jakkampudi raja
-
జక్కంపూడి రాజాను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
-
ఇసుక దోపిడీ అడ్డుకోవాల్సిన అధికారులే చోద్యం చేస్తున్నారు
-
ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?: జక్కంపూడి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే, చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ పేదలకు ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వ హయాంలో 72 వేల ఎకరాలు సేకరించి, వాటిలో 17 వేల కాలనీల్లో పూర్తి మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందు కోసం ఏకంగా రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి సంపద సృష్టిస్తే, దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా ఆక్షేపించారు.చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు: నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న ముని శాపం ఉండటం వల్లనేమో చంద్రబాబు ఏనాడూ నిజాలు చెప్పడు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోందని ఊరూరా తిరిగి తప్పుడు ప్రచారం చేశాడు. రాష్ట్రం అప్పులపై కూటమి నాయకులంతా కలిసిమెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తాను అధికారంలోకి వస్తే 40 ఏళ్ల అనుభవంతో సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు నమ్మబలికాడు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుని.. తీరా అధికారంలోకి వచ్చాక బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనేలా పాలన సాగిస్తున్నాడు. అసలే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే, కొత్తగా రకరకాల పన్నుల రూపంలో ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ఇప్పటికే కరెంట్ బిల్లుల రూపంలో ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపాడు.నాడు అప్పులపై దుష్ప్రచారం:ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రం అప్పులు రూ. 14 లక్షల కోట్లని ప్రచారం చేసి, తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు రూ.4.6 లక్షల కోట్లని కూటమి ప్రభుత్వమే ప్రకటించింది. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లని చెబుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలిచ్చారు. ఈ రోజు వాస్తవ అప్పులు రూ. 4.6 లక్షల కోట్లే అని తెలిసినా హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం. గత వైఎస్ జగన్ పాలనలో తీవ్రమైన కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాల అమల్లో సాకులు చెప్పి తప్పించుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం వాగ్ధానాలను అమలు చేయలేక చేతులెత్తేశారు.ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?. తాజాగా ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు 50 శాతం పెంచబోతున్నట్టు ప్రకటించారు. ఆదాయార్జనే ధ్యేయంగా ప్రజల నడ్డి విరచడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎంత వీలైతే అంత దోచుకోవడానికి వ్యూహరచనలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పిన విజనరీ ఏడు నెలల్లోనే ఒక్క పథకం కూడా అమలు చేయకుండానే చేతులెత్తేశాడు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల చంద్రబాబు దావోస్ వెళ్లినా పారిశ్రామికవేత్తులు పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. అందుకే ఒక్క రూపాయి పెట్టుబడులు తీసుకురాలేకపోయారు.సెంటు స్థలం కూడా ఇవ్వని బాబు:సుదీర్ఘకాలం సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదవారికి ఇంటి కోసం సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఆయన మాత్రం హైదరాబాద్‌లో ఇంద్ర భవనం నిర్మించుకుని విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు. దివంగత వైఎస్సార్ హయాంలో పేదవారికి ఇళ్ల పంపిణీ జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఏకంగా 31 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతోపాటు ప్రభుత్వం తరఫున ఇంటి నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ భూములతోపాటు రైతుల నుంచి భూములు సేకరించడం జరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు మా పథకానికి పేర్లు మార్చి తానే చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు.ఇంటి పట్టాల కోసం 71,811 ఎకరాలు సేకరణరూ.11,343 వేల కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటే ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాని విలువ రూ. 31,832 కోట్లు.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే 71,811 ఎకరాల భూమి విలువ కనీసం రూ.75 వేల కోట్లకుపైనే ఉంటుంది. దీంతో పాటు ఇళ్ల స్థలాలకు మౌలిక వసతుల కల్పనకు రూ. 32,909 కోట్లు వెచ్చించడం జరిగింది.ఇళ్ల పట్టాలు పొందిన వారిలో 22 లక్షల మందికి రూ. 1.80 లక్షల చొప్పున హౌసింగ్ శాంక్షన్ ఇచ్చాం. దీంతోపాటు అదనంగా డబ్బులు అవసరం అనుకుంటే పూర్తిగా సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాం. ఇందుకోసం రూ. 57,375 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా రూ. 1.27 లక్షల కోట్లు పేదల ఇళ్ల నిర్మాణం కోసం గత జగన్ ప్రభుత్వ ఖర్చు చేయడం జరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలతో ఊర్లకు ఊర్లే రూపుదిద్దుకున్నాయి. దాదాపు 17వేలకుపైగా కాలనీలు ఏర్పడ్డాయి. ఆయా కాలనీల్లో అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ గ్రావెల్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, కరెంట్ పోల్స్ వంటి మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉచితంగా ఎలక్ట్రిక్ మీటర్లు కూడా బిగించాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సబ్ స్టేషన్లతో పాటు అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేశాం.ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా అందంగా తీర్చిదిద్దాం. ఇంటి పట్టాను కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి వారి గౌరవాన్ని మరింత పెంచాం. పేదలకు మంచి చేయాలని ఇంత గొప్పగా ఆలోచిస్తే చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు. అమరావతి రాజధానిలో పట్టాలు పంపిణీ చేస్తే సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని కోర్టుకెళ్లిన దిక్కుమాలిన ఆలోచన చేసిన ఘనుడు చంద్రబాబు అని జక్కంపూడి రాజా గుర్తు చేశారు. -
కూటమి సర్కార్ పై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
-
‘సంక్రాంతికి వెరైటీ దోపిడీ.. కూటమి సూపర్ ఫైవ్ ఇవేనా?’
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja). ఏపీలో నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. పేకాట, గుండాట, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్, మద్యం అమ్మకాలు.. ఇదే కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు.రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబు(Chandrababu), పవన్(Pawan Kalyan) ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. సంక్రాంతి(sankranthi) సంబరాలు అంటే గంగిరెద్దులు ముగ్గులు, అక్కడక్కడ కోడిపందాలు మాత్రమే గతంలో ఉండేవి. సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చారు కూటమి నేతలు.. నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు.. గుండాటలు జరిగాయి.ఒక్కో మహిళకు నెలకు 15వేలు చొప్పున ఆర్థిక సాయం అన్నారు.. సూపర్ సిక్స్ మేనిఫెస్టో దేవుడి పేరిట అటకెక్కింది. పేకాట, గుండాట.. కోడిపందాలు.. రికార్డింగ్ డ్యాన్స్.. మద్యం అమ్మకాలు.. ఇవే కూటమి మేనిఫెస్టో. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చూసినట్టు కోడి పందాలను, ప్రీమియర్ లీగ్‌లా నిర్వహించి పార్కింగ్ పేరిట సామాన్యుడి దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో భూపాలపట్నంలో డ్రగ్స్.. రేవ్ పార్టీలు.. రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి తీసుకొచ్చారు. అనకాపల్లిలో గంజాయి దొరికితే.. అందులో రాజానగరం నియోజకవర్గం కాపవరం గ్రామానికి చెందిన జనసేన నేతలు మూలాలు ఉన్నాయి.గంగాధర్ అనే వ్యక్తి గుండాటలో డబ్బులు పోయాయని ఆత్మహత్య చేసుకున్నాడు. బహిరంగంగా పోలీసులను కూడా వేదికలపై నుండి బయటకి గెంటేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గాల్సి వచ్చింది. కొన్నిచోట్ల సంక్రాంతికి అసలు పోలీసులు ఉన్నారా లేరా అనే ప్రశ్న తలెత్తింది. రాజమండ్రి పేపర్ మిల్‌పై వేలమంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి చేస్తున్నాడు. ప్రవీణ్ చౌదరికి తెలుగుదేశంలో మూలాలు ఉన్నాయి.. బుచ్చయ్య చౌదరి అడుగుజాడల్లో నడుస్తాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.. కూటమి పాలనపై జక్కంపూడి రాజా ఫైర్
-
యువకుడిని చితకబాదిన SIపై జక్కంపూడి రాజా పిర్యాదు
-
ప్రజల్లో వ్యతిరేకత వల్లే ఈ దౌర్జన్యాలు
రాజమహేంద్రవరం సిటీ: సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. గడిచిన ఆర్నెలల్లో ప్రభుత్వం ఏమీచేయకపోవడంవల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా చేశారని చెల్లుబోయిన ఆరోపించారు. విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్ సరి్టఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వీఆర్వోలను ఎమ్మార్వో ఆఫీసుల్లో ఉంచేయడం, కొన్నచోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి అడ్డగించడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారన్నారు. ఇక విజయనగరం జిల్లా ఎస్.కోటలో అయితే కూటమిలో భాగస్వామి అయిన బీజేపీకి చెందిన అభ్యరి్థనే నామినేషన్ వేయకుండా చేసి అధికార పార్టీకే కొమ్ము కాశారన్నారు. ఏమాత్రం పారదర్శకత లేకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వ్యవహరించడం దారుణమని చెల్లుబోయిన చెప్పారు. రైతులు బాగా అసంతృప్తితో ఉన్నారు : జక్కంపూడి వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకి మొదటినుంచీ అలవాటేనన్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి, ఈ ఆర్నెలల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు.ముఖ్యంగా రైతులు బాగా అసంతృప్తితో ఉన్నారని.. అందుకే సాగునీటి సంఘాల ఎన్నికలను అరాచక పద్ధతిలో నిర్వహిస్తున్నారని జక్కంపూడి విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే, రైతులకు ఎప్పటికప్పుడు రూ.13,500ల పెట్టుబడి సాయం అందించామని.. అయితే, కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడంలేదని ఎద్దేవా చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజలందరూ ప్రభుత్వ అరాచకాన్ని గమనిస్తున్నారని.. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు సమయం వచ్చినపుడు బుద్ధి చెబుతారన్నారు. -
హత్యాచారం దోషుల్ని కఠినంగా శిక్షించాలి
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీలోని బుర్రిలంకలో మహిళపై అత్యాచారం చేసి, హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ని కోరారు. వారు శనివారం రాజమహేంద్రవరంలో ఎస్పీని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు పార్టీ నాయకులతో కలిసి బుర్రిలంకలో బాధితురాలు రౌతు కస్తూరి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ.1.1 లక్షల ఆర్థికసాయం అందజేశారు. న్యాయం జరిగేంతవరకు తాము అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ తరఫున తాము వస్తున్నామని.. కూటమి ఎమ్మెల్యే హడావుడిగా వచ్చి బాధితుల చేతిలో రూ.పదివేలు పెట్టి వెళ్లడం చూస్తుంటే ఈ ఘటన పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోందని చెప్పారు. పత్రికలు తిరగేస్తే ఓ హత్య, ఓ మానభంగం కచ్చితంగా కన్పిస్తున్నాయన్నారు. ఇలాంటి దారుణాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ వాళ్ల కాళ్లు విరగ్గొడతామని, 11 సీట్లు వచ్చినా నోరు లేస్తోందా అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. దిశ యాప్ తీసేయడం ద్వారా నేరాలు చేసేవారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లయిందన్నారు. ఇంత పాశవికంగా మహిళను హత్య చేస్తే జనసేన, టీడీపీ నాయకులు బైటకు పొక్కకుండా చేయాలని ప్రయత్నించడం శోచనీయమని చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించకపోతే తమపార్టీ ఉద్యమిస్తుందని వారు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్ç³ర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గిరజాల బాబు తదితరులున్నారు. -
కూటమికి జక్కంపూడి రాజా స్ట్రాంగ్ వార్నింగ్
-
ప్రజల్లో తిరుగుబాబు మొదలైంది: జక్కంపూడి రాజా
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదవరి జిల్లాలో బిక్కవోలు మండలం ఇల్లపల్లిలో వైఎస్సార్సీపీ సర్పంచ్ లొల్ల భద్రంను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ కి ప్రయత్నించారు. కారులో తీసుకెళ్తుండగా కేకలు వేయగా గ్రామస్తులు.. కిడ్నాపర్లను పట్టుకుని దేహశుద్ధి చేయడంతో సర్పంచ్ క్షేమంగా బయట పడ్డారు. దండగుల పెనుగులాటలో సర్పంచ్‌కి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపి నేత గూడూరు శ్రీనివాస్ ఇల్లపల్లి సర్పంచ్‌ను పరామర్శించారు. అనంతరం జక్కంపూడి రాజా మీడియాతో మాట్లడారు. ‘‘ కూటమి ప్రభుత్వం దాడులు పెచ్చు మీరుతున్నాయి. ఇల్లపల్లిలో ప్రజలే తిరగబడి సర్పంచును కాపాడుకున్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అనపర్తిలో మరొక్క హింస పక్క సంఘటన చోటుచేసుకున్నా ఊరుకునేది లేదు. వేలాదిగా ప్రజలతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. అధికారం శాశ్వతం కాదు’’ అని అన్నారు. -
టీడీపీ నేతలపై జక్కంపూడి రాజా ఫైర్
-
దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం జక్కంపూడి రాజా వార్నింగ్
-
తప్పు ఎవరిది గెలిచినా ఓడినా జగన్ రియల్ హీరో
-
ఓటమిపై జక్కంపూడి రాజా రియాక్షన్
-
‘కాపుల కష్టాలను పట్టించుకోనివాళ్లు హీరోలు అయిపోయారు: జక్కంపూడి రాజా
తూర్పుగోదావరి: కన్నతల్లికి బాగోలేదన్నా పట్టించుకోకుండా, నియోజకవర్గం గురించే ఆలోచించానని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కోరుకొండ సీతానగరం మండలాల్లో రెండు పంటలకు నీరు ఇచ్చాం. వ్యవసాయం చక్కగా చేసుకునేందుకు అనువైన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ, పురుగుమందులు, గోడౌన్లు, యంత్ర పరికరాలు అన్నీ అందించాం. రూ. 25 కోట్లతో తొర్రిగడ్డ పంపిణీ స్కీం మోడరనైజ్ చేశాం. ప్రతి చిన్న ఫిర్యాదుకు స్పందించి జవాబుదారీ తనంతో పని చేశాం. నియోజకవర్గంలో లక్ష కుటుంబాలు ఉంటే 80 వేల కుటుంబాలకు వద్దకు నేనే వెళ్ళాను. నా కుటుంబ సభ్యులంతా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించాం. ఇవాల్టి పరిస్థితి చూస్తే ఇంతవరకు భ్రమలో బతికామా అన్నట్టు అనిపిస్తుంది.... మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఈ దమ్ముందా?. గెలిచినా ఓడినా రియల్ హీరో జగన్ మాత్రమే. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. గత ప్రభుత్వంలో పది లక్షలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగని రాజానగరం మండల కేంద్రంలో రూ. 20 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. .. ఏదేమైనా ప్రజల కోసం పనిచేస్తాం. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతోనే కలిసి నడుస్తాం. కాపు రిజర్వేషన్ కోసం శ్రమించిన ముద్రగడ లాంటి నాయకుడు అనేక మాటలు పడ్డారు. కాపుల కష్టాలను ఏనాడు పట్టించుకోని నాయకులు హీరోలు అయిపోయారు’’ అని అన్నారు. -
పవన్ పై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కామెంట్స్
-
YSRCP సిద్ధం సభకు శరవేగంగా ఏర్పాట్లు
-
చంద్రబాబు పై జక్కంపూడి రాజా ఫైర్
-
చంద్రబాబుకు మతిభ్రమించింది
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబుకు మతిభ్రమించడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే రాజమహేంద్రవరం రాగానే జైలు జీవితం గుర్తుకు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ఇతరులపై బురద జల్లడం మాని ముందు ఆయన పార్టీలోని అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఉన్నవి, లేనివి కల్పించి, వైఎస్సార్సీపీ, నేతలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయోగం చేస్తున్నారని, చంద్రబాబుకు ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. బాబు చిప్ అరిగిపోయింది: ఎంపీ మార్గాని చంద్రబాబుకు చిప్ అరిగిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. సోమవారం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఏనాడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న బాబు జైలు కిటికీల్లోనుంచైనా అభివృద్ధి చూడాలి కదా... అని వ్యంగ్యాస్త్రం సంధించారు. లోకేశ్‌ను రాజమహేంద్రవరంలో పోటీకి దింపితే ప్రజలు చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. తాను చేసిన అభివృద్ధిలో బాబు తన హయాంలో సగం చేసినట్లు నిరూపించినా తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మార్గాని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. -
పప్పు తుప్పు రేగ్గొట్టిన జక్కంపూడి
-
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్ (ఫోటోలు)
-
వైభవంగా 'జక్కంపూడి వారి పెళ్లి సందడి..' ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం!
సాక్షి, తూర్పుగోదావరి: స్థానిక శాసనసభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా సోదరుడు, వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్ దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్లో అంగరంగ వైభవంగా జరిగింది. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావుకు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అభిమానమంతా ఉవ్వెత్తున ఎగసివచ్చిందా అన్నట్టుగా అభిమాన గణం భారీఎత్తున తరలివచ్చి, ఆయన ద్వితీయ కుమారుడైన గణేష్ దంపతులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి నేరుగా దివాన్‌చెరువుకు హెలికాప్టర్లో వచ్చి, నూతన వధూవరులైన జక్కంపూడి గణేష్, సుకీర్తిలను ఆశీర్వదించి, కొద్దిసేపు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ సమయంలో కొంతమంది సీఎంతో సెల్ఫీలకు రిక్వెస్టు చేయడంతో అందుకు ఆయన చిరునవ్వుతో వారికి అవకాశం ఇచ్చారు. కుటుంబ సభ్యులే కాకుండా బంధువర్గంలోని వారు, అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో.. ఆహ్వానితులలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో సినిమా సెట్టింగ్‌లను తలపించేలా చేసిన ఏర్పాట్లు అందరినీ అబ్బురపరిచాయి. వివాహ రిసెప్షన్ వేదికపై యశస్వి కొండేపూడి మ్యూజిక్ బ్యాండ్ లైవ్‌తోపాటు సింగర్ శిల్ప, యాంకర్ దీప్తి నల్లమోతు, మిమిక్రీ రాజు, గోవింద్ డ్యాన్స్ టీమ్ లైవ్ ప్రోగ్రామ్స్ అలరించాయి. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, రంగుల రాట్నం, ‘పెట్టా తులాల్’ కేరళ నృత్యం, ప్రకృతి ఒడిలోకి వచ్చామా అనే రీతిలో ఆసక్తి ఉన్నవారు ఫొటో షూట్లు తీసుకునేలా వేసిన సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక భోజన సదుపాయాల గురించి ప్రస్తావిస్తే .. ‘ఆహా .. ఏమి రుచి, తినరా మైమరిచి..’ అనేవిధంగా 24 రకాల వంటకాలతో ఆహార ప్రియుల మదిని దోచారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం.. జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కి గురువారం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా హెలికాప్టర్లో దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్లోని హెలిపాడ్‌పై దిగిన ఆయనకు ఆహ్వాన కర్త, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన తల్లి జక్కంపూడి విజయలక్ష్మితో పాటు మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, తానేటి వనిత, ఆర్కే రోజా, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, రాజంపేట ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆహ్వానం పలికారు. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, అనంతబాబు, వంక రవీంద్రనాఽథ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, తలారి వెంకట్రావు, కొండేటి చిట్టిబాబు, జె.శ్రీనివాస్‌నాయుడు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, జిల్లా కలెక్టర్ కె.మాధవీలత, పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. సినీ ప్రముఖులు రామ్‌గోపాల్‌వర్మ, సుమన్, హీరో విశ్వక్‌సేన్‌లు గణేష్, సుకీర్తిలకు ఆశీస్సులు అందజేశారు. -
ఇన్నాళ్లూ ప్యాకేజీ బంధం.. ఇప్పుడు పొత్తు బంధమా..?
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: పొలిటికల్ కమెడీయన్ పవన్ కళ్యాణ్.. చంద్రబాబు దత్తపుత్రుడిగా పొత్తు ప్రకటన హాస్యాస్పదం అని వైఎస్సాఆర్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్యాకేజీ పెంచుకునేందుకే జైల్లో బాబును కలిశాడన్నది నిజం.. బాబు అవినీతి వాటా పార్టనర్‌గానే ప్రభుత్వంపై రంకెలేస్తున్నాడు’’ అని మండిపడ్డారు. జక్కంపూడి రాజా ఇంకా ఏమన్నారంటే.. బ్లాక్‌మెయిలింగ్‌కు సరైన టైమ్ అని.. పవన్‌కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత మాట్లాడిన మాటల్ని చూస్తే.. ఒక విషయం స్పష్టమైంది. తన ప్యాకేజీ పెంపునకు చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేయడానికి ఇంతకన్నా సరైన సమయం దొరకదనకున్నాడు. అందుకే, రేపటి ఎన్నికల్లో నీకూ-నాకూ లాభం జరగాలంటే, ఇద్దరం కలిసి పోటీచేసే ప్రతిపాదనతో తన ప్యాకేజీ విలువను పెంచుకున్నాడు. పొత్తు పలుకులతో కామెడీ.. ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందంటూ పవన్‌కళ్యాణ్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ఈ రోజు ఇలా కొత్తగా చెబుతున్నాడేంటని అందరూ నవ్వు కుంటున్నారు. ఆయన సొంత పుత్రుడు లోకేశ్ మీడియా ముందుకొచ్చి చంద్రబాబుకు నేను మద్ధతు పలుకుతున్నాను.. నా ఓటు తెలుగుదేశం పార్టీకే అని.. అంటే ఎంత కామెడీగా ఉంటుందో.. ఇప్పుడు దత్తపుత్రుడి మాటలూ అంతే జోక్‌గా ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రశ్నిస్తానన్న ప్యాకేజీ స్టార్‌ను ఆనాడే నమ్మలేదు.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం చూస్తే.. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రత్యక్షంగా సపోర్టు చేసి ఆయనకు మేలు చేయడానికే ఉన్నానంటూ జనసేన పార్టీ పెట్టాడు. ఏ ఒక్కర్నీ జనసేన తరఫున ఎన్నికల్లో పోటీకి దించకుండా పూర్తిగా తాను, తన కేడర్ బాబు కోసం పనిచేసి అధికారం లోకి తెచ్చారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు తాను ప్రకటించిన ఎన్నికల వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్నీ అమలు చేయకుండా.. ఏకంగా టీడీపీ వెబ్సైట్ నుంచే మానిఫెస్టోను తొలగించారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌తో పాటు వారి కేబినెట్లో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సాధారణ పార్టీ కార్యకర్త వరకు ప్రభుత్వ ఖజానా సొమ్మును దోచుకుని పంచుకుని దాచుకున్న విషయం అందరం గమనించాం. అప్పట్లో బాబు అవినీతిని ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్ పూర్తి నిద్రమత్తులో జోగాడు. ఆ తర్వాత 2019 ఎన్నికలొచ్చేసరికి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని.. ఆ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే వ్యూహం పన్నాడు. జనసేన అనేది టీడీపీకి వ్యతిరేకమన్నట్లు ఒక సూత్రీకరణతో ప్రజల్ని నమ్మించాలని చూశాడు. కానీ, ప్రజలు మాత్రం పవన్‌కళ్యాణ్ నిజస్వరూపాన్ని అప్పటికే గమనించి అర్ధం చేసుకోవడంతో ఆయన మాటల్ని ఎవరూ నమ్మలేదు. టీడీపీ, జనసేనను చిత్తుచిత్తుగా ఓడించాయి. వైఎస్ఆర్సీపీకి అనూహ్యమైన భారీ మెజార్టీ కల్పించి రాష్ట్రవ్యాప్తంగా 151 స్థానాల్లో విజయాన్ని అందించారు. దొంగలా బాబు జైలుకెళ్తే.. నీకెందుకు కడుపుమంట..? మరలా ఇప్పుడు 2024 ఎన్నికల వ్యూహంలో పవన్‌కళ్యాణ్ నోటివెంట జనసేన, టీడీపీ పొత్తు అనే మాట వినిపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన్ను ఆత్మపరిశీలన చేసుకోవాలని చెబుతున్నాను. ఇన్నాళ్లూ ప్రజలు నీ సినిమాలు చూసి హీరోగా పవర్‌స్టార్ అని పిలుచుకున్నారు. ఇప్పుడేమో రాజకీయాల్లో నువ్వొక ప్యాకేజీ-పొత్తుస్టార్ అంటూ పొలిటికల్ కమెడియన్‌గా చూస్తున్నారు. అసలు చంద్రబాబు మీద నీకంత ప్రేమేంటి..? ఆయనకూ నీకూ ఉన్న లాలూచీ ఏంటి..? అవినీతి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని దోచుకుని ఆధారాలతో సహా దొరికిన ఒక దొంగను నువ్వెలా సమర్ధిస్తావు..? ఆయన ఎమన్నా దేశం కోసం పోరాడి జైలుకు వెళ్లాడా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెడ్‌హేండెడ్‌గా దొరికిన ఒక అవినీతిపరుడ్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేస్తే ప్రభుత్వంపై నీకంత కడుపుమంటేంటి.? ఎందుకు ప్రభుత్వం మీద పడి అంత ఊగిపోతున్నావని అడుగుతున్నాను. ఏదో దేశభక్తుడ్ని జైల్లో పెడితే.. ఆయనకు మద్ధతుపలికేందుకు వచ్చినట్టు నువ్వు బిల్డప్ ఇవ్వడం అవసరమా..? చంద్రబాబు కుంభకోణాలకు బాధ్యుడు కనుకే జైలుకొచ్చాడని అర్ధం చేసుకోకుండా.. నువ్వెందుకు దిగజారి మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తున్నాను. ఇందుకు సమాధానం చెప్పాలి. కాపులకు ద్రోహం తలపెట్టే కుట్ర: పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకొచ్చి చంద్రబాబుకు దఫదఫాలుగా సపోర్టు చేయడంలో యువతకు మేలు చేసే లక్ష్యం కనిపించడంలేదు. సమాజానికి మంచి చేసే సిద్ధాంతం కూడా ఆయన పార్టీ జనసేనలో లేదు. ఇక, కాపుల్ని పూర్తిగా ద్రోహం చేసేందుకే, బాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేందుకే ఆయన పనిచేస్తున్నాడనే కుట్ర కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఉమ్మడి పొత్తులో రాష్ట్రమొత్తం పర్యటించారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి రూ.5 కోట్లు చొప్పున కాపులకు సంక్షేమాన్ని అందిస్తామని చంద్రబాబు హామీనిచ్చాడు. ఆ హామీని నిలబెట్టుకోలేదని ప్రశ్నించిన పాపానికి ఆనాడు ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని బూతులు తిడుతూ బూటు కాళ్లతో తన్నుతూ శారీరకంగా, మానసికంగా వేధించి చిత్రహింసలకు గురిచేసి రోడ్డుమీద నిలబెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. మరి, ఆ సమయంలో చంద్రబాబును నువ్వెందుకు నిలదీయలేదు..? ఇవన్నీ పక్కనబెట్టి మరలా ఆయనతోనే కలిసి ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచన ఎలా కలిగిందని ప్రతీ ఒక్క కాపు సోదరుడు నిన్ను నిలదీసే పరిస్థితి ఉంది. జనసేన నాయకులు, కార్యకర్తల్లోనూ ఈరోజు నీ మాటలతో కళ్లుతెరుచుకున్నాయి. నీలాంటి దుర్మార్గమైన వ్యక్తిని ఇన్నాళ్లూ మా నాయకుడిగా భావించామా..? జనసేన జెండాను ఎందుకు మోశామని వాళ్లంతా బాధపడుతున్నారు. పార్టనర్‌గా పవన్‌కళ్యాణ్ ఆందోళనా..? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పార్టనర్‌గా పవన్‌కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడేమో అప్పట్లో జరిగిన కుంభకోణాలకు సంబంధించే చంద్రబాబు జైలుపాలయ్యాడు. మరి, ఆయన దోచుకున్న అవినీతి సొమ్ములో పవన్‌కళ్యాణ్‌కు కూడా వాటాలున్నాయని.. తనకేమైనా జరగరానిది జరుగుతుందనే ఆందోళనలో పవన్‌కళ్యాణ్ ఉన్నాడేమో. రాజకీయాలంటే సినిమా షూటింగులు కాదని ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఆయన పిలుపునిస్తే ఉన్నపళంగా ఏదో జరిగిపోతుందని.. ఈ ప్రభుత్వం పడిపోతుందనే భ్రమల్ని వీడి నేలమీద నిలబడి మాట్లాడితే మంచిదని చెబుతున్నాను. చదవండి: ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్ అవ్వరా? -
పవన్ డ్రామా ముగించారు: జక్కంపూడి రాజా
-
షెల్ కంపెనీలతో ప్రజాధనాన్ని దోచేశారు
-
చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అట్టర్ ప్లాఫ్
-
మూడున్నరేళ్లుగా వేజ్ అగ్రిమెంట్ ప్రకటించలేదు: జక్కంపూడి
-
పేపర్ మిల్లు ఎదుట ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దీక్ష
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులతో యాజమాన్యం ముందస్తుగా పదవీ విరమణ చేయిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలను అందనీయకుండా యాజమాన్యం, కార్మిక సంఘం నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యంతో చర్చించడానికి సోమవారం ఉదయం 11 గంటల సమయంలో రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు వద్దకు రాజా వెళ్లారు. అయితే యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆందోళన నిర్వహించారు. అనంతరం కోటిలింగాలపేట పంప్‌హౌస్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో కొందరు యువకులు పంప్‌హౌస్ పైకి ఎక్కి గోదావరిలో దూకేస్తామంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంప్‌హౌస్ నుంచి తిరిగి పేపర్ మిల్లు గేటు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రాజా అక్కడే బైఠాయించి అర్ధరాత్రి కూడా నిరసన కొనసాగిస్తున్నారు. పేపరు మిల్లు యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ కదలబోమని స్పష్టం చేశారు. యాజమాన్య నిరంకుశ ధోరణికి నిరసనగా కార్మికులు సైతం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీయడానికి పేపర్ మిల్లు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయకృష్ణ, గుర్తింపు పొందిన కార్మిక సంఘం నేత పనిచేస్తున్నారని మండిపడ్డారు. మూడున్నరేళ్లుగా వేతన ఒప్పందం కుదరకపోవడంతో కార్మికులు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లులో పనిచేస్తున్న సీనియర్ కార్మికులను బలవంతంగా వీఆర్ఎస్ పేరిట బయటకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. వారి స్థానంలో నైపుణ్యం లేని కొత్త యువకులను నియమించుకుంటున్నారని విమర్శించారు. -
రెండో రోజు ప్లీనరీ 4 లక్షల మందికి భోజనాలు సిద్ధం
-
ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు చెవిరెడ్డి, జక్కంపూడి
తిరుపతి రూరల్: ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వారిపై తెలుగుదేశం ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు నేటికీ వదలిపెట్టడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ 2015లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ ఉద్యమాలను అణచివేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేసింది. ఆ కేసులకు సంబంధించి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అతని సోదరుడు గణేష్, తల్లి విజయలక్ష్మి మంగళవారం అమరావతిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ జరిగిన ఉద్యమాల్లో ప్రజల తరఫున గళమెత్తిన వైఎస్సార్సీపీ నాయకుడు, ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గణేష్, విజయలక్ష్మి, కార్యకర్తలు కలిపి మొత్తం 26 మందిపై 2015లో అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అప్పట్లో వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆనాటి ఆందోళనలకు సంఘీభావం తెలిపిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపైనా రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అమరావతి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో మంగళవారం వాయిదా ఉండటంతో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, జక్కంపూడి రాజా, గణేష్, విజయలక్ష్మి విచారణ నిమిత్తం హాజరయ్యారు. -
టీడీపీ సభ్యులు అసెంబ్లీకి తాగి వస్తున్నారేమో..?
-
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జనబాట కార్యక్రమం
-
గ్రామ వలంటీర్లకు ప్రమాద బీమా
రాజానగరం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సకాలంలో చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ వలంటీర్లకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కంపూడి రాజా సొంత డబ్బుతో ప్రమాద బీమా కల్పించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ రాజానగరంలో శనివారం ప్రారంభించారు. వలంటీర్లకు బీమా బాండ్లు అందజేశారు. నియోజకవర్గంలోని సీతానగరం మండలం వంగలపూడి గ్రామ వలంటీర్ కోడెల్లి నీలారాణి గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అటువంటి దుస్థితి మరో వలంటీర్ కుటుంబానికి ఎదురు కాకూడదనే ఆలోచనతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ ప్రమాద బీమా పథకానికి అంకురార్పణ చేశారు. ఈ పథకం ద్వారా సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో 1,475 మంది గ్రామ వలంటీర్లకు ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఇందుకుగాను బీమా కంపెనీకి చెల్లించాల్సిన ప్రీమియాన్ని జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ చెల్లిస్తుంది. వలంటీర్లకు మనోధైర్యాన్ని అందించడంలో ఈ ప్రమాద బీమా పథకం అత్యుత్తమంగా నిలుస్తుందని కలెక్టర్ కొనియాడారు. పథకం ద్వారా ప్రమాదవశాత్తు్త మరణించినా లేదా అంగవైకల్యం ఏర్పడినా వలంటీర్లకు రూ.లక్ష పరిహారం అందుతుంది. అవయవాన్ని కోల్పోతే రూ.50 వేల పరిహారం ఇస్తారు. -
సీఎంపై అభిమానంతో.. 2,745 మంది రక్తదానం
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,745 మంది సోమవారం రక్తదానం చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు. రక్తదానం చేయడం ద్వారా జననేత జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి వరుసగా మూడో ఏడాది కూడా ఒరవడిని కొనసాగించారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందే సోమవారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ప్రతినిధి జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శిబిరాన్ని ప్రారంభించగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, శాప్ చైర్మన్ బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్రహౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దివంగతనేత జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శాప్‌చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి తొలుత రక్తదానం చేశారు. జగన్ సీఎం అయ్యాక తొలుత 2019లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 2,043 మంది రక్తదానం చేయగా, 2020లో 2,143 మంది రక్తదానం చేశారు. ఈ ఏడాది 2,745 మంది రక్తదానం చేసి రికార్డు నెలకొల్పారు. ఉభయ గోదావరి జిల్లాల జెడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాలరావు, కౌరు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు దిక్ష ఒక దోంగ దిక్ష
-
రాజానగరం లో లక్ష ముక్కలు నాటే బృహత్తర కార్యక్రమం
-
సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తూర్పుగోదావరి : రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి చాపర్‌లో కొమరగిరికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, జక్కంపూడి విజయలక్ష్మీ, ఆకుల సత్యనారాయణ, చందన నాగేశ్వర్ రావు ఉన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి బాకరాపురం హెలిప్యాడ్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి బయల్దేరి వెళ్లారు. చదవండి: పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్ -
కులాల మధ్య చంద్రబాబు చిచ్చు..
సాక్షి, విజయవాడ: కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టి కాపులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. శనివారం ‘వైఎస్సార్ కాపు నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ అర్హులను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాపు నేస్తం పథకం ద్వారా కాపుల్లో వెనుకబడిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. (చదవండి: 56 బీసీ కార్పొరేషన్లకు 672 మంది డైరెక్టర్లు) ‘‘కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే కేసులు పెట్టి కాపు ఉద్యమకారులను చంద్రబాబు జైళ్లలోకి నెట్టారు. పేదలు ఎవరూ పేదరికంలో మగ్గిపోకూడదని సంక్షేమ పథకాల సంస్కరణలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు. కాపు నేస్తం పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలు అయ్యేలా చర్యలు చేపడుతున్నాం. కాపులను బీసీల్లో చేరుస్తామని సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు కాపులను మోసం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నాడు జగన్ ఇవ్వలేదు. స్వార్థం కోసం పథకాలను చంద్రబాబు అమలు చేశారు. 5548 కోట్లు ప్రత్యక్ష లబ్ధిదారులకు అందేలా కాపు నేస్తం పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. దేవతలు యజ్ఞం తలపెడితే రాక్షసులు అడ్డుపడినట్లు రాష్ట్రంలో చంద్రబాబు అడ్డుపడుతున్నారని’’ వేణుగోపాల్ మండిపడ్డారు. (చదవండి: తూర్పులో వేణునాదం) చంద్రబాబు మోసం చేశారు.. జక్కంపూడి రాజా మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. 5 వేల కోట్లు కాపులకు కేటాయిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారని, అమలు చేయమంటే కేసులు పెట్టి జైళ్లలో పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన తెలిపారు. -
‘వైఎస్సార్ కాపు నేస్తం’ రెండో విడత ప్రారంభం
-
సంక్షేమ సారధిగా.. ప్రజారంజక పాలన
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా బస్ స్టాప్‌ను ప్రారంభించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ జక్కంపూడి రాజా ,బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు సహా వైఎస్సార్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ..'ఎవరూ చేయలేని సాహసం వైఎస్ జగన్ చేవారని, 3648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్రతో అన్ని వర్గాల ప్రజలతో జగన్ మమేకమయ్యారు. ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూసిన వైఎస్ జగన్..ప్రజా మేనిఫోస్టోతో ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు. అధికారం చేపట్టిన పద్నాలుగు నెలల్లోనే హామీలు నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్. సంక్షేమ రథసారధిగా ప్రజారంజక పాలన అందిస్తున్నారు' అని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్‌కు వస్తోన్న ఆధరణను చూసి టీడీపీ తట్టుకోలేకపోతుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. ఇతర రాష్ట్రాలు ఏపీలో సాగుతున్న సంక్షేమ పడకలవైపు చూస్తున్నాయని, సంక్షేమ క్యాలెండర్ అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పేదల ఇంటి వద్దకే చేరుస్తూ.. విద్య ,వైద్యం ,వ్యవసాయం ,శాంతిభద్రతల పరిరక్షణతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. (ప్రజా సంకల్పమే నిత్య స్ఫూర్తి) -
వారి వల్లే రోడ్లు పాడైపోయాయి: జక్కంపూడి
సాక్షి, తూర్పుగోదావరి : గత టీడీపీ పాలనలో 50 లక్షల టన్నుల ఇసుక తరలిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. సీతానగరం ర్యాంపుల నుంచి పెద్దఎత్తున ఇసుకను కొల్లగొట్టారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, నారా లోకేష్ కలిసి రూ.350 కోట్లు దోచుకున్నారని, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు పాడైపోయాయని మండిపడ్డారు. తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి ఆరు నెలలకు ఒకసారి బయటకొస్తారని ఎద్దేవా చేశారు. చదవండి: జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష విజయవంతం బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని ఎమ్మెల్యే అనన్నారు. మ్యానిఫెస్టోలో ప్రతి హామీని నెరవేర్చడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. కేబినెట్లో 60 శాతం మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని, రైతు భరోసా రెండో విడత పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. వరద నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు: జక్కంపూడి రాజా -
ఒక్క రోడ్డు అయినా వేశారా?
-
జక్కంపూడి రాజా దీక్ష విరమణ
-
జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష విజయవంతం
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ: కార్మికుల సంక్షేమం, వారి న్యాయమైన కోర్కెల సాధన కోసం కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విజయవంతమైంది. రాజా దీక్షకు యాజమాన్యం దిగివచ్చింది. కార్మికుల రెగ్యులరైజేషన్ డిమాండ్ నిరాహార దీక్షతో నెరవేరింది. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరాయంగా పోరాటం సాగిస్తామని జక్కంపూడి రాజా అన్నారు. శనివారం రాజమహేంద్రవరం పేపరుమిల్లు వద్ద కార్మికులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలంటూ మిల్లు ఎదుట పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. రాజమహేంద్రవరం ఏపీ పేపరుమిల్లులో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉండగా యాజమాన్యం నిర్లక్ష్యం, నిరంతృత్వధోరణి అవలంబిస్తూ వచ్చింది. కార్మికుల తరఫున ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఏడాది కాలంగా పలు దఫాలు చర్చలు నిర్వహించారు. పేపరుమిల్లు యాజమాన్యం సమయం కావాలంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. చివరగా జరిపిన చర్చల్లో 15వ తేదీ గురువారం తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో శుక్రవారం మరోమారు మిల్లు ఆవరణలో చర్చలు ప్రారంభించారు. పలు దఫాలు మిల్లు యాజమాన్యం తరుఫున జీఎమ్ సూరారెడ్డి, అక్కిన జయకృష్ణ చర్చలు నిర్వహించినా విఫలయ్యాయి. దీంతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సాయంత్రం ఐదు గంటలలోపు న్యాయమైన కోర్కెలు అంగీకరించకపోతే శాంతియుతంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. సమయం పూర్తయినా ప్రకటన వెలువడకపోవడంతో దీక్ష దిగిన విషయం తెలిసిందే. రాజాతో పాటు సీఐటీయూ నాయకుడు సంఘీభావంగా దీక్ష చేపట్టారు. చర్చలు సఫలం మిల్లు యాజమాన్యం తరఫున జీఎం సూరారెడ్డి, జయకృష్ణ, కార్మిక శాఖ తరఫున ఎం.రామారావు, శ్రీనివాస్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, టి.అరుణ్‌తో నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి. ప్రధానంగా 50 ఏళ్లు దాటిన వారిని రెగ్యులరైజ్ చేయడం, మహిళలను విధుల్లోకి తీసుకోవడానికి అంగీకరించారు. యాజమాన్యం వద్ద రాజా పెట్టిన ఎనిమిది డిమాండ్లలో ఏడు డిమాండ్లను అంగీకరించి బదిలీల విషయాన్ని రెండు రోజుల్లో లేబర్ కమిషనర్ వద్ద మాట్లాడనున్నట్లు యాజమాన్యం తెలిపింది. దీక్ష విరమణ మిల్లు కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడానికి యాజమాన్యం ఒప్పుకోవడంతో దీక్ష విరమణకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీఐటీయూ నాయకుడు టి.అరుణ్ అంగీకరించారు. దీంతో జక్కంపూడి రాజాకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, టి.అరుణ్‌కు పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. వైద్య పరీక్షలు రెండో రోజుకు చేరడంతో వైద్యులు బీపీ, సుగర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరోనా పరీక్షలు జరిపారు. డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయ భాస్కర్, అనపర్తి ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కొండేటి చిట్టిబాబు, ధనలక్ష్మి, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర నాయకులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, యువజన నేత పోలు కిరణ్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
జక్కంపూడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి : దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి తనయుడు ఎమ్యెల్యే జక్కంపూడి రాజా, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు పేర్ని నాని, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
బాలికను అన్ని విధాలా ఆదుకుంటాం
తూర్పుగోదావరి,తాడితోట (రాజమహేంద్రవరం): లైంగికదాడికి గురైన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, మధురపూడి గ్రామానికి చెందిన బాలికను ఆదుకుంటామని ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. అత్యాచారానికి గురై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలసి పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చి, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత కోసం దిశ చట్టం రూపొందించారని తెలిపారు. మైనర్ బాలికపై జరిగిన సంఘటనపై స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ వచ్చి బాలికను పరామర్శించి పూర్తి వివరాలు సేకరించారని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో పాటు 12 మందిని అరెస్ట్ చేశారని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తారన్నారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ మాట్లాడుతూ బాలికపై లైంగికదాడికి పాల్పడి చిత్రహింసలకు గురి చేయడం బాధాకరమన్నారు. మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంఘటన బాధాకరమని, సీఎం దృష్టికి తీసుకువెళతామని బాలికకు ఆర్థికంగా, అండగా ఉంటామని కేసు ఫైయిలైన నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలికి వైద్యపరంగా అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ టి.రమేష్ కిశోర్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఈతకోటి బాపన సుధారాణి, బొంతా శ్రీహరి, ఎస్సీసెల్ నాయకులు మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, మాసా రామ్ జోగ్, పెంకే సురేష్, వాసంశెట్టి గంగాధరరావు, తదిరులు పాల్గొన్నారు. -
నీ రాజకీయ సినిమా అయిపోయింది
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘నీ రాజకీయ సినిమా అయిపోయింది. ఇక అసలు సినిమాలు చేసుకో. ఆ సినిమాలను చూసి మేము ఆనందిస్తాం. తమ డిమాండ్ల కోసం చంద్రబాబు ప్రభుత్వంలో రోడ్డెక్కిన కాపులను అక్రమంగా పోలీసు కేసుల్లో ఇరికించినప్పుడు ఎక్కడున్నావు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయావు?’ అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్ అయ్యారు. రాజమహేంద్రవరంలో ఆదివారం రాజా విలేకరులతో మాట్లాడుతూ.. ► అటు సొంత పార్టీ అధ్యక్షుడిగా, ఇటు చంద్రబాబు మనిషిగా రెండు పడవలపై కాలు వేసి ఇంకా ఎంత కాలం పవన్ ప్రయాణిస్తారు? ► గత ఎన్నికల్లో రాష్ట్రంలోని కాపులు పవన్‌కు, జనసేన పార్టీకి గుణపాఠం చెప్పినా ఆయన బుద్ధి మారలేదు. ► అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాపులను పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వానికి తాళం వేస్తూ కాపు నేతగా పవన్ కూడా కాపులకు న్యాయం చేసే దిశగా మాట్లాడలేదు. నాడు కాపులు రోడ్డెక్కినప్పుడు వారితో కలిసి పోరాడలేదు. ► ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో కాపులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూ, తొలి ఏడాది బడ్డెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించి, కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల లోపు కాపు మహిళలను ఆదుకుంటూంటే.. కాపులపై మొసలి కన్నీరు కారుస్తూ అవాస్తవాలతో ఆరోపణలు చేయడం తగునా? ► చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కాపులకు రూ.5 వేల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి, కేవలం రూ.1,600 కోట్లే కేటాయించినప్పుడు పవన్‌కు కాపులు గుర్తుకు రాలేదా? -
అన్యాయం జరిగినా ప్రశ్నించలేదు..
-
ఆ సంగతి గుర్తుపెట్టుకో పవన్..!
సాక్షి, రాజమండ్రి: ప్రశ్నిస్తానంటూ 2014లో జనసేన ఏర్పాటు చేసిన పవన్‌కల్యాణ్ గత ఐదేళ్లలో ఏం ప్రశ్నించారని కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిలదీశారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ భరత్ రామ్, రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులు మోషేన్ రాజుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్‌కల్యాణ్ డ్యాన్సులు, డైలాగ్‌లకు ఆకర్షితులై కాపు యువత సొంత డబ్బుతో కార్యక్రమాలు చేశారని, ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక అంశంపై కూడా ఆయన ప్రశ్నించలేదని రాజా దుయ్యబట్టారు. టీడీపీ ఇరుకున పడిన సందర్భాల్లో మాత్రమే పవన్‌కల్యాణ్ బయటకు వచ్చి మాట్లాడేవారని ఆయన విమర్శించారు. (టీడీపీ మత్తులో పవన్ కల్యాణ్) కాపులకు అన్యాయం జరిగినా ప్రశ్నించలేదు.. ‘‘గత టీడీపీ ప్రభుత్వ పాలనలో కాపు కార్పొరేషన్ నుంచి 1600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంత తక్కువ ఖర్చు చేయడంపై పవన్‌కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు..ఆ హామీని విస్మరించారు. దీనిపై పవన్ ఎందుకు మాట్లాడలేదు. రిజర్వేషన్ల గురించి అడిగిన ముద్రగడ తో పాటు వేల మందిపై కేసులు పెట్టారు. అప్పుడు కూడా ఆయన ఎందుకు నోరు మెదపలేదు. చంద్రబాబు ప్రభుత్వాన్ని భుజాల మీద మోసే ప్రయత్నం చేశారు తప్ప కాపులకు అన్యాయం జరిగినా ప్రశ్నించే ప్రయత్నం మాత్రం చేయలేదంటూ’’ రాజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో అవినీతి మాత్రమే ఎజెండాగా పెట్టుకుని పనిచేశారని విమర్శించారు. (కాపులపై బాబు ఉక్కుపాదం మోపినప్పుడు ఎక్కడున్నావ్ పవన్?) ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్‌కల్యాణ్ భారీ తేడాతో ఓడిపోయారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీలతో కలిసి పోటీ చేస్తే ప్రజలు మీకు ఎన్ని సీట్లు ఇచ్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజా హితవు పలికారు. ప్రజలు మిమ్మల్ని ఒక సీటుకు మాత్రమే పరిమితం చేశారన్న సంగతితో పాటు, కాపులు విశ్వసించడం లేదనే ఆ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని జక్కంపూడి రాజా అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ ప్రజల కష్టాలు స్వయంగా గమనించారని, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధపడుతున్నారని చెప్పారు. అర్హులైన ఏ ఒక్కరికి ఇల్లు లేదనే మాట వినకూడదనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు. అన్ని సౌకర్యాలతో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. -
కాపుల కోసం జగన్ చాలా చేశారు: జక్కంపూడి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు కాపులందరి తరుపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘కాపులకు నేను ఉన్నాను అంటూ వైస్సార్ కాపు నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా వసతి, జగనన్న విద్యా దీవెన ద్వారా లక్షలాది మంది కాపులకు మేలు జరిగింది. గత ప్రభుత్వం వలన కాపులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏడాదికి 15 వేలు చొప్పున ఐదేళ్లు కాపు నేస్తం ద్వారా ఇవ్వనున్నారు. కాపుల కోసం ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారు. ఏడాదికి 400 కోట్లు కూడా చంద్రబాబు ఖర్చు చేయలేదు. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పి మోసం చేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టాలని అడిగితే చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారు. ('వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం) కాపులకు ఇచ్చిన హామీలు కంటే మిన్నగా సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాపులకు సీఎం జగన్ రూ. 4800 కోట్లు ఖర్చు చేశారు. కాపులకు ఇచ్చిన ఏ హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు. కాపులపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారు. గత పాలకులు కాపులను గాలికి వదిలేశారు. కాపులకు అండగా నిలుస్తున్నారు. కాపు నేస్తం ద్వారా రెండు లక్షల 36 వేల మందికి లబ్ది కలిగింది. కాపు నేస్తంకు రూ. 354 కోట్లు నిధులు విడుదల చేశారు. వంగవీటి రంగాను చంపించిన దగ్గర నుంచి చూస్తే కాపులకు చంద్రబాబు చేసింది ఏమీలేదు. కాపులను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే చంద్రబాబు వాడుకున్నారు. కాపులకు మేలు చేస్తున్న వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతార’ని జక్కంపూడి రాజా అన్నారు. (వారికి కూడా కాపునేస్తం తరహా పథకం) -
సీఎం వైఎస్ జగన్ రైతుల పక్షపాతి
-
రాజమండ్రిలో మెడికల్ కాలేజీకి లైన్ క్లియర్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో మెడికల్ కాలేజీకి లైన్ క్లియర్ అయిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. ఆయన శనివారం మీడయాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు మొదటిదశలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి యాభై ఎకరాల స్థలం అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటు కానుందన్నారు. వెయ్యి పడకల ఆసుపత్రిగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు అవుతుందన్నారు. (విశాఖ విషాదం: ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ) అవసరమైతే మరో 30 ఎకరాల భూసేకరణ ప్రయత్నాలు చేస్తామని రాజా తెలిపారు. ఇప్పటికే రెండు మూడు చోట్ల ప్రభుత్వ భూములు పరిశీలించామని ఆయన చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాల రాజమండ్రిలో ఏర్పాటు చేస్తే స్థానికులతో పాటు ఇతర జిల్లాల వారికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఎంత ఖర్చయినా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంటి స్థలం అందించాలనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కల అని గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే చర్యలు చేపడుతున్నామని జక్కపూడి రాజా తెలిపారు. (గ్యాస్ లీక్‌పై విచారణకు హైపవర్ కమిటీ) -
కరోనా: ‘ఈ యుద్ధంలో సైనికులు వారే’
-
కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని దరిచేరకుండా చేస్తున్న పోరాటంలో సైనికులు పారిశుధ్య కార్మికులేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అత్యంత క్లిష్ట సమయంలో కూడా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారన్నారు. (దేశంలో మూడోదశకు కరోనా వైరస్ : ఎయిమ్స్) ఇక కార్మికుల కృషిని, శ్రమను అభినందిస్తూ ఎమ్మెల్యే, జక్కంపూడి గణేష్‌లు కార్మికుల పాదాలను కడిగారు. వారు చేసిన సేవలకు కార్మికులకు ఎంత చేసినా తక్కువే అవుతుందని ప్రశంసించారు. ఇక కార్మికుల కనీసవేతనం రూ. 18 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మికుల సేవలను గుర్తించి వారికి కనీస వేతనం అందేలా చూస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. భయంకరమైన కరోనా వైరస్ ప్రభలుతున్నప్పటికీ దానిని లెక్కచేయకుండా సేవలందిస్తున్న కార్మికుల పాదాలు కడిగి.. వారివెనక మేమున్నామన్న ధీమా కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. కాగా ఈ సమావేశంలో జక్కంపూడి గణేష్, శివరామ సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. (వైరల్ ట్వీట్: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్) -
‘చంద్రబాబు, లోకేష్ పాస్‌పోర్టులను సీజ్ చేయాలి’
సాక్షి, రాజమండ్రి: టీడీపీ సీఆర్డీఏను చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపుడి రాజా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే అర్థిక పరిస్థితి కుంటుపడిందని ఆయన విమర్శించారు. కృతిమ ఉద్యమంతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని జక్కంపుడి రాజా ఆగ్రహించారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే రూ. రెండు వేల కోట్ల అక్రమ సంపాదన బయటపడిందంటే.. చంద్రబాబు, లోకేష్ వద్ద ఎన్ని కోట్ల అవినీతి సోమ్ము ఉందో అని రాజా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ పాస్‌పోర్టులను సీజ్ చేయాలని రాజా తెలిపారు. (ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లు) -
చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు
-
'బినామి ఆస్తులు కాపాడాలనేది బాబు తాపత్రయం'
సాక్షి, అనంతపురం : అధికార వికేంద్రీకరణ సదస్సు ఎస్కే యునివర్సిటీలోని భువనవిజయం ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ సెమినార్‌కు విద్యార్థి,విద్యార్థినులు భారీగా హాజరై అధికార వికేంద్రీకరణకు జైకొట్టారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ కార్పొరేషన్ చైర్మన్,ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ... రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని పేర్కొన్నారు. బినామి ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు తాపత్రయమని దుయ్యబట్టారు. అమరావతిలో మాత్రమే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, అభివృద్ధి ఒకే చోట జరగాలంటే ఎలా అని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న దృష్యా ఏపీకి మూడు రాజధారుల అవసరం ఎంతో ఉందని, అధికార వికేంద్రీకరణ ద్వారా సమగ్ర అభివృద్ధి జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మ ఒడి,రైతు భరోసా పథకాలు చారిత్రాత్మకం అని తెలిపారు.(చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి..) ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. లక్షకోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం అవసరమా అని, అభివృద్ధి ఒకచోట జరిగితే మిగిలిన ప్రాంతాలు ఏంకావాలని ఆయన ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి శ్రీనివాస్, విద్యార్థి సంఘాల నేతలు లింగారెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి..
సాక్షి, తాడేపల్లి : రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేయడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా మూడు రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని విమర్శించారు. టీడీపీ నేతలంతా అమరావతి ప్రాంతంలో ఆక్రమించిన భూముల కోసమే ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. (రాజధాని అంశంపై తొలిసారిగా స్పందించిన కేంద్రం) అభివృద్ధి వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబులా సీఎం జగన్ రెడ్డి గ్రాఫిక్స్ చూపించలేదని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడానికి మూలకారణం చంద్రబాబు నాయుడే అని విమర్శించారు. గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను ప్రభావితం చేశారని ధ్వజమెత్తారు. -
చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి..
-
శాసనమండలి రద్దును స్వాగతిస్తున్నాం!
సాక్షి, విజయవాడ: పెద్దల సభలో పెద్ద మనసుతో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వారు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు పైశాచిక ఆనందం, వికృత చేష్టలతో రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాసన సభ, శాసన మండలి సాక్షిగా టీడీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్సీపీ సిటీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భవానీపురం స్వాతి థియేటర్ నుంచి సితార్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ విధానాన్ని, తన బినామీలను కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఆర్డీఏను చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీగా మార్చేశారని విమర్శించారు. బాబు విధానాలతో టీడీపీ తర్వాతి ఎన్నికల్లో 23 సీట్ల నుంచి సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని జోస్యం పలికారు. సామాన్యుడికి వాటితో పనిలేదు సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని, హైదరాబాద్ తరహాలో పొరపాటు జరగకూడదనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. సామాన్యుడికి ఐకానిక్ టవర్స్‌తో, రాజధానితో పనిలేదని, సంక్షేమ ఫలాలు అందాలని మాత్రమే కోరుకుంటారని పేర్కొన్నారు. అమరావతిలోనే లక్ష కోట్ల పెట్టుబడి పెడితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక సీఎం జగన్ శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చదవండి: అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్ -
‘ఓడినా.. బాబు గుణపాఠంగా తీసుకోలేదు’
సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నం, అమరావతి, కర్నూలు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. జిల్లాలోని వైస్సార్సీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం అనేక మంది నిపుణులతో చర్చించి శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ జరగాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు. గతంలో రాజధాని అంశంలో జరిగిన తప్పులు మరలా జరగకూడదన్నది సీఎం జగన్ ఉద్దేశమని తెలిపారు. వనరులు తీసుకు వెళ్లి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడితే చివరకు విభేదాలతో విడిపోయామని, హైదరాబాద్ తరహాలో రాబోయే తరాలకు అన్యాయం జరగకుండా ఉండాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని పేర్కొన్నారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసే వ్యక్తి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అని రాజా మండిపడ్డారు. జన్మభూమి కమిటీలతో స్థానిక వ్యవస్థలను చిన్నా భిన్నం చేశారని, 2019 ఎన్నికల్లో ఓడినా చంద్రబాబు గుణపాఠంగా తీసుకోలేదని, అయినా ఆయన వ్యక్తిత్వం, ఆలోచనలో ఏమాత్రం మార్పు రాలేదని రాజా విమర్శించారు. చంద్రబాబు ప్రజల కోసం కాకుండా.. ఆయన స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని రాజా ఫైర్ అయ్యారు. ఇక శాసనమండలి చైర్మన్‌ను ప్రభావితం చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆయన వికృత చేష్టలకు ఆంధ్రప్రదేశ్ జనం బాధపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 13 జిల్లాల్లో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. జనవరి 25 నుంచి 30 వరకు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాజా తెలిపారు. 25వ తేదిన చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామన్నారు. 26న అంబేద్కర్ రాజ్యాంగంలో తెలిపిన వికేంద్రీకరణ అంశాన్ని ప్రజలకు తెలిజేచయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 27న భారీ బైక్ ర్యాలీ, 28న జిల్లాలోని యూనివర్శిటీ సదస్సులను నిర్వహించి సీఎం వికేంద్రీకరణ అంశాలపై ప్రసంగాలు చేస్తామన్నారు. 29న ప్రధాన కూడళ్లలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 30వ తేదీన రాష్ట్రపతికి పోస్టుకార్డుల ద్వారా తమ ఆకాంక్షను తెలియజేయనున్నట్లు రాజా తెలిపారు. ఇక 31వ తేదీన మూడు జిల్లాల జేఎసీలు ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు జక్కంపూడి రాజా తెలిపారు. -
‘విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది’
సాక్షి, అమరావతి : ఇంగ్లిష్ మీడియం విద్య ద్వారా విద్యార్థుల్లో అభద్రతా భావం పోతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఇంగ్లిష్ మీడియంపై చర్చ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. ఇంగ్లిష్ మీడియం విద్యతో రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల తలరాత మారుతుందని చెప్పారు. విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే సీఎం వైఎస్ జగన్ జనాల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారని చంద్రబాబు భయపడిపోతున్నారని తెలిపారు. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే.. గుంటనక్కలాగా శాసనమండలి గ్యాలరీలోకి వెళ్లి టీడీపీ సభ్యులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్‌ను పిల్లలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అన్నారు. ఏపీ దేశానికే ఆదర్శం కాబోతుంది : హఫీజ్ ఖాన్ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని తెలుగు మీడియం విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కాలంటే ఇంగ్లిష్ మీడియం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంగ్లిష్ రాకపోతే విదేశాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. ఇంగ్లిష్ అర్థంకాక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు ఆ సమస్య ఉండదన్నారు. ఇంగ్లిష్ మీడియంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శం కాబోతుందని తెలిపారు. చంద్రబాబు వైఖరి ఎంటో ఎవరికి అర్థం కావడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందన్నారు. అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ చదువుల బడిలాగా మారుతుందన్నారు. -
సీతానగరంలో మునకల్లంల వంతెనకు శంకుస్థాపన
-
పవన్ రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటే మంచిది
-
రాజా చెప్పిన చంద్రబాబు కథ
-
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర కథ
సాక్షి, అమరావతి: యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన ప్రసంసంతో అసెంబ్లీలో అందరినీ ఆకట్టుకున్నారు. మార్షల్‌పై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రవర్తించిన తీరుపై చర్య తీసుకోవడాన్ని స్పీకర్‌కు కట్టబెడుతూ తీర్మానం పెట్టిన తర్వాత ఆయన చెప్పిన కథ ఆసక్తికరంగా సాగింది. రాజా చెప్పిన కథ.. ‘ఒక ఘోర రాక్షసుడు పరమశివుడు కోసం తపస్సు చేస్తావుంటాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయి నీకు ఏ వరం కావాలో కోరుకో అని రాక్షసుడిని అడుగుతాడు. నేను తపస్సు చేస్తున్నాను గానీ ఇంత తొందరగా ప్రత్యక్షమవుతానని అనుకోలేదని శివుడితో రాక్షసుడు అంటాడు. నాకు 5 నిమిషాలు సమయమిస్తే ఏ వరం అడగాలో ఆలోచించకుని చెప్తా అంటాడు. ఐదు నిమిషాలు సమయం ఉంది కదా శివుడు వేచిచూస్తుండగా కొంత మంది దేవతలు వచ్చి రాక్షసుడికి వరాలు ఇవ్వొద్దని మొరపెట్టుకుంటారు. ఈలోపు వరం అడిగేందుకు రాక్షసుడు వస్తాడు. శివుడు వెంటనే వరం ఇవ్వకుండా సముద్రం ఒడ్డుకు వెళ్లి ఇసుక రేణువులన్నింటినీ లెక్కపెట్టిన తర్వాత రమ్మని రాక్షసుడితో చెబుతాడు. ఇసుక రేణువులు లెక్కపెట్టడం అసాధ్యం కాబట్టి వరం ఇవ్వక్కర్లేదన్న ఆలోచనతో శివుడు ఉంటాడు. అయితే రాక్షసుడు ఇసుక రేణువులన్నిలెక్కపెట్టి తొందరగా వచ్చేస్తాడు. ఏం చేయాలా అని ఆలోచించి ఆకాశంలోని చుక్కలన్నింటినీ లెక్కపెట్టుకుని రమ్మని రాక్షసుడికి చెబుతాడు. ఈసారి రాక్షసుడు చుక్కలన్నింటినీ లెక్కపెట్టి వెంటనే తిరిగొస్తాడు. ఏం చేయాలా అని శివుడు ఆలోచిస్తుండగా ఒకతను వచ్చి ఒక ఐడియా ఇస్తాడు. రాక్షసుడు తొందరగా మీ దగ్గరకు రాకుండా ఉండాలంటే చంద్రబాబు చెప్పిన అబద్ధాలను లెక్కపెట్టుకుని రమ్మని చెబితే ఇక ఎప్పటికి తిరిగి రాలేడని చెబుతాడు’ అని చెప్పడంతో అసెంబ్లీలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. చంద్రబాబుకు పౌరుషం ఉందా? అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని, మార్షల్స్ పట్ల ఆయన వ్యహారశైలిని చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఎమ్మెల్యే రాజా అన్నారు. వయసు పైబడటంతో మతిమరుపు వచ్చిందని తాను అన్నమాటలను అనలేదని అంటున్నారని పేర్కొన్నారు. ఆయన రావాల్సిన గేటు నుంచి రాకుండా మరో గేటు నుంచి వచ్చి మార్షల్స్‌పై విరుచుకుపడ్డారని.. గోదావరి పుష్కరాల సమయంలో పబ్లిసిటీ పిచ్చితో ఇలాగే చేసి 28 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పౌరుషం, సిగ్గు, శరం, మానం, మర్యాద ఉందని రాష్ట్రంలో ఎవరు అనుకోవడం లేదన్నారు. బాబుపై బుచ్చియ్యకే ఎక్కువ కోపం చంద్రబాబుపై బుచ్చియ్య చౌదరికే చంద్రబాబు మీద ఎక్కువ కోపం ఉంటుందని ఎమ్మెల్యే రాజా వెల్లడించారు. అసెంబ్లీలో మాటిమాటికి లేచి మాట్లాడాలని వెనుకనుంచి బుచ్చియ్య చౌదరిని చంద్రబాబు గిల్లుతుందారని అన్నారు. జీవితాంతం తానే ముఖ్యమంత్రిని అన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని, లోకేశ్ కూడా శాశ్వతంగా ముఖ్యమంత్రి కొడుకునన్న భావనతో ఉన్నారని ఎద్దేవా చేశారు. వయసుకు తగ్గట్టు నడుచుకోవాలని కోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. మార్షల్స్‌పై నోరు పారేసుకున్న చంద్రబాబు, టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత వార్తలు.. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం స్పీకర్‌దే తుది నిర్ణయం : బుగ్గన నీ సంగతి తేలుస్తా.. ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి -
రాజమండ్రిలో టూరిజం ఇన్వెస్టర్స్ సమావేశం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో పర్యాటక శాఖ అధ్వర్యంలో టూరిజం ఇన్వెస్టర్స్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీ సోమువీర్రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో 45శాతం దేశాలు టూరిజం మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని అన్నారు. అలాగే టూరిజానికి అవకాశం ఉన్న పలు ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి భద్రతకు ప్రాధాన్యం కల్పించాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈ క్రమంలో పర్యాటక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. సీతానగరం మండలంలో ఉన్న రామవరపు ఆవను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అన్నారు. అలాగే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద రోప్‌వే ఏర్పాటు చేస్తే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందరని, దీంత టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. స్టార్హోటల్లో మద్యం ధరలు అధికంగా ఉన్నందువల్ల టూరిజంపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్రేయపురం పరిధిలో ఉన్న పిచ్చుకలను 10కోట్లతో రిసార్ట్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయవచ్చనునని తెలిపారు. -
రాష్ట్ర అధికార ప్రతినిధిగా జక్కంపూడి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించినవారి జాబితాలో జిల్లా నుంచి రాజా ఒక్కరినే ఎంపిక చేశారు. పార్టీ అధికారంలోకి రాకముందు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేశారు. తాజాగా రాష్ట్ర« అధికార ప్రతినిధిగా నియమించటంతో జక్కంపూడి అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి అప్పగించిన ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. -
‘దళారులకు స్థానం లేదు..పథకాలన్నీ ప్రజల వద్దకే’
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉండగా కాపులను మోసం చేశారని..కాపుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. విజయవాడలో రెండో రోజు జరుగుతున్న ‘కాపు విదేశీ విద్య దీవెన’ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో జక్కంపూడి రాజా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు ఇచ్చిన హామీని వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారన్నారు. కాపులకు ప్రతి ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు సీఎం జగన్ కేటాయిస్తున్నారని వెల్లడించారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన ఉభయగోదావరి జిల్లాలో కాపులు వైఎస్ జగన్‌కు అండగా నిలబడ్డారన్నారు. ఇస్తామని చెప్పి మోసం చేశారు.. కాపులకు ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని.. కానీ వైస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2,000 కోట్లు కాపులకు కేటాయించారని పేర్కొన్నారు. ఐదేళ్లలో కేవలం 1,700 కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించారని విమర్శించారు. కాపు విదేశీ దీవెన పథకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేవని.. వైఎస్ జగన్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వారికి మాత్రమే లోన్లు ఇచ్చేవారు: మంత్రి వెల్లంపల్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే లోన్లు ఇచ్చేవారని.. వైఎస్ జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ తండ్రి బాటలో నడుస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది కాపు విదేశీ విద్య దీవెన పథకం ద్వారా 1000 మందిని విదేశాలకు పంపుతున్నామని మంత్రి వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో దళారులకు స్థానం లేదని.. సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజల వద్దకే చేరుతున్నాయని తెలిపారు. -
కాపు విద్యార్థుల కోసం విదేశీ విద్యా దీవెన పథకం
-
‘టీడీపీ కాపులకు నమ్మక ద్రోహం చేసింది’
సాక్షి, విజయవాడ : గత టీడీపీ ప్రభుత్వం కాపులకు నమ్మక ద్రోహం చేసిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా విమర్శించారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. ఐదేళ్లలో పదిహేడు వందల కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. విదేశి విద్య పథకంలో లబ్ధికోసం 400 మంది దరఖాస్తు చేసుకున్నారని, రెండు రోజులపాటు సర్టిఫెకేట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. విదేశి విద్యకు దరకాస్తు చేసుకున్న అర్హులైన కాపులందరికీ అవాకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాపుల కోసం ఒక్క ఏడాదిలోనే రెండు వేల కోట్లు కేటాయించారని వెల్లడించారు. సీఎం జగన్ సూచనలతో కాపు సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులంలోని ప్రతి ఒక్కరికీ కాపు కార్పొరేషన్ న్యాయం చేస్తుందని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. -
పవన్ కళ్యాణ్ పై జక్కంపూడి రాజా ఫైర్
-
పార్టీ అధ్యక్షుడిగా పవన్‌కు అది కూడా తెలియదా?
సాక్షి, తూర్పుగోదావరి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంద రోజుల పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు హాస్యాస్పదం ఉన్నాయని కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 19 రకాల చారిత్రాత్మక బిల్లులు తీసుకొచ్చామని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పవన్‌కు కాపులను బీసీల్లో కలిపే అంశంపై అవగాహన లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం కోసం ఈబీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్ ను తీసుకుంటే ... రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్ధేశ్యంతో సీఎం జగన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు రాజా వివరించారు. చాలా విషయాల్లో పవన్ అవగాహనలోపంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అన్ని నిధులను దారి మళ్లించి అవినీతి రాజ్యాన్ని స్థాపిస్తే.. అప్పుడు ఎందుకు పవన్ కల్యాణ్ మాట్లాడలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు అవినీతిపై పవన్ ఎందుకు మౌనం వహించారని నిలదీశారు. గత ప్రభుత్వ హయంలోని ఇసుక మాఫియా పవన్‌కు కలిపించలేదనా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను చదవడం పవన్ కల్యాణ్ మానేయాలని లేదంటే ప్రజలు క్షమించరని రాజా అన్నారు. -
టీడీపీ నాయకుల తీరు దారుణం
-
టీడీపీ నాయకుల కుట్రలను తిప్పికొడతాం
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ : తనను భూకబ్జాదారుడిగా చిత్రీకరించి బురదజల్లే ప్రయత్నం చేస్తున్న టీడీపీ నాయకుల కుట్రలను తిప్పికొడతామని కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో తన తాతయ్య, జడ్జి కొమ్మాల చక్రపాణి తనకున్న ఆస్తిలోని ఎకరా 70 సెంట్ల భూమిని 80–15ఏ సర్వే నంబర్ ద్వారా తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మి పసుపు కుంకుమ మాన్యంగా వచ్చిందన్నారు. దాన్ని 1994లో చెల్లుబోయిన వీరరాఘవులు, బాబూరావు అనే ఇద్దరు అన్నదమ్ములకు అమ్మి వేశామన్నారు. తాతయ్యకు చెందిన మిగిలిన భూమి అమ్మివేయగా ప్రస్తుతం 1.23 ఎకరాలు 80–15బి, 80–20ఏ, 80–20బి సర్వే నెంబర్లలో ఉందన్నారు. తమ భూమిని కోనుగోలు చేసిన వ్యక్తులు అదే సర్వే నెంబర్లలో ఇప్పటికి వ్యవసాయం ఫలాలు పొందుతున్నారు. అయితే టీడీపీ మాత్రం వైఎస్సార్ సీపీపైనా, తన పైనా బురదజల్లే ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టిందన్నారు. తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మి 25 ఏళ్ల క్రితం అమ్మిన భూమి సర్వే నెంబర్లు వేరని, తన అమ్మమ్మ పేరున ఉన్న సర్వే నెంబర్లు వేరని ఆయన రికార్డులను విలేకరులకు ప్రదర్శించారు. కానీ అమ్మ అమ్మిన భూమి.. అమ్మమ్మ వద్ద ఉన్న భూమి సర్వే నెంబర్లలో ఉందని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ సర్వే జరిపి ఎవరి భూమి ఎక్కడ ఉందో స్పష్టం చేశారు. టీడీపీ నాయకుల తీరు దారుణం టీడీపీ నాయకులు వ్యక్తిగత సమస్యను వైఎస్సార్ సీపీకి, తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ కోనసీమలో ఫ్లెక్సీలు కట్టారని జక్కంపూడి రాజా అన్నారు. శెట్టిబలిజలకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తోందన్నారు. ఈ విధానం సరికాదని హెచ్చరించారు. తన తండ్రి బీసీలకు పెద్దపీట వేశారన్నారు. చెల్లుబోయిన వేణుకు ఉన్నతస్థానం కల్పించింది తన తండ్రి రామ్మోహనరావు అని గుర్తు చేశారు. ఇదే భూమిపై గతంలో తన మామయ్య ఫిర్యాదులపై మూడు కేసులు నమోదు అయ్యాయని, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టలేదన్నారు. ఇటీవల 20 రోజుల క్రితం తన మావయ్యపై దాడి చేసి అక్కడ షెడ్‌ను తగులబెట్టారని దీనిపై కేసు నమోదైందన్నారు. ఇదే విషయంపై గత నెల 23న కాకినాడలో శెట్టి బలిజ పెద్దగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోష్ వద్ద సంప్రదింపులకు ఏర్పాటు చేశామని, కానీ ఆ వర్గం నుంచి ఎవ్వరూ హాజరు కాలేదన్నారు. తనపై కుట్రలు ఆపకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జక్కంపూడి రాజా హెచ్చరించారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలి పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు లంక సత్యనారాయణ, మాసా రామజోగ్, మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, ఈతకోట బాపన సుధారాణి, న్యాయవాది ధర్మ పాల్గొన్నారు. -
కాపుల అభివృద్ధికి కృషి చేస్తా
సాక్షి, అమరావతి: కాపుల అభివృద్ధికి కృషి చేస్తానని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు దైవమని, ఆయన తర్వాత తమ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్న సీఎం వైఎస్ జగన్‌తోనే ఎప్పటికీ నడుస్తానని స్పష్టం చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా రాజా ఆదివారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తమను వైఎస్ జగన్ ఆదుకున్నారన్నారు. కాపు రిజర్వేషన్లను చంద్రబాబు మంట కలిపారని, కాపులను అయోమయానికి గురి చేస్తూ రాజకీయ లబ్ధి కోసం నాటకాలాడారని ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తానని సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. కాపులను చంద్రబాబు మోసం చేశారు గతంలో తాను కాపుల సమావేశానికి వెళ్తే చంద్రబాబు నిలదీశారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. ఐదేళ్లలో రూ.రెండు వేల కోట్లు కూడా టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని మంత్రి కన్నబాబు విమర్శించారు. బాబును కాపులు నమ్మరని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని తేల్చిచెప్పారు. కాపులంతా ఆరాధించే నేత జగన్ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం కాపులను వాడుకొని వదిలేసిందని మంత్రి బొత్స సత్యనారాVయణ ధ్వజమెత్తారు. జగన్‌కు కాపులంతా వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. కాపులను ఏ రంగంలోనూ ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. కాపుల అభివృద్ధికి రూ.వేల కోట్లు కేటాయించి వారి అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ బాటలు వేశారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మంజునాథ కమిషన్ నివేదిక వ్యతిరేకంగా ఉండటంతో.. కమిషన్ సభ్యుల రిపోర్టు కేంద్రానికి ఇచ్చేలా చంద్రబాబు చేశారని మండిపడ్డారు. రెండు రిపోర్టులపై కేంద్రం అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, వైఎస్సార్సీపీ ఎంపీలు వంగా గీత, బాలశౌరి, సినీ దర్శకుడు వి.వి.వినాయక్, పలువురు కాపు సంఘం నేతలు మాట్లాడారు. -
‘చంద్రబాబును కాపులు ఇక జీవితంలో నమ్మరు’
సాక్షి, విజయవాడ: కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాను నియమించడం కాపులందరికీ దక్కిన గౌరవమని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవీ స్వీకార ప్రమాణ సభలో ఆయన మాట్లాడుతూ.. కాపు కార్పొరేషన్ టీడీపీ దోపిడీకి గురైందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కాపుల కోసం విడుదలయిన నిధుల మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్ళాయన్నారు. కాపుల సంక్షేమం గురించి చంద్రబాబు ప్రధానితో ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత చర్యలతో అగ్రవర్ణాలలో చిచ్చు రగిలిందన్నారు. చంద్రబాబును కాపులు ఇక జీవితంలో నమ్మరని తెలిపారు. కాపులను విస్మరించకుండా ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి బాధ్యతగా పనిచేస్తున్నారని ఆళ్ల నాని చెప్పారు. ఈ సందర్భంగా కాపుల పక్షాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్.. కాపు సామాజిక వర్గ ఆరాధ్య నేత ప్రతి కాపు విద్యార్థికి కార్పొరేషన్ అండగా ఉండాలని మంత్రి పేర్ని నాని అన్నారు. కాపు సామాజిక వర్గమంతా ఆరాధించే నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నిధులు మంజూరు చేయాలని జక్కంపూడి రాజాను ఆయన కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్ కాపులను టీడీపీ రాజకీయంగా మాత్రమే వాడుకుందని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. కాపులకు ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించాలని కోరారు. -
‘మా కుటుంబానికి వైఎస్ రాజశేఖరరెడ్డి దైవం’
సాక్షి, విజయవాడ : కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయన చేత కాపు కార్పొరేషన్ ఎండీ హరీంద్రప్రసాద్ ప్రమాణం చేయించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ తమ కుటుంబాన్ని వెన్నంటి ఆదుకున్నారని రాజా అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మమ్మల్ని ఆదుకున్న వైఎస్ జగన్, నన్ను ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలవల్లే నాకీ పదవి లభించింది. ఇప్పటికీ, ఎప్పటికీ వైఎస్ జగన్ వెంటే నడుస్తా. కాపుల సంస్కరణలను మంటకలిపిన వ్యక్తి చంద్రబాబు. కాపుల్ని అయోమయానికి గురిచేస్తూ రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాటకాలాడారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయంచేస్తానని మా నాయకుడు సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. కాపు కార్పొరేషన్లో కొత్త సంస్కరణలు తీసుకువస్తాం. ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటాను. ప్రతి రూపాయి కాపులకు అందేలా చూస్తాం’అన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే రాజా. ఆయన వైఎస్సార్సీపీ రాజానగరం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి బడ్జెట్లోనే రూ.2000 కోట్లు కాపు కార్పొరేషన్‌కు కేటాయించి కాపుల అభ్యున్నతికి తొలి అడుగు వేశారు. కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ఆళ్లనాని, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. కాపులు ఎవరికీ వ్యతిరేకం కాదు.. జక్కంపూడి రాజా తల్లి విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘మా కుటుంబానికి వైఎస్ రాజశేఖరరెడ్డి దైవం అయితే జక్కంపూడి రమ్మోహనరావు, వంగవీటి రంగా మా ప్రాణం. చెప్పిన మాటను నెరవేర్చుకునే ఏకైక వ్యక్తి జగన్. కాపులు ఎవ్వరికీ వ్యతిరేకం కాదు’అన్నారు. రాజా ఛైర్మన్‌గా రావడం మంచిపరిణామమని కాపు కార్పొరేషన్ ఎండీ హరీంద్రప్రసాద్ అన్నారు. కార్పొరేషన్ కింద వచ్చే ప్రతి రూపాయి కాపుల అభ్యున్నతికి ఖర్చు పెడతామని స్పష్టం చేశారు. మాట నిలబెట్టుకునే ఏకైక నేత జగన్ అని మాజీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. -
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ‘జక్కంపూడి’
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం : రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు విజయవాడలోని ఎ–1 కన్వెన్సన్ సెంటర్లలో పార్టీ నాయకులు, జక్కంపూడి అభిమానులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాపు కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే దానిపై పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ యువకుడు, దివంగత జక్కంపూడి తనయుడు కావడం, పార్టీలో యువజన విభాగంలో క్రియాశీలకంగా ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రాజా వైపే మొగ్గుచూపించారు. పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు కూడా రాజాకు చైర్మన్ పదవి కట్టబెట్టే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో చైర్మన్ పదవి ఖాయమైంది. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయ్యాక తొలి బడ్జెట్లోనే రూ.2000 కోట్లు కాపు కార్పొరేషన్‌కు కేటాయించి కాపుల అభ్యున్నతికి తొలి అడుగు వేశారు. ఈ క్రమంలోనే ఇటీవలనే కాపు కార్పొరేషన్‌ను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించే దిశగా ముఖ్యమంత్రి జగన్ ఐఏఎస్ అధికారి హరీంద్రప్రసాద్‌ను ఎండీగా నియమించారు. ఇందుకు భిన్నంగా గత చంద్రబాబు పాలనలో కాపు కార్పొరేషన్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా కోత పెట్టి బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు చెప్పి మాట తప్పారు. ఈ క్రమంలోనే యువకుడైన రాజా కార్పొరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకంతో కేటాయించారు. రాజా ప్రమాణస్వీకారోత్సవానికి రాష్ట్రంతోపాటు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు శనివారమే విజయవాడ తరలివెళ్లారు. -
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే రాజా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జక్కంపూడి కుటుంబం...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. మరోవైపు జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడంపై కాపు సామాజిక వర్గనేతలు హర్షం వ్యక్తం చేశారు. -
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా యువ ఎమ్మెల్యే?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుని రాజాకు తెలియజేసినట్లు సమాచారం. రెండు లేదా మూడు రోజుల్లో రాజాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పీపీగా శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా కొనకంటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగుతారు. క్రిమినల్ కేసులను వాదించడంలో శ్రీనివాసరెడ్డికి మంచి పేరుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు భర్తీకి సర్కారు ఇటీవల ముగ్గురు న్యాయవాదుల ప్యానెల్‌ను హైకోర్టుకు పంపింది. నిబంధనల ప్రకారం ఈ ప్యానెల్ నుంచి హైకోర్టు శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసి, అందుకు సంబంధించిన లేఖను ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. హైకోర్టు సిఫారసు మేరకు ప్రభుత్వం శ్రీనివాసరెడ్డిని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరెడ్డి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్లు, అప్పీళ్లు, ఇతర ప్రొసీడింగ్స్ చేపడతారు. శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీనటి జయసుధ
-
జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచారం
-
పవన్ తాను చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేక..
కాకినాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తాను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.శుక్రవారం కాకినాడలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో అనిల్ కుమార్ మాట్లాడుతూ..ఓట్ల కోసమే తాను కానిస్టేబుల్ కుమారుడినని పవన్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. చిరంజీవి పేరు చెప్పుకోలేని పవన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రతి సభలోనూ కులాన్ని ప్రస్తావించే నాయకుడే పవన్ కల్యాణ్ అని తీవ్రంగా దుయ్యబట్టారు. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. వైఎస్ జగనే లక్ష్యంగా టీడీపీ, కాంగ్రెస్, జనసేనలు పని చేస్తున్నాయని, ప్రజలు జాగరూకతతో వచ్చే ఎన్నికల్లో ఓట్లేయాలని కోరారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది వైఎస్సార్, ఎన్టీఆర్‌లేనని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ పప్పులుడకవని టీడీపీ, కాంగ్రెస్‌లతో పాటు జనసేనలు లోపాయకారిగా జతకట్టాయని ఆరోపించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే హుందాగా నడుచుకుంటూ వెళ్లిన సంగతి గుర్తు చేశారు. వైఎస్ జగన్ పేరు వింటేనే చంద్రబాబు వణికిపోతున్నారని, దొంగకూటమిని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం వైఎస్ జగన్‌కు ఇస్తే తండ్రిని మించిన పాలన అందిస్తారని అన్నారు. బాబు పాలనలో దళితులపై దాడులు: మేరుగ చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతూ..దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి బాబు మర్చిపోయారని, వైఎస్సార్ హయాంలోనే దళితులకు లాభం జరిగిందని అన్నారు. వైఎస్ జగన్‌తోనే దళిత సంక్షేమం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దళితులపై బాబుకు విశ్వాసం లేదని, దళిత కాలనీలకు బాబు వచ్చినప్పుడు నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశంలోని కానీ, రాష్ట్రంలో కానీ చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని, మీడియాను అడ్డం పెట్టుకుని 2019లో బాబు ఎన్నికలకు వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హోదాపై అనేక యూటర్న్లు తీసుకున్నది చంద్రబాబేనని, హోదా ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై చంద్రబాబు కేసులు పెట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి నిజంగా పోరాడుతున్నది వైఎస్ జగన్ మాత్రమేనని చెప్పారు. నిరుద్యోగులకు బాబు రూ.2 లక్షల కోట్లు బాకీ: జక్కంపూడి నాలుగేళ్ల పాలనలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు దొరికిన కాడికి దోచుకున్నారని వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా ఆరోపించారు. అధికారంలోకి రాగానే కొన్ని వేల ఉద్యోగాలు పీకేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి అందరి ఉద్యోగాలు పీకేయించి లోకేష్ మాత్రం జాబు ఇప్పించారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారని, నిరుద్యోగులకు రూ.2 లక్షల కోట్లు బాబు బాకీ పడ్డారని వెల్లడించారు. -
దోచుకోవడమే వారి సింగిల్ అజెండా
తూర్పుగోదావరి, సీతానగరం (రాజానగరం): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సింగిల్ ఎజెండాగా పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా విరుచుకుపడ్డారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సీతానగరం మండలం రఘుదేవపురంలో నిర్వహించిన రావాలి జగన్, కావాలి జగన్ ముగింపు సభ ఆదివారం జరిగింది. జక్కంపూడి రాజా, పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మార్గాని భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ అధికార టీడీపీ ఆర్థికంగా బలంగా ఉన్న వర్గాల కోసం పాటుపడుతోందని, జగన్ మాత్రం బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం పాదయాత్ర జరుపుతున్నారని గుర్తు చేశారు. టీడీపీ పరిపాలనలో వైఎస్సార్ సీపీకి చెందినవారికి సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 2014 ఎన్నికలలో 650కు పైగా వాగ్దానాలు చేసి, ఏ ఒక్క హామీని అమలుపర్చకుండా చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యేకు చంద్రబాబు నూటికి పదమూడు మార్కులు ఇచ్చారని, ఇసుక, మట్టిని దోచుకుంటూ రూ.వందల కోట్లు దోచేసి ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టారని అన్నారు. కాటవరం, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం, పుష్కర, చాగల్నాడు పథకాలలో ఏ ఒక్కటి పనిచేయకుండా రైతులకు నీరందించలేని ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్న విశాఖకు నీరందించడానికి శ్రద్ధ చూపడం విడ్డూరంగా ఉందన్నారు. విద్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని, ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేకపోవడంతో వెనుకబడి ఉన్నామని అన్నారు. ఎంపీ మురళీమోహన్ తనకు ఏదైనా పని ఉంటే వస్తారని, ప్రజల అవసరాలు తీర్చడానికి మాత్రం కనిపించరని ఎద్దేవా చేశారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపర్చవలసిన అవసరం ఉందని వివరించారు. మార్గాని భరత్ మాట్లాడుతూ వైఎస్సార్ పాలన చూడాలంటే వైఎస్సార్ సీపీని బలపర్చాలన్నారు. పార్టమెంట్ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, దోచుకోవడమే ధ్యేయంగా పాలన జరిపారన్నారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేశారన్నారు. నియోజకవర్గం వెనుకబడి ఉందని, జగన్ ముఖ్యమంత్రి అయిన తక్షణమే నియోజకవర్గాన్ని నో వర్క్ జోన్‌గా తయారు చేస్తామని అన్నారు. అలాగే నవరత్నాలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల అయిదు పార్టమెంట్ నియోజకవర్గాల రీజనల్ ఇన్చార్జి బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ పార్టీ విజయానికి బూత్ కమిటీలు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్ బాబు, పార్టీ నాయకులు వలవల రాజా, చల్లమళ్ళ సుజీరాజు, పిచ్చుకుల విజయ్ కుమార్, కోండ్రపు ముత్యాలు, పట్టపగల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాంపుల బాబూ.. చాలిక నీ డాబు!
సీతానగరం (రాజానగరం): క్యాంపుల బాబుగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇకనైనా పర్యటనలకు స్వస్తి చెప్పి, మిగిలిన కొద్ది రోజులైనా ప్రజాశ్రేయస్సు కోసం పాలన జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా హితవు పలికారు. రఘుదేవపురం పంచాయతీ రాపాకలో పార్టీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యాన శనివారం జరిగిన ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్న రాజా విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో ప్రజాధనంతో విదేశీ పర్యటనలు జరిపి, ఆయా దేశాల రాజధానుల్లా అమరావతిని మారుస్తానంటూ ప్రగల్భాలు పలికేవారని, ఇప్పుడు మన దేశంలోనే పర్యటిస్తూ దేశ రాజకీయాలను మార్చేస్తున్నాంటూ డప్పులు వాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కలిసిన పార్టీలన్నీ బీజేపీ వ్యతిరేక పక్షాలేనని, ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ఏం సాధించారో ఎవ్వరికీ అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఉంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయాందోళనలో చంద్రబాబు ఉన్నారని, అందుకే క్యాంపులు వేస్తూ ఏదో చేస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, భూ కుంభకోణాలు, మట్టి, ఇసుక మాఫియా, అగ్రిగోల్డ్ భూముల వివాదం వంటి పలు రూపాల్లో రాష్ట్రాన్ని దోచుకున్నారని రాజా ఆరోపించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే, వచ్చే ఎన్నికల్లో తన ఓటమి తప్పదని గ్రహించి, జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అందినకాడికి దోచుకుని, ఇప్పుడు తనను కాపాడుకోవడానికే దేశంలోని ఇతర పార్టీలను అడ్డు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశంలోనే అవినీతిలో నంబర్–1గా పేరొందిన చంద్రబాబు గురించి తెలియని పార్టీలు లేవని, ఆయన అవినీతి గురించి తెలియని నాయకులు లేరని ఆక్షేపించారు. ఇప్పటికైనా నక్కజిత్తులు కట్టిపెట్టి, ప్రజలను మోసం చేయడం మానుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వలవల రాజా, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకట్రాజు, ఎంపీటీసీ కోండ్రపు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. -
జక్కంపూడి రాజా దీక్ష భగ్నం..
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు గురువారం అర్ధరాత్రి భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి రాజా నిరాకరించారు. పురుషోత్తపట్నం రైతులకు న్యాయం చేసే వరకు దీక్ష విరమించబోనని ఆయన స్పష్టం చేశారు. రఘుదేవపురంలో పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, వరికుప్పలు కాలిపోయిన రైతులను ఆదుకోవాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, పోలవరం జలవిద్యుత్ కేంద్రం సిబ్బంది కాలనీకి భూసేకరణలో ఉన్న రైతుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ జక్కంపూడి రాజా నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్ సీపీ గోదావరి జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి రాజాను పరామర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, అనంత బాబు ,తోట నాయుడు, విశ్వరూప్, వేణు గోపాల్ కృష్ణ, కుడుపూడి చిట్టబ్బాయి లతోపాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజాని పరామర్శించారు. ఓవైపు రైతుల కోసం జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష కొనసాగిస్తుండగా మరోవైపు ఆయన సోదరుడు గణేష్ కోరుకొండ మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్ సీపీ నవరత్నాలు గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. -
జక్కంపూడి రాజా దీక్షను భగ్నం చేసిన పోలీసులు
-
న్యాయమైన పరిహారం కోరుతూ ఆమరణ దీక్షకు సిద్ధమైన రాజా
-
అక్టోబర్ 2 నుంచి ఆమరణ దీక్ష
రాజానగరం: పురుషోత్తపట్నం ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిపి రెండు సంవత్సరాలు పూర్తకావొస్తున్నా ఇం తవరకు ఆయా రైతులకు నష్టపరిహారాన్ని అందించకపోవడం ప్రభుత్వ దుర్మార్గ పు ఆలోచనా విధానానికి తా ర్కాణంగా చెప్పవచ్చునని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. ఈ పరిహారాన్ని తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు, రైతు కూలీల పక్షాన ఈ నెల 25వ తేదీ నుం చి చేపట్టదలచిన ఆమరణ దీక్షను రైతు సత్యాగ్రహం పేరుతో గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2వ తేదీన చేపట్టనున్నట్టు తెలిపారు. ‘రా వాలి జగన్, కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తన ఇష్టానుసారంగా పంíపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పరిహారం పంపిణీ విషయంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తించే రైతులు, రైతు కూలీలకు ఈ రోజుకు కూడా న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికీ ఇంకా 85 మంది వరకు రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. ఎకరాకు రూ. నాలుగు లక్షలు పెంచి పరిహారం అడుగుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం కోర్టులకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం ఆలోచించడం లేదన్నారు. అయితే తాను ఆమరణ దీక్ష గురించి ప్రకటించిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పరుగుపరుగున వెళ్లి రైతుల తరఫున సీఎంకు వినతి ప్రతం ఇచ్చినట్టుగా డ్రామాలాడటం విడ్డూరంగా ఉందన్నారు. సెంటు భూమి కూడా లేని బాలకృష్ణ లాంటి వ్యక్తులతో కొంతమంది డమ్మీ రైతులతో ప్రెస్మీట్లు పెట్టించి, తప్పుదారి పట్టేవిధంగా ఎల్లో మీడియాలో ప్రకటనలు ఇప్పించడం విచిత్రంగా ఉందన్నారు. 2013 భూ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారాన్ని లెక్కిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఒక రైతుకు చెందిన భూములు ఒకటికి రెండు మూడు ప్రాజెక్టుల్లో పోతే పరిహారం నాలుగు రెట్లు ఇవ్వడంతోపాటు రూ.ఐదున్నర లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కుటుంబంలో 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉందన్నారు. రైతు కూలీలకు కూడా ఇదే విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లేదా నెలకు రూ.రెండు వేలు చొప్పున 20 సంవత్సరాలపాటు ఆ కుటుంబానికి ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ ఏ విషయాన్నీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేదని జక్కంపూడి ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్సార్ జయంతి: మండపేటలో రక్తదాన శిబిరం
-
రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం
పెద్దాపురం: ప్రజా సంక్షేమ పాలన సాగించిన దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన ఆయన తనయుడు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పట్టణ ఎన్టీఆర్ నగర్ వాసులు సుమారు 150 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుబ్బారావు నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో రాజా మాట్లాడుతూ హైటెక్ పాలన పేరుతో ప్రజలను మభ్య పెడుతున్న చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కోఆర్డినేటర్ సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం పెద్దాపురం నియోజవర్గంలో మట్టి మాఫియా, అవినీతి పాలన రాజ్యమేలుతుందన్నారు. నాడు తోట గోపాలకృష్ణ హయాంలో రాజీవ్ గృహకల్ప నిర్మిస్తే సిగ్గు లేకుండా ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టుకుని గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్ర నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, జిగిని వీరభద్రరావు, ఆవాల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు రమేష్‌రెడ్డి, పెదిరెడ్ల రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. అనంతరం ఆ వార్డు నాయకులు ధరణికోట యోహాను, తుమ్మల వాసుల ఆ«ధ్వర్యంలో కాలనీకి చెందిన కడియాల సత్తిబాబు, దూలం పెద్ద, సిమ్మ అప్పారావు, గుమ్మడి వీర్రాజు, అక్షింతల గంగాధర్, కడియాల కుమారి, సుందరపల్లి వీర వరలక్ష్మి, యర్రా శ్రీను, మంతా గోవిందు, షేక్ పయ్యాన్, బత్తుల తాతారావులతోపాటు సుమారు 100 మంది పురుషులు , 50 మంది మహిళలు పార్టీలో చేరగా వారికి జక్కంపూడి రాజా, సుబ్బారావు నాయుడులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేకా శ్రీను, విడదాసరి రాజా, గోపు మురళి, గుర్రాల యాకోబు, పేర్నేడి ఈశ్వరరావు, జిగిని రాజుబాబు, ఉద్దగిరి సతీష్, శెట్టిబత్తుల దుర్గారావు, కొల్లి రాజు, సేపేని సురేష్, కందుల వెంకటాచలం, గుణ్ణం రామ్మోహన్, పల్లా శ్రీనివాస్ యాదవ్, దేవాడ శ్రీనివాసరెడ్డి, నందిక లోవరాజు, నీలం రామకృష్ణ, అధిక సంఖ్యలో ఎన్టీఆర్ కాలనీవాసులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. -
అవినీతి, చంద్రబాబు కవల పిల్లలు
అంబాజీపేట (పి.గన్నవరం): అవినీతి, చంద్రబాబు కవల పిల్లల్లాంటి వారని, అందుకే టీడీపీని ప్రజలు నమ్మడం లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ధ్వజమెత్తారు. అంబాజీపేట మండలం వాకలగరువులో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు అధ్యక్షతన నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ సమావేశం బుధవారం జరిగింది. రాజా, చిట్టబ్బాయి మాట్లాడు తూ చంద్రబాబు గత ఎన్నికల్లో 650 హామీలు ప్రకటించి ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తానని మోసం చేశారన్నారు. చంద్రబాబు 43 నెలల్లో లక్ష కోట్ల రూపాయలు నిరుద్యోగులకు బాకీ పడ్డారన్నారు. టీడీపీలో కింద స్థాయి నాయకుడి నుంచి సీఎం వరకూ ఇసుక, మట్టి, దేవాలయాలు తదితరాలను దోచుకుతింటూ రాష్టాన్ని అవినీతిలోకి నెట్టేశారని విమర్శించారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓర్వలేక తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలే స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రత్యే క హోదా వస్తే రాష్ట్రంలో పన్నుల భారం తగ్గడమే కాక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఇతర రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నారన్నారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహ న్, కర్రి పాపారాయుడు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మాట్లాడుతూ జగన్‌ను సీఎం చేసేం దుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి నాగవరపు నాగరాజు, గ్రామ శాఖ నాయకులు వాకపల్లి శ్రీనివాస్, చప్పిడి రా>జు, కేతా రాజు, పైడికొండల శ్రీనివాసరావుతో పాటు పలువురి సహకారంతో చిట్టిబాబు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి సుమారు 200 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి నేతలు కండువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు ఎం.ఎం.శెట్టి, పేరి శ్రీనివాస్, దొమ్మేటి సాయికృష్ణ, నీతిపూడి విలసిత మంగతాయారు, నేతల నాగరాజు, కొర్లపాటి కోటబాబు, అడ్డగళ్ళ వెంకట సాయిరాం, వాసంశెట్టి తాతాజీ, మైలా ఆనందరావు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, నక్కా వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి వెంకట్రావు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, బూడిద వరలక్ష్మి, సుంకర రామకృష్ణ, జక్కంపూడి వాసు, పేరాబత్తుల చిన సుబ్బరాజు, జక్కంపూడి కిరన్, దంతులూరి శ్రీనివాసరాజు, ఎస్.కె.జాకీర్, వాసంశెట్టి వెంకన్న, దూనబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సై నాగరాజు సస్పెన్షన్
-
ఎస్సై నాగరాజు సస్పెన్షన్
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దౌర్జన్యం చేసి గాయపర్చిన కేసులో తూర్పు గోదావరి జిల్లా రామచంద్ర పురం ఎస్సై పి.నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 30న రామచంద్రపురంలో రోడ్డుపక్కన కారు నిలిపి చంటి బిడ్డను ఎత్తుకొని ఉన్న రాజాపై ఎస్సై నాగరాజు దూకుడుగా వ్యవహరించి గాయపర్చిన విషయం తెలిసిందే. ఎస్సైను అరెస్టు చేసి సస్పెండ్ చేయాలంటూ పార్టీ నేతలు పోలీసు స్టేషన్ల వద్ద నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎస్సైని వీఆర్‌లోకి పంపించారు. -
హోంమంత్రి ఇంటిముందు అర్థరాత్రి బైఠాయింపు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇంటి వద్ద ఆందోళనకు దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాను పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమహేంద్రవరం వైపు తరలించారు. ఇటీవల తనపై దాడి చేసిన రామ చంద్రపురం ఎస్సై కె. నాగరాజును సస్పెండ్ చేయాలని కోరు తూ వైఎస్సార్సీపీ నాయకులు, తన సోదరుడు గణేష్, రామ జోగి, వంకా శ్రీహరి తదితరులతో కలసి జక్కంపూడి రాజా బుధవారం రాత్రి 11.15 గంటల సమయంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని హోంమంత్రి ఇంటి ముందు బైఠాయించారు. ఆ సమయంలో మంత్రి రాజప్ప ఇంట్లో లేరు. రాజా ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ వర్మ, సీఐ కృష్ణ చైతన్య తమ సిబ్బందితో వచ్చి రాజా తదితరులను బలవంతంగా అదుపు లోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం వైపు తరలించగా ఆందోళన చెందిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హోంమంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. రాజాపై దాడి జరిగి ఇన్నాళ్లయినా ఎస్సైపై ఇంతవరకు చర్య తీసుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. -
రాజాపై దాడి దారుణం..
కొత్తపేట, దానవాయిపేట (రాజమహేంద్రవరం): ‘వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రపురం ఎస్సై నాగరాజు దౌర్జన్యం, దాడికి పాల్పడడంవ దారుణమని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న రాజాను ఆయన పరామర్శించారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో కొందరు పోలీసు అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంటి బిడ్డతో కారులో ఉన్న రాజాను దౌర్జన్యంగా బయటకు లాగి, స్టేషన్‌కు తీసుకువెళ్లి లాఠీచార్జి చేయడం దారుణమైన సంఘటనగా అభివర్ణించారు. దీనిపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. జగ్గిరెడ్డి వెంట ఆలమూరు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు తమ్మన శ్రీను, జిల్లా కార్యదర్శి తోరాటి లక్ష్మణరావు, పార్టీ నాయకులు దొడ్డా రాంబాబు, మడికి రాజు తదితరులు ఉన్నారు. హోంమంత్రి నోరు మెదపలేదేం? జక్కంపూడి రాజాపై ఎస్సై దౌర్జన్యాన్ని, లాఠీచార్జీని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఖండించినా, జిల్లాకు చెందిన హోంమంత్రి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడంపై జగ్గిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం బిళ్లకుర్రు శివారు మాసాయిపేటలో మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ జిల్లా బీసీ విభాగం సభ్యుడు దూనబోయిన సత్యనారాయణ స్వగృహంలో జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులకు కొట్టే అధికారం ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థపై ఉన్న గౌరవంతోనే తాము ఇంత వరకు ఆగుతున్నామని, తమ సత్తా ఏమిటో చూపేందుకు పార్టీపరంగా సమాయత్తమవుతున్నట్టు హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా కార్యదర్శులు నెల్లి లక్ష్మీపతిరావు, రెడ్డి చంటి, ఎంపీటీసీ సభ్యురాలు నూకపేయి మేరీ సుశీలారాణి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకర సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నాగరాజులో..అంత విషమెందుకో..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పచ్చ ఖద్దరు వేసుకున్న నేతలు వివిధ రకాలుగా దౌర్జన్యాలకు దిగుతున్నారు ... ప్రత్యర్థులనే కాదు అధికారులను కూడా వదలకుండా దాడులకు దిగుతున్నారు ...వారు చేస్తే తప్పు కానప్పుడు నేను చేస్తే తప్పేంటీ? అని అనుకున్నారో ఏమో రామచంద్రపురం ఎస్సై నాగరాజు ఒక్కసారిగా విషం చిమ్మారు. ఇదేమీ ఆయనకు కొత్త కాదని గత చరిత్ర చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. గతంలో ఒకాయనను కారు పార్కింగ్ విషయంలో కాలర్ పట్టుకుని కొట్టుకుంటూ స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఆ తర్వాత ఒక న్యాయవాది విషయంలో దురుసుగా ప్రవర్తించాడు. తాజాగా సమాజంలో గౌరవ ప్రతిష్టలున్న మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుమారుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై తన జులుం చూపించారు. ♦ ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన ద్రాక్షారామకు చెందిన కుక్కల సూర్యశంకర నారయణ భార్య ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ఇంటికి కారులో ద్రాక్షారామ వెళుతున్నారు. అప్పట్లో రామచంద్రపురంలో రోడ్డు అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. ప్రధాన రహదారిలో కారును రోడ్డుకు పక్కగా తీసి ఆపారు. ఇంతలో అటుగా వచ్చిన ఈ ఎస్సై నాగరాజు కారును తీయాలని హుకుం జారీ చేశాడు. కారు పక్కగానే ఉందని, షాపులోకి తమవారు వెళ్లారని, వారు వచ్చిన వెంటనే తీసి వేస్తానని చెప్పేలోగానే సూర్యశంకర నారాయణ కాలర్ పట్టుకుని కొట్టుకుంటూ స్టేషన్‌కు లాక్కెళ్లారు. ♦ ఇదే తరహాలో పట్టణానికి చెందిన ఒక లాయర్ విషయంలోనూ దురుసుగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. అనుచితంగా ప్రవర్తించడం తనకో ట్రాక్ రికార్డ్‌గా భావిస్తున్నాడేమో తెలియదుగానీ ... ఆ తరహాలోనే దురుసుగా ప్రవర్తిస్తూ వివాదస్పదంగానే వ్యవహరించడం రివాజుగా మారిపోయింది. స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదగా నడుచుకోవాలని ఓ వైపు పోలీసు ఉన్నతాధికారులు హితబోధలు చేస్తున్నా నాగరాజు తరహా అధికారులకు చెవికెక్కడం లేదనడానికి ఆదివారం రాత్రి జరిగిన ఘటనే ఓ ఉదాహరణ. చేతిలో లాఠీ ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తనకెవరూ అడ్డు కాదని...కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తప్పు చేస్తే ఓకే...ఏదీ లేనప్పుడు...కేవలం కారు పార్కింగ్ విషయంలో చేయి చేసుకోవడం... కాలర్ పట్టుకుని స్టేషన్‌కు ఈడ్చుకెళ్లడం.. లాఠీ విరిగేలా కొట్టడం చూస్తే నాగరాజులో పేరుకుపోతున్న విషాన్ని పట్టి పిండేయకపోతే సమాజానికే తీవ్ర విఘాతం కలిగిస్తుందని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు. -
రాజాపై ఎస్సై దాడిని ఖండించిన ముద్రగడ
-
చంద్రబాబుకు తెలిసే జరుగుతున్నాయా?
సాక్షి, రాజమహేంద్రవరం: ఖాకీ డ్రెస్సు వేసుకున్న కేడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దాడి చేసిన రామచంద్రపురం ఎస్సైని డిస్మిస్ చేయాలన్నారు. ఎస్సై నాగరాజు దాడిలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జక్కంపూడి రాజాను సోమవారం ముద్రగడ పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులకే దిక్కులేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా ముద్రగడ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా అని అడిగారు. కాగా, జక్కంపూడి రాజాపై ఎస్సై నాగరాజు దాడికి నిరసనగా వైఎస్సార్సీపీ రామచంద్రాపురం బంద్ చేపట్టింది. ఎస్సై నాగరాజుపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనకాపల్లిలోనూ నిరసన జక్కంపూడి రాజాపై ఎస్సై దాడిని ఖండిస్తూ విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు నిరసనకు దిగారు. రామచంద్ర ధియేటర్ జంక్షన్ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జి. రమేశ్, సోమినాయుడు, వేగి త్రినాథ్, మల్లా రామచంద్రరావు తదితరులు నిరసన కార్యక్రిమంలో పాల్గొన్నారు. -
రాజాపై ఎస్ఐ దాడి; వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని తమ పార్టీ నాయకులను టార్గెట్ చేసినట్టు కనబడుతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, సుధాకర్‌బాబు, పైలా సోమినాయుడు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రపురం సబ్ ఇన్స్పెక్టర్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన ఎస్ఐ నాగరాజును తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని, రెచ్చగొట్టే చర్యలను ప్రభుత్వం ఆపాలన్నారు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. రాజాపై దాడిని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్‌గా పరిగణిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కారు పార్కు చేసినందుకు ఈడ్చి, చొక్కాలు పట్టుకొని లాఠీలతో కొడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అండతోనే ఈవిధంగా జరుగుతోందని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలన్నారు. రామచంద్రాపురం ఘటనతో సభ్యసమాజం తలదించుకుంటోందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన ఎస్ఐ నాగరాజును సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో మీడియా సమావేశంలో పైలా సోమినాయుడు, వెల్లంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, సుధాకర్‌బాబు -
రాజాపై ఎస్ఐ దాడి; వైఎస్ జగన్ సీరియస్
-
జక్కంపూడి రాజాపై దాడిని ఖండించిన వైఎస్ఆర్ సీపీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై పోలీసుల దాడిని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన సబ్ ఇన్స్పెక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీని ...వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఈ దాడి విషయాన్ని ఆయన ...ఏపీ డీజీపీ సాంబశివరావు దృష్టికి కూడా తీసుకు వెళ్లారు. ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత మూడున్నరేళ్ల కాలంలో వందలమంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులను అధికార పార్టీ వారు హత్య చేశారు. పత్తికొండలో చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా నరికి చంపారన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు, కార్యకర్తలపై లెక్కలేనన్ని అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలే లేకుండా చేసిన సీఎం చంద్రబాబు సర్కార్ ఇప్పుడు రాష్ట్ర నాయకుల మీద కూడా దాడులు చేయడానికి పోలీసుల్ని ఉపయోగించుకుంటున్న విషయం తాజాగా జక్కంపూడి రాజా మీద దాడితో స్పష్టం అవుతుంది. ఎస్ఐ నాగరాజును తక్షణమే విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. అలాగే ఎస్ఐ వెనక ఎవరున్నారన్నది వెలికి తీయాలి. లేనిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తదుపురి కార్యాచరణకు సిద్ధం అవుతుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు దాడి కేసుకు సంబంధించి... వైఎస్ఆర్ సీపీ నేతలు ఇవాళ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీని కలిశారు. దాడి ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. కాగా ఈ కేసు విచారణ నిమిత్తం డీఎస్పీ మురళీమోహన్ను ఎస్పీ నియమించారు. -
27న వైఎస్సార్ సీపీ సమావేశం
శ్రీకాకుళం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, రైతు, మహిళ, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో ఈ నెల 27న సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు ప్రకటించారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు గొండు రఘురాం సమావేశ వివరాలు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, సాగి ప్రసాదరాజు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలోనే సమావేశం జరుగుతుందన్నారు. పార్టీ వ్యవసాయ విభా గం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, పార్టీ మ హిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.కె.రోజా, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు తదితరులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. 38 మండలాలు, ఆరు మున్సిపాలిటీలకు సంబంధించి కమిటీలు వేయనున్నట్లు వెల్లడించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేం దుకు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కమిటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. యువజన, మహిళా, రైతు, విద్యార్థి విభాగాల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ భృతి పేరిట మోసం చేయడంతో యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలను నమ్మించి నట్టేట ముంచారన్నారు. సమావేశంలో పార్టీ నేతలు పడపాన సుగుణారెడ్డి, కోరాడ రమేష్, బగాది హరి, చింతాడ దిలీప్, బిడ్డిక లక్ష్మి, కె.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు చెప్పేందుకే హర్తాళ్‌కు మద్దతు
వైఎస్సార్ సీపీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రాజా నగరం (మామిడికుదురు) : పెద్ద నోట్ల రద్దును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నప్పటికీ, దాని వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వ విఫలమవడం వల్లే హర్తాళ్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలిపారు. నగరంలో కటకంశెట్టి పాండురంగారావు నివాస గృహంలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు, కార్మికులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజా అన్నారు. నోట్ల రద్దు వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కాపులను బీసీల జాబితాల్లో చేరుస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని దాన్ని అమలు చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. బీసీలకు అన్యాయం జరుగకుండా, వారికి ఇబ్బంది లేకుండా కాపులను బీసీల జాబితాల్లో చేర్చాలన్నదే తమ డిమాండ్ అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహ¯ŒS అన్నారు. సమావేశంలో పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, నాయకులు పేరి శ్రీనివాస్, బొలిశెట్టి భగవాన్, అడ్డగళ్ల సాయిరామ్, గుత్తుల బాబి, ఎంఎం శెట్టి, జక్కంపూడి వాసు, కిరణ్ పాల్గొన్నారు. -
ట్రంప్ విజయం మీ ఘనత అంటారేమో!
చంద్రబాబును ఎద్దేవా చేసిన జక్కంపూడి తూర్పుగానుగూడెం (రాజానగరం) : అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ విజయం సాధిండం తన ఘనతేనని పొరబాటున చెప్పుకుంటారామో, అది మనదేశం కాదు బాబు’ అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీ రామారావును రాజకీయాల్లోకి తీసుకురావడంలోను, హైదరాబాద్‌ని అభివృద్ది చేయడంలోనే కాకుండా ఇటీవల ఒలింపిక్స్‌లో మన దేశానికి సిల్వర్ పతకాన్ని సాధించిన పీవీ సింధు విజయంలోను తన ప్రమేయం ఉందంటూ ప్రచారం చేసుకున్న ఆయన అలవాటు ప్రకారం ట్రంప్ విజయాన్ని కూడా తన ఘనతగానే చెప్పుకోవచ్చన్నారు. అటువంటి అలవాటులో పొరబాటు జరుగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయనను ఈ విధంగా అప్రమత్తం చేస్తున్నానన్నారు. సంస్కృతిని కాపాడండి భారతీయ పౌరుడిగా మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జక్కంపూడి రాజా అన్నారు. విశాఖ బీచ్‌లో నిర్వహించనున్న లవ్ ఫెస్టివల్ విషయంలో ప్రజలంతా వద్దని వారిస్తూ ఆందోళనలు నిర్వహిస్తుంటే సీఎం చంద్రబాబు మాత్రం తాను చెప్పిందే శాసనం అన్నట్టుగా బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామనడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. చరిత్రలో నియంతల పరిస్థితి ఎలా ముగిసిందో ఒకసారి మననం చేసుకోవాలని హితవు పలికారు. వాస్తవాలను గ్రహించాలి ప్రజా çసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న తమ నాయకుడు వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిపై మీ మంత్రులతో విమర్శల దాడి చేయించడం మానుకుని వాస్తవాలను గ్రహించాలని, లేకుంటే భవిషత్తులో మిమ్మల్ని, మీ పార్టీని కాపాడటానికి ఏ పవనిజం, ప్రజావ్యతిరేకత ముందు నిలబడదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది సామాన్యులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, అన్నింటినీ పచ్చచొక్కాలే ఎగరేసుకుపోతున్నాయన్నారు. అ««ధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనా పేదవారి సొంతింటి కలను సాకారం చేయలేకపోయారన్నారు. సంజీవని వంటి 108, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అసంపూర్తిగా నడుస్తున్నాయన్నారు. సమావేశంలో మండల కన్వీనర్ మందారపు వీర్‌ారజు, ఉపసర్పంచ్ చొల్లంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు చెబుతుంటే పోలీసులను ఉపయోగిస్తున్నారు..!
వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కూనవరం (సీతానగరం) : టీడీపీ చేపట్టిన జన చైతన్య యాత్రలో ప్రజలు తమ సమస్యలను చెబుతుంటే పోలీసులతో వారిని అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. బుధవారం కూనవరంలో చౌటిపల్లి లాల్‌బాబు ఇంటివద్ద జరిగిన విందు కార్యక్రమంలో రాజా పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుప మేరకు చేపట్టిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా జనచైతన్య యాత్రలు టీడీపీ చేపట్టిందన్నారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 హామీలలో ఒకటి అమలు జరపలేదని ప్రజలు తమ వద్ద వాపోతున్నారని, ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జనచైతన్య యాత్రలో ప్రజలు స్పందించి, ఎక్కడకక్కడ ఖండిస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులో 90 ఇల్లు కాలిపోతే అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యే బుచ్చియ్యచౌదరి వారే ఇళ్ల కాల్చుకున్నారని అనడం అధికారం అహంకారంతో ఉన్నారని రుజువైందన్నారు. రెండేళ్ళ క్రితం ఇళ్లను వేరే ప్రాంతంలో ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన బుచ్చియ్య చౌదరి దానిని మర్చారన్నారు. దేశంలో గత ప్రభుత్వంలో 47 లక్షల గృహాలు కడితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టారని గుర్తు చేశారు. రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేవన్నారు. మోదీ ప్రకటనతో ప్రజల ఇబ్బందులు ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు పట్టిసీమ, దేవుడు భూములు అమ్ముకున్న డబ్బు, అమరావతి ద్వారా సంపాదించిన నల్లదనాన్ని ఏవిధంగా మారుస్తావని ప్రశ్నించారు. పెద్దనోట్లు రద్దు చేయమని మేమే చెప్పామని టీడీపీ నాయకులు చంద్రబాబును తెగపొగుడుతుంటే, చంద్రబాబు మాత్రం ఇంటిలో కూర్చుని డబ్బులు ఏవిధంగా మార్చాల అని మదనపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వేల కోట్లు రూపాయల అవినీతి జరుగుతుందని, ప్రజలే త్వరలో గట్టిగా బుద్ధిచెబుతారని రాజా హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అద్యక్షుడు పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చళ్లమళ్ల సుజీరాజు, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, మండల సేవాదళ్ అద్యక్షుడు ఆళ్ళ కోటేశ్వరావు, బంక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎవరికీ రాని ఐడియా చంద్రబాబుకే వచ్చింది’
పిఠాపురం : ప్రతి యువత ఒక మీడియాగా తయారు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు దుష్ప్ర చారాలను సోషల్ మీడియా ద్వారా యువకులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యువత అభిమానించి, అండదండలు చూపిస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని దోమలపై దండయాత్ర అనే ఐడియా చంద్రబాబుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. అయితే ప్రజా సమస్యలపై దండయాత్ర చేసే పార్టీ వైఎస్ఆర్ సీపీనే అని కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకుల నుంచే మొదలైందని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. వైఎస్ జగన్ విధివిధానాలను యువజన విభాగం క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందన్నారు. -
గోరంట్లా.. దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలు
కడియం : చంద్రబాబు చెప్పిన మోసపూరిత హామీల గాల్లో గెలిచిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి దమ్ముంటే తక్షణం తన పదవికి రాజీనామాచేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సవాల్ చేశారు. పార్టీ నాయకుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో జేగురుపాడులో ఆదివారం పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్య అతిథులుగా రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ జగన్‌ను నోటికొచ్చినట్టు విమర్శిస్తున్న గోరంట్ల తనకు పదవినిచ్చిన రూరల్ నియోజకవర్గం సమస్యలను పరిష్కరించడాన్ని మర్చిపోయారన్నారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి బంగారంపై అప్పులన్నీ తీర్చేస్తామని చెప్పుకొచ్చిన ఎంపీ మురళీమోహన్ ఏనాడైనా తన మాటను నిలబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. ఆయన అమరావతిలో రియల్ఎస్టేట్ వ్యాపారంపై పెట్టిన శ్రద్ధ తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించంపై పెడితే మంచిదన్నారు. వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న గడపగడపకూ కార్యక్రమంలో ప్రజలు ఇంటికో సమస్యను చెబుతున్నారన్నారు. రైతు, డ్వాక్రారుణమాఫీ అమలు జరగక, ఇంటిరుణాలు, ఇళ్లస్థలాలు, పెన్షన్లు మంజూరు కాక, రోడ్లు, డ్రైన్లు వంటి సమస్యలతో జనం సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు అంతా బాగుంటే ఇన్ని సమస్యలు ఎందుకున్నాయని రాజా ప్రశ్నించారు. ఎదుటి పార్టీ నాయకులను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి లాక్కుందామన్న ఆలోచనలే తప్ప ప్రజలు ఏమైపోతున్నారన్న ధ్యాస అధికార పార్టీకి లేకుండా పోయిందన్నారు. దోచుకోవడం అనే సింగిల్ పాయింట్ అజెండాతోనే చంద్రబాబు పనిచేస్తున్నాడన్నారు. జగన్‌ను అతిగా విమర్శిస్తే జనమే తిరగబడే పరిస్థితి ఉందన్నారు. టీడీపీ అబద్ధపు హామీల కారణంగానే రూరల్‌లో ఆకుల వీర్రాజు ఓటమిపాలయ్యారని రాజా చెప్పారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు జక్కంపూడి రాజాను యాదల సతీష్‌చంద్రస్టాలిన్, జేగురుపాడు గ్రామస్తులు గజమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జేగురుపాడు ఆడదాని రేవు వద్ద నుంచి యువకులు మోటారుసైకిల్ ర్యాలీ, పువ్వులతో నాయకులకు ఘన స్వాగతం పలికారు. -
మోసాలు ఎల్లకాలం సాగవు బాబూ
వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా నరేంద్రపురం (రాజానగరం) : ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసాలతో మభ్యపెడుతూ అధికారం చెల్లాయిస్తున్న సీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో నిలువునా బుక్కయ్యారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టి ఈ కేసు నుంచి తప్పించుకుందామని చూసిన ఆయన ఎత్తుగడ కోర్టు జోక్యంతో పటాపంచలైందన్నారు. ఎప్పుడూ తాను నిప్పు అని గొప్పలు చెప్పుకునే ఆయన ఈ కేసులో తన నిజాయితీ ఏమిటో నిరూపించుకోవాలన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈ కేసును పునర్విచారణకు ఆదేశించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన పైవిధంగా అన్నారు. వచ్చే నెల 29లోగా విచారణ పూర్తి చేయాలంటూ కోర్టు ఆదేశాలివ్వడంతో అయోమయంలో పడిన చంద్రబాబు తిరుపతిలోని కేంద్రమంత్రి పర్యటనను సైతం రద్దు చేసుకుని విజయవాడకు పరుగు పెట్టడం ఆయనలోని భయాన్ని తెలియజేస్తోందన్నారు. చంద్రబాబు నీతి తప్పితే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నారు. ప్రజాస్వామ్యం పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు. పాలకుల అభివృద్ధేగాని రాష్ట్ర ప్రగతి లేదు టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రగతి కన్నా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల అభివృద్ధి బాగా జరిగిందన్నారు. 2015లో గోదావరి, 2016లో కృష్ణా పుష్కరాలకు కేటాయించిన నిధులు, చేసిన ఖర్చులపై ఏసీబీ విచారణ జరిపితే మరెన్నో కుంభకోణాలు బయటపడతాయన్నారు. తాత్కాలిక సచివాలయంలో నాణ్యతలేక మంత్రులే తమ చాంబర్లు పెట్టుకోవడానికి వెనుకంజ వేస్తున్నారంటే అంతకుమించిన సిగ్గు చేటు మరొకటి ఉండదన్నారు. -
హామీల అమలుకు యువతతో ఉద్యమం
నేడు గుంటూరులో ఉద్యమ కార్యాచరణ వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా సాక్షి, రాజమహేంద్రవరం : ఎన్నికల్లో యువతకు ఎన్నో హామీలను ఇచ్చిన చంద్రబాబు వెంటనే వాటిని అమలు చేయాలని కోరుతూ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలియజేశారు. ఉద్యమ కార్యాచరణ కోసం శనివారం గుంటూరులో యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులకు తెలిపారు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్హాల్లో ఉదయం 8.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాలల నుంచి యువజన విభాగాల అధ్యక్షులు, నేతలు హాజరవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ హామీలు–వైఫల్యాలు, పార్టీ యువజన విభాగం–సంస్థాగత నిర్మాణం అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ హామీల అమలుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. ‘జాబు కావాలంటే.. బాబు రావాలి’ అని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనిహామీ ఇచ్చి ఆ ఉద్యోగాలే లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. విద్యను కార్పొరేట్ పరం చేసేందుకు చిన్న చిన్న పాఠశాలలు, కాలేజీలపై తనిఖీల పేరుతో ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. తన వియ్యంకుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలసి నారాయణ కళాశాలల అధినేత, రాష్ట్ర మంత్రి నారాయణ ప్రభుత్వ కళాశాలలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ కళాశాలల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. -
హామీని నెరవేర్చాల్సిందే..
లేకపోతే ఆమరణ దీక్ష చేపడతా ర్యాంపును, ఇసుక లారీలను అడ్డుకుంటాం ప్రజావాణిలో అధికారులను నిలదీసిన జక్కంపూడి రాజా సీతానగరం : జాలిమూడి వద్ద గత నెల 15న ఇసుక లారీ కిందపడి మామిడి దుర్గ మరణించిన సంఘటన నేపథ్యంలో ఆమె ఇద్దరు కుమార్తెలకు అధికారులు, ర్యాంపు నిర్వాహకులు నష్ట పరిహారం ఇస్తానన్న హామీని విస్మరిస్తే సహించేది లేదని జక్కంపూడి రాజా హెచ్చరించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ చంద్రశేఖరరావును ఆయన నిలదీశారు. సంఘటన జరిగి 40 రోజులైనా, మృతురాలి కుమార్తెలు శ్రీదేవి, సత్యభువనకు ర్యాంపు నిర్వాహకులు రూ.4 లక్షలు, ప్రభుత్వపరంగా ఇంటిస్థలం, ఆర్థికసాయం ఇచ్చేలా అధికారులు ఒప్పుకున్నారని, ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నగదు విషయమై తమకు సంబంధం లేదని, ఇంటì æస్థలం, సీఎం రిలీఫ్‌ఫండ్ వచ్చేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ర్యాంపు నిర్వాహకులతో చర్చిస్తామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు చేతులెత్తేస్తారా అంటూ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా హామీ నెరవేర్చకపోతే ఆమరణ æదీక్ష చేపడతానని ప్రకటించారు. ఇసుక లారీలను, కాటవరం ర్యాంపును అడ్డుకుంటామని హెచ్చరించారు. సిగ్గుంటే పదవికి రాజీనామా చెయ్! సాక్షి, రాజమహేంద్రవరం : గతంలో ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు నీతి, నైతిక విలువల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు.. ఇప్పుడు తాను చేసిన వ్యవహారం ఏమిటో చెప్పాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రశ్నించారు. సిగ్గు, నైతిక విలువలుంటే పార్టీకి రాజీనామా చేసినట్టుగానే, పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆదిరెడ్డి వల్లే నగరంలో ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్, ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికల్లో పార్టీ నష్టపోయిందని మండిపడ్డారు. బీసీలకు పెద్దపీట వేయాలని పార్టీ నుంచి తొలి ఎమ్మెల్సీ పదవిని ఆదిరెడ్డికి ఇచ్చారని గుర్తు చేశారు. పుష్కరాల్లో 29 మంది మరణిస్తే ఒక్కసారి కూడా కమిషన్ ముందు పార్టీ వాదన వినిపించలేదని విమర్శించారు. ఇసుక విక్రయాలు, నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై కోర్టుకెళతానన్న మాటలు, ఆ తర్వాత ఎక్కడిపోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సాధారణ లెక్చరర్‌గా ఉన్న ఆదిరెడ్డి ఇప్పుడు ఖరీదైన కార్లలో ఎలా తిరుగుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. కార్పొరేటర్లు మేడపాటి షర్మిలారెడ్డి, మింది నాగేంద్ర, బొంత శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ఉన్న జాబులు పీకేస్తావా చంద్రబాబూ?
ముమ్మిడివరం : బాబు వస్తే జాబు వస్తుంది..అంటూ ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి యువత ఓట్లు కొల్లగొట్టి ఇప్పుడు ఉన్న జాబులు పీకేసీ వారిని రోడ్డున పడేయడం న్యాయమా చంద్రబాబూ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడిరాజా ప్రశ్నించారు. ముమ్మిడివరంలో ఉపాధి హమీ పథకం ఫీల్డ్అసిస్టెంట్లు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆరోగ్యమిత్ర, ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు వివిధ శాఖ లలో చాలీచాలని వేతనాలతో పనిచేసే వారిని తొలగించి జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కాలకు అప్పగించే ప్రయత్రం చేస్తున్నారని విమర్శించారు. కోర్డు ఉత్తర్వుల మేరకు జిల్లావ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోగా ఈ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం తగదన్నారు. ఈ సమస్యను పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారికి హమీ ఇచ్చారు. అసెంబ్లీలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విధంగా తమ పార్టీ అధికారంలోకి రాగానే ఫీల్డ్అసిస్టెంట్లతో పాటు కాంట్రాక్టర్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. రాజాకు ఘనస్వాగతం : పదవి చేపట్టి తొలిసారి ముమ్మిడివరం వచ్చిన రాజాకు ఘన స్వాగం లభించింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, పెన్మత్స చిట్టిరాజు, జగతా పద్మనాభం(బాబ్జీ) నగర పంచాయతీ ఫ్లోర్‌లీడర్ కాశి బాలమునికుమారి, పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలువేసి స్వాగతం పలికారు. పోలమ్మ చెరువు వద్ద గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి శిలా విగ్రహానికి రాజా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వీరి వెంట రాజమహేంద్రవరం కౌన్సిలర్ బొంతా శ్రీహరి, కోడి కోటయ్య, వీరబాబు ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
'జ్యోతులకు ప్రజలే బుద్ధి చెబుతారు'
ఆయన పార్టీ మారడం సిగ్గుచేటు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కాకినాడ : తమ పార్టీ టిక్కెట్‌పై నెగ్గిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏ మాత్రం సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీలోకి చేరారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోట సుబ్బారావు నాయుడును జక్కంపూడి రాజా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జ్యోతులు నెహ్రూ 2004లో టీడీపీ తరఫున, 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇచ్చి గెలిపించడమే కాక శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అలాగే పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా బాధ్యతలు అప్పగిస్తే డబ్బు, అధికారానికి ఆశపడి జోత్యుల పార్టీ మారారని విమర్శించారు. జ్యోతులకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రూపు, వర్గ రాజకీయాలతో ఆయన పార్టీని కలుషితం చేశారని.. ఈ సందర్భంగా జోత్యులపై జక్కంపూడి రాజా నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి జ్యోతుల నెహ్రూనే కారణం అని రాజా పేర్కొన్నారు. ఆయన నిష్ర్కమణ తమ పార్టీకి శుభపరిణామమన్నారు. ఎందరు నాయకులు వెళ్లినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ వెంటే ఉన్నారని రాజా స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నవారిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తారనడానికి తన తండ్రి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావే ఓ నిదర్శమన్నారు. నాన్న గారి ఆరోగ్యం అనుకూలించక పోయినా చివరి వరకూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తన మంత్రివర్గంలో ప్రధానమైన రోడ్లు, భవనాలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా తన తండ్రిని కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించేందుకు యువజన విభాగం సారథిగా ప్రత్యేక పాత్ర పోషిస్తానన్నారు. పార్టీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి సుంకర చిన్ని, పలువురు పార్టీ నాయకులు జక్కంపూడి రాజా వెంట ఉన్నారు. -
అంగరంగ వైభవం.. రాజా, రాజిల వివాహం..
కళకళలాడిన ఆర్ట్స్ కళాశాల మైదానం వధూవరుల్ని ఆశీర్వదించిన ప్రముఖులు వరుడు జక్కంపూడి రాజాను ఆశీర్వదించిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో జక్కంపూడి విజయలక్ష్మి, సింధుసహస్ర, కొత్తపల్లి భుజంగ రాయుడు, సుబ్బారాయుడు తదితరులు (అంతర చిత్రం) వధూవరులను అభినందిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్‌కుమార్ మాజీమంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల పెద్ద కుమారుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజాకు, ద్రాక్షారామ వాస్తవ్యులు గంధం నారాయణరావు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె రాజశ్రీ(రాజీ)తో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వరుడు రాజాను ఆయన నివాసంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు వేలాదిగా ప్రజానీకం హాజరయ్యారు. ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల జ్యేష్టకుమారుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, ద్రాక్షారామ వాస్తవ్యులు గంధం నారాయణరావు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె రాజశ్రీల వివాహం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. అలనాటి సంప్రదాయాలను గుర్తుకు తీసుకువచ్చేలా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కల్యాణవేదికపై రాజా, రాజి వివాహబంధంతో ఒక్కటయ్యూరు. వరుడు రాజా ఇంటి నుంచి గుర్రపుబగ్గీపై ఊరేగింపుగా కల్యాణవేదికకు చేరుకోగా, ఆయన వెంట ఎద్దుల బండ్లపై పెండ్లి సామాన్లు తీసుకు వచ్చారు. పెండ్లికుమార్తె రాజశ్రీని పల్లకిలో ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తోడుకుని వచ్చారు. వివిధ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, ఆత్మీయబంధుమిత్రులు వివాహ వేడుకకు హాజరై నవవధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వివాహానికి వచ్చిన జనవాహినితో కళాశాల మైదానం కిక్కిరిసింది. ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జక్కంపూడి వారి ఇంటికి చేరుకుని వరుడు రాజాను అక్షింతలు వేసి ఆశీర్విదించారు. ఆయన సుమారు గంటపాటు జక్కంపూడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు విజయసాయిరెడ్డి, షర్మిల, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బ్రదర్ అనిల్‌కుమార్, వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొత్తపల్లి సుబ్బారాయుడు, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎంపి గిరజాల వెంకటస్వామినాయుడు, ఉండవల్లి అరుణకుమార్, బుచ్చిమహేశ్వరరావు, జి.వి.హర్షకుమార్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్ళనాని, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, గ్రంధి శ్రీ నివాస్, పెండెందొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, నల్లమిల్లి శేషారెడ్డి, పాముల రాజేశ్వరి, బండారు సత్యానందరావు, అల్లూరు కృష్ణం రాజు, జీఎస్ రావు, వంగా గీత, వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, సినీనటులు సుమన్, ఆలీ, దర్శకుడు వి.వి.వినాయక్, జిల్లా పరిషత్ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, వంకా రవీంద్రనాథ్, నియోజకవ ర్గ కన్వీనర్లు ఆకుల వీర్రాజు, వల్లూరి పట్టాభిరామారావుచౌదరి, కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, తోట సుబ్బారావునాయుడు, రాజమండ్రి నగరపాలక మండలి ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిళారె డ్డి, పార్టీ రాష్ట్రకార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, నక్కా రాజబాబు, భూపతిరాజు సుదర్శనబాబు, వట్టికూటి రాజశేఖర్, దూలం వెంకన్నబాబు, రాయపురెడ్డి చిన్న, మింది నాగేంద్ర, వివిధ విభాగాల చైర్మన్లు అనంత ఉదయభాస్కర్(బాబు), పెట్టాశ్రీనివాస్, మండపాక అప్పన్నదొర, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సేవాదళ్ ప్రధానకార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, గుర్రం గౌతమ్, సీజీసీ మాజీ సభ్యులు గంపల వెంకటరమణ, పార్టీ నాయకులు సాకా ప్రసన్నకుమార్, పి.కె.రావు, విప్పర్తి వేణుగోపాలరా వు, పెనుమత్స చిట్టిరాజు, అడపా హరి, రావి పాటి రామచంద్రరావు, శెట్టిబత్తుల రాజ బా బు, ఆదిరెడ్డి వాసు, తాడి విజయభాస్కరరెడ్డి, సత్యనారాయణచౌదరి, వాసిరెడ్డి జమీల్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, రాజ మండ్రి మేయర్ పంతం రజనీ శేషసాయి, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, డీసీఎంఎస్ చైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు శిరంగు కు క్కుటేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పంతం నానాజీ, అమలాపురం మాజీ చైర్మన్ నల్లా విష్ణు, చాంబర్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, పలువురు అధికారులు, ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. -
జక్కంపూడి రాజాకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
రాజమండ్రి : మాజీ మంత్రి, దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల కుమారుడు, పార్టీ కార్యదర్శి రాజా వివాహ వేడుకకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన మధురపూడి విమానాశ్రయం చేరుకున్న అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు. జక్కంపూడి నివాసంలో నూతన వరుడు రాజను ఆశీర్వదింది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బయల్దేరి వెళ్లారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్ రెడ్డి వివాహానికి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. -
జగన్ పాలన కోసం జనం ఎదురుచూపు
ఆలమూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షరాలు కొల్లి నిర్మలకుమారి, పార్టీ కొత్తపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్సీపీ యువనేత జక్కంపూడి రాజా అన్నారు. బడుగువానిలంకలో శుక్రవారం జరిగిన ‘గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ కార్యక్రమంలో వారు ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ ఆధ్యక్షతన జరిగిన సభలో వారు ప్రసంగించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సమైక్యత కోసం జగన్మోహన్రెడ్డి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ పార్టీల కలసి మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలన్నారు. ప్రస్తుత సర్వేల ప్రకారం ఏ పార్టీకీ అందనంత ఎత్తులో వైఎస్సార్సీపీ ఉందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, స్టీరింగ్ కమీటీ సభ్యుడు నెక్కంటి వెంకట్రాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.