Jyotiraditya Scindia
-
మద్యం మత్తులో అత్యంత పైశాచికంగా..
మద్యం మత్తులో ఆ యువకుడు మృగంగా మారాడు. భయ్యా అని పిలిచే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత పైశాచికంగా ప్రవర్తించడంతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్ శివపురి(Shivpuri District) జిల్లాలో జరిగిన పాశవికమైన ఘటన వివరాల్లోకి వెళ్తే..ఆ చిన్నారి ఓ యువకుడు జరిపిన లైంగికదాడి(Sexual Assault)లో తీవ్రంగా గాయపడింది. ఎంతలా అంటే.. ఆమె తలను గోడకేసి బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి, ఒంటి నిండా పంటి గుర్తులు పడ్డాయి. పెద్ద పేగు చిధ్రమైంది. ఆఖరికి ప్రైవేటు భాగం రెండుగా చీల్చేసి ఉంది. కనీసం మంచంపై పక్కకు కూడా తిరగలేని స్థితిలో.. కొన ఊపిరితో ఉందా చిన్నారి. ఫిబ్రవరి 22వ తేదీన దినార(Dinara) ప్రాంతంలో ఇంటి డాబాపైన ఆడుకుంటున్న ఆ ఐదేళ్ల చిన్నారి.. హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తోటి పిల్లలను ఆ తల్లి ఆరా తీస్తే.. పక్కింటి భయ్యా చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లాడని చెప్పారు. రెండు గంటలైనా వాళ్లు తిరిగి రాలేదు. దీంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించారు. కాసేపటికి ఆ కాలనీకి పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో రక్తపు మడుగులో స్థానికులు గుర్తించారు. శరీరంపై తీవ్ర గాయాలై.. లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో చిన్నారిని హుటాహుటిన గ్వాలియర్ కమలారాజ్ ఆస్పత్రిలో చేర్పించారు.అత్యంత దారుణంగా..ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు రెండు గంటలపాటు అత్యవసర సర్జరీలు చేశారు వైద్యులు. గాయాలకు చికిత్సతో పాటు చిధ్రమైన పెద్ద పేగును కత్తిరించి కృతిమంగా మలద్వారం సృష్టించారు. ప్రైవేట్ పార్ట్‌కు 28 కుట్లు వేశారు. అయినప్పటికీ శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.మైనర్‌గా చూపించి..ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆమె పక్కింట్లోనే ఉంటాడు. మద్యం మత్తులో తాను ఈ నేరానికి పాల్పడినటట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. అతని వయసు 17 ఏళ్లుగా పోలీసులు ప్రకటించడంతో ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. నిందితుడిని మైనర్‌గా చూపించి.. శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్ధతు ప్రకటించాయి. జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ కాంగ్రెస్‌లు పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. అయితే..పోలీసులు మాత్రం నిందితుడి వయసు నిర్ధారణ ఇంకా జరగలేదని చెబుతున్నారు. అప్పటిదాకా.. జువైనల్ చట్టాల ప్రకారమే అతన్ని అదుపులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్థానిక ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia) ఈ దారుణ ఘటనను ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతోపాటు బాధిత తల్లిదండ్రులతోనూ ఆయన మాట్లాడారు. చట్టం ప్రకారం ఈ కేసులో కఠినంగా శిక్ష పడాల్సిందేనని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. शिवपुरी के दिनारा में हमारी मासूम बेटी के साथ हुए अमानवीय कृत्य की जानकारी मिलते ही आज परिजनों से फोन पर बातचीत की एवं उन्हें हौसला दिया। बेटी अभी अस्पताल में भर्ती है और उसकी हालत स्थिर है। मैं लगातार डॉक्टरों की टीम के संपर्क में हूं। हमारे क्षेत्र और प्रदेश में इस तरह के…— Jyotiraditya M. Scindia (@JM_Scindia) February 25, 2025 -
ఎవరీ అనన్య రాజే సింధియా..? 400 గదులు, 560 కిలోల బంగారంతో..
భారతదేశంలో రాజులు, రాజుల కాలం ముగిసినప్పటికీ వారి వంశస్థులు తమ వాసత్వ సంపద్రాయాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధంగా జీవిస్తున్నాయి. అలా వారసత్వాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రాజవంశమే గాల్వియర్‌లోని సింధియా కుటుంబం. ఈ కుటుంబం రాజరికానికి పర్యాయ పదంగా ఉంటుంది. ఆ కుటుంబం వేరెవరో కాదు మన ప్రధాని మెదీ ప్రభుత్వంలోని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుటుంబమే. అలాంటి వ్యక్తి కుమార్తె అనగానే ఏ రేంజ్లోఉంటుదని సర్వత్రా కుతుహలంగా ఉంటుంది. అయితే ఆమె మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె నివశించే రాజదర్బారు లాంటి ప్యాలెస్‌కి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!.ఆ రాకుమార్తె ఎవరంటే ..జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia), మహారాణి ప్రియదర్శిని రాజే(Maharani Priyadarshini Raje)ల ముద్దుల తనయే అనన్య రాజే సింధియా(Ananya Raje Scindia,). అందంలో ఆమె తల్లిని మించి అందంగా ఉంటుందని అంతా అనుకుంటుంటారు. అంతేగాదు అనన్య ప్రపంచంలోని 50 మంది అందమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది కూడా. రాజవంశానికి చెందినదైనా..జనబాహుళ్యానికి దూరంగా ఉంటారు. పైగా సోషల్ మీడియాలో కూడా లోప్రొఫైల్ని కలిగి ఉంది. ఇక మంత్రి జ్యొతిరాదిత్య సింధియాకి కుమార్తె అనన్య తోపాటు కుమారుడు ప్రిన్స్ మహానార్యమన్ కూడా ఉన్నాడు. కుమార్తె ప్రిన్సెస్ అనన్య రాజే సింధియాకి తన రాజకుటుంబ వారసత్వానికి తగ్గట్టుగా సాహస క్రీడలు, గుర్రపుస్వారీ, ఫుట్‌బాల్ వంటి వాటి పట్ల మక్కువ. ఇక ప్రాథమిక విద్యను ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్లో పాఠశాలలో పూర్తి చేయగా, ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఉన్నత విద్యను అభ్యసించింది. ఇంతటి విలాసవంతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశ్యంతో స్నాప్‌చాట్(Snapchat)లో ఇంటర్న్‌గా పనిచేసి, ఆ తర్వాత ఆపిల్ కంపెనీ(Apple)లో డిజైనర్ ట్రైనీగా పనిచేస్తుందామె. ఆమె 2018లో ప్రతిష్టాత్మక పారిస్ ఫ్యాషన్ ఈవెంట్ 'లే బాల్'లో పాల్గొన్నప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరుడు మహానార్యమన్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తులు ప్రశంసనీయంగానూ చర్చనీయాంశగానూ మారాయి. వాళ్లుండే ప్యాలెస్..సింధియా కుటుంబ రాజ నివాసం జై విలాస్ ప్యాలెస్. ఇవి వారి వారసత్వానికి చిహ్నం. ఈ అత్యద్భుత నిర్మాణానికి ఎవ్వరైన ఫిదా అవ్వుతారు. ఎందుకంటే సుమారు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 400 గదులు కలిగిన విలాసవంతమైన ఫ్యాలెస్. ఇందులోని గ్రాండ్ దర్బార్ హాల్ దాని ఐశ్వర్యానికి ప్రధాన ఆకర్షణ. ఈ ప్యాలెస్ మొదటి అంతస్తు టస్కాన్ నిర్మాణ శైలిని, రెండో అంతస్తు ఇటాలియన్ డోరిక్ శైలి, మూడవ అంతస్తులో కొరింథియన్లో నిర్మించారు. దీని ఖరీదు వచ్చేసి..దగ్గర దగ్గర రూ. 4 వేల కోట్టు పైనే ఉంటుందట. దీన్ని 1874లో మహారాజా జయజీరావు సింధియా నిర్మించారు. అంతేగాదు ఈ ప్యాలెస్‌లో అత్యంత బరువైన 3,500 కిలోగ్రాముల షాన్డిలియర్ లైటింగ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందట. దీన్ని ప్యాలెస్ పైకప్పు తట్టుకోగలదో లేదని ఏకంగా పది ఏనుగుల చేత పదిరోజుల పాటు నడిపించి పరీక్షించారట. అలాగే గ్రాండ్ దర్బార్ హాల్లో 560 కిలోగ్రాముల బంగారంతో అలంకరించిన గోడ కళ్లు చెదరిపోయేలా ఉంటుందట. దీంతోపాటు ఇందులో ఉండే విలాసవంతమైన భోజనశాలలోని వెండిరైలు టేబుల్‌పై వంటలను వడ్డించడం అత్యంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అంతేగాదు ఈ ప్యాలెస్‌లో ఉండే 35 గదులను రాజమాతా విజయ రాజే సింధియా, జివాజిరావ్ సింధియా జ్ఞాపకార్థం మ్యూజియంలుగా మార్చారు. దీన్ని హెచ్.హెచ్. మహారాజా జివాజిరావ్ సింధియా మ్యూజియం అని పిలుస్తారు ప్రజలు. గాల్వియర్‌లో తప్పక చూడాల్సిన పర్యాటక స్పాట్ కూడా ఇదే.(చదవండి: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా 55 కిలోలు..!) -
స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట!.. వచ్చేసింది మొబైల్ యాప్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసగాళ్లు, మోసపూరిత చర్యలు ఎక్కువవుతున్నాయి. స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో.. వాటికి అడ్డుకట్ట వేయడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) మొబైల్ యాప్ ప్రారంభించింది.డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మోసపూరిత కమ్యూనికేషన్లను సులభంగా రిపోర్ట్ చేయడానికి 'సంచార్ సాథీ' (Sanchar Saathi) మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా అనుమాస్పద కాల్స్ వచ్చినప్పుడు మొబైల్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం మొబైల్ ఫోన్ బ్లాక్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.సంచార సాథీ పోర్టల్ 2023లో కేంద్ర టెలికామ్ శాఖ అందుబాటులో తీసుకువచ్చింది. కాగా తాజాగా మొబైల్ యాప్ లాంచ్ చేసింది. దీని ద్వారా మోసాల నుంచి ప్రజలను కాపాడవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని వినియోగించవచ్చు.''సంచార్ సాథి యాప్ ఇప్పుడు లైవ్‌లో ఉంది. మీ డిజిటల్ భద్రత కోసం స్కాన్ చేయండి.. అవసరమైన సాధనాలను యాక్సెస్ చేయండి'' అని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ట్వీట్ చేసింది. మొబైల్ యాప్ పరిచయం చేసిన సందర్భంగా.. టెలికామ్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఇది ప్రజల భద్రతను కాపాడే సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందని అన్నారు.SANCHAR SAATHI APP is now LIVE!Scan for your digital safety today and access essential tools at your fingertips!#SancharSaathiMobileApp pic.twitter.com/TNKhRHUE4O— DoT India (@DoT_India) January 17, 2025సంచార్ సాథీ ఉపయోగాలు➤అనుమానిత కాల్స్ లేదా మెసేజస్ వచ్చినప్పుడు యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయచ్చు. ➤మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అవసరమైన నెంబర్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అనవసరమైన వాటిని బ్లాక్ చేసుకోవచ్చు.➤మొబైల్ ఫోన్ పోయినప్పుడు లేదా దొంగతనానికి గురైనప్పుడు బ్లాక్ చేసే సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది.ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డ్‌లు లింక్ అయ్యాయో చెక్ చేయడం ఎలా?▸సంచార్ సాథీ అధికారిక వెబ్సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.▸వెబ్‌సైట్‌ను కిందికి స్క్రోల్ చేస్తే.. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తుంది. దానికి కింద మొబైల్ కనెక్షన్లను చూడటానికి ఆప్షన్ ఎంచుకోవాలి.▸మొబైల్ కనెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత.. మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.▸అక్కడ మీ 10 అంకెల మొబైల్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.▸దానికి కింద అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.▸క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత మీ ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.▸ఓటీపీ ఎంటర్ చేసిం తరువాత మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని నెంబర్స్ లింక్ అయ్యాయో డిస్ప్లే మీద కనిపిస్తాయి.▸అక్కడ మీరు అనవసరమైన నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సిమ్ కార్డు.. ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు.ఇదీ చదవండి: ఫోన్ పోయిందా? ఇలా చేస్తే.. కనిపెట్టేయొచ్చు -
భారత‘రత్న’ వాజ్‌పేయి శతజయంతి.. ప్రముఖుల నివాళి (చిత్రాలు)
-
పోస్టాఫీసుల్లో మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూఢిల్లీ: తపాలా శాఖల్లో 2028–29 నాటికి మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు వీలుగా తపాలా శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ‘భారత ఆర్థిక సదస్సు 2024’ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 6,40,000 విక్రయ కేంద్రాలున్నాయని, ప్రపంచంలో మరే సంస్థకు ఈ స్థాయి నెట్వర్క్ లేదన్నారు. పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు 2017తో ప్రారంభం కాగా.. 1.52 కోట్ల మందికి పైగా సేవలు అందించడంలో ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 442 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలున్నాయి. -
వీడియో: కేంద్రమంత్రి సింధియాకు తప్పిన ప్రమాదం.. పోలీసులకు గాయాలు!
భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తృటిలో ప్రమాదం తప్పింది. తేనెటీగల దాడి నుంచి సింధియాను భదత్రా సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న పోలీసులు, పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది. కేంద్ర మంత్రి సింధియా శనివారం శివపురి పర్యటనకు బయలుదేరారు. అక్కడ డ్రెడ్జింగ్ మిషన్‌ను ప్రారంభించేందుకు శివపురిలోని సరస్సు సెయిలింగ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో యంత్రానికి పంతులు పూజలు చేసే క్రమంలో అగర్బత్తిని వెలిగించారు. దీంతో, పొగలు రావడంతో సెయిలింగ్ క్లబ్‌లోని తేనెటీగలు ఒక్కసారిగా లేచి దాడి చేయడం ప్రారంభించాయి.ఈ సమయంలో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సింధియా కష్టం మీద కాపాడారు. సింధియా తలపైకి తేనెటీగలు రావడంతో ఎలాగోలా రక్షించి కారు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చాలా మంది నేతలు, పార్టీ మద్దతుదారులు, పోలీసులపై తేనేటీగలు దాడి చేశాయి. అనంతరం, గాయపడిని వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #WATCH | Swarm Of Bees Attack Minister Jyotiraditya Scindia In Shivpuri, Several Injured#MadhyaPradesh #MPNews #Jyotiradityascindia pic.twitter.com/Ls23wLa1GU— Free Press Madhya Pradesh (@FreePressMP) November 30, 2024 -
భారత మార్కెట్లోకి స్టార్‌లింక్!
న్యూఢిల్లీ: పలు దేశాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ భారతీయ విపణిలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధంచేసుకుంటోంది. భారత చట్టాల ప్రకారం సంస్థను నడిపేందుకు స్టార్లింగ్ ముందుకు వచ్చిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ప్రభుత్వ సవరించిన నియమనిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ కంపెనీ తమ భారతీయ యూజర్ల సమాచారాన్ని దేశీయంగానే నిల్వచేయాల్సి ఉంటుంది. ఇందుకు స్టార్‌లింక్ ఒప్పుకుందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో స్టార్‌లింక్ ప్రతినిధులు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.శాటిటైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల(జీఎంపీసీఎస్) లైసెన్స్ మంజూరుకు అనుసరించాల్సిన విధివిధానాలను పాటిస్తామని సంస్థ తెలిపింది. స్టార్‌లింక్ సంస్థ ఇంకా తమ సమ్మతి పత్రాలను సమర్పించాల్సి ఉంది. సమర్పణ పూర్తయితే సంస్థ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభంకానున్నాయని తెలుస్తోంది. 2022 అక్టోబర్‌లో జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం స్టార్‌లింక్ దరఖాస్తు చేసుకుంది. ఈ రంగంలోని భారత నియంత్రణసంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్) సంబంధిత అనుమతులను మంజూరుచేయనుంది. ఆలోపు తమ అభ్యంతరాలపై సరైన వివరణ ఇవ్వాలని స్టార్‌లింక్‌ను ఇన్–స్పేస్ కోరింది. స్టార్‌లింక్‌కు పోటీగా మరో ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ సంస్థలో భాగమైన ‘ప్రాజెక్ట్ కూపర్’సంస్థ సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.ఈ రెండు సంస్థల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని ఇన్–స్పేస్ చైర్మన్ పవన్ గోయంకా చెప్పారు. భద్రతా నియమాలకులోబడి సంస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం అన్నారు. అగ్రరాజ్యాధినేతగా తన సన్నిహితుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో భారత్‌సహా కీలక శాటిటైల్ ఇంటర్నెట్ సేవల మార్కెట్లలో మెజారిటీ వాటా కైవసంచేసుకోవాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నారు. స్ప్రెక్టమ్ కేటాయింపులు, తుది ధరలపైనే భారత్‌లో స్టార్‌లింక్ భవితవ్వం ఆధారపడిఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే భారతి గ్రూప్‌కు చెందిన వన్‌వెబ్, జియా–ఎస్ఈఎస్ సంయుక్త సంస్థ అయిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కు లైసెన్సులు ఇచ్చింది. వీటికి ఇంకా స్ప్రెక్టమ్ కేటాయింపులు జరగలేదు. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన సిఫార్సులకు ట్రాయ్ డిసెంబర్ 15వ తేదీలోపు తుదిరూపునివ్వనుంది. -
మస్క్ వైపే కేంద్రం మొగ్గు..
న్యూఢిల్లీ: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలకు తగ్గట్లే కేటాయిస్తామే తప్ప వేలం వేయబోమని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోసారి స్పష్టం చేశారు. అయితే దీన్ని ఉచితంగా ఇవ్వబోమని, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయించే ధరను కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ఉపయోగించే స్పెక్ట్రంను కేటాయించాలే తప్ప భారతీయ టెల్కోలు కోరుతున్నట్లుగా వేలం వేయరాదని కోరుతున్న స్టార్‌లింక్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు ఈ పరిణామం సానుకూలం కానుంది. ఈ స్పెక్ట్రంను వేలం వేయాలని దేశీ దిగ్గజాలు జియో, ఎయిర్టెల్ కోరుతున్నాయి. -
6జీ టెక్నాలజీపై కేంద్రం దృష్టి: జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే 5జీ నెట్‌వర్క్‌లో వేగంగా విస్తరిస్తున్న భారత్.. 6జీ టెక్నాలజీపై దృష్టిపెట్టినట్లు కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. తద్వారా 6వ జనరేషన్(6జీ) మొబైల్ సర్వీసులలో ప్రపంచ పేటెంట్లలో 10వ వంతును అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.ఏఐఎంఏ నేషనల్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ ఇక్కడ నిర్వహించిన 51వ సదస్సు(ఎడిషన్) సందర్భంగా కీలకోపన్యాసం చేశారు. 5జీ సేవల నెట్‌వర్క్‌లో ప్రపంచంలోనే భారత్ వేగంగా విస్తరిస్తున్నట్లు ప్రస్తావించారు. పీఎస్‌యూ సంస్థ బీఎస్ఎన్ఎల్ కోసం సొంత 4జీ టెక్నాలజీకి తెరతీసినట్లు పేర్కొన్నారు. 22 నెలల్లోనే 4.5 లక్షల 4జీ టవర్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ బాటలో 6జీ సాంకేతికతలోకి ప్రవేశించేందుకు భారత్ 6జీ కూటమి(అలయెన్స్)ను నెలకొలి్పనట్లు వెల్లడించారు.రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్త పేటెంట్లలో 10 శాతాన్ని సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచస్థాయిలో పురోగమిస్తున్నదని, సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ స్థాయిని అధిగమించిందని వివరించారు. ప్రపంచ ఆర్థిక, సామాజిక అనిశి్చత పరిస్థితుల్లో భారత్ నిలకడ, నమ్మకాల దిక్సూచిలా అవతరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండో పెద్ద దేశంగా భారత్ నిలుస్తున్నదని వెల్లడించారు.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంగత దశాబ్దంలో దేశీ కమ్యూనికేషన్ పరిశ్రమ సొంత బాటలో పరివర్తన చెందినట్లు తెలియజేశారు. సొంతంగా పూర్తి 4జీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంతోపాటు.. వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దేశీయంగా టెక్నాలజీ డిజైన్, అభివృద్ధి, అమలును చేపట్టినట్లు తెలియజేశారు. గ్లోబల్ ప్రమాణాలను అనుసరించడంతోపాటు.. రానున్న రోజుల్లో భారత్ సొంతంగా ప్రపంచానికి ప్రమాణాలను నిర్దేశించనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడం టీ-ఫైబర్ లక్ష్యమన్నారు. టీ-ఫైబర్ ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందిస్తామని రేవంత్ చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యం. టీ-ఫైబర్ అమలుగానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్‌కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. -
సెప్టెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వంటి సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్‌లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్ 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది. -
జియోపై బీఎస్ఎన్ఎల్ స్ట్రాంగ్ ఎఫెక్ట్
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత చాలామంది బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నెట్‌వర్క్‌కు మారిపోతున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 2.75 మిలియన్ల యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ వైపు వచ్చిన యూజర్లలో ఎక్కువ భాగం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి రీఛార్జ్ ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ చార్జీలు, వ్యాలిడిటీ వంటివి చాలామందిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ ముకేశ్ అంబానీ జియోపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య పెరుగుతోందని, స్వదేశీ 4జీ నెట్వర్క్ కూడా సిద్ధంగా ఉందని.. దానిని 5Gకి మార్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ కంపెనీలు 4జీ నెట్‌వర్క్‌ను తీసుకువచ్చినప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ ఎందుకు దీనిని ప్రవేశపెట్టలేదని చాలామంది అడిగారు. అయితే ప్రభుత్వం నిర్వహించే కంపెనీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయవలసి వస్తే.. స్వదేశీ టెక్నాలజీ, పరికరాలను మాత్రమే ఉపయోగించాలని.. చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే పరికరాలను ఉపయోగించకూడదని ప్రధానమంత్రి తీర్మానమని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.భారత్ తన స్వంత 4జీ స్టాక్, కోర్ సిస్టమ్ లేదా రేడియేషన్ యాక్సెస్ నెట్వర్క్ అని పిలువబడే టవర్లను అభివృద్ధి చేస్తుందని ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రధాని మోదీ వెల్లడించారు. భారతదేశం తన సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది, దేశప్రజలకు 4G నెట్‌వర్క్‌ను అందిస్తుందని అన్నారు. స్వదేశీ సాంకేతికతను కలిగి ఉన్న ఐదవ దేశంగా భారత్ అవతరించిందని సింధియా చెప్పారు.టవర్ల ఏర్పాటుకోసం తేజస్ నెట్వర్క్, సీ-డాట్, టీసీఎస్ వంటి భారతీయ సంస్థలతో బీఎస్ఎన్ఎల్ పనిచేస్తోంది. 2024 అక్టోబర్ నాటికి 80000 టవర్లు, వచ్చే ఏడాది మార్చి నాటికి 21000 టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2025 నాటికి 4G నెట్‌వర్క్‌కు చెందిన లక్ష టవర్లు ఇన్స్టాల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. -
గుడ్‌న్యూస్.. బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం
BSNL 5G: ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ దేశంలో తన 5జీ సేవల ట్రయల్స్ నిర్వహించడం ప్రారంభించింది. దీనికి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు."బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌తో ఫోన్ కాల్ ప్రయత్నించాను" అని సింధియా రాసుకొచ్చారు. ఈ మేరకు సి-డాట్ క్యాంపస్‌లో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు. మంత్రి పోస్ట్ చేసిన వీడియోలో ఆయన బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు.ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ. 82 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. టెలికం సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, దేశంలో పూర్తిగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ సాంకేతికతను సులభతరం చేయడానికి ఈ నిధులు ఉపయోగించనున్నారు. ఈ చర్య భవిష్యత్తులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పెద్ద సవాలుగా మారవచ్చు.Connecting India! Tried @BSNLCorporate ‘s #5G enabled phone call. 📍C-DoT Campus pic.twitter.com/UUuTuDNTqT— Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 2, 2024 -
సెంచరీ కూడా కొట్టలేదు.. కాంగ్రెస్‌పై సింధియా సెటైర్లు..
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల మొదటి రోజు (సోమవారం) ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను ప్రోటెం స్పీకర్‌గా ఎంపీక చేయటంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ ఎంపీలు నిరసన తెలిపారు. అయితే దీనిపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.‘‘ పార్లమెంట్ సమావేశాల తొలిరోజే కాంగ్రెస్ పార్టీ అనవసరంగా హడావుడి చేస్తోంది. కేవలం సొంతంగా 99 సీట్లు గెలిచినందుకే ఇలా చేస్తోంది. ఇప్పటివరకు మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన అన్ని సీట్లు కలిపినా.. 2014లో బీజేపీ సాధించిన సీట్ల కంటే కూడా తక్కువ. అంటే కాంగ్రెస్ మూడు ఎన్నికల్లో సైతం 240 సీట్లు కూడా గెలవలేకపోతోంది’ అని సింధియా ఎద్దేవా చేశారు. (కాంగ్రెస్ పార్టీ 2014-56 సీట్లు, 2019-42 సీట్లు, 20124-99 సీట్లు గెలుచుకుంది). నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారని సింధియా అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా భారత్ ఎదుగుతుందనే పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఇక.. 2024 ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలు గెలుపొందింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవటంతో మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ.. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించగా.. ఇండియా కూటమి 234 సీట్లకే పరిమితమైంది. సోమవారం పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ‘ఇండియా కూటమి’ ఎంపీలు.. నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్, ప్రోటెం స్పీకర్ ఎంపీక, పార్లమెంట్‌లోని విగ్రహాలను మరోచోటుకు తరలించటం వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగం బుక్‌తో నిరసన తెలిపారు. -
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి, రాజమాత మాధవి రాజే సింధియా కన్ను మూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆమె బుధవారం ఉదయం 9.28 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.“రాజమాత ఇక లేరు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి, గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన రాజమాత మాధవి రాజే సింధియా గత రెండు నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు వారాలుగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఉదయం 9:28 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. ఓం శాంతి” అని ఒక పత్రికా ప్రకటనలో ఢిల్లీ ఎయిమ్స్ పేర్కొంది. రాజమాత మాధవి రాజే సింధియా కుమారుడు, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈసారి సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. -
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
భోపాల్: దళిత మహిళ గురించి మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ చేసిన వ్యాఖ్యపైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు మహిళలను గౌరవించడం తెలియదని, ఆ పార్టీకి ఉపయోగించుకుని వదిలేసే అలవాటు ఉందని అన్నారు.కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీతూ పట్వారీ.. ఇమర్తి దేవిపై పట్వారీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి నీచమైన పదాలు ఉపయోగిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి పదాలు ఏ మహిళపై ఉపయోగించకూడదని సింధియా అన్నారు. ఇమర్తి దేవి 2020 మార్చిలో సింధియాతో కలిసి బీజేపీలో చేరారు.పార్టీ కార్యకర్తలను, గిరిజన ప్రజలను, మహిళలను ఇలా ఎవరినైనా అవసరమున్నంత వరకు వాడుకుని, ఆ తర్వాత వదిలేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటని సింధియా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ తమపై దాడులు చేస్తూనే ఉంటుంది.. ఎప్పుడూ తమ విజయం తధ్యమని చెబుతుంది. చివరి ఫలితాలు తారుమారు అవుతాయని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని సింధియా పేర్కొన్నారు. -
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
భోపాల్: కాంగ్రెస్ పార్టీ అంతిమ దశకు చేరుకుందని కేంద్రమంత్రి, ‘గుణ’ బీజేపీ ఎంపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా విర్శించారు. సైద్ధాంతికంగానూ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుంటోందని ఆయన శనివారం పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్నిస్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కొంతమందికి టికెట్లు ఇచ్చినా నామినేషన్ల తరువాత ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. వాస్తవానికి ఆ పార్టీతో ఉండాలని ఎవరూ అనుకోవడమూ లేదు’’ అని ఆయన విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ పార్టీలో నేతలకు సముచిత గౌరవ మర్యాదలు ఉండవు అని కూడా ఆయన కుండబద్ధలు కొట్టారు. దేశంలో అత్యాయిక పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవడం మేలని అన్నారు. భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న విమర్శిలను తిప్పికొడుతూ అది ఏ పార్టీతోనూ సాధ్యం కాని విషయమని అన్నారు.కాంగ్రెస్‌పార్టీలో చాలాకాలం కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా 2020లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరచిన 15 నెలలకు సింధియా.. 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరారు. ఫలితంగా కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. -
మహిళపై కస్సుమన్న కేంద్రమంత్రి భార్య.. వెల్లువెత్తిన విమర్శలు
సమస్య చెబుతున్న గ్రామీణ మహిళపై కస్సుమన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భార్య ప్రియదర్శినీ రాజే సింధియా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. గ్రామీణ మహిళ పట్ల ఆమె ప్రవర్తినపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్య ప్రదేశ్‌లోని గుణ-శివపురి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రియదర్శిని తన భర్త విజయం కోసం కుమారుడితో కలిసి గ్రామ గ్రామాలు తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియదర్శిని రాజే ఖుజ్రీ గ్రామానికి వెళ్లగా అక్కడ కొందరు మహిళలు గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను లేవనెత్తారు. దీంతో ఆమె సమస్యలను రాసి తమకివ్వలని చెప్పారు. ఇంతలో ఓ మహిళ “నువ్వే రాసుకో” అంది. అది విన్న ప్రయదర్శిని రాజే ఆగ్రహానికి గురై, "మీరు రాసి నాకు ఇవ్వండి, మీ పని చేయడం నా పని కాదు" అంటూ చిరాకుపడ్డారు.ఖుజ్రీ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, మహిళలు ప్రయదర్శిని సింధియాను ఆశ్రయించారు. గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని ఆ గ్రామ మహిళలు వాపోతున్నారు. ఈ సమయంలో, ఒక మహిళ, "మేడమ్, మీరు దయచేసి ఒకసారి ఇక్కడికి రండి. ఇక్కడ నీటి కోసం ఒక ట్యాంక్ ఉంది, కానీ అందులో నీరు లేదు" అంటూ తెలియజేసింది. -
సామాన్యుడు విమానాల్లో వెళ్లాలన్నదే మోదీ కల
సాక్షి, హైదరాబాద్: హవాయి చెప్పులు వేసుకునే సామాన్య వ్యక్తి సైతం విమానాల్లో ప్రయాణించాలన్నదే పీఎం నరేంద్రమోదీ కల అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఉడాన్ పథకంతో సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని పీఎం అందుబాటులోకి తీసుకు వచ్చారని గుర్తు చేశారు.గురువారం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా, ఏడవ అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌గా భారత్ అవతరించిందని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 2047 నాటికి విమానయాన రంగంలో 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో 500 కొత్త ఇండిగో విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మానవవనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించే జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి: ఇస్లాం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ మీడియా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌ను మాజీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ సయ్యద్ ఇస్లాం ప్రారంభించారు. పార్టీ బలోపేతంతో సహా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపై కూలంకుషంగా చర్చించడంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఎటాక్ చేసేలా, మరింత యాక్టివ్‌గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన గురించి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ మెజారిటీ సీట్లు గెలిపించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Aviation Expo Wings India 2024: విమానయానం ఉజ్వలం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మనుషులను, మనసులను విమానయాన రంగం అనుసంధానిస్తోంది. జీవితాల్లో మార్పు తెచ్చింది. సామాజిక, ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుంటోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన పరిశ్రమ వెలుగులమయం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకోసారి జరిగే వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాన్యుడికీ విమానయాన అవకాశాన్ని అందించే ఉడాన్ 5.3 స్కీమ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దేశీయంగా 30 కోట్లకు.. పౌర విమానయాన రంగంలో ప్రపంచంలో అయిదవ స్థానంలో భారత్ నిలిచిందని జ్యోతిరాదిత్య తెలిపారు. ‘2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో ఈ సంఖ్య 15.3 కోట్లకు ఎగసింది. 2030 నాటికి ఇది 30 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణికుల విస్తృతి ప్రస్తుతం కేవలం 3–4 శాతమే. ఏడేళ్లలో ఇది 10–15 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మిగిలిన 85 శాతం మేర అవకాశాలను అందుకోవడానికి కసరత్తు చేస్తున్నాం. అడ్డంకులు తొలగించడంతోపాటు మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం’ అని వివరించారు. కొత్త విమానాశ్రయాలు.. దేశవ్యాప్తంగా 2014 నాటికి 74 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ ఉన్నాయి. ఇవి రావడానికి 65 ఏళ్ల సమయం పట్టిందని సింధియా తెలిపారు. ‘గడిచిన 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ జోడించాం. దీంతో ఈ కేంద్రాల సంఖ్య 149కి చేరుకుంది. 2030 నాటికి ఇవి 200 దాటతాయి. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థల వద్ద 713 విమానాలు ఉన్నాయి. వచ్చే దశాబ్దిలో వీటి సంఖ్య 2,000 దాటుతుంది. విమానాల కొనుగోలులో యూఎస్, చైనా తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది’ అని అన్నారు. రికార్డు స్థాయిలో మహిళా పైలట్లు.. ప్రయాణికుల వృద్ధి రేటు దేశీయంగా 15.3 శాతం, అంతర్జాతీయంగా 6.1 శాతం ఉంది. 15 ఏళ్లలో విమానాల్లో సరుకు రవాణా దేశీయంగా 60 శాతం, విదేశాలకు 53 శాతం అధికమైందని సింధియా గుర్తు చేశారు. ‘గతేడాది 1,622 మంది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. వీరిలో 18 శాతం మహిళలు కావడం విశేషం. భారత్‌లో ఉన్న పైలట్లలో మహిళల వాటా 15 శాతం ఉంది. ఇది ప్రపంచ రికార్డు. డ్రోన్స్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు నిబంధనలు సరళీకరించాం, ప్రోత్సాహకాలు ప్రకటించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గగనంలో అద్భుత వీక్షణకు
సనత్‌నగర్ (హైదరాబాద్): గగనంలో గగుర్పొడిచే విన్యాసాలకు మరోసారి బేగంపేట విమానాశ్రయం వేదికైంది. వింగ్స్ ఇండియా–2024కు కౌంట్‌డౌన్ మొదలైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు జరిగే వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనున్నారు. తొలిసారి ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తోపాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు (18, 19 తేదీలు) వ్యాపార, వాణిజ్యవేత్తలను, ఆ తరువాత రెండు రోజులు (20, 21 తేదీలు) సామాన్యులను అనుమతిస్తారు. ఈ షోలో 106 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్, 5,000 మంది బిజినెస్ విజిటర్స్ పాల్గొననున్నట్లు అంచనా. ఫ్లయింగ్ డిస్ప్లే సమయం పెరిగిందోచ్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్‌తోపాటు మార్క్ జాఫరీస్ బృందం చేసే వైమానిక విన్యాసాలను కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే. గతంలో ఫ్లెయింగ్ డిస్ప్లే సమయాన్ని కేవలం 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు పర్యాయాలు నిర్వహించగా, ఈసారి 45 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విన్యాసాలు చేయనున్నారు. చివరి రోజు ఆదివారం సందర్శకులు ఎక్కువగా విచ్చేయనున్న దృష్ట్యా ఆ రోజు మూడుసార్లు విన్యాసాలు నిర్వహించనున్నారు. సారంగ్ టీమ్ వచ్చేసింది.. ముగ్గురు హైదరాబాదీలే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్ మరోసారి తమ వైమానిక విన్యాసాలు ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకైక జట్టుగా పేరొందిన ఈ టీమ్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. ఐదు హెలికాప్టర్లతో ఏరోబాటిక్స్ ప్రదర్శించే ఈ బృందానికి సీనియర్ గ్రూప్ కెపె్టన్ ఎస్కే మిశ్రా నేతృత్వం వహిస్తున్నారు. ఏరోబాటిక్స్ ప్రదర్శన చేసే ఐదుగురిలో ముగ్గురు హైదరాబాదీలే కావడం విశేషం. హైదరాబాదీలైన వింగ్ కమాండర్లు టీవీఆర్ సింగ్, అవినాష్ సారంగ్ టీమ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ టీమ్ 350 షోలకు పైగా నిర్వహించి రికార్డు సృష్టించింది. వైమానిక విన్యాసాల వేళలు 18వ తేదీన మధ్యాహ్నం 1 – 2 గంటల వరకు, 4.15–5 గంటల వరకు 19న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు. అనంతరం డ్రోన్ షో జరగనుంది. 20న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు.. 21న ఉదయం 11–11.45 వరకు, మధ్యాహ్నం 3–3.45 వరకు, సాయంత్రం 5–5.45 వరకు -
Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ఇటీవల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. విమానాల రద్దు, కొన్ని ఆలస్యంగా బయలుదేరటంతో విమానా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్ ఇచ్చారు. డేటా మైనింగ్ వలే ఇంటర్నెట్ నుంచి కేవలం కొన్ని ప్రెస్ ఆర్టీకల్స్‌ను సేకరించి ‘పరిశోధన’ అంటే ఎలా? అని ఎద్దేవా చేశారు. వాస్తవ నిజాలు.. సాంకేతిక రంగం వంటి విమానయానం గురించి శశిథరూర్, కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్లకు అర్థం చేసుకోవడానికి సహయ పడతాయని అన్నారు. విమానయానం వంటి రంగంలోని సంక్లిష్టత అర్థం చేసుకోకపోవటం థరూర్, కాంగ్రెస్ ఐటీసెల్ వెనకబాటుతనానికి నిదర్శనమని సింధియా ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. 1/6 It is for someone who is lost in his esoteric world of thesaurus that data mining of selective press articles from the internet qualifies as “research”. Here are some actual facts for arm-chair critic @ShashiTharoor and the Cong IT Cell that might help tackle their lack of… https://t.co/hA3sijtjr8 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 17, 2024 ఇటీవల ఢిల్లీలో కప్పేసిన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు, ఆసల్యం కావటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు. నిరసనగా రన్‌వే పైనే విమాన ప్రయాణికులు భోజనం చేశారు. దీనికంటే ముందు విమానం ఆసల్యం ఉందని ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఓ ప్రయానికుడు ఏకంగా విమానం పైలట్‌పైకే దాడికి యత్నించాడు. ఈ విషయంపై స్పందించిన విమానయాన శాఖ మంత్రి సింధియా.. పొగ మంచు నేపథ్యంలో విమానాల ఆలస్యంపై చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల రక్షణ కోసమే విమానాలు కొంత ఆలస్యం అవుతున్నాయని ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే.. విమానాల ఆలస్యంపై శశి థరూర్ స్పందిస్తూ.. సంకాంత్రి పండగ సమయంలో విమాన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడటం ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శమని విమర్శలు గుప్పించారు. చదవండి: అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరు బలి -
విమాన ప్రయాణికులు మాతో సహకరించాలి: సింధియా
న్యూఢిల్లీ: ఢిల్లీని తీవ్రమైన పొగ మంచు కప్పేయటంతో ఆదివారం సుమారు వంద విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. కొన్ని విమానాలు గంటల కొద్ది ఆలస్యంగా బయలుదేరాయి కూడా. ఈ వ్యవహారంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ ట్విటర్ వేదిక స్పందించారు. ‘‘నిన్న(ఆదివారం) ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా కొన్ని గంటలపాటు విజిబిలిటీ సమస్య ఎదురైంది. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు జీరో విజిబిలిటీ ఉంది. ఈ కారణంగానే ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికుల రక్షణ, భద్రత విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విమాన సర్వీసులను కొన్ని గంటల పాటు నిలిపివేసింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. ఎయిర్‌పోర్టులోని CAT-IIIలో భాగంగా ప్రారంభించిన నాలుగో రన్‌వేను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తాం. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు విమానాల రద్దు, ఆలస్య అసౌర్యాన్ని తగ్గించడానికి, ప్రయాణికుల సరైన సమాచారం అందజేయాలని కూడా విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రయాణికులంతా సహకరించాలని కోరుతున్నా. ప్రయాణికలు అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎప్పటికప్పుడు కృషి చేస్తోంది. ఈ సమయంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. అలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోకతప్పదు’’ అని మంత్రి సింధియా పేర్కొన్నారు. Yesterday, Delhi witnessed unprecedented fog wherein visibility fluctuated for several hours, and at times, dropped to zero between 5 AM to 9 AM. The authorities, therefore, were compelled to enforce a shut-down of operations for some time even on CAT III runways (CAT III… — Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 15, 2024 మరోవైపు.. విమానం ఆలస్యానికి సంబంధించి ఓ ప్రయాణికుడు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన కెప్టెన్‌పై దాడికి యత్నంచిన విషయం తెలిసిందే. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. చదవండి: Ram Mandir: అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి? -
కుక్కపిల్లను కొట్టిచంపాడు
భోపాల్: అటుఇటు తిరుగుతూ తన వద్దకు వచి్చన కుక్కపిల్లను ఓ వ్యక్తి అత్యంత నిర్దయగా నేలకేసి కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఈ దారుణం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వీడియో వైరల్‌గా మారడంతో వేలాది మంది.. ఆ వ్యక్తి కర్యశ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు. కఠిన శిక్ష పడేలాచూస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం గుణ జిల్లాలోని సుభాష్ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటన తాలూకు వీడియో చూసిన వారంతా వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలంటూ పోస్టులు పెట్టారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ఆరుబయట కూర్చోగా అక్కడికి రెండు బుల్లి కుక్కపిల్లలు తిండి కోసం తచ్చాడుతూ వచ్చాయి. వాటిల్లో ఒకటి ఇతడి సమీపానికి రాగానే వెంటనే ఆగ్రహంతో కుక్క పిల్లను ఎత్తిపట్టుకుని నేలకేసి బలంగా కొట్టాడు. అక్కడి నుంచి లేచి వచ్చి దానిని కుడికాలితో పలుమార్లు తొక్కిచంపాడు. ఈ హృదయవిదారక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ‘‘ఇది నా హృదయాన్ని కలిచివేసింది. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చౌహాన్ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
విమానయానంలో విప్లవం
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: గత తొమ్మిదిన్నరేళ్లలో విమానయాన గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర పౌర విమానయాన, ఉక్కుశాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రూ.347 కోట్లతో నిర్మిస్తున్న డొమెస్టిక్ టెర్మినల్ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 65 ఏళ్ల భారతదేశ చరిత్రలో 2014 నాటికి దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉన్నాయని, ఈ తొమ్మిదిన్నరేళ్లలో 75 ఎయిర్‌పోర్టులు నిర్మించామని చెప్పారు. దీంతో దేశంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 149కి చేరిందన్నారు. వీటి సంఖ్యను 220కి పెంచుతామని తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ పాయింట్ 21,094 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని, రద్దీవేళల్లో 2,100 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతోపాటు భవిష్యత్‌లో ఏటా 30 లక్షలమంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం ఉంటుందని వివరించారు. 28 చెక్ ఇన్ కౌంటర్లు, నాలుగు అరైవల్ కరైజల్స్, 600 కార్లకు పార్కింగ్, ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో టెర్మినల్ రూపు దిద్దుకోనుందని చెప్పారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్‌కు మాత్రమే విమానాల కనెక్టివిటీ ఉండేదని, ప్రస్తుతం మూడు ప్రధాన నగరాలకు ఉందని తెలిపారు. తిరుపతి నుంచి గతంలో ఒక నగరానికి మాత్రమే కనెక్టివిటీ ఉండగా.. ఇప్పుడది 10 ప్రాంతాలకు విస్తరించిందని చెప్పారు. విజయవాడకు రెండు నగరాలతో కనెక్టివిటీ ఉంటే ప్రస్తుతం ఎనిమిదికి పెరిగిందని, షార్జా కూడా వెళ్లగలుగుతున్నారని తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు తొమ్మిది ప్రాంతాలతో ఉన్న కనెక్టివిటీ ఇప్పుడు 14 నగరాలకు పెరిగిందన్నారు. సింగపూర్‌కు సైతం విమానాలు వెళ్లేలా వసతులు కల్పించామని చెప్పారు. అలాగే కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల ద్వారా వివిధ ప్రాంతాలకు విమానాలు వెళ్లేలా తీర్చిదిద్దామన్నారు. భోగాపురం, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులను గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఎయిర్‌పోర్టుల ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఇటీవల భోగాపురంలో 2,200 ఎకరాల్లో రూ.4 వేల కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని చెప్పారు. రెండేళ్లలో దీని నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. కర్నూలులో రూ.500 కోట్లతో ఫ్లయింగ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కలెక్టర్ కె.మాధవీలత, జేసీ ఎన్.తేజ్‌భరత్, రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ కమిషనర్ కె.దినేష్‌కుమార్, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్‌కుమార్, మధురపూడి విమానాశ్రయ అధికారి ఎస్.జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సింథియా ప్రసంగం అందరికీ నమస్కారం.. అంటూ సింథియా ప్రారంభించిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సాంస్కృతిక రాజధానిగా ఖ్యాతిగాంచిన రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి ఒడ్డున ఉందని, వెయ్యేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న ఈ నగర సాంస్కృతిక వారసత్వం దేశానికే తలమానికమని కొనియాడారు. ప్రజాకవి నన్నయ నడయాడిన నేలగా అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు, స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడి వారేనని ఆయన పేర్కొన్నారు. -
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన
-
నా ఎత్తు ఇప్పుడు తెలిసిందా? ప్రియాంకకు సింధియా కౌంటర్
భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ చాలా చోట్ల ఓటమితో వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో తన ఎత్తుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడు స్పందించారు. సింధియా ప్రభావం ఉన్న ప్రాంతంగా భావించే గ్వాలియర్ మాల్వా ప్రాంతంలో బీజేపీ ఆధిక్యాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘నా ఎత్తు గురించి ఎవరో మాట్లాడారు. గ్వాలియర్-మాల్వా ప్రజలు ఎంత ఎత్తులో ఉన్నారో చూపించారు’ అన్నారు. గత నెలలో డాటియాలో జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ.. సింధియాపై విరుచుకుపడ్డారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ‘ద్రోహ’ అని ముద్ర వేశారు. ‘వాళ్ల (బీజేపీ) నాయకులందరూ కొంచెం విచిత్రంగా ఉంటారు. ముందుగా మా సింధియా.. నేను యూపీలో అతనితో కలిసి పనిచేశాను. వాస్తవానికి అతని ఎత్తు కొంచెం తక్కువగా ఉంది. కానీ అహంకారంలో మాత్రం ఘనుడు’ అంటూ విమర్శించారు. ఎన్డీటీవీతో సింధియా మాట్లాడుతూ ‘బీజేపీ గెలుస్తుందని నేను ముందే చెప్పాను. మాకు ఇంత పెద్ద మెజారిటీని అందించిన మధ్యప్రదేశ్ ఓటర్లకు ధన్యవాదాలు. బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకత్వం పనిచేసింది’ అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందించిన ప్రజా, సంక్షేమ పథకాలు కూడా పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు. -
Madhya Pradesh: ఇప్పుడా ద్రోహి లేడు.. దిగ్విజయ్ తీవ్ర వ్యాఖ్యలు
భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శనివారం ఆయన రాష్ట్ర రాజధాని భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ద్విగ్విజయ్ సింగ్ స్పందిస్తూ ‘మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా దగ్గర సింధియా లేడు. కాబట్టి ద్రోహి లేడు’ అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్‌లోని దాతియాలో ఇటీవల జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ సింధియాపై 'ద్రోహి' అంటూ విరుచుకుపడ్డారు. సింధియా తనతో ఎమ్మెల్యేలతో కలిసి 2020 మార్చిలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడా పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ 130 సీట్లకుపైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత, దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ కూడా తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పారు. -
Madhya Pradesh: ‘24 గంటలు ఆగండి.. పూర్తి మెజార్టీ మాదే’
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో సింధియా శనివారం గ్వాలియర్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘రేపటి కౌంటింగ్లోమాకు పూర్తి విశ్వాసం ఉంది. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 24 గంటలు ఆగండి.. ఫలితాలు మన ముందే ఉంటాయి’ అన్నారు. ఇంతకుముందు మాట్లాడిన ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భారీ మెజారిటీతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందని, అత్యధిక మెజారిటీతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించగా 77.15 శాతం ఓటింగ్ నమోదైంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే అత్యధిక ఎగ్జిట్ పోల్స్ జీజేపీ వైపే మొగ్గు చూపాయి. -
'పొట్టివాడే కానీ..' సింథియాపై ప్రియాంక గాంధీ ఫైర్
భోపాల్: బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సింథియాను ద్రోహిగా పేర్కొన్నారు. యూపీలో గతంలో ఎన్నికల ప్రచారంలో సింథియాతో కలిసి పనిచేసిట్లు చెప్పిన ప్రియాంక గాంధీ.. పొట్టిగానే ఉంటాడు కానీ.. అహంకారం మాత్రం చాలా ఎక్కువని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని దాతియాలోని ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. 'ఎవరు ఆయన వద్దకు వెళ్లినా మహారాజ్ అని పిలవాలి. లేకపోతే ఆయన పెద్దగా స్పందించరు. మన సమస్యలు పరిష్కరించరు. ఈ రకమైన కుటుంబ సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తున్నారు. కానీ గ్వాలియర్, చంబా ప్రజలకు మాత్రం సింథియా ద్రోహం చేశారు.' అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సింథియా కూడా కాంగ్రెస్‌పై ఇటీవల తీవ్రంగా ఆరోపణలు చేశారు. మహిళలకు ఆ పార్టీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లో విఫలమయ్యారని విమర్శించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పతనమైందని అన్నారు. 2018లో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ సీఎం సీటు విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. కమల్‌నాథ్‌కు సీఎం పదవి ఇవ్వడంలో సింథియాను ఒప్పించింది అధిష్ఠానం. కానీ కొన్ని నెలల్లోనే సింథియా అసంతృప్తితో బీజేపీ గూటికి చేరారు. 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నాయి. ఈ క్రమంలో నేడే ప్రచారానికి తెరపడింది. ఇదీ చదవండి: Madhya Pradesh Election: ఎన్నికల ప్రచారం ఆఖరి క్షణంలో ఖర్గే సభ రద్దు! -
Madhya Pradesh Elections: సింధియాకు అగ్నిపరీక్ష
అసెంబ్లీ ఎన్నికలు ఇంకా వారం కూడా లేని వేళ మధ్యప్రదేశ్‌లో కీలకమైన గ్వాలియర్–చంబల్ ప్రాంతం అధికార బీజేపీకి తలనొప్పిగా మారుతోంది. పార్టీలోని పాత నేతలకు, మూడేళ్ల కింద కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయులకు అస్సలు సరిపడకపోవడం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఈ ప్రాంతంలో 34 కీలక అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ మంచి ఫలితాలు సాధించడం కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ చాలా కీలకం. అలాంటి ప్రాంతంలో పాత, కొత్త నేతలు సయోధ్యకు ససేమిరా అంటుండటం పార్టీ నాయకత్వంతో పాటు సింధియాకు కూడా ఇబ్బందికరంగానే మారింది. పైగా శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై జనంలో నెలకొన్న వ్యతిరేకత కూడా దీనికి తోడయ్యేలా కని్పస్తుండటం మరింత గుబులు రేపుతోంది. ఈసారి గ్వాలియర్ ప్రాంతంలో బీజేపీ సాధించబోయే సీట్ల సంఖ్యపై పారీ్టలో సింధియా భవితవ్యం కూడా చాలావరకు ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది... అది గ్వాలియర్‌లోని హజీరా ప్రాంతం. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఇంధన మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఓటెయ్యాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాత్రం కాంగ్రెస్‌కు ఓటెయ్యాల్సిందిగా కోరారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన అనంతరం యువ నేత జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న 16 మంది ఎమ్మెల్యేల్లో తోమర్ ఒకరు. ఆయన రాకతో కినుక వహించిన స్థానిక బీజేపీ నేతలు ఇప్పుడాయనకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. దాంతో ఒకరకంగా ఆయనది ఒంటరి పోరుగానే మారింది. ఆయనకు మాత్రమే కాదు, బీజేపీ టికెటిచ్చిన సింధియా వర్గానికి చెందిన మరో 17 మంది నాయకులకూ దాదాపుగా ఇదే పరిస్థితి ఎదురవుతోంది! అంతేగాక ఓటర్లు కూడా వారిపట్ల నిరాసక్తతే చూపుతున్నారు. ‘‘వారికే పరస్పరం కుదరడం లేదు. అలాంటి వాళ్లకు మా మంచీ చెడూ గురించి ఆలోచించేంత సమయం ఎక్కడుంటుంది?’’ అని ప్రశ్నిస్తున్నారు! బీజేపీ వర్సెస్ సింధియా వర్గం 2020 మార్చిలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి సింధియా బీజేపీలో చేరారు. దాంతో కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. వారంతా రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలొచ్చాయి. గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో ఇలా రాజీనామా చేసిన 16 మందిలో 9 మంది తిరిగి నెగ్గారు. దాంతో అక్కడ బీజేపీ బలం 16కు పెరిగింది. ఈసారి ఆ స్థానాలన్నింటినీ నిలుపుకోవడంతో పాటు మరిన్ని చోట్ల నెగ్గాల్సిన కఠిన పరీక్ష సింధియా ముందుంది. కానీ పరిస్థితులు ఆయనకు అంత సానుకూలంగా కనిచడం లేదు. ఆ ప్రాంత ప్రజల్లో మెజారిటీ సింధియా నిర్ణయాన్ని తప్పుబడుతుండటం విశేషం. ఆయనసలు కాంగ్రెస్‌ను వీడాల్సిందే కాదన్నది వారి నిశి్చతాభిప్రాయం. దీనికి తోడు సింధియా వర్గానికి చెందిన 18 మందికి బీజేపీ నాయకత్వం టికెట్లివ్వడం కూడా పార్టీలో విభేదాలకు కారణమైంది. పలువురు ఆశావహులు పార్టీలు మారి బరిలో దిగి సవాలు విసురుతున్నారు. మోరెనా అసెంబ్లీ స్థానంలో సింధియా వర్గం ఎమ్మెల్యే రఘురాయ్ కన్సానాకు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాకేశ్ రుస్తుం సింగ్ బీజేపీని వీడారు. బీఎస్పీ టికెట్‌పై బరిలో దిగి సవాలు విసురుతున్నారు. బీజేపీ ఓటు బ్యాంకును ఆయన గణనీయంగా చీల్చడం ఖాయమంటున్నారు. పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి! దీన్ని గమనించే బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్టోబర్ 30 నుంచి వారంలోపే ఏకంగా రెండుసార్లు గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో పర్యటించారు. అసంతృప్త పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరిపి బుజ్జగించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.‘‘అసలు బీజేపీ నేతల్లోనే చాలామంది సింధియాను వ్యతిరేకిస్తున్నారు. ఇది ఈసారి ఆ పారీ్టకి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది’’ అని రాజకీయ, మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి గ్వాలియర్ రాజ వంశీకునిగా సింధియాపై ఈ ప్రాంతవాసులకు చెప్పలేనంత అభిమానముంది. కానీ ఆయన పార్టీ మారిన తీరు వారికి పెద్దగా నచ్చలేదు. వ్యతిరేక పవనాలు...! అంతేగాక మధ్యలో ఓ ఏడాదిన్నర మినహా రాష్ట్రంలో 18 ఏళ్లుగా బీజేపీ పాలనే సాగుతుండటంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా సింధియాకు ప్రతికూలంగా మారుతోంది. ‘‘నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మాకొచ్చే రోజువారీ కూలీ ఏ మూలకూ చాలడం లేదు. పోయినసారి బీజేపీకి ఓటేశాం. ఈసారి మాత్రం కాంగ్రెస్‌కే వేసి చూద్దామనుకుంటున్నాం’’ అన్న మాలతీ కిరార్, ఆమె సోదరుడు యోగేంద్ర మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసినా తనకిప్పటికీ ఉద్యగం దొరకలేదని భగవాన్ దాస్ అనే యువకుడు వాపోయాడు. ‘‘మూడేళ్లుగా ప్రభుత్వోద్యోగాల భర్తీయే లేదు. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?’’ అన్న ఆయన ప్రశ్న యువతలో కూడా కమలం పార్టీకి సానుకూలంగా లేదనేందుకు రుజువేనంటున్నారు. -
విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడగలను: సింథియా
ఢిల్లీ: ప్రతీకార రాజకీయాలు చేయడం తనకు ఇష్టం ఉండదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌లపై తనకు ఎలాంటి పగ లేదని చెప్పారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తినని ఆయన అన్నారు. 2018లో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కమల్‌నాథ్‌ను సీఎంగా ప్రకటించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సింథియా చెప్పారు. సీఎం రేసులో తాను ఎప్పుడూ లేనని స్పష్టం చేశారు. పైగా కమల్‌నాథ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై తాను కూడా మద్ధతు తెలిపినట్లు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దోపిడీ పాలన జరిగిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అన్ని వాగ్దానాలను మరిచిపోయారని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. 2018లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. కమల్‌నాథ్‌ను అధిష్ఠానం సీఎంగా నిర్ణయించింది. 2020లో జ్యోతిరాదిత్య సింథియా 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీని ఫిరాయించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్‌లా ఆడగలను.. భవిష్యత్పైనే తనకు దృష్టి ఉంటుందని సింథియా అన్నారు. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్‌లాగా తాను ఆడగలనని అన్నారు. ఒకవేళ తాను అలా ఆడకపోయి ఉంటే.. 2020లో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కూలిపోయేది కాదని అన్నారు. కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపులో ఉండే అర్హత సంస్కృతిపై సింథియా మండిపడ్డారు. బీజేపీలో కష్టపడ్డవారికే ఫలితం ఉంటుందని, కాంగ్రెస్‌లో అలా కాదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అనుచరుడు సమందర్ పటేల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. తన అనుచరులతో కలిసి సమందర్ కాంగ్రెస్‌లో శుక్రవారం చేరారు. 'కాంగ్రెస్ పార్టీ భావాజాలంపై ఇష్టంతోనే సమందర్ చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజాయితీ నచ్చే ఇక్కడి వచ్చారు. ఇదే నిజాన్ని ప్రజలకు కూడా చెబుతారు. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ బీజేపీ కుట్రలు పన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా అయ్యారు. బీజేపీ అధికారంలో నేరాలు, మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. శివరాజ్ ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి పలకాలని అనుకుంటున్నారు.' అని కమల్ నాథ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగిరావడంపై సమందర్ పటేల్ ఆనందం వ్యక్తం చేశారు. సింధియా సహచరులు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగివెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలో కాంగ్రెస్ తరుపున శివపురి జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన బైజ్నాథ్ సింగ్ యాదవ్ కూడా సింధియాను వదిలి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. సింధియా మరో అనుచరుడు రాకేశ్ గుప్తా కూడా ఇటీవలే బీజేపీని వదలి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి.. కేంద్రానికి అఖిలేష్ కౌంటర్.. -
మనికాకు చేదు అనుభవం.. ఒక్క ట్వీట్‌తో తిరిగొచ్చేలా! థాంక్యూ సర్..
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా.. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ధన్యవాదాలు తెలిపింది. తన బ్యాగేజ్‌ను ఇంటికి చేర్చేలా చొరవ తీసుకున్నందుకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. కాగా పెరూ టోర్నమెంట్లో ఆడిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనిక బత్రా డచ్ విమానయాన సంస్థకు చెందిన కేఎల్ఎమ్ ఎయిర్‌లైన్స్‌లో భారత్‌కు చేరుకుంది. అయితే ఈ విమానంలో తన విలువైన బ్యాగేజ్‌ను మరిచిపోయిన మనిక ఇక్కడికి వచ్చాక సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థను సంప్రదించినప్పటికీ ఆశించిన స్పందన కరువైంది. దీంతో ఆమె.. సాయం చేయాలని కోరుతూ జ్యోతిరాదిత్య సింధియాకు ట్వీట్ చేసింది. మనికా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రి కార్యాలయం.. ‘‘ఢిల్లీకి రానున్న విమానంలో బ్యాగేజీ ఉంది. రేపు ఉదయం 01:55 నిమిషాలకు కలెక్ట్ చేసుకోవచ్చు’’ అని బుధవారం ట్విటర్ వేదికగా మనికాకు రిప్లై ఇచ్చింది. కాగా డచ్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన తాను బ్యాగేజీ పోగొట్టుకున్నానని మనిక మంగళవారం ట్వీట్ చేసింది. ఈ విషయం గురించి ఎయిర్‌పోర్టు సిబ్బందిని ఆరా తీసినా ఫలితం లేకుండా పోయిందంటూ మనికా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయగా.. ఆమెకు ఊరట లభించింది. Thank you so much @JM_Scindia sir and his office for prompt action and helping me in getting my baggage. I have received it this morning. https://t.co/XBVeQIApXO — Manika Batra (@manikabatra_TT) August 9, 2023 -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
భోపాల్: ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగలింది. బీజేపీ నేత సినిమా రేంజ్లో 400 కార్ల క్వానాయ్‌తో బయలుదేరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొన్ని నెల్లలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత కాంగ్రెస్‌లో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు.. ఆయన కాన్వాయ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ నేత జైజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు సింగ్. గురువారం ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికల సందర్భంగా 400 కార్ల కాన్వాయ్‌తో దాదాపు 300 కిలోమీటర్లు సైరన్ వేసుకుంటూ ప్రయాణించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక, ఆయనను మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజధాని భోపాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బైజ్నాథ్ సింగ్ తన బలప్రదర్శన చేశారు. శివ్‌పురి జిల్లా నుంచి 400 వందల కార్లతో 300 కిలోమీటర్ల దూరం ఉన్న భోపాల్‌కు భారీ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా కార్లకు సైరన్ వేసుకుంటూ ప్రయాణించారు. ఈ ర్యాలీలో భాగంగా మార్గ మధ్యలో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. 15 మంది జిల్లా స్థాయి నేతలు, ఇతర కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాకు చెందిన బైజ్నాథ్ అక్కడ పేరున్న నేత. ఆయనకు గ్రౌండ్ లెవల్ నుంచి ప్రజల మద్దతు ఉంది. కాగా, అంతకుముందు 2020లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు చేసి బీజేపీలోకి వెళ్లడంతో కమల్‌నాథ్ సర్కారు కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బైజ్నాథ్ సింగ్ కూడా సింధియా వెంటనే బీజేపీలో చేరారు. అనంతరం, బీజేపీలో ఆయనకు తగిన గుర్తింపు లభించకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇక, బైజ్నాథ్ సింగ్ కార్ల ర్యాలీపై బీజేపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో ఆయనపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇలా సైరన్ల వాడటమేంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రజలకు అసౌకర్యం కల్పించేలా సైరన్లు వినియోగించడం కాంగ్రెస్ పార్టీ నేతల మనస్తత్వమని మండిపడింది. Madhya Pradesh: BJP leader Baijnath Singh heads to rejoin Congress in 400-car convoy.pic.twitter.com/a7cofthV0R — Annu Kaushik (@AnnuKaushik253) June 15, 2023 ఇది కూడా చదవండి: బసవరాజ బొమ్మైతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య భేటీ.. -
200కు పైగా ఎయిర్‌పోర్ట్‌లు అవసరం
న్యూఢిల్లీ: భారత్‌కు వచ్చే ఐదేళ్లలో 200కు మించి ఎయిర్‌పోర్ట్‌లు, హెలీపోర్ట్‌లు, వాటర్ ఏరోడ్రోమ్‌లు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఇదే కాలంలో ఎయిర్‌లైన్స్ సంస్థలు 1,400 విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. నరేంద్రమోదీ సర్కారు తొమ్మిదేళ్ల హయాంలో విమానయాన రంగం సాధించిన పురోగతిపై బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 వరకు 74 ఎయిర్‌పోర్ట్‌లు, హెలీపోర్ట్‌లు, వాటర్‌పోర్ట్‌లే ఉండేవని, ఇవి రెట్టింపై ప్రస్తుతం 148కి చేరినట్టు చెప్పారు. ‘‘2013–14లో దేశీయంగా ఆరు కోట్ల మంది ప్రయాణించారు. ఇప్పుడు దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 14.5 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో అంతర్జాతీయ ప్రయాణికులు 50 శాతం పెరిగి 4.7 కోట్ల నుంచి 7 కోట్లకు చేరారు. దేశ, విదేశీ కార్గో పరిమాణం ఇదే కాలంలో 2.2 మిలియన్ టన్నుల నుంచి 3.6 మిలియన్ టన్నులకు (65 శాతం అధికం) పెరిగింది. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ప్రగతిశీల విధానాల ఫలితంగా భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించింది’’అని మంత్రి వివరించారు. విమానాల సంఖ్య కూడా 2014 నాటికి 400గా ఉంటే, ఇప్పుడు 700కు చేరినట్టు చెప్పారు. ‘‘ఎయిర్ ఇండియా 70 బిలియన్ డాలర్ల విలువైన 470 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇది కేవలం ఆరంభమే. భారత విమానయాన సంస్థలు రానున్న ఐదేళ్లలో 1,200 నుంచి 1,400 విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నాయి. రానున్న ఐదేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ల రంగంలోకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయి’’అని సింధియా పేర్కొన్నారు. 2030 నాటికి దేశీయ ప్రయాణికుల సంఖ్య 45 కోట్లకు (వార్షికంగా) చేరుకుంటుందన్నారు. హెలీకాప్టర్ల వినియోగాన్ని ప్రోత్సాహిస్తామన్నారు. త్వరలోనే అంతర్జాతీయ ఉడాన్ ఫ్లయిట్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. -
కేంద్ర మంత్రి ఉల్లిపాయల ఐడియా!.. మీరూ ట్రై చేస్తారా..?
గ్వాలియర్: ఎండాకాలం విపరీతంగా ఎండలు పెరిగిపోతున్నాయి. వడగాల్పుల నుంచి తట్టుకోవడానికి రకరకాల వంటింటి చిట్కాలు పాటిస్తుంటారు. కేంద్ర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింథియ కూడా ఉల్లిపాయల చిట్కాను పాటిస్తున్నట్లు చెప్పారు. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి అధికారులకు కూడా ఆయన ఆ చిట్కాను సూచించారు. వేడికి ఉల్లిపాయల ఐడియా మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఎండలు విపరీతంగా పెరిగాయి. దాదాపు 45డిగ్రీల సెల్సియస్ వరకు చెరుకున్నాయి. దీంతో రోజురోజుకూ వడదెబ్బతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజుల్లోనే 50 మంది ఆసుపత్రిలో చేరారు. దీంతో కేంద్ర మంత్రి సింథియా వేడినుంచి తప్పించుకోవడానికి ఉల్లిపాయలు తెచ్చుకోవాలని సూచనలు చేశారు. అధికారులు కూడా పాటించాలని సూచించారు. తానూ పాటిస్తున్నట్లు చెప్పారు. ఎండాకాలం అయినందున ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడే తన పాకెట్లో ఉల్లిగడ్డలు వెంట తెచ్చుకుంటున్నారట సింథియా. వాటిని ఉపయోగించి శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చని చెప్పారు. వేసవి ఎండల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో నిరాటంకంగా పనిచేయగలుగుతున్నానని తెలిపారు. ఉల్లిపాయలు శరీరంలో వేడిని గణనీయంగా తగ్గిస్తాయని వెల్లడించారు. మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. అజయ్ పాల్ కూడా ఎండల వేడి నుంచి తప్పించుకోవడానికి పలు సూచనలు చేశారు. తగిన మోతాదుల్లో నీటిని తాగాలని సూచించారు. ఇదీ చదవండి:'సెంట్రల్ విస్టాపై ప్రతిపక్షాలది తప్పుడు చర్య.' -
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మరో కొత్త టర్మినల్
చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1,260 కోట్లతో నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవంతి(ఫేజ్–1)ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా అద్భుత రీతిలో ఈ టర్మినల్‌కు తుదిరూపునిచ్చారు. ‘ సంవత్సరానికి 2.3 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యమున్న ఎయిర్పోర్ట్ నూతన టర్మినల్ ఏర్పాటుతో ఇక మీదట ప్రతి సంవత్సరం మూడు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది’ అని ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు సంప్రదాయాల్లో ఒకటైన కొల్లం(రంగోళీ), విశేష ప్రాచుర్యం పొందిన పురాతన ఆలయాలు, భరతనాట్యం, రాష్ట్రంలోని ప్రకృతి సోయగాలు, వారసత్వంగా వస్తున్న స్థానిక చీరలు ఇలా తమిళనాడుకే ప్రత్యేకమైన విశిష్టతల మేళవింపుగా భిన్న డిజైన్లతో నూతన టర్మినల్‌ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. నూతన టర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతోపాటు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా పాల్గొన్నారు. దీంతోపాటు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో చెన్నై–కోయంబత్తూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ‘అద్భుత నగరాలకు అనుసంధానించిన వందేభారత్‌కు కృతజ్ఞతలు’ అని ఈ సందర్భంగా మోదీ ట్వీట్‌చేశారు. కొత్త రైలురాకతో రెండు నగరాల మధ్య ప్రయాణకాలం గంటకుపైగా తగ్గనుంది. రాష్ట్ర రాజధాని, పారిశ్రామిక పట్టణం మధ్య ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలు ఇదే కావడం విశేషం. సేలం, ఈరోడ్, తిరుపూర్‌లలోనూ ఈ రైలు ఆగుతుంది. బుధవారం మినహా అన్ని వారాల్లో ఈ రైలు రాకపోకలు కొనసాగుతాయి. వివేకానంద హౌజ్‌ను సందర్శించిన మోదీ చెన్నై పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నగరంలోని వివేకానంద హౌజ్‌ను దర్శించారు. 1897లో స్వామి వివేకానంద ఈ భవంతిలోనే తొమ్మిదిరోజులు బస చేశారు. రామకృష్ణ మఠ్ 125వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడారు. ‘ రామకృష్ణమఠ్ అంటే నాకెంతో గౌరవం. నా జీవితంలో ఈ మఠం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది. పాశ్చాత్య దేశాలకు పయనంకాకముందు వివేకానందుడు బసచేసిన ఈ భవంతిని దర్శించడం నాకు దక్కిన ఒక మంచి అవకాశం. ఇక్కడ ధ్యానం చేయడం ప్రత్యేకమైన అనుభవం. ఇది నాకెంతో ప్రేరణను, కొండంత బలాన్ని ఇస్తోంది. ఆధునిక సాంకేతికత సాయంతో పురాతనమైన నాటి గొప్ప ఆలోచనలు నేడు ముందు తరాలకు అందుతుండటం చాలా సంతోషదాయకం’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి మోదీ ఘన నివాళులర్పించారు. -
పూర్తి సామర్ధ్యం దిశగా విశాఖ ఉక్కు.. బొగ్గు, ఖనిజం లోటు లేకుండా చర్యలు!
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) ఎదుర్కొంటున్న కోకింగ్ కోల్, ఐరన్ ఓర్ కొరత సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు. భారీ పెట్టుబడులతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఏటా 3.2 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులకు విస్తరిస్తే ప్రస్తుతం అందులో మూడింట ఒకటో వంతు మాత్రమే ఉక్కు ఉత్పత్తి జరుగుతున్న విషయం వాస్తవమేనా అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అది వాస్తవం కాదని చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్టింగ్ షాప్‌ను అధునీకరించి 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీకి పెంచినప్పటికీ సమగ్ర ఉక్కు ఉత్పాదన సామర్ధ్యాన్ని 7.3 మిలియన్ టన్నులకు విస్తరించలేదని మంత్రి తెలిపారు. అలాగే తీరప్రాంతంలో ఉన్నందున వాతావరణంలోని ఉప్పు సాంద్రత కారణంగా స్టీల్ ప్లాంట్‌లోని భారీ పరికరాలకు తుప్పు పట్టే అవకాశం లేదా ప్రశ్నించగా.. మంత్రి జవాబిస్తూ స్టీల్ ప్లాంట్‌ను తీరప్రాంతంలో నెలకొల్పుతున్నందున ఎక్విప్మెంట్ సమకూర్చుకునే దశలోనే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. పూర్తి సామర్ధ్యం మేరకు స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పాదన జరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల గురించి మంత్రి ఈ విధంగా వివరించారు. ►వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు నిరాటంకంగా కోకింగ్ కోల్ సరఫరా చేసే అంశంపై బొగ్గు మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం. ►. వైజాగ్ స్టీల్ కోసం ఒక ఇనుప ఖనిజం బ్లాక్‌ను ప్రత్యేకంగా కేటాయించాల్సిందిగా ఒడిషా ప్రభుత్వాన్ని కోరడం జరగింది. ► ఇనుప ఖనిజ నిక్షేపాలను తమ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయవలసిందిగా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయమంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికే ఒడిషా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలను కోరింది. ►స్టీల్ ప్లాంట్ వర్కింగ్ కేపిటల్ అవసరాల కోసం సులభతరమైన వడ్డీతో రుణాల మంజూరు కోసం వైజాగ్ స్టీల్ యాజమాన్యం వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరుతోంది. ► వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న పలు ఇతర ఇబ్బందులను అధిగమించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో 211 సీఎన్జీ స్టేషన్లు న్యూఢిల్లీ, మార్చి 13: ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 2030 నాటికి 211 సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ సీఎన్‌జి స్టేషన్ల ఏర్పాటకు అర్హత పొందిన అధీకృత సంస్థలు ఈ ఏడాది జనవరి 31 నాటికి ఉత్తరాంధ్రలో 13 సీఎన్‌జి స్టేషన్లను నెలకొల్పాయని తెలిపారు. పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు, సీఎన్‌జి స్టేషన్ల ఏర్పాటు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) నెట్వర్క్ అభివృద్దిలో భాగం. ఈ పనులను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు పర్యవేక్షణలో అది ఆమోదించిన అధీకృత సంస్థలు చేపడుతున్నాయని మంత్రి తెలిపారు. 11-ఏ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ పూర్తయిన అనంతరం ఆంధ్రప్రదేశ్ అంతటా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌కు అనుమతించనున్నట్లు మంత్రి తెలిపారు. విశిష్ట పరిశోధనా కేంద్రంగా విశాఖ ఐఐపీఈ చమురు, సహజవాయవుల రంగానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై విశిష్ట పరిశోధనలు చేస్తూ, పెట్రోలియం, ఇంధన రంగాలలో సుశిక్షితులైన మానవ వనరులును అభివృద్ధి చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. రాజ్యసభలో సోమవారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ లక్ష్యంతోనే రాజీవ్ ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సంస్థకు అనుబంధంగా రెండు కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో రెండు సెంటర్లను విస్తరించినట్లు తెలిపారు. చమురు, సహజవాయువు రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ-ముంబైతో కలిసి సంయుక్తంగా చమురు, సహజవాయువు రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం ముంబైలో విశిష్ట కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇంధన పరిశ్రమను ఏకీకృత లక్ష్యం వైపు నడిపించడం, కాంప్లెక్స్ ఎనర్జీ, పర్యావరణ అంశాలకు సంబంధించి అనువైన పరిష్కారాల మార్గాలు అభివృద్ధి చేయడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం, టెక్నాలజీకి సంబంధించి కొత్త హద్దులు అన్వేషించడం లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించినట్లు మంత్రి తెలిపారు. -
ప్లీజ్ సార్..ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డ ఎయిర్ హోస్ట్.. పిడిగుద్దులు గుద్దుతూ..
బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు వస్తున్న విమానంలో ఘటన ముయే థాయ్ (థాయ్ బాక్సింగ్) గేమ్‌ను తలపించింది. ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన సీటు గొడవ తారా స్థాయికి చేరింది. ఓ ప్రయాణికుడిపై మరో ఐదుగురు ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. గొడవను సద్దుమణిగించేందుకు ఎయిర్ హోస్టెస్ చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. క్యాబిన్ క్రూ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పిడిగుద్దులు గుద్దుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వివాదంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. వివాదానికి కారణమైన ప్రయాణికులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. థాయ్ స్మైలీ ఎయిర్వేస్కు చెందిన విమానం డిసెంబర్ 26న థాయ్‌ల్యాండ్ నుంచి కోల్‌కతాకు వస్తుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి క్రూ సిబ్బంది ప్రయాణికులకు జాగ్రత్తలు చెబుతున్నారు. అదే సమయంలో ఓ ఎయిర్ హోస్ట్ బ్రౌన్ కలర్ (గోధుమ రంగు) షర్ట్ ధరించిన ప్రయాణికుడు తాను కూర్చున్న సీటును నిటారుగా జరపాలని కోరింది. Not many smiles on this @ThaiSmileAirway flight at all ! On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone. Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l — VT-VLO (@Vinamralongani) December 28, 2022 అంతే బ్రౌన్ కలర్ షర్ట్ ధరించిన వ్యక్తి రెచ్చిపోయి తన పక్కనే గ్రే కలర్ (బూడిద రంగు) చొక్కా ధరించిన వ్యక్తిపై దాడికి దిగాడు. వివాదానికి కారణమైన ప్రయాణికుడు తన కళ్లజోడు తీసి నల్ల చొక్కా ధరించిన బాధితుడి చెంపలు వాయిస్తూ, ఆపకుండా పిడిగుద్దులు గుద్దాడు. దాడికి పాల్పడే వ్యక్తికి మద్దతుగా అతని స్నేహితులు సైతం కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతలో ఈ గొడవను ఆపేందుకు ఎయిర్ హోస్టెస్ ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్ అని ఒకటే ప్రాధేయ పడుతున్నా పట్టించుకో లేదు. నిందితుడు కోల్ కతాలో ఫ్లైట్ దిగే సమయంలో సైతం తన సీటు బెల్ట్ తీసి తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అదే ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్న అలోక్ కుమార్ అనే ప్రయాణికుడు తెలిపారు.కాగా, విమానంలో జరిగిన ప్రమాదంపై కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా గొడవలు విమాన ప్రయాణంలో ఆమోదయోగ్యం కాదని ట్వీట్ చేశారు. ఈ ఘటనలో కారణమైన ప్రయాణికులకు కేసు నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులుకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. With regard to the scuffle between passengers on board a @ThaiSmileAirway flight, a police complaint has been filed against those involved. Such behaviour is unacceptable. — Jyotiraditya M. Scindia (@JM_Scindia) December 29, 2022 చదవండి👉 రతన్ టాటా మరో సంచలనం..500 విమానాల కోసం భారీ ఆర్డరు! -
ఏవియేషన్ పరిశ్రమ.. వీ షేప్ రికవరీ!
న్యూఢిల్లీ: దేశీ పౌరవిమానయాన పరిశ్రమ వీ ఆకారంలో బలమైన రికవరీ చూస్తోందని (ఎలా పడిపోయిందో, అదే మాదిరి కోలుకోవడం) ఈ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. దేశీ ప్రయాణికుల సంఖ్యలోనూ బలమైన వృద్ధి కనిపిస్తోందంటూ, రానున్న సంవత్సరాల్లోనూ ఇది కొనసాగుతుందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండేళ్లపాటు ఏవియేషన్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను చూడడం తెలిసిందే. గతేడాది చివరి నుంచి పుంజుకున్న పరిశ్రమ ఈ ఏడాది బలమైన వృద్ధిని చూస్తుండడం గమనార్హం. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు పైనే నమోదవుతోంది. ప్రయాణికుల సంఖ్య ఎంతో ఉత్సాహకరంగా ఉందంటూ, ఈ ఏడాది నవంబర్ నాటికి 111 మిలియన్లకు చేరుకుందని సింధియా వెల్లడించారు. వాయు మార్గంలో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారంటూ, అందుకే ఈ స్థాయి గణాంకాలు నమోదవుతున్నట్టు వివరించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఏవియేషన్ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఆయన విపులంగా మాట్లాడారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం గత మంగళవారం 2,883 దేశీ సర్వీసుల్లో 4,15,426 మంది ప్రయాణించారు. ‘‘కరోనా ముందు 2019లో సగటు రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.15 లక్షలుగా ఉండగా, గడిచిన రెండు వారాల్లో దీనికి మించి ప్రయాణిస్తుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది. డిసెంబర్ 24న 4.35 లక్షల మంది ప్రయాణించారు’’అని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ కేసులు ఆందోళనకరం.. ప్రపంచవ్యాప్తంగా చైనా, దక్షిణకొరియా, జపాన్, యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళకర విషయమేనని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ‘‘మేము ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అందుకే ఆరోగ్యశాఖ సూచనలకు అనుగుణంగా భారత్‌కు వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి స్క్రీనింగ్ (పరీక్షలు) నిర్వహిస్తున్నాం. అదృష్టం కొద్దీ ప్రస్తుతం ఎక్కువ కేసులు రావడం లేదు. ఈ విషయంలో కొంత వేచి చూసే ధోరణి అవసరం’’అని చెప్పారు. అంత రద్దీని అంచనా వేయలేదు.. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర రద్దీ కారణంగా ప్రయాణికులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కోవడం తెలిసిందే. పండుగల సమయంలో అంత రద్దీని తాము అంచనా వేయలేదని సింధియా చెప్పారు. ‘‘నిజానికి ఇది విమానాశ్రయాల బాధ్యత. డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాల్లేని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వాటిపై ఉంది. రద్దీ వేళల్లో విమానాశ్రయాల సామర్థ్యానికి అనుగుణంగా ట్రాఫిక్‌ను కట్టడి చేయడం, సామర్థ్యాన్ని విస్తరించడం దీనికి పరిష్కారం’’అని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఢిల్లీ విమానాశ్రయంతోపాటు, పలు ఇతర విమానాశ్రయాల్లో రద్దీపై పౌర విమానయాన శాఖకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పౌర విమానయాన శాఖ పలు దిద్దుబాటు చర్యలకు దిగడం గమనార్హం. ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ను నియంత్రించామని, మరిన్ని గేట్లు తెరిచామని మంత్రి చెప్పారు. ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోనూ ఇదే తరహా చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2019తో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపారు. -
పెద్ద విమానాలు సమకూర్చుకోవాలి
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో భారత ఏవియేషన్ మార్కెట్ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందనున్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్ సుదీర్ఘ ప్రయాణాల విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ఇందుకోసం మరిన్ని పెద్ద విమానాలను (వైడ్–బాడీ) సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు గురువారం ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లయిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దాదాపు 86 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ .. భారత్‌కు విమానాలు నడిపిస్తున్నాయి. కానీ మన దగ్గర్నుంచి కేవలం అయిదు సంస్థలకే అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ఉన్నాయి. అయితే, ఈ అయిదింటికీ 36 శాతం మార్కెట్ వాటా ఉంది. మనం అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగానే సుదీర్ఘ రూట్ల మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మరిన్ని వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని మన ఎయిర్‌లైన్స్‌ను కోరుతున్నాను‘ అని మంత్రి చెప్పారు. టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న ఎయిరిండియా.. సుదీర్ఘ రూట్లలో మరింతగా విస్తరించగలదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023 తొలినాళ్లలో ఎయిరిండియా.. ముంబై నుంచి న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌కు కూడా ఫ్లయిట్స్ ప్రారంభించనుంది. మరోవైపు, 2013–14లో 6.3 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2019–20లో 14.4 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్‌డ్రోమ్‌ల సంఖ్య 145కి పెరిగిందని చెప్పారు. -
పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు!
సాక్షి, న్యూఢిల్లీ: ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను జర్మనీలోని ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేశారని సోమవారం ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. తాజాగా పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయం స్పందించారు. పంజాబ్ సీఎంపై వచ్చిన ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని సింధియా తెలిపారు. అయితే ఈ ఘటన విదేశీ గడ్డపై జరిగినందున అసలు నిజానిజాలు ఏంటో తెలుసుకోవాల్సి ఉందన్నారు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ వివరాలు వెల్లడించాల్సి ఉందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని తనకు విజ్ఞప్తులు అందాయని, కచ్చితంగా దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ఏం జరిగింది? జర్మనీ పర్యటన ముగించుకుని సోమవారం ఢిల్లీకి తిరిగివచ్చారు భగవంత్ మాన్. అయినే ఫుల్లుగా తాగి ఉన్న కారణంగా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేశారని, దీనివల్ల నాలుగు గంటలు ప్రయాణానికి ఆలస్యమైందని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. భగవంత్ మాన్ పంజాబీల పరువు తీశారని శిరోమణి ఆకాలీదళ్ ధ్వజమెత్తింది. అయితే లుఫ్తాన్సా సంస్థ దీనిపై స్పష్టత ఇచ్చింది. విమానాన్ని మార్చాల్సి రావడం వల్లే ఆలస్యం అయిందని చెప్పింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆరోపణలను ఖండించించి. పంజాబ్ సీఎంను అప్రతిష్టపాలు చేసేందుకే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగింది. భగవంత్ మాన్ సోమవారం జర్మనీ నుంచి ఢిల్లీకి చేరుకుని నేరుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. చదవండి: మాట్లాడింది మమతేనా? మోదీకి సపోర్ట్ చేయడమేంటి? -
స్టీల్ తయారీలో నంబర్ 1 కావాలి
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో భారత్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యక్తం చేశారు. దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఉక్కు లేదా 'మేడ్ ఇన్ ఇండియా' ఉక్కును ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు, ప్రస్తుతం చైనా తర్వాత ముడి స్టీల్ తయారీలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఎన్ఎండీసీ, ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారత్ స్టీల్ విషయంలో నికర దిగుమతిదారు నుంచి నికర ఎగుమతిదారుగా అవతరించినట్టు చెప్పారు. తలసరి స్టీల్ వినియోగం 2013-14లో 57.8 కిలోలు ఉంటే, అది ఇప్పుడు 78 కిలోలకు పెరిగిందన్నారు. ఉక్కు రంగంలో అధిక కర్బన ఉద్గారాల విడుదలపై ఆందోళన వ్యక్తం చేసిన సింధియా, 2030 నాటికి ఈ స్థాయిలను 30 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ తయారీని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. -
తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం పెరిగింది: జ్యోతిరాదిత్య సింధియా
-
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి సింధియా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంద్రి జ్యోతిరాదిత్య సింధియా. రాష్ట్రం తిరోగమనంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ సర్కార్ సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీ హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. అలాగే తెలంగాణలో అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని సింధియా ఆరోపించారు. తప్పు చేయనప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అంటే భయమెందుకు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొన్నారు సింధియా. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు సింధియా. గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆయనకు స్వాగతం పలికారు. చదవండి: రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్లో ఉత్కంఠ -
ఉక్కు శాఖ బాధ్యతలు స్వీకరించిన సింధియా
న్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య మాధవ్‌రావు సింధియా గురువారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింధియా మోదీ ప్రభుత్వంలో ఉక్కు శాఖను చేపట్టిన మూడో మంత్రి కావడం గమనించాలి. ఢిల్లీలోని ఉద్యోగభవన్‌లో ఉక్కు శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన తన టేబుల్‌పై వినాయకుడి విగ్రహం ఉంచి, ఈ కార్యక్రమం చేపట్టారు. ‘‘ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు స్టీల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. శ్రేయోభిలాషుల దీవెనలతో నూతన బాధ్యతలను సాధ్యమైన మేర మెరుగ్గా నిర్వహిస్తాను. ఆర్సీపీ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించాను. అగ్ర నాయకత్వం ఇచ్చిన ఈ బాధ్యతలను పూర్తి సామర్థ్యాలతో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిర్వహిస్తాను’’అంటూ సింధియా రెండు వేర్వేరు ట్వీట్లు పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉక్కు శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశాలు నిర్వహించారు. అలాగే, ఉక్కు రంగానికి సంబంధించి అన్ని ప్రభుత్వరంగ సంస్థల అధిపతులతోనూ సమావేశమయ్యారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఉక్కు శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్సీపీ సింగ్ రాజీనామా చేయడం తెలిసిందే. -
కేంద్ర మంత్రులు సింధియా, స్మృతి ఇరానీకి అదనపు బాధ్యతలు
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి అదనంగా మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఈ క్రమంలోనే జ్యోతిరాధిత్య సింధియాకు ఉక్కు, గనుల శాఖను కేటాయించారు. అయితే, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి బుధవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నఖ్వీతో పాటుగా రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ కూడా రాజీనామా చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు.. కేబినెట్ మంత్రి స్మృతి ఇరానీకి ప్రస్తుతం ఉన్న పోర్ట్‌ఫోలియోతో పాటు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా కేటాయించాలని రాష్ట్రపతి ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. Smriti Irani, Jyotiraditya Scindia get additional charge of minority affairs, steel ministries https://t.co/Hvu0KbuLTC via @indiatoday — Amit Paranjape (@aparanjape) July 6, 2022 -
ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదులు... స్పందించిన సింధియా
న్యూఢిల్లీ: స్పెస్ జెట్ బోర్డింగ్ పాస్ కోసం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. దీంతో సింధియా ఫిర్యాదులను పరీశీలించేందుకు అంగికరీంచడమే కాకుండా త్వరితగతిన విచారణ చేస్తానని ట్వీట్ చేశారు. కొన్ని విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ చేయాలని పట్టుబట్టడమే కాకుండా అలా చేయడంలో విఫలమైన ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ పలువురు సోషల్ మీడియా ఫిర్యాదులు చేశారు. అంతేగాదు ఎయిర్పోర్ట్ కౌంటర్లో బోర్డింగ్ పాస్ కోసం ప్రయత్నించే వారి నుంచి కొన్ని ఎయిర్‌లైన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ కౌంటర్లో చెక్ ఇన్ చేయడానికి ఒక్కో టికెట్‌కు రూ. 200 ఖర్చవుతుందని స్పైస్‌జెట్‌తో పాటు ఇండిగో కూడా అదే పని చేసిందని వెల్లడించారు. దీని వల్ల వినియోగ దారులకు చాలా అన్యాయం జరుగుతుందంటూ ఫిర్యాదులు చేశారు. Agreed, will examine this asap! https://t.co/KkY8b0xP93 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 13, 2022 Ridiculous .Is @JM_Scindia listening? https://t.co/HBL8hUo4oT — Madhavan Narayanan (@madversity) May 13, 2022 new rule of SpiceJet. If you wish to get a boarding card at the check in counter,you need to pay extra. This is like telling a customer In a restaurant that if you want eat in a plate, you will be charged. Wonder what’s conssumer forum doing!@flyspicejet @BDUTT @madversity — Dr. Neeti Shikha (@neetishikha) May 13, 2022 (చదవండి: ల్యాప్‌టాప్ కీబోర్డులో పట్టుబడ్డ రూ. 1.3 కోట్ల బంగారం) -
ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో
CEO of IndiGo Ronojoy Dutta has expressed regret: దివ్యాంగ చిన్నారి విమానం ఎక్కేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఆ సంస్థ సీఈవో రోనోజోయ్ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన పై విచారణ వ్యక్తం చేయడమే కాకుండా ఆ చిన్నారి కోసం ఎలక్ట్రిక్ వీల్ చైర్‌ని కొనుగోలు చేయాలనుకున్నట్లు తెలిపారు. శారీరక వికలాంగుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసే తల్లిదండ్రులే మన సమాజానికి నిజమైన హీరోలు అని అన్నారు. ఆయన బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. ఆ ఘటన గురించి దత్తా మాట్లాడుతూ..."మా కస్టమర్లకు మర్యాదపూర్వకంగా, దయతో కూడిన సేవను అందించడమే మాకు ముఖ్యం. ఐతే భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయ సిబ్బంది విమానం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై క్లిష్టమైన పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక సంస్థగా సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయం తీసుకుందనే నేను భావిస్తున్నాను". అని అన్నారు. అంతేకాదు ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తానే స్వయంగా దర్యాప్తు చేపడతానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆ ఘటన తాలుకా వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. Here is the video of the incident that happened at Ranchi airport where @IndiGo6E airlines denies boarding to a special need child along with his child. Seems lack of empathy from Indigo staff, not the first time though. Indigo to issue a statement shortly. @JM_Scindia https://t.co/5ixUDZ009a pic.twitter.com/SyTNgAQIT6 — Dibyendu Mondal (@dibyendumondal) May 8, 2022 (చదవండి: ఇండిగో సిబ్బంది తీరుపై జ్యోతిరాదిత్య సింథియా ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్) -
ఇండిగో ఘటనపై కేంద్రమంత్రి ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారిని ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కనివ్వని ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని స్పష్టంచేశారు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం కాకూడదని.. ఘటనపై స్వయంగా తానే దర్యాప్తు చేపడతానని ట్విటర్ వేదికగా తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈమేరకు ఇండిగోను హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని, ఇండిగో సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 చిరుతతో పోరాటం.. అధికారులపై దాడి.. వైరల్ వీడియో There is zero tolerance towards such behaviour. No human being should have to go through this! Investigating the matter by myself, post which appropriate action will be taken. https://t.co/GJkeQcQ9iW — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 9, 2022 ఏం జరిగింది? హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇండిగో ఏమంటోంది? రాంచి ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనపై ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. భయంతో ఉన్న ఆ చిన్నారి స్థిమిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం వరకూ గ్రౌండ్ సిబ్బంది వేచి చూశారని.. కానీ ఫలితం లేకపోయిందని తెలిపింది. ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఓ హోటల్లో వసతి సౌకర్యం కల్పించామని.. ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరుకున్నారని వివరించింది. చదవండి👉🏻 రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న.. ఎంపీల ఓటు విలువ -
విమానాల రిపేర్లకు అనువుగా తిరుపతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెంపుల్ సిటీగా పేరొందిన తిరుపతిలో విమానాల ఇంజిన్ల నిర్వహణ, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) ఫెసిలిటీ ఏర్పాటు పనులను వేగిరం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి మద్దిల శుక్రవారం విన్నవించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యాపార ఆవకాశాలను వివరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా నివేదిక రూపొందించింది. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 వేదికపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. తిరుపతిసహా 8 ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్వో కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే నుంచి 440 మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత ఎంఆర్వో కేంద్రం కోసం స్థలం ఉంది. ఇటువంటి సౌకర్యం దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో కూడా లేదు. ఎంఆర్వో సేవలకు అనువుగా ఉంటుంది’ అని గురుమూర్తి తెలిపారు. రెండు హెలిప్యాడ్స్ సైతం.. తిరుమలకు ఏటా 5.8 కోట్ల మంది భక్తులు, సందర్శకులు వస్తున్నారని గురుమూర్తి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘వీరిలో 40 శాతం మంది ఖర్చుకు వెనుకాడరు. నాలుగైదు రోజులు గడిపేందుకు సిద్ధంగా ఉంటున్నారు. తిరుపతితోపాటు కోస్తా ప్రాంతంలో హెలిప్యాడ్స్ స్థాపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ఇవి కార్యరూపంలోకి వస్తే తిరుమల వచ్చిన వారు కోస్తా ప్రాంతంలో ఉన్న సందర్శనీయ స్థలాలకు హెలికాప్టర్లో సులువుగా వెళ్లవచ్చు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ పనులు వేగిరం అయ్యాయి. స్థల సేకరణలో తలెత్తిన సమస్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో సమసిపోయాయి. కడపలో పైలట్ శిక్షణ కేంద్రం రానుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే దక్షిణాదివారు శిక్షణ తీసుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరాం’ అని వివరించారు. విదేశీ సంస్థలకు సైతం.. ఇన్వెస్ట్ ఇండియా నివేదిక ప్రకారం.. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2017–18లో విమాన రాకపోకలు 7,094 నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరం ఇది ఏకంగా 10,738కు ఎగసింది. మహమ్మారి కారణంగా 2021–22లో ఈ సంఖ్య 6,613కు వచ్చి చేరింది. 2020–21తో పోలిస్తే ఇది 49% అధికం. 2017–18లో 6.57 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య 2018–19లో 8.48 లక్షలకు ఎగసింది. 2021–22లో 47% అధికమై 5.02 లక్షలకు వచ్చి చేరింది. ఇండిగో, స్పైస్ జెట్, ట్రూజెట్, అలయన్స్ ఎయిర్, ఎయిరిండియా, స్టార్ ఎయిర్ సంస్థలు అన్నీ కలిపి వారం లో 131 సర్వీసులు నడిపిస్తున్నాయి. తిరుపతి నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో 10 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎంఆర్వో సేవలు అందించేందుకు ఈ నెట్వర్క్ దోహదం చేస్తుంది. ఆసియా పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సంస్థలకూ ఈ సేవలు విస్తరించేందుకు వ్యూహాత్మక కేంద్రంగా తిరుపతి ఉంది. ఏటా భారత్‌కు 120 కొత్త విమానాలు: సింధియా దేశంలో విమానయాన సంస్థల వద్ద ప్రస్తుతం 710 విమానాలు ఉన్నాయి. 2013–14లో ఈ సంఖ్య 400 మాత్రమే. రానున్న రోజుల్లో ఏటా కొత్తగా కనీసం 110–120 విమానాలు జతకూడనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా శుక్రవారం తెలిపారు. ఇక్కడి బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏడేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి ఎగసింది. మూడేళ్లలో ఇది 220లకు చేరుతుంది. దేశీయంగా 2013–14లో 6.7 కోట్ల మంది ప్రయాణించారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 14 కోట్లకు చేరింది. ప్రస్తుతం రోజుకు 3.83 లక్షల మంది విహంగ విహారం చేస్తున్నారు. మహమ్మారి నుంచి ఈ పరిశ్రమ వేగంగా కోలుకుంది. వచ్చే ఏడాది కోవిడ్–19 ముందస్తు స్థాయిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.1 లక్షలు దాటనుంది. 2018–19లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 34.4 కోట్లు. 2024–25 నాటికి ఇది 40 కోట్లు దాటుతుంది’ అని సింధియా తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియా నివేదికను జ్యోతిరాదిత్యతో కలిసి ఆవిష్కరిస్తున్న -
లాభాలే..లాభాలు: విమనాశ్రయాల ప్రైవేటీకరణ..సమర్ధించుకున్న కేంద్రమంత్రి!
కరోనా ప్రభావాల నుండి విమానయాన రంగం క్రమంగా కోలుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గణాంకాల ప్రకారం గత ఏడు రోజుల్లో రోజువారీగా 3.82 లక్షల మంది ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు. 2018–19లో 14.50 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2023–24 నాటికి 40 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు లోక్‌సభకు మంత్రి వివరించారు. వచ్చే 2–3 ఏళ్లలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ రంగ సంస్థలు విమానాశ్రయాల ఏర్పాటుపై రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ఆయన చెప్పారు. విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. దీని వల్ల ఏఏఐ లాభదాయకత పెరుగుతుందని పేర్కొన్నారు. 2014 వరకూ దేశీయంగా 74 ఎయిర్‌పోర్టులు ఉండగా గడిచిన ఏడేళ్లలో కొత్తగా 66 విమానాశ్రయాలు వచ్చాయని సింధియా చెప్పారు. దేశ ఎకానమీలో భారీగా ఉద్యోగాల కల్పన ద్వారా ఏవియేషన్ రంగం కీలకంగా మారిందని పేర్కొన్నారు. దేశీయంగా మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలే ఉన్నారని.. అంతర్జాతీయంగా ఈ సగటు 5 శాతమేనని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్ పరిశ్రమ ఒడిదుడుకులు ఎదురు కొంటూ ఉండగా.. భారత్‌లో రెండు కొత్త ఎయిర్‌లైన్స్ (జెట్, ఆకాశ) త్వరలో తమ సర్వీసులు ప్రారంభించనున్నాయని సింధియా వివరించారు. -
మొత్తం మీరే చేశారు! టాటా చేతికి ఎయిర్ ఇండియా, లోక్ సభలో ఆసక్తికర చర్చ!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించడంపై ప్రతిపక్షాల విమర్శలను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. లాభాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోవడానికి యూపీఏ పాలనా విధానాలే కారణమని అన్నారు. ప్రజా ధనం సంరక్షణే లక్ష్యంగా కేంద్రం ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. లోక్‌సభలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌పై ఎనిమిది గంటల పాటు జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ... ఎయిర్ ఇండియా–ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం, 111 కొత్త విమానాల కొనుగోలు, ద్వైపాక్షిక హక్కుల సరళీకరణ, ఎయిర్ నష్టాలకు కారణాల వంటి అశాలను ప్రస్తావించారు. తప్పని పరిస్థితిలోనే... మంత్రి ప్రకటన ప్రకారం, 2005కి ముందు ఎయిర్ ఇండియా ఏడాదికి రూ.15 కోట్లు, ఇండియన్ ఎయిర్‌లైన్స్ రూ.50 కోట్ల లాభా లను ఆర్జించేవి. ఈ విమానయాన సంస్థలు దాదాపు రూ. 55,000 కోట్లతో 111 విమానాలను కొనుగోలు చేయడం సంస్థలను తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి. 14 సంవత్సరాల్లో రూ.85,000 కోట్ల నష్టాలు, రూ.54,000 కోట్ల ప్రభుత్వ ఈక్విటీ ఇన్ఫ్యూషన్, రూ.50,000 గ్రాంట్లు, రూ.66,000 కోట్ల నికర అప్పులు వెరసి ఎయిరిండియాను దాదాపు రూ.2.5 లక్షల కోట్ల సంక్షోభంలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్కు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఉద్యోగుల తొలగింపు ఉండదు మొదటి సంవత్సరంలో ఉద్యోగుల తొలగింపులు ఉండవని టాటాలతో షేర్‌హోల్డర్ ఒప్పందం స్పష్టంగా పేర్కొన్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. మొదటి సంవత్సరం తర్వాత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అందజేయడం జరుగుతుందని, అలాగే పదవీ విరమణ పొందిన పొందిన ఉద్యోగులకు జీజీహెచ్ఎస్ కింద వైద్య ప్రయోజనాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. -
ప్రాంతీయ విమాన సేవలకు ప్రత్యేక పాలసీ
న్యూఢిల్లీ: ప్రధాన కేంద్రాల నుంచి వివిధ ప్రాంతాలకు వైమానిక సర్వీసులకి మరింత ఊతమిచ్చే దిశగా ప్రాంతీయ ఎయిర్‌లైన్స్, హెలికాప్టర్ ఆపరేటర్లకు సంబంధించి ప్రత్యేక పాలసీ రూపొందించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. చిన్న పట్టణాల్లోని విమానాశ్రయలతో పాటు ప్రాంతీయంగా కనెక్టివిటీపైనా ప్రధానంగా దృష్టి పెడుతోంది. పరిశ్రమల సమాఖ్య అసోచాం సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాలు వెల్లడించారు. ‘సాధారణంగా ఇలాంటి సర్వీసులకు ప్రత్యేక సమస్యలు ఉంటాయి. పరిమిత స్థాయిలో కార్యకలాపాల వల్ల అధిక లీజింగ్ వ్యయాలు, ధరలపరమైన సవాళ్లు ఉంటాయి. వీటిని అధిగమించడంపై దృష్టి పెడుతున్నాం. ప్రాంతీయ ఎయిర్‌లైన్స్, హెలికాప్టర్ల సేవలు మరింత అందుబాటులోకి వచ్చే విధంగా ప్రత్యేక పాలసీపై కసరత్తు చేస్తున్నాం‘ అని మంత్రి చెప్పారు. ఒడిషాలోని ఝర్సుగూడ, అసోంలోని రూప్సీ వంటి చిన్న నగరాల్లో కూడా ఇలాంటి సర్వీసులు వృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో హెలికాప్టర్ల వినియోగం నామమాత్రంగానే ఉందన్నారు. సంపన్న దేశాల్లో సివిల్ హెలికాప్టర్లు వేల సంఖ్యలో ఉంటుండగా.. భారత్‌లో 130-140 మాత్రమే ఉన్నాయని సింధియా చెప్పారు. విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించేందుకు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని సింధియా తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు గణనీయంగా తగ్గించాయని వివరించారు. (చదవండి: టాటా గ్రూప్‌కి షాక్ ! ఊహించని మలుపు తీసుకున్న సీఈవో నియామకం) -
ఉక్రెయిన్‌లో రక్తపాతం.. వారికి కీలక హామీ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం చోటుచేసుకుంది. రష్యా వైఖరిపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల విషయంలో కేంద్రం అప్రమత్తంగా ఉంది. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే, ఉక్రెయిన్‌లో పరిస్థితులపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని స్పష్టం చేశారు. భారతీయులను స్వదేశానికి తరలించేందకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. వారిని సురక్షితంగా భారత్‌కు చేరుస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ గగన తలాన్ని మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ వెళ్లిన ప్రత్యేక విమానాలు తిరిగి రావడానికి, అక్కడికి విమానాలు వెళ్లడానికి వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. గగనతలం మూసేయడంతోనే భారతీయులను వెనక్కి రప్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాగా, గగనతలం ప్రారంభమైన వెంటనే ప్రత్యేక విమానాలను పంపి భారతీయులకు స్వదేశానికి తరలిస్తామన్నారు. ఇప్పుడు కూడా మన దేశ పౌరులను తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. -
రాష్ట్రాభివృద్ధికి సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను ఆయన సోమవారం రాత్రి వేర్వేరుగా కలుసుకుని పలు అంశాలపై చర్చించి వినతి పత్రాలను అందచేశారు. నిధులిచ్చి ఆదుకోండి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, రెవెన్యూ లోటు భర్తీ, రుణ పరిమితి పెంపు తదితర అంశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. విశాఖ అభివృద్ధికి భోగాపురం కీలకం.. అనంతరం పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను కలుసుకుని విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రం చూపుతున్న ప్రత్యేక చొరవను సీఎం జగన్ అభినందించారు. గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అభివృద్ధికి సహకరించాలని కోరారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా (పక్కనే తూర్పు నౌకాదళ కేంద్రం ఉండడం) విశాఖలో విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేనందున భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఇది ఎంతో కీలకమన్నారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత వ్యవధి మూడేళ్లలో పూర్తి చేసేలా సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. జ్యోతిరాదిత్యను కలిసిన సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేడు గడ్కరీ, ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ! ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందించిన సింధియా.. ‘ఆ స్థాయి నాది కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా. దిగ్విజయ్ ఎన్ని మాటలు అన్నా.. సింధియా కుటుంబ స్థాయిని నిలబెట్టే విధంగా వ్యవహరిస్తానని ఆయన చెప్పారు. డిగ్గీ స్థాయికి దిగి తాను అలాంటి మాటలు అనలేనని సింధియా తేల్చి చెప్పారు. (చదవండి: మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య) ఇంతకీ దిగ్విజయ్ ఏం అన్నారంటే.. రఘోఘర్ లో శనివారం రాత్రి జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో జోతిరాధిత్య సింధియా ఓ ద్రోహి అంటూ దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా దోహులే అన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. దిగ్విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలపై మరుసటి రోజు సింధియా స్పందిచారు. 'అలా మాట్లాటడం ఆయనకు అలవాటే. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆయన స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను' అని సింధియా పేర్కొన్నారు. కాగా, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి.. బీజేపీ సర్కారు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు సింధియా. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు వీలు చిక్కినప్పుడల్లా ఆయనపై విరుచుకుపడుతున్నారు. (చదవండి: బీజేపీపై సంచలన ఆరోపణలు: కేబినెట్ బెర్త్, డబ్బు ఇస్తామన్నారు!) -
హైదరాబాద్‌లో రెండో ఎయిర్‌పోర్టు ? కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: వచ్చే దశాబ్ద కాలంలో విమాన ప్రయాణాలకు సంబంధించి ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిల్చే సత్తా భారత్‌కు ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. పరిశ్రమ కొత్త శిఖారాలకు చేరడంలో తోడ్పడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రాంతీయంగాను, సుదీర్ఘ దూరాల్లోని అంతర్జాతీయ రూట్లలోను కనెక్టివిటీని మెరుగుపర్చడంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని ఆయన వివరించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 136గా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను 2025 నాటికల్లా 220కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) వర్చువల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. గత ఏడేళ్లలోనే కొత్తగా 62 విమానాశ్రయాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. మెట్రో నగరాల్లో రెండో ఎయిర్పోర్ట్ ఉండాలి ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో నగరాల్లో రెండో విమానాశ్రయం కూడా ఉండాలని సింధియా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఎయిర్‌పోర్టుల్లో రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. ఢిల్లీ, ముంబైలో ఇప్పటికే కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని.. కోల్‌కతా సహా మిగతా నగరాల్లో కూడా రెండో ఎయిర్‌పోర్ట్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. వచ్చే 100 రోజుల్లో అయిదు కొత్త ఎయిర్‌పోర్టులు, ఆరు హెలీపోర్టులు, 50 ఉడాన్ రూట్లను ప్రారంభించాలని లేదా శంకుస్థాపన అయినా చేయాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. లాభాల్లోకి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా: ఇక్రా అంచనా ముంబై: విమానాశ్రయ మౌలిక సదుపాయాల రంగం ఈ ఏడాది(2021–22) నష్టాల నుంచి బయటపడే వీలున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా అంచనా వేసింది. గతేడాది(2020–21) నిర్వహణ నష్టాలు నమోదు చేసిన ఈ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాల బాట పట్టనున్నట్లు అభిప్రాయపడింది. రూ. 3,250 కోట్ల నిర్వహణ లాభాలు సాధించగలదని పేర్కొంది. ఈ ఏడాది వార్షిక ప్రాతిపదికన విమాన ప్రయాణికుల్లో 82–84 శాతం వృద్ధి నమోదుకాగలదని వేసిన అంచనాలు ఇందుకు సహకరించగలవని తెలియజేసింది. కాగా.. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రధాన విమానాశ్రయాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సామర్థ్య విస్తరణ 12–18 నెలలపాటు ఆలస్యంకావచ్చని పేర్కొంది. అయితే భారీ స్థాయిలో జరుగుతున్న వ్యాక్సినేషన్, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, లీజర్ ప్రయాణాలు ఊపందుకోవడం వంటి అంశాలు దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు ఊతమివ్వనున్నట్లు ఇక్రా నివేదిక వివరించింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా విమానాశ్రయ మౌలిక సదుపాయాల రంగం భారీగా దెబ్బతిన్నట్లు ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ గ్రూప్ హెడ్ రాజేశ్వర్ బుర్లా పేర్కొన్నారు. -
ఇండియా నుంచే ఏషియా తొలి ఫ్లయింగ్ కారు! మంత్రి కీలక ప్రకటన
స్టార్టప్‌ల రాకతో టెక్నాలజీ పరంగా సరికొత్త ఆవిష్కరణలు ఇండియాలో వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఏషియాలో మిగిలిన దేశాలను వెనక్కి నెడుతు తొలి ఫ్లయింగ్ కారును మార్కెట్లోకి తెచ్చేందుకు మన వాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వినత నుంచి మేకిన్ ఇండియా స్ఫూర్తితో ఇండియా దూసుకుపోతుంది. మరోవైపు రెండుమూడేళ్ల కిందట స్టార్టప్‌లుగా మొదలైన కంపెనీలు ప్రస్తుతం యూనికార్న్‌లు మారుతున్నాయి. ఈ పరంపరలో మరో మైలురాయి దాటేందుకు ఇండియాకు చెందిన వినత స్టార్టప్ ప్రయత్నిస్తోంది, ఏషియాలోనే తొలిసారి చెన్నైకి చెందిన వినత స్టార్టప్ రూపొందించిన ఫ్లైయింగ్ కారుకు సంబంధించిన ప్రోటోటైప్‌ను కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింథియా పరిశీలించారు. ఫ్లైయింగ్ కారుకి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏషియా నుంచి తొలి ఫ్లైయింగ్ కారు మన దేశం నుంచి వచ్చే అవకాశం ఉందంటూ ప్రశంసించారు. ఇప్పటికే కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ సైతం ఏషియా నుంచి ఫ్లైయింగ్ కారు తయారీ పనిలో ఉంది. Delighted to have been introduced to the concept model of the soon-to-become Asia’s First Hybrid flying car by the young team of VINATA AeroMobility: Civil Aviation Minister Jyotiraditya Scindia (1/2) pic.twitter.com/Jqtz9gbikk — ANI (@ANI) September 20, 2021 గరిష్టంగా 60 నిమిషాలు వినత రూపొందించిన ఫ్లైయింగ్ కారు రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించగలదు. ఇందులో ఒకే సారి ఇద్దరు ప్రయాణించే వీలుంది. గరిష్టంగా 1300ల కేజీల బరువును మోసుకెళ్లగలదు. గాలిలో గరిష్టంగా 60 నిమిషాల వరకు ఎగురగలదు. గరిష్ట వేగం గంటలకు 120 కిలోమీటర్లు. భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైయింగ్ కారు ప్రయాణిస్తుంది. వాలుగా కాకుండా నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అవడం ఈ కారు ప్రత్యేకత. బయో ఫ్యూయల్ ఈ హైబ్రిడ్ ఫ్లైయింగ్ కారులో బ్యాటరీలతో పాటు ఇంధనంగా బయో ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారు. కో యాక్సియల్ క్వాడ్ రోటార్ సిస్టమ్ ఆధారంగా ఈ కారు గాలిలో పైకి లేస్తుంది. ఎనిమిది రోటార్లలో ఒకటి చెడిపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేలపైకి సురక్షితంగా ఈ ఫ్లైయింగ్ కారుని ల్యాండ్ చేయోచ్చని వినత కంపెనీ చెబుతోంది. మెడికల్ ఎమర్జెన్సీలో ఫ్లైయింగ్‌కారు కాన్సెప్టు అందుబాటులోకి వస్తే మెడికల్ ఎమర్జెన్సీలో వైద్య సేవలు సత్వరమే అందించే వీలు ఉంటుందని మంత్రి జ్యోతిరాదిత్య అన్నారు. మరోవైపు రోడ్ ట్రాన్స్‌పోర్టులో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం కావడంతో ఉబర్ లాంటి సంస్థలు ఫ్లైయింగ్ కారు కాన్సెప్టు పట్ల ఆసక్తిగా ఉన్నాయి. లండన్‌లో 2021 అక్టోబరు 5న లండన్ వేదికగా జరగనున్న హెలిటెక్ ఎగ్జిబిషన్లో తొలిసారిగా ఈ ఫ్లైయింగ్ కారుని ప్రదర్శించనున్నారు. చదవండి: ఓలా కార్స్.. నడిపి చూడండి .. నచ్చితేనే కొనండి ! -
2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్‌గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: 2026 నాటికి డ్రోన్ పరిశ్రమ వ్యాపారం సుమారు రూ.13 వేల కోట్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆటో, డ్రోన్ రంగాలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌పై సింధియా గురువారం మాట్లాడారు. డ్రోన్లను ప్రపంచానికి ఎగుమతి చేసే దేశంగా భారతదేశం ఉండాలని తాము కోరుకుంటున్నామని వివరించారు. 2030 నాటికి భారత్ ప్రపంచ డ్రోన్ హబ్‌గా మారుతుందనే ధీమాను వ్యక్తం చేశారు. డ్రోన్ల తయారీ రంగానికి రాబోయే మూడేళ్లలో సుమారు రూ.5 వేల కోట్ల పెట్టుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. పీఎల్ఐ కారణంగా డ్రోన్ తయారీ రంగంలో ప్రత్యక్షంగా దాదాపు 10,000 మందికి, పరోక్షంగా డ్రోన్ సంబంధిత అన్ని రంగాల్లో కలిపి సుమారు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలను సృష్టించగలుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు డ్రోన్ రంగానికి చేయూతనిచ్చే ఈ నిర్ణయ పరోక్ష ప్రభావం దేశంలో డ్రోన్ సేవలపై కూడా ఉంటుందని సింధియా అన్నారు. దీంతో రాబోయే మూడేళ్లలో మొత్తం డ్రోన్ సేవల టర్నోవర్ దాదాపు రూ.3 0వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రోత్సాహక పథకం కవరేజీని విస్తృతం చేసేందుకు.. డ్రోన్ సంబంధిత ఐటి ఉత్పత్తుల డెవలపర్లను చేర్చడానికి ప్రభుత్వం అంగీకరించిందని కేంద్రమంత్రి వివరించారు. అంతేగాక ఎస్ఎస్ఎంఈ, స్టార్టప్‌లు పీఎల్ఐ పథకంలో భాగం అయ్యేందుకు డ్రోన్ల తయారీదారులకు రూ.2 కోట్లు, డ్రోన్ల విడిభాగాలు తయారుచేసే సంస్థలకు రూ. 50 లక్షలుగా వాటి వార్షిక టర్నోవర్‌ను అర్హతగా నిర్ధారించారు. దీనివల్ల లబి్ధదారుల సంఖ్య పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. పీఎల్ఐ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాలలో రూ.120 కోట్ల ప్రోత్సాహకాన్ని ఇవ్వబోతున్నామని తెలిపారు. వ్యవసాయం, మైనింగ్, మౌలిక సదుపాయాలు, నిఘా, ఎమర్జెన్సీ రెస్పాన్స్, రవాణా, జియో మ్యాపింగ్, రక్షణ వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం జరుగుతున్నందున ఆర్థిక వ్యవస్థలోని దాదాపు అన్ని రంగాలకు డ్రోన్లు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నాయని సింధియా వ్యాఖ్యానించారు. డ్రోన్ల వినియోగం కారణంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. దేశంలో వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు గత నెల 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సరళీకృత డ్రోన్ పాలసీని ప్రకటించిందని, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగానే డ్రోన్ రంగానికి కేంద్రప్రభుత్వం 21 రోజుల్లోనే పీఎల్‌ఐను ప్రకటించిందని సింధియా వెల్లడించారు. రాబోయే రోజుల్లో డ్రోన్ రంగానికి భారత్ నేతృత్వం వహించే సామర్థ్యం ఉందని తెలిపారు. ఆవిష్కరణ, సమాచార సాంకేతికత, ఇంజనీరింగ్, భారీ దేశీయ డిమాండ్ కారణంగా 2030 నాటికి భారతదేశం ప్రపంచ డ్రోన్ హబ్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించారు. -
డ్రోన్ టెక్నాలజీలో గ్లోబల్ హబ్‌గా భారత్
సాక్షి, హైదరాబాద్: విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి పరుస్తూ కీలక రంగాల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన శనివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డ్రోన్ టెక్నాలజీలో భారత్ గ్లోబల్ హబ్‌గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఔషధ సరఫరాకు డ్రోన్లను వినియోగించడం గొప్ప మార్పు అని, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. విమానయాన రంగంలో డిజిటల్ ఎయిర్ స్పేస్ మ్యాప్ ద్వారా అనుమతులను సులభతరం చేసినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ‘ఓలా ట్యాక్సీ’ తరహాలో ఎయిర్ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్ విమానాశ్రయాన్ని విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. బేగంపేటలోని పాత విమాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయబోతున్నట్లు పేర్కొన్నారు. జక్రాన్‌పల్లిలో కూడా ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, దేశంలో విమాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని విమానాశ్రయాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్తో రాజకీయ పోరాటం అధికారిక పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌తో భేటీకావడం మర్యాదపూర్వకమేనని జ్యోతిరాదిత్య స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలే కేసీఆర్‌తోనూ ఉన్నాయన్నారు. కేంద్రమంత్రులు ప్రధాని విజన్‌ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తారని.. దానికి, రాజకీయాలకు సంబంధం లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. టీఆర్ఎస్తో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ బలమైనరాజకీయ శక్తిగా మారనుందన్నారు. -
TS: డ్రోన్లతో నవశకం
వికారాబాద్: ‘రెండు, మూడు వందల ఏళ్ల క్రితం ప్రపంచంలో ఫాలోవర్‌గా ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించేస్థాయికి ఎదిగింది. ఇది ప్రధాని మోదీ కలలు గన్న భారత్’అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శనివారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయం పరెడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలతో కలసి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’కార్యక్రమాన్ని ప్రారంభించారు. మారుత్, టెక్ ఈగల్, స్కై ఎయిర్ కంపెనీలకు చెందిన మూడు డ్రోన్ల ద్వారా ఆకాశమార్గాన వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారి వికారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. మొదటి, రెండో, మూడో డ్రోన్లను సింధియా, కేటీఆర్, సబితారెడ్డిలు అనౌన్స్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి సిం«ధియా మాట్లాడుతూ ఆకాశయానంలో డ్రోన్ వ్యవస్థ ఓ కొత్త శకానికి నాంది పలకనుందని, ఇది ఎన్నో నూతన సవాళ్లకు పరిష్కారం చూపనుందని అభిప్రాయపడ్డారు. వైద్యులకు సహకారం అందించటంలో భవిష్యత్తులో డ్రోన్ల వ్యవస్థ ఎంతో ఉపయుక్తం కానుందని, వైద్యరంగంలో ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’కార్యక్రమం విప్లవాత్మక మార్పులు తేనుందన్నారు. దేశంలో డ్రోన్లు ఎగిరేందుకు ఉన్న ఆంక్షలు సడలిస్తామని, ఇందుకోసం మూడు రకాల జోన్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రోన్లు ఎగిరేందుకు అనుమతులు అవసరంలేని గ్రీన్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. డ్రోన్లు ఎగిరేందుకు వీలులేని ప్రదేశాలు, ప్రాంతాలను రెడ్‌జోన్‌గా విభజిస్తామని తెలిపారు. ‘మెడిసిన్ ఫ్రం ది స్కై కార్యక్రమం ప్రధాని మోదీ కల అని తెలిపారు. ఒక్కోసారి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు సకాలంలో మందులు చేరవేయలేక రోగుల ప్రాణాలు పోతుంటాయని, దానికి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’కార్యక్రమం ప్రత్యామ్నాయం కాగలదని పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ ఆదర్శం: కేటీఆర్ ‘దేశంలోనే తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రం. నేడు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్రమంత్రి కేటీఆర్ అన్నారు. రెండేళ్ల క్రితమే సాంకేతికతపై దావోస్‌లో జరిగిన సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో డ్రోన్ల వినియోగం గురించి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సాంకేతికతలో తెలంగాణ ముందుందనటానికి ఇదే నిదర్శనమన్నారు. హెల్త్ కేర్‌కు సాంకేతికతను జోడించటం ఎంతో అవసరమని కేటీఆర్ అన్నారు. గతంలో గుండెమార్పిడి లాంటివి జరిగితే పోలీసుల సాయంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించి అంబులెన్స్‌లలో గుండెను, ఇతర శరీర అవయవాలను నిర్దేశిత ప్రాంతాలకు చేరవేయటం మనం చూశామని, ఇప్పుడు ఆ ఇబ్బందులేవీ లేకుండానే డ్రోన్ల సాయంతో తక్కువ సమయంలో గుండె లాంటి అవయవాలను చేరవేయవచ్చని తెలిపారు. వ్యవసాయ పొలాల్లో పురుగుల మందులు చల్లటం, శాటిలైట్ మ్యాపింగ్ చేయటం, దిశ లాంటి సంఘటనలు జరిగితే క్షణాల్లో అక్కడికి డ్రోన్లను పంపి అప్రమత్తం చేయటం, అడవుల్లో మొక్కలు పెంచేందుకు సీడ్‌బాల్స్ చల్లటం లాంటి ఎన్నో రకాల పనులకు భవిష్యత్తులో ఈ డ్రోన్లను వాడవచ్చని తెలిపారు. పోలీసు వ్యవస్థలో సంఘ విద్రోహశక్తుల ఆట కట్టించటానికి కూడా ఈ వ్యవస్థను వినియోగించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. బేగంపేటలోని పాత విమానాశ్రయంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, దీనికి కేంద్రం సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణ, స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జెడ్పీ చైర్పర్సన్లు సునితారెడ్డి, అనితారెడ్డి, ఎమ్మెల్సీలు సురబి వాణిదేవి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, కాలె యాదయ్య, మూడు డ్రోన్ల తయారీ కంపెనీల ప్రతినిధులు విక్రం, ప్రేమ్, స్వప్నిక్ తదితరులు పాల్గొన్నారు. ► మారుత్ కంపెనీ రూపొందిం చిన హెపీ కోప్టర్ ఇది. దీని దూర సామర్థ్యం 40 కిలోమీటర్లు కాగా ఇది అత్యధికంగా 16 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. ఈ డ్రోన్‌ను మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. దీంట్లో ఒక్కోటి మూడు కిలోల బరువుతో ఉన్న నాలుగు బాక్సుల్లో మొత్తం 12 కిలోలు ఉంచారు. ఏ గమ్యస్థానానికి పంపకుండా ఆకాశంలో ఆ బరువుతో ఎగిరేలా చేసి దాని సామర్థ్యాన్ని పరీక్షించారు. డ్రోన్లు ఎలా ఎగిరాయంటే.... 1. మొదటి డ్రోన్: బ్లూ డార్ట్ కంపెనీ వారు రూపొందించిన స్కై ఎయిర్ డ్రోన్. ఇది కిలో బరువును మాత్రమే మోసుకెళ్లగలదు. ఈ డ్రోన్‌ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యసింధియా ప్రారంభించారు. ఇందులో ఒక వ్యాక్సిన్ బాక్సు మాత్రమే ఉంచారు. ఇది 40 కిలో మీటర్ల దూరం వరకు ఆకాశమార్గాన ప్రయాణించగలదు. ఇది వికారాబాద్ పట్టణంలోని సీహెచ్‌సీ ఆస్పత్రికి చేరుకోగా, ఇందులో ఉన్న వ్యాక్సిన్‌ను సిబ్బంది రిసీవ్ చేసుకున్నారు. ఈ డ్రోన్‌లో సరఫరా చేసిన వ్యాక్సిన్ ఉష్టోగ్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని వారు నిర్ధారించారు. ఇది ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుంది. 2. రెండో డ్రోన్: టెక్ ఈగల్స్ కంపెనీ వారు రూపొందించిన క్యూరీస్ ఫ్లై. దీని సామర్థ్యం కూడా ఒక కిలో కాగా ఇది కూడా 40 కిలో మీటర్ల దూరం వరకు ఎగరగలదు. ఈ డ్రోన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, ఇది ఆరు నిమిషాల వ్యవధిలో మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ పీహెచ్‌సీకి చేరుకుంది. దీన్ని కేవలం ట్రయల్ చేసి చూశారు. విమానాల తయారీకి అనువుగా హైదరాబాద్ ప్రాంతం ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల టాటా ఏరోస్పెస్ సెజ్‌లో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శనివారం పర్యటించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరి«ధిలో గల టాటా ఏరోస్పెస్, బోయింగ్ విమానాల తయారీ కేంద్రాన్ని సాయంత్రం 6:10 గంటలకు సందర్శించారు. రక్షణరంగ సంస్థల కోసం తయారు చేస్తున్న విమానాల విడి భాగాలను మంత్రి పరిశీలించారు. వాటి పనీతీరుపై టాటా సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న టాటా లాకిడ్ మార్టిన్‌లో విమాన విడిభాగాలను తయారీ సంస్థను పరిశీలించారు. హైదరాబాద్ ప్రాంతం విమానాల తయారీకి అనువుగా ఉందని సింధియా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం 6:40 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. మంత్రి రాకతో ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి టాటా ఏరోస్పెస్ వరకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జ్యోతిరాధిత్య సిందియా వెంట దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ విమానం ఎక్కడమే ప్రధాని కల శంషాబాద్: దేశంలో ప్రతి ఒక్కరు విమానయానం చేయాలన్నదే భారత ప్రధాని నరేంద్రమోదీ కల అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ప్రత్యేక ఆర్థిక జో¯న్లో జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏవియేషన్ స్కూల్ నూతన భవనానికి శనివారంరాత్రి ఆయన శంకుస్థాపన చేశారు. విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
‘శంషాబాద్’ విస్తరణకు సహకరిస్తా
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సింధియా శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సింధియా గౌరవార్థం సీఎం కేసీఆర్ ఆయన్ను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలని ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్నందున ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందన్నారు. వైద్య, వాణిజ్య, ఐటీ, పర్యాటక రంగాల హబ్‌గా హైదరాబాద్ మారిందని, దీంతో నగరానికి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి పెరిగిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్నేయాసియా, ఐరోపా, అమెరికాకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి పౌర విమానయాన శాఖ నుంచి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలును అనుసంధానించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మామునూరు ఎయిర్‌పోర్టులో త్వరలో ఏటీఆర్ కార్యకలాపాలు.. రాష్ట్రం ప్రతిపాదించిన 6 విమానాశ్రయాల్లో ఒకటైన వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టులో ఏటీఆర్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని సింధియా తెలిపారు. నిజామాబాద్ జిల్లా (జక్రాన్‌పల్లి)లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సాంకేతిక అనుమతి ఇస్తామమన్నారు. అలాగే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టును వైమానిక దళం ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని, పెద్దపల్లి (బసంత్ నగర్), కొత్తగూడెం, మహబూబ్‌నగర్ (దేవరకద్ర) ఎయిర్ పోర్టుల్లో చిన్న విమానాల రాకపోకల సాధ్యాసాధ్యాలను పున:పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌కు సింధియా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రు లు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, పౌర విమానయాన శాఖ సెక్రటరీ ప్రదీప్ కరోలా, జాయింట్ సెక్రటరీ దూబే, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు. చదవండి: యాదాద్రికి రండి..ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం -
రేపు ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’ ప్రారంభం
వికారాబాద్: దేశంలోనే తొలిసారి డ్రోన్ల ద్వారా మందులు, టీకాలు సరఫరా చేసే కార్యక్రమానికి వికారాబాద్ వేదిక కానుంది. దేశంలోనే తొలిసారి చేపడుతున్న ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’కార్యక్రమాన్ని శనివారం కేంద్ర మంత్రి జోతిరాదిత్య, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ట్రయల్ రన్‌ను డ్రోన్ల తయారీ కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ నిఖిల పరిశీలించారు. నూతన కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రవాణా వ్యవస్థ సరిగ్గాలేని ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందన్నారు. భవిష్యత్తులో టీకాలు, యాంటీవీనమ్ వంటి మందులు సకాలంలో ఆస్పత్రులకు చేరవేసేలా డ్రోన్లు ఎంతగానో సహాయపడతాయని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా అవయవాలను కూడా చేరవేసే అవకాశం ఉందని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు తదితర విషయాలు పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రయల్ రన్లో టీకాలు ఆకాశ మార్గాన వెళ్లే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో అంతే ఉంటుందా? ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? అనే విషయాలను గమనిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతీలాల్, అదనపు ఎస్పీ రషీద్, ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ తుకారామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంఆర్వో సేవలకు హబ్‌గా భారత్!
న్యూఢిల్లీ: మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ నూతన ఎంఆర్వో విధానాన్ని ప్రకటించింది. విమానాల నిర్వహణ, మరమ్మతులనే ఎంఆర్వోగా పేర్కొంటారు. ఎంఆర్వో సేవల కోసం భూ కేటాయింపులకు టెండర్ విధానాన్ని అనుసరించనుంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వసూలు చేసే రాయలీ్టని రద్దు చేసింది. అదే విధంగా భూమిని ప్రస్తుతం 3–5ఏళ్ల కాలానికే కేటాయిస్తుండగా.. ఇక మీదట 30 ఏళ్ల కాలానికి లీజ్ తీసుకోవచ్చు. భారత్‌ను ఎంఆర్వో సేవల కేంద్రంగా (హబ్) తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయంగా పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. నూతన విధానంలోని అంశాలు.. ► భూమికి ప్రస్తుతం ఎంత అద్దె వసూలు చేయాలన్నది ఏఏఐ ముందుగా నిర్ణయిస్తోంది. కొత్త విధానంలో బిడ్డింగ్ ద్వారా దీన్ని నిర్ణయించనున్నారు. ► అలాగే, భూమిని లీజుకు తీసుకున్న సంస్థలు ప్రతీ మూడేళ్లకు 7.5–10 శాతం స్థాయిలో 15 శాతం చొప్పున అద్దెను పెంచి చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకుంటే భూమిని కేటాయించే విధానం స్థానంలో.. టెండర్ ద్వారా కేటాయించే విధానం అమల్లోకి వస్తోంది. ► ఇప్పటికే తీసుకున్న లీజును రెన్యువల్ చేసుకునే సమయంలో చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత లీజు కాంట్రాక్టు ముగిసిపోతే టెండర్ విధానంలో కేటాయింపు ఉంటుంది. గరిష్ట బిడ్డర్‌కు 15 శాతం సమీపంలోనే పాత ఎంఆర్వో సంస్థ బిడ్ నిలిస్తే.. గరిష్ట బిడ్డర్ ఆఫర్ చేసిన ధరను చెల్లించడం ద్వారా కాంట్రాక్టును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. జాబితాలో బేగంపేట ఎయిర్పోర్ట్ విమానాలు, హెలికాప్టర్ల ఎంఆర్వో సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో.. పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను గుర్తించినట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. అందులో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంతోపాటు.. భోపాల్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, జుహు, కోల్‌కతా, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఎనిమిది ఫ్లయిట్ శిక్షణ సంస్థలను తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐదు విమానాశ్రయాలను ఉడాన్ పథకం కింద నిర్వహణలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇదే పథకం కింద ఆరు హెలిపోర్ట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. -
దేశంలో ఎగిరే టాక్సీలకి తొలిగిన అడ్డంకి
మన దేశంలో రాబోయే కాలంలో నగర రోడ్లపై ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించే ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం కావచ్చు. దేశంలో డ్రోన్(Drone) కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేస్తూ నూతన 2021 డ్రోన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మానవరహిత విమాన వ్యవస్థ నిబంధనల స్థానంలో డ్రోన్ నిబంధనలు-2021(Drone Rules) పేరిట వీటిని విడుదల చేసింది. "ఎయిర్ టాక్సీలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోదనలు జరుగుతున్నాయి.. దీనికోసం అనేకా స్టార్టప్ లు ముందుకు వస్తున్నాయి. మీరు రోడ్లపై చూసే ఉబెర్ టాక్సీల వలే, కొత్త డ్రోన్ పాలసీ కింద మీరు గాలిలో ఎగిరే టాక్సీలను చూసే సమయం చాలా దూరంలో లేదు. త్వరలోనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నా' అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం.. డ్రోన్ల ఆపరేషన్ కోసం లైసెన్స్ నమోదు లేదా జారీ చేయడానికి ముందు ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదు. అంతేగాకుండా, ఈ లైసెన్స్ ఫీజులను గణనీయంగా తగ్గించారు. కార్గో డెలివరీల కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నారు. డ్రోన్లు గరిష్ఠంగా మోసుకెళ్లే సామర్ధ్యాన్ని 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచారు. డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారాలను 25 నుంచి 5కు తగ్గించింది. ఆపరేటర్ నుంచి వసూలు చేసే ఫీజుల రకాలను 72 నుంచి నాలుగుకు తగ్గించింది. ఇక అన్ని డ్రోన్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ డిజిటల్ స్కై ఫ్లాట్ ఫారం ద్వారా జరుగుతాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సిఫారసు చేసే నిబంధనలకు అనుగుణంగా అన్ని డ్రోన్ ట్రైనింగ్, పరీక్షలు నిర్వహించబడతాయి.(చదవండి: అసంఘటిత కార్మికులకు కేంద్రం శుభవార్త!) జర్మన్ ఫ్లయింగ్ టాక్సీ స్టార్టప్ వోలోకాప్టర్ 2024 పారిస్ లో జరిగే ఒలింపిక్స్ సమయానికి తన ఎయిర్ టాక్సీని అందుబాటులోకి తీసుకొనిరావలని చూస్తుంది. భారీ డ్రోన్ లాగా కనిపించే ఈ ఎగిరే టాక్సీ రెండు సీట్లను కలిగి ఉంటుంది. ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులు కూడా ఈ రంగంలో ఆసక్తిని కనబరుస్తున్నారు సింధియా అన్నారు. హ్యుందాయ్ 2025 నాటికి తన ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ దక్షిణ కొరియా కంపెనీ ఎయిర్ టాక్సీలను అభివృద్ధి చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ బ్యాటరీల పనిచేస్తుంది. ఇది అత్యంత రద్దీగా ఉండే పట్టణ కేంద్రాల నుంచి విమానాశ్రయాలకు ఐదు నుంచి ఆరు మందిని రవాణా చేయగలదు. -
విమానాశ్రయాల అభివృద్ధికి చొరవ తీసుకోండి
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: విమానయాన మౌలిక సదుపాయాల బలోపేతం కోసం భూ కేటాయింపు, నిధుల డిపాజిట్ వంటి విషయాలను వేగవంతం చేసే అంశంలో వ్యక్తిగతంగా దృష్టి సారించాలని ఐదు రాష్ట్రాల సీఎంలను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్ సీఎంలకు లేఖ రాశారు. దేశంలో పెరుగుతున్న విమానప్రయాణ డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే నాలుగైదేళ్లలో రూ.20 వేల కోట్లతో ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధికి అవసరైన భూమిని ఇప్పటికే కేటాయించిందని పేర్కొన్నారు. అయితే తిరుపతి రన్‌వే విస్తరణ కోసం 14.31 ఎకరాలు, రాజమండ్రి సమీపంలో రెసిడెన్షియల్ కాలనీ నిర్మాణానికి 10.25 ఎకరాలు, కడపలో రన్‌వే విస్తరణ, అప్రోచ్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుకు అవసరమైన 50 ఎకరాల భూమిని కూడా త్వరగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని కోరారు. ఏలూరు కెనాల్‌ను దారిమళ్లించే పనులను వేగంగా పూర్తిచేస్తే విజయవాడ (గన్నవరం) విమానాశ్రయంలో 4 వేల మీటర్ల మేర రన్‌వే విస్తరణ, అప్రోచ్ లైటింగ్ సిస్టమ్ పనులను చేపడతామని తెలిపారు. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా ఉడాన్ ప్రాజెక్ట్‌లను రాష్ట్రం నుంచి నిర్వహించేందుకు (విశాఖపట్నం–దుబాయ్) రాష్ట్ర ప్రభుత్వం వందశాతం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) సమకూర్చాలని సూచించారు. దీన్ని త్వరగా పూర్తిచేస్తే బిడ్డింగ్‌కు మార్గం సుగమమై అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. -
ఆస్తులే కాదు.. అప్పులూ ఉన్నాయి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన కేంద్ర మంత్రి వర్గంలో ఆస్తులే కాదు అప్పులు కూడా రూ.కోట్లలో ఉన్నవారు ఉన్నారని నేషనల్ ఎలక్షన్ వాచ్/ఏడీఆర్ సంస్థ పేర్కొంది. తాజా మంత్రివర్గంలోని ప్రధాని సహా 78 మంది మంత్రులకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలోని సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడించినట్లు సంస్థ తెలిపింది. ఈ అంశాలపై దృష్టి.. తాజా మంత్రివర్గ విస్తరణలో 43 మంది కొత్త వారు చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఈ నివేదికలో మంత్రుల నేర, ఆర్థిక, విద్య తదితర అంశాలపై దృష్టి సారించినట్లు సంస్థ తెలిపింది. 33 మంది (42శాతం) మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందులో 24 (31 శాతం) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమానిక్‌పై హత్య సంబంధిత కేసు కూడా ఉందని తెలిపింది. 70 మంది (90 శాతం) కోటీశ్వరులని, మంత్రుల సరాసరి ఆస్తుల విలువ రూ.16.24 కోట్లు అని నివేదికలో తెలిపింది. సర్బానంద సోనోవాల్, ఎల్. మురుగన్ల వివరాలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ల నుంచి సేకరించినట్లు సంస్థ పేర్కొంది. విద్య: 12 మంది మంత్రులు తమ విద్యార్హతలు 8 నుంచి 12 మధ్యేనని పేర్కొనగా 64 మంది మంత్రులు గ్రాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువని, ఇద్దరు డిప్లొమా చదివినట్లు అఫిడవిట్‌లోపేర్కొన్నారు. ఎనిమిది పాస్: జాన్ బర్లా, నిశిత్ ప్రమానిక్ 10 పాస్: బిశ్వేశ్వర్ తుడు, రామేశ్వర్ తేలి, నారాయణరాణే 12 పాస్: అమిత్ షా, అర్జున్ ముండా , పంకజ్ చౌధరి, రేణుక సింగ్ సూరత, సాధ్వి నిరంజన్ జ్యోతి, స్మృతి ఇరానీ, రాందాస్ అథవాలే. క్రిమినల్ కేసులు: నలుగురు కేంద్రమంత్రులపై హత్యాయత్నం కేసులు నమోదుకాగా నిశిత్ ప్రమానిక్‌పై హత్య సంబంధిత కేసునమోదైంది. మతఘర్షణల కేసులు.. ఐదుగురు మంత్రులపై మత ఘర్షణల కేసులు నమోదు అయ్యాయి. మతం, జాతి, మతం, మత విశ్వాసాలను అవమానించడం ద్వారా మతపరమైన ఘర్షణలకు ఉద్దేశ పూర్వక చర్యలకు పాల్పడడం (ఐపీసీ సెక్షన్ 295ఏ) రూ.10 కోట్లపైనే అప్పులు 16 మందిమంత్రులకు రూ.కోటికన్నా ఎక్కువ అప్పులు ఉండగా వీరిలో ముగ్గురుకి రూ.10 కోట్లకన్నా పైనే అప్పులున్నాయని వారి వారి అఫిడవిట్లు చెబుతున్నాయనిసంస్థ పేర్కొంది. రూ.కోటి కన్నా తక్కువే ఎనిమిది మంది మంత్రు ల ఆస్తి రూ.కోటికన్నా తక్కువేనని వారి అఫిడవిట్లు చెబుతున్నా యని సంస్థ పేర్కొంది. ధన ‘మంత్రులు’ -
జ్యోతిరాదిత్య సింధియాకే కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారు
-
జ్యోతిరాదిత్యకు బెర్త్ ఖరారు.. అనుప్రియకు కూడా
న్యూఢిల్లీ: బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాకి కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారైనట్లు సమాచారం. జ్యోతిరాదిత్యతో పాటు అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణరాణెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుంటున్నారు. ఇక వీరితో పాటు సునీత దగ్గల్, బీఎల్ వర్మ, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేఖి, అజయ్ భట్, శోభా కర్లందాజే, ప్రీతం ముండే, శంతను ఠాకూర్, కపిల్ పటేల్ సైతం ప్రస్తుతం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌కు పయనమవుతున్నారు. ముగ్గురు సహాయమంత్రులకు ప్రమోషన్? కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వతంత్ర హోదాతో శాఖ బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర వ్యవసాయ, పంచాయతీరాజ్ సహాయమంత్రి పురుషోత్తం రూపాలకు ప్రమోషన్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. -
షాకింగ్: జ్యోతిరాదిత్య సింధియా ప్యాలెస్‌లో చోరీ
భోపాల్: బీజేపీ ఎంపీ, గ్వాలియర్ రాచ వంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన ప్యాలెస్‌లో దొంగలు చోరీకి యత్నించినట్లు తెలిసింది. వివరాలు.. సింధియాకు చెందిన మధ్యప్రదేశ్ జై విలాస్ ప్యాలెస్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్థానిక పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘సోమవారం లేదా మంగళవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు వెంటిలేటర్ బద్దలు కొట్టి జై విలాస్ ప్యాలెస్‌లోని రాణి మహల్లోకి ప్రవేశించేందుకు యత్నించినట్లు గుర్తించాం’’ అన్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించే పనిలో ఉన్నారు. స్నిఫర్ డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎంతమంది ఈ దొంగతనానికి ప్రయత్నించారు.. ఏమేం చోరీ చేశారు అనే దాని గురించి పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. గ్వాలియార్ సిటీ ఎస్పీ రత్నేష్ తోమర్ మాట్లాడుతూ.. ‘‘దొంగలు ప్యాలెస్‌లోని రాణి మహల్‌లోని ఓ గది వెంటిలేటర్‌ని బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ప్యాలెస్‌లో గతంలో బ్యాంక్ విధుల కోసం వినియోగించిన గదిలోని వస్తువులను ధ్వంసం చేశారు’’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలిపారు. స్నిఫర్ డాగ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు జై విలాస్ ప్యాలెస్‌ని 19వ శతాబ్దంలో జయరావ్ సింధియా నిర్మించారు. 1874 ప్రాంతంలో ఆయన గ్వాలియర్ మహారాజుగా ఉన్నపుడు ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఇది జ్యోతిరాదిత్య సింధియాకు సొంతం అయ్యింది. చదవండి: ‘నా చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి’ రూ.90 లక్షల ప్లాట్ కొని.. సొరంగం తవ్వి! -
‘పదవి వద్దు, పార్టీలో తగిన గౌరవం ఉంది’
భోపాల్: ఏ పదవులు ఆశించి తాను బీజేపీలో చేరాలేదని, ఆ పార్టీలో తనకు చాలా గౌరవం లభిస్తునందుకు ఆనందంగా ఉందని మధ్య ప్రదేశ్ ఫైర్ బ్రాండ్ జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. మధ్యప్రదేశ్ ఉపఎన్నికల నేపథ్యంలో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఆయన కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. తన తండ్రి లాగానే తనకి కూడా ఏ పదవి కాంక్ష లేదని అన్నారు. మీకు క్యాబినేట్ మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. మీరు ఎలా భావిస్తున్నారు అని ప్రశ్నించగా తాను పదవి కోసం పార్టీ మారలేదని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందని కానీ వాటిని నెరవేర్చలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రైతులను, మహిళలను, నిరుద్యోగులను కమల్‌నాథ్ ప్రభుత్వం మోసం చేసిందని, అలాంటి పార్టీకి బుద్ధి చెప్పడానికే తాను పార్టీ మారినట్లు చెప్పారు. ఇక పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ గురించి ప్రశ్నించగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పమని ఆదేశించిన కమల్‌నాధ్ చెప్పలేదని, అలాంటి దురుసు ప్రవర్తన కలిగిన నేతను తానెప్పుడు చూడలేదని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీకి మహిళలలు అన్నా, దళితులు అన్నా గౌరవం లేదని అందుకే కింది స్థాయి నుంచి ఎదిగిన మహిళను ఐటెమ్ అని సంబోధించడం బట్టే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు. చదవండి: ‘నాకు ఉప ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చారు’ -
‘నాకు ఉప ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చారు’
భోపాల్ : అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు హామీలతో కాంగ్రెస్ మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ద్రోహం చేసిందని బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఆరోపించారు. రాష్ట్రంలోని గ్వాలియర్‌లో మూడు రోజుల బీజేపీ మెంబర్ షిప్ (పార్టీ సభ్యత్వ నమోదు) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య మాట్లాడుతూ.. 2018 రాష్ట్ర ఎన్నికల తరువాత తను ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదివిని ఇస్తానని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అవకాశం ఇచ్చిందని తెలిపారు. అయినప్పటికీ ఆ ఆఫర్‌ను తిరస్కరించి.. తను ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించునట్లు తెలిపారు. కాగా కాగా, మార్చిలో కాంగ్రెస్‌ను వీడిన సింధియా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. సింధియా వెంట ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి బీజేపీకి మద్దతు తెలుపడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారం చేపట్టారు. (రాజస్తాన్ సంక్షోభం : సింధియా ట్వీట్) అయితే సింధియా కాంగ్రెస్ తనకు ఈ పదవి ఇచ్చిందని బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి. ‘కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాశనం చేస్తారని నాకు అర్థమైంది. పార్టీ అధికారంలోకి రావడానికి 10 రోజుల్లో వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తాం వంటి తప్పుడు వాగ్దానాలతో ప్రజలకు ద్రోహం చేశారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ 10 రోజుల్లో రూ .2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తారని, లేకపోతే పదకొండవ రోజున ముఖ్యమంత్రిని తిరిగి పంపిస్తామని హామీ ఇచ్చారు" అని ఆయన అన్నారు. సింధియాకు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారని ఈ ఏడాది మార్చిలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్ అన్నారు. అయితే ఈ విషయాన్ని కమల్ నాథ్ కొట్టిపారేశారు. (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!) అదే విధంగా గ్వాలియర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిన ఆందోళనపై సింధియా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయిన అయిదు నెలల తర్వాత బీజేపీ డ్రైవ్‌కు నిరసనగా కాంగ్రెస్ నాయకులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారన్నారు. కాగా రాష్ట్రంలోని 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ 27 నియోజకవర్గాల్లో 16 సెగ్మెంట్లు గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఉప ఎన్నికలపై దృష్టి సారించిన అధికారిక బీజేపీ శనివారం ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
‘ప్రభుత్వాన్ని వ్యాపారంలా నడిపారు’
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యాపారంలా నడిపిందని ఆ పార్టీ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలేందుకు 22 మంది ఎమ్మెల్యేలతో మంత్రాంగం నడిపిన సింధియా మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ అవినీతితో విసిగిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సచివాలయంలో అవినీతి రాజ్యమేలిందని అన్నారు. తన సహచరుడు సచిన్ పైలట్‌ను రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పక్కనపెట్టడం విచారకరమని, నైపుణ్యం, సామర్ధ్యం ఉన్నవారికి కాంగ్రెస్‌లో ప్రాధన్యత ఉండదనేందుకు ఇది నిదర్శనమని సింధియా ట్వీట్ చేశారు. 2018లో రాజస్ధాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించిన సచిన్ పైలట్, సింధియాలు ఇద్దరికీ తాము కోరుకున్న పదవి దక్కకపోవడంతో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం గమనార్హం. ఇక రాజస్ధాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. సచిన్ పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ చీఫ్‌గా తప్పించడంతో రాజకీయ సంక్షోభం తారాస్ధాయికి చేరింది. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పైలట్ చెబుతుండగా, అసెంబ్లీలో తనకు పూర్తి మెజారిటీ ఉందని గహ్లోత్ ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసిన గహ్లోత్ తనకు పూర్తి మెజారిటీ ఉందని పేర్కొనగా, అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధం కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. చదవండి : మన రెవాలో ‘చైనా’ -
రాజస్తాన్ సంక్షోభం : సింధియా ట్వీట్
న్యూఢిల్లీ : రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న అనిశ్చితిపై బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిభ, సామర్థ్యానికి విశ్వసనీయత తక్కువగా ఉంటుందని విమర్శించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్.. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ను కావాలనే పక్కకు బెట్టి, ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తన మాజీ సహచరుడు సచిన్‌ను ఇలా చూడటం బాధగా ఉందన్నారు.(రాజస్ధాన్ సంక్షోభం : కాంగ్రెస్ సర్కార్‌కు షాక్!) కాగా, మూడు నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడిన సింధియా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. సింధియా వెంట ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి బీజేపీకి మద్దతు తెలుపడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారం చేపట్టారు. ఇప్పుడు రాజస్తాన్‌లో కూడా అలాంటి సంక్షోభమే కనిపిస్తోంది. ప్రస్తుతం సచిన్ తనకు మద్దతుగా ఉన్న 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌నుగద్దె దించేందుకు బీజేపీ నాయకులు సచిన్‌తో కొంతకాలంగా మంతనాలు జరుపుతున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.(గుర్రాలు తెంచుకున్నాకే మనం మేల్కొంటామా!) మరోవైపు పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు అంగీకరించారు. రాజస్థాన్‌లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా అదిష్టానం స్పందికపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోనేత వివేక్ టాంకా స్పందిస్తూ.. ఇలాంటి ఆందోళనల వల్ల పార్టీ బలహీనపడుతుందని అన్నారు. Sad to see my erstwhile colleague, @SachinPilot too, being sidelined and persecuted by Rajasthan CM, @ashokgehlot51 . Shows that talent and capability find little credence in the @INCIndia . — Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 12, 2020 -
‘నా చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి’
భోపాల్: బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ కొత్త కేబినెట్లో తన అనుచరులకు సముచిత స్థానం లభించిన నేపథ్యంలో.. ‘టైగర్ అభీ జిందా హై’ అంటూ జ్యోతిరాదిత్య గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వాగ్గాదానాలు మరిచిన విషయం ప్రజలకు తెలుసునంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో జ్యోతిరాదిత్య వ్యాఖ్యలను తిప్పికొడుతూ ‘‘ఏ పులి బతికి ఉంది’’ అని కమల్‌నాథ్ ఎద్దేవా చేయగా.. ‘‘నిజమైన పులి వ్యక్తిత్వం ఏంటో తెలుసా’’ అంటూ డిగ్గీరాజా ట్విటర్ వేదికగా స్పందించారు. (టైగర్ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య) ‘‘వేటపై నిషేధం లేని సమయంలో నేను, మాధవరావు సింధియా(జ్యోతిరాదిత్య తండ్రి) పులులను వేటాడేవాళ్లం. అయితే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకువచ్చిన తర్వాత నుంచి కేవలం కెమెరాలో షూట్ చేస్తున్నా. నిజమైన పులి క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అడవిలో అదొక్కటే ఉంటుంది’’ అంటూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఈ ఇద్దరు నేతల వ్యంగ్యాస్త్రాలకు జ్యోతిరాదిత్య శుక్రవారం ధీటుగా బదులిచ్చారు.(‘ఏ పులి బతికుంది పేపర్ మీదా? సర్కస్ లోనా?’) బీజేపీ వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ‘‘నా చుట్టూ ఎన్నో గద్దలు తిరుగుతూ ఉంటాయి. దాడి చేస్తూ ఉంటాయి. మాంసం ఉన్న వాళ్ల చుట్టే పక్షులు ఆహారం కోసం తిరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కమల్‌నాథ్, దిగ్విజయ సింగ్‌కు మరోసారి గుర్తు చేస్తున్నా. టైగర్ అభీ జిందాహై’’ అంటూ విమర్శలు తిప్పికొట్టారు. కాగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సింధియా.. మార్చిలో కమల్‌నాథ్‌తో విభేదాలు తలెత్తిన క్రమంలో.. 22 ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జ్యోతిరాదిత్య బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
‘ఏ పులి బతికుంది పేపర్ మీదా? సర్కస్ లోనా?’
భోపాల్: బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియాపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాధ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధియా మార్చిలో కమల్‌నాధ్ అధ్యక్షతన అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి 22 ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా ఎన్నికయ్యారు. బీజేపీలో చేరిన చాలామంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు సంపాదించి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జ్యోతిరాధిత్య ‘సింధియా టైగర్ అభి జిందాహై’ (టైగర్ ఇంకా బతికే ఉంది) అంటూ వ్యాఖ్యనించారు. దీనిపై స్పందించిన కమల్‌నాధ్ ‘ఏ టైగర్ బతికి ఉంది. పేపర్ మీద ఉన్నదా? సర్కస్‌లో ఉన్నదా?’ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మన దేశంలో రెండు రకాల గుర్రాలు ఉంటాయని, ఒకటి పెళ్లి ఊరేగింపులో ఉండేది, మరొకటి రేసులో ఉండేది అంటూ కమల్‌నాధ్ వ్యాఖ్యానించారు. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాని నరేంద్రమోదీ మీద కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (టైగర్ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య) తాను టీ ఎప్పుడూ అమ్మలేదు అన్న కమల్‌నాధ్ ... కొంతమంది తమకు తాము టైగర్స్ అని చెప్పుకుంటున్నారని, అయితే తాను టైగర్‌ను కాదని, పేపర్ మీద ఉండే టైగర్‌ను కూడా కాదని, జస్ట్ కమల్‌నాధ్‌ని అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఏంటనేది ప్రజలకు తెలుసని అన్నారు.ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ గురించి మాట్లాడుతూ, అది బేరసారాల ప్రభుత్వమని, అందులో ఉన్నవారు ఎమ్మెల్యేలు కాదని, బేరమాడి కొనుకున్నవారు అని కమల్‌నాధ్ అన్నారు. (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!) -
టైగర్ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య
భోపాల్: ‘‘కమల్‌నాథ్ లేదా దిగ్విజయ్ సింగ్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 15 నెలల్లో వారు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. వారి స్వప్రయోజనాల కోసమే వారు పనిచేశారు. ఒకసారి గతంలో వారు చేసిన వాగ్దానాలు, వాటిని విస్మరించిన చరిత్రను పరిశీలించుకోవాలి. అయితే నేను వాళ్లకు ఓ మాట చెప్పాలనుకుంటున్నా. ‘టైగర్ అభీ జిందా హై’ (పులి ఇంకా బతికే ఉంది)’’ అంటూ బీజేపీ ఎంపీ జోత్యిరాదిత్య సింధియా కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ ప్రభుత్వంలో అర్హుడైన ప్రతీ పౌరుడికి అన్ని విధాలా లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు గురువారం కేబినెట్ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో కొత్తగా 28 మందికి మంత్రులుగా పనిచేసే అవకాశం లభించింది. వీరిలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేబినెట్ కేవలం నాయకుల బృందం మాత్రమే కాదు. ఇది ప్రజల కోసం పనిచేసే టీం. వాళ్లు మంత్రులు కాదు.. ప్రజాసేవకులు. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ ఫలాలు అందుతాయి. 100 రోజుల పాలనలో శివరాజ్ సింగ్ ప్రభుత్వం కరోనాతో సమర్థవంతంగా పోరాడింది. సాధ్యమైనంత వరకు రైతులకు అండగా నిలబడింది. వచ్చే నాలుగేళ్లలో మరింత సమర్థవంతంగా పాలన కొనసాగుతుంది’’ అని చెప్పుకొచ్చారు. (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!) ఇక సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సింధియా.. మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలగా.. బలం నిరూపించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సింధియా ఎంపీగా ఎన్నికకాగా.. ఆయన మద్దతుదారులు ఈరోజు మంత్రులుగా అవకాశం దక్కించుకోవడం గమనార్హం. కాగా సింధియా కరోనా బారిన పడి కోలుకున్న విషయం విదితమే. -
కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో గురువారం కొత్తగా 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్ అడిషనల్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గురువారం ఉదయం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మంత్రివర్గంలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందినవారు కావడం విశేషం. కాంగ్రెస్‌తో విభేదాల అనంతరం బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన సింధియా తనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో తన వర్గీయులకు పదవులు దక్కించుకోవడంలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో సింధియా వర్గంతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమార్తి దేవి, ప్రభురామ్ చౌదరి, ప్రధుమాన్ సింగ్ తోమర్‌తో పాటు సిందియా అత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే సింధియాలు ఉన్నారు. (ముగ్గురు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు) కమల్‌నాథ్‌తో ఏర్పడిన విభేధాలతో కాంగ్రెస్ పార్టీకి మార్చి 10న రాజీనామా చేసిన సింధియా బీజేపీలో చేరారు. సింధియాతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మార్చి నెలలో సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల తర్వాత మంత్రిమండలిలోకి ఐదుగురిని తీసుకున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికలతోపాటు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎవరెవరికి మంత్రిమండలిలో చోటుకల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో క్యాబినెట్ విస్తరణ ఇన్నిరోజులుగా వాయిదాపడుతూ వస్తున్నది. దీనికి తోడు లాక్డౌన్ ఉండడంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా గురువారం 28 మంది మంత్రులు ప్రమాణం చేయడంతో శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో పూర్తి కేబినెట్ కొలువు దీరినట్లయింది. (కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా) -
జోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్
-
జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆయన తల్లి మాధవి రాజే సింధియా కరోనా వైరస్(కోవిడ్-19) బారిన పడ్డారు. వైరస్ లక్షణాలతో బాధ పడుతున్న వారిరువురికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వాళ్లిద్దరికి దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌లో గల మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రాలో కూడా కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనను గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం ఆయనను డిశ్చార్జ్ చేశారు.(ఢిల్లీలో జులై 31 నాటికి 5.5 లక్షల కేసులు!) మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఢిల్లీలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. దేశ రాజధానిలో ఇప్పటివరకు మొత్తం దాదాపు 30వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
ఆ పార్టీ కోసం పని చేయను: పీకే
భోపాల్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికి సుపరిచితుడే. పీకేతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే మధ్యప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్‌ను కోరింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. జ్యోతిరాదిత్య సింథియా తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని కమల్ నాథ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా భావించారు. వారు నన్ను సంప్రదించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరారు. కాని నేను దానికి అంగీకరించలేదు. ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో నేను కాంగ్రెస్ కోసం పనిచేయలేనని స్పష్టంగా చెప్పాను’ అన్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోదీ కోసం పని చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే తరువాత అమిత్ షాతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన బీజేపీకి దూరమయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్ కిషోర్.. అరవింద్ కేజ్రీవాల్ కోసం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కోసం.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ కోసం పని చేస్తున్నారు.(ప్రశాంత్ కిషోర్‌కు అత్యవసర పిలుపు..) -
‘ఆయన ఆచూకీ చెబితే రూ.5,100 బహుమతి’
భోపాల్: మా నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా ఆచూకీ చెబితే రూ.5,100 బహుమతి ఇస్తామంటున్నారు గ్వాలియర్ జనాలు. ఈ మేరకు ఆయన కనిపించడం లేదంటూ వీధుల వెంట పోస్టర్లు అంటించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ ఏడాది మార్చిలో జ్యోతిరాధిత్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. -
మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్(61) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ఆయనతో సోమవారం రాత్రి 9 గంటలకు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన కమల్‌నాథ్ కూడా హాజరయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలెవరూ హాజరు కాలేదు. మధ్యప్రదేశ్‌లో నాలుగో సారి సీఎం పదవి స్వీకరించిన వ్యక్తిగా చౌహాన్ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. శాసనసభాపక్ష నేతగా.. సోమవారం సాయంత్రం చౌహాన్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీనియర్ బీజేపీ నేత గోపాల్భార్గవ శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదించగా మరి కొందరు ఎమ్మెల్యేలు ఆయన్ను బలపరిచారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్.. చౌహాన్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగాప్రకటించారు. అనంతరం చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం అనంతరం కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు విక్టరీ గుర్తును చూపిస్తూ కనిపించారు. కేవలం చౌహాన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంతో వచ్చే వారంలో మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. 107 మంది ఎమ్మెల్యేలతో.. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడటంతో, ఆయన వెంట ఉన్న 22 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం లేకపోయింది. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ప్రస్తుతం 107 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా అనంతరం ఆ పార్టీకి కేవలం 92 మంది సభ్యుల బలం మాత్రమే మిగిలింది. 230 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించగా, 22 మంది రాజీనామా చేశారు. దీంతో సభ బలం 206కు తగ్గగా, మెజారిటీ 104కు పడిపోయింది. దీంతో బీజేపీకి ఎవరి అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం వచ్చింది. సింధియా రాజీనామా అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో కమల్‌నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ సీఎం పీఠాన్ని చేరడానికి మార్గం సుగమమైంది. -
అధికారమంటే మానవత్వమే: దిగ్విజయ్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. కొందరు రాజకీయ నాయకులకు విశ్వసనీయత, భావజాలం కంటే అధికారమే ముఖ్యమని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి, గ్వాలియర్ రాజవంశస్తుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కేబినెట్ పదవి కోసం కాంగ్రెస్ మాజీ నేత సింధియా పార్టీ మారుతారని తాను ఊహించలేదని ట్విటర్ వేదికగా తెలిపారు. ట్విటర్లో ఆయన స్పందిస్తూ.. గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని కాదని ప్రధానీ నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని రాజ్యసభ, కేబినెట్ పదవి కోసం సింథియా పార్టీ మారతారని తాను అనుకోలేదని అన్నారు. బీజేపీని తాను వ్యతిరేకిస్తాను కానీ భావజాలం పట్ల వారి నిబద్దతను గౌరవిస్తానని తెలిపారు. మోదీని తాను విమర్శిస్తాను, కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని దేశాన్ని సంఘటితం చేయడానికి తాను ఉపయోగించే తీరు అద్భుతమని తెలిపారు. తాను చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని.. తనను మొదట్లో ఆర్ఎస్ఎస్లో చేరమని అడిగినా తిరస్కరించానని అన్నారు. తనకు విశ్వసనీయత, సిద్ధాంతాలు ముఖ్యమని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనుకుంటే తాను రాజ్‌ఘర్ స్థానం నుంచి సునాయసంగా గెలిచేవాడినని, పార్టీ ఆదేశాల మేరకు తాను పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేశానని పేర్కొన్నారు. తన దృష్టిలో అధికారం అంటే మానవత్వంతో సేవ చేయడమే అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. -
జ్యోతిరాదిత్య సింధియాకు షాక్..!
భోపాల్: గ్వాలియర్ రాజవంశీయుడు, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన క్రమంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. సింధియాతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడిన క్రమంలో కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో పడిపోయింది. ఈ క్రమంలో బల నిరూపణ పరీక్ష నిర్వహించాలంటూ ప్రతిపక్ష బీజేపీ ప్రతిపాదిస్తుండగా... తమకు కొంత సమయం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. గవర్నర్ లాల్జీ టాండన్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సింధియాపై గతంలో నమోదైన ఫోర్జరీ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి మరోసారి తాజాగా సింధియాపై కేసు నమోదు చేయడంతో విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ ఆర్థిక నేర విభాగం(ఈవోడబ్ల్యూ) పేర్కొంది.(ఆ కుటుంబాన్ని వీడాను: సింధియా భావోద్వేగం) ఈ మేరకు... ‘‘సురేంద్ర మరోసారి గురువారం సింధియా కుటుంబానికి వ్యతిరేకంగా మాకు ఫిర్యాదు చేశారు. 2009లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాదని 6 వేల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమిని తనకు అమ్మారని.. ఇందుకు సంబంధించి తప్పుడు పత్రాలు చూపించారని ఆరోపించారు. మహల్గావ్లోని భూమికి సంబంధించి ఈ ఫిర్యాదు చేశారు’’అని ఈవోడబ్ల్యూ తన నోట్లో పేర్కొంది. ఇక ఈ విషయం గురించి ఈవోడబ్ల్యూ అధికారి మాట్లాడుతూ... ‘‘ సురేంద్ర మార్చి 26, 2014లో తొలిసారి ఫిర్యాదు చేశారు. ఆ కేసును విచారించి 2018లో మూసివేశాం. అయితే తాజాగా మరోసారి పిటిషన్ వేశారు. కాబట్టి నిజానిజాలను తేల్చేందుకు మరలా విచారణకు సిద్ధమవుతున్నాం. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి’’ అని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన సింధియా అనుచరుడు పంకజ్ చతుర్వేది మాట్లాడుతూ.. ఇది రాజకీయ క్షక్షపూరిత చర్య అని మండిపడ్డారు. ‘‘ఈ కేసును ఎప్పుడో మూసివేశారు. అయితే ఇప్పుడు కావాలనే తిరగదోడుతున్నారు. మాకు రాజ్యాంగం పట్ల... చట్టాల పట్ల నమ్మకం ఉంది. కమల్‌నాథ్ ప్రభుత్వానికి మేం సరైన సమాధానం ఇస్తాం’’అని పేర్కొన్నారు.(సింధియా నిష్క్రమణపై సచిన్ పైలట్ ట్వీట్) -
‘జ్యోతిరాదిత్య నిర్ణయం సరికాదు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీలో చేరికపై జ్యోతిరాదిత్య సింధియా నిర్ణయం సరైంది కాదని ఆయన కజిన్, త్రిపుర కాంగ్రెస్ మాజీ చీఫ్ మాణిక్య వంశానికి చెందిన ప్రద్యుత్ దేవ్‌వర్మ అన్నారు. గత ఏడాది త్రిపుర కాంగ్రెస్ చీఫ్‌గా తనంతట తానుగా వైదొలిగిన వర్మ జ్యోతిరాదిత్య సింధియా నిష్ర్కమణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం యువనేతలకు అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టు కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతానికి లోబడిన తామంతా ఒకచోట చేరి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ శిబిరంలోకి వెళ్లడం సరైన నిర్ణయం కాదని, కాంగ్రెస్ పార్టీ యువతకు చోటు కల్పించని ప్రస్తుత తరుణంలో దేశానికి తాము ఎలా సేవలందించాలనే దానిపై యువనేతలు కలిసి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దేశం బలమైన విపక్షాన్ని కోరుకుంటున్న క్రమంలో యువ నేతలు ఓ పరిష్కారాన్ని అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. సచిన్ పైలట్ (రాజస్ధాన్) అజయ్ కుమార్ (జార్ఖండ్) వంటి నేతలకు మంచి నాయకత్వ సామర్థ్యం ఉందని అన్నారు. కాగా మాజీ ఐపీఎస్ అధికారి, జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ సైతం గత ఏడాది ఆగస్ట్‌లో పార్టీని వీడి ఆమ్ఆద్మీ పార్టీలో చేరారు. కాగా సింధియాకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న వర్మ వ్యాఖ్యలను ప్రస్తావించగా అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదో రాహుల్ తన కార్యాలయ సిబ్బందిని అడగాలని అన్నారు. మరోవైపు ఏ సమయంలోనైనా తన ఇంటికి నేరుగా వచ్చే వెసులుబాటు ఉన్న నేతల్లో సింధియా ఒకరని రాహుల్ గాంధీ పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి : సింధియా భావోద్వేగం -
ఆ కుటుంబాన్ని వీడాను: సింధియా భావోద్వేగం
భోపాల్: ‘‘దాదాపు 20 ఏళ్ల పాటు కలిసి ఉన్న నా కుటుంబం, సంస్థను వీడాను. ఎక్కడైతే నిబద్ధతతో పనిచేశానో ఆ సంస్థ నుంచి నన్ను నేను మీకు అప్పగిస్తున్నాను. అయితే ఈ కుటుంబం(బీజేపీ)లోకి రావడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. నా కోసం మీరు తలుపులు తెరిచారు. ప్రధాని మోదీజీ, నడ్డా సాబ్, అమిత్ భాయ్ ఆశీర్వాదాలు నాకు లభించాయి. ఇది నాకు ఎమోషనల్ డే’’ అంటూ బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా భావోద్వేగానికి గురయ్యారు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సింధియా.. ఆ పార్టీని వీడి బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు.(రసకందాయంలో మధ్యప్రదేశ్ రాజకీయం.. 22 మందికి నోటీసులు) ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో భోపాల్‌కు చేరుకున్న సింధియాకు బీజేపీ శ్రేణులు, అనుచరుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోకి సింధియాను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింధియా మీడియాతో మాట్లాడారు. ‘‘కారులో ఏసీ ఉపయోగించని నాయకులు ఇద్దరే ఉన్నారు. ఒకరు శివరాజ్ సింగ్ చౌహాన్. మరొకరు జ్యోతిరాదిత్య సింధియా. మేము ఒకటిగా ఉన్నాం కాబట్టి కార్యకర్తలు కూడా ఒకటిగా ఉండాలని ఆశిస్తున్నా. ఎందుకంటే ఒకటి.. ఒకటి కలిస్తే.. అది 2 కాకుండా 11 కావాలి’’ అని సింధియా తన అనుచరులను ఉద్దేశించి పేర్కొన్నారు. కలిసికట్టుగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శివరాజ్ సింగ్‌తో కలిసి భోజనం చేశారు. (సింధియా నిష్క్రమణపై సచిన్ పైలట్ ట్వీట్) ఇక ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న సింధియా, శివరాజ్ ఇలా కలిసి భోజనం చేస్తున్న ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జ్యోతిరాదిత్యను ముఖ్యమంత్రిని చేస్తారని అంతా భావించారు. అయితే సీనియర్ నేత అయిన కమల్‌నాథ్ వైపు మొగ్గుచూపిన అధిష్టానం ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గుణ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి సింధియా ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు.(‘మహరాజ్’ కోసం ఏం చేయడానికైనా సిద్ధం..!) -
ఆ 22 మందికి నోటీసులు
భోపాల్/న్యూఢిల్లీ/బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కల్లా తన ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. స్వచ్ఛందంగానా లేక.. ఎవరి ఒత్తిడితోనైనా రాజీనామా చేశారా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని వారిని కోరారు. ఆ తర్వాతే సభలో బల పరీక్ష చేపడతామని స్పీకర్ తెలిపారు. బల నిరూపణకు సిద్ధమని సీఎం కమల్‌నాథ్ ఇంతకుముందే తెలిపారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, పార్టీని వీడిన ఆరుగురు మంత్రులు సహా 22 మంది సభ్యుల రాజీనామాల విషయం తేలాకే బలపరీక్ష ఉంటుందన్నారు. రాజీనామాలు చేసిన వారంతా స్పీకర్‌ను ఎందుకు కలుసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి బీజేపీయే కారణమన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో భోపాల్ చేరుకున్న జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ కార్యకర్తలు, సింధియా అనుచరులు ఘనస్వాగతం పలికారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోకి ఆయన్ను మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సింధియా మీడియాతో మాట్లాడుతూ..బీజేపీలోకి చేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. బెంగళూరులో హైడ్రామా బెంగళూరు పోలీసులు తమ మంత్రులను ఇద్దరిని అరెస్టు చేశారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీ, న్యాయవాది అయిన వివేక్ తంఖా మాట్లాడుతూ.. ‘బెంగళూరు రిసార్టులో ఉన్న ఎమ్మెల్యే మనోజ్ చౌదరితో మాట్లాడేందుకు ఆయన తండ్రితో కలిసి మంత్రులు జితు పట్వారీ, లఖన్ సింగ్ వెళ్లారు. బెంగళూరు పోలీసులు వారిని రిసార్టులోపలికి వెళ్లనివ్వలేదు. వారిపై దాడి చేసి, అరెస్టు చేశారు. మనోజ్ తన తండ్రితో కలిసి భోపాల్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, రానివ్వడం లేదు. దీనిపై మేం సుప్రీంకోర్టుకు వెళతాం’ అని ఆయన వెల్లడించారు. కాగా, పట్వారీ అక్కడి పోలీసులతో వాదులాడుతున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. రాజీనామా చేసిన 22 మందిలో 19 మంది బెంగళూరులోనూ మిగతా వారు మధ్యప్రదేశ్‌లోనూ ఉన్నట్లు సమాచారం. బల పరీక్షకు బీజేపీ డిమాండ్ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో అసెంబ్లీలో సర్కారు బలం నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అందుకే, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నెల 16వ తేదీన సభలో బల నిరూపణ జరపాలని స్పీకర్‌ను, గవర్నర్‌ను కోరతాం’ అని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తు గురించి భయపడ్డారు: రాహుల్ తన రాజకీయ భవిష్యత్తు గురించి భయపడుతున్నందునే సింధియా నమ్ముకున్న సిద్ధాంతాలను మర్చిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘ఆయన బయటకు చెప్పే దానికి వాస్తవ కారణాలకు చాలా తేడా ఉంది. ఆయన నా చిరకాల మిత్రుడు. కాలేజీ రోజుల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. తన రాజకీయ భవిష్యత్తు గురించిన భయం వల్లే సిద్ధాంతాలను పక్కనబెట్టి ఆర్ఎస్ఎస్(బీజేపీ)లోకి వెళ్లారు. అయితే, ఆయనకు అక్కడ గౌరవం లభించదు. ఆ పార్టీలో ఆయన సంతృప్తికరంగా ఉండలేరు’ అని అన్నారు. -
సింధియా నిష్క్రమణపై సచిన్ పైలట్ ట్వీట్
జైపూర్: ఇప్పటికే అధినాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జ్యోతిరాదిత్య సింధియా ఎపిసోడ్‌తో మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవకుండా చతికిలపడటం వంటి పరిణామాలతో పాటు తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీలో పడటం వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ వైదొలగడం.. మళ్లీ సోనియా గాంధీకే పగ్గాలు అప్పగించిన క్రమంలో పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న నాయకుల వాదనకు.. సింధియా నిష్క్రమణ మరింత బలాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో యువనేత, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ చేసిన ట్వీట్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్న విషయాన్ని స్పష్టం చేసింది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడటం దురదృష్టకరమన్న సచిన్.. పార్టీలో ఉన్న అన్ని సమస్యలు పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు.(సొంత ప్రభుత్వంపై సచిన్ పైలట్ విమర్శలు) కాగా దాదాపు 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సింధియాను పక్కన పెట్టడంతో ఆయన పార్టీని వీడిన విషయం తెలిసిందే. సీనియర్ నేత, సీఎం కమల్‌నాథ్‌తో తలెత్తిన విభేదాల కారణంగానే ఆయన బీజేపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడటంతో కమల్‌నాథ్ సర్కారు కూలిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో మాదిరే.. ప్రస్తుతం మధ్యప్రదేశ్.. రానున్న రోజుల్లో రాజస్థాన్‌లో బీజేపీ... ఆపరేషన్ కమల్‌కు తెరతీయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటి మెజార్టీతో నెట్టుకొస్తున్న విషయం విదితమే. (‘మహరాజ్’ కోసం ఏం చేయడానికైనా సిద్ధం..!) ఇక కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించిన సచిన్ పైలట్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ల మధ్య కూడా సంబంధాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన.. రాజస్తాన్‌లోని కోటాలో చిన్నారుల మృతి అంశం సహా వివిధ అంశాల్లో సచిన్.. అశోక్‌కు వ్యతిరేకంగా బాహాటంగానే తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. అదే విధంగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజీవ్ అరోరాను పెద్దల సభకు పంపాలన్న గహ్లోత్ ప్రతిపాదనను కూడా ఈ యువనేత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలను ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాజస్తాన్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల బలం 200 కాగా కాంగ్రెస్‌కు 112 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరిలో సీపీఎం నుంచి ముగ్గురు, ఆర్ఎల్డీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఇక బీజేపీకి 80 మంది సభ్యులున్నారు. ఒక 20 మందిని తమ వైపుకి లాక్కుంటే రాజస్తాన్ కూడా బీజేపీ వశమవుతుంది. Unfortunate to see @JM_Scindia parting ways with @INCIndia. I wish things could have been resolved collaboratively within the party. — Sachin Pilot (@SachinPilot) March 11, 2020 -
అమిత్‌షాను కలిసిన సింధియా
-
అందుకే సింధియా పార్టీ వీడారు : నగ్మా
న్యూఢిల్లీ : జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతలకు మార్గం సుగమం చేసిందని నటి, ఆ పార్టీ నేత నగ్మా వ్యాఖ్యానించారు. సింధియా పార్టీని వీడటంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. బుధవారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది నాయకులు అసంతృప్తితో వేగుతున్నారని, దాన్ని కనిపెట్టడంలో పార్టీ విఫలమైందని అన్నారు. సరైన గుర్తింపు లభించకపోవటం మూలానే సింధియా పార్టీ వీడారని చెప్పారు. మరికొంతమంది అసమ్మతి నాయకులు పార్టీ వీడేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ( ‘మహరాజ్’ కోసం ఏం చేయడానికైనా సిద్ధం..) కాగా, మూడు రోజుల రాజకీయ రసవత్తరతకు తెరదించుతూ సింధియా బుధవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే బీజేపీ సింధియాను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. ( రాజ్‌నాథ్‌తో సింధియా భేటీ ) There’s a lot of discontentment among many of us seems like the party totally fails to see it @SachinPilot after a time it’s not abt ideology anymore it’s abt recognition of ones efforts and given one an appropriate due so it’s not surprising @JM_Scindia left many will follow too https://t.co/G1QWEA2K2i — Nagma (@nagma_morarji) March 11, 2020 చదవండి : సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు -
‘మహరాజ్’ కోసం ఏం చేయడానికైనా సిద్ధం..!
భోపాల్/బెంగళూరు: తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని.. విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలను రెబెల్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. 22 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో 13 మంది కాంగ్రెస్‌ను వీడిపోమని చెప్పారన్న వ్యాఖ్యలను ఖండించారు. తాము జ్యోతిరాదిత్య సింధియా వెంటే ఉంటామని.. ఆయన కోసం ఏమైనా చేస్తామని స్పష్టం చేశారు. తిరుగుబాటు చేయమని తమను ఎవరూ బలవంతం చేయలేదని... ఇది తమకు తాము తీసుకున్న నిర్ణయం అని వెల్లడించారు. తమ మద్దతు ఎల్లప్పుడూ జ్యోతిరాదిత్యకే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తుల్సీ సిలావట్, గోవింద్ సింగ్ రాజ్‌పూత్, మహేంద్ర సింగ్ సిసోడియా, ఇమర్తీ దేవి, ప్రభురాం చౌదరి, ప్రద్యుమ్న సింగ్ తోమర్ తదితర నేతలు మాట్లాడిన వీడియోలు బుధవారం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా) బావిలో దూకమన్నా దూకుతాను.. మధ్యప్రదేశ్ తాజా పరిణామాల గురించి ఇమర్తీ దేవి(కమల్‌నాథ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు) మాట్లాడుతూ...‘‘ ఒకవేళ మహరాజ్(స్థానికులు జ్యోతిరాదిత్య సింధియాను ఇలాగే పిలుస్తారు) నన్ను అడిగినా లేదంటే ఆయన కోసం ఏదైనా చేయాలని భావిస్తే నేను బావిలో దూకడానికి కూడా వెనుకాడను. మహరాజ్ కోసం ఏమైనా చేస్తాను’’ అని పేర్కొన్నారు. ఇక మరో మాజీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా మాట్లాడుతూ... ‘‘జ్యోతిరాదిత్య సింధియా ఎవరికీ ద్రోహం చేయలేదు. నిజానికి కమల్‌నాథే సింధియాను మోసం చేశారు. పదిహేనేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి సింధియా తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఎక్కడ ఉంటే మేమూ అక్కడే ఉంటాం. మేమంతా ఐకమత్యంగా ఉంటాం’’అని వీడియోలో చెప్పుకొచ్చారు. ‘‘మా ఇష్టప్రకారమే రాజీనామా చేశాం. మేము 22 మందిమి ఉన్నాం. ఈరోజు.. రేపు.. ఎప్పటికైనా కలిసే ఉంటాం. మాకు మేముగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు’’ అని మరో మాజీ మంత్రి ప్రభురాం చౌదరి, ఎమ్మెల్యే రక్షా సిరోనియా స్పష్టం చేశారు.(సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు) కాగా 18 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన గ్వాలియర్ రాజవంశీకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడి.. బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన అనుయాయులైన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సర్కారు మైనార్టీలో పడింది. ఈ క్రమంలో మిగిలిన తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి రాజస్తాన్‌లోని జైపూర్‌కు తరలించగా.. బీజేపీ ముందు జాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని ఒక హోటల్లో ఉంచింది. ఇక తమ రాజీనామాలను ఒక బీజేపీ సీనియర్ నేత ద్వారా మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కు పంపించిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు శిబిరంలో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230 కాగా, ప్రస్తుతం 228 మంది సభ్యులున్నారు(ఇద్దరు చనిపోయారు). వారిలో 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే.. ఆ సంఖ్య 206కి చేరుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 104 అవుతుంది. ఈ నేపథ్యంలో.. 107 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. అయితే అంతా స్పీకర్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. -
రాజ్‌నాథ్‌తో సింధియా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి ఢిల్లీలోని మంత్రి నివాసానికి వెళ్లిన సింధియాను రాజ్‌నాథ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించకున్నారు. మర్యాదపూర్వకంగానే రాజ్‌నాథ్‌తో సింధియా బేటీ అయినట్లు తెలుస్తోంది. (చదవండి : కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా) కాగా, అనేక రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ను వీడియా సింధియా.. బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో ఆయన ఆ పార్టీలో చేరారు. వెంటనే ఆయనను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దాంతో, ఆయన మరోమారు కేంద్ర మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు సింధియాతో పాటు మరో 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమలనాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. రాజీనామాలు చేయగా మిగిలిన తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ జైపూర్‌కు తరలించింది. బీజేపీ ముందుజాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని ఒక హోటల్లో ఉంచింది. తమ రాజీనామాలను ఒక బీజేపీ సీనియర్ నేత ద్వారా మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కు పంపించిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు శిబిరంలో కొనసాగుతున్నారు. (సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు) -
నానమ్మ బాటలో...
-
కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి బుధవారం కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, గ్వాలియర్ రాజవంశ వారసుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరారు. వెంటనే ఆయనను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దాంతో, ఆయన మరోమారు కేంద్ర మంత్రి పదవి చేపట్టే దిశగా తొలి అడుగు పడినట్లైంది. సింధియా అనుయాయులైన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో పతనం అంచుల్లో ఊగిసలాడుతున్న మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజీనామాలు చేయగా మిగిలిన తమ ఎమ్మెల్యేలను రాజస్తాన్‌లోని జైపూర్‌కు తరలించింది. బీజేపీ ముందుజాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని ఒక హోటల్లో ఉంచింది. తమ రాజీనామాలను ఒక బీజేపీ సీనియర్ నేత ద్వారా మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కు పంపించిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు శిబిరంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ సభ్యులు ఉన్న రాజస్తాన్(జైపూర్)లో కాంగ్రెస్.. బీజేపీ ఎమ్మెల్యేలున్న హరియాణా(గురుగ్రామ్)లో, కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలున్న కర్నాటక(బెంగళూరు)లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230 కాగా, ప్రస్తుతం 228 మంది సభ్యులున్నారు. వారిలో కాంగ్రెస్ రెబెల్స్ అయిన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే, ఆ సంఖ్య 206కి చేరుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 104 అవుతుంది. ఆ పరిస్థితుల్లో.. 107 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కానుంది. ఇప్పటివరకు కమల్‌నాథ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిచ్చే వీలుంది. ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం అయితే, విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ‘మాతో 95 మంది పార్టీ ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, బీఎస్పీ, ఎస్పీ సభ్యులు మాకే మద్దతిస్తారు’ అని రాష్ట్ర మంత్రి ప్రియవ్రత్ సింగ్ తెలిపారు. ‘22 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో 13 మంది కాంగ్రెస్‌ను వీడిపోమని చెప్పారు. జ్యోతిరాదిత్యకు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేందుకే ఈ పని చేశాం అని వారు చెప్పారు. సింధియా పార్టీని వదిలి వెళ్తారని మేం ఊహించలేదు’ అని పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ అన్నారు. ‘మేం సింధియాను రాజ్యసభకు పంపించగలం కానీ.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే ఆయనను కేంద్రమంత్రిని చేయగలరు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికల్లో విజయం అనంతరం జ్యోతిరాదిత్యకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశామని, అయితే, ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించి, తన మద్దతుదారుకు ఆ పదవి ఇవ్వాలని కోరారని దిగ్విజయ్ వెల్లడించారు. ఈ సంక్షోభం వెనుక బీజేపీ ఉందని, ఈ ఆపరేషన్‌కు ఆ పార్టీనే నిధులను సమకూరుస్తోందని ఆరోపించారు. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలుస్తానని మోదీ, షాలకు సింధియా ప్రతిపాదన పంపారు. కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు దాన్ని అడ్డుకున్నారు. ఆ పనికి సింధియా ఎందుకు? మేమే ఆ పని చేయగలం అని షాకు చెప్పారు. కానీ, వారి ప్రయత్నాన్ని మేం సాగనివ్వలేదు. దాంతో, ఇప్పుడు షా స్థానిక నాయకులను పిలిచి, మీరంతా పనికిరానివారు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే పనిని ఇప్పుడు సింధియాకు అప్పగిస్తున్నా అని వారికి చెప్పారు’’ అని దిగ్విజయ్ మధ్యప్రదేశ్ సంక్షోభాన్ని వివరించారు. ప్రజా ప్రభుత్వాలను కూల్చే కుట్ర మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘ప్రజా ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్న మీకు చమురు ధరలు 35% తగ్గిన విషయం బహుశా దృష్టికి రాలేదనుకుంటా. ఆ తగ్గుదల ప్రయోజనాలను ప్రజలకు కల్పించండి’ అని ట్వీట్ చేశారు. రాజమాత గుర్తొచ్చారు సింధియా బీజేపీలో చేరిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సింధియా నానమ్మ, గ్వాలియర్ రాజమాత, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన విజయరాజె సింధియాను గుర్తు చేసుకున్నారు. ఆమె మనవడు బీజేపీలోకి రావడం తనకు అత్యంత సంతోషకరమైన విషయమన్నారు. మహారాజ్, శివరాజ్ ఇప్పుడు ఒకే పార్టీలో జ్యోతిరాదిత్య బీజేపీలో చేరడాన్ని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ స్వాగతించారు. 2018 ఎన్నికల సమయంలో బీజేపీ నినాదమైన ‘మాఫ్ కరో మహారాజ్.. హమారా నేతాతో శివరాజ్ (క్షమించండి మహారాజ్.. మా నాయకుడు శివరాజ్)’ను విలేకరులు గుర్తు చేయగా.. ఇప్పుడు, మహారాజ్, శివరాజ్ ఒకే పార్టీలో ఉన్నారని చమత్కరించారు. జ్యోతిరాదిత్య స్థానికుల్లో మహారాజ్‌గా చిరపరిచితుడు. 9 మంది అభ్యర్థులు మార్చి 26న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి తమ అభ్యర్థిగా జ్యోతిరాదిత్యను బీజేపీ ప్రకటించింది. సింధియాతోపాటు గుజరాత్ నుంచి ఇద్దరిని, అస్సాం, బిహార్, మహారాష్ట్ర, రాజస్తాన్, జార్ఖండ్, మణిపూర్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున.. మొత్తం 9 మంది అభ్యర్థులతో ఒక జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. మిత్రపక్షాలు ఆర్పీఐ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్లకు ఒక్కో సీటును కేటాయించింది. ఆర్పీఐ తరఫున కేంద్ర మంత్రి రామ్‌దాస్ అఠవాలే మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశముంది. వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో లేదు బీజేపీలో చేరిన సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌పై లోతైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఒకప్పటి పార్టీ కాదని, ఇప్పుడు ఆ పార్టీ వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో లేదని విమర్శించారు. కొత్త ఆలోచనలను, నూతన నాయకత్వాలను ఆమోదించలేకపోతోందన్నారు. మోదీపై సింధియా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ సమర్ధుడైన నేత అని, దేశ సేవ కోసం సంపూర్ణంగా అంకితమైన వ్యక్తి అని పొగిడారు. ఆయన చేతుల్లో దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నారు. దేశ ప్రతిష్టను మోదీ విశ్వవ్యాప్తం చేశారన్నారు. 2018లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కలలు కన్నానని, ఈ 18 నెలల్లో అవన్నీ కల్లలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, రైతులు, యువత నిస్పృహలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటే ప్రజలకు సేవ చేయాలన్న తన ఆకాంక్ష నెరవేరదని అర్థమైందన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై మాత్రం ఆయన ఏ వ్యాఖ్యలు చేయలేదు. ఇంటికి ఎప్పుడైనా రావొచ్చు: రాహుల్ తనకు అత్యంత సన్నిహితుడైన సింధియా పార్టీని విడిచి పెట్టడంతో రాహుల్‌గాంధీ కాస్త కలత చెందినట్టు కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌లతో కలిసి ఉన్న ఫోటోకి లియో టాల్‌స్టాయ్ ప్రఖ్యాత కొటేషన్ పోరాటయోధులు అంటే ఎవరో కాదు సహనం, సమయం అంటూ తాను చేసిన ట్వీట్‌ని మళ్లీ రాహుల్ రీ ట్వీట్ చేశారు. ఆయన ఎందుకు దీనిని రీట్వీట్ చేశారో ఎవరికీ అర్థం కాలేదు కానీ ‘‘నా ఇంటికి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా హాయిగా వచ్చే నాయకుడెవరైనా ఉన్నారంటే జ్యోతిరాదిత్య సింధియాయే, ఆయన నాకు కాలేజీ రోజుల నుంచి బెస్ట్ ఫ్రెండ్‘‘అన్న రాహుల్ వ్యాఖ్యలతో వారిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో తెలుస్తోంది. భోపాల్ నుంచి జైపూర్‌కు ప్రత్యేక విమానంలో బయల్దేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు -
సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు
కాంగ్రెస్ పార్టీ నిజమైన పతనం ఇప్పుడే ప్రారంభం అయివుండవచ్చు. కాంగ్రెస్ యువనేతల్లోని అత్యంత ప్రతిభాశాలులలో ఒకరైన జ్యోతిరాదిత్య సింధియా(మధ్యప్రదేశ్ రాజకుటుంబం వారసుడు, కాంగ్రెస్ మాజీనేత మాధవరావు సింధియా తనయుడు, గాంధీ కుటుంబ విధేయుడు) భారత రాజ కీయాల్లో కురువృద్ధ పార్టీకి లాంఛనంగా వీడ్కోలు పలికారు. పైగా కాంగ్రెస్‌కు మరింత అవమానం కలిగిస్తూ దాని బద్ధ విరోధి అయిన భారతీయ జనతాపార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా సింధియా చేసిన తిరుగుబాటు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ పతనానికి దారితీయడమే కాదు.. పార్టీలో తాము ఒంటరులుగా మిగిలిపోయాం అని, అవమానాల పాలవుతున్నామని భావిస్తున్న ఇతరులకు కూడా కాస్త ధైర్యమిచ్చింది. దీనికి కాంగ్రెస్ పార్టీ తన్నుతాను తప్పుపట్టుకోవలసిందే కాని ఇతరులను నిందించలేదు. లక్ష్మణరేఖను ఇలా దాటగలడా? ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా తన రాజీనామాను ప్రకటించడానికి ముందు, చివర నిమిషం వరకు సింధియా లక్ష్మణరేఖను దాటగలడని నమ్మడానికే కాంగ్రెస్ అంగీకరించలేదు. కాంగ్రెస్ కుటుంబానికి సింధియా విధేయత పట్ల ఎన్నడూ సందేహం కలగలేదు. పైగా ఆయన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడు కూడా. అందుకే కాంగ్రెస్ పార్టీ సింధియాను రాజీనామా చేసిన తర్వాత లాంఛనప్రాయంగా బహిష్కరించింది తప్ప తనపై చర్య తీసుకోవడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంగా ఎదుర్కొంటూ వచ్చిన ఉత్థానపతనాల చరిత్రలో ఒక నాయకుడు పార్టీని వదిలి వెళ్లడం అనేది చాలా చిన్న విషయమే అవుతుంది. కానీ సింధియాను పార్టీ వదులుకోవలసి రావడం, పైగా తనను పోగొట్టుకున్న సమయం కలిగించే ప్రభావం చాలా విస్తృతమైనది. ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న దీనావస్థలో సింధియా నిష్క్రమణ దానికి మరిన్ని చిక్కులను కొనితేవచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే సింధియా చేరిక పార్టీకి లడ్డూ్డ లాంటి అవకాశమనే చెప్పాలి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ సాగిస్తున్న భావజాల సమరంలో సింధియా చర్య కాషాయ పార్టీకి ఎంతో మేలు చేస్తుంది. కాంగ్రెస్ ఉచ్చులోంచి తప్పించుకోవాలని చూస్తున్న అనేకమంది ప్రతిభావంతులను సింధియా అయస్కాంతంలా బీజేపీలోకి ఆకర్శించగలరు. బీజేపీలో లాంఛనంగా చేరిన తర్వాత మీడియాతో క్లుప్తంగా మాట్లాడిన సింధియా, కాంగ్రెస్ తిరస్కృత జీవితం గడుపుతోందని క్షేత్ర వాస్తవికతను అది పట్టించుకోవడం లేదని విమర్శించారు. భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయిన యువనేతలు పార్టీకి, దేశానికి కూడా సేవ చేయాలనుకుని వచ్చిన ఎంతోమంది యువనాయకులను కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఆరోపించారు. సింధియా ప్రకటన తర్వాత అయినా కాంగ్రెస్ కాస్త మేలుకుని ఈ సందర్భంలో పార్టీ నుంచి ఇతరులు వెళ్లిపోకుండా అడ్డుకోవాల్సి ఉంది. కానీ పార్టీలో ఇక తమకు భవిష్యత్తు లేదని భావిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్న తరుణంలో వెళ్లిపోదలుస్తున్న వారిని నిలుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి కష్టసాధ్యమే కావచ్చు. కాంగ్రెస్ అధిష్టానం క్షేత్ర వాస్తవికతకు దూరమైందని, గతంలోనే జీవిస్తూ పార్టీ శ్రేణుల కొత్త ఆలోచనలను, భావోద్వేగాలను, ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తోందని సింధియా ఆషామాషీగా చెప్పడం లేదు, పార్టీలోని కురువృద్ధులకు, యువతరానికి మధ్య సాగుతున్న కుమ్ములాట కాంగ్రెస్‌ని మరింత బలహీనపర్చవచ్చు కూడా. నిజానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చే ఇలాంటి అవకాశంకోసం పొంచి ఉంటున్న బీజేపీ చేతుల్లోకి సింధియాను కాంగ్రెస్ చేతురాలా అప్పగించేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలివైన వృద్ధ జంబూకమే కావచ్చు కానీ తన ప్రభుత్వాన్ని నిలుపుకోవడం కష్టసాధ్యమని గుర్తించక తప్పదు. ఎందుకంటే బీజేపీ మొదలెట్టిన ఆపరేషన్ కమల్ పరాకాష్టకు చేరింది మరి. సీఎం పదవిని ఆశించి భంగపాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో 2018 నవంబర్‌లో ప్రభుత్వాలు ఏర్పడుతున్న సమయంలో సింధియా, సచిన్ పైలట్ ఈ రెండు రాష్ట్రాల్లో సీఎం పదవిని ఆశించారు. కానీ రాహుల్ వారిని వృద్ధులకు అవకాశం ఇద్దామని చెప్పీ నిలువరిం చారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతలు తమకు ఊపిరాడటం లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నేతల బాగోగులను కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోకపోతే, వారి ఆకాంక్షలను నెరవేర్చుకోకపోతే పార్టీనుంచి చాలామంది వెళ్లిపోవచ్చు కూడా. ఆంధ్రప్రదేశ్ ఉదంతాన్నే తీసుకుందాం. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విషాద మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్ల నిరాదరణ చూపింది. ఆయన కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. దాని ఫలితం మనందరం చూశాం. 1977లో 42 ఎంపీ సీట్లకు గాను 41 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ హయాంలో 30 పైగా ఎంపీ సీట్ల దన్నుతో యూపీఏ1, యూపీఏ 2 ప్రభుత్వాలను నడపగలిగిన కాంగ్రెస్ ఈరోజు విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎంపీ సీటుకు కూడా నోచుకోని దౌర్భాగ్య స్థితిలో కూరుకుపోయింది. చరిత్ర నిర్మాణం.. చరిత్రలో కలిసిపోవడం! ఏపీలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణమే నేడు ఆవిరైపోయింది. పైగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతోంది. మరోవైపున బీజేపీ అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి కురువృద్ధులను పక్కన పెట్టి నరేంద్రమోదీ పట్ల విశ్వాసం ఉంచి 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. తదుపరి చరిత్ర అంతా తెలిసిందే. కానీ మరోవైపున కాంగ్రెస్ మాత్రం చరిత్రలో కలిసిపోయేటట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వంపై సింధియా తిరుగుబాటు పంపుతున్న సందేశం స్పష్టంగానే ఉంది. కాంగ్రెస్ నాయకత్వం తాను సమర్థంగా పనిచేయాలి, తన నేతలు సమర్థంగా పనిచేసేలా చూడాలి. అలా కాదంటే నాయకులకు అన్ని అవకాశాలూ తెరుచుకునే ఉన్నాయి. పార్టీనుంచి వేరయిపోయామని, తమ ప్రతిభ వృథా అవుతోందని, తాను నాయకత్వంతో సంబంధాలు కోల్పోయామని బలంగా నమ్ముతున్న నాయకులకు కాంగ్రెస్ సాధికారత కల్పించాల్సి ఉంది. లక్ష్మణ్ వెంకట్ కూచి(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) -
మేనల్లుడిని స్వాగతించిన మేనత్త
జైపూర్ : కేంద్రమాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంపై రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే స్పందించారు. సింధియా బీజేపీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన స్వభావం, బలం, ధైర్యాన్ని తాను ఎప్పటికీ గౌరవిస్తానని రాజే తెలిపారు. కాగా జ్యోతిరాదిత్య సింధియాకు వసుంధర స్వయానా మేనత్త అన్న విషయం తెలిసిందే. బుధవారం జేడీ నడ్డా సమక్షంలో సింధియా బీజేపీలో చేరిన అనంతరం ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. ‘మా అమ్మ (రాజమాత విజయ రాజే సింధియా) ఆరోజు ఉండి ఉంటే ఈ ఆనందక్షణాలను చూసి ఎంతో గర్వించేంది’ అని వ్యాఖ్యానించారు. చివరికి ఇద్దరం ఒకే పార్టీలో ఉండటం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. మరో మేనత్త, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే సైతం సింధియా చేరికపై సంతోషం వ్యక్తం చేశారు. మహారాజ్‌కు స్వాగతం అంటూ తన నిర్ణయాన్ని స్వాగతించారు. -
లైన్‌క్లియర్ : రాజ్యసభకు సింధియా
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు నామినేట్ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. బుధవారం 11 మందితో కూడిన తొలిజాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్క రోజుకిందట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సింధియాకు అవకాశం కల్పించింది. ఆయన స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి పెద్దల సభకు ఎంపిక చేసింది. ఆయనతో పాటు 11 తొమ్మది పేర్లను బీజేపీ ప్రకటించింది. అలాగే మిత్రపక్షాలకూ బీజేపీ అవకాశం కల్పించింది. బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల తొలిజాబితా.. జ్యోతిరాదిత్య సింధియా : (మధ్యప్రదేశ్) హర్ష్‌సింగ్ చౌహాన్ : (మధ్యప్రదేశ్) భువనేశ్వర్ కలిత : (అస్సాం) వివేక్ ఠాకూర్ : (బిహార్) అభయ్ భరద్వాజ్, రమీలా బెన్ (గుజరాత్) దీపక్ ప్రకాష్ : (జార్ఖండ్) మహారాజ్ : (మణిపూర్) ఉద్యన రాజే భోస్లే : (మహారాష్ట్ర) రాజేంద్ర గెహ్లాట్ : (రాజస్థాన్) ఆర్ఎస్పీ చీఫ్ రాందాస్ అథవాలే : (మహారాష్ట్ర) బీపీఎఫ్ నేత బుశ్వజిత్ : (అస్సాం) -
బీజేపీలో చేరిన సింధియా
-
కాంగ్రెస్‌కు ఆ సత్తాలేదు : సింధియా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ఎదుర్కొనే సత్తా ప్రస్తుతమున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి లేదని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సింధియా బుధవారం ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కమళం గూటికి చేరారు. అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే తన అంతమ లక్ష్యమని, దాని కోసమే బీజేపీలో చేరుతున్నానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు తనను ఎంతో ఆకర్షించాయని చెప్పారు. నాయకత్వలేమితో, వరకు ఓటములతో, పార్టీలో కుమ్ములాటతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవచేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పార్టీని ముందుండి నడిపిస్తూ, ప్రచారాన్ని భుజానకెత్తుకుని మోస్తున్న యువతకు అధిష్టానం మొండిచేయి చూపుతోందని విమర్శించారు. (బీజేపీలో చేరిన సింధియా) అలాగే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సైతం సింధియా విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కమల్‌నాథ్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి చేసేందుకు బీజేపీకి తనకు అవకాశం కల్పించిందని, ఆ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో దేశాభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వారి నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌తో 18 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని.. పార్టీలో తనకు తగిని ప్రాతినిధ్యం లభించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీలో చేరిన సింధియా
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి, గ్వాలియర్ రాజవంశస్తుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురుకు కేంద్రమంత్రులతో సహా, బీజేపీ పెద్దలు హాజరయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఉన్న విభేదాల కారణంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. పార్టీలో సరైన ప్రాతినిధ్యం లభించడంలేదని భావించిన సింధియా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా భేటీ అనంతరం హస్తం పార్టీకి రాజీనామా సమర్పించారు. ఈ పరిణామం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఊహించినట్టుగానే ఆయన కాషాయదళంలో చేరారు. అయితే బీజేపీ నుంచి సింధియాను రాజ్యసభకు పంపుతారని, మోదీ కేబినెట్లో కేంద్రమంత్రి పదవి కూడా కట్టబెడతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై బుధవారం రాత్రి నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. -
వాళ్లు మళ్లీ కాంగ్రెస్ గూటికే: సీఎం తనయుడు
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తనయుడు, ఎంపీ నకుల్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా, 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో కమల్‌నాథ్ సర్కారు మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై నకుల్ నాథ్ బుధవారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘కమల్‌నాథ్ ప్రభుత్వానికి వచ్చి ఢోకా ఏమీలేదు. సర్కారు కచ్చితంగా నిలదొక్కుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. నిజానికి వాళ్లు వ్యక్తిగతంగా ఆయనను సంప్రదించలేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న 92 మంది ఎమ్మెల్యేలను మేం కాపాడుకుంటాం’’ అని నకుల్‌నాథ్ పేర్కొన్నారు. (‘నా మేనల్లుడిదీ అదే పరిస్థితి.. పిచ్చోళ్లం కాదు’ ) కాగా అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. స్వతంత్రులు, బీజేపీయేతర పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 228(మొత్తం- 230 స్థానాలు.. ఇద్దరు సభ్యులు చనిపోవడంతో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి). ఇందులో తిరుగుబాటు బావుటా ఎగురువేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే సభలో సభ్యుల సంఖ్య 206కు చేరుకుంటుంది. అదే విధంగా కాంగ్రెస్ సొంత బలం 92కు పడిపోతుంది. ఇదే సమయంలో బీజేపీకి అసెంబ్లీలో 107 సభ్యుల బలం ఉంది. ఈ క్రమంలో మ్యాజిక్ ఫిగర్ 104 అయినప్పటికీ.. స్పీకర్ నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉన్న నేపథ్యంలో... స్వతంత్రులు, బీఎస్పీ, ఎస్పీకి చెందిన ఏడుగురు సభ్యులను తమవైపునకు తిప్పుకొనేందుకు ఇరుపార్టీలు రంగంలోకి దిగినట్లు సమాచారం.(ఆపరేషన్ కమల్.. కాంగ్రెస్‌కు రంగుపడింది) మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం: వరుస కథనాల కోసం క్లిక్ చేయండి -
‘నా మేనల్లుడిదీ అదే పరిస్థితి.. పిచ్చోళ్లం కాదు’
భోపాల్: కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరనున్నారన్న వార్తలపై ఆయన మేనత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధరా రాజే సింధియా స్పందించారు. జ్యోతిరాదిత్య బీజేపీలో చేరడాన్ని ‘ఘర్ వాపసీ’గా ఆమె అభివర్ణించారు. ప్రస్తుతం సింధియా పరిస్థితి చూస్తుంటే.. తనకు తల్లి విజయరాజే గుర్తుకువస్తున్నారని ఉద్వేగానికి గురయ్యారు. ‘‘మేమేమీ పిచ్చివాళ్లం కాదు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తను నిజంగా పెద్ద ముందడుగే వేశాడు’’అని పేర్కొన్నారు.(‘సింధియా’ రాజీనామాపై ప్రశాంత్ కిషోర్ ట్వీట్) బుధవారం యశోధరా రాజే ఎన్డీటీవీతో మాట్లాడుతూ... ‘‘మా అమ్మ, మహారాణి విజయారాజేకు ప్రజలు, ఎమ్మెల్యేలు ఎంతో గౌరవం ఇచ్చేవారు. అయితే ద్వారకా ప్రసాద్ మిశ్రా కారణంగా ఆమె కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. అసలు ఆయన అమ్మకు కనీస గౌరవం కూడా ఇచ్చేవాడు కాదు. ఈ విషయం గురించి ఆమె ఎంతో బాధపడింది. అంతిమంగా పార్టీని వీడింది. ఇప్పుడు నా మేనల్లుడికి కూడా కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తను ప్రజల కోసం పనిచేశాడు. పార్టీకి జీవితాన్ని అంకితం చేశాడు. సీనియర్ నాయకుడిగా, మంత్రిగా బాధ్యతగా వ్యవహరించాడు. తను నిజంగా సమర్థవంతుడైన నాయకుడు కాకపోయినట్లయితే బీజేపీ తనను ఎందుకు చేర్చుకుంటుంది’’ అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.(బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ ) కాగా గ్వాలియర్ రాజవంశీయుడైన జ్యోతిరాదిత్య సింధియా 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్వాలియర్ రాజమాత విజయారాజే సింధియా రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆమె కుమార్తెలు వసుంధరా రాజే, యశోధర బీజేపీలో ఉన్నప్పటికీ.. కుమారుడు మాధవరావు సింధియా మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన 2001లో విమాన ప్రమాదంలో మరణించగా.. గుణ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. అయితే 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర వహించిన జ్యోతిరాదిత్యను సీఎం పదవి వరిస్తుందని అంతా ఆశించారు. అయితే అనుభవజ్ఞుడైన కారణంగా కమల్‌నాథ్ వైపు మొగ్గుచూపిన అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని ఆయనకే కట్టబెట్టింది. అనంతరం గుణ ఎంపీగా బరిలోకి దిగి సింధియా ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీని వీడుతున్నట్లు జ్యోతిరాదిత్య ప్రకటన చేశారు.(ఆ విషయం చరిత్రే చెబుతోంది: మహానార్యమన్) -
అందుకే సింధియా రాజీనామా: మాణిక్య
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సింధియా రాజీనామా, పార్టీ నుంచి బహిష్కరణ, ఎమ్మెల్యేల తిరుగుబాటు తదితర అంశాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో 18 ఏళ్లపాటు పార్టీకి సేవలు అందించినప్పటికీ సింధియాకు సముచిత గౌరవం దక్కనందువల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిపుర రాజవంశీయుడు, సింధియా కజిన్ ప్రద్యోత్ మాణిక్య దేవ్ వర్మన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీని కలవడానికి సింధియా గత కొన్నినెలలుగా తీవ్రంగా ప్రయత్రిస్తున్నారు. అయినా ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. రాహుల్ మా మాటలు వినాలని అనుకోకపోతే.. అసలు మమ్మల్ని పార్టీలోకి ఎందుకు తీసుకువచ్చినట్లు’’ అని మాణిక్య ప్రశ్నించారు. కాగా త్రిపుర కాంగ్రెస్ చీఫ్‌గా వ్యవహరించిన మాణిక్య కొన్ని నెలల క్రితం ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే.(‘సింధియా’ రాజీనామాపై ప్రశాంత్ కిషోర్ ట్వీట్) ఇక ప్రస్తుతం సింధియా నిర్ణయం సరైనదేనన్న మాణిక్య... ‘‘ గత రాత్రి నేను సింధియాతో మాట్లాడినపుడు.. మా నాయకుడి అపాయింట్మెంట్ దొరికే అవకాశం లేదని నాకు చెప్పాడు. నిజానికి రాహుల్ గాంధీ నుంచి పార్టీ పగ్గాలు చేజారినపుడే ఒక్కసారిగా అనేక మార్పులు సంభవించాయి. అకస్మాత్తుగా మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది. అప్పటి నుంచే పలువురు ‘ప్రముఖులు’ కీలక విషయాల్లో మా నిర్ణయాలు, విధానాలను వ్యతిరేకించడం మొదలుపెట్టారు’’ అని తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. అందుకే యువ నాయకులు ఒక్కక్కరుగా పార్టీని వీడుతున్నారని అభిప్రాయపడ్డారు. కాగా మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన జ్యోతిరాదిత్య సింధియా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. సింధియా సహా పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో మధ్యప్రదేశ్‌లో కాషాయ పార్టీ అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మాత్రం తన సర్కారు వచ్చిన ఢోకా ఏమీ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.(ఆ విషయం చరిత్రే చెబుతోంది: మహానార్యమన్) -
రిక్త హస్తం
-
‘సింధియా’ రాజీనామాపై ప్రశాంత్ కిషోర్ ట్వీట్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించే వారు... జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడటాన్ని అతిపెద్ద కుదుపుగా ఎలా భావిస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘ఇంటి పేరు కారణంగా... కాంగ్రెస్ అధినాయకత్వాన్ని తప్పుబట్టేవారు... ఇప్పుడేమో సింధియా పార్టీని వీడితే.. పార్టీకి ఇదొక ఝలక్ అంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే.. జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇంటిపేరు కారణంగానే మాస్ లీడర్, రాజకీయవేత్త, పాలకుడిగా ఉన్నారు’’అని ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధియా విజయాలకు కేవలం కుటుంబ చరిత్రే కారణమని జ్యోతిరాదిత్య అనుచరులు భావించడం సరికాదన్న ఉద్దేశంతో ఆయన ఈవిధంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. (బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ ) కాగా గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా... మంగళవారం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్లుగా పార్టీకి సేవలందించిన ఆయన.. ఇకపై మరింత మెరుగ్గా ప్రజాసేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా 2001లో విమాన ప్రమాదంలో మరణించడంతో.. గుణ లోక్‌సభ స్థానానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి జ్యోతిరాదిత్య భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర వహించిన జ్యోతిరాదిత్యకి సీఎం పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అనుభవజ్ఞుడైన కారణంగా కమల్‌నాథ్‌కి దక్కింది. ఎంపీగా 2019లో ఓటమి చవిచూడడంతో పార్టీ జ్యోతిరాదిత్యని పక్కన పెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తోంది.(ఆ విషయం చరిత్రే చెబుతోంది: మహానార్యమన్) ఇక అనేక ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గ్వాలియర్ రాజమాత విజయరాజే.. ఆ తర్వాత జనసంఘ్‌లో చేరిన విషయం తెలిసిందే. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్న ఆమె ఏనాడు ఓటమిని చవిచూడలేదు. ఇక ఆమె కుమారుడు మాధవరావు బీజేపీ నుంచి పోటీ చేసి 26 ఏళ్లకే ఎంపీ అయ్యారు. అయితే అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి.. కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ క్రమంలో... ఇన్నాళ్లుగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన జ్యోతిరాదిత్య ప్రస్తుతం పార్టీని వీడారు. ఇక ఆయన మేనత్తలు వసుంధర రాజే(రాజస్తాన్ మాజీ సీఎం), యశోధర బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. Amazing that those who usually find fault with #Gandhis leading Congress because of their surname are finding a #scindia leaving #INC as big jolt for the party! Fact is but for his surname even @JM_Scindia has little to show as mass leader, political organiser or administrator. — Prashant Kishor (@PrashantKishor) March 10, 2020 -
జ్యోతిరాదిత్యపై డిగ్గీరాజా సెటైర్లు..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టినందునే జ్యోతిరాదిత్య సింధియా బీజేపీకి దగ్గరయ్యారనే వాదనను ఆ పార్టీ తోసిపుచ్చింది. జ్యోతిరాదిత్యను పార్టీ ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. గ్వాలియర్ ప్రాంతంలో ఏ కాంగ్రెస్ నేతను అడిగినా అక్కడ గడిచిన 16 నెలల్లో సింథియా అనుమతి లేకుండా ఏ పనీ జరగదని చెబుతారని అన్నారు. మన బ్యాంకులు కుప్పకూలుతూ, మన రూపాయి దిగజారుతూ, ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు రేగుతూ, సామాజిక సామరస్యం దెబ్బతింటున్న వేళ ఆయన (జ్యోతిరాదిత్య) మోదీ, షాల నేతృత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారని డిగ్గీరాజా వ్యంగ్యోక్తులు విసిరారు. మోదీ, షాల ప్రాపకంలో చల్లగా ఉండు మహరాజ్ అంటూ జ్యోతిరాదిత్యను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు జ్యోతిరాదిత్యకు మద్దతుగా 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తే మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. జ్యోతిరాదిత్య తోడ్పాటుతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు బెంగళూర్‌లో బస చేసిన రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చదవండి : ‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’ -
‘నాన్న నిర్ణయం పట్ల ఎంతో గర్వంగా ఉంది’
భోపాల్: తండ్రి నిర్ణయం తనకు గర్వకారణమని జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానార్యమన్ సింధియా అన్నాడు. తమ కుటుంబం ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని.. ప్రజాసేవచేయడమే తమకు ముఖ్యమని పేర్కొన్నాడు. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌ను వీడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మహానార్యమన్... ‘‘నాన్న ఈ స్టాండ్ తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఇందుకు ఎంతో ధైర్యం కావాలి. మా కుటుంబానికి అధికార దాహం లేదని చరిత్రే చెబుతోంది. భారత్, మధ్యప్రదేశ్‌లో ప్రభావవంతమైన మార్పు తీసుకువస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం’’ అని ట్వీట్ చేశాడు.(బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ ) కాగా మహానార్యమన్ కూడా తండ్రి బాటలోనే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. డెహ్రాడూన్‌లో హై స్కూల్ విద్యనభ్యసించిన మహానార్యమన్.. అమెరికాలో ఎంబీఏ చేశాడు. పార్టీ ప్రచార కార్యక్రమాలకు తండ్రి జ్యోతిరాదిత్యతో కలిసి హాజరైన మహానార్యమన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇక సమకాలీన రాజకీయ అంశాలపై సోషల్ మీడియాలో స్పందించే మహానార్యమన్.. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక ట్వీట్లు చేశాడు. ప్రస్తుతం తన తండ్రి అదే పార్టీలో చేరుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా 1994లో మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను వివాహమాడిన జ్యోతిరాదిత్యాకు కుమారుడు మహానార్యమన్, కుమార్తె అనన్య సింధియా ఉన్న విషయం తెలిసిందే.(కాంగ్రెస్‌కు సింధియా గుడ్‌బై.. ఏం జరుగనుంది?) I am proud of my father for taking a stand for himself. It takes courage to to resign from a legacy. History can speak for itself when I say my family has never been power hungry. As promised we will make an impactful change in India and Madhya Pradesh wherever our future lies. — M. Scindia (@AScindia) March 10, 2020 ఇక మంగళవారం తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన జ్యోతిరాదిత్య.. అనంతరం ఆయనతో కలిసి ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. చర్చల అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ పంపారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నానని.. ఇక ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని సింధియా లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఇంకా పార్టీలో కొనసాగితే దేశ, రాష్ట్ర ప్రజలకు సేవ చేయలేనని అనిపిస్తోంది కాబట్టి.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మెరుగని భావిస్తున్నానని తెలిపారు. (ఆపరేషన్ కమల్.. కాంగ్రెస్‌కు రంగుపడింది) అదే విధంగా ఇన్నాళ్లూ దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సోనియాకు ఆయన కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి సింధియా బహిష్కరణను సోనియా ఆమోదించినట్లు ఏఐసీసీ తెలిపింది. ఇక సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న సింధియా రాజీనామా చేయడం... ఆయన వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్‌కు లేఖలు పంపడంతో సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. (సింధియా టైమ్స్) -
ఆపరేషన్ కమల్.. కాంగ్రెస్‌కు రంగుపడింది
దేశమంతా హోలీ సంబరాల్లో ఉన్న వేళ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇటు కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభం.. అటు బీజేపీలో సంబరాలు.. వెరసి మధ్యప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని మోదీతో భేటీ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించగానే బీజేపీ కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. మరోవైపు తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. అధికార కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తూ 22 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు లేఖలు పంపడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఉత్కంఠ కొనసాగుతుండగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆరుగురు మంత్రులను తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం కమల్‌నాథ్.. గవర్నర్ లాల్జీ టాండన్‌కు లేఖ రాశారు. మొత్తంగా 15 నెలల కమల్‌నాథ్ సర్కారు పాలన కూల్చివేత అంచున ఊగిసలాడుతోంది. న్యూఢిల్లీ/భోపాల్: దేశమంతా హోలీ వేడుకల్లో ఉన్న వేళ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మధ్యప్రదేశ్‌లో ఏర్పాటైన 15 నెలల కాంగ్రెస్ సర్కారు పతనం అంచున చేరింది. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌ను వీడటం.. ఆ వెంటనే ఆయనకు మద్దతుగా 22 మంది శాసన సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్‌కు లేఖలు పంపడంతో సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రాజీనామాలు చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు ఆమోదం పొందితే కాంగ్రెస్ ప్రభుత్వం 92 మంది సొంత ఎమ్మెల్యేలతో మైనార్టీలో పడుతుంది. కాంగ్రెస్‌కు ప్రస్తుతం మద్దతిస్తున్న ఏడుగురు ఇతర సభ్యుల మద్దతు కీలకం కానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ శాసన సభా పక్ష సమావేశాలను నిర్వహించి తమ ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి తరలించాలని నిర్ణయించాయి. అమిత్ షాతో భేటీ అనంతరం ప్రధాని వద్దకు.. సింధియా ఉదయం తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం వారిద్దరూ కలసి ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుని ఆయనతో దాదాపు గంటపాటు చర్చించారు. అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియాకు సింధియా లేఖ పంపారు. ‘18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నా. ఇక ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ప్రస్తుత పరిస్థితిల్లో ఇంకా పార్టీలో కొనసాగితే దేశ, రాష్ట్ర ప్రజలకు సేవ చేయలేనని అనిపిస్తోంది. నా ప్రజలు, కార్యకర్తల కోసం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మెరుగని భావిస్తున్నా. ఇన్నాళ్లూ దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా’ అని లేఖలో సింధియా పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి సింధియా బహిష్కరణను సోనియా ఆమోదించినట్లు ఏఐసీసీ తెలిపింది. రాజ్యసభకు జ్యోతిరాదిత్య! జ్యోతిరాదిత్య నేడో రేపో బీజేపీలో చేరవచ్చని, ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు ఈనెల 13తో గడువు ముగుస్తున్నందున ఈలోపే ఆయన కచ్చితంగా బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. సింధియా నిర్ణయాన్ని ‘ఘర్ వాపసీ’గా ఆయన మేనత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధరా రాజే అభివర్ణించారు. తన తండ్రి, దివంగత కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా 75వ జయంతి రోజే జ్యోతిరాదిత్య పార్టీతో బంధాన్ని తెంచుకోవడం గమనార్హం. స్వతంత్రులు, ఇతరులు కీలకం ప్రస్తుతం 228 మంది ఎమ్మెల్యేలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తిరుగుబాటుకు ముందు కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉండగా తాజా రాజీనామాలతో సొంత బలం 92కి పడిపోయింది. సభలో బల నిరూపణకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 104 కాగా బీజేపీకి ఇప్పటికే 107 మంది సభ్యులున్నారు. నలుగురు స్వతంత్రులతోపాటు ఇద్దరు బీఎస్పీ సభ్యులు, సమాజ్‌వాదీ పార్టీకి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటివరకు మద్దతిస్తున్నారు. తాజాగా బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ కుశావహ, సమాజ్‌వాదీ శాసన సభ్యు డు రాజేశ్ శుక్లా మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్తో సమావేశం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్‌కు లేఖలు అందించిన బీజేపీ నేతల బృందం కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన 19 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను బీజేపీ నేతల బృందం మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతికి అందచేసింది. రాజీనామా లేఖలు అందాయని, నియమ నిబంధనలను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తెలిపారు. సీనియర్ బీజేపీ నేత భూపేంద్రసింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలతో ప్రత్యేక విమానంలో భోపాల్ చేరుకున్నట్లు పార్టీ ఎమ్మెల్యే విశ్వాస్ సారంగ్ తెలిపారు. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగా రాజీనామాలు అందించారు. ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ, భూపేంద్రసింగ్, నరోత్తమ్ మిశ్రా, సారంగ్‌తో కూడిన బృందం స్పీకర్ నివాసానికి చేరుకుని కాంగ్రెస్ సభ్యుల రాజీనామాలను అందచేసింది. ఒకవైపు ఈ ఉత్కంఠ కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్ రాజీనామా చేసిన ఆరుగురు మంత్రులను తక్షణమే తొలగించాలని కోరుతూ కమల్‌నాథ్ గవర్నర్‌కు లేఖ రాశారు. పోలీస్ రక్షణ కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు పోలీస్ రక్షణ కల్పించాలని కోరుతూ బెంగళూరు చేరుకున్న 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక డీజీపీకి లేఖ రాశారు. ఓ అత్యవసర పని నిమిత్తం తాము కర్ణాటకకు స్వచ్ఛందంగా వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. బెంగళూరు పరిసరాల్లో తాము స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా భద్రత కల్పించాలని ఈనెల 9వ తేదీతో ఉన్న లేఖలో కోరారు. వీరిలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు సింధియాను బుజ్జగించేందుకు రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను దూతగా పంపినా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఆ యత్నాలు ఫలించలేదని తెలిపాయి. ‘మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం త్వరలోనే పరిష్కారమై నేతల మధ్య తలెత్తిన విబేధాలు ముగుస్తాయని భావిస్తున్నా. ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు రాష్ట్రానికి స్థిరమైన సర్కారు అవసరం’అని సచిన్ పైలట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. నిజమైన కాంగ్రెస్ నేతలెవరూ పార్టీని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్లరని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు మంగళవారం జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్‌రావ్ సింధియా జయంతి సందర్భంగా ఆయన రాజకీయ చాణక్యుడని ప్రశంసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ట్వీట్ చేసింది. మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా ట్వీట్ చేసిన వారిలో ఉన్నారు. ఎగసిన అసంతృప్తి: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పాత తరానికి చెందిన సీఎం కమల్‌నాథ్‌తో సింధియాకు దీర్ఘకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికల అనంతరం స్వల్ప మెజార్టీతో కమల్‌నాథ్ పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వంలో సింధియా మద్దతుదారులను పక్కనబెట్టడం, రాష్ట్ర కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు కూడా దక్కకపోవడంతో ఆయన శిబిరంలో అసంతృప్తి రాజుకుంది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కూడా ఈ విషయాలను పట్టించుకోకపోవడంతో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాజా పరిణామాలతో నేతలను ఏకతాటిపై నడపటంలో నాయకత్వ లేమి మరోసారి బయటపడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. లక్నో హోలీ వేడుకల్లో గవర్నర్ లాల్జీ రాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్నామని, ఏ నిర్ణయమైనా రాజ్‌భవన్ చేరుకున్నాక తీసుకుంటానని లక్నోలో హోలీ వేడుకల్లో పాల్గొన్న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నేను ప్రేక్షకుడిని మాత్రమే. అక్కడకు (భోపాల్) చేరుకున్నాక అన్నీ గమనించాక స్పందిస్తా’అని చెప్పారు. సర్కార్‌కు ముప్పులేదు: సీఎం కమల్ ‘‘నా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నా. వారిని బందీలుగా ఉంచారు. లేదంటే ఎమ్మెల్యేలు బెంగళూరులో ఎందుకు ఉంటారు?’అని సీఎం కమల్‌నాధ్ మంగళవారం రాత్రి పేర్కొన్నారు. తమ రాజీనామా లేఖలను బెంగళూరులోని రిసార్ట్‌లో మీడియాకు చూపిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చదవండి: సింధియా టైమ్స్ బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ -
సింధియా టైమ్స్
న్యూఢిల్లీ: అది 2018 డిసెంబర్ 13.. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్నాక ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందా అని జోరుగా చర్చలు జరుగుతున్న వేళ. ఆ టైమ్‌లో రాహుల్‌గాంధీ కుడిచేత్తో జ్యోతిరాదిత్య సింధియాని, ఎడమ చేత్తో కమల్‌నాథ్ చేయి పట్టుకొని ఉన్న ఫొటోతో పాటు టాల్‌స్టాయ్ ప్రముఖ కొటేషన్ ‘అత్యంత శక్తిమంతమైన పోరాటయోధులు ఇద్దరే. ఒకరు సహనం, మరొకరు సమయం’’ అని షేర్ చేశారు. అది జరిగిన సరిగ్గా 15 నెలలు తర్వాత సింధియాలో సహనం నశించింది. పార్టీని వీడాల్సిన టైమ్ కూడా వచ్చిందని అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన దగ్గర్నుంచి సింధియా చాలా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ఏకాకిగా మారిపోయారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కొత్త జవసత్వాలు కల్పించడానికి ఎనలేని కృషి చేసి పార్టీకి ఒక జ్యోతిగా మారిన సింధియా సీఎం పదవిని ఆశించారు. కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ చేసిన జుగల్బందీ రాజకీయాలతో ఆయన ఆశించిన పదవి దక్కలేదు. సింధియాకు అనుభవం లేదన్న ఒకే ఒక్క కారణంతో సీనియర్ నేత కమల్‌నాథ్‌కు సీఎం పీఠం అప్పగించారు. సోనియాగాంధీ. పీసీసీ అధ్యక్ష పదవిని కూడా పార్టీలో ఏకాభిప్రాయం లేదన్న కారణంతో తిరస్కరించారు. సీఎం కమల్‌నాథ్ ఆయనతో ఎప్పుడూ కలిసి నడవలేదు. పార్టీపైన కూడా కమల్‌నాథ్ ఆధిపత్యమే కొనసాగింది. ఆ తర్వాత జ్యోతిరాదిత్యని పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇది ఒక రకంగా పనిష్మెంట్ అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఉనికి కూడా లేని ప్రాంతానికి ఇన్చార్జ్గా నియమాకం జ్యోతిరాదిత్యకు మింగుడుపడలేదు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. అలాంటి సమయంలోనే బీజేపీ ఆయనతో సంప్రదింపులు జరిపింది. అప్పటికే కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ చేస్తున్న రాజకీయాలతో పార్టీలో తనకెలాంటి భవిష్యత్ ఉండదని భావించిన జ్యోతిరాదిత్య సింధియా ఆపరేషన్ కమల్‌కి ఆకర్షితులైనట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు. సింధియాని రాజ్యసభకు పంపించి ఎన్డీయే కేబినెట్లో మంత్రి పదవి ఇస్తారని, చౌహాన్ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌లో సర్కార్ ఏర్పడితే సింధియా వెంట వచ్చే ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో మంత్రి పదవులివ్వడానికి బీజేపీ అధిష్టానం అంగీకరించినట్టు సమాచారం. ఏడాదిగా సంకేతాలు జ్యోతిరాదిత్య పార్టీ వీడి కాషాయం గూటికి చేరుతారని ఏడాదిగా సంకేతాలు వెలువడుతూనే ఉన్నాయి. 2019 జనవరిలో ఆయన బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలుసుకున్నారు. ఆ తర్వాత అది మర్యాదపూర్వక సమావేశమనేనని ఇరువురు నేతలు చెప్పుకున్నారు. 2019 నవంబర్‌లో ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల అకౌంట్లలో తన బయోడేటా నుంచి కాంగ్రెస్ పార్టీ పేరుని, ప్రధాన కార్యదర్శి అన్న హోదాను తొలగించి సామాజికవేత్త, క్రికెట్ ప్రేమికుడు అని రాసుకున్నారు. ఇక సోనియా, రాహుల్ నిర్ణయాలు, వివిధ అంశాల్లో పార్టీ వైఖరి కూడా జ్యోతిరాదిత్యకు మింగుడుపడలేదు. కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుపై కూడా ఆయన బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా చాలా కాలంగా జ్యోతిరాదిత్య పార్టీని ఏ క్షణంలోనైనా వీడుతారన్న ప్రచారమైతే జరుగుతోంది. నాడు మోదీ మ్యాజిక్‌ను తట్టుకుని మధ్యప్రదేశ్ గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా మాధవరావు సింధియా దంపతులకు 1971, జనవరి 1న బొంబాయిలో జన్మించారు. డెహ్రాడూన్ డూన్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేశారు. స్టాన్‌ఫర్డ్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేశారు.2001లో హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి మాధవరావు మరణించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో తండ్రి మృతితో ఖాళీ అయిన గుణ స్థానం మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మన్మోహన్ కేబినెట్లో కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయమంత్రిగా కూడా పని చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మ్యాజిక్‌ను తట్టుకొని లోక్‌సభకు ఎన్నికయ్యారు. -
కాంగ్రెస్ స్వయంకృతం
కాంగ్రెస్‌కు సాక్షాత్తూ అధిష్టానమే సమస్యగా మారిన వేళ మధ్యప్రదేశ్‌లోని ఆ పార్టీ విభాగంలో ఉన్నట్టుండి ముసలం బయల్దేరి, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పుట్టి మునగడం ఎవరికీ ఆశ్చర్యం కలి గించదు. అక్కడేం జరుగుతోందో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని అయోమయంలో సారథులు కూరుకుపోయివుండగానే, కమల్‌నాథ్ కేబినెట్లోని ఆరుగురు మంత్రులతోసహా 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు ఎగిరిపోయారు. ఈ సంఖ్య చూస్తుండగానే 21కి చేరింది. వారంతా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తామంటున్నారు. ఈ డ్రామాకు కథానాయకుడైన జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌కు చెల్లుచీటీ ఇచ్చి బీజేపీవైపు అడుగులేస్తున్నారు. ఆ పార్టీ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నిక కావడం సింధియాకు ఇక రోజుల్లో పని. రాజీనామా సంగతి తెలిశాక, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఒక ప్రకటన చేసి పరువు కాపాడుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ నాయకత్వం! ఏమైతేనేం 230మంది సభ్యులుండే అసెంబ్లీలో 114మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ బలం 93కి పడిపోయింది. మరో 30మంది కాషాయ తీర్థం తీసుకోవడానికి సంసిద్ధులవుతున్నారని బీజేపీ నేతలు చెప్పే మాటల్లో నిజమెంతోగానీ... ఈ దశలో స్పీకర్‌ది కీలకపాత్ర. మధ్యప్రదేశ్ డ్రామా ఎన్నాళ్లు కొనసాగాలో ఆయన చర్యలే నిర్దేశిస్తాయి. ఆ తర్వాతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా లేక అర్ధాంతరంగా ఎన్నికలొస్తాయా అన్నది తేలుతుంది. ఇదంతా బీజేపీ కుట్రని ఎంపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆరోపిస్తున్నారు. కానీ ఈ పరిణామాలకు బీజేపీని నిందించి ప్రయోజనం లేదు. ఏమీ లేని గోవాలోనే పావులు కదిపి అధికారం చేజిక్కించుకోగలిగిన బీజేపీ... అధికారం అంచుల వరకూ వెళ్లి ఆగిపోయిన మధ్యప్రదేశ్‌లో మౌనంగా ఉంటుందనుకోవడం తెలివితక్కువతనం. గతవారం ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అర్ధరాత్రి గురుగ్రామ్‌లోని హోటల్‌కు తరలించిన ఉదంతంలో ఎలాగోలా కాంగ్రెస్ పరువు కాపాడుకోగలిగింది. వారందరినీ వెనక్కు తీసుకు రాగలిగింది. ఈసారి మాత్రం పరిస్థితి చేయి దాటిపోయింది. మధ్యప్రదేశ్‌లో పార్టీ కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య, దిగ్విజయ్‌సింగ్ వర్గాలుగా చీలిపోయిందని, ఆ ఇద్దరూ ఏకమై జ్యోతిరాదిత్యను ఇరకాటంలోకి నెట్టారని పార్టీ సారథులకు తెలియందేమీ కాదు. కేబినెట్లో కీలక పదవులన్నీ కమల్‌నాథ్, దిగ్విజయ్ అనుచర ఎమ్మెల్యేలకే దక్కాయి. పర్యవసానంగా జ్యోతిరాదిత్యలో ఏర్పడ్డ అసంతృప్తిని పారదోలడానికి, ఆయన వర్గానికి కూడా తగిన అవకాశాలివ్వడానికి పార్టీ పెద్దలు ప్రయత్నించలేదు. పైపెచ్చు సోనియా, రాహుల్‌గాంధీలను కలిసి తన గోడు వెళ్లబోసుకుందామని సింధియా చేసిన ప్రయత్నం ఫలించలేదు. పార్టీలో తాను సంతృప్తిగా లేనని సింధియా కొద్దికాలంనుంచి పరోక్షంగా చెబుతూనేవున్నారు. కేంద్ర ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేసి కశ్మీర్ పత్రిపత్తిని మార్చినప్పుడు పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యానించి ఆయన కలకలం సృష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీకి దూరంగానే వుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోనే కాదు... అధికారం ఉందా లేదా అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఇలా అంతఃకలహాలతో సతమతమవుతోంది. వాస్తవానికిది కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన పాత తరం నేతలకూ, పార్టీ కోసం శ్రమిస్తూ అందులో తమ భవిష్యత్తును వెదుక్కుంటున్న యువతరానికీ మధ్య సాగుతున్న సంకుల సమరం. చుట్టూ చేరిన వందిమాగధుల బృందగానం తప్ప మరేమీ వినడానికి ఇచ్చగించని అధినేత్రి సోనియాగాంధీకి ఈ యువతరమంటే మొదటినుంచీ అనేకానేక శంకలు. సొంతంగా ఆలోచించేవారన్నా, స్వతంత్రంగా ఎదుగుతారనుకున్నా వారిని దూరం పెట్టడం ఆమె ఒక విధానంగా మార్చుకున్నారు. పార్టీలో యువతరానికి ప్రాధాన్యమిస్తానని, వారసత్వాన్ని పక్కనబెట్టి పనిచేయడం ఒక్కటే ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పిన రాహుల్‌గాంధీ పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడం, అడుగడుగునా తల్లి జోక్యం పెరగడం చూశాక చాన్నాళ్లక్రితమే కాడి పారేశారు. అడపా దడపా మీడియానుద్దేశించి మాట్లాడటం తప్ప పార్టీలో జరిగే ఏ విషయాలు తనకు పట్టనట్టు ఆయన వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వర్గంగా ముద్రపడి, కేవలం అందువల్లనే నిరాదరణకు గురవుతున్న నేతలకు వేరే ప్రత్యామ్నాయం ఏముంటుంది? ఎన్నికలకు ముందు జ్యోతిరాదిత్యకు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించి, ఫలితాల తర్వాత ఆయనకే పట్టం గడతామన్న అభిప్రాయం కలిగించిన కాంగ్రెస్...అటుపై ఆ యువ నాయకుడిని పక్కకు నెట్టి కమల్‌నాథ్‌ని పీఠం ఎక్కించింది. మధ్యప్రదేశ్‌నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యే అవకాశం వుండగా, ఖచ్చితంగా వస్తుందనుకున్న ఒక్క సీటుకూ దిగ్విజయ్‌సింగ్ కాచుక్కూర్చున్నారు. ఆయనకు అది దక్కకుండా చేయడానికి ప్రియాంకగాంధీ పోటీ చేయాలన్న డిమాండు ఈమధ్యే బయల్దేరింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన జ్యోతిరాదిత్య ప్రస్తుత పరిస్థితుల్లో తనకు రాజ్యసభ అవకాశం రావడం అసాధ్యమని గ్రహించివుంటారు. ఈ పార్టీలో తనకు రాజకీయంగా భవిష్యత్తు లేదన్న నిర్ణయానికొచ్చివుంటారు. రాజస్తాన్‌లోనూ సచిన్ పైలెట్‌కు ఇలాంటి పరిస్థితే వుంది. అధికారం లేకుండా బతకలేనని జ్యోతిరాదిత్య నిరూపించారని, అలాంటి నేతలు ఎవరైనా పార్టీని వదిలిపోవచ్చని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చేసిన వ్యాఖ్యానం ఎవరినుద్దేశించి చేసిందో సచిన్ పైలెట్ గ్రహించకపోరు. మధ్యప్రదేశ్ డ్రామా పూర్తయ్యాక రాజస్థాన్‌లో అది మొదలైనా ఆశ్చర్యం లేదు. కనీసం ఈ దశలోనైనా కాంగ్రెస్ అధినాయకత్వం మేల్కొనకపోతే, జనంలో పలుకుబడివున్న నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి దానికి జవసత్వాలు కలిగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించకపోతే పార్టీ కనుమరుగు కావడం ఖాయం. -
సింధియా రాజీనామా : ఆమె చివరి కోరిక నెరవేర్చారు
భోపాల్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, రాహుల్, ప్రియాంక గాంధీలకు అత్యంత సన్నిహితుడిగా, దాదాపు రెండు దశాబ్దాల పాటు నిఖార్సైన కాంగ్రెస్ వాదిగా ముద్రపడ్డ కేంద్రమాజీ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా పార్టీని వీడటం దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. జోతిరాధిత్య తండ్రి మాధవ్‌రావ్ సింధియా తొలుత జన్‌సంఘ్ నుంచి రాజకీయాలను ప్రారంభించిన్పటికీ అనంతరం కాంగ్రెస్‌లో చేరి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు గుర్తింపుపొందారు. మాధవరావ్ మరణం అనంతరం గ్వాలియర్ రాజవంశం బాధ్యతలన్నీ జ్యోతిరాధిత్య సింధియానే చూసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. తండ్రి మరణం అనంతరం రాజకీయ అరంగేట్రం చేసిన సింధియా 2002లో గుణ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. మొత్తం ఆయన నాలుగుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మార్చి 10 వెనుక అసలు కథ.. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన ఆయన.. 2014లో దేశమంతా బీజేపీ గాలి వీచినా గుణలో మాత్రం ఆయన గెలుపొందడం విశేషం. అయితే ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌లో ఉన్న విభేదాల కారణంగా ఎవరూ ఊహించని విధంగా జ్యోతిరాధిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే సింధియా మంగళవారమే రాజీనామా చేయడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. ఆయన తండ్రి మాధవ్‌రావు సింధియా జయంతి ఈరోజే (మార్చి 10) కావడం విశేషం. ఈ విషయాన్ని జ్యోతిరాధిత్య సింధియా స్వయనా మేనత్త బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే వెల్లడించారు. తాజా రాజీనామాపై ఆమె మాట్లాడతూ.. ‘జ్యోతిరాధిత్య కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం సంతోషంగా ఉంది. ఆయన తండ్రి మాధవ్‌రావు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బీజేపీలోకే ఆయన తిరిగి వస్తున్నారు. జన్‌సంఘ్ నిర్మాణంలో మాధవ్‌రావు తల్లి, రాజమాత విజయయి రాజే సింధియా కీలక పాత్ర పోషించారు. తన కుటుంబమంతా సంఘ్‌లోనే కొనసాగాలని ఆమె చివరి కోరిక. దానిని సింధియా నెరవేరుస్తున్నారు’ అని అన్నారు. (రాజ్యసభకు సింధియా.. కేంద్రమంత్రి పదవి!) చిచ్చుపెట్టిన సీఎం పీఠం కాగా 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక సమయంలో తీవ్ర ఆధిపత్య పోరు, నాయకత్వ లోపంతో బాధపడుతున్న సమయంలో కాంగ్రెస్‌కు సింధియా ఆశాదీపంలా కనిపించాడు. అంతాతానై పార్టీని ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చారు. అయితే సీఎం పీఠం తనకే దక్కుతుందని భావించిన సింధియాకు హస్తం అధిష్టానం మొండిచేయి చూపింది. కమల్‌నాథ్‌కు సీఎం పీఠాన్ని అప్పగించింది. అయితే పార్టీలో యువతకు ప్రాతినిధ్యం ఇవ్వడంలో తీవ్రంగా విఫలమైన కాంగ్రెస్ అధిష్టానం.. తనకు సీఎం పదవి ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గత లోక్‌సభ ఎన్నికల్లో గుణ లోక్‌సభ నియోజకవర్గం నుంచిపోటీచేసిన సింధియా.. సిట్టింగ్ స్థానంలో ఘోర పరాజాయాన్ని చవిచూశారు. (మధ్యప్రదేశ్ సంక్షోభంలో మరో ట్విస్ట్) బీజేపీ గూటికి.. మంత్రిపదవి..! అప్పటికే ముఖ్యమంత్రి పీఠం దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న సింధియా కమల్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలకు దిగడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తొలుత పదిమంది ఎమ్మెల్యేలను, ఆ తరువాత ఏకంగా 18 మంది ఎమ్మెల్యేలను తనకు అనుకూలంగా తిప్పుకున్నారు. అనంతరం తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ నేపథ్యంలోనే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి మోదీ మంత్రివర్గంలో ఆయనకు కేంద్రమంత్రి పదవిని సైతం కట్టబెడతారని సమాచారం. -
మధ్యప్రదేశ్ సంక్షోభంలో మరో ట్విస్ట్
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. తాజా సంక్షోభం నేపథ్యంలోనే ఎస్పీ ఎమ్మెల్యే రాజేష్ శుక్లా, బీఎస్పీ ఎమ్మెల్యే రాజీవ్ కుషావా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని వారిని చౌహాన్ కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఎమ్మెల్యేలు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు నలుగురు స్వతంత్ర శాసన సభ్యులతో కూడా బీజేపీ నేతలు మంతనాలు ప్రారంభించారు. తమకి మద్దతు ఇస్తే కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇస్తామనే ఆఫర్‌ను వారి ముందు ఉంచినట్టు సమాచారం. తాజా పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో నెట్టింది. (రాజ్యసభకు సింధియా.. కేంద్రమంత్రి పదవి!) ఇక కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 20 ఎమ్మెల్యేలు తమ రాజీనామాను స్పీకర్‌కు పంపించారు. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉండటంతో వారందరినీ మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎంకు గవర్నర్ టాండన్ లేఖ రాశారు. గవర్నర్ లేఖపై స్పందించిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్ వారిని ఇప్పటికే మంత్రిపదవుల నుంచి తొలగించినట్లు వివరణ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య సింధియా ఢిల్లీ వేదికగా చక్రం తిప్పుతున్నారు. మంగళవారం సాయంత్రం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది. -
రాజ్యసభకు సింధియా.. కేంద్రమంత్రి పదవి!
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువైన జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో సింధియా కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమైపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటల తరువాత బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 20 ఎమ్మెల్యేలు తమ రాజీనామాను స్పీకర్‌కు పంపించారు. రాజీనామా చేసిన వారిలో మంత్రులు కూడా ఉండటంతో వారందరినీ మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎంకు గవర్నర్ టాండన్ లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ.. కేంద్రమంత్రి..! సింధియా అనుచరవర్గంగా భావిస్తున్న రెబల్ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం బెంగళూరు రిసార్టులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా చేసిన వెంటనే వారంతా కూడా గుడ్‌బై చెప్పడంతో తిరుగుబాటు సభ్యులతో కలిసి సింధియా బీజేపీ గూటికి చేరతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా జ్యోతిరాధిత్యను రాజ్యసభకు పంపేందుకు కేంద్ర పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెలఖరులో జరిగే రాజ్యసభ ఎన్నికల్లోనే ఆయన్ని నామినేట్ చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ బీజేపీ చేరితే కేంద్రమంత్రివర్గంలోనూ సింధియాకు చోటు కల్పించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ పెద్దలతో సింధియా అవగహన కుదుర్చుకున్నట్లు తెలిసింది. చిచ్చుపెట్టినే సీఎం పీఠం.. మరోవైపు వరుస ఓటములతో కుదేలవుతున్న గ్రాండ్ఓల్డ్ పార్టీకి సింధియా ఊహించని షాక్ ఇచ్చారు. సీఎం కుర్చి తనదేనంటూ గత ఎన్నికల్లో ప్రచారాన్ని భుజాలకెత్తుకుని ముందుండి నడిపించిన మహరాజ్ సింధియా.. సీఎం సీటు దక్కకపోవడంతో అధిష్టానంపై గతకొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఇదే సరైన సమయంగా భావించి చాకచక్యంగా పావులుకదిపారు. దీంతో కమల్‌నాథ్ సీఎం కుర్చికి సంకటం ఏర్పడింది. సింధియా వ్యూహాలు ఫలించినట్లయితే ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేయకతప్పదు. ఇదిలావుండగా కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయిందని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ శాసనసభ్యులు గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో దేశ రాజకీయాలన్నీ మధ్యప్రదేశ్ చూట్టు తిరుగుతున్నాయి. -
20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. సోమవారం తన వర్గం ఎమ్మెల్యేలతో బెంగళూరుకు మకాం మార్చిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, ఆ వెంటనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. సింధియా రాజీనామా చేసిన వెంటనే.. తన వర్గపు 20మంది ఎమ్మెల్యేలు తమ పదవి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది. (చదవండి : కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా) మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230. అయితే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే మృతి చెందడంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 228కి చేరింది. కాంగ్రెస్ 114, బీజేపీ 107, స్వతంత్రులు 4, బీఎస్పీ 2, ఎస్పీ ఒక ఎమ్మెల్యే బలం కలిగిఉంది. కాంగ్రెస్‌కి స్వతంత్రులు, మిత్రపక్షాలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 20మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోసారి శివరాజ్‌సింగ్ చౌహాన్కే మధ్యప్రదేశ్ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. -
కాంగ్రెస్ పార్టీకి షాక్.. సింధియా రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాధిత్య సింధియా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఉన్న విభేధాల కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.మంగళవారం హోంమంత్రి అమిత్ షాతో కలిసి నరేంద్రమోదీతో భేటీ అయిన సింధియా.. కొద్దిసేపటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తనతో పాటు మరో 17మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకువచ్చారు. వారందరినీ బెంగళూరులోని ఓ రిసార్టుకు తరలించారు. (చదవండి : మోదీని కలిసిన జ్యోతిరాదిత్య సింధియా) సింధియా రాజీనామాతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మరోవైపు సింధియా బీజేపీలో చేరడానికి సర్వం సిద్దమయ్యారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆయన బీజేపీలో చేరబోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నికై కేంద్ర కేబినెట్లోకి వెళ్తారని సమాచారం. ఇక మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోసారి శివరాజ్‌సింగ్ చౌహాన్కే మధ్యప్రదేశ్ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. (చదవండి : ఎవరీ జ్యోతిరాదిత్య సింధియా?) అందుకే రాజీనామా చేశా : సింధియా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని సింధియా పేర్కొన్నారు. 18 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని.. ఏడాది కాలంగా కాంగ్రెస్‌ను వీడాలని ఆలోచిస్తున్నానని చెప్పారు. రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలన్నదే మొదట్నించీ తన కోరక అని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే మరోసారి కొత్తగా తమ పయనం ప్రారంభించాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ఇంతవరకూ తనకు సహకరించిన పార్టీ సహచరులు, కార్యకర్తలకు ధన్యవాదాలని సోనియాగాంధీకి పంపిన లేఖలో సింధియా పేర్కొన్నారు. (చదవండి : కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు) సింధియాపై బహిష్కరణ వేటు మరోవైపు సింధియాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఏఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సింధియా బహిష్కరణకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేసినట్టు పార్టీ అధిష్టానం ఒక ప్రకటనలో పేర్కొంది. -
సింధియా చాణక్యం.. కాంగ్రెస్ కుదేలు!
జ్యోతిరాదిత్య సింధియా.. ఈ ఒక్క పేరే ప్రస్తుతం కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు రుచి చూపించడంలో తీవ్రంగా కృషి చేసిన సింధియా.. ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేయడంలోనూ కీలకపాత్ర పోషించారు. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగు బావుటా ఎగరేసిన 17 మంది ఎమ్మెల్యేలకు క్యాంపు నిర్వహిస్తూ.. కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్ మహారాజు జీవాజీరావ్ సింధియా మనవడు. 1జనవరి 1971లో మాధవ్‌రావ్ సింధియా, మాధవి రాజే సింధియా దంపతులకు ముంబై నగరంలో జన్మించారు. ముంబైనగరంలోని కాంపియన్ స్కూల్, డెహ్రడూన్‌లోని డూన్ స్కూల్లలో పదవతరగతి వరకు చదువుకున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పట్టాపొందారు. స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. 1994లో మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు మహానార్యమన్, కుమార్తె ఉన్నారు. (మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్) తండ్రి మరణంతో రాజకీయాల్లోకి తండ్రి మాధవరావు సింధియా మరణంతో రాజకీయాలలోకి ప్రవేశించారు జ్యోతిరాదిత్య సింధియా. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాధవ్‌రావ్ విమాన ప్రమాదంలో మరణించగా 2001 డిసెంబర్ 18న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2002లో తండ్రి మరణంతో ఖాళీ పడ్డ స్థానంలో బై ఎలక్షన్లో గుణ ఎంపీగా గెలుపొందారు. దేశంలోనే అత్యంత ధనవంతులైన మంత్రులలో ఈయన కూడా ఒకరు. 2008లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా సేవలందించారు. 2009లో స్టేట్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2013 మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టారు. (అందుకే సింధియా మాతో మాట్లాడటం లేదు) 2018 ఎన్నికల తర్వాత సీఎంగా జ్యోతిరాధిత్య సింధియా, కమల్‌నాథ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సింధియా అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించటంతో ముఖ్యమంత్రి పదవి చేజారింది. అప్పటి నుంచి సింధియా సొంతపార్టీపై గుర్తుగా ఉన్నారు. పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సింధియాను రాజ్యసభకు పంపాలని ఆయన వర్గం డిమాండ్ చేయగా.. ఆయన స్థానంలో ప్రియాంకను నామినేట్ చేయాలని మరో వర్గం పట్టబడుతోంది. దీంతో అసంతృప్తికి లోనైన సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరుకు మకాం మార్చారు. వివాదాలు తండ్రి మాధవ్‌రావ్ సింధియాకు చెందిన 20వేల కోట్ల అస్తి తనకే చెందాలని జ్యోతిరాదిత్య సింధియా కోర్టులో కేసువేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ జ్యోతిరాదిత్య మేనత్తలు కోర్టులో కేసు వేశారు. దళిత నేతకు అవమానం జరిగేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీజేపీ నేత నంద కుమార్ సింగ్ చౌహాన్ జ్యోతిరాదిత్య సింధియాపై కేసు పెట్టారు. రాజకీయాల రాజవంశం సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు. గ్వాలియర్ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. -
‘ఐదేళ్లూ అధికారంలో ఉంటాం’
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌పై ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు బావుటా ఎగరవేసిన క్రమంలో పెను సంక్షోభం నెలకొంది. సింధియాకు మద్దతిస్తున్న 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూర్‌లో మకాం వేశారు. కాగా కమల్‌నాథ్ సర్కార్‌కు ఎలాంటి ముప్పూలేదని, కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్ల పరిపాలనను పూర్తిచేస్తుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత పీసీ శర్మ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చలు జరుగుతున్నాయని తమ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభంపై పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ పలువురు పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా హోంమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సింధియా సహకరిస్తారని భావిస్తున్నారు. చదవండి : ‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’ -
మోదీని కలిసిన సింధియా
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాజకీయం మంగళవారం కొత్తమలుపు తిరిగింది. 17 మందిఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు.ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రధానిని కలిశారు. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయం అత్యంత ఆసక్తిగా మారింది. సింధియా బీజేపీలో చేరుతారని..రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర కేబినెట్లో ఆయనకు చోటు కల్పించనున్నారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. (చదవండి : ‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’) కాగా, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. వీరంతా సింధియాకు మద్దతుగా ఇప్పటికే బెంగళూరులోని ఓ రిసార్టులో ఉన్నారు. వీరిని సంప్రందించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారు టచ్‌లోకి రావడంలేదు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. (చదవండి : కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు) దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి -
‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరిస్తే.. వారికే జనమే బుద్ధి చెబుతారని దిగ్గీ రాజా పేర్కొన్నారు. నిజమైన వ్యక్తులే పార్టీలో ఉంటారని.. మిగతా వారు కాంగ్రెస్‌ను వీడి వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తాజా సంక్షోభానికి కారణమని భావిస్తున్న ఆ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.17 మందిఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోన్న సింధియాను కలిసేందుకు తాము ప్రయత్నించామని.. కానీ, అతను అందుబాటులోకి రాలేదని తెలిపారు. సింధియాకు స్వైన్ ప్లూ ఉన్నట్టుంది.. అందుకే తమతో మాట్లాడటం వీలుకావడం లేదు అని తనదైనశైలిలో సెటైర్ వేశారు. (చదవండి : కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు) ‘ఎవరైతే మధ్యప్రదేశ్ ఓటర్ల తీర్పును ధిక్కరిస్తారో.. వారికి ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటికీ పార్టీలోనే ఉంటారు. మధ్యప్రదేశ్‌లో పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. సింథియాను కలిసేందుకు ప్రయత్నించాం. కానీ ఆయనకు స్వైన్ ప్లూ సోకినట్లు చెప్పారు. అందుకే ఆయన మాతో మాట్లాడలేకపోతున్నారు’ అని దిగ్విజయ్ అన్నారు. కాగా, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్యా సింధియా, ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో సోమవారం బెంగళూరుకు వచ్చి, రోడ్డు మార్గంలో బెంగళూరు రాజానుకుంటె సమీపంలో ఉన్న ఓ రిసార్టుకు వెళ్లారు. వీరిని సంప్రందించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారు టచ్‌లోకి రావడంలేదు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. -
కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు
భోపాల్/సాక్షి, బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కీలకనేత జ్యోతిరాదిత్య సింధియా, ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం బెంగళూరుకు మకాం మార్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలను వలలో వేసుకుంటోందంటూ ఇటీవల కాంగ్రెస్ ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగివచ్చి సర్కారుకు మద్దతు పలకడం తెలిసిందే. అసెంబ్లీలో బొటాబొటీ మెజారిటీ ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఈ పరిణామం షాక్ ఇచ్చింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. రిసార్టులో మకాం కాంగ్రెస్ అసంతృప్త నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో సోమవారం బెంగళూరుకు వచ్చి, రోడ్డు మార్గంలో బెంగళూరు రాజానుకుంటె సమీపంలో ఉన్న ఓ రిసార్టుకు వెళ్లారు. ఆరోగ్య, కార్మిక, రవాణా, మహిళా శిశు సంక్షేమ, ఆహార, పౌర సరఫరాలు, విద్యా శాఖలకు చెందిన ఆరుగురు మంత్రులు తులసి సిలావత్, మహేంద్ర సింగ్ సిసోడియా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ఇమార్తీ దేవి, ప్రద్యుమ్నసింగ్ తోమర్, ప్రభురా చౌధరితోపాటు ఎమ్మెల్యేలు సింథియా వెంట ఉన్నారు. వీరి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండగా, సింథియా మాత్రం ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం లేదని పీటీఐ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో జ్యోతిరాదిత్య సింధియా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్యతో ఫోన్లో మాట్లాడారు. బెంగళూరు వచ్చిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో లేరని సిద్ధరామయ్య చెప్పినట్లు సమాచారం. అనంతరం మాజీ మంత్రి జి.పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావుకు భోపాల్ రావాల్సిందిగా నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. ఏమిటీ సమస్య? సీఎం కమల్‌నాథ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా నిర్వహిస్తున్నారు. ఈ పదవి కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం మూడు రాజ్యసభ (కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన ప్రభాత్ ఝా, సత్యనారాయణ్ జతియా) సీట్ల కోసం ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత బలాబలాల ప్రకారం.. కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకోవడం ఖాయం. తాజా పరిణామంతో కాంగ్రెస్‌కు మూడో సీటు దక్కడం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ యత్నిస్తోందనే అనుమానాలు ఉన్నాయి. పరిస్థితిని పార్టీ చీఫ్ సోనియాకు వివరించేందుకు కమల్‌నాథ్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. ఆయన 12న తిరిగి రావాల్సి ఉంది. నేడు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ 16న రాష్ట్ర బడ్జెట్, 26న రాజ్యసభ ఎన్నికలపై చర్చించేందుకు మంగళవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కోల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన జరిగిన బీజేపీ సమావేశానికి సైతం వీరు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ నేతల్లోనూ ఉత్కంఠ పెరిగింది. రెండు రాజ్యసభ సీట్ల కోసం పార్టీ నేతలు రాంమాధవ్, కైలావ్ విజయ్‌వర్గీయ సహా 22 మంది పేర్లను సోమవారం రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపింది. -
తిరుగుబాటు: మోదీతో సింధియా భేటీ..!
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి 9: 30 నిమిషాల అనంతరం ఈ భేటీ జరుగనుందని.. బీజేపీ నేతలు ప్రకటన చేశారు. కాగా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ 18 ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. వీరందరూ సింధియా అండతో రెబెల్ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే మోదీ, అమిత్ షాతో సింధియా భేటీ జరుగుతుండటం జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. -
రాజకీయ సంక్షోభం: 18 ఎమ్మెల్యేలు మిస్సింగ్
భోపాల్ : సంక్షోభం దిశగా మధ్యప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. గతవారం పదిమంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మొదలైన ఈ వ్యవహరం సోమవారం నాటికి మరో కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గంలోని 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 6 మంది కేబినెట్ మంత్రులు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. అయితే వీరంతా ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలివెళ్లినట్టు తెలుస్తోంది. వీరందరూ సింధియా అండతో రెబెల్ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింధియాతో కలిసి బీజేపీ కుట్రపన్నిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు జరుగుతున్నా సింధియా ఢిల్లీలోనే ఉండిపోయారు. బీజేపీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంక్షోభానికి సింధియానే కారణమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం అనుమానిస్తోంది. మరోవైపు కమల్‌నాథ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో సరపడ బలం లేదని బీజేపీ వాదిస్తోంది. ప్రభుత్వంపై చాలామంది సభ్యులు అసంతృప్తితో ఉన్నారని చెబుతోంది. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సింధియా వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తునట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 114 మంది ఎమ్మెల్యేలను గెలుపొంది.. స్వతంత్రులు, బీఎస్పీ సభ్యుల మద్దతుతో ప్రభుత్వం నెట్టకొస్తోంది. బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో ఓ పదిమంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
జ్యోతిరాదిత్య X కమల్‌నాథ్
న్యూఢిల్లీ/గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో రైతు రుణ మాఫీ, ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ వంటి ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చకుంటే ఆందోళనలు చేపడతామంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా చేసిన హెచ్చరికపై రాష్ట్ర సీఎం కమల్‌నాథ్ స్పందించారు. ‘ఆయన (సింధియా) తనకు నచ్చినట్లు చేయొచ్చు. ఆయన్ను ముందుగా ఆందోళనలకు దిగనివ్వండి. చూద్దాం’ అని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదేళ్లకు వర్తించేదే తప్ప ఐదు నెలలకు కాదంటూ వ్యాఖ్యానించారు. పంటనష్టం సర్వే, రైతు రుణమాఫీ విషయంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరచూ సింధియా తప్పుపడుతున్నారు. సోనియానే చూసుకుంటారు! మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని పార్టీ చీఫ్ సోనియా నియమిస్తారని ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్ శనివారం గ్వాలియర్‌లో చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు రేసులో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. -
కాంగ్రెస్‌లో సింధియా కలకలం
భోపాల్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియా మరోసారి వార్తల్లోకెక్కారు. తన ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ పార్టీ పేరు తీసేసి ప్రజాసేవకుడు, క్రికెట్ ప్రేమికుడు అని పెట్టుకోవడం రాజకీయంగా కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి కమల్నాథ్కీ, జ్యోతిరాదిత్యకి మధ్య విభేదాలు ఉన్నాయని, త్వరలోనే ఆయన పార్టీ వీడతారంటూ పలు ఊహాగానాలు చెలరేగాయి. అయితే జ్యోతిరాదిత్య మాత్రం అదేమీ లేదంటూ కొట్టి పారేశారు. అతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా భూతద్దంలో పెట్టి చూస్తుందని మండి పడ్డారు. నెలరోజుల క్రితమే తాను ట్విట్టర్ అకౌంట్లో ప్రొఫైల్ మార్చానని,కాంగ్రెస్ పార్టీతో తాను తెగతెంపులు చేసుకున్నట్టు వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ట్వీట్ చేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంతో కృషి చేసిన జ్యోతిరాదిత్య సింధియా సీఎం పదవిని ఆశించి భంగపడ్డారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మరో కీలక నేత దిగ్విజయ్‌సింగ్‌లకు ప్రాధాన్యం ఇచ్చి తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనలో జ్యోతిరాదిత్య ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. -
‘బ్రేకింగ్ న్యూస్: 20 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్’
భోపాల్: మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా కొనసాగుతుండగానే మధ్యప్రదేశ్‌లో కలకలం రేగింది. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారని వచ్చిన వదంతులతో రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. హిందీ దినపత్రిక ‘నవభారత్ టైమ్స్’ లక్నో రెసిడెంట్ ఎడిటర్ సుధీర్ మిశ్రా దీని గురించి ఈ ఉదయం ట్వీట్ చేయడంతో ఈ వదంతులు వ్యాపించాయి. ‘బ్రేకింగ్ న్యూస్: మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాకు సన్నిహితులైన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. వారందరూ రెండు రోజుల నుంచి ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింద’ని ఆయన ట్వీట్ చేశారు. తర్వాత గంటలోపు ఈ ట్వీట్‌ను తొలగించారు. అయితే ఈ ట్వీట్ అందరికీ చేరిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వెంటనే దీనిపై స్పందించింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పనితీరుపై సింధియా, ఆయన మద్దతుదారులు అసంతృప్తిగా ఉన్నారని, ఏదోక సమయంలో వీరంతా తిరుగుబాటు చేసే అవకాశముందని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేశ్ వాజపేయి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారని వచ్చిన వార్తలను జ్యోతిరాదిత్య సింధియా కొట్టిపారేశారు. ‘ఈ వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదు. ఎవరు అదృశ్యమయ్యారో చెప్పండి. వాళ్లతో మాట్లాడిస్తాన’నని అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో సింధియా కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వచూపినా తిరస్కరించారు. అప్పటి నుంచి కమల్‌నాథ్ సర్కారుతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా వదంతులు వచ్చాయి. (చదవండి.. ప్రజల సలహా మేరకే ఆ మార్పులు : సింధియా) -
ప్రజల సలహా మేరకే ఆ మార్పులు : సింధియా
గ్వాలియర్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ముసలం ముదురుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్రంలోని పార్టీ నాయకత్వంపై కొద్ది రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. తన ట్విటర్ ఖాతాలో ఉన్న కాంగ్రెస్‌కు సంబంధించిన తన వ్యక్తిగత వివరాలను కూడా మార్పులు చేశారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ పేరు కనిపించకుండా.. ప్రజాసేవకుడిగా, క్రికెట్ ఔత్సాహికుడిగా తన అధికారిక ఖాతాలో దర్శనమిస్తున్నాయి. కాగా దీనిపై ఆయన స్పందిస్తూ.. నెల క్రితమే ప్రజల సలహా మేరకు తన ట్విటర్ ఖాతాలోని వివరాలను మార్చినట్లు వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి వస్తున్న వార్తలు కూడా పూర్తిగా నిరాధారమైనవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధేయుడైన దివంగత మాధవరావు సింధియా వారసుడిగా జ్యోతిరాదిత్య రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. మధ్యప్రదేశ్ లోని గుణ, శివ్ పురి లోక్‌సభ స్థానం నుంచి ఓటమి లేకుండా విజయం సాధిస్తూ వచ్చారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా పరాజయం చూశారు. భారతీయ జనతాపార్టీకి చెందిన కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. జ్యోతిరాదిత్య సింధియా పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు. గతంలో జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో బీజేపీకి అనుకూలంగా జ్యోతిరాదిత్య సింధియా కొన్ని ప్రకటనలు చేశారు. దీనిపై అప్పట్లోనే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేశారు. ఈ వ్యవహారాలతో విసిగిపోయిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. Jyotiraditya Scindia to ANI, on no mention of Congress party in his Twitter bio: A month back I had changed my bio on Twitter. On people's advice I had made my bio shorter. Rumours regarding this are baseless. pic.twitter.com/63LAw9SIvb — ANI (@ANI) November 25, 2019 -
పీసీసీ పదవికి ఆయన సమర్థుడే : కమల్‌నాథ్
సాక్షి, ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో వివాదాలపై ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పందించారు. ఇలాంటివి తమ పార్టీలోనే కాదు ప్రతీ పార్టీలోనూ ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం ఓ మీడియా చానెల్‌తో ఆయన మాట్లాడారు. జ్యోతిరాదిత్య సింధియాతో విభేదాల గురించి విలేకరులు ప్రశ్నించగా.. అదేం పెద్ద సమస్య కాదని కొట్టిపారేశారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవిని సింధియాకు ఇచ్చే అవకాశముందా అన్న ప్రశ్నకు ఎందుకుఇవ్వకూడదని తిరిగి ప్రశ్నించారు. ఆయనకు అనుభవముంది. నాయకత్వ లక్షణాలున్నాయి. తనకంటూ ఓ టీమ్ ఉందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవి ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దే ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా పేరున్న సింధియా సీఎం కావాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అధిష్టానం కమల్‌నాథ్‌ను ఎంపిక చేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పుడు సింధియా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు. ఇది సింధియాకు మైనస్‌గా మారిందని పార్టీ వర్గాల సమాచారం. అంతేకాక ఇటీవల వచ్చిన వర్షాలకు మధ్యప్రదేశ్‌లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈ విషయంలో ప్రభుత్వ చర్యల పట్ల సింధియా అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద ప్రభావంపై వెంటనే సర్వే నిర్వహించి బాధితులను ఆదుకోవాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ విషయం కమల్‌నాథ్ ముందుంచగా, రుతుపవనాలు ఇంకా తిరుగుముఖం పట్టలేదు. ఇప్పుడు సర్వే నిర్వహించినా తర్వాత మళ్లీ వరదలొస్తే రీసర్వే నిర్వహించమని డిమాండ్ చేస్తారు. అలా కాకుండా పరిస్థితులు సద్దుమణిగాక ఒకే సారి సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై కమల్‌నాథ్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. -
కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ జ్యోతిరాదిత్య సింధియా మరోసారి సీఎం కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కమల్‌నాథ్ బయటివారి కంటే సొంత మంత్రుల అభిప్రాయాలకే విలువివ్వాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేధాలపై సింధియా స్పందిస్తూ ఇరువర్గాల వాదనకు సీఎం ప్రాధాన్యతనిచ్చి వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాలన్నారు. పార్టీలో బయటవారి ప్రమేయానికి కమల్‌నాథ్ ఇకనైనా ముగింపు పలికితే బాగుంటుందన్నారు. పదిహేనేళ్లు కష్టపడి పార్టిని అధికారంలోకి తీసుకొచ్చామన్న సంగతిని సీఎం గుర్తించాలన్నారు. వేగంగా అభివృద్ది చేయాలన్న కాంగ్రెస్ నాయకుల ఆశలను నిజం చేయాలన్నారు. విభేదాలను పక్కనపెట్టి అందరు సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. అదే విధంగా పార్టీ మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ రాజకీయాలలో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేసులో ఇద్దరు ముందున్నవారే. అయితే అనూహ్యంగా కమల్‌నాథ్‌కు సీఎం పదవి వరించిన విషయం విదితమే. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఉమాంగ్ సింగర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఉమాంగ్ ఆరోపణలకు సింధియా మద్దతివ్వడం విశేషం. -
‘మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’
భోపాల్: తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్. మధ్యప్రదేశ్ రాజకీయాలలో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలకు ప్రత్యేక గుర్తుంపు ఉంది. సీఎం రేసులో ఇద్దరు ముందంజలో ఉన్నారు. అయితే అనూహ్యంగా కమల్‌నాథ్‌కు సీఎం పదవి వచ్చిన నేపథ్యంలో రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ తెలపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కమల్‌నాథ్ సమావేశం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని త్వరలో ఎన్నుకోనున్నట్లు సీఎం తెలిపారు. ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియాకు కీలక పదవి ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం వైపు ఆలోచించే అవకాశం ఉందన్న విలేకరుల ప్రశ్నలకు కమల్‌నాథ్ స్పందిస్తూ నాకు తెలిసి అతనికి ఎవరిపైన కోపం ఉండే అవకాశం లేదని అన్నారు. ఈ మధ్య ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సింధియా స్వాగతిస్తూనే తాను కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితిలో వీడబోనని స్పష్టం చేశారు. సింధియాను రాష్ట్ర రాజకీయాల నుంచి పక్కనపెడితే తనతో సహా 500మంది కార్యకర్తలు రాజీనామా చేస్తారని కాంగ్రెస్ నాయకుడు అశోక్ దాంగీ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రి రేసులో ముందున్న సింధియాకు పదవి దక్కకపోగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా రాకపోవడం గమనార్హం. కానీ, 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి ప్రియాంకాగాంధీ వాద్రాతో నాయకత్వం వహించే అవకాశం కల్పించిందని కొందరు పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సింధియా తన సొంత నియోజకవర్గమైన గుణాను కోల్పోయిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక ఎంపీ సీటు సీఎం కమల్‌నాథ్ కుమారుడు లోక్‌నాథ్‌ది కావడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ భోపాల్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. అయితే మధ్యప్రదేశ్ అధ్యక్ష పదవికి అర్జున్ సింగ్ తనయుడు అజయ్‌సింగ్‌కు దిగ్విజయ్ మద్దతు తెలుపుతున్నారు. త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే నాయకుల బాధ్యతను సింధియాకు అప్పగించారు. -
‘రాహుల్ నిష్క్రమణ పార్టీకి నష్టమే’
భోపాల్ : కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీ వైదొలగిన అనంతరం పార్టీ ఇబ్బందుల్లో కూరుకుపోయిందని మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా అంగీకరించారు. పార్టీ ఎదుర్కొంటున్న ఈ పరీక్షా సమయంలో నేతలంతా సమిష్టిగా కాంగ్రెస్ బలోపేతానికి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. పార్టీ నూతన చీఫ్‌గా శక్తివంతమైన నేత అవసరమని అన్నారు. పార్టీ నేతలంతా సమైక్యంగా రాహుల్ చూపిన బాటలో నడవాలని కోరారు. రాహుల్‌కు సంఘీభావంగా సింధియా గత వారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రజాతీర్పును ఆమోదించి అందుకు బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీకి తన రాజీనామా అందచేశానని ఆయన చెప్పుకొచ్చారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి బీజేపీయే బాధ్యత వహించాలని సింధియా ఆరోపించారు. కర్ణాటక, గోవాల్లో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు. ఎన్నికల్లో గెలవలేని చోట ఇతర మార్గాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్‌లో ఆగని రాజీనామాల పర్వం..!
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకున్నారు. తాజాగా ఆయన బాటలోనే మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు పయనిస్తున్నారు. కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ముంబై కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి మిలింద్ డియోరా వైదొలగిన కొద్ది గంటల్లోనే సింధియా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. పార్టీ ఓటమికి బాధ్యతవహిస్తూ.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపించాను’అని ట్వీట్ చేశారు సింధియా. జనరల్ సెక్రటరీగా పార్టీకి సేవచేసే అవకాశాన్నిఇచ్చినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడే నిర్ణయించుకున్నాను... మిలింద్ డియోరా ముంబై కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. జూన్ 26న రాహుల్ గాంధీని కలిసినప్పుడే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘ముంబైలోని కాంగ్రెస్ నాయకులను ఒక్కటిచేసి.. పార్టీ బలోపేతానికి కృషిచేద్దామనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాను. రాహుల్‌తో చర్చించాక నేను కూడా రాజీనామా చేయాలనుకున్నాను’ అని డియోరా ఓ ప్రకటనలో చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే ముంబై కాంగ్రెస్ చీఫ్‌గా మిలింద్ బాధ్యతలు తీసుకున్నారు. -
మారని కాంగ్రెస్ నేతల తీరు!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారలేదు. ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవాల్సిందిపోయి కాంగీయులు పరస్పరం నిందించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓటమికి గల కారణాలను సమీక్షించుకునేందుకు జ్యోతిరాదిత్య సింధియా, రాజ్‌బబ్బర్ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో సమావేశంలో గందరగోళం తలెత్తింది. ఎన్నికల సమయంలో యూపీ బాధ్యుడిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియాతో రాష్ట్ర నేతలు వాదోపవాదనలకు దిగారు. ఓటమికి మీదే బాధ్యత అంటూ మండిపడ్డారు. పశ్చిమ యూపీలోని 10 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఆఫీస్ బేరర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో టిక్కెట్ల పంపకం జరగడం వల్లే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని ఘజియాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరేంద్ర కాసన ఆరోపించారు. ఘజియాబాద్ లోక్‌సభ అభ్యర్థి డోలి శర్మ, ఆమె తండ్రి నరేంద్ర భరద్వాజ్‌పై పార్టీ పెద్దలకు ఆయన ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీని సీనియర్ నాయకులు తప్పుదారి పట్టించారని వాపోయారు. సమావేశం ముగిసిన తర్వాత కూడా హరేంద్ర, నరేంద్ర మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇది తమ పార్టీ అంతర్గత వ్యవహారామని కాంగ్రెస్ నాయకుడొకరు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేదనానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎంతో గర్వంగా ఉంది : జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ : ఓ తండ్రిగా ఎంతో గర్విస్తున్నానంటూ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఉద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు మహానార్యమన్ ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందడం పట్ల ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ ఈరోజు నా తనయుడు మహానార్యమన్ సింధియా యేల్ యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకున్నాడు. ఓ తండ్రిగా ఎంతో గర్విస్తున్నా. మా కుటుంబం మొత్తానికి ఇదో ప్రత్యేకమైన సందర్భం. నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నా నాన్నా’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఈ క్రమంలో భార్య ప్రియదర్శిని రాజే సింధియా, మహానార్యమన్‌లతో కలసి యూనివర్సిటీలో దిగిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. దీంతో మహానార్యమన్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. 2002లో తండ్రి మాధవరావు సింధియా మరణంతో గుణ లోక్‌సభ స్థానం ఖాళీ కావడంతో తొలిసారి ఉప ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలుపొందారు. ఇక్కడి నుంచే ఇప్పటి వరకు నాలుగు సార్లు సింధియా విజయం సాధించారు. గత ఎన్నికల్లో లక్షన్నర ఓట్ల భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక 1994లో మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను వివాహమాడిన జ్యోతిరాదిత్యాకు కుమారుడు మహానార్యమన్, కుమార్తె అనన్య సింధియా ఉన్నారు. I feel extremely proud as a father today that my son @AScindia graduates from @Yale University. A special moment for the entire family. Proud to be by your side as you graduate, son! #yalecollege #classof2019 pic.twitter.com/kt8ELVqmtm — Jyotiraditya Scindia (@JM_Scindia) May 19, 2019 -
భర్తకు ప్రేమతో.. గెలుపు బాధ్యత
భోపాల్: ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనేది ఎంత వరకు నిజమో తెలీదు కానీ.. ప్రతి భర్త విజయం వెనుక భార్య శ్రమ ఉంటుందని రుజువు చేస్తున్నారు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాదిత్య సింథియా భార్య.. ప్రియదర్శినీ రాజే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలో పార్టీ విజయానికి ప్రియదర్శిని ఎంతో కష్టపడుతున్నారు. భర్త జ్యోతిరాదిత్య జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్‌సభ నియోజకవర్గ గెలుపు బాధ్యతను ఆమె మోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రెండు స్థానాల్లో గుణ ఒకటి. గత ఏడాది హోరాహోరీగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక జ్యోతిరాదిత్యా కృషి అందరికీ తెలిసిందే. సీనియర్ నేత కమల్‌నాథ్‌ను పక్కన పెట్టి సీఎంగా కుర్చి కూడా అయననే వరిస్తుందని ఓ వర్గం నేతలు ఎంతో ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితాల అనంతరం లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కమల్‌నాథ్‌కు సీఎం పీఠం అప్పగించి.. జ్యోతిరాదిత్యకు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. ఆ తరువాత దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో పార్టీ పుర్వవైభవం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సింథియా, ప్రియాంక గాంధీను యూపీ బాధ్యులుగా నియమించారు. యూపీలో విజయం కోసం ప్రియాంకతో పాటు సింథియా విశ్వప్రయత్నలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గమైన గుణ ప్రచారానికి దూరమైయారు జ్యోతిరాదిత్య. గుణలో సింథియా కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. 1967 నుంచి వరసగా వారి కుటింబికులే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి గెలుపు బాధ్యతను ఆయన భార్య ప్రియదర్శినీ రాజేపే మోపారు. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి గుణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్రృతంగా పర్యటిస్తూ.. ప్రజల అవసరాల గురించి ఆరాతీస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజే.. ప్రత్యర్థి అభ్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే జ్యోతిరాదిత్య ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుణ స్థానంలో ఆయన భార్యను నిలపాలనే అనుకున్నారు. చివరి వరకూ ఇదే ప్రచారం జరిగినా.. కీలక ఎన్నికలు కావడంతో సింథియానే బరిలో నిలిపింది కాంగ్రెస్ అధిష్టానం. 2002లో తండ్రి మరణంతో ఈ స్థానం ఖాళీ కావడంతో తొలిసారి ఉప ఎన్నికల్లో గుణ ఎంపీగా గెలుపొందారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు సింథియా విజయం సాధించారు. గత ఎన్నికల్లో లక్షన్నర ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. మరోసారి తన భార్యపై ఉన్న నమ్మకంతో విజయంపై ధీమాగా ఉన్నారు. కాగా మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను 1994లో జ్యోతిరాదిత్యా సింథియా వివాహమాడిన విషయం తెలిసిందే. -
యూపీలో కాంగ్రెస్ ‘జ్యోతి’.. వెలిగేనా!
భోపాల్: మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు రుచి చూపించడంలో తీవ్రంగా కృషి చేసిన జ్యోతిరాదిత్య సింధియా.. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లోనూ పార్టీకి మెరుగైన ఫలితాలు సాధిస్తారని కాంగ్రెస్ అధినాయకత్వం ఆశిస్తోంది. ఈ మధ్యే పశ్చిమ యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా సింధియాను రాహుల్ గాంధీ నియమించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో తనను కాకుండా కమల్‌నాథ్‌ను సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినప్పుడు సంయమనం కోల్పోకుండా పార్టీ కోసం అందరం కలసి కష్టపడతామని అనడం సింధియాను రాహుల్‌కు దగ్గర చేసింది. అందుకే ప్రియాంక గాంధీని తూర్పు యూపీకి కార్యదర్శిగా నియమించిన రాహుల్.. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పార్టీని గెలిపించే బాధ్యతను సింధియాకు అప్పగించారు. 48 సంవత్సరాల జ్యోతిరాదిత్య సింధియా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ చదివారు. స్టాన్‌ఫర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏను పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించిన సింధియా, ప్రస్తుతం పార్లమెంట్లో కాంగ్రెస్ చీఫ్ విప్‌గా వ్యవహరిస్తున్నారు. సింధియాకు సవాల్ విసురుతున్న యూపీ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను గెలుపుబాట పట్టించిన జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వ పటిమకు ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలు పరీక్షగా మారాయి. యూపీ పగ్గాలు ప్రియాంక, సింధియాకు అప్పగించిన రాహుల్ అక్కడ మెజార్టీ సీట్లు గెలిపిస్తారని ఇద్దరిపై నమ్మకం ఉంచారు. ‘‘కాంగ్రెస్ భావజాలాన్ని యూపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరు నేతలు విజయవంతమవుతారని తాను విశ్వసిస్తున్నా’’నని రాహుల్ గాంధీ ఈ మధ్యే మీడియాతో ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమాన కాంగ్రెస్ మెరిసేనా...? రాహుల్ పశ్చిమ యూపీలోని 39 పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతను సింధియాకు అప్పగించడానికి ప్రధాన కారణం ఉంది. 2009, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ యూపీతో పోలిస్తే తూర్పు యూపీలో హస్తం పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది. 2014 ఎన్నికల్లో పశ్చిమాన కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. దీంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి సింధియాను సరైన నాయకుడిగా నమ్ముతూ గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించారు రాహుల్. తనపై కాంగ్రెస్ అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే దిశగా సింధియా అడుగులు వేస్తున్నారు. అక్కడి నాయకులు, శ్రేణుల్లో ధైర్యం నింపే చర్యలను ప్రారంభించారు. -
గ్వాలియర్ మహారాజు
సాక్షి వెబ్ ప్రత్యేకం : యువరాజుగా రాజభోగాలు అనుభవించాల్సిన వాడు రాజభవంతులు, పట్టుపరుపులు వదిలి ప్రజల కోసం ఎర్రటి ఎండలో తిరిగాడు. వివాదాలు, విమర్శలు, ఎదురు దాడులతో సహావాసం చేశాడు. తండ్రి మరణంతో అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా తను మాత్రం అనుకున్నది చేసుకుంటూపోయాడు. తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. ఆనతి కాలంలో ముఖ్యమంత్రి పదవికి అర్హుడనిపించకున్నాడు. చేతివరకు వచ్చిన సీఎం పదవి నోటికందకపోయినా బాధపడకుండా తనపనితాను చేసుకుపోతున్నాడు రాసబిడ్డ జ్యోతిరాదిత్య సింధియా. వ్యక్తిగత జీవితం జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్ మహారాజు జీవాజీరావ్ సింధియా మనవడు. 1జనవరి 1971లో మాధవ్‌రావ్ సింధియా, మాధవి రాజే సింధియా దంపతులకు ముంబై నగరంలో జన్మించారు. ముంబైనగరంలోని కాంపియన్ స్కూల్, డెహ్రడూన్‌లోని డూన్ స్కూల్లలో పదవతరగతి వరకు చదువుకున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పట్టాపొందారు. స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. 1994లో మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు మహానార్యమన్, కుమార్తె ఉన్నారు. రాజకీయ జీవితం తండ్రి మరణంతో రాజకీయాలలోకి ప్రవేశించారు జ్యోతిరాదిత్య సింధియా. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాధవ్‌రావ్ విమాన ప్రమాదంలో మరణించగా 2001 డిసెంబర్ 18న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2002లో తండ్రి మరణంతో ఖాళీ పడ్డ స్థానంలో బై ఎలక్షన్లో గుణ ఎంపీగా గెలుపొందారు. దేశంలోనే అత్యంత ధనవంతులైన మంత్రులలో ఈయన కూడా ఒకరు. 2008లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా సేవలందించారు. 2009లో స్టేట్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2013 మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల తర్వాత సీఎంగా జ్యోతిరాధిత్య సింధియా, కమల్‌నాథ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సింధియా అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించటంతో ముఖ్యమంత్రి పదవి చేజారింది. వివాదాలు తండ్రి మాధవ్‌రావ్ సింధియాకు చెందిన 20వేల కోట్ల అస్తి తనకే చెందాలని జ్యోతిరాదిత్య సింధియా కోర్టులో కేసువేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ జ్యోతిరాదిత్య మేనత్తలు కోర్టులో కేసు వేశారు. దళిత నేతకు అవమానం జరిగేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీజేపీ నేత నంద కుమార్ సింగ్ చౌహాన్ జ్యోతిరాదిత్య సింధియాపై కేసు పెట్టారు. రాజకీయాల రాజవంశం సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు. గ్వాలియర్ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. ఇష్టాఇష్టాలు జ్యోతిరాదిత్య సింధియాకు క్రికేట్, స్విమ్మింగ్, రీడింగ్ అంటే చాలా ఇష్టం. - బండారు వెంకటేశ్వర్లు -
ప్రియాంక ఎంట్రీపై రాహుల్ కామెంట్
-
ప్రియాంక ఎంట్రీపై రాహుల్ కామెంట్
అమేథి: తన సోదరి ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించి, కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు. కేంద్రం, యూపీలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రియాంక సమర్థురాలని ఆయన కితాబిచ్చారు. ‘ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా శక్తివంతులైన నాయకులు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి యువ నాయకత్వం అవసరమని భావించి వీరిద్దరికీ యూపీ బాధ్యతలు అప్పగించామ’ని రాహుల్ తెలిపారు. తమ పార్టీ అనూహ్యంగా ప్రియాంక గాంధీని తెరపైకి తీసుకురావడంతో బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తనకు ప్రియాంక తోడుగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. జ్యోతిరాదిత్య డైనమిక్ యువనేత అని ప్రశంసించారు. వీరిద్దరిపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు అవసరమైతే ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు సహకరిస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసే విషయంపై రాహుల్ సూటిగా సమాధానం చెప్పలేదు. ప్రియాంకను యూపీ తూర్పు, జ్యోతిరాదిత్య సింధియాను పశ్చిమ యూపీకి ఇన్‌చార్జ్‌లుగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. -
మద్యప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం
-
సింధియా-చౌహాన్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పై జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తితో ఉన్నారా? మధ్యప్రదేశ్ సీఎం పదవి దక్కలేదన్న బాధ వెంటాడుతోందా? బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌చౌహాన్‌తో సింధియా భేటీ ఆంతర్యం ఏంటి? మర్యాదపూర్వకంగా కలిశామని నేతలు చెబుతున్నా.. రాజకీయ కారణం ఉందన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ యువనేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం , బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలువడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భోపాల్‌కి దూరంగా ఉండే సింధియా సోమవారం సిటీకొచ్చారు. తన సన్నిహితులను కలిసిన తర్వాత చౌహాన్ ఇంటికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరిద్దరూ చర్చలు జరిపారు. తర్వాత బయటకొచ్చిన చౌహాన్, సింధియా.. మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. అనంతరం కారు వరకూ వెళ్లి సింధియాకు వీడ్కోలు పలికారు శివరాజ్‌సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రస్తుతం దావోస్‌లో ఉన్నారు. ఆయన రాష్ట్రంలో లేని సమయంలో సింధియా.. చౌహాన్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. మర్యాదపూర్వకంగానే కలిశామని ఇద్దరు నేతలూ చెబుతున్నా.. రాజకీయ నేపథ్యం ఉండే ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించి ఇటీవలే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కీలకంగా వ్యవహరించారు. సీఎం పదవి కోసం ఇద్దరూ పోటీపడ్డారు. చివరికి సీనియర్ అయిన కమల్‌నాథ్ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఇది సింధియా వర్గీయులను ఒకింత అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన సింధియా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడాలని అనుచరులకు సర్దిచెప్పుకున్నారు. తాజాగా ఆయన చౌహాన్‌తో భేటీ అవడంతో ఈ విషయం మళ్లీ తెరమీదకి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి కారణంగానే సింధియా.. చౌహాన్‌ను కలిశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను అస్థిరపరచాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్నదే త్వరలో మధ్యప్రదేశ్‌లోనూ జరిగే అవకాశం ఉందని కోల్‌కతాలో జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి హెచ్చరించారు. ఒక్క సీటే తేడా అయినా, మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వమే. ఎస్పీ, బీఎస్పీ సహకారంతో కమల్‌నాథ్ ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సింధియా ఎర్రజెండా చూపిస్తే, ప్రభుత్వం పడిపోవడం ఖాయం. అందుకే, సింధియా- చౌహాన్ భేటీ ఆసక్తికరంగా మారింది. అయితే, అభివృద్ధి కార్యక్రమాల్లో చౌహాన్ మద్దతు కోరేందుకే సింధియా ఆయనను కలిశారని.. పుకార్లు నమ్మొద్దని కాంగ్రెస్ చెబుతోంది. -
బీజేపీ ముఖ్య నేతతో సింధియా భేటీ
భోపాల్: మధ్యప్రదేశ్ తాజా మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కాంగ్రెస్ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చౌహాన్ నివాసంలో సోమవారం రాత్రి ఈ సమావేశం జరిగింది. ఇరువురు నేతలు 40 నిమిషాల పాటు రహస్యంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర రాజధానికి దూరంగా ఉండేందుకు మొగ్గుచూపే సింధియా తన అనుచరుల కుటుంబ సభ్యులు ఇద్దరు చనిపోవడంతో పరామర్శించడానికి సోమవారం భోపాల్‌కు వచ్చారు. అక్కడ నుంచి ఆశ్చర్యకరంగా నేరుగా చౌహాన్ ఇంటికి వెళ్లారు. అయితే మర్యాదపూర్వకంగా కలుసుకున్నామని నేతలిద్దరూ చెప్పడం విశేషం. సమావేశం ముగిసిన తర్వాత కారు వరకు వచ్చి సింధియాను చౌహాన్ సాగనంపడం విశేషం. రాష్ట్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకుపోతామని ఈ సందర్భంగా సింధియా చెప్పారు. ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. దావోస్‌కు వెళ్లిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం. చౌహాన్-సింధియా సమావేశంపై కాంగ్రెస్, బీజేపీ భిన్నంగా స్పందించాయి. దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనులకు చౌహాన్ సహకారం కోరేందుకే ఆయనతో సింధియా భేటీ అయ్యారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనాక్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. చౌహాన్‌ను సింధియా మర్వాదపూర్వకంగా కలిసినా కాంగ్రెస్ ఉలికిపడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ ఎద్దేవా చేశారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పీఠం కోసం సింధియా ప్రయత్నించారు. సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌వైపు అధిష్టానం మొగ్గుచూపడంతో ఆయన సీఎం అయ్యారు. మరోవైపు శివరాజ్‌సింగ్ చౌహాన్ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకునేందుకు బీజేపీ ఆయనకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. -
నువ్వు ఏదో ఒకరోజు సీఎం అవుతావు!
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, వసుంధర రాజేల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వసుంధర రాజే, జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరూ కూడా రాజవంశీకులన్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా సింధియాను పలకరించిన రాజే.. రాజవంశీకుల ఆచారం ప్రకారం ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో... రాజకీయ పరంగా సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ రక్తసంబంధీకుల మధ్య ఉన్న ఆప్యాయతల్లో ఎటువంటి తేడా ఉండదు అనేందుకు ఇదొక చక్కని ఉదాహరణ అంటూ వీరి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గాసిప్ రాయుళ్లు మాత్రం...’ ఈ వేడుకలో భాగంగా మేనత్త వసుంధర.. తన మేనల్లుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆనందపడుతూనే.. నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా మధ్యప్రదేశ్ సీఎం అవుతావంటూ ఆశీర్వదించి ఉంటారు’ అంటూ కథనాలు అల్లేస్తున్నారు కూడా. కాగా సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు. -
జ్యోతిరాదిత్య సింథియా (కాంగ్రెస్)
సి.ఎం. పదవి రానందుకు బాధ లేదు. డిప్యూటీ సి.ఎం.గా ఉండమన్నందుకు అసలే బాధ లేదు. రాజపుత్రులకు ఇలాంటివి ఏమాత్రం విషయాలు, విశేషాలూ కావు. ఆత్మార్పణ చేసుకోవలసినంత అవమానాలూ కావు. గ్వాలియర్ సంస్థానం రద్దు కాకుండా ఉంటే, ఇప్పుడు గ్వాలియర్‌ను పరిపాలిస్తుండేవాడిని అనుకోవడం వంటిదే.. కమల్‌నాథ్ లేకుంటే ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని అయి ఉండేవాడిని అనుకోవడం! లేకుండా ఏదీ ఉండదు జీవితంలో. స్వాతంత్య్ర సంగ్రామాలు ఉంటాయి. సంస్థానాల విలీనాలూ ఉంటాయి. సి.ఎం. పదవికి పోటీ ఉంటుంది. పోటీలో ఉన్న ప్రత్యర్థిని గెలిపించడం కోసం ఓడిపోవడమూ ఉంటుంది. నాన్నగారు ఇదంతా పైనుంచి చూస్తూ.. ‘క్షత్రియ పుత్రుడివి అనిపించావు ఆదిత్యా’ అని గర్వపడే ఉంటారు. ముప్పై ఏళ్ల క్రితం నాన్న అడిగింది వాళ్లు ఇవ్వలేదు. ముప్పై ఏళ్ల తర్వాత వాళ్లు ఇస్తానన్నది నేను తీసుకోలేదు. ఇది కూడా నాన్న గర్వించే విషయమే. నాన్న రైల్వే మినిస్టర్‌గా ఉన్నారు. హెచ్.ఆర్.డి. మినిస్టర్‌గా ఉన్నారు. టూరిజం మినిస్టర్‌గా ఉన్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌గా ఉన్నారు. చీఫ్ మినిస్టర్‌గా మాత్రం లేరు. కమల్‌నాథ్‌ని గెలిపించడానికి ఖడ్గాన్ని ఒరలోంచి తియ్యకుండానే ఓడిపోయాను నేను. ఖడ్గాన్ని ఒరలోంచి తీసి కూడా పార్టీ ఎంపిక చేసిన మనిషిని గెలిపించడానికి ఓడిపోయారు నాన్న. నాన్న ఎంత గొప్పవారు! పెద్దత్త, చిన్నత్త కబురు పంపారు. ‘‘కలుద్దాం’’ అన్నారు పెద్దత్త వసుంధరరాజే. ‘‘కలిసి మాట్లాడుకుందాం’’ అన్నారు చిన్నత్త యశోధరారాజే. ‘‘వద్దు పెద్దత్తా, చిన్నత్తా.. మీరొచ్చి నన్ను కలిస్తే మీరు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని అనుకుంటారు. నేనొచ్చి మిమ్మల్ని కలిస్తే నేను బీజేపీలో చేరబోతున్నానని అనుకుంటారు’’ అన్నాను. ‘‘అయితే నువ్వే వచ్చి మమ్మల్ని కలువు’’ అన్నారు పెద్దత్త, చిన్నత్త. అత్తలిద్దరూ నన్ను బీజేపీలోకి రమ్మని అడుగుతున్నట్లు అర్థమైంది. ‘‘కుంతల రాజ్యంలో న్యాయం జరగలేదని శకుంతల రాజ్యానికి వెళ్లిపోవడం న్యాయమేనా పెద్దత్తా, చిన్నత్తా?!’’ అని అడిగాను. ‘‘రాజపుత్రుడైన మీ నాన్నగారు కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లూ మంత్రిగానే బతికారు. నువ్వూ ఆ బతుకే బతుకుతావా ఆదిత్యా?’’ అన్నారు అత్తలిద్దరూ భారంగా. మౌనంగా ఉన్నాను. ‘‘ఆదిత్యా.. నీకన్నా ఎనిమిదేళ్లు చిన్నవాడు పెమా ఖండూ బీజేపీలో అరుణాచల్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నీకన్నా ఏడాది చిన్నవాడు, నీ పేరే ఉన్నవాడు ఆదిత్యనాథ్ బీజేపీలో ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నీ ఈడువాడే నీకన్నా పదినెలలు చిన్నవాడు విప్లవ్ కుమార్ దేవ్ బీజేపీలో త్రిపురకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీజేపీలోకి వచ్చెయ్. నువ్వెందుకింకా ఆ వయోవృద్ధుల పార్టీలోనే ఉన్నావు? శిరస్సుపై కిరీటం పెట్టకపోవడం, శిరస్సును ఖండించడం రెండూ ఒకటే’’ అన్నారు పెద్దత్త. ‘‘శిరస్సును ఖండించినంత మాత్రాన క్షత్రియపుత్రుడు క్షతగాత్రుడౌతాడా పెద్దత్తా..’’ అని అడిగాను. ‘‘పార్లమెంటులో చీఫ్ విప్‌గా ఉండడం, చీఫ్ మినిస్టర్‌గా పవర్లో ఉండడం రెండూ ఒకటేనా ఆదిత్యా.. ఆలోచించు’’ అన్నారు చిన్నత్త. ‘‘ఆలోచించడానికేం లేదు చిన్నత్తా’’ అని చెప్పాను. పవర్.. ఇస్తుంటే తీసుకోవడంలో లేదు. వస్తుంటే వద్దనడంలో ఉంది. ఆ విషయం బీజేపీలో ఉన్నవాళ్లకు చెప్పినా అర్థం కాదు. -మాధవ్ శింగరాజు -
సింధియాలకు అందని సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం పీఠం సింధియా కుటుంబాన్ని ఊరిస్తోంది. సీఎం అవుతారని అందరూ భావించినా జ్యోతిరాదిత్య సింధియాను కాదని సీనియర్ అయిన కమల్‌నాథ్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ్‌రావు సింధియాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పట్లో అర్జున్‌సింగ్ ఆయనకు సీఎం పీఠం దక్కకుండా చక్రం తిప్పారు. సీఎం రేసులో కమల్‌నాథ్‌తో పోటాపోటీగా తుదిదాకా జ్యోతిరాదిత్య ముందున్నారు. గుణ ఎంపీ అయిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకుని, పార్టీని విజయతీరాలకు నడిపించారు. 9 పర్యాయాలు ఎంపీ అయిన కమల్‌నాథ్ తన సీనియారిటీతోపాటు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడం ద్వారా సీఎం రేసులో పైచేయి సాధించారు. జ్యోతిరాదిత్యను సీఎం పీఠం ఎక్కిస్తే రాష్ట్రంలో అతిపిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించేవారు. అయితే, కమల్‌నాథ్(72)వైపే అధిష్టానం మొగ్గు చూపింది. 1989లో జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్‌రావు సింధియా విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌సింగ్ చుర్హాత్ లాటరీ స్కాంలో ఇరుక్కోవడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మాధవ్‌రావు సింధియాకు సీఎం కుర్చీ అప్పగించరాదనే హామీని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి తీసుకున్న తర్వాతే అర్జున్‌సింగ్ పదవి నుంచి వైదొలిగారు. అంతేకాదు, తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలు చేశారు. సీఎం పదవి తనకే దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న మాధవ్‌రావు సింధియా కూడా భోపాల్‌లో మద్దతుదారులతో వేరుగా మకాం వేశారు. అయితే, అధిష్టానం మోతీలాల్ వోరాను ముఖ్యమంత్రిగా ఎంపికచేయడంతో మాధవ్‌రావు సింధియా తీవ్ర నిరాశ చెందారు. గ్వాలియర్ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. -
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఖరారు!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారైనట్టుగా తెలుస్తోంది. బుధవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీ పక్షనేతగా కమల్‌నాథ్ పేరును ప్రతిపాదించారు. పార్టీ గెలుపుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే కారణమని సింధియా తెలిపారు. సీఎం ఎవరనే నిర్ణయాన్ని రాహుల్‌కే వదిలేస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న సింధియానే శాసనసభ పక్ష నేతగా కమల్‌నాథ్ పేరును ప్రకటించడంతో ఆయన ఎంపిక లాంఛనం కానుంది. ఈ అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రకటను చేయలేదు. ఈ రోజు రాత్రికి కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో మెజారిటీ మార్కుకు రెండు స్థానాల దూరంలో ఆగిపోయిన కాంగ్రెస్.. అధికారం చేజిక్కించుకోవడానికి వేగంగా పావులు కదిపింది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి కూడా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, స్వతంత్రులతో కాంగ్రెస్ నాయకుల చర్చలు ఫలించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అయితే సీఎం పదవి విషయంలో కొద్దిగా సందిగ్ధత నెలకొంది. సీఎంగా జ్యోతిరాధిత్య సింధియా, కమల్‌నాథ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సింధియా అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
సింధియా, సచిన్‌లకు షాక్!
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి తమకు దక్కుతుందని ఆశించిన కాంగ్రెస్ యువ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లకు నిరాశ తప్పలేదు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా పేరును పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించి ఆయన స్థానంలో సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను ప్రతిపాదించడంతో అందుకు పార్టీ అధిష్టానం అంగీకరించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కావాల్సిన మెజారిటీకి ఒక్క సీటు తక్కువ రావడం, ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌కు కేవలం ఐదు సీట్ల దూరంలో ఉండడం వల్ల అనుభవజ్ఞులు కావాలన్నది సీనియర్ల వాదన. ఇక రాజస్థాన్ విషయంలో అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిని చేసి, సచిన్ పైలట్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. అయితే డిప్యూటీ సీఎం పదవికి సచిన్ పైలట్ పేరును స్వయంగా అశోక్ గెహ్లాట్ తిరస్కరించారని తెల్సింది. పార్టీకి పూర్తి మెజారిటీ రాని ప్రస్తుత సమయంలో సంకీర్ణ రాజకీయాలు నడపాలంటే రెండు అధికారిక కేంద్రాలు ఉండరాదన్నది గెహ్లాట్ వాదన. యువకులైన జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్లకు వయస్సు ఉన్నందున వారికి మున్ముందు రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంటుందన్నది పార్టీలో సీనియర్ల వాదన. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ముందుగా ఖరారు చేయలేదు. అలా చేస్తే ముఠాలు ఏర్పడుతాయని, ఫలితంగా పరాజయం ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్లు పార్టీలో ఆధిపత్య పోరును పక్కనపెట్టి పార్టీ విజయం కోసం చిత్తశుద్ధితో కషి చేశారు. రాహుల్ గాంధీ యువతకు ప్రాధాన్యత ఇస్తారని వారి నమ్మి ఉండవచ్చు. అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందు రాహుల్ గాంధీ పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ తర్వాత జూనియర్లతోపాటు సీనియర్లను కలుపుకుపోవాలని నిర్ణయించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ ఆఫీసు బేరర్లు కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండేలు సచిన్‌కు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రయిన అశోక్ గెహ్లాట్‌కు రాష్ట్ర ప్రజల్లో మంచి పేరు కూడా ఉంది. ఇక కమల్‌నాథ్ వరుసగా తొమ్మదోసారి పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కూడా పార్టీ అధిష్టానం ఆయనకే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. చత్తీస్‌గఢ్ రేస్‌లో చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవికి పార్టీ రాష్ట్ర చీఫ్ భూపేశ్ భాగెల్, అవుట్ గోయింగ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీఎస్ సింగ్ దేవ్, మాజీ కేంద్ర మంత్రి చరణ్‌దాస్ మహంత్; పార్టీ ఏకైక ఎంపీ తామ్రధ్వాజ్ సాహు పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడే అయినప్పటికీ భాగెల్‌కు పదవి దక్కక పోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అనేక వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోను రాసిన టీఎస్ సింగ్ దేవ్‌కు దక్కవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు సాయంత్రానికి శాసన సభ్యులు తమ నాయకుడిని అధికారికంగా ఎన్నుకుంటారు. -
కమల్‌నాథ్ X సింధియా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టేదెవరో ఇంకా తేలనప్పటికీ ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడినా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గనుక ఇతర పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకుంటే ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో యువనాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న జ్యోతిరాదిత్య సింధియాతోపాటు మరో సీనియర్ నేత కమల్ నాథ్ కూడా కాంగ్రెస్ తరఫున మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్నారు. అనుభవజ్ఞుడికే బాధ్యతలు ఇస్తారా? చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ 9 సార్లు ఎంపీగా గెలిచారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఓ సారి ఇందిర చింద్వారాకు ఎన్నికల ప్రచారానికి వచ్చి, నా మూడో కొడుకు కమల్‌నాథ్‌ను గెలిపించండి అని ప్రజలను కోరారు. ఇవి చాలు రాజకీయాల్లో కమల్‌నాథ్‌కు ఉన్న అనుభవమేమిటో చెప్పడానికి. ఇప్పుడు అనుభవజ్ఞుడైనందున కమల్‌నాథ్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపొచ్చనే అంచనాలున్నాయి. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కాస్త ముందు పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కమల్‌నాథ్ సీఎం రేసులో ముందున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కమల్‌నాథ్ అంతా తన భుజస్కం«ధాలపైనే నడిపించారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత ధనవంతుడైన పార్లమెంటేరియన్ కమలనాథ్కు ఏరికోరి ఎన్నికల వేళ పీసీసీ పగ్గాలు అప్పగించిందనే విశ్లేషణలైతే ఉన్నాయి. కానీ మాస్ ఫాలోయింగ్‌లో ఆయన వెనుకబడే ఉన్నారు. మాస్ ఫాలోయింగ్ జ్యోతిరాదిత్యకే మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియర్ రాచ కుటుంబానికి చెందిన సింధియా జనాకర్షణ కలిగిన నేత. గత కొన్నేళ్లుగా గ్రామ స్థాయి పర్యటనలు చేస్తూ తన పట్టు పెంచుకున్నారు. 32 శాతం మంది ప్రజలు జ్యోతిరాదిత్య సీఎం కావాలని కోరుకున్నారంటే ఆయనకు ఏ స్థాయిలో ప్రజల్లో ఆదరణ ఉందో అర్థమవుతోంది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఆయన మధ్యప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించారు. కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలతో ఎల్లప్పుడూ విభేదిస్తూనే వచ్చారు. కాంగ్రెస్ మాజీ నేత మాధవరావు సింధియా కుమారుడు కావడం, రాహుల్ గాంధీకి కుడి భుజంగా ఉండడం జ్యోతిరాదిత్యకు కలిసొచ్చే అంశాలు. మరో నాలుగు నెలల్లోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలున్నందున ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సింధియాకు కాంగ్రెస్ సీఎంగా అవకాశం ఇవ్వొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.