Kannada actor
-
సతీమణి బర్త్ డే.. భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ స్టార్
కేజీఎఫ్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ఈ మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో యశ్ మెప్పించనున్నారు.అయితే నటి రాధిక పండిట్‌ను యశ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2016లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఇటీవల మార్చి 7న యశ్ భార్య రాధిక పండిట్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో హీరో యశ్ సతీమణికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రొమాంటిక్ సాంగ్‌ను ఆలపించాడు. 1981లో వచ్చిన కన్నడ మూవీలోని పాటను పాడి సతీమణికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రాధిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే కేజీఎఫ్ స్టార్ యశ్ చివరిసారిగా కేజీఎఫ్-2లో కనిపించారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
నటి రన్యా రావు కేసు.. తండ్రి కూడా 'తేడా'నే!
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డిన కన్నడ నటి రన్యా రావు (Kannada Actor Ranya Rao) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాన్నాళ్లుగా ఆమె ఈ దందా సాగిస్తున్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం అక్రమ రవాణాలో ఆమె కేవలం పాత్రధారి మాత్రమేనని సూత్రధారులు వేరే ఉన్నారని అనుమానిస్తున్నారు. రాజకీయ నేతల హస్తం కూడా ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. పోలీసుల దర్యాప్తులో ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.సవతి తండ్రిపైనా ఆరోపణలు రన్యా రావు అరెస్ట్ ఘటనలో తనకేం సంబంధం లేదని స్పష్టంచేసిన ఆమె సవతి తండ్రి కె.రామచంద్రరావు పైనా గతంలో ఆరోపణలున్నట్లు తాజాగా మీడియాలో వార్తలొచ్చాయి. ఐపీఎస్ అధికారి (IPS Officer) అయిన రామచంద్రరావు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్)గా సేవలందిస్తున్నారు. 2014లో మైసూరు సదరన్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిలో ఉన్నప్పుడు హవాలా కేసులో ఈయన పాత్ర ఉందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి.మైసూరులోని యెల్వాల్ నుంచి కేరళకు వెళ్తున్న బస్సును అడ్డగించిన పోలీసులు అందులోంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ బస్సు నుంచి రూ.2.07 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని రూ.20లక్షలు మినహా మిగతా కరెన్సీ పంచుకున్నారని ఒక వ్యాపారి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతంపై కేసు నమోదైంది. బస్సు వెళ్తున్న మార్గం వివరాలను వెల్లడించిన పోలీస్ ఇన్‌ఫార్మర్లతోపాటు రామచంద్రరావు వ్యక్తిగత గన్‌మెన్‌ను అరెస్ట్‌చేశారు. దీంతో రామచంద్రరావును ఈ పోస్ట్ నుంచి తప్పించి హెడ్‌క్వార్టర్స్‌కు ట్రాన్స్ఫర్చేశారు.తర్వాత రెండేళ్లకు మరో కేసులోనూ రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపించింది. గ్యాంగ్స్టర్లు ధర్మరాజ్, గంగాధర్‌ల నకిలీ ఎన్కౌంటర్ కేసు (Fake Encounter Case)లో రామంచంద్రరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.చదవండి: రన్యా రావు నాలుగు నెలలుగా ఇంటికి రాలేదు రన్యా రావుకు 3 రోజుల కస్టడీకర్ణాటకలోని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలు తెస్తూ రన్యా రావు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమెను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేసిన విజ్ఞప్తిని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతించింది. -
ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం
బెంగళూరులో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో అనేక మంది శాండల్‌వుడ్ నటీనటులు పాల్గొనకపోవడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖలపై ఆయన భగ్గుమన్నారు. కన్నడ భూమి, భాష గురించి నటీనటులు స్పందించకుంటే మీ నట్లు బోల్ట్లను టైట్ చేస్తామని సినీ ప్రముఖులను హెచ్చరించారు. దీంతో నెట్టింట పెద్ద దుమారం రేగింది. అయితే, తన వ్యాఖ్యలను కొంత సమయం తర్వాత డీకే సమర్థించుకున్నారు. 'సినిమా ప్రముఖులు ఏమికావాలంటే అది చేసుకోనీ, నాకు తెలియదు. నా మాటల్లో నిజాలున్నాయి. ధర్నాలు చేసినా ఫర్వాలేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. మన నీరు, మన హక్కు పోరాటంలో సినిమా వాళ్లెవరూ పాల్గొనలేదు' అని ఆయన ఆరోపించారు. మేకెదాటు పాదయాత్రలో ప్రేమ్, దునియా విజయ్, సాధుకోకిల పాల్గొన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కేసులు వేసిందని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా, కుంభమేళాలో స్నానం చేయడంపై సొంత పార్టీ నాయకులు విమర్శించారని ప్రశ్నించగా, అక్కడి నీటికి కులం, మతం ఉందా, ఏ పార్టీకై నా చెందిందా అని మండిపడ్డారు.అధికార దర్పం: ఫిల్మ్ చాంబర్డిప్యూటీ సీఎం ప్రకటనను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహలు ఖండించారు. అయన అధికార దర్పంతో అలా మాట్లాడి ఉండవచ్చని అన్నారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కన్నడ కళాకారులందరూ పాల్గొనవలసి ఉంది. ఆహ్వానం అందని కారణంగా కొందరు పాల్గొనలేదని చెప్పారు.మీకు సాధ్యమా: అశోక్సినిమా రంగం, నటులపై డీకే శివకుమార్ మాటలను బీజేపీ పక్ష నాయకుడు ఆర్ అశోక్ ఖండించారు. మీరు చెప్పేది సాధ్యమా, ముందు మీ మంత్రి రాజణ్ణకు నట్లు బోల్టులను బిగించాలని హేళన చేశారు. కిచ్చ సుదీప్, కేజీఎఫ్ యశ్, దర్శన్ నట్లు బోల్టులను బిర్రు చేయడం మీకు సాధ్యమా అంటూ ప్రశ్నించారు. కన్నడ సినిమా రంగాన్ని అవమానించారని, క్షమాపణలు చెప్పాలని డీకే శివకుమార్‌ను అశోక్ డిమాండ్ చేశారు. -
జాలిరెడ్డి పెళ్లిలో అరుదైన సన్నివేశం.. గడ్డం పట్టుకుని మరి..!
పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు డాలీ ధనంజయ (Daali Dhananjaya). ఇటీవలే ఆయన వివాహబంధంలో అడుగుపెట్టారు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతను పెళ్లాడారు. మైసూరులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేదికపై మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి శాండల్‌వుడ్ సినీతారలతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం జాలిరెడ్డి పెళ్లికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ భారీ వెడ్డింగ్ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే హాజరయ్యారు.అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ పెళ్లి వేడుకలో డాలీ ధనుంజయకు తన భార్య కాళ్లు మొక్కుతూ కనిపించింది. ఇందులో డాలీ ధనుంజయ వద్దని చెబుతున్నప్పటికీ వినకుండా గడ్డం పట్టుకుని మరీ భర్త పాదాలను నమస్కరించింది. ఆ తర్వాత వెంటనే తను కూడా భార్య పాదాలకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్ వీడియోను షేర్ చేయడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు) కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా చాలా సినిమాల్లో ధనంజయ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ ఆయన కనిపించారు. అయితే, పుష్ప పార్ట్-1లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాగా.. డాలీ ధనుంజయ్ ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు. ఇక డాలీ ధనుంజయ్ సతీమణి ధన్యతా విషయానికొస్తే.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు.Men in love 🤌🏻✨!!!#DaaliDhananjay #DaaliDhanyata #DaaliDhanyata #kfi pic.twitter.com/KXc7gqwTIa— MASS (@Thalassophilee6) February 16, 2025 -
పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు
పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ (Daali Dhananjaya) వివాహబంధంలో అడుగుపెట్టాడు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు వేశాడు. ఈ క్రమంలో తమ ఆత్మీయులకు, అభిమానులకు నూతన దంపతులు క్షమాపణ చెప్పారు. కర్ణాటకలోని మైసూరులో బంధుమిత్రులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఆదివారం (ఫిబ్రవరి 16న) వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే హాజరయ్యారు.పెళ్లి తంతు పూర్తి అయిన తర్వాత మీడియా పూర్వకంగా అందరి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్‌మీడియా ద్వారా పలు విషయాలు పంచుకున్నారు. పెళ్లికి వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి వేడుకలు ఘనంగా జరగడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు, మీడియా, పోలీసు శాఖ ఇలా ఎంతో మంది కృషి చేశారు. వారందరికీ మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు. మా పెళ్లి కోసం చాలామంది హాజరయ్యారు. దీంతో కొంతమంది మాపై అభిమానంతో ఫంక్షన్ హాలు వరకు వచ్చి కూడా లోపలికి రాలేకపోయారు. మీకు ఇబ్బంది కలిగించినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము తప్పకుండా మరిన్ని మంచి విషయాలతో తిరిగి మిమ్మల్ని కలుస్తాము. పెద్ద మనుసుతో మమ్మల్ని ఆశీర్వదించండి.' అని ఆయన తెలిపారు.కన్నడలో హీరో కమ్ విలన్‌గా చాలా సినిమాల్లో ధనంజయ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ ఆయన కనిపించారు. అయితే, పుష్ప1లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.ధనంజయ్ సతీమణి ధన్యత విషయానికొస్తే.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు. ధనంజయ్ ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు. View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన పుష్ప విలన్ జాలిరెడ్డి.. హాజరైన సుకుమార్
పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. మైసూరులో ఆయన పెళ్లి వేడుగ ఘనంగా జరిగింది. పుష్ప సినిమాలో విలన్‌గా మెప్పించిన డాలీ ధనుంజయ్.. డాక్టర్ ధన్యత మెడలో మూడు ముళ్లు వేశారు. ఇవాళ ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకలో కన్నడ సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం మైసూర్ ప్యాలెస్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పెళ్లికి అభిమానులు సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ అదరగొట్టేశాడు. పుష్ప- 2 సినిమా దర్శకుడు సుకుమార్ కూడా డాలీ ధనంజయ్ పెళ్లికి హాజరయ్యారు.పెళ్లి కోసం ప్రత్యేకంగా సెట్..మైసూర్ ప్యాలెస్ ముందు ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఒక విలాసవంతమైన సెట్‌ను నిర్మించారు. ఫిబ్రవరి 15న సాయంత్రం రిసెప్షన్ జరిగింది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం..డాలీ ధనుంజయ్‌కు మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ప్రాథమిక విద్య, జీవితం, సినిమా పరిశ్రమలోకి ప్రవేశం అన్నీ మైసూర్‌లోనే జరిగాయి. అందుకే మైసూర్‌లోనే వివాహం చేసుకున్నారు. చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం పొందడానికి చాముండేశ్వరి ఆలయ నమూనాతో పెళ్లి వేదికను నిర్మించారు. అలాగే టవర్ ఆకారపు సెట్ పెళ్లికి హైలైట్‌గా నిలిచింది. -
జీవితంలో పెళ్లే చేసుకోనన్న జాలిరెడ్డి.. ఇప్పుడేకంగా లవ్ మ్యారేజ్
బ్లాక్‌బస్టర్ పుష్ప మూవీలో జాలిరెడ్డిగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ (Daali Dhananjaya) మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్రియురాలు డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఇటీవల హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా తాజాగా ధనుంజయను పెళ్లికొడుకుగా, ధన్యతను పెళ్లికూతురిగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆమె కాలికి మెట్టెలు తొడిగాడు.పెద్ద ఎత్తున వివాహ వేడుక!కర్ణాటకలోని మైసూరులో శనివారం (ఫిబ్రవరి 15న) రాత్రి రిసెప్షన్ జరగనుంది. బంధుమిత్రులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 16న) వీరి వివాహం జరనుంది. ఈ వేడుకకు దాదాపు 30 వేల మంది వస్తారని అంచనా! కాగా ధనంజయ్- ధన్యత గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ధనంజయ.. అసలు పెళ్లే చేసుకోనని ఇంట్లో తెగ సతాయించేవాడట! దీంతో అతడ్ని ఎలా ఒప్పించాలా? అని తెగ టెన్షన్ పడిపోయానంటోంది నటుడి తల్లి సావిత్రమ్మ. పెళ్లి చేసుకోమని ఐదేళ్లుగా వెంటపడ్డానని.. ఎట్టకేలకు ఆ శుభకార్యం జరుగుతుండటం సంతోషంగా ఉందని పేర్కొంది.పెళ్లికూతురు ఎవరంటే?ధన్యత చిత్రదుర్గకు చెందిన అమ్మాయి. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. ధనంజయ్ విషయానికి వస్తే.. ఇతడు కన్నడలో హీరోగా, విలన్‌గా పలు సినిమాలు చేశాడు. పుష్ప మూవీతో తెలుగువారికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు.చదవండి: పెళ్లి, పిల్లలు వద్దంటేనే సినిమా ఛాన్స్..: హీరోయిన్ -
పెళ్లికి సిద్ధమైన జాలిరెడ్డి.. గ్రాండ్‌గా వెడ్డింగ్ ప్లాన్
పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు డాలీ ధనుంజయ్. సినిమాలో జాలిరెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నాడు. గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ధనుంజయ్ ఈనెల ఓ ఇంటివాడు కానున్నారు. ఈనెల 15,16 తేదీల్లో డాలి ధనుంజయ్- ధన్యతను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ మైసూరులో జరగనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ధనుంజయ. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.నటుడు డాలీ ధనంజయ్-ధన్యతల వివాహం మైసూర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. నటుడు ధనంజయ్‌కి ఇష్టమైన పట్టణం మైసూర్ . ఆ నగరంలోనే చిన్నప్పటి నుంచి చదువుకుని అక్కడే పెరిగారు. ఈ నేపథ్యంలో ధనంజయ్ తన పెళ్లి ప్లానింగ్స్ గురించి మాట్లాడారు. మైసూర్లో పెళ్లి చేసుకోవాలనేది నా కల.. ఎందుకంటే నా చదువు, సినీ రంగ ప్రవేశం అంతా మైసూరు నుంచే జరిగిందని వెల్లడించారు. మాత చాముండేశ్వరి అనుగ్రహం తనకు ఎప్పుడు ఉంటుందని ధనంజయ్ అన్నారు. అందుకే చాముండేశ్వరి దేవాలయం నమూనాలో పెళ్లి వేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ అదరగొట్టేశాడు.ధనంజయ్ చేసుకోబోయే ధన్యత విషయానికొస్తే చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమలో మారింగి. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
పెళ్లిరోజు నాడే గుడ్‌న్యూస్.. తల్లిదండ్రులైన టాలీవుడ్ జంట
కన్నడ నటుడు వశిష్ఠ ( Vasishta N. Simha), హీరోయిన్ హరిప్రియ (Haripriya) తల్లిదండ్రులు అయ్యారు. పండంటి మగబిడ్డకు హరిప్రియ జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తమ రెండో పెళ్లిరోజు నాడే బాబు జన్మించడం చాలా సంతోషాన్ని ఇస్తుందని ఆమె తెలిపింది. ఇలాంటి లక్ చాలా అరుదుగా కలిసొస్తుందని వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హరిప్రియ బిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగులో కూడా ఆమె చాలా సినిమాలలో నటించడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.కన్నడలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ఆమె ఏడడుగుల బంధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తమిళ్, తెలుగులో కూడా అనేక చిత్రాల్లో మెప్పించింది. నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు హరిప్రియ పరిచయమైంది. ఆ తర్వాత నానితో పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ( ఇదీ చదవండి: ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్)‘జై సింహా’లో (Jai Simha) బాలయ్య సరసన నటించి తెలుగు వారిని కూడా మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలు చేయలేదు. కానీ, కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది. వశిష్ఠ కూడా మరెవరో కాదు… కన్నడ నుంచి రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'కేజీఎఫ్'లో ఆయన విలన్‌గా నటించాడు. ఆర్వాత తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్ వంటి చిత్రాల్లో నటించిన ఆయన ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్ కోసం పనిచేస్తున్నాడు. అలా ఇద్దరూ కన్నడ, తెలుగు పరిశ్రమలో గుర్తంపు తెచ్చుకుని పలు సినిమాలతో రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) -
డబ్బుల కోసం కోర్టుకు వెళ్లిన నటుడు దర్శన్
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో నటుడు దర్శన్‌కు(Darshan) బెయిలు రావడంతో ప్రస్తుతం ఆయన తన కెరీర్పైన దృష్టి పెట్టారు. పలు సినిమాల్లో నటించిందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తన డబ్బు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. రేణుకాస్వామి హత్య తర్వాత చాలా సమస్యల్లో ఆయన చిక్కుకున్నారు. ఈ కేసు విషయంలో తనకు సంబంధించిన రూ. 37 లక్షల డబ్బును పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.( ఇదీ చదవండి: గతేడాదిలో పెళ్లి.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం)గత ఏడాది జూన్‌లో జరిగిన రేణుకాస్వామి హత్య కేసు నుంచి దర్శన్ బయటపడేందుకు పవన్, నిఖిల్ అనే వ్యక్తులను సంప్రదించి ఈ కేసును వారిపై వేసుకోవాలని కోరినట్లు విచారణలో తేలింది. అందుకోసం మొత్తం నలుగురికి కలిపి రూ. 37 లక్షలు దర్శన్ ఇచ్చినట్లు పోలీసులు అనుమానించారు. పవన్ తన ఇంట్లో దాచి ఉంచిన ఆ డబ్బును బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దర్శన్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.హత్య కేసులో నిందితుడు కావడంతో దర్శన్ తుపాకీ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. అందుకే గన్ లైసెన్స్ రద్దు చేయవద్దని దర్శన్ పోలీసు శాఖకు లేఖ రాశారు. తుపాకీ లైసెన్స్‌కు సంబంధించి పోలీసు శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందుకే దర్శన్ విజ్ఞప్తి లేఖ రాశాడు. ఈ విషయం గురించి దర్శన్ మాట్లాడుతూ.. 'నేను సెలబ్రిటీని కావడంతో ఎక్కడికి వెళ్లినా చాలా మంది గుమిగూడుతుంటారు. ఈ క్రమంలో నాకు రక్షణ అవసరం. వ్యక్తిగత కారణాలతో నాకు గన్ లైసెన్స్ కావాలి. లైసెన్స్ రద్దు చేయవద్దు. నాపై నమోదైన కేసులో సాక్షులను ఇప్పటి వరకు ఎక్కడా నేను బెదిరించలేదు. అలా జరిగితే నాపై చట్టపరమైన చర్యలు తీసుకోండి.' అంటూ లేఖలో ఆయన పేర్కొన్నారు.బెయిలు రద్దు చేయాలని కోర్టును కోరిన పోలీసులురేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పోలీసులు అర్జీ దాఖలు చేశారు. వెన్నునొప్పికి శస్త్రచికిత్స అత్యవసరమని ఆరు వారాలు బెయిలు తీసుకుని బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారని కోర్టుకు తెలిపారు. కొద్దిరోజులుగా మైసూరు ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకున్న దర్శన్.. మళ్లీ సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో ‘డెవిల్’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దర్శన్‌తో పాటు పవిత్రా గౌడ, అనుకుమార్, లక్ష్మణ్, ప్రదోశ్, జగదీశ్‌లకు ఇచ్చిన బెయిలు కూడా రద్దు చేయాలని న్యాయవాది అనిల్ సి.నిశానితో పోలీసులు అర్జీ వేయించారు. మరో వారంలోపు ఈ అర్జీ విచారణకు వస్తుందని పోలీసులు తెలిపారు. -
ఆలయాల బాటలో హీరో దర్శన్.. కారణం ఇదేనా.. ?
కర్ణాటకలో రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆలయాల బాట పడ్డాడు. జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకా ఆరతి ఉక్కడలో వెలిసిన శ్రీ అహల్యదేవి మారెమ్మ దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని పూజలు చేశారు. విజయలక్ష్మి, కుమారునితో కలిసి ఆలయానికి వచ్చారు. మేలుకోటె ఎమ్మెల్యే దర్శన్ పుట్టణ్ణయ్యతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఇప్పటికే బళ్లారి జిల్లా కురుగోడిలోని బసవేశ్వర ఆలయంలో కూడా ఆయన పూజలు నిర్వహించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆయన నిత్యం ఏదో గుడికి వెళ్తూ కనిపిస్తూ ఉండటంతో ఆయనలో భక్తి చింతన ఎక్కువగా కనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.కన్నడలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ సుమారు ఆరు నెలలు పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, దర్శన్ జైల్లో ఉన్నప్పుడు నిద్రలేని రాత్రులు గడిపినట్లు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి.బళ్లారి జైలులో దర్శన్ పలు ఇబ్బందులు పడినట్లు తెలిసిందే. అక్కడ కొన్ని రోజుల పాటు ఆయన సరైన నిద్రలేకుండా గడిపారని సమాచారం. దీనంతటికి కారణం రేణుకాస్వామి.. అతని ఆత్మ వెంటాడుతోందని జైలు అధికారులతో దర్శన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిద్రపోతున్న సమయంలో రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి బయపెడుతుందని ఆయన చెప్పుకొచ్చినట్లు తెలిసింది. దీంతో జైలు బారికేడ్లో తాను ఒంటరిగా ఉండలేకపోతున్నట్లు అధికారులతో చెప్పారని వార్తలు వైరల్ అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో నిద్రలోనే దర్శన్ కేకలు పెడుతున్నట్లు తోటి ఖైదీలు చెప్పినట్లు తెలిసింది. అయితే, ఈ విషయం గురించి అప్పట్లో జైలు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.దర్శన్ బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత జైలు జీవితం తనను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా రేణుకాస్వామి ఆత్మ తనను ఇబ్బంది పెడుతుందని, అందుకే ఆయన పలు గుడుల చుట్టూ తిరుగుతున్నారని ప్రచారం జరుగుతుంది. -
త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం
హీరోయిన్ హరిప్రియ (Hariprriya) త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ క్రమంలో నటుడు వశిష్ట సింహ భార్య సీమంతం వేడుకను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాడు. తన సీమంతం ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను ఈ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు సెలబ్రిటీ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హరిప్రియ, వశిష్ట సింహ 2023లో పెళ్లి చేసుకున్నారు.ఎవరీ హరిప్రియ?హరిప్రియ కర్ణాటకవాసి. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే క్లాసికల్ డ్యాన్స్‌పై ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుంది. అలా ఎన్నో ప్రోగ్రామ్స్‌కు హాజరయ్యేది. తను 12వ తరగతి చదువుతున్న సమయంలో తన డ్యాన్స్ స్టిల్స్ దర్శకుడు రిచర్డ్ కాస్టెలినో కంటపడ్డాయి. వెంటనే ఆమెను సినిమా కోసం సంప్రదించడం.. ఇంట్లో ఒప్పుకోవడంతో బడి అనే తుళు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. మనసుగుల మత్తు మధుర చిత్రంతో కన్నడ వెండితెరకు హీరోయిన్‌కు పరిచయమైంది.(చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)తెలుగులోనూ హీరోయిన్గా..యష్ సరసన నటించిన 'కళ్ళర సంతె'తో క్రేజ్ తెచ్చుకుంది. శివరాజ్‌కుమార్ 'చెలువెయె నిన్నే నోడలు' మూవీతో సెన్సేషన్ అయింది. ఉగ్రం, నీర్ దోసె, బెల్ బాటమ్, బిచ్చుగత్తి: చాప్టర్ 1 వంటి చిత్రాలతో అలరించింది. తకిట తకిట చిత్రంతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహ, అలా ఇలా ఎలా అనే సినిమాలతో మెప్పించింది. తమిళంలోనూ రెండుమూడు మూవీస్‌లో నటించింది. ప్రస్తుతం కన్నడలో బెల్ బాటమ్ 2, హ్యాపీ ఎండింగ్, లగామ్ సినిమాలు చేస్తోంది.కేజీఎఫ్ మూవీలో విలన్‌గా..వశిష్ట (Vasishta N Simha) విషయానికి వస్తే ఇతడు కూడా కర్ణాటకవాసే! రుద్ర తాండవ, ఎలోన్, నాన్ లవ్ ట్రాక్, ముఫ్టీ, టగారు, ఉపేంద్ర మట్టె బా, 8 ఎమ్ఎమ్ బుల్లెట్ వంటి చిత్రాల్లో నటించాడు. కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్: ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్, యేవమ్, సింబా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్లో నటిస్తున్నాడు. ఇతడు నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా! తెలుగులో కిరాక్ పార్టీ మూవీలో ఓ సాంగ్ పాడాడు. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు ఆలపించాడు.అలా మొదలైన ప్రేమకథఈ ఇద్దరికీ ఎలా ముడిపడిందో హరిప్రియ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నా దగ్గర రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోవడంతో మిగతాది ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట నాకు ఓ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన పప్పీతో నా కుక్కపిల్ల కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. అలాగే మా మధ్య ప్రేమ కూడా పెరిగింది’ అని తన ప్రేమ కహానీ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! -
తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు
కన్నడ నటుడు వశిష్ఠ ( Vasishta N. Simha), హీరోయిన్ హరిప్రియ (Haripriya) తల్లిదండ్రులు కాబోతున్నారు. రెండేళ్ల క్రితం వారు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వారు ఒక్కటయ్యారు. కన్నడలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ఆమె ఏడడుగుల బంధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తమిళ్, తెలుగులో కూడా అనేక చిత్రాల్లో మెప్పించింది.నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు హరిప్రియ పరిచయమైంది. ఆ తర్వాత నానితో పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ‘ జై సింహా’లో (Jai Simha) బాలయ్య సరసన నటించి తెలుగు వారిని కూడా మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలు చేయలేదు. కానీ, కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది.ఇద్దరినీ కలిపిన కుక్క పిల్లహరిప్రియ గతంలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తన సహచర నటుడు వశిష్ట సింహతో ప్రేమలో పడింది. ఓ కుక్కపిల్ల కారణంగా తాను వశిష్టతో ప్రేమలో పడిపోయానని గతంలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఇదే జరిగితే దంగల్ రికార్డ్‌ను 'పుష్ప' కొట్టేస్తాడు.. బన్నీకి గోల్డెన్ ఛాన్స్)‘నా దగ్గర లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో లక్కీ అనే కుక్క చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట సింహం నాకు ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన క్రిస్టల్‌తో హ్యాపీ కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. అలా మా ప్రేమకు క్రిస్టల్ కారణమైంది’ అని హరిప్రియ తన ప్రేమ కహానిని చెప్పుకొచ్చింది.వశిష్ఠ కూడా మరెవరో కాదు… కన్నడ నుంచి రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'కేజీఎఫ్'లో ఆయన విలన్‌గా నటించాడు. కన్నడలో ఆర్య లవ్, రాజా హులి, రుద్ర తాండవలో మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్ వంటి సినిమాల్లో చాలా కీలక పాత్రలు పోషించాడు. హరిప్రియ కూడా కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉగ్రమ్ సినిమాతో పాటు రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో గుర్తింపు పొందింది. అలా ఇద్దరూ కన్నడ, తెలుగు పరిశ్రమలో గుర్తంపు తెచ్చుకోవడం వల్ల వారికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.బాలయ్యను మెప్పించిన హరిప్రియనందమూరి బాలకృష్ణ నటించిన జై సింహా సినిమా 2018 సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా వేడుకలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ హరిప్రియపై ప్రశంసలు కురిపించారు. జై సింహా సినిమాలో ఆమె చాలా కీలకమైన పాత్ర చేశారని బాలయ్య చెబుతూనే.. ఒక సీన్లో ఆమె అద్భుతంగా మెప్పించారని తెలిపారు. ఆ సీన్ చేయాలంటే మరోక నటికి ఒకరోజు పట్టవచ్చని తెలిపారు. హరిప్రియ సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అని కూడా ఆయన పొగిడారు. బాలయ్య నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ప్రశంసలు అందుకున్న నటి హరిప్రియ మాత్రమేనని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) -
'యశ్' బర్త్‌డే స్పెషల్.. 'టాక్సిక్' నుంచి అదిరిపోయే వీడియో
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటించనున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic Movie). కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ తాజాగా యశ్ పుట్టినరోజు (జనవరి 8) సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను పంచుకుంది. గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ కథతో ‘టాక్సిక్’ తెరకెక్కనుంది. ఈప్రాజెక్ట్‌లో స్టార్ నటీనటులు నటించననున్నారు అని యూనిట్ పేర్కొంది. (ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బన్నీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు)ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన కేజీఎఫ్ చిత్రంతో యశ్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత కేజీఎఫ్-2తో ఆయన మార్కెట్ పెరిగింది. ఈ చిత్రాలతో విపరీతమైన పాపులారిటీ దక్కడం వల్ల తన తర్వాతి సినిమా ఏ స్థాయిలో ఉండాలి అనే అంశంలో కాస్త టైమ్ తీసుకున్నాడు. అందుకే 2022 నుంచి ఆయన మరో సినిమా చేయలేదు. తనకు సరిపోయే కథ కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో టాక్సిక్ స్టోరీ నచ్చడం ఆపై నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టాక్సిక్ షూటింగ్ ప్రారంభమైంది.రిలీజ్ ఎప్పుడు..?టాక్సిక్ సినిమాను వాస్తవంగా ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సినిమా షూటింగ్ పనులు ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ వెల్లడించింది. కానీ, తాజాగా రిలీజ్ అయిన వీడియోలో సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుందో మేకర్స్ ప్రకటించలేదు. ఈ ఏడాది ముగింపు నెల డిసెంబర్ నెలలో టాక్సిక్ విడుదల కావచ్చని తెలుస్తోంది.టాక్సిక్‌లో బాలీవుడ్ బ్యూటీఈ చిత్రంలో కరీనా కపూర్ ( Kareena Kapoor ) ఓ హీరోయిన్గా నటించనున్నారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో కరీనాది హీరోయిన్ పాత్ర కాదని, యశ్‌కు అక్క పాత్రలో ఆమె కనిపించనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గతంలో శ్రుతి హాసన్ , సాయిపల్లవి వంటి వార్ల పేర్లు తెరపైకి రాగా, తాజాగా కియారా అద్వానీ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. యశ్‌కు సిస్టర్ పాత్రలో కరీనా కనిపిస్తారా..? యశ్‌తో కియారా జోడీ కడతారా..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.రామాయణంలో యశ్నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ చిత్రంలో రావణుడిగా యశ్ నటించనున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా ఉన్నారు. యశ్‌కు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ బ్యానర్‌పై ‘టాక్సిక్’ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో పాటు నిర్మిస్తున్నారు. ఇప్పుడు రాయాయణ సినిమా కోసం నమిత్ మల్హోత్రాతో యశ్ చేతులు కలిపారు. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి 'రామాయణ' పేరుతో సినిమా రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బర్త్ డే వేడుకల్లో విషాదం.. అభిమానులకు కేజీఎఫ్ హీరో విజ్ఞప్తి
కేజీఎఫ్ హీరో, కన్నడ సూపర్ స్టార్ యశ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన బర్త్ డే వేడుకల కోసం ఎవరూ కూడా హోమ్‌టౌన్‌కు రావద్దని కోరారు. ఎన్నో ఏళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్‌కు సూచించారు. గతంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి యశ్ పోస్ట్ చేశారు.కాగా.. యశ్ తన పుట్టిన రోజును జవనరి 8న సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని.. పుట్టిన రోజు అందుబాటులో ఉండనని తెలిపారు. అయినప్పటికీ మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉంటాయని ఎక్స్ వేదికగా యశ్ లేఖను విడుదల చేశారు. మీరు సురక్షితంగా ఉండడమే నాకు ఇచ్చే గొప్ప బహుమతి అని.. మీ అందరికీ 2025 శుభాకాంక్షలు అంటూ యశ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఈ ఏడాది విషాదం..ఈ ఏడాది జనవరి 8న యశ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా విషాద ఘటన జరిగింది. ఆయన బ్యానర్‌ను కడుతూ ముగ్గురు అభిమానులు విద్యాదాఘాతంలో మృతిచెందారు. కర్ణాటకలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 8న 38వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) ఉన్నారు.మరో ముగ్గురికి గాయాలు..ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వారిని తరలించారు. యశ్ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్ధరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్ తన పుట్టినరోజును అభిమానులతో జరుపుకోలేదు. కరోనా సంక్షోభానికి ముందు, అతను ఒకప్పుడు తన అభిమానులతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఈ ఏడాది కూడా అభిమానులతో కలిసి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని లేఖ ద్వారా అభిమానులకు తెలియజేశారు. 🙏 pic.twitter.com/lmTH0lqiDx— Yash (@TheNameIsYash) December 30, 2024 -
లైంగిక వేధింపులు.. కన్నడ నటుడు అరెస్ట్
ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు చరిత బాలప్పను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి చేసిన ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 29 ఏళ్ల నటికి 2017లో బాలప్పతో పరిచయం ఏర్పడింది. పైకి మంచివాడిగా నటించిన బాలప్ప ఆమెను ప్రేమించాడు. నటి కూడా తిరిగి ప్రేమించాలని వెంటపడ్డాడు. బలవంతపెట్టాడు. అలా ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు.బెదిరింపులుఅయితే తనకు డబ్బు కావాలని, అడిగినంత ఇవ్వకపోతే ప్రైవేట్ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. నటి ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. ఈ విషయాలను బయటపెడితే తనకున్న ధనబలంతో, రాజకీయ నాయకుల అండతో నటిపైనే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించాడు. చంపడానికి కూడా వెనకాడనని బెదిరించాడు. దీంతో నటి పోలీసులను ఆశ్రయించింది. వారు బాలప్పను అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు. కాగా సదరు నటికి ఇదివరకే విడాకులవగా ఒంటరిగా నివసిస్తోంది.చదవండి: Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా వీడియో సాంగ్ రిలీజ్ -
జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమతో
కొన్ని నెలల క్రితం అభిమాని రేణుకాస్వామిని కన్నడ హీరో దర్శన్ హత్య చేయడం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. దీని తర్వాత పోలీసు కేసు నమోదు కావడం.. హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా పలువురి జైలుకెళ్లడం అప్పట్లో సెన్సేషన్ అయింది. కొన్నిరోజుల క్రితం అనారోగ్య సమస్యలతో దర్శన్‌కి బెయిల్ దక్కగా.. ఇప్పుడు పవిత్ర గౌడకు కూడా బెయిల్ లభించింది. వచ్చీ రావడంతోనే ప్రియుడిపై ప్రేమ బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్)దర్శన్‌కు ఇప్పటికే పెళ్లయినప్పటికీ.. పవిత్ర గౌడతో రిలేషన్ ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ పవిత్రని ఇబ్బంది పెట్టాడని దర్శన్.. రేణుకాస్వామిని హత్య చేయడం మాత్రం ప్రేమకు పరాకాష్టగా నిలిచింది. తొలుత ఆరోపణలు అనుకున్నారు గానీ బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతో కొన్నినెలల పాటు వీళ్లిద్దరూ జైలు జీవితం గడపాల్సి వచ్చింది.తాజాగా పవిత్ర గౌడ బెయిల్‌పై రిలీజైంది. వచ్చీ రావడంతోనే వజ్రమునేశ్వర ఆలయానికి వెళ్లింది. అక్కడ దర్శన్ పేరుపై ప్రత్యేక పూజలు చేయించింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంతోనే బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇప్పుడు దర్శన్ కోసం పబ్లిక్‌గానే పవిత్ర గౌడ ప్రేమ చూపించడం, ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)ರೇಣುಕಾಸ್ವಾಮಿ ಕೇಸ್ನಲ್ಲಿ ಜೈಲು ಸೇರಿದ್ದ ನಟಿ ಪವಿತ್ರಗೌಡ ಬಿಡುಗಡೆಯಾಗಿದ್ದು, ವಜ್ರಮುನೇಶ್ವರ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ತೆರಳಿದ್ದಾರೆ. ಇದೇ ವೇಳೆ ನಟ ದರ್ಶನ್ ಹೆಸರಲ್ಲಿ ದೇವರಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿದರು.@dasadarshan#PavithraGowda #DarshanThoogudeepa #MuneshwaraTemple #Bhagya #Darshan #RenukaswamyCase #Bengaluru pic.twitter.com/NUlC9XSRyP— NewsFirst Kannada (@NewsFirstKan) December 17, 2024 -
కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్
బొమ్మనహళ్లి: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనతోపాటు ఏడుగురికి హైకోర్టు బెయిలిచ్చింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్ మధ్యంతర బెయిల్‌పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. అనంతరం దర్శన్, అతడి సన్నిహితురాలు పవిత్రా గౌడ, ప్రదోశ్, అనుకుమార్, నాగరాజు, లక్ష్మణ్, జగదీష్‌కు బెయిల్ మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ లభించింది. పవిత్రా గౌడను దుర్భాషలాడాడనే కోపంతో రేణుక స్వామి అనే వ్యక్తిని చంపారనే ఆరోపణలపై దర్శన్‌ను జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
'ట్రైలర్ చూడగానే షాకయ్యా'.. కన్నడ చిత్రంపై అమిర్ ఖాన్ ప్రశంసలు!
కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘యుఐ: ది మూవీ’. ఈ మూవీని ఇంతకు ముందెన్నడు రాని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల విరామం తర్వాత ఉపేంద్ర నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీ ట్రైలర్ వీక్షించిన బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ చూడగానే షాకయ్యానని తెలిపారు. అద్భుతంగా ఉందని.. కచ్చితంగా సూపర్‌హిట్‌గా నిలుస్తుందని కొనియాడారు. హిందీ ఆడియన్స్‌ను సైతం ఈ సినిమా మెప్పిస్తుందని అమిర్ ఖాన్ కొనియాడారు. అమిర్ మాట్లాడిన వీడియోను ఉపేంద్ర తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.కాగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర ప్రస్తుతం జైపూర్ చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలో వీరిద్దరు కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర సినిమాను ఉద్దేశించి మాట్లాడారు. కాగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీలో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.Dear Aamir sir, it was a dream come true moment to meet and seek your blessings for UI The Warner Movie 🙏thanks for your love and support ❤️#UiTheMovieOnDEC20th#Aamirkhan#UppiDirects #Upendra @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth… pic.twitter.com/EcPcIVgS8z— Upendra (@nimmaupendra) December 11, 2024 -
రూ.120 కోట్ల బడ్జెట్.. మరో ఓటీటీకి బాక్సాఫీస్ డిజాస్టర్ మూవీ!
హీరో అర్జున్ మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ హీరో ధృవ సర్జా. ధృవ్ సర్జాకు జోడీగా వైభవి శాండిల్య, అన్వేషి జైన్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఆయన నటించిన భారీ యాక్షన్ చిత్రం మార్టిన్. ఈ మూవీకి అర్జున్ కథను అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా గతనెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.భారీ అంచనాల మధ్య రిలీజైన మార్టిన్ ఊహించవి విధంగా బోల్తాకొట్టింది. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా దారుణంగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకే పరిమితమైంది. కేజీఎఫ్ సినిమాతో పోల్చినప్పటికీ అంచనాలు అందుకోలేకపోయింది.అయితే ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ రోజు నుంచే మార్టిన్ మరో ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా... ఆహాలో కేవలం తెలుగు వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా చూసేయండి. -
ఛత్రపతి శివాజీగా పాన్ ఇండియా హీరో.. పోస్టర్ విడుదల
కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రానున్న చిత్రం 'ఛత్రపతి శివాజీ మహారాజ్'. భారీ బడ్జెట్ తెరకెక్కను ఈ చిత్రాన్ని ఒక పోస్టర్‌తో తాజాగా రిషబ్ ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి నటించనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను దర్శకుడు సందీప్ సింగ్ షేర్ చేశారు. 'ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధున్ని గౌరవించటానికి నిర్మిస్తున్నాం. యుద్ధ రంగంలో శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటన స్ఫూర్తిని, స్వపరిపాలన కోసం పోరాడిన మరాఠ యోధుడు శివాజీ. అతని జీవితం, వారసత్వం భారతీయ చరిత్రలో చెరగని ముద్రను మిగిల్చాయి' అని ఆయన గుర్తుచేసుకున్నారు. శివాజీ అన్‌టోల్డ్ స్టోరీతో ప్రేక్షకులకు తాము చూపించబోతున్నట్లు ఆయన అన్నారు.కాంతార సినిమా తర్వాత రిషబ్ శెట్టి మార్కెట్ పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఆయన చేతిలో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి. కాంతార ప్రీక్వెల్తో పాటు జై హనుమాన్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' వంటి బిగ్ ప్రాజెక్ట్‌లో ఆయన భాగమైనందుకు ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. 2025,2026,2027 ఇలా వరుసగా రిషబ్ శెట్టి సినిమాలు విడుదల కానున్నాయి.Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj. #ThePrideOfBharatChhatrapatiShivajiMaharajThis isn’t just a film – it’s a battle cry to honor a warrior who fought against all odds, challenged… pic.twitter.com/CeXO2K9H9Q— Rishab Shetty (@shetty_rishab) December 3, 2024 -
2040లో అసలేం జరగనుంది.. భయపెడుతోన్న టీజర్!
శాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం యూఐ ది మూవీ. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. లహరి ఫిల్మ్స్ అండ్ వెనుస్ ఎంటర్టైనర్స్ బ్యానర్లపై జి మనోహరన్, శ్రీకాంత్ కేపీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ చూస్తేటీజర్ చూస్తే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే ఈ సినిమాలో చూపించనున్నారు. 2040 కల్లా ఆహారం కోసం ఒకరిని ఒకరు చంపుకునే రోజులు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను తలపిస్తోంది. మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ ఉంటూ ఉపేంద్రం డైలాగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఆలస్యమెందుకు టీజర్ చూసేయండి. -
శివరాజ్ కుమార్ 'భైరతి రణగల్' మాస్ ట్రైలర్
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'భైరతి రణగల్' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీని దర్శకుడు నర్తన్ తెరకెక్కిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే, ఇప్పటికే ఈ సినిమా కన్నడలో నవంబర్ 15న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్లో కూడా విడుదల కానుంది. నవంబర్ 29న తెలుగుతో పాటు తమిళ్లో రిలీజ్ కానుంది.గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ 'భైరతి రణగల్' చిత్రాన్ని నిర్మించారు. 2017లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన మఫ్తీకి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. శివరాజ్ కుమార్‌కు టాలీవుడ్లో కూడా మార్కెట్ ఉండటంతో ఆయన చిత్రాలు ఇక్కడ విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో 'భైరతి రణగల్' తెలుగు ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. -
డాక్టర్‌తో నిశ్చితార్థం చేసుకున్న 'పుష్ప' విలన్
'పుష్ప' మూవీలో జాలిరెడ్డిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ.. నిశ్చితార్థం చేసుకున్నాడు. డాక్టర్ ధన్యతతో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం బన్నీ.. మెగా సపోర్ట్ ఎక్కడ?)కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న తనకు కాబోయే భార్యని ధనంజయ పరిచయం చేశాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఆదివారం (నవంబర్ 17) నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఫిబ్రవరి 16న మైసూరులో వీళ్ల పెళ్లి జరగనుంది.'పుష్ప' తొలి భాగంలో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న ధనంజయ.. ఇప్పుడు పార్ట్ 2లోనూ ఉన్నాడు. ట్రైలర్లో ఒక్క షాట్లో ఇతడిని చూపించారు. ధనంజయ నిశ్చితార్థం చేసుకున్న సందర్భంగా తోటి యాక్టర్స్, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్) View this post on Instagram A post shared by Pink Tickets (@pinkticketsofficial) -
విజయ్ సినిమాలో రోల్.. ఎందుకు వెనక్కి తగ్గారో తెలీదు: శివరాజ్ కుమార్
ది గోట్ సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం దళపతి69. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నికల పోటీకి ముందు విజయ్ కెరీర్లో ఇదే చివరి చిత్రం కానుంది. అయితే ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ విపిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ఈ వార్త తెగ వైరలవుతోంది.అయితే ఈ వార్తలపై తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పందించారు. దళపతి69 మూవీ డైరెక్టర్‌తో తాను మాట్లాడిన మాట వాస్తవమేనని తెలిపారు. దర్శకుడు హెచ్ వినోద్ బెంగళూరులో తనను వ్యక్తిగతంగా కలిశాడని.. అంతేకాకుండా నా పాత్రకు సంబంధించి వివరించాడని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అదొక అద్భుతమైన రోల్ అని అన్నారు.అయితే మళ్లీ కొద్ది రోజుల తర్వాత వినోద్ మరోసారి తనతో భేటీ అయ్యారని శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ రోల్ ప్రస్తుతానికి వర్కవుట్ కాదని వివరించారని.. మీకోసం భవిష్యత్తులో మరో ఆఫర్‌తో వస్తానని చెప్పాడని శివరాజ్ అన్నారు. అయితే అసలేం జరిగిందో.. ఆఫర్‌ను ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో కారణాలు మాత్రం తెలియదన్నారు. ఈ ఆఫర్ రాకపోయినప్పటికీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని శివరాజ్ కుమార్ తెలిపారు. కాగా.. ఇవాళ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బైరాతి రనగల్ థియేటర్లలో విడుదలైంది.కాగా.. శివరాజ్ కుమార్‌కు కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా పేరుంది. శాండల్‌వుడ్‌తో పాటు తమిళ సినిమాలలో అనేక చిత్రాలలో నటించారు. మరోవైపు రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మూవీలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు కన్నడ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం వచ్చేనెల డిసెంబర్లో యుఎస్ వెళ్తున్నట్లు శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటున్నట్లు వివరించారు. జనవరి 2025లో ఇండియాకు తిరిగి వచ్చాక సినిమాల్లో నటిస్తానని తెలిపారు. -
డాక్టర్‌తో 'పుష్ప' విలన్ ధనంజయ నిశ్చితార్థం (ఫొటోలు)
-
పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి
'పుష్ప' సినిమాలో జాలిరెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు ధనంజయ.. పెళ్లికి రెడీ అయిపోయాడు. కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు. దీంతో రహస్యంగా నిశ్చితార్థం అయిన విషయం బయటపడింది.(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య)కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి, సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. త్వరలో సీక్వెల్లోనూ అదరగొట్టేయనున్నాడు.ధనంజయ్ ఎంగేజ్మెంట్ విషయానికొస్తే ధన్యతని పెళ్లి చేసుకోబోతున్నాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్, సహ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి జరగొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
బర్త్ డే పార్టీలో కేజీఎఫ్ స్టార్.. అదరగొట్టేశాడుగా!
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న శాండల్‌వుడ్ హీరో యశ్. ప్రస్తుతం ఆయన టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది.అయితే తాజాగా యశ్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ బర్త్ డే పార్టీకి హాజరైన కేజీఎఫ్ స్టార్ తనదైన స్టెప్పలతో హోరెత్తించారు. స్టార్ హీరో శివరాజ్‌కుమార్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ రాకింగ్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. యశ్ డ్యాన్స్ చేసిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది.వివాదంలో టాక్సిక్ టీమ్యశ్ నటిస్తోన్న టాక్సిక్ టీమ్ ఊహించని వివాదంలో చిక్కుకుంది. రీసెంట్గా బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది. రెండు రోజులు షూటింగ్ చేశారు. అయితే సెట్ నిర్మాణ కోసం అక్రమంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలొచ్చాయి.ఈ విషయంపై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. 'టాక్సిక్' మూవీ టీమ్ చెట్లు నరికేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు స్యయంగా ఆ ప్రదేశానికి వెళ్లి సందర్శించారు. చెట్ల నరికివేతకు అనుమతించిన వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో షూటింగ్ అర్థంతరంగా నిలిచిపోయింది.Rocking Star @TheNameIsYash bringing all the energy, dancing to Century Star @NimmaShivanna 's hit "Tagaru Bantu Tagaru" at Yatharv’s birthday party.#YashBoss #Shivanna pic.twitter.com/pM1mM413NZ— Bhargavi (@IamHCB) October 31, 2024 -
హత్య కేసులో స్టార్ హీరోకి మధ్యంతర బెయిల్
కన్నడ హీరో దర్శన్‌కి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. కాకపోతే ఇది మధ్యంతర బెయిల్. అనారోగ్య సమస్యలు ఉన్నందున ఆరు వారాలు మాత్రమే బెయిల్ గ్రాంట్ చేస్తూ కర్ణాటక హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు దిగువ కోర్టులో దర్శన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. కోర్ట్ తిరస్కరించింది. తాజాగా దర్శన్ తరఫు న్యాయవాది హైకోర్టులో అభ్యర్థించడంతో బెయిల్ మంజూరైంది.దర్శన్‌కి తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, దీనికి శస్త్ర చికిత్స అవసరమని. చికిత్స ఆలస్యమైన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్‌ని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి)డాక్టర్ రిపోర్టులో దర్శన్‌కు చేయాల్సిన సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్.. 'విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని' అని పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.తన ప్రియురాలిని వేధిస్తున్నాడనే నెపంతో రేణుకాస్వామి అనే తన అభిమానిని.. దర్శన్, తన మనుషులతో కలిసి హత్య చేయించాడు. దీనికి పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దర్శన్‌కి మాత్రమే బెయిల్ లభించింది. తమ అభిమాన హీరోకి వచ్చింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ ఇతడి అభిమానులు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం) -
కన్నడ నటుడు దర్శన్‌కు సర్జరీ
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్ కోరుతూ దర్శన్ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి విచారించారు. పిటిషన్ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్‌కు సూచించారు. బళ్లారి జైలులో దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్ అవసరముందని వైద్యులు తెలిపారు. అందుచేత బెయిల్ ఇవ్వాలని దర్శన్ వకీలు కోరారు. నేర విచారణలో అనేక లోపాలు ఉన్నాయని, అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు. దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు.100 రోజులు దాటిందిదర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. ఈ క్రమంలో మరోసారి వారు బెయిల్ పిటీషన వేశారు. -
'ఇకపై నాకు మేసేజ్ రాదు'.. కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్!
తల్లి మరణాన్ని తలుచుకుని శాండల్‌వుడ్ హీరో కిచ్చా సుదీప్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను గుర్తు చేసుకుంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ సమయంలో ప్రస్తుతం నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తీకరించడానికి నా దగ్గర పదాలు రావడం లేదని బాధను వ్యక్తం చేశారు. సడన్‌గా ఈ శూన్యాన్ని అంగీకరించలేకపోతున్నాని.. కేవలం 24 గంటల్లో అంతా మారిపోయిందని భావోద్వేగ ట్వీట్ చేశారు.కిచ్చా తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'మనిషి రూపంలో ఎప్పుడు నా పక్కనే నిజమైన దైవం అమ్మ. నా గురువు. నా నిజమైన శ్రేయోభిలాషి. నా మొదటి అభిమాని. ఇప్పుడు ఒక జ్ఞాపకం మాత్రమే. ప్రతి రోజు ఉదయం నా ఫోన్లో ఆ మేసేజ్ వచ్చేది. ఉదయం 5.30 గంటలకే గుడ్ మార్నింగ్ కన్నా అని సందేశం వస్తుంది. ఆ మేసేజ్ చివరిసారిగా అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం వచ్చింది. శనివారం బిగ్‌బాస్ షూటింగ్లో ఉన్నప్పుడు అమ్మ ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఆసుపత్రిలో ఉన్న మా సోదరితో పాటు, డాక్టర్లతో మాట్లాడి వేదికపైకి వెళ్లా. మనసులో ఎంత బాధ ఉన్నా షూటింగ్ చేశా. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లేసరికి వెంటిలేటర్‌పై ఉంచారు. ఆదివారం ఉదయం మాకు శాశ్వతంగా దూరమైంది. కేవలం 24 గంటల్లో అంతా మారిపోయింది. నేను షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నన్ను హత్తుకొని జాగ్రత్తలు చెప్పిన అమ్మ.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది' అంటూ కిచ్చా సుదీప్ బాధను వ్యక్తం చేశారు.(ఇది చదవండి: నటుడు 'కిచ్చా సుదీప్' ఇంట తీవ్ర విషాదం)కాగా.. కన్నడ హీరో కిచ్చాసుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.సుదీప్ కూతురు ఆవేదనకిచ్చా సుదీప్ కుమార్తె శాన్వీ కూడా ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. నానమ్మతో దిగిన ఫోటోను పంచుకుంది. అయితే అంత్యక్రియల్లో మీడియా వ్యవహరించిన తీరుపై శాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు చాలా దారుణంగా ప్రవర్తించారని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొందరు వ్యక్తులు అంత్యక్రియలకు అంతరాయం కలిగించారని రాసుకొచ్చింది. నానమ్మను కోల్పోయిన బాధలో మేము ఉంటే.. కొందరు మా మొహాలపై కెమెరాలు పెట్టి అమానుషంగా ప్రవర్తించారని తెలిపింది. వారు నాన్నతో కూడా వారు అలానే ప్రవర్తించారని.. మా భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా రీల్స్ కోసం అలా వ్యవహరించడం దారుణమని శాన్వీ పోస్ట్‌లో వివరించింది. My mother , the most unbiased, loving, forgiving, caring, and giving, in my life was valued , celebrated, and will always be cherished.*Valued... because she was my true god next to me in the form of a human.*Celeberated... because she was my festival. My teacher. My true… pic.twitter.com/UTU9mEq944— Kichcha Sudeepa (@KicchaSudeep) October 21, 2024 -
నటుడు 'కిచ్చా సుదీప్' ఇంట తీవ్ర విషాదం
కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం జరిగింది. అక్టోబర్ 20 ఆదివారం తెల్లవారుజామున ఆయన తల్లి సరోజా సంజీవ్ (86) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో సుదీప్ కుటుంబం శోకసంద్రంలో ఉంది.బెంగళూరు జేపీ నగర్‌లోని సుదీప్ నివాసంలో సరోజ భౌతికకాయాన్ని చివరి చూపు కోసం ఉంచనున్నారు. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. సరోజకు నటుడు సుదీప్తో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరోజ మృతి పట్ల సుదీప్ అభిమానులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు, బంధువులు సంతాపం తెలిపారు. జేపీ నగర్ నివాసానికి ఇప్పటికే సుదీప్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. మంగళూరుకు చెందిన సుదీప్ తల్లి సరోజ సినిమా పరిశ్రమకు దూరంగానే ఉండేవారు. అయితే, తన తల్లితో పాటు మంగళూరుకు కొద్దిరోజుల క్రితమే సుదీప్ వెళ్లిన విషయం తెలసిందే. -
హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. డైరెక్టర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖ యువ దర్శకుడు దీపక్ ఆరస్ కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. డైరెక్టర్ ఆకస్మిక మరణం శాండల్‌వుడ్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. దర్శకుడి మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన చెల్లెలు, నటి అమూల్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలో తీవ్ర విషాదంలో ఉందని ఎమోషనలైంది.కాగా.. దర్శకుడు దీపక్ ఆరస్ మనసాలజీ (2012), షుగర్ ఫ్యాక్టరీ (2023) లాంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. అతని తొలిచిత్రం మనసాలజీతోనే విజయం అందుకున్నారు. 2023లో విడుదలైన షుగర్ ఫ్యాక్టరీ అనే కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో డార్లింగ్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. కాగా..ఇప్పటికే దీపక్ ఆరస్కు పెళ్లి కాగా.. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన చెల్లెలు అమూల్య కన్నడలో హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. -
అర్జున్ డైరెక్షన్లో కొత్త చిత్రం.. హీరోగా ఎవరంటే?
టాలీవుడ్ హీరో అర్జున్ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ డైరెక్షన్ చేయనున్నారు. సీతా పయనం పేరుతో మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ చివరిసారిగా ప్రేమ బరహా అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు.కాగా.. యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో నటించారు. కన్నడకు చెందిన అర్జున్ భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నారు. గతంలో దర్శకత్వం వహించిన సేవాగన్ (1992), జై హింద్ (1994),తాయిన్ మణికోడి (1998) లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. హీరోగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు అర్జున్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. View this post on Instagram A post shared by 𝙉𝙄𝙍𝙍𝘼𝙉𝙅𝘼𝙉 (@niranjansudhindra) -
జైలులో దర్శన్.. కలిసేందుకు వచ్చిన అభిమానికి షాక్!
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్నారు. ఓ అభిమాని హత్య కేసులో అరెస్టయ్యారు. అయితే కన్నడ ఇండస్ట్రీలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. తాజాగా అతన్ని కలిసేందుకు ఓ అభిమాని వినూత్న రీతిలో ప్రయత్నించారు. టెడ్డీ బేర్ వేషంలో వచ్చి జైలు బయట కనిపించారు."మేము మీ కోసం ఎదురు చూస్తున్నాము" అని రాసి ఉన్న ప్లకార్డును జైలు బయట ప్రదర్శించాడు. అతన్ని శివమొగ్గలోని సాగర్‌కు చెందిన కార్తీక్‌గా గుర్తించారు. అయితే అభిమాన హీరోను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎందుకంటే కఠినమైన నిబంధనలే కారణంగా తెలుస్తోంది.కాగా.. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం జైలులో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (సిసిహెచ్) ఇవాళ మరోసారి తిరస్కరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌ను భద్రతా కారణాల దృష్ట్యా బళ్లారికి తరలించారు. -
సూపర్‌స్టార్ కాళ్లకు మొక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో మెరిసింది. గతేడాది పొన్నియిన్ సెల్వన్‌తో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో నటనకు గానూ ఐశ్వర్య లీడ్ రోల్ ఉత్తమనటిగా(క్రిటిక్స్) సైమా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌తో కలిసి వేదికపై అవార్డును అందుకుంది.ఈ వేడుకకు హాజరైన ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన తల్లిని చూసి పరుగెత్తుకుంటూ స్టేజీ వద్దకు వచ్చింది. తన తల్లిని గట్టిగా కౌగిలించుకుని అభినందించింది. అదే సమయంలో అక్కడే ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కాళ్లకు ఆరాధ్య నమస్కరించింది. ఆయన పాదాలకు మొక్కిన ఆరాధ్య ఆశీస్సులు తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌లో ఐశ్వర్యరాయ్ నటించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రంలో తన నటనకు గానూ ఫీమేల్ లీడ్ రోల్ (క్రిటిక్స్) విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. కాగా.. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాలను మణిరత్నం తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
సలార్‌తో పోటీ పడిన సినిమా.. ఉత్తమ చిత్రంగా అవార్డ్!
సైమా అవార్డ్స్-2024లో కన్నడ స్టార్ దర్శన్ నటించిన చిత్రం సత్తా చాటింది. శాండల్‌వుడ్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ కన్నడలో గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దర్శన్ హీరోగా నటించిన యాక్షన్ సినిమా కాటేరా.. గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద ఏకంగా ప్రభాస్ సలార్‌తో పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీతమందించిన హరికృష్ణ ఉత్తమ సంగీత దర్శకుడిగా సైమా అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. కాగా.. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని దర్శకుడు తరుణ్ సుధీర్ తెరకెక్కించారు. కాటేరా సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్గా మెప్పించింది. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధన రామ్ కాటేరా మూవీతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. (ఇది చదవండి: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా తెలుగు వర్షన్)జైలులో దర్శన్అయితే ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత ఊహించని విధంగా దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టయ్యారు. ప్రియురాలిని వేధిస్తున్నాడంటూ ఓ అభిమాని హత్య చేయడం కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం దర్శన్, అతని ప్రియురాలు సైతం జైలులోనే ఉన్నారు. ఇటీవలే ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. Best Film #KAATERA #SIIMA #SIIMAAwards #SIIMAinDubai #Dboss #D56 pic.twitter.com/Pvx3ixJCDp— Filmy Corner ꭗ (@filmycorner9) September 14, 2024Congratulations Harikrishna for winning Best Music Director award in SIIMA for #Kaatera 🎊Thank you for giving this gem of a song to us, We will cherish forever❤️#DBoss @dasadarshanpic.twitter.com/fULQhP4tsK— King Kariya (@KingKariyaa) September 14, 2024𝗦𝗜𝗜𝗠𝗔 𝟮𝟬𝟮𝟰: Best Film (Kannada) award goes to #Kaatera #DBoss #RocklineEntertainment #SIIMA2024 #SIIMAAwards pic.twitter.com/jqitWHmMDu— Bhargavi (@IamHCB) September 14, 2024 -
సినిమా విడుదలకు ముందు షాక్.. హీరోకు రోడ్డు ప్రమాదం..!
ప్రముఖ కన్నడ హీరో కిరణ్ రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరులోని కెంగేరి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. మంగళవారం సాయంత్రం ఓ అనాథాశ్రమం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హీరోకు గాయాలు కావడంతో.. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు ట్విటర్లో వైరలవుతున్నాయి.(ఇది చదవండి: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం)కాగా.. కిరణ్ రాజ్ శాండల్‌వుడ్‌లో కన్నడతి సీరియల్‌తో ఫేమస్ అయ్యాడు. తెలుగులో నువ్వే నా ప్రాణం అనే చిత్రంలో హీరోగా నటించారు. అంతేకాకుండా పలు రియాలిటీ షోలలోనూ పాల్గొన్నారు. బాలీవుడ్లో హీరోస్, లవ్ బై ఛాన్స్, యే రిష్తా క్యా కెహ్లతా హై, తు ఆషికి వంటి సీరియల్స్‌లో కనిపించారు. కిరణ్ రాజ్ తాజాగా రోనీ: ది రూలర్ చిత్రంలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ రాజ్ నటించిన చిత్రం రిలీజ్‌కు ముందే ప్రమాదం జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. .#KiranRaj, the actor from #Kannadati serial, who was looking forward for his big screen release this week, met with an accident last night, while returning from an act of kindness - visiting an orphanage! Currently hospitalised, we wish him a speedy recovery. Let's come… pic.twitter.com/NFC5M3bFyo— A Sharadhaa (@sharadasrinidhi) September 11, 2024 -
ఫోటోలు, వీడియోలతో నా భర్తను లొంగదీసుకుంది: దర్శన్ సతీమణి
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ ఉన్నారు. వారిద్దరూ సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి 3,991 పేజీలతో చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. ఈ క్రమంలో దర్శన్ సతీమణి విజయలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా చార్జిషీట్లో పొందుపరిచారు. దర్శన్, పవిత్రల గురించి ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది.కన్నడలో స్టార్ హీరోగా ఉన్న దర్శన్ వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. 2000 సంవత్సరంలో విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, పలు విభేదాలు రావడంతో వారిద్దిరూ చాలాకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ పవిత్ర గౌడ్ వారి జీవితంలో అడుగుపెట్టడంతో ఆ దూరం కాస్త మరింత పెరిగింది. అయితే, ఇప్పుడు రేణుకాస్వామి హత్యకేసులో చిక్కుకునన తన భర్త దర్శన్, పవిత్రల రిలేషన్ గురించి చార్జిషీట్లో విజయలక్ష్మి ఇలా తెలిపారు.దర్శన్‌ను పవిత్రగౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసిందని దర్శన్ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2014లో పవిత్రగౌడతో దర్శన్ ప్రేమ, సహ జీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో పవిత్రగౌడ దర్శన్‌తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు. దర్శన్ నుంచి పవిత్రగౌడ ఇళ్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు తీసుకుందని చెప్పారు. పవిత్రగౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని తెలిపారు. మరోవైపు అంతా మంచి జరగాలని విజయలక్ష్మి అసోంలో గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకున్నారు. పోలీసులు వేసిన చార్జిషీట్ గురించి కన్నడ టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. -
నెలకు రూ.10వేలు ఇస్తానంటూ హీరోయిన్‌కు మెసేజ్
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడతో పాటు మరో 15 మంది పాత్ర ఉందని పోలీసులు 3,991 పేజీలతో చార్జిషీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు.కన్నీరుపెట్టిన పవిత్రాగౌడ రేణుకాస్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న పవిత్రాగౌడ పోలీస్ కస్టడీలో కన్నీరుపెట్టిన ఫొటో వైరల్ అయింది. అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌స్టేషన్‌లో హాజరైన సమయంలో పవిత్రాగౌడను ఫొటో తీశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వేసిన చార్జిషీట్లో ఒక్కొక్కటిగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గౌతమ్ పేరుతో రేణుకాస్వామి సందేశాలు రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రేణుకాస్వామి గౌతమ్ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి పవిత్రాగౌడకు అశ్లీల మెసేజ్ పంపించేవాడని పోలీసులు కోర్టుకు సమరి్పంచిన చార్జిషీట్లో పేర్కొన్నారు. నెలకు రూ.10వేలు ఇస్తా, తనతో లివింగ్ రిలేషన్షిప్ కొనసాగించాలని మెసేజ్ పెట్టడంతో నటి పవిత్రాగౌడ కోపోద్రిక్తురాలైంది. తన స్నేహితుడు పవన్ పేరుతో రేణుకాస్వామితో చాటింగ్ చేసి అతను ఎక్కడ ఉన్నాడు, ఏ ఊరిలో ఉన్నాడనే విషయాలను ఆరా తీసినట్లు అందులో పేర్కొన్నారు. -
దర్శన్‌ని పెళ్లి చేసుకుంటా.. జైలు ముందు మహిళ హంగామా
చిత్రదుర్గం రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న నటుడు దర్శన్‌ని చూడాలని ఓ మహిళ అక్కడ హంగామా చేసింది. తాజాగా జైలు వద్దకు కలబుర్గికి చెందిన లక్ష్మీ అనే యువతి అక్కడకు వచ్చింది. తాను దర్శన్‌ను చూడాలని, జైల్లోకి వదలాలని సిబ్బందిని పట్టుబట్టింది. పోలీసులు అడ్డుచెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగింది. దర్శన్ కుటుంబ సభ్యులు మాత్రమే కలవడానికి అనుమతి ఉందని ఆమెకు తెలిపారు. అయితే, తాను దర్శన్‌ని పెళ్లి చేసుకుంటానని, అప్పుడు కలవడానికి ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించింది. దీంతో కంగుతిన్న పోలీసు అధికారులు ఆమెను జైలు నుంచి పంపించే ప్రయత్నం చేశారు. తాను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వద్దకు కూడా వెళ్లి వచ్చానని అక్కడ కూడా దర్శన్‌ను కలిసేందుకు అవకాశం దొరకలేదని రాద్దాంతం చేసింది. చివరికి పోలీసులు ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.కన్నడ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడ, మరో 15 మంది పాత్ర ఉందంటూ ధృవీకరిస్తూ పోలీసులు 3,991 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులు దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పవిత్రగౌడను అసభ్యంగా కామెంట్లు చేస్తున్నాడని రేణుకాస్వామిని కిరాతకంగా దర్శన్ అనుచరులు హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
హత్యకు ముందు రేణుకాస్వామి పరిస్థితి.. ఫోటోలు వైరల్
కన్నడ సినీ నటుడు దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో తాజాగా కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హత్యకు ముందు అతనిపై తీవ్రంగా దాడిచేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఈ ఫోటోలు తీసినట్లు సమాచారం. వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తుంటే ఒక లారీ ముందు రేణుకాస్వామిని కూర్చోబెట్టినట్లు అర్థమవుతుంది. దుస్తులు లేకుండాే ఆయన ఏడుస్తున్నట్లు ఫోటోలో కనిపిస్తుంది. ఆయన చేతిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి.రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న ప్రదోశ్ మొబైల్‌ఫోన్ నుంచి ఫోటోలు, వీడియోలు పోలీసులు సేకరించారు. నన్ను కొట్టొద్దు అంటూ రేణుకాస్వామివారిని వేడుకున్నట్లు పలు వీడియోల్లో కనబడింది. ఆర్ ఆర్ నగరలోని పట్టణగెరె షెడ్లో సీసీ కెమెరా చిత్రాల్లో దర్శన్ ఉండడం, పవిత్రాగౌడ పాదరక్షలకు ఉన్న రక్తపు మరకలను సాక్ష్యాలుగా పేర్కొన్నారు. రేణుకాస్వామిని షెడ్ కు తీసుకువచ్చాం అని ఇతర నిందితులు దర్శన్ మొబైల్‌కి మెసేజ్ చేయగా, పోలీసులు దానిని సేకరించారు. నగరంలోనే ఓ పబ్‌లో ఎంజాయ్ చేస్తున్న దర్శన్ నేరుగా షెడ్ కు వెళ్లి రేణుకాస్వామిని చితకబాదినట్లు తెలిపారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారడానికి ఓ నిందితుడు ఒప్పుకున్నట్లు చార్జిషీట్లో పొందుపరిచారు. ఈ కేసు దర్యాప్తును పశ్చిమ విభాగం డీసీపీ ఎస్.గిరీశ్, ఏసీపీ చందన్‌కుమార్ బృందం దర్యాప్తు చేసింది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గంవాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడ, మరో 15 మంది పాత్రను ధృవీకరిస్తూ పోలీసులు 3,991 పేజీలతో కూడిన బృహత్ చార్జిషీట్‌ను తాజాగా బెంగళూరు నగర 24 వ ఏసీఎంఎం కోర్టులో సమర్పించారు. దర్శన్ ఏ2 నిందితుని, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు. హత్యకేసులో ఇప్పటివరకు దర్యాప్తులో సేకరించిన ప్రత్యక్ష, సాంకేతిక, ఇతరత్రా సాక్ష్యాధారాలను చార్జిషీటులో పొందుపరచినట్లు నగర పోలీస్ కమిషనర్ బీ దయానంద్ విలేకరులతో తెలిపారు. -
బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. భర్త ఎమోషనల్ పోస్ట్!
యంగ్ హీరో డార్లింగ్ కృష్ణ తండ్రయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమకు కూతురు పుట్టిందని ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ప్రయాణంలో తన భార్యను చూసి గర్వపడుతున్నానని హీరో ఎమోషనల్ అయ్యారు. ప్రపంచంలో ఇలాంటి బాధను భరిస్తోన్న తల్లులందరికీ నమస్కారం అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. లవ్ మాక్‌టైల్ అనే కన్నడ సినిమాతో డార్లింగ్ కృష్ణ, నటి మిలానా నాగరాజ్ జంటగా నటించారు. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ జంటగా నమ్మ దునియా నమ్మ స్టైల్, చాల్తి అనే సినిమాలలో నటించారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహా వేడుకలో కన్నడ చిత్రసీమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Darling Krishna (@darling_krishnaa) -
కాంతార హీరోగా రిషబ్ శెట్టి కాదు.. ఫస్ట్ అనుకున్నది ఎవరంటే?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ కూడా విడుదల చేశారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ శెట్టి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కాంతార మూవీకి మొదట హీరోగా తాను చేయాలని అనుకోలేదని తెలిపారు. ఈ చిత్రంలో శివ పాత్రను పోషించడానికి శెట్టి మొదటి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను సంప్రదించినట్లు వెల్లడించారు. రాజ్‌కుమార్‌కు ఈ స్క్రిప్ట్‌ను వినిపించినప్పుడు ఎంతో ఉత్సాహంగా విన్నారని.. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయాడని రిషబ్ వివరించారు. ఓ రోజు నాకు ఫోన్ చేసి నా కోసం ఎదురు చూస్తే సినిమా ఏడాది ఆలస్యం కావొచ్చని నాతో అన్నారని తెలిపారు. అయితే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఊహించని విధంగా అక్టోబర్ 29, 2021న బెంగళూరులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి రెండు రోజుల ముందు కలుసుకున్నానని రిషబ్ గుర్తు చేసుకున్నారు. తన సినిమా కాంతార గురించి ఆయన ఆరా తీశారని చెప్పుకొచ్చారు. సినిమా పట్ల రాజీ పడవద్దని నాకు సూచించారు. షూట్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను రాజ్‌కుమార్‌కు చూపించినట్లు వెల్లడించారు. ఫోటోలు చూసిన రాజ్‌కుమార్ చాలా సంతోషంగా వ్యక్తం చేశారని.. నీ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పాడని రిషబ్ శెట్టి తెలిపారు. -
కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్
-
జైలులో నటుడు దర్శన్‌కు వీఐపీ సేవలు.. వీడియో లీక్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో నటుడు దర్శన్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేణుకాస్వామి హత్య కేసులో ఖైదీగా ఉన్న దర్శన్‌కు జైలులో సకల మర్యాదలు జరుగుతున్నట్టు ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో జైలులులో ఆయనకు వీఐపీ సేవలు అందిస్తున్నట్టు సమాచారం. ఇక, తాజాగా వీటికి బలం చేకూరుస్తూ ఓ వీడియో కూడా బయటకు రావడం గమనార్హం. అందులో ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఉంది. వీడియో కాల్లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకున్నారు. దర్శన్ గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా వీడియోలో ఉంది. This is highly concerning matter!! He is living like a Pablo Escobar, made jail as his own resort. Government must think after see this videi. #Darshan pic.twitter.com/bE9AOFDAuI— RiyA Rawat (@RiyaRawat07) August 25, 2024ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫొటో ఒకటి కూడా బయటకు వచ్చింది. దీంతో, జైల్లో నిందితుడు దర్శన్‌కు వీఐపీ మర్యాదలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో జైలు అధికారులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. విచారణకు ఆదేశించారు. ಇವನಿಗೆ 10 ಸಲ ನೀವು ಒಳಗಡೆ ಹಾಕಿದ್ರು .. ಬುದ್ದಿ ಬರಲ್ಲ.. 2 ದಿನ ಬದುಕಿದರು ಮಯಾ೯ದೆಗೆ ಹೆದರಿ ಬದುಕಿ 😊…👍Shame On #Darshan Shame On KARNATAKA GOVT@dasadarshan @kfcc_official pic.twitter.com/Y7dyqt8DOY— ManK ‘MAX’ 😈 (@ManKichcha) August 26, 2024 -
అభిమానితో ప్రేమ.. రిషబ్ శెట్టి విజయంలో కీలక పాత్ర ఆమెదే
నేషనల్ అవార్డ్ విన్నర్ స్థాయికి చేరుకున్న కన్నడ హీరో విజయం వెనక ఎవరున్నారా..? అని అందరిలో మెదిలే ప్రశ్న. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని చెబుతూ ఉంటారు కదా.. అలా రిషబ్ విజయంలో క్రెడిట్ అంతా తన భార్య ప్రగతికే దక్కుతుందని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ విధంగా రిషబ్ ప్రేమను భార్యపై చాటారు. రిషబ్‌కు ప్రధాన బలం తన భార్య, ఇద్దరు పిల్లలే అంటూ ఉంటారు. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా రిషబ్‌కు ఆమె తోడుగా ఉంటుంది. వారిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం.అభిమానితో ప్రేమసాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. రక్షిత్‌శెట్టి హీరోగా ‘రిక్కీ’ అనే సినిమాను రిషబ్ శెట్టి తెరకెక్కించారు. ఆ చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో అందరూ హీరోతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. అయితే, ఆ సమయంలో ఆ అందమైన అమ్మాయి మాత్రం ఆ చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టిని చూస్తూ అలానే ఉండిపోయింది. దానిని గమనించిన రిషబ్.. తనను ఎక్కడో చూశానే అనుకుంటూ పలకరించాడు. ఆ అమ్మాయి తన గ్రామం కెరాడికి చెందిన అమ్మాయేనని గుర్తించాడు. అప్పటికే వారిద్దరికీ ఫేస్బుక్లో పరిచయం ఉంది. అలా ప్రగతితో ప్రేమలో పడిపోయిన రిషబ్ 2017లో పెళ్లి చేసుకున్నాడు. ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి మొదదట ఒప్పుకోలేదు. రిషబ్ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఐటీ నేపథ్యమున్న ప్రగతి బెంగళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. పెళ్లయ్యాక పూర్తిగా సినిమా రంగంపైనే తన దృష్టిపెట్టింది. చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘కాంతార’ సినిమాకు కూడా పనిచేసింది. ‘కాంతార’లో ప్రారంభ సన్నివేశంలో రాణి పాత్రలో ప్రగతి నటించింది. ప్రస్తుతం రిషబ్ పలు సినిమాలు నిర్మించడంతో పాటు డైరెక్షన్ చేసే స్థాయికి చేరుకున్నాడు. ప్రగతి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చిత్రపరిశ్రమలో రాణిస్తుంది. తన భర్త విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్‌కు అవార్డ్ దక్కడంలో ప్రగతి పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. -
యశ్ 'టాక్సిక్' నిర్మాణ సంస్థకు కోర్టు నోటీసులు
కన్నడ హీరో యశ్ ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే చిక్కుల్లో పడింది. కేజీఎఫ్ సినిమాల తర్వాత యశ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో ఆయన అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మలయాళ నటి–దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ, శ్రుతీహాసన్ వంటి స్టార్స్ పేర్లు వినిపించాయి. అలాగే యశ్‌కు సోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం జరిగింది.టాక్సిక్ చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. టాక్సిక్ సినిమా సెట్‌ను అటవీ భూమిలో పెద్దఎత్తున ఏర్పాటు చేశారని న్యాయవాది జి. బాలాజీ పిల్ దాఖలు చేశారు. వెంటనే సెట్‌ను క్లియర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిల్‌కు సంబంధించి కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థతో పాటు, హెచ్ఎంటిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.న్యాయవాది జి. బాలాజీ చెబుతున్న ప్రకారం అటవి ప్రాంతానికి సమీపంలోని 20 ఎకరాల స్థలం (అటవీ భూమి)లో అనధికారికంగా టాక్సిక్ సెట్‌ను నిర్మించారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఈ సెట్‌ను వెంటనే క్లియర్ చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే, ఈ అంశంలో విచారణను ఆగష్టు 19కి కోర్టు వాయిదా వేసింది.నోటీసుల అంశంపై టాక్సిక్ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రీత్ రియాక్ట్ అయ్యారు. సెట్ వేస్తున్న స్థలం తమ ఆత్మీయులదేనని ఆయన చెప్పారు. దీంతో కోర్టు నోటీసులు ఆఫీసుకి లేదా స్థలం యజమానికి వచ్చి ఉండవచ్చని ఆయన అన్నారు. కెవిఎన్ సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ నుంచి టాక్సిక్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. -
పెళ్లికి రమ్మని ఆహ్వానించా.. దర్శన్ అమాయకుడు.. నిరపరాధిగా తిరిగొస్తాడు!
చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. పరప్పన అగ్రహార జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను దర్శక నటుడు తరుణ్ సుధీర్ శుక్రవారం కలిశాడు. కొన్ని రోజుల్లో తన వివాహానికి ముహూర్తం పెట్టినందున పెళ్లికి రమ్మని ఆహ్వానించడానికి జైలుకు వెళ్లినట్లు తెలిపాడు.అనారోగ్యం?తరుణ్ మాట్లాడుతూ.. 'దర్శన్ ఎప్పటిలాగే చిరునవ్వుతో పలకరించాడు. అయితే కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేనట్లుంది. ఇప్పుడు కాస్త కోలుకున్నాడు. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి మనమంతా కూడా ఏదో కోల్పోయినట్లుగా బలహీనమైపోయినట్లే అనిపిస్తోంది.పెళ్లికి ఆహ్వానంనా పెళ్లి కుదిరిన సంగతి దర్శన్‌కు తెలుసు. వెడ్డింగ్‌కు ఆహ్వానించడానికి వెళ్లాను. తన కోసం పెళ్లి వాయిదా వేసుకోవడం లాంటి పిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించాడు. ఆయన ఏ పాపం చేయలేదని నేనిప్పటికీ నమ్ముతున్నాను. త్వరలోనే తను నిరపరాధిగా తిరిగొస్తాడు. నా పెళ్లికి హాజరవుతాడు అని చెప్పుకొచ్చాడు.కాంబినేషన్లో రెండు సినిమాలుకాగా తరుణ్, నటి సోనాల్ మాంటెరియోను వివాహం చేసుకోబోతున్నాడు. వీరి పెళ్లి వేడుకలు ఆగస్టు 10, 11 రోజుల్లో జరగనున్నాయి. ఇకపోతే తరుణ్ సుధీర్ దర్శకుడిగా.. దర్శన్‌తో కాటేర, రాబర్ట్ చిత్రాలు చేశాడు. వీరి కాంబినేషన్లో సింధూర లక్ష్మణ అనే చారిత్రాత్మక ప్రాజెక్టు రానున్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి.సంచలనంగా రేణుకాస్వామి హత్య కేసుహీరో దర్శన్ పదేళ్లుగా నటి పవిత్రగౌడతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ప్రియురాలిపై అనుచిత కామెంట్లు చేశాడన్న కోపంతో అభిమాని రేణుకాస్వామిని దర్శన్ గ్యాంగ్ అతడిని దారుణంగా చంపేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే న్యాయస్థానం.. వీరి జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 1 వరకు పొడిగించింది.చదవండి: 2024 OTT ఫస్టాఫ్: ఎక్కువమంది చూసిన సిరీస్, సినిమాలివే! -
సినీ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తను హీరోగా నటించి నిర్మించిన 'బ్యాచిలర్ పార్టీ' సినిమా వల్ల ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీని అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.'బ్యాచిలర్ పార్టీ' చిత్రంలో రక్షిత్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్నారు. తన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియో ద్వారా ఈ మూవీని నిర్మించారు. అయితే, రక్షిత్ శెట్టిపై MRT మ్యూజిక్‌లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు. రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో కాపీరైట్ అనుమతులు లేకుండానే తమ పాటలను ఉపయోగించారని ఫిర్యాదుదారు ఆరోపించారు. న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ‘బ్యాచిలర్ పార్టీ’లో రక్షిత్ శెట్టి కాపీ కొట్టారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ వివాదంపై హీరో రక్షిత్ శెట్టి ఇంకా స్పందించలేదు. సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, సైడ్-బి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకున్న రక్షిత్ శెట్టి తన టీమ్‌తో సదరు మ్యూజిక్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
హిట్ సినిమాకు ప్రీక్వెల్.. ఫస్ట్ గ్లింమ్స్ విడుదల
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా నుంచి ఫస్ట్ వెర్డిక్ట్ పేరుతో ఒక వీడియోను పంచుకున్నారు. పాన్ ఇండియా రేంజ్లో శివ రాజ్‌కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో 'భైరతి రంగల్' ఒకటి. శ్రీమతి గీతా శివ రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.'భైరతి రంగల్' సినిమాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15, 2024న విడుదల చేస్తామని గతంలో శివరాజ్‌కుమార్ ప్రకటించారు. అయితే, తాజాగా విడుదలైన వెర్డిక్ వీడియోలో సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. అందులో శివన్న రగ్గడ్ లుక్‌లో కనిపస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ చిత్రమైన 'ముఫ్తీ'కి 'భైరతి రంగల్' ప్రీక్వెల్‌గా రానుంది. -
ఒక్క సినిమాతో తెలుగోళ్లకు నచ్చేశాడు.. శివరాజ్ కుమార్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
జైల్లో ఉండలేకపోతున్న హీరో దర్శన్.. అవన్నీ కావాలని రిక్వెస్ట్
కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో ఉండలేకపోతున్నాడు. ఇన్నాళ్లు లగ్జరీ లైఫ్ బతుకుతూ వచ్చిన ఇతడు.. సాధారణ ఖైదీలా ఉండలనేసరికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇంటి ఫుడ్‌తో పాటు పలు సదుపాయాలు కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఇంతకీ దర్శన్ కేసులో అప్డేట్ ఏంటి?(ఇదీ చదవండి: ప్రభాస్ కోట్లాది రూపాయల సాయం.. బయటపెట్టిన కాస్ట్యూమ్ మాస్టర్)కన్న హీరో దర్శన్‌ని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడ సహా మొత్తంగా 17 మందిని అరెస్ట్ చేశారు. రేణుకస్వామి అనే వ్యక్తి దర్శన్‌కి వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో భార్యతో కాకుండా ప్రియురాలు పవిత్రతో ఎక్కువగా ఉండటాన్ని తట్టుకోలేకపోయిన రేణుకాస్వామి.. ఈమెకు అసభ్య సందేశాలు పంపించాడు. ఇది ఈమె దర్శన్‌కి చెప్పడంతో తన మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపేశాడు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది.ప్రస్తుతం జైల్లో ఉన్న దర్శన్.. మిగతా ఖైదీల్లానే ఉన్నాడు. కాకపోతే ఇతడికి అజీర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. తనకు ఇంట్లో చేసిన ఆహారంతో పాటు పడుకోవడానికి పరువు, బట్టలు, పుస్తకాలు కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. బుధవారం దీనిపై విచారణ జరగనుంది. మరి న్యాయస్థానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!) -
రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. పక్కా ప్రణాళికతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తూ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క వ్యక్తిని, వస్తువునీ వదలకుండా విచారణ చేసి, సాక్ష్యంగా మలచుకుంటున్నారు. తాజాగా ఈ హత్య కేసులో నిందితుల వేలిముద్రలకు సంబంధించిన రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది.రేణుకాస్వామి హత్య జరిగిన ప్రాంతంతో పాటు మృతదేహాన్ని తరలించిన వాహనంలోని వేలి ముద్రలతో దర్శన్, పవిత్ర గౌడ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి. వారిద్దరితో పాటు జైలులో ఉన్న మరో 10 మంది వేలి ముద్రలు కూడా సరిపోలాయి. హత్య జరిగిన చోట లభ్యమైన వేలిముద్రలను హైదరాబాద్, బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు అధికారులు పంపారు. అయితే, రెండు చోట్ల ఒకే రిపోర్ట్ వచ్చింది. ఇక డీఎన్ఏ రిపోర్ట్ రావాల్సి ఉంది.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన 17 మందిపై గతంలో పోలీసులు కేసులు ఉన్నాయి. వారిలో కొందరు హత్యలు కూడా చేసినట్లు తేలుతుంది. ఈక్రమంలో కామాక్షిపాళ్య పోలీసులు తాజాగా పీడబ్ల్యూడీ అధికారులకు బ్లూఫ్రింట్ తయారుచేసి ఇవ్వాలని లేఖ రాశారు. కామాక్షిపాళ్యలోని పట్టణగెరె మెకానిక్ షెడ్డు నుంచి రేణుకాస్వామి శవాన్ని ఏ మార్గాన తరలించారు? ఎక్కడ విసిరేసారు?, తర్వాత ఏ మార్గాల్లో ఎవరెవరు సంచరించారనే పూర్తి సమాచారం ఆధారంగా బ్లూ ఫ్రింట్ తయారు చేసి ఇవ్వాలని లేఖ రాశారు. -
దర్శన్‌కు సపోర్ట్‌గా విజయలక్ష్మి కామెంట్
రేణుకాస్వామి హత్యకేసులో నిందితునిగా ఉన్న సినీ హీరో దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. గతంలో 2011లో భార్యపై దాడికి పాల్పడిన కేసులో ఇదే జైలుకు తొలిసారిగా వచ్చి 20 రోజులకు పైగా ఉన్నారు. 13 ఏళ్ల తరువాత రెండోసారి మళ్లీ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, ఆయన ప్రియురాలు, నటి పవిత్రా గౌడ సమేతంగా పరప్పన జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా దర్శన్‌ను సతీమణి విజయలక్ష్మి తన కుమారుడితో వెళ్లి కలుసుకున్నారు.దర్శన్, విజయలక్ష్మి మధ్య విభేదాలు ఉన్నాయి. వారిద్దరూ కూడా వేరువేరుగా ఉన్నారని సమాచారం. అయితే, దర్శన్ కష్టాల్లో ఉండటంతో ఆయనకు అండగా నిలబడేందుకు ఆమె సిద్ధం అయింది. ఈ క్రమంలో ఇటీవలే కుమారుడు వినీష్‌తో కలిసి జైలుకు వెళ్లి సుమారు రెండు గంటలపాటు దర్శన్‌తో మాట్లాడారు ఆమె. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ కేసులో దర్శన్‌కు న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉందని, అంతవరకూ ఆయనకు అండగా ఉందామని, అభిమానులు ఓపికతో ఉండాలని పోస్ట్ చేశారు. ఇది పరీక్షా సమయమని, సహనం కోల్పోయి మాట్లాడినా, పోస్టులు పెట్టినా దర్శన్‌కు ఇబ్బంది కలుగుతుందన్నారు. అభిమానుల అంతరంగాన్ని మీ తరఫున దర్శన్‌కు వివరించాను. కోర్టులపై నమ్మకం ఉంచి న్యాయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. -
మేకప్‌లో పవిత్ర గౌడ.. పోలీస్ అధికారికి నోటీసులు
రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్ర గౌడ (A1) ఉన్నారు. అతని హత్యలో ఆమె కీలకమని పోలీసులు కూడా నిర్ధారించారు. రేణుకాస్వామిని హతమార్చే కుట్రలో ఆమె ప్రధాన కారణమని తెలినట్లు పోలీసుల వాదన ఉంది. రేణుకస్వామి సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్‌తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నటి పవిత్ర ఉన్నారు. అంతకు ముందు 10 రోజుల పాటు ఆమె పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. జైలుకు వెళ్లకు ముందు విచారణ కోసం ఆమె రోజూ అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చేది. విచారణ అనంతరం మడివాలలోని మహిళా కేంద్రంలో ఆమెను పోలీసులు ఉంచేవారు. అలా 10 రోజుల పాటు పవిత్రను పోలీసులు ప్రశ్నించారు. విచారణ అనంతరం పవిత్ర గౌడ మేకప్‌తో కనిపించేది. పోలీస్‌స్టేషన్‌లో ఆమె కాస్మోటిక్స్ వాడడంపై పెద్ద ఎత్తున చర్చలు ప్రారంభమయ్యాయి. పవిత్ర పెదాలపై లిప్ స్టిక్‌తో పాటు ఆమె మేకప్ వేసుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కన్నడ సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎతున్న చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ పోలీసుల అదుపులో ఉండగానే ఎలా మేకప్ వేసుకుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు కాస్మోటిక్స్ మహిళా పోలీసులే అందించారని చర్చ జరుగుతుంది. పవిత్ర గౌడ భద్రత బాధ్యతను విజయనగర పోలీస్ స్టేషన్‌లోని మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. ఆమె ప్రమేయంతోనే ఇదంతా జరిగిందా అనే వాదనలు కూడా వస్తున్నాయి.ఈ క్రమంలో డీసీపీ గిరీష్ ఈ అంశంలో ఫైర్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితురాలికి లిప్‌స్టిక్‌తో పాటు కాస్మోటిక్స్ ఎలా వచ్చాయనేది చెప్పాలని మహిళా పీఎస్‌ఐకి మెమో ఇచ్చారు. అయితే, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. విచారణ సమయంలో పవిత్ర గౌడ ప్రతిరోజూ మడివాలలోని మహిళా కేంద్రం నుంచి విచారణకు వచ్చేదని, అక్కడే దుస్తులు మార్చుకుని అవకాశాన్ని ఆమెకు అధికారులు కల్పించారని తెలుస్తోంది. అక్కడికి ప్రతిరోజు ఆమె కుటుంబ సభ్యులు వచ్చేవారని సమాచారం ఉంది. ఆ సమయంలోనే ఆమె మేకప్ వేసుకునే సౌలభ్యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇప్పుడు పవిత్ర గౌడను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. పరప్పన అగ్రహార జైలులో తాజాగా పవిత్ర గౌడ తల్లి, సోదరుడు, కూతురు ఆమెతో మాట్లాడారు.పవిత్ర గౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రేణుకాస్వామి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంహత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
జైలులో 'పవిత్ర గౌడ' గొంతెమ్మ కోరికలు.. తీర్చాలంటూ గొడవ
ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. రేణుకస్వామి సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్‌తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.జైల్లో పవిత్ర గౌడ మహిళా సిబ్బందితో గొడవకు దిగింది. పవిత్రకు రాత్రి నిద్రించేందుకు ఒక దుప్పటిని జైలు సిబ్బంది ఇచ్చారు. ఈ దుప్పటి వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలంటూ ఆమె గొడవ చేసినట్లు తెలిసింది. జైలులో ఉండి కూడా అది కావాలి, ఇది కావాలంటూ అక్కడ ఉన్న మహిళా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. జైలు భోజనం తినేందుకు కూడా ఆమె నిరాకరించారట. దీంతో పోలీసులు కూడా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారట. ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారట.దర్శన్‌కు ఇతర ఖైదీల నుంచి ఏమైనా ప్రమాదం రావచ్చిని ఆయన్ను ప్రత్యేకమైన బ్యారక్‌లో ఉంచారు. రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్, మజ్జిగ ఇచ్చారు. కానీ, భోజనం చేయని దర్శన్ ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్ చేశారు. జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. ఉదయం టిఫిన్ పలావ్ ఆరగించారు. భద్రత కోసం దర్శన్‌ను తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. -
దర్శన్ గురించి సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన డాక్టర్
కర్ణాటకలో సంచలనం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌కు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జులై 4 వరకు పరప్పన అగ్రహారం జైలులో ఆయన ఉండనున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ A2 అని పోలీసులు నిర్ధారించారు. ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ A1 అని తెలిపారు. వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే దర్శన్ మానసిక పరిస్థితి గురించి పలు విషయాలు బయటకు వస్తున్నాయి.దర్శన్ ఆరోగ్యంపై అనుమానాలుదర్శన్కు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తగిన వైద్యం అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 10వ తేదీన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యాక దర్శన్ మానసిక పరిస్థితి చర్చకు వచ్చింది. గతంలో దర్శన్ గొడవపడిన ఘటనలు, షూటింగ్లో ఇతరులను కొట్టిన సంగతులు, అతని పట్టలేని ఆగ్రహం చూస్తే మానసిక రోగంతో బాధపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతాయి. గతంలో దర్శన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చిన మానసిక వైద్యురాలు చంద్రిక ఈ విషయాన్ని చెప్పారు. చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం, కోపం రావడం తదితర లక్షణాలు ఉండేవని, అయితే అతడి స్టార్డమ్ కారణంగా అవి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే దర్శన్ ఇంతవరకూ వచ్చాడంటున్నారు. కౌన్సెలింగ్ కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. కోపం వస్తే దర్శన్ విచక్షణ మర్చిపోతారని, ఏం చేస్తున్నాడో అతడికే తెలీదన్నారు. తక్షణం అతడికి కౌన్సెలింగ్, వైద్యం చాలా అవసరమని పలువురు పేర్కొన్నారు. బెయిల్ కోసం డ్రామా..?దర్శన్ 13 ఏళ్ల కిందట భార్యపై దాడి కేసులో అరెస్టయి జైలుపాలయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే జైలుకి వెళ్లాడు. హత్య కేసులో ప్రథమ ముద్దాయి, దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇప్పటికే పరప్పన జైలులో ఉన్నారు. మరోవైపు బెయిల్ కోసమే దర్శన్ ఆరోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి బాగులేదనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మానసిక పరిస్థితి బాగులేదనే అధికారికంగా ప్రభుత్వ వైద్యులు ధృవీకరిస్తే తప్పకుండా దర్శన్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు. బెయిల్ కోసమే ఇలా కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. -
జైలుకు దర్శన్.. బెయిల్ కోసం రంగంలోకి దిగిన టాప్ లాయర్లు
కర్ణాటకలో సంచలనం రేపిన ఆటోడ్రైవర్ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌కు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హత్య కేసులో గత 12రోజులుగా ఆయన్ను పోలీసులు విచారించారు. హత్య జరిగిన ప్రదేశంతో పాటు పలు చోట్ల 139 వస్తువులను సాక్ష్యాలుగా పోలీసులు సేకరించారు. అన్నిటికంటే ముఖ్యంగా దర్శన్ అనుచరుడు వినయ్ ఫోన్లో చాటింగ్ చేసిన మెసేజ్‌లు కేసులో కీలకంగా మారనున్నాయి. రేణుకాస్వామిపై దర్శన్ దాడి చేసిన దృశ్యాన్ని ముగ్గురు యువకులు మొబైల్లో వీడియో తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీడియోలను సేకరించారు.దర్శన్‌తో పాటు అతని సహచరులు వినయ్, ప్రదుష్, ధనరాజ్‌లను శనివారం నగరంలోని 24వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. దర్శన్‌తో పాటు ఆయన ముఠాను జులై 04 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ తాజాగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేణుకాస్వామి దారుణ హత్య నేపథ్యంలో ఏ1 నిందితురాలు పవిత్రగౌడ్‌తో పాటు మరో 13 మంది ఇప్పటికే పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఇప్పుడు దర్శన్ గ్యాంగ్ కూడా పరప్పన అగ్రహారంలో చేరారు, అందువల్ల హత్య కేసులో ప్రమేయం ఉన్న 17 మంది నిందితులకు జులై 4 వరకు కస్టడీ విధించారు.దర్శన్ బెయిల్ కోసం ప్రముఖ లాయర్లు రేణుకాస్వామి హత్య కేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. దర్శన్ కేసు వాదించడానికి అనిల్, బాబు, రంగనాథ్‌రెడ్డి అనే లాయర్లను నియమించుకున్నారు. అదేవిధంగా సీనియర్ లాయర్ సీవీ నాగేశ్‌ను కూడా దర్శన్ నియమించుకున్నారు. ఇటీవల జైలుపాలైన మాజీ మంత్రి రేవన్న కేసును నాగేశ్ వాదించి బెయిలు ఇప్పించారు. అనేక క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం ఆయనకు ఉంది. దర్శన్‌కు కూడా బెయిల్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా లాయర్ నాగేశ్, అసిస్టెంట్ లాయర్ రాఘవేంద్ర ఇప్పటికే అన్నపూర్ణేశ్వరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకున్నారు. -
దర్శన్ కేసు.. హత్య తర్వాత అతను ఏం చేశాడంటే?
కన్నడ హీరో దర్శన్ కేసు శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మిని సైతం పోలీసులు విచారించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆమె ఉంటున్న ఫ్లాట్‌లో దర్శన్ షూస్ గుర్తించిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నప్పటికీ ఆమె నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో ఆమెను ప్రశ్నించారు.అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రేణుకాస్వామి హత్యం అనంతరం దర్శన్ తన భార్య విజయలక్ష్మి ఉంటున్న ఫ్లాట్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడే భార్యతో కలిసి ఇంట్లో పూజలు నిర్వహించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత దర్శన్ మైసూరుకు వెళ్లిపోయాడు. అయితే ఈ కేసులో ఆయన భార్యను దాదాపు ఐదుగంటల పాటు విచారించిన పోలీసులు ఆమె పేరును సాక్షిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈనెల 9న బెంగళూరులో రేణుకాస్వామి అనే అభిమాని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హీరో దర్శన్‌తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడ, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. -
దర్శన్ నా గురువు.. ఆయన ఇలా చేశారంటే..: హీరోయిన్
కొద్దిరోజులుగా హీరో దర్శన్ పేరు మారుమోగిపోతోంది. తనేదో మంచి పని చేసినందుకు కాదు.. తన గ్యాంగ్‌తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి క్రూరంగా చంపినందుకు! జూన్ 11న రేణుకాస్వామి హత్య జరగ్గా.. ఈ కేసులో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు పలువురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం గురించి కన్నడ హీరోయిన్ రచితా రామ్ తాజాగా స్పందించింది. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దర్శన్.. గురువుదర్శన్.. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. న్యాయం గెలుస్తుందిరేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలి. అతడి కుటుంబం ధైర్యాన్ని కూడదీసుకోవాలి. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్ తొలి సినిమా బుల్బుల్. ఈ మూవీలో దర్శన్ హీరోగా, రచిత హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్ చేశారు. కన్నడలో పలు సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'సూపర్ మచ్చి' మూవీతో పలకరించింది. View this post on Instagram A post shared by Rachitaa Ram (@rachita_instaofficial)చదవండి: షారూఖ్ ఖాన్‌కు యాటిట్యూడ్? బిగ్‌బీని తక్కువ చేసి.. -
కన్నడ హీరో దర్శన్ కేసు.. అతని భార్యకు నోటీసులు!
ప్రస్తుతం శాండల్‌వుడ్ అంతటా హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ పేర్లే వినిపిస్తున్నాయి. బెంగళూరులో జరిగిన ఓ అభిమాని హత్య కేసు వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. తన ప్రియురాలు పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపాడని రేణుకాస్వామి అనే అభిమానిని దారుణ హత్య చేశారని వీరిపై ఆరోపణలొచ్చాయి. అయితే హీరో దర్శన్‌కు ఇదివరకే పెళ్లయింది. విజయలక్ష్మిని వివాహం చేసుకోగా.. ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నారు. గత పదేళ్లుగా పవిత్ర గౌడతో రిలేషన్లో ఉన్నారు. తాజాాగ హత్య కేసులో నోటీసు అందుకున్న విజయలక్ష్మి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన భార్య వాంగ్మూలాన్ని బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. అయితే విజయలక్ష్మి నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. రేణుకస్వామి హత్య కేసులో ఇప్పటివరకు దాదాపు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇండస్ట్రీకి సంబంధం లేదు: కిచ్చా సుదీప్అయికే మరోవైపు.. ఈ వ్యవహారంతో కన్నడ ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ ఇప్పటికే హీరో కిచ్చా సుదీప్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు. -
పవిత్ర గౌడకు అస్వస్థత.. పోలీసుల ప్రశ్నలే కారణమా..?
కన్నడ చిత్రపరిశ్రమలో రేణుకాస్వామి హత్య పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడను గత కొద్దిరోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. రేణుకాస్వామి తనకు అసభ్య మెసేజ్‌లు పెడుతున్నట్లు తన ప్రియుడు హీరో దర్శన్‌కు చెప్పడంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు వద్ద ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పవిత్ర గౌడను పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఆమె తీవ్రంగా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆమె అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.పవిత్ర గౌడను గత 10 రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం కాస్త దెబ్బతినడంతో చికిత్స కోసం బెంగళూరులోని ప్రభుత్వాసుపత్రిలో పోలీసులు చేర్పించారు. రేణుకాస్వామి హత్య జరిగిన సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయింది, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పును ఇది వరకే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామిపై మొదట దాడిచేసింది పవిత్ర అని తెలిసింది.ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్‌నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపాడు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ఆ సినిమాలను తీసుకోని ఓటీటీలు.. అదే కారణమా?
777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దగ్గరైన శాండల్‌వుడ్ హీరో, డైరెక్టర్ రక్షిత్ శెట్టి. తాజాగా ఆయన ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ త్వరలోనే విడుదల కానుంది. ఈ సిరీస్ రిలీజ్ చేసేందుకు దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఏ ఓటీటీ వేదికలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో రక్షిత్ శెట్టి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ సినిమాలకు విలువ లేదా అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.రక్షిత్ శెట్టి తన ట్వీట్లో రాస్తూ..'జనవరి 2020లో ఏకమ్ సిరీస్ రిలీజ్ చేద్దామనుకున్నాం. కన్నడలో వెబ్ సిరీస్‌కి అదే సరైన సమయం అనిపించింది. ఆ తర్వాక కరోనా మహమ్మారి అంతా తలకిందులైంది. దీంతో మే ఏకం సిరీస్ వాయిదా వేసుకున్నాం. అక్టోబర్ 2021లో ఏకమ్ ఫైనల్ కాపీ చూశాను. అది చూసి థ్రిల్ అయ్యాను. ఆ తర్వాత దాన్ని ప్రపంచానికి చూపించడానికి రెడీ అయ్యాను. కానీ గత రెండేళ్లలో ఏకం సిరీస్ కోసం మేము ప్రయత్నించని ఓటీటీ లేదు. ప్రతిసారీ మాకు నిరాశే ఎదురైంది. ఏదేమైనా కంటెంట్ సత్తాను నిర్ణయించే హక్కు ప్రేక్షకులకు మాత్రమే ఉందని నమ్మాను. అందుకే మా సొంత వేదికపై తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఇది ఒక ప్రయత్నం మాత్రమే. దీనిని అందరు గుర్తించి మెచ్చుకోవాలి.' అని రాసుకొచ్చారు. అయితే కన్నడ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం మొదటిసారి కాదని రక్షిత్ శెట్టి అన్నారు. కన్నడ పరిశ్రమ కంటెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఎందుకు తీసుకోవడం లేదన్న విషయంపై కన్నడ డైరెక్టర్ అనూప్ భండారి మాట్లాడారు. 2022కి ముందు కన్నడ కంటెంట్ కొనుగోలు చేయడంలో విముఖత ఉన్న మాట నిజమే.. కానీ.. ఆ ఏడాది నుంచే కన్నడ సినిమాకు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. కాంతార, కేజీఎఫ్ లాంటి సినిమాలతో కన్నడ చిత్ర పరిశ్రమకు గుర్తింపు దక్కిందన్నారు.అయితే కన్నడ సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకం కొంతవరకు కోల్పోయామని గతంలోనే సప్త సాగరాలు దాటే ఎల్లో మూవీ దర్శకుడు హేమంత్ రావు అన్నారు. కన్నడ కంటే మలయాళం, హిందీ, తమిళ, తెలుగు కంటెంట్‌కే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. కన్నడ కంటెంట్‌ను ఎందుకు కొనుగోలు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా కర్ణాటకతో పాటు మలయాళంలో కూడా మంచి బిజినెస్ చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఒక్క శాండల్‌వుడ్‌లో మాత్రమే వెనక ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో తెలుగు సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ కన్నడ చిత్రాలకు రావడం లేదని వెల్లడించారు. -
కన్నడ హీరో దర్శన్ మేనేజర్ సూసైడ్.. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు!
హీరో దర్శన్ అభిమాని హత్య కేసు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దర్శన్‌కు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.విపరీతమైన ఒంటరితనం కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నట్లు సూసైడ్ నోట్లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని.. తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా?
ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ కేసు హాట్‌టాపిక్‌గా మారింది. ఓ అభిమాని హత్యకేసులో వీరిద్దరు ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. వీరిద్దరు గత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నట్లు తెలిసింది. పవిత్ర గౌడకు ఓ అభిమాని అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. నటి పవిత్ర గౌడ గురించి నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. అసలు ఆమె ఎవరు? ఇంతకీ పవిత్రకు పెళ్లయిందా? దర్శన్‌తో రిలేషన్లో ఉందా? అని తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి పవిత్రకు ఇప్పటికే పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆమె కూతురు ఖుషిగౌడ చేసిన పోస్ట్ నెట్టింట వైరలైంది. 'నాకు అన్ని నువ్వే.. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ ఆమె కూతురు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవిత్ర 18 ఏళ్ల వయస్సులోనే సంజయ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరి ఖుషీ అనే కూతురు ఉంది. ఆ తర్వాత సంజయ్ సింగ్‌తో పవిత్ర గౌడ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పదేళ్లుగా దర్శన్‌తో రిలేషన్లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దర్శన్‌తో ఉన్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. కాగా.. పవిత్ర కన్నడ సినీ పరిశ్రమలో 2013 కామెడీ చిత్రం చత్రిగలు సార్ చత్రిగలుతో అరంగేట్రం చేసింది. 2016లో తమిళ థ్రిల్లర్ మూవీ 54321లో నటించింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official) -
విచారణలో మౌనంగానే దర్శన్.. ఛాన్స్ ఉన్నా తప్పించుకోని రేణుకాస్వామి
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రియురాలు పవిత్రగౌడ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దర్శన్ తనకు ఏమీ తెలీదని చెప్పడం లేదా మౌనంగా ఉండిపోతున్నాడని తెలిసింది. ఈ కేసులో అరైస్టెన దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తుండగా దర్శన్ మాత్రం చెప్పిందే చెబుతున్నట్లు సమాచారం. అయితే రేణుకాస్వామిని స్కెచ్ వేసి హత్య చేయలేదని, బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలనుకున్నామని, దెబ్బలు తట్టుకోలేని రేణుకాస్వామి మృతి చెందినట్లు నిందితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాత్రి రేణుకాస్వామి కేసుకు సంబంధించి పోలీసులు చిత్రదుర్గలో స్పాట్ మహజర్ నిర్వహించారు. పగటి సమయంలో మీడియా, జనాల వల్ల పని కాదని భావించిన పోలీసులు అర్థరాత్రి చిత్రదుర్గలో సీఐ సంజీవ్ గౌడ... నిందితుడు రఘును తీసుకువచ్చి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన స్థలం, సంఘటనకు సంబంధం ఉన్న ఇతర చోట్ల మహజర్ చేశారు. రఘు దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్ చేయడంలో రఘు కీలకంగా వ్యవహరించారు.నగదు సీజ్రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్ ప్రకారం చేతులు మారిన రూ.30 లక్షల నగదు పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. దర్శన్ ఇచ్చిన రూ.30 లక్షలు దర్శన్‌కు సంబంధించిన దగ్గరి వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇంటిపై రైడ్ చేసి నగదు సీజ్ చేశారు.అవకాశం దొరికినా తప్పించుకోని రేణుకాస్వామిరేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో మార్గం మధ్యలో అనేకసార్లు తప్పించుకునే అవకాశం లభించినా తప్పించుకోలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఏ8గా ఉన్న నిందితుడు రవి పోలీసులకు లొంగిపోయాడు. రవి ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు రవి క్యాబ్ డ్రైవర్. టొయోటా ఈటీఎస్ కారు అద్దెకు నడుపుతుంటాడు. ఈక్రమంలో రవి స్నేహితుడు జగ్గు కాల్ చేసి బెంగళూరుకు వెళ్లాలని కోరాడు. చిత్రదుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకాస్వామి కారు ఎక్కారు. కారులో బెంగళూరు వస్తుండగానే ప్రయాణంలో పవిత్రగౌడకు పంపించిన మెసేజ్‌లపై జగ్గు, రఘు ప్రశ్నించారు. అయితే మెసేజ్‌లు పంపడం తనకు హాబీ అని రేణుకాస్వామి చెప్పుకున్నాడు. వారంతా మార్గం మధ్యలో తుమకూరులో టిఫిన్ చేయగా రేణుకాస్వామే బిల్ చెల్లించాడు. బెంగళూరు వచ్చేలోపు పలుసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. వారంతా రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లగా అను, రవి, జగ్గు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు రేణుకాస్వామి హత్య జరిగిపోయింది, అప్రూవర్‌గా మారతారా? అంటూ ప్రశ్నించాడు. రవి అందుకు నిరాకరించడంతో కారు అద్దె రూ.4వేలు ఇచ్చి పంపించేశాడు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. అనంతరం హత్య వెలుగు చూసి విషయం పెద్దది కావడంతో భయపడ్డ రవి పోలీసులకు లొంగిపోయాడు. -
హత్యపై దర్శన్ కుమారుడు కామెంట్.. కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రియురాలు పవిత్రగౌడ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె కారణంగానే ఈ హత్య జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. పవిత్ర వల్లే తన అభిమాన హీరో జీవితం నాశనం అవుతుందని రేణుకాస్వామి భావించాడు. ఆమె వల్లే భార్యను దర్శన్ దూరం చేసుకున్నాడని భావించిన రేణుకాస్వామి పవిత్రకు రేణుకాస్వామి వార్నింగ్ మెసేజ్‌లు పెట్టినట్లు తెలుస్తోంది.కన్నీళ్లు పెట్టుకున్న దర్శన్ ప్రియురాలుపోలీసుల విచారణలో నటి పవిత్ర కన్నీరు పెట్టుకుంది. తను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చింది. 'చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి నాకు అసభ్య మెసేజ్‌లతో పాటు అశ్లీల చిత్రాలను పంపేవాడు. ఈ విషయాన్ని దర్శన్‌కు చెప్పి తప్పు చేశాను. ఒకవేళ రేణుకాస్వామి విషయాన్ని ముందుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింటే ఈ హత్య జరిగేది కాదు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.నా తండ్రిని దూషిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు: దర్శన్ కుమారుడురేణుకాస్వామి హత్యకేసులో అరెస్ట్ అయిన తన తండ్రి దర్శన్ గురించి 'వినీశ్ తూగుదీ' (15) ఒక పోస్ట్ పెట్టాడు. నా తండ్రి దర్శన్‌తో పాటు తల్లి విజయలక్ష్మికి మానసిక ప్రశాంతత అవసరం ఉంది. నా తండ్రిని భూతులతో దూషిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. నా తండ్రి హత్య చేసి ఉంటాడని నేను నమ్మడం లేదు. పోలీసుల దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయి. అంతవరకు కాస్త ఓపిక పట్టండి.' అని ఆవేదనతో దర్శన్ కుమారుడు వినీశ్ చెప్పుకొచ్చాడు. -
దర్శన్ కేసులో మరో నటుడు అరెస్ట్
ప్రముఖ నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్, ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో అరెస్టులు పెరుగుతున్నాయి. క్రమంగా మరింతమంది పాత్ర బయటపడుతోంది. పోలీసులు తాజాగా ప్రదోశ్ అనే నటున్ని అరెస్టు చేశారు. దీంతో అరైస్టెన నిందితుల సంఖ్య 14కు చేరింది. ప్రదోశ్ పలు కన్నడ చిత్రాలలో సహాయక నటునిగా నటించాడు. దర్శన్‌తో కలిసి బృందావన, బుల్ బుల్ సినిమాలలో నటించాడు. దర్శన్ గ్యాంగ్‌లో ప్రదోశ్ ఒకడిగా పేరుంది. గతంలో ఓ బీజేపీ మంత్రి వద్ద పని చేశాడు, ఆ పార్టీ ఐటీ విభాగంలోనూ ముఖ్యునిగా ఉండేవాడు. రేణుకాచార్య హత్య తరువాత దర్శన్ ప్రదోశ్‌కు రూ.30 లక్షలు ఇచ్చి సెటిల్ చేయమని సూచించాడు. ఈ కేసులో ఇంకా ముగ్గురు నిందితులు జగదీష్, రవి, రాజు ఉన్నారని, పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, రేణుకాచార్య మృతదేహానికి బౌరింగ్ ఆస్పత్రిలో జరిపిన పోస్టుమార్టంలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతనికి ప్రైవేటు భాగాల్లో తీవ్రంగా హింసించారని, శరీరంలో అనేకచోట్ల గాయాలై ఎముకలు విరిగి ఉన్నాయని తెలిపారు.ఠాణా చుట్టూ నిషేధాజ్ఞలుదర్శన్, పవిత్రగౌడ, ఇతర నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్‌స్టేషన్‌లో కస్టడీలో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో దర్శన్ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో వారిని అదుపుచేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అందుకే పోలీస్ స్టేషన్‌ను షామియానాతో మూసివేసి భద్రత పెంచారు. స్టేషన్ కాంపౌండ్‌ను పరదాలతో కప్పేసారు. సామాన్య ప్రజలను ఎంతో అవసరమైతే కానీ లోపలకు అనుమతించడం లేదు. లోపల ఎవరూ ఫోటోలు, వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టూ 144 నిషేధాజ్ఞలు, అలాగే 200 మీటర్ల చుట్టూ కర్ఫ్యూ విధించారు. ఈ నెల 17 వరకు ఇవి అమలులో ఉంటాయి. బాడీ తరలించిన స్కార్పియో సీజ్కామాక్షిపాళ్యలోని పట్టణగెరెలో షెడ్ నుంచి రేణుకాస్వామి మృతదేహాన్ని తరలించడానికి వాడిన స్కార్పియో కారుని కామాక్షిపాళ్య పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఆర్ నగర దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుని ఇంటి వద్ద ఈ వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వాహనం పునీత్ అనే వ్యక్తి పేరుమీద రిజిస్టర్ అయ్యింది. షెడ్ నుండి శవాన్ని తరలించడానికి సహాయపడిన గ్యారేజ్ మంజు కోసం పోలీసులు వెతుకుతున్నారు.భార్య ఇన్‌స్టా ఖాతా డిలిట్దర్శన్ భార్య విజయలక్ష్మి తన ఇన్‌స్టా ఖాతాను క్లోజ్ చేసి డిలిట్ చేశారు. దర్శన్ అరెస్టు కాగానే భర్తను ఇన్‌స్టా లో అన్‌ఫాలో చేశారు. ఇప్పుడు దర్శన్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా వస్తున్న కామెంట్లు, పోస్టులతో ఏకంగా ఇన్‌స్టా నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. విజయలక్ష్మికి ముందునుంచి భర్తతో గొడవలు ఉండడం తెలిసిందే. ఈ కేసులతో విడాకులు తీసుకోవచ్చని సమాచారం.దర్శన్‌ను సస్పెండ్ చేయలేదుహత్య కేసులో అరైస్టెన దర్శన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అందరితో చర్చించి చర్యలు తీసుకుంటామని కన్నడ సినిమా వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్ఎం సురేశ్ తెలిపారు. కన్నడ ఆర్టిస్టుల సంఘం,వాణిజ్య మండలి, ఇతర సినీ పెద్దలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని, దర్శన్‌ను కన్నడ చిత్ర రంగం నుంచి సస్పెండ్ చేశారనే వార్త అవాస్తవమన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, వాణిజ్య మండలి ఎవరి తరఫున మాట్లాడదని అన్నారు. దర్శన్‌పై ఆరోపణ మాత్రమే ఉందని, కోర్టులో తీర్పు తరువాతే ఆయన నేరం చేశాడా, కాదా అనేది తెలుస్తుందన్నారు. మరోవైపు దర్శన్‌కు వ్యతిరేకంగా మండ్య సహా పలు ప్రాంతాల్లో భారీ నిరసనలు జరిగాయి. -
సినిమాను మించిన ట్విస్ట్‌లు.. దర్శన్ కేసులో విస్తుపోయే నిజాలు!
ఇటీవలే కాటేరా మూవీతో హిట్ కొట్టిన శాండల్‌వుడ్ హీరో దర్శన్ పేరు ప్రస్తుతం ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని(28) హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలు రావడం కన్నడ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ కేసులో మరో నటి, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు ఇదంతా చూస్తుంటే ఓ క్రైమ్ సినిమాను తలపించేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు అసలు పవిత్ర గౌడ ఎవరు? అని తెగ ఆరా తీస్తున్నారు. అసలు ఆమెకు, దర్శన్‌కు మధ్య రిలేషన్ ఏంటని శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదా సహజీవనం చేస్తున్నారా? అన్న విషయాలపై నెట్టింట తెగ వెతికేస్తున్నారు.నటిగా ఎంట్రీ ఇచ్చి...మొదట టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవిత్ర సినిమాల్లోనూ నటించింది. 2016లో 54321 అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా రెడ్ కార్పెట్ స్టూడియో 777 పేరిట ఒక బొటిక్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇటీవలే ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో కలకలం సృష్టించింది. మా బంధానికి పదేళ్లు అంటూ దర్శన్‌తో ఉన్న ఫోటోలను పవిత్ర పంచుకుంది.దర్శన్‌కు పెళ్లి.. పవిత్ర గౌడతో సహజీవనంమరోవైపు ఈ కేసులో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. హీరో దర్శన్‌కు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి రిలేషన్ వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని అశ్లీల సందేశాలు పోస్ట్ చేేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని దర్యాప్తులో వెల్లడైంది. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు రూ.30 లక్షలు ఇస్తానని దర్శన్ తమకు ఆఫర్ ఇచ్చాడని ముగ్గురు నిందితులు వెల్లడించారు. -
దునియా విజయ్ కేసులో నేడు తుది తీర్పు.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవాలని కన్నడ హీరో దునియా విజయ్ 2018లోనే కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, నేడు తుది తీర్పును కోర్టు వెళ్లడించనుంది. దీంతో ఆయన ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. వీర సింహా రెడ్డి చిత్రంలో విలన్‌గా నటించిన ఆయన తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు.నాగరత్న,దునియా విజయ్, అతని రెండవ భార్య కీర్తి మధ్య అప్పట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఎప్పుడూ వారు వార్తల్లో నిలిచేవారు. కుటుంబ గొడవలు వీధినపడటంతో మంచిది కాదని భావించిన విజయ్ నాగరత్నతో తెగతెంపులు చేసుకోవాలని భావించి బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల అర్జీ పెట్టుకున్నాడు. ఆపై 2019లో దునియా విజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యాడు. నాగరత్నతో కలిసి జీవించలేనని పేర్కొన్నాడు. ఆ సమయం నుంచి విజయ్ తన రెండో భార్య కీర్తితోనే ఉన్నాడు. దాదాపు 6 ఏళ్లుగా కోర్టులో వీరి విడాకుల కేసు విచారణ జరుగుతుండగా.. ఈ సాయింత్రం తుది తీర్పు వెలువడనుంది.నాగరత్నతో దూరంగా ఉన్న విజయ్ పిల్లల బాధ్యత మాత్రం తనే తీసుకుంటానని ఆప్పట్లోనే తెలిపాడు. నాగరత్నకు భరణం కూడా చెల్లించినట్లు ఆయన గతంలో చెప్పాడు. అయితే, కోర్టుకు వచ్చిన ప్రతిసారీ తనకు భర్త కావాలని నాగరత్న చెప్పేదని కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. విజయ్ తన పిల్లలను ఇతర దేశాల్లోనే చదవించాడు. కొద్దిరోజుల క్రితం విజయ్ పెద్ద కూతురు రితన్య మొదటి సినిమాని ప్రకటించింది. రెండో కూతురు మోనిక విదేశాల్లో చదువుకుంటుంది. కుమారుడు సామ్రాట్ కూటా తన చదువు పూర్తి అయిన తర్వాత సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఖాకీ కస్టడీలో హీరో
సినిమాలో కంటే నిజజీవితంలో జరిగే సంఘటనలే మరింత నాటకీయంగా ఉంటాయని మళ్లీ రుజువైంది. షూటింగ్లో ఉండగా ప్రముఖ నటున్ని పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆయన సన్నిహితురాలిని కూడా నిర్బంధించడం సినీ ఫక్కీలో జరిగిపోయింది. గతంలో కుటుంబ కలహాలతో వార్తల్లోకెక్కిన దర్శన్ ఇప్పుడు హత్య కేసులో నిందితుడు అయ్యాడు.దొడ్డబళ్లాపురం: ఓ యువకుని హత్యకు సంబంధించి ప్రముఖ హీరో, చాలెంజింగ్ స్టార్ దర్శన్, మరో నటి, ఆయన సన్నిహితురాలు పవిత్రగౌడతో పాటు 10 మంది బౌన్సర్లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉందని కామాక్షిపాళ్య పోలీసులు మంగళవారం మైసూరులో దర్శన్‌ను అరెస్టు చేసి రాజధానికి తరలించారు. దర్శన్ అరెస్టు విషయం తెలుసుకున్న అభిమానులు కామాక్షిపాళ్య పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బాస్.. బాస్.. ది బాస్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ నగరలోని దర్శన్ నివాసంతో పాటు పలుచోట్ల పోలీసులు భద్రతను పెంచారు. పవిత్రపై అసభ్య మెసేజ్‌లు... పోలీసు కమిషనర్ బి.దయానంద చెప్పిన ప్రకారం... సోషల్ మీడియాలో పవిత్రగౌడ ఫోటోలపై రేణుకాస్వామి తరచూ అసభ్యంగా మెసేజ్‌లు పెట్టేవాడు. ఆమె దర్శన్‌కు చెప్పడంతో రేణుకాస్వామిని గుర్తించి పట్టుకుని జూన్ 8న రాత్రి కామాక్షిపాళ్య వద్ద ఉన్న దర్శన్ అనుచరుడు వినయ్‌కు చెందిన షెడ్లోకి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. అప్పుడు దర్శన్ అక్కడే ఉన్నారు. తరువాత మృతదేహాన్ని దగ్గరలో కాలువలోకి విసిరేశారు. జూన్ 9న సుమ్మనహళ్లి వద్ద ఉన్న రాజకాలువలో రేణుకాస్వామి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రేణుకాస్వామిదిగా గుర్తించి విచారణ చేపట్టారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు డబ్బు గొడవలతో ఈ హత్య చేసినట్టు చెప్పుకుని పోలీసుల వద్ద లొంగిపోయారు. అయితే వారి వాంగ్మూలాలలో తేడా గమనించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించగా దర్శన్ పేరు చెప్పారు. చిత్రదుర్గ నుంచి ఇలా రప్పించారు చిత్రదుర్గలో కేఈబీ రిటైర్డ్ ఇంజినీర్ కాశినాథ్ శివనగౌడ, రత్నప్రభ దంపతుల కుమారుడు రేణుకాస్వామి. గత ఏడాది సహనా అనే యువతితో పెళ్లయింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణీ. అతడు కూడా దర్శన్‌కు అభిమాని. ఈ నేపథ్యంలో రేణుకాస్వామిని మాయమాటలతో బెంగళూరులో నిందితుల వద్దకు తీసుకువచ్చిన చిత్రదుర్గ దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను కూడా పోలీసులు అరెస్టు చేసారు. గత శనివారం దర్శన్ పిలుస్తున్నాడని చెప్పి రేణుకాస్వామిని రాఘవేంద్ర బెంగళూరుకు తీసుకువెళ్లాడు. శనివారం మధ్యాహ్నం తల్లితండ్రులకు ఫోన్ చేసిన రేణుకాస్వామి తాను స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి వెళ్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత రేణుకాస్వామి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబసభ్యుల్లో భయం నెలకొంది. చిత్రదుర్గ చెళ్లకెరె గేట్ వద్ద బాలాజీ బార్ వద్ద బైక్ లభ్యమైంది. సోమవారం మధ్యాహ్నం కామాక్షిపాళ్య పోలీసులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కుమారుని హత్య వార్త తెలిసి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పలుచోట్ల భద్రత పెంపు పోలీసులు దర్శన్, పవిత్ర, ఇతర నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య బౌరింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపి తరువాత తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మంది నిర్బంధంలో ఉన్నారు. దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే తీసుకెళ్లారని ఆయన లాయర్ నారాయణస్వామి మీడియాకు తెలిపారు. దర్శన్‌ను వెస్ట్ డీసీపీ గిరీశ్ విచారిస్తున్నారని తెలిపారు. మొత్తం ఈ వ్యవహారం రాష్ట్ర సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర సంచలనానికి కారణమైంది. పలువురు సెలబ్రిటీలు విస్మయం వ్యక్తంచేశారు.దర్శన్ ప్రమేయంపై విచారణ : హోంమంత్రిశివాజీనగర: ఓ హత్య కేసులో నటుడు దర్శన్ పాత్ర గురించి విచారణ జరుగుతోంది, ఆ తరువాతనే స్పష్టత వస్తుందని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం నగరంలో ఆయన మాట్లాడుతూ చిత్రదుర్గకు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో దర్శన్ పేరు వినిపించింది. అందుచేత విచారణ కోసం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందుగా అరెస్ట్ అయిన నిందితులు దర్శన్ పేరు చెప్పారు. ఏ కారణానికి హత్య జరిగింది? దర్శన్ పేరు ఎందుకు వచ్చింది అనేది దర్యాప్తు తరువాతనే స్పష్టమవుతుంది అని చెప్పారు. -
బిగ్‌బాస్ షోలో లవ్, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు!
బిగ్‌బాస్ షోలో చూపించే లవ్ అంతా ఉట్టిదే అని చాలామంది అంటుంటారు. కానీ తమ ప్రేమ నిజమైనదని, అగ్నిలాగ స్వచ్ఛమైనదంటూ కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ చందన్ శెట్టి, నివేదిత గౌడ నిరూపించారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 26న ఎంతో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. హనీమూన్‌కు నెదర్లాండ్‌కు వెళ్లి వచ్చారు.ట్విస్ట్ ఇచ్చిన జంటసోషల్ మీడియాలోనూ తరచూ జంటగా ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉండేవారు. ఇంత అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు కలకాలకం కలిసుంటారనుకున్న అభిమానులకు వీరు పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారట! బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సైతం దరఖాస్తు చేశారని ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై ఇంతవరకు చందన్, నివేదిత గౌడ స్పందించనేలేదు.బిగ్‌బాస్ షోలో..కాగా చందన్ శెట్టి రైల్వే చిల్డ్రన్, జోష్లే, పొగరు, చూ మంతర్ వంటి కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సొంతంగా పాటలు కూడా వదిలేవాడు. కన్నడ బిగ్‌బాస్ ఐదో సీజన్లో విజేతగా నిలిచాడు. ఇదే సీజన్లో నివేదిత కూడా పార్టిసిపేట్ చేసింది. మొదట ఫ్రెండ్సయిన వీరు తర్వాత రిలేషన్లోకి దిగారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లు జంటగా నటించిన క్యాండీ క్రష్ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. -
పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు)
-
తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు
కన్నడ నటుడు చేతన్ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. గుడికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి నటుడిపై దాడి చేశారు. అతడి కారును సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం చోటు చేసుకుంది. నటుడు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 12న మాతృదినోత్సవం సందర్భంగా నటుడు చేతన్ చంద్ర తన తల్లిని తీసుకుని గుడికి వెళ్లాడు. నటుడిపై దాడితిరుగు ప్రయాణమైన సమయంలో ఓ వ్యక్తి తనను ఫాలో చేయడమే కాక కార్ డ్యామేజ్ చేశాడు. ఇదేంటని వెళ్లి ప్రశ్నించగా.. వెంటనే 20 మంది అక్కడికి చేరుకుని నటుడిపై దాడికి దిగారు. రక్తం వచ్చేలా చితకబాదారు. ముక్కు పగలగొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు ఆ దుండగులు మళ్లీ నటుడి కారు దగ్గరకు చేరుకుని దాన్ని ధ్వంసం చేశారు. ఆ గ్యాంగ్‌లో ఓ మహిళ కూడా ఉంది.న్యాయం కావాలితనకు జరిగిన అన్యాయాన్ని చేతన్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇది చాలా భయంకరమైన సంఘటన.. నాకు న్యాయం కావాలి అంటూ గాయాలతో ఉన్న వీడియోను షేర్ చేశాడు. తాగిన మత్తులో ఉన్న వ్యక్తి.. నటుడి కారును చేజ్ చేయాలని ప్రయత్నించే క్రమంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.నిందితుడు అరెస్ట్చేతన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా చేతన్ 'సత్యం శివం సుందరం' అనే సీరియల్లో నటించాడు. 'ప్రేమిజం', 'రాజధాని', 'జరాసంధ', 'కుంభ రాశి', ప్లస్', 'బజార్'.. ఇలా తదితర కన్నడ చిత్రాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Chetan Chanddrra (@chetan_chanddrra) -
తెలుగు ఇండస్ట్రీలో బ్యాన్.. భార్యతో కలిసి గుడ్‌న్యూస్ చెప్పిన హీరో
ఈ మధ్య సీరియల్ యాక్టర్స్ వరుస శుభవార్తలు చెప్తున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి పండంటి బాబుకు జన్మనివ్వగా లేడీ విలన్ శోభా శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలాగే బుల్లితెర కమెడియన్ కొండమ్మ త్వరలో తల్లి కాబోతోంది. తాజాగా ఈ లిస్టులోకి మరో సెలబ్రిటీ కపుల్ వచ్చి చేరింది.తెలుగువారికి సుపరిచితుడే!చందన్ కుమార్- కవిత దంపతులు త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చందన్ తెలుగు సీరియల్స్ చూసేవారికి సుపరిచితుడే..! సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్‌తో గుర్తింపు పొందిన చందన్ కుమార్ శ్రీమతి శ్రీనివాస్ ధారావాహికలోనూ ప్రధాన పాత్ర పోషించాడు.చందన్‌పై బ్యాన్అయితే ఈ సీరియల్ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. అతడి తల్లిని దుర్భాషలాడటంతో ఆయన చందన్ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో చందన్ తెలుగు బుల్లితెర గురించి దురుసుగా మాట్లాడాడు. ఇందుకుగానూ తెలుగు టీవీ ఫెడరేషన్ అతడిపై బ్యాన్ విధించింది. అలా ఈ కన్నడ నటుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.ఇటీవలే కొత్త బిజినెస్కాగా చందన్- కవిత ఇటీవలే ఫుడ్ బిజినెస్‌లోకి దిగారు. మండిపేట్ ప్లేట్ ఇడ్లీ కేఫ్ పేరిట వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభించారు. కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశాడు. చందన్ ఇటీవల జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ తరపున ఆడాడు. ఇతడు హీరోగా కన్నడ భాషలో పరిణయ, కట్టె, లవ్యూ అలియా, బెంగళూర్ 560023, ఎరడోండ్ల మూరు, ప్రేమ బరహ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by K A V I T H A (@iam.kavitha_official) -
కొత్త కారు కొన్న స్టార్ హీరో సతీమణి.. ధర ఎంతో తెలిస్తే
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించి మూడేళ్లు కావస్తుంది. ఆయన మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను ఆయన సతీమణి అశ్విని తన భుజాన వేసుకున్నారు. ఆమె ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమా పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల హోస్పేటలో జరిగిన 'యువ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సగంలో వదిలేసిన పనులను అశ్విని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన పిఆర్‌కె ప్రొడక్షన్స్‌కు సంబంధించిన పలు సినిమాలు నిర్మాణరంగంలో ఉన్నాయి. ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్‌లను ఆమె కొనసాగిస్తున్నారు. వాటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రంమలో నిర్మాత అశ్విని పునీత్ రాజ్‌కుమార్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పునీత్‌కు కూడా కారు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు AudiQ7 కారు ఆ జాబితాలో చేరింది. ఈ రోజుల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. ఆడి క్యూ7 ఇతర కార్ల కంటే డిజైన్, లుక్స్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ తదితర అంశాల్లో చాలా భిన్నంగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇది లీటర్ పెట్రోల్‌కు 14 కి.మీల మైలేజీని కూడా ఇస్తుంది. క్షణాల్లో 250 KMPH స్పీడ్‌ను అందుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలతో కూడిన ఆడి క్యూ7 కారు ఆన్-రోడ్ ధర రూ.1 కోటి 10 లక్షల వరకు ఉంటుంది. 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా తన భార్య అశ్వినికి రూ. 5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారుని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు పునీత్. అంతకు ముందు కూడా జాగ్వార్ కారుని తన భార్యకి గిఫ్ట్‌గా పునీత్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశ్విక కొన్న కారు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
సడన్‌గా ఓటీటీకి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చాక కొత్త కొత్త సినిమాలు చూసేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలను ఓటీటీలు అందిస్తున్నాయి. ఏ భాష సినిమా అయిన డబ్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గతంలో కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి రెండు పార్టులుగా వచ్చి సక్సెస్ సాధించింది. ప్రేమకథగా వచ్చిన ఈ సిరీస్‌కు అభిమానుల నుంచి ఆదరణ దక్కించుకుంది తాజాగా మరో కన్నడ ప్రేమకథ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కథగా తెరకెక్కించిన ఒండ్రు సరళ ప్రేమ కథె చిత్రం సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో వినయ్ రాజ్‌కుమార్, మల్లికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 8న రిలీజైన ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కన్నడ భాషలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను తెలుగు డబ్బింగ్లో తీసుకోస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో స్వస్తిష్ట, రాజేశ్ నటరంగ, అరుణ్ బలరాజ్, సాధు కోకిల, కార్తిక్ మహేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని రామ్ మూవీస్ పతాకంపై మైసూర్ రమేశ్ నిర్మించగా.. వీర్ సామ్రాట్ సంగీతం అందించారు. -
మీ ఆశీస్సులే మమ్మల్ని బతికించాయి: స్టార్ హీరో పోస్ట్ వైరల్!
ఇటీవల విమాన ప్రమాదాల గురించే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఇలాంటి అనుభవాన్ని పంచుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా విమానం ల్యాండింగ్ సమస్య రావడంతో భయాందోళనకు గురైనట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా తెలిపింది. ఆ సమయంలో రష్మికతో పాటు మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా ఆమెతో పాటే ఉన్నారు. తాజాగా అలాంటి అనుభవమే మరో స్టార్ హీరోకు ఎదురైంది. తొలిసారి మృత్యువు నుంచి ఆ దేవుడే మమ్మల్ని కాపాడారంటూ కన్నడ నటుడు ధృవ సర్జా పోస్ట్ చేశారు. నా జీవితంలో మొదటిసారి ఎదురైన చేదు సంఘటనను ఇన్‌స్టా ద్వారా షేర్ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఫ్లైట్ ల్యాండింగ్‌కు ఇబ్బందులు రావడంతో మేమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం అంతా క్షేమంగా ఉన్నామని వెల్లడించారు. ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఢిల్లీ నుంచి ఓ పాట చిత్రీకరణ కోసం శ్రీనగర్‌కు ధృవ సర్జా బృందం బయలుదేరింది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అందరూ ఒక్కసారిగా తీవ్ర భయందోళనకు గురయ్యారు. కానీ పైలెట్ చాకచక్యంగా వ్యవహరించిన సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో చిత్రబృంద సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ మాకు నిజంగా పునర్జన్మ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత ఇండిగో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలో తీవ్ర అల్లకల్లోల వాతావరణ పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించడంతో శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. కాగా..కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా మార్టిన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ సర్జా కథ అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఓ పాట షూట్ చేసేందుకు శ్రీనగర్ వెళ్లారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) -
సలార్‌తో పోటీ పడిన సూపర్ హిట్ మూవీ.. ఓటీటీకి వచ్చేస్తోంది!
కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన చిత్రం కాటేరా. గతేడాది సలార్‌కు పోటీగా కర్ణాటకలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తరుణ్ సుధీర్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 9న నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా రిలీజైంది. పెద్ద సినిమాతో పోటీ కలెక్షన్స్ రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సలార్‌ను పక్కకు నెట్టి భారీ వసూళ్లు సాధించింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఫిబ్రవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అయితే మొదట దర్శన్ బర్త్ డే సందర్భంగా ఈనెల 16న ఓటీటీకి తీసుకురావాలని నిర్ణయించారు. కానీ వారం రోజులు ముందుగానే స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అయితే ఈనెల 9న కేవలం కన్నడలోనే అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం వర్షన్లు మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. కాటేరా 2023లో శాండల్‌వుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాల్లో ఏడో స్థానంలో నిలిచింది.ఈ చిత్రంలో సీనియర్ కథానాయిక మాలాశ్రీ కూతురు ఆరాధన రామ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రాక్‌లైన్ వెంకటేష్ ఈ మూవీని నిర్మించాడు. -
నేను రామభక్తుడిని.. అయోధ్యలోనే నా పెళ్లి..: నటుడు
పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిపేందుకు జనాలు ఏమాత్రం వెనుకాడటం లేదు. కొందరైతే తమ స్థోమతకు మించి అప్పు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. సామాన్య జనాలే ఇలా ఉంటే సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు. హల్దీ దగ్గరి నుంచి రిసెప్షన్ వరకు అంతా ఘనంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాదు తమ స్వస్థలాలలో కాకుండా ఏదైనా ప్యాలెస్‌లోనో లేదంటే వేరే దేశంలోనో వివాహం చేసుకుంటున్నారు. ఇందుకోసం కోట్లు గుమ్మరించడానికి కూడా వెనుకాడటంలేదు. రామభక్తుడిని.. అందుకే.. అయితే కన్నడ నటుడు రామ గౌడ మాత్రం అక్కడో, ఇక్కడో ఎందుకు అయోధ్యలోనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నటుడు రామ గౌడకు ఐశ్వర్య అనే అమ్మాయితో సోమవారం (జనవరి 22న) నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇకపోతే ఈ మధ్యే అయోధలో రామమందిరం ప్రారంభం కావడంతో ఆ ప్రదేశంలోనే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అరుణ్. దీని గురించి అతడు మాట్లాడుతూ.. 'నేను రామభక్తుడిని. అందుకే అయోధ్యలో ఆ రాములవారి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. యాక్టింగ్‌తో పాటు బిజినెస్ మేమిద్దరం పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. కెరీర్లో స్థిరపడ్డాకే జీవితంలో ముందడుగు వేయాలనుకున్నాం. ఇప్పుడా సమయం వచ్చిందని భావిస్తున్నాం. ఇన్నాళ్లకు పెళ్లికి సిద్ధపడటంతో మా కుటుంబసభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఐశ్వర్య చాలా నిజాయితీగా ఉంటుంది. ఎంతో అర్థం చేసుకుంటుంది. నాకంటూ ఓ రెస్టారెంట్ బిజినెస్ కూడా ఉంది. అటు సినిమాలు, ఇటు బిజినెస్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఆరు నెలల్లో దర్శకుడిగా ఓ సినిమా తీయబోతున్నాను. దాని తర్వాత అంటే ఈ ఏడాది చివర్లో మేము అయోధ్యలో పెళ్లి చేసుకుంటాం' అని చెప్పాడు. చదవండి: బామ్మ మరణంతో బాధలో కూరుకుపోయా.. అర్థం చేసుకుని.. మిల్కీబ్యూటీ ఇలా మారిపోయిందేంటి? ఇదంతా దాని కోసమేనా? -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. స్టార్ హీరోకు షాకిచ్చిన పోలీసులు!
ఇటీవలే కాటేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కన్నడ స్టార్ హీరో దర్శన్. గతేడాది చివర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కర్ణాటక వ్యాప్తంగా రికార్డ్ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ శాండల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన దర్శన్.. సమయం ముగిసిన తర్వాత పార్టీని కొనసాగించారని బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీకి హాజరైన సినీ ప్రముఖులతో పాటు పబ్ యజమానిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో హీరో దర్శన్‌తో పాటు ధనంజయ, అభిషేక్ అంబరీష్, రాక్‌లైన్ వెంకటేష్‌లకు పోలీసు అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఎఫ్ఐఆర్పై ఇప్పటివరకు నటీనటులు ఎవరూ స్పందించలేదు. అసలేం జరిగిందంటే.. న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులోని రాజాజీ నగర్‌లోని ఓ పబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో కన్నడ నటీనటులు పాల్గొన్నారు. అయితే సమయానికి మించి అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా పార్టీని కొనసాగించారు. సెలబ్రిటీలంతా కేక్‌లు కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా.. దర్శన్ నటించిన కాటేరా చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరాధన రామ్ హీరోయిన్గా నటించగా.. టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో కనిపించారు. -
Deepika Padukone Unseen Photos: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె బర్త్‌డే స్పెషల్.. ఈ రేర్ ఫొటోలు చూశారా?
-
ఆస్పత్రిలో చేరిన నటి హేమా చౌదరి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి
సౌత్ ఇండియ ప్రముఖ నటి హేమా చౌదరి బ్రెయిన్ హెమరేజ్ కారణంగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందించడం లేదని సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడంతో ఆమె కుమారుడు కూడా నేడు విదేశాల నుంచి వస్తున్నాడు. నటి హేమా చౌదరి ఎక్కువగా కన్నడ చిత్రాల్లోనే నటించి ఆపై తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో 100కు పైగా చిత్రాల్లో మెప్పించింది. కన్నడలో డా. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్‌నాగ్, అనంతనాగ్, రవిచంద్రన్ వంటి ప్రముఖ నటులతో నటించారు. కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు, ప్రేమ్ నజీర్ తదితరులతో కూడా నటించారు. కె.బాలచందర్, డి.యోగానంద్, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కె.శంకర్ లాంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో కూడా హేమా చౌదరి నటించారు. పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ,మేస్త్రీ, ప్రేమాలయం వంటి చిత్రాల్లో ఆమె నటించించారు. ఆపై కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్ పాపులర్ స్టార్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్సకు స్పందించడం లేదు. విదేశాల నుంచి కుమారుడి రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నెట్టింట్లో వైరల్ అవుతున్న 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు
-
భారతదేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్.. ఎవరీ పల్వంకర్ బాలూ
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. లీగ్ మ్యాచుల్లో అదరగొట్టి ఓటమి ఎరుగని జట్టుగా పేరుతెచ్చిన భారత్.. ఫైనల్లో చతికిలబడింది. తుదిపోరులో ఆరు వికేట్ల తేడాతో రోహిత్ సేన జట్టు కంగారుల చేతిలో ఘోర పరాజయపాలైంది. అయితే హోం గ్రౌండ్లో టీమిండియా ఓటమిని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 12 తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడుతుందనుకున్న భారత్‌కు ఇలా జరగడంపై తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఉద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ కుమార్ అహింస చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్రికెట్లో కూడా రిజర్వేషన్లు ఉండాలని, ఒకవేళ ఇప్పటికే రిజర్వేషన్లు ఉంటే భారత్ వరల్డ్‌కప్ సులువగా గెలిచేదని తెలిపారు. వరల్డ్ కప్ జరిగే రోజు చేతన్ మరో ట్వీట్ కూడా చేశాడు. డబ్బు, కీర్తి కోసం కాకుండా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లు దేశానికి అవసరమని.. 1876లో కర్ణాటకలోని ధర్వాడ్‌లో జన్మించిన భారత దేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్ పల్వకంర్ బాలూ ప్రస్తావన తీసుకొచ్చారు. వందేళ్ల క్రితం పల్వంకర్ బాలూ క్రికెటర్(బౌలర్)గా, సామాజిక, రాజకీయ కార్యకర్తగా చురుకుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చేతన్ అహింస ప్రస్తావనతో పల్వంకర్ బాలూ గురించి బయటకొచ్చింది. పల్వంకర్ బాలూ భారతీయ క్రికెటర్, రాజకీయ కార్యకర్త. 1876 మార్చి 19న కర్ణాటకలోని ధార్వాడ్‌లో(ఒకప్పటి బాంబే ప్రెసిడెన్సీ) జన్మించాడు. ప్రపంచ క్రీడల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన దళిత సమాజానికి చెందిన మొదటి వ్యక్తిగా బాలూ చరిత్రకెక్కాడు. అతడు పరమానందాస్ జీవందాస్ హిందూ జింఖానా, బాంబే బెరార్, కేంద్ర రైల్వేశాఖకు చెందిన కార్పొరేట్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. ఎడమ చేతి స్పిన్ బౌలర్ అయిన బాలూ.. మొత్తం 33 ఫస్ట్-క్లాస్మ్యాచ్లలో (15.21 బౌలింగ్ సగటుతో) 179 వికెట్లు పడగొట్టాడు. 1911 ఇంగ్లాండ్ పర్యటనలో ఇండియా తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ‘రోడ్స్ ఆఫ్ ఇండియా’గా పేరు సంపాదించాడు. అయితే బాలూ తన సామాజిక వర్గం కారణంగా కెరీర్లో అనేక వివక్షతను ఎదుర్కొన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా ముద్ర పడటంతో సమాన అవకాశాలు దక్కలేదనే విమర్శ ఉంది. ఒకసారి పుణెలో మ్యాచ్ ఆడుతుండగా.. టీ విరామం సమయంలో అతనికి టీం సభ్యులందరితో కాకుండా బయట డిస్పోజబుల్ కప్పులో అందించినట్లు, అతనికి భోజనం కూడా ప్రత్యేక టేబుల్‌పై వడ్డించినట్లు వార్తలొచ్చాయి. పల్వంకర్ తన ముఖం కడక్కోవాలనుకున్నా అణగారిన వర్గానికి చెందిన అటెండర్ అతనికి ఒక మూలన నీళ్లు తెచ్చి పెట్టేవాడని తెలుస్తోంది. అయితే బాలూ బొంబాయికి మారిన తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. క్వాడ్రాంగ్యులర్ టోర్నమెంట్లో అతనికి హిందూ జట్టు కెప్టెన్సీ నిరాకరించారు. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా పల్వంకర్ పేరు గాంచారు. గాంధీ భావజాలంతో ప్రభావితమై.. దేశంలో హోమ్ రూల్ తీసుకురావడానికి కృషి చేశాడు. 1910లో పల్వంకర్ బీఆర్ అంబేద్కర్‌ను తొలిసారి కలిశాడు. అనంతరం ఇరువురు మంచి మిత్రులుగా మారారు. వీరిద్దరూ అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం దెబ్బతింది. 1932లో అణగారిన తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన డిమాండ్‌ను బాలూ వ్యతిరేకించాడు. అనంతరం అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ‘రాజా-మూంజే ఒప్పందం’పై సంతకమూ చేశాడు. అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారాలనే తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పుడు.. అణగారిన వర్గాలను ఇతర మతాల్లోకి మార్చడాన్ని 'ఆత్మహత్య'గా అభివర్ణించాడు. 1933లో బాలూ హిందూ మహాసభ టికెట్‌పై బొంబాయి మున్సిపాలిటీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓటమి చెందాడు. నాలుగు సంవత్సరాల తరువాత కాంగ్రెస్‌లో చేరి బొంబాయి శాసనసభ ఎన్నికలలో బీఆర్ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి మరోసారి పరాజయం పొందాడు. స్వాతంత్ర్యం అనంతరం 1955 జూలై4న బాంబే స్టేట్‌లో మరణించాడు. డాయన అంత్యక్రియలకు పలువురు జాతీయ నాయకులు మరియు క్రికెటర్లు హాజరయ్యారు. -
ప్రశ్నలతో తరచూ వివాదాల్లోకి! చేతన్ అహింస బ్యాక్‌గ్రౌండ్!
ముక్కుసూటిగా మాట్లాడే వైఖరి.. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే ధైర్యం.. నటుడు చేతన్ కుమార్ సొంతం. కానీ దీనివల్ల ఎన్నో సార్లు విమర్శలు, వివాదాలు అతడిని చుట్టుముట్టాయి. అయినా వాటిని లెక్క చేయకుండా తనకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు. భారత క్రికెట్ జట్టులో రిజర్వేషన్ ఉండి తీరాల్సిందేనంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమ్ముదుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో చేతన్ కుమార్ అలియాస్ చేతన్ అహింస ఎవరనేది ఓసారి చూద్దాం.. అమెరికా నుంచి వచ్చి.. చేతన్ కుమార్ 1983 ఫిబ్రవరి 24న అమెరికాలో జన్మించాడు. అతడికి అమెరికన్ పౌరసత్వం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ అమెరికాలో డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. వీరు కర్ణాటక నుంచి వలస వెళ్లినవారే! 2005లో యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న చేతన్ అక్కడ చదువుకునే సమయంలో కుల, మత, లింగ బేధాల గురించి అధ్యయనం చేశాడు. ఫుల్బ్రైట్ స్కాలర్ అందుకున్న ఇతడు ఈ ప్రాజెక్ట్‌పై మరింత అధ్యయనం చేసేందుకు కర్ణాటకకు వచ్చాడు. ఇక్కడికి వచ్చాక సమాజంలో జరుగుతున్న సమస్యలు తనను నిద్ర పోనీయకుండా చేశాయి. ఆ రెండే ఇష్టం చేతన్‌కు రెండే రెండు ఇష్టం.. ఒకటి నటన, రెండు సామాజిక సేవ. 2005లోనే చికాగో వదిలేసి పూర్తిగా ఇండియాకు షిఫ్ట్ అయిన ఇతడు తన కలలను సాకారం చేసుకున్నాడు. ముందుగా మైసూరుకు 25 కి.మీ. దూరంలో ఉన్న ముల్లూరు అనే గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. తర్వాత విస్తారా అనే థియేటర్ గ్రూపులో చేరి నటుడిగా మారాడు. ఇక తన ప్రాజెక్టు కోసం కర్ణాటక అంతా తిరుగుతున్న సమయంలో డైరెక్టర్ కేఎమ్ చైతన్యను కలిశాడు. అతడు చేతన్‌ను హీరోగా పెట్టి ఆ దినగాలు అనే కన్నడ సినిమా చేశాడు. ఇది అగ్ని శ్రీధర్ అనే అండర్ వరల్డ్ డాన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. 2007లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. అలా అహింస తోడైంది తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఇతడికి హీరోగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా ఎనిమిది సినిమాలు చేశాక చేతన్ కుమార్ తన పేరు పక్కన అహింస అనే పదాన్ని జోడించాడు. సామాజిక కార్యకర్తగా తన ఆశయాన్ని, లక్ష్యాన్ని తన పేరులో ఇనుమడింపజేసేందుకు చేతన్ కుమార్ అహింసగా మారాడు. లింగాయత్, ఎల్జీబీటీక్యూఐ, దళితులు, ఆదివాసీలు, రైతులు.. బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పటినుంచో ముందుండి పోరాడుతున్నాడు. తను నమ్మే సిద్ధాంతాలు, ఆశయాల కోసం ఎంతవరకైనా వెళ్తాడు. గర్భిణీల వెంట్రుకలు తినాలట.. సాధారణంగా సినీ సెలబ్రిటీలు దేనిపైనా స్పందించడానికి ఇష్టపడరు. కానీ చేతన్ మాత్రం అందుకు భిన్నంగా తన అభిప్రాయాన్ని బల్లగుద్ది చెప్తాడు. 2017లో అజ్జలు పద్ధతి అనే సాంప్రదాయాన్ని బహష్కరించేందుకు పెద్ద పోరాటమే చేశాడు. ఈ సాంప్రదాయం ప్రకారం ఉన్నత వర్గానికి చెందిన గర్భిణీల వెంట్రుకలు, గోళ్లను తక్కువ వర్గానికి చెందినవారు తినాలి. దీన్ని రూపుమాపాలంటూ చేతన్ చేసిన పోరాటం ప్రభుత్వాన్నే కదిలించింది. ఆ సాంప్రదాయన్ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా ఎన్నో పోరాటాలు చేశాడు. ఓసారి ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడంతో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. పలుమార్లు అసందర్భ వ్యాఖ్యలు చేసి విమర్శలపాలు కూడా అయ్యాడు. పెళ్లిలో అదే స్పెషల్ చేతన్ 2020 ఫిబ్రవరి 2న మేఘ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి కూడా అనాథాశ్రమంలో జరిగింది. పెళ్లి పత్రికలు కూడా విభిన్నంగా రూపొందించారు. వాటిని మట్టిలో పాతిపెట్టితే మొలకలు వచ్చేలా వెడ్డింగ్ కార్డ్‌లో విత్తనాన్ని పొందుపరిచారు. ట్రాన్స్‌జెండర్ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిగింది. వివాహానికి వచ్చిన అతిథులకు భారత రాజ్యాంగ పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం విశేషం. చదవండి: 'మళ్లీ చెప్తున్నా, అలా చేసుంటే భారత్ గెలిచేది..' నటుడి వ్యాఖ్యలపై ట్రోలింగ్ -
వరల్డ్‌కప్‌లో భారత్ ఓటమి.. నటుడి సంచలన వ్యాఖ్యలు
కోట్లాది మంది కల ఒక్కసారిగా బుగ్గిపాలైంది. గెలుపును మాత్రమే కలగన్నవారికి ఒక్కసారిగా భంగపాటు ఎదురైంది. అందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఆస్ట్రేలియా వరల్డ్ కప్పు ఎగరేసుకుపోయింది. టీమిండియా ఓటమితో యావత్ భారత్ ఉద్వేగానికి లోనైంది. భారత జట్టు మరోసారి చరిత్ర తిరగరాస్తుందనుకుంటే ఇలా జరిగిందేంటని క్రికెట్ అభిమానులు కలత చెందారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అహింస వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'నేను మళ్లీ చెప్తున్నా.. క్రికెట్ క్రీడలో కూడా రిజర్వేషన్స్ ఉండాలి. ఆ రిజర్వేషన్స్ ఈపాటికే అమలై ఉంటే భారత్ వరల్డ్ కప్ సులువుగా గెలిచేది' అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'అందరూ బాధలో ఉంటే నీ గోల ఏంటి?', 'ఇక్కడ కూడా రిజర్వేషన్లా?', 'పెద్ద సైకోలా ఉన్నావే?' అని ట్రోల్ చేస్తున్నారు. వరల్డ్ కప్ జరిగే రోజు చేతన్ మరో ట్వీట్ కూడా చేశాడు. 'ఈ రోజు క్రికెటర్లు బంతి క్యాచ్ చేస్తారు, లేదంటే విసురుతారు.. దాన్ని బ్యాట్‌తో కొడతారు.. అంతే తప్ప దేశ నిర్మాణం కోసం ఇసుమంత సాయం కూడా చేయరు. వందేళ్ల క్రితం పల్వంకర్ బాలూ అని ఓ దళిత క్రికెటర్ సామాజిక కార్యకర్తగా చురుకుగా పనిచేశాడు. డబ్బు, ఫేమ్ కోసం పాటుపడే వాళ్లు కాకుండా ఇతడిలా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లే దేశానికి అవసరం' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. I repeat, India needs reservations in cricket If India had cricket reservations, India would’ve easily won this #WorldCup ನಾನು ಮತ್ತೆ ಹೇಳುತಿದ್ದೇನೆ, ಭಾರತಕ್ಕೆ ಕ್ರಿಕೆಟ್ನಲ್ಲಿ ಮೀಸಲಾತಿ ಅಗತ್ಯವಿದೆ ಭಾರತಕ್ಕೆ ಕ್ರಿಕೆಟ್ನಲ್ಲಿ ಮೀಸಲಾತಿ ಇದ್ದಿದ್ದರೆ ಭಾರತ ಸುಲಭವಾಗಿ ಈ ವಿಶ್ವ ಕಪ್ಪನ್ನು ಗೆಲ್ಲುತ್ತಿತ್ತು — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) November 19, 2023 Indian cricketers today can throw/catch/hit a ball but dont contribute much to nation-building 100+ yrs ago, Palwankar Baloo—Dharwad-born bowler & India’s 1st Dalit cricketer—was an activist & acquaintance of Babasaheb India needs cricketrs who care fr society—not money & glory pic.twitter.com/L0Rs08LzxU — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) November 19, 2023 చదవండి: దాదాపు రూ. లక్షన్నర తీసుకునే స్థాయి నుంచి కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరో -
నాని దసరాతో సూరి కెరీర్ టర్న్.. ఆ సినిమాలన్నీ తెలుగులో..
దసరా సినిమాలో నాని స్నేహితుడి పాత్రలో నటించిన హీరో దీక్షిత్ శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూరి పాత్రలో తాను చేసిన నటన తెలుగు ప్రేక్షకులను అలరించింది. దీక్షిత్ శెట్టి మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ద్వారా కిలారు ప్రేమ్ చెంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అడ్వెంచర్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం కన్నడలో దీక్షిత్ శెట్టి పలు సినిమాలు చేస్తున్నారు. అందులో 'బ్లింక్', 'కెటిఎమ్' 'కల్యాణ ప్రాప్తిరస్తు' చిత్రాలు ఉన్నాయి. ఇవి తెలుగులో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 'దసరా'తో తెలుగులో దీక్షిత్ శెట్టికి మంచి గుర్తింపు వచ్చింది. అందువల్ల అతడు నటించే కన్నడ సినిమాలు తెలుగులో విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చదవండి: పాపం.. సెల్ఫీ అడిగినందుకు అభిమానిని కొట్టి మెడ పట్టి తోశారు.. మరీ ఇంత ఘోరమా? -
జర్నలిస్ట్‌తో ప్రముఖ నటుడి అసభ్య ప్రవర్తన.. ఆపై క్షమాపణ చెబుతూ ట్వీట్
సురేష్ గోపీ భారతీయ సినీ నటుడు, మాజీ ఎంపీ, గాయకుడు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించాడు. కేరళలోని కోజికోడ్‌లో శుక్రవారం నాడు జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తూ మహిళా విలేకరి భుజంపై రెండుసార్లు చేయి వేసి ఆమెతో సంభాషించడంపై వివాదం చెలరేగింది. మొదట మహిళా విలేకరికి సమాధానం చెబుతూ.. ఆమె భుజంపై చెయ్యి వేశారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందిపడిన ఆమె కాస్త దూరం జరిగింది. (ఇదీ చదవండి: క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్ ఛాన్స్) కొంత సమయం తర్వాత ఆమె మరో ప్రశ్న అడిగేందుకు ముందుకు రాగా.. ఆయన మరోసారి ఆమెను అదే విధంగా తాకారు. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ ఘటనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాజీ ఎంపీ సురేష్ గోపి నేడు సదరు జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. ఓ మహిళా జర్నలిస్ట్‌తో ఆయన ప్రవర్తించిన తీరు దేశం అంతటా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ' ఆమెను నేనొక కుమార్తెగా భావించా. ఆ ఆప్యాయతతోనే భుజంపై చెయ్యి వేశా. ఈ ఘటన పట్ల ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. నా ప్రవర్తన వల్ల ఆమె ఇబ్బందిపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నా.' అని ఆయన తెలిపారు. -
'చిరంజీవి అన్నయ్య కోసం ఇలా చేయండి'.. ఫ్యాన్స్‌కు తమ్ముడి విజ్ఞప్తి!
2009లో సినిమారంగంలోకి ప్రవేశించిన స్టార్ హీరో చిరంజీవి సర్జా దాదాపు 22 చిత్రాల్లో నటించారు. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా నటించిన చివరి చిత్రం 'రాజమార్తాండ'. ఈ మూవీ ఈనెల 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే కన్నడ స్టార్ నటుడు జూన్ 7, 2020న 39 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన తమ్ముడు ధృవ సర్జా అన్న పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అన్నయ్య చివరి మూవీ రిలీజ్ సందర్భంగా ధృవ సర్జా ఓ వీడియో రిలీజ్ చేశారు. అభిమానులంతా అన్నయ్య సినిమాను థియేటర్లకు వచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. అన్నయ్య సినిమాను చూసి ఈనెల 17న జయంతిని జరుపుకోవాలని సూచించారు. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!) ఈ సందర్భంగా ధృవ సర్జా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. రాజామార్తాండ సినిమా రిలీజ్ కానుండడంతో కన్నడ నటుడు దర్శన్ కూడా వీడియోను రిలీజ్ చేశారు. అయితే గతంలో తన అన్నయ్యకు డబ్బింగ్ చెప్పడానికి ధృవకు సమయం ఇవ్వాలని.. అతనిపై ఒత్తిడి చేయవద్దని దర్శన్ 'రాజమార్తాండ' నిర్మాతను అభ్యర్థించినట్లు సమాచారం. అన్నయ్య మరణంతో మానసికంగా కుంగిపోయిన ధృవ సర్జా.. డబ్బింగ్ చెప్పేందుకు కొంత సమయం విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన భార్య సీమంతం సందర్భంగా చిరంజీవి సర్జా సమాధి వద్దనే నిర్వహించి అన్నపై తన ప్రేమను చాటుకున్నారు. అన్నదమ్ముల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా ధృవ సర్జా నిలుస్తున్నారు. కాగా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన 'రాజమార్తాండ'. ఈ చిత్రాన్ని శ్రీ మాదేశ్వర ప్రొడక్షన్స్‌పై నివేదిత ఎన్, ప్రణవ్ గౌడ, శివ కుమార్‌లు నిర్మించారు. ఈ మూవీకి అర్జున్ జన్య సంగీతం అందించారు. (ఇది చదవండి: రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు) View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) -
కన్నడ సినీ నటుడు నాగభూషణ్ అరెస్టు
బెంగళూరు: కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి, ఒక మహిళ మరణానికి కారణమైన కన్నడ సిటీ నటుడు నాగభూషణ్ ఎస్.ఎస్.ను పోలీసులు అరెస్టు చేశారు. నాగభూషణ్ కారు శనివారం రాత్రి బెంగళూరులోని వసంతపుర ప్రధాన రహదారిపై కృష్ణ(58), ప్రేమ(48) అనే దంపతులపైకి దూసుకెళ్లింది. వారిద్దరూ ఫుట్‌పాత్‌పై నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. తర్వాత కారు కొద్ది దూరం వెళ్లి, కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ సమయంలో కారును నాగభూషణ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ప్రేమ మృతిచెందగా, కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. కారును నడిపిన నాగభూషణ్‌ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నాడో లేదో తెలుసుకొనేందుకు అతడి రక్తపు నమూనాలు సేకరించామని అన్నారు. కారును స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
బెంగళూరులో విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన నటుడు!
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. కన్నడ నటుడు నాగభూషణ కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ఫుట్‌పాత్‌పై నడుస్తున్న జంటపైకి నాగభూషణ నడుపుతున్న కారు దూసుకెళ్లింది. శనివారం వసంతనగర్ ప్రధాన రహదారి సమీపంలో ఈ సంఘటన జరిగింది. నటుడి కారు మొదట విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. ఆ తర్వాత దంపతులపై దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కౌసల్య సుప్రజా రామ చిత్రంలో కనిపించిన కన్నడ నటుడు నాగభూషణ కర్ణాటకలోని బెంగళూరులో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న జంటపైకి తన కారును ఢీకొట్టాడు. ఈ సంఘటన శనివారం రాత్రి 9:45 గంటలకు వసంతనగర్ ప్రధాన రహదారి సమీపంలో నటుడి కారు మొదట విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, ఆపై నడుచుకుంటూ వెళ్తున్న జంటను ఢీకొట్టింది. నటుడు ఉత్తరాహాల్ నుండి కోననకుంటె వైపు వెళ్తున్నట్లు ఇండియా టీవీ రిపోర్టర్ ధృవీకరించారు. అయితే నాగభూషణం స్వయంగా తానే గాయపడిన దంపతులను ఆస్పత్రికి తరలించాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ 48 ఏళ్ల మహిళ మృతి చెందగా.. ఆమె భర్త ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. కాగా..ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు నటుడిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నాగభూషణం కౌసల్య సుప్రజా రామ చిత్రంలో చివరిసారిగా కనిపించాడు. ఇక్కత్ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన.. ఈ చిత్రంలో నటనకు ఉత్తమ డెబ్యూ నటుడిగా అవార్డు లభించింది. బడవ రాస్కెల్ అనే మూవీకి ఉత్తమ సహాయ నటుడిగా కూడా ఎంపికయ్యాడు. తెలుగు, తమిళంలో సమంత, ఆది పినిశెట్టి నటించిన యూ టర్న్ చిత్రంలో ఆటో డ్రైవర్‌గా నటించారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్
బిగ్‌బాస్ ఫేమ్ బాలాజీ మురుగదాస్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'వా వరలామ్ వా'. ఎస్జీఎస్ క్రియేటివ్ మీడియా పథకంపై ఎల్జీ రవిచందర్, ఎస్పీఆర్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. రెడిన్ కింగ్స్ లీ కామెడీ పాత్రలో నటిస్తుండగా మహానా సంజీవి హీరోయిన్గా, మైమ్ గోపీ విలన్‌గా నటిస్తున్నారు. నటుడు సింగం పులి, శరవణసుబ్బయ్య, దీప, గాయత్రి రమా, పయిల్ వాన్ రంగనాథన్, బొండామణి, మీసైరాజేంద్రన్, క్రేన్ మనోహర్, ప్రభాకరన్, యోగి సామి, రామసామి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు 40 మంది బాలలు నటించడం విశేషం. దర్శక ద్వయం ఎల్జీ రవిచంద్రన్, ఎస్పీఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని, కార్తీక్ రాజా చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఈచిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం చైన్నెలో జరిగింది. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంగీత దర్శకుడు దేవా ఆవిష్కరించి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా చిత్ర టైటిల్‌కు, పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల్లో మంచి స్పందన వస్తోందని చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. Here is the first look of my movie “VA VARALAM VA “ #VaVaralamVa #SBR #SGSCreativeMedia #BalajiMurugadoss #Deva #SaravanaSubbiah #MimeGobi #ReddinKingsley #LGR pic.twitter.com/BlHtGUvoAg — Balaji Murugadoss (@OfficialBalaji) September 12, 2023 చదవండి: అనారోగ్యంతో ఆస్తి అమ్మేయాలనుకున్న నటి.. తనను, కూతుర్ని చంపుతామని బెదిరింపులు! -
రక్షాబంధన్ వేడుకల్లో స్టార్ హీరో పిల్లలు.. ఎంత ముద్దుగా ఉన్నారో!
కాంతార సినిమాతో స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను ఒక్కసారిగా షేక్ చేసింది. కర్ణాటకలోని గ్రామీణ నేపథ్యంలో సాగే భూతకోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా వైడ్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా ఆయన ఫ్యామిలీతో కలిసి వేడుకను జరుపుకున్నారు. తన ముద్దుల కూతురు రాధ్య, కుమారుడు రాన్వీ రాఖీలు కట్టుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రిషబ్ శెట్టి. ఫోటోలు షేర్ చేస్తూ అన్నా, చెల్లెలికి హ్యాపీ రక్షాబంధన్.. మీ బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. చిట్టి చిట్టి నవ్వులతో సంప్రదాయ దుస్తులతో ఉన్న రిషబ్ శెట్టి పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం రక్షాబంధన్ విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఇటీవలే ప్రకటించారు. (ఇది చదవండి: ‘కాంతారా’ తరహాలో ‘కలివీరుడు’) View this post on Instagram A post shared by Pragathi Shetty (@pragathirishabshetty) View this post on Instagram A post shared by Pragathi Shetty (@pragathirishabshetty) -
అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి!
కిచ్చా సుదీప్ ఈ పేరు వింటే చాలా తెలుగువారికి రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమానే గుర్తుకొస్తుంది. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ ఏడాది ఆయన నటించిన విక్రాంత్ రోణ అభిమానులను పెద్ద ఆకట్టుకోలేదు. అయితే ఇటీవల సుమలత అంబరీష్ బర్త్ డే పార్టీలో కిచ్చా సుదీప్ కనిపించారు. ప్రస్తుతం ఆయన కిచ్చా46 చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రాంత్ రోణ సినిమా తర్వాత కిచ్చా సుదీప్ నెక్స్ట్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా తన న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) కిచ్చా తన ఇన్‌స్టాలో సిక్స్ ప్యాక్‌తో బాడీని ప్రదర్శిస్తున్న ఫోటోలను పంచుకున్నారు. అయితే ఇదంతా కిచ్చా46 సినిమా కోసమేనని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం సుదీప్ ఇలా రెడీ అయ్యారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం సుదీప్ తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పైల్వాన్ సినిమా కోసం సిక్స్ ప్యాక్‌తో కనిపించారు. ఇన్‌స్టాలో రాస్తూ..'వర్కవుట్ చేయడం నా సంతోషకరమైన క్షణాలలో ఒకటి. ఇది నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. మిమ్మల్ని దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. కిచ్చా46 చిత్రం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం మరో నెల సమయం ఉంది. దానికి ముందే ఈ వర్కవుట్.' అని సుదీప్ రాసుకొచ్చారు. కాగా.. తుపాకి, కబాలి, కర్ణన్, అసురన్‌తో సహా తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కలైపులి ఎస్ తాను ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?) View this post on Instagram A post shared by KicchaSudeepa (@kichchasudeepa) -
ప్రేమ పెళ్లి.. డిప్రెషన్లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!
కన్నడ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కిర్రిక్ కీర్తి విడాకులు తీసుకున్నాడు. తన భార్య అర్పిత గౌడతో విడిపోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 'నేను, అర్పిత చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం. భార్యాభర్తలుగా మా ప్రయాణానికి ఫుల్స్టాప్ పెట్టాం. ఇకపై నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆమెకు ఎటువంటి సంబంధం లేదు. దానికి గల కారణం.. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రానికి, నాకు రుణం చెల్లిపోయింది. తనకు మంచి జీవితం దొరకాలని కోరుకుంటున్నాను. చేదు అనుభవాలను అన్నింటినీ మర్చిపోయి నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాకూ అందించండి' అని రాసుకొచ్చాడు. ఏడాదిగా విడివిడిగా జీవనం కీర్తి తమ వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యల గురించి గతంలోనే పరోక్షంగా హింటిచ్చాడు. అటు అర్పిత సైతం సోషల్ మీడియాలో తన పేరు చివరన కీర్తిని తొలగించేయడంతో పాటు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేసింది. ఈ జంట ఈ ఏడాది ప్రారంభం నుంచే విడివిడిగా జీవిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే అర్పిత తన కొడుకు ఆవిష్కర్‌ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పేరెంట్స్‌ను ఒప్పించి మరీ పెళ్లి మరోవైపు కీర్తి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈమధ్య ఓ పోస్ట్‌లో అతడు మానసిక ఒత్తిడి ఎక్కువైందని, కొడుకు భవిష్యత్తు కోసం బెంగగా ఉందని పేర్కొన్నాడు. కాగా కిర్రిక్ కీర్తి-అర్పితలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట అర్పిత పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ దగ్గరుండి నచ్చజెప్పారు. అలా పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి జరిగి దాదాపు పదేళ్లవుతోంది. గతంలో వీరు జోడి నెం.1 రియాలిటీ షోలోనూ జంటగా పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. View this post on Instagram A post shared by ಕಿರಿಕ್ ಕೀರ್ತಿ - Kirik Keerthi (@kirikkeerthi) చదవండి: జైలర్ నటుడికి రజనీకాంత్ మర్చిపోలేని గిఫ్ట్.. ఎగిరి గంతేస్తున్న నటుడు -
భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!
బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరిక్ కార్తీ తన వివాహాబంధానికి ముగింపు పలికారు. తన భార్య అర్పితకో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పాత జ్ఞాపకాలన్నీ మరిచిపోయి త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించనున్నట్లు కిరిక్ కీర్తి వెల్లడించారు. ఈ జంట పెళ్లైన దాదాపు 11 ఏళ్లకు తమ వివాహాబంధానికి గుడ్ బై చెప్పారు. కాగా.. వీరిద్దరికీ ఇప్పటికే ఓ కుమారుడు కూడా ఉన్నారు. గతంలో వీరిద్దరు డైవర్స్ తీసుకోబోతున్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యేలా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి : వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా? ) ఇన్‌స్టాలో కిరిక్ కీర్తి రాస్తూ.. ' ఈ రోజు చట్టం ప్రకారం మేం విడిపోయాం. అర్పిత, నాకు మధ్య బంధానికి పూర్తిగా తెరపడింది. ఇక నుంచి నా వ్యక్తిగత విషయాలతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఉండదు కూడా. అధికారికంగా మేం విడాకులు తీసుకున్నాం. ఆమె కూడా మంచి జీవితాన్ని పొందాలని ఆశిస్తున్నా. చేదు జ్ఞాపకాలను మరచిపోయి.. మీ ప్రేమ, శుభాకాంక్షలు భవిష్యత్తులోనూ నాపై కొనసాగాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 2023లో డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు కిరిక్ కీర్తి వెల్లడించారు. తన కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని.. జీవితం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకొచ్చాడు. కాగా.. కిరిక్ కీర్తి, అర్పిత మొదటిసారి కాలేజీలో కలుసుకున్నారు. ఆ తర్వాత వారి స్నేహం పెళ్లిబంధంగా మారింది. అయితే వీరు పెళ్లికి ముందు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. వీరి వివాహానికి అర్పిత తల్లిదండ్రులు అంగీకరించలేదు. (ఇది చదవండి: రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా? ) View this post on Instagram A post shared by ಕಿರಿಕ್ ಕೀರ್ತಿ - Kirik Keerthi (@kirikkeerthi) -
స్టార్ హీరో ఉపేంద్రకు తాత్కాలిక ఊరట!
స్టార్ హీరో ఉపేంద్రపై పోలీసు కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉప్పీ.. ఈ మధ్య తన రాజకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా పలు విషయాలు మాట్లాడారు. అయితే దళితులని అవమానించేలా కామెంట్స్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు దీనిపై కర్ణాటక హైకోర్టు ఊరట ఇచ్చింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) అసలేం జరిగింది? స్వతహాగా నటుడు అయిన ఉపేంద్ర.. ప్రజాక్రియా పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. దీని వార్షికోత్సవం సందర్భంగా ఫేస్బుక్, ఇన్‌స్టాలో శనివారం లైవ్ సెషన్లో పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. విమర్శకులని ఓ వర్గంతో పోల్చుతూ సామెత చెప్పాడు. ఓ ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉంటారని, అలానే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు కచ్చితంగా ఉంటారని అన్నాడు. వాళ్లని పట్టించుకోవాల్సిన పనిలేదని, ప్రజలపై ప్రేమాభిమానాలే నిజమైన దేశభక్తి అన్నాడు. అయితే ఉపేంద్ర వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కామెంట్స్ తమని ఆవేదనకు గురిచేశాయని నిరసన తెలియజేశాయి. కొందరైతే బెంగళూరులోని చెన్నమున్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ క్రమంలోనే తన కామెంట్స్‌పై దుమారం రేగడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పాడు. లైవ్ వీడియోని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే ఉపేంద్రపై నమోదైన ఎఫ్ఐఆర్పై కర్ణాటక హైకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇది తాత్కాలిక ఊరటకాగా.. భవిష్యత్తులో మాత్రం ఉపేంద్రకి చిక్కులు తప్పవేమో అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Upendra (@nimmaupendra) (ఇదీ చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్) -
అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!
సినీ ఇండస్ట్రీలో నటుడిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత వీరేంద్రబాబును బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో వీరేంద్ర స్నేహితుల ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు.. ప్రాణహాని ఉందంటూ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. కాగా.. శాండల్‌వుడ్‌లో వీరేంద్రబాబు స్వయం కృషి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ అంబరీష్ ప్రధాన పాత్రలో నటించారు. (ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్ రచ్చ) అసలేం జరిగిందంటే.. 2021లో అపస్మారక స్థితిలోకి వెళ్లగా వీరేంద్ర తనపై అత్యాచారం చేసినట్లు ఆ మహిళ ఆరోపించింది. ఆ తర్వాత మొత్తం వీడియో చిత్రీకరించి తనను మహిళను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులకు తెలిపింది. రూ.15 లక్షలు ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడని.. అతని వేధింపులు భరించలేక వీరేంద్రకు కొంత డబ్బు ఇచ్చినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత జులై 30న మళ్లీ ఆ మహిళకు ఫోన్ చేసిన వీరేంద్ర బాబు.. ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్నాడని తెలిపింది. ఈ వ్యవహారంలో అతని స్నేహితుల ప్రమేయం కూడా ఉందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదుతో వీరేంద్ర, అతని స్నేహితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొడిగేహళ్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) -
'బిగ్ డాడీ' పేరుతో వచ్చేస్తున్న ఘోస్ట్ టీజర్
కన్నడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీనినే ఈ ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన 'సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై' ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్) యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఘోస్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఘోస్ట్ టీజర్‌ను బిగ్ డాడీ పేరుతో జూలై 12 న విడుదల చేయనున్నారు. బిగ్ డాడీ అనౌన్స్‌మెంట్‌ను స్ట్రైకింగ్ పోస్టర్‌తో ప్రకటించారు. శివరాజ్ కుమార్ గన్‌తో సీరియస్ లుక్‌తో వచ్చిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆ యాడ్ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ) -
స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!
కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా కిచ్చా సుదీప్‌పై కొందరు నిర్మాతలు తీవ్ర విమర్శలు చేశారు. తమ వద్ద రెమ్యునరేషన్ తీసుకుని సినిమా చేయలేదని ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా') దీంతో తనపై కామెంట్స్ చేసిన నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్‌లపై కిచ్చా సుదీప్ మండిపడ్డారు. అంతేకాకుండా వారిద్దరిపై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నిర్మాతలపై కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుదీప్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు వివాదం ఏంటి? ఒక సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుని ఎగ్గొట్టాడని నిర్మాత ఎంఎన్ కుమార్ ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి అంగీకరించి.. ఇప్పటి వరకు తనకు డేట్స్ కేటాయించలేదని నిర్మాత పేర్కొన్నారు. కోటిగొబ్బ -3, విక్రాంత్ రోనా చిత్రాల తర్వాత తన సినిమా పని ప్రారంభిస్తానని హామీ ఇచ్చాడని.. కానీ సుదీప్ వద్దకు వెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించినా స్పందన రాలేదని ఆరోపించారు. ఈ చిత్రానికి ముత్తట్టి సత్యరాజు అనే టైటిల్‌ను నమోదు చేశానని.. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ధర్నా చేస్తానని ఎంఎన్ కుమార్ ప్రకటించారు. కాగా.. కిచ్చా సుదీప్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు విజయ్ కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా కిచ్చా46 అని టైటిల్ పెట్టగా.. కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) -
రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన నటుడి కాలు.. తీసేసిన వైద్యులు!
కన్నడ నటుడు సూరజ్ కుమార్ అలియాస్ ధృవన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం మైసూర్-గుడ్లుపేట్ జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న క్రమంలో బెగూర్ వద్ద వేగంగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో నటుడి కాలు నుజ్జునుజ్జు అవడంతో ఆయన కుడికాలు తీసేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. 'సూరజ్ మైసూర్ నుంచి ఊటీకి బైక్‌పై బయలు దేరాడు. రోడ్డుపై ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీ కొట్టాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది' అని తెలిపారు. కాగా దివంగత నిర్మాత పార్వతమ్మ రాజ్‌కుమార్ సోదరుడు, సినీ నిర్మాత ఎస్ఏ శ్రీనివాస్ తనయుడే సూరజ్ కుమార్. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయంలో సూరజ్ తన పేరును ధ్రువన్గా మార్చుకున్నాడు. చదవండి: నాడు విజయ్ పేరుతో వైరల్.. నేడు మరోసారి -
ఘనంగా సీనియర్ నటి సుమలత తనయుడి పెళ్లి
-
గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్
-
గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్
దివంగత నటుడు అంబరీష్, ప్రముఖ నటి సుమలతల తనయుడు అభిషేక్ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ఎంటర్ప్రెన్యూర్ అవివా బిడప్పతో ఏడడుగులు వేశాడు. వేదమంత్రాల సాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. సోమవారం (జూన్ 5) బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్, యశ్, మోహన్‌బాబు సహా పలువురు సినీతారలతో పాటు వెంకయ్యనాయుడు వంటి ప్రముఖ రాజకీయ నేతలు సైతం హాజరయ్యారు. నెట్టింట కొత్త జంట ఫోటోలు వైరల్ అభిషేక్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో రజనీకాంత్, యశ్‌లతో పాటు కిచ్చా సుదీప్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే జూన్ 7న అభిషేక్-అవివాల రిసెప్షన్ వేడుక జరగనుంది. కాగా అభిషేక్-అవివా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అభిషేక్ పేరెంట్స్ బ్యాగ్రౌండ్.. 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో అంబరీష్, సుమలత మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగా ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. Snaps of Rocking Star @TheNameIsYash Boss Happy Married Life #AbhishekAmbareesh & Aviva Bidapa ❤️#YashBOSS #Yash19 pic.twitter.com/hgDohWoQNQ — Yash Trends ™ (@YashTrends) June 5, 2023 The #Rocking couple, @TheNameIsYash and @RadhikaPandit7, at the wedding ceremony of #AbishekAmbareesh and #AvivaBidappa as they elegantly wish the family and embrace the newlyweds. Dressed exquisitely in their ethnically-inspired attire, add a touch of enchantment to the joyous… pic.twitter.com/BRiPlgChRH — A Sharadhaa (@sharadasrinidhi) June 5, 2023 #Drpuneethrajkumar Ashwini mam at Abhishek ambareesh marriage. pic.twitter.com/ivGf1BHGJl — ಅಪ್ಪು ಡೈನಾಸ್ಟಿ (@appudynasty1) June 5, 2023 Abhi-Aviva Marriage | ಅಭಿ-ಅವಿವಾ ವಿವಾಹ ಸಂದರ್ಭ ಹರ್ಷದ ಕ್ಷಣಗಳು...#RajNews #Rajnewskannada #Rajnewslive #BreakingNews #LatestNews #trending #report #sports #Government #Karnataka #AbhishekAmbareesh #SumalathaAmbareesh #Aviva #marriage #wedding pic.twitter.com/BQuBrT9ubC — Raj News Kannada (@officialrajnews) June 5, 2023 చదవండి: ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు.. టీవీకి ముద్దుపెట్టేవారు -
సీనియర్ నటి కుమారుడి పెళ్లికి ముహూర్తం ఫిక్స్
ప్రముఖ దివంగత నటుడు అంబరీష్, సుమలతల తనయుడు అభిషేక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎంటర్ప్రెన్యూర్ అవివా బిడప్పతో ఏడడుగులు వేయనున్నాడు. బెంగళూరులో జూన్ 5న వీరి వివాహం జరగనుంది. ఆ తర్వాత రెండు రోజులకే గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇటు అభిషేక్ తల్లి సుమలత అటు వధువు పేరెంట్స్, ఫ్యాషన్ డిజైనర్స్ ప్రసాద్ బిడప్ప, జుడిత్ ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహానికి సినీ,రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అభిషేక్, అవివా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి రెడీ అయ్యారు. గతేడాది డిసెంబర్లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఫంక్షన్‌కు పలువురు సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేసిన సంగతి తెలిసిందే! అభిషేక్, అవివాతో సుమలత అభిషేక్ పేరెంట్స్ బ్యాగ్రౌండ్.. 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు అంబరీష్, సుమలత. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగానే ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. సుమలత, అంబరీష్ తండ్రీకొడుకులకు ఎదురైన బాధా సంఘటన 1978లో పదువరల్లి పాండవురు అనే కన్నడ చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో అంబరీష్ తండ్రి మరణించారు. ఆయన అంత్యక్రియలను పూర్తి చేసి మూడు రోజుల్లో తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారు అంబరీష్. తండ్రికి ఎదురైన పరిస్థితే తర్వాత కొడుక్కి కూడా ఎదురైంది. అమర్ సినిమా షూటింగ్ సమయంలో అంబరీష్ చనిపోయారు. ఆయన అంత్యక్రియలను దగ్గరుండి జరిపించిన అతడు మూడు రోజుల్లో తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యాడు. కుటుంబానికి వచ్చిన కష్టం నిర్మాతకు నష్టంగా మారకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ప్రస్తుతం అభిషేక్ బ్యాడ్ మేనర్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. చదవండి: మంచి జోడీ కోసం వెతుకున్న సమంత ఇదంత సులువేమీ కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్ -
ప్రేయసిని పెళ్లాడిన నటుడు, అడవిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాడట!
కన్నడ నటుడు రఘు రామప్ప ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి అశ్వినితో ఏడడుగులు నడిచాడు. ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రుల సమక్షంలో శుక్రవారం బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను రఘు రామప్ప సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. తన పెళ్లి గురించి ఆయన మాట్లాడుతూ.. 'మాది ప్రేమ వివాహం.. కాకపోతే పెద్దల అంగీకారంతో ఇద్దరం ఒక్కటయ్యాం. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఐదేళ్ల క్రితం మేము కలుసుకున్నాం. అప్పుడే మా మధ్య ప్రేమ చిగురించింది. మా పెళ్లి ఎప్పుడో జరగాల్సింది. కానీ సడన్‌గా కోవిడ్ రావడంతో మా ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. వివాహం వాయిదా పడింది. మా నాన్నకు ప్రకృతి అంటే ప్రాణం. అందుకని శివమొగ్గలోని ప్రైవేట్ ఫారెస్ట్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయితే అడవిలోకి రావడం అందరికీ సాధ్యపడదు, అతిథులకు కష్టమవుతుందేమోనని ఆలోచించి బెంగళూరులోనే మండపం ఫిక్స్ చేశాం. ఇప్పుడే పెళ్లయింది కాబట్టి ఈ వారమంతా గుళ్లూగోపురాలు తిరిగేస్తాం. ఆ తర్వాత హనీమూన్ గురించి ప్లాన్ చేస్తాం. నాకు చారిత్రక ప్రదేశాలంటే చాలా ఇష్టం. కాబట్టి అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రఘు రామప్ప నటుడు మాత్రమే కాదు ఫిట్నెస్ కోచ్ కూడా! అతడు బాడీ బిల్డర్‌గా జాతీయస్థాయిలోనూ సత్తా చాటాడు. View this post on Instagram A post shared by Raghu Ramappa (@raghu_ramappa) చదవండి: రూ.132 కోట్లు పోయాయి, దిగులుతో భర్త కోమాలోకి: కన్నీటిపర్యంతమైన నటి -
'ఆయన విలన్‌గానే ఫేమస్.. కానీ ఆ విషయం కొద్దిమందికే తెలుసు'
నటుడు దేవరాజ్ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో తెలుగులో ఆయనను గుర్తు పట్టని వారు ఉండరు. దాదాపు 38 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. తెలుగులో భరతనారి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. వెండితెరపై విలన్‌గా కనిపించిన దేవరాజ్.. కన్నడ సినిమాల్లో హీరోగా కూడా నటించారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపుగా 200 పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనిపించారు. ప్రేమ యుద్ధం, నేటి సిద్ధార్థ, అన్న, ఎస్పీ పరుశురాం, సమరసింహా రెడ్డి, లక్ష్యం, భరత్ అనే నేను సినిమాలో మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవరాజ్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దేవరాజ్ మాట్లాడుతూ.. 'నేను మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చా. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ పాలవ్యాపారం చేస్తూ పెంచింది. నేను చదివేటప్పుడు మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. అప్పుడు ఓ కంపెనీలో జాబ్‌లో చేరా. జాబ్ చేస్తుండగానే సినిమాల్లో అవకాశాలొచ్చాయి. ఈ ఫీల్డ్‌లో సక్సెస్ కావాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం ఉండాలి. అప్పుడు సినిమాల్లో పరిస్థితులు వేరు. నా భార్య చంద్రలేఖ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అలా ఓ సినిమాకు హీరోయిన్ను చూడడానికి వెళ్లా. ఆ రోజు చంద్రలేఖను చూడగానే నచ్చేసింది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి జరిగాయి. కూడా నా చిన్న కుమారుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒక సినిమా చేశాడు. అందుకే పెద్దోడు కూడా సినిమాల్లోకి వచ్చాడు. అప్పట్లో కన్నడలో ఎందుకు మంచి సినిమాలు చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడైతే కాంతార, కేజీఎఫ్ సినిమాలతో ఆ పరిస్థితి మారిపోయింది. ఆ విషయంలో నాకు గర్వంగా ఉంది. టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్‌కు వాళ్ల తాత టాలెంట్ వచ్చింది. అల్లు అర్జున్ సూపర్‌గా డ్యాన్స్ చేస్తారు. ' అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. దేవరాజ్ ఇంటిని చూస్తే అచ్చం ఒక కోటలాగే ఉంటుంది. ఆయనకు మైసూర్లోనూ సినిమా ఇండస్ట్రీలో ఆయన అందుకున్న అవార్డులను, ఫ్యామిలీ ఫోటోలు వారి ఇంట్లో అద్భుతంగా అలంకరించారు. కన్నడ నటి చంద్రలేఖను వివాహం చేసుకున్నారు. దేవరాజ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం దేవరాజ్ తనయుడు ప్రణమ్ హీరోగా నటిస్తున్నారు. సాయి శివం జంపాన దర్శకత్వంసో వైరం సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో మోనాల్ హీరోయిన్. యువాన్స్ నాయుడు సమర్పణలో తెలుగు, కన్నడ భాషల్లో జె. మల్లికార్జున నిర్మించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. శాండల్‌వుడ్ నటుడు, దర్శకుడు టపోరి సత్య కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కుటుంబానికి ఆధారమైన టపోరి సత్య మృతి తీరని శోకాన్ని మిగిల్చింది. సత్య తల్లి మాట్లాడుతూ..' సత్య ఆసుపత్రిలో వారం రోజులు ఐసీయూలో ఉన్నారు. ఆయన ఎప్పుడూ సినిమాలకే అంకితమయ్యారు. నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటానని సత్య మాటిచ్చాడు. అతని మరణం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.' అని కన్నీటి పర్యంతమయ్యారు. సత్య భౌతికకాయాన్ని బనశంకరిలోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. యోగేష్, నందిత జంటగా నటించిన నంద లవ్ నందిత చిత్రంలో టపోరి సత్య విలన్‌గా నటించారు. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మేళా అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనతో కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే ఓ బుల్లితెర నటుడు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
బీజేపీలోకి కిచ్చా సుదీప్! ఎన్నికల్లో పోటీపై నటుడి క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపే, జేడీఎస్ వంటి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నడుస్తోంది. వివిధ పార్టీల నుంచి నేతలను ఆకర్షించడంతోపాటు.. సినీ తారలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్లు, కమలం గుర్తు తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇందుకు సుదీప్ బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్ సీఎం బసవరాజ్ బొమ్మై, ఇతర నేతలతో సమావేశమవ్వడమే కారణం. తాజాగా ఈ వార్తలపై సుదీప్ స్పందించారు. తాను బీజేపీ తరపున కేవలం ప్రచారంలో మాత్రమే పాల్గొంటానని తెలిపారు. పార్టీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదీప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మైతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానం, గౌరవంతో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. బొమ్మై వ్యక్తిగతంగా జీవితంలో చాలాసార్లు సాయం చేశారని.. దానికి కృతజ్ఞతగా తాను ఈ విధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది పార్టీ కోసం కాదని చెప్పారు. ‘జీవితంలో నాకు చాలా మంది నాకు అండగా నిలిచారు. ఎంకరేజ్ చేశారు. వారిలో సీఎం బొమ్మై ఒకరు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఆయన కోసమే. పార్టీ కోసం కాదు’ అని తెలిపారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఇప్పటికే సీఎంకు చెప్పిన్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చేనెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడుతాయి. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీపై పిటిషన్ తిరస్కరణ.. -
సినిమాలకు బ్రేక్.. కిచ్చా సుదీప్ సంచలన నిర్ణయం!
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఈగతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇటీవల కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణతో ప్రేక్షకులను అలరించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఈ చిత్రం అభిమానుల అంతగా మెప్పించలేకపోయింది. ఇటీవల సుదీప్ నటించిన కబ్జ సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే తాజాగా ఆయన అభిమానులకు ఓ నోట్ విడుదల చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కిచ్చా సుదీప్ నోట్లో రాస్తూ.. ' హాయ్ ఫ్రెండ్స్. కిచ్చా46 గురించి మీ ట్వీట్స్ అండ్ మీమ్స్ చూశా. అలా పిలవడం నాకు కూడా సంతోషంగా ఉంది. దీనిపై మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలచుకున్నా. ప్రస్తుతం నేను స్వల్ప విరామం తీసుకుంటున్నా. ఇది నా మొదటి బ్రేక్. విక్రాంత్ రోణ, బిగ్ బాస్ సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ సమయాన్ని ఆనందంగా ఆస్వాదించాలనుకున్నా. క్రికెట్ కూడా నా లైఫ్‌లో ఓ భాగం. సీసీఎల్‌లో కర్ణాటక బుల్డోజర్స్ తరఫున మ్యాచులు ఆస్వాదించా. నా సినిమాలకు సంబంధించి మూడు స్క్రిప్టులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వాటిని ఓకే చేశా. ప్రతి రోజు వాటిపై వర్క్ జరుగుతూనే ఉంటుంది. త్వరలోనే అప్డేట్స్తో మీ ముందుకు వస్తా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆల్ ద బెస్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. About my Next ❤️🥂 pic.twitter.com/3vkCmS6FBF — Kichcha Sudeepa (@KicchaSudeep) April 2, 2023 -
ప్రముఖ నటుడు సంచలన వ్యాఖ్యలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రముఖ కన్నడ నటుడు చేతన్ కుమార్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభవాలను దెబ్బతీసే విధంగా ఇటీవల ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో చేతన్ కుమార్‌పై హిందుమత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఆయనను అరెస్ట్ చేశారు. వివరాలు.. స్వయాన హిందువైన కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస మత విశ్వాసాలను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మార్చి 20న ఆయన ట్వీట్ చేస్తూ ‘సావర్కర్: రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి చేరుకున్న తర్వాత భారతదేశ జాతి ప్రారంభమైంది అనేది ఒక అబద్ధం. 1992: బాబ్రీ మసీదు రాముడి జన్మస్థలం అనేది ఒక అబద్ధం. 2023: ఉరిగౌడ-నంజిగౌడ కులస్తులు టిప్పుని చంపిన హంతకులు అనేది ఒక అబద్ధం’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అంతేకాదు హిందుత్వం అనేది సత్యం చేత ఓడించబడుతుందంటూ హిందు మతాన్ని, హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసేలా అభ్యంతరకర కామెంట్స్ చేశాడు. దీంతో చేతన్ కుమార్‌పై పలు హిందు మతసంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కులాలు, మతాల మధ్యనే శత్రుత్వం పెరిగిలా ఆయన ట్వీట్ ఉందంటూ చేతన్‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా పలు హిందు సంఘాలు బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు చేతన్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా చేతన్ కుమార్ తరచూ తన తీరుతో, కామెంట్స్‌తో వివాదానికి తెరలేపుతుంటాడు. గతంలో ఇలానే అభ్యంతరకర కామెంట్స్ చేసి ఒకసారి అరెస్ట్ అయ్యాడు. 2022 ఫిబ్రవరిలో హిజాబ్ కేసులో తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పై అభ్యంతర కామెంట్స్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు. Hindutva is built on LIES Savarkar: Indian ‘nation’ began when Rama defeated Ravana & returned to Ayodhya —> a lie 1992: Babri Masjid is ‘birthplace of Rama’ —> a lie 2023: Urigowda-Nanjegowda are ‘killers’ of Tipu—> a lie Hindutva can be defeated by TRUTH—> truth is EQUALITY — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) March 20, 2023 -
అతనికి జీవితాంతం రుణపడి ఉంటాను: దీక్షిత్ శెట్టి
‘‘సినిమాలకు ఇప్పుడు భాష లేదు. ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ వంటి సినిమాలను ఇండియన్ సినిమాల్లానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం’’ అన్నారు కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి. నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేసిన దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ధరణి (నానిపాత్ర పేరు) క్లోజ్ ఫ్రెండ్ సూరిపాత్రలో కనిపిస్తాను. మంచి కథకు అన్ని అంశాలు మిళితమై ఉన్న మంచి వినోదాత్మక చిత్రం ‘దసరా’. ఇలాంటి సినిమాలో భాగం కావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకావం రావడాన్నే నేను ఒక సక్సెస్‌లా భావిస్తున్నాను. నానీగారి నుంచి చాలా నేర్చుకున్నాను. నన్ను నమ్మి చాన్స్ ఇచ్చిన సుధాకర్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
కన్నడ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు కన్నుమూశారు. మన్దీప్ రాయ్ (74) బెంగళూరులో గుండెపోటుతో మరణించారు. దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్దీప్ రాయ్ ఆదివారం మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ విషయం కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణంపై ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు వెంకట్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. మన్దీప్ రాయ్ బెంగాలీ అయినప్పటికీ బెంగళూరులో స్థిరపడి కన్నడ చిత్ర పరిశ్రమలో నటించారని తెలిపారు. కన్నడ పరిశ్రమతో గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. మన్దీప్ రాయ్ నటించిన చిత్రాలు వరుసగా 'మించిన ఓట', 'పుష్పక విమానం', 'దేవర ఆట', 'నాగరహావు', 'ఆప్త రక్షక', 'అమృతధారే', 'కురిగాలు సార్ కురిపాలు' వంటి సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. Mandeep Roy | Originally Bengali, Settled and Acted in Kannada Film Industry, Closely Connected to #Kannada #People He is Unforgettable in #Pushpaka Vimana #RIP #MandeepRoy #KFI #Kannada pic.twitter.com/TcP5EBNsFg — Venkat Bharadwaj (@csvenkat) January 29, 2023 -
కన్నడ నటుడి సోదరి అదృశ్యం..
బెంగళూరు: కన్నడ నటుడు, దర్శకుడు నవీన్‌కృష్ణ సోదరి నీతా పవర్ అదృశ్యమైంది. నాలుగు రోజుల నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని స్వయంగా నవీన్‌కృష్ణ సోషల్ మీడియాలో పోస్టు వేశారు. సోదరి ఫోటోను, సమాచారాన్ని కూడా పంచుకున్నారు. నవీన్ కృష్ణ పోస్ట్ ప్రకారం.. సుబ్రమణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే నీతా పవార్ జనవరి 17 మధ్యాహ్నం 2:57 గంటలకు ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయాన్ని ఇతరులకు షేర్ చేయాలని, తన సోదరి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పలు నెంబర్లు షేర్ చూస్తూ కోరారు. కాగా అదృశ్య ఘటనపై సుబ్రమణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అజిత్ సరసన సాయి పల్లవి! ఎంపిక చేశారా? లేక సస్పెన్స్‌గా ఉంచారా? -
సినిమా మధ్యలో ఆగితే రూ.12 లక్షలు ఇచ్చా, ఇంట్లో గొడవలు..
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా తల్లిదండ్రులే నా దేవుళ్లు. వారి ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్‌కు ముందు అమ్మానాన్న ఇద్దరూ చనిపోయారు. ఈ సినిమా చూడకుండానే నా తల్లి మరణించారన్న బాధ ఉంది. దునియా సినిమా మధ్యలో ఆగిపోతే నేను రూ.12 లక్షలు ఇచ్చాను. అప్పుడు ఇంట్లోవాళ్లతో గొడపడి మరీ ముందడుగు వేశాను. చివరికి సినిమా సూపర్ హిట్ కావడమే కాక నా ఇంటి పేరుగా మారిపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను. కానీ తెలుగులోకి రావడానికి చాలాకాలం పట్టింది. మొదట తెలుగులో లవకుశ సినిమా ఆఫర్ వచ్చింది కానీ అప్పుడు కన్నడలో బిజీ ఉండి చేయలేకపోయాను. తర్వాత గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమా గురించి సంప్రదించాడు. ముసలిముడుగు ప్రతాప్‌రెడ్డి రోల్ చేయాలన్నారు. ఆ రోల్ గురించి చెప్పగానే ఓకే చెప్పేశా. ఎప్పుడెప్పుడు పాత్ర చేయాలా? అని ఎదురుచూశాను. సినిమా అదిరిపోతుంది' అని చెప్పుకొచ్చాడు దునియా విజయ్. చదవండి: ఆ పాట, ఆ సన్నివేశం నా ఆల్‌టైమ్ ఫేవరెట్: రాజమౌళి -
కేజీఎఫ్ హీరోతో పాండ్యా బ్రదర్స్.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్..!
కేజీఎఫ్ మూవీ సృష్టించిన సంచలన అంతా ఇంతా కాదు. రెండు భాగాలు రిలీజై బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యశ్. బాలీవుడ్‌తో సహా దక్షిణాదిలో యశ్ అంటే తెలియని వారు ఉండరు. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే క్రికెట్లో బిజీగా ఉండే పాండ్యా బ్రదర్స్ యశ్‌తో దిగిన ఫోటో అభిమానులను కట్టి పడేస్తోంది. ఈ ఫోటోను హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ ఫోటోలను షేర్ చేస్తూ..' కేజీఎఫ్-3' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫోటోల్లో కృనాల్ పాండ్యా కూడా ఉన్నారు. పాన్-ఇండియా స్టార్‌తో దిగిన ఫోటోలు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. మరికొందరైతే కన్నడ పరిశ్రమకు దక్కినన గొప్ప గౌరవం అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. కేజీఎఫ్ మూడో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కథ ఇంకా సిద్ధం కాలేదని తెలిపారు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలిచి వేసింది: కిచ్చా సుదీప్
కన్నడ హీరో దర్శన్‌పై చెప్పుల దాడిని మరో నటుడు కిచ్చా సుదీప్ ఖండించారు. ఇలా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చర్య తనను తీవ్ర కలవరానికి గురి చేసిందని అన్నారు. పునీత్ రాజ్ కుమార్ ఉండి ఉంటే ఇలాంటి చర్యలను సమర్థించేవారా అని ఆయన అభిమానులను సుదీప్ ప్రశ్నించారు. దర్శన్‌పై చెప్పులు విసరడాన్ని ఖండిస్తూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఆదివారం 'క్రాంతి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలోని హోస్పేట్లో సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. కిచ్చా సుదీప్ ట్విటర్లో రాస్తూ.. 'మన భూమి, భాష, సంస్కృతి అనేది ప్రేమ, గౌరవానికి సంబంధించినది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి వ్యక్తి గౌరవంగా వ్యవహరించడానికి అర్హులు. నేను చూసిన వీడియో నన్ను చాలా కలవరపెట్టింది. ఇంకా చాలా మంది అలాగే సినిమాలోని ప్రముఖ మహిళ కూడా అక్కడే నిలబడి ఉన్నారు. వారంతా ఈవెంట్లో నిమగ్నమై ఉన్నారు. మీరు వారిని అవమానించారు. ఇలాంటి పనులు చేసింది కన్నడిగులేనా అన్న అనుమానం వస్తోంది.' అని రాసుకొచ్చారు. దర్శన్, పునీత్ అభిమానులకు మధ్య పరిస్థితులు బాగా లేవని నేను అంగీకరిస్తున్నా.. కానీ ఇలాంటి ప్రతిచర్యను పునీత్ స్వయంగా మెచ్చుకుని మద్దతు ఇచ్చేవారా? అని ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే..: కాగా దర్శన్ ఇటీవల అదృష్ట దేవతపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 'అదృష్ట దేవత ప్రతిసారీ తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడే చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి లాక్కెల్లి దుస్తులు విప్పేయాలి. అప్పుడు ఆమె ఎక్కడికీ వెళ్లదు' అని దర్శన్ చేసిన కామెంట్లు ఎంతగానో వివాదాస్పదమయ్యాయి. అదృష్ట దేవతను లక్ష్మీ దేవతగా భావిస్తారు. శ్రీ విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిపై అంత నీచంగా ఎలా మాట్లాడతావంటూ అతడిపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. కాగా.. దర్శన్ నటించిన చిత్రం క్రాంతి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వి హరికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దర్శన్ సరసన రచితా రామ్ నటిస్తోంది. Rebellion isn't always an Answer. ❤️🙏🏼 pic.twitter.com/fbwANDdgP0 — Kichcha Sudeepa (@KicchaSudeep) December 20, 2022 -
కాంతారపై సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు.. నటుడికి షాకిచ్చిన కోర్టు
‘కాంతార’ మూవీతో సంచలన వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు చేతన్ కుమార్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో చేతన్ కుమార్‌కు బెంగళూరు హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తు దశలో ఉండగా దానిని ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వివరాలు.. కాంతార సినిమాలో భూతకోల సంస్కృతిని డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి అద్భుతంగా చూపించాడు. ఈ సంస్కృతికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులంత ఫిదా అయ్యారు. అయితే ఈ సంస్కృతి హిందూ మతంలో భాగం కాదంటూ కన్నడ నటుడు చేతన్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చేతన్ కుమార్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివ కుమార్ అనే వ్యక్తి శేషాద్రినగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చేతన్ కుమార్ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టెల ఉన్నాయని, హిందూ మనోభవాలను దెబ్బతీసేశాల అతడు వ్యవహరించాడంటూ శివకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చేతన్ కుమార్‌ను కోర్టులో హాజరుపరిచారు. నిన్న ఈ కేసుపై విచారణ చేపట్టగా తాను కేవలం తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశానని, హిందూ మతాన్ని కించపరిచే విధంగా తన వ్యాఖ్యలు లేవంటూ కోర్టులో వాధించాడు. అదే విధంగా.. తాను ఏ మతాల మద్య విద్వేషాన్ని రెచ్చగొట్టలేదని వివరణ ఇచ్చాడు. అయితే కోర్టు ఈ కేసు విచారణ వాయిదా వేసింది. ఒక మత సంస్కృతిని కించ పరిచే విధంగా మాట్లాడటం.. మతాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల విషయంలో చేతన్‌పై నమోదు చేసిన ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉండగా అడ్డుకోలేమని హైకోర్టు పేర్కొంది. చదవండి: హీరోయిన్గా పరిచయం కాబోతున్న అజిత్ రీల్ కూతురు బేబీ అనిఖా మహేశ్ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్, మెను, రేట్స్ ఎలా ఉన్నాయంటే..! -
కేజీఎఫ్ నటుడు కన్నుమూత
కేజీఎఫ్ నటుడు కృష్ణ జి. రావు కన్నుమూశారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం నాడు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేజీఎఫ్ మొదటి భాగంలో విలన్లను హీరో యశ్ చితక్కొట్టే ఫైట్ సన్నివేశానికి ముందు ఈ తాత అంధుడిగా కనిపిస్తారు. ఆ సన్నివేశంతో రాఖీభాయ్ పవరేంటో అందరికీ తెలిసొస్తుంది. కేజీఎఫ్ సినిమాల్లో ఆయన నిడివి తక్కువే అయినప్పటికీ ఈ మూవీలు సూపర్ హిట్ కావడంతో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి ఆయన్ను వెతుక్కుంటూ సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో కృష్ణ ప్రధాన పాత్రలో ఇటీవలే ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఇంతలోనే ఆయన తుది శ్వాస విడిచారు. కాగా కృష్ణ జి రావు అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్, కథా రచయితగా.. ఇలా చాలా పనులు చేశారు. ఇలాంటి సమయంలో ప్రొవిజనల్ మేనేజర్ కుమార్.. కేజీఎఫ్ సినిమా కోసం ఫొటో పంపించమని కృష్ణని కోరారు. కానీ ఆయన స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉండటంతో నటన తనకెందుకులే అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ ఓ రోజు కుమార్ స్వయంగా కృష్ణ ఫొటోను కేజీఎఫ్ ఆడిషన్స్‌కు పంపారు. దీంతో ఆయన కేజీఎఫ్ సినిమాకు సెలక్ట్ అయ్యారు. చదవండి: మాజీ బాయ్‌ఫ్రెండ్ నన్ను చితక్కొట్టాడు, చంపేందుకు ప్రయత్నించాడు: నటి సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ -
కోరుకున్నవాడితో హీరోయిన్ ఎంగేజ్మెంట్
కన్నడ నటుడు వశిష్ఠ, హీరోయిన్ హరిప్రియ డేటింగ్లో ఉన్నారంటూ శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవలే వీరిద్దరూ దుబాయ్ నుంచి బెంగళూరుకు తిరిగివస్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కడంతో వారి ప్రేమ విషయం నిజమేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. త్వరలోనే వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. చూస్తుంటే ఇదే నిజం కాబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వశిష్ఠ, హరిప్రియల నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. కాగా వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది. కాగా హరిప్రియ కన్నడలో ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సంపాదించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో విలన్‌గానూ మెప్పించాడు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) చదవండి: RRR షూటింగ్లో అనారోగ్యంతో బాధపడ్డ రాజమౌళి టికెట్ టు ఫినాలే విన్ అయితే కప్పు కొట్టే ఛాన్సే లేదా? -
డేటింగ్లో ప్రముఖ నటి.. సోషల్ మీడియాలో వైరల్
కన్నడ నటుడు వశిష్ట సింహ, నటి హరిప్రియ డేటింగ్లో ఉన్నారా? ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అనే సందేహాలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతే కాదు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొన్ని రోజులుగా రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. సింహా, హరిప్రియ డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకుబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఈ వార్తలను ఇప్పటివరకు వీరిలో ఎవరూ ధృవీకరించలేదు. సోమవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో వశిష్ట సింహ, హరిప్రియ ఒక్కసారిగా మెరిశారు. తెల్లని దుస్తులతో చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితమే వశిష్ట తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. తన పోస్ట్‌లో రాస్తూ.. 'మీరు ప్రతి విషయంలో ఉత్తమమైన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నా. మీలో ఆనందం, ప్రేమ ఎప్పుడు ఉండాలి.. మీరు మీలా ఉన్నందుకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చారు. దీనికి హరిప్రియ కూడా 'థాంక్యూ పార్ట్నర్' అంటూ స్పందించింది. హరిప్రియ కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సాధించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) -
మరో భాషలో వస్తున్న ‘కాంతార’.. రిలీజ్ ఎప్పుడంటే?
కేవలం మౌత్‌టాక్‌తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సినిమా 'కాంతార'. ప్రస్తుతం ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచిన వరాహరూపం పాటను తొలగించడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే దాదాపు భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తాజాగా మరో భాషలో రిలీజ్ కానుంది. (చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు) కర్ణాటకలోని తులునాడు సంస్కృతి, సంప్రదాయల నేపథ్యంలో రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన తులు భాషలో అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 2 నుంచి ఈ సినిమా తులు భాషలో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయనుంది. ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్గా నటించారు. ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, కిశోర్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మరో పాత్రలో కనిపించిన షానిల్ గురు తులు వర్షన్ డబ్బింగ్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం వెల్లడించింది. -
షూటింగ్లో అస్వస్థతకు లోనైన కన్నడ స్టార్
కన్నడ స్టార్ ఉపేంద్ర స్వల్ప అస్వస్థతకు లోనయ్యాడు. గురువారం ఆయన శ్వాస సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరగా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. కాగా ప్రస్తుతం ఉపేంద్ర నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డస్ట్ అలర్జీ ఉన్న ఉపేంద్ర యాక్షన్ సీన్స్ చేస్తున్న క్రమంలో శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. దీంతో అతడు ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అనంతరం తిరిగి సినిమా సెట్స్‌లో పాల్గొన్నాడు. తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందడంతో ఉపేంద్ర ఫేస్బుక్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్ స్పాట్లోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. చదవండి: ఆస్పత్రిలో కమల్ హాసన్, హెల్త్ బులెటిన్ రిలీజ్ ఓటీటీలో నవీన్‌చంద్ర రిలీజ్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
ఓటీటీకి 'కాంతార'.. ఆ వివాదం వల్లే ఆలస్యమవుతోందా ?
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ 'కాంతార'. భాషతో సంబంధం లేకుండా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలై 50 రోజులైనా థియేటర్లలో క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఈ చిత్రం ఓటీటీలోకి రావడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవలే నవంబరు 24న ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేస్తుందంటూ సోషల్‌మీడియాలో వార్తలొచ్చాయి. (చదవండి: అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తోన్న కాంతార, అంతలోనే ట్విస్ట్!) కానీ ఈ విషయంపై అధికారిక ఒక్క ప్రకటన కూడా చిత్రబృందం ఎక్కడా ఇవ్వలేదు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ కూడా దీనిపై ఎక్కడా మాట్లాడటం లేదు. దీంతో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న కాంతార మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రం ఓటీటీ విడుదలపై హోంబాలే ఫిల్మ్స్ కార్తిక్ గౌడను నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. కారణం అదేనా?: కాంతార మూవీ క్లైమాక్స్‌లో ‘వరాహరూపం’ పాట, రిషబ్‌శెట్టి నటన లేకుండా సినిమాను ఊహించలేని పరిస్థితి. కానీ ఇటీవలే మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. అందువల్లో యూట్యూబ్‌లోనూ ఆ పాటను హోంబాలే ఫిల్మ్స్ తొలగించింది. ఈ వివాదం ఓ కొలిక్కి రావాల్సి ఉంది. మరోవైపు ‘తెయ్యికుడుం బ్రిడ్జ్’ బృంద సభ్యులు గతవారం బెంగళూరులో ‘నవరసం’ అనే పాటను ప్రదర్శించారు. (చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్!) కేజీఎఫ్‌ను దాటేసిన కలెక్షన్లు..: కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతార.సెప్టెంబర్ 30న చిన్న సినిమాగా రిలీజై భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ టాలీవుడ్లో అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. తెలుగులోనూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కర్ణాటకలో ‘కేజీయఫ్2’ రికార్డు రూ.155 కోట్లను అధిగమించి రూ.160.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. -
ఓటీటీకి 'కాంతార ' మూవీ.. అప్పటిదాకా ఆగాల్సిందేనా?
కన్నడ చిత్రం ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. భాషతో సంబంధం లేకుండా థియేటర్లను ఊపేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30న కన్నడలో విడుదలైన ‘కాంతార’ అతి తక్కువ సమయంలోనే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కేవలం మౌత్ టాక్‌తోనే పాన్ ఇండియా స్థాయిలో ‘కాంతార’ అదరగొట్టింది. (చదవండి: ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు మూవీ తెలుసా?) రిషబ్‌శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడమే అసలు కారణం. ఇప్పటికే ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదట నవంబర్ 4న ఓటీటీకి వస్తోందని వార్తలొచ్చాయి. కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు. దీంతో అందరి నోటా కాంతార ఓటీటీకి ఎప్పుడు వస్తోందని చర్చించుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారిక ప్రకటన చేస్తారా? అని ఆశిస్తున్నారు. (చదవండి: ‘కాంతార’కు కాసుల పంట.. ఒక్క తెలుగులోనే రూ.50 కోట్లు వసూళ్లు) అసలు కారణం ఇదే: అక్టోబరు 15న టాలీవుడ్లో ‘కాంతార’ విడుదలై దాదాపు నెల రోజులు కావొస్తున్న థియేటర్లు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. హిందీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. క్లైమాక్స్, రిషబ్‌శెట్టి నటనను చూసేందుకు చాలా మంది రెండోసారి సినిమా చూసేందుకు వస్తున్నారు. కలెక్షన్ల పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘కాంతార మూవీని ప్రస్తుతం ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చిత్రబృందానికి లేనట్లు తెలుస్తోంది. పైగా రాబోయే రోజుల్లో ‘హోంబలే ఫిల్మ్స్’ నుంచి మరిన్నీ క్రేజీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. దీంతో అమెజాన్ ప్రైమ్ కూడా కాంతారను ఓటీటీకి తెచ్చే విషయంలో తొందరపడటం లేదని సమాచారం. అన్నీ కుదిరితే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన తర్వాతే ఓటీటీకి తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. మరీ అప్పటి దాకా ఫ్యాన్స్ వేచి చూడాల్సిందే. -
సౌత్ సినిమాలు చూసి నవ్వుకునేవారు.. యశ్ సంచలన కామెంట్స్
కేజీఎఫ్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా స్టార్ గుర్తింపు తీసుకొచ్చింది ఆ చిత్రం. ఆ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో సౌత్ సినిమాలను చూసి ఉత్తరాది ప్రజలు ఎగతాళి చేసేవారని అన్నారు. (చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) కానీ ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయని తెలిపారు. అయితే ఇండియాను ప్రముఖంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమగా మాత్రమే పరిగణించేవారని వెల్లడించారు. దక్షిణాది సినిమాలు హిందీ చిత్రాలతో పోటీపడాలంటే కష్టతరంగా భావించేవారు. కానీ రాజమౌళి మూవీ బాహుబలి తర్వాత ఇది పూర్తిగా మారిపోయిందని యశ్ అన్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాతే ఉత్తరాది వాళ్లు దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకున్నారని తెలిపారు. సౌత్ సినిమాకు ఇంతలా ప్రాచుర్యం సొంతం చేసుకుందంటే ప్రధాన కారణం జక్కన్నే అని యశ్ అన్నారు. ‘కేజీయఫ్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యశ్ మాట్లాడుతూ.. '10 సంవత్సరాల క్రితమే డబ్బింగ్ చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ మొదట్లో అందరూ భిన్నమైన అభిప్రాయాలతో చూడటం ప్రారంభించారు. సౌత్ సినిమాలంటే జనాలు ఎగతాళి చేసేవారు. 'ఇదేం యాక్షన్ .. అందరూ అలా ఎగిరిపోతున్నారు' అని నవ్వుకునేవారు. కానీ చివరికి వారు కళారూపాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అంతే కాకుండా దక్షిణాది సినిమాలు తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో మా చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు సౌత్ సినిమాలను అందరూ గుర్తిస్తున్నారు.' అని అన్నారు. కేజీయఫ్-3’ గురించి మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే ఉండదని, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని, ప్రస్తుతానికి వేరే ప్రాజెక్ట్‌లపై తన దృష్టి ఉందని, త్వరలోనే కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తానని అన్నారు. (చదవండి: పారితోషికం రెట్టింపు చేసిన కేజీఎఫ్ బ్యూటీ!) -
నా దృష్టిలో అతనే కర్ణాటక రత్న.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
కర్ణాటక అసెంబ్లీలో టాలీవుడ్ యంగ్ టైగర్ అదిరిపోయే ప్రసంగమిచ్చారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ కన్నడ భాషలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పునీత్ రాజ్‌కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు యంగ్ టైగర్. వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అప్పూ.. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన చేసిన సేవలు అద్భుతం. రాజ్‌కుమార్‌తో ఉన్న క్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తాను అప్పూకు ఓ స్నేహితుడిగానే ఇక్కడికి వచ్చా. మీ అందరి అభిమానాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశమిచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు. అప్పూ ఫ్యామిలీ నన్ను ఓ కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు వారికి రుణపడి ఉంటా.' అంటూ కన్నడలో మాట్లాడారు. దీంతో సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
ఇది అసలు ఊహించలేదు.. కాంతార హీరో రిషబ్ శెట్టి
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ , రిషబ్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 15న విడుదల చేశారు. టాలీవుడ్లో మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ప్రారంభించింది. నేడు తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న థియేటర్లను కాంతారా చిత్రబృందం సందర్శించింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: ‘కాంతార’కి బిగ్ షాకిచ్చిన కోర్టు.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు!) హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ... 'ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారని ఊహించలేదు. కేవలం రెండు వారాల్లో ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లు సాధించడం ఆనందంగా ఉంది. ఇంతలా ఆదరించినందుకు టాలీవుడ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పటికి ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...' సినిమాకు భాష ముఖ్యం కాదు.. కేవలం ఎమోషన్ ఒకటే ఉంటుంది అని కాంతార నిరూపించింది. ఈ సినిమాను కన్నడలో చూసి బన్ని వాసు నాతో చెప్పాడు. ఆ తర్వాత సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్‌కు కనెక్ట్ అయి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించింది. అందుకే టాలీవుడ్‌లోనూ రిలీజ్ చేశాం'. అని చెప్పారు. -
బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!
కేజీఎఫ్ హీరో యశ్ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది. రాఖీభాయ్‌గా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత యశ్ తన తర్వాత ప్రాజెక్టులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్‌కు ప్రముఖ నిర్మాతలు యశ్‌ను సంప్రదించారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయని టాక్. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న బ్రహ్మస్త్ర- పార్ట్2 కోసం యశ్‌ను సంప్రదించారని నెట్టింట్లో వైరలైంది. అయితే ఈ విషయంపై బ్రహ్మస్త్ర నిర్మాత కరణ్ జోహార్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మాస్త్ర- 2లో దేవ్ పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ మొదటి ఎంపిక అని కరణ్ వెల్లడించారు. మీడియాలో వచ్చిన వార్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'ఇవన్నీ చెత్త.. ఆ పాత్ర కోసం మేము ఎవరినీ సంప్రదించలేదు' అని కొట్టిపారేశారు. బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా మహాభారతం ఆధారంగా ‘కర్ణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం యశ్‌ను సంప్రదించారని మరో టాక్. ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
కాంతార తగ్గేదేలే.. ఆ విషయంలో కేజీఎఫ్ -2 రికార్డ్ బ్రేక్
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతోంది. దేశవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే సంస్థ నిర్మించింది. అయితే తాజాగా ఈ చిత్రం కర్ణాటకలో హోంబలే సంస్థ నిర్మించిన సినిమాల్లో అత్యధికంగా వీక్షించిన మూవీగా నిలిచింది. (చదవండి: ‘కాంతార’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?) ఈ విషయంలో యశ్ మూవీ కేజీఎఫ్-2 రికార్డును అధిగమించింది. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం మున్ముందు మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ బ్లాక్‌బస్టర్ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా ఈ నెల 15న విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ‘కాంతార’కు బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా మంచి వసూళ్లను రాబడుతోంది. మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా గురించి తెలుసుకొని ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ‘కాంతార’ హవా నడుస్తోంది. -
ఆ చివరి 20 నిమిషాలు గూస్ బంప్స్.. కాంతారపై పూజా హెగ్డే
కన్నడ మూవీ కాంతార ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన నటులు రిషబ్ శెట్టిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ జాబితాలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా చేరిపోయింది. కాంతార సినిమాను వీక్షించిన భామ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టితో పాటు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఓ ప్రాంతీయ సంస్కృతిని అందరికీ అర్థమయ్యేలా అందంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా వేదికగా ఈ చిత్రంపై సమీక్షను వెల్లడించారు. పూజా తన ఇన్ స్టాలో స్టోరీలో రాస్తూ..'మీకేం తెలుసో దాన్నే కథగా రాయండి. మీ మనసులో నుంచి వచ్చిన స్టోరీనే చెప్పండి. ఈ సినిమాలోని చివరి 20 నిమిషాలు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. విజువల్స్, నటీనటుల ప్రదర్శనకు ఫిదా అయ్యా. ఈ చిత్రం ద్వారా రిషబ్ శెట్టి ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన భూతకోలని ఎంతో అద్భుతంగా చూపించి సూపర్ హిట్ అందుకున్నావు. రాబోయే రోజుల్లో మీరు మరిన్నీ ప్రశంసలు అందుకోవాలి' అంటూ పూజా రాసుకొచ్చింది. కాగా.. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా ఈ సినిమాను తెరకెక్కించారు. కర్ణాటకలోని తుళునాడు ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రం రూపొందించారు. స్థానికంగా ఉండే ప్రజలు గ్రామదేవతలను పూజించే భూతకోల సంస్కృతిని మూవీలో చక్కగా చూపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా.. విడుదలైన ‘కాంతార’ ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈసినిమా ఇప్పటివరకూ రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అంచనా వేస్తున్నారు. -
కేవలం అవి మాత్రమే థియేటర్లకు రప్పించలేవ్.. కాంతారపై ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఇప్పుడు ఎవరి నోటా విన్నా వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా 'కాంతార'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడలోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయడంతో కలెక్షన్లతో పలు పెద్ద చిత్రాల రికార్డులు బద్దలు కొడుతోంది. (చదవండి: కాసుల వర్షం కురిపిస్తున్న కాంతార.. మౌత్‌టాక్‌తోనే హిట్‌టాక్) అయితే ఈ సినిమా సక్సెస్ పట్ల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సైతం స్పందించారు. కేవలం సూపర్ స్టార్స్, మాసివ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్పెక్టాక్యులర్ వీఎఫ్ఎక్స్ మాత్రమే జనాలను థియేటర్లకు రప్పించగలవని ఫిల్మ్ మేకర్స్ అనుకుంటున్న తరుణంలో పేరు లేని చిన్న సినిమా పెద్ద సినిమాల రికార్డులను బద్దలు కొడుతోందని ట్వీట్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Just when all Filmwallas came to the conclusion that only SUPER STARS, MASSIVE PRODUCTION VALUES and SPECTACULAR VFX can bring people to theatres , a small tiny film with no names #Kantara is breaking all the records of the BIGGIES — Ram Gopal Varma (@RGVzoomin) October 17, 2022 -
కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్, మూడేళ్లుగా దాచిపెట్టాడు!
ప్రముఖ కన్నడ నటుడు హరీశ్ రాయ్ కేజీఎఫ్ సినిమాలో ఖాసిం చాచాగా నటించి సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పలువురు దక్షిణాది హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్యాన్సర్ నాలుగో దశలో ఉంది. తనకు క్యాన్సర్ సోకిన విషయాన్ని హరీశ్ రాయ్ మొదట గుట్టుగా దాచాడు. ఈ విషయం బయటకు చెప్తే తనకు సినిమా ఛాన్సులు రావేమోనన్న భయంతో దాన్ని గోప్యంగా ఉంచాడు. కానీ, తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాడు. 'కొన్ని పరిస్థితులు మనకు అద్భుతాన్ని అందించవచ్చు, లేదంటే మనదగ్గర ఉన్నదాన్ని కూడా పోగొట్టేలా చేయవచ్చు. విధి నుంచి మనం తప్పించుకునే ఛాన్సే లేదు. నేను మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దీనివల్ల మెడ దగ్గర వాచిపోయింది. నా దగ్గర డబ్బు లేకపోవడంతో శస్త్ర చికిత్స వాయిదా వేసుకున్నాను. ఆ సమయంలో కేజీఎఫ్‌లో నటించే అవకాశం రావడంతో పెద్ద గడ్డంతో నా వాపు కనిపించకుండా కవర్ చేసుకున్నాను. నేను నటించిన సినిమాలు రిలీజయ్యేవరకు ఈ విషయం చెప్పకూడదనుకున్నాను' 'ఇప్పుడు క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఉంది. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఓసారైతే క్లైమాక్స్‌లోని ఓ సీన్లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైంది' అని తన దీనగాథను చెప్పుకొచ్చాడీ నటుడు. ఒకసారి తన చికిత్స కోసం డబ్బులు కావాలని కోరుతూ ఓ వీడియో చేసినప్పటికీ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ధైర్యం చాల్లేదన్నాడు హరీశ్. ఇప్పుడతడికి క్యాన్సర్ ఉందన్న విషయం బహిర్గతం కావడంతో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారట! చదవండి: మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా? రజనీకాంత్‌తో సినిమా.. రాజమౌళి స్టేట్మెంట్, ‘ఆర్ఆర్’కి చాన్స్ ఉందా? -
‘రెడీగా ఉండు, నువ్వు కనపడకుండా పోతావ్’.. నిర్మాతకు హీరో వార్నింగ్!
నటుడు దర్శన్‌పై ఓ నిర్మాత కెంగేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు... భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ పేరుతో భరత్ అనే వ్యక్తి సినిమా తీస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైందీ సినిమా. ఇందులో విలన్ పాత్రలో ధ్రువన్ (సూరత్) నటిస్తున్నారు. సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావటంతో చిత్రీకరణ అలస్యమైనట్లు ధ్రువన్ వద్ద భరత్ వాపోయాడు. అయితే ధ్రువన్ ఈ విషయం చెప్పటానికి దర్శన్‌కు ఫోన్ చేశారు. అదే సమయంలో ఫోన్లో నిర్మాతను బెదిరించినట్లు భరత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఎన్సీఆర్ను నమోదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి దర్శకుడు ఆంథోని, కెమరామ్యాన్లను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దర్శన్ మాట్లాడిన ఆడియో సోషల్ వీడియాలో వైరల్‌గా మారింది. నీవు ఉండవు... ఏమైనా చేయాలంటే చెప్పే చేస్తా రెడీగా ఉండండి, నీవు కనపడకుండా పోతావంటూ ఆడియోలో ఉంది. ఈ ఆడియోలోని ధ్వని దర్శన్‌గా గుర్తించారు. దీంతో చందన సీమలో ఆడియోపై చర్చ సాగుతోంది. చదవండి: Mukesh Khanna: బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు -
సెట్లో దురుసు ప్రవర్తన.. నటుడు చందన్‌పై నిషేధం
ఇటీవల షూటింగ్ సెట్లో బుల్లితెర హీరో ఓవరాక్షన్ చేసి చెంపదెబ్బతిన్న సంఘటన సంచలనం రేపింది. ‘స్టార్ మా’ ధారావాహిక సావిత్రమ్మ గారి అబ్బాయితో తెలుగులో గుర్తింపు పొందిన నటుడు చందన్ కుమార్ ‘శ్రీమతి శ్రీనివాస్’ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం జరిగిన షూటింగ్ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాదు దుర్భాషలాడుతూ, అతడి తల్లిని దూషించాడు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ నటుడితో వాదనకు దిగాడు. చదవండి: ఆ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై ఈ క్రమంలో చందన్ ప్రవర్తన కాస్తా ఇబ్బందిగా అనిపించడంతో అక్కడి వారంత అతడిపై సీరియస్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్‌కి క్షమాపణ చెప్పమనడంతో చందన్ కుమార్ నేనేంటో చూపిస్తా అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్‌ని అందరి ముందే కొట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించగా చందన్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే అక్కడితో గొడవ ముగిసింది అనుకుంటే చందన్ కన్నడ మీడియా ముందు తెలుగు పరిశ్రమపై అసత్యాలు ప్రచారం చేస్తూ, తెలుగు బుల్లితెరని కించపరుస్తూ మాట్లాడాడు. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ దీంతో ఈ వివాదం కాస్తా మరింత ముదిరింది. తెలుగు పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడినందుకు నేడు తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేసి చందన్‌పై బ్యాన్ విధించింది. తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశంలో బాధితుడు అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘షాట్ రెడీ అని నాలుగు సార్లు పిలిచాను, అయినా రాకుండా నన్ను కొట్టి, బూతులు తిట్టాడు. డైరెక్టర్‌కి కంప్లైంట్ చేస్తే బయటకి రా దమ్ముంటే నేనెంటో చూపిస్తానంటూ బెదిరించాడు’ అని తెలిపాడు. దీంతో చందన్ తీరును క్షమించరానిదిగా పరిగణించి తెలుగు టీవీ ఫెడరేషన్ చందన్‌ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది. -
సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో
-
చీటింగ్ కేసు.. నటుడు, నిర్మాత అరెస్ట్
యశవంతపుర(బెంగళూరు): మోసం కేసుకు సంబంధించి నటుడు, నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు కోడిగేహళ్లి పోలీసుస్టేషన్లో బసవరాజ గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర జనహిత పార్టీని స్థాపించిన వీరేంద్రబాబు తనకు టికెట్ ఇస్తానని నమ్మించి 1.88 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అయనను అరెస్ట్ చేశారు. -
పవిత్రా లోకేశ్ నా భార్యే: సుచేంద్రప్రసాద్
బనశంకరి(కర్ణాటక): ‘నటి పవిత్రా లోకేశ్ నా భార్యే. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను వివాహం చేసుకున్నాను. నా పాస్‌పోర్ట్, ఆధార్ కార్డును గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది’ అని కన్నడ నటుడు సుచేంద్రప్రసాద్ చెప్పారు. నటి పవిత్ర, తెలుగు సీనియర్ నటుడు నరేష్‌లు పెళ్లి చేసుకోబోతున్నారని గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతుండటం, అదే సమయంలో వారిద్దరూ తరచూ జంటగా కనిపిస్తుండటం తెలిసిందే. చదవండి: అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది ఈ నేపథ్యంలో సుచేంద్రప్రసాద్ శనివారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవిత్రా లోకేశ్, తాను భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు వెళ్లామని, కానీ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు. మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడం విదేశీ సంస్కృతికి నిదర్శనమని భావించామని, అందుకే సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు. -
బెనారస్: మాయ గంగ సాంగ్ వచ్చేసింది
కేజీఎఫ్ తరువాత కన్నడ చిత్ర పరిశ్రమ పాన్ ఇండియాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా కన్నడ నటుడు జైద్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన బెనారస్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై తిలక్ బల్లాల్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఇందులోని మాయ గంగ అనే తమిళ వెర్షన్ పాటను చిత్రయూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత జీకే రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పాటను ఆవిష్కరించారు. ఇది కాశీలో జరిగే ప్రేమ కథా చిత్రమని దర్శకుడు తెలిపారు. బాహ్య సౌందర్యం కాకుండా అంతర సౌందర్యమే నిజమైన ప్రేమ చెప్పే చిత్రం ఇదని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు మాట్లాడుతూ తొలి చిత్రమే పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: శ్రీరామ్, అవికాగోర్ 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమా రివ్యూ జూలై 1న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు.. -
లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో, ధరెంతో తెలుసా?
కన్నడ స్టార్ దర్శన్ కొత్త కారు కొనుగోలు చేశాడు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని తన గ్యారేజీలోకి తెచ్చుకున్నాడు. దీని ధర దాదాపు రెండున్నర కోట్ల పైమాటే ఉంటుందని తెలుస్తోంది. కాగా సన్నీడియోల్, అర్జున్ కపూర్, ప్రకాశ్ రాజ్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ యజమానులే! ఇకపోతే దర్శన్‌కు కార్ల మీద మోజు ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడికి లంబోర్గిని ఉరుస్, హ్యురాకాన్ సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో మరో ఖరీదైన కారు చేరడంతో ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు నెట్టింట శుభాకాంక్షలు చెప్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ పెంపుడు కుక్కకి ఫ్లైట్ టికెట్స్ డిమాండ్ చేసిన రష్మిక? నటి రియాక్షన్! -
అక్క మరణానికి ప్రతీకారం.. బావమరిది చేతిలో నటుడు హత్య?
యశవంతపుర (బెంగళూరు): మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ నటుడు సతీష్ వజ్ర (36) శుక్రవారం రాత్రి బెంగళూరులో హత్యకు గురయ్యాడు. మూడు నెలల క్రితమే ఆయన భార్య ఆత్మహత్య చేసుకొంది. బెంగళూరులోనే నివాసం ఉంటూ టీవీ, యూట్యూబ్ చానెళ్లలో నటించి పేరు పొందిన సతీష్ ఇటీవల లగోరి అనే చిన్న సినిమాలోనూ నటించాడు. ఇంట్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలతో దాడి చేసి చంపారు. అక్క అకాల మరణానికి ప్రతీకారంగా భార్య తమ్ముడే హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. రాజరాజేశ్వరినగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పరీక్షల్లో ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం) -
'అఖండ' నటుడు చలపతి చౌదరి కన్నుమూత
ప్రముఖ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి (67) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని రాయ్‌చూర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న పలువురు సెలబ్రిటీలు చలపతి చౌదరికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా విజయవాడకు చెందిన చౌదరి రాయ్‌చూర్‌లో స్థిరపడ్డారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించారు. చిరంజీవి, శివరాజ్ కుమార్, బాలకృష్ణ వంటి పలు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్‌లోనూ కనిపించారు. ఇటీవల ఆయన నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రంలోనూ కనిపించి మెప్పించారు. చదవండి 👇 జీవిత నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు: నిర్మాతలు ఫైర్ ఓ వైపు చెల్లి పెళ్లి, మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ -
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జయంతి స్పెషల్ వీడియో
-
యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట తీవ్ర విషాదం
బెంగళూరు(కర్ణాటక): ప్రముఖ నటుడు, కన్నడ కళాతపస్వి రాజేశ్(89) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 19 తెల్లవారుజామున 2.03 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాజేశ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం కర్ణాటక విద్యారన్యపురలోని తన నివాసానికి తరలించనున్నారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. రాజేశ్ అసలు పేరు విద్యాసాగర్. ఈయన 1935లో బెంగళూరులో జన్మించారు. వీర సంకల్ప సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 1968లో వచ్చిన నమ్మ ఒరు సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన కన్నడ కళాతపస్విగా పేరుగాంచారు. 1960, 70 దశకాల్లో వచ్చిన పలు చిత్రాల్లో హీరోగా అలరించిన ఆయన ఆ తర్వాతి కాలంలో సహాయక పాత్రలు పోషించారు. 45 ఏళ్ల సినీప్రయాణంలో సుమారు 150 సినిమాల్లో నటించారు. ఈయనకు ఐదుగురు కుమార్తెలు కాగా వారిలో ఒకరైన ఆశారాణి.. నటుడు అర్జున్ సర్జా భార్య. ‘Kala Tapasvi’ Rajesh (15 April 1932 - 19 Feb 2022)#kalatapasvirajesh #JDS #HDdevegowda #HDkumarswamy pic.twitter.com/BqrjLhzoKF — Dr. Syed Mohid Altaf (@syedmohidaltaf) February 19, 2022 -
ఒక్క పైసా లేదు, దిక్కు తోచక గుడి ముందు.. నటుడు ఎమోషనల్
సాక్షి, యశవంతపుర (కర్ణాటక): నాకు కొడుకు పుట్టినప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అప్పుడు తండ్రిగా ఓడిపోయాను అని ప్రముఖ నటుడు జగ్గేశ్ గతం గుర్తుచేసుకున్నారు. తన కొడుకు గురురాజ్‌కు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు జగ్గేశ్. '1987లో తండ్రినయ్యాను. అప్పట్లో పని లేదు, చిల్లర డబ్బులూ లేవు. తండ్రిగా ఓడిపోయాను. దిక్కుతోచని స్థితిలో మంత్రాలయం గురురాయర ముందు నిలిచి నా గోడును చెప్పుకున్నా' అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ?
Kicha Sudeep 3D Movie Vikrant Rona Release Date Out: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రధారులుగా అనూప్ భండారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మంగళవారం విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘మిస్టరీ థ్రిల్లర్‌గా త్రీ డీ టెక్నాలజీతో రూపొందించిన ‘విక్రాంత్ రోణ’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రపంచానికి సరికొత్త సూపర్ హీరోను పరిచయం చేస్తున్నాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. దాదాపు 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’అని చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇందులో కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్‌తో కనిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను ఇస్తూ అంచనాలను పెంచుతూ వచ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. అప్పు ( పునీత్ రాజ్ కుమార్) మరణాంతరం 'కర్ణాటక రత్న' అవార్డుతో సత్కరించనున్నారు. కర్ణాటక రత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. "State Government has decided to honour late Sri Puneet Rajkumar with Karnataka Ratna award posthumously": Chief Minister @BSBommai. — CM of Karnataka (@CMofKarnataka) November 16, 2021 రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ తనదైన శైలిలో హీరోగా ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ అంటే పేరు కాదు, ఒక బ్రాండ్ అని అందరూ ఒప్పుకునే స్థాయికి ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాల్లో నటించడమే కాదు. పాటలు పాడటం కూడా ఆయనకు ఎంతో ఇష్టం. పునీత్ ఆరేళ్ల వయసు నుంచే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించారు. సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. కేవలం తన సినిమాలే కాక ఆయన అన్న శివరాజ్ కుమార్ సినిమాలు, ఇతర హీరోల సినిమాల్లో కూడా పునీత్ పాటలు పాడారు. ఇప్పటివరకూ వందకు పైగా పాటలు పాడిన పునీత్ రాజ్ కుమార్, గాయకుడిగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. సినిమాలే కాదు.. సామాజిక సేవ కార్యక్రమాలన్నా పునీత్‌కు మక్కువ ఎక్కువ. తన తల్లి పార్వతమ్మతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. మైసూరులో ఉన్న శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారు. కన్నడలో టాప్ హీరో అవడంతో ప్రచారకర్తగా కూడా పునీత్‌కు మంచి డిమాండ్ ఉండేది. తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ అడుగుజాడల్లో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. పునీత్ KMF ఉత్పత్తులను ఎలాంటి ఒప్పందం లేకుండా ప్రమోట్ చేశారు. -
సౌత్ ఇండియాలోనే ఏ హీరోకి లేని సక్సెస్ గ్రాఫ్ పునీత్ సొంతం
బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు సౌత్ ఇండియాలోనే ఏ సినిమా హీరోకి లేని ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన నటించిన 29 చిత్రాలలో అత్యదికం హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లే అత్యధికం. పునీత్ రాజ్‌కుమార్ కెరీర్లో కెవలం 4 సినిమాలు మాత్రమే నిరాశను కలిగించాయి. ఇలా పునీత్ రాజ్‌కుమార్ కెరీర్ ఆరంభంలో వరుసగా 11 చిత్రాలు సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లే కావడం విశేషం. ఆ రికార్డ్స్ సౌత్ ఇండియాలో ఏ ఇతర హీరోకు లేదనే చెప్పాలి. అయితే ఆయన విజయంలో మన తెలుగు వాళ్ళ పాత్రే ఎక్కువ. పునీత్ మొదని సినిమా నుంచి పవర్ స్టార్ బిరుదు వరకు తెలుగు సినిమా దర్శకులు, రచయితల పాత్ర ఉండటం విశేషం. తన తండ్రి స్వర్గీయ రాజ్‌కుమార్ కోరిక మేరకు మొదటి సినిమా పూరీ జగన్నాద్ దర్శకత్వంలో నటించాడు. పూరీ దర్శకత్వంలో 'అప్పు' చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు పునీత్. ఆ సినిమా రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమాకు మాత్రుక కావడం గమనార్హం. మొత్తంగా పునీత్ రాజ్‌కుమార్ నటించిన 29 చిత్రాలలో 6 బ్లాక్‌బస్టర్ హిట్లు కాగా 15 సూపర్ హిట్లు, అలాగే 5 సినిమాలు ఏవరేజ్ గానూ కెవలం 4 సినిమాలు మాత్రమే ప్లాప్‌గా నిలిచాయి. ఇలా తన కెరీర్లో 87% సక్సెస్ గ్రాఫ్ పునీత్ రాజ్‌కుమార్ సొంతం. తన నటన, డ్యాన్స్‌లతో లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన కన్నడ పవర్ స్టార్ ఇప్పుడు తమ మద్య లేక పోవడంతో తన అభిమానులతో పాటు యావత్ సినీ లోకం శోక సంద్రంలో మునిగి పోయింది.