JC prabhakar reddy
-
మాధవీలతపై కేసు.. ‘జేసీ’ ఆదేశాలతోనే..?
సాక్షి,అనంతపురం: సినీ నటి మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత తనపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 353 కింద మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతోనే మాధవీలతపై కేసు నమోదు చేశారని తాడిపత్రి లో చర్చ జరుగుతోంది.గతంలో తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనూ మాధవీలత జేసీపై కంప్లైంట్ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకుగాను మాధవీలతకు జేసీ ఒక దశలో క్షమాపణలు కూడా చెప్పారు. అయినా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. -
జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం
-
దళిత సంఘం నేత రాంపుల్లయ్యను బెదిరిస్తున్న జేసీ ప్రభాకర్
-
తాడిపత్రిలో ఇంత దారుణమా..
-
సినీ నటి మాధవీలత ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
-
రెడ్‌బుక్ రాజ్యాంగంతో గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా?
-
నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా తాడిపత్రి కి వెళ్లి తీరుతా...
-
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఇటీవల చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని ఆరోపిస్తూ ఆమె మంగళవారం గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అవినాష్ మహంతికు లేఖ పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నటీమణులు, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పడం ఆమోదయోగ్యమైన ప్రవర్తనా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తనను ప్రభావితం చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులలో భయాన్ని, బాధను కలిగించాయని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు జేసీ పార్క్ వద్ద తరచుగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు హాజరుకావద్దని మాధవీలత సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి ఆమెపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సైబరాబాద్ కమిషనర్ కు మాధవీలత ఫిర్యాదు
-
నాది కూడా సీమ రకమే గుర్తుపెట్టుకో జేసీ.. మాధవీలత స్వీట్ వార్నింగ్
-
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ చాంబర్ లో మాధవీలత ఫిర్యాదు
-
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై( J. C. Prabhakar Reddy) ఫిల్మ్ ఛాంబర్లో నటి మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి(Siva Balaji) పిర్యాదు పత్రాన్ని ఆమె అందజేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని తన సోషల్‌మీడియాలో ఆమె పేర్కొన్నారు.లేఖలో మాధవీలత పేర్కొన్న అంశాలు'జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.మేము సినిమాల్లో నటిస్తే.. వాళ్లు సమాజంలో నటిస్తున్నారు: శివ బాలాజీ లేఖపై శివ బాలాజీ ఇలా స్పందించారు. 'మాధవీలత చాలా బాధతో ఉన్నారని అర్థమైంది. ఒక మహిళను బాధపెట్టడం ఎవరికీ మంచిది కాదు. ఒక పోస్టర్ చూసి అపార్థం చేసుకుని ఆమెపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో మంది నటీనటులు పొలిటిషియన్స్ అయ్యారు. కానీ ఏ పొలిటిషియన్ కూడా పేరున్న యాక్టర్ కాలేదు. మేము కెమెరా ముందే నటిస్తాం. రాజకీయ నాయకులు సమాజంలో కూడా నటిస్తారు. ఇండస్ట్రీ జోలికి రాజకీయ నాయకులు రావొద్దు. మాధవిలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం'. అని ఆయన అన్నారు.(ఇదీ చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా)సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద వ్యభి చారి అని, ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఆయన ఒక సందర్భంలో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.మాధవిపై జేసీ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు.బెదిరేది లేదని ఘాటుగానే మాధవి రియాక్షన్అయితే, జేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారని ఆమె గుర్తుచేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు.మాధవికి క్షమాపణలు చెప్పిన జేసీతన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. 'ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ'అని జేసీ అన్నారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. 'మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ..' కన్నీళ్లు పెట్టుకుంది. -
‘‘రేయ్.. నీ కథ చూస్తా!’’ జేసీ బెదిరింపులు వెలుగులోకి
అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు. దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిలిచినా మీటింగ్‌కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే.. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత! -
తాడిపత్రిలో సీఐ, దళిత నేత మధ్య చిచ్చుపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత
హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత (Madhavi Latha) బోరున ఏడ్చేసింది. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఎంతో ప్రయత్నించా.. కానీ, నేనూ మనిషినే! నా ఆత్మగౌరవంపై జరిగిన దాడి.. నేను పడ్డ బాధను వర్ణించే పదాలు లేవు. ఎవరో వస్తారని ఎదురుచూడలేదు!ప్రతి క్షణం వేదన అనుభవిస్తున్నాను. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం.. అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు, పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరో వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్నా.. నా పార్టీ (ప్రజల) కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. ఎవరి దగ్గరా రూపాయి తీసుకున్నది లేదు.. ఎవరికీ ద్రోహం చేసిందీ లేదు.. మోసం చేసిందీ లేదు.చదవండి: హీరో విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు?నాపై కక్షతో..కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. ఆడపిల్లగా ఎప్పుడూ సింపతీ గేమ్ ఆడలేదు. మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించలేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమించండి. మీ ప్రేమాభిమానం, ఆశీర్వాదాలు నాకు శక్తినిస్తాయి అని రాసుకొచ్చారు.ఏం జరిగింది?డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. జేసీ పార్కులో వేడుకలకు మహిళలు వెళ్లొద్దని సూచించారు. తిరుగుప్రయాణంలో అర్ధరాత్రివేళ ఏదైనా జరగడకూడనిది జరిగితే ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ మాధవీలతపై అసభ్య కామెంట్లు చేశారు. ఆమెను వ్యభిచారి అని వ్యాఖ్యానించారు. తెరపై కనిపించేవాళ్లంతా వ్యభిచారులే అనడం నీ కుసంస్కారానికి అద్దం పడుతోందని మాధవీలత ఫైర్ అయ్యారు. తర్వాత నోరు జారినందుకు జేసీ సారీ చెప్పారు. అయినా సరే మాధవీలతపై విమర్శల దాడి జరుగుతూనే ఉండటంతో తట్టుకోలేక ఇలా ఏడ్చేశారు.సినిమా..కాగా మాధవీలత.. నచ్చావులే సినిమాతో హీరోయిన్గా తెలుగుతెరకు పరిచయమైంది. తర్వాత ష్, స్నేహితుడా, ఉసురు, చూడాలని చెప్పాలని, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ఆంబాల అనే మూవీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. చివరగా మధురై మణికురవర్ (2021) అనే తమిళ మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Runs NGO ll (@actressmaadhavi) చదవండి: సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా -
నిన్న బూడిద.. నేడు కాంక్రీట్ పంచాయితీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నిన్నటికి నిన్న బూడిద కోసం కొట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు కాంక్రీట్ పంచాయితీలోనూ ఇరుక్కున్నారు. ఆర్టీపీపీ నుంచి సిమెంటు ఫ్యాక్టరీలకు సరఫరా చేసే ఫ్లైయాష్ కోసం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నానా యాగీ చేసి చివరకు పార్టీ నుంచి ఎలాంటి సహకారమూ లేకపోవడంతో సర్దుకున్నారు. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ‘కాంక్రీట్’ కంపెనీని చేజిక్కించుకోవడానికి ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిoచడం చర్చనీయాంశమైంది. ప్లాంటు నాకు ఇచ్చేయాలి.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం మక్కాజిపల్లి తండా వద్ద ఆర్ఎంసీ (రెడీమిక్స్ కాంక్రీట్) ప్లాంటు ఉంది. దీని నిర్వాహకులు కొన్నేళ్లుగా చిన్న చిన్న ఆర్డర్లు తెచ్చుకుని నడుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఓ మంత్రి కన్ను ఈ ప్లాంటుపై పడింది. ‘నీకు ఎంతో కొంత ఇస్తా.. ప్లాంటు ఇచ్చేసి వెళ్లిపో’ అంటూ ఓనర్‌ను మంత్రి బెదిరించడం మొదలుపెట్టారు. ప్లాంటు యజమాని ప్రాధేయపడినా మంత్రి కనికరించలేదు. ఇచ్చేసి వెళ్లిపోవాల్సిందేనని కరాఖండిగా చెప్పారు. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ప్లాంటుకు ముడిసరుకు సరఫరా చేసే కంపెనీలకు ఫోన్ చేసి.. సరుకు ఇవ్వొద్దని, లారీలు తిప్పొద్దని హుకుం జారీ చేశారు. ముడిసరుకుతో వస్తున్న లారీలను మంత్రి అనుచరులు నిలిపివేశారు. తమ ప్లాంటుకు వచ్చే లారీలను ఆపుతున్నారంటూ స్థానిక కియా పోలీస్ స్టేషన్లో యజమాని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మంత్రి బెదిరింపులు పెరిగిపోవడంతో ఆ ప్లాంటు యజమాని విధిలేని పరిస్థితుల్లో మంత్రితో తీవ్ర రాజకీయ విభేదం ఉన్న అదే ప్రాంతానికి చెందిన మరో టీడీపీ ప్రజాప్రతినిధిని సంప్రదించారు. ఆ ప్రజాప్రతినిధికి ప్లాంటులో 50 శాతం భాగస్వామ్యం కల్పిస్తూ అగ్రిమెంటు చేసుకున్నారు. దీంతో మంత్రి వెనక్కి తగ్గినట్లు సమాచారం. చిన్న పరిశ్రమలనూ వదలడం లేదు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అన్ని వ్యాపారాలు, మైన్లు, పరిశ్రమలను చేజిక్కించుకునేందుకు వాటి యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలనూ వదలడం లేదు. గుడ్‌విల్, కమీషన్లు ఇవ్వాలని, లేదంటే వాటిని అప్పగించి వెళ్లిపోవాలంటూ వేధిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినా, అపార్ట్మెంట్లకు పునాది వేసినా గద్దల్లా వాలిపోతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో అనుమతులకూ స్థానిక ఎమ్మెల్యేకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆరు నెలలుగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. -
మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
మాధవీలతకు ‘జేసీ’ బహిరంగ క్షమాపణ
సాక్షి,అనంతపురం:తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. మాధవీలతపై జేసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జేసీ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో మాధవీలతను ఆయన క్షమాపణలు కోరారు.‘ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ’అని జేసీ అన్నారు. అయితే బీజేపీ నేతలపై మాత్రం జేసీ విమర్శలు కొనసాగించారు.బీజేపీ నేతలంతా ఫ్లెక్సీ గాళ్లు అంటూ మరోసారి ఫైరయ్యారు జేసీ. పవర్ ఉందని మంత్రి సత్యకుమార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తాను మీరకున్నంత నీచున్ని కాదన్నారు.పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. నేను జోలి పడితే కోట్ల రూపాయలు ఇచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీడియా ఎదుట నోట్ల కట్టలు విసురుతూ జేసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: తుస్సుమన్న బాబు,పవన్ హామీ -
జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలపై మాధవీలత రియాక్షన్
-
ఆమెతోనా మాకు నీతులు చెప్పించేది
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం టవర్ క్లాక్ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా.. ఆయన సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె పెద్ద వ్యభి చారి అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లొద్దన్నందుకు..నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆయనతో పాటు టీడీపీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున కూడా పరుష పదజాలంతో మాట్లాడారు. మాధవీలతకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ అశ్లీలంగా నటించిందంటూ వ్యాఖ్యానించారు.మీరు థర్డ్ జెండర్ కంటే అధ్వానం..జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీని, దాని అనుబంధ సంస్థలనూ వదల్లేదు. ‘మాధవీలత బతుకుదెరువు కోసం ఏదో పాట్లు పడుతోంది, పడనివ్వండి. ఆమె మాకు నీతులు చెప్పకూ డదు. భజరంగదళ్, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్.. ఇలాంటి వాళ్లా నన్ను బెదిరించేది? వాళ్లకంటే థర్డ్‌జెండర్ (ట్రాన్స్‌జెండర్)లు మేలు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక్కోలేరు.. సిగ్గులేని నా కొ...కల్లారా అంటూ ఫైర్ అయ్యారు. తన బస్సును కాల్చిన తర్వాత ఆ వేడికి కరెంటు వైర్లు పడ్డాయని.. కానీ, షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారని, అలాగే రాసుకోండని జేసీ అన్నారు. తన వర్గం మహిళలతో మాధవీలత పైనే తాడిపత్రి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు.జేసీకి మతిపోయిందేమో..ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డికి వయసు రీత్యా మతి ఏమైనా పోయిందేమోనని, ఒకసారి చూపించుకోవాలని బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు సూచించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ మహిళా నేతలపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమిలో ఉండి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఇది సరైంది కాదని హితవు పలికారు.కేసులకు భయపడను : మాధవీలతజేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఇలాగైతే తాడిపత్రి నుంచి తెర మీదకు ఎవరూ రాకూడదన్నట్లు ఉందన్నారు. తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు. -
జేసీ వ్యాఖ్యలపై మాధవీలత రియాక్షన్
సాక్షి, అనంతపురం: సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒక వ్యభిచారి అని.. తనను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలపై మాధవీలత స్పందిస్తూ.. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.సినిమాల్లో నటించే వారంతా వ్యభిచారులు అనుకోవడం జేసీ మూర్ఖత్వం. తండ్రి జేసీ అనుచిత వ్యాఖ్యలను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఎందుకు ఖండించరు. జేసీ ప్రభాకర్ రెడ్డి వయస్సుకు గౌరవం ఇస్తా.. అసభ్య భాషకు కాదు. నేను ఎవరికీ భయపడను. నన్ను కిడ్నాప్ చేసి.. హత్య చేస్తారా?. రాజ్యాంగ బద్ధంగా.. మహిళల రక్షణ కోసం మాట్లాడితే తప్పా?. జేసీ ప్రభాకర్ రెడ్డి కుసంస్కారి.. ఒళ్లంతా విష నాలుకలు కలిగిన వ్యక్తి’’ అంటూ మాధవీలత వ్యాఖ్యానించారు.కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదీ చదవండి: పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!ఇక, అంతకుముందు ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: బాబుకది షరా మామూలే! -
తాడిపత్రిలో ఆగని జేసీ కుటుంబ అరాచకాలు
-
గాంధీనగర్ లో కాశీ మనోజ్ ను కిడ్నాప్ చేసిన దుండగులు
-
జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారుల ఫిర్యాదు
-
YSRCP నేత జావెద్ ఇంటి వద్ద జేసీ వర్గీయుల వీరంగం
-
జేసీ బ్రదర్స్ కి పెద్దారెడ్డి వార్నింగ్
-
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేతిరెడ్డి ఫైర్
సాక్షి,అనంతపురం:మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డి మంగళవారం(డిసెంబర్3)మీడియాతో మాట్లాడారు.‘జేసీ వర్గీయులు తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా,పేకాట ఆడిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలపై దాడులు తీవ్రమయ్యాయి. బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. నన్ను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నన్ను వెళ్లనీయకపోయినా పర్వాలేదు కానీ వైఎస్సార్సీపీ నేతలపై దాడులు ఆపాలి. అధికారంలో ఉన్నారని టీడీపీ ఏమి చేసినా చెల్లుతుందంటే చూస్తూ ఊరుకోం’అని పెద్దారెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: సోషల్‌మీడియా కార్యకర్తలకు ప్రాణహాని -
జేసీ గుండాయిజం.. భయపడేదేలే అంటున్న వైఎస్సార్సీపీ నేతలు
-
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు అనంత వెంకటరామిరెడ్డి కౌంటర్
-
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదు
-
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య బూడిద గొడవ
-
చంద్రబాబు వద్ద ‘బూడిద’ పంచాయితీలో ట్విస్ట్
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య బూడిద గొడవ చివరికి చంద్రబాబు వద్దకు చేరింది. ఆదినారాయణరెడ్డికి వ్యతిరేకంగా ఎస్పీకి జేసీ ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. జేసీ లేఖ నేపథ్యంలో కూటమిలో ప్రకంపనలు సృష్టించగా.. పంచాయితీ తేల్చడానికి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు పిలిపించారు. అయితే, చంద్రబాబుతో భేటీ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.‘‘వెట్ డ్రై యాష్ అనేది ఉచితం. పీఎంఈజీపీలో తీసుకుపోతామని అంటాం. ఈ మాత్రం దానికే జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్ద లేఖ రాశారు. లెటర్ రాసిన వాడు స్వయంగా రావాలి కదా? ఎందుకు రాలేదు. జ్వరమో.. ఇంకేదో నాకు తెలియదు...బీజేపీ, టీడీపీ సమస్య కాదు ఇది. స్థానికత సమస్య ఇక్కడ ఉంది. అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తన ఏరియాలో ఉంది కనుక జెసీ ప్రభాకర్‌రెడ్డి అడుగుతున్నాడు. సీఎం నిర్ణయం తీసుకుంటారు. ఆయన చెప్పినట్లు వింటాం. జేసీ దివాకర్‌రెడ్డిది ఏమైనా రాజరికమా?. కాంగ్రెస్ నుంచి ఆయన టీడీపీకి వచ్చాడు.. నేను టీడీపీ నుంచి బీజేపీకి వచ్చా.. కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం సరికాదు’’ అని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ! -
YSRCP నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతల స్కెచ్
-
బూడిదపై చల్లారని రగడ
ఎర్రగుంట్ల/కొండాపురం: వైఎస్సార్ జిల్లాలోని డాక్టర్ ఎంవీఆర్‌ఆర్ ఆర్టీపీపీ నుంచి వెలువడుతున్న బూడిద (ఫ్లైయాష్) కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య రాజుకున్న రగడ చల్లారలేదు. ఆర్టీపీపీలో బుధవారం పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. కలమల్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ యామిని తెలిపారు. మరోవైపు.. తాడిపత్రి నుంచి బూడిద కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన ఆరు లారీలు వచ్చాయి. పోలీసులు వీటిని ఆర్టీపీపీ 600 మెగావాట్ల యూనిట్ వద్దే నిలిపేశారు. డ్రైవర్లను దించి లోడింగ్‌కు అనుమతిలేదని వారికి పోలీసులు తెలిపారు.సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఉత్కంఠ..మరోవైపు.. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండాపురం మండలంలోని తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్‌రెడ్డి మండలంలోని కె.సుగుమంచిపల్లె చెక్‌పోస్టు వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆర్టీపీపీకి వస్తారేమోనని సాయంత్రం వరకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఆయన రాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.బకాయిలిచ్చి 50 శాతం వాటా కల్పించాలి.. ఆర్టీపీపీలో ఉన్న యాష్ పాండ్ నుంచి వస్తున్న బూడిద సరఫరాకు సంబంధించి తమకు రావాల్సిన బకాయిలను చెల్లించి, సరఫరాలో 50 శాతం వాటా కల్పించాలని ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. యాష్‌పాండ్‌లోని బూడిదను తాడిపత్రిలోని ఎల్ ఆండ్ టీ ఫ్యాక్టరీకి నేరుగా సరఫరా చేసేవాళ్లమన్నారు. అప్పుడు ఫ్యాక్టరీ వారు సకాలంలో బిల్లులు ఇచ్చేవారన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆ ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకోవడంతో ఆయనకు బూడిదను సరఫరా చేశామన్నారు. అయితే, ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదన్నారు. సుమారు రూ.80 లక్షలు బకాయిలు ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని.. అలాగే సరఫరాలో 50 శాతం వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తమ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డికి తెలియజేశామన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి లారీలకు లోడింగ్ చేయబోమని ఆయన తెగేసి చెప్పారు. -
జమ్మలమడుగులో టెన్షన్ టెన్షన్
-
జేసీ, ఆది వర్గాల మధ్య వార్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి వైఎస్సార్ జిల్లా: జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది. ఆర్టీపీపీ వద్దకు జేసీ వాహనాలను ఆది వర్గం అనుమతించడం లేదు. దీంతో తాడిపత్రి సిమెంట్ కంపెనీల వద్ద జమ్మలమడుగు వాహనాలను అడ్డగించారు. జమ్మలమడుగు వాహనాలకు లోడింగ్ చేయొద్దని జేసీ వర్గం హుకుం జారీ చేసింది. ఆర్టీపీపీ వద్ద జేసీ వాహనాలకు లోడింగ్ చేయొద్దని ఆది వర్గం చెబుతోంది. ఇరువురి నేతల మధ్యలో ట్రాన్స్పోర్ట్ యాజమానులు నలిగిపోతున్నారు. జిల్లా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీపీపీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.కాగా, అధికారం కోసం పరస్పరం సహకరించుకున్నా ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. మొన్న ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సవాల్ విసిరింది. ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నల్లోనే జరగాలంటూ ఇరు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి.తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డు కోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి సహించేది లేదని.. తాను అదానీలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతోపాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం కూడా తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్ పోస్టుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. -
ప్లై యాష్ కాంట్రాక్టుపై ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు
-
అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం కోసం పరస్పరం సహకరించుకున్నా ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. మొన్న ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సవాల్ విసిరింది. ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నల్లోనే జరగాలంటూ ఇరు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి. తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డు కోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి సహించేది లేదని.. తాను అదానీలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతోపాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్ పోస్టుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.⇒ వైఎస్సార్ కడప జిల్లాలోని ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్) నుంచి నిత్యం 3,926 టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతుండగా 25 ప్రైవేట్ కంపెనీలు, 15 సిమెంటు పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు టన్ను రూ.550 చొప్పున, సిమెంట్ పరిశ్రమలకు టన్ను రూ.410 చొప్పున సరఫరా అవుతోంది. అయితే రవాణా మాత్రం కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుంది. తాడిపత్రిలో ఉన్న ఎల్ అండ్ టీ సిమెంట్ పరిశ్రమకు జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన ట్యాంకర్లు ఫ్లైయాష్ సరఫరా చేస్తున్నాయి. అయితే సిమెంట్ పరిశ్రమలకు తామే ఫ్లైయాష్ సరఫరా చేస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. ఈ క్రమంలో తాడిపత్రికి కూడా సరఫరా చేసేందుకు సన్నాహాలు చేశారు. అందుకు అందుకు నిరాకరించిన జేసీ తమ లారీల ద్వారానే తరలిస్తామంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జేసీ లారీలను నాలుగు రోజుల క్రితం అడ్డగించారు.⇒ ‘ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ సరఫరాను అడ్డుకుంటే తాడిపత్రికి వాళ్ల లారీలు వచ్చి వెళ్తాయా? తమాషాలు చేస్తున్నారా? ఎలా అడ్డుకుంటారో చూద్దాం. నేనే వస్తున్నా...’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించడంతో అప్రమత్తమైన పోలీసులు కొండాపురం మండలం సుగమంచుపల్లె నుంచి కలమల్ల వరకూ మూడు చోట్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కలమల్ల ఆర్టీపీపీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. జేసీ తన వాహనాలతో వస్తే అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం సిద్ధం కావడంతో ఉదయం ఉద్రిక్తత నెలకొంది.మొన్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌పై కూడా..అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు సివిల్ పనులను చేస్తున్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు తాజాగా దాడి చేయడం తెలిసిందే. కాంట్రాక్టు పనులన్నీ తామే చేస్తామని డిమాండ్ చేయడంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. తాజాగా ఫ్లైయాష్ సరఫరా విషయంలో రగడ మొదలైంది. ఆదాయ మార్గాలపై ఆదినారాయణరెడ్డి వర్గం కన్నేసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆర్టీపీపీ నుంచి సరఫరా చేసే ఫ్లైయాష్కు ప్రతి నెలా ఒక్కో లారీకి రూ.లక్ష కమీషన్ ముట్టజెప్పనున్నట్లు సమాచారం. ఎన్ని వాహనాలు తిరిగితే అంత కమీషన్ లభించనుంది. దీంతో రవాణాపై ఇరువర్గాలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదాయాన్ని వదులుకునేందుకు అటు జేసీ ప్రభాకరరెడ్డి, ఇటు ఆదినారాయణరెడ్డి వర్గం సిద్ధంగా లేదు.ఆర్టీపీపీలో పోలీసులకు సూచనలిస్తున్న పోలీసు అధికారులు అదానీలా ఊరుకోను– ఎస్పీకి జేసీ లేఖఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ తరలించే తమ వాహనాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్‌రెడ్డి అడ్డుకుంటే సహించేది లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు కడప ఎస్పీకి మంగళవారం ఆయన లేఖ రాశారు. అక్టోబరు 15న ఆర్టీపీపీ వద్ద తమ వాహనాలను అడ్డుకోవడంపై ఎస్పీ, జమ్మలమడుగు ఎస్డీపీఓల దృష్టికి తెచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. భూపేష్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో తాము ఈనెల 23న కడప నుంచి వచ్చే సిమెంటు, ఇసుక అక్రమ రవాణా వాహనాలను నిలిపి వేసినట్లు చెప్పారు. కడప ఎస్పీ విజ్ఞప్తి మేరకు ఆ రోజు వాటిని వదిలి వేశామన్నారు. ఈనెల 25 నుంచి ఫ్లైయాష్ లోడింగ్‌కు తమ వాహనాలను అనుమతిస్తామని తాడిపత్రి రూరల్ ఇన్స్పెక్టర్ హామీ ఇచ్చారన్నారు. అయినా కూడా ఒక రోజు అదనంగా గడువు ఇచ్చామన్నారు. బుధవారం నుంచి లోడింగ్‌కు తమ వాహనాలు ఆర్టీపీపీకి వెళతాయని, ఈ దఫా కూడా అడ్డుకుంటే తేలికగా తీసుకోబోమని స్పష్టం చేశారు. తాము రాత్రికి రాత్రే రాజకీయ నాయకులుగా అవతరించలేదన్నారు. తమ కుటుంబం 1932 నుంచి రాజకీయాల్లో కొనసాగుతోందన్నారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారన్నారు. ఈ దఫా తాము కచ్చితంగా ప్రతిస్పందిస్తామని, ముందుగానే ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే బీజేపీలో చేరారని, వైఎస్సార్ సీపీ హయాంలో తనపై 95 అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. -
ఆటోలను నిషేధించాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి,అనంతపురం:ఆటోలపై టీడీపీ సీనియర్ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిషేధించాలని జేసీ డిమాండ్ చేశారు.అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లిలో శనివారం(నవంబర్ 23) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందడంపై జేసీ స్పందించారు.‘ఆటోలను నిషేధించాలి. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే. డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఆటోల వల్లే ప్రతి నెలా 60 మంది చనిపోతున్నారు. తలగాసిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా సరిపోదు. ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఈ విషయం చంద్రబాబునాయుడుకు అధికారులు చెప్పాలి’అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: అసెంబ్లీలో ఆ విషయం మర్చిపోయావా.. అఖిలప్రియా.. -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
మద్యం షాపు నిర్వాహకులకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
-
జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం షాపు నిర్వాహకులు తనకు 35 శాతం కమిషన్ ఇవ్వాలని హుకూం జారీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే పేకాట, జూద కేంద్రాల నుంచి 15 శాతం, మరో 20 శాతం పెట్టుబడి వాటాగా ఇవ్వాలని హెచ్చరించారు.కమిషన్ల రూపంలో వచ్చే డబ్బును తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తానన్న జేసీ.. తాడిపత్రి నియోజకవర్గంలో తన ప్రత్యర్థులు ఊరు విడిచి పోవాల్సిందేనని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. జేసీ లిక్కర్ షాపు నిర్వహాకులకు, ప్రత్యర్థులకు బహిరంగంగా హెచ్చరికల జారీ చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ఇలా తండ్రే కాదు ఆయన కుమారుడు సైతం అస్మిత్‌రెడ్డి సైతం వ్యహరిస్తున్నారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మా రూటే సపరేటుఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు ఒకరకం.. తాడిపత్రి ఒక్కటీ మరో రకంగా మారింది. ‘మేమే రాజులం, మేమే మంత్రులం.. మేము రాసిందే రాజ్యాంగం’ అనే రీతిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనా, ప్రత్యర్థి పారీ్టలోని నాయకులపైనా దాడులు చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు పెట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇసుక అక్రమాలపై కావాలనే రాద్ధాంతం.. అధికారం చేతిలో ఉందికదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ‘25 మంది ఇసుక తోలేది మా వాళ్లే.. మీరందరూ ఇసుక తోలడం మానుకోండి. లేదా నాకు దూరమవుతారు’ అంటూ ఇటీవల ప్రభాకర్‌రెడ్డి వీడియో సందేశాలు విడుదల చేశారు. అయితే, జేసీ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అందులో మరో కోణం అవగతమవుతుంది. తన వర్గం నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను నిలిపివేయించి తానే సొంత వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగించాలన్న మర్మం బయటపడుతుంది. జిల్లాల వారీగా చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టులు తయారు చేయిస్తోందన్న సమాచారం అందడంతోనే డ్రామాలు ఆడుతున్నారన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. పోలీసుల్లో అసంతృప్తి.. తాడిపత్రి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులు పట్టుకోగా.. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వెంటనే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు కట్టాలంటూ దురుసుగా వ్యవహరించారు. ఎప్పుడు కేసులు కట్టాలో తనకు తెలుసునని సీఐ చెప్పగా.. ఆయనను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఐను వెనకేసుకు రావాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించి, సీఐతో ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పించారు. నిజాయితీగా పనిచేసే ఓ సీఐ పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎస్పీ స్థాయి వ్యక్తి క్షమాపణలు చెప్పించడమేంటని కిందిస్థాయి పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇదే క్రమంలో.. తాను ఏ తప్పూ చేయలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే క్షమాపణలు చెప్పానని సీఐ పేర్కొనడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డంకులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా దాడులు చేయిస్తున్నారంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇటీవల ఎన్నికల పోలింగ్ రోజు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డిలు ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ బెయిలొచ్చింది. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లగా తన అనుచరులతో దాడులు చేయించారు. కందిగోపుల మురళి అనే వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయడానికి అధికారులే రావడం లేదు.. జేసీ కుటుంబం దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. తాడిపత్రి తహసీల్దార్‌గా వెళ్లిన ఈశ్వరమ్మ కొన్ని రోజులకే తానక్కడ పనిచేయలేనంటూ తిరిగి వచ్చేశారు. తాడిపత్రి టౌన్‌కు ఎస్ఐ ఉన్నా అటాచ్డ్ కింద పెదపప్పూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ లేరు. తమకు ఎప్పుడు బదిలీ వస్తే వెళ్లిపోదామా అన్న ఆలోచనలో రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు. మైనింగ్, రెవెన్యూ, ఆరోగ్య.. ఇలా ఏ శాఖ అధికారులైనా తాడిపత్రిలో పనిచేసేందుకు జంకుతున్నారు. పోలీసులన్నా, అధికారులన్నా తన కింద గుమస్తాలే అన్న రీతిలో జేసీ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది: పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: తనకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ ఎస్పీ జగదీష్ సహకారంతోనే జేసీ కుట్రలు చేస్తున్నారని.. ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటిదాకా పలుసార్లు తానను చంపేందుకు జేసీ ప్రయత్నించారని పెద్దారెడ్డి అన్నారు.‘‘మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని 2006లో చంపారు. అదే పద్ధతిలో నన్ను హతమార్చేందుకు జేసీ కుట్రలు చేస్తున్నారు. జేసీ గూండాలకు ఎస్పీ జగదీష్ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. నాపై ఇప్పుడు మూడు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ కేసులు ఎందుకు నమోదు చేశారో ఎస్పీ జగదీష్ సమాధానం చెప్పాలి’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.కాగా, యాడికి మండలంలో జేసీ ముఠా బరితెగించింది. స్థానికులను భయకంపితులను చేసింది. చంపుతామంటూ పలువురు వైఎస్సార్ సీపీ నేతలను బెదిరించడమే కాకుండా ఓ నాయకుడిని కిడ్నాప్ చేసింది. యాడికి మండలంలో త్వరలో 4 వైన్ షాపులు ఏర్పాటు కానున్నాయి. వాటికి సంబంధించి లైసెన్సుల కోసం యాడికి మండల కేంద్రం నుంచి ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, వైఎస్సార్ సీపీ నాయకుడు బాలిరెడ్డి, రాయలచెరువు గ్రామానికి చెందిన జానా దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన ముఠాను ఉసిగొల్పారు.ఆయన ఆదేశాలతో గురువారం మధ్యాహ్నం టీడీపీ నేత, మాజీ ఎంపీపీ రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్ రుద్మనాయుడు, పరిమి చరణ్ ఆధ్వర్యంలో వంద మందితో కూడిన పచ్చ ముఠా రంగంలోకి దిగింది. యాడికి మండలకేంద్రానికి చేరుకుని ఉప సర్పంచు కాసా చంద్రమోహన్ ఇంటి తాళాలను పగుల గొట్టింది. వైఎస్సార్ సీపీ నాయకుడు బాలిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆయనతో పాటు కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది.ఇదీ చదవండి: మద్యం షాపులన్నీ నాకే కావాలి..!మద్యం షాపు కోసం చేసిన దరఖాస్తును విరమించుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్ ఓ టీ స్టాల్ వద్ద ఉన్నాడని తెలుసుకుని అక్కడికే వెళ్లింది. ‘ఒరేయ్ నీకు ఎన్ని గుండెల్రా.. మా ప్రభుత్వంలో మద్యం షాపుల కోసం టెండర్లు వేస్తావా.. వాటిని విరమించుకోకపోతే చంపుతాం’ అంటూ బెదిరించింది. టెండర్ రసీదులు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఇంటి వద్ద ఉన్నాయని చెబుతుండగానే స్కార్పియో వాహనంలో రామ్మోహన్‌ను పచ్చ నేతలు ఎక్కించుకెళ్లారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎంపీపీ బొంబాయి ఉమాదేవి విషయాన్ని తాడిపత్రి డీఎస్పీ, జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి తెలియజేశారు. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన యాడికి సీఐ ఈరన్న తన సిబ్బందితో టీడీపీ శ్రేణులను వెంబడించారు. రాయలచెరువు వద్ద వారి వాహనాన్ని ఆపి రామ్మోహన్‌ను కాపాడారు. కాగా, రామ్మోహన్ కిడ్నాప్‌నకు గురయ్యారనే సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బొంబాయి రమేష్ నాయుడు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. -
మద్యం షాపులన్నీ నాకే కావాలి..!
సాక్షి టాస్‌్కఫోర్స్, సాక్షి, రాజమహేంద్రవరం : ‘రేయ్..! ఇతరులు ఎవరైనా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్నారో జాగ్రత్త..! ఊరుకునే ప్రసక్తే లేదు. అన్నీ నాకే కావాలి. నా మాట కాదని ఎవరన్నా దరఖాస్తు చేశారో వారి అంతు చూడండి..!’ అనుచర గణానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలివీ!! ఆయన కనుసైగ చేయడమే ఆలస్యం.. తాడిపత్రి నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ఓ వైఎస్సార్ సీపీ నేతను టీడీపీ శ్రేణులు కిడ్నాప్ చేయగా మరో నేత ఇంటిపై దాడికి తెగబడి బెదిరింపులకు దిగాయి. ఒకపక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు పోలీసుల ద్వారా సామ, దాన, దండోపాయాలను కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ‘‘అసలు మీరు ఈ టెండర్లు ఎందుకు వేస్తున్నట్లు? సరే టెండర్లు దక్కించుకున్నారే అనుకోండి. టీడీపీ నేతలను కాదని అసలు మద్యం దుకాణాలను మీరు నిర్వహించగలరా? అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు మీపై కేసులు నమోదవుతాయి. ఎక్సైజ్ దాడులూ జరుగుతాయి. ఏదో ఒక కేసు బుక్ చేసి మిమ్మల్ని మూసి వేయడం ఖాయం. ఇదంతా ఎందుకొచి్చన గొడవ? మద్యం టెండర్ల నుంచి మీకు మీరే మర్యాదగా తప్పుకోండి..!’’ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇతర పార్టీల నేతలకు స్థానిక ఎస్సై, సీఐల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ఇదీ!! వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్ తాడిపత్రిలో 9 మద్యం షాపులు, రూరల్ పరిధిలో 3, యాడికిలో 4, పెద్దవడుగూరులో 3, పెద్దపప్పూరులో ఒక షాపు కలిసి మొత్తం 20 మద్యం దుకాణాలు తమ ఆదీనంలో ఉండాలని జేసీ ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన ఓ నేత 20 దుకాణాలకు దరఖాస్తు వేసేందుకు ప్రయత్నించగా ఆయన్ను విరమించుకునేలా చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు వేసిన ఇతర నేతలపై జేసీ వర్గం దౌర్జన్యాలకు తెగబడింది. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను స్కారి్పయోలో కిడ్నాప్ చేసి తరలించారు. ఎంపీపీ ఉమాదేవి ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తేవడంతో యాడికి సీఐ ఈరన్న టీడీపీ శ్రేణుల నుంచి రామ్మోహన్‌ను విడిపించి తీసుకొచ్చారు. యాడికిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, యాడికి ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ ఇంటి తాళాలను టీడీపీ మూకలు గురువారం పగులగొట్టి బెదిరింపులకు దిగాయి. వైఎస్సార్ సీపీకి చెందిన మరో నాయకుడు బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి దరఖాస్తు చేయవద్దని బెదిరించారు. దరఖాస్తుకు నేడే చివరి రోజు రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గురువారం నాటికి 65,424 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,396 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం చివరి రోజు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు 70 వేలు దాటవచ్చని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 12, 13వ తేదీల్లో దరఖాస్తులను పరిశీలించి 14న లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. దరఖాస్తులకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టీడీపీ సిండికేట్ బెదిరింపులు తీవ్రమయ్యాయి. టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న వ్యాపారులను టార్గెట్ చేసి నయాపైసా పెట్టుబడి పెట్టకుండా వాటా, గుడ్ విల్ ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. తమను కాదంటే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. » రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు తట్టుకోలేక దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. రూరల్ నియోజకవర్గంలో 11 షాపులకు గానూ బుధవారం వరకు 150 దరఖాస్తులే అందాయి. సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఇతరులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థి సంఘం నేతలను సైతం రంగంలోకి దించారు. నియోజకవర్గంలో 28 షాపులు ఉండగా బుధవారానికి 250 దరఖాస్తులు మాత్రమే అందాయి.» నిడదవోలులో గతంలో మద్యం వ్యాపారం చేసిన టీడీపీ సీనియర్ నేత తన అనుచరులతో టెండర్లు వేయిస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు తమకూ షాపులు ఇవ్వాలంటున్నారు. మంత్రి కందుల దుర్గేష్ అనుచరులు 20 శాతం వాటా ఇవ్వాలని టెండర్లు వేసిన వ్యాపారులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. â రాజానగరం ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులతో నియోజకవర్గంలో 13 దుకాణాలకు 206 టెండర్లు దాఖలు కాగా వీరంతా దాదాపుగా కూటమి నేతలే కావడం గమనార్హం. » కొవ్వూరులో టీడీపీ సీనియర్ నేత అనుమతిస్తేనే టెండర్లు దాఖలవుతున్నాయి.మద్యంపై ‘రౌండ్ ఫిగర్’ బాదుడుఅదనపు ప్రివిలేజ్ ఫీజు పేరిట భారీ దోపిడీకి సిద్ధం» ‘‘మొత్తం రూ.3,850 అయింది. రౌండ్ ఫిగర్ చేస్తే రూ.5 వేలు అవుతుంది..!’’ ఖలేజా సినిమాలో హీరో డైలాగ్!! » ‘‘అదేంటీ.. రౌండ్ ఫిగర్ రూ.4 వేలు కదా..?’’ హీరోయిన్ సందేహం!! » ‘‘రూ.5 వేలులో ఎక్కువ సున్నాలున్నాయి కదా..! అందుకు..’’ హీరో సమర్థన !! అదే రౌండ్ ఫిగర్ సూత్రాన్ని సీఎం చంద్రబాబు సర్కారు తన విధానంగా చేసుకుంది. ఇప్పటికే టీడీపీ సిండికేట్ ద్వారా ప్రైవేట్ మద్యం దుకాణాలతో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో ఎత్తుగడ వేసింది. మద్యం బాటిళ్ల ధరలను సమీపంలోని పదుల సంఖ్యకు చేరుస్తూ రౌండ్ ఫిగర్ చేయాలని నిర్ణయించింది. రూ.100 కంటే అధికంగా ఉన్న మద్యం బాటిళ్ల ధరలను తరువాత వచ్చే దశాంశ మానానికి మార్చి రౌండ్ ఫిగర్ చేసి ధర నిర్ణయిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు ఉదాహరణను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓ మద్యం బాటిల్ ధర రూ.150.50గా ఉంటే... ఆ బాటిల్ ధరను రూ.160గా నిర్ణయిస్తారు. బాటిల్ ధర రూ.272గా ఉంటే... దాన్ని రూ.280 చేస్తారు. ఈ దందాకు ‘అదనపు ప్రివిలేజ్ ఫీజు’ అని నామకరణం చేస్తూ ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిలక్కొట్టుడు కాదు.. భారీ బాదుడే ఇదేదో చిల్లర సమస్య లేకుండా చేసే చిలక్కొట్టుడు వ్యవహారం కానే కాదు! అదనపు ప్రివిలేజ్ ఫీజు ముసుగులో భారీ దోపిడీకి టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కాగా స్కెచ్ వేసింది. టీడీపీ హయాంలో 2018 నాటి లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే.. ఆ ఏడాది 3.84 కోట్ల లిక్కర్ కేసులు, 2.77 కోట్ల బీరు కేసులు విక్రయించారు. కేసుకు 48 లిక్కర్ బాటిళ్ల చొప్పున మొత్తం 184.32 కోట్ల లిక్కర్ బాటిళ్లు... కేసుకు 12 బీరు బాటిళ్ల చొప్పున మొత్తం రూ.33.24 కోట్ల బీరు బాటిళ్లు విక్రయించారు.వాటిలో 90 శాతం బాటిళ్ల ధర రూ.100 కంటే అధికంగానే విక్రయించారు. ప్రస్తుతం 180 ఎంఎల్ చీప్ లిక్కర్‌ను రూ.99కి విక్రయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ ఒక్క కేటగిరీ మినహా మిగిలిన అన్ని బ్రాండ్ల ధర రూ.వంద కంటే అధికంగానే ఉంటుంది. ఆ ప్రకారం ఒక్కో బాటిల్‌పై రూ.2 నుంచి రూ.9 వరకు అదనంగా దోపిడీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుతంత్రం పన్నింది. ఆ లెక్కన ఏడాదికి ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడతారన్నది అంచనాలకు అందడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వమా.. మజాకానా! -
జేసీ వర్గీయుల దాష్టీకం..లిక్కర్ షాపు కోసం కిడ్నాపులు
సాక్షి,అనంతపురం: ఏపీలో లిక్కర్ షాపుల కోసం టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను చేజిక్కించుకునేందుకు పచ్చనేతలు అక్రమాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్‌నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు ఏకంగా కిడ్నాప్‌లు చేసేందుకు తెగబడ్డారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేశాడన్న కోపంతో యాడికిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీ వర్గీయుల చెర నుంచి ఎంపీటీసీ రామ్మోహన్‌ను విడిపించారు. టీడీపీ నేతల దాష్టీకంపై యాడికి వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పాత మద్యం పాలసీని రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఏపీలో కొత మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మద్యంషాపులను ప్రైవేటు వారికి అప్పగించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ షాపులన్నీ ఎలాగోలా సిండికేట్లుగా మారి దక్కించుకోవాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తుండడం గమనార్హం.ఇదీ చదవండి: కమీషన్లు..ముడుపులు.. దారి తప్పిన టీడీపీ -
మద్యం షాపులన్నీ మావే: ‘జేసీ’ బెదిరింపులు
సాక్షి,అనంతపురం:తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం మాఫియా గుట్టు బయటపడింది.మద్యం షాపులన్నీ మాకే కావాలని జేసీ వర్గీయులు అంటున్నారు. ఎవరైనా టెండర్లు వేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు.తమ అనుమతి లేనిదే తాడిపత్రిలో ఎవరికీ రూములు అద్దెకు ఇవ్వొద్దని హెటల్ యజమానులకు టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేశారు.ఇంత జరుగుతున్నా తాడిపత్రిలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటం గమనార్హం. మరోవైపు మద్యం షాపులకు దరఖాస్తుల గడువును టీడీపీ నేతల కోసమే పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల్లూరులో మద్యంషాపులన్నీ తమ సిండికేట్‌కే దక్కాలని మంత్రి నారాయణ మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటపడిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తు గడువు పెంపు -
రావణ కాష్టం.. రాక్షసానందం!
‘మీరేంటో.. మీ విధానాలేంటో..’ అంటూ ఓ సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ వారికి బాగా సరిపోతుంది. నిత్యం వివాదాలకు వారే ఆజ్యం పోస్తూ చలికాచుకోవడం రివాజుగా మారింది. గత ఐదేళ్లూ ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించిన తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం జేసీ ఆగడాల కారణంగా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు ఒకరకం.. తాడిపత్రి ఒక్కటీ మరో రకంగా మారింది. ‘మేమే రాజులం, మేమే మంత్రులం.. మేము రాసిందే రాజ్యాంగం’ అనే రీతిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనా, ప్రత్యర్థి పారీ్టలోని నాయకులపైనా దాడులు చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు పెట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇసుక అక్రమాలపై కావాలనే రాద్ధాంతం.. అధికారం చేతిలో ఉందికదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ‘25 మంది ఇసుక తోలేది మా వాళ్లే.. మీరందరూ ఇసుక తోలడం మానుకోండి. లేదా నాకు దూరమవుతారు’ అంటూ ఇటీవల ప్రభాకర్‌రెడ్డి వీడియో సందేశాలు విడుదల చేశారు. అయితే, జేసీ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అందులో మరో కోణం అవగతమవుతుంది. తన వర్గం నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను నిలిపివేయించి తానే సొంత వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగించాలన్న మర్మం బయటపడుతుంది. జిల్లాల వారీగా చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టులు తయారు చేయిస్తోందన్న సమాచారం అందడంతోనే డ్రామాలు ఆడుతున్నారన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. పోలీసుల్లో అసంతృప్తి.. తాడిపత్రి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులు పట్టుకోగా.. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వెంటనే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు కట్టాలంటూ దురుసుగా వ్యవహరించారు. ఎప్పుడు కేసులు కట్టాలో తనకు తెలుసునని సీఐ చెప్పగా.. ఆయనను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఐను వెనకేసుకు రావాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించి, సీఐతో ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పించారు. నిజాయితీగా పనిచేసే ఓ సీఐ పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎస్పీ స్థాయి వ్యక్తి క్షమాపణలు చెప్పించడమేంటని కిందిస్థాయి పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇదే క్రమంలో.. తాను ఏ తప్పూ చేయలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే క్షమాపణలు చెప్పానని సీఐ పేర్కొనడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డంకులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా దాడులు చేయిస్తున్నారంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇటీవల ఎన్నికల పోలింగ్ రోజు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డిలు ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ బెయిలొచ్చింది. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లగా తన అనుచరులతో దాడులు చేయించారు. కందిగోపుల మురళి అనే వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయడానికి అధికారులే రావడం లేదు.. జేసీ కుటుంబం దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. తాడిపత్రి తహసీల్దార్‌గా వెళ్లిన ఈశ్వరమ్మ కొన్ని రోజులకే తానక్కడ పనిచేయలేనంటూ తిరిగి వచ్చేశారు. తాడిపత్రి టౌన్‌కు ఎస్ఐ ఉన్నా అటాచ్డ్ కింద పెదపప్పూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ లేరు. తమకు ఎప్పుడు బదిలీ వస్తే వెళ్లిపోదామా అన్న ఆలోచనలో రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు. మైనింగ్, రెవెన్యూ, ఆరోగ్య.. ఇలా ఏ శాఖ అధికారులైనా తాడిపత్రిలో పనిచేసేందుకు జంకుతున్నారు. పోలీసులన్నా, అధికారులన్నా తన కింద గుమస్తాలే అన్న రీతిలో జేసీ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. -
బాబుకు ఝలక్.. ఇసుక మాఫియాకి జేసీ వార్నింగ్
-
తాడిపత్రికి అనుమతి ఇవ్వండి.. లేదంటే..!
-
నా ఆత్మరక్షణ కోసం సీఐ గారి ముందే గన్ తీసాను...!
-
చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టు: వైఎస్సార్సీపీ నేత మురళి
సాక్షి, తాడేపల్లి: జేసీ కుటుంబం అరాచకాలపై తాడిపత్రి వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం జేసీ వర్గీయులు తమ ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారని ధ్వజమ్తెతారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాయలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వీడియో తీస్తుంటే మావాళ్ల ఫోన్లను లాక్కున్నారంటూ.. దాడి ఘటనను ఆయన వివరించారు.‘‘మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాల్ చేస్తే ఆయన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాను. కారులో వెళ్తుంటే నాపై దాడి చేసేందుకు జేసీ మనుషులు వచ్చారు. నేను భయపడి వెనక్కి వచ్చేశాను. కాసేపటికే వారంతా మా ఇంటి మీదకు వచ్చారు. వందల మంది వచ్చి దాడులు చేశారు. ఇనుప తలుపులను సైతం పగులకొట్టి లోపలకు వచ్చారు. మారణాయుధాలు చేతపట్టుకుని వచ్చి దాడి చేశారు. తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. ఫోన్లు చేసిన పోలీసులు రాలేదు. పదేపదే ఫోన్లు చేస్తే 45 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు’’ అని మురళి చెప్పారు.‘‘నాకు గన్ లైసెన్స్ ఉన్నా ఫైరింగ్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి మా ఇంటిపై దాడి చేసి లూఠీ చేశారు. బంగారం దోచుకుపోయారు. ఇరవై ఏళ్ల తర్వాత జేసీ కుటుంబాన్ని ఓడించాం. మళ్లీ ఓడిస్తాం. ఏం ఉన్నా రాజకీయంగా పోరాడతాం. జేసీ కుటుంబం ఇలా ఇళ్లపై దాడులకు దిగటం మంచిది కాదు. రాయలసీమలో ఐదేళ్లుగా శాంతిభద్రతలు బాగున్నాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.’’ అని మురళి పేర్కొన్నారు.15 ఏళ్లుగా నాకు గన్ లైసెన్స్ ఉంది. గొడవ అంతా అయిపోయిన తర్వాతే గన్ తీసుకుని బయటకు వచ్చాను. అయితే నేనే టీడీపీ వారిపై దాడి చేసినట్లుగా కేసులు పెట్టారు. చిన్నపిల్లలు, ఆడవారిపై జేసీ కుటుంబం దాడులు చేయడమేంటి?. జేసీ ప్రభాకరరెడ్డి చేసే రాజకీయాలు ఇవేనా?. చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టండి. ఒక విలేకరిని నేను బెదిరించినట్టుగా అక్రమ కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగొద్దు’’ అని మురళి అన్నారు. -
అరాచకం బట్టబయలు..వైరల్ గా మారిన జేసీ వర్గీయుల దాష్టీకం..
-
ఆ రోజు హింసను అరికట్టడం నేను చేసిన పెద్ద తప్పు.. లేదంటే..!
-
జేసీ బండారం బయటపెడతాననే నన్ను చంపడానికి ప్లాన్
-
అధికార జులుం.. తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం, సాక్షి: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుండడంతో.. నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటన అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారక్కడ. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు నిన్న(మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన. ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి అంతటా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో పాటు రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం శాఖలకు సైతం ఫిర్యాదులు పంపారు. ఈ సందర్భంగా జేసీపై కే. పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘‘నా హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర పన్నారు, నన్ను చంపి తాడిపత్రి లో రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని జేసీ భావిస్తున్నారు. 2006లో మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతా. త్వరలో తాడిపత్రి కి వెళ్లి వైఎస్సార్ సీపీ శ్రేణులకు అండగా ఉంటా అని అన్నారాయన. వంద మంది టీడీపీ గుండాలొచ్చారుదాడి ఘటనపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి సాక్షితో మాట్లాడారు. ‘‘జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చంపేందుకు స్కెచ్ వేశారు. నా ఇంటిపై వంద మంది టీడీపీ గూండాలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి, నా ఇంటికి నిప్పు పెట్టారు. తలుపులు పగులగొట్టి నన్ను చంపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నాకు లైసెన్స్ తుపాకీ ఉంది.. అయినప్పటికీ కాల్పులు జరపలేదు. ప్రాణ రక్షణ కోసమే తుపాకీ చేతిలో పట్టుకున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాకు గన్ మెన్ తొలగించారు అని అన్నారాయన. మురళి భార్య రమా మాట్లాడుతూ.. ఇలా దాడి జరగడం రెండోసారి అని చెప్పారామె.‘‘టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. గంటసేపు బెడ్ రూం లో దాక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాక్కున్నాం. మా ఇంటిపై దాడి టీడీపీ నేతలు దాడి చేస్తే... నా భర్త కందిగోపుల మురళి పై అక్రమ కేసులా?. ఇదెక్కడి న్యాయం?’’:::మురళి భార్య రమాదేవి -
నన్ను చంపేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు
-
ఇసుక దొంగలకు జేసీ వార్నింగ్
-
రక్తికట్టని జేసీ డ్రామా!
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి చేస్తున్న డ్రామాలు రక్తి కట్టడం లేదు. తాను అవినీతి పరుడిని కాను అని నిరూపించుకునేందుకు ఆయన పడుతున్న పాట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి నానా హంగామా చేస్తుండడం చూసి ఈసడించుకుంటున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త రకం డ్రామాలకు తెరతీస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలోనే సంచలనం సృష్టించిన బీఎస్3 వాహనాల అమ్మకాల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి కీలక నిందితులు. అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలే ఈ కేసులపై విచారణ చేసి కోర్టుల్లో ఛార్జ్ షీట్లు వేశాయి. దీంతో కొన్ని రోజులుగా న్యాయస్థానాల్లో కేసుల విచారణ జరుగుతోంది. విషయం ఇలా ఉంటే.. రవాణా శాఖ అధికారులేదో తనకు అన్యాయం చేసినట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ధర్నాలు.. ఫిర్యాదులతో నవ్వుల పాలు జేసీ ప్రభాకర్‌రెడ్డి బీఎస్3 వాహనాలను తుక్కు కింద కొని, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఇక్కడ బీఎస్4 కింద అమ్మారనేది ప్రధాన ఆరోపణ. దీంతో పాటు పర్మిట్లు లేకపోయినా వాహనాలను తిప్పిన కేసులో ఈయన వాహనాలను సీజ్ చేశారు. పక్కా ఆధారాలతో కేసు నమోదు చేయడమే కాదు, ఈ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజునుంచే జిల్లాలో అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.ఆర్టీఏ అధికారులు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల క్రితం మందీమార్బలంతో అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు. అప్పటి మంత్రి, రవాణా అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలో రోజూ ఒక వివాదాన్ని సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నా తాను నిజాయితీ పరుడిని అని చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. జేసీ ధర్నాలు, ఫిర్యాదులు చూసి కామెడీ చేస్తున్నట్టు జనం భావిస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఖండించలేదు.. జేసీ కుటుంబానికి తన సొంత పారీ్టలోనే ఎవరి మద్దతూ లేదు. కేసులు నమోదైనప్పుడు గానీ, విచా రణ జరుగుతున్నప్పుడు గానీ, జైలుకు వెళ్లినప్పుడు గానీ ఎవరూ మాట్లాడలేదు. దర్యాప్తు సంస్థల నివేదిక తప్పు అని ఏ ఒక్కరూ ఖండించలేదు. ఈ పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనకు న్యాయం జరగాలంటే విచారణ సంస్థలను ఆశ్రయించాల్సి పోయి పోలీసులను టార్గెట్ చేసి ముందుకెళ్తుండడంపై సొంతపారీ్టలోనే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా.. చంద్రబాబునే ఆశ్రయించి కేసులు కొట్టివేయించుకోవచ్చు కదా అని ఒక రిటైర్డ్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.జోక్యం చేసుకోలేం జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. వాటిపై జోక్యం చేసుకోలేం. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయి నివేదిక రవాణా శాఖ కమిషనర్‌కు అందజేశాం. జేసీ ప్రభాకర్‌రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాం. ఈ పరిస్థితుల్లో సీజ్చేసిన వాహనాలను విడుదల చేయలేం. కోర్టు నిర్ణయాన్ని బట్టి రవాణా శాఖ అప్పీల్‌కు వెళ్లాలా, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలా అన్నది ఉంటుంది. హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులోనూ కేసులున్నాయి. కోర్టుల తీర్పు తర్వాతే వాహనాల విడుదలకు సంబంధించిన అంశం తేల్చాల్సి ఉంటుంది. –వీర్రాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ -
తాడిపత్రి నీ అబ్బ జాగీరా?.. జేసీకి పెద్దారెడ్డి వార్నింగ్
-
దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి..
తాడిపత్రి రూరల్: ‘అల్లర్ల కేసుల్లో బెయిల్‌కు సంబంధించి నాకు పూచీకత్తు ఇచ్చే వారు లేరు. దమ్ముంటే అరెస్టు చేసి జైలుకు పంపండి’ అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ జనార్దననాయుడుకు టీడీపీకి చెందిన మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్ చేశారు. తాడిపత్రి మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను ఇంటికి వెళతానని, అక్కడికి వచ్చి అరెస్టు చెయ్యి.. అని అన్నారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఈనెల 24న అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి బైఠాయిస్తానని చెప్పారు.గతంలో రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన సీతారామాంజనేయులు, డీటీసీ ప్రసాద్‌రావు, మాజీ మంత్రి పేర్ని నాని, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులకు ఇంతకుముందే కొంత సమయం ఇచ్చానని, ఇచ్చిన గడువు తీరడంతో ఈ నెల 24న అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి బైఠాయించనున్నట్లు తెలిపారు. అల్లర్ల ఘటనలకు సంబంధించి తామిచ్చిన ఫిర్యాదు మేరకు మూడు కేసులు నమోదు చేయాలని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని, శాంతి భద్రతలు దెబ్బతినడానికి పోలీసు ఉన్నతాధికారులే బాధ్యులన్నారు. ఇకపై తాడిపత్రి నియోజకవర్గంలో ఏ పండుగకూ అనుమతులు తీసుకోబోమని, అవసరమైతే సమాచారం మాత్రమే ఇస్తామని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి బైండోవర్ చేయాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. -
రేపే ‘సాక్షి’ని మూసేయిస్తా
అనంతపురం క్రైం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మరోసారి నోటికి పనిచెప్పారు. బుధవారం మీడియా సమక్షంలో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఆయన.. ఆ వార్తను ప్రచురించిన, ప్రసారం చేసిన ‘సాక్షి’ మీడియాపై గురువారం నోరుపారేసుకున్నారు. సాక్షి ఆఫీసుకు రేపు ఉదయం 10 గంటలకు మూతేయకపోతే చూడండ్రా.. ఎవరూ అడ్డుకోలేరంటూ బెదిరించారు. గురువారం అనంతపురంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం పేరిట కొందరు పాత్రికేయులను పిలిపించి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. ‘వాళ్లని, వీళ్లని కాదు. మిమ్మల్నే (సాక్షి) బెదిరిస్తున్నా. ఏం పీకుతారు’ అంటూ బరితెగించి మాట్లాడారు. బ్రేక్ ఇన్స్పెక్టర్లను కాదు.. నేరుగా మీకే చెబుతున్నా.. సాక్షిని మూతేయిస్తా. నేను బంద్ చేయించేందుకు వస్తే పోలీసులు కూడా అడ్డుకోలేరు’ అంటూ బెదిరింపులకు దిగారు. ‘మీ కార్యాలయంపై దాడి చేస్తే దిక్కొచ్చే వారెవరున్నారు? నోరు మూసుకుని ఉండాలి. దర్బేష్.. నా కొ.. ల్లారా’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఊగిపోయారు. ‘ఆయమ్మను బెదిరించాడు.. ఈయమ్మను బెదిరించాడు అన్నారు కదా.. ఇప్పుడు మిమ్మల్నే అంటున్నా.. మీకెవరు దిక్కున్నారు? మీ సీతారామాంజనేయులు, మీ పేర్ని నాని, మా ఎమ్మెల్యే (పెద్దారెడ్డి) వస్తారా? వాళ్లెవరూ రారు. నేను ఎవరికీ భయపడను. అంతకు ముందు కూడా నేను ‘సాక్షి’ ముందే కూర్చున్నా. మీకు వెనకాల, ముందు ఏముంది? నేను అనుకుంటే అనంతపురం సాక్షి ఆఫీసు మూసేయిస్తా’ అంటూ రెచ్చిపోయారు. ‘వాన్నీ.. వీన్ని బెదిరించను. నేరుగా మిమ్మల్నే బెదిరిస్తున్నా. అప్పట్లో మాకు ఎవరూ ప్రొటెక్షన్ రాలేదు. ఈ రోజు మీపైకి వస్తే మీకు అండగా ఎవరూ రారు. మేమొస్తే ఎవడూ అడ్డుకోలేరు. లక్షలాది మంది జనం మీ కార్యాలయంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు ఎవడూ లేడు. నాకు జన బలం ఉంది’ అంటూ బెదిరించారు. -
బూతు తమ్ముళ్లు..నరుకుతా..
-
మరోసారి రెచ్చిపోయిన TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
-
‘నరికేస్తా..’ రవాణాశాఖ అధికారులకు జేసీ వార్నింగ్
అనంతపురం, సాక్షి: టీడీపీ సీనియర్లు.. ఇప్పుడు తమ అసలు రూపం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. రవాణా శాఖ అధికారులను ఉద్దేశించి.. నరికేస్తానంటూ వ్యాఖ్యానించారు. అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ జేసీ ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. జేసీ ట్రావెల్స్ బస్సులు, లారీలను సీజ్ చేసిన వాళ్లందరిపై ప్రతీకారం తీర్చుకుంటా అంటూ ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. ఈ క్రమంలో రవాణా శాఖ జేటీసీ శివరాం ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అత్తికానాజ్ లను వదలను అంటూ నేరుగా బెదిరించారాయన.‘‘నా బస్సులు సీజ్ చేయడంపై పదిరోజుల్లో ఎంక్వైరీ జరగాలి. నేను ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబుని ఏం అనను. చంద్రబాబును నేనేం వ్యతిరేకం కాను. కానీ, నా బస్సుల సీజ్‌ల విషయంలో ఎవరినీ వదలను. బ్రేక్ ఇన్స్పెక్టర్లకు చెబుతున్నా.. నేను ఎంత దూరమైనా వెళ్తా. బ్రేక్ ఇన్స్పెక్టర్లు నా కాళ్లు పట్టుకుని నా బస్సులు రిపేర్లు చేయాల్సిందే!’’ అని అన్నారాయన.కొసమెరుపు: ఇంతలా రెచ్చిపోయిన జేసీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని, తనను.. తన కుటుంబ సభ్యుల్ని దొంగోళ్లుగా చూశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. -
పరారీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత రెడ్డి..
-
జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ
-
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌కు బిగ్ షాక్..
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. బీఎస్-IV వాహనాల మనీలాండరింగ్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది.ఈడీ ఛార్జ్‌షీట్‌లో భాగంగా.. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. బీఎస్-4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి భారతదేశంలో విక్రయించరాదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ. గోపాల్ రెడ్డితో పాటుగా పలువురు అశోక్ లేల్యాండ్ లిమిటెడ్ నుంచి బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేశారు.ఈ క్రమంలో జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సీ.గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ పత్రాల ఆధారంగా బీఎస్-4 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ కొనుగోళ్లు నాగాలాండ్‌లో జరుగగా.. కొన్ని కర్ణాటక, ఏపీలో కూడా జరిగాయని ఈడీ తెలిపింది.జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని బీఎస్-4 వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు. అలాంటి కొన్ని వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపి విక్రయించారు. ఈ వాహనాలను సొంతం చేసుకోవడం, నడపడం, విక్రయించడం ద్వారా 38 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు ఈడీ పేర్కొంది. అంతకుముందు, జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ గోపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు.. 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల విధ్వంసం
తాడిపత్రి అర్బన్: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం జరిగిన అల్లర్ల అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోని గదులకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఎవరూ ఊహించని రీతిలో పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ నిద్రిస్తున్న పని మనుషులను నిద్రలేపి ఇంటి తలుపులు తీయాలని బలవంతం చేశారు. తమ వద్ద తాళాలు లేవని చెప్పడంతో పోలీసులు అక్కడే ఉన్న వంట చేసే కబ్గిరి(పెద్ద పొడవైన గరిటె)తో ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను పగులగొట్టి హార్డ్ డిస్క్‌లను మాయం చేశారు. కాన్ఫరెన్స్ హాలు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి అక్కడున్న ఫ్యాన్, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులుపోలింగ్ రోజు నుంచి తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీ గూండాలను రెచ్చగొడుతూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా ఎదుట మండిపడ్డారు. పోలింగ్ రోజున కూడా టీడీపీ నేతల వైపు వారు కన్నెత్తి చూడకుండా వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి వందలాది మంది అనుచరులను వెంటేసుకుని రోడ్లపై హల్చల్ చేసినా వారించలేదు. ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి తన వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకుని తిరిగినా పోలీసులు ప్రశ్నించలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా టీడీపీ అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నా ఆయన ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. మంగళవారం ఘర్షణల అనంతరం డీఐజీతో సహా రాయలసీమ జిల్లాల నుంచి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తాడిపత్రికి చేరుకున్నాయి. కానీ ఎమ్మెల్యే ఇంటి ముందు మాత్రం నామమాత్రపు బందోబస్తు ఏర్పాటు చేసి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం వద్ద మాత్రం పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేశారు. అంతేగాకుండా సోమ, మంగళవారాల్లో జరిగిన దాడులతో ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. వారిని మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండానే పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరికొందరిని కౌన్సెలింగ్ పేరిట ఇష్టారాజ్యంగా కొడుతున్నట్లు సమాచారం. తాడిపత్రి పోలీసుల ఏకపక్ష వైఖరి, తన ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.మీడియాపై ఎస్పీ ఆంక్షలుతాడిపత్రిలో వరుసగా జరుగుతున్న సంఘటనలకు సంబంధించి న్యూస్ కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిథులపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. గొడవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించకూడదని సాక్షాత్తు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆంక్షలు విధించడం గమనార్హం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాస సమీపంలో అదనపు ఎస్పీ రామకృష్ణతో బందోబస్తుపై ఆయన సమీక్షిస్తుండగా ఫొటోలు తీస్తున్న ఓ విలేకరిపై ఆయన చిందులు తొక్కారు. సెల్ ఫోన్ తీసుకోండంటూ అక్కడే ఉన్న తన గన్మన్లను ఆదేశించారు. -
పచ్చమూక దౌర్జన్యం
-
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
తాడిపత్రి/తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలింగ్ నాడు మొదలైన పచ్చ ముఠా హింసాకాండ మంగళవారమూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా కొనసాగింది.. సోమవారం పోలింగ్ సందర్భంగా దాడులకు దిగిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు.. మంగళవారమూ తాడిపత్రిలో రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు దిగి ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ దాడిలో గాయపడిన కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై రాళ్ల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వందలాది మంది తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడి చేశారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులూ ప్రతిఘటనకు దిగాయి. రెండు పార్టీల కార్యకర్తలూ పరస్పరం రాళ్ల దాడికి పాల్పడడంతో తాడిపత్రి రణరంగాన్ని తలపించింది. అడ్డొచ్చిన పోలీసులపైనా టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. తాడిపత్రి అర్బన్ సీఐ మురళీకృష్ణ తలకు రాయి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. బరి తెగించిన టీడీపీ కార్యకర్తలు తాడిపత్రి పట్టణంలోని గానుగవీధికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సంజీవ సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా 230వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున ఏజెంటుగా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీడీపీ నాయకుడు సూర్యముని తన వర్గీయులు భాను, కిరణ్, అశోక్, వేణు మరికొందరితో కలిసి సంజీవపై దాడి చేశారు. అతని ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా అతని మిక్చర్ బండినీ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి సంజీవ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్ద పెద్దఎత్తున గుమిగూడిన టీడీపీ అల్లరి మూకలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కాన్వాయ్‌పై దాడులకు పాల్పడ్డాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన టీడీపీ అల్లరి మూకలు పోలీసులపైనా రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో తాడిపత్రి అర్బన్ సీఐ మురళీ కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న పోలీసులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జేసీ ప్రభాకర్ గూండాగిరి దాడి విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వందలాది మంది తన అనుచరులతో టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి తన అనుచరులను వెంటేసుకుని సీబీ రోడ్డులో భయానక వాతావరణం సృష్టిస్తూ వస్తుండగా..పోలీసు బలగాలు అడ్డుకున్నా, ఫలితం లేకపోవడంతో పోలీసులు వారిపై బాష్పవాయువును ప్రయోగించారు. ఆ తర్వాత ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో పుట్లూరు రోడ్డు గుండా సంజీవనగర్ మీదుగా తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే పక్కా ప్రణాళికతో తన ఇంటి ముందున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిద్ధంగా ఉంచుకున్న ట్రాక్టర్లలోని రాళ్లతో టీడీపీ వర్గీయులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైకి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే నివాసాన్ని చుట్టుముట్టి రాళ్ల వర్షం కురిపించారు. ఈ చర్యతో ఆ ప్రాంతంలోని వారందరూ ఇళ్లకు తలుపులేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఐదు వేల మందికి పైగా జేసీ అనుచరులు గుమిగూడి ఉండడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినా వారు వినకుండా ఎస్పీ అమిత్ బర్దర్, డీఎస్పీ గంగయ్య, బీఎస్ఎఫ్ బలగాలపై ఊహించని రీతిలో ఒక్కసారిగా రాళ్లతో విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడి చేస్తూ ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు సైతం పరుగెత్తాల్సివచ్చి0ది. చివరకు ఎస్పీ ఆదేశాలతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా.. జేసీ అనుచరులు ఒక్కసారిగా నాగాలాండ్ నుంచి వచ్చిన బీఎస్ఎఫ్ బలగాలపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ జవానుల్లో ఒకరి కంటికి తీవ్ర గాయమైంది. జేసీ అనుచరులు విచక్షణ కోల్పోయి దాడులకు దిగడంతో ఎస్పీ అమిత్‌బర్దర్, డీఎస్పీ గంగయ్య, పోలీసులు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతటితో ఆగని అల్లరి మూకలు మరింత రెచ్చిపోయి బాణా సంచాకు నిప్పు పెట్టి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు విసిరారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన ఎస్పీ పెద్దఎత్తున అదనపు పోలీసు బలగాలను రప్పించారు. అనంతపురం రేంజ్ డీఐజీ షేముíÙతో పాటు కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు, ట్రైనీ ఎస్పీలు తాడిపత్రికి చేరుకుని భద్రతను సమీక్షించారు. ఆయా జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.పోలీసుల వైఫల్యమే కారణం రెండు రోజులుగా తాడిపత్రిలో జరుగుతున్న దాడులకు పోలీసుల వైఫల్యమే కారణమని తెలుస్తోంది. తాడిపత్రి అసలే సమస్యాత్మక ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎన్నికల బందోబస్తు నిమిత్తం వచ్చిన బలగాలను మంగళవారం ఉదయమే పంపేశారు. దాడులు జరుగుతాయని ముందస్తుగా పసిగట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. పోలీసు బలగాలను పట్టణంలో అలాగే ఉంచి ఉంటే మంగళవారం ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. టీడీపీ వర్గీయుల పట్ల పోలీసులు అవలంబిస్తున్న మెతకవైఖరే అందుకు కారణమన్న బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. -
పోలింగ్ వద్ద విధ్వంసం.. జేసీ కుటుంబంపై కేసు
-
తాడిపత్రిలో పెద్దారెడ్డిపై రాళ్లదాడి
తాడిపత్రి/ తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా సోమవారం టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి లక్ష్యంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పెద్దారెడ్డితో పాటు పలువురి వాహనాలు ధ్వంసమయ్యాయి. తాడిపత్రిలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి అల్లర్లు, ఘర్షణలకు పాల్పడి పోలింగ్ సరళిని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు కుట్ర పన్నారు. పట్టణంలో స్వైర విహారం చేస్తూ ఎక్కడికక్కడ దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి స్థానిక గాంధీకట్ట వద్దనున్న బూత్‌లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న పచ్చ మూకలు కవ్వింపు చర్యలకు దిగాయి. అదే సమయంలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ వారిని విడిచి పెట్టి వైఎస్సార్సీపీ వర్గీయులపై పోలీసులు ప్రతాపం చూపించడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి జోక్యం చేసుకున్నారు. శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు సహకరిస్తున్న తమపై పోలీసుల ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరిస్తూ జేసీ సోదరులకు తొత్తుగా మారారని, ఇలా వ్యవహరించడం తగదని కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు చెప్పారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారికి సర్దిచెప్పి పంపించేశారు. అక్కడి నుంచి పెద్దారెడ్డి ఓంశాంతి నగర్‌లోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తిరిగొస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ దశలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందస్తు ప్రణాళికతో జేసీ అనుచరులు రాళ్లు సిద్ధం చేసుకుని ఒక్కసారిగా పెద్దారెడ్డితో పాటు అనుచరులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో పెద్దారెడ్డి వాహనంతో పాటు మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ హుటాహుటిన తాడిపత్రికి చేరుకున్నారు. జేసీ అనుచరులు ఎస్పీ సమక్షంలోనే రాళ్ల దాడి కొనసాగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాల వారిని చెదరగొట్టాయి. డీఐజీ ఇమాన్షు బాబ్జి తాడిపత్రికి చేరుకుని శాంతిభద్రతలను సమీక్షించి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. -
ప్రగతి సాధకుడికా? అభివృద్ధి నిరోధకుడికా?
తాడిపత్రి రూరల్: పోలింగ్‌కు 48గంటల సమయం మాత్రమే ఉన్న ప్రస్తుత తరుణంలో తాడిపత్రి ప్రగతికి బాటలు వేసిన తనకా? లేకపోతే అభివృద్ధిని అడుగడునా అడ్డుకున్న టీడీపీకా? ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో ఐదేళ్ల తాడిపత్రి భవిష్యత్తు ఓటర్లపై ఆధారపడి ఉందన్నారు. ఓటు వేసే సమయంలో ఏ మాత్రం పొరపాటు చేసిన దాని ప్రభావం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, తాడిపత్రి అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. తాడిపత్రిలో అభివృద్ధి, ప్రశాంతతకు పెద్దపీట వేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాటలు విని ఆ పార్టీకి ఓటు వేస్తే అరాచకాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, మట్కా, పేకాట, అసాంఘిక శక్తులకు ఊతమిస్తూ అభివృద్ధి నిరోధకులుగా మారే ప్రమాదముందన్నారు. 40 ఏళ్లుగా జేసీ కుటుంబ ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా ఎదురైన పరిస్థితులను తాడిపత్రి ప్రజలు కళ్లారా చూశారన్నారు. జేసీ అరాచకాలకు చరమగీతం పాడుతూ 2019 ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, దీంతో ప్రజలు ఆశించినట్లుగానే తాడిపత్రి ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించానన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ అందజేశామన్నారు. ఎలాంటి వివక్ష చూపకుండా ప్రాధాన్యత క్రమంలో ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన కన్యకాపరమేశ్వరీ ఆలయం వద్ద జేసీ కట్టించిన యూరినల్స్‌ను తొలగించి, వారి ఆత్మాభిమాన్ని నిలబెట్టానన్నారు. ఎన్నో ఏళ్లుగా ఏటా డిసెంబర్ నుంచి నెలన్నర పాటు మాలధారులకు అయ్యప్పస్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జేసీ అడ్డుకుంటే, ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత పునరుద్ధరించానన్నారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుపై వేసే ప్రతి ఓటూ నేరుగా వైఎస్ జగన్‌కు చేరి అభివృద్ధికి, సంక్షేమానికి బాటలు వేస్తాయన్నారు. -
వేడెక్కిన రాజకీయం
-
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం
-
లగాన్ పేరున గ్రానైట్ మాఫియా.. ఆర్జాస్ మాటున అక్రమార్జన
కాదేదీ అక్రమాలకు అనర్హం అన్నట్లు ఆ సోదరులు రెచ్చిపోయారు. అధికారమే అండగా చెలరేగారు. అడ్డగోలుగా వ్యాపారాలు సాగించారు. ప్రకృతి వనరులను కొల్లగొట్టారు. దేవుని మాన్యాన్నీ చెరబట్టేశారు. పేదల కడుపు గొట్టారు. చివరికి అసాంఘిక కార్యకలాపాలకూ తెరలేపారు. తమకు అడ్డు చెప్పిన అధికారులపై దాడులకూ వెనుకాడలేదు. అలాంటి వారు నేడు ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజల ముందుకు వెళ్తూ నీతి మాటలు మాట్లాడుతుండడంపై జనం నవ్వుకుంటున్నారు. తాడిపత్రి అర్బన్: గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. నాలుగు దశాబ్దాల పాటు అక్రమంగా ట్రావెల్స్ వ్యాపారం సాగించి రూ.కోట్లు దండుకున్నారు. ఒక బస్సుతో ప్రారంభమైన వారి ట్రావెల్స్ వ్యాపారం నుంచి వందల సంఖ్యలో బస్సులు పుట్టుకొచ్చాయి. ఒక పర్మిట్ నంబర్‌తో ఏకంగా నాలులైదు బస్సులు తిప్పుతూ ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టించేవారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఓ ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు 2012లో అప్పటి రవాణాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి దాడులు చేశారు. కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించి మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. బస్సు సీజ్ చేశారు. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఘటన జరిగిన కొన్నాళ్ల పాటు నిబంధనలు పాటించిన జేసీ సోదరులు... ఆ తర్వాత మంగళం పాడారు. అంతేనా.. కండీషన్ లేని బస్సులను నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణమయ్యారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. అయితే, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వీరి అక్రమాలను బట్టబయలు చేయడంతో ట్రావెల్స్ మూసేశారు. లగాన్ పేరున గ్రానైట్ మాఫియా.. తాడిపత్రి ప్రాంతంలో 800కు పైగా గ్రానైట్ పరిశ్రమలున్నాయి. మామూలుగా వీటికి గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. క్వారీ నుంచి ఒక లోడు గ్రానైట్ తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల మేర రాయల్టీ చెల్లించాలి. అయితే టీడీపీ హయాంలో రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యాలు, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య అక్రమ ఒప్పందం కుదిరింది. దీనికితోడు లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని బిల్లులో తగ్గించి ఒకే బిల్లుతో ఐదారు లోడ్లు రవాణా చేసేవారు. అలా కొల్లగొట్టిన డబ్బు లగాన్ పేరుతో మాఫియాను నడిపే ఓ పెద్దమనిషి ఇంటికి చేరేది. ఈ క్రమంలోనే 2015 ఆగస్టు 21న మైనింగ్ విజిలెన్స్ ఏడీగా బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్‌రెడ్డి ఈ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా రూ.కోటి కూడా పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అందేది కాదు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారంటే లగాన్ దందా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఉంటే తమ ఆటలు సాగవని గుర్తించిన జేసీ సోదరులు ఎలాగైనా బదిలీ చేయించాలని చూశారు.చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీనిపై అప్పట్లో ఆయన మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి (పొట్టి రవి), అప్పట్లోగ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కొన్నాళ్లకే ప్రతాప్‌రెడ్డిని బదిలీ చేయించిన ఈ ముఠా..మళ్లీ అక్రమాలు యథేచ్ఛగా సాగించింది. ఈ మాఫియా ద్వారా రూ.200 కోట్లకు పైగా జేసీ సోదరులు వెనకేశారన్న ఆరోపణలున్నాయి. ఆర్జాస్ మాటున అక్రమార్జన.. తాడిపత్రి సమీపంలో ఆర్జాస్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం హుసేనాపురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు 2 వేల ఎకరాల తమ భూములను అప్పగించారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ప్లాంటుపై ఆధారపడి జీవించేవారు. అయితే దివాకర్ రోడ్‌లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టును కాదనే ధైర్యం ఫ్యాక్టరీల యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత వారికే ఇచ్చేవారు. అయితే, ఇందుకు సంబంధించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి పన్ను కూడా ఎగ్గొట్టేవారు. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం అక్రమ లెక్కలే. వీరి లారీలు మినహా ఇతర లారీలు స్టీల్‌ప్లాంట్‌లోకి వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్లలో రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. యథేచ్ఛగా డ్రై స్లాగ్ దందా.. అప్పట్లో ఆర్జాస్ స్టీల్ ప్లాంట్‌లో డ్రైస్లాగ్‌ను టన్ను రూ.1తో తమ బినామీల ద్వారా జేసీ సోదరులు కొనుగోలు చేయించేవారు. అల్ట్రాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు టన్ను రూ.850 చొప్పున విక్రయించేవారు. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చులు కింద రూ. 250 పోగా రూ.600 మేర మిగిలేది. ఇలా ప్రతి నెలా 25 వేల టన్నులకు పైగా డ్రై స్లాగ్ తరలించేవారు. ఈ లెక్కన నెలకు రూ.1.5 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100 కోట్లు కొల్లగొట్టారు. దేవుని మాన్యాన్నీ వదల్లేదు.. పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలసిన పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. తాడిపత్రి–పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కబ్జా చేశారు. ఫారం ఫాండ్లు ఏర్పాటు చేయించి బోరు బావుల నీటితో నింపి ఆ భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా చెల్లించలేదు. ఏడాది క్రితం విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారులు భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. -
వివాదాస్పదంగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరి
-
జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే పెద్దా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
జేసీ ప్రభాకర్ కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్..
-
కీచకుడికే జేసీ ప్రభాకర్ అండ!
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత, కౌన్సిలర్ మల్లికార్జున కీచక పర్వం నియోజకవర్గంలో కలకలం రేపింది. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ అనూష అనే యువతి పోరాటానికి దిగింది. ఈ క్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మల్లికార్జున్ వ్యవహారంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ప్రయత్నించింది. మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఆమె అప్పాయింట్మెంట్ కోసం యత్నించగా.. జేసీ అందుకు నిరాకరించారు. ఆమెను లోనికి రానియొద్దంటూ సిబ్బందికి సూచించారు. దీంతో గేటు వద్దే ఆమె చాలాసేపు ఉండిపోయింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందిపోయి.. కీచకుడికే అండగా నిలబడడం ఏంటని? జేసీ తీరుపై మండిపడుతున్నారు పలువురు. టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున తనను శారీరకంగా వాడుకున్నాడని, రెండు సార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని, తనను చంపుతానని టీడీపీ నేత మల్లికార్జున బెదిరిస్తున్నాడని బాధితురాలు అనూష వాపోతోంది. ఈ క్రమంలో ఎస్పీని కలిసి ‘స్పందన’లో తన గోడును సైతం వెల్లబోసుకుందామె. సంబంధిత వార్త: మల్లికార్జున కీచక పర్వమిది! -
మోజు తీర్చుకుని మొహం చాటేసిన టీడీపీ నేత..
తాడిపత్రి/రూరల్: యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకుని మోజు తీర్చుకున్నాక మొహం చాటేశాడో టీడీపీ కౌన్సిలర్. పెళ్లి చేసుకోమని నిలదీస్తే బాధితురాలిపైనే దాడి చేశాడు. దీంతో ఆమె సోమవారం అనంతపురం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఎస్పీ సూచన మేరకు తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు. పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలల క్రితం వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. యువతిని ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చి తనకు తెలిసిన వారి ఇంట్లో ఉంచాడు. అనంతరం ఆమెతో సహజీవనం చేశాడు. యువతి రెండు సార్లు గర్భం దాల్చగా, ఇప్పుడే పిల్లలు ఎందుకు అంటూ అబార్షన్లు కూడా చేయించాడు. ఇటీవల యువతికి అనుమానమొచ్చి మల్లికార్జున సెల్‌ఫోన్ పరిశీలించగా, వాట్సాప్‌లో మరో మహిళతో చాటింగ్ చేసిన విషయం బయటపడింది. దీనిపై మల్లికార్జున ప్రశ్నిస్తే కొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మల్లికార్జునతో సంబంధం పెట్టుకున్న మహిళ కూడా రంగంలోకి దిగింది. తను మల్లికార్జునతో తీయించుకున్న ఫొటోలను బాధిత యువతి సెల్‌ఫోన్‌కు పంపింది. వారం క్రితం మళ్లీ యువతి ఇంటికి వచ్చిన మల్లికార్జున మాయమాటలు చెప్పి రెండు రోజులు గడిపాడు. వివాహం చేసుకోమని ప్రశ్నిస్తే తీవ్రంగా కొట్టాడు. విషయం బయటకు చెబితే భూమిపైనే లేకుండా చేస్తానంటూ బెదిరించాడు. తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనతోనే జీవితం అంటూ చెప్పాడు. దీంతో ఆమె మల్లికార్జున ఇంటికి వెళ్లింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన కుటుంబసభ్యులకు వివరించింది. సర్దిచెప్పాల్సిన వారు కూడా దౌర్జన్యం చేశారు. యువతిని కొట్టి పంపించారు. దీంతో యువతి కుమిలికుమిలి ఏడ్చింది. తెలిసిన వారి సూచన మేరకు సోమవారం అనంతపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గోడు వెళ్లబోసుకుంది. ఆయన సూచన మేరకు తాడిపత్రి పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనలాంటి వారి జీవితాలతో ఆటలాడుతున్న మల్లికార్జునపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. -
Ananthapur: బాబు నిర్వాకం... జేసీ అరాచకం
తాడిపత్రి రూరల్: గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకున్న ఒక్క అనాలోచిత నిర్ణయం గ్రానైట్ పరిశ్రమను కోలుకోలేకుండా చేసింది. పరిశ్రమలు దివాళా తీసేందుకు కారణమైంది. వేలాది మంది వలస కూలీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన పరిశ్రమల నిర్వాహకులు చంద్రబాబు దెబ్బతో కోలుకోలేకపోయారు. రూ. కోట్లు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన యంత్రాలను రూ. లక్షలకే తెగనమ్ముకున్నారు. చాలామంది అప్పుల్లో కూరుకుపోయారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గ్రానైట్ పరిశ్రమ ఒక వెలుగు వెలిగింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు నిర్వాహకులకు ఊపిరినిచ్చాయి. తదనంతరం వచ్చిన పాలకుల చిన్నచూపుతో ఈ పరిశ్రమ ప్రభ తగ్గుతూ వచ్చింది. స్లాబ్ సిస్టం ఎత్తేసి.. ఉసురు తీసి 2014లో అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు గ్రానైట్ పరిశ్రమపై కన్నెర్ర చేశారు. అప్పటి వరకూ అమలులో ఉన్న స్లాబ్ సిస్టం ఎత్తి వేశారు. దీంతో నష్టాలు వస్తాయని, దివాళా తీస్తామని నిర్వాహకులు మొత్తుకున్నా లెక్క చేయలేదు. గ్రానైట్ పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా పట్టించుకోలేదు. 2019లో ఎన్నికలు దగ్గర పడడంతో మొదటికే మోసం వస్తుందని భావించి కంటి తుడుపు చర్యగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడానికంటూ కమిటీ ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు కమిటీ నివేదిక ఇచ్చినా దాన్ని బుట్టదాఖలు చేశారు. చెక్‌పోస్టులతో కొంపముంచిన జేసీ.. గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకులను గట్టెక్కించాల్సిన అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వారిపై మరింత కత్తిగట్టారు. పరిశ్రమల యజమానులను దొంగలుగా చిత్రీకరించారు. బిల్లులు లేకుండా ముడి సరుకు వస్తోందంటూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయించారు. సరుకును తరలిస్తున్న లారీల యజమానులను మామూళ్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. మరో వైపు జేసీ అనుచరులు మాత్రం యథేచ్ఛగా నాసిరకం ముడి సరుకును ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా చేసేవారు. జేసీ పెత్తనం వల్ల పనికి రాని సరుకును కూడా కొనుగోలు చేస్తూ యజమానులు మరింత నష్టపోయారు. ఈ దురాగతాలపై ఫిర్యాదు రావడంతో చర్యలకు దిగిన అప్పటి మైన్స్ అండ్ జియాలజీ అధికారిపైనా జేసీ అనుచరులు దాడికి యత్నించారు. తమ జోలికి వస్తే తల నరికి లారీకి కడతామంటూ వారు బెదిరించడం అప్పట్లో సంచలనం రేపింది. యంత్రాలను నష్టాలకు అమ్ముకుని.. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో తాడిపత్రి పరిసరాల్లో 250 వరకూ గ్రానైట్ పరిశ్రమలు ఉండేవి. చంద్రబాబు, జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వాకాలతో టీడీపీ ప్రభుత్వ హయాంలో వందకు తగ్గిపోయాయి. పరిశ్రమలు మూతపడటంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల కార్మికులకు వేలకు వేలు అడ్వాన్స్‌లు ఇచ్చి తీసుకొచ్చిన యజమానులు.. కార్మికులు అర్ధంతరంగా వెళ్లడంతో ఆ నష్టాన్ని కూడా మౌనంగా భరించారు. ట్రాలీ, కట్టర్లు, పాలిష్ తదితర మిషన్లను గుజిరీ కింద తెగనమ్ముకున్నారు. చంద్రబాబు మిగిల్చిన పీడ కలను నేటికీ మర్చిపోలేకున్నామని వారు ఆవేదనగా చెబుతున్నారు. మిషన్లను గుజిరీకి వేశా ఎన్నో ఆశలతో రూ.కోటి పెట్టుబడి పెట్టి గ్రానైట్ పరిశ్రమను నెలకొల్పా. టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు శరాఘాతంగా మారాయి. దీంతో నష్టాలు తప్పలేదు. పరిశ్రమలోని మిషన్లు, ఇతర సామగ్రిని గుజిరికి వేశా. రూ. 10 లక్షలే అన్నా ఎక్కడ తుప్పు పడతాయన్న భయంతో ఆ రేటుకే అమ్మేశా. ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నా. – రామ్మోహన్, తాడిపత్రివాసి -
ప్రజలను వంచనజేసి
తాడిపత్రి, రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి నవరసాలు పండించారు. అవకాశం ఇస్తే అలా చేస్తా, ఇలా చేస్తా అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. బొటాబొటి ఆధిక్యతతో ఎలాగోలా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను మాత్రం గాలికొదిలేశారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతూ ఉంటే, ఎక్కడ అధికార పార్టీకి పేరు వస్తుందనే అక్కసుతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై చర్చించడానికి, పరిష్కార మార్గం చూపడానికి వేదికై న కౌన్సిల్ సమావేశాన్ని కూడా 6 నెలలుగా నిర్వహించకుండా అడ్డు పడుతున్నారు. కమిషనర్ సహకరించడం లేదంటూ ప్రజల చెవిలో పూలు పెట్టే యత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి.. తాను మాత్రం గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఒక్క మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి చేతకాని ఆయన.. నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తానంటూ కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మాటున పల్లెల్లో కక్షలు రాజేస్తున్నారు. రచ్చ చేయడమే పని.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డు తగులుతున్నారు. ‘నేను చేయను.. మీరు చేయొద్దు..’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగిన సమయంలో పట్టణంలో పేరుకుపోయిన చెత్తను ఎమ్మెల్యే తన సొంత నిధులతో తొలగించే ప్రయత్నం చేస్తే అడ్డుకుని నానా యాగీ చేశారు. వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా బోర్ల మరమ్మతులు చేయిస్తుంటే టీడీపీ శ్రేణులతో కలిసి అడ్డుకుని రచ్చ చేశారు. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యే ఏ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అడ్డు తగలడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదంటూ మళ్లీ తనే ఎల్లో మీడియాతో కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆది నుంచి అంతే.. చైర్మన్‌గా ఎన్నికై నప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. గత టీడీపీ హయాంలో చేసిన అరాచకాన్ని కొనసాగించారు. మున్సిపాలిటీ ప్రతిష్టను బజారు కీడ్చారు. కొన్నాళ్ల పాటు చైర్మన్ చాంబర్ కోసం కౌన్సిలర్లతో కలిసి నానా రభస చేశారు. తనకు కేటాయించిన చాంబర్ కాదని కమిషనర్ కార్యాలయాన్ని కేటాయించాలని పట్టుబట్టారు. కొన్ని రోజుల పాటు కమిషనర్ చాంబర్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు చాంబర్ కేటాయించే విషయంపైనా రచ్చ చేశారు. తన మాట వినడం లేదంటూ గతంలో ఉద్యోగులపై రెచ్చిపోయారు. దీంతో కొందరు ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడానికి ప్రయత్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యాక ఏ కమిషనర్ కూడా ఎక్కువ రోజులు పనిచేయలేదు. అసలు మున్సిపాలిటీ అభివృద్ధినే ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు. కౌన్సిల్ మీట్ జరుగుతున్న సమయంలో తాను చాంబర్లోనే ఉన్నా, వైస్ చైర్మన్లతో సమావేశాలను జరిపించారంటేనే ఆయనకు ప్రజలపై ఏ మాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలను జేసీ సోదరులు పిచ్చోళ్లనుకుంటున్నారు మున్సిపాలిటీ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్‌రెడ్డి అనర్హుడు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. అలాంటి వ్యక్తి బస్సుయాత్రల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తుండడం హాస్యాస్పదం. నమ్మి ఓట్లేసిని ప్రజలను జేసీ సోదరులు పిచ్చివారు అనుకుంటున్నారు. ఇలాంటి వారికి జనమే గుణపాఠం చెప్పాలి. – పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే -
సీనియర్లకు దిక్కేది?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నమ్మించి నట్టేట ముంచడం అనే దానికి అసలైన నిదర్శనం చంద్రబాబు అని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన తమకే టికెట్ లేదంటే ఇక ఎటు వెళ్లాలి అంటూ అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు ఆవేదనతో రగిలిపోతున్నారు. అసలే వర్గపోరుతో గందరగోళంగా ఉన్న పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోకపోవడం, చివరి నిమిషం వరకూ ‘నీకే టికెట్’ అంటూ పలువురికి అధిష్టానం చెప్పడం నాయకుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతమని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు టీడీపీ ఓటికుండగా మారింది. చంద్రబాబును నమ్ముకున్న సీనియర్ నాయకులు ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరి ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. పైగా 2014లో గెలిచారు. ఇప్పుడు ఆయనను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడంతో లోలోపల అధినేతపై రగిలిపోతున్నారు. ∙గుంతకల్లు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడైన జితేందర్‌గౌడ్‌కు టికెట్ లేదని పరోక్షంగా లీకులు ఇస్తుండటంతో టీడీపీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. పాతికేళ్లుగా పార్టీ జెండాను మోసిన తనను కాదని వేరేవాళ్లకు ఇస్తే ఎలా గెలుస్తారో తానూ చూస్తా అని వ్యాఖ్యానిస్తున్నారు. పుట్టపర్తి సీటుపైనా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి పని చేసేది లేదని ఆయన ఇప్పటికే క్యాడర్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. పైగా ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. జేసీ కుటుంబానికి కొమ్ములొచ్చాయా? నిన్నగాక మొన్న టీడీపీలోకి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గానికి ఏమైనా కొమ్ములొచ్చాయా అంటూ కొంతమంది నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 2014లో జేసీ వర్గం టీడీపీలోకి వచ్చింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డికి దాదాపుగా సీటు ఖరారైన నేపథ్యంలో.. దివాకర్‌రెడ్డి కొడుకు పవన్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పవన్‌కు టికెట్ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి భగ్గుమనేలా కనిపిస్తోంది. కుటుంబానికి ఒక్కటే టికెట్ అన్న బాబు.. జేసీ వర్గానికి రెండు ఇస్తే తమకూ రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని పరిటాల వర్గం పట్టుబట్టనుంది. బీసీ వర్గాల్లో అసమ్మతి రాగాలు బోయ, కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల శాతం జిల్లాలో ఎక్కువ. ఈ నేపథ్యంలో బీసీ వర్గాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో హిందూపురం ఎంపీగా గెలిచిన నిమ్మల కిష్టప్ప తనను పక్కన పెట్టారని టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అవసరమైనప్పుడు వాడుకుని ఇప్పుడు వదిలేస్తారా అంటున్నట్టు సమాచారం. నిమ్మల, బీకే పార్థసారథి, జితేందర్‌గౌడ్ వంటి బీసీ నేతలతోపాటు శింగనమల, మడకశిర నియోజకవర్గాలకు చెందిన ఎస్సీ సామాజిక వర్గ నేతలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు అధికార పక్షం దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల బరిలోకి దూసుకెళుతుండగా.. ఇప్పటివరకు చంద్రబాబు ఎటూ తేల్చడం లేదని నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చంద్రబాబు శనివారం ఉరవకొండకు వస్తున్న నేపథ్యంలో నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిందే. -
టీడీపీలో అంతా ఎవరికి వారే...
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. నాయకుల మధ్య సఖ్యత చెడి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. ఏ నాయకుడికీ మరొక నియోజకవర్గ నాయకుడితో సరైన సంబంధాలు లేవు. ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు టీడీపీ అధ్యక్షులను నియమించింది. కానీ ఇక్కడ జిల్లా అధ్యక్షుల మాట కిందిస్థాయి నాయకులు వినే పరిస్థితి లేదు. పరిటాల వర్గమంటేనే భగ్గుమంటున్నారు పరిటాల రవి బతికున్నపుడు టీడీపీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన మరణానంతరం పరిటాల కుటుంబమంటేనే కత్తులు దూస్తున్న పరిస్థితి. రాప్తాడు పక్కనే ఉన్న ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు పరిటాల కుటుంబానికి సత్సంబంధాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొనే పరిస్థితులు చాలా తక్కువ. ఇక ధర్మవరం నుంచి 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన వరదాపురం సూరి.. 2019లో ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు పరిటాల శ్రీరామ్‌తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. ఇద్దరూ ఒకే ఊర్లో ఉంటే రోజూ ఉద్రిక్త పరిస్థితులే. జేసీ అనుచరులతో ఎవరికీ సంబంధాలు లేవు పరిటాల తర్వాత జిల్లాలో ప్రధాన గ్రూపు జేసీ బ్రదర్స్‌ది. ఈడీ కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఇప్పుడు జిల్లాలో పలకరించే దిక్కులేదు. పార్టీపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎవరూ ఆయన దగ్గరకు రాని పరిస్థితి. జిల్లాలో ఏ నాయకుడితోనూ సత్సంబంధాలు లేవు. విధిలేని పరిస్థితుల్లోనే ఆయన కుమారుడికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తున్నట్లు తెలిసింది. కాలవ మాటకు విలువేది? టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలవ శ్రీనివాసులు మాటకు విలువ ఇచ్చే నాయకులు వెతికినా కనిపించరు. పైగా ఆయనంటే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రధాన నాయకులు కత్తులు దూస్తున్నారు. అంతటా ప్రత్యేక గ్రూపులు పెట్టి పార్టీని అధమ స్థాయికి తీసుకెళ్లారని కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు తదితర నియోజకవర్గాల నాయకులు వాపోతున్నారు. అందుకే కాలవ శ్రీనివాసులుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీగా దించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీకే వేదన అరణ్య రోదన టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీకే పార్థసారథి వేదన అరణ్య రోదనగానే ఉంది. తనకు టికెట్ లేదన్న లీకులు ఆయన్ను కలవరపెడుతున్నాయి. సవితమ్మకూ ఈయనకూ గత కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంది. ఈసారి సవితమ్మకు టికెట్ ఇస్తూ తనను ఎంపీగా పంపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేగానే పోటీచేస్తా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా బీకేను పార్టీ లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో పార్టీ అధ్యక్షుడిగా తన మాట ఎవరూ వినడం లేదని ఆయన లోలోపల కుమిలిపోతున్నారు. వర్ధంతి..జయంతులకు కొట్లాటే ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ కొట్లాటలే. పూలదండలు వేసే కార్యక్రమం చిల్లర కొట్లాటలను తలపించాయి. కళ్యాణదుర్గం నుంచి కదిరి వరకూ వర్గాలు బాహాబాహీగా పోరులో పాల్గొన్నవే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిస్థితి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వర్గపోరును నియంత్రించలేకపోతున్నారు. అందుకే టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. -
బాబుపై జెసి ప్రభాకర్ సెటైర్లు
-
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరి
-
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి
-
జేసీవి దిగజారుడు రాజకీయాలు: కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తనపైన కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉనికి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న చీడ పురుగులను ఏరేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. 'జెండాలు తొలగించకుండా సుందరీకరణ పనులు చేస్తామని జేసీ లేఖ ఇచ్చారు. ఇప్పుడేమో వైఎస్సార్ సీపీ జెండాలు తొలగించాలని జేసీ ఆందోళన చేయడం హాస్యాస్పదం. జేసీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం. బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారు. నోరు జారితే ఊరుకునేది లేదు. జేసీ వర్గీయులు నా ఓర్పును పరీక్షించవద్దు. తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు కుట్రలు చేస్తున్నారు.' అని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: బాబును ప్రజలు ఫుట్‌బాల్ ఆడుతారు: మంత్రి రోజా -
జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్..
-
జేసీ ప్రభాకర్‌కు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓపెన్ సవాల్..
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తాడిపత్రి అభివృద్ధి కి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. అభివృద్ధిని నిరూపించలేకపోతే నీవు.. నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారు. తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగడుగునా అడ్డు పడుతున్నారు. అమృత్ స్కీం కింద తాడిపత్రి మునిసిపాలిటీకి రూ.52 కోట్లు రాకుండా అడ్డుకుంటున్నారు. సొంత పొలాలకు మాత్రమే నీరు విడుదల చేసుకునే నైజం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిదే. టీడీపీ పాలనలో సాగునీరు అడిగితే రైతుల మోటార్లు లాక్కెళ్లిన చరిత్ర జేసీ కుటుంబానిదే. సాగునీటి కోసం మిడుతూరు హైవేపై జేసీ ప్రభాకర్ ఆందోళన చేయడం హాస్యాస్పదం. ప్రజలను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక, టిక్కెట్ల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే తుది నిర్ణయం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నా మద్దతు ఉంటుంది. కుప్పం నుంచి పోటీ చేయాలని ఆదేశించినా నేను సిద్ధంగా ఉన్నాను’ అని వెల్లడించారు. -
బినామీ పేరుతో జె సి ప్రభాకర్ రెడ్డి చేసిన అరాచకాలు
-
చోటా డాన్ రజాక్, ఖాజాలకు జేసీ సోదరుల అండ !
తాడిపత్రిలో చీకటి మాటున మట్కా మాఫియా రాజ్యమేలుతోంది. ఒకప్పటి జూదరులు ఇప్పుడు బుకీలుగా అవతారమెత్తి చోటా మట్కా డాన్‌తో కలిసి అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. డబ్బు ఆశ చూపి వారిని రొంపిలోకి లాగుతున్నారు. అత్యాశకు పోయిన సామాన్యులు జేబులకు చిల్లు వేసుకుంటున్నారు. తాడిపత్రి అర్బన్: మట్కా మహమ్మారి అంకెల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తోంది. మట్కా తగిలితే రూపాయికి రూ.80 ఇస్తామని ఆశ చూపిస్తోంది. దీంతో ఎంతోమంది కూలీనాలీచేసుకునే వారు, వ్యాపారులు, చిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు మట్కాను ఎంచుకుంటున్నారు. పోలీసులు మట్కాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా టీడీపీ నేతల అండదండలున్న నిర్వాహకులు తమ పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. కేరళ నుంచి వలస వచ్చి స్థిరపడిన వ్యక్తి ఈ ప్రాంతానికి మట్కాను పరిచయం చేశాడు. ఆ వ్యక్తి కుమారుడైన రషీద్ మట్కా పగ్గాలు చేపట్టాక అనతికాలంలోనే డాన్‌గా ఎదిగాడు. టీడీపీకి చెందిన జేసీ సోదరుల (మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి – మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి)ఆశీస్సులుండడమే ఇందుకు కారణమన్న విమర్శలు ఉన్నాయి. తెరపైకి చోటా డాన్ రజాక్ మట్కా డాన్ రషీద్ కరోనాతో మృత్యువాతపడ్డాక పట్టణంలో మట్కా కొన్నాళ్లు మరుగున పడింది. తన అన్న (ఎల్లో డాన్) వారసత్వాన్ని అబ్దుల్ రజాక్ కొనసాగించడంతో మట్కా తిరిగి పుంజుకుంది. గతంలో బళ్లారికి చెందిన రిజ్వాన్‌ను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రిజ్వాన్ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ టీం అప్పట్లో అబ్దుల్ రజాక్‌ను అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వినాయక్ మేత్రాని అనే మట్కా నిర్వాహకుడిని కూడా పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే రిజ్వాన్, వినాయక్ మేత్రాని అనే వీరిరువురు సౌత్ ఇండియాలోనే మట్కా కంపెనీల్లో నంబర్ వన్ షేర్‌హోల్డర్స్. వీరిలో రిజ్వాన్‌కు తాడిపత్రికి చెందిన అబ్దుల్ రజాక్ మట్కా పట్టీలు ఇచ్చేవాడని అప్పట్లో పోలీసులు గుర్తించారు. టీడీపీకి చెందిన మరో మట్కా డాన్ మకందర్ ఖాజా అలియాస్ లప్ప ఖాజా కుటుంబం మొత్తం తాడిపత్రిలో మట్కా పురుడు పోసుకున్నప్పటి నుంచి మట్కా నిర్వహిస్తుండడం విశేషం. వీరి కుటుంబంలో మహిళలే మట్కా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. ఇటీవల మకందర్ ఖాజా తండ్రి మునీర్బాషాతో పాటు ఖాజా సతీమణి షేక్ నూరీని అరెస్టు చేశారు. పోలీసులనే టార్గెట్ చేసి.. తాడిపత్రి పచ్చ మట్కా మాఫియాలో కీలక సూత్రధారి రషీద్ సోదరుడు అబ్దుల్ రజాక్‌ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కాను పూర్తిస్థాయిలో ఆపాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్ కుటుంబం ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసింది. సీఐ హమీద్‌ఖాన్ తమను వేధిస్తున్నాడంటూ మొసలి కన్నీరు కార్చింది. తెరవెనుక ‘పచ్చ’ కుట్ర మట్కా మాఫియాను ఇన్నాళ్లూ పెంచి పోషించిన ‘పచ్చ’ నేతలకు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ చర్యలు మింగుడుపడడం లేదు. ఈయన ఉంటే తమ ఆటలు సాగవని భావించిన ‘పచ్చ’ నేతలు బురదజల్లేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చోటా డాన్ అబ్దుల్ రజాక్ భార్యతో పోలీసు శాఖలోని కీలక అధికారులపై ఆరోపణలు చేయిస్తున్నారు. మానవ హక్కుల సంఘం, ప్రైవేటు కేసుల పేరుతో పోలీసులను బ్లాక్మెయిల్ చేసి మట్కాను సాగించాలని పథకం రచిస్తున్నారు. మట్కారాయుళ్లపై కొరడా ఎన్నడూ లేని విధంగా తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లపై కొరఢా ఝళిపిస్తున్నారు. అర్బన్ సీఐగా పి.హమీద్‌ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మట్కాపై ఉక్కుపాదం మోపారు. పట్టణంలో మట్కా ఎవరు నిర్వహిస్తున్నారన్న దానిపై ఆరా తీసి వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోని వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్ గౌతమి ఉత్తర్వుల మేరకు మట్కా నిర్వాహకులు బుక్కపట్నం శివకుమార్, చుక్కలూరు చాంద్‌బాషా, మక్తుం పాల మాబు, దూదేకుల కుళ్లాయప్ప, ఉదయగిరి మాబున్నీ, దిగువపల్లి పుల్లయ్య, తుంగ రామాంజులరెడ్డిలపై ఆరు నెలల పాటు జిల్లా బహిష్కరణ వేటు వేశారు. ఆన్లైన్లో మట్కా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్వాహకులు మట్కాను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొందరు మట్కా నిర్వాహకులు స్వయంగా యాప్ డెవలపర్స్.. మిలాన్డే, మిలాన్ నైట్ పేర్లతో ప్రత్యేక వెబ్సైట్లు రూపొందించి యాప్‌ల ద్వారా అండ్రాయిడ్ ఫోన్లకు లింక్‌లను పంపి గుట్టుగా మట్కా నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను సదరు ఆండ్రాయిడ్ యూజర్ రూ.10 వేలు నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారుకు ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ ఉపయోగించి మట్కా నిర్వహించుకోవాలి. రూ.100కు రూ.8వేలు చెల్లిస్తామంటూ అమాయకుల బతుకులను నాశనం చేస్తున్నారు. ఉపేక్షించేది లేదు మట్కా విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నేను బాధ్యతలు తీసుకున్నాక ఇప్పటి వరకు మట్కా స్థావరాలపై దాడులు జరిపి, 33 కేసులు నమోదు చేశాం. మట్కా, గ్యాంబ్లింగ్‌ను కూకటివేళ్లతో పెకలించాలని సీఐ, ఎస్ఐలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఆన్లైన్ మట్కాను కూడా నిర్మూలిస్తాం. – సీఎం.గంగయ్య, డీఎస్పీ, తాడిపత్రి -
ప్రశ్నార్థకంగా జేసీ సోదరుల రాజకీయ భవిష్యత్తు
తాడిపత్రి: ఒకప్పుడు ఇంట్లో కూర్చొనే కనుసైగలతో జిల్లా రాజకీయాలను శాసించిన జేసీ సోదరుల రాజకీయ భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకంగా మారింది. అహంకారం, నోటి దురుసు వారిని ఈ స్థాయికి తెచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారి తీరుతో వారసుల రాజకీయ భవిష్యత్తూ ప్రమాదంలో పడింది. జేసీ సోదరులు సుమారు 35 ఏళ్ల పాటు తాడిపత్రి నియోజకవర్గాన్ని కబంధ హస్తాల్లో ఉంచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వారి వైఖరితో విసిగి వేజారిన ప్రజలు 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. వైఎస్సార్సీపీని ఆదరించి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయి. ఫలితంగా వైఎస్సార్సీపీకి మరింత ఆదరణ పెరిగింది. ఇటీవల కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంక్షేమ యాత్రకు విశేష జనాదరణ లభించడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిణామాలు జేసీ బ్రదర్స్‌ను, వారి అనుచరులను అంతర్మథనంలో, ఆందోళనలో పడేశాయి. సర్వేలోనూ వెనుకంజ? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై ఆ పార్టీ అధిష్టానం ఇటీవల సర్వే చేయించినట్లు తెలుస్తోంది. అందులోనూ జేసీ సోదరులు వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. మునిసిపల్ చైర్మగా పట్టం కట్టినా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, అధికారులను టార్గెట్ చేస్తూ, నోటిదురుసుగా మాట్లాడుతూ పాలన కుంటుపడేలా చేశారన్న అంశం సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి వల్ల టీడీపీకి నష్టమే కానీ, చేకూరే లాభం ఏమీలేదన్న విషయం వెల్లడి కావడంతో ఆ పార్టీ అధిష్టానం ప్రత్యామ్నాయ నాయకత్వంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో జేసీ సోదరులపై వరుసగా పోటీ చేసి ఓటమి పాలైన నాయకుడి వైపు చూస్తున్నట్లు సమాచారం. అతనికి టికెట్ కేటాయిస్తే కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందని, లేదంటే అదీ గల్లంతేనన్న భావన టీడీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. దూరమవుతున్న కేడర్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలిపై సొంత పార్టీ కేడర్లోనే అసంతృప్తి ఉంది. తన ఉనికి కోసం మాత్రమే పాకులాడే ఆయన్ను నమ్ముకుంటే తమకు నష్టమేనని కొందరు కౌన్సిలర్లు భావిస్తున్నారు. టీడీపీ సొంత సామాజిక వర్గం కూడా జేసీ వ్యవహారశైలిని తప్పుబడుతోంది. చివరకు అనుచరుల్లోనూ తీవ్ర నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జేసీ అనుచరుడు, పెద్దపప్పూరు మండల నాయకుడు రఘునాథ్‌రెడ్డి ఇటీవల వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అలాగే కౌన్సిలర్ రాబర్ట్, అయూబ్ బాషా పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు ఇదేబాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఉలిక్కిపడిన జేసీ సోదరులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు తమ నివాసంలో విందు ఏర్పాటు చేసి బుజ్జగించినట్లు తెలిసింది. అయినప్పటికీ కేడర్ వారిని విశ్వసించడం లేదు. వారసులకు నష్టం జేసీ కుటుంబాన్ని నియోజకవర్గ ప్రజలు సుదీర్ఘ కాలం పాటు ఆదరించినప్పటికీ వారి ఇబ్బందులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. సరికదా ఏవైనా సమస్యలు చెప్పుకునేందుకు తమ వద్దకు వచ్చిన ప్రజలను నోటికి ఎంతొస్తే అంత మాట అనేవారు. చులకనగా, హేళనగా మాట్లాడేవారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే నియోజకవర్గంలో పర్యటించి హడావుడి చేసేవారు. ఎన్నికల అనంతరం వ్యాపారాలకు పరిమితమయ్యేవారు. జేసీ బ్రదర్స్ అహంకారపూరితంగా, పెత్తందారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలను నిర్లక్ష్యం చేసిన ఫలితంగా 2019 ఎన్నికల్లో వారి వారసులుగా బరిలోకి దిగిన జేసీ పవన్, జేసీ అస్మిత్‌రెడ్డిలను ఓడించి గట్టిగానే గుణపాఠం నేర్పారు. ఇప్పుడు కూడా వారసుల రాజకీయ ఎదుగుదలకు జేసీ సోదరులే ప్రతిబంధకంగా మారారన్న భావన తాడిపత్రి ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి సవాల్..
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఒక రోజంతా మనమిద్దరం ఒక గదిలో ఉందాం.. దమ్ముంటే నన్ను చంపుతావా? అని సవాల్ చేశారు. ప్రభాకర్ రెడ్డి బెదిరింపు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాగా, ఎమ్మెత్యే కేతిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నన్ను చంపేస్తానని ప్రతీరోజు ప్రభాకర్ రెడ్డి అరుస్తున్నారు. నువ్వు-నేను ఒక గదిలో ఉందాం. రోజంతా టైమ్ ఇస్తాను. నన్ను చంపుతావా?. అడుగు తీసి అడుగు వేయలేని ప్రభాకర్ రెడ్డి బెదిరింపు హాస్యాస్పదం. తాడిపత్రిలో టీడీపీ లీడర్ ఎవరో అర్థం కాక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. తాడిపత్రి టీడీపీ ఇంఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి వీకెండ్ పొలిటీషియన్. ఉనికి కోసమే ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో హడావుడి చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం గద్వాల్లో దొంగతనాలు చేసి తాడిపత్రికి వలస వచ్చారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారం తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఉంది. త్వరలో ఆయా రాష్ట్రాల్లో కేసులు వేస్తాం. బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన నీచ చరిత్ర ప్రభాకర్ రెడ్డిది. నన్ను పదే పదే ఆయన రెచ్చగొడుతున్నారు. సానుభూతిలో తన కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకుందామన్న ఆలోచనలో జేసీ ఉన్నారు. జేసీ బ్రదర్స్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే త్రిశూల్ సిమెంట్ వ్యవహారంలో ప్రభుత్వం విధించిన వంద కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నన్ను పిలవకపోవడం దుర్మార్గం.. అసలు విలన్ పురంధరేశ్వరి: లక్ష్మీపార్వతి -
జేసీ.. జేసీబీ!
తాడిపత్రి: ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణంలో దర్జాగా అసాంఘిక కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవటమే కాకుండా తన అనుచరులతో కలసి కూల్చివేతలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనుల వద్ద వీరంగం సృష్టించారు. జేసీ గ్యాంగ్ కూలగొట్టిన పిల్లర్లను తిరిగి నిర్మించేందుకు ప్రయత్నించిన కార్మికులపై ఆదివారం ఉదయం దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఏం జరిగిందంటే... నాడు–నేడు ఫేజ్ 2 పనుల్లో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను మూడు రోజుల క్రితం చేపట్టారు. జూనియర్ కళాశాల సమీపంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం ఉంది. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో నిర్మాణ పనుల వద్దకు అనుచరులతో కలసి చేరుకున్న జేసీ ‘రేయ్ జేసీబీతో పిల్లర్లను కూలదోయండిరా..’ అంటూ హుకుం జారీ చేశారు. జేసీబీతో కాంక్రీట్ పిల్లర్లను కూలదోశారు. మర్నాడు అక్కడకు వచ్చిన కూలీలను పనులు నిలిపి వేయాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు అడ్డగించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రహరీ నిర్మిస్తున్నామని, అడ్డు తగలడం సమంజసం కాదని చెప్పినా వినిపించుకోలేదు. దీనిపై మేస్త్రీ గురుశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్మాణాలను దౌర్జన్యంగా కూలగొట్టడంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస మల్లికార్జునరెడ్డి, సుబ్బయ్య, వడ్డే మధు, సోమశేఖర్ నాయుడు, దినేష్‌రెడ్డి, పవన్‌నాయుడు, మునిసిపల్ కాంట్రాక్టర్ తిరుపాల్‌రెడ్డి, కుమ్మరి వెంకటేష్, రాంబాబు, గురుజాల శివశంకర్‌రెడ్డి, చరణ్, హరినాథ్‌రెడ్డి, గండికోట కార్తీక్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ తెలిపారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యకాండ
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యకాండకు దిగారు. నాడు నేడు పనులను అడ్డుకున్న ఆయన.. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంజీవనగర్ హైస్కూల్ లో నాడు - నేడు పనులకు అధికారులు ఉపక్రమించారు. అయితే.. ఆ ఎదురుగానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు ఉంది. కొంతకాలంగా ఆ ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్‌లోనే జేసీ తన పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అయితే.. అధికారులు హైస్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మిస్తే తన పార్టీ కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగుతాయని జేసీ అడ్డుకుంటున్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలు పూడ్చివేయడంతో పాటు అధికారులు, పోలీసులతో జేసీ వాగ్వాదానికి దిగారు. దుర్మార్గం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నాడు నేడు పనుల్ని అడ్డుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలో నాడు -నేడు పనులను జేసీ అడ్డుకోవడం దుర్మార్గం, తాడిపత్రి అభివృద్ధి కి జేసీ అడ్డుపడుతున్నారని మండిపడ్డారాయన. -
రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పోలీసులను అరేయ్.. ఓరేయ్ అంటూ..
సాక్షి, అనంతపురం: తరచూ తన వ్యవహారశైలితో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ అధికారులు, పోలీసులపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అరుపులు, కేకలతో దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. అరేయ్.. ఓరేయ్ అంటూ మీడియా సమావేశంలో ఊగిపోయారు. ఒక్కొక్కరి అంతుచూస్తానంటూ జేసీ బెదిరింపులకు దిగారు. ఇటు నియోజకవర్గంలోను, అటు టీడీపీ క్యాడర్లోను ఉనికి కోల్పోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఎలాగైనా ఉనికిని చాటుకునేందుకు చవకబారు రాజకీయాలు చేస్తున్నారు. గత నెల ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా కలెక్టర్‌పైనే దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. కనీస మర్యాద కూడా లేకుండా కలెక్టర్‌ను ఏకవచనంతో సంబోధించడంతో పాటు ఆమె ముందే పేపర్లు విసిరేశారు. అడ్డుకోబోయిన కలెక్టర్ గన్‌మెన్‌ను తోసేసి నానా రభస సృష్టించారు. చదవండి: టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ: ఎంపీ విజయసాయిరెడ్డి -
జేసీ ప్రభాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు
-
జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అనంతపురం(ఏపీ) టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను.. BS4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకుగానూ ఈ పరిణామం చోటు చేసుకుంది. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆయన్ని నోటీసుల్లో హైకోర్టు ఆదేశించింది. దివాకర్ ట్రావెల్స్ బీఎస్-3 వాహనాలను కొని బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్టు గతంలో అధికారుల సోదాల్లో నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసి.. కర్ణాటక, ఏపీలోని పలు వాహనాలను సైతం సీజ్ చేశారు. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. జేసీ ట్రావెల్స్ వ్యవహారాలపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి విచారణకు అప్పగించాలని పిటిషన్ వేశారు. 2020, అక్టోబర్ 12న తెలంగాణ రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని తన పిటిషన్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ప్రతివాదులైన తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. -
సీఐ ఆత్మహత్య.. జేసీ శవరాజకీయం.. ముందునుంచీ పోలీసులంటే చిన్నచూపే
అనంతపురం: ఇటు నియోజకవర్గంలోను, అటు టీడీపీ క్యాడర్లోను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉనికి కోల్పోయారు. ఎలాగైనా ఉనికిని చాటుకునేందుకు, తాడిపత్రిలో పైచేయి సాధించాలనే కుట్రపూరిత ఆలోచనతో సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయాస్త్రంగా వాడుకుంటున్నారు. ఈయన చవకబారు, శవరాజకీయాలపై ప్రజలు చీదరించుకుంటున్నారు. కుటుంబ కలహాలతో అర్బన్ సీఐ ఆనందరావు మూడు రోజుల క్రితం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఎస్పీ శ్రీనివాసరావే తాడిపత్రికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. సీఐ ఆత్మహత్యకు రాజకీయ, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు కారణం కాదని, కుటుంబ సమస్యల వల్లే ప్రాణం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు గురించి మీడియాకు వెల్లడించారు. అయితే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం సీఐ ఆత్మహత్యకు రాజకీయ రంగు పులిమి, హంగామా చేయడం విస్మయం కలిగిస్తోంది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయులు ఘర్షణ పడిన సమయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారన్న చిన్నచూపుతో సీఐ ఆనందరావును దుర్భాషలాడారు. ‘వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై తన వర్గీయులు దాడులు చేస్తారు చూస్తావా.. అడ్డుకోవడం నీవల్ల అవుతుందా’ అంటూ హేళన చేస్తూ బెదిరించారు. ఈ విషయమై సీఐ అప్పట్లోనే స్థానిక డీఎస్పీతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులంటే జేసీ బ్రదర్స్‌కు ఎప్పుడూ చిన్నచూపే.. జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడు మాట వినని పోలీసులను దుర్భాషలాడడమే కాకుండా, వారి వాహనాలను దహనం చేయడంతో పాటు ఏకంగా పోలీస్ స్టేషన్‌కే తాళాలు వేయించారు. అలాంటి జేసీ సోదరులు ఇప్పుడు పోలీసులంటే ఎనలేని గౌరవం ఉన్నట్లు మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాజకీయ ప్రయోజ నాల కోసం సీఐ ఆత్మహత్యను వాడుకుంటున్నారు. సీఐ చావుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిళ్లు కారణమంటూ ఆరోపణలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో అలజడులు రేపేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు.. తాడిపత్రి పట్టణంలోని ఆంజనేయస్వామి మాన్యంలో నివసిస్తున్న పేదలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రజలకు మేలు చేయడం గిట్టని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుయాయులచే హైకోర్టులో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడ్డారు. ► అంబేడ్కర్ నగర్‌లోని మున్సిపల్ స్థలంలో ఆరోగ్య ఉప కేంద్రం భవనం నిర్మించడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేక తన అనుచరుడైన టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటిషన్ వేయించి పనులు అడ్డుకున్నారు. ► తాడిపత్రిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ఒప్పించారు. ఎస్పీ కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే తన సొంత డబ్బుతో స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జీర్ణించుకోలేక టీడీపీ కౌన్సిలర్‌తో జేసీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయించి స్టే తెప్పించారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. మున్సిపల్ అధికారులపైనా కక్ష సాధింపు.. ► మున్సిపల్ అధికారులు, సిబ్బందిని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్షసాధింపులకు దిగారు. ప్రొటోకాల్ పేరుతో దూషణలు, బెదిరింపులతో భయకంపితులను చేస్తున్నారు. ►మున్సిపాలిటీలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలని హుకుం జారీ చేస్తున్నారు. ► మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరెడ్డి అహంకారపూరిత ధోరణితో కమిషనర్ మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు వృత్తిపరంగా అనేక రకాలుగా తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రి పట్టణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నారు. శాంతిభద్రతల విషయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మూడు దశాబ్దాల తమ ఏక ఛత్రాధిపత్యానికి చెక్ పడటం జేసీ ప్రభాకర్‌రెడ్డికి మింగుడు పడలేదు. ఎలాగైనా తమ ప్రాభవం తిరిగి సంపాదించుకునేందుకు ఏదో ఒక అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. ► ఇప్పుడు ఏకంగా ఓ సీఐ ఆత్మహత్యను అస్త్రంగా తెరపైకి తీసుకువచ్చి, అందుకు రాజకీయ రంగును పులుముతూ, పబ్బం గడుపుకోవాలని చూస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన తెలిపేందుకు చిహ్నంగా వాడే నల్లదుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి సీఐ ఆనందరావుకు నివాళులర్పించడం పట్ల కొన్ని దళిత సంఘాలతో పాటు తాడిపత్రి ప్రజలు తప్పుపడుతున్నారు. మరణించిన వ్యక్తి చిత్రపటానికి పూలు చల్లడం, పూల మాల వేయడం, లేదా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం, వాటితో మానవహారం నిర్వహించడం వంటి చర్యలతో మృతి చెందిన వ్యక్తికి శ్రద్ధాంజలి, నివాళులర్పిస్తారు. అయితే సీఐ ఆనందరావు దళితుడైనందునే జేసీ ప్రభాకర్‌రెడ్డి నల్ల దుస్తులు ధరించి అగౌరవపరిచారని దళితులు కొందరు జేసీ తీరును తప్పుబట్టారు.జే అనుచరుల కోసం చాంబర్.. మున్సిపల్ చైర్మన్ హోదాను అడ్డుపెట్టుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ మున్సిపాలిటీలో లేని విధంగా రెండు చాంబర్లను ఆక్రమించుకున్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన చాంబర్ల తాళాలను కూడా తనవద్దే ఉంచుకుంటున్నారు. బయటి వ్యక్తులు, అనుచరులు చైర్మన్ చాంబర్లలోకి వచ్చి వెళుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుచరులు కొందరు కార్యాలయంలోనే తిష్ట వేసి కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. జేసీ విపరీత పోకడలను తాళలేని సిబ్బంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. -
సీఐ ఆనందరావు ఆత్మహత్యపై జేసీవి శవరాజకీయాలు:కేతిరెడ్డి పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: సీఐ ఆనందరావు ఆత్మహత్య అంశంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైరయ్యారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య ను రాజకీయం చేయడం దురదృష్టకరమని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆత్మహత్యకు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. టీడీపీ పాలనలో పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసని అన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించాలని కోరారు. తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లాక తలుపులు బిగించుకొని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు... తాడిపత్రి సీఐ ఆనందరావు మృతికి కుటుంబ కలహాలే కారణమని తెలిపారు. ఇదీ చదవండి: ఆత్మహత్యకు పాల్పడ తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు -
జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాయుత వ్యాఖ్యలు
-
జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలు.. తాడిపత్రిలో హైటెన్షన్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో సోమవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. ఈ వ్యాఖ్యల అనంతరం జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించారు. ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో.. పోలీసులు జేసీ ప్రభాకర్‌ను తొలుత హౌస్ అరెస్టు చేశారు. ఈలోపు జేసీ నివాసం వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో డీఎస్పీ చైతన్య జోక్యం చేసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇంతలో జేసీ ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి బయటకు రావాలని యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. (చదవండి: యువతితో వీడియో కాల్: మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతా.. ) -
విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసు: టీడీపీ నేతలకు జీవిత ఖైదు
సాక్షి, అనంతపురం: అనంతపురంలో వైఎస్సార్సీపీ నేత అప్పిచర్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో టీడీపీ నేతలు శ్రీనివాసనాయుడు, గురుప్రసాద్ నాయుడికి జీవిత ఖైదు పడింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులకు గుత్తి కోర్టు.. ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. పెద్దవడుగూరు సొసైటీ కార్యాలయంలో విజయ్‌భాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో టీడీపీ నేతలు శ్రీనివాసనాయుడు, గురు ప్రసాద్ నాయుడు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన గుత్తి కోర్టు.. వీరిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు నిచ్చింది. అలాగే, మరో ఇద్దరు నిందితులకు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. కాగా, నిందితులంతా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనచరులు కావడం గమనార్హం. ఇది కూడా చదవండి: మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీరావు బెంబేలు -
బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేయొచ్చు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్–3 వాహనాలను తుక్కు కింద కొని, బీఎస్–4 వాహనాలుగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బినావీులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసేలా ఉత్తర్వులు జారీ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు హైకోర్టు వెసులుబాటునిచ్చింది. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 17 ప్రకారం సంబంధిత అధీకృత అధికారి చర్యలు చేపట్టవచ్చునని స్పష్టం చేసింది. ప్రభాకర్‌రెడ్డి బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవ్వా గోపాల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, భార్య లక్ష్మీదేవి పేరు మీద ఉన్న యాక్సిస్, యూనియన్ బ్యాంకుల ఖాతాల నుంచి 15 రోజుల పాటు ఎలాంటి నగదు లావాదేవీలు జరపడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఈడీ అధీకృత అధికారి సెక్షన్ 17 (1)(ఏ) కింద జారీ చేసే ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఇదే సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మీదేవి బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలు జరగకుండా స్తంభింపచేయాలంటూ యాక్సిస్, యూనియన్ బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పంపిన ఈ–మెయిళ్లను రద్దు చేసింది. సెక్షన్ 17 (1)(ఏ) కింద జారీ చేయని కారణంతోనే ఈ–మెయిళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ మంగళవారం తీర్పునిచ్చారు. అశోక్ లేలాండ్ సంస్థ నుంచి బీఎస్–3 వాహనాలను తుక్కు కింద కొని, బీఎస్–4 వాహనాలుగా మార్చిన వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బినావీులపై పోలీసులు 46 కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. కొల్లగొట్టిన సొమ్మును ప్రభాకర్‌రెడ్డి బినామీ గోపాల్‌రెడ్డి తన కుమారుడు, భార్య బ్యాంకు ఖాతాల్లో దాచినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలు జరగకుండా చూడాలంటూ యాక్సిస్, యూనియన్ బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ–మెయిళ్లు పంపారు. బ్యాంకు అధికారులు లావాదేవీలు నిలిపివేశారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ–మెయిళ్లను సవాలు చేస్తూ గోపాల్‌రెడ్డి అండ్ కో, దాని మేనేజింగ్ పార్ట్నర్ గోపాల్‌రెడ్డి, ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, భార్య లక్ష్మీదేవీలు హైకోర్టులో 2022లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి రవినాథ్ తిల్హరీ గత నెలలో పూర్తిస్థాయిలో వాదనలు విన్నారు. ఈడీ తరఫున జోస్యుల భాస్కరరావు, పిటిషనర్ల తరఫున న్యాయవాది ఐ.కోటిరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హరీ మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. -
జేసీ బ్రదర్స్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
-
టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌కు కోర్టు సమన్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో వాహనాల కుంభకోణం కేసులో టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 155 బీఎస్–3 వాహనాలకు బీఎస్–4గా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి వాటిని జేసీ బ్రదర్స్ విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న జేసీ బ్రదర్స్‌తో సహా 18 మందికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. మార్చి 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయంగా సమన్లు అందజేశారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్.. భారీగా ఆస్తుల అటాచ్
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ర్డెఇకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చిది. బస్సుల కొనుగోలు కుంభకోణం కేసులో ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దివాకర్ రోడ్‌లైన్స్, జఠాదర ఇండస్ట్రీస్‌కు చెందిన 22.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. జీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. అశోక్ లేలాండ్ నుంచి తక్కువ ధరకు వాహనాలు కొన్నట్లు తెలిపింది. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో కొత్త వాహనాలు నడిపినట్టు ఈడీ పేర్కొంది. బీఎస్ 4 వాహనాల స్కాంలో రూ. 38.36 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలిపింది. రూ.6.31 కోట్ల విలువైన నగదు, అభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు సీజ్ చేశారు. రూ. 15.79 కోట్ల విలువైన 68 చరాస్తులను సీజ్ చేశారు. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్ అక్రమాల బాగోతం ఇలా.. టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి బ్రదర్స్ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్–3 కేటగిరీకి చెందిన 154 లారీలు, బస్సులను తుక్కు కింద జటాధర ఇండస్ట్రీస్ పేరున 50, సి. గోపాల్‌రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నకిలీపత్రాలతో వాటిని బీఎస్–4 వాహనాలుగా చలామణిలోకి తీసుకొచ్చారు. అనంతరం వాటిని నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్ఓసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33 వాహనాలు, కర్ణాటకలో 15 వాహనాలు, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు నిర్వహిస్తున్నారు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాక.. వాహనాల బీమాలోనూ వీరు ఫోర్జరీకి పాల్పడ్డారు. వీటిని కొద్దిరోజులపాటు తిప్పి ఆ తర్వాత పోలీసుల ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో (ఎన్ఓసీ) వాటిని ఇతర రాష్ట్రాల వారికి విక్రయించేశారు. కానీ, వీటిని కొనుగోలు చేసినవారు తాము మోసపోయామని గుర్తించి ఫిర్యాదుచేశారు. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించారు. జేసీ కుటుంబం సమర్పించిన బీమా పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టుచేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లపై హత్యాయత్నం కేసు
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): తాడిపత్రిలో వైఎస్సార్సీపీ కార్యకర్త గండికోట హాజీబాషా అలియాస్ ఘోరా హాజీపై దాడి చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతని కుమారుడు, జేసీ అస్మిత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. ఈ నెల 23న తాడిపత్రిలోని మూడో వార్డు పర్యటనకు వెళ్లిన అస్మిత్‌రెడ్డి, ఆయన అనుచరుడు ఖాదర్‌బాషా మరికొందరు.. అదే వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. అంతటితో ఆగకుండా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో హాజీబాషా తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి, అనుచరులు ఖాదర్‌బాషా, ఫిల్టర్ బీడీ యజమాని అయూబ్‌తో పాటు మరో పది మంది టీడీపీ నేతలపై 147, 148, 307, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ -
జేసీ మనుషులమంటూ దౌర్జన్యం
చిలమత్తూరు(శ్రీసత్యసాయి జిల్లా): తాము జేసీ ప్రభాకరరెడ్డి మనుషులమని, తమను ప్రశ్నించినా... చర్యలను అడ్డుకున్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు దౌర్జన్యానికి దిగారు. వివరాలు... రాష్ట్రంలో ప్రభుత్వ భవన నిర్మాణాలకు సరఫరా చేసిన సిమెంట్ కర్ణాటకకు యథేచ్ఛగా తరలిపోతోంది. వందలాది సిమెంట్ బస్తాలు కర్ణాటక ప్రాంతంలోని ప్రైవేట్ భవన నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బాగేపల్లిలో ప్రైవేట్ భవన నిర్మాణానికి ఏపీ ప్రభుత్వ సిమెంట్ వినియోగిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న చిలమత్తూరు మండల అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆ సమయంలో అక్కడి వారు అధికారులను అడ్డుకున్నారు. ఫొటోలు డెలిట్ చేయాలని బలవంతం చేశారు. తాము తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మనుషులమని, తాము తలుచుకుంటే అక్కడి నుంచి అడుగు కూడా పక్కకు వేయలేరంటూ బెదిరింపులకు దిగారు. అవసరమైతే జేసీ ప్రభాకరరెడ్డితో ఫోన్లో మాట్లాడిస్తామంటూ దౌర్జన్యానికి దిగారు. విచారణలు, దర్యాప్తులు ఏవైనా ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని తమ ప్రాంతానికి వచ్చి ప్రశ్నిస్తే తిరిగి వెళ్లలేరంటూ హెచ్చరించడంతో మారు మాట్లాడకుండా అధికారులు వెనుదిరిగి వచ్చారు. ఈ విషయంగా చిలమత్తూరు ఎంపీడీఓ రామ్‌కుమార్‌ను వివరణ కోరగా... అక్కడ వినియోగిస్తున్న సిమెంట్ ఏపీ ప్రభుత్వం సరఫరా చేసిందేనని స్పష్టం చేశారు. అయితే అది చిలమత్తూరు మండలానికి సంబంధించినది కాదన్నారు. భవన యాజమాన్యం మాట్లాడిన తీరును బట్టి అది కచ్చితంగా అనంతపురం జిల్లా నుంచే సరఫరా అయినట్లుగా తెలుస్తోందన్నారు. దీనిపై లోతైన విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. -
కలెక్టర్‌పై రెచ్చిపోయిన జేసీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తరచూ తన వ్యవహారశైలితో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి ఏకంగా కలెక్టర్‌పైనే రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చిన ఆయన కలెక్టర్ నాగలక్ష్మిపై అరుపులు, కేకలతో ఊగిపోతూ తీవ్ర అలజడి సృష్టించి దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. కనీస మర్యాద కూడా లేకుండా కలెక్టర్‌ను ఏకవచనంతో సంబోధించారు. ఆమె ముందే పేపర్లు విసిరేశారు. అడ్డుకోబోయిన కలెక్టర్ గన్‌మెన్‌ను తోసేసి నానా రభస సృష్టించారు. అప్పటికీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సర్దిచెబుతున్నా వినకుండా అరుపులు, కేకలతో రెచ్చిపోయారు. మీరున్నది ఎందుకంటూ తీవ్రస్వరంతో గద్దించారు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుతో అక్కడున్న రెవెన్యూ సిబ్బంది తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అసలేం జరిగిందంటే.. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సర్వే నంబరు 775లోని 6.93 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి జేసీ ప్రభాకర్‌రెడ్డి కలెక్టరేట్లో ‘స్పందన’కు వచ్చారు. ఆ సర్వే నంబర్లోని పలు భూములు 22ఏ (చుక్కల భూములు) జాబితాలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా అక్కడి భూ అనుభవదారులు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సర్వే నంబరు 775లోని ఓ భూమికి సంబంధించిన ఫైలును 2021 నవంబరులో ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. కిందిస్థాయి నుంచి అంటే తహసీల్దార్ నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ ఫైలును ప్రభుత్వానికి పంపించారు. సీసీఎల్ఏ అధికారులు ఈ ఫైలును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 2022 ఫిబ్రవరిలో ఈ భూమిని చుక్కల భూముల జాబితా నుంచి తొలగించాలని జీఓ ఇచ్చారు. దీని ఆధారంగా ఈ 6.93 ఎకరాలతో పాటు ఇదే గ్రామంలోని మరో 40 ఎకరాల వరకూ చుక్కల భూముల నుంచి విముక్తి కల్పించారు. అనంతరం ఈ భూమిని సదరు యజమాని.. అంబటి రాఘవేంద్రరెడ్డి అనే వ్యక్తికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే, ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి కలెక్టరుతో వాగ్వాదానికి దిగారు. మండిపడిన ఉద్యోగులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలిపై అధికారులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. కలెక్టరుతో ఆయన ప్రవర్తించిన తీరు సరికాదని.. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం జిల్లా అధికారుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌తో మాట్లాడేది ఇలాగేనా.. ఇదేనా మీ సభ్యత.. సంస్కారం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. ఇలాంటివి పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె.సి.ప్రభాకర్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర చైర్మన్ వీఎస్ దివాకర్, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బి. సుగుణ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కలెక్టర్‌తో పాటుగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులపై ఆయన దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని తమ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఐఏఎస్ స్థాయి అధికారులతోనే జేసీ ఇలా వ్యవహరిస్తే సాధారణ ప్రభుత్వోద్యోగుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే జేసీపై చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటికప్పుడు నిర్ణయం కాదు ఈ ఫైలును రాత్రికి రాత్రే చేసినట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. అలా చేయడానికి సాధ్యంకాదు. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి చేయడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది. పైగా ఈ ఫైలును సీసీఎల్ఏ పరిశీలనకు పంపించేశాం. ఇందులో ఎవరి సిఫార్సులూ, ఒత్తిళ్లూ లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేశాం. – నాగలక్ష్మి సెల్వరాజన్, కలెక్టర్ జిల్లాలో లక్ష ఎకరాలు చేశాం.. ఇదొక్కటే కాదు జిల్లాలో లక్ష పైచిలుకు ఎకరాల భూమిని 22ఎ నుంచి విముక్తి కల్పించాం. సజ్జలదిన్నె గ్రామంలోని ఆ భూమి ఒక్కటే కాదు. ఈ భూమి కూడా ప్రభుత్వ పరిశీలనకు పంపించేశాం. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ప్రతీఒక్క అడుగూ నిబంధనల ప్రకారమే వేశాం. ఇందులో ఎలాంటి వివాదాలకూ తావులేదు. – కేతన్‌గార్గ్, జాయింట్ కలెక్టర్ -
జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు
-
మాజీ ఎమ్మెల్యే జేసీపై కేసు
తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం జూటూరు గ్రామంలో సోమవారం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వి.ఎన్.కె.చైతన్య తెలిపారు. జేసీ వర్గీయుల దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎర్రగుడి రామ్మోహన్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, ప్రతాపరెడ్డి, సత్యనారాయణరెడ్డి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎర్రగుడి రామ్మోహన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని కుట్రదారుగా పేర్కొన్నారు. జేసీతో పాటు ఎ.నారాయణరెడ్డి, జేసీ చిత్తరంజన్‌రెడ్డి, జేసీ శశిధర్‌రెడ్డి, కె.ఓబిరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, శివశంకర్‌రెడ్డి, దేవరాజు, ఎ.వరప్రసాద్‌రెడ్డి, కె.రామలింగారెడ్డి, వై.ఓబిరెడ్డి, మరొకరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
కదులుతున్న అక్రమాల పుట్ట.. స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు!
టీడీపీ పాలనలో జేసీ సోదరులు (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి) అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. నాలుగు దశాబ్దాలుగా ట్రావెల్స్ వ్యాపారంలో అక్రమంగా రూ.కోట్లు దండుకున్నారు. ఒక బస్సుతో ప్రారంభమైన ట్రావెల్స్ వ్యాపారం నుంచి వందల సంఖ్యలో బస్సులు పుట్టుకొచ్చాయి. ఒక పర్మిట్ నంబర్‌తో నాలుగు బస్సులు తిప్పుతూ ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టించారు. ఎట్టకేలకు వీరి అక్రమాల పుట్ట కదులుతోంది. నిన్న త్రిశూల్... నేడు దివాకర్ ట్రావెల్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాడిపత్రి అర్బన్: జేసీ సోదరులు అడ్డగోలు వ్యాపారాలు, అవినీతి అక్రమాలతో రూ.కోట్లు పోగేసుకున్నారు. ఒకేనంబర్పై పలు బస్సులను అనధికారికంగా నడిపారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు 2012లో రవాణాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సును సీజ్ చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని బస్సులను సీజ్ చేయడం సంచలనం రేపింది. కండీషన్ లేని బస్సులు నడపడం వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతుండటం, ట్రావెల్స్ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై నిఘా అధికమైంది. అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. గ్రానైట్ మాఫియా తాడిపత్రిలో 850 వరకు గ్రానైట్ పరిశ్రమలున్నాయి. వీటన్నింటికీ కలిపి 70 లారీలతో 20 నుంచి 30 మంది ట్రాన్స్పోర్టర్లు గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. ఒక లోడు గ్రానైట్ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల మేర రాయల్టీ చెల్లించాలి. అయితే రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యం, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య కుదిరిన ఒప్పందం మాఫియాను తలపించింది. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని బిల్లులో తగ్గించి, ఒకే బిల్లుతో ఐదారు లోడ్లు రవాణా చేస్తుండేవారు. ఈ డబ్బులు మొత్తం మాఫియాను నడిపే ఓ ‘పెద్దమనిషి’ ఇంటికి చేరవేసేవారు. అక్కడ వాటాల పంపకం జరుగుతుండేది. నిజాయితీ అధికారులకు వేధింపులు మైనింగ్ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలోని అక్రమాల గురించి తెలిసి షాక్ అయ్యారు. ఈ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా రూ.కోటి కూడా పెనాల్టీ రూపంలో వచ్చేవి కావు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. దందా ఏ స్థాయిలో సాగిందో ఈ జరిమానాలు చూస్తే తెలిసిపోతుంది. ఇలాంటి నిజాయితీ అధికారి ఇక్కడ ఉంటే ఆటలు సాగవని బదిలీ చేయించాలని చూశారు. చివరకు చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో గ్రానైట్ మాఫియాతో తనకు ముప్పు ఉందంటూ మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్‌కు ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని ఏ1గా, గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రతాప్‌రెడ్డిని ఇక్కడి నుండి ఆ మాఫియానే బదిలీ చేయించి తమ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగించేది. అధికారాన్నీ అడ్డుపెట్టుకుని గ్రానైట్ మాఫియా ద్వారా రూ.200 కోట్లకు పైగా ఆర్జించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. ట్రాన్స్‌పోర్టు ద్వారా రూ.300 కోట్లు అర్జాస్ స్టీల్‌ప్లాంట్ కోసం హుసేనాపురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు 2వేల ఎకరాల వరకు స్వాధీనం చేశారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ఈ ప్లాంటుపై ఆధారపడి జీవించే వారు. అయితే దివాకర్ రోడ్‌లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టును కాదనే ధైర్యం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత వారికే ఇస్తూ వచ్చేవారు. అయతే ఇందుకు సంబందించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా ఎగ్గొడుతున్నట్లు సమాచారం. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం బినామీ లెక్కలే. ఈ లారీలు మినహా ఇతర లారీలు స్టీల్‌ప్లాంట్‌లో వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్ళలోట్రాన్స్పోర్టు ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. డ్రై స్లాగ్ ద్వారా కోట్లు కొల్లగొట్టారు అర్జాస్ స్టీల్ ప్లాంట్‌లో డ్రైస్లాగ్‌ను టన్ను రూ.10 తో టీడీపీ నేతలు కొనుగోలు చేసేవారు. దీనిని అ్రల్టాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు తరలించి టన్ను రూ.850 చొప్పున విక్రయించేవారు. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చుల కింద రూ.250 పోగా రూ.600 మేర మిగులుతుండేది. ప్రతి నెలా 25వేల టన్నులకు పైగా డ్రై స్లాగ్‌ను ఈ స్థాయిలో తరలించే వారు. ఈ లెక్కన నెలకు రూ.1.5 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100కోట్ల ఆదాయం గడించినట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాలకు మట్కా డాన్ తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ అవసరాలకు మట్కా డాన్ రషీద్ స్పాన్సర్‌గా వ్యవహరించేవాడు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్లు కొనుగోలు చేస్తే వాటికి నెలవారీ కంతులు కూడా రషీద్ చెల్లించేవాడని తెలిసింది. దేవుని మాన్యాన్నీ వదలని సోదరద్వయం పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలసిన పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆలయంలో ధూప దీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు. అయితే తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కబ్జా చేసి పంట సాగు చేపట్టారు. రెండు పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేయించి బోరుబావుల నీటితో వాటిని నింపారు. ఈ నీటితో మాన్యం భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా చెల్లించలేదనే ఆరోపణలు వినిపించాయి. ఏడాది క్రితం విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారులు ఆ భూములన్నీ జేసీ ఆధీనంలో ఉన్నాయని గుర్తించారు. మూడు నెలల క్రితం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆదర్శ మున్సిపాలిటీని గలీజు చేసి.. తాడిపత్రి మున్సిపాలిటీ పేరుకే ఆదర్శం. జేసీ సోదరులు, వారి అనుచరులు ఆదర్శ మున్సిపాలిటీ మాటున రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్‌రెడ్డి బినామీగా వ్యవహరించిన ఎస్.వి.రవీంద్రారెడ్డి తాడిపత్రిలోని జేసీ నాగిరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్‌లో మొదటి అంతస్తు టెండర్ దక్కించుకున్నాడు. ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. దీనికి గుడ్‌విల్ రూపంలో రూ.2.66 కోట్లు మున్సిపాలిటీకి బకాయి చెల్లించాల్సి ఉంది. మొదటి అంతస్తుకు సంబంధించి రూ.2.73 కోట్లు మున్సిపాలిటీకి బకాయి పడ్డారు. ఈ మొత్తం కాంప్లెక్స్‌ను దాదాపు 50 మంది వ్యాపారులకు సబ్లీజుకు ఇచ్చేశారు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేల చొప్పున అద్దె వసూలు చేశారు. నెలకు రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షలు ఆదాయం వచ్చేది. ఇదే కాంప్లెక్స్‌లో 64, 68 షాపులు కూడా ఎస్.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి సంబంధించి రూ.3.52 లక్షలు గుడ్‌విల్ రూ.3.33 లక్షలు బాడుగ కలిపి మొత్తం రూ.7.83 లక్షలు బకాయి పడ్డారు. దీంతో ఈ దుకాణాల లీజును మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. కానీ ఈ దుకాణాలు లీజుకు ఇచ్చి ప్రతినెలా భారీగా అద్దె వసూలు చేశారు. గడిచిన ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగించారు. దీంతో పెద్ద ఎత్తున మున్సిపల్ ఆదాయానికి గండిపడింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో 64, 76, 68, 62 నంబర్ షాపులను కూడా ఎస్.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి రూ.2వేల చొప్పున మాత్రమే అద్దె చెల్లిస్తున్నాడు. వ్యాపారులకు మాత్రం రూ.20వేల నుంచి రూ.30వేల వరకు సబ్లీజుకు ఇచ్చుకున్నాడు. రెండు కాంప్లెక్స్‌లోని అద్దెలు రవీంద్రారెడ్డి వసూలు చేసినా, ఈ డబ్బులు తిరిగి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం. -
జేసీ ప్రభాకర్‌రెడ్డిని రెండోరోజూ ప్రశ్నించిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న తాడిపత్రి మునిసిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హైదరాబాద్ కార్యాలయంలో శనివారం వరుసగా రెండోరోజుసైతం సుదీర్ఘంగా ప్రశ్నించారు. శుక్రవారం దాదాపు 9 గంటలపాటు విచారించిన అధికారులు... శనివారం ఉదయం 10 గంటల నుంచే ఆయనను ప్రశ్నించడం ప్రారంభించారు. స్క్రాప్‌గా కొన్న బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా పేర్కొంటూ తప్పుడు పత్రాలు సృష్టించడమే కాకుండా వాటిని విక్రయించేందుకు డమ్మీ కంపెనీలు సృష్టించి భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అమ్మకాలు, నిధుల మళ్లింపునకు సంబంధించిన ఆధారాలు ముందుంచి జేసీని అధికారులు ప్రశ్నించారు. జేసీ కుటుంబం నిర్వహిస్తున్న జఠాధర ఇండస్ట్రీస్ పేరుతో వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తప్పుడు పత్రాల సృష్టికి సంబంధించి గతంలో ఏపీ రవాణా శాఖ నమోదు చేసిన కేసుల వివరాలను కూడా ఈడీ అధికారులు సేకరించినట్లు తెలిసింది. -
‘జేసీ’లపై బిగుస్తున్న ఉచ్చు!.. బట్టబయలైన అక్రమాలు
సాక్షి, అమరావతి/హైదరాబాద్: నకిలీపత్రాలతో వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ ఎన్ఓసీలతో వాహనాల కొనుగోలు, అమ్మకాల వెనుక భారీగా నల్లధనం చేతులు మారిన బాగోతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జేసీ కుటుంబ సభ్యులపై ఉచ్చుబిగుస్తోంది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీచేయడంతో ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి కూడా ఉన్నారు. దాదాపు 5 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. విచారణానంతరం ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అధికారులు విచారణకు రమ్మని నోటీసులివ్వడంతో వచ్చానని, లారీల కొనుగోలుపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. విచారణకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా తాను విచారణకు హాజరవుతానన్నారు. అక్రమాల బాగోతం ఇలా.. టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి బ్రదర్స్ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్–3 కేటగిరీకి చెందిన 154 లారీలు, బస్సులను తుక్కు కింద జటాధర ఇండస్ట్రీస్ పేరున 50, సి. గోపాల్‌రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నకిలీపత్రాలతో వాటిని బీఎస్–4 వాహనాలుగా చలామణిలోకి తీసుకొచ్చారు. అనంతరం వాటిని నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్ఓసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33 వాహనాలు, కర్ణాటకలో 15 వాహనాలు, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు నిర్వహిస్తున్నారు. మరో మూడు బస్సులు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాక.. వాహనాల బీమాలోనూ వీరు ఫోర్జరీకి పాల్పడ్డారు. వీటిని కొద్దిరోజులపాటు తిప్పి ఆ తర్వాత పోలీసుల ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో (ఎన్ఓసీ) వాటిని ఇతర రాష్ట్రాల వారికి విక్రయించేశారు. కానీ, వీటిని కొనుగోలు చేసినవారు తాము మోసపోయామని గుర్తించి ఫిర్యాదుచేశారు. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించారు. జేసీ కుటుంబం సమర్పించిన బీమా పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టుచేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రత్యేక దర్యాప్తునకు కేంద్రానికి లేఖ ఆ తర్వాత జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ రాష్ట్ర పోలీసులు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో జేసీ కుటుంబం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్నినెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి, వారి వ్యాపార భాగస్వామి సి. గోపాల్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాలతోపాటు తాడిపత్రి, హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల నిర్వహించిన సోదాల్లో కీలక ఆధారాలు సేకరించి ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి ఫోన్లను జప్తుచేసినట్లు సమాచారం. -
‘ప్రభ’ తొలగి.. పన్నాగాలు.. ఉనికి కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాట్లు
♦టీడీపీ హయాంలో జిల్లాలో పనిచేసిన మైనింగ్ ఏడీ నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తుండేవారు. తమ గ్రానైట్ దోపిడీకి ఏడీ అడ్డు తగులుతున్నారని జేసీ సోదరుల (దివాకర్‌రెడ్డి – ప్రభాకర్‌రెడ్డి) ప్రధాన అనుచరుడు ఎస్.వి.రవీంద్రారెడ్డితో ఏడీని తీవ్రస్థాయిలో బెదిరించారు. లారీలతో గుద్ది చంపుతామని బెదిరించడమే కాకుండా అవినీతి మరకలంటించారు. చదవండి: సైకోలా అయ్యన్న తీరు ♦ఇటీవల బదిలీపై వెళ్లిన తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డిని కూడా ప్రభాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. చీటికిమాటికి.. అయినదానికి కానిదానికి బ్లాక్మెయిల్ చేశారు. మున్సిపల్ కార్యాలయ పరిపాలనా విభాగాల సిబ్బందిపైనా నోరు పారేసుకున్నారు. ♦తాజాగా డీఎస్పీ వీఎన్కే చైతన్య శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డికి మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా డీఎస్పీపై విమర్శలు గుప్పిస్తూ అవినీతి మరక అంటించేందుకు సిద్ధమయ్యారు. ♦అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా తన పనులు సజావుగా, సాఫీగా చేసుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నారు. మాట వినని అధికారులను, పోలీసులను బెదిరించడం, వారి బంధువులకు వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారు. తాడిపత్రి అర్బన్: కళ్లు పెద్దవి చేస్తూ.. ఆవేశంతో ఊగిపోతూ.. నోటి దురుసుతో రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం.. అధికారులు, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నైజం. ఆయన వ్యవహార శైలి నచ్చక అనుచరులు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. దీంతో నిరాశానిస్పృహలకు లోనైన ప్రభాకర్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. తాడిపత్రిలో తన ప్రాభవం కనుమరుగైపోతుండటంతో తిరిగి పట్టు సాధించుకునేందుకు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తాను చైర్మన్ అని, మున్సిపల్ పరిధిలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈయన అహంకార ధోరణితో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కుదిరితే బేరం.. లేకుంటే బ్లాక్మెయిల్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తాను చెప్పిన పనులు చేయించుకోవడం కోసం అధికారులతో మొదట బేరానికి వెళ్లడం.. కుదరకపోతే బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణం. ముందుగా తన అనుచరులతో అధికారులకు ఫోన్ చేయించి, వారి ద్వారా నజరానాలు పంపి బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అధికారులు వాటిని తిరస్కరిస్తే ఇక తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతారు. దీంతో నిక్కచ్చిగా పనిచేసే అధికారులు జేసీ తీరుతో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల బంధువులకు బెదిరింపులు! అధికారుల వద్ద తన ఆటలు సాగవని తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి.. అధికారుల బంధువులు ఎవరున్నారు.. వారు ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం సేకరించి వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి సబ్‌డివిజన్‌లో పని చేస్తున్న ఓ ఎస్ఐ సమీప బంధువు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం నక్కలపల్లిలో ఉంటున్నారు. మూడ్రోజుల క్రితం ఆ ఎస్ఐ బంధువుకు జేసీ అనుచరుడు మల్లికార్జునరెడ్డి ఫోన్ చేసి ‘మీవాడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు.. జాగ్రత్తగా ఉండమ’ని హెచ్చరించినట్లు సమాచారం. ఇందుకు ఆ ఎస్ఐ బంధువు భయపడకుండా దీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. •సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎస్ఐలు, వారి బంధువుల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారు సివిల్ పంచాయితీలు చేసి లంచాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. •ఇటీవల ఓ సీఐని బెదిరించినట్లు తెలిసింది. ‘నా అనుచరులపై దాడి చేస్తే మేం కూడా వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేస్తాం...మీరేమి చేస్తారో చూస్తాం’ అని ఆ సీఐని ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. •గన్నెవారిపల్లి కాలనీలో ఇటీవల ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీ అనుచరులు భూగర్భ డ్రెయినేజీ మరమ్మతు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహించారు. వారికి ఫోన్ చేసి ‘నా మనుషులు చేసే కాంట్రాక్టు పనులను అడ్డుకుంటారా!’ అంటూ బూతులు తిట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. •మున్సిపల్ ఎన్నికల్లో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి అధికారం కట్టబెడితే ఇలా అధికారులపై బెదిరింపులకు దిగడమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
జేసీ బ్రదర్స్ చుట్టూ ఈడీ ఉచ్చు
సాక్షి, అమరావతి/తాడిపత్రి రూరల్: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. వీరు దశాబ్దాలుగా సాగిస్తున్న అక్రమ దందాపై ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. కేంద్ర, రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా సుప్రీంకోర్టు తీర్పును కాలరాసి మరీ దక్షిణాది రాష్ట్రాల అంతటా బస్సులను అక్రమంగా తిప్పుతున్న బాగోతాన్ని వెలికితీస్తోంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, వారి వ్యాపార భాగస్వామి సి.గోపాల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రితోపాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల నిర్వహించిన దాడుల్లో కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా 154 బస్సులు జేసీ కుటుంబం సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్ 3 మోడల్‌కు చెందిన 154 బస్సులను అశోక్ లేల్యాండ్ కంపెనీ నుంచి తుక్కు పేరుతో కొన్నది. జటాధర ఇండస్ట్రీస్ పేరున 50 బస్సులు, సి.గోపాల్ రెడ్డి అండ్ కో పేరున 104 బస్సులు కొన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్వోసీ పొందారు. తర్వాత 15 రోజుల్లోనే ఆ బస్సులను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, చత్తీస్‌ఘడ్‌లలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఏపీలో 101 బస్సులు, తెలంగాణలో 33, కర్ణాటకలో 15, తమిళనాడులో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నారు. మరో మూడు బస్సులు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. బస్సుల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. దీనిపై అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ ఎన్.శివరామప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాహనాల బీమాలోనూ ఫోర్జరీకి పాల్పడటం తీవ్రమైన వ్యవహారంగా గుర్తించారు. పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నేషనల్ ఇన్సూ్యరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ) రికార్డులను పరిశీలించాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు భావించారు. బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ల మాటున భారీగా నల్లధనం చలామణి అవుతున్నట్టుగా కూడా గుర్తించారు. జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. జేసీ కుటుంబం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. శుక్రవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి, సి.గోపాల్ రెడ్డి నివాసాల్లో, కార్యాలయాల్లో తనిఖీలు చేసి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి ఫోన్లను కూడా వారు జప్తు చేయడం గమనార్హం. ఈడీ అధికారులకు సహకరించాం: జేసీ ఈడీ అధికారులకు సహకరించాం. డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నందుకు మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. సెల్‌ఫోన్ తీసుకున్నందుకు బాధగా ఉంది. ‘త్రిశూల్’ అక్రమాలపై కూడా ఈడీ దృష్టి జేసీ కుటుంబం మైనింగ్ అక్రమాలపై కూడా ఈడీ కూపీ లాగుతోంది. టీడీపీ అధికారంలోకి రాగానే త్రిశూల్ సిమెంట్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మైన్స్‌కు అనుమతులు పొందారు. దీని ద్వారా దాదాపు లక్ష టన్నుల లైమ్‌స్టోన్‌ను అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్లు మైన్స్ అండ్ జియాలజీ అధికారులు నిర్ధారించారు. రూ.100 కోట్ల అపరాధ రుసుము కూడా విధించారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం స్థానిక పరిశ్రమల్లో ట్రాన్స్‌పోర్టు లారీలు, కంటైనర్లన్నీ జేసీ బ్రదర్స్ బినామీల పేరుతో నడిపారు. కంపెనీల్లో లేబర్ కాంట్రాక్టులనూ అనుచరులకే ఇప్పించుకుని వాటాలు తీసుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ వారి సమీప బంధువు అయిన ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి పర్యవేక్షించేవారు. వీటి ద్వారా వచ్చిన సొమ్ముతో అనంతపురం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో విలువైన స్థలాలు, వ్యవసాయ భూములు కొన్నట్లు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీ లావాదేవీలతో పాటు అభివృద్ధి పనుల్లోనూ భారీగా లబ్ధి పొందారు. జిల్లా బహిష్కరణకు గురైన జేసీ ముఖ్య అనుచరుడు కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు. వాటి పత్రాలను ప్రభాకర్‌రెడ్డి తన వద్ద ఉంచుకున్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్ అక్రమ మైనింగ్, ఇతర దందాలకు చెందిన పత్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. జేసీ కుటుంబ సభ్యులు, బినామీల ఆర్థిక లావాదేవీలు, దేశంలో, విదేశాల్లో పెట్టుబడుల గురించి కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈడీ సోదాలపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఆ ప్రకటన వస్తే... జేసీ బ్రదర్స్ అక్రమాల చిట్టా వెల్లడవుతుంది. -
జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
-
Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..?
అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ‘పల్లె’ మెడకు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయి. అనంతపురంలో అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టడం, విద్యా సంస్థల్లో భారీఎత్తున స్కాలర్షిప్లు స్వాహా చేయడం, సొసైటీ పేర్లతో అందిన కాడికి డబ్బు వసూలు చేయడం వంటివి పల్లె ప్రతిష్టను దిగజార్చాయి. దీనికితోడు ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారు. పోటాపోటీ విమర్శలతో ఇద్దరూ బజారుకెక్కారు. ఇవన్నీ గమనిస్తున్న పార్టీ అధిష్టానం పొమ్మన లేక ‘పల్లె’కు పొగ బెడుతోందని టీడీపీ కేడర్లోనే చర్చ సాగుతోంది. సాక్షి, పుట్టపర్తి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి సొంత పార్టీలోనే అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. ఆయన తీరుపై ఒకవైపు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొందరు పార్టీ నాయకులు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా... మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం నెత్తుటి పుండుపై కారం చల్లిన చందంగా తయారైంది. పల్లెకు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టపర్తి టీడీపీ టికెట్ వచ్చే ప్రసక్తే లేదని జేసీ మీడియా సాక్షిగా కుండబద్దలు కొడుతున్నారు. విజయవాడ నుంచి అనంతపురం దాకా పల్లె చేసిన అక్రమాలు, అన్యాయాలన్నింటినీ బయటపెడతానని పేర్కొంటుండడంతో మాజీ మంత్రి అయోమయంలో పడ్డారు. పుట్టపర్తి టీడీపీ టికెట్ తన మద్దతుదారుడైన సైకం శ్రీనివాస రెడ్డికి ఇప్పిస్తానని జేసీ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో పల్లెకు టికెట్ రాకపోతే మన పరిస్థితి ఏంటని అనుచరులు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. 2009లో అనుకూలం... నేడు ప్రతికూలం జేసీ ప్రభాకర్ రెడ్డి ధోరణి విపరీతం. 2009లో పుట్టపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండసాని సురేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా అప్పటి అధిష్టానం కడపల మోహన్ రెడ్డిని బరిలో దింపింది. కొండసానికి టికెట్ ఇవ్వలేదనే నెపంతో కడపల మోహన్ రెడ్డిని ఓడించడానికి జేసీ బ్రదర్స్ పావులు కదిపారు. అదే సమయంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పల్లె రఘునాథ రెడ్డి బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కారు. అప్పుడు పల్లె ఎమ్మెల్యే కావడానికి జేసీ బ్రదర్స్ పరోక్షంగా దోహదపడ్డారు. కానీ తాజాగా పల్లెకు టికెట్ రాకుండా వారు చక్రం తిప్పుతున్నారు. దీంతో పుట్టపర్తిలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ‘ఉజ్వల’ అంశంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన జేసీని అడ్డుకోవడానికి పల్లెతో పాటు ఆయన అనుచరులు తాపత్రయపడ్డారు. దీంతో జేసీ మరింత పట్టుదలగా పల్లెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: (Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..) పొమ్మనలేక పొగ పుట్టపర్తి టీడీపీ అభ్యర్థిగా పల్లె పనికిరాడని ఆ పార్టీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఆయనపై కొన్నేళ్లుగా జేసీ గుర్రుగా ఉండడం టీడీపీ అధిష్టానానికి కలిసివచ్చింది. 99.99 శాతం పల్లెకు టికెట్ రాదని జేసీ పదేపదే చెబుతుండడం ఇందుకు నిదర్శనం. పార్టీ అధిష్టానం పొమ్మనలేక పొగ పెడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పల్లె రఘునాథరెడ్డి అక్రమార్జనతో రూ.వందల కోట్లకు పడగలెత్తడం, విద్యా సంస్థల్లో కోట్లాది రూపాయల స్కాలర్షిప్లు స్వాహా చేయడం, అనంతపురంలో భారీగా ఆస్తులు కూడబెట్టడం, సొసైటీ పేర్లతో కళాశాలలు ఏర్పాటు చేసి అందిన కాడికి ఫీజులు వసూలు చేయడం తదితర అంశాలపై జేసీ సమగ్రంగా వివరాలు సేకరించినట్లు తెలిసింది. పార్టీ మార్పునకు అనుచరుల ఒత్తిడి పుట్టపర్తి టీడీపీ వ్యవహారంలో జేసీ జోక్యం చేసుకున్నా పార్టీ అధిష్టానం వారించలేదు. పైగా జేసీ రోజూ ప్రెస్మీట్లు పెట్టి పల్లెపై చులకన భావన ప్రదర్శిస్తున్నారు. ఎవరి నియోజకవర్గ పరిధిలో వారు పరిస్థితులు చక్కదిద్దుకోవాలని పార్టీ అధిష్టానం అక్షింతలు వేయకుండా జేసీకి మద్దతివ్వడం పల్లెను బయటికి పంపడంలో భాగమేనన్న అనుమానం టీడీపీ కేడర్లోనే వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పార్టీ మారితే గౌరవం అయినా దక్కుతుందని అనుచరులు పల్లెపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యే, ఒక దఫా మంత్రి, ఒక దఫా ఎమ్మెల్సీ, విప్, చీఫ్ విప్ హోదాలో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే కారణంతో టికెట్ రాకపోతే అవమానమని అనుచరులు వాపోతున్నారు. ఏది ఏమైనా జేసీ తన అనుచరుడు సైకం శ్రీనివాస రెడ్డికి టికెట్ ఇప్పించే అంశంలో పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. -
Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..
పుట్టపర్తి...జిల్లా కేంద్రం కావడం.. విమానాశ్రయానికి కూతవేటు దూరంలోనే ఉండటంతో భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో టీడీపీ నాయకులు కొందరు కనిపించిన స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడో 1992లో ఏర్పాటైన ఉజ్వల ఫౌండేషన్‌పై కన్నేసిన కొందరు పవర్ ఆఫ్ అటార్నీ పేరుతో పార్కులు, పార్కింగ్ స్థలాలనూ విక్రయిస్తున్నారు. దీంతో ఉజ్వల ఫౌండేషన్‌లో కాటేజీలు కొనుగోలు చేసిన వారు ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. మరోవైపు వీటన్నింటికీ ‘పల్లె’ అనుచరులే కారణమని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించడంతో పాటు సొంతపార్టీ నేతలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బయలుదేరడం చర్చనీయాంశమైంది. సాక్షి, పుట్టపర్తి: పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) ఏర్పాటు కాకముందు సుడా (సత్యసాయి అర్భన్ డెవలప్మెంట్ ) ఉండేది. 1992లో సుడా పరిధిలోని 6.25 ఎకరాల్లో ఉజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో లేఅవుట్ వేశారు. ఇందులో 150 కాటేజీల నిర్మాణం చేపట్టారు. దీంతో దేశ విదేశాల్లోని సత్యసాయి భక్తులు వీటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ‘ఈ–2’ కాటేజీని ఢిల్లీకి చెందిన డింపుల్ అరోరా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆమె అందులోనే నివాసం ఉంటున్నారు. ఇలా 1992 నుంచి లేఅవుట్లో కాటేజీలు అమ్ముతూ వచ్చిన ఉజ్వల ఫౌండేషన్ మిగిలిన కాటేజీలను చెన్నైకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి విక్రయించింది. అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సినప్పుడల్లా చెన్నై నుంచి అతను పుట్టపర్తి రావడం ఇబ్బందిగా మారడంతో నాలుగైదేళ్ల కిందట రవి అనే వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం రవి కోవిడ్‌తో మరణించారు. దీంతో కొన్నిరోజులుగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఈక్రమంలో రవి స్నేహితుడైన గోవర్దన్‌రెడ్డి చెన్నైకి వెళ్లి సుబ్రహ్మణ్యంను కలిసి కొత్తగా పవర్ ఆఫ్ అటార్నీ తెచ్చుకున్నారు. అక్రమాలకు ఊతం.. పవర్ఆఫ్ అటార్నీ పొందిన గోవర్ధన్‌రెడ్డి తన మామ, పుట్టపర్తి మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పల్లెరఘునాథరెడ్డికి నమ్మినబంటు శ్రీరామిరెడ్డితో కలిసి ఉజ్వల ఫౌండేషన్‌లో ఖాళీగా ఉన్న స్థలాల కబ్జాకు ప్లాన్ వేశారు. లేఅవుట్లోని చిల్ట్రన్పార్కు, పార్కింగ్ ఏరియా, సెక్యూరిటీ, లైబ్రరీకి కేటాయించిన స్థలాలను ఇష్టానుసారంగా విక్రయించాడు. దీంతో లేఅవుట్‌కు చెందిన ఉమ్మడి స్థలాలను విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ‘ఈ–2’ కాటేజీలో ఉంటున్న డింపుల్ అరోరా 15 రోజుల కిందట ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న గోవర్దన్‌రెడ్డి తన మామ శ్రీరామరెడ్డి సాయంతో డింపుల్ అరోరాపై బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా ఈ–2 కాటేజీ పక్కన ఉన్న నాలుగు సెంట్ల స్థలంలో ఏకంగా పునాది వేశారు. దీంతో డింపుల్ ఆరోరా ఈ విషయాన్ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే స్పందించారు. పుట్టపర్తి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, పుడా వైస్ చైర్మన్లతో కమిటీ నియమించి...వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. రచ్చకెక్కిన వర్గవిభేదాలు.. ఉజ్వల ఫౌండేషన్ వ్యవహారంతో టీడీపీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తి వస్తున్నట్లు తెలుసుకున్న ఆపార్టీ నేతలు కొత్త చెరువులో పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ‘గో బ్యాక్ జేసీ’ అంటూ పల్లె అనుచరులు, ‘స్వాగతం జేసీ’ అంటూ జేసీ అనుచరులు నినాదాలు చేశారు. టికెట్ వచ్చేది పల్లెకే అంటూ పల్లె వర్గీయులు, మీకు టికెట్ వచ్చేంత సీన్ లేదని జేసీ వర్గీయులు వాదులాడుకున్నారు. మాటా మాటా పెరిగి ఒక దశలో తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. జేసీకి కలిసివచ్చిన ‘ఉజ్వల’ టీడీపీకి చెందిన ‘పల్లె’, జేసీ విభేదాలతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. పుట్టపర్తి జిల్లా కేంద్రం కావడంతో అధికార పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తన ప్రాభవం కోల్పోతున్నానని పల్లె రఘునాథ రెడ్డి ఆందోళనలో ఉన్నారు.‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ’ జేసీ ప్రభాకర్ రెడ్డి పల్లెపై ప్రతీకారేచ్ఛతో రగలిపోతున్నారు. పల్లెకు టికెట్ రానీయనంటూ బాహాటంగానే శపథం పూనారు. పుట్టపర్తి నియోజకవర్గానికి టీడీపీ తరఫున సైకం శ్రీనివాసరెడ్డికి టికెట్ తెప్పించుకుంటామని చెబుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అనుచర వర్గాన్ని తయారుచేసి పల్లెకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఉజ్వల’ అక్రమాలను జేసీ అందిపుచ్చుకున్నారు. పల్లె అక్రమాలపై జేసీ లొల్లి.. కొన్నాళ్లుగా పల్లె రఘునాథరెడ్డిపై గుర్రుగా ఉన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉజ్వల ఫౌండేషన్‌లో అక్రమాలపై స్పందించారు. ఉజ్వల ఫౌండేషన్ అక్రమాలన్నీ ‘పల్లె’ కనుసన్నల్లోనే జరిగాయని, పల్లె అనుచరుడైన శ్రీరామిరెడ్డి, అతని అల్లుడు గోవర్ధన్‌రెడ్డి కాటేజీలను అక్రమంగా విక్రయించి రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ‘ఉజ్వల’ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం అనంతపురం నుంచి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని భావించి జేసీని మరూరు టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. జేసీకి నచ్చజెప్పి అనంతపురంలోని తన నివాసానికి పంపించారు. -
దేవుడా...జేసీకి మంచి బుద్ధి ప్రసాదించు!
సాక్షి, తాడిపత్రి అర్బన్: దేవుడా..జేసీ ప్రభాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని మీడియా సాక్షిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దేవుడిని వేడుకున్నాడు. మంగళవారం స్థానిక బండా మసీద్ దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డి తరచూ విలేకర్లు, పోలీసులు, అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏడుపులు, పెడబొబ్బలు, అలవిగాని హామీలు ఇచ్చి చైర్మన్ పీఠం దక్కించుకున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయ, పోలీసుల చొరవతో చైర్మన్ అయ్యాను అని చెప్పిన జేసీకి ఇప్పుడు పోలీ సులు దుర్మార్గుల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ పార్కుకు మాత్రమే చైర్మనా... జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారా...లేక పెన్నానది ఒడ్డున ఉన్న మున్సిపల్ పార్కుకు మాత్రమే చైర్మన్‌గా ఉన్నారా? అని ఎమ్మెల్యే నిలదీశారు. మున్సిపల్ పార్కులో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడాన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి.. సోమవారం సాయంత్రం పార్కులో చెత్తసేకరణ కార్యక్రమం ద్వారా ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశాడన్నారు. గతంలో ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన పట్టాలను తన అనుచరుల వద్ద ఉంచుకొని, ఇప్పుడు పంపిణీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. స్వార్థ రాజకీయాలకోసం మాయమాటలు చెప్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిని నమ్మొద్దని ప్రజలకు పెద్దారెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కూడా నిర్మిస్తోందన్నారు. చదవండి: (నాగసులోచనా నన్ను క్షమించు..!.. నేను బాధపడుతూ నిన్ను మరింత బాధపెట్టలేను) స్టేషన్లకు తాళాలు వేసే సంస్కృతి మాది కాదు జేసీ సోదరులు అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి ప్రాంతంలో చేయని దాష్టీకాలు లేవని ఎమ్మెల్యే విమర్శించారు. తాడిపత్రి ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లకు వెళ్లి అధికారులను అసభ్యంగా మాట్లాడుతూ స్టేషన్లకు తాళాలు వేసిన సంస్కృతి జేసీ సోదరులదేనన్నారు. దౌర్జన్యంగా షాపులను మూసి వేయించడం, మట్కా కేంద్రాలు నిర్వహించడం లాంటివీ చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మీడియా ముందుకొచ్చి అన్యాయాలు, అక్రమాలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అన్యాయాలు, అక్రమాలపైన పోలీసు స్టేషన్సర్కిల్లో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. -
జేసీ ప్రభాకర్‌పై పల్లె రఘునాథ్ ఘాటు కామెంట్స్
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. జేసీపై పల్లె సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీలో వర్గపోరు ముదరడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓ రౌడీ అని, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని పల్లె రఘునాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు గత 35 ఏళ్లుగా టీడీపీ నేతలపై జేసీ కుటుంబం దాడులు చేసింది.. అక్రమ కేసులతో వేధించిందని ధ్వజమెత్తారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజకీయ అజ్ఞాని అంటూ పల్లె మండిపడ్డారు. టీడీపీ కండువా కప్పుకోవటానికి జేసీ నామోషీగా ఫీలయ్యాడంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో టీడీపీలో చేరిన జేసీ కుటుంబం తమపై పెత్తనమా? అంటూ ప్రశ్నించారు. పరిటాలకు భయపడి జేసీ తాడిపత్రి నుంచి పారిపోయాడరన్నారు. నాజోలికి వస్తే ఊరుకోనని పల్లె రఘునాథ్‌రెడ్డి హెచ్చరించారు. -
జేసీ అనుచరుల ఆగడాలు.. ప్రభాకర్‌రెడ్డి అన్న చెప్పాడంటూ
సాక్షి, అనంతపురం(తాడిపత్రి): తాడిపత్రి మునిసిపాలిటీలో జేసీ అనుచరుల ఆగడాలు శ్రుతిమించాయి. తరచూ ఏదో ఒక వివాదాన్ని రేకెత్తిస్తున్నారు. తద్వారా అధికారులు, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రొటోకాల్ పేరిట గొడవ చేశారు. రెండు రోజుల క్రితం ఏకంగా మునిసిపల్ కమిషనర్ చాంబరును ఆక్రమించేందుకు ప్రయత్నించారు. టీడీపీ కౌన్సిలర్లతో పాటు ఆ పార్టీ నాయకులు మునిసిపల్ కార్యాలయంలోనే తిష్ట వేసి.. చీటికిమాటికి ‘జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్న చెప్పాడం’టూ అధికారుల విధులకు అడ్డు తగులుతున్నారు. వీరి ఆగడాలు తాళలేక కొందరు బదిలీపై వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మారని తీరు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు అనుచరులు దౌర్జన్యాలు, బరి తెగింపులతో రెచ్చిపోయారు. అధికారులను భయకంపితులను చేశారు. అప్పట్లో వీరి ఆగడాలు తాళలేక ఎంతో మంది అధికారులు సెలవుపై వెళ్లిపోయారు. మరికొందరు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకున్నారు. వీరి తీరును ప్రజలు సైతం అసహ్యించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా తీరు మార్చుకున్నారా అంటే అదీ లేదు. పాత పద్ధతుల్లోనే అధికారులు, ఉద్యోగులపై రుబాబు చేస్తున్నారు. చదవండి: (అచ్చెన్నా.. నీకెందుకంత నోటి దురద) స్వేచ్ఛాయుత వాతావరణాన్ని దెబ్బతీస్తూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కృషి చేశారు. అటు పోలీసు యంత్రాంగానికి, ఇటు అధికార యంత్రాంగానికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిచ్చారు. ఫలితంగా శాంతిభద్రతలు గాడిలో పడ్డాయి. పట్టణ వాసులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. జేసీ ప్రభాకర్‌రెడ్డి మునిసిపల్ చైర్మన్‌గా గెలిచిన తర్వాత తాడిపత్రిలో మళ్లీ అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునిసిపల్ కార్యాలయంలో తన పార్టీ కౌన్సిలర్లతో ప్రొటోకాల్ వివాదానికి తెర లేపడమే కాకుండా అధికార దర్పంతో అధికారులను, సిబ్బందిని బెదిరిస్తున్నారు. మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌రెడ్డి ఇటీవల బదిలీపై వెళ్లారు. ఇంకా నూతన కమిషనర్ రాకపోవడంతో చాంబర్‌కు తాళం వేసి ఉంచారు. దీన్ని గమనించిన టీడీపీ కౌన్సిలర్లు గురువారం కమిషనర్ చాంబరును ఆక్రమించేందుకు ప్రయత్నించారు. తాళాలను దౌర్జన్యంగా పగులగొట్టి, కమిషనర్ నేమ్ బోర్డు సైతం తొలగించి చైర్మన్ చాంబర్‌గా మార్చాలని చూశారు. పోలీసులు రావడంతో వారి ఆటలు సాగలేదు. ►గత ఆగస్టులో తాను పిలిస్తే కమిషనర్ రాలేదన్న నెపంతో చైర్మన్ జేసీ తన అనుచరులతో కలిసి మునిసిపల్ కార్యాలయంలో 24 గంటల పాటు తిష్టవేసి నానా హంగామా సృష్టించారు. తనకు అధికారం లేకపోయినప్పటికీ అధికారులకు, కింది స్థాయి సిబ్బందికి నోటీసులు ఇస్తున్నానంటూ హడావుడి చేశారు. ►ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్‌డే సందర్భంగా జెండా ఆవిష్కరణ పేరుతో నానా యాగీ చేసి విమర్శల పాలయ్యారు. ►ప్రతి రోజూ టీడీపీ కౌన్సిలర్లతో పాటు చైర్మన్ జేసీ అనుచరులు కార్యాలయంలోకి వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ సిబ్బందిని బెంబేలెత్తిస్తున్నారు. వీరి తీరుతో ఆందోళన చెందుతున్న కొందరు ఉద్యోగులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జేసీ అనుచరుల వైఖరితో మునిసిపల్ కార్యాలయ విధులకు ఆటంకం కలగడమే కాకుండా..పట్టణాభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. -
Blackmail Politics: నేనింతే.. మారనంతే!
జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు మారలేదు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ దౌర్జన్యాలు, బరితెగింపులతో తనకడ్డే లేనట్లు ప్రవర్తించారు. అధికారులను భయకంపితులను చేశారు. ఈ ఆగడాలు తాళలేని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా తీరు మార్చుకున్నారా అంటే అదీ లేదు. ఉన్నతాధికారులను సైతం బ్లాక్మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడిపత్రి: ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలి. మున్సిపాలిటీలో ప్రాభవాన్ని కోల్పోతున్నానన్న భావనతో అధికారులను, సిబ్బందిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ప్రొటోకాల్ పేరుతో భయకంపితులను చేస్తున్నారు. మున్సిపాలిటీలో వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అహంకార ధోరణితో మున్సిపల్ కమిషనర్ మొదలు కింది స్థాయి సిబ్బంది వరకూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాలు పక్కనే చైర్మన్‌కు కేటాయించిన గది, ఇటీవల జేసీ ఆక్రమించుకుని నేమ్‌బోర్డు వేయించుకున్న డీఈ చాంబర్ ఉన్నతాధికారికి బెదిరింపులు ఈ నెల ఒకటోతేదీ మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. ఆ సమయంలో అక్కడున్న వలంటీర్లనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన కొద్దిసేపటికే కార్యాలయంలోని ఉద్యోగులకు ఫోన్ చేసిన జేసీ.. ఏ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే పెద్దారెడ్డికి కుర్చీలు వేసి కూర్చోబెట్టారని ప్రశ్నించారు. కొద్దిసేపటికే అనుచరులతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని దూషిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. లీగల్ నోటీసులు ఇస్తానంటూ ఉన్నతాధికారి అయిన కమిషనర్ నరసింహ ప్రసాద్‌రెడ్డిని కూడా బెదిరించారు. కార్యాలయంలోని పరిపాలనా విభాగాల్లోకి వెళ్లి సిబ్బందిపైనా నోరుపారేసుకున్నారు. ఈ క్రమంలోనే కమిషనర్ జోక్యం చేసుకుని చీటికిమాటికి తమ విధులకు ఆటంకం కల్గించడం సరికాదని హితవు చెప్పారు. అనుచరుల కోసం చాంబర్! మున్సిపల్ చైర్మన్ హోదాను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఏ మున్సిపాలిటీలోనూ లేని విధంగా రెండు చాంబర్లను ఆక్రమించుకున్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన చాంబర్ల తాళాలను కూడా తన వద్దనే ఉంచుకుంటున్నారు. దీంతో బయటి వ్యక్తులు చాంబర్లకు వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుచరులు కొందరు నిత్యం కార్యాలయంలోనే తిష్టవేసి కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నట్లు వాపోతున్నారు. జేసీ విపరీత పోకడలను తాళలేని సిబ్బంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బెదిరించడం తగదు బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఒంటెద్దు పోకడలతో అధికారులను బెదిరించడం తగదు. అధికారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసే అవకాశం కల్పించాలి. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తే మరింత మెరుగ్గా విధులు నిర్వర్తించే వీలుంటుంది. – నరసింహప్రసాద్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్, తాడిపత్రి -
టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. అనంతపురం కమ్మ భవన్లో శనివారం జరిగిన ‘రాయలసీమ నీటి ప్రాజెక్టుల సదస్సు’ ఆ పార్టీ నేతల్లో చిచ్చు రేపింది. సదస్సు నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సొంత పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు. జేసీ సోదరుల పెత్తనాన్ని ఇక సహించబోమని స్పష్టం చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి జిల్లా టీడీపీ నేతల మధ్య మొదట్నుంచీ సఖ్యత లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో ఆధిపత్య పోరు కూడా అధికమైంది. జేసీ బ్రదర్స్ పార్టీలో చేరిన తరువాత అంతర్గత కుమ్ములాటలు మరింత ఎక్కువయ్యాయని ఆ పార్టీ సీనియర్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. (చదవండి: గోబెల్స్‌కు తమ్ముళ్లు.. టీడీపీ అబద్ధపు ప్రచారాలు) జేసీ బ్రదర్స్‌పై ముప్పేట దాడి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు టీడీపీని మరింత అంధకారంలోకి నెట్టేలా ఉందని, నియంతృత్వ వైఖరి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి జేసీ సోదరులంటే మొదట్నుంచీ పడదు. వారితో విభేదించే ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లారు. ఆ తరువాత జేసీ సోదరులకు వ్యతిరేకంగా ప్రతి సందర్భంలోనూ గళం విని్పంచారు. తాజాగానూ జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘జేసీ గూండాగిరికి భయపడం. వారి తప్పుడు పనులను సమరి్థంచాలా? వారు టీడీపీలోకి వచ్చాకే గ్రూపు రాజకీయాలు పెరిగాయి. పార్టీని సర్వనాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. నియోజకవర్గాల వారీగా చిచ్చు పెడుతున్నారు. మా నియోజకవర్గాల్లో మీ జోక్యం ఏంటి? మీ పెత్తనాన్ని ఇక సహించం. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుని మీకు వ్యతిరేకంగా పోరాడతాం’ అని హెచ్చరించారు. మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందించారు. జేసీ ఆరోపణలు అర్థరహితమని, వాటిని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. మాజీ మంత్రి పరిటాల సునీత సైతం జేసీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పారీ్టలో ఏవైనా సమస్యలు ఉంటే.. అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ బహిరంగంగా ఒక సభలో ప్రస్తావించడం సరైంది కాదని అన్నారు. చర్చను తప్పుదోవ పట్టించేలా ఆయన మధ్యలో కలి్పంచుకుని మాట్లాడినట్లు ఉందన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే కేశవ్ సైతం సదస్సులో జేసీ వ్యాఖ్యలను ఖండించారు. అలా చేయకుండా ఉండాల్సిందన్నారు. అనంత టీడీపీలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. కాలవ శ్రీనివాస్‌పై అభ్యంతరాలు ఉంటే చంద్రబాబుతో మాట్లాడాలని జేసీ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. ఉనికి కోసం పాట్లు.. జిల్లా టీడీపీ నేతలు ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనంతో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటికీ ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో అడపాదడపా ఉనికి చాటుకునేందుకు ‘తమ్ముళ్లు’ ప్రయతి్నస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల సందర్శన, సదస్సులంటూ హడావుడి చేస్తున్నారు. మొదటి సదస్సులోనే వర్గ విభేదాలు బహిర్గతం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. చదవండి: కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు.. -
రచ్చకెక్కిన విభేదాలు: కాల్వ శ్రీనివాస్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కాల్వ శ్రీనివాస్‌ల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఓడిపోవడం ఖాయమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పుకొచ్చారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని సూచించారు. కార్యకర్తలను టీడీపీ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఓటమి భయంతో జేసీ కంటతడి..!) తనకు, కార్యకర్తలకు ఏ మాత్రం సమాచారం లేకుండానే మీటింగ్‌లు నిర్వహిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ వైఖరిని తప్పుపట్టారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ కనుసన్నల్లోనే ఇలా జరుగుతుందన్నారు. కాల్వ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇలానే జరిగితే త్వరలోనే కార్యకర్తలు తామే స్వయంగా మీటింగ్ పెట్టుకుంటారని జేసీ హెచ్చరించారు. పెద్దవాళ్లను దృష్టిలో పెట్టుకుని తాను ఇలా మాట్లాడటం లేదని.. తమను పలకరించిన వారే లేరని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను సరిగా చూసుకోవడం లేదు.. టీడీపీ నేతలను కార్యకర్తలు నమ్మటంలేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చదవండి: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ -
అనంతపురం జిల్లాలో రోడ్డున పడ్డ టీడీపీ విభేదాలు
-
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు
అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అనంతపురం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్-2తో పాటు జిల్లాలోని పది మునిసిపాలిటీల్లో రెండో వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి మినహా అన్ని చోట్ల అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో స్వతంత్ర అభ్యర్థి (టీడీపీ బలపరిచిన) ఎన్నిక కాగా.. ఇక్కడ ఎన్నిక ప్రక్రియను వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పట్టణంలో అక్రమ భవనాల కూల్చివేతను అడ్డుకోవడంతో పాటు భూ కబ్జాదారులకు మద్దతిస్తున్న మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు
అనంతపురం: వాలంటీర్‌పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల్లో వాలంటీర్ హరికుమార్ తనకు సహకరించలేదనే కారణంతో జేసీ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఇంటిని కూల్చేస్తానంటూ వాలంటీర్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారు. జేసీ ఆదేశాలతో వాలంటీర్ ఇంట్లోని మోటార్‌ను ఆయన అనుచరులు లాక్కెళ్లారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, విచారణ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకున్నవారు తనను ప్రశ్నించొద్దంటూ జేసీ హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ హరికుమార్ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 384, 506,34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: కుప్పం టీడీపీలో ముసలం.. ‘పాచిపోయిన లడ్డూను తింటున్నారా..’ -
సీఎం జగన్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసలు
-
సీఎం జగన్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసలు
తాడిపత్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ సహకారం లేకుంటే..తాను ఈరోజు మునిసిపల్ చైర్మన్ అయ్యుండే వాడిని కాదన్నారు. ఆయన తల్చుకుంటే ఏమైనా చేసి ఉండొచ్చని.. కానీ ఆయనలోని నైతిక విలువలను ఈరోజు స్పష్టంగా గమనించానని తెలిపారు. హ్యాట్సాఫ్ టు సీఎం అని ప్రశంసించారు. తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యతో కలిసి పనిచేస్తానన్నారు. పట్టణాభివృద్ధికి నిధులను కోరేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తానని, ఆయన తప్పకుండా న్యాయం చేస్తారన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు భేష్ అని జేసీ కితాబిచ్చారు. చదవండి: బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు? నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్ -
కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ
సాక్షి, తాడిపత్రి (అనంతపురం): అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఓ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. జేసీ ప్రభాకరరెడ్డి అనుచరులతో కలిసి మెయిన్ బజార్లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరగా.. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారానికి గుంపుగా వెళ్లకూడదని పోలీసులు ఆయనకు చెప్పారు. అయినా వినకుండా ప్రచారం చేపట్టడంతో మార్గమధ్యంలో డీఎస్పీ వీఎన్కే చైతన్య మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పైగా అరెస్ట్ చేస్తారా.. చేయండి అంటూ ఆవేశంతో ఊగిపోయారు. నడుచుకుంటూ కాకుండా ప్రచార వాహనంలో వెళ్లాలని పోలీసులు సూచించినా వినిపించుకోలేదు. ఇంతలో టీడీపీ కార్యకర్త రఘునాథ్‌రెడ్డి కల్పించుకుని పోలీసులు చెప్పినట్టు చేద్దాం అనడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి బండబూతులు తిడుతూ ఆయనపై పలుమార్లు చేయి చేసుకున్నారు. -
ఓటమి భయంతో జేసీ కంటతడి..!
సాక్షి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎదురీతున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న జేసీ.. ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఓటమి భయంతో ఆయన కంటతడి పెట్టారు. తాడిపత్రిలో ఏదో జరిగిపోతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేని వాహనాల్లో వెళ్తూ పోలీసులతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. సర్ది చెప్పేందుకు యత్నించిన టీడీపీ నేత రఘుపై దాడికి పాల్పడ్డారు. బూతులతో మరోసారి రెచ్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో జేసీ దౌర్జన్యంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. జేసీ పవన్‌పై కేసు తాడిపత్రి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌రెడ్డిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. గత ఆదివారం అర్ధరాతి టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి ఆ పార్టీ తరఫున తాడిపత్రిలోని హరిజనవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా భారీ కాన్వాయ్‌తో హరిజనవాడకు చేరుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం పట్ల షాడో టీం ఫిర్యాదు మేరకు జేసీ పవన్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చదవండి: అయోమయంలో టీడీపీ.. చంద్రబాబు మాటలతో చేటే! మహిళను మెడవంచి కొట్టిన అశోక్‌గజపతిరాజు -
ఎన్నికలతో వలంటీర్లకు సంబంధమే ఉండదు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంలో మంగళవారం వాదనలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలకు వలంటీర్లను దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, వలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, అయినా ఎన్నికల కమిషన్ స్పందించడం లేదంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కూడా వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు ఈ మూడు వ్యాజ్యాల్లో బుధవారం ఉత్తర్వులు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఓటర్ స్లిప్పులిచ్చేది బ్లాక్ స్థాయి అధికారులే.. రాష్ట్ర ప్రభుత్వ వ్యాజ్యంపై ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ఓటర్ స్లిప్పులను పంచుతున్నారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. బ్లాక్ స్థాయి అధికారులే ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని, వలంటీర్లకు ఎన్నికలతో సంబంధం ఉండదని చెప్పారు. వలంటీర్ల వద్ద కేవలం తమ పరిధిలో ఉండే వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఉంటాయి తప్ప, పౌరులందరి సమాచారం ఉండదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వలంటీర్లకు మొబైల్ ఫోన్లు ఎంతో ముఖ్యమని, వాటిలోనే లబ్ధిదారుల సమాచారం ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు లేకుండా వారు సంక్షేమ పథకాలను అమలు చేయలేరని తెలిపారు. పింఛన్ నగదును నేరుగా లబ్ధిదారులకు వలంటీర్లే అందజేస్తున్నారని, మిగిలిన పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని వివరించారు. వలంటీర్ల వ్యవస్థను స్తంభింప చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల తరఫు న్యాయవాది ఎన్.రంగారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషన్ వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం నిరర్థకం అవుతుందన్నారు. ఫిర్యాదులొచ్చాయి కాబట్టే.. అంతకుముందు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్ల తీరుపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇతర పార్టీల సానుభూతిపరులకు ఓటర్ స్లిప్పులు ఇవ్వడం లేదన్నారు. పౌరుల సమాచారం మొత్తం వలంటీర్ల వద్ద ఉంటుందన్నారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, వలంటీర్ల వద్ద ఉన్న డేటా దుర్వినియోగం అవుతుందని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వం వద్ద పౌరుల సమాచారం ఉంటుందని, దాన్నెలా తప్పు పట్టగలమని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తరఫున న్యాయవాది రాసినేని హరీ‹Ù, ఎమ్మెల్యే రామకృష్ణబాబు తరఫున న్యాయవాది ఎస్.ప్రణతి వాదించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ మూడు వ్యాజ్యాల్లో బుధవారం ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీపై కేసు నమోదు
తాడిపత్రి (అనంతపురం): ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం పట్ల 188, 171–ఇ–హెచ్, సెక్షన్ల కింద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై శుక్రవారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత గురువారం రాత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని బృందావనం అపార్ట్మెంట్లో జేసీ సమీప బంధువు, టౌన్‌బ్యాంకు ఉద్యోగి గౌరీనాథ్‌రెడ్డి పెంట్హౌలో పెద్ద ఎత్తున క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా క్రికెట్ కిట్లను పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటంపై పలు సెక్షన్ల కింద మాజీ ఎమ్మెల్యే జేసీ, అతని సమీప బంధువు గౌరీనాథ్‌రెడ్డిపై పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. చదవండి: టీడీపీ ఆగడాలు: పంచాయతీ భవనాలకు ‘పచ్చ’ రంగు తాడిపత్రిలో బయటపడ్డ ‘జేసీ’ ప్రలోభాలు -
అట్రాసిటీ కేసు: జేసీ బ్రదర్స్ హైడ్రామా
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైడ్రామా మొదలు పెట్టారు. సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి ఈనెల నాలుగో తేదిన తాడిపత్రిలో ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే తాడిపత్రిలో 144 సెక్షన్ విధించడంతో పోలీస్ యాక్ట్ 30 అములులోకి వచ్చింది. దీంతో ఏ కార్యక్రమానికైనా పోలీసుల అనుమతి తప్పనిసరి. అయితే పోలీసులను రెచ్చగొట్టేందుకు జేసీ బ్రదర్స్ దీక్షకు సిద్ధమయ్యారు. తమపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదంటూ జేసీ బ్రదర్స్ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆస్మిత్ రెడ్డిలపై ట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసుల నుంచి తప్పించుకునేందుకే జేసీ బ్రదర్స్ దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. చదవండి: తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ -
నా కుటుంబం జోలికొస్తే సహించను
సాక్షి, పెద్దవడుగూరు: తమ కుటుంబం జోలికి వస్తే ఎంతటివారినైనా సహించేది లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా తన కుమారులను బెదిరిస్తూ చానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇలాంటి వాటికి తాను భయపడేది లేదన్నారు. సోమవారం పెద్దారెడ్డి మిడుతూరులో మీడియాతో మాట్లాడారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలు శాంతియుతంగా జీవనం గడపాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లకు చెక్ పెడదామని నాలుగు రోజుల క్రితం ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లానన్నారు. అయితే తాను దాడి చేయడానికి వచ్చానని, అక్కడున్న వారిని బెదిరించానని టీడీపీ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోలీసులు ఆదివారం తమపై కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా ఇరు వర్గాల వారిపైనా కేసులు నమోదు చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్‌కు తాళాలు వేసినా, ప్రబోధానంద ఆశ్రమంపై దాడులకు ఉసిగొల్పి అల్లర్లు సృష్టించినా అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేయకపోవడాన్ని గుర్తు చేశారు. నిష్పక్షపాత పాలన సాగిస్తున్న వైఎస్సార్సీపీపై అవాకులు చెవాకులు పేల్చుతున్న టీడీపీ నాయకులు గతంలో జరిగిన ఘటనలను గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడే తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందన్నారు. (చదవండి: జేసీ ఆరోగ్యం కాపాడుకో..) -
తాడిపత్రి ఎమ్మెల్యేపై కేసు నమోదు, ట్విస్టు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు ఆదివారం అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దాంతోపాటు ఆయన కుమారులు హర్షవర్ధన్, సాయిప్రతాప్‌పైనా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా మొత్తం 15 మందిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జేసీ తరపు లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన తనయులు, అనుచరులపై కేసు నమోదు చేసినట్టు తాడిపత్రి డీఎస్పీ చైతన్య మీడియాకు తెలిపారు. ఇక తాడిపత్రి అల్లర్లకు కారణమైన మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా 27 మందిపై పోలీసులు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశారు. ఇరువర్గాలపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ట్విస్టు ఇచ్చిన జేసీ తరపు లాయర్ అయితే, ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు విషయంలో ట్విస్టు నెలకొంది. జేసీ లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తుండగా ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఓ అర్జీ, సీసీ ఫుటేజీ, పెన్ డ్రైవ్ మాత్రమే పోలీసులకు ఇచ్చానని శ్రీనివాస్ తెలిపారు. తనను ఫిర్యాదుదారుడిగా పరిగణించొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు లాయర్ శ్రీనివాస్ మీడియాకు ఓ నోట్ విడుదల చేశారు. అయితే, ఇదంతా జేసీ ఆడుతున్న డ్రామాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం విమర్శలు గుప్పించింది.(చదవండి: తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్టు) శాంతి నెలకొల్పేందుకే జేసీ ఇంటికి: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాష్ట్రంలో తాడిపత్రిపై నెలకొన్న దురభిప్రాయాన్ని పారదోలి, శాంతియుత వాతావరణం నెలకొల్పాలనే సదుద్దేశంతో చర్చించేందుకు జేసీ ప్రభాకరరెడ్డి ఇంటికి వెళ్లినట్లు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఫాక్షన్ గొడవలు సృష్టించడం, దాడులు చేయించి, ఆస్తులు నాశనం చేసే సంస్కృతి తమకు లేదన్నారు. పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి, చిన్నవడుగూరు, పెద్దవడుగూరు గ్రామాల్లో ల బ్ధిదారులకు శనివారం ఆయన ఇంటి పట్టాలు పంపిణీ చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధ్యతగా గుర్తించా గ్రామాల్లో సమస్యలు తలెత్తితే వాటికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా తనపై ఉందన్నారు. తమ కుటుంబ సభ్యులపై జేసీ సోదరులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు సాగిస్తున్నారని, ఇది మితిమీరిపోవడంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డిని నేరుగా కలిసి చర్చించేందుకే వారి ఇంటికి వెళ్లానన్నారు. ఫ్యాక్షన్ గొడవలు సృష్టించడం, దాడులు చేయించి ఆస్తులను నాశనం చేయడం తనకు తెలియదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులు ఈ సమస్యను మరింత తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తుండడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు ఏనాడూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అపోహలతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దంటూ హితవు పలికారు. టీడీపీ వారి దాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారని, వీరి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వారిలో ఎవరికైనా దెబ్బలు తగిలి ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలీసులు విచక్షణతో వ్యవహరిస్తున్నారు జేసీ ఇంటిపై తామేదో దాడి చేసినట్లుగా అపోహలు సృష్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని టీడీపీ నేతలకు ఎమ్మెల్యే సూచించారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడులు చేశారంటూ, దీనిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు విచక్షణతోనే వ్యవహరిస్తున్నారని, వారికి అన్ని విషయాలు తెలుసునన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ పంతం నెగ్గించుకునేందుకు పోలీస్ స్టేషన్ల ఎదుట జేసీ సోదరులు ధర్నా చేసినప్పుడు ఈ సుమోటో నినాదం ఏమైందని ప్రశ్నించారు. ప్రభోదానంద ఆశ్రమం వద్ద గొడవలు తలెత్తితే నివారించేందుకు ప్రయత్నించకుండా పోలీసులతో నేరుగా ఘర్షణ పడి ‘మీ చేతుల్లో లాఠీలు ఉంటే.. మా చేతుల్లో కర్రలు ఉన్నాయి’ అంటూ జేసీ సోదరులు బెదిరింపులకు దిగినప్పుడు సుమోటో నినాదం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. గతంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రజలు మౌనంగా భరిస్తూ వచ్చారని, ఇప్పుడు నిర్భయంగా సామాన్యులు సైతం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారన్నారు. -
తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్టు
సాక్షి, అనంతపురం: తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయలేదు. మొదటి నుంచి ఊకదంపుడు ముచ్చట్లు, కవ్వింపు చర్యలతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గాన్ని రెచ్చగొడుతున్న జేసీ వర్గం తోకముడిచింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలకే పరిమితమైంది జేసీ వర్గం. ఇక జేసీ వర్గీయుల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలు మనోజ్, బ్రహ్మేంద్ర జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మనోజ్, బ్రహ్మేంద్ర ఫిర్యాదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. (చదవండి: తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ) ఐపీసీ 307, 306 సెక్షన్ల కింద జేసీ వర్గానికి చెందిన 27 మందిపై పోలీసులు కేసులు బుక్ చేశారు. దీంతోపాటు గొడవలకు కారణమైన యూట్యూబ్ ఛానల్ విలేకరి వలిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా తాడిపత్రి డీఎస్పీ చైతన్య మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ... తాడిపత్రిలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మాకు ఏ రాజకీయ పార్టీ తో సంబంధం ఉండదు. తప్పు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. తాడిపత్రిలో అల్లర్ల పై ఇప్పటిదాకా 3 కేసులు నమోదు చేశాం. ఫిర్యాదుల ఆధారంగానే కేసులు నమోదు చేస్తాం. వారం రోజుల పాటు తాడిపత్రి లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. -
జేసీ ప్రభాకర్, ఆస్మిత్ రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డితో పాటు మరో 31 మంది పై 188 ఏపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ పోలీసులు తెలిపారు. 144 సెక్షన్‌తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ తాడిపత్రికి ఊరేగింపుగా వచ్చినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి : జేసీ బెయిలు పిటిషన్ కొట్టేసిన కోర్టు -
జేసీ బెయిలు పిటిషన్ కొట్టేసిన కోర్టు
సాక్షి, అనంతపురం: అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జేసీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా దళిత సీఐ దేవేంద్రను దూషించి, బెదిరింపులకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. -
జేసీని విచారించిన పోలీసులు
అనంతపురం క్రైం/కడప అర్బన్: అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని అనంతపురం జిల్లా పోలీసులు విచారించారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న జేసీని ఆదివారం ఉదయం కస్టడీలోకి తీసుకుని అనంతపురం త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు 4 గంటల పాటు జేసీని విచారించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి, కడప కేంద్ర కారాగారానికి తిరిగి తరలించారు. ఈ నెల 6న విధుల్లో ఉన్న దళిత పోలీసు అధికారిని దూషించినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. -
కడప సెంట్రల్ జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి
సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఒకరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. దళిత పోలీస్ అధికారిని దూషించిన కేసులో ఇటీవల అరెస్ట్ అయిన జేసీని శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో పోలీసులు ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. (జేసీ ప్రభాకర్‌రెడ్డికి డీఎస్పీ వార్నింగ్!) త్రీటౌన్ పీఎస్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు. దళిత సీఐ దేవేంద్రను ఎందుకు దూషించారు? పోలీసు అధికారులపై పదేపదే ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారు? కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించలేదు? జనంతో ఎందుకు ర్యాలీ నిర్వహించారు? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నలు సంధించారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణ చేశారు. (దురుసు ప్రవర్తన.. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్) -
అట్రాసిటీ కేసు: పోలీసు కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, అనంతపురం: అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఒక్కరోజు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. జేసీని ఆదివారం పోలీసులు విచారించనున్నారు. దళిత సీఐ దేవేంద్ర ను దూషించి బెదిరించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (జేసీ ప్రభాకర్‌రెడ్డికి డీఎస్పీ వార్నింగ్!) ఫోర్జరీ డాక్యూమెంట్స్ కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పై విడుదలయిన వెంటనే దళిత పోలీసు అధికారి ని దూషించిన విషయాన్ని పిటీషన్లో పేర్కొన్నారు. కండీషన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. (దురుసు ప్రవర్తన.. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్)