Kalki 2898 AD
-
ప్రభాస్‌పై ట్రోలింగ్.. ‘కల్కి’ అంతా ఫేకేనా?
ప్రభాస్.. ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరో. అందులో నో డౌట్. ఆయన ప్లాప్ సినిమా కూడా దాదాపు రూ.500 కోట్లు కలెక్షన్స్‌ని రాబడుతున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో ‘కల్కి’ సినిమానే చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1180 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాదు గతంలో బాలీవుడ్ హీరోల ఖాతాలో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టాడు ప్రభాస్. దీంతో ప్రభాస్‌తో పాటు దక్షిణాది హీరోలపై బాలీవుడ్లో అసూయ పెరిగింది. సౌత్ సినిమాలు, హీరోలపై నెగెటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయనతో పాటు దక్షిణాది దర్శకులపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.అంతా ఫేకేనా?నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (prabhas) హీరోగా నటించిన చిత్రం ‘కల్కి’(Kalki 2898 AD). అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అమితాబ్, ప్రభాస్‌ల మధ్య జరిగే ఫైట్ సీన్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన యాక్షన్స్ సీన్స్ అన్ని ఫేకే అని ట్రోల్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం బాడీ డబుల్స్, డీప్ ఫేక్ టెక్నాలజీని వాడినట్లు వీడియోలు చూపించారు. ప్రభాస్‌ని వాడుకోవడంలో నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ ముందు వరుసలో ఉంటారని, ఆయన క్లోజ్ షాట్స్ తీసుకొని 80 శాతం షూటింగ్ డూప్‌లతోనే కానిస్తారంటూ కామెంట్ చేస్తున్నారు.(చదవండి: వేలంలోయువతి కన్యత్వం.. రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన హీరో!)ప్రభాస్ ఒక్కడే కాదుగా.. యాక్షన్ సీక్వెన్స్‌కి డూప్‌ని వాడడం ఇండస్ట్రీలో కామన్. స్టార్ హీరోలలో చాలా వరకు యాక్షన్ సీన్లను డూప్‌తోనే కానిస్తారు. ఈ కల్చర్ బాలీవుడ్ నుంచే మొదలైంది. షారుఖ్, సల్మాన్‌తో పాటు స్టార్ హీరోలంతా తమ సినిమాల్లోని యాక్షన్ సీన్లకు బాడీ డబుల్స్‌ని వాడుతారు. ప్రభాస్ కూడా అదే పని చేశాడు. తన సినిమాల్లో బాడీ డబుల్స్‌ని వాడుతుంటారు. కల్కిలోనూ వాడినట్లు తెలుస్తోంది. ట్రోల్ చేస్తున్న వీడియో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. తమ హీరోపై అసూయతోనే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ‘షారుఖ్, సల్మాన్‌లు అయితే క్లోజ్ షాట్స్ కూడా బాడీ డబుల్స్‌తోనే చేయిస్తారు’, యాక్షన్ సీన్లకు ప్రభాస్ ఒక్కడే కాదు.. ఎవరైనా డూప్‌నే’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: ‘దిల్ రూబా’ మూవీ రివ్యూక్షమాపలు చెప్పిన సురేఖవాణి కూతురు సుప్రీత.. ఎందుకంటే? -
మహేష్ తో కల్కి సీక్వెల్ తీస్తున్న రాజమౌళి..!
-
ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని హితవు పలికారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు శ్రీరామ్ అన్నారు. చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్నా అని మాట్లాడారు. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలని సూచించారు. విజయవాడలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.కల్కి చిత్రంపై ఆరోపణలు..సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని అనంత శ్రీరామ్ ఆరోపించారు. తెరపైన కనిపించే పాత్రలు...వినిపించే పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం.. కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ.. తెరవెనుక మా ముందు అన్యమతస్తుల ప్రవర్తన అని తెలిపారు. వినోదం కోసం వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అని తెలిపారు. మూడు కోణాల్లో దాడి..అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..'సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి మూడు కోణాల్లో జరుగుతోంది. కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం భారత సాహితీ, వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామాయణం, మహభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రంలో కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నా. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు.. హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థమని గంటాపథంగా తెలియేజేస్తున్నా' అని అన్నారు. కృష్ణాజిల్లా గడ్డపై నిలబడి చెబుతున్నా..అనంతరం మాట్లాడుతూ..'కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే... సూర్యదేవుడిచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్పారు. ఇలాంటి అభూతకల్పనలు... వక్రీకరణలు జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయి. చిత్రీకరణ,గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎలా? మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దాం. ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లా. ఆపాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చేయనన్నాడు. ఆ పాట చేయనన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పా. 15 ఏళ్లుగా ఒక్క పాట కూడా రాయలేదు. పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు చిత్ర దర్శకనిర్మాతలతో తిరుపతి పవిత్రతను హేళన చేస్తున్నా నిమ్మకనీరెత్తినట్లు ఉంటాం. కారణం వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి. సినిమా అనేది వ్యాపారాత్మకమైన, కళాత్మకమైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని సినిమాలకు లేకుండా చేయాలంటే...హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్పమార్గం. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు..డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తారో చూద్దాం.' అని అనంత శ్రీరామ్ అన్నారు -
మా అమ్మలా పెంచాలనుకుంటున్నాను: దీపికా పదుకోన్
‘‘మా అమ్మగారు నన్ను ఎలా పెంచారో నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలనుకుంటున్నాను’’ అంటున్నారు హీరోయిన్ దీపికా పదుకోన్. ప్రభాస్ హీరోగా నటించినపాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతరపాత్రలుపోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.తొలి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో ద్వితీయ భాగంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ‘కల్కి 2’ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. 2025లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని టాక్. ‘కల్కి 2898 ఏడీ’తో టాలీవుడ్లో అడుగుపెట్టారు దీపికా పదుకొనే. ఈ మూవీలో ఆమె చేసిన సుమతిపాత్ర నిడివి తక్కువగా ఉందనే మాటలు వినిపించాయి. అయితే ‘కల్కి 2’లో ఆమెపాత్ర చాలా కీలకమని, ఆమె కూడా త్వరలోనే షూటింగ్లోపాల్గొంటారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఏర్పాటు చేసిన ఓ గెట్ టు గెదర్పార్టీలోపాల్గొన్న దీపికకి ‘కల్కి 2’ సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆమె బదులిస్తూ..‘‘నేను కూడా ‘కల్కి 2’ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు నా తొలి ప్రాధాన్యం నా కుమార్తె దువా. నా కూతురు పెంపకం కోసం కేర్ టేకర్‌ని నియమించుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మా అమ్మగారు ఎలా అయితే పెంచారో.. నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలని, తన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే... హీరో రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్‌లకు 2018 నవంబరు 14న వివాహం కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వారికి కుమార్తె (దువా) జన్మించిన సంగతి తెలిసిందే. -
రికార్డులు తిరగరాసిన పుష్ప.. చిన్న చిత్రాలకు పెద్ద విజయం
తెలుగు సినిమా తగ్గేదే లే అన్నట్లుగానే 2024 సాగింది. విజయాల శాతం తక్కువే అయినప్పటికీ... కొన్ని చిత్రాలు సాధించిన వసూళ్లు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. రూ. 1700 కోట్లతో ‘పుష్ప: ది రూల్’ బాక్సాఫీస్‌ని రూల్ చేసింది. రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ‘కల్కి2898 ఏడీ’ సత్తా చాటింది. యువ హీరోలు తేజ సజ్జా ‘హను–మాన్’, కిరణ్ అబ్బరం ‘క’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇంకా నూతన తారలతో వచ్చిన సినిమాలూ ఆకట్టుకున్నాయి. ఇక 2024 రౌండప్లోకి వెళదాం...ఈ ఏడాది తెలుగు తెరపై అనువాద చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. తమిళ చిత్రాలు రజనీకాంత్ ‘వేట్టయాన్: ది హంటర్’, విజయ్ సేతుపతి ‘మహారాజా’, శివ కార్తికేయన్ ‘అమరన్’ కార్తీ–అరవింద్ స్వామిల ‘సత్యం–సుందరం’, విక్రమ్ ‘తంగలాన్’, ధనుష్ ‘రాయన్’, విజయ్ ‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, తమన్నా–సుందర్ .సి ‘బాకు’ (అరణ్మణై 4) చిత్రాలకు తెలుగులో ఆదరణ దక్కింది. ఈ ఏడాది తెలుగులో మలయాళ చిత్రాల హవా కూడా కనిపించింది. ‘మంజుమ్మెల్ బాయ్స్’, మమ్ముట్టి ‘భ్రమయుగం’, నస్లెన్ ‘ప్రేమలు’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడు జీవితం’, టొవినో థామస్ ‘ఏఆర్ఎమ్’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. కన్నడ చిత్రాలు ఉపేంద్ర ‘యూఐ’, కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’లకు అలరించాయి.తెలుగు సినిమా అసలు సిసలైన పండగ సంక్రాంతితో ఆరంభం అవుతుంది. ఈ పండగకి వచ్చే పెద్దా చిన్నా సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతాయి. అలా 2024లో సంక్రాంతికి వచ్చిన సినిమాలతో థియేటర్లు పండగ చేసుకున్నాయి. సినీ లవర్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి పండక్కి మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హను–మాన్’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ వరుసగా విడుదల అయ్యాయి.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదే రోజున ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ ఫిల్మ్ ‘హను–మాన్’ భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి వచ్చిన సీనియర్ హీరోలతో పాటు యువ హీరో తేజ విజయం అందుకోవడం విశేషం. ఇక వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో విడుదలైన ‘సైంధవ్’ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. సంక్రాంతి పండగలో చివరిగా వచ్చిన నాగార్జున మాస్ కమర్షియల్ ‘నా సామి రంగ’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఇంకా జనవరి నెలలో విడుదలైన ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘సర్కారు నౌకరి’, హన్సిక ‘105 మినిట్స్’ నిరాశపరిచాయి. జనవరిలో దాదాపు ఇరవై సినిమాలు వచ్చినా ఆకట్టుకున్నవి తక్కువే. ఇక ఫిబ్రవరిలో ఇరవై సినిమాలకు పైగా వచ్చాయి. కులవివక్ష నేపథ్యంలో సుహాస్ హీరోగా నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’కి కొద్దిపాటి ప్రేక్షకాదరణ దక్కింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించారు.మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రూపొందింది. సీక్వెల్ కూడా మహి దర్శకత్వంలోనే రూపొందింది. ఈ నెలలో రవితేజ ‘ఈగిల్’ సినిమా ఓ మోస్తరు హిట్ అందుకుంది. ఈ మాస్ ఫిల్మ్‌కి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఇంకా సందీప్ కిషన్ హారర్ ఫిల్మ్ ‘ఊరి పేరు భైరవకోన’ ఫర్వాలేదనిపించుకుంది. ఈ చిత్రానికి వీఐ దర్శకుడు. అలాగే ప్రియమణి ‘భామాకలాపం 2’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక మార్చిలో ముప్పైకి పైగా సినిమాలు వస్తే, అలరించినవి మాత్రం ఐదారు సినిమాలే. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’కి ఆశించిన ఫలితం దక్కలేదు.శివ కందుకూరి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, అఘోరాగా విశ్వక్ సేన్ నటించిన ‘గామి, అనన్య నాగళ్ల హారర్ మూవీ ‘తంత్ర’, హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ‘రజాకార్’ చిత్రాలు ఆడియన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాయి. అయితే సిద్ధు జొన్నలగడ్డ–అనుపమా పరమేశ్వరన్ల ‘డీజే టిల్లు స్క్వేర్’, శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘డీజే టిల్లు స్క్వేర్’ రూపొందగా, ‘ఓం భీమ్ బుష్’కి హర్ష కొనుగొంటి దర్శకుడు. ఇదే నెల ఆరంభంలో వచ్చిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘వ్యూహం’ చర్చనీయాంశమైంది.ఏప్రిల్‌లో థియేటర్స్‌లోకి వచ్చిన చిత్రాలు ఇరవైలోపే. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఓ మోస్తరుగా అలరించింది. ఇదే నెలలో నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో వచ్చిన అంజలి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ నవ్వించింది. ఇక మే నెలలో వచ్చిన ఇరవై చిత్రాల్లో కార్తికేయ ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, మోహన్ భగత్ ‘ఆరంభం’ ఆడియన్స్ దృష్టిని తమ వైపు తిప్పుకోగలిగాయి.‘భజే వాయు వేగం’తో దర్శకుడిగా ప్రశాంత్ రెడ్డి పరిచయం కాగా, ‘ఆరంభం’తో అజయ్ నాగ్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో వీవీ గోపాలకృష్ణ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ‘అల్లరి’ నరేశ్ ‘ఆ... ఒక్కటి అడక్కు..!’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలకు ఊహించిన ఫలితాలు రాలేదు. జూన్‌లో దాదాపు పాతిక సినిమాలు రాగా, అందరి దృష్టి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పైనే నిలిచింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇదే నెలలో వచ్చిన సుధీర్‌బాబు ‘హరోంహర’, శర్వానంద్ ‘మనమే’ వంటివి అంచనాలను అందుకోలేకపోయాయి. అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మెప్పించింది. జూలైలో మీడియమ్ చిత్రాలు ఓ పది విడుదలయ్యాయి. వీటిలో నవదీప్ ‘లవ్‌మౌళి’, ప్రియదర్శి–నభా నటేశ్ల ‘డార్లింగ్‘, రక్షిత్ శెట్టి ‘ఆపరేషన్ రావణ్‘, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ వంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఏ చిత్రం కూడా హిట్ కాలేకపోయింది. ఆగస్టు నెలలో దాదాపు ముప్పై సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆగస్టు నెలాఖర్లో వచ్చిన నాని ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్‌గా నిలవగా, అల్లు శిరీష్ ‘బడ్డీ’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు నిరాశపరిచాయి. అయితే చిన్న చిత్రాలుగా రిలీజైన దర్శకుడు అంజి మణిపుత్ర– హీరో నార్నే నితిన్ ‘ఆయ్’, యదు వంశీ దర్శకుడిగా పరిచయమై, నూతన నటీనటులు చేసిన ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్‌గా నిలిచాయి. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రావు రమేశ్ లీడ్ రోల్లో నటించిన ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రం మెప్పించింది. ఎన్టీఆర్ ‘దేవర’ మేనియాతో సెప్టెంబరులో పెద్దగా సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్టు 1’ ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా యూనిట్ పేర్కొంది. ఇదే నెలలో వచ్చిన నివేదా థామస్ ‘35: చిన్న కథ కాదు’, శ్రీ సింహా–హాస్యనటుడు సత్య–ఫరియా అబ్దుల్లా చేసిన ‘మత్తు వదలరా 2’ చిత్రాలు అలరించాయి.ఈ ఏడాదికి అక్టోబరు కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ముందుగా శ్రీవిష్ణు ‘స్వాగ్’ సినిమా రిలీజైంది. శ్రీవిష్ణు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక దసరాకి వచ్చిన సుధీర్‌బాబు ‘మా నాన్న సూపర్ హీరో’, గోపీచంద్ ‘విశ్వం’, సుహాస్ ‘జనక అయితే గనక’ చిత్రాలకు ఓ మోస్తరు ప్రేక్షకాదరణ దక్కింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘విశ్వం’ దసరా హిట్ సినిమాల్లో ముందు నిలిచింది. దసరా తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన రూరల్ డ్రామా ‘పొట్టేల్’ ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేయగలిగింది. అక్టోబరులో దీపావళి సందర్భంగా విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్‘, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘లక్కీ భాస్కర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే దర్శక ద్వయం సుజిత్–సందీప్ పరిచయం అయిన ‘క’ సూపర్ హిట్ అయింది. నవంబరులో భారీ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. విడుదలైన వాటిలో కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడితో విశ్వక్ సేన్ హీరోగా చేసిన ‘మెకానిక్ రాఖీ’, సత్యదేవ్–ధనంజయల ‘జీబ్రా’, కొత్త దర్శకుడు విక్రమ్ రెడ్డి తీసిన ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రాలు అలరించాయి. వరుణ్ తేజ్ ‘మట్కా’, నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నిరుత్సాహపరచాయి. ఇక డిసెంబరు తొలి వారంలోనే హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్‌ల ‘పుష్ప: ది రూల్’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా యూనిట్ ప్రకటించింది. హిందీలో ‘పుష్ప 2’కు రూ. 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం విశేషం. ఈ విధంగా ఇప్పటికే ‘పుష్ప 2’ పలు రికార్డులను తిరగ రాసింది. ఈ సినిమా ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితమవుతోంది. నెలాఖరులో అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’, ‘వెన్నెల’ కిశోర్–అనన్య నాగళ్ల నటించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’, ధర్మ ‘డ్రింకర్ సాయి’ వంటి చిత్రాలు వచ్చాయి. విజయాల శాతం తక్కువ, అపజయాల శాతం ఎక్కువ అన్నట్లుగా 2024 సాగింది. స్ట్రయిట్, డబ్బింగ్ చిత్రాలతో కలిపి దాదాపు 250 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే పెద్దా... చిన్నా... అనువాద చిత్రాలు సాధించిన విజయాలు పది శాతం లోపే. 2025లో సక్సెస్ రేట్ పెరగాలని కోరుకుందాం.మిస్సింగ్: ఈ ఏడాది వెండితెరను మిస్ అయిన సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, యువ హీరోల్లో నాగచైతన్య, రానా (సోలో హీరోగా..), అఖిల్, నితిన్, మంచు విష్ణు, నందమూరి కల్యాణ్‌రామ్, నాగశౌర్య, అడివి శేష్, సాయి దుర్గా తేజ్, నవీన్ పొలిశెట్టి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఉన్నారు. -
బాలీవుడ్లో కనిపించని ఖాన్ త్రయం.. టాప్ లేపిన 'పుష్ప' రాజ్
ఈ బాలీవుడ్‌కి ఏమైంది... దాదాపు రెండు మూడేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. అసలు ఈ ఏడాది ఖాన్ త్రయం (సల్మాన్, ఆమిర్, షారుక్) వెండితెరపై కనిపించనే లేదు. విడుదలైన చిత్రాల్లో మీడియమ్ స్టార్స్ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది మాత్రం హిందీలోకి అనువాదమైన తెలుగు చిత్రాలు ‘కల్కి 2898 ఏడీ, పుష్ప: ది రూల్’ కావడం విశేషం. ఇక ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా సాగిందో తెలుసుకుందాం.హిందీ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అంత అచ్చొచ్చినట్లుగా లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించే హిందీ సినిమాల సంఖ్య తక్కువైపోయింది. కాస్తో కూస్తో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కాపాడింది హారర్ చిత్రాలనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో హారర్ ‘స్త్రీ 2’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్లో నటించిన ‘స్త్రీ’ 2018లో విడుదలై, రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, అప్పట్లోనే సంచలనాలు సృష్టించింది. ఓ ఉమెన్ సెంట్రిక్ హారర్ ఫిల్మ్ వందకోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించడం బాలీవుడ్లో అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో ‘స్త్రీ 2’ వస్తుందనగానే ఈ సినిమాపై బాలీవుడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను వమ్ము చేయకుండా ‘స్త్రీ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ లీడ్ రోల్స్‌లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ గెస్ట్ రోల్స్‌లో నటించిన ‘స్త్రీ 2’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. రూ.650 గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచి, రికార్డు సృష్టించింది.హిందీ ఆడియన్స్ ‘స్త్రీ 2’ హారర్ హ్యాంగోవర్లో ఉన్నారేమో కానీ ఆ వెంటనే వచ్చిన మరో హారర్ హిందీ చిత్రం ‘భూల్ భూలయ్యా 3’ సినిమానూ విశేషంగా ఆదరించారు. కార్తీక్ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ మూవీకి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ ఇతర రోల్స్ చేశారు. ఈ ఏడాది నవంబరు 1న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే కోవలో అంటే... హారర్ నేపథ్యంలోనే వచ్చిన ‘సైతాన్’ చిత్రం హిందీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రాబట్టుకోగలిగింది.వికాస్ బాల్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సైతాన్’ సినిమాలో విలన్‌గా మాధవన్, మరో లీడ్ రోల్లో నటించిన మరాఠీ నటి జాంకీలు ఈ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలిచారు. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే అదీ చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియన్స్ పట్టించుకోరని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఈ ఏడాది మరోసారి ప్రూవ్ అయింది. హిందీ ఆడియన్స్‌ను మెప్పించిన హారర్ మూవీ ‘ముంజ్య’.యువ తారలు అభయ్ వర్మ, శర్వారీ హీరో హీరోయిన్లుగా, సత్యరాజ్, మోనాసింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ హారర్ ఫిల్మ్‌కు ఆదిత్య సర్ఫోత్థార్ దర్శకత్వం వహించారు. అంచనాలు లేకుండా జూన్‌లో విడుదలైన ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, బాలీవుడ్ ఆడియన్స్‌లో హారర్ జానర పట్ల ఉన్న మక్కువను మరోసారి నిరూపించింది. అలాగే 2018లో విడుదలైన హారర్ మూవీ ‘తుంబాడ్’ ఈ ఏడాది సెప్టెంబరులో రీ–రిలీజై హిట్ మూవీగా నిలిచింది. కథానాయికల జోరు హారర్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచిన చిత్రాలు హీరోయిన్స్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించినవి కావడం ఈ ఏడాది విశేషం. ముందుగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘లాపతా లేడీస్’ సినిమా గురించి ప్రస్తావించుకోవాలి. కొంత గ్యాప్ తర్వాత కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 1న థియేటర్స్‌లో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేని ఈ చిత్రానికి విడుదల తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ఆడియన్స్ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. ప్రతిభ రంతా, నితాన్షి గోయెల్, స్పర్శ్ శ్రీవాత్సవ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీలో రవికిషన్, ఛాయా కందమ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, విమర్శకుల ప్రసంసలను దక్కించుకుంది. అంతేకాదు... 2025 మార్చిలో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లాపతా లేడీస్’ సినిమాను, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీ మూవీగా పంపారు. ఇలా ‘లాపతా లేడీస్’ చిత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ 97వ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో ఈ సినిమాకు చోటు దక్కకపోవడం ఇండియన్ ఆడియన్స్‌కు కాస్త బాధ కలిగే అంశమనే చెప్పాలి. ఇదే నెలలో అంటే... ఫిబ్రవరి 23న విడుదలైన ΄÷లిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్టికల్ 370’. యామీ గౌతమ్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది.ఆదిత్యా సుహాస్ డైరెక్షన్‌లోని ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో హిట్‌గా నిలిచింది. అలాగే టబు, కరీనా కపూర్, కృతీ సనన్ నటించిన ఉమెన్ మల్టీ స్టారర్ మూవీ ‘క్రూ’ కూడా ప్రేక్షకుల మెప్పు పొంది, ఈ ఏడాది సూపర్‌హిట్ మూవీస్‌లో చోటు దక్కించుకోగలిగింది. రాజేశ్ ఏ క్రిష్ణన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లింగ్ డ్రామా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాయలల్ కపాడియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డును సైతం గెలుచుకుంది.అంతేనా... మరికొన్ని అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ చిత్రం గెలుచుకుంది. కనికా కస్రూతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఛాయా కందమ్ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం హిందీ భాషలో (మలయాళ, మరాఠీ భాషల్లో కూడా విడుదలైంది) సెప్టెంబరులో ఇండియాలో విడులైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. హిట్ యాక్షన్ బాలీవుడ్లో బడా మల్టీస్టారర్ మూవీగా రూపొందిన చిత్రం ‘సింగమ్ ఎగైన్’. దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించగా, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఇంతటి భారీ క్యాస్టింగ్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సింగమ్ ఎగైన్’ ఓ మోస్తరు హిట్‌ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. బాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.అయితే ‘సింగమ్ ఎగైన్’ రిలీజైన రోజునే... అంటే... నవంబరు 1నే, ‘భూల్ భూలయ్యా 3’ చిత్రం కూడా థియేటర్స్‌లోకి వచ్చింది. ‘సింగమ్ ఎగైన్’ సినిమా వసూళ్లపై కొంత ఎఫెక్ట్ పడటానికి ఈ సినిమా ఓ కారణం అని బాలీవుడ్ ట్రేడ్ వర్గీయులు చెప్పుకున్నారు. ఇక హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోని ఈ మూవీలో తొలి సారిగా హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ కలిసి నటించారు. జనవరి 25న విడులైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇంకా షాహిద్ కపూర్ రోబో లవ్‌స్టోరీ ‘తేరీ బోతో మే ఐసా ఉల్జా జియా’, విక్కీ కౌశల్ కామెడీ డ్రామా ‘బ్యాడ్ న్యూజ్’ వంటి చిత్రాలకు ప్రేక్షకులు హిట్ స్టేటస్ ఇచ్చారు. – ముసిమి శివాంజనేయులుటాప్ లేపిన పుష్ప రాజ్ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపిన చిత్రం ‘పుష్ప: ది రూల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూ పొందిన ‘పుష్ప: ది రూల్’ సినిమా హిందీ వెర్షన్ రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఏడాది బాలీవుడ్ స్ట్రయిట్ హిందీ బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘స్త్రీ 2’ కలెక్షన్స్‌ను సైతం అధిగమించి, ‘పుష్ప: ది రూల్’ సినిమా రికార్డు సృష్టించింది. ఇలా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ‘పుష్ప ది రూల్’ నిలిచింది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప: ది రూల్’ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా, మేకర్స్ వెల్లడించారు.‘పుష్ప: ది రూల్’ మూవీ ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ చేసిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాలీవుడ్ ఆడియన్స్‌తో హిట్ ఫిల్మ్ అనిపించుకుంది. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న థియేటర్స్‌లోకి వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ మూవీ హిందీలో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.ఇలా ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కూడా హిందీ ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.కనిపించని ఖాన్ త్రయం‘సింగమ్ ఎగైన్, బేబీ జాన్’ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా కనిపించారు. కానీ ఆయన హీరోగా నటించిన సినిమా ఏదీ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రాలేదు. అలాగే అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా నటించిన చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఇంకా రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ (సింగమ్ ఎగైన్ మూవీలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించలేదు)... ఇలా బాలీవుడ్ అగ్రశ్రేణి హీరోల సినిమాలు థియేటర్స్‌లోకి రాకపోవడం కూడా హిందీ బాక్సాఫీస్‌కి ఓ మైనస్ అని చెప్పాలి. -
'ఆ థియేటర్‌తో ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు'.. గుర్తు చేసుకున్న కల్కి డైరెక్టర్
కల్కి మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కల్కి పార్ట్-2 పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్.అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ థియేటర్‌ను గుర్తు చేసుకున్నారు. అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలుగు సినిమా చరిత్రలో సత్యం థియేటర్ ఒక భాగమన్నారు. ఆ థియేటర్లో గీతోపదేశంలోని కుడ్యచిత్రం అంతర్భాగమని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే మల్టీప్లెక్స్‌గా మార్చాక ఆ ఆ కుడ్యచిత్రాన్ని భద్రపరచలేదని ఆవేదన చెందాను.. కానీ మళ్లీ ఆ ఫోటోను చూడడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. ఆ చిత్రాలను అలాగే భద్రపరచిన నిర్మాత సునీల్ నారంగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సత్యం థియేటర్ మళ్లీ సత్యంగానే మారిందని ఇన్‌స్టాలో నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడైన సినిమా ఇదే..!
మరికొద్ది రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇకపోతే ఈ ఏడాదిలో చాలా చిత్రాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్త్రీ-2, సింగం ఏగైన్, భూల్ భూలయ్యా-2 లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ జాబితాలో అత్యధిక క్రేజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచిన సంగతి తెలిసిందే.తాజాగా పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఒక్క రోజులోనే అత్యధిక టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో వెల్లడించింది. అంతేకాకుండా అత్యధికంగా 10.8 లక్షల మంది సోలో ఆడియన్స్ వీక్షించినట్లు వెల్లడించింది.కాగా.. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా కనిపించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1508 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. -
అక్కడి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ప్రభాస్... ఎందుకంటే?
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. దాదాపు రూ.1200 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఆ మధ్య వైజయంతి మూవీస్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.జపాన్ భాషలో సారీ చెప్తూ..అంతేకాదు, జపాన్ను సైతం వస్తానని మాటిచ్చాడు ప్రభాస్. కానీ ప్రస్తుతం కాలికి గాయంతో బాధపడుతున్నందున ఆ ప్లాన్‌ను వాయిదా వేశాడు. దీంతో జపాన్ భాషలో అక్కడివారికి సారీ చెప్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'నాపై, నా సినిమాలపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. గాయం వల్లే..జపాన్‌కు రావాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నా కాలికి గాయం కావడం వల్ల రాలేకపోతున్నాను. కానీ త్వరలోనే మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను. జనవరి 3న జపాన్‌లో రిలీజయ్యే కల్కి 2898 ఏడీ మూవీ చూసి ఎంజాయ్ చేయండి' అని పేర్కొన్నాడు. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నాడు.కల్కి సినిమా సంగతులుకల్కి విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్స్)తో పాటు నెట్‌ఫ్లిక్స్ (హిందీ వర్షన్)లో అందుబాటులో ఉంది.#プラバース から日本のすべてのファンの皆さんへメッセージ 🫶❤️🔥- https://t.co/mLRYxxFLXl#Kalki2898AD releasing in cinemas across Japan from January 3rd!#カルキ2898AD #Kalki2898ADinJapan@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/CYdG1kmTmm— Kalki 2898 AD (@Kalki2898AD) December 18, 2024//#カルキ2898ADジャパンプレミア実況🏹\\TOHOシネマズ六本木ヒルズ 無事終了いたしました✨次は、19:00〜新宿ピカデリーにて!🔥#カルキ2898AD来日譚 pic.twitter.com/YIEbOzkhF6— 【公式】映画『カルキ 2898-AD』 (@kalki2898AD_jp) December 18, 2024చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్ -
స్టార్ హీరో ప్రభాస్ మళ్లీ గాయపడ్డాడా?
వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. గతేడాది 'సలార్', ఈ ఏడాది 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న డార్లింగ్ హీరో.. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. మరి ఎప్పుడు జరిగిందో గానీ ప్రభాస్ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే వెల్లడించినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బాహుబలి' తర్వాత నుంచి ప్రభాస్ తన ప్రతి సినిమాను జపాన్‌లోనూ విడుదల చేస్తున్నాడు. రాబోయే జనవరి 3న 'కల్కి' జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా ప్రీమియర్ కోసం ప్రభాస్ వెళ్లే ప్లాన్ ఫిక్సయింది. ఇప్పుడు ఇతడి చీలమండ బెణికిందని, దీంతో జపాన్ రాలేకపోతున్నానని జపనీస్ భాషలో ప్రభాస్ ఓ లెటర్ ఒకటి వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో పలుమార్లు ప్రభాస్ గాయపడ్డాడు!ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికే చాలా షూటింగ్ పెండింగ్‌లో ఉందని, బహుశా ఈ తేదీకి రాకపోవచ్చనే రూమర్స్ నడుస్తున్నాయి. విడుదల తేదీ ఇంకా చాలా దూరముంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
తొలి స్థానంలో స్త్రీ2... రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ
ప్రతి ఏడాది ప్రేక్షకులను ఆకర్షించే, చర్చించుకునేలా చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఈ ఏడాది కూడా పలు ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి.... అలరించాయి. కాగా ఇండియాలో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ ఫర్ మూవీస్ జాబితాలోని మొదటి పది చిత్రాల్లో మూడు తెలుగు చిత్రాలు నిలిచాయి. తొలి స్థానంలో రాజ్‌కుమార్ రావు– శ్రద్ధా కపూర్ నటించిన హిందీ చిత్రం ‘స్త్రీ 2’, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రెండో స్థానంలో నిలిచాయి. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘సలార్’కు తొమ్మిదో స్థానం లభించింది. 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో వరుసగా హిందీ చిత్రాలు ‘ట్వల్త్ ఫెయిల్, లాపతా లేడీస్’, తెలుగు చిత్రం ‘హను–మాన్’, తమిళ చిత్రం ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’, తమిళ చిత్రం ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు నిలిచాయి. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ చేసిన ‘ఆవేశం’ సినిమా చివరి స్థానంలో నిలిచింది. అలాగే గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ షోల జాబితాలో తొలి స్థానంలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ నిలిచింది. ‘మిర్జాపూర్, పంచాయత్, కోట ఫ్యాక్టరీ’ వంటి సిరీస్‌లకు చోటు దక్కింది. -
అత్యంత ఆదరణ కలిగిన చిత్రంగా టాలీవుడ్ మూవీ.. సెకండ్ ప్లేస్ ఏదంటే?
తాజాగా ఈ ఏడాది ఐఎండీబీ సినిమా ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ఏడాది అత్యంత ఆదరణ కలిగిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో శ్రద్ధకపూర్ సూపర్ హిట్ చిత్రం స్త్రీ-2 నిలవగా.. మూడోస్థానాన్ని విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం దక్కించుకుంది.ఆ తర్వాత స్థానాల్లో వరుసగా.. అక్షయ్ కుమార్ సైతాన్, హృతిక్ రోషన్ ఫైటర్, మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్, బాలీవుడ్ మూవీ భూల్ భూలయ్యా-3, కిల్, సింగం ఏగైన్, లపట్టా లేడీస్ ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే మొదటిస్థానంలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్ బజార్ నిలిచింది. ఈ జాబితాను ప్రకటిస్తూ ఐఎండీబీ పోస్టర్స్‌ను విడుదల చేసింది.కాగా.. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించారు.Presenting the Most Popular Indian Movies of 2024 that captured your hearts and kept you coming back for more! 💛📍Of all the movies released in India between January 1 and November 25, 2024, that have an average IMDb user rating of 5 or higher, these 10 titles were… pic.twitter.com/aP8nYcQuvO— IMDb India (@IMDb_in) December 11, 2024 ఐఎండీబీ టాప్-10 చిత్రాలు- 20241.కల్కి 2898 ఏడీ2.స్త్రీ-23.మహారాజా4.సైతాన్5.ఫైటర్6. మంజుమ్మెల్ బాయ్స్7.భూల్ భూలయ్యా-38.కిల్9.సింగం ఏగైన్10. లపట్టా లేడీస్టాప్-10 వెబ్ సిరీస్‌లు ఇవే..1. హీరామండి ది డైమండ్ బజార్2. మీర్జాపూర్ సీజన్-33.పంచాయత్ సీజన్-34.గ్యారాహ్ గ్యారాహ్5. సిటాడెల్ హనీ బన్నీ6.మామ్లా లీగల్ హ7.తాజా ఖబర్ సీజన్-28. మర్డర్ ఇన్ మహిమ్9. శేఖర్ హోమ్10.ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో -
అక్కడి 'ప్రభాస్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని కల్కి అందుకుంది. సుమారు రూ. 1200 కోట్లకు పైగానే ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది.కల్కి చిత్రం జపాన్‌లో విడుదల చేస్తున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం జపనీస్‌లో కూడా విడుదల కానుందని ఒక వీడియోతో మేకర్స్ పంచుకున్నారు. 2025 జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.పురాణాలను, సైన్సును ముడిపెడితూ తీసిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న భారత్‌లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటించారు. విజువల్ వండర్లా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక
‘‘కల్కి 2’ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు స్వాప్న దత్, ప్రియాంక దత్ చెప్పారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలై, ఘనవిజయం సాధించింది.‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని ప్రదర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్వాప్నదత్, ప్రియాంక దత్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తొలి పార్టు చిత్రీకరణ టైమ్‌లోనే 30 నుంచి 35 శాతం ‘కల్కి 2’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ప్రధాన నటీనటుల షూటింగ్ కాల్షీట్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. తొలి పార్టులో మదర్ రోల్ చేసిన దీపికా పదుకొనే ‘కల్కి 2’లోనూ మదర్ రోల్ చేస్తారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ‘కల్కి 2’ చిత్రీకరణ వచ్చే ఏడాది ్రపారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేశారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ మరెవరో కాదు.. కల్కి మూవీలో బుజ్జిగా అలరించిన కారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. బుజ్జి పేరుతో ఉన్న ట్విటర్లో హ్యాండిల్లో వీడియోను పోస్ట్ చేసింది కల్కి టీమ్.కాగా.. ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో బుజ్జి పేరుతో ఉన్న కారుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రిలీజ్‌కు ముందు పలు నగరాల్లో బుజ్జి సందడి చేసింది. ఈ సినిమాలో బుజ్జి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. కాగా.. బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.Happy Birthday BHAIRAVA - from your best friend #Bujji ❤️#Prabhas #Kalki2898AD pic.twitter.com/szhxo0xLqH— Bujji (@BelikeBujji) October 23, 2024 -
Happy Birthday Prabhas: అజాతశత్రువు.. అందరికి ‘డార్లింగ్’
టాలీవుడ్‌కి చెందిన చాలా మంది హీరోలు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కానీ టాలీవుడ్‌నే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక స్టార్ ఎవరంటే..అది ప్రభాస్ అనే చెప్పొచ్చు. ఈ ఒక్క పేరు ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఆల్ ఇండియా నెంబర్ వన్ హీరో మన రెబల్ స్టారే అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే.. ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల దాకా థియేటర్స్ కు వెళ్లడం ఒక ఫినామినా. ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాం అనే మలి వయసు పెద్దలు కూడా ప్రభాస్ సినిమాకు థియేటర్స్ కు కదలడం ఆయన ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఉన్న స్టార్ అని తెలియజేస్తుంటుంది. అందుకే బాక్సాఫీస్ దగ్గర డే 1 రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్, రికార్డ్ స్థాయి ఓవర్సీస్ కలెక్షన్స్ సాధ్యమవుతున్నాయి.ప్రభాస్ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ ప్రేక్షకుల్ని ఇంతలా ఆకర్షిస్తున్నాయని అనుకోవచ్చు. సలార్ లో ప్రభాస్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్ కు కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనుకున్నారు ఆడియెన్స్. అదీ స్క్రీన్ ప్రెజెన్స్ లో ప్రభాస్ కున్న ఛరిష్మా. బాహుబలి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ రీజనల్ స్టార్స్ కే కాదు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఒక నెరవేరని కల, సాధ్యం కాని ఫీట్. కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో రెండు సార్లు థౌసండ్ క్రోర్ గ్రాస్ మూవీస్ చేశాడు. బాహుబలి 2 డే 1, 200 కోట్ల రూపాయలు వసూళు చేయడం ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ వెయ్యి రోజుల శ్రమ కలెక్షన్స్ రూపంలో రిజల్ట్ ఇచ్చింది. కల్కి 2898 ఏడి మూవీ 1100 కోట్ల రూపాయల గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ చేయడం ప్రభాస్ రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్. ప్రభాస్ బిగ్ హీరోనే కాదు బిగ్ టికెట్ హీరో అని ఈ బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేస్తున్నాయి.ప్రభాస్ సినిమా అంటే ప్రొడ్యూసర్స్, ట్రేడ్ సెక్టార్ లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆయన సినిమాల మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు, ఆ పెట్టుబడికి ప్రభాస్ స్టార్ డమ్, బాక్సాఫీస్ స్టామినానే పూచీ. అందుకే వందల కోట్ల రూపాయలతో బడ్జెట్ తో ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నాయి ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌసెస్. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా...ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్. వీటిలో ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. మిగతా మూవీస్ చిత్రీకరణలో వివిధ దశల్లో ఉన్నాయి.ప్రభాస్ స్టార్ గానే కాదు వ్యక్తిగానూ అంతే గొప్పవారు. తనను ఇంత పెద్ద స్టార్ ను చేసిన అభిమానులు, ప్రేక్షకులంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే సొసైటీలో ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు. మిగతా స్టార్స్ కంటే రెట్టింపు డొనేట్ చేస్తుంటారు. ఈ ఏడాది కేరళలో వనయాడ్ విలయానికి విపత్తు సాయంగా తన వంతు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభాస్, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. అజాతశత్రువు అనే పాత మాటకు డార్లింగ్ అనే కొత్త అర్థానిచ్చిన ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు( అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే) -
ప్రభాస్ 'కల్కి' విలన్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా? (ఫొటోలు)
-
నేను మాట్లాడింది ప్రభాస్ గురించి కాదు.. జోకర్ కామెంట్స్‌పై క్లారిటీ!
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. కల్కి చిత్రంలో ప్రభాస్ నటనను ఉద్దేశించి జోకర్లా ఉన్నాడంటూ మాట్లాడారు. దీంతో అర్షద్ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తాను చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారాయన. ఐఫా-2024 అవార్డ్స్ వేడుకల్లో పాల్గొన్న అర్షద్ వార్సీ తాను చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు. (ఇది చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?)అర్షద్ వార్సీ మాట్లాడుతూ.'ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. నేను కేవలం పాత్ర గురించి మాత్రమే మాట్లాడాను. ఇక్కడ వ్యక్తి గురించి నేను చెప్పలేదు. ప్రభాస్ అద్భుతమైన నటుడు. ఈ విషయాన్ని తాను పదే పదే నిరూపించుకున్నాడు. అతని గురించి మనకు తెలుసు. కానీ మంచి నటుడికి చెడ్డ పాత్ర ఇచ్చినప్పుడు అది ప్రేక్షకులకు చాలా బాధగా ఉంటుంది' అని అన్నారు. ప్రభాస్ గురించిన నేను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అర్షద్ వార్సీ తెలిపారు. అయితే ప్రభాస్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేయడంతో అర్షద్ పెద్దఎత్తున ట్రోలింగ్‌కు గురయ్యాడు. -
బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కల్కి 2898 ఏడీ
ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’కి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి అక్టోబరు 11 వరకు దక్షిణ కొరియాలో 29వ బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్‌ఎఫ్) జరగనుంది. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న 279 చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’కి చోటు లభించింది. అక్టోబరు 8, 9 తేదీల్లో ఈ చిత్రం ‘బీఐఎఫ్‌ఎఫ్’లో ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని ‘కల్కి 2898ఏడీ’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ‘ఎక్స్’ మాధ్యమంలో ధ్రువీకరించింది. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న విడుదలై, సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుంది. -
భారత్ నుంచి ఆస్కార్ కోసం నామినేట్ అయిన చిత్రాలు ఇవే
ఆస్కార్ అవార్డుల రేస్‌లో ఈ ఏడాది సౌత్ ఇండియా నుంచి భారీగానే సినిమాలు పోటీ పడుతున్నాయి. తెలుగు,తమిళ్, మలయాళం నుంచి పలు సినిమాలు ఎంట్రీ కోసం ఊరిస్తున్నాయి. 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలను గుర్తించి వాటిని ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసింది. ఈమేరకు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించింది. 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి 'లాపతా లేడీస్' ఎంపికైనట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. భారత్ నుంచి పలు భాషలకు చెందిన 29 చిత్రాల్లో లా పతా లేడీస్‌ను మాత్రమే ఎంపిక చేశారు.అస్కార్ కోసం ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు 'కల్కి 2898 ఏడీ,హనుమాన్,మంగళవారం' ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో 6 తమిళ చిత్రాలు నామినేట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. మలయాళం నుంచి ఆట్టం, ఆడుజీవితం (ది గోట్ లైఫ్),ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఉళ్ళోజుక్కు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ ఇండియా నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే, భారతీయ చిత్ర పరిశ్రమ పంపిన 29 సినిమాల్లో ప్రస్తుతానికి లపతా లేడిస్ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన వస్తుంది. 🤞🏼 pic.twitter.com/YgdeaTsTNi— Prasanth Varma (@PrasanthVarma) September 23, 2024 -
'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?
ప్రభాస్ 'కల్కి' సినిమా వచ్చి నాలుగు నెలలైపోయింది. రిలీజ్ టైంలోనే అర్జునుడు, కర్ణుడు పాత్రలు వాటి మధ్య సన్నివేశాల గురించి చర్చోపచర్చలు నడిచాయి. అర్జునుడు గొప్ప అని కొందరు లేదులేదు కర్ణుడే గొప్ప అని మరికొందరు వాదించుకున్నారు. అదంతా ముగిసిపోయి చాలా కాలామైపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు 'కల్కి' సినిమాపై విమర్శలు చేశారు.గరికపాటి ఏమన్నారు?తాజాగా వినాయక చవితి సందర్భంగా గరికపాటి ప్రవచనాలు చెప్పారు. మాటల సందర్భంగా 'కల్కి' గురించి ప్రస్తవన వచ్చేసరికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మహాభారతంలో ఉన్నది వేరు సినిమాలో చూపించింది వేరు అని చెప్పారు. అశ్వద్ధామ, కర్ణుడిని హీరోలుగా చూపించడమేంటో తనకు అస్సలు అర్థం కాలేదని కౌంటర్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)వీడియోలో ఏముంది?'కర్ణుడు ఎవరో తెలియకపోతే 'కల్కి' సినిమాలో చూపించినవాడే కర్ణుడు. మనేం చేస్తాం. సినిమావోళ్లు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు అందులో చూపించింది వేరు. అశ్వద్ధామ, కర్ణుడు అర్జెంట్‌గా హీరోలైపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లేదు. బుర్రపాడైపోతుంది. పైగా మహాభారతమంతా చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వద్ధామ కాపాడాడు. అశ్వద్ధామని కర్ణుడు ఎప్పుడూ ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వద్ధామ మహావీరుడు. ఇక్కడేమో 'ఆచార్య పుత్ర ఆలస్యమైంది' అని డైలాగ్ పెట్టారు. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ వెయ్యి రూపాయలు ఎక్కువిస్తే డైలాగ్ రాసేవాడు రాసేస్తాడు కదా' అని గరికపాటి అన్నారు.'కల్కి' మూవీ గురించిజూన్ 27న థియేటర్లలో రిలీజైన 'కల్కి'.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనికి కొనసాగింపుగా తీస్తున్న రెండో భాగం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి 'కర్ణ 3102 బీసీ' అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. (ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)తనకు నచ్చని రాజకీయ పార్టీలపై, సినిమా హీరోలపై విమర్శలు చేసే గరికిపాటి నరసింహారావు.. తాజాగా కల్కిపై విమర్శలు pic.twitter.com/vThPZ5s4Nn— greatandhra (@greatandhranews) September 23, 2024 -
'కల్కి' పార్ట్ 2.. టైటిల్ ఫిక్స్ అయిందా?
ప్రభాస్ లైనప్ ప్రస్తుతం ఫుల్ ప్యాక్డ్ ఉంది. ఈ ఏడాది 'కల్కి 2898'తో రూ.1000 కోట్ల మార్క్ దాటేశాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో ఫుల్ బిజీ. దీని తర్వాత సలార్ 2, కల్కి 2 రెడీగా ఉన్నాయి. ఓవైపు 'సలార్' షూటింగ్ గురించి సెట్స్ సిద్ధమవుతుండగా.. మరోవైపు 'కల్కి' పార్ట్ 2 గురించి కొన్ని గాసిప్స్ వైరల్ అయిపోతున్నాయి. టైటిల్‌ని ఫిక్స్ చేయడంతో పాటు స్టోరీ ఎలా ఉండబోతుందో మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: పిల్ల దెయ్యం సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్)ఇప్పటికే వచ్చిన 'కల్కి' తొలి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. చివర్లో మహాభారతం ఎపిసోడ్, అందులో కర్ణుడు-అర్జునుడు సీన్స్ సూపర్ హైలైట్ అయ్యాయి. వీటిని చూసి చాలామంది మరికాసేపు ఇవి ఉంటే బాగుండు అని ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్ల కోరిక నెరవేరిందని చెప్పొచ్చు.ఎందుకంటే సీక్వెల్‌కి 'కర్ణ 3102 BC' అనే టైటిల్ నిర్ణయించారట. పేరు బట్టే అర్థమైపోతుందిగా.. మొత్తం కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్‌గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట. ఉన్న కొద్దిపాటి నిమిషాలకే మహా భారతం సీన్లతో నాగ్ అశ్విన్ తన మార్క్ చూపించాడు. మరి ఇప్పుడు రెండో పార్ట్ ఇంకేం మ్యాజిక్ చేస్తాడోనని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. రాబోయే జనవరి నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్) -
కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు, వీడియో వైరల్
దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఎప్పటి మాదిరే ఈ సారి కూడా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా పాత్రలపై స్పెషల్ వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవరతో పాటు పలువురి స్టార్ హీరోల లుక్‌లో ఉన్న గణపతి బొమ్మలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ‘కల్కి’ రూపంలో ఉన్న వినాయకుడే ఈ ఏడాది స్పెషల్ అట్రాక్షన్ నిలిచాడు.కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడుప్రభాస్ హీరోగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ ఏడాది జూన్ 27న విడుదలై..బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్, యాస్కిన్‌గా కమల్ నటించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు ప్రత్యేక కారు ‘బుజ్జి’, కాంప్లెక్స్ ప్రదేశాలు అలా గుర్తిండిపోతాయి. ఇప్పుడు ఇదే సినిమాను పోలిన ఓ గణపతి మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వినాయకుడు అశ్వత్థామ రూపంలో ఉండగా.. మందిరం కాంప్లెక్స్ ప్రదేశంలా ఉంది. ‘కల్కి’వినాయకుడు ఎక్కడ ఉన్నాడు?‘కల్కి’ వినాయకుడి విడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అసలు ఈ మందిరం ఎక్కడ ఏర్పాటు చేశారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేసింది తమిళ ప్రజలే. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ మందిరం ఉన్నట్లు తెలుస్తోంది. కాంప్లెక్ మాదిరి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్‌లో బుజ్జిని కూడా ఉంచారు. లోపల యాస్కిన్ లుక్‌లో ఉన్న కమల్ బొమ్మ పెట్టి.. అమితాబ్ అశ్వత్థామ లుక్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, నుదుటిపై మణి వెలిగిపోతున్నట్లు ఓ లైట్ కూడా సెట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది స్పెషన్ వినాయక విగ్రహం ఇదేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. #wow pic.twitter.com/54ssb41OTm— devipriya (@sairaaj44) September 9, 2024 -
ఓటీటీలోనూ తగ్గేదేలే.. ఆ జాబితాలో టాప్ ప్లేస్‌లో కల్కి!
ప్రభాస్- నాగ్అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ బ్లాక్‌బస్టర్ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో నెల రోజులకు పైగా అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం ఓటీటీలోనూ కల్కి మూవీకి విపరీతమైన క్రేజ్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో సౌత్ లాంగ్వేజేస్‌లో అందుబాటులో ఉంది. హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండు వారాల్లోనే అత్యధికంగా 2.6 మిలియన్ల వ్యూస్, 7.5M గంటల టైమింగ్‌తో గ్లోబల్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో వరల్డ్ వైడ్‌గా మొదటి స్థానంలో కొనసాగుతోంది. కాగా..ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.కాగా.. ఈ మూవీకి సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. పార్ట్-2లో కమల్ హాసన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. ఈ మూవీని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
'కల్కి' నిర్మాతలకు రామ్‌చరణ్ సర్ప్రైజ్.
-
మీకు మరణం లేదా..? కల్కి డిలీట్ సీన్స్ హైలైట్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఈ ఏడాదిలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో కూడా ట్రెండింగ్‌లో కల్కి ఉంది. ఈ క్రమంలో కల్కి డిలీట్ సీన్స్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా హిందీ వెర్షన్ ప్రసారం అవుతుంది. ఇదే తేదీ నుంచి తెలుగు, తమిళంతో సహా మిగతా భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
Dupe: ఏడడుగుల అశ్వత్థామ
ఏడడుగుల అశ్వత్థామ‘కల్కి’ సినిమాలో అశ్వత్థామ మనందరికీ నచ్చాడు కదా. అమితాబ్ బచ్చన్ ఆ పాత్రలో కనిపిస్తాడు. ద్వాపర యుగం నాటి పాత్ర కాబట్టి సినిమాలో మిగిలిన అన్ని పాత్రలు ఇప్పటి ఎత్తులో ఉన్నా అమితాబ్ 7 అడుగుల ఎత్తులో ఉంటాడు. కాని సినిమాల్లో అన్ని సన్నివేశాల్లో హీరోలు యాక్ట్ చేయరు. వాళ్లకు డూప్స్ ఉంటారు. ‘కల్కి’లో కూడా అమితాబ్‌కు డూప్ ఉన్నాడు. అతని పేరు సునీల్ కుమార్. ఇక్కడ ఫోటోల్లో ఉన్నాడే... అతనే. ఇతని ఎత్తు ఏడు అడుగుల ఏడంగుళాలు. జన్యుపరమైన ఇబ్బందుల వల్ల ఇంత ఎత్తు పెరిగాడు. జమ్ము– కశ్మీర్లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్యనే సినిమాల కోసం ఇతణ్ణి ఉపయోగిస్తున్నారు. కల్కి సినిమా మొత్తం అమితాబ్‌కు డూప్‌గా నటించాడు. అమితాబ్ సునీల్‌ని చూసి ‘అరె... నేనే లంబు అనుకుంటే ఇతను నాకంటే లంబుగా ఉన్నాడే’ అని సరదాపడ్డాడట. సునీల్ కుమార్ ఇటీవల పెద్ద హిట్ అయిన ‘స్త్రీ2’లో కూడా ఉన్నాడు. అందులో ‘సర్కటా’ అనే దెయ్యం వేషం వేశాడు. షూటింగ్‌ల కోసం లీవ్ పెట్టి ముంబై, హైదరాబాద్ తిరగాలంటే సెలవు కొంచెం కష్టమైనా సినిమాల్లో నటించడం బాగనే ఉందని సంతోషపడుతున్నా సునీల్. -
ప్రభాస్ కల్కి సీక్వెల్.. షూటింగ్ ఎప్పటినుంచంటే?
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మించారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందన ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.తాజాగా కల్కి సీక్వెల్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల రష్యాలోని మాస్కోలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ వీక్‌లో నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్‌లు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో కల్కి-2 షూటింగ్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూట్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాగా.. కల్కి మూవీని త్వరలోనే రష్యన్ భాషలోనూ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రంలో కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. అంతేకాకుండా రాజమౌళి, రాంగోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ మూవీలోని బుజ్జి కారుకు కీర్తి సురేశ్ వాయిస్ అందించారు. అయితేస పార్ట్-2లో కమల్ హాసన్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చారు. దీంతో పార్ట్-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
ప్రపంచ వేదికపై తెలుగు సినిమా.. ఆ దేశ భాషలోనూ కల్కి రిలీజ్!
టాలీవుడ్ సినిమా పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది. ఆర్ఆర్ఆర్, బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ దాకా ఎదిగింది. తాజాగా రష్యాలోని మాస్కోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో ఆర్ఆర్ఆర్, కల్కి చిత్రాలను ప్రదర్శించారు. రష్యాలోనూ ఇండియన్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఆర్ఆర్ఆర్ను ఆ దేశ భాషలోనూ విడుదల చేశారు.రష్యన్ భాషలో రిలీజ్తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాను రష్యన్ భాషలోనూ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్వప్నదత్, ప్రియాంక దత్‌లు వెల్లడించారు. కల్కి సినిమాను రష్యా భాషలోకి డబ్ చేయనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌లోనే రష్యా థియేటర్లలో కల్కి సందడి చేయనుంది. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో టాలీవుడ్ సినిమాల ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆగస్టు 23న ప్రారంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నేటితో ముగియనుంది.బాక్సాఫీస్ షేక్ చేసిన కల్కికాగా.. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో కీర్తి సురేశ్ వాయిస్‌తో ఉన్న బుజ్జికారు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. Celebrating Indian Cinema globally! ✨ #Kalki2898AD proudly represents India at the Moscow International Film Week during Indian Cinema Day 🇮🇳@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/yDmlcAurm8— Kalki 2898 AD (@Kalki2898AD) August 27, 2024 -
ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్
గత కొన్నిరోజుల నుంచి ప్రభాస్-అర్షద్ వార్సీ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. 'కల్కి'లో ప్రభాస్ లుక్ జోకర్లా ఉందని హిందీ నటుడు అర్షద్ కామెంట్ చేయడం.. దీనికి ప్రతిగా నాని, సిద్ధు, శర్వానంద్ తదితర తెలుగు హీరోలు కౌంటర్స్ వేయడంతో ప్రస్తుతం ట్విటర్లో నార్త్-సౌత్ అనే రచ్చ అవుతోంది. ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. మంట చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)'కల్కి' సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్, కర్ణుడిగా ఎంట్రీ ఇచ్చే సీన్ ని ట్విటర్లో పోస్ట్ చేసి.. బాలీవుడ్ మొత్తం కంటే ఇది బెటర్ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన నాగ్ అశ్విన్.. 'మళ్లీ పాతకాలంలోకి వెళ్లొద్దు. సౌత్ వర్సెస్ నార్త్, బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అనేవి లేవు. ఇప్పుడంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అర్షద్ సాబ్ మీరు కాస్త చూసుకుని మాట్లాడాల్సింది. కానీ ఓకే. మీ నలుగురు పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపిస్తున్నాను. అలానే కల్కి 2లో ప్రభాస్ మరింత బెస్ట్‌గా కనిపిస్తాడు' ఓ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు.'ఇప్పటికే ప్రపంచం చాలా ద్వేషంతో నిండిపోయింది. మనం దాన్ని పెంచే పనిచేయొద్దు. నేనే కాదు ప్రభాస్ కూడా ఇలానే చెబుతాడు' అని మరో ట్వీట్లో నాగ్ అశ్విన్ రాసుకొచ్చాడు. మరో ట్విటర్ యూజర్.. అర్షద్ వార్సి కంటే బెస్ట్ యాక్టర్ సౌత్‌లో ఎవరైనా ఉన్నారా? అని పోస్ట్ పెట్టాడు. దీనిపై ఫైర్ అయిన నాగ్ అశ్విన్.. 'అసలు నువ్వు ఎవర్రా? ఇంత ద్వేషం ఎందుకు? ఇలా వేరు చేసి ఎందుకు మాట్లాడుతున్నావ్? మేమంతా ఒక్కటే. కావాలంటే బుజ్జి బొమ్మ ఒకటి పంపనా?' అని గొడవని చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. (ఇదీ చదవండి: కూతురికి రామ్‌చరణ్ బహుమతి.. ఆ గిఫ్ట్‌కు మగధీరతో లింక్!)Let's not go backwards..no more north-south or bolly vs tolly..eyes on the bigger picture.. United Indian Film Industry..Arshad saab should have chosen his words better..but it's ok..sending buji toys 4 his kids..il work hard so tweets fdfs that prabhas was the best ever in k2💪— Nag Ashwin (@nagashwin7) August 24, 2024Who are you man? Why so much hate? And spreading division? We are all in this together...Chill... Can I send u a bujji toy?— Nag Ashwin (@nagashwin7) August 24, 2024Too much hate in the world already bro...we can try not to add to it..I know prabhas garu will also feel the same...❤️— Nag Ashwin (@nagashwin7) August 24, 2024 -
ఓటీటీలో కల్కి.. బీటీఎస్ పిక్స్ చూశారా? (ఫోటోలు)
-
ఓటీటీలో కల్కి.. రన్‌టైమ్ ఎన్ని నిమిషాలు తగ్గించారంటే?
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో కల్కి ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా రిలీజై 50 రోజులు పూర్తి కావడంతో ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆగస్టు 22 నుంచి అమెజాన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో కల్కి నిడివిపై నెట్టింట చర్చ మొదలైంది. థియేటర్లలో ప్రదర్శించిన రన్‌టైమ్ కంటే తక్కువ ఉండడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. థియేటర్లలో 181 నిమిషాలు ఉన్న కల్కి.. ఓటీటీకి వచ్చేసరికి 175 నిమిషాలకే కుదించారు. దీంతో ఈ మూవీలో ఏ సీన్లను తొలగించారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ట్రిమ్ చేసిన సీన్స్ ఇవే..కల్కిలో కొన్ని సీన్లను ట్రిమ్ చేయడంతో ఏకంగా ఆరు నిమిషాల రన్‌టైమ్ తగ్గిపోయింది. ఆ సీన్లలో మొదటిది ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్.. నిడివి కాస్త ఎక్కువగా అనిపించడంతో తొలగించారు. ఇందులో ప్రభాస్‌ను కప్ప అని పిలిచే సీన్ కూడా తీసేశారు. ఆ తర్వాత ప్రభాస్ ఇద్దరు భారీ కాయులతో చేసే ఫైట్ సీన్ నిడివిని కూడా తగ్గించారు. ఇక కాంప్లెక్స్‌లోకి వెళ్లిన తర్వాత అక్కడ దిశా పటానీతో ప్రభాస్ సాంగ్‌ను కూడా కట్ చేశారు.అంతేకాకుండా బీచ్ సీన్లను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. మెరూన్ దుస్తులలో ప్రభాస్‌తో మొత్తం సీక్వెన్స్ ఎత్తేశారు. ఇంటర్వెల్‌కు ముందు దీపికా మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్‌ను ట్రిమ్ చేయడంతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ తొలగించారు. అక్కడ థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్ జోడించారు. ఇకపోతే డబ్బింగ్లోనూ అక్కడక్కడా మార్పులు చేశారు.కారణమిదేనా?కల్కి 2898 ఏడీ జూన్ 27న రిలీజ్ నాటిటి 181 నిమిషాల నిడివి ఉంది. అంటే 3 గంటల ఒక నిమిషంతో థియేటర్లలో రిలీజైంది. నిజానికి ఇది చాలా ఎక్కువ రన్ టైమ్. ఆ సమయంలో సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చినా.. రన్‌టైమ్ విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. అందువల్లే ఓటీటీలోకి వచ్చేసరికి మేకర్స్ ఏకంగా 6 నిమిషాలను తగ్గించేసినట్లు తెలుస్తోంది. -
ప్రభాస్ అన్న జోకర్ కాదు.. సక్సెస్ వెనక స్ట్రాంగ్ పిల్లర్: సిద్ధు
కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆహా ఓహో అని కీర్తించారు. మరో ప్రపంచానికి వెళ్లొచ్చినట్లు ఉందన్నారు. అంత అద్భుతంగా ఉండబట్టే బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.1200 కోట్లు రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం (ఆగస్టు 22) నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదన్నాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. సెటైర్లుప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదులే అని ఫ్యాన్స్ ఏదో సర్దిపెట్టుకుందామనుకునేలోపే భైరవగా ప్రభాస్ లుక్ జోకర్లా ఉందని సెటైర్లు వేశాడు. ఊహించినంత ఏమీ లేదని విమర్శలు గుప్పించాడు. ఈయన వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా అర్షద్ వార్సీ కామెంట్లపై విరుచుకుపడ్డాడు.అంత ఈజీ కాదుఅభిప్రాయాన్ని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కొన్ని సినిమాలను ఇష్టపడతాం. కొన్నింటిని లైట్ తీసుకుంటా. నటీనటుల విషయంలోనూ అంతే.. ఎవరి ఇష్టాలు వారివి. కానీ మన అభిప్రాయాలను బయటకు ఎలా చెప్తున్నామనేది ముఖ్యం. సినిమా రంగంలోకి రావడం, ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. సద్విమర్శ మంచిదే కానీ.. జోకర్ వంటి పదాలు వాడటం కరెక్ట్ కాదు.ఒకే ఇండస్ట్రీలో ఉండి..సినిమా రంగంలోనే ఉండి ఇలాంటి కామెంట్లు చేస్తారా? కల్కి.. భారతీయ సినిమాకే గర్వకారణంలాంటిది. నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుతం రూ.1000 కోట్ల పైనే వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఇండియన్ సినిమాలోని పెద్ద స్టార్స్‌లో ప్రభాస్ అన్న ఒకరు. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. మన హిట్ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కంటే ప్రభాస్ అన్న ఫ్లాప్ సినిమాలకు వచ్చే కలెక్షన్సే ఎక్కువ! అలాంటి స్టార్డమ్జయాపజయాలతో సంబంధం లేని స్టార్డమ్ తనది. కల్కి సక్సెస్ వెనక స్ట్రాంగ్ పిల్లర్‌లా నిలబడ్డాడు. ఇదే నిజం. భావప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఆ భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నామనేది ఆలోచించుకుని మాట్లాడండి. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి అని సిద్ధు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. #SiddhuJonnalagadda slams the comments made by #ArshadWarsi on Rebel Star #Prabhas.#NagAshwin #Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/lBdNhJNvDJ— NANI (@NANI_09_30) August 21, 2024 -
మరికొన్ని గంటల్లో ఓటీటీకి కల్కి.. ఎక్కడ చూడాలంటే?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.థియేట్రికల్ రిలీజ్ సూపర్ హిట్ కావడంతో కల్కి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ నెల 22 నుంచి అమెజాన్ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని గంటల్లోనే కల్కి ఓటీటీలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ అదే తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకేందుకు ఆలస్యం ఇవాళ అర్థరాత్రి నుంచే ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ప్రభాస్ స్థాయి వేరు.. నీలాంటి వారిని పట్టించుకోరు: సుధీర్ బాబు
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి చిత్రంపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ సినిమా తనకు నచ్చలేదని అన్నారు. అంతేకాదు కల్కిలో ప్రభాస్ లుక్ జోకర్లా అనిపించిందని కించపరిచేలా మాట్లాడారు. దీంతో అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ప్రభాస్‌ను ఉద్దేశించిన అతను చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు అర్షద్ వార్సీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.తాజాగా టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సైతం అర్షద్ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాస్ విషయంలో మీరు నిర్మాణాత్మకంగా విమర్శించినా ఫర్వాలేదు.. కానీ అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్ నీలాంటి వారి నుంచి వస్తాయని ఊహించలేదని అన్నారు. ఇలా సంకుచిత మైండ్‌సెట్‌తో ఆలోచించే నీలాంటి వారిని ఆయన పట్టించుకోరని తెలిపారు. ఎందుకంటే ప్రభాస్ స్థాయి చాలా పెద్దదని సుధీర్ బాబు తన ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా..అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని రెబల్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.It's okay to criticize constructively but it's never okay to bad-mouth. Never expected the absence of professionalism from Arshad Warsi. Prabhas's stature is too big for comments coming from small minds..— Sudheer Babu (@isudheerbabu) August 20, 2024 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ఆగస్టు 15 లాంటి మంచి వీకెండ్‌ని టాలీవుడ్ ఘోరంగా మిస్ చేసుకుంది. 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిలయ్యాయి. 'ఆయ్' అనే చిన్న మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోగా... డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్' తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇదిలా ఉండగా ఈ వారం చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటి రిలీజ్ కావడం లేదు. 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' అనే తెలుగు మూవీ, 'డీమోంటీ కాలనీ 2' అనే డబ్బింగ్ సినిమా థియేటర్లలోకి వస్తున్నాయి.(ఇదీ చదవండి: 51 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో)ఓటీటీలో మాత్రం ఈ వారం 'కల్కి', 'రాయన్' లాంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు 'గర్‌ర్‌ర్' అనే డబ్బింగ్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూడు తప్పితే పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాకపోతే వీటిలో ఏవి బాగుంటాయనేది ఓటీటీలోకి వస్తే గానీ చెప్పలేం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 19 నుంచి 25 వరకు)అమెజాన్ ప్రైమ్యాంగ్రీ యంగ్ మ్యాన్: ద సలీం జావేద్ స్టోరీ (హిందీ సిరీస్) - ఆగస్టు 20కల్కి 2898 ఏడీ (తెలుగు సినిమా) - ఆగస్టు 22ఫాలో కర్లో యార్ (హిందీ సిరీస్) - ఆగస్టు 23రాయన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 23నెట్ఫ్లిక్స్టెర్రర్ ట్యూజ్‌డే: ఎక్స్ట్రీమ్ (థాయ్ సిరీస్) - ఆగస్టు 20జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22కల్కి 2898 ఏడీ (హిందీ వెర్షన్) - ఆగస్టు 22మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22ప్రెట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ద మూవీ పార్ట్ 1 (జపనీస్ సినిమా) - ఆగస్టు 22ఇన్ కమింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 23ద ఫ్రాగ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23ఆహాఉనర్వుగల్ తొడరకథై (తమిళ సినిమా) - ఆగస్టు 23హాట్స్టార్గర్ర్ర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 20ద సుప్రీమ్స్ ఎట్ ఎర్ల్స్ ఆల్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 23మనోరమస్వకార్యం సంభవబాహులం (మలయాళ మూవీ) - ఆగస్టు 23ఆపిల్ ప్లస్ టీవీపచింకో సీజన్ 2 (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23లయన్స్ గేట్ ప్లేఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 23జియో సినిమాడ్రైవ్ ఏవే డాల్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 23(ఇదీ చదవండి: రాఖీ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ అవ్వొద్దు!) -
ప్రభాస్ జోకర్లా కనిపించాడు.. కల్కిపై బాలీవుడ్ నటుడి సెటైర్లు
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 22న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి రానుంది.కల్కి నచ్చలేదుఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి.. ప్రభాస్ లుక్ బాగోలేదంటూ సంచలన కామెంట్లు చేశాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. నేను కల్కి సినిమా చూశాను. నాకసలు నచ్చలేదు. ప్రభాస్ అయితే జోకర్లా ఉన్నాడు. తననలా చూసి బాధేసింది. ఈ సినిమాను మ్యాడ్ మాక్స్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. ప్రభాస్‌పై ఏడుపుకానీ ఆ రేంజ్లో తెరకెక్కించడంలో దర్శకనటులు ఫెయిలయ్యారు అని చెప్పుకొచ్చాడు. ఇతడి కామెంట్లపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లమంది ఆదరించిన సినిమాపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అయినా వీళ్లెప్పుడూ ప్రభాస్ మీద ఏడుస్తూనే ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Here it is, The real view of #Kalki2898AD from north India. #Prabhas looks like Joker in the film says Arshad. He also added kalki could have been a good film like Mad Max but the actor and director failed to do so. pic.twitter.com/hbEWMOyyj7— Movie Hub (@Its_Movieshub) August 18, 2024 -
ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన
ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఆగస్టు 15 నాటికి 50 రోజుల మార్క్ అందుకుంది. దాదాపు థియేట్రికల్ రన్ ముగిసినట్లే. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనేది అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: అక్కడ షారూఖ్ ఖాన్.. ఇక్కడ మహేశ్ బాబు?)గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఆగస్టు మూడో వారంలోనే 'కల్కి' ఓటీటీలోకి రానుంది. అయితే ఆగస్టు 23న కాకుండా ఓ రోజు ముందే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ పోస్టర్ రిలీజ్ చేసి మరీ క్లారిటీ ఇచ్చింది. హిందీ వెర్షన్ అదే తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో భవిష్యత్, భూత కాలాల్ని చూపించారు. అలానే మహాభారతం ఎపిసోడ్ కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంది. ఆలోవర్ హిట్ టాక్‌తో రూ.1200 కోట్ల మేర వసూళ్లు సాధించింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)The dawn of a new ERA awaits you 🌅And this is your gateway into the GRAND world of Kalki⛩️🔥#Kalki2898ADOnPrime🔥, Aug 22#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani@VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/9FYs2quk5C— prime video IN (@PrimeVideoIN) August 17, 2024 -
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. ఓటీటీ రిలీజ్ డేట్ అదేనా?
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ టాలీవుడ్ మూవీ ఓటీటీకి ఎప్పుడెస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా కల్కి ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈనెల 23 నుంచే ఓటీటీకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాది హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెలలోనే స్ట్రీమింగ్కు వచ్చే ఛాన్స్ ఉండడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది.నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాంగోపాల్ వర్మ అతిథి పాత్రల్లో మెప్పించారు. -
'కల్కి' దర్శకుడి భారీ సాయం.. ఏకంగా రూ.66 లక్షలు!
'కల్కి' సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ సాయం చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంతూరు ఐతోల్లో తన తాత సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులు నిర్మించి ఇచ్చాడు. తన తండ్రి చదువుకున్న ఈ స్కూల్‌కి తన వంతుగా ఈ సాయం చేసినట్లు పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ కల్కిలో ఆఫర్.. రిజెక్ట్ చేశా: కీర్తి సురేశ్)ఈ క్రమంలోనే అదనపు గదులు నిర్మించేందుకు దాదాపు రూ.66 లక్షల మేర ఖర్చయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎప్పుడు ముందుంటుందని నాగ్ అశ్విన్ చెప్పాడు. తాజాగా ఈ గదుల ప్రారంభోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి నాగ్ అశ్విన్ హాజరయ్యాడు.'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. 'మహానటి' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఈ మధ్య 'కల్కి'తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. (ఇదీ చదవండి: హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం) -
ప్రభాస్ కల్కిలో ఆఫర్.. రిజెక్ట్ చేశా: కీర్తి సురేశ్
దసరా బ్యూటీ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ భామ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటిచిన కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసింగే. తాజా ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో నాగ్ అశ్విన్ తనకు ఓ రోల్ ఆఫర్ చేశారని తెలిపింది. కానీ దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించింది.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'కల్కి 2898 ఏడీ చిత్రంలో ఓ రోల్ కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించారు. కానీ ఆ పాత్ర నేను చేయలేనని చెప్పా. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుందని మెసేజ్ చేశా. ఆ తర్వాత ఆయన కాల్ చేసి బుజ్జి రోల్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారు. నాకు మొదట అర్థం కాలేదు. షూట్లో నేను కూడా భాగం కావాల్సిన అవసరం లేదా? అని అడిగా. లేదు కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే చాలు అన్నారు. దీంతో నేను వెంటనే ఓకే చెప్పా. వాయిస్ ఓవర్ విషయంలో నాగ్ అశ్విన్ నాకెంతో సాయం చేశారు' అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కల్కి పార్ట్ -2 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అయితే తనకు కల్కిలో ఆఫర్ చేసిన పాత్ర ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. కీర్తి ప్రధానపాత్రలో సుమన్‌కుమార్ తెరకెక్కించిన రఘు తాత ఆగస్టు 15న విడుదల కానుంది. I was offered some other role in #Kalki2898AD which I said no & opted for #Bujji voice. My best dubbing till date, lot of fun and waiting for #Kalki2898AD Part 2👌#Bujji voice is getting such fame that Bhardwaj wanted to end episode with that voice👌🤩.@keerthyofficial #Prabhas pic.twitter.com/iIOUhIu8zB— Pakistan Prabhas Fanclub (@Pak_PrabhasFC) August 11, 2024 -
కల్కి కలెక్షన్స్.. షారూఖ్‌ను దాటేసిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా మార్కెట్ రేంజ్ ఏంటో బాలీవుడ్‌కు చూపించాడు. కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టాడు. జూన్ 27న విడుదలైన కల్కి.. 40 రోజులు దాటినా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. ఇండియా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో కల్కి చేరిపోయింది. భారత్‌లో గ్రాస్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీని కల్కి 2898 ఏడీ దాటేసింది. జవాన్ లైఫ్‌టైమ్ రికార్డ్‌ను కల్కి 40 రోజలు కలెక్షన్లతో దాటేసింది.షారూఖ్ లైఫ్ టైమ్ రికార్డ్ దాటేసిన ప్రభాస్నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. బాహుబలి 2: ది కన్‌క్లూజన్, KGF 2, RRR తర్వాత భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా కల్కి సత్తా చాటింది. ఇప్పటి వరకు భారత్‌లో నాలుగో స్థానంలో ఉన్న షారుఖ్ జవాన్ చిత్రాన్ని ఈ చిత్రం అధిగమించింది. జవాన్ మొత్తం రూ.640.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే.. కల్కి భారత్‌లో రూ. 641.13 కోట్ల నెట్ మార్క్‌ను అధిగిమించింది. ప్రస్తుతానికి, కల్కి నెట్, గ్రాస్ కలెక్షన్లలో ముందుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌లో మాత్రం జవాన్ ఇంకా రేసులో ఉంది. జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1160 కోట్లు రాబడితే.. కల్కి రూ. 1100 కోట్లు సాధించింది. మరో రూ. 60 కోట్లు కలెక్ట్ చేస్తే అందులో కూడా ప్రభాస్ ముందుంటాడు.ఏ వారంలో ఎంత కలెక్షన్కల్కి 2898 AD మొదటి వారంలో రూ. 414.85 కోట్లు, రెండో వారంలో రూ. 128.5 కోట్లు, మూడో వారంలో రూ. 56.1 కోట్లు, నాలుగో వారంలో రూ. 24.4 కోట్లు వసూలు చేసి ఐదవ వారంలో రూ.12.1 కోట్ల వసూళ్లను కొనసాగించింది. ప్రస్తుతం ఆరో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 5.18 కోట్లతో మొత్తం దేశీయ కలెక్షన్ రూ. 641.13 కోట్లు అని ఒక సంస్థ నివేదించింది. మరో రెండు వారాల పాటు కల్కి కలెక్షన్స్ కొనసాగుతాయని ఆ సంస్థ తెలిపింది.కల్కికి ఉన్న పోటీ ఏంటి..?జవాన్ థియేట్రికల్ రన్ ఎనిమిది వారాల వరకు కొనసాగింది. కల్కి 2898 AD ఇంకా ఆరవ వారంలో ఉంది. మరికొన్ని వారాల పాటు కొనసాగుతుంది. ఆగస్ట్ 15న విడుదలవుతున్న స్ట్రీ 2, వేదా, ఖేల్ ఖేల్ మే వంటి కొత్త సినిమాలతో పోటీ పడాల్సి ఉంది. ప్రస్తుతం డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్ సినిమాతో పోటీ పడుతూ కల్కి ముందుకు సాగింది. కల్కి 2898 AD హిందూ పురాణాలను ప్రధాన అంశంగా తీసుకుని దానికి సాంకేతికత జోడించి సైన్స్ ఫిక్షన్ రూపంలో డైరెక్టర్ తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్,అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి బలమైన తారాగణం ఉంది. ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రత్యేక పాత్రలలో కనిపించారు. -
Kalki 2898 AD: గుడ్ న్యూస్.. చవక రేటుకే కల్కి టికెట్స్
కొన్ని సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రమే కల్కి 2898 ఏడీ. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్‌తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్లోనూ కలెక్షన్లతో విజృంభించింది. ఫలితంగా ఇప్పటివరకు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.టికెట్ రేట్ల తగ్గింపుఇంత మంచి ఆదరణ లభించడంతో చిత్రయూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వారం కల్కి సినిమాను తక్కువ ధరకే థియేటర్లలో అందుబాటులో ఉంచాలని డిసైడ్ అయింది. కల్కిని కేవలం రూ.100కే ఆస్వాదించండి. ఆగస్టు 2 నుంచి 9 వరకు ఇండియా అంతటా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పటివరకు కల్కి చూడనివారికి, మరోసారి సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే అవుతుంది.కల్కి మూవీ..కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో కలిసి నిర్మించాడు. చదవండి: నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్ -
OTT లోకి 'కల్కి 2898 AD
-
'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?
డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' వచ్చి నెల దాటిపోయింది. ఒకటి రెండు చోట్ల తప్పితే థియేటర్ రన్ దాదాపుగా చివరకొచ్చేసింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. తాజాగా స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఎప్పుడు వచ్చే అవకాశముందంటే?(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా)ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన మూవీ 'కల్కి'. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఊహించని విధంగా హిట్ టాక్ తెచ్చుకుని ప్రస్తుతం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే పలు రికార్డులు కూడా సాధించింది. అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూడో సినిమాగా నిలిచింది.ఇకపోతే ఓటీటీలో 'కల్కి' తెలుగు హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ముందే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 8 వారాల గడువు అనుకున్నారు. ఇప్పుడు దానికి కట్టుబడి ఆగస్టు 23న ఓటీటీలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఒకవేళ లేదంటే అద్భుతమైన వీకెండ్ అయిన ఆగస్టు 15నే ఓటీటీలోకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్) -
షారుఖ్ ను వెనక్కి నెట్టేసిన ప్రభాస్..
-
కల్కి ఖాతాలో మరో మైలురాయి.. ఆ మార్కును దాటేసింది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఓవర్సీస్లోనూ అత్యధిక వసూళ్లతో సత్తా చాటింది. విడుదలైన రెండువారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త మైలురాయిని అధిగమించింది.తాజాగా కల్కి మూవీ మరో రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోపే రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ మేరకు ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్ అంటూ కల్కి పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సైతం అతిథి పాత్రల్లో మెరిశారు. 𝐀 𝐫𝐞𝐬𝐨𝐮𝐧𝐝𝐢𝐧𝐠 𝐩𝐡𝐞𝐧𝐨𝐦𝐞𝐧𝐨𝐧 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐛𝐨𝐱 𝐨𝐟𝐟𝐢𝐜𝐞...❤️🔥1100 CRORES and counting… #Kalki2898AD continues its epic run into the 5th week! @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms… pic.twitter.com/WQOeT9a3Zf— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 25, 2024 -
Kalki Bujji: 'బుజ్జి' సందడితో.. యువత సెల్ఫీలు!
కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన ‘బుజ్జి’ కారు వరంగల్ నగరంలో సందడి చేసింది. ఇటీవల విడుదలైన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ నిమిత్తం హనుమకొండలోని ఏషియన్ మాల్లో ‘బుజ్జి’కారును బుధవారం ప్రదర్శనకు ఉంచారు.దీనిని చూసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. బుజ్జితో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకుని సంబురపడ్డారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
ఇదీ ప్రభాస్ రేంజ్! ఆర్ఆర్ఆర్ రికార్డునూ బ్రేక్ చేసిన కల్కి
-
మహబూబ్‌నగర్ : కల్కి కారు.. నాగీ సందడి..(ఫొటోలు)
-
ప్రభాస్ కల్కి మరో ఘనత.. ఆ లిస్ట్‌లో టాప్ ప్లేస్!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఐఎండీబీ ప్రకటించిన లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ ఏడాదిలో ఇండియావ్యాప్తంగా ఇప్పటివరకు మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో కల్కి మొదటిస్థానంలో నిలిచింది. దీంతో చిత్రయూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ జాబితాలో కల్కి తర్వాత మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, సైతాన్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా.. లపత్తా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్యా సినిమాలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో మలయాళ చిత్రాలు సత్తా చాటగా.. టాలీవుడ్ నుంచి కల్కి, హనుమాన్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి. కాగా.. కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ నాలుగో స్థానం నిలిచి సత్తా చాటింది. ‘Tis the season of lists, and we’re back with the ultimate one! 🌟Halfway through 2024, we're excited to share the Most Popular Indian Movies of the year (so far!) 🎬✨Which one's your top pick? 🤔1. Kalki 2898-AD pic.twitter.com/9eCnBR7zYM— IMDb India (@IMDb_in) July 23, 2024 -
'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి'
ప్రభాస్ 'కల్కి' ప్రస్తుతం నాలుగో వారంలో ఉంది. అయితేనేం ఇప్పటికీ మోస్తరు వసూళ్లు సాధిస్తోంది. కొత్త సినిమాలు రిలీజైనప్పటికీ.. అవి హిట్ కాకపోవడం దీనికి ప్లస్ అయింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం 'ఆర్ఆర్ఆర్' సాధించిన ఓ రికార్డుని ఇప్పుడు 'కల్కి' బ్రేక్ చేసింది. ఇంతకీ ఆ ఘనత ఏంటి?(ఇదీ చదవండి: 41 ఏళ్ల డైరెక్టర్‌తో 28 ఏళ్ల హీరోయిన్ పెళ్లి.. వీళ్లు ఎవరంటే?)రిలీజ్ ముందు వరకు 'కల్కి'పై ఓ మాదిరి అంచనాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కసారి థియేటర్లలోకి వచ్చిన తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్స్ కోసం రిపీట్స్‌లో చూస్తున్నారు. తెలుగులో కలెక్షన్ కాస్త డౌన్ అయినప్పటికీ హిందీలో ఇంకా రన్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కేవలం హిందీలోనే నాలుగు వారాల్లో రూ.275.9 కోట్లు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు 'ఆర్ఆర్ఆర్' హిందీలో సాధించిన రూ.272 కోట్ల రికార్డ్ బ్రేక్ అయింది.ఇకపోతే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల జాబితాలో 'బాహుబలి 2', 'కేజీఎఫ్ 2' తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. వీటికి బాలీవుడ్లో వరసగా రూ.511, రూ.435 కోట్లు వచ్చాయి! ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల క్రాస్ చేసిన 'కల్కి'.. మొత్తం పూర్తయ్యేసరికి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది చూడాలి.(ఇదీ చదవండి: విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య) -
కల్కి సినిమా చూసి థ్రిల్ అయ్యా: టాలీవుడ్ హీరోయిన్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. గతనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో సినీ ప్రముఖులు సైతం చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.తాజాగా కల్కి సినిమాపై టాలీవుడ్ హీరోయిన్ రాశి ప్రశంసలు కురిపించారు. కల్కి మూవీ అద్భుతంగా ఉందని ఆమె కొనియాడారు. చూస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని అన్నారు. తన కూతురితో కలిసి వెళ్లి కల్కి సినిమా చూశానని వెల్లడించారు. 3డీ అద్దాల్లో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేశామని.. ఈ మూవీని చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారని తెలిపింది. కాగా.. రాశి టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన సినిమాల్లో నటించారు. Old telugu golden actress #Raasi garu sharing her opinion about #Kalki2898AD movie 🎬 💥 Family audience lo darling mass ❤️#Prabhas #Kalki pic.twitter.com/yhYzZ4G6o4— Cinema Factory (@Cinema__Factory) July 20, 2024 -
కల్కి మూవీ సక్సెస్.. పార్టీ చేసుకున్న జగపతిబాబు!
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. సలార్‌లో రాజమన్నార్‌గా తనదైన నటనతో మెప్పించారు. ఈ ఏడాది గుంటూరు కారంతో అలరించిన జగ్గుభాయ్.. ప్రస్తుతం పుష్ప-2, కంగువా లాంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటారు. ఎక్కడికెళ్లినా.. విదేశాల్లో, షూటింగ్స్‌లో ఏక్కడ ఉన్నా తన అనుభవాలను పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మందు బాటిల్ కలుపుతూ కనిపించారు. ప్రభాస్, కల్కి టీమ్‌కు చీర్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. గతనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. Darling Prabhasa ki, Kalki team ki Cheers. 🥂 #Kalki2898AD #Prabhas pic.twitter.com/qFoJhAcQ4b— Jaggu Bhai (@IamJagguBhai) July 21, 2024 -
కమల్ హాసన్ 'కలి' కాదు.. 'కల్కి' సీక్రెట్స్ బయటపడ్డాయ్!
'కల్కి' సినిమా వచ్చి నెలరోజులు దగ్గరైపోయింది. వేరే సినిమాలేం సరైనవి లేకపోవడంతో ఇప్పటికీ చాలా చోట్ల విజయవంతంగా రన్ అవుతోంది. మూవీ గురించి ఇప్పటికీ ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన నితిన్ జిహానీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 'కల్కి' నుంచి సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)'మీరు 'కల్కి'లో చూసింది ఒక్క కాంప్లెక్స్ మాత్రమే. కానీ ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఏడు కాంప్లెక్స్‌లు ఉంటాయి. వీటన్నింటినికీ సుప్రీం యాష్కిన్ నాయకుడు. కంటికి కనిపించని అద్భుత శక్తి 'కలి' దిగువన ఇతడు పనిచేస్తుంటాడు' అని నితిన్ జిహానీ చెప్పుకొచ్చాడు.'కల్కి' చూసిన తర్వాత చాలామంది కమల్ హాసన్.. కలి పాత్రధారి అనుకున్నారు. కానీ నితిన్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే కలి, సుప్రీం యాష్కిన్ వేర్వేరు అని క్లారిటీ వచ్చేసింది. అలానే ఏడు కాంప్లెక్స్‌లు అంటే నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోయే సినిమాల్లో వీటిని చూపిస్తారేమో? దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేశాడో ఏంటో?(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!) View this post on Instagram A post shared by SoSouth (@sosouthofficial) -
'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!
ప్రభాస్ 'కల్కి' రిలీజై దాదాపు నెలరోజులు కావొస్తుంది. అయితేనేం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం లేకపోవడంతో ఇప్పటికే విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మహాభారతం సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. వీటికోసమే జనాలు మాట్లాడుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఈ సన్నివేశాల విషయమై చిత్రబృందానికి కల్కి ధామ్ పీఠాధిపతి నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి.(ఇదీ చదవండి: శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్)'కల్కి' సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపించిన ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ చిత్రబృందంతో పాటు ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌కు నోటీసులు పంపారు. కల్కి పుట్టుకని తప్పుగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.'మన పురాణాల్లో ఉన్న వాటికి ఈ సినిమా విరుద్ధంగా ఉంది. మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఉంది. అందుకే మేం అభ్యంతరాలు చెప్పాం. స్పందన కోసం వేచి చూస్తున్నాం. కల్కి భగవానుడి కాన్సెప్ట్నే ఈ సినిమా మార్చేసిందని, ఇలా చేయడం పురాణాలని అగౌరపరచడమే. దీని వల్ల పురాణాలపై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది' అని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తన నోటీసుల్లే పేర్కొన్నారు.(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?) -
కల్కి నిర్మాతలు సంచలన నిర్ణయం..
-
అశ్వద్దామ అమితాబ్ నటనపై బాలీవుడ్ సైలెంట్..?
-
'రెబల్స్ ఆఫ్ కల్కి' వీడియో వైరల్
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది.'బుక్ మై షో'లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇప్పటికీ టికెట్ల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా 'రెబల్స్ ఆఫ్ కల్కి' పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అందులో భారీ యాక్షన్ సీన్స్‌ను వారు చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూసేయండి. -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘దేవుళ్లు’
ఒకప్పుడు మన పురాణాలు, ఇతీహాసాలపై టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.అయితే రాను రాను వెండితెరపై మైథాలజీ కథలు తగ్గిపోతూ వచ్చాయి. యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, రొమాంటిక్ జానర్ సినిమాలే ఎక్కువగా సందడి చేశాయి. మధ్య మధ్యలో ఒకటి రెండు మైథాలజీ జానర్ సినిమాలు వచ్చినా..అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా.. మళ్లీ మన ప్రేక్షకులు ‘దేవుళ్ల’ కథలను ఆదరిస్తున్నారు. సోషియో పాంటసీ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం ‘కల్కి 2898 ఏడీ’ సినిమానే. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలన్నింటిని వెండితెరపై చూపిస్తూ..ఓ కొత్త కథను చెప్పాడు. ఆ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది.అంతకు ముందు వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రాన్ని కూడా ‘దేవుడే’ హిట్ చేశాడు. ఆ సినిమాలో కృష్ణుడుకి సంబంధించిన సన్నివేశాలకు నార్త్‌తో పాటు సౌత్ ప్రేక్షకులు కూడా పడిపోయారు. సినిమా విజయంలో ఆ సీన్స్ కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మరో మైథాలజీ ఫిల్మ్ ‘హను-మాను’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టింది.‘అరి’తో పాటు మరిన్ని చిత్రాలు..టాలీవుడ్లో మైథాలజీ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దీంతో పలువురు దర్శకనిర్మాతలు ఆ జోనర్ చిత్రాలనే తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆఖండ 2ను లైన్లో పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘కల్కి’ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. అలాగే హను-మాన్‌కి సీక్వెల్‌గా ‘జై హను-మాన్’ రాబోతుంది. 2025లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. చిరంజీవి ‘విశ్వంభర’, నిఖిల్ ‘స్వయంభు’ కూడా సోషియో ఫాంటసీ చిత్రాలే.ఇక ఇదే జోనర్లో ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ ‘అరి’అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృష్ణుడిది ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఇంత వరకి ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని తెరకెక్కించాడు జయశంకర్. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్‌లో కృష్ణుడికి సంబంధించిన సీన్స్..గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అసలే ఇప్పుడు మైథాలజీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ‘అరి’లో కృష్ణుడి సీన్స్ పేలితే..బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
'కల్కి' ఖాతాలో మరో సరికొత్త రికార్డ్!
-
బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!
'కల్కి' హిట్ కావడం ఏమో గానీ బాలీవుడ్ మాఫియాకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. తెలుగు సినిమాల వల్ల ఎప్పటికప్పుడు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే 'బాహుబలి'తో టాలీవుడ్ గ్రాఫ్ పెరగడం ఏమో గానీ బాలీవుడ్ పతనం మాత్రం అప్పటినుంచే మొదలైంది. ప్రభాస్ సినిమా హిట్ అయితే చాలు నార్త్ బ్యాచ్ అంతా దెప్పిపొడవడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే 'కల్కి' వసూళ్ల గురించి నోటికొచ్చింది మాట్లాడి చిక్కులో పడ్డారు!(ఇదీ చదవండి: 'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్)'బాహుబలి' సినిమాల తర్వాత టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. అప్పటివరకు ఇండియన్ మూవీ అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునేవాళ్లు. కానీ ప్రభాస్ వల్ల తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలిసింది. ఇది బాలీవుడ్ హీరోలకు, అక్కడి క్రిటిక్స్‌కి మాత్రం పంటికింద రాయిలా మారింది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభాస్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా 'కల్కి'కి రూ.1000 కోట్లు వస్తే.. అవి ఫేక్ వసూళ్లని చెప్పి ట్వీట్స్ చేశారు.దీంతో 'కల్కి' నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సీరియస్ అయింది. సుమిత్ కడేల్, రోహిత్ జైశ్వాల్ అనే ఇద్దరు బాలీవుడ్ క్రిటిక్స్‌పై పరువు నష్టం దావా వేసింది. కలెక్షన్స్ ఫేక్ అని చేసిన ట్వీట్స్ అసలు ఎవరు చెబితే వేశారు? ఫేక్ అని ఫ్రూప్ ఏంటి? అనేది బయటపెట్టాలని.. లేదంటే రూ.25 కోట్లు ఇవ్వాలని 'కల్కి' టీమ్ వీళ్లకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అసలే సినిమా హిట్ అయిందనే షాక్‌లో ఉన్న బాలీవుడ్ మాఫియాకు.. ఇప్పుడు దావా అంటే దెబ్బ మీద దెబ్బే! మరీ క్రిటిక్సే ఈ ట్వీట్స్ వేశారా? లేదంటే వీళ్ల వెనక ఎవరైనా హిందీ హీరోలు ఉన్నారా అనేది అనుమానం!(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ) -
Prabhas: ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. కాగా ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ పేర్కొన్నారు.‘‘12.15 మిలియన్+టిక్కెట్ సేల్స్ (దాదాపు కోటీ 20 లక్షలు)తో ‘బుక్ మై షో’లో హయ్యస్ట్ సేల్స్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా 12.01 మిలియన్ల టిక్కెట్ సేల్స్ రికార్డును సాధించింది. ‘కల్కి 2898 ఏడీ’ విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ‘జవాన్’ రికార్డును దాటింది. వీకెండ్‌తో పాటు వీక్ డేస్‌లోనూ మా సినిమా వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్
థియేటర్లలోకి వచ్చి మూడు వారాలు అవుతున్నా 'కల్కి' జోరు ఇంకా తగ్గట్లేదు. దీనికి పోటీ ఇచ్చే మరో సినిమా లేకపోవడం కూడా బాగా ప్లస్ అయింది. దీంతో జనాలు ఇంకా థియేటర్లకు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే వసూళ్లలో అద్భుతమైన రికార్డులు నెలకొల్పిన 'కల్కి'.. ఇప్పుడు మరో క్రేజీ ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా ఎవరికీ సాధ్యం కానీ విధంగా ప్రభాస్ తన కొత్త సినిమాతో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంతకీ అదేంటంటే?ఒకప్పటితో పోలిస్తే సినిమా టికెట్లన్నీ ఆన్లైన్లోనే దాదాపుగా సేల్ అవుతున్నాయి. అలా బుక్ మై షోలో 'కల్కి' చిత్రానికి ఇప్పటివరకు 12.15 మిలియన్ల బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే 'జవాన్' మూవీకి లైఫ్ టైమ్ వచ్చిన 12.01 మిలియన్ల మార్క్‌ని ప్రభాస్ మూవీ అధిగమించింది. తద్వారా దేశంలో ఇలా అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన మూవీగా 'కల్కి' అరుదైన ఘనత సాధించింది.ప్రస్తుతం చెప్పుకొన్నది ఆన్లైన్ వరకే. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా చోట్లు ఉన్న సింగిల్ స్క్రీన్లలో సాధారణంగా ఇచ్చే టికెట్లు కూడా లక్షల్లోనే అమ్ముడిపోయి ఉండొచ్చు. తద్వారా ఇప్పటివరకు లేని విధంగా 'కల్కి' సరికొత్త రికార్డులు సాధిస్తుండటం విశేషం. ట్రెండ్ చూస్తుంటే ఇప్పట్లో ఈ రికార్డులు ఎవరైనా అందుకుంటారా అనేది సందేహంగా మారుతోంది. -
ప్రభాస్‌కు అది రోటీన్.. కానీ నాకు మాత్రం.. అమితాబ్ ఆసక్తికర కామెంట్స్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత గతనెల థియేటర్లలోకి వచ్చింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం మొదటి రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. కల్కి మూవీకి ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న విశేష ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే వెయ్యి కోట్ల రావడమనేది ప్రభాస్ కెరీర్లో రోటీన్ విషయమేనని అన్నారు. నా విషయానికొస్తే ఇంత పెద్ద సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. కల్కి చిత్రాన్ని ఇప్పటికే నాలుగు సార్లు చూశానని.. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నానని అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా.. కల్కి మూవీకి పార్ట్-2 కూడా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో భైరవగా సందడి చేసిన ప్రభాస్.. సీక్వెల్లో కర్ణుడిగా కనిపించనున్నారు. దీంతో పార్ట్-2పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. కాగా.. కల్కి 2898 ఏడీలో మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. -
అల్లు అర్జున్ ని వెనక్కి నెట్టిన ప్రభాస్..
-
ఓటీటీకి ప్రభాస్ కల్కి.. అప్పటిదాకా ఆగాల్సిందేనా?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ బాక్సులు బద్దలు కొట్టింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. అయితే కల్కి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఇంటి వద్ద భారీ కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినా ఈ చిత్రం ఎప్పుడోస్తుందా అని ఆరా తీస్తున్నారు. అయితే కల్కి’ ఓటీటీలో చూడాలంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సినిమా రిలీజైన పది వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకు రానునన్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు సెప్టెంబరు రెండో వారంలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. కాగా.. ఇప్పటికే 'కల్కి' సినిమా దక్షిణాది భాషల హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. బాలీవుడ్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. -
'భారతీయుడు 2' కంటే 'కల్కి'పైనే కమల్ స్పెషల్ ఇంట్రెస్ట్!
విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇది 'భారతీయుడు 2' మూవీ గురించి అనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయిందని ఈయనకు కూడా తెలిసినట్లు ఉంది. దీంతో పూర్తిగా మర్చిపోయినట్లు ఉన్నారు. మరోవైపు 'కల్కి' సక్సెస్ గురించి ఏకంగా మూడున్నర నిమిషాలు మాట్లాడారు.(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)కమల్ హాసన్ లీడ్ రోల్ చేసిన 'భారతీయుడు 2' రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు ఓ మాదిరి అంచనాలు ఉండేవి. కానీ సినిమా మరీ ల్యాగ్ ఉండటం పెద్ద మైనస్ అయింది. దీంతో ఘోరమైన డిజాస్టర్ దిశగా వెళ్తోంది. మరోవైపు దీనికి రెండు వారాల ముందు రిలీజైన పాన్ ఇండియా మూవీ 'కల్కి'లోనూ సుప్రీం యాష్కిన్ అనే విలన్ పాత్రని కమల్ చేశారు. రెండు మూడు సీన్లలో కనిపించినప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ క్రమంలోనే కమల్ హాసన్ 'కల్కి' బ్లాక్ బస్టర్ కావడంపై స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మూవీ టీమ్‌ని అభినందిస్తూనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ని ఆకాశానికెత్తేశారు. దాదాపు మూడన్నర నిమిషాలు మాట్లాడారు. 'కల్కి' గురించి చాలా మాట్లాడారు కానీ రిలీజ్ తర్వాత 'భారతీయుడు 2' గురించి ఒక్క ట్వీట్, పోస్ట్, వీడియో గానీ కమల్ పెట్టలేదు. అంటే ఈయనకు కూడా రిజల్ట్ ఏంటే అర్థమైపోయింది అనుకుంటా!(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి) -
బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు.. భాజా భజంత్రీలతో సంబురాలు!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో చిత్రబృందం ఫుల్ ఖుషీ అవుతున్నారు.తాజాగా కల్కి మూవీ సక్సెస్ వేడుకను చిత్రబృంద సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విజయంతో ప్రభాస్ ఫ్యాన్స్ భాజాభజంత్రీలతో సందడి చేశారు. నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. Fans of Rebel Star #Prabhas celebrated the success of #Kalki2898AD with Producer @AshwiniDuttCh garu ❤️🔥#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/5IeNZx3DZr— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 15, 2024 -
కల్కి దెబ్బకు షారుఖ్ రికార్డులు బద్దలు
-
'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్‌ని అలా చూపించాల్సింది!
థియేటర్లలోకి వచ్చి రెండు వారాలైనా సరే ప్రభాస్ 'కల్కి'.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతూనే ఉంది. ఇప్పటికే రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసింది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ సినిమా ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మరీ అంతగా నచ్చలేదనే వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడా లిస్టులోకి తెలుగు సీనియర్ హీరో కమ్ నటుడు సుమన్ చేరాడు. సినిమాలో బాగున్న వాటి గురించి మెచ్చుకుంటూనే, కొన్ని అస్సలు బాగోలేవని విమర్శించాడు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)'కల్కి సినిమా చాలా నెమ్మదిగా అనిపించింది. ఓ అరగంట వరకు తీసేయొచ్చు. మరీ ముఖ్యంగా బాంబే హీరోయిన్ (దిశా పటానీ) సాంగ్, ఫైట్ తీసేయొచ్చు. అసలు అది కథకి సంబంధం లేదు. సెకండాఫ్ బాగుంది. డైరెక్టర్ విజన్‌కి సెల్యూట్. మూవీలో అమితాబ్ రోల్ చాలా డామినేట్‌గా ఉంది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే అతడిని ఓ టార్జాన్‌లా చూపించాలి. కానీ ఏదో ప్లేట్ పెట్టి, బాడీకి షీల్డ్ పెట్టి కవర్ చేసేశారు. ప్రభాస్‌కి మంచి ఫిజిక్ ఉంది. ఏదైనా సీన్లో దాన్ని చూపిస్తారేమో అనుకున్నా. సాంగ్స్ అయితే అస్సలు బాగోలేవు. మూవీని ఓ డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుంది' అని సుమన్ చెప్పుకొచ్చారు.ఇకపోతే 'కల్కి'లో చాలామంది అతిథి పాత్రలు చేశారు కదా ఒకవేళ మీకు అవకాశమొచ్చుంటే చేసేవారా అని సుమన్‌ని అడగ్గా.. 'కల్కి మూవీలో నేను చేసే క్యారెక్టర్ ఏం లేదు. చాలామంది అతిథి పాత్రల్లో అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. మనం ఓ పాత్ర చేస్తే అది గుర్తుండిపోవాలి. మూవీలో ఇంతమంది స్టార్స్ ఉన్నప్పుడు అంచనాలు ఉంటాయి. అది లేకపోతే ఫ్యాన్స్ నిరాశ పడతారు. చాలామంది చేసే తప్పు ఇదే. ఇలా స్టార్ సెలబ్రిటీలు ఎక్కువమందిని పెట్టేసి జనాల్ని థియేటర్లకి రప్పించాలనుకుంటారు' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: మీరు లేకపోతే నేను లేను.. 'కల్కి' సక్సెస్ పై ప్రభాస్ స్వీట్ వీడియో) -
మీరు లేకపోతే నేను లేను : ప్రభాస్ స్వీట్ వీడియో
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. కల్కి సూపర్ హిట్ కావడంపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ప్రభాస్ మాట్లాడుతూ..' ఇంత పెద్ద హిట్ అందించినందుకు మీకు ఫ్యాన్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను జీరోనే. థ్యాంక్ యూ నాగ్ అశ్విన్. దాదాపు మాది ఐదేళ్ల ప్రయాణం. ఇంత పెద్ద సినిమాను అందించినందుకు వైజయంతి మూవీస్, నిర్మాతలకు నా ధన్యవాదాలు. అద్భుతమైన క్వాలిటీతో పెద్ద సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అలాగే దీపికా, కమల్ సార్, అమితాబ్ సార్, దిశా పటానీకి మనస్ఫూర్తిగా నా అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ప్రభాస్ తదుపరి మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్‌లో కనిపించనున్నారు. WE HAVE MUCH BIGGER PART 2 🔥A sweet note from Rebel star #Prabhas, celebrating the blockbuster success of #Kalki2898AD ❤️#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms @Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/g5CdfE9a1E— Telugu FilmNagar (@telugufilmnagar) July 14, 2024 -
'రక్తపాతం, అశ్లీలత లేకుండా హిట్ కొట్టాం'.. సందీప్‌పై సెటైర్స్?
చిన్న చిత్రమైనా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అయినా.. కంటెంట్ బాగుంటేనే థియేటర్‌కు వస్తామంటున్నారు ఆడియన్స్. లేదంటే మాత్రం చూసేదేలేదని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో 'హనుమాన్' వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవగా 'బడే మియా చోటే మియా' వంటి భారీ బడ్జెట్ సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయాయి.చాలా పెద్ద విషయంప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా రాబట్టింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఇంత గొప్ప కలెక్షన్స్ అందుకుని ఈ మైలురాయిని చేరుకోవడం మా యంగ్ టీమ్‌కు చాలా పెద్ద విషయం. సందీప్‌పై సెటైర్స్?అయితే విధ్వంసం, అరాచకం, రక్తపాతం, అశ్లీలత లేకుండా ఈ విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్ చేసిన నటీనటులకు, సినీ ప్రేక్షకులకు థాంక్యూ' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. దానికి రేపటికోసం అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు. ఇది చూసిన కొందరు.. యానిమల్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేస్తూ పై కామెంట్స్ చేశాడా? అని నాగ్ అశ్విన్‌ను అనుమానిస్తున్నారు. పోలిక అవసరమా?సందీప్ తన సినిమాలను కొత్తగా ట్రై చేస్తున్నాడు. అతడిని కించపర్చాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్ వారికుంటుంది. పక్కవారిని ఎందుకు అనడం? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం కల్కి ఆల్రెడీ యానిమల్ సినిమా కలెక్షన్స్ దాటేసింది. నాగ్ అశ్విన్.. ఆ సినిమా డైరెక్టర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు. ఏదో సాధారణంగా చెప్పాడంతే! అని నాగిని వెనకేసుకొస్తున్నారు. Man literally attacked Sandeep vanga like nobody ever could 🏃🏻♂️#SandeepReddy #Kalki28989AD #nagashwin pic.twitter.com/p3E6f4sZPE— HARISH KS (@CinemaPaithiyom) July 14, 2024 చదవండి: బిగ్‌బీ కాళ్లకు నమస్కరించబోయిన రజనీకాంత్.. వీడియో వైరల్ -
వాష్ రూమ్ కోసం అమితాబ్ పర్మిషన్.. అసలు విషయం ఇది
థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు అయిపోతున్నా సరే ప్రభాస్ 'కల్కి'కి వసూళ్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా రూ.1000 కోట్ల గ్రాస్ దాటేసినట్లు పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే ఇందులో అశ్వద్థామగా నటించిన అమితాబ్ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు. ఇక సెట్లో ప్రభాస్ కాళ్లకు నమస్కారం చేస్తానని చెప్పడం లాంటి కామెంట్స్‌తో ఈయనపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి.షూటింగ్ జరుగుతున్న టైంలో అమితాబ్, వాష్ రూమ్‌కి వెళ్లాలన్నా సరే తన అనుమతి తీసుకునేవారని డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రమోషన్స్ టైంలో చెప్పాడు. తాజాగా దీనికి అమితాబ్ వివరణ ఇచ్చారు. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. సెట్లో ఉన్నంత సేపు తాను ఓ పనివాడిని అయితే.. దర్శకుడు కెప్టెన్ లాంటి వాడని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు)'మంచితనంగా ఉండటానికి ఇదేం ఉదాహరణ కాదు. ఎందుకంటే ఇది చాలా సాధారణ విషయం. వాష్ రూమ్‌కి వెళ్లేందుకు నేను పర్మిషన్ అడిగారని డైరెక్టర్ చెప్పారు. అవును అది నిజమే. అది అతడి సెట్, అతడి సమయం, అక్కడ అతడే కెప్టెన్. నేను కేవలం పనోడిని మాత్రమే. ఒకవేళ నేను బయటకెళ్లాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి కదా! సెట్‌కి నన్ను పిలిచింది అతడే. అందుకే అతడి చెప్పిన విషయాల్ని తూచ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. నేను అదే చేశాను' అని అమితాబ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.'కల్కి' సినిమాలో అశ్వద్థామగా కనిపించి అమితాబ్.. 80 ఏళ్ల వయసులోనే యాక్షన్, ఎమోషనల్ సీన్లలో రఫ్ఫాడించారు. ఒకానొక సమయంలో హీరో ప్రభాస్ అయినప్పటికీ.. పార్ట్-1లో తన యాక్టింగ్‌తో అశ్వద్థామనే అసలైన హీరో అనిపించేలా యాక్టింగ్ చేశారు. ఇలా ఇంత డెడికేషన్ చూపిస్తూ డైరెక్టర్ చెప్పింది వింటున్నారు కాబట్టి ఇప్పటికీ పాన్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారేమో!(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఆలస్యం.. మనసు మార్చుకున్న చరణ్?) -
సినీ‘వారం’: సాయితేజ్ ట్వీట్.. మంచు విష్ణు ఫైర్.. సారీ చెప్పిన సిద్ధార్థ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. జులై 27న విడుదలైన ఈ చిత్రం.. రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాల గురించి వివరిస్తూ.. పిల్లల వీడియోలు షేర్ చేయ్యొదంటూ మెగా హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)సోషల్ మీడియాలో నటి నటులపై ట్రోలింగ్ వీడియోలు డార్క్ కామెడీ పేరుతో వీడియోలు వేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)’ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించాడు. చెప్పినట్లుగానే నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఐదు యూట్యూబ్ ఛానెల్స్‌ని తొలగించారు. ఇది ప్రారంభం మాత్రమే అని చెబుతూ యూట్యూబర్స్‌కి 'మా' అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. (పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)భారతీయుడు 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని.. నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వాని అవమానించినట్లుగా ఉన్నాయంటూ సిద్ధార్థ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో సిద్దూ వెంటనే స్పందించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు.(పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి)68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ ఫెస్టివల్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరితో పాటు మొత్తం 8 అవార్డులను సోంతం చేసుకుంది. ఇక ఉత్తమ నటిగా టాలీవుడ్ స్టార్ భామ మృణాల్ ఠాకూర్ అవార్డు అందుకుంది.శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. శంకర్ మేకింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా తగ్గిపోయాయి. (‘భారతీయుడు 2’ సినిమా రివ్యూలో కోసం క్లిక్ చేయండి)రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సారంగదరియా చిత్రం ఈ నెల 12న విడుదలైంది. రీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీ ట్రైలర్ జులై 10న విడుదల అయింది.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. (ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి సితార సాంగ్ జూలై 10నరిలీజ్ అయింది. (సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ప్రియదర్శి నభా నటేష్ జంటగా నటిస్తున్న డార్లింగ్ సినిమా ట్రైలర్ రిలీజ్. అయ్యింది ఈ సినిమా జూలై 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. (ట్రైలర్ కోసం క్లిక్ చేయండి)కిరణ్ అబ్బవరం నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాకు ‘క’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.శ్రీ చక్రాస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో టాలవుడ్ నటులు సందడి చేశారు. మహేశ్ బాబు, రానా, రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్, రాశీఖన్నా సహా పలువురు టాలీవుడ్ తారలు ఈ వివాహానికి హాజరయ్యారు. -
16 రోజుల్లో 1000 కోట్లు కొల్లగొట్టిన ఏకైక హీరో ప్రభాస్
-
రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి ‘కల్కి’.. అరుదైన రికార్డు!
ఊహించిందే నిజమైంది. ‘కల్కి 2898 ఏడీ’ రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్ల కొల్లగొట్టడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలే నిజమైయ్యాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రం రెండు వారాల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజ్ రోజే(జూన్ 27) హిట్‌టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు రూ. 191 కోట్లను వసూలు చేసి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పటికి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు వచ్చాయాని మేకర్స్ ప్రకటించారు. (చదవండి: వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్)రిలీజ్ అయి రెండు వారాలు దాటినా..ఇప్పటికీ సక్సెఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ప్రభాస్, అమితాబ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.ఏడో చిత్రంగా ‘కల్కి’ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఏడోది. అంతకు ముందు దంగల్ (2016) రూ.2024 కోట్లు, బాహుబలి2 (2017) రూ.1810 కోట్లు, ఆర్ఆర్ఆర్ (2022) 1387 కోట్లు, కేజీయఫ్2 (2022) రూ.1250 కోట్లు, జవాన్ (2023) రూ.1148 కోట్లు, పఠాన్ (2023) రూ.1050 కోట్లు వసూలు చేశాయి. -
కల్కి సినిమా నుంచి అశ్వత్థామ సాంగ్.. వీడియో వైరల్
ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే మ్యూజిక్ ఆల్బమ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా కల్కి సినిమా నుంచి పాటలను విడుదలను కూడా విడుదల చశారు. 'వెయిట్ ఆఫ్ అశ్వత్థామ' పేరుతో కేశవ, మాధవ పాటను మేకర్స్ విడుదల చేశారు. జూన్ 27న విడుదలైన కల్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1000 వరకు కలెక్షన్స్ రాబట్టింది. సంతోష్ నారాయాణ్ పాడిన ఈ పాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
ఓటిటి లోకి కల్కి? షాక్ లో ప్రభాస్ ఫ్యాన్స్
-
1000 కోట్లు ఊరికే రాలేదు..! ఇవి కదా ప్లస్ పాయింట్స్
-
ప్రభాస్ కోట్లాది రూపాయల సాయం.. బయటపెట్టిన కాస్ట్యూమ్ మాస్టర్
ప్రభాస్ మంచితనం మరోసారి బయటపడింది. గతంలో చాలా సాయాలు చేశాడు కదా ఇందులో అంత గొప్ప ఏముంది అనుకుంటున్నారా? చాలానే ఉంది. ఎందుకంటే చాలామంది హీరోలు.. సినిమా చేశామా డబ్బులు తీసుకున్నామా అన్నట్లు ఉంటారు. ప్రభాస్ అలా కాదు. ఇప్పుడు అలాంటిదే ఓ సీక్రెట్ బయటపడింది. డార్లింగ్ హీరో చేసిన సాయాన్ని 'కల్కి' చిత్రానికి కాస్ట్యూమ్ మాస్టర్‌గా పనిచేసిన వ్యక్తి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన 'కల్కి' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. రూ.1000 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. సినిమా వచ్చి దాదాపు రెండు వారాలు అయిపోయింది. ఇప్పటికీ ఈ చిత్రం గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలా ఇప్పుడు మరోసారి మాట్లాడుకోవడానికి ఓ కారణం ప్రభాస్. ఎందుకంటే సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అంటే మొత్తంగా వేలాది మందికి తలో రూ.10 వేలు బహుమతిగా ఇచ్చాడట.'కల్కి 2898' సినిమా కాస్ట్యూమ్ టీమ్‌లో మురళి అనే వ్యక్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ప్రభాస్ సాయాన్ని బయటపెట్టాడు. అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేసిన ప్రతి ఒక్కరి పేరు తెలుసుకుని, అలా అందరికీ తలో రూ.10 వేలు.. వాళ్లవాళ్ల బ్యాంక్ అకౌంట్స్‌లో వేశారని కాస్ట్యూమ్ మాస్టర్ మురళి చెప్పారు. ఇంతవరకు ఇలాంటి హీరోని తను ఎప్పుడూ చూడలేదని అన్నాడు. షూటింగ్ జరుగుతున్నన్నీ రోజులు అద్భుతమైన భోజనం కూడా పెట్టారని చెబుతూ ప్రభాస్‌ని తెగ పొగిడేశాడు. ఎంతైనా డార్లింగ్ అంటే ప్రభాస్..ప్రభాస్ అంటే డార్లింగ్!(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిపై మరో కేసు పెట్టిన హీరోయిన్) -
'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!
డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. అలానే సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ప్రతిరోజూ మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఎక్స్‌పీరియెన్స్ చేస్తే బెటర్. కానీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు కూడా కొందరున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బాలయ్య సినిమా షూటింగ్లో గాయపడ్డ హాట్ బ్యూటీ)'కల్కి' రిలీజ్ ముందు వరకు కాస్తోకూస్తో సందేహాలు ఉండేవి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత తొలుత మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్టాప్ కాస్త ల్యాగ్ అన్నారు. కానీ ఓవరాల్‌గా మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని రెండు సంస్థ దక్కించుకున్నాయి. దక్షిణాది భాషలకు సంబంధించిన హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, హిందీ రైట్స్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.రిలీజ్‌కి ముందే 7-8 వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేలా కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని టాక్. ఇందులో భాగంగానే ఆగస్టు 15 నుంచి 'కల్కి' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. చాలావరకు ఇది నిజమయ్యే ఛాన్సులే ఉన్నాయి. ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ కాబట్టి అప్పుడు రిలీజైతే ఎక్కువమంది చూడటానికి అవకాశముంటుంది. కాబట్టి ఓటీటీ సంస్థలు ఈ తేదీకే మొగ్గు చూపే అవకాశముంది. కొన్నిరోజులు ఆగితే ఏదో ఓ క్లారిటీ వచ్చేస్తుందిలే!(ఇదీ చదవండి: 'కార్తీకదీపం' వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్) -
కల్కి భామ టాటూ గోల.. ఇంతకీ ఏ భాషనో తెలుసా?
లోఫర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ దిశా పటానీ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన కల్కి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం 11 రోజుల్లనే రూ.900 కోట్ల క్లబ్లో చేరింది. దిశా పటానీతో పాటు దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటించారు.కాగా.. ఇటీవల PD అనే టాటూతో వార్తల్లో నిలిచింది. ఇది చూసిన కొందరు ప్రభాస్ డార్లింగ్ అంటూ అర్థం వచ్చేలా ఎవరికీ నచ్చింది వారు చెప్పుకొచ్చారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి తన ఒంటిపై టాటూతో కనిపించింది. ప్రభాస్ కల్కితో తన అనుభవాన్ని షేర్ చేస్తూ ఫోటోలు, వీడియోలు పంచుకుంది. ఇందుతో దిశా పటానీ శరీరంపై అర్థం కానీ విదేశీ భాషలో ఉన్న టాటూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ దీని గురించి తెగ ఆరా తీస్తున్నారు. అసలు అర్థం కానీ భాషల్లో ఉన్న ఆ టాటూ ఏంటని చర్చించుకుంటున్నారు.అయితే దిశా పటానీ నడుము మీద ఉన్న టాటూ.. హీబ్రూ భాషలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఉండే కొన్ని దేశాల్లో ఈ భాష మాట్లాడతారు. 'అతను నమ్మే ప్రతిదీ పొందవచ్చు' అని ఆ టాటూ అర్థమట. మరీ ఆ టాటూ గురించి తెలుసుకోవాలంటే హీబ్రూ నేర్చుకోవాలా? నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది చూస్తుంటే కేవలం సినిమా షూటింగ్ కోసమే వేయించుకున్న టాటూలా అనిపిస్తోంది. రాక్సీ గెటప్‌లో ఉన్న దిశా పటానీ ప్రభాస్‌తో ఉన్న సెల్ఫీని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
'కల్కి' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మహేశ్ బాబు.. తెగ పొగిడేశాడు
కొత్త సినిమాలకు అప్పుడప్పుడు హీరో మహేశ్ బాబు రివ్యూ ఇస్తుంటారు. గత కొన్నాళ్ల నుంచి ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 'కల్కి' గురించి తెగ పొగిడేశారు. తనకు ఎంతలా నచ్చేసిందో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరో మహేశ్ బాబుకి యాక్టింగ్ క్లాసులు.. కొత్తగా ఆ విషయాల్లో?)రీసెంట్‌గానే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్ వెళ్లొచ్చిన మహేశ్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు తాజాగా 'కల్కి' మూవీ చూశాడు. ఈ క్రమంలోనే సినిమా చూసిన తర్వాత బుర్ర తిరిగిపోయిందని చెబుతూ అందరినీ తెగ పొగిడేశాడు.''కల్కి 2898' చూసిన తర్వాత నా బుర్ర తిరిగిపోయింది. జస్ట్ వావ్. నీ ఫ్యూచరిస్టిక్ విజన్‌కి హేట్సాఫ్ నాగ్ అశ్విన్. ప్రతి ఫ్రేమ్ కూడా ఆర్ట్‌లా అనిపించింది. బచ్చన్ సర్ మీ స్క్రీన్ ప్రెజెన్స్‌ని మ్యాచ్ చేయడం కష్టం. కమల్ సర్ మీరు ఏ పాత్ర చేసినా అది యునిక్ అంతే. ప్రభాస్.. నువ్వు మరో అద్భుతమైన మూవీని చాలా సులభంగా చేసేశావ్. దీపిక.. నువ్వు ఎప్పటిలానే అమేజింగ్ అసలు. వైజయంతీ మూవీస్‌కి కంగ్రాచ్యులేషన్స్' అని ప్రభాస్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?)#Kalki2898AD… blew my mind away 🤯 🤯🤯Just wow!! @nagashwin7, hats off to your futuristic vision. Every frame is a piece of art 👏👏👏— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2024Congratulations to @VyjayanthiFilms and the entire team on the phenomenal success 👏👏👏— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2024 -
కల్కి 'కైరా' ఫోటోలు వైరల్.. ఈ విషయాలు తెలుసా..?
-
కల్కితో కాసుల వర్షం.. 11 రోజుల్లోనే ఆ మార్క్ దాటేసింది!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. గతనెల 27న విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు సృష్టిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ భారీ బడ్జెట్ సినిమా.. అంతేస్థాయిలో కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి విడుదలైన 11 రోజుల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరనుంది.సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వచ్చిన కల్కి 2898 ఏడీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. మూడు ప్రాంతాల మధ్య జరిగే పోరాటాన్ని కల్కిలో చూపించారు. ఇందులో అమితాబ్ నటన, కమల్ హాసన్‌తో సీన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి పార్ట్-2 కూడా ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. Raging towards the magical milestone…❤️🔥#EpicBlockbusterKalki in cinemas - https://t.co/xbbZpkX7g0#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/r27Dybw58B— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 8, 2024 -
కల్కి పార్ట్ 2 స్టోరీ చెప్పిన నాగ్ అశ్విన్ !
-
ఈ రికార్డు సాధించిన ఏకైక ఘనుడు
-
మరోసారి ప్రభాస్ పెళ్లి టాపిక్.. శ్యామలా దేవి ఏమన్నారంటే?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్ల మార్కును దాటేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమా త్వరలోనే వెయ్యి కోట్ల మార్కును చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే ఈ సినిమాను మొదటి రోజే వీక్షించిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి(కృష్ణం రాజు సతీమణి) ఆనందం వ్యక్తం చేసింది. బుజ్జి కారులో కూర్చుని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద సందడి చేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి శ్యామలా దేవి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ప్రభాస్‌కు పెళ్లికాదని ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన మాటలపై ఆమె స్పందించింది.శ్యామలా దేవి మాట్లాడుతూ..' గతంలో ప్రభాస్ సినిమాలు సక్సెస్ కావన్నారు. ఇప్పుడు కల్కి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభాస్ సినిమాలు ఆడవన్న వారి అంచనాలు కల్కితో తలకిందులయ్యాయి. ప్రభాస్ పెళ్లి కూడా అంతే. కోట్లాది అభిమానుల కోసం ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. పెళ్లి చేయాలని మాకు కూడా ఉంటుంది. కానీ సరైన సమయం రావాలి కదా. ఇప్పటివరకు అన్ని అనుకున్నట్లే జరిగాయి. అలాగే ప్రభాస్ పెళ్లి కూడా జరుగుతుంది' అని అన్నారు. కాగా.. గతంలోనూ ప్రభాస్ పెళ్లి రూమర్స్‌పై శ్యామలా దేవి స్పందించిన సంగతి తెలిసిందే. -
'కల్కి' సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది.. సీరియల్ కృష్ణుడు జోస్యం
ఎక్కడ చూసినా ఇప్పుడు 'కల్కి' మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. గత కొన్నాళ్ల నుంచి డల్‌గా ఉన్న బాక్సాఫీస్‌కి ఈ సినిమా మంచి ఊపు తీసుకొచ్చింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు తెలుగు హీరోలు ఇప్పటికే సినిమాని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా మహాభారత్ సీరియల్ లో కృష్ణుడిగా చేసిన నితీశ్ భరద్వాజ్ వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి.(ఇదీ చదవండి: భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?)ఇంతకీ ఏమన్నారంటే?'మ్యాడ్ మ్యాక్స్ సినిమాలని దర్శకుడు నాగ్ అశ్విన్ సూర్తిగా తీసుకుని 'కల్కి 2898' తీసినప్పటికీ పురాణాలని లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే నడిపించారు. సెట్టింగులతో ఇది పురాణాలకు సంబంధించిన కథనే అన్నట్లు తెలివిగా తెరకెక్కించారు. ఫిక్షన్, పురాణాలని కలిపి కొత్తగా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. నా అంచనా ప్రకారం సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది. ఎందుకంటే కర్ణుడికి అశ్వధ్ధామ, కృష్ణుడు కలిసి విముక్తి కలిగించినట్లు పార్ట్ 2లో చూపిస్తారేమో! అయితే కృష్ణుడి ముఖాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నాను' అని నితీశ్ భరద్వాజ్ చెప్పుకొచ్చారు.ఎంత నిజం?నితీశ్ భరద్వాజ్ చెప్పినట్లు పార్ట్ 2లో ప్రభాస్ పాత్ర చనిపోకపోవచ్చు. ఎందుకంటే తొలి భాగం చివర్లో అంతలా హైప్ ఇచ్చి ప్రభాస్‌ని కర్ణుడిగా చూపించారు. ఒకవేళ ఇదే పాత్ర గనక రెండో భాగంలో మరణిస్తే అభిమానులు దీన్ని తీసుకోలేకపోవచ్చు. అంటే నితీశ్ భరద్వాజ్ చెప్పినట్లేం ఏం జరగకపోవచ్చు. మరి ఇలాంటి కామెంట్స్ అన్నింటికీ ఎండ్ కార్డ్ పడాలంటే మాత్రం 'కల్కి 2' వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. దర్శకుడు తాజాగా మీడియా మీట్లో చెప్పిన దానిబట్టి చూస్తే.. మరో రెండు మూడేళ్ల తర్వాత పార్ట్-2 రిలీజ్ కావొచ్చేమో!(ఇదీ చదవండి: OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్ హనీమూన్స్' ట్రైలర్) -
కల్కి కలెక్షన్ల సునామి..
-
'కల్కి'లో యాక్షన్ సీక్వెన్స్.. ఎలా తెరకెక్కించారంటే..?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ సినిమా వారం పూర్తి అయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. తొలిరోజే రూ.191.5 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసిన 'కల్కి' తాజాగా రూ. రూ.800కోట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే రూ. 1000 కోట్ల మార్క్‌ను మరో కొద్దిరోజుల్లో చేరుకోవడం పెద్ద కష్టం కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి.కల్కి సినిమాలోని ఫైట్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్కి యాక్షన్ సీన్స్‌ను ఎలా తెరకెక్కించారో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సాలమన్ డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్స్ వెనుకున్న కష్టాన్ని ఆయన ఒక వీడియో ద్వారా పంచుకున్నారు. -
'కల్కి' రికార్డుల పరంపర.. నైజాం, ఓవర్సీస్లో తగ్గేదే లే
ప్రభాస్ 'కల్కి' థియేటర్లలోకి వచ్చి వారం దాటిపోయింది. ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా వల్ల అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా రికార్డులు బద్ధలవుతున్నాయి. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరికొన్ని రికార్డులు చేరడం విశేషం.(ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్)ఈ సినిమాకు మన దగ్గర కంటే ఓవర్సీస్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే మిగతా హీరోలు ఒకటి లేదా రెండు మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడమే కష్టంగా మారుతుంటే.. 'కల్కి'తో ప్రభాస్ ప్రస్తుతం 14.5 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నాడు. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో 14.3 మిలియన్ డాలర్స్‌తో ఉండగా ఇప్పుడు దీన్ని 'కల్కి' అధిగమించేసింది.మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.242 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే ఏకంగా రూ.100 కోట్లని 'కల్కి' సాధించినట్లు టాక్. తమిళనాడులో రూ.24 కోట్లు, బాలీవుడ్లో రూ.164 కోట్లు, కర్ణాటక-తమిళనాడులో వరసగా రూ.25 కోట్లు, రూ.24 కోట్లు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా తన గత చిత్రాల కలెక్షన్స్ రికార్డులని ప్రభాసే అధిగమిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!) -
పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!
గత కొన్నిరోజుల నుంచి తెలుగు ప్రేక్షకుల మధ్య వినిపిస్తున్న పేరు 'కల్కి'. రిలీజ్ ముందు వరకు కొన్ని డౌట్స్ ఉండేవి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓవరాల్‌గా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలా అని పొరపాట్లు ఏం లేవా అంటే సినిమాలో చాలానే ఉన్నాయి. అయినా సరే మూవీ బాగానే ఉండటంతో జనాలు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పొరపాట్ల విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.చాలామంది దర్శకులకు ఒకటి రెండు హిట్స్ పడగానే పొగరు తలకెక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాము తీసిందే గొప్ప అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. సినిమాలో పొరపాట్లు గురించి చెబితే తట్టకోలేరు. కానీ ఈ విషయంలో నాగ్ అశ్విన్‌ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తాజాగా 'కల్కి' సెట్లో మీడియాతో చాలాసేపు ముచ్చటించాడు. తాను కొన్ని విషయాల్లో తప్పు చేశానని ఒప్పుకొన్నాడు.(ఇదీ చదవండి: కల్కిలో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ అలా అనేశాడేంటి?)'కల్కి'లో మేజర్ కంప్లైంట్స్ విషయానికొస్తే ఫస్టాప్ ల్యాగ్ అయిపోయింది. అయితే సినిమాని రెండు పార్ట్స్‌గా తీయాలనే ఉద్దేశంతో పాటు కథని డీటైల్డ్‌గా చెప్పాలని కాస్త టైమ్ తీసుకున్నామని నాగ్ అశ్విన్ చెప్పాడు. అలానే ఫస్టాప్ సీన్స్ కంటే ఎడిటింగ్‌ని ఇంకాస్త గ్రిప్పింగ్‌గా చేసుండాల్సిందని చెప్పుకొచ్చాడు. ఇక మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుతూ.. కొన్నిచోట్ల ఎక్స్‌ట్రార్డీనరీగా వస్తే, కొన్నిచోట్ల మాత్రం అనుకున్నంతగా వర్కౌట్ కాలేదని, అక్కడ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సిందని నాగ్ అశ్విన్ కూడా అభిప్రాయపడ్డాడు.'మహానటి'లానే ఇందులోనూ నటీనటులతో సొంతంగా డబ్బింగ్ చెప్పించాం. చివరి నిమిషంలో తొందర వల్ల బహుశా సరైన ఫినిషింగ్ రాలేదేమో! పట్టి పట్టి చెప్పినట్లు ఉందని తమకు కూడా అనిపించిందని నాగ్ అశ్విన్ అన్నాడు. యాక్ట్ చేసినవాళ్లు డబ్బింగ్ చెబితే 100 శాతం ఫెర్ఫెక్ట్ ఉంటుందనేది తన అభిప్రాయమని అందుకే ఇలా చేసినట్లు చెప్పాడు. పైన చెప్పిన వాటి బట్టి చూస్తే నాగ్ అశ్విన్ తాను చేసిన పొరపాట్లు ఏంటో తెలుసుకున్నాడు. కాబట్టి వీటిని పార్ట్-2లో రిపీట్ కాకుండా చూస్తాడనే ఆశిద్దాం.(ఇదీ చదవండి: ఆ కల్ట్ క్లాసిక్ చిత్రమే కల్కికి స్ఫూర్తినిచ్చింది: నాగ్ అశ్విన్) -
ఆ కల్ట్ క్లాసిక్ చిత్రమే కల్కికి స్ఫూర్తినిచ్చింది: నాగ్ అశ్విన్
‘‘కల్కి 2898 ఏడీ’ని సూపర్ హిట్ చేసినందుకు మా టీమ్, వైజయంతీ మూవీస్ తరఫున ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయం మొత్తం ఇండస్ట్రీదిగా భావిస్తున్నాను. ఎన్నో ప్రోడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్, అప్ కమింగ్ డైరెక్టర్స్‌కి ఒక డోర్ ఓపెన్ అయ్యింది. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథలు రాసుకునే వారికి ‘కల్కి’ రిఫరెన్స్ పాయింట్లా ఉంటుంది’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం రూపొందించిన సెట్స్‌లో శుక్రవారం డైరెక్టర్ నాగ్ అశ్విన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ⇒ తెలుగు సినిమా అనగానే చాలామందికి ‘మాయా బజార్’ గుర్తొస్తుంది. అది ఓ రకంగా మహాభారతం ఆధారంగా రూపొందిందే. ‘మాయా బజార్’ మూవీ స్ఫూర్తితోనే ‘కల్కి 2898 ఏడీ’ తీశాను. ఈ కథను ముందుగా చిరంజీవిగారికి చెప్పాననడంలో నిజం లేదు. ప్రభాస్‌గారు కథని నమ్మి చాలా సపోర్ట్ చేశారు. ముందు ఒకే భాగంగా తీయాలనుకున్నాం. కొన్ని షెడ్యూల్స్ తర్వాత ఇంత పెద్ద కథని ఒక భాగంలో చెప్పడం సవాల్‌గా అనిపించింది. అందుకే రెండు భాగాలుగా చూపించాలనుకున్నాను. ⇒ ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్ చేసిన భైరవ పాత్ర సీరియస్‌గా కాకుండా సరదాగా ఉండాలనే ఉద్దేశంతోనే అలా క్రియేట్ చేశాను. మొదటి భాగంలో ప్రభాస్ పాత్ర నిడివి తక్కువగా ఉందంటున్నారు. రెండో భాగంలో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక వంటి స్టార్స్‌ని వ్యాపార కోణంలో ఆలోచించి తీసుకోలేదు. ఆయా పాత్రలకు వారు న్యాయం చేయగలరనే ఉద్దేశంతోనే తీసుకున్నా. ఒకవేళ కథలో బలం లేకపోతే ఆ నటుల ఎంపిక మాకు నెగెటివ్ అయ్యేది. కానీ వారి క్యారెక్టర్స్‌కి అనూహ్య స్పందన వస్తోంది. కమల్ సార్ చేసిన యాస్కిన్ పాత్రను పార్ట్ 2లోనే ఎక్కువ రివీల్ చేస్తాం. ⇒ వైజయంతీ మూవీస్ 50 ఏళ్ల జర్నీలోనే కాదు... తెలుగు సినిమా హిస్టరీలో ఉన్న అత్యధిక భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. ఈ సినిమా గొప్ప విజయం సాధించి మా పెట్టుబడి పూర్తిగా రావడంతో చాలా హ్యాపీగా ఉంది. రామ్‌గోపాల్ వర్మ, రాజమౌళిగార్లు ఈ మూవీలో కనిపించడం ప్రేక్షకులకు సర్ప్రైజ్. విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్లతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తీశాను. నా ఫస్ట్ మూవీ నటులు కాబట్టి వారు ప్రత్యేకం. నాకు లక్కీ ఛార్మ్. అందుకే వాళ్లని నా ప్రతి చిత్రంలో తీసుకుంటాను. నానీ, నవీన్ ΄÷లిశెట్టిలను రెండో భాగంలో ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టేస్తా (నవ్వుతూ). ⇒ ‘కల్కి...’లో కృష్ణుడి పాత్రలో మహేశ్‌బాబు నటించి ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ మూవీలో ఆ చాన్స్ లేదు. కానీ ఆయన ఏ సినిమాలో అయినా కృష్ణుడిగా నటిస్తే చాలా బాగుంటుంది. ‘కల్కి’ రెండో భాగానికి సంబంధించి 20 రోజులు షూటింగ్ జరిపాం. రెండో భాగంలో కల్కి పాత్రలో ఏ హీరో కనిపిస్తార న్నది సస్పెన్స్. రెండో భాగాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది ఇప్పుడే చెప్పలేం. -
కల్కిలో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ అలా అనేశాడేంటి?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.కల్కి చిత్రం పార్ట్-2లో మహేశ్ బాబు ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు? దీనిపై మీరేమంటారు? అని నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. 'ఇప్పుడైతే మేం మహేశ్ బాబును తీసుకోవాలని అనుకోలేదు.. ఈ సినిమాలో కాకుండా.. వేరే ఏదైనా చిత్రంలో ఆయన చేస్తే బాగుంటుంది' అని అన్నారు. అయితే కల్కి పార్ట్-2లో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా హీరో నాని, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నించారు. అయితే దీనిపై బదులిస్తూ.. వాళ్లద్దరిని తీసుకోవడం ఈ చిత్రంలో కుదరలేదు.. ఎక్కడ ఛాన్స్ వస్తే వాళ్లను అక్కడ పెట్టేస్తాను' అని అన్నారు. -
ప్రభాస్ కల్కి.. బుజ్జి ప్రస్తుతం ఎక్కడ ఉందంటే?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.అయితే ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ నిలిచిన బుజ్జి కారు ప్రస్తుతం ఏపీలో హంగామా చేస్తోంది. ఇటీవల విజయవాడలో సందడి చేసిన బుజ్జి.. తాజాగా భీమవరంలో కనిపించింది. పట్టణంలో ఓ థియేటర్ వద్ద బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. బుజ్జిని చూసిన ఫ్యాన్స్ తమ కెమెరాల్లో బంధించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. The Rebel’s City Bhimavaram welcomes #Bujji with boundless excitement! ❤️🫶#EpicBlockbusterKalki in cinemas - https://t.co/z9EmiReie8#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/0kfWNzKffE— Kalki 2898 AD (@Kalki2898AD) July 5, 2024 -
'కల్కి 2898 ఏడీ'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ ఈ సినిమాను తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కల్కి 2898 ఏడీ చిత్రంలోని హోప్ ఆఫ్ శంబల అనే వీడియోసాంగ్ విడుదలైంది. వారణాసి, కాంప్లెక్స్, శంబల.. ఈ మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథతో ఈ మూవీని రూపొందించారు. కాగా.. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. The hope begins with her…#HopeOfShambala Video Song from #Kalki2898AD out now 🎵🔗 https://t.co/BxcYCLzjW9#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal… pic.twitter.com/YOhI2a9OmM— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 4, 2024 -
కల్కి మేకర్స్‌పై ప్రముఖ నటుడు ఆగ్రహం.. అలా చూపించడం సరైంది కాదు!
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.680 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కల్కి.. ఏడో రోజు సైతం అదే జోరును కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.అయితే బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం సృష్టిస్తోన్న వేళ.. ప్రముఖ బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. కల్కి మేకర్స్ మహాభారతాన్ని వక్రీకరించారని అన్నారు. కొన్ని సన్నివేశాల్లో పురాణ ఇతిహాసాన్ని మార్చేందుకు యత్నించారని ఆరోపించారు. తాజాగా కల్కి మూవీ వీక్షించిన ముకేశ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివ్యూను వెల్లడించారు. కల్కి చిత్రంలోని విజువల్స్, నటనను ప్రశంసించినప్పటికీ మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.ముఖేశ్ మాట్లాడుతూ.. "నన్ను బాధిస్తున్న ఒక విషయం ఏమిటంటే.. కల్కి మేకర్స్ ఈ చిత్రంలో మహాభారతాన్ని మార్చడానికి ప్రయత్నించారు. ఈ చిత్రం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అశ్వథామను వేడుకున్నట్లు చూపించారు. అశ్వథామ మణిని శ్రీకృష్ణుడు తొలగించడం.. భవిష్యత్తులో నువ్వే నా రక్షకుడివని అతన్ని శ్రీకృష్ణుడు వేడుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎప్పుడూ అలా చెప్పలేదు. ఈ విషయంపై నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా. మీకు వ్యాసముని కంటే ఎక్కువ తెలుసునని ఎలా ఊహించుకున్నారు. నేను నా చిన్నప్పటినుంచి మహభారతం చదువుతున్నా. అశ్వత్థామ 'మణి'ని తొలగించింది శ్రీ కృష్ణుడు కాదు. ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి' అని అన్నారు.అనంతరం ముకేశ్ మాట్లాడుతూ..'నేను ఈ కథను ఇంత వివరంగా చెప్పడానికి కారణం. కృష్ణుడు భవిష్యత్తులో తనను రక్షించమని కల్కిలో అశ్వత్థామను ఎలా ఆజ్ఞాపించాడో నాకు అర్థం కాలేదు? అంత శక్తిమంతుడైన శ్రీకృష్ణుడు.. తనను రక్షించమని అశ్వత్థామను ఎలా అడగుతాడు? ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి. దక్షిణాది ఫిల్మ్ మేకర్స్‌కి మన సంప్రదాయాలపై ఎక్కువ గౌరవం ఉందని అనుకుంటున్నాం? కానీ రామాయణం, గీత, ఇతర పౌరాణిక అంశాలతో రూపొందిస్తున్న చిత్రాలను పరిశీలించాలి. అవసరమైతే సినిమా స్క్రిప్ట్ పరిశీలనకు కమిటీని వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా.. మహాభారత్ సీరియల్లో భీష్ముని పాత్రలో ముకేశ్ ఖన్నా కనిపించారు. -
ప్రభాస్ కల్కి.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.680 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కల్కి.. ఏడో రోజు సైతం అదే జోరును కొనసాగించింది.గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం వారం రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. వీక్ డేస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కి.. వీకెండ్లో మరింత భారీగా రాబట్టే అవకాశముంది. ఇదే జోరు కొనసాగితే కల్కి కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
కల్కి భామ ఫరియా అబ్దుల్లా స్టయిలిష్ లుక్స్
-
శౌర్యంగపర్వం ఎప్పుడు మొదలౌతుంది అంటే..
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎక్కడ చూసిన కల్కి ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే రూ. 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన కల్కి లాంగ్ రన్లో రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగింది. దీంతో ఆయన నుంచి రాబోయే సినిమాలకు మంచి మార్కెట్ ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.గతేడాదిలో విడుదలైన సలార్ సినిమాకు సంబంధించి ఇప్పుడు సీక్వెల్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శౌర్యంగపర్వం’ రానుంది. దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సుమారు 20 శాతం షూటింగ్ పూర్తిచేశారని తెలుస్తోంది. ఆగష్టు 10 నుంచి సలార్ సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభం కాట్లు సమాచరం. ఇదే సమయంలో డైరెక్టర్ మారుతి- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'రాజాసాబ్'. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరడంతో ఇప్పుడు శౌర్యంగపర్వం వైపు ప్రభాస్ అడుగులు వేస్తున్నారట. ప్రశాంత్ నీల్ - జూ ఎన్టీఆర్ కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాంటి క్లాష్ రాకుండా శౌర్యంగపర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తానని మైత్రి మూవీస్ సంస్థకు ప్రశాంత్ మాట ఇచ్చారట. -
ఆ స్టార్ హీరోల ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను కొట్టేసిన ప్రభాస్
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కల్కి దూసుకుపోతుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి ఆ తర్వాతి రోజుల్లో కూడా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఆరు రోజుల్లో రూ. 700 కోట్లు రాబట్టిన కల్కి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారత చిత్రాల్లో ప్రథమ స్థానంలో ఉంది.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్ కల్కి చిత్రం ఇప్పటికే పలు రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్, దళపతి విజయ్‌ల ఆల్‌టైమ్ రికార్డులను కల్కి బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 15 ఇండియన్ సినిమాల జాబితాలో కల్కి చేరిపోయింది.రజనీకాంత్ హిట్ సినిమా జైలర్ లాంగ్ రన్లో రూ.650 కోట్లు రాబట్టితే.. విజయ్ నటించిన లియో మాత్రం రూ. 600 కోట్లు రాబట్టింది. ఇద్దరు సౌత్ ఇండియన్ టాప్ హీరోలకు చెందిన ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను ప్రభాస్ కేవలం ఆరు రోజుల్లోనే దాటేశాడు. బాక్సాఫీస్ వద్ద ఇంకా ఈ కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా కల్కి ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా 'హనుమాన్' రూ.350 కోట్లు, 'ఫైటర్' రూ. 327 కోట్లు, 'మంజుమ్మెల్ బాయ్స్ రూ. 242 కోట్లు, 'సైథాన్' రూ. 211 కోట్లు సాధించిన చిత్రాలు ఉన్నాయి.దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కల్కి మూవీలో నటించి మెప్పించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ఆ విజువల్ వండర్ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతున్నారు. అందుకే కల్కి చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు వెళ్తున్నారు. -
వీక్ డేస్‌లోనూ తగ్గేదేలే.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు రికార్డులను తన పేరున లిఖించుకుంది. మొదటి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.తాజాగా కల్కి ఆరు రోజుల్లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. కేవలం విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.680 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మంగళవారం ఒక్కరోజే రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో రూ.700 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఓవర్సీస్లో పలు రికార్డులు సృష్టించిన కల్కి.. మరికొద్ది రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. మూడు సినిమాలు ఒకేసారి!
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ బరిలో మాత్రం ఇతర పెద్ద సినిమాలు లేకుండా ప్లాన్ చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నారు. కల్కి 2898 మూవీ కూడా ఇక్కడ సోలోగానే విడుదలై హిట్ కొట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా దాదాపు సోలోగానే రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటి తర్వాత ఈ స్టార్ హీరోలు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య 2026లో బక్సాఫీస్ వార్ జరిగే అవకాశం మెండుగా ఉంది.(చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో!)కల్కి 2898 తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’గా రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది. 2025 చివరల్లో లేదా 2026 సంకాంత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది. (చదవండి: నా బిడ్డను పైకి పంపించేయాలనుకున్నా.. ఏడుస్తూ భర్తకు చెప్పా: పాక్ నటి)మరోవైపు గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్..బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కలేదు. సెప్టెంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రెహమాన్ కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రం రీలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దాదాపు ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి. పెద్ద సినిమాలు కాబట్టి ఏడాది వరకు నిర్మాణంలో ఉండడం సర్వసాధారణం. ఈ లెక్కన చూస్తే..మూడు సినిమాలు వారం అటు ఇటుగా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు బాక్సాఫీస్ వార్‌లో ఉంటారా లేదా సోలోగానే వచ్చి హిట్ కొడతారా అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే. -
ప్రభాస్‌కి చాలా సిగ్గు.. టికెట్ కొనిచ్చి థియేటర్‌కి పంపాడు: హంసనందిని
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రియల్ లైఫ్‌కి, రీల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో చాలా చలాకీగా ఉంటూ..ఎలాంటి పాత్రనైనా తనదైన నటనతో ఆకట్టుకుంటాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడడు. స్టైజ్‌పై మాట్లాడమంటే సిగ్గుపడుతుంటాడు. అంతేకాదు ఇతరులతో మాటలు కలిపేందుకు కూడా వెనుక ముందు ఆలోచిస్తుంటాడు. తనకు క్లోజ్ అయిన వారితో సరదాగే ఉన్నా..కొత్త వారితో మింగిల్ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటాడని ప్రభాస్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక్కసారి తనతో స్నేహం ఏర్పడితే.. వారిని తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటాడట. ఇక షూటింగ్ టైమ్‌లో అందరికి భోజనాలు తెప్పించే అలవాటు డార్లింగ్‌కి ముందు నుంచే ఉంది.(చదవండి: బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న కల్కి.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)తాజాగా టాలీవుడ్ హీరోయిన్ హంసనందిని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘మిర్చి’ సినిమాలో టైటిల్ సాంగ్‌కి ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసింది ఈ బ్యూటీ. అయితే వేరే సినిమా షూటింగ్ కారణంగా ఆ సినిమా తాను చూడలేకపోయానని.. ఈ విషయం తెలిసి ప్రభాసే టికెట్ బుక్ చేసి సినిమా చూపించారని హంసనందిని చెప్పింది.(చదవండి: నాగ్ అశ్విన్.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ)‘ప్రభాస్‌కి చాలా సిగ్గు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. మిర్చి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత నేను వేరే సినిమాలో బిజీ అయ్యాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌ని అందుబాటులో లేను. అలాగే రిలీజ్ టైమ్‌లో కూడా నేను హైదరాబాద్‌కి రాలేదు. కొద్ది రోజుల తర్వాత వేరే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ పార్టీలో ప్రభాస్ కలిసి.. ‘నీ సాంగ్ పెద్ద హిట్ అయిందని నీకు తెలుసా?’అని అడిగాడు. నేను సినిమా చూడలేదని చెప్పాను. వెంటనే టికెట్ బుక్ చేసి సినిమా చూడమని చెప్పాడు. అంతేకాదు సినిమాలో నా సాంగ్ ఏ టైమ్‌కి వస్తుందో కూడా చెప్పాడు. నేను అదే టైమ్‌కి థియేటర్‌కి వెళ్లి సినిమా చూశాను’ అని హంసనందిని చెప్పుకొచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 మూవీ తాజాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లో 625 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.#Prabhas Anna Mirchi Movie ki Ticket book chesi, ‘Mirchi’ Song oche timing cheppi mari Theatre ki pampadu anta Hamsa ni! 🥰😅❤️ pic.twitter.com/CgVqqKlkzg— . (@charanvicky_) July 2, 2024 -
బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.625 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలు పోషించారు.అరుదైన ఘనతతాజాగా ఈ సినిమా ఓవర్సీస్లోనూ దూసుకెళ్తోంది. కల్కి మరో ఘనతను సాధించింది. ఉత్తర అమెరికాలో 12 మిలియన్ల డాలర్ల వసూళ్లను అధిగమించింది. ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. కాగా.. హిందీ వర్షన్లో ఇప్పటి వరకు మొత్తం రూ.135 కోట్లు వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.1000 కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్ లోపే ఈ సినిమా ఆ మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది . -
దిశా పటానీ టాటూ గోల.. ప్రభాస్ పేరుతో లింక్ ఎందుకు..?
ముంబయి బ్యూటీ దిశా పటానీ చాలా ఏళ్ల తర్వాత కల్కి సినిమాతో టాలీవుడ్‌కు టచ్‌లోకి వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో తెలుగు మూవీ చేయలేదు. బాలీవుడ్ కి చెక్కేసింది. యంగ్, స్టార్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే , కల్కి సినిమాతో మళ్లీ టాలీవుడ్లో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు (టాటూ) సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.దిశా పటానీ పచ్చబొట్టులో "PD" అనే రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. దీని అర్థం ఏంటి అంటూ చాలామందిలో ప్రశ్నలు తలెత్తాయి. అయితే, లాజిక్స్ మాత్రమే చూసే కొందరు PD అంటే 'ప్రభాస్ డార్లింగ్' అని అర్థం చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. దీనంతటికి కారణం ఆమె కల్కి చిత్రంలో నటించడమే అని చెప్పవచ్చు. మా 'ప్రభాస్ డార్లింగ్' పేరును టాటూగా ఎందుకు తీసుకున్నావ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అయితే, వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే ఈ పుకార్లు నిరాధారమైనవని చెప్పవచ్చు. ముందుగా, దిశా పటాని కల్కి 2898 AD కోసం ప్రచార కార్యక్రమాలలో కూడా చేరలేదు. ప్రభాస్‌తో ఆమెకు ఎక్కువగా సీన్లు కూడా లేవు. వారిద్దరి మధ్య అంత బాండింగ్, స్నేహం ఉండే ఛాన్స్ లేదని చెప్పవచ్చు. "PD" అక్షరాలు ఆమె అసలు పేరు దిశా పటాని (DP) యొక్క రివర్స్ వెర్షన్ కావచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే, అసలు విషయం తెలియాలంటే దిశా పటానీ రివీల్ చేయాల్సిందే.ఇలా ఎంతమందితో మా డార్లింగ్‌ను లింక్ చేస్తారంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఆయనకు అర్జెంట్‌గా పెళ్లి చేస్తే కానీ ఇలాంటి వాటికి ఫుల్‌స్టాఫ్ పడదని తెలుపుతున్నారు. దిశా పటానీ ఇప్పటికే డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భాఘీ 2, భాఘీ 3 సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన టైగర్ ష్రాఫ్‌తో ఆమె చాలాకాలం నుంచి రిలేషన్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఆయనతో బ్రేకప్ అయ్యాక విదేశీ మోడల్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. -
నాగ్ అశ్విన్.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ
నాగ్ అశ్విన్.. మొన్నటి వరకు ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు తప్పితే..పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం మార్మోగిపోతోంది. యావత్ సినీ ప్రపంచం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దానికి కారణంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది.(చదవండి: కల్కి దెబ్బకు 'షారుఖ్ ఖాన్' రికార్డ్ బద్దలైంది) నాగ్ అశ్విన్ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడని పొగిడేస్తున్నారు. సామాన్యులు మొదలు..స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ‘కల్కి 2898 ఏడీ’పై రివ్యూ ఇస్తూ.. నాగ్ అశ్విన్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదైన శైలీలో ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు. (చదవండి: ఆ సంఘటనతో భయమేసింది: నాగ్ అశ్విన్)ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడు. ఆ విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తూ రిలీజ్ రోజు అరిగిపోయిన చెప్పులను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే డైరెక్టర్ ఎంత సింపుల్ ఉంటాడో చూడండి అంటూ.. ఆయన చెప్పుల ఫోటోలను వైరల్ చేశారు నెటిజన్స్. దానికి సింక్ ఆయ్యేలా బ్రహ్మాజీ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. తెలుగు సినిమా అనుకొంటే వరల్డ్ సినిమా తీశారు . నాగ్ అశ్విన్ గారు.. మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటా. థ్యాంక్యూ ప్రియాంక ,స్వప్న (నిర్మాతలు). మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష’ అని బ్రహ్మాజీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం బ్రహ్మాజీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు సినిమా అనుకొంటే world సినిమా తీశారు .@nagashwin7 గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను ❤️..thank యూ ప్రియాంక ..స్వప్న ..మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష 🙏🏼 .#Kalki2808AD 🔥@VyjayanthiFilms 🙏🏼— Brahmaji (@actorbrahmaji) July 1, 2024 -
కల్కి సినిమాలో ఓల్డ్ టెంపుల్.. ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా? (ఫొటోలు)
-
కల్కి దెబ్బకు 'షారుఖ్ ఖాన్' రికార్డ్ బద్దలైంది
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, వీకెండ్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే అనేక రికార్డ్స్‌ను కల్కి క్రియేట్ చేస్తుంది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని తెరకెక్కించారు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కల్కి మూవీలో నటించి మెప్పించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డ్స్‌ను దాటేసింది. ఒక వీకెండ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తొలి చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' ఉంది. షారుక్‌ఖాన్- అట్లీ 'జవాన్' (రూ.520 కోట్లు) పేరుతో ఉన్న రికార్డు ప్రభాస్ దెబ్బకు బద్దలైంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారత్ చిత్రంగా హనుమాన్ (రూ.350 కోట్లు) ఉంది. అయితే, ఆ రికార్డ్‌ను కల్కి కేవలం రెండు రోజుల్లోనే బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ టాప్-3 చిత్రాల జాబితాలో 'కల్కి' మూడో స్థానంలో ఉంది. ఆర్ఆర్ఆర్ (రూ.223 కోట్లు), బాహుబలి2 (రూ.217 కోట్లు), కల్కి (రూ.191.5కోట్లు) ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఇందులో రెండు ప్రభాస్ సినిమాలే ఉండటం విశేషం.బాలీవుడ్లో పెరుగుతున్న కలెక్షన్స్కల్కి సినిమాకు హిట్ టాక్ రావడంతో బాలీవుడ్లో కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. వీకెండ్ తర్వాత సోమవారం కూడా బాక్సాఫీస్ వద్ద భారీగానే రాబట్టింది. సోమవారం నాడు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్‌ను కల్కి రాబట్టింది. ఇప్పటికే బాలీవుడ్లో రూ. 170 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతుంది. బాలీవుడ్ బయర్ల నుంచి కల్కి చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో కల్కి సులభంగానే రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. -
ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుంది: నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడినట్లు నాగ్ అశ్విన్ ఇదివరకే వెల్లడించారు. తాజాగా కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ సంఘటనను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం.నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో రాస్తూ..' దాదాపు 10 సంవత్సరాల క్రితం మేము ముగ్గురం(నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్) కలిసి మా తొలి చిత్రం "ఎవడే సుబ్రహ్మణ్యం" ప్రారంభించాం . అప్పట్లో వైజయంతి నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కించడం రిస్క్‌తో కూడుకున్నది . నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుంది. ఒక రోజు వర్షం కురిసింది. దీంతో షూటింగ్ పూర్తి చేయలేకపోయాం. దీంతో మళ్లీ షూటింగ్ సెట్ వేయాల్సి వచ్చింది. దీంతో నిర్మాణ ఖర్చు ఎక్కువైంది. అది కాస్తా మమ్మల్ని భయాందోళనకు గురిచేసిందని. ' రాసుకొచ్చారు. 'అంతే కాకుండా.. దాదాపు 10 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు.. సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి. ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవడం మీ అందరి ఆశీర్వాదంగా భావిస్తున్నా. వీళ్లిద్దరి మధ్యలో నిల్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మా లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. మమ్మల్ని ఆదరిస్తున్నందకు మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు మీ నుంచి మరెన్నో అద్భుతమైన చిత్రాలు రావాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ప్రముఖ నిర్మాత అల్లుడు, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. కొత్త ఆలోచనలతో సరికొత్త మూవీస్ చేస్తూ అబ్బురపరుస్తుంటారు. అలా కొన్నేళ్ల క్రితం వచ్చిన ఓ కుర్రాడు జస్ట్ రెండే సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. లేటెస్ట్గా ఇతడి పేరు మరోసారి మార్మోగిపోతోంది. మరి హింట్స్ ఇచ్చాం కదా ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో ముగ్గురు కుర్రాళ్లున్నారు. వీళ్లలో ఓవైపు చివరలో ఉంది విజయ్ దేవరకొండ అని తెలుస్తోంది. మరో చివర ఉన్నది ఎవరంటే టక్కున చెప్పడం కష్టం. అతడి పేరు నాగ్ అశ్విన్. తాజాగా థియేటర్లలో సెన్సేషన్ సృష్టిస్తున్న 'కల్కి' మూవీ తీసింది ఇతడే. డాక్టర్స్ ఫ్యామిలీలో పుట్టిన ఇతడు.. రకరకాల ఉద్యోగాలు చేశాడు. కానీ ఓ షార్ట్ ఫిల్మ్ మాత్రం ఇతడి కెరీర్‌తో పాటు జీవితాన్నే మార్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)నాగ్ అశ్విన్ డైరెక్టర్ కాకముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇది చూసిన నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు. పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చారు. తొలుత ఒకటి అనుకున్నారు. కానీ చివరకొచ్చేసరికి 'ఎవడే సుబ్రహ్మణ్యం' బయటకొచ్చింది. ఈ మూవీతోనే విజయ్ దేవరకొండ నటుడిగా పూర్తిస్థాయిలో పరిచయమయ్యాడు. దీని తర్వాత 'మహానటి'తో సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించి నాగ్ అద్భుతం చేశాడు.ఇక తనతో సినిమా తీసిన ప్రియాంక దత్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా నిర్మాత అశ్వనీదత్‌కి నాగ్ అశ్విన్ అల్లుడైపోయాడు. వీళ్ల కాంబినేషన్లోనే ఈ మధ్య వచ్చిన 'కల్కి' మూవీ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ్ అశ్విన్ పాన్ ఇండియా సెన్సేషన్ అయిపోయాడు. తాజాగా ఇతడి పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసి తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అంత డిఫరెంట్‌గా ఉన్నాడు మరి!(ఇదీ చదవండి: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్) -
నాలుగు రోజుల్లో కల్కి కలెక్షన్స్.. ఎక్కడ ఎంత వచ్చిందంటే..?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా పట్ల హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కల్కి మూవీలో నటించి మెప్పించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ఆ విజువల్ వండర్ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతున్నారు. మహాభారతాన్ని ఫ్యూచర్ కథకు ముడి పెట్టి కల్కిని తెరకెక్కించిన నాగ్ అశ్విన్‌ను నెటిజన్లు అభిమానిస్తున్నారు.కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో 204.5 కోట్లు, హిందీలో రూ. 134.5 కోట్లు, తమిళ్లో రూ. 32.9 కోట్లు, మలయాళంలో రూ.35.1 కోట్లు, ఇతర దేశాల్లో రూ. 158 కోట్లు వచ్చాయి. అదె నెట్ పరంగా అయితే కల్కి ప్రపంచ వ్యాప్తంగా నాలుగురోజుల్లో రూ. 320 కోట్లు రాబట్టింది. -
విజయవాడలో బుజ్జిని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్ (ఫోటోలు)
-
కుమారుడితో కలిసి కల్కి చూసిన బిగ్‌బీ.. ఇంత ఆలస్యంగానా? (ఫోటోలు)
-
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
ప్రభాస్ పని అయిపోయిందన్న ప్రతిసారి రెట్టింపు వేగంతో డార్లింగ్ ముందుకు దూసుకు వస్తూనే ఉన్నాడు. కల్కి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మొదట్లో కూడా సినిమా పోయేలా ఉందన్న విమర్శలు వచ్చాయి. తీరా సినిమా రిలీజ్ చేశాక.. అప్పుడు విమర్శించినవారే వన్స్‌మోర్ అంటూ మరోసారి కల్కి చూసేందుకు థియేటర్‌కు పరుగులు తీస్తున్నారు. ఈ ఘనత ప్రభాస్ ఒక్కడిదే కాదు! తెర వెనక నుంచి నడిపించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ది.కలెక్షన్ల సునామీఅభిమానులను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా కల్కి కళాఖండాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్లోనూ రికార్డులు తిరగరాస్తోంది.హలో అమెరికా..అమెరికా, కెనడాలోనే రూ.91 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ అక్కడి ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. హలో అమెరికా.. మేము తీసే ప్రతి సినిమాకు మీరెప్పుడూ అండగా ఉంటున్నారు. మంచి సినిమాలను ఆదరిస్తారు. కల్కి మీ సినిమాగా భావించి సపోర్ట్ చేశారు. అందుకు థాంక్యూ సో మచ్. ఇలాంటి చిత్రాలు అరుదుగా..మీ ఫ్రెండ్స్, పిల్లలతో కలిసి సినిమాకు వెళ్లండి. కల్కి వంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇది తప్పకుండా బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన మూవీ! ఇప్పటికే మీలో చాలామంది కల్కి చూసి ఎంజాయ్ చేశారు. అందరికంటే ముందుగా కల్కిని సపోర్ట్ చేసినందుకు మరోసారి థాంక్యూ అని వీడియో రిలీజ్ చేశాడు. Our Captain @nagashwin7 thanks the USA audience for their tremendous love and record breaking start ❤️#Kalki2898AD #EpicBlockbusterKalki@PrathyangiraUS @AACreationsUS pic.twitter.com/fC6jUTcv0G— Kalki 2898 AD (@Kalki2898AD) June 30, 2024 ‘KALKI 2898 AD’ OVERSEAS BO: IT'S NOT A STORM, IT'S A TSUNAMI... #Kalki2898AD *opening weekend* biz in key international markets...⭐️ #USA + #Canada: $ 11 million+ [₹ 91.81 cr]. Final numbers later. Includes Wed premieres.⭐️ #UK: £ 888,190 [₹ 9.38 cr]. Some locations to be… pic.twitter.com/0kQ0cYOFR9— taran adarsh (@taran_adarsh) July 1, 2024చదవండి: ప్రభాస్‌తో పోటీ కాదు.. నాదొక పాత్ర మాత్రమే.. -
ప్రభాస్ 'కల్కి' రేర్ రికార్డ్.. ఇది కదా అసలైన మాస్ అంటే
డార్లింగ్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించాడు. 'కల్కి'తో ఇప్పటికే వరల్డ్ వైడ్ మరింతగా గుర్తింపుతో పాటు వసూళ్ల జోరు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి మరోసారి చేరిపోయాడు. 'బాహుబలి' నుంచి వరసగా ఈ మార్క్ చేరుకుంటున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం అదిరిపోయే రికార్డ్ తన పేరిట నమోదు చేసుకున్నాడు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష్మీ)'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. దీని తర్వాత బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. ఇలా వరస చిత్రాలతో వందల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. కాకపోతే 'బాహుబలి 2' తప్పితే మిగిలినవన్నీ కూడా లాంగ్ రన్లో ఐదారు వందల కోట్లు మాత్రమే సొంతం చేసుకున్నాయి. 'కల్కి' మాత్రం తొలి వీకెండ్ పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్ అధిగమించింది. రేర్ రికార్డ్ నమోదు చేసింది.ఆదివారం సాయంత్రం ఫస్ట్ షో పడేటప్పటికీ రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేసినట్లు తెలిసిపోయింది. మరోవైపు ఓవర్సీస్లోనూ వీకెండ్ పూర్తయ్యేసరికి 10.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. గతంలో 'బాహుబలి' మూవీ తొలి వారాంతంలో రూ.415 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు దీన్ని 'కల్కి' అధిగమించిందంటే.. లాంగ్ రన్లో రూ.1000 కోట్ల దాటడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్) -
వాళ్ల కోసమే 'కల్కి' చేశాను.. నాదేం లేదు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించాడు. రీసెంట్గా రిలీజైన 'కల్కి' సినిమాలో ఇతడు అర్జునుడి పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలోనే ఇతడి డైలాగ్ డెలివరీపై విమర్శలు వచ్చాయి. రెండు మూడు రోజుల నుంచి కర్ణుడు గొప్పా? అర్జునుడు గొప్పా? అనే విషయమై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా.. 'కల్కి' సక్సెస్‌పై రౌడీ హీరో తొలిసారి స్పందించాడు. తానేం లక్కీ ఛార్మ్ కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: 'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?)'మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాం. నాగీ, ప్రభాస్ అన్న కోసమే ఇందులో నేను నటించాను. ఇలాంటి సినిమాలో చివరలో అలా రావడం నాకు సంతోషంగా ఉంది. నాగీ యూనివర్స్‌లో ఓ పాత్ర పోషించాను అంతే. వాళ్లందరి కోసం ఈ పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. వైజయంతీ మూవీస్‌లోనే నా కెరీర్ మొదలైంది. అందుకే నాగీ ప్రతి సినిమాలో చేస్తుంటా. మహానటి అద్భుతమైన సినిమా, 'కల్కి' అద్భుతమైన సినిమాలు అంతే. అవి నా వల్ల అవి హిట్ కాలేదు. నేనేం లక్కీ ఛార్మ్ కాదు' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.విజయ్ దేవరకొండ తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అతడిని మీడియా 'కల్కి' గురించి ప్రశ్నించగా.. పై విధంగా సమాధానమిచ్చాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే నాగ్ అశ్విన్ తర్వాత తీయబోయే మూవీస్‌లోనూ విజయ్ ఉండటం పక్కా.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్)#VijayDeverakonda about #Kalki2898AD movie ❤️The way he say #Prabhas anna 😍 is what I really like 😍 pic.twitter.com/o5D4g7538e— The Chanti (@chanticomrade_) June 30, 2024 -
'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?
'కల్కి 2898' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నమోదు చేసింది. సినిమాలో లీడ్ రోల్స్ చేసిన వాళ్లు నలుగురైతే.. అతిథి పాత్రల్లో మాత్రం లెక్కలేనంత మంది కనిపించారు. వీళ్లందరితో పాటు మరో తెలుగు హీరోయిన్ శోభిత కూడా ఇందులో భాగమైందనే విషయం మీకు తెలుసా? మరి మీరు ఏమైనా గమనించారా? ఇంతకీ ఎక్కడ ఉందో తెలుసా?(ఇదీ చదవండి: Kalki 2898 AD: అర్జునుడుగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?)'కల్కి'లో ప్రభాస్, అమితాబ్, దీపిక, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తే.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్, ఫరియా అబ్దుల్లా ఇలా బోలెడు మంది స్టార్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రల్లో కనిపించారు. వీళ్లతో పాటే నాగచైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ శోభిత కూడా ఈ మూవీలో భాగమేనట. దీపికా పదుకొణె పాత్రకు తెలుగులో ఈమెనే డబ్బింగ్ చెప్పిందట.తొలుత తన పాత్ర కోసం దీపికనే డబ్బింగ్ చెప్పుకొంది. ట్రైలర్లోనూ ఆమె గొంతు వినిపించింది. కాకపోతే ఆ డబ్బింగ్ చూసి విమర్శలు వచ్చాయి. దీంతో మూవీలో దీపిక పాత్రకు శోభితతో డబ్బింగ్ చెప్పించారట. అలా 'కల్కి'లో కూడా శోభిత కూడా భాగమైందని అంటున్నారు. ఇదిలా ఉండగా శోభిత-నాగచైతన్య రిలేషన్ గురించి గత కొన్నాళ్ల నుంచి రూమర్స్ వస్తున్నాయి. దీనిపై ఓ క్లారిటీ వస్తే గానీ నెటిజన్లు ఊరుకునేలా లేరు!(ఇదీ చదవండి: ప్రభాస్ కల్కి.. వర్షంలో బుజ్జి కోసం బారులు తీరిన ఫ్యాన్స్!) -
హనుమాన్ టు కల్కి.. టాలీవుడ్ ఫస్టాప్ ఎలా ఉందంటే..
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి సినిమాలను ప్రపంచం మొత్తం ఆదరిస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇక్కడ సక్సెస్ ఎంత శాతం ఉందో ఫెయిల్యూర్ అంతే ఉంది. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం.ఓపెనింగ్ అదిరింది!టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ చాలా పెద్దది. ప్రతి సంక్రాంతికి ఒకటి రెండు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు కుర్రహీరో తేజ సజ్జ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిల్లో హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులు ‘హనుమాన్’కే ఓటేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. గుంటూరుకారం, నా సామిరంగ చిత్రాలకి మిశ్రమ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లనే రాబట్టాయి. సైంధవ్ మాత్రం దారుణంగా బోల్తాపడింది. అంతకు ముందు జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరి, రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’, ‘బిఫోర్ మ్యారేజ్’ సినిమాలు ప్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి.బ్యాండ్ మోగింది..ఇక ఫిబ్రవరి తొలివారంలో సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అదేవారంలో వచ్చిన ‘కిస్మత్’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘బూట్‌కట్ బాలరాజు’, ‘గేమ్ ఆన్’ చిత్రాలు మాత్రం సందడి చేయలేకపోయాయి. ఇక రెండో వారంలో వచ్చిన రవితేజ ఈగల్, మమ్ముట్టి, జీవా ల‘యాత్ర 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపంచాయి. మూడోవారంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకలను కొంతమేర భయపెట్టేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక చివరివారంలో వచ్చిన ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘రాజధాని ఫైల్స్’, ‘సిద్ధార్థ్ రాయ్’, ‘సుందరం మాస్టర్’ చిత్రాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే ఫిబ్రవరిలో ఈగల్, యాత్ర 2 తప్పితే మిగతావన్నీ అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిన్న చిత్రాలే రిలీజ్ కావడం గమనార్హం.అలరించని సమ్మర్సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ టాలీవుడ్‌కి చాలా ముఖ్యమైనది. దాదాపు మూడు నాలుగు పెద్ద సినిమాలైనా వేసవిలో విడుదలయ్యేవి. కానీ ఈ ఏడాది సమ్మర్లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. మార్చి తొలివారం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవారం భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్ 13’లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటి అలరించలేదు. (చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?)రెండోవారం గోపిచంద్ ‘భీమా’తో విశ్వక్ సేన్ ‘గామి’తో వచ్చాడు. వీటిల్లో భీమాకి ప్లాప్ టాక్ రాగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలో బోల్తా పడ్డాయి. ఇక మూడో వారంలో రజాకార్, లంబసింగి, షరతులు వర్తిసాయి’తో పాటు అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్ అయినా..ఒక్కటి కూడా హిట్ కాలేదు. మూడో వారంలో రిలీజైన శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక చివరి వారంలో వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’ సూపర్ హిట్ కొట్టేసింది. బాక్సాపీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ‘టిల్లుగాడు’ సత్తా చాటాడు.ఏప్రిల్‌లో భారీ అంచనాలతో వచ్చిన విజయదేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదేవారంలో రిలీజైన భరతనాట్యం’, ‘బహుముఖం’ చిత్రాలు ప్లాప్ టాక్ని సంపాదించుకున్నాయి. రెండోవారంలో రిజీలైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. ఇక చివరి రెండు వారాల్లో ‘శ్రీరంగనీతులు’ ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్ మహాలక్ష్మీ, తెప్ప సముద్రం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు.(చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)మేలో తొలివారం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నరేశ్ నటించిన కామెడీ చిత్రమిది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌నే సంపాదించుకుంది. ఈ మూవీతో పాటు రిలీజైన సుహాస్ ‘ప్రసన్నవదనం’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఒక సెకండ్ వీక్‌లో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో పాటు ‘ఆరంభం’ అనే చిన్న చిత్రం విడుదలైన..తొలిరోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకున్నాయి. ఇక నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ థియేటర్స్‌కి వచ్చిన విషయమే తెలియదు. ఆ తర్వాత వారంలో ‘నట రత్నాలు’, ‘బిగ్ బ్రదర్’, ‘సీడీ’ ‘సిల్క్ శారీ’, ‘డర్టీ ఫెలో’, ‘బ్రహ్మచారి’తో పాటు మొత్తం అరడజను చిత్రాలు విడుదలైన ప్లాప్ టాక్ని మూటగట్టుకున్నాయి. గెటప్ శ్రీను తొలిసారి హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక చివరివారం భజేవాయు వేగం, గం..గం..గణేశా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు రిలీజ్ కాగా.. వీటిల్లో ‘భజే వాయు వేగం’ హిట్ టాక్‌కి సంపాదించుకుంది. ఇక జూన్ తొలివారం ‘సత్యభామ’ అంటూ కాజల్.. ‘మనమే’ అంటూ శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాయి. అదేవారంలో లవ్ మౌళితో పాటు మరో రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏది హిట్ కాలేదు. రెండో వారంలో సుధీర్ బాబు ‘హరోం హర’తో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి, నీ దారే నీ కథ, యేవమ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో మ్యూజిక్ షాప్ మూర్తి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. మూడోవారంలో నింద, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’, ‘అంతిమ తీర్పు’ లాంటి పలు చిన్న సినిమాలు విడుదలైనా..ఏ ఒక్కటి అలరించలేదు. ఇక చివరి వారం మాత్రం టాలీవుడ్‌కి గుర్తిండిపోయే విజయాన్ని అందించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్ సృష్టిస్తోంది. మొత్తంగా ఈ ఆరు నెలల్లో హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. అయితే హనుమాన్, కల్కి 2898 చిత్రాలు మాత్రం చారిత్రాత్మక విజయాలను అందుకున్నాయి. -
కల్కి దెబ్బకు షేక్ అవుతోన్న బాక్సాఫీస్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. ఈనెల 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య రిలీజైన కల్కికి మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.కల్కి సినిమా రిలీజైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు సైతం అదే జోరును కొనసాగించింది. రెండో రోజు రూ.107 కోట్లు సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.415 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇదే జోరు కొనసాగితే కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్ సినీ తారలు అతిథి పాత్రల్లో మెరిశారు. The force is unstoppable…❤️🔥#Kalki2898AD #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/fjhnE8KWIB— Kalki 2898 AD (@Kalki2898AD) June 30, 2024 -
ప్రభాస్ కల్కి.. వర్షంలో బుజ్జి కోసం బారులు తీరిన ఫ్యాన్స్!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. ఈనెల 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య రిలీజైన కల్కికి మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ చిత్రంలో బుజ్జి కారు అభిమానులను తెగ ఆకట్టుకుంది. సినిమా విడుదల రోజు ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద సందడి చేసింది. దీంతో అభిమానులు, ప్రముఖులు బుజ్జితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. తాజాగా బుజ్జి విజయవాడకు చేరుకుంది. ఓ షాపింగ్ మాల్ వద్ద బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఇది చూసిన అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తమ కెమెరాలలో బుజ్జిని క్లిక్ అనిపిస్తున్నారు. ఆ థియేటర్ వద్ద భారీగా ఫ్యాన్స్ కోలాహాలం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. కల్కి చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. Thank you Vijayawada ❤️🔥🫶#Kalki2898AD #EpicBlockbusterKalki pic.twitter.com/Ov8oAS2MfB— Bujji (@BelikeBujji) June 30, 2024 -
ప్రభాస్‌కు అవసరమే లేదు, అయినా..: కల్కి నటుడు
కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉన్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణెల విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్లో జరిగిన విశేషాలను నటుడు హుంహు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.ఆయనతో సీన్స్ లేవుహుంహు మాట్లాడుతూ.. 'అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో నాకు ఎటువంటి సన్నివేశాలు లేవు. సీక్వెల్లో అయినా ఆయనతో కలిసి నటిస్తే బాగుండని భావిస్తున్నాను. ప్రభాస్, దీపికతో కొన్ని సన్నివేశాల్లో నటించాను. అసలే నాకు సినిమాలు కొత్త, అందులోనూ ప్రభాస్‌కు అభిమానిని.సొంత అన్నలా దగ్గరుండి..తనెప్పుడూ నన్ను డార్లింగ్ అని పిలిచేవాడు. ఒక యాక్షన్ సీన్లో నన్ను పక్కకు తీసుకెళ్లి టిప్స్ చెప్పాడు. ఎక్కడ? ఎలా? యాక్ట్ చేయాలో నేర్పించాడు. నిజానికి నాకు దగ్గరుండి చెప్పాల్సిన అవసరం ప్రభాస్‌కు లేనే లేదు. అయినా సొంత అన్నలా నాకు సలహాలు ఇచ్చాడు.విశాల హృదయం..దీపికతో నటించాల్సి వచ్చినప్పుడు కొంత భయపడ్డాను. అది గమనించిన ఆమె జోక్ చెప్పి నవ్వించింది. వీళ్లు పెద్ద సెలబ్రిటీలు మాత్రమే కాదు పెద్ద మనసున్నవాళ్లు కూడా! వీరితో కలిసి పని చేయడం నా అదృష్టం' అని చెప్పుకొచ్చాడు. అలాగే కల్కి షూటింగ్లో తాను గాయపడినట్లు తెలిపాడు.చదవండి: Kalki 2898 AD: అర్జునుడిగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే? -
ఆదిపురుష్ డైరెక్టర్ ని వదలని ఫ్యాన్స్.. కల్కి, హనుమాన్ ని చూసి..
-
500 కోట్ల వైపు కల్కి పరుగులు.. హాలీవుడ్ మూవీని మించి కలెక్షన్స్
-
Kalki 2898 AD: అర్జునుడుగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898’మూవీ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. హాలీవుడ్ ప్రముఖులే సినిమాను ప్రశంసిస్తున్నారంటే.. నాగ్ అశ్విన్ మేకింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచు. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు దర్శకధీరుడు రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఫరియా అబ్దుల్లాతో పాటు మరికొంత మంది టాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్లో మెరిశారు.(చదవండి: ఒరిజినల్ మాస్ హీరో అమితాబ్.. వెయ్యి కోట్లు పక్కా అంటున్న స్టార్స్) అయితే వీరిలో బాగా హైలైట్ అయింది మాత్రం విజయ దేవరకొండ పాత్ర అనే చెప్పాలి. అర్జునుడి పాత్రలో రౌడీ హీరో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సినిమా చివరిలో ఐదు నిమిషాల పాటు కనిపిస్తాడు విజయ్. నిడివి తక్కువే అయినా ఆ సీన్స్ హైలెట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమా కోసం విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్‌పై నెట్టింట చర్చ జరుగుతుంది. (చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట విజయ్. స్నేహితుడు నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పేశాడట. పార్ట్ 2లోనూ విజయ్ పాత్ర కనిపించబోతుంది. విజయ్ ఒక్కడే కాదు గెస్ట్ రోల్‌గా నటించిన చాలా మంది రెమ్యునరేషన్ తీసుకోలేదట. కేలవం నాగ్ అశ్విన్, వైయంజతీ మూవీస్ బ్యానర్‌పై ఉన్న గౌరవంతో ఈ సినిమాలో నటించారట. -
‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘ఐతోలు’ బిడ్డె!
‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన సైన్స్ విజువల్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్ర దర్శకుడు మన పాలమూరు బిడ్డే. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, రెబల్‌స్టార్ ప్రభాస్, కమల్‌హాసన్, దీపికా పదుకొణే, విజయ్ దేవరకొండ, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ వంటి టాప్‌స్టార్లతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై.. భారీ హిట్‌గా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. సాక్షి, నాగర్‌కర్నూల్/తాడూరు: దర్శకుడిగా మూడో సినిమానే హాలీవుడ్ తరహా చిత్రీకరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు అందుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి నాగ్ అశి్వన్పై పడింది. దీంతో సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆయన తండ్రి డాక్టర్ సింగిరెడ్డి జయరాంరెడ్డి హైదరాబాద్‌లో యూరాలజిస్ట్‌గా, తల్లి జయంతిరెడ్డి గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా వారు హైదరాబాద్‌కు వెళ్లినా.. గ్రామంలో సొంతిల్లు, దగ్గరి బంధువులు చాలా మందే ఉన్నారు. కుటుంబ, ఇతర శుభకార్యాలు ఉన్నప్పుడు అందరూ ఐతోలుకు వచ్చి వెళుతుంటారు. ⇒ హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో చదువుకున్న నాగ్ అశ్విన్‌కు చిన్నప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్సు చేశాడు. సినిమాలకు దర్వకత్వం వహించాలనే లక్ష్యంగా ‘నేను మీకు తెలుసా?’ చిత్రానికి తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అశ్విన్.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే.. ఆ చిత్రాల్లో చిన్నపాత్రలు సైతం వేశారు. అయితే 2013లో రచయిత, దర్శకుడిగా తీసిన ఇంగ్లిష్ లఘు చిత్రం ‘యాదోం కీ బరాత్’ కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్‌కు ఎంపికైంది. అనంతరం 2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’ దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్‌తో తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. అదే ఏడాది వైజయంతి మూవీస్ అధినేత, నిర్మాణ అశ్వినిదత్ కుమార్తె ప్రియాంకను వివాహం చేసుకున్నారు. 2018లో అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్‌గా తీసిన ‘మహానటి’ సినిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు నిచ్చింది. ‘బయోపిక్’లో కొత్త ఒరవడి సృష్టించిన ఈ చిత్రం 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. వీటితో పాటు 2021లో వచ్చిన పిట్టకథలు వెబ్ సిరీస్‌లో ‘ఎక్స్‌లైఫ్’ సిగ్మెంట్‌కు దర్శకత్వం వహించారు. అలాగే అదేఏడాది తెలుగులో సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఇండియాలోనే భారీ బడ్జెట్ రూ.600 కోట్లతో తీసిన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రికార్డులు కొల్లగొడుతోంది. స్వగ్రామంలో హర్షాతిరేకాలుదర్శకుడు నాగ్ అశి్వన్ తెరకెక్కించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుండటం, ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన స్వగ్రామం తా డూరు మండలం ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంతో పాటు జిల్లాకేంద్రంలోనూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని చాటుకుంటున్నారు. నాగ్ అశి్వన్ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడినా సొంత ఊరిపైనున్న మమకారాన్ని వదులుకోలేదు. గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ బాధ్యతలను కూడా వారే చూసుకుంటుండటం గమనార్హం. ఏళ్ల నాటి కల నెరవేర్చుకున్నాడు.. మంచి దర్శకుడిగా ఎదగాలన్న తన ఏళ్ల నాటి కలను నాగ్ అశ్విన్ నెరవేర్చుకున్నాడు. కల్కి సినిమా పార్ట్–1 విజయవంతమై అందరి ప్రసంశలు అందుకుంది. భవిష్యత్‌లోనూ ఈ విజయాల పరంపర కొనసాగాలి. సినిమా గొప్ప విజయం సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ జయంతిరెడ్డి, నాగ్ అశ్విన్ తల్లిఇంకా గొప్ప విజయాలు సాధించాలి.. ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన విజయం మాకు అందరికీ గర్వకారణం. భవిష్యత్‌లోనూ గొప్ప సినిమాలు చేయాలని, దర్శకుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. – హరికృష్ణ శర్మ, ఐతోలు, తాడూరు మండలం -
'ప్రపంచస్థాయి సినిమాకు ఏమాత్రం తగ్గలేదు'.. కల్కిపై పుష్పరాజ్ కామెంట్స్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు.అయితే ఈ సినిమాపై పలువురు దిగ్గజ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్, ప్రభాస్ నటన అద్భుతం అంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ సైతం తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కల్కి మూవీ చిత్రబృందానికి బన్నీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.అల్లు తన ట్వీట్లో రాస్తూ..' కల్కి టీమ్‌కు నా అభినందనలు. అద్భుతమైన విజువల్ వండర్. ముఖ్యంగా నా మిత్రుడు ప్రభాస్ నటన సూపర్బ్. అమితాబ్ బచ్చన్ నటన గురించి ఇక మాటల్లేవ్. కమల్ హాసన్,దీపికా పదుకొణె, దిశా పటానీ నటన అద్భుతం. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్ బృందానికి, సాంకేతిక సిబ్బందికి అభినందనలు. ఇంత రిస్క్ తీసుకుని భారతీయ సినిమా స్థాయిని పెంచినందుకు నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నదత్, వైజయంతి మూవీస్‌కు నా ధన్యవాదాలు. కల్కితో ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని ఆశ్చర్యానికి గురి చేశాడు నాగ్. మా తరానికి చెందిన నాగ్ అశ్విన్‌కు ప్రత్యేక అభినందనలు. చివరిగా ప్రపంచ సినిమాస్థాయి ప్రమాణాలకు సరిపోయే.. మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన చిత్రమే కల్కి' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 లో నటిస్తున్నారు. ఈ సినిమాను పుష్ప సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. Kudos to #Kalki2898AD team. Outstanding visual spectacle . Respect for my dear friend #Prabhas garu for empowering this epic . Entertaining super heroic presence. @SrBachchan Ji, you are truly inspirational... no words 🙏🏽 . Adulation to our @ikamalhaasan sir looking fwd for…— Allu Arjun (@alluarjun) June 29, 2024 -
అమితాబ్ అలా చేస్తారని ఊహించలేదు: నిర్మాత సి. అశ్వినీదత్
‘‘అమితాబ్ బచ్చన్‌గారు లెజెండ్. మేము సెట్స్‌లో కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. కానీ ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకలో నా కాళ్లకి అమితాబ్‌గారు నమస్కరించడంతో నాకు తల కొట్టేసినంత పని అయింది. ఆయన అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాగ్ అశ్విన్ ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది. ఈ శతాబ్దంలో ఒక మంచి దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు (నవ్వుతూ). ‘కల్కి’ విషయంలో టెన్షన్ పడలేదు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తీశాం... అది నెరవేరింది. ప్రభాస్ సహకారం లేకపోతే అసలు ఈ సినిమా బయటికి రాదు. రాజమౌళి–ప్రభాస్‌ల ఎపిసోడ్ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్‌గోపాల్ వర్మ పాత్రలని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.ఈ కథ అనుకున్నప్పుడే రెండో భాగం ఆలోచన వచ్చింది. కమల్‌గారు ఎంటరైన తర్వాత పార్ట్ 2 డిసైడ్ అయిపోయాం. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2 వచ్చే ఏడాది జూన్‌లోనే విడుదల కావొచ్చు. 50 ఏళ్ల వైజయంతీ మూవీస్ ప్రయాణం అద్భుతం. ప్రస్తుతం శ్రీకాంత్‌గారి అబ్బాయి రోషన్‌తో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్‌తో ఒక చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు. -
కల్కిపై తారల రివ్యూ.. నాగ్, రజనీ, దేవరకొండ ఏమన్నారంటే?
ప్రభాస్ భైరవగా నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాలుగైదేళ్లుగా ఈ సినిమా గురించి ఎంతగానో కష్టపడుతున్న దర్శకుడు నాగ్ అశ్విన్ చివరికి అనుకున్నది సాధించాడు. తను అనుకున్నట్లుగానే అత్యద్భుతంగా తెరకెక్కించాడు. జూన్ 27న రిలీజైన ఈ మూవీని చూసిన పలువురు తారలు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.రజనీకాంత్ రివ్యూ'వావ్.. కల్కి సినిమా ఎంత అద్భుతంగా ఉందో! దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, నిర్మాత అశ్వినీ దత్తో పాటు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను' అని రజనీకాంత్ ట్వీట్ చేశాడు. Watched Kalki. WOW! What an epic movie! Director @nagashwin7 has taken Indian Cinema to a different level. Hearty congratulations to my dear friend @AswiniDutt @SrBachchan @PrabhasRaju @ikamalhaasan @deepikapadukone and the team of #Kalki2898AD. Eagerly awaiting Part2.God Bless.— Rajinikanth (@rajinikanth) June 29, 2024 నాగార్జున రివ్యూ'నాగి.. నువ్వు మమ్మల్ని మరో ప్రపంచానికి, మరో కాలానికి తీసుకెళ్లావు. ఇతిహాసాన్ని, చరిత్రను, ఫిక్షన్‌ను కలుపుతూ చేసిన సాహసం చాలా గొప్పది. ఈ సినిమాకు అమితాబ్ గారు ఒరిజినల్ మాస్ హీరో. ఈ మూవీలో కమల్‌గారిని ఎక్కువ చూపించలేదు. కాబట్టి సీక్వెల్లో ఆయనను చూసేందుకు వెయిట్ చేస్తున్నాను. ప్రభాస్ ఎప్పటిలాగే అదుర్స్ అనిపించాడు. దీపికగారు గొప్ప తల్లిగా బాగా యాక్ట్ చేశారు. టీమ్ కృషి ప్రశంసనీయం. మరోసారి ఇండియన్ సినిమా తన సత్తా చూపించింది' అని నాగార్జున ట్వీట్ చేశాడు. Congratulations to the team of Super duper #Kalki2898AD!!Naagi you took us to another time and another place . entwining fiction with mythology and history so effortlessly!!Amith Ji, the original mass hero… Sir, you are on fire🔥🔥🔥🔥🔥 can’t wait to see Kamalji in the…— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 29, 2024 విజయ్ దేవరకొండ రివ్యూ'ఇప్పుడే కల్కి సినిమా చూశా.. మాటలు రావడం లేదు. ఇండియన్ సినిమాలో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ చిత్రం వెయ్యి కోట్ల పైనే రాబడుతుందని ఆశిస్తున్నాను' అని విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. Just watched the film.I don’t know what to say..OverwhelmedIndian cinema new level unlockedWth was that!I hope it makes a 1000 crores and more.. ❤️#Kalki2898AD— Vijay Deverakonda (@TheDeverakonda) June 29, 2024 ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం... మహాద్భుతం...!మా బావ ప్రభాస్‌కి, అమితాబ్ బచ్చన్ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు.తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను.#Kalki2898AD #Prabhas @SrBachchan @nagashwin7…— Mohan Babu M (@themohanbabu) June 29, 2024 చదవండి: క్షణం ఆలోచించలేదు.. వాళ్ల కోసమే కల్కి చేశా: మృణాల్ ఠాకూర్ -
క్షణం ఆలోచించలేదు.. వాళ్ల కోసమే కల్కి చేశా: మృణాల్ ఠాకూర్
అందరూ ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ మూవీ ఎట్టకేలకు గురువారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విజువల్ వండర్‌ను చూసిన సినీప్రియులు హాలీవుడ్ సినిమాను మించిపోయిందని ఖుషీ అవుతున్నారు. యాక్టర్స్ పోటీపడి మరీ నటించారని సినిమా చూస్తేనే తెలిసిపోతుంది. భైరవగా ప్రభాస్ ఎంత మెప్పించాడో అశ్వత్థామగా అమితాబ్ అంతే స్థాయిలో అదరగొట్టాడు. వారిపై నమ్మకంతోనే..విజయ్ దేవరకొండ, ఫరియా అబ్దుల్లా, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో కనిపించి మురిపించారు. అయితే తాను కల్కి మూవీలో గెస్ట్ రోల్లో నటించడానికి ఈ ముగ్గురే కారణమంటోంది మృణాల్. ఆమె మాట్లాడుతూ.. కల్కి సినిమా గురించి నన్ను సంప్రదించినప్పుడు క్షణం ఆలోచించలేదు. ఎందుకంటే నిర్మాతలు అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంకలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందువల్లే ఈజీగావారితో కలిసే సీతారామం సినిమా చేశాను. దానివల్లే ఈసారి ఈజీగా నిర్ణయం తీసుకున్నాను. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమవడం సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి మూవీ రెండు రోజుల్లోనే రూ.298 కోట్లు రాబట్టింది. వీకెండ్ కలిసొస్తుండటంతో ఈ శని, ఆదివారాల్లో ఇంకెత రాబడుతుందో చూడాలి!చదవండి: హృతిక్ రోషన్ అలా చేస్తాడనుకోలేదు: బాలీవుడ్ నటుడు'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్ -
కల్కి బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ.. ఈ ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
'కల్కి' రెండో రోజు కలెక్షన్స్.. కాస్త తగ్గాయి కానీ!
బాక్సాఫీస్ దగ్గర 'కల్కి 2898' జోరు మామూలుగా లేదు. తొలిరోజే రూ.191 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. కాకపోతే కాస్త తగ్గుదల చూపించింది. త్రిబుల్ సెంచరీ కొద్దిలో మిస్ అయింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్)టాలీవుడ్లోనే భారీ బడ్జెట్‌తో తీసిన 'కల్కి'.. రెండు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఇప్పటికే ఓవర్సీస్లో 7 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.191.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. రెండో రోజు రూ.107 కోట్లు సొంతం చేసుకుంది.తద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.298.5 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీని బట్టి చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి ఎంత? లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందోనని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేసేస్తున్నారు.(ఇదీ చదవండి: మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే) -
'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్
ప్రస్తుతం 'కల్కి' హ్యాంగోవర్ నడుస్తోంది. ఇక్కడ అక్కడా అనే తేడా లేకుండా అందరూ ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. తొలిరోజు రూ.191 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. లాంగ్ రన్లో రూ.1000 కోట్లు సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి? ఇలా అందరూ 'కల్కి' ఊపులో ఉండగానే సీక్వెల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: 'కల్కి'పై హాలీవుడ్ ప్రశంసలు.. రేంజు పెరిగిపోయింది!)'కల్కి' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నిర్మాత అశ్వనీదత్ మీడియాతో మాట్లాడారు. సీక్వెల్ గురించి అడగ్గా.. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని, కాకపోతే మేజర్ సీక్వెన్స్ మాత్రం పెండింగ్‌లో ఉంచామని చెప్పారు. వాటి షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తామని అన్నారు.అశ్వనీదత్ చెప్పిన దానిబట్టి చూస్తే ఏడాది ఏడాదిన్నరైనా చిత్రీకరణం పూర్తి చేయొచ్చు. కానీ అందరూ డేట్స్ కుదిరితేనే ఇది సాధ్యమవుతుంది. నాగ్ అశ్విన్ చేతిలో వేరే ప్రాజెక్ట్ ఏం లేదు కాబట్టి ముందు దీన్నే కంప్లీట్ చేస్తాడు. చూడాలి మరి 'కల్కి'ని సినిమాటిక్ యూనివర్స్‌గా ప్రకటించారు కాబట్టి రెండో భాగంలో కొత్త పాత్రలు ఏమైనా వచ్చి సర్ప్రైజ్ చేస్తాయేమో?(ఇదీ చదవండి: మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే) -
ఆ స్థానం లో ఒకే ఒక్కడు గా నిలిచిన ప్రభాస్
-
కల్కి లో ప్రభాస్ ని డామినేట్ చేసిన ఆ యాక్టర్...
-
Kalki 2898: కృష్ణుడి పాత్రను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్!
‘కల్కి 2898’..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చిస్తున్నారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడని అందరు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామతో పాటు పలు పాత్రలను చూపించారు. ఆ సన్నివేశాలన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అశ్వత్థామ, కృష్ణుడి మధ్య వచ్చే సన్నివేశాలు.. సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. (చదవండి: 'కల్కి'లో నిజంగానే అది అద్భుతం.. ఎందుకంటే?)అయితే సినిమా మొత్తంలో మూడు, నాలుగు సార్లు కృష్ణుడు కనిపిస్తాడు. కానీ ఆయన మొఖం మాత్రం కనిపించదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కావాలనే కృష్ణుడి ఫేస్ రివీల్ చేయలేదట. ఆ పాత్రను ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌తో చేయించాలని భావించారట. నిర్మాత అశ్వనీదత్ ఈ ఇద్దరి హీరోలను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో వారిద్దరు ఆ పాత్రను చేయలేకపోయారు.(చదవండి: ఇంటర్నేషనల్ మీడియాలో 'కల్కి' హవా .. వేరే లెవల్!) ‘కల్కి 2898’ విడుదలైన మంచి విజయం సాధిస్తే..పార్ట్ 2లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌తో కృష్ణుడు పాత్ర చేయించాలని డైరెక్టర్ నాగి అనుకున్నాడట. అందుకే పార్ట్ 1లో కృష్ణుడి ఫేస్‌ని రివీల్ చేయకుండా కథను నడిపించాడు. అనుకున్నట్లే సినిమా పెద్ద విజయం సాధించింది. తొలి రోజే ఏకంగా రూ. 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి రికార్డును సృష్టించింది. వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. డైరెక్టర్ అంచనా వేసిందే జరిగింది కాబట్టి.. పార్ట్ 2లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉంది.పార్ట్ 1 కృష్ణుడు ఇతనే‘కల్కి 2898’లో కృష్ణుడి పాత్ర పోషించిన నటుడితో పాటు చాలా మంది పేర్లను మేకర్స్ రహస్యంగానే ఉంచారు. అయితే సినిమా విడుదలైన తర్వాత అందరి పేర్లు బయటకు వచ్చాయి. ఎవరెవరు ఏ పాత్ర పోషించారనేది కూడా సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయింది. అర్జునుడుగా విజయ్ దేవరకొండ నటించగా.. కృష్ణుడిగా తమిళ నటుడు కృష్ణకుమార్ సుబ్రమణియమ్ నటించాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇక ఈ చిత్రంలో కీలకమైన అశ్వత్థామ పాత్రను అమితాబ్ బచ్చన్, సుప్రీం యాష్కిన్ పాత్రను కమల్ హాసన్ పోషించారు. ఇతర కీలక పాత్రల్లో దీపికా పదుకొణె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి నటించారు. (చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ) -
మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే
మొన్నటివరకు టాలీవుడ్లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ మాటలతో కొట్టేసుకునేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మహాభారతం హాట్ టాపిక్ అయిపోయింది. అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప? లాంటి చర్చలు మొదలయ్యాయి. ఇవన్నీ కాదన్నట్లు ఇన్ స్టాలో రీల్స్ దగ్గర నుంచి టీ కొట్టు దగ్గర ముచ్చట్ల వరకు మహాభారతమే వినిపిస్తుంది. దీనంతటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ నాగ్ అశ్విన్.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)అప్పట్లో మహాభారతం ఆధారంగా సీరియల్స్, సినిమాలు వచ్చాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి తీసుకుంటే ఏ డైరెక్టర్ కూడా దీన్ని సినిమాగా, కనీసం సీన్స్ వరకైనా తీసే సాహసం చేయలేదు. రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని చెప్పాడు. కాకపోతే జక్కన్న ఇది తీసేసరికి ఇంకో 10-15 ఏళ్లయినా పట్టొచ్చు. ఇంతలోనే నాగ్ అశ్విన్ అనే కుర్ర డైరెక్టర్ రయ్ అని దూసుకొచ్చాడు.మరీ పూర్తిగా కాకపోయినా సరే 'కల్కి'లో మహాభారతంలోని కురుక్షేత్రానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌తో అబ్బురపరిచాడు. అశ్వద్థామ పాత్రని 'కల్కి'తో లింక్ చేసిన విధానం సగటు ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది. దీంతో అసలు అశ్వద్థామ ఎవరు? అతడికి కర్ణుడితో సంబంధం ఏంటనే సీరియస్‌గా తెగ సెర్చ్ చేసేస్తున్నారు. 'కల్కి' అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)ఇక 'కల్కి' చివర్లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు. కర్ణుడి చరిత్ర అంతా తవ్వితీస్తున్నారు. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం వచ్చిన చందమామ కథలు పుస్తకాల దగ్గర నుంచి గీత ట్రస్ట్ మహాభారతం వరకు ఎవరికీ తోచిన పుస్తకాలని వాళ్లు తిరగేస్తున్నారు. ఇది కాదన్నట్లు మహాభారతం క్యారెక్టర్స్ గురించి పలువురు యాక్టర్స్ మాట్లాడిన వీడియోలని ట్విట్టర్లో వైరల్ చేస్తున్నారు.ఏదేమైనా ఓ తెలుగు సినిమా వల్ల 'మహాభారతం' అనే అద్భుతం గురించి తిరిగి మాట్లాడుకోవడం చాలా బాగుంది. ఇప్పటి జనరేషన్‌కి మహాభారతంపై మనసు పడేలా చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి ధన్యవాదాలు. కాకపోతే అర్జున vs కర్ణ.. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ గురించి యూత్ తగువులాడుకోవడం మాత్రం వింతగా ఉంది.(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)Thank you man @nagashwin7 🥺❤️Chinnaptinunchi karnudi story amtey chala istam...finally see the Elevations on screen about karna☀️ Even the Divine knows real Hero of MAHABHARAT🙌🔥 #Karna #Kalki2898ADonJune27 #Mahabharath #Kalki2898ADReview pic.twitter.com/PhmsJae837— DRUG❤️🔥 (@Akhilgo16778185) June 28, 2024 -
'కల్కి'పై హాలీవుడ్ ప్రశంసలు.. రేంజు పెరిగిపోయింది!
'కల్కి' సినిమా అద్భుతాలు చేస్తోంది. దక్షిణాదిలో టాక్ పరంగా అక్కడక్కడ కాస్త మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ ఉత్తరాదితో పాటు మిగతా దేశాల్లో మాత్రం యునానిమస్ టాక్ సొంతం చేసుకుంది. ముందు నుంచే దీన్ని పాన్ వరల్డ్ సినిమాగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు మూవీ టీమ్ కోరుకున్నట్లు హాలీవుడ్ మీడియా కూడా 'కల్కి'కి ఫిదా అయిపోయినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)డైరెక్టర్ నాగ్ అశ్విన్.. 'కల్కి'ని హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో తీసిన మాట వాస్తవం. వాళ్లకు మార్వెల్, డీసీ లాంటి విజువల్ వండర్స్ మూవీస్ ఉన్నాయి. మనకు అలాంటిది ఎందుకు ఉండకూడదని సైన్స్ ఫిక్షన్ కథకు మహాభారతాన్ని ముడిపెట్టి తీసిన మూవీనే 'కల్కి'. దీని రిలీజ్ తర్వాత తెలుగోళ్లు మహాభారతం గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.మరోవైపు హాలీవుడ్లో ప్రముఖ మీడియా సంస్థలైన డెడ్ లైన్, కొలీడర్ లాంటివి 'కల్కి' గురించి ఆర్టికల్స్ రాశాయి. అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాయి. గతంలో నాగ్ అశ్విన్ ఏదైతే అనుకున్నాడే ఇప్పుడు అదే జరిగింది. ప్రభాస్ క్రేజ్ కూడా 'కల్కి' దెబ్బకు హాలీవుడ్ వరకు వెళ్లిపోయింది. ఏదేమైనా తెలుగు సినిమాకు ఆస్కార్ రావడమే ఎక్కువ అనుకున్నాం ఇప్పుడు మన మూవీ గురించి వాళ్లు ఆర్టికల్స్ రాయడం బోనస్ లాంటిది!(ఇదీ చదవండి: గతంలో నేను తప్పు చేసిన మాట నిజమే: సమంత) -
ప్రభాస్ ‘కల్కి’ మూవీ HD స్టిల్స్ (ఫొటోలు)
-
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్‌లో, న్యూయార్క్‌లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్‌కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్ట్‌లు... అన్నీ హ్యాండ్‌మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్‌లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్‌లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్‌లో ఒక ఫ్యాబ్రిక్‌కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్‌ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్‌ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్‌కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్‌ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్‌స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
'ఆ విషయం నాకు ముందే చెప్పారు'.. కల్కిపై కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంంబోలో తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. నైజాంలో కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధిమిగమించేసింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా కమల్ హాసన్ కల్కి సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా సుప్రీం యాస్కిన్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు.కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'కల్కి రెండో పార్ట్‌లోనే నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం నాకు ముందే చెప్పారు. కేవలం ఓ అభిమానిగా పార్ట్-1 షూటింగ్లో పాల్గొన్నా. ప్రస్తుతం ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ఓపిక చాలా ఎక్కువ. పురాణాలను సైన్స్‌ను ముడిపెట్టి కల్కిని అద్భుతంగా రూపొందించారు. చాలా ఓపిగ్గా కల్కి కథను రాసుకున్నారు. అంతే ఓపికగా తెరకెక్కించారు' అంటూ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. గతంలో విలన్‌గా నటించిన సినిమాల కంటే యాస్కిన్ పాత్ర భిన్నంగా కనిపించిందన్నారు. ఈ పాత్ర నేను చేయగలనా అనే సందేహం వచ్చిందని కమల్ తెలిపారు. -
కల్కిలో భారీగా గెస్ట్ రోల్స్.. బాగా మెప్పిచ్చింది ఎవరంటే..?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ఈ సినిమాలో అనేక గెస్ట్ రోల్స్ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా హైలైట్ అవుతోంది విజయ్ దేవరకొండ నటించిన అర్జునుడి పాత్రే అని చెప్పవచ్చు. ఈ పాత్రలో విజయ్ పర్పెక్ట్ గా సరిపోయారంటూ నెట్టింట పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుంది.అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో చూపించే బలమైన ఎమోషన్స్ తన నటనతో పలికించారు విజయ్ దేవరకొండ. నిడివి తక్కువే అయినా అర్జునుడిగా విజయ్ మేకోవర్, చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ కల్కిలో ఒక హైలైట్‌గా నిలుస్తున్నాయి. విజయ్ క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ అప్లాజ్ వస్తోంది. విజయ్ను మైథాలజీ పాత్రల్లో చూసే అవకాశం అరుదు కాబట్టి కల్కి సినిమా ఆయన కెరీర్లోనూ ఓ స్పెషల్ మూవీ అనుకోవచ్చు. -
Kalki 2898 AD: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రభాస్!
ప్రతి ఒక్క స్టార్ హీరోకి కొన్ని డ్రీమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే కొంత మందికి మాత్రమే వాటిని నెరవేర్చుకునే అవకాశం వస్తుంది. మరికొంత మందికి అవి డ్రీమ్గానే మిగిలిపోతాయి. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా జరుగుతోంది. ఆయన ఏ పాత్ర చేయాలనుకున్నా..అది చేసేస్తున్నాడు. సినిమా ఏదైనా తన పాత్రను నెక్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాడు. ఇక పురాణాల పాత్రలను అవలీలగా చేసేస్తున్నాడు.(చదవండి: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కల్కి.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?)వెండితెరపై మనకు రాముడైనా..కృష్ణుడైనా ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆరే. పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్‌ను మించి ఎవరూ చేయలేరు అంటారు. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలను బాలకృష్ణ పోషించి మెప్పించాడు. ఈ తరంలో మాత్రం ఆ అవకాశాన్ని ప్రభాస్ అందిపుచ్చుకున్నాడు. పురాణ పాత్రలను అవలీలగా పోషిస్తున్నాడు. ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ప్రభాస్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.(చదవండి: 'కల్కి'లో కృష్ణుడి ముఖం అందుకే చూపించలేదా?)ఇప్పుడు ‘కల్కి 2898’లోనూ పౌరాణిక పాత్రలో కనిపించి మెప్పించాడు. సినిమా మొత్తం సాధారణ వ్యక్తి భైరవగా కనిపించినా ప్రభాస్.. చివరల్లో మాత్రం మహాభారతంలోని ఓ కీలక పాత్రలో కనిపించి అందరికి షాకిచ్చాడు. పార్ట్ 2లో ఆ పాత్రతో పాటు మరో పౌరాణిక పాత్రలోనూ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ పౌరాణిక పాత్రే పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా నేటితరం హీరోల్లో పౌరాణిక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న ఏకైక హీరో ప్రభాస్ అనే చెప్పాలి. -
రికార్డులు క్రియేట్ చేసే వాళ్లు పరుగులు పెట్టరు: స్వప్న దత్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం తాజాగా విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కల్కి నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ తాజాగా స్పందించారు. 'కల్కి సినిమా విడుదల తర్వాత చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఇతర సినిమాలకు చెందిన రికార్డులను 'కల్కి' క్రాస్ చేసిందా..? అని కొందరు అభిమానులు అడుగుతున్నారు. ఈ ప్రశ్న నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన వారెవ్వరూ మళ్లీ వాటికోసమే పరుగులు పెట్టి సినిమాలు చేయరు. కల్కి చిత్రాన్ని ప్రేక్షకుల కోసం తీశాం. ఇలాంటి ప్రశ్నలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.' అని స్వప్నదత్ అన్నారు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన వంటి స్టార్స్ నటించారు. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదలైన కల్కి సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ప్రభాస్, వైజయంతి మూవీస్ బ్యానర్లో కల్కి చిత్రం కూడా ఎవర్‌గ్రీన్‌గా ఉండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. -
Kalki2898AD ‘నవ్వొస్తోంది.. మేం రికార్డులకోసం చేయలేదు’! షాకింగ్ ట్వీట్
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి2898 ఏడీ అంచనాలకు మించి ఆదరణను సంపాదించు కుంటోంది. నాగ్ కథను ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే, టెక్నికల్ విలువలు, విజువల్స్ అన్నీ అద్భుతంగా అమరి పోవడం ప్రేక్షకులు చాలా థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నారు. అద్భుతమైన సినిమా అంటూ కితాబిస్తున్నారు. దీంతో వసూళ్లు , రికార్డులపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు సి. అశ్వినీదత్ కుమార్తె , నిర్మాత స్వప్నాదత్ చలసాని చేసిన ట్వీట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.#Kalki2898AD pic.twitter.com/85X4CYqNij— Swapnadutt Chalasani (@SwapnaDuttCh) June 28, 2024 ‘చాలామంది కాల్ చేసి మీరు రికార్డులను బ్రేక్ చేశారా అని అడగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నవ్వొస్తోంది.. ఎందుకంటే ఆ రికార్డులను సాధించినవారు, లేదా రికార్డులు సృష్టించిన వారు .. రికార్డుల కోసం ఎపుడూ సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ఉన్న ప్రేమతో సినిమాలు తీసారు. మేమూ అదే చేశాం’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు మంచిమాట అంటూ కమెంట్ చేశారు. ఎవరూ ఉచితంగా ఏమీ చేయరు అక్కా. మీరు నిజంగా సినిమాపై ఉన్న ప్రేమ కోసం దీన్ని రూపొందించినట్లయితే, తొలి వారంలోనే రెట్టింపు వసూళ్ల కోసంలా కాకుండా సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించండి. అందరూ చూడగలిగేలా సరసమైన ధరలో ఉండేలా చూడండి అని వ్యాఖ్యానించారు. -
ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 27న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి అదే రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిపించింది.మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ పోస్ట్ చేసింది. నైజాం ఏరియాలోనే మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ (రూ.23.55 కోట్లు) పేరిట ఉన్న ఘనత వెనక్కి వెళ్లిపోయింది. కాగా.. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. 𝐋𝐞𝐭’𝐬 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞 𝐂𝐢𝐧𝐞𝐦𝐚…❤️🔥#Kalki2898AD #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/Xqn7atEWNF— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 28, 2024 -
మరోసారి బాక్సాఫీస్ దగ్గర రికార్డుల ఫెస్టివల్..
-
కల్కిలో హైలెట్ గా నిలిచిన గెస్ట్ అప్పియరెన్స్ స్..