injured
-
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్‌ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
సొంత పౌరులపైనే ద.కొ. బాంబులు
సియోల్: దక్షిణ కొరియా సైన్యం శిక్షణలో(Military Drill Excercise) అపశ్రుతి చోటు చేసుకుంది. సొంత పౌరులపైనే యుద్ధ విమానం బాంబులు జారవిడిచింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆపై పొరపాటున ఈ దాడి జరిగినట్లు చెబుతూ సైన్యం పౌరులను క్షమాపణలు కోరింది.గురువారం ఉదయం పోచియాన్(Pocheon)లో సైన్యం-వైమానిక దళం సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాయి. కేఎఫ్-16 విమానం నుంచి నిర్దేశించిన లక్ష్యంలో ఎంకే-82 బాంబులను జార విడచాల్సి ఉంది. అయితే నిర్దేశిత లక్ష్యంలో కాకుండా.. జనావాసాలపైకి విమానం దూసుకెళ్లింది. మొత్తం ఎనిమిది బాంబులు వేసింది. దీంతో పలువురికి గాయాలుకాగా.. చికిత్స కోసం వాళ్లను ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారంజరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సైన్యం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే బాధితులకు పరిహారం అందజేస్తామని, ఘటనపై దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా(South Korea) రాజధాని సియోల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో పోచియాన్ ఉంది. దీనికి సమీపంలోనే ఉత్తర కొరియా సరిహద్దు ఉంది. త్వరలో అమెరికా-ద.కొ. సైన్యాల సంయుక్త ప్రదర్శన జరగాల్సి ఉంది. అయితే ఇందుకోసం గురువారం నుంచి పోచియాన్‌లో ఇరు దేశాల సైన్యాలు ప్రాక్టీస్ చేస్తాయని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది కూడా. -
భార్యతో గొడవపడి.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : భార్యతో గొడవ పడిన భర్త..ఆమె పనిచేసే దుకాణానికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దోమలగూడ తాళ్లబస్తీకి చెందిన శ్రవణ్‌కుమార్ రాణిగంజ్‌లోని బేరింగ్ షాపులో పనిచేస్తున్నాడు. ఇతనికి మౌనికతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆమెపై అనుమానంతో కొట్టడం, తిట్టడం చేస్తుండటంతో ఎనిమిదేళ్లుగా ఇద్దరూ విడిగా ఉంటున్నారు. శ్రవణ్‌కుమార్ తాళ్లబస్తీలో ఉంటుండగా మౌనిక దోమలగూడలో నివసిస్తూ ప్యాట్నీ సెంటర్లోని కామాక్షి సిల్‌్క్సలో రెండున్నరేళ్లుగా క్యాషియర్‌గా పని చేస్తోంది. విడివిడిగా ఉంటున్నా ఇద్దరూ అప్పుడప్పుడూ మాట్లాడుకునే వారు. అలాగే కుమార్తె కూడా గత 8 నెలల నుంచి శ్రవణ్‌కుమార్ వద్దే ఉంటోంది. పెట్రోల్ బాటిళ్లతో వచ్చి.. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్యాట్నీ సెంటర్లోని కామాక్షి సిల్‌్క్సకు కుమార్తెతో సహా వచి్చన శ్రవణ్‌కుమార్ భార్యతో గొడవ పడ్డాడు. షాపులో పనిచేసే సిబ్బంది అతడిని వారించి బయటకు పంపించారు. మళ్లీ 8.15 గంటలకు షాపు వద్దకు వచి్చన శ్రవణ్‌కుమార్ తనతో పాటు వాటర్ బాటిళ్లలో పెట్రోల్ తీసుకుని వచ్చాడు. రావడం రావడమే ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని బాటిల్లోని పెట్రోల్‌ను కింద పోశాడు. సిబ్బంది అతడిని వారిస్తుండగానే చేతిలో ఉన్న లైటర్‌తో నిప్పంటించాడు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అతనికి అంటుకున్నాయి. అక్కడ ఉన్న కొన్ని చీరెలు, సామగ్రితో పాటు సిబ్బంది మొబైల్ ఫోన్లు కాలిపోయాయి. 50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి... సిబ్బంది వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, మార్కెట్ పోలీసులు, షోరూం సిబ్బంది కలిసి మంటలను ఆరి్పవేశారు. సకాలంలో మాల్లోని సిబ్బంది తమ దగ్గర ఉన్నఅగ్నిమాపక పరికరాలతో మంటలను కొద్దిగా అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రవణ్‌కుమార్ 50శాతంకు పైగా కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహంకాళి ఏసీపీ సర్ధార్‌సింగ్, మార్కెట్ ఎస్ఐ శ్రీవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
నడవలేని స్థితిలో శ్రీవల్లి
-
HYD:చైనా మాంజా తగిలి టెకీకి గాయాలు
సాక్షి,హైదరాబాద్:నగరంలో నిషేధిత చైనా మాంజా తగిలి మరొకరికి గాయాలయ్యాయి. ఉప్పల్ డీఎస్ఎల్ కంపెనీ భవనంలోని బైక్‌పై వెళ్తుండగా ఘటన జరిగింది. మాంజా దారం తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయివర్థన్‌రెడ్డి కింద పడిపోయారు. దీంతో అతడి మెడకు గాయమైంది. గాయాలపాలైన ఆయనను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సాయివర్ధన్‌రెడ్డి కుషాయిగూడకు చెందినవారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ గాలిపటాలు ఎగురవేసేందుకు ఇప్పటికీ దానిని వాడుతున్నారు. పులువురు వ్యాపారులు పండగ వేళ సొమ్ము చేసుకునేందుకు అక్రమంగా చైనా మాంజా విక్రయాలు సాగిస్తున్నారు. గాలిపటాలు ఎగురవేయడంలో పక్కవారి మీద పైచేయి సాధించేందుకు చైనా మాంజాను వాడుతున్నారు. చైనా మాంజా వాడిన గాలిపటాలు దారంతో సహా తెగి పడి రోడ్లపై వేలాడుతున్న చోట వాహనదారులు చూసుకోకుండా వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో వారు తీవ్ర గాయాలపాలవుతున్నారు. హైదరాబాద్‌లో పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో చైనా మాంజా భారీగా పట్టుబడడం గమనార్హం. ఇదీ చదవండి: మీకు తెలియకుండా మీ ఫొటోలు ఇన్‌స్టాలో -
పుష్ప భామకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!
పుష్ప భామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయాలైనట్లు సన్నిహితులు వెల్లడించారు. రష్మికను గాయాన్ని పరిశీలించిన వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం శ్రీవల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని సన్నిహిత వర్గాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.మరోవైపు సినిమాల విషయానికొస్తే.. పుష్ప-2 (Pushpa 2 The Rule) మూవీతో హిట్ కొట్టి శ్రీవల్లి.. బాలీవుడ్లో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా రష్మికకు గాయం కావడంతో ఈ మూవీ షూటింగ్ విరామం ప్రకటించారు. ఫుల్ యాక్షన్ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్లోనే థామా అనే చిత్రంలో కనిపించనున్నారు.తెలుగులో మరో మూడు చిత్రాలు..టాలీవుడ్లో ప్రస్తుతం కుబేర మూవీలో రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు. ఈ పాన్–ఇండియా మూవీని తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ కావాల్సిన కుబేర పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి బరిలో ఉంటుందని ఆడియన్స్ అంతా భావించారు. కానీ అలా జరగలేదు. మరి కొత్త ఏడాది ఫిబ్రవరిలోనైనా రిలీజ్ అవుతుందేమోనని ఆశిస్తున్నారు. అయితే కుబేర విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి..ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి గతేడాది దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు కొత్త ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్నా ఈ మూవీతో పాటు ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో కనిపించనుంది. -
పిచ్చికుక్కల స్వైరవిహారం.. 26 మంది చిన్నారులకు గాయాలు
మహబూబ్‌నగర్ క్రైం/గూడూరు: వేర్వేరు జిల్లాల్లో పిచ్చికుక్కల దాడిలో 26 మంది చిన్నారులు గాయపడ్డారు. మహబూబ్‌నగర్ పట్టణంలో గురువారం రాత్రి 7 – 8.30 గంటల ప్రాంతంలో గోల్ మజీద్, పాత పాలమూరు ఏరియాలో ఒక పిచ్చికుక్క చిన్నారులను వెంటాడి కరుస్తూ గాయపరిచింది. గాయపడిన 24 మంది చిన్నారులకు జనరల్ ఆస్పత్రిలో టీటీ ఏఆర్వీ టీకాలు ఇచ్చారు.ఇందులో ఐదుగురు చిన్నారులకు గాయాలు ఎక్కువ కావడంతో.. వారిని ఆస్పత్రిలో చేర్పించుకుని పరిశీలనలో ఉంచినట్లు ఆర్ఎంవో డాక్టర్ జరీనా తెలిపారు. చిన్నారులను గురువారం రాత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరామర్శించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో.. : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురానికి చెందిన మహేశ్ కూతురు స్మైలీ, కారం సుమన్ కుమారుడు అచ్చితానంద.. గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా, పిచ్చికుక్క వీరిద్దరిపై దాడికి పాల్పడింది. కుటుంబసభ్యులు చిన్నారులను కుక్క బారి నుంచి కాపాడారు. గాయపడిన చిన్నారులను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
TG: మళ్లీ పులి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సాక్షి,కొమరంభీంజిల్లా: జిల్లాలో పులి మళ్లీ పంజా విసిరింది. తాజాగా మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్‌పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది.పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్‌ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో శుక్రవారమే ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పులి కోసం కాగజ్‌నగర్ కారిడార్‌లో ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ మ్యాన్ఈటర్ నిర్వహస్తున్నారు.మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం వేట కొనసాగుతోంది.ఇదీ చదవండి: పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్‌నగర్‌లో హై అలర్ట్ -
దాడి చేయబోతే 'దాడి' చేశార్సార్!
-
బీజింగ్: స్కూలులో కత్తితో ఉన్మాది దాడి.. 8 మంది మృతి
బీజింగ్: చైనాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక స్కూలులోకి చొరబడిన ఉన్మాది కత్తితో దాడికి తెగబడిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఇదే ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను నేరాన్ని అంగీకరించాడు.ఈ ఘటన తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఓ ఉన్మాది ఒకేషనల్ స్కూల్లోకి ప్రవేశించి, అక్కడున్నవారిని విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 17మంది గాయపడ్డారు. యిక్సింగ్ నగరంలోని వుక్సీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఈ దాడి జరిగింది.రాష్ట్ర వార్తా సంస్థ ‘జిన్హువా’ తెలిపిన వివరాల ప్రకారం ఈ దారుణానికి పాల్పడిన 21 ఏళ్ల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంటర్న్‌షిప్ జీతంపై అసంతృప్తితో ఉన్నాడని, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్కూల్లోకి ప్రవేశించి, కత్తితో దాడికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
షూటింగ్ సెట్లో ప్రమాదం.. స్టార్ నటుడికి గాయాలు!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న హంటర్ వెబ్ సిరీస్ సెట్స్‌లో గాయపడినట్లు సమాచారం. ఓ ఫైట్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ సన్నివేశంలో ఒక చెక్క లాగ్ అనుకోకుండా ఆయన పక్కటెముకలకు తగిలిందని తెలిపారు. ఈ సంఘటనతో ముంబయిలో జరుగుతున్న షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే సునీల్ శెట్టికి వైద్యచికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని సునీల్ శెట్టి సైతం ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నాకు చిన్న గాయం మాత్రమే తగిలిందని.. ప్రస్తుతం బాగానే ఉన్నానని పోస్ట్ చేశారు. దయచేసి ఎవరూ కూడా ఆందోళనకు గురికావద్దని అభిమానులను కోరారు. మీ అందరి ప్రేమ, అభిమానాలకు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు.కాగా.. హంటర్ వెబ్ సిరీస్‌ను ముంబయిలోని అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆయన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా డియోల్, బర్ఖా బిష్త్, కరణ్వీర్ శర్మ, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత వెల్కమ్ టు ది జంగిల్ అనే చిత్రంలో నటించనున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, దిశా పటానీ, సంజయ్ దత్లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.Minor injury, nothing serious! I'm absolutely fine and ready for the next shot. Grateful for all the love & care 🙏❤️ #OnSet— Suniel Shetty (@SunielVShetty) November 7, 2024 -
యువతిపై ప్రేమోన్మాది దాడి.. కత్తితో చేయి కోసి పరార్
సాక్షి,మెదక్‌జిల్లా: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద దారుణం జరిగింది. సోమవారం(నవంబర్ 4) ఉదయం దివ్యవాణి అనే యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. కత్తితో చేయి కోసి పరారయ్యాడు. ఓపెన్ డిగ్రీ పరీక్షలకు కాలేజీకి వస్తుండగా ఘటన జరిగింది.యువతిపై దాడి చేసింది బెంగుళూరుకు చెందిన చేతన్ అనే యువకుడిగా గుర్తించారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడు.యువతిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య -
ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కొండపై నుంచి జారిపడటంతో
బెంగళూరు: కర్ణాటకలోని ఓ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా.. చిక్కమగళూరులోని దేవీరమ్మ కొండపై ఉన్న ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తోపులాట జరిగింది. వేలాది సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడంతో, కొండలపై జారి పడి పలువురికి గాయాలయ్యాయి. మల్లెనహళ్లిలోని దేవీరమ్మ కొండపై ఉన్న గుడి వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. సందర్శకుల భద్రత కోసం జిల్లా యంత్రాంగం, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ.. భారీ వర్షాల కారణంగా కొండలు తడిగా మారాయని వెల్లడించారు. ఆలయం నుంచి తిరిగి వస్తుండగా పడిపోవడంతో దాదాపు 12మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారని, వారందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.కాగా దీపావళి సందర్భంగా ఏడాదిలో కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ఇది దేవిరమ్మ అనే కొండపై మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. బాబాబుడంగిరిలోని మాణిక్యధార, అరిసినగుప్పె మీదుగా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. నరక చతుర్దశికి ముందు దేవీరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. -
దీపావళి వేడుకల్లో గాయాలు.. సరోజినీదేవి ఆసుపత్రికి బాధితులు క్యూ..
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటుచేసుకున్నాయి. బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటివరకు 40 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. కాగా, గాయాలపాలైన వారికి చికిత్స కోసం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. వంద బెడ్లు వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. 9 మందికి తీవ్ర గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ఈసారి ప్రజల్లో అవగాహన పెరిగిందని.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గుతాయని ఆశిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. టపాసుల దుకాణాలతో మార్కెట్లు, కిటకిటలాడాయి. చిన్నాపెద్దా పెద్ద బాణసంచా పేలుస్తూ ఆనందంగా గడిపారు. కాగా, దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. -
స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 12 మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. స్థానిక అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు.మెక్సికో నగరానికి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలోని అక్లోజ్టోక్లో ఈ పేలుడు సంభవించినట్లు త్లాక్స్‌కాలా స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కార్మికుల నుండి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం కరిగిన ఉక్కు.. నీటి పరిధిలోకి రావడంతో పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. బాధిత కుటుంబాలను త్లాక్స్కలా గవర్నర్ లోరెనా క్యూల్లార్ పరామర్శించారు. ఈ ఉదంతం దర్యాప్తు పూర్తయ్యేంతవరకూ ప్లాంట్‌ను మూసివేయనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది? -
రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
చండీగఢ్:హర్యానాలోని రోహ్తక్లో కదులుతున్న రైలులో బాణసంచాకు మంటలంటుకున్నాయి.ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జింద్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలులో తొలుత మంటలు లేచాయని, తర్వాత రైలు మొత్తం పొగచూరిందని జీఆర్పీ పోలీసులు తెలిపారు.రైలులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా తొలుత మంటలు లేచాయని, ఈ మంటలు రైలులో ఉన్న ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బాణసంచాకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
రైల్వే స్టేషన్లో దీపావళి రద్దీ.. తొక్కిసలాటలో తొమ్మిదిమందికి గాయాలు
ముంబై: ముంబైలోని బాంద్రా టెర్మినల్ రైల్వే స్టేషన్లో ఈరోజు (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది గాయపడ్డారు. రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కసారిగా పోటీ పడటంతో ఈ తొక్కిసలాట జరిగింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం తొక్కిసలాట అనంతరం అప్రమత్తమైన రైల్వే అధికారులు గాయపడినవారిని ముంబైలోని భాభా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడిన తొమ్మదిమందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాంద్రా టెర్మినస్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉదయం 5.56 గంటలకు ఈ ఘటన జరిగింది. STORY | 9 persons injured in stampede at Mumbai's Bandra railway stationREAD: https://t.co/sdZpmGELdkVIDEO:(Source: Third Party) pic.twitter.com/LIBuwJkniS— Press Trust of India (@PTI_News) October 27, 2024బాంద్రా-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి ప్రయాణికులు పోటీ పడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని షబ్బీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కంగాయ్ (27), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (27), మహ్మద్ షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సాహ్ని (19), నూర్ మహ్మద్ షేక్ (18)గా పోలీసులు గుర్తించారు. Meanwhile in India #Mumbai : A #stampede on platform number 1 at #Bandra Terminus has left nine people injured. The injured passengers have been taken to the hospital, according to BMC.#MumbaiLocal #MumbaiCrowd #BandraStation #BandraStampede #Diwali #MumbaiLocalT pic.twitter.com/4HoRG2auoA— know the Unknown (@imurpartha) October 27, 2024ఇది కూడా చదవండి: కేజీఎఫ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది -
జమ్ముకశ్మీర్: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
గుల్మార్గ్: జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని బోటాపాత్ర్ వద్ద ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.కాగా, గుల్మార్గ్లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు పుల్వామాలో ఉగ్రవాద దాడిలో వలస కార్మికుడు గాయపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. -
రక్తమోడిన దేవరగట్టు
హొళగుంద: మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో ఈ ఏడాది కూడా రక్తం చిమ్మింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి సందర్భంగా శనివారం అర్ధరాత్రి తర్వాత మొదలైన బన్ని ఉత్సవంలో సంప్రదాయ ఆచారమే గెలిచింది. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం విజయోత్సవంలో భాగంగా ఉత్కంఠ భరితంగా జరిగిన జైత్రయాత్ర (కర్రల సమరం)లో 95 మందికి గాయాలు కాగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తలలు పగిలి, దివిటీలు తగిలి, కిందపడి చేతులు విరిగి.. ఇతర గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న వారికి స్థానిక హెల్త్ క్యాంప్‌లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆదోని, ఆలూరు, గుంతకల్లు, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారికి హెల్త్ క్యాంప్‌లో చికిత్స అందించారు. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర ఆదివారం ఉదయం వరకు సాగింది. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట భక్తులు డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి దివిటీలతో అర్ధరాత్రి 12.20 గంటలకు కొండపై ఉన్న స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం.. ఒంటి గంట వరకు నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా కొండ దిగువకు వచ్చి మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టింపచేశారు. ఆ సమయంలో వారితో పాటు నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల చేతుల్లో ఉన్న రింగు కర్రలు తగిలి చాలామంది గాయపడ్డారు.తలలు పగిలాయి. మొగలాయి ఆడుతున్న కొందరు కాగడాలతో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. కొందరు అగ్గి కాగడాలను భక్తులపై విసిరి భయాందోళనకు గురి చేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ముళ్లబండ, పదాలగట్టు, రక్షనడి, శమీ వృక్షం, బసవన్న గుడి మీదుగా ఉత్కంఠంగా ముందుకు సాగింది. స్వామి విగ్రహాలు సింహాసన కట్టకు చేర్చి జైత్రయాత్రను విజయవంతం చేసి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరధ్వాజ, పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. సోమవారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. ఉత్సవానికి వస్తూ ముగ్గురు దుర్మరణం ఆలూరు రూరల్: బన్ని ఉత్సవాలను తిలకించేందుకు బైక్‌పై వస్తుండగా బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా మోకా తాలూకా తగ్గిన బూదేహళ్లి గ్రామానికి చెందిన హరీ‹Ùరెడ్డి (26), మల్లికార్జున (26), రవి (22) శనివారం బైక్‌పై దేవరగట్టుకు బయలుదేరారు. ఆలూరు మండలం కరిడిగుడ్డం సమీపంలో రాత్రి 10 గంటలకు బైక్ అదుపుతప్పి ముగ్గురూ కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. హరీ‹Ùరెడ్డి, మల్లికార్జున అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవి (22)ని మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. -
ఎయిర్‌పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి
కరాచీ: పాకిస్తాన్లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుడులో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలింది.విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పాక్ హోం మంత్రి జియా ఉల్ హసన్ స్థానిక టీవీ ఛానల్ జియోకు తెలిపారు. చైనా పౌరులపై దాడి జరిగిందని, వారిలో ఒకరు గాయపడ్డారని అన్నారు. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ రహదారి దక్షిణ-మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్‌తో కలుపుతుంది.డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మహేసర్ మీడియాతో మాట్లాడుతూ తాము పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. గాయపడిన వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. హోం మంత్రి, ఇన్స్పెక్టర్ జనరల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎయిర్‌పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న అధికారి రాహత్ హుస్సేన్ తెలిపారు.ఇది కూడా చదవండి: అశ్వియ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ -
‘ఆప్’ నేతపై కాల్పులు..బుల్లెట్ గాయం
చండీగఢ్:పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత మన్దీప్ సింగ్ బ్రార్ కాల్పుల్లో గాయపడ్డారు.ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్‌నేత మన్‌దీప్‌సింగ్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపనలున్నాయి. ఆదివారం(అక్టోబర్6) అకాలీదళ్ నాయకుడు వర్దేవ్ సింగ్ మాన్ ఓ స్కూల్‌కు సంబంధించిన ఫైల్ గురించి బీడీపీఓ కార్యాలయానికి వెళ్లారు.ఆ ఫైల్ చూపించేందుకు అధికారులు నిరాకరించడంతో సింగ్ అక్కడినుంచి వెనుదిరిగారు. వెళుతు వెళుతూ బయట ఉన్న ఆప్ నేత మన్దీప్ సింగ్ బ్రార్‌తో సింగ్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఆప్‌నేత మన్‌దీప్‌కు బుల్లెట్ గాయమైంది. వెంటనే ఆయనను జలాలాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అకాలీ పార్టీ నాయకులే కాల్పులకు ఆప్ నేతలు ఆరోపించారు. పంచాయితీ ఎన్నికల సమయంలో అకాళీదళ్ పార్టీ దాడులకు పాల్పడుతోందన్నారు. ఈ నెల 15న పంజాబ్‌లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.ఇదీ చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం -
ముఖం నిండా గాయాలు.. అయినా షూట్ చేద్దామన్నా: బాలీవుడ్ నటి
బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ మహిమా చౌదరి. ప్రస్తుతం ఆమె సిగ్నేచర్ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ దిల్ క్యా కరే మూవీ షూటింగ్లో ఎదురైన సంఘటనను పంచుకుంది. అది తన వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వివరించింది. షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. తన ముఖానికి ఎంత గాయాలు ఉన్నాయో తనకు తెలియదని చెప్పింది. అయినప్పటికీ షూట్ కొనసాగించాలని చెప్పానని.. కానీ దర్శకుడు ప్రకాష్ ఝా విశ్రాంతి తీసుకోమని చెప్పారని వివరించింది.మహిమా చౌదరి మాట్లాడుతూ.. 'షూటింగ్ సమయంలో నాకు నా ప్రమాదం జరిగింది. నా ముఖంపై ఇన్ని గాయాలు ఉన్నాయని నేను గ్రహించలేదు. తర్వాత బాత్రూమ్కి వెళ్లి అద్దంలో చూసుకున్నా. ఏమీ జరగకపోతే షూట్ చేద్దాం అని ప్రకాష్ జీకి చెప్పాను. కానీ ఆయన వద్దన్నారు. గాయం తర్వాత నా ముఖం నుంచి డాక్టర్లు 67 గాజు ముక్కలు బయటకు తీశారు. ఆ సమయంలో ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అజయ్ దేవగన్, ప్రకాష్ జాను కోరా. నా కెరీర్ కాపాడుకునేందుకు బయట పెట్టొద్దని వారిని అభ్యర్థించాను. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ విషయం బయటపెట్టానని చెప్పుకొచ్చింది' బాలీవుడ్ భామ. అంతేకాకుండా తన కంటికి సర్జరీ తర్వాత చాలా ఒత్తిడికి గురైనట్లు మహిమా చౌదరి వెల్లడించింది. శస్త్రచికిత్సల తర్వాత ఇప్పటికీ నా కన్ను ఒకటి చిన్నదిగా కనిపిస్తుందని వివరించింది. -
కత్తితో దాడి.. ముగ్గురు మృతి
షాంఘై: చైనాలోని ప్రముఖ నగరం షాంఘైలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక సూపర్ మార్కెట్లో ఒక వ్యక్తి కత్తితో ముగ్గురిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆ ముగ్గురు హతమయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ వివరాలను షాంఘై పోలీసులు మీడియాకు తెలిపారు.చైనా 75వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో షాంఘై నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల లిన్ అనే వ్యక్తి ఈ దాడులకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడని పట్టుకున్నారు. కాగా సూపర్మార్కెట్లో కత్తి పట్టుకుని తిరుగుతున్న లిన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.దాడికి పాల్పడిన లిన్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా చైనాలో బహిరంగ ప్రదేశాల్లో కత్తితో దాడులు జరుగుతున్న ఘటనలు అధికమయ్యాయి. గత మే నెలలో చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో కత్తి దాడికి గురైన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.ఇది కూడా చదవండి: హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి -
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
బుండి: రాజస్థాన్‌లోని బుండిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎకో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో హిడోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ నేషనల్ హైవేలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైవేపై ఉన్న కెమెరాలు, టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన గురించి బుండి ఏఎస్పీ ఉమా శర్మ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. కాగా రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఓ కారు రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ఘటనలో కూడా ఆరుగురు మృతి చెందారు.ఇది కూడా చదవండి: రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి -
పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మందికిపైగా మృతి
పోర్ట్ అవ్ ప్రిన్స్:హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ఇంధన ట్యాంకర్ పేలిపోయింది.తీర నగరం మిరాగానేలో శనివారం(సెప్టెంబర్14) ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా దుర్మరణం పాలవ్వగా 50 మందికిపైగా గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ టైరు తొలుత పంక్చర్ అయింది. దీంతో ఆయిల్ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో పేలుడు జరిగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్లో తరలించారు.ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘ఇది చాలా భయంకర ప్రమాదం. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి’అని తెలిపారు. హైతీలో కొన్ని ప్రాంతాలు మిలిటెంట్ గ్యాంగుల ఆధీనంలో ఉండటంతో అత్యవసర వస్తువుల రవాణాకు రోడ్డు మార్గం కంటే నౌకలను ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి.. చమురు ట్యాంకర్‌కు మంటలు -
Bhediya Attack: మళ్లీ రెచ్చిపోయిన తోడేళ్లు.. ముగ్గురికి గాయాలు
కౌశాంబి: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో నరమాంస భక్షక తోడేలు ముగ్గురిపై దాడి చేసింది. వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించాక వైద్యులు బాధితులను ఇంటికి పంపించారు. తోడేళ్ల దాడి అనంతరం ఆ ప్రాంతంలోని ఇటుక బట్టీ సమీపంలో మూడు వన్యప్రాణులకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో గ్రామస్తులలో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్తులు రాత్రిపూట కర్రలు,రాడ్లతో తమ పశువులను, కుటుంబాలను కాపాడుకుంటున్నారు. గ్రామస్తుల అందించిన సమాచారంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన కరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెవారి, ఖోజ్వాపూర్ గ్రామాలలో చోటుచేసుకుంది.బుధవారం సాయంత్రం తమ కుటుంబ సభ్యులు పశువుల మేతను కోసేందుకు పొలాలకు వెళ్లారని నెవారి గ్రామానికి చెందిన రాజ్కరణ్పాల్ తెలిపారు. ఆసమయంలో తన రెండున్నరేళ్ల మేనల్లుడు ప్రియాంష్ అక్కడ ఆడుకుంటుండగా, ఒక నక్క పొదల్లోంచి బయటికి వచ్చి, ఆ పిల్లాడి మెడను నోట కరుచుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. ఆ చిన్నారి ఏడుపు విన్న మహిళలు గట్టిగా కేకలు పెట్టారు. దీంతో తాను, కొంతమంది గొర్రెల కాపరులు పరిగెత్తి ఆ తోడేలు దగ్గరికి వెళ్లగా, అది తమను చూసి పారిపోయిందన్నారు. ఆ తోడేలు అక్కడి నుంచి పరిగెట్టి మేకలు మేపుతున్న రాందాస్ సరోజ అనే మహిళపై దాడి చేసింది. గ్రామస్తులు దానిని తరిమికొట్టడంతో ఆ తోడేలు ఖోజ్వాపూర్ గ్రామం వైపు పరుగు తీసి, అక్కడ సోనుపాల్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిందని రాజ్కరణ్పాల్ తెలిపారు.నెవారి గ్రామానికి చెందిన ధ్యాన్ సింగ్ గత రెండు రోజులుగా తోడేళ్ల గుంపు తమ గ్రామానికి వస్తున్నదని తెలిపారు. ఏ సమయంలోనైనా తోడేళ్ల గుంపు గ్రామంలోకి వచ్చి పిల్లలు, మేకలు, గేదెలపై దాడి చేస్తుందనే భయం తమను వెంటాడుతున్నదన్నారు. రాత్రివేళ పిల్లలను ఇంటి లోపల పడుకోబెట్టి, తాము తోడేళ్ల నుంచి వారిని రక్షించడానికి రాత్రంతా కాపలాగా ఉంటున్నామన్నారు. అటవీశాఖ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో తామే తమ కుటుంబాన్ని, పశువులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. -
Mumbai: మద్యం మత్తులో బస్సు స్టీరింగ్ గిరగిరా తిప్పడంతో..
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో విచిత్ర పరిస్థితుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులోని ఒక ప్రయాణికుడు ఏదో విషయమై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆ ప్రయాణికుడు బస్సు స్టీరింగ్‌ను ఇష్టమొచ్చినట్లు గిరగిరా తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి, పలు వాహనాలను, పాదచారులను ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన లాల్బాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడి చర్యల కారణంగా, బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సు సియోన్‌లోని రాణి లక్ష్మీబాయి చౌక్ వైపు వెళుతోంది. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. -
Russia: పట్టాలు తప్పిన రైలు.. 100 మందికి గాయాలు
రష్యాలోని దక్షిణ వోల్గోగ్రాడ్ ప్రాంతంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 800 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.ట్రక్కును ఢీకొట్టిన అనంతరం రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. రష్యా టుడే తెలిపిన వివరాల ప్రకారం 20 బోగీలతో కూడిన ఈ రైలు రష్యాలోని టాటర్స్థాన్ రిపబ్లిక్‌లోని కజాన్ నుంచి సోచి సమీపంలోని రిసార్ట్ నగరం అడ్లెర్‌కు వెళుతోంది. రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు వోల్గోగ్రాడ్ రీజియన్ గవర్నర్ ఆండ్రీ బోచారోవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ప్రమాదం నుంచి ట్రక్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే అతని తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది జూన్‌లో రష్యాలోని కోమిలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు ఉంటుంది. WATCH | Russia Train-Truck Accident Injures 140, Derails Multiple Carriages#Russia #accident #Train https://t.co/Fs6k6KYVfe— Oneindia News (@Oneindia) July 29, 2024 -
Madhya Pradesh: కావడియాత్రలో విషాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావడియాత్రికులతో కూడిన ట్రాక్టర్‌ను ఒక ట్రక్కు బలంగా డీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు కావడి యాత్రికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మొరెనా జిల్లాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు కావడియాత్రికులు ఖాదియాహర్ గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఘాట్‌కు ట్రాక్టర్లో తరలివెళ్తున్నారు.డియోరీ గ్రామ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వీరి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కావడియాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన 12 మందికి పైగా క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Uttar Pradesh: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో ఢిల్లీ హైవేపై ఈరోజు (సోమవారం) ఉదయం రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ముగ్గురు మృతిచెందారు. వందమందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.మిలాక్‌లోని భైరవ బాబా ఆలయం సమీపంలో సాహిబాబాద్ డిపో బస్సు, వోల్వో బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. తెల్లవారుజామున 4.15 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్ జోగేంద్ర సింగ్, పోలీసు సూపరింటెండెంట్ విద్యాసాగర్ మిశ్రా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ తెలిపిన వివరాల ప్రకారం మృతులలో రోడ్డువేస్ బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు.గాయపడిన వారి సంఖ్య 49కి చేరిందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. తొమ్మదిమంది పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. సాహిబాబాద్ డిపోకు చెందిన జనరత్ బస్సు లక్నో నుంచి ఢిల్లీ వెళ్తోంది. ప్రైవేట్ వోల్వో బస్సు హరిద్వార్ నుంచి శ్రీబస్తీకి వెళ్తోంది. ప్రైవేట్ బస్సు రాంగ్ సైడ్‌లో వచ్చిన కారణంగానే ప్రమాదం చోటుచేసుకున్నదని ప్రాథమికంగా తెలుస్తోంది. -
జమ్ముకశ్మీర్‌లో నాల్గవరోజూ ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని దోడాలో వరుసగా నాల్గవరోజు కూడా ఎన్కౌంటర్ జరిగింది. నేడు (గురువారం) తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన అనంతరం ఆర్మీ సిబ్బంది.. గ్రామంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. జూన్ 12 నుంచి దోడాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. చటర్గాలా పాస్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మరుసటి రోజు గండోలో కాల్పులు జరిగాయి. దానిలో ఒక పోలీసు గాయపడ్డాడు.జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, జూలై 9న ఘరీ కుంకుమ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూలోని ఆరు జిల్లాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మృతి చెందారు. -
అరీనా సబలెంకాకు గాయం.. వింబుల్డన్ టోర్నీకి దూరం
వింబుల్డన్ -2024 నుంచి బెలారస్ టెన్నిస్ స్టార్, మూడో సీడ్ అరీనా సబలెంకా వైదొలిగింది. భుజం గాయం కారణంగా సబలెంకా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీకు దూరం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మెయిన్ డ్రాలో సబలెంకా స్ధానాన్ని రష్యన్ టెన్నిస్ స్టార్ ఎరికా ఆండ్రీవాతో భర్తీ చేశారు. ఇక ఈ విషయాన్ని అరీనా సబలెంకా సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. గాయం కారణంగా వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సబలెంక తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. "భుజం గాయం కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకున్నాను.ఈ విషయాన్ని మీకు తెలియజేయాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. కానీ నా భుజం గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నొప్పితో బాధపడుతున్నప్పటకి ప్రతీ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. వచ్చే ఏడాది ఇంతకంటే బలంగా తిరిగి వస్తానని మీకు మాటిస్తానని" ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా వింబుల్డన్ టోర్నీ జూలై 1 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం తొలి దశ పోటీలు జరుగుతున్నాయి. -
టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
ఇస్తాంబుల్: టర్కీలో సంభవించిన భారీ పేలుడుకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 63 మంది గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన టర్కీకి పశ్చిమాన ఉన్న ఇజ్మీర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌కు సంబంధించిన టాంకులో పేలుడు సంభవించింది. అక్కడి సీసీటీవీ కెమెరాలో ఘటన అంతా రికార్డయ్యింది. ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్ధం వినిపించడంతో స్థానికులంతా వణికిపోయారు. ఆ రహదారి గుండా వెళుతున్నవారు ప్రమాదం బారినపడ్డారు. టర్కీ హోమ్‌శాఖ మంత్రి అలీ ఎర్లికాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ తాము ఘటన జరిగిన స్థలానికి రెస్క్యూ బృందాన్ని పంపినట్లు తెలిపారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ఇజ్మీర్ గవర్నర్ వెళ్లి వారిని పరామర్శించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన 40 మందికి చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. మిగిలిన బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
షూటింగ్లో గాయపడ్డ స్టార్ హీరోయిన్
సినిమా షూటింగ్లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్ సమయంలో ఆమెకు స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకనే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన గొంతు మీద చిన్న స్క్రాచ్ అయిన ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ..‘వృత్తి జీవితంలో ప్రమాదాలు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ‘స్టంట్’ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. (చదవండి: అనుష్కకు అరుదైన వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట!)‘ది బ్లఫ్’లో ప్రియాంక చోప్రా యాక్షన్ రోల్ ప్లే చేస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్లో ప్రమాదాలు జరగడం ప్రియాంకకు కొత్తేమి కాదు. గతంలోనూ పలు సినిమాల షూటింగ్ సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు పెదవి చివర చిన్న గాయంతో పాటు మెడపై గాటు పడింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ‘జాగ్రత్త’ మేడం అంటూ అమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.(చదవండి: అనారోగ్యంతో మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత భుజానెత్తుకున్న మహేశ్)సినిమాల విషయాలకొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియాంకా చోప్రా.. 2018లో అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకొని తన మకాంను హాలీవుడ్‌కి మార్చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. చివరగా సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. -
ఖతర్ ఎయిర్వేస్ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు
డబ్లిన్: ఖతర్ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్ వెళ్లిన ఖతర్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787 విమానం గగనతలంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి.ఈ విమానం ఆదివారం(మే26) ఒంటిగంటకు డబ్లిన్‌లో ల్యాండ్ అయింది. ఖతర్ ఎయిర్వేస్ విమానం ల్యాండ్ అవగానే అత్యవసర సర్వీసులు, ఫైర్, రెస్క్యూ, ఎయిర్‌పోర్టు పోలీసు విభాగాల సిబ్బంది విమానాన్ని పరిశీలించారు. విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తున్నపుడు గాలిలో కుదుపులకు గురైంది. కుదుపుల కారణంగా విమానంలో ఉన్న ఆరుగురు ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి’అని డబ్లిన్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇటీవలే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాలిలో భారీ కుదుపులకు గురై ఒక ప్యాసింజర్ మరణించిన విషయం తెలిసిందే. -
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని పాండువా ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మీడియా కథనాల ప్రకారం కొంతమంది చిన్నారులు బంతిగా భావించి ఒక బాంబుతో ఆడుతుండగా, అది హఠాత్తుగా పేలింది. గాయపడిన వారిలో ఒకరు కుడి చేయి కోల్పోయినట్లు సమాచారం. కాగా టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇదే ప్రాంతంలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాల్సివుందిఈ పేలుడులో గాయపడిన ఇద్దరు చిన్నారులను రూపమ్ వల్లభ్, సౌరభ్ చౌదరిగా గుర్తించారు. చిన్నారుల వయసు 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం బాధితులు చుంచుర ఇమాంబర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం 8:30 గంటల సమయంలో తిన్నా ప్రాంతంలోని చెరువు దగ్గర పెద్ద పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో సమీపంలోని వారు చెరువు గట్టు వద్దకు పరుగులు తీయగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన స్థితిలో వారికి కనిపించారు. ఈ ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ఒకరు మృతి చెందారు.ఈ ఘటనపై హుగ్లీ రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన భద్రతా లోపంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక నేత అభిషేక్ బెనర్జీ సమావేశం జరగాల్సిన స్థలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. -
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
ఢిల్లీ,సాక్షి: కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్ గాలిస్తున్నారు.దాడి జరిగిన ప్రదేశానికి పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులు చేరుకుని పరి స్థితిని సమీక్షిస్తున్నారు. దాడి ఎలా జరిగిందనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. -
బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై దాడి
న్యూఢిల్లీ/బలూర్ఘాట్(పశ్చిమబెంగాల్): 2022 పేలుడు ఘటనలో ఇద్దరు కీలక కుట్రధారులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు జరిపిన దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు ఢిల్లీలో మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ‘బెంగాల్‌లోని భూపతినగర్ 2022 డిసెంబర్లో చోటుచేసుకున్న పేలుడు కేసులో కీలక పురోగతి సాధించాం. ముగ్గురి మృతికి కారణమైన అప్పటి ఘటనకు కీలక కుట్రదారులైన బలాయి చరణ మైతీ, మనోబ్రత జనాల కోసం తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో సోదాలు జరిపాం. స్థానికుల తీవ్ర ప్రతిఘటన నడుమ వారిద్దరినీ అరెస్ట్ చేశాం. స్థానికుల దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏకి చెందిన ఒక వాహనం ధ్వంసమైంది. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’అని ఆయన వివరించారు. మైతీ, జనా అనే వారు స్థానికంగా భయోత్పాతం సృష్టించేందుకు నాటుబాంబులు తయారు చేసి, పేల్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర పోలీసులు అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, పేలుడు పదార్థాల చట్టాన్ని అందులో చేర్చలేదు. దీనిపై దాఖలైన రిట్ పిటిషన్ మేరకు కలకత్తా హైకోర్టు కేసును ఎన్ఐఏకి అప్పగించింది. సీరియస్‌గానే తీసుకుంటాం: గవర్నర్ ఎన్ఐఏ అధికారులపై దాడి అత్యంత తీవ్రమైన అంశమని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. దీనిని అంతే తీవ్రంగా ఎదుర్కొంటామన్నారు. ‘దర్యాప్తు విభాగాల అధికారులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు ఎవరికీ మంచిది కాదు. ఇటువంటి గూండాయిజాన్ని అనుమతించబోం. కఠినంగా వ్యవహరిస్తాం’అని మీడియాతో అన్నారు. మరోదారి లేకే గ్రామస్తుల దాడి: సీఎం మమతా బెనర్జీ భూపతిపూర్‌లో ఎన్ఐఐ అధికారులపై స్థానికుల దాడిని సీఎం మమత సమర్థించారు. శనివారం వేకువజామున ఒక్కసారిగా ఇళ్లలోకి దూరి దాడి చేయడంతోనే స్థానిక మహిళలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడికి దిగారని ఆమె అన్నారు. 2022నాటి ఘటనను ఆమె బాణసంచా పేలుడుగా అభివర్ణించారు. -
ఢిల్లిలో చిరుత కలకలం.. ఐదుగురు ఆస్పత్రికి!
ఢిల్లిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ వాసులను వణికిస్తున్న చిరుత పట్టపగలే మరోసారి దర్శన మిచ్చింది. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం ఉత్తర ఢిల్లిలో రూప్ నగర్లో చిరుతపులి ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ క్రమంలో ముగ్గురిపై దాడిచేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెటింట చక్కర్లు కోడుతుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అగ్నిమాపక బృందం సాయంతో ఎట్టకేలకు దానిని బంధించారు. దీంతో అక్కడి జనం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ చిరుతను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందం నానా కష్టాలు పడినట్టు సమాచారం. చిరుతని గదిలో బంధించామని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని ఢిల్లీ అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. STORY | Leopard barges into house in Delhi's Roop Nagar, 5 injured READ: https://t.co/EbH7OulTMV VIDEO: (Source: Third Party) pic.twitter.com/7bJRdu08YH — Press Trust of India (@PTI_News) April 1, 2024 -
విద్యుదాఘాతానికి గురైన ఏడుగురి పరిస్థితి విషమం!
దేశ రాజధాని ఢిల్లీలోని పాండవ్ నగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకలు ఈ ప్రాంతానికి చెందిన ఏడుగురిని విషాదంలోకి నెట్టివేశాయి. హోలీ వేడుకల్లో మునిగిన వీరంతా హై టెన్షన్ లైన్‌ను పొరపాటున తాకారు. ఫలితంగా వీరు తీవ్రంగా కాలిపోయారు. ప్రస్తుతం బాధితులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గాయపడిన ఈ ఏడుగురిలో ముగ్గురు పిల్లలు, ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి, బాధితులను ఆసుపత్రికి తరలించారు. దీనికి ముందు వీరంతా తమ ఇంటి పైకప్పులపైకి చేరి హోలీ ఆడుతున్నారు. ఈ సమయంలో నీరు హైటెన్షన్ లైన్‌ను తాకడంతో పేలుడు సంభవించింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులలో ఒక జీఆర్పీ జవాన్‌తో పాటు అతని భార్య కూడా ఉన్నారు. #WATCH | A few members of a family admitted to Safdarjung hospital after getting injured due to an electric shock from a high-tension wire in the Pandav Nagar area of East Delhi, after celebrating Holi: Delhi Police pic.twitter.com/1nkJONc5HU — ANI (@ANI) March 25, 2024 -
రసాయన కర్మాగారంలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం!
రాజస్థాన్‌లోని జైపూర్ పరిధిలో గల బస్సీలోని షాలిమార్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గాయపడిన ఇద్దరిని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతులను మనోహర్, హీరాలాల్, కృష్ణలాల్ గుర్జార్, గోకుల్ హరిజన్లుగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన వారిని ఇంకా గుర్తించలేదు. పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. -
సీపీఐ నారాయణకు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 16వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన వేదిక ఎక్కబోతుండగా.. జారిపడ్డారు. ఆ తర్వాత అదేం పట్టించుకోకుండా మాములుగానే తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో ఆయన వైద్యుల్ని సంప్రదించడంతో ఆయన గాయపడినట్లు తేలింది. నారాయణకు రిబ్ ఎముక విరిగిందని.. రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. -
చైనాలో భారీ పేలుడు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. 🚨🇨🇳 BREAKING: HUGE EXPLOSION IS REPORTED IN YANJIAO, CHINA The explosion happened in a building. There's no immediate report on casualties.pic.twitter.com/XylJsBuLUW — Mario Nawfal (@MarioNawfal) March 13, 2024 భవనాల శిధిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత భారీ నీలి మంటలు ఎగిసిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ పేలుడులో ఎంత మంది చనిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రెస్క్యూటీమ్ సహాయక చర్యలు మొదలు పెట్టింది. #BREAKING- Large explosion damages multiple buildings in Yanjiao, China. No word on injuries at this time.#explosion #China #Yanjiaopic.twitter.com/lQ6UMCTv30 — Chaudhary Parvez (@ChaudharyParvez) March 13, 2024 ఇదీ చదవండి.. అట్లాంటా గ్యాస్ స్టేషన్లో దోపిడీ -
యూపీలో కాలువలో పడిన కారు.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురు గల్లంతు!
యూపీలోని బులంద్‌షహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో తిరిగి వస్తున్న కారు వర్షం కారణంగా కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడినట్లు సమాచారం. అలాగే ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియడంలేదు. వీరిని గాలించేందుకు రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమంది మంది ప్రయాణిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటాక జహంగీరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్నా కాలువలో కారు పడిపోయింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే డీఎం, ఎస్ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. -
Telangana: ప్రమాదంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కు గాయాలు
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్ కుమార్‌తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిచగా.. అడ్లూరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. -
బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ హింసకు దారి తీసింది. టీఎంసీ నేతల అగడాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను పరామర్శించడానికి బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు సందేశ్‌ఖాలీ సందర్శన బయలుదేరారు. #WATCH | Basirhat, North 24 Parganas | West Bengal BJP president Sukanta Majumdar admitted to Basirhat multi-facility hospital after he was injured during Police lathi charge as a scuffle broke out between Police and party workers. pic.twitter.com/8pBr5YxBfN — ANI (@ANI) February 14, 2024 ఈ క్రమంలో సందేశ్‌ఖాలీకి బీజేపీ కార్యకర్తలను రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమం పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ స్పృహ తప్పి పడిపోయి గాయపడ్డారు. వెంటనే అతన్ని స్థానిక అస్పత్రికి తరలించారు. అతనికి మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాకు తరలించినట్లు తెలుస్తోంది. ఇక.. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు అక్కడి మహిళపై అఘాయిత్యాకు పాల్పడున్నారని గత కొన్ని రోజులుగా వారు మమతా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ‘ప్రజలు ప్రేక్షకులుగా ఉండరు’.. మమతాపై స్మృతి ఇరానీ ఫైర్ -
Anantapur: పేలిన గ్యాస్ సిలిండర్
-
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి!
కర్ణాటకలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలో గల ఒక బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటచేసుకుంది. ఈ పేలుడు శబ్దం చాలా మైళ్ల దూరం వరకూ వినిపించింది. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. సమీపప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను వర్గీస్ (62), స్వామి (60), చేతన్ (24)గా గుర్తించినట్లు దక్షిణ కన్నడ పోలీసు సూపరింటెండెంట్ సీబీ రిషియంత్ తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి, పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
‘జాగరణ’లో స్టేజ్ కూలి ఒకరు మృతి.. 17 మందికి గాయాలు!
దేశ రాజధాని ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో జరిగిన ‘జాగరణ’ కార్యక్రమంలో వేదిక కూలిపోవడంతో కలకలం చెలరేగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 1,600 మంది అక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మహిళ మృతి చెందింది. గాయడిన 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతంలో ‘జాగరణ’ నిర్వాహకులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 337/304A/188 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి 1:20 గంటలకు జరిగినట్లు సమాచారం. #WATCH | Delhi | 17 people injured and one died when a platform, made of wood and iron frame, at a Mata Jagran at Mahant Parisar, Kalkaji Mandir collapsed at midnight on 27-28 January. Case registered against the organisers. (Video: Viral visuals confirmed by Police) https://t.co/r6bE9dh3ds pic.twitter.com/xJgJ0wSdqB — ANI (@ANI) January 28, 2024 -
‘లాలా’ కోసం భగత్‌సింగ్ ఏం చేశారు? విప్లవకారుల పొరపాటు ఏమిటి?
బ్రిటీషర్ల బానిసత్వ సంకెళ్ల నుండి దేశానికి విముక్తి కల్పించడంలో స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ విశేష కృషి చేశారు. ఆయన నిష్ణాతుడైన రాజకీయవేత్త, చరిత్రకారుడు, న్యాయవాది, రచయితగా పేరుగాంచారు. లాలా లజపతిరాయ్ కాంగ్రెస్‌లో అతివాద గ్రూపు నేతగా, పంజాబ్ కేసరిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర వీరుడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సహా విప్లవకారులకు లాలా లజపతిరాయ్ అంటే ఎంతో గౌరవం. యువతను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడేలా లాలా లజపతిరాయ్ పురిగొల్పారు. నేడు లాలా లజపతిరాయ్ జయంతి. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని అగర్వాల్ కుటుంబంలో 1865, జనవరి 28న లాలా లజపతిరాయ్ జన్మించారు. 1928, అక్టోబర్ 30న సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో భారీ ప్రదర్శన జరిగింది. దీనిలో లాలా లజపతిరాయ్ పాల్గొన్నారు. ఈ సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిపై లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో, లాలా మాట్లాడుతూ ‘నా శరీరంపై పడే ప్రతీ లాఠీ దెబ్బ.. బ్రిటిష్ ప్రభుత్వ శవపేటికపై దిగబడే మేకులా పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు. 1927, నవంబరు 8న భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దానికి సైమన్ కమిషన్ అనే పేరు పెట్టింది. దీనిలో ఏడుగురు బ్రిటిష్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. భారతీయులకు దానిలో స్థానం దక్కలేదు. మాంటేగ్ చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల పరిశీలనకు ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. సైమన్ కమిషన్ 1928, ఫిబ్రవరి 3న భారతదేశానికి వచ్చింది. దీనిని భారత జాతీయ కాంగ్రెస్‌తో సహా దేశమంతా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా ‘సైమన్ కమిషన్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పంజాబ్‌లో జరిగిన ఈ నిరసనకు లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించారు. లాహోర్ పోలీస్ ఎస్పీ జేమ్స్ ఎ స్కాట్ నేతృత్వంలో లాఠీ ఛార్జ్ జరిగింది. లాలా తీవ్రంగా గాయపడి 18 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. చివరకు 1928 నవంబర్ 17న కన్నుమూశారు. లాలా లజపతి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భగత్ సింగ్‌తో సహా పలువురు విప్లవకారులు బ్రిటిష్ అధికారి జేమ్స్ ఎ. స్కాట్ హత్యకు ప్లాన్ చేశారు. అయితే అతనిని గుర్తించడంలో పొరపాటు జరిగి, 1928, డిసెంబరు 17న భగత్ సింగ్, రాజ్గురులు బ్రిటీష్ పోలీసు అధికారి జాన్ పి. సాండర్స్‌ను కాల్చిచంపారు. ఆ సమయంలో సాండర్స్ లాహోర్ ఎస్పీగా ఉన్నారు. లాలా లజపతిరాయ్ మృతి విషయంలో దేశం మౌనంగా ఉండదని, బ్రిటిష్ వారికి తగిన సమాధానం చెప్పాలని భావించిన విప్లవకారులు బ్రిటిష్ వారికి ఇటువంటి సందేశం ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో దీదీ తలకు గాయం
కోల్‌కతా: రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆమె కారులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా మమతా బెనర్జీ కారులో బర్ధమాన్ నుంచి తిరిగి వస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్కి ఎదురుగా అకస్మాత్తుగా మరో కారు వచ్చింది. దీంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. దీదీ తలకు స్వల్ప గాయాలు కాగా.. ఆమెను కోల్‌కతాకు తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఇండియా కూటమికి డబుల్ షాక్! -
ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి!
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఒక ఇటుక బట్టీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో చిమ్నీ కూలిపోయి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 25 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బసిర్‌హత్‌లోని ధాల్టితా గ్రామంలో చోటుచేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఇటుక బట్టీలో పొయ్యి మండుతుండగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారంతా ఇటుక బట్టీ కార్మికులేనని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, శిథిలాల కింద ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం భారీ పేలుడు థాటికి ఇటుక బట్టీలోని చిమ్నీ పూర్తిగా కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కాగా ఈ పేలుడు వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య! -
పుష్ప-2తో పోటీ పడనున్న మూవీ.. షూటింగ్లో స్టార్ హీరోకు గాయాలు!
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తోన్న తాజా చిత్రం సింగం-3. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా అజయ్ దేవగణ్ గాయపడినట్లు తెలుస్తోంది. పొరపాటున అజయ్ కంటికి గాయమైనట్లు సమాచారం. అయినప్పటికీ అజయ్ దేవగణ్ వెంటనే షూటింగ్‌ని తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఇటీవలే సింగం-3 చిత్రంలో అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో కరీనా, దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు టాలీవుడ్ హీరో మూవీ పుష్ప-2 కూడా రిలీజ్ కానుంది. దీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. కాగా.. గతంలో రిలీజైన సింగం, సింగం రిటర్న్స్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. మరోవైవు అజయ్ దేవగన్ బోనీ కపూర్ నిర్మిస్తోన్న మైదాన్‌లో కనిపించనున్నారు. -
కంగువ షూటింగ్లో హీరో సూర్యకు ప్రమాదం..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. కంగువ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూర్య 42 వ ప్రాజెక్ట్‌గా వస్తున్న కంగువ చిత్రం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే థాయ్‌లాండ్‌లో షూటింగ్ ముగించుకుని వచ్చిన కంగువ టీమ్.. తాజాగా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణనను చెన్నైలో ప్లాన్ చేశారు. కంగువ చిత్రం కోసం భారీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్న సూర్యపై రోప్ కెమెరా వచ్చి పడంది. దీంతో ఆయన భుజానికి గాయమైంది. వెంటనే షూటింగ్ ఆపేసిన యూనిట్ సభ్యులు.. సూర్యను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఆ కెమెరా సూర్య భుజానికి తగలడంతో భారీ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారని తెలుస్తోంది. లేదంటే ఆ కెమెరా భుజానికి బదులుగా సూర్య తలపై పడింటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని అక్కడి వారు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్య ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. కనీసం కంగువ చిత్ర యూనిట్ కూడా ఇప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సూర్య త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నారు. A minor injury happened to #Suriya on his shoulders, yesterday at #Kanguva shooting spot due to the rope camera has been slipped off !! So the shooting has been cancelled today 🎬 Get well soon #Suriya❤️ pic.twitter.com/Br2VT0ryww — AmuthaBharathi (@CinemaWithAB) November 23, 2023 -
విశాఖ: స్కూల్ ఆటో-లారీ ఢీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సంగం శరత్ థియేటర్ సమీపంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో-లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరార్ కాగా.. క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ప్రమాదంలో విద్యార్థులు హాసిని ప్రియా, జీ.గాయత్రి, వాణి జయ రమ్య, భవేష్, లక్ష్య, చార్విక్, కుశాల్ కేజీ, కేయూష్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ సాక్షితో మాట్లాడారు. ‘‘ఉదయం 7గం.30ని. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆటోలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. వీళ్లంతా బేతని స్కూల్‌కు చెందిన వాళ్లు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో డ్రైవర్ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’’ అని ఏసీపీ రాజీవ్ అన్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని పదో తరగతి చదివే హాసినిగా తెలుస్తోంది. మరో ప్రమాదంలో.. కాగా, విశాఖలో ఈ ఉదయం మరో ప్రమాదం జరిగింది. మధురవాడ-నగరం పాలెం రోడ్డులో స్కూల్ ఆటో బోల్తా పడింది. ఆటోలో ఏడుగురు స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు, ఆటోడ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. చదవండి: ప్రేమా.. ఇదినీకు న్యాయమా? VIDEO | Eight school children were injured when the auto they were travelling in collided with a lorry in Visakhapatnam earlier today. The incident was captured on CCTV. (Disturbing visuals. Viewers discretion advised) pic.twitter.com/JE7BZiBQi1 — Press Trust of India (@PTI_News) November 22, 2023 -
‘దర్భంగా ఎక్స్‌ప్రెస్’ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న 12554 వైశాలి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావాలోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో క్లోన్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్ పూజలో పాల్గొనేందుకు బీహార్, యూపీకి చెందిన పలువురు ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో తూర్పు యూపీకి చెందిన ఇద్దరు, రాజస్థాన్‌కు చెందిన ఒకరు ఉన్నారు. గాయపడిన 11 మంది రైల్వే ప్రయాణికులను సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులను డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రభుత్వ జాయింట్ హాస్పిటల్లో చేర్చారు. రైలులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన మైన్‌పురి ఔటర్ గేట్ ఆఫ్ ఫ్రెండ్స్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. కాగా బుధవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు -
గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే..
ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులో మంటలు చెలరేగి, మూడు బోగీలు దగ్ధమయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలియజేశారు. కాగా గడచిన పదేళ్లలో పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా, వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం! 2012: మే 22న ఆంధ్రప్రదేశ్‌లో హంపి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు, హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నాయి. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతోపాటు, ఒక బోగీలో మంటలు చెలరేగడంతో దాదాపు 25 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2014: మే 26న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లోని ఖలీలాబాద్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును గోరఖ్‌పూర్ వైపు వెళ్తున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2016: నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పడంతో, 150 మంది ప్రయాణికులు మృతి చెందారు. 150 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2017: ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. 2017: ఆగస్ట్ 18న పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడంతో 23 మంది మృతి చెందారు. 60 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2022: జనవరి 13న పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ ప్రాంతంలో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. 2023: జూన్ 2న ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 291 మంది మృతి చెందారు. 1,1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలివే.. -
కేంద్రమంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం.. ఒకరు మృతి
భోపాల్: కేంద్రమంత్రి కాన్వాయ్‌లోని కారు ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న కారు మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా పలువురికి గాయాలయ్యాయి. కేంద్రమంత్రి సైతం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈనెల 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రహ్లాద్ పటేల్ మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచారు. ఈ క్రమంలో మంగళవారం చింద్వారాలో ఓ కార్యక్రమాన్ని ముగించుకొని నార్సింగ్‌పూర్‌కు వెళ్తుండగా అమర్వారా వద్ద ప్రమాదం జరిగింది. సింగోడి బైపాస్ సమీపంలో మంత్రి కాన్వాయ్‌ను రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని నిరంజన్ చంద్రవంశీగా(33) గుర్తించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నిరంజన్.. బైక్‌పై పిల్లలు నిఖిల్ నిరంజన్, సంస్కర్ నిరంజన్‌తో కలిసి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురికి గాయాలవ్వగా..వారిని నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూస్తుంటే మంత్రి ఎస్యూవీ కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. #WATCH | Union Minister and BJP candidate from Narsinghpur, Prahlad Patel's convoy meets with a road accident in Amarwara of Chhindwara district in Madhya Pradesh. The minister was travelling from Chhindwara to Narsinghpur. pic.twitter.com/k9vQvQWxda — ANI (@ANI) November 7, 2023 -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైన వేళ మావోయిస్టులు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయాలపాలయ్యాడు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. విధుల్లో భాగంగా తొండమార్కా నుంచి ఎల్మగుండ గ్రామానికి సీఆర్పీఎఫ్ జవాను వెళుతున్నాడు. ఈ క్రమంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీపై జవాన్ కాలు మోపాడు. ఈ పేలుడులో జవాను తీవ్ర గాయాలపాలయ్యాడు. జవాన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని జిల్లా పోలీసు అధికారి కిరణ్ ఛవాన్ తెలిపారు. జవాన్‌ను శ్రీకాంత్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కూడా ఓ బీఎస్ఎఫ్ జవానుతోపాటు ఇద్దరు పెట్రోలింగ్ బృందం నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలుడులో గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటివిడత పోలింగ్ నేడు కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్విగ్నంగా నిర్వహించేందుకు 600 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నవంబర్ 17న 90 సీట్లలో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. ఇదీ చదవండి: Assembly Elections Polling Live Updates: మిజోరం, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్ -
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి.. కేరళ మహిళకు తీవ్ర గాయాలు
తిరువనంతపురం: ఇజ్రాయెల్-హమాస్ దళాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఇరువైపుల నుంచి దాదాపు 1000 మందికి పైగా మరణించారు. ఇందులో ఇజ్రాయెల్‌లో ఉన్న విదేశీయులు కూడా ఉన్నారు. కేరళకు చెందిన ఓ భారతీయురాలు కూడా హమాస్ దాడుల్లో తీవ్రంగా గాయపడింది. కేరళకు చెందిన షీజా ఆనంద్(41) ఇజ్రాయెల్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఆమె క్షేమంగానే ఉన్నట్లు ఇక్కడి కుటుంబ సభ్యులతో చెప్పారు. హమాస్ దాడుల క్రమంలో షీజా భర్త ఫోన్ చేయగా.. అకస్మాత్తుగా కాల్ కట్ అయిపోయింది. ఆ సమయంలో భారీ శబ్దం వినిపించింది. మరుసటి రోజు ఓ భారతీయుడు షీజా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమె గాయపడినట్లు చెప్పాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించాడు. షీజా యోగక్షేమాలను కనుగొనడం కోసం ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు.. లండన్‌లో సంబరాలు -
తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుట ఆత్మాహుతి దాడి
అంకారా: పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడి మిగిల్చిన విషాదాన్ని మరువక ముందే తుర్కియేలో ఉగ్రావాదులు పంజా విసిరారు. తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుట ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు తెలిపింది తుర్కియే అంతర్గత వ్యవహారాల శాఖ. ప్రభుత్వం ఇది తీవ్రవాదుల పనేనని ప్రకటించింది. ఆదివారం ఉదయం 9.30 ప్రాంతంలో ఇద్దరు తీవ్రవాదులు ఒక కమర్షియల్ వాహనంలో తుర్కీయే పార్లమెంట్ భవనం వద్దకు వచ్చారు. డైరెక్టరేట్ జనరల్ భద్రతా విభాగం ఎంట్రన్స్ గేట్ వద్దకు రాగానే వీరిద్దరూ బాంబులతో దాడి చేశారనన్నారు. వారిలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడగా మరొక తీవ్రవాది బాంబును నిర్వీర్యం చేశామని తెలిపింది అంతర్గత వ్యవహారాల శాఖ. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పొందుపరుస్తూ ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపింది. బాంబు శబ్దానికి చుట్టుపక్కల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. తీవ్రవాదులు దాడులు చేసిన జిల్లాలో పార్లమెంట్ సహా అనేక ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రసంగం తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నాయని అంతలోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని తెలిపింది స్థానిక మీడియా. దాడులు జరిగిన సమాచారం అందగానే అత్యవసర సేవల విభాగం వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలి వచ్చారు. A terrorist attack occurred outside Turkey's interior ministry in Ankara. Two attackers, arriving in a commercial vehicle, executed the assault, injuring two officers. One attacker detonated himself in front of a ministry building, while the other was neutralized. The… pic.twitter.com/ovaiv3eVky — Pakistani Index (@PakistaniIndex) October 1, 2023 ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం -
వరల్డ్ కప్‌కు ముందు గాయాల బెడద.. ఏ జట్టు నుంచి ఎవరెవరంటే?
క్రికెట్ ప్రేమికులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్-2023కు మరో 15 రోజుల్లో తెరలేవనుంది. దాదాపు పుష్కరకాలం తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ వంటి ప్రధాన దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఈ మార్క్యూ ఈవెంట్ కోసం ఆయా జట్లు తమ ఆస్త్రాలను సిద్దంచేసుకుంటున్నాయి. అయితే ఈ టోర్నీలో పాల్గోనే దాదాపు ప్రతీ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. వరల్డ్‌కప్‌కు ముందు గాయాల బారిన పడిన ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం. ముఖ్యంగా ఈ జాబితాలో శ్రీలంక ప్రథమ స్ధానంలో ఉంటుంది. లంక జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లు గాయాలతో పోరాడుతున్నారు. వనిందు హసరంగా వనిందు హసరంగా.. గత కొంత కాలంగా శ్రీలంక జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సరిగ్గా ఆసియాకప్ ప్రారంభానికి ముందు హసరంగా గాయపడ్డాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో హసరంగా మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఆసియాకప్‌కు దూరమయ్యాడు. ఈ టోర్నీలో హసరంగా లేని లోటు శ్రీలంక జట్టులో సృష్టంగా కన్పించింది. హసరంగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు తిరిగి వరల్డ్‌కప్‌తో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మహేశ్ తీక్షణ మహేశ్ తీక్షణ.. ఇటీవలే ముగిసిన ఆసియాకప్‌లో లెగ్‌స్పిన్నర్ థీక్షణ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దురదృష్టవశాత్తూ భారత్‌తో ఫైనల్‌కు ముందు తీక్షణ గాయపడ్డాడు. థీక్షణ కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అయితే వరల్డ్‌కప్ సమయానికి అతడు కోలుకుంటాడని లంక అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దుష్మంత చమీర శ్రీలంక స్టార్ పేసర్లలో దుష్మంత చమీర ఒకడు. కానీ గాయాల కారణంగా అతడు జట్టులో కంటే బయటే ఎక్కువగా ఉంటున్నాడు. భుజం గాయం కారణంగా జింబాబ్వేలో జరిగిన వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌కు దూరమయ్యాడు. అతడు తిరిగి కోలుకుని లంక ప్రీమియర్ లీగ్‌తో మైదానంలో అడుగుపెట్టాడు. అయితే మళ్లీ అతడి గాయం తిరగ బెట్టడంతో టోర్నీ మధ్యలోనే నిష్కమ్రించాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌కు కూడా దూరమయ్యాడు. అయితే వరల్డ్‌కప్ సమయానికి చమీర కోలుకోవడం అనుమానమే. దిల్షాన్ మధుశంక 23 ఏళ్ల దిల్షాన్ మధుశంక తన అరంగేట్ర మ్యాచ్‌లోనే పేస్ బౌలింగ్‌తో అందరని అకట్టుకున్నాడు. ఇప్పటివరకు 6 వన్డేలు ఆడిన మధుశంక 10 వికెట్లు పడగొట్టాడు. మధుశంక ప్రస్తుతం కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు వరల్డ్‌కప్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని ఆసియాకప్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే గాయం తిరగబెట్టడంతో ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు ఈ ముంబైకర్. ఇప్పుడు వరల్డ్‌కప్ అతడి అందుబాటుపై సందేహలు నెలకొన్నాయి. మరోవైపు ప్రపంచకప్‌కు ముందు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా గాయపడ్డాడు. అక్షర్ ప్రస్తుతం మోచేతి గాయం బాధపడుతున్నాడు. అతడు ప్రస్తుతం ఏన్సీఏలో పునరవాసం పొందుతున్నాడు. అక్షర్ తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. నసీం షా.. ఫాస్ట్ బౌలర్లకు పుట్టినిల్లు పాకిస్తాన్. అందులో ఒకడు యువ సంచలనం నసీం షా. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే ఆసియాకప్‌లో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా నసీం షా భుజానికి గాయమైంది. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అయితే నసీం షా కోలుకోవడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు వరల్డ్‌కప్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. హ్యారిస్ రవూఫ్.. హ్యారిస్ రవూఫ్ ప్రస్తుతం పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అతడిని ముందు జాగ్రత్తగా ఆసియాకప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పించింది. కాగా రవూఫ్ వరల్డ్‌కప్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన విలియమ్సన్.. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటనుంచి ఫిట్నెస్ సాధించే పనిలో కేన్‌మామ పడ్డాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ జట్టులో విలియమ్సన్కు న్యూజిలాండ్ క్రికెట్ చోటు కల్పించింది. విలియమ్సన్ ప్రపంచకప్ నాటికి ఫిట్నెస్ సాధిస్తాడని న్యూజిలాండ్ ఆశలు పెట్టుకుంది. టిమ్ సౌథీ విలియమ్సన్ గైర్హజరీలో కివీస్ జట్టును నడిపించిన స్టార్‌పేసర్ టిమ్ సౌథీ కూడా గాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో కివీస్ సీనియర్ పేసర్ సౌథీ కుడిచేతి బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. అతడు వరల్డ్‌కప్‌లో ఆడేది అనుమానంగానే ఉంది. మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రస్తుతం భుజం గాయం, గజ్జ నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించికపోయనప్పటికీ వరల్డ్‌కప్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు ముందు స్టార్క్ కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ గాయం కారణంగా టోర్నీ ఫస్ట్ హాఫ్‌కు దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో నాలుగో వన్డే సందర్భంగా అతడి ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ►ఇక పైన పేర్కొన్నవారు మాత్రమే కాకుండా మిగితా కొంతమంది ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ►అన్రిచ్ నార్ట్జే(దక్షిణాఫ్రికా- వెన్ను గాయం) ►సిసంద మగల: (దక్షిణాఫ్రికా- మోకాలి గాయం) ►నజ్ముల్ హొస్సేన్ శాంటో: (బంగ్లాదేశ్-మోకాలి గాయం) ►స్టీవ్ స్మిత్: (ఆస్ట్రేలియా-మణికట్టు గాయం) ►మార్క్ వుడ్: (ఇంగ్లండ్- మడమ గాయం) ►ఇమామ్ ఉల్ హక్ - (వెన్ను నొప్పి-పాకిస్తాన్) -
కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితులు
సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్ లోయలో ఆర్టీసీ బస్సు దూసుకుపోయిన ఘటనలో గాయపడిన ప్రయాణికులు కోలుకుంటున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో 21 మందికి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన సేవలందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్లు.. కలెక్టర్, ఇతర వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్పర్సన్ గదల బంగారమ్మ, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ కణితి వెంకటరావులు ఆస్పత్రికి వెళ్లి బాధిత ప్రయాణికులను పరామర్శించారు. తీవ్ర గాయాలపాలైన బోడిరాజు, చిన్నమ్మలకు విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో ఉన్నత వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పిందని పాడేరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు చెప్పారు. మెడికవర్ ఆస్పత్రిలో బాధితులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శంకరరావు సోమవారం పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, పౌష్టికాహారం, ఇతర సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి కలెక్టర్ సుమిత్‌కుమార్, ఇతర అధికారులు నివేదికలు పంపుతున్నారు. ప్రయాణికులు కొండన్న, నారాయణమ్మల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
గృహంలో బాంబు పేలుడు.. భారీగా ఎగిసిన మంటలు.. వీడియో వైరల్..
న్యూయార్క్: అమెరికాలో దారుణం జరిగింది. పిట్స్‌బర్గ్‌లో బాంబు పెలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువకులతో పాటు ఓ చిన్నారి కూడా ఉంది. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. పిట్స్‌బర్గ్‌లో పగటిపూటనే బాంబు పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో పేలుడు అకస్మాత్తుగా జరిగింది. అదే సమయంలో పేలుడుకు పక్కనే ఉన్న నలుగురు యువకులు ఓ చిన్నారి మంటల్లో కాలి మృతి చెందారు. బాంబు పేలుడు సంభవించినప్పుడు ఇంటి శిథిలాలు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన ఇంటికి పక్కనే ఉన్న మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. Four Adults And A Child Have Passed Following A House Explosion In Pennsylvania. Three People From Surrounding Homes Were Rushed To Hospitals, One Of Which Is Currently In Critical Condition. 😳🤯 pic.twitter.com/LYyw5QZDDD — 🚘BrutalCams🎥 (@BrutalCams) August 15, 2023 పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్న మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. కాగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన -
టీడీపీ రౌడీల దాడి: పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: టీడీపీ రౌడీల దాడిలో గాయపడిన పోలీసులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయంగా దివాళా తీశారని.. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘పుంగనూరు బైపాస్ నుంచి వెళ్తామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత కావాలనే పుంగనూరులోకి వెళ్లాలని ప్రయత్నించారు. అనంతరం పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడి పాల్పడేలా చేశారు. అనరాని మాటలు తిడుతూ ప్రజలను రెచ్చగొట్టారు. పోలీసులపై ఈ స్థాయిలో దాడి జరిగిన ఘటనలు ఇటీవల కాలంలో లేవు. కుప్పంలో ఓడిపోతానన్న భయంతో చంద్రబాబు నీచానికి దిగారు’’ అని మంత్రి మండిపడ్డారు. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ ‘‘కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పోలీసులకు, ప్రభుత్వానికి ఇది ప్రతిష్టాత్మకం. షార్ట్ గన్స్కు లైసెన్స్ ఉండదు.. కానీ వారు ఆయుధాలు తెచ్చుకున్నారు. 200 వాహనాల్లో రౌడీలను తెచ్చుకున్నారు’’ అని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. -
మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం.. 10 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధులే జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి నాలుగు వాహనాలు ఢీకొట్టి దాబాలోకి (హోటల్) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పది గంటలకు పలాస్నర్ గ్రామ సమీపంలోని ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ధులేకు వెళ్తుండగా.. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పింది. దీంతో ముందుగా హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న రెండు బైక్‌లు, ఒక కారు, మరొక కారును ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కకు ఎగిరిపడింది. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న దాబాలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. 20 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. భాదితుల్లో బస్టాప్‌లో వేచిచూస్తున్న ప్రయాణికులు సైతం ఉన్నారని, క్షతగాత్రులను ధులే, సిర్పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు విచారణ చేపట్టినట్లు చెప్పారు. చదవండి: సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట.. -
షూటింగ్లో ప్రమాదం.. టాలీవుడ్ హీరోకు తీవ్ర గాయాలు..!
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కానిస్టేబుల్ అనే చిత్రంలో వరుణ్ సందేశ్ నటిస్తున్నారు. ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా.. హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయమైంది. దీంతో వెంటనే వరుణ్ సందేశ్ కాలికి చికిత్స అందించారు. అనంతరం డాక్టర్లు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం బంపరాఫర్.. భారీగా టికెట్ల ధరలు తగ్గింపు! ) ఊహించని సంఘటనతో సినిమా షూటింగ్ అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ అన్నారు. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని నిర్మాత బలగం జగదీష్ తెలియజేశారు. కాగా.. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత) -
పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి
ఉగాండా: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దులో ఉన్న ఒక స్కూలుపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారుగా 25 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుబంధ సంస్థగా పేరున్న ఏడీఎఫ్ శుక్రవారం రాత్రి పశ్చిమ ఉగాండాలోని పాండ్వేకు చెందిన లుబిరిరా ఉన్నత పాఠశాలపై దాడికి తెగబడింది. తిరుగుబాటుదారుల దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపారు ఉగాండా పోలీసులు. ఉగాండా పోలీసులు దాడికి సంబంధించిన వివరాలు తెలుపుతూ.. పాండ్వే లుబిరిరా పాఠశాలపై ఏడీఫ్ తీవ్రవాదులు దాడి చేసి పాఠశాల వసతి గృహాన్ని తగలబెట్టి ఆహారాన్ని దొంగిలించుకుపోయారు. ఇప్పటివరకు ఇక్కడ 25 మృతదేహాలను గుర్తించి దగ్గర్లోని బ్వేరా ఆసుపత్రికి తరలించాము.ఇందులో విద్యార్థులు ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదు. దాడి అనంతరం ఉగ్రవాద ముఠా విరుంగా నేషనల్ పార్క్ వైపుగా పారిపోయారని అన్నారు. 1990ల్లో తూర్పు ఉగాండాలో ఆనాటి అధ్యక్షుడు యోవెరీ ముసెవెనికి వ్యతిరేకంగా ఏడీఎఫ్ పుట్టుకొచ్చింది. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఏడీఎఫ్ 2021లో ఉగాండా రాజధాని కంపాలాలో బాంబు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇన్నాళ్లకి ఏడీఎఫ్ మళ్ళీ వెలుగులోకి వచ్చి పిల్లల పాఠశాలపై దాడులు చేయడం పాశవికమని ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్యని అన్నారు ఉగాండా నేత విన్నీ కిజా. ఇది కూడా చదవండి: నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్.. -
ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు..
గుజరాత్:గుజరాత్‌లోని జునాగఢ్‌లో అక్రమంగా నిర్మించిన దర్గా కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. దర్గా కూల్చివేత నోటీసులు జారీ చేయడానికి వెళ్లిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులపై అందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా..పలువురు పోలీసులు గాయపడ్డారు. దర్గాను అక్రమంగా నిర్మించారని జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. ఈ క్రమంలో అధికారులు దర్గాపై కూల్చివేతకు సంబంధించిన నోటీసులను జారీ చేయడానికి వెళ్లగా.. ఆందోళనకారులు అధికారులను అడ్డగించారు. అనంతరం అధికారులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసు పోస్టును కూల్చివేశారు. దాదాపు 300 మంది నిరసనకారులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ఉపయోగించారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మరణించాడు. ముగ్గురు పోలీసులతో సహా ఓ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 174 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి:Cyclone Biparjoy: బలహీనపడిన బిపర్జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం -
మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు.. 9మంది మృతి..
మణిపూర్:మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లో జరిగిన హింసాకాండలో మరో 9 మంది మరణించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఖామెన్‌లోక్ ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన ఫైరింగ్‌లో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఇంఫాల్‌లో ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. హింసాకాండలో మరణించిన వారి శరీరాలపై అవయవాలు తెగిన గుర్తులు, అనేక బుల్లెట్ గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజా ఘటనలతో సడలించిన కర్ఫ్యూ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. దాడులు జరిగిన ఖామెన్‌లోక్ ప్రాంతం.. కంగ్పోక్పీ, ఇంఫాల్‌కు తూర్పున ఉన్న జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో చాలా రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ చాలా రోజులుగా అట్టుడికి పోతోంది. గిరిజనులు ప్రధానంగా కుకీ వర్గం, గిరిజన హోదా కోసం డిమాండ్ చేస్తున్న మెయితీల నడుమ భేధాభిప్రాయలు తారాస్థాయికి చేరుకుని హింసాత్మక వాతావరణం నెలకొంది. తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే 100కి పైగా మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:కల్లోల మణిపూర్‌లో ఆర్మీ మోహరింపు.. జరుగుతోంది ఇదే! -
టాటా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్: కార్మికులకు గాయాలు
ఒడిశాలోని మేరమండలిలోని టాటా స్టీల్ లిమిటెడ్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కొంతమంది కార్మికుల తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గ్యాస్ లీక్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. దాదాపు 19 మంది గాయపడగా, ఆరుగురికి 40శాతం కంటే ఎక్కువ గాలిన గాయాలైనట్టు సమాచారం. BFPP2 పవర్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిందని ధృవీకరించిన సంస్థ అత్యవసర సేవలందిస్తున్నామని తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు ప్రమాదం సంభవించిందని, గాయపడిన కార్మికులకు ప్రాథమిక చికిత్స అనంతరం ముందు జాగ్రత్త చర్యగా తదుపరి చికిత్స కోసం కటక్‌కు తరలించినట్టు కంపెనీ తెలిసింది. Tata Steel Statement on Accident at BFPP2 Power Plant, Tata Steel Meramandali pic.twitter.com/sISjI2Wlaa — Tata Steel (@TataSteelLtd) June 13, 2023 అలాగే బాధిత ఉద్యోగుల కుటుంబ సభ్యులను సంప్రదించామని, వారికి తగిన సాయం అందిస్తున్నామని, ఆందోళన అవసరం లేదని కూడా పేర్కొంది. #WATCH | Gas leak in Odisha's Tata Steel plant: A total of 19 patients from Tata Steel's Meramandali plant in Dhenkanal were brought here. They have all suffered burns. Out of the 19 patients, 2 patients have also sustained fractures, and 6 of them are burnt above 40%. One… pic.twitter.com/LCKV9PU39i — ANI (@ANI) June 13, 2023 -
షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం.. సిబ్బందికి తీవ్రగాయాలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే చిత్రాల్లో గ్లాడియేటర్ సిరీస్ ఒకటి. గతంలో విడుదలైన గ్లాడియేటర్-1 సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది. భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌గా గ్లాడియేటర్-2 తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెట్లో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగింది. ( ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్) ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొరాకోలో జరుగుతోంది. ఈ ప్రమాదం వల్ల పలువురు సిబ్బంది గాయపడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ ప్రతినిధి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..'ఈ ప్రమాదంలో ఆనుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికే ఆరుగురు సిబ్బందిలో మరో నలుగురికి చికిత్స కొనసాగుతోంది. ఇంతటి భారీ అగ్నిప్రమాదం ఎప్పుడూ చూడలేదు. షూటింగ్ సెట్లో భద్రతా పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.' అని తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో నటీనటులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన వెల్లడించారు. కాగా.. 2000 సంవత్సరంలో వచ్చిన ‘గ్లాడియేటర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. సర్ రిడ్లీ స్కాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు ఏకంగా 5 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 2024లో విడుదల కానుంది. ( ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్) -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీవాసులు ఐదుగురు మృతి
బెంగళూరు: కర్ణాటక రాష్టంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదగిర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదు మంది అక్కడిక్కడే మృతిచెందగా, 14 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. వీరంతా బండిఆత్మకూరు, వెలుగోడు నుండి గుల్బర్గాదర్గా దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారు నంద్యాల జిల్లా, వెలుగోడు బండి ఆత్మకూరుకు చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి వెలుగోడుకు చెందిన నాయకులను, అడ్వకెట్ ను పంపారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామి ఇచ్చారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సొంత ఖర్చులతో ప్రమాద బాధితులు, మృతదేహల తరలింపుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: అర్ధరాత్రి క్లాసులు.. అసభ్యకర చేష్టలు.. వ్యవహారం బయటపడిందిలా? -
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..టెంపో బోల్తా..
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో ఘెర ప్రమాదం చోటు చేసుకుంది. ఘట్ రోడ్డులో ఆరవ మలుపు వద్ద టెంపో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ టెంపోలో కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన భక్తులకు ప్రయాణిస్తున్నట్లు అధికారుల తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ఈప్రమాదం జరిగినట్లు కొందరు భక్తుల చెబుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అతను మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన భక్తులను సమీపంలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఐతే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో రుయా నుంచి బర్డ్ ఆస్పత్రికి తరలించారు. భక్తులకు మరింత మెరుగైన వైద్యం అందేలా ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్డులో వరుసగా ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధకరమని, సత్వరమే దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వాహనాల వేగ నియంత్రణకు సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరారు ధర్మారెడ్డి. (చదవండి: చంద్ర పుష్కరణి బావిలో జారిపడ్డ భక్తురాలు) -
Jammu Kashmir: క్రూజర్ వాహనం బోల్తా..ఆరుగురు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న క్రూజర్ వాహనం అదుపు తప్పి లోయలో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చెప్పట్లినట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని కేరి సెక్టార్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింగ తెగ వైరల్ అవుతోంది వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!) -
వీడియో: బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు..
-
ప్లే జోన్ మెషిన్ లో పడి తెగిపోయిన మూడేళ్ల చిన్నారి చేతివేళ్లు
-
టీమ్ ఇండియాకి భారీ ఎదురుదెబ్బ
-
స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు.. ఆరుగురు అమ్మాయిలకు గాయాలు
చండీగఢ్: పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు అమ్మాయులు గాయపడ్డారు. పేలుడు శబ్దం వినగానే ఆలయంలోని భక్తులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రదాడి జరిగి ఉంటుందని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఉగ్రదాడి కాదని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు. Video: Several injured in blast near #Amritsar's Golden Temple https://t.co/GWEtgJ37sH pic.twitter.com/XwLJxvg1T0 — TOIChandigarh (@TOIChandigarh) May 7, 2023 ఫోరెన్సిక్ టీం పేలుడు జరిగిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ లభించిన కొంత పౌడర్‌ను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలకు స్వల్పగాయాలయ్యాయని ఓ స్థానికుడు తెలిపాడు. చదవండి: బైక్‌లే ఉన్నాయ్.. జనాలేరీ?.. బీజేపీ శ్రేణులపై అమిత్‌షా సీరియస్ -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 9 మంది మృతి
టెక్సాస్‌లో దుండగుల జరిపిన కాల్పుల కలకలంతో ఒక్కసారిగా అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. కొందరు దుండగలు శనివారం టెక్సాస్‌లోని ఓ మాల్లోసాముహిక కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. మాటల్లో చెప్పలేని విషాదం.. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ..సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించే క్రమంలో కాల్పులు జరుపుతున్న అగంతకుడుని కాల్చి చంపేసినట్లు తెలిపారు. అయితే ఘటనా స్థలంలో మరోక నిందితుడు కూడా కాల్పులు జరుపుతూ కనిపించాడని, అతడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు . ఈ ఘటనపై స్పందించిన టెక్సాస గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ ఘటనను మాటల్లో చెప్పలేని విషాదంగా అభివర్ణించారు. సదరు అగంతకుడి ఆచూకి కోసం టెక్సాస్ పోలీసులు మాల్లోని దుకాణాల వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రత్యక్ష సాక్షి జైనల్ పర్వేజ్ మాట్లాడుతూ..తన కూతురు కాల్పుల జరుగుతున్నట్లు చెప్పడంతో తాను మాల్ వద్దకు వచ్చానని, ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు మమ్మల్నిలోపలకి వెళ్లమని సైగ చేశారని తెలిపాడు. ఆ తదనంతరం తాను తన కూతురుని రక్షించే యత్నంలో ఉండగా.. ఒక అంగతుడిని పోలీసులు చంపేశారని చెప్పాడు. ఇంతలో మరో అగంతకుడు కాల్పులు జరుపుతూ కనిపించినట్లు తెలిపాడు. (చదవండి: కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..) -
జమ్మూ కాశ్మీర్లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్..పైలట్లకు గాయాలు..
జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని అటవీ సమీపంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆర్మీ అధికారులు కిష్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ గురువారం కూలిపోయినట్లు తెలిపారు. ఈ హెలికాప్టర్లో పైలట్, కోపైలట్ తోసహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఐతే వారంతా సురక్షితంగానే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి రెస్క్యూ బృందాలు చేరకున్నట్లు కిష్త్వార్ జిల్లా పోలీసు అధికారి ఖలీల్ పోస్వాల్ పేర్కొన్నారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని, ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. (చదవండి: 'బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది'!: అరవింద్ కేజ్రీవాల్) -
ఎంత విషాదం.. పెళ్లి రిసెప్షన్ నుంచి వెళ్తుండగా ఊహించని ప్రమాదం
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఎన్నో ఆశల మధ్య కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న జంటపై విధికి కన్ను కుట్టిందేమో.. వారి సంతోషం ఎంతసేపు నిలవలేదు నిండైన మనసుతో మనువాడి గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదంలో వధువు మరణించగా.. వరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన 34 ఏళ్ల వధువు సమంతా హచిన్సన్, ఆరిక్ హచిన్సన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఉంగరాలు మార్చుకొని ఒకటయ్యారు. కొత్త జంట సంతోషంగా వివాహ రిసెప్షన్ నుంచి గోల్ఫ్ కార్టులో(మోటరైజ్డ్ వాహనం) ఊరేగింపుగా బయల్దేరారు. ఇంతలోనే వేగంగా దూసుకువచ్చిన ఓ కారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గోల్ఫ్కార్టు దాదాపు 90 మీటర్ల దూరం ఎగిరి పడింది. ఈ ఘటనలో వధువు అక్కడికక్కడే మరణించింది. వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని తేలింది. వరుడి మెదడుకు గాయమైందని, ఎముకలు విరిగిపోయాయని, రెండు బలమైన శస్త్రచికిత్సలు చేయవలసి వచ్చిందని అతని తల్లి తెలిపింది. వీరితోపాటు మరో ఇద్దరు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. పెళ్లైన అయిదు గంటల్లోనే ఇదంతా జరిగిపోయిందని, అరిక్ తన జీవితంతో ప్రేమను కోల్పోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: మహిళల కోసమే 102 అంతస్తుల భవనం! కేవలం వారు తప్ప.. కోడలు అంత్యక్రియలకు, కొడుకు వైద్య బిల్లులను చెల్లించడానికి సహాయం కోసం ఫండ్ రైసింగ్ మొదలు పెట్టింది.. ఇప్పటి వరకు 385,053 డాలర్ల కంటే ఎక్కవే లభించాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ జామీ కొమెరోస్కి(25)ను అరెస్ట్ చేశారు. కాగా పెళ్లైన తరువాత కొత్త జంట బంధువుల మధ్య సంతోషంగా నడుస్తున్న ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లి రోజే ఇంతటి ఊహించని ఘోరం జరగడంతో రెండు కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగాయి. చదవండి: ఇదేం విడ్డూరం.. 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్! -
మిర్యాలగూడ: కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన మందుబాబులు
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడలో గత రాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. డ్రంక్ డ్రైవ్ సందర్భంగా.. పోలీసుల మీదకు కారును పోనిచ్చారు. ఈ క్రమంలో కారును ఆపేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. తప్పతాగిన కొందరు మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల సందర్భంగా హల్ చల్ చేశారు. పోలీసులు చెబుతున్నా వినకుండా ముందుకు కారును పోనిచ్చారు. కానిస్టేబుల్ లింగారెడ్డిని 50 మీటర్ల దూరం ఈడ్చుకుపోయారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. గాయాల పాలైన కానిస్టేబుల్ లింగారెడ్డి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన వన్‌టౌన్ పోలీసులు.. పరారైన వాళ్ల కోసం గాలింపు చేపట్టారు. -
అంతర్గత పోరుతో అట్టుడుకుతున్న సూడాన్.. 200 మంది మృతి
ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలు వరసగా మూడు రోజైన సోమవారం కూడా కొనసాగాయి. పేలుళ్లు, కాల్పులతో సూడాన్ అట్టుడుకిపోయింది. దేశ రాజధాని ఖార్టుమ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1800 మంది గాపడ్డారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ హోరాహోరీ యుద్ధంలో ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. దీంతో వైద్యసామాగ్రి, ఆహారం కొరత ఏర్పడింది. 2021లో తిరుగుబాటుతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఇద్దరు జనరల్స్, సూడాన్ ఆర్మీచీఫ్ అబ్దెల్ ఫట్టా అల్ బుర్హాన్, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాల పాటు అధికార పోరాటం జరిగింది. అది శనివారానికల్లా మరింత హింసాత్మకంగా మారింది. ఈ సంఘర్షణ వైమానిక దాడులు, ఫిరంగిదళాల భారీ కాల్పులను దారితీసింది. దీంతో నివాసితులు నిత్యావసారాలు, పెట్రోల్ కోసం బయటకు రావడం ఒక సాహసంగా మారింది. మరోవైపు విద్యుత్తు అంతరాయంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఐతే దేశ రాజధాని ఖార్టుమ్‌లో చోటు చేసుకున్న ఈ అంతర్గత పోరు సుదీర్ఘంగా ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దౌత్యవేత్తలు సమీకరించి ప్రాంతీయంగా, అంతర్జాతీయ పరంగా కాల్పులు విరమణకు పిలుపునిచ్చారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి మిషన్ హెడ్ వోల్కర్ పెర్థెస్ భద్రత మండలిలో సూడాన్ యుద్ధం చాలా పీక్ స్టేజ్‌కి చేరుకుందని, ఇది ఎంతటి విధ్వంసానికి దారితీస్తోందో కూడా చెప్పడం కష్టం అన్నారు. ఈమేరకు సోమవారం యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సూడాన్‌లో మళ్లీ అంతర్గత పోరుకు తెరతీసిన ఇరు పార్టీలను తక్షణమే శత్రుత్వాలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. దీన్ని మరింతగా తీవ్రతరం చేయడం దేశానికి, ఆయా ప్రాంతాలకి మరింత ప్రమాదరకమని హెచ్చరించారు. కాగా, పారా మిలిటరీ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్’ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనే దేశంలో అగ్నికి ఆజ్యంపోసింది. ఇదే ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఘర్షణలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి వరకు దాదాపు 100 మంది పౌరులకు చికిత్స అందిచినట్లు వైద్యుల సంఘం ఒకటి పేర్కొంది. గాయపడినవారిలో చాలమంది ఆస్పత్రులకు చేరుకోలేకపోతున్నట్లు తెలిపింది. అంతేగాదు కొనసాగుతున్న ఈ ఘర్షణలో ఆస్పత్రులు దెబ్బతినడంతో పౌరులను జాయిన్ చేసుకునే పరిస్థితి కూడా లేదని వైద్యుల సంఘం పేర్కొంది. చాలా ఆస్పత్రులు సామాగ్రి కొరతతో వైద్యం అందించలేని స్థితిలో ఉన్నాయని తెలిపింది. మరోవైపు సైన్యం విమానాశ్రయాలు, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌తో సహా కీలక ప్రాంతాలు తమ అధీనంలో ఉన్నాయని ప్రకటించడం గమనార్హం. స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి సూడాన్ దశాబ్దాలుగా అనేక తీవ్రమైన అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లతో మగ్గిపోయిందని సూడాన్ విశ్లేషకుడు ఖో లూద్ ఖై చెబుతున్నారు. (చదవండి: రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి) -
కిమ్స్ ఆసుపత్రి లో చీమలపాడు క్షతగాత్రులు
-
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాలికి ఫ్రాక్చర్ అయినందు వల్ల మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. అందుకే కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు. అయితే తన కార్యాలయం మాత్రం అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమాచారానికైనా, సాయానికైనా తన ఆఫీస్‌ను సంప్రదించవచ్చని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks. My @OfficeOfKavitha shall be available for any assistance or communication. — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023 అయితే ఎలా గాయపడ్డారనే విషయాన్ని మాత్రం కవిత వెల్లడించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవలే ఈడీ ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. మొత్తం మూడు రోజుల పాటు ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా కవిత అధికారులకు అప్పగించారు. తాను ఏ తప్పు చేయలేదని, అవసరమైతే న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. చదవండి: ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ -
రైలులో తోటి ప్యాసింజర్‌కు నిప్పు.. ముగ్గురి మృతి!
కోజికోడ్: కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదిలే రైలులో తన తోటి ప్రయాణికుడికి నిప్పటించగా.. బోగీలోని మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అయితే ఇదే ఘటనలో.. పట్టాలపై పడి మరో ముగ్గురు చనిపోయారు. ఇందులో ఏడాది చిన్నారి ఉండడం గమనార్హం. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో.. అలప్పుజ్జా కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘోరం జరిగింది. రైలు కోరాపుళ రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకోగానే.. గుర్తు తెలియని ఓ వ్యక్తి తన తోటి ప్యాసింజర్‌కు నిప్పటించాడు. ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. ఇది గమనించిన తోటి ప్రయాణికులు చెయిన్ లాగి.. సహాయం కోసం రైల్వేసిబ్బందికి ఫోన్ చేశారు. ఈ గ్యాప్‌లో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోగా.. గాయపడిన వాళ్లను ఆంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆపై రైలు కన్నూర్‌కి చేరుకోగా, ఓ మహిళ, చిన్నారి కనిపించకుండా పోయారనే ఫిర్యాదు అందింది. దీంతో.. వాళ్ల కోసం గాలింపు చేపట్టగా.. ఎళథూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాల మీద సదరు మహిళ, ఏడాది వయసున్న చిన్నారితో పాటు మరో వ్యక్తి మృతదేహం లభ్యమయ్యాయి. మంటల్ని చూసి భయంతో రైలు నుంచి దూకేయడమో లేదంటే ప్రమాదవశాత్తూ వాళ్లకు కిందపడిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళ, ఆ చిన్నారికి బంధువని తేలింది. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. దారుణానికి తెగబడిన వ్యక్తిగా అనుమానిస్తున్న వ్యక్తిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి.. ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. -
శోభా యాత్రలో ఘర్షణ.. బీజేపీ ఎమ్మెల్యేకి గాయాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు చల్లారడం లేదు. శ్రీరామ నవమి వేడుకల కోసం తాజాగా నిర్వహించిన శోభా యాత్రలోనూ హింస చెలరేగింది. ఆదివారం హూగ్లీలో బీజేపీ నిర్వహించిన శోభా యాత్రలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీజేపీ ఎమ్మెల్యే బీమన్ ఘోష్ గాయపడగా, ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన పోలీసులు.. 24 గంటలపాటు జనాలు గుమిగూడడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రారంభించిన ఈ యాత్రలో.. ఒకవైపు నుంచి ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో అంతా తలోపక్క పారిపోవడం సీసీటీవీలో రికార్డు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ నవమి ఊరేగింపులో భాగంగా భారీగా డీజే సౌండ్‌తో కొందరు కత్తులు దూస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఓ మసీదు వద్దకు రాగానే.. చాలాసేపు అక్కడే డీజే నడిపించారు. అయితే అప్పటికే చాలా ఆలస్యంగా శోభా యాత్రను ప్రారంభించి.. సమయం ముగిశాక కూడా కొనసాగించారు. ఆ సమయంలో మసీదును లక్ష్యంగా చేసుకుని యాత్ర ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కొందరు గట్టిగట్టిగా అరవడంతో.. ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ క్రమంలో చెరోవైపు నిల్చుని ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఈలోపు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భద్రతా బలగాలతో స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసే యత్నం చేశాయి. అంతలోనే రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఎమ్మెల్యే బీమన్ గాయపడడంతో.. అనుచరులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ పరిస్థితికి అధికార టీఎంసీ పనేనని బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజూందార్ ఆరోపిస్తున్నారు. హూగ్లీ బీజేపీ శోభా యాత్రపై దాడి జరిగింది. కారణం స్పష్టంగా తెలుస్తోంది. మమతా బెనర్జీకి హిందువులంటే ద్వేషం అంటూ మజూందార్ ట్వీట్ చేశారు. బెంగాల్లో పరిస్థితిపై జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది బెంగాల్ బీజేపీ. ఇక ఈ రాళ్లదాడిలో పలువురు పోలీస్ సిబ్బంది సైతం గాయపడ్డారు. మరోవైపు అక్కడి పరిస్థితిపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. కారకులు ఎవరైనా 24 గంటల్లో అరెస్ట్ అవుతారంటూ మీడియాకు తెలిపారాయన. . @abhishekaitc, who are these stone pelters? Remove your lenses and watch. You will get clearer picture. Public knows everything. pic.twitter.com/yEr8j3zoGA — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 2, 2023 Bengal is going out of control. Mamata Banerjee is unable to control the riots. She is protecting a particular community and targeting Hindus. Wrote to Union Minister @AmitShah ji for immediate help in West Bengal. pic.twitter.com/pVnwh6mAaL — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 2, 2023 ఇదిలా ఉండగా.. హూగ్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని హౌరాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. దీంతో ఆంక్షలు ఎత్తేసి.. అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు పోలీసులు. గురువారం హౌరాలో కాజిపారా ప్రాంతంలో నవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. హింసకు బీజేపీ, హిందూ సంఘాలే కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించగా.. ఎన్ఐఏ ద్వారా దర్యాప్తు చేయిస్తే అసలు కారకులు ఎవరో బయటపడుతుందని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. మరోవైపు బీహార్‌లోనూ శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా చెలరేగిన హింసలో ఒకరు చనిపోగా, వంద మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలందలో 144 సెక్షన్ విధించడంతో పాటు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు స్కూల్స్‌కు బంద్ ప్రకటించారు. ఇదీ చదవండి: అల్లర్లకు పాల్పడ్డవారిని తలకిందులుగా ఉరి తీస్తాం-అమిత్ షా -
అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు..ఇద్దరికి తీవ్ర గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పులక కలకలం చోటు చేసుకుంది. ఈ మేరకు అమెరికాలోని గురుద్వార్‌లో ఇద్దరు దుండగలు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఐతే ఈ కాల్పులు ద్వేషపూరిత నేరాని సంబంధించినది కాదని చెప్పారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో చోటు చేసుకుంది. ఇది తెలిసిన వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న కాల్పుల దాడి అని శాక్రమెంటో కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. కాల్పుల జరగాడానికి ముగ్గురు వ్యక్తుల మధ్య చిన్న ఫైట్ జరిగిందని, ఆ తర్వాత అదికాస్త కాల్పులకు దారితీసిందని షెరీష్ కార్యాయల ప్రతినిధి అమర్ గాంధీ పేర్కొన్నారు. అలాగే అనుమానితుల్లో ఒకరు భారతీయ వ్యక్తి కాగా, మరో అనుమానిత షూటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, యూఎస్‌లో గతేడాది దాదాపు 44 వేల తుపాకీ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. వాటిలో సగం హత్య కేసులు, మరికొన్ని ప్రమాదాలు, ఆత్మరక్షణ, ఆత్మహత్యలు కారణంగా జరిగినవి. (చదవండి: అమెరికాలో భారత ఎంబసీపై దాడికి విఫలయత్నం) -
మంచు లక్ష్మీ కూతురికి ప్రమాదం.. ఎలా జరిగిందంటే..!
ఇటీవల మంచువారి ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే మంచు మనోజ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో విష్ణుతో విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ మనోజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో వివాదం తలెత్తింది. అయితే తాజాగా మంచు లక్ష్మీ కూతురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈనెల 19న మోహన్ బాబు బర్త్‌డే వేడుకల్లో ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా బయటకొచ్చింది. అయితే ఈ ప్రమాదంపై మంచు లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 19న మా నాన్న పుట్టిన రోజు సందర్భంగా పిల్లలంతా బగ్గీలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. అది అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో పిల్లలు కిందపడిపోయారని వెల్లడించారు. ఆ సమయంలో మంచు లక్ష్మీ కూడా అక్కడే ఉన్నారు. ఆమె పక్కకు దూకేయగా.. పిల్లలంతా రోడ్డుపై పడిపోయారు. అప్పటికే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మొహం రక్తంతో నిండిపోయిందన్నారు. పాపని గుర్రపు బండి ఎక్కించకుండా ఉంటే బాగుండేదని మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. అయితే కుమార్తెతో కలిసి మంచు లక్ష్మీ తరచుగా వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. -
షూటింగ్లో ప్రమాదం.. అక్షయ్ కుమార్‌కు గాయాలు!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన 'బడే మియాన్ చోటే మియాన్'చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం స్కాట్లాండ్లో జరుగుతోంది. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గాయపడినట్లు సమాచారం. (ఇది చదవండి: తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ సింగర్) ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తొలిసారిగా టైగర్ ష్రాఫ్‌తో జతకట్టాడు. తాజా నివేదిక ప్రకారం యాక్షన్ సీక్వెన్స్ సీన్లు చేస్తున్నప్పుడు గాయపడినట్లు తెలుస్తోంది. ఓ ఫైట్ కోసం స్టంట్ చేస్తుండగా అతని మోకాలికి గాయమైనట్లు సమాచారం. గాయపడినప్పటికీ షూటింగ్ కొనసాగించారని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. కాగా.. అక్షయ్ కుమార్ మూవీలో సోనాక్షి సిన్హా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో పాటు అక్షయ్ కుమార్ 'ఓఎంజీ 2', 'క్యాప్సూల్ గిల్', 'సూరరై పొట్రు', 'హేరా ఫేరి' చిత్రాల్లో నటించనున్నారు. -
షూటింగ్లో ప్రమాదం.. గాయపడ్డ స్టార్ హీరో అక్షయ్‌కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ గాయపడ్డారు. షూటింగ్ సెట్లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా అనుకోకుండా అక్షయ్‌కు గాయమైంది. ప్రస్తుతం అక్షయ్ స్కాట్లాండ్లో బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో భాగంగా హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి స్టంట్ సీన్ చేస్తుండగా అక్షయ్ మోకాలికి గాయమైంది. అయినప్పటికీ అక్షయ్ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించడం విశేషం. గాయం తీవ్రత అంతగా లేకపోవడంతో కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. కాగా టైగర్ జిందా హై, సుల్తాన్ వంటి పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్, టైగర్లతో పాటు సోనాక్షి సిన్హా ఇందులో నటిస్తుంది. ఇటీవలె ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు మూవీ టీం స్కాట్లాండ్కు పయనమయ్యారు. -
విశాఖలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి..
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని పాత రామజోగిపేటలో ఘోర ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే వారికి ఎటువంటి ప్రాణాప్రాయం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరగడంతో తమకేమీ గుర్తులేదని గాపడిన వారు అంటున్నారు. వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఆ భయంతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. -
బిగ్‌బాస్ ఫేం అఖిల్‌కు గాయం.. ఆసుపత్రిలో చేరిక
బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్ సార్థ్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రెండుసార్లు(బిగ్‌బాస్-4, బిగ్‌బాస్ ఓటీటీ)లలో రన్నరప్‌గా నిలిచి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అఖిల్ ప్రస్తుతం ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పర్ఫార్మెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తేజస్వి మదివాడతో కలిసి జంటగా పాల్గొని డ్యాన్స్ దుమ్మురేపుతున్నాడు. ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో ఉన్న అఖిల్‌కు ఈసారి కూడా ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అఖిల్ తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఎప్పటినుంచో నాకు ఈ బాధ ఉంది. కానీ నేనే పెద్దగా పట్టించుకోలేదు. కానీ సాంగ్ పర్ఫెర్మెన్స్ చేస్తున్నప్పుడు కూడా నొప్పితోనే చేశాను. నా గాయాలు బయటకు కనపించనందున ఎవరికి నచ్చినట్లు వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈ విషయం గురించి చెప్పాలనుకుంటున్నా. నా కడుపు కింది భాగంలో తీవ్రవైన నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పటికే ఆలస్యం చేయడంతో అది మరింత నన్ను బాధిస్తుంది. నేను, తేజు మా సాయశక్తులా కష్టపడ్డాం. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో నేను షో నుంచి బయటకు వచ్చేశాను. ఇంకా షాకింగ్ విశేషమేమిటంటే మేం బాటమ్2లో ఉన్నాం. అయినా ఏం పర్లేదు. మరో అద్భుతమైన షోతో మళ్లీ మిమ్మల్ని త్వరలోనే అలరిస్తాను అంటూ అఖిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
ఉదయ్ కిరణ్ చిత్రంతో ఎంట్రీ.. తీవ్ర గాయాలపాలైన హీరోయిన్
టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ పేరు తెలియని వారు ఉండరు. అప్పట్లో యంగ్ హీరో తన సినిమాలతో అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆయన తన కెరీర్‌ను ముగించారు. ఉదయ్ కిరణ్ కెరీర్లో 2004లో నటించిన చిత్రం 'లవ్ టుడే'. ఈ సినిమాలో ఉదయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా నటించింది. తన కెరీర్లో టాలీవుడ్ సినిమాతోనే సినీరంగంలో ప్రవేశించింది బాలీవుడ్ భామ. తీవ్ర గాయాల పాలైన నటి ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోన్న బాలీవుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఓ మూవీ షూటింగ్లో పాల్గొన్న దివ్య తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇవీ చూసిన ఆమె అభిమానులు 'గెట్ వెల్ సూన్' అంటూ పోస్టులు పెడుతున్నారు. దివ్య ఖోస్లా ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..' నా రాబోయే చిత్రంలో ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు నా ముఖంపై తీవ్రమైన గాయమైంది. కానీ షూటింగ్ మాత్రం కొనసాగాలి. నేను త్వరగా కోలుకోవడానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. ' అంటూ పోస్ట్ చేశారు. జాన్ అబ్రహంతో ప్రేమ పాట చిత్రీకరించినప్పుడు భర్త భూషణ్ కుమార్ సెట్లో ఉన్నారని దివ్య ఖోస్లా కుమార్ చెప్పారు. కాగా.. దివ్య ఖోస్లా తన తదుపరి చిత్రం యారియాన్ -2లో కనిపించనుంది. ఇది దివ్య ఖోస్లా దర్శకత్వంలో వచ్చిన హిమాన్షు కోహ్లీ, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రానికి సీక్వెల్. మీజాన్ జాఫ్రీ, యష్ దాస్ గుప్తా ప్రధాన పాత్రలలో దివ్య నటించారు. వారినా హుస్సేన్, ప్రియా వారియర్, పెరల్ వి పూరి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar) -
కొమురభీం జిల్లా: టోంకిని లోనవెల్లిలో ఎలుగుబంటి దాడి
-
నడవలేని స్థితిలో టాలీవుడ్ హీరోయిన్.. ఫోటో వైరల్
కొంతమంది హీరో,హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయినా ఇట్టే గుర్తిండిపోతారు. అలాంటి వారిలో నటి కనిహ ఒకరు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఒట్టేసి చెబుతున్నా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కనిహా తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆమె అసలు పేరు దివ్య వెంకట సుబ్రమణ్యం. తమిళనాడుకు చెందిన ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును కనిహా అని మార్చుకుంది. తెలుగులో ఒట్టేసి చెపుతున్నా,నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ వంటి సినిమాల్లో నటించింది. 2008లో పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తున్న ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా కనిహా గాయపడింది. ఫ్రాక్చర్ కారణంగా నడలేని స్థితిలో ఉంది. వాకర్ పట్టుకొని ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ.. బ్యాలెన్సింగ్‌గా అడుగులు వేయడం నేర్చకుంటున్నా అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు కనిహా త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kaniha (@kaniha_official) -
Sucide Bomb Attack In Pakistan: తొమ్మిది మంది పోలీసులు మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరగడంతో సుమారు తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి అనే నగరంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ ఆత్మాహుతి బాంబర్ మోటర్ సైకిల్‌తో పోలీసు ట్రక్కును బలంగా ఢీ కొట్టినట్టు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్లు, భద్రతా సిబ్బంది హుటాహుటినా చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 11 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఐతే బలూచిస్తాన్ పుష్కలంగా లభించే గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడి చేస్తుందంటూ బలూచి జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా పోరాడుతున్నట్లు సమాచారం. (చదవండి: 30 ఏళ్ల నాటి మిస్సింగ్ కేసు మిస్టరీ..క్లోజ్ చేస్తుండగా ఊహించని ట్విస్ట్!) -
బిగ్ బీ అమితాబ్ కు ప్రమాదం
-
వధువుకు యాక్సిడెంట్.. ఆస్పత్రి బెడ్ మీదే పెళ్లాడిన వరుడు
కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు సినిమాల్లోనే జరుగుతాయి తప్ప రియల్ లైఫ్‌లో అసాధ్యం అనిపిస్తాయి. కానీ సాధ్యమే అని నిరూపించాడు ఇక్కడొక వ్యక్తి. అతన్ని చూస్తే ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని భేరుఘాట్లో నివాసం ఉంటున్న సౌదాసింగ్కు కుమారుడు రాజేంద్రకు జుల్వానియా గ్రామానికి చెందిన సుభాష్ కుమార్తె శివానితో వివాహం నిశ్చయమైంది. వధువరులిద్దరి బంధువులు ఖాండ్వాలోని భగవాన్పురా నివాసితులు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు వివాహ వేడుకను ఖాండ్వాలో నిర్వహించాలని అనుకున్నారు. ఇంతలో అనుకోకుండా వధువు ప్రమాదం బారిన పడింది. దీంతో ఆమె కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఐతే వరుడు రాజేంద్ర సినిమాలో మాదిరి హిరోలా ఆమెకు అండగా నిలవాలనుకున్నాడు. దీన్ని అపశకునంగా భావించకుండా తమ పెద్దలు అనుక్నున్న ముహుర్తానికే ఆస్పత్రిలోనే ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పెళ్లికి ముందు రోజే శివాని కాలికి చేతికి ఆపరేషన్ జరగడం గమనార్హం. సాధారణ వార్డును పెళ్లి వేడుకగా మార్చి..పండితుడి సమక్షంలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. వరుడు తల్లిదండ్రులు కోడలికి కూతురికి మధ్య ఉన్న అంతరం తోలగించాలనే ఈ పెళ్లిని ఆపకుండా అనుకున్న ముహుర్తానికే జరిపించామని చెప్పారు. అలాగే తమ కూతురికే ఇలాంటి పరిస్థితి ఎదురై పెళ్లి ఆగిపోతే తమకు కూడా అలానే బాధగా ఉంటుందన్నారు. తమ కోడలికి నయం అయ్యేంతవరకు ఆస్పత్రిలో చికిత్సను కూడా అందిస్తామని చెప్పారు. ఈ మేరకు పెళ్లి కూతురు తండ్రి మాట్లాడుతూ.."మా కూతురికి మంచి సంబంధం కుదిరింది. అల్లుడు, వారి బంధువులు ఈ పెళ్లికి సహకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది." అంటూ ఆనందబాష్పాలతో చెప్పుకొచ్చారు. दुल्हन हुई घायल तो अस्पताल पहुंची बारात, बेड पर ही दूल्हे ने रचाई शादी | Unseen India pic.twitter.com/A8ENcxVuis — UnSeen India (@USIndia_) February 20, 2023 (చదవండి: రింగ్ మాస్టర్‌కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా!) -
సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి
-
కదల్లేని స్థితిలో సింగర్ భర్త.. అయినా కూడా..!
టాలీవుడ్ హీరో నందు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గతేడాది బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. యాంకర్ రష్మీ హీరోయిన్గా.. రాజ్ విరాట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. 2006లో వచ్చిన ఫోటో సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన నందు.. ఆ తర్వాత 100% లవ్, ఆటోనగర్ సూర్యలో పలు పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సవారీ మూవీతో సక్సెస్ అందుకున్నారు యంగ్ హీరో. కాగా.. 2014లో గాయని గీతామాధురిని వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నందు తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో వైరలవుతోంది. కాలికి గాయమైన ఓ ఫోటోను పంచుకున్నారు. అయితే ఆ ఫోటోలో ఆయన డబ్బింగ్ చెబుతున్నట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ స్డూడియోకి వచ్చి డబ్బింగ్ చెబుతూ కనిపించారు. అయితే ఆయన కాలికి ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం నందు సినిమాలు, క్రికెట్ కామెంటరీలతో ఫుల్ బిజీ అయిపోయారు. జిమ్‌లోనూ శ్రమిస్తూ ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు. కాగా.. నందు ప్రస్తుతం మహేశ్ బాబు మూవీ ఎస్ఎస్ఎంబి 28తో పాటు ఆర్సీ15,డిజే టిల్లు 2, హరిహరమల్లు, ధాస్ కా ధమ్కీ సినిమాల్లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by @that_actor_nandu -
శానిటైజర్‌కు ‘అగ్ని’పరీక్ష,.. ఇద్దరికి తీవ్రగాయాలు
సాక్షి, బంజారాహిల్స్: శానిటైజర్ కాలుతుందో.. లేదో చూద్దామని అగ్గిపుల్ల గీసి వేయడంతో మంటలు చెలరేగి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు...బంజారాహిల్స్ రోడ్ నం.4లోని యానిమల్ కేర్ సెంటర్లో వికారాబాద్‌కు చెందిన జె.మొగలప్ప నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. అతనితో పాటు పవన్ ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 12న ఇద్దరూ కలిసి ఐదు లీటర్ల శానిటైజర్‌ను ఓ చిన్న డబ్బాలోకి ఒంపుతుండగా, అసలు శానిటైజర్‌కు నిప్పు అంటుకుంటుందా లేదా అని పవన్‌కు అనిపించింది. వెంటనే తన వద్ద ఉన్న అగ్గిపెట్టెను తీసి అగ్గిపుల్లను గీసి శానిటైజర్లో వేశాడు. ఒక్కసారి మంటలు చెలరేగి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డాడు. మొగలప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్‌కాలనీ తన్వీర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దోమ తెరలు, బ్లాంకెట్ల సరాఫరా.. 60 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని.. ) -
స్టార్ డైరెక్టర్‌కు ప్రమాదం.. ఓ చేయి పూర్తిగా.. !
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుధా కొంగరకు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని తెలిపారు. ప్రస్తుతం 'సూరరై పోట్రు' సినిమా హిందీ రీమెక్ షూట్లో జరిగిన ప్రమాదంలో చేతికి గాయమయ్యిందని సమాచారం. గాయంతో విపరీతమైన నొప్పి ఉందని అందుకే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆ ఫోటోలు చూస్తే చేతికి బలమైన గాయాలైనట్లు కనిపిస్తోంది. గురు', 'ఆకాశమే నీ హద్దురా' లాంటి సూపర్‌హిట్ మూవీస్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారామె. ప్రస్తుతం 'సూరరై పోట్రు' సినిమా హిందీ రీమెక్ తెరకెక్కిస్తుండగా అక్షయ్ కుమార్ లీడ్రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రాధిక మదన్ నటిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. మరోవైపు ఈ స్టార్ డైరెక్టర్ తమిళ హీరో సూర్యతో మరో ప్రాజెక్ట్ తీయడానికి రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. Super painful. Super annoying! On a break for a month 😒 #NotTheKindOfBreakIWanted pic.twitter.com/AHVR4Nfumf — Sudha Kongara (@Sudha_Kongara) February 5, 2023 -
జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు.. ఆరుగురు పౌరులకు గాయాలు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నర్వాల్‌లో శనివారం ఉదయం జంట పేలుళ్లు జరిగాయి. ట్రాన్స్పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో ఈ ఘటన జరిగింది. వరుస పేలుళ్లలో ఆరుగుగు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుళ్లు బాంబుల వల్ల జరిగాయా? లేక ఇతర కారణాలున్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు దీన్ని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. నర్వాల్ ప్రాంతాన్ని దిగ్భంధించి తనిఖీలు చేపట్టారు. నర్వాల్ ఏరియా రోజంతా రద్దీగా ఉంటుంది. ఇక్కడ వాహనాల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. కార్ల విడి భాగాలు, రిపేర్లు, మెయింటెనెన్స్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఓ వైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లోనే కొనసాగుతున్న తరుణంలో ఈ పేలుడు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలో నిఘా పెంచారు. చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై బీర్ తాగుతూ బిల్డప్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. -
కేరళలో ఘోర అగ్ని ప్రమాదం..పలువురికి గాయాలు
కేరళలోని ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపార సంస్థల్లోని సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ అడ్నిమాపక సిబ్బంది, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని సివిల్‌స్టేషన్ సమీపంలోని వ్యాపార సంస్థల్లో శుక్రవారం హఠాత్తుగా సిలండర్ పేలుడంతో జరిగింది. దీంతో సంఘటన స్థలానికి సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. మంటలు మరింత వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న దుకాణంలోని గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. దీంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ ప్లగ్ నుంచి వైర్ ముక్క తలకు తగలడంతో మరోక వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. గాయపడ్డ బాధితులను అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేగాదు మిగతా దుకాణాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలకుండా వాటిని తక్షణమే తరలించారు అధికారులు. ఈ మేరకు సంఘటనాస్థలికి మరిన్ని అగ్నిమాపక యంత్రాలు చేరుకుని త్వరిత గతిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఈ ప్రమాదం బారిని పడ్డారనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఆమె మరణించిన 15 ఏళ్లకు కీలక తీర్పు ఇచ్చిన కోర్టు) -
అమ్మా.. ఏమైందమ్మా.. లేమ్మా!
లేద్దామంటే శరీరం సహకరించదు.. తిందామంటే మేత లేదు.. యజమాని ఎక్కడో తెలియదు.. చుట్టూ ఎవరూ కనిపించరు.. అంబా అని అరిచినా పట్టించుకునే దిక్కు లేదు. మలమూత్రాలు చేస్తున్న చోట అలా కూలబడిపోయింది ఓ గోమాత. ఒకటి కాదు, రెండు కాదు, ఐదు రోజులు గడిచిపోయింది. అరిచీ అరిచీ నీరసించింది. ఓ దూడ తల్లి చుట్టూ తిరుగుతోంది. తల్లికి ఏమైందో తెలియక అక్కడక్కడే తచ్చాడుతోంది. మౌనంగా రోదిస్తూ.. తల్లికేసి చూస్తూ అలా నిల్చుండిపోతోంది. ఏమైందమ్మా.. లేమ్మా.. అన్నట్లు దీనంగా చూస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కర్నూలు: అది మండలంలోని క్రిష్టిపాడు గ్రామ శివారు ప్రాంతం. చుట్టూ పొలాలే తప్ప నివాస ప్రాంతాలు కనిపించవు. ప్రతిరోజూ రైతులు పొలం పనులు చేసుకుని వెళ్తున్నారు. అయితే ఎక్కడి నుంచో ఓ ఆవు అరుపులు వినిపిస్తున్నా, మంద నుంచి తప్పిపోయి ఉంటుందనుకుని మళ్లీ పనుల్లో ఉండిపోయారు. ఇలా ఐదు రోజులు గడిచిపోయాయి. జొన్న పైరు కావడంతో ఏపుగా పెరగడం, పొలం మధ్యలో ఆవు పడిపోవడంతో రైతులు గుర్తించే అవకాశం లేకపోయింది. చివరకు ఇక్కడే ఎక్కడో ఉన్నట్లుగా అనుమానించి అందరూ వెతకడంతో ఎట్టకేలకు గురువారం ఆనవాలు లభించింది. దగ్గరికి వెళ్లి చూడగా కుప్పకూలిన ఓ అవు, దాని పక్కనే దూడ కనిపించాయి. ఆవు వెనుక కాలు విరిగి గాయమవడంతో అక్కడే కూలబడింది. దూడ వయస్సు కూడా పది రోజులకు మించి ఉండదని తెలుస్తోంది. ఈ రెండూ ఐదు రోజులుగా నరకం అనుభవించాయి. ఈ దృశ్యం చూసి చలించిన రైతులు వెంటనే ఆవు, దూడకు నీళ్లు తాపించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనం గుర్తుకు వచ్చి 1962 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన సిబ్బందికి నిముషాల్లో అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం సర్జరీ కోసం ఆవుతో పాటు దూడను వాహనంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు తరలించారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. మారుమూల ప్రాంతానికి సంచార వాహనం రావడం.. మూగజీవి వేదన తీర్చే ప్రయత్నం చేయడం అందరి అభినందనలు అందుకుంది. -
షూటింగ్లో ప్రమాదం.. ది కశ్మీర్ ఫైల్స్ నటికి తీవ్రగాయాలు
ది కశ్మీర్ ఫైల్స్ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషికి తీవ్ర గాయాలయ్యాయి. కార్ ఛేజింగ్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న 'వ్యాక్సిన్ వార్' సినిమా షూటింగ్లో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. -
'బిచ్చగాడు' హీరోకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు దాదాపు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై భారీగా పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్–2 (బిచ్చగాడు-2) తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతుండడం ప్రత్యేకత. అయితే తాజాగా విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్‌లో పిచైక్కారన్- 2 సెట్లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ వాటర్ బోట్లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బిచ్చగాడు టాలీవుడ్‌లోనూ ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో అమ్మ కోసం 48 రోజుల పాటు రహస్య జీవితాన్ని గడిపే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు, హీరోగా పిచైక్కారన్- 2 చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ విజయ్, హరీష్ బెరాడి, వై.జి.మహేంద్రన్, అజయ్ ఘోష్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఈ ఏడాది తమిళరసన్, అగ్ని సిరగుగల్, ఖాకీ, కొలై, రథం, మజై పిడిక్కత మనితన్ లాంటి తమిళ ప్రాజెక్టుల్లో నటించనున్నారు. -
కేంద్ర మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం..
కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆదివారం రాత్రి బక్సర్ నుంచి పాట్నా వెళుతుండగా ఆయన కాన్వాయ్‌లోని ఓ పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. డుమ్రాన్‌లోని మథిలా-నారాయణపూర్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోల్తాకొట్టిన కారు కాలువలో పడటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అయిదుగురు పోలీసులతో సహా డ్రైవర్‌కు గాయలవ్వగా.. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీస్ వాహనం ప్రమాదానికి గురైన సమయంలో వెనకాలే కేంద్రమంత్రి కారు ఉండడం గమనార్హం. అయితే ఈ ఘటనలో కేంద్ర మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత సంఘటన స్థలానికి చెందిన ఓ వీడియోను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. ప్రమాదంలో బోల్తా పడిన ఎస్కార్ట్ వాహనాన్ని మంత్రి తనిఖీ చేయడాన్ని చూడవచ్చు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ‘బక్సర్ నుంచి పాట్నాకు వెళ్లే క్రమంలో కోరన్‌సరాయ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనం దుమ్రావ్ మథిలా-నారాయణపూర్ రహదారి వంతెన కాలువలో ప్రమాదానికి గురైంది. శ్రీరాముని దయవల్ల అందరూ క్షేమంగా ఉన్నారు. గాయపడిన పోలీసులు, డ్రైవర్‌ను డుమ్రావ్ సదర్ ఆసుపత్రికిలో చేర్చారు’ అని ట్వీట్ చేశారు. కాగా బీజేపీ నేత అశ్విని కుమార్ చౌబే ప్రస్తుతం కేంద్ర పర్యావరణం, అటవీ, వినియోగదారుల వ్యవహారాలు. ఆహారం ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. చదవండి: మధ్యప్రదేశ్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. बक्सर से पटना जाने के क्रम में डुमराव के मठीला-नारायणपुर पथ के सड़की पुल के नहर में कारकेड में चल रही क़ोरानसराय थाने की गाड़ी दुर्घटनाग्रस्त हो गई है। प्रभु श्रीराम की कृपा से सभी कुशल हैं। घायल पुलिसकर्मियों एवं चालक को लेकर डुमराव सदर अस्पताल जा रहा हूं। pic.twitter.com/ybTVi6jn5v — Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) January 15, 2023 -
కొత్త బట్టలు కొని వస్తుండగా ఘోరం
సాక్షి, రొద్దం: ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని బొక్సంపల్లి క్రాస్ సమీపాన పావగడ–పెనుకొండ ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందిగా, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల మేరకు తుమకూరు జిల్లా పావగడ తాలూకా వెంకటమ్మనళ్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం వివాహ వేడుకకు సంబంధించి కొత్త బట్టలు కొనడానికి కారులో బెంగళూరుకు వెళ్లారు. దుస్తులను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో ఉండగా, బొక్సవపల్లి క్రాస్ సమీపాన వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందన్నారు. తీవ్ర గాయాలతో వేణు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన కాంట్రాక్టర్‌గా పనిచేసేవారని తెలిసింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. గాయపడిన మృతుడి భార్య , పిల్లలు, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్వగ్రామంలో విషాదఛాయలు పావగడ: కారు ప్రమాదంలో కాంట్రాక్టరు, జేడీఎస్ నాయకుడు అయిన ఎగువపల్లి వేణు మరణంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వేణు తన బావమరిది పెళ్లికి బట్టలు, ఇతర సామగ్రి తీసుకువస్తూ ఉండగా కారు యాక్సిడెంట్ జరిగినట్లు బంధువులు తెలిపారు. మరో బంధువు అశ్వర్థప్పకు కాలు విరిగింది, వేణు భార్య భార్గవి, కుమారుడు వికాస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇంకా ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలై బెంగుళూరులో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్ లో చదువుతున్న మరో కుమారుడు నితిన్ వచ్చాక ఆదివారం అంత్యక్రియలు చేస్తారు. మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, జేడీఎస్ నాయకులు వేణు మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. (చదవండి: కర్ణాటకలో సంకీర్ణం వస్తుందా? కోడిమఠం స్వామీజీ జోస్యం ఇదే) -
నటుడికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఇన్స్పెక్టర్ అవినాష్ షూటింగ్ సమయంలో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడిపోయాడు. దీంతో వెంటనే అతన్ని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి అతనికి పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. నటుడి ఎడమ కాలికి గాయం కావడంతో దీనికి శస్త్రచికిత్స చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ సల్మాన్ ఖాన్‌తో రాధే సినిమా కోసం యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు రణదీప్ గాయపడ్డాడు. అప్పుడు ఆయన కుడి కాలుకు మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. రణదీప్ నటించనున్న ప్రాజెక్ట్‌లు రణ్‌దీప్ నటించబోయే వీర్ సావర్కర్ తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. తన రాబోయే చిత్రంలోని సావర్కర్ పాత్ర కోసం రణ్‌దీప్ హుడా చాలా బరువు తగ్గాడు. వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రకు సరిపోయేలా కఠినమైన డైట్‌ని పాటిస్తూ 22 కిలోల బరువు తగ్గారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఇప్పటికీ వరకు షెడ్యూల్ ప్రకటించలేదు. చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ క్యాట్‌లో కనిపించాడు. ఆ తర్వాత తేరా క్యా హోగా లవ్లీలో ఇలియానా డి'క్రూజ్‌తో కలిసి కనిపించనున్నాడు. -
రోడ్డు మధ్యలో...హఠాత్తుగా గొయ్యి! అటుగా వచ్చిన బైకర్..
సాక్షి, శివాజీనగర: బెంగళూరులో గుంతల రహదారులతో సతమతమవుతున్న నగరవాసులకు సింక్ హోల్ తరహా ముప్పు ఎదురైంది. ఆకస్మాత్తుగా రోడ్డు మధ్య భాగంలో నేల కుంగిపోగా, ఆ గుంతలోకి బైకిస్టు పడిపోయి గాయపడిన ఉదంతం గురువారం మధ్యాహ్నం సంభవించింది. గత మంగళవారం మెట్రో పిల్లర్ కడ్డీలు కూలిపడి తల్లీ కొడుకు మృతి చెందిన దుర్ఘటన మరువక ముందే ఈ తరహా సంఘటన కలకలం రేపుతోంది. ఏం జరిగిందంటే అశోకనగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వ్యాప్తిలో జాన్సన్ మార్కెట్ రోడ్డులో రోజులాగానే వాహనాలు వెళ్తుండగా రోడ్డు హఠాత్తుగా కుంగిపోయి 3 అడుగుల వ్యాసం, 3 మీటర్ల లోతుతో గొయ్యి ఏర్పడింది. వేగంగా వెళ్తున్న ఒక బైకిస్టు అదుపుతప్పి పడిపోవడంతో గాయాలు తగిలాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. నడి రోడ్డులో ఏర్పడిన ఈ సింక్ హోల్ అందరికీ ఆందోళన కలిగించింది. సమాచారం అందుకొన్న తూర్పు విభాగపు డీసీపీ కళా కృష్ణమూర్తి స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఈ రోడ్డు మొత్తాన్ని మూసివేసి ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. భూగర్భంలో మెట్రో రైల్ సొరంగ మార్గం పనుల వల్ల పైన రోడ్డు ఇలా కుంగిపోయిందని అనుమానం ఉంది. (చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?) -
సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి.. స్కూల్లో భోగి మంటలు అంటుకుని..
సాక్షి, కోనసీమ జిల్లా: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో భోగి మంటలు వేశారు. ఆ మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన విద్యార్థులను మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చదవండి: నాపై భర్త, అతడి ప్రియురాలి హత్యాయత్నం.. ఆత్మహత్య చేసుకుంటా.. -
అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం
సాక్షి, గజ్వేల్/జగదేవ్‌పూర్: వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని వస్తున్నామనే సంతోషం.. వారిలో కొద్ది గంటలు కూడా నిలవలేదు. మూలమలుపు దాటేవరకు సజావుగానే సాగిన ప్రయాణానికి మృత్యువు కాపుగాసిందన్న విషయం తెలియకుండానే పైలోకాలకు వెళ్లిపోయారు. అతివేగం ఆరుగురి ప్రాణాలను బలిగొన్నది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. యాదాద్రి–భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన బొల్లు సమ్మయ్య స్టీల్ సామాన్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య స్రవంతి కూడా చేదోడువాదోడుగా ఉంటుంది. వీరికి కూతురు భవ్య, కుమారుడు కార్తీక్ అలియాస్ లోకేష్ ఉన్నారు. అదే గ్రామంలోని మాంటిస్సోరి పాఠశాలలో భవ్య, ఏడో తరగతి, లోకేష్ 5వ తరగతి చదువుతున్నారు. సమ్మయ్య తన కుటుంబ సభ్యులతో పాటు బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన అత్తమామ రాజమణి–బిట్టు వెంకటేష్‌తో కలిసి రాజన్న దర్శనం చేసుకున్నాడు. మంగళవారం తిరిగి వస్తుండగా, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని మునిగడప వద్ద కాల్వలోకి కారు బోల్తా కొట్టిన ఘటనలో మృత్యువాత పడ్డారు. మూలమలుపు దాటాక.. ప్రమాద ఘటనలో అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తొంది. గ్రామంలోని ఎల్లమ్మగుడి వద్ద నిజానికి ప్రమాదకరమైన మూలమలుపు ఉంది. సహజంగా అక్కడ ప్రమాదాలు జరగడం పరిపాటి. కానీ ఈ మలుపు దాటిన కొద్ది క్షణాలకే కారు అదుపు తప్పింది. డ్రైవింగ్ చేస్తున్న సమ్మయ్య అజాగ్రత్త వహించాడా? వేరే కారణాలున్నాయా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌పై నిర్మించిన కల్వర్టును ఎడమ వైపున ఢీకొట్టిన కారు, అదుపుతప్పి మరింత వేగంతో కుడివైపునకు వెళ్లి అక్కడ మట్టిగడ్డను దాటి కెనాల్లో పడిపోయింది. ఈ క్రమంలో కెనాల్ పైభాగంలో ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను బలంగా తాకి గుంతలోకి తలకిందులుగా పడిపోయింది. ఆలయాల సందర్శనకు వెళ్లివస్తున్నప్పుడు సహజంగా మధ్యలో ఆగి దావత్‌లు చేసుకోవడం పరిపాటి. అంతేగాకుండా దైవదర్శనం సందర్భంలో నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం చూస్తుంటాం. తాజా ప్రమాదంలో ఈ రెండు కారణాలు కూడా ప్రభావం చూపాయా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవే కాకుండా మృతులు ప్రయాణించిన కారు కండిషన్ సక్రమంగా లేకపోవడం, అందులో ఆరుగురు ఇరుకుగా కూర్చోవడం కూడా ప్రమాదానికి మరో కారణంగా భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పారిశుధ్య కార్మికులు గమనించి హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు.మృతదేహాలను వెలికి తీయడంలో కీలకంగా వ్యవహరించారు. రోజువారి కూలీలే.. ప్రమాదంలో మృతి చెందిన వెంకటేష్, రాజమణి దంపతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. కాగా వీరి పూర్వీకులు గ్రామాల్లో భాగవతం ఆడేవారు. వీరు రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. రాజమణి గంపలో గాజులు, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లు ఇంటింటికి అమ్ముతూ ఉండగా, వెంకటేష్ గ్రామంలో ఎక్కడైన కూలి లభిస్తే వెళ్లేవాడు. లేని పక్షంలో బొమ్మలరామారం మండలంతో పాటు సమీప మండలాల్లో భాగవతం పాటలు పాడుతూ భిక్షాటన చేసేవాడు. అందరితో కలిసిమెలసి ఉండే ఈ దంపతులు ప్రమాదంలో మృతి చెందడంతో మల్యాల గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంట తీరని శోకం తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల బాధ వర్ణణాతీతంగా ఉంది. రాజమణి –వెంకటేష్ దంపతులకు కూతుళ్లు స్రవంతి, విజయ, కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. పెద్ద కూతురు స్రవంతి కుటుంబమంతా మృతి చెందగా, విజయకు గోదావరిఖని చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొడుకు శ్రీకాంత్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. కలిసిరాని సెంటిమెంట్ బీబీనగర్‌లోని దాసరి కుటంబాలకు చెందిన వారంతా ప్రతీ ఏడాది వారి ఆరాధ్య దైవమైన వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. రాజన్నను సోమవారం మాత్రమే దర్శించుకోవడం వీరికి సెంటిమెంట్. సమ్మయ్య కుటుంబం ఈ సంవత్సరం కూడా సోమవారమే రాజన్న దర్శనానికి వెళ్లగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయం వారి బంధువులకు తెలియడంతో బీబీనగర్, బొమ్మలరామారం, మల్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫోన్‌రాగానే గుండె పగిలింది ‘నిన్న మధ్యాహ్నం తర్వాత మా అమ్మనాన్న, బావ, అక్క పిల్లలతో కలిసి వేములవాడ పోయిండ్రు. మొక్కులు తీర్చుకొని ఇయ్యాల 12 గంటలకు బయలుదేరుతున్నమని నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు. సాయంత్రం 4 గంటల తర్వాత జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీవాళ్లకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతో ఒక్కటేసారి గుండె పగిలినట్టయింది’. అంటూ మృతుడు వెంకటేష్ కుమారుడు శ్రీకాంత్ రోదించాడు. తన తండ్రిని గజ్వేల్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించే క్రమంలో మాట్లాడారు. (చదవండి: ప్రమాదమా.. తగలబెట్టారా?) -
ఘెరం: కారు ట్రక్కు ఢీ..మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మృతి
పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మృతి చెందగా, ఒక మైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. వారంతో కారులో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు, ట్రక్కు ఘెరంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడికి తలకు తీవ్రగాయాలయ్యాయని, ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని బటాలాలో చోటు చేసుకుంది. వారు చాహల్ కలాన్‌లోని వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం బారిన పడ్డారని చెప్పారు. పంజాబ్‌లోని బటాలాకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య ) -
నెత్తురోడిన రహదారులు..రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
సాక్షి, కంటోన్మెంట్: నగరంలో ఉంటున్న కుమారుడిని చూసేందుకు నిర్మల్ నుంచి వచ్చిన వృద్ధ దంపతులు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన సంఘటన బోయిన్పల్లి చౌరాస్తాలో ఆదివారం చోటు చేసుకుంది.. నిర్మల్ నగరానికి చెందిన తులసీదాస్ (65), రాజమణి (62) దంపతులు నగరంలోని గచ్చిబౌలిలో ఉంటున్న తమ కుమారుడు రామరాజు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం నగరానికి వచ్చారు. మధ్యాహ్నం బోయిన్‌పల్లిలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపునకు వెళ్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు బస్సు డ్రైవర్ మార్గం నరహరి అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుమారుడు రామరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు బోయిన్పల్లి చౌరస్తాలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆగ్రహించిన స్థానికులు పోలీసులు, అధికారులకు కనువిప్పు కలగాలంటూ ఓ పక్క అంబులెన్స్‌లో మృతదేహాలు, ఆర్టీసీ బస్సును చూపిస్తూ ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం కుషాయిగూడ: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలోని మల్లాపూర్ అశోక్‌నగర్ కాలనీ మర్రిగూడ హెచ్‌పీ పెట్రోల్ పంప్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన రాజు మహతో నగరానికి వలసవచ్చి మల్లాపూర్‌లోని న్యూ నర్సింహనగర్లో కుటుంబంతో సహా నివాసం ఉంటూ ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం తోపుడుబండిపై ఉల్లిపాయలు విక్రయిస్తుండగా మర్రిగూడ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచి్చన కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి బావ నాగేందర్‌కుమార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి) -
ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు
నాసిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పలవురు కార్మికులు అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయారు. ఈ మేరకు మహారాష్ట్రలో నాసిక్‌లోని ముండేగావ్ గ్రామంలోని ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 11 గంటలకు భారీ బాయిలర్ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయని చెప్పారు. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 11 మంది కార్మికులను రక్షించారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Massive Fire After Explosion In Nashik Factory, Workers Feared Trapped https://t.co/QxhVRO0G1l pic.twitter.com/pJN6pDX6iC — Breaking News (@feeds24x7) January 1, 2023 (చదవండి: న్యూయర్ వేడుకల్లో రగడ..సెల్ఫీల కోసం వేరేవాళ్ల భార్యలతో బలవంతంగా..) -
రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సోదరుడి కుటుంబానికి గాయాలు
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుటుంబ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనుమడు ఉన్నారు. ఈ ప్రమాదంలో మోదీ మనుమడి కాలుకి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలతో బయటపడిన మోదీ కుటుంబ సభ్యులను మైసూర్‌లోని జేఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబంతో కలిసి మెర్సిడేస్ బెంజ్ కార్లో బందిపురాకు వెళ్తుండగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కాన్వాయ్ సైతం ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ -
ప్రేమోన్మాది దాడిలో ముగ్గురికి గాయాలు
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. యువతితో పాటు ఆమె అక్క, తల్లిపై దాడి చేసి గాయపర్చాడు. పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ కడియపులంకకు చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నెల 20న యువతి తండ్రికి ఫోన్ చేసి.. నీ చిన్న కుమార్తె నన్ను ప్రేమించకుంటే చంపేస్తా.. అంటూ బెదిరించాడు. అనంతరం శుక్రవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లాడు. యువతితో పాటు, ఆమె అక్క, తల్లిపై సుత్తితో దాడి చేసి గాయపర్చాడు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో తన మెడ, చేతిపై గాయపర్చుకున్నాడు. తల్లి, ఇద్దరు కుమార్తెలను బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వెంకటేష్‌ను అతడి స్నేహితులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కడియం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఉన్న బాధితులను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ చందననాగేశ్వర్, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పరామర్శించారు. ఇదిలా ఉండగా నిందితుడు దాసరి వెంకటేష్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అనుచరుడని గ్రామస్తులు చెబుతున్నారు. -
Bihar: బిహార్‌లో రాజుకున్న భూవివాదం.. ఐదుగురి మహిళలపై కాల్పులు
బిహార్‌లో ఒక్కసారిగా కాల్పుల కలకలం చోటు చేసుకుంది. భూమి పట్టా పొందిన ఐదుగురు మహిళపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జీఎంసీహెచ్ ఆస్పత్రి తరలించారు. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బిహార్‌లో బెట్టియాలోని జగదీష్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భూ యజమానులు, భూమిని పొందిన పట్టాదారులు మధ్య చెలరేగిన వివాదంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భూ వివాదం 1985 నాటిది. ఈ ఐదుగురు మహిళలు ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం భూ పట్టాలు పొందారు. ఐతే పూర్వపు భూ యజమానులు భూమిపై తమ హక్కును తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి నిందితులు మహిళలను భూమిపై హక్కును కోల్పోయేలా పలుమార్లు ఒత్తిడి చేశారు. కానీ మహిళలు అందుకు ససేమిరా అంటూ నిరసన తెలిపారు. దీంతో దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ మేరకు బెట్టియా ఎస్పీ ఉపేంద్రనాథ్ వర్మ మాట్లాడుతూ...ఇది పాత వివాదం అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన ఏడుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి భూమి గరిష్ట విస్తీర్ణ పరిమితి కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నట్లయితే దానిని ప్రభుత్వ లాక్కుంటుంది. (చదవండి: డిగ్రీ, పీజీ ప్రెగ్నెంట్ విద్యార్థులకు ప్రసూతి సెలవులు మంజూరు) -
పారిస్‌లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి
పారిస్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, నలుగురికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సెంట్రల్ పారిస్‌లోని కుర్దిష్ సాంస్కృతిక కేంద్రం పరిసరాల వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిందని పారిస్ పోలీసులు చెబుతున్నారు. నిందితుడు 60 ఏళ్ల షుటర్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఒక దుకాణదారురాలు తాను సుమారు ఏడు నుంచి ఎనిమిది దాక కాల్పుల షాట్లు విన్నానని, భయంతో లోపల లాక్ చేసుకుని ఉండిపోయినట్లు పోలీసులుకు తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమై నిందితుడి పట్టుకున్నందుకు భద్రతా దళాలకు డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ ట్వీట్టర్లో ధన్యవాదాలు తెలిపారు. ALERTE - Fusillade à Paris : plusieurs blessés dans le 10eme arrondissement. Police sur place. Un suspect interpelé. pic.twitter.com/mbQFl2a0vf — Clément Lanot (@ClementLanot) December 23, 2022 (చదవండి: ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్) -
షాకింగ్ ప్రమాదం: జనాల మీదకు దూసుకొచ్చిన టెంపో, ఆపై..
-
షాకింగ్ ఘటన:రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఒక టెంపో హైవేకి సమీపంలో ఉన్న ధాబా (రోడ్డు సైడ్ రెస్టారెంట్)లోకి దూసుకొచ్చింది. సరిగ్గా ఆ సమయంలో రెస్టారెంట్లో సుమారు 8 నుంచి 10 మంది దాక కస్టమర్లు ఉన్నారు. ఈ అనుహ్య ఘటనలో ముగ్గరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ టెంపో అదుపు తప్పి వేగంగా ధాభాలోకి దూసుకురావడంతో రెస్టారెంట్‌లోని గోడను ఢీకొట్టి ఫర్నీచర్‌ని ధ్వంసం చేస్తూ..పలువురు పైకి దూసుకుపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అవ్వడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే ఆ సమయంలో టెంపో ఖాళీగానే ఉందని డ్రైవర్ మాత్రం తప్పించుకున్నాడని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. સરોલીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે. સરોલીમાં આવેલ બાપા ના બગીચા નામના ઢાભામાં બુલેરો પિકઅપ વાન ઘુસી જતા 3 લોકો કચડાયા@CP_SuratCity @TrPoliceSurat #ACCIDENT #suratcity #Surat pic.twitter.com/dumHqOW9OW — journalist Sharif Shaikh (@PatrkarShaikh) December 19, 2022 (చదవండి: గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందండి) -
షాకింగ్ ఘటన: అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు...ముగ్గురికి గాయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతీ బ్రెజ్ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకురావడంతో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో గులాబీ బాగ్‌లోని లీలావతి పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. ఐతే ఆ కారు అదుపుతప్పి అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చింది. అక్కడ ఉన్న పిల్లలను ఢీకొని కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు టైరు పేలి ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కొందరూ చిన్నారులకు సాయం అందించగా, మరికొందరూ సదరు కారు డ్రైవర్ని అడ్డుకుని అందులోని మరో వ్యక్తిని బంధించారు. ఆ తర్వాత ఆ ఇద్దర్నీ పోలీసులుకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రాంతంలో చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు. వాస్తవానికి ఆ సమయంలో డ్రైవర్ తాగి ఉన్నాడని, ఈ ప్రాంతంలో పాఠశాల ఉందని స్థానికులు హెచ్చరించిన తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా దురుసుగా ప్రవర్తించాడని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, గాయపడిన ఇద్దరు చిన్నారులు పరిస్థితి నిలకడగానే ఉంది. మరో ఆరేళ్ల బాలుడు మాత్రం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Delhi: A speeding car hits three children in Gulabi Bagh area this morning, two children received minor injuries while the third is critical but stable and admitted to a hospital: Delhi Police (Note: Graphic content, CCTV visuals) pic.twitter.com/1HAc4qyqGk — ANI (@ANI) December 18, 2022 (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసు: యువతి తల్లి మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లోని ప్రేమోన్మాది దాడి కేసులో తీవ్రంగా గాయపడిన యువతి తల్లి శోభ మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. కాగా మియాపూర్‌లో సందీప్ అనే యువకుడు ప్రియురాలు వైభవీ ఆమె తల్లి శోభపై కత్తితో దాడి చేసి..తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ తల్లి కూతుళ్ల వైభవీ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిందితుడు సందీప్ కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐతే ప్రస్తుతం సందీప్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఈఎన్టీ వైద్యులు తెలిపారు. అసలేం జరిగిందంటే గుంటూరు జిల్లా ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ దంపుతుల కుమార్తె శోభ, నిందితుడు సందీప్ గతంలో ప్రేమించకున్నారు. ఇంట్లో వాళ్లు మందలించడంతో సందీప్‌ని దూరంగా ఉంచడమే గాక ఆమెకు మరోకరితో వివాహం నిశ్చయించారు. వచ్చే ఆదివారం నిశ్చితార్థం కాగా, ఈ విషయం తెలుసుకున్న సందీప్ కోపంతో వైభవీ ఇంటికి వచ్చి గొడవ చేసి.. కత్తితో తల్లి కూతుళ్లపై దాడి చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరి అరుపులు విని స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత) -
పెళ్లింట విషాదం.. గ్యాస్ బండ పేలి ఐదుగురి మృతి
జైపూర్: రాజస్తాన్ పెళ్లి వేడుకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వివాహ విందు కోసం వంటలు తయారు చేస్తుండగా.. రెండు గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ లీక్ అయ్యి పేలుడు సంభవించింది. దీంతో ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, సుమారు 60 మంది దాక గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భుంగ్రా గ్రామంలో చోటుచేసుకుంది. పేలుడు ధాటికి పెళ్లి జరుగుతున్న ఇంటిలోని ఓ భాగం కుప్పకూలింది. ఇది చాలా తీవ్ర స్థాయిలో చోటు చేసుకున్న పేలుడుగా అధికారులు పేర్కొన్నారు. గాయపడిన 50 మందిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నాట్లు వెల్లడించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు గుప్తా తెలిపారు. అలాగే రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ ఈ రోజు సాయంత్రం ఆస్పత్రిలో గాయపడిన వారిని పరామర్శించే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: కన్న తల్లే కర్కశంగా..చిన్నారులపై పెట్రోల్ పోసి..) -
దువ్వాడ రైల్వే స్టేషన్ లో గాయపడ్డ విద్యార్థిని శశికళ మృతి
-
స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 150 మందికి పైగా గాయాలు
స్పెయిన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 39 మంది వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. బార్సిలోనా సమీపంలోని మాంట్‌కాడా స్టేషన్ వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో స్టేషన్లో పార్క్ చేసిన ఉన్న రైలును వెనక నుంచి వచ్చిన మరో రైలు ఢీకొట్టిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు చాలా నెమ్మదిగా కదులుతుండటం వల్ల ఎవరికి తీవ్ర గాయాలు అవ్వలేదని చెప్పారు. రైలులో నిలబడి ఉన్న వారు ఎక్కువ గాయపడినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. .ఈ ఘటన కారణంగా సదరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు దిశలలో రైలు ట్రాఫిక్ నిలిపివేశారు. చదవండి: జిన్‌పింగ్ సౌదీ పర్యటనతో..టెన్షన్లో పడిన అమెరికా -
గీతకార్మికుడి నరకయాతన
నల్గొండ: తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారడంతో గీతకార్మికుడు చెట్టుపైనే తలకిందులుగా వేలాడుతూ నరకాన్ని చూశాడు. ఈ సంఘటన మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లి గ్రామానికి చెందిన ఇట్టగోని ముత్యాలు కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజుమాదిరిగా మంగళవారం గ్రామ సమీపంలో తాటిచెట్టు ఎక్కుతుండగా ఒక్కసారిగా మోకు జారడంతో చెట్టుపైనే తలకిందులుగా వేలాడాడు. కొంతసేపటి తర్వాత స్థానికులు గమనించి హుటాహుటిన గ్రామం నుంచి నిచ్చెనలు తీసుకొచ్చి ముత్యాలును కిందికి దింపి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. -
జాగ్రత్తగా నడపమన్నందుకు... కారుతో ఢీకొట్టారు
మైసూరు: కారును ఇష్టానుసారంగా నడుపుతుండటంతో జాగ్రత్తగా నడపాలని చెప్పిన ముగ్గురు యువకులను అదే వాహనంతో ఢీకొట్టిన ఘటన మైసూరు నగరంలోని టీకే లేఔట్లో చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో ప్రజ్వల్, రాహుల్, ఆనంద్ అనేవారు ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు... మంగళవారం ఉదయం వాసు, అతని తండ్రి దర్శన్ ఫార్చునర్ కారులో రోడ్డుపై అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడంతో అక్కడే ఉన్న ప్రజ్వల్, రాహుల్, ఆనంద్ వారిని మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన వాసు, అతని తండ్రి కారుతో వెనక్కి వచ్చి ప్రజ్వల్, రాహుల్, ఆనంద్‌లను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రజ్వల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సరస్వతీ పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ఏడు నెలల క్రితమే పెళ్లి.. వివాహేతర సంబంధం కారణంగా..) -
బస్టాప్‌లో ఉన్న ప్రజలపైకి దూసుకొచ్చిన ట్రక్కు...ఆరుగురు మృతి
భోపాల్: ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు ప్రజల మీదకి దూసుకురావడంతో ఆరుగురు మృతి చెందగా, పదిమందికి పైగా గాయపడ్డారు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లోని బస్టాప్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ట్రక్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం సాయంతం జరిగిందని పోలీసులు తెలిపారు. రత్లామ్ జిల్లాలో రోడ్డు పక్కన బస్టాప్ వద్ద నిలబడి ఉన్న వ్యక్తుల గుంపుపైకి దూసుకొచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, పదిమంది దాక గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదంలో రెండు మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయని వెల్లడించారు. లారీ డ్రైవర్ పరారయ్యడని అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: హత్య చేసి తప్పించుకోవాలనుకుంది..తల్లిని పట్టించిన 13 ఏళ్ల కూతురు) -
ఆనందంగా విహారయాత్రకు బయల్దేరారు...అంతలోనే...
కెలమంగలం: వారాంతం కావడంతో అందరూ కలిసి పర్యాటక ప్రాంతంలో సరదాగా గడపాలని బయల్దేరారు. కానీ విధి వక్రించడంతో యాక్సిడెంట్‌కు గురయ్యారు. బెంగళూరులోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న మిత్రులు కారులో క్రిష్ణగిరి జిల్లాలోని హొగెనకల్ విహారానికి వెళ్తుండగా అంచెట్టి సమీపంలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక యువతి, మరో యువకుడు అక్కడికక్కడే మరణించారు. ఏడు మంది స్కార్పియోలో.. వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిరాజ్ సురేష్ (24), ప్రవీణ (24), సయ్యద్ అమీ ర్సల్మాన్ (24), మణికంటేశ్వర (33), జార్ఖండ్‌కు చెందిన అమ్మన్ కుమార్ (24), బీహార్‌కు చెందిన రిషికుమార్ (24), అభయ్‌కుమార్ (24)లు బెంగళూరులో నివాసముంటూ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. శనివారం ఉదయం 7 మందీ కలిసి హొగేనకల్ను చూడాలని ఆంధ్ర రిజి్రస్టేషన్ (ఏపీ 39 బీకే 1289) స్కారి్పయో కారులో బయలుదేరారు. అతివేగంతో పల్టీ డెంకణీకోట –హొగెనకల్ రోడ్ అంచెట్టి సమీపంలోని శేషురాజపురం వద్ద అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిరాజ్ సురేష్, ప్రవీణలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అంచెట్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయాలపాలైన నలుగురిని చికిత్స కోసం అంచెట్టి పీహెచ్‌సీకి, అక్కడి నుంచి డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. తీవ్రంగా గాయపడినవారు స్పృహలో లేకపోవడంతో ఏ జిల్లావాసులన్నదీ తెలియాల్సి ఉంది. (చదవండి: కిరాతక భర్త.. భార్య పిల్లలపై పెట్రోల్ పోసి..) -
షూటింగ్లో గాయపడ్డ ప్రముఖ హీరోయిన్
ప్రముఖ కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది షూటింగ్లో గాయపడింది. వివరాల ప్రకారం.. రాగిణి ద్వివేది ప్రస్తుతం ‘‘నన్నొబ్బ బరతియా’’ అనే కన్నడ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదవశాత్తూ ఆమె ఎడమ చేతికి గాయమైంది. దీంతో వెంటనే షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన మూవీ టీం ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా కోలుకున్నాక తిరిగి ఆమె షూటింగ్లో పాల్గొననుంది. ఇక తన గాయానికి సంబంధించిన ఫోటోను రాగిణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. మీ శరీరం దేన్నైనా తట్టుకోగలదు. మీరు ఒప్పించాల్సింది మీ మనస్సు. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అంటూ రాసుకొచ్చింది. కాగా 2009లో వచ్చిన ‘వీర మడక్కరి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాగిణి‘‘జెండాపై కపిరాజు’’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. View this post on Instagram A post shared by Ragini dwivedi (@rraginidwivedi) -
మొదటి భర్త ఘాతుకం...తనని కాదని మరో పెళ్లి చేసుకుందని పెట్రోల్‌తో...
హిమాయత్‌నగర్: తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ యువకుడు తన మాజీ భార్య, ఆమె భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పది నెలల చిన్నారి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి నారాయణగూడ ఎక్స్‌రోడ్ సమీపంలోని జీహెచ్ఎంసీ మార్కెట్‌వద్ద చోటు చేసుకుంది’. డయల్–100 ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులు స్థానికుల సాయంతో బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం క్లూస్‌టీం వివరాలు సేకరించింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అంబర్‌పేటకు చెందిన నాగుల సాయి, చిక్కడపల్లి మునిసిపల్ మార్కె ట్ ప్రాంతానికి చెందిన ఆర్తీ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. నాగుల సాయి బ్యాండ్ కొట్టే పనిచేస్తుండగా ఆర్తీ నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో పూలు విక్రయించేది. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో రెండేళ్ల క్రితం ఆర్తీ అతడి నుంచి విడిపోయి తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్లతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లికి చెందిన ట్యాంక్ క్లీనర్ నాగరాజుతో పరిచయం ఏర్పడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తనని వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆర్తిని, ఆమె వివాహం చేసుకున్న నాగరాజు, అన్ని విషయాల్లో తనకు అడ్డుపడుతున్న ఆర్తి సోదరుడు జితేందర్‌ను అంతమొందించేందుకు నాగుల సాయి రెండేళ్ల క్రితమే కుట్ర పన్నాడు. భార్యను అంతమొందించేందుకు ఆమె వద్దకు వెళ్లగా జితేందర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో జితేందర్‌పై నాగుల సాయి దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నాగుల సాయిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏడాది క్రితం మరోసారి నారాయణగూడ పరిధిలో నాగులసాయిపై కేసు నమోదైంది. దీంతో వారిపై కక్ష పెంచుకున్న నాగుల సాయి ఈసారి పక్కాగా హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి జగ్గులో పెట్రోల్ తీసుకువచ్చి ఆర్తీ, భర్త నాగరాజులపై చల్లి నిప్పటించాడు. ఆ పెట్రోల్ ఆర్తీ ఒడిలో ఉన్న చంటిపిల్లాడు విష్ణుపై (10 నెలలు) కూడా పడింది. దీంతో ముగ్గురూ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఆర్తీ, నాగరాజులకు 50శాతం గాయాలవ్వగా..90 శాతం గాయపడిన చిన్నారి విష్ణును గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు నాగుల సాయి కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి..) -
భయంకరమైన కారు స్టంట్..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
గురుగ్రామ్: ఎనిమిది మంది యువకుల చేసిన కారు స్టంట్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురగ్రామ్‌లో సుమారు అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఎనిమిది మంది యువకు మూడు కార్లతో మద్యం దుకాణం వద్ద రాత్రి 2 గంటల సమయంలో కారుతో స్టంట్స్ చేశారు. ఆ ఎనిమిది మంది మారుతి ఎర్టిగా, హ్యుందాయ్ వెన్యూ, హ్యందాయ్ క్రెటా అనే మూడు కార్లతో స్టంట్లు చేశారు. తొలుత సౌరభ అనే వ్యక్తి తన కారుతో స్టంట్ చేశాడు. తదనంతరం రెండు స్టంట్‌లో మద్యం దుకాణం వెలుపల ఉన్న ముగ్గురు వ్యక్తులన ఘోరంగా ఢీ కొట్టాడు. దీంతో 50 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తుల తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు నిందితులు సౌరభ్ శర్మ అలియాస్ సాయిబీ, రాహుల్, రవి సింగ్ అలియాస్ రవీందర్, వికాస్ అలియాస్ విక్కీ, మోహిత్, ముకుల్ సోని, లవ్లుగా గుర్తించి అరెస్టు చేయగా, అశోక్ అనే మరో నిందితుడిని సాయంత్రం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు సోదరులని, వారంతా మద్యం సేవించి ఈ స్టంట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ ఉన్న సీసీఫుటేజ్ తనిఖీ చేయగా సుమారు 10 నుంచి 12 మంది యువకులు మద్యం దుకాణం ముందు కార్లతో విన్యాసాలు చేయడం కనిపించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. #Gurugram में मौत की स्टंटबाज़ी, Wine Shop के बाहर स्टंट करते हुए तीन लोगों को मारी टक्कर एक बेगुनाह की मौत @gurgaonpolice pic.twitter.com/edZYWDB39e — Sunil K Yadav 🇮🇳 (@SunilYadavRao) November 7, 2022 (చదవండి: గుట్కా తినండి, మందు తాగండి.. సేవ్ వాటర్!: బీజేపీ ఎంపీ కామెంట్ల దుమారం) -
అమ్మో కుక్క...పీకేస్తుంది పిక్క
ఈ బాలుడు రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. గత నెల 28న స్కూల్‌కు వెళుతుండగా వీధి కుక్క కరిచింది. అదే సమయంలో పక్కనే మరో విద్యార్థుని సైతం గాయపరిచింది. మధ్యాహ్నం మరొకరిని, సాయంత్రం ట్యూషన్‌కు వెళుతున్న మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. ఒక్క రోజే ఐదుగురు విద్యార్థులు కుక్కకాటుకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ పరిస్థితి ఒక్క రాయదుర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా నిత్యం చోటు చేసుకుంటున్నాయి. వెలుగు చూస్తున్నవి కొని...వెలుగులోకి రానివి మరెన్నో.... రాయదుర్గం: పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో సంచరిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. కాలినడకన వెళుతున్న వారే కాదు.. పశువులు, మేకలు, గొర్రెలు, ద్విచక్ర వాహన చోదకులు సైతం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడుతున్నారు. మూడు నెలల్లో 2,978 కేసులు కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన మూడు నెలల్లో 2,978 మంది కుక్కకాటుకు గురయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారం క్రితం రాయదుర్గంలోని దాసప్ప రోడ్డు, చికెన్ మార్కెట్ ప్రాంతాల్లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిక్కలు పీకేశాయి. ఇక ద్విచక్ర వాహనాల వెంట పడుతూ బెంబేలెత్తిస్తుండడంతో పలువురు ప్రమాదాలకు గురైన ఘటనలూ కోకొల్లలుగా ఉన్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాప్తాడుతో పాటు అనంతపురం నగర పాలక సంస్థలోనూ కుక్కకాటు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి నియంత్రణ, సంరక్షణ కోసం రూ. లక్షలు ఖర్చు చేస్తున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. వ్యర్థాలతో అనర్థాలు పట్టణ, గ్రామీణ, నగర ప్రాంతాల్లోని పలు చికెన్ సెంటర్ నిర్వాహకులు వ్యర్థాలను రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. వీటి కోసం పదుల సంఖ్యలో కుక్కలు గుమికూడి పోట్లాడుకుంటూ రోడ్డున వెళుతున్న వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కోడిమాంసాన్ని అధికంగా తినడంవల్ల తరచూ దుష్ప్రభావాలకు గురికావాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్లలో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, ఎస్చెరిచియా కోలి వంటి బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయని, సరిగా ఉడికించకపోతే ఈ బ్యాక్టీరియా మనిషిలో అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుందని వివరిస్తున్నారు. పచ్చి మాంసం, వ్యర్థాలను తినడం వల్ల కుక్కల్లో పలు రకాల వ్యాధులు వ్యాపిస్తాయని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తూ కనిపించిన వారిపై దాడికి తెగబడుతాయని అంటున్నారు. చర్యలు తీసుకుంటాం గతంలో రీజియన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఏబీసీ కేంద్రానికి వీధికుక్కలు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేవాళ్లం. కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఇటీవల కుక్కల బెడద ఎక్కువైంది. వీటి నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. – దివాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం అందుబాటులో టీకా జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రిలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో కుక్క కాటుకు టీకా అందుబాటులో ఉంది. కుక్క కాటు బాధితులు అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో టీకా వేయించుకోవచ్చు. శీతాకాలంలో కుక్కకాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కరిచే కుక్కలు ఉంటే ముందస్తుగా వాటికి రేబిస్ టీకా వేయించాలి. – డాక్టర్ విశ్వనాథయ్య, డీఎంహెచ్ఓ, అనంతపురం (చదవండి: బరితెగించిన టీడీపీ నేతలు.. 20కోట్ల ల్యాండ్ కోసం కలెక్టర్ పేరుతో..) -
తీవ్ర విషాదం: కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 131 మంది సందర్శకుల మృతి
మోర్బీ/న్యూఢిల్లీ: మాటలకందని మహా విషాదం. సెలవు రోజున నదిపై జరిపిన సరదా విహారం ప్రాణాంతకంగా మారిన వైనం. గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లాలోని మోర్బీ పట్టణంలో ఆదివారం సాయంత్రం 6.30 సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మణి మందిర్ సమీపంలో మచ్చూ నదిపై ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ అయిన 140 ఏళ్ల నాటి వేలాడే తీగల వంతెన ప్రమాదవశాత్తూ తెగి కుప్పకూలిపోయింది. దాంతో వంతెన రెండుగా విడిపోయింది. ఆ సమయంలో వంతెనపై మహిళలు, చిన్నారులతో సహా 400 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. వారిలో చాలామంది 100 మీటర్ల ఎత్తు నుంచి హాహాకారాలు చేస్తూ నదిలోకి పడిపోయారు. ఆ విసురుకు 100 మందికి పైగా గల్లంతయ్యారు. 132 మందికి పైగా నీట మునిగి దుర్మరణం పాలైనట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని వెల్లడించారు. ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. వారిలో పలువురు నదిలోకి కుంగిపోయిన వంతెనపై వేలాడుతూ కాపాడండంటూ ఆక్రందనలు చేశారు. పైకెక్కేందుకు విశ్వప్రయత్నం చేశారు. #Morbi ब्रिज में दुर्घटना से पहले कुछ युवकों का झुंड केबल को पैरों से मारकर अपनी जगह से खींचते कैमरे में कैद हुआ है। आपिये गुजरात को बदनाम करने के लिए किसी भी हद तक जा सकते हैं। pic.twitter.com/atpJXRJDPT — Prashant Umrao (@ippatel) October 30, 2022 ఆదివారం గుజరాత్లో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో పర్యాటకులు. ప్రమాదం గురించి తెలిసి సహాయక చర్యలు మొదలవడానికి కనీసం గంట సమయం పట్టింది. అప్పటికే అత్యధికులు నిస్సహాయంగా అసువులు బాశారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు, పసివాళ్లేనని తెలుస్తోంది. సాయమందేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. వారి హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డవాళ్లు, స్థానికులు వీలైనంత మందిని కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం ప్రభుత్వ సిబ్బంది వారికి జత కలిశారు. బాధితులను పడవల్లో ఒడ్డుకు చేర్చారు. Saddened by the terribly tragic news coming from #Morbi in #Gujarat, a renovated cable bridge reopened 5 days ago came crashing down killing 60 people and leaving several hundred people injured. My condolences and prayers to the families who have lost their dear ones. pic.twitter.com/jRahvZVDki — K C Venugopal (@kcvenugopalmp) October 30, 2022 తెగిన బ్రిడ్జిపై చిక్కుబడ్డ బాధితులు జాతీయ విపత్తు సహాయక బృందాలూ రంగంలోకి దిగాయి. అర్ధరాత్రి దాటాక కూడా వెలికితీత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సామర్థ్యానికి మించిన భారమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి ముందు చాలామంది వంతెనపై గంతులు వేస్తూ, దాని వైర్లను లాగుతూ కన్పించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వంతెన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు తదిరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్‌లోనే ఉన్న మోదీ దీనిపై సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ వచ్చారు. బాధితులకు అవసరమైన అన్నిరకాల సాయమూ అందించాలని ఆదేశించారు. సీఎం అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు కేంద్ర, రాష్ట్రాలు చెరో రూ.50 వేలు ఇవ్వనున్నాయి. మోదీ అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్ షోను ప్రమాదం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. -
కొంపముంచిన ఫైర్ హెయిర్ కట్... నిప్పుతో చెలగాటం వద్దు!
గుజరాత్: యువకులు రకరకాల హెయిర్ స్టైయిల్స్లో కటింగ్ చేయించుకునేందుకు ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే ఇటీవల ఫైర్ హెయిర్ కట్ స్టైయిల్ మంచి క్రేజీ స్టైయిల్‌గా మారింది. దీంతో యువత ఆ ట్రెండ్ స్టెయిల్నే ఫాలో అవుతున్నారు. అచ్చం అలానే ఒక యువకుడు ఆ స్టైయిల్లోనే జుట్టు కట్ చేయించుకుందామని బార్బర్ షాపు కెళ్లి భయానక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. వివరాల్లోకెళ్తే...ఇటీవల మంచి ట్రెండీగా ఉన్న ఫైర్ హెయిర్ కట్ స్టేయిల్లో కట్ చేయించుకుందామని ఒక యువకుడు మంచి పేరున్న సెలూన్‌కి వెళ్లాడు. అయితే ఈ హెయిర్ కట్ని మంటతో హెయిర్‌ని స్టైయిలిష్‌గా కట్ చేస్తారు. అదే ఇందులోని ప్రత్యేకత. అందులో భాగంగా హెయిర్‌కి ఒక విధమైన లిక్విడ్ కెమికల్ని రాసి కటింగ్ స్టార్ట్ చేస్తే ప్రమాదవశాత్తు భగ్గుమని మంటలు అతని తలభాగం, మెడ వరకు వ్యాపించాయి. దీంతో సదరు యువకు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఈఘటన బుధవారం గుజరాత్లో వలసద్ జిల్లాలో వాపీ అనే సిటీలోని సెలూన్లో చోటు చేసుకుంది. దీంతో సదరు వ్యక్తిని హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితుడు నుంచి, సదరు సెలూన్‌లోని హెయిర్ కటింగ్ చేసిన బార్బర్ వద్ద నుంచి వాగ్ములం తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: కుమారుడు, భార్య తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా..) -
తనిఖీలు చేస్తుండగా గాయపడ్డ నితీష్‌కుమార్
పట్నా: బిహార్‌లో గంగానది ఒడ్డున అట్టహాసంగా జరిగే ఛత్ పూజ నిమిత్తం ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఘాట్ల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఆయన కాసేపు విలేకరులతో ముచ్చటించారు. ఐతే ఈ వారం తనిఖీలు పడవలో కాకుండా కారులో పర్యవేక్షిస్తున్నారేంట? అని విలేకరులు నితీష్‌ని ప్రశ్నించారు. దీంతో నితీష్ కుమార్ వివరణ ఇస్తూ... గతవారం తాను పడవలో తనిఖీలు చేస్తుండగా తమ బోటు జేపీ స్తంభాన్ని ఢీ కొట్టిందని తెలిపారు. దీంతో తాను గాయపడ్డానంటూ తన కుర్తా ఎత్తి మరీ బ్యాండేజ్‌లను చూపించారు. ఐతే పడవలో ఉన్నవారందరు సురక్షితంగా ఉన్నారని, తమను వేరే పడవలో తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో తన కాలికి కూడా గాయమైందని చెప్పారు. తన పొట్టకు బ్యాండేజ్‌ఉండటంతోనే సీటు బెల్టు వేసుకోలేక కారు ముందు సీటులో కూడా కూర్చొలేదని వివరణ ఇచ్చారు. ఛత్‌పూజ బిహార్‌లో అత్యంత ప్రసిద్ధమైన పండుగ, అందువల్ల మూడు రోజుల పాటు గంగానది వద్ద ఉండే ఘాట్లన్నీ జనసందోహంతో కిటకిటలాడుతుంటుంది. (చదవండి: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు సోనియా అభినందనలు) -
ఛీ ఏం మనుషులు! చావుబతుకుల మధ్య కొట్టమిట్టాడుతుంటే ఫోటోలా!
లక్నో: ఒక యువతి తీవ్రగాయలపాలై నిస్సహాయ స్థితిలో ఉంటే స్థానికులు సాయం అందించకపోగా చుట్టూ చేరి మొబైల్ ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజ్‌లో చోటు చేసుకుంది. ఆ యువతి ఇంటి నుంచి అదృశ్యమైన కొద్ది గంటల్లోనే తీవ్ర గాయాలపాలై కనిపించింది. ఆ 13 ఏళ్ల బాధిత యువతికి తలతో సహ ఒంటిపై పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఒకవైపు నుంచి సాయంచేయమంటూ అక్కడ ఉన్నవారిని అభ్యర్థిస్తుంది. కానీ అక్కడ ఉన్న స్థానికులంతా ఆమె చుట్టూ చేరి సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసే బిజీలో ఉన్నారు. ఒక్కరూ కూడా పోలీసులు వచ్చేదాకా ఆమెకు ఎలాంటి సాయం అందించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు బాధిత యువతిని ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ కున్వార్ అనుపమ్ సింగ్ తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఆమెపై లైంగికదాడి జరిగిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదని, అలాగే ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. (చదవండి: వాతావరణ కార్యకర్తకు షాక్..! ఫేస్బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా మొబైల్ కొట్టేసిన స్నాచర్) -
వీర శునకం... ఉగ్రదాడిలో రెండు బుల్లెట్లు దిగినా లెక్కచేయక....
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సెర్చ్ చేసే ఆపరేషన్ని ప్రారంభించాయి. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు, భధ్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్ దాడిలో ఆర్మీ కుక్క తీవ్రంగా గాయపడింది. తొలుత ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి 'జూమ్' అనే ఆర్మీ కుక్కను పంపినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిపై దాడి చేసి, చేజ్ చేసే పనిలో భాగంగా జూమ్ ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఆ సమయంలోనే కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించగా, పలువురు జవాన్లు గాయపడ్డారు. ఆ తర్వాత అధికారులు జూమ్‌ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కుక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ జూమ్ అనే కుక్క అత్యంత శిక్షణ పొందిన క్రూరమైన, నిబద్ధత కలిగిన కుక్క అని చెప్పారు. అంతేగాదు ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి పట్టుకోవడంలో అత్యంత తర్ఫీదు పొందిందని కూడా తెలిపారు. #WATCH | In an operation in Kokernag, Anantnag, Army's dog 'Zoom' attacked terrorists & received 2 gunshot injuries. In spite of that, he continued his task which resulted in neutralisation of 2 terrorists. The canine is under treatment in Srinagar, J&K. (Source: Chinar Corps) pic.twitter.com/D6RTiWqEnb — ANI (@ANI) October 10, 2022 (చదవండి: సింహం పిల్లలే కదా అనుకుంటే ఇట్లుంటది.. ఒక్క గాండ్రింపుతో హడల్) -
భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో...
రాజస్తాన్: ఆరు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐతే ఈ ఘటనలో వరసగా ఆరు సిలిండర్లలో పేలుడు సంభవించిందని, దీంతో పలు వాహనాలు దారుణంగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు సకాలంలో స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన జోథ్‌పూర్‌లో మంగ్రా పుంజ్లా ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాలనీలో చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారని, దాదాపు 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ఐతే దర్యాప్తులో ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్‌కి అక్రమంగా రీఫిల్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తేలింది. ప్రస్తుతం క్షతగాత్రులు జోథ్‌పూర్‌లోని మహాత్మగాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన సిలిండర్ ప్రమాదం మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం. (చదవండి: బస్సులో చెలరేగిన మంటలు.. 11 మంది సజీవ దహనం) -
రావణ దహనంలో అపశ్రుతి... ప్రజలపైకి దూసుకొచ్చిన దిష్టిబొమ్మ
న్యూఢిల్లీ: దేశంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చివరిరోజు విజయదశమి సంబరాలు మిన్నంటాయి. అదీగాక విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన గుర్తుగా పలుచోట్ల రామలీల ప్రదర్శనలతోపాటు, రావణదహనం చేస్తుంటారు. అచ్చం అలానే హర్యానాలో కూడా రావణదహనం చేస్తుండగా... పెనుప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా రావణుడి దిష్టిబొమ్మ ప్రజలపైకి దూసుకువచ్చింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్లో బుధవారం చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. #WATCH | Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH — ANI (@ANI) October 5, 2022 (చదవండి: చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు) -
చీతా హెలికాప్టర్ క్రాష్ ...పైలెట్ మృతి
న్యూఢిల్లీ: చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ కూలిపోయినట్లు భారత ఆర్మీ పేర్కొంది. ఈ ఘటనలో పైలెట్, మృతి చెందగా, కో పైలెట్ తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించింది. ఈ ప్రమాదం తవాంగ్ ప్రాంతంలో ఉదయం 10 గం.ల సమయంలో జరిగినట్లు తెలిపారు. ఈ చీతా హెలీకాప్టర్‌లో ఇద్దరు పైలెట్లు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే ఇద్దరు పైలెట్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఐతే లెఫ్టినెంట్ సౌరభ యాదవ్ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే కో పైలెట్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఇదే ఏడాది మార్చిలో మరో చీతా హెలికాప్టర్ జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో కూలిన సంగతి విధితమే. ఆఘటనలో కూడా పైలెట్ మృతి చెందగా, కోపైలెట్‌కి తీవ్ర గాయాలపాలయ్యాడు. (చదవండి: ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్’పై దర్యాప్తు) -
బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్ పేలి... ఒకరు మృతి
బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్ పేలడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం..బెలూన్లు అమ్మే వ్యక్తి నార్సింగ్ నిర్లక్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుడు 35 ఏళ్ల రవిగా గుర్తించారు. అతను బెలూన్లు కొనడానికి వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనలో నలుగురైదుగురు వ్యక్తుల స్వల్ప గాయాలతో బయటపడ్డారని అన్నారు. ఈ పేలుడులో ద్విచక్రవాహనాలు, ఒక ఆటోరిక్షా దారుణంగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. ఈ ఘటన మొత్తం టెక్స్టైల్ ఫోరూం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో షాపు బయట ఒక వ్యక్తి బెలూన్లు అమ్ముతున్నాడు. కాసేపటికి హఠాత్తుగా పేలుడు సంభవించింది తదనంతరం సమీపంలోని జనాలంతా భయంతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది. #WATCH | Tamil Nadu: A helium tank exploded in a market in Trichy's Kotai Vasal area yesterday; One dead & several injured. Case registered. pic.twitter.com/wUHvlaM5GQ — ANI (@ANI) October 3, 2022 (చదవండి: పండగ వేళ విషాదం..కొడుకు మృతిని జీర్ణించుకోలేక ఆగిన తండ్రి గుండె) -
నేలపై నుంచి కాల్పులు.. విమానంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
మయన్మార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నేషనల్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి బుల్లెట్ తగిలింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. నేలపై నుంచి ఎవరో కాల్పులు జరపడంతో విమానం పైకప్పుకు రంద్రంపడి బుల్లెట్ లోనికి దూసుకెళ్లింది. అనంతరం లోయికావ్ నగరంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బ్రిటీష్ వార్త సంస్థ వివరాల ప్రకారం విమానం 3,500 అడుగుల ఎత్తులో, విమానాశ్రయానికి నాలుగు మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే లోయికావ్ విమానాశ్రయానికి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే విమానంపై కాల్పులు జరిపింది కచ్చితంగా రెబల్ గ్రూప్‌కు చెందిన వారే అని మయన్మార్ సైన్యం తెలిపింది. కరెన్ని నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడించింది. రెబల్స్ గ్రూప్స్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించాయి. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సాయుధ దళాలు, సంప్రదాయ తెగలు పోరాటం చేస్తున్నాయి. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అనుబంధ సంస్థలే విమానంపై కాల్పులు జరిపాయని మయన్మార్ మిలిటరీ కౌన్సిల్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ జామ్ మిన్ టున్ తెలిపారు. మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీని జైలుకు తరలించిన నాటి నుంచి ఆ దేశంలో అనేక చోట్ల సాయుధ దాళాలు పోరాటం చేస్తున్నాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు విమానంపై కాల్పులు జరిగిన కాయా రాష్ట్రంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. చదవండి: ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. ఆ నగరం వదిలి పరార్! -
బిహార్‌లో కాల్పుల కలకలం..ఒకరు మృతి
పట్నా: బిహార్‌లో నలుగురు వ్యక్తులు తుపాకీలతో కాల్పుల కలకలం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని బెగుసురాయ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....బిహార్‌లోని బెగుసురాయ్‌లో బాటసారులపై నలుగురు దుండగులు కాల్పులు జరిపారని అన్నారు. వారు బైక్‌పై వచ్చి ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు...సుమిత్ కుమార్, యువరాజ్, కేశవా అలియాస్ నాగా, అర్జున్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్ల వెల్లడించారు. ఈ ఘటన తర్వాత అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 7గురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. ఆ దుండగులు మొదటగా బెగుసురాయ్ పట్టణంలోని మల్హిపూర్ చౌక్‌లో షాపులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ నిందితులు బరౌని థర్మల్ చౌక్, తేఘ్రా, బచ్వారా, రాజేంద్ర బ్రిడ్జి వరకు కాల్పులు కొనసాగించినట్లు వెల్లడించారు. (చదవండి: బిహార్‌లో మద్యం నిషేధం విఫలం) -
వీడియో వైరల్ చేద్దామనుకున్నాడు.. పాపం తానే వైరల్ అయ్యాడు
సాక్షి, వరంగల్: అప్పట్లో టిక్‌టాక్ పిచ్చితో కొందరు యూత్ ఫేమస్ అవడం కోసం తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో చూసే ఉంటాము. ప్రస్తుతం రీల్స్ చేసేందుకు సోషల్ మీడియాలో పేరు కోసం కొందరు వింత చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కేంద్రంలో వడ్డేపల్లికి చెందిన అజయ్ ఆదివారం కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి రీల్స్ చేద్దామని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ట్రాక్ పక్కన వీడియో చేస్తుండగా ఖాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే రైలు ఒక్కసారిగా అజయ్‌ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
షూటింగ్లో గాయపడ్డ మంచు విష్ణు.. వైరల్ అవుతున్న ఫోటో
యంగ్ హీరో మంచు విష్ణు జయపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇషాన్ సూర్య దర్శకత్వంలో జిన్నా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మంచు విష్ణు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న విష్ణు గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఓ సాంగ్ షూటింగ్లో భాగంగా గాయం అయ్యిందని, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ వల్ల అయ్యిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విష్ణు షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే నెల అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.