gudivada amarnath
-
Gudivada Amarnath: ఎన్నికలకు ముందు మావోడు.. ఓడిపోయాక పరాయివాడా..?
-
ఓటమిని ఒప్పుకోండి.. గెలిచిన వ్యక్తి కూటమి సభ్యుడా?: అమర్నాథ్
సాక్షి, విశాఖ: ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాట మార్చడానికి కూటమి నేతలకు సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ మంత్రులు, నేతల ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసింది. రఘు వర్మ ఓటమి తరువాత మాకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. కూటమి నేతలకు మాట మార్చడానికి సిగ్గు లేదా?. ప్రభుత్వ పని తీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం నిదర్శనం. విద్యాశాఖకు మంత్రిగా సీఎం కుమారుడు లోకేష్ ఉన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారు. ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదు.ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఫలితాలు నిదర్శనం. రిగ్గింగ్‌కు పాల్పడి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం. కూటమి తరపున మా అభ్యర్థి రఘు వర్మ అని అనేక సార్లు కూటమి నేతలు చెప్పారు. ఎన్నికల్లో ఎప్పుడూ శ్రీనివాసుల నాయుడు తమ అభ్యర్థి అని కూటమి నేతలు ప్రకటించలేదు. శ్రీనివాసుల నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారు. బాబాయి ఏమో.. శ్రీనివాసుల నాయుడు అంటున్నారు.. అబ్బాయి ఏమో.. రఘు వర్మ అంటున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చెప్పిన దాంట్లో ఎవరి మాట నిజం. ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టవద్దు.కూటమి పాలనలో రిషికొండ బీచ్‌కు అన్యాయం జరిగింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల బ్లూప్లాగ్ను బీచ్‌లో నుంచి తొలగించారు. ప్రభుత్వం చేతగాని చర్యలు వలన ఉత్తరాంధ్ర జిల్లాలు నష్టపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది అని చెప్పుకొచ్చారు. -
బడ్జెట్ పై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
-
బడ్జెట్ ప్రసంగం కాదు.. లోకేష్‌ను పొగిడే కార్యక్రమం: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు సర్కార్‌కు హామీలు అమలు చేసే సత్తా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వైఎస్ జగన్‌ను విమర్శించడం.. నారా లోకేష్‌ను పొగడటమే పనిగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేర్చారు. కోవిడ్ సమయంలో కూడా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారు. బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ జపం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచింది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారు.హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ.. అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కేటాయింపుల ద్వారా తమ జీవితాలు మారుతాయని ఆశ పడ్డారు. బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశే మిగిలింది. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తారని ప్రజలు భావించారు. చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల్లో కోత పెట్టారు. తల్లికివందనం పథకానికి రూ.13,113 కోట్లు అవసరమైతే రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆడపిల్లకు వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతికి అసలు నిధులే కేటాయించలేదు. వైఎస్ జగన్ విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. బడ్జెట్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కేటాయించలేదు. నిరుద్యోగులకు ఏడాదికి 7000 కోట్లు ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన మహిళకు 27000 కోట్లు ఇవ్వాలి. హామీలు దసరా, దీపావళికి అమలు చేస్తామన్నారు.. వాయిదా వేశారు. సంక్రాంతికి వస్తామన్నారు, సినిమా వచ్చింది కానీ చంద్రబాబు రాలేదు. తొలి సంతకం డీఎస్సీకి దిక్కుమొక్కు లేదు. షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డుక్కె పరిస్థితి ఏర్పడింది. కూటమి పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఎందుకు కేటాయించలేదు?. సంపద సృష్టి అనేది అమరావతి కోసమేనా?. మెట్రో రైలు, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు. -
ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం
-
ప్రభుత్వ మెడలు వంచి విద్యార్థుల బకాయిలు రాబడతాము..
-
3లక్షల మెజారిటీ ఇస్తే.. 3వందల లారీలతో ...గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
-
కూటమి నేతలకు ప్రజా సంక్షేమం పట్టడం లేదు: మాజీ మంత్రి అమర్నాథ్
-
రీల్స్ చూడటానికి తప్ప... అనితకు గుడివాడ అమర్నాథ్ దిమ్మతిరిగే కౌంటర్
-
పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టమేమీ లేదు: వంగా గీత
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడు అని చెప్పుకొచ్చారు పార్టీ నాయకురాలు వంగా గీతా. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరమని అన్నారు. పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోయినా వారి లోటు తీర్చలేము అంటూ వ్యాఖ్యలు చేశారు.గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వంగా గీతా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరం. పార్టీలో ముఖ్యమైన, కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి. పార్టీ నుండి ఎవరూ వెళ్ళినా.. వారి లోటు తీర్చలేము. పార్టీ నుండి ఎవరూ బయటకు వెళ్ళినా వైఎస్సార్సీపీ కొనసాగుతుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా దృఢమైన నాయకుడు. ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అధికార మార్పిడి జరిగినప్పుడు ఆయా పార్టీల నుండి వ్యక్తులు బయటకు వెళ్ళడం.. మరి కొందరు చేరడం నిరంతర ప్రక్రియ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. పార్టీ అధినేత నడిచే విధానంపై పార్టీ ఉనికి ఉంటుంది. వైఎస్ జగన్‌పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదే విషయమై అంతకుముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని వైఎస్ జగన్ తయారు చేయగలరని సాయిరెడ్డి చెప్పారు. పార్టీ మారే వారిని వద్దని చెబుతాము.. అలాంటి వారిని ఆపలేం కదా?. నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్‌కు తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కోట్లలో ప్రజల సొమ్ము స్వాహా... బాబుపై గుడివాడ సంచలన వ్యాఖ్యలు
-
ప్రచారం కోసమే చంద్రబాబు బృందం దావోస్ టూర్: అమర్నాథ్
-
Amarnath: లోకేష్ భజన కోసం 20 కోటు ఖర్చుపెడతారా?
-
దావోస్ పర్యటన పబ్లిసిటీ తప్పా ఏం ప్రయోజనం లేదు
-
‘చంద్రబాబు దావోస్ పర్యటన.. ఖర్చు ఫుల్.. పెట్టుబడులు నిల్’
సాక్షి, విశాఖపట్నం: దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని.. పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన (Davos Tour)ను ఉపయోగించుకున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని.. లోకేష్ భజనతో దావోస్ ముగిసిందన్నారు.‘‘కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు?. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్ను దెబ్బ తీశారు. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్.. దావోస్‌లో కూడా లోకేష్ భజన చేశారు. జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టు బడులు ఇతర రాష్ట్రాలకు తరలించారు. పెట్టుబడిదారులను వేధింపులకు గురిచేశారు. దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు’’ అంటూ అమర్నాథ్ ధ్వజమెత్తారు.‘‘బల్క్ డ్రగ్ పార్క్ వైఎస్సార్సీపీ హయాంలో వచ్చింది. ప్రధాని శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ గ్రీన్ హబ్ వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చింది. ఒక హామీ ఒక స్కీం కూడా అమలు చేయలేదు. నమ్మే వాళ్ళు ఉంటే బిల్ గేట్స్ చంద్రబాబు కలిసి చదువుకున్నాము అంటాడు. చంద్రబాబు బ్రాండ్ ఇమెజ్ పెంచుకోవడానికి దావొస్ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి కాదు.’’ అంటూ గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: విద్యార్థులను మోసగించిన చంద్రబాబు సర్కార్: లేళ్ల అప్పిరెడ్డి -
వైఎస్ జగన్ చర్యల వల్లే ప్రైవేటీకరణ ఆగింది: అమర్నాథ్
-
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీను నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస రావు, కాగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు YSRCP మద్దతుగా నిలిచింది
-
కష్టం జగన్ ది.. క్రెడిట్ బాబు ది
-
‘ప్రధాని భూమి పూజ చేసే ప్రాజెక్టులన్నీ మేం తెచ్చినవే’
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో భూమి పూజ చేయనున్న రైల్వే జోన్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టులన్నీ వైఎస్సార్సీపీ హయాంలో సాధించినవేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) చెప్పారు. కానీ ‘సొమ్మొకడిది సోకొకడిది...’ అన్న చందంగా ఇవన్నీ తామే తీసుకొచ్చామన్నట్లుగా మంత్రి లోకేశ్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని, ప్లాంట్ అభివృద్ధి కోసం కర్ణాటక తరహాలో రూ.15 వేల కోట్లను కేంద్రం నుంచి తీసుకురావాలని సవాల్ విసిరారు. స్థానిక మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ శాఖపైనా అవగాహన లేకపోయినా.. సకల శాఖల మంత్రిగా, కలెక్షన్ కింగ్‌గా లోకేశ్ ఏడు నెలల్లో మంచి పేరే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదని చెప్పారు. గత వైఎస్సార్సీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని, దీనిపై లోకేశ్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని అమర్నాథ్ ప్రకటించారు. అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుపై విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో నాటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా చర్చించి ఒప్పందం చేసుకునేలా చూశారని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు అన్ని అనుమతులు ఇవ్వడంతోపాటు గత ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భూమి పూజ చేయాలనుకున్నా ప్రధానికి సమయం కుదరలేదని, ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పారు.బల్క్ డ్రగ్ పార్క్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి దాన్ని సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇది కచ్చితంగా నాటి సీఎం వైఎస్ జగన్ ఘనతేనని స్పష్టంచేశా>రు. రైల్వే జోన్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూములే ఇవ్వలేదని లోకేశ్ పచ్చి అబద్ధాలు చెప్పారని, రైల్వేశాఖకు 52 ఎకరాలు కేటాయిస్తూ జీవీఎంసీ కమిషనర్ గత ఏడాది జనవరి రెండో తేదీన ఉత్తర్వులు ఇచ్చారని వివరించారు. రుషికొండపై టూరిజం గెస్ట్‌హౌస్ ఏమైనా మా సొంత నిర్మాణమా? ప్రభుత్వానిదే కదా? ఏ అవసరం కోసమైనా వాడుకోవచ్చు కదా? ఎందుకా పిచ్చి విమర్శలు? అని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
లోకేష్ కు గుడివాడ కౌంటర్
-
టీడీపీ సభ్యత్వ నమోదుపై లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
టీడీపీ సభ్యత్వ నమోదు పెద్ద డ్రామా: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ(TDP) సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath). పట్టాలు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారని అమర్నాథ్ ఆరోపించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్(nara Lokesh) తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ముచ్చర్లలో 1400 మంది ఓటర్లు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ముచ్చర్లలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్దం. లేనిది ఉన్నట్టు సృష్టించి టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తోంది. ముచ్చర్లలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. గ్రామంలో వైఎఎస్సార్సీపీతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు లేవా?.ముచ్చర్ల గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ పదవులను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 1350 ఓట్లకు గాను టీడీపీకి వైఎస్సార్సీపీకి మధ్య ఓట్ల తేడా 150 ఓట్లు మాత్రమే ఉంది. భీమిలీలో వైఎస్సార్సీపీకి బలమైన కేడర్ ఉంది. 100 శాతం సభ్యత్వం జరిగిందని లోకేష్ ముచ్చెర్ల గ్రామానికి ఎలా వస్తారు?. సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెప్పడం మంచి పద్ధతి కాదు. కొన్ని చోట్ల బెదిరించి సభ్యత్వం నమోదు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల వారికి సభ్యత్వం ఇస్తున్నారు. సంక్షేమ పథకాలిస్తాం.. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు.600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు. గత ఏడు నెలల ప్రవచనాలు చెబుతున్న అనితా గురించి టీడీపీ గెజిట్ పేపర్ ఈనాడులో వచ్చింది. టీటీడీ లెటర్ అమ్ముకునే స్థితికి హోం మంత్రి అనిత పేషీ చేరుకుంది. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు టీటీడీ లెటర్ గురించి ఏం చెబుతారు మరి?. టీటీడీ లడ్డు గురించి రాద్ధాంతం చేసిన నేతలు ఏం చేస్తున్నారు?. మంత్రులు నెల వారీగా వసూళ్లు చేస్తున్నారు అని కామెంట్స్ చేశారు. విశాఖలోని ముచ్చర్లలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు’ అని కామెంట్స్ చేశారు. -
ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.. త్వరలో వైఎస్ జగన్ జిల్లాల పర్యటన
-
సూపర్ సిక్స్ అని మోసం చేసి అధికారంలోకి వచ్చారు
-
రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: నమ్మకానికి, మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు.‘‘రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం రూ.20 వేలు ఏమైంది?. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయిలు పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు.ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తామని మొదట్లోనే చెప్పాం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అన్ని జిల్లాల్లో పోరుబాట ఉధృతం చేస్తాం. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఎండగడతాం’’ అని అమర్నాథ్ తెలిపారు.‘‘ఈ ఏడాది వైఎస్ఆర్సీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చూశారు. ప్రజలు నమ్మించి మోసం చేసిన పార్టీ కుటమిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. వైఎస్ జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు. ఐదేళ్లలో 2.75 లక్షల కోట్లు ప్రజల ఖాతాలో వేశారు...భోగాపురం ఎయిర్పోర్ట్, సచివాలయాలు, మెడికల్ కాలేజీలు నిర్మించారు. నాడు-నేడు ద్వారా విద్య వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేశారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మొదటి సంతకం చంద్రబాబు పెట్టారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. సూపర్ సిక్స్ అని చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. మేము చేసిన ప్రజా వ్యతిరేక పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది.ఇదీ చదవండి: అత్యంత ధనిక సీఎం చంద్రబాబు..తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలు లేదు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, ఒక్కొక్క మహిళకు 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు..\ ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. త్వరలో జిల్లాలు వారీగా వైఎస్ జగన్ పర్యటిస్తారు. ఏడు నెలల కాలంలో లక్ష 12 వేల కోట్లు అప్పు చేశారు. గతంలో 400 కోట్లు ఉంటే దేశంలో ధనిక సీఎం వైఎస్ జగన్ అని ప్రచారం చేశారు. సుమారు రూ. 950 కోట్లు చంద్రబాబు సంపాదించారు. దేశంలోనే ధనిక సీఎం గా చంద్రబాబు పేరు సంపాదించారు. చంద్రబాబు ఆస్తుల పక్కన ఒకటో రెండో సున్నాలు మర్చిపోయి ఉంటారు.’’ అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.‘‘రెండు ఎకరాల నుంచి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారు?. చంద్రబాబు ఆస్తులపై ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ఉంగరం వాచ్ ఫోన్ పెట్టుకోలేనంత మాత్రాన ఆస్తులు లేవంటే ప్రజలు నమ్మరు. సంక్షేమ పథకాలు అమలు చేయక చివరికి దేవుడుకి ఆదాయం కూడా పడిపోయింది. బీసీ మంత్రులను కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు. గౌతు శిరీషతో క్షమాపణ చెప్పించారు. ఉత్తరాంధ్ర మంత్రి బొత్స సత్యనారాయణ కు ఎదురు పడితే ఆ మంత్రిని టార్గెట్ చేశారు. ప్రధాని పర్యటన ముందే స్టీల్ ప్లాంట్ పై కూటమి తమ వైఖరిని చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా లేదా అనేది ఎంపీకి తెలియక పోవడం ఆశ్చర్యం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు.. -
బాదుడే బాదుడు ఇదే బాబు విజన్.. అమర్నాథ్ సెటైర్లు
-
అవంతి శ్రీనివాస్ కు గూబ గుయ్యమనేలా కౌంటర్ ఇచ్చిన గుడివాడ
-
సూపర్ సిక్స్ హామీలతో కూటమి డకౌట్
-
సూపర్ సిక్స్ హామీలతో కూటమి డకౌట్.. ప్రభుత్వంపై గుడివాడ కౌంటర్
-
సాక్షి జర్నలిస్టులపై దాడి.. గుడివాడ అమర్నాథ్ కౌంటర్
-
లక్ష కోట్ల డ్రగ్స్.. ఆపరేషన్ గరుడ ఏమైంది.. చంద్రబాబు ఆర్గనైజడ్ క్రైమ్ చేయడంలో దిట్ట..
-
కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్
-
అధికారం కోసం చంద్రబాబు గడ్డి కరుస్తారు
-
‘చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో దిట్ట’
విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా డ్రగ్స్‌తో ఓ కంటైనర్ విశాఖకు వచ్చిందని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేశారని ఈ సందర్బంగా గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. ఆ సమయంలో 25 వేల కేజీల డ్రగ్స్ తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు ప్రచారం చేశారని, విశాఖ బ్రాండ్ ఇమేజ్ను డ్రగ్స్ పేరుతో దెబ్బ తీయడానికే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.‘ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. 25 వేల కేజీల డ్రగ్స్ తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. అధికారం కోసం నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. కంటైనర్‌లో ఎటువంటి డ్రగ్స్ లేవని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్ లేవని చెప్పడానికి 8 నెలల సమయం ఎందుకు పట్టింది.ఆపరేషన్ గరుడ అనే పేరుతో సీబీఐ విచారణ జరిపింది. చంద్రబాబు, ఎల్లో మీడియా వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేశారు. మాకు ఆ కంటైనర్‌కు సంబంధం లేదని మేము మొదటి నుంచి చెపుతూనే వచ్చాము, మేము చెప్పిందే సీబీఐ కూడా చెప్పింది. కంటైనర్ షిప్ పై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ను డ్రగ్స్ పేరుతో దెబ్బ తీయడమే లక్ష్యంగా తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు అర్గనైజడ్ క్రైమ్ చేయడంలో దిట్ట’ అని గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: కుప్పంలో సీజ్ ది థియేటర్ -
చంద్రబాబు విశాఖ పర్యటన పై గుడివాడ అమర్నాథ్ కామెంట్స్
-
ఒప్పందంలో ఈ ముక్క చదుకోలేదా చంద్రబాబు
-
అదానీతో విద్యుత్ ఒప్పందం జరగలేదు: గుడివాడ అమర్నాథ్
-
ఆరు నెలల కాలంలో ఒక్క హామీని నిలబెట్టుకోలేదు: అమర్నాథ్
-
Gudivada Amarnath: దమ్ముంటే నిరూపించండి.. దేనికైనా సిద్ధం
-
‘వైఎస్సార్సీపీ ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లోకేష్ రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని మండిపడ్డారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రైల్వే భవనాల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించిందన్నారు.‘కేకే లైన్‌తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదానీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకీతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆదానీ సంస్థతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ప్రధాని మోదీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్లాంట్‌కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి’ అని తెలిపారు. -
కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్
-
YSRCP అండగా ఉంటుంది: గుడివాడ అమర్నాథ్
-
మేమున్నాం.. మేము చూసుకుంటాం
-
Amarnath: అబద్ధాలతో ప్రజలను చంద్రబాబు తప్పు దారి పట్టించారు
-
‘హామీలు నిలబెట్టుకోలేక.. అప్పులపై చంద్రబాబు తప్పుడు లెక్క’
సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్ధాలు ఆగలేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని.. రాష్ట్రం దివాలా తీసిందంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో 6 లక్షల 40 వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోక చంద్రబాబు అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారు’’ అని దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 3 లక్షల 13 వేల కోట్లు అప్పు ఉంది. కోవిడ్ పరిస్థితిని తట్టుకొని వైఎస్ జగన్ పాలన చేశారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు మోసాలు బయటపడతాయని వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు’’ అని అమర్నాథ్ ఎండగట్టారు.పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం ఆరు నెలలు సమయం తీసుకోలేదు. పథకాలకు కేటాయింపులు సక్రమంగా జరపలేదు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి రూ. 12,500 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించారు. 18 ఏళ్లు దాటిన మహిళలు రాష్ట్రంలో కోటి 50 లక్షలు మంది వరకు ఉన్నారు. వారికి ఏడాదికి 26,000 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించలేదు. నిరుద్యోగ భృతికి ఒక రూపాయి కేటాయించలేదు. చంద్రబాబు హామీలకు ఏడాదికి లక్ష 20 వేల కోట్లు అవసరం. చంద్రబాబు బడ్జెట్లో 30 వేల కోట్లు ఖర్చు చేశారు...సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు తర్వాత మమ్మలను అరెస్టు చేస్తారు. మేము దేనికైనా సిద్ధం. మా తాత పేరు మీద ఉన్న ట్రస్ట్‌కు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి పేపర్లు తేవాలని అడుగుతున్నారు. పోలీసులకు భయపడేది లేదు’’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. -
విశాఖలో సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్.. గుడివాడ అమర్నాథ్ ఫైర్..
-
ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధంగా లేరు..
-
వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు
విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం వైఎస్సార్సీపీ నేతలు సీపీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి. వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొంటాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని డిప్యూటీ సీఎం ఒప్పుకున్నారు. ఎక్కడ పోయినా ప్రజలు ప్రశ్నిస్తున్నారని డిప్యూటీ సీఎం వపన్ చెప్పారు. 6 నెలల్లోనే 50 మందికిపైగా మహిళలపరై అత్యాచారాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం నేరాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది’’ అని తెలిపారు. -
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ అరెస్ట్‌లా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే స్వయంగా ఒప్పుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టుల ద్వారా పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు.సోషల్ మీడియా కోఆర్డినేటర్లను అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుడివాడ అమర్నాథ్ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, దీనిపై పోలీసులు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు.. -
రుషికొండ భవనాలపై బాబు కామెంట్స్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అమర్ నాథ్
-
‘ఒక్క రన్ కూడా తీయలేదు.. ఇంకెప్పుడు సిక్స్ కొడతావ్ బాబూ?’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని.. సూపర్ సిక్స్ హామీల అమలు సంగతి మర్చిపోయారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నిర్మించిన బిల్డింగ్లు వరదలకు గురయ్యాయి. మా హయాంలో అద్భుత భవనాలు నిర్మిస్తే ఓర్చుకోలేకపోతున్నారన్నారు‘‘రాష్ట్రంలో రుషికొండ టూరిజం ప్రాజెక్టు లాంటి నిర్మాణాలు ఎక్కడా లేవు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి అద్భుత భవనాలు లేవు. నిన్న చంద్రబాబు షెడ్యూల్లో కూడా ఏపీ టూరిజం బిల్డింగ్ అని షెడ్యూల్ విడుదల చేశారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా రుషికొండ టూరిజం భవనాలు లాంటివి నిర్మించారా?’’ అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు.‘‘రూ.15 వందల కోట్లు పెట్టి చంద్రబాబు తాత్కాలిక సచివాలయం కట్టారు. వర్షం వస్తే మంత్రుల పేషిల్లోకి వరద నీరు వస్తుంది. తాత్కాలిక సచివాలయం పేరుతో పెద్ద ఎత్తున దోచేశారు. రుషికొండ నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు.. రుషికొండ టూరిజం భవనాలను మేమే ప్రారంభించాం’’ అని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం చంద్రబాబు ప్రకటన చేస్తారని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను పక్కదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు’’ అని అమర్నాథ్ ధ్వజమెత్తారు.‘‘ప్రజలకు రుషికొండ భవనాలు చూపిస్తామని చంద్రబాబు అంటున్నారు. అమరావతి తాత్కాలిక సచివాలయం కూడా చూపిస్తే ఎవరి నిర్మాణాలు గొప్పవో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రభుత్వానికి అమరావతి తప్పితే వేరే ప్రాంతం అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత విశాఖే పెద్ద నగరం. అందుకే విశాఖను రాజధాని చేయాలనుకున్నాం. విశాఖ గ్రోత్ ఇంజెన్గా ఉపయోగపడుతుంది. రాష్ట్రపతి, ప్రధాని వంటి పెద్దలు వచ్చినప్పుడు ఈ భవనాలు ఉపయోగపడతాయి.’’ అని అమర్నాథ్ వివరించారు.ఇదీ చదవండి: సిగ్గేస్తున్నది బాబూ!‘‘స్టేట్ గెస్ట్ హౌస్ కట్టాలని మా ప్రభుత్వం భావిస్తే కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు.. రుషికొండ భవనాలు దేనికి వాడుతారో చెప్పాలి. కేవలం రుషికొండ భవనాలు మాత్రమే కాదు.. ఉద్దానం రీసెర్చ్ సెంటర్, మెడికల్ కాలేజీలు, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ వంటివి కూడా ప్రజలకు చూపించాలి. పోలవరం నిర్మాణం ఎలా జరుగుతుందో చూపించడానికి రూ. 150 కోట్లు వృథా చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇళ్లు, ఫార్మ్ హౌస్ రెన్నోవేషన్ కోసం కోట్లు ఖర్చు చేశారు.’’ అని అమర్నాథ్ మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్ అన్నారు ఒక్క రన్ కూడా తియ్యలేదు.. ఇంకెప్పుడు సిక్స్ కొడతారు. గ్యాస్ ఇచ్చాం అంటున్నారు.. ముందు ప్రజలు డబ్బులు కడితే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. మద్యం ధరలు తగ్గింపు అని బోర్డులు పెట్టారు. నిత్యావసర ధరలు తగ్గించకుండా మద్యం ధరలు తగ్గించారు. తల్లికి వందనం లేదు. నాన్నకు ఫుల్లుగా ఇంధనం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.రుషికొండ భవనాలు ప్రభుత్వానివి.. ఎలా వాడాలో ఆలోచించండి. గుర్ల డయేరియా బాధితులను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు. ఆ కుటుంబాలను ఎందుకు పిలిచి మాట్లాడలేదు. గుంతలు సృష్టించి గుంతలు కప్పుతున్నారు. ఉన్న గుంతలను కప్పాలి. బాగున్న రోడ్లు తవ్వేసి కప్పేస్తున్నారు. లేని గోతులను సృష్టిస్తున్నారు. గుంతలు పూడ్చడానికి ఇంత ప్రచారం దేనికి’’ అంటూ అమర్నాథ్ దుయ్యబట్టారు. -
వైఎస్ షర్మిలపై అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం
-
షర్మిల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: గుడివాడ అమర్నాథ్
సాక్షి,విశాఖపట్నం: షర్మిల చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నంలో శనివారం(అక్టోబర్ 26) అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై ఫైరయ్యారు. ‘మీరు చేసిన ఆరోపణలు ఖండించిన వాళ్లంతా మోచేతి నీళ్లు తాగినట్లు కనిపిస్తే అది మీ అమాయకత్వం. వైఎస్సార్సీపీ నాయకులకు అలాంటి లక్షణాలు లేవు. మేం నిజాలను ప్రజల ముందు పెడుతుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పండి. సొంత అన్నను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ చూస్తు ఊరుకోరు. వైవీ సుబ్బారెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దుకు కుట్రలు చేస్తున్నారు.ఎవరి పతనాన్ని మీరు కోరుకుంటున్నారు. ఎందుకు ఈ స్థాయికి దిగజారారు. కాంగ్రెస్ పెట్టిన కేసులను తట్టుకుని నిలబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన దమ్ము, ధైర్యం, హీరోయిజాన్ని ఇష్టపడే చాలా మంది ఆయనతో నడుస్తున్నారు’అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరదు కళ్యాణి -
టీడీపీ, కూటమి నాయకులకే సంపద సృష్టి: అమర్నాథ్ మండిపాటు
సా క్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టి అని చెప్పారని, అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారని.. కానీ మద్యం పాలసీ, వైన్‌షాప్‌ల కేటాయింపు చూసిన తర్వాత, వాస్తవ పరిస్థితి అందరికీ అర్ధమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలంటించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టికి అర్ధం.. కేవలం తెలుగుదేశం పార్టీతో పాటు, కూటమి నాయకులకు మాత్రమే సంపద సృష్టించడం అన్నట్లుగా తేలిందని ఆయన ధ్వమెత్తారు. ఆ దిశలోనే నిన్న (14వ తేదీ) జరిగిన మద్యం షాప్‌ల కేటాయింపుల్లో అన్ని చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి ప్రజా ప్రతినిధులకు ఎక్కువ షాప్‌లు దక్కాయని గుర్తు చేశారు.‘రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, తెలుగుదేశం నాయకుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మద్యం పాలసీ ఉంది. అందుకు అనుగుణంగానే వైన్‌షాప్‌ల కేటాయింపు కూడా జరిగింది. 2019లో తాము అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్టుషాప్‌లు రద్దు చేశాం. అలాగే 4500 వైన్‌షాప్‌లు ఉంటే, వాటిని 2900కి తగ్గించాం. ఆ విధంగా పేద కుటుంబాలను రక్షించి, వారిని మద్యం బారి నుంచి కాపాడాలని చూశామని చెప్పారు.నాడు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ప్రభుత్వ సేవలు అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇంటింటికీ మద్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని.. రానున్న రోజుల్లో వీధికో బెల్టు షాప్ ఉంటుందని, అలాగే ఇంటికే మద్యం సరఫరా మొదలుపెడతారని విమర్శించారు. కీలకమైన విద్య, వైద్య రంగాలను పూర్తిగా పక్కన పెట్టేసి, వాటికి బదులు మద్యానికి అ«ధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. అందుకే వెంటనే మద్యం పాలసీ రద్దు చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే, ప్రజల పక్షాన పోరాడతామని ప్రకటించారు. మద్యంపై పేదప్రజలు కూడా తప్పకుండా తిరగబడతారని ఆయన అన్నారు. -
ఎవరికో పుట్టిన బిడ్డకు పేర్లు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు
-
స్టీల్‌ప్లాంట్ కార్మికుల జీవితాలతో ఆటలా బాబూ?: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖకు ఉక్కునగరంగా పేరొచ్చిందంటే స్టీల్‌ప్లాంట్ వల్లేనన్నారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అపుతామని సీఎం చంద్రబాబు మాట ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టో మాట నిలబెట్టుకుంటారా అని అడిగితే నాకేమీ అర్థం కాలేదు అని మాట్లాడుతున్నారు. మీకు అర్థం కాకుండా ఎలా మాట ఇచ్చారు’’ అంటూ గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.‘‘స్టీల్ ప్లాంట్ కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారా?. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైంది?. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరా..?. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణ చేయలేదు. ఒక విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మాత్రమే ప్రైవేటీకరణ చేస్తున్నారు. 32 మంది ప్రాణ త్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఇందిర గాంధీ మెడలు వంచి స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నారు. సెయిల్ లో స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేయాలి’’ అని అమర్నాథ్ డిమాండ్ చేశారు.‘‘గడిచిన కొన్ని నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. పండగ పూట పస్తులు ఉండే పరిస్థితి కార్మికులకు ఏర్పడింది. వైఎస్సార్సీపీ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించింది. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాము. కూటమి పాలనలో కార్మికులపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. చంద్రబాబు మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మద్దతు వెనక్కి తీసుకుంటామని చెప్పండి. ఇద్దరు ఎంపీలు ఉన్న కుమార స్వామి తమ రాష్ట్రంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నారు. 16 మంది ఎంపీలు ఉన్న చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారు.’’ అని అమర్నాథ్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: పగ ప్రతీకారాల ‘రెడ్ బుక్’ బదులుగా ప్రేమ, ఆప్యాయతల ‘గుడ్ బుక్’గతంలో దివంగత మహానేత వైఎస్సార్ 4000 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించారని అమర్నాథ్ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు బంగాళాఖాతంలో కలిపేశారు. స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాము. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
చంద్రబాబు చేసిన తప్పుకు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష
-
చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్
-
రుషికొండలో గుడివాడ అమర్నాథ్, వరుదు కల్యాణి ప్రత్యేక పూజలు..
-
బాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు.. గుడివాడ సంచలన వ్యాఖ్యలు
-
CBI విచారణ కోరే దమ్ము చంద్రబాబుకుందా..
-
బాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తిరుమల శ్రీవారిపై రాజకీయం చేసి చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇదే సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.మాజీ మంత్రి అమర్నాథ్ బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘రాజకీయాల కోసం పసుపు చొక్కాలు వేసుకునే టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం కాషాయ చొక్కాలు వేసుకుంటున్నారు. దేవుడితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి. చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ వలన ఎలాంటి ఉపయోగం లేదు.ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. లడ్డూ విషయంపై విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ ఇప్పటికే లేఖ రాశారు. ఈ విషయంపై మోదీకి ఫిర్యాదు చేస్తాం అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి మా పార్టీ దేనికైనా సిద్ధం
-
అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
సాక్షి, విశాఖపట్నం: విజయవాడ వరదల్లో మరణించిన వారివి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నగరాన్ని వరద ముంచెత్తబోతోందని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నా.. ప్రజలను అప్రమత్తం చేయలేదని, కనీసం ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టలేదని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. సోమవారం విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని, అది ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యమని ఆరోపించారు.సీఎం చంద్రబాబుకున్న పబ్లిసిటీ యావతో నలుగురు ఫొటో గ్రాఫర్లను జేసీబీపై ఎక్కించుకుని ప్రచారం చేయించుకుంటున్నారని, ఆయనకు ప్రజల మరణాలతో పనిలేదని, పబ్లిసిటీ ఉంటే చాలు అని మండిపడ్డారు. బుడమేరు వరదపై నీటి పారుదల శాఖ డీఈ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా.. భిన్న ప్రకటనలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నాయన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికే డైవర్షన్ పాలిటిక్స్..గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో శబరి, గోదావరి నదులకు భారీ వరదలు వచ్చినప్పుడు సుమారు 250 ఏజెన్సీ గ్రామాలకు చెందిన 18 వేల కుటుంబాలను 102 పునరావాస కేంద్రాలకు తరలించామని మాజీ మంత్రి గుర్తుచేశారు. కనీస రహదారి లేని చోట్ల లాంచీలు ఏర్పాటు చేసి, అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఒక్క ప్రాణనష్టం కూడా జరక్కుండా చూశామన్నారు. అలాంటిది విజయవాడ నడిబొడ్డున వరదలు వస్తే, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించడం అత్యంత బాధాకరమన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు. ఆ దిశలోనే ప్రతి అంశాన్ని తమ పార్టీకి అన్వయిస్తున్నారని ఆక్షేపించారు. -
వరద సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైంది
-
‘విజయవాడ వరద మరణాలు.. సర్కారీ హత్యలే’
సాక్షి, విశాఖపట్నం: వరద సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తే అంటూ ధ్వజమ్తెతారు. విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమన్నారు.వరదలు వచ్చినప్పుడు ప్రజలను ప్రభుత్వం కాపాడాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విజయవాడ విపత్తు సంభవించింది. చంద్రబాబుకు పబ్లిసిటి మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను రక్షించడంపై లేదు. బుడమేరు కాల్వ నుంచి వరద వస్తుందని తెలిసి కూడా డీఈ హెచ్చరికలను లెక్క చేయలేదు. 20 గంటల ముందు వరద వస్తుందని తెలిసి కూడా తాము స్పందించలేదని మరి కొంతమంది అధికారులు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక వరదలపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదు. చంద్రబాబు అమరావతిలో ఉన్నారు కాబట్టి వరదలు రావనుకున్నారా?’’ అంటూ గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.‘‘మునిగిపోతారని తెల్సి కూడా ప్రజలను వదిలేస్తారా..? విజయవాడ వరద మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే. అల్లూరి జిల్లాలో గతంలో వర్షాలు వస్తే 250 గ్రామాల ప్రజలను సురక్షితంగా రక్షించాము. దీనికి సీఎం చంద్రబాబు, అధికారులు బాధ్యత వహించాలి. పడవలను వైఎస్సార్సీపీ నాయకుల వదిలేశారని బురద జల్లుతున్నారు. ప్రభుత్వం మీదే కదా అధికారంలో ఉంది. విచారణ చేయండి. ప్రచారం కోసం జేసీబీలపై చంద్రబాబు తిరిగారు.’’ అని అమర్నాథ్ ధ్వజమెత్తారు.సంబంధింత వార్త: ఎటు చూసినా ఆక్రందనలే‘‘అనకాపల్లి జిల్లాలో వర్షాలకు పంటలు మునిగిపోయాయి. ఒక్క అధికారి జిల్లాలో కనిపించలేదు. కొవిడ్ సమయంలో ఐదు కోట్ల మంది ప్రాణాలను వైఎస్ జగన్ కాపాడారు. వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన డోర్ డెలివరీ వాహనాలు సహాయక చర్యల్లో ఉపయోగపడ్డాయి. వైఎస్ జగన్ రిటైన్ వాల్ నిర్మించకపోతే మరింత ప్రమాదం జరిగి ఉండేది. 45 మంది మరణాలకు చంద్రబాబు బాధ్యత వహించాలి’’ అని అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు శ్రీ సిటీ పర్యటనపై గుడివాడ సెటైర్లు
-
శ్రీసిటీలో సీఎం చంద్రబాబు హైడ్రామా
సాక్షి, విశాఖపట్నం: శ్రీసిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శ్రీసిటీలో తమ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు కాగా, ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు, ఇప్పటికే పనులు మొదలుపెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు, ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని, చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమే అని స్పష్టం చేశారు. వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం.. అదే ఎప్పటికీ చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహారం అని చురకలంటించారు.విశాఖలో నాడు తమ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లోని ఒప్పందాలన్నీ దాదాపు కార్యరూపం దాల్చాయని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు వాటికే తిరిగి ప్రారంభోత్సవాలు చేస్తూ, ఏకంగా 16 పరిశ్రమలు ఏర్పాటైనట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. వందల కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమల పనులకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని గుర్తు చేసిన ఆయన, ఈరోజు చంద్రబాబు ప్రారంభించిన వాటిలో ఏ ఒక్కటీ ఈ ప్రభుత్వంలో వచ్చినవి కావని స్పష్టం చేశారు.అలాగే తమ ప్రభుత్వ హయాంలో కొన్నింటి శంకుస్థాపనలు చేయగా, మరి కొన్నింటికి భూకేటాయింపులు జరిగాయని, ఇప్పుడు వాటన్నింటినీ సీఎం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని దుయ్యబట్టారు.దాదాపు రెండున్నర ఏళ్లు కోవిడ్ సంక్షోభం ఉన్నా, 2023 మార్చిలో విశాఖలో జీఐఎస్ నిర్వహించి, 386కు పైగా ఒప్పందాలు చేసుకున్నామన్న గుడివాడ అమర్నాథ్, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న డ్రామాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు నాటి ఎంవోయూలకు సాక్ష్యాలని తేల్చి చెప్పారు. శ్రీసిటీలో పలు అంతర్జాతీయ ఉత్పత్తి సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొందరికి వీసా సమస్య వస్తే, కేంద్రంతో మాట్లాడి వీసాలు ఇప్పించామని వివరించారు.అందుకే ఇకనైనా వాస్తవాలను మననం చేసుకుని, తమ ప్రభుత్వంపై నిందలు మానాలని, దుష్ప్రచారాలు విడనాడాలని, ప్రచార ఆర్భాటం వదిలి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని, వేరొకరి క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడం వంటి నిస్సిగ్గు వ్యవహారాలు వదిలిపెట్టాలని సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు చెప్పారు. -
జగన్ తెచ్చిన పరిశ్రమలు.. సిగ్గులేకుండా చంద్రబాబు ఖాతాలో వేసుకుంటున్నాడు
-
బాబు పై గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు
-
బాబు వైస్రాయ్ రాజకీయాలకు.. YSRCP నేతలు లొంగరు
-
చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
-
మేమేంటో రేపు ఢిల్లీలో చూపిస్తాం
-
ABN రిపోర్టర్ కి గుడివాడ అదిరిపోయే కౌంటర్
-
కూటమి అరాచకాలు.. ప్రజలే బుద్ధి చెబుతారు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పచ్చ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాకా.. 31 మంది ప్రాణాలు బలిగొన్నారని, 35 మంది ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులనూ ద్వసం చేస్తున్నారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు నిర్విర్యమయ్యాయని అన్నారు గుడివాడ అమర్నాథ్. వినుకొండ సంఘటన దేశాన్ని కుదిపేసిందని, పార్టీకి చెందిన మైనార్టీ నేత చేతులు నరికి దారుణంగా హత్య చేశారన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ళ దాడి చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాన్ని తగులబెట్టారని తెలిపారు. ఎంపీపై రాళ్ళ దాడి ప్రజా స్వామ్యంలో ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. .‘ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయలేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, హత్యచారాలు, దాడులు, దౌర్జన్యం మీద శ్వేత పత్రం విడుదల చేయాలి. జరిగిన ప్రతి పరిణామానికి ప్రజలు బుద్ధి చెబుతారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని తెలిపారు.ఎర్రమట్టి దిబ్బలు జాతీయ వారసత్వ సంపద. ఎర్రమట్టి దిబ్బలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. నేలను చదును చేసి రోడ్లు వేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 45 రోజులు గడుస్తున్న ఇంకా వైఎస్సార్సీపీ మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎర్రమట్టి దిబ్బలు తవ్వకాలు మీద కోర్టులో కేసు వేస్తాను. గతంలో పవన్ పేదల లేఔట్ వేస్తే నానా రాద్ధాంతం చేశారు. నా మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేసుకోవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయాలని కోరుతున్నాం’. అని పేర్కొన్నారు. -
ఎర్రమట్టి దిబ్బల దోపిడీ.. కూటమి పాలన ఇదంటూ అమర్నాథ్ ఫైర్
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని 29 భౌగోళిక వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బల్ని ‘పచ్చ’ మాఫియా దోచేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే బఫర్ జోన్లోకి చొరబడి మరీ మట్టిని అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎర్ర మట్టి దిబ్బల తవ్వకాలపై స్పందించారు. ఎర్రమట్టి దిబ్బల్లో జరుగుతున్న విధ్వంసం వద్ద సెల్ఫీ తీసుకొని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ఈ క్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు. చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బల వద్ద పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం స్థానిక నాయకుల మద్దతుతో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్ ఏలా ఉండబోతుందో ఇలా చెప్పకనే చెబుతున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు, చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 35 రోజుల్లో విశాఖలోని భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టిదిబ్బల పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇలా చెప్పకనే… pic.twitter.com/27R1dNyr7e— Gudivada Amarnath (@gudivadaamar) July 17, 2024 ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దిబ్బలపై పచ్చ మీడియా ఎన్నో అసత్య ప్రచారాలు చేసింది. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ కలిసి అప్పట్లో నోటికొచ్చిన అబద్ధాల్ని ప్రజలపై రుద్దేశారు. వారసత్వ సంపదకి ముప్పు వాటిల్లుతోందంటూ గగ్గోలు పెట్టేశారు. అంతా నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నా అక్కడేదో ఘోరం జరిగిపోతోందంటూ నానా యాగీ చేసి నిజాలను ‘ఎర్రమట్టి’లో కప్పెట్టేశారు. సీన్ కట్‌చేస్తే.. ఇప్పుడు వారే అధికారం చెలాయిస్తున్నారు. ఇంకేముంది.. నిబంధనల్ని గాలికొదిలేసి మట్టి తవ్వకాలు జరుగుతున్నా.. ఏమో సార్.. మాకు కనబడదు.. అన్నట్లుగా ఉంది ఇప్పుడు వారిద్దరి తీరు. -
డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి గుడివాడ రియాక్షన్
-
మార్కెటింగ్ బాబు
-
చంద్రబాబు అసత్యాలు
-
అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు చెప్పు కుంటున్నారు
-
30 రోజుల పాలన.. 'చంద్ర' మోసం అప్పుడే మొదలైంది
సాక్షి, విశాఖపట్నం: నాలుగు సార్లు సీఎం ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమి చెయ్యకుండా ఇప్పుడు చవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికే పరిమితమై పరిపాలన కొనసాగించారని దుయ్యబట్టారు.భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి కావాల్సిన అనుమతులు అన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడితే ఇప్పుడు వచ్చి చంద్రబాబే అన్ని తానే చేసినట్లు మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఏమి చెయ్యకుండా అన్ని తనే చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకి ఆయనే సాటి.. దేశంలో చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ దేశంలో ఎవరికి వుండవు‘‘ అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.‘‘గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు ఎప్పుడైనా పోర్ట్‌లు, మెడికల్ కాలేజీలు కట్టించారా?. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే ఇప్పుడేమో జగన్ ఏమి చెయ్యలేదని చంద్రబాబు చిత్రీకరించారు. మేము మొదలు పెట్టిన పనులు చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి తల్లికి వందనం 15000 ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడేమో ఒకరికే ఇస్తాం అన్నట్లు జీఓ ఇచ్చారు.. ఇసుక ఫ్రీ అన్నారు, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు... వాలంటీర్లు పరిస్థితి ఏంటో చెప్పాలి అంటూ అమర్నాథ్ డిమాండ్ చేశారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చి 30 రోజులు అయ్యింది. అప్పుడే ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టేశారు.. గడిచిన నెల రోజుల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మీద దాడులు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై కూడా దాడుకు దిగడం చాలా దారుణం‘‘ అంటూ అమర్నాథ్ ధ్వజమెత్తారు.భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు సంబంధించిన భూసేకరణ వైఎస్సార్సీపీ హయాంలో జరిగింది. ఏమీ చేయకపోయన అన్ని నేనే చేశానని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ భూములకు సంబంధించిన కేసులను పరిష్కరించాము. రెండు గ్రామాలకు 80 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చాము. కేంద్ర సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాము.. మేము చేసిన కార్యక్రమాలను వారే చేసినట్లు చెప్పుకుంటున్నారు. ములపేట పోర్ట్ పనులు దాదాపు 45 శాతం పూర్తయ్యాయి‘‘ అని గుడివాడ అమర్నాథ్ వివరించారు.బీపీసీఎల్ అధికారులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పరిశీలనకు వచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యాక బీపీసీఎల్ వచ్చినట్లు చెపుతున్నారు. మార్కెటింగ్ చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు లేరు. ఎన్నికల ముందు చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15000 చొప్పున ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 29లో పిల్లలను బడికి పంపే తల్లికి రూ.15000 వేలు ఇస్తామని చెప్పారు. దీనిపై తల్లుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు దీనిపై ఎందుకు ప్రకటన చేయలేదు.. ఉచిత ఇసుక అని చెప్పి అమ్ముకుంటున్నారు. అప్పుల మీద ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు. టీడీపీ హయాంలో కంటే వైఎస్సార్సీపీ హయాంలో అప్పు తక్కువని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు‘‘ అని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. -
త్వరలో కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు
సాక్షి, విశాఖపట్నం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గురువారం ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, డిప్యూటీ రీజనల్ కో–ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి, నగర మేయర్ హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సమన్వయకర్త కె.కె.రాజు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అమర్నాథ్, వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, ప్రతి వార్డులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను సమీక్షిస్తున్నామని, వచ్చే వారం నుంచి పార్టీ నాయకులు, శ్రేణుల మనోభావాలు తెలుసుకుంటారని చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా, నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తామన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల అయిందని, మరో 4 నెలలు పాలనా విధానాన్ని పరిశీలించి ఆ తర్వాత మాట్లాడతామని చెప్పారు. తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, తిరిగి వారి అభిమానాన్ని సంపాదిస్తామని అన్నారు. ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని, దానికి అనుగుణంగా పార్టీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తల ఆలోచనలు, సమస్యలను తెలుసుకొని, పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి మనోభావాలకు అనుగుణంగానే పని చేస్తామన్నారు. 2019కి ముందు జగన్మోహన్రెడ్డి చెప్పిన ప్రతి అంశాన్ని మళ్లీ అమలు చేస్తామని తెలిపారు. -
ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా దివంగత మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ జయంతి వేడుకల నిర్వహణపై చర్చించారు.అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే వైఎస్ జగన్ సమీక్ష మొదలు పెట్టారని.. నియోజక వర్గ స్థాయిలో నాయకులతో సమావేశాలు పెట్టే ఆలోచన అధిష్టానం చేస్తుందని తెలిపారు. ప్రజల పక్షాన ఎప్పడూ వైఎస్సార్సీపీ నిలబడుతుంది. ప్రజలకు అండగా వైఎస్ జగన్ నిలబడతారు. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగింది.’’ అని అమర్నాథ్ అన్నారు.కార్యకర్తలు, నాయకుల కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళతాము. 99 శాతం హామీలు అమలు చేసిన వైఎస్సార్సీపీకి ప్రజల్లో అభిమానం ఉంటుంది. కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిసిన తర్వాత మా యాక్షన్ ఉంటుంది’’ అని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. -
అంబేడ్కర్ రాజ్యాంగం కాదు.. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం అమలవడం లేదని, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఆయన శనివారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన మరుక్షణం నుంచి ఈరోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి దమనకాండ చూస్తూనే ఉన్నామన్నారు.హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ, తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూలి్చవేయడం కూటమి నేతల విధ్వంసకాండకు పరాకాష్టగా చెప్పారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల వైఎస్సార్సీపీ కార్యాలయాలకు అనుమతులున్నప్పటికీ, జీవీఎంసీ అధికారులతో నోటీసులు జారీ చేయించారన్నారు. వీటిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, తమ పార్టీ దేవాలయాలను రక్షించుకుంటామని అన్నారు. అనుమతులున్నా.. లేవంటూ నోటీసులు విశాఖ, అనకాపల్లి పార్టీ కార్యాలయాలకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనుమతులున్నప్పటికీ, జీవీఎంసీ అనుమతుల్లేవంటూ నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 33 ఏళ్లకు డబ్బు చెల్లించి పార్టీ కార్యాలయానికి స్థలాలు లీజుకు తీసుకున్నామన్నారు. విశాఖ కార్యాలయానికి రూ.15 లక్షలు, అనకాపల్లి కార్యాలయానికి రూ.38 లక్షలు వీఏంఆర్డీఏకి చెల్లించి గతేడాది ఫిబ్రవరి నెలలోనే అనుమతి కోరామన్నారు.గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకొచ్చిన జీవో ప్రకారమే ఏదైనా పార్టీ కార్యాలయాలకు లీజు పద్ధతిలో ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవచ్చనేది ఉందని, దాని ప్రకారమే 33 ఏళ్లకు లీజుకు తీసుకొని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పార్టీ కార్యాలయాలు నిరి్మస్తున్నామని తెలిపారు. గజాల్లో స్థలం ఉంటే జీవిఎంసీ అనుమతి కావాలని, కానీ 2 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలంటే వీఎంఆర్డీఏ అనుమతి తీసుకోవాలన్నారు.దాని ప్రకారమే డబ్బులు చెల్లించి వీఎంఆర్డీఏ అనుమతి కోరామన్నారు. సెప్టెంబర్‌లో మార్టగేజ్ కూడా చేశామని తెలిపారు. ఈ నిర్మాణాలు తమ పరిధిలోకి రావని వీఎంఆర్డీఏ చెప్పి ఉంటే అప్పుడే జీవిఎంసీ అనుమతి కోరేవాళ్లమని అన్నారు. రూల్ ప్రకారం వీఎంఆర్డీఏ ద్వారానే జీవీఎంసీకి కూడా అనుమతికి పంపిస్తారని తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయాన్ని అక్రమ పద్ధతుల్లో నిర్మించారు విశాఖలో టీడీపీ కార్యాలయానికి నిర్మాణం చేపట్టిన 16 ఏళ్ల వరకు అనుమతే తీసుకోలేదని, అనుమతుల్లేకుండా అక్రమ పద్ధతిలో దాన్ని నిర్మించారని చెప్పారు. తాము అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా నిరి్మంచిన టీడీపీ కార్యాలయాలను కూల్చడం క్షణాల్లో పని అని, కానీ తాము ఆ పని చేయలేదని అన్నారు. 2015–19 మధ్య ఏపీలో 10 టీడీపీ కార్యాలయాల కోసం లీజు పద్ధతిలో స్థలం తీసుకుని నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.ఇది బుల్డోజర్ల ప్రభుత్వమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం అక్రమాలతో పాలన సాగిస్తోందని శుక్రవారం తమ పారీ్టకి చెందిన 4వ వార్డు కార్పొరేటర్ కొండబాబు ఇంటిపై రాళ్లతో టీడీపీ మూకలు దాడి చేశాయన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు.ఇది ప్రజాస్వామ్యమేనా? హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ అధికార బలంతో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చేయడం కక్ష సాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూలి్చవేశారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదని, నారా డిస్ట్రక్టివ్ అలయన్స్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివసిస్తున్న కరకట్ట బిల్డింగ్ కూడా అక్రమ నిర్మాణమేనన్నారు. టీడీపీ కార్యాలయాలు చాలావరకు అనుమతుల్లేకుండా నిరి్మంచినవేనని తెలుసుకుని, అప్పుడు తమ పార్టీ ఆఫీస్‌కి నోటీసులిస్తే బెటర్ అని సూచించారు. -
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం.. చేసేదంతా చేస్తూ నీతులా?
-
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం.. చేసేదంతా చేస్తూ నీతులా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టారని.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై శనివారం ఉదయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం?. కోర్టు ప్రొసీడింగ్‌లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. పైగా చేసిందంత చేస్తూ.. అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు’’ అని అన్నారాయన. అధికారంలోకి వచ్చిన పార్టీకి సమయం ఇచ్చిన అవసరం ఉందని, ఆరు నెలలు గడిచాక పరిస్థితుల్ని చూసి ప్రభుత్వం తీరును ఖండిద్దామని పార్టీ అధినేత వైఎస్ జగన్ తమతో చెప్పారని, కానీ, అధికారం చేపట్టి 20 రోజులు పూర్తి కాకముందే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి కార్యాలయల విషయంలో అనుమతులు తీసుకునే తాము రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టామని ఆయన మీడియాకు వివరించారు. పార్టీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమన్న అమర్నాథ్.. కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. అలాగే.. ఏపీ ప్రజలంతా ఈ కక్షపూరిత రాజకీయ చర్యలను గమనించాలని కోరారాయన. -
దాడులు కాదు.. సూపర్ 6 అమలు ఎప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు ఆపి.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3 వేలు వెంటనే ఇవ్వాలన్నారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫర్నిచర్ విలువ చెబితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా, దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మాజీ మంత్రులు కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే సుధా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.కార్యకర్తలకు అండగా ఉంటాం టీడీపీ దాడులకు భయపడేది లేదు. ఎవరిని చంపుతారో చంపుకోమనండి. టీడీపీ దాడుల్లో గాయపడిన ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబం వద్దకు తాను వెళ్తానని, వాళ్లకు అండగా ఉంటానని వైఎస్ జగన్ చెప్పారు. ఎటువంటి రివ్యూ చేయకుండా వైఎస్ జగన్‌కు సెక్యూరిటీ తీసేయడం దారుణం. మమ్మల్ని ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదు. మేం ప్రజల మధ్య ఉంటాం. వారి సమస్యల కోసం పోరాటం చేస్తాం.రుషికొండపై భవనాలు ప్రభుత్వ ఆస్తి. అవి వైఎస్ జగన్‌వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే దానినీ రాద్ధాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే. రుషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాలి్న.. జగన్ నివాసంగా ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్‌లో ఉండాల్సిన అవసరం వైఎస్ జగన్‌కు లేదు. ఎక్కడైనా ఆయన సొంత ఇంటిలోనే ఉంటారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. – కొడాలి నాని, మాజీ మంత్రి టీడీపీ చేసిన మంచి ఒక్కటీ లేదు రుషికొండపై నిరి్మంచిన ప్రభుత్వ భవనాలు విశాఖకే తలమానికంగా ఉంటాయి. దీనిపై ఎల్లో మీడియా, కూటమి పార్టీలు వికృత రాజకీయం చేస్తున్నాయి. రూ.700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిరి్మంచింది టీడీపీ ప్రభుత్వం. రుషికొండలో రూ.400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రభుత్వ స్థలంలో నిరి్మంచిన ప్రభుత్వ భవనాలివి. శిథిలమైన హరిత రిసార్ట్స్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం.విశాఖ నుంచి పరిపాలనకు ఈ భవనాలు అనువైనవని అధికారుల కమిటీ తేలి్చంది. దీంతో సీఎం నివాసం, కార్యాలయానికి అనుకూలంగా కొన్ని మార్పులు చేస్తే అవి సొంత భవనాలంటూ టీడీపీ గగ్గోలు పెడుతోంది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. 2014 – 2019 మధ్య రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటి లేదు. అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రివైఎస్ జగన్ ఊరూరా తిరగమన్నారు వైఎస్ జగన్ మమ్మల్ని ఊరూరా తిరగమన్నారు. కూటమి పార్టీల దాడులు, ఆస్తుల విధ్వంసం సమయంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని సూచించారు. 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన మనం భయపడకూడదంటూ మనో ధైర్యం నింపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలెవరూ మరచిపోలేదు. ప్రతి ఇంట్లో జగన్ చేసిన మంచి కనిపిస్తోంది.ప్రతి ఇంటికీ మేం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య అపజయం సంభవించింది. బాబు మోసాలు ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై కోపం వస్తుంది. అప్పుడు వైఎస్సార్సీపీ పట్ల అభిమానమూ మళ్లీ రెట్టింపు అవుతుంది. మళ్లీ వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీతో గెలుస్తుంది. చంద్రబాబు చేతిలో ప్రతి రోజు మోసపోతున్న ప్రజలకు అండగా ఉంటాం. – వంగా గీత, మాజీ ఎంపీ అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలి. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్ స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిరి్మంచాం. మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు – నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా టీడీపీ నేతలు ఇలానే ప్రజలకు చూపించాలి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిరి్మంచాం.గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా? కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణలోనే నిర్మాణాలు చేపట్టాం. ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా ఉంటుందా? క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా? అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదం. 2029లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం. – ఆర్కే రోజా, మాజీ మంత్రి మా ఓట్లు ఏమయ్యాయి.. అంటున్నారుబద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 99 శాతం పైగా హామీలను అమలు చేయటంతో సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. మా ఓటు మీకే నమ్మా? మీ ఫ్యాన్ గుర్తుకే వేసి తీరుతాం అని ఓటర్లు భరోసా ఇచ్చారు. కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చనలేదా? ఎన్నికల ఫలితాలు చూసి ఓటర్లే ఆశ్చర్యపోతున్నారు.మేం జగన్‌కు వేసిన ఓట్లు ఏమయ్యాయి అని ప్రశి్నస్తున్నారు. అదే మన ప్రభుత్వం ఉండి ఉంటే ఈపాటికే విద్యా దీవెన ఇచ్చేవాళ్లం. రైతు భరోసా, అమ్మ ఒడి, మత్స్యకార భరోసా అన్నీ సమయానికి అందేవి. ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. ఏ పథకం ఏ నెలలో అమలవుతుందో క్యాలెండర్ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వైఎస్ జగన్ నగదు జమ చేసేవారు. ఇప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – దాసరి సుధా, బద్వేలు ఎమ్మెల్యే టీడీపీ కపట నాటకాన్ని ప్రజలు గమనించాలి ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవ్వాళ్టికీ మాకు ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వైఎస్ జగన్ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారు. ఇంత చేసినా ఎక్కడ మోసం జరిగింది అనేదే ప్రశ్న. ఇప్పుడు రుషికొండపై చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిరి్మంచారు.గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి.వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిరి్మంచారు. ప్రెసిడెన్షియల్ సూట్, సూట్ రూమ్, బాంక్వెట్ హాల్‌తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బాంక్వెట్ హాల్‌తో కళింగ బ్లాక్ నిరి్మంచారు. సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్‌తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్‌తో గజపతి బ్లాక్, ప్రైవేట్ సూట్ రూమ్‌లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్ట్రన్ గంగా బ్లాక్‌లని నిరి్మంచారు. ఈ ఏడు బ్లాక్‌లు ప్రభుత్వానివే. అయినప్పటికీ ఈ విష ప్రచారం టీడీపీ సంస్కృతికి నిదర్శనం. దాడులు, ఆస్తుల విధ్వంసం ఆపి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
రుషికొండ బిల్డింగ్ తప్పుడు ప్రచారాలపై గుడివాడ అమర్నాథ్ క్లారిటీ..
-
అచ్చెన్నాయుడు కు గుడివాడ కౌంటర్..
-
జగన్ ను విమర్శించడం కాదు.. వాటిని ఎలా ఉపయోగించాలో ఆలోచించండి..
-
చంద్రబాబు పై గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు..
-
మూడేళ్లుగా దుష్ప్రచారం
కొమ్మాది (విశాఖ): విశాఖపట్నం బీచ్‌రోడ్డులో రుషికొండపై నిర్మించిన భవనాల విషయంలో టీడీపీ నేతలు గడిచిన మూడేళ్లుగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని, దానిని తక్షణమే మానుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎండాడలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రుషికొండపై ప్రభుత్వ అవసరాల కోసం ఆ భవనాలను నిర్మించామన్నారు. అయితే ఆ భవనాలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి సొంతానికి నిర్మించుకున్నారంటూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.రుషికొండపై నిర్మాణాలు సాగనీయకుండా అనేక సార్లు కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ నిర్మాణాలకు ముందే సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేశామని, ఆ కమిటీ ఇచ్చిన సూచనలు మేరకు ముందుకు సాగామని తెలిపారు. విశాఖ నగరానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ వంటి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు వారికి సరైన విడిది సౌకర్యం లేనందువల్లే ఆ భవనాలను నిర్మించామని తెలిపారు.ఈ భవనాలు వీఐపీలు, వీవీఐపీలకు కేటాయించే అవకాశం ఉన్నందున భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు వాటిని బహిర్గతం చేయలేదని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని పట్టించుకోకుండా వీటిని బహిర్గతం చేశారని అన్నారు. అదే విధంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఇక్కడి నుంచే పాలన సాగించాలని వైఎస్ జగన్ భావించారని వివరించారు. రాష్ట్రంలో అధికార మారి్పడి జరిగిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పర్యాటక శాఖకు సంబంధించిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన చేయాలన్నారు. అమరావతి పేరుతో రూ.వేల కోట్లు దుర్వినియోగం గతంలో 2014–19 సమయంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో తాత్కాలిక భవనాల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని అమర్నా«థ్ చెప్పారు. హైదరాబాద్‌లో చంద్రబాబు అత్యంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులను ఓ హోటల్లో ఉంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశి్నంచారు.నిజంగా గంటా శ్రీనివాసరావు ప్రజలకు వాస్తవాలు చూపించాలి అనుకుంటే ఇదే నిర్మాణం ఎదురుగా గీతం ఆక్రమణలు బహిర్గతం చేసి ప్రజలకు చూపించాలన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగమైన భోగాపురం ఎయిర్‌పోర్టు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మూలపేటలో పోర్టు, మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ వంటివి నిర్మించామని వాటినీ ప్రజలకు చూపించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్‌కు ఎలా అంటగడతారు?’
-
రుషికొండ నిర్మాణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
-
ఏపీలో అధికారం చేపట్టబోతున్న కూటమికి అభినందనలు
-
మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది
-
‘ఏపీలో వార్ వన్ సైడే.. YSRCPదే గెలుపు’
విశాఖపట్నం, సాక్షి: పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలనే ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. గురువారం విశాఖలో వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు. గ్రామీణ ఓటర్లు మన పార్టీ వైపే నిలబడ్డారు. అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ తో మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. సంక్షేమం అభివృద్ధికే ప్రజలు ఓటేసి పట్టం కట్టబోతున్నారు.. ..గతంలో ఓటింగ్ పెరిగినప్పుడు కూడా ఉన్న ప్రభుత్వాలే గెలిచిన దాఖలాలు ఉన్నాయి. గతంలో.. మహాకూటమి జత కట్టిన సమయంలో దివంగత మహానేత వైఎస్సార్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా సీఎం జగన్ విజయం సాధిస్తారు. గతంలో కంటే వైఎస్సార్సీపీకి ఎక్కువ సీట్లే వస్తాయి. .. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది. అందుకే వార్ వన్‌సైడ్ కాబోతోంది. ఏకపక్షంగా విజయం సాధించబోతున్నాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు. .. ప్రతిపక్ష పార్టీలు ప్రెస్టేషన్ లో గొడవలకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు తాము చేస్తున్న అల్లర్లకు, హింసకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు. కేంద్రంలో ఏ పార్టీకి, కూటమికి మెజారిటీ రాకూడదు. మన పార్టీల అవసరం వాళ్లకు పడాలి. పనికిమాలిన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమనండి’’ అంటూ అమర్నాథ్ ప్రసంగించారు. -
Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
అనకాపల్లి: మూడు పార్టీలు కలిసినా అనకాపల్లిలో ఎదురీత తప్పలేదు. 15 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణను చాలామంది గుర్తు పట్టడం లేదు. దీనికితోడు ఆనాటి ఆయన సోదరుల ఆగడాలు గుర్తుకు తెచ్చుకొని.. ఆ తలనొప్పి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. 2004లో కొణతాలను గెలిపించి మూడు శాఖల మంత్రిని చేసిన వైఎస్సార్ అభిమానులను పక్కన పెట్టి తన సోదరుల సంపద సృష్టికే పరితపించిన కొణతాల.. 2009 ఎన్నికల్లో పరాజయం పాలై అనకాపల్లిని వదిలి విశాఖకు మకాం మార్చేశారు. తనను నమ్ముకున్న క్యాడర్‌ను గాల్లో వదిలేశారు. ఆనాటి కొణతాల వర్గమంతా వైఎస్సార్సీపీలో చేరి ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తదితర పదవుల్లో ఉన్నారు. 2019లో గుడివాడ అమర్నాథ్ వెంట నడిచిన వీరంతా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ గెలుపునకు కృషి చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రజల్లోకొచ్చిన కొణతాల జనసేన పార్టీలో చేరి, టీడీపీ, బీజేపీ పొత్తుతో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ క్యాడర్ కరువై విలవిల్లాడుతున్నారు. తమ పాత వర్గమంతా కొణతాల గెలుపు కోసం పనిచేయాలని ఆయన సోదరుడు పెదబాబు కోరినప్పటికి ప్రయోజనం లేకపోయింది. దీంతో కనీసం కొణతాలకు వ్యతిరేకంగా చురుగ్గా పనిచేయకుండా గమ్మున కూర్చోవాలని ఆయన తెరవెనుక బెదిరింపులకు దిగుతున్నారట. కొందరు నాయకులకు ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. మీ సంగతి చూస్తానంటూ దురుసుగా మాట్లాడుతున్నారట. మీ బెదిరింపులకు ఎవరు భయపడతారని, మా మీద మీ పెత్తనమేమిటని వారంతా ఎదురుతిరగడంతో చేసేది లేక పెదబాబు మిన్నకుండిపోయారట. కొణతాల రామకృష్ణ మంత్రిగా ఉన్న కాలంలో అనకాపల్లికి చేసిందేమీలేదు. ప్రజలు ఆయన్ను కలిసి సమస్యలు చెప్పుకునే పరిస్ధితి ఏనాడూ లేదు. నియోజకవర్గంలో పాలన, అధికారం మొత్తం ఆయన సోదరులు పెదబాబు, రఘుబాబులదే. వ్యాపారులను బెదిరించి నెలవారీ మామూళ్లతో దోచుకున్నారు. సమస్యలపై వస్తే గంటలపాటు నిల్చోబెట్టేవారు. వారి ఆగడాలతోనే కొణతాల పరాజయం పాలయ్యారని అనకాపల్లిలో అందరూ చెప్పేమాట. తాను గెలిస్తే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తానని, రాజకీయాల్లో వారి పాత్ర లేకుండా చేస్తానని మద్దతిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కొణతాల ఇచ్చిన హామీ పెదబాబు బెదిరింపులతో మూలకు చేరింది. -
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చదివారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మాట్లాడని మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. మోదీ ఆరోపణలు ఖండిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ హయంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడు జరగలేదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబుపై మోదీ తీవ్రమైన విమర్శలు చేశారని అమర్నాథ్ ప్రస్తావించారు. పోలవరాన్ని ఏటీఎం లా చంద్రబాబు మార్చుకున్నారని మోదీ విమర్శించారని గుర్తు చేశారు. బాబే కాదు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల అవసరాల కోసం అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సెంటిమెంట్ ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటారని ఆశించినట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఊసు కూడా మోదీ ప్రస్తావించలేదని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడితే పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించినట్లు తెలిపారు. రాజకీయ అవసరాల కోసం వెళ్తున్న కూటమిని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.‘చంద్రబాబు ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నారు. తనకు అధికారం రాదని తెలిసి నోటికొచ్చినట్లు మాట్లాడుతూన్నారు. రాబోయే రోజుల్లో ఎవరికి ఎవరు మొగుడు అవుతారో చంద్రబాబుకు తెలుస్తుంది. ల్యాండ్ టైపింగ్ యాక్ట్‌ను అసెంబ్లీలో స్వాగతించింది టీడీపీ. రైల్వే జోన్‌కు సంబంధించి ఇప్పటికే భూములను అధికారులు అప్పగించారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడ్డం తగదు’ అని పేర్కొన్నారు.చంద్రబాబు ఫ్రస్టేషన్లో మతి బ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి. బాబు, పవన్ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎన్డీఏ ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. హక్కు దారులకు మేలు చేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు భూములు ఇచ్చేవాడే కాని లాక్కునే వాడు కాదని, అందుకే 31లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు.అమరావతి పేరుతో చంద్రబాబు భూములు లాక్కున్నారు. పేదలు ఎవరూ వీరి తప్పుడు ప్రచారన్ని నమ్మద్దు. పింఛన్లను అడ్డుకొని లబ్ధిదారుల మరణానికి కారణం అయ్యారు. కూటమిలో చేరిన తరువాత బీజేపీ తీరులో మార్పు వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పాలనపై కేంద్రం ఆధీనంలో ఉండే నీతి అయోగ్ ప్రశంసించింది. చంద్రబాబు, పవన్ ఇచ్చిన స్క్రిప్ట్ మోీదీ చదివారు.పోలవరంను ఏటీఏంలా వాడుకున్నారని నాడు మోదీ అన్నారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. బాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో భాగస్వామ్యం ఉందని బీజేపీ ఎందుకు చెప్పలేకపోతుంది.? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది. ప్రధాని మాట్లాడలేదు సరే.. బాబు అయినా తన స్టాండ్ చెప్పాలి’ అని అన్నారు. -
గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం
-
ఉప్పొంగిన ఉత్తరాంధ్ర..
-
సీఎం రమేష్ ‘పువ్వు’ చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తానని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారని పేదవాడికి కనిపించేంది సీఎం జగన్ మాత్రమేనని తెలిపారు. తమకు మంచి చేసిన వైఎస్ జగన్‌కే మళ్లీ ఓటువేసి గెలిపించాలని పేదవాడు అనుకుంటాడని పేర్కొన్నారు. సీఎం రమేష్ ఎంపీ నిధులను అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడో అనకాపల్లి ప్రజలు గమనించాలని అన్నారు. బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకునేందుకు వచ్చాడని విమర్శించారు. రమేష్ ఆధార్ కార్డుపై మైదరాబాద్ అడ్రస్ ఉంటుందని దుయ్యబట్టారు. సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు(అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి) లోకల్ అంటూ పేర్కొన్నారు. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదని అమర్నాథ్ సెటైర్లు వేశారు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమేనని ఎద్దేవా చేశారు. అనకాపల్లిలో రాజకీయ శత్రువులను కలిపిందే తానంటూ కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులను ఉద్ధేశిస్తూ అన్నారు. వాళ్ల ఇంట్లో తన ఫోటో పెట్టుకోవాలని అన్నారు. అలాంటి వారు తనమీద పడి ఏడుస్తున్నారని విమర్శించారు. -
చంద్రబాబు పాలనకు ఇది ట్రైలర్ మాత్రమే: గుడివాడ అమర్నాథ్
-
గాజువాక ఎన్నికల ప్రచారంలో గుడివాడ అమర్నాథ్
-
సినిమా హీరో అవసరం లేదు..
-
నాకు సీటు ఇవ్వరు అని ట్రోల్ చేసిన వాళ్ళకి చెప్తున్నా.. గుడివాడ అమర్నాథ్ అదిరిపోయే కౌంటర్
-
గాజువాకలో నా పోటీ..దొంగలెవరో తేలిపోయింది
-
టీడీపీ-జనసేన, బీజేపీ పోతులకి గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్
-
YSRCP: గాజువాక సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వైఎస్సార్సీపీ 12వ జాబితా విడుదల అయ్యింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ మంగళవారం సాయంత్రం అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట(అసెంబ్లీ) సమన్వయకర్తగా కావటి మనోహర్‌నాయుడు, గాజువాక(అసెంబ్లీ) సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను పార్టీ అధిష్టానం నియమించింది. ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ఎంపిక చేశారు. ఇక కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. బీవీ రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించడంతో కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను నియమించారు. -
‘సీఎం జగన్‌ను ఎదుర్కోలేకే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు’
సాక్షి, విశాఖపట్నం: సీఎం జగన్‌ను ఎదుర్కోలేకే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని.. కేఏ పాల్‌తో తప్ప అన్ని పార్టీలతోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని చూసి ఓటు వేయమని సీఎం జగన్ చెబుతుంటే, మా పొత్తులును చూసి ఓటు వేయమని చంద్రబాబు పవన్ చెప్తున్నారు. ఎన్నికలకు మేము సిద్ధం అంటుంటే, అమిత్ షా ఇంటి ముందు పొత్తుల కోసం మేము సిద్ధమని చంద్రబాబు, పవన్ అంటున్నారు. బీజేపీకి ఓటు వేస్తే జగన్‌కు ఓటు వేసినట్టేనని గతంలో చంద్రబాబు మాట్లాడారు. బీజేపీకి మాకు ఎటువంటి సంబంధం లేదని గతంలోనే చెప్పాం. పొత్తుల పేరుతో చంద్రబాబు ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటారు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీతో పొత్తు పెట్టుకోగల సామర్థ్యం చంద్రబాబుది.. చంద్రబాబు పొత్తులతోనే కూటమి ఓటమి మొదలైంది. పొత్తుల గురించి ఆలోచించాల్సిన సమయం మాకు లేదు. మా పొత్తు ప్రజలతోనే ఉంటుంది’’ మంత్రి అమర్నాథ్ అన్నారు. ఇదీ చదవండి: బాబు కన్నింగ్.. ఏపీ బీజేపీ గగ్గోలు ! -
భారీగా చేయూత సభ
అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలోని పిసినికాడ గ్రామంలో ఈనెల 7న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించే “చేయూత’ సభ భారీ ఎత్తున విజయవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. స్థానిక రింగ్‌రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ పార్టీ నాయకులు, శ్రేణులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సభను ఎన్నికల శంఖారావ సభగా పరిగణించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు భారీ సంఖ్యలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారిలో చాలామందికి అవకాశాలు లభించాయని, మిగిలిన వారికి కూడా పార్టీలో తగిన న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలందరికీ అందాలంటే మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఈ ప్రయత్నానికి పునాది అనకాపల్లిలోనే పడాలని ఆయన అన్నారు. ఇతర పార్టీల నుంచి మన పార్టీలోకి రావడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారని, వారిని స్వాగతించాలన్నారు. ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం సభలు విజయవంతం అవుతున్నాయని, పిసినికాడ సభ గొప్పగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీఐడబ్ల్యూఏ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ మరోసారి సీఎంగా జగన్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, పార్టీ అనకాపల్లి, కశింకోట మండల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్‌కుమార్, పార్టీ వైద్యవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డేడ లక్ష్మీనరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు వాడు పీకే-1 వీడు పీకే -2
-
ప్రశాంత్ కిషోర్ బీహార్ లో చెల్లని రూపాయి: మంత్రి అమర్నాథ్
-
బిహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంత్ కిశోర్ పార్టీ బిహార్‌లో దిక్కుమొక్కూ లేకుండా చిత్తుగా ఓడిపోనున్న తరహాలోనే చంద్రబాబు–పవన్‌కళ్యాణ్ ఓటమికి సిద్ధంగా ఉన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. బిహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని ప్రశాంత్ కిశోర్‌పై విరుచుకుపడ్డారు. డబ్బులు తీసుకుని కన్సల్టెన్సీలో ఒక డైరెక్టర్‌గా ఉండే ప్రశాంత్ కిషోర్ బిహార్‌లో సొంతంగా పార్టీ పెట్టుకున్నాడని, ఇంట గెలవని వాడి మాటలను ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు. ఆదివారం విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ పలుమార్లు రహస్యంగా భేటి అవుతున్నారని, అందులో భాగంగానే రెండు రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో ఇద్దరూ రహస్యంగా కలుసుకున్నట్లు పలు పత్రికల్లో వచ్చిందన్నారు. ‘డీబీటీ, అభివృద్ధి రెండూ చేయలేని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారన్నట్లు ప్రశాంత్‌కిశోర్ చెప్పడానికి కారణం నెలరోజులు క్రితం చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశమే కదా? ఆ తర్వాత రహస్యంగా పలుమార్లు ప్రశాంత్ కిశోర్ చంద్రబాబును కలవడం నిజం కాదా? ఒక పీకే వల్ల కావడంలేదని చంద్రబాబు రెండో పీకేని కూడా తెచ్చుకున్నారు’ అని పేర్కొన్నారు. ఒక స్టేట్మెంట్తో మొత్తం ప్రజల నాడిని మార్చేయొచ్చని, తాను మహా మాంత్రికుడినని అనుకుంటున్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చివరకు తన సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ భిక్షగాడిగా మారాడని ఎద్దేవా చేశారు. పేదలకు మేలు చేస్తూ అవినీతికి తావులేకుండా అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఓట్లు వేయకుంటే చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసేవారికి ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. బాబు, పీకే పన్నాగాలు తిప్పికొడతాం.. చంద్రబాబు, చెల్లని రూపాయి ప్రశాంత్ కిషోర్ కొత్త ఎత్తుగడలకు పన్నాగాలు పన్నుతున్నారని, వాటిని ఎన్నికల్లో తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైఎస్సార్సీపీనే గెలుస్తుందని సామాన్యులు సైతం చెబుతున్నారని గుర్తు చేశారు. సామాన్యులు చెప్పేది నెగ్గుతుందా? లేక చెల్లని రూపాయి ప్రశాంత్ కిశోర్ చెప్పేది నెగ్గుతుందా? అనేది మీరే చూస్తారన్నారు. చంద్రబాబే గెలుస్తాడనుకుంటే మేనిఫెస్టోలో సంక్షేమం గురించి అది చేస్తా.. ఇది చేస్తానంటూ ఎడాపెడా హామీలివ్వాలని ప్రశాంత్ కిశోర్ ఎందుకు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. ఏపీలో అసలు సర్వే టీం లేని ప్రశాంత్ కిశోర్ డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెప్పారని ప్రశ్నించారు. అభివృద్ధి లేకుంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం ఐదేళ్లుగా ఎలా పురోగమిస్తాయని సూటిగా నిలదీశారు. బిహార్‌లో చెల్లనికాసులా మారడంతో ఇక్కడ కొన్ని కాసులైనా ఏరుకుందామనే ఉద్దేశంతో చంద్రబాబుతో డీల్ కుదుర్చుకున్నారని చెప్పారు. ఆ డీల్‌లో భాగంగా చేస్తున్న ప్రకటనలను ఏపీలో ఉన్న 5.30 కోట్ల మంది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ భారీ విజయం సాధించనున్నట్లు లగడపాటి రాజగోపాల్‌తో చంద్రబాబు జోస్యం చెప్పించారని, ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందేనని మంత్రి వ్యాఖ్యానించారు. -
రుషికొండపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: మంత్రి అమర్నాథ్
-
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సభ అట్టర్ ఫ్లోప్: మంత్రి అమర్నాథ్
-
‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’
సాక్షి, విశాఖపట్నం: తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసులకు గోల్డ్ కవరింగ్ ఇస్తూ.. తాము బలంగా ఉన్నామన్న భ్రమలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఎండాడ వైఎస్ఆర్సీపి కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి మేము ఓట్లు అడుగుతామని చెప్పారు. అదే జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తే బలమని భావిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కేవలం 24 సీట్లు మాత్రమే జనసేనకి ఇచ్చి చంద్రబాబునాయుడు చేతులు దులుపుకొన్నారని, జనం కోరితే తాను ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సీట్లతో ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారని, ఆ పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని అమర్నాథ్ ప్రశ్నించారు. కాపులను హింసించిన బాబును ఎలా నమ్ముతారు? గడచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏఏ మేళ్లను చేసిందో ధైర్యంగా చెప్పి మా పార్టీ అభ్యర్థులు ఓటు అడుగుతారని, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు తాను ఫలానాది చేశానని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అమర్నాథ్ విమర్శించారు. జనసేన టిడిపి విడుదల చేసిన జాబితాను పరిశీలిస్తే కాపుల్ని కమ్మలు... కమ్మ కులస్తులను కాపులు నమ్మడం లేదనేది తేలిపోయిందని అమర్నాథ్ అన్నారు. వంగవీటి మోహన్ రంగా నుంచి ముద్రగడ పద్మనాభం వరకు కాపులను హింసించిన వారిని ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. అది ప్యాకేజీ ఇంజినీరింగ్ జనసేన, టిడిపి ఉమ్మడి జాబితాలో సోషల్ ఇంజనీరింగ్ జరిగిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అక్కడ సోషల్ ఇంజనీరింగ్ కన్నా ప్యాకేజీ ఇంజనీరింగ్ కనిపించిందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయాన్ని స్పష్టత ఇవ్వలేదని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మానికి విరుద్ధంగా రెండు సీట్లను ప్రకటిస్తే, పవన్ కళ్యాణ్ అందుకు ప్రతిగా రెండు సీట్లు ప్రకటించారని, అప్పట్లో పవన్ కళ్యాణ్ తీరును అందరు అభినందించారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 94 సీట్లను ప్రకటించినప్పుడు, పవన్ కళ్యాణ్ కేవలం ఐదు సీట్లతోటి ఎందుకు సరిపెట్టుకున్నారని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. సామాజిక న్యాయం ఎక్కడ? తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించిన తొలి జాబితాను పరిశీలిస్తే, ఈ రెండు పార్టీలు సామాజిక న్యాయాన్ని పాటించ లేదన్న విషయం అర్థమవుతోందని అన్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించారో ఈ రెండు పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని, మరోమారు జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. -
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ఆర్కే బీచ్‌లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్‌లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్‌తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్‌షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్‌భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్‌లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్‌భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్‌లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్‌నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
నారా లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్
-
నారా లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ, పర్రిశమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆయన సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పప్పు లోకేష్‌కు పప్పును కానుకగా పంపుతున్నాను. కొంచెం ఉప్పు కారం కూడా వేశాను. సిగ్గు లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. నేను లోకేష్‌లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ ను కాదు. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వలన మంత్రి అయ్యాను. అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించలేదా? 420 గాళ్లను పక్కన పెట్టుకొని 420 గాడిలా లోకేష్ మాట్లాడారు. మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏమీ పికలేకపోయారు. నువ్వేమీ పికుతావు లోకేష్’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. సారాయి, గంజాయి తాగిన వాళ్లు నా గురించి మాట్లాడుతున్నారు. వీరప్పన్ లు, స్మగ్లర్లు లోకేష్ వెంట ఉన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్దం. అయ్యన్న గంజాయి డాన్ అని గంటా ఎప్పుడో చెప్పారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమీ చెప్పారో గుర్తుకు తెచ్చుకో.. గతంలో మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకో. బంధుత్వాలు గురించి మాట్లాడడానికి లోకేష్‌కు సిగ్గు లేదా?’’ అంటూ మంత్రి అమర్నాథ్ నిప్పులు చెరిగారు. లోకేష్, చంద్రబాబు కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశాము. రెడ్ బుక్‌లో మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్‌కు రాదు. ఎర్ర బుక్‌ను మడత పెట్టీ ఎక్కడ పెట్టుకుంటారో లోకేష్ ఇష్టం’’ అంటూ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: దిగజారుడుతనానికి కేరాఫ్ చంద్రబాబే -
లోకేష్ పై గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు
-
చంద్రబాబు లాగా ఆ లక్షణం నాకు లేదు: మంత్రి గుడివాడ అమర్నాథ్
-
సీఎం జగన్ కుర్చీలో నేను కూర్చోలేదు.. ధూళిపాళ్లకు దిమ్మతిరిగే కౌంటర్
-
ఒక్క ఏడాదిలోనే రూ. 2.46 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: పారిశ్రామిక రంగాన్ని సీఎం జగన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండటంతో రిలయన్స్, బిర్లా, టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గతేడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కుదిరిన ఒప్పందాలు వేగంగా వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.4,178 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయెన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్‌కు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులకు బుధవారం వెలగపూడి సచివాలయం నుంచి ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ‘ఏపీ ఎంఎస్ఎంఈ వన్’ వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్, ఆదిత్య బిర్లా, హెల్లా ఇన్ఫ్రా సంస్థలకు సీఎం తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలను అందిస్తుందని పునరుద్ఘాటించారు. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయని, మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జీఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నట్లు వివరించారు. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉందని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన భరోసాతో పెట్టుబడులకు పరిశ్రమలు ముందుకొస్తున్నాయని చెప్పారు. గత మూడేళ్లుగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పుతుండగా ఏపీ పరిధిలో విశాఖ–చెన్నె, చెన్నె–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాదు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.1,000 కోట్లతో నక్కపల్లి, శ్రీకాళహస్తి నోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, ఈ రెండు పారిశ్రామిక పార్కుల ద్వారా సుమారు రూ.60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టి సుదీర్ఘంగా 974 కి.మీ. పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉన్న మన రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలమని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.20 వేల కోట్లతో నాలుగు ప్రధాన పోర్టులను నిర్మిస్తుండగా రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మరో రూ.నాలుగు వేల కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక యువత ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే గత నాలుగేళ్లలో 2.50 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఆరు లక్షల మందికి పైగా ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు 50కిపైగా పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్.రాజేశ్వర్‌రెడ్డితోపాటు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కౌన్సిల్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అమర్నాథ్
-
నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, అమరావతి: 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను చదువుతారు. అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మొత్తం బడ్జెట్ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. -
లోకేష్ కు అమర్నాథ్ ఛాలెంజ్
-
షర్మిల వ్యాఖ్యలకు గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్..
-
రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోంది: YSRCP
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఈనాడులో రాసిన చెత్త రాతలపై వైఎస్సార్సీపీ మంత్రులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలుకుతున్నారు. కేవలం చంద్రబాబు కోసమే ఇలాంటి వార్తలు రాయడమేంటని ప్రశ్నిస్తున్నారు. పలుచోట్ల ఈనాడు పేపర్‌ను చించివేసి, మంటల్లో వేసి దగ్ధం చేస్తున్నారు. పచ్చ మీడియా ఏడుపే.. ఏడుపు.. పచ్చ బ్యాచ్‌కు ఏదీ చాతకాదు.. ఇంకొకరు చేస్తే చూడలేరు. ఇదీ చంద్రబాబుకు మొదటి నుంచీ ఉన్న రోగమే కదా!. సీఎం జగన్ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ లక్షలాది పేద, దళిత, గిరిజన, అణగారిన వర్గాల ఇంటి పండుగ. పచ్చ బ్యాచ్ మీరు ఏడుస్తూనే ఉండండి. మేము ఆ వర్గాలను ప్రగతిపథం వైపు నడిపిస్తూ ముందుకు సాగుతాం: వైఎస్సార్సీపీ ఏడుపే… ఏడుపు 😂 మీకు ఏదీ చేతకాదు... ఇంకొకరు చేస్తే చూడలేరు. ఇది @ncbn కు మొదటి నుంచీ ఉన్న రోగమే కదా కొత్తగా చెప్పేదేముంది. మీకు దళితులు, బడుగులు, పేదలు అంటేనే అసహ్యం. కానీ నేడు సీఎం @ysjagan దళితుల ఆత్మగౌరవాన్ని మహనీయుడు డా. అంబేద్కర్ రూపంలో సమున్నతంగా నిలబెట్టారు. ఇది లక్షలాది… https://t.co/VZcESUbfWI — YSR Congress Party (@YSRCParty) January 19, 2024 గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కుటుంబాలకి సాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్సీ ఉపప్రణాళిక ద్వారా దేశం మొత్తం మీద 53,85,270 కుటుంబాలు లబ్ధి పొందగా.. వారిలో ఒక్క మన రాష్ట్రం నుంచే 51,91,091 కుటుంబాలు సాయం పొందాయి. ఇది సీఎం @ysjagan పాలన దార్శనికతకి నిదర్శనం.… pic.twitter.com/Kcmu3s5j8J — YSR Congress Party (@YSRCParty) January 19, 2024 మంత్రి అమర్నాథ్ సీరియస్ ఈనాడు పత్రికా లేక.. ! చంద్రబాబు టాయిలెట్ పేపరా..? మనందరి ముఖ్యమంత్రి జగన్ గారు విజయవాడ నడిబొడ్డున రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నంగా.. ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ మహా శిల్పం నెలకొల్పారు రామోజీకి పచ్చ కామెర్లు వచ్చాయి అందుకే అంబేడ్కర్ విగ్రహంపైనా విషం చిమ్మటానికి బరితెగించాడు. ఈ వయసులో ఇదేం పాడు పని.. ఇవేం రోత రాతలు రామోజీ ..!? ఈనాడు పత్రికా లేక.. ! చంద్రబాబు టాయిలెట్ పేపరా..!! మనందరి ముఖ్యమంత్రి జగన్ గారు విజయవాడ నడిబొడ్డున రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నంగా.. ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ మహా శిల్పం నెలకొల్పడంతో రామోజీకి పచ్చ కామెర్లు వచ్చాయి. అందుకే అంబేడ్కర్ విగ్రహంపైనా విషం చిమ్మటానికి బరితెగించాడు. ఈ వయసులో… pic.twitter.com/B0chsF9Wfl — Gudivada Amarnath (@gudivadaamar) January 19, 2024 జాలేస్తోంది.. యెల్లో మీడియాకు అంబటి చురకలు బడుగు బాంధవుడి విగ్రహంపైనా పచ్చ మంద ఏడుపులు జగన్‌కు అంబేడ్కర్ విగ్రహం తాకే అర్హత లేదంటూ కథనాలు యెల్లో మీడియాకు వైఎస్సార్సీపీ నేతల కౌంటర్ ఎక్స్ వేదికగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చురకలు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణని చూసి బోరున విలపిస్తున్నారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాని చూస్తే జాలి వేస్తుంది. దుష్ర్పచారం చేస్తున్న ఎల్లో పత్రికలను దహనం చేస్తున్న డా. అంబేద్కర్ అభిమానులు ! pic.twitter.com/ukd0gT7Yha — Ambati Rambabu (@AmbatiRambabu) January 19, 2024 డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణని చూసి బోరున విలపిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాని చూస్తే జాలి వేస్తుంది!@JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) January 19, 2024 పిచ్చి రాతలు రాస్తే చెప్పుతో కొడతారు: కొడాలి నాని అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా గుడివాడలో సంబరాలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, వేడుకల ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్.. ప్రపంచంలో అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు కావడం సంతోషకరం అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు జనవరి 19వ తేదీ క్యాలెండర్లో అంబేద్కర్ డేగా చరిత్రలో నిలిచిపోతుంది ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషకరం రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వ్యతిరేకంగా రామోజీ, రాధాకృష్ణ కుట్రలు చేస్తున్నారు పిచ్చి రాతలు రాస్తున్న వారిద్దరూ రోడ్లపైకి వస్తే యువత చెప్పులతో కొడతారు. రామోజీ.. వయసుకు తగినట్టు నడుచుకో: మంత్రి పెద్దిరెడ్డి రామోజీరావుకు ఏం అర్హత ఉందని సీఎం జగన్ గురించి రాశారు. రామోజీరావు అగ్రవర్ణాల అహంకారి. వయసుకు తగ్గట్టుగా రామోజీ నడుచుకుంటే మంచింది. నేను 2009లో ఫారెస్ట్ మంత్రిగా పనిచేశాను. ఎర్రచందనం అక్రమ తరలింపు కట్టడికి నేనే మొదటగా చర్యలు తీసుకున్నాను. ఎవరి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. చంద్రబాబు తన పక్కన తెచ్చిపెట్టుకున్న కిషోర్ కుమార్ రెడ్డి ఎవరు?. 2009లో మహేశ్వర్ నాయుడు, రెడ్డి నారాయణలపై టాడా కేసులు పెట్టాం. ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వారి పేర్లతో రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. ఎన్నికల కోసమే రామోజీ తాపత్రయం. సీఎం జగన్‌ను మీరు ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం. గతంలో కంటే ఎక్కువ సీట్లను వైఎస్సార్సీపీ సాధిస్తుంది. చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా? సమాధానం చెప్పాలి. మేం తీసేసినోళ్లను, పనికిరానోళ్లను చంద్రబాబు తన దగ్గర చేర్చుకుంటున్నాడు. ముఖ్యమంత్రి జగన్ వద్ద క్వాలిటీ లీడర్ షిప్ ఉంది. చంద్రబాబు ఏ రకంగానూ మాకు ధీటుగా లేడు. -
సీటు కన్ఫర్మ్ పై మంత్రి గుడివాడ క్లారిటీ
-
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల..!
-
అమాయక చక్రవర్తి కాదు
మహారాణిపేట (విశాఖ): చంద్రబాబు ‘స్కిల్’ దొంగేనని, ఆయన అమాయక చక్రవర్తి అని ఏ కోర్టూ సర్టిఫికెట్ ఇవ్వలేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. చంద్రబాబు అన్ని కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చింన తీర్పు ఒకటైతే.. ఎల్లో మీడియా మరో రకంగా ప్రచారం చేస్తోందని అన్నారు. కొన్ని చానళ్లు బాబు గొప్ప విజయం సాధించారని, ఆయనకు ఏదో ఊరట కలిగిందని, ఆయన సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింనట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. 2019లో చంద్రబాబుకు వచ్చిన 23 సీట్లను గొప్ప విజయంగా చూపిస్తే ఏ రకంగా ఉంటుందో.. నేడూ అదే విధంగా కనిపిస్తోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పులో చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్ కలగలేదన్నారు. వాస్తవానికి ముందుగా గమనించాల్సింది సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా లేదా అనేది ఒక ప్రొసీజరల్ సెక్షన్ మాత్రమే అని అన్నారు. 2018లో అమల్లోకి వచ్చింన ఈ సెక్షన్ ఈ కేసుకు వర్తించదని, స్కిల్ స్కాం 2015 ప్రాంతంలోనే జరిగిందని చెప్పారు. చంద్రబాబు, పార్టీ నాయకులు తప్పు చేయలేదని వారి లాయర్లు కూడా ఎక్కడా అనడంలేదన్నారు. రూ. 370 కోట్ల ప్రజాధనాన్ని దోచుకోలేదని ఎక్కడా వారి వాదనల్లో చెప్పలేదని గుర్తు చేశారు. గవర్నర్ అనుమతి లేదనో, స్పీకర్‌కు చెప్పలేదనో 17 ఏని చూపించి క్వాష్ చేయాలని కోరారని తెలిపారు. రిమాండ్ ప్రక్రియలో లోపం లేదని ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయాన్ని చెప్పారని, 17 ఏ వర్తించే విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని చెప్పారు. రిమాండ్ అంతా పద్ధతి ప్రకారమే జరిగిందని ఇద్దరు జడ్జిలూ చెప్పారన్నారు. గతంలోనూ ఇదే ధోరణి చంద్రబాబు గతంలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినప్పుడు కూడా ఇదే రకమైన వాదనలు చేశారని, సెక్షన్ 8 అమల్లో ఉందని, మీకూ పోలీసులున్నారని.. మాకూ ఉన్నారని.. మీకూ ఏసీబీ ఉందని.. మాకూ ఉంది అంటూ చంద్రబాబు మాట్లాడారని మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి వితండ వాదం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. గతంలో కేసులకు సెక్షన్ 17ఏ వర్తించదని దాదాపు ఆరు కోర్టులు చెప్పాయన్నారు. అంత క్లియర్‌గా ఉందని అన్నారు. ఈ రోజు వచ్చింన తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు న్యాయస్థానంలో బోనులో, విచారణ సంస్థల ముందు దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సిందేనన్నారు. బాబు 52 రోజులు జైలు శిక్ష అనుభవించి, ఆరోగ్య కారణాలు చెప్పి బెయిల్‌పై ఉన్న ఒక దొంగే తప్ప నిజాయితీపరుడు, అమాయక చక్రవర్తి అని న్యాయస్థానాలు చెప్పలేదని మంత్రి అన్నారు. లేని పార్టీకి ఎవరు అధ్యక్షులయితే మాకేంటి? ఈ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 0.4 శాతమేనని, నోటా కంటే తక్కువని అన్నారు. అటువంటి పార్టీ గురించి చర్చించుకోవడం అనవసరమన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు చాలా మందికి తోబుట్టువులు ఉంటారని, వారంతా ప్రధానులు, రాష్ట్రపతులు కాలేరు కదా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కి సీట్లు కాదు కదా ఓట్లేసే వారూ లేరన్నారు. ఈ రాష్ట్రానికి వారు చేసిన అన్యాయమే అందుకు కారణమన్నారు. కలిసి నిర్మించుకున్న ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి, రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితో నరికిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఉండకూడదని ప్రజలు అనుకున్నారని, అలానే లేకుండా చేశారని మంత్రి అన్నారు. -
సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా కేసు కొట్టేసినట్టు న్యూస్ వేస్తున్నారు
-
Makar Sankranti 2024 Festival Celebration: విశాఖపట్నంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
పార్టీ మారిన వారికి మంత్రి అమర్నాథ్ దిమ్మతిరిగే కౌంటర్
-
వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు కి లేదు
-
మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను: గుడివాడ అమర్ నాథ్
-
సత్యనారాయణపురంలో పూర్తయిన 2,744 టిడ్కో గృహాలు
-
కైలాసగిరికి మరో మకుటం
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నంలోని కైలాసగిరిని రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో అడుగు పడింది. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న కైలాసగిరి.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా మరిన్ని హంగులు సంతరించుకుంటోంది. తాజాగా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం పురుడుపోసుకుంటోంది. కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సుమారు ఎకరా విస్తీర్ణంలో రూ.4.69 కోట్లతో ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాయి. 3డీ ఆర్ట్ గ్యాలరీ, సిలికా విగ్రహాలు, సైన్స్ వర్కింగ్ మోడల్ ప్రదర్శనలు, శాస్త్రీయ థీమ్‌లు తదితరాలతో.. ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ మ్యూజియం నిర్మాణానికి ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాసగిరిని ముఖ్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఇక్కడ పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో పలు అభివృద్ధి పనులకు ఇక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మ్యూజియం గ్రాంట్æస్కీం కింద సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్సీఏపీ) ఆధ్వర్యంలో అధునాతనమైన సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.4.69 కోట్లతో ఏర్పాటు చేస్తున్న దీనికి.. రూ.3.75 కోట్లను ఎస్సీఏపీకి కేంద్ర సాంస్కృతికశాఖ కేటాయించగా మిగిలిన సుమారు రూ.కోటిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పనుల్ని ఏడాదిలో పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన చెప్పారు. జీవీఎంసీ కార్పొరేటర్ స్వాతి, ఎస్సీఏపీ సీఈవో డాక్టర్ కె.జయరామిరెడ్డి, వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, కార్యదర్శి బి.కీర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో భారీ షిప్పులతో జల రవాణా, కార్గో రవాణా
-
ప్రశాంత్ కిషోర్ ఒక ఈవెంట్ మేనేజర్: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంత్ కిషోర్ ఒక ఈవెంట్ మేనేజర్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 మంది ఎమ్మెల్యేల కంటే 5 కోట్ల మంది ప్రజల సంక్షేమమే సీఎం జగన్‌కు ముఖ్యం. నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. బీఫామ్ ఇచేవరకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరేనేది నిర్థారణ కాదు. అవసరం అనుకుంటే ఎవరినైనా మార్చవచ్చు. సీటు ఇవ్వలేదని ఇంట్లో కూర్చోం.. పార్టీ జెండా మోస్తాం’’అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పార్టీ మారుతున్నారన్న విషయం నాకు తెలియదు. పార్టీ మారితే స్వయం కృపారాధమే. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయంటారు అది ఆ ఎమ్మెల్సీ విషయంలో నిజమవుతుంది’’ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఈయనేందబ్బా జనాన్ని ఉద్దరించబోయేది? -
అనకాపల్లిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించిన మంత్రి అమర్నాథ్
-
చంద్రబాబు, పవన్ ఎన్నిసార్లు కలిసినా ప్రజలు వారిని నమ్మరు: అమరనాథ్
-
పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి: మంత్రి గుడివాడ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. టీడీపీ, జనసేన విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని. నాదెండ్ల మనోహర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి. కొన్ని కంపెనీలకే భూములు కేటాయిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అంటూ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ఇదీ చదవండి: రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్ -
మంత్రి గుడివాడ అమర్నాథ్ తిరుమల ఆలయాన్ని సందర్శించారు
-
సాగరతీరంలో సాహస విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతంగా కనిపించే విశాఖ సాగరతీరం ఆదివారం సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బాంబుల వర్షం.. యుద్ధ విమానాల చక్కర్లు, శత్రుమూకల దాడులు.. యుద్ధ ట్యాంకర్ల వీర విహారంతో.. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. శత్రుదేశం పాక్‌పై విజయానికి ప్రతీకగా ఏటా విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ఆదివారం నేవీడే విన్యాసాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ముందుగా నేవీ బ్యాండ్, నేవల్ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలతో ప్రారంభమైన విన్యాసాలు.. మార్కోస్ రాకతో వేడెక్కాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, వైమానిక దళాల అద్భుత ప్రదర్శనలు, యుద్ధ, నిఘా విమానాలు, హెలికాప్టర్ల ద్వారా నిర్వహించబడే వ్యూహాత్మక విన్యాసాలతో కూడిన ఫ్లాగ్షిప్ ఈవెంట్ అద్భుతంగా సాగింది. చివరిగా.. యుద్ధ నౌకలు విద్యుత్ దీపాలంకరణతో నేవీడే విన్యాసాల్ని ముగించాయి. విన్యాసాలకు విశిష్ట అతిథులుగా మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, ఎంపీ డా.సత్యవతి, కలెక్టర్ డా.మల్లికార్జున, సీపీ రవిశంకర్, జేసీ విశ్వనాథన్ హాజరయ్యారు. అనంతరం.. నేవీ హౌస్‌లో తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ‘ఎట్ హోమ్’ ఫంక్షన్ పేరుతో నిర్వహించిన తేనీటి విందులో గవర్నర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత నౌకాదళ పటిమని చాటిచెప్పే వీడియోను గవర్నర్ ఆవిష్కరించి తిలకించారు. -
పవన్ కళ్యాణ్ నీ అత్తారింటికి దారేది..మంత్రి గుడివాడ సెటైర్లు
-
విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ
సాక్షి, విశాఖపట్నం : ఐటీ రంగంలో దూసుకుపోతున్న విశాఖ నగరంలో మరో దిగ్గజ సంస్థ కొలువుదీరనుంది. అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్‌రైజ్ పేరుతో విశాఖలో ఐటీ అనుబంధ సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చి ంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయాన్ని శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఎపిటా, ఏసీఎన్ ఇన్ఫోటెక్ అనే బీపీవో సంస్థ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఇక్కడ 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. రుషికొండ ఐటీ హిల్స్‌లో మంత్రి అమర్నాద్తో హెల్త్‌రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ ఫార్బ్మెన్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ ఎండీ చమన్బైద్, ఎపిటా సీఈవో కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ఐటీ సలహాదారు శేషిరెడ్డి శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. సంస్థ అందించే సేవలు, కల్పించే ఉద్యోగావకాశాలపై చర్చించారు. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. బీచ్ ఐటీ కారిడార్‌ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో 300 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఏటా 1,20,000 మంది వివిధ కోర్సులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. అమెరికాలోని వివిధ టెక్ కంపెనీలలో పని చేస్తున్న ప్రతి నలుగురిలో ఒక తెలుగువాడు ఉంటాడని అమెరికా సంస్థ బృందానికి వివరించారు. స్టార్టప్స్‌లోనూ తెలుగు విద్యార్థులు బాగా రాణిస్తున్నారన్నారు. విశాఖలో మెడ్ టెక్ జోన్ మెడికల్ రీసెర్చ్‌కు, వైద్య రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. హెల్త్‌రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచేందుకు హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్‌కు సహకారం అందిస్తుందన్నారు. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్, హెల్త్ కోడింగ్, వైద్య సంస్థలకు ఐటీ సర్విసులు సైతం అందించేలా విశాఖ నుంచి సంస్థ పనిచేస్తుందని తెలిపారు. -
తెలంగాణ ఎన్నికల ఫలితాలకు పవన్ “పవర్” పోయింది