Hyderabad
-
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు.. విలువ ఎంతంటే..
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో గతేడాది ఇళ్ల అమ్మకాల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయింది. 2023తో పోల్చి చూస్తే 18 శాతం తక్కువగా రూ.1.05 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023లో విక్రయాల విలువ రూ.1.28 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. కానీ, దేశవ్యాప్తంగా టాప్ 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల విలువ 2024లో నికరంగా 12 శాతం పెరిగి రూ.6,73,000 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ‘ప్రాప్‌ఈక్విటీ’ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 2023లో రూ.6,00,143 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఢిల్లీలో సానుకూల పరిస్థితులు ‘‘ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లో సగటు విక్రయ ధర చదరపు అడుగుకి (ఎస్ఎఫ్టీ) రూ.12,469గా ఉంది. మౌలిక వసతుల అభివృద్ధి మెరుగ్గా ఉండడం, కార్పొరేట్ కంపెనీల ప్రాతినిధ్యం పెరుగుతుండడం, విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో డిమాండ్ పెరుగుతోంది’’అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. నగరాల వారీగా అమ్మకాలు.. ⇒ గురుగ్రామ్‌లో 2023లో రూ.64,314 కోట్ల ఇళ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,06,739 కోట్లకు పెరిగాయి. ⇒ ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో గతేడాది ఇళ్ల అమ్మకాలు 63 శాతం పెరిగి రూ.1,53,000 కోట్లకు చేరాయి. 2023లో అమ్మకాల విలువ రూ.94,143 కోట్లుగానే ఉంది. ⇒ ముంబై మార్కెట్లో అమ్మకాల విలువ 13 శాతం పెరిగి రూ.1.38 లక్షల కోట్లకు చేరింది. ⇒ నవీ ముంబైలోనూ 32 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు రూ.25,000 కోట్లకు చేరాయి. ⇒ థానేలో 6 శాతం అధికంగా రూ.56,000 కోట్ల అమ్మకాలు 2024లో జరిగాయి. ⇒ బెంగళూరు మార్కెట్లో రూ.85,000 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు గతేడాది జరిగాయి. అంతకుముందు ఏడాది విక్రయాలు రూ.75వేల కోట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. ⇒ చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో ఇళ్ల విక్రయాలు రూ.20,000 కోట్లుగా ఉన్నాయి. ⇒ కోల్‌కతాలో రూ.15,000 కోట్ల అమ్మకాలు చోటుచేసుకున్నాయి. 2023లో విక్రయాలు రూ.13,000 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. ⇒పుణెలో అమ్మకాల విలువ కేవలం ఒక శాతం క్షీణించి రూ.76,000 కోట్లుగా ఉంది. 2023లో ఇక్కడ రూ.77,000 కోట్ల విక్రయాలు జరిగాయి. -
Amrutha : ప్రణయ్ కేసులో కోర్టు తీర్పు.. అమృత ఏమన్నారంటే
సాక్షి,హైదరాబాద్ : నల్లగొండలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు (Pranay Murder case) నిందితులకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు శిక్ష విధించింది. ప్రణయ్‌ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పుపై అమృత తొలిసారి స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ తీర్పుతోనైనా పరువు పేరిట జరిగే దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన బిడ్డ పెరుగుతున్నాడని, అతడి భవిష్యత్తును, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నట్లు తెలిపారు. దయచేసి తమను అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి అమృత కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు సంచలన తీర్పుతెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు. 👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు.👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది.👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది.👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు.👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు. -
TSPSC Group 2 results released : తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్‌తో పాటు కీ విడుదలైంది. ఓఎంఆర్ షీట్‌ను సైతం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ కొద్ది సేపటిక్రితమే విడుదల చేసింది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకాగా, ఈ గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 15,16న జరిగిన ఈ పరీక్షలను సుమారు 2.5లక్షల మంది రాశారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. గ్రూప్-2 పరీక్షల ఇలా..టీఎస్పీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. అలాగే డిసెంబరు 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్షను ,మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష నిర్వహించింది. -
మానవ సేవే.. మాధవ సేవగా... మహ్మద్ నజీబ్ సేవలు!
మానవ సేవే మాధవ సేవ.. అనే నానుడిని ఒంటబట్టించుకున్నారు.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ నజీబ్. సరిగ్గా అదే తలంపుతో గత 18 ఏళ్లుగా పేదల కోసం నిరంతరాయం శ్రమిస్తూ.. నిరుపేదలకు, వలస కూలీలకు సేవలందిస్తున్నారు. తాను స్థాపించిన తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ ద్వారా పేదల కుటుంబాల్లో తలెత్తే తగాదాలను పరిష్కరిస్తూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు వలస కూలీలు, నిరుపేదలకు వైద్య సహాయం, నిత్యావసరాలు అందజేస్తున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మహ్మద్ నజీబ్ షేక్‌పేట ఫ్రెండ్స్ కాలనీలో ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం వంద కిలోల బియ్యంతో వంట చేస్తూ లేబర్ అడ్డాలు, ఆస్పత్రుల వద్ద భోజన ప్యాకెట్లు అందించారు. – గోల్కొండ నజీబ్ చిన్ననాటి స్నేహితులతో కలిసి గోల్కొండలోని షేక్ పేటలో నిరంతరాయంగా నిరుపేదలకు సేవలందిస్తున్నాడు మహ్మద్ నజీబ్. స్థానిక ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను గుర్తిస్తూ.. తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నాడు. స్థానికులకు, పేదలకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా లేబర్ అడ్డాల వద్ద ఒక్కపూట భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నాడు. కాలనీలో ప్రత్యేకంగా ఓ వంట శాలను సైతం ఏర్పాటు చేశాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం భోజన ప్యాకెట్లను అందించాడు. పలువురు బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందించాడు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల సహాయంతో స్థానికులకు వైద్య సేవలను అందించాడు. కుటుంబ కలహాలు చక్కబెడుతూ.. టోలిచౌకీలోని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రధాన కార్యాలయంలో స్థానికుల కుటుంబ తగాదాలు, భార్యా భర్తల కలహాలకు పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 15 యేళ్లగా చిన్న చిన్న తగాదాలతో విడాకులు తీసుకోడానికి తనవద్దకు వచి్చన వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వారి కలహాలకు పరిష్కారం చూపుతున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 350 మంది దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించి, వారిని ఏకం చేస్తున్నాడు. మరోవైపు నిరుపేద విద్యార్థులకు ఆర్గనైజేషన్ ద్వారా తామున్నామంటూ అండగా ఉంటూ ఫీజులకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. చదువు మధ్యలో వదిలేసిన వారిని చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి యేటా తాము 8 మంది నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుంటున్నామని, పదో తరగతి వరకూ ఉచితంగా చదువుకునేలా వారికి అండగా నిలబడుతున్నాడు. ప్రస్తుతం ఆర్గనైజేషన్ కార్యకలాపాలు తెలంగాణ జిల్లాలకు కూడా విస్తృతం చేస్తున్నట్లు నజీబ్ తెలిపారు. -
మాదాపూర్ వేదికగా హోలినేషన్ 2025 వేడుకలో కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
బీఆర్ఎస్ యువ కార్పొరేటర్ హేమ సామల వివాహ వేడుకలో ప్రముఖుల సందడి (చిత్రాలు)
-
అన్నం తినిపించే విషయమై గొడవ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన సంగిరెడ్డి నర్సింహారెడ్డి (28) విష్ణుప్రియ దంపతులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య నగర్ కృష్ణకాలనీలో నివాసముంటున్నారు. నర్సింహారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం కుమారుడికి అన్నం తినిపించే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సింహారెడ్డి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో విష్ణు ప్రియ స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా నరసింహారెడ్డి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య విష్ణుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో సాఫ్్టవేర్ ఉద్యోగి దుర్మరణం మియాపూర్: టిప్పర్ లారీని ఓవర్ టెక్ చేయబోయి స్కూటీని ఢీకొని అదుపుతప్పి బుల్లెట్ పై వెళ్తున్న సాఫ్్టవేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన రోషన్(27) మూడేళ్లుగా చందానగర్‌లో స్నేహితులతో కలిసి ఉంటూ సాఫ్్టవేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను బైక్‌పై చందానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తుండగా మదీనాగూడ దీప్తీశ్రీనగర్ కాలనీ కమాన్ సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో స్కూటీని ఢీనడంతో అతడి బైక్ అదుపుతప్పింది. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి జహరాబాను ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: కేంద్రంగానే ఉగ్ర చరిత్ర!
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకు కీలక సూత్రధారులుగా ఉండి, సోమవారం జీవితఖైదు పడిన అస్ఘర్ అలీ, అబ్దుల్ బారీ సామాన్యులు కారు. అత్యంత దారుణమైన నేరచరిత్ర కలిగిన వీరిపై నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. మీర్జా ఎస్కేప్, భారీ పేలుళ్లకు కుట్ర తదితరాలు వాటిలో ఓ మచ్చుతునకలు మాత్రమే. వీరిద్దరూ గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్‌పాండ్యా హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. అప్పట్లో ఆయనపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది సైతం అస్ఘరే అని సీబీఐ ఆరోపించింది. పాకిస్తాన్‌లోనూ ఉగ్రవాద శిక్షణ... నల్లగొండలోని దారుల్షిఫా కాలనీకి చెందిన మహ్మద్ అస్ఘర్ అలీకి జునైద్, అద్నాన్, చోటు అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు.కాశ్మీర్ కు చెందిన ముస్లిమ్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ప్రోద్భలంతో అక్కడకు వెళ్ళిన అస్ఘర్ ప్రాథమిక ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. ఆపై అక్రమంగా సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు వెళ్లిన ఇతగాడు అక్కడి ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో తుపాకులు కాల్చడం నుంచి నుంచి ఆర్డీఎక్స్తో తయారు చేసిన బాంబులను పేల్చడం వరకు వివిధ రకాలైన శిక్షణలు తీసుకున్నాడు. పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన అస్ఘర్ నల్లగొండలోని ప్యార్ çసూఖాబాగ్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ బారితో సహా మరికొందరితో ముఠా ఏర్పాటు చేశాడు. ఆ కేసుల్లో మీర్జా నిందితుడిగా... బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కర సేవకుల్ని టార్గెట్‌గా చేసుకుని నగరంలో రెండు దారుణ హత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్య గౌడ్‌ను చాదర్‌ఘాట్‌లోని మహబూబ్ కాంప్లెక్స్ సమీపంలో, అదే ఏడాది ఫిబ్రవరి 2న అంబర్‌పేట్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్ గౌడ్‌ను హత్య చేశారు. ఫసీ మాడ్యుల్ చేసిన ఈ దారుణాలకు మీర్జా ఫయాజ్ అహ్మద్ అలియాస్ ఫయాజ్ బేగ్ సూత్రధారిగా, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన ఇతడి పాత్ర దీనికి ముందూ అనేక కేసుల్లో ఉంది. పాపయ్య గౌడ్, నందరాజ్ గౌడ్లను హత్య చేసిన కేసుల్లో మీర్జా ఫయాజ్ బేగ్‌కు జీవితఖైదు పడింది. మిగిలిన కేసుల విచారణ కోసం చర్లపల్లి జైలులో ఉన్న ఇతడిని నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చేవారు. తప్పించి తీసుకువెళ్లిన ద్వయం.. మీర్జాను తప్పించడానికి అస్ఘర్, బారీ తదితరులు పథక రచన చేశారు. 1996 డిసెంబర్ 19న నాంపల్లి న్యాయస్థానం నుంచి ఎస్కేప్ చేయించారు. అస్ఘర్ ఇతడిని తనకున్న పరిచయాల నేపథ్యంలో కాశీ్మర్కు పంపి ముస్లిమ్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కలిసి పని చేసేలా చేశాడు. జైలు నుంచి ఎస్కేప్ అయిన కొన్ని రోజులకే అక్కడ జరిగిన ఓ ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో మీర్జా హతమయ్యాడు. చాలాకాలం వరకు మీర్జాను ఎస్కేప్ చేసింది ఎవరనేది రహస్యంగానే ఉండిపోయింది. 1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారీ సహా పది మంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో వీరి నుంచి మూడు కేజీల ఆర్డీఎక్స్, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు పిస్టల్స్, 40 రౌండ్లు స్వా«దీనం చేసుకున్నారు. నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి వచ్చినట్లు తేల్చారు. ఈ విచారణ నేపథ్యంలో మీర్జా ఎస్కేప్‌లోనూ అస్ఘర్, బారీల పాత్ర కీలకమని వెలుగులోకి వచ్చింది. ఐఎంఎంఎంలోనూ అస్ఘర్ పాత్ర.. ఆజం ఘోరీ అనే ఉగ్రవాది (జగిత్యాలలో 2000 ఏప్రిల్ 6న ఎన్కౌంటర్ అయ్యాడు) ఇండియన్ ముస్లిమ్ మహ్మదీ ముజాహిదీన్ (ఐఎంఎంఎం) పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. బెయిల్‌పై బయటకు వచి్చన అస్ఘర్ దీనికి సానుభూతిపరుడిగా మారి తనకంటూ ఓ ప్రత్యేక మాడ్యుల్ (గ్యాంగ్) ఏర్పాటు చేసుకున్నాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని మధ్యవర్తుల ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. బారీ తదితరులతో కలిసి రంగంలోకి దిగిన ఇతడు ఆ ఏడాది మార్చి 26న తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్ళి కాల్చి చంపాడు. స్వయంగా తుపాకీ పట్టుకున్న అస్ఘర్ ఐదు రౌండ్లు పాండ్యపై కాల్చడంతో ఆయన కన్నుమూశారు.అప్పట్లో మేడ్చల్‌లో అరెస్టు... ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న అస్ఘర్, బారీలను పట్టుకున్నాయి. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిని కింది కోర్టు దోషులుగా తేలి్చనా..గుజరాత్ హైకోర్టులో ఈ కేసు వీగిపోవడంతో 2011లో బయటపడ్డారు. ఆ తర్వాత నగరంలో వీరిపై నమోదైన కేసుల్లో కొన్ని వీగిపోవడం, మరికొన్నింటిలో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత మలక్‌పేటలోని సలీమ్నగర్లో ఓ అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. 2011 తర్వాత వీరి పేర్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. 2018లో ప్రణయ్ హత్య కేసులో అరెస్టు కావడంతో పోలీసులు, నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. హరేన్ పాండ్యా కేసును గుజరాత్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ విచారణ అనంతరం అస్ఘర్‌కు జీవితఖైదు పడింది. దీంతో 2019 ఆగస్టులో ఇతడిని సబర్మతి జైలుకు తరలించారు. -
2020: హైదరాబాద్‌లోనే మారుతిరావు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతిరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. 2020 మార్చి 7న ఖైరతాబాద్‌లో ఉన్న వైశ్య భవన్లో బస చేసిన ఆయన మరుసటి రోజు విగతజీవిగా కనిపించారు. న్యాయవాదిని కలవడానికి వచ్చి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అప్పట్లో మారుతిరావు బస చేసిన గది నుంచి పోలీసులు సూసైడ్ నోట్ సైతం స్వా«దీనం చేసుకున్నారు. మారుతిరావు తన వాహనంలో డ్రైవర్ బెల్లంకొండ రాజేష్ తో కలిసి నగరానికి వచ్చారు. 2020 మార్చి 7 సాయంత్రం 6:40 గంటలకు ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో ఉన్న ఆర్య వైశ్య భవన్ రూమ్ నెం.306లో బస చేశారు. న్యాయవాది వస్తారంటూ డ్రైవర్‌తో చెప్పిన మారుతిరావు అతడిని కారులోనే ఉండమన్నారు. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు వచ్చిన మారుతిరావు డ్రైవర్‌ను పిలిచి ఎదురుగా ఉన్న మిర్చీ బండీ నుంచి గారెలు, కారులో కొన్ని కాగితాలు తెప్పించుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తన గదిలో ఏసీని బాగు చేయించుకున్న మారుతిరావు.. లోపల నుంచి తలుపులు వేసుకుని పడుకున్నారు. మరుసటి రోజు (2020 మార్చి 8) ఉదయం మిర్యాలగూడలో ఉన్న ఆయన భార్య గిరిజ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో డ్రైవర్ రాజేష్‌కు ఫోన్ చేయగా..అతడు పైకి వెళ్లి ప్రయత్నించిన అతడు చివరకు వైశ్య భవన్ నిర్వాహకుల ద్వారా సైఫాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు గదిలోకి ప్రవేశించగా...మంచంపై విగతజీవిగా పడి ఉన్న మారుతిరావు కనిపించారు. ఆ గదిలో ఓ సూసైడ్‌నోట్ పోలీసులకు లభించింది. అందులో ‘గిరిజా క్షమించు...అమ్మా అమృత అమ్మ దగ్గరకు రా అమ్మా’ అని మాత్రమే ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అప్ప ట్లో వైశ్య భవన్ వద్దకు వచ్చిన మారుతిరావు సోదరుడు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ... వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయా లని, ఊహా కల్పనతో వార్తలు రాయవద్దని దురుసుగా మాట్లాడారు. తాజాగా ప్రణయ్ కేసులో శ్రవణ్‌కు జీవితఖైదు పడటం గమనార్హం. -
హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు...
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచి్చనట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్‌నగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్‌రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు.గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కని్పంచారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కనిపించారు.దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్‌లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది. -
IPBL: అదరగొట్టిన భారత బాక్సర్లు
ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్(IPBL)లో భాగంగా వరల్డ్ చాంపియన్స్‌తో పోటీలో భారత బాక్సర్లు అదరగొట్టారు. రానా దగ్గుబాటి బాక్సింగ్ బే- ఆంటొని పెట్టిస్ ఏపీఎఫ్సీల మధ్య జరుగుతున్న బాక్సింగ్ పోటీల్లో అక్షయ్ చహల్- సబరి జయశంకర్ సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచ చాంపియన్లు అయిన లూయీస్ ఫెలిషియానో, సెర్గియో పెట్టిస్లపై అద్భుత విజయం సాధించి.. ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.అక్షయ్-సబరి అద్బుత పోరాటం కారణంగా టీమిండియా- టీమ్ అమెరికా మధ్య సాగిన పోరు 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ యూఎఫ్‌సీ లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంటోని పెట్టిస్ మాట్లాడుతూ.. ‘‘IPBL ప్రపంచంలోని అతిపెద్ద బాక్సింగ్ లీగ్‌లలో ఒకటిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.అగ్రశ్రేణి బాక్సర్లను ఇక్కడికి తీసుకువచ్చేందుకు నేను కట్టుబడి ఉన్నాను. ఇండియాలో ఈ పోటీలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని తెలిపాడు. ఇక రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ అసమాన హోస్ట్ అని మరోసారి నిరూపితమైంది’’అని హర్షం వ్యక్తం చేశాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ఇండియాలోనే బాక్సింగ్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎదిగేలా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. పెట్టిస్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాడని.. అతడి సహకారం ఇలాగే కొనసాగుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు. -
స్ట్రోక్ థ్రోంబోలిసిస్, థ్రోంబెక్టమీపై అపోలో హాస్పిటల్స్ సదస్సు
హైదరాబాద్, మార్చి 10, 2025: అపోలో హాస్పిటల్స్ మార్చి 8 ,9, తేదీలలో స్ట్రోక్ థ్రోంబోలిసిస్ అండ్ థ్రోంబెక్టమీపై ఎస్టీఏటీ-2025 సదస్సు విజయవంతంగా నిర్వహించింది. తీవ్రమైన స్ట్రోక్ నిర్వహణలో అత్యాధునిక పురోగతి, వినూత్న ఇమేజింగ్ పద్ధతులు , క్లిష్టమైన విధానపరమైన వ్యూహాలను చర్చించడానికి ప్రముఖ అంతర్జాతీయ , జాతీయ నిపుణులను సమావేశపరిచింది.ఈ సదస్సులను తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్, అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ శ్రీ వి తేజస్వి రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్య నిపుణులు, అపోలో హాస్పిటల్స్ అసోసియేట్ డీఎంఎస్ డాక్టర్ సుబ్బారెడ్డి, అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్-న్యూరాలజిస్ట్ డాక్టర్ అలోక్ రంజన్, సీనియర్ కన్సల్టెంట్-న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హాజరయ్యారు.ప్రారంభోత్సవానికి హాజరైన ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య నిపుణులలో బాసెల్, స్విట్జర్లాండ్ కు చెందిన డాక్టర్ మారియోస్ సైకోగియోస్, బార్సిలోనా, స్పెయిన్‌కు చెందిన డాక్టర్ మార్క్ రిబో, అల్బానీ, న్యూయార్క్, యుఎస్ఏకు చెందిన డాక్టర్ నబీల్ హెరియల్, ఫిలడెల్ఫియా, యుఎస్ఏ కు చెందిన డాక్టర్ రీడ్ గూచ్, ఫిలడెల్ఫియా, యుఎస్ఏ కు చెందిన డాక్టర్ ఉస్మాన్ కోజాక్ మరియు ఇస్తాంబుల్, టర్కీ కు చెందిన డాక్టర్ యిల్మాజ్ ఓనాల్ ఉన్నారు.ఈ సందర్భంగా అపోలో గ్రూప్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తంగా వైకల్యం , మరణాలకు ఒక ముఖ్యమైన కారణంగా తీవ్రమైన స్ట్రోక్ నిలుస్తుంది . ఎస్టీఏటీ-2025 వంటి సదస్సులు ప్రపంచ నాయకుల మధ్య విప్లవాత్మక ఆలోచనలు, పద్ధతులు, అనుభవాల మార్పిడిని సులభతరం చేయడం ద్వారా స్ట్రోక్ కేర్‌ను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అపోలో ఆస్పత్రిలో స్ట్రోక్ కేర్‌కు సంబంధించిన అన్నీ రకాల చికిత్సలను అందిస్తున్నట్లు తెలిపారు.అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ శ్రీ వి తేజస్వి రావు మాట్లాడుతూ, "అపోలో హాస్పిటల్స్ వద్ద , ఆవిష్కరణ , నైపుణ్యం ద్వారా తీవ్రమైన స్ట్రోక్ కేర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాము. స్ట్రోక్ థ్రోంబోలిసిస్ థ్రోంబెక్టమీలో విప్లవాత్మక పురోగతిని చర్చించడానికి ప్రపంచ, జాతీయ నిపుణులను ఒకచోట చేర్చడానికి ఎస్టీఏటీ-2025 సమావేశం కీలకమైన వేదికగా పనిచేస్తుంది. రోగికి మెరుగైన ఫలితాలను అందించటానికి తోడ్పడనుంది’ అని అన్నారు. అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ.. స్ట్రోక్ నిర్వహణలో సకాలంలో తగిన వైద్య సేవలను అందించడం చాలా కీలకం. ఎస్టీఏటీ-2025 సమావేశం ఈ రంగంలో అవగాహన మరియు క్లినికల్ నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా చికిత్సలు , సాంకేతికతలపై చర్చలను ప్రోత్సహించడం ద్వారా, తీవ్రమైన స్ట్రోక్ కేర్‌లో కొత్త ప్రమాణాలను నిర్దేశించటానికి మరియు రోగులకు మెరుగైన ఫలితాలను నిర్ధారించడానికి మేము కృషి చేస్తున్నాము’ అని అన్నారు.ఎస్టీఏటీ-2025 సమావేశంలో యుఎస్ఏ , స్పెయిన్, స్విట్జర్లాండ్, సింగపూర్, టర్కీ వంటి దేశాల నుండి హాజరైన అంతర్జాతీయ అధ్యాపకులతో పాటు 650 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
TSPSC : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థి లాగిన్‌లో ప్రొవిజనల్ మార్కులు చూసుకునే అవకాశం ఉంది. మొత్తం 563 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు,అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా సిద్ధం చేసేందుకు కమిషన్ తుది పరిశీలన నిర్వహిస్తోంది. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.ఫలితాల విడుదల షెడ్యూల్మార్చి 10 - గ్రూప్-1 ఫలితాల విడుదల, ప్రొవిజినల్ మార్కుల వెల్లడింపు.మార్చి 11 - గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.మార్చి 14 - గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.మార్చి 17 - హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాల ప్రకటన.మార్చి 19 - ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాల విడుదల.అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన గ్రూప్-1 ఫలితాల విడుదల అనంతరం చేపట్టనున్నారు.గతేడాది అక్టోబర్‌లో మెయిన్స్తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఉమ్మడి హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసింది.హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ కేంద్రాల్లో ఐపీఎస్ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది. -
New Ration Cards: తీసివేతలకు తిప్పలే!
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్ కార్డు మంజూరు మాటేమో గానీ.. పాత కార్డులోని పేర్ల తొలగింపు ప్రక్రియకు సైతం తిప్పలు తప్పడం లేదు. వివాహ బంధాలతో కొత్తగా ఏర్పాటైన కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తల్లిదండ్రుల కుటుంబ కార్డుల్లో పేర్లు రద్దయితే కానీ, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కుటుంబం రేషన్ కార్డుల నుంచి తమ పేర్లను తొలిగించుకునేందుకు ఉరుకులు పరుగులు చేస్తున్నారు. మీ సేవ, పౌర సరఫరాల సర్కిల్, తహసీల్ ఆఫీసుల్లో ఆఫ్‌లైన్ దరఖాస్తులు సమరి్పంచి మెంబర్ డిలిషన్ కోసం రెండు మూడుసార్లు చక్కర్లు చేయక తప్పడం లేదు. సంబంధిత సిబ్బంది సైతం సిఫార్సు దరఖాస్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ.. మిగతా వాటిని పెండింగ్‌లో పడేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షన్నరకు పైగా దరఖాస్తులు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలో సుమారు రేషన్ కార్డుల్లోంచి పేర్ల తొలగింపునకు సుమారు లక్షన్నరకుపైగా ఆఫ్‌లైన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో సగానికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతున్నాయి. గ్రేటర్ మొత్తమ్మీద సుమారు పన్నెండు అర్బన్ సర్కిల్ పరిధిలో 12,34,873 కార్డులు ఉండగా.. వీటిలో 42,72,820 మంది లబ్దిదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో మరో ఐదు లక్షల కార్డులు ఉండగా.. అందులో 17 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో మొత్తమ్మీద సుమారు 10 శాతం కుటుంబాల్లోని సభ్యులు పెళ్లిళ్లతో కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయి. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండంతో కొత్త కుటుంబాలకు ఆసక్తి పెరిగింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు కుటుంబం కార్డులోని పేర్లు తొలగింపు పెద్ద సమస్యగా పరిణమించింది. కొత్త కుటుంబాల్లోని దంపతుల్దిరూ.. వారి తల్లిదండ్రుల కార్డుల్లో లబి్ధదారులుగా ఉండటంతో అందులోంచి వారి పేర్లను తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రెండు కార్డుల్లోని ఇద్దరి పేర్లు డిలిషన్ కోసం తంటాలు పడుతున్నారు. రేషన్ కార్డుల్లో అర్బన్ పరిధికి సంబంధించి డిలిషన్ ప్రక్రియ సివిల్ సర్కిల్ కార్యాలయాల్లో జరుగుతుండగా, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రక్రియ తహసీల్ ఆఫీస్‌లో జరుగుతోంది. -
భారత్ ఘన విజయం.. అభిమానంతో దద్దరిల్లిన ట్యాంక్ బండ్ (ఫొటోలు)
-
చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత కార్మికుల కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు రూ. 33 కోట్ల రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి రూ. లక్ష వరకూ రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు రుణాల మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం రుణమాఫీ జీవో విడుదల చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు 2017 వరకు రుణమాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకుల నుంచి, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ స్థాయిలో వస్త్ర వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ తయారీ రంగం కూడా ఉంది. సుమారు ఈ ఉమ్మడి జిల్లాలో సుమారు 20 వేల మంది వరకూ చేనేత కార్మికులు ఉంటారు. పోచంపల్లి, గట్టుప్పల్, పుట్టపాక, సంస్థాన్ నారాయణపురం, భువనగిరి, చండూరు, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి చీరల వ్యాపారం అధికంగా సాగుతూ ఉంటోంది. ఇక్కడ సుమారు 40 పైగా సొసైటీలు ఉండగా, వాటిల్లో వేలాది మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. -
‘మహా ప్రణాళిక’కు కసరత్తు
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధి విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో సమగ్రమైన మాస్టర్‌ప్లాన్ రూపకల్పన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వచ్చే సెప్టెంబర్ నాటికి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను విడుదల చేసే దిశగా హెచ్ఎండీఏ (HMDA) కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు కొత్తగా విస్తరించనన్న పరిధికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ కోసం మరో వారం, పది రోజుల్లో ఆసక్తి వ్యక్తీరణ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) దరఖాస్తులను స్వీకరించేందుకు నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్‌లో చేర్చాల్సిన అంశాలపై కసరత్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో రూపొందించిన హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ – 2031లో దొర్లిన లోపాలు పునరావృతం కాకుండా పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్లు ఒక అధికారి వివరించారు. 2050 వరకు హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, టౌన్‌షిప్పులు, రహదారులు, ప్రజారవాణా సదుపాయాలు, పచ్చదనం, నీటివనరులు, తదితర అంశాలను సమగ్రంగా ప్రతిపాదించేలా మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు ఆసక్తి గల అంతర్జాతీయ కన్సార్షియంల నుంచి దరఖాస్తులను కోరనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఉన్న అన్ని మాస్టర్పాల్న్లను ఈ బృహత్తర మాస్టర్‌ప్లాన్‌లో విలీనం చేయనున్నారు. ఎంసీహెచ్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, సైబరాబాద్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ప్లాన్లు విలీనం కానున్నాయి.రీజినల్ రింగ్‌రోడ్డు వెలుపల 2 కిలోమీటర్ల వరకు... హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు రీజనల్ రింగ్‌రోడ్డుకు వెలుపల 2 కిలోమీటర్ల వరకు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తారు. ట్రిపుల్ ఆర్ తరువాత ఒక కిలోమీటర్ను బఫర్‌జోన్‌గా పరిగణిస్తారు. ఆ కిలోమీటర్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం 7,527 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధి కొత్తగా 10,560 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. మొత్తం 104 మండలాలు, 1,355 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి.చదవండి: హైదరాబాద్‌కు దీటుగా ప్యూచర్ సిటీ!ఇప్పుడు ఉన్న 7 జిల్లాలకు తోడు నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ కొత్తగా చేరడంతో హెచ్ఎండీఏ పరిధిలోని జిలాల సంఖ్య 11కు చేరనుంది. అలాగే 41 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. కొత్తగా 3 మున్సిపాలిటీలు చేరనున్నాయి. ఔటర్ లోపల 28 మున్సిపాలిటీలు, ఔటర్ వెలుపల 12 మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. -
Hyderabad: నవ వధువు ఆత్మహత్య
బాలానగర్(హైదరాబాద్): నవవధువు ఆత్మహత్య(Newly Married WomanNewly Married WomanNewly Married Woman) చేసుకున్న సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్(Balanagar Police Station) పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా, తర్లా మండలం నందిగామకు చెందిన ఈశ్వరరావుతో గత ఫిబ్రవరి 6న గంటా విజయ గౌరీ (23)కి వివాహం జరిగింది. నూతన దంపతులు బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాల్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు. ఈశ్వరరావు ఉద్యోగం నిమిత్తం డ్యూటీకి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి విజయగౌరి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ ఇన్స్పెక్టర్ టి.నరసింహరాజు తెలిపారు. ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య చైతన్యపురి: ప్రేమించాలంటూ ఓ యువకుడు వేధించడంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పాతర్లపాడుకు చెందిన బీమగోని కృష్ణయ్య, మన్నెమ్మ దంపతుల చిన్న కుమార్తె గంగోత్రి (22) చైతన్యపురిలోని తన సోదరి నివాసంలో ఉంటోంది. పాతర్లపాడుకు చెందిన కేశబోయిన మహేష్ అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ గత ఆరునెలలుగా గంగోత్రిని వేధిస్తున్నాడు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పి తనకు భయంగా ఉందని వాపోయింది. తను ఎక్కడికి వెళ్లినా వెంబడించి వేధిస్తున్నాడని తెలిపింది. ఈ క్రమంలో శనివారం ఉదయం గంగోత్రి రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు పిలిచినా పలకకపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపు గడియ పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి కనిపించింది. మహేష్ వేధింపుల వల్లే గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని తండ్రి కృష్ణయ్య ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
'సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్' (2023–24) అందుకున్న సినీ స్టార్స్ (ఫోటోలు)
-
Sakshi Excellence Awards 2025: సినీ ప్రతిభకు క్లాప్స్
తెలుగు ప్రజల ప్రాథమిక వినోదం సినిమా. ప్రతి శుక్రవారం కొత్త రిలీజుకై ఎదురు చూసే ప్రేక్షకులు తమ ఇష్టాఇష్టాలతో జాతకాలు మారుస్తుంటారు. వీరిని మెప్పించేందుకు హీరో, హీరోయిన్లు, నిర్మాత–దర్శకులు అనుక్షణం కొత్త ఆలోచనలు చేస్తుంటారు. 2023 ఎన్నో ఘనవిజయాలను చూసింది. అలాగే 2024లోనూ తెలుగు సినిమా ఘన విజయాలు చూసింది... ఘనతలు సాధించింది. చంద్రమోహన్ వంటి గొప్ప నటుణ్ణి కోల్పోయింది. అందుకే చంద్రమోహన్‌కు నివాళి అర్పిస్తూ ఈ వేడుకను నిర్వహించింది ‘సాక్షి’. వేయి చిత్రాల్లో నటించిన గొప్ప నటి రమాప్రభకు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ బహూకరించడం తనను తాను గౌరవించుకోవడంగా భావిస్తోంది ‘సాక్షి’. మాతో పాటు మీరూ క్లాప్స్ కొడుతూ వేడుకలోకి రండి.‘సాక్షి’ టీమ్‌కి ధన్యవాదాలు. యాక్చువల్లీ... ఇది నాకు సర్ప్రైజ్. ఈ అవార్డుని అసలు ఊహించలేదు. నేను కాలేజీలో లెక్చరర్‌గా చేస్తూ... జాబ్ వదిలేసి సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు ... నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గురువు రామ్మోహన్రావుగారికి ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను. థ్యాంక్యూ... సార్. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి. – 2024 ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న సందర్భంగా దర్శకుడు సుకుమార్∙అవార్డు అందుకుంటున్న సుకుమార్ మా హీరో బన్నీ (అల్లు అర్జున్), నిర్మాతలు నవీన్, రవిగార్లు, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్లో నేను కొందరికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. సెట్స్‌లో నాతోపాటు ఏకధాటిగా పని చేసిన పాండు, ఆర్ట్ అసిస్టెంట్ మధు, నాతోపాటు ఐదేళ్లు వేరే సినిమా చేయకుండా పని చేసిన కూలీ గ్యాంగ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. సహ నిర్మాతలు ప్రవీణ్, సతీష్గార్లు, ప్రశాంతిగారికి థ్యాంక్స్. – ‘పుష్ప 2’కి పాపులర్ డైరెక్టర్ అవార్డు అందుకున్న సందర్భంగా సుకుమార్నా సినిమా ప్రయాణం చాలా పెద్దది. నేను ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయింది. ఈ పెద్ద ప్రయాణంలో ఐదు తరాలతో కలిసి నటించాను. అలాంటి నాకు ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి ధన్యవాదాలు. సరైన సమయంలో... సరైన వయసులో నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ భారతమ్మా. – నటి రమాప్రభ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ సందర్భంగా దివంగత చంద్రమోహన్‌గారికి నివాళి అర్పిస్తూ, మా కుటుంబాన్ని ఆహ్వానించినందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్‌కి కృతజ్ఞతలు. నేను, మా పెద్దమ్మాయి మీనా మోహన్, మా చిన్నమ్మాయి డాక్టర్ మాధవి హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా ఈ వేడుకకి హాజరు కాలేకపోయాం. మా తరఫున మా మేనల్లుడు శివలెంక కృష్ణప్రసాద్ ఈ వేడుకలో పాల్గొని, మా అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతారు. – జలంధర, చంద్రమోహన్ సతీమణిచంద్రమోహన్గారి రెండో అక్క కొడుకుని నేను. 1978లో ‘సీతామాలక్ష్మి’ సినిమా సమయంలో ఆయన వద్దకు నేను ఉద్యోగం కోసం వెళ్లాను. అప్పుడు ఆయన నా వ్యక్తిగత విషయాలు చూసుకో అన్నారు. అలా మావయ్య వద్ద చేరాను. ‘నిర్మాత కావొద్దు... టెక్నీషియన్‌గా అయినా పర్వాలేదు’ అని కూడా ఆయన అన్నారు. కానీ, నేను మాత్రం నిర్మాతగా నా తొలి సినిమానే మావయ్య, రాజేంద్రప్రసాద్‌లతో ‘చిన్నోడు పెద్దోడు’ తీశా. ఆ తర్వాత బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’తో పాటు నాలుగు సినిమాలు చేశాను. ఈ మధ్య కాలంలో ‘యశోద’ మూవీ తీశాను. చంద్రమోహన్‌గారు 1965లో ఇండస్ట్రీకి రాగా 1966లో మొదటి మూవీ చేశారు. మన తెలుగు వాళ్లే కాకుండా మిగతా భాషల్లో కూడా ఆయనకి అప్రిషియేషన్ ఉండేది. శివాజీ గణేశన్, ఎంజీఆర్గార్లతో పాటు అందరూ ఆయన్ని అభినందించేవారు. 1977–78 నుంచి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా మారి దాదాపు 160 సినిమాలు చేశారు. దాదాపు 54 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఎన్నో పాత్రలు వేశారు. మావయ్యగారి ‘సుఖ దుఃఖాలు’ మూవీ చూసి, మహానటుడు ఎస్వీ రంగారావుగారు మావయ్యతో ‘బాంధవ్యాలు’ అనే సినిమా నిర్మించారు. చంద్రమోహన్గారిలాంటి మంచి నటుడికి, మంచి వ్యక్తికి మేనల్లుడు కావడం నా అదృష్టం. మావయ్య నటనని, చిత్రసీమకు ఆయన చేసిన సేవలను పురస్కరించుకుని గుర్తింపు ఇచ్చినందుకు ‘సాక్షి’ మేనేజ్మెంట్కి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‘పుష్ప 2’ చిత్రానికి ఇది తొలి అవార్డు. ‘సాక్షి’ అవార్డుతోప్రారంభం అయింది. ఇక్కడి నుంచి ఇంకా చాలా అవార్డులు రావాలని, వస్తాయని నమ్ముతున్నాను. పదేళ్ల క్రితం ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఇదే వేదికపై ఇదే ‘సాక్షి’ అవార్డుని భారతీగారు తన గోల్డెన్ హ్యాండ్స్‌తో ఇచ్చారు. అప్పటి నుంచి మా ప్రయాణం సినిమా సినిమాకి పెరుగుతూ వస్తోంది. ‘సాక్షి’ మొదటి అవార్డుతో మొదలైన మా ప్రయాణంలో ఇప్పటికి మా మైత్రీ మూవీ మేకర్స్‌కి దాదాపు 50 నుంచి 100 అవార్డులు వివిధ సంస్థల నుంచి వచ్చాయి. అందులో జాతీయ అవార్డు కూడా ఉండటం గొప్పగా భావించే అంశం. థ్యాంక్యూ వెరీ మచ్ టు ‘సాక్షి’. ‘పుష్ప 2’ని బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు. మా హీరో అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్‌గా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్‌గారు ఇక్కడ ఉండి ఉంటే తప్పకుండా వచ్చి అవార్డు తీసుకునేవారు. ఆయన తర్వాతి సినిమా ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిద్ధం అవుతుండటం వల్ల రాలేకపోయారు. – నిర్మాత యలమంచిలి రవిశంకర్‘లక్కీ భాస్కర్’లో నా నటనని గుర్తించి ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఇది నాకు తొలి అవార్డు కావడంతో ఎక్స్ట్రా స్పెషల్. మా నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, సుమతి వంటి మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. ఈ అవార్డు నా జీవితంలో ఓ భాగం. – హీరోయిన్ మీనాక్షీ చౌదరి నాకు ఇది తొలి అవార్డు. ‘క’ సినిమాని నిర్మించిన చింతా గోపాలకృష్ణా రెడ్డిగారికి, నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకులు సుజీత్, సందీప్‌లకు ధన్యవాదాలు. ‘క’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. పీపుల్స్ ఛాయిస్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. నన్ను ఆదరించి, సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. – హీరో కిరణ్ అబ్బవరంమా ‘హను–మాన్’ సినిమానిప్రోత్సహించిన ఆడియన్స్‌కు, ఎఫర్ట్స్ పెట్టిన దర్శకుడు ప్రశాంత్, మమ్మల్ని నమ్మిన నిర్మాత నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఇలా అవార్డ్స్‌తో ప్రతిభనుప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. సుకుమార్‌గారి చేతుల మీదగా అవార్డు అందుకోవడం హ్యాపీ. నేపాల్, చైనా–టిబెట్ బోర్డర్ లొకేషన్స్‌లో మా సినిమా షూటింగ్ జరిపినప్పుడు అక్కడి వారు... ఇది ఏ సినిమా అంటే.. తెలుగు సినిమా అన్నాం. వెంటనే వాళ్లు ‘హో పుష్ప’ అన్నారు. మేం ‘పుష్ప’ టీమ్ కాదు కానీ ‘పుష్ప’ సినిమా తీసిన ల్యాండ్ నుంచి వచ్చాం అని చె΄్పాం. – హీరో తేజ సజ్జా‘క’ సినిమాకు మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత గోపాలకృష్ణా రెడ్డిగారు, మమ్మల్ని నమ్మిన కిరణ్ అబ్బవరంగారికి థ్యాంక్స్. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్. ఇది మా ఫస్ట్ అవార్డు. మాకెంతో ప్రత్యేకం. కంటెంట్‌ను నమ్మి సినిమా తీద్దామనుకున్నాం. స్ట్రాంగ్ కంటెంట్ చెబుదామనుకున్నాం... కంటెంట్‌ను నమ్మి చేసినందుకు మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చిన తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఈ అవార్డును వారికి అంకితం ఇద్దామనుకుంటున్నాం. – దర్శకులు సుజిత్ అండ్ సందీప్ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్. మా అమ్మానాన్నలకు, యూ ట్యూబ్ ద్వారా ఎంతో నేర్పించిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌కి, ఎలా సినిమా తీయాలో నేర్పించిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు. ప్రతి డెబ్యూ డైరెక్టర్ పడే కష్టాలన్నీ పడ్డాను. రైట్ స్క్రిప్ట్‌కి, రైట్ ప్రొడ్యూసర్ అవసరం అంటారు. నిహారిక కొణిదెల, ఫణి ఎడపాకగార్ల ద్వారా ఆ అవకాశం దక్కింది. ‘ఇది చిన్న సినిమా (‘కమిటీ కుర్రోళ్లు) కాదు.. ఎంత బడ్జెట్ కావాలో అంత పెడతాం’ అన్నారు. అందుకే ఈ అవార్డు నిహారిక, ఫణిగార్లకు అంకితం. – దర్శకుడు యదు వంశీ‘నాకు ఫస్ట్ క్లాస్‌లో సాంస్కృతిక విభాగంలో బహుమతి ఇచ్చారు. నాకు ఊహ తెలిశాక అది ఫస్ట్ అవార్డు కావడంతో ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు నా సినిమా (‘డ్రింకర్ సాయి’)కి హీరోగా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి థ్యాంక్స్. ఈ అవార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2025లో నా తొలి హ్యాపియెస్ట్ మూమెంట్ ఇది. – హీరో ధర్మఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు సరికొత్త కథలు రావడానికిప్రోత్సాహకంగా ఉంటుంది. దర్శకుడిగా నాకిది (‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’) తొలి సినిమా అయినప్పటికీ చాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్‌కి థ్యాంక్స్. – డైరెక్టర్ దుష్యంత్ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి థ్యాంక్స్. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని ఆదరించిన ప్రేక్షకులకూ మరోసారి ధన్యవాదాలు. – నిర్మాత ధీరజ్ మొగిలినేనిమా సినిమాకి అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి, భారతీ మేడమ్‌కి ధన్యవాదాలు. – హీరో సుహాస్వ] ూ దర్శక–నిర్మాతలకు, గీతా ఆర్ట్స్‌కి, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని సపోర్ట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్ – హీరోయిన్ ఎన్. శివాని‘హాయ్ నాన్న’ విడుదలై చాలా రోజులు గడిచిపోయాయి. కానీ, ఆ సినిమా గెలుచుకుంటున్న ప్రేమ, అవార్డులు, రివార్డులు... ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఈ మూవీని సెలబ్రేట్ చేస్తున్నందుకు ‘సాక్షి’కి, జ్యూరీ మెంబర్లకు కృతజ్ఞతలు. మా సినిమాని వివిధ విభాగాల్లో ఎంపిక చేసినందుకు, అలాగే నన్ను బెస్ట్ యాక్టర్‌గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నేను వేరే దేశంలో ఉండటం వల్ల అవార్డు ఫంక్షన్‌కి రాలేకపోయాను. – హీరో నాని‘హాయ్ నాన్న’ విడుదలై ఏడాదికి పైగా అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు అదే అభిమానం చూపిస్తుండటం అపురూపమైనది. బెస్ట్ యాక్ట్రస్‌గా ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. నేను ఫంక్షన్‌కి రానందుకు క్షమించాలి. నాని, శౌర్యువ్, బేబి కియారా, నిర్మాతలు, సంగీత దర్శకుడు... ఇలా వీరందరూ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. – హీరోయిన్ మృణాల్ ఠాకూర్‘హాయ్ నాన్న’కి ఈ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి, భారతీగారికి ధన్యవాదాలు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాం. ఫిల్మ్‌ఫేర్, ఐఫా, సైమా అవార్డులొచ్చాయి. వీటన్నిటికన్నా ఒక తెలుగు అవార్డు (సాక్షి ఎక్సలెన్స్) అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుని నా నిర్మాతలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నా... ప్రత్యేకించి నానీగారికి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఇలాంటి ఒక సున్నితమైన కథ, అందులోనూ ‘దసరా’ లాంటి సినిమా తర్వాత ఆయన ‘హాయ్ నాన్న’ని ఒప్పుకుని చేసినందుకు రుణపడి ఉంటాను. – డైరెక్టర్ శౌర్యువ్మా సినిమాకి అవార్డు ఇచ్చిన సాక్షి యాజమాన్యానికి, జ్యూరీ మెంబర్లకు థ్యాంక్స్. ‘బలగం’ అనేది పీపుల్స్ ఛాయిస్ మూవీ. ఈ సినిమా క్రెడిట్ వేణుకి దక్కుతుంది. – నిర్మాత హన్షితా రెడ్డి‘బలగం’ చిత్రానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో అవార్డు అందించిన ‘సాక్షి’వారికి థ్యాంక్స్. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మా నాన్నకి చాలా క్లోజ్. మా ఆటోమొబైల్ బిజినెస్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌ని రాజశేఖర రెడ్డిగారి చేతుల మీదుగా చేయించాలని మా నాన్న మూడు నెలలు వేచి ఉండి, ఆయన చేతుల మీదుగానేప్రారంభింపజేశారు. ఇప్పుడు మేం నిర్మించిన ‘బలగం’కి వాళ్ల సంస్థ (సాక్షి) నుంచి మాకు అవార్డు రావడం, అది కూడా మా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది. – నిర్మాత హర్షిత్ రెడ్డి‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ టెన్త్ ఎడిషన్‌లో అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకో మధురమైన అనుభూతి. ‘బేబీ’ సక్సెస్‌కు కారణమైన నా స్నేహితుడు సాయి రాజేశ్‌కు మరోసారి కృతజ్ఞతలు. – నిర్మాత ఎస్కేఎన్ ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు తీసుకోవడం, పైగా బెస్ట్ క్రిటికల్లీ ఎక్లై్లమ్డ్ ఫిల్మ్‌కు తీసుకోవడం అనేది ఇంకా సంతోషం. – దర్శకుడు సాయి రాజేశ్2023 నా లైఫ్‌లో స్పెషల్ ఇయర్. మా ‘బేబీ’ ద్వారా మాకు చాలా లవ్, ఎంకరేజ్మెంట్ దొరికింది. ‘బేబీ’ సినిమా నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్’ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఎంకరేజింగ్‌గా, మోటివేటివింగ్గా ఉంది. – హీరోయిన్ వైష్ణవీ చైతన్య ‘బలగం’ వంటి ఒక మించి కథని నమ్మి నాకు అన్ని రకాలుగా సహకారం అందించి, నన్ను ముందుకు నడిపించిన ‘దిల్’ రాజు, హన్షిత, హర్షిత్, శిరీష్గార్లకు ధన్యవాదాలు. జీవితాంతం వీళ్లందరికీ రుణపడి ఉంటాను. జీవితాంతం గుర్తుంచుకునే మరపురాని అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్... అలాగే వారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను. మా ‘బలగం’ విజయం కానీ, ఏ అవార్డు అయినా కానీ మా యూనిట్ అందరికీ దక్కుతుంది. – దర్శకుడు వేణు యెల్దండినన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి ఈ అవార్డు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)ని అంకితం ఇస్తున్నాను. అలాగే మా ‘మ్యాడ్’ ముగ్గురు హీరోలకి, నిర్మాత చినబాబుగారికి, ఎడిటర్ నవీన్ నూలిగార్లకు థ్యాంక్స్. ‘మ్యాడ్ 2’ కూడా రాబోతోంది. టీజర్ కూడా విడుదలైంది. ఈ చిత్రం కూడా తొలి భాగం అంత క్రేజీగా ఉంటుంది. దయచేసి అందరూ చూడండి. ఇది నా మొదటి అవార్డు.. చాలా ప్రత్యేకం. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. – డైరెక్టర్ కల్యాణ్ శంకర్ -
Sakshi Excellence Awards 2025: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్
సమాజం ఆర్థిక సూత్రాల పై ఆధారపడి నడుస్తున్నట్టు కనిపించినా దానికి హృదయం, స్పందన ఇచ్చేది మాత్రం సామాజిక, సాంస్కృతిక అంశాలే. ‘ఇలా మారాలి’ అని సామాజిక సేనానులు బోధ చేస్తే, ‘ఇలా వికాసం పొందాలి’ అని సాంస్కృతిక సారథులు దారి చూపుతారు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక వికాసం లేని సమాజంలో సంపద కేవలం పటాటోపం మాత్రమే. అందుకే అర్థవంతమైన సమాజం కోసం గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ నిర్వహిస్తోంది. సామాజిక రంగంలో, కళారంగంలో విశిష్ట రీతిలో పని చేస్తున్న వారికి అవార్డ్స్ ఇచ్చి గౌరవిస్తోంది. ఈ పరంపరలో 2023కు గాను ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో ఘనమైన వేడుక నిర్వహించింది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్లు, ఎడిటర్, విశిష్ట అతిథులు పాల్గొన్న వేడుక అవార్డు గ్రహీతలకు జీవితకాల అనుభూతిగా మారింది.సమాజంలో ఉన్నటువంటి అనేక మంది సేవకు గుర్తింపు రావడం అంటే సామాన్య విషయం కాదు. వారు ఆయా రంగాల్లో చేసిన సేవను గౌరవించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు. సమాజానికి సేవ చేసిన వారికి ఇలాంటి గౌరవం ఇవ్వడం అభినందనీయం. సాక్షి గ్రూప్‌నకు, ముఖ్యంగా భారతీరెడ్డి గారికి అభినందనలు.– బండారు దత్తాత్రేయ, హరియాణ గవర్నర్సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవార్డుల కార్యక్రమంతో నాకు 10 ఏళ్ల అనుబంధం ఉంది. జ్యూరీలో నన్ను భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు. అసామాన్య ప్రతిభ చూపే వారిలో ఉత్తములను ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిది. ఇందుకోసం సాక్షి టీమ్ ఎంతో కష్టపడ్డారు. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై రీసెర్చ్ చేసి పెద్ద నోట్స్ సిద్ధం చేశారు. మేం ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పేందుకు వారు పడిన కష్టం ఎంతో గొప్పది. ఎలాంటి పక్షపాతం లేకుండా అవార్డులకు ఎంపిక చేసే విధానం సాక్షిలో నాకు కనిపించిన గొప్పదనం. అవార్డులు తీసుకున్న వారందరికీ నా అభినందనలు.– శాంతా సిన్హా, జ్యూరీ చైర్పర్సన్మట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికిప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంవీధి బాలలను చేరదీసి ఆశ్రయం కల్పించి తగిన పౌష్టికాహారం అందించి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనే సమున్నత ఆశయంతో పని చేస్తోంది రెయిన్ బో హోమ్స్ప్రోగ్రాం సంస్థ్థ. దేశవ్యాప్తంగా పది నగరాల్లో ఇప్పటివరకు 14,996 మంది వీధి బాలలు, 5,557 మంది చిన్నారులు, యువతీ, యువకులకు ఆశ్రయం కల్పించింది. రెయిన్ బో హోమ్స్ ప్రోగ్రామ్ సంస్థను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.కె. అనురాధ, విద్యారంగంమట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయంప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంచదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేసి...ప్రత్యర్థిని చిత్తు చేయాలి.. అలాంటి టాలెంట్ పుష్కలంగా ఉన్న అర్జున్ చెస్‌లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. హన్మకొండకు చెందిన అర్జున్ గుజరాత్లో జరిగిన జాతీయ చాంపియన్ షిప్లో అండర్ 13 విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుని తన విజయయాత్రనుప్రారంభించారు. 2015 ఏషియన్ యూత్ చాంపియన్ షిప్లో రజతం గెలిచి తొలి అంతర్జాతీయ పతకం సొంతం చేసుకున్నారు. 2018లో 14 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి తెలంగాణ నుంచి జీఎం హోదా పొందిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. అర్జున్ ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్–స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అర్జున్ ఎరిగైసి, క్రీడలుఅడవులు అంతరించి పర్యావరణ సంక్షోభం ఏర్పడుతున్న ఈ కాలంలో అడవినే సృష్టించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి దుశర్ల సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా రాఘవపురంలో 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చేశారాయన. ఆయన కృషి ఫలితంగా లక్షల చెట్లు ఊపిరి తీసుకుంటూ ఉండగా వాటితో పాటు నెమళ్లు, జింకలు, నక్కలు, అడవి పందులు... నీడ పొందుతున్నాయి. పక్షులు, జంతువుల కోసం ఆ అడవిలోనే ఏడు చెరువులు తవ్వించిన సత్యనారాయణను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.దుశర్ల సత్యనారాయణ, పర్యావరణంభద్రాచలంకు చెందిన గొంగడి త్రిష క్రికెట్లో కొత్త తారగా అవతరించింది. ఎనిమిదేళ్ల వయసులో జిల్లాస్థాయి అండర్ 16 జట్టుకు ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద సీరిస్’ గా నిలిచింది. పన్నెండేళ్ల వయసులో హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన త్రిష బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను గెలుచుకుంది. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ లెగ్ స్పిన్నర్ ఐసీసీ అండర్–19 మహిళల టి 20 వరల్డ్ కప్–2025లో సెంచరీ చేసి రికార్డులు బ్రేక్ చేసింది. గొంగడి త్రిషను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.త్రిష, క్రీడలుఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మద్దెబోయిన మానస పుట్టుకతోనే అంధురాలు. ఇరుగు పొరుగువారి మాటలకు మానసగాని ఆమె తల్లిదండ్రులుగాని కొంచెం కూడా వెరవలేదు. డిగ్రీ వరకు చదివిన మానస తానెవరికీ తక్కువ కాదు అని పోటీ పరీక్షలపై దృష్టి సారించారు.ఇంటి వద్దనే సొంతంగా ప్రిపరేషన్ మొదలు పెట్టి గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికై తన కలను నెరవేర్చుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మానసను ‘ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మద్దెబోయిన మానస, విద్యారంగంవరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తికి పుట్టుకతో జన్యుపరమైన బలహీనత ఉంది. అయినా స్కూల్లో తోటి విద్యార్థులతో సమానంగా ఆటల్లో పాల్గొనేది. ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ రమేశ్ పారా అథ్లెట్‌గా ట్రెయినింగ్ ఇచ్చారు. ఇక ఆ తరువాత మొదలైంది పతకాల వేట. 2024లో జపాన్ లో జరిగిన పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో 400 మీటర్ల టి20 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకోవడమే కాకుండా ప్రపంచ రికార్డును నెలకొల్పారు దీప్తి. దీప్తి జీవాంజిని స్పోర్ట్స్ కేటగిరిలో ‘యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.జీవాంజి దీప్తి, క్రీడలుపెద్ది శంకర్ గౌడ్ ‘రెడీ టు సర్వ్ ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి 2011లో వనస్థలిపురంలో ఒక ఓల్డేజ్ హోమ్ప్రారంభించారు. ఏ ఆసరా లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఉచిత భోజన, వైద్య సేవలు అందచేస్తోంది ఈ సంస్థ. ప్రముఖ హాస్పిటల్స్ యాజమాన్యాలను ఒప్పించి అక్కడి వైద్యుల చేత వృద్ధులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మెడిసిన్స్ ఉచితంగా ఇస్తున్నారు. పెద్ది శంకర్ గౌడ్‌ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ సోషల్ సర్వీస్’ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.పెద్ది శంకర్, సామాజిక సేవమద్దినేని ఉమామహేష్.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్న ఇరవయ్యేళ్ల షూటర్. స్వస్థలం విజయవాడ. బెంగుళూరులో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో గోల్డు మెడల్ సాధించాడు. 2022లో జర్మనీలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్‌లో, 2024లొ ఢిల్లీలో జరిగిన FISU వాల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్ షిప్ మెన్స్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఉమా మహేష్‌ను ‘స్పోర్ట్స్ కేటగిరిలో యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.మద్దినేని ఉమా మహేష్, క్రీడలుఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్ కుమార్ చందన, నాగభరత్ కలిసి 2018లో స్కైరూట్ ఏరోస్పేస్నుప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ కంపెనీ. అంతరిక్షాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో విక్రమ్–సిరీస్ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తోంది స్కైరూట్. ఈ కంపెనీలో 350కు పైగా ప్రతిభావంతమైన అంతరిక్ష నిపుణులు పని చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలను సరళతరం చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీని ‘ఎక్సలెన్స్ ఇన్ స్టార్టప్ అవార్డు’తో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్.పవన్ చందన, నాగ భరత్, స్టార్టప్తలసీమియా... చిన్నారుల పాలిట శాపమైన ఈ వ్యాధికి వైద్యం చేయించలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు పొద్దుటూరి అనిత. ఖమ్మంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూనే తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం సంకల్ప పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ తలసేమియా గురించి... రక్త దానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నారు. పొద్దుటూరి అనితను ‘ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అనితప్రొద్దుటూరి, సామాజిక సేవచంద్రకాంత్ సాగర్ పుట్టుకతోనే 90 శాతం శారీరక లోపంతో జన్మించారు. అయినా ఏనాడూ కుమిలిపోలేదు. వీల్‌చైర్ నుంచే 2019లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేసి పర్యావరణహిత సంచులు, సర్జికల్ మాస్కులు, పెన్నులు, పెన్సిళ్లు తయారు చేస్తూ పది మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వారి టర్నోవర్ 25 లక్షలు. చంద్రకాంత్ సాగర్ని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీ’లో స్పెషల్ జ్యూరీ రికగ్నేషన్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.చంద్రకాంత్ సాగర్, చిన్న/మధ్య తరహా వాణిజ్యండొక్కరి రాజేశ్ గుండె ధైర్యం, త్యాగం దేశాన్నే కాదు తెలుగు వారిని కూడా గర్వపడేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్ 2018లో ఆర్మీలో చేరి తండ్రి కలను నిజం చేశారు. మూడేళ్లలోనే నాయక్ స్థాయికి ఎదిగారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చుపెట్టేవారు. 2024 జూలై 15న జమ్ము కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందారు. వీర జవాన్ డొక్కరి రాజేశ్‌కు సాక్షి ఎక్సలెన్స్ – పొస్తమస్ అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు అందించింది సాక్షి మీడియా గ్రూప్.డొక్కరి రాజేష్ తల్లిదండ్రులు, అమర సైనికుడు→పురస్కార గ్రహీత చంద్రకాంత్‌తో భారతీరెడ్డి ∙‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధులతో ముఖ్య అతిథి బండారు దత్తాత్రేయడొక్కరి రాజేష్ తల్లిదండ్రులకు పురస్కారం అందిస్తూ... -
‘ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలి’
హైదరాబాద్: కోఠి వుమెన్స్ కాలేజ్ ను యూనివర్శిటీగా మార్చడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ(Chakali Ilamma Womens University)గా పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,. దొరలపై, నిజాములపై పోరాడిన చాకలి ఐలమ్మ.. చరిత్రలో తనకంటూ పేజీ లిఖించుకున్నారన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా ఈరోజు(శనివారం) అక్కడకు విచ్చేసిన సీఎం రేవంత్(Revanth Reddy).. నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ..ఈ గొప్ప చరిత్ర కల్గిన మహిళ పేరును ఒక యూనివర్శిటీకి పెట్టామన్నారు. వందేళ్ల చరిత్ర కల్గిన చరిత్ర ఈ మహిళా కళాశాలదని, దానిని యూనివర్శిటీగా మార్చి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీగా నామకరణం చేశామన్నారు. వందేళ్ల క్రితం ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల.. నేడు ఏడువేల మందితో యూనివర్శిటీగా రూపాంతరం చెందిందన్నారు. దీనికి ఐదు వందల కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలన్నారు సీఎం రేవంత్. మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, అలానే స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆడ బిడ్డలు వంటిళ్లు కుందేళ్లు కాదని, వారు వ్యాపారవేత్తలుగా రాణించాలనేది తన ఆశయమన్నారు. -
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ దేశ భవిష్యత్ ఎజెండా: కిషన్ రెడ్డి
హైదరాబాద్: వన్ నేషన్ - వన్ ఎలక్షన్(One Nation-One Election) అనేది దేశ భవిష్యత్ ఎజెండా అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ఇది బీజేపీ ఎజెండా కాదని, దేశ భవిష్యత్ ఎజెండా అని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్సర్, చంద్రశేఖర్ తివారీలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా తెలంగాణలో జరిగాయి. రెండు సంవత్సరాలుగా ఎన్నికల కోసమే రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రధాన మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి వస్తుంది. వికసిత భారత్ కోసం కృషి చేయాల్సిన సమయం.. ఎన్నికల కోసం వెచ్చించాల్సి వస్తుంది. ఎన్నికల కోసం సమయం వృథా అవుతోంది. అభివృద్ధికి అడ్డంకిగా ఎన్నికలు మారుతున్నాయి. ప్రతీసారి ఎన్నికల పేరు మీద రాజకీయ పార్టీల సమయం వృథా అవుతుంది. తెలంగాణలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై రాజకీయాలకు అతీతంగా చర్చలు పెట్టాలి. స్వచ్చంధ సంస్థలతో విద్యార్థులతో, యువతతో పార్టీతో సంబంధం లేకుండా సంతకాలు సేకరణ చేయాలి. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనేది బీజేపీ(BJP) ఎజెండా కాదు... దేశ భవిష్యత్ ఎజెండా’ అని ఆయన పేర్కొన్నారు. -
లేడీస్ బ్యాంక్ ఎక్కడుందో తెలుసా?
సనత్‌నగర్: ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాదు.. కుటుంబాన్ని నడిపించడంలోనూ మహిళల పాత్ర ఎనలేనిది. ఓ వైపు ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ.. మరోవైపు ఉద్యోగ విధులను బాధ్యతాయుతంగా చేపడుతున్న మహిళలు కోకొల్లలు. అయితే అందరి ఆర్థిక అవసరాలు తీర్చే బ్యాంకింగ్ రంగంలోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే నగరంలోని సుందర్‌నగర్ బ్రాంచ్‌లో మాత్రం నూటికి నూరు శాతం మహిళా ఉద్యోగులే ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. క్యాషియర్ దగ్గర నుంచి మేనేజర్ వరకూ అందరూ మహిళామణులే విధులు నిర్వహిస్తుండడంతో దీనికి లేడీస్ బ్యాంక్‌గా ముద్ర పడింది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!2023 డిసెంబర్లో మేనేజర్‌గా సునీత బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని పోస్టుల్లోనూ మహిళలే భర్తీ అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో రమ్య, శృతి, సృజన, లక్ష్మీ, జ్యోతిర్మయి, ధీరజ తదితర మహిళా ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ.. ఖాతాదారులకు ఎంతో ఓపిగ్గా సేవలందిస్తున్నారు. -
అఖిలపక్ష ఎంపీల సమావేశంలో కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్ లో అఖిలపక్ష ఎంపీల సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28 అంశాలపై చర్చ జరిగినట్లు భట్టి తెలిపారు.‘కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలపై చర్చించాం. రాష్ట్రానికి రావాల్సిన అంశాలను కేంద్రం నెరవేర్చాలని కోరుతూ ప్రతిపాదనలు ఇప్పటికే ఇచ్చాం మళ్ళీ ఇస్తాం. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలపై చర్చించాం. కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించాం.. సమావేశానికి రావాలని బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానించినా రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. విభజన చట్టం నుండి రావాల్సిన రాష్ట్ర హక్కుల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం నుండి ఎంపీల అందరికీ వివరాలు పంపిస్తాం.బీఆర్ఎస్ ఆనాడు చేయాల్సిన ప్రయత్నం సరిగా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక కొంచెం ఒత్తిడి పెంచాం. పార్లమెంట్ లో కేంద్రం మీద ఒత్తిడి చేయాలని మ ప్రయత్నం. కేంద్రం నుండి రావాల్సిన నిధులు..ప్రాజెక్టులు అందాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలి. ఇంకో సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ చెప్తం. ముందే సమాచారం ఇస్తాం. అప్పుడైనా బీజేపీ..brs వాళ్ళు కలిసి వస్తారు. కేంద్రం కి ఇచ్చిన లేఖలు..సమాచారం బుక్ లెట్ గా రూపొందించాం’ అని భట్టి పేర్కొన్నారు.నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయంతెలంగాణ ప్రభుతవం ఏర్పాటు చేసిన అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించడం లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు’ అని ఓవైసీ అన్నారు. -
Hyderabad: ఆస్తి పన్ను బకాయి వడ్డీలపై 90% మాఫీ
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తిపన్ను భారీ బకాయిదారులకు శుభవార్త. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీల మొత్తం భారీగా పేరుకుపోయిన వారి సదుపాయార్థం ప్రభుత్వం వన్ టైమ్ స్కీమ్ (ఓటీఎస్)గా పేర్కొంటూ 90 శాతం మాఫీతో రాయితీ సదుపాయం కల్పించింది. దీంతో.. ఈ మార్చి నెలాఖరుకు ముగియనున్న 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిల వడ్డీల్లో పది శాతం, అసలు చెల్లించేవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు కమిషనర్ ఇలంబర్తి రాసిన విజ్ఞప్తి లేఖకు స్పందించిన ప్రభుత్వం ఈ రాయితీ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ.2 వేల కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.1,540 కోట్లు వసూలైంది. వడ్డీ మాఫీ రాయితీ వర్తించే వారి నుంచి రావాల్సిన బకాయిలు దాదాపు రూ.5 వేల కోట్లున్నాయి. రాష్ట్రప్రభుత్వం గతం సంవత్సరం, అంతకుముందు సైతం ఈ సదుపాయాన్ని కల్పించడం తెలిసిందే. భారీగా బకాయిలు పేరుకుపోయిన వారి నుంచి కనీసం రూ. 500 కోట్లయినా వసూలవుతాయని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే వడ్డీలతో సహా ఆస్తిపన్ను చెల్లించిన వారికి సైతం ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. వారు చెల్లించిన మొత్తాన్ని వారి రాబోయే ఆస్తిపన్ను చెల్లింపులో అడ్జస్ట్ చేయనున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. -
Hyd: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీ మదీనా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘన్సీ బజార్ లోని హోల్ సేల్ క్లాత్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. ఆ ఐదంతస్తుల భవనంలో చిక్కుకున్న వారిని రక్షించే యత్నం చేస్తున్నారు. -
హైదరాబాద్‌కు దీటుగా ప్యూచర్ సిటీ!
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు దీటుగా నాలుగో నగరం ఆవిష్కృతం కాబోతోంది. ఇటు శ్రీశైలం, అటు నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఉన్న ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలతో సుమారు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (future city urban development authority) పేరుతో మరో అద్భుత నగరం ఆవిష్కరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేసింది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో హెచ్ఎండీఏ (HDMA) పరిధిలో ఉన్న 36 గ్రామాలను కూడా కొత్త గా ఏర్పాటు చేసే ఎఫ్డీసీఏలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది.ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి కోసం కొత్తగా 90 పోస్టులను సృష్టించడమే కాకుండా, వాటి భర్తీకి ఆమోదం కూడా తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపనతో ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆర్ఆర్ఆర్ (RRR) వరకు నిర్మించతలపెట్టిన 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ (రతన్‌టాటా) రోడ్డుకు భూసేకరణ చేపట్టింది. తొలి దశలో 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు కేటాయించింది. అదే విధంగా రెండో విడతలో 22.30 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రూ.2,365 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.హెచ్ఎండీఏ పరిధిని పెంచుతూ మంత్రివర్గం ఆమోదంహైదరాబాద్ మహా నగర పరిధి విస్తరణకు గురువారం మంత్రివర్గం (Telangana Cabinet) ఆమోద ముద్ర వేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు పెరగనుంది. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చ.కి.మీ వరకు పెరగనుంది. ఇప్పుడు 70 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, మరో 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడం వల్ల మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, సుమారు 1400కు పైగా గ్రామాలతో హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరగనుంది.హెచ్ఎండీఏ పరిధి పెరగడం వల్ల ట్రిపుల్ ఆర్ పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్పుల నిర్మా ణం జరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా స్తబ్దత నెలకొన్ని ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు సైతం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అంచనా. చదవండి: మల్కాజిగిరి రైల్వే స్టేషన్ న్యూ లుక్ అదరిందిఔటర్రింగ్రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 11 జిల్లాలకు పరిధిని పెంచడం వల్ల నల్లగొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి. -
హైదరాబాద్‌లో మహిళా దినోత్సవ సంబరాలు (ఫొటోలు)
-
మల్కాజిగిరి రైల్వే స్టేషన్ న్యూ లుక్ అదిరింది
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి రైల్వేస్టేషన్ (Malkajgiri railway station) పునరభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగరానికి తూర్పు వైపున చర్లపల్లి తర్వాత సకల సదుపాయాలతో మల్కాజిగిరి వినియోగంలోకి రానుంది. ప్రధాన ముఖద్వారంతో పాటు స్టేషన్ విస్తరణ, ప్రత్యేక విశ్రాంతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ పథకం (amrut bharat scheme) కింద సుమారు రూ.27.61 కోట్లతో మల్కాజిగిరి అభివృద్ధి పనులను చేపట్టారు. ఇప్పటి వరకు 60 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మిగతా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.సబర్బన్ రైళ్లతో పాటు పలు దూర ప్రాంత రైళ్లకు మల్కాజిగిరిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ప్రయాణికుల రాకపోకలకు ప్రధాన కేంద్రంగా ఉన్న మల్కాజిగిరి స్టేషన్లో పునరభివృద్ధి వల్ల విశాలమైన కాన్కోర్స్, విశ్రాంతి గదులు, ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. అలాగే.. దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ర్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సబర్బన్ గ్రేడ్–3 కేటగిరీకి చెందిన మల్కాజిగిరి స్టేషన్ నుంచి ప్రతి రోజు 2500 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఏటా రూ.5.48 కోట్ల ఆదాయం లభిస్తుంది. ప్రతి రోజు 27 జతల రైళ్లు మల్కాజిగిరిలో ఆగుతాయి.పునరభివృద్ధి పనులు ఇలా.. మల్కాజిగిరి రైల్వేస్టేషన్ భవనం ముఖద్వారం అభివృద్ధి ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి)తో పాటు 3 లిఫ్టులు మరో 3 ఎస్కలేటర్లు. పెరగనున్న ప్లాట్‌ఫామ్ ఉపరితలం ఎత్తు. ప్లాట్‌ఫామ్‌పై అదనపు పై కప్పు ఏర్పాటు. ఇప్పటి వరకు టాయిలెట్ బ్లాకుల నిర్మాణం పూర్తయింది. వెయిటింగ్ హాల్ అభివృద్ధి చేశారు. వాహనాల పార్కింగ్తో పాటు పచ్చదనం విస్తరణపై ప్రత్యేక దృష్టి. ప్రయాణికులను ఆకట్టుకొనేలా కళలు, సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో 40 స్టేషన్లు. చదవండి: పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఎల్ఆర్ఎస్ రాయితీ -
హైదరాబాద్‌లో అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శన: ఎన్ని రోజులంటే..
మార్చి 7, 2025, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారా హిల్స్‌లోని తాజ్ కృష్ణలో హైదరాబాద్‌లో అతిపెద్ద వెడ్డింగ్, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభమైంది.ఈ ప్రదర్శన కార్యక్రమానికి.. PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో ప్రతీక్ జైన్, చక్రపాణి, పాండు గౌడ్, ఇతర ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. మార్చి 7న ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఆభరణాల ప్రదర్శనలో 20,000 కంటే ఎక్కువ PMJకు చెందిన హ్యండ్ మేడ్ డిజైనర్ ఆభరణాలను ప్రదర్శిస్తారు.వివాహ ఆభరణాలు, హాఫ్ సారీ ఆభరణాలతో పాటు.. ఈ ప్రదర్శనలో రోజువారీ దుస్తులు, ఫెస్టివల్ క్రియేషన్లు కూడా ప్రదర్శించనున్నారు. ఇవి ప్రత్యేక సీజన్లకు మాత్రమే కాకుండా ఆఫీసు, పార్టీలతో పాటు సాధారణ దుస్తులకు కూడా అనుకూలంగా ఉంటాయి.ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన.. బ్యూటీ డిజైన్లు ఉంటాయి. ఇవి కాలాతీత సంప్రదాయాన్ని సమతుల్యం చేయడంతో పాటు ఫ్యాషన్ డిజైన్లను ప్రతిబింభిస్తున్నాయి. వజ్రాలు, బంగారం, పోల్కీ, సాలిటైర్లలో విస్తృత శ్రేణి డిజైన్లతో.., ఈ ప్రదర్శనలో సాంప్రదాయ డిజైన్లు మొదలు ఆధునిక హంగుల వరకు సమకాలీన సౌందర్యంతో అలరిస్తున్నాయి. -
హైదరాబాద్ పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందనను పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మిన వందన.. నలుగురు బ్రోకర్లకు నలుగురు పిల్లలను విక్రయించింది. అహ్మదాబాద్‌కు చెందిన వందనను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. వందన.. ఆసుపత్రుల నుంచి, రోడ్లపై చెత్త ఏరుకునే వారి పిల్లలను అపహరించినట్లు తమ విచారణ తేలినట్లు పోలీసులు వెల్లడించారు. పేద తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా పిల్లలను కొనుగోలు చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. వందనను 5 రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరారు. -
పొద్దున పొగమంచు.. మధ్యాహ్నం ఎండ దంచు!
హైదరాబాద్: నగర శివారు ప్రాంతాల్లో ఉదయం 7 గంటల వరకు పొగ మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. మసక చీకటి అలుముకోవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని మరీ వెళ్తున్నారు. కాగా.. ఉదయం 10 గంటల దాటిదంటే చాలు సూరీడు సుర్రుమంటున్నాడు. గురువారం శివారులో.. నగరంలో కనిపించిన ఈ చిత్రాలు పొద్దున పొగమంచుకు.. పగలు ఎండ వేడిమికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. – సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
మద్యం మత్తులో యువతుల హుల్ చల్
-
పాతబస్తీ బహదూర్‌పురాలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బహదూర్‌పుర క్రాస్ రోడ్డులో స్థానికంగా ఉన్న లారీ మెకానికల్ వర్క్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదం ధాటికి పక్కనే మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. అయితే, అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. -
‘సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం.. తెలంగాణ సమాజానికి అంకితమన్న కిషన్ రెడ్డి.. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.‘పదేళ్లు అధికారంలో ఉంటామంటున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో కర్రకాల్చి వాత పెట్టారు. మా సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి కావొచ్చాయి. రానున్న రెండు నెలల్లో అన్ని కమిటీలు పూర్తి చేసుకుంటాం. రాష్ట్రంలో పూర్తి బలోపేతం దిశగా పని చేస్తాం. అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున అడుగడుగునా ప్రశ్నిస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శాసన సభ, శాసన మండలిలో వినిపిస్తాం. త్రిశూలం మాదిరి మండలిలో ముగ్గురు సభ్యులు బీజేపీకి ఉన్నారు . కార్యకర్తల మీద కేసులు, కుట్రలు చేసినా బీజేపీ గెలిచింది. ఈ విజయంతో మేమేమి అతి ఉత్సాహం చూపించడం లేదు, మా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రభుత్వం మీద మరింత పోరాడాలని, ప్రశ్నించాలని బాధ్యత పెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో వ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది బీజేపీ బలపడి తెలంగాణను రక్షించాలి. సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం. రెఫరెండం అని ఎవరు అన్నారో వాళ్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ప్రజల మద్ధతు, ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్ల, ఉద్యమకారుల సపోర్టుతో గెలిచాం. ఆ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్సే కలిసాయి కానీ మేము ఎప్పుడు ఎవరిని కలవలేదు. ఎవరిని కలిసే ప్రసక్తే కూడా లేదు. సమస్యలపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం . పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వచ్చిందో అదే రిపీట్ అవుద్ది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఓడించి తీరుతాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడమే మా నెక్స్ట్ టార్గెట్’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. -
పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఎల్ఆర్ఎస్ రాయితీ
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి ఫీజు చెల్లిస్తేనే 25 శాతం రాయితీ లభిస్తుందని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు ప్రో–రాటా ఓపెన్ స్పేస్ చార్జీలను కూడా చెల్లించిన వారికి రాయితీ వర్తిస్తుందన్నారు. బుధవారం హెచ్ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో బీఆర్కే భవన్లో లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్టీపీ), ఆర్కిటెక్ట్‌లకు ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్ (Workshop) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నిషేధిత జాబితాలో లేని, బఫర్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలు తదితర ప్రాంతాల్లో లేని ప్లాట్లకు ఆటోమేటిక్‌గా ఎల్ఆర్ఎస్కు అనుమతి లభిస్తుందని చెప్పారు. చెరువులు, నీటి వనరులు తదితర ప్రాంతాలకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు మాత్రం రెవెన్యూ, నీటిపారుదల శాఖ అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. ఎల్ఆర్ఎస్ అర్హతలేని స్థలాలపై చెల్లించిన ఫీజులో 90 శాతం రీఫండ్ (Refund) అవుతుందన్నారు. 10 శాతం మాత్రం ప్రాసెసింగ్ కోసం తీసుకుంటామని చెప్పారు. స్థలాల క్రమబద్ధీకరణను పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి త్వరలోనే ఎల్ఆర్ఎస్ (LRS 2020) జారీ ప్రక్రియను పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు కమిషనర్ వివరించారు.చదవండి: ఎల్ఆర్ఎస్కు ఐదంచెల ‘చెక్‌లిస్ట్’ఎల్ఆర్ఎస్పై ఎలాంటి సందేహాలు ఉన్నా హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్ 18005998838 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, రాజేంద్రప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక్రిశాట్ నూతన డైరక్టర్ జనరల్‌గా డా.హిమాన్షు పాఠక్ బాధ్యతలు
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ సమశీతోష్ణ మండల ప్రాంత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన డా.హిమాన్షు పాఠక్ బాధ్యతలు స్వీకరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన ఆయన.. తాజాగా ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు తీసుకునే క్రమంలో ఇక్రిశాట్ హిమాన్షు పాఠక్‌కు సాదర స్వాగతం పలికింది.మొట్టప్రాంతాల వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన డాక్టర్ హిమాన్షూ పాఠక్ దేశంలోనే పేరెన్నికగన్న వ్యవసాయ శాస్త్రవేత్త. నేల, వ్యవసాయ రసాయనాలు, మొక్కలు ఎదుర్కొనే ఒత్తిళ్ల గురించి విసృ్తత పరిశోధనలు చేసిన ఈయన 1986లో బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి వ్యవసాయంలో బీఎస్సీ విద్యనభ్యసించారు.భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)లో సాయిల్ సైన్స్ ఎమ్మెస్సీతోపాటు పీహెచ్డీ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్‌గా, ఐసీఏఆర్ జాతీయ వరి పరిశోధన సంస్థ (కటక్) డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబయటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ (బారామతి) డైరెక్టర్‌గానూ పనిచేశారు. యూకేలోని ఎస్సెక్స్ యూనివర్శిటీ, జర్మనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటరాలజీ అండ్ క్లైమెట్ రీసెర్చ్‌లలో విజిటింగ్ సైంటిస్ట్‌గా పని చేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని మెట్టప్రాంతాల చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కోసం పరిశోధన, వ్యవసాయ విధానాలను రూపొందించడంలో డాక్టర్ పాఠక్‌ది కీలకపాత్ర. -
International women's day 2025: ఈ నెల 9న రన్ ఫర్ హర్
మాదాపూర్: మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివైబ్ సీఈవో రఘవీణసజ్జ తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం రన్ ఫర్ హర్ పేరిట పరుగు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన రన్‌ఫర్ హర్ కార్యక్రమాన్నినిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రన్‌కు సంబందించిన బ్రోచర్, టీషర్టు, మెడల్స్‌ను ఆవిష్కరించారు. ఇందులో 3కె, 5కె, 10కె విభాగంలో ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీ పార్కు వద్ద పరుగును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 200 మందికి పైగా వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొననున్నట్టు తెలిపారు.డబుల్స్ డైవ్ చాలెంజ్‌కు పదేళ్లు సాక్షి, సిటీబ్యూరో: సింక్రోనీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘డబుల్స్ డైవ్ చాలెంజ్’ పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సింక్రోనీ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుక నిర్వహించారు. నగరంలోని నోవోటెల్ హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సింక్రోనీ సంస్థకు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ‘డబుల్స్ డైవ్ ఛాలెంజ్’లో భాగంగా.. ఉద్యోగులు పేద విద్యార్థుల విద్యకు అవసరమైన వనరులను రూపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు సహకారం అందిస్తారని సింక్రోనీలో ఇ–చాట్ వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ రీజినల్ ఎంగేజ్మెంట్ హబ్ లీడర్ రాజ్ కోలా తెలిపారు. యూ అండ్ ఐ ట్రస్ట్ ప్రయత్నంలో భాగంగా హ్యాండ్‌మేడ్ బుక్మార్క్లు, ఆకర్షణీయమైన పద శోధన మెటీరియల్స్‌తో పాటు విజ్ఞాన అంశాలను పెంపొందించే చాట్బోర్డులు, పుస్తకాలను అందిస్తామన్నారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తామని, ఇందులో సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ తదితర అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక జట్టుగా పదేళ్ల పాటు కృషి చేయడం అభినందనీయమని వివరించారు. మహిళామణుల ఆరోగ్యం కోసం..సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి, జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రారంభించారు. వంద మందికిపైగా మహిళా ఉద్యోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వీరికి బీపీ, షుగర్, ఈసీజీ, కంటి చూపు, దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు డా.ఎం.మాధవి, ఫైనాన్స్ సీజీఎం కేదారేశ్వరి, జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజ, జనరల్ సెక్రటరీ బిల్కిస్ భాను తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ ఫర్ హోప్ సామాజిక మార్పు కోసం కళను సాధనంగా మార్చాలనే సందేశంతో హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ‘ఆర్ట్ ఫర్ హోప్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా 50 మంది ప్రతిభావంతులైన కళాకారులను ఎంపిక చేస్తున్నామని, వీరికి రూ.60 లక్షల మొత్తం గ్రాంట్‌గా అందిస్తున్నామన్నారు. ఎంపికైన చిత్రకారుల కోసం దేశ రాజధానిలో భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. -
హలో హలీమ్.. చలో తినేద్దాం..
హైదరాబాద్: నగరంలో రంజాన్ మాసం అంటే ఆధ్యాత్మికతకు నెలవు. అయితే రుచుల ప్రియులకు అది హలీమ్‌కు కొలువు. రద్దీ బజార్ల నుంచి సందు గొందుల దాకా తినుబండారాల స్టాల్స్ నుంచి లగ్జరీ ఫైన్‌డైనింగ్ రెస్టారెంట్ల వరకు, ఎందెందు వెదకినా.. అందందే హలీమ్ ఘుమఘమలు గుబాళిస్తూ ఉంటాయి. నగరవాసులకు మాత్రమే కాదు విదేశాలకు సైతం ఎగుమతి అయ్యే సిటీ హలీమ్‌ను అందించడంలో స్పెషల్‌గా నిలవాలని తయారీదారులు పోటీపడుతుంటారు. కొందరు తమ సంప్రదాయ తయారీ పద్ధతులకు కట్టుబడి ఉంటారు, మరికొందరు సమకాలీన రుచులతో ప్రయోగాలు చేస్తారు. పలువురు ఫుడ్ లవర్స్‌ను ఫ్యాన్స్‌గా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఆదరణ పొందిన టాప్ 10 హలీమ్ స్పాట్స్ విశేషాలివి.. భలే ‘సర్వీ’స్.. ప్రముఖ రెస్టారెంట్.. సర్వి గత కొంతకాలంగా అత్యంత ఆదరణ పొందుతున్న హలీమ్‌కు కేరాఫ్‌గా ఉంది. ఈసారి చికెన్ 65, ఉడికించిన గుడ్డు, జీడిపప్పు, క్రీమ్‌లతో కూడిన ప్రత్యేక ఇరానీ హలీమ్‌ను అందిస్తున్నారు. మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, మాదాపూర్, సికింద్రాబాద్‌లలో సర్వి రెస్టారెంట్స్ ఉన్నాయి. ‘వజ్రం’లా.. హోటల్ సిటీ డైమండ్ హలీమ్ ప్రియుల ఫేవరెట్ ప్లేస్‌గా పేరొందింది. నెయ్యితో తయారైన వీరి హలీమ్ సుగంధ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. దీనిని సంప్రదాయ భట్టిలో వండుతారు. మెహదీపట్నంలో సిటీ డైమండ్ ఉంది. హుషార్.. పెషావర్.. ప్రత్యేక టాపింగ్స్ లేని హలీమ్‌ను ఇష్టపడే వ్యక్తులకు, పెషావర్ సరైన ప్లేస్. గత కొన్ని సంవత్సరాలుగా సువాసన గల హలీమ్‌తో హైదరాబాదీలను ఆకట్టుకుంటోన్న పెషావర్ లక్డీకాపూల్, మలక్‌పేట్‌లో ఉంది. వహ్వా.. అని‘పిస్తా’.. నగరవాసులు అత్యంత ఇష్టపడే పిస్తా హౌస్ ప్రస్తావన లేకుండా హైదరాబాద్ హలీమ్ పండుగ ఉండదు. ప్రతి ఏటా మాంసం, మసాలాతో కూడిన హలీమ్‌తో తనదైన రుచిని పిస్తా హౌస్ అందిస్తుంది. నగరంలో దాదాపు ప్రతీ ప్రధాన ఏరియాలో పిస్తా హౌస్‌లు ఉన్నాయి. మది దోచే.. మందార్ అచ్చమైన సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి వండే హలీమ్‌కు మందార్ పేరొందింది, కాసింత ఇంటిశైలి రుచిని ఇష్టపడేవారికి కరెక్ట్ ప్లేస్. ఈ హలీమ్‌ను రుచి చూడాలంటే టోలీచౌకిలోని మందార్ను సందర్శించాల్సిందే. ట్రిపుల్ ‘ఫై’న్.. ఫ్యూజన్ హలీమ్‌కు ప్రసిద్ధి చెందింది కేఫ్ 555.. చికెన్ 65, నల్లి ఘోష్్ట, తలవా ఘోష్్ట, ఉడికించిన గుడ్డు లేదా క్రీమ్ వంటి విభిన్న టాపింగ్స్‌తో వెరైటీ రుచులను అందిస్తుంది మాసాబ్ ట్యాంక్‌లో ఉన్న ఈ కేఫ్. సుభాన్.. మహాన్.. ఉస్మానియా బిస్కెట్ల సృష్టికర్త సుభాన్ బేకరీ రెండేళ్ల క్రితం హలీమ్ వ్యాపారంలో అడుగు పెట్టింది. స్వల్పకాలంలోనే నగరవాసుల మనసులను గెలుచుకుంది. నాంపల్లి, అత్తాపూర్ ప్రాంతాలలో ఈ బేకరీ ఉంది. గ్రిల్.. భారీ థ్రిల్.. బాహుబలి హలీమ్‌తో ప్రత్యేకంగా గుర్తింపు పొందింది గ్రిల్(3 ప్లేట్ల హలీమ్, ఉడికించిన గుడ్లు, చికెన్ 65, పత్తర్ కా ఘోష్ట్, నల్లి, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదం క్రీమ్)తో కూడిన హలీమ్‌లను వడ్డిస్తూ ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ హలీమ్ టేస్ట్ చేయాలంటే ఛలో సికింద్రాబాద్.మటన్కా.. బాద్‘షా’ షాగౌస్ పేరు తెలియని మాంసాహార ప్రియులు సిటీలో ఉండరేమో. ఆ క్రమంలోనే హలీమ్ లవర్స్నూ తనదైన శైలితో ఆకట్టుకుంటోంది. వినియోగించే మాంసపు రుచి పరంగా ఫ్యాన్స్‌ను దక్కించుకున్న ఈ రెస్టారెంట్ సిటీలోని లక్డికాపూల్, టోలిచౌకి, గచి్చ»ౌలి షాలీబండాల్లో ఉంది. ఆదాబ్.. షాదాబ్.. ఓల్డ్ సిటీ నడి»ొడ్డున ఉన్న షాదాబ్ హోటల్ ప్రతి రంజాన్‌కు హలీమ్ ఆదరణలో అగ్రగామిగా ఉంటుంది. నాణ్యమైన ముడిదినుసులు సాంప్రదాయ వంట శైలిని ఉపయోగించడం వీరి ప్రత్యేకత. ఘాన్సీ బజార్లో షాదాబ్ ఉంది. -
Hyderabad: తాగునీటితో బైక్ వాషింగ్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు తరహాలో తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే మన జలమండలి కొరడా ఝుళిపించనుంది. బుధవారం ఇలా నగరంలో తొలిసారిగా జరిమానా విధించిన ఘటన జూబ్లీహిల్స్ చోటుచేసుకుంది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. రోడ్ నెంబర్– 78లో నేలపై నీరు పారుతుండటాన్ని చూసి పైపులైన్ లీకయినట్లు భావించారు. ఈ విషయంపై ఆరా తీయాలంటూ స్థానిక జీఎంను ఆయన ఆదేశించారు. దీంతో డివిజన్ జీఎం హరిశంకర్ స్థానిక మేనేజర్‌తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. రోడ్డు పక్కన ఉన్న ఇంటి ముందు ఓ యువకుడు తాగునీటితో బైక్ వాషింగ్ చేస్తుండగా గమనించారు. ఈ విషయం ఎండీ దృష్టి తీసుకెళ్లారు. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేసి.. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని, తక్షణమే సదరు వ్యక్తికి జరిమానా విధించాలని సంబంధిత జనరల్ మేనేజర్‌ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి తొలిసారి తప్పుగా భావించి రూ.1000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించద్ధని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బెంగళూర్‌లో తాగునీటిని వాహనాలను కడగడం, గార్డెనింగ్, నిర్మాణాలకు, వినోద కార్యక్రమాలకు వినియోగించడాన్ని నిషేధించింది. తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే తొలిసారి గుర్తిస్తే రూ.5 వేలు జరిమానా.. ఆ తర్వాత కూడా వృథా చేస్తుంటే రోజుకు అదనంగా మరింత జరిమానా విధిస్తోంది.సుదూర ప్రాంతాల నుంచి.. మహా నగర తాగునీటి అవసరాల కోసం జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సుదూరు ప్రాంతాల నుంచి నీటి తరలించి శుద్ధి చేసి సరఫరా చేస్తోంది. తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న మూడు నెలలు నీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలు తాగునీటిని వృథా చేయకూడదని సూచిస్తోంది. -
బస్సు కండక్టర్ టికెట్ మెషీన్నే కొట్టేశాడు!
మలక్‌పేట(హైదరాబాద్): ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న బస్సులోని కండక్టర్ టికెట్ మెషీన్‌ను గుర్తు తెలియని వ్యక్తి కొట్టేశాడు. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సూర్యాపేట డిపో బస్సు నగరానికి చేరుకుంది. తిరిగి సూర్యాపేటకు వెళ్లే క్రమంలో దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లోని 2 నంబర్ ప్లాట్‌ఫాంపై డ్రైవర్ బస్సు ఆపాడు. కండక్టర్ కృష్ణవేణి టికెట్ మెషీన్ తన బ్యాగులో పెట్టి కంట్రోలర్ వద్ద వెళ్లి వచ్చి చూసేసరికి కన్పించలేదు. బ్యాగులో టికెట్ మెషీన్, సెల్‌ఫోన్, పాస్‌బుక్ ఉన్నట్లు పోలీసులకు కండక్టర్ ఫిర్యాదు చేశారు. కండక్టర్ బస్సు దిగిన తర్వాత డ్రైవర్ కార్గో కేంద్రానికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన ఆగంతకుడు బ్యాగును అపహరించాడు. ఇందంతా మూడు నిమిషాల్లోనే జరిగిందని కండక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్లాల్ తెలిపారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ఒకే కులం పెళ్లిళ్లతోనూ వ్యాధులు
సాక్షి, హైదరాబాద్: ‘బంధువుల అమ్మాయే. అన్నీ కుదిరాయి. అందుకే చేసుకుంటున్నాం.. మా కులపువాళ్లే. అమ్మాయి బాగుంటుంది. సంబంధం ఖాయం చేశాం.. పెళ్లిళ్ల విషయంలో ఈ రకమైన మాటలు తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ రకంగా దగ్గరి చుట్టాలు, ఒకే కులంలో పెళ్లిళ్ల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.ఒకే కులం (Same Caste)లో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం (కులాలతో పాటు చిన్నచిన్న సమూహాలకు కూడా ఇది వర్తిస్తుంది) వల్లనే ఆయా కులాల వారికి కొన్ని రకాల జబ్బులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. నాలుగు వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యు క్రమాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తంగరాజ్ తెలిపారు. జబ్బులకు వాడే మందులు కొన్ని సమూహాల్లో ఎందుకు భిన్నమైన ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా పరిశీలించామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతీసా మచ్చ తెలిపారు.కీళ్లు, వెన్ను, లిగ్మెంట్లలో వాపు/మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్‌కు ఒక నిర్దిష్ట జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని చెప్పారు. HLA& B27:04 అని పిలిచే ఈ జన్యు మార్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో ఒక సామాజికవర్గం వాళ్లలో ఈ స్పాండిలైటిస్ (spondylitis) ఎక్కువగా ఉందని గుర్తించినట్లు కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital) రుమటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి వెల్లడించారు. కొన్ని కులాలు, సమూహాలకే ప్రత్యేకమైన వ్యాధుల జన్యు రూపాంతరాలను కూడా గుర్తించినట్లు వివరించారు. ఆయా సమూహాల్లోని వారు ఈ వ్యాధులకు వాడే ఔషధాలు ఇతరులలో కంటే భిన్నంగా పని చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ పేర్కొన్నారు. చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైంది -
నిజాంపేట రూట్ క్లియర్!
అసలే రద్దీ రహదారులు.. ఆపై ఆక్రమణలు.. వాహనచోదకుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అంతే సంగతులు. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేయగా ఏళ్లనాటి ఆక్రమణలు మాయమయ్యాయి. వాహనచోదకుల కష్టాలు తీరాయి. మొత్తానికి నిజాంపేట (Nizampet)రూట్ క్లియర్ అయింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) మంగళవారం నిజాంపేటలోని బాలాజీ హిల్స్, ఇందిరమ్మ కాలనీ (Indiramma Colony) ప్రధాన రహదారుల ఆక్రమణలను తొలగించింది. రోడ్లను ఆక్రమిస్తూ నిర్మించిన అపార్ట్మెంట్ ర్యాంపులు, మొక్కల కోసం నిర్మాణాలు, ఫెన్సింగ్లతోపాటు పైఅంతస్తులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ఇనుప మెట్లతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాహనదారులు, ఆయా కాలనీవాసులు చేసిన ఫిర్యాదులకు హైడ్రా స్పందించింది.ఇందిరమ్మ కాలనీలో రహదారిని పలువురు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు గదులు నిర్మించుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కారణంగా వెంకటరాయనగర్, బాలాజీ కాలనీ, కేఎన్ఆర్ కాలనీ, కొలను తులసిరెడ్డి (కేటీఆర్) కాలనీసహా ఎనిమిది కాలనీలకు రాకపోకలు సాగించే వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనిపై విచారణ చేసిన హైడ్రా అధికారులు ఆయా ఆక్రమణలను తొలగించాలని యజమానులకు రెండు నెలలు గడువు ఇచ్చారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోవడంతో మంగళవారం నిజాంపేట మున్సిపల్ అధికారులతో కలిసి కూల్చివేతలు చేపట్టారు. పలుచోట్ల రహదారి ఆక్రమణల్ని తొలగించారు. దాదాపు కిలోమీటరుకుపైగా ఉన్న ఆక్రమణలు కూల్చేశారు. కూల్చివేతలతో ఉద్రిక్తత నిజాంపేట్ ఇందిరమ్మ ఫేజ్ –2 కాలనీలో మంగళవారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తంగా మారాయి. పలువురు స్థానికులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తమ ఇళ్ల ముందున్న నిర్మాణాలను ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. చిన్న, చిన్న నివాసాలతోపాటు, వ్యాపారాలు చేసుకునే తమ నిర్మాణాల్లో ఉన్న సామాన్లు సైతం తరలించేందుకు సమయం ఇవ్వలేదని ఆరోపించారు. లక్షలాది రూపాయల సామాన్లు పాడయ్యాయని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమపై ఎందుకు కక్ష కట్టిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తుందని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తమ కుటుంబాలనే ఛిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రెండున్నరేళ్లుగా పోరాడుతున్నాంఈ రహదారుల ఆక్రమణలపై దాదాపు రెండున్నర ఏళ్లుగా పోరాడుతున్నాం. ఆక్రమణలను తొలగించాలని కోర్టు తీర్పు కూడా ఉంది. మున్సిపాలిటీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. అయినా ప్రయోజనం లేకపోయింది. హైడ్రాను ఆశ్రయించిన వెంటనే విచారణ చేపట్టి రెండు నెలల క్రితం సంబంధీకులకు నోటీసులు ఇచ్చారు. ఎవరూ స్పందించకపోవడంతో హైడ్రా కూల్చేసింది. – చిరంజీవి, బాలాజీ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం ఈ ఆక్రమణల కారణంగా చాలా ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం. వాటర్ ట్యాంకర్లు కూడా ఈ మార్గంలో వచ్చే పరిస్థితి లేదు. స్కూల్ వ్యాన్లు వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో పిల్లలు నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్తున్నారు. హైడ్రా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించారు. – విజయ్, బాలాజీ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చదవండి: ఇక RRR వరకు హైదరాబాద్ నగరమే! -
అమెరికాలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో దుండగులు తెలంగాణలోకి రంగారెడ్డి జిల్లా కేశం పేటకు చెందిన ప్రవీణ్‌పై (27) కాల్పులు జరిపారు.దుండగుల జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మృతి చెందాడు. ఎంఎస్ సెకండియర్ చదువుతున్న ప్రవీణ్ మృతిపై సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
శిరీష కేసులో బిగ్ ట్విస్ట్.. స్వాతి, వినయ్ ప్లాన్ ప్రకారమే...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శిరీషను భర్త, ఆమె ఆడపడుచు (భర్త సోదరి) స్వాతి కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో వినయ్, స్వాతిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై వివరాల ప్రకారం.. మలక్‌పేటకు చెందిన శిరీషను తన భర్త, ఆడపడుచు స్వాతి కలిసి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. స్వాతి ప్లాన్ ప్రకారం.. శిరీషకు మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. తన అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని కోపంతో వినయ్ హత్య చేసినట్టు చెప్పారు. హత్య విషయం తెలిసినప్పటికీ బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్ మాయం చేయాలనుకున్నాడని వెల్లడించారు. మరోవైపు, ఊపిరాడకుండా చేయటంతోనే ఆమె మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో సైతం వెల్లడైంది.మెడ చుట్టూ గాయాలు..అంతకుముందు.. శిరీష మెడ చుట్టూ గాయాలను గుర్తించి.. మృతురాలి బంధువులు వినయ్‌ను నిలదీయగా, పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఛాతీ నొప్పితో కుప్పకూలినపుడు సీపీఆర్ చేశానని, ఆ సమయంలో చేతి గోళ్లు గీసుకుపోయాయంటూ ఒకసారి.. మృతదేహాన్ని తరలించేటప్పుడు కుదుపులకు గాయాలైనట్టు మరోసారి చెప్పాడు. దీంతో, శిరీషను అతడే హత్య చేసినట్టు బంధువులు ఆరోపించారు.భర్త వేధింపులు.. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌ను 2017లో శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. దంపతులిద్దరూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2019లో పాప జన్మించింది. పెళ్లయిన ఏడాది నుంచే భార్యపై అనుమానంతో వినయ్ నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మార్చి రెండో తేదీన ప్లాన్ చేసి ఆమెను హత్య చేశారు. అనంతరం, గుండెపోటుతో చనిపోయినట్టు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు వినయ్.ఈ క్రమంలో వారు వచ్చేలోపే మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో, శిరీష కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దోమలపెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా వాహనాన్ని గుర్తించి పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
మిసెస్ ఇండియా పోటీలకు తెలుగు ఎన్ఆర్ఐ
సాక్షి, సిటీబ్యూరో: లండన్ వేదికగా ప్రముఖ బహుళ జాతి సంస్థలో కార్పొరేట్ లీడ్ రోల్ నిర్వహిస్తున్న తెలుగు వనిత బిందు ప్రియ.. త్వరలో జరగనున్న మిసెస్ ఇండియా 2025 పోటీల్లో ఎన్ఆర్ఐ విభాగంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. జాతీయ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని నిజామాబాద్ జిల్లాకు చెందిన బిందు ప్రియ తెలిపారు. బిందు ప్రియా జైస్వాల్ మిసెస్ ఇండియా తెలంగాణా 2025 క్లాసిక్ NRI కేటగిరీలో విజేతగా నిలిచింది. 2025 ప్రారంభంలో ఎన్ఆర్ఐ విభాగంలో మిసెస్ ఇండియా తెలంగాణ–2025 కిరీటాన్ని గెలుచుకుని త్వరలో జరగనున్న మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బిందు బహుముఖ ప్రజ్ఞాశాలి. వర్క్‌లైఫ్, ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఐటీలో కార్పొరేట్ లీడర్ , గ్లోబల్ బ్యాంకింగ్ నిపుణురాలు. ఉన్నత విద్యావంతురాలు. ఆరోగ్యం & ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. తన తల్లి బోధించిన గీత పాఠాలే స్ఫూర్తి అని చెబతారు. కథక్, తెలుగు, హిందీ సంగీతం, గిటార్, పియానో వంటి సంగీత వాయిద్యాల్లో బిందుకు ప్రావీణ్యం ఉంది. అలాగే యూకేలోని ప్రసిద్ధ వేదికలపైన నృత్య ప్రదర్శనలివ్వడం విశేషం. సేవా (ఎస్ఈడబ్ల్యూఏ) సభ్యురాలిగా నిరుపేద విద్యార్థుల విద్య, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 400 ఎకరాల వేలంపాట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలంపాటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు పిలిచింది. ఈ నెల 15 వరకు బిడ్ దాఖలుకు గడువు ఇచ్చింది.కాగా, భూముల అమ్మకానికి రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హరీష్‌రావు ఆరోపించారు. రూ. 30 వేల కోట్ల విలువైన భూములు అమ్మేందుకు యత్నిస్తున్నారు. నాడు భూములు అమ్మొద్దని రేవంత్ సుద్దులు చెప్పారు. పీసీసీ చీఫ్‌గా ఒక మాట.. సీఎం రాగానే మరో మాట అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు.ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మొసలి కన్నీరు కార్చారని హరీష్‌రావు గుర్తుచేశారు. ప్రభుత్వ భూములను అమ్మబోంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారంటూ కాంగ్రెస్ సర్కార్‌ని హరీష్‌రావు నిలదీశారు. -
అందుకే హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా ఉండాలి
హైదరాబాద్: దేశ రక్షణ నిమిత్తం హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ (prakash yashwant ambedkar) డిమాండ్ చేశారు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీ పాకిస్తాన్ (Pakistan) సరిహద్దు నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉందని, శత్రుదేశాలు దేశ రాజధానికి దగ్గర ఉండటం దేశ రక్షణకు శ్రేయస్కరం కాదన్నారు. భారతదేశం బలమైన ప్రజాస్వామిక దేశంగా ఎదగాలంటే కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ హైదరాబాద్ (Hyderabad) రెండో రాజధాని అనే అంశంపట్ల లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నదీ జలాలు, యూనివర్సిటీలతోపాటు ప్రతి రంగంలోనూ కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం ధోరణిని కొనసాగిస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ని ఏర్పాటు చేయాలని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హైదరాబాద్ అనుకూలమని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కీలకమైన అంశాలపట్ల సమన్యాయం కావాలని, హైదరాబాద్‌కు అన్ని విధాలుగా న్యాయం జరిగేటట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలకు సమాన వాటా కల్పించాలన్నారు. ప్రముఖ సామాజిక వేత్త సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నర్సమ్మ, ప్రొఫెసర్ వెంకట్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ హక్కుల నేతల అరెస్టు అక్రమం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మూలవాసీ బచావో మంచ్ మాజీ అధ్యక్షుడు రఘు మదియాని (raghu midiyami)ని ఎన్ఐఏ పోలీసులు రాయపూర్‌లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణరావు మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన రఘుతోపాటు గజేంద్ర, లక్ష్మణ్ అనే కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందన్నారు. గత 14 నెలల కాలంలో 434 మందిని కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. పోలీసుల అప్రజాస్వామికగా చర్యలను బాహ్య ప్రపంచానికి చేరవేస్తున్నారని, పోలీసు క్యాంపులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గజేంద్ర, లక్ష్మణ్ అనే కార్యకర్తలను జైలుకు పంపారని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వెలసిన పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని, ఆదివాసీ మహిళలపై జరుగుతున్న హత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు చంద్రమౌళి, జాన్, భవాని, పీడీఎం రాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆనందంగా అమెరికాకు బయలుదేరి.. అంతలోనే విషాదం -
నాకు ధైర్యం చెప్పే మేనకోడలు.. ఈరోజు విగతజీవిలా మారిపోయింది..!
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దేవిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఆరు నెలల క్రితమే సాఫ్ట్ వేర్ ఉద్యోగినే ప్రేమ వివాహం చేసుకున్న దేవిక.. ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెకు వేధింపులు ఎక్కువ కావడంతోనే ఈ దారుణానినికి పాల్పడి ఉంటుందని ఆరోపిస్తున్నారు.అతనొక ఉన్మాది..దేవికను ప్రేమించి పెళ్లిచేసుకున్న శరత్ చంద్ర అనే వ్యక్తి ఒక ఉన్మాది అని, అతనికి ఉరిశిక్షే సరైనదని దేవిక మేనమామ అంటున్నారు. ‘సాక్షి’తో మాట్లాడిన దేవిక మేనమామ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఎప్పుడూ అందరికీ ధైర్యం చెప్పే తన మేనకోడలు.. ఈరోజు ఇలా విగత జీవిలా పడి ఉండటం తమను ఎంతగానో బాధిస్తుందన్నారు. తానొక రైతునని, తనకు ఎప్పుడు కష్టం వచ్చినా ధైర్యం చెప్పే మేనకోడలు ఈరోజు లేదన్నారు. నేటి సమాజంలో ఏ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. తన మేనకోడలు ఎంతో గట్టి మనస్తత్వం ఉన్న అమ్మాయి అని, కానీ భర్త వల్ల ఎంతగా కృంగిపోతే ఆత్మహత్య చేసుకుందో తమకు అర్థమైందన్నారు. అతన్ని కచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు మేనమామ.మండే వస్తా మమ్మీ అంది.. శవమై వచ్చింది నా బిడ్డ..!తన కూతురు ఆత్మహత్యపై తల్లి పడే రోదన అంతా ఇంతా కాదు. ఇంటికి వస్తానన్న బిడ్డ, శవమై వచ్చిందంటూ ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన బిడ్డ తనకు ప్రతీ రోజూ ఫోన్ చేసేదని, తిన్నావా మమ్మీ, ఎలా ఉన్నావ్ మమ్మీ అనే అడిగేదని కన్నీటి పర్యంతమయ్యారు తల్లి. ‘మొన్న పోయిన సండే ఇంటికి రా బిడ్డా అని అడిగితే, లేదు మమ్మీ మండే వస్తానంది.. వచ్చి నన్ను ఆస్పత్రిలో చూపిస్తానంది. మండే నాడు శవమై వచ్చింది నా కూతురు’ అంటూ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. ఆరు నెలల క్రితమే ప్రేమ పెళ్లి..కాగా, వికారాబాద్ జిల్లా, తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిద్దరూ గతేడాది ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.అయితే, కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది.ఈ క్రమంలో ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వరకట్నం కోసం శరత్చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సమాజ హితం కోసం.. సకినీ ఫౌండేషన్
సమాజ హితం కోసం తాను ఏదో చేయాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా.. తనకు తోచిన మేరకు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాహాయం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆపదలో ఉన్న పలువురు బస్తీ వాసులకు ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నాడు. మురికి వాడల్లో నివసించే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే సమాజ సేవలోనూ ముందు వరుసలో ఉంటున్నాడు.. – గోల్కొండ నగరంలో అది పెద్ద లేబర్ అడ్డాల్లో టోలిచౌకీ లేబర్ అడ్డా ఒకటి. పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా నగర పరిసరాల నుంచి ఎందరో నిరుపేదలు ఉపాధి కోసం స్థానిక లేబర్ అడ్డాలకు వస్తుంటారు. పని దొరకక వారిలో అనేక మంది రోజుల తరబడి పస్తులు ఉంటుంటారు. ఇది గమనించిన ఆసిఫ్ హుసేన్స్న్ సోహెల్ సూర్యనగర్ కాలనీలో మాషా అల్లా పేరిట కిచెన్ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా నిత్యం 250 మందికి మధ్యాహ్న సమయంలో భోజనం అందిస్తున్నాడు. వలస కూలీలకు అండగా.. ఆసిఫ్‌హుస్సేన్ సోహెల్ సేవలపై ప్రశంసలునగరంలో గోల్కొండకు చెందిన ఆసిఫ్‌హుస్సేన్ సోహెల్ సమాజంలో మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. మురికివాడల్లో చదువుకు నోచుకోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి, పై చదువులకు ప్రైవేటు పాఠశాలల్లో చేరి్పంచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. దీంతో పాటు ఆయా మురికి వాడల్లోని మహిళల సాధికారత కోసం సకీనా ఫౌండేషన్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ.. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి పథకాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. పేదల బస్తీలైన విరాట్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఫ్యాషన్ డిజైనింగ్, ఫస్ట్ ఎయిడ్, జిగ్‌జాగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా, వారి ఆర్థిక స్థితికి తోడ్పడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. కరోనా సమయంలో.. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కూలీలకు తాను అండగా ఉన్నానంటూ నిత్యావసరాలు అందించడంతో పాటు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఉచిత రవాణా కలి్పంచాడు. టోలిచౌకీ ముంపు కాలనీగా పేరుగాంచిన నదీమ్ కాలనీలో వరదల సమయంలో బోట్లతో రంగంలోకి దిగి ఎందరినో సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వీటన్నింటికీ తోడుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ బస్తీలో రోగులకు వారి ఇంటి ముందే మందులు అందిస్తున్నారు. మున్ముందు కూడా సకీనా ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సోహెల్ చెబుతున్నారు. -
‘ఆమెకు ఇచ్చిన టాస్క్ ఒక్కటే.. సీఎం చేంజ్ ఆపరేషన్’
హైదరాబాద్: తెలంగాణలో నాలుగు స్తంభాలాటగా మంత్రి వర్గం నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్ లో కలహాలు, కథలు కథులుగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఆగస్టు వరకూ తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. అందులో భాగంగానే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చారన్నారు. ఆమెకు రాహుల్ గాంధీ అప్పగించిన టాస్క్ ఒక్కటే.. సీఎం ఛేంజ్ ఆపరేషన్ అంటూ చమత్కరించారు.‘తెలంగాణ ఆడపిల్లల ఆశీర్వాదం కాదు.. ఢిల్లీ నుంచి వచ్చిన మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదం ఉంటేనే రేవంత్ సీఎంగా కొనసాగుతారు. రాహుల్ గాంధీ సొంత టీం నుంచి మీనాక్షి నటరాజన్ ను ‘మిషన్ సీఎం ఛేంజ్ ఆపరేషన్’ కోసం పంపించారు. మంత్రులు.. సీఎంను లెక్క చేయడం లేదని స్వయంగా రేవంత్ పార్టీ ఇంచార్జ్ ముందుకు చెప్పుకున్నారు.* రాహుల్ గాంధీ ఇన్‌డైరెక్ట్ గా సీఎం ఛేంజ్ ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ ను పనిచేయనివ్వడం లేదని భట్టి, ఉత్తమ్, పొంగులేటిని అనుమానిస్తున్నారు. మూటల పంచాయతీ నడుస్తోంది. ఎవరి శాఖ వాళ్లదే అన్నట్లుగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మేం ఎస్ఎల్బీసీకి వెళ్లిన తర్వాత సీఎం రేవంత్ అక్కడకు వెళ్లివచ్చారు.ప్రతీ అంశం ఢిల్లీ కి చెరవేస్తున్నది.. రేవంత్ ను ఏ పని చేయకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అనుకుంటున్నారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ ను తీసుకు వచ్చిన.. మాస్టర్ ప్లాన్ ఉత్తమ్ కుమార్ రెడ్డే. మిలటరీ మాస్టర్ ప్లాన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డివే. గతంలో ఇంచార్జ్ గా కుంతియాను తెచ్చుకున్నది ఉత్తమ్ కుమారే. మూడు మంత్రులు పోటీపడి అధిష్టానానికి కప్పం కడుతున్నారు. ఆ ముగ్గురు సీఎం రేవంత్ తో సంబంధం లేకుండా నేరుగా అధిష్టానంతో డీల్ చేసుకుంటున్నారు’ అని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. -
హైదరాబాద్‌లో రూ.1,500 కోట్ల రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ (Real Estate) ప్రాజెక్ట్ రాబోతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో తన ముద్రను విస్తరించడానికి జువారీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ జువారి ఇన్‌ఫ్రావరల్డ్ ఇండియా లిమిటెడ్ (జువారీ ఇన్ఫ్రా) గంగోత్రి డెవలపర్స్‌తో డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లోని కొల్లూరు మైక్రో మార్కెట్ లో సుమారు 9.4 ఎకరాల విస్తీర్ణంలో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడమే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం లక్ష్యం.1,730 అపార్ట్మెంట్లు"జువారి గంగోత్రి త్రిభుజ" పేరుతో చేపట్టిన ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కొల్లూరు మైక్రో మార్కెట్ లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టులో 1,730 విశాలమైన మూడు, నాలుగు పడక గదుల అపార్ట్మెంట్లతో కూడిన తొమ్మిది ఎత్తైన టవర్లు ఉంటాయి. రూ.1,500 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ సుమారు 3.8 మిలియన్ చదరపు అడుగుల అమ్మకపు విస్తీర్ణాన్ని, సుమారు 5.3 మిలియన్ చదరపు అడుగుల మొత్తం అభివృద్ధి ప్రాంతాన్ని కలిగి ఉంటుంది.ఒప్పందం పరిధిడెవలప్మెంట్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ కింద బ్రాండింగ్, మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం), నిర్మాణ పర్యవేక్షణతో సహా సమగ్ర నిర్వహణ సేవలను జువారీ ఇన్ఫ్రా అందిస్తుంది. ఈ సహకారం రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో జువారీ ఇన్ఫ్రా నైపుణ్యాన్ని, గంగోత్రి డెవలపర్స్ నిర్మాణ సామర్థ్యాలను ప్రపంచ స్థాయి రెసిడెన్షియల్ ప్రాజెక్టును అందించడానికి ఉపయోగిస్తుంది.ఇది చదివారా? హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు.. ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ హుషారుసౌకర్యాలు, ఫీచర్లుఈ ప్రాజెక్ట్ అక్కడ నివసించేవారి జీవన అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన జీవనశైలి సౌకర్యాల శ్రేణిని అందిస్తుంది. స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, క్రీడా సౌకర్యాలు, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్లతో సహా 50కి పైగా జీవనశైలి సౌకర్యాలతో పాటు సుమారు 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక గ్రాండ్ క్లబ్ హౌస్ ప్రధాన ఫీచర్‌గా ఉంటుంది. ఆధునిక నగరవాసుల అవసరాలను తీర్చడం ద్వారా స్థిరమైన జీవన వాతావరణాన్ని అందించడం ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లక్ష్యం.వ్యూహాత్మక స్థానంవ్యూహాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 2కు కేవలం రెండు నిమిషాల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలక వ్యాపార కేంద్రాలకు అద్భుతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ స్థానం ప్రధాన ఉపాధి కేంద్రాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలకు అందుబాటులో ఉంటుంది. ఈ సౌలభ్యాన్నీ కోరుకునే గృహ కొనుగోలుదారులకు ఇది అనువైన ఎంపికగా మారుతుంది. -
శిరీష అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు.. ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేటలో విషాదకర చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న జమున టవర్స్‌లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలి భర్త వినయ్ కుమార్ గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. దీంతో, ఆమె పేరెంట్స్ వచ్చే సరికే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేయడంతో అనుమానం వ్యక్తమవుతోంది.వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన సింగం శిరీషతో హైదరాబాద్‌కు వినయ్‌కు మధ్య 2017లో వీరికి వివాహం జరిగింది. వీరు మలక్‌పేట జమున టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, శిరీష అనుమానాస్పద స్థితిలో సోమవారం ఉదయం మృతి చెందారు. అనంతరం, భర్త వినయ్ కుమార్.. ఆమె గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. ఈ క్రమంలో అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం తరలించే ప్రయత్నం చేశారు.దీంతో, శిరీష కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దోమలపెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా వాహనాన్ని గుర్తించి పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య చేసి చంపి.. గుండెపోటుగా చెపుతున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. చదవండి: 4 నిమిషాల్లో రూ.29.69 లక్షలు దోచేశారు! -
కేరాఫ్ కాంటినెంటల్ : ఇంటర్నేషనల్ చెఫ్‌లతో స్పెషల్ చిట్‌చాట్
కాంటినెంటల్ వంటకాలకు నగరం కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందుతోంది. సాధారణంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాలతో నగరానికి ప్రత్యేక అనుబంధముంది. ఈ మూడు దేశాల వంటకాలు భాగ్యనగరంలో విరివిగా లభ్యమవుతుండడం.. ప్రధానంగా సింగపూర్, మలేషియాలో దక్షిణాది వంటకాలకు మంచి ఆదరణ ఉండడం..చైనీస్ వంటకాలకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని ‘ది లీలా హైదరాబాద్’ ఆధ్వర్యంలో ఆగ్నేయాసియా వంటకాలను అందుబాటులోకి తీసుకురావడానికి, వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ)ను ప్రారంభించింది. ‘త్రీ’ అనే మలయ్ పదం నుంచి పుట్టుకొచ్చిన టీఐజీఏ సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో సాధారణంగా ఏ కాంటినెంటల్ వంటకం నగరానికొచ్చినా కాసింతైనా స్థానిక రుచులకు అనుగుణంగా వాటి ఫ్లేవర్స్, రుచిని మార్చుతారు. కానీ ఇక్కడ ఎలాంటి మార్పూ లేకుండానే స్వచ్ఛమైన ఆగ్నేయాసియా వంటకాలను అందిస్తామని ప్రముఖ సింగపూర్ మాస్టర్ చెఫ్ ఆల్బర్ట్ రాయన్ తెలిపారు. దీని ఆవిష్కరణ సందర్భంగా నగరంలో సందడి చేసిన ప్రముఖ చెఫ్‌లు ఆల్బర్ట్ రాయన్, మలేషియా వంటకాల నిపుణుడు, ప్రముఖ చెఫ్ ‘షా’ సాక్షితో ముచ్చటించారు. వారు పంచుకున్న అనుభవాలు వారి మాటల్లోనే.. దాదాపు 20 ఏళ్లకు పైగా ప్రొఫెషనల్ చెఫ్‌గా వివిధ దేశాల్లో వినూత్న వంటకాలను వండి వడ్డించాను.. కానీ హైదరాబాద్ నగరం ఆహ్వానించినంత ఉన్నతంగా మరే ప్రాంతం లేదని చెప్పగలను. ఆగ్నేయాసియాకు చెందిన పసందైన వంటకాలను చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌కు చేరువ చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ) ‘మూడు’ అనే మలయ్ పదంలో భాగంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తుంది. నగరంలోని కాంటినెంటల్ రుచుల ఆసక్తికి అనుగుణంగా విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులతో మాత్రమే అరుదైన పసందైన డిషెస్ తయారు చేస్తున్నాం. ఈ వంటకాల్లో ఆయా దేశాల సంస్కృతి, పాకశాస్త్ర పరిపూర్ణ ప్రామాణికత నిర్ధారించడానికి రెస్టారెంట్ నిరి్థష్ట మూలికలు, సుగంధ ద్రవ్యాలను పెంచడం ప్రారంభించింది. చైనీస్, మలయ్, ఇండియన్ సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్ అద్భుత వంటల వారసత్వం, చిల్లీ క్రాబ్, హైనానీస్ చికెన్ రైస్ వంటి ఐకానిక్ వంటకాలను కలినరీ స్పెషల్‌గా అందిస్తున్నాం. నాసి లెమాక్, రెండాంగ్, సాటే వంటి మలేషియా ప్రత్యేకతలు ఆయా దేశం టేస్ట్ ప్రొఫైల్, పాక శాస్త్ర నైపుణ్యాలను హైలైట్ చేస్తాయి. వీటికి అనుబంధంగా అద్భుతమైన టీలు, ప్రసిద్ధ సామాజిక భోజన సంస్కృతి అయిన ఆరి్టసాన్ డిమ్ సమ్ వంటి క్లాసిక్ కాంటోనీస్ యమ్ చా అనుభవం చేయవచ్చు. ఇలా ఒక ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక వైభవాన్ని స్వచ్ఛంగా కలుషితం లేకుండా కొనసాగిస్తున్న నగరం హైదరాబాద్ కావడంవిశేషం. – ఆల్బర్ట్ రాయన్, చెఫ్ దక్షిణాది ప్రేరణతో.. మలేషియాలో దక్షిణాది వంటకాలకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఇక్కడి నుంచి మలేషియాకి వచ్చినన ఫుడ్ లవర్స్ మామ అని సంబోధిస్తూ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. ఇందులో భాగంగా కొన్ని మలేషియాయా వంటకాలకు మామ కలిపి వాటి పేర్లను తయారు చేశాము. మలేషియాలో చాలా వంటకాలు దక్షిణాది ప్రేరణతో వాటి వైవిధ్యాన్ని, తయారీ విధానాన్ని రూపొందించుకున్నాయి. ఆహారాన్ని ఆస్వాదించడంలో, గౌరవించడంలో దక్షిణాది ప్రజలు ఉన్నత స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా హైదరాబాదీలు. ఈ నేపథ్యంలో నగరం వేదికగా సింగపూర్, మలేషియా, చైనా సాంస్కృతిక వంటకాలను అందించడం సంతోషంగా ఉంది. – షా, చెఫ్ -
హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన మేధా పాట్కర్
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ హఠాత్తుగా నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఛాదర్‌ఘాట్ సమీపంలోని ఓ ఇంటికి ఆమె చేరుకోగా.. పోలీసులు అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. మూసీ సుందరీకరణ ప్రాంతానికి ఆమె వెళ్తారనే సమాచారంతో పోలీసులు ఆమె బస చేసిన ఇంటికి భారీగా చేరుకున్నారు. అయితే ఆమె స్నేహితుల ఇంటికి వచ్చానని చెప్పడం గమనార్హం. అయినప్పటికీ ఆమెను అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి పంపించేసినట్లు సమాచారం. -
జూబ్లీహిల్స్ : వైభవంగా టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
రిత్విక్... మళ్లీ సాధించాడు
సాక్షి, హైదరాబాద్: అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి... అంచనాలకు మించి రాణించి... హైదరాబాద్ టెన్నిస్ యువతార బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ అద్భుతం చేశాడు. చిలీ దేశ రాజధాని సాంటియాగోలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. లాటిన్ అమెరికాలో క్లే కోర్టులపై ఏటీపీ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా రిత్విక్ గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్ (భారత్)–నికోలస్ బరియెంతోస్ (కొలంబియా) ద్వయం 6–3, 6–2తో టాప్ సీడ్ మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మొల్తాని (అర్జెంటీనా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్ దక్కించుకుంది. విజేతగా నిలిచిన రిత్విక్–బరియెంతోస్లకు 35,980 డాలర్ల (రూ. 31 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 24 ఏళ్ల రిత్విక్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ –250 డబుల్స్ టైటిల్. గత ఏడాది అక్టోబర్‌లో కజకిస్తాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో భారత్‌కే చెందిన అర్జున్ ఖడేతో కలిసి రిత్విక్ తొలి డబుల్స్ టైటిల్ గెలిచాడు. తాజా టైటిల్‌తో రిత్విక్ సోమవారం విడదలయ్యే ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 66వ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. 11 ఏస్‌లతో మెరిసి... 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బరియెంతోస్ ద్వయం పూర్తి ఆధిపత్యం చలాయించింది. 11 ఏస్‌లు సంధించిన ఈ జోడీ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. ఫస్ట్ సర్వ్లోని 30 పాయింట్లకుగాను 26 పాయింట్లు... సెకండ్ సర్వ్‌లో 13 పాయింట్లకుగాను 10 పాయింట్లు ఈ జంట గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వని ఈ ఇండో–కొలంబియన్ జంట ప్రత్యర్థి ద్వయం సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఈ టోర్నిలో అన్‌సీడెడ్ గా పోటీపడ్డ రిత్విక్–బరియెంతోస్ తొలి రౌండ్లో 7–6 (7/5), 7–6 (9/7)తో ద్రెజెవ్స్కీ–పీటర్ మత్సుజెవ్‌స్కీ (పోలాండ్)లపై, క్వార్టర్ ఫైనల్లో 3–6, 7–6 (7/2), 10–8తో మార్సెలో డెమోలైనర్–మార్సెలో జొర్మాన్ (బ్రెజిల్)లపై, సెమీఫైనల్లో 4–6, 7–6 (9/7), 10–5తో మూడో సీడ్ గిడో ఆంద్రెజీ (అర్జెంటీనా)–థియో అరిబెజ్ (ఫ్రాన్స్)లపై గెలుపొందారు. -
మరో రెండ్రోజులు పట్టొచ్చు.. SLBC రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఆదివారం ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్స్ పరిశీలించిన రేవంత్.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్.. సహాయక చర్యలు పూర్తయ్యేందుకు రెండు మూడ్రోజుల సమయం పడుతుందన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘ఎస్ఎల్బీసీ పనులు 2005లో మొదలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసింది. పనులు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. గత 10ఏళ్లలో రెండు కిలోమీటర్లు కూడా టన్నెల్ తవ్వలేదు. మేం వచ్చాక పనులు ఊపందుకున్నాయి. నిపుణలతో చర్చించి పనులు ప్రారంభించాం. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి. 11కేంద్ర రాష్ట్రాల రెస్క్యూ బృందాలు సహాకచర్యల్లో పాల్గొన్నాయి. తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందిస్తున్నా. రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండు మూడ్రోజుల సమయం రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే సరికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులను పంపించా, సమీక్ష నిర్వహించా. ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద,పొడవైన టన్నెల్. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బాధితుల పట్ల సానుభూతి చూపించాలి. ఎన్ని రోజులైనా మృత దేహాలను వెలికి తీయాల్సిందే.. బాధిత కుటుంబాలకు అప్పగించాల్సిందే. కన్వేయర్ బెల్ట్‌ను రేపటిలోగా అందుబాటులోకి తెస్తామన్నారు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే రెస్క్యూ వేగవంతం అవుతుంది. అవసరమైతే రోబోలను పంపి రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయిస్తాం. ఏం జరిగినా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయతం చేస్తున్నారు . ఏం జరిగినా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే దృఢసంకల్పంతో ఉంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ప్రమాదం జరిగితే చూసేందుకు వెళ్లిన నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు’ అని వ్యాఖ్యానించారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలిఅంతకుముందు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సీఎం రేవంత్ రెస్క్యూ ఆపరేషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వవాలని అధికారులకు ఆదేశించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్.. ఈ ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాలి. మరింత మంది నిపుణులను రప్పించండి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ఎన్జీఆర్ఐ నిపుణులు వచ్చాక మరింత వేగంగా సహాయక చర్యలు చేపట్టాలి. త్వరలో సిస్మాలజీ నిపుణులు కూడా వస్తారు. విభాగాల వారీగా చేయాల్సిన పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. తక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకంగా నీటి ఊట నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు నీటి ఊట ఆటంకంగా మారింది. దీంతో ఆ నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో జియోలాజికల్ టీమ్ సర్వే చేసేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఎస్ఎల్బీసీ టన్నెల్‌పై భాగమైన అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో జియోలాజికల్ అధికారులు సర్వే నిర్వహించారు. అధికారుల సర్వేలో ప్రమాదం స్థలం పైభాగంలో 450 మీటర్ల లోతున నీటి పొరలు ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉసురు వాగు,మల్లెల వాగు,రామతీర్దం, మల్లెల తీర్థం వాగుల నీరు ప్రవహిస్తుంటుంది.ఈ వాగుల్లోని మల్లెల తీర్థం నుంచి వచ్చే నీటి ప్రవాహాం మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. మల్లెలతీర్ధం నుంచి నీరు కృష్ణ నది వైపు ప్రవహిస్తున్నది. వాగుల ప్రవాహం వల్లే ఎస్ఎల్బీసీ టెన్నెల్లో నీటి ఊట ఉన్నట్లు నిర్ధారించారు. జియోలాజికల్ అధికారులు పరీక్షించారు. నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో ఆరాతీశారు. అయితే ఉసురు వాగు,మల్లెల వాగు,రామతీర్దం, మల్లెల తీర్థం నుంచి ప్రవహించే నీరు కృష్ణ నది వైపు ప్రవహిస్తుంది. వాటిలో మల్లెల తీర్ధం నుంచి వచ్చే నీటి ప్రవాహాం మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. జీపీఆర్ ద్వారా గల్లంతైన వారి ఆచూకీ లభ్యంమరోవైపు రెస్క్యూ సిబ్బంది జీపీఆర్ ద్వారా ఒక ప్రాంతంలో 2మీటర్ల లోతులో గల్లంతైన వారిలో నలుగురి ఆచూకీ , మరో ప్రాంతంలో ఏడు మీటర్ల లోతులో మరో నలుగురి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. ఎస్ఎల్ బీసీ వద్దకు సీఎం రేవంత్తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 18 ఏజెన్సీలు, వాటి పరిధిలోని 54 మంది ఉన్నతాధికారులు, 703 మంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది వచ్చారు. ప్రతి షిప్టునకు 120 మంది చొప్పున 24 గంటలు పూడికతీత చేపడుతున్నారు. టీబీఎం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. శనివారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీఎస్ శాంతికుమారితో కలిసి రెస్క్యూ ఏజెన్సీలు, సభ్యులతో టన్నెల్ వద్ద సమీక్ష నిర్వహించారు. అనంతరం, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం జరుగుతున్న సహాయ చర్యల్లో పురోగతి కనిపించిందని, ఆదివారం సాయంత్రానికి ఏదైనా సమాచారం లభ్యమయ్యే అవకాశముందని ఆబ్కారీ, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22న ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పైకప్పు కూలిన విషయం తెలిసిందే. అక్కడ ఎనిమిది రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. -
‘SLBC దగ్గరకు వెళ్లేందుకు సీఎంకు టైం లేదు’
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడకు వెళ్లే టైం లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన రఘునందన్ రావు.. గత ఎనిమిది రోజులుగా సీఎం రేవంత్.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సందర్భించే తీరిక లేదన్నారు. తెలంగాణలో పాలన పడకేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకుండా రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చారు.. రేవంత్ ఒకవేళ కలిస్తే ఒక్క ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదు. పేరుకే పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారు. సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ గా ఉన్న మహేస్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నా. జీహెచ్ఎంసీలో ఒక అధికారికి ఐదేళ్లుగా డిప్యూటేషన్ మీద పని చేస్తున్నారు. ఇక మున్సిపల్ పాలనపై సీఎం రేవంత్ కు పట్టులేదు. మమునూరు ఎయిర్ పోర్ట్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు. గద్వాల ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లో తన ఫోటో కాంగ్రెస్ ఫ్లెక్సీలో వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కిషన్ రెడ్డి సౌమ్యుడు.. ఆయన గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదు. ఆరు మంత్రి పదవులు భర్తీ చేసుకోలేని పరిస్థితి రేవంత్‌ది‘త్రిభాషా సిద్ధాంతానికి పునాదులు వేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉర్దూ భాష ఎందుకు రాస్తున్నారు. 90 శాతం జనాలకు ఉర్దూ రాకపోయినా ఎందుకు బోర్డులపై రాస్తున్నారు. ఎవరికి భయపడి ఉర్దూ భాష రాస్తున్నారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ అనుమతి తీసుకొని రేవంత్ తెలుగులో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ లో ఏ భాషలో మాట్లాడతారు. వ్యక్తిగత విమర్శలపై మేం మాట్లాడగలం . సిద్ధాంతం మీద, ప్రజా సమస్యలపై చర్చకు సిద్దం. వేదిక, సమయం చెప్పాలని సీఎం రేవంత్ కు సవాల్ విసురుతున్నా. కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టింది.. ఇక్కడ కేంద్రానికి ఏం సంబంధం.. రేవంత్ ను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం మరిచిపోయినట్లున్నారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి రేవంత్ భయపడుతున్నారు’ అంటూ రఘునందన్ రావు మండిపడ్డారు. -
నెస్ట్..ఆర్కిటెక్చర్లో బెస్ట్..!
గూడు.. మనుషుల నుంచి జంతువులు, పక్షుల వరకూ ఎంతో అవసరం. అయితే ఒక్కో జీవిది ఒక్కో తరహా నిర్మాణ శైలి. ఆయా జీవుల అవసరాలను తీర్చేదిగా నిర్మాణం ఉంటుంది. వీటిల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన నిర్మాణ శైలి పక్షులదే.. వాటి నిర్మాణాలు పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్లను సైతం ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. అయితే నగరీకరణలో భాగంగా పక్షుల జాడలు, వాటి గూళ్ల సంఖ్య రాను రాను కనుమరుగవుతున్నాయి. నగర శివార్లు, పల్లెటూళ్లు, అడవులకే పరిమితమైన వీటి గూళ్లు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని హెచ్‌సీయూలో సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. నగరంలో నివసించే నేటి తరం యువతకు పక్షులను జూ లోనో, పార్కుల్లో సందర్శించి ఆనందించడం అలవాటు. ఇక వాటి గూళ్ల సంగతి, వాటి నిర్మాణ శైలి చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి పక్షుల గూళ్లు పదుల సంఖ్యలో హెచ్‌సీయూ కేంద్రంగా కనిపిస్తుండడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అనేక రకాల పక్షి జాతులకు ఆవాసంగా మారిన గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పక్షి గూళ్లకు నిలయంగా మారింది. ప్రస్తుతం ఈ క్యాంపస్‌లో దాదాపు 233 రకాల పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వాటి గూళ్లను విద్యార్థులు తమ ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తున్నారు. క్యాంపస్‌లో వృక్ష సంపద పరిరక్షణే పక్షుల సంఖ్య పెరుగుదలకు కారణమని విద్యార్థులు, పలువురు సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సైకిల్ సవారీ..ఆరోగ్యం, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన..!) -
సైకిల్ సవారీ..ఆరోగ్యం, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన..!
వ్యాయామాల అన్నింటిలోనూ అత్యుత్తమమైనది సైకిలింగ్. ఆరోగ్యానికీ ఇది ఎంతో మంచిది. ఓ వైపు ఆరోగ్యం.. మరోవైపు పర్యావరణ కాలుష్యం పట్ల పెరుగుతున్న అవగాహన వెరసి హైదరాబాద్నగర వాసుల్లో సైక్లింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు వారాంతాల్లో గ్రూపులుగా మారి సైకిలింగ్ చేయడం ప్రస్తుతం హాబీగా మారింది. ఈ అలవాటు క్రమంగా విస్తరిస్తోంది. దీంతో విభిన్న రకాల సంస్థలు సైక్లిస్ట్ల కోసం రైడ్స్ నిర్వహిస్తుండడంతో తెలంగాణలోని హైదరాబాద్ నగరవాసులు భాగ్యనగర వీధుల నుంచి విదేశీ విహారాల వరకూ రైయ్ రైయ్ మంటూ సైకిల్‌పై సవారీ చేస్తున్నారు. ఎడా పెడా దూసుకొచ్చే బైక్స్, కార్స్, ఆటోల మధ్య తాదూరే సందు.. లేదు మెడకో డోలు అన్నట్టు ఉంది..భాగ్యనగరంలో సైకిల్ సవారీ. సరదా ఉంది కదా అని కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కాలంటే ప్రత్యేక ట్రాక్స్ వెతుక్కోవాల్సిందే తప్ప.. నగర రోడ్లపై పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. నగరంలో సైకిల్ ట్రాక్స్ ఉన్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో సైక్లిస్ట్స్ రైడింగ్ కోసం ప్రత్యేక మార్గాలను అన్వేషించక తప్పడం లేదు. ఈ క్రమంలోనే సైకిల్‌పై లాంగ్ జర్నీ చేయాలనుకునే నగరవాసుల కోసం విభిన్న రకాల రైడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. నైట్.. రైట్.. ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి వారాంతపు సెలవుదినాలను ఎంచుకుంటున్నారు ఎక్కువ మంది సైక్లిస్ట్‌లు. తమ హాబీని ఎంజాయ్ చేయడం కోసం.. మరింత సౌకర్యంగా వీధుల్లో విహరించాలని రాత్రి సమయాల్లో జాయ్ రైడ్స్‌కి జై కొడుతున్నారు. ‘పగలు ట్రాఫిక్ రద్దీతో పాటు పొల్యూషన్ కూడా ఎక్కువ. అందుకే వీలైనంత వరకూ రాత్రిపూట సైక్లింగ్ చేస్తా’ అని చెప్పారు ఐటీ ఉద్యోగి సౌరభ్. సాధారణంగా ఈ నైట్ రైడ్స్ రాత్రి 7గంటల ప్రాంతంలో మొదలై పరిస్థితులు, పాల్గొన్నవారి ఆసక్తిని బట్టి.. 10 నుంచి 12గంటల వరకూ కొనసాగుతున్నాయి. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో రైడ్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రసిద్ధ క్రీడా పరికరాల ఉత్పత్తి కంపెనీ డెకథ్లాన్ ప్రతినిధి చరణ్ తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్ రైడ్స్ షురూ.. నగరంలో ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉండే ఉదయపు వేళల్లో బ్రేక్ ఫాస్ట్ రైడ్స్ షురూ అయ్యాయి. తెల్లవారుజామున మొదలై ఉదయం 8–9 గంటల లోపు ముగిసిపోయే ఈ తరహా రైడ్ పూర్తయిన అనంతరం ఏదైనా ప్రత్యేక రెస్టారెంట్ లేదా దాబాల్లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ‘ఒకప్పుడు జిమ్‌లో కార్డియో వ్యాయామంలో భాగంగా ఎక్కువ సైకిల్ తొక్కేదానిని. అయితే దాని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వైద్యుల సూచన మేరకు రోడ్స్ మీద సైక్లింగ్‌ను ఎంచుకున్నా’ అని సైక్లిస్ట్ నీలిమారాణి చెప్పారు. సుదూర ప్రాంతాలకూ రెడీ.. సైక్లింగ్‌పై ఉన్న ఇష్టం నగరవాసులను దూరాభారం లెక్కజేయనీయడం లేదు. నగరం నుంచి విభిన్న ప్రాంతాలకు లాంగ్రైడ్స్కూ వెనుకాడడం లేదు. ఈ విషయంలో బైకర్ క్లబ్స్‌తో వీరు పోటీపడుతున్నారని చెప్పొచ్చు. ‘కనీసం 100 నుంచి 250 కి.మీ వరకూ దూరంలో ఉండే గమ్యాలను చేరుకోడానికి నగరంలోని సైక్లిస్ట్‌లు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తరచూ లాంగ్ రైడ్స్ ఏర్పాటు చేస్తున్నాం’ అని బైక్ అఫైర్స్ నిర్వాహకులు వివరించారు. విదేశాల్లోనూ.. రయ్ రయ్.. నగరం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి రోడ్స్‌పై రైడ్స్ చేయాలనుకునే ఆసక్తి కలిగిన నగరవాసుల కోసం అక్కడ సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహించే సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ‘మల్టీ డే బైస్కిల్ రైడ్స్ పేరిట విదేశాల్లో సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. నార్తర్న్ థాయ్‌లాండ్‌లో గత ఫిబ్రవరిలో ఒక రైడ్ నిర్వహించాం. పలువురు సిటిజనులు అందులో పాల్గొన్నారు. త్వరలో స్పెయిన్‌లోనూ ఈ తరహా రైడ్ నిర్వహించనున్నాం’ అని చెప్పారు బార్నోల్ అడ్వెంచర్స్ సంస్థ నిర్వాహకులు. పెడలింగ్.. ఈవెంట్స్.. నగరవాసుల్లో నైట్రైడ్స్ పట్ల పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా డెకథ్లాన్, బైక్ అఫైర్స్ తదితర సంస్థలు ప్రత్యేక సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. వాహనం ఉండి, సైక్లింగ్‌పై ఆసక్తి ప్రధాన అర్హతగా, వ్యక్తిగతంగా లేదా బృందాలుగా కూడా పాల్గొనేందుకు వీటిని నిర్వహిస్తున్నవారు సైక్లిస్ట్‌లకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ తరహా రైడ్స్‌లో భాగంగా సైక్లిస్ట్‌లకు కొత్త కొత్త సైకిళ్ల గురించిన సమాచారం, వాహన నిర్వహణపై అవగాహన, ఆరోగ్యకరమైన అభిరుచిగా తీర్చిదిద్దుకోవడంపై మెళకువలు అందిస్తున్నారు. చిన్న చిన్న రైడ్స్ కోసం కెబీఆర్ పార్క్, నెక్లెస్ రోడ్ ఎంచుకునే వీరు.. రైడ్ ఈవెంట్స్‌కి శంకర్పల్లి నుంచి కోకాపేట్ టూ శంకర్పల్లి టౌన్, శంకర్ పల్లి నుంచి కంది రోడ్, మేడ్చల్ రోడ్/నాగ్‌పూర్ హైవే వంటివి ఎంచుకుంటున్నారు.బిగినర్స్.. సిగ్నేచర్.. ఆలోచనలు, ఆసక్తికి అనుగుణంగా విభిన్న రకాల ఈవెంట్ మేనేజర్స్ రైడ్స్ డిజైన్ చేస్తున్నారు. ప్రారంభకుల కోసం 15 నుంచి 20 కి.మీ వేగం పరిమితితో బిగినర్స్ రైడ్ నిర్వహిస్తున్నారు. ఈ తరహా రైడ్స్ కోసం 25 నుంచి 30 కి.మీ దూరాన్ని ఎంచుకుంటున్నారు. ఇటు ప్రారంభకులు అటు అలవాటైన వారు కాకుండా మధ్యస్థంగా ఉండే వారికి సిగ్నేచర్ రైడ్ నిర్వహిస్తారు. దీని కోసం సుమారు 70 కి.మీ దూరాన్ని నిర్ణయిస్తున్నారు. కనీసం 25 నుంచి 30 కి.మీ వేగంతో 80 నుంచి 100 కి.మీ దూరం ప్రయాణం చేసే రైడ్స్‌ని ఫాస్ట్ రైడ్స్గా పేర్కొంటున్నారు. ఇవి నైపుణ్యం కలిగిన వారికి ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: 'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రే) -
జలమండలిలో హాజరు ఇక పక్కా!
సాక్షి,సిటీబ్యూరో: ఇక జలమండలి ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది సమయ పాలన పాటించాల్సిందే. శనివారం నుంచి ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం) పద్ధతి హాజరు అమలు ప్రారంభమైంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు నిలిచిపోగా ..ఇప్పుడు ఆ«ధునిక సాంకేతిక ముఖగుర్తింపు హాజరు అమలులోకి వచ్చింది. దశల వారీగా క్షేత్ర స్థాయి వరకు ఎఫ్ఆర్ఎస్ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. ఫీల్డ్ సిబ్బందికి సైతం ప్రత్యేక యాప్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ హాజరు అమలు చేసేందుకు అధికార యంత్రాగం సిద్ధమవుతోంది. ఉదయం 11 గంటల తర్వాతే.. గత ఐదేళ్లుగా మాన్యువల్ హాజరు అమలవుతుండటంతో ఉద్యోగులు ఎవరు ఎప్పుడు వస్తున్నారో.. వెళ్తున్నారో సమయ పాలన లేకుండా పోయింది. సాక్షాత్తు జలమండలి ప్రధాన కార్యాలయంలో కొందరైతే ఉదయం 11 గంటలు దాటిన తర్వాత రావడం ఆనవాయితీగా మారింది. ప్రధాన కార్యాలయంలో సుమారు 500 మంది, డివిజన్, సెక్షన్ ఆఫీసుల్లో మూడు వేల మంది వరకు సిబ్బంది సేవలందిస్తున్నారు. బయో మెట్రిక్ హాజరు లేకపోవడం వల్ల చాలామంది ఆలస్యంగా విధులకు హాజరవుతున్నట్లు ఇటీవల ఉన్నతాధికారుల పరిశీలనలోనే బహిర్గతమైంది.ప్రధాన కార్యాలయంలో పరిశీలించగా..60 శాతం మంది ఉదయం 11.30 గంటల తర్వాత విధులకు వస్తున్నట్లు తేలింది. డివిజన్, సర్కిల్ కార్యాలయాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సిబ్బంది, ఉద్యోగుల గైర్హాజరుతో ఆ ప్రభావం సేవలపై పడుతోంది. కొందరైతే అసలు విధుల్లోకే రాకుండా..వస్తున్నట్లు మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. మరికొందరు ఆలస్యంగా వచ్చి మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోయి..సొంత పనులు చూసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విధుల అలసత్వానికి చెక్‌పెట్టేందుకు ఎఫ్ఆర్ఎస్ అమలుకు జలమండలి సిద్ధమైంది. -
అమీన్పూర్లో దందాలు.. హైడ్రా కమిషనర్ ఆగ్రహం
హైదరాబాద్: నగరంలో ఆక్రమణలపై ఇప్పటికే హైడ్రా కొరడా ఝుళిపిస్తూ వస్తోంది. ఆక్రమణలకు పాల్పడిన కట్టడాలని కూల్చివేసే ప్రక్రియను గత కొన్ని నెలల క్రితమే హైడ్రా ఆరంభించింది. అయితే హైడ్రా జేఏసీ పేరుతో పలువురు దందాలు చేస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పలువురు జేఏసీ ఏర్పాటు పేరుతో దందాలు చేస్తూ బిల్డింగ్ నిర్మాణదారుల నుంచి డబ్బులు పిండుకునే వ్యవహారానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా అమీన్ పూర్ పెద్ద చెరువులో దందాలు నిర్వహిస్తున్నట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. -
జోరు.. హుషారుగా : మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్-బ్యూటీఫుల్ ఆడిషన్స్
నగరంలో జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ – బ్యూటీఫుల్ ఆడిషన్స్ ఆకట్టుకున్నాయి. మాసాబ్ ట్యాంక్‌లోని జేఎన్ఎఫ్ యూలో శుక్రవారం యువతులతో పాటు వివాహిత మహిళలకు ఈ ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న రంగాలకు చెందిన వారు ఈ పోటీల్లో హుషారుగా పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో సినీనటుడు జోయల్, మిస్ ఇండియా రన్నరప్ నిషితా తదితర ఫ్యాషన్ రంగ ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ఆడిషన్స్ ద్వారా ఎంపికైన వారు మార్చి 29న జరిగే ఫైనల్స్‌లో పోటీ పడతారని నిర్వాహకురాలు కిరణ్మయి అలివేలు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : హైదరాబాద్ : ఆకట్టుకున్న మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ ఆడిషన్స్ (ఫొటోలు) శిల్పారామానికి గోల్డ్ గార్డెన్మాదాపూర్ : మాదాపూర్ శిల్పారామం అరుదైన పురస్కారాన్ని అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టీకల్చర్ ఎనిమిదో గార్డెన్ ఫెస్టివల్లో మాదాపూర్ శిల్పారామానికి ల్యాండ్‌స్కేప్ గార్డెన్ నిర్వహణకు గానూ గోల్డ్గార్డెన్ సర్టిఫికెట్, జ్ఞాపికను అందజేశారు. ఈ అవార్డు ఇచ్చినందుకు శిల్పారామం ప్రత్యేక అధికారి జి.కిషన్‌రావు సంతోషం వ్యక్తం చేశారు .డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టీకల్చర్ ఎనిమిదో ఫెస్టివల్లో ప్రదానం -
మన్సూరాబాద్ లో తల్లిని రోడ్డుపై వదిలి వెళ్లిపోయిన కొడుకు
-
పంజాగుట్ట షాన్‌బాగ్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాన్‌బాగ్ హోటల్లోని ఐదో అంతస్తులో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.కాగా, పుప్పాలగూడ పాషా కాలనీలో నిన్న(శుక్రవారం) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన విషాదాన్ని నింపింది.స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి. -
హైదరాబాద్‌లో ‘గ్లోబల్’ జోష్
గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్(GCC)లకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. గతేడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2.83 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోరెండేళ్లలో ఏకంగా 5.28 కోట్ల చదరపు అడుగుల డీల్స్ పూర్తయ్యాయి. జీసీసీ లావాదేవీల్లో ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లు పోటీపడుతున్నాయని పేర్కొంది. 1.2 కోట్ల చదరపు అడుగులతో బెంగళూరు టాప్‌లో ఉండగా హైదరాబాద్‌లో 48.6 లక్షల చదరపు అడుగుల మేర జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి.జీసీసీ అంటే? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు.మూడో స్థానంలో హైదరాబాద్దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగానికి చెందిన జీసీసీలలో దాదాపు 35% లేదా 42 బెంగళూరులో ఉండగా 16 జీసీసీలతో హైదరాబాద్.. ఢిల్లీ ఎన్సీఆర్ (22) తర్వాత మూడవ స్థానంలో ఉంది. అయితే నైపుణ్యాలు కలిగిన 19% మంది యాక్టివ్ ఉద్యోగార్థులతో రెండవ స్థానంలో ఉందని కెరీర్‌నెట్ తెలిపింది. -
భాగ్యనగరంలో..‘విజ్ఞాన్ వైభవ్ 2 కే 25’ (ఫొటోలు)
-
రోడ్డురోలర్ కొట్టేసి.. తుక్కుకింద అమ్మేసి..
మహబూబాబాద్ రూరల్: బంగారం, వెండి, డబ్బులు, ఇతర వస్తువులు చోరీ జరగడం సాధారణమే. కానీ టన్నులకొద్దీ బరువుండే రోడ్డు రోలర్‌ను కొందరు దొంగలు అపహరించి.. పాత ఇనుప సామాను దుకాణంలో అమ్మేసి డబ్బుతో ఉడాయించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తండ్రీకొడుకులు ఎస్.కే.బడేమియా, ఖాదర్, కరీమ్ ఉమ్మడిగా పాత ఇనుప సామాను (స్క్రాప్) దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణానికి చెందిన ఎంఎస్ కన్స్ట్రక్షన్ సివిల్ రైల్వే కాంట్రాక్టర్ మోహన్‌మిశ్రా పేరిట ఉన్న రోడ్డురోలర్‌ను.. కొందరు వ్యక్తులు జేసీబీతో పాత ఇనుప సామాను దుకాణానికి తీసుకొచ్చారు. రూ.2.19 లక్షలకు దాన్ని విక్రయించి, వచ్చిన నగదుతో వెళ్లిపోయారు. కాగా, చోరీ చేసి తీసుకువచ్చి విక్రయించారని గ్రహించని స్క్రాప్ దుకాణం నిర్వాహకులు రోడ్డురోలర్‌ను గ్యాస్ కట్టర్‌తో ముక్కలు చేసే పనిలో నిమగ్నం కాగా.. వారికి ఒక ఫోన్ వచ్చింది.రోడ్డురోలర్ యజమానిని మాట్లాడుతున్నానని.. ఇటీవల చోరీ అయిన తన రోడ్డురోలర్‌ను ఎలా కొనుగోలు చేశారని అవతలి వ్యక్తి ప్రశ్నించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో తమను మోసగించి విక్రయించారని దుకాణ యజమానులు లబోదిబోమన్నారు. రోడ్డురోలర్ చోరీ, విక్రయంపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
హైదరాబాద్ : ఆకట్టుకున్న మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ ఆడిషన్స్ (ఫొటోలు)
-
అమ్మను అనాథను చేశాడు!
మన్సూరాబాద్(హైదరాబాద్): రోజు రోజుకూ మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు ఆమెను రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. వృద్ధురాలి దీనస్థితిని గమనించిన కాలనీవాసులు అక్కున చేర్చుకుని అన్న పానీయాలు అందించి ఆశ్రయం కల్పించారు. ఈ ఘటన మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. వృద్ధురాలు చెప్పిన వివరాల ప్రకారం.. భువనగిరి– యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామానికి సమీపంలోని సీత్యా తండాకు చెందిన ధర్మీ (80)కి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. వీరిలో ఇద్దరు పెద్ద కుమారులు గతంలోనే చనిపోయారు. చిన్న కుమారుడు లక్ష్మణ్ నాయక్ వద్ద ధర్మీ ఉంటోంది. లక్ష్మణ్‌నాయక్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. ఎల్బీనగర్లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం లక్ష్మణ్‌నాయక్ తన తల్లి ధరీ్మని మన్సూరాబాద్‌లోని చిత్రసీమ కాలనీలోని లిటిల్ చాంప్ స్కూల్ వద్ద తన ఆటోలో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ధర్మీ కాలనీలోని రోడ్ నంబర్–4లో ఓ మూలన కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన రిటైర్డ్ అధికారి బొప్పిడి కరుణాకర్‌రెడ్డి, సైదులు గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచారు. తన కుమారుడు ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లాడని చెప్పింది. దీంతో ఆమెకు ఆశ్రయం కల్పించి ఈ సమాచారాన్ని 108తో పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ వృద్ధురాలి కోసం ఎవరూ రాకపోవడంతో కాలనీ వాసులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఆలేటి వృద్థాశ్రమానికి ధరీ్మని తరలించారు. కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన కుమారుడికి తగిన బుద్ధి చెప్పాలని కాలనీ వాసులు కోరారు. -
మూడు ప్రాణాలు బలి
మణికొండ(హైదరాబాద్): గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ పాషా కాలనీలో శుక్రవారం సాయంత్రం విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కారులోని గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మరింత ఉద్ధృతమై భవనంలోని మొదటి అంతస్తుకు వ్యాపించడంతో కిచెన్ గదిలోని రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఓ గదిలో ఇరుక్కుపోయిన ఉస్మాన్‌ఖాన్ తల్లి జమిలాఖాతమ్ (78), అతని తమ్ముడి భార్య శాహినా ఖాతమ్ (38), తమ్ముడి కూతురు సిజ్రా ఖాతమ్ (4)లు ఊపిరి ఆడకపోవడంతో గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందికి దూకి.. మంటల నుంచి తప్పించుకునేందుకు చుట్టుపక్కల వారు బాధితుల ఇంటి ముందు పరుపులు వేయగా.. ఉస్మాన్‌ఖాన్ తమ్ముడు యూసుఫ్‌ఖాన్, కుమారుడు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకారు. దీంతో యూసుఫ్ ఖాన్ కాలు విరిగింది. గాయపడిన యూసుఫ్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్ని మాపక శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్లాట్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. అగి్నమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత పైఅంతస్తుకు వెళ్లి గోడలకు రంగులు వేసే జూల ద్వారా ఇద్దరిని సురక్షితంగా కిందికి తీసుకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు మొదటి అంతస్తు నుంచి దూకి, ఇద్దరు జూల ద్వార కిందికి వచ్చి ప్రాణాలను కాపాడుకోగా.. ఇద్దరు మహిళలు, బాలిక మృతి చెందారు. ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
Hyderabad: ‘జూ’ టికెట్ ధరలు పెరిగాయ్
హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూ పార్కు సందర్శనకు కొత్త టికెట్ రేట్లు ఈ నెల 1 నుంచి (శనివారం) అమలులోకి రానున్నాయి. గతంలో పెద్దలకు వారం రోజుల్లో రూ.70, చిన్నారులకు రూ.45 ఉండగా.. వీకెండ్‌తో పాటు సెలవు రోజుల్లో రూ.80, రూ.55 ఉండగా.. ప్రస్తుతం రెండు కేటగిరీలుగా కాకుండా వారం రోజుల్లో పెద్దలకు రూ.100, చిన్నారులకు రూ.50గా నిర్ధారించారు. వీటితో పాటు జూ సందర్శనలో వివిధ కేటగిరీలకు కూడా రేట్లు పెరిగాయి. కొత్త రేట్లు ఇలా.. గతంలో రూ.120 టికెట్ ఉన్న స్టిల్ కెమెరాకు ప్రస్తుతం రూ.150 వసూలు చేస్తారు. రూ.600 ఉన్న వీడియో కెమెరాకు రూ.1900 పెంచి రూ.2500గా నిర్ధారించారు. ఇక మూవీ కెమెరా షూటింగ్ (కమర్షియల్)కు రూ.10 వేలు, టాయ్ ట్రైన్‌కు పెద్దలకు రూ. 80, చిన్నారులకు రూ.40, బ్యాటరీ వెహికిల్ పెద్దలకు రూ.120, చిన్నారులకు రూ. 70, ఒక గంట పాటు తిరిగే 11 సీటర్ల వెహికిల్‌కు రూ.3000, 14 సీటర్ల వెహికిల్స్‌కు 4000, ఏసీ సఫారీ బస్సు ఒకొక్కరికి రూ. 150, నాన్ ఏసీ బస్సు రూ.100 చొప్పున కొత్త రేట్లు ఉండనున్నాయి. నేవిగేషన్ యాప్‌తో.. అంతేకాకుండా ప్రస్తుతం జూ సందర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా ముందస్తుగానే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. మొబైల్ నేవిగేషన్ యాప్‌తో గైడ్ లేకుండానే జూ పార్కును చుట్టి రావచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని జూ సందర్శనకు వెళితే.. అన్ని ఎన్‌క్లోజర్స్‌తో పాటు ఇతర సమాచారం ఇట్టే మన కళ్ల ముందుంటుంది. -
Narsingi : అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ : నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.పోలీసుల వివరాల మేరకు నార్సింగిలోని స్థానికంగా పాషా నగర్ కాలనీలోని జీ ప్లస్ టూ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్క్ చేసి ఉన్న కారులో మంటలు వ్యాపించాయి. కారులో వేడి తీవ్రత కారణంగా మంటలు భవనం మొత్తం వ్యాపించాయి.అగ్ని ప్రమాదంతో భవనంలో నివాసం ఉంటున్న ఇద్దరు పిల్లలు కిందకి దూకారు. మంటల దాటికి గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు జమీలా, సహానా,నాలుగేళ్ల చిన్నారి షీర్జా మరణించారు.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
‘ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కార్యకర్తలు పని చేయాలి’
హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలన్నారు మంత్రి సీతక్క. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ అధికారం అనేది వస్తుంది.. పోతుంది. కానీ 140 ఏళ్లుగా దేశానికి పార్టీ సేవలు చేస్తుంది.పార్టీ అనేది తల్లి లాంటిది. తల్లి లేకపోతే పిల్లలు అనాథలు అవుతారు. కాబట్టి క్షేత్ర స్థాయిలో పార్టీ జెండా పండగ కార్యక్రమాలు చేయాలి. గ్రామ గ్రామాన ప్రభుత్వ కార్యక్రమాలు వివరించాలి. అర్హులకు పథకాలు అందేలా చూడాలి. ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకు వెళ్ళాలి. భవిష్యత్ లో పార్టీ బలోపేతం కు ఉపయోగ పడుతుంది. రాహుల్ గాంధీ చరిత్మకమైన భారత్ జోడొ యాత్ర చేశారు. నిర్మాణాత్మకంగా పార్టీ పటిష్టత కోసం పని చేయాలి. మరో వందేళ్లు పార్టీ నిలబడేలా కార్యాచరణ తీసుకోవాలి. పార్టీ లోకి కొందరు వస్తుంటారు పోతుంటారు.. అవేవీ పట్టించుకో వద్దు’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. -
‘లివింగ్ టెంపుల్’ ఆర్ట్ షో ప్రారంభం, ముఖ్య అతిథిగా స్మితా సబర్వాల్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లివింగ్ టెంపుల్’ హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని టి-వర్క్స్‌లో ప్రారంభమైంది. భారతదేశ ఆలయ కళ, సంస్కృతి మరియు వారసత్వాన్ని చాటుకునే ఈ ప్రదర్శనలో టెంపుల్ ఆర్ట్ స్ఫూర్తితో 30 మంది కళాకారులు వారి వారి కళారూపాలను ప్రదర్శిస్తారు. ‘లివింగ్ టెంపుల్’ పేరుతో నిర్వహిస్తున్న మూడు రోజుల పాలు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పర్యాటక, సంస్కృతి, వారసత్వం మరియు యువజన వ్యవహారాల శాఖ, తెలంగాణ) స్మితా సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు సర్వే శాఖ కెకె ముహమ్మద్ తదితరులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, “ఇది యువకులు, అనుభవజ్ఞులైన కళాకారులతో జమిలిగా కలిసి వచ్చే క్యాలెండర్ కార్యక్రమంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీనికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కెకె ముహమ్మద్ మాట్లాడుతూ, “వివిధ రకాల వారసత్వ పర్యటనలు ఉన్నాయి కానీ,అవి ప్రజలను ఆకట్టుకునేలా వినూత్నంగా ఉండాలన్నారు. సందర్శకులకు ఈ ప్రదర్శనను ఆదరించడం ద్వారా సింగపూర్, చైనాలో లాగా ఈ స్మారక చిహ్నాలను జీవన వారసత్వంగా మార్చాలని అభిలషించారు.మన వారసత్వాన్ని, ప్రకృతిని కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు ప్రముఖ ఆర్టిస్ట్, కళా దర్శకుడు తోట తరణి తన సెట్‌ను తీసివేసినపుడు, ఈ ప్రదేశంలో ఎలాంటి శిథిలాలు లేకుండా జాగ్రత్త పడతానని వివరించారు.తెలంగాణ టూరిజం మద్దతుతో అన్నపూర్ణ మడిపడిగ క్యూరేట్ చేస్తున్న ‘లివింగ్ టెంపుల్’ దేశవ్యాప్తంగా ఉన్న 30 మందికి పైగా ప్రఖ్యాత కళాకారులు భారతీయ దేవాలయాల గొప్ప వారసత్వాన్ని ప్రదర్శిస్తారు. 100 కి పైగా అద్భుతమైన కళాకృతులతో,సాంప్రదాయ ఆలయ కళ, సమకాలీన కళాత్మక వ్యక్తీకరణల అందమైన కలయికగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన కళాఖండాల సేకరణతో పాటు - ఆర్ట్ - హెరిటేజ్ టూరిజం - ది మిస్సింగ్ లింక్ , ప్యానెల్ చర్చ, సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. తోట తరణి, అమర్ రమేష్, ద్రధా, చరణ్ జీత్, పర్ణవి బంగర్, రాయన్న గిరిధర్ గౌడ్, సంగం వంఖడే, వినోద్ దరోజ్ లాంటి అనేక ప్రఖ్యాత కళాకారుల బృందం అద్భుతమై ప్రదర్శనివ్వబోతోంది. ఈ కార్యక్రమం పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహమ్మద్, ఫోటోగ్రాఫర్ అమర్ రమేష్ , కళాకారుడు ద్రధా వ్రత వంటి నిపుణుల సహకారం తో ‘లివింగ్ టెంపుల్’ భారతీయ ఆలయ సంస్కృతి యొక్క సజీవ వారసత్వానికి ఒక వేడుక, ఒక మరపురాని అనుభవాన్ని మిగల్చినుంది అనడంలో సందేహంలేదు.ఫిబ్రవరి 28 2025 మార్చి 2 వరకు సందర్శకులకు ఆహ్వానంప్రదర్శన: ఉదయం 11:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకువేదిక : టి-వర్క్స్, శిల్ప్ గ్రామ్ క్రాఫ్ట్ విలేజ్, రాయ్ దుర్గ్, హైదరాబాద్, తెలంగాణ 500081.మరిన్ని వివరాల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెం.అన్నపూర్ణ మడిపడిగ- 9052594901 -
మేం ‘పింక్ బుక్’ రాస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ప్రత్యర్థి పార్టీల నేతలకు, అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మేం పింక్ బుక్ (pink book) రాస్తున్నాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోం’ అని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో శుక్రవారం బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ (brs) నాయకులు ఎమ్మెల్సీ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా 3 బిల్లులు పెట్టాలి. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.కాంగ్రెస్ చేపట్టిన కుల గణన సర్వే తప్పుడు తడకగా ఉంది. 2014 కేసీఆర్ (kcr) జరిపిన సర్వేలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేలింది. నేటి కాంగ్రెస్ సర్వే 46 శాతం బీసీలు ఉన్నట్లు చెబుతోంది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరం. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారత్ అమెరికాను మించిపోయేది’అని వ్యాఖ్యానించారు.మరోవైపు, నాగర్ కర్నూల్ సొంత జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ‘సింగోటం ఆలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారు. దేవుడికిచ్చిన డబ్బులను జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ.15 కోట్లను క్యాన్సిల్ చేయడం దారుణం. జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష్య గట్టి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలు హత్య కేసుల్లోని హంతకులకు కొమ్ము కాస్తున్నారు. జూపల్లి నియోజకవర్గానికి రావాలి. టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్ట్లా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గానికి రావడం లేదు. మేం పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు నాయకులైనా, అధికారులైనా ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. -
కష్టం తీర్చిన కుంభమేళ.. ఆటో కుర్రాడి భావోద్వేగం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం... మహా కుంభమేళ ముగిసింది! త్రివేణీ సంగమ స్థలి ప్రయాగ్‌రాజ్‌లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్లమంది సందర్శించారు. పవిత్ర గంగలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవశ్యంలో మునిగితేలారు. వీరందరిది ఒక ఎత్తైతే.. కొందరు పరోపకారాన్ని కూడా అంతే శ్రద్ధాసక్తులతో చేసి ఆత్మానందం పొందారు. అలాంటి ఓ సంఘటన సాగిందిలా...కోట్లమందిలాగే.. స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధ పరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడం కోసం ఆమె కూడా కుంభమేళాకు వెళ్లారు. ఎక్కడో ఓ మూలనున్న రిసార్టులో మకాం. అక్కడి నుంచి సంగమ స్థలికి వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకున్నారు.. దాన్ని నడుపుతోంది ఓ నూనూగు మీసాల కుర్రాడు. మాట మాట కలిసింది. కుశల ప్రశ్నలయ్యాయి. బడికెందుకు వెళ్లడం లేదన్న ప్రశ్న వచ్చింది. అంత సౌలభ్యం లేదన్న సమాధానంతోపాటు తప్పనిసరి పరిస్థితుల్లోనే... బతుకు కోసం ఆటో నడపాల్సి వస్తుందని ఆ కుర్రాడు తన బాధను వెళ్లబోసుకున్నాడు. ఈ మాటలు ఆమెలో ఆసక్తిని పెంచాయి. మెల్లిగా మాటలతో అతడి నేపథ్యం గురించి ఆరా తీశారు.మేడమ్ జీ.. అంటూ మొదలుపెట్టి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడతను. చదువుకోవాల్సిన వయసులో తల్లిని పోషించాల్సిన భారం ఆ కుర్రాడిపై పడింది. అందుకే బాడుగకు ఆటోను నడిపిస్తున్నట్లు చెప్పాడతను. రోజుకు రూ.వెయ్యి కిరాయి చెల్లిస్తేనే ఆటో నడుపుకోవచ్చునని, చెల్లించని రోజు లేదా తక్కువ మాత్రమే ఇవ్వగలిగిన రోజు ఆటో యజమాని నానా ఇబ్బందులు పెడుతున్నాడని ఆ కుర్రాడు వాపోయాడు. అతని పరిస్థితి గురించి తెలుసుకుని ఆమె చలించిపోయారు. సొంత ఆటో ఉంటే బాగుంటుంది కదా? అని అన్నారామె. నిజమే.. కానీ నాకెవరు ఇస్తారు మేడమ్ జీ?. అంత స్థోమతెక్కడిది నాకు? అన్నాడా కుర్రాడు. అదంతా నేను చూసుకుంటా.. నీ వివరాలివ్వు అన్న ఆ మేడమ్ జీ.. మరుసటి రోజు ఆ కుర్రాడికి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఆటో కొనుగోలుకు సంబంధించిన డౌన్‌పేమెంట్ రసీదును వాట్సప్‌లో అందుకున్న ఆ కుర్రాడి కళ్లల్లో కచ్చితంగా నాలుగు చుక్కల ఆనందభాష్పాలు రాలే ఉంటాయి. అందుకేనేమో.. కష్టాల ఊబి నుంచి తనను బయటకు లాగేసేందుకు విచ్చేసిన ఇంకో తల్లికి కృతజ్ఞతలు చెప్పాడు. తనతోపాటు జన్మనిచ్చిన తల్లితోనూ ఆ మేడమ్ చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పించాడు. ఆడియో మెసేజీ ద్వారా.. ఆ మేడమ్ జీని దేవుడే పంపించాడని మురిసిపోయారు. మళ్లీ సంగం వస్తే తప్పకుండా తమకు ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానించారు. ఇంతకీ ఆ మేడమ్ ఎవరన్నదేనా మీ సందేహం. పేరు.. భారతి చంద్రశేఖర్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరిశ్ధోన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సతీమణి. ఎస్సీఎస్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలువురి విద్య, ఆరోగ్య అవసరాలకు సాయం చేసిన భారతీ చంద్రశేఖర్ తాజాగా తనకెంతో తృప్తిని కలిగించిన ఈ అనుభవాన్ని ‘సాక్షి.కాం’తో పంచుకున్నారు. -
నోవోటెల్లో నోరూరిస్తున్న ఫుడ్ ఫెస్ట్
విభిన్న వంటకాలకు నెలవైన నగరంలో గుజరాత్ రుచులు ఆహార ప్రియుల నోరూరిస్తున్నాయి. భౌగోళిక సమ్మేళనానికి ఈ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెఫ్ పూనమ్ చెబుతున్నారు. గుజరాత్ గ్రామీణ పాంతాల్లోని ప్రత్యేక వంటకాలతో పాటు, విశ్వవ్యాప్తంగా ఇష్టపడే తమ సిగ్నేచర్ డిషెస్ వండి వడ్డిస్తున్నారు. ఎయిర్‌పోర్టు వేదికగా నోవోటెల్లో ఏర్పాటైన ఈ ఫెస్టివల్ మార్చ్ 2 వరకూ కొనసాగనుంది. ఇందులో సూర్తి ప్యాటీలు, కుచ్చి దబేలి వంటి వెరైటీలు లైవ్ కౌంటర్లలో ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి సిటీ బ్యూరో నగరంలోని నోవోటెల్ ఎయిర్పోర్ట్ వేదికగా కొనసాగుతున్న గుజరాత్ కతియావాడి వంటకాలు నగరవాసుల నోరూరిస్తున్నాయి. గుజరాత్ ప్రాంతానికి చెందిన ప్రముఖ చెఫ్ పూనమ్ దేధియ ఆధ్వర్యంలో అక్కడి సంప్రదాయ వంటకాలను ఆహారప్రియులకు వడ్డిస్తున్నారు. ఈ ఫెస్ట్ నగరంలో మరో సాంస్కృతిగా సమ్మేళనంగా కనిపిస్తోంది. ‘స్వాద్ కతియావాడ్ కా’ పేరుతో ఏర్పాటైన ఈ పసందైన రుచులు బఫే నుంచి స్నాక్స్ వరకూ అక్కడి పురాతన రుచులను అందిస్తుంది. కోప్రా పాక్.. ఎండు కొబ్బరి, చక్కెర, నెయ్యి, కొత్తిమీరతో తయారు చేసే వినూత్న రుచికరమైన వెరైటీ. ఇది గుజరాతీ స్పెషల్. ఇందులో విభిన్న రకాల డ్రై ఫ్రూట్స్ వినియోగిస్తారు. 100 గ్రాములకు సుమారు 280 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. క్లాసిక్ హ్యాండ్వో.. ఇది గుజరాత్‌కి చెందిన ప్రత్యేక స్నాక్. ఈ క్లాసిక్ హ్యాండ్వో ఫెర్మెంటెడ్ రైస్, బటర్, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కూరగాయల మిశ్రమం, గుజరాత్లో మాత్రమే లభించే మసాలాలు కలిపి తయారుచేస్తారు. వంటకాల్లో వైవిధ్యంవిభిన్న కూరగాయల మిశ్రమంతో, ఘాటైన మసాలాల ఘుమఘుమలతో తక్కువ సెగపై నెమ్మదిగా వండేవంట వరదియు.. మంచి సువాసనతో కాసింత సూప్‌తో గుజరాతీ వెరైటీని నోటికి అందిస్తుంది. బిజోరా పికిల్.. ఈ అరుదైన వంటకం గుజరాత్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు పొందిన ప్రత్యేక వంటకం. ఈ బిజోరా పికిల్ కేవలం గుజరాత్లో మాత్రమే లభిస్తుందని చెఫ్ తెలిపారు. ఇది స్థానిక సాంస్కృతిక వంటకమే కాకుండా ఎన్నో ఆరోగ్య సంరక్షణ గుణాలున్న రుచికరమైన పికిల్. లిల్వాని కచోరి.. కరకరలాడించే లడ్డూ లాంటి స్పెషల్ గుజరాతీ కచోరి ఇది. ఇందులో ప్రత్యేక రుచికరమైన పదార్థాలతో పాటు బఠానీల మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసి వడ్డిస్తారు. చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ? -
మనసు 'దోసే'స్తారు..!
టాలీవుడ్ ప్రముఖులను సిటీలో చూడాలనుకుంటే.. కాస్ట్లీ క్లబ్లోనో, సగటు మనిషి తొంగిచూడలేని లగ్జరీ కేఫ్‌లోనో.. ఒక్కోసారి అనుకోకుండా మరో చోటనో తారసపడవచ్చు. కొన్ని సార్లు.. సాదా సీదా ఇడ్లీలు, దోశలు విక్రయించే టిఫిన్ సెంటర్ దగ్గర కూడా కావచ్చు. అవును మరి.. విలాస వంతమైన రెస్టారెంట్లు, ప్రత్యేకమైన క్లబ్‌లు హై–ఎండ్ కేఫ్‌లకు మాత్రమే వెళ్లడం అలవాటైన వారిని కూడా ఓ టిఫిన్ సెంటర్ రారమ్మంటోంది. అదే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో ఉన్న రాయలసీమ శైలి ప్రత్యేకమైన అల్పాహారంతో చవులూరిస్తోంది.పంచెకట్టు అంటే.. తెలుగింటి వస్త్రధారణ గుర్తొస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ తన పేరుకు తగ్గట్టే మెనూలో సంప్రదాయం ప్రతిబింబిస్తుంది. నెయ్యి, కారం ఇడ్లీ, కారం పాళ్యం దోసె, ఉల్లి, నెయ్యి కారం దోశ, నన్నారి ఫిల్టర్ కాఫీ వంటి వెరైటీలే ఇక్కడ ఉంటాయి. ఇక దోశల తయారీ చూడటం ఒక చక్కటి అనుభవం. ప్రతి దోశనూ తక్కువ మంటపై రెండు వైపులా దోరగా కాల్చి, నెయ్యి పోసి, కారం పొడితో ప్లేట్లో ఉంచుతారు. పల్య (బంగాళదుంప కూర), టాంగీ మిరపకాయ చట్నీ క్లాసిక్ కొబ్బరి చట్నీతో కలిపి వడ్డిస్తారు.అలా మిస్సై.. ఇలా క్లిక్కై.. తాడిపత్రి మా సొంతూరు. అక్కడి నుంచి నగరానికి ఐటీ ఉద్యోగం రీత్యా వచ్చాం.. మా ప్రాంతపు వంటకాలను బాగా మిస్సయ్యేవాడిని. నాలాంటి ఫీలింగ్ మరికొందరిలోనూ చూశాక.. 2019లో ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశాను. పంచెకట్టుతో దోశలు వేయడం, తినడం మా ప్రాంతంలో సర్వసాధారణం. అందుకే ఆ పేరు పెట్టాను. అనంతరం నగరవాసుల ఆదరాభిమానాలతో పూర్తి స్థాయి రెస్టారెంట్‌గా మార్చాను. ఇడ్లీ, దోశలతో పాటు ఉప్మా, పొంగలి.. వంటి అల్పాహారాలు అందిస్తున్నాం. నెయ్యి, మసాలా తదితర ముడి దినుసులతో సహా చాలా వరకూ రాయలసీమ నుంచే తీసుకొచ్చి స్థానిక ఫ్లేవర్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాం. – నాగాభరణ్, పంచెకట్టు దోసె నిర్వాహకులు టాలీవుడ్ ఫేవరెట్ స్పాట్.. తొలుత ఫుడ్ ట్రక్‌గా ప్రారంభమైన పంచెకట్టు దోశ, ఇప్పుడు నగరం చుట్టూ నాలుగు శాఖలకు విస్తరించింది. దీని కస్టమర్లుగా టాలీవుడ్ సెలబ్రిటీలైన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, హీరో సిద్ధార్థ, నటుడు మురళీ శర్మ, నటి లక్ష్మి మంచు తదితరులతో పాటు బ్యూటీ క్వీన్ మానుషి చిల్లర్, మేఘాంశ్ శ్రీహరి, గాయకుడు మనో, దర్శకుడు పరశురామ్ కూడా ఉన్నారు. బంజారాహిల్స్, మాదాపూర్, ప్రగతి నగర్ కొండాపూర్‌లలో పంచెకట్టు దోశ సెంటర్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by FORAGE HOUSE| Shreya Gupta (@forage_house) (చదవండి: అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్‌లో..!) -
డాక్టర్ బూట్లు ఎత్తుకెళ్లాడు..
సాక్షి, హైదరాబాద్ : సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఓ విచిత్రమైన చోరీ జరిగింది. వైద్యుడి గదిలోకి వచ్చిన ఓ ఆగంతకుడు అక్కడ ఉన్న బూట్లను ఎత్తుకెళ్లాడు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమాజీగూడ, యశోద ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం ఓ ఆగంతకుడు డాక్టర్లు వినియోగించే బీ1 సెల్లార్ నుంచి లిఫ్ట్‌లో ఐదో అంతస్తులోకి వెళ్లాడు. అక్కడ ఓ వైద్యుడి గదిలో డాక్టర్‌కు చెందిన డ్రెస్సింగ్ రూమ్ నుంచి రూ.15 వేల విలువ చేసే షూస్‌ను తస్కరించాడు. ఆస్పత్రి సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణ ఫిర్యాదు మేరకు పంజగుట్ట (Panjagutta) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తి బీ1 సెల్లార్ నుంచి ఐదో అంతస్తుకు వెళ్లి డాక్టర్ డ్రెస్సింగ్ రూమ్‌లో షూస్ తొడుక్కుని అక్కడి నుంచి నడిచి వెళ్తున్నట్లు గుర్తించారు. ఆస్పత్రి నుంచి బయటికి వచ్చిన అతను రాజ్‌భవన్ వైపు నడిచి వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. చిల్లర దొంగ పనే సూర్యాపేటకు చెందిన మహేష్ (22) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చిన అతను సోమాజీగూడలోని దక్కన్ ఆస్పత్రిలో పని చేస్తూ ఇక్కడే హాస్టల్లో ఉండేవాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న యశోద ఆస్పత్రి సిబ్బందితో పరిచయాలు పెంచుకుని తరచూ వచ్చి పోతుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నేరుగా ఆస్పత్రి ఐదో అంతస్తుకు వెళ్లి వైద్యుడి డ్రెస్సింగ్ రూమ్‌లో షూస్ దొంగిలించి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి గదిలో సోదాలు చేయగా ఒక ఐ–ఫోన్, ట్యాబ్‌తో పాటు షూస్ స్వాధీనం చేసుకున్నారు. చదవండి: రియల్ టైమ్‌లో పట్టేస్తున్నారు! -
నా కారునే ఆపుతావా..?
పంజగుట్ట : కేవలం రూ. 4 వేల పెండింగ్ చలానాలు ఉంటే నా కారునే ఆపుతావా ..? నీకు ఎంత ధైర్యం అంటూ ఓ వ్యక్తి పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించాడు. నేను తలచుకుంటే ఐదు నిమిషాల్లో నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాను అంటూ చిందులు తొక్కాడు. అంతే కాకుండా లైసెన్స్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ఏర్పాటు చేసుకోవడం, కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకుని దర్జాగా తిరుగుతున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తులో ఉన్న ట్రాఫిక్ పోలీసులు తాజ్‌కృష్ణా నుంచి మోనప్పా సర్కిల్ వైపు వస్తున్న ఫ్యాన్సీ నెంబర్‌తో ఉన్న ఓ కారును గుర్తించారు. మోనప్ప సర్కిల్ వద్ద కారును ఆపి పెండింగ్ చలానాలు చెక్ చెయ్యడంతో రూ.4 వేలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా విండోస్‌కు బ్లాక్ ఫిల్మ్ కనిపించాయి. కారు నడుపుతున్న గచి్చ»ౌలికి చెందిన అరీఫ్ అనే వ్యక్తిని కారు దిగాల్సిందిగా కోరారు. దీంతో ఆరీఫ్ కారు దిగుతూనే తనను ఎందుకు ఆపారు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. కేవలం రూ.4 వేలు పెండింగ్‌లో ఉంటే తన కారును ఆపుతారా ..?, నా ఇంట్లో ఉన్న కారుకు రూ.16 వేలు పెండింగ్ ,లానాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరూ అడగలేదు, నేను తలచుకుంటే ఐదు నిమిషాల్లో మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాను అంటూ వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై మోజీరామ్ అతడిని అడ్డుకుని కారును పక్కకు తీయించి కారు టైర్లకు లాక్ వేశారు. అతడి వద్ద లైసెన్స్ కూడా లేనట్లు గుర్తించిన పోలీసులు కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి, పెండింగ్ చలానా రూ.4 వేలు, లైసెన్స్ లేనందుకు మరో రూ.వెయ్యి చలానా విధించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు పంజగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గచ్చిబౌలి స్టేడియంలో ‘విజ్ఙాన్ వైభవ్-2025’ ప్రదర్శన (ఫొటోలు)
-
హైరైజ్బాద్..
సాక్షి, హైదరాబాద్: ఆకాశహర్మ్యాలతో అంతర్జాతీయ నగరంగా విలసిల్లుతున్న హైదరాబాద్‌లో మరో భారీ ఆకాశసౌధం ఆవిష్కృతం కానుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక అంతస్తులు కలిగిన భవనాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన సింక్ అనే సంస్థ 61 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.సుమారు 7.19 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. 5 టవర్లలో అన్నీ 4 పడకగదులు ఉన్న ఫ్లాట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఒక్కో ఫ్లాట్ 3,600 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. ‘వాక్ టు వర్క్’ కాన్సెప్ట్ తరహాలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. దక్షిణాదిలో ఇప్పటివరకు 59 అంతస్తుల నిర్మాణమే (క్యాండియర్ స్కైలైన్) పెద్దది కాగా.. ఇప్పుడు 61 అంతస్తుల అత్యంత ఎత్తయిన టవర్ హైదరాబాద్‌లో రానుండటం విశేషం. -
తెలంగాణలో తుగ్లక్ పాలన.. రేవంత్‌పై ఈటల ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రధాని మోదీని విమర్శిస్తే.. కేసీఆర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.. గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి.. వీటిపై చర్చకు వస్తారా రండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25 ఏళ్లు కొట్లాడినాం.. మూత వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం... తెరిచింది బీజేపీ ప్రభుత్వం. కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందిఅధికారం చేతిలో ఉన్న పని చేసే దమ్ము రేవంత్ కు లేదు.. కానీ కిషన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు ఎలా ముందుకు వెళ్తాయి. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర బస్టాప్ కట్టలేని దుస్థితి. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లో పనులు చూసి రావాలని రేవంత్‌కు సూచన.మోదీ గురించి మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయారో రేవంత్‌కు అదే గతి పడుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది.. సిగ్గు అనిపించడం లేదా? అని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. -
హెచ్‌సీయూలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం
హైదరాబాద్: హెచ్‌సీయూ(హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ)లోనిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం గురువారం రాత్రి కూలిపోయింది. ఈ కూలిన భవనం కింద ఓ కార్మికుడు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. -
ఐటీ హాబ్‌గా మేడ్చల్ జిల్లా!
హైదరాబాద్ నగర శివారుల్లో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త పరిశ్రమలతో వందలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, వేలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించటమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. హైదరాబాద్– వరంగల్ పారిశ్రామిక కారిడార్‌తోపాటు హైదరాబాద్ (Hydearabad) మహానగరం నలువైపులా పారిశ్రామిక పార్కుల విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాటు ఐటీ శాఖ మంత్రి కావటంతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప్పల్ జెన్ ప్యాక్ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు, నగరానికి ఉత్తరాన కండ్లకోయలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిని వేగవంతం చేయటంతోపాటు నగరానికి తూర్పు దిశలో ఉన్న ఘట్కేసర్ మండలం మాదారంలో ఇండ్రస్టియల్ పార్కు (Madaram Industrial Park) స్థాపనకు కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇదే మండలంలోని పోచారంలో దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న ఇన్ఫోసిస్‌ను మరో రూ.750 కోట్ల పెట్టుబడులతో మరింత విస్తరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫోసిస్ (Infosys) విస్తరణపై ఇటీవల వారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పోచారంలో ఇన్ఫోసిస్ వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పింస్తోంది. మరింత విస్తరింపజేయటం ద్వారా త్వరలో కొత్తగా వందలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. నరానికి తూర్పు వైపు ఐటీ విస్తరణలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాల సేకరణకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో... పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించటంతోపాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వే సౌకర్యం, నీటి సరఫరా, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కొండలు, గుట్టలు, అటవీ భూములు కాకుండా ఇతర భూములను ఎంపిక చేయాలని సూచించింది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే ప్రైవేట్ భూములను కూడా గుర్తించాలని, వాటి బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ ధరలను తెలపాలని పేర్కొంది.చదవండి: హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ మరో జీడీసీస్థానికంగా ఉన్న వనరుల వివరాలతోపాటు ఏఏ పరిశ్రమలకు భూములు, ప్రాంతాలు అనువుగా ఉంటాయన్న విషయాలతో అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. భూములను గుర్తించిన తర్వాత ఆయా ప్రాంత చిత్రాలు (లొకేషన్ మ్యాప్‌లు) తయారు చేసి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)కి పంపించాలని నిర్దేశించటంతో అందుకు అనుగుణంగా కార్యాచరణకు వ్యూహా రచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూముల సమగ్ర సర్వేలో రెవెన్యూ యంత్రాంగం తలములకలైనట్లు తెలుస్తోంది. సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని మేడ్చల్ జిల్లా (Medchal District) పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మేడ్చల్ జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంటే.. తొమ్మిది నెలల కాలంలో రూ.380 కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక వేత్తలు 130 కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేశారు. 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. జిల్లాలో కొత్తగా 783 భారీ, సూక్ష్య, మధ్యతరహా పరిశ్రమలను రూ.12,523 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లాలో మరో 46,356 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు.చదవండి: షంషేర్.. చార్మినార్..కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లా ఐటీ హాబ్‌గా మారనుంది. ప్రస్తుతమున్న పరిశ్రమలకు తోడుగా మేడ్చల్‌లో హాస్పిటల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్ అండ్ సైన్స్ ఇండస్ట్రీ, ఘట్కేసర్లో ఐటీ అండ్ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ, గుండ్ల పోచారంలో ఫార్మా అండ్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ రానున్నాయి. మేడ్చల్ జిల్లా ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలోని పోచారం, ఘట్కేసర్, ఉప్పల్, శామీర్‌పేట, మేడ్చల్, కీసర, బోడుప్పల్, చెంగిచర్ల తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం భూసేకరణకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. -
హైదరాబాద్‌లో బిజినెస్ మొదలుపెట్టిన హృతిక్ రోషన్ మాజీ భార్య (ఫోటోలు)
-
హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ మరో జీడీసీ..
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) హైదరాబాద్‌లో మరో గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను (GDC) తెరిచింది. హైటెక్ సిటీలో ఏర్పాటైన ఈ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో హెచ్‌సీఎల్ టెక్ సంస్థకు ఇది ఐదో గ్లోబల్ డెలివరీ సెంటర్. ఈ అత్యాధునిక కేంద్రంలో 5,000 మంది ఉద్యోగులు పని చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ తాజాగా ఏర్పాటు చేసిన గ్లోబల్ డెలివరీ సెంటర్ 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ పొందింది. ఈ కేంద్రం ద్వారా 5,000 ఉద్యోగాలు లభిస్తాయని, ప్రముఖ టెక్ గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.2007 నుండి హెచ్‌సీఎల్ టెక్ సంస్థకు హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది. నగరంలో ఈ సంస్థకు 10,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కొత్త కేంద్రం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు మద్దతు ఇస్తుంది. ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో అధునాతన పరిష్కారాలను అందిస్తుంది.గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణ శరవేగంగా రూపాంతరం చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పట్ల రాష్ట్రానికి ఉన్న నిబద్ధతను ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ 2.0 గ్రోత్ విజన్ ద్వారా వృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.హెచ్ సీఎల్ టెక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ కొత్త కేంద్రంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ‘కృత్రిమ మేధ నేతృత్వంలోని సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తేజకరమైన దశలో మనం ఉన్నాం. మా క్లయింట్లకు ఈ పరిష్కారాలను అందించడానికి మా గ్లోబల్ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక స్థానం. ఇక్కడి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల పురోగతికి కృషి చేస్తాం’ అన్నారు. -
హైదరాబాద్‌లో ఫనాటిక్స్ విస్తరణ..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్పోర్ట్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫనాటిక్స్ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఐసీసీతోపాటు పలు దేశాల్లోని లీగ్పోటీలకు, క్రీడాకారులకు జెర్సీలు, జ్ఞాపికలు, ఇతర వాణిజ్య వస్తువుల డిజైనింగ్, తయారీ, మార్కెటింగ్ పనులు ఫనాటిక్స్ వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 కేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లోనూ ఒక కేంద్రాన్ని ప్రారంభించింది.అయితే పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా ఈ కేంద్రాన్ని విస్తరించేందుకు నిర్ణయించామని, ఇందులో భాగంగా అభిషేక్ దశ్మనాను వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా నియమించామని ఫనాటిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మథియాస్ స్పైచర్ తెలిపారు. అంతేకాకుండా.. రానున్న రెండేళ్లలో హైదరాబాద్ కేంద్రం ఉద్యోగుల సంఖ్యను 250 నుంచి 500కు పెంచుతామని, వచ్చే ఏడాది తొలినాళ్లలోనే హైటెక్ సిటీ సమీపంలో సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఆఫీసుకు వెళ్లనున్నామని ఆయన వివరించారు.ఈ కేంద్రం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది క్రీడాభిమానులకు ఉత్పత్తులు, సేవలు అందిస్తామని చెప్పారు. సంస్థ కార్యకలాపాలన్నింటికీ హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారనుందని అన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక అత్యాధునిక టెక్నాలజీలను హైదరాబాద్ కేంద్రంలో ఉపయోగించనున్నామని చెప్పారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఏఐ అప్లికేషన్స్, ఫనాటిక్స్ గ్లోబల్ కార్యకలాపాలన్నింటికీ అవసరమైన బ్యాక్ఎండ్ టెక్నాలజీలను ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు.ఈ సందర్భంగా అభిషేక్ దశ్మనా మాట్లాడుతూ.. భారత్‌లో క్రీడలపై ఆసక్తి ఏటికేడాదీ పెరుగుతోందని.. క్రీడాభిమానుల మనసు గెలుచుకునేందుకు ఫనాటిక్స్ హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాలు ఉపకరిస్తాయన్నారు. ఫనాటిక్స్ ద్వారా ప్రపంచంలోని ఏ మూలనున్న స్పోర్ట్స్ టీమ్ తాలూకూ జెర్సీ, ఇతర వాణిజ్యవస్తువులను భారత్‌లో కూర్చుని తెప్పించుకునేందకు అవకాశం ఏర్పడిందని అన్నారు.సుమారు 190 దేశాలకు ఫనాటిక్స్ ఉత్పత్తులు రవాణా అవుతూంటాయని, ఇందుకోసం 80కిపైగా తయారీ కేంద్రాలుండగా.. మొత్తం 900 మంది భాగస్వాములతో కలిసి వీటిని ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. ఐపీఎల్ లాంటి భారతీయ క్రీడల్లో భాగస్వామ్యం వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మెర్చండైజ్ తయారీ వంటివి భవిష్యత్తులో తగిన సమయంలో చేపట్టే అవకాశం లేకపోలేదన్నారు. -
చట్టబద్ధతే దత్తతకు మార్గం!
సాక్షి, హైదరాబాద్: అమ్మా, నాన్న అనే పిలుపు కోసం తపన.. తల్లినయ్యానంటూ చెప్పాలనే కోరిక.. తండ్రిగా బిడ్డ వేలుపట్టి నడిపించాలనే తహతహ కొందరు దంపతులను అక్రమ మార్గంలో నడిచేలా చేస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా, చికిత్సలు చేయించుకున్నా వేధిస్తున్న సంతానలేమి సమస్యలు, వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో సమాజంలో చిన్నచూపు, చట్టబద్ధంగా పిల్లల దత్తతకు(Child Adoption) ఏళ్ల కాలం పాటు పట్టే సమయం వెరసీ.. దళారుల మాటలు నమ్మేలా చేస్తున్నాయి. విద్యావంతులు, గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వారు సైతం అక్రమ మార్గంలో పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. పిల్లలు లేని దంపతులకు నవజాత శిశువులను విక్రయిస్తున్న రెండు ముఠాలను మంగళవారం రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా పిల్లలను విక్రయించే నేరస్తులపైనే కాదు శిశువులను కొనుగోలు చేసిన బాధిత తల్లిదండ్రుల పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా పిల్లల దత్తత ఎంత అవసరమో ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో ‘కారా’.. పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడానికి జాతీయ స్థాయిలో ‘కేంద్రీయ దత్తత వనరుల ఏజెన్సీ’ (కారా) పని చేస్తోంది. ఈ ఏజెన్సీ కింద రాష్ట్ర దత్తత వనరుల ఏజెన్సీలు పని చేస్తాయి. అసహాయ పరిస్థితులు, ఆర్థిక భారంతో తల్లిదండ్రులు వదిలేసిన, అప్పగించిన పిల్లలను శిశు సంక్షేమశాఖ అధికారులు చేరదీస్తారు. వీరినే దత్తత ఇస్తారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో శిశువిహార్, జిల్లా స్థాయిలో శిశుగృహాలు ఉన్నాయి. వీటిల్లో ఆరేళ్లలోపు చిన్నారులకు మాత్రమే సంరక్షణ ఉంటుంది. ఆరేళ్లు దాటితే శిశుగృహాల నుంచి బాలసదన్‌కు పంపించి చదువు నేరి్పస్తారు. చిన్నారుల దత్తత కోసం నమోదు చేసుకున్నాక వచి్చన సీనియారిటీ, పిల్లల వయసు, ఆడ, మగ, ఆరోగ్యం తదితరాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే దత్తతకు కనీసం ఏడాది నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. బంధువుల పిల్లల దత్తతకూ అనుమతి తప్పనిసరి.. ఇలాంటి చిన్నారులే కాదు బంధువుల పిల్లలను దత్తత తీసుకోవాలన్నా ‘కారా’ ద్వారా అనుమతి పొందాల్సిందే. దంపతుల వయసు, వైవాహిక బంధం ఆధారంగా చిన్నారులను దత్తత ఇస్తారు. కనీసం రెండేళ్ల పాటు ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా జీవిస్తున్న వారే అర్హులు. సింగిల్ పేరెంట్ అయితే మహిళ మాత్రమే దత్తత తీసుకునేందుకు అర్హురాలు. పురుషులు దత్తత తీసుకోవడానికి చట్టం అనుమతించదు. కేరింగ్స్ పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దంపతులు కుటుంబ పరిస్థితులు, తనిఖీ చేసిన అనంతరం జిల్లా బాలల సంరక్షణ విభాగం (డీసీపీయూ) నివేదిక అందిస్తుంది. అనంతరం ‘కారా’ ప్రాథమిక అనుమతి లేఖను ఇస్తుంది. అప్పుడు డీసీపీయూ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఈ వివరాలన్నీ పరిశీలించాక జిల్లా కలెక్టరు దత్తత ఆదేశాలు జారీచేస్తారు. -
మరో సిరాజ్ కోసం.. పాతబస్తీలో ఎమ్మెస్కే వేట (ఫోటోలు)
-
12 గంటలు రోడ్డుపైనే మృతదేహం..
జోగిపేట(మెదక్): అభాగ్యురాలైన వృద్ధురాలి శవం రోడ్డుపై 12 గంటల పాటు ఉన్నా మున్సిపల్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు. అంత్యక్రియలు నిర్వహించాలని కూతురు వేడుకున్నా కనికరించలేదు. వివరాలిలా ఉన్నాయి. జోగిపేట పట్టణంలో విద్యావతి (68) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఒక గుడిసెలో నివాసం ఉంటూ కాగితాలు, పాత సామాన్లు సేకరించి వాటిని అమ్ముకొని తన కూతురు అశ్వినితో కలిసి జీవనం సాగిస్తుంది. కుమార్తెకు వివాహం చేసింది. కుమార్తె భర్త ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో చౌటకూరు మండలం శివ్వంపేట ప్రాంతంలోని కంపెనీలో పని చేస్తోంది. శివరాత్రి పండుగ నేపథ్యంలో తల్లి వద్దకు వచ్చిన అశ్విని అమ్మా..అమ్మా అంటూ పిలిచినా ఉలుకు పలుకూ లేకపోవడంతో బోరున విలపిస్తూ కూర్చుంది. ఎవరూ లేకపోవడంతో పక్కనే ఉన్న మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి తన తల్లి అంత్యక్రియలు చేయాలని కోరింది. పోలీసులకు చెబితేనే చేస్తామని వారు చెప్పారు. రోడ్డుపై వెళ్తున్న పోలీసులకు కూడా చెప్పినా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎవరూ రాకపోవడంతో పటాన్చెరు ప్రాంతంలో తనకు తెలిసిన వారికి కూతురు ఫోన్ చేసింది. వారు వచ్చి మున్సిపల్ అధికారులను వేడుకున్నా స్పందించలేదు. దీంతో రూ.2 వేలకు అంబులెన్స్‌ను మాట్లాడుకొని రూ.1,500కు జేసీబీతో గోతి తీయించి అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లి మృతదేహం వద్ద కూతురు ఏడవడం రోడ్డుపై వెళ్లే వారి హృదయాలను కలిచివేసింది. -
మహా కుంభ్‌లో.. మన నగరం
హరహర మహాదేవ అంటూ హర్షధ్వనులతో గొంతెత్తిన కోట్లాది భక్తజనంలో మన భాగ్యనగరవాసులూ ఉన్నారు. గంగమ్మ తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ పుణ్యస్నానాలు ఆచరించిన జన సంద్రంలో భాగమై నగరమూ తడిసి ముద్దయి మురిసింది. తండోపతండాలుగా.. నగరం నుంచి కుంభ్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ప్రయాగ్‌రాజ్, కాశీ, అయోధ్యతో కూడిన ఆధ్యాత్మిక యాత్రను ప్రణాళికాబద్దంగా డిజైన్ చేసుకుని కుటుంబ సమేతంగా వెళ్లి వచ్చారు. చాలా మంది వ్యక్తిగత వాహనాలు ఎంచుకోగా, ప్రయాణాల కారణంగా రైళ్లు, బస్సులతో పాటు విమానాల్లో సైతం టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక విమాన యానం ధరలు ఆకాశాన్ని తాకాయి. చివరి రోజైన బుధవారం విమానం టిక్కెట్ ధర రూ.40వేలకు పైగానే ఉండటం రద్దీకి నిదర్శనం.టాలీవుడ్ తెరవేల్పులు ఎందరో మన నగరం నుంచీ కుంభ్‌మేళాకు తరలివెళ్లారు. సినిమా సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే చిన్నితెర తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా భారీగానే వెళ్లి వచ్చారు. నగరంలో జరిగిన నుమాయిష్ కి లక్షల సంఖ్యలో సందర్శకులు తగ్గిపోవడానికి కుంభ్‌మేళా ఒక కారణమని నిర్వాహకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. మహా క్రతువు ముగిసిన వేళ.. నగరం నుంచి కుంభ్‌కి వెళ్లొచ్చిన పలువురు నగరవాసులు తమ జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు.ఈ అనుభూతి వేరు.. నాన్నగారి అస్తికల నిమజ్జనం కోసం తొలిసారి వెళ్లినప్పటి నుంచి అంటే దాదాపు 15ఏళ్లుగా, కాశీ, త్రివేణీ సంగమంతో నాకు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. మనసుకు తోచిన ప్రతీసారీ.. అక్కడకు వెళ్లివస్తుంటా. అయితే ఈ సారి ప్రయాగ్‌కు చేసిన ప్రయాణం చాలా ప్రత్యేకం. కోట్లాది మంది భక్తులతో కలిసి దైవ నామస్మరణ చేస్తూ పుణ్యస్నానాలు చేయడం.. అద్భుతమైన అనుభవం. నాతో పాటు నా స్నేహితుల్లోనూ ఆధ్యాతి్మకత మరింత పెరిగేలా చేసింది కుంభ్ మేళా. – చంగవల్లి శ్రీనివాస్, స్నేహితులు, దమ్మాయిగూడ ’అనిర్వచనీయం.. ఆ భావం.. మహాకుంభ్ సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి అరడజను మంది స్నేహితులతో కలిసి వ్యక్తిగత వాహనంలో వెళ్లాం. జనసమ్మర్ధం వల్ల, సమాచారం లోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. అయినప్పటికీ త్రివేణీ సంగమంలో స్నానాలతో అవన్నీ మరచిపోయాం. ఆ అనుభూతిని అనిర్వచనీయమైనదనే చెప్పాలి. వెళ్లే దారిలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎలా అనిపించినా, ప్రయాగ్‌రాజ్ నుంచి తిరిగివస్తున్నప్పుడు మాత్రం మళ్లీ రాలేం కదా అని మనసు భారమైంది. కాశీలో 9గంటలు వేచి దర్శనం చేసుకున్నా కూడా అలసట అనిపించలేదు. – ఆర్.అరుణ్‌కుమార్, ఎల్బీనగర్దేవదేవుని స్పర్శతో పులకించి.. నీళ్లను తాకినట్టుగా అనిపించలేదు. ఆ దేవదేవుడే స్పర్శించినట్టు శరీరం పులకించింది. నగరం నుంచి కాశీ అక్కడ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు దాదాపు 23 గంటల పాటు ప్రయాణం. అక్కడకు చేరుకోగానే అంతవరకూ ఆవరించిన ప్రయాణ బడలికలన్నీ చేతితో తీసినట్టు మాయమైపోయాయి. నోస్ ఆఫ్ త్రివేణీ సంగమం అనే ప్రత్యేకమైన ప్రాంతంలో నాగసాధువులూ, అఘోరాలతో కలిసి స్నానాలు ఆచరించడం అసలు ఊహించని విశేషం. ఎక్కడ చూసినా భక్త జనసంద్రమే. అక్కడ ఉట్టిపడిన ఆధ్యాత్మికత నాలో నా ఆలోచనల్లో మార్పులు తెచ్చింది. వెళ్లకుండా ఉంటే ఎంత మిస్సయి ఉండేదానినో అనిపించింది. దైవభక్తి ఎక్కువే.. అయితే ఇంతగా తనువూ మనసూ ఆద్యంతం ఆధ్యాత్మికత ఆవరించడం మున్నెన్నడూ జరగలేదు. – అర్చన చిగుళ్లపల్లి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ -
KPHB మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం
-
పక్కా ప్లాన్ తో పోసాని అరెస్ట్
-
వచ్చే నెలలో వివాహం.. అంతలోనే విషాదం
కీసర: బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన విషాద ఘటన సోమవారం రాత్రి యాద్గార్పల్లి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో జరిగింది. మృతుల్లో తమ్ముడికి వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా.. అంతలోనే రోడ్డు ప్రమాదం అతడిని బలిగొనడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీసర సీఐ శ్రీనివాస్, ఎస్ఐ నాగరాజు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి–భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్‌గూడకు చెందిన గూడూరు చంద్రశేఖర్ (36) బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. తార్నాక ప్రాంతంలో టైలర్‌గా పని చేస్తున్నాడు.లాలాపేట శాంతినగర్‌లో ఉండే అతని సోదరుడు మత్స్యగిరి (27) విజయ డెయిరీలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి సోమవారం తమ అల్లుడు శ్రీను (17)తోకలిసి సోమవారం యాద్గార్‌పల్లిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఇదే రోజు రాత్రి తిరిగి నగరానికి వెళ్తుండగా యాద్గార్పల్లి– చీర్యాల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఎదురుగా అతివేగంతో వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలతో చంద్రశేఖర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మత్స్యగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. చంద్రశేఖర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్పా సెంటర్లకే భారీ టోకరా
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ముఠా పశ్చిమ మండలంలోని స్పా సెంటర్లను టార్గెట్‌గా చేసుకుంది. ఆయా సెంటర్లకు కస్టమర్‌గా వెళ్లి, అసాంఘిక కార్యకలాపాల రంగు పూసి, సోదాలు చేసి, భయభ్రాంతులకు గురి చేసి, సెటిల్మెంట్కు పిలిచి, అందినకాడికి దండుకుంటోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ సహా అనేక చోట్ల పంజా విసిరిన ఈ ముఠా ఇప్పటికి దాదాపు రూ.50 లక్షల వరకు కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌కు కొందరు పోలీసులు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ చేసి, కస్టమర్‌గా వెళ్లి... వెస్ట్‌జోన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్పా లేదా మసాజ్ సెంటర్ వద్ద రెక్కీ నిర్వహిస్తున్న ఈ ముఠా అనువైన దాన్ని టార్గెట్ చేసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్‌లోనూ వీటిని ఎంపిక చేసుకుంటోంది. ఆపై దాని ఫోన్ నెంబర్ సేకరించే ఈ ముఠా సభ్యుడు నిర్వాహకులకు కాల్ చేస్తాడు. కస్టమర్ మాదిరిగా మాట్లాడుతూ ఆయా సెంటర్లు అందించే సేవలు, వాటి రుసుముల్ని తెలుసుకుంటాడు. ఈ తంతు పూర్తయిన తర్వాత వినియోగదారుడి మాదిరిగా ఆ సెంటర్‌కు వెళ్లే అతగాడు తనతో పాటు కండోమ్ ప్యాకెట్లు తీసుకువెళ్తాడు. ఇతడు వెళ్లే సమయంలో మిగిలిన ముఠా సభ్యులు ఆ సెంటర్‌కు సమీపంలోనే వేచి ఉంటారు. స్పా సెంటర్లోకి వెళ్లిన ముఠా సభ్యుడు అదును చూసుకుని తనతో తెచ్చిన కండోమ్ ప్యాకెట్లను మసాజ్ టేబుల్ కింద పడేస్తాడు. ఆ తర్వాత మిగిలిన వారికి సందేశం ఇచ్చి పోలీసుల మాదిరిగా రమ్మంటాడు. దాడి చేసి, హడావుడి చేస్తూ.... ఈ సందేశం అందుకున్న వెంటనే సమీపంలో వేచి ఉన్న ముఠా సభ్యులు పోలీసుల మాదిరిగా ఆ సెంటర్‌పై దాడి చేస్తారు. తొలుత సీసీ కెమెరాలను ఆపేసి, వాటి దృశ్యాలు రికార్డు అయ్యే డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) స్వాదీనం చేసుకుంటున్నారు. స్పా మొత్తం సోదాలు చేస్తున్నట్లు నటిస్తూ తమ ముఠా సభ్యుడు ఉన్న గదిలోకి వెళ్తారు. అక్కడి టేబుల్ కింద పడి ఉండే కండోమ్ ప్యాకెట్లు స్వాదీనం చేసుకుని, అతడితో పాటు థెరపిస్టును ‘అదుపులోకి’ తీసుకుంటారు. వీటి ఆధారంగా ఆ స్పాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ హడావుడి చేసి నిర్వాహకులను పూర్తి భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్లు పూర్తిగా తమ ట్రాప్‌లో పడ్డారని నిర్థారించుకున్న తర్వాత మరో అంకానికి తెరలేపుతారు. ముఠాకు చెందిన ఓ సభ్యుడు స్పా సెంటర్ నిర్వాహకులకు సహాయం చేస్తున్నట్లు ముందుకు వచ్చి వారితో మాట్లాడతాడు. సెంటర్లో ఏ తప్పు జరగట్లేదని తాను నమ్ముతున్నానని, ఈ విషయాన్ని తాను సెటిల్ చేస్తానంటూ చెప్తాడు. అటు నిర్వాహకులు, ఇటు పోలీసులుగా వచ్చిన తమ ముఠా సభ్యులతో మాట్లాడుతూ రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ తంతు మొత్తం అయితే అదే స్పా సెంటర్లో లేదంటే మరో ప్రాంతంలోని రెస్టారెంట్లో జరుగుతోంది. కాగా అప్పుడప్పుడు స్పా సెంటర్ల కేంద్రంగా జరిగే అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్‌్కఫోర్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి వివాదాలను క్యాష్ చేసుకుంటూ ఈ ముఠా తమ దందా కొనసాగిస్తోంది. ఇలా ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు పశ్చిమ మండలంలోని పలు సెంటర్లపై పంజా విసిరి దాదాపు రూ.50 లక్షల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. ఈ ముఠాకు సహకరిస్తున్న వారిలో కొందరు పోలీసులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
హైదరాబాద్ టు హాంకాంగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి హాంకాంగ్‌కు నేరుగా విమాన సర్వీసులు వచ్చే మార్చి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హాంకాంగ్‌కు వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్‌ల మీదుగా రాకపోకలు సాగించేవారు. హైదరాబాద్ నుంచి ఏటేటా అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ పెరుగుతోంది. ఇప్పటి వరకు 20 నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. రానున్న 18 నెలల్లో దశలవారీగా మరిన్ని అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌తోపాటు అడిస్ అబాబా, ఆమ్స్టర్డామ్, రియాద్‌లకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆయా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ అడిస్ అబాబాకు విమానాలు నడపనుంది. సెప్టెంబర్‌లో ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. రియాద్‌కు కూడా త్వరలోనే సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మరిన్ని నగరాలకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.హైదరాబాద్ నుంచి పారిస్, ఆస్ట్రేలియా, హోచిమిన్ సిటీ, హనోయ్, క్రాబీ, కఠ్మాండు, మదీనా నగరాలకు కొత్తగా విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పలు విమానయాన సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2019–20 సంవత్సరంలో 32 లక్షల మంది విదేశాలకు రాకపోకలు సాగించగా, 2023–24 నాటికి ఈ సంఖ్య 42 లక్షలకు పెరిగింది. -
పిల్లలను అమ్మే ముఠా గుట్టురట్టు.. గుజరాత్ నుంచి నగరానికి తీసుకువచ్చి..
సాక్షి,హైదరాబాద్ : రాచకొండలో అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. 11 మందిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్యపురి పోలీసులతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ జాయింట్ ఆపరేషన్‌లో అప్పుడే పుట్టిన నలుగురు పిల్లలను అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.పిల్లలు లేని తల్లిదండ్రులు ఆరాటం.. ఆ దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులను.. ముక్కు పచ్చలారని పసికందుల్ని అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. ఇందులో భాగంగా నిందితులు గుజరాత్లో పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులకు డబ్బులు ఎరవేస్తున్నారు. మెడికల్ ప్రతినిధుల ద్వారా బేరసారాలు జరిపి అప్పుడే పుట్టిన పిల్లల్ని గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తెస్తున్నారు. నగరంలో ఆడ శిశువును రూ.2.5 లక్షలకు, మగ శిశువును రూ 4.5లక్షలకు విక్రయిస్తున్నారు. అయితే, ఛైల్డ్ ట్రాఫికింగ్‌పై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతులని సైతం నిందితులుగా చేర్చారు. -
షంషేర్.. చార్మినార్..
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) స్మారక చిహ్నాల జాబితా టాప్ 10లో నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం చార్మినార్ చోటు దక్కించుకుంది. అంతేకాదు అత్యధిక సంఖ్యలో భారతీయ సందర్శకులను ఆకట్టుకుని వార్షిక పెరుగుదలలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. అన్నింటికన్నా మిన్నగా.. గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితాలో చార్మినార్ 9వ స్థానంలో నిలిచింది. దేశీయ పర్యాటకుల సంఖ్య 2022–23లో 9.29లక్షలు కాగా, గత ఏడాది 2023–24 కల్లా 12.9లక్షలకు పెరిగింది. సందర్శకుల సంఖ్యలో పెరుగుదల 38 శాతానికి పైగా ఉండడంతో అన్ని ఏఎస్ఐ స్మారక చిహా్నల్లో కలిపి 10.8 శాతంగా ఉన్న మొత్తం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. గత 2022–23 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఏఎస్ఐ స్మారక చిహా్నల్లో మొత్తం దేశీయ పర్యాటకుల సంఖ్య 479.01 లక్షలు కాగా ఇది 2023–24లో 530.9 లక్షలకు పెరిగింది. గోల్కొండ కోటకూ.. చారి్మనార్‌తో పాటు, నగరంలోని గోల్కొండ కోట కూడా అత్యధిక భారతీయ సందర్శకులను సాధించిన స్మారక చిహ్నాల జాబితాలో చోటు సంపాదించింది. ఈ చారిత్రక స్మారక చిహ్నాన్ని 2022–23లో 15.27 లక్షల మంది సందర్శించగా, 2023–24లో 5 శాతానికి పైగా పెరిగి 16.08 లక్షల మంది సందర్శించారు. ఇక అత్యధిక భారతీయ సందర్శకులను ఆకట్టుకున్న టాప్ 10 స్మారక చిహ్నాల జాబితాలో తాజ్ మహల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది 20 శాతానికి పైగా సందర్శకుల సంఖ్యను పెంచుకుంది. అయితే ఇది చార్మినార్ పెరుగుదలతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. -
చేతబడి చేయడంతోనే సోదరి పెళ్లి ఆగిపోయింది..!
హైదరాబాద్: చేతబడి చేయడంతోనే తన తండ్రి కాళ్లు, చేతులు పడిపోయాయని, సోదరి పెళ్లి ఆగిపోవడం, తన అనారోగ్యానికి కారణం అనే అనుమానంతో ఓ వ్యక్తిపై కక్ష పెంచుకొని నలుగురు స్నేహితులతో కలిసి కర్రలతో కొట్టి హత్య చేసిన ముగ్గురు వ్యక్తులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇరువురు పరారీలో ఉన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ హత్యకేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వివరాలు ఇలా..చందానగర్ పాపిరెడ్డి కాలనీలో నివాసముంటున్న ఎండీ నజీర్(41) కారు డ్రైవర్. నెహ్రూనగర్‌కు చెందిన ఎండీ ఫక్రుద్దీన్(28) స్థానికంగా ఎల్రక్టీషియన్. ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇటీవల నజీర్ చేతబడి చేస్తున్నట్టు ఇరుగుపొరుగు వారు చెప్పడంతో పకృద్దీన్కు నజీర్పై అనుమానం మొదలై, ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఫక్రుద్దీన్ తండ్రి మోహీద్బేగ్కు కాళ్లు, చేతులు పనిచేయకపోవడానికి నజీర్ చేతబడి కారణమని భావించాడు. నెల రోజుల క్రిందట ఫక్రుద్దీన్ సోదరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నిశి్చతార్ధానికి వచి్చన నజీర్ 15 రోజుల్లో చెల్లి పెళ్లి ఆగిపోతుందని చెప్పాడు. అదే జరిగింది. పైగా ఫక్రుద్దీన్ కూడా అనారోగ్యానికి గురికావడంతో నజీర్పై తీవ్ర అనుమానం ఏర్పడింది.దీంతో నజీర్‌తో పలుమార్లు గొడవలు పడ్డారు. ఎలాగైనా నజీర్‌ను చంపాలని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఫక్రుద్దీన్ అదే కాలనీకి చెందిన స్నేహితుడు ఐటీ ఉద్యోగి మహ్మద్ అలీకి విషయం తెలిపాడు. దీంతో అలీ చందానగర్ బాబునగర్‌కు చెందిన రౌడీïÙటర్ ఎండీ బురాన్‌ను కలిసి జరిగిన విషయాలను ముగ్గురు ప్రస్తావించారు. నజీర్‌కు, ఎండీ బురాన్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపార విషయంలో డబ్బులు ఇచి్చపుచ్చుకోవడంలో గొడవలు జరుగుతున్నాయి. నజీర్పై కోపం ఉందని తనతో కూడా గొడవపడుతున్నాడని ఎండీ బురాన్ వారికి తెలిపారు. దీంతో ఫక్రుద్దీన్, అలీ, బురాన్లు కలిసి పథకం ప్రకారం ఈనెల 21వ తేదీన రాత్రి 8:30 గంటల సమయంలో నజీర్‌ను ఫక్రుద్దీన్ శేరిలింగంపల్లి గోపీనగర్ చెరువు కట్ట వద్దకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత వారి స్నేహితులు అలీ, బురాన్, మహ్మద్ ఖలీమ్, అజర్‌లను పిలిచారు. వీరందరు కలిసి చెరువు కట్టపై మద్యం సేవించారు. తర్వాత ఫక్రుద్దీన్ కుటుంబంపై చేతబడి చేస్తున్నావని నజీర్పై గొడవకు దిగారు. ఆ సమయంలో ఫక్రుద్దీన్ పథకం ప్రకారం నజీర్ తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. మిగతా స్నేహితులు కూడా నజీర్‌ను కర్రలతో తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తాళలేక పక్కనే ఉన్న గోపీనగర్ బస్తీవైపు పరిగెత్తాడు. అతని అరుపులు విని కాలనీవాసులు ఆస్పత్రికి తీసుకెళ్లమని హెచ్చరించారు. దీంతో అలీ, బురాన్, ఖలీమ్ æ, అజర్‌లు అక్కడి నుండి వెళ్లిపోగా ఫక్రుద్దీన్ గాయాలై అపస్మారక స్థితిలో పడి ఉన్న నజీర్‌ను వెనకాల ఎక్కించుకుని సమీపంలోని హైటెక్ బావర్చీ వద్దకు వచ్చి మళ్లీ స్నేహితులకు ఫోన్ చేశాడు. దీంతో అందరూ కారులో రాగా ఫక్రుద్దీన్ నజీర్‌ను కొండాపూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడ చేర్పించి పారిపోయాడు. గాయాలతో ఉన్న నజీర్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు చందానగర్‌కు చెందిన నజీర్‌గా గుర్తించారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా హత్యలో ప్రధాన నిందితుడైప ఫక్రుద్దీన్, రౌడీ షీటర్ బురాన్, ఖలీమ్లను అరెస్ట్ చేసి విచారించగా హత్య చేసినట్టు అంగీకరించారు. ఈ హత్యలో పాల్గొన్న హఫీజ్‌పేట్‌కు చెందిన అజర్, గోపీనగర్‌కు చెందిన మహ్మద్ అలీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ఇల్యూజన్ పబ్‌లో యువతిపై దాడి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఇల్యూజన్ పబ్‌లో శనివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు ఓ యువతిపై దాడి చేసి పొత్తి కడుపులో బూటు కాలితో తన్ని తీవ్రంగా గాయపరిచిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..పాతబస్తీకి చెందిన యువతి తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి శనివారం రాత్రి ఇల్యూజన్ పబ్‌కు వచ్చింది. రాత్రి 12.40 గంటల సమయంలో ఆమె మాజీ ప్రియుడు ఓల్డ్ సిటీకే చెందిన ఎండీ ఆసిఫ్‌జానీ మద్యం సేవించి అక్కడికి వచ్చాడు. సదరు యువతి స్నేహితురాళ్లతో బర్త్‌డే వేడుకలు జరుపుకుంటుండగా అక్కడికి వచ్చిన ఆసిఫ్‌జానీ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దూషిస్తూ దాడి చేశాడు. దీంతో ఆమె స్నేహితురాళ్లతో కలిసి కిందకు పరుగులు తీయగా అక్కడికి కూడా వచి్చన ఆసిఫ్‌జానీ ఆమె పొత్తి కడుపులో బూటు కాలితో తన్నడమేగాక తీవ్రంగా కొట్టాడు. అడ్డుకునేందుకు యతి్నంచిన ఆమె స్నేహితురాలిపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గతంలో ఆసిఫ్‌జానీ, తాను ప్రేమించుకున్నామని, కొద్ది రోజులు కలిసి తిరిగామని, అయితే అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నానని తెలిపింది. అయినా తనను వెంబడిస్తూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆసిఫ్జానీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమంగా నగరానికి వలస వచ్చిన రోహింగ్యాలు వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. తమ జాతీయతను దాచి పెట్టడానికి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసుకున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం మెరుపు దాడులు చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకుని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన ఈ రోహింగ్యాలు కోల్‌కతాలో నకిలీ ఆధార్ కార్డులు సంపాదించారు. వీటిని తయారు చేసి ఇచ్చిన వ్యక్తులు వారిని వెస్ట్‌బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా చూపించారు. ఈ ఆధార్ కార్డుల ఆధారంగా నగరానికి చేరుకున్న వీరు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో పురుషులు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసి వాటి ఆధారంగా ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తుండగా... మహిళలు, యువతులు వ్యభిచార వృత్తిలో దిగారు. పరిచయస్తులతోనే ఈ దందా చేస్తున్న వారిని సంబందీకులైన పురుషులే తమ వాహనాలపై తీసుకెళ్లి కస్టమర్ల వద్ద వదిలి వస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్‌్కఫోర్స్‌కు సమాచారం అందడంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో వరుస దాడులు చేసిన ప్రత్యేక బృందాలు మొత్తం 18 మందిని పట్టుకున్నాయి. వారి నుంచి వాహనాలు, నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోహింగ్యాల్లో కొందరిని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. -
‘సీనియర్లను’ ఇబ్బంది పెట్టొద్దు!
సాక్షి, హైదరాబాద్: తమకు గుర్తింపు కార్డులివ్వడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని, తద్వారా కొన్ని సదుపాయాలు పొందలేకపోతున్నామని సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కొందరు సీనియర్ సిటిజన్లు కమిషనర్ ఇలంబర్తికి ఫిర్యాదు చేశారు. వారి సాదకబాధకాలు విన్న కమిషనర్ సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులివ్వడంలో జాప్యం చేయొద్దని, వారిని ఇబ్బంది పెట్టొద్దని సంబంధిత అధికారుకు సూచించారు. ఇవి మాత్రమే కాకుండా ప్రజల నుంచి అందే అన్ని ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచి్చన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరితంగా పరిష్కరించాలని సూచించారు. ఈ వారం ప్రధాన కార్యాలయానికి మొత్తం 82 విజ్ఞప్తులు రాగా, ఎప్పటిలాగే టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించినవి అత్యధికంగా 46 ఉన్నాయి. మిగతావి ఆస్తిపన్ను, ఆరోగ్యం, ఇంజినీరింగ్ (నిర్వహణ), పరిపాలన, విద్యుత్, భూసేకరణ, యూబీడీ, హౌసింగ్, ఫైనాన్స్ విభాగాలకు సంబంధించినవి ఉన్నాయి. కార్యాలయం దాకా రాలేని ఆరుగురు ఫోన్ ద్వారా తమ తమ సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, గీతా రాధిక, పంకజ, రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, యాదగిరి రావు, సీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జోన్లలో జరిగిన ప్రజావాణి కార్యక్రమాల్లో ఆరు జోన్లలో వెరసి 112 అర్జీలందాయి. వాటిల్లో కూకట్పల్లి జోన్లో 51, ఎల్బీనగర్లో 13, శేరిలింగంపల్లిలో 12, సికింద్రాబాద్‌లో 27, చార్మినార్‌లో 8, ఉండగా, ఖైరతాబాద్‌జోన్ కేవలం ఒక్కటి మాత్రమే అందడం విశేషం. -
Haleem Price Hike: హలీం లవర్స్‌కు షాకింగ్ న్యూస్..
చార్మినార్: రంజాన్ మాసంలో ప్రత్యేకమైన హలీం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఏడాది రంజాన్ ప్రారంభానికి ముందే హలీం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మటన్ రేట్లు పెరగడంతో హలీం తయారీదారులు హలీం ధర పెంచేశారు. గతేడాది రూ.280లకు ప్లేట్ హలీం లభించగా..ప్రస్తుతం రూ.20 పెరిగి రూ.300 చేరుకుంది. ఇటీవల ముగిసిన నాంపల్లి ఎగ్జిబిషన్లో సైతం పిస్తాహౌజ్ ప్లేట్ హలీంను రూ.300 చొప్పున విక్రయించింది. అయితే ఎగ్జిబిషన్ ముగిసినా నగరంలోని పలు హోటళ్ల నిర్వాహకులు రూ.300కు విక్రయిస్తున్నారు. రేటు పెరిగినా హలీం ప్రియులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మార్చి 1న ఆకాశంలో నెల వంక కనిపిస్తే..2 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్నట్లు ముస్లిం మత పెద్దలు పేర్కొంటున్నారు. రంజాన్ మాసంలో మాంసాహార వంటకాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించే ఇఫ్తార్ విందులో హాలీంను తప్పనిసరిగా వడ్డిస్తారు. పాతబస్తీ ప్రత్యేకం.. హలీం తయారీ, విక్రయాల్లో పాతబస్తీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు రంజాన్ మాసంలో పాతబస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు. దీంతో పాతబస్తీలోని హాలీం హోటళ్లు వినియోగదారులతో కిటకిటలాడతాయి. పాతబస్తీలోని పిస్తాహౌజ్, మదీనా సర్కిల్లోని షాదాబ్ హోటల్, నయాగ్రా హోటల్, శాలిబండలోని షాగౌస్, బార్కాస్ తదితర హోటళ్లలో ఎన్నో ఏళ్లుగా హలీం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. -
అసంపూర్తిగా ముగిసిన కృష్ణా రివర్ బోర్డు సమావేశం
హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) ప్రత్యేక, అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని హైదరాబాద్ లోని జలసౌథలో ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు ఛైర్మన్ సమావేశానికి హాజరయ్యారు.అయితే బోర్డు సమావేశంలో ఎలాంటి వాదనలు వినిపించకుండా ఏపీ అధికారులు వెళ్లిపోగా, తెలంగాణ మాత్రమే తమ వాదనను వినిపించింది. దాంతో నీటి ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు రేపు(మంగళవారం) సమావేశం కానున్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న పంటలు, త్రాగునీటి అవసరాలపై వివరాలతో రావాలని ఇరు రాష్ట్రాలను కృష్ణ నదీ యాజమాన్య బోర్డు కోరింది. చీఫ్ ఇంజనీర్ల సమావేశం అనంతరం ఎల్లుండి మరోసారి బోర్డు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు.మరోసారి భేటీ కానున్నారు. -
ఫ్యామిలీతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో మన్మధుడు హీరోయిన్ అన్షు (ఫోటోలు)
-
క్రీడలతో ఉత్సాహం... చదువులకు ప్రోత్సాహం
కూకట్పల్లి: విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ఒత్తిడిని అధిగమించగలరని ఏకాగ్రత పెరిగి చదువుల్లో మరింత రాణిస్తారని శ్రీచైతన్య విద్యాసంస్థల నిర్వహకులు తెలిపారు. సంస్థ ఛైర్మన్ బీఎస్ రావు.. జ్ఞాపకార్థం శ్రీచైతన్య విద్యాసంస్థలు కూకట్ పల్లి జోన్‌లోని వివిధ బ్రాంచ్‌ల విద్యార్థులకు జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్‌ను హైదర్ నగర్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించింది.శ్రీ చైతన్య అంటే చదువు, ర్యాంకులు ఒక్కటే కాదని, తమ విద్యార్థులు క్రీడల్లోనూ రాణించగలరని కూకట్పల్లి ఏజీఎం శివరామకృష్ణ తెలిపారు. బీఎస్ రావు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడని, డాక్టర్‌గా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ.. విద్యాసంస్థలను ప్రారంభించి శ్రీచైతన్య అనే బ్రాండ్‌ను సృష్టించారని ఆయన చూపించిన మార్గంలో నేడు ఎంతో మంది చదువుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని కొనియాడారు.సీనియర్లు, జూనియర్ల విభాగాలలో వేర్వేరుగా జరిగిన వివిధ క్రీడల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆయా బ్రాంచీల విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీడా జ్యోతితో స్పూర్తిని పెంచి ఉత్తేజంతో విద్యార్థులు ఆటల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం రవికుమార్, పార్ట్నర్ అడ్వైజర్ ఫర్ ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ వినోద్ కుమార్ బుర్రా హాజరయ్యారు. ఆర్ ఐ శ్రీనివాసరెడ్డి, ఆల్ ఇండియా స్పోర్ట్స్ రీసోర్స్ పర్సన్ రాజశేఖర్, ఆయా బ్రాంచ్‌ల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనపై కిషన్‌కెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. ‘14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉంది. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా?, రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయం?, ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటు, నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు మీరు ఏ సందేశం ఇస్తున్నట్లు?, కళాశాలల యాజమాన్యాలపట్ల మీ తీరు దుర్మార్గం, ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. కాలేజీల యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే దుస్థితి దాపురించింది. ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్?, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటు, నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారు. మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా యుద్ద ప్రాతిపదికన బకాయిలు విడుదల చేయండి. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయండి. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ ఈరోజే విడుదల చేయండి. యువత అకౌంట్లలో 14 నెలల బకాయి కలిపి రూ.56 వేల నిరుద్యోగ భృతి జమ చేయాలి. ఇవన్నీ యుద్ద ప్రాతిపదికన విడుదల చేసిన తరువాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. దగా హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు సిద్ధంగా లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ కిషన్‌రెడ్డి హెచ్చరించారు. -
మూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!
తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సౌందర్యానికి ప్రతీక చీరకట్టు.. అలాంటి చీరకట్టులోని ఔన్నత్యాన్ని నలుదిశలా చాటిచెప్పేలా నగర నారీమణులు ఉత్సాహంగా శారీ రన్లో పాల్గొన్నారు. అద్భుతమైన చీరకట్టుకు తామే బ్రాండ్ అంబాసిడర్లమనేలా వివిధ రకాల చీరకట్టుతో హాజరయ్యారు. ఆదివారం ఉదయం ట్యాంక్ బండ్ వేదికగా నారీమణులు తెలుగు సంప్రదాయ చీరకట్టుతో పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ మీదుగా శారీ రన్లో పాల్గొని తిరిగి పీపుల్స్ ప్లాజా చేరుకున్నారు. సుప్రసిద్ధ బ్రాండ్ తనైరా, ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ శారీ రన్‌ను తనైరా సీఈఓ అంబుల్ నారాయణ్, జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ప్రారంభించారు. తనైరా శారీ రన్ ఐక్యత, స్ఫూర్తి చిహ్నంగా మహిళలలోని స్త్రీతత్వం, ఫిట్‌నెస్‌కు ప్రేరణగా నిర్వహించినట్లు అంబుల్ నారాయణ్ తెలిపారు. మహిళల ఆరోగ్యం, సమగ్రతను ప్రోత్సహించేందుకు మొదటి ఎడిషన్‌ను 2020లో పూణె, బెంగళూరు, హైదరాబాద్‌లో నిర్వహించామని రెండో ఎడిషన్‌ను మరోసారి హైదరాబాద్‌లో నిర్వహించినట్లు తెలిపారు. చదవండి: ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీచందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఉత్సాహంగా సాగిన శారీ రన్లో మహిళలు అందమైన చీరకట్టుతో హాజరుకాగా.. కొందరు బుల్లెట్లు తోలుతూ, మరికొందరు సైకిళ్లు తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున సాగర తీరంలో శారీ రన్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రన్లో పాల్గొన్న పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సుమారు మూడు వేల మందికిపైగా రన్లో పాల్గొన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వీరంతా ఫినిషింగ్ పాయింట్లో సెల్పీలు, గ్రూఫ్ ఫొటోలు దిగారు. జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముందు వామ్ అప్ ఫిట్నెస్, జుంబా చేయించారు. -
సిగరెట్ అమ్మినా సీరియస్ యాక్షన్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) అధికారులు కేవలం మాదకద్రవ్యాల క్రయవిక్రయాల పైనే కాదు...సిగరెట్ల అమ్మకంలో జరుగుతున్న చట్టం ఉల్లంఘనలపైనా దృష్టి పెడుతున్నారు. నగర వ్యాప్తంగా పలువురు వ్యాపారులు మైనర్లకు సిగరెట్లు అమ్ముతున్నారంటూ వచి్చన ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. ఇవి శుక్రవారం పశి్చమ మండలంలోని ఇద్దరు వ్యాపారులను పట్టుకుని, వారిపై స్థానిక ఠాణాల్లో కేసు నమోదు చేయించాయి. మాదక ద్రవ్యాలకు ముందు సిగరెట్... టీజీఏఎన్‌బీ అధికారులు గడిచిన కొన్నేళ్లుగా నగరంలో జరుగుతున్న మాదక ద్రవ్యాల దందాను అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా కళాశాలలు, పాఠశాలలతో పాటు ఇతర విద్యా సంస్థలపై పటిష్ట నిఘా ఉంచారు. వాటిలో, సమీపంలో, సంబంధించిన టీజీఏఎన్బీకి చిక్కిన వారిలో గంజాయి తాగుతున్న వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. అతి తక్కువ మంది ఇతర మాదకద్రవ్యాలను బానిసలుగా మారారు. ఆయా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్న టీజీఏఎన్‌బీ అధికారులు వాళ్లు ఈ వ్యసనానికి బానిసకావడానికి కారణాలను అన్వేíÙస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కీలక విషయం అధికారులకు తెలిసింది. ఇతర మాదకద్రవ్యాలు వినియోగానికి ముందు వారంతా గంజాయి సేవించేవారని బయటపడింది. దీనికి ముందు సిగరెట్ కాల్చడంతో ఈ ఊబిలోకి దిగినట్లు పలువురు బయటపెట్టారు. చట్టం స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. తల్లిదండ్రులు, కుటుంబీకుల పర్యవేక్షణ లేకపోవడం, మెచ్యూరిటీ తక్కువగా ఉండటంతో పాటు వివిధ కారణాల నేపథ్యంలో మైనర్లు వ్యసనాలకు తేలిగ్గా ఆకర్షితులై, బానిసలుగా మారుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే జువైనల్ జస్టిస్ యాక్ట్ (జేజేఏ), సిగిరెట్ అండ్ అదర్ టుబాకో ప్రొడక్టŠస్ యాక్ట్ (కాటా్ప) ప్రకారం మైనర్లకు మద్యం, సిగరెట్లు, మాదకద్రవాలు తదితరాల విక్రయంపై నిషేధం ఉంది. అయితే మద్యం విక్రయాల విషయంలో నిబంధనలు కొంతవరకు అమలు అవుతున్నాయి. సిగరెట్ల విక్రయించకూడదనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. పోలీసులు సైతం అప్పుడప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు తప్ప మైనర్లకు విక్రయం విషయం పట్టించుకోవట్లేదు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. ఈ నేపథ్యంలోనే టీజీఏఎన్బీకి ఇటీవల కాలంలో మైనర్లకు సిగరెట్ల విక్రయంపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వీరు తమ సెల్ఫోన్లతో పాటు రహస్య కెమెరాలను వినియోగించి నిఘా ఉంచుతున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఈ తరహా సిగరెట్ల విక్రయాలను రహస్యంగా చిత్రీకరిస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని ఆ వ్యాపారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఆ అధికారులే స్థానిక పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు ఇస్తూ వీడియోలు అందిచడం ద్వారా వ్యాపారులపై జేజేఏ, కాటా్పల్లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తున్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేయించారు. ఈ డ్రైవ్ కొనసాగించాలని సందీప్ శాండిల్య నిర్ణయించారు. -
రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్
సాక్షి,హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆగంతకుల నుంచి సోమవారం(ఫిబ్రవరి 24) మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు తనను బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. రెండు గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు.గతంలోనూ రాజాసింగ్‌కు పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై అప్పట్లో రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. రాజాసింగ్‌కు హత్యకు కుట్రపన్నినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. -
‘ఎక్స్’లో పోస్ట్.. కారు సీజ్!
బంజారాహిల్స్ : ‘ఎక్స్’వేదికగా ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ఆధారంగా ఓ కారు డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడమే కాకుండా మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా వాహనాన్ని నడుతుండగా ఓ వ్యక్తి ఆ కారును వీడియో తీసి ‘ఎక్స్’(ట్విట్టర్)లో పోస్ట్ చేయడంతో పోలీసులు స్పందించి సదరు కారు డ్రైవర్‌పై చర్యలకు దిగారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సిగ్నల్ వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో (ఏపీ 09 ఏక్యూ 7209) నంబర్ గల కారు రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పాటు అధిక వేగంతో ప్రమాదకరంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లాడు. కారు నడుపుతున్న దృశ్యాలను ఎండీ మౌజం అనే వ్యక్తి వీడియో తీసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో టెక్ టీమ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కరుణాకర్ సాధారణ పరిశీలనలో భాగంగా ఎక్స్ ఖాతాను పరిశీలిస్తుండగా ఎండీ మౌజం పోస్ట్ చేసిన వీడియోను పరిశీలించాడు. దీంతో కారును వేగంగా నడుపుతూ రోడ్డుపై ప్రయాణించే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కరుణాకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కారు కోసం గాలించి పట్టుకున్నారు. మలక్‌పేటలోని ప్రజ్ఞ విజయజ్యోతి కాలేజీలో చదువుతున్న మహ్మద్ అబ్దుల్ ఖదిర్, అన్వర్ ఉలుం కాలేజీలో చదువుతున్న ఎండీ అనస్ అహ్మదుద్దీన్, లకోటియా కాలేజీలో చదువుతున్న మహ్మద్ అబ్దుల్ రహద్ ఈ కారులో వెళ్తూ స్టంట్లు చేసినట్లుగా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి వీరు ఇష్టారాజ్యంగా దూసుకెళ్తున్నట్లుగా నిర్థారించి కారును సీజ్ చేసి ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో కుటుంబం అదృశ్యం?
శంషాబాద్ : అప్పుల బాధ భరించలేక కుటుంబంతో సహా ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలి్పన మేరకు..మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన డి.సుదర్శన్ వివాహనం అనంతరం అత్తగారిల్లు ఉన్న కర్మన్‌ఘాట్‌లో ఏడేళ్లు, ఆ తర్వాత శంషాబాద్ పట్టణంలో ఏడాది కాలం నివసించాడు. రెండు చోట్లా అప్పులు కావడంతో గత మూడేళ్లుగా నర్కూడ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల చీటీ డబ్బుల వసూలు కోసం ప్రభాకర్ అనే వ్యక్తి సుదర్శన్ ఇంటికి వెళ్లగా వారు ఇంట్లో కన్పించకపోవడంతో వారి తల్లికి విషయం తెలిపాడు. ఈ విషయమైన సుదర్శన్ సోదరుడు భానుప్రకాష్ అద్దె ఇంట్లో ఆరా తీయగా సుదర్శన్‌తో పాటు ఆయన భార్య తేజస్వి, ఇద్దరు కుమారులు ఇక్కడ ఉండడం లేదని వెల్లడైంది. ఈ నెల 18 నుంచి వారు ఇంట్లో లేరని తెలియడంతో భానుప్రకాష్ వారి కోసం అన్ని చోట్లా ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. అప్పుల ఒత్తిడి కారణంగానే ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భానుప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి పెళ్లాడిన వ్యక్తే..
ఉప్పల్: సరిగ్గా ఏడాది క్రితం ప్రేమికుల రోజున ఒక్కటైన జంట ఉదంతంలో విషాదం చోటుచేసుకుంది. కట్టుకున్నోడే వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు..సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామానికి చెందిన ఆకుల మనీషా(24), తుంగతుర్తి ప్రాంతానికి చెందిన పులిగుజ్టు సంపత్‌లు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదివే సమయంలో ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో మనీషా తల్లిదండ్రులను ఎదురించి సంపత్‌ను గతేడాది వాలంటైన్స్ డే రోజున ఉప్పల్ ఆర్యసమాజ్‌లో పెళ్లాడింది. అనంతరం రామంతాపూర్‌లో కాపురం పెట్టారు. వీరి వైవాహిక జీవితం కొన్నాళ్లు బాగానే ఉన్నా అనుకోని విధంగా భర్త నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. సంపత్‌కు వరుసకు సోదరి అయ్యే మున్నిత అనే యువతి కూడా కట్నం తేవాలని వేధించడంతో ఇటీవల మనీషా విషయాన్ని తల్లిదండ్రులకు మొరపెట్టుకుంది. దీంతో వారు భర్తను వదిలేసి ఇంటికి రావాలని సలహా ఇవ్వగా అందుకు ఒప్పుకోలేదు. చివరకు తీవ్ర ఒత్తిడికి గురై ఆదివారం రాత్రి తాను ఉంటున్న గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. మనీషా తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త సంపత్, మున్నితపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్యాంక్ బండ్ వేదికగా : చీర కట్టి..పరుగు పెట్టి.. (ఫోటోలు)
-
అరుణవ్ చిరునవ్వులు.. ఇక కానరావు
నాంపల్లి: చిరునవ్వుల అరుణవ్ ఊపిరాగింది. ఇరు కుటుంబాల ఆశల కిరణం ఆరిపోయింది. లిఫ్టులో ఇరుక్కుని చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు అరుణవ్ శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మృతి చెందాడు. అరుణవ్‌ను బతికించడానికి నిలోఫర్ వైద్యులు శత విధాలా ప్రయతి్నంచినా ఫలితం దక్కలేదు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి బంధువులకు అప్పగించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు ఆరేళ్లకే కన్నుమూయడంతో అజయ్‌కుమార్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అత్తను చూసేందుకు వచ్చి.. గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ దంపతులకు ఒకే ఒక సంతానం. మగ పిల్లాడు పుట్టడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అజయ్‌కుమార్ సోదరి, అరుణవ్ మేనత్త జయశ్రీ అలియాస్ ఆయేషా శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఇమ్రాన్‌తో ప్రేమ వివాహం చేసుకున్నారు. సోదరి ప్రేమ వివాహం చేసుకోవడంతో చాలా రోజులు అజయ్‌కుమార్ కుటుంబం జయశ్రీ అలియాస్ ఆయేషాతో దూరంగా ఉంటోంది. ఆయేషాకు ఇటీవల తన పుట్టింటితో బంధం మళ్లీ చిగురించింది. మాట్లాడుకోవడాలు, వచి్చపోవడాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలుడు అరుణవ్ శుక్రవారం తన తాతయ్యతో కలిసి శాంతినగర్‌లోని మేనత్త ఇంటికి వచ్చి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. రెండు కుటుంబాల మధ్య చిగురించిన బంధంలో బాలుడి మరణం విషాదాన్ని నింపింది. -
INDvsPAK: ఆదివారం.. ‘ఆట’విడుపు
సాక్షి, హైదరాబాద్: హాలిడే బద్ధకం ఎగిరిపోనుంది. రోజంతా కళ్లార్పనివ్వని ఉద్వేగం దరి చేరనుంది. నగర వాసులకు ఈ సన్డే.. అసలు సిసలు హాట్ హాట్ విందును వడ్డించనుంది. ఆదివారం జరగనున్న భారత్, పాకిస్తాన్ క్రికెట్ పోరును వీక్షించేందుకు ఎవరి స్థాయిలో వారు ఏర్పాట్లు చేసుకున్నారు. సిద్ధమైన వేదికలు... పాక్– ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే ఎక్కడ లేని సందడి. పైగా ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో క్రికెట్ ఫీవర్ రెండింతలైంది. దీంతో యువత, చిన్నా, పెద్దా, క్రికెట్ అభిమానులందరి వారాంతపు రొటీన్ మారిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే డేఅండ్ నైట్ మ్యాచ్‌ను మిస్ కాకూడదు అదొకటే ప్లాన్. మధ్యాహ్నం 2 గంటలకే పనులన్నీ పూర్తి చేసుకుని టీవీల ముందు కూర్చోవడం మాత్రమే లక్ష్యం. రివెంజ్ తీరేనా? గత 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని ఈసారి టీం ఇండియా తిప్పికొడుతుందనే నమ్మకం ధీమా నగర వాసుల్లో కనిపిస్తోంది. రెండు జట్లూ శాయశక్తులా పోరాడతాయి కాబట్టి.. ఉత్కంఠభరిత మ్యాచ్ తప్పదని నమ్ముతున్న సిటిజనులు ఆ థ్రిల్‌ని తనివితీరా ఆస్వాదించాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం రెస్టారెంట్, హోటల్స్, పబ్స్, క్లబ్స్, ఓపెన్ థియేటర్స్, ఇతర ప్రదేశాల్లో స్క్రీన్స్ ఏర్పాటు చేసి స్పెషల్ మెనూలు సిద్ధం చేశారు. ఫ్రెండ్స్‌తో కొందరు, ఫ్యామిలీస్‌తో కలిసి కొందరు.. ఎవరికివారు తమకు అనువైన వేదికలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.. ఏదేమైనా.. అందరి నోటా ఒకటే మాట ‘జయహో ఇండియా’. -
పట్టపగలే నడిరోడ్డుపై.. కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45) ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పనిచేస్తుండగా, అతని కుమారుడు సాయి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి.. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. కుటుంబ కలహాలతో పాటు వీరిమధ్య కొంతకాలంగా ఆస్తికి సంబంధించి తగాదాలు కూడా ఉన్నాయి.దీంతో విసిగిపోయిన సాయికుమార్.. తండ్రినే హతమార్చాలని భావించాడు. శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి బస్సులో వెళ్తున్న మొగలిని కుమారుడు సాయి వెంబడించాడు.. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద మొగిలి బస్సు దిగగానే.. వెనుక నుంచి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దాదాపు 15 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. స్థానికులు మొగిలిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దాడి దృశ్యాలు ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు పైపైకి!
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో హైదరాబాద్ నగరానికి వలస వస్తుండటంతో ఇక్కడ ఇంటి అద్దెలు (house rent) పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. - సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లోని దాదాపు అన్ని కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) విధానాన్ని ఎత్తివేయడంతో అంతా నగరానికి చేరుకున్నారు. దీంతో ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉందని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ తెలిపింది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో సప్లై తగ్గడంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు అద్దెలు కూడా పెరిగాయి.ఇదీ చదివారా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..ఈ ఏడాది హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్, సప్లై వాటా 50, 39 శాతంగా ఉన్నాయి.గచ్చిబౌలి, కొండాపూర్‌లో అత్యధికంగా అద్దెలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీ కారణం. 55 శాతం మంది అద్దెదారులు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు నెలవారీ అద్దెలకు కోసం వెతుకుతున్నారు. 1000 చదరపు అడుగుల నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
Hyderabad: ప్రాణాలతో చెలగాటం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడే సంబంధిత అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆ తర్వాత అందరూ ఆ విషయాన్ని మరిచిపోతున్నారు. భవనాలు కూలినప్పుడే అక్రమ నిర్మాణాలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే సేఫ్టీ నిబంధనలు గుర్తుకొస్తాయి. అలాగే లిఫ్టుల్లో ప్రమాదాలు జరిగినప్పుడే వాటి నిర్వహణ గుర్తుకొస్తుంది. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లో ఆరేళ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుపోవడంతో లిఫ్టులు.. వాటి నిర్వహణ.. తీసుకోవాల్సిన భద్రతచర్యలు వంటివి చర్చనీయాంశంగా మారాయి. ఎవరికీ పట్టదు.. లిఫ్టులు, వాటి నిర్వహణకు సంబంధించి ఏ ప్రభుత్వ విభాగం కూడా పట్టించుకోవడం లేదు. జీహెచ్ఎంసీలో భవనాల నిర్మాణాలకు నిబంధనలున్నప్పటికీ, లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించి నిబంధనల్లేవని సంబంధిత అధికారులు తెలిపారు. లిఫ్టుల స్టెబిలిటీ, నిర్వహణలపై కూడా నిబంధనల్లేవు. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సరి్టఫికెట్ ఇచ్చినట్లుగానే లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించి లిఫ్ట్ ఇన్స్పెక్టర్ సరి్టఫికెట్ ఉండాలనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. భవనం ఎత్తును బట్టి లిఫ్టులు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, లిఫ్టుల స్టెబిలిటీ, నిర్వహణలకు సంబంధించి ఎలాంటి నిబంధనల్లేవు. ఏటా వేల సంఖ్యలో భవనాల నిర్మాణం జరుగుతున్న జీహెచ్ఎంసీలో లిఫ్ట్ ఇన్స్పెక్టర్ లేకపోవడం దారుణమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యం.. ⇒ స్టెబిలిటీ లేకపోవడం.. నాసిరకం లిఫ్టులు వాడటం ప్రమాదాలకు ఒక కారణం కాగా, కనీస నిర్వహణ లేకపోవడం ప్రమాదాలకు తావిస్తోంది. ⇒ సాధారణంగా లిఫ్టు ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రైవేటు సంస్థలు సంబంధిత లిఫ్టు కంపెనీలతో ఏఎంసీ(యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్) కుదుర్చుకుంటాయి. నిర్ణీత వ్యవధుల్లో పరీక్షించడం, అవసరాన్నిబట్టి పరికరాలు సరఫరా చేయడం, తగిన మరమ్మతులు చేయడం వంటివి చేయాలి. ⇒ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో ఇవి మరింత పకడ్బందీగా ఉండాలి. ⇒లిఫ్టులో లిఫ్ట్ ఆపరేటర్ తప్పనిసరిగా ఉండాలి. ఆపరేటర్ లేకుండా లిఫ్ట్ వినియోగించరాదు. ⇒పనిచేసే ‘అలార్మ్’ బెల్ ఉండాలి.లేని పక్షంలో కనీసం ఫోన్ చేసేందుకు వీలుగా ల్యాండ్‌లైన్ ఉండాలి. ⇒అత్యవసర సమయాల్లో ఫోన్ చేసేందుకు వీలుగా సంబంధిత ఎమర్జెన్సీ నెంబర్లులిఫ్టులోకనబడేలా ఉండాలి. ⇒ గ్రిల్‌తో కూడిన లిఫ్టుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్రిల్ వాటికంటే పూర్తిగా మూసుకునే డోర్వి, అందరికీ కనిపించేలా అద్దాలవి అయితే మేలు. గతంలోనూ ప్రమాదాలు.. ⇒గతంలో కుందన్‌బాగ్‌లోని ఐఏఎస్‌ల క్వార్టర్లలోని లిఫ్టు కేబుల్ తెగి ప్రమాదం జరిగిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హిమాయత్‌నగర్‌లో లిఫ్టులో ఇరుక్కొని ఒకరు మృతి చెందారు. ⇒వ్యాపార సంస్థలతోపాటు నివాస అపార్ట్మెంట్లలోనూ లిఫ్టులతో అప్రమత్తంగా ఉండాలి. నిరీ్ణత వ్యవధుల్లో సరీ్వసు చేయించడం, లిఫ్టు ఆపరేటర్ విధుల్లో ఉండేలా చూడటం అవసరం. -
హైదరాబాద్ లో కుదుపునకు లోనైన రియల్ ఎస్టేట్ రంగం
-
లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు
నాంపల్లి: ఆరేళ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుపోయి.. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయిన ఘటన నాంపల్లి పరిధిలోని మాసబ్‌ట్యాంక్ శాంతినగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ ప్రైవేట్ హెల్త్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కుమారుడు అరుణవ్ (6) ఉన్నాడు. శాంతినగర్ కాలనీ మఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న తన అత్తమ్మ ఆయేషా ఇంటికి తాతయ్యతో కలిసి అరుణవ్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వచ్చాడు. అపార్ట్మెంట్ మూడో అంతస్తుకు వెళ్లేందుకు తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట అరుణవ్ వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు. అంతలోనే అరుణవ్ బటన్ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్ తెరిచే ఉండటంతో బయపడ్డ అరుణవ్ లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్ స్లాబ్ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అరుణవ్ గట్టిగా అరిచాడు. అపార్ట్మెంట్లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఫైర్ సిబ్బందికి, హైడ్రా డీఆర్ఎఫ్ బలగాలను రప్పించారు. గ్యాస్ కట్టర్లతో తొలగించి.. ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు గ్యాస్ కట్టర్లు, ఫైర్ విభాగానికి చెందిన పరికరాలతో లిఫ్టు ఫ్రేమ్‌ను కట్ చేశారు. రెండు గంటల పాటు శ్రమించి స్లాబ్ గోడను తొలగించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ యజ్ఞనారాయణ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి.దత్తు తమ బృందాలతో ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. బాలుడిని ప్రాణాలతో బయటికి తీసి చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో బాలుడు.. నిలోఫర్ ఆస్పత్రి ఐసీయూలో అరుణవ్‌ను వెంటిలేటర్ మీద ఉంచి ఆక్సిజన్, ప్లూయిడ్, గ్లూకోజ్‌ను అందిస్తున్నారు. 24 గంటలు గడిస్తే తప్ప బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ తెలిపారు. బాధిత బాలుడిని స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పరామర్శించారు. లిఫ్టు పని తీరుపై అనుమానాలు.. శాంతినగర్ కాలనీలోని మఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్ మూస్తేనే లిప్ట్ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్ వేయకుండానే, కేవలం బటన్ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు. -
HYD: లిఫ్టు ప్రమాదం విషాదాంతం.. బాలుడు అర్ణవ్ మృతి
సాక్షి, నాంపల్లి: ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కుపోయిన అర్ణవ్(6) తాజాగా మృతిచెందాడు. నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ణవ్ మృతిచెందినట్టు శనివారం మధ్యాహ్నం వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత అందించినప్పటికీ బాలుడిని కాపాడుకోలేకపోయారు. అయితే, లిఫ్టు ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అలాగే, ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో, బాలుడు చనిపోయినట్టు స్పష్టం చేశారు. ప్రమాదం ఇలా జరిగింది..నాంపల్లి పోలిస్‌స్టేషన్ పరిధిలోని ఆగాపుర గోడేకిఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ ప్రైవేట్ హెల్త్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు అర్ణవ్(6).. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తన తాతతో కలిసి రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట బాలుడు వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు.అంతలోనే అర్ణవ్ బటన్ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్ తెరిచే ఉండటంతో బయపడ్డ బాలుడు లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్ స్లాబ్ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అర్ణవ్ గట్టిగా అరిచాడు. అపార్ట్మెంట్లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఫైర్ సిబ్బందికి, హైడ్రా డీఆర్ఎఫ్ బలగాలను రప్పించారు.రెండు గంటల పోరాటం..మొదట గ్యాస్కటర్తో లిఫ్టు గ్రిల్స్‌ను తొలగించే ప్రయత్నం చేసినా.. బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి లిఫ్టు గోడలను బద్దలుకొట్టారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టమ్మీద బాలుడిని బయటికి తీశారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలై.. అపస్మారకస్థితికి చేరిన బాలుడికి 108 వైద్య బృందం ఆక్సిజన్ అందించి.. అనంతరం నిలోఫర్ ఆసుపత్రికి తరలించింది. బాలుడికి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి విషమంగానే ఉందని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.లిఫ్టు పని తీరుపై అనుమానాలు.. శాంతినగర్ కాలనీలోని మఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్ మూస్తేనే లిప్ట్ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్ వేయకుండానే, కేవలం బటన్ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు. -
జీహెచ్ఎంసీ టార్గెట్ 600 కోట్లు.. బడాబాబులు, స్టార్ హోటళ్లకు షాక్!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలున్న బడా బాబులకు, స్టార్ హోటళ్లకు బల్దియా అధికారులు షాకిస్తున్నారు. పన్నులు కట్టకపోవడంతో భవనాలను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి నెలాఖరు నాటికి మరో రూ.600కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ (GHMC) కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా బల్దియా రెవెన్యూ విభాగం ఇప్పటికే ఆరు లక్షల మంది యజమానులకు నోటీసులు జారీ చేస్తోంది. ట్రేడ్ లైసెన్సులు తీసుకోని వారికి, గతంలోని లైసెన్సులు పునరుద్ధరించుకోని వారికి మరో లక్షన్నర నోటీసులు జారీ చేసింది. అంతటితో అధికారులు ఆగలేదు. మొండి బకాయిలున్న ప్రైవేటు ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలకు తాళం వేయాలని నిర్ణయించారు. గడిచిన వారంలో 100 భవనాలకు తాళం వేశారు. ఇదే సమయంలో అధికారులు తమ పంథా మార్చారు. ప్రస్తుతం బస్తీలు, కాలనీల్లో వినూత్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31లోగా ఆస్తి పన్నుతో పాటు మొండి బకాయిలను వెంటనే చెల్లించాలంటూ క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల సిబ్బంది చేతికి మైక్సెట్లు ఇచ్చి చాటింపు వేయిస్తున్నారు. ఈ సందర్బంగా ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారులకు నోటీసులు ఇవ్వడంతో పాటు స్పందించని వారి ఆస్తులను సైతం జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. చాలా వరకు ప్రభుత్వ భవనాలే..ఆస్తిపన్ను బకాయి రూ.5లక్షలకు మించి ఉన్న భవనాలు 4వేలకుపైగా ఉన్నాయి. అత్యధికంగా జూబ్లిహిల్స్ సర్కిల్లో 700 నిర్మాణాలు, ఖైరతాబాద్‌లో 650, గోషామహల్లో 550, బేగంపేటలో 280, సరూర్‌నగర్‌లో 180, అంబర్‌పేట్‌లో 140, మెహిదీపట్నంలో 150 ఉన్నాయి. వాటి నుంచి రూ.4వేల కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉందని అంచనా. అందులో చాలా వరకు ప్రభుత్వ భవనాలున్నాయి. పంజాగుట్టలోని ప్రముఖ సర్కారు ఆస్పత్రి రూ.55కోట్లు, బంజారాహిల్స్‌లో రోడ్డు నెం.12లోని ప్రభుత్వ కార్యాలయం రూ.కోట్లలో ఆస్తిపన్ను బకాయి పడ్డాయి.కొన్ని సంస్థల బకాయిలు ఇలా.. జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి రూ.52కోట్లు. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ బకాయిలు రూ.32కోట్లు. హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ బకాయిలు రూ.30కోట్లు. సోమాజీగూడ కత్రియా హోటల్ బకాయి రూ.8.62 కోట్లు. ఇండో అరబ్ లీగ్ బకాయి రూ.7.33 కోట్లు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బకాయిలు రూ.5.5 కోట్లు. -
పెళ్లి మంటపంలో కుప్పకూలిన వధువు తండ్రి
భిక్కనూరు(హైదరాబాద్): మంగళ వాయిద్యాలు మోగుతుండగా వేదపండితులు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. బంధువులు, స్నేహితులంతా పెళ్లి మంటపానికి చేరుకున్నారు. అల్లుడు, కూతురు కాళ్లు కడిగిన వధువు తండ్రి ఆనందంగా అందరినీ పలకరిస్తున్నారు. మరోవైపు భోజనాలు కూడా మొదలయ్యాయి. ఇంతలోనే ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాల్‌చంద్రం (55) కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో నివసిస్తున్నారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసేవారు. ఆయనకు భార్య రాజమణి, కూతుళ్లు కనకమహాలక్ష్మి, కల్యాణలక్ష్మి ఉన్నారు. పెద్ద కూతురు కనకమహాలక్ష్మి పెళ్లి కుదిరింది. శుక్రవారం భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులను బాల్‌చంద్రం ఆనందంగా పలకరించారు. అందరూ అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది చిన్న కూతురు పెళ్లి కూడా చేస్తానని చాలా మందితో బాల్‌చంద్రం చెబుతూ సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. బాల్‌చంద్రంను వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. కూతురు పెళ్లిలో తండ్రి కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పెళ్లి కోసం వేసిన పందిరిలో విగతజీవిగా పడిపోయిన తండ్రిని చూసి ఆ కూతురు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయంత్రం కామారెడ్డి పట్టణంలో బాల్‌చంద్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
పతంగిదేపై ‘చేయి’
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల సందర్భంగా సస్పెన్స్‌లు.. డ్రామాలు.. రక్తికట్టిన అనంతరం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఊహించినట్లుగానే ఏకగ్రీవమయ్యాయి. అధికారంలో ఉన్న పారీ్టతో సఖ్యత ఫార్ములాతో ఎంఐఎం.. కాంగ్రెస్‌తో జత కట్టడంతో ఆ రెండు పారీ్టల కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో జట్టుకట్టిన ఎంఐఎం.. ఈసారి కాంగ్రెస్‌తో జత కలిసింది. దాంతో.. ఈసారి బీఆర్ఎస్ స్థానే కాంగ్రెస్ సభ్యులు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లున్న జీహెచ్ఎంసీలో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల కోసం ఎన్నిక జరిగింది. రెండు పారీ్టలు కలిస్తే.. మిగతా పార్టీలు గెలవవని తెలిసినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయానికి ముందస్తుగానే నామినేషన్లు వేసి బరిలో దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో పోలింగ్ జరగకుండానే పోటీలో మిగిలిన 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ప్రకటించారు. పోటీ చేయని బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్కు దూరమంటూ జీహెచ్ఎంసీలో ఆ పారీ్టతో కలిస్తే అపప్రథ అనే తలంపుతో బీజేపీ అసలు పోటీ చేయలేదు. ఈ ఎన్నికకు పారీ్టలతో సంబంధం లేనందున వ్యక్తిగత బలంతో గెలవవచ్చనుకున్నారో, లేక లోపాయికారీగా నామినేషన్లు ముగిసేలోగా ఏమైనా జరగవచ్చనుకున్నారో నామినేషన్లు వేసిన ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోటీ నుంచి వైదొలిగారు. గెలవలేమని తెలిసి బరిలో ఉండొద్దంటూ అధిష్ఠానం ఆదేశించడంతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఎంఐఎందే హవా.. స్టాండింగ్ కమిటీలో స్థానంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరువు దక్కించుకున్నప్పటికీ, ఎంఐఎం హవా కొనసాగనుంది. 15 మంది సభ్యులకుగాను 8 మంది ఎంఐఎం వారే. అంటే, ఒక్కటే అయినప్పటికీ, కాంగ్రెస్ కంటే ఎంఐఎందే మెజారీ్ట. ఇక జీహెచ్ఎంసీ పాలకమండలికి చివరి సంవత్సరంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరగనున్న తరుణంలో స్టాండింగ్క మిటీలో ఆమోదం పొందాలంటే ఎంఐఎం సభ్యులే కీలకం కానున్నారు. ఎంఐఎంకు అధికారంలోని పార్టీలతో అనుబంధం ఈనాటిది కాదు. బీఆర్ఎస్ రాకముందు నుంచీ అది అధికారంలో ఉన్న పారీ్టతో పొత్తు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పొత్తులో భాగంగా స్టాండింగ్ కమిటీలోనే కాదు..మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు పొత్తులో భాగంగా పంచుకున్నారు. పెరిగిన కాంగ్రెస్ బలం.. కాంగ్రెస్ పార్టీ బలం ప్రస్తుతం 25కు చేరినప్పటికీ, ఆ పార్టీ తొలుత గెలిచింది రెండు సీట్లే. ఇతర పారీ్టల నుంచి చేరికలతో దాని బలం 25కు పెరిగింది. గతంలో కాంగ్రెస్–ఎంఐఎం పొత్తు కొనసాగినప్పుడు కాంగ్రెస్ 8, ఎంఐఎం 7 స్టాండింగ్కమిటీ స్థానాలు పొందేవి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బల్దియాలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు 99 మంది, ఎంఐఎం కార్పొరేటర్లు 44 మంది ఉన్నప్పుడు బలానికనుగుణంగా అంటూ బీఆర్ఎస్ నుంచి 9 మంది, ఎంఐఎంనుంచి ఆరుగురు మాత్రమే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. గత పాలకమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం 56కు తగ్గడంతో తిరిగి స్టాండింగ్ కమిటీకి 8 మందినే ఖరారు చేశారు. ఇప్పుడు ఎంఐఎం–కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఎంఐఎంకు ఎక్కువమంది కార్పొరేటర్లు ఉన్నందున వారు ఎనిమిది స్టాండింగ్ కమిటీ స్థానాలు పొందారు. మొత్తానికి ఎన్నికలకున్న ఏడాది సమయంలో ముఖ్యపాత్ర పోషించనున్నారు. కాంగ్రెస్‌లోకి ఇతర పారీ్టల నుంచి వచి్చనవారే స్టాండింగ్ కమిటీలో స్థానం పొందారు. తొలుత గెలిచిన వారిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. వీరే స్టాండింగ్ కమిటీ సభ్యులు (పారీ్టల వారీగా)ఎంఐఎం నుంచి.. అబ్దుల్ వాహబ్ (చాంద్రాయణగుట్ట), డాక్టర్ ఆయేషా హుమేరా (టోలిచౌకి), గౌసుద్దీన్ మహ్మద్(¿ోలక్పూర్), పరీ్వన్ సుల్తానా (ఘాన్సీబజార్), బాతాజబీన్ (విజయనగర్ కాలనీ), మహ్మద్ సలీం (దూద్‌బౌలి), సమీనా బేగం (తలాబ్ చంచలం), సయ్యద్ మిన్హాజుద్దీన్ (అక్బర్ బాగ్). కాంగ్రెస్ నుంచి.. వి.జగదీశ్వర్‌గౌడ్ (మాదాపూర్), బానోత్ సుజాత (హస్తినాపురం), మహ్మద్ బాబాఫసియుద్దీన్(బోరబండ), బూరుగడ్డ పుష్ప (ఆర్సీపురం), బొంతు శ్రీదేవి (చర్లపల్లి), మహాలక్ష్మి రామన్ గౌడ్ (హిమాయత్‌నగర్), సీఎన్ రెడ్డి (రహ్మత్‌నగర్). -
భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న జాయింట్ కమిషనర్ భార్య
బౌద్ధనగర్: తనను వేధింపులకు గురి చేస్తూ.. మరో మహిళతో కలిసి ఉన్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది ఆయన భార్య. ఈ ఘటన వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన జానకీరామ్ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు గతంలో వివాహమైంది. కొంత కాలం తర్వాత దంపతులు విడాకులు తీసుకున్నారు. 2018లో బౌద్ధనగర్‌కు చెందిన కల్యాణితో జానకీరామ్‌కు రెండో పెళ్లి జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత జానకీరామ్, కల్యాణి కలిసి ఆయన తల్లిదండ్రులతో నివసించసాగారు. ఈ క్రమంలోనే కల్యాణిని అత్తామామలతో పాటు తన భర్త అన్న, వదిన వేధింపులకు గురి చేసేవారు. జానకీరామ్‌కు మరో వివాహం చేసేందుకు కల్యాణిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జానకీరామ్ నాలుగు నెలల క్రితం భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి కల్యాణి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా భర్త లిఫ్ట్ చేసేవాడు కాదు. దీంతో భర్తపై అనుమానం కలిగిన కల్యాణి శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి వారాసిగూడలోని భర్త ఇంటికి వెళ్లి చూడగా.. అతను మరో అమ్మాయితో కలిసి ఉన్నాడు. వీరిద్దరినీ పట్టుకొని దేహశుద్ధి చేశారు. వారాసిగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని జానకీరామ్‌తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టినట్లు సమాచారం రావడంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు బాధితురాలు కల్యాణి తెలిపారు. తన భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని, తాను 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో కడుపుపై భర్త తన్నడంతో గర్భస్రావం జరిగిందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో కల్యాణి పేర్కొన్నారు. 20 మంది దాడి చేశారు: జానకీరామ్ తనతో పాటు ఇంట్లో ఉన్న తన స్నేహితురాలిపై 20 మంది దాడికి పాల్పడ్డారని జాయింట్ కమిషనర్ జానకీరామ్ వారాసిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య కల్యాణి, బావమరిది బులిశెట్టి భాస్కర్ సుమారు 20 మందితో కలిసి ఇంట్లోకి వచ్చి దాడి చేశారన్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు తెలిపారు. -
బంజారాహిల్స్‌లో సందడి చేసిన సినీ తారలు తేజస్వి, కామాక్షి (ఫొటోలు)
-
తెలంగాణ సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంతంటే?.. ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక
హైదరాబాద్ : సచివాలయ నిర్మాణం, వ్యయం అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయానికి వెచ్చించిన నిధులు, నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలు అంశాలను తేల్చాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వింగ్‌ల వారిగా విచారణ మొదలుపెట్టింది. అయితే, ఈ విచారణలో సచివాలయం నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ విభాగంపై విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికలో సెక్రటేరియట్లో మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్‌వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి రూ. 320కోట్లకు పైగా ఖర్చు దాటిందని విజిలెన్స్ పేర్కొంది. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు తేల్చింది.బిల్లులు మంజూరు చేయకుండానే నిధులను విడుదల చేసినట్లు గుర్తించింది. రూ. 320 కోట్లకు పైగా నిధుల విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాదాపుగా ఇప్పటివరకు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ప్రభుత్వం సదరు సంస్థకు నిధులను విడుదల చేసింది. మొత్తం అంచనా రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని విజిలెన్స్ తాత్కాలిక రిపోర్టులో పేర్కొంది. -
Hyderabad : లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు ఆర్నవ్ (6) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నీలోఫర్ వైద్యులు బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.పోలీసులు వివరాల మేరకు.. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌కు చెందిన ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో అర్నవ్ ఇరుక్కుపోయాడు. మూడో ఫ్లోర్ నుంచి కిందకు దిగే క్రమంలో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో లిఫ్ట్- స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడు కేకలు వేశాడు. కేకలు విన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం ఘటనా స్థలికి చేరుకున్నారు. లిఫ్ట్-స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడిని నాలుగు గంటల పాటు శ్రమించి వెల్డింగ్ మిషన్ల సాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బయటకు తీశారు. అనంతరం, అత్యవసర చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నీలోఫర్ వైద్యులు తెలిపారు. -
అంతర్జాతీయ హంగులతో నియో పోలిస్
సాక్షి, హైదరాబాద్: కోకాపేట కొత్త కళను సంతరించుకుంది. ఆకాశ హర్మ్యాలతో ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ హంగులను అద్దుకున్న కోకాపేటలో హెచ్ఎండీఏ (HMDA) భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను విస్తరించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నియోపోలిస్ లే అవుట్ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. రహదారులు, నీటి సదుపాయం, పార్కులు, విద్యుత్ తదితర సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. నియోపోలిస్ (neopolis) నుంచి నగరంలోని అన్ని వైపులకు రాకపోకలు సాగించేలా రహదారుల విస్తరణ చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డుతో అనుసంధానం చేసే ట్రంక్‌రోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం టోల్‌ప్లాజా (Toll Plaza) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో 20 రోజుల్లో పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలను ప్రారంభించనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు తెలిపారు. నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం.. వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, ఐటీ కంపెనీలు, నివాస సముదాయాలతో విస్తరించిన కోకాపేటకు మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెండో దశలో డీపీఆర్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. మహా నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట గుర్తింపు పొందింది. నియోపోలిస్‌లో హెచ్ఎండీఏ నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో ఎకరా భూమి సుమారు రూ.100 కోట్లు పలికింది. బడా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యాపార వర్గాలు పోటీ పడి మరీ ప్లాట్లను కొనుగోలు చేశాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలకు అవకాశం ఉండడంతో అనూహ్యమైన పోటీ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో రెండు దశల్లో వేసిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో సుమారు రూ.5000 కోట్లకు పైగా ఆదాయం లభించింది. మొదటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ లేఅవుట్లో రూ.268 కోట్లతో హెచ్ఎండీఏ మౌలిక సదుపాయాలను అభివృద్ధిపర్చింది. రెండో దశలో భారీ స్పందన.. కోకాపేట (Kokapet) నియోపోలిస్‌లో రెండు దశల్లో 14 ప్లాట్లలో ఉన్న భూములను విక్రయించారు. 2021 జూన్‌లో నిర్వహించిన మొదటి దశ బిడ్డింగ్‌లో 8 ప్లాట్లకు బిడ్డింగ్ నిర్వహించగా.. గరిష్టంగా ఎకరానికి రూ.42.4 కోట్ల చొప్పున అమ్ముడైంది. సగటున రూ.35 కోట్ల చొప్పున విక్రయించారు. మొత్తం 48.27 ఎకరాలపై రూ.1901.04 కోట్లు వచ్చాయి. 2023లో నిర్వహించిన రెండో దశ బిడ్డింగ్‌లో 7 ప్లాట్లలో 46.33 ఎకరాలను విక్రయించారు. ఎకరానికి గరిష్టంగా రూ.100.75 కోట్ల ఆదాయం లభించింది. సగటున రూ.73 కోట్ల చొప్పున విక్రయించారు. రెండో దశలో మొత్తం రూ.3319.60 కోట్ల ఆదాయం లభించింది. మొదటి నుంచి ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేశారు. ఔటర్తో అనుసంధానం.. కోకాపేట నుంచి వివిధ మార్గాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా కోకాపేట లే అవుట్ ప్రవేశ రహదారిని ఔటర్తో అనుసంధానం చేసేలా రహదారులను విస్తరించారు. ఈ లే అవుట్లో పెద్ద ఎత్తున హైరైజ్ భవనాలను నిర్మిస్తున్న దృష్ట్యా వాహనాల రాకపోకలు సైతం భారీగా ఉంటాయని అంచనా. ఈ మేరకు భవిష్యత్ అంచనాలకు అనుగుణంగా రహదారుల విస్తరణకు హెచ్ఎండీఏ అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. నార్సింగి వద్ద సుమారు రూ.15 కోట్లకు పైగా వెచ్చించి ఇంటర్‌చేంజ్‌ను ఏర్పాటు చేశారు. మరో రూ.65 కోట్లతో ట్రంపెట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. కోకాపేట నుంచి ట్రంపెట్‌కు రాకపోకలు సాగించే మార్గంలో ప్రస్తుతం టోల్గేట్ నిర్మిస్తున్నారు. చదవండి: ఓఆర్ఆర్ చుట్టూ హౌసింగ్ కాలనీలుట్రంపెట్ రోడ్డును వినియోగించుకొనేందుకు వాహనదారులు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఇటు పటాన్చెరు వైపు అటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు రాకపోకలు సాగించవచ్చు. -
రంగారెడ్డి జిల్లా రామోజీ ఫిలిం సిటీ బాధితుల ఆందోళన
-
సికింద్రాబాద్ వారాసిగూడలో GHMC అధికారి రాసలీలలు
-
ముస్తాబు అయిన హైదరాబాద్ (ఫొటోలు)
-
అమ్మాయితో భార్యకు అడ్డంగా దొరికిన జీహెచ్ఎంసీ అధికారి
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డునపడేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. సొసైటీలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు సైతం వివాహేతర సంబంధాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పరువు తీసుకుని నవ్వుల పాలవుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీకి చెందిన ఓ అధికారి బాగోతం బట్టబయలైంది. తన కంటే 20 ఏళ్ల తక్కువ వయసున్న అమ్మాయితో సదరు అధికారి వివాహేతర సంబంధం పెట్టుకోగా అతడి భార్య వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు.వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకీరామ్‌ను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెతో కలిసి నగరంలోని వారాసిగూడలో మకాం ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో భార్య కళ్యాణికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో జానకీరామ్ ఎక్కడికి వెళుతున్నాడని కళ్యాణి నిఘా పెట్టింది. దీంతో, వారాసిగూడలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించింది.దీంతో, ప్లాన్ ప్రకారం భర్తను ఫాలో చేసిన కళ్యాణి.. అపార్ట్మెంట్లోని గదిలో వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరినీ ఆమె చితకబాదారు. అనంతరం, కళ్యాణి మాట్లాడుతూ.. జానకీరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడని అన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జానకీరామ్‌కు తగిన బుద్ది చెప్పాలని పోలీసులను కళ్యాణి కోరారు. -
అందాల ఆతిథ్యం..! విశ్వసుందరి జన్మించిన నగరంలో పోటీలు..
నగరంలో ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచం సరికొత్త సందడి పులుముకుంది. ఈవెంట్స్ రంగం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ణంలోని హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించడమే ఈ సందడికి కారణం. ప్రపంచస్థాయి అందాల పోటీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం భాగ్యనగరంలోని ఫ్యాషన్ రంగానికి చెందిన ఔత్సాహికులకు కలర్ ఫుల్ కలలకు ఊతమిస్తోంది. ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం నగరానికి మరింత గ్లోబల్ లుక్ తెచి్చపెడుతోంది. మొత్తం 120 దేశాలు పాల్గొనే ఈ అతిపెద్ద ఈవెంట్ దాదాపు నెల రోజుల పాటు నగర కేంద్రంగా జరగడం వల్ల అంతర్జాతీయంగా ఖ్యాతి పొందనుంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ జరగని స్థాయిలో అంతర్జాతీయ ఫ్యాషన్, మోడలింగ్ రంగాలను నగరం ఆకర్షిస్తోంది. తద్వారా నగరంలో ఔత్సాహిక యువతకు అవకాశాలు విస్తరిస్తాయి. అదే విధంగా నగరం, చుట్టుపక్కల చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హస్తకళలు ప్రపంచం దృష్టికి రానున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న నగరం టాలీవుడ్ పరిశ్రమకు సైతం మరింత ఊపునివ్వనుంది. గొప్ప విశేషం.. ఎందరో యువత కల.. హైదరాబాద్ దేశంలోనే ఓ గొప్ప నగరంగా ఎదుగుతోంది. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటివెన్నో నిర్వహించగల సామర్థ్యం నగరానికి ఉంది. ఒకనాటి బ్యూటీ కాంటెస్ట్ విజేతగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అందమైన యువతులకు మన నగరం వేదిక కావడాన్ని చూసే రోజు కోసం ఎంతో ఉది్వగ్నంగా ఎదురుచూస్తున్నాను. – శిల్పారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా బ్యూటీ ఈవెంట్స్ కేంద్రంగా.. గత కొంత కాలంగా బ్యూటీ క్వీన్స్‌కు మాత్రమే కాదు బ్యూటీ ఈవెంట్స్‌కు సైతం చిరునామాగా మారుతోంది. నగరానికి చెందిన శిల్పారెడ్డి మొదలుకుని గత ఏడాది సుష్మ తొండేటి వరకూ మిసెస్ ఇండియా కిరీటాన్ని నగరవాసులు ఎందరో గెలుచుకున్నారు. ఇక మానసా వారణాసి వంటివారు మిస్ ఇండియా కిరీటాలను తీసుకొచ్చారు. పూనమ్ కౌర్, మధుశాలిని వంటి మిస్ హైదరాబాద్‌లు అనంతరం సినీతారలుగా రాణించారు. నగరంలోని కళాశాలల నుంచి క్లబ్స్ వరకూ బ్యూటీ కాంటెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి.ఈ తరహా ఈవెంట్లకు మరింత ప్రొఫెషనలిజాన్ని మిస్ వరల్డ్ అందించడం తధ్యం. ఏదేమైనా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌కు ప్రపంచ సుందరి పోటీలు రావడం సమయోచితం అని చెప్పాలి. (చదవండి: ఆరోగ్య ప్రయోజనాలందించే బెస్ట్ చట్నీలివే..!) -
హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ సీజ్
-
HYD: తాజ్ బంజారా హోటల్ సీజ్.. కారణం ఇదే
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్ తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. పన్ను బకాయిలు చెల్లించని నేపథ్యంలో సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్ తాజ్ బంజారాను జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. గత రెండేళ్లుగా హోటల్ యాజమాన్యం పన్నులు బకాయిలు చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. రూ.1.40కోట్లు పన్ను బకాయిలు ఉన్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు. గడిచిన రెండు సంవత్సరాలుగా హోటల్ నిర్వాహకులు పన్ను బకాయలు చెల్లించలేదు. దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ క్రమంలో సీజ్ చేసినట్టు తెలిసింది. ఇక ఈ ఘటనపై తాజ్ హోటల్ యాజమాన్యం స్పందించింది. సీజ్‌చేసి వారెంట్ ఇష్యూ చేయడంతో హుటాహుటిన హోటల్ నిర్వాహకులు స్పందించారు. జీహెచ్ఎంసీకి బకాయి పడిన కోటీ 43 లక్షల రూపాయల పన్నులో సగం చెల్లించినట్టు తెలిపారు. మిగతా బకాయిలను వారంలోగా చెల్లించేందుకు ఒప్పుకున్నట్టు స్పష్టం చేశారు. అయితే తాజా బంజారానే కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో భాగంగా డిఫాల్టర్స్ అందరికీ నోటీసులు పంపింది జీహెచ్ఎంసీ. మూడేళ్లుగా పన్ను చెల్లించనివాళ్లకు వారెంట్స్ ఇష్యూ చేశారు. అందులో భాగంగానే తాజ్ బంజారాకి కూడా నోటీసులు ఇచ్చారు. రెడ్ నోటీస్ ఇష్యూ చేయడంతో తప్పని పరిస్థితుల్లో సగం పన్ను చెల్లించింది తాజ్ బంజారా యాజమాన్యం.హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా కూడా ఒకటి. ఈ హోటల్‌కు సెలబ్రెటీలు ఎక్కువగా వస్తుంటారు. క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్లోనే ఎక్కువగా బస చేస్తుంటారు. అలాగే దేశంలోని కీలక రాజకీయనేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు. పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది దీని వైపు మొగ్గుచూపుతారు. -
హైదరాబాద్‌లో అప్పుడే దంచేస్తున్న ఎండలు
భానుడు భగ్గుమంటున్నాడు. తాజాగా పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు (High Temperature) 35.7 డిగ్రీలు నమోదు కాగా.. ఎండ తీవ్రతకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపషమనం పొందేందుకు ఏసీలు, కూలర్లకు పనిచెప్పారు. దీంతో విద్యుత్ డిమాండ్ (Electricity Demand) అమాంతం పెరిగింది. సగటున విద్యుత్ డిమాండ్ 60 మిలియన్ యూనిట్లు నమోదు కాగా.. అది తాజాగా 70ఎంయూకి దాటింది.సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీలు, కనిష్టంగా 21.3 డిగ్రీలు నమోద య్యాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం ప్రజలు ఏసీలను ఆన్ చేస్తున్నారు. మొన్నటి వరకు మూలన పడిన కూలర్లు (Air Coolers) మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయి. ఇంట్లోనే కాదు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో రోజంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఆన్‌లో ఉండటంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఫిబ్రవరి (February) మొదటి రెండో వారం వరకు గ్రేటర్లో రోజు సగటున డిమాండ్ 60 మిలియన్ యూనిట్లు నమోదు కాగా, తాజాగా 70 ఎంయూ దాటింది. అత్యవసరమైతేనే.. ఎల్సీలకు అనుమతి విద్యుత్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లలో ఆందోళన మొదలైంది. వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కం ముందస్తు లైన్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ చర్యలు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, లూజు లైన్లను సరి చేయడం, దెబ్బతిన్న ఇన్సులేటర్లను మార్చడం, ఎర్తింగ్ సిస్టం పక్కగా ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్ వర్క్స్ నిర్వహిస్తుంది. వారం పది రోజుల్లో వీటిని కూడా పూర్తి చేయనుంది. మార్చి మొదటి వారంలో ఇంటర్మీడియట్, రెండో మూడో వారంలో టెన్త్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైన్ క్లియరెన్స్ (ఎల్సీ)లకు స్వస్తి చెప్పింది. అత్యవసరమైతే తప్ప.. ఎల్సీలకు అనుమతి ఇవ్వడం లేదు.ఫిబ్రవరిలోనే.. ఏప్రిల్ డిమాండ్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ 2022 ఏప్రిల్ నెలలో నమోదైన సగటు గరిష్ట (3435 మెగావాట్లు)డిమాండ్.. ప్రస్తుతం ఫిబ్రవరిలోనే (3455 మెగావాట్లు) నమోదవుతోంది. ఇక మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ ఎంత పెరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మే చివరి నాటికి రోజు సగటు డిమాండ్ 100 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేస్తోంది.ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రణాళికలు 60 శాతానికి మించి లోడు ఉన్న 33కేవీ, 11 కేవీ ఫీడర్లు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, ప్రత్యమ్నాయ మార్గాలకు విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం 571 (33కేవీ) సబ్స్టేషన్లు ఉండగా, వీటి సామర్థ్యం 9,675 ఎంవీఏగా ఉంది. కొత్తగా మరో 213(33/11 కేవీ) సబ్స్టేషన్ల ఏర్పాటుకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. పనులు చేసేందుకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్లకు ఆయా సబ్స్టేషన్ల నిర్మాణ పనులు అప్పగించి, నిర్ధేశిత లక్ష్యం లోగా వాటిని పూర్తి చేయించాలని డిస్కం నిర్ణయించింది. అంతేకాదు కొత్తగా నాలుగు వేల కిలో మీటర్ల 33 కేవీ లైన్లు, ఏడు వేల కిలో మీటర్ల 11 కేవీ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చదవండి: హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ హౌసింగ్ కాలనీలుసీఎండీ ముషారఫ్ ఫరూఖీ రోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎస్ఈలు, సీజీఎంలు, డీఈలతో సమావేశాలు ఏర్పాటు చేసి, లైన్ల పునరుద్ధరణ, కొత్త లైన్ల ఏర్పాటు వంటి పనులను సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా నిజాంపేట, బాచుపల్లి, కూకట్పల్లి, గండి మైసమ్మ, అమీన్‌పూర్‌లలో నమోదవుతున్న విద్యుత్ డిమాండ్, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రూ.212.20 కోట్లతో బౌరంపేటలో కొత్తగా నిర్మించిన 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఈ నెలాఖరు లోగా ఛార్జ్ చేయనున్నారు. ఫైళ్ల పెండింగ్‌పై సీఎండీ సీరియస్ సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలో కొత్త కనెక్షన్ల జారీకి సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటాన్ని సీఎండీ ఫారూఖీ సీరియస్‌గా తీసుకున్నారు. బుధవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయా సర్కిళ్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా కనెక్షన్లను ఎందుకు పెండింగ్‌లో పెట్టాల్సి వచి్చందని నిలదీసినట్లు తెలిసింది. నిర్దేశించిన గడువులోగా కనెక్షన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలోని కొంత మంది ఇంజినీర్లు తీరు మార్చుకోవడం లేదని, పరిస్థితిలో మార్పు రాకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు తెలిసింది. -
హైదరాబాద్‌లో తొలిసారిగా ఆక్సిజన్ థెరపీ ఛాంబర్
హైదరాబాద్: నగరంలోని వైద్య చికిత్సలలో ఇదో సరికొత్త విప్లవం. నగరంలో ఇన్నాళ్లుగా అందుబాటులో లేని హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ (హెచ్‌బీఓటీ) సాయంతో 20 మందికి రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ విజయవంతంగా చికిత్స అందించింది.హెచ్‌బీఓటీ అనేది ఒక నాన్ ఇన్వేజివ్ థెరపీ. ఇందులో ఆరోగ్యం కావాలనుకునేవారు ప్రెషరైజ్డ్ ఛాంబర్లో 100% స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటారు. దీనివల్ల శరీరం ఆక్సిజన్‌ను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ సెల్యులార్ మరమ్మతును వేగవంతం చేస్తుంది, యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. నాడీ, జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, మంటలను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇలా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ చికిత్సను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు, అథ్లెట్లు, వెల్నెస్ ఔత్సాహికులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా దాని ప్రయోజనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.సయ్యద్ ఖలీల్, ఫిజికల్ థెరపిస్ట్: "మేము హైదరాబాద్‌లో మొట్టమొదటి హెచ్‌బిఒటి (హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ) ఛాంబర్‌ను పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తి గా, ఆరోగ్య పునరుద్ధరణ మరియు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను విప్లవాత్మకంగా మార్చుతోంది. ఈ అత్యాధునిక చికిత్స ఆక్సిజన్ శోషణను పెంచి, మానవ శరీరపు స్వాభావిక నయం చేసే శక్తిని వేగవంతం చేస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి పెంచిన ఛాంబర్లో 100% శుద్ధ ఆక్సిజన్ శ్వాసించడం ద్వారా కణాల పునరుద్ధరణ మెరుగుపడి, వాపు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నాడీ సంబంధిత ఆరోగ్యం, మెటాబాలిక్ ఆరోగ్యం, మరియు జీవనశైలి పునరుద్ధరణ వంటి అనేక ప్రయోజనాలతో, హెచ్‌బిఒటి ఆధునిక ఆరోగ్య సంరక్షణలో గేమ్-చేంజర్‌గా మారింది.రుజువైన ప్రయోజనాలు- యాంటీ ఏజింగ్, రికవరీ విషయంలో సమూల మార్పులు రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్‌ను ప్రారంభించినప్పటి నుంచి రోగులు వేగంగా కోలుకోవడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు పలు విభాగాల్లో అసాధారణ ఫలితాలు సాధించింది. వాటిలో ప్రధానమైనది యాంటీ ఏజింగ్, చర్మ పునరుజ్జీవనం.వయసుతో వచ్చే సమస్యలకు సరైన పరిష్కారంహెచ్బీఓటీ చికిత్స వల్ల చర్మం మీద అసాధారణ ప్రభావాలు కనిపిస్తాయని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువైంది. బయటి వాతావరణంలో మనం గాలి పీల్చుకునేటప్పుడు అందులో 20 శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. దాన్ని మనం పీల్చుకుని, మళ్లీ 15% బయటకు వదిలేస్తాం. అంటే, 5 శాతం ఆక్సిజన్ మాత్రమే మన శరీరంలోకి వెళ్తుంది. కానీ, అదే హెచ్‌బీఓటీ ఛాంబర్లో అయితే మొత్తం నూరుశాతం ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. దాన్ని మన శరీరం పూర్తిగా పీల్చుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ప్రేరేపితం అవుతుంది. చర్మం స్థితిస్థాపకత మెరుగుపడుతుంది. దానివల్ల శరీరం మీద ఉండే గీతలు తగ్గిపోతాయి. మన కణజాలం కూడా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. ఎముకలు, కండరాలకు వయసుతో పాటే వాటిల్లే నష్టాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. దీనివల్ల గుండె కండరాలు, ఊపిరితిత్తుల పనితీరు చాలా మెరుగుపడుతుంది. గతంలో మధుమేహ బాధితులకు ఏవైనా గాయాలు అయినప్పుడు, లేదా శస్త్రచికిత్సలు చేసినప్పుడు వారి చర్మం త్వరగా కోలుకునేందుకు వీలుగా ఇలాంటి చికిత్సలు సూచించేవారు. కానీ, ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా ఈ చికిత్స వల్ల చర్మంతో పాటు శరీరంలోని కణాలన్నింటికీ కూడా ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. అవన్నీ ఆరోగ్యవంతం కావడంతో వయసు ప్రభావం వల్ల కనిపించే చర్మం ముడతలు, ఇతర సమస్యలన్నీ తగ్గిపోతాయి.ఇది కాక ఇంకా...దీర్ఘకాలిక అలసట, శక్తి బూస్ట్: ఈ చికిత్స ఆక్సిజన్ డెలివరీని పెంచి, అలసటను తగ్గిస్తుంది, సామర్థ్యాన్ని పెంచుతుందిడయాబెటిస్, జీవక్రియపరమైన ఆరోగ్యం: రక్త ప్రసరణకు ఇది సహాయపడుతుంది. గాయం నయం చేయడాన్ని వేగవంతం చేస్తుంది, రక్తంలో చక్కెరశాతాన్ని సరిగ్గా నిర్వహించేలా చూస్తుంది. క్యాన్సర్ చికిత్సలు: రేడియేషన్ తర్వాత కణజాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. క్యాన్సర్ బాధితులకు రోగనిరోధకశక్తి మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది. నాడీ సమస్యలు: స్ట్రోక్, మెదడుకు అయ్యే గాయాలు, రోగులలో న్యూరోడీజెనరేటివ్ సమస్యలకు, జ్ఞాపకశక్తి పునరుద్ధరణకు సహాయపడుతుంది. ఒత్తిడి, జీవనశైలి పునరుద్ధరణ: ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుందిఆధునిక వైద్యం, చికిత్సలలో గేమ్ ఛేంజర్అసలు తొలినాళ్లలో దీన్ని కనుక్కున్నప్పుడు.. డ్రైవర్లలో డీకంప్రెషన్ సిక్నెస్కు చికిత్స చేయడానికి ఉపయోగించేవారు. కానీ తర్వాత ఇప్పుడు దానివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. యాంటీ ఏజింగ్, జీవితకాలాన్ని పెంచడం, క్యాన్సర్ చికిత్సల వల్ల కలిగే దుష్ప్రభావాలు, ముఖ్యంగా రేడియేషన్ వల్ల కలిగే నష్టాల నుంచి కోలుకునేలా చేయడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, ఒత్తిడి, నిద్రలేమి లాంటి జీవనశైలి సమస్యలను పరిష్కరించడం, అథ్లెట్ల సామర్థ్యాన్ని పెంచి, కండరాలు కోలుకునేలా చేయడం లాంటి అనేక ప్రయోజనాలు దీంతో సిద్ధిస్తున్నాయి.రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ గురించి: రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ అనేది హైదరాబాద్ నగరంలోని ఒక ప్రధాన వెల్నెస్, హెల్త్‌కేర్ సంస్థ. వ్యాధుల నుంచి కోలుకుఓవడం, సమగ్ర ఆరోగ్యం, పనితీరు విషయాలకు సంబంధించి శాస్త్రీయ చికిత్సలను అత్యాధునిక విధానాల్లో అందించేందుకు ఇది అంకితమైంది. సంపూర్ణ వైద్యం, వినూత్న చికిత్సలపై దృష్టి సారించిన రాస్ సంస్థ.. హెచ్‌బీఓటీ, ఇతర పునరుత్పత్తి చికిత్సలతో చికిత్సల భవిష్యత్తును పునర్నిర్వచిస్తోంది -
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ముందు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం హాజరయ్యారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని.. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వీడియో విడదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్, నల్గొండలో కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నాంపల్లి ప్రజాపత్రినిధుల కోర్టుకు రేవంత్‌రెడ్డి వెళ్లారు. తదుపరి విచారణను కోర్టు.. ఈ నెల 23కి వాయిదా వేసింది. -
కాళేశ్వరంతో నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు మాత్రం నిండాయి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై రూ.లక్షల కోట్లు ఖర్చు చేసే మేడిగడ్డ కూలిపోయింది.. ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయంటూ బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన జలసౌధలో మాట్లాడుతూ.. కాళేశ్వరం కూలిపోయింది.. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.‘‘కృష్ణా వాటర్‌లో తెలంగాణకు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు వివరించా.. పదేళ్ల పాటు అధికారంలో ఉండి.. టెలిమెట్రిక్ ఏర్పాటు చేయలేక పోయారు. పదేండ్ల పాటు తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు. పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్లను కూడా మేమే ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని ఉత్తమ్ తెలిపారు.కాళేశ్వరం కూలితే.. స్వయంగా ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణలోనే.. ప్రాజెక్టు డిజైన్ తప్పు ఉందని స్పష్టం చేసింది. నీళ్లు నింపవద్దని స్వయంగా ఎన్డీఎస్ఏ లిఖిత పూర్వకంగా లేఖ రాసింది. ప్రాజెక్టుల్లో కమీషన్ కోసం 12 శాతం వడ్డీకి రుణాలు తెచ్చారు. ప్రాజెక్టుల రుణాలను నెగోషియేట్ చేసి 7 శాతానికి తగ్గించాం.’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. -
హైడ్రా దూకుడు.. జగద్గిరిగుట్టలో కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జగద్గిరిగుట్టలోని భూదేవిహిల్స్ సమీపంలోని పరికి చెరువు వద్ద ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గాజులరామారంలోని మహదేవపురం ప్రాంతంలోని కొన్ని బేస్మెంట్లను కూడా కూల్చివేశారు. గత వారం చెరువు పరిరక్షణ సమితి సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన క్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.కాగా, నగర శివార్లలో ఫాం ల్యాండ్ ప్లాట్ల పేరిట అక్రమ లేఔట్ల అమ్మకాలు జరుగుతున్నాయని, అనుమతి లేని వాటిలో ప్లాట్లు ఖరీదు చేసి ఇబ్బందులు పడొద్దని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సోమవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేసింది.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడ గ్రామంలోని సర్వే నం.50లోని 1.02 ఎకరాల్లో ఫాం ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నారని ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019, తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్–2018 ప్రకారం ఎక్కడా ఫాం ల్యాండ్ ప్లాట్లుగా అమ్మడానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు.ఫాం ల్యాండ్ అంటే కనీసం 2 వేల చదరపు మీటర్లు, లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్దేశించిందని వివరించారు. ఈ మేరకు ఫాం ప్లాట్లురిజిస్ట్రేషన్లు చేయరాదని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు కూడా ఇచి్చందని రంగనాథ్ తెలిపారు. జీవో నం.131 ప్రకారం 2020 ఆగస్టు 31 తర్వాత వెలసిన అక్రమ లేఔట్లలోని ప్లాట్లలో ఇల్లు నిరి్మంచడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం గుర్తించాలని కోరారు. -
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
Hyderabad: శనివారాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’
లక్డీకాపూల్ (హైదరాబాద్) : ఆస్తి పన్ను(Property Tax) సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి(GHMC Commissioner) తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు (ఆర్పీఎస్) ఆస్తిపన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్ల ద్వారా/ఆరీ్టజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ అసెస్ మెంట్) తదితరాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం ఈ నెల 22న, మార్చి 1, 8, 15, 22,29 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డిప్యూటీ కమిషనర్స్ కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్న వారు తమ సంబంధిత జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పైన పేర్కొన్న తేదీలలో నిర్వహించే ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు. -
రూ.20 లక్షలు ఇస్తా.. నన్ను మరిచిపో..
బంజారాహిల్స్(హైదరాబాద్) : ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సదరు యువతితో చనువుగా మెదిలాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మాత్రం.. మరిచిపో అంటూ తాపీగా చెప్పేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని గాయత్రీహిల్స్‌లో నివసిస్తున్న సాయిప్రణీత్ (26) సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. ఆయన బెంగళూరులో ఉన్న సమయంలో 2023లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్ గదిలో పేయింగ్ గెస్ట్‌గా ఉండేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన యువతి సాయిప్రణీత్‌తో సాన్నిహిత్యం పెంచుకుంది. అనంతరం నగరంలోని గాయత్రీ హిల్స్‌కు మకాం మార్చిన సాయిప్రణీత్.. కొద్ది రోజులు యువతితో కలిసి సహజీవనం కూడా చేశాడు. తన చెల్లెలి పెళ్లి తర్వాత మన పెళ్లి జరుగుతుందంటూ ఆమెను నమ్మించి గత ఏడాది నవంబర్‌లో వెళ్లిపోయాడు.మీ చెల్లెలి పెళ్లి ఫొటోలు పంపించాలని యువతి చెప్పగా.. కొన్నింటిని పంపించాడు. ఆ ఫొటోలను చూసి అనుమానం వచ్చినది బాధితురాలు ఇటీవల మరింతగా ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో రెండు రోజుల క్రితం సాయిప్రణీత్ గదికి వెళ్లిన ఆమెను కొట్టి.. మెడ పట్టి గెంటివేశాడు. ఇన్ని రోజులు నాతో తిరిగినందుకు ఖరీదుగా రూ.20 లక్షలు ఇస్తాను.. మన బంధం మరిచిపో అంటూ చెప్పేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.