Heavy rush
-
ఇసుక వేస్తే రాలనంత జనంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
-
పల్లెబాట పట్టిన నగర వాసులు
-
పల్లెకు పోదాం చలో చలో (ఫొటోలు)
-
పండగొచ్చింది.. పల్లెబాట పట్టిన పట్నంవాసులు (ఫొటోలు)
-
సొంతూళ్లకు నగరవాసులు .. రద్దీగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
-
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . నిన్న 64,467 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 40,005 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. -
ఓటు మా బాధత్య.. పల్లెకు బయల్దేరిన నగరవాసులు (ఫొటోలు)
-
Ram Mandir Trust: అయోధ్యకు రాకండి!
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆ రోజు అయోధ్యలో ఊహించనంతటి రద్దీ ఉంటుంది. కనుక ఎలాగైనా కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని అయోధ్య దాకా రాకండి. మీరున్న చోటే ఆలయాల్లో పూజలు చేయండి’’ అని భవ్య రామమందిరం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. జనవరి 16వ తేదీ నుంచే వైదిక కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. 80 వేల మంది భక్తులకు బస, భోజన వసతి కలి్పంచేలా అయోధ్యలో ’టెంట్ సిటీ’ని నిర్మిస్తున్నారు. ఆలయ పూజారుల్లో తిరుపతి పూర్వ విద్యార్థి అయోధ్య రామాలయ పూజారిగా ఎంపికైన మోహిత్ పాండే తిరుపతిలో గతంలో వేద విద్య అభ్యసించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో ఎంఏ (ఆచార్య) పట్టా సాధించారు. లక్నోలోని సీతాపూర్‌కు చెందిన మోహిత్ గాజియాబాద్‌లోని దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో ఏడేళ్ల సామవేదం అభ్యసించారు. తర్వాత వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేద విద్యాభ్యాసం కొనసాగించారు. -
సంక్రాంతి ఎఫెక్ట్.. బస్టాండులు కిటకిట (ఫొటోలు)
-
బతుకమ్మ-దసరా పండగకి ఊరెళ్లిపోతా మామ...బస్టాండ్ లు,రైల్వేస్టేషన్లు కిటకిట (ఫొటోలు)
-
కిక్కిరిసిపోతున్న తిరుమల కొండ.. ఎటు చూసిన భక్తులే ( ఫొటోలు)
-
పర్యాటక ప్రదేశాన్ని తలపిస్తోన్న ప్రకాశం బ్యారేజీ...(ఫొటోలు)
-
కిటకిటలాడిన సాగర తీరం.. బీచ్‌లో యువతీయువకుల సందడి
-
భక్తులతో కిటకిటలాడుతున్న యాదగిరిగుట్ట
-
వైకుంఠ ఏకాదశి : తిరుమలలో పోటెత్తిన భక్తులు
-
అసలు వాళ్ళకి కరోనా అంటే భయం లేదు
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో భారీ క్యూలైన్లు
-
సంక్రాంతి పండుగ రద్దీ
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిట
-
బుక్ ఫెయిర్ కు పోటెత్తిన జనం
-
శబరిమలలో కొనసాగుతున్న రద్దీ
శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశనలుమూలల నుంచి తరలివచ్చిన స్వామలు మణికంఠుని దర్శించుకుంటున్నారు. స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో శబరిమల హోరెత్తుతోంది. మండల పూజల కోసం నిన్న శబరిమల దేవాలయ ద్వారాలు తెరుచుకున్నాయి. డిసెంబర్ 27 వరకు అయప్పస్వామికి నిత్యపూజలు జరుగుతాయి. నాలుగు రోజుల విరామం తర్వాత మళ్లీ జ్యోతి దర్శనం వరకూ స్వామి ఆలయం తెరిచి ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేరళప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేసింది. శబరిమల సంప్రదాయాలను అతిక్రమించే ఎలాంటి చర్యలను సహించబోమని కేరళ దేవాదాయ శాఖ ముందే స్పష్టం చేసింది. -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసుల లాఠీచార్జ్
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్ : పండుగ సీజన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగడంతో ఈ రద్దీ మరింతగా పెరిగింది. ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బస్సులకు వెళ్దామని భావించిన చాలా మందికి ఆర్టీసీ కార్మికుల సమ్మె షాకిచ్చింది. దీంతో చేసేది ఏమి లేక చాలా మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఫ్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో కలిసి ఊళ్లకు వెళ్లే వారి పరిస్థితి మరి దారుణంగా తయారైంది. రద్దీ పెరగడంతో ప్రయాణికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి.. ప్రయాణికులను చెదరగొట్టారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులను లైన్లలో ఉంచి రైలు ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా ప్రయాణికుల రద్దీ
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ : ఓటెత్త.. పోటెత్త
-
రైళ్లు కిటకిట...ప్రయాణం కటకట
-
పండుగ ఎఫెక్ట్: సికింద్రాబాద్ స్టేషన్లో సంక్రాంతి రద్దీ
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ : పండగా మజాకా
-
తిరుమల: వైకుంఠ ఏకాదశి పోటెత్తిన భక్తులు
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూలైనులో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపుగా 22 గంటల సమయం పడుతుందని సమాచారం. కాలిబాట దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శనివారం నాడు 93,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాక స్వామివారి హుండీ రూ. 2.71 కోట్లు తెలుస్తోంది. జూన్ 7వ తేదీన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. -
తిరుమలకు పోటెత్తిన భక్తజనం
-
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. స్వామివారిని శనివారం 82,660 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ. 2.26 కోట్లు వచ్చింది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి బిమిలేంద్ర నిధి శ్రీవారిని దర్శించుకున్నారు. -
వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్‌జిల్లా బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు సోమవారం అమ్మవారి పుట్టిన రోజు కావడంతో బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామున 5 గంటల నుంచే అక్షర శ్రీకార పూజలు ప్రారంభించారు. అక్షర శ్రీకార పూజలు, అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామునుంచే వేలాదిమంది భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
భక్తులతో తిరుమల కిటకిట
సాక్షి, తిరుమల: సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 67,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,920 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.81 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
ముంబైలో సిద్ధివినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు
-
వైకుంఠ దర్శనం: తిరుమల కొండ కిటకిట
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్మెంట్లతో పాటు, టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రేపటి వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే లక్షమంది భక్తులు నిరీక్షిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. రేపటికి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందేకాకుండా కాలిబాటలో గోవిందమాల భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా ఏకాదశి పర్వదినాన భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సామాన్య భక్తులు, ప్రముఖులకు వేర్వేరుగా బస, దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్థరాత్రి నుంచి దివ్యదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు. సర్వదర్శనం మినహా ఐదు రోజుల పాటు దివ్యదర్శనం సహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కనుమ రహదారులను 24 గంటల పాటు తెరిచే ఉంచుతారు. ధనుర్మాస పూజల తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనంను కల్పించనున్నారు. రేపు ఉదయం 5 గంటల తర్వాత వీఐపీ దర్శనాలను అనుమతిస్తారు. ఉదయం 7.30 గంటల తర్వాత సర్వదర్శనం ప్రారంభం కానుంది. రెండు రోజులు పాటు 40 గంటలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు 30 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు 200 మందికిపైగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు రానున్నట్టు సమాచారం. ప్రముఖుల బస, దర్శన ఏర్పాట్లు మంత్రులు, రాజ్యాంగపరమైన హోదాల్లో ఉన్న వారు తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయ పరిధిలోని వెంకటకళా నిలయానికి వెళ్లాల్సి ఉంది. ఇక్కడ ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, 2కు మించకుండా గదులు కేటాయిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రామరాజు నిలయం, సీతా నిలయానికి వెళ్లాలి. ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గది మంజూరు చేస్తారు. అఖిల భారత సర్వీసు అధికారులు సన్నిధానానికి, ఇతర ఉన్నతాధికారులకు గంబుల్ విశ్రాంతి గృహానికి వెళ్లాలి. నలుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గదిని కేటాయిస్తారు. సామాన్య భక్తులకు బస, దర్శన ఏర్పాట్లు ఏకాదశి సందర్భంగా వచ్చే సామాన్య భక్తుల కోసం కేంద్రియ విచారణ కార్యాలయంలోని అన్ని కౌంటర్లలో గదులు కేటాయించనున్నారు. ఇక్కడ ఎలాంటి సిఫారసులు స్వీకరించరు. స్వామి దర్శనం కోసం లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. ఇందులో భాగంగానే కాలిబాట దర్శనం కూడా నిలిపివేశారు. ఒకే క్యూలైనులోనే భక్తులను అనుమతించనున్నారు. సామాన్య భక్తులకు ఎండ, వాన, చలి, మంచుకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. 42 వేల మందికి సరిపడేలా నారాయణగిరి ఉద్యాన వనాల్లో 20 తాత్కాలిక షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2లో 16 వేల మంది, వైకుంఠం క్యూకాంప్లెక్స్–1లో 16 వేల మంది భక్తులు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ సారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 నుంచి కల్యాణవేదిక వరకు 2.3 కిలోమీటర్ల నిడివిలో కొత్తక్యూలైను నిర్మించారు. తొలుత కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతిస్తారు. అవి నిండిన తర్వాత ఆళ్వార్‌ట్యాంక్, నారాయణగిరి ఉద్యానవనాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2, కర్ణాటక సత్రాలు, అహోబిల మఠం, ఉత్తర మాడ వీధి మీదుగా ఎ టైప్ క్వార్టర్స్, బాట గంగమ్మ గుడి వద్ద రింగ్‌రోడ్డు నుంచి కల్యాణవేదిక వరకు నిర్మించిన క్యూలైన్లోకి అనుమతిస్తారు. భక్తులు 24 నుంచి 30 గంటలు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడ భక్తులకు మరుగుదొడ్లతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. సుమారు 2 లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలు, మజ్జిగ, కాఫీ, టీ తదితరాలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో అనీల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆదేశించారు. -
తిరుమలలో సర్వ దర్శనానికి 26 గంటలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. 29, 30లలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శుద్ధి కారణంగా ఉదయం 11 గంటల వరకు దర్శనం నిలిపివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కానుంది. 28 నుంచి ఐదు రోజులపాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి 26 గంటలు పట్టే అవకాశం ఉంది. సోమవారం 88,507 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. 33,102 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారికి హుండీ ఆదాయం రూ.4కోట్లు వచ్చింది. -
తిరుమలలో భక్తుల రద్దీ
-
తిరుమలలో పోటెత్తిన భక్తులు
-
ఐసెట్ కౌన్సెలింగ్‌కు పోటెత్తిన విద్యార్థులు
ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి ఐసెట్–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనకు గురువారం విద్యార్థులు పోటెత్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం, ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రాల్లో 721 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రంలో 411 మంది అభ్యర్థులు హాజరుకావడంతో గురువారం రాత్రి 10 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని క్యాంప్ ఆఫీసర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. 15న ఐసెట్ కౌన్సెలింగ్ పూర్తికానుంది. -
కిటకిటలాడిన లోక్ అదాలత్
- 3,961 కేసులు రాజీ మార్గంలో పరిష్కారం అనంతపురం లీగల్ : జిల్లాలో జిల్లా న్యాయసేవాప్రాధికార సంస్థ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. 3,961 కేసులు రాజీమార్గంలో శాస్వత పరిష్కారం పొందాయి. శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిల్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లకు కక్షిదారులు ఉత్సాహంగా తరలివచ్చారు. కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసులతో పాటుగా ఇంకా కోర్టు గడప చేరని ప్రీలిటిగేషన్ కేసులు దాదాపు 1,544 పరిష్కారమయ్యాయి. జాతీయ లోక్‌అదాలత్‌కు విచ్చేసిన కక్షిదారులందరికీ భోజన వసతి,తాగునీటి సౌకర్యం కల్పించారు. సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి, కార్యదర్శి ఎస్.కమలాకర్ రెడ్డి న్యాయసేవాసదన్‌లో లోక్‌అదాలత్ నిర్వహించారు. వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్న సివిల్ కేసులు, కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, బకాయిలు, చెక్‌బౌన్సు కేసులు, రాజీకాదగిన క్రిమినల్ కేసులు, ఇంకా కోర్టులో దాఖలు చేయని వివాదాలను కూడా ఈ లోక్ అదాలత్‌లో రాజీ మార్గంలో పరిష్కరించారు. -
వన భో‘జనం’
-
పెట్రోల్ బంకుల్లో జనం క్యూ..
-
నోట్ టాపిక్..
-
పెట్రోల్ బంకుల్లో జనం క్యూ..
హైదరాబాద్: రూ. 500, 1000 నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. జేబులో రూ. 500, 1000 నోట్లు తప్ప చిల్లరలేని వారు.. అవి ఎందుకు పనికిరాకపోవడంతో రోజు వారి అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. తరువాత నోట్లను మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఉన్న కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం చిల్లర కోసం నానా తంటాలు పడుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రూ. 500, 1000 నోట్లను మార్చడానికి జనాలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ సైతం వారికి నిరాశే ఎదురౌతుంది. బంకుల నిర్వాహకులు సరైన చిల్లర ఇస్తేనే పెట్రోల్ పోస్తామని చెబుతున్నారు. అందరూ 500, 1000 నోట్లను మార్చుకోవడానికి పెట్రోల్ కోసం వస్తుండటంతో.. చిల్లర లేదని వారు అంటున్నారు. రూ. 500, 1000 నోట్లను తీసుకోవడానికి బంకుల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: యాదాద్రిలో కోలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఆలయం వెలుపలకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో కొండపైకి వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ. అలాగే అక్టోబర్ 30వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండి బయట వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 14 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
శ్రీవారి ఉదయాస్తమాన సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమలలో శుక్రవారం శ్రీవారి ఉదయాస్తమాన సేవలో చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవరం కూడా కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి... భక్తులు భారీగా క్యూ లైన్లులో నిలబడ్డారు. సర్వదర్శనానికి 14 గంటలు, నడకదారిన వచ్చే భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లో పూర్తి అవుతుంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు సమయం పడుతుంది. అయితే శ్రీవారి పాదల వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. -
పదోరోజు మహిషాసుర వర్దిని అవతారం
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కొనసాగుతుంది. దేవదేవుడు శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి. కంపార్ట్మెంట్ల బయట భక్తులు క్యూలో బారులు తీరారు. సర్వదర్శనానికి 12 గంటలు, నడక భక్తులకు 10 గంటల సమమయ పడుతుంది. నిన్న శనివారం స్వామివారిని 93,119 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే నిన్న శ్రీవారి హుండీకి రూ. 2.58 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. -
భక్తజనకీలాద్రి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిౖయెన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసేలా ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను శనివారం శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి... వీణ, దండ, కమండలం, అక్షరమాల, నెమలితో కూడిన అభయముద్రను ధరించిన చదువుల తల్లిని దర్శించి భక్తులు తరించారు. ‘ తల్లీ.. మా అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞానం ప్రసాధించు..’ అని వేడుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి.. భక్తజనకీలాద్రిగా మారింది. – సాక్షి, విజయవాడ -
భక్తుల ఆగ్రహం
-
బాసరలో పోటెత్తిన భక్తులు
-
బస్టాండ్లలో కిక్కిరిసిపోయిన ప్రయాణీకులు
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమలలో దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ఆరోరోజు కొనసాగుతున్నాయి. శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు బంగారు రథంపై ఊరేగనున్నారు. రాత్రికి స్వామివారికి గజవాహన సేవ జరగనుంది. అయితే బ్రహ్మోత్సవాలు... వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి... క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలిబాట దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. కాలిబాట మార్గం నుంచి భారీగా భక్తులు వస్తున్నారు. -
బాసరలో పోటెత్తిన భక్తులు
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ మాత సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. అమ్మ వారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావటంతో శనివారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు క్యూకట్టారు. వందలాది మంది చిన్నారులకు అర్చకులు అక్షరాభ్యాసం చేయించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళరాత్రి అవతారంలో దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకున్నారు. -
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు... ఆపై అమ్మవారి జన్మనక్షత్రం మూల. ఈ నేపథ్యంలో శనివారం ఇంద్రకీలాద్రిపై కోలువైన శ్రీకనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము 2.00 గంటల నుంచే భక్తులు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల మధ్య వీఐపీ దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం దుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్శించనున్నారు. -
శ్రీవారి గరుడ సేవకే టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల : తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి... బయట క్యూ లైన్లలో బారులు తీరారు. సర్వ దర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నేడు గరుడ సేవ సందర్భంగా ప్రత్యేక ప్రవేశ దర్శనంతోపాటు వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. గరుడ సేవకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సేవను వీక్షించేందుకు భక్తులకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి భక్తులను ఈ గ్యాలరీల్లోకి అనుమతి ఇస్తారని అధికారులు వెల్లడించారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అన్న ప్రసాద కేంద్రంలోనూ భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. నేటి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 2.00 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరగుతుందని టీటీడీ తెలిపింది. -
దుర్గగుడికి పోటెత్తిన భక్తులు
విజయవాడ : దుర్గగుడికి బుధవారం భక్తులు పోటెత్తారు. దసరా నవరాత్రులు నేపథ్యంలో నేడు ఐదో రోజు సందర్భంగా అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అయితే క్యూలైన్లో అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్న వృద్ధురాలు స్పృహ కోల్లోయింది. దీంతో ఆలయ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. -
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు
విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ గర్భాలయం నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాల నడుమ మహామంటపానికి తరలించారు. వేకువజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో నాలుగు క్యూలైన్లలో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. వీవీఐపీ, వీఐపీ దర్శనాలకు రూ. 500 , రూ.300 టికెట్లతో ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ఎ. సూర్యకుమారి తెలిపారు. -
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం కూడా కొనసాగుతుంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 27 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 10 గంటలు, నడక దారిన వచ్చిన భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. . -
పండుగలకు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 52 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లన్నింటికీ ప్రత్యేక చార్జీలు వర్తిస్తాయి. ఈ మేరకు హైదరాబాద్-తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రెయిన్ ఈ నెల 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీలలో సాయంత్రం 5.55 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలలో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-మైసూర్ (07073/07074) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు మైసూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 3, 10, 17, 24, 31 తేదీలలో సాయంత్రం 6.15 కు మైసూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సంత్రాగచ్చి (కోల్కత్తా)-సికింద్రాబాద్ (02849/02850) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 5, 12, 19, 26, నవంబర్ 2, 9, తేదీలలో రాత్రి 11.50 కి సంత్రాగచ్చి నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారు జామున 4.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11 తేదీలలో ఉదయం 6.20 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 10.25 కు సంత్రాగచ్చి చేరుకుంటుంది. సికింద్రాబాద్-విజయవాడ (07757/07758) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 2, 9, 16, 23, 30 నవంబర్ 6, 13, 20, 27 తేదీలలో ఉదయం 5.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10.45 కు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు సాయంత్రం 5.30 కు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 10.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-పాట్నా (02793/02794) స్పెషల్ ట్రెయిన్ ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11తేదీలలో ఉదయం 8.35 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 కి పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 2, 9, 16, 23, 31, నవంబర్ 8, 13 తేదీలలో మధ్యాహ్నం 12.45 కు పాట్నా నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.20 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం అధికంగా ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చన భక్తులతో 28 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 89,260 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.52 కోట్లు అని వారు పేర్కొన్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం అధికంగా ఉంది. శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 28 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 67, 605 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 85,434 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
కృష్ణమ్మ తీరం ... భక్తజన సంద్రం
సాక్షి, అమరావతి : కృష్ణాతీరానికి పుష్కరాల పదోరోజు భక్తజనం పోటెత్తింది. ఆదివారం కావడం, మరో రెండురోజుల్లో పుష్కరాలు ముగియనుండటంతో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన పుష్కర ఘాట్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి. ఎండ తీవ్రత, ట్రాఫిక్ జామ్‌లు, ఇతర ఇబ్బందులను లెక్కచేయకుండా భక్తులు పుష్కర స్నానాలాచరించి పులకించిపోయారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రంలో 29,91,750 మంది స్నానాలు చేయడం విశేషం. ఈ పుష్కరాల్లో ఇదే రికార్డు కావడం గమనార్హం. మొత్తం మీద ఈ పది రోజుల్లో పుష్కర స్నానాలు చేసిన భక్తుల సంఖ్య 1,53,66,036కు చేరింది.విజయవాడ కనకదుర్గమ్మ ఆల యంతో పాటు కృష్ణాతీరంలోని ఆలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. 23న ఆది పుష్కరాల ముగింపు కృష్ణా పుష్కరాల్లో తొలి 12 రోజుల ఆది పుష్కరాలను మంగళవారం వేడుకగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 23వ తేదీ రాత్రి 7 గంటలకు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదికిచ్చే హారతితో ఆది పుష్కరాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా కృష్ణా హారతి ప్రాంతంలో ప్రభుత్వం భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనుంది. ఆది పుష్కరాల ముగింపు సంద ర్భంగా వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహిస్తారు. -
తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నానం ఆచరించేందుకు భక్తులు తెల్లవారే పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. విజయవాడలోని సంగమం, పద్మావతి, జగ్గయ్యపేట సమీపంలోని వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు భారీ గా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిని శ్రీదుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో దేవాలయ ప్రాంతం జనసంద్రంగా మారింది. దీంతో భక్తులను అదుపు చేయలేక పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఉదయం 9.00 గంటల వరకు 75 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. తాగేందుకు మంచి నీరు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్ ఘాట్లలో భక్తుల రద్దీ భారీగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణా పుష్కరోత్సవం ఆదివారం 10వ రోజుకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలోని భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు పయనమవుతున్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 9 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని విజయవాడలో పద్మావతి, వేదాద్రిలోని ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం, పాతాళగంగ ఘాట్‌లో భక్తులు పోటెత్తారు. అలాగే తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్‌లోని ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు సంఖ్య భారీగా పెరిగింది. -
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ : ఓ వైపు కృష్ణా పుష్కరాలు... మరోవైపు వరుస సెలవులు రావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. ఆమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఐదు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. గత అర్థరాత్రి నుంచి ఇప్పటి వరకు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. -
గోదావరి అంత్య పుష్కరాల్లో అపశృతి
ధవళేశ్వరం : గోదావరి అంత్యపుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ధవళేశ్వరంలోని కేదారలంక ఘాట్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పవిత్ర స్నానం కోసం నదిలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంత్య పుష్కరాలకు పోటెత్తిన భక్తులు గోదావరి అంత్య పుష్కరాలకు భక్తజనం పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. పుష్కర గ్రామీణ ఘాట్లన్ని కిటకిటలాడుతున్నాయి. పెనుగొండలోని సిద్ధాంతం, పెరవలి తీపర్రు, గన్నవరం వైనతేయ గోదావరి, నిడదవోలు పెండ్యాల, నరసాపురం వశిష్ట గోదావరి, గోష్పాద క్షేత్రాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర (ఆదిలాబాద్) : బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. గోదావరి అంత్యపుష్కరాలను పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకోవడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా గుట్టపైకి వాహనాలను అనుమతించడం లేదు. -
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఏడు కంపార్టుమెంట్లు నిండి ఉన్నాయి. శ్రీవారి సర్వ దర్శనానికి ఏడు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు ఆరు గంటల సమయం పడుతోంది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తి అవుతోంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు. నడక దారిలో వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. తిరుమలలో శ్రీవారిని శనివారం 85, 717 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న హుండీ ఆదాయం రూ. 2.54 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
యాదాద్రిలో పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట (యాదాద్రి) : నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురుపూర్ణిమ సందర్భంగా స్థానిక సాయిబాబా దేవాలయానికి భక్తులు బారులు తీరారు. మంగళవారం వేకువజాము నుంచే భక్తుల పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల వరకు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) స్వామివారిని 81,555 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి (నల్లగొండ) : యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవదడానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. -
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కోనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అయితే నేడు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్తానోత్సవం. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. శుక్రవారం శ్రీవెంకటేశ్వర స్వామిని 67,087 మంది భక్తులు దర్శించుకున్నారని... 3.03 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారు పుష్పాల పల్లకిలో ఊరేగనున్నారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి (నల్లగొండ) : యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనర్సింహ స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లు నిండి వెలుపల బారులు తీరారు. స్వామివారి సర్వ దర్శనానికి 14 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) శ్రీవారిని 92 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. -
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు మహామండపం సమీపంలోని ఘాట్‌రోడ్డు మీదుగా భక్తులను అనుమతించారు. ప్రస్తుతం అమ్మవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం ఉదయం నుంచి సుమారు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెలంగాణా నుంచే కాకుండా బయటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్యూలైన్లు నిండటంతో భక్తులు బయట బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భద్రత దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించటం లేదు. -
తిరుమల కొండ కిటకిట
- సర్వదర్శనం 13 గంటలు, కాలిబాట దర్శనానికి 8 గంటలు - టీటీడీ ఈవో, జేఈవోల నిరంతర పర్యవేక్షణ తిరుమల : తిరుమల కొండ ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. గదులు, లాకర్లు, తలనీలాలు, దర్శనం, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం.. ఇలా అన్ని చోట్లా భక్తులు బారులు తీరిన క్యూలైన్లలో నిరీక్షించారు. సాయంత్రం 6 గంటల వరకు సుమారు 65 వేల మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 13 గంటలు, కాలినడకన వచ్చిన యాత్రికులకు 8 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. గదులు ఖాళీ లేవు. రిసెప్షన్ కేంద్రాల్లో ఖాళీ అయిన గదులను వెనువెంటనే భక్తులకు కేటాయించారు. యాత్రిసదన్లలో లాకర్ల కోసం క్యూ కట్టారు. తలనీలాలు సమర్పించేందుకు ప్రధాన కల్యాణకట్ట , మినీ కల్యాణకట్టల వద్ద భక్తుల నిరీక్షణ తప్పలేదు. ఇక పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు క్యూలైన్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, ఆలయం, లగేజి కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. దీనివల్ల దర్శన క్యూలైన్లు వేగంగా కదిలింది. భక్తులు వేచి ఉండే సమయం తగ్గింది. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర (ఆదిలాబాద్ జిల్లా) : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 25 వేల మంది భక్తులు తరలివచ్చారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు వెయ్యి మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది. -
యాదాద్రిలో పోటెత్తిన భక్తులు
యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లు దాటి బయట వరకు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
కాలిబాట క్యూలైన్లలో తోపులాట
తిరుమల : తిరుమలలో శనివారం భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో కాలిబాట క్యూలైన్లో తోపులాటలు జరిగాయి. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేసవి సెలవులు ముగిసే దశకు చేరుకోవటం, వారాంతపు సెలవులతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అదేవిధంగా లగేజీ డిపాజిట్ చేసే చోట కనీస సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. సర్వదర్శనం, కాలిబాట భక్తులతో రెండు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. వెలుపల క్యూలైన్లు రెండు కిలోమీటర్లు విస్తరించాయి. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం సుమారు 40 వేల మంది దాకా భక్తులు కాలిబాటల్లో నడిచి వచ్చారు. వీరికి 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. -
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం తీసుకుంటోంది. అన్ని కంపార్ట్మెంట్లూ భక్తులతో నిండిపోయాయి. కాలినడకన వచ్చిన భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు మూడు గంటల్లోపు దర్శనం లభిస్తోంది. జూలై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లనుఈవో సాంబశివరావు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం 56,640 టికెట్లను టీటీడీ వెబ్సైట్లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. వీటిలో సుప్రభాతం 6,426, తోమాల సేవ 120, అర్చన 120, విశేషపూజ 1,497, అష్టదళ పాదపద్మారాధన 60, నిజపాద దర్శనం 1,859, కల్యాణం 11,248, ఊంజలసేవ 3000, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,450, వసంతోత్సవం 11,610, సహస్ర దీపాలంకరణసేవ 14,250 ఉన్నాయి. రూ.300 ప్రత్యేక దర్రశనం, గదులను ఇకపై 90 రోజల ముందు నుంచి బుక్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. నడకదారి భక్తులకు స్వామి వారి దర్శనం కోసం 22 కంపార్టుమెంట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. మే నెలలో 25.05 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు వెల్లడించారు.టీటీడీ వెబ్సైట్లో 14వేల అన్నమయ్య సంకీర్తనలు అందుబాటులో ఉంచామని చెప్పారు. 3,700 పుస్తకాలను టీటీడీ వెబ్సైట్లో ఉంచగా, 10 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయన్నారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో అర్చక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. -
యాదాద్రిపై భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట (నల్లగొండ జిల్లా) : యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు బయట బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం తీసుకుంటోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. -
ఇదేనా.. కష్టనివారణ గోవిందా!
-
తిరుమలతో భక్తుల కిటకిట
తిరుమల: కలియగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం బుధవారం భక్తులు పోటెత్తారు. అన్నికంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. కాలినడక న వచ్చే భక్చులకు 10 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భారీగా భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొండ అంతా భక్తమయంగా మారింది. సుమారు 50వేల మందికి పైగా వచ్చినట్టు అంచనా. అమ్మవారి దర్శనం కోసం మూడుగంటలకు పైనే సమయం పడుతోంది. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. కనకదుర్గానగర్‌లోని కేశఖండన శాలలో తలనీలాలు ఇచ్చి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. పుష్కరాల పనుల నేపథ్యంలో దుర్గాఘాట్‌ను మూసివేయడంతో భక్తులు స్నానాల కోసం కేశ ఖండన శాల వద్ద ఇబ్బందులు పడ్డారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: వేసవి సెలవులతో శుక్రవారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ సీజన్లో ఇంత స్థాయిలో భక్తులు రావటం ఇదే మొదటిసారి. ఏపీ, తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడటం, వారపు సెలవులు కావటంతో స్వామి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లూ భక్తులతో నిండిపోగా... బయట కిలోమీటరు మేర క్యూలో జనం నిరీక్షించారు. వీరికి 15 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. ఇక 14 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. రద్దీ కారణంగా గదులు ఖాళీలేవు. కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించేందుకు నాలుగు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. అంగప్రదక్షిణం క్యూలో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాగా, రద్దీ నేపథ్యంలో భక్తులకు సాధ్యమైనంత వేగంగా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
నల్లగొండ : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. యాదాద్రిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులను గుట్టపైకి వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో ఆదివారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 32 కంపార్ట్మెంట్లూ నిండిపోగా భక్తులు బయట క్యూలైన్లలో బారులు తీరారు. కాలిబాటలో వచ్చిన భక్తులకు 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 2 నుంచి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అలాగే, చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్‌శెట్టిలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట (నల్లగొండ) : పరీక్షల సమయం ముగియడంతోపాటు వరుస సెలవులు రావడంతో.. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. యదాద్రి పై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. స్వామివారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులను గుట్టపైకి వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: వరుస సెలవు దినాలు రావడంతో తిరుమల భక్తులతో పోటెత్తింది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి... కిలోమీటరు మేర బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. భక్తులు రద్దీ అధికంగా ఉండటంతో గదులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలనీలాలు సమర్పించేందుకు కూడా భక్తులు బారులు తీరారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం కలియుగ దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) స్వామివారిని 77,877 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారి సేవలో ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రాతః కాల దర్శన సమయంలో మంచు లక్ష్మీ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డీజీ కే.ఎల్ వరప్రసాద్ శ్రీవారి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
వేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడ (కరీంనగర్) : దక్షిణ కాశీగా పేరొందిన కరీంనగర్ జిల్లా వేములవాడ క్షేత్రంలో సోమవారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచి 5 క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పిస్తున్నప్పటికీ దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. దీంతో క్యూలైన్లలోనే భక్తులు పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. స్త్రీలు, వృద్ధులు, పిల్లల ఇక్కట్లు వర్ణనాతీతం. అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమయింది. సాయంత్రం వరకూ ఇదే తీరు కొనసాగేలా ఉంది. -
భక్తులతో కిక్కిరిసిన శ్రీమఠం
మంత్రాలయం (కర్నూలు) : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు ముందుగా తుంగభద్ర నదిలో స్నానమాచిరించి గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనంను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఏకదాశి కావడంతో రాఘవేంద్రస్వామి నిర్మల బృందావన దర్శనం భక్తులకు అందుబాటులో ఉంది. స్వామి వారి దర్శనం కోసం ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, అసిస్టెంట్ పీఆర్వో వ్యాసరాజాచార్ తదితరులు ఉన్నారు. -
రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం
ఒక్క రోజులో 1,00,699 మంది భక్తుల రాక సాక్షి,తిరుమల: రథసప్తమి పర్వదిన సందర్భంగా ఆదివారం తిరుమల భక్తులతో కిక్కిరిసింది. రికార్డు స్థాయిలో 1,00,699 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీ చరిత్రలో ఒక రోజులో ఇంత మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం ఇదే తొలిసారని తెలిపింది. గత ఏడాది రథసప్తమి రోజున 92,021 మంది భక్తులు దర్శించుకోగా, ఈ సారి మరో ఎనిమిది వేల మంది అదనంగా దర్శించుకొన్నారని పేర్కొంది. అలాగే 2.5 లక్షల మందికిపైగా భక్తులు ఉత్సవమూర్తులను దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. -
బెజవాడ కనకదుర్గ ఆలయానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీ పంచమి నేపథ్యంలో అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిపోయింది. అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిస్తున్నారు. అయితే శ్రీపంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై విజయిభవ మహాసరస్వతియాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు అందించేందుకు ఈ యాగం నిర్వహిస్తున్నారు. -
రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి
వేములవాడ అర్బన్ : కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం లక్ష మంది వరకు భక్తులు రాగా, సోమవారం కూడా రద్దీ భారీగానే ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈవో ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో ఆదివారం భక్తులతో కిక్కిరిపోయింది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు... కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అందులోభాగంగా భక్తులకు అల్పాహారంతో పాటు ఆహార పానీయాలను అందజేస్తున్నారు. -
కిటకిటలాడుతున్న బస్ స్టాప్‌లు
-
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
నల్గొండ : శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం నల్గొండ జిల్లా యాదాద్రికి పోటెత్తారు. స్వామివారి సర్వ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వెళ్లే వాహనాలను కిందే నిలిపివేశారు. దీంతో అటు రోడ్డు మార్గం, ఇటు మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడుతుంది. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల : నూతన సంవత్సరం సందర్భం తిరుమల శుక్రవారం భక్తులతో కిక్కిరిపోయింది. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు... కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 20 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల క్యూలైన్లను టీటీడీ ఈవో డి సాంబశివరావు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అందులోభాగంగా భక్తులకు అల్పాహారంతో పాటు ఆహార పానీయాలను అందజేస్తున్నారు. -
తిరుమలలో పోటెత్తిన భక్తులు
- సర్వదర్శనానికి 16 గంటలు, కాలిబాట భక్తులకు 10 గంటలు - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఏర్పాట్లపై ఈవో సమీక్ష తిరుమల : తిరుమల కొండ శనివారం భక్తులతో నిండింది. వరుస సెలవులతో రెండు రోజులుగా తిరుమలలో క్యూలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనం కోసం వచ్చే భక్తులతో రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు నిండి, వెలుపల రెండు కిలోమీటర్లు క్యూ కట్టారు. వీరికి 16 గంటల తర్వాత శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం లభిస్తోంది. కాలిబాటల్లో నడిచి వచ్చిన భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో పద్మావతి, సీఆర్వో, ఎంబీసీ-34 రిసెప్షన్ కేంద్రాల వద్ద గదుల కోసం యాత్రికులు పడిగాపులు కాచారు. ఐదారుగంటలపాటు నిరీక్షించిన తర్వాతే గదులు లభించాయి. కల్యాణకట్టల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రధాన కల్యాణకట్టతోపాటు మరో 9 మినీ కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించుకునేందుకు భక్తులు నిరీక్షించారు. వీఐపీ దర్శనాలు, ప్రోటోకాల్ మినహా మిగిలిన సిఫారసు దర్శనాలు రద్దుచేశారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయా విభాగాల అధికారులతో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పర్యవేక్షించారు. శనివారం వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మొత్తం 61,619 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.2.95 కోట్లు లభించాయి. -
ఎర్రవల్లిలో మరింత రద్దీ
జగ్దేవ్పూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో చేపట్టిన అయుత మహాచండీయాగం శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. అయుత చండీయాగం చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య శనివారం ఉదయం మరింత పెరిగింది. చివరి రెండు రోజులు కావటంతో శనివారం ఉదయానికే సుమారు 80 వేల మంది యాగశాలకు చేరుకున్నారు. యాగశాల వైపునకు వచ్చే బైక్‌లు సహా వాహనాలను నర్సన్నపేట్, ప్రజ్ఙాపూర్, గౌరారం, తుర్కపల్లి వద్దనే పోలీసులు నిలిపివేస్తున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మధ్యాహ్నానికి రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు యాగానికి లక్ష వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు కుంకుమార్చన రద్దు చేస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతుంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని శుక్రవారం 62,431 మంది భక్తులు దర్శించుకున్నారు. -
తిరుమలలో పోటెత్తిన భక్తులు
తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో భక్తులు విచ్చేయడంతో.. ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. స్వామి వారిని ఈ రోజు సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారులు తెలిపారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
నల్గొండ : శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం నల్గొండ జిల్లా యాదాద్రికి పోటెత్తారు. స్వామివారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వెళ్లే వాహనాలను కిందే నిలిపివేశారు. దీంతో అటు రోడ్డు మార్గం, ఇటు మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడుతుంది. -
చిలుకూరులో భక్తుల సందడి
మొయినాబాద్ : తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. రెండవ శనివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో 108 ప్రదక్షిణలు నిలిపివేసి కేవలం 11 ప్రదక్షిణలకు మాత్రమే అనుమతించారు. స్వామివారిని దర్శించుకునేందుకు రెండు వరుసల్లో మహాద్వార దర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. -
భక్తులతో కిటకిటలాడిన కీసరగుట్ట
కీసర (రంగారెడ్డి) : కార్తీకమాసం చివరిరోజు కావడంతో శుక్రవారం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం యాగశాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీరామలింగేశ్వరస్వామికి తైలాభిషేకం, అన్నపూజను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. లోకంలో క్షుద్బాధ తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ ఏటా కార్తీక మాసోత్సవాల్లో చివరి రోజున స్వామివారికి అన్నాభిషేకాన్ని నిర్వహిస్తుంటారు. ఈ పూజలో భాగంగా వరి అన్నంతో గర్భాలయంలో శివలింగాన్ని పూర్తిగా కప్పివేయడం జరుగుతుందని... సాయంత్రం శివలింగంపై కప్పిన వరి అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర (ఆదిలాబాద్) : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసంలో చివరి ఆదివారం కావడంతో.. అమ్మవారి సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. శ్రీ జ్ఞాన సరస్వతి సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీకమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి బారులు తీరారు. దర్శనానికి 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువవుతుండటంతో కొండపైకి వాహనాల అనుమతిని నిరాకరించారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
నల్గొండ : శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం నల్గొండ జిల్లా యాదాద్రికి పోటెత్తారు. స్వామివారి సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వెళ్లే వాహనాలను కిందే నిలిపివేశారు. దీంతో అటు రోడ్డు మార్గం, ఇటు మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడుతుంది. -
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యదాద్రిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ధర్మదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో.. పోలీసులు కొండ పైకి వాహనాలను అనుమతించడం లేదు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడానికి భక్తులు బారులు తీరారు. -
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి ఇరుగుపొరుగు జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం కిటకిటలాడుతోంది. దీంతోపాటు స్థానికంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం వద్ద కూడా భక్తజన సందోహం కనిపించింది. -
వేములవాడలో పోటెత్తిన భక్తులు
వేములవాడ (కరీంనగర్ జిల్లా) : మొదటి కార్తీక సోమవారం కావడంతో కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. పర్వదినం కావడంతో సుమారు 50 వేల మంది వరకు భక్తులు తరలివచ్చారు. దర్శనం కోసం ఆలయం వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. అయితే భక్తుల రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. షెల్టర్లు, తాగు నీరు, మరుగుదొడ్ల వసతి లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూల్లో నిల్చుని నిల్చుని నీరసపడి అక్కడే చతికిలపడిన పరిస్థితులు కనిపించాయి. -
యాదాద్రిలో పోటెత్తిన భక్తులు
నల్గొండ : తెలంగాణలో ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూ కాంప్లెక్స్‌లు నిండిపోయాయి. సత్యనారాయణస్వామి వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గుట్టపైకి వాహనాలను అనుమతించడం లేదు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరి ఉన్నారు. ప్రస్తుతం భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ ఎదుట కిలోమీటర్ మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 85,013 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో పోటెత్తిన భక్తులు
తిరుమల : తిరుమలలో శనివారం భక్తులు పోటెత్తారు. దసరా, వారాంతపు సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో రద్దీ పెరిగింది. శనివారం వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మొత్తం 61,825 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 31 కంపార్ట్మెంట్లలో నిండిన సర్వదర్శన భక్తులు వెలుపల రెండు కిలోమీటర్ల దూరం వరకు క్యూ కట్టారు. వీరికి స్వామి దర్శనం లభించేందుకు 16 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి ఉద్యావనంలో కాలిబాట భక్తులు కిక్కిరిసి క్యూ కట్టారు. వీరికి కూడా 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ విజిలెన్స్, పోలీసులు రంగప్రవేశం చేసి భక్తులను ఎక్కడికక్కడ నియంత్రించి క్యూల్లోకి అనుమతించారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు క్యూలు, పక్కనే తాత్కాలిక లగేజీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. గదుల కోసం భక్తులు రిసెప్షన్ కేంద్రాల వద్ద నిరీక్షించారు. తలనీలాలు తీసుకునేందుకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. హుండీ కానుకలు రూ.2.08 కోట్లు వచ్చాయి. -
భద్రాద్రిలో పోటెత్తిన భక్తులు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయూనికి భక్తులు శనివారం పోటెత్తారు. దసరా సెలవులు ముగుస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో రామాలయం శ్రీరామనామ స్మరణతో మారుమోగింది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ఏఈఓ శ్రావణ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రామయ్యకు బంగారు తులసీ పుష్పార్చన : శ్రీసీతారామచంద్రస్వామి వారికి బంగారు తులసీ దళార్చన నిర్వహించారు. స్వామివారి మూలవరులకు అంతరాలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన నిర్వహించి పవిత్ర గోదావరి నుంచి తీర్థ జలాలను తెచ్చి పంచామృతాలు, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలతో భద్రుని మండపంలో అభిషేక తిరుమంజనం నిర్వహించారు. అనంతరం 108 బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు. తదుపరి స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను బేడా మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి.. ఘనంగా నిత్యకల్యాణం జరిపించారు. నిత్య కల్యాణంలో 92 జంటలు పాల్గొన్నాయి. ఆలయ వేదపండితులు మురళీకృష్ణమాచార్యులు రామాయణం, రాముని ఔన్నత్యం గురించి భక్తులకు ప్రవచనం చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, పీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట (నల్లగొండ) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి ప్రస్తుతం 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు వాహనాలను గుట్టపైకి అనుమతించడం లేదు. దసరా సెలవులు ముగుస్తుండటంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. -
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం సెలవు దినం కావడంతో భక్తులు కనకదుర్గ అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి పెరిగిపోవడంతో.. అంత్రాలయ దర్శనం రద్దు చేశారు. ప్రస్తుతం అమ్మవారి సర్వధర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ఉచిత దర్శనానికి 15 గంటల సమయం, కాలినడక భక్తులకు 9 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఉచిత, రూ.50ల గదులు ఖాళీగా ఉన్నాయి. రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది. గదుల వివరాలు : ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు- ఖాళీ లేవు రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్రదీపాలంకరణ సేవ: 100 ఖాళీగా ఉన్నాయి, వసంతోత్సవం : ఖాళీ లేవు, బుధవారం ప్రత్యేక సేవ: సహస్ర కలశాభిషేకం. -
శ్రీశైలం.. భక్తజన ఆధ్యాత్మిక శోభితం!
శ్రీశైలం : శ్రీశైలమహాక్షేత్రం నిమజ్జన భక్తజనంతో సోమవారం కళకళలాడుతూ కనిపించింది. అదేరోజు రాత్రి ఆలయప్రాంగణంలోని దీపార్చన మండపంలో సహస్రదీపోత్సవం, ప్రత్యేకపూజలను అర్చకులు నిర్వహించిన తరువాత స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేయించారు. మల్లన్న దర్శనం, సహస్రదీపార్చన, వెండిరథోత్సవసేవను తిలకించిన భక్తులు ఆధ్యాత్మికానందంతో పులకించిపోయారు. -
మంత్రాలయంలో భక్తుల రద్దీ
మంత్రాలయం (కర్నూలు) : కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వేకువజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడు కొండలవాడి దర్శనానికి 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 4 గంటలు , ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా , సోమవారం 60,812 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతొంది. సాయంత్రం ఆరు గంటల వరకు 58,946 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 12 గంటలు, కాలిబాట భక్తులకు 7 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లు నిండి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న 82,610 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా ఈరోజు శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం, రేపు ఉట్లోత్సవం జరుగనుండటంతో.. పలు ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. -
భక్తులరద్దీతో కిక్కిరిసిన శ్రీశైలం
శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను శ్రావణ మూడవ సోమవారం నాడు వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన రద్దీ సోమవారం కూడా కొనసాగింది. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని సోమవారం ఆలయ పూజావేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఇందులో భాగంగా సోమవారం వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహా మంగళహారతి, 5.30గంటల నుంచి దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల నంచి అధికసంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా వేకువజామునే పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకున్న భక్తులు నేరుగా క్యూ కాంప్లెక్స్ చేరుకుని ఉచిత, ప్రత్యేక, అతి శీఘ్ర దర్శన క్యూల ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తులరద్దీని దృష్టిలో పెట్టుకుని సాధారణ భక్తులు స్వామివార్ల దూర్శదర్శనం ఏర్పాటు చేసి కేవలం అభిషేకాలను నిర్వహించుకునే భక్తులను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. -
చిర్యాలకు పొటెత్తిన భక్తులు
కీసర (రంగారెడ్డి) : శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి సందర్భంగా రంగారెడ్డి జిల్లా చిర్యాల లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు. ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయంలో సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి పల్లకీసేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి విశేష అలంకరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ చెర్మైన్ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజరాజేశ్వరి ఆలయానికి వెల్లువెత్తిన భక్తులు
మహేశ్వరం (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు వెల్లువెత్తారు. దాదాపు 200ల మంది దేవాలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించగా, 2 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. -
ఉల్లి కోసం తోపులాట
విజయనగరం (పార్వతీపురం) : ప్రభుత్వం కిలో ఉల్లి రూ.20 లకే అందజేస్తుండటంతో రైతు బజార్లకు తాకిడి ఎక్కువైంది. శుక్రవారం విజయనగరం జిల్లా పార్వతీపురం రైతుబజార్ వద్ద ఉల్లి కోసం తోపులాట జరిగింది. దీంతో కౌంటర్ వద్ద విక్రయం ఆపేశారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిస్థితి అంతా అదుపులోకి వచ్చిన తర్వాతే మళ్లీ ఉల్లి విక్రయం ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చేది రెండు కిలోలే అయినా రైతు బజార్ల వద్ద క్యూలైన్లు చూస్తే ప్రజలకు దిమ్మతిరిగిపోతుంది. నిన్న ఇదే రైతు బజార్ వద్ద క్యూలైన్లో నిల్చుని 10 మంది వృద్ధులు కళ్లు తిరిగి పడిపోయారు. -
శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తులరద్దీ
శ్రీశైలం (కర్నూలు) : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ శుక్రవారం నుంచి ప్రారంభమైన భక్తులరద్దీ సోమవారం కూడా కొనసాగింది. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. రెండవ శ్రావణ సోమవారం దాదాపు 70 వేలకుపైగా భక్తులు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. కాగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈఓ సాగర్‌బాబు ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహా మంగళహారతులు, 5.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. కాగా శ్రావణమాసం సందర్భంగా భక్తులు పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని కృష్ణమ్మకు వాయనాలు అందజేసి నేరుగా స్వామివార్ల దర్శనార్థమై క్యూలో వేచి ఉండడంతో ఉచిత, ప్రత్యేక, అతి శీఘ్ర దర్శన క్యూలు కిటకిటలాడాయి. భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించేందుకు ఉచిత, ప్రత్యేక, అతి శీఘ్ర దర్శన భక్తులకు స్వామివార్ల దూరదర్శనం ఏర్పాటు చేశారు. కేవలం అభిషేకాలను నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రమే గర్భాలయంలోనికి అనుమతించారు. సోమవారం స్వామివార్ల దర్శనానంతరం భక్తులు సందర్శనీయ స్థలాలైన సాక్షిగణపతి, హఠకేశ్వరం, ఫాలదార-పంచధార, శిఖరేశ్వరం తదితరాలను దర్శించుకుని వెళ్లారు. -
భక్తులతో మంత్రాలయం కిటకిట
మంత్రాలయం (కర్నూలు జిల్లా) : వరుసగా రెండు రోజులు సెలవుదినాలు కావడంతో మంత్రాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తొలుత గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ రాఘవేంద్ర కూడా స్వామివారిని దర్శించుకున్నారు.