Jayam Ravi
-
Kadhalikka Neramillai Review: వీర్యదానంతో బాబు పుడితే...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రేమ.. ఓ చక్కటి ఫీలింగ్. ప్రేమ తరువాత పెళ్లి... ఓ థ్రిల్లింగ్ ఈవెంట్... పెళ్లి తరువాత పిల్లలు... జస్ట్ స్ట్రగులింగ్... ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. నేటి యువతరం పడుతున్న పాట్లు ఇవి. ఇన్ఫెర్టిలిటీ అనేది నేటి జనరేషన్‌తో పాటు వేగంగా విస్తరిస్తున్న సమస్య. చాప కింద నీరులా ఈ సమస్య మనకు తెలియకుండానే మన కుటుంబాలను, బంధాలను మానసికంగా వేధిస్తోంది. ఆ సమస్య మీదే కాస్త చిలిపిగా రాసుకున్న కథ ‘కాదలిక్క నేరమిల్లై’ (ప్రేమించడానికి సమయం లేదు). ఇది తమిళ సినిమా కానీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ లభ్యమవుతోంది. సినిమా అంతా చాలా సరదాగా సాగిపోతుంది. దర్శకురాలు కృతికా ఉదయనిధి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘జయం’ రవి, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... 2017లో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. ఆర్కిటెక్ అయిన శ్రియ తను ప్రేమించిన కరణ్‌ను తల్లిదండ్రులను ఎదిరించి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. పెళ్లైన కొద్ది సమయంలోనే కరణ్ మోసగాడు అని తెలిసి, విడిపోతుంది. కానీ శ్రియకు పిల్లలంటే మహా ఇష్టం. విడిపోయిన కరణ్‌తో అది సాధ్యపడదు కాబట్టి ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కనాలని నిర్ణయించుకుంటుంది. మరో పక్క పెళ్లి, పిల్లలు అనే సిద్ధాంతానికి దూరంగా ఉన్న ఆర్కిటెక్ సిధ్ తన గర్ల్‌ఫ్రెండ్ నిరుపమతో విడిపోవాల్సి వస్తుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో తాను ఓ స్వచ్ఛంద సంస్థకు వీర్యదానం చేస్తాడు. అనూహ్యంగా సిద్ వీర్యంతోనే శ్రియ ఓ పిల్లాడికి జన్మనిస్తుంది. ఆ పిల్లాడి పేరు పార్ధివ్. పార్ధివ్‌కు ఊహ తెలిశాక తన తండ్రి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదే టైంలో ఓ ప్రాజెక్టుకు సంబంధించి సిద్, శ్రియ చెన్నై నగరంలో కలుస్తారు. మరి... తన తండ్రి సిద్ అని పార్ధివ్ తెలుసుకుంటాడా? సిధ్‌ని పార్ధివ్ తండ్రిగా శ్రియ ఒప్పుకుంటుందా? అనేది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమాలోనే చూడాలి. ఓ సున్నితమైన పాయింట్‌ని చక్కటి స్క్రీన్‌ప్లేతో సరదాగా తీసుకెళ్లారు దర్శకురాలు. మీకు సమయం ఉంటే ప్రేమ కోసం ప్రేమతో ఈ సినిమాని చూడండి. వర్త్‌ఫుల్ వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంక్రాంతి చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ జయం రవి, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం కాదలిక్కా నేరమిల్లై(Kadhalikka Neramillai). ఈ సినిమాను కృతిక ఉదయనిధి తెరకెక్కించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. కోలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది.పొంగల్ కానుకగా థియేటర్లలో ఫ్యాన్స్‌ను అలరించిన కాదలిక్కా నేరమిల్లై ఈ నెల 11 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీ ప్రియులను అలరించనుంది కాదలిక్కా నేరమిల్లై మూవీ.(ఇది చదవండి: వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!)కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన సతీమణి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.తెలుగులో నిత్యా మీనన్ కెరీర్..అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది. Kadhalargal gavanathirkku 👀💕… kadhalikka neram odhikkirunga, yaena…Kadhalikka Neramillai is coming soon to Netflix on 11 February, in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi!#KadhalikkaNeramillaiOnNetflix pic.twitter.com/nuAQsDsjy9— Netflix India South (@Netflix_INSouth) February 6, 2025 -
జయం రవి, ఆర్తీ విడాకుల కేసులో మధ్యవర్తులతో చర్చలు
కోలీవుడ్ ప్రముఖ నటుడు జయం రవి (రవి మోహన్) భార్య ఆర్తీతో విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరి 14 ఏళ్ల వివాహ బంధానికి తెర పడినట్లయ్యింది. ఈ వ్యవహారంలో జయం రవి భార్య ఆర్తీ (Aarthi) నుంచి విడాకులు కోరుతూ చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇందరు మళ్లీ కలిసి జీవించడానికి సామరస్య చర్చలకు అవకాశం ఇచ్చింది. (ఇదీ చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు)ఇప్పటికే జయం రవి (Jayam Ravi), ఆర్తీల మధ్య మూడు సార్లు సామరస్య చర్చలు జరిగాయి. కాగా శనివారం ఈ కేసు మరోసారి న్యాయమూర్తి తేనెతోమొళి సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో జయం రవి,ఆర్తల తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. నటుడు జయం రవి, ఆర్తీ కూడా ఆన్లైన్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. కాగా వారి న్యాయవాదులు తమ క్లైంట్ల మధ్య శనివారం సామరస్య చర్చల కోసం మధ్యవర్తులు ఆహ్వానించినట్లు కోర్టుకు విన్నవించారు. దీంతో సామరస్య చర్చలు పూర్తి అయిన తరువాత తీర్పును ప్రకటిస్తామంటూ న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేశారు.పేరు మార్చుకున్న జయం రవి.. కారణం ఇదేజయం రవి (Jayam Ravi) పేరు మార్చుకున్నాడు. తనను ఇకపై రవి మోహన్(Ravi Mohan) అని పిలవాలని కొద్దిరోజుల క్రితమే తెలిపాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కాదలిక్క నెరమలై సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకు కారణం ఎంటో ఇలా చెప్పాడు. 'ఈ రోజు నుంచి నా పేరు రవి లేదా రవి మోహన్. వ్యక్తిగతంగా కానీ, వృత్తిగతంగా కానీ ఇలాగే పిలవండి. దయచేసి ఇకపై ప్రతి ఒక్కరూ నన్ను జయం రవి అని సంభోదించకుండా రవి/ రవి మోహన్ అని మాత్రమే పిలవాలని కోరుతున్నాను' అని అన్నాడు. జయం రవి అసలు పేరు రవి. ఆయన తండ్రి మోహన్ డైరెక్ట్ చేసిన జయం (తెలుగు జయం మూవీ రీమేక్) మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో తన పేరు జయం రవిగా మారింది. రెండు దశాబ్దాలుగా జయం రవిగానే కొనసాగిన ఆయన ఇప్పుడు తనను పాత పేరుతోనే పిలవాలని చెప్తున్నాడు. అలాగే ఈ హీరో తన పేరు మీద రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్ ద్వారా మంచి కథలను అందించడంతో పాటు ప్రతిభావంతులైన కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు. -
పేరు మార్చుకున్న హీరో.. ఇకపై అలా పిలవొద్దంటూ..
తమిళ హీరో జయం రవి (Jayam Ravi) పేరు మార్చుకున్నాడు. తనను ఇకపై రవి మోహన్(Ravi Mohan) అని పిలవాలని చెప్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కాదలిక్క నెరమలై సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ రోజు నుంచి నా పేరు రవి లేదా రవి మోహన్. వ్యక్తిగతంగా కానీ, వృత్తిగతంగా కానీ ఇలాగే పిలవండి. ఇకపై అలా పిలవొద్దుదయచేసి ఇకపై ప్రతి ఒక్కరూ నన్ను జయం రవి అని సంభోదించకుండా రవి/ రవి మోహన్ అని మాత్రమే పిలవాలని కోరుతున్నాను అన్నాడు. జయం రవి అసలు పేరు రవి. ఆయన తండ్రి మోహన్ డైరెక్ట్ చేసిన జయం (తెలుగు జయం మూవీ రీమేక్) మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో తన పేరు జయం రవిగా మారింది. రెండు దశాబ్దాలుగా జయం రవిగానే కొనసాగిన ఆయన ఇప్పుడు తనను పాత పేరుతోనే పిలవాలని చెప్తున్నాడు. అలాగే ఈ హీరో తన పేరు మీద రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్ ద్వారా మంచి కథలను అందించడంతో పాటు ప్రతిభావంతులైన కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు. (చదవండి: 50 ఏళ్ల వయసులో హీరోయిన్ డేటింగ్? నిజమిదే!)మీరిచ్చిన ప్రేమకు ప్రతిఫలంగా..అంతే కాదు తన అభిమానుల కోసం రవిమోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాడు. దీని ద్వారా ఆపదలో ఉన్నవారికి, అవసరం కోసం అర్థిస్తున్నవారికి సాయం చేస్తానన్నాడు. ఈ ఫౌండేషన్‌తో సమాజంలో సానుకూల మార్పును ఆశిస్తున్నట్లు తెలిపాడు. మీరు నాకందించిన ప్రేమాభిమానాలను, సపోర్ట్‌కు ప్రతిఫలంగా నేను మీకు సహాయసహాకారాలు అందిస్తాను అని సదరు లేఖలో పేర్కొన్నాడు. సినిమాఇకపోతే జయం రవి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై మూవీ జనవరి 14న విడుదల కానుంది. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. View this post on Instagram A post shared by Ravi Mohan (@jayamravi_official) చదవండి: డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్ -
నిత్య మేనన్ పేరు తర్వాత నా నేమ్ వేశారు: జయం రవి
కోలీవుడ్ నటుడు జయం రవి(Jayam Ravi) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రాలలో 'కాదలిక్క నేరమిల్లె' (ప్రేమకు సమయం లేదు) ఒకటి. నటి నిత్యామీనన్ (Nithya Menen) నాయకిగా నటించిన ఇందులో వినయ్, టీజే భాను తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నటి నిత్యామీనన్ మాట్లాడుతూ ఎవరు ఎలాంటి ఈగో లేకుండా పనిచేసిన చిత్రం ఇదని, ఇది రోమ్ కామ్ కథ కాదని, చాలా డ్రామాతో కూడిన చిత్రమని, దీన్ని దర్శకురాలు కృతిక చాలా అందంగా తెరపై ఆవిష్కరించారని చెప్పారు. ఈ చిత్రంలో నటించడం ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నటుడు జయం రవి మాట్లాడుతూ ఈ చిత్రానికి అట్టహాసమైన టైటిల్ లభించడం సంతోషకరమని తెలిపారు. 'కాదలిక్క నేరమిల్లె' (Kadhalikka Neramillai) చిత్రంలో నటి నిత్య మేనన్ పేరు తర్వాత తన పేరు వేయడం గురించి అడుగుతున్నారని, అందుకు తన కాన్ఫిడెన్సే కారణమని అన్నారు. సినీ జీవితంలో తాను చాలా విషయాలను బ్రేక్ చేశానని, ఇది మాత్రం ఎందుకు చేయకూడదు అని భావించానన్నారు. నటుడు షారుక్ ఖాన్‌ను చూసిన తర్వాత తానీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మహిళలు లేకుంటే ఈ ప్రపంచమే లేదన్నారు. వారు లేకపోతే మనం లేమన్నారు ఇకపై మహిళ దర్శకుల చిత్రాల్లో ఇలానే నటిస్తానని పేర్కొన్నారు. తనకు ఇంతకుముందు చాలా గడ్డు కాలం వచ్చిందని, నటించిన చిత్రాలు ఏవీ బాగా ఆడలేదని, దీంతో తాను చేసిన తప్పేమిటి అని ఆలోచించానన్నారు. ఎలాంటి తప్పు చేయని తాను ఎందుకు కుంగిపోవాలని అనిపించిందన్నారు. ఆ తర్వాతే తాను నటించిన మూడు చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయన్నారు. కింద పడినా నిలబడక పోవడమే అపజయం అని, ఈ ఏడాది మళ్లీ ఇదే బాట పడతాననే నమ్మకాన్ని జయం రవి వ్యక్తం చేశారు. దర్శకుడు కె.బాలచందర్ పలు సాధారణ విషయాలను బ్రేక్ చేశారని, అదేవిధంగా ఈ జనరేషన్లో దర్శకురాలు కృతిక ఉదయనిధి చేస్తున్నారని అన్నారు. -
1965లో ఏం జరిగిందో చెప్పనున్న శివకార్తికేయన్
అయలాన్, మావీరన్ చిత్ర వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్‌కు తాజాగా అమరన్ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆయన, సాయిపల్లవి నటన పలువురి ప్రశంసలను అందుకుంది. కాగా ప్రస్తుతం శివకార్తికేయన్ తన 23వ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. అదేవిధంగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో 24వ చిత్రాన్ని చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్ హీరోగా నటించే 25వ చిత్రానికి మహిళా దర్శకురాలు సుధా కొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించాల్సి ఉంది. దీనికి పురనానూరు అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల సూర్య ఈ చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ను ఎంపిక చేశారు. ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనుండడం విశేషం. అదేవిధంగా మరో నటుడు అధర్వ ముఖ్యపాత్ర పోషించనున్నారు. నటి శ్రీలీల నాయకిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈమె ఈ చిత్రం ద్వారా నేరుగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. డాన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 1965లో జరిగే చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలిసింది. కాగా ఇంతకుముందు దీనికి పురనానూరు అనే టైటిల్‌ను నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా పేరును మార్చినట్లు, 1965 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా
టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్.. తమిళంలోనూ హీరోయిన్గా పలు సినిమాలు చేస్తోంది. అలా చేసిన లేటెస్ట్ మూవీ 'బ్రదర్'. జయం రవి హీరో. కొన్నిరోజుల క్రితం తమిళ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఎలాంటి హడావుడి లేకుండానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ 'బ్రదర్' సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?అక్కా తమ్ముళ్ల ఫ్యామిలీ డ్రామా స్టోరీలతో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఓ మూవీనే 'బ్రదర్'. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే.. రూ.5 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కంటెంట్ మరీ రొటీన్‌గా ఉండటమే దీనికి కారణం. స్టార్ యాక్టర్స్ బోలెడంతమంది ఉన్నాసరే సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)దీన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ తమిళ రిజల్ట్ చూసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. జీ5లో ప్రస్తుతం తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇష్టముంటే దీనిపై లుక్కేయొచ్చు.'బ్రదర్' విషయానికొస్తే.. అన్యాయాన్ని తట్టుకోలేని కార్తి (జయం రవి), తనతో పాటు కుటుంబాన్ని కూడా తలనొప్పిగా మారతాడు. న్యాయం కావాలని గొడవలు పడే ఇతడితో.. లా డిగ్రీ చేయిస్తే అయినా సరే బాగుపడతాడేమోనని తండ్రి భావిస్తాడు. కానీ అక్కడా నిరాశే. కనీసం అక్క ఆనంది(భూమిక) దగ్గరకు పంపిస్తే బాగుపడతాడేమోనని ఆశపడతారు. కానీ కార్తి వల్ల వాళ్ల కుటుంబం చిక్కుల్లో పడుతుంది. చివరకు వీటిని కార్తి ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ') -
విడాకులకు గుడ్‌బై చెప్పి మళ్లీ కలవనున్న జయం రవి, ఆర్తి..?
కోలీవుడ్ నటుడు జయం రవి ఇటీవల విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మళ్లీ తన భార్య ఆర్తితో కలిసి జీవించనున్నాడంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట ఇదే చర్చ జరుగుతుంది. కొన్నాళ్ల పాటు డేటింగ్ తర్వాత 2009లో పెళ్లి చేసుకున్న జయం రవి, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు 15 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జోడీ పలు విభేదాలు రావడంతో విడాకుల నోటీసుల వరకు వెళ్లింది.జయం రవి, ఆర్తి విడాకుల కేసు చెన్నై మూడో కుటుంబ న్యాయస్థానంలో జడ్జి తేన్మొళి విచారణ చేశారు. సయోధ్య కేంద్రంలో మధ్యవర్తిత్వానికి హాజరు కావాలని దంపతులను ఆదేశించారు. అక్కడ జయం రవి, ఆర్తి ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యారు. మధ్యవర్తితో పాటు ఒక గంటకు పైగా సాగిన చర్చలో వారిద్దరూ కూడా సానుకూలంగా మాట్లాడినట్లు సమాచారం. ఎలాంటి ఆందోళన లేకుండా తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారట. పిల్లల కోసం అయినా కలిసి ఉండాలని మధ్యవర్తి ఇచ్చిన కౌన్సిలింగ్‌తో వారు కాస్త ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. దీంతో మళ్లీ వారిద్దరూ కలుస్తారంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.ఘీ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి మొదటసారి ప్రకటించాడు. అయితే, విడాకుల విషయంలో తన ప్రమేయం లేదని ఆర్తి తన సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. తన అనుమతి లేకుండానే ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటి అంటూ జయం రవి నిర్ణయాన్ని తప్పుపట్టింది. కానీ, లాయర్ ద్వారా ఆర్తికి విడాకుల నోటీసు పంపించానని జయం రవి చెప్పుకొచ్చాడు. ఈ విషయం ఆమె తండ్రికీ కూడా తెలుసని ఆ సమయంలో తెలిపాడు. ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకున్న తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నాడు. -
జయం రవి విడాకుల కేసు.. కోర్టు కీలక ఆదేశాలు!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత జయం రవి సతీమణి ఆర్తి అతనిపై ఆరోపణలు చేసింది. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఆ తర్వాత ఆర్తి రవి పేరుతో ఆమె ఒక లేఖను తన సోషల్ మీడియాలో విడుదల చేశారు.అయితే తనకు విడాకులు కావాలని కోరుతూ జయం రవి ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా రవి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. రాజీ చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. కాగా.. ఈ రోజు జరిగిన విచారణకు రవి కోర్టుకు హాజరు కాగా.. ఆయన భార్య ఆర్తి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ విచారణలో ఇరువురికి రాజీ కేంద్రంతో మాట్లాడి పరిష్కారం చూపాలని న్యాయమూర్తి ఆదేశించారు.(ఇది చదవండి: భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి)2009లో సినీ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని జయం రవి పెళ్లాడారు. వీరిద్దరికి ఆరవ్, అయాన్ పిల్లలు సంతానం కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. మొదట జయం రవి సోషల్ మీడియాలో తన భార్య ఫోటోలను తొలగించారు. కాగా.. జయం రవి 1989లో బాలనటుడిగా తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు సినిమా ద్వారా బాలనటుడిగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత తమిళ చిత్రసీమలో స్టార్‌గా ఎదిగారు. 2003లో విడుదలైన ‘జయం’ సినిమాతో కోలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్నారు. -
స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ఏమందంటే?
కొన్నిరోజుల క్రితం తమిళ హీరో జయం రవి విడాకులు తీసుకున్నాడు. తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిపోయిందని ఇతడి భార్య ఆర్తి చెప్పుకొచ్చారు. ఇదలా ఉంచితే జయం రవి.. హీరోయిన్ ప్రియాంక మోహన్ని నిశ్చితార్థం చేసుకున్నాడనే రూమర్‌తో పాటు దండలతో ఉన్న ఫొటో కూడా వైరల్ అయింది. దీంతో అందరూ అది నిజమే అనుకున్నారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)అయితే అది 'బ్రదర్' సినిమాలోనిది అని తేలింది. జయం రవి, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ తమిళ మూవీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియాంక.. ఎంగేజ్మెంట్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.'జయం రవి, నేను కలిసి 'బ్రదర్' సినిమా చేశాం. ప్రమోషన్లో భాగంగా మూవీ టీమ్ ఓ ఫొటో రిలీజ్ చేసింది. అందులో మేమిద్దరం మెడలో దండలు వేసుకుని ఉంటాం. దీంతో వెంటనే వైరల్ అయిపోయింది. అది చూసి మేం నిజంగానే నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది అనుకున్నారు. షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఇది నా దృష్టికి రాలేదు. ఆ ఫొటో నిజమే అనుకుని టాలీవుడ్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. అసలు విషయం తెలిసి అది సినిమాలో స్టిల్ అని క్లారిటీ ఇచ్చా. రిలీజ్ చేయడానికి వేరే ఫొటో ఏం దొరకలేదా అని మూవీ టీమ్‌ని తిట్టుకున్నా' అని ప్రియాంక మోహన్ చెప్పుకొచ్చింది. ఈ సంఘటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రియాంక చెప్పింది. అయితే జయం రవి విడాకుల చర్చ ఓ వైపు నడుస్తుండగానే ఈ ఫొటో వైరల్ అవడం దీనికి కారణమైంది. ఏదైతేనేం మూవీ ప్రమోషన్‌కి ఇది కాస్తోకూస్తో పనికొచ్చినట్లు ఉంది. (ఇదీ చదవండి: నటుడిగా 50 ఏళ్లు పూర్తి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్) -
భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయం రవి విడాకుల తర్వాత తనపై వచ్చిన రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.జయం రవి మాట్లాడుతూ.. 'మేము పబ్లిక్ డొమైన్లో ఉన్నాం. నేను బయట టీ తాగినా..ఏ చేసినా తెలిసిపోతుంది. ఎందుకంటే మేము సినిమా వ్యక్తులం. మమ్మల్ని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. వారి అభిప్రాయాలు కూడా వెల్లడిస్తుంటారు. మేమైతే వాటిని అడ్డుకోలేం కదా. కొంతమంది పరిణితి చెందిన వారు ఇలాంటి రూమర్స్‌ను పట్టించుకోరు. పరిపక్వత లేని కొద్దిమంది మాత్రమే రూమర్స్ వ్యాప్తి చేయడం చేస్తుంటారు. కొంతమంది ఆ విషయంలో ఉన్న తీవ్రత అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. కానీ నా గురించి నాకు పూర్తిగా తెలిసినప్పుడు ఇలాంటి వాటి గురించి తెలుసుకుని ఎందుకు బాధపడతాం' అని అన్నారు.(ఇది చదవండి: మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి)కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అనుమతి లేకుండానే విడాకుల ప్రకటన విడుదల చేశారని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. అయితే ఆమె మాటల్లో ఎలాంటి నిజం లేదని జయం రవి క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. -
టాప్ దర్శకుడితో జయంరవి కొత్త సినిమా..?
కోలీవుడ్ నటుడు జయంరవి వరుసగా చిత్రాలు చేసుకుంటూపోతున్నారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నా, అవి ఆయన వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారు. తను నటించిన తాజా చిత్రం బ్రదర్ దీపావళికి తెరపైకి రానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ప్రస్తుతం సీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఈయన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం నటుడు సూర్య కథానాయకుడిగా ఆయన 44వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2డీ.ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టెయినర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుందని సమాచారం. దీంతో కార్తీక్ సుబ్బరాజ్ జయంరవి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని ఆయన తన సొంత నిర్మాణ సంస్థ అయిన స్టోన్ బెంచ్ స్టూడియోస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి
తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని రవి తెలపగా.. తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. విడాకుల విషయంలో వెనక్కు తగ్గేదే లేదని రవి పేర్కొంటుండగా ఇప్పటికీ తన భర్తతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఆర్తి అంటోంది. రవిని ముప్పుతిప్పలు పెట్టిన ఆర్తి?ఇంతలో వీరి విడాకులకు ఈవిడే కారణమంటూ ఓ సింగర్ పేరు తెరపైకి రావడం, ఆమె స్పందించి తనను మధ్యలోకి లాగొద్దని హెచ్చరించడమూ జరిగింది. ఇక జయం రవిని ఆర్తి ముప్పుతిప్పలు పెట్టిందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. అతడి సోషల్ మీడియా ఖాతాలన్నీ ఆర్తి ఆధీనంలో ఉన్నాయని, వాటిని అతడికి అప్పగించకుండా ఇబ్బందిపెడుతోందని సదరు వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో ఆర్తి తాజాగా సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది.మౌనంగా ఉన్నానంటే..'నా వ్యక్తిగత జీవితం గురించి నానారకాలుగా ప్రచారం జరుగుతోంది. నన్ను చెడుగా చిత్రీకరించి నిజాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అయినా మౌనంగా ఉంటున్నానంటే నేను తప్పు చేశానని అర్థం కాదు. కేవలం హుందాగా వ్యవహరించాలనుకున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం అని అతడు లేఖ రిలీజ్ చేసినప్పుడు నేను నిజంగానే షాకయ్యాను.అదే నాకు ముఖ్యంఅప్పుడు నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో తనతో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు అవకాశం ఉందేమోనని ఎదురుచూస్తున్నాను. వివాహవ్యవస్థను నేను గౌరవిస్తాను. ఇరువురి ప్రతిష్టను దెబ్బతీసే బహిరంగ చర్చలను నేను ఎంకరేజ్ చేయను. నా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యం అని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్తి పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) చదవండి: సినిమాల్లోకి రావాలనుకుని టీవీలో సెటిలయ్యా,.. అనుకున్నంత ఈజీ కాదు! -
జయం రవి విడాకులకు కారణం నేను కాదు.. సింగర్ క్లారిటీ!
కోలీవుడ్ హీరో జయం రవి తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం ఒక సింగర్ అని టాక్ వినిపిస్తోంది. తాము విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఒక లేఖను కూడా జయం రవి విడుదల చేశారు. ఇదే విషయంపై ఆయన సతీమణి ఆర్తి కూడా తీవ్రమైణ ఆరోపణలు చేశారు. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఒక సింగర్ అని నెట్టింట వార్తలు వస్తున్నాయి. జయం రవితో బెంగళూరుకు చెందిన కెనిషా ఫ్రాన్సిస్ డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..?)అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్ కెనీషా స్పందించింది. జయం రవికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలిపింది. మా మధ్య ఉన్నది కేవలం బిజినెస్‌కు సంబంధించిన రిలేషన్ మాత్రమే అని అన్నారు. నాకు బిజినెస్‌లో ఆయన సపోర్ట్ చేస్తున్నారు అంతే.. జయం రవి నాకు మంచి మిత్రుడని తెలిపింది. మీరంతా అనుకుంటున్నట్లు వారి విడాకులకు కారణం నేను కాదని తేల్చి చెప్పింది. తనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దంటూ సింగర్ కెనీషా కోరింది. -
సాక్ష్యాలన్నీ బయటపెడతా.. హీరో భార్యకు సింగర్ వార్నింగ్!
ప్రముఖ నటుడు జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ భార్త ఆర్తి మాత్రం తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆరోపిస్తుంది. అంతేకాదు జయం రవి సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇవి పుకార్లు మాత్రమేనని జయం రవి కొట్టేశాడు. తాజాగా సింగర్ కెనిషా కూడా జయం రవి విడాకుల ఇష్యూపై స్పందిస్తూ అతని భార్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.సింగర్‌తో సహజీవనంజయం రవి గత కొన్నాళ్లుగా భార్య ఆర్తితో కలిసి ఉండడం లేదు. అతను ఒక్కడే వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సింగర్ కెనిషాతో ప్రేమలో పడ్డాడని..ఆమె కారణంగానే ఆర్తికి దూరంగా ఉంటున్నాడని కోలీవుడ్‌లో రూమర్స్ వచ్చాయి. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అటు జయం రవి కానీ, ఇటు కెనిషా కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. తాము వృత్తిపరంగానే కలిశామని చెబుతున్నారు. అనవసరంగా మా విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. నా విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.సాక్ష్యాలన్నీ బయటపెడతా: సింగర్జయం రవి విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది సింగర్, థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని చెబుతోంది. ఒక థెరపిస్ట్‌గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించింది. ‘ఆర్తి, ఆమె పెరెంట్స్ పెట్టిన టార్చర్ కారణంగా రవి చాలా మానసికంగా క్రుంగిపోయాడు. ట్రీట్మెంట్ కోసం జూన్‌లో నా దగ్గరకు వచ్చాడు. ఆయనతో నాకు వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉంది. ఆయన స్నేహితుడు, క్లయింట్ కూడా. అంతకు మించి ఏమి లేదు. నా కారణంగానే విడాకులు తీసుకుంటున్నరనేది పచ్చి అబద్దం. రవి తన భార్యకు విడాకులు నోటీసులు పంపిన విషయం కూడా నాకు తెలియదు. నేను ఇచ్చిన ట్రిట్మెంట్, థెరపీకి సంబంధించిన నోట్స్‌తో పాటు అన్ని సాక్ష్యాలు కోర్టుకు ఇవ్వగలను. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదంటూ పరోక్షంగా ఆర్తికి వార్నింగ్ ఇచ్చింది. కాగా, జయం రవి, ఆర్తిగా వివాహం 2009 జూన్‌లో జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. ఈ నెల 9న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. -
20 ఏళ్లు పట్టినా సరే, వెనక్కు తెగ్గే ప్రసక్తే లేదు: జయం రవి
భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ ఆ గొడవలు మితిమీరినా, మనస్పర్థలు ఎక్కువైనా వారు విడిపోవడానికి దారి తీస్తాయి. తమిళ హీరో జయం రవి విషయంలోనూ ఇదే జరిగింది. ఇంట్లో గొడవల కారణంగా కొంతకాలంగా వీరు విడిగానే ఉంటున్నారు. ఇంతలో జయం రవి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. అయితే తనకు ఒక్క మాట కూడా చెప్పకుండానే విడాకులు ప్రకటించాడని ఆర్తి మండిపడింది. గొడవలు పరిష్కరించుకుందామనుకున్నానని, ఇప్పటికీ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానంది.ఆమెకు రాజీ పడాలన్న ఉద్దేశం లేదుబ్రదర్ సినిమా ఆడియో లాంచ్ అనంతరం ఓమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయం రవికి ఇదే విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఆర్తికి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదా? అన్నదానిపై హీరో స్పందిస్తూ.. నాకు విడాకులు కావాలి. ఒకవేళ ఆర్తి విడాకులు వద్దనుకుంటే, తను అన్నట్లుగా కలిసుందామనుకుంటే ఇంతవరకు నన్నెందుకు కలవలేదు. నేను పంపించిన రెండు లీగల్ నోటీసులకు ఎందుకు స్పందించలేదు? తనకు రాజీ పడాలన్న ఉద్దేశం ఎక్కడా కనిపించడం లేదే! అని బదులిచ్చాడు.రెండింటికీ ఏం సంబంధం?సింగర్, స్పిరిచ్యువల్ హీలర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందిస్తూ.. అసలు ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయి? అనవసరంగా మూడో వ్యక్తిని ఇందులోకి లాగుతున్నారు. నేను కెనీషాతో కలిసి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాను. అందుకోసం మంచి లొకేషన్ వెతుకుతున్నాం. నా విడాకులకు, దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ పుకార్ల వల్ల మా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి అని తెలిపాడు.పోరాడుతూనే ఉంటాపిల్లల గురించి మాట్లాడుతూ.. పిల్లల కస్టడీ నాకే కావాలి. పదేళ్లయినా, ఇరవయ్యేళ్లు పట్టినా సరే.. ఆరవ్, అయాన్లు నాకు దక్కేవరకు పోరాడతాను. వాళ్లే నా సంతోషం. ఆరవ్తో కలిసి ఆరేళ్ల క్రితం టిక్ టిక్ టిక్ మూవీ చేశాను. ఆ సినిమా సక్సెస్‌మీట్‌లో ఎంత సంతోషపడ్డానో! ఇప్పుడు నిర్మాతగా మారి తనతో సినిమా తీయాలనుకుంటున్నాను. విడాకులంటారా? ఈ విషయంలో నేను వెనక్కు తగ్గను అని కుండబద్ధలుట్టేశాడు.చదవండి: నా అనుమతి లేకుండా ముఖ్యమైన సీన్స్ కాపీ చేశారు, బాధేసింది! -
భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి.. ఖుష్బూ షాకింగ్ ట్వీట్
ఒకప్పటి హీరోయిన్, నటి ఖుష్బూ షాకింగ్ ట్వీట్ చేసింది. భార్యభర్తల అనుబంధం గురించి చాలా పెద్దగా రాసుకొచ్చింది. భర్త ఎలా ఉండాలి. భార్యని ఎలా చూసుకోవాలి అనే విషయాల్ని చాలా చక్కగా చెప్పింది. తలాతోక లేకుండా ఉన్న ఈ ట్వీట్ చూస్తే ఏం అర్థం కాదు. కానీ ఈ మధ్య జయం రవి విడాకులు తీసుకున్నాడు. తనకు కనీసం చెప్పుకుండా ఈ పనిచేశాడని అతడి భార్య ఆర్తి చెప్పుకొచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఖుష్బూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయిపోయింది.ట్వీట్లో ఏముంది?'తన కుటుంబాన్ని సమాజంలో ఉన్నతంగా ఉంచాలనుకునే వ్యక్తి.. ప్రేమించిన వారి అవసరాలు, కోరికలు తీర్చేందుకు ప్రయత్నిస్తాడు. పెళ్లి అనే బంధంలో ఎత్తుపల్లాలు సహజం. చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అంతమాత్రాన బంధాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమ అనేది అప్పుడప్పుడు తగ్గొచ్చు. కానీ గౌరవం, మర్యాద చెక్కు చెదరకుండా ఉండాలి. పురుషుడు తన భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి'(ఇదీ చదవండి: కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్)'స్వార్థంతో ఉండే వ్యక్తి తన పనుల వల్ల మిగతా వాళ్ల మనసులు ఎలా బాధపడతాయనేది చూడలేడు. ఇలాంటి ప్రవర్తన వల్ల కుటుంబంలో కల్లోలం ఏర్పడుతుంది. జీవితం చాలా అందమైనది. కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాల వల్ల పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. కానీ అప్పటికే ఆలస్యం కావొచ్చు. తన భార్యని గౌరవించలేని వ్యక్తి.. జీవితంలో ఎదగడు. నిన్ను ప్రేమించిన, తోడుగా నిలబడిన వ్యక్తిని అగౌరవపరచడం బాధాకరం. గౌరవం అనేది కుటుంబంలో ఉండాలి. ఈ విషయాన్ని మరిచిపోయిన వ్యక్తి ప్రేమ కంటే విలువైన బంధాన్ని, నిజమైన ఆనందాన్ని కోల్పోయినట్లే' అని ఖుష్బూ రాసుకొచ్చింది. ఇదంతా జయం రవిని ఉద్దేశించే పెట్టిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.జయం రవి సంగతేంటి?తమిళ స్టార్ జయం రవి చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. 'పొన్నియిన్ సెల్వన్' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 2009లో ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్నిరోజుల క్రితం విడాకులు ప్రకటన చేశాడు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం అని చెప్పాడు. భార్య ఆర్తి మాత్రం తనకు తెలియకుండా ఇలా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ప్రేమనే విడాకులకు కారణమని అంటున్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌నే బూతులు తిడతావా? ఇంట్లో నుంచి వెళ్లిపో..)A true man stands tall, putting his family above all else. His needs, whims, desires, and freedoms all come second to the ones who love him unconditionally. In the journey of life, every marriage faces its ups and downs, and yes, mistakes happen. But these missteps never grant a…— KhushbuSundar (@khushsundar) September 21, 2024 -
జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..?
కోలీవుడ్ హీరో జయం రవి తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనంతటికీ కారణం ఒక గాయని అనితెలుస్తోంది. తాము విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఒక లేఖను కూడా జయం రవి విడుదల చేశారు. ఇదే విషయంపై ఆయన సతీమణి ఆర్తి కూడా తీవ్రమైణ ఆరోపణలు చేశారు.విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. అయితే, వారిద్దరూ విడిపోవడానికి కారణం ఒక గాయని అని నెట్టింట వార్తలు వస్తున్నాయి. జయం రవితో ఆమె డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.బెంగళూరుకు చెందిన గాయిని 'కెనిషా ఫ్రాన్సిస్'తో జయం రవి డేటింగ్లో ఉన్నారని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. గోవాలోని పబ్‌లలో పాటలు పాడుతూ స్వతంత్ర గాయకురాలిగా ఆమె పేరు సంపాదించుకుంది. జయం రవి తన స్నేహితులతో కలిసి తరచూ గోవా వెళ్లేవాడు. ఆ సమయంలో కెనిషా ఫ్రాన్సిస్ అనే యువతితో పరిచయం అయిందని సమాచారం. వారిద్దరూ ఆ తర్వాత స్నేహితులు అయ్యారని, ఆపై ఇరువిరి ఇష్టంతోనే డేటింగ్ కూడా ప్రారంభించారని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. తమిళంలో నటుడు జీవా నిర్మించిన ఆల్బమ్‌లో కూడా ఆమె పాటలు పాడింది. ఆమెకు ఇదివరకే పెళ్లయిందని వార్తలు వస్తున్నప్పటికీ ఆమె భర్తకు సంబంధించిన సమాచారం మాత్రం బయటకు రాలేదు.కెనిషా ఫ్రాన్సిస్‌తో జయం రవి స్నేహం చేయడం ఆర్తికి నచ్చలేదు. ఆమెతో స్నేహం వద్దని చెప్పినా రవి వినిపించుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో తమ పెళ్లిరోజు నాడు జయం రవి ఇంటి వద్ద లేరట. ఆ సమయంలో సినిమా షూటింగ్ ఉందని చెప్పి గోవా వెళ్లిపోయారట. అయితే, అక్కడ తన కారుకు జరిమానా పడటం వల్ల అసలు విషయం బయటకొచ్చిందని చెప్పుకొస్తున్నరు. జులై 14న జయం రవి కారును వేగంగా నడిపినందుకు కెనిషా ఫ్రాన్సిస్‌కు జరిమానా విధించారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పలు ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జయం రవి, కెనిషా ఫ్రాన్సిస్ల మధ్య ఉన్న రిలేషన్షిప్ వల్ల ఆర్తి డిస్టర్బ్ అయ్యారని సమాచారం. ఈ కోపంతోనే జయం రవితో ఉన్న ఫోటోలను ఆమె తొలగించారని టాక్. అనంతరం తాము విడిపోతున్నట్లు జయం రవి ప్రకటించారు. -
విడాకుల గురించి జయం రవిపై భార్య సంచలన ఆరోపణ
కోలీవుడ్ హీరో జయం రవి తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయన ఒక లేఖను కూడా విడుదల చేశారు. అయితే, తాజాగా ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఈమేరకు ఆర్తి రవి పేరుతో ఆమె ఒక లేఖను తన సోషల్ మీడియాలో విడుదల చేశారు.'ఇటీవల మా వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి నేను ఆందోళన చెందాను. నాకు తెలియకుండా, నా నుంచి అనుమతి లేకుండానే విడాకుల గురించి ప్రకటించారు. ఇలా చెప్పకుండా బహిరంగ ప్రకటన చేయడంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురికావడమే కాకుండా చాలా బాధపడ్డాను. 18 సంవత్సరాలుగా కలిసి జీవించాం. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నాకు చెప్పకుండా ప్రకటించడం ఏంటి..? వ్యక్తుల మధ్య దయ, గౌరవంతో పాటు గోప్యతతో నిర్వహించాలని నేను నమ్ముతున్నాను. కొంతకాలంగా మేమిద్దరం దూరంగానే ఉంటున్నాము. మా కుటుంబాల మధ్య వచ్చిన గొడవలపై పరిష్కిరించుకుందామని అనేకసార్లు ప్రయత్నించాను. కానీ, ఫలితం లేదు. నా భర్తతో నేరుగా మాట్లాడటానికి అనేకసార్లు కోరుకున్నాను. ఇప్పటికీ కూడా నేను ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. కానీ,దురదృష్టవశాత్తూ, ఆ అవకాశం నాకు లభించలేదు.' ఇదీ చదవండి: సతీమణితో విభేదాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న జయం రవి'ఈ ప్రకటనతో నాతో పాటు నా పిల్లలు కూడా షాకయ్యారు. విడాకుల విషయంపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రం కుటుంబానికి ప్రయోజనం చేకూర్చదు. నేను గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఇప్పటి వరకు బహిరంగంగా ఈ వివాదాల గురించి కామెంట్ చేయలేదు. అనేకమార్లు బాధ కలిగినా గౌరవం కాపాడాలనే చూశాను. కానీ, ఇప్పుడు నాపై అన్యాయంగా దారుణమైన నిందలు వేస్తున్నారు. ఈ క్రమంలో నాపై తప్పుగా వార్తలు వస్తున్నాయి. అవి చూసి భరించడం నావల్ల కావడం లేదు. అయితే, ఒక తల్లిగా ఎల్లప్పుడూ నా పిల్లల శ్రేయస్సు మాత్రమే కోరుకుంటాను. కాలక్రమేణా ఆ నిందలు వారిపై ప్రభావం చూపొచ్చు. దానిని తలుచుకుంటే బాధేస్తుంది. ఇన్నాళ్లు మాకు మద్ధతుగా నిలిచిన మీడియా, అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. భవిష్యత్‌లో మా పట్ల మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను.' అని ఆర్తి తెలిపింది. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
సతీమణి ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన హీరో జయం రవి (ఫోటోలు)
-
సతీమణితో విభేదాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న జయం రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా తన సతీమణి ఆర్తితో విభేదాలు ఉన్నాయని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరువేరుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జయం రవి తన వివాహ జీవితానికి ఫుల్స్టాప్ పెడుతన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెళ్లిడించారు.చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న ఎడిటర్ మోహన్ కుమారుడే జయం రవి. 2009లో ఆర్తిని జయం రవి వివాహం చేసుకున్నారు. సుమారు 15 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట మధ్య పలు విభేదాలు రావడంతో విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయం గురించి జయం రవి ఒక నోట్ విడుదల చేశారు.'మేము ఇద్దరం చాలా ఆలోచించి, అందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఆర్తితో నా వైవాహిక జీవితం ముగిసింది. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయానికి వచ్చాం. ఇలాంటి డెసీషన్ తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ.. నాకు తప్పడం లేదు. ఈ నిర్ణయం అంత తేలికగా తీసుకోలేదు. నాపై ఆధారపడిన వారి సంక్షేమం, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తీసుకున్నాను. ఈ సమయంలో నా ప్రైవసీతో పాటు నా సన్నిహితుల గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. మీలో చాలామంది నన్ను ఆదరించి మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో పాటు మీడియాతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను.ఈ నిర్ణయం నా సొంత నిర్ణయం మాత్రమే. ఈ విషయం నా వ్యక్తిగత విషయంగానే అందరూ భావిస్తారని ప్రార్థిస్తున్నాను. జీవితం అనేది విభిన్న అధ్యాయాలతో కూడిన ప్రయాణం. ఎప్పుడూ కూడా అనేక సవాళ్లు, అవకాశాలతో ముగుస్తుంది. నేను ఎప్పటికీ మీ జయం రవిగానే ఉంటానని అభిమానులను కోరుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. నేను ఎప్పటికీ కృతజ్ఞతగా భావిస్తున్నాను.' అని జయం రవి పేర్కొన్నారు.Grateful for your love and understanding. Jayam Ravi pic.twitter.com/FNRGf6OOo8— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2024జయం రవి- ఆర్తి దంపతులకు అర్వ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలీవుడ్ మీడియా అనేకసార్లు ప్రచురించింది. దీంతో కొంత కాలంగా వారిద్దరూ కూడా వేరువేరుగానే జీవిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకోనే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. -
జయం రవి హిట్ చిత్రానికి సీక్వెల్
చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు జయం రవి. ప్రస్తుతం ఈయన బ్రదర్, జీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో బ్రదర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా నటుడు జయం రవి 2016లో కథానాయకుడిగా నటించిన చిత్రం మిరుదన్. నటి లక్ష్మీమీనన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని శక్తి సౌందర్‌రాజన్ తెరకెక్కించారు. నటి అనికా సురేందరన్ నటుడు జయం రవికి చెల్లెలిగా నటించగా, నటి లక్ష్మీమీనన్ ఆయన్ని ప్రేమించే నాయకిగా నటించారు. ఆమె జోంబీ బారిన పడడంతో తనను కాపాడే ప్రయత్నంలో పోలీస్ అధికారి అయిన జయం రవి కూడా జోంబీగా మారే ఇతి వృత్తంతో రూపొందిన చిత్రం మిరుదన్. కాగా ఈ తరహా జోంబీల ఇతి వృత్తంతో ఆంగ్లంలోనే వచ్చాయి. అలా తొలిసారిగా దక్షిణాదిలో జోంబీల ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మిరుదన్. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా మిరుదన్ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆయన మొదలెట్టేశారట. వచ్చే ఏడాది ప్రఽథమార్థంలో మిరుదన్ 2 చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్నందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో నటుడు జయం రవి హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే హీరోయిన్గా నటి లక్ష్మీమీనన్‌నే నటింపజేస్తారా? లేక మరెవరినైనా ఎంపిక చేస్తారా? అన్నది వేచి చూడాలి. అయితే ఇటీవల నటి లక్ష్మీమీనన్‌కు సరైన అవకాశాలు లేవన్నది గమనార్హం. దీంతో మిరుదన్ 2 చిత్రంలో మరో నటి నాయకిగా నటించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. -
స్టార్ హీరో విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?
మరో స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి కంటే విడాకులు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. మిగతా వాళ్ల గురించి పక్కనబెడితే తమిళ స్టార్ హీరో జయం రవి విడాకుల న్యూస్ గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు దానికి తగ్గట్లు ఇతడి భార్య చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)ప్రముఖ ఎడిటర్ మోహన్ కొడుకే జయం రవి. చాలా ఏళ్ల నుంచి తమిళంలో హీరోగా చేస్తున్నాడు. ఈ మధ్య 'పొన్నియిన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీలోనూ కీలక పాత్ర చేశాడు. ఇతడు ఆరతి అనే అమ్మాయిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇన్నేళ్లుగా బాగానే ఉన్నారు గానీ ఈ మధ్య ఎందుకో కలతలు వచ్చినట్లు ఉన్నాయి.మనస్పర్థల్ని తొలగించుకోవాలనుకున్నారు గానీ వర్కౌట్ కాలేదని, దీంతో గత కొన్నాళ్ల నుంచి జయం రవి, ఆరతి విడివిడిగా ఉంటున్నారని కోలీవుడ్ మీడియాలో టాక్. ఇప్పుడు దీన్ని నిజం చేసేలా భర్తతో ఉన్న ఫొటోల్ని ఆరతి ఇన్ స్టా నుంచి తీసేసింది. దీంతో విడాకుల వార్త నిజమేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. దీనిపై ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్పితే అసలు విషయం బయటపడదు.(ఇదీ చదవండి: పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్) View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
చేతిలో మూడు చిత్రాలు.. మరో కథకు ఓకే చెప్పిన హీరో!
కోలీవుడ్ హీరో జయంరవి గతేడాది పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో హిట్ సాధించారు. ఆ తరువాత ఆయన కెరీర్లో సరైన హిట్ పడడం లేదు. అయితే అంతకు ముందు కంటే జయంరవి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కాదలిక్క నేరమిలై చిత్రాన్ని పూర్తి చేశారు. అంతే కాకుండా బ్రదర్, జీనీ చిత్రాలు అతని చేతిలో ఉన్నాయి. వీటితో పాటు తన సోదరుడు మోహన్‌రాజా దర్శకత్వంలో తనీఒరువన్ –2 చేయాల్సి ఉంది.ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పాండిరాజ్ దర్శకత్వంలో నటించడానికి జయంరవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. సూర్య హీరోగా ఎదర్కుం తుణిందవన్ చిత్రం చేసిన పాండిరాజ్ ఆ తరువాత ఇప్పుటి వరకూ మరో చిత్రం చేయలేదు. నిజానికి ఆ చిత్రం కమిర్షియల్‌గా పెద్దగా హిట్ కాలేదు. ఆ తరువాత నటుడు విశాల్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగినా, అది వాస్తవ రూపం దాటలేదు.కాగా.. తాజాగా పాండిరాజ్ చెప్పిన కథ నటుడు జయంరవికి నచ్చినట్లు సమాచారం. జయంరవి హీరోగా సుజాతా విజయకుమార్ హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన సైరన్ చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఆ బ్యానర్లో మరో చిత్రం చేయాలని జయంరవి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పాండిరాజ్ చెప్పిన కథ హోం మూవీ మేకర్స్ సంస్థ నిర్వాహకులకు నచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసిన తరువాత జయంరవి ఈ చిత్రానికి సిద్ధం అవుతారని తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. -
కమల్ హాసన్- మణిరత్నం కాంబో.. ఆ హీరోలు మళ్లీ..!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సాధించిన సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షెడ్యూల్ వాయిదా పడడంతో నటుడు జయం రవి ఆ తరువాత దుల్కర్ సల్మాన్ ఇటీవల సిద్ధార్థ్ కూడా థగ్స్ లైఫ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అలాగఇందులో నటుడు శింబును ఒక ముఖ్యపాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ముందుగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిన జయంరవి, దుల్కర్ సల్మాన్‌లు మళ్లీ ఈ చిత్రంలో నటించడానికి తిరిగి వస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే కమలహాసన్ థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారన్నది తాజా సమాచారం. -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేశ్ మూవీ, స్ట్రీమింగ్ అక్కడే!
తమిళ హీరో జయం రవి, హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరన్. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో మెరిసింది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట్లో నేరుగా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల చేశాకే ఓటీటీలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అక్కడ రిలీజ్ డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను పలు వాయిదాల తర్వాత తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళనాట మరీ అంత పాజిటివ్ స్పందన లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 19 నుంచి హాట్‌స్టార్‌లో సైరన్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కథేంటంటే? ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటించారు. భార్య(అనుపమ పరమేశ్వరన్)ను హత్య చేసిన కేసులో రవి జైలుకెళ్తాడు. పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో ఓ లీడర్‌ను, పోలీస్‌ను హత్య చేస్తాడు. ఈ కేసు కీర్తి సురేశ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను నిజంగానే రవి చంపేశాడా? కీర్తి కేసును ఎలా సాల్వ్ చేసింది? అనేది తెలియాలంటే? ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.. #Siren OTT - Apr 19 - Hotstar. pic.twitter.com/Mr4KPtCHIe — Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2024 చదవండి: అమ్మ అంటే ఎంత ప్రేమో.. తనకోసం ఆలయాన్నే కట్టించిన హీరో -
జీనీ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
తమిళసినిమా: పొన్నియన్ సెల్వన్ చిత్రం తరువాత జయం రవి కథానాయకుడిగా నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో ఈయనకు అర్జెంట్‌గా ఒక హిట్ అవసరం. దాన్ని జీనీ చిత్రం తీరుస్తుందని భావించవచ్చు. జయాపజయాలకు అతీతంగా చిత్రాలను చేసుకుంటూ పోతున్న నటుడు జయంరవి. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం జీనీ. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా అర్జునన్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మిష్కిన్ శిష్యుడన్నది గమనార్హం. జయం రవికి ఇది 35వ చిత్రం అవుతుంది. ఇందులో ఆయనకు జంటగా నటి కల్యాణి ప్రియదర్శన్, కృతిశెట్టి, వామిక దీపక్ నాయికలుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని, మహేశ్ ముత్తుస్వామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్లో జయంరవి ఆలీబాబా భూతం తరహాలో ఉన్నారు. ఆయన చుట్టూ బంగారు నాణేలు, డబ్బు నోట్లు, తెగిన చైన్లు, తినుబండారాలు ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. దీని తరువాత జయం రవి తనీఒరువన్–2, అధర్వ తదితర చిత్రాల్లో నటించనున్నారు. -
స్టార్ డైరెక్టర్‌కు షాక్.. భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న మరో హీరో!
ఇండియన్ సినిమాలో దర్శకుడిగా మణిరత్నంకు మంచి పేరు ఉంది. అలాంటి దర్శకుడి చిత్రాల్లో పనిచేయాలని కోరుకోని నటినటులు ఉండరనే చెప్పాలి. ఇటీవల మణిరత్నం భారీ తారాగణంతో దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ హీరోగా థగ్స్ లైఫ్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కమల్‌హాసన్ నటిస్తున్న 234వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా 34 ఏళ్ల తర్వాత కమలహాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న చిత్రమిదే. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో జయంరవి, దుల్కర్సల్మాన్, త్రిష కూడా ముఖ్యపాత్రలకు ఎంపికయ్యారు. కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ సెర్బియాలో జరగనుంది. అయితే నటుడు కమలహాసన్ అమెరికాలో జరుగుతున్న ఇండియన్–2 చిత్ర పనుల్లో బిజీగా ఉండడం, అదే సమయంలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల తేదీ ప్రకటించడంతో, పార్టీ వ్యవహారాలలో పాల్గొనడానికి చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ సెర్బియాలో ప్రణాళిక ప్రకారం జరగకపోవడంతో దర్శకుడు చైన్నెకి చేరుకున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ కోసం తదుపరి షూటింగ్‌ను ఎన్నికల తర్వాత మళ్లీ సెర్బియాకు వెళ్లి జరుపుతారని సమాచారం. దీంతో కమలహాసన్ కాల్షీట్స్ దొరక్కపోవడంతో ఇందులో నటిస్తున్న ఇతరుల కాల్షీట్స్ వ్యవహారంలోనూ సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు కారణంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి దుల్కర్సల్మాన్ వైదొలిగారు. తాజాగా జయం రవి కూడా థగ్స్ లైఫ్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇందులో దుల్కర్సల్మాన్ పాత్రను శింబు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జయంరవికి బదులుగా దర్శకుడు మణిరత్నం ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
అటు డాక్టర్‌గా ఇటు హీరోగా.. త్వరలోనే డబుల్ టక్కర్..
ధీరజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డబుల్ టక్కర్. మీరా మహతి దర్శకత్వం వహిస్తుండగా ఏర్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. స్మృతి వెంకట్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని, గౌతమ్ రాజేంద్రన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. నటి కోవై సరళ, ఎంఎస్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం యానిమేషన్ పాత్రలతో కలిసి నటీనటులు నటించడం అన్న వినూత్న ప్రయోగంతో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా తెరపై రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో చైన్నెలోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు. ఇందులో హీరో ధీరజ్ మాట్లాడుతూ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, షారుక్ ఖాన్ వంటి ప్రముఖ హీరోల సినిమాల ఆడియో ఆవిష్కరణ వేడుకలు తరువాత ఇదే వేదికపై డబుల్ టక్కర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ నిర్వహించే అవకాశం కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి సపోర్ట్ చేసిన దర్శకుడు రవికుమార్, జయం రవిలకు ప్రేమతో కూడిన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడండి.. ఆనందంతో థియేటర్ నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు. జయంరవి మాట్లాడుతూ.. డబుల్ టక్కర్ టైటిల్.. హీరో కోసమే పెట్టినట్లు అనిపిస్తోందన్నారు. డాక్టర్ అయిన ధీరజ్ ఇప్పుడు యాక్టర్‌గా మారి రెండు రంగాల్లో రాణిస్తున్నానన్నారు. తన మంచి మిత్రుల్లో ధీరజ్ ఒకరని, ఆయనతో కలిసి త్వరలో ఒక చిత్రం చేయాలనిపిస్తోందన్నారు. విద్యాసాగర్ సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. చదవండి: కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్‌కు పెళ్లయిపోయింది -
స్టార్ హీరో యాక్షన్ థ్రిల్లర్.. టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
'తని ఒరువన్' 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ దక్కించుకున్న హీరో జయం రవి. ఆయన తాజాగా 'సైరన్' అనే మాస్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో దసరా భామ కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది. టాలీవుడ్లో ఈ సినిమా 'గంగ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తెలుగు టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ మాట్లాడుతూ.. " ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం. అదీ పెద్ద హీరోతో చేసినప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి తీసుకున్నారు. జీవీ గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. చిత్రం అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని అన్నారు. జయం రవి మాట్లాడుతూ.."ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జీవీ తన సంగీతంతో ప్రాణం పోశారు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కీర్తి సురేశ్ మా నమ్మకాన్ని నిలబెట్టింది. ఆంథోనీ భాగ్యరాజ్ లాంటి కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది హెచ్చరిస్తుంటారు. కానీ ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే విజయం కనిపిస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. మా సైరన్ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, అజయ్, అలగం పెరుమాళ్, పాండ్యన్ కీలక పాత్రలు పోషించారు. -
వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: కీర్తి సురేశ్
తక్కువ కాలంలోనే హీరోయిన్గా అనూహ్య స్థాయికి చేరుకుంది కీర్తీ సురేశ్. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగు భాషలను దాటి ఉత్తరాది ప్రేక్షకులను అలరించడానికి బాలీవుడ్ వరకు చేరుకుంది. ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీ సురేశ్‌కు ధైర్యం కాస్త ఎక్కువేనట. సినీ రంగప్రవేశం చేయకముందే నిజ జీవితంలో తన మాస్ హీరోయిజాన్ని చూపించారట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఒక పోకిరికి బుద్ధి చెప్పిన సంఘటన గురించి చెప్పారు. నటిగా పరిచయం కాని సమయంలో ఒక రోజు అర్ధరాత్రి తాను స్నేహితురాళ్లతో కలిసి వెళుతున్నానని, అప్పుడొక మందుబాబు వెనుకగా వచ్చి తనను రాసుకుంటూ వెళ్లాడని చెప్పారు. తనకు కోపం తన్నుకు రావడంతో అతన్ని పట్టుకుని చెంపలు పగలకొట్టినట్లు చెప్పారు. ఆ తరువాత ఆ మందుబాబు తనపై దాడి చేసి తలపై కొట్టాడని, దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు కీర్తి సురేశ్‌గుర్తు చేసుకున్నారు. పోలీసులు అతన్ని ఆ రాత్రి అంతా జైలులోనే ఉంచి ఉదయం విడిచి పెట్టారని చెప్పారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కీర్తీ సురేశ్ తాజాగా జయంరవి చొక్కా కాలర్ పట్టుకుని ఈడ్చుకెళుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సైరన్ చిత్రంలో దృశ్యం అని గమనించవచ్చు. జయంరవి కథానాయకుడిగా నటించిన ఇందులో కీర్తీసురేశ్ పోలీస్ అధికారిగా నటించారు. ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ 10 కిలోల బరువు పెరిగారట. సైరన్ చిత్రం ఈనెల 16న థియేటర్లలోకి రానుంది. -
కీర్తి సురేశ్ పవర్ఫుల్ పాత్రలో వస్తోన్న సైరన్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో జయంరవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తాజా చిత్రం సైరెన్. హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయకుమార్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా ఆంథోని భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించిన సైరన్ చిత్రం ఈనెల 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చైన్నెలోని పీవీపీ స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో జయంరవి మాట్లాడుతూ.. తాము సమష్టిగా శ్రమించిన సైరన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోందని చెప్పారు. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని.. ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. కీర్తీసురేశ్ చాలా బలమైన పాత్రను అద్భుతంగా చేశారని అభినందించారు. తాను ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించానని.. ఈ చిత్రం పిల్లలు నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తుందనే నమ్మకాన్ని జయంరవి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సుజాత విజయకుమార్ మాట్లాడుతూ.. అంబులెన్స్ సైరన్‌కు, పోలీస్ సైరన్‌కు మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రమని అన్నారు. జయంరవి కథానాయకుడిగా సైరన్ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన తన అల్లుడు అని చెప్పడం కాదు కానీ.. చాలా అద్భుతంగా నటించారని అన్నారు. కీర్తీసురేశ్ ఈ చిత్రంలో పోలీసు అధికారిగా పవర్ఫుల్ పాత్రను జయంరవికి ధీటుగా నటించారని ప్రశంసించారు. అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా చక్కగా చేశారని చెప్పారు. దర్శకుడు తనకు చెప్పిన కథ వేరు.. జయంరవికి చెప్పి చేసిన సైరన్ చిత్ర కథ వేరని ఆమె అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, అళగర్ పెరుమాళ్ ముఖ్యపాత్రలు పోషించారు. -
స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో కాదట!
దసరా బ్యూటీ కీర్తి సురేశ్, జయం రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'సైరెన్'. 108 అనేది ఉపశీర్షిక. యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని కీర్తి సురేశ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథనే సినిమాగా రూపొందిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి జైలు నుంచి బయటికొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కుతోంది. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్..! అయితే ఈ సినిమాపై మొదట డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానుందని వార్తలొచ్చాయి. ఈ మూవీ రిలీజ్ తేదీపై గతంలో చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను జయం రవి, కీర్తి సురేష్ ట్విటర్లో పంచుకున్నారు. (ఇది చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్..!) కాగా.. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. డీజే టిల్లు స్క్వేర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. మరోవైపు కీర్తి సురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. . @actor_jayamravi coming out on parole this Feb16th ! 🚨#SirenFromFeb16 #Tamil & #Telugu A @gvprakash Musical @antonybhagyaraj @anupamahere @sujataa_HMM @iYogiBabu @IamChandini_12 @AntonyLRuben @brindagopal @dhilipaction @selvakumarskdop @SaktheeArtDir @shiyamjack… pic.twitter.com/Au67K5Vo3F — Keerthy Suresh (@KeerthyOfficial) January 22, 2024 -
డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్..!
కోలీవుడ్ స్టార్ జయంరవి, కీర్తీసురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరెన్. ఈ చిత్రంలో జయంరవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్, కుటుంబ కథా చిత్రంగా ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో హోమ్ ఫిలిం మేకర్స్ పతాకంపై సుజాత నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ ఇటీవల విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జయం రవి జైలర్‌గా నటిస్తుండగా, నటి కీర్తి సురేష్ పోలీసు అధికారిగానూ, అనుపమ పరమేశ్వరన్ ఆయన ప్రేయసిగా నటిస్తున్నారు. (ఇది చదవండి: నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!) అయితే థియేటర్లలో రిలీజ్ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సైరెన్ త్వరలోనే తెరపైకి రానుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జయంరవి అభిమానులకు షాకి ఇచ్చే విధంగా ఓ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ నెల 26న నేరుగా జీ5లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. గతంలో జయంరవి నటించిన భూమి చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. దీంతో ఈ మూవీ విషయంలోనూ అదే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే సైరెన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటనైతే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించారు. -
రూ. 100 కోట్ల బడ్జెట్.. 18 భాషల్లో విడుదల..కృతి శెట్టికి లక్కీ ఛాన్స్
కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయం రవి. ఈయన చిత్రాల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించి కొత్తదనం ఉన్న చిత్రాలను చేస్తుంటారు. పొన్నియిన్ సెల్వన్ వంటి చరిత్రాత్మక కథా చిత్రంలో నటించి, ఆ తరహా కథా పాత్రల్లోనూ సత్తా చాటారు. ఆ చిత్రం మంచి విజయం సాధించినా ఆ తర్వాత వచ్చిన ఇరైవన్ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి జీనీ. ఇందులో జయం రవి సరసన కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, వామిక కబీ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. దర్శకుడు అర్జునన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరీ గణేష్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దీనిని రూ.100 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా చిత్రాన్ని 18 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా పొన్నియిన్‌సెల్వన్ చిత్రాన్ని పక్కన పెడితే జయం రవి నటిస్తున్న రూ.100 కోట్ల బడ్జెట్ చిత్రం ఇదే అవుతుంది. ఇది ఐసరి గణేష్ నిర్మిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో జీవీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు సైరన్, బ్రదర్ తదితర చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అదే విధంగా తనీ ఒరువన్, ఎం.కుమరన్ సన్ఆఫ్ మహాలక్ష్మి చిత్రాల సీక్వెల్స్‌లో నటించేందుకు జయం రవి సిద్ధమవుతున్నారు. -
రవితేజ బ్లాక్‌బస్టర్ మూవీ.. 20 ఏళ్ల తర్వాత సీక్వెల్!
నటుడు జయం రవి కథానాయకుడిగా నటించిన చిత్రం ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్గా నటించారు. జయం రవికి తల్లిగా నదియా కనిపించారు. అయితే ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ చిత్రం 2004లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో రవితేజ నటించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు. తెలుగులో 2003లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు మోహన్‌రాజా సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ తాజా సమాచారం. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందులో నటి నదియా పాత్ర కూడా ఉంటుందని సమాచారం. అయితే ఆమెనే ఎంపిక చేస్తారా? అదే విధంగా హీరోయిన్గా ఎవరు నటిస్తారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆసిన్ సినిమాలకు దూరంగా ఉంది. కాగా ప్రస్తుతం మోహన్ రాజా, జయం రవి హీరోగా తనీ ఒరువన్ చిత్రానికి సీక్వెల్ 'తని ఒరువన్- 2' తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఎం.కుమరన్ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. కాగా మోహన్‌రాజా తమిళంలో చిత్రం చేసి చాలా గ్యాప్ వచ్చింది. 'ఎమ్ కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి' తెలుగు సినిమా 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'కి రీమేక్ అయినప్పటికీ.. తమిళ అభిమానులను ఆకట్టుకునేలా మోహన్ రాజా అనేక మార్పులు చేశారు. ఈ చిత్రం తమిళనాడులో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, ఐశ్వర్య, వివేక్, జనకరాజ్, వెన్నిర ఆడై మూర్తి ముఖ్య పాత్రలు పోషించారు. -
రెండు పాత్రల కథ
జయం రవి, కీర్తీ సురేష్ నటించిన చిత్రం ‘సైరన్ ’. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో సుజాత విజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ , థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన చిత్రం ‘సైరన్’. రెండు పాత్రల మధ్య నడిచే కథ ఇది. ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. ఈ మూవీలో తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కొత్తగా కనిపిస్తారు రవి. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. -
ఓటీటీలో సైకో థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?
థియేటర్లో అన్ని జానర్ల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అయితే ఓటీటీలో మాత్రం సస్పెన్స్, థ్రిల్లర్ కంటెంట్‌కే ఎక్కువగా ఓటేస్తున్నారు. ఓటీటీ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా సరికొత్త సినిమాలు, సిరీస్‌లతో సినీప్రియులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్టార్ హీరో జయం రవి, నయనతార జంటగా నటించిన చిత్రం ఇరైవన్. అహ్మద్.. కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించగా సుధన్ సుందరం, జయరామ్.జి కలిసి నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న విడుదలైంది. ఈ తమిళ చిత్రం తెలుగులో గాడ్ పేరిట విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. గాడ్ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, చార్లీ, అశ్విన్ కుమార్, రాహుల్ బోస్, విజయలక్ష్మి, వినోద్ కిషన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా కథేంటంటే.. సినిమా కథ విషయానికి వస్తే.. నగంలో వరుసగా అమ్మాయిలు హత్యకు గువుతుంటారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేస్తున్న సైకో కిల్లర్‌ను ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ పట్టుకుంటాడు. కానీ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా హత్యలు జరుగుతూనే ఉంటాయి. మరి వాళ్లను ఎవరు చంపుతున్నారు? ఈ మర్డర్ మిస్టరీలను ఎలా ఛేదించారు? అనేది తెలియాలంటే గాడ్ సినిమాను ఓటీటీలో చూసేయాల్సిందే! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: పదేళ్లయినా నాకోసం ఎదురుచూస్తున్నారు: కియాఆ -
ఆ హీరోతో తొలిసారి జోడీ కడుతున్న నిత్యామీనన్..
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయికల్లో నిత్యామీనన్ ఒకరు. అయితే ఈ మలయాళ భామ రూటే సెపరేటు. పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించడానికి సమ్మతిస్తారు. అలా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇటీవల వెబ్ ప్రపంచంలోకి ఎంటర్ అయిన నిత్యామీనన్ తాజాగా తమిళంలో జయం రవితో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్ధ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించనున్నారు. ఈచిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. దీని గురించి నిత్యామీనన్ తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం.. గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్న రొమాంటిక్ కామెడీ మూవీగా ఉంటుందన్నారు. తాను ఇంతకు ముందు ధనుష్ సరసన నటించిన తిరుచిట్రంఫలంలో పోషించిన శోభన పాత్ర తరహాలో ఇందులోనూ తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రం తరువాత జయం రవి నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సైరస్, జీనీ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా కృతిక ఉదయనిధి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈయనతో నిత్యామీనన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. చదవండి: సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్ చరిత్ర ఇదే -
విజయ్ సేతుపతి కాల్షీట్ల కోసం హీరో వెయిటింగ్..
జయం రవి, నయనతార జంటగా నటించిన చిత్రం ఇరైవన్. నటి విజయలక్ష్మి, నరేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై సుదన్ సుందరం నిర్మించిన ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఇరైవన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు జయం రవి మాట్లాడుతూ.. ఇరైవన్ చిత్ర టైటిల్ గురించి చాలా మంది అడిగారన్నారు. ఇదే విషయం గురించి తాను దర్శకుడిని అడగ్గా ఇరైవన్ అంటే ప్రేమ అని చెప్పారన్నారు. ఇది ప్రేమతో ప్రారంభమైన చిత్రం అన్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. తాను చూసిన తొలి హీరో జయం రవి అన్నారు. అయితే తాను దర్శకత్వం వహించాలని కోరుకుంటున్న తొలి కథానాయకుడు విజయ్ సేతుపతి అని.. ఆయన త్వరగా కాల్షీట్స్ ఇవ్వాలని జయంరవి కోరారు. ఇక దర్శకుడు అహ్మద్ ప్రేమాభిమానాలు తనకు ఎప్పుడూ ఉండాలన్నారు. ఈ చిత్రం నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత సుదన్ సుందర మాట్లాడుతూ జయం రవి, విజయ్ సేతుపతి ఇద్దరూ పాత్రలకు ప్రాణం పోయడానికి శ్రమించే నటులని పేర్కొన్నారు. చదవండి: శివాజీ నోటిదూల.. 'ఎక్స్' టాపిక్.. నీ క్యారెక్టర్ ఏంటంటూ శుభశ్రీపై ఫైర్ -
దయచేసి పిల్లలతో కలిసి సినిమా చూడకండి:స్టార్ హీరో
లేడీ సూపర్ స్టార్ నయనతార, జయం రవి జంటగా నటించిన చిత్రం ఇరైవన్. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని గాడ్ పేరుతో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ లాంఛ్‌లో పాల్గొన్న జయం రవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చారు. (ఇది చదవండి: కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!) జయం రవి మాట్లాడుతూ..' అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం అందించే లక్ష్యంతో సినిమాలు చేస్తున్నాం. అయితే ఇరైవన్ (గాడ్) చిత్రాన్ని మాత్రం పిల్లలతో కలిసి చూడొద్దు. ఎందుకంటే సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి చిన్న పిల్లలు భయపడే అవకాశం ఉంది. మా సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్లోనే చూపించాం. కొంతమంది ప్రేక్షకులు ఇలాంటి క్రైమ్ అండ్ సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడతారు. వాళ్లు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా.' అని అన్నారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గతంలో నాకు ఓ కథ చెప్పారు. అది అనివార్య కారణాలతో చేయలేకపోయాను. అతనికి మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా. ఇకపోతే నాకు డైరెక్షన్ చేయాలనే ఉంది.. భవిష్యత్తులో అవకాశం వస్తే విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని తెలిపారు. (ఇది చదవండి: 800 మూవీ విజయ్ సేతుపతి చేయాల్సింది, కుటుంబాన్ని బెదిరించడంతో..) -
రూట్ మార్చిన స్టార్ హీరో.. అలాంటి మూవీలో
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు జయం రవి. ఈయన నయనతారతో కలిసి నటించిన 'ఇరైవన్' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. మరోపక్క 'సైరన్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. తాజాగా జయం రవి 30వ సినిమా టైటిల్‌ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి 'బ్రదర్' అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఎం.రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. నటరాజన్, భూమిక, శరణ్య, గణేష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీశ్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తున్న జయం రవి.. ఇప్పుడు రూట్ మార్తి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటిస్తున్నాడు. చైన్నె, హైదరాబాద్, ఊటీ, కొడైక్కెనాల్ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!) Excited to be a '#Brother,' a word that connects us all ♥️ Releasing worldwide in Tamil & Telugu !!! #BrotherMovie #BrotherFirstLook Happy #VinayagarChathurthi @rajeshmdirector @jharrisjayaraj @screensceneoffl @priyankaamohan @bhumikachawlat @vivekcinema@saranyaponvanan… pic.twitter.com/YvUQMHMJLl — Jayam Ravi (@actor_jayamravi) September 18, 2023 -
స్టార్ హీరో నెవ్వర్ బిఫోర్ లుక్.. గ్లింప్స్ అదిరింది!
తమిళ హీరో జయం రవి కొత్త సినిమా 'సైరన్'. మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయకుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంతో ఆంటనీ భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇంతకు ముందు ఈ డైరెక్టర్.. అభిమన్యుడు, విశ్వాసం, హీరో చిత్రాలకు కథ సహకారం అందించాడు. ఇకపోతే జయం రవి పుట్టినరోజు కానుకగా ఆదివారం 'సైరన్' ప్రీ ఫేస్ వీడియోని రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) ఈ సినిమాలో జయం రవి సరసన కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సాల్ట్ పెప్పర్ లుక్‌తో ఓ బల్లపై కూర్చుని టీ తాగుతున్న జయం రవి ఫొటోను పోస్టర్‌గా కాకుండా చిన్న వీడియోగా విడుదల చేశారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న 'సైరన్' సినిమాని యాక్షన్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిగతా వివరాలని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. (ఇదీ చదవండి: 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే) -
క్రేజీ హారర్ థ్రిల్లర్.. కేక పుట్టిస్తున్న ట్రైలర్
'తనీ ఒరువన్' లాంటి హిట్ తర్వాత తమిళ స్టార్ హీరో జయం రవి, నయనతార జంటగా నటించిన సినిమా 'ఇరైవన్'. సుధన్ సుందరం, జయరామ్.జి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు 'ఎండ్రెండ్రుమ్ పున్నగై', 'మనిదన్' వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తీసిన అహ్మద్.. కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. యువన శంకర్ రాజా సంగీతాన్ని,హరి కె.వేదంత్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండున్నర నిమిషాలున్న ఇది.. హీరో vs విలన్ అనే టెంప్లేట్‌కి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: అతడి పెళ్లిలో రష్మిక.. కొత్తజంట అలా చేయడంతో!) ట్రైలర్ ప్రకారం.. ఇందులో జయం రవి పోలీస్‌గా నటించాడు. 12 మంది అమ్మాయిలని చంపిన నర హంతకుడిగా రాహుల్ బోస్ యాక్ట్ చేశాడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో హీరో విలన్ మధ్య రసవత్తర సన్నివేశాలు చూపించారు. ఇది మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇరైవన్ అంటే భగవంతుడు అని అర్ధం. అయితే ఈ చిత్రంలో మనుషులను కిరాతకంగా చంపే విలన్ తనను దేవుడిగా భావించుకుంటాడా..? లేక ఆ నరహంతకుడిని అంతం చేసే కథానాయకుడు దేవుడా? అనేది చిత్రంలో చూడాల్సిందే. హీరోయిన్ నయనతారకు కూడా ఇందులో మంచి రోల్ చేసిందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ స్టేజీపై సమంత కోసం ఆరా తీసిన నాగార్జున) -
హిట్ సినిమాకు సీక్వెల్.. ఆ హీరోతో మరోసారి జోడీ కట్టనున్న నయనతార!
నటుడు జయం రవి, నయనతార కాంబినేషన్ సక్సెస్ఫుల్ అని తనీ ఒరువన్ చిత్రంతో నిరూపణ అయ్యింది. ఈ సినిమాలో ఈ జంట మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. కాగా జయం రవి, నయనతార మరోసారి తెరపై రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారన్నది తాజా న్యూస్. వీరిద్దరి కాంబోలో ఇరైవన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్దమవుతోంది. తనీఒరువన్ చిత్ర దర్శకుడు మోహన్‌రాజానే ఈ చిత్రాన్నీ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేతలు మంగళవారం అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్మాతలే తనీ ఒరువన్ చిత్రాన్ని కూడా నిర్మించడం గమనార్హం. కాగా ఈ సంస్థ ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి జయం రవి, నయనతార జంటగా నటించే తనీ ఒరువన్ –2 సెట్ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారిక పూర్వకంగా వెల్లడించనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకురాలు అర్చన పేర్కొన్నారు. కాగా దర్శకుడు మోహన్ రాజా కొత్త ఇమేజ్ను తెచ్చి పెట్టిన చిత్రం తనీ ఒరువన్ అనే చెప్పాలి. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందనున్న తనీ ఒరువన్ –2పై భారీ అంచనాలు నెలకొన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. YouTube trending #1#Mithran is here with his magic! ICYMI▶️ https://t.co/jtCIuceSGx#KalpathiSAghoram #KalpathiSGanesh #KalpathiSSuresh @jayam_mohanraja @actor_jayamravi @archanakalpathi @aishkalpathi @venkat_manickam pic.twitter.com/4NKs9XcnY2 — AGS Entertainment (@Ags_production) August 29, 2023 చదవండి: డ్రగ్స్ కేసుపై వివరణ ఇచ్చిన వరలక్ష్మీ శరత్‌కుమార్.. ఆదిలింగం ఎవరంటే? -
ధృవ సినిమాకు సీక్వెల్ రెడీ.. టీజర్ విడుదల కానీ..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హిట్ చిత్రం 'ధృవ'. ఇందులో హీరోయిన్గా రకుల్ నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 2016లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌ను అందుకుంది. కోలీవుడ్‌లో డైరెక్టర్ మోహన్‌రాజా తెరకెక్కించిన 'తనీ ఒరువన్'కు రీమేక్‌గా ఇది విడుదలై తెలుగు వారిని అలరించింది. తాజాగ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సీక్వెల్ కావాలంటూ మెగా ఫ్యాన్స్ నుంచి భారీగానే డిమాండ్లు వచ్చాయి. అయితే ఈ సీక్వెల్ తమిళ సినిమాకు మాత్రమేనని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో టీజర్‌ను కూడా మేకర్స్ విడుదుల చేశారు. కానీ తెలుగులో కూడా చెర్రీతోనూ చర్చలు జరిపే ఉంటారని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ఇదే దర్శకుడు మోహన్ రాజా పనిచేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గాడ్ ఫాదర్' సినిమాతో మెగా ఫ్యామిలీకి మోహన్ రాజా దగ్గరయ్యారు. ఆ సమయంలోనే ధృవ సినిమాకు సీక్వెల్ కథను వినిపించారని సమాచారం. మరి తెలుగు సీక్వెల్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. -
కృతి శెట్టితో సినిమా ప్రకటించిన 'పొన్నియిన్ సెల్వన్'
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో అరుళ్మొళిగా టైటిల్ పాత్రను పోషించి అందరి ప్రశంసలను పొందిన నటుడు జయంరవి. ఈయన నటించిన చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఎల్కేజీ, కోమాలి, మూక్కుత్తి అమ్మన్, వెందు తనిందదు కాడు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. దీనికి జీనీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. (ఇదీ చదవండి: Salaar Teaser: ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి .. 'సీజ్ఫైర్' అంటే ఏమిటో తెలుసా?) ఈ చిత్రం ద్వారా మిష్కిన్ శిష్యుడు జేఆర్ అర్జున్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నటి కల్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, వామిక కబి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటి దేవయాని ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్థానిక తిరువేర్కాడు సమీపంలోని పీజీఎస్ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖుల హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. మహేశ్ ముత్తుసామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ సహా ఐదు భాషల్లో రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. (ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్‌లో సమంత.. వీడియో వైరల్) -
సైలెంట్ అయిన విశాల్, కార్తీ.. ఛాన్స్ పట్టేసిన జయం రవి
సినిమాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు నటుడు జయం రవి. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో టైటిల్ పాత్రను పోషించి అందరి ప్రశంసలను అందుకున్న ఈయన ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. జయం రవి, నయనతార జంటగా నటించిన ఇరైవన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అలాగే ప్రస్తుతం సైరన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్. అదే విధంగా దర్శకుడు రాజేష్ ఎం.దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, మరో నూతన దర్శకుడి సినిమాలోనూ నటించనున్నారు. ఈ పరిస్థితుల్లో జయం రవి మరో నూతన చిత్రానికి కమిట్ అయినట్లు తాజా సమాచారం. ఈయన ఇంతకు ముందు కార్తీక్ తగవేల్ దర్శకత్వంలో అడంగామరు అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో భారీ చిత్రం తెరకెక్కబోతుంది. దర్శకుడు కార్తీక్ తంగవేల్ తాను రాసుకున్న కథను నటులు విశాల్, కార్తీలకు చెప్పి వారిలో ఒకరి నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూసినట్లు, వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మళ్లీ నటుడు జయం రవినే ఆశ్రయించినట్లు సమాచారం. జయం రవి పచ్చజెండా ఊపడంతో దర్శకుడు కార్తీక్ తంగవేల్ షూటింగ్‌కు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిని ఏజీఎస్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. చదవండి: నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆ ఫోటో ఏంటి? మలైకాపై నెటిజన్స్ ఫైర్ -
ముగ్గురు హీరోయిన్స్‌తో జయంరవి రొమాన్స్.. స్టార్స్‌తో డ్యూయెట్లు
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాజు అరుణ్ మొళి వర్మగా ప్రేక్షకుల మన్ననలను పొందిన జయం రవి ఇప్పుడు మళ్లీ రొమాంటిక్ హీరోగా మారబోతున్నారు. ప్రస్తుతం ఈయన సైరన్ చిత్రంలో కీర్తి సురేష్ తోనూ, ఇరైవన్ చిత్రంలో నయనతారతోనూ డ్యూయెట్లు పాడుతున్నారు. కాగా జయం రవి కథానాయకుడిగా వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత రూ.100 కోట్ల బడ్జెట్లో భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటింన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా భువనేశ్ అర్జునన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈయన దర్శకుడు మిష్కిన్ శిష్యుడు అన్నది గమనార్హం. కాగా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో జయం రవికి జంటగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తాజా సమాచారం. కాగా నటి కృతి శెట్టి ఒక హీరోయిన్గా నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా నటి కల్యాణి ప్రియదర్శన్‌ను ఇందులో మరో హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మూడో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చిత్రం జూలైలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధింన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
PS2 Collections: రెండు రోజుల్లో వందకోట్లు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 28న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. (ఇది చదవండి: ఘనంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 యాంథెమ్ లాంఛ్) పొన్నియన్ సెల్వన్- 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇండియాలో రెండో రోజు దాదాపు రూ.28.50 కోట్ల గ్రాస్ సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రిలీజైన తొలిరోజు రూ.38 కోట్ల రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్ల సాధించింది. (ఇది చదవండి: అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!) కాగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-1 పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
రోజూ బిర్యానీ తినలేం కదా.. సాంబారు అన్నం తినక తప్పదు : నటుడు
మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్‌సెల్వన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా నటుడు జయం రవి పేర్కొన్నారు. శుక్రవారం ఈ చిత్ర రెండవ భాగం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో జయం రవి టైటిల్ పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఐదేళ్ల శ్రమ పొన్నియిన్ సెల్వన్ (రెండు భాగాలు) అని ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులతో కలిసి నటించడం మరచిపోలేని మధురానుభూతిగా జయం రవి పేర్కొన్నారు. చదవండి:రోజూ బిర్యానీ తినలేం కదా.. సాంబారు అన్నం తినక తప్పదు : నటుడు షూటింగ్ సమయంలో అందరం పలు విషయాల గురించి ముచ్చటించుకునే వాళ్లమని చెప్పారు. మళ్లీ ఇంతమంది ప్రముఖ నటీనటులతో కలిసి నటించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ అలాంటి చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ముందుకు రావాలిగా అని పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని భారీ చిత్రాల్లో నటించిన తరువాత మీరు నటిస్తున్న తర్వాత చిత్రాలను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అన్న ప్రశ్నకు మనం రోజూ బిరియానీ తినలేము కదా, సాంబారు అన్నం తినక తప్పదు కదా. అదే విధంగా పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలు అరుదుగా వస్తాయని కాబట్టి తన తర్వాత చిత్రాలకు ఆదరణ లభిస్తుందా అనే సందేహం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఇరైవన్ చిత్రాన్ని పూర్తి చేశానని, నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని చెప్పారు. ప్రస్తుతం సైరన్ చిత్రంలో నటిస్తున్నానని ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పారు. కాగా సైరన్ చిత్రంలో తండ్రి పాత్ర కోసం సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు రాజేష్ ఎం.దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నట్లు ఇది కూడా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..? మెగా ఫోన్ ఎప్పుడు పట్టనున్నారు అన్న ప్రశ్నకు ఆ ఆలోచన ఉందని అందుకు చిన్నచిన్న కథలను కూడా తయారు చేసుకున్నట్లు చెప్పారు. అందులో ఒక కథ గురించి చెప్పగా బాగుంది నువ్వు మంచి దర్శకుడు అవుతావు అని పేర్కొన్నారు. కాగా తాను దర్శకత్వం వహించే చిత్రంలో కార్తీ నటిస్తారని ఈ విషయాన్ని ఆయన కూడా చెప్పానని జయంరవి చెప్పారు. -
PS2 Movie Review: ‘పొన్నియన్ సెల్వన్-2’ మూవీ రివ్యూ
టైటిల్: పొన్నియన్ సెల్వన్-2 నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ దర్శకత్వం : మణిరత్నం సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ విడుదల తేది: ఏప్రిల్28, 2022 ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 పై ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుగు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?రివ్యూలో చూద్దాం. కథేంటంటే... చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్) చిన్న కుమారుడు అరుళ్‌మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) నౌకలో తన రాజ్యానికి తిరిగివెళ్తుండగా శత్రువుడు దాడి చేయడం.. పోరాటం చేస్తూ ఆయన సముద్రంలో పడిపోవడం.. ఒక ముసలావిడ సముద్రంలో దూకి అతన్ని కాపాడటం. ఆ ముసలావిడకు పళవూరు రాణి నందిని (ఐశ్వర్యరాయ్) పోలికలు ఉన్నట్లు చూపించి మొదటి భాగాన్ని ముగించాడు దర్శకుడు మణిరత్నం. (చదవండి: 'ఏజెంట్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?) అసలు ఆ ముసలావిడ ఎవరు? నందినికి ఆ ముసలావిడకి ఎలాంటి సంబంధం ఉంది? అరుళ్మోళికి ఆపద వచ్చినప్పుడల్లా ఆ ముసలావిడ ఎందుకు కాపాడుతుంది? చోళరాజ్యాన్ని నాశనం చేయాలని ప్రతీజ్ఞ పూనిన పాండ్యుల లక్ష్యం నెరవేరిందా? ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్)పై పగ పెంచుకున్న నందిని.. అతన్ని అంతం చేసేందుకు పన్నిన కుట్రలు ఫలించాయా? నందిని విషయంలో తప్పు చేశానని బాధపడుతున్న ఆదిత్య కరికాలుడు చివరకు ఏం చేశాడు? అసలు మందాకిని ఎవరు? ఆమెకు సుందర చోళుడుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు చోళ సామ్రాజ్యానికి రాజు ఎవరయ్యారు? అనేది తెలియాలంటే పొన్నియన్ సెల్వన్ 2 చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తొలి భాగంలో చోళ రాజ్య వ్యవస్థను.. సింహాసనం కోసం సొంతమనుషులే అంతర్గత కుట్రలు చేయడం.. చోళ రాజ్యాన్ని పతనం చేసేందుకు శత్రురాజ్యాలు వేచి చూడడం చూపించారు. ఇక రెండో భాగంలో ఆ కుట్రల వెనుక ఉన్న కారణాలు తెలుపుతూ.. కథను మరింత లోతుగా చూపించాడు. ఆదిత్య కరికాలుడు, నందినిల ప్రేమ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. నందినిని పెళ్లి చేసుకోకుండా ఎవరు అడ్డుపడ్డారనేది మొదట్లోనే చూపించారు. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర, ఎక్కడంటే?) ఆ తర్వాత అరుళ్‌మోళి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? అతను చనిపోయాడని భావించిన శుత్రువులు.. కరికాలుడిని, సుందర చోళుడిని చంపడానికి వేసిన కుట్రలు.. బౌద్దుల సమక్షంలో జరిగే నాటకీయ పరిణామాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెండాఫ్లో మందాకిని నేపథ్యం గురించి తెలిపే సన్నివేశాలు.. ఆదిత్య కరికాలుడు, నందిని మధ్య జరిగే సంఘర్షణలు ఆకట్టుకుంటాయి. నందిని పాత్రకి సంబంధించిన ట్విస్టులు బాగుంటాయి. రాజ్యాధికారం కోసం సొంతవాళ్లే చేసే కుట్రలు.. ప్రేమ, స్నేహం కోసం చేసే త్యాగాలు ఇందులో చూపించారు. అయితే ‘పొన్నియన్ సెల్వన్’ అనేది చోళ రాజులకు సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మణిరత్నం పీఎస్ 2ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో ఎక్కువ పాత్రలు ఉండడం.. అందులో ఒక్కో పాత్రకి రెండు,మూడు పేర్లు ఉండడం.. పైగా చరిత్రపై అందరికి పట్టుఉండకపోవడం ఈ సినిమాకు మైనస్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు చోళుల చరిత్రపై అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే పీఎస్1 టాలీవుడ్లో పెద్దగా ఆడలేదు. పీఎస్ 2 విషయంలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. పీఎస్ 1 చూసిన ప్రేక్షకులకు చోళ రాజ్య వ్యవస్థపై కాస్త అవగాహన వస్తుంది కాబట్టి.. రెండో భాగం నచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి భాగం చూసి వెళ్తేనే రెండో భాగం అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొదటి భాగంతో పోలిస్తే.. రెండో భాగంలో ఐశ్వర్యరాయ్ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. నందినిగా ఆమె నటన అందరిని ఆకట్టుకుంటుంది. విక్రమ్ పాత్రకు నిడివి తక్కువే అయినా.. అతను కనిపించే సన్నివేశాలన్నీ అందరికి గుర్తిండిపోతాయి. పొన్నియన్ సెల్వన్‌గా జయం రవి చక్కగా నటించాడు. కుందవైగా త్రిష తెరపై అందంగా కనిపించింది. కానీ ఆమె నిడివి కూడా చాలా తక్కువే. మొదటి భాగంలో కార్తి పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఇందులో అంత నిడివి ఉండదు కానీ..ఒకటి రెండు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్గా ఆర్.పార్తిబన్, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అంత బాగాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
త్రిష అందానికి కార్తీ ఫిదా..
-
ఐశ్వర్య రాయ్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుందో చుడండి..
-
రాజమౌళి ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు: మణిరత్నం
‘‘నేను ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. రాజమౌళికి థ్యాంక్స్. ఎందుకంటే ‘బాహుబలి’ రెండు భాగాలుగా రాకపోయిఉంటే ‘పొన్నియిన్ సెల్వన్’(పీఎస్)తెరకెక్కేది కాదు. ఈ విషయాన్ని రాజమౌళితో కూడా చెప్పాను.‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాలుగా తీసే దారిని తను చూపించాడు. చారిత్రాత్మక సినిమాలను తీసే ఆత్మవిశ్వాసాన్ని సినిమా ఇండస్ట్రీకి రాజమౌళి ఇచ్చా రు. భారదేశ చరిత్ర ఆధారంగా చాలామంది ఇప్పుడు సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ మణిరత్నం. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన ఈ చిత్రంలోని రెండో భాగం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ నెల 28న రిలీజ్ కానుంది. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడానికి కారణమైన సుభాస్కరన్, వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరంజీవి, తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తున్న ‘దిల్’రాజుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా గురువు మణిరత్నంతో మరో అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చినందుకు టీమ్‌కు శుభాకాంక్షలు’’ అన్నారు విక్రమ్. ‘‘ఒకేసారి రెండు విభాగాలు చిత్రీకరించి, తొలి భాగం రిలీజ్ చేసిన ఆరు నెలల తర్వాత రెండో భాగాన్ని రిలీజ్ చేస్తానన్న గుండె ధైర్యం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎవరూ రెండు విభాగాలను ఒకేసారి చిత్రీకరించలేదు. మణిరత్నంగారి ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అన్నారు ‘జయం’ రవి. ‘‘భారతదేశ చరిత్ర తెలియాలని మణిరత్నంగారు ఈ సినిమా తీశారు’’అన్నారు కార్తీ. ‘‘పొన్నియిన్ సెల్వన్’ మ్యాజికల్ వరల్డ్’’ అన్నారు ఐశ్వర్యారాయ్. ‘‘హైదరాబాద్ నాకు రెండో ఇల్లు’’ అన్నారు త్రిష. ‘‘పొన్నియిన్ సెల్వన్ పార్టు 2’లో అద్భుతం చూడబోతున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ కార్యక్రమంలో శోభిత, ఐశ్వర్యాలక్ష్మీ, ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ కుమరన్, లైకా డిప్యూటీ ౖచైర్మన్ ప్రేమ్ పాల్గొన్నారు. -
జయం రవికి జోడీగా కృతిశెట్టి?
తమిళసినిమా: నటి కృతి శెట్టి మరో లక్కీఛాన్స్ వరించిందని తాజా సమాచారం. తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా వున్న ఈ బ్యూటీకి ఇప్పటికే ది వారియర్ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినా కృతిశెట్టికి అక్కడ అవకాశాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో ఆమె నటిస్తోంది. తాజాగా నటుడు జయం రవికు జంటగా నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్ చిత్రం విజయంతో మంచి జోష్‌లో ఉన్న జయంరవికి ఆ తరువాత విడుదలైన అఖిలన్ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం సైరన్ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ఇరైవన్ అనే చిత్రం ఆయన చేతిలో ఉంది. కాగా తాజాగా మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనిని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా భువనేశ్వర్ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నారు. చిత్రం జూన్ నెలలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అదే విధంగా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఇందులో జయం రవికు జంటగా నటి కృతి శెట్టిని నటింపచేయడానికి యూనిట్ వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. కాగా దీనికి జీవీ అనే టైటిల్‌ను ఖరారు చేశారని తెలిసింది. -
పొన్నియిన్ సెల్వన్-2లోని ఫస్ట్ సాంగ్ విన్నారా?
ఆగనందే.. ‘ఆగనందే ఆగనందే.. మోవి నవ్వుతోందే.. మోవి నవ్వే.. మోవి నవ్వే.. మోము నవ్వుతోందే.. మోము నవ్వే.. మోము నవ్వే.. మాను నవ్వుతోందే’ అని పాడుతున్నారు యువరాణి కుందై. ప్రియుడు వల్లవరాయన్ వందియ దేవన్ కోసమే ఈ పాట. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితర భారీ తారాగణంతో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్2’లోని పాట ఇది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కుందవైగా త్రిష, వందియ దేవన్‌గా కార్తీ నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే ‘ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే..’ పాట పూర్తి లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా శక్తి శ్రీ గోపాలన్ పాడారు. ‘పొన్నియిన్‌సెల్వన్’కి సీక్వెల్‌గా రూపొందిన రెండో భాగం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 28న విడుదల కానుంది. -
Agilan Movie Review: జయం రవి అఖిలన్ సినిమా ఎలా ఉందంటే?
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాజు అరుళ్మొళిగా అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు జయం రవి తాజాగా అఖిలన్గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్క్రీన్ స్కిన్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఇది భూలోకం చిత్రం ఫేమ్ కల్యాణ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటి ప్రియాభవాని శంకర్ నాయకిగా నటించగా నటి తాన్యా రవిచంద్రన్ కీలక పాత్ర పోషించారు. నటుడు జయం రవి నటించిన 28వ చిత్రం ఇది. ఈ చిత్రానికి ది కింగ్ ఆఫ్ ది ఓషన్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఇది సముద్రతీరంలో మాఫియా నేపథ్యంలో సాగే కథా చిత్రం అని క్యాప్షన్ చూస్తేనే అర్థమైపోతుంది. కథ: దేశ ఆర్థిక లావాదేవీలను శాసించే వేదిక హార్బర్. అక్రమాలు, హత్యలు స్మగ్లింగ్ వంటి దుర్మార్గాలకు సాక్ష్యంగా నిలిచేది హార్బరే అని చెప్పే కథా చిత్రం అఖిలన్. అలాంటి నేపథ్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిందే ఈ సినిమా. ఒక కూలీగా పని చేసే అఖిలన్ ఓ మాఫియా ముఠా దుర్మార్గాలకు సహకరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తనే ఒక మాఫియా డాన్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తాడు. హార్బర్లో జరిగే అక్రమాలకు అన్నిటికీ తనే కారణంగా మారతాడు. అతనికి హార్బర్లో పనిచేసే పోలీస్ అధికారి ప్రియ భవాని శంకర్ సహకరిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా అతను ఎందుకు చేస్తున్నాడు? తర్వాత అతని జీవితం ఎటువైపు సాగింది? వంటి పలు సంఘటనలతో సాగే చిత్రం అఖిలన్. విశ్లేషణ ఈ చిత్రంలో జయంరవి తన నటనతో మెప్పించారు. ఇందులో జయం రవి తండ్రి పాత్ర కూడా ఉంటుంది. ఆయన కలను సాకారం చేయడం కోసమే అఖిలన్ పోరాడతాడు. అయితే దాన్ని నెరవేర్చగలిగాడా? లేదా? అసలు ఆయన తండ్రి కల ఏమిటి అన్న ఆసక్తికరమైన అంశాలతో పలు మలుపులతో అఖిలన్ చిత్రం సాగుతుంది. కథ పూర్తిగా హార్బర్‌లోనే సాగుతుంది. జయం రవిది నెగటివ్ షేడ్‌లో సాగే పాజిటివ్ పాత్ర అని చెప్పవచ్చు. దాన్ని ఆయన సమర్థవంతంగా పోషించారు. అఖిలన్ కమర్షియల్ అంశాలతో సాగే అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. -
గ్యాంగ్‌స్టర్‌గా నటుడు జయంరవి.. రిలీజ్ డేట్ వచ్చేసింది
కథల ఎంపిక విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తలు తీసుకునే నటుడిగా జయం రవికి పేరుంది. అందుకే ఆయన కెరీర్లో విజయాల శాతం ఎక్కువ. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చారిత్రక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్‌లో టైటిల్ పాత్రను పోషించి శెభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. స్కీన్ర్ సీన్ సంస్థకే వరుసగా మూడు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటి అఖిలన్ చిత్రం. ఇందులో ఆయనకు జంటగా నటి ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా నటి తాన్యారవిచంద్రన్ మరో నాయకిగా ఎంపికైంది. ఎన్.కల్యాణ్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఉత్తర చెన్నై నేపధ్యంలో సాగే ఇందులో జయంరవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇక శ్యామ్ సీఎస్.సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అఖిలన్ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ చిత్రం తరువాత జయంరవి నటుడు విక్రమ్, కార్తీ, విక్రమ్ ప్రభు, శరత్‌కుమార్, త్రిష, ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించిన పొన్నియిన్ సెల్వన్– 2 ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. ఇవి కాకుండా జయం రవి ఇరైవన్, సైరన్ వంటి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. వీటిలో నయనతారతో జత కడుతున్న ఇరైవన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా ఈయన నటించిన చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదలకు సిద్ధం అవుతుండడం విశేషం. -
'విక్రమ్' డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో జయంరవి
తమిళసినిమా: మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ నాలుగే ఛిత్రాలతో స్టార్ దర్శకుల పుట్టింట్లో చేరిన యువదర్శకుడు లోకేష్ కనకరాజ్. తాజాగా రెండోసారి విజయ్‌ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే సైలెంట్‌గా మొదలైంది. ఇందులో నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇతర ముఖ్య పాత్రల్లో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, దర్శకుడు గౌతమ్‌మీనన్, అర్జున్, దర్శకుడు మిష్కిన్ భారీ తారాగణం నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రారంభం దశలోనే లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రానికి స్కెచ్ వేసినట్లు తాజా సమాచారం. ఈయన తదుపరి హీరో జయంరవి అనే విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు కలిసిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయమై జయంరవి ఒక భేటీలో పేర్కొంటూ లోకేష్ కనకరాజ్ తనకు ఇటీవల ఒక కథ చెప్పారని, అది తనను విస్మయపరిందన్నారు. దీంతో వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుంది అనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఈయన సైరన్, ఇరైవన్, ఎం.రాజేష్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. ఇకపోతే ఈయన నటింన అఖిలన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'లవ్ టుడే'
తమిళసినిమా: ఇప్పుడు చిన్న చిత్రం, పెద్ద చిత్రం అనే తారతమ్యాలు చెరిగిపోతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ఆదరించిన సినీ ప్రియులు గత శుక్రవారం తెరపైకి వచ్చిన లోబడ్జెట్ చిత్రం లవ్ టుడేనూ ఆదరిస్తున్నారు. ఇక్కడ ఈ విజయాలకు కారణం కథ, కథనాలే. ఇంతకుముందు జయం రవి కథానాయకుడిగా కోమాలి అనే సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం లవ్ టుడే. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో ఈయనే కథానాయకుడు కావడం. సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, రవీనా రవి, ఇవేనా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఆసక్తికరమైన కథ కథనాలతో సాగే ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ప్రేమ, వినోదం ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కోల్పోతాయి ఎస్.అఘోరం నిర్మించారు. ఈతరం ఆతరం అన్న బేధం లేకుండా చిత్రాన్ని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. విమర్శకులు, సినీ ప్రముఖుల ప్రశంసలను చూరగొంటున్న ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే తమిళనాడులో మాత్రమే రూ.15 కోట్లు వసూలు చేసి పెద్ద విజయం వైపు దూసుకుపోతోంది. స్టార్ దర్శకులు, హీరోలకు దక్కని ఈ విజయం మంచి కంటెంట్‌తో రూపొందిన లవ్ టుడేకు దక్కడాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నాయి. -
2023లో జయం రవి, నయనతారల ఇరైవన్
పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో తన సక్సెస్ పయనాన్ని కొనసాగిస్తున్న నటుడు జయం రవి. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాలు చూస్తే జయం రవి కథానాయకుడిగా స్క్రీన్ సీన్ సంస్థ వరుసగా మూడు చిత్రాలను నిర్మించడం విశేషం. అందులో ఒకటి భూలోకం చిత్రం ఫేమ్ ఎన్ కళ్యాణ్ కృష్ణన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న అఖిలన్. ఇందులో జయం రవికి జంటగా నటి ప్రియభవానీ శంకర్, తాన్యా రవిచంద్రన్ నటిస్తున్నారు. హార్బర్ నేపథ్యంలో సాగే యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చి త్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వర లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సంస్థ నిర్మిస్తున్న రెండో చిత్రానికి రాజేష్ దర్శక త్వం వస్తున్నారు. ఇందులో జయం రవి సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నా రు. ఇది జయంరవి నటిస్తున్న 30వ చిత్రం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు నవ దర్శకుడు ఆంటోని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి సైరన్ అని టైటిల్ నిర్ణయించారు. దీన్ని హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత తన అత్తయ్య సుజాత విజయ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రంలో జయం రవి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఇకపోతే ఇంతకుముందు నటుడు జయం రవి నయనతార జంటగా నటించిన తనీ ఒరువన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సక్సెస్ఫుల్ జంట మరో చిత్రంలో నటించనున్నారు. దీనికి ఇరైవన్ అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని 2023లో ఇరైవన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. -
థియేటర్ వద్ద పొన్నియన్ సెల్వన్ తారల సందడి.. అభిమానుల కోలాహాలం
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ 'పొన్నియిన్ సెల్వన్-1'. కల్కి కృష్ణ మూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో ఇవాళ మొదటి భాగం విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు వచ్చిన నటీనటులు చైన్నైలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి మొదటి రోజు మొదటి షోను ఎంజాయ్ చేశారు. అభిమాన నటీనటులు థియేటర్లకు రావడంతో ఫ్యాన్స్ టపాసులు కాలుస్తూ హోరెత్తించారు. (చదవండి: పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘చియాన్’ విక్రమ్, ఐశ్వర్య రాయ్, ‘జయం’ రవి, త్రిష, కార్తి లాంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటించారు. మణిరత్నం దర్శకత్వం, భారీ తారగణంతో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. #ChiyaanVikram #PonniyinSelvan #FDFS #Aadithakarikalan pic.twitter.com/dtbiCPF2xw — Kavi Kumar (@KaviKum42539573) September 30, 2022 -
Ponniyin Selvan Review: పొన్నియన్ సెల్వన్ మూవీ రివ్యూ
టైటిల్: పొన్నియన్ సెల్వన్-1 నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ దర్శకత్వం : మణిరత్నం సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ విడుదల తేది: సెప్టెంబర్ 30, 2022 లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో మొదటి భాగం PS-1 నేడు(సెప్టెంబర్ 30) విడుదలైంది. నాలుగేళ్ల విరామం తర్వాత మణిరత్నం చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. పొన్నియన్ సెల్వన్ కథేంటంటే? పొన్నియన్ సెల్వన్ కథంతా పదో శతాబ్దంలో జరుగుతుంది. వేయి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ రాజుల గొప్పదనం గురించి చెబుతూ కథ మొదలవుతుంది. చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్)కి ఇద్దరు కుమారులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్) తంజావూరుకు దూరంగా ఉంటూ.. కనిపించిన రాజ్యానల్లా ఆక్రమిస్తూ వెళ్తుంటాడు. చిన్న కుమారుడు అరుళ్ మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) చోళ రాజ్యానికి రక్షకుడిగా ఉంటాడు. తండ్రి ఆజ్ఞతో శ్రీలంకలో ఉంటాడు. తన తర్వాత వారసుడిగా పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ను యువరాజుగా సుందర చోళుడు ప్రకటిస్తాడు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సామాంత రాజులను ఏకం చేస్తాడు కోశాధికారి పళవేట్టురాయర్(శరత్ కుమార్). సుందర చోళుడు అన్నయ్య కుమారుడు మధురాంతకుడు (రహమాన్) ను రాజును చేయాలనేది అతని కోరిక. రాజ్య ఆక్రమణ కోసం తెలిసినవాళ్లే కుట్ర చేస్తున్నారని గ్రహించి.. ఆ కుట్రను చేధించడానికి తన మిత్రుడు వల్లవరాయన్(కార్తి)ని తంజావురుకు పంపిస్తాడు ఆదిత్య కరికాలన్. కుట్ర విషయాన్ని వల్లవరాయన్ ఎలా కనిపెట్టాడు? శ్రీలంకలో ఉన్న అరుళ్‌మోళిని వల్లవరాయన్ ఎలా రక్షించాడు? సొంతవాళ్లు పన్నిన కుట్రకు యువరాణి కుందవై(త్రిష) ఎలా చెక్ పెట్టింది? పళవేట్టురాయల్ భార్య నందిని(ఐశ్యర్య రాయ్) ఉన్నంత వరకు తంజావూరుకు రానని ఆదిత్య కరికాలుడు ఎందుకు చెబుతున్నాడు? అసలు నందిని, ఆదిత్యకు మధ్య ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. రాజ్యాలు.. యుద్దం.. కుట్రలు అనగానే అందరికి గుర్తుకొచ్చే సినిమా ‘బాహుబలి’. రాజుల పాలన ఎలా ఉంటుంది? అధికారం కోసం ఎలాంటి కుట్రలు చేస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు రాజమౌళి. అయితే అది కల్పిత కథ కాబట్టి అందరికి అర్థమయ్యేలా, కావాల్సిన కమర్షియల్ అంశాలను జోడించి ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ చారిత్రాత్మక కథలకు ఆ వెసులుబాటు ఉండదు. కథలో మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. పొన్నియన్ సెల్వన్ విషయంలో అదే జరిగింది. మణిరత్నం చరిత్రకారులను మెప్పించాడు కానీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. కథలో విషయం ఉంది కానీ కన్ఫ్యూజన్స్ లేకుండా తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. స్లోనెరేషన్ సినిమాకు పెద్ద మైనస్. కథ జరిగే ప్రాంతాలు మారుతాయి కానీ.. కథనం మాత్ర కదినట్లే అనిపించదు. చాలా పాత్రలు.. పెద్ద పెద్ద నటులు కనిపిస్తారు కానీ.. ఏ ఒక్క పాత్ర కూడా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దలేదు. యాక్షన్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. ఏ పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ కావు. నవల ఆధారంగా ఈ స్క్రిప్ట్‌ను రాసుకోవడం వల్ల..ట్విస్టులు, వావ్ ఎలిమెంట్స్ ఏవి ఉండవు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్లైమాక్స్‌లో మాత్రం ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి పార్ట్-2పై ఆసక్తి పెంచారు. మొత్తంగా ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు ,అది కూడా చరిత్రపై అవగాహన ఉన్నవారికి ఎంతో కొంతో నచ్చుతుంది. కానీ తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కాస్త కష్టమే. ఎవరెలా నటించారంటే... ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాకు మెయిన్ పిల్లర్ లాంటి పాత్ర వల్లవరాయన్. ఈ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. వల్లవరాయన్ సమయస్ఫూర్తి కలవాడు, చమత్కారి కూడా. సినిమాలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ కార్తికే దక్కింది. ఆదిత్య కరికాలుడు పాత్రలో చియాన్ విక్రమ్ మెప్పించాడు. అయితే ఇతని పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. సినిమా ప్రారంభంలో ఒకసారి, మధ్యలో మరోసారి, ఇక క్లైమాక్స్‌లో ఇంకోసారి కనిపిస్తాడు. అరుళ్‌మొళి వర్మన్ అలియాస్ పొన్నియన్ సెల్వన్ పాత్రలో జయం రవి ఒదిగిపోయాడు.. నందిని పాత్రకు వందశాతం న్యాయం చేసింది ఐశ్యర్యరాయ్. తన అందం, అభినయంతో ఎలాంటి మగవాడినైనా తన వశం చేసుకోగల పాత్ర తనది. అందుకు తగ్గట్టే తెరపై చాలా అందంగా కనిపించింది. రాజకుమారి కుందవైగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంది. పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్గా ఆర్.పార్తిబన్, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతం అని చెప్పలేం కానీ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
అప్పుడు పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడ్డా!
‘‘నలభై రెండేళ్లుగా మీరు (ప్రేక్షకులు) నాపై చూపించిన ప్రేమని ‘పొన్నియిన్ సెల్వన్’పై చూపించండి. ఈ సినిమా ఓ పది శాతం షూటింగ్ చెన్నైలో జరిగితే మిగిలినదంతా రాజమండ్రి, హైదరాబాద్‌లో చేశాం.. కాబట్టి ఇది మీ (తెలుగు) సినిమా.. మీరు ఆదరించాలి’’ అని నటి సుహాసినీ మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ (‘పీయస్–1’). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘పీయస్–1’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పెళ్లికి ముందు మణిరత్నంగారు ఓ పెద్ద బ్యాగ్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అందులో ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఐదు భాగాలుగా ఉంది. చదివి ఒక్క లైన్లో కథ చెప్పమన్నారు. నేను ఐదు భాగాలను చదివి ఐదు లైన్లుగా రాసి ఇచ్చాను. ఇలాగేనా రాసేది? అన్నారాయన. అప్పుడు మా పెళ్లి ఆగిపోతుందేమో? అని భయపడ్డాను.. కానీ పెళ్లయింది. మా పెళ్లయిన 34 ఏళ్లకి ‘పొన్నియిన్ సెల్వన్’ తీశారాయన. దానికి ముఖ్య కారణమైన సుభాస్కరన్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ఐశ్వర్యా రాయ్ మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్ సెల్వన్’ టీమ్‌తో ఇక్కడ ఉండటం గర్వంగా ఉంది. ప్రతిభావంతులైన మంచి యూనిట్‌తో పని చేయడం గౌరవంగా ఉంది. నా తొలి సినిమా (‘ఇద్దరు’) మణిరత్నం సార్‌తో చేశాను. ఆయన కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ భాగం కావడం హ్యాపీ’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో ఒక హీరోని పెట్టుకుని సినిమా తీయా లంటే చుక్కలు కనిపిస్తున్నాయి.. అలాంటిది ఇంతమంది హీరోలు, హీరోయిన్లని పెట్టి మణిరత్నంగారు ‘పొన్నియిన్ సెల్వన్’ని రెండు భాగాలుగా తీయడం గ్రేట్. ఇప్పుడు సినిమాకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు.. బాగుంటే ఇండియా మొత్తం ఆదరిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కార్తికేయ 2’ చిత్రాల్లా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ కూడా ఇండియా మొత్తం అద్భుతం సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ఇండియాలో రెహమాన్‌గారు ఉన్నారని చెప్పుకునేందుకు భారతీయుడిగా గర్వపడతాం’’ అన్నారు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ– ‘‘38 ఏళ్ల క్రితం నా ప్రయాణం తెలుగులో ప్రారంభమైంది. రమేశ్ నాయుడు, చక్రవర్తి, రాజ్–కోటి, సత్యంగార్లు సంగీతానికి ఒక పునాది వేశారు. ఇన్నేళ్లుగా నా సంగీతాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాని అందరూ చూసి, ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘పొన్నియిన్ సెల్వన్ ’ లాంటి మంచి టీమ్‌తో పని చేయడం హ్యాపీ. చాన్స్ ఇచ్చిన మణిరత్నం సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు త్రిష. ‘‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో అందరూ హీరోలే, అందరూ హీరోయిన్లే. నా డ్రీమ్ డైరెక్టర్ మణిరత్నంగారు అంత అద్భుతంగా మా పాత్రలను తీర్చిదిద్దారు’’ అన్నారు విక్రమ్. ‘‘మణిరత్నంగారి నలభై ఏళ్ల కల ఈ సినిమా. ఇది ‘బాహుబలి’ సినిమాలా ఉంటుందా? అని అడుగుతున్నారు. ఒక ‘బాహుబలి’ని మనం చూశాం.. ఇంకో ‘బాహుబలి’ అవసరం లేదు. ఇండియాలో ఎన్నో కథలు ఉన్నాయి.. వాటిని మనం ప్రజలకు చెప్పాలి. ఇలాంటి ఒక గొప్ప సినిమాని మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు కార్తీ. ‘‘మా నాన్న ఎడిటర్ మోహన్‌గారు ‘హిట్లర్, హనుమాన్ జంక్షన్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ వంటి చిత్రాలు నిర్మించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ ఒక అద్భుతం’’ అన్నారు ‘జయం’ రవి. ఐశ్వర్యా లక్ష్మి, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ చిత్రంలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు: తమిళ స్టార్ హీరో
పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఘనత అంతా దర్శకుడు మణిరత్నంకు చెందుతుందని జయంరవి అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో మద్రాస్ పిక్చర్స్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్. జయం రవి టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, శరత్‌కుమార్, పార్తీపన్, ప్రకాÙరాజ్, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, పలువురు ప్రములు నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం, రవివర్మ ఛాయాగ్రహణంను అందించారు. రెండు భాగాలుగా పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం తొలి భాగం ఈ నెల 30వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా జయంరవి మంగళవారం ఉదయం చెన్నైలో పాత్రికేయులతో ముచ్చటించారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. సినిమాలో నటించాలని మణిరత్నం అడిగినప్పుడు తాను ఆ పాత్రకు న్యాయం చేయగలనా? అనే సందేహం కలిగిందని, ఆపై అంతకు మించి సంతోషం కలిగిందన్నారు. మంచి నటులను కూడా భిన్నంగా నటింపచేయగల దర్శకుడు మణిరత్నం అని అన్నారు. బేసిక్ ఎమోషన్ మైండ్‌లో ఉంచుకోమని, దానిని డైలాగ్‌లోనో, బాడీ లాంగ్వేజ్లోనో చూపించాల్సిన అవసరం లేదని, నటనలో ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయని సూచించారని వెల్లడించారు. పొన్నియిన్ సెల్వన్‌లో నటించడం వరం అన్నారు. చంద్రలేఖ తరువాత అంత స్టాండర్డ్‌తో రూపొందిన చిత్రం ఇదేనని తన భావన అన్నారు. కోలీవుడ్‌లో యుద్ధంతో కూడిన చిత్రాలు రావాలన్నది తన ఆశ అన్నారు. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర చేయడం ఛాలెంజ్‌గా అనిపించిందన్నారు. అయితే దర్శకుడు మణిరత్నం తనకు ఆరు నెలల ముందే గుర్రపు స్వారీ, యువరాజుకు తగ్గ బాడీకి తయారవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నారు. పొన్నియిన్ సెల్వన్ నవల రెండు భాగాలు చదివానన్నారు. ఆ లోపు ఈ చిత్ర స్క్రిప్ట్ వచ్చిందన్నారు. దాంతో ఆ నవలను చదవడం నిలిపేశానన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో రాజరాజచోళన్ అంటే శివాజీ గణేశన్ అని పేర్కొన్నారు. అందుకే తాను దాని జోలికి పోకుండా పొన్నియిన్ సెల్వన్ చిత్ర స్కి్రప్ట్‌ను ఫాలో అయి నటించాను. ఈ చిత్రం మణిరత్నం వల్లే సాధ్యమైందన్నారు. రెండు భాగాలను 150 రోజుల్లో పూర్తి చేయగలిగారన్నారు. చిత్రం అద్భుతంగా వచ్చిందని చెప్పారు. చదవండి: Fact Check: తిరుమల కొండపై నటి అర్చనా గౌతమ్ రచ్చ... అసలు నిజాలు ఇవే -
జయం రవితో ప్రియాంక మోహన్ రొమాన్స్!
సినిమా హీరోయిన్ల విషయంలో ప్రతిభ కంటే అదృష్టం బాగా పని చేస్తుంది. సక్సెస్ వెంటేనే అవకాశాలు వరిస్తాయి. ఇవన్నీ నటి ప్రియాంక అరుళ్ మోహన్‌కు కరెక్ట్‌గా వర్తిస్తాయి. అమ్మడి అందం ఓకే అయినా, ఒడ్డు పొడుగులో మార్కులు తక్కువే పడతాయి. అయితే లక్ మాత్రం అందుకోనంత వేగంగా పరుగెడుతోందని చెప్పవచ్చు. ఇటీవల అందాలారబోత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తోంది. (చదవండి: కోలీవుడ్‌లో సంచలనం.. డైరెక్టర్ లింగుస్వామికి జైలు శిక్ష) తెలుగులో నానితో గ్యాంగ్ లీడర్ చిత్రం తరువాత ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ శివకార్తీకేయన్‌తో జత కట్టిన తొలి చిత్రం డాక్టర్, రెండో చిత్రం డాన్ వరుసగా విజయాలు సాధించడంతో అమ్మడు లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. మధ్యలో సూర్యతో ఎదర్కుమ్ తుణిందవన్ చిత్రంలోనూ నటించింది. అలా చాలా తక్కువ సమయంలో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఏకంగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న జైలర్ చిత్రంలో నటించే ఛాన్స్‌ను కొట్టేసింది. అదే విధంగా నటుడు జయం రవితో రొమాన్స్ చేస్తోంది. ఎం.రాజేష్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటిస్తున్నారు. ఇది ఆయన 30వ చిత్రం. ఇందులో ప్రియాంక మోహన్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఊటీలో ప్రారంభం అయ్యి తొలి సెడ్యూల్ను పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ చెన్నైలో మొదలు కానుంది. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఇతి ఇతివృత్తంతో కూడిన ఇందులో నటుడు నట్టి, వీటీవీ గణేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
Ponniyin Selvan: రాజమౌళి వల్లే ధైర్యం వచ్చింది
‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడం గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగాన్ని ‘పీయస్–1’ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ చిత్రంలోని ‘చోళ చోళ..’ అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ, అది ఎందుకనేది చెప్పను. తర్వాత మీకే తెలుస్తుంది. రాజమౌళిగారి వల్లే ఇలాంటి (పొన్నియిన్ సెల్వన్) చిత్రాలు తీయగల మనే ధైర్యం వచ్చింది. రెండు భాగాలుగా ఇలాంటి సినిమాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. నా బిడ్డలాంటి ఈ చిత్రం తెలు గులో ఇక ‘దిల్’ రాజుగారిదే’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మణిరత్నంగారి ‘అమృత’ సినిమా వల్లే నిర్మాతగా మారి, 50 చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’ని రిలీజ్ చేసే చాన్స్ ఇచ్చిన మణిరత్నంగారికి థ్యాంక్స్’’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ– ‘‘మణి సార్‌తో గతంలో ‘రావణ్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’. మణిగారితో సినిమా అంటే కల నెరవేరడం వంటిది. మణిగారు, శంకర్‌గారితో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చని అనుకున్నాను.. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు’’ అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో దాదాపు 50 పాత్రలుంటాయి.. నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘అన్ని భాషల్లో నటించి, పాన్ ఇండియన్ నటుడు అవడం వేరు. కానీ దక్షిణాది నుంచి తన మేకింగ్ ఆఫ్ స్టైల్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ఏకైక వ్యక్తి మణిరత్నంగారు’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ‘‘కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను సినిమాగా తెరకెక్కించాలని ఎంజీఆర్, కమల్ వంటి వారెందరో ప్రయత్నించారు. కానీ మణిరత్నంగారి వల్లే సాధ్యం అయింది’’ అన్నారు నాజర్. సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘ఇది మీ డ్రీమ్ ప్రాజెక్టా? అంటే కాదు ఇష్టమైన చిత్రం అని మావారు (మణిరత్నం) అన్నారు. నేను ఆయన్ను ఇష్టపడ్డాను. ఆయన ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారు. అంటే మీరు (ప్రేక్షకులు) కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడాలి (నవ్వుతూ)’’ అన్నారు. -
పొన్నియిన్ సెల్వన్: చోళులు వచ్చేస్తున్నారు
మణిరత్నం సినిమా వస్తుందంటే చాలు సినీప్రియుల అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. వారి అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు తెరకెక్కిస్తుంటాడీ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన పొన్నియిన్ సెల్వన్ సినిమా చేస్తున్నాడు. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ రెండు విభాగాలుగా తెరకెక్కనుంది. తాజాగా శనివారం నాడు ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజైంది. చోళులు వస్తున్నారు అంటూ ఈ వీడియోలో రాసుకొచ్చారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం నిర్మించిన ఈ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. Look out! Brace yourself. Get ready for an adventure filled week! The Cholas are coming! #PS1 🗡 @LycaProductions #ManiRatnam pic.twitter.com/9Ovj3I8GXW — Madras Talkies (@MadrasTalkies_) July 2, 2022 చదవండి: అందుకే పెళ్లి చేసుకోలేదు.. నా పిల్లలు కారణం కాదు: స్టార్ హీరోయిన్ జనవరి టు జూన్.. ఫస్టాఫ్‌లో అదరగొట్టిన, అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలివే! -
'పొన్నియన్ సెల్వన్' రిలీజ్ డేట్ ప్రకటన.. సూపర్బ్‌గా ఐశ్వర్య రాయ్, త్రిష పోస్టర్స్
Mani Ratnam Ponniyin Selvan Movie Release Date Out With Posters: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్' చిత్రం. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. Wishing our Producer Allirajah Subaskaran a very happy birthday! The Golden Era comes to the big screens on Sept 30th! 🗡#PS1 #PS1FirstLooks @LycaProductions pic.twitter.com/60XRY8egM6 — Madras Talkies (@MadrasTalkies_) March 2, 2022 దీంతోపాటు ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తీ ఫస్ట్ లుక్‌లను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లలో ఐశ్వర్య రాయ్, త్రిష యువరాణుల్లాగా కనిపించగా విక్రమ్, జయం రవి యుద్ధ వీరుల్లాగా దర్శనమిచ్చారు. ఇక కార్తీ విభిన్నమైన లుక్‌లో అలరించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు ఆస్కార్ గ్రహిత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ ఏమేరకు సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. -
సీఎం స్టాలిన్‌ను కలిసిన తారలు: విరాళాల వెల్లువ
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అనేకమంది ప్రాణాలను బలిగొంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడడానికి రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటోంది. అయితే ప్రజలకు ఆర్థికసాయం చేయడానికి, కరోనా బాధితుల కోసం ఆక్సిజన్, వ్యాక్సిన్ వంటి వైద్య సదుపాయాలను సమకూర్చడానికి ఆర్థిక పరమైన అవసరాలు ఏర్పడడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ దాతలు కరోనా నివారణ నిధికి ఆర్థికసాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి చెక్కు అందిస్తున్న ఎడిటర్ మోహన్ కుటుంబం దీంతో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే శివకుమార్ కుటుంబం, అజిత్, సౌందర్య రజనీకాంత్ కుటుంబం తదితరులు విరాళాలు అందించారు. తాజాగా మరికొందరు సినీ దర్శక నటులు కరోనా నివారణ నిధికి విరాళాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నటుడు శివకార్తికేయన్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.25 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. అదేవిధంగా నిర్మాత, ఎడిటర్ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు మోహన్‌రాజ, నటుడు జయం రవి ముఖ్యమంత్రిని కలిసి రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు. దర్శకుడు వెట్రిమారన్ దర్శకుడు శంకర్ కరోనా నివారణకు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని ఆయన ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు పంపించారు. అదేవిధంగా దర్శకుడు వెట్రిమారన్ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.10 లక్షల విరాళాన్ని చెక్కు ద్వారా అందించారు. రజనీకాంత్, విజయ్, ధనుష్, శింబు తదితర ప్రముఖులు ఇంకా తమ విరాళాలను ప్రకటించలేదు. అజిత్ విరాళాన్ని ప్రకటించడంతో ఆయనకు పోటీదారులుగా భావించే విజయ్ ఇంకా విరాళాన్ని ప్రకటించలేదు. కాగా సినీ కార్మికులను ఆదుకునేందుకు నటుడు అజిత్ స్పందించి రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి వెల్లడించారు. నటుడు శివకార్తికేయన్ చదవండి: పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో.. సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు -
జయంరవి 29వ చిత్రానికి పచ్చ జెండా!
చెన్నై: కోలీవుడ్ నటుడు జయం రవి. ఈయన నటించిన భూమి చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కల్యాణ్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నారు. ఇప్పుడు మరో చిత్రానికి జయం రవిపచ్చ జెండా ఉపారన్నది తాజా సమాచారం. ఇది జయంరవి 29వ చిత్రం. ఈ చిత్రం ద్వారా ఆంథోని భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. దర్శకుడు మిత్రన్ మంచి స్నేహితుడు. జయం రవి కథానాయకుడిగా ‘భూమి’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన హోమ్ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ఇందులో లభించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతికవర్గం ఎంపీక జరుగుతోందని తెలిసింది. చదవండి: బీ-టౌన్లో కరోనా కష్టాలు.. టెన్షన్లో స్టార్ హీరోలు -
సింధూర..
‘జయం’ రవి, అరవింద్ స్వామి హీరోలుగా, హన్సిక హీరోయిన్గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘బోగన్’. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘సింధూర..’ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా తెలుగు ట్రైలర్‌కు విశేషమైన స్పందన రావడం మా టీమ్‌కి సంతోషంగా అనిపించింది. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ ట్యూన్ చేసిన ‘సింధూర..’ పాటను తెలుగులో సమీర భరధ్వాజ్ ఆలపించారు. భువనచంద్రగారు ఈ పాటకు లిరిక్స్ అందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
జూలై నుంచి షురూ?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో మణిరత్నం తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చారిత్మ్రాతక చిత్రం ఇది. తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కరోనా వల్ల అన్ని సినిమాల్లానే ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. అయితే జూలై నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం పాండిచ్చేరిలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. నెలరోజుల పాటు ఈ భారీ షెడ్యూల్ జరగనుందట. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ ఈ షెడ్యూల్లో పాల్గొంటారట. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్. -
పొన్నియిన్.. శోభితా ఇన్
చోళసామ్రాజ్యంలో రాణిగా స్థానం సంపాదించారు హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో ప్రధానతారాగణం. వీరితో పాటు తాజాగా శోభితా ధూళిపాళ్ల కూడా ఈ చిత్రంలో చోటు సంపాదించారు. ‘‘మణిరత్నంగారి దర్శకత్వంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు శోభిత. కూచిపూడి, భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యత, నైపుణ్యం ఉన్న ఓ రాణి పాత్రలో శోభిత నటించబోతున్నారని టాక్. నిజజీవితంలోనూ శోభితా మంచి క్లాసికల్ డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. -
స్వర్ణయుగం మొదట్లో..
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మదరాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. ‘స్వర్ణయుగం మొదట్లో..’ అంటూ ఈ సినిమా టైటిల్‌ను, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. మణిరత్నం చేసే అన్ని సినిమాలకు దాదాపు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుంటారు. ఈ చిత్రానికి కూడా ఆయనే స్వరకర్త. జయమోహన్ మాటల రచయిత. మణిరత్నం, కుమారవేల్ సంయుక్తంగా ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, కార్తీ, ‘జయం’రవి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. కార్తీ, ‘జయం’ రవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
ఆరు గంటలకు టేక్
ఉదయం మూడు గంటలకే మేకప్ చైర్లో కూర్చుని, ఆరు గంటలకల్లా షూట్‌కు సిద్ధంగా ఉంటున్నారట కార్తీ, ‘జయం’ రవి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని దర్శకుడు మణిరత్నం ఆర్డర్ ఇది. ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఆయన దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌ల్యాండ్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తీ, ‘జయం’ రవిలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సూర్యోదయం సన్నివేశాలను తీస్తున్నారట మణిరత్నం. ఇది చారిత్రాత్మక చిత్రం కావడంతో నటీనటులు గెటప్పులు భిన్నంగా ఉంటాయి. అందుకే కార్తీ, ‘జయం’ రవి ఉదయం మూడు గంటలకల్లా మేకప్ రూమ్‌కి ఎటెండ్ అయిపోతున్నారు. అలాగే సహజమైన లైటింగ్‌లో సన్నివేశాలను తీయాలని మణిరత్నం ప్లాన్ చేసుకున్నారట. అందుకని ఉదయం 6 గంటలకు ఫస్ట్ షాట్‌కి టేక్ చెబుతున్నారట. సూర్యాస్తమయం లోపు షూటింగ్ ప్యాకప్ చెబుతున్నారని సమాచారం. ఈ భారీ షెడ్యూల్ ఫిబ్రవరి వరకు థాయ్‌ల్యాండ్‌లోనే జరుగుతుందట. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత త్రిష, విక్రమ్‌లపై సన్నివేశాలను ప్లాన్ చేశారట. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. -
నాతో పెళ్లా..అయితే ట్రై చెయ్: హీరోయిన్
నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నావా. అయితే ప్రయత్నించు అని హీరోయిన్ కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరో గానీ, హీరోయిన్‌గానీ వరుసగా రెండు మూడు అపజయాలను చవిచూసినా ఆ తరువాత ఒక్క విజయం వస్తే గత అపజయాలన్నీ తుడిచి పెట్టుకుపోతాయి. నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుత పరిస్థితి ఇదే. ఇటీవల ఈ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. అలాంటి సమయంలో తమిళంలో జయంరవితో రొమాన్స్ చేసిన కోమాలి చిత్రం మంచి సక్సెస్ కావడంతో కాజల్‌అగర్వాల్ మానసికానందంతో మతాబులా వెలిగిపోతోంది. నిజానికి ఈ చిత్రంలో ఈ అమ్మడి పాత్ర పరిధి చాలా పరిమితమే. అది కాదిక్కడ ముఖ్యం సక్సెస్ వచ్చిందా? లేదా? అన్నదే కౌంటవుతుంది. ఆ సంతోషంతో నటి కాజల్‌అగర్వాల్ ఇటీవల తన ఫేస్బుక్లో అభిమానులను పలకరించి వారి ప్రశ్నలు బదులిచ్చింది. అలా పలువురు అభిమానుల ప్రశ్నలకు ఎంతో సహనంగా సమాధానాలను ఇచ్చింది. అయితే పురుషుల్లో పుణ్య పురుషులు వేరయా! అన్నట్లు, అభిమానుల్లో వీరాభిమానులు ఉంటారు కదా! అలా ఒక అభిమాని ‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నాను’ అన్నాడు. అంతే ఇంతకుముందు అందరి ప్రశ్నలకు టక్కు టక్కున బదులిచ్చిన కాజల్ ఈ అభిమాని వ్యాఖ్యలకు మాత్రం అవాక్కయ్యింది. వెంటనే బదులివ్వలేక మౌనం వహించింది. కొంత సేపు తరువాత అందుకు ప్రయత్నించండి. అయితే అది అంత సులభమైన విషయం కాదు అని పేర్కొంది. అందుకు తెగ సంబరపడిపోయిన ఆ అభిమాని వెంటనే ప్రయత్నిస్తూనే ఉన్నాను అని బదులిచ్చాడు. తనకు ఇదో వింత అనుభవం అని కాజల్ పేర్కొంది. కాగా ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదన్న విషయం తెలిసిందే. దీంతో అలాంటి అభిమానులు ఎందరు ఈ బ్యూటీపై తమ ప్రేమను వ్యక్తం చేస్తారో చూడాలి. ఇకపోతే కాజల్‌అగర్వాల్ ప్రస్తుతం కమలహాసన్‌కు జంటగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. త్వరలో సూర్యకు జంటగా నటించడానికి సిద్ధం అవుతోంది. అదేవిధంగా ఒక హిందీ చిత్రం ఈ అమ్మడి చేతిలో ఉంది. అలా నటిగా కాజల్‌అగర్వాల్ బిజీగా ఉందన్నమాట. -
కామెడీ కాస్తా కాంట్రవర్సీ!
‘జయం’ రవి నటించిన కొత్త చిత్రం ‘కోమలి’. ఈ సినిమాలో కామెడీ కోసం వేసిన జోక్ కాంట్రవర్సీ అయింది. రజనీ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ‘కోమలి’ సినిమాలో 16 ఏళ్లు కోమాలో ఉండి బయటకు వస్తారు ‘జయం’ రవి. అయితే తాను కోమాలో ఉన్న విషయాన్ని అతను గ్రహించాడు. దాంతో 16 ఏళ్లు కోమాలో ఉన్నావని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అతన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలోనే పక్కనే ఉన్న టీవీలో న్యూస్ ప్లే అవుతుంటుంది. ‘త్వరలోనే రాజకీయాల్లో అడుగుపెడతాను’ అని రజనీకాంత్ ప్రసంగిస్తుంటారు. దాంతో తానింకా 2003లోనే ఉన్నాను అని హీరో అనుకుంటాడు. ఇది ఈ చిత్రం టీజర్‌లోని సీన్. ఏళ్ల తరబడి రాజకీయాల్లోకి వస్తానని రజనీ ఊరిస్తూ వస్తున్న విషయాన్ని చెప్పేలా ఈ సీన్ ఉందని ఆయన అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ సీన్ తీసేయాలని రజనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల చేశారు. దాంతో చిత్రబృందం కట్ చేస్తున్నట్టు ప్రకటించారు. -
కాజల్ చిత్రానికి అన్ని వీడియో కట్స్ ఎందుకు ?
సినిమా: పాపం నటి కాజల్ అగర్వాల్‌కు మాత్రమే ఎందుకిలా జరుగుతోంది. 2017లో విజయ్‌తో నటించిన మెర్శల్ చిత్రం తరువాత కోలీవుడ్‌లో ఈ అమ్మడు నటించిన చిత్రమేదీ తెరపైకి రాలేదు. అలాగని తెలుగులో ఇటీవల నటించిన చిత్రమేదీ విజయం సాధించలేదు. అలాగని కాజల్‌అగర్వాల్‌కు అవకాశాలు లేకుండా పోలేదు. ముఖ్యంగా ప్రస్తుతం కోలీవుడ్‌నే ఈ బ్యూటీ నమ్ముకుంది. అందులో ఒకటి జయంరవితో డూయెట్స్ పాడిన కోమాలి చిత్రం. ఇది నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 15న తెరపైకి రానుంది. ఇక మరో లక్కీచాన్స్ విశ్వనటుడు కమలహాసన్ సరసన శంకర్ తెకెక్కించనున్న ఇండియన్–2 చిత్రం. ఇంకేంటి కాజల్ çఫుల్జోష్లోనే ఉందిగా? అని అంటారా? ఈ అమ్మడు నటించిన తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ప్యారిస్ ప్యారిస్. ఇది హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్. ఎందరో ప్రముఖ నటీమణులు నటించాలని ఆశ పడ్డ ఈ చిత్రంలోని కథానాయకి పాత్రను పోషించే అవకాశం నటి కాజల్‌అగర్వాల్‌కు దక్కింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇదే చిత్రం తెలుగులో నటి తమన్నా హీరోయిన్గా దటీజ్ మహాలక్ష్మి పేరుతో తెరకెక్కింది. ఇక కన్నడంలో పరూల్‌మాధవ్ హీరోయిన్గా బటర్‌ఫ్లై పేరుతోనూ, మలయాళంలో మంజిమామోహన్ హీరోయిన్గా జామ్జామ్ పేరుతోనూ రూపొందింది. మీడియంట్ ఫిలిం పతాకంపై మనుకుమార్ నాలుగు భాషల్లోనూ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. వచ్చిన చిక్కేంటంటే తెలుగు, కన్నడం, మలయాళం వెర్షన్లకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్లను ఇచ్చారు. కాజల్‌అగర్వాల్ నటించిన తమిళ వెర్షన్‌కే 25 వరకూ ఆడియో, వీడియో కట్స్‌ను ఇచ్చారు. ఒకే కథకు రీమేక్ అయిన ఈ నాలుగు చిత్రాల్లో మూడు చిత్రాలకు సెన్సార్ గ్రీన్ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే కాజల్‌అగర్వాల్ నటించిన తమిళ వెర్షన్ ప్యారిస్ ప్యారిస్ చిత్రానికి అన్ని కట్స్ ఇవ్వడంతో పాపం కాజల్ ఏం చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇదే అభిప్రాయానికి వచ్చిన ప్యారిస్ ప్యారిస్ చిత్ర నిర్మాత రివైజింగ్ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు మీడియాకు ఆదివారం సాయంత్రం వ్యక్తం చేశారు. మరి ఆ కమిటీ కాజల్ చిత్రం ప్యారిస్ ప్యారిస్ చిత్రాన్ని చిన్న చిన్న మార్పులను చూపించి వదిలేస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. -
కోమాలిలో కావాల్సినంత రొమాన్స్
తమిళసినిమా: కోమాలి చిత్రంలో కావాల్సినంత రొమాన్స్ ఉంటుందంటున్నారు ఆ చిత్ర కథానాయకుడు జయంరవి. జయం చిత్రంతో కథానాయకుడిగా సినీ రంగప్రవేశం చేసిన ఈయన ఆ చిత్రం పేరునే తన పేరుకు ముందు చేర్చుకుని తన విజయ పయనాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అలా 24 చిత్రాలు పూర్తి చేశారు. 24వ చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం కోమాలి. కాజల్‌అగర్వాల్, సంయుక్తహెగ్డేలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ పరిచయం అవుతున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరిగణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్హాప్ తమిళా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా కోమాలి చిత్ర కథానాయకుడు జయంరవితో సాక్షీ భేటి అయింది. ప్ర: కోమాలి చిత్రం కథ గురించి వివరించండి? జ: కోమలి చిత్రం నాకు చాలా ప్రత్యేకం. ఇది నాగరికత చెందుతున్న మనిషి జీవన విధానం గురించి ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుంది. సుమారు 20 ఏళ్ల క్రితం భవిష్యత్‌లో నీళ్లను బాటిల్లో విక్రయించే రోజు వస్తుందంటే ఎవరూ నమ్మేవారు కాదు. అలాంటి విషయాల గురించి మాట్లాడే ఒక యువకుడిని జోకర్‌గా చూసేవారు. ఆ యువకుడి ఇతి వృత్తంతో సాగే కథా చిత్రమే కోమలి. ఇది రాతి యుగం నుంచి కాలం ఎలా మారుతూ ఆధునిక యుగంగా రూపాంతం చెందిందన్న పలు విషయాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుంది. ప్ర: చిత్రంలో మీరు చాలా గెటప్‌లలో కనిపించనున్నట్లున్నారు? జ: అవును. ఇందులో చాలా గెటప్‌లలో కనిపిస్తాను. అందులో నాలుగు గెటప్‌లకు కథలో ప్రాధాన్యత ఉంటుంది. మిగిలినవి రాతి యుగం నుంచి మనిషి ఎలా రూపాంతం చెందాడన్నది చూపడానికి ఉపయోగించాం. నాలుగు గెటప్‌లలో విద్యార్థి దశలోని పాత్ర చిత్రంలో సుమారు 20 నిమిషాలు ఉంటుంది. ఆ పాత్ర కోసం మారడానికి చాలా కసరత్తులు చేయాల్సి వచ్చింది. ముందు విద్యార్థిగా వేరే నటుడితో నటింపజేద్దామని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే వేరే నటుడైతే సహజంగా ఉండదని నేనే విద్యార్థిగానూ నటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు చాలా బరువు తగ్గాల్సి వచ్చింది. ప్ర: ఇలా బరువు పెరగడం, తగ్గడం కష్టం అనిపించడం లేదా? జ: చాలా కష్టం. అయితే ఇప్పుడు ప్రేక్షకులు మామూలుగా లేరు. వారికి నచ్చకపోతే ఎలాంటి చిత్రాన్నైనా పక్కన పెట్టేస్తున్నారు. సో వారిని సంతృప్తి పరచడానికి మేము శ్రమించక తప్పదు. అంతే కాకుండా కొత్తదనాన్ని నేనూ కోరుకుంటాను. ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తాను. ఇదే మా నాన్న నాకు చెప్పారు. ప్ర: కోమాలి చిత్రంలో ప్రత్యేకతలేంటి? జ: చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్రంలో విద్యార్థి దశ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇక పలు గెటప్‌లు. వీటితో పాటు చెన్నై 2015లో ఎదుర్కొన్న వరద సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి సెట్ వేయడానికి 10 మందికి పైగా ప్రముఖ కళాదర్శకులను సంప్రదించి, నాటి వరదలను కళ్లకు కట్టినట్లు సెట్ వేసి సన్నివేశాలను రూపొందించాం. ప్ర: హీరోయిన్గా నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేయడానికి కారణం? జ: కొత్త కాంబినేషన్ బాగుంటుందనే. నిజం చెప్పాలంటే ఇంతకు ముందే మా కాంబినేషన్లో చిత్రం రావాల్సింది. అలా రెండు సార్లు అనివార్యకారణాల వల్ల అది సెట్ కాలేదు. ఈ చిత్రం కోసం కాజల్‌అగర్వాల్‌ను అడిగినప్పుడు నటిస్తానని చెప్పారు. నిజానికి ఇందులో ఆమె పాత్ర పరిది తక్కువగానే ఉంటుంది. కథ నచ్చడంతో మంచి కథా చిత్రంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నానని తను నటించడానికి అంగీకరించారు. ఇందులో మరో హీరోయిన్గా సంయుక్తాహెగ్డే నటించారు. ప్ర: ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి రొమాన్స్ సన్నివేశాలు బాగానే ఉంటాయని భావించవచ్చా? జ: కోమలి చిత్రంలో కావాల్సినంత రొమాన్స్ ఉంటుంది. మరో విషయం ఏమిటంటే సాధారణంగా చిత్రాల్లో ఒక సన్నివేశంలో సెంటిమెంట్, మరో సన్నివేశంలో రొమాన్స్, ఇంకో సన్నివేశంలో వినోదం ఉంటాయి, అయితే కోమాలి చిత్రంలో ప్రతి సన్నివేÔ¶ ంలోనూ రోమాన్స్, కామెడీ, సెంటిమెంట్ వంటి అంశాలు చోటు చేసుకుంటాయి. ఇదే ఈ చిత్రంలో హైలైట్. అందుకే నాకీ చిత్రం ప్రత్యేకం. ప్ర: మీ వారసుడు ఆరవ్‌ను టిక్ టిక్ టిక్ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయం చేశారు. ఆ తరువాత మరే చిత్రంలోనూ ఆరవ్ నటించలేదే? జ: నిజం చెప్పాలంటే ఆరవ్ ఆ చిత్రం తరువాత 25 చిత్రాల అవకాశాలు వచ్చాయి. చదువు పాడవుతుందని ఆ అవకాశాలను అంగీకరించలేదు. ఇప్పుడు ఆరవ్‌కు 9 ఏళ్లు. మరో 10 ఏళ్లలో హీరో అయిపోతాడు. ప్ర: ఆరవ్ హీరోగా పరిచయం అయ్యే చిత్రానికి మీరే దర్శకత్వం వహిస్తానని ఇంతకు ముందు అన్నారు. అదే జరుగుతుందా? జ: నేను దర్శకత్వం చేద్దాం అనుకున్నాను కానీ దర్శకుడు శక్తిశరవణన్ ఆరవ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వాలని నాతో ప్రామిస్ చేయించారు. ప్ర: సరే మీరు దర్శకత్వం వహించేదెప్పుడు? జ: అందుకు 3 కథలను సిద్ధం చేసుకున్నాను. అయితే దర్వకత్వం చేపట్టడానికి ఇంకా టైమ్ పడుతుంది. ప్ర: మీ సోదరుడు మోహన్‌రాజాతో తనీఒరువన్ 2 చేస్తానన్నారు. అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? జ: అన్నయ్య తనీఒరువన్ 2 చిత్ర కథను తయారు చేసే పనిలోనే ఉన్నారు. కథ దాదాపు పూర్తయింది. అయితే నేను ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో అన్నయ్యనే ఆ చిత్రాలు పూర్తి చేయ్యి ఆ తరువాత మనం కలిసి తనీఒరువన్ 2 చేద్దాం అని చెప్పారు. ప్ర: మీరు నటించిన హిట్ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యి సరైన ప్రమోషన్ లేక ప్రేక్షకులను రీచ్ అవ్వలేకపోతున్నాయి. కొన్ని చిత్రాలయితే ఛానళ్లకే పరిమితం అవుతున్నాయన్నది తెలుసా? జ: నిజమే. ఈ విషయం నా దృష్టికీ వచ్చింది. నేను నటించిన అడంగుమరు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటే తెలుగులో నా పాత్రను పోషించే నటుడు లేరని చెప్పారు. దీంతో ఆ చిత్రాన్ని అనువాదంగానే విడుదల చేయాలనుకుంటున్నాం. అయితే గత చిత్రాల మాదిరిగా కాకుండా బాగా ప్రమోట్ చేసే నిర్మాత దిల్‌రాజుకు ఆ బాధ్యతలను అప్పగించడానికి చర్చలు జరుగుతున్నాయి. ప్ర: చివరిగా ఒక ప్రశ్న. మీరు తెలుగులో నటించే అవకాశం ఉందా? జ: చెయ్యాలండీ. చాలా మంది అడుగుతున్నారు. కచ్చితంగా తెలుగులో చిత్రం చేస్తాను. -
రాణి నందిని
ఎందరో తమిళ దర్శకులు ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను స్క్రీన్ మీద చూపించాలని అనుకున్నారు. కానీ మణిరత్నం ఫైనల్‌గా ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, కీర్తీ సురేశ్, అమలాపాల్ నటించనున్నారని సమాచారం. మోహన్‌బాబుని కూడా ఓ కీలక పాత్రకు మణిరత్నం సంప్రదించారు. ఇక ఈ సినిమాలో చేస్తున్నాను అని ఐష్ స్పష్టం చేశారు. అయితే తన పాత్ర ఎలా ఉండబోతోందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. ఈ సినిమాలో ఐష్ నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తారని సమాచారం. చోళరాజ్యానికి చెందిన కోశాధికారి పెరియ పళువెట్టారియార్ భార్య నందిని పాత్రలో కనిపిస్తారట ఐష్. అధికార దాహంతో చోళ రాజ్యం కుప్పకూలిపోవడానికి భర్తను తప్పు దోవలో నడిపించారట నందిని. మరి నందినీగా ఐష్ నటిస్తే ఆమె భర్తగా నటించేది ఎవరు? అంటే.. ఆ పాత్రను మోహన్‌బాబు చేయనున్నారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
పాతిక... పదహారు!
నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి 16ఏళ్లు పూర్తి కావడం ఒకటి, కెరీర్లో 25వ చిత్రం ప్రారంభం కావడం మరొకటి... ఇలా రెండు సెలబ్రేషన్స్‌తో ఖుషీగా ఉన్నారు తమిళ నటుడు ‘జయం’ రవి. లక్ష్మణ్ దర్శకత్వంలో ‘జయం’ రవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తారు. చెన్నైలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో ‘జయం’ రవి రైతు పాత్రలో నటించనున్నారని తెలిసింది. ఇది ఆయనకు 25వ చిత్రం కావడం విశేషం. అలాగే 2003లో ‘జయం’ (తెలుగు ‘జయం’ చిత్రానికి తమిళ రీమేక్) సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రవి ఆ సినిమా హిట్‌తో ‘జయం’ రవిగా మారారు. ఆ సినిమా వచ్చి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన 25వ చిత్రం ప్రారంభోత్సవంలో కేక్ కట్ చేసి సందడి చేశారు ‘జయం’ రవి. -
గ్లామర్‌నే నమ్ముకుంటుందా?
జీవితంలో ఎంతవారికైనా ఎత్తుపల్లాలు తప్పవు. నటి కాజల్ అగర్వాల్ ఇందుకు అతీతం కాదు. నిజం చెప్పాలంటే ఈ ఉత్తరాది బ్యూటీ నట జీవితం కోలీవుడ్‌లో అపజయాలతోనే మొదలైంది. అయితే ఆ తరువాత పోరాడి గెలిచారు. అలా జయాపజయాలతో అగ్రనటి స్థాయికి ఎదిగారు. 2004లోనే బాలీవుడ్లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చారు. అలా నటిగా దశాబ్దంన్నరకు చేరుకున్న కాజల్‌అగర్వాల్ అర్ధ శతకం చిత్రాలను దాటేవారు. ఇటీవల కాజల్‌అగర్వాల్ వరుసగా అపజయాలను మూటకట్టుకుంటోంది. గాలి కూడా ఎదురీస్తోంది. ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుని నటించిన ప్యారిస్ ప్యారిస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలమే అయ్యింది. హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్ ఇది. అంతే కాదు కాజల్ నటించిన తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం కూడా ఇదే. సహ నటీమణులు చాలా మంది ఆశ పడ్డ ఈ చిత్రంలో నటించాలన్న అవకాశం తనను వరించడంతో కాజల్ అగర్వాల్ సంబరపడ్డారు. అయితే అవి చిత్ర విడుదలలో జాప్యంతో నీరు కారిపోతున్నాయి. ఇకపోతే ఇటీవల మరో బిగ్ ఆఫర్ కాజల్‌ను వరించినట్టే వరించి ఇంకా అది ఊగిసలాడటం కూడా ఈ అమ్మడిని నిరాశ పరస్తున్న విషయం. అదే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2లో నటించే అవకాశం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలు ఈ చిత్రానికి బ్రేక్ వేశాయి. కమలహాసన్ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల ఆ ఇండియన్–2 నిర్మాణం ముందుకు సాగలేదు. ఇలా వరుసగా ఒక్కొక్కటి వెనక్కుపోవడంతో కాజల్ అగర్వాల్ సినీ జీవితం మరోసారి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతం టాలీవుడ్లో ఒకటి, కోలీవుడ్‌లో ఒకటి అని కాజల్ చేతిలో రెండే రెండు చిత్రాలు ఉన్నాయి. వాటిలో జయంరవితో రొమాన్స్ చేస్తున్న కోమాలి చిత్రాన్నే కాజల్ అగర్వాల్ చాలా నమ్మకాలు పెట్టుకుందట. ఇక్కడ ఈ అమ్మడు సెంటిమెంట్‌పై ఆశలు పెట్టికుందని చెప్పవచ్చు. జయంరవికి హీరోయిన్ల లక్కీ హీరో అనే పేరుంది. ఆయనతో కాజల్‌అగర్వాల్ జతకట్టిన తొలి చిత్రం కోమాలి. ఈ అమ్మడు నమ్మకం పెట్టుకోవడానికి ఇదో కారణం. అయితే కోమాలి చిత్రం కథ జయంరవి చుట్టూనే తిరుగుతుందట. అయినా చిత్ర హిట్ అయితే హీరోయిన్గా అది తన ఖాతాలోనూ పడుతుందిగా. తనకు కావలసింది హిట్ అంతే అనే ఆలోచనలో కాజల్ ఉందట. ఇక మరో విషయం ఏమిటంటే అవకాశాలు సన్నిగిల్లడంతో ఈ బ్యూటీ గ్లామర్‌తో సొమ్ము చేసుకోవాలని భావించడమే కాకుండా అటుగా అడుగులు వేగంగా వేస్తోంది. తరచూ ఫొటో షూట్ చేయించుకుంటూ గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్ట్ర్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. అవి బాగానే ఈ అమ్మడిని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. మరి ఏ మాత్రం అవకాశాలను తెచ్చి పెడతాయో చూడాలి. -
ఎవరూ పిలవడం లేదు!
తననెవరూ పిలవడం లేదు అని అంటోంది నటి తాప్సీ. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ ఉత్తరాది బ్యూటీ ఒకప్పుడు ఐరెన్‌లెగ్ నటిగా ముద్రవేసుకున్నా, ప్రస్తుతం క్రేజీ నటిగా రాణిస్తున్నారు. అయితే తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాల కోసం పోరాడినా పెద్దగా సాధించలేకపోయారు. అలాంటిది బాలీవుడ్ ఈ అమ్మడిలోని టాలెంట్‌ను గుర్తించింది. అక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ సక్సెస్‌లు అందుకుంటున్నారు. టాలీవుడ్‌లోనూ ఆనందోబ్రహ్మ చిత్రంతో విజయాన్ని చవిచూసిన తాప్సీ తాజాగా తమిళం, తెలుగు భాషల్లో నటించిన గేమ్ఓవర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది. వైనాట్ ప్రొడక్షన్ పతాకంపై శశికాంత్ నిర్మించిన ఈ చిత్రానికి మాయ చిత్రం ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. రోన్ ఈత్తాన్ యోహాన్ సంగీతాన్ని అందించిన ఇందులో నటి వినోదిని, రమ్య, కాంచన నటరాజన్, అనిల్ కురువిల్లా ముఖ్య పాత్రల్లో నటించారు. గేమ్ఓవర్ చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి తాప్సీ మాట్లాడుతూ గేమ్ఓవర్ తన కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు. ఈ మూవీలో తాను వీడియో గేమ్ డిజైనర్‌గా నటించానని, ఒక ప్రమాదంలో కాలు విరగడంతో వీల్ చైర్లోనే కూర్చుని గేమ్ డిజైన్ చేస్తానని చెప్పారు. అలాంటి సమయంలో ఆ ఇంట్లో మరో ఆపద ఎదురవుతుందని, దాని నుంచి తాను గేమ్‌తో ఎలా బయట పడ్డానన్నది గేమ్ ఓవర్ చిత్రం అని తెలిపారు. తమిళంలో తాను నటించి చాలా కాలమైంది, నిజం చెప్పాలంటే ఇక్కడ తననెవరూ నటించడానికి పిలవడం లేదన్నారు. పింక్ చిత్ర రీమేక్‌లో నటించమని తనను ఎవరూ అడగలేదని, ఒకవేళ అడిగితే కచ్చితంగా నటించేదానిన్ననారు. ప్రస్తుతం నటుడు జయంరవికి జంటగా నటించే చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, దీని గురించి చిత్ర నిర్మాతల నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు. తన నటిగా పెంచి పోషించిన తమిళ సినిమాను ఎప్పటికీ మరచిపోనని తెలిపారు. కాగా ఈ అమ్మడికి హిందీలోనూ మార్కెట్ ఉండడంతో గేమ్ఓవర్ చిత్రాన్ని అక్కడ అనువాదం చేసి విడుదల చేయనున్నట్లు నిర్మాత శశికాంత్ తెలిపారు. గేమ్ఓవర్ చిత్రం హాలీవుడ్ చిత్రాల తరహాలో చాలా వేగంగా థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆయన తెలిపారు. -
మీకు వయసు పెరగదా?
మీకసలు వయసు పెరగదా?.. నటి జెనీలియా నటుడు జయంరవిని చూసి వేసిన ప్రశ్న ఇది. వీరిద్దరి వ్యవహారం ఏమిటని అనుకుంటున్నారా? జయరవి, జెనీలియా జంటగా సంతోష్ సుబ్రమణియమ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న జెనీలియా 2012లో పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. వరుస విజయాలతో తన గ్రాఫ్‌ను పెంచుకుపోతున్న జయం రవి తాజాగా కోమాలి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి కాజల్‌అగర్వాల్ కథానాయకి. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కోమాలి. కాగా ఇందులో నటుడు జయంరవి 9 గెటప్ల్లో కనిసించనున్నారట. వీటిలో చిత్ర ఫస్ట్‌లుక్ పేరుతో ఒక్కో గెటప్‌ను ఒక్కో ప్రముఖ వ్యక్తితో విడుదల చేస్తున్నారు చిత్ర వర్గాలు. కాగా తాజాగా సోమవారం జయంరవి 9వ గెటప్‌ను ఆయన సోదరుడు, దర్శకుడు మోహన్‌రాజా విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఈ గెటప్ కోసం జయంరవి సుమారు 20 కిలోల బరువు తగ్గారు. ఈ గెటప్‌ను చేసిన దర్శకుడు మోహన్‌రాజా రవిని తొలి చిత్రం జయంలో చూసినట్లుగా ఉందని ప్రశంసించారు. అంతే కాదు జయంరవి విద్యార్థి గెటప్‌ను చూసి నటి కుష్బూ, దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్, కార్తీక్‌తంగవేల్ శుభాకాంక్షలు తెలిపారు. నటి జెనీలియా జయంరవి ఫొటోను చూసి తన ట్విట్టర్లో పేర్కొంటూ మీకు వయసే పెరగదా? అని ప్రశ్నించారు. కోమాలి చిత్రంలో మీ గెటప్ చూసి ఆశ్యర్యపోయాను. శుభాభినందనలు అని జెనీలియా పేర్కొంది. నవ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహిస్తున్న కోమాలి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో కాజల్‌అగర్వాల్‌తో పాటు నటి సంయుక్తాహెగ్డే మరో హీరోయిన్గా నటిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్హాప్ తమిళా సంగీతాన్ని అందిస్తున్నారు. కోమాలి చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. What is this @actor_jayamravi ???? You are not aging at alll... You Look like a teenager all over again.. Good Luck https://t.co/aEUfly5LvE — Genelia Deshmukh (@geneliad) 26 May 2019 -
చలో చెన్నై
నిధీ అగర్వాల్ నెక్ట్స్ కొన్ని రోజులు చెన్నైని చుట్టొచ్చే ప్లాన్‌లో ఉన్నారు. పర్సనల్ ట్రిప్ కోసం కాదు ప్రొఫెషనల్ ట్రిప్పే. తమిళ ఇండస్ట్రీ ఈ బెంగళూరు బ్యూటీకి స్వాగతం పలికింది. అందుకే నెక్ట్స్ కొన్ని రోజులు చెన్నైలో మకాం వేయబోతున్నారు. బాలీవుడ్లో ‘మున్నా మైఖేల్’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు ని«ధి. ఆ తర్వాత ‘సవ్యసాచి, మిస్టర్ మజ్ను’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ప్రస్తుతం రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నారు. లేటెస్ట్గా ‘జయం’ రవి 25వ చిత్రంలో హీరోయిన్గా నిధీ అగర్వాల్ ఎంపిక అయ్యారు. తమిళంలో నిధీకి ఇదే తొలి సినిమా. లక్ష్మణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
యాక్టర్ కాదు డైరెక్టర్
ఇన్ని రోజులూ దర్శకులు యాక్షన్ చెప్పగానే యాక్షన్ చేసిన ‘జయం’ రవి త్వరలోనే స్టార్ట్ కెమెరా, యాక్షన్ అనడానికి రెడీ అయ్యారు. త్వరలోనే దర్శకుడిగా మారతానని రవి ప్రకటించారు. ప్రస్తుతం యాక్టర్‌గా ఫుల్ బిజీబిజీగా ఉంటూ మంచి సక్సెస్‌లు అందుకుంటున్నారు ‘జయం’ రవి. హీరోగా 25 సినిమాలు చేసిన తర్వాత డైరెక్టర్ చైర్లో కూర్చోడానికి సిద్ధమయ్యారు. అయితే తన డైరెక్షన్లో తాను యాక్ట్ చేయరట. కమెడియన్ యోగిబాబును మెయిన్ లీడ్‌గా తీసుకొని ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ప్రస్తుతం యాక్టర్‌గా ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక డైరెక్టర్‌గా తన తొలి సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. -
కొత్త కోణం
ఇన్ని సంవత్సరాలుగా ఐశ్వర్యా రాయ్‌ను రకరకాల పాత్రల్లో చూశాం. అందం, అభినయం బ్యాలెన్స్ చేస్తూ గుర్తుండిపోయే రోల్స్ చేశారామె. అయినా నటిగా ఆమె దాహం తీరలేదు. లేటెస్ట్గా ఐష్ తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకురానున్నారని తెలిసింది. ఆమె నెగటివ్ రోల్లో కనిపించనున్నారట. తమిళ ఫేమస్ నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్, శింబు, జయం రవి, కార్తీ, నయనతార, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. ఇందులో ఐశ్వర్యా రాయ్ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అధికార దాహం కలిగిన రాణి పాత్రలో ఐష్ నటించనున్నారట. చోళుల సామ్రాజ్యం చుట్టూ ఈ కథ సాగనుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సూపర్ బ్యాలెన్స్
సౌత్‌లో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్లో జోరుమీదున్నారు. సినిమా వెంట సినిమాను జెట్ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నారామె. ఇటీవల ‘సాండ్ కీ అంఖే’ అనే సినిమాను పూర్తి చేశారు. బాలీవుడ్లో తాప్సీ బిజీగా ఉన్నా సౌత్‌ను నెగ్లెట్ చేయడం లేదు. సౌత్‌లో 2017లో ‘ఆనందో బ్రహ్మ’, 2018 ‘నీవెవరో’ సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది ‘గేమ్ ఓవర్’ అనే బైలింగ్వల్ (తెలుగు, తమిళం) సినిమాను రిలీజ్‌కు రెడీ చేశారు. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను దర్శకుడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్లో రిలీజ్ చేయనున్నారు. మరి.. ఈ ఏడాది తాప్సీ నటించబోయే సౌత్ సినిమా ఏంటి? అనేగా మీ డౌట్. ఆమె ఓ తమిళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్. ‘జయం’ రవి హీరోగా అహ్మద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కథ పరంగా ఇద్దరు హీరోయిన్స్‌కు చోటుందట. ఒక హీరోయిన్ పాత్ర కోసం తాప్సీని సంప్రదించి, అహ్మద్ కథ వినిపించడంతో ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇలా సౌత్, నార్త్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ కెరీర్‌ను సూపర్ బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్తున్నారు తాప్సీ. -
బంపర్ ఆఫర్
అవునా.. అమలాపాల్ బంపర్ ఆఫర్ కొట్టేశారా? అని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మరి.. మణిలాంటి దర్శకుడి సినిమాలో అంటే రత్నంలాంటి అవకాశమే కదా. యస్.. మీరు ఊహిస్తున్నది నిజమే. మణిరత్నం తీయబోతున్న భారీ మల్టీస్టారర్‌లో అమలా పాల్ నటించనున్నారట. మణిరత్నం సినిమాల్లో ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ ఎవరి పాత్రకు ఉండాల్సిన ప్రాముఖ్యత వాళ్లకు ఉంటుంది. గత ఏడాది అరవింద్‌సామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతికలతో ‘చెక్క›చివంద వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) తీశారు. లేటెస్ట్గా ఆయన తమిళ ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, కీర్తీ సురేశ్, నయనతార నటించనున్నారని సమాచారం. ఈ భారీ మల్టీస్టారర్‌లో ఓ కీలక పాత్ర కోసం అమలా పాల్ అయితే బావుంటుందని చిత్రబృందం భావించిందట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతోందట. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తొలుత లైకా ప్రొడక్షన్స్ నిర్మించాలి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను రిలయన్స్ సంస్థ నిర్మించనుందని తెలిసింది. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
ఆనందం తొమ్మిదింతలు!
సినిమాలో ఒకటీ, రెండు గెటప్స్‌లో కనిపిస్తేనే ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. అదే తొమ్మిది గెటప్స్‌లో తమ హీరో కనిపిస్తే ఆనందం తొమ్మిదింతలైనట్టే. ఇప్పుడు అలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ‘జయం’ రవి. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ‘జయం’ రవి నటిస్తున్న చిత్రం ‘కోమలి’. ఇందులో కాజల్ అగర్వాల్, సంయుక్తా హెగ్డే కథానాయికలు. ఈ సినిమాలో ‘జయం’ రవి దాదాపు 9 గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ విషయం గురించి దర్శకుడు ప్రదీప్ మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండే కామెడీ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నాం. ‘జయం’ రవిగారు పోషించే తొమ్మిది పాత్రల్లో ముఖ్యంగా 1990ల్లో గెటప్ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు. -
వ్యయసాయం చేస్తా
కెరీర్లో తన 25వ చిత్రం కోసం వ్యవసాయం చేస్తానంటున్నారు తమిళ నటుడు ‘జయం’ రవి. అవును.. ఆయన 25వ చిత్రం ఖరారు అయ్యింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తారు. ఇదివరకు ‘జయం’ రవి హీరోగా రోమియో జూలియట్ (2014), బోగన్ (2017) చిత్రాలను లక్ష్మణ్ తెరకెక్కించారు. తాజా సినిమాలో ‘జయం’ రవి రైతుగా నటించబోతున్నారు. ‘‘తన 25వ చిత్రానికి నన్ను దర్శకునిగా ఎంచుకున్నందుకు రవికి థ్యాంక్స్. వ్యవసాయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. ఓ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈ విషయాన్ని త్వరలో చెబుతాం’’ అన్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 15న స్టార్ట్ కానుంది. -
ఆరు సినిమాలతో బిజీ
సాధారణంగా హీరోయినే ఏక కాలంలో అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తుంటారు. అలాంటిది ఒక స్టార్ హీరో అరడజనుకు పైగా చిత్రాలకు ఒప్పందం చేసుకోవడం అనేది అరుదైన విషయమే అవుతుంది. అదీ ఆచితూచి చిత్రాలను ఎంపిక చేసుకునే నటుడు జయంరవి ఒకేసారి అరడజను చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈయన అడంగుమరు చిత్రం తరువాత తాజాగా కోమాలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జంటగా నటి కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరో నాయకిగా సంయుక్తా హెగ్డే నటిస్తోంది. ఇది సమ్మర్ తరువాత తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల జయం రవి ఒకేసారి మూడు చిత్రాలు చేయడానికి స్క్రీన్ సీన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో ఒప్పుందం కుదుర్చుకున్నారు. ఇదీ అరుదైన విషయమే అవుతుంది. వాటిలో ఒక చిత్రానికి ఎండ్రెండ్రుం పున్నగై, మనిదన్ చిత్రాల ఫేమ్ అహ్మద్ దర్శకత్వం వహించనున్నారు. మణిరత్నం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించడానికి సై అన్నారు. ఇవి కాక తన సోదరుడు మోహన్‌రాజా దర్శకత్వంలో తనీఒరువన్–2 చిత్రం చేయాల్సి ఉంది. ఇకపోతే మరో ప్రముఖ దర్శకుడు రాజీవ్ మీనన్ దర్శకత్వంలో నటించానికి జయంరవి ఓకే చెప్పినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు కండుకొండేన్ కండుకొండేన్ తరువాత ఈ దర్శకుడు ఇటీవల జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా సర్వం తాళ మయం చిత్రాన్ని తెరకెక్కించారు. తదుపరి జయంరవితో చేసే చిత్ర స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. -
ఇన్నుమ్ ఇరుక్కు!
ఏ ఇండస్ట్రీలో అయినా ప్రతి ఏడాది కొన్ని సీక్వెల్స్ వెండితెరపైకి వస్తూనే ఉంటాయి. కోలీవుడ్‌లో గత ఏడాది రజనీకాంత్ ‘2.0’, కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’, ధనుష్ ‘మారి 2’, విశాల్ ‘పందెంకోడి 2’ చిత్రాలతో పాటు ‘కలకలప్పు 2’, ‘గోలీ సోడా 2’, ‘తమిళ్ పడమ్ 2’ చిత్రాలు సీక్వెల్స్‌గా వచ్చి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశాయి. ‘ఇన్నుమ్ ఇరుక్కు’ (ఇంకా ఉంది) అంటూ తమిళంలో ఈ ఏడాది కూడా కొన్ని సీక్వెల్స్ వెండితెరపై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో వాంగ పాక్కలామ్.. అదేనండీ.. రండి చూద్దాం. లోకనాయకుడు కమల్‌హాసన్ సీక్వెల్స్‌పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది ‘విశ్వరూపం 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్ పనుల్లో ఉన్నారిప్పుడు. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. సేమ్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ ‘ఇండియన్ 2’ సినిమాలో కాజల్ అగర్వాల్ కథా నాయికగా నటిస్తున్నారు. అలాగే 1992లో భరతన్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘దేవర్‌మగన్’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కమల్‌హాసనే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా సీక్వెల్స్‌పై ఫుల్ కాన్సట్రేట్ చేశారు కమల్. యువహీరో ‘జయం’ రవి కూడా ఓ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్‌చరణ్ చేసిన హిట్ మూవీ ‘ధృవ(2016)’ తమిళంలో ‘జయం’ రవి హీరోగా నటించిన ‘తని ఒరువన్’ (2015)కు రీమేక్ అని తెలిసిందే. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘తని ఒరువన్’ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. సేమ్ మోహన్‌రాజా దర్శకత్వంలోనే ‘జయం’ రవి హీరోగా నటిస్తున్నారు. మొదటిపార్ట్ కన్నా మరింత మెరుగ్గా సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడతామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఇక తమన్నా, ప్రభుదేవా, సోనూ సూద్ ముఖ్య తారలుగా ఏఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ (తెలుగులో ‘అభినేత్రి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ చిత్రం రూపొందుతోంది. ఏఎల్. విజయ్ దర్శకత్వంలోనే తమన్నా, ప్రభుదేవా ముఖ్యతారలుగా నటిస్తున్నారు. నందితా శ్వేత, కోవై సరళ ముఖ్యపాత్రలు చేస్తున్నారీ సీక్వెల్లో. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలిసింది. తెలుగులో ‘అభినేత్రి 2’ పేరుతో విడుదల కావొచ్చు. మరోవైపు ఓ మల్టీస్టారర్ సీక్వెల్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇది ఇప్పటి చిత్రానికి సీక్వెల్ కాదు. దురై దర్శకత్వంలో కమల్‌హాసన్, శ్రీప్రియ నటించిన నీయా (1979) చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ వస్తోంది. మల్టీస్టారర్ మూవీగా జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్‌లక్ష్మీ, క్యాథరీన్లతో ఈ చిత్రం రూపొందింది. ఆల్రెడీ ఫస్ట్‌లుక్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ‘నాగకన్య’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నాలుగేళ్ల క్రితం హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చతురంగ వేటై్ట’. ఈ సినిమా ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో తెలుగులో ఈ ఏడాది విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటించారు. ఇప్పుడు త్రిష, అరవింద్ స్వామి హీరోహీరోయిన్లుగా ‘చతురంగ వేటై్ట 2’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రముఖ కమెడియన్ వడివేలు నటించిన ‘ఇమ్సై అరసన్ 23 ఆమ్ పులికేశి’ (తెలుగులో ‘హింసించే రాజు 23వ పులకేశి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇమ్సై అరసన్ 24 ఆమ్ పులికేశి’ చిత్రాన్ని మొదలుపెట్టారు. సీక్వెల్లో కూడా వడివేలునే తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి ఆ స్థానంలో యోగిబాబు నటిస్తారని టాక్. మరి.. హింసించే రాజు ఎవరో త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలే కాకుండా కొన్ని చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కొన్ని హిట్ సినిమాలకు సీక్వెల్స్‌ను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నారట కొంతమంది కోలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘తుపాకీ’ (2012) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మురుగదాస్ ఈ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఫస్ట్ పార్ట్‌లో విజయ్ నటించగా, సీక్వెల్లో మాత్రం అజిత్ హీరోగా నటిస్తారట. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘పుదుపేటై్ట’ (2006). ఈ సినిమా సీక్వెల్ ఆలోచన ఉన్నట్లు ఓ అభిమాని ప్రశ్నకు ధనుష్ సమాధానంగా చెప్పారు ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో. విశాల్,ధనుష్ అభివృద్ధి చెందిన నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఇరంబు దురై’ (2018). (తెలుగులో ‘అభిమన్యుడు’). పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు హింట్స్ ఇస్తున్నారు విశాల్. 2017లో వచ్చిన హారర్ మూవీ ‘గృహం’ సిద్ధార్థ్‌కు మంచి హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట. అలాగే నయనతార కలెక్టర్‌గా నటించిన ‘అరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’), సూర్య కెరీర్‌కు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చిన ‘కాక్క కాక్క’ (తెలుగులో ‘ఘర్షణ’) సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయని కోలీవుడ్‌లో కొత్తగా కథనాలు వస్తున్నాయి. ‘గోల్మాల్, రేస్, ధూమ్, క్రిష్’ చిత్రాల సీక్వెల్స్ ఫ్రాంచైజ్‌లుగా మారాయి బాలీవుడ్లో. ఈ ట్రెండ్ మెల్లిగా సౌత్‌కి వస్తున్నట్లు అర్థం అవుతోంది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో ఇప్పటికే ‘సింగం’ (తెలుగులో ‘యముడు’) సిరీస్‌లో మూడు సినిమాలు వచ్చాయి. మరో రెండేళ్లలోపు ‘సింగం 4’ అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సిరీస్ ఇలాంటిదే. ‘ముని’ పేరుతో మొదలైన ఈ హారర్ సిరీస్‌లో ఫోర్త్ పార్ట్‌గా ‘కాంచన 3’ ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాఘవ లారెన్స్ రాఘవ లారెన్స్‌తో పాటు, వేదిక, ఓవియా నటించారు. విశాల్ కెరీర్‌కు మాస్ ఇమేజ్ను తీసుకువచ్చిన చిత్రం ‘పందెం కోడి (2005)’. ఈ సినిమా సీక్వెల్ ‘పందెంకోడి 2’ గతేడాది విడుదల అయ్యింది. ‘పందెంకోడి 3’ సినిమా 2020లో సెట్స్‌పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు విశాల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఓ సిరీస్‌లా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట టీమ్. భవిష్యత్‌లో ఈ సిరీస్‌ల ట్రెండ్ మరింత ముందుకు వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. -
అడంగుమరుతో అత్తగారికి స్వాగతం
అడంగు మరు చిత్రంతో వెండి తెరకు నిర్మాతగా అత్తగారికి స్వాగతం పలుకుతున్నట్లు నటుడు జయంరవి పేర్కొన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం అడంగుమరు. రాశీఖన్నా నాయకిగా నటించిన ఈ చిత్రం ద్వారా కార్తీక్ తంగవేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చితాన్ని హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై సుజాతా విజయకుమార్ నిర్మించారు. ఇంతకు ముందు బుల్లితెరకు పలు టీవీ.సీరియళ్లను నిర్మించిన ఈమె తొలిసారిగా చిత్ర నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం అడంగుమరు. సుజాత విజయ్‌కుమార్ నటుడు జయం రవికి స్వయానా అత్త అన్నది గమనార్హం. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 21వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న చిత్ర కథానాయకి రాశీఖన్నా మాట్లాడుతూ జయంరవికి జంటగా నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన చాలా స్వీట్ పర్సన్ అని, సహ నటుడిగా ఈ చిత్రంలో చాలా సహకరించారని చెప్పింది. నిజం చెప్పాలంటే జయంరవి నుంచి తాను చాలా నేర్చుకున్నానని అంది. నటిగా అడంగుమరు చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. తన పాత్ర చాలా డిఫెరెంట్‌గా ఉంటుందని చెప్పింది. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన దర్శక నిర్మాతలకు, నటుడు జయం రవికి కృతజ్ఞతలు అని చెప్పుకుంటున్నానని అంది. కథానాయకుడు జయంరవి మాట్లాడుతూ దర్శకుడు కార్తీక్తంగవేల్ను తన అత్త సుజాత జయకుమార్ తన వద్దకు పంపి కథ చెప్పమనడంతో సరేనన్నానని, అయితే కార్తీక్‌తంగవేల్ చూడగానే అరే నువ్వా అని అన్నానన్నారు. కారణం తన తాను నటించిన ఇదయ తిరుడన్ చిత్రం ద్వారా సహాయ దర్శకుడిగా పరిచయమైన వ్యక్తి అని చెప్పారు. తన అత్త సుజాత విజయకుమార్ విన్న తొలి కథనే ఎలా ఒకే చేశారనే అనుమానంతోనే తానూ కథను విన్నానని చెప్పారు. అయితే దర్శకుడు కార్తీక్‌తంగవేల్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందన్నారు. అయితే కాస్త వయిలెన్స్ ఉండడంతో దానికి తేనె పూసినట్లు మార్చి రూపొందించినట్లు తెలిపారు. అడంగుమరు చిత్రం ద్వారా తన అత్తగార్ని వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇందులో ఈ తరానికి అవసరమైన మంచి సందేశం ఉంటుందని చెప్పారని జయంరవి అన్నారు. -
అంతకంటే గర్వంగా భావించే విషయం ఏముంటుంది?
సమాజానికి మంచి చేయడానికి రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదని తమిళ హీరో జయంరవి వ్యాఖ్యానించారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన ఇటీవల టిక్ టిక్ టిక్ చిత్రంతో అలరించారు. తాజాగా అడంగమరు చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధం అయ్యారు. ఇది జయంరవి మామ సొంతంగా నిర్మిస్తున్న చిత్రం కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీక్ తంగవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా నాయకిగా నటించింది. ఈ నెల 21న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు జయంరవితో సాక్షి చిట్‌చాట్. అడంగమరు ఏ తరహా చిత్రంగా ఉంటుంది? ఇది విభిన్నంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుంది. చిత్రంలో మీ పాత్ర గురించి? ఇందులో మరోసారి పోలీస్ అధికారిగా కనిపించనున్నాను. ఇందులో సమాజానికి మంచి చేయాలనే ఒక సిన్సియర్ సీఐగా నటించాను. ఇది పూర్తి కమర్శియల్ కథా చిత్రం అంటున్నారు. మరి దీని ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు? ఇప్పుడు దేశంలో జరుగుతున్న దారుణాల గురించి చూపిస్తున్నాం. అలాంటి సంఘటనలను ఎలా అరికట్టాలనే అంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించాం. నిజజీవితంలో అలాంటి సంఘటనలను అరికట్టడం సాధ్యమంటారా? ప్రయత్నిస్తే అసాధ్యం అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. అప్పుడే దారుణాలను అరికట్టగలం. అందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు రాజకీయాల్లోకి వచ్చే అలోచన ఉందా? అసలు లేదు. అయినా మంచి చేయడానికి రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదు. రజనీకాంత్, కమలహాసన్ వంటి వారు రాజకీయాల్లోకి వస్తున్నారుగా? అని మీరు అడగవచ్చు. వారు రాజకీయాల ద్వారానే ప్రజలకు మంచి చేయవచ్చునని భావిస్తున్నారేమో. నేను చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయం. అడంగమరు చిత్రంలో హీరోయిన్ రాశీఖన్నా పాత్ర గురించి? ఆమెది చాలా మంచి పాత్ర. ఇంటీరియర్ డిజైనర్‌గా నటించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి డాక్యుమెంటరీని ఇటీవల ఒక చానల్లో ప్రసారమైంది. అందులో జయలలిత నాకు నచ్చిన చిత్రం దీపావళి అని, ఈతరం యువ నటుల్లో జయంరవి అంటే ఇష్టం అని పేర్కొన్నారు. దీనిపై మీ స్పందన? అంతకంటే గర్వంగా భావించే విషయం ఏముంటుంది? చాలా సంతోషం. జయలలితను ఎప్పుడైనా స్వయంగా కలిశారా? ఒకసారి కుటుంబసభ్యులతో కలిసి జయలలిత ఇంటికి వెళ్లాను. నాకు అప్పుడు చిన్న వయసు. మేడమ్ మీ ఇల్లు చాలా బాగుంది అని అనేశాను. అందుకామె థ్యాంక్స్ అని అన్నారు. ఆ తరువాత సంతోష్ సుబ్రమణియం చిత్ర విజయోత్సవ వేడుకలో జయలలిత చేతుల మీదగా జ్ఞాపికను అందుకున్న క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను. జయలలిత బయోపిక్ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో నటించే అవకాశం మీకు వస్తే ఎంజీఆర్‌గా నటిస్తారా? అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. మీ అబ్బాయి ఆరవ్ టిక్ టిక్ టిక్ చిత్రంలో బాల నటుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నాడు. తదుపరి మరే చిత్రంలోనూ నటించలేదే? నిజం చెబుతున్నా. టిక్ టిక్ టిక్ చిత్రం తరువాత ఆరవ్‌కు 25 చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే తన వయసు 9 ఏళ్లే. ఇప్పటి నుంచే నటిస్తూ పోతే చదువుకు అంతరాయం కలుగుతుంది.అందుకే 18,19 ఏళ్ల వరకూ పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాం. ఆ తరువాత ఆరవ్ ఇష్టపడితే నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. -
ఒక స్టార్ ఫిక్స్?
తమిళంలో ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వమ్’. ఈ నవలకు ఎప్పటినుంచో దృశ్యరూపం ఇవ్వాలనుకుంటున్నారు దర్శకుడు మణి రత్నం. ఇప్పుడు దానికి ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం ఈ నవలను సినిమాగా రూపొందించే ప్లాన్‌లో ఉన్నారు మణి. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. విజయ్, విక్రమ్, శింబు, ‘జయం’ రవిలను ముఖ్య తారలుగా నటింపజేయాలనే ప్లాన్‌లో మణి ఉన్నారని కోలీవుడ్ టాక్. తాజా సమాచారం ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్‌కు విక్రమ్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఆల్రెడీ మణిరత్నం దర్శకత్వంలో ‘రావణ్’ చిత్రంలో యాక్ట్ చేశారు విక్రమ్. వచ్చే ఏడాది స్టార్ట్ కానున్న ‘పొన్నియిన్ సెల్వమ్’ ప్రాజెక్ట్‌కి మిగతా హీరోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా చూడాలి. -
స్కూల్ స్టూడెంట్‌గా...
సినిమా సినిమాకు డిషరెంట్ జానర్స్తో ప్రయోగాలు చేస్తుంటారు తమిళ నటుడు ‘జయం’ రవి. తాజాగా మరో ప్రయోగానికి రెడీ అయ్యారట. ప్రదీప్ రంగనాథన్ అనే నూతన దర్శకుడితో తన కొత్త సినిమా స్టార్ట్ చేశారు ‘జయం’ రవి. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. సంయుక్తా హెగ్డే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో స్కూల్ యువకుడిగా కనిపిస్తారట ‘జయం’ రవి. దాని కోసం బరువు తగ్గుతున్నారట. ఈ పాత్ర కోసం సుమారు 20 కిలోల పైనే తగ్గుతారట. ఈ నెలాఖరులో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే బరువు పరంగా ‘జయం’ రవి తన టార్గెట్‌ని దాదాపు చేరుకున్నారట. -
జయంతో నిశ్చయమేనా!
రీసెంట్ టైమ్స్‌లో తెలుగు, తమిళ్‌ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు కాజల్ అగర్వాల్. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రెండు చిత్రాలు చేస్తున్నారామె. అలాగే బాలీవుడ్ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పుడు తమిళంలోనే ‘జయం’ రవితో కాజల్ జోడీ కట్టనున్నారట. ఈ జోడీ ‘జయం’ రవి హీరోగా నటించిన ‘బోగన్’ సినిమాకే కుదరాల్సింది. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ‘జయం’ రవి హీరోగా రూపొందనున్న ‘తని ఒరువన్’ (తెలుగులో ‘ధృవ’) సీక్వెల్‌కి కాజల్‌ని తీసుకున్నారని టాక్. అయితే సాయేషా పేరు కూడా వినిపిస్తోంది. మరి.. ‘జయం’ రవితో కథానాయికగా ఎవరు నిశ్చయమయ్యారు? అనేది వేచి చూడాల్సిందే. -
ధృవకు సీక్వెల్.. ఇద్దరితో జోడీ కడుతున్న హీరో!
సాక్షి, తమిళ సినిమా: కోలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 2.ఓ (రోబో-2), సామీ స్క్వేర్, సండైకోళీ 2 (పందెం కోడి-2) వంటి చిత్రాలు నిర్మాణంలో ఉండగా త్వరలో కమలహాసన్ హీరోగా ఇండియన్ 2, ధనుష్ హీరోగా మారి 2 తదితర చిత్రాలు తెరకెక్కడానికి రెడీ అవుతున్నాయి. ఈ వరుసలో తాజాగా తనీఒరువన్ 2 (తెలుగులో ధృవ) చేరుతోంది. జయంరవి కథానాయకుడిగా ఆయన సోదరుడు మోహన్‌రాజా దర్వకత్వంలో తెరకెక్కిన ‘తనీఒరువన్’ 2015లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో జయం రవికి నయనతార జోడీ కట్టగా.. మోడ్రన్ విలన్‌గా అరవిందస్వామి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అప్పటివరకూ రీమేక్ చిత్రాల దర్శకుడన్న ముద్ర మోస్తున్న మోహన్‌రాజా తనీఒరువన్తో దానిని బ్రేక్ చేశారు. ఈ సంచలన చిత్రానికిప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తనీఒరువన్ చిత్రానికి ప్రధాన మూలస్తంభాలు నలుగురు అని చెప్పవచ్చు. వారు హీరో జయంరవి, విలన్ అరవిందస్వామి, హీరోయిన్ నయనతార, దర్శకుడు మోహన్‌రాజా. ఈ నలుగురిలో ముగ్గురు తనీఒరవన్ సీక్వెల్లోనూ కనిపింపచనున్నారు. సీక్వెల్లోనూ నయనతార మరోసారి జయంరవితో రొమాన్స్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. బిజీ షెడ్యూల్లోనూ మళ్లీ జయంరవికి నయన్ ఓకే చెప్పడం విశేషమే. తొలి పార్టులో జయంరవి పోలీస్ అధికారిగా, నయనతార ఫోరెన్సిక్ నిపుణురాలుగానూ నటించగా.. రెండో పార్టులోనూ వీరు అదే పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అదనంగా సీక్వెల్లో మరో బ్యూటీ సాయోషా సైగల్ కూడా చేరనుందట. జయంరవికి జోడీగా ‘వనమగన్’ చిత్రంతో ఈ అమ్మడు కోలీవుడ్‌కు దిగుమతి అయిన తెలిసిందే. ఇప్పుడు తనీఒరువన్ సీక్వెల్లో మరోసారి ఆయనతో జోడీ కట్టబోతోంది. ఇప్పటికే సూర్యకు జంటగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న సాయేషాసైగల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తనీఒరువన్లో విలన్‌గా అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సీక్వెల్లో ఆయన పాత్ర ఎవరు పోషిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హీరోకు దీటైన విలన్‌గా అరవింద్ స్వామి అద్భుతమైన అభినయం కనబర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనీఒరువన్- 2లో హీరో, విలన్ పాత్రలను ద్విపాత్రాభినయంతో జయంరవి పోషించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. -
కాజల్‌కు లక్కీచాన్స్
తమిళసినిమా: దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటీమణుల్లో కాజల్‌అగర్వాల్ ఒకరని చెప్పకతప్పదు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోలతో నటించిన ఈ బ్యూటీ ముఖ్యంగా తమిళంలో విజయ్, అజిత్, విశాల్, ధనుష్, కార్తీ వంటి స్టార్స్‌తో రొమాన్స్ చేసింది. అంతేకాదు బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేసింది. అయితే ఆక్కడ ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. తిరిగి దక్షిణాదిపైనే దృష్టి సారించింది. కోలీవుడ్‌లో వివేకం, మెర్శల్ వంటి చిత్రాలతో సక్సెస్ అందుకుంది. అయినా కారణాలేమైనా ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే హిందీ చిత్రం క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కితున్న ప్యారిస్ ప్యారిస్ చిత్రం మినహా మరే చిత్రం కాజల్ అగర్వాల్ చేతిలో లేదు. అదే విధంగా తెలుగు, కన్నడ భాషలో ఒక్కో చిత్రం చేస్తోంది. దీంతో కాజల్ జోరు తగ్గిందనే ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్‌కు కోలీవుడ్‌లో ఒక లక్కీచాన్స్ వరించిందన్నది తాజా సమాచారం. ఇక్కడ ఈ అమ్మడు చాలామంది స్టార్స్‌తో జత కట్టినా, హీరోయిన్లకు లక్కీ హీరోగా పెరొందిన జయంరవితో మాత్రం ఇంత వరకూ రొమాన్స్ చేయలేదు. అయితే ఆ అవకాశం ఇన్నాళ్లకు కాజల్ అగర్వాల్ తలుపు తట్టింది. జయంరవి టిక్ టిక్ టిక్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ప్రస్తుతం అడంగ మను చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగేసే జయంరవి తాజాగా మరో కొత్త చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీనికి ఒక కొత్త దర్శకుడు పరిచయం కానున్నట్లు సమాచారం. ఇందులో జయంరవికి జంటగా నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు తాజా న్యూస్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా జయంరవి సరసన నటించిన హీరోయిన్లందరూ ఆ తరువాత బిజీ అయిపోతుంటారు. కాజల్ అగర్వాల్ కూడా కోలీవుడ్‌లో మరో రౌండ్ కొడుతుందేమో చూడాలి. -
సూపర్ హిట్‌కి సీక్వెల్
ఆగస్ట్ 28.. ‘జయం’ రవి, అతని సోదరుడు మోహన్ రాజా జీవితంలో మరచిపోలేని రోజు. బ్లాక్ బస్టర్ మూవీ ‘తని ఒరువన్’ తెరకు వచ్చిన రోజు. ‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై మంగళవారంతో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సీక్వెల్ అనౌన్స్ చేశారు మోహన్ రాజా. ‘‘నా లైఫ్‌లో ‘తని ఒరువన్’ ఓ ఆశీర్వాదం. మూడేళ్లయినా ఇప్పటికీ ఆ సినిమా గురించి ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకులు అంతగా ఇష్టపడి చూసిన సినిమాకు సీక్వెల్ తీయాలని ఉంది. ఫస్ట్ పార్ట్‌లో హీరోగా నటించిన నా తమ్ముడు ‘జయం’ రవి సెకండ్ పార్ట్‌లోనూ నటిస్తాడు. ‘తని ఒరువన్’ కంటే ‘తని ఒరువన్ 2’ ఇంకా బాగుండేలా తీయడానికి ట్రై చేస్తాను’’ అని మోహన్‌రాజా పేర్కొన్నారు. కాగా ‘తని ఒరువన్’ తెలుగులో రామ్‌చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. -
‘ధృవ’ మాతృకకు సీక్వెల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ధృవ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ధృవ తమిళనాట ఘనవిజయం సాధించిన తనీఒరువన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్రయూనిట్. అరవింద్ స్వామి, నయనతార ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతున్నారు. సీక్వెల్‌ను కూడా మోహన్ రాజా దర్శకత్వలోనే తెరకెక్కనుందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. -
అవకాశాలు లేకపోతే దుబాయ్ వెళ్లిపోతాను..
తమిళసినిమా: నటి నివేదా పేతురాజ్ బిజీ కథానాయకిగా మారిపోయింది. మదురైలో పుట్టి, దుబాయ్‌లో పెరిగిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో హీరోయిన్ అయ్యింది. తొలి చిత్రం ఒరునాళ్ కూత్తుతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న నివేదాకు ఆ తరువాత అవకాశం రావడానికి కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. అవకాశాలు లేకపోతే దుబాయ్ వెళ్లిపోతాను గానీ, వాటి కోసం ఎవరినీ అడగనని తెగేసి చెప్పిన నివేదా పేతురాజ్‌కు ఆ అవసరం రాలేదు. అంతే ఆ తరువాత ఉదయనిధికి జంటగా నటించిన పొదువాగ ఎన్ మనసు తంగం ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయినా సక్సెస్ఫుల్ నటుడు జయంరవికి జంటగా నటించే భారీ అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. అంతే లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. మధ్యలో మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తాజాగా విజయ్‌ఆంటోని సరసన తిమిరు పుడిచ్చవన్, ప్రభుదేవాతో పొన్ మాణిక్యవేల్ చిత్రాలతో పాటు తెలుగులో బ్రోచేవారెవరురా చిత్రంలోనూ నటించేస్తోంది. తాజాగా మరో లక్కీచాన్స్‌ను కొట్టేసింది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. మైనా, కుంకీ, తొడరి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రభుసాల్మన్ తాజాగా కుంకీ–2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కుంకీ చిత్రంలో విక్కమ్‌ప్రభుతో పాటు నటి లక్ష్మీమీనన్‌కు సినీ లైఫ్‌ను ఇచ్చిన ప్రభుసాల్మన్ ఇప్పుడు కుంకీ–2లో నవ నటుడు మదిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయనకు జంటగా నటి అతిథిమీనన్ నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా నటి నివేదాపేతురాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అమ్మడు రెండో నాయకిగా నటిస్తోందా లేక అతిథిమీనన్‌ను తొలగించి నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. కుంకీ–2 చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే థాయిల్యాండ్‌లోని ఏనుగులు నివసించే దట్టమైన అడవుల్లో జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం నివేదా పేతురాజ్ ఏకంగా 70 రోజులు కాల్షీట్స్ కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బెన్ ఇండియా అనే బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. -
పుత్రోత్సాహంలో జయంరవి
తమిళసినిమా: మనిషి ఆనందాన్ని వెతుక్కుంటున్న రోజులివి. సినీరంగంలో కూడా సంతోషం గగనంగా మారింది. విజయం వరించడమే కష్టంగా మారింది. అలాంటిది ప్రముఖ యువ నటుడు జయంరవి డబుల్ హ్యాపీలో ఖుషీ అయిపోతున్నారు. ఒకటి ఆయన నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడడం, మరొకటి పుత్రోత్సాహం. శక్తిసౌందర్‌రాజన్ దర్శకత్వంలో నెమిచంద్ జపక్ నిర్మించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. డీ.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆయనకు 100వ చిత్రం కావడం మరో విశేషం. ఈ చిత్రం ద్వారా జయంరవి కొడుకు ఆరవ్‌రవి బాలనటుడిగా పరిచయం అయ్యాడు. చిత్రంలోనూ జయంరవికి కొడుకుగానే నటించాడు. భారతీయ సినీ చరిత్రలోనే తొలి అంతరిక్ష ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రంగా నమోదైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను శుక్రవారం చిత్ర యూనిట్ చెన్నైలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జయంరవి మాట్లాడుతూ టిక్ టిక్ టిక్ చిత్ర విజయానికి ముఖ్య కారణం ప్రేక్షకులేనన్నారు. అందుకే వారికి హ్యాట్సాప్ చెబుతున్నానన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సాధారణ విషయం కాదని అలాంటిది సమర్థవంతంగా తెరకెక్కించిన దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ ఈ విజయానికి కారణంగా పేర్కొన్నారు. యూనిట్ సభ్యులందరూ పూర్తి ఎఫర్ట్ పెట్టి చేసిన చిత్రం టిక్ టిక్ టిక్ అని అన్నారు. ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. కారణం ఇందులో తన కొడుకు ఆరవ్ రవి తొలిసారిగా నటించాడని అన్నారు. చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య ప్రేమను ఆవిష్కరించే కురుంబా అనే పాటను తాను ఇప్పుటికి రెండు వేల సార్లు విన్నానని తెలిపారు. శుక్రవారం ఆరవ్‌రవి పుట్టిన రోజు అని, ఈ ఆనందంతో పాటు, టిక్ టిక్ టిక్ సక్సెస్ వేడుకను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని జయంరవి పేర్కొన్నారు. కార్యక్రమంలో జయం రవి తండ్రి ఎడిటర్ మోహన్, సోదరుడు, దర్శకుడు మోహన్‌రాజా, చిత్ర దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్, డీ.ఇమాన్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ముందుగా ఆరవ్‌రవి పుట్టిన రోజును పురష్కరించుకుని ఆ బాలనటుడితో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. -
‘సంఘమిత్ర’ మొదలవుతోంది..!
బాహుబలి సక్సెస్ తరువాత తమిళ చిత్ర వర్గాలు అదే స్థాయిలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు సుందర్.సి సంఘమిత్ర పేరుతో భారీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశారు. ముందుగా టాప్ స్టార్స్‌తో సినిమా రూపొందించాలని ప్రయత్నించిన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో జయం రవి, ఆర్య కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. టైటిల్ రోల్‌కు శృతి హాసన్‌ను ఎపింక చేసి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో గ్రాండ్‌గా పోస్టర్స్ రిలీజ్ చేశారు. కానీ కొద్ది రోజులకే శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీంతో సంఘమిత్ర ఆగిపోయినట్టే భావించారు. కానీ తాజాగా సంఘమిత్ర చిత్రయూనిట్ షూటింగ్ ప్రారభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. లోఫర్ ఫేం దిశా పటాని టైటిల్ రోల్లో సినిమాను తెరకెక్కించేందుకు సుందర్.సి రెడీ అవుతున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
జూన్ 22... ఓ మంచి జ్ఞాపకం
‘‘నేను చిన్నప్పుడు హైదరాబాద్‌లోనే పెరిగాను. ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చినంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు డబుల్ హ్యాపీగా ఉన్నాను. కారణం చిత్రవిజయంతో ఇక్కడి రావటమే. మా నాన్నగారు ఎడిటర్ మోహన్ ఎంత బాగా పబ్లిసిటీ చేస్తారో చదలవాడ లక్ష్మణ్‌గారు అంతే పబ్లిసిటీ చేస్తారు. అందుకే భవిష్యత్‌లో ఈ బ్యానర్‌తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను. ‘టిక్ టిక్ టిక్’ చాలా మంచి ప్రయత్నం. రిజల్ట్ కొంచెం తేడాగా వచ్చినా భవిష్యత్‌లో ఇలాంటి సినిమాలకు తగిన ప్రోత్సాహం ఉండదని కొందరు అన్నారు. కానీ రిజల్ట్ బాగుండటం హ్యాపీ. 15 ఏళ్ల క్రితం తెలుగు ‘జయం’ తమిళ రీమేక్ ‘జయం’ చిత్రం ద్వారా హీరో అయ్యాను. అప్పుడు ‘జయం’ విడుదలైన జూన్ 22నే ఇప్పుడు ‘టిక్ టిక్ టిక్’ విడుదల కావడం, సక్సెస్ అవ్వడం ఓ మంచి జ్ఞాపకం. ఈ చిత్రంలో నాతో పాటు నా కొడుకు ‘ఆరవ్’ నటించాడు’’ అన్నారు. ‘జయం’ రవి హీరోగా శక్తి సౌందర్యరాజన్ దర్శకత్వంలో రూపొందిన ‘టిక్ టిక్ టిక్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో లక్ష్మణ్ చదలవాడ రిలీజ్ చేశారు. సోమవారం చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. సౌందర్య రాజన్ మాట్లాడుతూ – ‘‘ఆసియాలోనే తొలి స్పేస్ సినిమా ‘టిక్ టిక్ టిక్’. ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయం సాధించటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మౌత్ పబ్లిసిటీ ద్వారా మా సినిమా సక్సెస్ సాధించింది. హాలీవుడ్లో ఇలాంటి సినిమా చేస్తే ఎంత ఖర్చవుతుందో అందులో 10 శాతం ఖర్చుతో నిర్మించిన చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత లక్ష్మణ్. -
కాలమే శత్రువు
గెలవాలని ఓ టీమ్ అంతరిక్షంలోకి బయలుదేరింది. ఓడిపోతే దాదాపు 4 కోట్ల మంది ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుంది. ఆ టీమ్ ప్రధాన శత్రువు టైమ్ అంట. మరి.. గెలవడానికీ ఈ టీమ్ లీడర్ ఏం చేశాడు? అంతరిక్షంలో వాళ్లు ఎలాంటి అవరోధాలను అధిగమించాల్సి వచ్చింది? ఇటువంటి ఆసక్తికర అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘టిక్. టిక్. టిక్’. శక్తి సుందర్ రాజన్ దర్శకత్వంలో ‘జయం’ రవి హీరోగా నటించారు. నివేథా పేతురాజ్, రమేశ్ తిలక్, అరోణ్ అజీజ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 22న విడుదల కానుంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి, చదలవాడ లక్ష్మణ్ ఈ చిత్రాన్ని ‘టిక్. టిక్. టిక్’ పేరుతోనే తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ‘‘సినిమా సెన్సార్ పూర్తయింది. ఆల్రెడీ రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. అంతరిక్షం నేపథ్యంలో రూపొందిన ఫస్ట్ ఇండియన్ మూవీ ఇది. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ‘బిచ్చగాడు, డీ 16’ సినిమాలను తెలుగులో రిలీజ్ చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. వాటిని మించిన విలక్షణమైన చిత్రమిది’’ అన్నారు నిర్మాత చదలవాడ లక్ష్మణ్. -
ఆ సంఘటనలు నాకు ఎదురవలేదు
తమిళసినిమా: తనకిప్పటి వరకు అలాంటి సంఘటనలు ఎదురవలేదని అంటోంది నటి నివేదా పేతురాజ్. మదురైకి చెందిన అచ్చ తమిళమ్మాయి అయినా దుబాయిలో 13 ఏళ్లు పెరిగిన నివేదా పేతురాజ్ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అందాల పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అనంతరం మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అలా కోలీవుడ్‌కు ఒరు నాళ్ కూత్తు చిత్రంతో కథానాయకిగా పరిచయమైంది. ఆ తరువాత పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు జయంరవికి జంటగా నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. అయితే ప్రస్తుతం పార్టీ, తిమిరుపిడిచవన్, జగజాల కిల్లాడి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. టిక్ టిక్ టిక్ చిత్రం వచ్చే నెల తొలి వారంలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఈ అమ్మడిచ్చిన భేటీలో తమిళ సినిమాలో హీరోయిన్లు ఇప్పుడు బాగా మారిపోయారనిపిస్తోందని పేర్కొంది. చిత్రాలను ఎంపిక చేసుకునే ముందు పాత్ర నచ్చిందా అన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అంది. పారితోషికాన్ని మాత్రమే ప్రధానంగా చూడడం లేదని, స్క్రిప్ట్ పూర్తిగా చదివి తమ కథా పాత్ర నచ్చితేనే నటించడానికి ఒప్పుకుంటున్నారని చెప్పింది. ఇకపోతే కాస్టింగ్ కౌచ్ సమస్య సోషల్ మీడియాల్లో బాగా వైరల్ అవుతోందని, అయితే తనకు సంబంధించినంత వరకూ అలాంటి ఘటనలు ఇంతవరకు తనకు ఎదురవలేదని చెప్పింది. తనకు ఆత్మరక్షణ విద్యలు తెలుసని చెప్పింది. బాక్సింగ్ లాంటి ఆత్మరక్షణ విద్యలను థాయ్‌ల్యాండ్‌లో రెండేళ్ల పాటు నేర్చుకున్నానని పేర్కొంది. ఆ విద్యలిప్పుడు టిక్ టిక్ టిక్ చిత్రంలో నటించడానికి బాగా ఉపయోగపడినట్లు చెప్పింది. ఇది అంతరిక్ష కథాంశంతో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రంగా నమోదవుతుందని, ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని నివేదా పేతురాజ్ పేర్కొంది. -
ప్రేక్షకులకు థ్రిల్
‘బిచ్చగాడు, 16’ చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతలుగా చదలవాడ బ్రదర్స్ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చదలవాడ బ్యానర్లో సినిమా అంటే సమ్‌థింగ్ స్పెషల్. తాజాగా ఈ బ్యానర్లో రాబోతోన్న చిత్రం ‘టిక్ టిక్ టిక్’. జయం రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి, చదలవాడ లక్ష్మణ్ ‘టిక్ టిక్ టిక్’ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘అంతరిక్ష నేపథ్యంలో రూపొందిన తొలి భారతీయ చిత్రమిది. ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ అయ్యేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మిలియన్ వ్యూస్‌ను రీచ్ అయింది. ‘బిచ్చగాడు, 16’ సినిమాలను మించేలా తెరకెక్కిన విలక్షణమైన సబ్జెక్ట్ ఇది. మా బ్యానర్లో విడుదల చేస్తుండటం గర్వంగా ఉంది’’ అన్నారు. -
అంతరిక్షంలో థ్రిల్
ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘టిక్ టిక్ టిక్’. ‘జయం’ రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తీ సౌందర్‌రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ అదే పేరుతో జూన్ 22న తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. చిత్రసమర్పకుల్లో ఒకరైన లక్ష్మణ్ మాట్లాడుతూ –‘‘అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూసిన సినిమాలకు భిన్నంగా ‘టిక్ టిక్ టిక్’ ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు థ్రిల్ అవడంతో పాటు ఓ కొత్త అనుభూతికి లోనవుతారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మా బ్యానర్లో వచ్చిన ‘బిచ్చగాడు’. ‘16’ సినిమాలని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇండియన్ సినిమాలో తొలి స్పేస్ మూవీని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
జూన్ 22న ‘టిక్ టిక్ టిక్’
‘తనీఒరువన్’ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో జయం రవి హీరోగా తెరకెక్కిన సినిమా టిక్ టిక్ టిక్. ఈ సినిమా జూన్ 22న రిలీజ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. ఈ సినిమాలో జయం రవి సరసన నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తుండగా అరోన్ అజీజ్, జయ ప్రకాష్, రమేష్ తిలక్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలి స్పేస్ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు. టిక్ టిక్ టిక్‌ను ముందుగా 2018 జనవరిలోనే రిలీజ్ చేయాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల విడుదల సాధ్యం కాలేదు. తాజాగా ఈ సినిమాను జూన్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను హీరో జయం రవి తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. అయితే తెలుగు వర్షన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
రా ఏజెంట్
తమిళ హీరో ‘జయం’ రవి సీక్రెట్ ఆపరేషన్ ఏదో చేయడానికి రెడీ అవ్వబోతున్నారట. మరీ.. అంత సీక్రెట్‌గా చేయాల్సిన అవసరం ఏంటి? అనే విషయానికి ‘బేబి’ రూపంలో సీల్వర్ స్క్రీన్‌పైనే సమాధానం దొరకుతుందని కోలీవుడ్ టాక్. ఆల్మోస్ట్ మూడేళ్ల క్రితం అక్షయ్‌కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘బేబి’. ఈ సినిమాలో అక్షయ్ రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసెస్ వింగ్) ఏజెంట్‌గా నటించారు. ఇప్పుడు ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేయబోతున్నారట. ఇందులో అక్షయ్ పాత్రలో కనిపించనున్నారట ‘జయం’ రవి. అహ్మద్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాకు మధి కెమెరామేన్‌గా వర్క్ చేయబోతున్నారని చెన్నై ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే శక్తి సుందర్రాజన్ దర్శకత్వంలో ‘జయం’ రవి హీరోగా రూపొందిన ‘టిక్. టిక్. టిక్’ చిత్రం జనవరి 26న విడుదల కాలేదు. ‘‘రిపబ్లిక్ డే రోజున టిక్.టిక్.టిక్ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ఎనౌన్స్ చేస్తాం’’ అన్నారు ‘జయం’ రవి. -
‘టిక్ టిక్ టిక్’ మూవీ స్టిల్స్
-
అంతరిక్షంలో టిక్ టిక్
‘జయం’ రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో అంతరిక్ష (స్పేస్) నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘టిక్ టిక్ టిక్’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని తెలుగులో త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘జనవరి 1న నేను ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌పై కూర్చున్నప్పుడు ఓ ఫారిన్ కపుల్ వచ్చి, ‘మీది ఇండియానా?’ అనడిగారు. అవునని చెప్పా. ‘బాహుబలి’ పదిసార్లు చూశామన్నారు. మన ఇండియన్ సినిమాకి అంత గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ మనవాళ్లు అమెరికన్ సినిమాలు చూస్తారు. అటువంటి స్థాయిలో తీసిన సినిమా ‘టిక్ టిక్ టిక్’’ అన్నారు. ‘‘మన దేశంలో వచ్చిన ఫస్ట్ స్పేస్ ఫిల్మ్ ఇది. ఇటువంటి సినిమాలను ఈజీగా చేయలేం. ఒక్కొక్క షాట్ వెనుక చాలా కష్టం ఉంటుంది. టీజర్, ట్రైలర్లలో ప్రేక్షకులు చూసినదాని కంటే సినిమాలో పది రెట్లు ఎక్కువ ఉంటుంది’’ అన్నారు ‘జయం’ రవి. ‘‘స్టార్ వార్స్’ టైమ్ నుంచి స్పేస్ నేపథ్యంలో ఇండియాలో ఎవరు సినిమా చేస్తారా? అనుకునేవాణ్ణి. తమిళంలో ‘టిక్ టిక్ టిక్’ చేస్తున్నారని తెలిసి పోటీ ఎక్కువగా ఉన్నా తెలుగు హక్కులు తీసుకున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు చదలవాడ లక్ష్మణ్. దర్శకులు అజయ్, అల్లాణి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, కెమెరా: వెంకటేశ్. -
ఆయనతో నటించడం చాలా కూల్..
ఆయనతో నటించడం చాలా కూల్ అంటోంది నటి సాయేషా సైగల్. వనమగన్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీకి ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, అవకాశాలకు మాత్రం ఆ చిత్రమే కారణం అంటుంది. జయంరవికి జంటగా నటించిన వనమగన్ చిత్రంలో సాయేషా నటన, ముఖ్యంగా ఆమె డాన్స్ పలువురిని ఆకర్షించింది. తాజాగా ఆర్యకు జంటగా గజనికాంత్ చిత్రంలో నటిస్తోంది. ఇంతకు ముందు హరహర మహేదేవకి చిత్రంలో దర్శకుడిగా పరిచయమైన పి.విజయకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. స్టూడియోగ్రీన్ అధినేత కేఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రాల్లో ఇది ఒకటి. సాధారణంగా ఆర్యతో నటించే హీరోయిన్లు ఆయన గురించి కాస్త ఎక్కువగానే చెబుతుంటారు. వారిని ఏం మాయ చేస్తారోగానీ, హీరోయిన్ల హీరోగా పేరు తెచ్చుకున్నారు. చాలా మంది హీరోయిన్లకు నచ్చే ఆర్య సాయేషాకు తెగ నచ్చేశారట. ఇటీవల జరిగిన చిత్ర విలేకరుల సమావేశంలో ఈ భామ ఆర్యతో నటించడం చాలా కూల్ అంటూ కితాబిచ్చేసింది. అంతే కాదు గజనికాంత్ లాంటి చిత్రాల్లో నటించడం జాలీ అని చెప్పింది. వనమగన్ చిత్రంలో తన నటనను చూసే జ్ఞానవేల్‌రాజా తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించారని తెలిపింది. తన కేరీర్లో గజనీకాంత్ మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని చెప్పింది. ఇక ఆర్య కూడా సాయేషాపై పొగడ్తల వర్షం కుపించారు. సాయేషాసైగల్ డాన్స్ చూసి భయపడిపోయానని, ఆమెతో డాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డానని ఆర్య చెప్పారు. ఈ చిత్రం తరువాత సాయేషా కార్తీతో కడైకుట్టి సింగం చిత్రంలో నటిస్తోంది. మొత్తం మీద ఈ ఉత్తరాది బ్యూటీ కోలీవుడ్‌లో వరుసగా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది. -
అరవ్ వరాన్..
‘జయం’ రవి హీరోగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో రూపొందిన ఇండియా ఫస్ట్ స్పేస్ ఫిలిం ‘టిక్ టిక్ టిక్’. ఈ సినిమా ద్వారా ‘జయం’ రవి కుమారుడు అరవ్ కూడా సిల్వర్ స్క్రీన్‌కి వరాన్ (వస్తున్నాడు). ఈ బుడతడు ‘టిక్ టిక్ టిక్’లో యాక్ట్ చేశాడు. కుమారుడితో కలిసి నటించటం చాలా ఆనందంగా ఉంది అంటూ పలు మార్లు పేర్కొన్నారు ‘జయం’ రవి. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
టిక్ టిక్ టిక్ : థ్రిల్లింగ్ ట్రైలర్
-
టిక్ టిక్ టిక్ : థ్రిల్లింగ్ ట్రైలర్
‘తనిఒరువన్’ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేథా పేతురాజ్, అరోన్ అజీజ్, జయ ప్రకాష్, రమేష్ తిలక్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలి స్పేస్ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా కోలీవుడ్ లోరిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశాడు. థ్రిల్లింగ్ విజువల్స్‌తో రూపొందించిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. ఇండియన్ స్ర్కీన్ మీద గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Here we go guys the Telugu trailer of #TikTikTik @actor_jayamravi @ShaktiRajan @NPethuraj and the whole team of #TikTikTikTelugu https://t.co/KzhElYCMcf all the best guys 👍🏼👍🏼👍🏼 — Sai Dharam Tej (@IamSaiDharamTej) 18 January 2018 -
పసందుగా పండగ
ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులతో సంక్రాంతి సంబరాలను తన నివాసంలో జరుపుకున్నారు నటి, నిర్మాత మంచు లక్ష్మీప్రసన్న. టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జంట నగరాల్లోని 38 ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు మంచు లక్ష్మీ నివాసానికి చేరుకుని, సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, టీచ్ ఫర్ చేంజ్ వాలంటీర్లకు సంక్రాంతి విందు భోజనాన్ని వడ్డించారు మంచు లక్ష్మీ. ‘‘ప్రతి ఏడాది ఫైవ్‌స్టార్ హోటల్‌కు విద్యార్థులను తీసుకెళ్లి సంక్రాంతి వేడుకలను జరుపుకునేవాళ్లం. కానీ ఈ ఏడాది సంక్రాంతిని మా ఇంట్లోనే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు లక్ష్మీప్రసన్న. కుమార్తె విద్యా నిర్వాణతో కలసి పిల్లలందరితో లక్ష్మీప్రసన్న సెల్ఫీ దిగారు. ‘జయం’ రవి, నివేతా పేతురాజ్ నటించిన చిత్రం ‘టిక్.. టిక్. టిక్’. ఈ నెల 26న విడుదల కానున్న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. మూవీ ప్రమోషన్లో భాగంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేశారు ‘జయం’ రవి, నివేతా, సంగీత దర్శకుడు ఇమ్మాన్ తదితరులు. -
అంతరిక్షంలో టిక్ టిక్
ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా రూపొందిన తమిళ చిత్రం ‘టిక్ టిక్ టిక్’. ‘జయం’ రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తీ సౌందర్‌రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ ‘టిక్ టిక్ టిక్’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరో అడివి శేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘టీజర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీని తలపిస్తోంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి సినిమా రావడం గొప్ప విషయం. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుంది’’ అన్నారు. సమర్పకుల్లో ఒకరైన లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో వచ్చిన ‘బిచ్చగాడు, 16’ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు మరో విభిన్నమైన ‘టిక్ టిక్ టిక్’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మంచి టెక్నికల్ అంశాలతో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. తొలి ఇండియన్ స్పేస్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, పాటలు: వెన్నెలకంటి, రాకేందు మౌళి, కెమెరా: వెంకటేశ్. -
శ్రీవారి సేవలో నాని, జయం రవి
సాక్షి, తిరుమల: తెలుగు హీరో నాని, తమిళ హీరో జయం రవి ఆదివారం తిరుమల శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో సతీమణి అంజన, ఇతర కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని నాని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల నానిని చూసి, కరచాలనం చేసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. -
రాశీఖన్నా లక్కీచాన్స్
తమళసినిమా: రాశిని తన పేరులోనే ఇముడ్చుకున్న నటి రాశీఖన్నా. టాలీవుడ్లో నటిగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ తాజాగా కోలీవుడ్‌లో తన సత్తా చాటాలని ఆరాటపడుతోంది. ఆల్రెడీ బహుభాషా కథానాయకి అనిపించుకున్న రాశీ కోలీవుడ్‌లో ఇమైకా నోడిగళ్ చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటూ జనవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. ఆ చిత్రం విడుదలకు ముందే మరో లక్కీచాన్స్‌ను కొట్టేసిందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. హీరోయిన్లకు లక్కీ హీరోగా పేరున్న స్టార్ నటుడు జయంరవితో రొమాన్స్ చేసే అవకాశం రాశీఖన్నాను వరించింది. ఈయనతో జత కట్టిన హీరోయిన్లందరూ కోలీవుడ్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నది గమన్హారం. జయంరవి ప్రస్తుతం శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వంలో టిక్ టిక్ టిక్ చిత్రంలో నటిస్తున్నారు. తొలి అంతరిక్ష కథా చిత్రంగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్ నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తదుపరి జయంరవి సుదర్.సి దర్శకత్వంలో భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్రలో ఆర్యతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు.ఈ చిత్రం 2018 ఏప్రిల్‌లో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. దీంతో జయంరవి ఈ మధ్యలో ఒక చి త్రం చేయాలని నిర్ణయించుకున్నారట. తంగవేల్ దర్శకత్వంలో హోమ్ మూవీస్ సంస్థ నిర్మించనున్న మొదటి చిత్రంలో నటించనున్నారు. ఈ నెలలోనే చిత్ర షూటిం గ్ పారంభం కానుందని, ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. సీఎస్.శ్యామ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబం ధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారకపూర్వకంగా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. -
టిక్ టిక్ టిక్.. ఏం జరిగింది?
వాసు ఇంద్రజాలికుడు మాత్రమే కాదు... పైలట్ కూడా. ఎటువంటి ప్రమాదం నుంచైనా తప్పించుకోగల సత్తా ఉన్నవాడు. అలాంటి వాడు ఓ పెనుముప్పును తప్పించడానికి ఒక టీమ్‌తో అంతరిక్షంలోకి వెళ్తాడు. కానీ, అక్కడి పరిస్థితులు చేయిదాటి పోతాయి. కాలానికి వ్యతిరేకంగా పరిగెత్తాల్సి వస్తుంది. ‘రేస్ ఎగైనస్ట్ టైమ్’ అన్నమాట. అప్పుడు వాసు ఏం చేశాడు? ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా? టీమ్‌లో ఉన్న అందరూ క్షేమమేనా? అన్న ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలంటున్నారు తమిళ దర్శకుడు శక్తీ సుందర్ రాజన్. ‘జయం’ రవి, నివేతా పేతురాజ్, అరోన్ అజీజ్ ముఖ్య పాత్రలుగా శక్తీ సుందర్ రాజన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టిక్. టిక్. టిక్’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ‘ఫస్ట్ ఇండియన్ స్పేస్ మూవీ ఇదే’ అని కూడా అన్నారు. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా చిత్రాలను రూపొందిస్తుంటారు శక్తీ సుందర్. గత ఏడాది ‘జయం’ రవితో ఆయన తీసిన ‘ మిరుదన్’ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘టిక్. టిక్. టిక్’పై అంచనాలు పెరిగాయి. -
ఇండియన్ ఫస్ట్ స్పేస్ మూవీ ట్రైలర్
-
ఇండియన్ ఫస్ట్ స్పేస్ మూవీ ట్రైలర్
సాక్షి, సినిమా : దేశంలోని తొలి స్పేస్ చిత్రం టిక్ టిక్ టిక్ ట్రైలర్ వచ్చేసింది. కోలీవుడ్‌లో జయం రవి హీరోగా శక్తి సౌందర్ రాజన్ డైరెక్షన్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అంతరిక్షం నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు విజువల్స్ చూస్తే అర్థమౌతోంది. భారతదేశానికి పొంచి ఉన్న ముప్పు.. దానిని అడ్డుకునేందుకు అంతరిక్ష శాఖ అధికారులు మేజిషియన్ అయిన హీరో సాయం తీసుకోవటం.. ఓ బృందంగా అంతరిక్షంలోకి వెళ్లి శత్రువులతో పోరాటం నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కింది. గ్రాఫిక్స్ వర్క్ కూడా ఆసక్తికరంగానే ఉంది. నివేథా పెతురాజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలకు ముందుండే జయం రవి నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమానే రాబోతుందని స్పష్టమౌతోంది. కాగా, టిక్ టిక్ టిక్ రిలీజ్ తేదీ ప్రకటించాల్సి ఉంది. గతంలో రవి-రాజన్ కాంబినేషన్లో మిరుథన్(తెలుగులో యమపాశం) జాంబీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. Ecstatic to present to u #TikTikTikTrailer https://t.co/04VSUYdyg0 #FirstIndianSpaceFilm #FirstAsianSpaceFilm 💥💥💥God bless the entire team! @ShaktiRajan @JabaksMovies @immancomposer @madhankarky @NPethuraj — Jayam Ravi (@actor_jayamravi) November 24, 2017 -
హీరోయిన్లకు ఆ హీరో లక్కీ ..!
బాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు తాజాగా దిగుమతి అయిన ఏంజల్ నటి సాయేషా సైగల్. కోలీవుడ్‌లో హీరోయిన్లకు లక్కీ హీరో జయంరవి అనే పేరుంది. మొదటిసారి ఆయనతో రొమాన్స్ చేసిన హీరోయిన్లకు అదృష్టం తేనె తుట్టెలా పడుతుందని అంటారు. రవి తొలి చిత్ర హీరోయిన్ సదా, శ్రియ, అశిన్ ఇలా చాలామంది ప్రముఖ హీరోయిన్లుగా రాణించారు. ప్రస్తుతం ఈ వరుసలో నటి సాయేషా సైగల్ చేరింది. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ జయం రవికి జంటగా వనమగన్ చిత్రం ద్వారా కోలీవుడ్ రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం యాజరేజ్ అనిపించుకున్నా సాయేషాకు మాత్రం బోలెడంత పేరు వచ్చింది. ఆ వేంటనే ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీతో నటించడానికి సిద్ధమైన కరుప్పరాజా- వెళ్లరాజా చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం వాయిదా పడింది. అది సాయేషాకు చిన్న షాక్ అనే చెప్పాలి. అయితే ఆమెకు అదృష్టం చేజారలేదు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న భారీ బడ్జెట్ కథా చిత్రం ‘జూంగా’లో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పుడు మరో స్టార్ హీరో కార్తీతో రొమాన్స్ చేసే అవకాశం తలుపు తట్టిందన్నది తాజా సమాచారం. కార్తీ నటించిన తాజా చిత్రం ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 17న విడుదలకు ముస్తాబవుతోంది. ఆ తరువాత పసంగ పాండిరాజ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అన్నయ్య, నటుడు సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో కార్తీకి జంటగా ఇంతకు ముందు నటి ప్రియ భవానీశంకర్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్ర హీరోయిన్ సాయేషాసైగల్‌ను వరించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ అమ్మడు హీరో అక్కినేని అఖిల్ మొదటి చిత్రం అఖిల్‌లో నటించిన విషయం తెలిసిందే. -
అలా నటించడంలో తప్పేముంది!
గ్లామర్‌గా నటించడంలో తప్పులేదు అంటోంది నటి నివేదా పేతురాజ్. తొలి చిత్రం ఒరునాళ్ కూత్తు చిత్రంతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి ఈ మదురై చిన్నది. అయితే దుబాయ్‌లో పెరిగిన పక్కా మోడ్రన్ అమ్మాయి నివేదా అన్నది గమనార్హం. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. అందులో స్టార్ హీరో జయంరవితో రొమాన్స్ చేసే చిత్రం కూడా ఉంది. పనిలో పనిగా తెలుగులో కూడా అడుగుపెట్టేసింది. అలాంటి నివేదాపేతురాజ్ తాజా ముచ్చట్లు చూద్దాం. – తమిళసినిమా ప్ర: నటుడు జయంరవికి జంటగా నటిస్తున్న టిక్ టిక్ టిక్ చిత్రంలో మీకు లవ్ సీన్సే లేవట నిజమేనా? జ: నిజమే. ఈ చిత్రంలో జయంరవికి నాకు మధ్య లవ్ సీన్స్ ఉండవు. ఒక్కటి మాత్రం చెప్పగలను. టిక్ టిక్ టిక్ లాంటి చిత్రం ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలోనే వచ్చి ఉండదు.అంతరిక్షంలో జరిగే కథాంశంతో తెరకెక్కుతున్న సీరియస్ కథా చిత్రంలో లవ్ సీన్స్‌కు తావుండదు. ఇందులో నా పాత్ర కల్ప నాచావ్లా మాదిరిగా ఉంటుంది. నా అభిమానులు సంతోషించే విధంగా ఇందులో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటిస్తున్నాను. ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి ఎక్కువ చెప్పలేను. ప్ర: తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయినట్లున్నారు? జ: అవును. మెంటల్ మదిలో అనే తెలుగు చిత్రంలో శ్రీవిష్ణుకు జంటగా నటిస్తున్నాను. ఇది నా తొలి తెలుగు చిత్రం. తెలుగు భాషను కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను. అయితే సంభాషణలు మాత్రం ముందు రోజే తీసుకుని బట్టీ పట్టి పక్కాగా చెబుతున్నాను.అందులో చాలా స్ట్రాంగ్ అయిన నగర యువతి పాత్రలో నటిస్తున్నాను. ప్ర: అక్కడ గ్లామర్‌గా నటించాలని ఒత్తిడి చేస్తారటగా? జ: కథకు అవసరం అయితే గ్లామర్‌గా నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. అయినా గ్లామర్‌గా నటించడంలో తప్పేముంది. అయితే మెంటల్ మదిలో చిత్రంలో గ్లామర్‌కు ప్రాధాన్యత ఉండదు. మరో విషయం ఏమిటంటే నాకు ఎలాంటి దుస్తులు ధరించినా నప్పుతాయి. నా నటనాప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తున్నారు. నేనూ నా పాత్రలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నాను. ప్ర: బీజూ దీవులు చుట్టొచ్చారట. ఆ అనుభవం గురించి? జ: వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో రెజీనా, సత్యరాజ్, జయరామ్, రమ్యకృష్ట, జై, శివ, వైభవ్ అంటూ సీనియర్ నటీనటులతో నటించడం మంచి అనుభవం. అందరం ఒకే చోట బసచేసి నటించడం చాలా జాలీగా ఉంది. అయితే నాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ రాత్రుల్లో జరగడంతో పగులు దీవులన్నీ తిరిగి చూడలేకపోయాను. తదుపరి షెడ్యూల్లో ఆ దీవులన్నీ చుట్టిరావాలనుకుంటున్నాను. ప్ర: ఈ రంగంలో ఏదైనా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారా? జ: ఇతరులతో మనం ప్రవర్తించే విధం బట్టే మర్యాద అన్నది ఉంటుంది. సినిమారంగంలో షూటింగ్లో నాకు మంచి మర్యాద లభిస్తోంది. మంచిగా ట్రీట్ చేస్తున్నారు. నేనెవరితోనూ గొడవకు పోను. వృత్తిని ప్రేమిస్తూ చేస్తాను. ప్ర: నటీమణులకు రక్షణ లేదనే ప్రచారం జరుగుతోంది. మీరేమంటారు? జ: షూటింగ్ స్పాట్లోనైనా, బయట అయినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన రక్షణ బాధ్యతను మనమే వహించుకోవాలి. -
అంతరిక్షం నేపథ్యంలో తొలి భారతీయ చిత్రం
-
అంతరిక్షం నేపథ్యంలో తొలి భారతీయ చిత్రం
జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 1981లో ఇదే పేరుతో కమలహాసన్ నటించిన సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్లో జయం రవికి జంటగా నటి నివేదాపేతురాజ్ నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో జయంరవి కొడుకు మాస్టర్ ఆరవ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. నెమిచంద్ జబక్ పతాకంపై వీ.హింటేశ్జబక్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తి సౌందర్‌రాజన్ దర్శకుడు. గతంలో జయం రవి హీరోగా సౌందర్‌రాజన్ మిరుదన్ చిత్రాన్ని తెరకెక్కించారు. జోంబీస్ల ఇతివృత్తంగా తెరెక్కిన ఈ సైన్స్‌ఫిక్సన్ థ్రిల్లర్ కథా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా మళ్లీ వీరి కాంబినేషన్లో రూపొందుతున్న టిక్ టిక్ టిక్ చిత్రం అంతరిక్షంలో జరిగే తొలి భారతీయ చిత్రంగా నమోదు కానుంది. -
ఆయన నాకు చాలా నేర్పించారు: నివేద
చెన్నై: నటి నివేదా పేతురాజ్ ఇప్పుడు ఒక రకమైన ఎగ్జైట్మెంట్, టెన్షన్‌తో ఉంది. దానికి కారణం కోలీవుడ్‌లో తను నటించిన రెండో చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఉదయనిధి స్టాలిన్ సరసన కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తీపన్ ప్రధాన పాత్రను పోషించారు. తేనాండాళ్ ఫిలింస్ లిమిటెడ్ పతాకంపై ఎన్.రామస్వామి నిర్మించిన ఈ చిత్రానికి దళపతి ప్రభు దర్శకుడు. ఒరునాళ్‌కూత్తు చిత్రం తరువాత నటి నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన రెండో తమిళ చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం. ఇందులో తన అనుభవం గురించి చెపుతూ, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. అయితే ఇందులో నటుడు పార్తీపన్‌కు కూతురుగా నటించినట్లు చెప్పింది. ఆయన నటన గురించి నాకు చాలా నేర్పించారనీ తెలిపింది. పార్తిపన్ తనకు తండ్రిగా నటిస్తున్నారని దర్శకుడు చెప్పగానే సంతోషం కలిగినా, కాస్త భయం అనిపించిందని అంది. కారణం ఆయన చాలా సీనియర్ దర్శకుడు కావడమేనంది. ఈ చిత్రం తుది ఘట్ట సన్నివేశాల్లో నటించడానికి తటపటాయిస్తున్నప్పుడు పార్తీపన్ ఎలా నటించాలో చెప్పి ధైర్యాన్ని నింపారని చెప్పింది. పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రంలో తాను ఏ మాత్రం బాగా చేశానని అభినందనలు లభిస్తే ఆ క్రెడిక్ట్ అంతా పార్తీపన్కే దక్కుతుందని నివేదా పేర్కొంది. కాగా ఈ బ్యూటీ తాజాగా నటుడు జయంరవికి జంటగా టిక్ టిక్ టిక్ చిత్రంలో నటిస్తోంది. -
అహ్మద్ దర్శకత్వంలో జయంరవి
తమిళసినిమా: జయంరవి, యువ దర్శకుడు అహ్మద్ కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కనుందన్నది తాజా సమాచారం. యువ నటుడు జయంరవి తన చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోమియో జూలియట్ చిత్రం నుంచి తనీఒరువన్ వరకూ డబుల్ హ్యాట్రిక్ కొట్టిన జయంరవి తాజాగా టిక్ టిక్ టిక్ అనే అంతరిక్షంలో సాగే ఇతివృత్తంతో కూడిన కథా చిత్రంలో నటిస్తున్నారు. శక్తిసౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. నివేద పేతురాజ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంపై చాలా అంచనాలు నెలకొన్నాయి. కాగా తదుపరి ఆర్యతో కలిసి చారిత్రాత్మక చిత్రం సంఘమిత్రలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం తరువాత జయంరవి దర్శకుడు అహ్మద్ కాంబినేషన్ ఒక భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కనుంది. అహ్మద్ ఇంతకు ముందు వామనన్, ఎండ్రేండ్రు పున్నగై, మనిధన్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. -
ఆసక్తిని రేకెత్తిస్తున్న టిక్ టిక్ టిక్... ఫస్ట్‌లుక్
తమిళసినిమా: టిక్ టిక్ టిక్ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు, చిత్రంపై అంచనాలను పెంచుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నారు. జయం రవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టిక్ టిక్ టిక్. ఇదే పేరుతో ఇంతకు ముందు నటుడు కమలహాసన్ నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్లో జయం రవికి జంటగా నటి నివేదాపేతురాజ్ నటిస్తోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో జయంరవి కొడుకు మాస్టర్ ఆరవ్ కీలక పాత్రలో పరిచయం అవుతున్నాడు. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నెమిచంద్ జబక్ పతాకంపై వీ.హింటేశ్జబక్ నిర్మిస్తున్నారు. కాగా జయంరవి, శక్తి సౌందర్‌రాజన్‌ల కాంబినేషన్లో ఇంతకు ముందు మిరుదన్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. జోంబీస్ల ఇతివృత్తంగా తెరెక్కిన ఈ సైన్స్‌ఫిక్సన్ థ్రిల్లర్ కథా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా మళ్లీ వీరి కాంబినేషన్లో రూపొందుతున్న టిక్ టిక్ టిక్ చిత్రం అంతరిక్షంలో జరిగే తొలి తమిళ చిత్రంగా నమోదు కానుంది.డీ. ఇమాన్ సంగీత భాణిలను అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపారు. మరో పక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. జయంరవి అంతరిక్షకుడి గెటప్‌లో తాడు పట్టుకుని ఎగబాకుతున్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సంమ్థింగ్ స్పెషల్‌గా ఎంట్రాక్ట్ చేస్తోంది. -
ఆయనతో చేసేందుకు భయపడ్డా: నటి
తమిళసినిమా: ఆయన గర్వంలేని నటుడు అని తెగ పొగిడేస్తోంది వర్ధమాన నటి నివేదా పేతురాజ్. నటీనటులు చాలా చిత్రాలు చేస్తుంటారు. అయితే అందులో కొన్ని చిత్రాలపైన నమ్మకం పెరుగుతుంది. పలాన చిత్రం తన కెరీర్లో మలుపురాయిగా నిలిచిపోతుందనే భావన కలుగుతుందని నటి నివేదా పేతురాజ్ అన్నారు. ఈ బ్యూటీ ఏమంటుందో చూద్దాం. నేను నటించిన తొలి చిత్రం ఒరునాళ్‌కూత్తు మంచి సక్సెస్‌ను అందించింది. మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నా చేతిలో మూడు చిత్రాలున్నాయి. వాటిలో జయం రవితో నటిస్తున్న టిక్ టిక్ టిక్ ఒకటి. ఇందులో తాను ఏంజిల్ గెటప్‌లో కనిపిస్తానని చెప్పింది. స్టార్ హీరో జయం రవికు జంటగా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఆయనతో కలిసి నటించడానికి ముందు చాలా భయపడ్డానని ఆమె అన్నారు. కాని ఆయన మాత్రం చాలా సౌమ్యంగా సన్నివేశంలో నటించేటప్పుడు ఎన్ని టేక్‌లు తీసుకున్నా సహనం పాటించారు. నిజంగా ఆయన గ్రేట్. ఎంత నిరాడంబరుడో అని రవిని పొగిడింది. టిక్ టిక్ టిక్ చిత్రంలో నాది చాలా బలమైన పాత్ర అని ఈ చిత్ర విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇక ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. అదేవిధంగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది చాలా జాలీగా సాగే కథా చిత్రంగా ఉంటుంది అని నివేదాపెతురాజ్ పేర్కొంది. -
సంఘమిత్ర కోసం రెండేళ్లు
‘బాహుబలి’ కోసం ప్రభాస్ ఐదేళ్లు రాసిచ్చారు. ఈ టైమ్‌లో మరో సినిమా చేయలేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... ‘బాహుబలి’ స్థాయిలో ‘సంఘమిత్ర’ సినిమాను తీయాలని తమిళ దర్శకుడు సుందర్ .సి సంకల్పించిన సంగతి తెలిసిందే. ‘సంఘమిత్ర’లో ఓ హీరోగా నటించనున్న ‘జయం’ రవి తన రెండేళ్ల కాల్షీట్స్ను ఈ సినిమాకు రాసిచ్చారట! ‘బాహుబలి’ చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు ఐదేళ్లు పడుతుందని ఎవరూ అనుకోలేదు. ‘సంఘమిత్ర’కు ‘జయం’ రవి రెండేళ్లు కేటాయించారు. సినిమా పూర్తయ్యే సరికి ఎన్ని రోజులు పడుతుందో! ఇందులో ఆర్య మరో హీరోగా నటించనున్నారు. -
ఆ తప్పు ఇక్కడ చేయను: సాయేషా
'అఖిల్' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయనంటోంది. మొదట టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో అవకాశాలు వచ్చినా అంగీకరించలేదట.. ఇప్పుడు కోలీవుడ్‌లో వస్తున్న అవకాశాలను వదులుకునేది లేదని ఆమె కరాఖండిగా చెబుతోంది. లెజెండ్రీ నటుడు దిలీప్‌కుమార్ కుటుంబం నుంచి వచ్చిన సాయేషా టాలీవుడ్‌ను ఎంచుకుని అఖిల్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఆమె ప్రతిభ వెలుగులోకి రాలేదు. తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా శివాయ్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఓకే అనిపించుకోవడంతో ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తలుపు తట్టాయట. ఈ రెండు భాషా చిత్రాల అనుభవాన్ని చవిచూసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కోలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఇక్కడ జయం రవికి జంటగా వనయుద్ధం చిత్రంలో నటించింది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో హీరోకు చాలా తక్కువ మాటలు, సాయేషాకు ఎక్కువ మాటలు ఉంటాయట. అంతేకాక ఇందులో పాటల సన్నివేశాల్లో డ్యాన్స్‌లో సాయేషా కుమ్మేసిందట. అంతేకాకుండా ఆ పాట కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన డ్యాన్సింగ్ కింగ్ ప్రభుదేవానే అబ్బురపడేలా డ్యాన్స్ చేసిందట. ఈ టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవడంతో అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీ స్టార్ చిత్రం కరుప్పు రాజా వెళ్లై రాజా చిత్రంలో నటించడానికి ఎంపికైంది. మరో మూడు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఇలా కోలీవుడ్‌లో అనూహ్యంగా అవకాశాలు తలుపు తడుతుండటంతో అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయనంటోంది సాయేషా. -
సౌత్ నుంచి తొలి అడుగు శ్రుతిదే!
తెలుగు, తమిళం, హిందీ... శ్రుతీహాసన్ మూడు భాషల ప్రేక్షకులకు పరిచయమే. శ్రుతి కథానాయికగా తమిళ దర్శకుడు సుందర్. సి మూడు భాషల్లోనూ ‘సంఘమిత్ర’ అనే భారీ సినిమా తీయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ నటులు ఆర్య, ‘జయం’ రవి హీరోలుగా సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 18న ప్రారంభం కానుంది. అదీ ఫ్రెంచ్ రివేరా తీరంలో జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో. ఈ 17 నుంచి 28 వరకూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రతి ఏడాది కాన్స్‌కి పలువురు హిందీ హీరోయిన్లు హాజరవుతారు. అయితే... ఓ సినిమా ప్రారంభోత్సవం నిమిత్తం కాన్స్ వెళ్తున్నది మాత్రం శ్రుతీనే. కేన్స్ రెడ్ కార్పెట్ మీద మెరిసే ఫస్ట్ సౌత్ హీరోయిన్ కూడా ఈమేనని సమాచారం. విద్యాబాలన్ సౌతిండియన్ అయినప్పటికీ హిందీ నటిగానే కాన్స్‌కి వెళ్లారు. సౌత్‌లో హీరోయిన్గా సెటిల్ అయిన బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ సైతం గతేడాది ఫారిన్ సంస్థ ప్రచారం నిమిత్తం కాన్స్ వెళ్లారు. ఈ ఏడాది ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఇండో–బ్రిటన్ సినిమా ప్రచారం కోసం వెళ్తారట! -
నేను మంచోణ్ని కాను!
ఖచ్చితంగా నేను అంత మంచి వాడిని కాననిపించింది అని అన్నారు నటుడు జయంరవి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ నటుడు తాజాగా నటిస్తున్న చిత్రం వనమగన్. థింక్ బిగ్ స్డూడియోస్ పతాకంపై నిర్మాత ఏఎల్.అళగప్పన్ నిర్మిస్తున్న చిత్రం వనమగన్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయంరవి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ సాయేషాసైగల్ కథా నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తిరు ఛాయాగ్రహణం, హారీస్‌జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినిమాహాల్లో నిర్వహించారు. దర్శకుడు బాలా, లైకా ప్రొడక్షన్స్ రాజా మహాలింగం, నిర్మా త ఐసరి గణేశ్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత నా. ముత్తుకుమార్ కుమారుడు ఆదవన్ తొలి సీడీని అందుకున్నారు. ప్రకృతికి ప్రాధాన్యతనిచ్చి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వరల్డ్ ఎర్త్‌డే రోజున జరగడం విశేషం. అదే విధంగా జాతీయ అవార్డును గెలుచుకున్న ఛాయాగ్రాహకుడు తిరును ఈ వేదికపై సత్కరించడం మరో విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ జయంరవి లేకపోతే ఈ వనమగన్ చిత్రం లేదన్నారు. అదే విధంగా మదరాసుపట్టణం చిత్రానికే హారీస్‌జయరాజ్ సంగీతం కోసం ప్రయత్నించానని, ఏడేళ్ల తరువాత ఈ చిత్రానికి ఆ ప్రయత్నం ఫలించిందని చెప్పారు. సాయేషా అంకితభావం కలిగిన నటి అని ప్రశంసించారు. సాయేషా మట్లాడుతూ వనమగన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో ఒక పాటకు డాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చిత్ర హీరో జయం రవి మాట్లాడుతూ తాను చాలా మంచి వాడినని అనుకునేవాడినని, దర్శకుడు విజయ్‌ని చూసిన తరువాత ఖచ్చితంగా తాను అంత మంచి వాడిని కాదనే భావన కలిగిందని అన్నారు. తాను వనబిడ్డను అయితే విజయ్ దైవబిడ్డ అని పేర్కొన్నారు. నటి సాయేషా చాలా బాగా నటించారన్నారు. సాయేషాను ఇప్పుడే బుక్ చేసుకోండి. తరువాత ఆమె కాల్షీట్స్ దొరకడం కష్టం అని అన్నారు. వనమగన్ చిత్రంలో తాను చాలా టఫ్ పాత్రను పోషించానని, తాను చేసే పనిలో బోర్ కొట్టకూడదనే వైవిధ్యభరిత పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నానని అందుకు సపోర్ట్‌గా నిలుస్తున్న దర్శకులకు, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. -
ఆ ఇద్దరితో సాయేషా రొమాన్స్
బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్‌కు కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు విజయ్ దర్వకత్వం వహిస్తున్న వనమగన్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేస్తున్నారు. ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్‌కుమార్ మనవరాలు అయిన సాయేషా ఇప్పటికే తెలుగులో అఖిల్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. తాజాగా విశాల్, కార్తీలతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. విశాల్,కార్తీ కలిసి ఒక చిత్రం చేయనున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మల్టీస్టారర్ చిత్రానికి మరోస్టార్ నటుడు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న విషయం ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి త్వరలో ముహూర్తం కుదరనుంది. జూన్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. దీనికి కరుప్పురాజా వెళ్లైరాజా అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఒక కథానాయకిగా నటి సాయేషా నటించనున్నారన్నది తాజా సమాచారం. గత ఏడాది దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో నెగ్గిన విశాల్ జట్టు సంఘ భవన నిర్మాణ నిధి కోసం ఒక చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అందులో విశాల్, కార్తీ కలిసి నటించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల సంఘ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంలో కూడా కార్యదర్శి విశాల్ తాను కార్తీ కలిసి రూ.10 కోట్ల నిధిని అందించనున్నట్లు ప్రకటించారు. తాము కలిసి నటించనున్న చిత్రాన్ని నడిగర్ సంఘం తరఫున నిర్మిస్తారా? లేక వేరే నిర్మాత చేస్తారా?అన్నది తెలియాల్సిఉంది.అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సిఉంది. -
రీమేక్ రాజా?
మాస్ మహారాజా రవితేజను రీమేక్ రాజా చేయాలని తమిళ దర్శకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు రవితేజ రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారు. ‘టచ్ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లకముందు... ‘జిల్లా’, ‘కణిదన్’ తదితర తమిళ చిత్రాల రీమేక్స్‌లో రవితేజ నటిస్తారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. కానీ, అవేవీ పట్టాలు ఎక్కలేదు. తాజాగా లక్ష్మణ్ దర్శకత్వంలో ‘జయం’ రవి, అరవింద్ స్వామి నటించిన ‘బోగన్’ను తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేయాలను కుంటున్నారని చెన్నై నుంచి కబురొచ్చింది. ‘‘తెలుగులోనూ లక్ష్మణే దర్శకత్వం వహిస్తారు. ‘జయం’ రవి పాత్రకు రవితేజను, అరవింద్ స్వామికి మరో ప్రముఖ నటుణ్ణి సంప్ర దించారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్సుంది’’ అని కోలీవుడ్ టాక్. మరి, రవితేజ ఈ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? రెడ్ సిగ్నల్ చూపిస్తారా? వెయిట్ అండ్ సీ. -
స్పీడు పెంచిన రవితేజ..!
బెంగాల్ టైగర్ సినిమా తరువాత ఏడాదికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న రవితేజ ఇటీవల తిరిగి షూటింగ్‌లకు హాజరవుతున్నాడు. గ్యాప్‌లో ఫుల్ రీచార్జ్ అయిన మాస్ మహరాజ్ ఒకేసారి రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్‌తో పాటు విక్రమ్ సిరి దర్శకత్వంలో టచ్ చేసి చూడు సినిమాల షూటింగ్లలో ఒకేసారి పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తాజాగా మరో సినిమాను అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల తమిళ్లో ఘనవిజయం సాధించిన బోగన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. జయం రవి, అరవింద్ స్వామి హీరోలుగా తెరకెక్కిన బోగన్ సినిమాను తమిళ్లో డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ తెలుగులోనూ డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. జయం రవి పాత్రలో రవితేజ నటిస్తుండగా అరవింద్ స్వామి పాత్రకు తెలుగు టాప్ హీరోను సంప్రదిస్తున్నారట. త్వరలోనే ఈ రీమేక్‌పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. -
జయంరవితో బాగుంటుంది!
నటుడు జయంరవితో నటిస్తున్నప్పుడు నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందంటోంది నటి హన్సిక. దర్శకుల నటి, సక్సెస్ఫుల్ నటిలాంటి మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ నటించిన చిత్రాలు గత ఏడాది నాలుగు తెరపైకి వచ్చాయి. అలాంటిది తాజాగా కోలీవుడ్‌లో ఒక్క చిత్రం లేకపోవడం విశేషమే. ఇటీవల విడుదలైన బోగన్ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది అయినా అవకాశాలు లేవు. ఏంటీ హన్సిక పనైపోయిందా?ఇక దుకాణం బందేనా? లాంటి చర్చ జరుగుతోంది.ఇత్యాధి విషయాల గురించి హన్సిక ఏం చెబుతుందో చూద్దాం.. ఏమిటి పరిస్థితి ఇలాగైందీ? చేతిలో ఒక్క చిత్రం కూడా లేదేం? నేను 2007 నుంచి కథానాయకిగా నటిస్తున్నాను.ఏడాదికి నాలుగైదు చిత్రాలు నటిస్తూ వచ్చాను. నేను టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నది 2012లోనే. నాకు క్వాంటిటీ ముఖ్యం కాదు.క్వాలిటీనే ప్రధా నం. ప్రస్తుతం చాలా కథలు వింటున్నాను.అందులో కొన్ని కథలను ఓకే చేశాను.సెలెక్టెడ్ చిత్రాలే చేస్తాను. విశాల్, శింబు, ధనుష్, జయంరవి, శివకార్తికేయన్ లాంటి ప్రముఖ హీరోలతో నటించిన మీరు ఇప్పుడు వర్దమాన నటులతో కూడా నటించడానికి సిద్ధం అంటున్నారటగా? జ: స్టార్ హీరోల సరసన మాత్రమే నటిస్తానని నేనేప్పుడూ చెప్పలేదే. మాన్‌కరాటే చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర హీరో శివకార్తీకేయన్ అప్పుడే ఎదుగుతున్న నటుడు. చిన్న నటుడు,పెద్ద నటుడు అన్న భేదాభిప్రాయాన్ని నేనెప్పుడూ వ్యక్తం చేయలేదు. జయంరవికి జంటగా నటిస్తున్నప్పుడు మాత్రమే చాలా సన్నిహితంగా నటిస్తారనే ప్రచారంపై మీ స్పందన? అవునా? ఇలాంటి ప్రచారం ఎవరు చేస్తున్నారోగానీ, రవితో నేనిప్పటికి మూడు చిత్రాలు చేశాను. నేను జయంరవికి ఫ్యామిలీ ఫ్రెండ్‌ను.ఆయన భార్య ఆర్తి నాకు మంచి స్నేహితురాలు. వారిద్దరూ నా వెల్‌విషర్స్. జయంరవితో కలిసి నటిస్తున్నప్పుడు నేను చాలా కంఫర్టబుల్‌గా ఫీలవుతాను.ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో పాజిటీవ్ ఎనర్జీతో ఉంటారు. సినిమాల్లో మేము కంఫర్టబుల్ జంటగా కనిపించడం వల్లే మీరు అన్నట్లు కొందరు భావిస్తున్నారేమో. నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకుంటున్నారు.అయినా చెక్కు చెదరని అందం.ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? మీ ప్రశ్నకు నాకు వయసైపోయిందేమోనన్న భయం కలుగుతోంది. నా వయసెంతనుకుంటున్నారు? నేను 16 ఏటనే నటిగా రంగప్రవేశం చేశాను.ఈ ఏడాది ఆగస్ట్ నెల వస్తే 26 ఏళ్లు వస్తాయి.ఇకపోతే నాకు ఆహారపు నియమాలంటే పెద్దగా ఏమీ ఉండవు. నచ్చిన ఆహారం అయితే పుల్గా లాగించేస్తా. మనసును సంతోషంగా ఉంచుకుంటే అందం పెరుగుతూ పోతుంది.యోగా మనసును, శరీరాన్ని మెరుగు పరిస్తుంది.నేను నిత్యం యోగా క్రమం తప్పకుండా చేస్తాను. -
150 కోట్ల సినిమాలో...
వరుస విజయాలతో రేసుగుర్రంలా దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్. ఇటీవల ‘ప్రేమమ్’ వంటి క్యూట్ లవ్‌ప్టోరీ, ‘సింగమ్ 3’ వంటి మాస్ కమర్షియల్ మూవీ.. ఈ రెండు చిత్రాల్లోనూ ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసి, మెప్పించారు. ఇప్పుడు ఓ భారీ చిత్రంలో శ్రుతీకి ఛాన్స్ దక్కిందని సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ‘సంఘమిత్ర’లో శ్రుతి ఓ హీరోయిన్గా ఎంపికయ్యారని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ఈ సినిమా కోసం పలువురు కథానాయికలను దర్శకుడు సంప్రదించినా, చివరికి శ్రుతీహాసన్‌ను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. చారిత్రక నేపథ్యమున్న చిత్రం కావడంతో శ్రుతి మరో ఆలోచన లేకుండా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. హిందీలో అక్కడి నటీనటులతో తీయాలనుకుంటున్నారని వినికిడి. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటించనున్నారు. -
చాలా మంది ప్రపోజ్ చేశారు
నాకు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు అంటోంది నటి నివేదా పెతురాజ్. ఒరునాళ్ కూత్తు చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు ఇప్పుడు ఉదయనిధిస్టాలిన్, జయంరవిలతో రొమాన్స్ చేస్తూ బిజీగా ఉంది.ఈ సందర్భంగా నివేదా పేతురాజ్‌తో చిన్న భేటీ.. నేను పుట్టింది తమిళనాట.పెరిగింది, చది వింది దుబాయ్‌లో. నాన్న పేతురాజ్ ఇంజినీర్.అమ్మ హౌస్‌మేకర్. తమ్ముడు ని శాంత్ కాలేజీ చదువు పూర్తి చేసి సీఏఎఫ్‌ఏ చేస్తున్నాడు. ప్ర: సినీ రంగ ప్రవేశం గురించి? జ: నేను మోడలింగ్ రంగం నుంచి వచ్చాను.యూఏఈలో మిస్ ఇండియా పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్నాను.ఆ తరువాత మోడలింగ్ చే యడం బోర్ అనిపించింది.ఎప్పుడూ ఓకే విధంగా దుస్తులు ధరించడం, ఫోజులివ్వడం నచ్చలేదు. అలాంటి సయమంలో తమిళంలో ఒరునాళ్ కూత్తు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ కు జం టగా పొదువాగ ఎన్ మనసు తంగం,జయంరవితో కిక్ కిక్ కిక్ చిత్రాల్లో నటిస్తున్నాను. ప్ర: మీ సినీ హీరోల గురించి? జ: నటుడు దినేష్ నా తొలి హీరో. తొలిసారి నటిస్తున్నానన్న భయం కలగకుండా చాలా విషయాలు చెప్పారు. ఉదయనిధి స్టాలి్న్ కు జంటగా పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రంలో ఒక షెడ్యూల్లోనే నటించాను.ఎంతో ఉన్నత కుటుంబం నుంచి వచ్చి ఇంత సౌమ్యంగా ఉంటారా? అని ఉదయ్‌ను చూసి ఆశ్చర్యపోయాను. చాలా జెంటిల్మెన్ . తన అసిస్టెంట్లను కూడా గౌరవిస్తారు. అలాంటివన్నీ నేను ఉదయనిధి స్టాలిన్ చూసే నేర్చుకున్నాను. ఇక జయంరవికి జంటగా నటిస్తున్న కిక్ కిక్ కిక్ చిత్ర షూటింగ్లో పది రోజులే పాల్గొన్నాను. జయంరవిని ఒక్క రోజే కలుసుకున్నాను. అప్పుడు ఆయన భార్య,పిల్లలు కూడా ఉన్నారు. అలా కుటుంబంతో ఆయన్ని చూడడం చాలా సంతోషం కలిగింది. ప్ర: కొంచెం అందంగా ఉన్న అమ్మాయిలకే లవ్ ప్రపోజల్స్ గోల తప్పదు.అలాంటిది మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న మీకు? జ: అబ్బో దాని గురించి ఎందుకు అడుగుతారులెండి. నేను చదువుకుంటున్న సమయంలోనే తొలి ప్రపోజల్ అందుకున్నాను. రోజాపూలతో కూడిన కార్డుపై ఇంగ్లిష్‌లో ఏవేవో రాశాడు. అయితే అది చూడడానికి చాలా క్యూట్‌గా ఉంది.అయితే అప్పట్లో నాకు అబ్బాయిలంటే చాలా భయం. దూరంగా పారిపోయేదాన్ని. ఈ విషయాలు తలచుకుంటే ఇప్పుడు చాలా కామెడీగా అనిపిస్తుంది. ఇక దుబాయ్‌లో చాలా మంది ప్రపోజ్ చేశారు.అక్కడి అబ్బాయిలు చాలా పోకిరోళ్లు. బయట అమ్మాయిలెవరైనా కనిపిస్తే, అందంగా ఉన్నారనిపిస్తే వెంటనే వారి ఫోన్ నంబర్లు అడిగి తీసుకోవడం గానీ, తమ ఫోన్ నంబర్లు ఇవ్వడం గానీ చేస్తారు.అలా నేనెవరికీ ఫోన్ నంబర్ ఇవ్వలేదుగానీ, ఒక అబ్బాయి ఫోన్ నంబర్ మాత్రం అడిగి తీసుకుని వెంటనే దాన్ని పారేశాను. ప్ర: మీరు ఫిట్నెస్ ట్రైనర్ అటగా? జ: ఫిట్‌నెస్‌లో 1 లెవల్ వరకూ ట్రైనింగ్ తీసుకున్నాను. 2వ లెవల్ ట్రైనింగ్ అవడానికి ఇష్టం కలగలేదు.అయితే ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందుతున్నాను.ఇప్పటికీ థాయ్‌ల్యాండ్‌కు ఎడాదిలో రెండు నెలలు శిక్షణ పొందుతుంటాను.అలగే కిక్బాక్స్, జూడో విద్యలు తెలుసు. జూడో లాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే అమ్మాయిలకు అత్యాచారాల భయం ఉండదు.అలాంటి అమ్మాయిల వద్దకు రావడానికి అబ్బాయిలు భయపడతారు. -
9న తెరపైకి భోగన్
ఎట్టకేలకు భోగన్ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. జయంరవి, హన్సిక జంటగా నటించిన మూడవ చిత్రం భోగన్ . ఇదే జంటతో ఇంతకు ముందు రొమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణ్ ఈ చిత్రానికి దర్శకుడు. అదే విధంగా తనీఒరవన్ జయంరవి, అరవిందస్వామి కలిసి నటిస్తున్న చిత్రం భోగన్ . నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా నిర్మాతగా మారి తన ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న రెండవ చిత్రం బోగన్ . డి.ఇమాన్ సంగీతాన్ని, సౌందర్‌రాజన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా రోజులైంది. గత డిసెంబర్లోనే చిత్రం విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.ఆ తరువాత జనవరి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.అదే తేదీన సూర్య నటించిన సీ–3(ఎస్–3 పేరు మారింది) చిత్రం తెరపైకి రానుండడంతో భోగన్ చిత్రాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించారు. ఇటీవల సరైన విజయాలు లేక వెనకపడిపోయిన నటి హన్సిక ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.ఇది మంచి విజయం సాధిస్తేనే తనకు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమ్మడికి ఇక్కడ చేతిలో ఒక్క చిత్రం లేదన్నది గమనార్హం. -
అభిమానుల మనసు గెలుచుకోవడమే ప్రధానం
అభిమానుల మనసు గెలుచుకోవడం డబ్బును మించిన సంతోషాన్నిస్తోందంటున్నారు నటి హన్సిక. బాలీవుడ్లో బాలతారగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ అనంతరం కోలీవుడ్‌లో క్రేజీ నాయకిగా ఎదిగారు. ఆదిలోనే విజయ్, ధనుష్, సూర్య, ఆర్య, జయంరవి వంటి స్టార్ హీరోలతో నటించి ముఖ్యంగా దర్శకుల నటిగా పేరు తెచుకున్నారు.అంతే కాదు చిన్న కుషూ్బగా గుర్తింపు పొందిన హన్సికకు ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలే ఉన్నాయి. అందులో ఒకటి జయంరవితో రొమన్స్ చేసిన బోగస్. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. మరో చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇకపోతే చాలా గ్యాప్ తెలుగులో ఒక చిత్రం చేస్తున్నారు. పాపులారిటీలోనూ, అధిక అభిమానులున్న నటిగానూ హన్సికనే టాప్ అట. ఈ తరం హీరోయిన్లు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను అధికంగా వాడుతున్నారు. ఆ మాధ్యమాల ద్వారా అభిమానులతో తమ భావాలను పంచుకోవడం, కొత్త చిత్రాల వివరాలను, ఫొటోలను పోస్ట్ చేయడం చేస్తున్నారు. అలా అధికంగా అభిమానుల ఫాలోయింగ్ ఉన్న నటిగా హన్సిక రికార్డు సృష్టించారు. ఈ అమ్మడికి 60 లక్షల మంది ఫేస్బుక్ అభిమానులున్నారు. దీనిపై హన్సిక మాట్లాడుతూ డబ్బు సంపాదించడం ముఖ్యం కాదని, అభిమానుల మనసులను గెలుచుకోవడం ప్రధానం అని పేర్కొన్నారు. తనకు 60 లక్షల మంది ఫేస్బుక్ అభిమానులుండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. -
అడవి పుత్రుడిగా జయంరవి
వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు జయంరవి. రోమియో జూలియట్, తనీఒరువన్, భూలోకం, మిరుధన్ వంటి సూపర్‌హిట్ చిత్రాల తరువాత జయంరవి నటిస్తున్న చిత్రం భోగన్ . హన్సిక నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తదుపరి జయంరవి ఏక కాలంలో రెండు చిత్రాలను చేస్తున్నారు. అందులో ఒకటి టిక్ టిక్ టిక్. దీనికి శక్తి సౌందర్‌రాజన్ దర్శకుడు. రెండో చిత్రాన్ని విజయ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయేషా సైగల్ నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఈ చిత్రం పేరు నిర్ణయించకుండానే చిత్రీకరణను జరపుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రానికి వనమగన్(అడవిపుత్రుడు)అనే టైటిల్‌ను నిర్ణయించారు. దేవి వంటి విజయవంతమైన చిత్రం తరువాత విజయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అంతే కాదు ఆయనే నిర్మాతగా తన థింక్బిగ్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి తిరు ఛాయాగ్రహణం, హారీ‹స్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పేరాన్మై చిత్రం తరువాత జయంరవి గిరిజన జాతికి చెందిన వాడిగా నటిస్తున్న చిత్రం వనమగన్. తమిళనాడులోని దట్టమైన అటవీ ప్రాంతలలోనూ, చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
గాయపడ్డ హీరో.. త్వరలో మళ్లీ షూటింగులకు
రాంచరణ్ హీరోగా నటిస్తున్న ధ్రువ సినిమాకు తమిళంలో ఒరిజినల్ వెర్షన్ చేసిన జయం రవి.. తన కొత్త సినిమా బోగన్ షూటింగులో గాయపడ్డాడు. మళ్లీ త్వరలోనే పని మొదలుపెడతానని అతడు చెప్పాడు. బోగన్ సినిమాలో ఒక కీలక సన్నివేశం షూటింగ్ సందర్భంగా గాయపడినప్పుడు జయం రవి భుజానికి తీవ్రగాయమైంది. ఆ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉంది. ''మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు. షూటింగ్ సందర్భంగా చిన్న గాయమైంది. మరికొద్ది రోజుల్లో మళ్లీ పని మొదలుపెడతా. అభిమానులే నా బలం'' అని రవి ట్వీట్ చేశాడు. ఇంతకుముందు జయం రవి నటించిన జాంబీ సినిమా మిరుదన్, అంతకుముందు 2015లో చేసిన తని ఒరువన్ రెండూ బ్రహ్మాండమైన హిట్ అయ్యాయి. బోగన్ సినిమాలో జయం రవి సరసన హన్సిక నటిస్తుండగా, వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రోమియో జూలియట్ దర్శకుడు లక్ష్మణ్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. Thank u for ur love and prayers. I'm doing well. A minor injury at shoot. Will resume work in a few days. U guys r my strength — Jayam Ravi (@actor_jayamravi) 22 October 2016 -
కమలహాసన్ టైటిల్లో జయంరవి
తమిళసినిమా: తనీఒరువన్,భూలోకం,మిరుదన్ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు జయంరవి. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ నటిస్తున్న ఈయన తాజాగా మూడు చిత్రాలకు కమిట్ అయ్యారు. వాటిలో రోమియో జూలియట్ చిత్రం ఫేమ్ లక్ష్మణన్ దర్శకతంలో మరోసారి నటిస్తున్న చిత్రం బోగన్. హన్సికనే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా తదుపరి మిరుదన్ వంటి విజయ వంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శక్తి సౌందర్రాజన్తో మరో చిత్రానికి జయంరవి రెడీ అవుతున్నారు. దీన్ని జపక్ ఇందోశ్ నిర్మించనున్నారు. బోగన్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జయంరవి ఈ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కాగా ఈ చిత్రానికి ఇంతకు ముందు భారతీరాజా దర్శకత్వంలో కమలహాసన్ నటించిన రోమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రం టిక్ టిక్ టిక్ టైటిల్‌ను నిర్ణయించారు. ఆ చిత్ర నిర్మాత అనుమతి పొందే ఈ టైటిల్‌ను తమ చిత్రానికి పెట్టినట్లు దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ తెలిపారు. కాగా కోలీవుడ్‌లో స్పేస్ నేపథ్యంలో రూపొందనున్న తొలి చిత్రంగా టిక్ టిక్ టిక్ ఉంటుందని ఆయన చెప్పారు. ఇక పోతే దీనితో పాటు జయంరవి దర్శకుడు విజయ్ కాంబినేషన్లో కూడా ఒక చిత్రం చేయనున్నారు. ఈ చిత్రం వినాయకచవితి సందర్భంగా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.