kerala
-
ఆ ఏనుగు హెయిర్ స్టైల్ వేరేలెవెల్..!
ఫ్యాషన్ అంటే కేవలం మనుషుల మాత్రమేనా మేము కూడా తీసికిపోం అంటున్నాయి జంతువులు. ట్రెండీ ఫ్యాషన్‌ని మనుషులే కాదు జంతువుల కూడా ఫాలోఅవుతాయని ఈ వైరల్ వీడియోని చూశాక ఒప్పుకుంటారు. ఆ వీడియోలోని ఏనుగు స్టైల్ చూస్తే..వేరేలేవెల్ అని అంగీకరిస్తారు. మరీ ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..తమిళనాడులో మన్నార్గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఏనుగు విలక్షణమైన హెయిర్‌స్టైల్‌తో చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఏనుగు పేరు సెంగమాలం. ఆ ఏనుగుకి సంబంధించిన వీడియోని ఇండియా కల్చరల్ హబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సెంగమాలం ఏనుగు మనుషుల జుట్టు మాదిరిగా 'బాబ్‌కట్ హెయిర్ స్టైల్'లో ఉంటుంది. చూస్తే మనుషుల హెయిర్‌స్టైల్ మాదిరిగానే ఉంటుంది ఆ ఏనుగు హెయిర్. అంతేగాదండోయ్ ఆ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ ఏనుగే ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. అయితే ఇంతలా ఏనుగు జుట్టు పట్ల కేర్ తీసుకుంటున్న దాని సంరక్షకుడిని మెచ్చుకోవాల్సిందే. ఈ మేరకు ఆ ఏనుగు సంరక్షకుడు ఎస్ రాజగోపాల్ మాట్లాడుతూ..ఈ సెంగమాలం జుట్టుని వేసవికాలంలో రోజుకి మూడుసార్లు, ఇతర సీజన్లలో కనీసం రోజుకి ఒకసారైనా.. కడుగుతామని చెబుతున్నారు. 2003లో ఆ ఏనుగుని కేరళ నుంచి తీసుకవచ్చారట. అప్పటి నుంచి ఈ ఆలయంలోనే నివాసిస్తోందట. దేవుని కైంకర్యాలకు ఈ ఏనుగుని వినియోగిస్తామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. మే నెలలో ఈ ఏనుగుకి చల్లదనం కల్పించడం కోసం ప్రత్యేకంగా దాదాపు రూ. 45 వేలు ఖరీదు చేసే షవర్‌ని కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!) -
బరువు తగ్గాలని ఆ డైటింగ్ : చివరికి ప్రాణమే పోయింది!
బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా పొరబాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అసలు బరువు తగ్గడం అవసరమా? తగ్గితే ఎన్ని కిలోలు తగ్గాలి? ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనేది నిర్ణయించుకోవడం అవసరం. ఇందుకు వైద్యుల సలహాలు, నిపుణుల సూచనలు చాలా ముఖ్యం. అలాకాకుండా బరువు పెరుగుతామనే భయంతో ఆన్లైన్లో చూసో, లేదా మరెవరో చెప్పారనో ఏ డైట్ బడితే అది ఫాలో కావడం అనర్థం. ఒక్కోసారి ఇది ప్రాణాలు కూడా పోవచ్చు. కేరళలో కన్నూరులో చోటు చేసుకున్న ఘటన ఇలాంటి ఆందోళనలనే రేకెత్తిస్తోంది. కొన్ని రకాల రుగ్మతల వల్ల కూడా భయం పెరిగిపోతామనే భయం పట్టుకుంటుందని మీకు తెలుసా? రండి తెలుసుకుందాం! కేరళలోని కన్నూర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తీవ్రమైన ఆహార నియంత్రణలు పాటించేది. యూట్యూబ్‌లో చూసి దాదాపు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. కేవలం నీటినే తీసుకునేది. చివరికి తీవ్రమైన దీర్ఘకాలిక ఆకలి కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయింది. మృతురాల్ని కూతుపరంబ నివాసి శ్రీనందగా గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో తలస్సేరిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలు కోల్పోయింది. ఆమె గతంలో కూడి ఇలాంటి సమస్యలతో కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరిందట. వైద్యుడు డాక్టర్ నాగేష్ ప్రభు ప్రకారం, శ్రీనంద అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మతతో బాధపడుతోంది. దీని వలన రోగి బరువు పెరుగుతారనే భయం ఉంటుంది. ఆరు నెలల కింత నుంచి ఆకలితోనే ఉంటోందని ఆయన తెలిపారు. సోడియం , చక్కెర స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి సమస్యలకు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాధి తీవ్రత గురించి తెలుసు కోవాలన్నారు. పశ్చిమ దేశాల్లో ఎక్కువగా కనిపించే అనోరెక్సియా నెర్వోసా కేరళలో కనిపించడం ఇది చాలా అరుదు అని కూడా ఆయన చెప్పారు. అనోరెక్సియా నెర్వోసా అంటే..?డా. నగేష్ అందించిన వివరాల ప్రకారం అనోరెక్సియానెర్వోసాతో బాధపడేవారిలో కాలక్రమేణా ఆకలి అనే అనుభూతిని కోల్పోతారు. దీనికి కారణాలపై స్పష్టత లేదు. అయితే మానసిక ఆరోగ్యం, జన్యు మార్పులు, పర్యావరణం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతుంది. అన్ని వయసులు, జాతులు, శరీర రకాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.మానసిక చికిత్సఅనోరెక్సియా నెర్వోసా ఒక మానసిక పరిస్థితి. దీని లక్షణాలను బట్టి మానసిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, పోషకాహార కౌన్సెలింగ్, వారానికి ఒకసారి మానసిక కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. సకాలంలో చికిత్స చేస్తే నయమవుతుంది. అయితే, ఇలాంటివి రుగ్మతలు రాత్రికి రాత్రే నయం కావు. కోలుకోవడానికి సమయం చాలా పట్టవచ్చు. వైద్యులను సలహాలను తప్పక పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాల్సి ఉంటుంది. -
ఉడ్తా కేరళ!
అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు బానిసలవుతున్న పరిస్థితి! మాదకద్రవ్యాల వాడకంలో పంజాబ్‌ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూర్‌లో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు! సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు ఉదాహరణ మాత్రమే.కేరళలో ఏ మూలన చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం,1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్‌లో నమోదైంది 9,734 కేసులే! ‘‘సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయమొచి్చంది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయి’’ అని కేరళ హైకోర్టు జస్టిస్ వీజీ అరుణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.330 శాతం అధికం 2021 నుంచి చూస్తే మూడేళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330 శాతం పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తుపదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో రెండుసార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఎన్నెన్ని విషాదాలో...! డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు..→ కాలికట్ జిల్లాలో మత్తుకు బానిసైన పాతికేళ్ల ఆశిఖ్ తన తల్లినే నరికి చంపాడు. పైగా ‘నాకు జన్మనిచి్చనందుకు శిక్షించా’ అంటూ డ్రగ్స్ మత్తు లో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మా రింది.→ త్రిసూర్‌లో మరో పాతికేళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిసూర్‌లోనే 14, 16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటూ హల్చల్ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.→ తమ అబ్బాయి డ్రగ్స్ వ్యసనాన్ని వదిలించలేకపోతున్నామంటూ పథినంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది.→ డ్రగ్స్ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడుతో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు మందలించిన తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్ కొనేందుకు డబ్బివ్వలేదని తల్లినే చితకబాదాడు.→ డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి, విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్లనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు డ్రగ్స్‌ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్ గ్రూప్‌ల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్ సరఫరా చేసే హాట్స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషి‹Ù, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్నా మిథేలిన్ డైఆక్సీ మిథాఫెటమైన్ (ఎండీఎంఏ) వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65 శాతం పెరిగింది. ఎండీఎంఏ, మెథ్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్రతీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్‌వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు.నాలుగేళ్లలో 93,599 అరెస్టులు! కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్టు సీఎం విజయన్ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.క్యాండీలు, ఐస్క్రీంల రూపంలో... సింథటిక్ డ్రగ్స్ వాడేవారిలో సమాజంలోని అన్నివర్గాల వారూ ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్క్రీంల దాకా నానారకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యాసంస్థలే అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.సూపర్‌బైక్‌లపై డెలివరీ... స్మార్ట్ ఫోన్లో, వాట్సాప్ గ్రూప్‌లోనూ మెసేజ్ చేస్తే పావుగంటలోపే సూపర్ బైక్‌లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు/నకిలీ నంబర్ ప్లేట్లున్న సూపర్‌బైక్‌లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు, వేగంగా సరకు డెలివరీకి రాత్రిళ్లు ఈ బైక్‌లను వాడుతున్నట్టు ఎక్సయిజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18–24 ఏళ్ల వారినే డెలీవరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్‌కు రూ.1,000, రోజంతా డెలీవరీ చేస్తే రూ.4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు. టీనేజర్లనే డ్రగ్స్ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పోకిరీలతో పరిచయాలు కాకుండా తల్లిదండ్రులే తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి– రిటైర్డ్ ఎస్పీ కేజీ సిమాన్ కేరళలో పదేళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు– కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‘‘అత్యధిక అక్షరాస్యతా రేటు, ఉన్నత విద్యార్హతలున్నా ఉపాధి లేక కేరళలో యువత నైరాశ్యంతో డ్రగ్స్ బారిన పడుతోంది’’ – ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆసియా–పసిఫిక్ రీజియన్ మాజీ సలహాదారు జి.ప్రమోద్‌కుమార్– సాక్షి, నేషనల్ డెస్క్ -
దైవ భూమిలో ఇటువంటి ఏనుగుల గురించి తెలుసా? (ఫొటోలు)
-
‘కార్బన్ పాజిటివ్’ పొలం!
లిస్సిమోల్ జె. వడక్కూట్.. దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిన డైనమిక్ వ్యవసాయ అధికారిణి. కేరళ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో సహాయ సంచాలకురాలిగా గత 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కొచ్చిన్ నగరానికి సమీపంలో అలువి అనే చోట వందేళ్లకు ముందే ఏర్పాటైన ప్రభుత్వ వరి విత్తనోత్పత్తి క్షేత్రం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం లిస్సిమోల్ ఈ క్షేత్రం బాధ్యతలు తీసుకునేటప్పటికి దేశంలో ఎవరికీ దీని గురించి తెలీదు. అయితే, ఆమె అకుంఠిత దీక్షతో పనిచేసి ఈ క్షేత్రానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. దేశంలోనే తొలి ‘కార్బన్ న్యూట్రల్’ వరి క్షేత్రంగా అలువి సీడ్ ఫామ్‌కు గుర్తింపు దక్కింది. 5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. వరి (ఇక్కడ పండించే వరి రకాల్లో అత్యధికం దేశీ రకాలే)తో పాటు అనేక ఇతర పంటలను సాగుచేస్తూ.. ఒక ఆదర్శ సమీకృత వ్యవసాయ క్షేత్రంగా లిస్సిమోల్ ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. ‘కార్బన్ న్యూట్రల్’ అంటే?నీటిని నిల్వ గట్టి వరి పంటను సాగు చేస్తే కర్బన ఉద్గారాలు భారీగానే వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఉద్గారాలతో పాటు... నీటిని నిల్వగట్టడం వల్ల మిథేన్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంటుంది. అటువంటి పొలం నుంచి విడుదలయ్యే ఉద్గారాలను అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించటం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించటం మాత్రమే కాకుండా.. అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరించే స్థాయికి ఈ ఫామ్‌ను అభివృద్ధి చేయటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. 2022 డిసెంబర్లో అలువ ఫామ్‌ను ప్రభుత్వం కార్బన్ న్యూట్రల్ ఫామ్‌గా ప్రకటించింది.170 టన్నుల కర్బనం మిగులు!కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ‘కాలేజ్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్’ (ఇలాంటి కాలేజీ ఒకటి దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాటేమో గానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు) ప్రయోగాలు చేసి ఉద్గారాలను శాస్త్రీయంగా లెక్కగట్టింది. తురుత్ ద్వీప ప్రాంతంలో గల ఈ ఫామ్ 43 టన్నుల కర్బనాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తుండగా, 213 టన్నుల కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరిస్తోందని ఈ ప్రయోగాల్లో తేలింది. అంటే.. ఈ క్షేత్రం 170 టన్నుల కార్బన్ క్రెడిట్లను సంపాయించిందన్న మాట. ఇది నిజానికి ‘కార్బన్ పాజిటివ్’ క్షేత్రం!కేరళ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 13 విత్తనోత్పత్తి క్షేత్రాలు నడుస్తున్నాయి. వీటన్నిటినీ కార్బన్ న్యూట్రల్ ఫామ్స్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం చేరుకోవటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. అంతేకాదు, రాష్ట్రంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్బన్ న్యూట్రల్ ప్రదర్శనా క్షేత్రాలను నిర్మించే ప్రయత్నమూ జరుగుతోంది.ఇదీ సమీకృత సేంద్రియ సేద్యం5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో 3 హెక్టార్లలో వరితో పాటు.. ఒక హెక్టారులో చిరుధాన్యాలు, చియా గింజలు, కొబ్బరి, అరటి, దుంప పంటలు, జాపత్రి, కూరగాయలు, ΄్యాషన్ ఫ్రూట్ తదితర పంటలను సాగు చేస్తున్నారు. 2012 నాటికే ఎన్‌పిఓపి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చింది. 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాసర్గోడ్ కల్లన్ రకం దేశీ ఆవులు 9, మలబార్ మేకలు 16, కుట్టనాడన్ బాతులు వంద, నాటు కోళ్లు, గిన్నె కోళ్లు కలిపి 50తో పాటు బ్యాచ్‌కి 5 వేల గిఫ్ట్ తిలాపియా చేపలను సైతం ఈ సమీకృత క్షేత్రంలో పెంచుతున్నారు. దేశీ వరి రకాలు (జపాన్ వైలెట్, రక్తశాలి, గోల్డెన్ నవార, వెల్లతొండి, వదక్కన్ వెల్లారి కైమ, జైవ, మనురత్న..), అధికోత్పత్తినిచ్చే వరి వంగడాల విత్తనోత్పత్తిని చేపట్టడంతో పాటు లైవ్ రైస్ మ్యూజియంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. పంచగవ్య, జీవామృతం వంటి ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ ద్రావణాలతో పాటు చీడపీడలను అరికట్టే కషాయాలను తయారు చేసుకొని పంటలకు వాడటమే కాకుండా రైతులకు విక్రయిస్తున్నారు. వామ్, వర్మీ కం΄ోస్టు, వర్మీవాష్‌ను తయారు చేస్తున్నారు. రెడువీద్ వంటి మిత్రపురుగులను సైతం పెంచుతున్నారు. తేనెటీగల పెంపకం కూడా ఉంది. పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ క్షేత్రం నిజంగా విలక్షణమైనదే. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. వరి పొలంలో అనేక సమస్యల పరిష్కారానికి బాతులను ఉపయోగించటం. కలుపు నివారణ, చీడపీడల నియంత్రణతో పాటు భూసారం పెంపొందించడానికి కూడా బాతులు ఉపయోగపడుతున్నాయని లెస్సిమోల్ తెలిపారు. ఇక్కడ అనుసరించే ప్రతి పనినీ శాస్త్రీయంగా రికార్డు చేసి, అధ్యయనం చేసి గణాంకాలను రూపొందించారు. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని అన్ని హంగులతో సక్రమంగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ క్షేత్రం కళ్లకు కడుతున్నదనటంలో అతిశయోక్తి లేదు! దేశం నేర్చుకోదగ్గ పాఠాలు2012 నుంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఈ క్షేత్రంలో అనుసరిస్తూ పదేళ్లలో ఈ మైలురాయిని దాటాం. హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించే విధంగా వ్యవసాయ పనులను సమూలంగా మార్చాం. ఇలా చేయాల్సిన అవసరం ఏమిటో రైతులు, స్థానిక ప్రజలకు అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాం. దేశం యావత్తూ నేర్చుకోదగిన పర్యావరణ హిత సేద్య పాఠాలకు మా క్షేత్రం కేంద్ర బిందువైంది. – లిస్సిమోల్ జె. వడక్కూట్, సహాయ సంచాలకురాలు, స్టేట్ సీడ్ ఫామ్ అలువి, ఎర్నాకులం జిల్లా పంచాయత్, కేరళ -
విదర్భ తీన్మార్...
సీజన్ ఆసాంతం నిలకడ కొనసాగించిన విదర్భ జట్టు... తుదిపోరులోనూ అదే జోరు కనబరుస్తూ చాంపియన్‌గా ఆవతరించింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా... పరాజయమే ఎరగకుండా మూడోసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. అసమాన పోరాటంతో తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నిలో ఫైనల్ చేరిన కేరళ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా... దేశవాళీ టోర్నీ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు విజేతగా నిలిచింది. కేరళతో జరిగిన తుదిపోరు ‘డ్రా’గా ముగియడంతో... 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన విదర్భ జట్టుకు ట్రోఫీ దక్కింది. రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు చాంపియన్‌గా అవతరించడం ఇది మూడోసారి. 2017–18, 2018–19 సీజన్లలో వరుసగా ట్రోఫీ చేజిక్కించుకున్న విదర్భ జట్టు... మళ్లీ ఆరేళ్ల తర్వాత టైటిల్ దక్కించుకుంది. తాజా సీజన్లో ఫైనల్‌తో కలిపి మొత్తం 10 మ్యాచ్‌లాడిన విదర్భ... పరాజయం లేకుండా ట్రోఫీ కైవసం చేసుకోవడం విశేషం. సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చాంపియన్ విదర్భ జట్టుకు రూ. 5 కోట్లు... రన్నరప్ కేరళ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. సొంత మైదానంలో జరిగిన తుదిపోరులో ఓవర్‌నైట్ స్కోరు 249/4తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు... 143.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (295 బంతుల్లో 135; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు మరో 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగినా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (108 బంతుల్లో 25), దర్శన్ నల్కండే (98 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్షయ్ కర్నెవర్ (70 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. ఫలితంగా విదర్భ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 37 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా విదర్భ జట్టు 412 పరుగుల ముందంజలో నిలిచింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు టీ విరామం కంటే ముందే ‘డ్రా’కు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన విదర్భ బ్యాటర్ దానిశ్ మాలేవర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 379; కేరళ తొలి ఇన్నింగ్స్: 342; విదర్భ రెండో ఇన్నింగ్స్: పార్థ్ రేఖడే (బి) జలజ్ సక్సేనా 1; ధ్రువ్ షోరే (సి) అజహరుద్దీన్ (బి) ని«దీశ్ 5; దానిశ్ మాలేవర్ (సి) సచిన్ బేబీ (బి) అక్షయ్ చంద్రన్ 73; కరుణ్ నాయర్ (స్టంప్డ్) అజహరుద్దీన్ (బి) ఆదిత్య 135; యశ్ రాథోడ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య సర్వతే 24; అక్షయ్ వాడ్కర్ (బి) ఆదిత్య 25; హర్ష్ దూబే (ఎల్బీడబ్ల్యూ) అధన్ టామ్ 4; అక్షయ్ కర్నెవర్ (బి) బాసిల్ 30; దర్శన్ నల్కండే (నాటౌట్) 51; నచికేత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య 3; యశ్ ఠాకూర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (143.5 ఓవర్లలో 9 వికెట్లకు) 375. వికెట్ల పతనం: 1–5, 2–7, 3–189, 4–238, 5–259, 6–279, 7–283, 8–331, 9–346, బౌలింగ్: ని«దీశ్ 15–3–48–1; జలజ్ సక్సేనా 50–11–109–1; అధన్ టామ్ 14–0–57–1; ఆదిత్య సర్వతే 44.5–12–96–4; బాసిల్ 7–2–18–1; అక్షయ్ చంద్రన్ 13–2–33–1.వీసీఏ నజరానా రూ. 3 కోట్లు మూడోసారి రంజీ టైటిల్ నెగ్గిన తమ జట్టుకు విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. టీమ్ మొత్తానికి రూ. 3 కోట్లు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపింది. ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసి రికార్డు నెలకొలి్పన హర్ష్ దూబేకు రూ. 25 లక్షలు... నాలుగు సెంచరీలతో అదరగొట్టిన కరుణ్ నాయర్‌కు రూ. 10 లక్షలు... ఈ రంజీ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన యశ్ రాథోడ్‌కు రూ. 10 లక్షలు... హెడ్ కోచ్ ఉస్మాన్ ఘనీకి రూ. 15 లక్షలు... అసిస్టెంట్ కోచ్ అతుల్ రనాడేకు రూ. 5 లక్షలు... ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నితిన్ ఖురానాకు రూ. 5 లక్షలు... స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ యువరాజ్ సింగ్ దసోంధికి రూ. 5 లక్షలు... వీడియో ఎనలిస్ట్ అమిత్ మాణిక్‌రావుకు రూ. 5 లక్షలు ప్రకటించారు. గతేడాది మేం ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఈసారి అలాంటి తప్పు చేయకూడదని ముందే అనుకున్నాం. ప్రతి ఒక్కరు తమ ఆటతీరును మెరుగు పర్చుకున్నారు. దాని ఫలితమే ఈ విజయం. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తొలి పది మందిలో నలుగురు విదర్భ ఆటగాళ్లు ఉన్నారు. సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన హర్ష్, అత్యధిక పరుగులు చేసిన యశ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ హోదాలో ఈసారి రంజీ ట్రోఫీ అందుకున్న క్షణాలు అద్భుతంగా అనిపించాయి. –అక్షయ్ వాడ్కర్, విదర్భ కెప్టెన్ -
కరుణ్ నాయర్ సూపర్ సెంచరీ.. రంజీ ఛాంపియన్‌గా విదర్భ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy 2024-25) ఎడిషన్ ఛాంపియన్‌గా విదర్భ (Vidarbha) అవతరించింది. కేరళతో (Kerala) జరిగిన ఫైనల్ డ్రాగా ముగిసినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విదర్భ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 37 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ స్కోర్‌ను క్రాస్ చేయలేకపోవడంతో తొలి సారి రంజీ ఫైనల్‌కు చేరిన కేరళ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.VIDARBHA LIFTS THE RANJI TROPHY. 🏆- 3rd Ranji title in the last 7 years. 🔥pic.twitter.com/cKclAW94XJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2025విదర్భ రంజీల్లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. విదర్భ 2017-18, 2018-19 ఎడిషన్లలో వరుసగా రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. గత ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరిన విదర్భ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత సీజన్ ఫైనల్లో విదర్భ ముంబై చేతిలో ఓడింది.VIDARBHA HAS WON 3 RANJI TROPHY TITLES IN JUST 7 YEARS 🤯- New force of Indian Domestic Cricket. pic.twitter.com/grTjVqWxLd— Johns. (@CricCrazyJohns) March 2, 2025మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో విదర్భ రెండు ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేయగా.. కేరళ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది.యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (86) సెంచరీకి చేరువలో రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా విదర్భ 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కేరళ ఇన్నింగ్స్‌లో ఆదిత్య సర్వటే (79), సచిన్ బేబి (98) సత్తా చాటగా.. అహ్మద్ ఇమ్రాన్ (37), మహ్మద్ అజాహరుద్దీన్ (34), సల్మాన్ నిజర్ (21), జలజ్ సక్సేనా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ (0), ఏడెన్ యాపిల్ టామ్ (10), నిధీశ్ (1) నిరాశపరిచారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, పార్థ్ రేఖడే, హర్ష్ దూబే తలో 3 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.సూపర్ సెంచరీతో మెరిసిన కరుణ్37 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ అయిన కరుణ్ నాయర్ ఈ ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో (135) మెరిశాడు. కరుణ్‌కు ఈ రంజీ సీజన్లో ఇది నాలుగో సెంచరీ. ఓవరాల్‌గా ఈ దేశవాలీ సీజన్లో 9వది. ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఐదు సెంచరీలు చేశాడు.రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించిన మలేవార్తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దనిశ్ మలేవార్ (73) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ద సెంచరీతో రాణించాడు. ఐదో రోజు ఆట చివరి సెషన్లో దర్శన నల్కండే (51 నాటౌట్) కేరళ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కేరళ బౌలర్లలో ఆదిత్య సర్వటే 4 వికెట్లు తీయగా.. నిధీశ్, జలజ్, యాపిల్ టామ్, బాసిల్, అక్షయ్ చంద్రన్ తలో వికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా హర్ష్ దూబేఈ రంజీ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు తీసిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబేకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీమెంట్ అవార్డు లభించింది. ఈ ప్రదర్శనతో హర్ష్ ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో హర్ష్ 7 ఐదు వికెట్ల ప్రదర్శనలు.. 3 నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన దనిశ్ మలేవార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
‘నేను లేకుండా ఆమె ఒంటరిగా బ్రతకలేదు..’!
తిరువనంతపురం: కేరళలో ప్రియురాలితో సహా, నలుగురు కుటుంబ సభ్యుల్ని అతి దారుణంగా హత్య చేసిన ‘సైకో కిల్లర్’ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల అఫాన్ నుంచి కీలక వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు.ఈ హత్యలు అనంతరం వెంజరామూడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన అఫాన్.. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు. పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఇదంతా పోలీసులకు సరెండర్ అయిన తర్వాత జరగ, ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ నిందితుడి నుంచి స్టేట్ మెంట్ లు తీసుకుంటున్నారు పోలీసులు. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో ప్రశ్నించగా, తన గర్ల్ ఫ్రెండ్ ను ఎందుకు హత్య చేశాడో వెల్లడించాడు.ఒంటరిగా ఉండలేను అన్నందుకే..తన ప్రేయసిని చంపడానికి ‘నేను లేకుండా ఆమె ఒంటరిగా బ్రతకలేదు’’ అనే ఉద్దేశంతోనే హత్య చేయాల్సి వచ్చిందని నిందితుడు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబాన్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే దానికి సదరు నిందితుడు సమాధానం చెప్పాడు. తన కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుందని, అందుకు తానే హత్య చేయాలనుకున్నానని పోలీసులు పేర్కొన్నారు.అయితే అతని స్టేట్ మెంట్ ను ఇంకా పూర్తిగా నమ్మలేమని, విచారణ జరుగుతుందన్నారు పోలీసులు. అతను చెప్పేదాంట్లో నిజమెంతో ఇంకా దర్యాప్తు చేస్తే కానీ తెలియదన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారన్నారు. అతని బ్లడ్ శాంపిల్స్ ను మెడికల్ టెస్టు కోసం పంపామన్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ కోరతామని, ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు కోసం అతన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు.రూ. 65 లక్షల అప్పు.. ఆపై హత్యలకు ప్లానింగ్ఈ హత్యలకు ముందు 14 మంది రూ. 65 లక్షల వరకూ అప్పు తీసుకున్నాడు. అనంతరం తాను హత్యలు చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. నిందితుడి కుటుంబ సభ్యుల్లో ఒకరైన 88 ఏళ్ల బామ్మతో పాటు, 13 ఏళ్ల తమ్ముడిని, వరుసకు అత్తయ్య ఆమెను, ఆమె భర్తను, గర్ల్ ఫ్రెండ్ ను హత్య చేశాడు. -
తొమ్మిది సెంచరీలు.. సిగ్గుతో తలదించుకోండి!.. వీడియో వైరల్
విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) మరోసారి శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఎలైట్ 2024-25 సీజన్ ఫైనల్లో భాగంగా కేరళపై సెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా అతడు సెలబ్రేట్ చేసుకున్న విధానం నెటిజన్లను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భీకర ఫామ్‌లో ఉన్న ఆటగాడి పట్ల వివక్ష చూపిస్తున్న టీమిండియా సెలక్టర్లు సిగ్గుతో తలదించుకోవాలంటూ అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా దేశవాళీ క్రికెట్ తాజా ఎడిషన్‌లో ఫార్మాట్లకు అతీతంగా కరుణ్ నాయర్ దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ(Vidarbha) కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం ఎనిమిది ఇన్నింగ్స్‌లోనే 779 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు శతకాలు ఉండటం విశేషం.ఈ నేపథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టులో కరుణ్ నాయర్‌కు స్థానం దక్కాలని భారత మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడి అత్యద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు.ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న వాళ్లను జట్టులోకి తీసుకోలేమని వ్యాఖ్యానించాడు. అతడు ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రస్తుత జట్టులో చోటు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడు.23వ శతకంఈ క్రమంలో నిరాశకు గురైనప్పటికీ కరుణ్ నాయర్ ఆ ప్రభావాన్ని తన ఆట మీద పడనీయలేదు. రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై శతకం(122) బాదిన అతడు.. తాజాగా ఫైనల్లోనూ సెంచరీతో మెరిశాడు. నాగ్‌పూర్ వేదికగా కేరళ జట్టుతో జరుగుతున్న తుదిపోరులో నాలుగో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్.. 184 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి ఇది 23వ శతకం.సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!ఈ నేపథ్యంలో హెల్మెట్ తీసి బ్యాట్‌ను ఆకాశం వైపు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్న కరుణ్ నాయర్... ఆ తర్వాత బ్యాట్, హెల్మెట్‌ను కింద పెట్టేసి.. తన చేతి వేళ్లలో తొమ్మిదింటిని ఎత్తి చూపాడు. దేశీ తాజా సీజన్లో తాను తొమ్మిది సెంచరీలు సాధించానని.. ఇకనైనా టీమిండియాలో చోట ఇవ్వండి అన్నట్లుగా సెలక్టర్లకు సందేశం పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ ఇప్పటి వరకు కేవలం ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ సాయంతో 374 పరుగులు చేసిన అతడు.. వన్డేల్లో 46 రన్స్ చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. కేరళతో శనివారం నాటి ఆట ముగిసే సరికి కరుణ్ నాయర్ 280 బంతులు ఎదుర్కొని 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో రోజు ఆట పూర్తయ్యే సరికి కేరళ కంటే 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం 💯 for Karun Nair 👏A splendid knock on the big stage under pressure 💪It's his 9⃣th 1⃣0⃣0⃣ in all formats combined this season, and the celebration says it all👌🙌#RanjiTrophy | @IDFCFIRSTBank | #FinalScorecard ▶️ https://t.co/up5GVaflpp pic.twitter.com/9MvZSHKKMY— BCCI Domestic (@BCCIdomestic) March 1, 2025 -
Ranji Trophy Final: చరిత్ర సృష్టించిన దూబే.. విదర్భకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
రంజీ క్రికెట్లో (Ranji Trohy) విదర్భ (Vidarbha) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే (Harsh Dubey) చరిత్ర సృష్టించాడు. ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు (69 వికెట్లు) తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బీహార్ బౌలర్ అషుతోష్ అమన్ పేరిట ఉండింది. అమన్ 2018-19 ఎడిషన్‌లో 68 వికెట్లు తీశాడు. ప్రస్తుత రంజీ ఎడిషన్ (2024-25) ఫైనల్లో (కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో) హర్ష్, అమన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఎడిషన్‌లో హర్ష్ 19 ఇన్నింగ్స్‌ల్లో 16 సగటున 69 వికెట్లు తీశాడు.రంజీ ట్రోఫీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..హర్ష్ దూబే (విదర్భ)- 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (2024-25)ఆషుతోష్ అమన్ (బీహార్)- 8 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు (2018-19)జయదేవ్ ఉనద్కత్ (సౌరాష్ట్ర)- 10 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు (2019-20)ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హర్ష్ సహా విదర్భ బౌలర్లు రాణించడంతో విదర్భ కేరళపై కీలకమైన తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో విదర్భ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అతనికి కరుణ్ నాయర్ (86) సహకరించాడు.విదర్భ ఇన్నింగ్స్‌లో మలేవార్, కరుణ్ నాయర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటై, విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 37 పరుగులు వెనుకపడింది. కేరళ ఇన్నింగ్స్‌కు ఆదిత్య సర్వటే (79), కెప్టెన్ సచిన్ బేబి (98) జీవం పోశారు. వీరిద్దరూ అహ్మద్ ఇమ్రాన్ (37), సల్మాన్ నిజర్ (21), మహ్మద్ అజారుద్దీన్ (34), జలజ్ సక్సేనాతో (28) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఓ దశలో (సచిన్ క్రీజ్‌లో ఉండగా) కేరళ విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేసేలా కనిపించింది. అయితే సచిన్ సెంచరీ ముందు అనవసర షాట్ ఆడి వ్యక్తిగతంగా నష్టపోవడంతో పాటు జట్టును కూడా ఇరకాటంలో పడేశాడు. సచిన్ ఔటయ్యాక కేరళ ఇన్నింగ్స్ ఒక్కసారిగా గతి తప్పింది. 18 పరుగుల వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోయింది. పార్థ్ రేఖడే సచిన్ సహా జలజ్ సక్సేనా, ఏడెన్ యపిల్ టామ్ వికెట్లు తీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో హర్ష్ కూడా 3 వికెట్లు తీశాడు. కీలకమైన ఆదిత్య సర్వటే, సల్మాన్ నిజర్, ఎండీ నిధీశ్ వికెట్లు పడగొట్టాడు. నిధీశ్ వికెట్‌తో హర్ష్ ఓ సింగిల్ రంజీ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.కీలకమైన తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించి విదర్భ కేరళపై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భనే విజేతగా నిలుస్తుంది. అలాగని కేరళకు దారులు మూసుకుపోలేదు. కేరళ విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసి, వారు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ జట్టు తమ తొలి రంజీ టైటిల్ కలను నెరవేర్చుకుంటుంది. ప్రస్తుతానికి కేరళపై విదర్భ ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. విదర్భ, కేరళ తమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంది. విదర్భ గత సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో భంగపడి టైటిల్ ఆశలను చేజార్చుకుంది. ఈసారి ఆ జట్టు ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. కాగా, ఈ సీజన్లో విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు చేరింది. -
అద్భుతమై ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. తృటిలో సెంచరీ మిస్
కేరళ, విదర్భ (Kerala Vs Vidarbha) జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ (Ranji Trophy Final) హోరాహోరీగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు ఇరు జట్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో విదర్భ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అతనికి కరుణ్ నాయర్ (86) సహకరించాడు. అనంతరం బరిలోకి దిగిన కేరళ విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సచిన్ బేబి (Sachin Baby) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేరళను తొలి ఇన్నింగ్స్ సాధించే దిశగా తీసుకెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 235 బంతులు ఎదుర్కొన్న సచిన్.. 10 బౌండరీల సాయంతో 98 పరుగులు చేశాడు. సచిన్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య సర్వటే (79) కేరళ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. సర్వటే.. అహ్మద్ ఇమ్రాన్ (37), సచిన్ బేబి సహకారంతో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అనంతరం సచిన్.. సల్మాన్ నిజర్ (21), మహ్మద్ అజహరుద్దీన్ (37), జలజ్ సక్సేనా (28 నాటౌట్) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.మూడో రోజు మూడో సెషన్ సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా, ఏడెన్ యాపిల్ టామ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేరళ ఇంకా 42 పరుగులు వెనుకపడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధిస్తే ఈ మ్యాచ్ డ్రా అయినా కేరళనే విజేతగా నిలుస్తుంది. కాబట్టి తొలి ఇన్నింగ్స్ లీడ్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి.ఇబ్బంది పెట్టిన నల్కండేఈ ఇన్నింగ్స్‌లో కేరళకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ను (0) దర్శన్ నల్కండే తెగ ఇబ్బంది పెట్టాడు. వీరిద్దరినీ నల్కండే 13 పరుగుల వ్యవధిలో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో నల్కండే ఈ రెండు వికెట్లతో పాటు మరో వికెట్ కూడా తీశాడు. సెమీఫైనల్లో సెంచరీ హీరో మహ్మద్ అజహరుద్దీన్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. విదర్భ బౌలర్లలో నల్కండేతో పాటు హర్ష్ దూబే (2), యశ్ ఠాకూర్ (1), పార్థ్ రేఖడే (1) వికెట్లు తీశారు.అంతకుముందు విదర్భ ఇన్నింగ్స్‌లో మలేవార్, కరుణ్ నాయర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు చేరింది. -
ఆ‘పాత’ నావ
ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు, చెక్క, తాళ్లు తదితరాలతో వీటిని తయారు చేసేవారు. అయినా ఇవి అత్యంత ప్రతికూల వాతావరణాలను కూడా తట్టుకుంటూ సదూర సముద్రయానాలకు ఎంతో అనువుగా ఉండేవి. ఈ భారతీయ నావలకు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా యమ గిరాకీ ఉండేదట. ఇంతటి చరిత్ర ఉన్న పురాతన భారతీయ నావకు వాయుసేన, కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పుడిలా ప్రాణం పోశాయి. వారి ఆలోచనలకు రూపమిస్తూ గోవాకు చెందిన నౌకా నిర్మాణ సంస్థ హోడీ ఇన్నొవేషన్స్ అచ్చం అలనాటి విధానంలోనే దీన్ని రూపొందించింది. బాబు శంకరన్ సారథ్యంలో కేరళకు చెందిన నిపుణులైన పనివాళ్లు అహోరాత్రాలు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. అప్పట్లో మాదిరిగానే ఈ నావను ముందుగా రెండు అర్ధ భాగాలుగా నిర్మించారు. తర్వాత కొబ్బరి నార నుంచి అల్లిన తాళ్ల సాయంతో ఒడుపుగా ఒక్కటిగా బిగించారు. సముద్ర జలాల్లో తడిసి పాడవకుండా నావ అడుగు, పక్క భాగాలకు అప్పటి పద్ధతుల్లోనే సార్డిన్ ఆయిల్ తదితరాలతో పూత పూశారు. మన్నిక కోసం టేకు, పనస వంటి చెక్కలు మాత్రమే వాడారు. ఈ తరహా భారతీయ నావల హవా క్రీస్తుశకం ఐదో శతాబ్ది దాకా ప్రపంచమంతటా నిరి్నరోధంగా సాగింది. ఆ ఘన వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఇదో ముందడుగని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆ‘పాత’నావకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. ఇది బుధవారం ఘనంగా జలప్రవేశం చేసింది. ఈ ఏడాది చివర్లో 15 మంది నేవీ అధికారులతో ప్రాచీన సముద్ర మార్గాల్లో ఈ నావ మస్కట్, ఇండొనేసియాలకు తొలి ప్రయాణం ప్రారంభించనుంది. దీన్ని నడిపే విధానం తదితరాలపై వారు ముందస్తు శిక్షణ కూడా పొందనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రంజీ ట్రోఫీ ఫైనల్.. విదర్భ భారీ స్కోర్.. పోరాడుతున్న కేరళ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్ ఫైనల్లో గతేడాది రన్నరప్ విదర్భ (Vidarbha), తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ (Kerala) తలపడుతున్నాయి. విదర్భలోని నాగ్‌పూర్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేరళ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (379) చేసింది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (86) అతనికి సహకరించాడు. దురదృష్టవశాత్తు కరుణ్ సెంచరీకి ముందు రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ (0) నిరాశపర్చగా.. ఆదిత్య సర్వటే (66 నాటౌట్), అహ్మద్ ఇమ్రాన్ (37) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసిన సర్వటే.. కెప్టెన్ సచిన్ బేబితో (7) కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 14 పరుగులకే ఇద్దరు కేరళ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపాడు. యశ్ ఠాకూర్ క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఇమ్రాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. కేరళ.. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 248 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. -
రంజీ ఫైనల్లో శతక్కొట్టిన యువ కెరటం
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్ ఫైనల్ (Ranji Final) మ్యాచ్ ఇవాళ (ఫిబ్రవరి 26) మొదలైంది. గతేడాది రన్నరప్ విదర్భ (Vidarbha).. తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళతో (Kerala) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో కేరళ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బౌలింగ్ చేసిన కేరళకు ఆదిలోనే ఫలితం లభించింది. ఆ జట్టు బౌలర్ నిధీశ్ మ్యాచ్ రెండో బంతికే విదర్భ ఓపెనర్ పార్థ్ రేఖడేను (0) ఔట్ చేశాడు. అనంతరం నిధీశ్ ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు. 11 పరుగుల స్కోర్ వద్ద నిధీశ్ దర్శన్ నల్కండేను (1) పెవిలియన్‌కు పంపాడు. మరికొద్ది సేపటికే విదర్భ మూడో వికెట్ కోల్పోయింది. ఈసారి ఏడెన్ యాపిల్ టామ్ కేరళకు సక్సెస్ అందించాడు. టామ్.. విదర్భ స్టార్ బ్యాటర్ ధృవ్ షోరేను (16) ఔట్ చేశాడు. ఫలితంగా విదర్భ 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.Danish Malewar in his last 13 innings 👏61, 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 104*(still batting)#RanjiTrophy2025pic.twitter.com/HmdjKiXaOm— CricTracker (@Cricketracker) February 26, 2025సెంచరీతో కదంతొక్కిన దనిశ్ మలేవార్ఈ దశలో 21 ఏళ్ల దనిశ్ మలేవార్ (Danish Malewar) సెంచరీతో కదంతొక్కి విదర్భను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. దనిశ్ 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. దనిశ్ తన సెంచరీ మార్కును సిక్సర్, బౌండరీతో అందుకున్నాడు. దనిశ్కు స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) సహకారం అందిస్తున్నాడు. కరుణ్ సైతం అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దనిశ్, కరుణ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 158 పరుగులు జోడించారు. 63 ఓవర్లు ముగిసే సరికి విదర్భ స్కోర్ 183/3గా ఉంది. దనిశ్ 116.. కరుణ్ 51 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.భీకర ఫామ్‌లో దనిశ్దనిశ్ ప్రస్తుత రంజీ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో దనిశ్ 13 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 600 పైచిలుకు పరుగులు చేశాడు. ఫైనల్లో సెంచరీతో మెరిసిన దనిశ్.. క్వార్టర్ ఫైనల్, సెమీస్‌లో అర్ద సెంచరీలతో రాణించాడు. దనిశ్ ఇదే సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆంధ్రతో జరిగిన అరంగ్రేటం మ్యాచ్‌లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం వరుసగా 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 118* పరుగులు స్కోర్ చేశాడు. -
కాంగ్రెస్‌కు నా అవసరం లేదనుకుంటే.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తీరు కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీలో చేరుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మరోసారి శశిథరూర్ ప్రశంసించారు. అలాగే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు కథనాలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు.తాజాగా శశిథరూర్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నన్ను వ్యతిరేకిస్తున్నారు. కానీ, నేను దేశం, కేరళ భవిష్యత్ కోసం మాట్లాడుతున్నాను. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నేను కాంగ్రెస్‌కు విధేయుడినే. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకానీ, పార్టీ మారే ఆలోచన నాకు లేదు. ప్రజల సేవ పట్ల నిబద్ధతతో ఉన్నాను. నేను రాజకీయాల్లోకి రా ముందే ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా పనిచేశాను. అనంతరం.. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని కోరిన తర్వాతే పార్టీలో చేరాను’ అని తెలిపారు.పార్టీకి నేను అవసరం అనుకుంటే నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతాను. పార్టీకి అవసరం లేదనుకుంటే నా ముందు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంతేకానీ ఇతర పార్టీల్లో చేరడంపై నేను ఆలోచించడం లేదు. పుస్తకాలు.. ప్రసంగాలు.. సదస్సుల కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఆహ్వానాలు.. ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నేను ప్రజాస్వామ్యవాదిగా ఉంటాను. మతతత్వాన్ని వ్యతిరేకిస్తాను. అలాగే, సామాజిక న్యాయాన్ని నమ్ముతాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త అయిన శశిథరూర్.. పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై ప్రశంసలు కురిపించడం కాంగ్రెస్ నాయకత్వానికి రుచించలేదు. కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్ టేప్ కోత విధానాలను శశిథరూర్ ఇటీవల ప్రశంసించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన, ట్రంప్‌తో భేటీ ఫలితాలను శశిథరూర్ కొనియాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
రంజీ రారాజు ఎవరో?
నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి జరగనున్న 2024–25 రంజీ ట్రోఫీ సీజన్ ఫైనల్లో కేరళతో రెండుసార్లు చాంపియన్ విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది ఫైనల్లో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన విదర్భ జట్టు... ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పు చేజిక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి రంజీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు అద్భుతాన్ని ఆశిస్తోంది. తాజా సీజన్లో ఇరు జట్లు నిలకడైన ప్రదర్శన కనబర్చగా... అక్షయ్ వాడ్కర్ సారథ్యంలోని విదర్భ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఫైనల్ చేరే క్రమంలో విదర్భ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలుపొందిన విదర్భ... క్వార్టర్ ఫైనల్లో తమిళనాడును చిత్తు చేసింది. ఇక డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో జరిగిన సెమీఫైనల్లో విజృంభించిన విదర్భ... స్టార్లతో కూడిన ముంబైకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో నిరుడు ఫైనల్లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో ఇది 90వ సీజన్ కాగా... విదర్భ జట్టుకిది నాలుగో ఫైనల్. గతంలో 2017–18, 2018–19 సీజన్లలో వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు... గతేడాది ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.అప్పటి నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో విదర్భ జట్టు నిలకడగా విజయాలు సాధిస్తోంది. ఈ సీజన్లో విజయ్ హజారే ట్రోఫీలో కూడా విదర్భ జట్టు ఫైనల్‌కు చేరింది. మరోవైపు తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించిన కేరళ సమష్టి కృషితోనే టైటిల్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. బ్యాటింగే బలంగా... తాజా సీజన్లో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసిన విదర్భ జట్టు... బ్యాటింగే ప్రధాన బలంగా ఫైనల్ బరిలోకి దిగనుంది. కెపె్టన్ అక్షయ్ వాడ్కర్, కరుణ్ నాయర్, అథర్వ తైడే, ధ్రువ్ షోరే, యశ్ రాథోడ్, దానిశ్ మాలేవర్‌తో విదర్భ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. 933 పరుగులు చేసిన యశ్ రాథోడ్ విదర్భ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. 5 సెంచరీలు, 3 అర్ధసెంచరీలతో విజృంభించిన యశ్... 58.13 సగటుతో ఈ పరుగులు రాబట్టడం విశేషం. సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో యశ్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్, కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు అతడు 48.14 సగటుతో 674 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అందులో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగుతున్న సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ 8 మ్యాచ్‌లాడి 45.85 సగటుతో 642 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉంది. దానిశ్ మాలేవర్ (557 పరుగులు), ధ్రువ్ షోరే (446 పరుగులు) కూడా రాణించారు. బ్యాటింగ్‌లో టాపార్డర్ సమష్టిగా కదంతొక్కుతుంటే... బౌలింగ్‌లో 22 ఏళ్ల హర్‡్ష దూబే సంచలన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 66 వికెట్లు పడగొట్టిన హర్‡్ష... ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు అశుతోశ్ అమన్ (2018–19 సీజన్లో 68 వికెట్లు; బిహార్) పేరిట ఉంది. హర్‡్షతో పాటు దర్శన్ నల్కండే, నచికేత్ భూటె, పార్థ్ రెఖడే బౌలింగ్‌లో కీలకం కానున్నారు. ఈ బౌలింగ్ దాడిని కాచుకుంటూ పరుగులు రాబట్టాలంటే కేరళ జట్టు శక్తికి మించి పోరాడక తప్పదు. సమష్టి కృషితో... స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... సమష్టి ప్రదర్శనతోనే కేరళ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో 3 మ్యాచ్‌లు గెలిచి మరో రెండు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న సచిన్ బేబీ సారథ్యంలోని కేరళ జట్టు... రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంతో నాకౌట్‌కు చేరింది. అయితే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లో మాత్రం కేరళ అసాధారణ పోరాటం కనబర్చింది. జమ్మూకశ్మీర్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసిన కేరళ... సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో గట్టెక్కింది. మిడిలార్డర్ బ్యాటర్లు సల్మాన్ నిజార్, మొహమ్మద్ అజహరుద్దీన్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. నిజార్ 86.71 సగటుతో 607 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అజహరుద్దీన్ 75.12 సగటుతో 601 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 4 అర్ధశతకాలు ఉన్నాయి. క్వార్టర్స్‌లో, సెమీస్‌లో ఈ జంట అసమాన పోరాటం వల్లే కేరళ జట్టు తుదిపోరుకు అర్హత సాధించింది. గంటలకు గంటలు క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లపై మానసికంగా పైచేయి సాధించడంలో అజహరుద్దీన్, నిజార్ది అందెవేసిన చేయి. వీరితో పాటు జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, రోహన్ కున్నుమ్మల్, అక్షయ్ చంద్రన్ కూడా కలిసికట్టుగా రాణిస్తే కేరళకు తిరుగుండదు. బౌలింగ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా తాజా సీజన్లో 38 వికెట్లు పడగొట్టాడు. ఆదిత్య సర్వతే (30 వికెట్లు) కూడా ఫామ్‌లో ఉన్నాడు. ని«దీశ్, బాసిల్ పేస్ బౌలింగ్ భారం మోయనున్నారు.విదర్భ ఫైనల్ చేరిందిలా... » ఆంధ్రపై 74 పరుగుల తేడాతో గెలుపు » పుదుచ్చేరిపై 120 పరుగుల తేడాతో విజయం » ఉత్తరాఖండ్‌పై 266 పరుగుల తేడాతో గెలుపు » హిమాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్88 పరుగులతో విజయం » గుజరాత్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » రాజస్తాన్‌పై 221 పరుగులతో గెలుపు » హైదరాబాద్‌పై 58 పరుగులతో విజయం » క్వార్టర్స్‌లో తమిళనాడుపై 198 పరుగులతో గెలుపు » సెమీస్‌లో ముంబైపై 80 పరుగులతో విజయం కేరళ ఫైనల్ చేరిందిలా... » పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం » కర్ణాటకతో మ్యాచ్ ‘డ్రా’ » బెంగాల్‌తో మ్యాచ్ ‘డ్రా’ » ఉత్తరప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 117 పరుగులతో గెలుపు » హరియాణాపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » మధ్యప్రదేశ్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » బీహార్‌పై ఇన్నింగ్స్ 169 పరుగులతో విజయం » క్వార్టర్స్‌లో జమ్ముకశ్మీర్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » సెమీస్‌లో గుజరాత్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం -
ప్రియురాలిని ఇంటికి తెచ్చి.. ఆపై ఇంట్లోవాళ్లని హతమార్చి!
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలి మీద దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. అతని తల్లి, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తిరువనంతపురం సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వెంజరమూడు(Venjaramoodu) పీఎస్‌కు సోమవారం సాయంత్రం ఓ యువకుడు వచ్చాడు. తాను తన కుటుంబ సభ్యులను చంపినట్లు చెబుతూ పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. అది నిజమేనని తేలడంతో షాక్‌కి గురయ్యారు. ఈలోపు ఆ యువకుడు తనతో తెచ్చుకున్న ఎలుకల మందు తాగి పీఎస్‌లోనే పడిపోయాడు. దీంతో.. అతన్ని చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.పెర్ములాలో నివాసం ఉంటున్న అఫన్(Afan).. స్థానికంగా బీఎస్సీ చదివే ఫర్సనాతో ప్రేమలో ఉన్నాడు. వాళ్ల ప్రేమకు ఫర్సనా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట ఆమెను అఫన్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఏం జరిగిందో తెలియదు.. సోమవారం తన ఇంట్లో తల్లి షమీ, సోదరుడు అఫ్సన్(13), ఫర్సనాపై దాడి చేశాడు. అక్కడి నుంచి బైక్ మీద ఎన్ఎన్ పురంలో ఉన్న మేనమామ లతీఫ్(69) ఇంటికి వెళ్లి ఆయన్ని, ఆయన భార్య షాహిదా(59)ను హతమార్చాడు. అక్కడి నుంచి పాంగోడ్లో ఉన్న బామ్మ సల్మా బీవీ దగ్గరకు వెళ్లి ఆమెను కూడా చంపేశాడు. 16 కిలోమీటర్ల పరిధిలోనే ఈ దారుణాలకు తెగబడ్డాడు. ఆపై నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అఫన్.. పక్కన దాడి కోసం బైక్‌పై వెళ్తు క్రమంలో రికార్డైన దృశ్యంఅఫన్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తల్లి షమీ, ప్రియురాలు ఫర్సనా తీవ్ర గాయాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరోవైపు.. ఆత్మహత్యాయత్నం చేసిన అఫన్ ఆస్పత్రిలోనూ హల్చల్ చేశాడు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగి చికిత్సకు నిరాకరించాడు. దీంతో.. పోలీసుల సాయంతో బేడీలు వేయించి మరి బలవంతంగా అతనికి చికిత్స అందించారు.అఫన్కు డ్రగ్స్ అలవాటు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మత్తులోనే అఫన్ ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. తిరువనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. మరోవైపు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని, మంగళవారం అఫన్ను విచారణ జరుపుతామని వెంజరమూడు పోలీసులు చెబుతున్నారు. -
ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. డైరీలో ఆమె ఫోన్ నంబర్!
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదుగానీ తల్లితో కలిసి విగతజీవులుగా మారిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణాలు కేరళలో (Kerala) కలకలం రేపాయి. వారు ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు అకాల మరణం చెందారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.అసలేం జరిగింది?కొచ్చిలోని ఎకాముఖ్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. మృతులు శాలిని విజయ్, మనీశ్ విజయ్, శకుంతలగా గుర్తించారు. శాలిని.. జార్ఖండ్ (Jharkhand) సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆమె సోదరుడు మనీశ్.. ఐఆర్ఎస్ అధికారి. కొచ్చిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో అడిషనల్ కమిషనర్ ఉద్యోగం చేస్తున్నాడు. లివింగ్ రూములో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని మనీశ్ చనిపోయాడు. మరో గదిలో శాలిని నిర్జీవంగా కనిపించారు. వీరి తల్లి శకుంతల మృతదేహం తెల్లని వస్త్రంలో చుట్టివుందని, పూలు చల్లిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.మనీశ్ డైరీలో చెల్లెలి ఫోన్ నంబర్మనీశ్, శాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శకుంతల మరణానికి గల కారణాలు అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ‘శకుంతల మరణం సహజమా, మరేదైనా కారణాలు ఉన్నాయనేది అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంద’ని త్రిక్కకరా ఏసీపీ పీవీ బేబీ తెలిపారు. మనీశ్ డైరీలో ఫిబ్రవరి 15న రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు. తమకు సంబంధించిన కొన్ని పత్రాలను దుబాయ్‌లో (Dubai) ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాలని కోరుతూ, ఆమె ఫోన్ నంబరు కూడా అందులో రాశారు.టాపర్‌గా నిలిచి.. కేసులో ఇరుక్కుని.. శాలిని.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) 2003లో నిర్వహించిన మొదటి సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ పోటీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్ష ద్వారా 64 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో 2022, జూలైలో జార్ఖండ్ హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. శాలినితో పాటు మిగతా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27న జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో శాలిని మరణించడం చర్చనీయాంశంగా మారింది.ప్రొఫెసర్ శకుంతల శకుంతల బొకారో (Bokaro) ప్రాంతానికి చెందిన వారని, వీరి కుటుంబం రాంచీలో 2013 వరకు అద్దె ఇంటిలో ఉందని తెలిసింది. శకుంతల కుటుంబ సభ్యులు భక్తిభావంతో మెలిగేవారని, తమతో స్నేహంగా ఉండేవారని పొరుగింటివారు వెల్లడించారు. బొకారోలో శకుంతల ప్రొఫెసర్‌గా పనిచేసేవారని తెలిపారు. ఆమె మరో కుమార్తె పెళ్లిచేసుకుని రాజస్థాన్‌లో స్థిరపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాంచీ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో కలిసినప్పుడు మనీశ్ అప్యాయంగా పలకరించాడని.. అతడితో పాటు శాలిని, శకుంతల మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కాగా వీరి ముగ్గురి మరణానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.చదవండి: వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయంఅన్నికోణాల్లోనూ దర్యాప్తుశాలినిపై సీబీఐ కేసు కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శకుంతల సహజంగా చనిపోయివుంటే ఆమె మరణాన్ని తట్టుకోలేక కూతురు, కొడుకు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు
కేరళ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహంగా అదానీ గ్రూప్ వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం, అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉండబోతున్నట్లు తెలిపింది. ‘ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ 2025’ సందర్భంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఈమేరకు ప్రకటన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సదస్సును ప్రారంభించారు.కీలక పెట్టుబడి రంగాలువిజింజం పోర్టు అభివృద్ధి: రూ.20,000 కోట్ల పెట్టుబడిలో గణనీయమైన భాగాన్ని విజింజం పోర్టు అభివృద్ధికి మళ్లించనున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటికే ఈ ప్రాజెక్టులో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. విజింజం పోర్టును దేశంలోనే మొదటి ట్రాన్స్ షిప్మెంట్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యాన్ని 45 లక్షల ప్రయాణికుల నుంచి 1.2 కోట్లకు పెంచేందుకు అదానీ గ్రూప్ రూ.5,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇది విమానాశ్రయం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది.కొచ్చి లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్ హబ్: కొచ్చిలో లాజిస్టిక్స్, ఈ-కామర్స్ హబ్‌ను ఏర్పాటు చేసి అదానీ గ్రూప్ ఈ రంగంలో కేరళ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. సమర్థవంతమైన సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను ఈ హబ్ సులభతరం చేస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఈ-కామర్స్ పరిశ్రమకు మద్దతు ఇస్తుంది.సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు: కొచ్చిలో తన సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని అదానీ గ్రూప్ ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఈ పెట్టుబడి నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలకు తోడ్పడుతుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: మస్క్, బెజోస్‌ను మించిన ‘బ్లాక్‌పాంథర్’ సంపదఅభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..కేరళ పురోగతికి అదానీ గ్రూప్ కట్టుబడి ఉందని కరణ్ అదానీ నొక్కిచెప్పారు. కేరళ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఈ వృద్ధిలో అదానీ గ్రూప్ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. సంస్థ ప్రకటించిన ఈ పెట్టుబడులు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని చెప్పారు. స్థానిక వ్యాపారాలను పెంచుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. -
కేరళ కల సాకారం.. కష్టానికి తోడైన అదృష్టం.. తొలిసారి రంజీ ఫైనల్లోకి ప్రవేశం
‘ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడి కేరళ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. 68 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... 352 మ్యాచ్‌ల పోరాటం అనంతరం కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న కేరళ జట్టు... తీవ్ర ఉత్కంఠ మధ్య మాజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించి తొలిసారి తుదిపోరుకు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్‌ను వెనక్కి నెట్టిన కేరళ... ఇప్పుడు సెమీఫైనల్లో గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఒక్క పరుగే కదా అని తేలికగా తీసుకుంటే ... ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యర్థికి రుచి చూపింది. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. సుదీర్ఘ కాలంగా రంజీ ట్రోఫీ ఆడుతున్న కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ముంబై, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ మాదిరిగా తమ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినా... నిలకడ కనబరుస్తున్నప్పటికీ ఆ జట్టు తుదిపోరుకు మాత్రం అర్హత సాధించలేదు. తాజా సీజన్లో అసాధారణ పోరాటాలు, అనూహ్య ఫలితాలతో ఎట్టకేలకు కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. జమ్మూ కశ్మీర్‌తో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన కేరళ జట్టు... సెమీస్‌లో మాజీ చాంపియన్ గుజరాత్‌పై 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ చిరకాల కల నెరవేర్చుకుంది.నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ చివరి రోజు కేరళ జట్టు అద్భుతమే చేసింది. చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు తుదిపోరుకు అర్హత సాధించాలంటే మరో 29 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఇన్నింగ్స్ కొనసాగించగా... కేరళ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయి మొండిగా పోరాడుతున్న గుజరాత్ బ్యాటర్లు జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్‌లను కేరళ బౌలర్ ఆదిత్య వెనక్కి పంపాడు. ఇంకేముంది మరో వికెట్ తీస్తే చాలు కేరళ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం ఖాయమే అనుకుంటే... ఆఖరి వికెట్‌కు అర్జాన్ నాగ్వస్వల్లా, ప్రియజీత్ సింగ్ జడేజా మొండిగా పోరాడారు.పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన ఈ జంటను చూస్తే ఇక మ్యాచ్ కేరళ చేజారినట్లే అనుకుంటున్న తరుణంలో అర్జాన్ కొట్టిన షాట్ కేరళకు కలిసొచ్చింది. ఆదిత్య వేసిన బంతిని అర్జాన్ బలంగా బాదే ప్రయత్నం చేశాడు. బంతి షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్‌కు తాకి గాల్లోకి లేచి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కెప్టెన్ సచిన్ బేబీ చేతిలో పడింది. అంతే కేరళ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. స్టార్లు లేకుండానే... స్టార్ ఆటగాడు సంజూ సామ్సన్ భారత జట్టులో ఉండగా... అనుభవజ్ఞులైన విష్ణు వినోద్, బాబా అపరాజిత్ వంటి వాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అయినా ఈ సీజన్లో కేరళ జట్టు స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా మిడిలార్డర్లో కెప్టెన్ సచిన్ బేబీతో పాటు సీనియర్ ప్లేయర్ జలజ్ సక్సేనా... యువ ఆటగాళ్లు మొహమ్మద్ అజహరుద్దీన్, సల్మాన్ నిజార్ అసమాన పోరాటం కనబర్చారు.జమ్మూ కశ్మీర్‌తో క్వార్టర్స్ పోరులో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు సల్మాన్, అజహరుద్దీన్ కనబర్చిన తెగువను ఎంత పొగిడినా తక్కువే. 40 ఓవర్లకు పైగా జమ్మూ బౌలర్లను కాచుకున్న ఈ జంట వికెట్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించి తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఒక్క పరుగు ఆధిక్యంతో సెమీఫైనల్‌కు చేరింది.తాజాగా గుజరాత్‌తో సెమీస్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో కేరళ బ్యాటర్లు అసాధరణ ప్రదర్శన కనబర్చారు. సచిన్ బేబీ 195 బంతుల్లో 69 పరుగులు, జలజ్ సక్సేనా 83 బంతుల్లో 30 పరుగులు, అజహరుద్దీన్ 341 బంతుల్లో 177 పరుగులు, సల్మాన్ నిజార్ 202 బంతుల్లో 52 పరుగులు చేసి గుజరాత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముందు నుంచే చక్కటి గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెట్టిన కేరళకు చివర్లో అదృష్టం కూడా తోడవడంతో చక్కటి విజయంతో తొలిసారి రంజీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ చరిత్రలో కేరళ జట్టు ఇప్పటి వరకు అత్యుత్తమంగా 2018–19 సీజన్లో సెమీఫైనల్‌కు చేరింది.నిరీక్షణకు తెరదించుతూ.. తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో కేరళ జట్టు 1957లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫుట్‌బాల్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ వాసులు... క్రికెట్‌ను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో కేరళ క్రికెట్లో అనూహ్య మార్పు వచ్చింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్ స్ఫూర్తితో మరెందరో ఆటగాళ్లు క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నారు.అందుకు తగ్గట్లే గత కొన్నేళ్లుగా కేరళలో క్రీడా మౌలిక వసతులు మరింత మెరుగు పడటంతో ప్రతిభావంతులు వెలుగులోకి రావడం మొదలైంది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. అందుకే శుక్రవారం సెమీస్‌లో కేరళ జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో ప్రసార మాధ్యమాల్లో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా లక్షల్లో పెరిగింది. ప్రతిష్టాత్మక టోర్నీలో కేరళ టీమ్ ఫైనల్‌కు చేరగానే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు... తామే గెలిచినంతగా లీనమైపోయి జట్టును అభినందనల్లో ముంచెత్తారు. మౌలిక వసతుల్లో భేష్.. సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే కేరళలో ఒకప్పుడు నిరంతరం అవుట్డోర్ ప్రాక్టీస్ చేయడం కూడా కష్టతరంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఫస్ట్‌క్లాస్ మైదానాలు అందుబాటులోకి వచ్చాయంటే కేరళ క్రికెట్లో ఎంత పురోగతి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కృషి వల్లే కేవలం పెద్ద నగరాల నుంచే కాకుండా... ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా రంజీ జట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నారు.‘ముంబై, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి ఇతర జట్లతో పోల్చుకుంటే... కేరళ జట్టు ఎంపిక విభిన్నంగా ఉండేది. పరిమితమైన వనరులు మాత్రమే ఉండటంతో అందుబాటులో ఉన్నవాళ్లనే ఎంపిక చేసేవాళ్లం. ముందు ఆ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో అకాడమీలను స్థాపించాం. కేవలం ప్లేయర్లకే కాకుండా కోచ్‌లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒకప్పుడు వర్షం వస్తే ప్రాక్టీస్ ఆగిపోయేది. ఇప్పుడు ఇండోర్‌లోనూ నెట్స్ ఏర్పాటు చేశాం.2005లో రాష్ట్రంలో ఒక్క మైదానంలో కూడా లేదు. ఇప్పుడు మొత్తం 17 ఫస్ట్‌క్లాస్ గ్రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలో లేనంతమంది బీసీసీఐ లెవల్1 కోచ్‌లు కేరళలో ఉన్నారు’ అని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు మాథ్యూ తెలిపారు.కేరళ క్రికెట్ సంఘం కృషి వల్లే స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని... సెమీఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న అజహరుద్దీన్ వెల్లడించాడు. పరస్పర సహకారం, సమష్టితత్వంతో ముందుకు సాగడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నాడు. ఈనెల 26 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తుది పోరులోనూ కేరళ విజయం సాధిస్తే 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన దక్షిణాది జట్టుగా నిలుస్తుంది... ఆల్ ద బెస్ట్ కేరళ..! -
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో హైడ్రామా
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) సెమీ ఫైనల్లో హైడ్రామా చోటు చేసుకుంది. గుజరాత్‌తో (Gujarat) జరుగుతున్న తొలి సెమీస్‌లో కేరళ (Kerala) 2 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. రంజీ రూల్స్ ప్రకారం.. మ్యాచ్‌లో ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. గుజరాత్, కేరళ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం కాబట్టి, కేరళ విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరుకుంటుంది.Drama in the Ranji Trophy semifinals🤯pic.twitter.com/o8Bykc8Q4P— CricTracker (@Cricketracker) February 21, 2025కాగా, ఈ మ్యాచ్‌లో గుజరాత్.. కేరళకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. కేరళపై లీడ్ సాధించేందుకు కేవలం మూడు పరుగులు అవసరమైన తరుణంలో గుజరాత్ ఆఖరి ఆటగాడు సగస్వల్లా ఔటయ్యాడు. నగస్వల్లా బౌలర్ ప్రతిభ కారణంగా ఔటై ఉంటే గుజరాత్ అంత ఫీల్ అయ్యేది కాదు. నగస్వల్లా కొట్టిన షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ సల్మాన్ నిజర్ హెల్మెట్‌కు తాకి స్లిప్స్‌లో ఉన్న సచిన్ బేబి చేతుల్లోకి వెళ్లింది. దీంతో నగస్వల్లా పెవిలియన్ ముఖం పట్టాడు. అప్పటివరకు బాగా ఆడిన నగస్వల్లా ఔట్ కావడంతో గుజరాత్ శిబిరంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. తాము ఫైనల్‌కు చేరలేమన్న విషయం తెలుసుకుని గుజరాత్ ఆటగాళ్లు కృంగిపోయారు. తృటిలో గుజరాత్‌కు ఫైనల్ బెర్త్ మిస్ అయ్యింది. ఈ సీజన్లో కేరళను లక్కీ జట్టుగా చెప్పాలి. క్వార్టర్ ఫైనల్లోనూ ఆ జట్టు ఇలాగే స్వల్ప ఆధిక్యంతో (ఒక్క పరుగు) సెమీస్‌కు చేరుకుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.స్కోర్ల విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో అదరగొట్టడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు. -
జైమీత్ పోరాటం
అహ్మదాబాద్: జైమీత్ పటేల్ (161 బంతుల్లో 74 బ్యాటింగ్; 2 ఫోర్లు), సిద్ధార్థ్ దేశాయ్ (134 బంతుల్లో 24 బ్యాటింగ్; 1 ఫోర్) మొండి పట్టుదలతో ఆడటంతో... గుజరాత్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరువైంది. కేరళతో జరుగుతున్న సెమీఫైనల్లో ఓవర్‌నైట్ స్కోరు 222/1తో గురువారం నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ జట్టు... ఆట ముగిసే సమయానికి 154 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. ఫలితం తేలడం కష్టమైన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టే ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమైంది. అంతకుముందు కేరళ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా... ప్రస్తుతం చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ మరో 29 పరుగులు చేస్తే కేరళ స్కోరును దాటేస్తుంది. ప్రియాంక్ పాంచాల్ (237 బంతుల్లో 148; 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ ఖాతాలో వేసుకోగా... మనన్ హింగ్రాజియా (127 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (43 బంతుల్లో 25; 3 ఫోర్లు), హేమంగ్ పటేల్ (41 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్ చింతన్ గాజా (2), విశాల్ జైస్వాల్ (14) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చివర్లో సిద్ధార్థ్ దేశాయ్‌తో కలిసి జైమీత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ పక్క పరుగులు సాధిస్తూనే... ఓవర్లు కరిగించాడు. ఈ జంట అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 220 బంతుల్లో 72 పరుగులు జోడించింది. ఓవరాల్‌గా గురువారం 83 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 207 పరుగులు చేసింది. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 4 వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: 457; గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బి) జలజ్ సక్సేనా 148; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జలజ్ సక్సేనా 33; ఉర్విల్ పటేల్ (స్టంప్డ్) అజహరుద్దీన్ (బి) జలజ్ సక్సేనా 25; హేమాంగ్ పటేల్ (సి) (సబ్) రోజర్ (బి) నిధీశ్ 27; జైమీత్ పటేల్ (బ్యాటింగ్) 74; చింతన్ గాజా (ఎల్బీడబ్ల్యూ) (బి) జలజ్ సక్సేనా 2; విశాల్ జైస్వాల్ (సి) బాసిల్ (బి) ఆదిత్య 14; సిద్ధార్థ్ దేశాయ్ (బ్యాటింగ్) 24; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (154 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 429. వికెట్ల పతనం: 1–131, 2–238, 3–277, 4–292, 5–320, 6–325, 7–357. బౌలింగ్: నిధీశ్ 23–4–86–1; జలజ్ సక్సేనా 61–12–137–4; బాసిల్ 22–1–59–1; ఆదిత్య సర్వతే 36–3–104–1; అక్షయ్ చంద్రన్ 11–0–31–0; ఇమ్రాన్ 1–0–3–0. -
గిరిజన పిల్లల కోసం ఆ టీచర్ ప్రాణాలనే..!
‘ఎవరైనా సరే బతకడానికి ఉద్యోగం చేస్తారు. చావడానికి కాదు’ అని ఎంతోమంది అన్నలక్ష్మితో అనేవారు. ఇంతకీ ఆమె చేస్తున్న ఉద్యోగం ఏమిటి? కేరళలోని చిన్నార్ అభయారణ్యంలో ఉన్న మారుమూల గిరిజన గ్రామం తయ్యన్నన్‌కుడిలోని ఏకైక అంగన్వాడీలో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.అన్నలక్ష్మి ఉద్యోగ జీవితం రిస్క్, సాహసంతో కూడుకున్నది. వారం రోజుల క్రితం అటవీమార్గంలో జనావాసాలకు వచ్చిన అడవి ఏనుగు నుంచి తృటిలో తప్పించుకుంది. కొన్ని రోజుల క్రితం అదే ఏనుగు ఒక గిరిజనుడిని తొక్కి చంపేసింది. అయినప్పటికీ అన్నలక్ష్మి ఎప్పుడూ భయపడలేదు.విద్యార్థుల దగ్గరికి వెళ్లడానికి గత పదిహేడు సంవత్సరాలుగా మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ లేని అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూనే ఉంది. ప్రయాణ మార్గంలో జంతువుల అడుగు జాడలు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అడవి ఏనుగులు వెంబడించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో పెద్ద పెద్ద రాళ్లు, చెట్ల వెనుక దాక్కొని తప్పించుకుంది.38 ఏళ్ల అన్నలక్ష్మి జీవితంలో అరణ్యం, గిరిజన తెగలు భాగం అయ్యాయి. స్థానిక ముత్తువన్ భాషను అనర్గళంగా మాట్లాడే అన్నలక్ష్మి గిరిజన ప్రజలకు ప్రియమైన ఉపాధ్యాయురాలు.‘పిల్లలు ఇంట్లో కంటే టీచర్ దగ్గర ఉండడానికే ఇష్టపడతారు’ అంటుంది ఒక గిరిజన తల్లి.‘ఉద్యోగ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల అమాయక ముఖాలను గుర్తు తెచ్చుకుంటే ఎంతో శక్తి వస్తుంది. నా వృత్తి జీవితానికి వారే వెలుగు’ అంటుంది అన్నలక్ష్మి. (చదవండి: మూడు నెలల తరువాత.... గ్రేహౌండ్స్ దొరికిందహో!) -
కేసు దాకా వెళ్లిన కోడి కూత
పథనంథిట్ట(కేరళ): ప్రకృతి రమణీయతకు, ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరైన కేరళలో పథనంథిట్ట జిల్లా అంతే స్థాయిలో ప్రశాంతంగా ఉంటుంది. ఆ జిల్లాలో భూమి కోసమో నగదు కోసమో తగాదా జరిగితే అది వార్త స్థాయికి చేరేదికాదు. కానీ ఒక కోడి కూత ఇప్పుడు ఫిర్యాదుచేసి కేసు పెట్టేదాకా వెళ్లింది. ఆ కోడి అన్ని కోళ్లలాగా ఉదయం ఆరు గంటలకో అంతకు కాస్తంత ముందే కూత పెట్టట్లేదు. ఆ కోడి పుంజు ప్రతిరోజూ ఠంచనుగా తెల్లవారుజామున మూడు గంటలకే కూత అందుకుంటోంది. నిశ్శబ్దం రాజ్యమేలే మూడు గంటల వేళ అందరూ గాఢ నిద్రలోకి జారుకున్న సమయంలో ఈ కోడి కూత ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. ఇది ముఖ్యంగా పక్కింట్లో ఉండే వృద్ధుడు రాధాకృష్ణ కురూప్ నిద్రకు తీవ్రస్థాయిలో భంగం వాటిల్లజేస్తోంది. ఆ శబ్దాలకు నిద్ర పట్టక రాధాకృష్ణ తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని ఆ కోడి యజమాని అనిల్‌కుమార్‌కు చెప్పిచూసినా లాభం లేకుండాపోయింది. దీంతో చేసిదిలేక అదూర్ రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆ కోడి పుంజుపై ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ రాత్రిళ్లు నిద్రలేక ఇబ్బందులు పడుతున్న ఆ పెద్దాయన అవస్థ చూడలేక అధికారులు కోడి యజమాని అనిల్ కుమార్‌ను పిలిపించారు. తన తప్పేంలేదని యజమాని అనిల్ వాదించారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పోలీసులు రంగంలోకి దిగి కోళ్లను పరిశీలించేందుకు వచ్చారు. అనిల్ కుమార్ ఆ కోళ్లను నేలపై పెంచకుండా తన స్థలంలోని తొలి అంతస్తులో పెంచుతున్నాడు. ఎత్తు నుంచి శబ్దం వస్తుండటంతో చుట్టూతా గోడలు, ఎలాంటి అడ్డూ లేకపోవడంతో కోడి కూత పెద్దగా వినిపిస్తోందని అధికారులు తేల్చారు. దీనికి పరిష్కారంగా కోళ్లను మొదటి అంతస్తు నుంచి తరలించి అదే స్థలంలో దక్షిణ వైపు నేలపై పెంచుకోవాలని అధికారులు సూచించారు. మరో 14 రోజుల్లోపు ఈ కోళ్ల తరలింపు ప్రక్రియ పూర్తవ్వాలని యజమాని అనిల్‌కు అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో వృద్ధుడు కాస్తంత ఆనందం వ్యక్తంచేశారు. కోడి కూత అంశం కేసుదాకా వెళ్లిందని ఇరుగుపొరుగు తెగ మాట్లాడుకుంటున్నారు. పళ్లిక్కల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
ప్రియాంక్ ప్రతాపం
అహ్మదాబాద్: సీనియర్ ఓపెనర్ ప్రియాంక్ పాంచాల్ (200 బంతుల్లో 117 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో అదరగొట్టడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్ జట్టు దీటుగా బదులిస్తోంది. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట కేరళ బ్యాటర్లు భారీ స్కోరు చేయగా... ఇప్పుడు గుజరాత్ కూడా అదే బాటలో నడుస్తోంది. బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 222 పరుగులు చేసింది. ప్రియాంక్ సూపర్ సెంచరీకి ఆర్య దేశాయ్ (118 బంతుల్లో 73; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం తోడవడంతో గుజరాత్ ఇన్నింగ్స్ సజావుగా సాగింది. ఈ జంట కేరళ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొవడంతో పరుగుల రాక సులువైంది. ముఖ్యంగా ఆర్య దూకుడుగా ఆడాడు. తొలి వికెట్‌కు 131 పరుగులు జోడించిన అనంతరం అతడు అవుటయ్యాడు. ఆ తర్వాత మనన్ హింగ్రాజియా (108 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి ప్రియాంక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ప్రియాంక్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 29వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తాజా రంజీ సీజన్లో అతడికిది రెండో శతకం. మూడో రోజు 71 ఓవర్లు వేసిన కేరళ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టింది. బాసిల్‌కు ఆ వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 418/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు చివరకు 187 ఓవర్లలో 457 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్ కీపర్ మొహమ్మద్ అజహరుద్దీన్ (341 బంతుల్లో 177 నాటౌట్; 20 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. మూడో రోజు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు మరో 39 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. చివరి వరుస బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో అర్జాన్ మూడు, చింతన్ గజా రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 9 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 235 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ బేబీ (సి) ఆర్య దేశాయ్ (బి) అర్జాన్ 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (నాటౌట్) 177; సల్మాన్ నిజర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విశాల్ 52; ఇమ్రాన్ (సి) ఉర్విల్ (బి) అర్జాన్ 24; ఆదిత్య (బి) చింతన్ 11; నిదీశ్ (రనౌట్) 5; బాసిల్ (సి) ఆర్య (బి) చింతన్ 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (187 ఓవర్లలో ఆలౌట్) 457. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157, 5–206, 6–355, 7–395, 8–428, 9–455, 10–457, బౌలింగ్: చింతన్ 33–9–75–2; అర్జాన్ 34–9–81–3; ప్రియజీత్ సింగ్ 21–2–58–1; జైమీత్ 13–1–46–0; రవి బిష్ణోయ్ 30–7–74–1; సిద్ధార్థ్ దేశాయ్ 33–13–49–0; విశాల్ జైస్వాల్ 22–5–57–1; ఆర్య దేశాయ్ 1–0–3–0. గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బ్యాటింగ్) 117; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 222. వికెట్ల పతనం: 1–131. బౌలింగ్: నిధీశ్ 10–1–40–0; జలజ్ 25–5–71–0; బాసిల్ 15–1–40–1; ఆదిత్య 17–2–55–0; అక్షయ్ చంద్రన్ 3–0–11–0; ఇమ్రాన్ 1–0–3–0. -
ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్
కేరళ మన దేశంలో మొదటి మహిళా స్కూబా టీమ్‌ను సిద్ధం చేసింది. అగ్నిమాపక దళం నుంచి ఎంపిక చేసిన వారితో ఈ టీమ్‌ను తయారు చేసి ఇక పై వరద ప్రమాదాల్లో వీరి సేవను వినియోగించనుంది.‘గన్నెట్స్’(The Gannets)... ఇదీ కేరళ(Kerala) అగ్నిమాపక శాఖ(Fire Department) తన ఆల్ విమెన్ స్కూబా డైవింగ్ టీమ్‌కు(All Women Scuba Diving Team) పెట్టిన పేరు. ఉత్తర అట్లాంటిక్ తీరంలో సముద్రపు లోతుకు దూసుకెళ్లి చేపలను నోట కరుచుకుని ఎగిరే పక్షులే ‘గన్నెట్స్’. ఇకపై కేరళలో ఏవైనా జల ప్రమాదాలు సంభవిస్తే ఈ గన్నెట్స్ దూసుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తారు. వీరి మొత్తం సంఖ్య 17. ఇరవై ఒక్క రోజుల ట్రైనింగ్ ముగించుకొని ఈ టీమ్ మంగళవారం బాధ్యతల్లోకి వచ్చింది. భారతదేశంలో అందరు మహిళల స్కూబా రక్షణ దళం ఇదే.100 మంది నుంచి...కేరళలో వానకాలంలో ఊహించని వరదలు సర్వసాధారణంగా మారాయి. మనుషుల్లో నీళ్లల్లో చిక్కుకున్నప్పుడు వారిని రక్షించే సామర్థ్యం ఉన్న స్కూబా డైవర్స్ ఉండాలని ప్రభుత్వం భావించింది. అయితే వారు ఎందుకు స్త్రీలు కాకూడదు అని ప్రశ్నించుకుంది. అగ్నిమాపక శాఖ నుంచి 100 మంది మహిళలను ఎంపిక చేస్తే వారిలో 17 మంది అన్ని విధాలుగా అర్హులుగా నిలిచి ట్రైనింగ్‌కు ఎంపికయ్యారు.కఠినమైన ట్రైనింగ్కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అకాడెమీలో ఈ మహిళా సభ్యుల శిక్షణ 21 రోజుల పాటు జరిగింది. స్కూబా డైవింగ్‌తోపాటు నదులు, చెరువులు, సముద్రాల్లో నీటి స్వభావాన్ని బట్టి ఎలా రక్షణ చర్యలు చేపట్టాలో నేర్పారు. అండర్‌వాటర్ కెమెరాలు వాడటం కూడా ఇందులో భాగం.]వీరికి 30 మీటర్ల లోతుకు వెళ్లి రక్షించడం నేర్పారు. ‘ట్రైనింగ్ మాకు మొదట్లో కష్టమైంది. కాని అన్ని దశలను దాటగలిగాం. ఇప్పుడు మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ప్రజల సేవకు సిద్ధం’ అని ఈ టీమ్‌లోని మహిళలు అన్నారు. ఈ కొత్తశక్తికి స్వాగతం. (చదవండి: చాట్ జీపీటీ బామ్మ..! ఆమె అడిగిన ప్రశ్నలు నెట్టింట వైరల్) -
Ranji Semis-1: కేరళ భారీ స్కోర్.. అజేయ సెంచరీతో మెరిసిన అజహరుద్దీన్
అహ్మదాబాద్: పసలేని గుజరాత్ బౌలింగ్‌పై కేరళ బ్యాటర్లు ఆధిపత్యం కనబరుస్తున్నారు. రెండో రోజు ఆటలో ఓవర్‌నైట్ బ్యాటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ (303 బంతుల్లో 149 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. సల్మాన్ నిజర్ (202 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండు రోజుల్లో గుజరాత్ బౌలర్లలో ఏ ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు. 177 ఓవర్లు వేసిన గుజరాత్ 7 వికెట్లనే పడగొట్టింది. మంగళవారం అజహరుద్దీన్, సల్మాన్ల జోడీ క్రీజులో పాతుకుపోవడంతో రోజంతా కష్టపడిన గుజరాత్ బౌలర్లకు మూడే వికెట్లు దక్కాయి. ఓవర్‌నైట్ స్కోరు 206/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కేరళ అదే స్కోరు వద్ద కెప్టెన్ సచిన్ బేబీ (69; 8 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. కీలకమైన వికెట్‌ను తీశామన్న ఆనందం లేకుండా సల్మాన్... ఓవర్‌నైట్ బ్యాటర్ అజహరుద్దీన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరు కూడా ఏమాత్రం అనవసర షాట్ల జోలికి వెళ్లకుండా నింపాదిగా పరుగులు జత చేశారు. దీంతో మొదటి సెషన్లో మరో వికెట్ పడకుండా కేరళ 293/5 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. తర్వాత జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. ఇద్దరు జిడ్డుగా ఆడటంతో గుజరాత్ బౌలర్లకు ఆలసటే తప్ప వికెట్ల ఓదార్పు దక్కనే లేదు. ఈ క్రమంలో అజహరుద్దీన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డ్రింక్స్ విరామం తర్వాత సల్మాన్ అర్ధశతకం సాధించాడు. ఈ రెండో సెషన్లోనూ వీళ్లిద్దరి ఆటే కొనసాగడంతో గుజరాత్ శిబిరానికి వికెట్ సంబరమే లేకుండాపోయింది. ఎట్టకేలకు ఆఖరి సెషన్ ఊరటనిచ్చింది. ఇందులో రెండు వికెట్లు పడగొట్టగలిగింది. సల్మాన్‌ను విశాల్ జైస్వాల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆరో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ తర్వాత వచి్చన అహమ్మద్ ఇమ్రాన్ (66 బంతుల్లో 24; 3 ఫోర్లు) కూడా గుజరాత్ బౌలర్లను ఇబ్బంది పెట్టాకే నిష్క్రమించాడు. ఆదిత్య సర్వతే (10 బ్యాటింగ్; 1 ఫోర్)తో వచ్చాక అజహరుద్దీన్ జట్టు స్కోరును 400 దాటించాడు. ఆటనిలిచే సమయానికి ఇద్దరు అజేయంగా నిలిచారు. అర్జాన్కు 3 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ (సి) ఆర్య దేశాయ్ (బి) అర్జాన్ 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (బ్యాటింగ్) 149; సల్మాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విశాల్ 52; ఇమ్రాన్ (సి) ఉర్విల్ (బి) అర్జాన్ 24; ఆదిత్య (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (177 ఓవర్లలో 7 వికెట్లకు) 418. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157, 5–206, 6–355, 7–395. బౌలింగ్: చింతన్ గజా 28–8–57–0, అర్జాన్ 29–8–64–3, ప్రియజీత్ సింగ్ 21–2–58–1, జైమీత్ 13–1–46–0, రవి బిష్ణోయ్ 30–7–74–1, సిద్ధార్థ్ దేశాయ్ 33–13–49–0, విశాల్ జైస్వాల్ 22–5–57–1, ఆర్య దేశాయ్ 1–0–3–0. -
చరిత్ర సృష్టించిన కేరళ క్రికెటర్
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, కేరళ జట్ల మధ్య రంజీ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో కేరళ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి కేరళ 134.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ మొహమ్మద్ అజహారుద్దీన్ (105 నాటౌట్), సల్మాన్ నిజర్ (40 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69) అర్ద సెంచరీతో రాణించగా.. అక్షయ్ చంద్రన్, రోహన్ కున్నుమ్మల్, జలజ్ సక్సేనా తలో 30 పరుగులు చేశారు. వరుణ్ నయనార్ 10 పరుగులకు ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా 2, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.చరిత్ర సృష్టించిన మొహమ్మద్ అజహారుద్దీన్ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన మొహమ్మద్ అజహారుద్దీన్ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. రంజీ సెమీఫైనల్లో సెంచరీ చేసిన తొలి కేరళ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రంజీల్లో కేరళ గతంలో ఒకే ఒక సారి సెమీస్‌కు చేరుకుంది. 2018-19 సీజన్లో కేరళ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. అయితే ఆ సీజన్ సెమీస్‌లో ఏ కేరళ ఆటగాడు సెంచరీ చేయలేదు. అజహారుద్దీనే రంజీల్లో కేరళ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ప్రస్తుత రంజీ సీజన్లో కేరళ అద్భుతమైన ప్రదర్శనలతో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఎలైట్ గ్రూప్-సిలో కేరళ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 డ్రాలతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్‌పై ఒక్క పరుగు ఆధిక్యం (తొలి ఇన్నింగ్స్‌లో) సాధించి సెమీస్ బెర్త్ దక్కించుకుంది.మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో విదర్భ, ముంబై జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్ శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించాడు. షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో దనిశ్ మలేవార్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ మాత్రే (9) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆకాశ్ ఆనంద్ (29), సిద్దేశ్ లాడ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. 23 ఓవర్ల అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్ 62/1గా ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 321 పరుగులు వెనుకపడి ఉంది. -
సెమీఫైనల్ మ్యాచ్.. లంచ్‌కు ముందు ఐదుగురు.. తర్వాత ఒక్కడే.. జనాలు లేక వెలవెలబోయిన నరేంద్ర మోదీ స్టేడియం
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సుప్రసిద్ధ దేశవాళీ టోర్నీ సెమీఫైనల్‌కు (కేరళ వర్సెస్ గుజరాత్) సరైన ప్రచారం లేక ప్రేక్షకులు అటువైపే కన్నెత్తి చూడలేదు. దాదాపు లక్షా 30 వేల సామర్థ్యమున్న ప్రేక్షకుల గ్యాలరీలో తొలిరోజు తొలి సెషన్లో కేవలం ఐదుగురే మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చారు. భోజన విరామం తర్వాత ఇందులో ఒకే ఒక్కడు మిగిలాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ స్పందించారు. కొందరేమో ప్రేక్షకులను అనుమతించరేమోనని వెళ్లలేదని పేర్కొనగా, మరికొందరు అసలిక్కడ సెమీస్ జరుగుతున్న సంగతే తమకు తెలియదని పోస్ట్‌లు పెట్టారు. మరికొందరు క్రికెట్ ఔత్సాహికులు అనుమతిస్తున్నారనే బదులు రావడంతో రెండో రోజు నుంచి వెళ్తామని ఆసక్తి చూపారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ, ఇన్నింగ్స్‌ను చప్పగా ప్రారంభించింది. కెప్టెన్ సచిన్ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30; 5 ఫోర్లు), రోహన్ (30; 5 ఫోర్లు) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వరుణ్ నాయనార్ (10) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.జలజ్ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్షించాడు. ఆట ముగిసే సమయానికి సచిన్ బేబితో పాటు మొహమ్మద్ అజారుద్దీన్ (30) క్రీజ్‌లో ఉన్నాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. -
Ranji Trophy Semis-1: సచిన్ కెప్టెన్ ఇన్నింగ్స్
అహ్మదాబాద్: కేరళ, గుజరాత్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్ చప్పగా మొదలైంది. తొలిరోజు ఆటలో మొదట బ్యాటింగ్‌కు దిగిన కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మొదట ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30; 5 ఫోర్లు), రోహన్ (30; 5 ఫోర్లు) 20 ఓవర్ల వరకు వికెట్ పడిపోకుండా 60 పరుగులు జతచేశారు. 3 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు. కాసేపయ్యాక వరుణ్ నాయనార్ (10) నిష్క్రమించగా... కెప్టెన్ సచిన్, జలజ్ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టేలా బ్యాటింగ్ చేశారు.గుజరాత్ జట్టు ఏకంగా ఏడుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా... ప్రయోజనం లేకపోయింది. వీళ్లిద్దరు 27.5 ఓవర్ల పాటు క్రీజులో పాతుకుపోవడంతో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లు అలసిపోయారు. ఎట్టకేలకు మూడో సెషన్ మొదలయ్యాక సక్సేనాను అర్జాన్ నగ్వాస్వాలా బౌల్డ్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 71 పరుగులు జోడించింది. తర్వాత మొహమ్మద్ అజహరుద్దీన్ (30 బ్యాటింగ్; 3 ఫోర్లు) కూడా నాయకుడికి అండగా నిలవడంతో గుజరాత్ జట్టుకు కష్టాలు కొనసాగాయి.132 బంతుల్లో సచిన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అబేధ్యమైన ఐదో వికెట్‌కు అజహరుద్దీన్, సచిన్ 49 పరుగులు జతచేశారు. టెస్టులు, దేశవాళీ టోర్నీలో సెషన్‌కు 30 ఓవర్లు వేస్తారు. అయితే సచిన్ 25వ ఓవర్లో క్రీజులోకి వచ్చి ఓ సెషన్ ఓవర్లను మించే క్రీజులో నిలిచాడు. 193 బంతులంటే 32 ఓవర్ల పైచిలుకు బంతుల్ని అతను ఎదుర్కొన్నాడు. అర్జాన్, ప్రియజీత్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ బేబీ (బ్యాటింగ్) 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (89 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157. బౌలింగ్: చింతన్ గజా 18–536–0, అర్జాన్ 16–4–39–1, ప్రియజీత్ సింగ్ 12–0–33–1, జైమీత్ 9–1–26–0, రవి బిష్ణోయ్ 15–2–33–1, సిద్ధార్థ్ దేశాయ్ 16–8–22–0, విశాల్ జైస్వాల్ 3–1–13–0. -
ఇది ఏనుగు... కానీ కాదు!
కేరళ త్రిసూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయంలో ఒక ఏనుగు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే ఇది సజీవమైన ఏనుగు కాదు. లైఫ్–సైజ్ మెకానికల్ ఎలిఫెంట్. ప్రముఖ సితారిస్ట్ అనౌష్క శంకర్, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్(పెటా) కలిసి శ్రీకృష్ణస్వామి ఆలయానికి ఈ యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఇది మూడు మీటర్ల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుంది.‘ఈ రోబోటిక్ ఏనుగు వల్ల సజీవమైన ఏనుగులను గొలుసులతో బంధించి, ఆయుధాలతో నియంత్రిస్తూ బాధ పెట్టడం అనేది ఉండదు. రోబోటిక్ ఏనుగులు సజీవ ఏనుగులకు మానవీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి’ అంటోంది పెటా. రబ్బర్, ఫైబర్, మెటల్, ఫోమ్, స్టీల్‌తో రూపొందించిన ఈ యాంత్రిక ఏనుగు సజీవ ఏనుగులా భ్రమింపచేస్తుంది. తల, కళ్లు, చెవులు, తోక, తొండాలను కదిలిస్తుంది. తొండాన్ని పైకి లేపి నీళ్లు చల్లుతుంది. -
పూసల దండలు అమ్మే అమ్మాయి నగల షాపు ఓపెనింగ్‌కి గెస్ట్‌గా..!
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయినిగుర్తు పట్టారా? కేరళలో ఒక నగల షాపుకు ఓపెనింగ్‌కు వచ్చింది. అంటే డబ్బు ఇచ్చి పిలిపించి ఆమె చేత ఓపెనింగ్ చేయించారు. తమాషా చూడండి. రోడ్డు మీద కూచుని పూసల దండలు అమ్మే అమ్మాయి బంగారు ఆభరణాల షోరూమ్‌కు రిబ్బన్ కత్తిరించడం. సోషల్ మీడియా గొప్పతనం అలా ఉంది. మీకర్థమైంది కదా.. ఈ అమ్మాయి మోనాలిసా. మెడలో పూసలు వేసుకుని తిరిగే అమ్మాయి అదే మెడలో ఖరీదైన నెక్లెస్‌ను కాసేపటి కోసమైనా ధరించగలనని ఊహిస్తుందా? అదే జరిగింది. అదే మేజిక్.కుంభమేళాకు పూసలమ్ముకోవడానికి వచ్చిన 16 ఏళ్ల మోని భోంస్లే తన అందమైన కళ్లతో ప్రపంచాన్నే ఆకర్షించింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియా తోపాటు ప్రొఫెషనల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ‘మోనాలిసా’ పేరుకు రాత్రికి రాత్రి ఇన్‌స్టాలో ఆమె ఫాలోయెర్లు కోట్లకు పెరిగారు. ఇండోర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన మోని భోంస్లే ఇప్పుడు సెన్సేషన్. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా కోసం ఆమె 21 లక్షల పారితోషికానికి సైన్ చేసిందని వార్త. ఇక ఇప్పుడు షోరూమ్‌ల ప్రాంరంభానికి కూడా ఆహ్వానాలు అందుకుంటోంది. కేరళ కోజికోడ్‌కు చెందిన జ్యువెలరీ షోరూమ్‌ను వాలెంటైన్స్ డే రోజున మోని భోంస్లే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది. దాని యజమాని బాబీ చెమ్మనూర్ ఒక ఖరీదైన నెక్లెస్‌ను కాసేపు మెడలో వేసి ఆమెను సంతోషపెట్టారు. ఆమెను చూడటానికి జనం విరగబడ్డారు. ఆమెరాకతో ప్రచారం బ్రహ్మాండంగా దొరికింది. బదులుగా ఆమెకు మంచి పారితోషికం లభించింది. విమానాలలో, లగ్జరీ కారుల్లో ఇప్పుడు మోని భోంస్లే తిరుగుతోంది. సోషల్ మీడియా ఎవరి జాతకాన్ని ఎలా మారుస్తుందో ఊహించలేము. టాలెంట్ ఉంటే జనానికి చేరడానికి సోషల్ మీడియా ఉంది. దానిని సరిగ్గా ప్రదర్శించాలి. అయితే ఇదే సోషల్ మీడియాలో మెజారిటీ సెంటిమెంట్స్‌కు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే పాతాళానికి పడిపోతాము. కనుక ఆచితూచి వ్యవహరించాలి. ఇటీవల నంబర్ 1 యూట్యూబర్ రణ్వీర్ అహ్లాబాదియా మాట తూలి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మరో విషయం ఏమిటంటే వ్యక్తిగత వివరాలు, చిరునామాలు వెల్లడి చేయకుండా సోషల్ మీడియాలో కేవలం మన టాలెంట్‌ను, కళను, ప్రతిభను చూపాలి. స్త్రీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం కలిసొస్తే మోనాలిసా లాంటి ఫేమ్ పెద్ద కష్టం కాదు. View this post on Instagram A post shared by boche (@dr.boby_chemmanur) (చదవండి: కోళ్ల అందాల పోటీలు..!) -
చదువుకున్న మారాజు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, చాలాచోట్ల ఇంకా రాచరికాలు లాంఛనప్రాయంగా మిగిలి ఉన్నాయి. పలుచోట్ల రాజ సంస్థానాల వారసులకు పట్టాభిషేకాల వంటి లాంఛనాలు కొనసాగుతుండటం మనకు తెలిసిన సంగతే! నాగరిక రాజ్యాలు, సంస్థానాల వ్యవహారాలు సరే, దక్షిణాదిన ఏకైక ఆదివాసీ రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు కూడా ఉన్నాడు.అదే కేరళలోని మన్నన్ రాజ్యం. పుష్కరం కిందట ఆ రాజ్యానికి కొత్త రాజు వచ్చాడు. ఆయన పట్టభద్రుడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రభుత్వ ఆహ్వానంపై హాజరైన ఈ చదువుకున్న మారాజు కథా కమామిషూ..కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన గ్రామానికి చేరువలో ఉంటుంది మన్నన్ రాజ్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దక్షిణాదిన మిగిలి ఉన్న ఏకైక ఆదివాసీ రాజ్యం ఇది. ఈ రాజ్యానికి 2012లో కొత్త రాజు వచ్చాడు. ‘రామన్ రాజమన్నన్(Raman Rajamannan)’గా పట్టాభిషిక్తు డయ్యాడు. అతడి అసలు పేరు బిను. అతడికి ముందున్న రాజు ‘అరియన్ రాజమన్నన్’. అతడు 29 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అరియన్ రాజమన్నన్కు ముందున్న రాజు ‘దేవన్ రాజమన్నన్’ తన 54వ ఏట చనిపోయాడు. ఇప్పటి రాజు రామన్ రాజమన్నన్ అలియాస్ బిను మన్నన్ రాజ్యానికి పదిహేడో రాజు. అతడికి ముందున్న రాజులందరూ నిరక్షరాస్యులే! రామన్ రాజమన్నన్ ఎర్నాకుళం మహారాజా కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశాడు.మన్నన్ రాజ్యానికి ఎవరు రాజైనా, వారికి ‘రాజమన్నన్’ గౌరవ బిరుదనామం వస్తుంది. మన్నన్ తెగ ప్రజలది మాతృస్వామ్య సమాజం. దేశ పాలనా యంత్రాంగానికి లోబడే ఈ రాజ్యం నడుస్తోంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. ఇడుక్కి జిల్లావ్యాప్తంగా 62 చోట్ల విస్తరించి ఉన్న మూడువందలకు పైగా మన్నన్ తెగ కుటుంబాల మంచిచెడ్డలను ప్రస్తుత రాజు రామన్ రాజమన్నన్ చూసుకుంటారు. ఈ రాజుకు ఒక ఆస్థానం, ఆ ఆస్థానంలో తొమ్మిదిమంది మంత్రులు ఉంటారు. ప్రజల పెళ్లిళ్లు, విడాకులు సహా తెగకు సంబంధించిన అంతర్గత సమస్యలు, బయటి నుంచి తెగ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం రాజు బాధ్యతే! రాజుకు హఠాత్తుగా అనారోగ్యం వాటిల్లినా, రాజు మరణించినా, కొత్తరాజు వచ్చేంత వరకు రాజ్యభారాన్ని మంత్రులు చూసుకుంటారు. మన్నన్ ప్రజలు రాజును తమ పాలకుడిగానే కాకుండా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా గౌరవిస్తారు. ఒక రాజు, అతడికి ఒక ఆస్థానం అంటే భారీగా ఊహించుకుంటారేమో! ఈ రాజుకు, ఆయన ఆస్థానానికి భారీ భవంతులు, రాజప్రాసాదాలూ ఉండవు. మామూలు పక్కా ఇల్లే ఆయన నివాసం, ఆస్థానం.రామన్ రాజమన్నన్ భార్య బినుమాల్ మన్నన్ తెగప్రజలకు రాణి. వీరి కూతురు అర్చన యువరాణి. మన్నన్ ప్రజల్లో ఎక్కువమంది వ్యవసాయ పనులు చేసుకుంటారు. వీరిలో కొందరు అటవీశాఖలో చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు రామన్ రాజమన్నన్ సకుటుంబంగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేడుకలకు ఆహ్వానం అందుకున్న తొలి మన్నన్ రాజుగా ఆయన దేశ ప్రజలకు కనిపించారు. రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక రాజదంపతులు ఢిల్లీలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి జనవరి 31 వరకు అక్కడే ఉన్నారు. వారు ఫిబ్రవరి 2న తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు. వీరి ప్రయాణ ఖర్చులను గిరిజనాభివృద్ధి శాఖ పెట్టుకుంది. మన్నన్‌ల చరిత్ర!ఏడు వందల ఏళ్ల క్రితం పాండ్య, చోళ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పాండ్యరాజు చిరై వర్మన్ ఓడిపోయాడు. కొద్దిమందిని వెంటబెట్టుకుని తన రాజ్యం నుంచి పారిపోయి, ఇప్పటి ఇడుక్కి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చి, కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అదే ఈ మన్నన్ రాజ్యమని స్థానిక మన్నన్ తెగ ప్రజలు చెబుతారు.విద్యను అందించడమే లక్ష్యంరాజుగా నా ప్రజలందరికీ విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యం. విద్యతోనే ఆదివాసీల జీవితాలు మెరుగుపడతాయి. నేటితరానికి ఈ అవగాహనను కల్పించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగలం – రామన్ రాజమన్నన్పిల్లల్ని చదివించటం అంటే వారికి రాయల్ లైఫ్‌ను ఇవ్వటమే. – రాజమన్నన్ -
సునామీలో సర్వం కోల్పోయారు..కానీ ఆ అక్కా చెల్లెళ్లు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా..
ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయింది ఆ కుటుంబం. ఉండేందుకు నీడ కూడా లేకుండా రోడ్డున పడిపోయాయి జీవితాలు. ఒక్క రోజులో కథే మారిపోయింది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి. అలాంటి గడ్డు పరిస్థితిలో చదువుపై ధ్యాస పెట్టి ఉన్నతాధికారి కావాలనే ఆలోచన వైపుకే వెళ్లనంతగా జీవితం కటికి చీకటిమయంగా ఉంటుంది. అయితే అంతటి కటిక దారిద్య్రంలో బతికీడుస్తూ కూడా అన్నింటిని ఓర్చుకుని కన్నెరజేసిన ప్రకృతికే సవాలు విసిరారు. కష్టతర సాధ్యమైన హోదాలని అందుకున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ఎవ్వరూ ఊహించని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారిణులై మనిషి సంకల్పానికి ఎలాంటి కష్టమైనా.. తోక ముడిచి తీరాల్సిందేనని చూపించారు. ఇంతకీ ఎవరా అక్కాచెల్లెళ్లు అంటే..తమిళనాడులోని కడలూరు జిల్లాకి చెందిన రైతు కుమార్తెలు ఆ అక్కాచెల్లెళ్లు. వారి పేర్లు సుష్మిత రామనాథన్, ఐశ్వర్య రామనాథన్. ఆర్థికంగా వెనుకబడిన వ్యవసాయం కుటుంబం వారిది. కటిక పేదరికంలో పెరిగారు. కనీస వనురుల లేక అల్లాడిపోయారు. అలాంటి కుటుంబం ప్రకృతి ప్రకోపానికి పూర్తిగా అల్లకల్లోలమైపోయింది. సరిగ్గా 2004 హిందూ మహాసముద్రం సునామీలో ఇల్లుతో సహా సర్వం కోల్పోయారు. అప్పటికీ అంతంత మాత్రంగా ఉన్నజీవితాలు పూర్తిగా రోడ్డున పడిపోయాయి. అయితే అక్కాచెల్లెళ్లు అంతటి భరించలేని పరిస్థితుల్లో కూడా చదువుని వదలలేదు. అదే తమ జీవితాలను మార్చే ఆయుధమని పూర్తిగా నమ్మారు. దానికే కట్టుబడి ఇరవురు యూపీఎస్సీకి సన్నద్ధమై అనుకున్నది సాధించారు. మరీ అక్కాచెల్లెళ్ల విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..ఐఏఎస్ ఐశ్వర్య రామనాథన్2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 628వ ర్యాంకు సాధించి రైల్వే అకౌంట్స్ సర్వీస్ (RAS)కి ఎంపికయ్యింది. కానీ ఆ పోస్టుతో సంతృప్తి చెందని ఐశ్వర్య మరోసారి 2019లో యూపీఎస్సీకి సన్నద్ధమైంది. అప్పుడు మెరుగైన ర్యాంకు సాధించి 22 ఏళ్లకే తమిళనాడు కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి అయ్యింది. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో అదనపు కలెక్టర్‌గా నియమితురాలైంది.ఐపీఎస్ సుష్మితా రామనాథన్చెల్లెలు ఐశ్వర్యలా సునాయాసంగా యూపీఎస్సీలో విజయం అందుకోలేకపోయింది. ఏకంగా ఐదు సార్లు విఫలమైంది. చెల్లలు కంటే ఎక్కువ కష్టపడి సివల్స్‌లో సక్సెస్ అయ్యింది. ఆమె 2022లో ఆరవ ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో 528వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి అయ్యింది. ఆమె ప్రస్తుతం దక్షిణ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ASP)గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. (చదవండి: ప్రపంచం అంతమయ్యేది అప్పుడే..! వెలుగులోకి న్యూటన్ లేఖ..) -
19 ఏళ్ల మర్డర్ మిస్టరీకి ముగింపు పలికిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
1992లో వచ్చిన బ్రహ్మ సినిమా చూశారా? అందులో హీరోకి చిన్నప్పటి ఫొటో ఇస్తే.. పెద్దయ్యాక ఎలా ఉంటారో బొమ్మ గీసి ఇచ్చేస్తాడు. విలన్లు ఓ అమ్మాయిని చంపడం కోసం ఆమె చిన్ననాటి ఫొటో ఇచ్చి.. పెద్దయ్యాక ఎలా ఉంటుందో గీసి ఇవ్వాలని కోరతారు.. అయితే, హీరో ఆమె బొమ్మ కాకుండా చనిపోయిన తన భార్య బొమ్మ గీసి ఆ అమ్మాయిని కాపాడతాడు. అది ఆ సినిమా కథ (Cinema Story) ఇప్పుడు ఇలాంటి పనులకు ఆ బ్రహ్మ అవసరం లేదు. కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).. అంతకంటే ఎక్కువ పనులే చేస్తోంది. దైనందిన జీవితంలోనే కాదు.. నేర పరిశోధనలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. పోలీసులకు సవాల్‌గా నిలిచిన కేసుల చిక్కుముళ్లను సునాయాసంగా విప్పి.. నేరస్తులను కటకటాల వెనక్కి నెడు తోంది. కేరళలో 19 ఏళ్లుగా మూలనపడి ఉన్న కేసును ఈ అభివన బ్రహ్మ సునాయాసంగా ఛేదించింది.- సాక్షి సెంట్రల్ డెస్క్19 ఏళ్ల క్రితం.. అది కేరళ (Kerala) కొల్లాం జిల్లాలోని అంచల్ పట్టణం (Anchal Town) 2006 ఫిబ్రవరి 10 సాయంత్రం ఆరు గంటలు.. స్థానిక పంచాయతీ కార్యాలయంలో పనిచేసే శాంతమ్మ అప్పుడే ఇంటికొచ్చి లోపలకు వెళ్లారు. అంతే.. ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. గది మొత్తం రక్తసిక్తంగా కనిపించింది. తన ఒక్కగానొక్క కుమార్తె, రంజని, ఆమె 17 రోజుల కవలు పిల్లలు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. ఎవరో వారు ముగ్గురినీ అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశారు. 17 రోజుల పసిపిల్లలనే కనికరం లేకుండా దారుణానికి తెగబడ్డారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అక్కడ లభించిన ద్విచక్ర వాహనం ఆధారంగా ఆర్మీలో పనిచేస్తున్న దివిల్, రాజేశ్ ఈ హత్యలకు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ ఎంతగా గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. 2010లో ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. అయినా నిందితుల జాడ తెలియలేదు.ఏఐ రాకతో..ప్రస్తుతం నేరపరిశోధనలోనూ ఏఐ (AI) కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రంజని, ఆమె పిల్లల హత్య కేసును ఏఐ సాయంతో పరిష్కరించాలనే ఆలోచనతో దర్యాప్తు అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటన జరిగి 19 ఏళ్లు పూర్తయింది. తమ దగ్గర ఉన్న ఆధారం రాజేశ్ ఫొటో ఒక్కటే. అది కూడా 19 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఫొటో సాయంతో అతడిని పట్టుకోవడం ఎలా అని ఆలోచించిన అధికారులకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే రాజేశ్ పాత ఫొటోను ఉపయోగించి.. అతడు 19 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడో ఏఐ సాయంతో ఓ ఫొటో సృష్టించారు. అనంతరం వివిధ సామాజిక మాధ్యమాల్లో ఉన్న లక్షలాది ఫొటోలను ఏఐను ఉపయోగించి జల్లెడ పట్టగా.. ఓ పెళ్లి ఫొటోలో ఉన్న వ్యక్తి 90 శాతం మేర మ్యాచ్ అయ్యాడు. వెంటనే వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు పుదుచ్చేరి వెళ్లి రాజేశ్‌ను, అతడి ద్వారా దివిల్ను గుర్తించి అరెస్టు చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఒకే గ్రామానికి చెందిన రంజని, దివిల్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. దీంతో దివిల్ ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. 2006 జనవరిలో ఆమె కవల పిల్లలకు (Twins) జన్మనిచ్చింది. తనను మోసం చేసిన దివిల్ పై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న దివిల్.. రంజని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం ఆర్మీలోనే తనతో పనిచేస్తున్న రాజేశ్ సహాయం కోరాడు. వారి పథకంలో భాగంగా రాజేశ్ అంచల్ వచ్చి.. తనను అనిల్ కుమార్‌గా రంజనికి పరిచయం చేసుకున్నాడు. దివిల్పై పోరులో సహకరిస్తానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో తన పిల్లలకు తండ్రి దివిల్ అని.. అతడికి డీఎన్ఏ పరీక్షలు చేయించాలని కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన రంజని.. ఆ మేరకు ఉత్తర్వులు పొందింది. దీంతో సాధ్యమైనంత త్వరగా రంజనిని అంతం చేయాలని దివిల్, రాజేశ్ నిర్ణయానికి వచ్చారు.చదవండి: విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!ఫిబ్రవరి 10న రంజని ఇంటికి వచ్చిన రాజేశ్.. పిల్లల పుట్టినరోజు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని చెప్పి శాంతమ్మను పంచాయతీ ఆఫీసుకు పంపించాడు. ఆమె వెళ్లిన వెంటనే రంజనిని గొంతు కోసి చంపేశాడు. తర్వాత 17 రోజుల ఇద్దరు పసికందులను కూడా అలాగే చంపి, అక్కడ నుంచి జారుకున్నాడు. తర్వాత ఇరువురూ ఏమీ తెలియనట్టుగా పఠాన్ కోట్‌లోని ఆర్మీ బేస్ క్యాంపునకు వెళ్లిపోయారు. దర్యాప్తులో భాగంగా వీరిని నిందితులుగా గుర్తించిన పోలీసులు పఠాన్ కోట్ ఆర్మీ బేస్‌కు వెళ్లారు. అయితే, అప్పటికే ఇరువురూ అక్కడ నుంచి పరారయ్యారు. అక్కడ నుంచి పుదుచ్చేరి వెళ్లిపోయి విష్ణు, ప్రవీణ్ కుమార్ అనే తప్పుడు పేర్లతో ఇంటీరియర్ డిజైనర్లుగా అవతారమెత్తారు. ఈ క్రమంలో ఓ వివాహ వేడుకలో తీసిన ఫొటోలో ఉన్న రాజేశ్‌ను ఏఐ గుర్తించడంతో ఇరువురూ కటకటాల వెనక్కి వెళ్లారు. -
వయసు 14 ఏళ్లే.. కానీ లక్ష మొక్కలు నాటింది..!
‘ప్రసిద్ధి సింగ్’ను ‘చెట్ల అమ్మాయి’ అని పిలవొచ్చు. ఎందుకంటే ఎక్కడ ప్రసిద్ధి ఉంటే అక్కడ ఒక చెట్టయినా ఊపిరి పోసుకుంటుంది. తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన 14 ఏళ్ల ప్రసిద్ధి ఇప్పటికి లక్ష మొక్కలు నాటిందంటే నమ్ముతారా? కాని నిజం. ఇటీవల కేరళలో నిర్వహించిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ తన లక్ష్యం పది లక్షల మొక్కలు నాటడం అని తెలిపి అందరిలో స్ఫూర్తి నింపింది. 2016లో ప్రసిద్ధికి ఆరేళ్లు ఉన్నప్పుడు తుపాను వారి ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. అనేక చెట్లు నేలకూలాయి. ఆ వయసులోనే ప్రసిద్ధి నేలకూలిన మొక్కలను చూసి బాధపడింది. తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు మొక్కలు నాటే కార్యక్రమం చేపడితే ఉత్సాహంగా తనూ పాల్గొంది. రెండేళ్లపాటు తమిళనాడులోని రకరకాల ప్రాంతాలకు వెళ్లి మొక్కలు నాటింది. నాటే కొద్ది ఆ అమ్మాయికి మొక్కల కోసం పని చేయాలనిపించి లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. ఆ వయసులో అది సాధ్యమా అని ఎవరైనా తనని అడిగితే, ‘చిన్న కొవ్వొత్తి ఇంటికంతా వెలుగు ఇవ్వడం లేదా? ఇది కూడా అంతే. సంకల్పం బలంగా ఉంటే తప్పక సాధ్యమవుతుంది’ అని చెప్పేది. ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొని మరికొంతమందిని కలుపుకొని ‘ప్రసిద్ధ ఫారెస్ట్ ఫౌండేషన్’ ప్రారంభించింది. అందులో కార్యక్రమాలు నిర్వహించేందుకు నిధుల కోసం తోటి పిల్లలకు పెయింటింగ్, యోగా నేర్పేంది. అలా వచ్చిన డబ్బుతో కార్యక్రమాలు నిర్వహించేది. ఈ క్రమంలో ఎన్నో పాఠశాలలకు వెళ్లి, అక్కడి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు అనుమతి కోరింది. ఇంత చిన్నపిల్ల ఏం చేస్తుందా అని వారు ఆశ్చర్యపోయినా, తనకు అవకాశం ఇచ్చేవారు. అలా అనేక పాఠశాలల్లో మొక్కలు నాటింది. మెల్లగా తన గురించి అందరికీ తెలిసింది. తన సంకల్పానికి మరికొందరు తోడయ్యారు. అలా ఇప్పటికి 110 ప్రాంతాల్లో 1.3 లక్షల కంటే ఎక్కువ మొక్కలు నాటింది. పర్యావరణం కోసం, అడవుల సంరక్షణ కోసం ఆమె చేస్తున్న పనికి మెచ్చుకుంటూ 2021లో పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించారు. తమిళనాడు వాతావరణ సదస్సు 3.0లో ఆమెను చైల్డ్ ఛాంపియన్ స్పీకర్‌గా యునిసెఫ్ గుర్తించింది. త్వరలో తమిళనాడులోని 200 పాఠశాలల్లో ’Green Brigade’ కార్యక్రమం మొదలుపెట్టి, విద్యార్థులకు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి, వారిని అందులో భాగస్వాములను చేయనుంది. (చదవండి: స్టైల్గానే కాదు అందంగా నాజుగ్గా కనపడాలంటే..!) -
దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, 24మందికి గాయాలు
తిరువనంతపురం : కేరళలో విషాదం చోటు చేసుకుంది. పటాకుల శబ్ధానికి బెదిరిపోయిన ఏనుగులు భక్తుల్ని తొక్కి చంపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు.పోలీసుల సమాచారం మేరకు.. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి సమీపంలో కురవంగడ్‌లోని మనక్కులంగర భగవతి ఆలయ ప్రాంగణంలో వార్షిక ఉత్సవం జరిగింది. ఉత్సవం చివరి రోజున నిర్వాహకులు రెండు ఏనుగుల్ని తీసుకువచ్చారు.ఉత్సవ సమయంలో నిర్వాహకులు బాణసంచా పేల్చారు. దీంతో ఆ రెండు ఏనుగులు బెదిరిపోయాయి. భక్తుల్ని తొక్కుకుంటూ, దాడులు చేస్తూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా.. 24 మంది గాయపడ్డారు. ‘ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది. ఏనుగులను సాయంత్రం ఊరేగింపు కోసం ప్రదర్శిస్తుండగా, పటాకుల శబ్దం విన్న తర్వాత అకస్మాత్తుగా వాటిలో ఒక ఏనుగు బెదిరిపోయింది. మరో ఏనుగుతో ఘర్షణకు దిగింది. ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఏనుగులు ఒకదానికొకటి తోసుకోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు ఉత్సవ కార్యాలయం కూడా కూలిపోయింది’ అని కౌన్సిలర్ చెప్పారు.దేవాలయంలో దుర్ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రెండు ఏనుగుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్రాకర్ల శబ్దానికి ఏనుగులు బెదిరిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలింది. కోయిలాండి ఎమ్మెల్యే కనాతిల్ జమీలా మీడియాతో మాట్లాడుతూ.. క్రాకర్ల శబ్ధానికి ఏనుగులు బెదిరిపోయాయి. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాయి. ఆ సమయంలో భక్తుల మధ్య తొక్కిసలాట, తోపులాట జరిగింది. గాయపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించాము’ అని అన్నారు. -
Ranji Trophy: ఒక్క పరుగు జమ్మూ కశ్మీర్ కొంప ముంచింది.. సెమీస్‌కు కేరళ
పుణే: ఒక్క పరుగే కదా అని తేలిగ్గా తీసుకుంటే... ఆ ఒక్క పరుగే ఒక్కోసారి ఫలితాన్ని నిర్ణయిస్తుంది. దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఈ ఒక్క పరుగు విలువ ఎలాంటిదో అటు కేరళ జట్టుకు... ఇటు జమ్మూ కశ్మీర్ జట్టుకు తెలిసొచ్చింది. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్ చేరుకోవాలని ఆశించిన జమ్మూ కశ్మీర్ జట్టుకు ఒక్క పరుగు నిరాశను మిగిల్చింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో సంపాదించిన ఒక్క పరుగు ఆధిక్యం కేరళ జట్టుకు ఆరేళ్ల తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే... జమ్మూ కశ్మీర్ నిర్దేశించిన 399 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 100/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు చివరి రోజు ఆట ముగిసేసరికి 126 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు సాధించి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. సల్మాన్ నిజర్ (162 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు), మొహమ్మద్ అజహరుద్దీన్ (118 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) 43 ఓవర్లు ఆడి ఏడో వికెట్‌కు అజేయంగా 115 పరుగులు జోడించి జమ్మూ కశ్మీర్ విజయాన్ని అడ్డుకున్నారు. భారత్‌లోని పిచ్‌లపై చివరిరోజు 299 పరుగులు చేయాలంటే ఏ స్థాయి టోర్నీలోనైనా కష్టమే. ఈ నేపథ్యంలో కేరళ బ్యాటర్లు ఆఖరి రోజు క్రీజులో నిలదొక్కుకొని సాధ్యమైనన్ని బంతులు ఆడాలని... జమ్మూ కశ్మీర్ బౌలర్లకు వికెట్లు సమర్పించుకోరాదని... మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోవాలనే ఉద్దేశంతోనే పోరాడారు. చివరకు తమ ప్రయత్నంలో కేరళ బ్యాటర్లు విజయవంతమయ్యారు. వెరసి కేరళ, జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య ఐదు రోజుల రంజీ ట్రోఫీ చివరి క్వార్టర్ ఫైనల్ ‘డ్రా’గా ముగిసింది. ఫలితం తేలకపోవడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన జట్టుకు సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. జమ్మూ కశ్మీర్‌పై 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న కేరళ జట్టుకు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. ఈనెల 17 నుంచి జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్ జట్టుతో కేరళ తలపడుతుంది. ఆ ఇద్దరు అడ్డుగోడలా... ఓవర్‌నైట్ స్కోరు 100/2తో ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ బుధవారం తొలి సెషన్లో నింపాదిగా ఆడి 46 పరుగులు జోడించి ఒక్క వికెట్ కోల్పోయింది. లంచ్ సమయానికి కేరళ 146/3తో ఉంది. రెండో సెషన్లోనూ కేరళ బ్యాటర్లు ఎలాంటి ప్రయోగాలకు పోలేదు. ఆచితూచి ఆడుతూ వికెట్లను కాపాడుకున్నారు. అయితే ఎనిమిది బంతుల వ్యవధిలో కేరళ సచిన్ బేబీ (162 బంతుల్లో 48; 7 ఫోర్లు), జలజ్ సక్సేనా (48 బంతుల్లో 18; 3 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఆదిత్య సర్వాతే (27 బంతుల్లో 8; 2 ఫోర్లు) కూడా అవుటయ్యాడు. దాంతో టీ విరామానికి కేరళ 216/6 స్కోరుతో వెళ్లింది. టీ బ్రేక్ తర్వాత ఆఖరి సెషన్లో మరో నాలుగు వికెట్లు తీస్తే జమ్మూ కశ్మీర్‌కు విజయంతోపాటు సెమీఫైనల్ బెర్త్ లభించేది. కానీ సల్మాన్ నిజర్, అజహరుద్దీన్ మొండి పట్టుదలతో ఆడి జమ్మూ కశ్మీర్ జట్టు ఆశలను వమ్ము చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ సాధించడంతోపాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ నాటౌట్‌గా నిలిచిన నిజర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సంక్షిప్త స్కోర్లు జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 280; కేరళ తొలి ఇన్నింగ్స్: 281; జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్: 399/9 డిక్లేర్డ్; కేరళ రెండో ఇన్నింగ్స్: 295/6 (126 ఓవర్లలో) (రోహన్ 36, అక్షయ్ 48, సచిన్ బేబీ 48, సల్మాన్ నిజర్ 44 నాటౌట్; అజహరుద్దీన్ 67 నాటౌట్, యు«ద్వీర్ 2/61, సాహిల్ 2/50). -
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం.. డంబెల్స్ వేలాడదీసి
తిరువనంతపురం : ‘అరె తమ్ముళ్లు మందేయాలి. డబ్బులు ఇవ్వండ్రా అని సీనియర్ విద్యార్థులు.. తమ జూనియర్ విద్యార్థులకు హుకుం జారీ చేశారు. దీంతో జూనియర్లు చేసేది లేక కొన్ని వారాల పాటు ప్రతి ఆదివారం సీనియర్లకు డబ్బులు ఇచ్చే వారు. ఈ తరుణంలో ఓ ఆదివారం ఎప్పటిలాగే జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సీనియర్లు ప్రయత్నించారు. దీంతో జూనియర్లు మీకు ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవు అన్నా’అని సమాధానం ఇచ్చారు. అంతే కోపోద్రికులైన సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను అత్యంత కిరాతంగా ర్యాగింగ్ (Ragging) చేశారు. చివరికి..కేరళ పోలీసులు వివరాల మేరకు.. కేరళ (kerala) రాజధాని తిరువనంతపురంకు చెందిన ముగ్గురు విద్యార్థులు కొట్టాయంలో ప్రభుత్వ కాలేజీలో (kottayam government narsing college) నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే, గతేడాది నవంబర్‌లో మూడో సంవత్సరం నర్సింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఈ ముగ్గురు విద్యార్థుల్ని ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేశారు.ఆ ర్యాగింగ్ ఎలా ఉందంటే? బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడం. వాటిపై కారం పూయడం. మంటకు విలవిల్లాడుతుంటే వీడియోలు తీసి పైశాచికానందం పొందడం. గాయాల్ని కంపాస్‌తో కొలవడం. అంతర్గత అవయవాలకు డంబెల్స్‌ను వేలాడదీయడం వంటి వికృత చేష్టలకు దిగారు. తాము ర్యాగింగ్ చేస్తున్నామని ఫిర్యాదు చేస్తే మీకు చదువును దూరం చేస్తామని బాధిత విద్యార్థుల్ని బెదిరింపులకు దిగారు. అలా నాలుగు నెలల పాటు సీనియర్ల వేధింపులను మౌనంగా భరించారు.ఈ నేపథ్యంలో ఓ బాధిత విద్యార్థి ధైర్యం చేసి కాలేజీలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీనియర్ విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో విద్యార్థుల్ని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.👉చదవండి : నేను లీవ్ అడిగితే ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడో చూడండి! -
అరవై రోజుల అద్భుతం 'నవార'!
నవార.. కేరళకు చెందిన ఓ అపురూపమైన పాత పంట. 2 వేల ఏళ్ల క్రితం నుంచే సాగులో ఉన్న అద్భుతమైన ఔషధ విలువలున్న ధాన్యపు పంట. ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న విశిష్ట వంగడం నవార (Navara). ఆహారంగా, ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లనే ఇది ఔషధ పంటగా అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం పొందింది. 60 రోజుల పంటదక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా కేరళ, పురాతన వ్యవసాయ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది నవార. ఇది స్వల్పకాలిక పంట. విత్తిన 60 రోజుల్లోనే ధాన్యం చేతికొస్తుంది. అందుకే దీనికి ‘షస్తిక శాలి’ అనే పేరు వచ్చింది. నవార బియ్యం (Navara Rice) ఎరుపు + నలుపు రంగుల కలగలుపుతో విలక్షణంగా కనిపిస్తుంది. చర్మం, ఎముకలు, కండరాలు, జీర్ణకోశం ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందని కేరళలోని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.జిఐ గుర్తింపు జన్యుపరంగా విశిష్ట గుణాలు కలిగి ఉన్నందున 2008లో నవార వంగడానికి కేంద్ర ప్రభుత్వం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపునిచ్చింది. ఈ గుర్తింపు పొందిన నవార వంగడాలు రెండు. నలుపు జీరతో ఉండే ఎర్ర బియ్యపు రకం ఒకటి. లేత బంగారు రంగు జీరతో ఉండే ఎర్ర బియ్యపు రకం రెండోది. కేరళలోని కరుకమనికళంలో గల నవార రైస్ ఫార్మర్స్ సొసైటీ ఈ రెండు వంగడాలకు జిఐ గుర్తింపును పొందింది. ఈ రెండు రకాల నవార బియ్యానికి సహజమైన తీపి రుచి ఉంటుంది. సులువుగా జీర్ణమవుతాయి. అందువల్ల అన్ని వయసుల వారూ తినటానికి అనువుగా ఉంటాయి. సాధారణంగా నవార బియ్యాన్ని పిండి పట్టించి పాలలో కలుపుకొని తాగుతారు. దీనికి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆథ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. ఆలయ క్రతువుల్లోనూ వాడుతారు.9.5% మాంసకృత్తులు.. నవార బియ్యం పోషకాల గని. 73% పిండి పదార్థం, 9.5% మాంసకృత్తులు, 2.5% కొవ్వు, 389 కేలరీల శక్తి ఉంటాయి. అంతేకాదు, చక్కని పీచు పదార్థానికి, యాంటీఆక్సిడెంట్ల తోపాటు జింక్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలకు నిలయం. ఈ పోషకాలు కలిగి ఉన్నందునే ఆరోగ్యప్రదాయినిగా ప్రఖ్యాతి పొందింది.ఆయుర్వేదంలో నవారఆయుర్వేద పంచకర్మ చికిత్సల్లో నవార బియ్యానికి అత్యంత అధిక ప్రాధాన్యం ఉంది. రక్తప్రసరణ, శ్వాసకోశ, జీర్ణవ్యవస్థలను మెరుగుపరచటంలో నవార పాత్ర ఎంతో ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కీళ్లనొప్పులు, కండరాల క్షీణత, కొన్ని రకాల చర్మ సమస్యలకు చేసే ఆయుర్వేద చికిత్సల్లో ఈ బియ్యాన్ని వాడుతున్నారు. నవార బియ్యంతోపాటు తౌడు, నూక, ఊక, గడ్డిని కూడా ఔషధ విలువలతో కూడిన ఆహారోత్పత్తుల తయారీలో పరిశ్రమదారులు ఉపయోగిస్తున్నారు. నవార తౌడు, ఊకలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.నవార సాగులో సవాళ్లునవార వంటి పాత పంటల సాగులో సంప్రదాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే కేరళలో రైతులు అనుసరిస్తున్నారు. ప్రకృతి వనరులతో కూడిన ఎరువులు, కషాయాలు వాడుతూ వ్యవసాయం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా చూస్తున్నారు. పొలాల్లో పర్యావరణ సమతుల్యానికి మిత్ర పురుగుల పాత్ర కీలకం.వాటిని రక్షించుకోవటం కోసం కషాయాలను మాత్రమే వాడుతున్నారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, పశువుల పేడ, పంచగవ్యలను రసాయనిక ఎరువులకు బదులు వాడుతున్నారు. బలమైన గాలులు, భారీ వర్షాలను నవార వరి పంట అంతగా తట్టుకోలేదు, పడిపోయే గుణం ఉంది. తీవ్రమైన మంచుతో కూడా ఇబ్బంది పడే సున్నితమైన పంట ఇది. చలిని తట్టుకోలేదు. కాండం అడుగునే వంగి పడి΄ోతుంది. కాబట్టి శీతాకాలంలో దీన్ని సాగు చేయకూడదు. ఈ కారణాల వల్ల నవార పంటకాలం 60 రోజులే అయినప్పటికీ ఏడాదికి కేవలం ఒకే పంట సాగు అవుతోంది. నవార వరి పంటను మనుషులతోనే కోయించాలి. కూలీల కొరతతో ΄ాటు అధిక ఖర్చుతో కూడిన పని కావటం వల్ల రైతులకు ఇది కూడా పెద్ద సమస్యే అవుతోంది.నిజంగా బంగారమే!నవార ధాన్యం దిగుబడి కూడా ఎకరానికి 300 కిలోలు మాత్రమే. ఇతర వరి రకాలతో ΄ోల్చితే చాలా తక్కువ. అయినా, దీనికి ఉన్న ప్రత్యేక ఔషధ గుణాల కోసం ఎక్కువ ధర పెట్టి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ధర అధికంగా ఉన్నప్పటికీ నవార బియ్యానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. రైతులకూ మంచి ఆదాయాన్ని సమకూర్చుతోంది. నవారకున్న అరుదైన ఔషధగుణాల వల్ల ‘బంగారం’ అని కూడా పేరొచ్చింది. నవార బియ్యాన్ని మీ కుటుంబం ఆహారంగా తీసుకుంటే ఎన్నెన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయి. 2 వేల సంవత్సరాల ఘన చరిత్ర గల అద్భుత వంగడాన్ని పరిరక్షించుకున్నట్లు కూడా అవుతుంది. షుగర్ నియంత్రణ...నవార బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ తెల్ల బియ్యంతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అంటే.. గ్లూకోజ్‌ను రక్తంలోకి తెల్ల బియ్యం మాదిరిగా ఒకేసారి కాకుండా నెమ్మది నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది అనువైన మూలాహారం అయ్యింది. ఇందులోని పీచు వల్ల ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తుంది. ఎముక పుష్టి... కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాలతో కూడి ఉంటుంది కాబట్టి నవార బియ్యం తిన్న వారికి ఎముక పుష్టి కలుగుతుంది. రెగ్యులర్‌గా తినే వారికి ఎముకలు గుల్లబారటం వంటి సమస్య రాదు. బ్లడ్ క్లాట్ కావటం, మజిల్ కంట్రాక్షన్ వంటి సమస్యలను అధిగమించడానికీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.చర్మ సౌందర్యం... యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నవార ఆహారం దోహదం చేస్తుంది. ముడతలను పోగొట్టడానికి, చర్మంలో మెరుపును పెంపొందించటానికి దోహదం చేస్తుంది. నవార బియ్యపు పిండిని పాలలో లేదా నీటిలో కలిపి ముఖవర్చస్సు మెరుగవడానికి, మచ్చలు పోవటానికి లేపనంగా వాడుతూ ఉంటారు. నవార బియ్యంలోని మెగ్నీషియం కండరాలను, నరాలను ఆరోగ్యవంతంగా ఉంచటానికి.. మొత్తంగా నాడీ వ్యవస్థను, కండరాల వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉండటానికి ఉపయోడపడుతుంది.గుండెకు మేలు... నవార బియ్యంలోని అధిక పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తనాళాల్లో పూడికను నివారించడానికి తద్వారా గుండెపోటు ముప్పును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సీ ఉండటం వల్ల కణజాలానికి మరమ్మతు చేస్తే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి దోహదపడటం ద్వారా నవార రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ... ఇందులోని అధిక పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొట్టలోని సూక్ష్మజీవరాశిని పెంపొందించడం ద్వారా జీర్ణశక్తిని పెంపొందించి, పోషకాల మెరుగైన శోషణకు, మొత్తంగా జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు దోహదం చేస్తుంది.శిశు ఆహారం... కేరళలో నవార బియ్యాన్ని శిశువులకు ఆహారంగా పెడుతుంటారు. నవార పిండి, అరటి పండు ఒరుగులతో కలిపి తయారు చేసే ‘అంగ్రి’ అనే వంటకాన్ని పిల్లలకు తినిపించటం కేరళవాసులకు అనాదిగా అలవాటు. డబ్బాల్లో అమ్మే ప్రాసెస్డ్ ఆహారం కన్నా ఇది పిల్లలకు చాలా సహజమైన, బలవర్ధకమైన ఆహారం. పిల్లలు తగినంత బరువు పెరగడానికి దోహదపడుతుంది.కేన్సర్ నిరోధకం... నవార బియ్యంలో ప్రోయాంథోశ్యానిడిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయ. డిఎన్ఎకి నష్టం కలగకుండా నివారించడటం, హానికారక ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యం చేయటం ద్వారా కేన్సర్ ముప్పును తగ్గించడానికి నవార బియ్యం ఉపకరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.చదవండి: ఈ ఆపిల్ ఎక్కడైనా కాస్తుంది!రక్తహీనతకు చెక్... నవార బియ్యంలో పుష్కలంగా ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను నివారించగలదు. నిస్సత్తువ, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలను రూపుమాపగలదు. గర్భవతులకు ఈ బియ్యం ఉపయుక్తమైనవి. పీచు, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి సూక్ష్మపోషకాలు గర్భవతుల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. గర్భవతులు సాధారణంగా ఎదుర్కొనే మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరించటంతో పాటు గర్భస్థ శిశువు పెరుగుదలకు చాలా ఉపయోగకరం.నవార నారాయణన్!కేరళ సంప్రదాయ ఆహారంలోనే కాదు ఆయుర్వేద వైద్యంలోనూ కీలక ΄పాత్ర పోషిస్తున్న నవార సాగుకు పాల్ఘాట్ ప్రాంతంలో 2 వేల ఏళ్ల చరిత్ర ఉన్నా గత 50 ఏళ్లుగా దీనికి సాగు తగ్గిపోయి, అంతరించిపోయే దశకు చేరింది. అక్కడక్కడా రైతులు సాగు చేస్తున్నారు. అయితే, ఒకే ఒక్క కుటుంబం మాత్రం నవారను గత 115 ఏళ్లుగా విడవ కుండా తమ 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో నిరంతరాయంగా సాగు చేస్తూనే ఉంది. అద్భుత వ్యవసాయ, సాంస్కృతిక వారసత్వ సంపద అయిన నవారను ఈ కుటుంబం కాపాడుకుంటోంది. ఈ కుటుంబానికి చెందిన మూడో తరం రైతు పి. నారాయణన్ ఉన్ని ఇప్పుడు దీన్ని సాగు చేస్తున్నారు. నవార ఎకో ఫార్మ్ అని ఈయన క్షేత్రానికి పేరు పెట్టారు. ‘నవార నారాయణన్’గా ఆయన పేరుగాంచారు. ఆయన కృషి దేశ విదేశాల్లో మారుమోగుతూ ఉంటుంది. పరిరక్షించటంతో పాటు నవార ఫార్మర్స్ సొసైటీ పేరిట నవారకు జిఐ గుర్తింపు తేవటంలోనూ నారాయణన్ విశేష కృషి చేశారు. నవార ఉత్పత్తులను ఆయన సేంద్రియంగా పండిస్తూ దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. (చదవండి: చర్మతత్వానికి సరిపోయే ఫేస్ ప్యాక్‌లు..!)న్యూఢిల్లీలోని కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఆర్ఐ)కి చెందిన ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టాస్) నవారపై ప్రత్యేక గ్రంథాన్ని ప్రచురించింది. నారాయణన్ ఏర్పాటు చేసిన సొసైటీ ఆధ్వర్యంలో 2011లో నవార ఉత్సవ్‌ను నిర్వహించారు. నవార పునరుజ్జీవనానికి కృషి చేసిన నారాయణన్‌కు ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్అథారిటీ (పిపివి అండ్ ఎఫ్ఆర్ఎ) ప్రతిష్టాత్మకమైన ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ రికగ్నిషన్ పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది. ఎకరానికి 3 క్వింటాళ్ల నవార ధాన్యాన్ని ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండిస్తున్నారు. మిల్లు పట్టిస్తే 180 కిలోల బియ్యం వస్తున్నాయి. బియ్యంతో పాటు అటుకులు, పిండిని తయారు చేసి విక్రయిస్తున్నారు. గత ఏడాది ‘టాస్’ ప్రచురించిన వివరాల ప్రకారం నారాయణన్ ఎకరానికి రూ. 1 లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Ranji Trophy QFs: అంకిత్ శతకం.. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా
కోల్‌కతా: కెప్టెన్ అంకిత్ కుమార్ (206 బంతుల్లో 136; 21 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హరియాణా జట్టు దీటుగా బదులిస్తోంది. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... అంకిత్ కుమార్ ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.లక్షయ్ దలాల్ (34), యశ్వర్ధన్ దలాల్ (36) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 278/8తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై చివరకు 88.2 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది.తనుశ్ కొటియాన్ (173 బంతుల్లో 97; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న హరియాణా ప్రస్తుతం... ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. రోహిత్ శర్మ (22 బ్యాటింగ్), అనూజ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.రాణించిన హర్ష్ దూబే, ఆదిత్య విదర్భ పేసర్ ఆదిత్య థాకరే (4/18) సత్తా చాటడంతో తమిళనాడుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ జట్టు మంచి స్థితిలో నిలిచింది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 18 ఏళ్ల సిద్ధార్థ్ (89 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... తక్కినవాళ్లు విఫలమయ్యారు.మొహమ్మద్ అలీ (4), నారాయణ్ జగదీశన్ (22), సాయి సుదర్శన్ (7), భూపతి కుమార్ (0), విజయ్ శంకర్ (22) విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 264/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ... చివరకు 121.1 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (243 బంతుల్లో 122; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ అనంతరం అవుట్ కాగా... హర్ష్ దూబే (69; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్, సోను యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న తమిళనాడు జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. కెపె్టన్ సాయి కిశోర్ (6 బ్యాటింగ్), ప్రదోశ్ రంజన్ పాల్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా పేస్ బౌలర్ అఖీబ్ నబీ ఐదు వికెట్లతో మెరిపించడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జమ్మూ కశ్మీర్ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. పుణే వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 63 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (78 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నజీర్ (49 బ్యాటింగ్; 8 ఫోర్లు), నిదీశ్ (30) రాణించారు.ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన అఖీబ్ను ఎదుర్కునేందుకు కేరళ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 228/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశీ్మర్ జట్టు చివరకు 95.1 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. యుధ్వీర్ సింగ్ (26), అఖీబ్ నబీ (32) కీలక పరుగులు జోడించారు. కేరళ బౌలర్లలో ని«దీశ్ 6 వికెట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్న కేరళ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్ నజీర్ క్రీజులో ఉన్నాడు.మెరిసిన మనన్, జైమీత్బ్యాటర్లు రాణించడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ 95 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మనన్ హింగ్రాజియా (219 బంతుల్లో 83; 8 ఫోర్లు, 1 సిక్స్), జైమీత్ పటేల్ (147 బంతుల్లో 88 బ్యాటింగ్; 9 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు.అంతకుముందు సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌట్ కాగా... ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న గుజరాత్ 44 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైమీత్తో పాటు వికెట్ కీపర్ ఉరి్వల్ పటేల్ (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!
దేవాలయాల్లో దేవుళ్లను గజవాహనంతో ఊరేగించడం వంటివి చేస్తారు. అంతేగాదు కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే ఏనుగులపై దేవుడిని ఊరేగిస్తారు. అందుకోసం మావటి వాళ్లు తర్ఫీదు ఇచ్చి దైవ కైంకర్యాలకు ఉపయోగించడం జరుగుతుంది. దీని కారణంగా ప్రకృతి ఓడిలో హాయిగా స్వేచ్ఛగా బతకాల్సిన ఏనుగులు బందీలుగా ఉండాల్సిన పరిస్థితి. దీనివల్లే కొన్ని ఏనుగులు చిన్నప్పుడు వాటి తల్లుల నుంచి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా లాభపేక్షలే జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఒక చక్కని పరిష్కారమార్గం చూపించింది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేస్తోందంటే..గజారోహణ సేవ కోసం ఏనుగుల బదులుగా యాంత్రిక ఏనుగుల(ఛMechanical elephant)ను తీసుకొచ్చింది పెటా ఇండియా. ఏనుగులు సహజ ఆవాసాలలోనే ఉండేలా చేసేందుకే వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇలా యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం ద్వారా నిజమైన జంబోలు తమ కుటుంబాలతో కలిసి ఉండగలవని, పైగా నిర్బంధం నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంది పెటా ఇండియా. అలాగే ఆయుధాలతో నియత్రించబడే బాధల నుంచి తప్పించుకుని హాయిగా వాటి సహజమైన ఆవాసంలో ఉంటాయని పేర్కొంది. ఇక ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్ స్టీల్‌తో రూపొందించినట్లు తెలిపింది. ఇవి నిజమైన ఏనుగులను పోలి ఉంటాయి. ఈ యాంత్రిక ఏనుగు తల ఊపగలదు, తొండం ఎత్తగలదు, చెవులు, కళ్లను కూడా కదిలించగలదు. అంతేగాదు నీటిని కూడా చల్లుతుందట. ఇది ప్లగ్-ఇన్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుందట. దీనికి అమర్చిన వీల్‌బేస్ సాయంతో వీధుల గుండా ఊరేగింపులకు సులభంగా తీసుకెళ్లచ్చొట. తాజాగా ప్రఖ్యాత సితార్ విద్వాంసురాలు, ఈ ఏడాది గ్రామీ నామినీ అనౌష్కా శంకర్(Anoushka Shankar) పెటా ఇండియా(Peta India) సహకారంతో కేరళ త్రిస్సూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయాని(Kombara Sreekrishna Swami Temple)కి ఇలాంటి యాంత్రిక ఏనుగుని విరాళంగా సమర్పించారు. సుమారు 800 కిలోగ్రాముల బరువున్న ఈ ఏనుగును బుధవారం(ఫిబ్రవరి 05, 2025న ) ఆలయంలో ఆవిష్కరించారు. ఈ యాంత్రిక ఏనుగు పేరు కొంబర కన్నన్.ఇలా పెటా ఇండియా కేరళ(Kerala) ఆలయాలకి యాంత్రిక ఏనుగులను ఇవ్వడం ఐదోసారి. త్రిస్సూర్ జిల్లాలో మాత్రం రెండోది. ఇటీవల మలప్పురంలోని ఒక మసీదులో మతపరమైన వేడుకల కోసం కూడా ఒక యాంత్రిక ఏనుగును అందించింది. నిజంగా పెటా చొరవ ప్రశంసనీయమైనది. మనుషుల మధ్య కంటే అభయారణ్యాలలోనే ఆ ఏనుగులు హాయిగా ఉండగలవు. అదీగాక ఇప్పుడు ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ప్రత్యామ్నాయం ప్రశంసనీయమైనదని జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Kombara Kannan, a 3-metre-tall mechanical elephant weighing 800 kilograms, was offered to Kombara Sreekrishna Swami Temple, in Thrissur district on Wednesday, by renowned sitarist Anoushka Shankar and PETA India.📹Thulasi Kakkat (@KakkatThulasi) pic.twitter.com/Cz0vD0NNHs— The Hindu (@the_hindu) February 5, 2025 (చదవండి: ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!) -
కేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు
కేరళ (Kerala)లోని కొచ్చిలో 15 ఏళ్ల మిహిర్ అహ్మద్ ఆత్మహత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ యువకుడు ఎత్తైన భవనం 26వ అంతస్తులోని ఫైర్ ఎగ్జిట్ వింటోనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విపరీతమైన ర్యాగింగ్ కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బలవంతంగా టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారని, నిగ్గా (నల్లగా ఉన్నాడని) అంటూ దారుణంగా వేధించడం వల్లనే తన కొడుకు చనిపోయాడని బాధితుడి తల్లి ఆరోపించారు. విచారణ జరిపించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసింది. వేధింపులపై దర్యాప్తు చేయాలని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సహాయం కోరింది. గుండెల్ని పిండేసే విషయాలుమరోవైపు మిహిర్ అకాలమరణంపై ఐడి ఫ్రెష్ ఫుడ్స్ సీఈఓ పీసీ ముస్తఫా iD Fresh Foods CEO, PC Musthafa) స్పందించారు. మిహిర్ తన మేనల్లుడు అని సోషల్‌మీడియాలో వెల్లడించారు. నల్లగా ఉన్నాడనే కారణంగానే అతణ్ణి వేధించి చంపేశారని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు నిగ్గుతేల్చి, తన మేనల్లుడు మిహిర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి ఒక భావోద్వేగ పోస్ట్‌ను ఎక్స్ (గతంలో ట్విటర్) ఇన్‌స్టాలో పంచుకున్నారు.అలాగే మిహిర్‌తో, తన కుమారుడి కలసి చిన్ననాటి స్నాప్‌ను పోస్ట్ చేసి బాధను వ్యక్తం చేశారు. చిన్నపుడు బెంగళూరులో కలిసిపెరిగారని వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులని తెలిపాడు. కేవలం పదిహేనేళ్లకే నూరేళ్లు నిండి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మిహిర్ పాఠశాలలో, బస్సులో విద్యార్థుల గ్యాంగ్ దారుణంగా ర్యాగింగ్‌కు పాల్పడింది. శారీరకంగా దాడికి గురిచేసింది. చనిపోయేముందు రోజుకూడా మిహిర్‌ను కొట్టారు. దుర్భాషలాడారు. అవమానించారు. అతన్ని బలవంతంగా వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారు. టాయిలెట్ ఫ్లష్ చేస్తున్నప్పుడు అతని తలని టాయిలెట్లోకి నెట్టారు. దీని తర్వాత, వారు అతన్ని 'పూపీహెడ్' అని పిలిచి ఎగతాళి చేశారు’’ అంటూ వేధింపుల తాలూకు వివరాలను పీసీ ముస్తఫా వెల్లడించారు. View this post on Instagram A post shared by Musthafa PC (@musthafapcofficial) మిహిర్ మరణించిన తర్వాత కూడా'నిగ్గా' అని సంబోధించారని, ఆ సేజ్స్చూసి చలించిపోయాయనని, చాట్ స్క్రీన్షాట్లను చదివిన తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయానని ముస్తఫా పంచుకున్నారు. చిన్నపిల్లాడి పట్ల ఇంత దారుణా అంటూ వాపోయారు. అందుకే ఈ దుర్మార్గుల బెదిరింపులు, ర్యాగింగ్లు లేని ప్రపంచానికి వెళ్లిపోయాడు. వాడి మరణం వృధా కాకూడదు. న్యాయం జరగాలి అని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది ,న్యాయం గెలుస్తుందదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని నెటిజన్లును కోరారు. తనకోసం కాదు, ఎదిగే ప్రతిబిడ్డకోసం, సురక్షితమైన వాతావరణంలో చదువుకునేందుకు తాను చేస్తున్న పోరాటంలో తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇవీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధు -
అంగన్వాడీ చిన్నారి ‘చికెన్ ఫ్రై’ రిక్వెస్ట్.. స్పందించిన ప్రభుత్వం
తిరువనంతపురం: అంగన్వాడీలో పెడుతున్న తిండి విషయంలో ఓ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ దెబ్బకు ప్రభుత్వం కదిలి వచ్చింది. అంగన్వాడీ మెనునూ మార్చేయాలని నిర్ణయించింది.కేరళ అంగన్వాడీ సెంటర్లలో మెనూ మార్చే అంశంపై అక్కడి విద్యా శాఖ సమీక్ష జరుపుతోందట. అందుకు కారణం.. శంకూ అనే ఓ చిన్నారి వీడియో వైరల్ కావడమే. స్వయానా ఆ రాష్ట్ర ఆరోగ్య, శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్( Veena George) ఆ చిన్నారి వీడియోకు స్పందించి.. ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.అంగన్వాడీలో ప్రతీసారి ఉప్మా పెడుతున్నారని, దానికి బదులు.. బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ ఆ చిన్నారి విజ్ఞప్తి చేశాడు. అమాయకంగా ఆ బుడ్డోడు చెప్పిన మాటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అయ్యాయి. చివరకు.. ఆ వీడియో ప్రభుత్వం దాకా వెళ్లింది. దీంతో వీణా జార్జ్ స్పందించారు.അംഗൻവാടിയിൽ, ഉപ്പുമാവ് മാറ്റി ബിരിയാണിയുംപൊരിച്ച കോഴിയും വേണം എന്നുഈ അമ്പോറ്റി പൊന്നിന്.🤗♥️🥰😘ഈ പരാതി ആരോടു പാറയും മല്ലയ്യാ. 🤔🤔 pic.twitter.com/FPYoXHB3tJ— 🖤 🍁 സുമ 🍁🖤 (@Suma357381) February 1, 2025అంగన్వాడీలో పిల్లలకు ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. ఇప్పటికే పాలు గుడ్లు అందిస్తున్నాం. అయితే.. చిన్నారి శంకూ చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. మెనూను కచ్చితంగా సమీక్షిస్తాం. ఆ వీడియోను చూశాక.. చాలామంది మాకు ఫోన్లు చేశారు. అతనికి బిర్యానీ, చికెన్ ఫ్రై ఇప్పిస్తామని అన్నారు. అంగన్వాడీలో పిల్లలకు అన్నిరకాల పోషకాలు అందాల్సిన అవసరం ఉంది. అందుకే మెనూలో మార్పులు తప్పకుండా చేస్తాం అని అన్నారామె.అయితే.. అవసరమైతే జైల్లో ఖైదీలకు అందించే పెట్టే ఫుడ్‌ను తగ్గించి.. ఇలాంటి పిల్లలకు పెట్టాలంటూ ఆమె కామెంట్ సెక్షన్లో కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. -
Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!
అడిగినంత కట్నం ఇచ్చి బిడ్డకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పండగలకు వచ్చిపోతున్న ఆమెను చూసి.. మెట్టినింట్లో సంతోషంగా ఉంటోందని అంతా సంబుర పడ్డారు. కానీ, తోబుట్టువులకు కూడా చెప్పుకోలేని రీతిలో ఆమె వేధింపులు ఎదుర్కొంది. చివరకు.. ఓపిక నశించి అఘాయిత్యానికి పాల్పడింది!. తిరువనంతపురం: కేరళలలో సంచలనం సృష్టించిన విష్ణుజా(25) కేసులో(Vishnuja Case).. విస్మయం కలిగించే విషయాలు బయటకు వచ్చాయి. భర్త, అతని కుటుంబం పెట్టే హింస భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.మలప్పురం ప్రాంతానికి చెందిన విష్ణుజా(Vishnuja)కి 2023 మే నెలలో ప్రభిన్ అనే యువకుడితో వివాహమైంది. ఆ తర్వాత ఆ జంట ఎలంగూర్‌లో కాపురం పెట్టింది. ప్రభిన్ ఓ పేరుమోసిన ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నాడు. అయితే జనవరి 31వ తేదీన ఉదయం భార్యభర్తలిద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్డారు. కాసేపటికే ప్రభిన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా ప్రభిన్ ఇంటికి రాకపోవడంతో.. విష్ణుజా కూడా కిందకు దిగకపోవడంతో కింద పోర్షన్లో ఉండే ఆమె అత్త పైకి వెళ్లి చూసింది. ఎంతకీ స్పందన లేకపోవడంతో.. స్థానిక సాయంతో తలుపు పగలకొట్టింది. చూసేసరికి.. విష్ణుజా ఫ్యాన్‌ను ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది.స్నేహితుల స్టేట్మెంట్ ప్రకారం.. గత కొంతకాలంగా విష్ణుజాను భర్త శారీరకంగా, మానసికంగా హింసిస్తూ వచ్చాడు. ఈ విషయం అతని తల్లికి కూడా తెలుసు. ప్రభిన్ తీరు వల్ల ఈ విషయాలను ఆమె పుట్టింటి వాళ్లతో పంచుకోలేదు. ఎలాగైనా భర్తను మార్చుకోవానుకుంది. కానీ, ఆ మూర్ఖుడి మనసు కరగలేదు. సరికదా.. ఆ వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. క్షోభకు గురై..పెళ్లైన తొలినాళ్ల నుంచే విష్ణుజాను భర్త హింసిస్తూ వచ్చాడు. అందంగా లేదని.. తనకు నచ్చినట్లు తయారు కావట్లేదని సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఆ వంకతోనే ఆమెను తన బైక్ మీద తిప్పేవాడు కూడా కాదు. పైగా తరచూ ఆమెను కొట్టేవాడు. ఇంత చదువు చదివి ఉద్యోగమూ లేదని తిట్టేవాడు. ఇంత జరుగుతున్నా.. ఆమె భరించింది. భర్త మెల్లిగా మారుతాడులే అనుకుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లకు ప్రిపేర్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలో వేధింపుల విషయాన్ని ఆమె తన స్నేహితులతో పంచుకుంది. అయితే ఆ విషయం తెలిసిన ప్రభిన్ మరింత రెచ్చిపోయాడు. ఆమె ఫోన్, వాట్సాప్‌పై నిఘా పెట్టి.. ఆమె ప్రతీ చర్యను పరిశీలించి హింసించసాగాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ.. చివరకు ఆమె విగతజీవిగా మారిపోయింది. ఏనాడూ ఇంటికి రాలేదుఅయితే తమ కూతురిని ఆమె భర్త, అత్తలు వేధిస్తున్న విషయం.. చనిపోయాక స్నేహితుల ద్వారానే తెలిసిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. పెళ్లైనప్పటి నుంచి ప్రభిన్ ఏనాడూ మా ఇంటికి రాలేదు. అడిగితే.. చిన్న సమస్యే నాకు వదిలేయండి అని మా కూతురు చెబుతుండేది. చదువుకునే రోజుల్లోనే పార్ట్ టైం జాబ్‌తో మా కష్టాలను పంచుకున్న మా బిడ్డ.. పెళ్లయ్యాక ఆమె కష్టాలను మాత్రం మాకు చెప్పుకోలేకపోయింది’’ అని తండ్రి వసుదేవన్ కంటితడి పెట్టారు. అంతేకాదు..తన కూతురిని ప్రభిన్ హత్య చేసి ఉంటాడని ఆయన అనుమానిస్తున్నారు. అతనికి వేరే యువతితో సంబంధం ఉందని ఇప్పుడే తెలిసింది. బహుశా ఆ ఉద్దేశంతోనే నా కూతురిని ఆ కుటుంబం మొత్తం కడతేర్చి ఉండొచ్చు’’ అని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కేసు తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. నిందితుడికి కఠినంగా శిక్షించాలని చర్చ జరుగుతోంది. గృహహింస చట్టాలను మరింత కఠినతరంగా అమలు చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comచదవండి: టార్గెట్ రూ.333 కోట్లు!.. 100 మంది యువతులతో సన్నిహితంగా.. -
దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..
గాడ్స్ ఓన్ కంట్రీ... చూడాల్సినవి ఇవి అని చెప్పుకోవడం కష్టం. జాబితా వేళ్ల మీద లెక్కపెట్టేటంత చిన్నదిగా ఉండదు. ఆర్ట్ అండ్ కల్చర్, ఆధ్యాత్మికం, ధార్మికం, వీకెండ్ పిక్నిక్ స్పాట్స్, బీచ్‌లు, బ్యాక్ వాటర్స్, పర్వతాలు, కొండవాలులో టీ తోటలు, సముద్రం మీద సూర్యాస్తమయాలు, జలపాతాలు, వన్యప్రాణులు, హాలిడే రిసార్టులు... ఇలా పరస్పరంవైవిధ్యభరితమైన పర్యటనల నిలయం ఈ రాష్ట్రం. కేరళలో ఆధ్యాత్మికం కూడా ఆద్యంతం అలరిస్తుంది. త్రివేండ్రంలోని పద్మనాభ స్వామి ఆలయం మొదలు అంబళంపుర శ్రీకృష్ణుడు, చెట్టికుళాంగుర భగవతి, శబరిమల అయ్యప్ప, కొట్టరక్కర గణపతి, తిరునెల్లి ఆలయం, చర్చ్‌లు, మసీదులు ప్రతిదీ టూరిస్టులకు కనువిందు చేస్తాయి.శబరిమలైకి మహిళలను అనుమతించడం కోసం తృప్తి దేశాయ్ చేసిన ఉద్యమంతో ఉత్తరాదివాసుల దృష్టి కూడా కేరళ మీద కేంద్రీకృతమైంది. ఇప్పుడు కేరళలో హిందీవాళ్లు కూడా కనిపిస్తున్నారు.అరబిక్ కడలికేరళ టూర్‌కి కాలంతో పని లేదు. అరేబియా తీరం– పశ్చిమ కనుమల మధ్య విహారానికి ఎప్పుడైనా రెడీ కావచ్చు. ఎండకాలం చల్లగా అలరిస్తుంది. జూన్ నుంచి చిరు వానలు పలకరిస్తాయి. శీతాకాలం పచ్చదనం తన గాఢతను ప్రదర్శిస్తుంది. తలలు వాల్చి ఆహ్వానం పలికే కొబ్బరితోటలు, కోమలత్వాన్ని తాకి చూడమనే అరటి గుబుర్లు, ఎటూ వంగని పోకచెట్లు, ఏ చెట్టు దొరుకుతుందా అల్లుకుపోదామని వెతుక్కునే మిరియాల తీగలు, కాయల బరువుతో భారంగా వంగిపోతున్న కాఫీ చెట్లు, టూర్‌కి మినిమమ్ గ్యారంటీ ఇచ్చే అరేబియా సముద్రం మీద సూర్యాస్తమయాలు... ఇవన్నీ ప్రకృతి ప్రసాదితాలు.ఆది శంకరుడు పుట్టిన నేలకాలడి ఓ చిన్న పట్టణం. పెరియార్ నది ఒడ్డున ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఆది శంకరాచార్యుడు పుట్టిన ప్రదేశం ఇది. ఇక్కడ ఆయన నివసించిన ఇల్లు, ఆయన తల్లి సమాధి ఉన్నాయి. ఇక్కడి స్నానఘట్టంలో ముత్తల కడవు (మొసలి మడుగు) ను కూడా చూడవచ్చు. ఆది శంకరుడు సన్యసించాలనుకున్నప్పుడు తల్లి అంగీకరించలేదు. ఆమె అంగీకారం కోసం ఆది శంకరుడు నాటకం ఆడిన ఘట్టం ఇది. స్నానఘట్టంలో దిగి మొసలి పట్టుకున్నదని, సన్యసించడానికి ఒప్పుకుంటేనే వదులుతుందని తల్లిని మాయ చేసి అంగీకారం పొందిన కథనాన్ని చెబుతారు పూజారులు. పెరియార్ నది కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగడానికి ముందే పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. పచ్చటి చేనులో నీలిరంగు వస్త్రాన్ని మలుపు తిప్పుతూ పరిచినట్లు ఉంటుంది దృశ్యం.కళల నిలయంకేరళ ప్రకృతిసోయగంతోపాటు కళలతోనూ ఆకట్టుకుంటుంది. కలరిపయట్టు వంటి యుద్ధ క్రీడ, మోహినీ అట్టం, కథాకళి వంటి నాట్యరీతులు, రాజారవివర్మ చిత్రలేఖన సమ్మేళనం ఇక్కడే పుట్టాయి. భరత్పుఱ నది తీరాన త్రిశూర్ జిల్లాలోని చెరుత్తురుతి పట్టణంలో కేరళ కళామండలం ఉంది. కళల సాధన కోసం ఏర్పాటు చేసిన ఈ కళామండలంలో నిత్యం సంప్రదాయ నాట్యరీతుల సాధన జరుగుతూ ఉంటుంది. మరో హాలులో కేరళ సంప్రదాయ నాట్య రీతుల నాట్య ముద్రలు, భంగిమలు, ఆహార్యంతో ఉన్న బొమ్మల మ్యూజియం ఒక ఎడ్యుకేషన్. ఈ కళల కోసమే కాదు, కేరళ కళామండలం భవన నిర్మాణశైలిని చూడడం కోసం ఆర్కిటెక్చర్ విద్యార్థులు వెళ్లాల్సిన ప్రదేశం.వాస్కోడిగామా ఎంట్రీ!కేరళ రాష్ట్రంలో సగం తీర్రప్రాంత జిల్లాలైతే మిగిలిన సగం కొండ్రప్రాంత జిల్లాలు. రైలు ప్రయాణంలో తమిళనాడు నుంచి కేరళకు వెళ్లేటప్పుడు పాలక్కాడ్ నుంచే మార్పు కనిపిస్తుంది. మనదేశంలో వలస పాలనలో మగ్గి΄ోవడానికి దారులు పడింది కూడా ఈ రాష్ట్రం నుంచే. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మనదేశంలోకి ప్రవేశించింది కోళికోద్ పట్టణానికి సమీపంలోని కప్పడ్ అనే చిన్న తీరగ్రామంలో. కప్పడ్ బీచ్‌లో వాస్కోడిగామా జ్ఞాపకచిహ్నాలున్నాయి. చర్చ్‌లు యూరోపియన్ నిర్మాణశైలిలో అందంగా ఉంటాయి. నది తీరాన నిర్మించడంలో గొప్ప అభిరుచి వ్యక్తమవుతుంటుంది. ఎర్నాకుళంలో సెయింట్ మేరీస్ బాసిలికా చర్చ్, మలయత్తూర్ చర్చ్, శాంతాక్రజ్ కేథడ్రల్, జార్జ్ ఫ్రాన్సిస్ చర్చ్, సముద్రతీరాన నిర్మించిన వల్లర΄ాదమ్ చర్చ్‌లు ప్రశాంత వాతావరణంలో మౌనముద్ర దాల్చి ఉంటాయి. ముఖ్యమైన మసీదులు ముప్పైకి పైగా ఉంటాయి.ఆరోగ్యదేవుడు ధన్వంతరిఆయుర్వేదంలో వైద్యానికి మూల పురుషుడు ధన్వంతరి. ధన్వంతరికి ‘ముక్కిడి’ పేరుతో 35 ఔషధాల మిశ్రమాన్ని నివేదిస్తారు. త్రిశూర్ జిల్లా, నెల్లువాయ్ గ్రామంలో ఉన్న ఆలయం పురాతనమైనది. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతభాండాన్ని ధన్వంతరి పట్టుకుని వస్తాడు. ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రం, ఒకచేతిలో అమృతభాండం, మరో చేతిలో జలూకం(జలగ, ఆయుర్వేద వైద్యంలో జలగను ఉపయోగిస్తారు)తో ఉద్భవించాడు ధన్వంతరి. ఆ మూర్తినే ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు. మున్నువరువట్టం, గురువాయూర్లలో కూడా ధన్వంతరి ఆలయం ఉంది. శబరిమలకు వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.టీ తోటల మునార్మున్నార్ అంటే మూడు నదుల కలయిక. ముథిరాప్పుజ, నల్లతన్ని, కుండలి నదుల మధ్య ఉన్న హిల్‌స్టేషన్ ఇది. టీ తోటలు విస్తారంగా ఉంటాయి. ఈ తోటల మధ్య జలపాతాలు తెల్లగా పాలధారలను తలపిస్తుంటాయి. వర్షాకాలంలో దట్టంగా అలముమున్న నల్లటి మేఘాలను చీల్చుకుంటూ భూమ్మీద పాలను కుమ్మరిస్తున్నట్లు ఉంటుంది అట్టుకడ జలపాతం. ఈ టూర్లో ఎరవి కులమ్ నేషనల్ పార్క్‌ను, నీలగిరులు అనే పేరు రావడానికి కారణమైన నీలకురింజి మొక్కలను చూడాలి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రదేశాలను ఒకసారి చూసిన వాళ్లు కూడా కురింజి పూలు పూసినప్పుడు మళ్లీ చూడాలని ఆశపడతారు. బొటానికల్‌గా ఇవి 50 రకాల జాతులున్నాయి. కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి, షేడ్లు మాత్రం ఏ చిత్రకారుడూ మిక్స్ చేయలేనంత లలితంగా ఉంటాయి. నీలకురింజి పూలు పన్నెండేళ్లకోసారి పూస్తాయి. 2018లో పూశాయి, మళ్లీ పూసేది 2030లోనే. కోవిడ్ సమయంలో కూర్గ్ కొండల్లో కొన్ని చోట్ల విరిశాయి. కానీ సీజన్లో పూసినట్లు కొండ మొత్తం విస్తరించలేదు. ఇక్కడ జంతు సంచారం కూడా ఎక్కువ. నీలగిరి థార్ ఇక్కడ మాత్రమే కనిపించే జింక జాతి.కోటలు... తోటలు!కేరళ గ్రామాల్లో మన దగ్గర ఉన్నట్లు ఇళ్లన్నీ ఒక చోట, పొలాలు ఒకచోట ఉండవు. రెండు – మూడు ఎకరాల స్థలంలో కొబ్బరి చెట్లు, మధ్యలో ఇల్లు ఉంటుంది. తోట పక్కన మరొక తోట... ఆ తోటలో ఒక ఇల్లు... చాలా ఇళ్లకు పై కప్పు ఎర్ర పెంకులే ఉన్నాయి. రెండస్తుల ఇల్లు కూడా పై కప్పు వాలుగా, ఎర్ర పెంకులతో ఉంటుంది. రాజుల ప్యాలెస్‌లు కూడా భారీ నిర్మాణాలేమీ కాదు. రాజస్థాన్ కోటలు, ప్యాలెస్‌లను చూసిన కళ్లతో ఇక్కడి ప్యాలెస్‌లను చూస్తే కళ్లు విప్పార్చలేం. కానీ ప్రకృతి సహజమైన, శాంతియుతమైన జీవనశైలికి నిదర్శనంగా కనిపిస్తాయి. పాలక్కాడ్, తలస్సెరి కోటలు పర్యాటకులను అలరిస్తుంటాయి. చిన్న చిన్న ప్యాలెస్‌లను రిసార్టులుగా మార్చేశారు. భరత్‌పుర నది ఒడ్డున ఉన్న ప్యాలెస్‌ను ‘ది రివర్ రిట్రీట్’ పేరుతో హెరిటేజ్ ఆయుర్వేదిక్ రిసార్టుగా మార్చారు. అందులో భోజనం చేయడం జిహ్వకు వైద్యం.మీన్ ముట్టి జలపాతంవయనాడు... కేరళ రాష్ట్ర్రంలో అత్యున్నత స్థాయి ప్రకృతి సౌందర్యాన్ని ఇముడ్చుకున్న ప్రదేశం. ఆ రాష్ట్రానికి శిఖరాగ్రం కూడ ఇదే. మీన్ముట్టి వాటర్ ఫాల్స్‌కి రెండు కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో ట్రెకింగ్ చేయాలి. ఈ కొండ మీద మీన్ముట్టి వాటర్‌ఫాల్స్ దగ్గర నుంచి చూస్తే ఒక వైపు తమిళనాడు నీలగిరులు, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్ కొండలు దోబూచులాడుతుంటాయి. వరదలు ముంచెత్తినప్పటికీ పర్యాటకం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటోంది. ట్రీ హౌస్‌లో బస చేయాలనే సరదా తీరాలంటే ముందుగానే ΄్లాన్ చేసుకోవాలి. ఇక్కడ పర్యటిస్తే కేరళ వాళ్లు తమ రాష్ట్రాన్ని ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.గిన్నిస్ బుక్‌లో జటాయుపురాజటాయు నేచర్ పార్క్... కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణం, జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో రావణాసురుడితో జటాయువు పోరాడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. నేచర్ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ మ్యూజియమ్ ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. వెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు.త్రివేండ్రం పద్మనాభుడుఅనంత పద్మనాభ స్వామి ఆలయం అప్పుడప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటుంది. తలుపులు తెరుచుకోని ఆరోగది మీదనే అందరి దృష్టి. అంతకంటే గొప్ప ఆసక్తి ఇక్కడి పద్మనాభుడి రూపం. ఈ ఊరికి తిరువనంతపురం అనే పేరు రావడానికి కారణం ఈ ఆలయమే. కేరళ రాజధాని నగరం ఇది. బంగారు గోపురం ఉన్న ఈ ఆలయం టావెన్కోర్ రాజవంశం సంపన్నతకు ప్రతీక.అలెప్పీ హౌస్బోట్హౌస్బోట్లో ప్రయాణం చేయకపోతే కేరళ టూర్ వృథా అనే చెప్పాలి. ఇప్పుడు హౌస్బోట్లు మరింత పెద్దవిగా క్రూయిజ్‌లుగా మారాయి. టూర్ ప్యాకేజ్‌లో డే క్రూయిజ్ ప్యాకేజ్ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ప్రయాణంలో కేరళ సంప్రదాయ భోజనంలో రకరకాలను ఆస్వాదించవచ్చు. భోజనాన్ని అరిటాకులో వడ్డించడం మాత్రమే కాదు అరటికాయ చిప్స్, చేపను అరిటాకులో చుట్టి వేయించిన ఫిష్‌ఫ్రై ఇక్కడ ప్రత్యేకం. చికెన్ కర్రీలో కొబ్బరి ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి నూనె వంటల మీద అపోహ ఉంటుంది. కానీ ఈ వంటలు చాలా రుచిగా ఉంటాయి.షాపింగ్జరీ అంచు హాఫ్‌వైట్ చీర లేదా లంగా–ఓణీ తెచ్చుకోవడం మరువద్దు. ఉడెన్ కార్వింగ్ బాక్సులు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అందంగా ఉంటాయి. కొబ్బరి, అరటి నారతో చేసిన టేబుల్ మ్యాట్స్, కోషెలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వాల్ హ్యాంగింగ్స్ కొనుక్కోవచ్చు. ఇవి తినాలికోకోనట్ హల్వా, అరటికాయ చిప్స్, అరటికాయ బజ్జీ ప్రసిద్ధి. కొబ్బరి బోండాం తప్పకుండా తాగాలి. వేడుకలివిఫిబ్రవరి 14 నిషగంధి డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు పరియాణమ్ పేట్ పూరమ్, పాలక్కాడ్, భగవతి టెంపుల్, త్రిశూర్ ఆలయంలో ఉత్రాళిక్కవు పూరమ్ వేడుకలు జరుగుతాయి. ప్యాకేజ్‌లిలా...సౌత్ కేరళ 4 రాత్రులు 5 రోజులకు 55 వేలు. 5 రాత్రులు 6 రోజులకు దాదాపుగా అరవై వేలు. ఎంటైర్ కేరళకు ఆఫర్ నడుస్తోంది. పది రాత్రులు 11 రోజులకు 55 వేలు. ఈ ఆఫర్ మార్చి 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో కొదుండుళూర్లోని చేరమాన్ జుమా మసీద్, చీయప్పార జలపాతం, వాలర జలపాతం, ఇడుక్కి దేవికులమ్ హిల్స్, కొచ్చిలోని బోల్గట్టీ ఐలాండ్, హౌస్‌బోట్, విలేజ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ మొదలైనవి కవర్ అవుతాయి. సెంట్రల్ కేరళ ప్యాకేజ్ కి20 వేలు. ఇందులో అళప్పుఱ, పెరియార్ టైగర్ రిజర్వ్, తెక్కడి, మునార్, ఫోర్ట్ కొచ్చి మొదలైనవి ఉంటాయి. --వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం చూతము రారండి) -
నిజాలు బయటకు రావాలి.. వారిని కఠినంగా శిక్షించాలి: సమంత
ర్యాగింగ్ భూతానికి ఓ కేరళ బాలుడు బలైన సంగతి తెలిసిందే. కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన మిహిర్(15)(Mihir) అనే బాలుడు..తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న ఈ ఘటన చోటు చేసుకోకగా.. తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవల సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఈ అమానవీయ ఘటనపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత(Samantha) కూడా ఈ ఘటనపై స్పందిచింది. మిహిర్ ఆత్మహత్య గురించి తెలిసి షాకయ్యానని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈమేరకు ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది.‘మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ కొంతమంది స్వార్థం, ద్వేషం కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. వేధింపులు, ర్యాగింగ్ వంటికి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. వీటి వల్ల మనిషి శారీరకంగా, మానసికంగా కుంగిపోతాడు. మన దగ్గర ఎన్నో కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు. లోలోనే కుమిలి పోతున్నారు. మనం ఎక్కడో విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నా.నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎదుటి వారినుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండి’అని సమంత కోరింది. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి.. తన కుమారుడితో తోటి విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారని మిహిర్ తల్లి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మిహిర్‌ను తోటి విద్యార్థులు కొట్టారని, దుర్భాషలాడారని, అతడి చివరి రోజున ఊహించలేని అవమానాన్ని ఎదుర్కొన్నాడని తెలిపారు. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి టాయిలెట్ సీటును నాకించారని, టాయిలెట్‌ను ఫ్లష్ చేసి తలని అందులో పెట్టారని, అవన్నీ భరించలేకనే తన క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.మిహిర్ మరణం తర్వాత కూడా వేధింపులు ఆగలేదని చెబుతూ కొన్ని స్క్రీన్ షాట్లను పంచుకున్నారు.మ కుమారుడి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి, డీజీపీకి బాధిత తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో త్రిప్పునితుర హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మిహిర్ తల్లి ఆరోపణలను సదరు స్కూల్ యాజమాన్యం ఖండించింది. -
రంజీల్లో కేరళ బౌలర్ ఆల్‌టైమ్ రికార్డు.. అత్యంత అరుదైన ఘనత
కేరళ స్పిన్నర్ జలజ్ సక్సేనా(Jalaj Saxena) సంచలన రికార్డు సాధించాడు. రంజీ చరిత్ర(Ranji Trophy)లో ఇంత వరకు ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించాడు. అత్యధికంగా పందొమ్మిది వేర్వేరు జట్లపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్‌గా ఆల్‌టైమ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన జలజ్ సక్సేనా.. దేశవాళీ క్రికెట్లో కేరళ(Keral) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 23న రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో రెండో దశ పోటీలు ఆరంభం కాగా... కేరళ తరఫున మరోసారి బరిలోకి దిగాడు. సెకండ్ లెగ్‌లో కేరళ తొలుత మధ్యప్రదేశ్‌తో తలపడగా.. జలజ్ ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు వికెట్లు మాత్రమే తీశాడు.సల్మాన్ నిజార్ భారీ శతకంఇక ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగియగా.. తాజాగా కేరళ బిహార్‌తో తలపడుతోంది. ఎలైట్ గ్రూప్- ‘సి’లో భాగంగా తిరువనంతపురంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 351 పరుగులకు ఆలౌట్ అయింది. సల్మాన్ నిజార్ భారీ శతకం(150) బాదడంతో కేరళ ఈ మేరకు స్కోరు చేయగలిగింది.జలజ్‌కు ఐదు వికెట్లుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బిహార్ జట్టుకు జలజ్ సక్సేనా చుక్కలు చూపించాడు. 7.1 ఓవర్ల బౌలింగ్‌లో 19 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ఓపెనర్ షర్మాన్ నిగ్రోథ్(6)తో పాటు.. సకీబుల్ గనీ(0), బిపిన్ సౌరభ్(4), కెప్టెన్ వీర్ ప్రతాప్ సింగ్(0), హర్ష్ సింగ్(5) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.జలజ్ సక్సేనాకు తోడుగా ఎండీ నిధీశ్ , వైశాఖ్ చంద్రన్, ఆదిత్య సర్వాటే రాణించారు. నిధీశ్ రెండు, వైశాఖ్, ఆదిత్య ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో 64 పరుగులకే బిహార్ కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేరళకు ఏకంగా 287 పరుగుల ఆధిక్యం లభించింది.కాగా జలజ్ సక్సేనా రంజీల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ప్రత్యర్థి జట్లలో బిహార్ పందొమ్మిదవది కావడం విశేషం. ఇంతకుముందు పంకజ్ సింగ్ రంజీల్లో పద్దెనిమిది జట్లపై ఐదు వికెట్ల హాల్ సాధించగా.. తాజాగా జలజ్ అతడిని అధిగమించాడు.400కు పైగా వికెట్లురంజీ ట్రోఫీలో జలజ్ సక్సేనాకు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు అతడు 416కు పైగా వికెట్లు తీశాడు. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్-10లో నిలిచాడు. ఇక ఇటీవలే అతడు రంజీల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు.ఈ క్రమంలో రంజీల్లో ఈ మేర పరుగులు రాబట్టడంతో పాటు నాలుగు వందలకు పైగా వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. ఇక 2005లో స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ తరఫున తొలిసారి రంజీ బరిలో దిగిన జలజ్.. 2016-17 సీజన్ నుంచి కేరళ జట్టుకు ఆడుతున్నాడు.రంజీల్లో అత్యధిక జట్లపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆటగాళ్లు వీరే👉జలజ్ సక్సేనా- 19👉పంకజ్ సింగ్- 18👉సునిల్ జోషి- 16👉ఆర్. వినయ్ కుమార్- 16👉షాబాజ్ నదీం- 16👉ఆదిత్య సర్వాటే-16. చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
బైక్ యువతి చేష్టలకు బలైపోయిన బస్సులు
-
‘మ్యాన్ ఈటర్’ హతం..ఇతర పులుల దాడిలోనే..!
తిరువనంతపురం:కేరళలో మనుషులపై దాడి చేసి చంపుతున్న మ్యాన్ ఈటర్ ఆడపులి మృతిచెందింది. పులి కళేబరాన్ని సోమవారం ఉదయం వయనాడ్‌లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. కళేబరం తాము వెతుకున్న మ్యాన్ ఈటర్దేనని ధృవీకరించారు. 6నుంచి7 ఏళ్ల వయసు ఉండి ఒంటిపై గాయాలున్న ఆడపులి కళేబరాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గత వారం పులి 45 ఏళ్ల గిరిజన మహిళపై దాడి చేసి చంపిందని కేరళ అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ తెలిపారు. దీంతో దానిని కాల్చి చంపేందుకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. మ్యాన్ ఈటర్ పులిని పట్టుకునేందుకు తాము సాగించిన వేట దాని కళేబరం దొరకడంతో ముగిసినట్లు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ తెలిపారు. పులి ఒంటిపై ఉన్న గాయాలు కొన్ని పాతవి కాగా మరికొన్ని తాజాగా అయినవని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. ఇతర పులుల దాడిలోనే అది మరణించి ఉండొచ్చని చెప్పారు. తమపై వన్యమృగాల దాడులు ఎక్కువయ్యాయని,వాటిని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని వయనాడ్‌లో గిరిజనులు ఇటీవల ఆందోళనలు నిర్వహించడం గమనార్హం.ఇదీ చదవండి: జగిత్యాలలో పులి సంచారం.. భయాందోళనల్లో ప్రజలు -
కేరళలో చిల్ అవుతోన్న దేవర భామ (ఫోటోలు)
-
ఫ్యామిలీ వేకేషన్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ యాంకర్ రవి (ఫోటోలు)
-
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ : డెస్టినేషన్ టూరిజం
సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగానే కాకుండా విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించడానికి వినూత్నంగా హెలీ–టూరిజం, సీ టూరిజం అభివృద్ధి చేశామని కేరళ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సజీవ్ కే.ఆర్ తెలిపారు. కేరళ ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని తాజ్ డెక్కన్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సజీవ్ కేరళ పర్యాటక విశేషాలను వెల్లడిస్తూ.. ఇప్పటికే మంచి ఆదరణ ఉన్న పర్యాటక ప్రాంతాలతో పాటు బేకల్, వయనాడ్, కోజికోడ్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలను పరిచయం చేయడం పై దృష్టి సారించామని అన్నారు. నూతన ప్రాజెక్టులతో పాటు బీచ్, హిల్ స్టేషన్స్, హౌస్బోట్లు, బ్యాక్‌వాటర్ విభాగం వంటి అంశాలు సందర్శకులకు హాట్స్పాట్లుగా మారాయన్నారు. కేరళలో పర్యాటకుల సంఖ్య 2022లో పెరిగిందని, 2023 నుంచి ఈ ఆదరణ రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. గతేడాది మొదటి ఆరు నెలల్లో 1,08,57,181 దేశీయ పర్యాటకులు రావడం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేరళ కళాకారులు మోహినియాట్టం, కథక్, కత్తిసాము వంటి సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ వేదికగా బెంగళూరు, అహ్మదాబాద్, చండీగఢ్, ఢిల్లీ, జైపూర్, చెన్నై, కోల్‌కతా తదితర ప్రాంతాలకు చెందిన పర్యాటక రంగ సంస్థలు, ప్రముఖులు బీ టు బీ సమావేశాల్లో పాల్గొన్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 21 వరకూ కనకక్కున్ను ప్యాలెస్‌లో నిషాగంధి నృత్యోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో దేశ వ్యాప్తంగా ప్రఖ్యాత నృత్యకారులు మోహినియాట్టం, కథక్, కూచిపూడి, భరతనాట్యం, మణిపురి వంటి శాస్త్రీయ నృత్య రూపాలను ప్రదర్శిస్తారు. జనవరి 23–26 వరకూ కోజికోడ్ బీచ్‌లో ప్రసిద్ధ కేరళ సాహిత్య ఉత్సవం నిర్వహించనున్నారు. ఇందులో 12కి పైగా దేశాల నుంచి 400 మంది ప్రముఖులు పాల్గోనున్నారు. అంతేకాకుండా సుమారుగా 200 సదస్సులు జరగనున్నాయి. వీటిలో విలాసం, విశ్రాంతిని, కేరళ డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి అంశాలు ప్రధానంగా నిలువనున్నాయి. -
చిక్కుల్లో బాబా రామ్‌దేవ్
తిరువనంతపురం: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యింది. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ బాబా రామ్‌దేవ్‌తో పాటు ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీలపై కేరళ కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.మోసపూరిత వ్యాపార ప్రకటనపై నమోదైన కేసులపై పాలక్కాడ్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ II కోర్టులో విచారణ జరిగింది. జనవరి 16న జరిగిన విచారణలో.. రామ్ దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీల ప్రతినిధులు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టుకు రాలేదు. అందుకే నిందితులందరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నామని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954ను ఉల్లంఘించినట్లు పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీలు ప్రచారం చేసిన ప్రకటనలపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతుంది. గత రెండేళ్లుగా పతంజలి, దాని వ్యవస్థాపకులు అనేక చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. పతంజలి ఆయుర్వేద్‌కు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఫిర్యాదు చేసింది. నాటి నుంచి రామ్ దేవ్ బాబా సంస్థలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. పతంజలి ఇస్తున్న యాడ్స్‌పై సుప్రీం కోర్టు సైతం నిర్వాహకులకు మొట్టికాయలు వేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనలను తాత్కాలికంగా నిషేధించాలని సూచించింది. కోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, రామ్ దేవ్ బాబా సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం వ్యాధులను నయం చేయడం గురించి, అల్లోపతితో సహా, ఆధునిక వైద్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు!
తిరువనంతపురం : ప్రియుడిని చంపిన కేసులో కేరళ కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. షరోన్ రాజ్ ప్రేయసి గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది. తీర్పును వెలువరించే సమయంలో ‘ఈ కేసు అరుదైన కేసుల్లోనే అరుదైన కేసు. కాబట్టి ఈ కేసులో వయస్సును పరిగణలోకి తీసుకోకుండా నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తున్నాం’ అంటూ కేరళ సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. కేరళ పరసాలలో మూడేళ్ల కిందట(2022లో) సంచలనం సృష్టించిన షరోన్ రాజ్ హత్య కేసులో తిరువనంతపురం జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శుక్రవారం(జనవరి 17న) షరోన్ ప్రేయసి గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్ నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటించారు. సోమవారం (జనవరి 20న) ప్రేయసి గ్రీష్మకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించారు. షరోన్‌ను హత్య చేసేలా గ్రీష్మకు సహకరించడంతో పాటు కేసులో కీలక ఆధారాల్ని ధ్వంసం చేసినందుకు ఆమె మేనమామ నిర్మలా కుమారన్ నెయ్యట్టింకరకు మూడేళ్ల జైలు శిక్షను విధించారు. నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు షరోన్ రాజ్ హత్య కేసును అరుదైన కేసుల్లో అరుదైనదని,అందువల్ల నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్షే సరైందని భావిస్తున్నట్లు తెలిపింది.కాబట్టే వయస్సును పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది.సెషన్స్ కోర్టు తుదితీర్పు వెలువరించక ముందు గ్రీష్మ తరుఫులు న్యాయవాదులు కోర్టుకు తమ వాదనల్ని వినిపించారు. తన వాదనలలో గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు. చిన్న వయస్సు. తాను మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు డిఫెన్స్ లాయర్ వాదనల్ని తోసిపుచ్చారు. గ్రీష్మ తీరు దారుణంతీర్పు వెలువరించే సమయంలో అదనపు సెషన్స్ కోర్టు గ్రీష్మ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక సాన్నిహిత్యాన్ని సాకుగా చూపి షరోన్‌ను గ్రీష్మను ఆహ్వానించింది. ఆ తర్వాత విషం కలిపిన కషాయాన్ని షరోన్ రాజ్‌కు తాపించి, ఆపై దారుణానికి ఒడిగట్టిన గ్రీష్మా చర్యను విస్మరించలేమని పేర్కొంది.అంతేకాదు, షరోన్ కలిసేందుకు వచ్చిన గ్రీష్మా వెంటన విషం కలిపిన కషాయాన్ని తెచ్చుకుంది. ఆ కషాయంపై షరోన్ అనుమానం వ్యక్తం చేస్తూ వీడియో రికార్డ్ చేయడం, వద్దని గ్రీష్మ వద్దని వారించడం వంటి ఆధారాలు ఉన్నాయి. గ్రీష్మ ఇచ్చిన కషాయం తాగిన షరోన్ 11 రోజుల పాటు చుక్క నీరు కూడా తాగకుండా ప్రాణాలతో పోరాడాడు ’ అని కోర్టును ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. గ్రీష్మపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుభారతీయ శిక్షాస్మృతి (IPC) కింద గ్రీష్మపై ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 364 (హత్య చేయాలనే ఉద్దేశ్యంతో అపహరణ), 328 (ప్రాణానికి హాని కలిగించే ఉద్దేశ్యంతో విషం ప్రయోగించడం), 203 (తప్పుడు సమాచారం అందించడం ద్వారా న్యాయాన్ని అడ్డుకోవడం) కింద కేసులు నమోదయ్యాయి. అసలేం జరిగిందంటే..పరసాలా ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్(23), గ్రీష్మలు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహాం నిశ్చయమైంది. ఆ తర్వాత షరోన్-గ్రీష్మల మధ్య దూరం పెరిగింది. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. దీంతో తన స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో గ్రీష్మ ఇంటికి వెళ్లాడు షరోన్.స్నేహితుడు బయటే ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. కాసేపటికే పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. దీంతో కంగారుపడ్డ స్నేహితుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ దారిలోనూ ఇద్దరూ చాట్ చేసుకున్నారు. ‘‘కషాయంలో ఏం కలిపావు?’’ అని షరోన్ గ్రీష్మను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా వికటించిందేమో అని సమాధానం ఇచ్చిందామె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది.నీలిరంగులో వాంతులు చేసుకున్న షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు స్నేహితుడు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. రెండు రోజుల తర్వాత షరోన్ పరిస్థితి విషమించింది. దీంతో తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో పురుగుల మందు కలిసిందని నిర్ధారించుకున్నారు. అవయవాలన్నీ పాడైపోయి అక్టోబర్ 25వ తేదీన గుండెపోటుతో షరోన్ ప్రాణం విడిచాడు.ఎస్కేప్.. అరెస్ట్..తమ బిడ్డ చావుకు గ్రీష్మ కుటుంబం కారణమంటూ షరోన్ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆ కుటుంబం కోసం గాలించారు. చివరకు.. అదే ఏడాది నవంబర్ 22న గ్రీష్మ కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. అయితే పీఎస్‌లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం నాటకీయ పరిణామాలకు దారి తీసింది.వాదనలు ఇలా.. ఇది అత్యంత అరుదైన కేసు అని ప్రాసిక్యూషన్ వాదించారు. ఆమె కేవలం ఓ యువకుడ్ని మాత్రమే చంపలేదు. ప్రేమ అనే భావోద్వేగాన్ని ప్రదర్శించి ఓ ప్రాణం బలి తీసుకుంది. అనుకున్న ప్రకారమే.. ఆమె ప్రేమను అడ్డుపెట్టి మరీ అతన్ని తన ఇంటికి రప్పించి ఘోరానికి తెగబడింది. అతని చంపడానికి ఆమె అన్నివిధాల ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పేరిట 11 రోజులపాటు అతను నరకం అనుభవించాడు. ఇదేదో హఠాత్తుగా జరిగింది కాదు. షరోన్ కూడా ఎన్నో కలలు కన్నాడు. కానీ, గ్రీష్మ వాటిని చెరిపేసింది. కాబట్టి, ఆమెపై కనికరం చూపించాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉరే సరి అని వాదించారు.మరోవైపు.. గ్రీష్మ తరఫున వాదనలు వినిపించిన లాయర్ అజిత్ కుమార్.. కేసులో వాస్తవ ఆధారాలు(Circumstantial Evidence) లేనప్పుడు మరణశిక్ష విధించడం కుదరని వాదించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గ్రీష్మ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వాస్తవానికి ఆమె షరోన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ యువకుడు ఆమెను వదల్లేదు. వ్యక్తిగత చిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బెడ్రూం వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. మానసికంగా ఆమెను ఎంతో వేధించాడు. అలాంటప్పుడు ఏ మహిళ అయినా ఎందుకు ఊరుకుంటుంది. ఆమె మెరిట్ విద్యార్థిని. శిక్ష విషయంలో కనికరం చూపించాల్సిందే’’ అని వాదించారు.దాదాపు రెండేళ్లపాటు ఈ కేసు విచారణ జరిగింది. చివరకు.. జనవరి 17వ తేదీన గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్‌ను దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో గ్రీష్మ తల్లి సింధును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. మూఢనమ్మక కోణం!మూఢనమ్మకంతో గ్రీష్మ కుటుంబం తమ బిడ్డ ప్రాణం తీసిందని షరోన్ కుటుంబం ఆరోపించింది. ఆమెకు ఎంగ్మేజ్మెంట్ అయ్యాక మనసు విరిగిన షరోన్.. తన పనిలో తాను ఉన్నాడని, గ్రీష్మానే ఫోన్ చేసి అతన్ని పరసాలాకు రప్పించిందన్నారు. ‘‘గ్రీష్మ కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. ఆపై పెళ్లిని అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉంది. ఆ దోషం పొగొట్టేందుకు షరోన్‌ను బలి పశువును చేశారు. బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని వెంట ఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. పక్కా ప్లాన్‌తో ఆమెతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై పురుగుల మందు తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ వచ్చింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు. -
కేరళ కాలింగ్
కేరళ కాలింగ్ అంటున్నారు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ ఇద్దరూ జంటగా హిందీలో ‘పరమ్ సుందరి’ అనే లవ్‌స్టోరీ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తుషార్ జలోటా దర్శకత్వంలో దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. కాగా నెల రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్ కోసం సిద్ధార్థ్, జాన్వీ అండ్ టీమ్ కేరళ వెళ్లారని బాలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్లో మేజర్ టాకీ పార్ట్, యాక్షన్ సీక్వెన్స్, ఓ లవ్ సాంగ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.ఇక ఈ సినిమాలో నార్త్ అబ్బాయి పరమ్ పాత్రలో సిద్ధార్థ్, సౌత్ అమ్మాయి సుందరి పాత్రలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కనిపిస్తారు. రెండు విభిన్న సాంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రకథ అని బాలీవుడ్ టాక్. ‘పరమ్ సుందరి’ సినిమాను ఈ ఏడాది జూలై 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. -
మహా కుంభమేళా.. ‘కొబ్బరి’ ఆనంద హేల
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు తరలివస్తున్న మహా కుంభమేళా (Maha Kubh Mela) గోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు (Coconut Market) పెద్ద వరమే అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) కేంద్రంగా జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు వస్తున్న భక్తులు నదీ మాతకు అర్పించేందుకు కురిడీ కొబ్బరిని విరివిగా వినియోగిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరిగి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తయ్యే కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంది. మహా కుంభమేళా కారణంగా ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న ఈ కురిడీ రకం ధర అనూహ్యంగా పెరిగింది. కొబ్బరి మార్కెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట (Ambajipeta) కొబ్బరి మార్కెట్లో కురిడీ కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంది. పాతకాయలో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.20 వేలు వరకు పలుకుతోంది. దీనిలో గటగట రకం రూ.17,500 వరకూ ఉండగా, కొత్త కాయలో గండేరా రకం రూ.19 వేలు, గటగటా రకం రూ.16 వేలుగా ఉంది. కురిడీ కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండేరా రకం వెయ్యి కాయలకు రూ.20 వేల ధర పలకడం ఇదే తొలిసారి. 2016లో వచ్చిన రూ.18 వేలు మాత్రమే ఇప్పటి వరకూ గరిష్ట ధరగా ఉంది. ఈ రికార్డుకు ఇప్పుడు బ్రేక్ పడింది.ఉత్తరాది రాష్ట్రాల్లో నదీమ తల్లికి భక్తులు నేరుగా కొబ్బరి కాయలు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాకుంభమేళా కారణంగా కురిడీ కొబ్బరికి డిమాండ్ పెరిగింది. దీనికితోడు కురిడీ కొబ్బరి అధికంగా తయారయ్యే తమిళనాడు, కేరళలో సైతం దీని లభ్యత తగ్గింది. ఈ రెండు కారణాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కురిడీ ఎగుమతి పెరిగింది. రోజుకు రూ.8 లక్షలు విలువ చేసే కురిడీ కొబ్బరి 20కి పైగా లారీల్లో ఎగుమతి అవుతోందని అంచనా. సాధారణ రోజుల్లో జరిగే ఎగుమతులకు కుంభమేళా ఎగుమతులు కూడా తోడవడం కురిడీ ధర పెరుగుదలకు కారణమైందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి.ఎనిమిదేళ్ల తరువాత మంచి ధర2016లో గండేరా రకానికి రూ.18 వేల ధర వచ్చింది. ఎనిమిదేళ్ల తరువాత కురిడీకి రూ.20 వేలు వచ్చింది. తమిళనాడు నుంచి ఉత్తరాదికి కురిడీ ఎగుమతులు తగ్గడం, కుంభమేళా కారణంగా డిమాండ్ వచ్చింది. గతం కన్నా మన ప్రాంతం నుంచి కూడా ఎగుమతులు తగ్గాయి. కానీ ధర పెరగడం వల్ల కురిడీకి మార్కెట్లో ఊహించని ధర వచ్చింది.– అప్పన శ్యామ్, కురిడీ వ్యాపారి, అంబాజీపేట -
గ్రీష్మపై కనికరమా?.. కఠినశిక్షా?
‘‘సర్.. నా వయసు 24 ఏళ్లు. నేనింకా చిన్నదాన్నే. నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. జీవితంతో ఎంతో చూడాల్సి ఉంది. ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. నేను బాగా చదువుకున్నా. కావాలంటే ఇవి చూడండి..’’ అంటూ అమాయకంగా జడ్జి చేతికి తన సర్టిఫికెట్లను అందించింది గ్రీష్మ. తన ఛాంబర్ సీట్లో కూర్చున్న న్యాయమూర్తి వాటిని చూస్తూ.. ఒక్కసారిగా నిట్టూర్పు విడిచారు.కేరళ పరసాలలో మూడేళ్ల కిందట(2022లో) సంచలనం సృష్టించిన షరోన్ రాజ్ హత్య కేసులో.. జనవరి 20వ తేదీన తీర్పు వెలువడనుంది. ఈ కేసులో శుక్రవారం(జనవరి 17న) షరోన్ ప్రేయసి గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్ నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటించింది. అయితే.. శిక్షలు ఖరారు కావాల్సి ఉంది. అయితే.. వ్యక్తిగతంగా ఆమె విజ్ఞప్తి చేయడంతో.. శనివారం ఉదయం తన ఛాంబర్‌కు రప్పించుకుని న్యాయమూర్తి ఏఎం బషీర్ మాట్లాడారు. ఈ క్రమంలో.. తన శిక్ష విషయంలో కనికరం ప్రదర్శించాలని గ్రీష్మ ఆయన్ని వేడుకుంది.అసలేం జరిగిందంటే..పరసాలా ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్(23), గ్రీష్మలు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహాం నిశ్చయమైంది. ఆ తర్వాత షరోన్-గ్రీష్మల మధ్య దూరం పెరిగింది. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. దీంతో తన స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్.స్నేహితుడు బయటే ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. కాసేపటికే పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. దీంతో కంగారుపడ్డ స్నేహితుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ దారిలోనూ ఇద్దరూ చాట్ చేసుకున్నారు. ‘‘కషాయంలో ఏం కలిపావు?’’ అని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా వికటించిందేమో అని సమాధానం ఇచ్చిందామె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది. నీలిరంగులో వాంతులు చేసుకున్న షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు స్నేహితుడు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. రెండు రోజుల తర్వాత షరోన్ పరిస్థితి విషమించింది. దీంతో తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో పురుగుల మందు కలిసిందని నిర్ధారించుకున్నారు. అవయవాలన్నీ పాడైపోయి అక్టోబర్ 25వ తేదీన గుండెపోటుతో షరోన్ ప్రాణం విడిచాడు.ఎస్కేప్.. అరెస్ట్..తమ బిడ్డ చావుకు గ్రీష్మ కుటుంబం కారణమంటూ షరోన్ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆ కుటుంబం కోసం గాలించారు. చివరకు.. అదే ఏడాది నవంబర్ 22న గ్రీష్మ కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. అయితే పీఎస్‌లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం నాటకీయ పరిణామాలకు దారి తీసింది. వాదనలు ఇలా.. ఇది అత్యంత అరుదైన కేసు అని ప్రాసిక్యూషన్ వాదించారు. ఆమె కేవలం ఓ యువకుడ్ని మాత్రమే చంపలేదు. ప్రేమ అనే భావోద్వేగాన్ని ప్రదర్శించి ఓ ప్రాణం బలి తీసుకుంది. అనుకున్న ప్రకారమే.. ఆమె ప్రేమను అడ్డుపెట్టి మరీ అతన్ని తన ఇంటికి రప్పించి ఘోరానికి తెగబడింది. అతని చంపడానికి ఆమె అన్నివిధాల ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పేరిట 11 రోజులపాటు అతను నరకం అనుభవించాడు. ఇదేదో హఠాత్తుగా జరిగింది కాదు. షరోన్ కూడా ఎన్నో కలలు కన్నాడు. కానీ, గ్రీష్మ వాటిని చెరిపేసింది. కాబట్టి, ఆమెపై కనికరం చూపించాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉరే సరి అని వాదించారు.మరోవైపు.. గ్రీష్మ తరఫున వాదనలు వినిపించిన లాయర్ అజిత్ కుమార్.. కేసులో వాస్తవ ఆధారాలు(Circumstantial Evidence) లేనప్పుడు మరణశిక్ష విధించడం కుదరని వాదించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గ్రీష్మ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వాస్తవానికి ఆమె షరోన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ యువకుడు ఆమెను వదల్లేదు. వ్యక్తిగత చిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బెడ్రూం వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. మానసికంగా ఆమెను ఎంతో వేధించాడు. అలాంటప్పుడు ఏ మహిళ అయినా ఎందుకు ఊరుకుంటుంది. ఆమె మెరిట్ విద్యార్థిని. శిక్ష విషయంలో కనికరం చూపించాల్సిందే’’ అని వాదించారు.దాదాపు రెండేళ్లపాటు ఈ కేసు విచారణ జరిగింది. చివరకు.. జనవరి 17వ తేదీన గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్‌ను దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో గ్రీష్మ తల్లి సింధును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. జనవరి 20 సోమవారం శిక్షలు ఖరారు చేయనుంది. అయితే ఆమెకు కఠిన శిక్ష పడుతుందా? లేదంటే కోర్టు కనికరం ప్రదర్శిస్తుందా? చూడాలి. మూఢనమ్మక కోణం!మూఢనమ్మకంతో గ్రీష్మ కుటుంబం తమ బిడ్డ ప్రాణం తీసిందని షరోన్ కుటుంబం ఆరోపించింది. ఆమెకు ఎంగ్మేజ్మెంట్ అయ్యాక మనసు విరిగిన షరోన్.. తన పనిలో తాను ఉన్నాడని, గ్రీష్మానే ఫోన్ చేసి అతన్ని పరసాలాకు రప్పించిందన్నారు. ‘‘గ్రీష్మ కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. ఆపై పెళ్లిని అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉంది. ఆ దోషం పొగొట్టేందుకు షరోన్‌ను బలి పశువును చేశారు. బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారు. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని వెంట ఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. పక్కా ప్లాన్‌తో ఆమెతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై పురుగుల మందు తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ వచ్చింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు. -
కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌కు, లేదా ఒక వీడియోకు లేదా ఒక రీల్‌కు దక్కిన వ్యూస్, కామెంట్స్ ఆధారంగా దాని ప్రాధాన్యతను అంచనా వేస్తుంటాం సాధారణంగా. క్రియేట్ చేసినవాళ్లే ఆశ్చర్యపోయేలా మిలియన్ల వ్యూస్‌తో ప్రజాదరణ పొంది, రికార్డులను క్రియేట్ చేసే కొన్ని విశేషమైన వీడియోలను కూడా చూస్తుంటాం. ఇలా సరదాగా సృష్టించిన ఒక రీల్ రికార్డు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా చూసిన ఈ వైరల్ క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. రండి.. ఆ రికార్డ్ స్టంట్ రీల్ కథాకమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఒకటీ రెండూ ఏకంగా 55.4 కోట్ల (554 మిలియన్ల) మంది ఆ రీల్‌ను వీక్షించారంటే మరి ప్రపంచ రికార్డు కాక మరేమిటి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా? భారతదేశంలోని కేరళకు చెందిన ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ ఆటగాడు 21 ఏళ్ల ముహమ్మద్ రిజ్వాన్. ఈ స్టార్ ప్లేయర్ కంటెంట్ క్రియేటర్‌గా కూడా పాపులర్ అయ్యాడు. 2023 నవంబరులో ఈ రీల్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి ఇది వైరల్ అవుతూ రికార్డును కొట్టేసింది. మలప్పురంలోని కేరళంకుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్‌ను పోస్ట్ చేశాడు. ఈ రీల్లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తంతాడు. దీంతో ఆ బంతి జలపాతం వెనుక ఉన్న రాళ్ల నుండి ఎగిరి పడుతుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసి రిజ్వాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు, కోట్లాదిమంది నెటిజనులను కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి, రీల్ ప్రజాదరణ పొందింది, 92 లక్షలకు పైగా (9.2 మిలియన్లు) లైక్‌లు మరియు 42,000 కంటే ఎక్కు లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్స్టాగ్రామ్ రీల్‌తో అవార్డు కూడా పొందాడు. ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలువిశేషం ఏమిటంటేఅతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే మరి. జర్మనీ, ఫ్రాన్స్ స్పెయిన్‌ల ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ వ్యూస్ అంటూ నెటిజన్లను రిజ్వాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.రిజ్వాన్ స్పందన“నేను దీన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఇది స్నేహితులతో సరదాగా గడిపిన వీడియో. 10 నిమిషాల్లోనే, దీనికి 2లక్షలవీక్షణలు వచ్చాయి . నేను ఇంటికి చేరుకునే సమయానికి, అది మిలియన్‌కు చేరుకుంది.” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపురిజ్వాన్ అసాధారణ విజయాన్ని ఈ ఏడాది జనవరి 8న అధికారికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిజ్వన్ షేర్ చేశాడు. అదే జలపాతం వద్ద, ఒక చేతిలో వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, మరో చేతిలో ఫుట్‌బాల్‌ను పట్టుకుని, తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. (బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్) View this post on Instagram A post shared by muhammed riswan (@riswan_freestyle) కేవలం 21 సంవత్సరాల వయస్సులో, రిజ్వాన్ తన వైరల్ రీల్‌కు మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ నైపుణ్యాలకు కూడా ప్రపంచ సంచలన ఆటగాడు. ఆటలోని విన్యాసాలకు పరిమితం కాలేదు రిజ్వాన్ పర్వత శిఖరాలపై, కారు పైకప్పులపై మకా, నీటి అడుగున కూడా విన్యాసాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఫుట్‌బాల్‌తో పాటు, రిజ్వాన్ రోజువారీ వస్తువులతో కూడా సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
కేరళ సమాధి కేసులో అదిరిపోయే ట్విస్ట్!
కేరళలో తీవ్రచర్చనీయాంశంగా మారిన సమాధి కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. కేరళ హైకోర్టు ఆదేశం ప్రకారం.. భారీ బందోబస్తు నడుమ ఈ ఉదయం పోలీసులు సమాధిని తవ్వారు. అందులోంచి గోపన్ స్వామి మృతదేహం వెలికి తీసి శవపరీక్ష కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీకి పరీక్షల కోసం తరలించారు. అయితే ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు బయటపడలేదని తెలుస్తోంది.తిరువనంతపురం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో నెయ్యట్టింకర(Neyyattinkara) ఉంది. ఆ ప్రాంతంలో గోపన్ స్వామి(Gopan Swami) అనే వ్యక్తి ఉండేవాడు. వయసు మీద పడడంతో కూలీ పనులకు వెళ్లడం మానేసి ఇంటిపట్టునే ఉంటున్నారు. ఆయనను స్థానికులు ముద్దుగా మణియన్ అని పిలుస్తారు. ఆయనకు భార్యా, ఇద్దరు కొడుకులు. దైవ భక్తి ఎక్కువగా ఉన్న మణియన్ స్థానికంగా తనకు ఉన్న స్థలంలోనే ఓ చిన్న ఆలయం కట్టించుకుని.. అప్పుడప్పుడు అక్కడకు వెళ్తూ పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీ నుంచి మణియన్ కనిపించకుండా పోయాడు... మణియన్‌కి ఏమైంది? అని చుట్టుపక్కలవాళ్లు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. ఆయన ఆత్మార్పణంతో ధైవసన్నిధికి చేరుకున్నారంటూ చెప్పసాగారు. పైగా ధ్యానముద్రలోనే ఆయన కన్నుమూశారని, అలాగే సజీవ సమాధి అయ్యారని ప్రచారం చేశారు. ఆపై సమాధి వద్ద ఓ పోస్టర్‌ను ఉంచారు. అయితే కుటుంబ సభ్యుల ఈ కదలికలు ఇటు బంధువులకు, అటు స్థానికులకు అనుమానం తెప్పించింది. విషయంపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈలోపు విషయం కలెక్టర్ కార్యాలయం దాకా చేరడంతో.. సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.జనవరి 13వ తేదీన సబ్ కలెక్టర్ సమక్షంలో సమాధిని బద్ధలు కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కుటుంబ సభ్యులు సమాధికి అడ్డంగా పడుకుని తవ్వకాన్ని అడ్డుకున్నారు. ఈలోపు విషయం తెలిసిన హిందూ సంఘాలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వాళ్లు తమ ప్రతిఘటన ఆపలేదు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. ఆపై కేరళ హైకోర్టును ఆశ్రయించారు.అయితే.. సమాధిని కచ్చితంగా తవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి మృతిపై అనేక అనుమానాలు నెలకొన్నప్పుడు.. వాటి నివృత్తి జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆఖరికి.. అది కుటుంబ సభ్యులకైనా సరే!. ఇక్కడ సమాధిని తవ్వడం కూడా ఎంక్వైయిరీలో భాగమే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈలోపు మణియన్ కొడుకులు హైకోర్టులో స్టే పిటిషన్ వేశారు. ఒక మత మనోభావాలను దెబ్బ తీసేలా ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని, తాత్కాలికంగా తవ్వకాన్ని ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఇది మనోభావాలకు సంబంధించిన అంశం కాదని.. అధికారుల విధులకు భంగం కలిగించడమే అవుతుందని పేర్కొంటూ తవ్వకానికి క్లియరెన్స్ ఇచ్చింది హైకోర్టు.దీంతో.. ఈ ఉదయం భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆర్డీవో, ఇతర అధికారులు సమాధిని బద్ధలు కొట్టారు.ఆ టైంలో మీడియాతో సహా ఎవరినీ ఆ పక్కకు అనుమతించలేదు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం మాత్రమే అక్కడికి వెళ్లాయి. సమాధిలోపల బూడిదతో పాటు ఏవో పూజలు జరిపినట్లు ఆనవాళ్లు కనిపించాయని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. ఆయన మృతదేహాం పడుకున్న పొజిషన్లో ఉందని చెబుతుండడంతో ఈ కేసులో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నెయ్యట్టింకర సమాధి కేసు (Neyyattinkara Samadhi Case)లో మణియన్ సహాజంగానే మరణించాడా? లేదంటే ఏదైనా మతలబు జరిగిందా? అనేది ఫోరెన్సిక్ టెస్ట్ ద్వారా తేలుతుందని అధికారులు అంటున్నారు. ఇక.. శవపరీక్షలు పూర్తయ్యాక మణియన్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సబ్ కలెక్టర్ ప్రకటించారు. ‘‘ఆయన గత రెండేళ్లుగా ఇంటి నుంచి బయటకు రావడం తగ్గించేశారు. పైగా ఆయనకు చూపు సరిగ్గా లేదు. అలాంటి వ్యక్తి తనంతటా తానుగా అక్కడికి ఎలా వెళ్లారు? సమాధిలోకి వెళ్లి ఎలా కూర్చున్నారు?. పూజలు ఎలా చేశారు? ఆయన భార్యాపిల్లలు చెబుతున్నవేవీ నమ్మశక్యంగా అనిపించడం లేదు’’ అని స్థానికులు అంటున్నారు. మరోవైపు ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలని, అప్పుడే అసలు విషయం బయటకు వస్తుందని బంధువులు పోలీసులను కోరుతున్నారు. ఇదీ చదవండి: ఇన్‌స్టాలో కామపిశాచులు.. అమ్మాయిలూ జర భద్రం -
కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్ ముప్పు
-
కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు
-
రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య పోరు కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది.ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.రష్యాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపింది. అలాగే, ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడినట్టు స్పష్టం చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను అక్కడి నుంచి పంపించాలని కోరినట్టు ప్రకటన విడుదల చేసింది.మరోవైపు.. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ‘మాస్కోలోని భారత రాయబార కార్యాలయం మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు రప్పించేందుకు రష్యన్ అధికారులతో మాట్లాడుతున్నాం. గాయపడిన జైన్‌ను కూడా విడుదల చేసి, ఇండియాకు పంపించాలని కోరాం’ అని వెల్లడించారు. -
కేరళ,తమిళనాడుకు ‘కల్లక్కడల్’ ముప్పు..!
తిరువనంతపురం: కేరళ,తమిళనాడు(Tamilnadu) తీరాలకు ‘కల్లక్కడల్’ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్కాయిస్’ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. బుధవారం(జనవరి 15)న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన రాకాసి అలలు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది.బుధవారం రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో అర మీటరు నుంచి ఒక మీటరు మేర అలల తాకిడి ఉంటుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (Incois) హెచ్చరించింది.ఇన్కాయిస్ హెచ్చరిక నేపథ్యంలో కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ అప్రమత్తమైంది.తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పడవలు పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.మత్స్యకారులు ముందుగానే పడవలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని ప్రకటించింది. పర్యాటకులు బీచ్‌లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.కల్లక్కడల్ అంటే ఏంటి..?కల్లక్కడల్ అనేది మళయాలం పదం. కల్లక్కడల్ అంటే సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్ని సార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని Incois వెల్లడించింది.ఎలాంటి సూచన,హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయని పేర్కొంది.అందుకే దీనిని స్థానికంగా ‘కల్లక్కడల్’ అని పిలుస్తారు. -
దర్శనమిచ్చిన మకరజ్యోతి..అయ్యప్ప భక్తుల పరవశం
తిరువనంతపురం: అయ్యప్ప భక్తులు ఏడాదిపాటు ఎదురు చూసిన క్షణం మళ్లీ వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన మంగళవారం(జనవరి14) సాయంత్రం 6గంటల 44 నిమిషాలకు కేరళలోని శబరిమల ఆలయ సమీపంలోని పొన్నాంబళమేడు కొండపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి రూపంలో అయ్యప్పస్వామి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్పస్వామిని తిరువాభవరణలతో అలంకరించారు.జ్యోతి దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శబరిమల కొండల్లోని పంబ, హిల్‌టాప్, సన్నిధానం సహా పలు చోట్ల భక్తుల కోసం వ్యూపాయింట్లు ఏర్పాటు చేసింది. జ్యోతిని సుమారు లక్షన్నర మంది దాకా అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించినట్లు సమాచారం. జ్యోతిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్‌లో కొన్ని కోట్ల మంది జ్యోతిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శనం చేసుకున్నారు. జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు శబరిమల కొండపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. . ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి లేదా మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. -
కేరళలో చోరీ..సికింద్రాబాద్‌లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కేరళలోని తిరునల్వేలి జిల్లా మూలక్రాయ్పట్టిలో ఉన్న జ్యువెలరీ దుకాణంలో రెండు కేజీలకు పైగా బంగారు ఆభరణాలు చోరీ చేసి, నాలుగున్నర నెలలుగా పరారీలో ఉన్న రామకృష్ణన్‌ను అక్కడి పోలీసులు శనివారం సికింద్రాబాద్‌లో అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆ సొత్తును తాను తల్లి మీనాక్షి వద్దే ఉంచానని చెప్పాడు. దీంతో ప్రత్యేక బృందం తిరునల్వేలి సమీపంలోని రెట్టార్కులం గ్రామంలోని వారి ఇంటిపై దాడి చేసి సొత్తు స్వా«దీనం చేసుకున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక మీనాక్షి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. అక్కడ చోరీ చేసి సిటీకి వచ్చి... మూలక్రాయ్పట్టికి చెందిన వి.రెహ్మాన్ అక్కడే కొన్నేళ్లుగా జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ సమీపంలోని రెట్టార్కులం గ్రామానికి చెందిన రామకృష్ణన్ ప్రైవేట్ ఉద్యోగి. జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు కొన్నేళ్లుగా తిరునల్వేలి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పట్టబడకపోవడంతో పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. గత ఏడాది ఆగస్టులో ఇతడి కన్ను రెహా్మన్ నిర్వహిస్తున్న జ్యువెలరీ దుకాణంపై పడింది. ఆ నెల 22 రాత్రి షెల్డర్ పగులకొట్టి లోపలకు ప్రవేశించిన రామకృష్ణన్ 2.22 కేజీల బంగారం, రూ.3 లక్షల నగదు తస్కరించాడు. ఆ సొత్తును బయటకు తీయకుండా దాచి ఉంచి, కొన్నాళ్లు తన స్వస్థలానికి దూరంగా ఉంటే పోలీసులకు చిక్కనని భావించాడు. స్నేహితుడిది అంటూ తల్లికి ఇచ్చు... మర్నాడు దుకాణం తెరిచిన వెంటనే కనిపించిన సీన్‌తో తన దుకాణంలో జరిగిన చోరీ విషయం రెహా్మన్ గుర్తించాడు. దీనిపై మూలక్‌రాయ్‌పట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు కోసం తిరునల్వేలి ఎస్పీ నేతృత్వంలో తొమ్మిది ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. గుర్తించిన జ్యువెలరీ దుకాణం నుంచి తస్కరించిన నగదు తన వద్ద ఉంచుకున్న రామకృష్ణన్ బంగారం మాత్రం నేర్పుగా ప్యాక్ చేశాడు. రెట్టార్కులంలోని తల్లికి దీన్ని ఇచ్చి ఇంట్లో ఉంచాలని సూచించాడు. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితుడు కొన్ని విలువైన వస్తువులు ప్యాక్ చేసి, భద్రపరచాలని ఇచ్చాడంటూ ఆమెను నమ్మించాడు. నగదుతో గత ఏడాది ఆగస్టు 23న కేరళ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. హో టళ్లలో బస, ఖరీదైన మద్యం, ఆహారం, జల్సాలతో మూడు నెలల్లోనే రూ.3 లక్షలు ఖర్చు చేసేశాడు. నిర్మాణం వద్ద కాపలాదారుడిగా పని... దీంతో సికింద్రాబాద్‌లోని ఓ నిర్మాణం వద్ద కాపలాదారుడిగా ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. కనీసం ఏడాది పాటు ఇక్కడ తలదాచుకుని ఆపై స్వస్థలానికి వెళ్లాలని భావించాడు. ఆ తర్వాత తల్లి వద్ద ఉన్న సొత్తును విక్రయించి సొమ్ము చేసుకోవాలని అనుకున్నాడు. సికింద్రాబాద్‌లో కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్న రామకృష్ణన్ దాన్ని వినియోగించి తల్లి మీనాక్షితో మాట్లాడటం మొదలెట్టాడు. మూలక్‌రాయ్‌పట్టి చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా రామకృష్ణన్‌ను నిందితుడిగా గుర్తించాయి. అయితే అతడి ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తల్లి ఫోన్‌పై నిఘా ఉంచాయి. ఆమెకు సికింద్రాబాద్‌లో ఉన్న నెంబర్ నుంచి ఫోన్లు వస్తున్నట్లు గుర్తించాయి. దీంతో శనివారం ఇక్కడకు వచి్చన ఓ స్పెషల్ టీమ్ రామకృష్ణన్‌ను పట్టుకుంది. ప్రాథమిక విచారణలోనే అతగాడు విషయాలన్నీ బయటపెట్టాడు.తీవ్ర అవమానంగా భావించిన మీనాక్షి.. నిందితుడిని తీసుకుని కేరళ బయలుదేరిన పోలీసులు జ్యువెలరీ దుకాణంలో చోరీ చేసిన సొత్తు అతడి తల్లి వద్ద ఉందనే విషయాన్ని అక్కడి టీమ్‌కు చెప్పారు. దీంతో ఓ బృందం ఆదివారం ఉదయం రెట్టార్కులం గ్రామంలోని రామకృష్ణన్ ఇంట్లో దాడి చేసి 2.22 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతోనే తన కుమారుడు దొంగగా మారాడనే విషయం మీనాక్షికి తెలిసింది. దీనికి తోడు గ్రామంలో అందరూ చూస్తుండగా పోలీసులు తమ ఇంట్లో సోదాలు చేయడం, చోరీ బంగారం రికవరీ చేయడాన్ని తీవ్ర అవమానంగా భావించింది. దీంతో పోలీసులు వెళ్లి కొద్దిసేపటిలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుస్టేషన్‌కు వచ్చి తిరిగి వెళ్లిన ఆమె భర్త ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘సోమవారం రామకృష్ణన్‌ను రెట్టార్కులం తీసుకువెళ్లి మీనాక్షి అంత్యక్రియలు పూర్తి చేయించాం. ఆపై కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించాం. అతడు ఇలాంటి మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానం ఉంది. కస్టడీలోకి తీసుకుని ఆ కోణంలో విచారిస్తాం’ అని తిరునల్వేలికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు.తిరునల్వేలిలో జ్యువెలరీ దుకాణాన్ని దోచేసిన రామకృష్ణన్ గత ఏడాది ఆగస్టులో చోటు చేసుకున్న ఈ భారీ దొంగతనం సొత్తు తల్లికి ఇచ్చి నగరానికి వచ్చి ప్రైవేట్ ఉద్యోగిగా మకాం సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న అక్కడి కాప్స్ అతడి ఇంటి నుంచి సొత్తు సీజ్, అవమానంతో తల్లి ఆత్మహత్య -
శరీరాకృతిపై వ్యాఖ్యలూ లైంగిక వేధింపులే
కొచ్చి: మహిళ రూపురేఖలను వర్ణిస్తూ ద్వంద్వార్థం ధ్వనించేలా వ్యాఖ్యలు చేసినా, ఎస్ఎంఎస్ సందేశాలు పంపినా లైంగిక వేధింపుల సెక్షన్ల కింద అవి నేరంగా పరిగణించబడతాయని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. ఒకే కార్యాలయంలో పనిచేసిన కాలంలో తోటి మహిళా ఉద్యోగిపై తాను చేసిన వ్యాఖ్యల కుగాను నమోదైన లైంగిక వేధింపుల కేసులను కొట్టేయాలంటూ కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డ్ మాజీ ఉద్యోగి చేసిన అభ్యర్థనను జస్టిస్ ఏ.బధారుద్దీన్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. ఎర్నాకులం జిల్లాలో కేఎస్ఈబీ ఆఫీస్‌లో పనిచేసిన కాలంలో 2013 ఏడాది నుంచి తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, 2016–17 కాలంలో మొబైల్ ఫోన్‌కు తన రూపురేఖలను వర్ణిస్తూ ఎస్ఎంఎస్లు పంపారని, వాయిస్ కాల్స్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ తర్వాత సైతం అతని నుంచి ఎస్ఎంఎస్లు, ఫోన్‌కాల్స్ ఆగలేదు. దీంతో భారత శిక్షాస్మృతిలోని 354(ఏ)(1)(4), 509 సెక్షన్లతోపాటు కేరళ పోలీస్ చట్టంలోని 120(ఓ) సెక్షన్ కింద సదరు ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదైంది. అందంగా ఉందని మాత్రమే ఎస్ఎంఎస్లు పంపానని, ఆ సందేశాల్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశంలేదని అతని తరఫు న్యాయవాది చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. లైంగిక వేధింపుల సెక్షన్లను తొలగించాలంటూ ఆ ఉద్యోగి వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
సోషల్‌మీడియా వేదికగా మలయాళ నటి హనీరోజ్‌ను (Honey Rose) ఇబ్బందులకు గురిచేసిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కొంత కాలంగా ఒక వ్యాపారవేత్త ఇబ్బంది పెడుతున్నాడని కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సుమారు 30మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో కీలకమైన వ్యక్తి వివరాలను తాజాగా పోలీసులు ప్రకటించారు.హనీరోజ్‌ను ఇబ్బంది పెడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును ( Boby Chemmanur) సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హనీరోజ్ ఫిర్యాదు చేసిన సమయం నుంచి అతను పరారీలో ఉన్నాడు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే, అంశంపై హనీరోజు కూడా స్పందించారు. అతనిని అరెస్ట్ చేయడం తనకెంతో ప్రశాంతంగా ఉందని ఆమె అన్నారు. ఈ కేసు అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Pinarayi Vijayan) వద్దకు తీసుకెళ్లానని ఆమె తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం మాట ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. కొందరు తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఒక లేఖను హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని అందులో రాసుకొచ్చింది. తప్పుడు కామెంట్ల గురించి తాను సైలెంట్‌గా ఉంటుంటే.. ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా..? అని చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు)ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించాడు. పలు వ్యక్తిగత కారణాల వల్ల చాలాసార్లు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. కానీ, తనపై ఎవరైనా వివరణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తానని ఆమె పేర్కొన్నారు. తన లుక్స్‌పై వేసే సరదా జోక్స్ కూడా తీసుకుంటానన్నారు. తనపై వచ్చిన కొన్ని మీమ్స్ కూడా సరదాగేనే ఉంటాయని అన్నారు. ఇలాంటివి తనను బాధించవని కూడా తెలిపారు. కానీ, దానికంటూ ఒక హద్దు ఉంటుందని దానిని దాటి ఇలా అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించనని హనీరోజ్ హెచ్చరించారు.ఎవరీ బంగారు బాబీ..?భారత్‌లో బంగారు వ్యాపారంలో బాబీ చెమనూరు ప్రముఖులుగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ డిగో మారడోనాను కొచ్చికి తీసుకొచ్చి తన జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశాడు. అలా ఆయన పేరు అందరికీ పరిచయమే. వ్యాపారంలో భాగంగా నటి హనీరోజ్‌ను అతను ఆహ్వానించినా పలు కారణాలతో ఆమె వెళ్లలేకపోయింది. దీంతో ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ ఒక్క సినిమాతోనే 10 చిత్రాలకు దక్కినంత పేరు, గుర్తింపు ఆమె రావడం విశేషం. దీంతో తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు గెస్ట్‌గా వెళ్లారు. వాస్తవంగా 2008లోనే ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. -
సేద్యంలో మహిళా సైన్యం!
దేవతల స్వంత దేశంగా భావించే భూమిపై తమకంటూ సొంతమైన కుంచెడు భూమి లేని నిరుపేద మహిళలు వారు. కేరళ ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఆసరాతో సాగునే నమ్ముకోని వేరే ఉపాధికి నోచుకోని ఆ మహిళలు చేయి.. చేయి కలిపారు. సాగుబాటలో వేల అడుగులు జతకూడాయి. మహిళల నుదుటి చెమట చుక్కలు చిందిన బీడు భూములు విరగపండాయి. పైరు పరవళ్లు తొక్కాయి. వ్యవసాయం లాభసాటి కాదనే మాటలు నీటిమీది రాతలుగా తేలాయి. కేరళలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. వ్యవసాయంలో మాదే పైచేయి సుమా అంటున్నారు కేరళ మహిళా రైతులు.భూమిలేని మహిళల ఆర్థిక స్వావలంభన కల్పించే దిశగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం కుడుంబశ్రీ. కేరళ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ 1998లో ఊపిరి΄ోసుకున్న ‘కుడుంబ శ్రీ’ కేరళ గడ్డపై మహిళా సంఘటిత శక్తికి ప్రతీకగా ఎదిగింది. ఆ రాష్ట్రం మొత్తం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉపాధి. ముఖ్యంగా తమకంటూ సొంత వ్యవసాయ భూములు లేని కుటుంబాలే ఎక్కువ. స్థానిక సాగు భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించటం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది. వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎక్కువగా మహిళలే కావటంతో పనులు దొరక్క తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వాల్సివచ్చేది. రాష్ట్ర భూ సంస్కరణల చట్టం కౌలుపై నిషేధం విధించింది. అనధికారికంగా కౌలుకు ఇస్తే తమ భూమిపై అధికారం శాశ్వతంగా కోల్పోతామనే భయం యజమానుల్లో ఉండేది. కూలి పనులు మానుకొని సొంత వ్యవసాయం చేయాలనుకునేవారికి అది అందని ద్రాక్ష అయింది. సంఘటిత శక్తే తారక మంత్రం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోను కేరళ ప్రభుత్వం వెనుకడుగేయలేదు. సామూహిక వ్యవసాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూమిలేని మహిళలకు ΄÷లం, పంటతో అనుబంధం కల్పించటమే లక్ష్య సాధనలో తొలి అడుగుగా కొంతమంది భూమిలేని మహిళలను కలిపి 15–40 మంది మహిళలను కలిపి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, వ్యక్తిగత వ్యవసాయ భూములను గుర్తించి సంఘాలకు దఖలు పరిచారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు సాగులో సేంద్రియ పద్ధతులకు పెద్ద పీట వేశారు. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మహిళా రైతుల కోసం ఏర్పాటు చేశారు. మంచి దిగుబడులను సాధించిన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేవారు. అన్ని జిల్లాల్లో 201 క్లస్టర్లలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ / ప్రకృతి సేద్యం జరుగుతోంది. నాబార్డు సహకారంతో కుడుంబశ్రీ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. రుణాలు తీసుకోవటం తిరిగి చెల్లించటంలో ఆయా సంఘాల్లోని మహిళా సభ్యులందరిది ఉమ్మడి బాధ్యత. ఒక్క తిరువనంతపురం జిల్లాలోనే ఆరువేల గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 30 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఆదునిక పద్ధతుల్లో అరటి సాగుపై కేర ళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన శిక్షణతో తక్కువ కాలంలోనే రెండింతల దిగుబడులు సాధించారు. వనితా కర్మసేన పేరుతో కుడుంబశ్రీ కోసం వ్యవసాయ పరికాలను, యంత్రాలను ఉపయోగించటంలో మహిళలకు శిక్షణ ఇచ్చారు. కొనుగోలుకు రుణాలు ఇచ్చారు. ప్రతి సంఘానికి తమ సొంత పరికరాలు ఉన్నాయి. దీంతో వారే శ్రామికులుగా మారటంతో ఖర్చును ఆదా చేయగలిగారు. పంటను నష్ట΄ోయిన సందార్భాల్లో నాబార్డ్ మహిళా రైతులకు అండగా నిలిచింది. 47 వేల పై చిలుకు సంఘాలు, లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నాయి. జీడిమామిడి, కొబ్బరి, వరి, అరటి, పైనాపిల్ పండ్లతోటలు, ఆకుకూరలు, గుమ్మడి, బఠాణీ, సొర, అల్లం, బెండ, మిరప, వంటి పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించటంతో మంచి లాభాలు కళ్లజూశారు. ఆరు నెలలు తిరగకుండానే రుణాలు తిరిగి చెల్లించారు. ఒక్కో సీజన్లోనే ఈ సంఘాలు రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జించేవి. దీంతో తమకంటూ సొంత ఇళ్లను నిర్మించుకున్నారు. చిన్న వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకులు గతంలో మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవి కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. 10543 స్వయం సహాయక సంఘాలకు రూ. 123 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకుల దృష్టిలో మహిళారైతులు అంటే మంచి పరపతిగల మహిళలు. (చదవండి: కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..) -
డెలివరీ బాయ్.. జడ్జిగా మారితే.. యాసిన్ షా సక్సెస్ స్టోరీ
విజయసాధనకు అకుంఠిత దీక్ష అవసరమని అంటారు. పట్టుదలతో లక్ష్యం దిశగా పయినించినవారు తప్పక విజయం సాధిస్తారని కూడా చెబుతుంటారు. ఈ కోవలోకే వస్తారు యాసిన్ షా మహ్మద్. ఈయన జీవితం ఒక సినిమాను తలపిస్తుంది. తన ప్రయాణంలో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్న యాసిన్ చివరకు విజయబావుటా ఎగురవేశాడు.జీవితంలో ఎత్తుపల్లాలు, మలుపులుఇటీవల జరిగిన కేరళ జ్యుడీషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యాసిన్ షా మహ్మద్ రెండో స్థానం సాధించాడు. దీంతో సివిల్ జడ్జి అయ్యే అర్హత సాధించాడు. డెలివరీ బాయ్ నుండి మేజిస్ట్రేట్ అయ్యే దిశగా సాగిన యాసిన్ జీవన ప్రయాణంలో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. యాసిన్‌కు మూడేళ్ల వయసున్నప్పడే అతని తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టివెళ్లిపోయాడు. నాడు 19 ఏళ్లు ఉన్న అతని తల్లి.. పిల్లలను పెంచిపోషించింది. శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఉంటూ, వారు కాలం వెళ్లదీశారు. రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద వారికి ఒక చిన్న ఇంటి సౌకర్యం లభించినప్పటికీ, వారికి అది ఏమాత్రం అనువుగా ఉండేది కాదు.న్యూస్ పేపర్ పంపిణీ చేస్తూ..యాసిన్ తన బాల్యంలో ఉదయం 4 గంటలకు నిద్రలేచి వార్తాపత్రికలను పంపిణీ చేసేవాడు. తరువాత 7 గంటల నుండి పాల ప్యాకెట్లు పంపిణీ చేసేవాడు. ఇది పూర్తయ్యాక స్కూలుకు వెళ్లేవాడు. యాసిన్ తల్లి రెండు పాడి ఆవును కొనుగోలు చేసి, వాటి ద్వారా వచ్చే పాలు విక్రయిస్తూ కుటుంబాన్ని సాకేది. యాసిన్ తన ఆరేళ్ల వయసు నుంచే ఆదాయం వచ్చే పనులు చేసేవాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు పంపిణీ చేసేవాడు.స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం..సమయం చిక్కినప్పుడు యాసిన్ పెయింటర్‌గా, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌గానూ పనిచేశాడు. ఇతరుల నుంచి పాత పుస్తకాలు సేకరించి చదువుకునేవాడు. అలాగే ఇతరులిచ్చే పాత దుస్తులు ధరించేవాడు. రోజులో ఏది దొరికితే దానిని తిని కడుపునింపుకునేవాడు. ఇలా పనిచేస్తూనే 12వ తరగతి పూర్తిచేసిన యాసిన్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కోర్సులో చేరేందుకు షోరనూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈ కోర్సు పూర్తయ్యాక స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి విని, దానికి ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు. యాసిన్ 46వ ర్యాంక్‌తో కేరళలోని ఎర్నాకులంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందాడు. ఈ సమయంలో రాత్రి 2 గంటల వరకు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు.29 ఏళ్ల పోరాటంయాసిన్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను 12వ తరగతిలో ఫెయిల్ అయి, చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా పట్టుదల వీడక 12వ తరగతి పాస్ అయ్యాను. నేను మలయాళం మీడియం స్కూల్లో చదవడంతో ఇంగ్లీషులో చదవడం ఇబ్బందిగా అనిపించేంది. పట్టుదలతో ఈ సమస్యను కూడా అధిగమించాను’ అని తెలిపారు. యాసిన్ 2023 మార్చిలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో తన పేరు నమోదు చేయించుకున్నారు. తరువాత పట్టాంబి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది షాహుల్ హమీద్ దగ్గర పని చేశారు. ఈ సమయంలోనూ యాసిన్ వార్తాపత్రికలు విక్రయించడం, డెలివరీ బాయ్‌గా పనిచేయడాన్ని మానలేదు. యాసిన్ తనకు 29 ఏళ్ల వయసు వచ్చే వరకూ జీవితంతో పోరాడుతూనే వచ్చాడు. అయితే ఇదే సమయంలో తాను జడ్జి కావాలనుకున్న కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు యాసిన్ తాను అనుకున్న విధంగా జడ్జిగా మారి, పదిమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇది కూడా చదవండి: ‘ఆంగ్లం’లో భారత్ స్థానం ఎంత? నాన్ ఇంగ్లీషులో టాప్ దేశమేది? -
19 ఏళ్ళ తరువాత దొరికారు.. కావలపిల్లలను తల్లిని హతమార్చిన హంతకులు
-
శబరిమలలో హైదరాబాద్ స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి
తిరువనంతపురం: హైదరాబాద్ నుండి కేరళ వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బస్సు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. పంబా వెళ్తున్న క్రమంలో ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడిపోవడంతో ప్రమాదం జరిగింది. పంపా నదికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారు.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయ్యప్ప స్వాములను ఉప్పర్గూడకు చెందిన వారిగా గుర్తించారు. -
వీడియో: 15 అడుగుల స్టేజ్‌పై నుంచి పడిపోయిన మహిళా ఎమ్మెల్యే.. తీవ్ర గాయాలు
తిరువనంతపురం: ఈవెంట్‌కు వెళ్లడమే కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే పాలిట శాపమైంది. సదరు ఎమ్మెల్యే ఈవెంట్లో వేదికపై నుంచి కింద పడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతోంది. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.కేరళలోని కలూర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై సదరు ఎమ్మెల్యే నిర్వాహకులు, కార్యక్రమానికి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. అనంతరం, కుర్చీలో నుంచి లేచి పక్కకు వెళ్లే సమయంలో ఆమె.. వేదికపై నుంచి జారి పడ్డారు. ఈ సమయంలో నేల మీద కాంక్రీట్ స్లాబ్‌కు తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది.అయితే, వేదిక ఎత్తు దాదాపు 15 అడుగులు ఉండటంతో ఎమ్మెల్యే తలకు, ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. అలాగే, గర్భాశయం, వెన్నెముకలో గాయాలు కూడా అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యం జరుగుతోందని.. ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైనట్టు వైద్యులు వెల్లడించారు. తన వద్దకు వచ్చిన వారిని గుర్తించి, ఆమె మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు.Footage of MLA Uma Thomas falling from the stage at Kaloor JLN Stadium is now out.#umathomas #kochi #kerala pic.twitter.com/xW7saafNEw— Sreelakshmi Soman (@Sree_soman) January 2, 2025ఇదిలా ఉండగా.. ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. వేదిక ఏర్పాటు విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యం, తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కార్యక్రమం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. The site where MLA Uma Thomas fell at the Kaloor stadium and the visuals from the dance event that took place.@NewIndianXpress video by @sanesh_TNIE@MSKiranPrakash @PaulCithara #UmaThomas #Kaloor #Kochi #Kerala pic.twitter.com/odr6oj98y8— TNIE Kerala (@xpresskerala) December 29, 2024 -
రైలు పట్టాల మధ్యలో పడుకుని.. చావు తప్పించుకున్నాడు
ఓ వ్యక్తి పట్టాలపై నడుస్తుండగా ఎదురుగా రైలు దూసుకొచ్చింది. వెంటనే పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు తన మీదుగా వెళ్తున్నంత సేపు కదలలేదు. మెదలలేదు. రైలు వెళ్లిపోగానే లేచి.. దుమ్ము దులుపుకొని ఇంటి దారి పట్టాడు. చూసినవారికి మాత్రం గుండె ఆగిపోయినంత పనయ్యింది. కేరళ రాష్ట్రంలో కన్నూర్ జిల్లాలో జరిగిన ఘటనను చిత్రీకరించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అవుతోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో.. మంగళూరుృతిరువనంతపురం ట్రైన్ కన్నూర్ృచిరక్కల్ రైల్వే స్టేషన్ల గుండా వెళ్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి ఆ మార్గంలోని పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే అతను ఫోన్లో మాట్లాడుతుండటంతో రైలు దగ్గరగా వస్తున్న విషయాన్ని గమనించలేదు. తీరా చూసేసరికి.. తప్పించుకునే వీలులేకుండా పోయింది. వెంటనే సమయ స్ఫూర్తితో వ్యవహరించిన పవిత్రన్.. పట్టాల మధ్యలో పడుకున్నాడు. ట్రైన్ వెళ్లిపోగానే లేచి ఇంటికెళ్లిపోయాడు. #Kerala: A middle-aged man from Chirakkal narrowly survived after a train passed over him in Pannenpara, Kannur, while he was walking along the tracks. Eyewitnesses reported that he lay down on the tracks just before the train approached, emerging unscathed. pic.twitter.com/ZPApakxHRp— Informed Alerts (@InformedAlerts) December 24, 2024 అయితే వీడియో వెనుకనుంచి చిత్రీకరించడంతో వ్యక్తిని గుర్తించడం కష్టమైంది. వైరలైన వీడియోను చూసిన పోలీసులు.. తాగిన మత్తులో వ్యక్తి అలా చేశాడేమోనని భావించారు. తరువాత విచారించగా ఆ వ్యక్తి స్కూల్ వ్యాన్ క్లీనర్‌గా 56 ఏళ్ల పవిత్రన్ అని తేలింది. తాను తాగలేదన్న పవిత్రన్.. ప్రాణాలను కాపాడుకోవడానికి అలా పట్టాలపై పడుకున్నానని చెప్పారు. ఇంకా ఆ భయం నుంచి తేరుకోలేదన్నారు. వీడియో చూసి తాము ఆశ్చర్యపోయామని, బక్కగా ఉండటం వల్లే పవిత్రన్ ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు అంటున్నారు. -
రియల్ స్టోరీతో వస్తోన్న అనుపమ పరమేశ్వరన్..!
మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ సినిమాను యధార్థ సంఘటనల ఆధారంగా తెరెకెక్కిస్తున్నారు. ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి ఫణీంద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ జానకి పాత్రలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొందనేదే అసలు కథ. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో జానకి కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.రియల్ స్టోరీ కావడంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గిరీష్ నారాయణన్ , జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
సంజూ శాంసన్‌కు షాక్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు షాక్ తగిలింది. విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో శాంసన్ చోటు కోల్పోయాడు. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందును సంజూని జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. సంజూ గైర్హాజరీలో సల్మాన్ నిజర్ కేరళ జట్టును ముందుండి నడిపించనున్నాడు. మొహమ్మద్ అజారుద్దీన్, ఎం అజ్నస్ కేరళకు వికెట్‌కీపింగ్ ఆప్షన్స్‌గా ఉన్నారు. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సంజూ శాంసన్ కేరళకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో కేరళ తృటిలో నాకౌట్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. ఈ టోర్నీలో సంజూ ఆరు మ్యాచ్‌లు ఆడి హాఫ్ సెంచరీ సాయంతో 135 పరుగులు మాత్రమే చేశాడు. సంజూ ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరఫున రెండు సెంచరీలు సాధించాడు.విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ జట్టు: సల్మాన్ నిజర్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, షోన్ రోజర్, మొహమ్మద్ అజారుద్దీన్ (వికెట్‌కీపర్), ఆనంద్ కృష్ణన్, కృష్ణ ప్రసాద్, జలజ్ సక్సేనా, ఆదిత్య సర్వతే, సిజోమన్ జోసెఫ్, బాసిల్ థంపి, బాసిల్ NP, నిధీష్ MD, ఈడెన్ యాపిల్ టామ్, షరాఫుద్దీన్ , అఖిల్ స్కారియా, విశ్వేశ్వర్ సురేష్, వైశాక్ చంద్రన్, అజ్నాస్ M (వికెట్‌కీపర్)మనీశ్ పాండే ఔట్విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం కర్ణాటక జట్టును కూడా నిన్ననే ప్రకటించారు. ఫామ్‌ల లేమి కారణంగా స్టార్ ఆటగాడు మనీశ్ పాండే జట్టులో చోటు కోల్పోయాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మనీశ్ పేలవ ప్రదర్శన చేశాడు. ఆ టోర్నీలో మనీశ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. SMAT-2024లో కర్ణాటక నాకౌట్స్‌కు క్వాలిఫై కావడంలో విఫలమైంది. మనీశ్ గైర్హాజరీలో కర్ణాటక వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ గోపాల్ వ్యవహరిస్తాడు. కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ కొనసాగనున్నాడు.విజయ్ హజారే ట్రోఫీ కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శ్రేయస్ గోపాల్ (వైస్ కెప్టెన్), ఎస్ నికిన్ జోస్, కెవి అనీష్, ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్, అభినవ్ మనోహర్, హార్దిక్ రాజ్, వైషాక్ విజయ్‌కుమార్, వాసుకి కౌశిక్, విద్యాధర్ పాటిల్, కిషన్ బెదరే, అభిలాష్ శెట్టి, మనోజ్ భండాగే , ప్రవీణ్ దూబే, లువ్నిత్ సిసోడియా -
కేరళలో మళ్లీ మంకీపాక్స్ కలకలం
తిరువనంతపురం:మంకీపాక్స్ వైరస్ కేసులు కేరళలో మళ్లీ నమోదయ్యాయి. తాజాగా రెండు కేసులు వెలుగుచూడడం ఇక్కడ కలకలం రేపింది. యూఏఈ నుంచి ఇటీవలే కేరళ వచ్చిన ఇద్దరికి మంకీ పాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.వయనాడ్‌కు చెందిన వ్యక్తికి తొలుత మంకీపాక్స్ నిర్ధారణ కాగా తాజాగా కన్నూర్ జిల్లా వాసికి వైరస్ సోకినట్లు తేలింది.దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.ఇదిలాఉంటే కేరళలో ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొన్ని మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
కుటుంబం, తోడుంటానన్న ప్రియుడు దూరమైపోయినా..శృతి స్ఫూర్తిదాయక జర్నీ
ధైర్యంగా ఉండాలి. ఆశ నిలపాలి. స్థైర్యాన్ని కూడగట్టుకోవాలి. జూలై 30న వాయనాడ్ వరదల్లో శ్రుతి చూసిన నష్టాలు అన్నీ ఇన్నీ కావు. కుటుంబ సభ్యులను పోగొట్టుకుంది. పెళ్లి కోసం దాచిన డబ్బు, బంగారం నీటి పాలయ్యాయి. ఆఖరికు చేసుకోవాల్సిన కుర్రాడు కూడా యాక్సిడెంట్లో మరణించాడు. అయినప్పటికీ ఎందరో ఆమెకు తోడుగా నిలిచారు. శ్రుతి విధిని ఎదిరించి నిలబడింది. మొన్నటి సోమవారం ప్రభుత్వ ఉద్యోగిగా నియమితురాలై తన సీటులో కూచుని నవ్వింది.సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్బుక్ పేజీలో ఇలా రాశారు ‘వాయనాడ్ వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన శ్రుతికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చాం. ఇవాళ మా మాట నెరవేర్చాం’ అని ఉంది అందులో. వాయనాడ్ కలక్టరెట్లోని కంప్యూటర్ డిపార్ట్మెంట్లో క్లర్క్‌గా బాధ్యతలు తీసుకుని చిరునవ్వుతో చూస్తున్న శ్రుతి ఫొటోను విజయన్ తన వ్యాఖ్యకు జత చేయడం వల్ల నెటిజన్స్ అందరూ ఆ ఫొటోలోని శ్రుతిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.‘ఈ సమయంలో మా అమ్మా నాన్నలేరు. నాకు కావలసిన భర్త కూడా లేరు. అందుకు నాకు బాధగా ఉంది. కాని జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు సాగాలని తెలుసుకుని ఆ విధంగా కొనసాగినందుకు సంతోషంగా ఉన్నాను’ అందామె. 24 ఏళ్ల శ్రుతి కచ్చితంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆమె కోసం కేరళ అంతా తోడుగా నిలిచింది. ఇకపై నిలిచే ఉంటుంది. ఒక ధైర్యం సాటి మనిషి కల్పిస్తే బాధలో ఉన్న వ్యక్తి కోలుకుంటారనడానికి ఈ సంఘటన పెద్ద ఉదాహరణ. అలాగే దు:ఖంలో ఉన్న వ్యక్తి ధైర్యం సడలనివ్వకుండా ఉంటే సమాజం తోడు నిలిచి ఆ వ్యక్తిని నిలబెట్టుకుంటుందనడానికి కూడా ఈ ఘటనే ఉదాహరణ.వాయనాడ్‌లో ఆమెవాయనాడ్లోని ఒక ప్రయివేటు సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న శ్రుతి తనకు బాల్య స్నేహితుడైన జాన్సన్‌ను వివాహం చేసుకోవాలనుకుంది. వారివి వేరు వేరు మతాలైనా ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. సెప్టెంబర్, 2024లో పెళ్లి అనుకుంటే జూన్ 1 వాళ్లు వాయనాడ్ సమీపంలోని సొంత ఇంటికి మారారు. జూన్ 2న శ్రుతికి, జాన్సన్‌కు నిశ్చితార్థం అయ్యింది. అంతా సంతోషంగా ఉంది అనుకుంటూ ఉండగా జూన్ 30న వరదలు చుట్టుముట్టాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. ఆ సమయానికి శ్రుతి వాయనాడ్‌లో ఉండటం వల్ల ఆమె తప్ప కుటుంబంలోని 15 మంది మృత్యువు పాలయ్యారు. అదొక్కటే కాదు పెళ్లి కోసం తల్లిదండ్రులు దాచి పెట్టిన బంగారం, 4 లక్షల నగదు మొత్తం వరద నాలయ్యాయి. ఇల్లు కూలిపోయింది. ఈ విషాదంలో శ్రుతి స్తంభించిపోయింది. అయితే జాన్సన్ ఆ సమయంలో ఆమెకు కొండంత అండగా ఉన్నాడు. ధైర్యం చెప్పాడు. ‘నీ దగ్గర రూపాయి లేకపోయినా నేను వివాహం చేసుకుంటా... నిన్ను సంతోషంగా ఉంచుతా’ అని మాట ఇచ్చాడు. అందరూపోయినా జాన్సన్ ఉన్నందుకు ఆమె కార్చే కన్నీటిలో ఒక చిన్న ఆశాకిరణాన్ని నిలబెట్టుకుంది.కోల్పోయిన ఆ తోడుఅయితే విధి మరోసారి శ్రుతి మీద పగబట్టింది. సెప్టెంబర్ మొదటి వారంలో తన బంధువుల సమాధులను (వాయనాడ్ వరద మృతులు) చూసి వద్దామని వ్యాన్‌లో జాన్సన్ బయలుదేరి తోడుగా శ్రుతిని, బంధువులను తీసుకెళ్లాడు. ఆ సమయంలోనే ఆ వ్యాన్‌కు యాక్సిడెంట్ అయ్యింది. డ్రైవ్ చేస్తున్న జాన్సన్ దుర్మరణం పాలయ్యాడు.కదలిన కేరళఈ ఉదంతం తెలిసిన వెంటనే కేరళ మొత్తం కదిలింది. అందరూ శ్రుతి ఫొటోను తమ ఫోన్ల డీపీలుగా పెట్టుకుని ‘నీకు మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు. వందలాది వేలాది మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ప్రభుత్వంలోని మంత్రులు, ఎంఎల్ఏలు వచ్చి పలుకరించి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగాన్ని హామీ ఇచ్చారు. ఇవన్నీ శ్రుతిని నిలబెట్టాయి. ఇప్పుడు తను ప్రభుత్వ ఉద్యోగిని అయ్యింది. మర్చిపోయిన నవ్వును పెదవుల మీదకు తెచ్చుకుంది. కాలం దయతో చూడాలి అందరినీ. అది ఇక్కట్లపాలు చేసినా వెలుతురు తీసుకువస్తుంది. (చదవండి: రణబీర్ కపూర్‌కి నాసల్ డీవియేటెడ్ సెప్టం: అంటే ఏంటి..?) -
Pushpa 2: పొట్టపై బన్నీ లుక్.. గంగమ్మ పాటకు మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్
పుష్ప2..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. సినిమా చూసిన వాళ్లు బన్నీ నటన గురించి, క్లైమాక్స్, జాతర సీన్లను గురించి మాట్లాడుకుంటే..చూడలి వాళ్లు సినిమా అలా ఉందట..ఆ సీన్లు బాగున్నాయట వెళ్లి చూద్దాం అని చర్చించుకుంటున్నారు. ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు అంతా ఇంతా కాదు. తొలి రోజే ఏకంగా రూ.294 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ఇక ఐదు రోజుల్లో రూ. 922 కోట్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. (చదవండి: 'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ)సినిమా విడుదలై ఐదు రోజులు దాటినా.. ఇప్పటికీ థియేటర్స్ వద్ద సందడి కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇంకా పుష్ప సెలెబ్రేషన్స్ చేస్తూనే ఉన్నారు. పుష్పరాజ్ వేషధారణ ధరిస్తూ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ బన్నీ అభిమాని.. గంగమ్మ తల్లి వేషాధారణతో థియేటర్స్‌కి వెళ్లి డ్యాన్స్ చేశాడు. పొట్టపై బన్నీ లుక్..పుష్ప 2 రిలీజ్ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ కేరళలో సందడి చేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా పుష్ప 2లో అల్లు అర్జున్ వేసిన గంగమ్మ తల్లి వేషాధారణలో కనిపించి అందరిని అలరించాడు. థియేటర్స్ వద్ద నిలబడి చిందులేశాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, కేరళలో బన్నీకి చాలా మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసేందే. అక్కడ బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. బన్నీ నుంచి వచ్చే ప్రతి సినిమాను అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారు. View this post on Instagram A post shared by Mukesh ponnore/ (@mukeshmohan2255) -
ఇదేంటి 'పుష్ప'..? ఆశతో సినిమా చూద్దామని వెళ్తే ఇలా చేస్తే ఎలా..?
అల్లు అర్జున్- సుకుమార్ పుష్ప2తో ప్రేక్షకులలో పూనకాలు తెప్పించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 621 కోట్లు రాబట్టింది. తెలుగు,హిందీ,తమిళ,కన్నడ,మలయాళం, బెంగాలీ భాషల్లో అల్లు అర్జున్ రప్పా రప్పా ఆడించేస్తున్నాడు. కేరళలో అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, అక్కడి రాష్ట్రంలోని కొచ్చిన్‌లోని ఒక థియేటర్లో ప్రేక్షకులకు విచిత్రమైన అనుభవం ఏర్పడింది. ఈ ఘటన రిలీజ్ రోజే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.కేరళలో భారీ కలెక్షన్స్‌తో పుష్ప2 దూసుకుపోతుంది. డిసెంబర్ 6న కొచ్చిన్‌లోని సినీపోలిస్ సెంటర్ స్క్వేర్‌లో ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు చాలామంది ప్రేక్షకులు వెళ్లారు. థియేటర్ కూడా నిండిపోయింది. అయితే, సినిమా స్క్రీనింగ్‌లో తొలి భాగం ప్రదర్శించకుండా సెకండాఫ్ వేశారు. కానీ, ఈ విషయాన్ని ప్రేక్షకులు గుర్తించలేకపోవడంతో సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే, ఇంటర్వెల్ సమయంలో సినిమా పూర్తి అయినట్లు టైటిల్ కార్డ్ పడటంతో అప్పుడు అసలు విషయం వారందిరికీ అర్థం అయింది. తాము ఇప్పటి వరకు సెకండాఫ్ చూశామని థియేటర్ యాజమాన్యానికి తెలిపారు. తాము చెల్లించిన డబ్బు తిరిగి చెల్లించాలని కోరడంతో వారందరికీ రిటర్న్ ఇచ్చేశారు. ఈ క్రమంలో కొంతమంది ఫస్ట్ పార్ట్‌ను ప్రదర్శించాలని కోరడంతో వారందరి కోసం యాజమాన్యం రన్ చేసింది. -
ఆయనకు వీఐపీ దర్శనం ఎలా ?.. కోర్టు ఆగ్రహం
శబరిమల స్వామి దర్శనానికి అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు కఠినమైన దీక్ష పూర్తి చేసి భక్తితో వెళ్తారు. కోట్లకు అధిపతి అయినా, కార్మికుడైనా, శ్రామికుడైనా సరే స్వామి దర్శనం విషయంలో సమానమే... అయితే, మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు ఉన్న దిలీప్‌కు శబరిమలలోని అయ్యప్ప క్షేత్రంలో వీఐపీ దర్శనం కల్పించడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. ఇదే సమయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ)పై మండిపడింది.డిసెంబర్ 4న నటుడు దిలీప్ శబరిమలలోని అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సమయంలో టీడీబీ అధికారులు ఆయనకు వీఐపీ దర్శనం కల్పించారు. దీంతో సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ విషయంపై అక్కడి మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దిలీప్‌కు వీఐపీ దర్శనం కల్పించడం వల్ల భక్తులు ఇబ్బందులకు గురయ్యారని, కొందరైతే దర్శనం కూడా చేసుకోకుండానే వెనుదిరిగారు అంటూ కథనాలు వచ్చాయి. దీంతో ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించింది.నటుడు దిలీప్‌ను ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతిచ్చారని కేరళ కోర్టు ప్రశ్నించింది. టీడీబీ చేసిన పొరపాటు వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కోర్టు వెళ్లడించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారే ఇలాంటి తప్పులు చేస్తే.. భక్తులు ఎవరితో చెప్పుకుంటారని తప్పబట్టింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే అక్కడ వీఐపీ దర్శనం ఉంటుందని ఈమేరకు కోర్టు గుర్తుచేసింది. ఇతరులు ఎవరైనా సరే ఆ అవకాశం కల్పించడం విరుద్ధం అంటూ న్యాయమూర్తులు జస్టిస్ నరేంద్రన్, జస్టిస్ మురళీకృష్ణలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..
మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం వెళితే సాయంత్రానికి దారి తప్పారు. సిగ్నల్ లేదు. ఎటు చూసినా ఏనుగులు. రాత్రంతా అడవిలోనే. వారికోసం అగ్నిమాపకదళం, పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రామస్తులు తెగించి అడవిలోకి వెళ్లారు. ‘ఒక్క ఆవు కోసమా ఇదంతా’ అని దాని ఓనరమ్మను అడిగితే ‘నాకున్న ఏకైక ఆస్తి అదేనయ్యా’ అంది. కేరళను ఊపేసిన ఈ ఘటన వివరాలు.ఆ ఆవు పేరు మాలూ. ఎర్నాకుళం జిల్లాలోని కొత్తమంగళం ప్రాంతంలోని అట్టికాలం అనే అడివంచు పల్లెలో మాయా అనే 46 ఏళ్ల స్త్రీ దాని యజమాని. దాని మీద వచ్చే రాబడే ఆ ఇంటికి ఆధారం. రోజూ అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరడం మాలూ అలవాటు. మొన్న బుధవారం (నవంబర్ 27) అది అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకూ చూసిన మాయా తన ఆవు అడవిలో తప్పిపోయిందని ఆందోళన చెందింది. గురువారం మధ్యాహ్నం వరకూ అటూ ఇటూ వెతికి అడవిలోకి వెళ్లడానికి ఇరుగూ పొరుగునూ తోడు అడిగింది. పాపం మాయా ఆందోళన చూసిన పారుకుట్టి (64), డార్లీ (56) సరే మేమూ వస్తాం అన్నారు. వారికి అడవి కొట్టిన పిండి. మధ్యాహ్నం వాళ్లు ముగ్గురూ మాలూను వెతుకుతూ కొత్తమంగళం అడవిలోకి వెళ్లారు.అడవి ఒక్కలాగా ఉండదుఅడవిలోపలికి వెళ్లిన ఆ ముగ్గురు స్త్రీలు చాలా దూరం వెళ్లారు. సాయంత్రం నాలుగు వరకూ వాళ్లు సిగ్నల్స్ దొరికేంత దూరం వెళ్లారు. ఆ తర్వాత ఆవు కనిపించక వెనక్కు తిరిగేసరికి ఏనుగుల మంద. కొత్తమంగళం అడవుల్లో ఏనుగులు జాస్తి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురూ రెండోదారి పట్టేసరికి అక్కడ కూడా ఏనుగుల మందే. దాంతో భయపడి మూడోదారిలోకి మళ్లారు. కాని ఈసారి ఒంటరి ఏనుగు కనిపించింది. ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదం. వారు దారి మార్చుకుని నాలుగో దారి పట్టేసరికి దారి తప్పారు. అడవి లోపల తన రంగులు మార్చుకుంటూ ఉంటుందని ఆటవీ శాఖ వారు అంటారు. లోపల అడవంతా ఒక్కలాగే ఉంటూ కనికట్టు చేస్తుంది. అలా తెలిసిన దారే అనుకుని తెలియని దారిలో అడుగుపెట్టి వారు దారి తప్పారు.మొదలైన అన్వేషణఊళ్లోని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లి తప్పిపోయారనే సరికి అట్టికాలంలో గగ్గోలు రేగింది. వెంటనే కబురు మీడియాకు చేరేసరికి వార్తలు మొదలైపోయాయి. తక్షణం ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ అండ సేఫ్టీ వాళ్లు 15 మంది ఒక టీమ్ చొప్పున నాలుగు బృందాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు 50 మంది, వీరితో కలిసి తోడుగా వెళ్లిన గ్రామస్తులు, డ్రోన్లు... ఒక సినిమాకు తక్కువ కాకుండా అన్వేషణ మొదలైంది. ‘అడవిలో ఆ సమయంలో వెళ్లడం ప్రమాదం. ఏనుగులు చూశాయంటే అటాక్ చేసి చంపేస్తాయి. మా టీమ్‌లు రెండు వెనక్కు వచ్చేశాయి. ఒక టీమ్ ఒక షెల్టర్‌లో రాత్రి గడిపి తెల్లవారు జామున వెతకాల్సి వచ్చింది’ అని ఫారెస్ట్ అధికారి తెలిపారు.స్మగ్లర్లు అనుకునిఆ ముగ్గురు స్త్రీలు 15 గంటల అన్వేషణ తర్వాత శుక్రవారం ఉదయం 7.30 గంటలకు రెస్క్యూటీమ్‌కు కనిపించారు. కాని వాస్తవంగా వారు ఆ రాత్రే దొరకాల్సింది. ‘మేము ఆ ముగ్గురు స్త్రీలను వెతుకుతూ మమ్మల్ని గుర్తించడానికి అక్కడక్కడా మంటలు వేశాం. ఏనుగులను చెల్లాచెదురు చేయడానికి టపాకాయలు కాల్చాం. టార్చ్లైట్ల వెలుతురు కూడా దూరం వరకూ వేశాం’ అని అటవీ అధికారి చెప్పారు. ‘అయితే మేము ఆ టార్చ్‌లైట్‌ను దూరం నుంచి చూశాం. అడవిలోకి వచ్చిన వారు పోలీసులో, స్మగ్లర్లో ఎలా తెలుస్తుంది. ఆ సమయంలో స్మగ్లర్లకు దొరికితే అంతే సంగతులు. అందుకే మేం లైట్ వెలుగులు చూసినా చప్పుడు చేయకుండా ఉండిపోయాం’ అని ఆ ముగ్గురు స్త్రీలు చెప్పారు.వారు అడవిని జయించారుగతంలో తెలుగులో రచయిత కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల రాశారు. ఆ నవలలో తన పంది తప్పిపోతే ఒక వృద్ధుడు అడవిలోకి వెళతాడు రాత్రిపూట. అనేక ప్రమాదాలు జయించి తిరిగి వస్తాడు. ఈ ఘటనలో కూడా ఈ ముగ్గురూ అనేక ప్రమాదాలు దాటి తిరిగి వచ్చారు. వారి కోసం అంబులెన్సులు, వైద్య సహాయం సిద్ధంగా ఉంచినా వాటి అవసరం రాలేదు.మరి ఇంతకీ మాలూ అనే ఆ ఆవు?వీరిని వెతకడానికి పెద్ద హడావిడి నడుస్తున్నప్పుడే అంటే గురువారం సాయంత్రం అది ఇంటి దగ్గరకు వచ్చి అంబా అంది. కొడుకు దానిని కట్టేసి తల్లి కోసం అడవిలోకి పరిగెత్తాడు. అదన్నమాట. (చదవండి: -
సంజూ సేనను మట్టికరిపించిన ఆంధ్ర.. వరుసగా ఐదో విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆంధ్ర క్రికెట్ జట్టు జోరు కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలు సాధించిన ఆంధ్ర.. తాజాగా ఐదో విజయం నమోదు చేసింది. కేరళతో ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ సేనను ఆంధ్ర బౌలర్లు 87 పరుగులకే (18.1 ఓవర్లలో) మట్టికరిపించారు. కేవి శశికాంత్ 3, కే సుదర్శన్, సత్యనారాయణ రాజు, బోధల కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టారు. కేరళ ఇన్నింగ్స్‌లో జలజ్ సక్సేనా (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అబ్దుల్ బాసిత్ (18), నిధీశ్ (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీమిండియా ఆటగాడు, కేరళ సారధి సంజూ శాంసన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు.. 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. శ్రీకర్ భరత్ అజేయమైన అర్ద శతకంతో (56) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ హెబ్బర్ 12, షేక్ రషీద్ 5, పైలా అవినాశ్ 0, రికీ భుయ్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 3 వికెట్లు పడగొట్టగా.. నిధీశ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తాజా ఓటమితో కేరళ గ్రూప్-ఈ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఆంధ్ర గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుంది. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
అలప్పుజ: కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలప్పుజలో కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు అతివేగంగా వచ్చి, కారును ఢీకొన్నదని స్థానికులు చెబుతున్నారు. బాధితులను వందనం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ముహ్సిన్, మహమ్మద్, ఇబ్రహీం, దేవన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను వందనం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక నివేదికల ప్రకారం మృతులు కోజికోడ్, కన్నూర్, చేర్యాల, లక్షద్వీప్‌కు చెందినవారు. ఈ ప్రమాదంలో కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
అటు ప్రేమ, ఇటు వివక్ష
కోజికోడ్(కేరళ): పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న ప్రధాని మోదీ కేరళలోని వయనాడ్ బాధితుల పట్ల విపక్ష కనబరుస్తున్నారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తొలిసారిగా సొంత నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కోజికోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమెతో కలిసి రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించారు. ‘‘అందర్నీ సమాన దృష్టిలో చూడాలని మన రాజ్యాంగం ప్ర¿ోధిస్తోంది. కానీ మన ప్రధానికి మాత్రం అవేం పట్టవు. అమెరికాలో అదానీపై కేసులు నమోదయ్యాక ఆయనను భారతీయులంతా ఒక నిందితుడిగా చూస్తుంటే ప్రధాని మోదీ మాత్రం ఆయనను ప్రత్యేకంగా చూస్తున్నారు. అమెరికాలో అదానీపై నేరాభియోగాలు నమోదైనా ప్రధాని మోదీ అస్సలు పట్టించుకోరు. ఆయనను నేరస్తుడు అని అమెరికా సంబోధించినా భారత ప్రభుత్వం ఆయనపై ఎలాంటి నేరాభియోగాలు మోపదు. అదానీపై ఇంతటి ప్రేమ ఒలకబోసే ప్రధాని కేరళలో ప్రకృతి విలయంతో సర్వం కోల్పోయిన వయనాడ్ బాధితుల బాధలను చెవికెక్కించుకోరు. అవసరమైన సహాయక సహకారాలు మద్దతు ఇవ్వాలనే ఆలోచన ఆయనకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ సమర్థవంతంగా ప్రజల కోసం పోరాడుతోంది. మన మీద నమ్మకంతో, కాపాడుతామన్న విశ్వాసంతో ప్రజలు మన వద్దకు వస్తున్నారు. వయనాడ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు పోరాడతా’’అని అన్నారు. అంతకుముందు రాహుల్ వయనాడ్ మృతులకు నివాళులరి్పంచారు. బీజేపీ, ప్రకృతి విపత్తు ఒక్కటే: ప్రియాంక రాహుల్ తర్వాత ప్రియాంకాగాంధీ ప్రసంగించారు. ‘‘ప్రకృతి విపత్తు, బీజేపీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. రెండింటి శైలి ఒక్కటే. ప్రకృతి విపత్తు ఎలాగైతే తనకు నచి్చనట్లు చేస్తుందో బీజేపీ కూడా ఎలాంటి నియమనిబంధనలు, వివరణలు, ప్రజాస్వామ్యయుతవిధానాలను అవలంభించదు. బీజేపీ నుంచి ఎదుర్కొంటున్న రాజకీయసవాళ్లు అచ్చు కొండచరియలు విరిగిపడటం లాంటిదే. రాజకీయసమరంలో పాటించాల్సిన కనీస ధర్మాలనూ బీజేపీ పాటించదు. రాజ్యాంగబద్ద సంస్థలనూ నాశనంచేస్తోంది. విధ్వంసకర అజెండాకు మాత్రమే బీజేపీ కట్టుబడి ఉంటుంది. వయనాడ్ ప్రజల మనిషిగా పార్లమెంట్లో మాట్లాడతా. ఇక్కడి వారి సమస్యలను ప్రస్తావిస్తా. సోదరుడు రాహుల్‌గాం«దీపై చూపించిన ప్రేమను నాపైనా చూపించినందుకు మీకు రెండింతల ధన్యవాదాలు. గెలిచి ఇక్కడికొచ్చా. వయనాడ్ ప్రజల ఉజ్వల భవిత కోసం నా శాయశక్తుల కృషిచేస్తా’’అని ప్రియాంక గాంధీ అన్నారు. -
వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో బ్యాటర్లు ఉతికారేశారు! పాపం శార్దూల్..
భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. కాగా ఇండియాలో ప్రస్తుతం దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా.. గ్రూప్-‘ఇ’లో ఉన్న కేరళ- ముంబై జట్లు శుక్రవారం తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కేరళకు శార్దూల్ ఠాకూర్ ఆరంభంలోనే షాకిచ్చాడు. కెప్టెన్, ఓపెనర్ సంజూ శాంసన్(4)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు.అయితే, ఆ తర్వాత ముంబైకి పెద్దగా ఏదీ కలిసిరాలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీసినా.. ఓపెనర్ రోహన్ కణ్ణుమల్, సల్మాన్ నిజార్ ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. రోహన్ 48 బంతుల్లోనే 87 పరుగులతో చెలరేగగా.. సల్మాన్ 49 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేరళ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 234 పరుగులు చేసింది.కాగా ముంబై బౌలర్లలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. ఏకంగా 69 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రమేశ్ రాహుల్ చెత్త రికార్డును సమం చేశాడు. కాగా రమేశ్ అరుణాచల్‌ప్రదేశ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 2 కో ట్ల కనీస ధరతో శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నాడు. అయితే, ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. ప్పుడిలా టీ20మ్యాచ్‌లో చె త్త ప్రదర్శన కనబరిచాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కేరళ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఆఖరి వరకు పోరాడింది. ఓపెనర్లు పృథ్వీ షా(23), అంగ్క్రిష్ రఘువంశీ(16) నిరాశపరచగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(18 బంతుల్లో 32) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న అజింక్య రహానే 35 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు.రహానే ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ హార్దిక్ తామోర్(23) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 191 పరుగులు చేయగలిగింది. దీంతో కేరళ 43 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఘన విజయం సాధించారు. ఇవాళ(గరువారం (నవంబర్ 28, 2024న)) ఆమె లోక్‌సభలో కసవు చీర ధరించి చేతిలో భారత రాజ్యంగ కాపీని పట్టుకొని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించి శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి వెలుగెత్తి చాటారు. ఈ కసవు చీరతో కేవలం కేరళ సంస్కాృతినే గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తుచేశారు ప్రియాంక. ఈ సందర్భంగా కసవు చీర, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!కసవు చీర అనేది కేరళలో ఉండే హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల నాటిది. ఏనుగు దంతాలతో కూడిన బంగారు కసవు చీరను పురాతన కాలంలో రాయల్టీకి చిహ్నంగా ప్రభువులు ధరించేవారు. మలయాళీ వేడుకల్లో అంతర్భాగం ఈ చీరలు. ఈ చీరతోనే అక్కడ అసలైన పండుగ వాతావరణ వస్తుంది. నిజానికి సాంప్రదాయ కసవు చీర చేతితో నేసిన పత్తితో తయారు చేస్తారు. అంతేగాదు దీనిలో నిజమైన బంగారం, వెండి దారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రంగు దారాలను చౌక ధరల్లో లభించేలా ఈ కసవు చీరలను నేస్తున్నారు. ఈ చీరకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. నిజానికి ఈ చీరలు నేయడం అత్యంత సంక్లిష్టత, నైపుణ్యంతో కూడిన చేనేత పని. ఈ చీరలు మూడు ప్రధాన చేనేత కేంద్రాలు బలరామపురం, చెందమంగళం , కుతంపుల్లిల వద్ద ప్రసిద్ధిగాంచింది. కుతంపుల్లి చీరల్లో జరీతోపాటు ఏనుగు దంతాకృతి ఉంటుంది. ఒక్కొసారి మానవ బొమ్మలు వంటి మూలాంశాలు ఉంటాయి. ఈ చీరకు ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటంటే మోహినియాట్టం వంటి నృత్య ప్రదర్శనల సమయంలో, కేవలం కసవు వస్త్రాలు మాత్రమే నృత్యకారులు ధరిస్తారు. ఇలా అలాగే కైకొట్టికళి, తిరువాతిరక్కళి వంటి నృత్యాలలో మహిళా ప్రదర్శకులు సాంప్రదాయ ఎరుపు బ్లౌజుతో కూడా కసవు చీరలను ధరిస్తారు.(చదవండి: ఫేస్ యోగా"తో..సెలబ్రిటీల మాదిరి ముఖాకృతి సొంతం!) -
కేరళకు రానున్న మెస్సీ బృందం
తిరువనంతపురం: అంతా అనుకున్నట్లు జరిగితే... భారత క్రీడాభిమానులు, కేరళ ఫుట్‌బాల్ ప్రేమికులు ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆటగాళ్ల విన్యాసాలు ప్రత్యక్షంగా చూస్తారు. రెండు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడేందుకు... స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు వచ్చే ఏడాది కేరళకు రానుందని ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దుల్ రహమాన్ బుధవారం ప్రకటించారు. ఈ మ్యాచ్‌లను కేరళ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని... వేదికతో పాటు, ప్రత్యర్థి జట్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే ఖతర్, జపాన్ జట్లను ఆహ్వానించాలనే ఆలోచన ఉందని ఆయన వివరించారు. ‘ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో కూడిన ప్రపంచ నంబర్‌వన్ ఫుట్‌బాల్ జట్టు అర్జెంటీనా వచ్చే ఏడాది కేరళకు రానుంది. ఆ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. దీనిపై అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంతో కలిసి త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేస్తాం’ అని రహమాన్ పేర్కొన్నారు. ఇటీవల స్పెయిన్ పర్యటన సందర్భంగా అర్జెంటీనా జాతీయ జట్టును ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. దీనికి ఆ జట్టు నుంచి సానుకూల స్పందన వచ్చిందని... త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు. మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని మంత్రి చెప్పారు. అయితే తమ షెడ్యూల్ ప్రకారం అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘమే భారత పర్యటనకు సంబంధించిన తేదీలను వెల్లడించనుందని పేర్కొన్నారు. అర్జెంటీనా ఆడనున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా 50 వేల మంది అభిమానులు చూసేలా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించే శక్తి సామర్థ్యాలు కేరళ ప్రభుత్వానికి ఉన్నాయని రహమాన్ పేర్కొన్నారు. రెండు మ్యాచ్‌ల నిర్వహణకు రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని స్పాన్సర్ల ద్వారా సమకూరుస్తామని ఆయన తెలిపారు. -
అంబులెన్స్‌కు దారివ్వని కారు.. షాకిచ్చిన పోలీసులు!
రోడ్డు మీద వెళ్లేటపుడు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. అయితే అంబులెన్స్ సౌండ్ వినిపించగానే ఎంతటివారైనా వెంటనే తమ వాహనాలను సైడ్‌కు తీసుకుంటారు. సినీ సెలబ్రిటీలైనా, రాజకీయ నేతలైనా.. చివరికి ప్రధాని, రాష్ట్రపతి అయినా సరే అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇస్తారు. కానీ ఓ ప్రబుద్దుడు అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు.దీంతో ఆ వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో నవంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేరళలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. చలకుడిలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. రోడ్డుపైకి వచ్చాక అన్ని వాహనాలు పక్కకి తొలగి అంబులెన్స్‌కు దారిచ్చాయి. కానీ ఓ కారు మాత్రం అంబులెన్స్ కు దారివ్వకుండా ఏకంగా రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది. అంబులెన్స్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నా, ఆ కారు ఓనర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ వ్యవహారాన్నంతా అంబులెన్స్ లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ఆ కారు యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదో గుర్తించిన పోలీసులు. నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. దాదాపు రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతడి లైసెన్స్ కూడా రద్దు చేశారు.A car owner in Kerala has been fined Rs/- 2.5 Lakh and their license has been cancelled for not giving away the path for an ambulance. pic.twitter.com/GwbghfbYNl— Keh Ke Peheno (@coolfunnytshirt) November 17, 2024 -
ఎనిమిదో వింత పక్షి మ్యూజియం
పక్షి మ్యూజియం అంటే... రకరకాల పక్షుల రూపాలు, వాటి రెక్కలు, గుడ్లు, పొదిగిన పిల్లల రూపాలను ఒక చోట పొందు పరిచిన మ్యూజియం కాదు. పక్షి ఆకారంలో ఉన్న మ్యూజియం. జటాయు పక్షి ఆకారంలో ఉన్న ఈ మ్యూజియం పరిమాణం కూడా జటాయువులాగ భారీగానే ఉంటుంది. రెండు వందల అడుగుల పొడవు, నూట యాభై అడుగుల వెడల్పు, డెబ్బై అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ మ్యూజియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ మ్యూజియం కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలో ఉంది. ఈ మ్యూజియాన్ని జటాయు ఎర్త్ సెంటర్ అంటారు. ఈ మ్యూజియం ఉన్న కొండ ప్రదేశాన్ని జటాయు నేచర్ పార్క్ అంటారు.జటాయు పురజటాయు నేచర్ పార్క్... కేరళ, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో కీలక పాత్ర జటాయువుది. ఆ ఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. నేచర్ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ మ్యూజియమ్ ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మాణం లోపల జటాయువు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోప్‌వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది.రామాయణం గొప్పదనం ఇదేవెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు. శిల్పకారుడు రాజీవ్ ఆంచల్ నిర్మించాడు. సీతాపహరణం సమయంలో రావణాసురుడిని అడ్డగించిన జటాయువును రావణాసురుడు సంహరించాడని రామాయణం చెబుతుంది. ఈ ఘట్టానికి వేదిక ఈ జటాయుపుర అని కేరళవాళ్లు చెప్పుకుంటారు. తెలుగు వాళ్లుగా మనం అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా చెప్పుకుంటాం. రామాయణం గొప్పదనం అది. దేశం అంతటా ప్రతి ఒక్కరూ కథను స్వాగతిస్తూ ఐడింటిఫై అవుతారు.జటాయుపుర... కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్ రైల్వేస్టేషన్ నుంచి పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకుని కారు అద్దెకిస్తారు. -
అంబులెన్స్ కు దారి ఇవ్వని కారు డ్రైవర్
-
వయనాడ్ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!
Updates వాయనాడ్‌లో సాయంత్రం 6 గంటల వరకు 64.27% ఓటింగ్ నమోదైంది. వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. వాయనాడ్ నియోజకవర్గంలో 64.27% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇది 72.92 శాతంగా ఉంది.కలపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 65.01%, సుల్తాన్ బతేరిలో 62.10%, మనంతవాడిలో 63.48%, తిరువంబాడిలో 66.05%, ఎర్నాడులో 68.97%, నిలంబూరులో 61.46%, వండూరులో 64.01% పోలింగ్ నమోదైంది. వయనాడ్‌లో పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.వాయనాడ్ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 1 గంటల వరకు 40% పైగా ఓటింగ్ నమోదైందివాయనాడ్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34.38 శాతం పోలింగ్ నమోదైంది#WayanadElection | Chanda, an 80-year-old woman of the Kallumala tribal settlement, after casting her vote at a booth at Meppadi in #Wayanad #Byelections2024 📸E.M. Manoj pic.twitter.com/PPDIf8unGL— The Hindu - Kerala (@THKerala) November 13, 2024 ఉదయం 11 గంటల వరకు వయనాడ్‌లో 27.04 శాతం పోలింగ్ నమోదైంది. #JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 29.31% voter turnout till 11 am, as per the Election Commission of India. #WayanadByElection2024 | Wayanad recorded 27.04% voter turnout till 11 am, as per the Election Commission of India. pic.twitter.com/ohjDBHolK3— ANI (@ANI) November 13, 2024 కేరళ: వయనాడ్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 9 గంటల వరకు వాయనాడ్‌లో 13.04 శాతం ఓటింగ్ నమోదైంది.#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India.#WayanadByElection2024 | Wayanad recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India. pic.twitter.com/5OI9p3Adtk— ANI (@ANI) November 13, 2024 కర్ణాటక:బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారుషిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు#WATCH | | Karnataka | BJP leader and Former CM Basavaraj Bommai casts his vote at a polling booth in Shiggaon, as voting in bypoll to the assembly constituency is underwayHis son Bharath Bommai is the BJP candidate for bypoll to the Shiggaon assembly constituency pic.twitter.com/x2ta1ZaFDw— ANI (@ANI) November 13, 2024 కేరళ:వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు.వయనాడ్ ప్రజలు చూపిన ప్రేమను తిరిగి చెల్లించడానికి, వారి కోసం పని చేయడానికి తమ ప్రతినిధిగా ఉండటానికి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేస్తారని ఆశిస్తున్నా #WATCH | Kerala: Congress candidate for Wayanad Lok Sabha by-elections Priyanka Gandhi Vadra says, "My expectation is that the people of Wayanad will give me the chance to repay the love and affection they have shown and to work for them and to be their representative. I hope… pic.twitter.com/LYg9Sgg4OE— ANI (@ANI) November 13, 2024 రాజస్థాన్: దౌసా అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ మురారీ లాల్ మీనా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.దౌసా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి దీనదయాళ్ బైర్వా, బీజేపీ నుంచి జగ్మోహన్ మీనాను బరిలోకి దిగారు.#WATCH | Dausa, Rajasthan: Congress MP from Dausa Murari Lal Meena casts his vote for the Dausa Assembly by-election.Congress has filled Deendayal Bairwa from the Dausa assembaly seat. BJP has fielded Jagmohan Meena from this seat. pic.twitter.com/0qtmoLyimy— ANI (@ANI) November 13, 2024 కేరళవయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మీడియాతో మాట్లాడారు.వయనాడ్ ప్రజలకు అట్టడుగు స్థాయిలో పని చేయగల, పార్లమెంటులో తమ సమస్యలను పరిష్కరించగల నేత కావాలి. కిట్లు, డబ్బు, మద్యం, అన్నీ అందించి ఈసారి ఓటర్లను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయం కాంగ్రెస్‌కు ఉంది#WATCH | Kerala: BJP candidate from Kerala's Wayanad Lok Sabha constituency, Navya Haridas says, "... People of Wayanad need a person who can work with them at the grassroots level and who can address their issues in Parliament and find solutions. Congress is trying to influence… pic.twitter.com/2TjyrKKiVx— ANI (@ANI) November 13, 2024 మధ్యప్రదేశ్:బుద్ని ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.సెహోర్‌లోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికే చౌహాన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Sehore: Kartikey Chouhan, son of Union Minister Shivraj Singh Chouhan shows his inked finger after casting his vote at a polling station in Sehore for Budhni by-elections. Kartikey Chouhan says "I would like to request everyone to come out and cast their votes. There… pic.twitter.com/FUrPIsYGur— ANI (@ANI) November 13, 2024 కర్ణాటక:చన్నపట్న అసెంబ్లీ ఉపఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.ఓటు వేయడానికి కర్ణాటకలోని చన్నపట్నాలోని పోలింగ్ స్టేషన్ వద్ద ప్రజలు క్యూ కట్టారు.ఎన్డీయే తరఫున ఈ స్థానం నుంచి జేడీఎస్ పార్టీ నేత నిఖిల్ కుమారస్వామి, కాంగ్రెస్ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీపీ యోగేశ్వర్ పోటీలో ఉన్నారు. #WATCH | Karnataka: People queue up at a polling station in Channapatna, Karnataka to vote for Channapatna Assembly by-electionsNDA has fielded JDS leader Nikhil Kumaraswamy from this seat; five-time MLA CP Yogeshwar is contesting against him on a Congress ticket pic.twitter.com/YO5DLC32Cp— ANI (@ANI) November 13, 2024 కేరళపాలక్కాడ్ అసెంబ్లీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. పశ్చిమ బెంగాల్: పశ్చిమ్ మేదినీపూర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శ్రీతికోన అరబింద హైస్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లో ఉన్నారు. కేరళ:వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు. ఛత్తీస్‌గఢ్:రాయ్‌పూర్ సిటీ సౌత్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.బీజేపీ మాజీ ఎంపీ, మేయర్ సునీల్‌కుమార్ సోనీని, కాంగ్రెస్ తరఫున యూత్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆకాశ్ శర్మను పోటీలో ఉన్నారు. #WATCH | Chhattisgarh: Voting underway for Raipur City South Assembly by-elections BJP has fielded Sunil Kumar Soni, a former MP and mayor, while Congress has fielded Akash Sharma, the president of the Youth Congress state unit. pic.twitter.com/KEDX8M4but— ANI (@ANI) November 13, 2024 అస్సాం:సమగురి అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటు వేయడానికి ప్రజలు నాగాన్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.#WATCH | Assam: People queue up at a polling station in Nagaon to vote for the Samaguri Assembly by-polls. pic.twitter.com/XH1fLEZPPu— ANI (@ANI) November 13, 2024 కేరళవాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలకు ఓటు వేయడానికి ప్రజలు వాయనాడ్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.#WATCH | Kerala: People queue up at a polling station in Wayanad to vote for the Wayanad Lok Sabha by-polls pic.twitter.com/lBF0ykyJNn— ANI (@ANI) November 13, 2024 మధ్యప్రదేశ్: షియోపూర్ జిల్లాలోని బుద్ని అసెంబ్లీలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.పోలింగ్ స్టేషన్ నంబర్ 170 ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల కొత్త భవనం (విజయపూర్) వద్ద పోలింగ్ ప్రారంభమైంది.#WATCH | Madhya Pradesh: Voting for the by-election to be held today in the Budhni assembly of Sheopur district. Preparations underway at polling station number 170 Government Higher Secondary School New Building Vijaypur. pic.twitter.com/SopzxUBWBH— ANI (@ANI) November 13, 2024 కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Voting has also begun in the by-elections for 31 assembly seats spread across 10 states, as well as for the Wayanad Lok Sabha constituency in Kerala. pic.twitter.com/muTcQsr2nx— ANI (@ANI) November 13, 2024 రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.ఆమెపై ఎల్డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారుఇక్కడ 14 లక్షల మంది ఓటర్ల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఈ రోజు(బుధవారం) 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్‌లో 7, పశ్చిమబెంగాల్లో 6, అస్సాంలో 5, బిహార్‌లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. -
సరికొత్త తూనీగ జాతి.. భలే వెరైటీగా ఉంది!
సన్నని వెదురు గొట్టం మాదిరిగా ఉండే సరికొత్త తూనీగ జాతిని కేరళలో పశ్చిమ కనుమల ప్రాంతంలో తాజాగా గుర్తించారు. దీని పొట్ట భాగం పొడవైన స్థూపాకృతిలో అచ్చం సన్నటి వెదురు గొట్టాన్ని తలపించేలా ఉంటుంది. అందుకే దీనికి అగస్త్యమలై బాంబూటెయిల్ (వెదురుతోక) అని పేరు పెట్టారు. దీని శాస్త్రీయనామం మెలనోనౌరా అగస్త్యమలైకా. ఇది మెలనోనౌరా జెనస్ కుటుంబానికి చెందినది. ఆ కుటుంబంలో వెలుగులోకి వచ్చిన రెండో జాతి ఇదని సైంటిస్టులు చెబుతున్నారు.ఈ తూనీగలు కేరళలో తిరువనంతపురం జిల్లాలో పెప్పర వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మంజడినిన్నవిల ప్రాంత పరిధిలో పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ వర్సిటీ, కేరళ క్రైస్ట్ కాలేజీ సైంటిస్టుల బృందం కంటబడ్డాయి. అనంతరం పొన్ముడి కొండల్లో కూడా వీటి ఉనికిని గుర్తించారు. మెలనోనౌరా కుటుంబంలో తొలి తూనీగ జాతిగా మలబార్ బాంబూటెయిల్ గుర్తింపు పొందింది. దాన్ని కూర్గ్–వయనాడ్ ప్రాంతంలో తొలుత గుర్తించారు.చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!వాటితో పోలిస్తే అగస్త్యమలై తూనీగ (Agasthyamalai Damselfly) జాతిలో దాదాపు 7 శాతం దాకా జన్యూపరమైన తేడాలున్నట్టు తేలింది. పొడవాటి నల్లని శరీరం, నీలిరంగు చారికలు దీని సొంతం. ఇంతటి జీవ వైవిధ్యానికి నిలయమైన పశ్చిమ కనుమలను మరింతగా సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని ఎంఐటీ వర్సిటీకి చెందిన డాక్టర్ పంకజ్ కోర్పడే అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వయనాడ్ బరిలో సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం) పోలింగ్ జరగనుంది. నిన్న(సోమవారం) వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా విజయం సాధించడంతో.. నిబంధనల రిత్యా వయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ సోదరిని పోటీకి దింపడం ద్వారా యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు.. సీపీఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.2019 నుంచి 2024 వరకు వయనాడ్ ఎంపీగా రాహుల్ పదవీకాలం, వయనాడ్ ప్రజల్లో ఆయనకున్న ఆదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారని ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకా గాంధీ గెలిస్తే.. ఆమె కూడా తన సోదరుడిలాగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోతారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ ప్రియాంకా గాంధీ.. తను క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన పలు కంపెనీల సిబ్బందితో భద్రత కల్పించినున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ప్రియాంకా గాంధీ నేపథ్యం..మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ. మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి.తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు.భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.సత్యన్ మొకేరి నేపథ్యం..సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. కోజికోడ్ జిల్లాలోని నాదపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. మొకేరి 1987 నుంచి 2001 వరకు కేరళ శాసనసభలో నాదాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2015లో ఆయన సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీకి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘాలతో మొకేరికి మంచి అనుబంధం ఉంది. ఆయన సుదీర్ఘ అనుభవం, వ్యవసాయ సమస్యల పట్ల నిబద్ధత వయనాడ్ ఓటర్లకు ప్రతిధ్వనిస్తుందని ఎల్డీఎఫ్ భావిస్తోంది.:::సాక్షి వెబ్ డెస్క్ -
‘కలెక్టర్ బ్రో’ సహా ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్
తిరువనంతపురం: కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటుపండింది. క్రమశిక్షణ ఉల్లంఘన కారణంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు ఐఏఎస్ అధికారులు కె గోపాలకృష్ణన్, ఎన్ ప్రశాంత్‌లను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినందుకు ఐఏఎస్ గోపాలకృష్ణను సస్పెండ్ చేయగా, సోషల్ మీడియాలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ఐఏఎస్ ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌కు ‘‘కలెక్టర్ బ్రో’’గా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది. అయితే.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. తన మొబైల్ ఫోన్‌ను గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని ఐఏఎస్ అధికారి కె. గోపాల్‌కృష్ణన్ అన్నారు. తన అనుమతి లేకుండా మతపరమైన వాట్సాప్ గ్రూపులను సృష్టించారని ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఐఏఎస్ అధికారి వాదనలను పోలీసు దర్యాప్తు అధికారి తోసిపుచ్చారు. ఆయన ఫోన్ హ్యాక్ చేయబడిందని తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పరికరాన్ని సమర్పించే ముందు గోపాలకృష్ణన్ మొబైల్ ఫోన్‌ను చాలాసార్లు రీసెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించినట్లు తెలిపారు. -
Priyanka Gandhi: సొంతబిడ్డల్లా సంరక్షిస్తా
వయనాడ్(కేరళ): కేరళలో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యరి్థగా బరిలో దిగిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం ప్రచారంలో పాల్గొన్నారు. పిల్లల ఆలనాపాలనా తల్లి ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా చూస్తుందో అదేరీతిలో తాను పౌరుల బాగోగులను పట్టించుకుంటానని ప్రియాంక వ్యాఖ్యానించారు. మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలాంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అకంపదం, పొథుకల్లు పట్టణాల్లో ప్రియాంక ప్రసంగించారు. ‘‘గెలిపించి నాకొక అవకాశం ఇస్తే మీ సమస్యలపై ఒక్క పార్లమెంట్లోనేకాదు వేర్వేరు సందర్భాల్లో ప్రతి ఒక్క భిన్న వేదికపై పోరాడతా. గతంలో గెలిపించిన రాహుల్‌పై వయనాడ్ ప్రజలకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నన్ను గెలిపిస్తే నా కుటుంబానికి ఇంత మద్దతుగా ఉన్న మీకందరికీ సాయపడతా’’అని ఓటర్లునుద్దేశించి అన్నారు. ‘‘మోదీ ప్రభు త్వం సాయం అందక వయనాడ్‌లోని కొండలు, గ్రామీణ ప్రాంత రైతులు, చిరువ్యాపారులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. బీజేపీ విభజన, విద్వేష రాజకీయాలే ఇందుకు కారణం’’అని అన్నారు. వయనాడ్ స్థానానికి నవంబర్ 13వ తేదీన పోలింగ్ జరగనుంది. -
Kerala: రూ.100 కోట్ల ముడుపుల కలకలం
తిరువనంతపురం: కేరళలోని ఎన్సీపీ (శరద్)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే థామస్ కె.థామస్ అధికార ఎల్డీఎఫ్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జనాధిపత్య కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంటోనీ రాజు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(లెనినిస్ట్) ఎమ్మెల్యే కొవూర్ కుంజుమోన్లకు థామస్ ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎల్డీఎఫ్లో భాగస్వాములు. ప్రతిగా ఈ ఎమ్మెల్యేలిద్దరూ ఎన్సీపీ(అజిత్)లో చేరడం, పినరయి విజయన్‌పై ఒత్తిడి తెచ్చి కేబినెట్లో స్థానం దక్కించుకునేందుకు పథక రచన జరిగిందని ఆరోపణలున్నాయి. జూన్ 5న థామస్ నుంచి ఈ మేరకు తమకు ప్రతిపాదన వచి్చందని మాజీ మంత్రి కూడా అయిన రాజు సీఎం విజయన్ చెవిన వేశారు. దీనిపై ఆయన కుంజుమోన్‌ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు. ఈ వ్యవహారం అక్టోబర్ 25న త్రిసూర్‌లో జరిగిన సీపీఎం సమావేశం సందర్భంగా బయటకు వచి్చంది. ఎల్డీఎఫ్ మిత్ర పక్షం ఎన్సీపీ(శరద్)వర్గం ఎమ్మెల్యే థామస్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం విజయన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి థామస్ కేబినెట్లో అటవీ శాఖను కోరుతున్నారు. అయితే, సీఎం విజయన్, సీపీఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న మంత్రి శచీంద్రన్ ఆ శాఖను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అందుకే, ఒక రకంగా సీఎం విజయన్‌పై ఒత్తిడి తేవడం ద్వారా కేబినెట్లో చేరేందుకు థామస్ వేసిన పథకంగా భావిస్తున్నారు. ఎన్సీపీ(అజిత్), బీజేపీలు మహారాష్ట్రలో మిత్రపక్షాలే కాబట్టి.. ఈ పథకమే ఫలించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్సీపీ(అజిత్)లో చేరితే కేరళలో బీజేపీకి పరోక్షంగా లాభం కలిగి ఉండేది. ఏదేమైనప్పటికీ, మంత్రి వర్గంలో చేరే అవకాశాన్ని ప్రస్తుతానికి థామస్ కోల్పోయినట్లుగానే భావిస్తున్నారు. ఈ పరిణామాలపై తమకెలాంటి సంబంధం లేదని కేరళలో ఎన్సీపీ(అజిత్)నేత మహ్మద్ కుట్టి స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఎన్సీపీ(శరద్)కమిటీ ఎదుట ఇటీవల థామస్ హాజరై, ముడుపుల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమిటీ త్వరలోనే ఎన్సీపీ(శరద్) జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పీసీ చాకోకు నివేదిక ఇవ్వనుంది. -
Ranji Trophy: చరిత్ర సృష్టించిన జలజ్ సక్సేనా
కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీలో 6000 పరుగులు సహా 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సక్సేనా 400 వికెట్ల మార్కును క్రాస్ చేశాడు. సక్సేనా బెంగాల్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 6000 పరుగుల మార్కును తాకాడు. యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ రాణా వికెట్ తీయడంతో సక్సేనా 400 వికెట్ల క్లబ్లో చేరాడు. సక్సేనా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. రంజీ కెరీర్లో అతనికి ఇది 29వ ఐదు వికెట్ల ఘనత. 37 ఏళ్ల సక్సేనా రంజీ చరిత్రలో 400 వికెట్లు తీసిన 13వ బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. 2005లో మధ్యప్రదేశ్‌తో తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను మొదలుపెట్టిన సక్సేనా.. ఆ రాష్ట్రం తరఫున 11 ఏళ్ల వ్యవధిలో 159 వికెట్లు, 4041 పరుగులు స్కోర్ చేశాడు. ఆతర్వాత 2016-17 సీజన్ నుంచి సక్సేనా కేరళ జట్టుకు మారాడు. ప్రస్తుతం సక్సేనా కేరళ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. కేఎన్ అనంతపద్మనాభన్ టాప్‌లో ఉన్నాడు. సక్సేనా గత రంజీ సీజన్లో దిగ్గజాల సరసన చేరాడు. భారత దేశవాలీ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) 9000 పరుగులు, 600 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సక్సేనాకు ముందు వినూ మన్కడ్, మదన్‌లాల్, పర్వేజ్ రసూల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. జలజ్ సక్సేనా విజృంభించడంతో (5/56) ఉత్తర్‌ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి 2, సర్వటే, కేఎమ్ ఆసిఫ్, అపరాజిత్ తలో వికెట్ పడగొట్టారు. యూపీ ఇన్నింగ్స్‌లో 10వ నంబర్ ఆటగాడు శివమ్ శర్మ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (21), సర్వటే (4) క్రీజ్‌లో ఉన్నారు. యూపీ బౌలర్లలో శివమ్ మావి, ఆకిబ్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. యూపీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేరళ ఇంకా 80 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: సెలెక్టర్లకు సవాలు విసిరిన శ్రేయస్ అయ్యర్.. వరుసగా రెండు సెంచరీలు -
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. ప్లాట్‌ఫాం మధ్యలో పడిన యువతి
తిరువనంతపురం: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నం చేసిన యువతి.. అదుపుతప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో పడిపోయారు. ఈ ప్రమాదం కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రమదంలో 19 ఏళ్ల యువతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పుదుచ్చేరి-మంగళూరు వీక్లీ రైలులో ఇరిట్టికి చెందిన యువతి.. తలస్సేరి నుంచి మంగళూరుకు వెళుతోంది. అయితే.. మధ్యలో కన్నూర్ రైల్వే స్టేషన్లో రైలు కాసేపు ఆగటంతో.. సదరు యువతి స్టేషన్లో ఉన్న షాప్‌లో స్నాక్స్ కొనుగోలు చేయడానికి దిగారు. కొనుగోలు చేస్తున్న సమయంలోనే రైలు కదటం గమనించిన యువతి.. పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా రైలు, ప్లాట్ఫారం మధ్య పడిపోయారు. ప్రయాణికులు, రైల్వే పోలీసులు, క్యాటరింగ్ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే డ్రైవర్‌కు సమాచారం అందించడంతో ఆమెను రక్షించేందుకు రైలును నిలిపివేశారు. ఆ యువతికి స్వల్ప గాయాలకు అవ్వటంతో.. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం రైల్వే అధికారులు.. ఆమె మరోక రైలులో ఎక్కించి మంగళూరుకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.கேரளா, கண்ணூர் ரயில் நிலையத்தில் ஓடும் ரயிலில் ஏற முயன்றபோது தடுமாறி நடைமேடைக்கும் ரயிலுக்கும் இடையில் விழுந்த இளம் பெண். உடனடியாக ரயில் நிறுத்தப்பட்டு பத்திரமாக மீட்டனர். Platform க்கும் train க்கும் இடைவெளி அதிகமா இருந்ததால் சிறு காயங்களுடன் அந்த பெண் உயிர் தப்பினார் pic.twitter.com/Qb7bVUHOBb— admin media (@adminmedia1) November 4, 2024 -
వయనాడ్ విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోంది: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ.. లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా.. వయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బతేరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కెనిచిరాలో సోమవారంప్రచారం చేశారు.‘‘ప్రజలకు తీరని బాధ కలిగించిన విపత్తును కూడా బీజేపీ రాజకీయం చేసింది. దేశం, ప్రజల ప్రయోజనాలు, దేశ రాజకీయాల గురించి ఆలోచించాల్సిన ప్రదేశంలో నిలబడి ఉన్నాం. కొండచరియలు విరిగిన జిల్లాలోని కుటుంబాలకు తగినంత సహాయం పంపిణీ చేయడంలో కేంద్రం విఫలమైంది. ఈ సమస్యపై పోరాడుతా. పార్లమెంటులో వయనాడ్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తే.. నేను మీ కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడి చూపిస్తా. ..నేను మీ సమస్యలను ప్రతిచోటా వినిపిస్తాను. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా. మీ అవసరాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గని పోరాటయోధురాలుగా మీ పక్కనే ఉంటా. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా.. ద్వేషం, కోపం, విభజన, విధ్వంసాలను బీజేపీ ఉపయోగిస్తుంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఇలా అనేక సమస్యలను పరిష్కరించటంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. బీజేపీ రాజకీయాలు ఇక్కడి సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించటమే లక్ష్యంగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఏకైక లక్ష్యం.. ఎంత ఖర్చు అయినా సరే అధికారంలో ఉండటం’’ అని అన్నారు.జూలైలో వయనాడ్‌లో చోటు చేసుకున్న కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సుమారు 200 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. వంద ఇళ్లు బురదలో కొట్టుకుపోయాయి. -
దేశంలో పలు స్థానాల్లో ఉపఎన్నిక తేదీ మార్పు
ఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పు చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 13న ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఆ తేదీని నవంబర్ 20కి మారుస్తూ ఈసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.By-polls in Assembly Constituencies in Kerala, Punjab and Uttar Pradesh rescheduled from November 13 to November 20 due to various festivities pic.twitter.com/P2eaNMDhzb— ANI (@ANI) November 4, 2024శ్రీ గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ (నవంబర్ 15), కల్పతి రాస్తోల్సవం (నవంబర్ 13-15), కార్తీక పూర్ణిమ (నవంబర్ 15), ప్రకాష్ పర్వ్ వంటి పండుగలను నేపథ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘంగా ఉప ఎన్నికల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, పంజాబ్‌లో నాలుగు, కేరళలో ఒకటి అసెంబ్లీ స్థానాలుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని మొత్తం 48 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉపఎన్నిక జరగనుంది. మరోవైపు.. కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌లో తేదీలో ఎటువంటి మార్పు లేదని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. -
కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పూరమ్ ఉత్సవాల సమయంలో అంబులెన్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వక ర్యాష్ డ్రైవింగ్‌తోపాటు మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద త్రిస్సూర్ ఈస్ట్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానిక సీపీఐ నేత కేపీ సుమేశ్ ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అభిజిత్ నాయర్, అంబులెన్సు డ్రైవర్‌ను నిందితులుగా చేర్చారు. పూరమ్ ఉత్సవాల వేదిక వద్దకు చేరుకునేందుకు వీరు పోలీసు ఆంక్షలను ధిక్కరిస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని సుమేశ్ ఆరోపించారు. మంత్రి సురేశ్ గోపీ ఈ ఆరోపణలను ఖండించారు. కారులో వస్తుండగా ప్రత్యర్థి పారీ్టల గూండాలు దాడి చేయడంతో అక్కడే ఉన్న అంబులెన్సులో ఉత్సవాల వేదిక వద్దకు చేరుకున్నట్లు చెప్పారు. -
రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం: రాహుల్
వయనాడ్: దేశంలో నేడు ప్రధానమైన పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆగ్రహం, విద్వేషంతో కాకుండా ప్రేమ, ఆప్యాయత, వినయంతో రాశారు. అంతటి విశిష్టమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పౌరులుగా మనం పొందుతున్న రక్షణ, దేశ ఔన్నత్యం తదితరాలకు రాజ్యాంగమే కారణభూతం’’ అన్నారు. కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని మనాంథావాడీలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, తన సోదరి ప్రియాంకా గాంధీ కోసం ప్రచారం చేశారు. ‘‘ప్రేమకు, విద్వేషానికి ఆత్మవిశ్వాసానికి, అభద్రతకు మధ్య నేడు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో నెగ్గాలంటే విద్వేషాన్ని, ఆగ్రహావేశాలను హృదయం నుంచి తొలగించుకోవాలి. ప్రేమ, అనురాగం, వినయాలను నింపుకోవాలి’’ అని సూచించారు. తన సోదరిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రియాంక కోసం తాను ఓట్లు అభ్యరి్థంచడం ఇదే తొలిసారని రాహుల్ గుర్తు చేశారు. తండ్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోదోషి అయిన నళినిని ఆప్యాయంగా హత్తుకున్న మంచి మనస్సు తన చెల్లిదన్నారు. ప్రేమ, సానుభూతి, మానవత్వంతో కూడిన ఇలాంటి రాజకీయాలే మనకు కావాలని ఉద్ఘాటించారు. రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదు. ‘‘మోదీ గురించి చెప్పీ చెప్పీ బోరు కొట్టేసింది. అందుకే ఆయన ప్రస్తావన తేవడం లేదు’’ అన్నారు. అనంతరం రాహుల్ అరీకోడు పట్టణంలో ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.సంపన్న మిత్రుల కోసమే ఆరాటంప్రధాని మోదీపై ప్రియాంక మరోసారి నిప్పులు చెరిగారు. కొందరు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. సంపన్న మిత్రుల సేవలో ప్రధాని తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మనాంథావాడీలో సభలో ఆమె ప్రసంగించారు. ‘‘పేదలకు మంచి చేయాలన్న ఆలోచన మోదీకి అస్సలు లేదు. ప్రజలకు మంచి విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలివ్వాలన్న ఉద్దేశం లేదు. దేశ ప్రజల మధ్య మోదీ సర్కారు చిచ్చుపెడుతోంది. వారిని విభజిస్తోంది. హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామిక సంస్థలను దెబ్బతీస్తోంది’’ అని ధ్వజమెత్తారు. -
వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ: ప్రియాంక గాంధీ
వయనాడ్: వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ అని ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇదే సమయంలో బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం కాకుండా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందంటూ కామెంట్స్ చేశారు.వయనాడ్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడుతూ..‘వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ. వయనాడ్ ప్రజలు అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏ మతానికి చెందిన వారైనా అందరూ కలిసి జీవించే భూమి వయనాడ్. పజాస్సి రాజా, తలక్కల్ చంతు, ఎడచెన కుంకన్ వంటి నాయకుల స్ఫూర్తి కలిగిన బలమైన చరిత్ర మీకు ఉంది. మీరు ఎల్లప్పుడూ సరైన దాని కోసం పోరాడారు. అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు.ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా ప్రియాంక.. తన వ్యాపార మిత్రుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలో నిరుద్యోగుల గురించి మోదీ సర్కార్ ఏనాడు ఆలోచించదు. మెరుగైన ఆరోగ్యం, విద్య కోసం కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే బీజేపీకి ఉండదు. ఏం చేసైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. ప్రజలను విడగొట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజాస్వామిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. అలాగే, రాహుల్ గాంధీని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకోవడంతో ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. కానీ, వయానాడ్ ప్రజలకు రాహుల్‌కు ఎప్పుడూ అండగానే ఉన్నారని ప్రశంసించారు.ఇదిలా ఉండగా.. వయనాడ్‌లో నవంబర్ 13వ తేదీన పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉండగా.. బీజేపీ తరఫున నవ్య హరిదాస్ పోటీలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. #WATCH | Wayanad, Kerala: Congress leader and party's candidate for Wayanad Lok Sabha by-election, Priyanka Gandhi Vadra says, "Modi ji's government works only for his big businessman friends. His objective is not to give you a better life. It is not to find new jobs. It is not… pic.twitter.com/l5fkrO7pGX— ANI (@ANI) November 3, 2024 -
కింగ్ చార్లెస్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!
కింగ్ చార్లెస్, కెమిల్లా దంపతులు ఇటీవల బెంగూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే రాజ దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కేరళలోని సౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ సెంటర్‌ని కూడా సందర్శించారు. అక్కడ దాదాపు ముప్పై ఎకరాల్లో ఉండే వెల్నెస్ రిట్రీట్‌లో మూడు రోజులు గడిపారు. అంతేగాదు అక్కడ జరిగే యోగా సెషన్లు, ధ్యానం, ఆయుర్వేద ప్రకృతి వైద్య చికిత్సలన్నింటిలోనూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కింగ్ చార్లెస్ అక్కడి వంటకాలకు ఎంతగానో ఫిదా అయ్యారు. అక్కడ ఆయన రెండు కేరళ వంటకాలను అమిత ఇష్టంగా తిన్నట్లు సమాచారం. అవేంటో చూద్దామా..కింగ్ చార్లెస్ కేరళ సంప్రదాయ కోడి గుడ్డు కూర, ఇడియప్పం ఎంతో ఇష్టంగా తిన్నారు. అవే కూరలు మరుసటి రోజు కూడా వడ్డించమని కోరారట. కింగ్ చార్లెస్ మనుసును దోచుకున్న రెండు రెసీపీల తయారీ విధానం, వాటి చరిత్ర గురించి సవివరంగా చూద్దామా..!.సాంప్రదాయ కేరళ గుడ్డు కూర..ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించే ఈ కూరని కేరళ పాకశాస్త్ర నిపుణులు చాలా ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. కొబ్బరిపాలు, కొబ్బరి నూనె, కొద్దిపాటి మసాల దినుసుల వేసి.. విలక్షణమైన రుచితో అందిస్తారు. ఇడియప్పం..ఇక ఇడియప్పం క్రీస్తూ శకం ఒకటొవ శతాబ్ద కాలం నుంచి గొప్ప చరిత్ర కలిగిన వంటకం. బియ్యం పిండిని న్యూడిల్స్ మాదిరిగా సతాంగై అనే ప్రత్యేక పరికరంలో ప్రెస్ చేసి ఆవిరిపై ఉడికిస్తారు. ఈ వంటకం సరిహద్దులు దాటి శ్రీలంక, మలేషియా, సింగపూర్ వంటకాల్లోకి కూడా ప్రవేశించడం విశేషం. అంతలా ఈ వంటకం ఎందరో ఆహరప్రియుల మనసులను గెలుచుకుంది. కాగా, కింగ్ చార్లెస్ దంపతులు అక్కడ క్యూరేటెడ్ వెల్నెస్ డైట్‌ని అనుసరించారు. గతంలో 2019లో ఇదే వెల్నెస్ రిట్రీట్‌లో కింగ్ చార్లెస్ 71 పుట్టిన రోజు జరుపుకున్నారు. అప్పటి నుంచే రాజ దంపతులు ఇక్కడ వంటకాలపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున..) -
డ్రాగన్ తోట : ఉపాయం ఉండాలేగానీ, నెలకు రూ.లక్ష ఈజీగా
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయిని కృషే నిదర్శనం. కొల్లం పట్టణానికి చెందిన రెమాభాయ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాయిల్ లెస్ పద్ధతిలో తమ ఇంటిపైనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ప్రారంభించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. నెలకు 500 కిలోల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వస్తోంది. కిలో రూ. 200కు విక్రయిస్తూ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 3 నెలలే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉంటుంది. రిటైరైన కొద్ది రోజులకే ఆమె తల్లి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆ వేదనలో నుంచి బయటపడటం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నారు. విదేశీ పండైన డ్రాగన్ సాగును ఇంటిపైనే ప్రారంభించారామె. నేలపైన పెంచడానికి ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేదు. అందుకే మేడపై రెండొందల లీటర్ల బ్యారళ్లు 50 పెట్టి, వాటిల్లో వంద డ్రాగన్ మొక్కల్ని పెంచుతున్నారు. మట్టి మోసుకెళ్లి ఇంటిపైన పెట్టటం నాకు కష్టం అనిపించి సాయిల్ లెస్ పద్ధతిని ఎంచుకున్నానని రమాభాయ్ అంటున్నారు. కొన్ని రెడ్, కొన్ని ఎల్లో రకం డ్రాగన్ రకాలను నాటారు. ఎక్కువైన నీరు బయటకు పోవటానికి బ్యారెల్‌కు అడుగున బెజ్జం పెట్టి.. అందులో ఆకులు, రంపపు పొడి, వరి గడ్డి ముక్కలు, బ్యారెల్‌కు 3 కిలోల చొప్పున కం΄ోస్టు ఎరువును దొంతర్లుగా వేశారు. వంద గ్రాముల బోన్ మీల్ కూడా కలిపి, మొక్కలు నాటారు. ఎండాకులు, కూరగాయ వ్యర్థాలు, చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఆల్చిప్పలతో సొంతంగా తయారు చేసుకునే ద్రవరూప ఎరువులను మొక్కలకు ఆమె అప్పుడప్పుడూ ఇస్తున్నారు. దీంతో మొక్కలు పోషకలోపాల్లేకుండా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తున్నాయని రమాభాయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు.‘ఏదైనా కంటెయినర్లో కిలో చేపలు, రొయ్యలు, పీతల డొప్పలకు కిలో బెల్లంతో పాటు బొప్పాయి పండ్ల తొక్కలు కలపాలి. ఎండ తగలకుండా నీడన ఉంచి అప్పుడప్పుడూ కలియదిప్పుతూ ఉంటే.. 90 రోజులకు సేంద్రియ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఆ బలంతో డ్రాగన్ మొక్కలు చక్కగా కాస్తున్నాయి’ అన్నారు రమాభాయ్. జెసిస్ వరల్డ్ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఆమె ప్రారంభించారు. సీజన్లో మా ఇంటిపైన 200–300 డ్రాగన్ పూలు కనువిందు చేస్తుంటే నా వయసు 60 నుంచి 20కి తగ్గిపోతుంది. బాధలన్నీ మర్చిపోతున్నా అంటున్నారామె సంతోషంగా! -
కేరళ నీలేశ్వరం ఆలయం సమీపంలో బాణాసంచా పేలుడు..
-
సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?
-
గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు
తిరువనంతపురం:కేరళలోని ఓ గుడిలో వేడుకల సందర్భంగా బాణసంచాకు ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. కాసర్గోడ్ నీలేశ్వరంలోని వీరర్కవు గుడిలో కాళియట్లం ఉత్సవాల్లో సోమవారం(అక్టోబర్ 28) అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 150 మంది దాకా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.గాయపడ్డవారిని కాసర్గోడ్, కన్నూర్, మంగళూరులలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. గుడిలో బాణసంచా నిల్వ చేసిన గదికి మంటలంటుకోవడం భారీ అగ్ని ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రమాదస్థలాన్ని సందర్శించారు. బాణసంచా నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలోనే వాటిని కాల్చాలన్న నిబంధనను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కలెక్టర్ చెప్పారు. #Kasargod Firecracker room caught fire at veerakaav temple https://t.co/3tqCteOJXf pic.twitter.com/4TU0dkLZOb— 𝖆𝖓𝖚𝖕 (@anupr3) October 28, 2024 ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం -
రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తృటిలో తప్పించుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఒక మహిళను కాపాడేందుకు సీఎం పినరయి కారు పైలెట్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేశారు. దీంతో సీఎం కాన్వాయ్‌లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప నష్టం వాటిల్లింది.ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ద్విచక్రవాహనం నడుపుతున్న ఒక మహిళ అకస్మాత్తుగా కుడి మలుపు తీసుకోవడాన్ని చూడవచ్చు. దీంతో ఆమె వెనుక ఉన్న తెల్లటి ఎస్యూవీ ఆగిపోయింది. తరువాత ఆ ఎస్యూవీ వెనుక వస్తున్న అంబులెన్స్‌తో సహా ఆరు ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.కొట్టాయం పర్యటన ముగించుకున్న సీఎం విజయన్ తిరిగి తిరువనంతపురం వస్తుండగా వామనపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం భద్రతా సిబ్బంది వెంటనే వాహనాల నుంచి దిగి పరిస్థితిని పరిశీలించారు. వైద్య సిబ్బంది కూడా అంబులెన్స్ నుండి బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాన్ని నడిపిన ఆ మహిళను పోలీసులు విచారిస్తున్నారు. ब्रेक लगाया..लेकिन बहुत देर हो गई थीVIDEO केरल की राजधानी से आया है. ये काफिला है मुख्यमंत्री पिनाराई विजयन की कारों का. स्कूटी सवार महिला जो दाएं मुड़ रही थी, उसको बचाने के चक्कर में आपस में भिड़ गईं काफिले की गाड़ियां.#Kerala #RoadAccident pic.twitter.com/hyKKwYANgx— NDTV India (@ndtvindia) October 28, 2024ఇది కూడా చదవండి: సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం? -
మదర్ థెరిసా మా ఇంటికి వచ్చారు: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె వయనాడ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తనకు మానవతవాది, నొబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాతో ఉన్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు.‘‘నాకు 19 ఏళ్ల వయసులో మా నాన్నగారు( మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) చనిపోయారు. ఆ సమయంలో మదర్ థెరిసా మా అమ్మను (రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ)ని కలవడానికి మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి నా గదిలో ఉన్నాను. ఆమె నన్ను కూడా కలవడానికి వచ్చి.. నా తలపై చేయి వేసి, నా చేతికి రోజరీ అందించారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను బాధలో ఉన్నానని ఆమె గ్రహించి ఉండవచ్చు. .. ఆమె నాతో 'నువ్వు వచ్చి నాతో పని చేయి' అని చెప్పారు. నేను ఢిల్లీలోని మదర్ థెరిసా ఆశ్రమంలో పనిచేశాను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఇదే తొలిసారి. ఆశ్రమంలో నాకు పని నేర్పించారు. బాత్రూమ్లు కడగడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను బయటికి తీసుకెళ్లడం. వారితో కలిసి పనిచేయడం ద్వారా నేను వారు ఎదుర్కొన్న బాధ, ఇబ్బందులు, సేవ చేయడం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగాను. ఒక సంఘం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకున్నా. ప్రజల అవసరాలు ఏంటో ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ సమస్యలేమిటో వినాలనుకుంటున్నా’’ అని ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో అన్నారు.ఏప్రిల్-జూన్ సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సీటులో గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ స్థానంలో కూడా విజయం సాధించారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇక.. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.చదవండి: రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ -
అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే..
దీపావళి వేడుకలను భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గురువారం(అక్టోబర్ 31) ఘనంగా చేసుకోనున్నారు. దీపావళి కోసం షాపింగ్ చేయడంతో సహా అన్ని సన్నాహాలు చాలా ముందుగానే ప్రారంభిస్తారు.దీపావళినాడు లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. అయితే మన దేశంలో దీపావళి జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగను దక్షిణ రాష్ట్రమైన కేరళలో జరుపుకోరు. కేరళలో కొచ్చిలో మాత్రమే దీపావళి జరుపుకుంటారు. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి అనేక కారణాలున్నాయి.మహాబలి అనే రాక్షసుడు కేరళను పరిపాలించేవాడు. అతన్ని ఇక్కడి ప్రజలు పూజిస్తారు. దీపావళి ఒక రాక్షసుని ఓటమిని గుర్తు చేస్తూ చేసుకునే పండుగ కావడంతో దీనిని ఇక్కడి ప్రజలు జరుపుకోరు. రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి చేసుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి రెండవ కారణం అక్కడ హిందువుల సంఖ్య తక్కువగా ఉండటం. అందుకే రాష్ట్రంలో దీపావళి సందడి కనిపించదు. కేరళతో పాటు తమిళనాడులో కూడా దీపావళి జరుపుకోరు. అక్కడ ప్రజలు నరక చతుర్దర్శిని వేడుకగా జరుపుకుంటారు. ఇది కూడా చదవండి: ‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’ -
వయనాడ్‌లో ఖర్గేకు అవమానం నిజమేనా? తేల్చేసిన కాంగ్రెస్
ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అవమానపరిచిందంటూ బీజేపీ చేసిన విమర్శలకు పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. డోర్ లాక్ అవ్వడం వల్ల ఆయన కొద్దిసేపు మాత్రమే బయట వేచి ఉన్నారని.. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఆయన లోపలే ఉన్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ చేస్తున్న విమర్శలు ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.తలుపుకి తాళం వేసి ఉండటం వల్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా లోపలికి వచ్చే ముందు కొన్ని నిమిషాలు వేచి ఉన్నారని వేణుగోపాల్ తెలిపారు. ‘బీజేపీ ఇలాంటి అబద్ధాలు ఎలా ప్రచారం చేస్తుంది?. సభ పూర్తయ్యాక కలెక్టరేట్‌కు చేరుకోగానే డోర్ మూసి ఉంది. తరువాత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ అక్కడికి వచ్చారు.. వారు కూడా కొన్ని నిమిషాలు వేచి చూసి లోపలికి వచ్చారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే కూడా వచ్చి తలుపు తాళం వేసి ఉండటంతో నిమిషంపాటు బయట వేచి ఉన్నారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాతే ప్రియాకం నామినేషన వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై, పార్టీపై బీజేపీ ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? ఇది సరైంది కాదు.’ అని పేర్కొన్నారు.కాగా వయనాడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తన తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే నామినేషన్ సమర్పణ సమయంలో ఖర్గేను అగౌరవ పరిచారని, రిటర్నింగ్ అధికారి గదిలోకి రానివ్వకుండా బయటే ఉంచారని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వేషాన్ని పెంచుకుంటోందని విమర్శించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా కాషాయ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
‘ప్రియాంక రోడ్డు షో.. సీజనల్ ఫెస్టివల్ లాంటిది’
తిరువనంతపురం: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా నిర్వహించిన రోడ్డు షోకు భారీగా ప్రజలు తరలిరావటంపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ విమర్శలు గుప్పించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రియాంకా గాంధీ రోడ్డు షోకు త్రిసూర్‌తో సహా ఇతర జిల్లాల ప్రజలను తరలించారని అన్నారు. అందుకే భారీగా జనాలు వచ్చారని తెలిపారు.‘‘షూటింగ్‌కు లేదా వయనాడ్‌లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పి ప్రజలను ప్రియాంక గాంధీ రోడ్డు షోకు తీసుకొచ్చారు. రోడ్‌షోకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావటం వెనక కారణం ఇది. ప్రియాంక గాంధీ వయనాడ్‌కు రావటం, రోడ్‌షో నిర్వహించటం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే వచ్చే ‘సీజనల్ ఫెస్టివల్’ లాంటిది. ప్రజలు అన్నీ గమనిస్తారు. ...ప్రముఖ రాజకీయ కుటుంబ నేపథ్యం ఆధారంగా మాత్రమే ప్రియాంకా గాంధీ అభ్యర్థి అయ్యారు. కానీ, నేను కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ప్రజల కోసం ఏళ్ల తరబడి పనిచేశా. అట్టడుగు స్థాయిలో పనిచేసి ప్రజాసేవలో అనుభవం సంపాదించా. ఒక అభ్యర్థి గొప్పతనానికి కుటుంబ ఆధిపత్యమే ప్రమాణమైతే.. దానికి నిదర్శనం ప్రియాంకా గాంధీ మాత్రమే. అయితే.. బీజేపీకి అలాంటి ప్రమాణాలు ఉండవు’’ అని అన్నారు. ఇక.. నవ్య హరిదాస్ ఇవాళ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. -
తొలిసారి పోటీ చేస్తున్నా, భారీ మెజారిటీతో గెలిపించండి: ప్రియాంక
తిరువనంతపురం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేడు(బుధవారం) వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు ముందు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి యూడీఎఫ్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.అనంతరం బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు. గత 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించానని, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరి మద్దతు తనకు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచమంతా తన సోదరుడికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో వాయనాడ్ ప్రజలు అండగా నిలిచారని అన్నారు. మీరు ఇచ్చిన మద్దతుతోనే ఆయన దేశంలో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేయగలిగారని ఆమె పొగిడారు.‘నా సోదరుడికి మద్దతుగా నిలిచిన మీ అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, కానీ నేను ఆయనకు, మీకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాను. వయనాడ్ నియోజకవర్గం సమస్యల గురించి నా సోదరుడు చెప్పాడు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా మీ సమస్యలు తెలుసుకుంటాను. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. వాయనాడ్‌లో భారీ మెజారిటీతో గెలిపించండి ’ ఆమె హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్ అని అన్నారు. దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారని, కానీ వాయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని చెప్పారు. ప్రియాంకాగాంధీ అధికారిక ఎంపీగా ఉంటే, తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని అన్నారు. ఇద్దరం కలిసి వాయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ ఎదుట ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. వయనాడ్‌లో ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేప అభ్యర్థి నవ్యా హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్డీఎఫ్ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.#WATCH | Kerala: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi arrives in Wayanad for the nomination filing of party's national general secretary and his sister, Priyanka Gandhi Vadra for Wayanad Lok Sabha by-elections. Visuals from Sultan Bathery. pic.twitter.com/EgCeMpGolL— ANI (@ANI) October 23, 2024 -
హనీమూన్ డెస్టినేషన్ : పడవింట్లో విహారం!
కేరళ ప్రకృతి సౌందర్యానికి నెలవు అని తెలిసిందే. ఈ సంగతిని గ్రహించిన కేరళ వాళ్లు గాడ్స్ ఓన్ కంట్రీ అనే విశేషణంతో పర్యాటకరంగాన్ని తమ వైపు తిప్పుకున్నారు. టూరిజమే ప్రధాన ఉ΄ాధి మార్గంగా ఉన్న ఉత్తరాఖండ్ వాళ్లు కూడా తమది దేవభూమి అని చెప్పుకుంటారు. ప్రకృతి వాళ్లకిచ్చిన ప్రివిలేజ్ అది. ఈ సీజన్లో కేరళలో చూడాల్సిన ప్రదేశం అలెప్పీ... అదే అళప్పుఱపడవింట్లో విహారంహౌస్బోట్ విహారం అళప్పుఱ ప్రత్యేకం. హనీమూన్ కపుల్ కోసం అందమైన హౌస్బోట్లుంటాయి. అరేబియా సముద్రంతోపాటు నదులు, చిన్న చిన్న నీటి పాయల్లో విహారం, భోజనం, రాత్రి బస కూడా హౌస్‌బోట్‌లోనే. కేరళ ఆహారం చేప లేకుండా ఉండదు. శాకాహారం కావాలంటే ముందుగా చెప్పాలి. కొబ్బరి నూనెతో వండిన వంటలు తేలిగ్గా జీర్ణమవుతాయి. కేరళలో సంతృప్తిగా భోజనం చేసినప్పటికీ మళ్లీ త్వరగా ఆకలి వేస్తుంది. జర్నీలో చిరుతిండి దగ్గరుంచుకోక తప్పదు. ఇక్కడ కొబ్బరి హల్వా, అరటి కాయ చిప్స్ రుచిగా ఉంటాయి. పర్యాటకులు కేరళలో కొబ్బరి నీటిని అమృతంలాగ తాగుతుంటే స్థానికులు మాత్రం థమ్స్ అప్, స్ప్రైట్ తాగుతుంటారు. ఇక్కడ మార్కెట్లో రకరకాల అరటిపండ్లు ఉంటాయి. తప్పకుండా రుచి చూడాలి. -
వయనాడ్ ఎవరది?.. డైనమిక్ లీడర్ నవ్య Vs ప్రియాంక
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. వయనాడ్‌ను దక్కించుకునేందుకు కాంగ్రెస్.. ప్రియాంక గాంధీని బరిలో నిలిపింది. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పోటీగా యంగ్ డైనమిక్ లీడర్, కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్‌ను ఖరారు చేసింది. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.ఇక, బీజేపీ నవ్య హరిదాస్(39) పేరును ఖరారు చేయడంతో ఆమె ఎవరు? ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. నవ్య ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. బీటెక్ చదవి ఉద్యోగం చేసిన నవ్య.. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీలో తన ముద్ర వేసి తక్కువ కాలంలోనే అందరి దృష్టిలో పడ్డారు. తాజాగా వయనాడ్ బరిలోకి టికెట్ పొంది బంపరాఫర్ దక్కించుకున్నారు.నవ్య హరిదాస్ రాజకీయ నేపథ్యం..👉నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు.👉బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు.👉నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు.👉బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.👉2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి.👉అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.👉నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.ఇదిలా ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది.Navya Haridas to take on PriyankaGandhi from the Wayanad Lok Sabha seat on a BJP ticket👍👍 pic.twitter.com/joo5dXrEhT— tsr. (@srikanth690935) October 19, 2024 -
వయనాడ్ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
తిరువనంతపురం : వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ దిగుతున్నట్లు కొద్ది సేపటి క్రితమే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ,కేరళ వయనాడ్.. ఈ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. విజయం సాధించారు. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూన్‌లో ప్రకటించారు. తాజాగా, అధికారికంగా ఏఐసీసీ అధికారికంగా వెల్లడించింది. కాగా, ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే, ప్రస్తుత పార్లమెంట్లో గాంధీ కుటుంబం నుంచి ఆమె మూడో ఎంపీ. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. -
జమిలి ఎన్నికల ఆలోచనను విరమించుకోండి: కేరళ తీర్మానం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించటంపై ఆలోచనను విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమాఖ్య నిర్మాణానికి హానికరమని తీర్మానంలో పేర్కొన్నారు.Kerala Legislative Assembly passed a resolution urging the central government to withdraw its proposed 'One Nation, One Election' reform, describing it as undemocratic and detrimental to the nation's federal structure.— ANI (@ANI) October 10, 2024కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా.ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం. -
బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్
కొచ్చి: కేరళ తొలి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిణి ఆర్ శ్రీలేఖ జేపీలో చేరారు. ధవారం తిరువనంతపురంలోని ఆమె నివాసంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్ర సమక్షంలో బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అధికారికంగా బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. శ్రీలేఖ.. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. రాష్ట్ర కేడర్‌లో మొదటి మహిళా ఐపీఎస్. ఇక.. 2020లో కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు. తన నివాసంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ నుండి అధికారికంగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించిన తర్వాత ఆమె అన్నారు.బీజేపీలో చేరిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘ 33 ఏళ్లు పార్టీలకతీతంగా ఐపీఎస్ అధికారిగా పనిచేశా. కానీ నా పదవీ విరమణ తర్వాత చాలా సమస్యలను దూరం నుంచి చూడటం ప్రారంభించా. ప్రజాసేవ చేయడానికి ఇదే అత్యుత్తమ మార్గమని నాకు అర్థమైంది. బీజేపీ పార్టీ ఆదర్శాలపై నాకు నమ్మకం ఉంది’ అని అన్నారామె. -
కేరళలో బస్సు ప్రమాదం.. ఇద్దరి మృతి
తిరువనంతపురం: కేరళలోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోజికోడ్ తిరువంబాడి ప్రాంతంలో కర్టాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని కాళియంబుజ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.#Kerala: A tragic accident occurred in Thiruvambadi, Kozhikode, on Tuesday when a KSRTC bus veered off course, hitting a culvert and plunging into the Kaliyambuzha River.The incident, which took place around 1:40 p.m., claimed the life of 63-year-old Rajeswari from… pic.twitter.com/sPyFzhmyAW— South First (@TheSouthfirst) October 8, 2024 నదిలో పడేముందు బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కోజికోడ్ మెడికల్ కాలేజీ, ఓమసేరీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారిలో అనక్కంపోయిల్కు చెందిన 63 ఏళ్ల రాజేశ్వరి వృద్దురాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. -
కార్డినల్‌గా కేరళ బిషప్
తిరువనంతపురం: కేరళకు చెందిన 51 ఏళ్ల మత ప్రబోధకుడు మాన్సిగ్నర్ జార్జ్ జాకబ్ కోవక్కడ్ను కార్డినల్‌గా ప్రకటిస్తూ పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 21 మందిని కార్డినల్స్‌గా పోప్ ప్రకటించినట్టు వాటికన్ సిటీ ఆదివారం వెల్లడించింది. రోమ్‌లో క్రిస్మస్ సీజన్ మొదలయ్యే డిసెంబర్ 8న వీరంతా కార్డినల్స్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. జాకబ్ నాలుగేళ్లుగా పోప్ అంతర్జాతీయ పర్యటనల కార్యక్రమాలను చూసుకుంటున్నారు. చంగనచెర్రీ సైరో–మలబార్ ఆర్క్డయాసిస్కు చెందిన జాకబ్ వాటికన్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. పలు దేశాల్లో వాటికన్ ‘దౌత్య’ కార్యాలయాల్లో పనిచేశారు. 1973లో తిరువనంతపురంలో జన్మించిన జాకబ్ 2004 జూలై 24న చర్చి ఫాదర్ అయ్యారు.కొత్తవారిలో 99 ఏళ్ల బిషప్ సైతం..కొత్తగా కార్డినల్స్‌గా ఎన్నికైన 21 మందిలో అత్యంత వృద్దుడు, 99 ఏళ్ల ఏంజిలో అసెర్బీ సైతం ఉన్నారు. ఈయన గతంలో వాటికన్ దౌత్యవేత్తగా పనిచేశారు. గతంలో ఈయనను కొలంబియాలో వామపక్ష గెరిల్లా దళాలు ఆరు వారాలపాటు బంధించాయి. 21 మంది కొత్త కార్డినల్స్లో అత్యంత తక్కువ వయసు వ్యక్తిగా 44 ఏళ్ల బిషప్ మైకోలా బైచోక్ ఉన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉక్రెయిన్ గ్రీకు కేథలిక్ చర్చిలో ఈయన సేవలందిస్తున్నారు. నిబంధనల ప్రకారం 120 మంది మాత్రమే కార్డినల్స్ కాగలరు. కానీ పోప్‌ఫ్రాన్సిస్ ఎక్కువ మందిని ఎంపికచేశారు. దీంతో కొత్తవారితో కలుపుకుని సంఖ్య 142కు పెరిగింది. -
టీ20 మ్యాచ్‌లో హైదరాబాద్‌ను గెలిపించిన ధృతి
బీసీసీఐ ఆధ్వర్యంలోని మహిళల అండర్–19 టీ20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం అందుకుంది. రాజ్‌కోట్‌లో కేరళ జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘సి’ మూడో లీగ్ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలుపొందింది. కేరళతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు సాధించింది. కావ్య (35; 6 ఫోర్లు), నిధి (25; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం.. 149 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 23 రన్స్ తేడాతో ఓటమిని చవిచూసింది.హైదరాబాద్ బౌలర్ కేసరి ధృతి 3.4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరో బౌలర్ వైష్ణవి యాదవ్ 2 వికెట్లు తీసుకుంది. ఇక ఆరు జట్లున్న గ్రూప్ ‘సి’లో హైదరాబాద్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తదుపరి ఆదివారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌తో హైదరాబాద్ తలపడనుంది.చదవండి: WT20 WC Ind vs NZ: కివీస్ ముందు తలవంచారు -
ఎంబీబీఎస్ పూర్తి చేయని వైద్యుడితో చికిత్స.. హార్ట్ పేషెంట్ మృతి
కేరళలో విషాదం నెలకొంది. వైద్యుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పూర్తి చేయని ఓ వైద్యుడు.. రోగికి గుండె ఆపరేషన్ చేయడంతో అతడు మరణించాడు. ఈ దారుణం కోజికోడ్ జిల్లాలో సెప్టెంబర్ 23న జరగ్గా.. మృతుడి కుమారుడు వైద్యుడి విద్యార్హతలపై ప్రశ్నించడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.వినోద్ కుమార్ అనే వ్యక్తి హార్ట్ పేషెంట్. కొన్ని రోజులుగా ఛాతీలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యం నిమిత్తం కోజికోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స చేసిన కాసేపటికి ఆయన మరణించారు. అనంతరం సంబంధిత వైద్యుడు(రెసిడెంట్ మెడికల్ అధికారి) కనీసం తన వైద్యవిద్యను పూర్తి చేయలేదనే విషయం మృతుడి కుమారుడు అశ్విన్‌కు తెలిసింది. 2011లో ఎంబీబీఎస్ కోర్సులో చేరగా.. ఇప్పటికీ ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పాస్ కాలేదని తేలింది. రెండు ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలను క్లియర్ చేయలేకపోయాడని తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైద్యుడిగా అర్హత లేని వ్యక్తిని వైద్యుడిగా ఎలా పనిచేయిస్తారని ప్రశ్నించారు. తన తండ్రి చావుకు వైద్యుడే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెసిడెంట్ మెడికల్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారుఅయితే ఆర్ఎంఓ వైద్యుడి అర్హతలను ధృవీకరించడంలో విఫలమైన ఆసుపత్రి యజమా న్యం.. అతడిని వెనకేసుకొని రావడం గమనార్హం. డాక్టర్‌ను అబూ అబ్రహం లూక్గా గుర్తించారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించారు. లూక్‌ని నియమించి ముందు అతని మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తనిఖీ చేసినట్లు ఆసుపత్రి మేనేజర్ పేర్కొన్నారు. తమతో పనిచేసే ముందు కోజికోడ్, మలప్పురంలోని చాలా ఆసుపత్రులలో పనిచేశాడని తెలిపారు.గతంలో తమ కంటే పెద్ద ఆసుపత్రులలో పనిచేయడంతో అపాయింట్మెంట్తో ముందుకు సాగినట్లు చెప్పారు. అతను నిజంగా మంచి వైద్యుడని, ఆయను అందుబాటులో లేకుంటే రోగులు వారి అపాయింట్మెంట్లను రద్దు చేసేవారని తెలిపారు. రోగులతో బాగా ప్రవర్తించేవాడని, ాలా గౌరవించేవాడని తెలిపారు. -
'కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా?
ఇడ్లీ అనంగానే తేలిగ్గా అరిగిపోయే వంటకం. చాలా సులభంగా జీర్ణమయ్యే అల్పాహారం కూడా. పేషెంట్లే కాదు, సామాన్య ప్రజల వరకు అందరూ బ్రేక్‌ఫాస్ట్ మొదటగా ఈ రెసిపీకే ప్రాధాన్యత ఇస్తారు. అంతలా ఇడ్లీలు అందరి మనసులో దోచుకున్న గొప్ప ప్రసిద్ధ వంటకంగా పేరుగాంచింది. అయితే వీటిని పలు రకాలుగా చేస్తారు. ఆయా ప్రాంతాల వారీగా చేసే విధానం మారుతుంటుంది. అందులోకి ఆరోగ్య స్ప్రుహతో మరింత ఆరోగ్యవంతంగా ఆస్వాదించే వైరైటీ ఇడ్లీలు కూడా మన ఆహారంలో భాగమైపోతుండటం మరింత విశేషం. అయితే ఇడ్లీలకే కింగ్‌గా పిలిచే వెరైటీ ఇడ్లీ వంటకం గురించి విన్నారా..?.ఇడ్లీలకే రాజుగా పేరుగాంచిన ఈ వంటకం కేరళలోని పాలక్కాడ్‌లోని గ్రామానికి చెందింది. ఈ ఇడ్లీలు మనం తినే ఇడ్లీలకు చాలా విభిన్నంగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు ఆకృతి పరంగా పెద్దవిగానూ మల్లెపువ్వులా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తయారు చేసే విధానం కూడా అత్యంత విభిన్నంగా ఉంటుంది. పాలక్కాడ్‌లోని రామస్సేరి గ్రామం కింగ్ ఆఫ్ ఇడ్లీలకు పేరుగాంచింది. ఈ ఇడ్లీలనే తినేందుకు పర్యాటకులు ఈ గ్రామానికి తరలి వస్తుంటారా..!. వీటిని పాన్కేక్ మాదిరిగా తయారు చేస్తారు.తయారు చేయు విధానం..మట్టికుండపై ఒక గుడ్డ కప్పి ఆవిరిపై ఉడకబెడతారు. 200 ఏళ్ల క్రితం తమిళనాడు, కాంచీపురం, తిరుపూర్, తంజావూర్ వంటి ప్రాంతాల నుంచి కొన్ని ముదలియార్ కుటుంబాలు కేరళకు రావడంతో ఈ వంటకం పుట్టుకొచ్చిందని స్థానికులు చెబుతుంటారు. వాళ్లంతా బతుకుదెరువు కోసం రామస్సేరి అనే చిన్న గ్రామానికి వచ్చి స్థిరపడటంతో ఈ వంటకం ఉనికిలోకి వచ్చిందని ఓ కథనం. ఆయా కుటుంబాల్లో మగవాళ్లంత చేనేత కార్మికులు కాగా, మహిళలు రుచికరంగా వంట చేసేవారట. అలా ఈ రామస్సేరి ఇడ్లీలు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఇడ్డీని తయారు చేసేందుకు ఉపయోగించే మెష్క్లాత్ ఇడ్డీని సమానంగా ఉడికేలా చేయగా, స్లీమింగ్ కోసం ఉపయోగించే మట్టికుండా ఆ ఇడ్లీలకు ఒక విధమైన రుచిని అందిస్తాయి. తయారీ..కావాల్సిన పదార్థాలు..కప్పుల బియ్యం (ఇడ్లీ బియ్యం మరియు ముడి బియ్యం)ఉరద్ పప్పు 1 కప్పు నీరు 1 కప్పు మెంతు గింజలు 1 స్పూన్ తగినంత ఉప్పునాలుగు గంటలు పైనే నానబెట్టిటన మినపప్పు, బియ్యం, మెంతులు కలిపి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఉప్పు వేసి కనీసం ఓ పది నుంచి 12 గంటలు వదిలేయాలి. ఆ తర్వాత ఇడ్లీల్లా మట్టిప్లేటులో పెద్ద మొత్తంలో పరుచుకుని మట్టికుండపై ఉడికిస్తే.. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రామస్సేరి ఇడ్లీలు రెడీ..!.(చదవండి: -
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
తిరువనంతపురం: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (ఎంపాక్స్) భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది. కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. .ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లోమంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు. అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చింది. దీంతో కేరళలో తొలి మంకీ పాక్స్ కేను నిర్ధారణైంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకిపాక్స్ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.చదవండి : మంకీపాక్స్ వైరస్ లక్షణాలు -
కేరళలో ఓనం...కోనసీమకి వరం
కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు వరి కంటే మక్కువగా కొబ్బరికి ప్రాధాన్యమిస్తారు. కొబ్బరికాయ దిగుబడి ఇక్కడ బాగుంది అనుకునేలోపే తమిళనాడు, కేరళ రూపంలో గట్టి సవాల్ ఎదురయ్యేది. దాంతో కాయ ఉన్నా.. సరైన ధర ఎన్నడూ లభించేది కాదు. కానీ ఇప్పుడు కేరళలో ఓనం పండుగ వచ్చి అక్కడి కాయ అక్కడికే సరిపోతోంది. తమిళనాడు, కర్నాటకల్లో సరైన దిగుబడి లేకపోవడం, ఉత్తరాదిన దసరా, దీపావళి, కార్తికమాసం రూపంలో పండగలు క్యూ కట్టడంతో కోనసీమ కొబ్బరికి, రైతులకు ముందే పండగొచ్చింది. సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కేరళలో ఓనం పండుగ... తమిళనాడులో కొబ్బరికాయ అందుబాటులో లేకపోవడం... కోనసీమ కొబ్బరి రైతులకు పండగ వచ్చింది. కొబ్బరికాయ ధర రికార్డ్ స్థాయిలో పెరగడంతో వారికి దసరా... దీపావళి పండగ ముందే వచ్చింది. కొబ్బరి వెయ్యి కాయల ధర సైజును బట్టి రూ.17,500ల నుంచి రూ.18 వేల వరకు పలుకుతుంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ చరిత్రలో ఇది ఆల్ టైమ్ హై. కొబ్బరి ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులకు ముందే దసరా, దీపావళి పండగ వచ్చినట్టయింది. వరుస పండగల నేపథ్యంలో కొబ్బరి ధరలు అనూహ్యంగా పెరిగాయి. నెల రోజుల క్రితం వెయ్యి కొబ్బరికాయల ధర రూ.8,500 మాత్రమే ఉండేది. తర్వాత నెమ్మదిగా పెరుగుతూ ఆగస్టు నెలాఖరు నాటికి రూ.10,500కు చేరింది. వినాయక చవితి సమయానికి రూ.11,500 నుంచి రూ.12 వేల వరకు ధర రావడంతో రైతులు చాలా వరకు కోలుకున్నారు. కానీ గత వారం రోజుల నుంచి ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది, తమిళనాడు, కర్ణాటకల్లో కొబ్బరి దిగుబడులు తక్కువగా ఉన్నాయి. కేరళలో ఓనం పండగ కారణంగా స్థానికంగా కొబ్బరి వినియోగం ఎక్కువగా ఉంది. దీనితో ఆ రాష్ట్రం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు మందగించాయి. ఈ కారణంగా ఉత్తరాది మార్కెట్ అవసరాలను ఉమ్మడి గోదావరి జిల్లాల కొబ్బరి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల గతంలో ఎన్నడూ లేనంత ధర రావడం విశేషం. విజయదశమి, దీపావళి, కార్తికమాసం దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లోని కొబ్బరి అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కొబ్బరి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. సాధారణంగా ఈ రాష్ట్రాలకు డొక్క ఒలిచిన కొబ్బరి ఎగుమతి అవుతుంటుంది. కానీ ఈసారి డొక్కా ఒలుపు చేయని కాయను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. రాసుల రూపంలో రూ.18 వేల వరకు ధర ఉండగా 60 రకం (పెద్ద కాయ) డొక్కతో వెయ్యి కాయలు ధర రూ.20 వేలు పలుకుతుంది. ఏడేళ్ల తర్వాత రికార్డు ధర ఏడేళ్ల తర్వాత కొబ్బరికాయకు రికార్డు స్థాయి ధర వచ్చింది. 2017లో కొబ్బరికాయకు జాతీయ మార్కెట్లో రూ.17 వేల ధర రాగా ఈసారి అంతకుమించి ధర పలుకుతుండటం విశేషం.మార్కెట్లో ఈ స్థాయి ధర రావడం అరుదైన విషయమని కొబ్బరి రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరికాయతో పాటు మిగిలిన కొబ్బరి ఉత్పత్తుల ధరలు సైతం పెరిగాయి. ప్రస్తుతం పాత కురిడీ కాయ గండేరా వేయింటికి రూ.14 వేలు, గటగటా రూ.17,500, కురిడీ కొత్త కాయ గండేరా రూ.13 వేలు, గటగట రూ.15,500 పలుకుతుంది. -
EY మహిళా ఉద్యోగి మృతి : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల దుమారం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పని ఒత్తిడి కారణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY)సంస్థలో 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ మృతిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అంతర్గత బలం అవసరమని, ఇది దైవత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. దీనిపై అనుచిత వ్యాఖ్యలు అంటూ ప్రతిపక్ష నాయకులతో సహా పలువురు సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు.చెన్నై మెడికల్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.ఈ సందర్భంగా అన్నా సెబాస్టియన్ కేంద్ర మంత్రి స్పందిస్తూ ఇంటి నుండి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు నేర్పించాలని, దేవునిపై ఆధారపడటం ద్వారా మాత్రమే ఒత్తిడిని ఎదుర్కోవచ్చని అన్నారు. ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి అంతర్గత శక్తి ఉండాలని పేర్కొన్నారు. “భగవంతుని నమ్మండి, మనకు భగవంతుని అనుగ్రహం ఉండాలి. దేవుణ్ణి వెతకండి, మంచి క్రమశిక్షణ నేర్చుకోండి. మీ ఆత్మ శక్తి దీని నుండి మాత్రమే పెరుగుతుంది. పెరుగుతున్న ఆత్మశక్తితోనే అంతర్గత బలం వస్తుంది...విద్యా సంస్థలు దైవత్వం మరియు ఆధ్యాత్మికతను తీసుకురావాలి. అప్పుడే మన పిల్లలకు అంతర్గత బలం వస్తుంది. అది వారి ప్రగతికి, దేశాభివృద్ధికి దోహదపడుతుంది. అదే నా దృఢమైన నమ్మకం,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు అంబానీ, అదానీ దిగ్గజాల బాధ తప్ప సామాన్యుల బాధ కనిపించదు, ఎన్నో ఆశలతో వస్తున్న అన్నా లాంటి యువకులు కార్పొరేట్ కంపెనీల దోపిడీకి బలైపోతున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ), కెసి వేణుగోపాల్ ట్వీట్ చేశారు. Dear Nirmala Sitaraman ji,Anna had inner strength to handle the stress that came with pursuing a gruelling Chartered Accountancy degree. It was the toxic work culture, long work hours that took away her life which needs to be addressed. Stop victim shaming and atleast try to be… pic.twitter.com/HP9vMrX3qR— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 23, 2024 చార్టర్డ్ అకౌంటెన్సీ డిగ్రీని చదవడంలోనే అన్నా అంతర్గత బలం ఎంతోఉంది. కానీ విషపూరితమైన పని సంస్కృతి, సుదీర్ఘ పని గంటలు ఆమె జీవితాన్ని నాశనం చేశాయి. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. బాధితురాలిని అవమానించడం ఆపండి, కనీసం కొంచెం సున్నితంగా ఉండటానికి ప్రయత్నించండి, మీరు కోరుకుంటే దేవుడు మార్గనిర్దేశం చేస్తాడు అంటూ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. అటు అన్నా సెబాస్టియన్ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ చేపట్టింది. పని భారం వల్లే అన్నా మృతి చెందిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్, ఈ వ్యవహారంలో స్వయంచాలకంగా విచారణ ప్రారంభించింది. నాలుగు వారాల్లోగా సమగ్ర దర్యాప్తు నివేదికను అందజేయాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖను కూడా కమిషన్ ఆదేశించింది. దీనిపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విచారణ జరుపుతోంది.కాగా ఎర్నాకులం కున్నప్పిల్లికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిలో నాలుగు నెలలకే, తీవ్ర ఒత్తిడి, గుండెపోటుతో మరణించింది. దీంతో ఆమె తల్లి కంపెనీ చైర్మన్‌కు ఈమెయిల్ రావడంతోఈ విషయంలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
ఆహార భద్రత సూచిక 2024: మరోసారి అగ్రస్థానంలో ఆ రాష్ట్రం!
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆహార భద్రతను మెరుగుపరచడం అత్యవసరం. భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నందున ఇది మరింత ముఖ్యం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విడుదల చేసిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ (SFSI) 2024 ర్యాంకింగ్‌లో మరోసారి కేరళ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ సూచీలో వరుసగా రెండోసారి తొలిస్థానం దక్కించుకుంది. గతేడాది రెండోస్థానంలో ఉన్న తమిళనాడు ఈసారి మొదటి స్థానానికి ఎగబాకింది. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, నాగాలాండ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకుర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఫేస్బుక్ పోస్ట్‌లో.. "కేరళ జాతీయ స్థాయిలో ఆహార భద్రతలో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆహార భద్రతా సూచికలో జాతీయ స్థాయిలో కేరళ వరుసగా రెండవ సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌లో గతేడాది కూడా మొదటి స్థానంలోనే నిలిచింది కేరళ. ఈ విషయంలో ప్రాసిక్యూషన్ కేసులు, గుర్తింపు పొందిన ల్యాబ్‌ల సంఖ్య, ల్యాబ్‌లలో అత్యుత్తమ పరీక్ష, మొబైల్ ల్యాబ్‌ల పనితీరు, శిక్షణ , అవగాహన కార్యకలాపాలు మొదలైనవి కేరళను అగ్రస్థానంలో నిలిపాయి. అలాగే కేరళ ఈ విజయాన్ని దక్కించుకోవడంలో కృషి చేసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ అభినందనలు. అని పోస్ట్‌లో పేర్కొన్నారు వీణా జార్జ్. ఈ ఆహార భద్రతా సూచీ అనేది రాష్ట్రాల ఐదు కీలక పారామితులపై అంచనా వేస్తుంది. మానవ వనరులు, సంస్థాగత డేటా, సమ్మతి, ఆహార పరీక్ష-మౌలిక సదుపాయాలు, నిఘా, శిక్షణ, సామర్థ్యం పెంపు, వినియోగదారుల సాధికారత. ఆహార సంబంధిత వ్యాధులు, న్యూట్రాస్యూటికల్ భద్రత, ఆహారంలో ప్లాస్టిక్‌ల వల్ల ఎదురవుతున్న సవాళ్లను దృష్ట్యా..నేటి ప్రపంచంలో ఫుడ్ రెగ్యులేటర్ల ప్రాముఖ్యత పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నొక్కి చెప్పారు. అంతేగాదు ఫుడ్ సేఫ్టీ విషయంలో నిరంతర సహకారం, ఆవిష్కరణలు, మెరుగుదల తదితరాల ఆవశ్యకత గురించి హైలెట్ చేశారు.(చదవండి: ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!) -
పని.. ప్రాణం మీదకు, ‘అన్నా’ మృతిపై ఎవరేమన్నారంటే!
‘ల్యాప్‌టాప్ అనేది నా శరీరంలో ఒక భాగం అయింది’ ఇచట, అచట అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆఫీసు పనిలో తలమునకలయ్యే ఉద్యోగి మాట ఇది. ‘మాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు’ అని కవి అన్నట్లు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్న చాలామంది ఉద్యోగులకు జీవితం లేకుండాపోతోంది. పని కోసం జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తోంది.26 ఏళ్ల తన కుమార్తె మరణానికి ‘అధిక పనిభారం’ కారణం అని ఆరోపిస్తూ ఆమె తల్లి ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ చైర్మన్‌కు రాసిన లేఖ ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది. విషపూరిత పని సంస్కృతిని ఎత్తి చూపేలా ఉన్న ఈ లేఖపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది...కొచ్చికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ కొన్ని నెలల క్రితం పుణెలోని ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ కంపెనీలో చేరింది. అధిక పనిభారం కారణంగా అన్నా సెబాస్టియన్ ఆరోగ్యం త్వరగా క్షీణించిందని ఆమె తల్లి అనితా అగస్టీన్ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ హెడ్ రాజీవ్ మెమానికి రాసిన లేఖలో ఆరోపించింది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో అన్నా సెబాస్టియన్ చాలా సంతోషించింది. అయితే ఆ సంతోషం కొద్ది నెలల్లోనే ఆవిరై΄ోయింది. ‘అధిక పని వల్ల రాత్రి ΄÷ద్దు΄ోయే వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేది. ఎప్పుడూ అలిసి΄ోయి కనిపించేది’ అని కుమార్తె గురించి రాసింది అనిత అగస్టీన్.‘నా బిడ్డ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లిస్తుందని అనుకోలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అయింది అనిత. ‘ఎక్స్’లో ఆమె రాసిన లేఖకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అనిత అగస్టీన్ లేఖ నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో, అన్నా మృతికి సంతాపం తెలుపుతూ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చింది.అయితే వారి హామీ నెటిజనుల ఆగ్రహాన్ని తగ్గించలేదు.‘కంపెనీ నుండి ఎవరూ నా కుమార్తె అంత్యక్రియలకు హాజరు కాలేదు’ అంటూ అనిత వెల్లడించిన తరువాత నెటిజనుల కోపం మరింత ఎక్కువ అయింది. ‘కంటి తుడుపు మాటలు కాదు కార్యాచరణ ముఖ్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనితా అగస్టీన్ లేఖపై కళాకారులు, రచయితలు స్పందించారు. ‘చిన్న వయసులోనే కూతురుని కోల్పోయిన అనితను చూస్తుంటే, ఆమె రాసిన లేఖ చదువుతుంటే కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా మారింది. ఆమె అంత్యక్రియలకు హాజరు కావాలనే కనీస మర్యాద లేని యజమానులు ఉండడం సిగ్గు చేటు. కార్పొరేటు శక్తుల కోసం మీ ఆరోగ్యాన్ని, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు’ అని స్పందించింది రచయిత్రి నందితా అయ్యర్. ఒకానొక సమయంలో రోజుకు 14 గంటలకు పైగా పనిచేసిన సింగర్ పౌశాలి సాహు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంది.‘అన్నా సెబాస్టియన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు భారం అవుతోంది. నా గత కాలం గుర్తుకు వస్తుంది. తీరిగ్గా కూర్చోలేని పని ఒత్తిడి... చివరికి వీకెండ్స్‌లో కూడా పనిచేయాల్సి వచ్చేది. అప్పటి పనిభారం ఇప్పటికీ ఏదో రూపంలో నాపై ప్రభావం చూపుతూనే ఉంది’ అంటూ స్పందించింది పౌశాలి సాహు.‘మన దేశంలో పని భారం భయంకరంగా ఉంది. వేతనం నిరాశాజనకంగా ఉంది. నిత్యం కార్మికులను వేధిస్తున్న యజమానులలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అని ఒక యూజర్ స్పందించాడు. అన్నా సెబాస్టియన్ మరణం హాస్టల్ కల్చర్, విషపూరిత పని ప్రదేశాల ప్రమాదాల గురించి కూడా చర్చను రేకెత్తించింది. -
పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం
ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్, పని ఒత్తిడి కారణంగా చనిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్త మైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరయిల్ కంపెనీలో పని ఒత్తిడిని తట్టుకోలేకే చనిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదును స్వీకరించి, మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనుంది.కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిర్యాదును స్వీకరించిందని దర్యాప్తు జరుగుతోందని కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎక్స్లోతెలిపారు. ఆ సందర్బంగా తల్లి అగస్టీన్‌కు జరిగిన నష్టంపై తీవ్ర విచారం వ్యక్తి చేశారు. రక్షణలేని దోపిడీ పని పరిస్థితుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుతో న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ట్వీట్ చేశారు. Deeply saddened by the tragic loss of Anna Sebastian Perayil. A thorough investigation into the allegations of an unsafe and exploitative work environment is underway. We are committed to ensuring justice & @LabourMinistry has officially taken up the complaint.@mansukhmandviya https://t.co/1apsOm594d— Shobha Karandlaje (@ShobhaBJP) September 19, 2024అన్నా మరణం చాలా బాధాకరమైందంటూ బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోస్ట్‌పై ఆమె స్పందించారు. (ఇదీ చదవండి: నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)కాగా ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన తన కుమార్తె, కంపెనీలో పని భారాన్నిభరించలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక క్షోభంతో చనిపోయిందంటూ కంపెనీ ఛైర్మన్ రాజీవ్ మెమానికి బాధితురాలి తల్లి అన్నాఅగస్టీన్ ఈమెయిల్ సమాచారం అందించింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా ఎవరూ రాలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలు కార్పొరేట్ కంపెనీల్లో పనిపరిస్థితులపై చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
దేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదు
తిరువనంతపురం: భారత్‌లో మంకీపాక్స్ రెండో కేసు నమోదైంది. ఇటీవలే యూఏఈ నుంచి కేరళ వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య మంత్రి వీనా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం మంకీపాక్స్ సోకిన వ్యక్తికి మలప్పురంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.ఆ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో మంకీపాక్స్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ కాగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.మంకీపాక్స్ కొత్త వేరియెంట్ బయటపడడంతో ఆగస్టులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ అత్యవసర స్థితిగా ప్రకటించింది. ఇదీచదవండి..50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూపు కనిపెట్టిన సైంటిస్టులు -
నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ
కష్టపడి చదవి, మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకోవాలని ఆశపడింది కలలు కనింది 26 ఏళ్ల యువతి. కానీ ఆశలన్నీ ఆవిరై తన తల్లిదండ్రులకే తీరని శోకాన్ని మిగల్చబోతున్నానని కలలో కూడా ఊహించి ఉండదు. ఎన్నో ఆశలతో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడంతో యువతి తల్లి తీరని విషాదంలో మునిగిపోయింది. పని ఒత్తిడితో, తన బిడ్డ కలల్ని, జీవితాన్ని నాశనం చేశారు, తనలాగా మరే తల్లికి ఇలాంట దుర్గతి పట్టుకూడదంటూ కంపెనీ చైర్మన్‌కి పంపిన ఈమెయిల్లో ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు..కేరళకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరైల్ బహుళజాతి సంస్థ ఎర్నెస్ట్ & యంగ్, EYలో ఉద్యోగంలో చేరింది. తొలి ఉద్యోగం కావడంతో చాలా కష్టపడి చేసింది. ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలని రాత్రింబవళ్లు పనిచేసి తన టార్గెట్‌ను పూర్తి చేసింది. అయినా ఆమె మేనేజర్ చేసిన ఒత్తిడిని ఆమె గుండె తట్టుకోలేకపోయింది. ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే 26 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. తన బిడ్డ విషాదాంతానికి కారణం పని ఒత్తిడే అంటూ అన్నా తల్లి, అనితా అగస్టిన్ ఆ కపెంనీ ఛైర్మన్ ఇండియా చీఫ్ రాజీవ్ మెమనికి ఇమెయిల్ రాశారు. తన కుమార్తె మరణానికి దారితీసిన పరిస్థితులపై తన బాధను వ్యక్తం చేశారు. దీంతో కంపెనీలో ఉద్యోగుల పనిపరిస్థితులపై చర్చకు దారి తీసింది. ఆసియా దేశాల్లోఅంతే,టాక్సిక్‌కల్చర్, దుర్మార్గం అంటూ సోషల్ మీడియా యూజర్లు మండి పడుతున్నారు. ఈమెయిల్ అన్నా తల్లి బరువెక్కిన గుండెలతో రాసిన ఈమెయిల్ సమాచారంలో అందించిన వివరాల ప్రకారం అన్నా సెబాస్టియన్ పెరైల్ బాల్యం నుంచీ చాలా తెలివైనది. చిన్నప్పటి నుంచీ చదువులో,ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో రాణించింది. స్కూల్ టాపర్, కాలేజీ టాపర్. అంతేకాదు సీఏ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ‘‘నా బంగారు తల్లిని పొగొట్టుకున్నాను. నేను ఇంకొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆరోగ్యం, జీవితం కన్నా, ఏదీ ఎక్కువ కాదని ఆమెకు నచ్చజెప్పి, బిడ్డను కాపాడుకోవలసింది. ఈ బాధతోనే ఈ లేఖ రాస్తున్నా.. ఆమె గురించి రాస్తోంటే.. నా గుండె బద్దలవుతోంది. నా శోకం, బాధ మరే కుటుంబానికి రాకూడదనే ఇది రాస్తున్నాను.2023 నవంబరులో సీఏ పాస్ అయింది. 2024 మార్చి19న పూణేలో ఉద్యోగంలో చేరింది. అంత గొప్ప కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు పొంగిపోయింది. ఉద్యోగంలో చేరిన కంపెనీ కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. పగలూ, రాత్రి, చివరికి ఆదివారాలు కూడా పని చేసేంది. ఉద్యోగం, ఊరు, భాష అన్నీ కొత్త అయినా సర్దుకుపోవడానికి ఆమె చాలా ప్రయత్నించింది.పడుకున్నా, కూర్చున్నా పనిధ్యాసే. సరిగా తిండి లేదు. నిద్ర లేదు. అంతులేని ఒత్తిడిని భరించింది. శారీరకంగా, మానసికంగా అలిసిపోయినా, కష్టపడి పనిచేయడం, పట్టుదల విజయానికి కీలకమని నమ్ముతూ నెట్టుకుంటూ వచ్చింది. ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా, వారాంతాల్లో కూడా అర్థరాత్రి వరకు పని చేసి, చేసి చివరికి ఆ ఒత్తిడితోనే నాలుగు నెలల తర్వాత, జూలై 20 శాశ్వతంగా నాకు దూరమైపోయిందన్న వార్త విన్నాక నా ప్రపంచం కుప్పకూలింది. 26 ఏళ్లకే నా బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయి. కనీసం ఆమె అంత్యక్రియలకు కంపెనీ తరపునుంచి ఒక్కరుకూడా రాలేదు. ఇదింకా నన్ను బాధించింది.జూలై 6వ తేదీన నేను, నాభర్త సీఏ కాన్వకేషన్ కోసం పూణే వచ్చాం. అప్పుడే గుండెల్లో ఏదో భారంగా ఉందని చెప్పింది అన్నా. డాక్టర్ దగ్గరికెళ్లేందుకు ఆమె సమయం దొరకలేదు. కానీ బలవంతంగా ఆసుపత్రికి వెళ్లాం. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయినీ, ఆందోళన అవసరం లేదని కార్డియాలజిస్ట్ చెప్పారు. కానీ తిండి, నిద్ర సమయానికి తీసుకోవడం లేదని, విశ్రాంతి తీసుకోవాలని, జాగ్రత్త అని చెప్పారు. కానీ ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని గమనించలేదు. జూలై 7, ఆమె కాన్వకేషన్ రోజు అపుడు కూడా ఆమెకు సెలవు దొరకలేదు. ఆ రోజు కూడా మధ్యాహ్నందాకా వర్క్ ఫ్రం హోం చేసింది. దీంతో కాన్వకేషన్‌కు లేట్‌గా వెళ్లాం. కష్టపడి సంపాదించిన డబ్బుతో తన తల్లిదండ్రులను తన కాన్వకేషన్‌కు తీసుకెళ్లాలనేది నా కుమార్తె గొప్ప కల. ఆమె మా విమాన టిక్కెట్లు బుక్ చేసి మమ్మల్ని తీసుకువెళ్లింది. మా బిడ్డతో చివరిగా గడిపిన ఆ రెండు రోజులు కూడా పని ఒత్తిడి కారణంగానే మాతో ప్రశాంతంగా ఉండలేకపోయింది. ఇది తలుచుకుంటేనే నా గుండె పగిలిపోతుంది. తరచుగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో మీటింగ్‌లను రీషెడ్యూల్ చేసేదట ఆమె టీమ్ మేనేజర్. చివరి నిమిషంలో పని ఒత్తిడి పెంచేదట. ఆమె కింద పనిచేయడం నీ బ్యాడ్ లక్ అని ఒక ఆఫీస్ పార్టీలో, ఒక సీనియర్ లీడర్ చెప్పాడట అన్నాతో. అయినాదురదృష్టవశాత్తూ, తప్పించుకోలేకపోయింది. ధిక పని భారం కారణంగా చాలామంది ఉద్యోగులు రాజీనామా చేశారని కూడా తెలిపింది. దయచేసి ఇలాంటి పరిస్థితి మరో ఉద్యోగికి రాకుండా జాగ్రత్తపడండి. ఇంత పెద్ద కంపెనీలో కనీస మానవహక్కులను పట్టించుకోకపోతే ఎలా? మీ హెచ్ఆర్ కాపీ మొత్తం చదివాను.ఇది నా కుమార్తె గురించి మాత్రమే కాదు, ఎన్నో ఆశలు, కలలతో మీ కంపెనీలో చేరి ప్రతి యువ నిపుణుడి గురించి కూడా. అన్నా మరణం మీ కంపెనీకి ఒక హెచ్చరిక లాంటిది.మీ సంస్థలోని పని సంస్కృతిని ప్రతిబింబించే సమయం ఇది, ఆచరణ సాధ్యంకాని అంచనాలతో వారిపై ఒత్తిడి పెంచకండి.మీ ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోండి.నాబిడ్డ అనుభవం నిజమైన మార్పుకు దారితీస్తుందని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి దుఃఖం ఏ ఇతర కుటుంబమూ రాకుండా చూడండి. నా అన్న ఇప్పుడు మాతో లేదు. కానీ ఆమె గాథ మార్పుకు నాంది కావాలి..’’ అంటూ రాసుకొచ్చారు అనితా అగస్టిన్. అయితే దీనిపై కంపెనీనుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.అలాగే అన్నా మరణానికి అసలైన కారణాలు ఏమిటి అనేదానిపై స్పష్టత లేదు. -
జస్టిస్ హేమా కమిటీ నివేదికపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్
మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 20 మందికి పైగానే మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా హేమా కమిటీ రిపోర్ట్‌లోని అంశాలు సంచలనం రేపాయి. దీంతో ఇతలర చిత్రపరిశ్రమలలో కూడా చలనం వచ్చింది. తాజాగా ఈ అంశం గురించి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలోని నటీమణులు ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారో తెలుసుకునేందు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో కన్నడ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఎన్.ఎం.సురేశ్ పాల్గొన్నారు. ఇండస్ట్రీకి చెందని ప్రముఖులతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ జరిపిన ఈ మీటింగ్ పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్.ఎం సురేశ్ ఇలా చెప్పుకొచ్చారు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని, వాటిని సరిచేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో నటీమణులకు ఎలాంటి సమస్యలు రాకుండా వారిని సంరక్షించుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? అనే టాపిక్ గురించి చర్చించామని ఆయన అన్నారు. మహిళల రక్షణ కోసం తాము ఏం చేయబోతున్నామో త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.హేమా కమిటీ నేపథ్యందాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు.విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. కొద్దిరోజుల క్రితం ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి
కాసర్గోడ్: కేరళలోని కాసర్గోడ్లో హృదయ విదారక ఉదంతం చోటుచేసుకుంది. కంజనగడ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి చెందారు. మృతులు దక్షిణ కొట్టాయం జిల్లా చింగవనం వాసులుగా పోలీసులు గుర్తించారు.వీరు ఇక్కడికి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన బృందంలోని వారని పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లేందుకు వారు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ సమయంలో సూపర్‌ఫాస్ట్ రైలు ఢీకొనడంతో ఆ ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దిగువ సియాంగ్ జిల్లాలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, ఒక చిన్నారికి గాయాలయ్యాయి. దిమోవ్ సమీపంలోని పాలే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ హజారికా తెలిపారు. మృతుడిని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సబ్ ఇన్స్పెక్టర్ రిగో రిబాగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని.. -
అక్కడ భారీగా పెరిగిన ఇళ్ల ధరలు: ఇదిగో ప్రూఫ్..
భారతదేశంలో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలంటే లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. అయితే కేరళలో కూడా ఇళ్ల ధరలు ఏ మాత్రం తక్కువ కాదని ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక పోస్ట్ వెల్లడిస్తోంది.ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక సోషల్ మీడియా పోస్టులో 4 బీహెచ్‌కే (3500 చదరపు అడుగులు) ఇల్లు ధర రూ. 3 కోట్లు అని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే కేరళలో రియల్ ఎస్టేట్ ఎంతగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది నగరానికి దగ్గర ఉందా? దూరంగా ఉందా? అనే వివరాలు వెల్లడించలేదు.ఇదీ చదవండి: పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా? కరోనా తరువాత స్థిర ఆస్తిని కలిగి ఉండాలని.. భూములు, భవనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రాపర్టీ ధరలు పెరిగాయి. ఢిల్లీ, నోయిడా, బెంగళూరు వంటి నగరాల్లో 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్ ధర సగటున రూ. 2 కోట్లు. 4 బీహెచ్‌కే ధర రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ఇల్లు బాగుందని చెబుతుంటే.. మరికొందరు ధర చాలా ఎక్కువని అని పేర్కొంటున్నారు.4 BHK, 3500 sq ft is what 3Cr gets you in Kerala. pic.twitter.com/oRqSzmWqZg— Sidharth II सिद्धार्थ (@sidharthgehlot) September 9, 2024 -
వంట గది నుంచి పంట పొలాల్లోకి...
‘అయిదు వేళ్లు కలిస్తేనే ఐకమత్యం’ అనేది ఎంత పాత మాట అయినా ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తు తెచ్చుకోదగ్గ మాట. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలో ఎంతోమంది మహిళలు ‘ప్రకృతి’ పేరుతో స్వయం సహాయక బృందాలుగా ఏర్పడుతున్నారు. ‘ప్రకృతి’ చేసిన మహత్యం ఏమిటంటే... వంటగదికి మాత్రమే పరిమితమైన వారిని పంట నొలాల్లోకి తీసుకువచ్చింది. డ్రోన్ పైలట్‌గా మార్చి కొత్త గుర్తింపు ఇచ్చింది. జెండర్ ఈక్వాలిటీ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు రకరకాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేసింది. పిల్లలు పెద్ద చదువులు చదివేలా చేసేలా చేసింది.సినిమాల్లో చూడడం తప్ప ఎప్పుడూ చూడని విమానంలో ప్రయాణం చేయించింది....‘మీ గురించి చెప్పండి’ అని సుధా దేవదాస్‌ను అడిగారు ప్రధాని నరేంద్ర మోది. తన వ్యక్తిగత వివరాలతో పాటు తమ స్వయం సహాయక బృందం ‘ప్రకృతి’ గురించి ప్రధానికి వివరంగా చెప్పింది సుధ.మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన ‘లఖ్పతి దీదీస్’ కార్యక్రమంలో పాల్గొనడానికి కేరళ నుంచి వచ్చింది సుధ. ‘లఖ్‌పత్ దీదీస్’ డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు కేరళ నుంచి ఎంపికైన ఇద్దరు మహిళల్లో సుధ ఒకరు. సుధ త్రిసూర్‌లోని కుఝూర్ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్. కేరళ నుంచి ‘డ్రోన్ పైలట్’ అయిన తొలి మహిళా పంచాయతీ మెంబర్‌గా సుధ ప్రత్యేక గుర్తింపు సాధించింది.‘ఈ శిక్షణా కార్యక్రమాల పుణ్యమా అని డ్రోన్లను ఎగరవేయడం మాత్రమే కాదు ఆండ్రాయిడ్ ఫోన్లు అంటే ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి, పంట పొలాల్లో ఉపయోగించే ఎరువులు, మందులు... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం’ అంటుంది సుధ.‘ఇప్పుడు నన్ను అందరూ డ్రోన్ పైలట్ అని పిలుస్తున్నారు’ ఒకింత గర్వంగా అంటుంది సుధ. సుధలాంటి ఎంతో మంది మహిళల జీవితాలను మార్చిన స్వయం సహాయక బృందం ‘ప్రకృతి’ విషయానికి వస్తే... ‘ప్రకృతి’లో 30 సంవత్సరాల వయసు మహిళల నుంచి 63 సంవత్సరాల వయసు మహిళల వరకు ఉన్నారు. ‘ప్రకృతి’లోని పన్నెండు మంది సభ్యులు ‘గ్రామిక’‘భూమిక’ పేరుతో విధులు నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు గృహ నిర్మాణం, పిల్లల చదువు, పెళ్లిలాంటి ఎన్నో విషయాలలో ప్రజలకు సహాయపడతారు.‘ప్రకృతి వల్ల మా జీవన విధానం పూర్తిగా మారి΄ పోయింది’ అంటుంది 51 సంవత్సరాల సుధ. ఆమె పెద్ద కుమారుడు ఎం.టెక్., చిన్న కుమారుడు బీటెక్. చేశారు. ‘పై చదువుల కోసం పెద్ద అబ్బాయి కెనడా, చిన్న అబ్బాయి ΄ పోలాండ్ వెళుతున్నాడు’ సంతోషం నిండిన స్వరంతో అంటుంది సుధ. కొన్ని నెలల క్రితం ‘ప్రకృతి’ బృందం కేరళ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకి వెళ్లింది. ఆ బృందంలోని ప్రతి ఒక్కరికి ఇది తొలి విమాన ప్రయాణం. అది వారికి ఆకాశమంత ఆనందాన్ని ఇచ్చింది.సాధారణ గృహిణి నుంచి గ్రామ వార్డ్ మెంబర్‌గా, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ‘కుటుంబశ్రీ’లో రకరకాల విధులు నిర్వహిస్తున్న కార్యకర్తగా, జెండర్ ఈక్వాలిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లకు సంబంధించి మహిళలకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్‌గా, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో) డైరెక్టర్‌గా, డ్రోన్ పైలట్‌గా రకరకాల విధులు నిర్వహిస్తున్న సుధ ఎంతోమంది గృహిణులకు రోల్‌మోడల్‌గా మారింది.‘మహిళలు ఆర్థికంగా సొంత కాళ్లమీద నిలబడినప్పుడు ఎంతో ఆత్మస్థైర్యం వస్తుంది. అది ఎన్నో విజయాలను అందిస్తుంది. ఎవరు ఏమనుకుంటారో అనే భయాలు మనసులో పెట్టుకోకుండా మనకు సంతోషం కలిగించే పని చేయాలి’ అంటుంది సుధా దేవదాస్. -
ఓనం అంటే సంబరం, సరదా, సాధ్య!
దక్షిణ రాష్ట్రమైన కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మరో విధంగా చెప్పాలంటే తెలుగువారికి సంక్రాంతి అంత సంబరం. రుతుపవనాల ముగింపుకు గుర్తుగా రాక్షసరాజు బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ ఘనంగా మలయాళీలు జరుపుకునే పండుగ. సంప్రదాయం,రుచులు కలగలిసిన ఓనం అనగానే రకరకాల వంటలు, వైవిధ్యభరితమైన రుచులు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రదేశంలోఉన్నా కేరళ ప్రజలు ఓనంని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సెప్టెంబరు 6 న మొదలైన ఈ ఏడాది ఓనం పండుగ సంబరాలుఆఖరిరోజు సెప్టెంబరు 15న ముగుస్తాయిఓనం అంటే పువ్వులతో అందమైన అలంకరణ, చూడముచ్చటగొలిపే ముస్తాబు. పసందైన విందు భోజనం సాధ్య. ఎర్రబియ్యంతో చేసిన అన్నం, ఇంకా ఉప్పేరి, పసుపు , ఆవాలు మ్యారినేట్ చేసిన పనీర్ కర్రీ, క్లాసిక్ పరిప్పు, గుమ్మడి, కొబ్బరితో చేసే అనేక రకాల వంటకాలు ఉంటాయి. ఇంకా తోరన్, శర్కరవరట్టి, ఉల్లి వడ అవియల్, సాంబారు, తదితర 20కి పైగా వంటకాలతో అరిటాకు బోజనం మరీ స్పెషల్. పరిప్పు కర్రీపెసరపప్పు, కొబ్బరితో చేసి పరిప్పు కర్రీ. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి (ఇష్టమున్నవారు)వేసి మిక్సీలో వేసుకుని కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవాలి. తరువాత పెసరపప్పును బాగా మెత్తగా ఉడికించాలి. ఇపుడు ఉడికిన పప్పులో పసుపు, కొబ్బరి ముద్ద వేసి బాగా కలపి, దీంట్లో కొద్దిగా నీళ్లుపోసుకుని సన్నని మంట మీద ఉడికించాలి. తగినంత ఉప్పు, చిటికెడు, నల్ల మిరియాల కలపాలి. (కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!)తాలింపు: నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపడలాడాక, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఇది సాధారణంగా ఓనం సాధ్యలో బియ్యంతో కలిపి వడ్డిస్తారు. దీంతోపాటు, అప్పడం, పచ్చడి ఉంటుంది. అన్నట్టు ఓనంలో మరో స్పెషల్ పచ్చడి.పచ్చడిసాధ్యలో ఎన్నో రకాల పచ్చళ్లను వడ్డిస్తారు. బీట్రూట్, దోసకాయ, గుమ్మడి, పైనాపిల్ ఇలా ఏ కూరగాయచ పండుతోనైనా రుచికరంగా తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా భుజిస్తారు.సాంబారుమన విందుభోజనాల్లోఉన్నట్టే కేరళీయులు సాంబారును బాగా ఇష్టపడతారు. అన్ని రకాల కూరగాయల ముక్కలతో సాంబారును తయారు చేస్తారు. చివరిగా పాయసం లాంటి ఇతర అనేక తీపి పదార్థాలతో నోరును తీపి చేసుకుంటారు. ఇదీ చదవండి : మల్టీ కలర్ చీరలో నీతా అంబానీ స్పెషల్ అండ్ సింపుల్ లుక్ -
'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది!
కన్నీటికి కూడా ఇష్టం ఉన్నట్టుంది. కన్నీటికి కూడా ఒక మనిషి కంటినే అంటి పెట్టుకొని ఉండాలన్న కోరిక ఉన్నట్టుంది. కన్నీరు ఎందుకనో ఒకే మనిషిని పదే పదే ఆలింగనం చేసుకుంటూ ఆ మనిషికి మరింత ప్రేమను పంచాలని అనుకుంటున్నట్టుంది. కేరళలో ఒకమ్మాయి శ్రుతి. ఆ అమ్మాయి గత కొన్ని రోజులుగా కన్నీరు కారుస్తోంది. ఆమెను ఊరడించడానికి కేరళ ప్రభుత్వం, కేరళ ప్రజలు కదిలారు. ఈ ప్రేమ కోసమేనా కన్నీరుకు ఆమెపై ప్రేమ?‘బాధ పడకు. నీకు నేనున్నాను. నేను చనిపోయినా నువ్వు ఒంటరివి కావు. నీకంటూ ఒక భరోసా ఉండేలా చూస్తాను’ అన్నాడా యువకుడు ఆ అమ్మాయితో ఓదార్పుగా. ఇవాళ ఆ యువకుడు కన్నుమూశాడు. ఆ యువకుడి మాటలను గుర్తు చేసుకుంటున్న కేరళ ప్రజలు ‘మేమున్నాం’ అంటూ ఆ అమ్మాయికి తోడుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన చాలా అరుదు.ఆ అమ్మాయి పేరు శ్రుతి..అందరు అమ్మాయిల్లాంటిదే శ్రుతి. కోజికోడ్‌లో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేయడం... సెలవులలో ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో గడపడం... తండ్రి చిన్న ఉద్యోగి... తల్లి చిన్న షాపు నడిపేది... చెల్లెలు కాలేజీ చదువుతోంది. వాళ్ల కుటుంబం వాయనాడ్‌లోని చూరలమలలో కొత్త ఇల్లు కట్టుకుని వరదలకు నెల ముందే షిఫ్ట్ అయ్యారు. అక్కడే శ్రుతి నిశ్చితార్థం జరిపించారు. ఈ డిసెంబర్లో పెళ్లి చేయాలని 4 లక్షల డబ్బు. 15 సవర్ల బంగారం ఇంట్లో దాచారు. అంతా సంతోషమే. కాని...జూలై 30 రాత్రి..ఆ రాత్రి ఉద్యోగరీత్యా శ్రుతి చూరలమలకు రెండు గంటల దూరంలో ఉన్న కోజికోడ్‌లో ఉంది. వరద విజృంభించింది. శ్రుతి వాళ్ల కొత్త ఇల్లు ధ్వంసమైంది. తల్లి, తండ్రి, చెల్లెలు... పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం పోయాయి. ఎవరూ మిగల్లేదు. ఏమీ మిగల్లేదు. శ్రుతి కన్నీరు కట్టలు తెంచుకుంది. అది ఆగలేదు. ఆపేందుకు ఒక్కడు పూర్తిగా ప్రయత్నించాడు. అతని పేరు జాన్సన్. శ్రుతికి కాబోయే భర్త.నేనే తోడుంటా..‘శ్రుతికి ఇప్పుడు ఏమీ మిగల్లేదు. అంతమాత్రం చేత నేను వదిలేస్తానా? పదేళ్లుగా మేము స్నేహితులం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇప్పుడు ఆమె సర్వం కోల్పోయినా నేను వదలను. తోడుంటా. నేను చనిపోయినా ఆమె ఒంటరిదై పోకుండా మంచి ఉద్యోగం, ఇల్లు ఏర్పాటు చేస్తా’ అన్నాడు. ఆ మాటలు ఎందుకన్నాడో. అవి వాయనాడ్ విషాదాన్ని ప్రసారం చేసేటప్పుడు టీవీలో టెలికాస్ట్ అయ్యాయి.ఆ తోడు కూడా పోయింది...శ్రుతికి ఇక ఏడవడానికీ కన్నీరు మిగల్లేదు. జాన్సన్ చనిపోయాడు. మొన్నటి మంగళవారం వాయనాడ్‌లో అతను, శ్రుతి, శ్రుతి బంధువులు కొంతమంది ప్రయాణిస్తున్న వ్యాను బస్సుతో ఢీకొంది. శ్రుతి, ఆమె బంధువులు స్వల్పంగా గాయపడ్డారు. కాని జాన్సన్ మృత్యువుతో పోరాడి బుధవారం మరణించాడు. అన్నీ కోల్పోయిన శ్రుతికి ఆఖరి ఆసరా కూడా పోయింది. ఆమె ఏం కావాలి?మేమున్నాం..ఇక కేరళ జనం తట్టుకోలేకపోయారు. మేమున్నాం అంటూ శ్రుతి, జాన్సన్ జంట ఫొటోలను డీపీగా పెట్టుకోసాగారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ నేనున్నానంటూ ఫేస్బుక్ పోస్ట్ రాశారు. ఫహద్ ఫాజిల్, మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు. కేరళ మంత్రి ఒకరు శ్రుతికి మంచి ఉద్యోగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది... కేరళ ప్రజలది అన్నారు. శ్రుతి కోసం కేరళ కన్నీరు కారుస్తోంది. శ్రుతి కన్నీటిని కేరళ పంచుకుంది. అయినవారిని లాక్కుని పరాయివారినెందరినో ఆమె బంధువులుగా మార్చింది కన్నీరు. ఈ కన్నీటిని ఏమని నిందించగలం. కన్నీరా కనికరించు... చల్లగా చూడు అనడం తప్ప.ఇవి చదవండి: బెయిలా? జైలా?.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు -
శ్రుతి జీవితంలో మరో పెను విషాదం
వయనాడ్ విలయంతో కుటుంబాన్ని కోల్పోయిన ఆమెకు.. కాబోయేవాడు అండగా నిలిచాడు. కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు శ్మశానవాటికకు చేరుకొని.. ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఇద్దరూ వివాహంతో ఒక్కటి కావాల్సి ఉంది.ఈ లోపు విధి ఆమెపై మరోసారి కన్నెర్ర చేసింది.కేరళ వయనాడ్ విలయం తర్వాత.. ప్రధాని మోదీ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ టైంలో ఓ యువతి, యువకుడు కలిసి మోదీతో మాట్లాడడం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే.. ఆమెకు అంతటి కష్టం వచ్చింది కాబట్టి. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యుల్ని పొగొట్టుకుందామె.చూరాల్మల గ్రామానికి చెందిన శ్రుతి (24)కి తన చిరకాల మిత్రుడైన జెన్సన్ (27) ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనా.. తల్లిదండ్రులు వివాహానికి పచ్చ జెండా ఊపారు. జూన్ 2న ఎంగేజ్మెంట్ జరిగింది.జూన్ 30న వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరితో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఈ విషాద సమయంలో తన ఉద్యోగాన్ని వదులుకుని మరీ జెన్సన్ ఆమెకు అండగా నిలిచాడు. మోదీ పర్యటన టైంలో జాతీయ మీడియా సైతం ఈ జంట గురించి కథనాలు ఇచ్చింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ నెలలోనే రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.అయితే..వివాహ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 10న శ్రుతి, జెన్సన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యానులో బయలుదేరారు. కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వాహనం, ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. జెన్సన్ తీవ్రంగా గాయపడగా, శ్రుతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ జేన్సన్ బుధవారం రాత్రి మరణించాడు. అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన శ్రుతి బాధ వర్ణణాతీతంగా మారింది. -
ఆ స్కూలు మళ్లీ సైకిలెక్కింది!
వాయనాడ్ వరదలకు రెండు నెలల ముందు షాలినీ టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లి΄ోయింది. స్కూల్ పిల్లల యూనిఫామ్‌లోనే సైకిల్ మీద తిరుగుతూ పిల్లలతో ఆడినఆమె వీడియో ఇంటర్నెట్లో ఎందరికో ఇష్టం. తర్వాత వరదలు వచ్చాయి. వీడియోలో ఉన్న పిల్లలు ముగ్గురు చని΄ోయారు. ‘నేను ఎప్పటికీ ఆ స్కూల్‌కి వెళ్లలేను’ అని బాధపడింది షాలినీ టీచర్. కాని వారం క్రితం స్కూల్ తెరిచాక పిల్లలు కోరింది షాలినీ టీచర్ కావాలనే. వారి టీచర్ వారికి దొరికింది. ఇక గాయం తప్పక మానుతుంది.టీచర్ల జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం ఏమిటో తెలుసా? విగత జీవులుగా ఉన్న పిల్లల ముఖాలను గుర్తు పట్టమని వారిని పిలవడం. జూలై 30 వాయనాడ్‌లోని కొండ్ర΄ాంత పల్లెలు ముండక్కై, చూరలమల వరదల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఊహించని వరద నిద్రలో ఉన్నవారిని నిద్రలోనే తీసుకెళ్లింది. ముండక్కైలో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ మొత్తం బురదతో నిండి΄ోయింది. దాని చుట్టూ ఉండే ఇళ్లు ధ్వంసమై΄ోయాయి. స్కూల్లోని 9 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు. మృతదేహాల ఆచూకీ దొరికాక వారిని గుర్తించడానికి టీచర్లనే పిలిచారు. అక్కడ పని చేసిన షాలినీ టీచర్‌కు ఆ ఘటన ఎంత మనోవేదన కలిగించిందో! మిగిలిన టీచర్లు మళ్లీ ఈ స్కూల్ ముఖం చూడకూడదని ఎంతగా ఏడ్చారో!!షాలినీ టీచర్‌ది కొట్టాయం. కాని పట్నంలో ΄ాఠాలు చెప్పడం కన్నా వాయనాడ్ ్ర΄ాంతం ఆహ్లాదంగా ఉంటుంది... ప్రజలు అమాయకంగా ఉంటారని ముండక్కైలో ఎలిమెంటరీ స్కూల్లో అడిగి మరీ టీచర్‌గా చేరింది. అక్కడ పిల్లలకు ఆమె ఇష్టమైన టీచర్. వారి యూనిఫారమ్‌లాంటి చుడిదార్ వేసుకుని స్కూల్‌కు వచ్చి పిల్లల్లో కలిసి΄ోయేది. చిన్న స్కూలు... పిల్లల సంఖ్య తక్కువ కావడంతో అందరి ఇళ్లు, తల్లిదండ్రులు తెలుసు. ఒకరోజు గేమ్స్ పిరియడ్‌లో ఒక ΄ాప సైకిల్‌ను ఆసక్తిగా చూడటం గమనించింది షాలినీ టీచర్. ఆ ΄ాప స్లోచైల్డ్. తానుగా సైకిల్ తొక్కలేదు. షాలినీ టీచర్ అది గమనించి ‘సైకిల్ ఎక్కుతావా’ అని వెనుక నిలబెట్టి తాను తొక్కుతూ గ్రౌండ్లో ఒక రౌండ్ వేసింది. పిల్లలందరూ చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. ఎవరో ఇది షూట్ చేయగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. రెండేళ్లు పని చేశాక షాలినీ టీచర్‌కి జూన్ నెలలో దగ్గరలోనే ఉన్న మీనన్‌గడి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు ఆమె వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని వెళ్లక తప్పలేదు. ఆ రోజు షాలినీ టీచర్ అనుకోలేదు.. వారిలో కొందరిని మళ్లెప్పుడూ చూడలేనని. వాయనాడ్ వరదలు పిల్లలకూ ఆమెకూ మధ్య శాశ్వత దూరం తెచ్చాయి. చని΄ోయిన పిల్లలను గుర్తు పట్టమని ΄ోలీసులు ఆమెను పిలిచినప్పుడు ఆమె హృదయం బద్దలైంది. వాయనాడ్ కోలుకుంది. సెప్టెంబర్ 2న ముండక్కైలోని స్కూల్‌ను రీ ఓపెన్ చేస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి హాజరయ్యారు. దారుణమైన విషాదాన్ని చవిచూసిన ఆ పిల్లల ముఖాలను చూసిన మంత్రి ‘మీకు ఏం కావాలో అడగండి చేస్తాను’ అన్నారు. వెంటనే పిల్లలు ‘మా షాలినీ టీచర్‌ను మా దగ్గరకు పంపండి’ అన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఇష్టమైన టీచర్ తోడుంటే బాగుంటుందనుకున్న మంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. షాలినీ తన స్కూల్‌కు తాను తిరిగి వచ్చింది.ఆమెను చూసిన పిల్లలు కేరింతలు కొట్టారు. ఆమె కన్నీరు కార్చింది చని΄ోయిన పిల్లలను తలుచుకుని. కాని ఆనందించింది తన స్కూలుకు తాను వచ్చానని.ఆ స్కూల్‌ను తిరిగి ఆట΄ాటలతో నింపడమే ఆమె లక్ష్యం.పిల్లల మోముల్లో చిర్నవ్వును పూయించడమే కర్తవ్యం.షాలిటీ టీచర్ తప్పక సాధిస్తుంది. -
కేరళ 9వ తరగతి పాఠంగా ముంబై డబ్బావాలాలు
తిరువనంతపురం: అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ముంబై డబ్బావాలాలకు మరో గౌరవం దక్కింది. ఠంచనుగా ఆహారాన్ని సమయానికి అందిస్తూ సమయపాలనకు చిరునామాగా మారిన ముంబై డబ్బావాలాల విజయగాథను కేరళలో 9వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ పాఠ్యాంశంగా చదువుకోనున్నారు. డబ్బావాలాల గురించి హ్యూ, కొలీన్ గాంట్జర్లు రాసిన ‘ది సాగా ఆఫ్ ది టిఫిన్ క్యారియర్స్’ను ఒక అధ్యాయంగా చేర్చారు. కేరళ రాష్ట్ర విద్యా పరిశోధనా, శిక్షణా మండలి(ఎస్సీఈఆరీ్ట) 2024 కోసం పాఠ్యప్రణాళికలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఇందులో భాగంగా డబ్బావాలాల స్ఫూర్తిదాయక ప్రయాణంపై ఒక అధ్యాయాన్ని సిలబస్‌లో ప్రవేశపెట్టింది. 1890లో మహా హవాజీ బచే.. దాదర్ నుంచి ముంబైలోని ఒక కోటకు డెలివరీ చేసిన మొదటి లంచ్ బాక్స్ మొదలు ఇప్పటిదాకా డబ్బావాలాలు ముంబైకి అందించిన సేవలను ఈ అధ్యాయం వివరిస్తుంది. ‘‘1890లో దాదర్ శివారులోని ఓ పార్శీ మహిళ బొంబాయి వాణిజ్య నడిరోడ్డున పని చేసే తన భర్తకు టిఫిన్ క్యారియర్ అందించడానికి సహాయం చేయమని మహాదు హవాజీ బచేని కోరింది. అది డబ్బావాలాల ఆరంభం’’అని చాప్టర్ పేర్కొంది. ‘‘ఆ వినయపూర్వక ప్రారంభం నుంచి, ఓ స్వయం–నిర్మిత భారతీయ సంస్థ ఒక గొప్ప నెట్‌వర్క్‌గా ఎదిగింది. వారి సేవ, అంకితభావం, కచ్చితత్వం అంతర్జాతీయంగా వ్యాపార పాఠశాలలకు ఓ మేనేజ్మెంట్ పాఠంగా మారింది. ప్రిన్స్ (ఇప్పుడు ఇంగ్లాండ్ రాజు) చార్లెస్ ప్రశంసలనూ అందుకుంది’’అని పేర్కొంది. -
కోల్‌కతా నుంచి కేరళ వరకు...
కేరళతో మొదలుపెట్టి కోల్‌కతా దాకా... దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దాష్టీ కపు వార్తలే. ఇవన్నీ దేశంలో మహిళల స్థితిని ఎత్తిచూపుతున్నాయి. అదే సమయంలో రాజకీయాల నిర్లిప్తత, వ్యవస్థల వైఫల్యమూ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి.మలయాళ చిత్ర పరిశ్రమ చీకటి కోణాలు కాస్తా హేమ కమిటీ రిపోర్టుతో బట్టబయలయ్యాయి. నటులు, దర్శకులు, సినీ రంగంలోని అన్ని వర్గాల ప్రతినిధులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను చూస్తే, ‘అయ్యో’ అనిపి స్తోంది. అధ్వాన్నమైన విషయం ఇంకోటి ఉంది. మహిళకు సమానత్వం, మర్యాద, స్వేచ్ఛ, భద్రత అన్న సిద్ధాంతాన్ని నమ్మిన ఒక్క రాజకీయ పార్టీ లేకపోవడం! ఇదే విషయం మిత్రుడైన ఓ రాజకీయ నేతతో చెబితే... ‘‘మహిళలపై దౌర్జన్యం విషయాల్లో వాళ్లు, వీళ్లు అని ఏమీ లేదు. సొంత ప్రయోజనాలే వారికి పరమావధి’’ అని సమాధానమిచ్చాడు. నిత్యంకించపరిచే వ్యాఖ్యలు వింటూండే మహిళ రాజకీయ నేతలు కూడా పార్టీ అగ్రనేతల హుకుంలకు కట్టుబడ్డారేమో తెలియదు కానీ... గట్టిగా మాట్లాడతారని ఆశించినవాళ్లు కూడా నోళ్లు మెదపలేని స్థితిలో ఉన్నారు. బాధితు లకు రక్షణగా ఉండటం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అనిపించిందేమో వారికి!కోల్‌కతా ‘అభయ’కు న్యాయం దక్కుతుందని నాకైతే అనిపించడం లేదు. ఇలా చెప్పేందుకూ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కేసులో అక్కడి ఘోరకలి సమగ్రంగా ప్రపంచానికి తెలుస్తుందన్న నమ్మకమూ సన్న గిల్లుతోంది. కాలేజీ అధికారులు బాధితురాలి తల్లిదండ్రులకు చేసిన మూడు ఫోన్ కాల్స్ వివరాలు మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. దీన్నిబట్టే ఈ కేసు వివరాలపై గోప్యత ఎంతన్నది స్పష్టమైంది.ఆర్జి కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా సందీప్ ఘోష్ చలాయించిన అధికారాన్ని అర్థం చేసుకుంటే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈయన వేధింపులు తట్టుకోలేక ఇద్దరు కాలేజీ ఇంటర్న్లు ఆత్మ హత్య చేసుకుందామని అనుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. కాలేజీ మాజీ అధికారి అఖ్తర్ అలీ ఆరోపణల ప్రకారం సందీప్ ఘోష్ మృత దేహాలతో వ్యాపారం చేసేవాడు. అవయవాల రాకెట్‌నూ నడిపేవాడు. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఒక వ్యక్తిని కాపాడేందుకు ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నారు? సందీప్ ఘోష్ తరఫున వాదించేందుకు ప్రభుత్వం న్యాయ వాదిని నియమించడం ఏమిటి?ఈ ఘటనను రాజకీయంగా వాడుకోలేదా? అందరూ వాడుకున్నారు. రాళ్లు రువ్వడంతో దేబాశీష్ చక్రవర్తి లాంటి పోలీసు కనుచూపు కోల్పోయే పరిస్థితి వచ్చింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటా మాటా నడుస్తోంది. ఇందు కేనేమో... ఆందోళన చేస్తున్న వైద్యులు ఈ రెండు పార్టీల వారు ఎవరూ తమ పరిసరాల్లో లేకుండా జాగ్రత్త పడ్డారు. ‘అభయ’లాంటి ఘటన జరిగిన తరువాత చేసిన వ్యాఖ్యలు తప్పేనని తృణమూల్ పార్టీ హుందాగా తమ తప్పు ఒప్పుకుని ఉండాల్సింది. కొద్ది రోజులపాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి... ఆ తరువాత ఒక్క పళంగా విరుచుకుపడింది. ఒకరి ద్దరు పార్టీ ప్రతినిధులు నోటికి ఏదొస్తే అది మాట్లా డేశారు. ఈ క్రమంలోనే ఓ ఎంపీని నా కార్యక్రమం నుంచి వెళ్లిపొమ్మని అడగాల్సి వచ్చింది. ముప్ఫై ఏళ్ల నా వృత్తి జీవితంలో నేను ఇలా ఎన్నడూ చేయలేదు. పశ్చిమ బెంగాల్ ఘటనకు బాధ్యత టీఎంసీదైతే... హేమ కమిటీ నివేదిక పుణ్యమా అని కేరళ సినీ రంగం లేవనెత్తుతున్న ప్రశ్నలకు అక్కడి లెఫ్ట్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జస్టిస్ కె.హేమ కమిటీ తన నివేదికను సిద్ధం చేసేందుకు ఏకంగా ఐదేళ్ల సమయం పట్టింది. ఈ నివేదిక బయటపడటంతో చాలామంది మహిళా ఆర్టిస్టులు ఇప్పుడు పోలీసులకూ, టాస్క్ఫోర్స్కూ ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఈ మలయాళ ‘మీ టూ’ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న నటీమణులు రేవతి, పార్వతి చెప్పిన దాని ప్రకారం... ఈ కేసులో అటు రాజకీయ నేతలు, ఇటు సినిమా శక్తులు వాస్తవాలను తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు వర్గాలూ కలిసిపోయే అవకాశమూ లేకపోలేదని వాళ్లు అంటున్నారు. హేమా కమిటీ నివేదికలోని 11 పేరాలను ప్రభుత్వం ఎందుకు తొలగించిందో ఇప్పటివరకూ ఎలాంటి వివరణ లేదు. గుజరాత్ ప్రభుత్వ పుణ్యమా అని బిల్కిస్ బానో రేపిస్టులు మెడలో పూలదండలతో జైల్లోంచి బయట కొచ్చారు. అభయ విషయంలో మమత ప్రభుత్వం మితిమీరిన అహంకారంతో వ్యవహరించింది. 2012 నాటి నిర్భయ ఘటనలో కాంగ్రెస్వాళ్లూ నానా చెత్తా మాట్లాడారు. ఇవన్నీ మనకు చెబుతున్నది ఏమిటి? రాజకీయ నేతలు పట్టించుకోవాలంటే, మహిళలు ఒక ఓటుబ్యాంకుగా సంఘటితం కావాలి.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Rahul Gandhi: వయనాడ్ బాధితులకు విరాళంగా నెల జీతం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రకృతి విపత్తుతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వయనాడ్ కోసం విరాళం ప్రకటించారు. తన ఒక నెల జీతం రూ.2.3 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని వయనాడ్‌లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) అందజేశారు.2 లక్షల తన విరాళానికి సంబంధించిన రశీదును ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘వయనాడ్‌లోని మా సోదర, సోదరీమణులు వినాశకరమైన విషాదాన్ని చవిచూశారు. వారు ఎదుర్కొన్న ఈ నష్టాల నుంచి కోలుకునేందుకు మన మద్దతు అవసరం. అందుకే బాధితుల సహాయార్థం, పునరావాస ప్రయత్నాలకు నా వంతు సాయంగా నెల మొత్తం జీతాన్ని విరాళంగా ఇచ్చాను’ అని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అందించాలని రాహుల్ పిలుపునిచ్చారుOur brothers and sisters in Wayanad have endured a devastating tragedy, and they need our support to recover from the unimaginable losses they have faced.I have donated my entire month's salary to aid in the relief and rehabilitation efforts for those affected. I sincerely urge… pic.twitter.com/GDBEevjg5y— Rahul Gandhi (@RahulGandhi) September 4, 2024కాగా, ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా ‘స్టాండ్ విత్ వయనాడ్–ఐఎన్‌సీ’ అనే యాప్‌ను రూపొందించింది. వయనాడ్‌లో పునరావాస పనులకు సంబంధించిన పురోగతిని కాంగ్రెస్ ఎంపీ కే సుధాకరన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజు తెలిపారు.ఇదిలా ఉండగా, జూలై 30న భారీ వర్షాలు, వరదలు వయనాడ్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు వయనాడ్‌లో భారీగా మట్టిపెళ్లలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ విలయంలో సుమారు 400 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది -
Sagubadi: పొద చిక్కుడు పంటతో.. ఏనుగులకు చెక్!
లఏనుగులు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రాకుండా తిప్పికొట్టేందుకు కేరళవాసులు రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. మొదటిది: తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెలు నిర్మించటం. రెండోది: ప్రత్యేక వాసనను వెదజల్లే దేశవాళీ పొద చిక్కుడు పంటను సరిహద్దు పంటగా సాగు చేయటం. మొదటి పద్ధతి కన్నా రెండో పద్ధతి ఎక్కువ ప్రభావశీలంగా పని చేస్తోందని రైతులు చెబుతున్నారు.గ్రామ సరిహద్దుల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీహైవ్ ఫెన్సెస్)ను ఏర్పాటు చేశారు. ఏనుగులు అడవి నుంచి గ్రామాల వైపు వచ్చే దారిలో ఈ కంచె తీగలను తాకగానే తేనెటీగలు పెద్దపెట్టున శబ్ధం చేస్తూ వాటిని చుట్టుముడతాయి. అవి చేసే శబ్ధం ఏనుగులకు గిట్టదు. అందువల్ల అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు లూసీ కింగ్ 15 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని కనుగొన్నారు. కెన్యా, టాంజానియాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి, తేనెటీగల కంచెలు ఏనుగులను సమర్థవంతంగా బెదరగొట్టగలవని నిర్థారించారు. ఆ తర్వాత కేరళలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న అట్ట΄్పాడి తాలూకాలో అనేక గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ఏనుగుల నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికింది.కేరళలో గిరిజనులు మరో సంప్రదాయ పద్ధతిలో కూడా ఏనుగుల సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆట్టుకొంబ అమర (అట్టాప్పడీ డొలిఖోస్ బీన్ లేదా లాబ్లాబ్ బీన్) అనే స్థానిక రకం పొద చిక్కుడు పంటను ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే మార్గాల్లో సాగు చేయటం ద్వారా వాటì రాకను సహజ పద్ధతిలో నిరోధించవచ్చని గిరిజన రైతులు గుర్తించారు.అట్టాప్పడీ తాలూకాలోని మూలకొంబు అనే గ్రామవాసి అయిన చింది అనే 65 ఏళ్ల మహిళా రైతు ఏనుగులను నిరోధించేందుకు చెట్టు చిక్కుడును సాగు చేస్తున్నారు. అడవి ఏనుగుల గుంపును తేనెటీగల కంచెలు పూర్తిగా ఆపలేకపోతున్నాయన్నారు. ఆట్టుకోంబ అమర వంటి దేశవాళీ పొద చిక్కుడు పంట ప్రభావం చాలా బాగుందన్నారు. ‘ఈ చిక్కుడు పంటను కంచె పంటగా వేసినప్పటి నుంచి నా పొలం మీద ఏనుగులు దాడి చెయ్యలేదు. అమర చిక్కుళ్లు మంచి ధరకు అమ్ముడు కావటంతో మంచి ఆదాయం కూడా వస్తోంద’ని చింది సంతోషిస్తున్నారు.ఈ చిక్కుడు రకం పంట వెదజల్లే ఒక రకమైన ఘాటు వాసన ఏనుగులు, తదితర వన్య్రపాణులకు గిట్టకపోవటం వల్లనే అవి వెనుదిరిగి వెళ్లి పోతున్నాయని చెబుతున్నారు. ఈ సంగతి శాస్త్రీయంగా ఇంకా రుజువు కానప్పటికీ, ప్రజలకు ఏనుగుల బెడద మాత్రం తీరింది. కేరళలో అనాదిగా సాగవుతున్న ఆట్టుకొంబ అమర చిక్కుళ్లు విలక్షణమైన రకం కావటంతో మూడేళ్ల క్రితం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపు వచ్చింది. దీంతో ‘బయోసర్టిఫికేషన్’ ఉన్న ఈ చిక్కుళ్లకు ఏకంగా కిలోకు రూ. వెయ్యి వరకు ధర పలుకుతుండటం మరో విశేషం. మళయాళంలో ‘ఆట్టు’ అంటే మేక. ‘కొంబు’ అంటే కొమ్ము. కేరళ గిరిజన రైతులు సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ‘మేక కొమ్ము’లతో ఏనుగులను జయిస్తున్నారన్న మాట! -
కులగణన సన్నితమైన అంశం, రాజకీయాలకు వాడొద్దు: ఆర్ఎస్ఎస్
దేశంలో కులగణనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణన సున్నితమైన అంశమని పేర్కొంది. అయితే దీనిని ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని తెలిపింది. ఈ మేరకు కేరళలోని పాలక్కడ్‌లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల్లో సంస్థ ప్రతినిధి సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. కులగణ జాతీయ ఐక్యత, సమగ్రతకు చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.‘కుల గణన అనేది చాలా సున్నితమైన అంశం. దీనిని చాలా తీవ్రంగా పరిగణించాలి. కొన్నిసార్లు ప్రభుత్వాలు డేటా అవసరం కోసం దీనిని చేపట్టవచ్చు. అయితే ఇదికేవలం ఆ వర్గాలు కులాల సంక్షేమం కోసం మాత్రమే ఉండాలి. కానీ.. కుల గణనలను ఎన్నికల ప్రచారాల కోసం వినియోగించకూడదు’ అని అన్నారు.ఈ అంశంపై తీవ్రమైన చర్చల మధ్య, కుల గణనపై ఆర్ఎస్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కసరత్తును నిర్వహించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని పేర్కొంది. ‘ఇటీవల కాలంలో కులగణన అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీనిని పూర్తిగా సమాజహితానికే వాడతారని భావిస్తున్నాం. వీటిని నిర్వహించే క్రమంలో అన్నిపక్షాలు సామాజిక సమగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
కేరళలో తొలిసారి.. భర్త స్థానంలో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన భార్య
తిరువనంతపురం: కేరళలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య నూతన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వేణు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆగష్టు 31న పదవీ విరమణ చేశారు. వేణు స్థానంలో ఆయన భార్య శారదా మురళీధరన్ సీఎస్ పదవి బాద్యతలు చేపట్టారు.ఆమె గతంలో ప్రణాళిక విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ ఆగష్టు 21న నిర్ణయం తీసుకుంది. కాగా కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త స్థానంలో భార్య బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.For the first time in India (at least as far as anyone can remember!), Kerala’s outgoing ChiefSecretary, Dr V, Venu, handed over the CS’s post to his wife, Sarada Murlidharan, at a formal handover ceremony at the secretariat in Thiruvananthapuram. Both are IAS officers of the… pic.twitter.com/E0nZmDDIWi— Shashi Tharoor (@ShashiTharoor) September 1, 2024కాగా భార్యభర్తలిద్దరూ 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికార్లే అయినప్పటికీ.. వేణు అతని భార్య కంటే కొన్ని నెలలు పెద్దవాడు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తిరువనంతపురంలోని సచివాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో భారతదేశంలోనే తొలిసారిగా (ఎవరికైనా గుర్తున్నంత వరకు!) కేరళ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీ వేణు.. ఆయన భార్య శారదా మురళీధరన్‌కు సీఎస్ పదవిని అప్పగించారు.’ అని పేర్కొన్నారు.శుక్రవారం వేణు వీడ్కోలు సందర్భంగా సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త వీ వేణు నుంచి శారదా మురళీధరన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా.. వివిధ శాఖల అధిపతులుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వేర్వేరు సమయాల్లో విధులు నిర్వర్తిస్తుంటారని అన్నారు. -
ఏఐ పోలీస్.. ఆన్ డ్యూటీ
ఇకపై పెట్రోలింగ్‌కు నో పోలీస్.. ట్రాఫిక్ క్లియరెన్స్కీ నో పోలీస్.. ఫిర్యాదు స్వీకరించేందుకూ నో పోలీస్.. నిందితుల గుర్తింపునకు నో పోలీస్.. ఓన్లీ ఏఐ కాప్ అన్ని పనులు పూర్తి చేసేస్తుంది మరి. రోడ్డు మీద పోలీసులు ఎవ్వరూ కనబడటంలేదు కదా.. ఇష్టమొచ్చినట్లు వెళదాం.. మనల్ని ఎవర్రా ఆపేది అనుకుంటూ రయ్ మని దూసుకెళితే.. ఏఐ కాప్ కంట్లో మీరు పడ్డట్లే. ఫైన్ కడితేగానీ అది కదలనివ్వదు. ఇలాంటి ఏఐ పోలీస్‌లు ఇప్పటికే కొన్ని దేశాల్లో వినియోగంలోకి వచ్చాయి. మనకీ ఆ రోజులు త్వరలోనే రానున్నాయి. బ్యాచ్ నంబర్ గిటెక్స్. వెర్షన్ ఏఐ. 7 కిలోమీటర్స్ పర్ అవర్. 360 డిగ్రీస్ మోనిటరింగ్.. పోలీస్ కాప్ పెట్రోలింగ్ వెహికల్ రిపోర్టింగ్ సర్.. అంటూ దుబాయ్ పోలీసులకు ఓ పెట్రోలింగ్ వాహనం సాయమందిస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వాహనం ముందుకు వచ్చి మరీ ఫైన్ కట్టాలంటూ రశీదు చేతికిస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. మనుషుల స్థానంలో రోబో పోలీసులు విధులు నిర్వహించే పరిస్థితులు వస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని దేశాలు ఆశ్రయిస్తున్నాయి. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో మనుషులు లేకుండానే పోలీసుల పనులన్నీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఇందులో దుబాయ్ కాస్తా ముందంజలోనే ఉందని చెప్పవచ్చు. పోలీస్, సెక్యూరిటీ ఆపరేషన్స్‌లో ఏఐను దుబాయ్ విస్తృతంగా వినియోగిస్తోంది. దీనిలో భాగంగా స్మార్ట్ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో అమ్నా పేరుతో ఉండే ఓ ఫీచర్లో.. ఫస్ట్ లెఫ్టినెంట్ స్థాయిలో ఉండే ఒక వర్చువల్ పోలీస్ అధికారి ప్రజల ప్రశ్నలకు ఇంగ్లి‹Ù, అరబిక్ భాషల్లో సమాధానాలు ఇస్తున్నారు. ఇలా 2023లో ఏకంగా 20 వేల మందికి సమాధానాలిచ్చారు. ఒళ్లంతా కళ్లే.. ఇక దుబాయ్ పోలీసులకు ఓ ఏఐ పెట్రోలింగ్ వాహనం సాయమందిస్తోంది. ఈ వెహికల్లో 360 డిగ్రీస్‌లో స్పష్టంగా ఫుటేజ్ అందించే కెమెరాలున్నాయి. అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నా, మారణాయుధాలు కలిగిఉన్నా, వెంటనే సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం చేరవేస్తుంది. వారు వచ్చేలోగా సదరు నిందితుడ్ని ఫాలో అవుతుంది. 15 గంటల పాటు నిరి్వరామంగా పనిచేసే సామర్థ్యం ఈ ఏఐ పెట్రోలింగ్ వెహికల్ సొంతం. కొద్దిరోజుల్లోనూ ఇది దుబాయ్ రోడ్లపై నిశ్శబ్దంగా తిరగనుంది. 65 మంది ఇంజనీర్లు దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి దీనిని రూపొందించారు.ఫిర్యాదు కాపీ 8 సెకన్లలో...! అమెరికా పోలీసింగ్‌లోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఫిర్యాదుదారులు చెప్పే విషయాన్ని నోట్ చేసుకుంటూ చాట్ జీపీటీ ద్వారా కేవలం 8 సెకన్లలో ఫిర్యాదు కాపీని తయారుచేసి ఇచ్చే సాంకేతికను ఓక్లహామా నగరంలో మొదటిసారిగా వినియోగిస్తున్నారు. కేవలం ఫిర్యాదు కాపీనే కాకుండా.. ఏదైనా సంఘటనపై చాట్ జీపీటీ ద్వారా సెకన్లలోనే డ్రాఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది. ప్రయోగాత్మక పరిశీలనలో తప్పులు లేకుండా 100 శాతం పర్ఫెక్ట్ రిపోర్టును సిద్ధం చేసినట్టు ఆ సిటీ పోలీసులు ప్రకటించారు.లండన్‌లో...! ప్రధానంగా పాత నేరస్తులను పట్టుకునేందుకు ఏఐను బ్రిటన్ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. గతంలో దొంగతనం చేసి, మర్డర్లు చేసి, బ్యాంకులను దోచుకుని తప్పించుకు తిరుగుతున్న సుమారు 10 మంది పాత నేరస్తులను.. గుంపులో తిరుగుతుండగా ఏఐను ఉపయోగించి లైవ్ ఫేషియల్ రికగ్నైజేషన్ (ఎల్‌ఎఫ్‌ఆర్) కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిని విస్తృతంగా వినియోగించాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. చైనాలో ఏఐ పోలీస్‌స్టేషన్...! మనుషులే లేని పోలీస్ స్టేషన్‌ను చైనా సిద్ధం చేసింది. వుహాన్ నగరంలో ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ స్టేషన్లో డ్రైవింగ్ లైసెన్స్ రిజి్రస్టేషన్ సేవలను అందించనుంది. అదేవిధంగా డ్రైవింగ్‌లో ఎదురయ్యే సమస్యలు, యాక్సిడెంట్ చేసింది ఎవరు? ఎలా చేశారు? ఎవరిది తప్పు వంటి వాటిని పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ 24/7 అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే చైనాలో ఏఐ టెక్నాలజీని నిఘా కోసం వినియోగిస్తున్నారు.సింగపూర్‌లో స్వతంత్ర నిర్ణయాలతో.. సింగపూర్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తమంతట తాముగా నిర్ణయాలు తీసుకునే రోబోలను పోలీస్ శాఖలో ఉపయోగించనున్నట్టు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది. గత ఐదేళ్లుగా సింగపూర్‌లో ఈ పోలీస్ రోబోలతో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ రోబో కాప్ ఎత్తు 5.7 అడుగులు. దీనికి అమర్చే కెమెరాతో 360 డిగ్రీల్లో వీక్షించవచ్చు. ప్రాణాలకు తెగించే ఆపరేషన్లలో పాల్గొనేందుకు ఈ రోబోల్ని వినియోగించాలని సింగపూర్ పోలీసులు నిర్ణయించారు. ఇందులో ఉండే స్పీకర్లు.. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వారితో మాట్లాడేందుకు ఉపయోగపడతాయి. ఈ పోలీస్ రోబో సేవలను సింగపూర్ ప్రభుత్వం ఎంతో రద్దీగా ఉండే చాంగీ ఎయిర్ పోర్టులో వినియోగించాలని నిర్ణయించింది. చిట్టితో.. సమస్యలు! రజనీకాంత్ రోబో సినిమాలో హ్యుమనాయిడ్ చిట్టితో అనేక సమస్యలు వస్తాయి. అదేవిధంగా ప్రతి సాంకేతిక పరిజ్ఞానంలోనూ సమస్యలు తలెత్తుతుంటాయి. ఏఐ టెక్నాలజీ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. దీని ద్వారా ఉద్యోగాల కల్పన విషయంలో సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సర్వే ప్రకారం అమెరికాలోనే 2033 నాటికి 47 శాతం ఉద్యోగాలు ఆటోమేషన్ కానున్నాయని తెలుస్తోంది. హ్యాకింగ్ సమస్యలు, సొంత అవసరాలకు వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. ఏఐ వినియోగించుకునే అవసరమైన డేటా సేకరణ, స్టోరేజీతో... ప్రైవసీ పోయే ప్రమాదం ఉంది. కేవలం మనం ఇచ్చిన డేటాతో మాత్రమే ఏఐ పనిచేస్తుంది. సృజనాత్మక ఆలోచనలకు అవకాశం లేకుండా పోతుంది.ఏఐ దిశగా.. భారత్ అడుగులుపోలీస్ వ్యవస్థలో ఏఐని వినియోగించే దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోంది. ప్రస్తుత మొబైల్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (ఎంఈసీటీఎన్ఎస్)తో ఈ ఏఐ వ్యవస్థని అనుసంధానించనున్నారు. ఈ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్‌లో ఉండే పాత డేటా ఆధారంగా తన రేడియస్ పరిధిలో ఎవరైనా క్రిమినల్ కనిపించినా.. వెంటనే కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చేలా ప్రోగ్రామింగ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేరళలో తొలి రోబో పోలీస్ సేవలందించేందుకు సిద్ధమవుతున్నాడు. కేరళ పోలీస్ అసిమోవ్ రోబోటిక్స్ సంస్థ సహకారంతో మానవ తరహాలో ‘కేపీ–బాట్’ని అభివృద్ధి చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కెమెరా ద్వారా.. నిందితుల్ని గుర్తించగల సామర్థ్యం దీని సొంతం. -
మానవ తప్పిదాలే విలయ హేతువులు
కేరళలోని వయనాడ్‌లో జూలై 30న వానరూపంలో మృత్యువు చేసిన కరాళ నృత్యానికి 375 మంది మృత్యు వాతపడగా మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విలయం కంటే ముందు 2019 ఆగస్ట్‌లో పుతుమల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇక, 2018లో కనివిని ఎరుగని విధంగా కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు, వరదలకు 433 మంది మృత్యువాత పడగా, దాదాపు 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. ఇంతకూ ఎందుకు కేరళ రాష్ట్రంలో పదేపదే ప్రకృతి ప్రకోపిస్తోంది? ఈ ప్రశ్నకు జవాబు ప్రభుత్వాలకు చెంప పెట్టుగా నిలుస్తుంది. నిజానికి ప్రకృతి తనంతట తాను ప్రకో పించదు. దాన్ని ధ్వంసం చేసినప్పుడు మాత్రమే కన్నెర్ర జేస్తుంది. మనిషి అంతులేని స్వార్థంతో ప్రకృతి సంపదను ఇష్టానుసారం దోచుకోవడానికి చేసే విధ్వంసమే ప్రకృతి గతి తప్పడానికి కారణం అవుతోంది. ఇది ఒక్క కేరళలో మాత్రమే కాదు... గత దశాబ్ద కాలంగా హిమాలయ ప్రాంతంలోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో సైతం ఇదే జరుగు తోంది. అందుకే అక్కడా తరచుగా భారీ వర్షాలు కురిసి కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరగడం పరిపాటిగా మారింది. బెంగళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’కు చెందిన ప్రొఫెసర్ సీపీ రాజేంద్రన్ ‘వయనాడ్’లో ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్న అంశాలను శాస్త్రీయంగా వివరించారు. 50వ దశకం వరకు వయనాడ్‌లో 85 శాతం దట్టమైన అడవులు ఉండగా, అవి క్రమంగా క్షీణిస్తూ 2018 నాటికి 62 శాతానికి చేరుకొన్నాయి. అడవులను నరికి వేసి ఆ ప్రాంతంలో విస్తారంగా తేయాకు తోటల పెంపకం ప్రారంభించారు. దాంతో అక్కడ అనేక జనావాసాలు పుట్టు కొచ్చాయి. మానవ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి. కాలుష్య కారకాల వల్ల కర్బన ఊద్గారాలు పెరిగి వాతా వరణంలో వేడి అధికమైంది. ఫలితంగా, ఆగ్నేయ ప్రాంతంలోని అరేబియా సముద్రం వేడెక్కి ఒక్కసారిగా కుండపోత వానలు పడటం మొదలైంది. అడవులు ఉన్నప్పుడు వర్షపు నీటి ప్రవాహ వేగం తక్కువుగా ఉండి ఒక క్రమపద్ధతిలో పల్లపు ప్రాంతానికి చేరేది. కానీ, అడవుల్ని నరకడం వల్ల ప్రవాహ ఉధృతి పెరిగిపోవడం, వర్షపునీటి సాంద్రత అధికమవడంతో... రాతి శకలాల మధ్య ఉన్న మట్టి తొందరగా కరిగిపోయి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడు తున్నాయి. వయనాడ్ కొండప్రాంతం లేటరైట్ మృత్తిక, రాతిశకలాల మిశ్రమంతో నిండి ఉండటం వల్ల భారీ వర్షాలు, వరదనీటి తాకిడికి కొండలు పెళ్లలు ఊడిపడినట్లు పడతా యని ఎప్పటి నుంచో శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు.పశ్చిమ కనుమల పర్యావరణ స్థితిగతుల నిపుణుల బృందం (వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్)కు నేతృత్వం వహించిన మాధవ్ గాడ్గిల్ 2010 నుంచి దాదాపు ఏడాదిపాటు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కేరళ నుంచి ఇటు తమిళనాడు; అటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ వరకు విస్తరించిన పశ్చిమ కనుమల ప్రాంతాన్ని సున్నితమైన 3 జోన్లుగా వర్గీకరించి... ఒకటవ జోన్లో ఉన్న వయనాడ్ ప్రాంతంలో పర్యావరణాన్ని నష్టపరిచే కార్యకలా పాల్ని నిషేధించాలని సిఫారసు చేశారు. కనుమల స్థిరత్వాన్ని దెబ్బతీసే భారీ కట్టడాల్ని నిర్మించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.అయితే, అపరిమితమైన ప్రకృతి సంపద గలిగిన ఆ ప్రాంతంపై కన్నేసిన కొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మాధవ్ గాడ్గిల్ కమిషన్ నివేదికను బుట్ట దాఖలా చేయాలని చూశారు. స్థానికంగా ఉన్న ప్రజల్ని రెచ్చ గొట్టారు. ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగితే స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ప్రచారం ముమ్మరం కావడంతో మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు తలొగ్గిన ప్రభుత్వాలు మాధవ్ గాడ్గిల్ కమిషన్ చేసిన సూచనలకు సవరణలు ప్రతిపాదించి, పరిమితమైన వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చాయి. ఫలితంగా వయ నాడ్ ప్రాంతంలో మైనింగ్, క్వారీ కార్యకలాపాలు పెరిగి పోయాయి. అలాగే కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు సజావుగా సాగిపోయింది. ఈ చర్యలన్నింటి వల్లనే కేరళ తరచుగా విపత్తులకు గురవుతోందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. దేశంలో ఎటువంటి ఉపద్రవం సంభవించినా దాని చుట్టూ రాజకీయ రంగు పులుముకోవడం సహజమైపోయింది. వయనాడ్ మృత్యు విలయంపై ఆ మరుసటి రోజునే పార్లమెంట్లో హోమ్ మంత్రి అమిత్‌షా ‘కాలింగ్ అటెన్షన్’ రూపంలో చర్చను ప్రారంభించారు. ముందుగా ఆయన భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక (అలెర్ట్) లను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అదే సమయంలో పశ్చిమ కనుమలలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణం పరంగా సున్నిత ప్రాంతంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అందులో వయనాడ్‌లోని కనుమ ప్రాంతం కూడా ఉంది. అయితే, కేంద్రం తాజాగా ప్రకటన నేపథ్యంలో 5 రాష్ట్రాల పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన ఈ కనుమలలో ఇప్పటికే జరుగుతున్న పర్యావరణ విధ్వంసకర కార్యకలాపాలను నిలుపుదల చేయాలంటే అక్కడి పరిశ్రమలను వెంటనే తరలించాలి. ఆ పరిశ్రమలలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమల యజమానులకు తగిన పరిహారం ఇవ్వాలి. ఈ చర్యలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే జరగాలి. ఇవన్నీ జరగాలంటే.. రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ప్రజల ప్రాణాలకంటే విలువైనదేదీ లేదన్న స్పృహ పాలకుల్లో కలిగినప్పుడే విపత్తుల్లో చోటుచేసుకునే ప్రాణ, ఆస్తి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
కేరళ చీఫ్ సెక్రటరీగా భర్త తర్వాత భార్య
తిరువనంతపురం: దక్షిణ భారతదేశంలో నెల వ్యవధిలోనే అరుదైన రికార్డు పునరావృతమైంది. కేరళ నూతన ప్రధాన కార్యదర్శిగా శారదా మురళీధరన్ బుధవారం నియమితులయ్యారు. ఆమె తన భర్త, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వి.వేణు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. వేణు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రణాళిక విభాగంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కర్నాటకలోనూ ఆగస్టు 1న శాలినీ రజనీష్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. భర్త రజనీష్ గోయెల్ రిటైరయ్యాక ఆయన స్థానంలో శాలినీ సీఎస్ అయ్యారు.