Ivanka Trump
-
డొనాల్డ్ ట్రంప్ కుటుంబ వృక్షం: తల్లిదండ్రులు వలసదారులు..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేసి వైట్‌హౌస్‌కి మరోసారి కుంటుంబంతో తిరిగి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆయన కుటుంబసభ్యులు, వంశవృక్షం గురించి హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ట్రంప్ తల్లిదండ్రులు, అతని సోదర సోదరిమణలు ఎవరనేది వెలుగులోకి వచ్చింది. మరీ ట్రంప్ కుటుంబ వృక్షం ఏంటో ఓ లుక్కేద్దామా..!.డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తల్లిదండ్రులు వలసదారులు. తండ్రి ఫ్రెడ్ ట్రంప్(Fred Trump) కాగా, తల్లి మేరీ ట్రంప్(Mary Trump). ట్రంప్ తండ్రి జర్మన్ వలసదారుల కుమారడు. బ్రోంక్స్లో జన్మించిన ఆయన నిర్మాణ రంగానికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఇక తల్లి మేరి మాక్లియోడ్ ట్రంప్ లూయిస్ ద్వీపంలో జన్మించిన స్కాటిష్ వలసదారు. ఆమె కేవలం 50 డాలర్లు(రూ.40 వేలు)తో యూఎస్ వచ్చింది. బతకు భారం కావడంతో పనిమనిషిగా జీవనం సాగించేది. ఆ తర్వాత ఫ్రెడ్ ట్రంప్‌ని కలిసింది. ఇరువురు తొలిచూపులోనే ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు. వారు మేరియన్నే, ఫ్రెడ్ జూనియర్, ఎలిజబెత్, డోనాల్డ్ , రాబర్ట్. అయితే ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ పన్ను ఎగవేసి, ఫెయిర్ హౌసింగ్ చట్టం ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. అలాగే 1927లో, కు క్లక్స్ క్లాన్ మార్చ్‌లో పాల్గొన్నందుకు కూడా అరెస్టు అయ్యాడు.ట్రంప్ సోదర, సోదరీమణులు..పెద్ద అక్క మేరియన్నే ట్రంప్ బారీ..ఈమె దశాబ్దాలుగా యూఎస్ ఫెడరల్ న్యాయమూర్తిగా సేవలందించింది. ఆమెకు ఒక కుమారుడు విడ్ విలియం డెస్మండ్ ఉన్నాడు.ట్రంప్ అన్న ఫ్రెడ్ జూనియర్..ఈయనే పెద్దకొడుకు. ట్రంప్ తండ్రి కుటుంబ వ్యాపారాన్ని చూసుకునేవాడు. కొన్నాళ్లు పైలెట్‌గా కూడా పనిచేశారు. అయితే మద్యపాన వ్యసనానికి గురై కెరీర్ దెబ్బతింది. జస్ట్ 42 ఏళ్లకే మరణించాడు. ఈయనకు జూనియర్‌కు మేరీ ట్రంప్, ఫ్రెడ్ ట్రంప్ III అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.చిన్న అక్క ఎలిజబెత్ ట్రంప్ గ్రౌ1942లో జన్మించిన ఎలిజబెత్ కొన్నాళ్లు అమెరికా ఆర్థక సేవల బహుళ సంస్థ జేపీ మోర్గాన్‌లో చేశారు. డాక్యుమెంటరీ నిర్మాత జేమ్స్ గ్రౌను వివాహం చేసుకున్నార. పామ్ బీచ్‌లో నివశిస్తోంది. అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు.చిన్న తమ్ముడు రాబర్ట్ ట్రంప్డోనాల్డ్ విశ్వసనీయ మిత్రుడుగా వ్యవహరిస్తాడు. అదీగాక ట్రంప్ ఆర్గనైజేషన్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా. రెండు వివాహాల చేసుకున్నారు. ఒక కూమారుడుని దత్తత కూడా తీసుకున్నారు. ఆయన 2020లో మరణించారు.డోనాల్డ్ ట్రంప్ భార్యలు, పిల్లలఇవానా ట్రంప్ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (1949-2022), ఒక చెక్-అమెరికన్ వ్యాపారవేత్త. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె 2022లో మరణించింది.డొనాల్డ్ ట్రంప్ జూనియర్ (1977): ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్.ఇవాంకా ట్రంప్(Ivanka Trump (1981)): ఆమె గతంలో ట్రంప్‌కి మాజీ సీనియర్ సలహాదారు. జారెడ్ కుష్నర్ను వివాహం చేసుకున్నారు. ఆయన కూడా ట్రంప్ అధ్యక్ష పదవిలో కీలక సలహాదారు. వారికి ముగ్గురు పిల్లలు: అరబెల్లా, జోసెఫ్,థియోడర్.ఎరిక్ ట్రంప్ (1984): ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. లారా ట్రంప్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.రెండో భార్య మార్లా మాపుల్స్డోనాల్డ్ రెండవ భార్య మార్లా మాపుల్స్ (1963). ఆమె ఒక టెలివిజన్ నటి. వారికి ఒక కుమార్తె. టిఫనీ ట్రంప్టిఫనీ ట్రంప్ (1993): ఆమె జార్జ్‌టౌన్ లా గ్రాడ్యుయేట్.మూడో భార్య మెలానియా ట్రంప్ట్రంప్ ప్రస్తుత భార్య, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (1970). స్లోవేనియన్-అమెరికన్ మాజీ మోడల్. ఆమెకు ఒక కుమారుడు బారన్ ట్రంప్బారన్ ట్రంప్ (2006): ట్రంప్ చిన్న కుమారుడు. తల్లిదండ్రలతో కలిసి ఉంటున్నాడ. ప్రస్తతం ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు.ట్రంప్ అన్న పిల్లలు..మేరీ ట్రంప్ (1965): ఫ్రెడ్ జూనియర్ కుమార్తె. ఆము మనస్తత్వవేత్త, రచయిత్రి. కటుంబంపై విమర్శలు చేస్తుంటుందని సమాచారంఫ్రెడ్ ట్రంప్ III (1962): ఫ్రెడ్ జూనియర్ కుమారుడు.రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్‌గా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు.ట్రంప్ మనవరాళ్ళు, మనవళ్లు..అరబెల్లా, జోసెఫ్, థియోడర్ కుష్నర్ (కూతురు ఇవాంకా, జారెడ్ దంపతుల పిల్లలు)కై, డోనాల్డ్ III, ట్రిస్టాన్, స్పెన్సర్, క్లో ట్రంప్ (కుమారుడు డొనాల్డ్ జూనియర్ పిల్లలు).ఎరిక్, లారా ట్రంప్ ఇద్దరు పిల్లలు.ఇది అమెరికా అధ్యక్షుడి వంశ వృక్షం. చాలా పెద్దగానే ఉంది కదూ..!(చదవండి: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం: స్టైలిష్ లుక్‌లో మెలానియా ట్రంప్) -
జైశంకర్‌కు ముందు సీటు.. మెలానియా తళుకులు.. సందడిగా సాగిన ట్రంప్ ఈవెంట్లో చిత్రాలెన్నో!
-
ఫుల్ జోష్‌లో ట్రంప్.. అధ్యక్ష ప్రమాణ స్వీకారంలో ప్రముఖులు (ఫొటోలు)
-
ట్రంప్ క్యాండిల్ లైట్ డిన్నర్లో స్టైలిష్‌గా ఉషా వాన్స్ దంపతులు..!
అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ జనవరి 19న క్యాబినెట్(cabinet ) కోసం క్యాండిల్ లైట్ ప్రైవేట్ డిన్నర్(private dinner)ని ఏర్పాటు చేశారు. ఈ విందుకి ఎందరెందరో అతిరథ మహారథులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో అమెరికా(United States) ఉపాధ్యాక్షుడు(Vice-President) జేడీ వాన్స్(JD Vance), ఆయన భార్య ఉషా చిలుకూరి(Usha Chilukuri )స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో మెరిశారు. ఫ్యాషన్‌కే ఐకానిక్‌గా నిలిచి ఈ విందులో సందడి చేశారు. ఉషా ఈ డిన్నర్ పార్టీ కోసం అమెరికా ప్రసిద్ధ డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్ వేర్ గౌనులో ఉషా మెరిశారు. అందుకు తగ్గట్టుగా కురులను బన్ మాదిరిగా స్టైలిష్‌గా వేసుకున్నారు. ఆ లుక్‌లో ఉషా అదిరిపోయింది. ఇక వైస్ ప్రెసిడెంట్ జేడీ ఆన్స్ సంప్రదాయ వేషధారణకు ప్రాధాన్యతమిచ్చేలా తరుచుగా సింగిల్-బ్రెస్ట్ సూట్లలో కనిపిస్తాడు. ఆ సూట్‌కి సరిపోయేలా సిన్సినాటిలోని ఇటాలియన్ దర్జీ వద్ద కొనుగోలు చేసే నెక్ టెక్లను ధరిస్తాడు. ఆయన ఎక్కువగా నేవీ లేదా గ్రే కలర్ సూట్లనే ధరిస్తారు. ఉపాధ్యక్షుడిగా మారాక వాన్స్ డ్రెస్సింగ్ స్టైల్ మరింతగ మారడమే గాక బరువు కూడా తగ్గడం విశేషం. కాగా, ట్రంప్ క్యాండిల్‌లైట్ డిన్నర్లో ఇవాంకా ట్రంప్ కూడా ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్‌కి సంబంధించిన మరో గౌనులో తళుక్కుమంది. ఇవాంక స్టమ్ ఆఫ్-షోల్డర్, క్రిస్టల్, పెర్ల్-ఎంబ్రాయిడరీడ్ ఎంపైర్ వెయిస్ట్ గౌనులో మెరిసింది. సింపుల్‌గా వజ్రపు చెవిపోగులను ధరించింది. View this post on Instagram A post shared by Oscar de la Renta (@oscardelarenta) (చదవండి: ‘పుష్ప-2’విలన్‌కి ఆ సమస్య..భార్య ఏం చేసిందో తెలుసా?) -
'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా, తల్లిగా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే స్ట్రాంగ్ విమెన్. ముగ్గురు పిల్లల తల్లి అయినా.. ఆమె ఇప్పటకీ అంతే స్లిమ్‌గా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆమె శరీరాకృతి చూస్తే 16 ఏళ్ల అమ్మాయే అన్నంత అందంగా ఉంటుంది. అంతలా టోన్డ్ ఫిజిక్‌ని మెయింటైన్ చేసేందుకు ఎలాంటి వర్కౌట్లు చేస్తుంటుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇవాంక. సాధారణ వ్యాయమాలతో సరిపెట్టెకుండా అలాంటి వర్కౌట్లు కూడా చేస్తే.. ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉండగలమని అంటోంది. ఇంతకీ ఆమె విల్లులాంటి శరీరాకృతి కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తుందో తెలుసా..!.చాలామంది మహిళల మాదిరిగానే తాను కూడా కార్డియో, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్లపైనే దృష్టిసారిస్తానని ఆ వీడియోలో పేర్కొంది ఇవాంక. అయితే తన కండరాల బలం కోసం ప్రస్తుతం తాను వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్లపై శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎప్పుడూ సాధారణ వ్యాయామాలే కాకుండా ఎల్లప్పుడు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఇలాంటి వ్యాయామాలు కూడా చేయాలని చెబుతోంది. మన కండరాలు బలోపేతంగా ఉండేలా స్క్వాట్లు, డెడ్‌లిఫ్ట్‌లు, హింగ్లు, పుష్-పుల్ అప్స్ వంటి వర్కౌట్లు అవసరమని గట్టిగా విశ్వసిస్తానంటోంది ఇవాంక. స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఇలాంటివి ప్రతి మహిళ తప్పనిసరిగా చేయాలని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్లలో అత్యంత కీలకమైనవి ఇవేనని పేర్కొంది. వారంలో నాలుగు రోజులు ఇలాంటి వ్యాయామాలకు కేటాయిస్తానని చెప్పారు. జిమ్‌కి వెళ్లడమే గాక ఆరు బయట సర్ఫింగ్ పాడిల్ టెన్నిస్, స్విమ్మింగ్, వేక్ సర్ఫింగ్, బ్రెజిలియన్ జియు-జిట్సు, హైకింగ్, వాకింగ్, గోల్ప్ వంటి వాటిల్లో కూడా పాల్గొంటానని అన్నారు. తాను రొటీన్ వ్యాయామాలతో సరిపెట్టనని గేమ్‌చేంజర్‌లా వివిధ వ్యాయామాలపై దృష్టిపెడతానని చెప్పారు. తాను శరీరాకృతి విల్లులా ఉండేలా.. అత్యంత బలంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది ఇవాంక. అందుకు అంకితభావంతో కూడిన నిబద్ధత అవసరమని చెప్పారు. అలా క్రమతప్పకుండా వర్కౌట్లు చేస్తే మంచి ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని అంటోంది. అలాగే వీడియోలో అందర్నీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిట్‌గా ఉండమని కోరింది ఇవాంక. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) (చదవండి: బెల్ట్‌లు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్ ఖురాన్! బాల్యం భారంగా మారకూడదంటే..) -
రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులు
అమెరికా అధ్యక్షుడి పీఠాన్ని రెండోసారి అధిరోహించనున్న డొనాల్డ్ట్రంప్ కూతురు ఇవాంకాట్రంప్ ఇటీవల తన పాత మాన్షన్‌ను పునరుద్దరించినట్లు తెలిపారు. ఇందుకోసం 24 మిలియన్ డాలర్లు(సుమారు రూ.199 కోట్లు) ఖర్చు చేసినట్లు ‘బెంజింగా’ అనే రియల్ ఎస్టేట్ రిసెర్చ్ సంస్థ నివేదించింది. కొత్తగా పునరుద్ధరించిన ఇవాంకా మాన్షన్ ‘బిలియనీర్ బంకర్’లో ఉంది. మియామిలో అత్యంత గుర్తించదగిన ఆధునిక భవనాల జాబితాలో తన మాన్షన్ ఒకటిగా నిలిచినట్లు బెంజింగా తెలిపింది.ఇవాంకా మాన్షన్ ఫ్లోరిడాలోని మియామి డెడ్ కౌంటీలో ఉన్న ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌లో ఉంది.ఈ ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌ను బిలియనీర్ బంకర్ అని పిలుస్తారు.ఈ ఐల్యాండ్ ఒక ప్రైవేట్, గేటెడ్ కమ్యూనిటీ. దీనికి అత్యంత భద్రత ఉంటుంది.ఫ్లోరిడా స్టేట్ పోలీసు ఫోర్స్, 24/7 ఆర్మ్డ్ మిలిటరీ దీనికి గస్తీ కాస్తోంది.ఈ ద్వీపంలో కేవలం 41 నివాస గృహాలు మాత్రమే ఉన్నాయి.ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని అత్యంత ప్రత్యేకమైన, సంపన్న వర్గాలకు చెందిందిగా ప్రసిద్ధి.ఇండియన్ క్రీక్‌లో లగ్జరీ సౌకర్యాలున్నాయి.ప్రముఖ సింగర్ జూలియో ఇగ్లేసియాస్, ఎన్ఎఫ్ఎల్ లెజెండ్ టామ్ బ్రాడీ, గిసెల్ బాండ్చెన్, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, కార్ల్ ఇకాన్లతో సహా మరికొందరు ప్రముఖులు ఇక్కడ నివాసముంటున్నారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు -
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ : ఇవాంకా ట్రంప్ డ్రెస్సింగ్ స్టయిల్ అదిరిందిగా!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎందరో అతిరథ మహారథులు, ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేసి సందడి చేశారు. ఇక ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు కుమార్తె ఇవాంకా తన కుటుంబంతో సహా పాల్గొంది. ఈ వేడుకలో ఆమె దేశీ అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్చి 1న జరిగిన అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇవాంకా తన భర్త జారెడ్ కుష్నర్, కుమార్తె అరబెల్లా రోజ్‌తో కలిసి సందడి చేసింది. ఇదొక 'మ్యాజికల్ రాత్రి" అంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఆమె ఆ వేడుకల్లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గోల్డ్ సిల్వర్ కలయిక గల చీరను ధరించింది. అందుకు తగట్టుగా వీ షేప్‌లో ఉండే మ్యాచింగ్ బ్లౌజ్‌తో గ్రాండ్ లుక్‌లో కనిపించింది. అయితే ఈ చీర ధర ఏకంగా రూ. 2.65 లక్షలు. అంతేగాదు ఆ చీరకు తగ్గ రేంజ్లో చెవులకు డైమండ్ జూకాలు ధరించింది. మంచి గ్లామరస్ లుక్‌లో అందర్నీ మిస్మరైజ్ చేసింది. ఇక రెండో రోజు జంగిల్ సఫారీలో జరిగిన వేడుకల్లో ఇవాంకా త్రెడ్ వర్క్‌తో కూడిని కుర్తాని ధరించింది. సింపుల్ మేకప్‌తో తన కూతురు అరబెల్లా రోజ్‌తో కలిసి సందడి చేసింది. ఇక అదే రోజు సాయంత్రం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన తెల్లటి లెహంగాలో భారతీయ వనితలా రెడీ అయ్యింది. ఇక చివరి రోజు ఉదయం గోల్డెన్ ఎంబ్రాయిడరీతో కూడిన తెల్లటి గౌనుతో ఆకర్షించింది. ఇకా ఆమె భర్త, కూతురు కూడా దేశీ వస్త్రాధారణలో అలరించడం విశేషం. ఇక అదే రోజు సాయంత్రం అంబానీ కుటుంబం దేవుడి పూజలతో ఆ వేడుకలకు ముగింపు పలికే కార్యక్రమం కావడంతో వచ్చిన అతిధులందరికి సంప్రదాయ డ్రెస్ కోడ్‌ని ధరించాలని సూచించడం జరిగింది. దీంతో ఇవాంకా ఆ సాయంత్రం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన నిమ్మపండు రంగు కశ్మీరీ లెహంగాతో సంప్రదాయ మహిళ వలే కనిపించింది. ఈ లెహంగా ధర అక్షరాల రూ. 5 లక్షలు. ఏదీఏమైన అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో పాల్గొన్న విదేశీయులు సైతం మన భారతీయ సంస్కతి తగ్గ వస్తాలంకరణలో కనిపించడం గ్రేట్ కదూ. బహుశా ఆ క్రెడిట్ అంతా అంబానీ కుంటుంబానికే దక్కుతుంది. (చదవండి: అనంత్-రాధికా: నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా!) -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రెటీల స్పెషల్ ఫొటోలు..
-
ఇజ్రాయెల్‌లో పర్యటించిన ఇవాంకా ట్రంప్
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. హమాస్‌ను పూర్తిగా అంతం చేయాడమే లక్ష్యంగా కాల్పుల విరమణకు కూడా అంగీకరించకుండా ముందుకు సాగుతున్నాయి ఇజ్రాయెల్ సేనలు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జార్డ్ కుష్నర్ ఇజ్రాయెల్ పర్యటించారు. అక్టోబర్ 7ను ఇజ్రాయెల్ దాడులు చేసి.. తమ వెంట ఇజ్రాయెల్ బంధీలుగా తీసుకెళ్లిన పౌరుల బాధిత కుటుంబాలను వారు పరామర్శించారు. ‘నేను ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టగానే తీవ్రమైన దుఖంతో కూడిన భావోద్వేగానికి లోనయ్యా. అక్టోబర్ 7న జరిగిన దాడుల పరిణామాల్లో బాధితుల కుటుంబ సభ్యుల హృదయవిదారకమైన బాధలు విన్నా. ఇలాంటి కఠికనమైన సమయాల్లో ఆశ, మంచితనం ఎప్పటికీ మన వెంటే ఉంటాయని గుర్తు చేస్తాయి. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు. As I depart from Israel, my heart fills with a mix of sorrow and hope. Witnessing the aftermath of the October 7th terrorist attack, I heard heart-wrenching stories from victims, families, soldiers, and first responders. Their strength amid the despair was profoundly moving and… pic.twitter.com/fI73Zpfuq8 — Ivanka Trump (@IvankaTrump) December 21, 2023 ‘హమాస్ అనాగిరిక చర్యల వల్ల బాధితులుగా మారినవారి పరిస్థితును స్వయంగా మన కళ్లతో చూడటం చాలా ముఖ్యం’ అని జార్డ్ కుష్నర్ ఎక్స్( ట్విటర్)లో పోస్టు చేశారు. ‘హమాస్ చేత కిడ్నాప్ చేయబడిన వారి కుటుంబ సభ్యులు కలిశాము. ఇంకా కొంత మంది గాజాలోని హమాస్ చెరలోనే ఉన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపే పలు రాజకీయ నాయకులను కూడా కలుసుకున్నాం. సంకల్పం, విశ్వాసం, నమ్మకం, గతంలో ఊహించలేనిది కూడా పొందవచ్చు’ అని జార్డ్ తెలిపారు. యూదులైన జార్డ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్.. గత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన పదవులను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2024 అమెరికా ఎన్నికల ప్రచారం మాత్రం వీరు పాల్గొనపోవడం గమనార్హం. Today I visited Kibbutz Kfar Aza with @IvankaTrump & @jaredkushner so that they could bear witness to the crimes against humanity committed by Hamas on 7 October. Thank you for coming to Israel and for standing by our side 🇮🇱🇺🇸 (📹: Natan Weill | Knesset Press Office) pic.twitter.com/wZbqqNBXj8 — Amir Ohana - אמיר אוחנה (@AmirOhana) December 21, 2023 గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు, సుమారు 20 వేల మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందినట్లు ఇరు దేశాల అధికారలు వెల్లడించారు. హమాస్ చేసిన దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులను భీకరస్థాయిలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసినప్పుడు.. ఇజ్రాయెల్ దేశ నాయకత్వంపై విమర్శలు గుప్పించిన ట్రంప్ అనంతరం తన వైఖరి మార్చుకొని మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చదవండి: 'లొంగిపోవడం లేదా చావడం'.. హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం -
బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ట్రంప్ కూతురు.. ఫోటోలు వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో తన ప్రియుడు మైఖెల్ బౌలోస్‌ను(25) పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల ప్రేమాయాణం అనంతరం బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడింది. ట్రంప్‌కు చెందిన మార్ ఏ లాగో క్లబ్ ఈ వేడుకకు వేదికగా మారింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయత్రం 4.30 నిమిషాలకు వివాహం జరిగింది. పెళ్లిలో తెలుపు రంగు గౌను ధరించి మెరిసిపోయారు టిఫానీ. ట్రంప్ దగ్గరుండి ఈ పెళ్లిని జరిపించారు. కూతురుని అప్యాయంగా వివాహ వేదికకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ముద్దుపెట్టి..వరుడు చేతికి వధువు చేతిని అందించారు. ఈ వేడుకకు ట్రంప్ కుటుంబమంతా హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. వీరిలో ట్రంప్ భార్య మెలానియా, మరో కూతురు ఇవాంక, ఆమె భర్త జేర్డ్ కుష్నర్, జూనియర్ డొనాల్డ్ ట్రంప్, ఎరిక్ ట్రంప్, బారన్ ట్రంప్ ఉన్నారు. 2018లో టిఫానీ, మైఖెల్‌కు పరిచయం ఏర్పడగా.. ఏడాదికి 2019లో ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేశారు. 2021 జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పదవి నుంచి తొలగిపోయే ముందు బాయ్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకన్నట్లు టిఫానీ ప్రకటించింది. కాగా డొనాల్డ్ ట్రంప్.. ఆయన రెండో భార్య, నటి మార్ల మాపుల్స్ ఏకైక కూతురే టిఫానీ. 1993లో మర్లను ట్రంప్ వివాహమాడగా 1999 వరకు వీరు భార్యభర్తలుగా కొనసాగారు. అనంతరం విడాకులు తీసుకున్నారు. -
‘వారు దేశభక్తులు’: ఇవాంకపై విమర్శలు
వాషింగ్టన్: అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ జో బైడెన్ గెలుపును ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఆందోళనలను అణచివేసే క్రమంలో జరిపిన కాల్లుల్లో ఇప్పటి వరకు నలుగురు మరణించారు. ఇక ట్రంప్ తీరును సొంతపార్టీ నేతలతో పాటు ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుమార్తె, వైట్‌హౌజ్ సలహాదారు ఇవాంక ట్రంప్ తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి అనాలోచిత వ్యాఖ్యలతో వాటిని మరింత పెంచుతూ.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. ఇంతకు విషయం ఏంటంటే క్యాపిటల్ భవనంపై దాడి చేసిన ట్రంప్ మద్దతురాలను ఇవాంక దేశభక్తులతో పోల్చారు. నిరసకారులను దేశభక్తులతో పోల్చడం పట్ల తీవ్ర విమర్శలు రేగడంతో ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు. (చదవండి: మమ్మల్ని ఏ శక్తి ఆపలేదు; మేం ఊహించలేదు!) ఈ ట్వీట్లో ఇవాంక ‘అమెరికా దేశభక్తులురా.. భద్రతా ఉల్లంఘన, చట్టాల అమలును అగౌరవపర్చడం ఆమోదయోగ్యం కాదు. హింస ఎన్నిటికి ఆమోదం కాదు. దయచేసి గౌరవంగా ఉండండి’ అని కోరారు. దీనిపై భారీ ఎత్తున విమర్శలు రావడంతో వెంటనే ఈ ట్వీట్‌ని డిలీట్ చేశారు. కానీ ఈలోపే నెటిజనులు ఆ ట్వీట్‌ని ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ తర్వాత కూడా ఇవాంక తన తండ్రి మద్దతుదారులను ఆందోళన విరమించమని కోరకపోగా.. దేశభక్తులంటూ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను దేశ భక్తులన్నది ఆందోళనకారులని కాదని.. వారు చేసే నిరసనని అంటూ కేట్ బెన్నెట్ చేసిన ట్వీట్‌కి సమాధానం ఇచ్చారు ఇవాంక. ఈ క్రమంలో ‘శాంతియుత ఆందోళన దేశభక్తికి చిహ్నం. హింస ఎన్నిటికి ఆమోదయోగ్యం కాదు.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ కేట్ బెన్నెట్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు ఇవాంక.(చదవండి: క్యాపిటల్ బిల్డింగ్ విమానంతో కూల్చేస్తాం!) No. Peaceful protest is patriotic. Violence is unacceptable and must be condemned in the strongest terms. https://t.co/GwngZTqzTH — Ivanka Trump (@IvankaTrump) January 6, 2021 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్ శాంతియుతంగా అధికార మార్పడికి సహకరించట్లేదు. పైగా జో బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో బైడెన్ ఎన్నికను వ్యతిరేకించాలంటూ రిపబ్లికన్ నేతల మద్దతు కోరి భంగపడ్డ సంగతి తెలిసిందే. -
‘ఆ పదవికి హారిస్ కన్నా ఇవాంకనే ఉత్తమం’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ సభ్యురాలు కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. అధ్యక్ష పదవికి ఆమె అసలు పోటీదారే కాదన్నారు. ఆమెతో పోల్చితే ఇవాంక బెటర్ చాయిస్ అన్నారు. శుక్రవారం న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన రిపబ్లికన్ ప్రచార ర్యాలీలో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. అందుకు మద్దతు కూడా తెలుపుతున్నాను. అయితే ఆ పదవికి హారిస్ అర్హురాలు కాదు.. పోటీదారు అంతకన్నా కాదు. వైట్ హౌస్ సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్ అయితే బాగుంటుంది’ అన్నారు. ట్రంప్ మద్దతుదారులు కూడా ఇవాంక అని అరవడంతో ‘ఇది ప్రజల కోరిక.. నా తప్పు లేదు’ అన్నారు ట్రంప్. రిపబ్లికన్ పార్టీ తరఫున రెండో సారి అధ్యక్ష పదవికి నామినేట్ అయిత తర్వాత నిర్వహించిన తొలి ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్. (చదవండి: చీకటి నుంచి వెలుగులోకి) అంతేకాక హారిస్ ఎన్నికల ప్రచారాన్ని బలంగానే ప్రారంభించారని.. కాని కొద్ది నెలల్లోనే ఆమె మద్దతుదారులను కోల్పోతుందన్నారు ట్రంప్. అప్పుడు ఆమె అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటుందని తెలిపారు. హారిస్‌కు ఓట్లు రావని విమర్శించారు ట్రంప్. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తే అమెరికా కన్న కలలన్నీ సర్వనాశనం అవుతాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా గొప్పతనాన్ని నాశనం చేయడంతో పాటుగా ప్రజలకెవరికీ ఉద్యోగాలు ఉండవన్నారు ట్రంప్. -
ఇవాంక వర్సెస్ మెలానియా.. వీడియో వైరల్
వాషింగ్టన్: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె అయిన ఇవాంక ట్రంప్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్(ఆర్ఎన్సీ) చివరి రోజు రాత్రి జరిగిన ఓ సంఘటన ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండో సారి ట్రంప్ అమెరికా అధ్యక్ష్య పదవికి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె ఇవాంక, ట్రంప్‌ను పరిచయం చేయగా, ప్రథమ మహిళ మెలానియాతో కలిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాంక.. తన తండ్రిని, మెలానియాను నవ్వుతూ విష్ చేశారు. బదులుగా ప్రథమ మహిళ కూడా చిరునవ్వులు చిందించారు. కానీ సెకన్ల వ్యవధిలోనే ఇవాంకను చూసి మూతి ముడుచుకున్నారు మెలానియా. ఇవాంక అక్కడ నుంచి వెళ్లగానే ప్రథమ మహిళ ముఖం చిట్లించుకున్నారు. ప్రస్తుతం ఈ మూడు సెకన్ల వీడియో ఎంతగా వైరలవుతుందంటే.. ఇప్పటికే దీన్ని 5 మిలియన్ల మంది వీక్షించారు. (చదవండి: అవన్నీ ట్రంప్ కోతలేనా!) This was so weird. #RNC2020 pic.twitter.com/YHReTl0bfT — Dana Goldberg (@DGComedy) August 28, 2020 ఇప్పటికే ఇవాంకకు, మెలానియా ట్రంప్‌కు పడటం లేదని వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో మెలానియా తన స్నేహితురాలు, ఒకప్పటి సిబ్బంది అయిన స్టెఫానీ విన్ స్టన్ వాకాఫ్ రాసిన పుస్తకంలో మెలానియా ట్రంప్ తన సవతి కుమార్తె అయిన ఇవాంక ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రస్తావించారని ఆ దేశ మీడియా రిపోర్టర్ యాషర్ ఆలీ పేర్కొన్నారు. దానికి సంబంధించి ఆయన వరుస ట్వీట్లను సైతం చేశారు. ‘మెలానియా అండ్ మీ’:ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మై ఫ్రెండ్ షిప్ విత్ ఫస్ట్ లేడీ’ అనే పుస్తకంలో మెలానియా తన సవతి పిల్లల గురించి ముఖ్యంగా ఇవాంక తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా రాశారని సమాచారం. మెలానియా ట్రంప్‌కు తెలియకుండా ఆమె స్నేహితురాలు స్టెఫానీ విన్ స్టన్.. మెలానియా వ్యాఖ్యలను రికార్డు చేసినట్లుగా రిపోర్టర్ యాషర్ ఆలీ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె ట్రంప్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారని వాటిని బహిర్గతం చేయలేదని రాసుకొచ్చారు -
మెలనియా ఫస్ట్ లేడీ ఎలా అవుతారు?.. ఇవాంక
ట్రంప్ వంటి మహానుభావులు పూర్వాచారాలకు కొత్త నిర్వచనాలను కల్పించుకోవలసిన పరిస్థితులను తెచ్చి పెడుతుంటారు. అమెరికా అధ్యక్షుడి సతీమణిని ‘ఫస్ట్ లేడీ’ అంటారు. వైట్ హౌస్‌లో ఆమెకు ‘ఫస్ట్ లేడీ’స్ ఆఫీస్’ ఉంటుంది. అయితే ట్రంప్‌కు ఇప్పుడు భార్యగా ఉన్న మెలనియా మూడో సతీమణి. మరి ఈవిడ ఫస్ట్ లేడీ ఎలా అవుతారు? ఈ సందేహం రావలసిన వాళ్లకే వచ్చింది. ట్రంప్ మొదటి భార్య కుమార్తె ఇవాంక తన తల్లికి దక్కవలసిన ‘ఫస్ట్ లేడీ’ టైటిల్ ను మారుతల్లి మెలనియాకు చెందకుండా ఉండటం కోసం ‘ఫస్ట్ లేడీ’స్ ఆఫీస్’ పేరును ‘ఫస్ట్ ఫ్యామిలీ’స్ ఆఫీస్’ గా మార్పించేందుకు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని మెలనియా విజయవంతంగా అడ్డుకున్నారట! ‘ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్’ అనే పేరుతో మెలనియా జీవిత చరిత్రను రాసిన వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ మేరీ జోర్డాన్ ఈ సంగతిని పుస్తకంలో వెల్లడించారు. ట్రంప్‌కి ‘సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అడ్వయిజర్’ గా కూడా మెలనియాను జోర్డాన్ అభివర్ణించారు. అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకంలో అభివర్ణనలు, అవాస్తవాలు తప్ప వేరే ఇంకేమీ లేవని ఇవాంకను సమర్ధించేవారు అంటున్నారు. -
ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ
వాషింగ్టన్ : గాయపడిన కన్నతండ్రిని కరోనా కష్ట కాలంలో సొంతూరికి చేర్చడం కోసం 15 ఏళ్ల వయసున్న జ్యోతి కుమారి అయిదు రోజులు, 1500 కి.మీ. సైకిల్ తొక్కడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఆ అమ్మాయి చేసిన సాహసం ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ జ్యోతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె కథని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఇవాంకా ‘‘అదో అందమైన సహనంతో కూడిన ప్రేమ.ఆమె చేసిన ఫీట్‌ని భారత్ ప్రజలతో పాటు సైక్లింగ్ ఫెడరేషన్ గుర్తించాయి‘‘అని ట్వీట్ చేశారు. ఎందుకా సాహసం అంటే .. ఎనిమిదో తరగతి చదువుతున్న జ్యోతికుమారి స్వగ్రామం బీహార్ లోని దర్భాంగా. ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ గత 20 ఏళ్లుగా గుర్గావ్లో ఆటో నడుపుతున్నారు. గత జనవరిలో ఆటోకు ప్రమాదం జరిగి పాశ్వాన్ తీవ్రంగా గాయ పడ్డారు. తండ్రిని చూసు కోవడానికి తల్లితో పాటు జ్యోతి కూడా గుర్గావ్ వచ్చింది. తల్లి అంగన్వాడీ వర్కర్ కావడంతో ఎక్కువ రోజులు గడిపే వీలులేక తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయింది. చిన్నారి జ్యోతి తండ్రి ఆలనా పాలనా చూడసాగింది. ఇంతలో ఉరుము లేని పిడుగులా కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు. తండ్రి ఇంకా పూర్తిగా గాయాల నుంచి కోలుకోలేదు. అద్దె ఇవ్వాలంటూ యజమానులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న జ్యోతి తన సైకిల్‌పై తండ్రిని కూర్చోబెట్టుకొని ఏకంగా 1500 కి.మీ. తొక్కింది. అయిదు రోజుల పాటు అష్టకష్టాలు పడి ఎంతో శ్రమకి ఓర్చుకొని ఆ అమ్మాయి తండ్రితో పాటు సొంతింటికి చేరి ఊపిరిపీల్చుకుంది. జ్యోతి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది. నిర్విరామంగా ఆమె సైకిల్ తొక్కిన విషయం తెలుసుకున్న సైక్లింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) ఆమెకి సైక్లింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. జ్యోతి శిక్షణలో విజయవం తమైతే నేషనల్ సైక్లింగ్ అకాడమీలో ట్రైనీగా తీసుకుంటారు. ఇప్పుడు ఇవాంకా నుంచే ప్రశంసలు రావడంతో ఆమె సాహసానికి తగిన గుర్తింపు లభించినట్టయింది. -
జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక
న్యూయార్క్ : లాక్డౌన్ నేపథ్యంలో హర్యానాలోని గుర్గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించిన బాలిక జ్యోతి కుమారిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ట్రంప్ జ్యోతిని మెచ్చుకున్నారు. 15 ఏళ్ల జ్యోతి కుమారి చేసిన సాహసం అద్భుతమని ట్విటర్ వేదికగా కొనియాడారు. (లాక్డౌన్ : 1200 కి.మీ దాటి సైకిల్‌పై స్వగ్రామానికి..) ఈ మేరకు ఇవాంక ట్రంప్ ట్విటర్లో స్పందిస్తూ.. ' 15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు 1200 వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమనే చెప్పాలి. భారతీయ ప్రజలో ఇంత ఓర్పు, సహనం, ప్రేమ ఉంటాయనేది ఈమె ద్వారా నాకు తెలిసింది. ఇది కేవలం నన్ను మాత్రమే గాక సైక్లింగ్ ఫెడరేషన్‌ను ఆకర్షించిందంటూ' ట్వీట్ చేశారు. ఇవాంక చేసిన ట్వీట్‌పై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. లాక్డౌన్ వేళ ప్రభుత్వం విఫలమైన వేళ ఆమె పేదరికం, తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయం జ్యోతిని 1200 కి.మీ సైకిల్ తొక్కేలా చేసిందంటూ పేర్కొన్నారు. మే 10న గురుగ్రామ్ నుంచి ప్రారంభమైన జ్యోతి ప్రయాణం మే 16న తన సొంతూరైన దర్భంగాకు చేరుకోవడంతో ముగిసింది. ప్రస్తుతం వీరిద్దరు క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. అయితే దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది. ఏకంగా జ్యోతి కుమారికి సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ట్రయల్స్‌కు రమ్మని పిలుపువచ్చింది. '1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమెలో అసాధ్యమైన ప్రతిభ ఉంది. ఏడు లేదా ఎనిమిది ప్రమాణాలను తాను దాటితే.. తను జాతీయ జట్టులోకి ఎంపిక అవుతుంది. అంతేకాక.. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు' అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. -
వైట్‌హౌస్‌కి కరోనా దడ
వాషింగ్టన్/బీజింగ్: అమెరికా శ్వేతసౌధాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా సోకిన మర్నాడే మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీ కేటీ మిల్లర్, అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా సోకింది. దీంతో వైట్‌హౌస్‌లో కేసుల సంఖ్య మూడుకి చేరుకుంది. కరోనా పరీక్షల్లో వాళ్లిద్దరికీ పాజిటివ్‌గా తేలింది. ఇటీవల కేటీ మిల్లర్ పెన్స్‌ను కలుకున్నారు కానీ ట్రంప్‌ని నేరుగా కలుసుకోలేదు. అయితే కేటీ మిల్లర్ ట్రంప్ సలహాదారుల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే స్టీఫెన్ మిల్లర్ భార్య కావడంతో వైట్ హౌస్‌లో ఆందోళన నెలకొంది. వైట్‌హౌస్‌లో రాకపోకలపై మరింత పకడ్బందీ చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే స్టీఫెన్ మిల్లర్‌కి పరీక్షలు చేయించారా? ఆయన వైట్ హౌస్‌కు తరచూ వస్తున్నారా అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కేటీ మిల్లర్‌కి గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వస్తే, ఆ మర్నాడు నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఒక్క రోజులోనే పరీక్షల్లో అంత వ్యత్యాసం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అందుకే కరోనా వైరస్‌కి ఎవరూ భయపడాల్సిన పని లేదని ఆయన తేల్చేశారు. ట్రంప్ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా సోకడంతో వైట్‌హౌస్‌లో పనిచేసే సిబ్బంది అందరికీ రొటీన్‌గా చేసే పరీక్షల్లో కేటీకి పాజిటివ్ వచ్చింది. ఇవాంకా కొన్ని వారాలుగా కలవలేదు అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కూడా కరోనా సోకినట్టుగా సీఎన్ఎన్ వెల్లడించింది. ఇవాంకా తన పనులన్నీ వీడియో కాన్ఫరెన్స్ద్వారా నిర్వహిస్తూ ఉండడంతో ఆమెను కొన్ని వారాలుగా కలుసుకోలేదు. దీనివల్ల ఇవాంకాకు వచ్చిన ఇబ్బందిలేదు. ఇవాంక ఆమె భర్త ఖుష్నెర్ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే వారిద్దరికీ నెగిటివ్ వచ్చింది. ఎలాంటి సవాలైనా చైనా ఎదుర్కొంటుంది : జిన్ పింగ్ చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీని అధ్యక్షుడు జిన్‌పింగ్ వెనకేసుకొచ్చారు. సీపీసీ నాయకత్వం, దేశంలోని సోషలిస్టు పొలిటికల్ వ్యవస్థ ఎలాంటి సంక్షోభాన్నయినా ఎదుర్కోగలదని కోవిడ్‌పై పోరాటంతో మరోసారి రుజువైందని అన్నారు. కరోనా వైరస్ బట్టబయలైన తొలిరోజుల్లో చైనా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జిన్‌పింగ్ మాట్లాడారు. -
ఇవాంకా వ్యక్తిగత సహాయకురాలికి కరోనా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా(కోవిడ్-19) పాజిటివ్‌గా తేలింది. దీంతో శ్వేతసౌధంలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. కాగా బాధితురాలు గత కొన్ని వారాలుగా ఇవాంకాకు దూరంగానే ఉన్నారని.. కాబట్టి ఆమెకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. ఇవాంకా, ఆమె భర్త జారేద్ కుష్నర్కు శుక్రవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగటివ్ ఫలితం వచ్చిందని వెల్లడించాయి. (ట్రంప్‌కి రోజూ కోవిడ్ పరీక్షలు) ఈ విషయం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘కేటీ అద్భుతమైన వ్యక్తి. ఆమెలో కరోనా లక్షణాలు బయటపడలేదు. అయినప్పటికీ తరచూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఆమెకు ప్రాణాంతక వైరస్ సోకినట్లు తేలింది’’ అని పేర్కొన్నారు. కాగా ట్రంప్ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన శ్వేతసౌధ వర్గాలు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో నెగెటివ్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి తాను ప్రతిరోజూ కరోనా పరీక్షలు చేయించుకుంటానని ట్రంప్ పేర్కొన్నారు. అన్ని వర్క్ వీసాలపై తాత్కాలిక నిషేధం! -
లాక్డౌన్: హలీడే ట్రిప్‌లో ఇవాంక!
వాషింగ్టన్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా(కోవిడ్-19) ధాటికి అమెరికాలో 33 వేలకు పైగా మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారానికి 6,54,343కు చేరుకుంది. ఇటువంటి తరుణంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని.. అమెరికన్లు తిరిగి యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్లిన వార్తలు బయటకు రావడంతో ట్రంప్ కుటుంబంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసిన ఇవాంక.. తానే వాటిని ఉల్లంఘించారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహమ్మారిని తేలికగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. (హెల్త్ వాలంటీర్‌గా స్వీడన్ యువరాణి) వివరాలు.. ఇవాంక, తన భర్త జారేద్ కుష్నర్తో కలిసి జ్యూయిష్ హాలిడే(యూదుల పండుగ- పాసోవర్ సెలబ్రేషన్స్) కోసం న్యూజెర్సీకి వెళ్లారు. ఏప్రిల్ 8న ప్రారంభమైన పాసోవర్ సెలబ్రేషన్స్ కోసం వాషింగ్టన్‌లోని తన నివాసం వీడి గురువారం వరకు అక్కడే ఉన్నారు. ఈ విషయం వార్తా పత్రికల్లో ప్రచురితమైన తర్వాత.. ఇవాంక బెడ్మినిస్టర్లోని ట్రంప్ కుటుంబానికి చెందిన గోల్ఫ్ రిసార్టుకు వెళ్లారని శ్వేతసౌధ వర్గాలు ధ్రువీకరించాయి. ఆమెతో పాటు కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని... ఇవాంక నివాసం కంటే అక్కడే తక్కువ జనాభా ఉంటారు కాబట్టి పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి. ‘‘బెడ్‌మినిస్టర్‌లో ఇవాంక భౌతిక దూరం పాటిస్తూనే ఉన్నారు. అక్కడి నుంచే తన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ప్రయాణం వ్యాపార సంబంధమైనది కాదు. తన కుటుంబంతో వ్యక్తిగతంగా సమయాన్ని గడిపేందుకు వెళ్లారు’’అని ఓ ప్రకటనలో తెలిపాయి. (‘ఏప్రిల్ చివరి నాటికి ఆ రాష్ట్రాలు తెరుచుకుంటాయి’) కాగా న్యూజెర్సీ, న్యూయార్క్‌లో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు 16,251 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రాణాంతక వైరస్ విస్తరిస్తున్న తొలినాళ్లలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అందరూ ఇంట్లోనే ఉండాలంటూ ఇవాంక ఓ వీడియో సందేశం పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనమంతా తెలిసోతెలియకో కోవిడ్ వ్యాప్తిలో భాగస్వాములం అవుతాం. భౌతిక దూరం ఒక్కటే మన ప్రాణాలు కాపాడుతుంది’’అని ఇవాంక విజ్ఞప్తి చేశారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాంకపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి అందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(మరణాలు @ 33 వేలు) -
ఆయన త్వరగా కోలుకోవాలి : ఇవాంకా ట్రంప్
లండన్ : కరోనా వైరస్ సోకి ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. మార్చి 27న బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. తనకు కరోనా వచ్చినట్లు స్వయంగా ప్రకటించిన ఆయన.. ఇంటి నుంచే పరిపాలన వ్యవహారాలు చూస్తానని ట్వీట్ చేశారు. కానీ వ్యాధి తగ్గకపోగా మరింత తీవ్రం కావడంతో సోమవారం ఐసీయూకి తరలించారు. అంతకముందు బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మెరుగపడి, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో బోరిస్ జాన్సన్ పది రోజుల పాటు స్వీయ నిర్భందంలోనే ఉన్నారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో డాక్టర్ల సలహా మేరకు లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించారు. -
అద్భుతం.. మోదీకి థాంక్స్: ఇవాంక
వాషింగ్టన్: ప్రాణాంతక వైరస్ కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలో భాగంగా పలు దేశాల్లో లాక్డౌన్ పటిష్టంగా అమలు అవుతోంది. అగ్రరాజ్యం మొదలు అన్ని దేశాల్లోనూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగా వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లలో చైతన్యం నింపుతున్నారు. యోగాతో ఫిట్నెస్ పెంచుకోవచ్చని.. మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తాజాగా యోగ నిద్రకు సంబంధించిన వీడియోను మోదీ పోస్ట్ చేశారు. ‘‘సమయం దొరికినపుడు... వారానికి ఒకటి లేదా రెండుసార్లు యోగ నిద్ర ప్రాక్టీసు చేస్తాను. తద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇంటర్నెట్లో మరిన్ని యోగ నిద్ర వీడియోలు మీకు లభిస్తాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉన్న వీడియోను షేర్ చేస్తున్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ కూడా స్పందించారు. ఇది అద్భుతం అంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గతేడాది ప్రధాని మోదీ.. యానిమేటెడ్ వర్షన్ వీడియోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా కరోనా అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఇవాంక మహమ్మారిని అంతా కలిసి తరిమికొడదాం అంటూ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. This is wonderful! Thank you @narendramodi!#TogetherApart https://t.co/k52G4viwDs — Ivanka Trump (@IvankaTrump) March 31, 2020 -
ఇవాంకకూ కరోనా సెగ!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకకూ కరోనా సెగ తగి లింది. ఇవాంక గత శుక్రవారం ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి పీటర్ డుటన్తో సమావేశమైంది. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో పీటర్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో శుక్రవారం ఇవాంక తన ఆఫీస్ పనులను ఇంటి నుంచే చక్కబెట్టుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంటి నుంచే పనిచేసినట్లు ఆమె వెల్లడించారు. మరోవైపు పీటర్ డుటన్ మాత్రం కొంతకాలం పాటు విడిగా (సెల్ఫ్ క్వారంటైన్)లో ఉండాలని నిర్ణయించుకున్నారు. కాగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరే కరోనా వైరస్ బారిన పడగా.. ట్రూడో మాత్రం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇవాంకతో భేటీ.. కరోనా పాజిటివ్
కాన్బెర్రా : ప్రమాదకర కరోనా వైరస్ విజృంభిస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపుతోంది. అన్ని రంగాలపై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. ఆయా రంగాల ప్రముఖులను సైతం వీడట్లేదు. తాజాగా ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ దుట్టన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. అగ్రరాజ్యం అమెరికా పర్యటన నిమిత్తం ఐదు రోజుల కిందట అక్కడకు చేరుకున్నారు. వివిధ దేశాధినేతలతో ఆయన భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్‌తోనూ ఆయన సమావేశమయ్యారు. అయితే అమెరికా పర్యటన ముగించుని శుక్రవారం నాడు స్వదేశానికి చేరుకున్న మంత్రికి అక్కడి వైద్య అధికారులు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. (కరోనా బారిన ఆ దేశ ప్రధాని భార్య..) కాగా బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రికి ఇప్పటికే కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా రిపోర్ట్స్ వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు అప్రమత్తమైయ్యాయి.. ప్రపంచ వ్యాప్తంగా క్రీడా, వినోద ఈవెంట్లను రద్దు చేసుకుంటున్నాయి. భారత్‌లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో పలు కార్యక్రమాలను సైతం రద్దు చేస్తున్నారు. -
తాజ్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్: ఇవాంకా
న్యూఢిల్లీ: నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్ చేసిన ఓ ట్వీట్ ట్విట్టర్‌ను ఊపేస్తోంది. దీనికి కారణం ఆ ట్వీట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు రిప్లై ఇవ్వడమే. వివరాల్లోకి వెళితే.. ఇవాంకా ట్రంప్ ఇటీవల భారత పర్యటనలో తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె తాజ్‌మహల్ వద్ద దిగిన ఓ ఫొటోను దిల్జిత్ ఫొటోషాప్ ఉపయోగించి మార్ఫింగ్ చేసి, ఇవాంకా పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. ‘నేనే తనను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లాను.. అంతకంటే ఏం చేయగలను ?’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై ఇవాంకా స్పందిస్తూ.. ‘నన్ను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు. దీన్ని నేనెప్పటికీ మరచిపోలేను.’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై దిల్జిత్ స్పందిస్తూ.. ‘ఓ మైగాడ్.. కృతజ్ఞతలు ఇవాంకా ! ఇది ఫొటోషాప్ చేసిన చిత్రం కాదని అందరికీ చెప్పేప్రయత్నం చేస్తున్నారు. ఈసారి లూథియానాకు రండి’ అన్నారు. దీనిపై మళ్లీ స్పందించిన ఇవాంకా ‘భారతీయ అభిమానులను అభినందిస్తున్నా’ అంటూ ఫొటోషాప్ చేసిన మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు. తనపై ఫొటోషాప్ చేసిన ఫొటోలపై ఇవాంకా సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడంతో ట్విట్టర్లో నవ్వులు పూశాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇవాంకా ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు -
సైకిలెక్కిన ఇవాంక.. వైరల్ ఫోటోలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతూరు ఇవాంక ట్రంప్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ట్రంప్ భారత్ పర్యటనలో ఇవాంక కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆమె రాకకోసం ఎంతోమంది అభిమానులు కళ్లుకాసేలా ఎదురుచూశారు. తమ అభిమాన ఇవాంకను ఒక్కసారి కళ్లారా చూసి.. ఒక్క సెల్ఫీ తీసుకోవాలని ఎంతోమంది ఆశపడి ఉంటారు. కొంతమంది ఆ అవకాశం దొరికినా.. చాలా మందికి మాత్రం నిరాశే మిగిలింది. అయితే వారంత అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుని, ఉన్న తెలివితో ఇవాంకతో సెల్ఫీ తీసుకున్నట్లు ఫోటోలను ఎడిట్ చేసి మురిసిపోతున్నారు. (అందరి చూపులు ఆమె వైపే..!) దీనిలో భాగంగానే ఓ కుర్రవాడు ఇవాంక ట్రంప్‌ను చూసి మనసు పారేసుకున్నాడు. తన సైకిల్‌పై ఎక్కించుకుని తిప్పాలని అనుకున్నాడు. అయితే అది కుదరకపోవడంతో ఎడిటింగ్‌లో తన సైకిల్‌పై ఇవాంకను ఎక్కించుకున్నట్లుగా చేసుకుని సరదా తీర్చుకున్నాడు. మరోకరు ఆమెతో తాజ్‌మహాల్ వద్ద పక్కపక్కన కూర్చోని ఉన్నట్లు ఫోటోను ఎడిట్ చేశారు. ఈయన ఎవరో కాదు ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసంజ్. ఇలాంటివి ఎన్నో చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో తన దృష్టికి వచ్చిన పలు ఫోటోలపై ఇవాంక సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారతీయుల అభిమానాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానంటూ బదులిస్తున్నారు. (తాజ్ అందాలకు ఇవాంక ఫిదా!) -
భారత్ గొప్ప దేశం: ట్రంప్
వాషింగ్టన్: భారత్ ఎంతో గొప్ప దేశమని, తన పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఇతర ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి భారత్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న ఆయన బుధవారం అమెరికాకు చేరుకున్నారు. స్వదేశానికి వెళ్లిన వెంటనే ట్రంప్ ‘భారత్ చాలా గొప్ప దేశం. నా పర్యటన విజయవంతమైంది’అని ట్వీట్ చేశారు. అధ్యక్ష ఎన్నికలయ్యాక రావాలనుకున్నా.. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక భారత పర్యటనకు రావాలని భావించానని ట్రంప్ చెప్పారు. మోదీకి ఆ ఆలోచన నచ్చకపోవడంతో ముందే వచ్చానన్నారు. రాష్ట్రపతి భవన్లో మంగళవారం విందులో ట్రంప్ ఈ విషయం చెప్పారు. ‘భారత్‌కి మళ్లీ మళ్లీ వస్తూ ఉండాలని ఆశపడుతున్నాను’అని ట్రంప్ అన్నారు. ట్రంప్ ప్లేటర్‌ను ఆస్వాదించిన ట్రంప్ ట్రంప్, భార్య మెలానియా భారత్ పర్యటనలో బస చేసిన ఐటీసీ మౌర్యలో వారి కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ట్రంప్ ప్లేటర్ భోజనాన్ని ఎంజాయ్ చేస్తూ తిన్నారు. టేబుల్ సైజ్‌లో ఉండే నాన్, మటన్ లెగ్‌తో తయారు చేసిన సికందరి నాన్ రుచికి వారు ఫిదా అయ్యారని హోటల్ వర్గాలు వెల్లడించాయి. వారు వెళ్లేటపుడు ఎంఎఫ్ హుస్సేన్ గుర్రం చిత్రం ముద్రించిన అప్రాన్లను హోటల్ యాజమాన్యం అధ్యక్షుడికి కానుకగా ఇచ్చింది. -
సర్వోదయ బడి ఫస్ట్‌లేడీ సందడి
సంతోషం సగం బలం అంటారు. కానీ సంతోషమే సంపూర్ణ బలం. అవును ఇది నిజం. పువ్వుల్లా నవ్వే చిన్నారుల్ని చూసినా.. వారి పక్కనే కూర్చొని సంతోషంపై పాఠాలు నేర్చుకున్నా.. ధ్యానముద్రలో ఉంటూ అలౌకిక ఆనందాన్ని పొందినా.. సంతోషం ఎలా రెట్టింపవుతుందో అదే సంపూర్ణ బలంగా ఎలా మారుతుందో తెలుస్తుంది. అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌కి ఢిల్లీ పాఠశాల జీవితకాలానికి సరిపడా అద్భుతమైన అనుభూతినిచ్చింది. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీలోని మోతీబాగ్‌లో సర్వోదయ బాలబాలికల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల్లో విద్యార్థిగా కలిసిపోయారు. తరగతి గదిలో కూర్చొని హ్యాపీనెస్ క్లాసుల్ని శ్రద్ధగా విన్నారు. చిన్నారులతో ముచ్చట్లాడారు. హ్యాపీనెస్ పాఠ్యాంశాలు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, ఇవి విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆలోచనల్ని, సానుకూల దృక్ఫథం అలవడడానికి దోహదపడతాయని కూడా అన్నారు. బొట్టుపెట్టి.. హారతిచ్చి డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీతో చర్చలు నిర్వహిస్తున్న సమయంలో మెలానియా ఈ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. ఆమెకు స్వాగతం చెప్పడానికి పువ్వులు, కళాకృతులతో పాఠశాలని కంటికింపుగా అలంకరించారు నిర్వాహకులు. చాలా చోట్ల రంగు రంగుల ముగ్గులు వేశారు. చీరలు ఘాగ్రాచోళీలు ధరించి అందంగా ముస్తాబైన కొందరు విద్యార్థినులు ఆడుతూ, పాడుతూ మెలానియాకు స్వాగతం పలికారు. ఆమెకి పుష్ప గుచ్ఛాన్ని ఇచ్చి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి, హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. ‘హ్యాపీనెస్’ స్ఫూర్తి మెలానియా పాఠశాల అంతా కలియ తిరిగారు. రీడింగ్ రూమ్‌కి వెళ్లారు. ఎల్కేజీ, యూకేజీ చిన్నారులకి ఆటపాటల్ని నేర్పే యాక్టివిటీ రూమ్‌కి వెళ్లారు. వారితో పాటు అక్కడే కూర్చొని చాలాసేపు గడిపారు. యోగా క్లాసుకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి కాసేపు ధ్యానముద్రలో గడిపారు. ఆ ధ్యానం తనకు ఎంతో ప్రశాంతతనిచ్చిందని అన్నారు. ఆ తర్వాత పాఠశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. భారత్‌కు రావడం ఇదే తొలిసారని, ఇక్కడి ప్రజలు ఎంతో దయామయులని కితాబునిచ్చారు. విద్యార్థుల మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్‌తో తరగతుల్ని ప్రారంభించడం, ప్రకృతితో మమేకం కావడం ఎంతో స్ఫూర్తిని కలిగిస్తాయని చెప్పారు. విద్యార్థులతో మంచి సమయాన్ని గడిపిన మెలానియా తిరిగి వెళ్లే ముందు విద్యార్థులు భారత్, అమెరికా జెండాలు పట్టుకొని బారులు తీరి నిల్చొని ఉల్లాసంతో, ఉత్సాహంతో ఛీర్స్ చెబుతూ ఆమెకు వీడ్కోలు చెప్పారు. ఫస్ట్ లేడీకి ప్రశ్నలు అమెరికా ఎంత పెద్దది ? ఇక్కడ నుంచి బాగా దూరమా? ఫస్ట్ లేడీ అంటే ఏం చేస్తారు? ఇలా సర్వోదయ పాఠశాలలో ఔత్సాహిక విద్యార్థులు మెలానియా ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు గంటకు పైగా ఆమె స్కూలులో గడిపారు. ఈ సందర్భంగా అక్కడి టీచర్లు మెలానియాను ఏమైనా అడగాలని అనుకుంటే అడగమని విద్యార్థుల్ని ప్రోత్సహించారు. దీంతో అమెరికా గురించి, అక్కడకి వెళ్లేందుకు పట్టే సమయం గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. వాటన్నింటికి మెలానియా ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఢిల్లీ సీఎం ట్వీట్ మెలానియా పాఠశాలకు రావడానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు.‘‘ మా స్కూలులో హ్యాపీనెస్ క్లాస్‌కు అమెరికా ఫస్ట్ లేడీ హాజరవుతున్నారు. ఢిల్లీ ప్రజలకు మా పాఠశాల విద్యార్థులు, టీచర్లకు ఇది అద్భుతమైన రోజు. శతాబ్దాలుగా భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మికతను బోధిస్తోంది. మా పాఠశాల నుంచి ఆమె ఆనందోత్సాహాలతో తిరిగి వెళతారు. అదే మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది’’ అని కేజ్రీవాల్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఏమిటీ హ్యాపీనెస్ క్లాస్‌లు?! ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాఠశాలల్లో తరగతులంటే పాఠాలు బట్టీ పట్టడం, పరీక్షలు రాయడం, మార్కులు, ర్యాంకులు, అడుగడుగునా ఒత్తిళ్లు. ఈ విధానానికి చెక్ పెట్టి విద్యార్థుల మెదడుకి పదును పెడుతూ వారిలో సంతోషాన్ని పెంచే క్లాస్లివి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తాను చేపట్టిన విద్యావ్యవస్థ సంస్కరణలో భాగంగా ఈ హ్యాపీనెస్ క్లాస్‌లను ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠశాలల్లో 45 నిముషాల సేపు ఈ హ్యాపీనెస్ పీరియడ్ ఉంటుంది. ఈ క్లాసులో పిల్లలందరి మానసిక ప్రశాంతత కోసం కాసేపు ధ్యానం చేయిస్తారు. విలువలతో ఎలా బతకాలో నేర్పిస్తారు. వారి మేధస్సుకు పదును పెట్టేలా, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని ఆనందంగా జీవితాన్ని ఎలా గడపాలో వారికి బోధిస్తారు. ఆత్మ స్థైర్యంతో అనర్గళంగా మాట్లాడేలా చర్చలు నిర్వహిస్తారు. వారిలో కళని బయటకు తీసేలా చిన్నచిన్న నాటికలు వేయిస్తారు. -
తెలుపు.. స్వచ్ఛత
ఇండియా వచ్చిన ట్రంప్ ఫ్యామిలీ నిన్న రాత్రి యు.ఎస్. వెళ్లిపోయింది. ట్రంప్‌తో పాటు వచ్చిన ట్రంప్ సతీమణి మెలానియా, ట్రంప్ కూతురు ఇవాంక ఈ రెండు రోజుల్లోనూ తమ ముద్రల్ని భారతీయ మహిళల మదిపై వదిలి వెళ్లారు. సన్నగా, అందంగా, ఫ్యాషనబుల్‌గా..వీటన్నిటినీ మించి ధవళవర్ణ కాంతులతో స్వచ్ఛతకు ప్రతీకగా మెరిశారు ఈ ఇద్దరు మహిళలు. మెలానియా వయసు 49. ఇవాంక వయసు 38. వయసులో పెద్దగా తేడా లేదు. అందుకే కావచ్చు ఇద్దరూ ఒకేలా ఉన్నారు. ఒకట్రెండు మార్కులైతే మెలానియాకే ఎక్కువ పడ్డాయేమో. సోమవారం ఆమె ఇండియాలో ఫ్లయిట్ దిగడమే.. సొగసుగా దిగారు. తెల్లటి జంప్‌సూట్‌తో ఉన్నారు. నడుముకు ఆకుపచ్చరంగు పట్టు శాష్ (కండువా లాంటిది) చుట్టుకున్నారు. ఆ శాష్లో బిగించి కట్టినట్లుగా భారతీయ ఉట్టిపడుతోంది. ఫ్రెంచి– అమెరికన్ డిజైనర్ హార్వే పియరీ సన్నటి బంగారు లోహపు దారలతో దానిని అల్లారు. పారిస్‌లో జరిగిన భారత సంప్రదాయ జౌళి కళల ప్రదర్శనలో ఆ వస్త్ర విశేషం గురించి చదివారట ఆయన. దాంతో ఇన్స్పైర్ అయి ఈ శాష్‌ను తయారు చేశారు. శాష్ బోర్డర్‌లోనే పనితనమంతా ఉంది అంటారు పియరీ. పర్యటనలో రెండో రోజు రాజ్‌ఘాట్‌లో మహాత్ముని సమాధికి నివాళులు అర్పించినప్పుడు, ఆ పరిసరాలలో మొక్కను నాటినప్పుడు కూడా మెలానియా తెల్లని డ్రెస్‌నే ధరించారు. మోకాళ్ల కిందివరకూ పూల ఎంబ్రాయిడరీ ఉన్న బటన్ డౌన్ కాటన్ పాప్లిన్ లాంగ్ షర్ట్ వేసుకున్నారు. కాలర్ నెక్లెస్, ఫోల్డెడ్ స్లీవ్‌తో చూడచక్కగా ఉన్నారు. ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలకు వెళ్లినప్పుడూ ఇదే డ్రెస్‌తో ఉన్నారు. ఒక విద్యార్థిని ఆమె నుదుటిపై తిలకం దిద్దినప్పుడు అచ్చు భారతీయ స్త్రీలా మారిపోయారు మెలానియా. ఈ డ్రెస్‌ను వెనిజులా ఫ్యాషన్ డిజైనర్ కరోలినా హెరేరా డిజైన్ చేశారు. కాటన్ ఫ్యాబ్రిక్‌ని లూజ్ ఫిట్‌తో భారతీయ వాతావరణానికి అనువుగా రూపొందించారు. మెలానియా వయసుకు తగినవిధంగా సౌకర్యానికి ప్రాముఖ్యం ఇస్తూ, క్యాజువల్ లుక్‌తో ఆకట్టుకునేలా డిజైన్ చేయడం విశేషం. ఈ షర్ట్ డ్రెస్‌కి ఫోల్డెడ్ స్లీవ్స్, కాలర్ నెక్ హుందాగా అమరాయి. ధర మన రూపాయలలో దాదాపు 1.1 లక్షలు. డ్రెస్‌లోని రెడ్ ప్రింట్‌ను మ్యానేజ్ చేస్తూ నడుముకు ఎర్రటి పెద్ద బెల్ట్‌ను వాడటంతో లుక్ రెట్రో స్టైల్‌ని తలపిస్తోంది. దీనికి వైట్ కలర్ పెన్సిల్ కట్ లెదర్ హీల్స్ అదనపు హంగుగా అమరాయి. స్మోకీ ఐ మేకప్, రోజ్ కలర్ లిప్‌స్టిక్‌తో పాటు భుజాల మీదుగా అలలుగా ఎగిసే శిరోజాల్లోనూ చర్మం రంగు పోటీ పడుతున్నట్లుగా ఉన్నారు మెలానియా. ఇవాంక దుస్తులు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి కానీ, గత ఏడాది అర్జెంటీనా పర్యటనలో ధరించిన దుస్తులనే ఆమె ఈ పర్యటనలోనూ (తొలి రోజు) ధరించడం మరింత ప్రత్యేకం అయింది! లక్షా డెబ్భైవేల రూపాయల విలువైన బేబీ బ్లూ, రెడ్ ఫ్లోరల్ డ్రెస్ అది. కలవారి అమ్మాయి, పైగా ఒక ఫ్యాషన్ మోడల్... వేసిన దుస్తుల్నే మళ్లీ వేయడం సోషల్ మీడియాలో ప్రశంసలు కురవడానికి కారణం అయింది. ‘‘డబ్బు మిగల్చడం అటుంచండి. ఒక డ్రెస్ తయారవడానికి ఖర్చయ్యే ప్రకృతి వనరుల్ని క్షయం కాకుండా ఆమె కాపాడారు’’ అని అభినందనలు వచ్చాయి. రెండో రోజు.. అగ్రదేశాధినేత కూతురుగానే కాదు వైట్ హౌస్ సీనియర్ సలహాదారుగా కూడా ఇవాంక తన డ్రెస్సింగ్ ద్వారా అంతే హుందాతనాన్ని ప్రదర్శించారు. సంప్రదాయ పద్ధతుల్లో చేత్తో రూపుదిద్దుకున్న లాంగ్ స్లీవ్స్, ఫ్రంట్ బటన్స్ సల్వార్ కమీజ్ను ధరించారు. దీనిని మన ఇండియన్ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేశారు. మన దేశంలో తెలుపు రంగును శాంతికి, స్వచ్ఛతకు సూచికగా వాడతారని తెలిసిందే. అందుకే కావచ్చు.. మెలానియా, ఇవాంకల వస్త్రధారణ.. తెల్లని కాంతులు ప్రతిఫలింపజేసేలా ఉంది. ఇక ఇవాంక పాదాలకు ధరించిన వైట్ కిటెన్ మనోలో బ్లానిక్ మ్యూల్స్ ధర దాదాపు 40 వేలు. గ్లామర్ టచ్ కోసం మన బాలీవుడ్ స్టైల్ బంగారు షాండ్లియర్ ఇయర్ రింగ్స్ ఇవాంక ధరించడం మరో విశేషం. ఫిట్నెస్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారులుగా వైట్ హౌస్‌లోకి వచ్చాక, ఇవాంక, ఆమె భర్త.. ఒకరి సమక్షంలో ఒకరు గడిపే అవకాశం ఉదయం పూట కొన్ని నిముషాలు మాత్రమే దొరుకుతోంది. మ్యాచింగ్ అథ్లెటిక్ దుస్తులు వేసుకుని, లో బేస్‌బాల్ క్యాప్‌లు ధరించి, ఇద్దరూ పక్కపక్కనే వడివడిగా, వగరుస్తూ నడుస్తూ మాట్లాడుకునే విషయాలు ఎక్కువగా ఫిట్నెస్ గురించే! ఇవాంకకు ఒకప్పుడు న్యూయార్క్ సిటీ హాఫ్–మారథాన్‌ను గెలవడం అన్నది లక్ష్యంగా ఉండేది. ఆ లక్ష్యాన్ని కొన్ని నెలల కఠోరమైన శిక్షణతో ఆమె నెరవేర్చుకున్నారు కూడా. 2015 ఏప్రిల్‌లో పదమూడు మైళ్ల మారథాన్ పరుగులో ఇవాంక విజయం సాధించారు! ఫ్రాంక్‌నెస్ ఇవాంక.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ట్రంప్ అయినా తన కుమార్తె ఆదేశాలను పాటిస్తారేమో కానీ, ఇవాంక తన తండ్రిని గుడ్డిగా సమర్థించరు. ఒక ఉదా : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇవాంక.. తండ్రి తరఫున ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడంపై ఆమె తన అభిప్రాయలను ఏమాత్రం దాపరికం లేకుండా వెల్లడించడం ట్రంప్ ప్రత్యర్థుల్ని సైతం నివ్వెరపరచింది. ‘‘ఒక పౌరురాలిగా ఆయన చేస్తున్న పనిని నేను ఇష్టపడతాను. కానీ ఒక కూతురిగా ఇది ఆయనకు కష్టమైన విషయంగా భావిస్తాను’’ అని ఇవాంక అన్నారు! అదొకటేనా.. ‘‘నా తండ్రిలో ఉన్న అత్యంత గొప్పవైన నైపుణ్యాలలో ఒకటి ఏమిటంటే.. మనుషుల్లోని సామర్థ్యాలను ఇట్టే పట్టేస్తారు. ఆమెరికాను ఆయన మళ్లీ ఒక గొప్ప దేశంగా మార్చేగలరు’’ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల సమావేశంలో ఇవాంక అన్న మాటల్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రముఖంగా ప్రచురించింది. ఇవాంక వైట్‌హౌస్‌లో ఉన్నంత వరకే అమెరికా గానీ, మిగతా దేశాలు గానీ ట్రంప్ చేతుల్లో సురక్షితంగా ఉంటాయని కూడా ఆ పత్రిక రాసింది. బిజినెస్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకపోయుంటే ఈరోజు ఇవాంక పరిచయం వేరేలా ఉండేది. ప్రధానంగా వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారి ఆమె. అంతకన్నా ముందు ఫ్యాషన్ మోడల్. అయితే ఇప్పుడు ఆమె కెరీర్లో ఈ రెండిటికీ ఏమంత ప్రాధాన్యం లేదు! అమెరికా అధ్యక్షుడి కూతురిగా ఇవాంక ప్రస్తుతం తన తండ్రికి వైట్ హౌస్ ఆంతరంగికురాలిగా జీతం లేని ఉద్యోగం చేస్తున్నారు. అమె కన్నా ఏడాది మాత్రమే వయసులో పెద్దవాడైన భర్త జారెడ్ కుష్నర్ కూడా ఒక సీనియర్ సలహాదారుగా ట్రంప్ దగ్గరే ఉండిపోయారు. సాఫ్ట్‌నెస్ ఇవాంక చెయ్యిం ఎంత పెద్దదో, మనసూ అంతే పెద్దది. సున్నిత హృదయం. మంచి పనులు చేస్తున్న వారికి తరచు విరాళాలు ఇస్తుంటారు. న్యూయార్క్‌లో ‘చాయ్ లైఫ్‌లైన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. ఆ సంస్థ క్యాన్సర్ బారిన పడిన బాలలను సంరక్షిస్తుంటుంది. దానితో పాటు ఇంకా అనేక యూదు సంస్థలకు ఇవాంక క్రమం తప్పకుండా డబ్బు సహాయం చేస్తుంటారు. అలాగే ‘యునైటెడ్ హట్జాల్లా’ అనే సంస్థ ఉంది. జెరుసలేంలోని అత్యవసర వైద్య చికిత్సా సంస్థ ఇది. దానికి వేల డాలర్ల చెక్కులు పంపుతుంటారు. ఇవాంక రచయిత్రి కూడా! ‘ది ట్రంప్ కార్డ్ : ప్లేయింగ్ టు విన్ ఇన్ వర్క్ అండ్ లైఫ్’, ‘ఉమెన్ హు వర్క్ : రీరైటింగ్ ద రూల్స్ ఫర్ సక్సెస్’ అనే పుస్తకాలు రాశారు. -
అందరి చూపులు ఆమె వైపే..!
న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంక ట్రంప్ రెండవ రోజు తెలుపు రంగు సూట్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయం అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వెనుక తన భర్త జరెద్ కుష్నర్తో కలిసి ఇవాంక రాష్ట్రపతి భవన్ వద్దకు వచ్చారు. ఈ సారి కాస్త డిఫరెంట్‌గా తెలుపు రంగు సూట్ ధరించారు. ఇండో వెస్ట్రన్ డిజైనర్ అనితా డొంగ్రే ఈ షేర్వానీని డిజైన్ చేశారు. పశ్చిమబెంగాల్‌కి చెందిన ముర్షిదాబాద్ పట్టుతో షేర్వానీని అందంగా డిజైన్ చేశారు. దీనికి మెటాలిక్ బటన్లను పొందుపరిచారు. స్లీవ్‌లెస్ కాకుండా తెలుగు రంగు సూట్‌తో పాటు స్ట్రెయిట్ ఫీట్ గల తెల్లని ప్యాంట్‌ను ఇవాంక ధరించారు. అందులో నిండుగా భారతీయత ఉట్టిపడేట్టు ఇవాంక కనిపించారు. చదవండి: ట్రంప్ పర్యటన : ఇవాంకా డ్రెస్ అదుర్స్! ‘తాజ్’ అందాలకు ఇవాంక ఫిదా! -
ఎయిర్పోర్ట్ టు స్టేడియం వయా సబర్మతి
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి భారత పర్యటన ఘనంగా ప్రారంభమైంది. ట్రంప్, ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్ వచ్చిన ‘ఎయిర్‌ఫోర్స్ 1’ విమానం ఉదయం 11.37 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. బ్లాక్ సూట్లో ట్రంప్, వైట్ జంప్‌సూట్‌లో మెలానియా భారత గడ్డపై అడుగుపెట్టారు. ట్రంప్ రాకకు దాదాపు గంట ముందే మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ట్రంప్‌కు సాదర స్వాగతం పలుకుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మెలానియాకు ప్రేమగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అక్కడి నుంచి వారు నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. దాదాపు పావుగంట పాటు గడిపిన అనంతరం, మొటేరా స్టేడియానికి బయల్దేరారు. రోడ్ షో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచే ట్రంప్ రోడ్ షో ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతూ రహదారులకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. దారి పొడవునా దాదాపు 22 కిమీ మేర వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రత్యేకతలను వివరించేలా దాదాపు 50 వేదికలను ఏర్పాటు చేశారు. ఆ వేదికలపై ఆయా రాష్ట్రాల కళాకారులు తమ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు. బ్లాక్ లిమోజిన్ ‘ది బీస్ట్’లో ప్రయాణిస్తూ ఈ రోడ్ షోలో ట్రంప్ పాల్గొన్నారు. భద్రత 10 వేలకు పైగా పోలీసులు, ఎన్ఎస్జీ, ఎస్పీజీ దళాలు, అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు రోడ్ షో, ఆ తరువాత మొతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాలకు భద్రత కల్పించారు. ‘మౌర్య’లో సంప్రదాయ స్వాగతం ట్రంప్ దంపతులకు హోటల్ మౌర్య షెరాటన్‌లో సంప్రదాయ సిద్ధంగా స్వాగతం పలికారు. హోటల్లో అడుగుపెట్టగానే వారికి తిలకం దిద్ది, పూలగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. భద్రతాకారణాల రీత్యా వారు వెనకద్వారం గుండా లోనికి వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో వారు భోజనం చేశారని హోటల్ వర్గాలు తెలిపాయి. మౌర్యషెరాటన్‌లోని గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్లో ట్రంప్ బస చేశారు. నేడు చర్చలు ఢిల్లీలో మంగళవారం ఉదయం నుంచి ట్రంప్ బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం రాష్ట్రపతి భవన్లో ఆయనకు అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆ తరువాత, ప్రధాని మోదీ, ట్రంప్‌ల నేతృత్వంలో హైదరాబాద్ హౌజ్‌లో భారత్, అమెరికాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య 300 కోట్ల డాలర్ల విలువైన డిఫెన్స్ డీల్‌తో పాటు ఐదు ఒప్పందాలు కుదిరే అవకాశముంది. మోదీ, ట్రంప్ చర్చల్లో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. రక్షణ ఒప్పందంలో.. నౌకాదళం కోసం 24 ఎంహెచ్ 60ఆర్ రోమియో హెలీకాప్టర్లను, 6 ఏహెచ్64ఈ అపాచీ హెలీకాప్టర్లను భారత్ కొనుగోలు చేయనుంది. అనంతరం ట్రంప్ దంపతులు రాష్ట్రపతి కోవింద్‌ను కలుస్తారు. కోవింద్ ఇచ్చే విందులో పాల్గొంటారు. ఆ తరువాత అమెరికాకు బయల్దేరి వెళ్తారు. -
తాజ్‌మహల్‌లో ఇవాంక సందడి
-
‘తాజ్’ అందాలకు ఇవాంక ఫిదా!
ఆగ్రా: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్ తాజ్‌మహల్‌లో సందడి చేశారు. భర్త జారేద్ కుష్నర్తో కలిసి ప్రపంచ వింతల్లో ఒకటైన కట్టడాన్ని వీక్షించారు. 2017లో ఇవాంక తొలిసారిగా భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)’ కు ఆమె హాజరయ్యారు. తాజాగా తన తండ్రి ట్రంప్ భారత పర్యటనలో ఆమె కూడా భాగస్వామ్యమయ్యారు.(చేతిలో చెయ్యి వేసుకుని.. తాజ్ అందాలు వీక్షిస్తూ.. ) ఈ క్రమంలో సోమవారం అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ దంపతులతో పాటు ఇవాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగు ఫ్లోరల్ డిజైన్‌తో రూపొందించిన డ్రెస్‌తో పాటు అదే రంగు హైహీల్స్ ధరించి తనదైన స్టైల్లో వావ్ అనిపించారు. ఇక నమస్తే ట్రంప్ కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ కుటుంబం ఆగ్రాకు చేరుకున్నారు. ట్రంప్ దంపతులతో పాటు, ఇవాంక దంపతులు కూడా తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇవాంక భర్త జారేద్ కుష్నర్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. చారిత్రక కట్టడానికి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి తాజ్ అందాలకు ఫిదా అయిన ట్రంప్ కుటుంబం.. దాదాపు గంటసేపు అక్కడే ఆహ్లాదంగా గడిపారు. (ట్రంప్ పర్యటన : మిడి డ్రెస్‌లో ఇవాంక) -
ట్రంప్ పర్యటన : ఇవాంకా డ్రెస్ అదుర్స్!
అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ ఉదయం 11:45 గంటలకు అహ్మదాబాద్ సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టులో అడుగుపెట్టారు. ఆయనతో పాటు అమెరికా తొలి మహిళ మెలనియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరెడ్ కుష్నర్లు కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న మిడి డ్రెస్‌ను ఆమె ధరించారు. బౌవుడ్ నెక్లైన్తో, పఫ్పుడ్ స్లీవ్స్‌తో డ్రెస్ చాలా అందంగా ఉంది. మామూలుగానే ఎత్తుగా ఉండే ఆమె డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా పొడవైన ఎర్రటి హైహీల్స్ ధరించి మరింత ఎత్తుగా కనిపించారు. (ఆ హోటల్లో ట్రంప్ విడిది.. ఒక రాత్రి ఖర్చు.. ) ఇవాంకా గురించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. వారాంతాల్లో, సెలవుల్లో టామీ హిల్ఫిగర్, ససాన్ జీన్స్ బ్రాండ్లకు మోడల్‌గా చేసింది. 1997లో సెవంటీన్ మ్యాగజైన్ కవర్‌పేజీపై కనిపించింది. అదే ఏడాది మిస్ టీన్ యూఎస్ఏ పోటీకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అందాల రాశిగా గుర్తింపు వచ్చినా... తర్వాతికాలంలో ఇవాంకా మోడలింగ్‌ను వదిలేసి పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. చదవండి : ట్రంప్ దంపతులకు మోదీ ఘన స్వాగతం విజయాలు.. వివాదాలతో సహజీవనం! -
ట్రంప్ భారత్ పర్యటనపై వర్మ పంచ్‌లు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 24, 25 తేదీల్లో ఇండియాకు వస్తున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదిలా ఉండగా ట్రంప్ భారత పర్యటనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ మధ్య కాలంలో సైలెంట్‌గా ఉన్న కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తాజాగా డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనపై ట్వీటర్ వేదికపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సెటైర్లు వేస్తున్న వర్మ.. మరోసారి ట్రంప్ పర్యటనను ఉద్దేశించి పలు ఆసక్తికర ట్వీట్లు చేశారు.(‘అగ్ర’జుడి ఆగమనం నేడే) ‘ట్రంప్‌ను ఇండియాకు ఆహ్వానించడానికి మనం వేలకోట్లు ఖర్చు చేశాం.. కానీ ప్రధాని నరేంద్ర మోదీని అమెరికాకు స్వాగతించడానికి అమెరికన్లు వేల రూపాయలైనా ఖర్చు చేస్తారా..? అది అమెరికా.. భారత్ కాదు’’.అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అదే విధంగా ‘ట్రంప్ ఇండియాకు రావడానికి ఒకే ఒక కారణం.. తను ఇండియా వస్తున్నాడంటే ఎంత మంది అతన్ని చూడటానికి వస్తారో అని ఆసక్తిగా ఉన్నాడు. ఎందుకంటే దీనిని ఆయన చనిపోయే వరకు గొప్పగా చెప్పుకోవచ్చు.తన కోసం 10 మిలియన్ల మంది రావచ్చు.. కానీ ట్రంప్ 15 మిలియన్ల జనాలు వచ్చారని అబద్ధం చెబుతాడు.’ అంటూ మరో ట్వీట్ చేశాడు. (ట్రంప్ పర్యటన: వర్మ సంచలన వ్యాఖ్యలు!) ‘ఏ భారతీయుడైన తమ సొంత సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తారని నేను అనుకోవడం లేదు. అలాంటిది వేరే దేశం నుంచి వచ్చిన వాళ్లు ఆసక్తిగా చూస్తారని ఆశించడం సరైనది కాదు. దీని కంటే ఓ బాలీవుడ్ నైట్ ఈవెంట్ ఏర్పాటు చేయడం ఉత్తమం’ అని ట్రంప్ పర్యటను టార్గెట్ చేసిన వర్శ ఆయనపై మరికొన్ని పంచ్‌లు విసిరారు.. ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ మోదీ, నేను మంచి ఫ్రెండ్స్! ‘అగ్ర’జుడి ఆగమనం నేడే We Indians spent thousands of crores in welcoming @realDonaldTrump , but will Americans spend even thousands of rupees in welcoming @narendramodi to the US ? That says about America and not India ...Just saying ! — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2020 The only reason @realdonaldtrump is coming to india is because he’s obsessed with crowd sizes which he can brag about till he dies ..I hope for his sake the 10 million will turn up..But knowing him he will just lie and say 15 million turned up..Just saying! — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2020 The only reason @realdonaldtrump is coming to india is because he’s obsessed with crowd sizes which he can brag about till he dies ..I hope for his sake the 10 million will turn up..But knowing him he will just lie and say 15 million turned up..Just saying! — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2020 The only reason @realdonaldtrump is coming to india is because he’s obsessed with crowd sizes which he can brag about till he dies ..I hope for his sake the 10 million will turn up..But knowing him he will just lie and say 15 million turned up..Just saying! — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2020 -
అగ్రరాజ్య అధ్యక్షుడి ఆగమనానికి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్ : అగ్రరాజ్య అధ్యక్షుడి ఆగమనానికి సర్వం సిద్ధమైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలి భారత పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. కుటుంబంతో సహా ట్రంప్ గుజరాత్‌లోని అహ్మదా బాద్‌లో నేటి మధ్యాహ్నం అడుగిడనున్నారు. దేశ రాజధానికి కాకుండా.. నేరుగా ఒక రాష్ట్రంలోని ప్రధాన నగరానికి అమెరికా అధ్యక్షుడు వస్తుండటం ఒక విశేషమైతే.. ప్రొటొకాల్‌కు విరుద్ధంగా దేశ రాజధానిలో కాకుండా మరో నగరానికి వెళ్లి మరీ భారత ప్రధాని ఆయనకు స్వాగతం పలుకుతుండటం మరో విశేషం.భారత పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ వస్తున్నారు. ఆయనతో పాటు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ట్రంప్ కూతురు, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా భారత్ వస్తున్నారు. కీలక అంశాల్లో భారత్‌తో జరిగే చర్చల్లో పాలు పంచుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఇండియా వస్తోంది. (ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ) 36 గంటలు.. ముఖ్యమైన కార్యక్రమాలు భారత్‌లో తొలుత ట్రంప్ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అహ్మదాబాద్‌లో రోడ్ షోలో పాల్గొంటారు. ఎయిర్పోర్ట్ నుంచి వారు నేరుగా ఈ రోడ్ షోలో పాలుపంచుకుంటారు. దాదాపు 22 కి.మీ.లు ఈ రోడ్ షో జరుగుతుంది. వేలాది మంది ఈ రోడ్ షోలో ట్రంప్‌నకు స్వాగతం పలుకుతారు. రోడ్ షో పొడవునా 28 వేదికలను ఏర్పాటు చేసి, భారతీయ కళారూపాలను కళాకారులు ప్రదర్శిస్తారు. అనంతరం, కొత్తగా నిర్మించిన మొతెరా క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’కార్యక్రమం ఉంటుంది. ట్రంప్‌నకు స్వాగతం పలుకుతూ జరుగుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్ కైలాశ్ ఖేర్ నేతృత్వంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంతో పాటు భారతీయత ఉట్టిపడే పలు ఇతర కార్యక్రమాలుంటాయి. గత సంవత్సరం మోదీ అమెరికా వెళ్లినప్పుడు.. హ్యూస్టన్‌లో అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన హౌడీ మోదీ’కార్యక్రమం తరహాలో ఈ ‘నమస్తే ట్రంప్’ఉంటుంది. ఆ కార్యక్రమం తరువాత ట్రంప్ దంపతులు ఆగ్రా వెళ్లి, ప్రఖ్యాత ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. ట్రంప్ పర్యటన సందర్భంగా ఆగ్రాను, తాజ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు నేరుగా ఢిల్లీ వెళ్లి హోటల్ మౌర్య షెరాటన్‌లో సేద తీరుతారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడికి అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులర్పిస్తారు. అనంతరం, హైదరాబాద్ హౌజ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చల్లో ప్రధాని మోదీతో కలిసి పాలుపంచుకుంటారు. ఆ తరువాత, అమెరికా అధ్యక్షుడు, తన స్నేహితుడు ట్రంప్ గౌరవార్ధం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ఉంటుంది. అనంతరం, యూఎస్ ఎంబసీలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో ట్రంప్ పాల్గొంటారు. వాటిలో ప్రముఖ భారత పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక భేటీ కూడా ఉంటుంది. మంగళవారం సాయంత్రం భారత రాష్ట్రపతిని రామ్‌నాథ్ కోవింద్‌ను ట్రంప్ కలుస్తారు. అక్కడ విందు కార్యక్రమంలో పాల్గొని, అమెరికాకు పయనమవుతారు. దాదాపు 36 గంటల పాటు ట్రంప్ భారత్‌లో గడపనున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లో స్వాగతం పలికేందుకు చిన్నారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ చర్చల్లో కీలకం ట్రంప్ పర్యటన భారత్, అమెరికాల ద్వైపాక్షిక సంబంధాలను మేలిమలుపు తిప్పనుంది. ముఖ్యంగా, రక్షణ, వ్యూహాత్మక సంబంధాల్లో గణనీయ స్థాయిలో సహకారం పెంపొందనుంది. అయితే, వాణిజ్య సుంకాల విషయంలో నెలకొన్న విబేధాలకు సంబంధించి నిర్ధారిత ఫలితాలేవీ రాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ, ఈ ప్రాంతంలో ఆర్థికంగా, సైనికంగా చైనా విస్తృతిని అడ్డుకునే దిశగా ఇరు దేశాల సంబంధాల మధ్య కీలక సానుకూల ఫలితాలు ఈ పర్యటన ద్వారా వెలువడే అవకాశముంది. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరుదేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఉగ్రవాదంపై పోరు, విద్యుత్, మత స్వేచ్ఛ, అఫ్గనిస్తాన్‌లో తాలిబన్‌తో ప్రతిపాదిత శాంతి ఒప్పందం, ఇండో పసిఫిక్ ప్రాంత పరిస్థితి.. తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని భారత్, అమెరికా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మత స్వేచ్ఛపై కామెంట్స్ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ పర్యటన జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. భారత్‌లో మత స్వేచ్ఛపై ట్రంప్ తన అభిప్రాయాలను వెల్లడిస్తారని వైట్‌హౌజ్‌లోని ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ‘ప్రెసిడెంట్ ట్రంప్ ఇరుదేశాల విలువలైన ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛకు సంబంధించి బహిరంగంగాను, వ్యక్తిగత చర్చల్లోనూ ప్రస్తావన తీసుకువస్తారు. అన్ని అంశాలు, ముఖ్యంగా మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని ప్రెసిడెంట్ తప్పక లేవనెత్తుతారు’అని ఆ అధికారి తేల్చిచెప్పారు. ఐదు ఒప్పందాలు! ఇరు దేశాల మధ్య ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వాణిజ్యం, అంతర్గత భద్రతలకు సంబంధించి ఐదు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. ముఖ్యంగా, అమెరికా నుంచి 260 కోట్ల డాలర్లను వెచ్చించి 24 ఎంహెచ్–60 రోమియో హెలీకాప్టర్లను, 80 కోట్ల డాలర్లతో 6 ఏహెచ్ 64ఈ అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందాలు కుదిరే అవకాశముంది. భారత్‌కున్న పలు అభ్యంతరాల రీత్యా.. భారత పౌల్ట్రీ, డైరీ మార్కెట్లలో ప్రవేశించాలన్న అమెరికా ఆశలు ఈ పర్యటన సందర్భంగా కుదిరే అవకాశం కనిపించడం లేదు. ట్రంప్ నేటి షెడ్యూల్.. ఉదయం.. 11:40.. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్ మధ్యాహ్నం 12:15.. ట్రంప్, మోదీలు కలసి సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు 01:05.. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం 03:30.. ఆగ్రాకు ప్రయాణం సాయంత్రం 04:45.. ఆగ్రాకు చేరుకుంటారు 05:15.. తాజ్‌మహల్ సందర్శన 06:45.. ఢిల్లీకి ప్రయాణం 07:30.. ఢిల్లీకి చేరుకుంటారు -
తండ్రితో పాటు భారత పర్యటనకు ఇవాంకా!
-
ట్రంప్‌తో పాటు ఇవాంకా కూడా..
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ కూడా భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం. ఈనెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురు అధికారులు సహా అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ కూడా భారత్‌కు వస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. వీరితో పాటు ఇవాంకా, ఆమె భర్త జారేద్ కుష్నర్ కూడా వస్తున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ట్రంప్, మెలానియా, ఇవాంకా తొలుత అహ్మదాబాద్ వెళ్లి.. ఆ తర్వాత ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి.. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా మెలానియాతో కలిసి ఇవాంకా విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక 2017లో ఇవాంకా భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)’ కు ఆమె హాజరయ్యారు. చదవండి: భారత పర్యటన: ట్రంప్ నిష్ఠూరం మరోవైపు.. ట్రంప్ తాజా పర్యటనలో భాగంగా వాణిజ్యపరంగా భారత్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకుంటారని భావిస్తున్న తరుణంలో.. వాణిజ్యం విషయంలో భారత్ సరిగ్గా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ‘‘భారత దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, తర్వాత కోసం దీన్ని పొదుపు చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఇక ఇతర దేశాలతో వాణిజ్యం విషయంలో అమెరికా ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ వ్యవహరిస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే. -
తల్లిగా ఓడిపోకుండా చేశారు: ఇవాంక
తల్లిగా తనని ఓడిపోకుండా చేశారంటూ అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాంక ఇటీవల తన తండ్రి, కుటుంబ సభ్యులతో కలిసి ‘ప్రెసిడెంట్స్ మార్-ఏ లాగో ఎస్టేట్’లో హాలిడే ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో తిరిగి వస్తున్న క్రమంలో విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. ‘మేము సెలవు రోజులు ఎంజాయ్ చేయడానికి పర్యటనకు వెళ్లాము. ఆదివారం తిరిగి వాషింగ్టన్ చేరుకున్నాము. ఈ క్రమంలో వాషింగ్టన్లో విమానం ల్యాండ్ అవుతుండగానే నా చిన్న కుమారుడు థియోడోర్ జేమ్స్ ఉత్సాహంతో విమానం నుంచి ఒక్కసారిగా పరుగులు తీశాడు. దీంతో అక్కడే ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. జేమ్స్‌ను ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ తల్లిగా వారు నన్ను ఓడిపోకుండా చేశారు’ అంటూ ఇవాంక ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కాగా ఆ సమయంలో జేమ్స్ తన కూతురు చేతిని పట్టుకుని ఉండటంతో చేతిని విడిపించుకుని పరుగులు తీశాడని ఇవాంక పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ... ‘తల్లిగా నన్ను ఓడిపోకుండా చేసిన అమెరికా విమాన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేగాకుండా తన కుమారుడి ఫొటోలను క్యాప్చర్ చేసిన ఫొటోగ్రాఫర్ల ప్రతిభను ప్రశంసించారు. ఇక ఈ ఫొటోలకు ఇప్పటి వరకు 1.3 లక్షల లైకులు రాగా ‘ థీయో ఎంత క్యూట్‌గా ఉన్నాడో’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇవాంక- జారేద్ కుశ్నర్ దంపతులకు ముగ్గురు సంతానం(ఒక కూతురు, ఇద్దరు కుమారులు) ఉన్న సంగతి తెలిసిందే. వారి ఫొటోలను ఇవాంక తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. View this post on Instagram Theo busted attempting a stealth exit from AF1 last night while I was distracted prying melted M&Ms out of my daughter’s hands. Thanks to the US Secret Service I narrowly avoided a major parenting fail! 😅 Hat tip to the eagle eyed photographers who busted my boy in action! A post shared by Ivanka Trump (@ivankatrump) on Jan 6, 2020 at 1:14pm PST View this post on Instagram Home: Imagination Station 🚘🔨☺️ A post shared by Ivanka Trump (@ivankatrump) on Dec 5, 2019 at 6:03pm PST -
ట్రంప్ గెలిచినా నేనక్కడ ఉండను: ఇవాంకా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తన తండ్రి గెలిచినప్పటికీ వైట్ హౌస్‌లో ఉండనని తేల్చి చెప్పారు. ఇవాంకా ట్రంప్ ఇటీవలే ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ మళ్లీ గెలిస్తే ఆయన పాలకవర్గంలో కొనసాగుతారా అని వారు ప్రశ్నించారు. దానికి ఇవాంకా సమాధానమిస్తూ తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని ఖరాఖండిగా చెప్పారు. మొదట తన పిల్లల కోసం, వారి సంతోషం కోసం సమయం కేటాయించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా తను చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని చెప్పుకొచ్చారు. ఎంతో చేసినప్పటికీ, అది సరిపోదని అన్నారు. కాగా ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ 2017లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ తరపున ప్రచారం చేపట్టారు. అతని గెలుపు తర్వాత పాలకవర్గంలోనూ భాగమైన విషయం తెలిసిందే. -
ఇవాంక ట్రంప్‌పై జోకులు!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అన్వాంటెడ్ ఇవాంక హ్యాష్‌ట్యాగ్(#UnwantedIvanka) తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ 20 సదస్సులో ఆమెకు ఎదురైన అనుభవమే ఇందుకు కారణం. అధ్యక్షుడి సలహాదారు హోదాలో ఇవాంక ఎల్లప్పుడు తండ్రి ట్రంప్ వెంటే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు భర్త జారేడ్ కుష్నేర్ కూడా వైట్‌హౌజ్‌లో దర్శనమివ్వడమే కాకుండా ముఖ్యమైన విదేశీ పర్యటనలోనూ ఆయన వెన్నంటే ఉంటారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన పరివారానికే అన్ని పదవులు కట్టబెట్టారంటూ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా జీ20 సదస్సుతో పాటు ట్రంప్ ఉత్తర కొరియా పర్యటనలోనూ ఇవాంక పాల్గొనడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచస్థాయి నేతలతో ట్రంప్ భేటీ అయిన సందర్భాల్లో కూడా ఇవాంక ఆయన పక్కనే ఉండటం, ఉత్తర కొరియా నిస్సైనిక ప్రాంతంలో ట్రంప్‌తో పాటు ఆమె పర్యటించడం పట్ల విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో ఇవాంక కూడా పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మే, అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ క్రిస్టిన్ లగార్డే, ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయెల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివిధ అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఇవాంక కూడా అక్కడే ఉన్నారు. అయితే వారి చర్చలో పాలుపంచుకోవడానికి ఇవాంక ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆమెపై జోకులు పేలుస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంనాటి సమావేశంలో ఇవాంక పాల్గొన్నట్లుగా..ఒబామా హయాంలో వైట్‌హౌజ్‌లో ఉన్నట్లుగా.. ఇలా రకరకాల మీమ్స్ సృష్టించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా ట్రంప్ కుటుంబంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే డెమొక్రటిక్ కాంగ్రెస్ మహిళ అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్...‘ ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది. అయితే ఒకరి కూతురు అవడమే పదవి సంపాదించడానికి అర్హత కాదు’ అంటూ విమర్శలు గుప్పించారు. Ivanka Trump appears to be trying to get involved in a talk among Macron, May, Trudeau and Lagarde (IMF head). The video is released by French Presidential palace. pic.twitter.com/TJ0LULCzyQ — Parham Ghobadi (@ParhamGhobadi) June 29, 2019 -
తొలి ప్రసంగం: ఆమె ఎక్కడా తడబడలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మీ ఓటే మీ ఆయుధం. ఆ ఆయుధం ఎవరినో గాయపర్చడానికో, మరెవరినో బాధ పెట్టడానికో కాదు. మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికే ఆ ఆయుధం. ఎవరైతే మీకు అది చేస్తామని, ఇది చేస్తామని చెబుతారో వారిని నిలదీయండి, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడా ? అని, మీ బ్యాంకు ఖాతాల్లో వేస్తానన్న 15 లక్షల రూపాయలు ఎక్కడికి పోయాయో అడగండి!’ అని కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక ప్రియాంక గాంధీ మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన సభలో పిలుపునిచ్చారు. బీజేపీ అంటే ప్రజల మధ్య విద్వేషాలను పెంచే పార్టీ అని, కాంగ్రెస్ అంటే ప్రజల మధ్య సామరస్యాన్ని పెంచే పార్టీ అంటూ రాహుల్ గాంధీ మాటలను కూడా పునరుద్ఘాటించారు. మొత్తం ఏడు నిమిషాల్లో ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. ఉత్తర ప్రదేశ్ (తూర్పు) కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించాక ప్రియాంక చేసిన మొదటి ప్రసంగం ఇదే! అయినా ఆమె ఎక్కడా తడబడలేదు. చెప్పదల్చుకున్న నాలుగు మాటలను ముక్కుసూటిగా, అందరికి అర్థం అయ్యేలా స్పష్టంగా మాట్లాడారు. అదే రాహుల్ గాంధీ స్పష్టంగా, గుక్క తిప్పుకోకుండా మాట్లాడడానికి చాలా కాలమే పట్టింది. ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 14వ తేదీన తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లక్నోలో పర్యటించారు. ఆ రోజున స్థానిక ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆ రోజునే ఆమె అక్కడ తన తొలి ప్రసంగం ఇవ్వాల్సి ఉండింది. అయితే పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది సైనికులు మరణించడంతో ఆమె తన కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకొని.. యాత్రను నిర్వహించారు. ప్రియాంక క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తే రాహుల్ గాంధీ తెర మరుగయ్యే ప్రమాదం ఉంటుందని, ఆమె భర్త రాబర్ట్ వాడ్రాపై అనేక కేసులు నమోదైనందున ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం లేదన్న వాదనలు గతంలో వినిపించాయి. రాహుల్ గాంధీకి రాజకీయ పరిణితి రావడంతో ఆయనకు తోడుగా ప్రియాంక రంగప్రవేశం చేశారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. యూపీలో బీఎస్పీ, ఎస్పీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఏమేరకు రాణించగలరన్నది ప్రస్తుతానికి ప్రశ్నే! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు రాజకీయ సలహాదారుగా రంగప్రవేశం చేసి విజయం సాధించిన ఆయన కూతురు ఇవాంకలా కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా, రాహుల్ గాంధీకి చేతోడుగా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక తప్పకుండా విజయం సాధిస్తారని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి. -
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షురాలిగా ఇంద్రానూయి?
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి రేసులో భారత సంతతికి చెందిన పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి తెరపైకి వచ్చారు. అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదనతో ఆమె ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షరాలిగా ఇంద్రా నూయిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నామినేట్ చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. 12 ఏళ్లు పెప్సీకో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి.. గత ఆగస్ట్‌లో పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్‌లో అమెరికా అతిపెద్ద భాగస్వామి అయినందున ఆ దేశం సూచించిన వ్యక్తికే పదవి దక్కే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి అమెరికా తన పేరును ప్రతిపాదిస్తే ఇంద్రా నూయి ఏమంటారో చూడాలి. అధ్యక్షుడిని ప్రతిపాదించే వ్యక్తుల్లో ఇవాంక ట్రంప్ కీలక వ్యక్తి కావడంతో ఆమె విజ్ఞప్తిని సభ్య దేశాలు ఆమోదించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఇంద్రా నూయికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్రంప్, ఇవాంకా అనేక సార్లు ప్రశంసించిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి మొదట ఇవాంక, నిక్కి హేలి పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే. -
నిక్కి హేలీ స్థానంలో ఇవాంకను నియమించండి
-
నిక్కీ హేలీ స్థానంలో ఇవాంకా ట్రంప్..?!
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధిగా ఉన్న నిక్కీ హేలీ రాజీనామా చేశారు. ఎలాంటి ముందస్తు ఊహాగానాలు లేకుండా ఆమె అకస్మాత్తుగా రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అయితే నిక్కీ రాజీనామా తరువాత ఆమె స్థానంలో ఎవరూ వస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇవాంకా ట్రంప్‌ని ఆ పదవిలో నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ట్రంప్ కూడా సంకేతాలు వెలువరించారు. ‘నిక్కీ తర్వాత అలాంటి డైనమిక్ అంబాసిడర్ అయ్యే అర్హత ఇవాంకాకి ఉందనుకుంటున్నా. అయితే, నా కూతుర్ని ఎంపిక చేస్తే.. నాకు బంధుప్రీతి అని ఆరోపిస్తారేమో’ అంటూ ట్రంప్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే ఈ వార్తల్ని ఇవాంకా కొట్టి పారేశారు. ‘ప్రస్తుతం నేను వైట్ హౌస్‌లో చాలా గొప్ప వారితో కలిసి పనిచేస్తున్నాను. నిక్కీ హేలీ చాలా గొప్ప వ్యక్తి. ఆమె స్థానంలో అధ్యక్షుడు మరో గొప్ప వ్యక్తిని నియమిస్తారని నమ్ముతున్నాను. అయితే ఆ వ్యక్తి నేను మాత్రం కాదం’టూ ఇవాంకా ట్రంప్ తెలిపారు. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన నిక్కీ హేలీ.. 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకే రాజీనామా చేసి ఉంటారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఆ వాదనను నిక్కీ హేలీ కొట్టిపారేశారు. ‘నా జీవితంలో ఇవి ఉన్నతమైన రోజులు. నా తర్వాత అంబాసిడర్‌గా వచ్చేవారికి అన్నీ అనుకూలంగా ఉండేలా చూడడం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో లేను. ట్రంప్‌కే ప్రచారం చేస్తా’ అని నిక్కీ హేలీ ప్రకటించారు. కానీ, తాను ఎందుకు రాజీనామా చేశారో మాత్రం ఆమె చెప్పలేదు. -
స్త్రీలోక సంచారం
కార్ల అమ్మకాలు, కొనుగోళ్లలో నాలుగో వంతు మార్కెట్ మహిళలదేనని, గత ఐదేళ్లలో మహిళల కొత్త, పాత కార్ల వినియోగం 10–12 శాతం నుంచి 25 శాతానికి రెట్టింపు అయిందని తాజా సర్వేలో వెల్లడయింది. ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు మరింత సులభంగా, ఫ్రెండ్లీగా ఉండే ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల ఉత్పత్తి కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని కూడా సర్వేలు కొన్ని పెద్ద కంపెనీల పేర్లను ఉదహరించాయి. అన్ని జాతులూ కలిసిమెలిసి, స్వేచ్ఛగా జీవించే అమెరికాలో జాతి వివక్షకు చోటు లేదని ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు. తమను తాము ఆధిక్యజాతిగా భావించుకుంటున్న అమెరికన్లు కొందరు వర్జీనియాలోని చార్లెట్‌విల్ పట్టణంలో పరజాతులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మళ్లీ అలాంటి ర్యాలీలే జరిగే అవకాశం ఉండటంతో స్థానికేతరులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకు ఇవాంకా ఇలా.. (తన తండ్రి మద్దతిచ్చే ఆధిక్య భావజాలానికి పూర్తి విరుద్ధంగా).. ట్వీట్ చేయడం విశేషం. ఆగస్టు 12న మరణించిన భారత సంతతి బ్రిటిష్ రచయిత, నోబెల్ గ్రహీత వి.ఎస్.నయీపాల్.. స్త్రీల రచనా సామర్థ్యం విషయంలో తేలిక భావంతో ఉండేవారనీ, స్త్రీలోలుడని, స్త్రీలపై తరచు చెయ్యి చేసుకునేవాడని.. నివాళులలో భాగంగా జాతీయ పత్రికల్లో వరదలా వచ్చిపడిన ఆయన జీవిత విశేషాలను బట్టి తెలుస్తోంది. ‘రీడర్స్ డైజెస్ట్’ మాజీ ఎడిటర్ రాహుల్ సింగ్.. నయీపాల్లోని సత్యశీలతను కొనియాడుతూ.. సంక్లిష్టమైన ఆయన వ్యక్తిగతం జీవితానికి నిదర్శనంగా.. మొదటి భార్య ప్యాట్, పెళ్లికాకుండా ఆయనతో కలిసి ఉన్న మార్గరెట్ అనే ఒక అర్జెంటీనా మహిళ, నదీరా అనే మరో పాకిస్తానీ మహిళల గురించి ప్రస్తావించడాన్ని బట్టి నయీపాల్ జీవితంలో స్త్రీలకు పెద్ద స్థానమే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు డెన్జెల్ వాషింగ్టన్.. తన కుమార్తె (ఆమె కూడా హాలీవుడ్ నటి) ఒలీవియాతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారి నడుము విరగ్గొడతానని హెచ్చరించారు. గత ఏడాది హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపులు బహిర్గతం అయిన అనంతరం ‘మీటూ’ ఉద్యమంతో బాధిత నటీమణులంతా సంఘటితం కావడంపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. మీటూ వల్ల హాలీవుడ్ ఇప్పుడు మరింత సురక్షితం అయిందని చెబుతూ, ఒకవేళ తన కూతుర్ని ఎవరైనా లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిస్తే తక్షణం వెళ్లి వారి వెన్నెముకను సున్నం చేస్తానని డెన్జెల్ అన్నారు. మేనేజ్మెంట్ డిగ్రీలు లేకపోయినప్పటికీ మహిళలు ఇంటా బయటా పనుల్ని చక్కబెట్టగలరని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. చండీగఢ్‌లో ‘భారత వికాస్ పరిషత్’ నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. ‘ఒక మహిళ బయటì పనికి వెళ్లి వస్తోందంటే ఆమె ఏకకాలంలో రెండు పనులు చేస్తున్నట్లు. ఇదే మాట పురుషుడి విషయంలో చెప్పలేం. ఎందుకంటే అతడు బయటి పని మాత్రమే చేస్తాడు తప్ప, ఇంట్లో పూచిక పుల్లంత పని కూడా అందుకోడు’ అని కిరణ్ జీ (చండీగఢ్ ఎం.పి. కిరణ్‌ఖేర్) అన్న మాటను సమర్థించారు. వయసొచ్చిన కొడుకు విషయంలో తల్లికి ఉండే భయాలు, బెంగలు, ఆరాలు, అనుమానాలు, నిఘాలు.. ఇవన్నీ కలిసి ‘మమ్మా కి పరిచాయి’ (అమ్మ నీడ) అనే థీమ్‌తో విడుదలైన ‘హెలికాప్టర్ ఇలా’ చిత్రంలోని టీజర్ సాంగ్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తల్లిగా కాజల్, కొడుకుగా రిథీ సేన్ కనిపించే ఈ పాటలో.. కొడుకును అనుక్షణం ప్రొటక్ట్ చేసే కేరింగ్ మదర్, తల్లి పోరు పడలేక సతమతమయ్యే కొడుకు కనిపిస్తారు. ‘లండన్ లోని భారత దౌత్య కార్యాలయంలో టీమ్ ఇండియా’ అనే క్యాప్షన్‌తో ఈ నెల 8న బి.సి.సి.ఐ. (బోర్ట్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ట్విట్టర్లో పెట్టిన గ్రూప్ ఫొటోలో టీమ్ సభ్యులతో పాటు విరాక్ కోహ్లీ భార్య అనుష్కాశర్మ కూడా ఉండటంపై ‘క్రికెట్‌నీ, బాలీవుడ్‌నీ కలపకండి’ అంటూ వస్తున్న ట్రోల్స్ మీద ఎట్టకేలకు అనుష్క స్పందించారు. అయితే.. ‘ఇలాంటి ట్రోల్స్‌కి నేను స్పందించను’ అన్నంత వరకే ఆమె స్పందించారు! నేడు నటి సుహాసిని 57వ పుట్టినరోజు. భర్త మణిరత్నం.. కొడుకు నందన్.. ఇదీ ఆమె ఫ్యామిలీ. సుహాసిని నాస్తికురాలు. ‘‘నాకు దేవుడి మీద నమ్మకం లేదు. దైవ ప్రార్థనల మీద నమ్మకం లేదు. నాకు, నా కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వు దేవుడా అని గుడులకు వెళ్లడం మీద నమ్మకం లేదు’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సుహాసిని. అలాగే మల్టీ టాస్కింగ్ (ఒకేసారి అనేక పనులు నెత్తికెత్తుకునే నేర్పు) మీద కూడా ఆమెకు నమ్మకం లేదు. ‘అదెలా సాధ్యం?’ అంటారు. ‘‘ఇంట్లో పని ఇంట్లోనే. బయటి పని బయటే. ఇక్కణ్ణుంచి ఆ పని, ఆక్కణ్ణుంచి ఈ పని చెయ్యలేను’’ అని చెబుతుంటారు సుహాసిని. -
మీతో స్నేహం.. నేను చాలా హ్యాపీ : ఇవాంక
వాషింగ్టన్ : ప్రపంచ పారిశ్రామిక రంగంలో అత్యంత ప్రభావశీలిగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ ప్రశంసలు కురిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై చర్చించేందుకు.. ఇంద్రా నూయి, మాస్టర్‌కార్డ్ సీఈఓ అజయ్ బంగాతో పాటు పలువురు కార్పొరేట్ లీడర్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఏర్పాటు చేశారు. న్యూజెర్సీలోని ట్రంప్ ప్రైవేట్ గోల్ఫ్‌క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక, ఆమె భర్త జెరెడ్ ఖుష్నెర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఇంద్రా నూయికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్రంప్ ప్రశంసించారు. ‘12 ఏళ్లుగా పెప్సీకో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి.. ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు. ఇంద్రా.. నాలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలకు మీరే స్ఫూర్తి. మీలాంటి గొప్ప వ్యక్తితో స్నేహం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ దేశ(అమెరికా) ప్రజల కోసం ఇన్నాళ్లుగా ఎంతగానో శ్రమించిన మీకు కృతఙ్ఞతలు’ అంటూ ఇవాంక ట్వీట్ చేశారు. కాగా శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేస్తున్న ఇండో-అమెరికన్ ఇంద్రా నూయి త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్న విషయం తెలిసిందే.12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె అక్టోబర్ 3న తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఆమె స్థానంలో కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తా నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. The great @IndraNooyi is stepping down as PepsiCo CEO, after 12 yrs. Indra, you are a mentor + inspiration to so many, myself included. I am deeply grateful for your friendship. Thank you for your passionate engagement on issues that benefit the people of this country, and beyond — Ivanka Trump (@IvankaTrump) August 7, 2018 -
స్త్రీలోక సంచారం
విదేశాలకు వెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ప్రత్యేక విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ లోని టీవీలో తనకు ఇష్టం లేని చానెల్.. సి.ఎన్.ఎన్. ట్యూన్ చేసి ఉండటం, పైగా ఆ చానెల్‌ను తన సతీమణి మెలానియ వీక్షిస్తూ కనిపించడంపై ఇటీవలి పర్యటనలో వైట్ హౌస్ సిబ్బంది మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. నియమాలకు విరుద్ధంగా ‘ఫాక్స్’ చానల్‌కు బదులు సి.ఎన్.ఎన్.ను సిద్ధం చేసి ఉంచిన వారిపై విరుచుకుపడ్డారు. అయితే అమెరికా ప్రథమ మహిళకు తనకు ఇష్టమైన చానెల్‌ను చూసే హక్కు, అధికారం ఉంటాయని మెలానియ ప్రతినిధి స్టెఫానీ గ్రీషమ్ ఒక ప్రకటన విడుదల చేశారు! ::: ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తన ఫ్యాషన్ కంపెనీలన్నిటినీ మూసి వేసి, వైట్ హౌస్‌లో తన తండ్రికి పూర్తి స్థాయి సలహాదారుగా విధులు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు నుంచీ ‘ఇవాంకా ట్రంప్’ బ్రాండు పేరిట ఆమె నడుపుతున్న దుస్తులు, షూలు, హ్యాండ్ బ్యాగుల విక్రయ సంస్థలపై.. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అనేక రాజకీయ విమర్శలు రావడంతో ఇవాంక ఒకొటొకటిగా తన బిజినెస్‌లు అన్నింటి నుంచీ వైదొలగుతున్నారు ::: ప్రముఖ అమెరికన్ టీవీ నెట్వర్క్ సి.బి.ఎస్. (కొలంబియా బ్రాడ్కాస్ట్ సిస్టమ్) లో నాలుగేళ్లుగా ప్రసారం అవుతున్న పొలిటికల్ డ్రామా సిరీస్ ‘మేడమ్ సెక్రటరీ’లో అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శులు హిల్లరీ క్లింటన్, మెడలీన్ ఆల్బ్రైట్లు ప్రత్యక్షం కాబోతున్నారు! అక్టోబర్ 7న మొదలవుతున్న ఐదో సీజన్ డ్రామా ప్రీమియర్‌లో.. ‘మేడమ్ సెక్రటరీ’ కల్పిత వ్యాఖ్యాత ఎలిజబెత్ మెకార్డ్ పాత్రను పోషిస్తున్న అమెరికన్ నటి ఈ డ్రామా ఎపిసోడ్లో భాగంగా బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ల హయాంలో విదేశాంగ కార్యదర్శులుగా పనిచేసిన పై ఇద్దరు మహిళలు.. హిల్లరీ క్లింటన్, మెడలీన్ ఆల్బ్రైట్ల సలహాలను తీసుకుంటారు. జూలై 25న జరిగిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ (లోక్‌సభ) ఎన్నికల్లో ఈసారి ఎక్కువమంది మహిళా అభ్యర్థులు పోటీ చేయడంపై ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పాక్ మహిళా రాజకీయ నాయకులను, భారత్‌లోని మహిళా రాజకీయ నాయకులను పోలుస్తూ వారి ఫొటోలను పక్కపక్కన పెట్టి.. ‘ఇక్కడివాళ్లు అక్కడివాళ్లంత అందంగా లేరని, అందుకే శశిథరూర్ వంటివాళ్లు ఇండియాను ‘పాకిస్తానిండియా’ అవాలని కోరుకున్నారని’ అంటూ, ఇంకా అనేక రకాల ‘సెక్సిస్టు’ కామెంట్లతో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ సంగతలా ఉంచితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి పార్టీ విధిగా కనీసం 5 శాతం మహిళా అభ్యర్థులను నిలపాలన్న పాక్ ఎన్నికల సంఘం ఆదేశాల కారణంగా ఈసారి ఎక్కువ సంఖ్యలో 171 మంది మహిళా అభ్యర్థులు 272 జనరల్ సీట్లకు పోటీ చేశారు ::: జార్జియాలో సెప్టెంబర్ 23 నుంచి మొదలౌతున్న ‘ఒలింపియాడ్’కు మన చెస్ గ్రాండ్ మాస్టర్, 31 ఏళ్ల కోనేరు హంపి సిద్ధమౌతున్నారు. 11 నెలల బిడ్డ తల్లి అయిన హంపీ.. పాప ఆలన, పాలన కోసం ఆట నుంచి విరామం తీసుకున్నాక తిరిగి చెస్ బరిలోకి రావడంపై ‘స్పోర్ట్‌స్టార్’ పత్రికతో మాట్లాడుతూ, ‘పెళ్లయ్యాక కెరీర్లో రాణించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవన్న మాట విన్నప్పుడు నేను నమ్మలేకపోయేదాన్ని కానీ, పెళ్లి తర్వాత కెరీర్‌కి, కుటుంబానికి మధ్య ప్రాధాన్యాలు తరచు మారిపోతుంటాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను’ అని చిరునవ్వుతో అన్నారు ::: స్త్రీ, పురుషులతో పాటు తమకూ ఉద్యోగాలలో ఒక కేటగిరీని ప్రభుత్వం ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేయకూడదని తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన ట్రాన్స్ ఉమన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ షానవీ పొన్నుసామి ప్రశ్నిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, కేవలం ట్రాన్స్ ఉమన్ అయిన కారణంగా ‘ఎయిర్ ఇండియా’ షానవీకి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించడంతో, ఆమెకు సంఘీభావంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమన్ (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ) బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, తనకు ఇప్పటి వరకు 20 కంపెనీలు ఉద్యోగాన్ని నిరాకరించాయని షానవీ ఆవేదన చెందారు ::: -
ఇవాంకా ఏందిది? మెదడు వాచిపోయింది!
వాషింగ్టన్/బీజింగ్: గడిచిన రెండు రోజులుగా దాదాపు ప్రపంచమంతా ‘ట్రంప్-కిమ్ భేటీ’ గురించే మాట్లాడుకుంది. సింగపూర్‌లోని సెంతోసా దీవిలో గల రిసార్టులో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అమెరికా-ఉత్తరకొరియా దేశాధినేతలు ఎట్టకేలకు ఉమ్మడిగా శాంతిసందేశాన్ని ఇచ్చారు. సుమారు 40 గంటలు సాగిన కార్యక్రమ ఖర్చు రూ.100కోట్ల పైమాటే. ఇరుదేశాల మేలు కోరే మిత్రురాలు సింగపూరే ఖర్చంతా భరించింది. ఈ చరిత్రాత్మక సన్నివేశాన్ని కవర్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 3 వేల మంది జర్నలిస్టులు తరలివెళ్లారు. ఉత్తరకొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణ సహా పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇరునేతలు ప్రశాంతంగా తమ తమ దేశాలకు పయనమయ్యారు. ఇదిలా ఉంటే, కిమ్-ట్రంప్ భేటీపై అమెరికా అధ్యక్షుడి కూతురు, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ చేసిన కామెంట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇవాంకా ట్వీట్ వైరల్: అణుబాంబులు వేస్తానని బెదిరించినా, చివరికిప్పుడు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చినా కిమ్ జాంగ్ వెనకున్నది చైనాయే అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా, ఓ చైనీస్ సామెత ఇదంటూ ఇవాంకా చేసిన ట్వీట్‌పై డ్రాగన్ దేశస్తులు జుట్టు పీక్కుంటున్నారు. ‘Those who say it can not be done, should not interrupt those doing it -Chinese Proverb (ఇది అసాధ్యమని అన్నవాళ్లంతా సుసాధ్యం అవుతున్నవేళ ఆటంకాలు కల్గించొద్దు- చైనీస్ సామెత)’ అని ఇవాంకా రాశారు. బ్రెయిన్ ఎగ్జాస్టెడ్!: అసలే భాషా(వీరా)భిమానులైన చైనీయులు.. ఇవాంకా చెప్పిన సామెత ఎక్కడిదా? అని సెర్చింగ్ మొదలెట్టారు. చివరాఖరికి అలాంటి అర్థాన్నిచ్చే సామెత ఏదీ తమ భాషలో లేదనే నిర్ధారణకు వచ్చారు. చైనీస్ సోషల్ మీడియా వేదికలైన వీచాట్, వెయిబో, క్యూక్యూల్లో ఇవాంకా పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ‘‘వామ్మో ఇవాంకా.. ఒక్క సామెతతో మా మెదడు నరాలను తెంపేశావుగా!’’ అని కొందరు, ‘‘ మీ రాతల్లో అర్థం ఉన్నా, సామెత మాత్రం ఇక్కడిది కాదు’’అని ఇంకొందరు, ‘‘బహుశా పాండా ఎక్స్‌ప్రెస్ రెస్టారెంట్లో ఫార్చూన్ కుకీ(లోపల చైనీస్ సామెత రాసుండే బిస్కెట్)లో ఆమెకిది దొరికి ఉండొచ్చు..’’ అని మరొకరు కామెట్లు చేశారు. -
హద్దు మీరాను.. సారీ ఇవాంక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీవీ యాంకర్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. కమెడియన్ కమ్ టీవీ హోస్ట్ సమంత బీ, ‘ఫుల్ ఫ్రొంటల్’ అనే షోలో ఇవాంకపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా, అది దుమారం రేపింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా, మరోవైపు వైట్‌హౌజ్ కూడా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇవాంకకు సారీ చెప్పేశారు. ‘ఇవాంక ట్రంప్, ఆ కార్యక్రమం చూసిన ప్రేక్షకులకు నా క్షమాపణలు. ఆమెపై గత రాత్రి నేను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. అనవసరంగా మాట్లాడాను. హద్దులు మీరాను. అందుకు చింతిస్తున్నా. ఇవాంక నన్ను మన్నించండి’ అని ఓ ప్రకటనలో సమంత తెలిపారు. తన ట్విటర్లో ఆమె ట్వీట్ కూడా చేశారు. కాగా, ఈ మధ్యే ఇవాంక తన చిన్న కొడుకుతో దిగిన ఓ ఫోటోను ట్వీట్ చేశారు. సరిగ్గా అదే సమయంలో అమెరికాలో 1500 మంది వలసవాద చిన్నారులు అదృశ్యం అయ్యారన్న నివేదిక ఒకటి వెలువడింది. బుధవారం తన టీవీ షోలో సమంత బీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... యూఎస్ ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ వలసవాదుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. తన తండ్రికి(ట్రంప్) సలహాలు ఇవ్వాలంటూ ఇవాంకకు సూచిస్తూ కొడుకుతో ఉన్న ఫోటో ప్రస్తావనకు తెచ్చి మరీ సమంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిస్థితి మీకు వస్తే తెలుస్తుందంటూ కామెంట్లు చేశారు. దీనిపై వైట్‌హౌజ్ ప్రెస్ కార్యదర్శి సారా హుక్కాబీ సాండర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. సమంత చేసిన వ్యాఖ్యలు సరైంది కాదని పేర్కొన్నారు. మరోవైపు పలువురిని నుంచి విమర్శలు రావటంతో సమంత క్షమాపణలు చెప్పారు. మరోవైపు టీబీఎస్ నెట్వర్క్ ఆ కార్యక్రమం తాలూకూ వీడియోలను తొలగిస్తున్నట్లు చెబుతూ వైట్‌హౌజ్ కార్యాలయాన్ని క్షమాపణలు కోరింది. -
కోపంతో ‘కేటీఆర్-ఇవాంక రోడ్డు’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పట్టించుకోలేదు. విజ్ఞప్తులను నేతలు పెడ చెవిన పెట్టేసిండ్రు. అధికారులేమో నిర్లక్ష్యపు సమాధానాలిచ్చారు. విసిగిపోయిన జనాలు ఆ కోపంలో తమ దారి తామే చూ(వే)సుకున్నరు. విశ్వనగరంలోని మారేడ్‌పల్లి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కనిపించిన దృశ్యాలు ఇవి. గతుకుల రోడ్లను తమంత తామే బాగు చేసుకున్నారు. చివరకు దానికి పేరు కూడా పెట్టేశారు. విజ్ఞప్తులు పట్టించుకోలేదు... కొంత కాలంగా రోడ్ల అధ్వానపరిస్థితి గురించి ఫిర్యాదులు వెల్లువెత్తినా జీహెచ్ఎంసీ పట్టించుకోలేదు. గతేడాది ఇవాంక ట్రంప్-ప్రధాని మోదీ రాకల సందర్భంగా నగరానికి మరమ్మత్తులు జరిగింది తెలిసిందే. ఆ సమయంలో జీహెచ్ఎంసీకి పలువురు స్థానికులు మళ్లీ విజ్ఞప్తులు చేశారు. బదులుగా ‘ఆమె(ఇవాంక) మీ ప్రాంతంలోకి రావట్లేదు కదా’ అన్న నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందని స్థానికులు ఆరోపించారు. ఇంకోపక్క ‘ఇవాంక ఈ వంక రావమ్మా!’ అంటూ సోషల్ మీడియాలో అప్పుడు చిన్నపాటి ఉద్యమం కూడా నడిచింది. అదే సమయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం కృష్ణాంక్ ఆధ్వర్యంలో స్థానికులు ఫ్లకార్డ్లతో ధర్నా కూడా నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. విసిగిపోయి చివరకు... రోజులు గడుస్తున్నాయి. ఇవాంక ఆవైపు రాలేదు.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. దీంతో ప్రజలే రంగంలోకి దిగారు. వాళ్లకు కావాల్సిందాన్ని పూర్తి చేసుకున్నారు. కొందరు స్థానికులు స్వచ్ఛందంగా తట్ట చేతబట్టి మట్టితో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేసుకున్నారు. అంతా అయ్యాక చివరకు ఆ రోడ్డుకు తెలంగాణ మంత్రి కేటీఆర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ పేర్లు కలిపి పెట్టేశారు. ప్రభుత్వం, అధికారుల తీరుకు నిరసనగా తాము ఈ పని చేసినట్లు వారు చెబుతున్నారు. ‘కేటీఆర్-ఇవాంక ట్రంప్ రోడ్డు’ అని నామకరణం చేసినట్లు ఫ్లకార్డులను ప్రదర్శించారు. ‘మారేడ్‌పల్లి డేస్’ ఫేస్బుక్ పేజీలో ఆ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. స్థానికులు చేసిన పనిని అభినందిస్తున్న కొందరు.. ప్రభుత్వాలు పని చేయనప్పుడు ప్రజలే ఇలా రంగంలోకి దిగాల్సి వస్తుందని ఇంకొందరు.. మిగతా ప్రాంత ప్రజలు కూడా ప్రభుత్వంపై ఆధారపడకుండా వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. -
గాలిలో ఇవాంక.. హెలికాప్టర్‌కు సాంకేతిక లోపం!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్, ఆమె భర్త జెరెడ్ ఖుష్నెర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం నుంచి ఇవాంక, జెరెడ్ హెలికాప్టర్లో న్యూయార్క్‌కు బయలుదేరారు. హెలికాప్టర్ ఎంతోదూరం ప్రయాణించకముందే తిరిగి విమానాశ్రయంవచ్చింది. హెలికాప్టర్లో ఇంజిన్ ఫెయిల్ కావడంతో వెంటనే ఫైలట్లు దానిని వెనుకకు తిప్పి వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. దీంతో వారు కమర్షియల్ విమానంలో న్యూయార్క్ బయలుదేరారు. హెలికాప్టర్ బయలుదేరిన సమయంలో ఇవాంక, జెరెడ్, వారి వ్యక్తిగత భద్రతాసిబ్బందితోపాటు ఒక్క పైలట్ మాత్రమే అందులో ఉన్నట్టు తెలుస్తోంది. -
ఇవాంకతో స్నేహం లేదు : చెల్సియా
కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ మధ్య స్నేహంపై రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చెల్సియా వాటికి తెరదించారు. స్టెఫెన్ కొల్బర్ట్ లెట్ షో లో మాట్లాడిన ఆమె తమ మధ్య స్నేహం ఎక్కువ కాలం కొనసాగలేదని స్పష్టం చేశారు. చెల్సియా తల్లి హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పలు సందర్భాల్లో వీరి స్నేహం గురించి పలు రకాల కథనాలు వెలువడ్డాయి. చెల్సియా స్పందిస్తూ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావితం చేస్తాయని, వాటికి వైట్ హౌస్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గత నెలలో తన తండ్రి ట్రంప్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల గురించి ఇవాంకని ప్రశ్నించినప్పుడు, ఆమె స్పందిస్తూ.. ఇది తనను అడగాల్సిన ప్రశ్న కాదని సూచించారు. ఒక కూతురిని తన తండ్రి గురించి ఇలాంటి ప్రశ్నలు అడగటం సరికాదన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మీరు ఇదే ప్రశ్ననే ఇతరుల కుమార్తెలను అడుగుతారని అనుకోవడం లేదన్నారు. ఇవాంకను ట్రంప్ సలహాదారుగా నియమించటం, ఇతర దేశాధినేతలతో సమావేశమైనప్పుడు అధిక ప్రధాన్యత ఇవ్వడాన్ని మీడియా విమర్శించింది. ఇప్పుడు చెల్సియా క్లింటన్ స్పందించిన తీరు చూస్తుంటే ఈ పరిణామాల మీదే ఆమె స్పందించినట్లు అర్థమవుతుంది. ఇవాంక మీడియాతో వ్యవహరించిన తీరుపైన చెల్సియా క్లింటన్ ఈ విధమైన వ్యాఖ్యాలు చేసినట్లు తెలుస్తోంది. -
'మా నాన్న ఎలాంటివాడో నాకు తెలుసు'
న్యూయార్క్ : తన తండ్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన లైంగిక అంశాలపరమైన ఆరోపణలను ఇవాంక ట్రంప్ కొట్టిపారేశారు. అసలు అలాంటి ప్రశ్నే తగినది కాదని అన్నారు. అమెరికా అధ్యక్షుడి పరిపాలన వర్గంలో ఇవాంక ట్రంప్ కూడా ప్రముఖ సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ క్రీడల ముగింపు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమెను ఓ ఎన్బీసీ అనే ఓ మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ట్రంప్ పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారని, పోర్న్‌స్టార్‌తో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా ఆమె కొట్టి పారేశారు. 'నేను అనుకుంటున్నాను ఓ కూతురును అడిగేందుకు ఇది ఏమాత్రం అర్హమైన ప్రశ్నకాదని. తన తండ్రిని నిందించే వాళ్లను ఆమె నమ్మబోదు. నేను మా నాన్నను నమ్ముతున్నాను. మా నాన్న ఏమిటో నాకు తెలుసు. నా తండ్రిని నమ్మేందుకు ఓ కూతురిగా నాకు ఆ హక్కు ఉందని అనుకుంటున్నాను' అని ట్రంప్ చెప్పారు. -
వింటర్ ఒలింపిక్స్‌కు ఇవాంకా
వాషింగ్టన్ : వింటర్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ హాజరుకానున్నారు. ఆదివారం ప్యాంగ్చాంగ్లో జరిగే ఈ వేడుకల నిమిత్తం ఇవాంకా సారథ్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం దక్షిణ కొరియాలో పర్యటించబోతున్నట్లు శ్వేతసౌధం బుధవారం ప్రకటించింది. ఉత్తరకొరియా అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా(డబ్ల్యూపీకే) ఉపాధ్యక్షుడు కిమ్ యోంగ్ చోల్ కూడా 8 మంది ప్రతినిధులతో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో ఇవాంకా, కిమ్ యోంగ్ చోల్ ఒకరికొకరు ఎదురుపడే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న విషయం తెలిసిందే. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమైనప్పటి నుంచి మాటల యుద్ధం తగ్గుముఖం పట్టింది. -
‘ఛీ టూ’...
ఎనభై ఏళ్లు దాటిన హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ క్విన్సీ జోన్స్.. ఇవాంకపై నిందవేయడాన్ని మహిళా లోకం ‘ఛీ’ కొడుతోంది. ‘మీ టూ.. ఛీ’ అంటోంది. చూస్తుంటే పురుష పుంగవులు రివర్స్ గేర్‌లో మహిళలపై యుద్ధానికి దిగినట్లే కనిపిస్తోంది! ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక.. కలిసి పనిచేసే చోట మగ ఉద్యోగులు మహిళా ఉద్యోగులతో మాట్లాడ్డం బాగా తగ్గించారని ఒక వైపు సర్వేలు వెల్లడిస్తుంటే.. ఇప్పుడు క్విన్సీ జోన్స్ అనే 84 ఏళ్ల హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఒకప్పుడు తను ఇవాంకా ట్రంప్‌తో డేటింగ్ చేశానని ప్రకటించి ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ‘మీ టూ’ అంటూ హాలీవుడ్ నటీమణులు ఫలానా వ్యక్తి తమను లైంగికంగా వేధించాడని ఒకరొకరుగా బయటికి వచ్చి చెప్పుకుంటున్న ఈ తరుణంలో క్విన్సీ జోన్స్.. ఇవాంకాతో తనకు ఉన్న సంబంధం గురించి బయట పెట్టడం వెనుక.. ‘మీ టూ’ ఉద్యమానికి టిట్ ఫర్ ట్యాట్ (తగిన శాస్తి) చేయాలన్న ఉద్దేశం ఉండి ఉండవచ్చునని సామాజిక పరిణామాల పరిశీలకులు భావిస్తున్నారు! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ టామీహిల్ఫింగర్ దగ్గర జోన్స్ కూతురు కిదాదా పని చేస్తున్నప్పుడు.. అదే ఫీల్డులో ఉన్న ఇవాంకా అక్కడికి వచ్చేవారు. అలా వచ్చి వెళుతున్న సమయంలో ఓసారి.. తనకు క్విన్సీ జోన్స్‌తో కలిసి డిన్నర్ చేయాలని ఉంది అని ఇవాంకా అన్నట్లు కిదాదా ద్వారా జోన్స్‌కి కబురు పంపించాడట టామీ హిల్ఫింగర్. అలా లంచ్ పరిచయం డేటింగ్ వరకు వెళ్లిందని ‘వల్చర్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో çపరమ దరిద్రపుగొట్టు పదాలతో వెల్లడించారు క్విన్సీ జోన్స్. ‘‘మేమిద్దరం ఏ టైమ్‌లో డేటింగ్లో ఉన్నామో సరిగ్గా చెప్పలేను కానీ కుష్నర్తో (ఇవాంకా భర్త) ఇవాంక డేటింగ్ చేయడానికి ముందే అనుకుంటాను. బహుశా 2007లో కావచ్చు’’ అని క్విన్సీ జోన్స్ అప్పటి తీపి జ్ఞాపకాలేవో గుర్తు చేసుకోడానికి ప్రయత్నించినట్లుగా పద భావాలు ప్రదర్శించారు. దీనిపై ఇంతవరకు ఇవాంకా కానీ, ట్రంప్కానీ ఏమీ స్పందించలేదు. ఇవాంకాకు 2009తో కుష్నర్తో పెళ్లయింది. ఆమె భర్తగా కుష్నర్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. యు.ఎస్.లోని ప్రముఖ మహిళలంతా మగజాతిపై పగబట్టినట్లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి, ఆడజాతిపై అక్కడి పురుషజాతి కట్టుకథలతో, ఉత్తుత్తి సర్వేలతో ప్రతీకారం తీర్చుకోబోతున్నారా? ‘మీ టూ’ లాంటి ఒక మగ ఉద్యమానికి క్విన్సీ జోన్స్ ఆద్యుడు కాబోతున్నాడా? చూడాలి. -
ఇదేమీ ట్వీటమ్మో ఇవాంకా?
న్యూయార్క్: గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన ప్రముఖ హాలీవుడ్ నటి, వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రేపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. లైంగిక దాడులను వెలుగులోకి తీసుకొస్తూ.. ఇటీవల గళమెత్తిన హాలీవుడ్ నటీమణులు, మహిళలను ప్రశంసిస్తూ విన్ఫ్రే గొప్పగా ప్రసంగించారు. మహిళలపై లైంగిక దాడులు లేని కొత్త సమాజానికి ఇది నాంది కావాలంటూ ఆమె ఇచ్చిన ఉపన్యాసం శ్రోతలను కదిలించింది. ఆమె స్ఫూర్తిదాయక ప్రసంగం విన్న పలువురు.. ఆమె 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని గట్టిగా కోరుతున్నారు. విన్ఫ్రే కూడా ఆ దిశగా గట్టిగానే ఆలోచిస్తున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు. అందరిలాగే అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ కూడా విన్ఫ్రే ప్రసంగాన్ని ట్విట్టర్లో ప్రశంసించారు. మహిళా సాధికారిత దిశగా ఓప్రా ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని, పురుషులు, మహిళలు ముందుకొచ్చి ఇందుకోసం కృషి చేయాలని ఇవాంకా యథాలాపంగా ట్వీట్ చేశారు. వెంటనే ఆమె ట్వీట్ బ్యాక్‌ఫైర్ అయింది. ఆమె ట్వీట్‌ను తప్పుబడుతూ.. హాలీవుడ్ ప్రముఖులు అలిస్సా మిలానో, రోసీ ఒడొనెల్, క్రిసీ టీజెన్ తదితరులు ట్వీట్ చేశారు. అందుకు కారణం ఆమె తండ్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలే. ట్రంప్ తమను లైంగికంగా వేధించాడని, తమ పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడని పలువురు మహిళలు గళమెత్తారు. ’మీ టూ’ క్యాంపెయిన్‌లో భాగంగా ట్రంప్ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు. మరి బాధితులకు మీరు అండగా ఉంటారా? మీ తండ్రిపై ఆరోపణలు చేసిన బాధితులకు న్యాయం జరిగేలా మీరు చూస్తారా? బాధితులకు న్యాయసహాయం కోసం టైమ్స్ మ్యాగజీన్ ఏర్పాటుచేసిన ఫండ్‌కు నిధులు ఇస్తారా? మీ తండ్రి బాధితులకు ఆర్థిక సహాయం చేస్తారా? అంటూ పదునైన ప్రశ్నలతో ఇవాంకాపై పలువురు నెటిజన్లు విరుచుకుపడ్డారు. -
ట్రంప్‌కు ప్రాణ భయం పట్టుకుందట
వాషింగ్టన్ : ఎవరూ ఊహించని రీతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని అధిష్టానించిన డొనాల్డ్ ట్రంప్.. తాను అధ్యక్షుడు కావాలని ఎన్నడూ అనుకోలేదట. అంతేకాదు ట్రంప్ ఎన్నికల్లో గెలిచారనే విషయం తెలియగానే మెలనియా ఏడ్చేశారట. అధ్యక్షుడిగా ట్రంప్ ఏడాది పాలనపై జర్నలిస్టు మైఖెల్ వూల్ఫ్ సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఫైర్ అండ్ ఫ్యూరీ : ఇన్సైడ్ ది ట్రంప్ వైట్ హౌస్’ పేరుతో ట్రంప్ పాలనపై మైఖెల్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఎన్నికల్లో గెలుపు అనంతరం ట్రంప్‌ను టీవీలో చూసిన మైఖెల్‌కు ఆయనో దెయ్యంలా కనిపించారట. ప్రపంచంలోనే ప్రముఖ వ్యక్తి కావాలన్నది తన కలని.. అధ్యక్షుడిగా గెలవాలనే ఉద్దేశం తనకు ఏ మాత్రం కాదని ట్రంప్ తన స్నేహితుడైన సామ్‌తో చెప్పారని మైఖెల్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. బుల్లితెర రంగంలో రాణించాలి అంటే అధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందేనని ట్రంప్‌కు ఆయన స్నేహితుడు రోజర్ చెప్పినట్లు వెల్లడించారు. రోజర్ మాటను అనుసరించే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. ట్రంపే తనను ఈ పుస్తకం రాసేందుకు ప్రోత్సహించారని మైఖెల్ పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇవాంక ట్రంప్ వచ్చే ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని భర్త కుష్నెర్తో చెప్పినట్లు తెలిపారు. వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన అనంతరం ఆ వాతావరణానికి అలవాటు పడేందుకు ట్రంప్ చాలా ఇబ్బంది పడ్డారని మైఖెల్ తన పుస్తకంలో పేర్కొన్నారు. తన వస్తువులను ఎవరూ ముట్టుకోకూడదని సిబ్బందికి కఠిన నిబంధనలు విధించారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్‌కు ప్రాణ భయం పట్టుకుందని చెప్పారు. విష ప్రయోగం చేసి తనను హతమారుస్తారనే భయంతో ఎక్కువగా మెక్‌డొనాల్డ్స్ బర్గర్లనే తినేవారని వెల్లడించారు. -
భాగ్యనగరానికి విశ్వఖ్యాతి
2017.. భాగ్యనగరంపై చెరగని సంతకం చేసింది. అంతర్జాతీ యంగా హైదరాబాద్ ఖ్యాతి మారుమోగేలా చేసింది. నవంబర్ 28 నుంచి 3 రోజుల పాటు జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)’ హైదరాబాద్‌లో విజయవంతంగా జరిగింది. దానితోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు, పురావస్తు, చారిత్రక అంశాలపై రెండు సదస్సులకూ హైదరాబాద్ వేదికైంది. – సాక్షి, హైదరాబాద్ ఘనంగా తెలుగు మహాసభలు తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించింది. 1975లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికైన హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ క్రీడా మైదానమే ఈ సభలకూ వేదిక అయింది. తెలంగాణ తొలిసారిగా నిర్వహిస్తుండటంతో ఈ మహాసభలను తొలి ప్రపంచ తెలుగు మహాసభలుగానే పరిగణించారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు జరిగిన ఈ అక్షరాల పండుగలో 42 దేశాల నుంచి తెలుగువారు హాజరుకావడం గమనార్హం. తెలుగు భాషలో విభిన్న సాహితీ ప్రక్రియలు తొలుత తెలంగాణ గడ్డ మీదే మొదలయ్యాయన్న విషయాన్ని ఆధారాలతో సహా ఈ సభలు సాహితీవేత్తల ముందుంచాయి. ఇక ఏటా రెండు రోజుల పాటు తెలుగు మహాసభలను నిర్వహిస్తామని, రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలుగు భాష సబ్జెక్టును తప్పనిసరిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహాసభల్లో ప్రకటించారు. సంబురంతో మొదలై వివాదంతో.. 2017 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండు భిన్న ఉదంతాలకు వేదికైంది. ఏప్రిల్‌లో ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్య అతిథిగా ఇందులో పాల్గొన్నారు. ఇక జనవరిలో ఇదే ఉస్మానియా ప్రాంగణంలో ప్రతిష్టాత్మక సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరగాల్సి ఉంది. దానికి డిసెంబర్లోనే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కానీ అక్కడ అనుకూల వాతావరణం లేదన్న కారణంతో సదస్సు వేదికను మణిపూర్‌కు మార్చడం చర్చనీయాంశమైంది. ప్రతిష్టాత్మకంగా జీఈఎస్–2017 వాస్తవానికి దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో జీఈఎస్ సదస్సు జరిగింది. ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణకు ఎన్ని నగరాలు పోటీపడ్డా చివరకు అమెరికా–నీతిఆయోగ్‌లు హైదరాబాద్‌ను ఎంపిక చేయటం మన నగరం ప్రత్యేకతను చాటింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా పాల్గొని హైదరాబాద్‌ను కీర్తించడం, రాష్ట్ర ఆతిథ్యాన్ని కొనియాడారు. అమెరికా వెళ్లిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వదస్తూరీతో లేఖ రాయటం గమనార్హం. దేశ విదేశాలకు చెందిన 1,700 మంది పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరైన ఈ సదస్సును చిన్న లోపం లేకుండా నిర్వహించటం ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించేందుకు సరైన ప్రాంతమన్న పేరు పొందింది. వ్యవసాయం, వాణిజ్యం, విద్య, వైద్యం, ఆరోగ్యం, క్రీడలు, జీవశాస్త్రాలు, డిజిటల్ ఎకానమీ, మీడియా, వినోదం... తదితర అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. సృజనాత్మక ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలను ప్రోత్సహించాలని, అడ్డంకులు లేని మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో తీర్మానించారు. రోడ్ కాంగ్రెస్ సదస్సుకూ వేదికగా.. భారత్‌లోని రహదారులు అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలంటే ఏం చేయాలన్న అంశంలో మేధో మథనానికి హైదరాబాద్ కేంద్రమైంది. హెచ్ఐసీసీలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సు జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇందులో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో.. రోడ్ల నిర్మాణంలో అనుసరించాల్సిన కొత్త పద్ధతులు, అంతర్జాతీయంగా వస్తున్న మార్పు చేర్పులు, కొత్త పరిజ్ఞానం, మన్నిక, పర్యావరణ అనుకూల విధానం తదితర అంశాలపై చర్చలు, ప్రదర్శనలు జరిగాయి. మరిన్ని కార్యక్రమాలు కూడా రెండేళ్లకోసారి జరిగే బాలల చలన చిత్రోత్సవాలు ఈసారీ హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రపంచ పర్యాటకుల దృష్టి తెలంగాణపై పడేలా, మన దేశంలో పర్యాటక రంగానికి విదేశీ హంగు అద్దేలా స్కాలా సదస్సు కూడా ఇక్కడ జరిగింది. పురావస్తు శాఖకు కొత్త ఊపు.. మానవ మనుగడ మూలాలు, చరిత్రకు సాక్ష్యాలను, తార్కాణాలను చూపేది పురావస్తు విభాగం. తెలంగాణ గడ్డ ప్రపంచంలోనే గొప్ప ప్రత్యేకతలకు నిలయంగా ఉందని నిరూపించే పలు చారిత్రక ఆధారాలు ఈ ఏడాది బయటపడ్డాయి. ఇక హైదరాబాద్‌లో చారిత్రక, పురావస్తు అంశాలపై రెండు అంతర్జాతీయ స్థాయి సదస్సులు జరిగాయి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఒక సదస్సు, పర్యాటక భవన్ ప్లాజా హోటల్లో బుద్ధవనం ఆధ్వర్యం లో మరో సదస్సు నిర్వహించారు. వీటికి అంతర్జాతీయ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పరిధిలోని పలు చారిత్రక ప్రత్యేకతలు వారి ముందుకు వచ్చాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ఇక్కడి ప్రత్యేకతలకు కొంత ప్రచారం ఏర్పడింది. ఒకప్పుడు ఈ ప్రాంతం బౌద్ధానికి కేంద్రమన్న ఆధారాలు చాటేందుకు ఈ సదస్సులు వేదికయ్యాయి. -
సీఎం కేసీఆర్‌కు ఇవాంకా కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా హైదరాబాద్ వచ్చిన తనకు ఇచ్చిన ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ లేఖ రాశారు. తన హైదరాబాద్ పర్యటన ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన అనుభవమని పేర్కొన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం అందజేసిన కానుక విషయంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, రాష్ట్ర ప్రజలు చూపిన ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందని పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ భారత్‌కు తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. -
ఇవాంక ట్రంప్‌పై నెటిజన్లు ఫైర్
హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష తనయ, సలహాదారు ఇవాంక ట్రంప్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇందుకు కారణం త్వరలో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీలకు ఆమె శుభాకాంక్షలు తెలపడమే. వచ్చే ఏడాది మే నెల 19వ తేదీన మార్కెల్, హ్యరీల వివాహా వేడుక సెయింట్ జార్జి చాపెల్ చర్చిలో పెళ్లి చేసుకోనున్నారు. గత నెలలో ఇరువురికి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం ఇవాంక ట్విట్టర్ వేదికగా దంపతులు కానున్న జంటకు శుభాకాంక్షలు చెప్పడంపై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పెళ్లి పిలుపు కోసమే ఇవాంక శుభాకాంక్షలు చెప్పారంటూ పలువురు రీట్వీట్లు చేశారు. రాయల్ ఫ్యామిలీ.. ట్రంప్ క్రైమ్ ఫ్యామిలీని ఆహ్వానించబోదు అని వ్యాఖ్యానించారు. 1:2 Wishing Meghan and Prince Harry a lifetime of love, laughter and happiness together. https://t.co/fgjJhCfYnr https://t.co/8YP3Nzef5I — Ivanka Trump (@IvankaTrump) 15 December 2017 2:2 I have no doubt that this couple will do extraordinary things, both individually and collectively. Congratulations! — Ivanka Trump (@IvankaTrump) 15 December 2017 -
భారత పర్యటనపై ఇవాంక మరో ట్వీట్
అమెరికా అధ్యక్షుని సలహాదారు, డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ మరోసారి భారతీయులను కొనియాడారు. నవంబర్‌లో మూడురోజుల పాటు హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు( GES 2017) జరిగిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సులో ఇవాంక విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. జీఈఎస్ సదస్సులో పాల్గొనడం గర్వకారణమని ఇవాంక ట్వీట్ చేశారు. ' ప్రపంచ వ్యాప్తంగా 1200 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, అందులో 350 అమెరికా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి అతిధులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన భారత ప్రజలకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు' అని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ట్వీట్ లో ఇవాంక 'ధన్యవాద్' అని ప్రత్యేకంగా హిందీపదం చేర్చడం విశేషం. పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఇవాంక ఇక్కడ రెండురోజులు గడిపారు. హెచ్ఐసీసీలో జరిగిన జీఈఎస్ సదస్సులో పాల్గొనడంతో పాటు.. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చిన విందుకు హాజరై.. నగరంలోని చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. జీఈఎస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇవాంక తన పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా వెళ్లాక ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుంచి తిరిగి బయలుదేరే ముందు అమెరికా ప్రతినిధులతో కలిసి గోల్కొండ కోటను సందర్శించాను. అద్భుతమైన ఈ పర్యటనకు పరిపూర్ణ ముగింపు ఇది (ద పర్ఫెక్ట్ ఎండ్ టు ఏ రిమార్కబుల్ విజిట్)’ అని ఇవాంక ట్విట్టర్లో తెలిపిన విషయం తెలిసిందే. అయితే జీఈఎస్ ముగిసిన 15 రోజులు తర్వాత కూడా ఇవాంక భారత పర్యటనను గుర్తు చేసుకోవడం విశేషం. కాగా, ఇవాంక చేసిన ట్వీట్‌ను ఎక్కువ మంది షేర్ చేయడమే కాకుండా రీ ట్వీట్లు చేశారు. It was an honor to participate in @GES2017 in Hyderabad, India with 1,200 brilliant and passionate entrepreneurs from around the world, including our delegation of 350 Americans! Thank you Prime Minister Modi and the people of India for the warm hospitality. धन्यवाद! #GES2017 pic.twitter.com/3pbKylMaeQ — Ivanka Trump (@IvankaTrump) December 12, 2017 -
భారతీయులకు ధన్యవాదాలు: ఇవాంక
-
జస్ట్ రూ. 200లకే ఇవాంకకు ఆధార్!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన వ్యక్తిగత సలహాదారు అయిన ఇవాంక ట్రంప్ హైదారాబాద్ పర్యటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జీఈఎస్ సందర్భంగా వచ్చిన ఆమె కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన హడావుడి.. ప్రత్యేక ఆకర్షణలు... ఇలా ప్రతీ విషయం గురించి మీడియాలో చర్చలు జరిగాయి. అయితే ఆమె ఇండియాకు వచ్చిన కారణం ఇదేనంటూ ఓ జోక్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. ఆధార్ కార్డు కోసం ఇండియాకు వచ్చిన ఇవాంక పేరుతో ప్రముఖ కమెడియన్, మిమిక్రీ కళాకారుడు జోస్ కోవాకో ఓ వీడియో పోస్టు చేశాడు. పెయిడ్ మీడియా దీనిని ప్రసారం చేయలేదని.. ఇవాంక రాకకు అసలు కారణం ఇదేనన్న సందేశం అతను ఉంచాడు. ఇక వీడియోలో.. ఆధార్ అందుకోసమే వచ్చానంటూ ప్రతినిధులతో చెప్పటం.. మాకు ఆ అవకాశం లేదని భారతీయ అధికారి ఒకరు చెప్పటం.. కారు ఎక్కే సమయంలో ఆధార్ సెంటర్ కు వెళ్లమని ఇవాంక డ్రైవర్‌ను కోరటం... మీకోసం 200 రూపాయలకే నేను చేస్తానని చెప్పటం ఆ వీడియోలో చూడొచ్చు. ఇది కేవలం హస్యం కోసం చేశానని.. నేరం కాదని అతను అంటున్నాడు. ఇక జోస్ ట్వీట్‌కు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చిపడుతున్నాయి. చివరకు స్పందించిన యూఐడీఏ... ఆమె మన భారత దేశానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి దరఖాస్తు చేసుకోవటానికి వీల్లేదంటూ బదులు కూడా ఇచ్చింది. -
200లకే ఇవాంకకు ఆధార్!
-
ఇవాంకం
ప్రధాని మందులేని విందు ఇచ్చారు. మొరార్జీ విందు అన్నారు. దేశమంతా హాయిగా తూగే వేళ ఇలా అతిథులని ఎండగట్టడం అన్యాయమన్నారు కొందరు. ‘‘అన్ని వంటలా? తినడానికి ఎక్కువ–చూడ్డానికి తక్కువ’’ అన్నారు. నెలరోజుల్నించి సందడి.. సందడి, పండుగ.. పండుగ వాతావరణం భాగ్యనగరంలో. రెండు పెద్ద సందర్భాలు కలిసొచ్చాయ్–దసరా, దీపావళి లాగా. మెట్రో పట్టాలెక్కడం, ప్రపంచ పారిశ్రామికవేత్తల సమాలోచనలు– రెండూ కలసి నగరం రంగు మార్చాయి. ఇవాంకా ట్రంప్ రాక మొత్తం దృశ్యాన్ని ముంచెత్తింది. ఓ పక్కన మోదీకి, ఓ మూల కేసీఆర్‌కి చోటు దక్కింది. ఇవాంక కదిలే మార్గాలన్నీ రంగులు పులుముకున్నాయి. పాత చెట్లకి కొత్త రంగులు పడ్డాయ్. ఈతచెట్లు అసహజంగా కనిపిస్తూ కనువిందు చేశాయ్. గోడల మీది బొమ్మలు గాడీగా కనిపిస్తూ వచ్చేపోయే వారి దృష్టిని లాగేశాయి. ఇవాంక కోసం వచ్చిన అత్యాధునిక కార్ల టైర్లు కుదుపుకి లోనుకాకుండా రోడ్లని నునుపు చేశారు. దారికిరువైపులా పచ్చని తెరలు కట్టారు. గోల్కొండ శిథిలాల్లో ఎగిరే ఈగల్ని దోమల్ని వేటాడారు. ఇవాంక తిరిగే హద్దుల్లో వీధి కుక్కలు లేకుండా మోసేశారు. బిచ్చగాళ్లని ఏరేశారు. పనిలేని వారు వీధుల్లోకి రావద్దని పోలీసులు సలహాల్లాంటి హెచ్చరికలు జారీ చేశారు. ఇవాంక అంటే అమెరికా అధ్యక్షుని గారాల పట్టి. పైపెచ్చు సలహాదారు. అసలు రెండుమూడు వారాల పాటు మీడియాలో ఇవాంక ముచ్చట్లు తప్ప వేరే వార్తలు లేవు. కారాలు మిరియాలు కూడా వైట్‌హౌస్‌లోనే నూరుకు తెచ్చారట! వంటవారు, నీళ్లవారు, ముందస్తుగానే తినేవారు, తిని పించేవారు అంతా అక్కణ్ణించే దిగారట. ఆవిడ చార్మినార్ తిలకిస్తారట. అక్కడ రంగురంగుల గాజులు చూస్తారట... ఇలా ఇవాంక రాక నగర చరిత్రలో సువర్ణాంకమైపోయింది. ప్రధాని మోదీ విమానం దిగుతూనే పాలక వర్గానికి ఝలక్ ఇచ్చారు. హైదరాబాద్ పేరు చెబితే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గుర్తొస్తారని తొలి విసురు విసిరారు. ఆనాటి సాయుధ పోరాటంలో వీర మరణం చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించి, నాటి పీడకలని గుర్తుకు తెచ్చారు. కేసీఆర్ నిజాం గారికి నిత్య భజనలు చేస్తున్నారు. మెట్రోకి ‘నిజ్’ అన్నది ముద్దుపేరు. అక్కడి బీజేపీ శ్రేణులు తెగ సంబరపడి నేత ప్రసంగానికి చప్పట్లు కొట్టారు. తర్వాత మోదీ గబగబా పైలాన్‌ని, చకచకా రైలుని ఆవిష్కరించేశారు. ఇంతపెద్ద సందర్భమైనా ఒక్కమాట మాట్లాడలేదు. ఏ ఒక్కరినీ అభినందించలేదు. ఆఖరికి గొప్ప సౌకర్యం పొందిన నగరవాసులని కూడా. ప్రపంచ పారిశ్రామికవేత్తల సభలో మోదీ గళం విప్పారు. గార్గి నుంచి ఆధునికకాలం దాకా మహిళలని ప్రస్తుతించారు. తర్వాత తన పాలనలో తను చేపట్టిన అద్భుతాలను ఏకరువు పెట్టారు. ఇదే కొంచెం ఎక్స్ట్రా అయిందని విశ్లేషకులన్నారు. ఇవాంక స్పీచ్ ఒక ప్రదర్శనలా వీక్షకులని ఆకట్టుకుంది. ఫలక్‌నుమాలో ప్రధాని మందులేని విందు ఇచ్చారు. మొరార్జీ విందు అన్నారు. దేశమంతా హాయిగా తూగే వేళ ఇలా అతిథులని ఎండగట్టడం అన్యాయమన్నారు కొందరు. ‘‘అన్ని వంటలా? అన్ని వంటకాలా! తినడానికి ఎక్కువ–చూడ్డానికి తక్కువ’’ అన్నారు టీవీక్షకులు. క్షీరసాగర మథనం స్థాయిలో మేధో మథనం జరిగింది హైటెక్స్‌లో. ఇంతకీ కవ్వానికి వెన్న పడిందా? కుండలోనే కరిగిపోయిందా? ఈ నిజాలు మనదాకా రావు. ఈ ఇవాంకం నేపథ్యంలో ప్రజలొకటే కోరుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితో దోమలు, వీధికుక్కల విషయంలో ఉండండి! తిరిగి జన జీవన స్రవంతిలోకి బిచ్చగాళ్లని ప్రవేశపెట్టండి, పాపం! ఏదో రకంగా అందరం బిచ్చగాళ్లమే కదా! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇవాంకకు లేఖ రాశా.. జీఈఎస్ ఖర్చు ఎంత..?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్ షో గా నడిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. కీలకమైన సదస్సులో నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించరన్నారు. కనీసం నగర మేయర్‌నుకూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమెరికా అద్యక్ష సలహాదారు ఇవాంకాకు హైదరాబాద్‌లో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు లేఖ రాసినట్టు వీహెచ్ తెలిపారు. జీఈఎస్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి :షబ్బీర్ అలీ డిమాండ్ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రభు త్వం పెట్టిన ఖర్చు ఎంత, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని, కొత్తగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయో శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలిసి గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రపం చ పారిశ్రామికవేత్తలు హైదరాబా ద్ కు వచ్చిన సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకోసం ఆకర్షించడంలో, హామీలను సాధించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వంత ప్రచారం తప్ప పెట్టుబడులను సాధించుకోవాలని, తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచాలనే చిత్తశుద్ధి లేదని షబ్బీర్ అలీ ఆరోపించారు. -
'ఇవాంకకు లేఖ రాశా'
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్ షో గా నడిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. కీలకమైన సదస్సులో నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించరన్నారు. కనీసం నగర మేయర్‌నుకూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమెరికా అద్యక్ష సలహాదారు ఇవాంక కు హైదరాబాద్‌లో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు లేఖ రాసినట్టు వీహెచ్ తెలిపారు. -
కేటీఆర్‌కు ఇవాంక ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వచ్చే ఏడాది అమెరికా పర్యటకు వెళ్లనున్నారు. పిబ్రవరి 12, 2018 న ఆయన తన బృందంతో హార్వర్డ్ యూనివర్సిటీ లో సందర్శనకు వెళ్లనున్నట్టు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్, అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంక ట్రంప్‌తో భేటీ అవుతారు. యూఎస్ వచ్చినప్పుడు తనను కలవాలని కేటీఆర్‌ను ఇవాంక ఆహ్వానించారని జయేష్ రంజన్ వెల్లడించారు. కాగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుపై ఇవాంక సంతోషం వ్యక్తం చేశారన్నారు. జీఈ సమ్మిట్ భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలపర్చడానికి ఎంతో దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు జీఇఎస్‌లో 300 మంది వెంచర్ కాపిటలిస్ట్ లు పాల్గొన్నారని, వారంతా హైదరాబాద్ తో పాటు ఇక్కడ కంపెనీల పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దీంతో భవిష్యత్తులో భారీ ఎత్తున పెట్టుబడులకు అవకాశాలు వున్నాయన్నారు. రెండు రోజుల పాటు సాగిన ఇవాంక పర్యటనతో ప్రపంచ దృష్టిని హైదరాబాద్ వైపు మలచ గలిగామని.. ఇలాంటి అంతర్జాతీయ సదస్సును అర్థవంతంగా నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు. -
జీఈఎస్ సదస్సులో ఆకట్టుకున్న కేటీఆర్
-
హైదరాబాద్ టూర్: ఇవాంక అమెరికా వెళ్లాక ఏమన్నారంటే
అమెరికా నెలవంక ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. నగరంలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఇవాంక.. ఇక్కడ రెండురోజులు గడిపారు. హెచ్ఐసీసీలో జరిగిన జీఈఎస్ సదస్సులో పాల్గొనడంతోపాటు.. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చిన విందుకు హాజరై.. నగరంలోని చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. మొత్తానికి తన నడక, నడవడి ప్రపంచ పారిశ్రామిక సదస్సులో అందరినీ ఆకట్టుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నట్టుగా నిరాడంబర స్వభావంతో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆద్యంతం ఉల్లాసంగా, అద్భుతంగా సాగిన హైదరాబాద్ పర్యటనపై ఇవాంక... అమెరికాకు తిరిగి వెళ్లగానే ట్వీట్‌చేశారు. ‘హైదరాబాద్ నుంచి తిరిగి బయలుదేరేముందు అమెరికా ప్రతినిధులతో కలిసి గోల్కొండ కోటను సందర్శించాను. అద్భుతమైన ఈ పర్యటనకు పరిపూర్ణ ముగింపు ఇది (ద పర్ఫెక్ట్ ఎండ్ టు ఏ రిమార్కబుల్ విజిట్)’ ఇవాంక ట్వీట్ చేశారు. Tour of Golkonda Fort with members of the US delegation prior to departing Hyderabad. The perfect end to a remarkable visit. #GES2017 pic.twitter.com/HNYeBe4FdB — Ivanka Trump (@IvankaTrump) 29 November 2017 -
హైదరాబాద్..గ్రేట్ విజిట్..!
-
ఉమెన్ ఫస్ట్
-
అవకాశాలకు..జీఈ’ఎస్’
-
అప్పుడే సిటీ వదిలెళ్లాలని లేదు
-
వావ్.. హైదరాబాద్..!
సాక్షి, హైదరాబాద్: ‘వావ్.. హైదరాబాద్..’‘భాగ్యనగరాన్ని అప్పుడే వదిలి వెళ్లాలని లేదు..’ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. నగర పర్యటన ముగింపు సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలివీ.. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగిన ఇవాంకా తన కాన్వాయ్‌లో ట్రైడెంట్ హోటల్ వరకు ప్రయాణిస్తూ హైదరాబాద్ అందాలను తిలకించారు.. ఆపై హెచ్ఐసీసీకి వెళ్లిన ఆమె.. అక్కడి ఆధునిక అంశాలను పరిశీలించారు.. మంగళవారం రాత్రి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ అందాలను వీక్షించి.. బిర్యానీ, స్థానిక రుచుల్నీ ఆస్వాదించారు.. బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోటను సందర్శించిన ఆమె.. నగర చరిత్రను తెలుసుకున్నారు.. ఈ రెండు రోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడి కుమార్తెను నగరం కట్టిపడేసింది. తనకు ఈ వాతావరం ఎంతో నచ్చిందని.. అప్పుడే హైదరాబాద్ వదిలి వెళ్లాలని లేదని.. మరికొన్ని రోజులు ఉండాలని అనిపిస్తున్నప్పటికీ సమయాభావం వల్ల బుధవారం రాత్రికే తిరుగు ప్రయాణమవ్వాల్సి వస్తోందని ఇవాంకా వ్యాఖ్యానించారు. గోల్కొండలో ఇవాంకా పర్యటన విధుల్లో భాగం పంచుకున్న నగర అదనపు పోలీస్ కమిషనర్ స్వాతిలక్రాతో ఇవాంకా తన భావాలను పంచుకున్నారు. దాదాపు గంట సేపు గోల్కొండ కోటలో గడిపిన ఇవాంకాకు స్వాతిలక్రాను అమెరికా రా యబార కార్యాలయం అధికారి పరిచయం చేశారు. అమెరికా ప్రభుత్వ విభాగం ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మక హ్యాంపేరీ లీడర్షిప్ అవార్డును 2 రోజుల క్రితం స్వాతిలక్రా అమెరికాలో అందుకున్నారని ఆ అధికారి ఇవాంకాకి వివరించారు. యూనైటెడ్ స్టేట్స్ బ్యూరో అఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్, ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) విభాగం నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారని ఆమెకు వివరించారు. సిటీ టెక్నాలజీకి కితాబు.. ఈ నేపథ్యంలో స్వాతిలక్రాతో కాసేపు సంభాషించిన ఇవాంకా నగర పోలీసు విభాగం అంశాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు అభివృద్ధి చేసి, వినియోగిస్తున్న హాక్–ఐ, హైదరాబాద్ కాప్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ యాప్స్‌తోపాటు బాధితులకు సత్వర న్యాయం చేయడం, నేరగాళ్లకు చెక్ చెప్పడానికి వాడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వివరాలను స్వాతిలక్రా ఇవాంకాకు వివరించారు. మహిళలు, యువతులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించడానికి సిటీ పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న విధానాన్ని తెలిపారు. న్యూయార్క్ పోలీసు డిపార్ట్మెంట్(ఎన్‌వైపీడీ) తరహాలోనే తమ వద్దా అత్యాధునిక డయల్ 100 వ్యవస్థ ఉన్నట్లు స్వాతిలక్రా.. ఇవాంకాకు తెలిపారు. దాదాపు 10 నిమిషాల పాటు నగర పోలీసులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న ఇవాంకా.. అద్భుతమంటూ కితాబిచ్చారని తెలిసింది. పోలీసింగ్‌లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఇవాంకా అభినందించారు. -
ముందు భార్యను.. తల్లిని.. బిడ్డను..
సాక్షి, హైదరాబాద్: ‘నేనొక భార్యను.. తల్లిని.. చెల్లిని.. బిడ్డను.. ఆ తర్వాతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను, ప్రభుత్వ సలహాదారును..’.. ఇవాంకా ట్రంప్ ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో తనకు తానుగా చేసుకున్న పరిచయం ఇది. అచ్చంగా తన పరిచయానికి తగినట్లుగానే ఉన్న ఇవాంకా నడక, నడవడి ప్రపంచ పారిశ్రామిక సదస్సులో అందరినీ ఆకట్టుకున్నాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నట్లుగానే ఆమె తీరు కనిపించింది. మొత్తంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఇవాంకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదిక మీద అగ్రరాజ్య మహిళా దిగ్గజంలా కాకుండా.. అందరినీ కలుపుకొని పోతూ, సాధారణ మహిళగానే కనిపించింది. మోముపై చెదరని చిరునవ్వుతో అతిథులను పలకరించటంతోపాటు వేదికపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మాట్లాడినప్పుడు అందరి కంటే ముందుగా ఆమెనే చప్పట్లు కొట్టడం కనిపించింది. తను ప్రసంగిస్తున్నప్పుడు సైతం తనకు తానుగా సంబరపడిపోవటం, చప్పట్లు కొడుతూ ఆనందపడటం వంటివాటితో ఆమె ప్రసంగం ‘బోల్డ్ లైక్ ఏ చైల్డ్ (తన శక్తికి మించిన పనిచేసి.. పెద్దవాళ్ల మెప్పుకోసం చూసే చిన్న పిల్లల మాదిరి..)’లా సాగిందని సదస్సుకు హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు పేర్కొనడం గమనార్హం. అమెరికాతో మన దౌత్య సంబంధాల గురించి ప్రస్తావించినా.. మహిళలకు సంబంధించి స్ఫూర్తి కలిగించే మాటలు చెప్పినా.. ఆగి మరీ ప్రేక్షకుల నుంచి స్పందన కోరుకోవడం, చప్పట్ల రూపంలో అభినందనలు అందితే మురిసిపోవడం వంటివన్నీ ఇవాంకా ప్రసంగంలో ఆకట్టుకున్నాయి. మచ్చుకైనా కనిపించని ఆడంబరం.. ‘మిత్ర’రోబోతో మీట నొక్కి సదస్సును ప్రారంభించిన సందర్భంలోనూ ఇవాంకా మురిసిపోయింది. ‘భలే బాగుందం’టూ పిల్లలు ఆనందపడ్డట్లుగా అనిపించింది. జీఈఎస్‌కు సంబంధించిన నృత్య ప్రదర్శన, జయహో పాటతో ప్రదర్శించిన థీమ్ సాంగ్, లేజర్ డ్యాన్స్‌ను చూసినంత సేపూ అదే ఆనందం. ప్రపంచ సదస్సుకు అమెరికా ప్రతినిధిగా వచ్చిన ఆడంబరం కంటే.. సాదాసీదాగా సభకు వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తగానే ఇవాంకా వ్యవహరించినట్లు అనిపించింది. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలసినప్పుడుగానీ, ఇతర మహిళా పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నప్పుడుగానీ ఆమె ఆహార్యం, మాటతీరు ఎవరో స్నేహితులు, బంధువులతో వ్యవహరించినంత సాదాగా కనిపించింది. మర్యాదగా, గౌరవంగా, అన్నింటికీ మించి స్నేహపూర్వకంగా.. వ్యవహరించింది. అందుకే ‘షీ ఈజ్ మోర్ లైక్ ఎ చైల్డ్’.. ట్వీటర్, ఫేస్బుక్లో తనకు తానుగా చెప్పుకున్న పరిచయాన్ని సదస్సులో కళ్లకు కట్టినట్లుగా చూపారనే చెప్పొచ్చు. రాయల్ గ్రీన్.. వైబ్రెంట్ వైలెట్.. రేడియంట్ రెడ్.. జీఈఎస్‌లో ఇవాంకా ధరించిన వస్త్రాలు అందరినీ ఆకర్షించాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన సమయంలో నలుపు రంగు డ్రెస్‌లో చాలా సింపుల్‌గా కనిపించారు. జీఈఎస్ సమావేశం ప్రారంభానికి రాయల్ గ్రీన్ రంగు సిల్క్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. దాని మీద పసుపు, గులాబీ రంగుల్లో ఉన్న పూల డిజైన్లతో పూర్తి విభిన్నమైన లుక్ వచ్చింది. ఈ డ్రెస్ జపాన్ మహిళలు సాంప్రదాయంగా వేసుకునే ‘కిమోనో’డ్రెస్‌ను గుర్తుకుతేవడం గమనార్హం. ఇక ఫలక్‌నుమాలో విందుకు హాజరైన సమయంలో ఇవాంకా ఉదారంగు (వైబ్రెంట్ వయోలెట్)లో ప్రకాశవంతమైన గౌన్ వేసుకున్నారు. హైనెక్, ఫుల్ స్లీవ్స్‌కు తోడు ముడుచుకున్న సిగతో హుందాగా కనిపించారు. రెండో రోజున జీఈఎస్ సమావేశానికి ఆకర్షణీయంగా ఉన్న ఎరుపు రంగు (రేడియంట్ రెడ్) డ్రెస్ వేసుకున్నారు. మొదటి రోజుకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నానని చెప్పడానికి ఆ రంగును ఎంచుకున్నారో.. మరేమోగానీ మొదటి రోజుకన్నా బాగా ఉత్సాహంగా కనిపించారు. కేటీఆర్, చందా కొచ్చర్, చెర్రీ బ్లెయిర్‌లతో చర్చాగోష్టిలో ఉత్సాహం కనిపించింది. ఫలక్‌నుమా విందుకు హాజరైనప్పుడు మినహా మిగతా స మయంలో ఇవాంకా జుట్టును లూజుగా వదిలేసే ఉన్నారు. విందులో మాత్రం సిగ ముడుచుకున్నారు. ఇవాంకా ఆభరణాలకు అంత ప్రాధాన్యమేమీ ఇవ్వకపోవడం గమనార్హం. -
అతివకు అండగా నిలవాలి
సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తేనే సరిపోదని.. పురుషులూ తమ వంతు పాత్ర పోషించడం కూడా అవసరమేనని బుధవారం గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచ దిగ్గజ మహిళలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మహిళలు మరింత ఎక్కువ మంది భాగమవడం ఆర్థిక అభివృద్ధిని పెంచే విషయమన్నారు. ఈ దిశగా మహిళలకు పెట్టుబడులను అందుబాటులో ఉంచడంతోపాటు తగిన నైపుణ్యాలు అందించడం, విద్యా, ఉపాధి, మార్గదర్శక అవకాశాలు కల్పించడం తప్పనిసరని, ఈ బాధ్యత ప్రభుత్వాలదే కాకుండా.. కుటుంబాల్లోని పురుషులపైనా ఉందన్నారు. ‘ఇన్నొవేషన్స్ ఇన్ వర్క్‌ఫోర్స్ డెవలప్మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్’ అంశంపై జరిగిన చర్చలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, డెల్ కంప్యూటర్స్ చీఫ్ కన్సూ్యమర్ ఆఫీసర్ కెరెన్ క్వింటాస్, ఐసీఐసీఐ బ్యాంకు చైర్ పర్సన్ చందా కొచ్చర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. – సాక్షి, హైదరాబాద్ స్త్రీలకు సమాన అవకాశాలివ్వాలి:ఇవాంకా పురుషులు, మహిళలకు సమాన ఉద్యోగ అవకాశాలివ్వడం కంపెనీల సామాజిక బాధ్యత మాత్రమే కాదని, ఆర్థికంగానూ ప్రయోజనకరమని ఇవాంకా ట్రంప్ తెలిపారు. కేటీఆర్ అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ మహిళలు నడుపుతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడుల లభ్యత అమెరికాలో కేవలం 3 శాతం మాత్రమే ఉందన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక పథకం ద్వారా ఈ లోపాన్ని సవరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. ‘‘కుటుంబ బాధ్యతల్లో పురుషులు చురుకుగా పాల్గొనరన్నది పాత తరానికి చెందింది. కొత్త తరం పురుషులు, మహిళల్లోనూ మార్పు కనిపిస్తోంది. ఉద్యోగాలు చేసేందుకు, పరిశ్రమల ఏర్పాటుకు మహిళలూ ఉత్సాహం చూపుతుండగా.. ప్రపంచవ్యాప్తంగా కుటుంబ బాధ్యతలు చూసుకునే పురుషుల సంఖ్య కూడా పెరుగుతోంది’’అని ఇవాంకా ట్రంప్ తెలిపారు. భాగస్వామ్యం పెరుగుతోంది: చందా కొచ్చర్ మహిళలకు పనిలో భాగస్వామ్యం కల్పించే విషయంలో భారత్ మిగిలిన వాటి కంటే మెరుగైన స్థితిలో ఉందని ఐసీఐసీఐ బ్యాంకు చైర్పర్సన్ చందా కొచ్చర్ తెలిపారు. పది కోట్ల మంది మహిళా స్వయం సేవక సంఘాల సభ్యులే ఇందుకు నిదర్శనమన్నారు. మహిళలు వంటింటికే పరిమితమన్న భావన తొలగి అనేక రంగాల్లో వారు ప్రతిభ చాటుకుంటున్నారని చెప్పారు. ఒక దేశ బ్యాంకింగ్ రంగంలో 40 శాతం మంది మహిళలు ఉండటం ఒక్క భారతదేశానికి మాత్రమే చెల్లిందని కొచ్చర్ చెప్పారు. పురుషులు, మహిళల మధ్య అంతరాన్ని మరింత తగ్గిస్తే దేశ స్థూల జాతీయోత్పత్తికి మరో 7,000 కోట్ల డాలర్లు చేర్చవచ్చునని మెకిన్సే అధ్యయనం చెప్పడాన్ని కొచ్చర్ గుర్తుచేశారు. సగం మందికి ఇల్లే ఆఫీసు: కెరెన్ క్వింటాస్ డెల్ కంప్యూటర్స్‌లో పని చేసే మహిళల్లో సగం మంది ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారని, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా కంపెనీ వారికి ఈ అవకాశం కల్పిస్తోందని సంస్థ చీఫ్ కన్సూ్యమర్ ఆఫీసర్ కెరెన్ క్వింటాస్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు డెల్ అనేక చర్యలు చేపట్టిందని, పెట్టుబడులతోపాటు మార్గదర్శకత్వం వహించేందుకు, బిగ్ డేటా, ఆర్టి్టఫిషియల్ ఇంటెలిజెన్స్‌లతో వారికి సాయపడేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఉద్యోగాల్లో, పరిశ్రమల స్థాపనలో పురుషులు, మహిళల మధ్య ఉన్న అంతరం తగ్గితే ఆ యా దేశాల స్థూలజాతీయోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థ మెకెంజీ అధ్యయనం స్పష్టం చేసిన విషయాన్ని కెరెన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మహిళల సామర్థ్యం వృథా అవుతోంది: చెర్రీ బ్లెయిర్ భారత్‌లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు తక్కువగా ఉన్నారని, వారిలోనూ చాలా మంది పెళ్లిళ్ల తరువాత ఉద్యోగాలు మానేస్తున్నారని, ఈ పరిణామాన్ని మహిళలు వారి సామర్థ్యాన్ని వృథా చేస్తున్నట్లుగానే చూడాలని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు అయిన యువతులతోపాటు లేటు వయసులో మళ్లీ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేలా చెర్రీ బ్లెయిర్ ఫౌండేషన్ తరఫున శిక్షణ ఇస్తున్నామన్నారు. మరో పదేళ్ల తర్వాత... మరో దశాబ్దం తరువాత మహిళలు ఎలా ఉండా లని కోరుకుంటున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించగా ఆంక్షలు పెట్టే సమాజం ఉండకూడదని ఆడపిల్లల తల్లులుగా తాము కోరుకుంటున్నామని ఇవాంకా ట్రంప్ బదులిచ్చారు. మహిళలు చేసే పనులు పురుషులు చేయడం, పురుషులకే పరిమితమైన పనులను మహిళలు చేయడం మరింత పెరగాలని ఆకాంక్షించారు. మహిళలకు విద్య, ప్రోత్సాహం, సాధికారత అందాలన్నది తన ఆకాంక్ష అని చందా కొచ్చర్ పేర్కొనగా ఆడపిల్లలు తమకు తగిన వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకునే స్వేచ్ఛ అందాలని కోరుకుంటున్నట్లు చెర్రీ బ్లెయిర్ తెలిపారు. గ్రామాలకు స్వచ్ఛ ఇంధనం: అజైతా షా ఇంధనం, మౌలిక రంగ విభాగానికి సంబంధించిన పిచ్ కాంపిటీషన్లో స్టార్టప్ సంస్థ ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’విజేతగా నిలిచింది. సోలార్ టెక్నాలజీ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన ఇంధన వనరులను గ్రామీణ ప్రాంతాల మహిళలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఫ్రాంటియర్ మార్కెట్స్‌ని ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకురాలు అజైతా షా ‘సాక్షి’బిజినెస్ బ్యూరోతో చెప్పారు. మహిళా ఎంట్రప్రెన్యూర్స్ సాయంతో వాటిని అందజేస్తున్నట్లు తెలిపారు. రాజస్తాన్‌లో దాదాపు నాలుగు వేల మంది మహిళలకు సోలార్ టెక్నాలజీ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని, తద్వారా వెయ్యి మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆదాయ మార్గాలు కూడా చూపించగలిగామని వెల్లడించారు. ‘‘మహిళలపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభాలను నేను చూశా. దీనిని అందరికీ చూపొ చ్చని జీఈఎస్‌కు వచ్చి.. పిచ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. నా లక్ష్యం అందరికీ నచ్చి, నేను గెలవటం సంతోషం కలిగించింది. ప్రస్తుతం రాజస్థాన్‌కే పరిమితమైనా.. త్వరలో మరో 6 రాష్ట్రాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్స్ సంఖ్యను వెయ్యి నుంచి పదివేలకు పెంచాలని భావిస్తున్నాం’’అని అజైతాషా వివరించారు. తమ సంస్థను ప్రారంభించి ఆరేళ్లవుతోందని, గతంలో కొంత పెట్టుబడులు సమీకరించామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఇప్పటిదాకా ఒకటిన్నర మిలియన్ డాలర్ల దాకా సమీకరించామని.. 2020 నాటికల్లా 26 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకునేలా మరో 2 మిలియన్ డాలర్లు సమీకరించనున్నామన్నారు. ‘పిచ్’ విజేతలు అజైతా, జైనేశ్! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఈఎస్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ (జిస్ట్) పిచ్’కాంపిటీషన్లో బుధవా రం రెండు విభాగాల్లో తుది విజేతలను ప్రకటించారు. ఫిన్‌టె క్–డిజిటల్ ఎకానమీ, ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో ఆరు చొప్పున 12 స్టార్టప్ సంస్థలు పోటీపడ్డాయి. వాటిల్లో ఫిన్‌టెక్ విభాగంలో విద్యా రుణాల సదుపాయం కల్పించే జ్ఞాన్‌ధన్ సంస్థ, ఎనర్జీ విభాగంలో ఫ్రాంటియర్ మార్కె ట్స్ సంస్థ విజేతలుగా నిలిచాయి. గురువారం మరో రెండు (హెల్త్‌కేర్–లైఫ్‌సైన్సెస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్) విభాగాల్లో తుది విజేతలను ప్రకటిస్తారు. అనంతరం ఈ 4 విభాగాల్లో ఎంపికైన వారి నుంచి తుది విజేతను ఎంపిక చేస్తారు. విభాగాల వారీ విజేతలకు సుమారు రెండు లక్షల డాలర్ల మేర బహుమతి అందజేస్తారు. తుది విజేతకు నాలుగు లక్షల డాలర్లు ఇస్తారు. బుధవారం రెండు విభాగాల్లో విజేతలు ఫ్రాంటియర్ మార్కెట్స్ వ్యవస్థాపకులు అజైతాషా, జ్ఞాన్‌ధన్ వ్యవస్థాపకులు జైనేశ్ సిన్హా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. రెండు రోజుల్లో రుణాలు: జైనేశ్ సిన్హా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న జ్ఞాన్‌ధన్ స్టార్టప్ సంస్థ ఫిన్‌టెక్ విభాగంలో విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా జ్ఞాన్‌ధన్ సంస్థ వ్యవస్థాపకులు జైనేష్ సిన్హా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘‘మంచి చదువు, మంచి కాలేజీ, మంచి ఉద్యోగం.. ఏ విద్యార్థిౖ కెనా ఇదే కల. విదేశాల్లో అందులోనూ టాప్ వర్సిటీల్లో చదవాలని అనుకుంటారు. కానీ చాలా మందికి ఇది కలగానే మిగిలిపోతుంది. కారణం డబ్బు సమస్య. బ్యాంకులు విద్యా రుణాలు ఇస్తున్నా.. అంత సులువేమీ కాదు. తనఖా నుంచి మొదలు పెడితే వడ్డీ రేట్ల వరకూ ప్రతీది సమస్యే. దీనికి మేం ‘జ్ఞాన్‌ధన్’తో పరిష్కారం చూపిస్తున్నాం. ఐఐటీ చదివే రోజుల్లో డబ్బు కోసం మాకు ఎదురైన ఇబ్బందులే ఈ స్టార్టప్ ప్రారంభానికి పునాది వేశాయి. అంకిత్ మెహ్రాతో కలసి దీన్ని ప్రారంభించా. రుణాల కోసం ఎస్బీఐ, బీఓబీ, యాక్సిస్ బ్యాంకులతోపాటు ఒక ఎన్బీఎఫ్సీ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. జ్ఞాన్ధన్లో తనఖాతో, తనఖా లేకుండా రెండు రకాల విద్యా రుణాలుంటాయి. రూ.10 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు రుణాలు అందిస్తాం. తనఖాతో కూడిన రుణానికైతే 2–3 వారాలు, తనఖా లేకుండా అయితే 2 రోజుల్లో రుణం అందిస్తాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 600 మంది విద్యార్థులకు రూ.160 కోట్ల రుణాలను అందించాం. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి 100 మంది విద్యార్థులున్నారు’’అని జైనేశ్ సిన్హా వివరించారు. -
జీఈఎస్.. గోల్కొండ.. శంషాబాద్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన ప్రశాంతంగా ముగిసింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్) కోసం నగరానికి వచ్చిన ఆమె రెండో రోజూ బిజీబిజీగా గడిపారు. బుధవారం ఉదయం అమెరికా బృందంతో కలసి ట్రైడెంట్ హోటల్లోనే ఇవాంకా బ్రేక్‌ఫాస్ట్ చేశారు. పది గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుని.. జీఈఎస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ‘వి కెన్ డూ ఇట్’అనే అంశంపై చర్చాగోష్టిలో పాల్గొన్నారు. 11.15 గంటలకు చర్చాగోష్టి ముగియగానే తిరిగి బస చేసిన హోటల్‌కు చేరుకున్నారు. గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్న ఇవాంకా 12.50 గంటల ప్రాంతంలో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పలువురు మహిళా పారిశ్రామికవేత్తలతో ఇవాంకా హోటల్లోనే ముఖాముఖిలో పాల్గొన్నారు. – సాక్షి, హైదరాబాద్ మధ్యాహ్నం గోల్కొండ ఖిల్లాకు.. ఇవాంకా గోల్కొండ పర్యటనపై బుధవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఇవాంకా భద్రతాధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన షెడ్యూల్లో గోల్కొండ పర్యటన వివరాలు లేవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండలో విందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ అధికారులు ముందస్తుగానే ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఇవాంకా గోల్కొండకు వస్తున్నట్టు ఆమె భద్రతాధికారులు రాష్ట్ర పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్పటికప్పుడు గ్రీన్‌చానల్ ద్వారా ఇవాంకా 2.35 గంటల ప్రాంతంలో ట్రైడెంట్ నుంచి గోల్కొండ కోటకు చేరుకున్నారు. గంట పాటు గోల్కొండ విశేషాలు తెలుసుకుని 3.35 ప్రాంతంలో తిరుగు పయనమైన ఇవాంకా 3.55 గంటలకు ట్రైడెంట్‌కు చేరుకున్నారు. ఎస్పీజీ అసంతృప్తి.. ప్రధాని మోదీ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) రాష్ట్ర పోలీస్ అధికారులపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒకవైపు ఫలక్‌నుమాలో విందు జరుగుతుంటే టీవీ చానళ్లు సీసీఫుటేజ్ ఆధారంగా ప్రత్యక్ష ప్రసారం చేయడం భద్రతకు ఇబ్బందిగా మారిందని, ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరైన వారి భద్రత విషయంలో ఇలా వ్యవహరిం చడం మంచిది కాదని రాష్ట్ర పోలీస్ అధికారులను కాస్త ఘాటుగానే హెచ్చరించినట్టు తెలిసింది. అయి తే అప్పటికప్పుడు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సీసీటీవీ ఫుటేజ్ ప్రసారం ఆపాలని అన్ని మీడియా చానళ్లను కోరడంతో టీవీ చానళ్లు ప్రసారాలు ఆపేశా యి. ఈ ఒక్క విషయం తప్పా భద్రతా పరంగా రాష్ట్ర పోలీస్ శాఖ సక్సెస్ అవడంతో ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. సాయంత్రమే డిన్నర్.. తిరుగు ప్రయాణం.. తిరుగు ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకుని సాయంత్రం 5.30 సమయంలోనే అధికార బృందంతో కలసి ఇవాంకా ట్రైడెంట్‌లో డిన్నర్ పూర్తిచేశారు. 7.25 సమయంలో బస చేసిన హోటల్ నుంచి బయలు దేరి రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నీతిఆయోగ్ అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతా ధికారులు ఇవాంకాకు వీడ్కోలు పలికారు. 9.20 ప్రాంతంలో దుబాయి వెళ్లే ఎమిరేట్స్(ఈకే 529) విమానంలో తిరుగు పయనమయ్యారు. ఎంతో హడావుడి.. కానీ సాదాసీదాగా.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాంకా పర్యటనకు ఎంతో హడావుడి చేశాయి. అయితే ఇవాంకా అమెరికా నుంచి సాధారణ ప్రయాణికురాలిగా అందరితో కలసి కమర్షియల్ విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కాన్వాయ్ వాహనాలను సైతం కాదని అందుబాటులో పెట్టుకున్న రెండో వాహన శ్రేణిలో తాను బస చేసిన హోటల్‌కు వెళ్లారు. హెచ్ఐసీసీలోనూ అందరితో తాను అంటూ సదస్సులో పాల్గొని ఆకట్టుకున్నారు. -
గోల్కొండ కోటలో 'నెలవంక'
సాక్షి, హైదరాబాద్: అమెరికా నెలవంక ఇవాంకా.. చారిత్రక గోల్కొండ కోటలో సందడి చేసింది. వైభవోపేతమైన కోట చరిత్ర తెలుసుకొని మంత్రముగ్ధురాలైంది. నాలుగు వందల ఏళ్ల నాటి భాగ్యనగర చారిత్రక విశేషాలను ఎంతో ఆసక్తిగా ఆలకించింది. హైదరాబాద్ నగరాన్ని స్థాపించిన కుతుబ్‌షాహీల ప్రస్థానం, శత్రుదుర్భేద్యమైన కోటలు, ప్రాకారాలు, దర్వాజాలు తదితర కట్టడాల నిర్మాణం చూసి అబ్బురపడింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండోరోజు కార్యక్రమంలో భాగంగా ఇవాంకా బుధవారం మధ్యాహ్నం 3.05 గంటల నుంచి 3.56 వరకు సుమారు 45 నిమిషాలకు పైగా గోల్కొండ కోటలో పర్యటించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమె పర్యటన కొనసాగింది. కోట ప్రధాన ద్వారంలోకి ప్రవేశించింది మొదలు.. తిరిగి బయటకు వచ్చేవరకు ప్రతి విషయాన్ని ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు. చప్పట్లు ప్రతిధ్వనించే క్లాప్పోర్టికో వద్ద చప్పట్లు తిరిగి వినిపించే తీరుపై అమితాసక్తిని ప్రదర్శించారు. కుతుబ్‌షాహీల రెండంతస్థుల ఆయాధాగారం, బ్యారక్‌లు, పచ్చటి పచ్చిక బయళ్లు, పూలతో ఎంతో అందంగా కనిపించే నగీనాబాగ్, కుతుబ్‌షాహీల అంతఃపురం రాణీమహల్, తారామతి మసీదు, రామదాసు బందీఖానా తదితర ప్రాంతాలను ఇవాంకా కాలినడనే సందర్శించారు. పర్యాటక, ఆర్కియాలజీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఆమెకు గోల్కొండ కోట విశేషాలను వివరించారు. కుతుబ్‌షాహీల చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలిపే లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. హస్తకళల ప్రదర్శన గోల్కొండ మార్గంలో ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారయ్యే బొమ్మలు ఇవాంకాను ఆకట్టుకున్నాయి. నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక, లేపాక్షి, గోల్కొండ తదితర హస్తకళా వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాలు వంటి 12 స్టాళ్లను ఇవాంక రాక సందర్భంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించే హస్తకళల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఆతిథ్యం అదరహో.. ఫలక్‌నుమాలో మొఘలాయీల వంటకాలు ఆరగించిన విదేశీ అతిథులు.. బుధవారం గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ వంటకాలను రుచి చూశారు. ప్రపంచంలో మరెక్కడా లభించని అద్భుతమైన రుచులు తెలంగాణ సొంతమని పలువురు ప్రతినిధులు కితాబునిచ్చారు. తెలంగాణ ప్రజలు వండుకొనే అన్ని రకాల వంటకాలను ఈ విందులో రుచి చూపించారు. జొన్నరొట్టె, సజ్జ రొట్టె, సర్వపిండి, అంబలి, జొన్నగట్క మొదలుకొని హైదరాబాద్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, బగారా రైస్, పులావ్, తలకాయ మాంసం, మటన్, కాళ్ల షోరువా, బోటి కూర, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పచ్చిపులుసు, రొయ్యల పులుసు, కోరమీను చేపల పులుసు, ఫిష్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్, ఎగ్ కర్రీ, ఎగ్పులుసు, పప్పు, సాంబారు వివిధ రకాల కూరగాయలతో చేసిన నాన్ వెజ్ వెరైటీలు, సకినాలు, గర్జెలు, లడ్డూలు, గారెలు, పకోడీ, మలీద ముద్ద తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గోల్కొండ కోటలో విందు కొనసాగింది. సుమారు 1,500 మంది ప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విందులో పాల్గొన్నారు. ఆర్టీసీ, పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఈ ప్రతినిధులంతా గోల్కొండ కోటకు చేరుకున్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు ప్రముఖ నృత్యకారిణి డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ నేతృత్వంలో సుమారు 200 మంది కళాకారులతో గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన తెలంగాణ కళలు, సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమంలో హైలెట్‌గా నిలిచింది. శాస్త్రీయ, జానపద, గిరిజన కళారూపాలు విదేశీ అతిథులను అబ్బురపరిచాయి. తెలంగాణ బతుకమ్మ, బోనాలు, తెలంగాణ తల్లి, రాణీ రుద్రమ తదితర నృత్య ప్రదర్శనలు, డప్పు దరువు, పేరిణీ నృత్యం, కథక్, సూఫీ తదితర నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నర్తకీమణి డాక్టర్ అలేఖ్య పుంజాల రాణీరుద్రమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీపికారెడ్డి తెలంగాణ తల్లి కూచిపూడి నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. మంగళ్‌భట్ కథక్, కళాకృష్ణ పేరిణి, స్నేహ మంగాపు భరతనాట్యం, రాఘవరాజ్ భట్ సూఫీ, షేక్ హనీఫ్ అహ్మద్ మార్షల్ ఆర్ట్స్, ప్రమోద్‌రెడ్డి రామదాసు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఈ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించారు. మళ్లీ మళ్లీ హైదరాబాద్ రావాలనిపిస్తోంది హైదరాబాద్ చాలా బాగుంది. గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్ వంటి గొప్ప కట్టడాలను చూస్తోంటే మళ్లీ మళ్లీ హైదరాబాద్‌కు రావాలనిపిస్తోంది. ఫూడ్స్ చాలా బాగున్నాయి. బిర్యానీ టేస్టీగా ఉంది. ఈ వంటకం తినడం ఇదే మొదటిసారి. –గోంజా, టాంజానియా అతిథి మర్యాదలు బాగున్నాయి ఆతిథ్యం చాలా బాగుంది. రకరకాల వంటలు రుచి చూశాం. హైదరాబాద్ ప్రజల టేస్ట్ తెలిసింది. మటన్, చికెన్, స్వీట్స్, ఒకటేమిటీ అన్నీ బాగున్నాయి. బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. చాలా బాగుంది. రుచికరమైన వంటల్లో హైదరాబాద్ చాలా ఫేమస్ అని తెలిసిపోయింది. – మెరీనా, ఇటలీ గ్రేట్ వర్క్ ఇవాంకా.. జీఈఎస్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమిచ్చావ్ కుమార్తె ఇవాంకాపై ట్వీటర్లో డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు వాషింగ్టన్: హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్) సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలకు అద్భుతమైన ప్రోత్సాహం ఇస్తోందంటూ తన కుమార్తె, సలహాదారు ఇవాంకాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘గ్రేట్ వర్క్ ఇవాంకా’అంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీటర్లో మంగళవారం అర్ధరాత్రి ట్వీట్ చేశారు. అమెరికన్ల కలలను నిజం చేసేలా పారిశ్రామికవేత్తల కోసం అమెరికా తీసుకుంటున్న చర్యలపై జీఈఎస్‌లో ఇవాంకా చేసిన వ్యాఖ్యలను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ట్వీటర్లో పోస్ట్ చేసింది. దీనిని రీట్వీట్ చేసిన సందర్భంగా ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ కూడా ఇవాంకాపై పొగడ్తలు కురిపించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇవాంకా భారత్‌లో పర్యటించడం ఉద్విగ్నంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలను పెట్టుబడిదారులుగా.. మెంటార్లుగా అవకాశంతో పాటు వారికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారని ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. వేల దిగ్గజాలు.. లక్షల ఆలోచనలు ఉత్సాహంగా రెండోరోజు సదస్సు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండోరోజున విజయవంతంగా సాగింది. దాదాపు 20కు పైగా చర్చాగోష్ఠులు, సామూహిక సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తమ ఆలోచనలు పంచుకున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్లీనరీ సెషన్‌తో సదస్సు ప్రారంభమైంది. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం, పని ప్రదేశాల్లో అవకాశాలు కల్పించడం, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అంశాలపై చర్చించారు. ఇవాంకాతో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్, డెల్ ఈఎంసీ సీసీవో కరేన్ క్వింటోస్ ఈ చర్చలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సెషన్ అందరినీ ఆకట్టుకుంది. తొలి ప్లీనరీకి ఇవాంకా హాజరవటంతో రెండోరోజు సదస్సు ఉత్సాహంగా ఆరంభమైంది. ఈ చర్చ ముగియగానే ఇవాంకా వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలతో గ్రూప్ ఫొటోలు దిగారు. అనంతరం సదస్సు నుంచి ఆమె తిరుగుపయనమయ్యారు. ఆ తర్వాత సాయంత్రం వరకు మహిళా సాధికారత, వ్యవసాయం, పెట్టుబడులు, వ్యాపార మెలకువలు, ఆరోగ్యరంగం, క్రీడలు, మీడియా వినోద రంగాలపై చర్చాగోష్ఠులు సాగాయి. -
అమెరికాకు బయలుదేరిన ఇవాంకా
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ పర్యటన ముగించుకుని ట్రెడెంట్ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఎక్కిన ఇవాంకా బృందం అమెరికాకు బయలుదేరింది. ఆమె పర్యటనలో రెండో రోజైన బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్లో ఆమె ప్రసంగించారు. ఆ కార్యక్రమం అనంతరం తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్ హోటల్లో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. సాయంత్రం దాదాపు ఆరు గంటల ప్రాంతంలో హోటల్ ఖాళీ చేసిన ఇవాంకా నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా ప్రయాణించి ఇవాంకా సహా ఇతర అమెరికా ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బంది అమెరికాకు చేరుకుంటారు. మంగళవారం వేకువజామున హైదరాబాద్‌కు వచ్చిన ఇవాంకా తన తొలిరోజు పర్యటనలో భాగంగా ప్రపంచ పారిశ్రామిక సదస్సులో పాల్గొన్నారు. అదేరోజు రాత్రి ప్రసిద్ధ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర కీలక వ్యక్తులతో కలిసి డిన్నర్ చేశారు ఇవాంకా. తిరిగి రాత్రి ట్రెడెంట్ హోటల్‌కు చేరుకున్న ఇవాంకా బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. -
గోల్కొండ కోటలో అమెరికా నెలవంక
-
రెండో రోజు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు
-
గోల్కొండ కోటలో ఇవాంకా ట్రంప్
-
బాంబు బెదిరింపు కాల్, టీ.సర్కార్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : జీఈఎస్ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు పసందైన విందుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్ నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఫలక్ నుమా పరిసరాల్లో బాంబు పెట్టామని, ఏ నిమిషంలో అయినా పేలుతుందంటూ ఆగంతకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, నిన్న రాత్రంతా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం దాన్ని బెదిరింపు కాల్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా దుండగుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతగాడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం ఫలక్ నుమా ప్యాలెస్‌లో బాంబు పెట్టినట్లు వచ్చిన బెదిరింపు కాల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బెదిరింపు ఫోన్ కాల్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఘటనకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ ఫోన్ కాల్ పాతబస్తీ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాంకా ట్రంప్ పర్యటన ముగియగానే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. -
గోల్కొండ కోటలో ఇవాంకా ట్రంప్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ముఖ్య అతిథిగా హాజరు అయిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోట చేరుకున్నారు. జీఈఎస్‌కు హాజరైన ఇవాంకా ట్రంప్ రెండో రోజు బిజీబిజీగా గడిపారు. ఈ రోజు ఉదయం సమిట్‌లో సెషన్లకు హాజరైన ఆమె తర్వాత చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. భారీ భద్రత మధ్య ఇవాంకా ట్రంప్ గోల్కొండ కోటకు విచ్చేశారు. అక్కడ ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ పర్యటనలో ఇవాంకా వెంట తెలంగాణ సీఎస్ కూడా ఉన్నారు. జీఈఎస్‌కు హాజరయిన 1500మంది ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు అధికారికంగా విందు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. అంతకు ముందు యూఎస్ సీక్రెట్ ఏజెంట్స్ గోల్కొండ కోటలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు పోలీసులు గోల్కొండ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కోట పరిధిలో రాత్రి పది గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సందర్శకులను లోనికి అనుమతించడం లేదు. -
గోల్కొండలో రాష్ట్ర ప్రభుత్వం విందు
-
మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు
-
ఇవాంక సదస్సులో కేసీఆర్ ఉండగా.. మోదీ ఎందుకు?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకావడాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి హాజరవుతుండగా.. మోదీ వెళ్లాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ‘ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న కార్యక్రమానికి హాజరవ్వడం ద్వారా నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవిని చులకన చేశారు. ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ప్రధానికి విదేశీయులు, విదేశీ రేటింగ్ ఏజెన్సీల సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తన పాలనపై సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన గుజరాత్ ప్రజలను అడగాలి’ అని ఆనంద్‌శర్మ అన్నారు. జీఈఎస్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని తప్పుబడుతూ ఆనంద్ శర్మ చేసిన విమర్శలపై నెటిజన్లు తప్పుబడుతున్నారు. -
కళకళ..వెలవెల
సాక్షి,సిటీబ్యూరో/గచ్చిబౌలి: వందలాది మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు. వేలకొద్దీ వాహనాల రాకపోకలు ,ప్రభుత్వ ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఎక్కడికక్కడ భారీగా మోహరించిన పోలీసు బలగాలతో నగరంలో మంగళవారం హడావిడి నెలకొంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు జరుగనున్న హెచ్ఐసీసీ, హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మియాపూర్ మెట్రో స్టేషన్, తదితర ప్రాంతాలు అతిథులు, సందర్శకులతో కళకళలాడాయి. మరోవైపు మిగతా నగరమంతా వెలవెలపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు స్తంభించాయి. నగరమంతటా ఇవాంక రాక, మెట్రో రైలు ప్రారంభోత్సవ అంశాలే చర్చనీయాంశమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆ దేశ సలహాదారు ఇవాంక ట్రంప్‌ను నగరానికి స్వాగతిస్తూ అక్కడక్కడా బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ బీజేపీ పలుచోట్ల ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేసింది. అతిథుల భద్రత దృష్ట్యా మోహరించిన ప్రత్యేక భద్రతా బలగాలతో రహదారులు నిండిపోయాయి. హెచ్ఐసీసీ ప్రాంగణానికి నలువైపులా భారీ బందోబస్తు కనిపించింది. నిత్యం ఐటీ సంస్థల కార్యకలాపాలతో, ఐటీ నిపుణులతో సందడిగా ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మంగళవారం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది.సైబరాబాద్‌లోని విదేశీ అతిథులు బస చేసిన 18 హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 150 దేశాలకు చెందిన వందలాది మంది ప్రతినిధులు, అధికారులతో సందడిగా కనిపించింది.హెచ్ఐసీసీ ప్రాంతంలో కారు పాస్‌లు ఉన్నవాళ్లను మాత్రమే లోపలికి అనుమతించారు. పాస్‌లు లేని వారు కాలినడకనే హెచ్ఐసీసీకి వెళ్లారు. స్కూళ్లు, ఐటీ సంస్థలకు సెలవు సదస్సు నేపథ్యంలో ప్రముఖుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లోని ఐటీ సంస్థలు వర్క్ టూ హోమ్‌కు అవకాశం కల్పించడంతో ఐటీ ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద నుంచే విధులు నిర్వహించారు. మరి కొన్ని సంస్థల్లో ఉదయం 8 గంటలకే వచ్చి విధుల్లో చేరారు. మొదటి షిఫ్టు విధులను మధ్యాహ్నం 2 గంటలలోపే ముగించారు. ప్రధాని మోదీ, ఇవాంకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసుల సూచన మేరకు కొన్ని సంస్థలు సాయంత్రం విధులను రద్దు చేశాయి. అలాగే హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూళ్లు చాలా వరకు మూతపడ్డాయి. కొన్ని స్కూళ్లు ఒక్క పూటకే పరిమితమయ్యాయి. శేరిలింగంపల్లి, తదితర చోట్ల ప్రభుత్వ స్కూళ్లు మాత్రం యథావిధిగా పని చేశాయి. దుకాణాలు బంద్ .. జీఈఎస్ సదస్సు, ప్రధాని, ఇవాంకా ట్రంప్ పర్యటన నేపథ్యంలో న్యాక్ నుంచి హైటెక్స్ వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపుల అన్ని దుకాణాలను ముసివేయించారు. హైటెక్స్ నుంచి ఫలక్నామా వెళ్లే మార్గంలో హైటెక్స్, చార్మినార్ మెటల్ కమాన్, కొత్తగూడ, గచ్చిబౌలి మార్గంలో కూడా దుకాణాలను మూసివేయించారు. కనిపించని జనసంచారం ఒకవైపు అతిథుల రాకతో హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాలు కళకళలాడగా నగరంలోని మిగతా ప్రాంతాలు వెలవెలాబోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, కోఠీ, ఆబిడ్స్, దిల్సుఖ్నగర్, తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ,ప్రైవేట్ కార్యకలాపాలు స్తంభించాయి. జనం సైతం అవసరమైతే తప్ప రోడ్లపైకి రాలేదు. దీంతో సాధారణ ట్రాఫిక్ రద్దీకి భిన్నంగా పలు ప్రాంతాల్లో జనసంచారం సైతం చాలా తక్కువగా ఉంది. స్తంభించిన జనజీవనం.. జీఈఎస్ ప్రతినిధులకు కేంద్రం విందు ఏర్పాటు చేసిన ఫలక్‌నుమా ప్యాలెస్ మార్గంలోనూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.ఎక్కడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడకుండా జాగ్రత్తలు పాటించారు. షాపింగ్‌కాంప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాళ్లు మూసి ఉంచారు. రోడ్లకు ఇరువైపులా జనం రద్దీ లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో సాధారణ జనజీవనానికి భిన్నమైన వాతావరణం నెలకొంది. నేడు గోల్కొండ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు సాక్షి, సిటీబ్యూరో: జీఈఎస్‌లో పాల్గొన్న అతిథులకు తెలంగాణ సర్కారు బుధవారం రాత్రి గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నార్సింగి, రామ్‌దేవ్‌గూడ వైపుల నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాలను బాపూఘాట్ నుంచి లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ కింది భాగం, ఫతేదర్వాజా మీదుగా పంపిస్తారు. షేక్‌పేట్‌నాలా వైపు నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాలను గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి జమాలీ దర్వాజా మీదుగా పంపిస్తారు. -
హైదరాబాద్‌లో జీఈఎస్ సదస్సు
-
ఫలక్‌నుమ ప్యాలెస్‌లో ఆత్మీయ విందు
-
ఒకరికి ఒకరు..!
పారిశ్రామిక యవనికపై మహిళలు నిలదొక్కుకోవాలంటే పరస్పర సహకారం అవసరమని ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) తొలి సెషన్లో వక్తలు అభిప్రాయపడ్డారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఒకరికొకరు తోడుగా ఉండి తదుపరి జీఈఎస్‌కు మరో మహిళా పారిశ్రామికవేత్తను తీసుకురావాలని, ఇందుకు పురుషుల ప్రోత్సాహమూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో మార్పునకు అనుగుణంగా మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. జీఈఎస్‌లో భాగంగా మంగళవారం ‘మహిళా సాధికారత–వివిధ దేశాల్లో మహిళల అవకాశాలు’ అంశంపై చర్చాగోష్టి జరిగింది. సిస్కో సంస్థ చైర్మన్ జాన్ చాంబర్స్ దీనికి ప్యానెల్ స్పీకర్‌గా వ్యవహరించగా.. భారత్ తరఫున రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా తరఫున ఇవాంకా, ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ అండ్ ఎస్ఆర్ఎస్ పెట్రోలియం సంస్థ ఎండీ సిబోంగిల్ సాంబూ (దక్షిణాఫ్రికా), స్కాండిన్ విస్కా ఎన్స్కిడ్లా బ్యాంకెన్ (సెబ్) చైర్మన్ మార్కస్ వాలెన్బర్గ్లు పాల్గొని మాట్లాడారు. – సాక్షి, హైదరాబాద్ జస్ట్ డూ ఇట్..: ఇవాంకా ‘‘వ్యాపార రంగంలో ఎంతో మంది విఫలమయ్యారు. మరెందరో విజయం సాధించారు. కొత్త పరిశ్రమలు నెలకొల్పాలనుకునేవారిని నేను కోరేది ఒక్కటే.. ప్రతి ఒక్కరిలో తమ వ్యాపారం విజయవంతం అవుతుందని 100 శాతం నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. వ్యాపార ఆలోచనల పట్ల ఉత్సాహం, వాటి ద్వారా మార్పు తీసుకురావాలనే బలమైన సంకల్పం ఉంటే పరిశ్రమలు స్థాపించండి. జస్ట్ డూ ఇట్..’’ అని ఇవాంకా సూచించారు. ఆవిష్కరణలకు కేంద్రమైన హైదరాబాద్‌కు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పెట్టుబడులు, మార్గనిర్దేశకత్వం పొందడంతోపాటు కొన్ని దేశాల్లో సరైన చట్టాలు లేక మహిళా పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారని... శాస్త్ర, సాంకేతిక విద్యను అందిపుచ్చుకునే విషయంలో మహిళలు వెనుకబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఏ ఒక్కరి సొత్తూ కాదని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పరిశ్రమపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ పాలనలో అప్పుడే 11 నెలలు పూర్తి చేసుకోవడం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. అమెరికాలో విద్య, నైపుణ్యాభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేజీ నుంచి 12 వరకు విద్య ప్రైవేటీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అమెరికాలో పనిచేసేవారిలో 47 శాతం మహిళలుండగా.. ఐటీ రంగంలో పనిచేసేవారిలో 21 శాతమే ఉండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇంజనీరింగ్ రంగంలోనూ మహిళల ప్రాతినిధ్యం 13 శాతమే ఉందని చెప్పారు. ఉద్యోగాల విషయంలో మహిళల వెనుకబాటు ఇలా కొనసాగితే తిరోగమనం దశగా పయనిస్తామని.. అందుకే విద్య ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమెరికా ప్రభుత్వం ఏటా విద్యకు 200 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుందన్నారు. అంత తేలికేం కాదు: సిబొంగిల్ సాంబు సవాళ్లు ఎదురైనప్పుడు వేగంగా స్పందించే తత్వమే మన విజయావకాశాలను నిర్దేశిస్తుందని దక్షిణాఫ్రికాకు చెందిన ఎస్ఆర్ఎస్ ఏవియేషన్స్ అండ్ పెట్రోలియం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిబొంగిల్ సాంబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తగా ముందుకు సాగడం తేలికైన పనికాదని, దక్షిణాఫ్రికాలో ఓ మహిళగా విమానరంగ వ్యాపారాన్ని నెలకొల్పి విజయవంతంగా నడపడం అంత సులువుగా జరగలేదని ఆమె చెప్పారు. ‘‘ఆఫ్రికాలో విమానాలు, హెలికాప్టర్లు నడిపేందుకు ఈ మహిళకు ఎవరు రుణాలిచ్చి ఉంటారని మీకు ఆలోచన రావచ్చు.. విమానాలు నడిపేందుకు స్థానిక ప్రభుత్వం నుంచి తొలి ఆర్డర్ సంపాదించినా.. విమాన రంగం నష్టాలతో కూడిన వ్యాపారమంటూ నాకు రుణాలిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నా దగ్గర తనఖా పెట్టేందుకూ ఏమీ లేదు. దీంతో బంధువుల నుంచి డబ్బులు తీసుకుని వ్యాపారం ప్రారంభించాను..’’ అని సాంబు వివరించారు. ఎన్నో త్యాగాలు చేయాలి: మార్కస్ వాలెన్‌బర్గ్ (స్వీడన్) ప్రపంచంలోనే అత్యంత వైవిధ్య ప్రాంతానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, మహిళలు వ్యాపారాలు చేయాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని స్వీడన్‌కు చెందిన సెబ్ సంస్థ చైర్మన్ మార్కస్ వాలెన్‌బర్గ్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా మహిళలకు పారిశ్రామిక రంగంలో ద్వారాలు తెరుచుకుంటున్నాయని, ఇలాంటి సమయంలో వారికి మద్దతు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ‘‘మహిళలకు తోడుండి నడిపించే గురువులు అవసరం. ఎన్నో అనుభూతులు, ఆలోచనలు వారి మెదళ్లను తొలిచేస్తుంటాయి. వారిని ప్రోత్సహిస్తే కచ్చితంగా రాణిస్తారు. వారికి మద్దతివ్వండి.. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దండి. వచ్చే జీఈఎస్ సమావేశానికి కనీసం మరో మహిళా పారిశ్రామికవేత్తకు సాయం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోండి..’’ అని సూచించారు. కష్టాలకు వెరవొద్దు: నిర్మలా సీతారామన్ భారత మహిళల్లో కష్టపడే లక్షణం ఉందని, 60 ఏళ్లుగా ఈ దేశం అలవరుచుకున్న అభివృద్ధి నమూనా ఎంతోమంది మహిళలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మహిళలు వ్యాపార రంగంలోనే కాకుండా విద్యా రంగంలోనూ రాణిస్తూ సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నారని చెప్పారు. ‘‘అసలు భారత రాజ్యాంగ నిర్మాతల్లో 15 మంది మహిళలు ఉన్నారన్న విషయం అందరూ గ్రహించాలి. అందులో అత్యంత నిమ్న వర్గాల నుంచి వచ్చిన దాక్షాయణి అనే మహిళ కూడా ఉన్నారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారనేందుకు ఆమే ఉదాహరణ. అంతరిక్ష రంగంలో దేశాన్ని ముందుకు నడిపిస్తోన్న టెస్సీ థామస్ కూడా మహిళే..’’ అని పేర్కొన్నారు. దేశంలో మహిళలకు విద్యావకాశాలు విస్తృతంగా లేవని, దీనిపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. మహిళలు వ్యాపారం చేసేందుకు రుణం కోసం బ్యాంకులకెళితే పూచీకత్తు అడుగుతారని, కుటుంబ భాగస్వామిగా పురుషుడి సహకారం లేకుండా చాలా మంది మహిళలు పూచీకత్తు ఇవ్వలేరని పేర్కొన్నారు. అందుకే దేశంలోని మహిళలందరికీ తానే పూచీకత్తుగా ఉంటానని మోదీ బ్యాంకులకు హామీ ఇచ్చారని... ప్రతి జిల్లాలోని ఒక్కో షెడ్యూల్ బ్యాంకు నుంచి కనీసం ఒక్క మహిళకు స్టార్టప్ కంపెనీ కోసం రుణాలు ఇప్పించాలనేది ప్రభుత్వ ఆలోచన అని వివరించారు. ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సినన్ని ఉద్యోగాలను దీర్ఘకాలం సృష్టించలేవని... యువత వ్యాపారాలు ప్రారంభించి మరికొందరికి ఉపాధి చూపాలన్నారు. ఆ కోణంలోనే స్టార్టప్‌లకు ప్రోత్సాహమిస్తున్నావన్నారు. డిసెంబర్ 4న దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు, చాంబర్ ఆఫ్ కామర్స్లతో సమావేశం అవుతున్నామని, రక్షణ శాఖలోకి పెట్టుబడులకు ఆహ్వానిస్తామని చెప్పారు. జర్మనీ వెళ్లినప్పుడు ఆ దేశ చాన్సలర్ ఏంజెలా మార్కెల్ కూడా భారత్‌లో స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారని, ఇజ్రాయెల్ కూడా ఆ బాటలోనే ఉందని తెలిపారు. మహిళల్లో స్వయం చొరవ రావాలని, తమకున్న ప్రతి అవకాశం తలుపు తట్టాలని, కష్టాలకు వెరవకుండా ముందుకెళ్లాలని సూచించారు. -
‘ఇవాంకా’ వ్యతిరేక ఆందోళన..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమారై ఇవాంకా పర్యటనను నిరసిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇవాంక రాకను వ్యతిరేకిస్తూ టీపీఎఫ్ ప్రదర్శన చేపట్టింది. సదస్సు పేరుతో రూ.వందల కోట్లు ప్రజా ధనం వృథా చేస్తున్నారని ఈ సందర్భంగా ఆందోళనకారులు విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో మన పాలకులు కీలుబొమ్మల్లా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీపీఎఫ్ నేతలు నలమాస కృష్ణ, రవిచంద్ర, మమత, రాణి, సంధ్య తదితరులను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘జీఈఎస్’ ఎంట్రీపాస్ల గందరగోళం సదస్సుకు హాజరుకాకుండానే వెనుదిరిగిన అనేక మంది విదేశీ డెలిగేట్లు నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన వందలాది మంది డెలిగేట్లు నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా మంగళవారం తొలిరోజున ఎంట్రీ పాసులు లభించక గంటల తరబడి హైటెక్స్ ఆవరణలో పడిగాపులు పడ్డారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా తదితర దేశాల నుంచి వందలాది డెలిగేట్లు తరలివచ్చారు. వీరందరూ హైటెక్స్‌లోని జీఈఎస్ సమ్మిట్ జరిగే హాలు లోనికి ప్రవేశించేందుకు అవసరమైన పాస్‌ల జారీ విషయంలో నిర్వాహకులు పలు రకాల ప్రశ్నలతో డెలిగేట్లను వేధించారని..ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవారు తమ మొబైల్లో ఆ వివరాలు చూపినా లోనికి అనుమతించలేదని నగరానికి చెందిన ఓ డెలిగేట్ ‘సాక్షి’తో ఆవేదన పంచుకున్నారు. ఒకసారి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆహ్వానం అందినవారిని భద్రతా కారణాల నెపంతో హైటెక్స్ ఆవరణలో భద్రతా విధుల్లో పాల్గొన్న సిబ్బందితోపాటు నీతిఆయోగ్ అధికారులు ఎంట్రీపాస్‌లు లేవంటూ లోనికి అనుమతించకుండా అమర్యాదగా ప్రవర్తించారని అసహనం వ్యక్తం చేశారు. కాగా రెండోరోజు సదస్సు నాటికి ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. కాగా తొలిరోజు సదస్సుకు లోనికి అనుమతి లేకపోవడంతో విదేశీ అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోవడం కనిపించింది. -
ఆ ముగ్గురూ..
(హైదరాబాద్, సాక్షి బిజినెస్ బ్యూరో): జీఈఎస్ సదస్సులో ప్రసంగించినప్పుడు ఇవాంకా ట్రంప్ ముగ్గురు మహిళల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాల నుంచి అవకాశాలను అందిపుచ్చుకుని ఎలా ఎదిగారన్నది వివరించారు. వారు మన ఆకాంక్షలకు ప్రతిరూపమని చెప్పారు. ‘‘సమస్యలకు వెరవకుండా ధైర్యంగా ముందుకు సాగే మీ లాంటి ఎంట్రప్రెన్యూర్ల ఆకాంక్షలు, దార్శనికతకు వీరంతా ప్రతీకలు. వారు అనేక జీవితాలను నిలబెడుతున్నారు. ఉపాధి కల్పిస్తున్నారు. ఆశాజ్యోతులుగా నిలుస్తున్నారు. మహిళలు, పురుషులనే భేదం లేకుండా అంతా కలసి.. ఏకమై సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. ఆ దిశగా పాటుపడదాం. అలా చేస్తే మెరుగైన భవిష్యత్తు మనదే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మన భవిష్యత్‌ను సమైక్యంగా తీర్చిదిద్దుకోగలిగే సత్తా మనలో ఉంది.’’అని ఇవాంకా స్పష్టం చేశారు. ఆమె చెప్పిన ముగ్గురిలో బెంగళూరుకు చెందిన మహిళ కూడా ఉండడం గమనార్హం. ఆ ముగ్గురి గురించీ ఇవాంకా మాటల్లోనే.. దారా డోట్జ్.. శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా) దారా దశాబ్దకాలంపైగా ప్రపంచవ్యాప్తంగా బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. వారు ఎదుర్కొనే చిన్న చిన్న కష్టాలను ఆమె దగ్గర్నుంచి చూశారు. నీళ్లు తెచ్చుకునేందుకు అవసరమైన వస్తువులు లేకపోవడం దగ్గరి నుంచి.. దెబ్బతగిలితే కనీసం కట్టుకట్టేందుకు సరైన సాధనం లేకపోవడం దాకా అనేక సమస్యలను దగ్గరి నుంచి పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రాణాధారమైన అనేక ఉత్పత్తులను త్రీడీ ప్రింటింగ్ ద్వారా రూపొందించే ఫీల్డ్ రెడీ సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎక్కడ ఏ విపత్తు ముంచుకొచ్చినా.. ఫీల్డ్ రెడీ సంస్థ వెంటనే రంగంలోకి దిగుతుంది. అత్యాధునిక టెక్నాలజీ తోడ్పాటుతో సహాయక చర్యలు అందిస్తుంది. వినూత్న ఆవిష్కరణల ద్వారా దారా డోట్జ్ అనేకమంది జీవితాలను నిలబెడుతున్నారు. అందరికీ ఆశాజ్యోతిగా నిలుస్తున్నారు. రాజ్యలక్ష్మి బొర్థాకుర్, బెంగళూరు చిన్న వయసులోనే కుమారుడు ఫిట్స్ బారిన పడటం రాజ్యలక్ష్మిని కలచివేసింది. కుమారుడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు ఉపయోగపడే పరిష్కార మార్గాన్ని సొంతంగానే కనుగొనాలని ఆమె నిర్ణయించు కున్నారు. ఆ క్రమంలోనే ఆమె ‘స్మార్ట్ గ్లోవ్స్’ను రూపొందించారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా వివిధ రకాల వ్యాధులను, రుగ్మతలను ఈ పరికరం ముందస్తుగానే అంచనా వేస్తుంది. రోగులను హెచ్చరిస్తుంది కూడా. ప్రస్తుతం రాజ్యలక్ష్మి నెలకొల్పిన ‘టెరా బ్లూ’సంస్థ.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా కృషి చేస్తోంది. రేహాన్ కెమలోవా, అజర్బైజాన్ రేహాన్ వయసు కేవలం పదిహేనేళ్లే. కానీ వర్షపునీటి నుంచి విద్యుత్ తయారు చేసే సంస్థను ఏర్పాటు చేసిన ఘటికురాలు ఆమె. ఒక్కొక్కటిగా మొదలుపెట్టి ప్రపంచంలోని ప్రతి ఇంట్లో విద్యుత్ కాంతులు నింపాలన్నది రేహాన్ లక్ష్యం. -
మహిళతోనే మార్పు
హైదరాబాద్, సాక్షి బిజినెస్ బ్యూరో :మహిళతోనే మార్పు సాధ్యమని అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ ఉద్ఘాటించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఎక్కువ మందికి లాభం చేకూరుతుందని, సమాజంపై దాని ప్రభావం ఎన్నో రెట్లు ఉంటుందని చెప్పారు. మహిళలు తమ సంపాదనను తిరిగి తమ కుటుంబాలు, సంబంధీకులపైనే ఇన్వెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. ‘మహిళలకు సాధికారత కల్పించని మానవ పురోగతి అసంపూర్ణమేనని నమ్ముతున్న ప్రధాని మోదీని మనస్పూర్తిగా అభినందిస్తున్నా’ అంటూ కొనియాడారు. మంగళవారమిక్కడ ‘అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు– జీఈఎస్ 2017’ను ప్రారంభిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అభివర్ణించారు. ‘‘తమ సొంత పరిశ్రమ, పనితనంతో భారతీయులు 13 కోట్ల మందికిపైగా ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తెచ్చారు. ఇది చరిత్రాత్మకం. మోదీ సారథ్యంలో ఇది మరింత ముందుకెళుతుందని ఆశిస్తున్నా. 2030 నాటికి 50 కోట్ల మంది మధ్య తరగతికి చేరాలన్న లక్ష్యానికి తగ్గట్టు భారతదేశమంతటా కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి వైద్యులు, శాస్త్రవేత్తలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇంజనీర్లు ఆధునిక అద్భుతాలు సృష్టిస్తున్నారు. భారతీయ అంతరిక్ష నౌకలు చంద్రుణ్ణి, అంగారకుడిని చేరుతున్నాయి. అందుకే భారతీయులు మాకు స్ఫూర్తిదాయకం’’ అని ఉద్వేగంగా అన్నారు. అందుకే.. మీరు పారిశ్రామికవేత్తలు ‘‘మీరొక ఆలోచనతో ఆరంభిస్తారు. తదుపరి రోబోను సృష్టించడానికో, మరో యాప్‌ను ఆవిష్కరించడానికో, మరో మందు కనిపెట్టడానికో రేయింబవళ్లు పనిచేస్తారు. ఆ సమయంలో కొందరు మిమ్మల్ని భయపెడతారు. మీరు అతిపెద్ద రిస్కు తీసుకుంటున్నారని, దానివల్ల వచ్చే లాభం మాత్రం చిన్నదని చెబుతారు. కానీ మీరు వైఫల్యానికి భయపడరు. మీ భవిష్యత్తును మీరు సొంతం చేసుకోవాలనుకుంటారు. అందుకే మీరు ఈ రోజు ఇక్కడున్నారు. అందుకే మీ అందరికీ నా శుభాభినందనలు’’ అని ఇవాంకా వివరించారు. భారత్‌లో పని విషయంలో మగ– ఆడ మధ్య తారతమ్యాలు లేకుండా సమానత్వం వస్తే వచ్చే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 150 బిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని అంచనా వేశారు. తొలిసారి.. మహిళల మెజారిటీ ‘మహిళకు ప్రాధాన్యం.. అందరికీ పురోగతి’ పేరిట ఇక్కడ జరుగుతున్న సదస్సులో 1,500 మంది పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారని, తొలిసారి మహిళలు మెజారిటీ సంఖ్యలో హాజరవటం ఇదే తొలిసారి అని ఇవాంక అన్నారు. ‘‘పురుషుల ఆధి పత్యం ఉన్న పరిశ్రమలో నేను గతంలో పారిశ్రామికవేత్తగా, ఎగ్జిక్యూటివ్‌గా దగ్గర్నుంచి అన్నీ చూశా. పనిలో తమను తాము నిరూపించు కోవాలంటే మహిళలు మగవారి కన్నా ఎక్కువ పనిచేయాలి. మా నాన్న అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక నేను మహిళలతో సహా అమెరికన్ల కోసం పనిచేసే అవకాశం వచ్చింది. అందుకే వ్యాపారాల్ని వదిలిపెట్టా. మహిళలు తమ కుటుంబాలకు ప్రాధాన్యమిస్తూనే కెరీర్‌ను కూడా చూసు కునేలా మేం పాలసీలు రూపొందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 2014–16 మధ్య మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10% పెరిగింది. అమెరికాలో మహిళలు నడిపించే సంస్థల సంఖ్య 45% పెరిగింది. ఇంకా చెప్పాలంటే వాటిలో 8–10% మైనారిటీ మహిళలవే’’ అని వివరించారు. ప్రస్తుతం అమెరికాలో 1.1 కోట్ల మందికిపైగా మహిళలకు సొంత వ్యాపారాలున్నా యని, వారు 90 లక్షల మందికి పని కల్పించారని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళా పారిశ్రామిక వేత్తలు, మగవారి మధ్య సమానత్వం వస్తే జీడీపీ 2% పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మహిళలు ఇప్పటికీ పరిశ్రమలు ఆరంభించడానికి, నిధులు పొందటానికి నానా తిప్పలూ పడుతున్నారని అంగీకరించారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 70% మహిళలు చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలే నడుపుతున్నారు. వారికి నిధుల్లేవు. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రకారం అమెరికాలోనూ చిత్రమైన పద్ధతి నడుస్తోంది. ఇన్వెస్టర్లు మగవారికైతే వారెలా లాభపడతారో చెబుతున్నారు. మహిళలకైతే వారెలా నష్టపోతారో వివరిస్తున్నారు. అందుకే గతేడాది ఫండింగ్‌లో మహిళలకు 3% మాత్రమే దక్కింది’’ అని వివరించారు. మార్పు అంటే... ప్రధాని, హైదరాబాద్ టీ అమ్మే స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన నరేంద్రమోదీ.. మార్పు సాధ్యమేనని నిరూపించారని ఇవాంక అన్నారు. హైదరాబాద్ అధునాతన టెక్నాలజీని సంతరించుకుందని, ఇప్పుడిక్కడి టెక్నాలజీ కేంద్రాలు సిటీకి మారుపేరైన బిర్యానీని కూడా మరిపిస్తున్నాయని చమత్కరించారు. ‘‘మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇక్కడే చదివారు. ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని టి–హబ్ వచ్చే ఏడాది కొత్త కేంద్రాన్ని ఆరంభిస్తోంది. ఈ ముత్యాల నగరానికి గొప్ప నిధి ఇక్కడి ప్రజలే. తమ ఆశలు, ఆకాంక్షల్ని ఎన్నడూ వదిలిపెట్టకుండా మెరుగైన భవిష్యత్తు కోసం శ్రమించే స్వాప్నికులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నాయకులు ఉన్నారిక్కడ. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థల్లో పారిశ్రామికవేత్తల విప్లవం కొనసాగుతోంది. ఇక్కడే కాదు.. అమెరికాలో, మొత్తం ప్రపంచమంతటా ఇదే ఉంది. అందుకే ఈ ఉత్సవాలు. పారిశ్రామికవేత్తలిప్పుడు నియమాల్ని తిరగరాస్తున్నారు. వారు ఆరంభించిన ప్రాజెక్టులు, నిర్మించిన వ్యాపారాలు సమాజాల్ని ముందుకు నడిపిస్తున్నాయి’’ అని అన్నారు. చట్టాలు ఇంకా మారాలి.. మహిళలు, పురుషుల విషయంలో చట్టాలు ఒకేలా లేవని ఇవాంక పేర్కొన్నారు. ఈ విష యంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు చాలా వరకూ మార్పులు చేశాయని, అయినా ఇంకా జరగాల్సింది చాలా ఉందన్నారు. ‘‘కొన్ని దేశాల్లో మహిళలు భర్తల అనుమతి లేకుండా పనిచేయలేరు. మహిళలు బయట పనిచేసేందుకు వారి కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు అడ్డొస్తున్నాయి’’ అని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థిక సహకారం (వెఫి) పేరిట ప్రపంచ బ్యాంకుతో కలిసి ఈ ఏడాది బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసినట్లు ఇవాంక తెలిపారు. గడిచిన దశాబ్దంలో యూఎస్ ఎయిడ్ సంస్థ మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించిందన్నారు. -
‘ఆహా’ర్యం.. మాటే మంత్రం..
సాక్షి, హైదరాబాద్: అందం, ఆహార్యంతోనే కాదు.. మాట్లాడే తీరులోనూ ఇవాంకా ట్రంప్ అదరహో అనిపించింది. ఆత్మ విశ్వాసాన్ని ప్రతి బింబిస్తున్న నడకతో, ముఖ్యంగా మోముపై చెరగని చిరునవ్వుతో ఆకట్టుకుంది. దీంతో సదస్సుకు వచ్చినవారంతా ఆమెకు అభిమాను లైపోయారు. ఈ నేపథ్యంలో ఇవాంకా మాట తీరు, సంతకం, వస్త్రధారణలను హైదరాబాద్‌కు చెందిన పలువురు నిపుణులు విశ్లేషించారు. ఆ మాటే మంత్రం... ‘‘చెప్పే విషయాన్ని సరిగా ప్రారంభిస్తే సగం పని పూర్తయినట్టే అనేది పబ్లిక్ స్పీకింగ్‌లో ఒక ప్రాథమిక సూత్రం. ఇవాంకా తన ప్రసంగం ప్రారంభంలోనే అందరి మనసులనూ హత్తుకున్నారు. అంతే అద్భుతంగా చివరి వరకూ ప్రసంగాన్ని కొనసాగించారు. ‘హలో ఎవ్రీవన్.. థాంక్యూ బీయింగ్ హియర్ అండ్ ఫర్ ఇన్క్రెడిబుల్లీ వార్మ్ వెల్కమ్ (అందరికీ నమస్కారం.. సుస్వాగతం. ఇక్కడ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది)’ అంటూ ఇవాంకా పలకరించిన తీరు ఆకట్టుకుంది. భారత్ శక్తి సామర్థ్యాలను ప్రస్తుతిస్తూ.. ఇరు దేశాల మధ్య అనుబంధాలను వివరిస్తూ ప్రతీ పదం స్పష్టంగా పలికారు. చెరగని చిరునవ్వుతో సరైన పదాలను వినియోగిస్తూ అందరికీ కనెక్టయ్యారు. సత్య నాదెళ్ల వంటి తెలుగువారిని, టీ–హబ్, సిటీ ఆఫ్ పెరల్స్‌ను ప్రస్తావిం చారు. ఆమె ఆహార్యం, నేరుగా అందరి వైపూ చూస్తూ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆమె ఒక మంచి వక్త అనిపించింది. అవసరాలకు అనుగుణంగా పదాల మధ్య ఇచ్చిన విరామాలు, మధ్య మధ్యలో ‘థాంక్యూ’లు ఆహూతులను కట్టిపడేస్తాయి. ‘దిస్ ఈజ్ ది ఫ్యూచర్.. వి కెన్, విల్ అండ్ మస్ట్ బిల్డ్ టుగెదర్ అండ్ దిస్ ప్రామిస్’ అనే వాక్యంతో ఇవాంకా ప్రసంగాన్ని ముగించారు.’’ – డి.రామచంద్రం, వ్యక్తిత్వ వికాస నిపుణుడు అది విజయానికి ‘సంతకం’.. ‘‘ఇవాంకాది అసాధారణ వ్యక్తిత్వం. దీనికి ప్రతీక ఆమె సంతకమే. ఆ సంతకం యాంగిల్ అండ్ రౌండెడ్ (ఓ వైపు వంగినట్లుగా ఉండి గుండ్రంగా)గా ఉంది. ఆమెలో బిజినెస్ సెన్స్ అద్భుతమని దీని అర్థం. అలాగే సంతకంలో ‘కంటిన్యూయస్ ఫ్లో, కనెక్టింగ్ లెటర్స్ (ఒకదానిని ఒకటి తాకుతూ అక్షరం వెంటే అక్షరం ఉండటం)’ విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణిని పట్టిస్తుంది. సంతకంలో లోయర్ జోన్ అక్షరాలు మానసికంగా, శారీరకంగా సమర్థవం తమైన స్థాయిని (హైఎనర్జీ లెవల్స్‌ను) సూచిస్తున్నాయి. చివరి అక్షరం రాసిన తీరు ఆమె స్వతంత్ర భావాలకు నిదర్శనం. సంతకంలో ఫ్రీఫ్లో ఆఫ్ స్ట్రోక్స్ వ్యాపారంలో దూరదృష్టికి, సంతకం కింద ఉన్న పెద్ద సర్కిల్ భావోద్వేగాలకు, సెంటిమెంట్స్‌కు, సంతకంలో పొడవాటి స్ట్రోక్స్ (అక్షరాలు) సృజనాత్మకతకు, స్ఫూర్తిదాయక లక్షణాలకు, కొత్త విషయాల పట్ల చూపే ఉత్సాహానికి నిదర్శనాలు. ఆమె ప్రేమాస్పదురాలు కూడా. అప్పుడప్పుడు తొం దరగా స్పందించడం, వేగంగా మూడ్ మారి పోయే లక్షణం ఉండే అవకాశముంది. – రణధీర్ కుమార్, సిగ్నేచర్ అనలిస్ట్ వైవిధ్యాన్ని గుర్తు చేసేలా.. ‘‘విమానాశ్రయంలో దిగిన ప్పుడు ఇవాంకా ధరించిన దుస్తులు సెమీ ఫార్మల్. రౌండ్‌నెక్ టీషర్ట్‌పై నలుపురంగు ట్రౌజర్‌ను కాంబినేషన్‌గా ధరించారు. దానిపై బ్లాక్ అండ్ వైట్ బ్లేజర్ వేసుకున్నారు. దానిపై ఏకరూపత కలిగిన డిజైన్లు (సిమ్మెట్రికల్ ప్యాట్రన్స్) ఉన్నాయి. తన కన్నా ఉన్నత స్థాయి వారిని, సీనియర్లను కలవడానికి వెళ్లినప్పుడుగానీ.. లంచ్ లేదా తేనీటి విందు వంటి సందర్భాల్లో వీటిని ధరిస్తారు. ఇక ఇవాంకా హెచ్ఐసీసీలో సదస్సు జరుగుతున్న ప్రాంతానికి వచ్చినప్పుడు.. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చేవారికి కలుస్తున్న విషయాన్ని గుర్తు చేసేలా వస్త్రాలను ధరించారు. పూల డిజైన్లను ముద్రించిన కూల్ కలర్ గౌన్‌ను వేసుకున్నారు. (సాధారణంగా గ్రీన్, లెమన్ ఎల్లో, లైట్ పింక్ తదితర వాటర్ కలర్స్‌ను ఫ్యాషన్ పరిభాషలో కూల్ కలర్స్ అంటారు). అంతేగాకుండా ఈ డ్రెస్‌లో హైదరాబాదీలకు బాగా నచ్చే ఆకుపచ్చ, పసుపు రంగులకు ఆమె ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అనిపిస్తోంది..’’ – సంతోష్‌కుమార్, ఫ్యాషన్ డిజైనర్ రావమ్మా.. ఇవాంకా! సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున 2.51 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎతిహాత్ ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఆమె వెంట 13 మంది అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు, సాధారణ ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం శంషాబాద్ చేరుకోవడానికి మూడు గంటల ముందే 96 మంది అమెరికా ప్రతినిధులతో కూడిన మరో విమానం వచ్చింది. ఇవాంకకు ఎయిర్‌పోర్టులో అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, జీఈఎస్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఇన్చార్జ్గా విధులు నిర్వర్తిస్తున్న సీఐడీ ఐజీ షికాగోయల్, శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమెరికా నుంచి తెచ్చిన ప్రత్యేక వాహనంలో 15 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో వీవీఐపీ రూట్ ద్వారా 3.14 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన ఆమె... నేరుగా ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లారు. దాదాపు 34 కి.మీ. ఉన్న ఈ దూరాన్ని ఇవాంక కాన్వాయ్ 23 నిమిషాల్లో చేరుకుంది. మధ్యాహ్నం వరకు ట్రైడెంట్‌లో ఉన్న ఇవాంక 2.50 గంటలకు ట్రైడెంట్ నుంచి బయల్దేరి 2.3 కిమీ దూరంలో ఉన్న హెచ్ఐసీసీ చేరుకున్నారు. -
బ్రాండ్ హైదరాబాద్..
-
ఫలక్‌నుమ ప్యాలెస్‌లో గ్రాండ్ డిన్నర్
సాక్షి, హైదరాబాద్: జీఈఎస్ సదస్సుకు హాజరైన విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పసందైన విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని మోదీతోపాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సదస్సుకు వచ్చిన అమెరికన్ డెలిగేట్లు, రతన్ టాటా, ముఖేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, ఆది గోద్రెజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో కేసీఆర్, కేటీఆర్‌లు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. 8.44 గంటల సమయంలో మోదీ రాగా.. ఆయనకు సాదర స్వాగతం పలికారు. 8.53 గంటల సమయంలో ఇవాంకా ప్యాలెస్ వద్దకు చేరుకున్నారు. అంతకుముందే 33 బస్సుల్లో దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు విందు ప్రాంగణానికి చేరుకున్నారు. విందు షెడ్యూల్ ముందు నిర్ణయించిన దానికంటే దాదాపు గంట ఆలస్యమైంది. రాచ మర్యాదలతో స్వాగతం ఫలక్‌నుమా ప్యాలెస్ విందులో పాల్గొనేందుకు ఇవాంకా తాను బస చేసిన ట్రైడెంట్ హోటల్ నుంచి రాత్రి 8.10 గంటల సమయంలో బయలుదేరారు. ప్యాలెస్ వద్ద ఆమెకు రాచ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ప్రధాన గేటు వద్దే ఆమెకు గులాబీపూల గుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గీలో ప్యాలెస్ లోపల ప్రధాన భవనం వరకు తీసుకెళ్లారు. ఇతర ప్రముఖుల వాహనాలను కూడా ప్రధాన గేటు వద్దే నిలిపేసి.. గుర్రపు బగ్గీలు, ఎలక్ట్రిక్ కార్లలో లోనికి తీసుకెళ్లారు. 101 మంది ఒకేసారి కూర్చుని తినగలిగే భారీ డైనింగ్ టేబుల్‌పై ఆమెకు విందు ఇచ్చారు. ప్రధాని మోదీ, ఇవాంకా, కేసీఆర్, కేటీఆర్, పలువురు జీఈఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. విందులో ఆమెకు భారతీయ, హైదరాబాదీ ప్రత్యేక వంటకాలను వడ్డించారు. ముఖ్యంగా కుంకుమ పువ్వు మేళవించిన వంటకాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. హైదరాబాదీ బిర్యానీ రుచి చూస్తానని ఆమె ఇంతకు ముందే పేర్కొన్నారు కూడా. ఇక విందు అనంతరం ఇవాంకా కొంతసేపు ప్యాలెస్‌లో గడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గతంలో నిజాం నవాబు ఉపయోగించిన నిజాం సూట్‌ను ఆమెకు కేటాయించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌ను తాజ్ గ్రూప్ లగ్జరీ హోటల్‌గా మార్చిన తరువాత విచ్చేసిన తొలి హైప్రొఫైల్ విదేశీ అతిథి ఇవాంకాయే. ఇక విందులో తెలుగు రాష్ట్రాల నుంచి శోభా కామినేని, ప్రతాప్ సి రెడ్డి, బీవీ మోహన్‌రెడ్డి, ఉపాసన, సంజయ్‌బారు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదీ వంటకాలు స్పెషల్.. ప్యాలెస్‌లోని చారిత్రాక డిన్నర్ టేబుల్‌పై భారతీయ, హైదరాబాదీ ప్రత్యేక వంటకాలను వడ్డించారు. హలీం, బిర్యానీ, షీర్ కబాబ్, మటన్ మరగ్, నాన్ రోటీ, పరోటా, రుమాలీ రోటీ, మటన్ కోఫ్తా, గ్రిల్డ్, మొఘలాయి చికెన్, ఘోస్ట్ షికపురీ కబాబ్, దహీ కే కబాబ్, ముర్గ్ పిస్తా కా సలాన్, సితాఫల్ కుల్ఫీ, అఘజ్ సూప్, వాక్ఫా, మెజ్ బన్, మహ్గూల్ దస్తర్ క్వాన్, గులాబ్ జామ్, ఖుబానీకా మీఠా, కద్దుకీ ఖీర్, డ్రైఫ్రూట్స్ ఖీర్ తదితర వెరైటీలను అతి థులకు వడ్డించారు. ఒక్కో అతిథికి ఒక్కొక్క సర్వర్ ద్వారా వడ్డించారు. ఫలక్నుమలో విందు అనంతరం రాత్రి 10.47 గంటలకు మోదీ నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని రాజ్‌కోట్‌కు వెళ్లారు. ఇవాంక రాత్రి 10.45 గంటలకు బయల్దేరి తాను బస చేస్తున్న ట్రైడెంట్‌కు వెళ్లారు. రావమ్మా.. ఇవాంకా! సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున 2.51 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎతిహాత్ ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఆమె వెంట 13 మంది అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు, సాధారణ ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం శంషాబాద్ చేరుకోవడానికి మూడు గంటల ముందే 96 మంది అమెరికా ప్రతినిధులతో కూడిన మరో విమానం వచ్చింది. ఇవాంకకు ఎయిర్‌పోర్టులో అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, జీఈఎస్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఇన్చార్జ్గా విధులు నిర్వర్తిస్తున్న సీఐడీ ఐజీ షికాగోయల్, శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమెరికా నుంచి తెచ్చిన ప్రత్యేక వాహనంలో 15 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో వీవీఐపీ రూట్ ద్వారా 3.14 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన ఆమె... నేరుగా ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లారు. దాదాపు 34 కి.మీ. ఉన్న ఈ దూరాన్ని ఇవాంక కాన్వాయ్ 23 నిమిషాల్లో చేరుకుంది. మధ్యాహ్నం వరకు ట్రైడెంట్‌లో ఉన్న ఇవాంక 2.50 గంటలకు ట్రైడెంట్ నుంచి బయల్దేరి 2.3 కిమీ దూరంలో ఉన్న హెచ్ఐసీసీ చేరుకున్నారు. -
ఇవాంక డిన్నర్.. ఫలక్‌నుమా వద్ద భారీ భద్రతా
సాక్షి, హైదరాబాద్ : ఇవాంక ట్రంప్ ఫలక్‌నూమ ప్యాలెస్‌కు మరికాసేపట్లో చేరుకోనున్నారు. ప్యాలెస్‌లో ఏర్పాటు చేయబోతున్న గ్రాండ్ విందులో ప్రధాని మోదీతోపాటు ఆమె పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. 101 మంది కూర్చునే టేబుల్ పై విందులో పాల్గొనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి శోభా కామినేని, ప్రతాప్ సి రెడ్డి, బీవీ మోహన్‌రెడ్డి, ఉపాసన, సంజయ్బారులకు ఆహ్వానం అందించారు. గేట్ నుంచి ప్యాలెస్‌లోకి గుర్రపు బగ్గీలో ఇవాంక వెళ్తారు. -
పవన్ పాట.. ఇవాంక కోసం!
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు కోసం నగరానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఇవాంక రాకతో హైదరాబాద్‌లో ఉదయం భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో హీరో నవదీప్ వెంటనే ‘అజ్ఞాతవాసి’ పాటను గుర్తు చేసుకున్నాడు. ఆమెకు.. ఆ పాటకు ఏం సంబంధం అనుకుంటున్నారా ? నగరంలో ఇవాళ ఉదయం 10 గంటలకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అందులో చిక్కుకున్న నవదీప్ వెంటనే తన ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు. ‘బయటికెళ్లి చూస్తే టైం ఏమో 10’O క్లాక్’. ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంక రోడ్డు బ్లాక్’ అని ట్రాఫిక్ కష్టాల గురించి హీరో ఫన్నీగా ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. Baitikelli chusthe time emo 10 o clock Intikelle road mothham ivanka road block !! #haha :) — Navdeep (@pnavdeep26) November 28, 2017 -
‘అమెరికా చూపిస్తున్న ఆసక్తి ప్రశంసదాయకం’
-
నేను తెలంగాణకు చిన్నమ్మను : సుష్మ
సాక్షి, హైదరాబాద్ : భారతదేశం ఎన్నో అవకాశాలకు కేంద్రమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆమె మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ ప్రధాని మోదీ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. అమెరికా చూపిస్తున్న ఆసక్తి ప్రశంసదాయకం. మోదీ నాయకత్వంలో ఇరుదేశాల మైత్రీ మరింత బలపడుతుంది.’ అని ఆకాంక్షించారు. తాను తెలంగాణకు చిన్నమ్మనంటూ సుష్మా వ్యాఖ్యానించారు. అంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. -
జీఈఎస్‌లో ఇవాంకా ఏమన్నారంటే...
సాక్షి,హైదరాబాద్: ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌లో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సదస్సు(జీఈఎస్)లో పాల్గొనడం సంతోషకరమని ఇవాంక ట్రంప్ అన్నారు. అమెరికాకు భారత్ అసలైన మిత్ర దేశమని, భారత్‌కు ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం ఉన్నాయని అన్నారు. ముత్యాల నగరంలో యువతే గొప్ప సంపదని, ఇక్కడి పారిశ్రామికవేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారని కొనియాడారు. మీరంతా రాత్రింబవళ్లు కష్టపడి రోబోలు, యాప్‌లు రూపొందిస్తున్నారని ఇవాంక ప్రశంసించారు. భారతీయ నిపుణులు తమకు స్ఫూర్తిదాయకమని, టీ అమ్మే స్ధాయి నుంచి ప్రధాని కాగలడం మీ ప్రధాని గొప్పతనమని ఆమె ప్రస్తుతించారు. ‘ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీహబ్ రూపొందింది. ఈ సదస్సులో 52 దేశాలకు పైగా మహిళలు పాల్గొనడం ఆనందంగా ఉంది. పురుషాదిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయం. ఓ పారిశ్రామికవేత్తగా మహిళ ఎదగడం ఎంత కష్టమో నాకు తెలుసు. మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నా’అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పది శాతం పెరిగిందని చెప్పారు. టెక్నాలజీతో పాటు రుచికరమైన బిర్యానీకి భారత్ అడ్డా అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని..గత దశాబ్ధకాలంగా మహిళలు ఎంతో ఎత్తుకు ఎదిగారని చెప్పారు. కష్టపడితే మహిళలు వారి భవిష్యత్‌ను వారే తీర్చిదిద్దుకోగలరన్నారు. ఇవాంక ఇంకా ఏమన్నారంటే... మాకు ఆతిథ్యం ఇచ్చినందకు కృతజ్ఞతలు హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతోంది ఆసియాలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీ హబ్ ఆవిర్భవించింది ప్రపంచంలో వేగంగా పురోగతి సాధిస్తోన్న దేశాల్లో భారత్ ఒకటి ఇక్కడి ప్రజల విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం అమెరికాకు భారత్ అత్యంత సన్నిహిత దేశం టెక్నాలజీనే కాదు...బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక అభినందనలు పురుషాధిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయం మహిళలు ఎదగాలంటే ఎన్ని సమస్యలుంటాయో నాకు తెలుసు గత దశాబ్ధ కాలంలో మహిళలు చాలా ఎత్తుకు ఎదిగారు మహిళలు రాణిస్తే కుటుంబాలు బాగుపడతాయి మోదీ నాయకత్ంలో భారత్ అద్భుత పురోగతి సాధిస్తోంది టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యారు ప్రధాని మోదీ జీవితాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు -
హెచ్ఐసీసీలో జీఈఎస్-2017
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ) వేదికగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు-2017 ప్రారంభం అయ్యింది. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ-అతిథి ఇవాంక ట్రంప్ చేతుల మీదుగా రోబో మిత్రా ద్వారా సదస్సును ప్రారంభించారు. అనంతరం సదస్సు లోగోను ఆవిష్కరించారు. ఇక మూడు రోజులపాటు కొనసాగే ఈ సమ్మిట్ కోసం సుమారు 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు, 300 మంది పెట్టుబడిదారులు హాజరయ్యారు. అమెరికా, భారత్ నీతి ఆయోగ్‌లు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు హోదాలో ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ సదస్సుకు హాజరయ్యారు. నేడు, రేపు సదస్సులో పాల్గొననున్న ఇవాంక.. వ్యాపారరంగంలో మహిళలకు అవకాశాలు పెంచటం అనే అంశంపై ప్రసంగించనున్నారు. భారత్ లో స్టార్టప్స్‌కు సువర్ణావకాశంగా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ 8వ సదస్సును పేర్కొంటున్నారు. ఇక ‘ఉమెన్ ఫస్ట్’ థీమ్‌తో మహిళా శక్తికి అగ్రపీఠం వేస్తూ ఈసారి సదస్సును నిర్వహించనున్నారు. ఈసారి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో 52 శాతం మంది మహిళా డెలిగెట్స్ పాల్గొంటుండటం విశేషం. ఉపాసన కొణిదెల, నారా బ్రహ్మిణి, సానియా మీర్జా , మంచు లక్ష్మీ, మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. బ్రేక్ ఔట్లు, మాస్టర్ క్లాసులు, వర్క్ షాపులతో సమ్మిట్ సందడిగా సాగనుంది. 52 అంశాలపై చర్చ.. విశిష్ట అతిథుల అమూల్యమైన సందేశాలు... ప్రపంచ ప్రఖ్యాతి పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకోనున్నారు. -
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాంక ట్రంప్ భేటీ
-
హెచ్ఐసీసీలో మోదీ-ఇవాంక భేటీ
సాక్షి, హైదరాబాద్ : జీఈ సదస్సు 2017 ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇరుదేశాల విదేశాంగ ప్రతినిధులు కూడా హాజయ్యారు. తమ బృందంలోని సభ్యులను ఈ సందర్భంగా ఆమె మోదీకి పరిచయం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఇవాంకతో భేటీ అయ్యారు. మహిళా సాధికారికతపైనే వీరిద్దరు చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
ఇవాంకపై బ్రాహ్మిణి ఏమన్నారంటే?
-
ఇవాంకకు ప్రత్యేక గాజులు.. ఓ లుక్కేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) కు నగరం ముస్తాబైంది. జీఈఎస్‌లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇవాంకకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే ఇవాంకా రావడానికి మునుపే హైదరాబాద్‌లో హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. ఆమె పర్యటనలో భాగంగా చార్మినార్‌ను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అధికారులు చార్మినార్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. దాంతో పాటు గాజులకు ప్రసిద్ధిగాంచిన లాడ్ బజార్లో ఇవాంకా షాపింగ్ చేస్తుందనే సమాచారంతో అక్కడి వ్యాపారులు వారి సృజనాత్మకతకు పదును పెట్టారు. ఇవాంక పర్యటన నేపధ్యంలో లాడ్ బజార్ వ్యాపారులు 'భారత-అమెరికా స్నేహం' పై ప్రత్యేకంగా గాజులు తయారు చేశారు. గాజుల మీద ఇవాంకా పేరుతో పాటు ఇండియా, అమెరికా జాతీయ జెండాలను కూడా వేశారు. ' ఇవాంకా ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఈ గాజులను తయారు చేశాను. ఈ గాజుల సెట్ ను తయారు చేయడానికి 45 రోజులు పట్టింది. ఆమె లాడ్ బజార్ ను సందర్శిస్తే ఈ గాజులను అమెకు బహుమతిగా అందజేస్తాం' అని వ్యాపారి మహ్మద్ అన్వర్ తెలిపారు. ఇవాంకా లాడ్ బజార్లో షాపింగ్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఆమె పేరుతో తయారు చేసిన బ్యాంగిల్స్ నగర మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. -
నమస్తే మోదీజీ, ఇవాంకా.. ఎవరు స్వాగతం చెప్తారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ‘నమస్తే నరేంద్రమోదీజీ.. నమస్తే ఇవాంకా ట్రంప్’ అంటూ ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు హాజరుకాబోతున్న ప్రధాని మోదీని, ఇవాంకలకు ‘మిత్ర’ స్వాగతం పలుకబోతుంది. నగరంలోని హెచ్ఐసీసీ ప్రాంగణానికి మోదీ, ఇవాంక చేరుకోగానే వారిని మిత్ర పలుకరిస్తుంది. ఇంతకు మిత్ర ఎవరంటే.. ఒక బోట్ (రోబో). బెంగళూరుకు చెందిన బాలాజీ విశ్వనాథన్ పూర్తి స్వదేశీ విజ్ఞానంతో ఈ బోట్‌ను రూపొందించారు. హైదరాబాద్‌లో జరగనున్న జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇక్కడ రెండు ‘మేడిన్ ఇండియా’ బోట్లను విశ్వనాథన్ బృందం ప్రదర్శనకు పెట్టింది. ఈ రెండు బోట్లలో ఒకటి వేదిక మీద ఉండి.. విదేశీ పారిశ్రామిక ప్రముఖులతో ముచ్చటిస్తుంది. మరొక బోట్ వేదిక బయట ఉండి.. ప్రేక్షకులతో ముచ్చటిస్తుంది. ‘మా ‘మేడిన్ ఇండియా’ రోబోట్లను ప్రదర్శించడానికి జీఈఎస్‌ను ఆదర్శ వేదికగా మేం భావిస్తున్నాం. ఈ సదస్సుకు అత్యంత ప్రముఖులు వస్తుండటం, కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో మిత్ర వేదిక మీద కొద్దిసేపు మాత్రమే ముచ్చటిస్తుంది. ప్రధాని మోదీ, ఇవాంక వేదిక మీదకు రాగానే మిత్ర వారి వద్దకు వెళ్లి.. వారితో సంభాషిస్తుంది. వాళ్లు ఒక బటన్ ప్రెస్ చేస్తారు. దీంతో మిత్ర పాట పాడుతుంది. శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైనట్టు డిక్లేర్ అవుతుంది’ అని విశ్వనాథన్ తెలిపారు. ఇప్పటికే ఈ రోబోలకు 1000-1500 శిక్షణ ప్రక్రియలను నిర్వహించామని, ఈ రోబోలు వేదికపైన, సదస్సు జరిగే ప్రాంగణంలో ఉండి.. ప్రతినిధులు, ప్రేక్షకులతో ముచ్చటిస్తాయని చెప్పారు. -
జీఈఎస్‌పై ఐఎస్ ఉగ్రవాదుల గురి!
సాక్షి, హైదరాబాద్ : హైదారాబాద్‌లో జరుగుతున్న గ్లోబెల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమావేశం(జీఈఎస్)పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదలు దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ కుమార్తె ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇవాంక ట్రంప్ పాల్గొనే ఈ సమాశాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారనే ఖచ్చితమైన సమాచారం తమ వద్ద ఉందని అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికా నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమయినట్లు తెలంగాణ పోలీస్ అధికారి ఒకరు చెప్పినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపింది. హైదరాబాద్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశముందనే హెచ్చరికల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాలు 200 మంది అనుమానితులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి సలహాదారు హోదాలో జీఈఎస్ సమావేశానికి ఇవాంక ట్రంప్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు అమెరికా సీక్రెట్ సర్వీసెస్ భద్రత ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీకి ఎస్పీజీ భద్రత కల్పిస్తోంది. తర్వాతి లేయర్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రేహౌండ్స్, అక్టోపస్ దళాలతో కూడా జీఈఎస్‌కు భద్రత కల్పించనున్నట్టు వెల్లడించారు. -
గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ సాగేదిలా
-
హైదరాబాద్‌లో ఇవాంక.. తొలి పలుకులు!
న్యూఢిల్లీ: ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన మనం కలిసి సాగితే ఎంతో చేయగలం. ఆర్థిక వృద్ధి, సంస్కరణలను ప్రోత్సహించడం, ఉగ్రవాదంపై పోరాడటం, భద్రత సహకారాన్ని పెంపొందించుకోవడం వంటి విషయమాల్లో మన ప్రాధాన్యాలు ఉమ్మడివి’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ అన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. ఈ సందర్భంగా ’టైమ్స్ ఆఫ్ ఇండియా’ తో మాట్లాడారు. ‘గత సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యాను. నాకు భారత్ చరిత్ర, సంస్కృతి అంటే ఎంతో ఇష్టమని ఆమెకు తెలిపాను. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాల్లో పురోగతి విషయమై నా ఆశయాలను ఆమెతో పంచుకున్నాను. ప్రధాని మోదీతో జరిగే సంభాషణలో ఈ అంశం మరింత ముందుకువెళ్తుందని ఆశిస్తున్నాను. భారత్ పర్యటన పట్ల ఎంతో ఎక్సైటింగ్‌గా ఉన్నాను’ అని ఆమె అన్నారు. ‘భారత్, అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అవకాశాలను సృష్టించడం, పౌరులందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించడం అతిపెద్ద సవాలు. ఇటు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, అటు భారత్‌లో నరేంద్రమోదీ పౌరులకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల ప్రగతి కోసం కృషి చేస్తున్నారు’ అని ఆమె అన్నారు. జీఈఎస్ గురించి ఇవాంక మాట్లాడుతూ.. తొలిసారి ఈ సదస్సులో పాల్గొంటున్న వారిలో 50శాతం మంది మహిళలు ఉన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సాధికారిత ఆవశ్యకతను చాటిచెప్పేందుకు ఈ సదస్సు ఓ అంతర్జాతీయ వేడుకగా నిలుస్తుందని నేను భావిస్తున్నారు. మహిళలు రాణిస్తే.. సమాజాలు, దేశాలు వర్ధిల్లుతాయి’ అని అన్నారు. -
అంతా ఆమె..
సాక్షి,సిటీబ్యూరో: అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది. సమాజ అభివృద్ధిలో ఒక నిర్ణాయక భాగస్వామిగా మహిళలు ఎదుగుతున్నారు. పారిశ్రామిక రంగంలోనూ ప్రధాన భూమికను పోషిస్తున్న మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందజేసేందుకు, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపార మహిళలకు ఒక వేదికను కల్పించే దిశగా ఈ ఏడా ది గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్ (జీఈఎస్ –2017) ‘మహిళలే ముందు సంపద అందరికీ (విమెన్ ఫస్ట్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్)’ అనే ఉన్నతమైన ఆశయంతో నిర్వహిం చనున్నారు. అనేక దేశాల నుంచి వందలాది మంది మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్న ఈ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం విశేషం. ‘విమెన్ ఫస్ట్’ అనే స్ఫూర్తిని అందజేస్తున్న మన విశ్వనగరంలో ఆ స్ఫూర్తికి తగిన విధంగానే వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఉంది. కొన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నా మరి కొన్ని రంగాల్లో నిర్ణాయకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్నింటా పురుషులతో సమానంగా ‘సగం’వాటాకు ఇంకా చేరుకోలేకపోయినా ఆ దిశగా పురోగమనం కనిపిస్తోంది. అసంఘటిత, కార్మిక వర్గాల్లో మహిళలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వివిధ కేడర్లలో పని చేస్తున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐటీ రంగంలో .. నగరంలో ఐటీ రంగం అనూహ్యంగా విస్తరిస్తోంది. వేలాది సాఫ్ట్వేర్ సంస్థలు వెలిశాయి. కొన్ని సార్టప్ సంస్థలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నాయి. హైటెక్‌సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ సంస్థల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సైబరాబాద్ ప్రాంతంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు వారిలో భరోసాను కలిగిస్తున్నాయి. మూడేళ్ల క్రితం కేవలం 20 శాతం ఉన్న మహిళా ఉద్యోగులు ఇప్పుడు 35 శాతానికి పెరిగారు. ఈ భాగస్వామ్యం ఇంకా పెరగాల్సి ఉంది. కానీ షీటీమ్స్ వంటి పోలీసు బృందాలు, షీ షటిల్స్ వంటి రవాణా సదుపాయాలు, సుమారు 200 మహిళల వసతి గృహాల్లో పెరిగిన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీల నిఘా వంటివి సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన అనంతరం ధైర్యంగా పని చేసేందుకు మహిళలు ముందుకు వస్తున్నట్లు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ ఉపాధ్యక్షులు, సీఈవోలు వంటి కీలకమైన స్థానాల్లో మాత్రం ఇంకా 3 శాతం మహిళలే ఉన్నారు. ప్రోగ్రామర్స్‌గా, ప్రాజెక్టు అధికారులుగా మహిళలు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. ప్రభుత్వంలో... అలాగే నగరంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పటితో పోల్చితే ఎంతో మెరుగ్గానే ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విద్య,వైద్య రంగాల్లో, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, ఆర్టీసీ వంటి వివిధ విభాగాల్లో మహిళల భాగస్వామ్యం కీలకంగా నిలిచింది. స్త్రీ సమానత్వానికి సమ్మిట్ ఓ సదవకాశం యూఎస్ అంబాసిడర్ కెన్నెత్ ఐ జస్టర్ సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో స్త్రీలు సమాన అవకాశాలను అందింపుచ్చుకునేందుకు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఒక సదవకాశంగా భావించాలని, తక్షణావసరాలు కాకుండా పారిశ్రామిక రంగంలో ఇరుదేశాల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఈ సదస్సు లక్ష్యంలో ఉమిడి ఉన్నాయని అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ అభిప్రాయపడ్డారు.ఇదిఎనిమిదవ ప్రపంచస్థాయి పారిశ్రామిక వేత్తల సదస్సు అని, ఇంతవరకు ఇంత భారీ స్థాయిలో మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొనడం ఇదే తొలిసారి అని అన్నారు. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సు వివరాలను వెల్లడించేందుకు గచ్చిబౌలిలోని రహేజా ఐటీ పార్క్, వెస్టిన్‌లో నీతి ఆయోగ్ నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో కెన్నెత్ ఐ జస్టర్ మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించగలిగితేనే సమాజం పురోగమిస్తుందన్నది ఇరుదేశాల విధానమని అన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ సదస్సు ద్వారా సమాన అవకాశాలు, ప్రోత్సాహం, కొత్త పెట్టుబడులు, నూతన పరిశ్రమలకు అవకాశం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ మొత్తం 150 దేశాల నుంచి 1500 మంది పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొంటున్న ఈ సదస్సులో సగానికిపైగా మహిళలే కావడం విశేషం అన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో 52.5 శాతం మంది ప్రపంచ దేశాల మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నట్టు వెల్లడించారు.ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఇస్రాయిల్ సహా మొత్తం పది దేశాలనుంచి ప్రతినిధులంతా మహిళలే కావడం విశేషం. నగరపాలనలో ప్రత్యేక ముద్ర సాక్షి,సిటీ బ్యూరో: సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా పాలనా యంత్రాంగంలో ఉన్నతాధికారులంతా మహిళలే. జిల్లా కలెక్టర్ నుంచి వీఆర్వోల వరకు మహిళలు సమర్థవంతమైన సేవలందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.అధికార యంత్రాంగానికి గుండెకాయలాంటి రెవెన్యూతోపాటు సంక్షేమ, వైద్య శాఖలో కూడా మహిళా ఉద్యోగులదే పైచేయి. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా యోగితా రాణా కొనసాగుతున్నారు. ♦ మూడు నెలల క్రితం పాలన పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే కలెక్టర్ యోగితా రాణా అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ పలు సంస్కరణలతో ముందుకు సాగుతున్నారు. ♦ జాయింట్ కలెక్టర్‌గా ప్రశాంతి గతేడాదినుంచి కొనసాగుతున్నారు. ♦ జిల్లా రెవెన్యూ అధికారి పోస్టులో భూ సేకణ విభాగం స్పెషల్ కలెక్టర్ సరళా వందనం ఇంచార్జి డీఆర్వోగా కొనసాగుతున్నారు. ♦ కలెక్టరేట్ పరిపాలనాధికారి పోస్టులో స్పెషల్ కలెక్టర్ రాధిక రమణి ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విభాగానికి కూడా ఆమెనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ♦ ప్రభుత్వ భూముల న్యాయ విభాగం అధికారిగా స్పెషల్ కలెక్టర్ సంగీత సేవలందిస్తున్నారు. ♦ హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పోస్టు ఖాళీగా ఉండటంతో సికింద్రాబాద్ ఆర్డీఓ చంద్రకళ అదనపు బాధ్యతలతో కొనసాగుతున్నారు. ♦ జిల్లా రేషనింగ్ అధికారిగా బాలమాంబ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పద్మజా, అదనపు డీఎంహెచ్‌వో సరళా కుమారి, ఈ–డిస్ట్రిక్ మేనేజర్‌గా సరోజ. హైదరాబాద్ ఎస్టేట్ అధికారి నిఖిల విధులు నిర్వర్తిస్తూ పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. అతిథుల సేవలో నిథమ్ విద్యార్థులు రాయదుర్గం: గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్ నేపథ్యంలో ఆతిథ్య సేవలు అందిం చడంలో గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ హస్పిటాలిటీ మేనేజ్మెంట్ (డాక్టర్ వైఎస్సార్నిథమ్)కు పెద్దపీట వేశారు. పర్యాటక, ఆతిథ్యరంగంలో విద్యా, శిక్షణాసంస్థల్లో జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను సాధించిన నిథమ్ నుండి గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో ఆతిథ్య సేవలందించేందుకు 150 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. ♦ నిథమ్ నుంచి బీబీఏ, ఎంబీఏ చదువుతున్న 80 మంది బాలికలు, 70 మంది బాలురు ఉన్నారు. ఎంపిక చేసిన వారు ఎయిర్‌పోర్టు, హోటళ్ళు, హెచ్ఐసీసీల వద్ద ఒక్కో విద్యార్థికి రోజుకు ఎనిమిది గంటల చొప్పున మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించడం ప్రారంభించారు. ♦ అయిదు విడతల్లో శిక్షణ... ♦ గెస్ సదస్సులో ఆతిథ్య సేవలందించే నిథమ్ విద్యార్థులకు అయిదు విడతల్లో శిక్షణ ఇచ్చారు. మూడేసి గంటల చొప్పున రెండుమార్లు నిథమ్ ప్రాంగణంలో, ఒక్కోసారి నిఫ్ట్, హెచ్ఐసీసీ, తారామతి బారాదారిలో శిక్షణ ఇచ్చారు. తారామతిబారాదారిలో ఇచ్చిన శిక్షణలో కేంద్ర,రాష్ట్ర అధికారులే కాకుండా అమెరికా అధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే అతిథులకు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలుకడం, ఆతర్వాత వారి బస ఏర్పాటు చేసిన చోటుకు చేర్చడం వంటి సేవలను అందిస్తారు. రోజుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి వెయ్యి రూపాయల చొప్పున నాలుగు రోజులు నాలుగు వేల రూపాయలను పారితోషికంగా అందిస్తుంది. -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడ!
నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళ, బుధవారాల్లో పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ నగరంలో పర్యటించనున్నందున భద్రతా కారణాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నిర్ణీత వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ, వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. ఫలక్‌నుమా పరిసరాల్లో.. చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే విందు కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ డీసీపీ ఏ.వి.రంగనాథ్ తెలిపారు. ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ప్యాలెస్‌లో జరిగే విందుకు ప్రధాని నరేంద్రమోదీ, ఇవాంక ట్రంప్‌లతో పాటు 2000 మంది ప్రముఖులు హాజరుకానున్నారన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలుమార్లు రూట్ సర్వే, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించామన్నారు. 50–60 బస్సుల్లో విదేశీ ప్రముఖులు ప్యాలెస్‌కు చేరుకుంటారన్నారు. మంగళవారం రాత్రి 7–8 గంటల మధ్య ప్రధాని, ఇవాంక, గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ప్యాలెస్‌కు రానున్న నేపథ్యంలో ఆ సమయంలో చాంద్రాయణగుట్ట–బండ్లగూడ–ఫలక్‌నుమా రహదారులను పూర్తిగా మూసివేస్తామన్నారు. ఫ్లై ఓవర్లపై రాకపోకలు నిలిపివేస్తామని, రాత్రి 9.45 గంటల నుంచి 10.30 గంటల మధ్య ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. పరిస్థితిని సర్యవేక్షించేందుకు 8 మంది ఏసీపీలు, 20 మంది ఇన్స్పెక్టర్లు, 200 మంది సిబ్బంది నియమించామని, ప్యాలెస్ రూట్లో దుకాణాలను మూసివేయించడంతో పాటు ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామన్నారు. సమావేశంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్, ఏసీపీలు నాగన్న, శ్రీనివాస్ కుమార్, ఇన్స్పెక్టర్లు సి.హెచ్.నరేందర్ రావు, చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. వాహనాల దారి మళ్లింపు ♦ చార్మినార్ నుంచి ఫలక్‌నుమా వైపు వచ్చే వాహనాలు నాగుల చింత చౌరస్తా (లాల్‌దర్వాజా మోడ్) నుంచి లాల్‌దర్వాజా మీదుగా వెళ్లాలి. స్థానిక బస్తీల వాహనదారులైతే ఇంజన్‌బౌలి వరకు ప్రయాణించవచ్చు. ♦ ఇంజన్‌బౌలి నుంచి చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ వరకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పూర్తిగా రాకపోకల నిషేధం ఉంటుంది. ♦ ఎల్,బి.నగర్, సంతోష్‌నగర్‌ల నుంచి చాంద్రాయణగుట్ట వైపు వచ్చే వాహనాలు మిధాని చౌరస్తా నుంచి బాలాపూర్ ఎక్స్‌రోడ్డు వైపు వెళ్లాలి. ♦ శ్రీశైలం హైవే నుంచి వచ్చే వాహనదారులు కేశవగిరి నుంచి గుర్రం చెరువు, బాలాపూర్ మీదుగా వెళ్లాలి. ♦ ప్రధాని, ఇవాంక ట్రంప్‌ల కాన్వాయ్ సమయంలో చాంద్రాయణగుట్ట–బండ్లగూడ రహదారిలో రెండు వైపులా వాహనాలను పూర్తిగా నిషేధిస్తారు. సైబరాబాద్ పరిధిలో.. సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మంగళవారం జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక రానున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సదస్సు ప్రారంభానికి హాజరయ్యే అతిథులు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లనుండటంతో ఆ సమయంలో హెచ్ఐసీసీ నుంచి కొత్తగూడ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో వెళ్లాలని పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య సూచించారు. యధావిధిగానే గచ్చిబౌలి ఫ్లైఓవర్ వాహనదారులకు అందుబాటులో ఉంటుంది. వీవీఐపీ రాకను బట్టి అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ నిలిపివేస్తామన్నారు. ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మెట్రో రైలు ప్రారంభం నేపథ్యంలో.. మియాపూర్‌లో మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి 4.30 గంటల ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మియాపూర్ నుంచి కొండాపూర్, కొత్తగూడ వెళ్లే వాహనాలను చందానగర్, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్మోహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి మీదుగా అనుమతించనున్నారు. మియాపూర్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మియాపూర్ వద్ద దారి మళ్లించి చందానగర్, పటాన్చెరు, ఓఆర్ఆర్ మీదుగా ఎయిర్‌పోర్టుకు అనుమతించనున్నారు. మాతృశ్రీ నగర్ నుంచి వచ్చే వాహనాలను షీలా పార్క్ ప్రైడ్ వద్ద దారి మళ్లించి మంజీరా రోడ్డువైపు అనుమతించనున్నారు. పటాన్చెరు. ఇక్రిశా>ట్ బీరంగూడ, ఆర్సీపురం, ఆశోక్ నగర్, బీహెచ్ఈఎల్ నుంచి కూకట్పల్లి, హైదరాబాద్ వెళ్లే వాహనాలను బీహెచ్ఈఎల్ రోటరీ వద్ద మళ్లించి నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్మోహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మెహదీపట్నం మీదుగా హైదరాబాద్‌కు అనుమతివ్వనున్నారు. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి నుంచి కూకట్పల్లి, హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఓఆర్ఆర్ ముత్తంగి వద్ద దారి మళ్లించనున్నారు. ప్రధాని కాన్వాయ్ రిహార్సల్ గచ్చిబౌలి: మెట్రో రైలు ప్రారంభోత్సవం అనంతరం హెచ్ఐసీసీలో జరగనున్న జీఈఎస్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో సోమవారం సైబరాబాద్ పోలీసులు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి ప్రధాని హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి చేరుకోనున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కాన్వాయ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. 20కి పైగా వాహనాలు కాన్వాయ్‌లో పాల్గొన్నాయి. హెలికాప్టర్ ట్రయల్ రన్ ప్రధాని రాకను పురస్కరించుకొని సోమవారం ఉదయం 10.05 గంటలకు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి హెచ్ఐసీసీలోని హెలిప్యాడ్ వరకు హెలికాప్టర్ ట్రయల్‌రన్ నిర్వహించారు. కోటలో ఏర్పాట్ల పరిశీలన గోల్కొండ: గోల్కోండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం జీఈఎస్ ప్రతినిధుల విందు ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్ల ఇన్చార్జి, ఐజి స్వాతిలక్రా, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులతో కోటలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. విందు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు, పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. వీఐపీల వాహనాలు, కోటలో ప్రవేశించే మార్గం నుంచి వేదిక వరకు బందోబస్తు కట్టుదిట్టం చేయాలని సూచించారు. కోటలో బందోబస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. కోటలో ఈ నెల 29న జరిగే సాంస్కృతిక కార్యక్రమాల నిడివి 20 నిమిషాలే అయినా ఆ సమయంలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సాంçస్కృతిక కార్యక్రమాల రిహార్సల్స్‌ను తిలకించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ యోగితారాణా తదితరులు ఉన్నారు. ‘గెస్’తో ప్రపంచస్థాయి గుర్తింపు సీఐఐ తెలంగాణ చైర్మన్ రాజన్న రాయదుర్గం: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సు నిర్వహణతో హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ విశ్వవ్యాప్తం అవుతుందని సీఐఐ తెలంగాణ చైర్మన్ వి రాజన్న పేర్కొన్నారు. ఖాజాగూడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సీఐఐ చైర్మన్‌గా తనకు అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్, స్టార్టప్ పాలసీ, పారిశ్రామిక విధానం ద్వారా ప్రోత్సాహం కల్పిస్తోందని, మౌలిక వసతులతో జాతీయ, అంతర్జాతీయస్థాయి సదస్సుల నిర్వహణకు కేంద్రంగా దేశంలో హైదరాబాద్ పేరుగాంచిందన్నారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు హైదరాబాద్ నగరం ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. సీఐఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ పాలసీ,ఫుడ్ ప్రాసెస్ పాలసీ వంటివి రూపకల్పనలో తోడ్పాటు అందించామన్నారు. -
ఇవాంక ఇంకెక్కడికి వెళ్లరా?
దేశ విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ప్రెసిడెంట్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మంగళవారం నగరానికి రానున్న నేపథ్యంలో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అటు మెట్రో రైలు ప్రారంభం..ఇటు ప్రపంచ పారిశ్రామిక సదస్సు నిర్వహణతో సిటీ కొత్త కళ సంతరించుకుంది. మియాపూర్‌లో ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంభిస్తారు. ఇక హైటెక్స్‌లో జరగనున్న జీఈఎస్ సమ్మిట్‌లో ఆయన ఇవాంకా ట్రంప్‌తో కలిసి పాల్గొంటారు. వీరి కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేక విందు సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగరమంతా హై అలర్ట్ ప్రకటించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సాక్షి, సిటీబ్యూరో: అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల పర్యటన నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ సదస్సు, మెట్రో రైలు ప్రారంభం నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి వెస్టిన్ హోటల్‌కు వెళ్ళడంతో పాటు హెచ్ఐసీసీలో జరుగనున్న జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. అక్కడ నుంచి తాజ్ ఫలక్‌నుమాలో విందుకు హాజరవుతారు. ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్‌లో మెట్రో రైలును ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్ఐసీసీ, ఆపై తాజ్ ఫలక్‌నుమాలకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి వెళ్ళనున్నారు. ఇవాంక మాత్రం బుధవారం సాయత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఈ మూడు రోజుల్లోనూ మొత్తం మూడు విందులు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విందు తాజ్ ఫలక్‌నుమాలో, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విందు గోల్కొండ కోటలో, అమెరికా ప్రభుత్వం ఇస్తున్న విందు హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో జరుగనున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకు పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. భద్రత, బందోబస్తు విధుల కోసం వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసుల్ని కేటాయించారు. వీరు మూడు షిఫ్టుల్లోనూ విధులు నిర్వర్తించనున్నారు. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలు, వెస్టిన్ హోటల్, హెచ్ఐసీసీ, మియాపూర్, తాజ్ ఫలక్‌నుమా, గోల్కొండ కోటల్లో ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు జీఈఎస్‌కు హాజరయ్యే విదేశీ అతి«థులు బస చేస్తున్న 21 హోటళ్ల వద్దా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులతో పాటు అతిథులు ప్రయాణించే మార్గాల్లోనూ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాష్ట్ర పోలీసులు, నీతి ఆయోగ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఎస్పీజీ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ప్రాంతంలోనూ యాక్సిస్ కంట్రోల్, రోడ్ ఓపెనింగ్, బాంబు నిర్వీర్య తనిఖీలు జరుగుతున్నాయి. హెచ్ఐసీసీ–తాజ్ ఫలక్‌నుమా మధ్య ఉన్న రహదారి పరిస్థితులు, ప్యాలెస్ వద్ద పార్కింగ్ సమస్యల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి అతిథుల తరలింపు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే ప్రధాని, ఇవాంక అక్కడకు చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సదస్సు, ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో వీలున్నంత వరకు సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ఔటర్ రింగ్ రోడ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్ళింపులు తప్పనిసరి. ప్రధానికి సంబంధించి తాజ్ ఫలక్‌నుమా, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగతా టూర్ మొత్తం హెలీకాప్టర్‌లో జరుగుతుంది. అయినప్పటికీ ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్లే ప్రముఖులూ ఉండనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు కచ్చితంగా తమ వెంట గుర్తింపుకార్డు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాంక ఇంకెక్కడికి వెళ్లరా? బుధవారం వరకు హైదరాబాద్‌లోనే ఉండనున్న ఇవాంక షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత కొరవడింది. బస, హెచ్ఐసీసీ, తాజ్ ఫలక్‌నుమా ఈ మూడు కార్యక్రమాలు మంగళవారమే జరుగుతున్నాయి. అయితే బుధవారం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల నుంచి పోలీసులకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పోలీసు అధికారులు మాత్రం ఈ అన్ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే కనీసం మూడు, నాలుగు గంటల ముందు తమకు సమాచారం ఇవ్వాలని అమెరికా అధికారుల్ని కోరారు. ఇవాంక వెళ్ళే మార్గం క్లియర్ చెయ్యడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లకు ఈ సమయం పడుతుందని వారు స్పష్టం చేశారు. కాగా ఇవాంక పర్యటన నేపథ్యంలో సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. ఇంజన్‌బౌలి–చాంద్రాయణగుట్ట మధ్య రోడ్డు క్లోజ్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మంగళవారం రాత్రి విందు నేపథ్యంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం. వీటిలో భాగంగా ఇంజన్‌బౌలి–చంద్రాయణగుట్ట చౌరస్తా మధ్య మార్గాన్ని సాధారణ వాహనాలకు పూర్తిగా మూసేస్తున్నాం. ఐఎస్ సదన్, డీఎంఆర్ఎల్ వైపు నుంచి చాంద్రాయణగుట్ట వైపు వచ్చే వాహనాలను మిదానీ జంక్షన్ నుంచి బాలాపూర్ వైపు మళ్ళిస్తాం. శ్రీశైలం హైవే మీదుగా వచ్చే వాహనాలను కేశవగిరి పోస్టాఫీస్ నుంచి బాలాపూర్ వైపు పంపిస్తాం. హిమ్మత్‌పుర నుంచి ఫలక్‌నుమా వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాగుల్చింత టి జంక్షన్ వద్ద లాల్‌దర్వాజా వైపు మళ్ళిస్తాం. కాలాపత్తర్/జహనుమ వైపుల నుంచి షంషీర్గంజ్ టి జంక్షన్ వైపు వచ్చే వాహనాలను గోశాల జహనుమ వైపు పంపిస్తాం. జహనుమ, బీబీకా చష్మా వైపు నుంచి ఫలక్‌నుమా వైపు వచ్చే వాహనాలను షంషీర్గంజ్ వైపు పంపిస్తారు. – వీవీ శ్రీనివాసరావు, ఇన్చార్జ్ సీపీ ఎస్పీజీ ఆధీనంలోనే ప్యాలెస్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలస్ మొత్తం ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఆధీనంలో ఉంటుంది. ప్యాలెస్‌లోకి ఇవాంక కాన్వాయ్‌లో ఐదు వాహనాలు, ప్రధాని కాన్వాయ్‌లో మూడు వాహనాలు అనుమతిస్తున్నారు. అయితే ఒక్కో వాహనం మాత్రమే పైన ఉండి మిగిలినవి కింద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లోకి వచ్చేస్తాయి. ఈ పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో వ్యాపారులపై ఎలాంటి ఆంక్షలు విధించట్లేదు. కేవలం రహదారికి అడ్డంగా ఉన్న కొందరు చిరు వ్యాపారులను మాత్రమే తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలిస్తున్నాం. ఆరాంఘర్ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ మధ్య మార్గంలో మొత్తం 30 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. వాటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. మంగళవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10.30 గంటల వరకు ప్రధాన రహదారిపైకి ఎలాంటి వాహనాలు అనుమతించవద్దని వాటిలో స్పష్టం చేశాం. దీనికి అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు సైతం చేస్తున్నాం. – వి.సత్యనారాయణ, సౌత్‌జోన్ డీసీపీ -
ఈ వంక రావమ్మా..ఇవాంకా!
-
ఇవాంకా ట్రంప్ విచ్చేశారు
-
నెట్టింట్లో ఇవాంకా హల్చల్
సాక్షి, హైదరాబాద్: ఇవాంకా ట్రంప్.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారారు. హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభంకానున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఆమె పాల్గొంటున్న నేపథ్యంలో ఫేస్బుక్, ట్వీటర్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఆమె ఫొటోలు, విశేషాలతో పాటు సెటైర్లు వంటివి చక్కర్లు కొడుతున్నాయి. పత్రికలు, మీడియా కూడా ఆమె పర్యటన విశేషాలను, వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తుండడంతో.. ఇంటర్నెట్, సామా జిక మాధ్యమాల్లో చర్చలు జరుగు తున్నాయి. ‘రావమ్మా ఇవాంకా..’అంటూ ఆహ్వానిస్తున్న వారితోపాటు.. ఆమె పర్యటనపై సెటైర్లూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాంకా రాకపోకలు సాగించే మార్గా లను సుందరీకరిస్తుండ డం, రోడ్లు బాగుచేయి స్తుండడం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. రాజధానిలో బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించే కార్యక్రమం, వీధి కుక్కలను నియంత్రించే ప్రయత్నాల గురించి అయితే చలోక్తులు, విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇవాంకా విందు చేసే ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని భారీ టేబుల్ గురించి, ఆమె తినే వంటకాలు, ప్రయాణించే వాహనాల గురించి చిత్ర విచిత్ర చర్చలు జరుగుతున్నాయి. ‘శతాబ్దాల రాతియుగపు సమాధుల నుంచి..’అంటూ ఫేస్బుక్లో వచ్చిన ఓ కవిత అయితే బాగా వైరల్ అయింది. ఈ వంక రావమ్మా... ఇవాంకా! ఇకఇవాంకా తమ ఊరికి రావాలంటూ కొందరు పోస్టు చేస్తున్న ఆన్లైన్ ఆహ్వానాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. వరంగల్‌కు వస్తే ఓరుగల్లు కోట చూపెడతామని, కల్లు తాగిస్తామని ఫేస్బుక్లో పెట్టిన పోస్టింగ్‌కు భారీగా లైకులు, కామెంట్లు రావడం గమనార్హం. హైదరాబాద్‌లోని మణికొండకు రావాలంటూ ఇవాంకాతో వాట్సాప్‌లో డిస్కస్ చేసినట్టు.. ఆమె అంగీకరించినట్టు వచ్చిన మరో వీడియో అంతే వైరల్ అయింది. ఇలా మరెన్నో పోస్టులు వైరల్ అవుతున్నాయి. -
సద్వినియోగం చేసుకుందాం
ప్రపంచంలోని దాదాపు నూట యాభై దేశాల పారిశ్రామిక ప్రతినిధులను సాద రంగా ఆహ్వానించి, ఆత్మీయ ఆతిథ్యాన్నిచ్చి ఎనిమిదవ ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు(జీఈఎస్)ను విజయవంతం చేయడానికి భాగ్యనగరి సర్వసంసిద్ధమై ఉంది. నేటి నుంచి మూడు రోజులపాటూ జరిగే ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సదస్సుకు తగ్గట్టు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పకడ్బందిగా సకాలంలో సక్రమంగా పూర్తి చేయడానికి ప్రశంసనీయమైన కృషి చేసింది. అంతే కాదు, అదే సమయానికి హైదరాబాద్ ప్రజలకు మెట్రో రైలు సేవలను కానుకగా అందించడం విశేషం. అమెరికా, ఇతర దేశాలలోని ప్రైవేటు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలకు, ప్రత్యేకించి కొత్తగా ఏర్పాటుచేసే స్టార్టప్ సంస్థలకు పెట్టుబడి, సాంకేతికత, నైపుణ్యాలు, సమాచారం తదితరాలను సమకూర్చడానికి తోడ్పడే ధ్యేయంతో 2010 నుంచి ఈ వార్షిక సదస్సులను నిర్వహిస్తోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రేరణను, పెట్టుబడులకు నూతన అవకాశాలను కల్పించడానికి కొత్త ఆర్థిక వృద్ధి కేంద్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. దేశదేశాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు అమెరికా ద్రవ్య, సాంకేతిక, నైపుణ్య సంస్థలను, అనుభవజ్ఞులను ఈ సందర్భంగా కలుసుకో గలుగుతారు. తద్వారా వారి మధ్య ఆదాన ప్రదానాలకు, కొత్త భాగస్వామ్యాలకు అవకా శాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో అవ సరమైన అనుభవజ్ఞుల, నిపుణుల సలహాలు, సహాయసహకారాలు, పెట్టుబడులు సమకూరుతాయి. హైదరాబాద్ నగరం పెద్ద సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, సంస్థలకు నెలవైన సాంకేతిక కేంద్రం. అంతే కాదు, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్, ఉబర్ తదితర ప్రముఖ అమెరికన్ సంస్థలున్న నగరం. జీఈఎస్‌కు తగిన వేదిక. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంకా ట్రంప్‌లు కలసి ప్రారంభించనున్న ఈ ఏడాది సదస్సును ‘మహిళలకు ప్రథమ స్థానం, అందరికీ సౌభాగ్యం’ అనే శీర్షికతో నిర్వహిస్తుండటం విశేషం. అందుకు తగ్గట్టే సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల్లో 52 శాతానికి పైగా మహిళలే. ఈ సదస్సుకు ముందే రంగాలవారీగా దేశంలోని వివిధ నగరాల్లో సుప్రసిద్ధ అమెరికన్ సంస్థలు, నిపుణులు, అనుభవజ్ఞులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో, ఆవిష్కర్తలతో గోష్టులు, వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించారు. ఈ సదస్సు, దాదాపు రెండేళ్ల క్రితం తాను ప్రారంభించిన స్టార్టప్ ఇండియా కార్య క్రమానికి ఊపును ఇస్తుందని ప్రధాని మోదీ ఆశిస్తున్నారు. 1,500 మంది ప్రతి నిధులలో 400 మంది భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు. కాగా, ఇవాంకా ట్రంప్ నేతృత్వంలోని 400 మంది అమెరికన్ మదుపరులు, వ్యాపార నిపు ణుల బృందం హాజరవుతోంది. వివిధ వర్క్‌షాప్‌లు, గోష్టులు తదితర రూపాల్లో సాగే ఈ సదస్సు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఆవిష్కర్తలకు అమెరికా సంస్థ లతో కలసి పనిచేసే, వాటి సహాయసహకారాలను అందుకునే అవకాశాలను కల్పి స్తుంది. వేగంగా వృద్ధి చెందుతున్న ఆరోగ్యవైద్య సేవలు–జీవ విజ్ఞానశాస్త్రాలు, డిజిటల్ ఆర్థికవ్యవస్థ– ద్రవ్యసాంకేతికత, విద్యుత్తు–మౌలిక సదుపాయాలు, మీడియా–వినోదం అనే నాలుగు రంగాలపైన సదస్సు దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఈ కార్యక్రమాన్నంతటినీ అమెరికాతో కలసి మన నీతి ఆయోగ్ నిర్వహిస్తోంది. మన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ప్రత్యేకించి స్టార్టప్ సంస్థలు అందివచ్చిన ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయని ఆశిద్దాం. లైసెన్స్‌లు, భూసేకరణ, పర్యావరణ అనుమతులు తదితర అంశాల్లో అడ్డం కులను తొలగించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యో గితను పెంచాలనేది ఈ పథకం లక్ష్యం. దీనికి మంచి స్పందన లభించింది 4,200 రిజిస్టరయిన స్టార్టప్ సంస్థలతో ప్రపంచంలో మన దేశం 3వ స్థానానికి చేరింది. 2016లో స్టార్టప్ హబ్ మొదలయ్యాక స్టార్టప్‌లకు నిధులను, పన్నుల మినహాయిం పులు, రాయితీలను కల్పించడం, తదితర సహాయ సేవలను అందిస్తోంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎస్ఐడీబీ) స్టార్టప్‌లలో మదుపులు పెట్టడం కోసం రూ. 10,000 కోట్లను ఎనిమిది వెంచర్ కేపిటల్ ఫండ్స్‌కు కేటాయించింది. అయినా మన స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో మూణ్ణాళ్ల ముచ్చటగా ముగుస్తుండటం శోచనీయం. దీంతో ఈ పథకం ఆచరణయోగ్యతే చర్చనీయాంశంగా మారుతోంది. మన స్టార్టప్‌లలో 90 శాతం ఐదేళ్లు తిరిగేసరికి విఫలమౌతున్నాయనే ఆందోళన కరమైన చేదు వాస్తవాన్ని ఐబీఎమ్ తాజా సర్వే వెల్లడించింది. మన స్టార్టప్‌లు నిధుల లభ్యత, ప్రభుత్వపరమైన అడ్డంకుల వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మాట నిజమే. కానీ మన స్టార్టప్ పారిశ్రామికవేత్తలు స్థానిక అవసరాలపై దృష్టిని కేంద్రీకరించడానికి బదులు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన సంస్థ లను అనుకరించడమే ఈ వైఫల్యాలకు ప్రధాన కారణమని ఐబీఎమ్ సహా పలు వురు నిపుణులు నిర్ధారించారు. ఉబర్ వంటి సంస్థలు విజయవంతం అవుతున్నా, మన స్టార్టప్‌లు నగరాల్లో తీవ్ర సమస్యగా ఉన్న రవాణా వంటి రంగాలవైపు దృష్టి సారించడం లేదు. ఆవిష్కరణ అంటేనే అంత వరకు లేని కొత్త వస్తువు, సేవ లేదా మార్కెట్‌ను కనుగొనడం. అదే కొర వడితే స్టార్టప్‌లు మూలనపడక తప్పదు. స్థానిక ప్రజల అవసరాలపై ఆధారపడిన ఆవిష్కరణలకు మార్కెట్ కొరత ఉండక పోవ డమే కాదు, నిపుణ శ్రామికుల కొరత ఉండదు. అవసరమైతే కొద్దిపాటి శిక్షణతో ఉపయోగించుకోగలిగిన విద్యా వంతులైన నిరుద్యోగ యువతకు కొదవ లేదు. ఈ సదస్సుకు హాజరవుతున్న పలువురి విజయగాథలు, అనుభవజ్ఞులు, నిపుణుల నుంచి మన నవ పారిశ్రామికవేత్తలు నేర్చుకోవాల్సినది చాలా ఉంది. ఆ అంత ర్జాతీయ స్థాయి సాంకేతికతను, నైపుణ్యాలను, పెట్టుబడులను స్థానిక అవసరా లను తీర్చే ఆవిష్కరణల కోసం, స్థానిక శ్రమపై ఆధారపడగల ఉత్పత్తి పద్ధతులను పెంపొందింప చేయడం కోసం ఉపయోగించగలిగేతేనే మన స్టార్టప్‌లు విజయ వంతం అవుతాయి. అప్పుడే ఈ సదస్సుకు సార్థకత. -
హైదరాబాద్ గ్లోబల్
సాక్షి, హైదరాబాద్: ఇక్కడ మహిళలు మైనారిటీ కాదు.. తొలిసారి మెజారిటీలోకి వచ్చారు. ఇదీ... మంగళవారం నుంచి హైదరాబాద్ వేదికగా మొదలు కాబోతున్న ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు–జీఈఎస్ 2017’ ప్రత్యేకత. ఇదొక్కటేనా!! అమెరికా ప్రభుత్వం ఏటా నిర్వహించే ఈ సదస్సు.. దక్షిణాసియాలో జరగటం ఇదే ప్రథమం. అంతేకాదు! 10 దేశాల నుంచి వస్తున్న బృందాల్లో మహిళలు తప్ప పురుషులు లేనేలేరు. ఇలాంటి ప్రత్యేకతలెన్నో మూటగట్టుకున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభమవుతోంది. హెచ్ఐసీసీలో మూడ్రోజులపాటు జరిగే సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. ప్రారంభ వేడుకల్లో వీరితో పాటు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్ సహా పలువురు ముఖ్యులు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల నుంచి దాదాపు 1700 మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సులో.. తమ ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని మారుస్తున్న పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొంటారు. సోమవారం సాయంత్రానికే వీరిలో చాలా మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. భారత్–అమెరికా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సయుక్త సదస్సు కావటంతో ఏర్పాట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అతిథులకు ఘనమైన ఆతిథ్యమిచ్చేందుకు రాష్ట్ర సర్కారు భాగ్యనగరాన్ని అందంగా ముస్తాబు చేసింది. నీతి ఆయోగ్ నిర్వహణ ఏర్పాట్లకు సారథ్యం వహించింది. 2010 వాషింగ్టన్లో తొలిసారి సదస్సు నిర్వహించిన అమెరికా... తర్వాత ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీలో నిర్వహించింది. ఎనిమిదో సదస్సుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 52.5 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలే హాజరవుతుండటంతో సదస్సు ప్రపంచ మహిళా చరిత్రలో మైలురాయిగా నిలువనుంది. వేదికపై ముగ్గురి ప్రసంగాలు హైదరాబాద్‌లో మెట్రో రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. అక్కణ్నుంచి నేరుగా సదస్సుకు హాజరవుతారు. ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతోపన్యాసం చేస్తారు. భారత్, అమెరికా జాతీయ పతాకాలను ఎగరేస్తారు. తర్వాత అమెరికా ప్రతినిధిగా ఇవాంకా ట్రంప్, చివరగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇది ముగిసిన వెంటనే వివిధ దేశాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలపై ప్లీనరీ సెషన్ మొదలవుతుంది. సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ మోడరేటర్‌గా వ్యవహరించే ఇందులో... ప్యానెల్ స్పీకర్లుగా ఇవాంక, ఎస్సారెస్ ఏవియేషన్, పెట్రోలియం ఎండీ శిబొంగ్లే సాంబో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, స్కాండినెవియా బ్యాంక్ ఛైర్మన్ మార్కస్ వ్యాలెన్బర్గ్ ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఇన్నోవేషన్స్ ఆన్ వర్క్‌ఫోర్స్ డెవెలప్మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ అనే చర్చా గోష్ఠిలోనూ ఇవాంకా పాల్గొంటారు. ఈ చర్చకు పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. ప్యానెల్లో ఇవాంకతో పాటు చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్, డెల్ సీసీవో కరెన్ క్వింటోస్ ఉంటారు. అమెరికా, భారత్ భారీ అంచనాలు మహిళలు నిలదొక్కుకుని, ఆర్థిక సాధికారతను సాధిస్తే... అక్కడి సమాజాలు, ఆయా దేశాలు వృద్ధి సాధిస్తాయని చెప్పాలనేది ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఈ దిశగా భారత్, అమెరికా ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని చాటి, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. ఇప్పటికే మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలతో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం సదస్సుపై భారీగానే ఆశలు పెట్టుకుంది. దేశంలో ఉన్న స్టార్టప్ కంపెనీలు మరో మెట్టును అధిగమించేందుకు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకు వస్తారని ఆశాభావంతో ఉంది. ‘ది ఇండియా ఎడ్జ్‘ పేరుతో దేశంలో ప్రఖ్యాతి సాధించిన వంద స్టార్టప్ కంపెనీలకు ఈ సదస్సులో పాలుపంచుకునే అరుదైన అవకాశం కల్పించింది. ఈ స్టార్టప్‌లన్నీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయని, దీంతో కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు భారత్ గమ్యస్థానంగా నిలుస్తుందనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలను ఈ సదస్సుకు ఆహ్వానించింది. దేశ విదేశాల నుంచి 200 మంది మీడియా ప్రతినిధులు రానున్నారు. ఇక్కడి అవకాశాలను చాటుదాం ప్రపంచం అందరి దృష్టిని ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా సదస్సుపై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ అవకాశం భవిష్యత్తులో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు తెచ్చి పెడుతుందని, శిఖరాగ్ర సదస్సు ద్వారా ఇక్కడున్న అపారమైన వనరులు, పెట్టుబడులకున్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఉవ్విళ్లూరుతోంది. -
చంద్రబాబు విశ్వప్రయత్నాలు విఫలం!
సాక్షి, అమరావతి : అమెరికా అధ్యక్ష తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను ఆంధ్రప్రదేశ్(ఏపీ)కు రప్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. హైదరాబాద్‌లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ (జీఈఎస్)కు హాజరవుతున్న ఇవాంకాను ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేలా చేసేందుకు ప్రభుత్వం యత్నించినట్లు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డు(ఈడీబీ) ముఖ్య కార్యదర్శి జే కృష్ణ కిషోర్ అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇవాంకా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తే అమరావతి లేదా విశాఖపట్నంలో ప్రత్యేక ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తామని అమెరికా కాన్సులేట్‌కు చెప్పారు. అయితే, ఇందుకు అమెరికా ప్రభుత్వం ససేమీరా అంది. జీఈఎస్ మినహా ఇవాంకా మరెక్కడా పర్యటించబోరని తేల్చి చెప్పింది. దీంతో 'బ్రాండ్' బిల్డింగ్ చేసుకోవాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భంగపాటు ఎదురైంది. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఏపీలో పర్యటిస్తే అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కాగా, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ - 2017 మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
సుడిగాలి పర్యటనకు కౌంట్‌డౌన్ స్టార్ట్
సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఎంటర్‌ప్రిన్యూయర్ షిప్(జీఈఎస్) సదస్సుకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులు భాగ్యనగరానికి చేరుకోనున్నారు. ప్రముఖుల సుడిగాలి పర్యటనకు సంబంధించిన ఫ్యాక్ట్ పాయింట్స్ మీ కోసం.. సుడిగాలి పర్యటన ఇలా.. మంగళవారం మధ్యాహ్నం 01.10 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మియాపూర్ మెట్రో స్టేషన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 02.15 నిమిషాలకు మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు. మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకూ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణిస్తారు. మధ్యాహ్నం 02.45 నిమిషాలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 03.35 నిమిషాలకు ఇవాంకా ట్రంప్‌తో 20 నిమిషాల పాటు భేటీ అవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు ఇండియన్ ఎడ్జ్ ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం 04.40 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తారు. సాయంత్రం 04.43 నిమిషాలకు జీఈఎస్ సదస్సును మోదీ ఆరంభిస్తారు. సాయంత్రం 04.45 నిమిషాలకు ఇవాంకా ట్రంప్ ప్రసంగం ఉంటుంది. సాయంత్రం 04.50 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 05.10 నిమిషాలకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ముగింపు ప్రసంగం చేస్తారు. సాయంత్రం 05.30 గంటలకు హెచ్ఐసీసీలో మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి భేటీ అవుతారు. సాయంత్రం 06.00 గంటల నుంచి దేశ, విదేశాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని ముఖాముఖి మాట్లాడతారు. రాత్రి 07.00 గంటలకు ప్రధానమంత్రి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 07.30 గంటలకు హెచ్ఐసీసీ నుంచి ప్రధానమంత్రి ఫలక్‌నూమా ప్యాలెస్‌కు వెళ్తారు. రాత్రి 08.00 గంటలకు ప్యాలెస్‌లో ఇవాంకా, ప్రధానమంత్రి మోదీ, జీఈఎస్ ప్రతినిధులతో కలసి విందు చేస్తారు. -
'ఆవిష్కరణలు, ఉపాధి కల్పనలపై చర్చ'
న్యూఢిల్లీ : మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనేది గ్లోబల్ ఎంటర్‌ప్రిన్యూయర్ షిప్(జీఈఎస్) సదస్సు ముఖ్య ఉద్దేశం అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు సదస్సు జరుగుతుందన్నారు. అమెరికా, భారత్ సంయుక్తంగా జీఈఎస్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్నారని తెలిపారు. ఆవిష్కరణలు, ఉపాధి కల్పన కఠిన సవాళ్లపై జీఈఎస్‌లో చర్చ జరుగుతుందన్నారు. తొలి రోజు సదస్సులో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్ పాల్గొంటారని వెల్లడించారు. 150కి పైగా దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారన్నారు. మహిళలు పారిశ్రామిక రంగంలో పురోగాభివృద్ధి సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. -
వాహ్.. ఫలక్‌నుమా ప్యాలెస్
-
నవ యువ నారీ..విజయోస్తు!
-
రెండు చోట్లే ఇవాంకా పర్యటన
-
కళ్ళు చెదిరే...మనసు మురిసే..!
అగ్రదేశం అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంఫ్కు ఆతిథ్యమిచ్చేందుకు చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ ముస్తాబైంది. దీంతో ఈ భవనంపై ప్రపంచ ప్రజల దృష్టి పడింది. ప్యాలెస్‌లో అంత ప్రత్యేకత ఏంముందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ అద్భుత భవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి, చాంద్రాయణగుట్ట/చార్మినార్ నిజాం నవాబుల కాలంలో నిర్మించిన కట్టడాల్లో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. చార్మినార్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాల విస్తీర్ణంలో అద్భుత వాస్తు నైపుణ్యంతో ఉంటుందీ ప్యాలెస్. ఫలక్‌నుమా అంటే ఉర్దూలో ‘ఆకాశ దర్పణం’ అని అర్థం. ప్రాణం పోసిన ‘పైగా’లు.. ఆరో నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్¯ హయాంలో ఇతడి బావ.. సంస్థానం ప్రధాని అయిన పైగా వంశస్తుడు సర్ వికారుల్ ఉమ్రా (1893–1901) ఫలక్‌నుమాకు నిర్మాణానికి 1884 మార్చి 3న శంకుస్థాపన చేశారు. భవనం సగ నిర్మాణం పూర్తికాగానే వికారుల్ కుటుంబం 1889 డిసెంబర్లో ఇందులోకి మారింది. అప్పటికి ప్రస్తుత ప్రధాన భవనం నిర్మాణం కానందున కుటుంబమంతా ‘గోల్ మహల్’లో ఉండి ప్రధాన ప్యాలెస్‌ను నిర్మించారు. మొత్తం భవనం 1893 నాటికి పూర్తయ్యాయి. ప్యాలెస్ ఇండో అరేబియన్, పర్శియన్, ఇటాలియన్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. ఇందులో వాడిన పాలరాయిని ఇటాలీ నుంచి, చెక్కను ఇంగ్లాండ్ నుంచి తెచ్చారు. గోడలు, పైకప్పుపై ఫ్రెంచ్ కళాకారులతో అందమైన చిత్రాలు గీయించారు. తాజ్ ఫలక్‌నుమాగా.. ఏడో నిజాం అనంతరం ప్యాలెస్ ఇతడి మనవడు బర్కత్ అలీఖాన్ ముకరంజా ఆధీనంలోకి వచ్చింది. 1948 నుంచి ఈ ప్యాలెస్‌లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. అయితే ఈ భవనాన్ని 2000 సంవత్సరంలో ముకరంజా మొదటి భార్య అస్రా తాజ్ గ్రూప్‌నకు 30 ఏళ్ల పాటు అద్దెకిచ్చింది. తర్వాత హోటల్‌కు అనువుగా కొన్ని మార్పులు చేసి 2010 నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్లో ప్రధాన సూట్స్‌తో పాటు 60 గదులను వినియోగంలో ఉన్నాయి. స్పెషల్ బాత్, స్పా, హెల్త్ క్లబ్, స్విమ్మింగ్ పూల్, స్మోకింగ్ ఏరియా, ఇటాలియన్ రెస్టారెంట్‌తో పాటు హైదరాబాద్ స్పెషల్ (ఆదా) రెస్టారెంట్ ఉన్నాయి. నిజాం ఉపయోగించిన టేబుళ్లు, కూర్చీలు అతిథులకు అందుబాటులోకి తెచ్చారు. అతిపెద్ద డైనింగ్ హాల్.. ఆరో నిజాం సంస్థానానికి 1898లో వచ్చిన ఐదో కింగ్‌జార్జి ఆడ్వర్డ్ పరివారానికి విందు ఇచ్చేందుకు ప్యాలెస్‌లో 101 అతిపెద్ద డైనింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి ఇటాలియన్ ఫర్నిచర్‌తో 33 మీటర్ల పొడవుండే ఈ డైనింగ్ హాల్ దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటిది. నిజాం ఈ డైనింగ్ హాల్లోనే తన బంధువులు, కుటుంబ సభ్యులు, బ్రిటీష్ ప్రధాన అధికారులు విందు చేసేవారు. ప్రస్తుతం ఈ టేబుల్‌పై విందు చేయాలంటే ఒక్కొక్కరికీ రూ.15 వేలు చిల్లించాల్సిందే. ప్యాలెస్ ప్రధాన ముఖద్వారం.. అతిపెద్ద డైనింగ్ హాల్.. స్పెషల్ గేమ్స్ రూమ్.. నిజాం లండన్ నుంచి తెప్పించిన స్నూకర్‌తో పాటు ఇటలీ నుంచి తెప్పించిన చెస్ గేమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. బంగారు, వెండి తీగలతో రూపొందించిన హుక్కాను సైతం అతిథులకు అందిస్తున్నారు. ఏనుగు దంతం, పాలరాతితో చెక్కిన చెస్ కాయిన్స్ ఉన్నాయి. ఆరో నిజాం చేతికి ఇలా వచ్చింది.. సంస్థాన ప్రధాని అయినప్పటికీ వికారుల్ ప్యాలెస్ నిర్మాణం తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్టు చరిత్రకారుల కథనం. తన బావమరిది, ఆరో నిజాంను విందుకు ఆహ్వానించి తన అప్పుల విషయం ప్రస్తావించాడని, దీనికి నిజాం రూ.60 వేలు చెల్లించి భవనాన్ని తనకు రాయించుకున్నట్టు చెబుతారు. ఇలా 1897లో ప్యాలెస్ ఆరో నిజాం సొంతమైంది. తర్వాత కొన్ని మార్పులు చేసిన ‘రాయల్ గెస్ట్‌హౌస్’గా వినియోగించేవారు. ఇతడి పాలనలో దేశ విదేశాల అతిథులు, వివిధ రాజ్యాల పాలకులు సంస్థానానికి వచ్చినప్పుడు ఈ ప్యాలెస్‌లోనే విడిది చేసేశారు. అలా ఐదో కింగ్ జార్జ్, ఎనిమిదో కింగ్ ఎడ్వర్డ్, వైస్రాయ్ లార్డ్బెల్, స్వాతంత్య్రానంతరం హైదారాబాద్ తొలి గవర్నర్ సి.రాజగొపాలాచారి, భారత మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఇందులో విడిది చేశారు. ఏడో నిజాం పాలనలో భవనానికి యూరోపియన్ స్టైల్లో కొన్ని మార్పులు చేశారు. ఆదా రెస్టారెంట్.. ప్యాలెస్‌లో ఆదా రెస్టారెంట్‌కు తాజ్ గ్రూపు ప్రత్యేక స్థానమిచ్చింది. ఇందులో హైదరాబాద్ రుచులతో పాటు ఆంధ్రా భోజనాన్ని అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌తో పాటు పక్కనే చెలాస్రే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ‘‘1883లోనే ఈ భవనంలో విద్యుత్, టెలిఫోన్ వినియోగించారు. భారతదేశంలోనే అతి పెద్ద స్విచ్ బోర్డు ఇక్కడ చూడవచ్చు. ఈ భవనానికి విద్యుత్తు అందించేందుకు ఆరోజుల్లో బొగ్గు యంత్రాలను ఉపయోగించేవారు. యంత్రాలున్న ప్రాంతాన్ని ‘ఇంజన్ బౌలి’ అనేవారు. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని ఇదే పేరుతో పిలుస్తున్నారు’’ నిజాం సూట్.. ప్యాలెస్‌లో అన్నింటి కంటే ఖరీదైనది ‘నిజాం సూట్’. దీని అద్దె రోజుకు రూ.5 లక్షలు. ప్యాలెస్‌లో 204 నంబర్‌గా కేటాయించారు. ఈ సూట్లో నిజాం ఉపయోగించిన వస్తువులు ఉంటాయి. ఈ సూట్ నుంచి జంట నగరాల అందాలను తిలకించవచ్చు. ఇంకా అక్బర్ సూట్, షాజాది సూట్ వంటి దాదాపు 60 సూట్రూలున్నాయి. వీటి అద్దె రూ.20 వేల నుంచి ప్రారంభమవుతుంది. ‘‘ప్యాలెస్‌లోని బిలియర్డ్స్ టేబుల్ చాలా అరుదైనది. ఇలాంటిది ప్రపంచంలో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లండ్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్‌లోను, మరొకటి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మాత్రమే ఉంది’’ పైగాలు నిజాం సంస్థానంలో అత్యంత ధనవంతులు. వారు సైన్యాధిపతులుగా ఉండేవారు. వికారుల్ ఉమ్రా మాత్రం ప్రధానిగా నియమితుడయ్యాడు. ఇతడు ఉండేందుకు రాజమహళ్లను మించిన అద్భుత భనవం కట్టాలని ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మించాడు -
దోమలు.. కనిపిస్తే కాల్చివేత..!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు హాజరయ్యే అతిథులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఇవ్వనున్న గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. విందు నాటికి గోల్కొండ కోటలో ఒక్క దోమ కూడా లేకుండా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోమల నిర్మూలన చర్యల్ని ముమ్మరం చేసింది. దోమల నిర్మూలనలో భాగంగా ఇప్పటి వరకూ ఫాగింగ్, స్ప్రేయింగ్‌లకు శక్తిమంతమైన అల్ఫా సైపర్ మెథ్రిన్, సిఫనోథ్రిన్‌తోపాటు పొగ రాకుండా పైరిథ్రమ్‌ను వాడుతున్న సిబ్బంది.. తాజాగా పరిమళాలు వెదజల్లే సిట్రనెల్లా ఆయిల్, డెల్టా మిథిలీన్ లిక్విడ్లను స్ప్రే చేస్తున్నారు. వీటివల్ల దోమల నిర్మూలనే కాకుండా పరిసరాల్లో సువాసనలు వెదజల్లుతాయి. మస్కిటో రెపెల్లెంట్స్ గానూ పనిచేస్తుండంతో వీటిని వినియోగిస్తున్నారు. ఈ పనులకుగానూ 4 డ్యూరోటెక్ మెషీన్లు, 8 పవర్ స్ప్రేయర్లు, 8 మొబైల్ మెషీన్లను వాడుతున్నారు. పరీక్షలతో దోమల లెక్క.. దోమల నిర్మూలనకు చేపట్టిన చర్యలతో పాటు ఏరోజుకారోజు ప్రత్యేకంగా మస్కిటో డెన్సిటీ అధ్యయనం చేస్తున్నారు. ఇందుకు గానూ గోడలపై సక్షన్ ట్యూబ్‌లను ఉంచి గాలి గుంజుతారు. దీంతో పరిసరాల్లోని దోమలు ట్యూబ్‌లోకి వస్తాయి. వాటిని టెస్ట్‌ట్యూబ్‌లోకి పంపి లెక్కిస్తారు. బుధవారం విందు సమయానికి ఒక్క దోమా లేకుండా చేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తూ అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం.. చీకటి పడ్డ తర్వాత ఇలా రోజుకు రెండు పర్యాయాలు ఈ పరీక్షలు చేస్తున్నారు. గోల్కొండ కోటలో పరీక్షల్లో ఐదు రోజుల క్రితం గంటకు 200 దోమలు ఉండగా.. శనివారం నాటికి 40కి తగ్గాయి. సోమవారం వరకు వీటిని జీరో చేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. సాధారణంగా చీకటి పడిన తర్వాత గోల్కొండ కోటలోకి దోమలు ఎక్కువగా వస్తాయని, అయితే తాము చేపట్టిన చర్యలతో శని, ఆదివారాల్లో దోమలు చాలా వరకు తగ్గిపోయాయని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వి.వెంకటేశ్ ‘సాక్షి’కి తెలిపారు. గోల్కొండ కోట పరిసరాల్లో దోమల లార్వా వ్యాప్తికి కారణమవుతున్న గుర్రపుడెక్కను తొలగించారు. శాతం చెరువు, హుడా తలాబ్, టిప్పుఖాన్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లోనూ గుర్రపుడెక్క తొలగించినట్లు సీనియర్ ఎంటమాలజిస్ట్ లచ్చిరెడ్డి తెలిపారు. విందురోజు ప్రత్యేక అగర్బత్తీలు.. ఇప్పటికే పరిమళాలు వెదజల్లే లిక్విడ్స్‌తో స్ప్రేయింగ్ పనులు చేస్తుండగా విందురోజు ప్రత్యేక పరిమళాలతోపాటు దోమలను దరి చేరకుండా చేసే లెమన్‌గ్రాస్‌తో తయారు చేసిన ప్రత్యేక అగర్బత్తీలను గోల్కొండ కోటలో వినియోగించనున్నారు. లెమన్ గ్రాస్.. దోమల రెపెల్లెంటే కాక సుగంధం వెదజల్లడంతో సదరు అగర్బత్తీలను నాందేడ్ నుంచి తెప్పిస్తున్నారు. -
రెండు చోట్లే ఇవాంకా పర్యటన
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు విశిష్ట అతిథిగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో హెచ్ఐసీసీ, ఫలక్‌నుమా రెండు చోట్ల మాత్రమే పర్యటించే అవకాశం ఉందని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా అధికారుల నుంచి వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఆమె షెడ్యూల్లో మరో ప్రాంతం లేదన్నారు. ప్రధాని మోదీ, ఇవాంకా రాక, జీఈఎస్ సదస్సు, అధికారిక విందుల నేపథ్యంలో అందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ.. ఆ ఇద్దరి పర్యటనలూ ఇలా.. ఇవాంకా మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెస్టిన్ హోటల్‌కు వెళ్లడంతో పాటు హెచ్ఐసీసీలో జరిగే జీఈఎస్‌లో పాల్గొంటారు. అనంతరం తాజ్ ఫలక్‌నుమాలో విందుకు హాజరవుతారు. ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్ వెళ్లి మెట్రో రైలును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జీఈఎస్‌కు.. ఆపై ఫలక్‌నుమాకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి శంషాబాద్ నుంచి తిరిగి వెళ్తారు. ఇవాంకా మాత్రం బుధవారం సాయంత్రం వరకు నగరంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసుల్ని కేటాయించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్.. జీఈఎస్‌కు సంబంధించిన ప్రధాన కంట్రోల్ రూమ్‌ను హెచ్ఐసీసీలో సైబరాబాద్ పోలీసుల అధీనంలో ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలు, ఫలక్‌నుమాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఉండనున్నాయి. వీటన్నింటినీ అనుసంధానిస్తూ డీజీపీ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుంది. మరోవైపు సామాన్యులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, ఓఆర్‌ఆర్‌లను ఎక్కువగా వినియోగించనున్నారు. ప్రధానికి సంబంధించి ఫలక్‌నుమా, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగతా టూర్ అంతా హెలికాప్ట్టర్‌లో జరుగుతుంది. ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్లే ప్రముఖులూ ఉండటంతో ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. -
‘ఇవాంకాకు సిరిసిల్ల చీరను ఇవ్వండి’
సాక్షి, వేములవాడ: అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకాకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బతుకమ్మ చీరను బహుమతిగా ఇవ్వాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ చీరను కానుకగా ఇవ్వకుంటే నేత కార్మికులను అవమాన పరిచినట్లేనని ఆయన తెలిపారు. చీరను కానుకగా ఇవ్వకపోతే తామే మెండితో బాక్స్ తయారు చేసి, అందులో చీరను ప్రభుత్వానికి అందజేస్తామని పొన్నం అన్నారు. అమెరికా- భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ఈ సదస్సు కోసం నగరానికి నవంబర్ 28న విచ్చేయనున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 28న జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు హజరవనున్న ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం రెండు పోచంపల్లి పట్టుచీరలు, డైమండ్ నెక్లెస్ బహూకరించనున్నట్లు తెలిసింది. -
ఫలక్ నుమాలో భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విందును పురస్కరించుకొని ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులు, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు, క్యూఆర్టీ, అమెరికా, కేంద్ర, రాష్ట్ర, నగర నిఘా సంస్థలు ప్యాలెస్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్యాలెస్‌కు వెళ్లే రూట్లోని బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌బౌలి రహదారులను జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సీఎస్ ఎస్పి.సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రావు, కలెక్టర్ యోగితా రాణాలు ప్యాలెస్‌లో ఏర్పాట్లతో పాటు బందోబస్తును పర్యవేక్షించారు. రైల్వే పోలీసులు కూడా ఫలక్‌నుమా రైల్వే స్టేషన్లో, దక్షిణ మండలం పోలీసులు ప్యాలెస్ పరిసరాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 45 బస్సులలో అతిథులు విచ్చేయనున్న నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్ అంశాలపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేశారు. మొత్తం 2000 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగించనున్నట్లు పోలీసులు తెలిపారు. 520 సీసీ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో పాటు సోమవారం సాయంత్రం కాన్వాయ్ రిహర్సల్స్ చేయనున్నారు. ప్యాలెస్‌కు అతిథులు విచ్చేసే సమయంలో ప్రధాన రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ రానున్న నేపధ్యంలో నిఘా పెంచామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను ఆపరేట్ చేస్తామని తెలిపారు. డెలిగేట్స్ బస చేసే 21 హోటల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. ఎల్లుండి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని... నగరంలో 10 వేల 4 వందల మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు . -
ఫలక్ నుమాలో భారీ బందోబస్తు
-
పాతబస్తీలో ఇవాంకా షాపింగ్...!
-
సోషల్‌మీడియాలో హైదరాబాదీల అభ్యర్థన
సాక్షి, హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనపై సోషల్‌మీడియాలో నెటిజన్లు విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు. కొంచెం వీలు చేసుకుని తమ వీధుల గుండా ప్రయాణించాలని ఇవాంకాను అభ్యర్థిస్తున్నారు. అప్పుడైనా జీహెచ్ఎంసీ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతుందని, రోడ్లు బాగు అవుతాయని అంటున్నారు. మరో మూడు నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేస్తామని అన్నారు. నగరంలో ఇవాంకా పర్యటన సందర్భంగా వాట్సాప్‌లో తిరుగుతున్న మెసేజ్ సారాంశం ఇలా వుంది.. హైదరాబాదీ : ఇవాంకా గారు నేను మణికొండలో నివాసం ఉంటున్నాను. మీరు మా రోడ్ల మీద ప్రయాణిస్తే బావుంటుంది. అప్పుడైనా మాకు కొత్త రోడ్లు వేస్తారు. ఇవాంకా : రోడ్ల నిర్మాణంపై నేను ప్రధానమంత్రితో మాట్లాడతాను. హైదరాబాదీ : అప్పుడు కేంద్ర ప్రభుత్వం మాపై రోడ్ సర్వీస్ ట్యాక్స్ వేస్తుంది. ఈ ఒక్క మెసేజే కాదు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లు వేదికగా ఇవాంకా ట్రంప్ పర్యటనపై నెటిజన్లు పెడుతున్న పోస్టులకు లెక్కలేదు. హఫీజ్‌పేట్‌లోని రోడ్ల మీదుగా పర్యటించాలని ఒకరు, మా ప్రాంతం గుండా ప్రయాణించాలని మరొకరు ఇవాంకాను అభ్యర్థిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా కొత్త ఫుట్‌పాత్‌లు కనిపించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై జీహెచ్ఎంపీ కమిషనర్ జనార్ధన్ రెడ్డికి ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పెట్టారు. హైదరాబాద్‌లో రోడ్లకు ఇరువైపులా కొత్త ఫుట్‌పాత్‌లు చాలా అందంగా ఉన్నాయని మెయిల్లో పేర్కొన్నారు. అయితే, ముందుముందు వాటిని ఎలా నిర్వహిస్తారో తలుచుకుంటే భయంగా ఉందన్నారు. ఫుడ్ ట్రక్స్ త్వరలోనే ఫుట్‌పాత్‌లను కళ తప్పిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఇవాంకా వెంట అమెరికా వైద్య బృందం
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతున్న ఇవాంకా వెంట ఆ దేశానికి చెందిన ప్రత్యేక వైద్య బృందం కూడా వస్తోంది. పర్యటనలో భాగంగా ఆమెకు ఏదైనా అనారోగ్య సమస్య, అత్యవసర పరిస్థితి తలెత్తితే.. వెంటనే తగిన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సదస్సుకు ప్రధాని మోదీ సహా దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు వేదిక వద్ద ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసి.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులతో కూడిన మూడు బృందాలను అందుబాటులో ఉంచనుంది. అందులో కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, అనెస్థీషియన్ సహా నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. ప్రతినిధుల్లో ఎవరికైనా ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలు అందిస్తారు. ఇక సదస్సు ప్రాంగణం బయట మూడు అంబులెన్సులను సిద్ధంగా ఉంచనున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వైద్యం అందించేలా.. హైటెక్‌సిటీ సమీపంలోని కిమ్స్, పంజాగుట్ట నిమ్స్, అపోలో ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందుకు సంబంధించి కూడా వైద్య సేవల కోసం ఏర్పాట్లు చేశారు. -
ఎటువంటి ఇబ్బందులూ రావొద్దు!
సాక్షి, హైదరాబాద్: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మెట్రో రైలు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ప్రాంతం, భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ప్రధాని మోదీ, ఇవాంకా, ఇతర ప్రముఖులు ప్రయాణించే మార్గాలు, పర్యటించే ప్రదేశాలు ఏర్పాట్లపై సమీక్షించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సులో హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ అనంతరం జీఈఎస్ సదస్సు జరిగే హెచ్ఐ సీసీ వేదికను డీజీపీ పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, మోదీ, సీఎం, ఇవాంకా వచ్చే మార్గాలు, గ్రీన్ చానల్ ఏర్పాటు, డెలిగేట్లు వచ్చే మార్గం తదితరాలపై సమీక్షించారు. ఇక 29న గోల్కొండ కోటలో జీఈఎస్ డెలిగేట్లకు విందు ఇవ్వనున్న ప్రాంతాలను సీఎస్, డీజీపీ పరిశీలించారు. ఆదివా రం నుంచి కోటను అదీనంలోకి తీసుకోవాలని.. ఎవరినీ అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. విందు మెనూను పరిశీలించారు. కోటలో హస్తకళల ప్రదర్శన మాత్రమే ఉంచాలని, అమ్మకాలను జరపవద్దని సూచించారు. సిబ్బంది, అధికారులు ఎప్పటి కప్పుడు సమన్వయం చేసుకోవాలని, ఇబ్బందులు తలెత్త కుండా, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఇక డీజీపీ మహేందర్ రెడ్డి మెట్రో రైలు డిపో, మియాపూర్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి.. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాలపై మెట్రోరైల్ అధికారులతో కలసి సమీక్షించారు. అధికారులతో కలసి మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రతి మెట్రో స్టాప్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాట్లు పరిశీలించారు. సదస్సు నేపథ్యంలో ఆదివారం నుంచి గురువారం వరకు పోలీసు శాఖ డేగకళ్లతో పహారా కాయబో తోంది. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌ల పర్యటన నేపథ్యంలో.. దాదాపు 4 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది భద్రతా వ్యవహారాల్లో నిమగ్న మవుతున్నారు. -
జీఈఎస్‌పై అగ్రరాజ్యం డేగకన్ను!
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌పై అమెరికా డేగకన్ను వేసింది. పలు ఉగ్రవాద దేశాలు, ఉగ్రవాద సంస్థల నుంచి ఆమెకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనే అమెరికా బృందానికి ఇవాంకా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా.. ప్రత్యేక భద్రతా విధులన్నీ అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీయే పర్యవేక్షిస్తోంది. అయితే అమెరికాను టార్గెట్ చేసిన ఉగ్రవాద సంస్థల నుంచి ఇవాంకాకు ముప్పు పొంచి ఉంది. ఐసిస్ ఉగ్రవాదులతో పాటు విద్వేషాగ్నితో రగులుతున్న ఉత్తర కొరియా నుంచి కూడా ప్రమాదం ఉంటుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ అధికారులను హెచ్చరించింది. ఇవాంకా హైదరాబాద్‌లో ఉన్నంత సేపూ అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేలా ఏర్పాట్లు జరిగాయి. హాజ్మత్ వాహనాల మోహరింపు రసాయనిక దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు, తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలు కల్పించే వాహనాలే హాజ్మత్ వాహనాలుగా చెబుతారు. హాజ్మత్ అంటే హాజర్డస్ మెటీరియల్ అని అర్థం. అత్యంత హానికరమైన రసాయన దాడుల సందర్భాల్లో ఈ వాహనాలను వినియోగిస్తుంటారు. ఇలాంటి వాహనాలు మన దేశంలో అరుదు. హైదరాబాద్‌లో అందుబాటులోనే లేవు. ప్రధాని మోదీ, ఇవాంకాల పర్యటన నేపథ్యంలో హాజ్మత్ వాహనాలను తెప్పించి మోహరించాలని నిర్ణయించారు. ఇక ఇవాంకా హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు అమెరికా నుంచి ప్రత్యేకంగా మూడు వాహనాలను తెప్పిస్తున్నారు. మందు పాతరలతో పాటు రాకెట్ లాంచర్లు, జీవ, రసాయన దాడుల నుంచీ రక్షించగలిగేలా వాటిల్లో ఏర్పాట్లు ఉంటాయి. 2 కిలోమీటర్ల దూరం ఆంక్షలు ఇవాంకా బస చేసే రెండు రోజుల పాటు మాదాపూర్ వెస్టిన్ హోటల్, విందుకు హాజరయ్యే పాతబస్తీ ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయి. వీటికి రెండు కిలోమీటర్ల పరిధిలోని జనావాసాలు, ఆఫీసులు, ప్రజల కదలికలపై నిఘా పెట్టారు. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలో ఉన్న వారి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. విదేశీయుల వివరాలపై ఆరా.. కొంతకాలంగా అమెరికా, ఉత్తర కొరియా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాంకాకు ఆ దేశం నుంచి ముప్పు ఉందని అమెరికా భావిస్తోంది. దీంతో ఇటీవల భారత్‌లోకి వచ్చిన విదేశీయుల వివరాలను ఆరా తీస్తోంది. ముఖ్యంగా గత 45 రోజుల్లో ప్రధానంగా ఉత్తర కొరియా, సిరియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చినవారి సమాచారం సేకరిస్తోంది. మన దేశంలో విదేశీ రాకపోకల రద్దీ ఉండే 12 ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఈ వివరాలను సేకరించింది. వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ పనిపై వచ్చారు,వారి కదలికలేమిటనే సమాచారం రాబడుతోంది. మరోవైపు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్న అనుమానితులపై నిఘా వేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఇవాంకా పర్యటించే ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా తమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇవాంకా ఉండే పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ఆయుధాలతో ప్రవేశించకుండా ఆంక్షలు విధించాలని.. రసాయనిక దాడులు సైతం జరిగే ఆస్కారం లేకుండా భద్రత ఉండాలని స్పష్టం చేసింది. అసలు ఇవాంకా ఆసియాలో తొలిసారి అడుగు పెడుతుండటంతో సీఐఏ గట్టి జాగ్రత్తలే తీసుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రోన్లు, నిఘా కెమెరాలను వినియోగించనుంది. దాదాపు 60 మందికిపైగా సీఐఏ ఆఫీసర్లు, దేశంలోని అమెరికా రాయబార కార్యాలయాలకు చెందిన వంద మందికిపైగా ఉద్యోగులు ఇవాంకా రక్షణ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. -
మానుషి ఛిల్లర్.. సానియా.. మిథాలీ
సాక్షి, హైదరాబాద్: జీఈఎస్ సదస్సులో ప్రసంగించే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. మిస్‌వరల్డ్ మానుషి ఛిల్లర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్, బాలీవుడ్ నటులు సోనమ్‌కపూర్, అదితీరావు హైదరీ, నటుడు రామ్‌చరణ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ సదస్సులో మొత్తం 50కుపైగా చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ టెక్ అండ్ డిజిటల్ ఎకానమీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఈ చర్చలను నిర్వహిస్తున్నారు. 28న సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య జరిగే సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్, ఇవాంకా, మోదీ ప్రసంగాలు ఉండనున్నాయి. క్రీడా వ్యాపారంలో విజయం అంశంపై సానియా మీర్జా, మిథాలీరాజ్, గోపీచంద్‌లతోపాటు వన్ చాంపియన్‌షిప్ ఉపాధ్యక్షులు చాత్రి సిత్యోంద్టాంగ్‌లు మాట్లాడనున్నారు. ఫ్యూచర్ ఆఫ్ సినిమా అంశంపై రాంచరణ్ తేజ, అదితీరావ్‌హైదరీ, నెక్ట్స్ స్టేజ్ ప్రొడక్షన్స్ సంస్థ సీఈవో ఒనెకాచి స్టిఫానీ లినస్ ఇడాహొసాలు మాట్లాడనున్నారు. మీడియాలో మహిళలకు అవకాశాలపై మానుషి ఛిల్లర్, సోనమ్ కపూర్, కల్లీ పూరి తదితరులు ప్రసంగిస్తారు. ఫలక్‌నుమాకు ‘లాడ్‌బజార్ ’ ఇవాంకా చార్మినార్ సందర్శిస్తారని, లాడ్ బజార్లో షాపింగ్ చేసి గాజులు కొంటారని తొలుత భావించినా.. పలు కారణాల రీత్యా భద్రతా సిబ్బంది అందుకు అంగీకరించలేదు. దీంతో లాడ్‌బజార్ నుంచి కొన్ని ఎంపిక చేసిన గాజుల దుకాణాలను ఫలక్‌నుమా ప్యాలెస్‌కే పంపించి.. తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు దుకాణాలకు ఆర్డర్ కూడా ఇచ్చారు. ఎంపిక చేసిన గాజులు, ఆయా దుకాణాల నిర్వాహకులను ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తీసుకెళతారు. అక్కడికి విందుకు వచ్చిన సందర్భంలో.. ఇవాంకాతోపాటు, ఇతర డెలిగేట్స్ కూడా గాజులు కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ హైటెక్స్‌కు మినీ శిల్పారామం తెలంగాణ సంప్రదాయ హస్తకళలను ఇవాంకాతో పాటు ఇతర ప్రముఖులకు ప్రదర్శించనున్నారు. సదస్సు జరిగే హెచ్ఐసీసీకి సమీపంలోనే శిల్పారామం ఉన్నప్పటికీ.. ఇవాంకా అక్కడికి రావటం సాధ్యం కాదని ఆమె భద్రతా విభాగం స్పష్టం చేసింది. దీంతో ముఖ్యమైన హస్తకళాకృతులను హెచ్‌ఐసీసీకే తరలించి.. చిన్న ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే దీనికి కూడా ఇప్పటివరకు అమెరికా భద్రతా సిబ్బంది నుంచి అంగీకారం రాలేదు. మరోవైపు 29న గోల్కొండ కోటలో విందు కార్యక్రమం ఉన్నందున.. శిల్పారామం నుంచి కొన్ని హస్త కళాకృతులను గోల్కొండకు తరలించి ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. – సాక్షి, హైదరాబాద్ -
మన స్టార్టప్‌లకు ‘వంద’నం!
సాక్షి, హైదరాబాద్: వందలాది కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలన్నీ ఒకే చోట పంచుకునేందుకు ఈ నెల 28న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు వేదిక అవుతోంది. ‘వీటన్నింటినీ చూసేందుకు రండి.. తరలిరండి..’అంటూ భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతోంది. దేశంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఇలాంటి స్టార్టప్లన్నింటితో పారిశ్రామిక సదస్సులో ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తోంది. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న కొత్త ఆవిష్కరణలు, వినూత్న పరిశ్రమలను ఈ సదస్సులో భాగంగా ఒకే గొడుగు తీసుకొచ్చింది. ఇప్పటికే ఎంపిక చేసిన దాదాపు వందకుపైగా ఉత్తమ స్టార్టప్‌లకు కేంద్ర పారిశ్రామిక శాఖ ఈ అవకాశం కల్పించింది. సదస్సులో వారంతా తమ ఆలోచనలు, ఆవిష్కరణలు, ఉత్పత్తుల గురించి చాటి చెప్పేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవానికి ముందే.. ఈ నెల 28న పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే హెచ్ఐసీసీలో ఈ ‘ఇండియన్ ఎడ్జ్’ప్రదర్శన ఉంటుంది. అత్యాధునిక దృశ్య శ్రవణ సాంకేతిక పరిజ్ఞానంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) విభాగం ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది. ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అనే నినాదంతో కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తోంది. టచ్ స్క్రీన్లు, మల్టీ టచ్ ఇంటరాక్టివ్ వాల్, సెన్సర్ స్కీన్లు, ఎల్ఈడీ స్క్రీన్లను వినియోగిస్తున్నారు. స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తమ సంస్థలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం, అవకాశాలు, ప్రయోజనాలు, ఆ రంగంలో ఉన్న భవిష్యత్తు తదితర అంశాలను చాటిచెప్పేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో కంపెనీలు తమ ఉత్పత్తులు, ఆవిష్కరణలను సైతం ప్రదర్శించేలా ఎగ్జిబిషన్‌ను అధునాతనంగా రూపొందిస్తున్నారు. సదస్సులో తొలి రోజున సాయంత్రం 4 గంటల నుంచి 4.25 వరకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ ఈ ప్రదర్శనను తిలకిస్తారు. ‘ది ఇండియన్ ఎడ్జ్.. అండ్ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ త్రూ ఏజెస్’పేరిట ప్రదర్శనను నిర్వహిస్తారు. అందరూ పాదాలకు చెప్పులతో నడిచేలా భరోసా ఇవ్వగలమా? పాత చెప్పులను స్లిప్పర్లుగా తయారు చేసి అందించే ‘గ్రీన్‌సోల్’ సాధించి చూపింది. భారత్‌లో ఆ కంపెనీ పెట్టిన ఔత్సాహికులను కలుసుకోవాలనుందా.. భవిష్యత్తు తరాలకు మనమంతా మంచి చేస్తామని హామీ ఇవ్వగలమా? శిశువుల సంరక్షణకు అవసరమైన ఉత్పత్తులు తయారు చేస్తున్న స్టార్టప్ కంపెనీ ‘బేబి చక్ర’ను అడుగుదాం.. -
జయహో...జానీ
అతడి ప్రతిభ.. నిరంతర సాధన ఇప్పుడు ఎనలేని గుర్తింపును తీసుకురాబోతున్నాయి. ముస్లిం కుటుంబంలో పుట్టినా.. ఎంతో ఆసక్తితో భరతనాట్యం నేర్చుకొని..ఇంతింతై అన్నట్లు ప్రపంచ స్థాయి సదస్సులో ప్రదర్శనకు సిద్ధమవుతున్నాడు. ఏకంగా అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్‌లో హాజరయ్యే వేడుకలో సంప్రదాయ సిద్ధంగా ఓలలాడించబోతున్నాడు. చారిత్రక గోల్కొండ కోట వద్ద భద్రాచల పుణ్యక్షేత్రం, రామదాసు విశిష్టతను చాటే కళారూప ప్రదర్శనతో జిల్లా ఖ్యాతిని చాటబోతున్నాడు. గోల్కొండలో జానిమియా నృత్యం.. తల్లాడ: తల్లాడకు చెందిన డ్యాన్స్ మాస్టర్ షేక్ జానిమియాకు అరుదైన అవకాశం దక్కింది. హైదరాబాద్‌లో ఈ నెల 28 నుంచి మూడురోజులపాటు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరగనుంది. సదస్సుకు హాజరయ్యే అతిరథమహారథుల ఎదుట నాట్యం చేసే గౌరవం జానిమియాకు లభించింది. ఈ నెల 29న అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ ముందు గోల్కొండలో రామదాసు కీర్తనపై న్యతం ప్రదర్శించనున్నారు. తన శిష్య బృందంతో గురు పర్యవేక్షణలో డాక్టర్ పద్మశ్రీ ఆనందశంకర్ జయంతి నృత్య దర్శకత్వంతో ప్రదర్శించబోతున్నారు. భద్రాచల పుణ్య క్షేత్రం, రామదాసు విశిష్టతను కళారూపంలో ఆవిష్కరించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తల్లాడకు చెందిన షేక్ సైదా, షాహిదాబీబేగం దంపతుల కుమారుడు జానిమియా. విజయవాడ ఆంధ్రా లయోల కళాదర్శినిలో నృత్యంపై తర్ఫీదు పొందాడు. నర్తకి రామకృష్ణ వద్ద భరతనాట్యం నేర్చుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంపీఏ పూర్తి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ చిరక్ ఇంటర్ నేషనల్ స్కూల్లో నృత్య గురువుగా పని చేస్తున్నాడు. ఐదేళ్ల ప్రాయంలోనే తల్లే తొలిగురువుగా జానిమియా నాట్యం ప్రారంభించాడు. ముస్లిం కటుంబానికి చెందిన జానిమియా తన సంప్రదాయాలకు భిన్నమైన హిందూ కళలు, నాట్యం పట్ల ఆసక్తి పెంచుకోగా.. తల్లి షాహిదా బేగం కూడా ప్రోత్సహించింది. బాల్యం నుంచే నాట్యంపై అమితమైన అభిరుచి ఉండటంతో ఉపాధ్యాయులు కూడా తగిన ప్రోత్సాహం అందించారు. హైదరాబాద్‌లో కోటి దీపోత్సవంలో జానిమియా నాట్యం.. ,విజయవాడ శారద కళాపీఠం యువపురస్కారం అందుకుంటున్న జానిమియా బిరుదులు, సత్కారాలు విజయవాడ ఆకాశవాణి యువవాణి విభాగం యువ సౌరభం బిరుదుతో సత్కరించింది. విజయవాడ శారద కళా పీఠం యువ పురస్కారం అందించింది. సిద్ధార్థ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు పొందాడు. ముఖ్యమైన ప్రదర్శనలు ♦ ప్రపంచ తెలుగు మహాసభలు ♦ రాంచి యూనివర్సిటీలో జాతీయస్థాయి నృత్య పోటీల్లో ప్రథమ స్థానం ♦ హైదరాబాద్ గుడి సంబురాల కార్యక్రమం ♦ ఖుజరహు డాక్ర ఫెస్టివల్లో ♦ సిలికానాంధ్ర అంతర్జాతీయ సమ్మేళనంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ♦ సెంట్రల్ యూనివర్సిటీ సంస్కృత దినోత్సవంలో.. -
ప్రధాని పర్యటన తొమ్మిది గంటలు
-
వాహనం నుంచే వాహనాలపై నిఘా
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్) కోసం నగరానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భద్రతా చర్యల్లో భాగంగా ఆ దేశ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్‌తో పాటు ఆ దేశ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వాడే బ్యాక్ స్కాటింగ్ పరిజ్ఞానంతో పని చేసే స్కానర్లను తమ వెంట తీసుకువచ్చారు. వీటిని ఇవాంకా క్యారికేడ్(కాన్వాయ్)లో ఉండే మూడు వాహనాల్లో ఒక దానిలో ఏర్పాటు చేశారు. ఈ పరిజ్ఞానం వినియోగిస్తే భద్రతాధికారులు చుట్టూ ఉన్న వాహనాల వద్దకు స్వయంగా వెళ్లి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎదుటి వాహనాల్లో ఉన్న ఆయుధాలు, అనుమానాస్పద వస్తువులు, కరెన్సీ, డ్రగ్స్, మందుగుండు సామగ్రి ఇలా దేన్నైనా స్కానింగ్‌లో కనిపెట్టడం సాధ్యమవుతుంది. బ్యాక్ స్కాటింగ్ పరిజ్ఞానం కలిగిన వాహనం ఎక్స్‌రే ఇమేజింగ్ పద్ధతి ద్వారా తన చుట్టూ ఉన్న వాహనాలు లేదా వస్తువులను క్షణాల్లో స్కాన్ చేస్తుంది. వాటిలోని అన్ని మూలల్నీ, ప్రతి కోణంలోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పైకి చూడ్డానికి కాన్వాయ్‌లోని సాధారణ వాహనంలా కనిపించే దాంట్లోనే ఈ పరిజ్ఞానం జోడించారు. దీంతో సదరు వాహనం ఉన్న ప్రాంతం నుంచి చుట్టూ గరిష్టంగా 100 మీటర్ల పరిధిలో ఉన్న వాహనాలపై నిఘా పెట్టగలదు. దీని నిర్వహణ సైతం ఎంతో సులభం. వాహనంలో డ్రైవర్‌తో పాటు ఒక ఆపరేటర్ సరిపోతారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లతో పాటు రానున్న ఎఫ్‌బీఐ అధికారులు దీన్ని పర్యవేక్షించనున్నారని తెలిసింది. ప్రమాదకర పరిస్థితులు, ప్రదేశాల్లో పని చేయాల్సి వచ్చినప్పుడు ఆపరేటర్ సైతం వాహనంలో లేకుండా దూరం నుంచి రిమోట్ ద్వారా కూడా ఈ స్కానింగ్ వ్యవస్థను నియంత్రించే అవకాశం ఉంది. ఈ వాహనం నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాలు చుట్టూ ఉన్న వాహనాలను స్కాన్ చేసి ఆ ఫొటోలను సేకరిస్తాయి. ఆ చిత్రాలు ఆపరేట్ వాహనంలో ఉన్న సిబ్బంది తమ కంప్యూటర్ స్క్రీన్‌పై ఎక్స్‌రే వ్యూలో చూస్తుంటారు. వీటిని జూమ్ చేసుకునే సదుపాయమూ ఉంటుంది. స్కాన్ చేసిన చిత్రాల్లో ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే.. వెంటనే భద్రతా దళాలను అప్రమత్తం చేయడానికి సమాచార వ్యవస్థ కూడా సదరు వాహనంలోనే ఉంటుంది. -
ప్రధాని పర్యటన తొమ్మిది గంటలు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కణ్నుంచి హెలికాఫ్టర్‌లో 2.05 గంటలకు మియాపూర్ హెలిప్యాడ్‌కు.. అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. 2.15 నుంచి 2.23 వరకు మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి.. హైదరాబాద్ మెట్రోను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ప్రదర్శించే ఆడియో విజువల్ దృశ్యమాలికను తిలకిస్తారు. మెట్రో రైలు బ్రోచర్‌ను, ప్రయాణికులకు అనువుగా రూపొందించిన యాప్‌ను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 2.40 వరకు మియాపూర్ నుంచి కూకట్పల్లి, అక్కణ్నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలులో ప్రయాణం చేస్తారు. 2.55కు మియాపూర్ నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి 3.15కు హెచ్ఐసీసీ చేరుకుంటారు. 3.25కు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు వేడుక వద్దకు చేరుకుంటారు. 3.25 నుంచి 7.25 వరకు సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. 7.30కి అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 8 గంటలకు తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. 8 గంటల నుంచి 10 గంటల వరకు అక్కడ విందులో పాల్గొంటారు. 10.05 గంటలకు అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో 10.25కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ముఖాముఖీ భేటీలు.. సాయంత్రం 5.30 నుంచి 5.48 వరకు మూడు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందాలతో ప్రధాని ప్రత్యేకంగా భేటీ అవుతారు. 5.48 నుంచి 5.56 వరకు మెమెంటోలను బహూకరిస్తారు. 5.56 నుంచి 6.03 వరకు గ్రూప్ మీటింగ్‌లో పాలుపంచుకుంటారు. 6.32 వరకు నలుగురు పారిశ్రామిక దిగ్గజాలతో విడివిడిగా ప్రధాని సమావేశమవుతారు. 6.32 నుంచి రాత్రి 7 గంటల వరకు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మర్యాదపూర్వక భేటీల అనంతరం 7.30కు అక్కణ్నుంచి బయల్దేరి ఫలక్‌నుమా చేరుకుంటారు. ఫలక్‌నుమాలో ప్రత్యేక ఆకర్షణలు ఫలక్‌నుమాలో రాత్రి 8 గంటలకు భారత ప్రభుత్వం ఇచ్చే విందులో ముందుగా దేశ, విదేశీ అతిథులకు స్వాగతం పలుకుతారు. 8.05 నుంచి 8.20 వరకు ‘ట్రీ ఆఫ్ లైఫ్’పేరుతో భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శన ఉంటుంది. 8.20 నుంచి 8.35 వరకు భారత చారిత్రక వారసత్వంపై లైవ్ షో ప్రదర్శిస్తారు. 8.45 నుంచి 9.50 వరకు విందు ఉంటుంది. 10 గంటలకు ప్రధాని మోదీ తిరుగుపయనమవుతారు. 3 నిమిషాలు కేసీఆర్.. 5 నిమిషాలు ఇవాంకా.. జీఈఎస్ ప్రారంభోత్సవ షెడ్యూల్ ఖరారైంది. 3.25 నిమిషాలకు హెచ్ఐసీసీకి చేరుకోనున్న ప్రధాని 3.35 నుంచి 3.55 వరకు 20 నిమిషాల పాటు ఇవాంకా ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. నాలుగు గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 4 గంటల నుంచి 4.25 వరకు భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలుసుకునేందుకు సమయం కేటాయిస్తారు. 4.30కు కాన్ఫరెన్స్ హాల్‌కు చేరుకుంటారు. 4.30–4.40 వరకు మహిళల ప్రాధాన్యాంశంగా, నాలుగు కీలక రంగాలపై జీఈఎస్ రూపొందించిన ఆడియో, వీడియో దృశ్యమాలికను తిలకిస్తారు. 4.40 నుంచి 4.43 నిమిషాల వరకు సీఎం కేసీఆర్ సదస్సులో స్వాగతోపన్యాసం చేస్తారు. 4.43కు అధికారికంగా సదస్సును ప్రారంభిస్తారు. 4.45 నుంచి 4.50 నిమిషాల వరకు ఇవాంకా సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 4.50 నుంచి 5.10 వరకు ప్రధాని ప్రసంగిస్తారు. 5.10 నుంచి 5.13 వరకు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కృతజ్ఞతలు తెలుపుతారు. 5.30 వరకు విరామ సమయంగా కేటాయించారు. -
పెట్టలేం ఏ వంకా..
జీవితంలో ఏదైనా సాధించాలంటే... గాఢంగా ప్రేమించాలి. ఆ ప్రేమ నుంచి పుట్టుకొచ్చేదే.. దీక్ష, తపన, సంకల్పం. ఇవాంకా తన బిజినెస్‌ను ప్రేమించింది... సమాజాన్ని ప్రేమించింది. నాన్నను ప్రేమించింది... అంతెందుకు? తను ప్రేమించిన కుష్నర్ కోసం అతడి మతాన్ని ప్రేమించింది. ఇవాంకా ట్రంప్... ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ లవ్! జీవితాన్ని ఇంతగా ప్రేమించిన ఇవాంకా కు ఇక ఏ వంక పెట్టగలం?! అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఈనెల 28న హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. హిల్లరీకి విరాళం బిల్ క్లింటన్, హిల్లరీల కూతురు చెల్సీ.. ఇవాంకాకు చిన్ననాటి స్నేహితురాలు. అందుకే 2008లో హిల్లరీ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరాక్ ఒబామాతో పోటీపడుతున్నపుడు హిల్లరీకి ఎన్నికల విరాళమిచ్చారు ఇవాంకా. ఇప్పుడు ట్రంప్‌కి హిల్లరీ ప్రత్యర్థి. బహుముఖ ప్రజ్ఞాశాలి కుటుంబ రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ఇవాంకా... ‘ట్రంప్ గ్రూపు’ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ (కొనుగోళ్లు, అభివృద్ధి విభాగాలు)గా ఎదిగారు. సోదరులు డొనాల్డ్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌లతో కలిసి ట్రంప్ హోటల్స్‌ను స్థాపించారు. వాషింగ్టన్‌లోని చారిత్రక ఓల్డ్ పోస్ట్ ఆఫీసును 1,300 కోట్ల రూపాయలతో లగ్జరీ హోటల్‌గా మలచడంలో, మయామీలోని డొరల్ గోల్ఫ్ రిసార్ట్‌ను 1,600 కోట్ల రూపాయలతో ఆధునీకరించడంలోనూ ఇవాంకా ముఖ్యభూమిక పోషించారు. రచయిత్రి కూడా! ఇవాంకా రచయిత్రి కూడా. ఇప్పటిదాకా రెండు పుస్తకాలు రాశారు. ‘ది ట్రంప్ కార్డ్: ప్లేయింగ్ టు విన్ వర్క్ అండ్ లైఫ్’... ఇది 2009లో ప్రచురితమైంది. రెండో పుస్తకం... ‘వుమెన్ హూ వర్క్: రీరైటింగ్ ది రూల్స్ ఫర్ సక్సెస్’. రెండోది ఈ ఏడాది మే నెలలో ప్రచురితమైంది. దీంట్లో మహిళలు ఉద్యోగ– ఇంటి బాధ్యతల మధ్య సమతౌల్యం సాధించడం ఎలాగో సూచనలు చేశారు. విమర్శల్ని తిప్పికొట్టారు ట్రంప్ నోటికి అదుపు ఉండదు. మహిళలను చులకన చేస్తూ ట్రంప్ మాట్లాడిన టేపులూ ప్రచారపర్వంలో బయటకు వచ్చాయి. ఆ సమయంలో ఇవాంకా ఆయన్ను సమర్థించారు. తండ్రిపై విమర్శలను తిప్పికొట్టారు. చదువుతూనే మోడలింగ్ డొనాల్డ్ ట్రంప్‌కు, చెక్ రిపబ్లిక్కు చెందిన మోడల్ ఇవానా (మొదటి భార్య)లకు రెండో సంతానంగా ఇవాంకా ట్రంప్ అక్టోబర్ 30, 1981లో జన్మించారు. ఇవాంకాకు పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోగా... ఆమె తండ్రి వద్ద పెరిగింది. చదువును నిర్లక్ష్యం చేయనని తల్లిదండ్రులను ఒప్పించి మరీ 14 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. వారాంతాల్లో, సెలవుల్లో టామీ హిల్ఫిగర్, ససాన్ జీన్స్ బ్రాండ్లకు మోడల్‌గా చేసింది. 1997లో సెవంటీన్ మ్యాగజైన్ కవర్‌పేజీపై కనిపించింది. అదే ఏడాది మిస్ టీన్ యూఎస్ఏ పోటీకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రేమ కోసం మతం మార్పు ఉమ్మడి మిత్రులైన కొద్దిమంది ద్వారా ఇవాంకా 2005లో రియల్టర్ జేర్డ్ కుష్నర్ను మొదటిసారి కలుసుకున్నారు. మూడేళ్లు డేటింగ్ చేశాక సంప్రదాయ యూదులైన కుష్నర్ తల్లిదండ్రుల అభ్యంతరాలతో వీరు విడిపోయారు. అయితే... ఇవాంకా యూదు మతం స్వీకరించి మరీ 2009లో కుష్నర్ను వివాహమాడారు. డొనాల్డ్ ట్రంప్ కూతురు నిర్ణయానికి పూర్తి మద్దతు ఇచ్చారు. తండ్రి స్పీడ్‌కు బ్రేకు తండ్రికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఇవాంకా వ్యవహారశైలి. డొనాల్ట్ ట్రంప్‌ది దుందుడుకు స్వభావం. వ్యతిరేకులు, విమర్శకులపై ట్వీటర్లో తీవ్రంగా విరుచుకుపడతారు. ఇవాంకా మితభాషి. కలుపుగోలుగా ఉంటారు. తన అభిప్రాయాన్ని చాలా మృదువుగా సూటిగా, స్పష్టంగా చెబుతారు. మధ్యలో అడ్డుకోకుండా ఎదుటివారు చెప్పేది సాంతం వింటారు. మహిళా సాధికారత, సమాన వేతనం... తదితర అంశాలను ఇవాంకా ప్రచారంలో విరివిగా ప్రస్తావించడం... మహిళా ఓటర్లలో డొనాల్డ్ ట్రంప్ పట్ల సానుకూలత ఏర్పడడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు ట్రంప్‌లో దూకుడు, మాటల్లో కరుకుదనం కనిపించడం లేదు. దీని వెనుక ఇవాంకా పాత్ర ఉంది. మొహ మాటం లేని అమ్మాయి ఈ ఏడాది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇవాంక మొదటి రెండు నెలలు అనధికారికంగా తండ్రికి సలహాదారుగా ఉన్నారు. తగిన నిర్ణయాలు తీసుకోగలదని, అభిప్రాయాలను వెల్లడించడంలో నిర్మొహమాటంగా ఉంటారని ఇవాంకకు పేరు. దాంతో డొనాల్ట్ ట్రంప్ మార్చి 29న ఆమెను తన సలహాదారుగా నియమించుకున్నారు. జీతం లేకుండా అమెరికా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయడానికి ఇవాంక ముందుకు వచ్చారు. నిబంధనల ప్రకారం తన ఆస్తులను ప్రకటించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఐఎస్‌డబ్ల్యూ, యూఎస్ సీక్రెట్ సర్వీస్ తో భద్రత
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలోని ఫలక్ నుమాలో ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రజల సహకారంతోనే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. కాగా నగరంలో ఈనెల 28నుంచి అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు జరగనున్న నేపథ్యంలో ఫలక్‌నుమా పరిసర ప్రాంతాల్లో పోలీసులు శుక్రవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్రాంతాలపై పోలీస్ నిఘా పెంచారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...పాతబస్తీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో పలువురి అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే అంతర్జాతీయ సదస్సు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ఇక ఇవాంకా ట్రంప్ చార్మినార్ సందర్శనపై ఇప్పటివరకూ తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపారు. సీపీ మాట్లాడుతూ...‘28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మియాపూర్‌లో మెట్రో రైలు ప్రారంభోత్సవానికి హాజరు అవుతున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రధాని, ఇవాంకా ట్రంప్‌తో పాటు 100మంది ప్రత్యేక అతిథులు హాజరు అవుతున్నారు. అలాగే వారికి ఫలక్ నుమా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు గంటలపాటు ప్రధాని ప్యాలెస్‌లో ఉండే అవకాశం ఉంది. ఐఎస్‌డబ్ల్యూ (రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్), యుఎస్ సీక్రెట్ సర్వీస్ వారితో ...ఇంటర్నల్ మీటింగ్‌కు భద్రత పెంచాం. రెండువేలమందితో బందోబస్తు ఏర్పాటు చేశాం, హోంగార్డు నుంచి కమిషనర్ స్థాయి అధికారులు వరకూ అంతా ఆన్‌డ్యూటీలో ఉంటారు.’ అని తెలిపారు. -
ఐఎస్‌డబ్ల్యూ, యూఎస్ సీక్రెట్ సర్వీస్ తో భద్రత
-
ఇవాంక.. ఇటువంక
అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్య సదస్సు నేపధ్యంలో నగరానికి వస్తున్న ఇవాంకా ట్రంప్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు రానున్నారు. దీంతో పోలీసులు పాతబస్తీ పరిసరాలను జల్లెడ పట్టారు. ఇప్పటికే ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. కాలనీల్లో కొత్తగా ఇళ్లను అద్దెకు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా.. జీఈఎస్ సదస్సుకు అవసరమైన వాహనాల సేకరణలో ఆర్టీఏ అధికారులు తలమునకలయ్యారు. మరోపక్క హెచ్ఐసీసీ పరిసరాల్లో రోడ్లు, ఫుట్‌పాత్‌లకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ పరసరాల్లో డెలిగేట్స్ వాహన శ్రేణికి అడ్డు పడకుండా ఉండేందుకు వెటర్నరీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకెళుతున్నారు. ఇవాంక రాక కోసం భాగ్య నగరం ప్రత్యేకంగా ముస్తాబవుతోంది. పాత బస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సదస్సు జరిగే హెచ్ఐసీసీ ప్రాంతంలో రహదారులను అందంగా ముస్తాబు చేశారు. ఇవాంకకు బహుకరించేందుకు లాడ్ బజార్‌లోని గాజుల వ్యాపారులు ప్రత్యేకంగా గాజులను తయారు చేశారు. చార్మినార్: అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్య సదస్సు (గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్–జీఈఎస్)లో పాల్గొనేందుకు నగరానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వస్తున్న నేపథ్యంలో దక్షిణ మండలం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఫారూఖ్‌నగర్, ఫాతిమానగర్, బీబీకా చస్మా, జంగమ్మెట్, మదీనా కాలల్లో ఇంటింటి సర్వే నిర్వహించి స్థానికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. కొత్తగా ఎవరికీ ఇళ్లను అద్దెకు ఇవ్వరాతని ఆదేశాలు జారీ చేశారు. 3 వేల ఇళ్ల సర్వే... మూడు వేల ఇళ్లను తనిఖీ చేసి సమాచారాన్ని సేకరించిన పోలీసులు ఈ నెల 28న అత్యవసరమైతే తప్ప వీధుల్లోకి రాకూడదని స్థానికులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై తమకు ఫిర్యాదు చేయాలని, అపరిచిత వ్యక్తులకు ఇళ్లను అద్దెకివ్వరాదని తెలిపారు. సీసీ కెమెరాల నీడలో.. ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లోని గల్లీల్లో సైతం కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 28న చిరు వ్యాపారులు వీధుల్లోకి రాకూడదని తెలిపారు. పోలీసుల ఆంక్షలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 180 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానుండటంతో బందోబస్తు తప్పదని పోలీసులు పేర్కొన్నారు. 28న ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ నెలకొననుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ సహకరించాలి ఇవాంక ట్రంప్ పర్యటన నేపథ్యంలో స్థానికులు పూర్తిగా సహకరించాలని దక్షిణ మండలం అదనపు డీసీపీ మహ్మద్ గౌస్ మోహీద్దీన్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ ఫయాజుద్దీన్‌లు కోరారు. ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసర బస్తీల ప్రజలతో బుధవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో తమ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వస్తున్నందున బందోబస్తుకు సహకరిస్తూ ప్రతినిధులకు స్వాగతం పలకాలన్నారు. ఇవాంక రాక కోసం లాడ్‌బజార్ ముస్తాబు సాక్షి సిటీబ్యూరో: చారిత్రాత్మక భాగ్యనగరం మరో అంతర్జాతీయ వేడుకలకు సన్నద్ధమవుతున్న వేళ....పాతబస్తీలోని లాడ్‌బజార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహ్మద్ కులీకుతుబ్‌షా గారల పట్టి హయాత్ బక్షీ కోసం అప్పట్లో ఏర్పాటు చేసిన చుడీబజార్ (లాడ్ బజార్) ఇప్పుడు అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ సందర్శన కోసం ముస్తాబైంది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ముత్యాలు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే గాజులకు నెలవైన హైదరాబాద్ లాడ్‌బజార్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇవాంక మనస్సు దోచుకొనే రకరకాల డిజైన్ గాజులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఒక్క గాజులే కాకుండా వెరైటీ వస్త్రాలు, ఆభరణాలు, శతాబ్దాలుగా మగువల మదిని దోచుకుంటున్న డిజైన్లు ఇవాంకా కోసం పాతబస్తీలో ప్రదర్శనకు ఉంచారు. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సులో భాగంగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందుకు హాజరుకానున్న ఇవాంకా పాతబస్తీలోని లాడ్‌బజార్‌ను సైతం సందర్శించవచ్చుననే సమాచారంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేకంగా గాజుల తయారీ ఈ సందర్బంగా లాడ్ బజార్‌లోని ఖాజా బ్యాంగిల్ స్టోర్ యజమాని మహ్మద్ అన్వర్ భారత జాతీయ జెండా, అమెరికా దేశ పతాకం రంగులతో నెల రోజుల పాటు శ్రమించి అద్భుతమైన గాజుల పేరును తయారు చేశారు. హైదరాబాదీ లక్క బ్యాంగిల్స్ తరహాలో తయారు చేసిన ఈ గాజులలో కట్ గ్లాస్ స్టోన్‌ను సెట్లో అమర్చారు. ఇవాంక ట్రంప్ లాడ్ బజార్ సందర్శనకు వస్తే భారత, అమెరికా దేశ పతాకాలతో రూపొందించిన గాజుల సెట్‌ను బహూకరించనున్నట్లు అన్వర్ తెలిపారు. తుది మెరుగులు గచ్చిబౌలి: జీఈఎస్ సదస్సు ఏర్పాట్లలో భాగంగా జీహెచ్ఎంసీ మాదాపూర్ సైబట్టవర్ సమీపంలో చేపడుతున్న ఫుట్‌పాత్ పనులతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్‌లోని కరాచీ బేకరీ నుంచి సైబర్ టవర్ జంక్షన్‌తో పాటు మైండ్‌స్పేస్ జంక్షన్ వైపు ఫుట్‌పాత్ పనులు కొనసాగుతున్నాయి. సైబర్‌టవర్ జంక్షన్‌లోని బీటీ రోడ్డు వాహనాల రద్దీకి అనుగుణంగా లేకపోవడంతో ప్రతిరోజూ ట్రాఫిక్ జాం నెలకొంటుంది. హె చ్ఐసీసీ రోడ్డులోని ఖానామెట్ చౌరస్తాలో రోడ్డు గ్రీన్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. బుద్ద విగ్రహం ఏర్పాటు హెచ్ఐసీసీ వెళ్లే రోడ్డులో గౌసియా కేఫ్ వద్ద డెలిగేట్స్‌కు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఆర్చ్ సమీపంలో బుద్ద విగ్రహం ఏర్పాటు చేయడంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. సుందరంగా హెచ్ఐసీసీ రోడ్డు మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లకు ట్రీపెయింటింగ్ వేశారు. పచ్చిక, పూల మొక్కలు నాటుతున్నారు. సర్వీస్ రోడ్డులోని పూలకుండీలకు వైష్ణవి ఆర్కిటెక్చర్ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా రంగులు అద్దుతున్నారు.హైటెక్స్ కమాన్‌తో పాటు మేడిన్ లైటింగ్ అమర్చుతున్నారు. హైటెక్స్ నుంచి హెచ్‌సీసీ వరకు రంగురంగులు విద్యుత్ బల్బులు ఏర్పాటు చేశారు. వాహనాల వేట సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రతినిధుల రాకపోకలకు ఎంపిక చేసే వాహనాల విషయంలో రవాణా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విదేశీ ప్రతినిధుల భద్రత, సౌకర్యం దృష్ట్యా వాహనాల ఎంపికను సీరియస్‌గా పరిగణిస్తున్నారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్, తదితర వర్గాల నుంచి వాహనాలను సేకరించడం ఆర్టీఏకు సవాల్‌గా మారింది. ఇందుకు వినియోగించే వాహనాలన్నీ 2016, 2017 సంవత్సరానికి చెందినవి మాత్రమే అయి ఉండాలని ప్రభుత్వం స్పష్టం గా పేర్కొనడంతో డిమాండ్‌కు తగిన విధంగా వాహనాలను సేకరించడం సమస్యగా మారింది. ప్రతినిధుల కోసం 250 ఇన్నోవాలు, భద్రతా సిబ్బంది కోసం మరో 50 ఇన్నోవాలను ప్రతిపాదించారు. వీటికితోడు ఆర్టీసీ సుమారు 60 మల్టీ యాక్సిల్ ఓల్వో బస్సులను ఏర్పాటు చేసింది. కొన్ని మార్గాల్లో పెద్ద బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తాజాగా అధికారులు మినీ బస్సులపై దృష్టి సారించారు. గత రెండు రోజులుగా సుమారు 40 మినీ బస్సులను ఎంపిక చేయగా, వాటిలో చాలా వాహనాలకు గీతలు (స్క్రాచెస్) ఉన్నాయని, లుక్ బాగా లేదనే కారణంతో తిప్పి పంపారు. దీనికితోడు డ్రైవర్ల ఎంపికలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వాహనాలు ఏ మార్గంలో ఫలక్‌నుమాకు వెళ్తాయి. ఏ మార్గంలో తిరిగి వస్తాయనే అంశంపై గోప్యతను పాటిస్తున్నారు. రవాణాకు ప్రత్యేక కమిటీ... జీఈఎస్ సదస్సుకు రవాణా సదుపాయాలపైన పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ రమణారావు, హైదరాబాద్ జేటీసీ పాండురంగ్‌నాయక్ కమిటీ సభ్యులుగా విధులు నిర్వహిస్తారు. ఆర్టీసీ, ఆర్టీఏకు చెందిన అధికారులు వాహనాల సేకరణపైన దృష్టి సారించారు. -
ఇవాంకా జర్నీ..సునీత కామెంట్
సాక్షి,ముంబై: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సు-2017’ పై సామాన్యుడినుంచి సెలబ్రిటీలదాకా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న హడావిడి, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హంగామాపై ఇప్పటికే చాలామంది సెటైరికల్‌గా స్పందించారు. ఇరువైపులా పెయింటింగ్‌లు, పచ్చదనంతో ముచ్చటేస్తున్న రోడ్లను చూసి.. తమ రోడ్లకు ఆ భాగ్యం కలిగితే బావుండు అన్నట్టు స్పందించారు. తాజాగా టాలీవుడ్ గాయని సునీత కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం- ఖాజాగూడ రోడ్డు గుండా రావడం లేదేమో.. వస్తే బావుండు’’ అంటూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ ముస్తాబంతా ఇవాంక ప్రయాణించే మార్గాలకే పరిమితమా? అన్నట్టుగా సింగర్ సునీత చేసిన కామెంట్‌పై నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. కాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకకు ఘనంగా స్వాగతం పలికేందుకు సర్వహంగులతో సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అటు సెక్యూరిటీపరంగా, ఇటు ముస్తాబు పరంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆమె పర్యటించే ప్రాంతాలన్నీ కొత్త కళను సంతరించుకుంటున్నాయి. ఐటీ కారిడార్, పాతబస్తీలోని రోడ్లన్నీ తళతళా మెరిసిపోతున్న సంగతి తెలిసిందే. -
షైనింగ్ సిటీ
దేశ, విదేశీ ప్రతినిధుల రాకకోసం నగరం ముస్తాబైంది. సిటీలోని రహదారులు సరికొత్త మెరుపులు సంతరించుకున్నాయి. రోడ్ల పక్కనున్న గోడలు, వంతెనలు అందమైన చిత్రాలతో నిండిపోయాయి. మరో నాలుగు రోజుల్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాంకా ట్రంఫ్ కోసం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సర్వాంగ సుందరంగా మార్చేశారు. హైటెక్స్ పరిసరాలను సరికొత్త విద్యుత్ కాంతులతో నింపేశారు. ఈ మార్గంలోని ప్రతి మొక్కా, చెట్టూ వెలుగులు విరజిమ్ముతున్నాయి. సదస్సుకు వచ్చే అతిథులను ఆకర్షించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూ.56 లక్షల ఖర్చుతో ఈ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. హైటెక్స్‌కు ప్రధాన మార్గమైన మినీ చార్మినార్‌కు శక్తివంతమైన పవర్ క్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. ఘడియకో డిజైన్ మారుతూ చూపరులను ఆకట్టుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: వచ్చేవారంతా దేశ, విదేశీ ప్రతినిధులు. వివిధ దేశాల్లోని విద్యుత్ వెలుగులు చూసిన వారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు రాత్రులను రంగుల హోలీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. వీధిదీపాల స్థానంలోని ఎల్ఈడీలతో రేయి పగలుగా మార్చేస్తున్నారు. సదస్సు ప్రతినిధుల మనసులు దోచుకునేందుకు రోజురోజుకూ మారుతున్న ఆలోచనలతో మరింతగా రిహార్సల్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు(జీఈఎస్) జరుగనున్న హైటెక్స్ పరిసరాల్లో సరికొత్త విద్యుత్ కాంతులు రానున్నాయి. దారి పొడవునా ఎల్ఈడీ దీపాలే కాక మరింత ప్రత్యేకంగా సీతాకోక చిలుక ఆకారంలో కనబడేలా వెలుగులిచ్చే బల్బులను ఏర్పాటు చేస్తున్నారు. చెట్టు పుట్ట, ట్రాఫిక్ ఐలాండ్లు, ఫ్లై ఓవర్లతో సహా రహదారులు మొత్తం విద్యుత్ కాంతులతో కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు వివిధ రకాల రంగుల బల్బులకు సిద్ధమైన అధికారులు.. అవేవీ నచ్చక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల ‘పవర్ క్యాన్ల’ ద్వారా నిమిష నిమిషానికీ రంగులు మారి వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రెండు నుంచి నాలుగు పవర్ క్యాన్లను ఏర్పాటు చేస్తారు. ఈ క్యాన్ల నుంచి ఎరుపు, పుసుపు, గులాబీ, ఆకుపచ్చ, ఆరెంజ్, నీలం తదితర రంగుల కాంతులు ప్రసరిస్తాయి. దాంతో పరిసరాలు మొత్తం కాంతివంతమవనున్నాయి. ఈ ప్రత్యేక రంగులిచ్చేందుకు వినియోగిస్తున్న పవర్ క్యాన్ల అద్దె రోజుకు ఒక్కోదానికి రూ.10 వేలు వెచ్చిస్తున్నారు. ఇలా మొత్తం 500 పవర్ క్యాన్లను హైటెక్స్ పరిసరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక రంగుల కాంతుల కోసమే రూ. 56 లక్షలు ఖర్చు చేస్తున్నారు. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నుంచి మినీ చార్మినార్ వరకు, గచ్చిబౌలి ఫ్లై ఓవర్ నుంచి కొత్తగూడ జంక్షన్ మీదుగా మినీ చార్మినార్ వరకు, మినీ చార్మినార్ నుంచి న్యాక్ భవనం వరకు 27 నుంచి 30వ తేదీ వరకు ఈ ప్రత్యేక రంగుల కాంతులే కనిపించనున్నాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మినీ చార్మినార్‌కు మరింత శోభ హైటెక్స్‌కు ప్రధాన ఆకర్షణ అయిన మినీ చార్మినార్ వద్ద మరింత శక్తివంతమైన పవర్ క్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. చార్మినార్ ఒక్కో స్తంభానికి నాలుగు పవర్ క్యాన్లు ఉంచి ఘడియకో డిజైన్ మారుతూ చూపరులను ఆకట్టుకునేలా కాంతులు ప్రసరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దేశంలోని ముంబై, బెంగళూర్, కోల్కత్తా నగరాల్లో జరిగిన ప్రత్యేక సదస్సుల సందర్భంగా చేసిన ఏర్పాట్లకు ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ హంగులు అద్దుతున్నారు. ఆ నగరాలతో పాటు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేస్తున్న ఏజెన్నీ ఈ ఏర్పాట్లు చేస్తోందని సంబంధిత అధికారి తెలిపారు. పుష్పాలు వలయాకారంలో తిరుగుతున్నట్లు కనబడేందుకు డీఎన్‌ఎఫ్ లైట్లు వినియోగిçస్తున్నారు. మినీ చార్మినార్ కాంతులకు పూర్తిగా జనరేటర్‌ను వినియోగించనున్నారు. అద్భుతమైన కాంతులతో చేసే ఏర్పాట్లకు ఎలాంటి విద్యుత్ అవాంతరాలు లేకుండా ఉండేందుకు పూర్తిగా జనరేటర్లనే వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. లండన్ వంటి నగరాల్లో అంతర్జాతీయ సదస్సులు జరిగితే ప్రతి ఇంట్లోనూ జెండాలు ఎగురవేస్తూ స్వాగతాలు పలుకుతారని, అలాంటిది మన నగరంలో జరిగే సదస్సు ప్రత్యేకత కనబడేలా, విద్యుత్ కాంతులతో అందరి దృష్టిని ఆకట్టుకునేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన దాసరి తెలిపారు. హైదరాబాద్‌లో గతంలో జరిగిన సీఓపీ–11, మెట్రోపొలిస్ వంటి జాతీయ, అంతర్జాతీయ సదస్సుల సందర్భంగా వివిధ ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రత్యేక విద్యుత్ కాంతులకు ఇంతపెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేయలేదు. దాదాపు 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నందున అందరికీ హైదరాబాద్ పర్యటనను ఒక రంగుల కలగా మార్చేందుకు ఈ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. హెచ్ఐసీసీ పరిసరాలతో పాటు ఇవాంకా ట్రంప్ బసచేసే వెస్టిన్ హోటల్ పరిసరాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులకు విందు ఇస్తున్న ఫలక్‌నుమా ప్యాలెస్, రాష్ట్ర ప్రభుత్వ విందు వేదిక అయిన గోల్కొండ కోట మార్గాల్లోనూ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇవాంకా పర్యటన ఇలా..