగా దాడులు చేసింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యమే గతంలో ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా గుర్తించి, నిరాశ్రయులు అక్కడే ఆశ్రయం పొందాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి మహమ్మద్ డెయిఫేనన్న వాదనలు ఉన్నాయి. -
హమాస్‌కు ఎదురు దెబ్బ.. ఇజ్రాయెల్ మెరుపు దాడిలో
హమాస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్‌కు చీఫ్ ఇస్మాయిల్ హనియే సోదరితో సహా అతని 10 మంది కుటుంబ సభ్యులు మరణించారని గాజా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని అల్ షాతీ శరణార్థి శిబిరంలోని హనియే నివాసంపై దాడి జరిగిందని హమాస్ పాలిత ప్రాంతం పౌర రక్షణ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు. శిథిలాల కింద అనేక మృతదేహాలు ఇంకా ఉన్నాయని, అయితే వాటిని వెలికితీసేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవని ఆయన అన్నారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది మృతదేహాలను సమీపంలోని గాజా సిటీలోని అల్ అహ్లీ ఆసుపత్రికి తరలించారు.దాడిలో చాలామంది గాయపడినట్లు నివేదించారు.కాగా,గాజాలో ఈద్ వేడుకల నుండి తిరిగి వస్తున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే పిల్లలు, మనవళ్లతో సహా 14 మంది చనిపోయారు. -
వీడియో: ఇజ్రాయెల్ టార్గెట్ సక్సెస్.. హమాస్ కమాండర్ మృతి
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ నేతలను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు జరుపుతున్నాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక కమాండర్, స్నిపర్ అహ్మద్ అల్ సౌర్కాను అంతమొందించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. హమాస్‌పై దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరోసారి పైచేయి సాధించింది. హమాస్ నుఖ్బా ఫోర్సెస్‌లో సీనియర్ నాయకుడు, కమాండర్ అహ్మద్ అల్ సౌర్కా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో అల్ సౌర్కా మరిణించాడు. ఈ మేరకు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, అతడిపై దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఇక, ఐడీఎఫ్‌కు ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఐఎస్ఏ) నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆ ఆపరేషన్ జరిపినట్టు వెల్లడించింది.ఇక, ఈ ఆపరేషన్ సమయంలో పౌరులకు హాని కలుగకుండా ఇజ్రాయెల్ సైన్యం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఆపరేషన్‌లో పాలస్తీనా పౌరులు ఎవరూ మృతిచెందకుండా దాడులు చేసినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడంలో అహ్మద్ అల్ సౌర్కాదే కీలక పాత్ర అని తెలుస్తోంది. దాడులకు అహ్మదే ప్లాన్ చేసినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. Eliminated: Ahmed Hassan Salame Al-Sauarka, a #Hamas terrorist, in the area of Beit Hanoun in northern #Gaza. Alsauarka, a squad commander in the Nukhba Forces, infiltrated Israeli communities and participated in attacks during the #October7Massacre. He led sniper activity in… https://t.co/CUIkhTJQg0 pic.twitter.com/kojwx9uZGW— (((🇺🇸Zemmel🇮🇱))) (@jshayevitz) June 20, 2024 -
పాలస్తీనియన్లకు భారీ ఊరట.. ఇజ్రాయెల్‌కు కీలక ప్రకటన
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో కాల్పుల విషయంలో ఇజ్రాయెల్ మరో కీలక ప్రకటన చేసింది. రఫాలో పగటి పూట(దాదాపు 11 గంటల పాటు) కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, గాజా ప్రజలకు మానవతాసాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా, రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వనున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. పాలస్తీనియన్లకు మానవతా సాయం అందింందే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కాల్పుల విరామం ప్రకటించింది. ఇక, ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయంతో కొన్ని వారాలుగా మానవతా సాయం అందక ఇబ్బందులు పడుతున్న గాజా ప్రజలకు ఊరట లభించింది.ISRAEL-HAMAS WARIsraeli army announces "#Tactical #Pause" in part of southern #GAZA strip during daylight hours to facilitate the delivery of aid pic.twitter.com/iDk5caNJnG— Alberto Allen (@albertoallen) June 16, 2024అయితే, దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో 12 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న రోడ్డు వెంబడి మాత్రమే కాల్పుల విరమణ కొనసాగనుంది. ఇక, తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కాల్పులు విరామం కొనసాగనున్నట్టు ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కెరోమ్ షాలోమ్ క్రాసింగ్ దగ్గర వేచి ఉన్న ట్రక్కులు సురక్షితంగా సలాహ్-అల్-దిన్ రోడ్డు మార్గం నుంచి ప్రయాణించగలవు. దీంతో రఫా ప్రాంతానికే కాకుండా ఉత్తర గాజాతో పాటుగా మరికొన్ని ప్రాంతాలకు కూడా మానవతాసాయం అందనుంది.ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ ప్రకటనను సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నేతలు ఖండిస్తున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మానవతా సాయం అందివ్వడానికి యుద్ధానికి విరామం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో శనివారం ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. -
రఫాలో మారణహోమం.. అసలు జరిగింది ఇది అంటున్న ఇజ్రాయెల్!
హమాన్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయక ప్రజలు మరణిస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించడంతో రఫాలో 37 మంది మృతిచెందారు. కాగా, వీరి మృతిపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. వారి మరణాలకు తాము కారణంకాదని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.కాగా, రఫాలో జరిగిన దాడులపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఇజ్రాయెల్ మంగళవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఆర్మీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ..‘రఫాలో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. రఫాలో ఇద్దరు సీనియర్ హమాస్ కమాండర్లు యాసిన్ రబియా, ఖలీద్ నజ్జర్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు జరిగాయి. ఈ దాడి కోసం చాలా చిన్న ఆయుధాలు ఉపయోగించడం జరిగింది.అయితే, ఈ క్రమంలో అనుకోకుండా మంటలు చెలరేగాయి. అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సందర్బంగా హమాస్ నేతలు దాచిన మందుగుండు సామాగ్రి పేలిన కారణంగానే పెద్ద ప్రమాదం జరిగి గుడారాల్లోని ప్రజలు చనిపోయారు. అంతేకానీ, మేము చేసిన దాడుల కారణంగా కాదు. ఇజ్రాయెల్ దాడులు కేవలం హమాస్ నేతల కోసమేనని.. గాజా ప్రజల కోసం కాదు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. గాజాపై మే నెలలో ఇజ్రాయెల్ దాడి ప్రారంభమైనప్పటి నుండి ఒక మిలియన్ మంది ప్రజలు రఫా నుండి పారిపోయారు. ఇక, అమెరికా, ఇతర మిత్రదేశాలు రఫాపై పూర్తి స్థాయి దాడికి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరించాయి. ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. మరోవైపు.. రఫాపై దాడిని ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం ఇజ్రాయెల్‌ను కోరింది. -
అవును.. తప్పు చేశాం: ఇజ్రాయెల్ ప్రధాని
టెల్ అవీవ్: రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన మారణహోమం.. అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటన చేశారు.‘‘సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించేవరకు యుద్ధం ఆపబోమని తెలిపారు.మరోవైపు హమాస్ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, మరోవైపు అమెరికా సహా ప్రపంచమంతా కోరుకుంటున్నా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో దాడులు జరిపింది. అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. ఆదివారం రాత్రి రఫాపై జరిగిన ఈ భీకర వైమానిక దాడిలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.మిత్రదేశాల ఖండనఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్ర స్వరంతో ఖండించాయి. ‘‘ఈ ఆపరేషన్లను ఆపాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి’’ అని ‘ఎక్స్’ వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ పేర్కొన్నారు. Outraged by the Israeli strikes that have killed many displaced persons in Rafah.These operations must stop. There are no safe areas in Rafah for Palestinian civilians.I call for full respect for international law and an immediate ceasefire.— Emmanuel Macron (@EmmanuelMacron) May 27, 2024 మరోవైపు.. ‘‘భూమి మీద ఉన్న నరకం గాజా, గత రాత్రి జరిగిన దాడి ఇందుకు మరో సాక్ష్యం’’ అని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్ఆర్డబ్ల్యూఏ పేర్కొంది. -
రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం..
జెరూసలెం: దక్షిణ గాజా నగరమైన రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. నివాస ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేస్తూ బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 109 మంది మృతిచెందినట్టు సమాచారం.కాగా, రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల మధ్య భీకరపోరు ప్రారంభమైంది. తూర్పు రఫా, పశ్చిమ రఫాను విడదీసే రహదారిపై ఇజ్రాయెల్ తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీంతో, హమాస్ కూడా ఐడీఎఫ్ దళాలపై భారీస్థాయిలో రాకెట్లను ప్రయోగిస్తోంది. దీంతో రఫాలో తలదాచుకుంటున్న 14 లక్షలకు పైగా పాలస్తీనియన్ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటికే లక్షా పదివేల మంది రఫాను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం గాజాలో ఏ ప్రాంతం కూడా సురక్షితం కాదని పేర్కొంది. అలాగే, ఆహారం, ఇంధనం, మందులను తీసుకుని వస్తున్న 400 ట్రక్కులు సరిహద్దుకు ఆవల ఈజిప్టువైపు నిలిచిపోయాయి. గాజాలో ప్రజల ఆకలి తీర్చేందుకు రోజుకు కనీసం 500 ట్రక్కుల ఆహారం, మందులు అవసరమవుతాయని తెలిపింది. ఇజ్రాయిల్ చర్య మూలంగా రఫాలోని 15 లక్షల మంది ఆకలి రక్కసి కోరల్లో చిక్కుకునే ప్రమాదం ముంచుకొస్తోంది.ఇక, ప్రస్తుతానికి రఫాలో మూడు రోజులకు సరిపడా ఇంధనం, ఆహార నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అది పెను మానవ విపత్తుకు దారి తీస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. మందుల సరఫరా ఆగిపోవడం వల్ల ఆసుపత్రులు మూత పడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) హెచ్చరించింది. -
నెతన్యాహు పెద్ద తప్పు చేస్తున్నావ్.. బైడెన్ సీరియస్ వార్నింగ్
గాజాగాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ అయ్యారు. నెతన్యాహు తప్పు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వైఖరి మారకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గాజాలో గత వారం జరిగిన డ్రోన్ దాడిలో వరల్డ్ కిచెన్ సెంటర్ (డబ్ల్యూకేసీ) స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలోనే బైడెన్ స్పందించారు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. గాజాలో నెతన్యాహు తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని అంగీకరించను. ఆరు లేదా ఎనిమిది వారాలపాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెల్ సైన్యాన్ని కోరుతున్నాను. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయవచ్చు అని అన్నారు. ఇదే సమయంలో బైడెన్.. జోర్డాన్, సౌదీ, ఈజిప్ట్ దేశాలు కూడా సహాయం, ఆహారం పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. వారు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పారు. మరోవైపు శ్వేతసౌధం స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్ కొన్ని చర్యలు తీసుకొందని వెల్లడించింది. కానీ, హమాస్ వైపు స్పందన మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది. ఇక, ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అమెరికా, ఐరాస డిమాండ్ చేసిన విధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని వివరించింది. తాము వీటికి ఎటువంటి ఆటంకాలను సృష్టించడం లేదని తెలిపింది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామగ్రిని తరలించినట్లు చెప్పింది. యుద్ధం మొదలైన నాటికి ఇదే అత్యధికమని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేహ్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఖతర్ వంటి దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ హమాస్ కీలక నేత కుమారులు మరణించడంతో సయోధ్యపై మరోమారు నీలినీడలు కమ్ముకున్నాయి. ‘జెరూసలేం, అల్–అఖ్సా మసీదుకు విముక్తి కల్పించే పోరాటంలో నా కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు’ అని ఇస్మాయిల్ వెల్లడించారు. ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు. షాటీ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలోనే ఆయన కుమారులు హజీమ్, అమీర్, మొహమ్మద్‌లు మరణించారని అల్–అఖ్సా టీవీ ప్రకటించింది. ముగ్గురూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురితోపాటు హజీమ్ కుమారులు, కుమార్తె, అమీర్ కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు. -
అడుగు దూరంలో ఉన్నాం.. ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. గాజాతో జరుగుతున్న పోరులో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో హమాస్ వద్ద ఉన్న బంధీలను విడిచిపెట్టే వరకు సంధి ప్రసక్తే ఉండదని కుండబద్దలు కొట్టారు. కాగా, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నెతన్యాహు నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాతో యుద్ధంలో విజయానికి అడుగు దూరంలోనే ఉన్నాం. ఇప్పటివరకు మనం చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైంది, విచారకరం. ఒప్పందానికి సిద్ధమే, లొంగిపోవడానికి కాదు. అంతర్జాతీయంగా వస్తోన్న ఈ ఒత్తిడి ఇజ్రాయెల్‌పై చేసే బదులు.. దీనిని హమాస్ వైపు మళ్లించాలి. తద్వారా బందీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. తమపై ఎవరు దాడి చేసినా, చేయాలని ప్రయత్నించినా.. వారిపై ప్రతిదాడులు తప్పవన్నారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతోందని.. అన్ని వేళలా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడతామని అన్నారు. ఇదిలాఉంటే, హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ఇప్పటికే వరకు దాదాపు 33వేల మంది మరణించినట్టు సమాచారం. యుద్ధం కారణంగా గాజాలో విపత్కర పరిస్థితుల నెలకొన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ వరకు పరిమితమైన ఈ యుద్ధం.. ఇరాన్ జోక్యంతో మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుతాయని భావిస్తోన్న తరుణంలో నెతన్యాహు ఇలా కామెంట్స్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. -
పద్దతి మార్చుకో.. ఇజ్రాయెల్ నెతన్యాహును హెచ్చరించిన బైడెన్
వాషింగ్టన్:గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో సాధారణ పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని హెచ్చరించారు. కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో జో బైడెన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా బైడెన్.. ఇజ్రాయెల్‌పై అమెరికా విధానం గాజాలోని పౌరుల రక్షణపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పౌరులే లక్ష్యంగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. గాజాలో వెంటనే కాల్పుల విరమణను పాటించాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. స్వచ్ఛంద సంస్థ ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’కు చెందిన ఏడుగురు సహాయకులను తాజాగా ఇజ్రాయెల్ చంపివేయడంపై అమెరికా సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో యుద్ధం అన్నాక ఇటువంటివి సహజమేనని నెతన్యాహూ కామెంట్స్ చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తమ వాహనం మీద దాడిచేశాయని ఈ చారిటీ సంస్థ అధినేత ఆరోపిస్తున్నారు. ఆ వాహనం ఒక సహాయక సంస్థదని తెలియచెప్పే గుర్తులు దాని మీద స్పష్టంగా ఉన్నాయి. పైగా ఐడీఎఫ్తో సమన్వయం చేసుకుంటూ ఘర్షణలేని ప్రాంతం గుండా అది ప్రయాణిస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. మూడుసార్లు కాల్పులు జరపడం, కొందరు చనిపోగా, పారిపోతున్న మిగతా సహాయకసిబ్బందిని కూడా వదిలిపెట్టకుండా హతమార్చడం త్రీవ పరిణామంగా మారింది. JUST IN: President Biden warns PM Netanyahu that future U.S. support for Israel depends on actions taken to shield civilians in Gaza. #Israel #Gaza #USA — The Reportify (@TheReportify) April 4, 2024 ఇక, హమాస్‌తో పోరులో ఇజ్రాయెల్ అనేక విధాలుగా అతిక్రమణలకు పాల్పడుతోంది. అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. గాజాలో ఆపన్నులకు కాస్తంత సాయాన్ని అందిస్తున్న ఏడుగురు వర్కర్లను ఇజ్రాయెల్ దళాలు కాల్చివేయడం, మిగిలివున్న ఆ ఒక్క ప్రధాన ఆస్పత్రిని కుప్పకూల్చడం, పొరుగుదేశంలోని మరోదేశం కాన్సులేట్ మీద దాడిచేసి కీలకమైన వ్యక్తులను చంపివేయడం వంటి చర్యలకు ఇజ్రాయెల్ పాల్పడుతోంది. -
ఇజ్రాయెల్ అరాచకం.. హమాస్ అగ్రనేత కుమారుడు మృతి!
గాజా: గాజా సిటీపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఇక, తాజాగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కుమారుడు హజెం హనియే(22) కూడా మృతి చెందినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు తీవ్రతరం చేసింది. హమాస్ నేతలే టార్గెట్ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ అగ్రనేత కుమారుడు హజెం హనియే (22) మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన వైమానిక దాడుల్లో అతడు చనిపోయాడని స్థానిక మీడియాతో పాటు ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, హజెం హనియే ప్రస్తుతం ఓ కాలేజీలో విద్యార్థిగా ఉన్నట్టు సమాచారం. 🚨🇵🇸 BREAKING: SON OF #HAMAS LEADER KILLED IN AN IDF STRIKE Unconfirmed reports indicate The son of Ismail Haniyeh, 22-year-old Hazim Haniyeh, head of Hamas’s political bureau, has reportedly been killed by a succession of Israeli air strikes. pic.twitter.com/WCqLTxsKmu — Geopolitical Kid (@Geopoliticalkid) February 11, 2024 మరోవైపు.. రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. వైమానిక దాడులతో విరుచుకుపడింది. తాజాగా ఇజ్రాయెల్ దాడిలో కనీసం 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. ఈ నగరంలో 14 లక్షల మంది జీవిస్తున్నారని అంచనా. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఆదేశించిన కాసేపటికే దాడులు ప్రారంభమయ్యాయి. ఇక, గాజాలో దాడులు ప్రారంభమైన తర్వాత లక్షలాది మంది రఫాకు నిరాశ్రయులుగా వెళ్లి తలదాచుకుంటున్నారు. తాజాగా అక్కడ కూడా దాడులు ప్రారంభం కావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. రఫాపై ఇజ్రాయెల్ దాడులను అమెరికా సహా అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామలు ఉంటాయని సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. Missiles fired into Israel from Lebanon. All of them rebuffed by the Iron Dome system. Israel is under constant attack and yet is demonised for defending itself by liberals safely in the West. The double standards are galling. pic.twitter.com/Azgb43Bnah — Bella Wallersteiner 🇺🇦 (@BellaWallerstei) February 10, 2024 -
Israel-Hamas war: గాజాకు సాయం పునరుద్ధరించండి
రఫా: గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లకు అందించే మానవతా సాయాన్ని యథా ప్రకారం కొనసాగించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరస్ సంబంధిత దేశాలను కోరారు. లేని పక్షంలో 20 లక్షల మందికి పైగా శరణార్థులకు అందాల్సిన సాయం, పునరావాస కార్యక్రమాల్లో భారీగా కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర మానవీయ సంక్షోభం నెలకొందని అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడికి దిగిన విషయం తెలిసిందే. పాలస్తీనా శరణార్థులకు సాయం, పునరావాసం కోసం పనిచేస్తున్న ఐరాస సిబ్బందిలో డజను మంది ఆ దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర 8 దేశాలు సాయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. పాలస్తీనా శరణార్థులకు అందుతున్న సాయంలో ఈ దేశాల వాటా దాదాపు 60 శాతం వరకు ఉంటుంది. సాయం ఆగిపోతే పాలస్తీనా శరణార్థులకు అవసరమైన కనీస ఆహార నిల్వలు సైతం మరికొద్ది రోజుల్లోనే అడుగంటే ప్రమాదముందని భావిస్తున్నారు. హమాస్‌కు తోడ్పాటు అందించినట్లుగా భావిస్తున్న 12 మంది ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 9 మందిని బాధ్యతల నుంచి తొలగించారు. ఒకరు చనిపోగా మరో ఇద్దరిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
Israel-Hamas war: సెంట్రల్ గాజాపై భీకర దాడులు..
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాపై మరోసారి విరుచుకుపడింది. ఆదివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో కనీసం 35 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా అధికారులు వెల్లడించారు. గాజాలో హమాస్ మిలిటెంట్లపై యుద్ధం మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన మరుసటి రోజే సైన్యం దాడులు ఉధృతం చేయడం గమనార్హం. ఆదివారం ప్రధానంగా ఖాన్ యూనిస్ నగరంపై క్షిపణి దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 21,600 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. 55,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు. ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా పశి్చమాసియాలో మాత్రం ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాదులు పశ్చిమ దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ఎర్ర సముద్రంలో భారీ కంటైనర్ షిప్‌ను ధ్వంసం చేయడానికి హౌతీ ముష్కరులు ప్రయోగించిన రెండు యాంటీ–షిప్ బాలిస్టిక్ క్షిపణులను మధ్యలోనే కూలి్చవేశామని అమెరికా సైన్యం ఆదివారం ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత ఇదే నౌకపై దాడి చేయడానికి నాలుగు పడవలు ప్రయతి్నంచాయని వెల్లడించింది. ఈ దాడిని తాము తిప్పికొట్టామని, తమ ఎదురు కాల్పుల్లో సాయుధ దుండగులు హతమయ్యారని పేర్కొంది. -
గుండె తరుక్కుపోయే చిత్రం.. ఇలాంటి ఒక్క చిరునవ్వు చాలు!
Gaza Viral Photo: ఇక్కడి ఫొటో చూడండి.. ఓ వైపు రాకెట్ల దాడులు.. మరోవైపు బాంబు దాడులు అయినా చెక్కు చెదరని అమాయక చిరునవ్వు లోకం గురించి ఏం తెలుసని అంత ధీమా? ఈ చిన్నారుల నవ్వు చూడండి. యుద్ధం గురించి తెలియని వయసు. ఓ తమ ప్రాంతం చిధ్రమై పోతున్నా అర్థంకాని వయసు. ఆ క్షణంలో వాళ్లకేం అక్కర్లేదు. గుండెకు హత్తుకున్న ఆ స్నేహం తప్పా. ఈ యుద్ధంలో అమ్మ తప్పిపోయి ఉండొచ్చు. నాన్న ప్రాణమే పోయి ఉండొచ్చు. యుద్ధం వీళ్లను అనాథనూ చేసి ఉండొచ్చు. దిక్కులు బిక్కటిట్లేలా వీళ్లు రోదించి ఉండొచ్చు. కానీ, ఓదార్చే చెయ్యి పక్కన ఉంది కదా అందుకే ఫొటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చారేమో. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా సామాన్యులు కడగళ్లపాలవుతున్నారు. మృతుల్లో చిన్నారులే ఎక్కువగా ఉన్నారనే నివేదికలు ప్రపంచాన్ని చలింపజేస్తోంది. యుద్ధంతో చితికిపోయి ఉన్న గాజాకు.. ఈ చిన్నారుల నవ్వులు మళ్లీ ప్రాణం పోస్తే.. యుద్ధం ఓడిపోయినట్లే కదా!. -
Pak: న్యూఇయర్ వేడుకలపై కఠిన నిషేధం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలపై కఠిన నిషేధం విధించారు. ఈ ప్రకటనను ఆ దేశ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వార్ ఉల్ హక్ కాకర్ స్వయంగా చేశారు. గాజాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన. గురువారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రధాని అన్వార్ ఉల్ హక్ కాకర్ ప్రసంగించారు. ‘‘పాక్ ప్రజలంతా పాలస్తీనాలో తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకోండి. గాజాలో ఉన్న మన పాలస్తీనా సోదర సోదరీమణులకు సంఘీభావం తెలపాల్సిన సమయం ఇది. నూతన సంవత్సరానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వం కఠినమైన నిషేధం విధించిందని గుర్తించాలి’’ అని అన్నారు. గాజాలో ఇప్పటిదాకా 21 వేలమంది పాలస్తీనియన్లు మృతి చెందారన్న పాక్ ప్రధాని.. ఇజ్రాయెల్ దాడుల్లో 9 వేల మంది చిన్నారులే మరణించారని గుర్తు చేశారు. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో నిరాయుధులైన పాలస్తీనియన్లు, అమాయక పిల్లల మారణహోమం పట్ల పాక్ సహా యావత్ ముస్లిం సమాజం పూర్తి వేదనలో ఉన్నాయన్నారాయన. ఇదిలా ఉంటే.. పాక్‌లో సాధారణంగానే కొత్త సంవత్సరం వేడుకలు మరీ కోలాహలంగా ఏం జరగవు. ఇస్లామిక్ గ్రూప్‌ల అభ్యంతరాల నేపథ్యంలో.. పరిమితంగానే జరుగుతుంటాయక్కడ. -
గాజాలో మృత్యుఘోష
ఖాన్ యూనిస్: గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్ గ్రూప్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం రక్తపుటేరులు పారిస్తోంది. గురువారం బీట్ లాహియా, ఖాన్ యూనిస్, అల్–మఘాజీ ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఒకేరోజు 50 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి వేలాది మంది సామాన్య ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరోవైపు ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని రమల్లాతోపాటు ఇతర నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. అక్టోబర్ 7 నుంచి మొదలైన ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 21,320 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 55,603 మంది గాయపడ్డారు. -
IDF: హమాస్ మాస్టర్ ప్లాన్ భగ్నం?
ఇజ్రాయెల్ ఆసక్తికర వీడియో ఫుటేజీ ఒకటి విడుదల చేసింది. గాజా స్ట్రిప్ కింద హమాస్‌కు చెందిన భారీ సొరంగం కనుగొన్నట్లు ఆదివారం ప్రకటించింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ టన్నెల్.. కీలకమైన ఎరెజ్ ప్రాంత సరిహద్దు ప్రాంతానికి అనుసంధానమై ఉందని తెలిపింది. అంతేకాదు.. ఇజ్రాయెల్‌పై దాడుల కోసం హమాస్ దాచుకున్న భారీ ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర గాజా ఎరెజ్ సరిహద్దు వద్ద 400 మీటర్ల దూరం నుంచి మొదలైన ఈ టన్నెల్.. మొత్తం నాలుగు కిలోమీటర్ల దూరం గాజాకు కలిపి ఉంది. చిన్నసైజు వాహనాలు సైతం ఆ టన్నెల్ గుండా ప్రయానించగలవని, మందమైన గోడలతో ఏర్పాటు చేసిన ఈ సొరంగంలో కొంత భాగం కాంక్రీట్‌తో ఏర్పాటు చేసిన రోడ్డు మార్గం ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ(ఐడీఎఫ్) తన ప్రకటనలో తెలిపింది. EXPOSED: The biggest Hamas terrorist tunnel discovered. This massive tunnel system branches out and spans well over four kilometers (2.5 miles). Its entrance is located only 400 meters (1,310 feet) from the Erez Crossing—used by Gazans on a daily basis to enter Israel for work… pic.twitter.com/RcjK5LbvGL — Israel Defense Forces (@IDF) December 17, 2023 టన్నెల్ గుండా రవాణా సదుపాయంతో పాటు విద్యుత్ సరఫరా, వెంటిలేషన్ సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఆర్మీ ఒక వీడియోను సైతం విడుదల చేసింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో హమాస్ జరిపిన దాడుల ప్రధాన సూత్రధారి మహమద్ యహ్యా నేతృత్వంలోనే ఈ టన్నెల్ ఏర్పాటు అయ్యిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ టన్నెల్ కోసం భారీ సంఖ్యలో ఖర్చు అయ్యి ఉంటుందని అంచనా వేస్తోంది. హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ సోదరుడే ఈ మహమద్ యహ్యా. ఇదిలా ఉంటే.. డిసెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 800 వద్ద సొరంగాల్ని కనిపెట్టినట్లు, అందులో 500 టన్నెల్స్‌ని నాశనం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించుకుంది. -
హమాస్‌పై యుద్ధం: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక సూచన
జెరూసలెం: గాజాపై రెండు నెలలుగా చేస్తున్న యుద్ధ తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. ఇక నుంచి గాజాలో సామాన్య పౌరుల ప్రాణాలు పోకుండా చూడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఇజ్రాయెల్ వెళ్లిన వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సుల్లివాన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్, రక్షణశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ‘నేను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతోనూ మాట్లాడాను. గాజాపై యుద్ధ తీవ్రతను తగ్గించి ఉగ్రవాదులు టార్గెట్‌గా మాత్రమే దాడులు చేయాలని చెప్పాను. సామాన్య పారుల ప్రాణాలు కాపాడాలని కోరాను. అయితే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఇది మొదలు పెడుతుందో చెప్పలేను. గాజాపై ఇజ్రాయెల్ దాడులు మాత్రం మరింత కాలం కొనసాగుతాయి’అని సుల్లివాన్ ఇజ్రాయెల్ మీడియాకు తెలిపారు. తన పర్యటనలో భాగంగా శుక్రవారం రమల్లా వెళ్లనున్న వైట్‌హౌజ్ సెక్యూరిటీ సలహాదారుసుల్లివాన్ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తోనూ చర్చలు జరుపుతారు. పాలస్తీనా అథారిటీని ప్రక్షాళన చేసి కొత్తరూపు తీసుకువచ్చే విషయంపై వీరి మధ్య చర్చలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి -
గాజా.. గజ గజ
గాజాలో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. బందీల విడుదల సమయంలో యుద్ధానికి చిన్న బ్రేక్ ఇచ్చారు. దీంతో అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ బాంబుల మోత మొదలవ్వడంతో గాజా గజగజ వణుకుతోంది. గాజా ఒక నెత్తుటి నగరంలా మారిపోయింది. దాడులతో దద్దరిల్లుతోంది. ఆసుపత్రుల్లోనూ హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఒక యుద్ధం వేలాది మంది అమాయకులను బలి తీసుకుంటోంది. ఎక్కడ చూసినా రక్తం ఏరులై పారుతోంది. ఎక్కడ విన్నా బాంబుల మోతలే వినిపిస్తున్నాయి. గాజా నగరం ఒక శ్మశానాన్ని తలపిస్తోంది. ప్రాణాలు కాపాడుకునే దారి లేదు. సరిహద్దులు దాటే అవకాశం లేదు. గాజా నగరం పరిస్థితి.. యుద్ధానికి ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా మారింది. అసలు ఈ మారణకాండకు ముగింపు పడేది ఎప్పుడు ? గాజా భవిష్యత్తు ఏంటి ? యుద్ధం ఏదైనా.. యుద్ధం ఎక్కడైనా.. యుద్ధం ఏ రెండు దేశాల మధ్యనైనా.. ఎక్కువగా బలైపోయేది అమాయకులే..! యుద్ధానికి కారణం ఏదైనా కావొచ్చు.. ఒకరిది యుద్ధ దాహం కావొచ్చు.. మరొకరిది దేశ రక్షణ కోణం కావొచ్చు.. రీజన్ ఏదైనా.. ఆ యుద్ధంలో ఎక్కువగా బలయ్యేది సామాన్యులే..! ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ అదే జరుగుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా దద్దరిల్లుతోంది. హమాస్ జరిపిన మెరుపు దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేస్తోంది. ఈ యుద్ధానికి కారణం ఎవరన్నది పక్కన పెడితే.. ఎక్కువగా బలైపోతున్నది మాత్రం అమాయకులే..! గాజా ప్రజలు పడుతున్న కష్టాల గురించి చెప్పేందుకు మానవీయ సంక్షోభం అనే మాటలు కూడా సరిపోవడం లేదు. అంత దారుణాతి దారుణంగా ఉన్నాయి అక్కడి పరిస్థితులు. Violent and successive attacks in the city of Khan Yunis and Deir al-Balah 💔 #casefireNow #CopaAmerica #Isreal_The_Occupier_has_No_right_of_self_defense #IsrealiWarCrimes pic.twitter.com/X5cpGKVlQT — آلاء ALAA - 𓂆🔻 (@iilid_97) December 8, 2023 యుద్ధం కారణంగా ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురు అవుతున్నారు. కళ్ల ముందే భవనాలు పేక మేడల్లా కుప్ప కూలుతున్నాయి. శిథిలాల కింద కుప్పలు తెప్పలుగా శవాలు పడి ఉన్నాయి. మొత్తంగా గాజా ఇక శ్మశాన వాటికను తలపిస్తోంది. పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా పాలస్తీనా పౌరుల మీద దాడులు కొనసాగుతున్నాయి. కేవలం హమాస్‌ను మాత్రమే కాదు మొత్తం గాజాను నాశనం చేయడం లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిన తరువాత గాజాను మిలిటరీ రహిత ప్రాంతంగా మారుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. పోరు ఎంతకాలం సాగినా కొనసాగించేందుకు తాము సన్నద్దంగా ఉన్నట్లు హమాస్ బలంగా చెబుతోంది. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో.. గాజాలో రక్తం ఏరులై పారుతోంది. అయితే ఏడు రోజుల కాల్పుల విరామంలో హమాస్ వద్ద ఉన్న వారిలో వంద మంది బందీలు, ఇజ్రాయిల్ జైళ్లల్లో అక్రమంగా నిర్బంధంలో ఉన్న పాలస్తీనా పౌరుల్లో 240 మంది విడుదల తరువాత పెద్ద ఎత్తున గాజా మీద ఇజ్రాయిల్ దాడులకు దిగింది. ఇంకా హమాస్ వద్ద 138 మంది బందీలు, వేలాది మంది పాలస్తీనా పౌరులు జైళ్లల్లో ఉన్నారు. గత రెండు నెలల దాడుల్లో 16,248 మంది పాలస్తీనియన్లు మరణించారన్నది ఓ అంచనా..! అలాగే ఈ దాడుల్లో దాదాపు 50 వేల మందికి పైగా గాయపడ్డారు. దాడులను విరమించే వరకు చర్చల ప్రసక్తే లేదని హమాస్, దాడులను కొనసాగించి తీరుతామని ఇజ్రాయిల్ ప్రకటించాయి. ఇక హమాస్ మిలిటెంట్ల స్థావరాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రతరం చేసింది. The Israel Forces continue operations in the Gaza Strip and claim to be making progress in the city of Khan Yunis. H@mas' armed wing has destroyed 135 Israeli military vehicles in whole or in part in the past three days across the Gaza Strip, a H@mas spokesman said. pic.twitter.com/whVvL3X4Fo — Sprinter (@Sprinter00001) December 8, 2023 ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ తాజా దాడుల్లో 43 మంది మరణించారని హమాస్ వెల్లడించింది. సాధారణ జనావాసాలపై దాడులు చేయలేదని, హమాస్ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇలాంటి ప్రకటనల సంగతి ఎలా ఉన్నా.. ఇరువైపుల జరుగుతున్న దాడుల్లో సామాన్య ప్రజలు భారీగానే బలవుతున్నారు. గాజాలో ఇప్పుడు సురక్షిత ప్రాంతం అంటూ ఏదీ లేకుండాపోయింది. దీంతో అక్కడి ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునే దారి కనిపించడం లేదు. అక్కడ పరిస్థితి ప్రతి గంట గంటకూ దారుణంగా దిగజారుతోంది. ఇక గాజాలో హమాస్ మిలిటెంట్లు బలమైన సొరంగాల వ్యవస్థను నిర్మించుకున్నారు. అక్కడే వారి ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కలుగుల్లో దాక్కొని ఇజ్రాయెల్ సైన్యంపై దాడులకు దిగుతున్నారు. అందుకే ఆ సొరంగాలను ధ్వంసం చేయడానికి , వాటిని సముద్రపు నీటితో నింపేయాలని ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం నవంబర్లోనే అల్–షాతీ శరణార్థి శిబిరానికి మైలు దూరంలో 5 భారీ పంపులను ఏర్పాటు చేసింది. దక్షిణ గాజాలో రెండు లక్షల మందికి పైగా జనాభా ఉన్న ఖాన్‌యూనిస్ పట్టణాన్ని సర్వనాశనం చేయాలని ఇజ్రాయెల్ చూస్తోంది. పౌరులు పట్టణాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే అలర్ట్ చేశారు.మరింత దక్షిణంగా అంటే ఈజిప్టు సరిహద్దువైపు వెళ్లాలి. అటు తమ భూభాగంలోకి శరణార్ధులు రాకుండా ఈజిప్టు సరిహద్దులను మూసివేసింది. ఉత్తర గాజాతో పోల్చుకుంటే ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా దక్షిణ గాజాలో దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతున్నా..అక్కడ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. అమాయకులైన పౌరులకు ఎక్కడా రక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయింది. ఖాన్ యూనిస్ పట్టణం చుట్టూ ఆరుకిలోమీటర్ల పరిధిలో 150 ఇజ్రాయిలీ టాంకులు, సాయుధులతో కూడిన అనేక వాహనాలున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయి. Israelis just destroyed a 700 year old Mosque in Gaza! Israel = ISIS pic.twitter.com/dWDiQG73V3 — The Barracks (@thebarrackslive) December 8, 2023 ఇక మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ కూడా పశ్చిమాసియాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నా రు. ఆయా దేశాలు హమాస్ చర్యలను ఖండిస్తున్న నేపథ్యంలో పాలస్తీనా అథారిటీని పునరుద్ధరించి, పరిపాలన బాధ్యతలను వెస్ట్‌బ్యాంక్‌కు అప్పగించేలా చర్చలు జరుగుతున్నాయి. దీనికి అర్థం ఏంటంటే హమాస్ ను పూర్తిగా తుడిచిపెట్టాలనే ఇజ్రాయెల్ శపథాన్ని నెరవేరుస్తూనే గాజా భూభాగంపై ఇజ్రాయెల్ ఎలాంటి నియంత్రణ చేపట్టకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాయి. అయితే ఒకవేళ వెస్ట్‌బ్యాంక్‌ను పాలస్తీనా అథారిటీగా గుర్తిస్తే.. ఇంతకాలం వ్యతిరేకిస్తూ వస్తున్న పాలస్తీనా అంశాన్ని ప్రపంచం అధికారికంగా గుర్తించే ప్రమాదం ఉంది. ఇది ఇజ్రాయెల్ కు ఏమాత్రం మింగుడు పడని అంశం. ఈ అంతర్జాతీయ రాజకీయాలు గురించి కాసేపు పక్కన పెడితే.. గాజాలో అమాయకుల పరిస్థితే దారుణంగా మారింది. పూర్తి స్థాయిలో గాజా ఇప్పట్లో కోలుకోవడం కష్టమే..! ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆకాశం నుంచి మృత్యువు ఎప్పుడు వచ్చి పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ క్షణ బతికుండా చాలు అనుకుని ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గాజా ప్రజలు బతుకీడిస్తున్నారు. -
దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ గురి
ఖాన్ యూనిస్: శనివారం దక్షిణ గాజాలోని నిర్దేశిత లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లో హెలికాప్టర్ల ద్వారా మొట్టమొదటిసారిగా మ్యాప్ ముద్రించిన కరపత్రాలను విడిచిపెట్టింది. అందులో, దాడుల నుంచి రక్షణ పొందేందుకు తాముంటున్న చోటు నుంచి సురక్షిత ప్రాంతానికి ఎలా వెళ్లాలో తెలిపే వివరాలున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు దాడుల్లో కనీసం 200 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజాలోని ఆరోగ్య శాఖ తెలిపింది. -
గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 175 మంది మృతి
వారం రోజుల విరమణకు తెర పడటంతో గాజా స్ట్రిప్ మళ్లీ కాల్పులతో దద్దరిల్లుతోంది. విరామం అనంతరం ఇజ్రాయెల్ శుకరవారం రెట్టించిన తీవ్రతతో మళ్లీ దాడులకు దిగింది. గాజాలోని ఇళ్లు, భవనాలపై క్షిపణులు, రాకెట్లు, బాంబులతో విరుచుపడిందిదీంతో ఖాన్ యూనిస్‌లో ఒక భారీ భవన సముదాయం నెలమట్టమైనట్లు తెలుస్తోంది. హమాద్లో కూడా ఒక అపార్ట్‌మెంట్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత జరిగిన దాడుల్లో గాజాలో కనీసం 178 మంది మరణించినట్లు హమాస్ తాజాగా ప్రకటించింది. దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయెల్ సేనలు తమ దాడులను ఉధృతం చేసేలా కనిపిస్తోంది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ రోజంతా అక్కడ కరపత్రాలు జారవిడవడం దీన్ని బలపరుస్తోంది. అక్కడి ఖాన్ యూనిస్ తదితర ప్రాంతాలు ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రాలుగా మారాయని వాటిలో హెచ్చరించింది. ‘యుద్ధ లక్ష్యాల సాధనకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. బందీలందరినీ విడిపించుకోవడం, హమాస్‌ను నిర్మూలించడం, గాజా మరెప్పుడూ ఇజ్రాయెలీలకు ముపపుగా మారకుండా కట్టుదిట్టటమైన చర్యలు తీసుకునే దాకా సైనిక చర్య కొనసాగుతోంది’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. మహిళా బందీలందరినీ వదిలేస్తామన్న ఒప్పంద వాగ్దానాన్ని హమాస్ ఉల్లంఘించడం వల్లే దాడులను తిరిగి మొదలు పెట్టాల్సి వచ్చిందని నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయెలే రక్త దాహంతో తమ ప్రాతిపాదనలన్నింటినీ బుట్టదాఖలు చేసి దాడులకు దిగిందని హమాస్ రోపించింది. ఇక ఇజ్రాయెల్ సైన్యం- హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7 ప్రారంభమైన భీకర యుద్ధం దాదాపు రెండు నెలలుగా సాగుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ప్పటి వరకు 13,300 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు .ఇటీవల ఏడు రోజులు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించుకున్నాయి. కాల్పుల విరమణ సమయంలో హమాస్ 100 మంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయారని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. ఇంకా హమాస్ వద్ద 137 మంది బందీలుగా ఉన్నారని, వారిలో 115 మంది పురుషులు, 20 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక గురువారం ఇజ్రాయెల్, హమాస్ మధ్య వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో గాజాలో మళ్లీ కాల్పుల మోత మోగుతోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హమాస్ నుంచి బందీల విడుదల.. నెతన్యాహు షాకింగ్ కామెంట్స్
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీల విడుదల కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో సాఫీగా సాగింది. ఇక, తాజాగా 17 మంది బంధీలను విడుదల చేసింది. దానికి ప్రతీగా ఇజ్రాయెల్.. దాదాపు 75 మంది పాలస్తీనా ఖైదీలను వదిలిపెట్టింది. వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండు, మూడు విడతల బందీల విడుదల కొనసాగింది. మూడో విడతలో భాగంగా ఆదివారం 14 మంది ఇజ్రాయెలీలతోపాటు ముగ్గురు విదేశీయులను హమాస్ విడిచిపెట్టింది. వీరిలోనూ కొంత మంది ఈజిప్టునకు వెళ్లిపోయారు. మిగిలిన వారిని ఇజ్రాయెల్‌కు రెడ్‌క్రాస్ అప్పగించింది. ప్రతిగా 39 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది. ఆదివారం నాటికి మొత్తం 63 మందిని హమాస్, 114 మందిని ఇజ్రాయెల్ విడిచిపెట్టినట్లయింది. ఇక, బంధీల తరలింపు ప్రకియ నాలుగు రోజలు పాటు కొనసాగనుంది. İsrail'in Serbest Bıraktığı, Filistinli Mahkumlar, Aileleri İle Buluşmaya Devam Ediyor. Gazze Bursa Tevfik Göksu Osman Gökçek Ankara Yeşim #ikizlerdolunayı Deniz Binali Yıldırım Murat Kurum Hamas #koraypehlivanoğlututuklansın Filistin pic.twitter.com/aC7mevApCx — 🇹🇷 Abdulhamid Denge 🇹🇷 (@AbdulhamidDenge) November 27, 2023 More and more children are being released from Israeli prisons Yes, you read that right, KIDS. For years, Israel has kept children in prisons as adults. 8, 10, 16 years doesn't matter. They are imprisoned, mistreated and beaten for years. Why are they accused? As… pic.twitter.com/s8df6SStes — Megatron (@Megatron_ron) November 26, 2023 ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం గాజాలో అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్ బయట పెట్టిన హమాస్ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను సరిచేయడం’ అని అన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉత్తర గాజాలో పర్యటించారు. היום בסיור בעזה: נמשיך עד הסוף - עד לניצחון. pic.twitter.com/e2aEA7Gfa4 — Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 26, 2023 -
Israel-Hamas war: గాజాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జెరూసలేం: గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్ ప్రయతి్నస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అక్కడ అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్ బయట పెట్టిన హమాస్ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ‘‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను ‘సరిచేయడం’’ అని అన్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉత్తర గాజాలో పర్యటించారు. -
Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ
గాజా స్ట్రిప్/జెరూసలేం: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గాజా స్ట్రిప్‌లో శుక్రవారం భూతల, వైమానిక దాడులు ఆగిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజాలో ఏడు వారాల తర్వాత ప్రశాంత వాతావరణం కనిపించింది. పాలస్తీనియన్ల ఎదురు చూపులు ఫలిస్తున్నాయి. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మానవతా సాయం, ఇంధనం గాజాకు చేరుకుంటోంది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాల చొరవతో ఇజ్రాయెల్–హమాస్ మధ్య కుదిరిన సంధి శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచి్చంది. తాత్కాలిక కాల్పుల విరమణ నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఒప్పందం మేరకు హమాస్ చెరలోని బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటిరోజు 13 మంది ఇజ్రాయెలీ బందీలకు హమాస్ మిలిటెంట్లు స్వేచ్ఛావాయువులు ప్రసాదించారు. వీరిలో ఆరుగురు వృద్ధులు, నలుగురు పిల్లలున్నారు. వారిని రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించారు. మొత్తం 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టిందని, వారిని 4 వాహనాల్లో ఈజిప్టుకు చేర్చామని రెడ్‌క్రాస్ వెల్లడించింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్ పౌరుడున్నట్టు ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. హమాస్ డిమాండ్‌ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. వీరిలో 24 మంది మహిళలు కాగా 15 మంది చిన్నారులు. వారిని తీసుకుని వాహనాలు వెస్ట్ బ్యాంక్‌లోని జైళ్ల నుంచి రమల్లాకు బయల్దేరాయి. నాలుగు రోజుల వ్యవధిలో 50 మంది బందీలకు హమాస్ విముక్తి కల్పించాల్సి ఉంది. అలాగే 150 మంది ఖైదీలను జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి. ప్రస్తుతం 7,200 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్నారు. ‘ఉత్తరాది వలస’లపై కాల్పులు.. ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు ఆగిపోవడంతో దక్షిణ గాజా నుంచి జనం ఉత్తర గాజాకు కాలినడకన తిరిగివస్తున్నారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రయతి్నస్తోంది. శుక్రవారం పలుచోట్ల వారిపై కాల్పులు జరిపింది. ఎవరూ వెనక్కి వెళ్లొద్దంటూ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారని, 11 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలియజేసింది. అక్టోబర్ 7న గాజాపై దాడులు మొదలైన తర్వాత ఇజ్రాయెల్ హెచ్చరికల వల్ల ఉత్తర గాజా నుంచి లక్షలాది మంది ప్రాణభయంతో దక్షిణ గాజాకు వలసవెళ్లారు. వారంతా స్వస్థలాలకు తిరిగి రావాలని భావిస్తున్నారు. గాజాకు 1.30 లక్షల లీటర్ల డీజిల్ కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం కావడంతో గాజాకు మానవతా సాయం చేరవేతలోనూ వేగం పెరిగింది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, వైద్య పరికరాలు, దుస్తులు తదితర సామగ్రితో దాదాపు 90 వాహనాలు శుక్రవారం ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ గుండా గాజాలోకి ప్రవేశించాయి. అలాగే 1.30 లక్షల లీటర్ల డీజిల్ కూడా గాజాకు అందింది. డీజిల్ లేక, జనరేటర్లు పనిచేయక గాజా ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఇప్పటికే నిలిచిపోయాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్న నాలుగు రోజుల్లో రోజుకు 1.30 లక్షల లీటర్ల డీజిల్‌ను గాజాకు సరఫరా చేయడానికి ఇజ్రాయెల్ అనుమతి ఇచి్చంది. వాస్తవానికి గాజాకు నిత్యం 10 లక్షల లీటర్ల డీజిల్ అవసరం. కాల్పుల విరమణ పొడగిస్తారా ? ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కేవలం నాలుగు రోజులపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒప్పందాన్ని పొడిగిస్తారని సమాచారం. హమాస్ చెరలో 240 మంది బందీలు ఉన్నారు. వారందరినీ విడుదల చేయించాలంటే నాలుగు రోజుల సమయం సరిపోదు. అందుకే ఒప్పందం పొడిగింపునకు ఇజ్రాయెల్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
బందీలకు ఇక విముక్తి!
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న దాదాపు 240 మంది బందీలకు త్వరలోనే విముక్తి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. బందీల్లో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులూ ఉన్నారు. వారందరినీ క్షేమంగా విడిపించడానికి ఇజ్రాయెల్, అమెరికా, ఖతార్ దేశాలు ప్రయత్నాలు వేగవంతం చేశాయి. ఆయా దేశాల ప్రతినిధులు హమాస్‌తో కొన్ని రోజులుగా జరుపుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. బందీలను విడుదల చేయాలంటే ఇజ్రాయెల్ సైన్యం తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించాలని, గాజాలోకి పెద్ద ఎత్తున మానవతా సాయాన్ని అనుమతించాలని, ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఫైటర్లను విడుదల చేయాలని హమాస్ షరతు విధించింది. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించినట్లు సమాచారం. బందీలకు స్వేచ్ఛ ప్రసాదించే విషయంలో అతి త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని హమాస్ సీనియర్ నాయకుడు ఇజ్జత్ రిష్క్ మంగళవారం వెల్లడించారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తే బందీలను వదిలిపెట్టడానికి తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చామని ప్రవాసంలో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియేహ్ చెప్పారు. ఒప్పందం చివరి దశలో ఉందని ఖతార్ తెలియజేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే గాజా నుంచి బందీలు వారి స్వదేశాలకు చేరడం ఖాయమే. అయితే, హమాస్‌పై ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నోరువిప్పడం లేదు. హమాస్ చెరలో ఉన్న తమ ఆప్తులను విడిపించాలని బందీల కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. నిత్యం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అంశం రాజకీయంగా తనకు చాలా నష్టం కలిగించే ప్రమాదం ఉండడంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నాలుగు మెట్లు కిందికి దిగొచ్చినట్లు స్థానిక మీడియా అంచనా వేస్తోంది. హమాస్ షరతులేమిటి? గాజాపై ఐదు రోజులపాటు భూతల, వైమానిక దాడులను ఇజ్రాయెల్ నిలిపివేస్తే బందీల్లో 50 మంది మహిళలు, చిన్నారులను వదిలేస్తామని హమాస్ షరతు విధించినట్లు తెలిసింది. ఆ తర్వాత ముగ్గురు పాలస్తీనియన్ ఖైదీలకు చొప్పున బదులుగా ఒక్కో బందీని విడిచిపెడతామని చెబుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ జైళ్లలో 8 వేల మందికిపైగా పాలస్తీనా ఫైటర్లు శిక్ష అనుభవిస్తున్నారు. వారిని విడిపించుకోవడానికి బందీలను ఎరగా వాడుకోవాలని హమాస్ నిర్ణయించుకుంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు జర్నలిస్టులు మృతి లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లో మంగళవారం హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించింది. క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ఫరా ఒమర్, రబీన్ మామరీ అనే ఇద్దరు జర్నలిస్టులు, మరో ఇద్దరు పౌరులు బలయ్యారు. మృతిచెందిన ఇద్దరు జర్నలిస్టులు లెబనాన్‌కు చెందిన అల్–మయాదీన్ టీవీ చానల్లో పనిచేస్తున్నారు. -
Israel-Hamas war: అల్–షిఫాలో మృత్యుఘోష
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో అతి పెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలో మరణ మృదంగం మోగుతోంది. పెద్ద సంఖ్యలో రోగులు కన్ను మూస్తున్నారు. రోగులు, క్షతగాత్రులతోపాటు 7,000 మందికిపైగా సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడ ఉందన్న వాదనతో ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. నిత్యం తనిఖీలు చేస్తోంది. బయట నుంచి ఆహారం, నీరు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంధనం, విద్యుత్ సరఫరా కాకుండా నిలిపివేసింది. గత ఐదారు రోజులుగా ఇక్కడ చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఐసీయూలోని రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గురువారం రాత్రి నుంచి 22 మంది మరణించారని అల్–షిఫా డైరెక్టర్ మొహమ్మద్ అబూ సాలి్మయా చెప్పారు. గత మూడు రోజుల వ్యవధిలో ఇక్కడి 50 మందికిపైగా రోగులు మరణించినట్లు సమాచారం. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ స్థావరాలనే కాదు, శరణార్థి శిబిరాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం ఉపేక్షించడం లేదు. తాజాగా జబాలియా క్యాంపుపై జరిగిన వైమానిక దాడిలో ఏకంగా 18 మంది పాలస్తీనా శరణార్థులు మరణించారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరం సమీపంలో ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 14 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు ఎంతమంది మృత్యువాత పడ్డారన్నది తెలియరావడం లేదు. గత కొన్ని రోజులుగా మృతుల, క్షతగాత్రుల గణాంకాలను గాజా ఆరోగ్య శాఖ విడుదల చేయడం లేదు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రభుత్వ అధికార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలమే ఇందుకు కారణం. బందీలను హత్య చేస్తున్న హమాస్! అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. ఇప్పటిదాకా నలుగురు బందీలను విడుదల చేశారు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేయడంతో ప్రతిస్పందనగా బందీలను మిలిటెంట్లు హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ వద్ద బందీగా ఉన్న 19 ఏళ్ల నోవా మర్సియానో అనే ఇజ్రాయెల్ మహిళా జవానును ఇప్పటికే హత్య చేశారు. ఆమె మృతదేహం అల్–షిఫా వద్ద లభ్యమైంది. అలాగే 65 ఏళ్ల మరో మహిళా బందీ సైతం హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని అల్–షిఫా వద్ద గుర్తించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆగని దాడులు.. అందని సాయం గాజాపై ఇజ్రాయెల్ సేనలు భీకరస్థాయిలో విరుచుకుపడుతుండడంతో పాలస్తీనియన్లకు మానవతా సాయం అందడం లేదు. దాడులకు విరామం ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆహారం, ఔషధాలు, నిత్యావసరాను గాజాకు చేరవేయలేకపోతున్నామని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి నిస్సహాయత వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మారకపోతే త్వరలోనే ఆకలి చావులు ప్రారంభం కావడం తథ్యమని తేలి్చచెప్పింది. మరోవైపు గాజాలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఊహించినదాని కంటే వేగంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, సాధారణ జనావాసాలతోపాటు ఆసుపత్రుల్లోనూ జనం రోగాల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఇతర దేశాల నుంచి ఇంధనం వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో జనరేటర్లు పనిచేయడంలేదు. విద్యుత్ లేక మొబైల్ ఫోన్ల సేవలు సైతం నిలిచిపోయాయి. గాజాలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. గాజాను ఆక్రమించొద్దు: బ్లింకెన్ హమాస్‌పై యుద్ధం ముగిసిన తర్వాత గాజా పరిస్థితి ఏమిటి అన్నదానిపై చర్చ ప్రారంభమైంది. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకొని, అక్కడ తన కీలు»ొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గాజాను మళ్లీ ఆక్రమించుకోవాలన్న ఆలోచన చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరోసారి ఇజ్రాయెల్‌కు సూచించారు. ఆఖరి గౌరవానికీ దూరం ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజాలో మెజార్టీ ప్రజలు ముస్లిం మతçస్తులే. దాడుల్లో నిత్యం పదుల సంఖ్యలో జనం మరణిస్తున్నారు. భవనాలు నేటమట్టమవుతున్నాయి. కాంక్రీట్ దిబ్బలుగా మారుతున్నాయి. చాలామంది వాటికింద చిక్కుకొని తుదిశ్వాస విడుస్తున్నారు. గాజాలో చాలా ప్రాంతాలు శ్మశనాలను తలపిస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై 5 వారాలు దాటింది. గాజాలో ఇప్పటివరకు 1,500 మంది చిన్నారులు సహా 2,700 మంది కనిపించకుండాపోయారు. వారంతా శిథిలాల కింద విగతజీవులైనట్లు తెలుస్తోంది. ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం.. మృతులకు సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు పూర్తిచేయాలి. మృతదేహాలను సబ్బుతో శుభ్రం చేసి, కొత్త వస్త్రాలు చుట్టి, పన్నీరు చల్లి 24 గంటల్లోగా ఖననం చేయాల్సి ఉంటుంది. గాజాలో వేలాది మంది ఈ ఆఖరి గౌరవానికి నోచుకోవడం లేదు. బయటకు తీసేవారు లేక శిథిలాల కింద శవాలు కుళ్లిపోతున్నాయి. గుర్తుపట్టలేని విధంగా మారిపోతున్నాయి కరెంటు, డీజిల్, పెట్రోల్ లేకపోవడంతో గాజాలో సహాయక చర్యలు ఎప్పుడో నిలిచిపోయాయి. భవనాల శిథిలాలను తొలగించేవారే లేరు. కనిపించకుండాపోయిన తమ బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసం జనం గాలిస్తున్నారు. శవం కనిపించినా ఎవరిదో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిగో హమాస్ సొరంగం.. అల్–షిఫా హాస్పిటల్ కింది భాగంలో సొరంగంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉందన్న తన వాదనకు బలం చేకూర్చేలా వీడియోను, కొన్ని ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో గుహ లాంటి ప్రదేశం కనిపిస్తోంది. ఇది నిజంగా హమాస్ సొరంగమేనా? అనేది నిర్ధారించాల్సి ఉంది. అల్–షిఫా హాస్పిటల్లో హమాస్ ఆయుధాల వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అల్ షిఫా ఆస్పత్రి ఐసీయూ వార్డు (ఫైల్ ఫొటో) -
జస్టిన్ ట్రూడో Vs నెతన్యాహు.. ఇజ్రాయెల్ దాడులపై కౌంటర్లు..
జెరూసలేం: ఇజ్రాయెల్ సేనల దాటికి గాజా విలవిల్లాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులో పిల్లలు, మహిళలు భారీగా సంఖ్యలో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో ట్రూడో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం సంయమనం పాటించాలని నేను కోరుతున్నాను. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచమంతా చూస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన వైద్యులు, కుటుంబాలను కోల్పోయిన వారిని, ప్రాణాలతో బయటపడినవారిని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూస్తున్నాము. మహిళలు, పిల్లలను టార్గెట్ చేస్తూ కూడా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికైనా వారి విషయంలో మానవత్వం చూపించాలని కోరారు. ఇదే సమయంలో హమాస్‌ను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో సామాన్య పాలస్తీనియన్లను అడ్డుపెట్టుకోవడం సరికాదన్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడిచిపెట్టారని కామెంట్స్ చేశారు. ఇక, కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహు కౌంటరిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన నెతన్యాహు.. అక్టోబర్ ఏడో తేదీన హమాస్ దాడుల గురించి ప్రస్తావించారు. వారి దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యవాపడ్డారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నది ఇజ్రాయెల్ కాదు. హోలోకాస్ట్ నుండి యూదులపై జరిగిన దాడుల్లో హమాస్ ఎంతో దారుణంగా వ్యవహరించింది. సామాన్య పౌరులను ఊచకోత కోసింది. ఇజ్రాయెల్.. గాజా పౌరుల కోసం సేఫ్ జోన్లు, మానవతా కారిడార్లను అందిస్తోంది. కానీ, హమాస్ వాటిని కూడా అడ్డుపెట్టుకుని నేరాలకే పాల్పడుతోంది. వారి వెనుక దాక్కోని కాల్పులకు తెగబడుతోందన్నారు. హమాస్ అనాగరిక చర్యలను ఓడించేందుకు అన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతివ్వాలని కోరారు. .@JustinTrudeau It is not Israel that is deliberately targeting civilians but Hamas that beheaded, burned and massacred civilians in the worst horrors perpetrated on Jews since the Holocaust. While Israel is doing everything to keep civilians out of harm’s way, Hamas is doing… — Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 15, 2023 -
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం.. ఐరాసలో భారత్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ అంశంతో మరోసారి ఆచితూచి వ్యవహరించింది. తాజాగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై భారత్ అనుకూలంగా ఓటువేసింది. ఇక, తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. వివరాల ప్రకారం.. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలెం, సిరియాకు చెందిన గోలాన్ హైట్స్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా.. 18 దేశాలు తటస్థంగా ఓటు వేశాయి. మరోవైపు.. కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్, మార్షల్‌ఐలాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు, అమెరికా మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరోవైపు, ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ యద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. దీనిలో హమాస్ అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్ వ్యతిరేకించింది. అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్‌కు భారత్ సహా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. 120 దేశాలు మాత్రం దీనికి అనుకూలంగా ఓటేశాయి. 🔥🔥BIG UPDATE 🔥🔥 India Supports UN Resolution Condemning Israeli Settlements In Palestine This comes weeks after India abstained from a vote on a UN resolution calling for "immediate, durable and sustained humanitarian truce" in Gaza Strip. India has voted in favour of a… pic.twitter.com/fttSp5xiWq — Resonant News🌍 (@Resonant_News) November 12, 2023 గాజాలో దారుణ పరిస్థితులు.. ఇదిలా ఉండగా.. గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సందర్భంగా పాలస్తీనా అధికారులు శుక్రవారం మాట్లాడుతూ.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 11,078 మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. వారిలో దాదాపు 40శాతం మంది చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. గాజాపై నిరంతరం వైమానిక, శతఘ్ని దాడులు నిర్వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన వైద్యసేవలు.. కరెంటు సరఫరా లేకపోవడంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచ్చినట్టు తెలుస్తోంది. దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. ఇది కూడా చదవండి: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్ -
Israel-Hamas war: దిగ్బంధంలో ఆస్పత్రులు
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: దక్షిణ గాజాకు బారులు కట్టిన జనం.. హమాస్ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. వీధుల్లో భూతల పోరాటాలు.. ఆసుపత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైనికులు.. గాజా స్ట్రిప్‌లో ప్రస్తుత దృశ్యమిదీ. గాజా సిటీలోని నాలుగు పెద్ద ఆసుపత్రులపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్లు అక్కడే ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని తేల్చిచెప్పింది. శుక్రవారం తెల్లవారుజామునే నాలుగు ఆసుపత్రుల సమీపంలో క్షిపణి దాడులు చేసింది. గాజాలో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో 24 గంటల వ్యవధిలో ఐదుసార్లు క్షిపణులు ప్రయోగించింది. కొన్ని వార్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో కంటే ఆసుపత్రిలోనే భద్రత ఉంటుందని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వేలాది మంది జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక యుగంలా కాలం గడిపారు. అల్–ఫిఫా హాస్పిటల్ వద్ద జరిగిన దాడుల్లో ఒకరు మరణించారని, మరికొందరు గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. కానీ, తమ సైన్యం దాడుల్లో 19 మంది మిలిటెంట్లు హతమయ్యారని, వీరిలో హమాస్ కీలక కమాండర్, ప్లాటూన్ కమాండర్ సైతం ఉన్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది. 20 రాకెట్ లాంచర్లు నిల్వ చేసిన హమాస్ షిప్పింగ్ కంటైనర్‌ను ధ్వంసం చేశామని తెలియజేసింది. గాజాసిటీలోని నాలుగు ఆసుపత్రుల చుట్టూ ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. ఇజ్రాయెల్ సేనలు గాజా నగరంలోకి మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాసిటీలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా, 20 పాలస్తీనియన్లు మరణించారని స్థానిక అధికారులు చెప్పారు. మృతులు 11,078.. క్షతగాత్రులు 27,000 ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 11,078 మంది మరణించారని, వీరిలో 4,506 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. 27,000 మంది గాయపడ్డారని తెలిపింది. మరో 2,650 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా ఇప్పటికే మృతిచెంది ఉండొచ్చని తెలుస్తోంది. వలస వెళ్తున్నవారిపై వైమానిక దాడులు! ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు చేరుకోవడానికి వీలుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతిరోజూ దాదాపు 4 గంటలపాటు దాడులకు విరామం ఇస్తోంది. ఇకపై నిత్యం విరామం అమల్లో ఉంటుందని ఇజ్రాయెల్ వెల్లడించింది. గత ఐదు రోజుల్లో 1,20,000 మంది దక్షిణ గాజాకు వెళ్లిపోయారు. వారిపైనా వైమానిక దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈజిప్టు నుంచి గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందుతోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలతోప్రతిరోజు దాదాపు 100 వాహనాలు గాజాకు చేరుకుంటున్నాయి. మరోవైపు, హమాస్ మిలిటెంట్లపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. గాజాలో హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసేవరకూ అవి కొనసాగుతాయన్నారు. ఉత్తర గాజా.. భూమిపై నరకం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. మిలిటెంట్ల స్థావరాలతోపాటు సాధారణ జనవాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం కాగా, గాజాలో ఇప్పటికే దాదాపు 50 శాతం ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాలుగా మారిపోయాయి. ప్రధానంగా ఉత్తర గాజాలో పరిస్థితి భీతావహంగా మారింది. ఈ ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. ఐక్యరాజ్యసమితి హ్యూమానిటేరియన్ ఆఫీసు ఉత్తర గాజాను ‘భూమిపై నరకం’గా అభివరి్ణంచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
యుద్ధంలో కీలక ఘట్టాన్ని చేరాం: ఇజ్రాయెల్
టెల్ అవీవ్: కాల్పుల విరమణ చేయాలని కోరుతున్న ప్రపంచ దేశాల విన్నపాన్ని ఇజ్రాయెల్ మరోసారి తోసిపుచ్చింది. ఆదివారం బాంబుల దాడులతో గాజా నగరంపై విరుచుకుపడింది. గాజాను రెండుగా విభజించి హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో కీలక ఘట్టానికి చేరుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి ప్రకటించారు. గాజాను మొత్తం చుట్టుముట్టి, ఉత్తర-దక్షిణ గాజాగా విభజించడంలో విజయం సాధించామని వెల్లడించారు. అటు.. గాజాలో సమాచార వ్యవస్థ నిలిచిపోవడం యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇది మూడోసారి. హమాస్ అంతమే ధ్యేయంగా విరుచుకుపడిన ఇజ్రాయెల్ సేనలు.. ఆదివారం గాజాలో రెండు శరణార్థి శిబిరాలపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 53 మంది మరణించారు. అటు.. హమాస్‌ను అంతం చేసేవరకు వెనక్కి తగ్గబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. తమకు ఇంకో దారి లేదని తెలిపారు. యుద్ధాన్ని ప్రారంభించింది హమాస్ అని గుర్తుచేశారు. మరోవైపు దక్షిణ గాజాలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తున్న క్రమంలో పశ్చిమాసియాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బ్లింకెన్ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. ఇరాక్‌లోనూ పర్యటన చేపట్టారు. బాగ్దాద్‌లో ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేడు తుర్కియేలో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 1400 మంది మరణించారు. 280 మంది నిర్బంధంలో ఉన్నారు. ఇదీ చదవండి: Vladimir Putin Body Doubles: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? -
గాజా యుద్ధ విరామం అవసరమే.. మళ్లీ నోరు జారిన బైడెన్
మిన్నెపోలీస్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజాలో జరుగుతున్న యుద్ధానికి స్వల్ప విరామం అవసరమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ చేపట్టాలని ఐక్యరాజ్య సమితి చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో.. ఆయన ఇలా నేరుగా స్పందించడం విశేషం. అయితే.. ఆ సమయంలో ఆయన నోరు జారారు. బుధవారం ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ ప్రసంగించారు. ఆ సమయంలో గాజాలో కాల్పల విరమణ అవసరం అంటూ ఓ వ్యక్తి నినాదాలు చేశాడు. దానికి స్పందించిన ఆయన.. ‘‘అవును.. స్వల్ప విరామం అవసరమే. ఖైదీలను బయటకు క్షేమంగా తెచ్చేందుకు ఆ విరామం కచ్చితంగా అవసరం కూడా’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయనే చర్చ మొదలుకాగా.. వైట్‌హౌజ్ వివరణ ఇచ్చుకుంది. ప్రెసిడెంట్ బైడెన్, హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలను ఉద్దేశించి అలా వ్యాఖ్యానించారని వైట్‌హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకు ముందు ‘గాజాలో మనవతా సాయం ఆగిపోకుండా ఉండేందుకు యుద్ధానికి తాత్కాలిక విరమణ అవసరం’ అని వైట్‌హౌజ్ అభిప్రాయపడింది కూడా. అక్టోబర్ 7న హమాస్ దాడులతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. నాటి దాడుల్లో 1,400 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఆపై ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడుల సమయంలో హమాస్ సుమారు 200 మందిని తమ బందీలుగా చేసుకుంది. ఇందులో ఇజ్రాయెల్ పౌరులతో పాటు సైనికులు, విదేశీయులు ఉన్నారు. వీళ్లను విడిపించేందుకు తీవ్ర యత్నాలు జరుగుతున్నాయి. హమాస్ బలగాల వేటలో గాజాను మరుభూమిగా మార్చేస్తోంది ఇజ్రాయెల్. కిందటి నెలలో ఇజ్రాయెల్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అయితే.. గాజాలో మరణాల సంఖ్య పెరగడం, మానవతా సంక్షోభం నానాటికీ దిగజారుతున్న వేళ ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణకు పిలుపు ఇచ్చింది. కానీ, ఇజ్రాయెల్ మాత్రం అందుకు అంగీకరించలేదు. మరోవైపు అమెరికా సైతం కాల్పుల విరమణకు బదులుగా.. యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తే సరిపోతుందని.. తద్వారా గాజా ప్రజలకు సాయం అందేలా చూడాలని కోరుకుంటోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 8,796 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో పిల్లలే 3,648 మంది ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు బుధవారం బబాలియా శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 195 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్లు హమాస్ ప్రభుత్వం ప్రకటించుకుంది. -
Gaza: హమాస్ కీలక ప్రకటన
ఇజ్రాయెల్‌తో యుద్ధంలో.. హమాస్ కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న బందీల్లో కొందరు విదేశీయులను వదిలిపెట్టేందుకు అంగీకరించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిళ్ల మేరకే హమాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ బలగాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని హమాస్ స్పష్టం చేసింది. హమాస్ సైనిక విభాగం ప్రతినిధి అబు ఒబీదా మంగళవారం ఓ మీడియా సంస్థ ద్వారా మాట్లాడుతూ.. ‘‘రానున్న రోజుల్లో కొందరు విదేశీయులను విడిచిపెడతాం. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం వహిస్తున్న వారికి తెలియజేశాం. మాపై దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్ సైన్యాన్ని విడిచిపెట్టేది లేదు. గాజా ప్రాంతాన్ని వాళ్లు నాశనం చేశారు. కాబట్టి, ఇజ్రాయెలీ సైనికులు, సైన్యాధికారుల్ని చంపి అక్కడే పాతేస్తాం. వాళ్ల మృతదేహాలతో గాజా అతిత్వరలో శ్మశానంగా మారబోతోంది’’ అని అన్నారు. అక్టోబర్ 7న హమాస్ బలగాలు రాకెట్ లాంఛర్లతో ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశాయి. సరిహద్దులోని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. దాదాపు 240 మందిని అపహరించి గాజాలో తమ బందీలుగా చేసుకుంది. వాళ్లలో ఇజ్రాయెల్ పౌరులు, సైనికులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. వీళ్లను విడిపించాలని ఇజ్రాయెల్‌లో నిరసనలను తారాస్థాయికి చేరాయి. శాంతియుతంగా బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో హమాస్‌ను సర్వనాశనం చేసి మరీ బంధీలను విడిపిస్తామని ఇజ్రాయెల్ ప్రతిన బూనింది. గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడి కారణంగా ఇప్పటి వరకు 8,525 మంది మృతి చెందినట్లు హమాస్ ఆధీనంలోని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మృతి చెందిన వారిలో 3,500 మంది చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది. పలు దేశాల మధ్యవర్తిత్వం వల్ల ఇప్పటి వరకు హమాస్ నలుగురిని విడిచిపెట్టగా.. ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన గ్రౌండ్ ఎటాక్స్‌లో మరొకరు హమాస్ చెర నుంచి విముక్తి పొందారు. -
గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందన
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందించింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రకటించారు. కాల్పుల విరమణ పాటిస్తేనే.. మానవతా సాయం గాజాకు అందుతుందని, లేకుంటే అక్కడి పరిస్థితులు మానవతా సంక్షోభానికి దారి తీస్తాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నెతన్యాహూ స్పందించారు. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో కాల్పలు విరమణ ఉండదు. ఎందుకంటే అది హమాస్‌కు లొంగిపోవడమే అవుతుంది గనుక అని అన్నారాయన. ‘‘కాల్పుల విరమణ కోసం ఇస్తున్న పిలుపు.. ఇజ్రాయెల్ హమాస్‌కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపు ఇవ్వడమే అవుతుంది. కాబట్టి అది జరగదు. యుద్ధంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాడుతుంది అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సోమవారం ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా కూడా కాల్పుల విరమణపై అభ్యంతరం వ్యక్తం చేసింది.‘‘ప్రస్తుత ఉద్రిక్తతలకు కాల్పుల విరమణ సరైన సమాధానం అని మేము భావించం అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. అయితే గాజాలో సాయం అందాలంటే.. యుద్ధ విరమణల సమయం కేటాయిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఇజ్రాయెల్ భీకర దాడులు.. వారిని రక్షించాలన్న జో బైడెన్
జెరూసలేం: గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు మరింత ఉధృతం చేసింది. ఒకవైపు ఇజ్రాయెల్ వైమానిక దళం నిప్పుల వర్షం కురిపిస్తూంటే ఇంకోవైపు పదాతి దళం మన్ముందుకు చొచ్చుకెళ్తోంది. ఇరవైనాలుగు గంటల వ్యవధిలో 450 హమాస్ స్థావరాలపై దాడుల చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. మరోవైపు.. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక సూచన చేశారు. హమాస్ మిలిటెంట్లు, పౌరుల మధ్య తేడాను గుర్తించాలని బైడెన్ కోరారు. దాడుల్లో గాజాకు చెందిన అమాయక ప్రజలు మృతిచెందకుండా వారిని కాపాడాలన్నారు. పౌరుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చే అంతర్జాతీయ మానవతా చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఇజ్రాయెల్‌కు ఆత్మ రక్షణ హక్కు ఉన్నప్పటికీ సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. BREAKING NEWS FROM ISRAEL Israeli forces destroying cameras as they were raiding homes in Jenin they are targeting male Palestinian [Saudi,Putin's Russia,WhatsApp,Amin Emery, Halloween,Dame,Jones, Rickman, Chiefs]pic.twitter.com/Yw8peVSbLG — 🌎🏞️ YOBBY THE FIRST (@Obayobrian1) October 30, 2023 ‘ద్విదేశ’ విధానమే పరిష్కారం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి తెరపడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ముగిసిన తర్వాత సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలన్న దానిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం, అరబ్ దేశాల నాయకత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని సూచించారు. ద్విదేశ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై ఒప్పందానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, స్వతంత్ర పాలస్తీనా అనే రెండు దేశాలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు తెలియజేశానని చెప్పారు. בשעות האחרונות צה"ל המשיך לתקוף ולחסל מחבלים ברצועת עזה, לוחמי צה"ל שפעלו בסמוך למעבר ארז זיהו מספר מחבלים שיצאו מפיר של מנהרה בשטח רצועת עזה, לאחר הזיהוי הלוחמים ניהלו מולם קרב, הרגו מספר מחבלים ופצעו נוספים. במקביל, התרחשו מספר קרבות נוספים בהם חוסלו מחבלים>> pic.twitter.com/R4TpMIJupy — צבא ההגנה לישראל (@idfonline) October 29, 2023 ఆటలొద్దు.. గల్లంట్ వార్నింగ్ ఇదిలా ఉండగా.. హమాస్‌పై ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ స్పందించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బందీలపై హమాస్ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. మానసికంగా తమను బెదిరించే ప్రయత్నం చేస్తోందన్నారు. అలాగే, బందీలను విడిపెట్టేందుకు పలు షరతులు విధిస్తోందన్నారు. కాగా, ఇజ్రాయెల్‌కు చెందిన 300 మందికిపైగా పౌరులు గాజాలో హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. గాజాలోని హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్, ఇజ్రాయెల్‌తో తక్షణ ఖైదీల మార్పిడికి పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ సిద్ధంగా ఉందని చెప్పిన విషయం తెలిసిందే. -
గాజా స్ట్రిప్‌లోని హమాస్‌పై దాడులు తీవ్రతరం చేస్తున్న ఇజ్రాయెల్..ఇంకా ఇతర అప్డేట్స్
-
గాజా మానవతా సంధి తీర్మానానికి ఓటేయని భారత్
ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో.. తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యింది. గాజాలో మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే పలు ప్రతిపాదనలపై ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యదేశాలున్న జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌లో మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. అయితే 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు కాగా.. అందులో భారత్ కూడా ఉంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే దూరంగా ఉన్నాయి. ‘‘పౌరుల రక్షణ, చట్టపరమైన & మానవతా బాధ్యతలను సమర్థించడం’’ పేరిట జోర్దాన్ ఈ తీర్మానం ప్రతిపాదించింది. బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, రష్యా సహా 40 దేశాలు మద్దతు తీర్మానానికి ఇచ్చాయి. గాజా స్ట్రిప్‌లో నివసిస్తోన్న వారికి మానవత దృక్పథంతో సహాయం అందించడం, వారికోసం ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేయడం.. వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే.. ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాల్ని భారత్ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్ తీరును తప్పు పట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్ తన నిర్ణయాన్ని వివరించింది. "ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని, దౌత్యం-చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాము" అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు.. అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలంటూ కెనడా సవరణలను సూచించగా.. భారత్ సమర్థించింది. ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్‌లో పాల్గొంటామని యోజనా ముందుగానే తెలిపారు. కానీ, అది జరగలేదు. జోర్డాన్ రూపొందించిన తీర్మానంలో హమాస్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అమెరికా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్, వారి చెరలో బందీలు.. అనే పదాలను జోర్డాన్ రూపొందించిన డ్రాఫ్ట్‌లో చేర్చాలనేది కెనడా డిమాండ్. కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఓటింగ్ సైతం నిర్వహించింది ఐరాస. దీనికి అనుకూలంగా భారత్ సహా 87 దేశాలు ఓటు వేశాయి. అయితే.. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగింది హమాస్. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి.. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో సైన్యంతో ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్.. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ చేపట్టింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఫలితంగా.. గాజా ఛిద్రమైపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 6,700 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రతరమౌతోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
గాజాలో గుట్టలుగా శవాలు.. 50 మంది బందీల మృతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం 21వ రోజుకి చేరింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది. హమాస్‌ను నామరూపాలు చేస్తామని, అందుకోసం గాజాను సర్వనాశనం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకుంది ఇజ్రాయెల్. ఇప్పటికే తమ దళాలకు గాజాపై భూతల దాడికి సిగ్నల్స్ ఇచ్చింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 7,028 మంది చనిపోయినట్టు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో 3 వేల మంది చిన్నారులు ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. శవాల గుర్తింపు కోసం బయటకు వస్తే.. ఎక్కడ ప్రాణాలు పోతాయోననే భయంతో గడుపుతున్నారు. చివరకు అంత్యక్రియలు కూడా సజావుగా నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదని గాజా అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఏ బంధీలనైతే సురక్షితంగా విడిపించాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందో.. వాళ్ల ప్రాణాల్నే బలిగొంటోందన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోని ఈజిప్టు పట్టణాన్ని ఇజ్రాయెల్ మిసైల్ తాకిన ఘటనలో 50 మంది బందీలు మరణించినట్టు హమాస్ ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్‌లో రాతంత్రా జరిపిన దాడుల్లో 60 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది. తూర్పు జెరూసెలంతో వేరేగా జరిపిన దాడుల్లో మరింత మంది అరెస్ట్ అయినట్టు ‘అల్ జజీరా’ పేర్కొంది. ఇజ్రాయెల్-లెబనాన్-సిరియా మధ్య సీమాంతర పోరు కూడా జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. యుద్ధం ఇప్పట్లో ఆగే సంకేతాలు కనిపించకపోవడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాలస్తీనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన సామగ్రిని సరఫరా చేసేందుకు అనుమతించాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొస్తోంది. -
Israel-Hamas war: గాజాలో కన్నీటి చుక్కలు
రఫా/టెల్ అవీవ్: ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. ప్రధానంగా ఇంధన కొరత వల్ల సహాయక చర్యలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనాలు మూలనపడ్డాయి. క్షిపణుల దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగించే అవకాశం లేకుండాపోయింది. వాటికింద చిక్కుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మరోవైపు ఇంధనం కొరతవల్ల ఆసుపత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు ఆపేస్తున్నారు. క్షతగాత్రులకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం పదుల సంఖ్యలో మృతదేహాలు ఆసుపత్రుల నుంచి శ్మశానాలకు చేరుతున్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాకు ఇంధన సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని బుధవారం ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసింది. ఇంధనం సరఫరా చేయకపోతే గాజాలో సహాయక చర్యలు అతిత్వరలో పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరిలో 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 6 లక్షల మంది ఐక్యరాజ్యసమితి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు సరిహద్దు నుంచి ఆహారం, నిత్యావసరాలను గాజాకు చేరవేసేందుకు ఇజ్రాయెల్ ఇటీవల అనుమతి ఇచి్చంది. దాంతో కొన్ని వాహనాలు గాజాకు చేరుకున్నాయి. పరిమితంగా అందుబాటులోకి వచి్చన ఆహారం, నిత్యావసర సామగ్రిని రేషనింగ్ విధానంలో పాలస్తీనియన్లకు సరఫరా చేస్తున్నారు. ఇంధన కొరత మాత్రం తీరడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్‌ను గాజాలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ సైన్యం తెగేసి చెబుతోంది. చేతులేత్తేయడమే మిగిలింది ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ ప్రస్తుతం గాజాలో సహాయక చర్యల్లో నిమగ్నమైంది. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తోంది. విద్యుత్ లేక, పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకపై క్షతగాత్రులకు సేవలందించే పరిస్థితి లేదని చెబుతోంది. ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి కూడా వాహనాలకు ఇంధనం లేదని పేర్కొంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పూర్తిగా చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేదని ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మూడింట రెండొంతులు ఇప్పటికే మూతపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సిరియాలో 8 మంది జవాన్లు మృతి ఇజ్రాయెల్–హమాస్ మధ్య మొదలైన యుద్ధం మధ్యప్రాచ్యంలో అగ్గి రాజేస్తోంది. హమాస్‌కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచేవారిని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు సిరియా ప్రభుత్వం మద్దతు పలుకుతుండడంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం దక్షిణ సిరియాలోని సైనిక శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 8 మంది సిరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా నుంచి తమపై రాకెట్ దాడులు జరుగుతుండడంతో తిప్పికొట్టామని, వైమానిక దాడులు చేసి సిరియా సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఒక్కతాటిపైకి మిలిటెంట్ సంస్థలు! ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచిన నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ముఖ్య నేత హసన్ నస్రల్లా బుధవారం హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అగ్రనాయకులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్, హెజ్బొల్లా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ సంస్థలు కలిసి పోరాడే సూచనలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల దాడులకు దిగితే తగిన మీకు గుణపాఠం నేర్పుతామంటూ ఇజ్రాయెల్‌ను హెజ్బొల్లా హెచ్చరించింది. హమాస్‌కు ఇరాన్ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. ఇరాన్‌లోని మిలిటెంట్ సంస్థలు ఇరాక్, యెమెన్, లెబనాన్ భూభాగల నంచి ఇజ్రాయెల్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బందీల విడుదలకు ఖతార్ యత్నాలు హమాస్ చెర నుంచి బందీలు విడుదలయ్యే విషయంలో మరిన్ని సానుకూల పరిణామాలు చూడొచ్చని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహా్మన్ అల్–థానీ చెప్పారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే నలుగురు బందీలు విడుదలైన సంగతి తెలిసిందే. మిగిలినవారిని సైతం విడుదల చేసేలా హమాస్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఖతార్ ప్రధానమంత్రి తెలిపారు. బందీల విడుదలకు చొరవ చూపుతున్న ఖతార్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి అధినేత టాగీ హనెగ్బీ కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికన్ల తరలింపు! ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే, అక్కడున్న తమ పౌరులను స్వదేశానికి తరలించాలని యోచిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ఇప్పటికే ప్రారంభమైంది. చాలామంది అమెరికన్లు ఇజ్రాయెల్ వదిలి వెళ్లిపోయారు. మధ్యప్రాచ్య దేశాల్లో పెద్ద సంఖ్యలో అమెరికన్లు ఉన్నారు. యుద్ధం గనుక విస్తరిస్తే వారి భద్రతకు భరోసా ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పరిస్థితి అదుపు తప్పకముందే వారిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సౌరే అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ తాజా పరిస్థితులపై చర్చించారు. ఘర్షణను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు రోజుల్లో 750 మంది మృతి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడుల తీవ్రత పెంచింది. బుధవారం కొన్ని టార్గెట్లపై క్షిపణులు ప్రయోగించింది. హమాస్ స్థావరాలను, సొరంగాలను, ఆయుధాగారాలను, సమాచార వ్యవస్థను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మంగళవారం, బుధవారం జరిగిన దాడుల్లో గాజాలో 750 మందికిపైగా జనం మృతిచెందారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 5,791 మందికిపైగా మరణించారని, 16,297 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. గాజాలోని మృతుల్లో 2,300 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 96 మంది పాలస్తీనియన్లు బలయ్యారు. 1,650 మంది క్షతగాత్రులుగా మారారు. 10 మంది యూదులను చంపేశా! ఇజ్రాయెల్‌లో 10 మంది యూదులను చంపేశానంటూ హమాస్ మిలిటెంట్ ఒకరు తన తల్లిదండ్రులతో మొబైల్ ఫోన్లో చెప్పిన ఆడియో రికార్డు ఒకటి వెలుగులోకి వచి్చంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ దీన్ని విడుదల చేసింది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ భూభాగంలోని కిబుట్జ్‌లో తానున్నానని, తాను ఒక్కడినే 10 మంది యూదులను మట్టుబెట్టానని సదరు మిలిటెంట్ గాజాలోని ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి గర్వం తొణికిసలాడే స్వరంతో ఆనందంగా చెప్పాడు. దాంతో వారు అతడిని శభాష్ అంటూ అభినందించారు. మిలిటెంట్ ఉపయోగించిన ఫోన్ అతడి చేతిలో చనిపోయిన ఇజ్రాయెల్ పౌరుడిదే కావడం గమనార్హం. అయితే, ఈ ఆడియో రికార్డు నిజమైందో కాదో ఇంకా నిర్ధారణ కాలేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. -
Israel-Hamas War: గాజా కింద మరో గాజా!
సరిహద్దులు దాటి మెరుపు దాడులతో భయోత్పాతం సృష్టించిన హమాస్ పనిపట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఆర్మీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతానికి గాజాస్ట్రిప్‌పై భారీ వైమానిక దాడులతో వందలాదిగా భవనాలను ఇజ్రాయెల్ ఆర్మీ నేలమట్టం చేస్తూ పోతోంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దాని దృష్టంతా ఇప్పుడు హమాస్ శ్రేణులపైనే ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ అత్యాధునిక సాంకేతికత, ఆయుధ బలంతో హమాస్ ఏమాత్రం సరితూగదు. అయితే, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ పని అనుకున్నంత సులువు కాదన్నది నిపుణుల మాట. ఏళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసుకున్న రహస్య భూగర్భ సొరంగాల విస్తారమైన నెట్వర్క్ హమాస్‌కు పెట్టని కోటగా మారింది. గత వారం నరమేథం సృష్టించిన హమాస్ మిలిటెంట్లు సరిహద్దులు దాటేందుకు సముద్ర, భూ, ఆకాశ మార్గాలతోపాటు ఈ సొరంగమార్గాలను కూడా వాడుకున్నారనే అనుమానాలున్నాయి. శత్రుదుర్బేధ్యమైన టన్నెల్ నెట్ వర్క్ ఎలా, ఎక్కడుందన్నది ఇజ్రాయెల్ ఆర్మీకి అంతుచిక్కడం లేదు. ఈ టన్నెళ్లలోనే హమాస్ ఆయుధ సామగ్రి, నెట్వర్క్ అంతా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ బందీలను అండర్‌గ్రౌండ్‌లోనే దాచినట్లు ఆర్మీ అంటోంది. ఇజ్రాయెల్ 2014 నుంచి గాజా స్ట్రిప్‌తో ఉన్న 60 కిలోమీటర్ల సరిహద్దుల్లో భూగర్భంలో బారియర్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.7,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సరిహద్దులకు ఆవలి వైపు ఏర్పాటయ్యే సొరంగాలను సైతం గుర్తించేందుకు ఎల్బిట్ సిస్టమ్స్, రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు సంస్థలే ఇజ్రాయెల్‌కు క్షిపణి దాడులను అడ్డుకునే ఐరన్ డోమ్‌ను సమకూర్చాయి. ఐరన్వాల్, ఐరన్ స్పేడ్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ఇవి సాంకేతికతలను అభివృద్ధి పరిచాయి. అయితే, అవేవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. టన్నెళ్ల మధ్య లింకులను అవి కనిపెట్టలేకపోయాయి. ‘గాజా స్ట్రిప్‌లో రెండు లేయర్లున్నాయి. ఒకటి పౌరులది కాగా, రెండోది హమాస్‌ది. హమాస్ నిర్మించుకున్న ఆ రెండో లేయర్ ఎక్కడుందో కనిపెట్టేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రతినిధి జొనాథన్ కొన్రికస్ చెప్పారు. అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఛేదించడం అంత సులువు కాదు. గతంలోనూ ఇజ్రాయెల్ అనేక మార్లు ప్రయత్నించి భంగపడింది. 2021లో గాజాపై భారీ చేపట్టిన బాంబు దాడులతో 100 కిలోమీటర్ల పరిధిలోని టన్నెళ్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, తమకు 500 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ నెట్వర్క్ ఉన్నట్లు హమాస్ ఆ తర్వాత ప్రకటించుకోవడం గమనార్హం. భూగర్భ మార్గాలు ప్రమాదకరమా? సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినప్పటికీ భూతల పోరాటంలో ఆధిపత్యం సాధించిన వారిని అక్షరాలా అణగదొక్కేందుకు టన్నెలింగ్ అత్యంత ప్రభావ వంతమైన మార్గంగా మారిపోయిందని స్కాట్ సవిట్జ్ అనే మిలటరీ నిపుణుడు అంటున్నారు. సొరంగాలు ఉన్నా యా, ఉంటే ఎన్ని ఉన్నాయి? అవి ఎక్కడ ఉ న్నాయి? అనేది వాటిని నిర్మించిన వారికే తప్ప ప్రత్యర్థికి తెలిసే అవకా శాలు చాలా తక్కువని ఆయన చెబుతు న్నారు. సైనిక పరమైన నష్టాన్ని తగ్గించేందుకు రోబోట్లను పంపి సంక్లిష్టమైన సొరంగాలను కనిపెట్టొచ్చు. అయితే, లోపల జాగా తక్కువగా ఉండటం, బూబీ ట్రాప్‌లు, ఇతర ఆత్మరక్షణ ఏర్పాట్లను మిలిటెంట్లు ఏర్పాట్లు చేసుకొని ఉండే ఉంటారు. భూగర్భ టన్నెళ్ల వాతావరణం వారికే తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ బలగాలు అందులోకి ప్రవేశించి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోవాల్సి రావచ్చు’అని సవిట్జ్ హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటున్న హమాస్ ‘అత్యంత జనసాంద్రత కలిగిన గాజాలో హమాస్ ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటోంది. ఆయుధాలు, కమాండ్ వ్యవస్థలు, ఫైటర్లను వాటిలోనే దాచిపెడుతోంది. వాటిలోకి వెంటిలేషన్ మార్గాలు, విద్యుత్ తదితర సౌకర్యాలను సైతం సమకూర్చుకుంది. కొన్ని టన్నెళ్లయితే 35 మీటర్ల లోతులో కూడా ఉన్నాయి. రైల్ రోడ్ మార్గాలు, కమ్యూనికేషన్ గదులూ ఉన్నాయి. వాటి ప్రవేశ మార్గాలు ఎక్కువగా నివాస భవనాలు, కార్యాలయాల్లోనే ఉన్నాయి’అని నిపుణులు అంటున్నారు. మొదట్లో ఈ సొరంగాలను ఈజిప్టు నుంచి దొంగచాటుగా ఆయుధాలు, సరుకులను తరలించేందుకు వాడారు. సరిహద్దుల అవతల దాడులు జరిపేందుకు సైతం వీటిని ఉపయోగించుకున్నారు. 2006లో గిలాడ్ షలిట్ అనే ఇజ్రాయెల్ జవానును మిలిటెంట్లు సొరంగం ద్వారా దాడి చేసి, ఎత్తుకుపోయారు. అయిదేళ్ల తర్వాత వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశాక అతడిని వదిలిపెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈజిప్ట్ గ్రీన్‌సిగ్నల్ .. గాజాకి అందనున్న మానవతా సాయం
గాజా ప్రాంతమంతా ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. ఆవాసాలు కోల్పోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వాళ్లు లక్షల్లోనే ఉన్నారు. ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మానవతా సాయం అందించేందుకు ఈజిప్ట్ అంగీకరించింది. ఇజ్రాయెల్‌కి తాజా పర్యటనలో గాజాకి రూ. 832 కోట్ల సాయం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అయితే, ఈ సాయం గాజాలోకి ప్రవేశించాలంటే గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని రఫా క్రాసింగ్ దాటాల్సి ఉంటుంది. ఇప్పటికే మానవతా సాయం కింద సామగ్రితో కూడిన వందలాది ట్రక్కులు రఫా సరిహద్దు వద్ద బారులుతీరి ఉన్నాయి. కానీ, భద్రతా కారణాలను చూపిస్తూ ఈజిప్ట్ ఈ మార్గాన్ని మూసివేసింది. గాజా ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించి స్థిరపడే అవకాశముందని, అలాగే ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో బైడెన్.. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి Abdel Fattah El Sisi తో చర్చించి రఫా బార్డర్ క్రాసింగ్ తెరిపించేందుకు ఒప్పించారు. అయితే గాజాకు సాయం చేయడానికి మార్గం సుగమమైనప్పటికీ.. అది పరిమితంగానే ఉంటుందని ఈజిప్ట్ చెబుతోంది. పైగా హమాస్ దాడుల్లో రోడ్లు దెబ్బ తినడంతో.. వాటి పునరుద్ధరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అదే సమయంలో మరిన్ని దాడులు జరగవచ్చనే ఆందోళనను వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం నుంచి సాయం అందించేందుకు అనుమతిస్తామని ఈజిప్ట్ తెలిపింది. ఇదే విషయంపై జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈజిప్ట్ అధ్యక్షుడితో మాట్లాడాను. రఫా బార్డర్ తెరిచి మానవతా సాయం కింద ఇచ్చే సామగ్రితో కూడిన దాదాపు 20 ట్రక్కులను గాజాలోకి పంపించడానికి ఒప్పుకొన్నారు’’అని తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ప్రకటన ప్రకారం.. ‘‘గాజాకు మానవతా సాయం చేయడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు ఇరు దేశాలు గాజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికా, ఈజిప్ట్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరుదేశాల అధినేతలు కట్టుబడి ఉన్నారు’’ అని పేర్కొంది. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
దక్షిణ గాజాపై భీకర దాడులు.. శిథిలాల కింద శరణార్థులు
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. సరిహద్దులో శరణు కోరుతున్న వేళ.. దక్షిణ గాజాలో భారీ షెల్లింగ్‌తో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. గాజా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో లక్షల మంది నిస్సహాయులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్క ఖాన్ యూనిస్ ప్రాంతంలోనే దాడుల వల్ల నెలకొన్న విధ్వంసంతో.. శిథిలాల కింద వెయ్యి మంది దాకా చిక్కుకున్నట్లు హమాస్ అధికారిక ప్రకటన చేసింది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలనే ఇజ్రాయెల్ బలగాల హెచ్చరికలతో.. పొరుగు దేశాల శరణు కోరుతూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తర గాజా ప్రజలు. ఈ క్రమంలో దక్షిణం వైపున ఖాన్ యూనిస్‌తోపాటు రఫా పట్టణాలకు లక్షల సంఖ్యలో గాజా పౌరులు చేరుకున్నారు. అదే సమయంలో ఈ రెండు పట్టణాలపై భారీ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఈ దాడుల్లో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య 50 మందికిగా ప్రకటించినప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నందునా ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తోంది. ఖాన్ యూనిస్‌తోపాటు రఫా పశ్చిమ ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం భారీ స్థాయిలో దాడులు జరిపినట్లు గాజా అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయని.. వాటికింద చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అదే సమయంలో ఈజిప్టునకు వెళ్లేందుకు రఫా సరిహద్దులో లక్షల మంది వేచిచూస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ దళాలు వారిని అనుమతించడంలేదు. దీంతో ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలతోపాటు అత్యవసర సామగ్రితో గాజాకి వచ్చే ట్రక్కులు ఆ సరిహద్దు వద్దే నిలిచిపోయాయి. మరోవైపు, అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్- గాజాల మధ్య జరుగుతోన్న పోరులో భారీ ప్రాణనష్టం జరుగుతోంది. రెండు వైపులా ఇప్పటివరకు దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 9వేల మంది గాయాలపాలైనట్లు సమాచారం. ఒక్క గాజాలోనే 2,750 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పది లక్షల మంది పాలస్తీనీయన్లు వారి ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని తెలిపింది. గాజాలో పరిస్థితి దిగజారుతున్న వేళ ఈ సందిగ్ధతను తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్‌తోపాటు జోర్డాన్‌లోనూ బుధవారం పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా తమ సైనికులను పంపించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. -
హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం వేళ.. జో బైడెన్ కీలక నిర్ణయం
పాలస్తీనా మిలిటెంట్లు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ ఉగ్రవాదులను అంతు చూడడంతోపాటు వారి స్థావరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లో 3 లక్షలకు పైగా సైనికులను, భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. హమాస్, ఇజ్రాయెల్ భీకర పోరు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఇజ్రాయెల్‌లో జో బైడెన్ బుధవారం పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. గాజాకు సాయం అందించేందుకు ఓ ప్రణాళికను రూపొదించేందుకు ఇజ్రాయెల్, అమెరికా మధ్య అంగీకారం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు. అరబ్ దేశాల పర్యటన ముగించుకొని సోమవారం ఇజ్రాయెల్‌కు బ్లింకెన్ తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతోపాటు అధికారులతో దాదాపు ఎనిమిది గంటలపాటు సమవేశామయ్యారు. తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. అనంతరం బ్లింకెన్ మాట్లాడుతూ జో బైడెన్ పర్యటన విషయాన్ని వెల్లడించారు. హమాస్‌తోపాటు ఇతర ఉగ్రవాదుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నిరోధించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని తెలిపారు. ఇజ్రాయెల్‌లో పర్యటించే విషయాన్ని బైడెన్ స్వయంగా ఎక్స్(ట్విటర్)లో వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదుల క్రూరమైన దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు బుధవారం ఇజ్రాయెల్‌కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మనవతా సాయం అందించే విషయంపై జోర్దాన్‌కు వెళ్లనున్నట్లు చెప్పారు. అక్కడి నాయకులను కలిసి పాలస్తీనియన్ల స్వయం నిర్ణయాధికారం కోసం హమాస్ నిలబడదనే విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు తెలిపారు. On Wednesday, I'll travel to Israel to stand in solidarity in the face of Hamas's brutal terrorist attack. I'll then travel to Jordan to address dire humanitarian needs, meet with leaders, and make clear that Hamas does not stand for Palestinians' right to self-determination. — President Biden (@POTUS) October 17, 2023 తమ ప్రజలను రక్షించడానికి ఇజ్రాయెల్‌కు అవసరమైన విషయాలపై బైడెన్ వెళ్లి చర్చిస్తారని.. వాటిని తీర్చేందుకు తాము పనిచేస్తూనే ఉంటామని బ్లింకెన్ పేర్కొన్నారు. హమాస్ ఆధిపత్యంలోని గాజా భూభాగంపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. గాజా స్ట్రిప్‌కు విదేశీ సహాయాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేయడంపై యునైటెడ్ స్టేట్స్కు ఇజ్రాయెల్ హామీ ఇచ్చిందని తెలిపారు. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించే విధంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మంగళవారం పదకొండవ రోజుకు చేరుకుంది. ఈ పోరులో ఇప్పటిదాకా గాజాలో 2,750 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించినట్లు తెలిసింది. అతిత్వరలోనే ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సేనలు భూతల దాడులు ప్రారంభిస్తాయని ప్రచారం సాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వలసబాట పట్టారు. కాగా హమాస్ ఉగ్రవాదుల చెరలో 199 మంది ఇజ్రాయెల్ దేశ పౌరులు బందీలుగా ఉన్నారు. -
ఒక్కడి కోసం వెయ్యి మందిని వదిలిపెట్టి..
పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య కొనసాగుతున్న భీకరపోరు పదో రోజు దాటింది. హమాస్‌ను తుడిచిపెట్టడమే లక్ష్యంగా గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ రక్షణ బలగాలు విరుచుకుపడుతున్నాయి.ఇప్పటి వరకు వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ దళాలు.. ఏ క్షణమైనా గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిగా ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసుకుని దాడుల నుంచి తప్పించుకోవాలని హమాస్ ప్రయత్నిస్తోంది. అయితే.. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు. తాజాగా తమ చెరలో 199 మంది ఇజ్రాయెల్ పౌరులు(కొందరు విదేశీయలు కూడా) హమాస్ ప్రకటించుకుంది. అందులో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డానియల్ హగారే చెబుతున్నారు. తొమ్మిది నెలల పాప, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు, యువతులు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాదులు కలిగిన వృద్ధులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే.. ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్స్‌ను బందీలుగా పట్టుకోవడం హమాస్‌కు ఇదే తొలిసారి. కానీ, ఈ బందీల వంకతో తమ డిమాండ్లు నెరవేర్చుకోవడం మాత్రం ఇదే తొలిసారి కాదు. 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పటి నుంచి యుద్ధ తరహా సంక్షోభాలెన్నింటినో ఎదుర్కొంది. ముఖ్యంగా.. 1955 నుంచి ఇప్పటిదాకా పలు సందర్భాల్లో తమ దేశ పౌరులను విడిపించుకునేందుకు ఖైదీల పరస్పర మార్పిడి చేపడుతోంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. 2011లో జరిగిన ఘటన గురించి.. ఒక్క సైనికుడి కోసం ఏకంగా వెయ్యి మంది ఖైదీల్ని విడిచిపెట్టింది ఇజ్రాయెల్. కార్పొరల్ గిలాద్ షలిత్(19) వెళ్తున్న ట్యాంక్‌పై దాడి చేసిన హమాస్ సభ్యులు.. అతన్ని బందీగా చేసుకున్నారు. ఐదేళ్లపాటు హమాస్ చెరలో ఉన్న షలిత్‌ను విడిపించాలని బెంజిమన్ నెతన్యాహు ప్రభుత్వం మీద ప్రజలు ఒత్తిడి చేశారు. దీంతో.. షలిత్కి బదులుగా ఏకంగా 1,027 మంది పాలస్తీనా ఖైదీల్ని ఇజ్రాయెల్ విడుదల చేసింది. అందులో 78 మంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు. 1955లో.. నలుగురు సైన్య సిబ్బంది కోసం(మరొకరు బందీగా ఉన్నప్పుడే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని మృతదేహం కోసం కూడా..) 40 మంది సిరియా పౌరుల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. 1983లో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆధీనంలో ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ ఖైదీల్ని విడిపించుకునేందుకు 4,700 మంది పాలస్తీనా-లెబనీస్ ఖైదీల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. అందులో మరణశిక్షలు పడ్డ ఉగ్రవాదులు ఉన్నారు. 1985లో ముగ్గురి కోసం మరో 1,150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. 2004 నుంచి 2008 మధ్య కూడా.. ఖైదీల పరస్సర మార్పిడి జరిగింది. అలా.. ఇజ్రాయెల్ తమ పౌరుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తుందో హమాస్‌కు తెలుసు. అందుకే హమాస్ ఇప్పుడు బందీల ప్లాన్ అమలు చేస్తోందా?.. వీళ్ల ద్వారా ఎంతమందిని విడుదల చేయించాలనుకుంటోంది?.. అనేది త్వరలోనే తేలనుంది. మరోవైపు.. హమాస్ నుంచి తమ దేశస్థుల్ని సురక్షితంగా రప్పించాలంటూ ఇజ్రాయెల్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో.. వాళ్లను విడిపించడం నెతన్యాహూ ప్రభుత్వానికే పెద్ద సవాల్‌గానే మారనుందనే చెప్పాలి. హమాస్-ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇరువైపులా మరణించినవారి సంఖ్య 4 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో 700 మంది పిల్లలతో సహా 2,670 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా.. హమాస్ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు 1400 మంది మరణించారు. -
ఇజ్రాయెల్ ఆదేశాలు.. గాజా నుంచి తరలివెళ్తున్న వేలాది పాలస్తీనియన్లు
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 600 చిన్నారులతో 1,900 పాలస్తీన్లు, సహా మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాతపడ్డారు. తాజాగా ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించడంతో ఇక్కడి పాలస్తీనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గాజాలో కరెంట్, మంచి నీళ్లు, ఆహారం, ఇంధన కొరతతో అల్లాడుతున్న అక్కడి పౌరులు ఇజ్రాయెల్ ఆదేశాలతో మరింత భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని వేలాది మంది పాలస్తీనియన్లు ఖాళీ నడకన సౌత్ గాజాకు తరలివెళ్తున్నారు. ఆరంభం మాత్రమే.. మరోవైపు హమాస్ ఉగ్రవాదులను నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతోంది. గాజాను ఆక్రమించుకునేందుకు దాని సరిహద్దుల్లో 3.60 లక్షలమంది రిజర్వ్ సైనికులు సిద్ధం చేసింది. గత ఏడు రోజులుగా గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సేనలు తాజాగా గ్రౌండ్ ఆపరేషన్ దాడులను ప్రారంభించింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తమ దేశం ఇప్పుడే ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టిందని తెలిపారు. ఇజ్రాయెల్ సేనలు సింహాల్లా పోరాడుతున్నాయని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. ఉత్తర గాజాలోనే హమాస్ మిలిటెంట్ల మకాం ఉత్తర గాజాపై హమాస్‌కు గట్టి పట్టుంది. అగ్రనాయకులంతా అక్కడే మకాం వేశారు. అందుకే తొలి టార్గెట్‌గా అదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర గాజాను వదిలి దక్షిణ గాజాకు వెళ్లాలని పాలస్తీనా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సామాన్య ప్రజలకు నష్టం కలిగించే ఉద్దేశం లేదని, యుద్ధం ముగిసిన తర్వాత వారంతా తిరిగిరావొచ్చని సూచించింది. హమాస్ మిలిటెంట్లు జనావాస ప్రాంతాల్లో మకాం వేసి, కార్యకలాపాలు సాగిస్తున్నారు. సాధారణ ప్రజలను కవచంగా వాడుకుంటూ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తున్నారు. ప్రజలను అక్కడి తరలిస్తే మిలిటెంట్ల ముసుగు తొలగిపోతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా గాజా మొత్తం జనాభా 20 లక్షలు కాగా ఉత్తర గాజాలో 10 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు జనాలు దక్షిణ గాజాకు పయనవతున్నారు.అయితే ఇప్పటికే జనంతో కిక్కిరిపోయిన దక్షిణ గాజాపై మరింత ఒత్తిడిపెరగనుంది. చదవండి: అమేయ సైనిక శక్తి.. అతి శక్తిమంతమైన సైన్యం ఇజ్రాయెల్ సొంతం దారుణంగా గాజా పరిస్థితి గాజాలో పరిస్థితిలు మరి దారుణంగా మారాయి. ఎటు చూసిన శిథిలాలు.. వాటి కింది చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. కరెంట్, తాగునీరు, నిత్యవసరాల కొరతతో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళనతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గడుతున్నారు. ఖాళీ చేయించే ఆలోచన మానుకోండి: ఐరాస ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది. సామూహికంగా జనమంతా ఒకేసారి తరలివెళ్లడం సంక్షోభానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ ఇజ్రాయెల్‌కు సూచించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకోడంతో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగిస్తోంది. ఇటు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను దక్షిణ ప్రాచ్చంలోని దేశాలు ఖండిస్తున్నాయి. బీరూట్, ఇరాక్, ఇరాన్, జోర్డాన్ బహ్రెయిన్‌లో పాలస్తీనియన్లకు భారీగా మద్దతు లభిస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసలను వ్యక్తం చేస్తున్నారు. -
Gaza: ప్రాణ భయంతో.. ఉరుకులు పరుగులు!
వైమానిక దాడులతో గాజాను ఛిద్రం చేసిన ఇజ్రాయెల్ బలగాలు.. ఇక భూభాగంపై దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే గాజా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో గాజా ప్రజలు ప్రాణాలు గుప్పిట పట్టుకుని భయంతో పరుగులు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బట్టలు, పరుపులు కార్ల పైభాగానికి కట్టుకుని.. ఇంతకాలం తమను ఆశ్రయం ఇచ్చిన నేలను వదిలేసి పారిపోతున్నారు గాజా ప్రజలు. కాలినడకన, దొరికిన వాహనం పట్టుకుని వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు నార్త్ గాజాకు చెందినవిగా పాలస్తీనాకు చెందిన ఓ రిపోర్టర్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. హమాస్ సంస్థను నామారూపాలు లేకుండా చేస్తామని శపథం చేసిన ఇజ్రాయెల్.. రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో బలగాలతో గాజాపై విరుచుకుపడేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అదే జరిగితే.. గాజాలో ప్రాణ నష్టం ఊహించని స్థాయిలో ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐక్యరాజ్య సమితి. Gaza | Residents in North Gaza (Gaza City, Beit Lahia, Beit Hanoun, and Jabalia RC) are evacuating their homes in response to the Israeli military's threat that those who stay could face deadly consequences. pic.twitter.com/ZOlU0Rg5Rj — Younis Tirawi | يونس (@ytirawi) October 13, 2023 ‘‘గాజా నగర పౌరులారా.. మీరు, మీ కుటుంబాలు భద్రంగా ఉండాలంటే ఖాళీ చేసి వెళ్లిపోండి. హమాస్ ఉగ్రవాదులకు మీరు దూరంగా ఉండండి. మిమ్మల్ని వాళ్లు రక్షణ కవచంగా వాడుకుంటున్నారు’’ అని ఇజ్రాయెల్ మిలిటరీ తన హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. గాజాలో జనావాసాల్లో హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు మొదటి నుంచి ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు గాజా ప్రజల్ని తరలిపోవాలన్న ఇజ్రాయెల్ అల్టిమేటంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. అది మరింత వినాశనానికి దారి తీయొచ్చని హెచ్చరించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇజ్రాయెల్ హెచ్చరికలపై స్పందిస్తూ.. గాజా ఆస్పత్రుల్లో ఉన్న పేషెంట్ల తరలించడం సాధ్యం కాదన్న విషయాన్ని అక్కడి అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారని అంటోంది. ముఖ్యంగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లను తరలించడం వీలయ్యేది కాదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిక్ జసరెవిక్ తెలిపారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటు తర్వాత వేరు ప్రాంతంగా ఏర్పాటైనా గాజాలో.. 20 లక్షల కంటే ఎక్కువ జనాభానే ఉంది. అందులో శరణార్థులే ఎక్కువగా ఉన్నారు. గత 16 ఏళ్లుగా హమాస్ పాలనలో.. ఇజ్రాయెల్ దాడులు ఒకవైపు, మరోవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని గాజా స్ట్రిప్ ఎదుర్కొంటోంది. ఇక.. గత శనివారం(అక్టోబర్ 7) హమాస్.. ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపు దాడికి దిగింది. కేవలం 20 నిమిషాల్లో.. ఐదువేల రాకెట్ లాంఛర్లను ప్రయోగించింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా దాడులకు దిగింది. ఈ దాడుల్లో 1,300 ఇజ్రాయెల్ పౌరులు, 1800 దాకా పాలస్తీనియన్లు మృతి చెందారు. -
Israel Hamas War: చైనాలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై కత్తితో దాడి
ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిపై చైనాలో దాడి జరిగింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుల చేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్యవేత్తను కత్తితో పొడిచినట్లు తెలిపింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చిక్సి అందిస్తున్నారని.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడికి గల కారణాలు తెలియరాలేదు. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ఏ విధమైన ప్రకటన చేయలేదు. బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో కాకుండా మరోచోట ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఓ వైపు హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయిలీలు, యూదులు అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడి ఇజ్రాయెల్, చైనా మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడులను చైనా ఖండించకపోవడంపై బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబారి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుతం యుద్ధ పరిణామాల పట్ల చైనా వైఖరికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: తల్లి కడుపు చీల్చి మరీ.. వెలుగులోకి హమాస్ అరాచకాలు మరోవైపు వారం రోజులుగా గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గాజా సరిహద్దు వెంట ఇజ్రాయెల్‌లోకి చొరబడి కాల్పులు జరుపుతున్న హమాస్ ఉగ్రవాదులపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. బాంబ్, వైమానిక దాడులతో విరుచుపడుతోంది. ఇప్పటి వరకు 6 వేల బాంబులను గాజాపై ప్రయోగించింది. గాజాస్ట్రిప్‌లోని ఇళ్ల కింద ఉన్న టన్నెల్స్‌లో హమాస్ టెర్రరిస్టులు దాక్కుడటంతో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. 24 గంటల్లో సిటీ వదిలి దక్షిణం వైపు వెళ్లాలని, ఉగ్రవాదులకు దూరంగా ఉండాలని గాజా పౌరులకు ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఆశ్రయం పొందుతున్న వారికి కూడా హెచ్చరికలు జారీ చేసిందిమరోవైపు ఆహారం, ఇంధనం, నీరు, కరెంట్ నిలిపివేయడంతో గాజాలో పరిస్థితి అధ్వానంగా మారింది. అయితే ఇజ్రాయెల్ ఆదేశాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళ వ్యక్తం చేసింది. పౌరుల తరలి వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులు, విదేశీ బందీల మృతి -
ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో తమ ఆధీనంలో ఉన్న బందీలు మరణించినట్లు హమాస్ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో గాజా స్ట్రిప్ ఉత్తర భాగంలో ఈ దాడులు జరగ్గా వేర్వేరు ప్రాంతాల్లోని మొత్తం 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. హమాస్ గత శనివారం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసి సుమారు 150 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బందీల్లో సాధారణ పౌరులు, విదేశాలకు చెందిన వారూ ఉన్నారు. బందీలను హమాస్ చెర నుంచి తప్పించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు కృషి చేస్తూనే హమాస్ బలగాలను మట్టుబెట్టేందుకూ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గాజా మొత్తంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజా స్ట్రిప్ జనాభా దాదాపు 24 లక్షలు. ఇజ్రాయెల్ బాంబు, క్షిపణి దాడులు విపరీతమైన ఆస్తినష్టాన్ని మిగులుస్తున్నాయి. భవనాలు నేలమట్టం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ గాజాపై జరిపిన దాడుల్లో 1500 మంది మృతి చెందారు. అందులో 500 మంది చిన్నారులే ఉన్నట్లు హమాస్ మీడియా కార్యాలయం ప్రకటించింది. మరోవైపు గాజా పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులకు.. ప్రతిగా బందీలను హతమారుస్తామంటూ హమాస్ ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో.. నీటి, కరెంట్ సరఫరాను నిలిపివేసింది. తాజాగా గాజాను ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని.. అది కల్లోలానికి దారి తీస్తుందని చెబుతోంది. -
ఇక సిరియాపైకి గురి.. మరిన్ని దాడులు తప్పవని హెచ్చరిక
హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని గాజాను విచ్ఛిన్నం చేసిన ఇజ్రాయెల్.. తాజాగా సిరియాపై కూడా గురిపెట్టింది. గురువారం సిరియాలోని డమాస్కస్, అలెప్పో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులపై క్షిపణులతో దాడులు చేసింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని సిరియా యాక్టివేట్ చేసింది. అయితే.. ఈ దాడుల్లో డమాస్కస్ ఎయిర్పోర్ట్ వద్ద నలుగురు, అలెప్పో వద్ద ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. దాడుల వల్ల విమానాశ్రయం దెబ్బతినడంతో రాకపోకలను రద్దు చేసినట్లు సిరియా వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ రెండు విమానాశ్రయాల్లో విమానాలను గ్రౌండింగ్ చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. పొరుగు దేశమైన సిరియాతో కూడా ఇజ్రాయెల్ దశాబ్దాలుగా పోరాడుతోంది. ప్రధానంగా ఇరాన్ మద్దతిస్తున్న హిజ్బుల్లా ఫైటర్స్‌తోపాటు సిరియా ఆర్మీని కూడా టార్గెట్ చేసింది. అయితే ఎప్పుడూ కూడా సిరియాపై దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. కానీ, తాజాగా గురువారం సిరియాపై ఎయిర్‌స్ట్రైక్స్ చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేకాదు.. ఈ దాడులు రాబోయే రోజుల్లో ఉధృతంగా కొనసాగుతాయని పేర్కొంది. Israeli Air Force attacked positions near Damascus airport. The plane, flying from Iran to Syria, was forced to turn around. According to some reports, the Iranian Regime’s Foreign Minister is scheduled to fly to Syria tomorrow.#Israel pic.twitter.com/WrC6g5K4Mw — Pouria Zeraati (@pouriazeraati) October 12, 2023 అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్ సందర్శించారు. అదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. సిరియా బషర్ అల్ హసద్‌తో ఫక్షన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్ మద్దతిస్తున్న హమాస్ ఆధిపత్యం ఉన్న గాజాతోపాటు సిరియాపై కూడా ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేయడం గమనార్హం. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు జరిగి నేటికి ఆరు రోజులు గడిచింది. ప్రతిదాడులతో హోరెత్తిస్తున్న ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌లో 1200 మందికి చంపేసింది. ఇందులో హమాస్ బలగాలతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ తరపున కూడా ప్రాణనష్టం భారీగానే సంభవించింది. ఇరువైపులా ప్రాణ నష్టం 3వేలు దాటినట్లు తెలుస్తోంది. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
గాజాకు ఇజ్రాయెల్ డెడ్లీ వార్నింగ్
గాజాను గుప్పిట పట్టిన ఇజ్రాయెల్ సైన్యం .. అక్కడి ప్రజల విషయంలో అత్యంత కఠిన వైఖరిని అవలంభించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ సమాజం పిలుపు ఇచ్చినా సరే మానవతా దృక్ఫథంతో వ్యవహరించేది లేదని తేల్చేసింది. బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని హమాస్ విడుదల చేసేదాకా.. గాజా పౌరులకు కనీసం మంచి నీళ్లు కూడా అందవని స్పష్టం చేసింది. మంచి నీరు, కరెంట్ కోతతో గాజా ప్రజలు అల్లలాడిపోతున్నారంటూ గాజా క్షేత్రస్థాయి పరిస్థితులపై కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో.. కనికరించి మానవతా సాయానికి ముందుకు రావాలంటూ రెడ్ క్రాస్ ఇజ్రాయెల్‌ను అభ్యర్థించింది. మరికొన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్‌ను ఇదే కోరాయి. అయితే ఈ పిలుపుపై ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘గాజాకు మానవతా సాయమా?.. ఎట్టి పరిస్థితుల్లో అది వీలు పడదు. బంధీలుగా ఉంచిన ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా ఇంటికి చేరేంత వరకు గాజా ప్రజలకు కరెంట్, మంచి నీళ్లు.. మనుషులకే కాదు ఆఖరికి అక్కడి వాహనాలు కదిలేందుకు కావాల్సిన చమురు కూడా అందదు. మాకు ఎవరూ నీతులు బోధించకండి’’ అని స్పష్టం చేశారాయన. శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూప్ మెరుపుదాడి తర్వాత.. గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకుంది. ఆ తర్వాత జరుగుతున్న పరస్పర దాడులతో భాగంగా.. గాజాను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించుకుంది. ఇందుకు కోసం జరిపిన దాడుల్లో 1200 మందిని చంపింది. 5వేల మందిని గాయపర్చింది. ఇక ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పవర్ ప్లాంట్ ఇంధనం కొరత కారణంగా పని చేయడం ఆగిపోయింది. దీంతో ఆస్పత్రులకు సైతం కరెంట్ సరఫరా నిలిచిపోయి.. పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్‌క్రాస్ సానుకూలంగా స్పందించాలంటూ ఇజ్రాయెల్‌ను కోరుతోంది. -
గాజా సరిహద్దుల్లో 1500 హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ సైన్యం–హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణ నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ మెరుపుదాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్.. ప్రస్తుతం వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. తాజాగా గాజా సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ ప్రాంతంలో సుమారు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు కనుగొన్నామని. గాజా సరిహద్దుపై నియంత్రణ పునరుద్ధరించామని సైనిక ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ . వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచి ఎవరూ లోపలికి రాలేదని, కానీ పలుచోట్ల చొరబాట్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. గాజా సరిహద్దు చుట్టూ ఉన్న ప్రజలను సైన్యం దాదాపు తరలించిందని చెప్పారు. అయితే ఈ మరణాలను పాలస్తీనా మిలిటెంట్లు ధృవీకరించలేదు. మరోవైపు గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. తాజా యుద్ధంలో మృతుల సంఖ్య 1,600 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 900 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 68700 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ అ«దీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. చదవండి: ఇజ్రాయెల్ సూపర్ నోవా ఫెస్టివల్‌పై హమాస్ దాడి.. అసలేం వేడుకిది..? హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ధీటుగా ఎదుర్కొంటున్నారు.సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను వెంబడించి మరీ కాల్చి పారేస్తున్నారు. తాజాగా గాజా సరిహద్దు లో ఇద్దరు హమాస్ మిలిటెంట్లను గుర్తించిన ఇజ్రాయెల్ పోలీసులు వారిని వెంబడించి మట్టుపెట్టారు. కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఛేజ్ చేసి గన్‌తో కాల్పులు జరపడంతో మిలిటెంట్లు చనిపోయారు.ఇదంతా బైక్ నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ యూనిఫాంకు అమర్చిన వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ఇజ్రాయెల్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. Police and Border Police officers heroically neutralized two armed terrorists outside of Netivot on Saturday. We will continue working on the front lines to defend our civilians from terror pic.twitter.com/PQk9KiiKoT — Israel Police (@israelpolice) October 9, 2023 -
ఇజ్రాయెల్ కీలక నిర్ణయం.. పూర్తి దిగ్బంధంలో గాజా..
పాలస్తీనా మిలిలెంట్లు హమాస్, ఇజ్రాయెల్ మధ్య మూడు రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ పోరులో ఇప్పటి వరకు 1100 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఇజ్రాయెల్‌లోనే 44 మంది సైనికులతోపాటు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లో చొరబడి దాడులు మొదలు పెట్టింది హమాజ్ అయినా.. ఇజ్రాయెల్ సైన్యం సైతం గాజాపై విరుచుకుపడుతోంది. రాకెట్లు, మిస్సైల్స్‌తో దాడులు జరుపుతోంది. హమాస్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకొంది.హమాస్ అధీనంలో ఉన్న గాజాను సైతం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలో గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గాజాకు వెళ్లే కీలక సరఫరలైన కరెంట్, ఆహారం, ఇంధనంను నిలిపివేసింది. కాగా శనివారం ఉదయం హమాజ్ దాడి మొదలైనప్పటి నుంచి.. ఇజ్రాయెల్ గాజాకు విద్యుత్‌ను కట్ చేయంతో అంధకారాన్ని ఎదుర్కొంటుంది. దీనిపై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవో గల్లాంట్ మాట్లాడుతూ.. గాజాను పూర్తిగా దిగ్భంధించమని ఆదేశించినట్లు తెలిపారు. ఇక అక్కడ విద్యుత్, ఆహారం, నీరు, అందదని తెలిపారు. తాము మానవ మృగాలతో పోరాడుతున్నామని, దానికి తగ్గట్లే తమ పోరాటం ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2007లో పాలస్తీనా బలగాల నుంచి హమాస్ అధికారాన్ని చేజిక్కించుకునన్నప్పటిన ఉంచి గాజాపై ఇజ్రాయెల్, ఈజిప్టు వివిధ స్థాయిలో దిగ్భంధనాలు విధించాయి. గాజా.. అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం. 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తుత యుద్ధంతో వారంతా బిక్కుబిక్కుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. గాజాకు తూర్పు, ఉత్తర భాగాల్లో ఇజ్రాయెల్, దక్షిణాన ఈజిప్టు, పశ్చిమ భాగంలో మధ్యదరా సము ద్రం సరిహద్దులుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరుదేశాలు జల, వాయు, భూ దిగ్బంధాన్ని విధించాయి. దీంతో గాజా వాసులు ఎటువెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎటునుంచి మృత్యువు వస్తుందో తెలియక చావు భయంతో నరకయాతన అనుభవిస్తున్నారు. -
Israel-Hamas: భారత్ వైఖరిపై ఉత్కంఠ
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాజ్ దాడులు.. దానికి ఇజ్రాయెల్ ప్రతిదాడులతో పశ్చిమాసియా నెత్తురోడుతుంది. రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. గాజా స్ట్రిప్ నుంచి దక్షిణ ఇజ్రాయెల్‌లోని నగరాలు, పట్టణాల్లోకి చొరబడ్డ హమాజ్ బలగాలు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర పోరు సాగుతోంది. శనివారం ఉదయం మొదలైన ఈ విధ్వసంలో మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికీ ఇరు దేశాలకు చెందిన సుమారు 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు. ఒక్క ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులు సహా 700 మందికిపైగా ప్రజలు చనిపోయారు.అనేక సంఖ్యలో గాయపడ్డారు. కాగా ఇజ్రాయెల్, హమాజ్ దాడిపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. పలు దేశాలు హమాజ్ చర్యను ఖండిస్తూ ఇజ్రాయెల్‌కు మద్దతు నిలుస్తున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం పాలస్తీనియన్ల హక్కులను హరించడం కారణంగానే ఈ యుద్ధం తలెత్తదిందని ఇజ్రాయెల్‌ను నిందిస్తున్నాయి. ఈ క్రమంలో మిడిల్ ఈస్ట్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ యుద్ధం భారత్‌ను దౌత్యపరంగా క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టివేసింది. ఇజ్రాయెల్‌కు అండగా.. మోదీ ట్వీట్ ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్రమోదీ ఇజ్రాయెల్ యుద్ధంపై శనివారం ట్విటర్ వేదికగా స్పందించారు. ఉగ్రవాద దాడులతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తాము ఇజ్రాయిల్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి ఇప్పటి వరకు తమ వైఖరిని వెల్లడించలేదు. ఏ విధమైన ప్రకటన చేయలేదు. కేవలం ప్రధాని ట్వీట్‌ను కేంద్రమంత్రి ఎస్ జై శకంర్ రీట్వీట్ చేశారు. కానీ ప్రధాని మాత్రం ఇజ్రాయెల్‌కు స్పష్టమైన మద్దతు తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధంపై చైనా స్పందన ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య నెల ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందామని చైనా పేర్కొంది. ఇజ్రయెల్, చైనా మధ్య నిర్ధిష్ట ద్వైపాక్షిక వివాదాలు లేనప్పటికీ పాలస్తీనా భూభాగంలోని వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్ నిర్మాణ కార్యకలాపాలను చైనా వ్యతిరేకించింది. ఇక ఈ హింసాత్మక పరిస్థితులకు ఇజ్రాయెల్ అక్రమ ఆక్రమణలే కారణమని పాకిస్థాన్ ప్రధానమంత్రి హెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. పాలస్లీనియన్ల హక్కులను, అధికారాలను ఇజ్రాయెల్ హరిస్తుంటే ఈ చర్యలు కాకుండా ఇంకేమి ఆశించవచ్చని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్లు భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రకటించిన ఒక నెల లోపే ఇజ్రాయెల్-గాజా యుద్ధం జరుగుతోంది. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్‌కు కౌంటర్‌గా పరిగణిస్తున్న ఈ కనెక్టివిటీ ప్రాజెక్టు వందల ఏళ్ల పాటు ప్రపంచ వాణిజ్యానికిఆధారమని మోదీ పేర్కొన్నారు. హమాజ్ దాడులు.. అమెరికాకు షాక్ అరబ్‌లీగ్‌లో బలమైన దేశాల్లో ఒకటి సౌదీ అరేబియాతో ఇజ్రాయెల్ సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకునేందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న సమయంలో.. హమాస్ దాడి చర్చనీయాంశంగా మారింది. హింసపై సౌదీ అరేబియా స్పందిస్తూ.. దాడులను తక్షణం నిలిపివేయాలని పిలుపునిచ్చింది. అంతేగాక పాలస్తీనియన్ ప్రజల చట్టబద్ధమైన హక్కులను హరించడం ఫలితంగానే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. సౌదీ అరేబియా ప్రకటనతో ఇజ్రాయెల్‌తో సాధారణ సబంధాలు ఏర్పరుచుకునేందుకు సౌదీ అరేబియా సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్, సౌదీ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు తహతహలాడుతున్న అమెరికాకు గట్టి షాక్‌గానే చెప్పవచ్చు. మెరుగైన భారత్ సంబంధాలు కాగా ద్వైపాక్షిక పర్యటనలు, ఎస్పీసీ ఒప్పందంపై సంతకాలు చేయడంతో ప్రధాని మోదీ సారథ్యంలో భారత్ సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. అంతేగాక సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారం మోదీ లభించింది. జోర్డాన్, ఒమన్, యూఏఈ, పాలస్తీనా, ఖతార్ ఈజిప్టులలో ప్రధాని మోదీ పర్యటనలే మిడిల్ ఈస్ట్‌తో భారత్ కీలకంగా వ్యవహరించాలనుకుంటున్న తెలియజేస్తున్నాయి ఇక మిడిల్ ఈస్ట్‌తో కేవలం వాణిజ్యానికే పరిమితమైన భారత్ సంబంధాలు ఇప్పుడు వ్యూహత్మకంగా , రాజకీయంగా కూడా విస్తరించాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్ వైఖరి భారతదేశం 1950లో మాత్రమే ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించింది. మతం విభజన కారణంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారత్ ఇజ్రాయెల్ దేశ ఏర్పాటును వ్యతిరేకించింది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాట్లాడుతూ.. అరబ్ దేశాల్లోని తమ స్నేహితుల మనోభావాలను కించపరచకూడదనే కారణంతో భారత్ ఇజ్రాయెల్‌ను గుర్తించడం మానుకుందని తెలిపారు. యాసర్ అరాఫత్ నేతృత్వంలోని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో)కు మద్దతు ఇవ్వడం ద్వారా చాలా ఏళ్ల పాటు ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలు అంతమాత్రంగానే ఉండేవి. పాలస్తీనా ఉద్యమానికే మద్దతు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు కూడా పాలస్తీనా ఉద్యమానికి మద్దతునిచ్చాయి. అయితే ఈ మద్దతు స్వదేశంలో విమర్శలకు దారితీసింది ప్రత్యేకించి అరబ్ దేశాలు 1962 భారత్-చైనా యుద్ధంలో తటస్థ వైఖరిని అనుసరించి, 1965, 1971లో జరిగిన యుద్ధాల సమయంలో పాకిస్థాన్‌కు మద్దతునిచ్చాయి.రెండు అంశాలు భారతదేశం మిడిల్ ఈస్ట్ వ్యూహంలో భారీ మార్పుకు దారితీశాయి. కువైట్‌పై ఇరాక్ దాడి, సోవియట్ యూనియన్ పతనం, సద్దాం హుస్సేన్‌కు పీఎల్‌వో మద్దతు, ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో అలీనోద్యమాన్ని పలుచన చేయడం వల్ల భారత్ తన విధానాలను మార్చుకోవలసి వచ్చింది. బీజేపీ ప్రభుత్వంలో ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఇక 1992లో ఇజ్రాయెల్‌తో భారత్ పూర్తి దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో సంబంధాలు మరింత బలపడ్డాయి. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ భారతదేశానికి అత్యవసరమై సైనిక సామాగ్రిని అందించడంతో స్నేహితునిగా మారింది. అయితే బహిరంగంగా భారత్ పాలస్తీనా వాదానికి మద్దతునిస్తూనే ఉంది. 2014 నాటికి అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలను కొనసాగిస్తూనే తాము పాలస్తీనా వాదానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. 2018లో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు కూడా భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. వెస్ట్ బ్యాంక్‌ను పాలించే ఫతాకు అబ్బాస్ నాయకత్వం వహించాడు. ఇజ్రాయెల్‌పై దాడి జరిగిన గాజా స్ట్రిప్‌పై హమాస్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు భారత్ స్టాండ్ ఏంటి? ప్రస్తుత హింసాకాండతో భారత్ ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. ఎటువైపు తమ మద్దతు తెలిపే విషయంలో స్పష్టత కరువైంది. ఉక్రెయిన్‌పై దాడి సమయంలోనూ భారత్ తన వైఖరిని వెల్లడించడంలో తటస్టంగా ఉండిపోయింది. అయితే ఇరు దేశాలు చర్చించుకోవాలని, హింస వల్ల ఏం ఒరగదనే విషయాన్ని నొక్కి చెప్పింది. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పశ్చిమ దేశాల నుండి ఆంక్షలను ఎదుర్కొన్నప్పటికీ.. రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేసినందుకు తటస్థంగా ఉందంటూ పలు దేశాలు విమర్శించాయి. అయితే మిడిల్ ఈస్ట్‌తో భారత్‌కు సన్నిహిత సంబంధాలు (వ్యూహాత్మకం, ఆర్థికం, సాంస్కృతికం, వాణిజ్యం) ఉన్నందున, ప్రస్తుత సమస్య చాలా క్లిష్టంగా మారింది. అంతేగాక సౌదీ అరేబియా భారత్‌తో నాల్గవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ భారత్‌కు అతిపెద్ద ఆయుధ భాగస్వామి. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీటెల్ అవీవ్ మధ్య సంబంధాలు బాగా పెరిగాయి. 2017లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు. ఆయన పర్యటన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తరువాతి ఏడాది భారత్ పర్యటనకు సైతం వచ్చాడు. ఈ క్రమంలో ఎవరికి మద్దతుగా నిలవాలనే విషయంలో భారత్ సందిగ్దంలో పడినట్లు తెలుస్తోంది. -
Israeli-Palestinian Conflict: దేశాన్నే వణికిస్తున్న బుల్లి సంస్థ!
హమాస్. అత్యాధునిక నిఘాలో, అంతకుమించిన సైనిక సంపత్తిలో ప్రపంచంలోనే తిరుగులేనిదని పేరున్న ఇజ్రాయెల్‌ను మెరుపు దాడులతో నిలువునా వణికించిన పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్. పక్కా ప్రణాళిక ప్రకారం భూ, జల, వాయుతలాల గుండా దాడులకు దిగి గుక్కతిప్పుకోనివ్వలేదు. ఇంతకీ ఏమిటీ సంస్థ? ఎందుకు ఈ స్థాయిలో దాడులకు దిగింది? ఇంతటి శక్తి సామర్థ్యాలను ఎలా సంతరించుకుంది...? పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న సాయుధ సంస్థ హమాస్. ఇజ్రాయెల్ వినాశనం, ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనే లక్ష్యమని ప్రకటించుకుంది. 2007లో గాజాను చేజిక్కించుకున్న నాటినుంచీ ఇజ్రాయెల్‌తో ఎన్నోసార్లు పోరుకు దిగింది. హమాస్ అంటే హర్కతల్ ముఖవమా అల్ ఇస్లామియా. రాజకీయ పారీ్టగా మొదలై సాయుధ సంస్థగా మారింది. 2000లో రెండో తిరుగుబాటులో భాగంగా ఇజ్రాయెల్‌పై భారీ దాడులకు పాల్పడి వందల మందిని బలి తీసుకుంది. ► శనివారం నాటి దాడి ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన వాటిలో అత్యంత తీవ్రమైనది. ఈజిప్టు, సిరియా ఇలాగే ఇజ్రాయెల్‌పై సరిగ్గా 50 ఏళ్ల కింద, 1973లో మెరుపు దాడికి దిగాయి. అది మధ్యప్రాచ్యంలో తీవ్ర యుద్ధంగా çమారింది. ► 2000లో బందీగా దొరికిన ఒకే ఒక్క ఇజ్రాయెల్ సైనికుడిని అడ్డం పెట్టుకుని వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయించుకుంది. తాజాగా భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులను నిర్బంధించిన ఆ సంస్థ, ఈసారి ఏ స్థాయిలో బేరం పెడుతుందన్నది తేలాల్సి ఉంది! ► ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ యూనియన్ హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాయి. ► ఈ సంస్థకు ఇరాన్ దన్నుగా నిలుస్తోంది. నిధులు, ఆయుధాలతో పాటు సాయుధ శిక్షణ ఇస్తోంది. తుర్కియే, ప్రవాస పాలస్తానీయులు, ప్రైవేటు దాతలతో పాటు పలు ఇస్లామిక్ సంస్థలు సాయం చేస్తుంటాయి. పాలస్తీనా సంగతేంటి? ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణ ఇప్పటిది కాదు. అవి ఆవిర్భవించినప్పటి నుంచీ నిత్య రావణకాష్టంలా రగులుతోంది. వెస్ట్‌బ్యాంక్, గాజాలను కలిపి పాలస్తీనాగా పిలుస్తారు. రోమన్ సామ్రాజ్య కాలంనాటి పాలస్తీనాలో నేటి తూర్పు జెరూసలేం, ఇజ్రాయెల్ కలిసే ఉంటాయి. బైబిల్లో వీటిని యూదు రాజ్యాలుగా పేర్కొన్నారు. యూదులు వీటిని తమ పూర్వీకుల భూభాగంగా పరిగణిస్తారు. ► 1948లో ఇజ్రాయెల్ తనను తాను స్వతంత్రదేశంగా ప్రకటించుకుంది. దీన్ని పాలస్తీనా ముస్లింలు మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ► పాలస్తీనియన్లతో పాటు అరబ్ దేశాలు తమ సైనిక చర్యలో పాల్గొని ఇజ్రాయెల్‌ను తుడిచి పెట్టాలని హమాస్ సైనిక కమాండర్ మొహమ్మద్ దెయిఫ్ శనివారం దాడులు మొదలయ్యాక వీడియో సందేశంలో పిలుపునిచ్చాడు. ► అరబ్బు దేశాల మాట అటుంచితే వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలేం పాలస్తీనియన్లు ఆ పిలుపునకు ఏ మేరకు స్పందిస్తారన్నది చూడాలి. ► పాత జెరూసలేంలోని అల్ అక్సా మసీదుపై నియంత్రణ దాడికి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. క్రైస్తవులతో పాటు ముస్లింలు, యూదులకు ఇది అతి పవిత్ర ప్రాంతం. ఇది ఇజ్రాయెల్ అ«దీనంలో ఉంది. శాంతి ఒప్పందానికి లోబడి అక్కడ ముస్లింల ప్రార్థనలకు అనుమతిస్తూ వస్తోంది. మసీదుకు పహారాగా ఉండే ఇజ్రాయెలీ దళాల దన్నుతో యూదు అతివాదులు అక్కడ హల్చల్ చేస్తుండటం హమాస్ ఆగ్రహానికి మరో కారణం. గాజా స్ట్రిప్ కథ ఇదీ.. ఇజ్రాయెల్, ఈజిప్టు, మధ్యదరా సముద్రం మధ్యన ఉండే కేవలం 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు భూభాగమిది. అక్కడ జనాభా ఏకంగా 23 లక్షలు! ► గాజా గగనతలమే గాక చాలావరకు సముద్ర తీరం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి గాజాలోకి ఆహార పదార్థాలు, నిత్యావసరాల సరఫరాను అనుమతిస్తోంది. అత్యవసర జాతీయ ఐక్య ప్రభుత్వం! దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో రాజకీయ పారీ్టలన్నీ చేతులు కలుపుతున్నాయి. సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. అన్ని పారీ్టల ప్రతినిధులతో కూడిన అత్యవసర జాతీయ ఐక్య ప్రభుత్వ ఏర్పాటుపై సంప్రదింపులు జరుపుతున్నాయి. దీనిపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ, విపక్ష నేతలు యాయిర్ లాపిడ్ బెన్నీ గాంట్జ్ ఇప్పటికే చర్చించుకున్నారు. అత్యవసర ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరేందుకు విపక్ష నాయకులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ కళ్లు గప్పి.. ఇజ్రాయెల్‌కు పకడ్బందీగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ప్రపంచం నలుమూలల ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇజ్రాయెల్ నిఘా వర్గాలకే మొట్టమొదట సమాచారం అందుతుంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇజ్రాయెల్ కళ్లు గప్పి హమాస్ మిలిటెంట్లు ముప్పేట దాడులకు తెగబడడం అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలైన షిన్బెత్, మొసాద్‌ల గురించి ఎప్పుడూ ఆ దేశం గర్వంగా చెప్పుకుంటుంది. గాజా సరిహద్దుల్లో భారీగా భద్రతా సిబ్బంది మోహరించి ఉంటారు. నిరంతరం సీసీ కెమెరాలు పని చేస్తూ ఉంటాయి. ఆర్ట్ థర్మల్ ఇమేజింగ్, మోషన్ సెన్సర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లను దాటుకొని హమాస్ మిలిటెంట్ల దాడులకు దిగారంటే కచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యమేనన్న అభిప్రాయాలున్నాయి. మోటరైజ్డ్ పారా గ్లైడర్ల సాయంతో మోటరైజ్డ్ పారా గ్లైడర్ల సాయంతో సరిహద్దుల్లో కంచెలు దాటిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దిగుతూనే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.సరిహద్దులు దాటడానికి పారా గ్లైడర్లు హమాస్ వినియోగిస్తుందని ఇజ్రాయెల్ ఊహకి కూడా అందలేదు. ుద్యాధర సముద్రం నుంచి చిన్న చిన్న బోట్లలో గాజా మీదుగా ఇజ్రాయెల్‌లోకి అడుగు పెట్టారు. పికప్ ట్రక్కుల్లో భారీ మిషన్ గన్లుతో భూ మార్గంలో చొచ్చుకువచ్చారు. సరిహద్దులు దాటినప్పుడు భారీగా పేలుడు పదార్థాలు వినియోగించారు. కొందరు మిలిటెంట్లు వైర్లను కట్ చేసుకుంటూ కంచెలు అడ్డం తొలగించి లోపలికి వచ్చారు. ఇలా ఏకకాలంలో మూడు మార్గాల ద్వారా దాడులకు దిగడంతో తేరుకొని ఎదురు దాడులకు దిగేలోపుల నష్టం జరిగిపోయింది. హమాస్ మిలిటెంట్లు పకడ్బందీగా దాడులు జరపడానికి పదేళ్ల కిందట నుంచే విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పారాగ్లైడర్ల దాడికి శిక్షణ తీసుకున్న వీడియోలను హమాస్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఐరన్ డోమ్‌ను దాటుకొని మరీ.. ఇజ్రాయెల్ వద్ద శత్రు దుర్భేద్యమైన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఉంది. దూసుకొచ్చే శుత్రుదేశ రాకెట్ల దిశకు తగ్గట్లు ప్రతిగా రాకెట్లను ప్రయోగించి వాటిని ధ్వంసం చేయడంలో ఐరన్‌డోమ్ వ్యవస్థ పేరుగాంచింది. అయితే హమాస్ మిలిటెంట్లు ఆ ఐరన్ డోమ్ వ్యవస్థ తికమకపడేలా లెక్కలుమిక్కిలిగా అంటే 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లను ప్రయోగించారు. ఇన్నాళ్లూ 80% సక్సెస్ రేటుతో పని చేసిన ఐరన్ డోమ్ వ్యవస్థ దీంతో ఒక్కసారిగా చేతులెత్తేసింది. ఈ రాకెట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. దాడుల్లో కనీసం 100 మందికి పైగా మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డట్టు చెబుతున్నారు. సరిహద్దుల ప్రాంతాల్లో పౌరులతో పాటు సైనికులను కూడా మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. వారిని, చేజిక్కించుకున్న ఇజ్రాయెల్ సైనిక వాహనాలను గాజా వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఊహించని దాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్ తేరుకుని హుటాహుటిన సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇరువర్గాల ఎక్కడికక్కడ మధ్య భీకర పోరు సాగుతోంది. కాల్పులు, మోరా్టర్లు, రాకెట్ల మోతతో దేశం దద్దరిల్లుతోంది. తాము ముట్టడిలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘ఇది దాడి కాదు, మాపై పూర్తిస్థాయి యుద్ధమే’’అని పేర్కొన్నారు. దీనికి పాలస్తీనా అతి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘‘ముందుగా చొరబాటుదారులను ఏరేస్తాం. అనంతరం భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరతాం’’అని ప్రకటించారు. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. గత కొన్నేళ్లలో ఆ దేశంపై జరిగిన అతి తీవ్ర దాడి ఇదే. మరోవైపు ఇజ్రాయెల్ ప్రతి దాడిలో గాజాలో ఇప్పటికే 200 మందికి పైగా మరణించినట్టు, 2000 మంది దాకా గాయపడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 14 చోట్లనుంచి చొరబాటు...! ఇజ్రాయెల్‌లోకి కనీసం 7 నుంచి 14 ప్రాంతాల గుండా మిలిటెంట్లు చొచ్చుకొచి్చనట్టు చెబుతున్నారు. తొలుత వివాదాస్పద గాజా స్ట్రిప్ నుంచి తెల్లవారుజామున రాకెట్ల వర్షం కురిపించారు. 20 నిమిషాల్లోనే 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించారు. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు దేశమంతటా వాయుదాడి సైరన్లు మోగాయి. ఆ వెంటనే మిలిటెంట్లు దేశంలోకి చొచ్చుకొచ్చారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దక్షిణాన గాజా–ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కంచెలను పేల్చేసి మోటార్‌సైకిళ్లు, వాహనాల్లో, పారా గ్లైడర్ల ద్వారా కూడా దూసుకొచ్చి దాడులకు దిగారు. ప్రతిగా సైన్యం కూడా గాజాపైకి వేలాది రాకెట్లు ప్రయోగించింది. అల్ హక్సా మసీదుపై ఇజ్రాయెల్ అకృత్యాలకు, గాజాపై ఏళ్ల తరబడి అణచివేతకు ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్టు హమాస్ మిలిటరీ వింగ్ నేత మొహమ్మద్ దెయిఫ్ పేర్కొన్నాడు. దీన్ని ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్’గా అభివరి్ణంచాడు. తూర్పు జెరూసలేం నుంచి ఉత్తర ఇజ్రాయెల్ దాకా ఉన్న పాలస్తీనియన్లంతా యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఈ దాడి నెతన్యాహూ నాయకత్వ సామర్థ్యంపై పలు సందేహాలు లేవనెత్తింది. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, భారీ ఆందోళనలకు ఆయన కారకుడవడం తెలిసిందే. దాడి నేపథ్యంలో సైనిక ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండ: మోదీ ఇజ్రాయెల్‌పై దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి అండగా ఉంటామని ప్రకటించారు. బాధిత పౌరులు, కుటుంబాల క్షేమం కోసం ప్రారి్థస్తున్నానంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడిని అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించగా. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని పలు ఇతర దేశాలు కోరాయి. అక్కడి భారతీయులకు అడ్వైజరీ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయు లు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. అ నవసరంగా ఇళ్ల నుంచి బయటికి రావద్దని పేర్కొంది. ఈ మేరకు అక్కడి భారత ఎంబసీ ఇంగ్లిష్తో పా టు హిందీ, మరాఠా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయె ల్లో 18 వేల మంది దాకా భారతీయులున్నారు. -
దక్షిణ లెబనాన్, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
జెరూసలేం: దక్షిణ లెబనాన్‌తోపాటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లోని హమాస్ ఉగ్రవాద శిబిరాలపై శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులు నిర్వహించింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో యూదులు పాస్ఓవర్ అనే వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గురువారం దక్షిణ లెబనాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ వైపు 30కిపైగా రాకెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌లో ఇద్దరు గాయపడ్డారు. స్వల్పంగా ఆస్తి నష్టం వాటిల్లింది. రాకెట్ల ప్రయోగానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లో పాతుకుపోయిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణులు లెబనాన్‌లో టైర్ సమీపంలోని రషీదియా పాలస్తీనా కాందిశీకుల క్యాంప్ వద్ద నేలను తాకాయని అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఒకరు వెల్లడించారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలీషియాకు ఇరాన్ అండదండలు అందిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యంపై హిజ్బుల్లా మిలీషియా దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే, తాము కేవలం పాలస్తీనా మిలిటెంట్ల శిబిరాలపైనే వైమానిక దాడులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో పాలస్తీనా వాసి ఒకరు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
గాజాకు అండగా మేముంటాం: అమెరికా
జెరూసలేం: ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన గాజాకు అండగా మేముంటాం అని అమెరికా పేర్కొంది. గాజా అభివృద్ధి కోసం అంతర్జాతీయంగా మద్దతు కూడగడతామని అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ ప్రకటించారు. అయితే, ఆ సాయం హమాస్ పాలకుల చేతుల్లోకి వెళ్లకుండా చూస్తామన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య 11 రోజలపాటు జరిగిన యుద్ధంలో దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోగా, అసలే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న గాజా నగరం తీవ్ర విధ్వంసాన్ని చవిచూసింది. శుక్రవారం రెండు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బ్లింకెన్ ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం బ్లింకెన్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రాంతంలో మళ్లీ హింస తలెత్తరాదంటే ముందుగా కొన్ని అంశాలను, సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. ముందుగా గాజా పునర్నిర్మాణం ప్రారంభించి, మానవతా సాయాన్ని అందజేయాలి. ఈ విషయంలో అమెరికా ముందుంటుంది. అంతర్జాతీయ మద్దతును కూడా కూడగడుతుంది. పునర్నిర్మాణ సాయంతో హమాస్ లబ్ధి పొందకుండా చూసుకుంటాం’ అని బ్లింకెన్ తెలిపారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య చర్చలను మళ్లీ ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదని బ్లింకెన్ ఈ సందర్భంగా అన్నారు. జెరూసలేం కాన్సులేట్‌ను తిరిగి తెరుస్తాం జెరూసలేంలోని కాన్సులేట్ కార్యాలయాన్ని మళ్లీ తెరుస్తామని బ్లింకెన్ ప్రకటించారు. పాలస్తీనాతో దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ ఈ కాన్సులేట్ చాలా కాలంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తోంది. అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చిన ట్రంప్ ప్రభుత్వం ఈ కాన్సులేట్ హోదాను తగ్గించడం పాలస్తీనియన్లకు ఆగ్రహం తెప్పించింది. చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు! -
జెరూసలెంలో తిరిగి తెరుచుకున్న మౌంట్ హోలీ టెంపుల్
జెరూసలేం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ ఓపెన్ అయింది. ఇజ్రాయెల్ పోలీసు పర్యవేక్షణలో నేడు 50 మంది యూదు సందర్శకులు టెంపుల్ మౌంట్ ను సందర్శించారు. ఇజ్రాయెల్- గాజాను పాలిస్తున్న హమాస్ సంస్థ మధ్య కాల్పుల విరమణ జరిగిన మూడు రోజుల తర్వాత మొదటి సారిగా వారు టెంపుల్ మౌంట్ దగ్గరికి వెళ్లారు. మొదటి రోజున ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా యాత్ర కొనసాగిందని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సంస్థ మధ్య జరిగిన 11 రోజుల యుద్ధం తర్వాత గాజా స్ట్రిప్‌లో ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడం ప్రారంభమైంది. అంతకుముందు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణను పూర్తిగా పాటించాలని ఇరు ప్రాంతాలకు పిలుపునిచ్చింది. భద్రతా మండలిలోని మొత్తం 15 మంది సభ్యులు శనివారం ఒక ప్రకటనలో ‘హింస కారణంగా ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం ప్రకటించారు. అలాగే, పాలస్తీనా పౌర జనాభాకు, ముఖ్యంగా గాజాలో మానవీయ సహాయం అవసరం అని ఐరాస నొక్కి చెప్పింది. మే 10న గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న హమాస్ మొదటి సారి దాడి చేయడంతో ఇజ్రాయెల్ రక్షణ చర్యలలో భాగంగా దాడులకు దిగింది. ఈ దాడుల్లో గాజాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. ఇజ్రాయెల్ లో ఎక్కువ ప్రాణ ఐరన్ డోమ్ అనే క్షిపణి నిరోదక వ్యవస్థ రక్షించింది. చదవండి: రెండు రాజ్యాల ఏర్పాటే ఏకైక పరిష్కారం: జో బైడెన్ -
Israel: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే
గాజా సిటీ: పదకొండు రోజులుగా గాజా స్ట్రిప్‌పై కొనసాగిస్తున్న వైమానిక దాడులకు ఇజ్రాయెల్ ముగింపు పలుకనుంది. ఏకపక్ష కాల్పుల విరమణకు, వైమానిక దాడుల నిలిపివేతకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలో గురువారం జరిగిన భద్రతా కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. గాజాలో పాలస్తీనియన్లపై దాడుల్లో చిన్నారులు, మహిళలతో సహా సాధారణ పౌరులు మృతి చెందడంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ధోరణిపై విమర్శలు వచ్చాయి. సంయమనం పాటించాలని పలుదేశాలు విజ్ఞప్తి చేశాయి. శాంతిస్థాపన కోసం ఈజిప్టు సహా పలు దేశాలు మధ్యవర్తిత్వం నెరిపాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతుదారైన అమెరికా ఒత్తిడి పెంచింది. దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి కోరారు. తమ లక్ష్యం నెరవేరేదాకా ఆపబోమని భీష్మించిన ఇజ్రాయెల్ చివరకు అమెరికా నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. కాల్పుల విరమణ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. అధికారిక వార్తా ఛానల్ కాన్ మాత్రం ఇది తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయంపై హమాస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా కనీసం 230 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ రాకెట్ల దాడిలో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
గాజాలో బాంబుల మోత
గాజా సిటీ/వాషింగ్టన్: పాలస్తీనా హమాస్ మిలటరీ విభాగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు యథాతథంగా కొనసాగిస్తోంది. బుధవారం ఉదయం గాజా స్ట్రిప్‌పై బాంబు వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులను విరమించాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం లెక్కచేయడం లేదు. హమాస్ రాకెట్ దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెబుతోంది. శత్రువులను బలహీనపర్చడానికి వైమానిక దాడులను ఉధృతం చేస్తామని పేర్కొంటోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో దక్షిణ గాజా టౌన్లో ఒకే కుటుంబానికి చెందిన 40 మంది నివసించే భవనం నేలమట్టమయ్యింది. ఖాన్ యూనిస్, రఫా పట్టణాల్లో 40 సొరంగాలను ధ్వంసం చేయడానికి 52 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 219 మంది పాలస్తీనియన్లు మరణించారు. 58 వేల మంది పాలస్తీనియన్లు తమ నివాసాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇక హమాస్ రాకెట్ దాడుల్లో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. హింసను ఇకనైనా ఆపండి: జో బైడెన్ గత పది రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సాగుతున్న హింసాకాండకు ఇకనైనా స్వస్తి పలకాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు సూచించారు. ఇరువురు నేతలు బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఉద్రిక్తతలకు చరమగీతం పాడాలని బైడెన్ నొక్కిచెప్పారు. ఆ తర్వాత నెతన్యాహు కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదలచేసింది. తన లక్ష్యం నెరవేరేదాకా దాడులు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపింది. ఇజ్రాయెల్ చర్యలపై పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. -
దాడుల్లో 469 మంది చిన్నారులు మృతి
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయిల్ దాడుల వల్ల గాజాలో గత 48 గంటల్లో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారని యూనిసెఫ్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ దాడుల వల్ల ఇప్పటి వరకు మొత్తం 469 మంది మరణించారని చెప్పారు. దాడులతో గాజాలో పరిస్థితి దారుణంగా తయారైందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులే కొనసాగితే స్థానికంగా ఉన్న చిన్నారులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. గాజాలో చిన్నారుల మిగలక పోయినా అశ్చర్యపడవలసిన పని లేనదని అన్నారు. దాడులతో తీవ్ర గాయాలవుతున్నవారి సంఖ్య కూడా అధికంగా ఉందని వివరించారు. -
ఇజ్రాయిల్ వైమానిక దాడి: ఎనిమిది మంది మృతి
గాజా : గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్ నగరంపై శనివారం ఇజ్రాయిల్ వైమానికి దాడి చేసింది. ఆ దాడిలో ఎనిమిది మంది మరణించగా, మరో 10 మంది గాయపడ్డారని ఉన్నతాధికారి వెల్లడించారు. నగరంలోని నివాసంపై మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఖాన్ యూనిస్ నగరంలోని జనావాసాలపై దాడి చేయడంతో ఇళ్లలోని వారంతా చనిపోయారని చెప్పారు. గాజా నగరంపైపై ఇజ్రాయిల్ శుక్రవారం నిర్వహించిన వేర్వేరు దాడుల్లో అయిదుగురు మరణించారని తెలిపారు.