Kishan Reddy
-
14 నెలలైనా.. హామీల అమలులో అదే కాలయాపన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని, తాము చేయలేకపోయిన హామీలను ఇంకొకరి మీద వేసి, వారు అడ్డుకుంటున్నారు అని ఎప్పుడూ ఎవరినీ నిందించలేదని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి విమర్శించారు. కొత్త ప్రాజెక్టుల పేరు మీద రూ. 1.5 లక్షల కోట్లు కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చిన్నపిల్లల నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో భారతీయ పురాతన చేతివృత్తుల వైభవాన్ని గుర్తుచేస్తూ రచించిన ‘వూట్జ్: ద ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్’పుస్తకాన్ని కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, తన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతున్నారని విమర్శించారు. ఇది దివాలాకోరు విధానం, బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, తమకు తెలియదని, రాష్ట్ర అప్పు రూ.3.5 లక్షల కోట్లే అనుకున్నానని రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నానని, హామీలు అమలు చేయలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రి మాట మార్చడం రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతకు అద్దం పడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు తామే హామీ ఇచ్చామని, తప్పకుండా అమలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, జాబ్ కేలండర్, నిరుద్యోగ భృతి, రైతులు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పెన్షన్లు సహా ఇచి్చన అన్ని హామీల గురించి ప్రస్తావిస్తామన్నారు. వీటన్నింటి గురించి శాసనసభలో చర్చిస్తే బాగుంటుందని కిషన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, రియల్టర్లను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. తనను ఎవరు తిట్టినా వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. -
నేనే మెట్రో తెచ్చా అంటున్నారు.. ఆ మెట్రో ఎక్కడుందో?: రేవంత్
హైదరాబాద్: కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. కిషన్‌రెడ్డి.. మెట్రో తానే తెచ్చానని చెప్పుకుంటున్నాడని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో తనకైతే తెలియదంటూ చమత్కరించారు రేవంత్. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా రేవంత్ మాట్లాడారు. ‘ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సహకరించడం లేదు. తెలంగాణకు నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తాం. ఇటీవల అఖిల పక్షం సమావేశం నిర్వహిస్తే కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ లో ఉండి రాలేదు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ హైదరాబాద్ కు వచ్చేది కూడా కిషన్‌రెడ్డికి తెలియదా?, ఈటల వచ్చారు.. కానీ కిషన్‌రెడ్డి రాలేదు. మెట్రో నేనే తెచ్చానని కిషన్‌రెడ్డి అంటారు. నాకైతే జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కన్పిస్తోంది కానీ కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది?,రీజనల్ రింగ్ రోడ్డు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. అదే ఇవ్వమని అంటున్నాం. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడటం లేదు. భూసేకరణ అడ్డుకుంటుంది ఈటల, లక్ష్మణ్. ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది రాష్ట్ర బీజేపీ నేతలే. మూసీకి నిధులు తెస్తే కిషన్‌రెడ్డికి సన్మానం చేసి గండపిండేరం తొడుగుతాను. సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదు? అని రేవంత్ ప్రశ్నించారు.ఇక రేవంత్ తన ఢిల్లీ పర్యటనపై కూడా మాట్లాడారు. ఢిల్లీకి 39 సార్లు కాదు 99 సార్లు వెళ్తాను. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటా. రాష్ట్రానికి కావాల్సిన అనేక అంశాలను క్లియర్ చేసుకొని వచ్చాను. కుల గణన ప్రభావమే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చాయి. హరీష్ రావు మోసం వల్లే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయాం’ అని రేవంత్ పేర్కొన్నారు. -
సంబరాలు చేసుకుంటే తప్పేంటి ? రేవంత్ ను ప్రశ్నించిన బండి, కిషన్ రెడ్డి
-
కేంద్ర మంత్రుల పోస్టులు.. ఖండించిన కరీంనగర్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ విజయ సంబురాల్లో జరిగిన పరిణామాలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే లాఠీ ఛార్జ్ ఆరోపణలను కరీంనగర్ పోలీసులు ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.కరీంనగర్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీలు ఝళిపించారని కేంద్ర మంత్రులు పోస్టులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిని పోస్ట్ చేశారు. అయితే.. విజయ సంబురాల్లో ఎలాంటి లాఠీ ఛార్జ్ జరగలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ కేంద్ర మంత్రుల ట్వీట్స్ ప్రెస్ నోట్ ద్వారా పోలీసులు వివరణ ఇచ్చారు. అవి ఫేక్ వీడియోలంటూ స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించారు. కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా.. భారత జట్టు విజయం సాధించిన సందర్బంగా విజయోత్సవాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం, అనుమతి ఇవ్వకపోవడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు.This is how the Congress govt. in Telangana not allowing India’s #ChampionsTrophy2025 win celebrations.Shameful! pic.twitter.com/OxIdrfkn90— G Kishan Reddy (@kishanreddybjp) March 9, 2025బండి సంజయ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారు?. భారత విజయాన్ని మనం జరుపుకోలేము.. కానీ, పాకిస్తాన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తారా?. భారత విజయాన్ని జరుపుకోవడం మతపరమైన సమస్యగా ఎలా మారుతుంది?. శాంతిభద్రతల సమస్యలను సృష్టించడానికి ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారో తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.Can the Home Minister of Telangana Shri Revanth Reddy garu clarify - which country is Karimnagar police supporting?We can’t celebrate India’s win, but a flexi with Pakistan’s name will be removed?How does celebrating India’s victory become a “communal issue”? @TelanganaDGP… https://t.co/4Hpyid5ThM— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 9, 2025 -
అప్పుల సాకుతో హామీలకు పాతర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అప్పుల సాకు చూపి ఎన్నికల హామీలను ఎగ్గొట్టే పథకం వేశారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.7.50 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎం గతంలో అనేకమార్లు చెప్పారు. ఇటీవల ఢిల్లీలో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాను సీఎం అయ్యాక కూడా రూ.3.5 లక్షల కోట్ల అప్పే ఉందని అనుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు అప్పుల పేరు చెప్పి హామీల అమలుపై చేతులెత్తేశారు’అని ధ్వజమెత్తారు. బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానం కానందువల్లే గ్యారంటీలు అమలు చేయకుండా సాకులు వెతుకుతున్నారని ఆరోపించారు. ఇష్టారీతిన హామీనిచ్చా, పథకాలు ప్రకటించి.. వాటిని కేంద్రం పూర్తిచేయాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై మాకేమీ తొందరలేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా వచ్చే ఎన్నికల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం’అని ప్రకటించారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పారు.జాతీయ రహదారిగా ట్రిపుల్ఆర్ ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ఆర్)ను జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ‘తెలంగాణలో రూ.6,280 కోట్ల ఖర్చుతో 285 కి.మీ. మేర 10 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. వీటిని పార్లమెంటు సమావేశాల తర్వాత గడ్కరీ ప్రారంభిస్తారు. రూ.961 కోట్లతో 51 కి.మీ. రోడ్డు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంపై గడ్కరీతో చర్చించాను. రూ.18,772 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ రోడ్డు విషయంలో ఇంకా మూడు పనులు జరగాల్సి ఉంది.పీపీపీ అప్రయిజల్ కమిటీ, కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం నోట్, నిధులకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరగాలి. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది’అని కిషన్‌రెడ్డి వివరించారు. పెండింగ్ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూ సేకరణ జరిపి అప్పగించాలని కోరారు. వరంగల్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొత్తం భూమి ఇవ్వలేదని చెప్పారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. జనాభా తగ్గినా తెలంగాణలో కానీ.. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో కానీ ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని స్పష్టంచేశారు. ఒక దేశం–ఒక ఎన్నిక దేశ భవిష్యత్ ఎజెండా తెలంగాణలో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై రాజకీయాలకు అతీతంగా చర్చలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత నుంచి సంతకాల సేకరణ నిర్వహించాలని తీర్మానించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను పార్టీ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని శనివారం జరిగిన సమావేశంలో ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు.ఒకదేశం–ఒక ఎన్నిక అనేది బీజేపీ ఎజెండా కాదని దేశ భవిష్యత్ ఎజెండా అని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, పార్లమెంట్ ఎన్నికలు మరో సారి జరగడం వల్ల రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, ప్రజల సమయం వృథా అవుతోందని.. పాలన, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారించడానికి వీలులేకుండా పోతోందని అన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వన్‌నేషన్ – వన్ ఎలక్షన్‌పై నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి ఎంఎంటీఎస్‌కు కిషన్‌రెడ్డి అడ్డంకి
శంషాబాద్: ‘నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేకమార్లు రైల్వేమంత్రికి చేసిన విన్నపంతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ మంజూరైంది. కానీ ఆ పనులు ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్రెడ్డియే. ప్రతి ఆదివారం యాదాద్రికి లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ పర్యటనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో కలసి రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎయిర్‌పోర్టు మంజూరు కోసం జీఎంఆర్ సంస్థ అభ్యంతరాన్ని పరిష్కరించి.. వారిని ఒప్పించింది తామేనన్నారు.ఇప్పటికే భూసేకరణ కోసం రూ. 2 వేల కోట్లు కూడా ప్రభుత్వం కేటాయించిందన్నారు. మరో మూడు నెలల్లో కొత్తగూడెం విమానాశ్రయం కూడా మంజూరవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. వరంగల్‌లో రీజినల్ రింగురోడ్డుకు రైల్వేరింగు రోడ్డు కూడా ఏర్పాటు చేసుకునేందుకు రైల్వేమంత్రి అంగీకరించారన్నారు. సానుకూలంగా స్పందించారు..తాము చేసిన అన్ని వినతులకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ అభివృద్ధి ఉత్తి మాటలకే పరిమితమైందని మంత్రి సీతక్క విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ దేశ భవిష్యత్ ఎజెండా: కిషన్ రెడ్డి
హైదరాబాద్: వన్ నేషన్ - వన్ ఎలక్షన్(One Nation-One Election) అనేది దేశ భవిష్యత్ ఎజెండా అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ఇది బీజేపీ ఎజెండా కాదని, దేశ భవిష్యత్ ఎజెండా అని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్సర్, చంద్రశేఖర్ తివారీలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా తెలంగాణలో జరిగాయి. రెండు సంవత్సరాలుగా ఎన్నికల కోసమే రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రధాన మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి వస్తుంది. వికసిత భారత్ కోసం కృషి చేయాల్సిన సమయం.. ఎన్నికల కోసం వెచ్చించాల్సి వస్తుంది. ఎన్నికల కోసం సమయం వృథా అవుతోంది. అభివృద్ధికి అడ్డంకిగా ఎన్నికలు మారుతున్నాయి. ప్రతీసారి ఎన్నికల పేరు మీద రాజకీయ పార్టీల సమయం వృథా అవుతుంది. తెలంగాణలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై రాజకీయాలకు అతీతంగా చర్చలు పెట్టాలి. స్వచ్చంధ సంస్థలతో విద్యార్థులతో, యువతతో పార్టీతో సంబంధం లేకుండా సంతకాలు సేకరణ చేయాలి. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనేది బీజేపీ(BJP) ఎజెండా కాదు... దేశ భవిష్యత్ ఎజెండా’ అని ఆయన పేర్కొన్నారు. -
ఎవరి మీటింగ్ వాళ్లదే!
-
రేవంత్‌కు ఝలక్.. బీఆర్ఎస్ బాటలోనే బీజేపీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీల అఖిలపక్ష సమావేశానికి బీజేపీ సభ్యులు హాజరుకాకూడదని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. మరోవైపు.. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. నలుగురు రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొనడం లేదు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో.. పార్టీ కార్యక్రమాల కారణంగా సమావేశానికి హాజరు కాలేకపోతున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియజేయాలని కోరుతున్నాను. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అంటూ చెప్పుకొచ్చింది.ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షత వహించనున్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. -
‘సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం.. తెలంగాణ సమాజానికి అంకితమన్న కిషన్ రెడ్డి.. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.‘పదేళ్లు అధికారంలో ఉంటామంటున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో కర్రకాల్చి వాత పెట్టారు. మా సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి కావొచ్చాయి. రానున్న రెండు నెలల్లో అన్ని కమిటీలు పూర్తి చేసుకుంటాం. రాష్ట్రంలో పూర్తి బలోపేతం దిశగా పని చేస్తాం. అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున అడుగడుగునా ప్రశ్నిస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శాసన సభ, శాసన మండలిలో వినిపిస్తాం. త్రిశూలం మాదిరి మండలిలో ముగ్గురు సభ్యులు బీజేపీకి ఉన్నారు . కార్యకర్తల మీద కేసులు, కుట్రలు చేసినా బీజేపీ గెలిచింది. ఈ విజయంతో మేమేమి అతి ఉత్సాహం చూపించడం లేదు, మా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రభుత్వం మీద మరింత పోరాడాలని, ప్రశ్నించాలని బాధ్యత పెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో వ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది బీజేపీ బలపడి తెలంగాణను రక్షించాలి. సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం. రెఫరెండం అని ఎవరు అన్నారో వాళ్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ప్రజల మద్ధతు, ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్ల, ఉద్యమకారుల సపోర్టుతో గెలిచాం. ఆ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్సే కలిసాయి కానీ మేము ఎప్పుడు ఎవరిని కలవలేదు. ఎవరిని కలిసే ప్రసక్తే కూడా లేదు. సమస్యలపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం . పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వచ్చిందో అదే రిపీట్ అవుద్ది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఓడించి తీరుతాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడమే మా నెక్స్ట్ టార్గెట్’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్‌కు గిఫ్ట్ ఇచ్చాం: కిషన్ రెడ్డి
-
రేవంత్‌కు ఇది చెంప పెట్టులాంటి తీర్పు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలతో పాలక పక్షంపై ఉన్న ప్రజా వ్యతిరేకత బయటపడిందని, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని అన్నారాయన.సాక్షితో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధారణ విషయమేమీ కాదు. ఇది బీజేపీ సాధించిన సమిష్టి విజయం. తెలంగాణలో పాలకులు మారినా.. మార్పు రాలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 37 శాతం మంది బీజేపీని ఆదరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా నిలిచారు. .. కాంగ్రెస్‌కు, రేవంత్‌కు చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత అర్థమైంది. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా’’ అని అన్నారాయన. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అంజిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ.. ఈ విజయం బీజేపీ కార్యకర్తలందరిదని అన్నారు. కిషన్ రెడ్డి, సంజయ్ తో పాటు, అందరి సహకారంతో ఈ విజయం సాధించాం. మేము ఊహించినట్టే విజయం దక్కింది. మండలిలో ఉద్యోగుల సమస్యలపై గళం విప్పుతా’’ అని అన్నారు.సాక్షి టీవీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇది బీజేపీ కార్యకర్తల విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చెంపపెట్టు ఈ విజయం. తెలంగాణాలో బీజేపీ బలపడుతుందనేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలు నిదర్శనం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ విజయం ప్రభావం తప్పకుండా ఉంటుంది అని అన్నారు. -
ఫైనల్‌కు చేరిన టీమిండియాకు కిషన్‌రెడ్డి అభినందనలు
హైదరాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు(మంగళవారం) జరిగిన తొలి సెమీ ఫైనల్ లో గెలిచి ఫైనల్ చేరిన టీమిండియా విజయం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. . ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రోహిత్ సేనకు అభినందనలు తెలియజేశారు. ఇదే జోష్ ను ఫైనల్ కూడా కనబరిచి చాంపియన్స్ ట్రోఫీ గెలవాలని ఆయన ఆకాంక్షించారు.ఆసీస్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), రాహుల్(42 నాటౌట్)లు బాధ్యతాయుతంగా ఆడగా, హార్దిక్ పాండ్యా( 24 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ 28)లు బ్యాట్ ఝుళిపించారు. దాంతో భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించి తుదిపోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ తలపడనుంది. -
మల్క కొమురయ్య గారి విజయంపై స్పందించిన కిషన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య గారి విజయంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటనప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త మల్క కొమురయ్య ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్బంగా హృదయపూర్వక అభినందనలు.ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు, తెలంగాణ ప్రజలకు.. బీజేపీ విజయానికి కృషిచేసిన కార్యకర్తలకు, ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు.ఏ ఆకాంక్షల కోసమైతే, ఉపాధ్యాయులు బీజేపీని గెలిపించారో.. వాటి సాధనకు బీజేపీ కృషిచేస్తుంది. -
సమస్య మోదీ కాదు.. కిషన్‌రెడ్డి: సీఎం రేవంత్
సాక్షి, వనపర్తి: బీఆర్ఎస్, బీజేపీ నేతల తప్పుడు మాటలు నమ్మొద్దని.. ఆ పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒకేసారి రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పథకాలు అమలు చేయడం లేదని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలకు వాతలు పెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ చేశామని సీఎం పేర్కొన్నారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రాష్ట్రానికి సమస్య మోదీ కాదు.. కిషన్‌రెడ్డి’ అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. తెలంగాణపై కిషన్‌రెడ్డి పగబట్టారు. ఆయనకు ఎందుకంత అక్కసు?. ఖట్టర్ సమీక్షకు హాజరుకాని కిషన్‌రెడ్డి.. మెట్రోకు సహకరిస్తున్నారంటే నమ్మాలా?. కిషన్‌రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత ప్రభుత్వమే కారణం. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
అందుకే నాపై విమర్శలు.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: పద్నాలుగు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని దుయ్యబట్టారు. శనివారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనేక రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. గతేడాది డిసెంబర్‌లోపు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి?. ఇళ్లులేని వారందరికీ రూ.5 లక్షలు, ఇంటి స్థలం ఇస్తామన్నారు.. ఏమైంది?’’ అంటూ కిషన్‌రెడ్డి నిలదీశారు.‘‘బాధ్యతలు, హామీలను విస్మరించి సీఎం గాలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలిపించి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి నాపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలే సీఎం అసహనానికి కారణం. రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాం. నేను బెదిరింపు రాజకీయాలు చేస్తున్నానన్నది అవాస్తవం. సీఎం రేవంత్ దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. -
‘వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటాడో తెలీదు’
నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డిడ్డికి సీఎం రేవంత్ రాసిన లేఖ దిక్కుమాలినదిగా అభివర్ణించారు రాకేశ్‌రెడ్డి. కిషన్‌రెడ్డిడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదంటూ ధ్వజమెత్తారు.‘ మూడు పార్టీలు మారి.. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం కుర్చీ తెచ్చుకున్న వ్యక్తి రేవంత్. పుట్టినప్పుడే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి కిషన్‌రెడ్డి. కిషన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్‌కు లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిన ఘనత కిషన్‌రెడ్డిది. నిజాయితీలో మచ్చలేని వ్యక్తి కిషన్‌రెడ్డిడ్డి. రానున్న ఎన్నికల్లో రేవంత్ కు గట్టి సమాధానం చెబుతాం. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చేపడితే మేమేందుకు నిధులిస్తాం. అవినీతి ప్రాజెక్టుల తప్ప, ప్రజలకు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చడం లేదు. తెలంగాణకు నిధులిచ్చి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వమే’ అని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తెలిపారు రేవంత్ Vs కిషన్‌రెడ్డి.. బహిరంగ లేఖతో సీఎం కౌంటర్ -
కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
-
రేవంత్ Vs కిషన్‌రెడ్డి.. బహిరంగ లేఖతో సీఎం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శలపర్వం కొనసాగుతోంది. పలు ప్రాజెక్ట్‌ల అంశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి కౌంటరిస్తూ తాజాగా సీఎం రేవంత్ బహిరంగ లేఖను విడుదల చేశారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ తాజాగా తొమ్మిది పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశామో తెలియజేశారు. ఇక, సీఎం రేవంత్ లేఖలో.. ఆర్ఆర్ఆర్, మూసీ, మెట్రో ఫేజ్-2, హైదరాబాద్ సివరేజ్, వరంగల్ అండర్ గ్రౌండ్ సివరేజ్ కోసం ఎన్ని సార్లు కేంద్ర మంత్రులను, అధికారులను కలిసినా ఉపయోగం లేదు. మేము సిస్టం ఫాలో అయ్యాం.. కానీ, కేంద్రమే పక్కన పెట్టింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితమ ప్రధాని మోదీతో సమావేశానంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘హైదరాబాద్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదు. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండి. నేను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తా. సన్మానిస్తాం అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని మోదీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలి. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు. నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. -
రేవంత్.. మెట్రో అడ్డుకున్నట్టు నిరూపించే దమ్ముందా?: కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. నిజంగా రేవంత్‌కు ధైర్యం ఉంటే తాను మెట్రోను అడ్డుకున్నా అనే విషయం నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై ప్లానింగ్ ఉందా? అని ప్రశ్నించారు.కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలి. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీని అడిగి.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చారా?. హామీల, పథకాల అమలు విషయంలో మాపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. దమ్ములేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా?. ప్రధానికి కాగితం ఇవ్వగానే పనులు అయిపోతాయా? అని ప్రశ్నించారు.అంతకుముందు, ప్రధానితో సమావేశానంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘హైదరాబాద్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదు. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండి. నేను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తా. సన్మానిస్తాం అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఖ్యాతి గాంచిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని.. ప్రపంచ అవసరాల్లో 60 శాతానికి పైగా వ్యాక్సిన్లు, 20% జనరిక్ మందులు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయని తెలిపారు. బయో ఆసియా– 2025 సదస్సు ముగింపు కార్య క్రమంలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ‘‘గత పదేళ్లలో భారత ఫార్మా ఎగుమతుల విలువ రెట్టింపు అయింది. 2014లో ఫార్మా ఎగుమతి విలువ 15 బిలియన్ డాలర్లుకాగా.. 2024 నాటికి అది 27.85 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ పరిశోధనలు, ఏఐ–హెల్త్ కేర్, తయారీ రంగంలో వేగంగా వృద్ధి చెందుతూ.. ‘వసుధైక కుటుంబం’అనే భావనకు ప్రతిబింబంగా నిలుస్తోంది..’’అని తెలిపారు. ఫార్మాలో తెలంగాణ కీలకం.. ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35శాతం, బల్క్ డ్రగ్స్‌లో 40శాతం ఆదాయం భాగ్యనగరం నుంచే వస్తోందన్నారు. 800 ఫార్మా, బయోటెక్, మెడ్‌టెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు వంటివి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని... 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకానమీ సృష్టి దిశగా హైదరాబాద్ అడుగులు వేస్తోందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగానికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్లోబల్ హెల్త్‌కేర్ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఇన్నోవేటర్లు, శాస్త్రవేత్తలు భారత్‌తో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా.. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేసిన వారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర శ్రీధర్‌బాబు బహుమతులు అందజేశారు. 200కుపైగా దేశాలకు భారత మందులు: పీయూష్ గోయల్ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‌గా భారతదేశం గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. బయో ఆసియా–2025 సదస్సు ముగింపు సందర్భంగా ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాలకు జనరిక్ మందులు సరఫరా చేస్తున్నాం. ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్, హైవాల్యూ బయో ఫార్మాపై దృష్టి సారించాం..’’అని పీయూష్ గోయల్ తెలిపారు. ఫార్మా రంగంలో సమాచార మార్పిడి, పెట్టుబడులు, ఆవిష్కర్తలకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్, జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్ జోన్, భారత్ మాల కార్యక్రమంలో భాగంగా 2,605 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 4 గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు, నిజామాబాద్ పసుపుబోర్డులను తెలంగాణకు కేటాయించామని వివరించారు. హైదరాబాద్‌ను ఫార్మా కేంద్రంగా నిలుపుతాం: మంత్రి శ్రీధర్‌బాబు 22వ బయో ఆసియా సదస్సుకు 44 దేశాల నుంచి 3 వేల మంది డెలిగేట్స్, 100 మంది వక్తలు హాజరయ్యారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 200 బిజినెస్ టు బిజినెస్ మీటింగ్‌లు జరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని తెలిపారు. బయో ఆసియా సదస్సు ముగింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లైఫ్ సైన్స్ పాలసీని త్వరలో తీసుకొస్తామని.. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో లైఫ్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ‘‘అమెరికా, ఆ్రస్టేలియా, తైవాన్ దేశాల సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని బయో ఆసియా సదస్సులో తెలిపాయి. పరిశోధనల ద్వారా కొత్త టెక్నాలజీని ఉపయోగించి మందులు తక్కువ ఖర్చుతో బాధితులకు అందించాలన్నది లక్ష్యం. మాపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి, చెప్పింది చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ఫార్మా పరిశ్రమల కేంద్రంగా నిలపడానికి మా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంది..’’ అని వెల్లడించారు. -
ఎరువుల కొరత.. కృత్రిమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎరువుల కొరత లేదని, కావాలనే కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆరోపించారు. మంగళవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఎరువుల కొరతపై మీడియాలో కథనాలు రావటంతో నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడాను.రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే ఎక్కువ కోటా ఎరువులు విడుదల చేశామని కేంద్రం స్పష్టత ఇచి్చంది. 2024–25 రబీ సీజన్లో 9.5 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరమైతే, 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపింది. ఈ విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత పదేళ్లుగా దేశంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. పాత అలవాటు ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు’అని విమర్శించారు. 27 శాతం అధికంగా సరఫరా గత ఏడాది అక్టోబర్1 నుంచి ఈ నెల 22 వరకు కూడా తెలంగాణలో యూరియా అందుబాటులో ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. గతేడాదితో పోలిస్తే 27.37 శాతం అధికంగా ఎరువులు సరఫరా చేశామని చెప్పారు. ఈ నెల 22న 40 వేల టన్నుల యూరియాను కేంద్రం అదనంగా పంపిందని వెల్లడించారు. 23, 24 తేదీల్లో అదనంగా మరో 48 వేల టన్నుల యూరియా పంపిస్తున్నట్లు కేంద్రం తెలిపిందని వివరించారు. లెక్క ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 1.22 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఇదిగాక 6 వేల టన్నులు కృష్ణపట్నం పోర్టు నుంచి ఆదిలాబాద్‌కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణకే అత్యధికంగా ఎరువుల సరఫరా చేస్తున్నామని చెప్పారు. యూరియాను రైతులకు సరఫరా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు.పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా తెలంగాణలో 31 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు. -
‘అప్పుడు సీబీఐ దర్యాప్తు అంటూ హోరెత్తించారు.. ఇప్పుడు ఆ ఊసే లేదే’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడి ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు చాలా అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక సీబీఐ డిమాండ్ అనే మాటే ఎత్తడం లేదన్నారు. అధికారంలోకి రాగానే ఆయన వైఖరి మారిందన్నారు కిషన్ రెడ్డి. అప్పుడు సీబీఐ దర్యాప్తు అంటూ హోరిత్తించారు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.‘బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సినిమా నటులు, జడ్జీలు, మీడియా ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. సీబీఐ దర్యాప్తు చేస్తే మేం నిగ్గు తేలుస్తాం. మూసీ ప్రక్షాళనకు మేం ఎక్కడ అడ్డుకుంటున్నాం. మూసీ ప్రక్షాళన కు మేం వ్యతిరేకం కాదురేవంత్ మెట్రో నిర్మాణం చేస్తే మేం ఎందుకు అడ్డుకుంటాం. లేనిపోని ఆరోపణలు చేసి దిగజారి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద మార్కులు వూయించుకోవడానికి కేంద్ర మంత్రులను, మోదీని తిడుతున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ను తెలంగాణకు అదనంగా తెచ్చింది మేమే. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జలాల తరలింపును అడ్డుకోవాలి’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడు ఆ కేసు ఎలా ముందుకెళ్లదో తామూ చూస్తామని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలు తీసుకోని అసమర్థుడు రేవంత్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన అసమర్థతను బీజేపీపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, తాము ఎక్కడ కుమ్మక్కు అయ్యామో నిరూపించాలన్నారు. ఈ కేసును రేవంత్ వదిలిపెట్టినా.. బీజేపీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీగా హైకోర్టులో కేసు వేయడమే కాకుండా, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. అయితే బీఆర్ఎస్తో రేవంత్ కుమ్మక్కై ఈ కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రేవంత్ మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడుచోట్లా గెలిచే అవకాశాలుండగా, పోటీచేసిన ఆ ఒక్కసీటులోనూ ఓటమి భయంతో ఒత్తిడికి గురై రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారన్నారు. ‘రేవంత్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది.పోలింగ్‌కు ముందే సీఎం ఓటమిని ఒప్పుకున్నారు. రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల, నిరుద్యోగులకు ఏం చేశారో రేవంత్‌రెడ్డి చెప్పాలి’అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలమే బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలమని, ఎక్కడా తాము ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ముస్లింలను బీసీల్లో చేర్చడం బరాబర్ తప్పే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ కోటాలో అధికమంది కార్పోరేటర్లుగా ముస్లింలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతుంది. నాకు నైతిక విలువలున్నాయి. రేవంత్ మాదిరిగా పార్టీలు మారలేదు. గంటకో మాట మాట్లాడలేదు. దయ్యం అని పిలిచిన సోనియాను దేవత అని పొగడలేదు’అని ఓ ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అని నిలదీశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం కిషన్‌రెడ్డి బహిరంగలేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను మళ్లీ మోసగించేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనపై కిషన్‌కెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. ‘14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉంది. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా?, రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయం?, ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటు, నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు మీరు ఏ సందేశం ఇస్తున్నట్లు?, కళాశాలల యాజమాన్యాలపట్ల మీ తీరు దుర్మార్గం, ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. కాలేజీల యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే దుస్థితి దాపురించింది. ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్?, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటు, నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారు. మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా యుద్ద ప్రాతిపదికన బకాయిలు విడుదల చేయండి. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయండి. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ ఈరోజే విడుదల చేయండి. యువత అకౌంట్లలో 14 నెలల బకాయి కలిపి రూ.56 వేల నిరుద్యోగ భృతి జమ చేయాలి. ఇవన్నీ యుద్ద ప్రాతిపదికన విడుదల చేసిన తరువాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. దగా హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు సిద్ధంగా లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ కిషన్‌రెడ్డి హెచ్చరించారు. -
పాలకులే మారారు..పాలన కాదు
కైలాస్‌నగర్: రాష్ట్రంలో పాలకులు మాత్రమే మారారు.. పాలన తీరు ఏ మాత్రం మారలేదని కేంద్ర గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. అప్పులు, ఆర్థిక దోపిడీలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరే అని విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన తీరుపై ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మాటలు కోటలు దాటగా, కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి మాటలు సచివాలయ గేటు కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. వందరోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవడంతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారనే కార్యాచరణ కూడా ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం మొండిహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి తమ అసమర్థపాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి, రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారం చేశారని ఆరోపించారు. 14 నెలల పాలనలోనే ఈ ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీల్లో 20 శాతం కూడా అమలు చేయని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ పాలనపై బహిరంగచర్చకు రావాలని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీ పాలనను విమర్శించే అర్హత రేవంత్, రాహుల్‌గాంధీలకు లేదని చెప్పారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే దీనిని అమలు చేయకుండా కేంద్రంపై నెపం మోపేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: కిషన్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని.. సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హామీలు అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమన్నారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలో సీఎం రేవంత్ స్పష్టం చేయాలని కిషన్‌రెడ్డి అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి. బీజేపీని ఆదరించాలి. బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుంది. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లను స్వాగతిస్తాం. ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తాం. బీజేపీ తో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్‌తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. జిల్లా అధ్యక్షుల నియామకాల ప్రక్రియ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక’’ ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు.14 నెలల్లో కాంగ్రెస్ ప్రజలకు ఓరగబెట్టింది ఏమీ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు శాసన మండలి ప్రాధాన్యతను తగ్గించాయి. ప్రజా సమస్యల పోరాటానికి శాసన మండలి వేదిక. కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. ముస్లింలను బీసీ లో చేర్చే కుట్ర జరుగుతుంది. దానికి వ్యతిరేకం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది: Kishan Reddy
-
‘మాకు అన్ని వర్గాల మద్దతు ఉంది’
భువనగిరి: రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఉపాధ్యాయులు అండగా ఉన్నారన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందని, అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్బీఆర్ఎస్ లు నాటకాలు ఆడుతున్నాయన్న కిషన్ రెడ్డి.. ఆ రెండు పార్టీలకు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు. బీజేపీకి అన్ని వర్గాల మద్దతు ఉందని భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా19 మంది చివరకు బరిలో ఉన్నారు. ఈ నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 10వ తేదీ వరకూ ానామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం ఓటింగ్ ముగిసే సమయంలో క్యూ లైన్లో ఉన్న వారికి టోకెన్ నంబర్లను ఇచ్చి, ఓటింగ్ వేసే ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘కేంద్ర మంత్రులే అలా మాట్లాడి చిచ్చుపెడుతున్నారు’
హైదరాబాద్: కేంద్ర మంత్రులైన బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడటం సరైంది కాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. బీసీలలో మైనార్టీలను కలిపారని వారు చెప్పడం సరికాదన్నారు. సాధారణ వ్యక్తి చదువుకుని మాట్లాడితే వదిలేయొచ్చు..కానీ కేంద్ర మంత్రులే అలా మాట్లాడి చిచ్చు పెడుతున్నారన్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు.‘కిషన్ రెడ్డి... బండి సంజయ్ లకు పోస్టు లో వివరాలు పంపిస్తున్న.హంటర్ కమిషన్ ..1882 లో వేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. 1918 లో మిల్లర్ కమిషన్ .. స్టడీ చేసింది. 1953 లో కాక కాలేకర్ రిపోర్ట్ లో కూడా కొన్ని కులాలు బీసీ జాబితా లో ఉన్నాయి. గుజరాత్ లో కూడా obc ముస్లిం లు ఉన్నారు.ఎక్కడా లేదు..తెలంగాణ లో ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులే కదా... బీసీ ల జాబితాలో ఉన్న ముస్లిం లను తొలగించి..గుజరాత్ లో కూడా తొలగించండి. మతంలో కూడా పేదరికం లేదా..? , మీరు పిలిస్తే...మీ పార్టీ కార్యాలయంకి వచ్చి కూడా ప్రజెంటేషన్ ఇస్తా. కానీ మాతల మధ్య చిచ్చు పెట్టొద్దు. మనం అంతా భారతీయులం. వెనకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా...వెనకబడిన తరగతులు.బీసీల మీద అంత ప్రేమ ఉంటే... బీసీ కుల గణన చేయించండి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పై అన్ని వర్గాల ప్రజలు నిరాశతో ఉన్నారు
-
ఈ అమానుష దాడి దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
ఢిల్లీ: చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. ‘చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగ రాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలి.ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న శ్రీ రంగరాజన్.. దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందువరసలో ఉన్నారు. దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బీజేపీ శ్రీ రంగరాజన్ గారికి అన్నిరకాలుగా అండగా నిలబడుతుంది మనవిచేస్తున్నాను’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.దాడి ఇలా.. సీఐ పవన్‌కుమార్ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పని చేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.🚨Great job, Telangana law and order—thriving for all the wrong reasons!What a proud moment for our society—when even a deeply respected figure like Sri Rangarajan garu, the chief priest of Chilkur Balaji Temple and a staunch advocate for Dharma, isn’t spared from goons.… pic.twitter.com/sVeNmCiXus— VoiceofValor (@VoiceofValr) February 10, 2025 -
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కార్పొరేటర్లంతా పూర్తి సమయం కేటాయించాలని కిషన్ రెడ్డి కోరారు. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికలకు.. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలు, ప్రజలకు చేకూరే లబ్ధి, ప్రాజెక్టులు, నిధులను వివరించాలని కోరారు.జీహెచ్ఎంసీ మేయర్ పీఠం సాధిస్తే.. అనంతరం రాష్త్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందనే సంకేతాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్టాండింగ్ కమిటీపై మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. జీహెచ్ఎంసీ పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానంపై బీఆర్ఎస్, ఎంఐఎంలు ఎలా వ్యవహరిస్తాయో చూసి.. దానికనుగుణంగా బీజేపీ వ్యూహం ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా.. పార్టీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. కేజ్రీవాల్ ఓటమితో బీఆర్ఎస్లో కలకలంబీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో జతకట్టాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సూచించడంపై కేంద్రమంత్రి, జి.కిషన్‌రెడ్డి స్పందించారు. ‘లిక్కర్ స్కామ్ భాగస్వామి’ అయిన కేజ్రీవాల్ ఓడిపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందని, అందుకే పాత దోస్తు అయిన కాంగ్రెస్‌తో మరోసారి బహిరంగంగా జతకట్టేందుకు కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. -
అన్ని సీట్లూ గెలవాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు (రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్) సీట్లనూ గెలుచుకుని సత్తా చాటాలని బీజేపీ తీర్మానించింది. ఈ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహం, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకోసం వెంటనే రంగంలో దిగాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ఎంపీస్థాయి నేతలు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు పూర్తిగా ఈ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి, అనుకున్న ఫలితాలను సాధించాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించింది. శనివారం ఓ స్టార్ హోటల్లో తొలుత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, ఆ తర్వాత రాష్ట్రపదాధికారులతో జరిగిన కీలక సమావేశాల్లో.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్– నిజామాబాద్– మెదక్– ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, ఇదే నియోజకవర్గం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, నల్లగొండ– ఖమ్మం– వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డిలను రాష్ట్ర నాయకత్వం పరిచయం చేసింది. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రానున్న రోజుల్లో కర్ణాటక, తెలంగాణలో స్వతంత్రంగా అధికారంలోకి వస్తాం. కేరళ, తమిళనాడులో కూడా బీజేపీ బలం పెరిగింది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరిస్తోంది’అని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ప్రతిఒక్కరూ చైతన్యంతో ఆలోచించి ప్రజల పక్షాన నిలిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్రరావు, పొంగులేటి సుధాకరరెడ్డి, పారీ్టనేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు, డా.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చారు’
హైదరాబాద్: ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అక్కడ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ఇది ఢిల్లీ(Delhi Assembly Elections 2025) ప్రజల స్పష్టమైన తీర్పు అని తేల్చిచెప్పారు.ఢిల్లీ గల్లీలో దుర్గంధం చూస్తే అన్నం కూడా తినలేం. ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈ తీర్పునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి 400 సీట్లు ఇవ్వనందుకు ప్రజలు బాధపడుతున్నారు. అందుకే ఆ తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం అందిస్తున్నారు ప్రజలు. ఢిల్లీలో కేజ్రీవాల్ బాగుపడ్డాడు తప్ప.. పేద ప్రజల బతుకులు మారలేదు. గల్లీ గల్లీలో లిక్కర్ షాపులు ఏర్పాటు చేశారు. ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చిన ఘనత కేజ్రీవాల్‌ది. లిక్కర్ స్కాం తో ఢిల్లీ ప్రజలు తలదించుకున్నారు. ఢిల్లీ ప్రజల చేతిలో కేజ్రీవాల్, ిసిసోడియాలు చావుదెబ్బ తిన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు.అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే సత్తా మోదీ(Narendra Modi)కే ఉందని ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పాలన చూశాక వారికి పొరపాటున కూడా ఓటేయొద్దని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అతి తక్కువ కాలంలో వ్యతిరేకత మూటగట్టుకుంది. తొందర్లోనే ఢిల్లీ తీర్పు తెలంగాణలో రాబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలపై బీజేపీ మాత్రమే కొట్లాడుతుందని ప్రజలు నమ్ముతున్నారు’ అని ఈటెల పేర్కొన్నారు.కాంగ్రెస్ దీన స్థితి చూస్తే జాలేస్తోంది: కిషన్‌రెడ్డి -
కాంగ్రెస్ కు గాడిద గుడ్డు.. ఉచితాలతో అధికారం రాదు
-
అజయ్ కోసం హుస్సేన్ సాగర్‌లో గాలింపు
హైదరాబాద్, సాక్షి: ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటన తర్వాత అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్‌లో రెండు బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు గాలింపు చేపట్టారు. మరోవైపు.. యువకుడి తల్లిదండ్రుల రోదనలతో ఈ ప్రాంతం మారుమోగుతోంది. కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్(21)గా నిర్ధారణ అయ్యింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి భరతమాత మహా హారతి కార్యక్రమం కోసం అజయ్ ట్యాంక్ బండ్‌కు వచ్చాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. మరోవైపు.. అతని ఆచూకీ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అజయ్‌కు ఈత రాదని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉదయం నుంచి గజఈతగాళ్లతో సాగర్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.ఘటనపై కేసు నమోదుహుస్సేన్ సాగర్‌లో భారతమాత హారతి అపశ్రుతి ఘటనపై కేసు నమోదయ్యింది. బోటు టూరిజం ఇన్‌ఛార్జి ప్రభుదాస్ ఫిర్యాదుతో లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆదివారం భరతమాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు. అనంతరం ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. -
హుస్సేన్ సాగర్ తీరంలో ఘనంగా భారతమాతకు మహా హారతి (ఫొటోలు)
-
సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతృప్తిగా లేరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి చెందిన ప్రజలూ సంతృప్తికరంగా లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, వ్యాపారులు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సంతృప్తికరంగా లేరన్నమాట వాస్తవం. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ లేదు.యువతకు ఇస్తామన్న రూ.4వేల నిరుద్యోగ భృతి లేదు, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు లేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న రూ.2,500 ఆర్థిక సహాయం రాలేదు. రైతులకు చేస్తామన్న రుణమాఫీ పూర్తి చేయరు, రైతు భరోసా కూడా అరకొరే. ఆటో డ్రైవర్లు మొదలుకొని గీత కార్మికుల వరకూ కార్మికులకు ఇస్తామన్న భరోసా దొరకదు. దళితులకు ఇస్తామన్న రూ.12 లక్షలు మరిచిపోయారు. బెదిరింపులతో వ్యాపారాలకు అనువైన వాతావరణాన్ని దెబ్బ తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు అంతేలేదు. సామాన్య ప్రజలు మొదలుకొని తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో అసంతృప్తితో ఉన్నారు..’ అని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్.. బొమ్మా బొరుసు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ప్రజలు చూస్తున్నారని, అభివృద్ధిలో ఈ రెండు పార్టీల వైఖరి బొమ్మ, బొరుసు మాదిరి ఉందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పలువురు యువకులు ఆదివారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కాలయాపన చేస్తున్నాయని, రెండు పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలని ఆరోపించారు.ఈ రెండు పార్టీల నేతలు రాష్ట్ర ఖజానాను దోపిడీ చేశారని మండిపడ్డారు. విశ్వనగరమని చెబుతూ వీధుల్లో కనీసం లైట్లు కూడా లేవన్నారు. ప్రభుత్వ శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. లిక్కర్ మీద వచ్చే డబ్బులు కూడా ఇతర వాటికి మళ్లిస్తున్నారని, దీంతో లిక్కర్ కంపెనీలు కూడా రాష్ట్రానికి మద్యం ఇవ్వమని చెబుతున్నాయన్నారు. బీజేపీపై నమ్మకంతో ప్రజలు 8 పార్లమెంటు సీట్లు కట్టబెట్టారన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నా రు. రాష్ట్రంæ అప్పుల కుప్పగా మారడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని మండిపడ్డారు. అవినీతి మచ్చ లేకుండా మూడు దఫాలుగా మోదీ ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాం«దీకి లేదన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదకొండేళ్లుగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేసిందని, ఈ దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా ఉండే కులసంఘాలు, ఇతర సంస్థలతో కలసి పనిచేస్తామన్నారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించే అవకాశముందని వస్తున్న వార్తలపై స్పందించాలని విలేకరులు కోరినపుడు.. కేంద్ర మంత్రిగా ప్రజలకు, తన శాఖలో పనిచేస్తున్న వారికి సేవ చేయాలని అనుకుంటున్నానని ఆయన బదులిచ్చారు. తన బొగ్గు, గనుల శాఖ పరిధిలో 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి రూ.కోటి బీమా పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించే అవకాశం ఉందనే ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిస్తూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే వారికి ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని నిబంధన లేదు. బీజేపీ అధ్యక్ష పదవికి రెండు సార్లు క్రియాశీల సభ్యుడు అయి ఉండాలి. అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు. ఆ నిబంధన ఆయనకు వర్తించదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను నేతల ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తారు. నామినేషన్ పద్ధతిలో వారం తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని తెలిపారు. మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో అన్నింటిలోనూ గెలుస్తామనే నమ్మకం తమకుందన్నారు. ‘రాష్ట్రంలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు కదా’అన్న ప్రశ్నకు.. ఎన్నికలు ఉంటాయంటున్న కేటీఆర్, సుప్రీంకోర్టు జడ్జి కూడా అయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. సినీహీరో చిరంజీవి బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు.. ‘నా ఆహ్వానం మేరకు ఇటీవల ఆయన ఢిల్లీకి వచ్చారు, అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. కొందరు పార్టీలో చేరారు. మంత్రులు అయ్యారు. కొందరు పార్టీకి ప్రచారం చేశారు. ఇకపై ఏవైనా ఫంక్షన్లకు నేను పిలిస్తే వస్తారంటే నాగార్జున, వెంకటేశ్, ఇతర హీరోలను కూడా పిలుస్తాను’అని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ఉచితాలు వద్దని ఎక్కడా చెప్పలేదు.. ‘బీజేపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, ఉచితాల (ఫ్రీ బీస్)కు వ్యతిరేకం కాదు. ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు. రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని హామీలివ్వాలి’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రీజినల్ రింగ్ రోడ్ నేనే తెచ్చా. ప్రధానిని ఒప్పించి మహబూబ్‌నగర్ సభలో పసుపు బోర్డు ప్రకటన నేనే చేయించా. మూసీ సుందరీకరణకు కేంద్రం నిధులను నిబంధనల మేరకు కచ్చితంగా ఇస్తాం. హైదరాబాద్ మెట్రోకి రూ.1,250 కోట్లు కేంద్రం ఇచ్చింది. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కచ్చితంగా సహకరిస్తాం. రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్రం డబ్బులు ఇచ్చింది. అలైన్మెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘తెలంగాణలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎంఐఎం సహకరిస్తోంది. బీజేపీపై విషం చిమ్మడమే ఎంఐఎం నేతలు పనిగా పెట్టుకున్నారు. దేశంలో ముస్లింనేతగా ఎదగాలన్న ఆశతో ఆ పార్టీనేత అసదుద్దీన్ ఒవైసీ పిట్టల దొరగా మారారు’అని విమర్శించారు. -
త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ (RSS) నేపథ్యం ఉండాలన్న నిబంధనేది లేదని, వారం రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. శనివారం(జనవరి18) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు.‘ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను నేతల ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారు.వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో తర్వాత ప్రెసిడెంట్ ఎవరో తెలిసిపోయింది.బీఆర్ఎస్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.బీజేపీలో వచ్చే అధ్యక్షుడు ఎవరో ఎవరు చెప్పలేరు. కొత్త సభ్యత్వాలు,పోలింగ్ బూత్ కమిటీలు,మండల కమిటీలు పూర్తయ్యాయి.జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ నడుస్తోంది.600 మండల కమిటీలు పూర్తి చేస్తాం..అందులో 50 శాతంపైగా బీసీలకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చాం.పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇస్తాం.స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదు..బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి మూడు వాయిదాల నిధులు రాలేదంటే అందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడమే.రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా ? ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు.రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని పథకాలు అమలు చేయాలి. కేంద్రానికి వచ్చే ఆర్థిక వనరులను బేరీజు వేసుకొని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.హైదరాబాద్‌లో ఏడు నెలలుగా వీధి దీపాలు కాలిపోతే నిధుల కొరత ఏర్పడింది. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో మద్యంపై వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేశారు.హైడ్రా కొత్తది కాదు..గతంలో ఉన్నదానిని పేరు మార్చారు.మూసీ సుందరీకరణకు నిబంధనల మేరకు కేంద్రం నిధులు ఖచ్చితంగా ఇస్తాం’అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఆనందం.. ఆరోగ్యం ఇవ్వాలి..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన ఈ సంబరాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. మోదీకి కిషన్‌రెడ్డి కుటుంబస భ్యులతోపాటు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి తదితరులు స్వాగతం పలికారు. నేరుగా తులసికోట వద్దకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయి ద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య భోగి మంటలు వెలిగించారు.గంగిరె ద్దులకు వృషభ పూజ చేశారు. అక్కడి నుంచి సంప్రదాయ, జానపద కళాకారుల నృత్యా లు, డప్పు చప్పుళ్ల మధ్య సభాస్థలి వరకు మోదీకి స్వాగతం పలికారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వేదికపై ప్రధాని మోదీ జ్యోతి వెలిగించారు. ప్రముఖ గాయని సునీత శ్లోకం అలపించగా, ఢిల్లీ నా ట్య అకాడమీ బృందం నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇది సంస్కృతి, సమృద్ధి, పునరుద్ధరణ వేడుక: మోదీ సంక్రాంతి పండుగ సంస్కృతి, పునరుద్ధర ణల వేడుక అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా మంత్రివర్గ సహచరుడు జి.కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా చూసి ఆనందించాను. ఇది మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయాలల్లో అంతర్భాగ మైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణల వేడుక. సంక్రాంతి అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతోపాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నాను’అంటూ ట్వీట్ ముగించారు. సంకాంత్రి అంటే రైతుల పండుగ: కిషన్రెడ్డిసంక్రాంతి అంటేనే రైతులు..గ్రామాల పండుగ అని కిషన్‌రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో తొలిసారిగా తన అధికార నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించానని తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్, గజేంద్రసింగ్ షెకావత్, జ్యోతిరాధిత్య సింథియా, మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, సతీష్‌చంద్ర దూబే, శ్రీనివాస్‌వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు కె.లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, గోడెం నగేష్, బాలశౌరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే.అరుణతోపాటు, తెలంగాణ, ఏపీకి చెందిన బీజేపీ నేతలు, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, క్రీడాకారిణి పీవీ.సింధు, మంగ్లీ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. -
కిషన్‌రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు.. హాజరైన ప్రధాని
సాక్షి,న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం(జనవరి13) సాయంత్రం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని తొలుత తులసి చెట్టుకు పూజ చేశారు.అనంతరం గంగిరెద్దులకు అరటిపళ్ళు తినిపించి,నూతన వస్త్రాలు బహుకరించారు. భోగి రోజు కావడంతో భోగి మంట వేశారు. ఈ సంబరాలకు ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,పలువురు కేంద్రమంత్రులు,బీజేపీ ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.అంతకుముందు సినీ నటుడు చిరంజీవి,ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు,బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి సంక్రాంతి వేడుకలకు ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ గాయని సునీత గీతాలాపనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. -
కాంగ్రెస్ వాళ్లు ఒక్కరూ కూడా బయట తిరగలేరు.. ఖబడ్దార్: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(kishan Reddy) తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.బీజేపీ(Telangana BJP Office) రాష్ట్ర కార్యాలయంపై దాడి నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..‘తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నాం. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడటం దుర్మార్గం.రాళ్లు, కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో, పోలీసులతో కలిసి వచ్చి ఆఫీసుపైన, బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు తావు లేదు. ఇలాంటి రాజకీయాలకు మేం పూర్తి వ్యతిరేకం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కక్షపూరిత, ద్వేషపూరిత రాజకీయాలు రాష్ట్రంలో పెరిగిపోయాయి. గతంలో సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రులను గద్దెదించేందుకు మతకల్లోలాలు సృష్టించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసమర్థ పాలనతో ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న తరుణంలో.. అసహనంతో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి దాడులను ఆపకపోతే.. ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడిచేసి.. మా కార్యకర్తలను గాయపరిచిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు. ఖబడ్దార్, అసహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రెస్‌కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి.రాష్ట్రంలో ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మా సహనాన్ని అసమర్థతగా భావించవద్దు. మేం హింసా రాజకీయాలను ప్రోత్సహించం. అలాగని మాపై దాడులు చేస్తే సహించం. ఎవరి వ్యాఖ్యలైనా మీకు నచ్చకపోతే.. నిరసన తెలియజేయండి అంతే కానీ.. కార్యాలయంపై భౌతికంగా దాడి చేయడం, రాళ్లు, కర్రలతో దాడికి దిగడం సరికాదు. తన వ్యాఖ్యలకు ఢిల్లీకి చెందిన మాజీ ఎంపీ రమేశ్ బిదూరీ గారు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా.. అసహనంతో దాడులు చేయడం సరైనదేనా?.గతంలోనూ ప్రధానమంత్రికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ ఎక్కడైనా దాడులు చేసిందా?. ఈ వ్యాఖ్యలకు ఒక్కసారి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక్కసారైనా క్షమాపణలు చెప్పారా?. అలాంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీకి లేదు. మేం దీనికి ప్రతిగా సమాధానం చెబితే.. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు దేశంలో రోడ్లపై తిరగలేడు. కానీ ఇది మా సంస్కృతి కాదు. మీ సంస్కృతిని మార్చుకోండి అంటూ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: రాళ్లు, కర్రలతో దాడి.. బీజేపీ ఆఫీసు వద్ద ఉదద్రిక్తత.. -
కోతలే తప్ప చేతలు లేవు
సాక్షి. హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీది ప్రజాప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం. అది చేతల ప్రభుత్వం కాదు.. మాటలు, కోతల ప్రభుత్వం మాత్రమే’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ఇచి్చన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆ పార్టీ నాయకుల ఆర్థిక స్థితిలో మార్పు వచ్చిందే తప్ప ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. ఆశచూపి వెన్నుపోటు కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆశచూపి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రైతు లు, కూలీలు, కౌలు రైతుల డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉండగా.. మళ్లీ ఎందుకు దరఖాస్తులు అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘గతంలో దరఖాస్తులు తీసుకున్నారు..సర్వే చేశారు.. ఇప్పుడు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఎందుకు? రైతు భరోసా కింద ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు కూడా సంకెళ్లు వేసింది’అని విమ ర్శించారు. రైతులకు నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్లు నవంబర్ 30వ తేదీనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఆ డబ్బులు ఇంకా రైతు ల ఖాతాల్లో పడలేదని తెలిపారు.ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి రెండో వారంలో రైతుల సమస్యలు, హామీల అమలుపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల ఆఫీసర్లు, తహసీల్దార్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచినప్పుడు తమ ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రకటిస్తుందని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు కేంద్రం అండగా నిలుస్తుంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం దిల్ కుశ అతిథి గృహంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, సమగ్ర శిక్ష ప్రతినిధులు.. కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సమగ్ర శిక్ష కార్యక్రమ అమలుకు కేంద్రం తన వాటా కింద 60 శాతం నిధులు, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ఉద్యోగుల సంఘం నేతలు యాదగిరి, అనిల్ చారి తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందు కు సమగ్ర శిక్ష ఉద్యోగులు కృషి చేస్తున్నా, చాలీచాలని వేతనాల తో సతమతమవుతున్నామని వాపోయారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం ఇచ్చే 60 శాతం నిధుల వాటాను కొనసాగించాలని ఉద్యోగులు కిషన్‌రెడ్డిని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించం’
సాక్షి,హైదరాబాద్: ‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించబోమని’ కాంగ్రెస్ (congress) ప్రభుత్వానికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)హెచ్చరించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘రుణ మాఫీ వచ్చే నాలుగేళ్లలో కూడా పూర్తిస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. 35 రోజుల క్రితం రుణమాఫీ చెక్కు ఇచ్చినా..ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో డబ్బులు జమకాలేదు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది.పండిన ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది. ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం 26 వేల కోట్లు ఖర్చుపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పట్టు లేదా ? రైతులంటే పట్టింపు లేదా ? ఎందుకు ధాన్యం కొనుగోలు చేయలేకపోతుంది ?.రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. పత్తి, వరి పంటలను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ భారం అంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. రైతులపై భారం పడకుండా రైతు పక్షపాతిగా మోదీ (narendra modi) ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది’ అని అన్నారు. -
రీజినల్ రింగ్ కోసం కేంద్రం టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టింది
-
జీవితాంతం అంబేడ్కర్‌ను అవమానించారు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను జీవితాంతం అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయనకు భారతరత్న ఇవ్వకపోగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కనీసం చిత్రపటం కూడా ఏర్పాటు చేయకపోవడం చూస్తే కాంగ్రెస్‌కు అంబేడ్కర్ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇందిరాగాంధీ సహా ఎంతోమందికి భారతరత్న ఇచి్చనా.. కాంగ్రెస్ అంబేడ్కర్‌కు ఇవ్వలేకపోయిందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ కావాలనే ఓడించిందని ఆరోపించారు. ఎన్డీయే హయాంలోనే అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చామని గుర్తుచేశారు. ఏడాదిపాటు వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాజ్‌పేయి జీవితం దేశానికి ఆదర్శమని, ఆయన ప్రసంగం వినడానికి దేశం నలుమూలల నుంచి వేలాదిమంది వచ్చేవారన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో వాజ్‌పేయి జనసంఘ్ నేతలతో కలిసి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, వారి సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఇంటింటికీ తెలియచేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. అబద్ధాల్లో కాంగ్రెస్‌కు ఆస్కార్: బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ 70 ఎంఎం సినిమా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాజ్‌పేయి అందరికీ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. దేశభక్తి, అభివృద్ధి, చతుర్భుజి పేరిట జాతీయ రహదారుల నిర్మాణంతో దేశాన్ని ఒక ప్రాంతంతో మరో ప్రాంతాన్ని అనుసంధానించారన్నారు. అన్ని పారీ్టల్లోనూ ఆయనను అభిమానించే నేతలు ఉన్నారని చెప్పారు. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు జరుగుతున్నాయన్నారు. సంతుïÙ్టకరణ విధానాలకు వాజ్‌పేయి వ్యతిరేకమని, అవినీతికి ఆమడదూరం ఉన్నారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్‌పేయి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌కు, అంబేడ్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని, అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ అంబేడ్కర్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి కృషి: భట్టి మధిర: క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం రోమన్ కేథలిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని మతాల అభ్యున్నతికి స్థిర సంకల్పంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు. -
దేశం గర్వించదగ్గ గొప్ప నేత
సాక్షి, హైదరాబాద్: దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖ్యులని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది కొనియాడారు. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మారకోపన్యాసంలో త్రివేది ప్రసంగించారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు నాయకులుగా పుట్టి ప్రధాని పగ్గాలు చేపట్టింది ఇద్దరేనని.. వారిలో వాజ్‌పేయి అయితే మరొకరు నరేంద్ర మోదీ అన్నారు. వాజ్‌పేయి ఆలోచలను ప్రధాని మోదీ అనుసరిస్తున్నారని త్రివేది చెప్పారు. దేశంలో మౌలికవసతుల కల్పనకు వాజ్‌పేయి బీజం వేస్తే దాన్ని మోదీ వటవృక్షం చేశారన్నారు. విద్యతోపాటు, నైపుణ్యం, డిజిటల్ విద్య, డిజిటల్ ఎకానమీ వరకు అన్నింటినీ గ్రామాల చెంతకు చేర్చారని ప్రశంసించారు. నాటి వాజ్‌పేయి ప్రభుత్వం దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రస్తుతం మోదీ సర్కారు అణ్వాయుధాలను భూమ్యాకాశాల నుంచి ప్రయోగించే సామర్థ్యానికి తీసుకెళ్లిందని గుర్తుచేశారు. అందరినీ మెప్పించిన నేత వాజ్‌పేయి: కిషన్‌రెడ్డి అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పాయ్ పేరు కాదని, ఒక చరిత్ర అని అన్నారు. దేశ ప్రధానిగా, కేంద్రమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధినేతగా వేలెత్తి చూపించలేని పనితీరుతో అందరినీ మెప్పించారన్నారు. చివరి శ్వాస వరకు జాతీయ వాదానికి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. అటల్జీ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామన్నారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ వాజ్‌పేయిని ప్రజలు దేశానికి ఒక కాంతిరేఖగా గుండెల్లో దాచుకున్నారన్నారు. అలాంటి వ్యక్తి పాలనలో పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, వాజ్‌పేయి ఫౌండేషన్ చైర్మన్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన కిషన్‌రెడ్డి
ఢిల్లీ : అల్లు అర్జున్ ఇంటిపై పలువురు దాడి చేసిన ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఇది రాష్ట్రంలోని శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలన అసమర్థతను ఇలాంటి సంఘటనలు ప్రతిబింబిస్తాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. ఈ ఆందోళన కాంగ్రెస్‌కు మద్దతుగానా?, లేక స్పాన్సర్డ్గానా అని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. The incident of stone pelting at actor Allu Arjun's residence in Hyderabad highlights the shocking failure of law and order under the Congress government in the state. Incidents reflect the administration's inability to protect & ensure the safety and security of citizens.… pic.twitter.com/xhRMmNs1mj— G Kishan Reddy (@kishanreddybjp) December 22, 2024 ‘స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్’.. సోషల్ మీడియాలో వైరల్అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి -
జార్జ్ సోరోస్ తో మీకు సంబంధాలు లేవా! కిషన్ రెడ్డి కౌంటర్
-
‘రేవంత్ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రి వర్గ సహచరులతో.. అనుచరులతో రాజ్ భవన్ ముందు ధర్నా చెయ్యడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా అనిపించింది. ఏడాదిగా పాలనలతో.. సరైన పాలన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద గాని ముందుడుగు పడటం లేదు.👉ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతో.. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. వందకోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా?.. వందకోట్ల సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.👉కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నా.. రేవంత్ అయినా రాహుల్ గాంధీ అయినా.. ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలి. ఒక సాక్ష్యం చూపిస్తారా?. మన మీడియా ముందు, న్యాయస్థానాల ముందు, ప్రజలముందు ఆధారాలు చూపించకుండా.. విమర్శలు చేయడం సరికాదు.👉గత పార్లమెంటు ఎన్నికల్లో ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీ.. ఇవాళ ఫ్రస్టేషన్ లో అదానీ మాట మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని, కేంద్రం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరూపించగలరా?.👉మాటమీద నిలబడే సత్తాలేక.. ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచదేశాల ముందు భారతదేశాన్ని నవ్వలుపాలు చేస్తున్నది, భారత దేశ గౌరవ వ్యవస్థలపైన.. విదేశాల్లో మన సైనికుల మీద పరువు తీసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైన రాహుల్ గాంధీకి ఉంది.👉రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపే ఉన్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులే. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డికి హెచ్చరించిందా?. అందుకే రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా?. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు.. దొందూ దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచించడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
పరిపాలనా సౌలభ్యం కోసమే భాషల ఫార్ములా: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చాకే 21 భాషలకు స్థానం దక్కిందన్నారు. అలాగే, భాషలు.. మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయం అని చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదు. 121 భాషలు, మన దేశంలో ఉన్నాయి. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలుండేవి. మోదీ ప్రభుత్వం వచ్చాకా 21 భాషలకు స్థానం దక్కింది. భాషలు మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయాలు. ఎన్డీయే ప్రభుత్వం, వాజ్‌పేయి గారి నేతృత్వంలో ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యత ఇచ్చారు. భాష మన సంస్కృతికి ఆత్మ వంటిదని వాజ్‌పేయి చెప్పేవారు.జ్ఞానాన్ని ప్రసరింపజేసేందుకు 1835లో మెకాలే ద్వారా భారత శాస్త్రీయ భాషల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం జరిగింది. ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్ర్యానంతరం.. 1956లో భాష ఆధారిత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినపుడు.. దేశానికి సహకార సమాఖ్య, పాలనాపరమైన అంశాల కోసం భాష కీలకమైన అంశంగా మారింది. పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములా వినియోగంలో ప్రజలు సంతృప్తిగా లేని కారణంగా మార్పులు తీసుకురావాలనే డిమాండ్ పెరిగింది. దీనికి అనుగుణంగా ప్రధాని మోదీ 2020లో NEP-2020 నూతన జాతీయ విద్యావిధానం ద్వారా కనీసం రెండు ప్రాంతీయ భాషలను విద్యార్థులు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందించారు’ అని కామెంట్స్ చేశారు. -
కేంద్రం సాయం చేసేలా సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కావల్సిన చేయూతపై కిషన్‌రెడ్డితో చర్చించారు. ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలను ప్రస్తావించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం సాయంత్రం కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ భేటీల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, గడ్డం వంశీ, సురేశ్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనుమతులు ఇప్పించండి ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయి. ఆర్ఆర్ఆర్కు సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండి. మెట్రో ఫేజ్–2 సంయుక్తంగా చేపట్టేలా చూడండి మెట్రో ఫేజ్–2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీ నగర్–హయత్‌నగర్ మధ్య మొత్తం 76.4 కి.మీ మేర నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో దీనిని చేప్టటేందుకు సహకరించాలి. ‘మూసీ’కి అనుమతులు, నిధులు కావాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. దీనితో పాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణం ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశాం. ఈ మేరకు అనుమతులు, నిధుల మంజూరుకు సహకరించాలి.· మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. ఆ మొత్తం విడుదలకు సహకరించాలి. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీకి ప్రణాళిక రూపొందించాం. రూ.4,170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రణాళికను అమృత్–2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టేలా చూడండి. సింగరేణి సంస్థ దీర్ఘకాలం పాటు మనుగడ కొనసాగించేందుకు గాను గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించండి..’ అని కిషన్‌రెడ్డిని సీఎం కోరారు. ఆర్ఆర్ఆర్ అనుమతులు వెంటనే ఇవ్వండి ‘ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159 కి.మీ) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్–765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. అయితే మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ, పర్యావరణ శాఖల నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకం ఎదురవుతోంది. దీనివల్ల కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాబట్టి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయండి. ఇది నిర్మిస్తే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాల మధ్య 45 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. హైదరాబాద్–విజయవాడ డీపీఆర్ త్వరగా పూర్తి చేయండి హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్–65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయండి. వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి. పర్వత్‌మాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయండి. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయండి. నల్లగొండ జిల్లాలో ఎన్‌హెచ్–65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి..’ అని నితిన్ గడ్కరీతో భేటీలో రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి ‘ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు. కానీ రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదు. కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించండి. డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అయినప్పటికీ.. ఇటీవల కేవలం కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఓసీ కూడా తప్పకుండా తీసుకునేలా చూడండి..’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి కోరారు. నేడు ఏఐసీసీ నేతలతో సీఎం భేటీ! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల ¿భర్తీ వంటి అంశాలపై చర్చించవచ్చని సమాచారం. -
కిషన్‌రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్‌రెడ్డి నివాసానికి వచ్చిన సీఎం.. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు తదితర ప్రాజెక్టులకు నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సింగరేణికి బొగ్గు గనులు తదితర అంశాలపై కేందమంత్రితో సీఎం చర్చించారు. అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.కాగా, ఏఐసీసీ పెద్దలను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశముంది. కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్లో చోటు కోసం అధిష్టానం పెద్దల చుట్టూ ఆశావహలు చక్కర్లు కొడుతున్నారు.రంగారెడ్డి నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలిశారు. బీసీ వర్గం నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అవకాశం కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ అడుగుతుండగా, మరో వైపు.. ఎస్సీ కోటాలో మంత్రి పదవి కోసం వివేక్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం -
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా?
సాక్షి,హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని బీఆర్ఎల్సీ కవిత డిమాండ్ చేశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ముడి ఇనుము నిల్వల కేటాయింపుపై లోక్ సభలో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై కీలక వ్యాఖలు చేశారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. The Bayyaram Steel Plant is not merely a promise; it is a constitutional commitment made during the formation of Telangana. The BJP’s blatant refusal to fulfill this commitment exposes their neglect of the backward and tribal communities in Khammam District, Telangana.It is… https://t.co/uuTMbcH1oB— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 12, 2024 ‘బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు’ అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారు. లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయి. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన.బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే. 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిస్తోంది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్‌ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలిఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరం. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయం. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదు. బీజేపీ కేంద్రంపై, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
మొసలి కన్నీరు కార్చొద్దు.. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో “హైదరాబాద్ రైజింగ్” ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్ది, న్యూయార్క్ లాంటి నగరాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.‘‘ప్రజలు ఏకోన్ముఖమై రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుని ఇవ్వాళ్టికి ఏడాది. వచ్చే ఏడాదికి భవిష్యత్ ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అంటే రాష్ట్రానికే కాదు.. ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. నగరంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కృష్ణా జలాలనే కాదు.. గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారమైంది...హైదరాబాద్‌కు మెట్రోను తీసుకొచ్చేందుకు ఆనాడు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయి. రూ.35 వేల కోట్లతో 360 కి.మీ తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి రేడియల్ రోడ్లు నిర్మించి నగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నాం. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ లో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది...40 నుంచి 50 వేల ఎకరాల్లో ప్రపంచంలోని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ట్యాంక్ బండ్‌ను మురికి కూపంగా మార్చారు. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని ప్రజలను మోసం చేశారు. పదేళ్లలో నగరానికి కావాల్సిన శాశ్వత అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించింది. ఢిల్లీ నగరం పూర్తిగా కాలుష్యమయమైంది.ముంబైలో వరదలు వస్తే నివసించలేని పరిస్థితి. చెన్నైలోనూ వరదలు వస్తే గందరగోళ పరిస్థితి. బెంగుళూరులో గంటలకొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక కలకత్తాలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడా లేవు. దేశంలో ఏ నగరాన్ని చూసినా సమస్యలమయమే. ఆ నగరాల నుంచి మనం నేర్చుకోవాలి. హైదరాబాద్ నగరం అలా మారకుండా జాగ్రత్త పడాలి. అందుకే హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవనం జరగాలి.నగరంలో వరదల నియంత్రణకు రోడ్లపై వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం. నగరంలోని 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని అధికారులకు ఆదేశించాం. ఎంత మంది ఎంత విష ప్రచారం చేసినా.. రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా మేం వెనక్కి తగ్గేది లేదు. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు మీరు గమనించండి. మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఏప్రిల్ 1, 2024 నుంచి నవంబర్ 30, 2024 వరకు మా పాలనకు తేడా చూడండి. మా పాలనలో 29 శాతం ఎక్కువ అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది తగ్గలేదు. ఇది మా నిబద్ధతకి నిదర్శనం. హైడ్రా చెరువుల ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు పుట్టించింది.10 వేల కోట్లు తీసుకురా.. భూమి నేను చూపిస్తా: భూమి కిషన్‌రెడ్డికి కౌంటర్మూసీ వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు.. మోదీ కంటే మంచి పేరు వస్తుందనే ఆయన మా కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు మూసీలో పడుకున్నా.. మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మీకు చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి మూసీ ప్రక్షాళనకు రూ.25 వేల కోట్లు నిధులు తీసుకురావాలి.పేదలపై మొసలి కన్నీరు కార్చొద్దు.. చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకురా భూమి నేను చూపిస్తా.. పేదలకు మంచి అపార్ట్ మెంట్స్ కట్టిద్దాం.. మంచి భవిష్యత్ ఇద్దాం. మోదీ గుజరాత్‌కి గిఫ్ట్ సిటీ తీసుకుపోయిండు. నువ్వు తెలంగాణకు ఏం గిఫ్ట్ తెచ్చినవ్?. రెండో సారి కేంద్రమంత్రి అయిన నువ్వు రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చినవ్? సమాధానం చెప్పాలి. నగరంలో మెట్రో విస్తరణకు రూ.35 వేల కోట్లు అవసరం ఉంది.. మీరు ఎన్ని నిధులు తెస్తారో చెప్పండి. గుజరాత్ మెట్రోకు, చెన్నైకి మెట్రోకు నిధులు ఇచ్చారు.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు ఇవ్వరు..?..హైదరాబాద్‌కు తాగు నీటికి కోసం గోదావరి జలాల తరలించడానికి రూ.7 వేల కోట్లు కావాలి.. కేంద్రం నుంచి నువ్వు ఎంత తెస్తావ్.. రీజనల్ రింగ్ రోడ్డుకు, రేడియల్ రోడ్లకు రూ.50 వేల కోట్లు కావాలి. కేంద్రం నుంచి నువ్వు ఎన్ని నిధులు తెస్తావ్?. నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.. మీరు ఎన్ని నిధులు ఇప్పిస్తారో జవాబు చెప్పాలి.. మోదీ గుజరాత్‌కు తీసుకెళ్తుంటే గుడ్లు అప్పగించి చూస్తారా?. మూసీలో పడుకోవడం కాదు.. మోదీని తీసుకొచ్చి మూసీని చూపించు... పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందొ..మూసీ అభివృద్ధి ఎందుకు అడ్డుకుంటున్నారు?.. హైదరాబాద్ మరో ఢిల్లీ కావాలా?. మనం ఈ మురికి కూపంలో మగ్గాల్సిందేనా? తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి.. లక్షన్నర కోట్లతో హైదరాబాద్ నగరం అద్భుతమైన నగరంగా మారుతుంది. ప్రపంచం పెట్టుబడులకు హైదరాబాద్ వేదిక కావాలంటే.. ఇవన్నీ జరగాలి.. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకరించాలి. మీరు నిధులు తెస్తారా? గుజరాత్‌కు వలస వెళతారా? తేల్చుకోండి’’ అంటూ కిషన్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. -
‘రేవంత్ భాష మార్చుకుంటే మేం చర్చకు సిద్ధం’
సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై చర్చకు తాను సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై 6 అబద్ధాలు.. 66 మోసాలు.. పేరిట కిషన్‌రెడ్డి ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భాష మార్చుకుంటేనే రేవంత్‌రెడ్డితో చర్చకు వస్తాం.కేసీఆర్ లాగా అదే భాష కాకుండా.. నిర్మాణాత్మక అంశాలపై మేము చర్చకు సిద్ధం. కుల గణనను మేము వ్యతిరేకించడం లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం.. గ్రూప్ 1, 2, 3, 4 నియామకాలు ఎప్పుడో పూర్తవ్వాలి. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేస్ కూడా పూర్తికాలేదు.షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు ఏదీ పూర్తవ్వలేదు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. భూసేకరణ చేపట్టవద్దని కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేశారు.కాంగ్రెస్ కూడా భూసేకరణ చేపట్టే సమయంలో పద్ధతి ప్రకారం చేయాలి.. రైతులతో మాట్లాడి పరిష్కారం చేసుకోకుండా రైతులపై దాడులా..ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నడుచుకోవాలి.ఫామ్ హౌజ్‌లో ఉన్న కేసీఆర్‌తో కాంగ్రెస్ సంబంధాలు పెట్టుకుందికేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్‌లో..కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. రేవంత్ దృష్టిలో ఆయన్ను ప్రశ్నించే వారు.. వార్తలు రాసేవారు కూడా మానవ మృగాలే. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలో కూడా రోడ్డు మ్యాప్ లేదు’అని మండిపడ్డారు. -
కాంగ్రెస్ పాలనపై బీజేపీ చార్జ్‌షీట్
-
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జీషీట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. 6 అబద్ధాలు.. 66 మోసాలు.. పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఛార్జీషీట్‌ను విడుదల చేశారు. ఎంపీలు డికె అరుణ, రఘునందన్ రావు, నగేష్, బీజే ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే లు హరీష్ బాబు, పైడి రాకేశ్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి పలువురు హాజరయ్యారు.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలపైనే మా పోరాటం అని.. ప్రజల తరపున ఛార్జ్‌షీట్ రూపంలో ప్రభుత్వం ముందు పెట్టామని కిషన్‌రెడ్డి అన్నారు.‘‘కాంగ్రెస్ విజయోత్సవాలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. వందరోజుల్లో హామీలు పూర్తి చేస్తామన్నారు. ఏడాదైంది. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏం తేడా లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాపై ఉంది. ప్రజలను నమ్మించడం కోసం దేవుడిపై ఒట్లు పెట్టారు. రుణమాఫీ ఇప్పటివరకు కొంతమంది రైతులకే జరిగింది. ఏడాది పూర్తయింది.. రైతు భరోసా ఎక్కడ?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. -
కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ సభ.. తెలంగాణకు అమిత్ షా: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను డిసెంబర్ 6న బహిరంగ సభ ద్వారా ప్రజలకు వెల్లడించనున్నట్టు చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేవు. గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన వాటికి వీళ్లు భర్తీ చేశామని చెప్తున్నారు. అరకొర రుణమాఫీ చేసి మొత్తం పూర్తి చేశామని చెప్తున్నారు.రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమం చేయాలి. కొత్త రక్తం పార్టీలో చేరబోతుంది. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతుంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలి. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని మోదీ తెలిపారు. మీరు ధైర్యంగా ముందుకి వెళ్ళాలని ప్రధాని మాకు భరోసా ఇచ్చారు.ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. రేపు బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. అసెంబ్లీ, జిల్లలా వారీగా ఛార్జ్‌షీట్ తయారు చేసి విడుదల చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. సభ ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలను వివరిస్తాం. సభకు బీజేపీ జాతీయ నేతలు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘గురివింద గింజ తరహాలో.. బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్‌లోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారిని గులాబీ పార్టీలోకి పంపించుకుని.. మంత్రి పదవులు తీసుకున్నప్పుడు ఎవరు ఎవరితో కలిసినట్లో కేటీఆర్ చెప్పగలరా?’ అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్ర శ్నించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్‌పై గురువా రం ఢిల్లీలో కిషన్‌రెడ్డి స్పందిస్తూ... ‘కేటీఆర్ మిడిమి డి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసింది వారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్నది వారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది వారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంటోంది.ఇప్పుడు బుర ద జల్లడం కోసం మాపైన ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను పట్టించు కోవాల్సిన అవసరం లేదు’ అని వ్యా ఖ్యానించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే.. ఇవాళ కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా అనుసరిస్తున్న మాట వాస్తవం కాదా? కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ మొద లైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణా లు, కేసుల విషయంలో పురోగతి లేకపోవడమే ఎవ రితో ఎవరు కలిసున్నారని చెబుతోంది’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక సిద్ధాంతం ఆధా రంగా ఎదిగిన పార్టీ అని.. జాతీయవాదం, అంత్యో దయ వంటి నినాదాలతో పనిచేసే పార్టీ తమదని అన్నా రు. కుటుంబపాలన, అవినీతి వంటివి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలని.. అందుకే ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. -
కేటీఆర్ ట్వీట్.. కిషన్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మిడిమిడి జ్ఞానంతో కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ ట్వీట్‌పై ఆయన స్పందిస్తూ.. ‘‘గురివింద గింజ తరహాలో.. బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారికి కాంగ్రెస్ లోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారికి గులాబీ పార్టీలోకి పంపించుకుని.. మంత్రిపదవులు తీసుకున్నప్పడు.. ఎవరు? ఎవరితో కలిసినట్లో.. కేటీఆర్ చెప్పగలరా?’’ అంటూ ప్రశ్నించారు.‘‘మేం గిల్లినట్లు చేస్తాను.. మీరు ఏడ్చినట్లు చేయండన్న తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే.. ఇవాళ కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా అనుసరిస్తున్న మాట వాస్తవం కాదా? కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ మొదలైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, కేసుల విషయంలో పురోగతి లేకపోవడం.. ఎవరితో ఎవరు కలిసున్నారని చెబుతోంది?’’ అంటూ దుయ్యబట్టారు.‘‘రైతులను మోసం చేయడంలో, నిరుద్యోగ యువతను నడిరోడ్డుపై నిలబెట్టడంలో, ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడంలో, హిందూ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడంలో, కుటుంబ పాలనను ప్రోత్సహించడంలో.. అవినీతిని పెంచి పోషించడంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల ఆలోచన, పరిపాలనలో సారూప్యతను చూస్తే ఎవరు, ఎవరి చేతుల్లో ఉన్నారో, ఎవరు సంగీతం వాయిస్తే..ఎవరు డాన్స్ చేస్తున్నారో ప్రజలకు ఈపాటికే అర్థమైపోయింది...బీజేపీ ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ. జాతీయవాదం, అంత్యోదయ వంటి నినాదాలతో పనిచేసే పార్టీ మాది. కుటుంబపాలన, అవినీతి వంటివి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు. అందుకే ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న సందర్భంలో.. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండాలనుకునే మనస్తత్వాలకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారు.’’ అంటూ కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. -
కమలదళం.. ద్విముఖ వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే, మరోవైపు అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఉద్యమబాట పట్టాలని బీజేపీ ముఖ్యనేతలకు కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైన తీరు, హామీలు, వాగ్దానాల అమల్లో వైఫల్యాలను ఎత్తిచూపాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను కూడా లక్ష్యంగా చేసుకొని పదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలు వంటి వాటిని ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించి.. రెండు లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. డిసెంబర్ మొదటివారంలో ఏడాది పాలన పూర్తి సందర్భంగా కాంగ్రెస్ సర్కారు సంబురాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతకంటె ముందుగానే రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో చార్జిషీట్లు, వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వెనుకబడడాన్ని ఎండగడుతూ ఇతర రూపాల్లో ఆందోళన, నిరసనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి 5 దాకా రాష్ట్రవ్యాప్తంగా (అసెంబ్లీ నియోజకవర్గాల్లో) ‘ఆరు అబద్ధాలు’పేరిట హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను అధికారంలోకి వచ్చాక వేటిని పూర్తిచేశారనే దానిపై డిసెంబర్ 1న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో చార్జిషీట్లు విడుదల చేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చార్జిషీట్ల విడుదలతోపాటు ఎక్కడికక్కడ బహిరంగసభల నిర్వహణకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువమోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టకపోవడంపై బైక్ ర్యాలీలు, మహిళామోర్చా ద్వారా మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీల అమల్లో వైఫల్యాలు ఎండగట్టేలా, రైతాంగానికి చేసిన వాగ్దానాల్లో అమలు తీరును ఎత్తిచూపుతూ నిరసనలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చాల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై ఆయా మోర్చాలు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు యువ, మహిళ, కిసాన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ మోర్చాలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏడు మోర్చాల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీలోగా ఒక్కో మండలంలో ఒక్కో మోర్చా పదిమంది చొప్పున కొత్తవారిని క్రియాశీల సభ్యులుగా చేర్పించాలని సూచించారు. ప్రస్తుతం పార్టీపరంగా చేపట్టిన సభ్యత్వ నమోదులో 36 లక్షల మంది సభ్యులుగా చేరారని, ఈ నెలాఖరులోగా ఆ సంఖ్యను 50 లక్షలకు పెంచేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి 15 దాకా పోలింగ్ బూత్ కమిటీలతో పాటు మండల కమిటీల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం పార్టీ కార్యాలయంలో అన్ని మోర్చాలు, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల కమిటీలతో వేర్వురుగా కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. ఈ రెండు భేటీల్లో పార్టీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లుతోపాటు ఏడు మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ విమర్శలు సిగ్గుచేటు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజాతీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ విమర్శించడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు.. బీజేపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్లు మాట్లాడటం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందని విమర్శించారు.శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్కే అత్యధిక ఓట్లు, సీట్లతో మరోసారి పట్టం కట్టారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని.. మరాఠీలకు అన్యాయం జరుగుతుందని లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసి విపక్షాలు కొంత లబ్ధి పొందాయని.. కానీ 5 నెలల్లోనే ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమై బీజేపీ కూటమికి భారీ విజయం అందించారని కిషన్‌రెడ్డి చెప్పారు.మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయినప్పుడు జరిగిన ఎన్నికల తర్వాత మహాయుతి కూటమికి ఇంత పెద్ద విజయం లభించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలలో కలిపితే కాంగ్రెస్ 30 సీట్లు కూడా దాటలేదంటే ఆ పార్టీ ఎంతటి ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందో స్పష్టమవుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
‘రేవంత్‌రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పని చేయలేదు’
హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకతో ఉందో తాజా ఫలితాల్ని బట్టి అర్థమవుతోందన్నారు కిషన్‌రెడ్డి. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో విపక్షహోదా కూడా కాంగ్రెస్‌కు రాలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.‘రేవంత్ రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పనిచేయలేదు. ఆయన తెలంగాణ ప్రజల డబ్బును మహారాష్ట్రకు పంపించినా పనిచేయలేదు. తెలంగాణలో రాహుల్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పై కోపంతో వారు పోవాలని, అలాగే అబద్ధపు 6 గ్యారెంటీల కారణంగా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి పూర్తిస్థాయిలో విజయం సాధించడం హర్షనీయం.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేసింది.అయినా ప్రజలు వారిని తిరస్కరించారు.మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందింది. ఈ 5 నెలల్లో తిరిగి ప్రజలు ఆలోచించి పూర్తిస్థాయిలో ఎన్డీయే కూటమి వైపు మొగ్గుచూపారు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
Kishan Reddy: బీజేపీపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేశారు
-
ది సబర్మతి రిపోర్ట్ సినిమాను వీక్షించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో మత పరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని... ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్నట్టుగానే మహారాష్ట్రలో కూడా 4శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం సరికాదన్నారు. మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆర్ఎస్ఎస్ వరిష్ట్ ప్రచారక్ నందకుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేశాయని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పాయని గుర్తు చేశారు.దీనిపై సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు..ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని కోర్టు తీర్పు ఇచి్చందని తెలిపారు. ఆ కోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గౌరవించాలని సూచించారు. లగచర్ల అంశంపై చట్టం తనపని తాను చేస్తుందని, ఇది ముఖ్యంగా శాంతిభద్రతల సమస్య అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నానని తెలిపారు. హిందూ దేవాలయాల్లో పనిచేసే ఇతర మతాల వారిని వేరేచోట్లకు బదిలీ చేయాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఎక్కువ సార్లు ప్రజలను మోసం చేయలేరు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నేతల గాలి మాటలతో ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు పెద్ద తేడా ఏమీలేదన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పోలింగ్ బూత్ కమిటీల ఎన్నిక ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలి. సాధారణ సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్తకు సమాచారం ఇచ్చిన తర్వాతే పోలింగ్ బూత్ కమిటీ వేయాలి. పోలింగ్ బూత్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. నేతల వ్యక్తిగత ఇష్టాలకు తావులేకుండా అందరి ఆమోదంతో బూత్ కమిటీలు వేసుకోవాలి. క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికే పార్టీ పదవులు. పార్టీ కోసం సమయం కేటాయించి పనిచేసే సమర్ధులకు కమిటీల్లో అవకాశం ఇవ్వాలి. 30 శాతం కొత్త వారికి పార్టీ మండల కమిటీల్లో ఛాన్స్ దక్కేలా చూడాలి.రాష్ర్టంలో కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పాలన సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య తేడా ఏమీ లేదు. గాలి మాటలతో ప్రజలు విసిగిపోతున్నారు. వ్యక్తులను విమర్శించడమే రాజకీయం అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. రెండు పార్టీ నేతల మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. బాధ్యతారహితంగా ఇరు పార్టీల నేతలు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా అబద్దపు ప్రచారం చేస్తున్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి ?కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటలీకి గులాం. కిషన్ రెడ్డి ఎవరికి గులాం కాదు.. భారతీయులకు మాత్రమే గులాం. నా తెలంగాణను నిజాం నుంచి కాపాడిన గుజరాత్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నేను గులాంనే. కాంగ్రెస్ నేతలు నకిలీ గాంధీలకు గులాంలు. వ్యక్తిగతంగా బురద చల్లే ప్రయత్నం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయి. తాత్కాలికంగా ప్రజలు వారికి జై కొట్టవచ్చు. ఎక్కువసార్లు ప్రజలను ఎవరు మోసం చేయలేరు. నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేసే వారికే ప్రజలు అండగా ఉంటారు. తెలంగాణలో ఉన్నంత దిగజారుడు రాజకీయాలు మరే రాష్ట్రంలో లేవు. మూడు వందల రోజులు పూర్తయినా.. హామీల అమలు చేయగలరా? అని ప్రశ్నించారు. అలాగే, బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని కామెంట్స్ చేశారు. -
వేలాదిమంది పేదలనుఎక్కడకు వెళ్లగొడతారు?
అంబర్‌పేట/మలక్‌పేట: దశాబ్దాల తరబడి మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తూ..కష్టపడి కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వం కూలగొడితే తామంతా ఎక్కడకు వెళ్లాలి అనే ఆవేదనలో అక్కడి ప్రజలు ఉన్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరీవాహక ప్రాంత ప్రజలపై కక్షపూరిత ధోరణి అవలంభిస్తుందని మండిపడ్డారు. వేలాదిమంది పేద ప్రజలను నిరాశ్రయులను చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ బాధితుల కోసం బీజేపీ చేపట్టిన మూసీనిద్ర కార్యక్రమంలో భాగంగా గోల్నాక డివిజన్ పరిధిలోని తులసీరామ్‌నగర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిద్రించారు. ఆదివారం ఉదయం నిద్ర లేచినంతరం బస్తీ వాసులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. బస్తీల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు మూసీతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని తాను గమనించినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. వందేళ్ల క్రితం మూసీనదికి నిజాం రాజు ప్రహరీ నిర్మించారని, ప్రస్తుతం అలాంటి ప్రహరీ నిర్మించి పేదల ఇళ్ల జోలికి వెళ్లరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తాను మూసీ పక్కన నివసించే శంకరమ్మ ఇంట్లో నిద్రించి వారి ఇబ్బందులను తెలుసుకున్నానని, ఇలాంటి శంకరమ్మలు ఎంతో మంది ఆవేదనతో ఉన్నారన్నారు. పేదల ఇళ్లకు ఇబ్బంది లేకుండా మూసీ సుందరీకరణ చేస్తామంటే బీజేపీ శ్రేణులు శ్రమదానం చేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, గౌతమ్‌రావు, అజయ్‌కుమార్, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు. లగచర్ల ఘటన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం : డాక్టర్ లక్ష్మణ్ లగచర్ల ఘటన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మూసారంబాగ్ శాలివాహననగర్‌లో మూసీనిద్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ బాధితులకు భరోసా కల్పించడానికి చేపట్టిన మూసీనిద్ర కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తూ అధికార మదంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.మూసీనీటిని శుద్ధి చేయాలని, పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేసి నల్లగొండ, భాగ్యనగర్ ప్రజలకు ఉపశమనం కలింగించాలన్నారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్‌రెడ్డి, కొత్తకాపు అరుణా రవీందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్‌చందర్ పాల్గొన్నారు. -
‘మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్-బీజేపీలపై మండిపడ్డారు.‘ వారెవా తోడు దొంగల నాటకం. కిషన్ రెడ్డి గారూ.. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?,లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?,హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది మేము!,రేవంత్‌ను మొదటి అభినందించింది మీరైతే.. మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి?, ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? మరెవరిని వంచించడం కోసం? ,రేవంత్‌ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగానామాలు.. మీ పాలి'ట్రిక్స్' ను గమనిస్తోంది తెలంగాణ..ఆట కట్టిస్తుంది సరైన వేళ’ అంటూ ట్వీట్ చేశారు.రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం దోస్తును కాపాడేందుకు 'చీకటి' రాజకీయంవారెవా తోడు దొంగల నాటకం!కిషన్ రెడ్డి గారూ..ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది…— KTR (@KTRBRS) November 17, 2024 -
అసలు మూసీ ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డికే క్లారిటీ లేదు
-
రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాంనగర్‌లోనే గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లు మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటే వేలాది ఇళ్లు కూల్చేయాల్సి వస్తుందన్నారు.‘‘కోటిమంది డ్రైనేజీ నీళ్లు మూసీలో వెళ్తుంది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. సీఎం ముందుగా చేయాల్సిన పని కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయండి. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారు ?. మూసీ డీపీఆర్ ఎప్పుడు పూర్తవుతుంది?. కృష్ణా నీళ్ళు తెస్తారా?. గోదావరి నీళ్లు తెస్తారా?. లక్షా యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారా?..రేవంత్ పాలన ఏడాది పూర్తయ్యింది. డీపీఆర్ రావడానికి రెండేళ్లు పడుతుంది. ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్లో దుర్గంధం వాసన రావడం లేదు. పేదల నివాసం ఉంటున్న ఇళ్లపై రేవంత్ కన్ను పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. పేదల జోలికి వెళ్లకుండా పునర్జీవం చేయండి. మూసీ ప్రక్షాళన అనే వార్త వింటేనే భయంతో వణికిపోతున్నారు. కక్ష పూరితంగా వ్యవహరించవద్దు. హుస్సేన్ సాగర్‌లో కొబ్బరినీళ్లు చేస్తానన్న కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కి వెళ్లాడు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలి’’ కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు...మహారాష్ట్రలో తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేయండి. నల్లగొండ రైతులకు న్యాయం చేయండి. నిజాం రిటైనింగ్ వాల్ కట్టినట్లు హై కోర్టు దగ్గర ఆనవాళ్లు ఉన్నాయి. రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తేనే పూర్తికాలం సీఎం గా రేవంత్ పనిచేస్తారు’’ అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా?: మంత్రి పొన్నం
సాక్షి, వరంగల్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని ఆయన.. తన మొద్దు నిద్ర వీడాలని సూచించారు.కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని, ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? అని నిలదీశారు. కలెక్టర్‌ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐఏఎస్పైన దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులను కొట్టిన వాళ్లు, కొట్టించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. -
ఇవాళ బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం
-
‘లోక్‌మంథన్’కు భారత రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతి..ఏకత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరించే ద్వైవార్షిక సాంస్కృతిక మహోత్సవమైన ‘లోక్‌మంథన్’కు భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హాజరవుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బేగంపేటలోని పర్యాటక భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజ్ఞాభారతి అఖిల భారత కన్వీనర్ నందకుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. నవంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శిల్పకళావేదిక, శిల్పారామంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు ‘లోక్‌మంథన్ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారని చెప్పారు.అంతకంటే ముందు 21వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శిల్పకళావేదికలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభిస్తారన్నారు. వసుదైక కుటుంబమని ప్రపంచానికి చాటిచెప్పిన భారతీయ సాంస్కృతిక విశిష్టతను ఈ వేడుకల్లో వీక్షించొచ్చని పేర్కొన్నారు. జాతీయవాద ఆలోచనాపరులు, ఆచరణీయులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు ఈ వేడుకల్లో భాగస్వాములవుతారని కిషన్‌రెడ్డి చెప్పారు. నందకుమార్ మాట్లాడుతూ దేశవిదేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు తరిలిరానున్నట్టు చెప్పారు. లిథువేనియా, ఆర్మేనియా, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన విశిష్ట కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారన్నారు. లోక్మాత నాటకంతోపాటు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి రుద్రమదేవి నాటక ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. ముగింపు ఉత్సవాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్లు పాల్గొంటారని చెప్పారు. ⇒ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలు ఇప్పటివరకు భోపాల్, రాంచీ, గువాహటిల్లో జరిగాయి.‘లోక్–అవలోకన్, లోక్ విచార్–లోక్ వ్యవహార్’అనే ప్రధాన థీమ్‌తో ఈసారి లోక్‌మంథన్–2024 వేడుకలను నిర్వహిస్తున్నారు. ⇒ ఈ వేడుకల్లో ప్రదర్శనలు వీక్షించేందుకు ప్రతి రోజూ లక్ష మందికి పైగా సందర్శకులు తరలిరానున్నట్టు అంచనా.1,500 మందికి పైగా కళాకారులు సుమారు వెయ్యి కళారూపాలను ప్రదర్శించనున్నారు. ⇒ఫొటో జర్నలిస్ట్ అంధేకర్ సతీలాల్ వనవాసీ సంస్కృతి, జీవనశైలిపైన తీసిన ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలను ప్రదర్శిస్తారు. -
మాటలు ప్రజలకు.. మూటలు కాంగ్రెస్‌కు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గ్యారంటీలు, హామీలను అమలు చేయకుండా.. మహారాష్ట్రలో అబద్ధపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ ఏ మొహం పెట్టుకుని మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ పాలన మాటలు ప్రజలకు.. మూటలు కాంగ్రెస్ పారీ్టకి అన్నట్టుగా తయారైంది.తెలంగాణలో సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ యాత్రలు చేసి.. ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ పాలన నడుస్తోంది. రేవంత్ వ్యవహారం, దోపిడీ, అబద్ధాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, తెలంగాణ సమాజాన్ని అవమానించే మాటలు.. అచ్చం కేసీఆర్ మాదిరిగానే సాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల డీఎన్ఏ ఒకటే. ఒకరిపై మరొకరు డూప్ ఫైటింగ్ చేయడం వారికి అలవాటే. రాష్ట్ర ప్రభుత్వం విఫలం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. వ్యాపార రంగం విశ్వాసం కోల్పోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికీ పైసల్లేవు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచలేదు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు.. కానీ కొత్త ఉద్యోగాలు ఇచ్చామంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు భారాన్ని కేంద్రమే భరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లలో విఫలమైంది. రైతులకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచి్చంది. కానీ 15 పైసలు కూడా ఇవ్వలేదు. రైతులకు ధాన్యంపై బోనస్ లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో ఫార్మా విలేజీకి భూసేకరణ విషయంలో కలెక్టర్‌పై దాడి, రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించేంతగా రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నాం.. మూసీని కొబ్బరినీళ్లలా మారుస్తామన్న కేసీఆర్.. ఏమీ చేయకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి.. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చడం, నల్లగొండలో రైతులను రెచ్చగొట్టడం తప్పితే చేసిందేమీ లేదు. పేదల ఇండ్లు కూల్చొద్దంటే.. బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ అహంకారంతో మాట్లాడుతున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి.. పేదల ఇళ్లు కూల్చకండి.. ఇదే మా డిమాండ్. మూసీ పరిసర ప్రాంతంలో ఒక్క రోజు నిద్రపోండి అని సీఎం విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. శనివారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిద్ర చేయబోతున్నాం. ప్రజలతో కలసి వారి ఇంట్లోనే భోజనం చేసి, అక్కడే నిద్ర చేస్తాం. పోలీసు వ్యవస్థ నిర్విర్యం రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. పోలీసు వ్యవస్థను నిర్విర్యం చేసింది. మజ్లిస్ పార్టీ, అసదుద్దీన్, రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయి.’’అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. -
రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంత జాప్యం జరగడం సహజం. అంతమాత్రానికే తొందరపాటు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పడం అవివేకం’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం భారత్ మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్– 2024లో కేంద్ర గనుల శాఖ, కోలిండియా పెవిలియన్లను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు పెవిలియన్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల స్టాళ్లను కేంద్రమంత్రి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవినీతి ఎక్కడ జరిగినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాము హైకోర్టుకు వెళ్లామని, ఈ వ్యవహారాన్ని కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ సరిగ్గా జరిగితేనే తప్పు ఎవరు చేశారో ప్రజలకు అర్థమవుతుంది కదా అని చెప్పారు. కేంద్ర మంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారనే విషయంలో.. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఒకరిపైఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో బీజేపీ గురించి అసత్యాలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఆయన ప్రజలతో మాట్లాడాలి.. అంతే తప్ప ఈ విషయంలో రాజకీయ ప్రయోజనం ఆశించడం సరికాదని సూచించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందులో సందేహం అక్కర్లేదని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలం: సముద్రాల్లో ఉన్న మినలర్స్ను సద్వినియోగం చేసుకునేందుకు ఆఫ్‌షోర్ మైనింగ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి సారించామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలానికి అంతా సిద్ధమైందని, రెండుమూడు నెలల్లో ఈ బ్లాకులను వేలం వేస్తామని చెప్పారు. ఇప్పటికే అర్జెంటీనాలో పలు బ్లాక్‌లను వేలంలో దక్కించుకున్నామని, అక్కడ తవ్వకాల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. భారతదేశం బొ గ్గు, గనుల రంగంలో సాధిస్తున్న ప్రగతి, ఆధునిక సాంకేతికత వినియోగం, కా రి్మకుల భద్రత, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచర ణ తదితర అంశాలను భారత్‌మండపంలో ప్రారంభించిన పెవిలియన్ ద్వారా సందర్శకులకు వివరిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని వివరించారు. ప్రపంచంలోనే కోలిండియా మూడో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందన్నా రు. సంవత్సరంపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని.. అంగన్వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు.‘‘నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. దిశా కమిటీ సమావేశంలో అనేక విషయాలపై చర్చించాం. ప్రతి మూడు నెలలకోసారి పథకాల అమలు, కార్యక్రమాలపై అధికారులంతా సమీక్షించుకోవాలి. తెలంగాణలో 70-80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. అయినా, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మూతబడే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి’’ అని కిషన్‌రెడ్డి సూచించారు.రేపటి నుంచి పంట కొనుగోలు కేంద్రాలను తెలంగాణ బీజేపీ సందర్శించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు, పత్తి కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశీలించనున్నాయి. 9, 11, 13 తేదీల్లో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో పంట కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశిలించనున్నారు. రేపు(శనివారం) ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బృందాలు పర్యటించనున్నాయి.రేపు(శనివారం) భువనగిరిలో కిషన్‌రెడ్డి, సూర్యాపేటలో లక్ష్మణ్, ఆదిలాబాద్‌లో యేలేటి మహేశ్వర్ రెడ్డి బృందాలు.. 11న కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు సందర్శించనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ బృందాలు కొనుగోలు కేంద్రాలను పరిశిలించనున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ, వరంగల్ జిల్లాలో ఈటల రాజేందర్, మెదక్ రఘునందన్ రావు, ఖమ్మం కాటిపల్లి వెంకట రమణారెడ్డి బృందాలు పరిశీలించనున్నాయి. 13న నిజామాబాద్ జిల్లాలో పంట కొనుగోలు కేంద్రాలను ధర్మపురి అరవింద్ బృందాలు సందర్శించనున్నాయి. -
వచ్చే నెల్లో పాదయాత్రలు, సభలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఎన్నికల హామీలను అమలుచేయకపో వటాన్ని ఎండగడుతూ డిసెంబర్ మొదటివారంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నాలుగేళ్లపాటు (2028లో అసెంబ్లీ ఎన్నికల వరకు) నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడాలని తీర్మానించింది. గురువారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికల స్టేట్ లెవల్ వర్క్ షాప్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నందున శనివారం రాష్ట్రంలోని ధాన్యం కోనుగో లు కేంద్రాలను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సందర్శించాలని నిర్ణయించారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసించాలని ప్రతి పక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో.. ఆ ప్రాంతాల్లోని ఇళ్లల్లో బీజేపీ నేతలు ‘మూసీ నిద్ర’ చేసి అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. 11 నెలల్లోనే సర్కార్‌పై వ్యతిరేకత: కిషన్రెడ్డికాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టుగా తయారైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 11 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత వచ్చిందని తెలిపారు. గతంలో తెలంగాణను పట్టి పీడించిన బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూము లు తాకట్టు పెట్టి అప్పుల కోసం అన్వేషణ సాగి స్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీనే సరైన రాజకీయ ప్రత్యామ్నాయమని తేలిపోయిందని అన్నారు.పార్టీని సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూనే, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలతో ప్రజలకు అండగా నిలవాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే నాలుగేళ్లపాటు ప్రజల పక్షాన నిలిచి పోరాడు దామని అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం ఎన్ని వేల కోట్లయినా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగాఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దళారులు, మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీని ప్రజలే కోరుతున్నారు: డా.కే లక్ష్మణ్తెలంగాణలో అతి తక్కువ సమయంలో 30 లక్షల మంది బీజేపీ సభ్యులుగా చేరారని, దీన్నిబట్టే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అర్ధమవుతోందని ఆ పార్టీ నేత డా.కె.లక్ష్మణ్ అన్నారు. ఈ వర్క్‌షాపులో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హరీష్‌బాబు, రామారావు పటేల్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ యెండల లక్ష్మీనారాయణ, పార్టీనేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఎం.ధర్మారావు చంద్రశేఖర్ తివారీ (సంస్థాగత), గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకోం‘మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. శుద్ధ నీళ్లు ఇవ్వాల్సిందే.. కృష్ణా, గోదావరి నుండి నీటిని తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. అయితే ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోం’ అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ వర్క్‌షాప్ అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించా రు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, స్థా నిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఖతం చేస్తామని ప్రకటించారు. త్వరలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభిస్తారని తెలిపారు. -
ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నిళ్లు ఇవ్వాల్సిందే. కృష్ణా, గోదవారి నుంచి నీళ్లు తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. మూసీకి రిటైనింగ్ వాల్ కట్టాలి.. సీటీలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కులగణనకు మేం వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ అని అన్నారు. -
రుణమాఫీపై సిట్టింగ్ జడ్జికి నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తాము ఇచ్చిన హామీ అమలు చేశామని చెప్పే ధైర్యముంటే.. రుణమాఫీ విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జికి నివేదిక సమర్పించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు మధ్య నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో సైతం హామీలు, సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ధ్వజమెత్తారు. ఏడాది తిరక్కుండానే రూ.లక్ష కోట్ల అప్పులు మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తే, కాంగ్రెస్ ఏడాది తిరగకుండానే రూ.లక్ష కోట్ల అప్పులు చేసిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ‘ప్రచారం ఫుల్ పనులు మాత్రం నిల్’అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు గాను 22 లక్షల మందికే రుణమాఫీ చేసి, మొత్తం చేశామంటూ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి, మహిళలకు సాయం ఏదీ?కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, ప్రియాంక, రాహుల్.. డిక్లరేషన్లు, గ్యారంటీల పేరిట ఇచ్చిన అనేక హామీల అమలు ఏమైందని కేంద్రమంత్రి ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణలలో మాదిరిగానే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో సైతం మభ్యపెట్టే హామీలు, గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా హామీలను ఎప్పటిలోగా, ఏవిధంగా అమలు చేస్తారనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం కరువవుతోందని అన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, వివాహం చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం హామీలు ఏమయ్యాయని కిషన్‌రెడ్డి నిలదీశారు. -
చిరంజీవితో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: సినీహీరో చిరంజీవితో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. శనివారం చిరంజీవి నివాసానికి వెళ్లిన సందర్భంగా ఆయన్ను కిషన్‌రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. దీపావళి సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ‘ఎక్స్’ ద్వారా కిషన్‌రెడ్డి వెల్లడించారు.సినీపరిశ్రమతో పాటు సేవా కార్యక్రమాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ప్రభావితం చేసిన చిరంజీవిని కలుసుకోవడం ఎల్లప్పుడూ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే కిషన్‌రెడ్డి చిరంజీవిని మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీటీడీ చైర్మన్‌గా నియమితుడైన బీఆర్ నాయుడిని కూడా కిషన్‌రెడ్డి కలిసి అభినందించినట్లు పార్టీ నాయకుల సమాచారం. -
పేదల ఇళ్లు కూల్చితే రణరంగమే...
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: ‘మూసీలో పేదల ఇళ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుంది. పేదలు ఆక్రోశంతో తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేదల ఇళ్ల కూల్చివేతల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. మేం కూడా కూల్చివేతలను అడుగడుగునా అడ్డుకుంటాం. సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను మేం స్వీకరిస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల కోసంవారి ఇళ్లల్లో ఉండేందుకు మేం సిద్ధం..’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మూసీ, హైడ్రా కూల్చివేతలకు నిరసనగా ‘చేయి చేసిన కీడు...మూసీ బాధితులకు బీజేపీ తోడు’పేరిట నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఇళ్లు కూల్చకుండా సుందరీకరణ చేయాలి ‘మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు. అయితే పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా మూసీ సుందరీకరణ చేయాలి. మూసీకి రెండువైపులా రిటైనింగ్‌వాల్ నిర్మించాక సుందరీకరణ చేపట్టాలి. అప్పుడు బీజేపీ కార్యకర్తలు కరసేవ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాకాకుండా పేదల ఇళ్లు కూల్చాలనుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటాం. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, వివరాలు సేకరించి రానున్న రోజుల్లో పేదల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.అనేక ఏళ్ల నుంచి ఉంటున్న ఇళ్లను ఎలా కూలుస్తారు ? మూసీ పరీవాహక ప్రాంతం చరిత్ర రేవంత్‌రెడ్డికి తెలుసా? మూసీలో అనేక ప్రాంతాల డ్రైనేజీ నీరు కలుస్తోంది. దాన్ని మళ్లించకుండా, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) నిర్మించకుండా మూసీ ప్రక్షాళన చేయలేరు..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. ముందుగా హైదరాబాద్‌లోని అనేకచోట్ల భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాక మూసీ సుందరీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, తమ మోసపూరిత వైఖరి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతామంటోందని ధ్వజమెత్తారు. మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్: బండి సంజయ్ ‘మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్. మూసీ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్లే. లండన్, సియోల్ కాదు.. మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ము సీఎంకు, మంత్రులకు ఉందా? మీ అల్లుడి (వాద్రా) కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా? మూసీ బాధితులకు మేం అండగా ఉంటాం..’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మూసీ ప్రాజెక్టుకు లక్షన్నరకోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ ప్రక్షాళనకు, ఇళ్ల కూలి్చవేతలకు సంబంధం ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. సీఎం మాతో మూసీ పర్యటనకు రావాలి: ఏలేటి మహేశ్వరరెడ్డి సీఎం రేవంత్ తమతోపాటు మూసీ పర్యటనకు రావాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు ప్రజల్లో ఒక్కరు ఒప్పుకున్నా తాము వెనక్కి తగ్గుతామని సవాల్ చేశారు. మీ కమీషన్ల కోసం సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సమన్వయకర్తగా నిర్వహించిన ఈ ధర్నాలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్, పలువురు పార్టీ నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మూసీ ప్రభావిత ప్రాంతాల్లోని పలువురు మహిళలు ఈ సందర్భంగా తమ సమస్యలను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. -
పేదల ఇళ్ల జోలికి రావద్దు: కిషన్ రెడ్డి
-
మూసీ పక్కన టెంపుల్స్ కూల్చే దమ్ముందా?.. కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా రేవంత్ ఉందా? అని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.తెలంగాణ బీజేపీ నేతలు ఇందిరా పార్క్ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా ‘చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు పేరుతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు సవాల్ చేస్తున్నాను. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో నివాసం ఉండటానికి మేం సిద్ధం. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు వెళ్ళడానికి మేం రెడీ. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం. పేద ప్రజల గూడు లేకుండా చేయవద్దని కోరుతున్నాను.మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. రేవంత్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఒక్క పేద వాడి ఇంటి పనికి కూడా శంకుస్థాపన చేయలేదు. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్ళు కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియక బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. పేద ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం కూడా పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో పర్యటించి.. వారి బాధలు తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టాలని రేవంత్‌కు కల వచ్చినట్టుంది.రేవంత్‌కి మరో సవాల్ చేస్తున్నా.. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్‌కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. -
ఇందిరా పార్క్ ధర్నా చౌక్.. నేడు బీజేపీ నేతల ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ ప్రాంత ప్రజలకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద నేడు బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు.తెలంగాణ బీజేపీ నేతలు రెండు రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం, వారికి మద్దతుగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు బీజేపీ నేతలు ధర్నా చేయనున్నారు. బీజేపీ ధర్నాకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కానున్నారు. -
వచ్చే ఆగస్టుకల్లా కాజీపేట యూనిట్
సాక్షి, హైదరాబాద్: కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)ను వచ్చే ఆగస్ట్ నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ యూనిట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌హెచ్‌బీ (లింక్‌హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు, ఈఎంయూ (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) కోచ్‌లను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏటా 600 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యంతో కాజీపేట యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. గురువారం దక్షిణమధ్య రైల్వే పరిధిలోని పార్లమెంట్ సభ్యుల సమావేశం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగింది.ఈ సందర్భంగా పలు పెండింగ్ సమస్యలను ఎంపీలు ప్రస్తావించారు. అనంతరం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌తో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదట్లో రూ.250 కోట్లతో కాజీపేట్‌లో ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, ప్రస్తుతం దానిని రూ.680 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు మూడువేల మందికిపైగా ఉపాధి లభిస్తుందన్నారు. అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన 40 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, రూ.780 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ పునరాభివృద్ధి ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. 15 ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే దక్షిణమధ్య రైల్వేలో 15 ప్రాజెక్టులను చేపట్టేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.50 వేల కోట్లతో 2647 కి.మీ. రైల్వేలైన్లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రూ. 17,862 కోట్ల అంచనాతో 1,447 కి.మీ. డబ్లింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ తరువాత హైదరాబాద్ కేంద్రంగానే అత్యధికంగా 5 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో భూమి లభించకపోవడం వల్ల ఎంఎంటీఎస్ రెండో దశతోపాటు పలు ప్రాజెక్టుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రూ.650 కోట్లతో రాయగిరి నుంచి యాదాద్రి వరకు 31 కి.మీ. వరకు ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రైల్వేశాఖ సొంతంగా చేపట్టనుందన్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మించాలని ప్రతిపాదించిన రైల్రింగ్రోడ్డుకు సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రాధాన్యతల కోసం కసరత్తురానున్న కేంద్ర బడ్జెట్లో రైల్వే ప్రాధాన్యతలను లక్ష్యంగా చేసుకొని దక్షిణమధ్య రైల్వే నిర్వహించిన ఈ ఎంపీల సమావేశంలో తెలంగాణ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి, డీకే అరుణ, కడియం కావ్య, బలరాంనాయక్, రఘురాంరెడ్డితోపాటు సాగర్ ఈశ్వర్ ఖండ్రే (బీదర్), రాధాకృష్ణ దోడ్డమణి (కలబురిగి) పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆర్‌యూబీలు, ఆర్ఓబీలు నత్తనడకన సాగుతున్నాయని, సకాలంలో పూర్తయ్యేలా గడువు విధించాలని ఈటల సూచించారు.ఈదుల నాగులపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని, జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాస్‌ల ను పునరుద్ధరించాలని రఘునందన్‌రెడ్డి కోరా రు. ఏటా రెండుసార్లు ఎంపీల సమావేశం పెట్టి సమస్యలపై చర్చించాలని సురేశ్‌రెడ్డి సూచించా రు. దేవరకద్ర, కౌకుంట్ల, జడ్చర్ల ప్రాంతాల్లోని ఆర్‌యూబీలు, ఆర్ఓబీలను సకాలంలో పూర్తి చేయాలని డీకే అరుణ కోరారు. కాజీపేట రైల్వే ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కలి్పంచాలని కడియం కావ్య కోరారు. ఎంపీల ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఉంటుందని జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ చెప్పారు. 2023–24 ఆర్థిక ఏడాదిలో 141 మిలియన్ టన్నుల సరుకు రవాణాద్వారా అత్యధికంగా రూ.13,620 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. -
వచ్చే నెలలో చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేష్ రెడ్డి, కావ్య, రఘునందన్, డీకే అరుణ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా రైల్వే అభివృద్ధిపై చర్చించారు. రైళ్ల హోల్డింగ్, కొత్త రైల్వే లైన్లతో పాటు అండర్ పాసులు, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90 శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రక్రియను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని.. 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు తీసుకొస్తాం. రూ.720 కోట్లతో సికింద్రబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి. రూ. 430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు మరో రూ.650 కోట్లు కావాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.జంట నగరాల నుంచి యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంఎంటీస్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. రైల్వే అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసి, చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కింద సర్వీసును పొడిగిస్తున్నాం. మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.33 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే పనుల కోసం సుమారు 6 వేల కోట్లు బడ్జెట్ మంజూరు అయింది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్‌రెడ్డి?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం వేగిరం చేసింది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాల యూనిట్లను ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని, తద్వారా అక్కడ పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటా యని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీ రెండ్రోజుల కిందటే పార్టీ కీలక నేతలతో వర్క్‌షాప్ నిర్వహించి సంస్థాగత ఎన్ని కల ప్రక్రియపై మార్గదర్శనం చేసింది. బీజేపీలో మొదట బూత్, ఆ తర్వాత మండల, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు ప్రకటించే తేదీల్లో బూత్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికతోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాలి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎన్నుకోనుండగా, జాతీయ కౌన్సిల్ సభ్యులు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం.. అంటే డిసెంబర్ రెండో వారానికి పూర్తవుతుంది, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. దక్షిణాదికే అవకాశమెక్కువ.. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసినా సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్ 30 వరకు పొడిగించారు. ఆ తర్వాతా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ఆరు నెలల నుంచి వివిధ పేర్లపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు శివరాజ్‌సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), సునీల్ భూపేంద్ర యాదవ్ (రాజస్తాన్), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), ధర్మేంద్ర ప్రధాన్ (ఒడిశా)ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని మరింత విస్తరించాలని భావిస్తున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందని బలమైన ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమున్న దృష్ట్యా, డిసెంబర్ రెండు లేదా మూడో వారానికి కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో అధినాయకత్వం ఉంది. -
25న ఇందిరాపార్క్ ధర్నాను విరమించుకోండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు ఈ నెల 25న ఇందిరాపార్కు వద్ద తలపె ట్టిన ధర్నాను విరమించుకోవాలని, గత పదేళ్లలో మూసీ ప్రక్షాళనకు, మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధికి నయా పైసా కేటాయించని కేంద్రం ఎదుట ధర్నా చేయాలని మంత్రి సీతక్క హితవు పలికారు. యూపీఏ హయాంలో మూసీ ప్రక్షాళనకు రూ.335 కోట్లు మంజూరు చేస్తే, మోదీ పాలనలో పైసా మంజూరు కాకపోయినా కిషన్‌రెడ్డి ఎందుకు పెదవి విప్పలేదని మంగళవారం ఓ ప్రకటనలో నిలదీశారు. ఇతర నదుల ప్రక్షాళన కు నిధులిచ్చి మూసీ ప్రక్షాళనకు పైసా కేటాయించకపోవడం తెలంగాణపై కేంద్రం వివక్షతకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.సొంత నియోజకవర్గం మీదుగా మూసీ పారు తున్నా ఏనాడూ కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కిషన్‌రెడ్డి ఇప్పుడు ధర్నాకు పిలుపునివ్వడం ఏమిటో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఒక కేంద్రమంత్రి ప్రాతిని ధ్యం వహిస్తున్నందున.. కేంద్రంతో చర్చించి హైదరాబాద్ జీవనరేఖగా భావించే మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సమర్థిస్తున్న బీజేపీ ఇక్కడ మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. -
ఇది కుట్రా... లేక ద్వేషమా?
సాక్షి, హైదరాబాద్: వివిధ హిందూ సంస్థల కార్యకర్తల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హిందూ సంస్థల పట్ల, ఆ సంస్థల కార్యకర్తలపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కిషన్‌రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఇది కుట్రా? లేక ద్వేషమా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని హిందూ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి’అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘ముందుగా...భారతీయ న్యాయసంహిత సెక్షన్ 176, సెక్షన్ 173 నిబంధన కింద 3 క్రిమినల్ కేసులకింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు..సోమవారం అర్ధరాత్రి సమయంలో..ఆ ఎఫ్ఐఆర్లో మార్పులు చేసి సెక్షన్ 109 (హత్యాయత్నం)ను చేర్చారు. ఇది హిందూ సంస్థల సభ్యులను హింసించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనను తెలియజేస్తోంది’అని ఎక్స్‌లో పేర్కొన్నారు. -
నిరుద్యోగులు రోడ్డెక్కితే.. దురహంకారంతో అణచివేస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నియామక పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. గ్రూప్–1 పరీక్షల రీషెడ్యూల్ కోరుతూ అభ్యర్థులు రోడ్డెక్కితే వారిపై లాఠీలు ఝలిపించి, దురహంకారంతో అణచివేయాలని చూడటం దారుణమని వ్యాఖ్యానించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘గ్రూప్–1 ఉద్యోగాల ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఒకే తరహా నిబంధనలుండాలి. ఆ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒకే హాల్‌టికెట్ ఉండాలి.కానీ టీజీపీఎస్సీ రెండుసార్లు జారీ చేయడం ఏమిటి? పరీక్షలన్నీ హైదరాబాద్ పరిసరాల్లోనే నిర్వహించడానికి కారణాలు ఏమిటి? ఇలా ఒకేచోట పరీక్షల నిర్వహణపై పలు అనుమానాలు వస్తున్నాయి. గ్రూప్–1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో అమలు చేసిన జీవో 29 విషయంలో అభ్యర్థులకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి దాపరికం లేకపోతే స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు?’’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీతో కలసి అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో మాట్లాడిన మాటలేమిటి? ఇప్పుడు చేస్తున్న పనులేమిటి? ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని సీఎం రేవంత్‌కు సూచించారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నాలు న్యాయం కావాలని రోడ్డెక్కిన నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం, నిరసనలను అణచివేసే ప్రయత్నం చేయడం, అరెస్టులకు దిగడం దారుణమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా పేదల ఇళ్లను కూలి్చవేస్తూ కాలం గడిపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హామీలు అమలు చేసే సత్తా, శక్తి, లేకనే.. కొత్త సమస్యలు సృష్టించి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ పూర్తిగా హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.వినాయక చవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేక మందిపై కేసులు పెట్టించారని.. డీజే సౌండ్ పెట్టారంటూ మండపాల నిర్వాహకులను వేధించారని పేర్కొన్నారు. ఇతర వర్గాల ప్రార్థన కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్దాలు పోలీసులకు, ముఖ్యమంత్రికి వినబడవా? కనబడవా? అని ప్రశ్నించారు. ముత్యాలమ్మ గుడి వద్ద నిరసనకారులపై అత్యంత పాశవికంగా దాడి చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఒక కార్యకర్తకు తీవ్రగాయాలు అయ్యాయని, పోలీసులు అతడిని ఇంట్లో వదిలివెళ్లారని.. కానీ అతడి పరిస్థితి విషమిస్తుండటంతో తాము ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చూశామని చెప్పారు. -
న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఓ వైపు గ్రూప్ వన్ విద్యార్థులు,మరోవైపు ముత్యాలమ్మ గుడి భక్తుల ఆందోళనలతో వారం రోజులుగా హైదరాబాద్ అట్టుడుకుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు.‘సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేస్తే సీఎం ఎందుకు స్పందించలేదు. హిందువులను కాంగ్రెస్ ఎప్పుడూ శత్రువులుగానే భావిస్తోంది. పోలీసులు చాలా మంది భక్తుల తలలు పగులగొట్టారు. హిందువుల విషయంలో అనేక నిర్బంధాలకు గురిచేస్తున్నారు. న్యాయం కోసం ఆందోళనలు చేస్తే తలలు పగులగొడతారా.గ్రూప్ వన్ విద్యార్థులపై లాఠీఛార్జ్ సరికాదు. తెలంగాణలో మళ్లీ యువత రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ప్రాతిపదికన విద్యార్థులు చదువుకోవాలి. వికీపీడియా ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇస్తారా’అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు -
కమలం మంత్రుల ‘లోకల్ పాలిటిక్స్’!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రుల ‘లోకల్ పాలిటిక్స్’ రాష్ట్ర రాజకీయాలకు వేడెక్కిస్తున్నాయి. శనివారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిష¯Œ రెడ్డి, గ్రూప్–1 అభ్యర్థులు, నిరుద్యోగులకు మద్దతుగా హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మెరుపు నిరసన లు చేపట్టడంతో.. ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో మూసీ పరీవాహక, హైడ్రా ప్రాంతాల్లో ఎంపీలు, ఎమ్మెల్యే లు క్షేత్రస్థాయి పర్యటనలు, 24న రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల ఆందోళనలు చేపట్టడానికి ముందే కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా దీర్ఘ, స్వల్ప, తక్షణ కార్యాచరణ చేపట్టేందుకు, నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇవి దోహదపడినట్టుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాపై బుల్డోజర్లు తెచ్చాక కూల్చండి: కిషన్‌రెడ్డి మూసీ నది పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అనా లోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డిని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రాజెక్ట్‌కు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్న సీఎం.. ముందుగా పేదల ఇళ్లు కూల్చ కుండా మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. తమపై బుల్డోజర్లు తీసుకొచ్చి.. అప్పుడు పేదల ఇళ్లు కూల్చాలని.. వారి ఇళ్లను కూల్చాలనుకునే ముందు తమను జైలులో పెట్టాలని కోరారు. పాత సంజయ్ గుర్తొచ్చారుప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్.. ఒక్కసారిగా రాష్ట్రపార్టీ అధ్యక్షునిగా వ్యవహరించిన రోజుల్ని గుర్తుకు తెచ్చారు. ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనడం, రోడ్ల బైఠాయింపు, ఇతర రూపాల్లో ఉద్యమ కార్యాచరణను గుర్తుకు తెచ్చేలా శనివారం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటా నికి దిగారు. ప్రస్తుతం తాను హోంశాఖ సహాయమంత్రినన్న విషయాన్ని కూడా పక్కనపెట్టి.. బీజేపీ కార్యాలయంలో తొలుత గ్రూప్–1 అభ్యర్థులు, నిరుద్యోగులతో సమావేశ మయ్యారు.ఆ వెంటనే పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి సంఘీభావం తెలిపేందుకు అశోక్‌నగర్‌కు పయనమయ్యా రు. వెంటనే పార్టీ నాయకులు, శ్రేణులు వెంటరాగా, గ్రూప్–1 బాధితులను కలుసుకున్నారు. నిరుద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తేగానే, వారిపై ఇటీవల జరిగిన లాఠీచార్జీకి నిరసనగా అక్కడే రోడ్డుపై బైఠాయించి మెరుపు నిరసన తెలిపారు. తాను కేంద్రమంత్రినైనా.. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా బీజేపీ కార్యకర్తగా వారికి అండగా ఉంటా నని ప్రకటించారు. జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్–1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద వదిలివెళ్లారు. అక్కడ కొంత సేపు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యాక.. గ్రూప్–1 అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తా మంటూ ‘చలో సెక్రటేరియట్’కు బయలుదేరారు. ఆయనతో పాటు నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిమంది ర్యాలీగా ముందుకు కదలడంతో పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మధ్యలో చర్చలకు ప్రభుత్వం పిలిచిందనే ప్రచారం జరిగినా.. అది రూఢీ కాలేదని పార్టీ నాయకులు తెలిపారు. ఈ దశలో జీవో 29 రద్దు చేయాల్సిందేనంటూ సంజయ్ ప్లకార్డ్‌ను ప్రదర్శించారు. అక్కడి నుంచి ఆయనను పోలీసు బందోబస్తు మధ్య రామకృష్ణమఠం వైపు తీసుకురాగా.. అక్కడికి దగ్గరలోని ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై సంజయ్ మరోసారి బైఠాయించారు. జీవో 29 రద్దుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి నిరుద్యోగులతో కలిసి లిబర్టీ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకుని వాహనంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడి.. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటుగా విమర్శలు సంధించారు. -
మూసీ సుందరీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మూసీ సుందరీకరణ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే, మూసీ నదిలో డ్రైనేజీలు కలవకుండా చూడాలన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ సుందరీకరణ చేసినా పునర్జీవం చేసినా మేం వ్యతిరేకం కాదు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. డ్రైనేజీ మూసీలో కలవకుండా చూడండి. పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చు. ఆ తర్వాత మూసీ పునర్జీవం చేయండి. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల న్యాయ బద్ధమైన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణలో ఇంకా వ్యతిరేకత ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లే ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ -
సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముత్యాలమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని పలు హిందూ సంఘాలు డిమండ్ చేస్తున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోలనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. విగ్రహ ధ్వంసంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ధానికులతో మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘హిందూ దేవాలయలు లక్ష్యంగా దాడి చేస్తున్నారు. అమ్మవారి విగ్రహాన్నిధ్వంసం చేసి గేట్లు విరగ్గొట్టారు. దేవాలయాలపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దేవాలయాలకు పటిష్ట భద్రత కల్పించి రక్షణ కల్పించాలి. మత కలహాలు జరగకుండా అడ్డుకోవాలి’’ అని అన్నారు.కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ పరిశీస్తున్నారు.చదవండి: యూఎస్‌లో తెలంగాణ విద్యార్థి హత్య.. నిందితుడికి 60 ఏళ్ల జైలు శిక్ష -
రాష్ట్ర సాధనకు తోడ్పడిన అలయ్ బలయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడానికి, గౌరవించడానికి రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికే కాకుండా, నాటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ కార్యక్రమం స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలనే ఆలోచనతో బండారు దత్తాత్రేయ ప్రారంభించిన ఈ కార్యక్రమం.. చివరకు స్వరాష్ట్రం సాధించుకోవడానికి కూడా దోహదపడిందని పేర్కొన్నారు. దసరా పండుగ నేపథ్యంలో హరియాణా గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 19వ అలయ్ బలయ్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అలయ్ బలయ్ అంటే దత్తాత్రేయే.. ‘తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా.. దసరా అంటే మొట్టమొదట పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయి. అలాగే అలయ్ బలయ్ అంటే కూడా బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారు. ఆయన అందించిన సంస్కృతి, వారసత్వ లక్షణాలతో దత్తాత్రేయ వారసురాలిగా బండారు విజయలక్ష్మి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. రాజకీయాలకు అతీతంగా మా పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు దీనికి హాజరై రాష్ట్ర సంప్రదాయాలు కొనసాగించడంలో రాజకీయాలకు తావు లేదని నిరూపించాం. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కవులు, కళాకారులు, వివిధ సంఘాల వారు కూడా ఏకమై అంతా ఒకటేనని సందేశాన్నివ్వడం అభినందనీయం..’అని సీఎం పేర్కొన్నారు. వేరే రాష్ట్రానికి గవర్నర్ అయినా తెలుగు బిడ్డనే: దత్తాత్రేయ ‘నేను ఇప్పుడు వేరే రాష్ట్రానికి గవర్నర్ అయినా తెలుగు బిడ్డనే. అందుకే స్థానిక కళాకారులు, కుటీర పరిశ్రమలకు చెందిన కుమ్మరి, కమ్మరి, చేనేత, గీత కారి్మకులు తదితర వర్గాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశా. వారికి ప్రత్యేకంగా అంకుర సంస్థలు ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సాహం అందించాల్సిన అవసరముంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదరభావంతో ముందుకు సాగాలి..’అని దత్తాత్రేయ ఆకాంక్షించారు. ఐక్యతను ప్రతిబింబిస్తుంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ‘విజయలక్ష్మి అలయ్ బలయ్‌ను కొనసాగించడం అభినందనీయం. గ్రామాల్లో పొలాల గెట్ల గొడవలు, ఇంట్లో మనస్పర్థలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దసరా జమ్మి పూజ చేశాక అంతా కలిసి అలయ్ బలయ్ తీసుకోవడం తెలంగాణ సంస్కృతి. దత్తన్న అలయ్ బలయ్ దీనినే ప్రతిబింబిస్తుంది. రాజకీయాల్లో విమర్శలు, విభేదాలు ఉండొచ్చు కానీ ఇలా కలవడం మంచి విషయం. ఎన్నికల సమయంలో విమర్శించుకోవచ్చు.. తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది లోపించింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ భాష మార్చుకోవాలి. ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. అలయ్ బలయ్ స్ఫూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలి..’అని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉద్రేకాలు రగిలించడాన్ని నియంత్రించాలి: పొన్నం ‘రాజకీయ నాయకులు భాష మార్చుకోవాలంటూ కిషన్‌రెడ్డి చేసిన సూచన వంద శాతం సమంజసం. అదే విధంగా మత పరమైన ఉద్రేకాలను రగిలించే మాటలను కూడా నియంత్రించేలా చొరవ చూపించాల్సిన అవసరం ఉంది..’అని రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సంస్కృతి కొనసాగాలిఉత్తరాఖండ్, రాజస్తాన్, మేఘాలయ గవర్నర్లు‘గతంలో బొల్లారంలోని యూనిట్లో పని చేశా. ఇక్కడి సంస్కృతి అద్భుతమైనది. శాంతికి సంకేతంలా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. ఈ సంస్కృతి ఇలాగే శతాబ్దాలు కొనసాగాలని ఆశిస్తున్నా..’అని ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ గుర్మిత్ సింగ్ అన్నారు. అలయ్ బలయ్ మంచి సంస్కృతి అని రాజస్తాన్ గవర్నర్ హరిభావ్ బగాదే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నేతల మధ్య ఆత్మీయత, అనుబంధాలను పెంచుతోందని మేఘాలయ గవర్నర్ విజయశంకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, నేతలు ఈటల రాజేందర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రఘునందన్ రావు, కోదండరాం, వి.హన్మంతరావు, లక్ష్మణ్, కె.కేశవరావు, గోరటి వెంకన్న, వందే మాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.అద్భుతమైన సంస్కృతిగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ‘భారతీయ సంస్కృతి అంటేనే ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం. దీనిని ప్రతిబింబించేలా నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం చాలా బాగుంది. ఇక్కడి సంస్కృతిలో విభిన్న మతాలను సైతం సమానంగా చూసే తత్వముంది. సీనియర్ నేత దత్తాత్రేయ అద్భుతమైన స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం హర్షణీయం..’అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. -
హైదరాబాద్: అలయ్ బలయ్ సందడి
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరుగుతోంది. బండారు దత్తత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు. ఇది 19వ సారి జరుగుతున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరు తెలంగాణ గవర్నర్ జిష్ణూ దేవ్ వర్మ, పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది సినీ ప్రముఖులను కూడా నిర్వాహకులు అహ్వానించారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.రాజకీయాలకు అతీతంగా గౌరవించబడే బండారు దత్తాత్రేయ 19 ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ అంతరించిపోతున్న తెలంగాణ కళలు భావితరాలకు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తి. జెండాలకు అజెండలను పక్కన పెట్టి తెలంగాణ కోసం ఒక్కటయ్యేలా చేసింది. ఆఎస్ఎస్ టూ ఆర్ఈసీ, కాంగ్రెస్ టూ కమ్యూనిస్టుల వరకు ఒక్కటై తెలంగాణ కోసం గళం వినిపించారు. దసరా అంటే జమ్మి చెట్టు, పాలపిట్ట గుర్తుకు వస్తాయి. ‘అలయ్ బలయ్’ అంటే బండారు దత్తాత్రేయ గుర్తు వస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కొనసాగిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత’’ అని అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై.. మాట్లాడారు.‘‘ స్నేహశీలి బండారు దత్తాత్రేయ. భావితరాలకు ఈ కార్యక్రమాన్ని అందించాలి. పండగలకి సామాజిక సంస్కృతి అంతే ఉంది. కలిసి మెలిసి ఉండాలన్న సంకల్పం ఈ అలయ్ బలయ్. కుటుంబ, ప్రాంత, దేశ సమైక్యత సాధించుకోవాలి. పాశ్చాత్య సంస్కృతి వదిలి పెట్టి మన అనుకునే ఐక్యత పద్దతి పాటించాలి’ అని అన్నారు.మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడారు.‘‘ అలయ్ బలయ్ రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వానికి ప్రతీక . పలు రాష్ట్రాల గవర్నర్ల రాకతో దేశమంతా దిగివచ్చినట్లు ఉంది. అలయ్ బలయ్‌ను హైదరాబాద్‌తో జిల్లాలకు, ఆంధ్రపదేశ్ కు కూడా విస్తరించాలి’’ అని అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు.‘‘ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉండాలి. అభివృద్ధిలో తెలుగురాష్ట్రాలు దేశంలో నెంబర్ వన్‌గా నిలవాలి’’ అని అన్నారు.తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు. ‘‘ అలయ్ బలయ్ అంటే ఐక్యత. మన సాంప్రదాయలను ప్రతిబింబించే కార్యక్రమం. తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో సుందరమైనవి. అందరూ కలిసుండాలనేది మన సంస్కృతి. అన్ని మతాల వారు కలిసి విజయదశమి జరుపుకుంటున్నారు. విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయం. ఆ విజయం ఐక్యతతో సాధ్యం’’ అని అన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘ అన్ని వర్గాల వారిని ఐక్యం చేసే అలయ్ బలయ్ గొప్ప కార్యక్రమం. రాజకీయంగా ఎన్ని ఉన్నా ఇలాంటి ప్రొగ్రాంలలో కలవడం గొప్ప విషయం. ఎన్నికలప్పుడు రాజకీయాలు, తర్వాత పేద ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో అది లోపించింది. గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల మధ్య మాటలతో మాట్లడలేని విధంగా విమర్శించుకుంటున్నారు. వాళ్లలో మార్పు రావాలని దసరా సందర్భంగా దేవుళ్లను కోరుకుంటున్నా. మాట్లాడే భాష అంగీకారం కాదు. మార్పు రావాలి. రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునేలా మాట్లాడం రాజకీయ నాయకులకు తగదు’’ అని అన్నారు.చదవండి: పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్‌చాట్‌లో హరీష్ రావు -
13 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీతో రాష్ట్రస్థాయిలో సభ్యత్వ నమోదు ముగించాల్సి ఉంది. సభ్యత్వ నమోదు టార్గెట్ 50 లక్షలు కాగా, శుక్రవారం నాటికి రాష్ట్రంలో 20 లక్షల మంది (5 లక్షల దాకా మిస్డ్‌కాల్‌తో నమోదు, అసంపూర్తి వివరాలు) పార్టీ సభ్యులుగా చేరినట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సభ్యుల్లో 15 లక్షల మంది పూర్తి వివరాలు నమోదు చేయగా, మిగతా వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించాల్సి ఉన్నట్టుగా తేలింది. దీంతో దసరా పండుగ తర్వాతి మూడురోజులు ‘స్పెషల్ డ్రైవ్’పేరుతో సభ్యత్వ నమోదు ఉధృతంగా చేపట్టాలని బీజేపీ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రంలోని 36 వేల పోలింగ్ బూత్‌లలో ఒక్కోదాంట్లో కనీసం వంద మంది సభ్యులను చేరి్పంచడం ద్వారా మరో పది లక్షలకు చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 తర్వాత వంద మంది సభ్యులను చేరి్పంచిన వారితో క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తారు. క్రియాశీల సభ్యులుగా ఉన్నవారే పార్టీ బూత్, మండల, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ 15 నాటికి ‘యాక్టివ్ మెంబర్íÙప్’పూర్తయ్యాక, ఆ తర్వాత బూత్ కమిటీల ఎన్నిక, ఆపై మండల అధ్యక్షులు, మళ్లీ వారు జిల్లా అధ్యక్షులను, ఆ తర్వాత వారంతా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల మంది ఓటు వేయగా, ఈ ఓట్లలో 75 శాతం అంటే 50 లక్షల దాకానైనా సభ్యులుగా చేర్పించేలా ప్రయతి్నంచాలని బీజేపీ హైకమాండ్ టార్గెట్ పెట్టింది. సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరుపై శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ సభ్యత్వ ఇన్చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్రపార్టీ సభ్యత్వ కార్యక్రమ కనీ్వనర్ ఎన్.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ముందు ఎంజీబీఎస్,మెట్రో పిల్లర్లు కూల్చండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేసే ముందు మహాత్మాగాం«ధీ బస్టాండ్ (ఎంజీబీఎస్)ను, మెట్రో పిల్లర్లను కూల్చాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వాటిని తొలగించకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రణాళికలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ‘ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాంటి డీపీఆర్, కార్యాచరణ ప్రణాళిక లేకుండా, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దకుండా సుందరీకరణ ఎలా చేస్తారు? ప్రభుత్వమే రోడ్లువేసి, విద్యుత్ కనెక్షన్లు, ఇంటినంబర్, ఆధార్‌కార్డ్‌లు ఇచ్చి.. ఇప్పుడు పేదలు, దిగువ మధ్యతరగతి వారి ఇళ్లు కూలుస్తామంటే ఎలా? ముందు ఇళ్లు కూల్చుతాము, ఆ తర్వాత ప్రణాళిక వేస్తామంటే.. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోతే బాధిత ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? ఇళ్ల కూలి్చవేతపై మూసీ ప్రభావిత ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి దర్బార్ పెట్టి ప్రజలను ఒప్పించాలి.సీఎం వస్తే నేను కూడా అక్కడకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడేందుకు సిద్ధం’అని కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చే ముందు ఇమ్లీబన్లోని ఎంజీబీఎస్‌ను, అక్కడి మెట్రో పిల్లర్లు, స్టేషన్‌ను కూల్చాలి. మూసీ పరీవాహక ప్రాంతంలో 30, 40 ఏళ్ల కిందటే పేదలు తమ కష్టార్జితంతో ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే, ప్రభుత్వం పెద్ద పెద్ద ఫామ్‌హౌస్‌లను వదిలిపెట్టి పేదలపై పడతామంటే మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు’అని హెచ్చరించారు. కాగా, తమతో బీఆర్ఎస్ నేతలెవరూ టచ్‌లో లేరని స్పష్టం చేశారు. తెలంగాణను లూటీ చేసిన ఆ పార్టీతో ఎలాంటి రాజీ లేదని, ఆ పార్టీ అవినీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రాజెక్ట్ పెట్టదని, అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. హైడ్రా, మూసీపై నేను చెప్పేదే పార్టీ పాలసీ.. ‘హైడ్రా ద్వారా దుందుడుకు చర్యలు తీసుకోవడం సరికాదు. హైడ్రా అనేది రేవంత్‌రెడ్డి పెట్టుకున్న పేరు. అక్రమ నిర్మాణాల కూలి్చవేతలకు జీహెచ్ఎంసీలో ఓ వ్యవస్థ ఉంది. హైడ్రా వెనుక సీఎం రేవంత్‌రెడ్డికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి’అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో హైడ్రాపై భిన్నస్వరాలు వినిపించడంపై ఏమంటారని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘పేదల ఇళ్లు కూల్చమని మా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్పారా’అని కిషన్‌రెడ్డి తిరిగి ప్రశ్నించారు. హైడ్రా, మూసీపై తాను చెప్పేదే పార్టీ పాలసీ అని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు క్షీణిస్తే కేంద్రం జోక్యానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ‘కశ్మీర్లో బీజేపీ వంద శాతం లక్ష్యం చేరుకుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకి చేయగలిగాం. భారత్‌కు వ్యతిరేకం కాబట్టి ఆ దేశానికి చైనా అన్నిరకాలుగా సహాయపడుతోంది’అని తెలిపారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణ అసాధ్యమని, అది ముగిసిన అధ్యాయమని అన్నారు. జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదా కల్పనపై తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
TG: కిషన్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం(అక్టోబర్10) తెలంగాణ బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. తన అల్లుడు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశారు. తన మనవరాలి పెళ్లికి రావాలని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారు. వివాహపత్రికను కిషన్‌రెడ్డికి అందించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకే కిషన్‌రెడ్డిని కలిశానని, రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. చంద్రబాబునాయుడు రాజకీయ భిక్ష పెట్టడం వల్లే గతంలో ఎంపీ అయ్యానన్నారు. టీడీపీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు మాత్రం మల్లారెడ్డి సమాధానం దాటవేశారు.కాగా, ఇటీవలే మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లికి రావాల్సిందిగా ఏపీ సీం చంద్రబాబునాయుడును కలిసి ఆహ్వానించారు. బాబును కలిసిన తర్వాత మల్లారెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే పెళ్లికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిశానని మల్లారెడ్డి ఆ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇదీ చదవండి: మార్కెటింగ్‌లో సీఎం రేవంత్ నెంబర్‌వన్ -
పేదల ఇళ్లు కూలిస్తే.. ప్రభుత్వం కూలుతుంది
సాక్షి, హైదరాబాద్: పేదవాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలమీద ప్రతాపం చూపిస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామన్నారు. పేదవాళ్ల ఇళ్లపై బుల్డోజర్లు దింపే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. సమగ్రమైన ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనలు, మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గురువారం పార్టీనేతలు ప్రేమ్‌సింగ్ రాథోడ్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్.కుమార్, ఎస్.ప్రకాశ్‌రెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా పేదలకు మేలు చేసే ప్రయత్నంతోపాటు ప్రాజె క్టులు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బస్తీలపై కన్నేసి, ఆ ఇళ్లను కూల్చే పనికి శ్రీకారం చుట్టిందని, ఇలా దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి, పేదల ఇళ్లపై మార్కింగ్ చేయడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైందని, దాంతో వెనకడుగు వేసిందని గుర్తుచేశారు. హైదరాబా ద్‌లోని 70 శాతం డ్రైనేజీ నీరంతా మూసీలో చేరుతోందని, ప్రతీగల్లీలో డ్రైనేజీ సమస్య నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకుండా రూ.లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ పేరుతో అనాలోచిత చర్యలకు పాల్పడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘అనేక చెరువుల్లో బడాబాబులు, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు ఫామ్‌హౌస్‌లు, ఎస్టేట్ల పేరుతో నిర్మాణాలు చేసుకున్నారు. ముందు వారిపై హైడ్రా ప్రతాపం చూపాలి. దమ్ముంటే అక్రమంగా నిర్మించుకున్న ఒవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి’అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై..మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై విలేకరులు స్పందన కోరగా.. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేవలం రాజకీయ ప్రయోజనాలు, ప్రత్య ర్థులపై విమర్శల కోసం ఇతరుల కుటుంబ వ్యవహారాలు, మహిళల వ్యక్తిగత విషయా లను వాడుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ‘అలాంటి నీచ సంస్కృతిని కేసీఆర్ మొదలు పెట్టారు. కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. నేడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనసా గిస్తు న్నారు’అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తు న్న తప్పులకు ఆ పార్టీలను బహిష్కరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ‘కేసీఆర్ సర్కార్ గతంలో ఫోన్ ట్యాపింగ్‌తో సినీ ప్రము ఖులు, వ్యాపారస్తుల వ్యక్తిగత విషయాలను తెలుసుకుని, వారిని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసు అధికారులే చెప్పారు’అని వ్యాఖ్యానించారు. -
ఇలాంటి రాజకీయ నేతలను బహిష్కరించాలి
-
హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ - కాన్పూర్, హైదరాబాద్-అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసులు నడపనున్నారు. రేపటి(శనివారం) నుంచి హైదరాబాద్ - ప్రయాగరాజ్ మధ్యన, హైదరాబాద్-ఆగ్రా మధ్యన వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు.హైదరాబాద్ నగరం నుంచి ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసుల ప్రారంభం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్యన ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కిషన్‌రెడ్డి ప్రయాణికులను కోరారు.ఇదీ చదవండి: ఈ దుఃఖం తీర్చేదెవరు? -
ఇళ్ల కూల్చివేతతో పేరు కోసం తాపత్రయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రణాళిక లేకుండానే, హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో అక్రమ కట్టడాల పేరిట ఇళ్ల కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలని భావిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అయితే ఈ కూల్చివేతల ప్రక్రియ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని ప్రజల అభిప్రాయమని సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. హైడ్రా బాధితులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, మేధావుల ఆలోచనలు, నిత్యం వార్తాపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా తెలుసుకుంటున్న అంశాలన్నింటితో ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తాము సమరి్థంచబోమని, అయితే వీటిపై చర్యలు తీసుకునే సమయంలో సహజ న్యాయ సూత్రాలకు (ప్రిన్సిపుల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్) అనుగుణంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విషయంలో వీటి ఆధారంగానే పనిచేయాలనేది అందరి అభిప్రాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా కేసుల్లో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదన్నారు. ఇవాళ అక్రమమని కూల్చేస్తున్న వాటి గురించి సున్నితంగా ఆలోచించాల్సిన అవసరముందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాల్లో వెలసిన ఇళ్లకు ప్రభుత్వ పక్షాన రూ.కోట్లు ఖర్చుచేసి రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం, కరెంటు కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటి నంబరు కేటాయింపు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ద్వారా సేవలు పొందుతూ పన్నులు కడుతుండగా, ఇప్పుడు హఠాత్తుగా అక్రమం అంటే వారు ఎక్కడకు వెళ్లాలి? అందులోనూ పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? అని నిలదీశారు. గతంలో అనేకసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ కూడా చేశాయన్నారు.మూసీ రివర్ బ్యూటిఫికేషన్లో భాగంగా గ్రేటర్ పరిధిలో ఇళ్లు కోల్పోయే వారితో చర్చించాలని సూచించారు. మూసీతోపాటు, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతల విషయంలోనూ ఎలాంటి దుందుడుకు విధానాలతో ముందుకెళ్లకూడదన్నారు. హైడ్రా పేరుతో ఏర్పాటు చేసిన విభాగంతో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళుతోందని చెప్పారు. దీనిపై పేద ప్రజలు చేస్తున్న ఆందోళనలను, వారి మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించడాన్ని తప్పుబట్టారు. -
హైడ్రా కూల్చివేతలపై కిషన్ రెడ్డి కీలక లేఖ
-
వారి బతుకులు ఏమైపోవాలి?.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని.. ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఏమైపోవాలి?. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా చెబుతుంది. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’’ అని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండి. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణనలో తీసుకోండి. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి. అక్రమంగా భూములు అమ్మిన వారిని బాధ్యులను చేయాలి. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే వాళ్ల బతుకులు ఏమైపోతాయి.’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘పాలకుల, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి దళారులు దోచుకున్నారు. అన్ని అనుమతులున్న భవనాలను నేలమట్టం చేయడం బాధకరం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుంది. మూసీ పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మంది జీవనోపాధి ఇక్కడే ఉంటుంది. దుందుడుకు విధానాలతో ముందుకు వెళ్లవద్దు’’ అని లేఖలో రేవంత్‌కు కిషన్‌రెడ్డి సూచించారు.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!బ్యాంకులకు, బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు రుణ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దు. కూల్చివేతలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్న కిషన్‌రెడ్డి.. ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలితో గందరగోళానికి గురవుతున్నారన్నారు. అధికారులు ఎలాంటి ప్రకటనలు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. మీరు తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని సీఎంకు కిషన్‌రెడ్డి సూచించారు.‘‘ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందని పక్షంలో అవకాశం ఉన్నచోట పేదలు తమ కష్టాన్ని దారబోసి ఇళ్లను నిర్మించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన మోసానికి గురయ్యారు. సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం. ఆక్రమణలపై, ఆక్రమ నిర్మాణాలపై చట్టబద్దంగా, న్యాయబద్దంగా చర్యలు ఉండాలన్నదే మా ఉద్దేశ్యం. హడావుడి చేసి, నిత్యం వార్తల్లో ఉండేందుకే ప్రభుత్వం అక్రమ నిర్మాణాల కూల్చివేత’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి నిలదీశారు. -
సంచలనంగా మార్చొద్దు
సాక్షి, హైదరాబాద్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న అంశాన్ని సంచలనాత్మకంగా మార్చొద్దని రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మాన్ని, హిందూ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసే కుట్రలు గతంలోనూ జరిగిన నేపథ్యంలో వాటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలతో భక్తుల నమ్మకం, విశ్వాసం సడలే ప్రమాదం ఉందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంలో పార్టీలు, ధార్మిక సంస్థలు బాధ్యతతో వ్యవహరించి సంయమనం పాటించాలని ఓ ప్రకటనలో సూచించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిత్యం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు.. వారి మనోభావాలను పరిరక్షించేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డి కోరారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని పేర్కొన్నారు. హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం క్షమార్హం కాదన్నారు.కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన నేరస్తులకు తగిన శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశగా పోలీసు యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తున్నాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి దురాగతానికి బాధ్యులైన వారందరినీ గుర్తించి తగిన శిక్ష పడేలా చేయాలని కోరారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలేవీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు. -
జమిలి ఎన్నికల నిర్వహణకు కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం çపనిచేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. జమిలి ఎన్నికలు నిర్వహించాల ని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామమన్నారు. జమిలి ఎన్నికల విషయంలో కేబినెట్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చకు ప్రోత్సహించడం, జమిలి ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా త్వరలోనే దీనికి సహకరిస్తాయనే విశ్వాసం తనకుందని తెలిపారు.దేశవ్యాప్తంగా ఐదేళ్లపాటు ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నందున.. కోడ్ అమల్లో ఉండటం తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా మారాయన్నారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల కారణంగా.. ధ్వని కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ప్రజ లకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం కారణంగా అవుతున్న ఖర్చు రూ.4,500 కోట్ల పైమాటేనన్నారు. జమి లి ఎన్నికల ద్వారా జాతీయ అంశాలతోపాటుగా, ప్రాంతీయ సమస్యలపైనా సమానస్థాయిలో చర్చ జరుగుతుందని తెలిపారు. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో ఓటర్లలో ఎన్నికల ప్రక్రియ పట్ల నిరాసక్తత పెరిగి.. ఓటరుశాతం తగ్గటం స్పష్టంగా కనబడుతోందన్నారు. దీనికి జమిలి ఎన్నికలు ఓ పరిష్కారాన్ని చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల కారణంగా, దేశంలో ద్రవ్యోల్బణంలో 1.1% తగ్గుతుందని రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ పేర్కొందన్నారు. -
తెలంగాణ చరిత్రను మరుగుపరిచారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్వాతంత్య్ర దినాన్ని మరుగునపరిచి.. ఈనాటి తరానికి తెలియకుండా పాలకులు తొక్కిపెట్టారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన 13 నెలల తర్వాత తెలంగాణలో మువ్వన్నెల జెండా ఎగిరిందన్న విషయం తెలియకుండా చేశారంటూ ధ్వజమెత్తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన 1948 సెపె్టంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్నా, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వమే అధికారిక వేడుకలు జరుపుతుందని చెప్పారు.నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం దేశంలోనేకాక ప్రపంచ పోరాటాల్లోనే మహోన్నతమని, అపురూప ఘట్టమన్నారు. భారత సైన్యం ముందు 17 సెపె్టంబర్ 1948లో నిజాం రాజు, సైన్యం, రజాకార్లు లొంగిపోయారన్నారు. ఇంతటి గొప్ప పోరాటచరిత్ర నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం సెపె్టంబర్ 17న ‘విమోచన’దినోత్సవం అధికారికంగా నిర్వహించలేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మజ్లిస్‌కు సలాం కొడుతూ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని చెప్పారు.తెలంగాణ ఉద్యమం సమయంలో ‘విమోచన దినోత్సవం’అధికారికంగా నిర్వహించాలని ఆనాటి పాలకులను నిలదీసిన కేసీఆర్ సీఎం అయ్యాక స్వరం మార్చారన్నారు. విమోచన దినంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వక్రభాష్యాలు చెప్పి మోసం చేశాయని తెలిపారు.17 సెపె్టంబర్ను బీఆర్ఎస్ ‘జాతీయ సమైక్య దినం’అనడం, కాంగ్రెస్ ‘ప్రజాపాలన దినోత్సవం’అనడం ముమ్మాటికీ ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టడమేనని చెప్పారు. రజాకార్ల వారసుల కోసమే: బండి సంజయ్ పిడికెడు రజాకార్ల వారసుల కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేశ విచి్ఛన్నకర శక్తులతో అధికార పారీ్టలు అంటకాగే పరిస్థితి తెలంగాణలో ఉండడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రజాకార్లపై పోరాడిన చరిత్ర ఉందని, అదే రజాకార్ల వారసులను సంతృప్తిపరిచే చర్యలను ప్రభుత్వాలు విడనాడాలని కోరారు.వచ్చే ఏడాది నుంచైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర భద్రతా బలగాలు నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే ప్రదర్శనలు సాగాయి. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించారు. రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డిని కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి, సీఐఎస్ఎఫ్ డీజీ ఆర్ఎస్. భాటియా పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో.... బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దిన వేడుకల్లో భాగంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేసి, అమరవీరులకు నివాళు లర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ...‘ప్రస్తుత సెప్టెంబర్ 17 చాలా ప్రత్యేకమైనది. విశ్వకర్మ జయంతి, వినాయక నిమజ్జన మహోత్సవం, ప్రధాని మోదీ జన్మదినం. అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శానంపూడి సైదిరెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఆగస్టు 15 ఎంత ముఖ్యమో సెప్టెంబర్ 17 కూడా అంతే: కిషన్‌రెడ్డి
పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు..తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ సందర్బంగా పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది హైదరాబాద్ ముక్తి దివాస్ నిర్వహిస్తాం. తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నిజాం చెరిపేసే ప్రయత్నం చేశారు. ఉద్దేశపూర్వకంగా చరిత్రను తొక్కి పెట్టారు. స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు దాచడం దుర్మార్గం. ప్రధాని ఆదేశాలతో 2022 నుంచి వేడుకలు చేస్తున్నాం. భవిష్యత్‌లో కూడా ఇదే వేదికగా తెలంగాణ లిబరేషన్ డే నిర్వహిస్తాం.పనిముట్లనే ఆయుధాలుగా చేసుకొని ప్రజలు నిజాంపై పోరాటం చేశారు. రజాకార్ల ఆగడలతో ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవించారు. నిజాం హయాంలో బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారు. హిందూ మహిళలను బలవంతంగా ఎత్తుకెళ్లి అఘాయిత్యాలు చేశారు. పాకిస్తాన్లో హైదరాబాద్ సంస్థానాన్ని కలపాలని నిజాం భావించాడు. పాకిస్తాన్‌తో చర్చలు కూడా జరిపారు. సర్దార్ పటేల్ నిజాంతో ముందుగా శాంతి చర్చలు జరిపారు. తమ సంస్థానం జోలికి వస్తే హైదరాబాద్‌లో ఉన్న కోటిన్నర హిందువులను చంపేస్తామని ఖాసిం రజ్వీ బెదిరించారు. అందుకే ఆపరేషన్ పోలోతో హైదరాబాదు సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. ఈ గడ్డకు స్వాతంత్ర్యం వచ్చిన రోజును జరపకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక విమోచన వేడుకలపై మాట మార్చారు. విమోచన దినోత్సవం జరపకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తున్నాయి. మేము నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మనకు వాస్తవ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది. చరిత్ర గాడి తప్పితే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడతాయి. పథకం ప్రకారం చరిత్రను పక్కదారి పట్టిస్తున్నారు. ఆగస్ట్ 15 ఎంత ముఖ్యమో.. సెప్టెంబర్ 15 కూడా అంతే ముఖ్యం. చరిత్రను పట్టించుకోని పార్టీలను తరిమికొడదాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. 👉పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన కిషన్ రెడ్డి.👉తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి👉పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కిషన్ రెడ్డి. 👉నేడు తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా విమోచన దినోత్సవ వేడుకలను స్థానిక బీజేపీ నేతలు నిర్వహించనున్నారు.👉బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేసిన కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు. వేలాది మంది తెలంగాణ ప్రజలు విరోచిత పోరాటం చేశారు. అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం రాజాకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో పటేల్ పాత్ర సాహసోపేతమైనది.లిబరేషన్ డే ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, వినాయక శోభాయాత్ర ఉత్సవాలు, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు.. నేడు నాలుగు ప్రధాన ఘట్టాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత మూడేళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తుందికాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలి.👉ఇక, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, పారా మిలటరీ, రక్షణ దళాల కవాతు జరుగుతుంది. 𝗛𝗼𝗻𝗼𝗿𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝘂𝗻𝘀𝘂𝗻𝗴 𝗵𝗲𝗿𝗼𝗲𝘀 𝘄𝗵𝗼 𝗳𝗼𝘂𝗴𝗵𝘁 𝗳𝗼𝗿 𝘁𝗵𝗲 𝗹𝗶𝗯𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱!Join the #HyderabadLiberationDay celebrations tomorrow, 17th September 2024, at Parade Grounds, Secunderabad, from 8:00 AM onwards. pic.twitter.com/9IjbadoyrS— G Kishan Reddy (@kishanreddybjp) September 16, 2024ఇది కూడా చదవండి: తెలంగాణ తల్లికి నేడు పాలాభిషేకాలు: కేటీఆర్ -
నేడు కేంద్రం ఆధ్వర్యంలో ‘విమోచనం’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. ఉదయం 7.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కళాకారుల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ద్వారా ‘సెప్టెంబర్ 17–హైదరాబాద్ విమోచన దినం’ప్రాధాన్యత వివరించేలా సంక్షిప్త ప్రదర్శన ఉంటుంది. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు పోలీసు బలగాలు, సైనికదళాల పరేడ్ ఉంటుంది. 9 గంటలకు కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, గజేంద్రసింగ్ చౌహాన్, బండి సంజయ్ పరేడ్ గ్రౌండ్స్‌లోని యుద్ధస్మారకం వద్ద నివాళులరి్పస్తారు. ఉదయం 9.15 గంటలకు జి.కిషన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేస్తారు.కేంద్ర మంత్రులు సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. 9.20 గంటలకు కేంద్ర సాయుధ బలగాల నుంచి కిషన్‌రెడ్డి గౌరవవందనం స్వీకరిస్తారు. అనంతరం 700 మందికిపైగా కళాకారులు మంగళవాద్యం, బతుకమ్మ, కొమ్ముకోయ, బోనాలు–పోతరాజు, డప్పులు, కోలాటం, లంబాడీ, గుస్సాడి, ఒగ్గు కథ తదితరాలను ప్రదర్శిస్తారు. చివరగా ‘హైద రాబాద్ విమోచన దినం శకటం ప్రదర్శన ఉంటుంది. 10.10 గంటలకు కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి స్వాగతోపన్యాసం చేస్తారు. తర్వాత బండి సంజయ్ ప్రసంగిస్తారు. రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ఆరుగురిని సన్మానిస్తారు. 10.30 గంటలకు కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి బిషన్‌ను కేంద్రమంత్రులు తిలకిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. -
‘చరిత్రను తుడిచివేసే ప్రయత్నం’లో భాగస్వామిని కాలేను
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రను తుడిచివేసే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వామిని కాలేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం ప్రజల దృష్టిని మరల్చడమేనని అన్నారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ‘సెప్టెంబర్ 17న ప్రతిపాదిత ప్రజాపాలనా దినోత్సవం కోసం ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు. అయితే ఇంతటి పవిత్రమైన, స్ఫూర్తిదాయకమైన రోజును, వేలాదిమంది త్యాగాల ఫలితమైన విమోచన దినోత్సవానికి పేరుమార్చి.. చరిత్రలో ఏమీ జరగలేదన్నట్టుగా, పరిపాలన నియంత రాజు నుంచి ప్రజాస్వామ్యానికి మారడం మాత్రమే జరిగిందన్నట్టుగా చెప్పడం వాస్తవ చరిత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడమేనని అర్థమవుతోంది.దీంతోపాటుగా బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించినట్టవుతోంది. రజాకార్ల హింసకు వేలమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా మీకు తెలుసు. వీరుల వీరోచిత పోరాటం, నిస్వార్థ త్యాగం, హృదయ విదారక పరిస్థితులను ఎదుర్కొనడం, బలిదానం కావడం ఇదే మన తెలంగాణ చరిత్ర. అందుకే సెప్టెంబర్ 17 నాడు.. ఆ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రస్తుత తరానికి మన పెద్దల ధైర్య, సాహసాలను తెలియజేసి జాతీయభావన కల్పించాల్సిన అవసరం ఉంది. విమోచన చరిత్రను వారికి అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది.అయితే గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ వీరుల త్యాగాలను స్మరించుకునేలా, వారికి ఘనంగా నివాళులు అర్పించేలా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘనంగా, అధికారికంగా నిర్వహిస్తోంది. అందుకే వాస్తవ, ఘనమైన తెలంగాణ చరిత్రను ప్రజల çస్మృతిపథం నుంచి తుడిచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో నేను భాగస్వామిని కాలేను.సెప్టెంబర్ 17వ తేదీ.. అత్యంత ప్రాధాన్యం కలిగిన రోజుగా మీరు గుర్తించి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవడం సంతోషకరం. సమీప భవిష్యత్‌లో వాస్తవాలను అర్థం చేసుకొని ఈ చరిత్రాత్మకమైన రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా గుర్తిస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నాను’ అని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
70 ఏళ్లు దాటిన వారికి పీఎంజేఏవైతో మేలు
సాక్షి, న్యూఢిల్లీ: వయోవృద్ధుల ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం 70 ఏళ్లు దాటిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం (పీఎంజేఏవై) పరిధిలో తెలంగాణలోని దాదాపు 30 లక్షల కుటుంబాలు ఉండగా.. ఇందులో సుమారు 1.15 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారని చెప్పారు. అంతేగాక ఈ ఏడాది జూలై వరకున్న లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో జరిగిన 17.2 లక్షల చికిత్సలకు రూ.3,626 కోట్ల విలువైన వైద్యసేవలను లబ్ధిదారులు పొందారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో వివరించారు. పీఎంజేఏవై పథకాన్ని అప్‌గ్రేడ్ చేసి 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులందరికీ రూ.5 లక్షల వరకు వైద్య బీమా అందించేందుకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం.. దేశ సమగ్రాభివృద్ధిలో వయోవృద్ధుల సంక్షేమానికి సరైన ప్రాధాన్యం కలి్పంచే దిశగా తీసుకున్న చర్య అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో అదనంగా 10 లక్షల మంది 70 ఏళ్లు దాటిన వృద్ధు లు లబ్ధి పొందనున్నారని ఆయన తెలిపారు. అయితే.. ఇన్నా ళ్లుగా పీఎంజేఏవై పథకం దారి్రద్యరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే వర్తిస్తోందని, ఈ నేపథ్యంలో పథకానికి పలు మార్పులు చేసి.. పేద, ధనిక అనే తేడాల్లేకుండా 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులందరికీ వర్తింపజేయాలని భావించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు ప్రత్యేక గుర్తింపు కార్డు పీఎంజేఏవైకి అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డును అందిస్తారని, ఇందుకోసం వచ్చే రెండేళ్లలో రూ.3,437 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చుచేయనుందని కిషన్‌రెడ్డి తెలిపారు. సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసినందుకు ఆయన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.సెప్టెంబర్ 16న వందేభారత్ షురూప్రారంభించనున్న ప్రధాని.. తెలుగు రాష్ట్రాలకు 2 రైళ్లు కేటాయించడంపై మోదీకి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వినాయక నవరాత్రుల కానుక అందించనున్నారు. నాగ్‌పూర్ –సికింద్రాబాద్, విశాఖపట్నం–దుర్గ్‌ల మధ్య రెండు వందేభారత్ రైళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే నాలుగు వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సేవలందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును ప్రధానమంత్రి కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య పరుగులు పెట్టనుంది. విశాఖపట్నం– దుర్గ్ (ఛత్తీస్‌గఢ్) మధ్య కూడా మరో వందేభారత్ రైలు సేవలందించనుండగా, ఈ రెండు రైళ్లను ఈ నెల 16న ప్రధానమంత్రి అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 10 కొత్త వందేభారత్ రైళ్లను వచ్చే సోమవారం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే రైలు సికింద్రాబాద్ చేరుకునే సందర్భంలో స్వాగతం పలకాలంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆహా్వన పత్రం పంపించారు. వందేభారత్ రైళ్లు కేటాయించిన ప్రధానికి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే వ్యవస్థ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లు అనేక రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైలులో ఛార్జీలు కొంచెం ఎక్కువైనా సరే, అత్యాధునిక టెక్నాలజీతోపాటు అనేక సౌకర్యాలు ఉండటంతో ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని రూట్లలో మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్, చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జంక్షన్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.చదవండి: తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు -
సికింద్రాబాద్, చర్లపల్లి వద్ద రోడ్ల విస్తరణకు సహకరించండి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టరి్మనల్కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు సోమవారం లేఖ రాశారు. తెలంగాణలో మౌలికవసతుల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి పదేళ్లుగా ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి శరవేగంగా సాగుతోందని.. కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్తోపాటు లైన్ల విద్యుదీకరణ పనులు, 40కిపైగా స్టేషన్ల అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.ఇందులో భాగంగా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లిలో రూ. 415 కోట్లతో కొత్త రైల్వే టరి్మనల్ నిర్మాణం కూడా వేగంగా పూర్తవుతోందన్నారు. చర్లపల్లి రైల్వే టరి్మనల్ ప్రారంభోత్సవానికి ప్రత్యక్షంగా హాజరై ప్రజలకు అంకితం చేసేందుకు ప్రధాని మోదీ అంగీకరించారని కిషన్‌రెడ్డి తెలియజేశారు. 100 అడుగుల దాకా రోడ్లు..: ‘చర్లపల్లి రైల్వే టరి్మనల్కు చేరుకోవడానికి ఎఫ్‌సీఐ గోడౌన్ వైపు నుంచి ప్రయాణికుల రాకపోకల కోసం 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరముంది. దీనిపై మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నా’అని సీఎం రేవంత్‌ను కిషన్‌రెడ్డి కోరారు. సికింద్రాబాద్ స్టేషన్ మార్గంలోనూ..: దక్షిణ మధ్య రైల్వే కేంద్ర స్థానమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ. 715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికల్లా అత్యాధునిక వసతులతో ప్రజలకు ఈ స్టేషన్‌ను అంకితం చేసేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని వివరించారు. అయితే రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులు వచి్చ, వెళ్లే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయన్నారు. రేతిఫైల్ బస్ స్టేషన్, ఆల్ఫా హోటల్ మధ్యనున్న రోడ్డు ఇరుకుగా ఉండటంతో రద్దీ వేళల్లో ప్రయాణికులకు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గే వీలు ఉంటుందని.. ఈ విషయంలోనూ చొరవ తీసుకోవాలని సీఎంను కిషన్‌రెడ్డి కోరారు. -
నష్టం అంచనా.. 11న తెలంగాణకు కేంద్ర బృందం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాజాగా కేంద్ర బృందం సభ్యులతో కిషన్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, కేంద్ర బృందానికి హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేపీ సింగ్ నేతృత్వం వహించనున్నారు.ఇక, ఈనెల 11న(బుధవారం) రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరు పర్యటించి నష్టం అంచనా వేయనున్నారు. అలాగే, బాధితులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు.అయితే, ఆరుగురు సభ్యులతో కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా.. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. -
రాకాసి తండాకు అండగా ఉంటాం: కిషన్‌రెడ్డి
తిరుమలాయపాలెం: ఆకేరు వరద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సర్వం కోల్పోవడంతో ఇక్కడ ఉండలేమంటున్న ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరో ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాడైన భూములు మళ్లీ సాగులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆకేరు వరదతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో జరిగిన నష్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి వచ్చిందని తెలిపారు. స్వయంగా తండాను చూసి రావాల్సిందిగా ప్రధాని తనకు చెప్పారని వెల్లడించారు. ఆదివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వ ర్‌రెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి రాకాసి తండాను సందర్శించారు. ముంపునకు గురైన పంటపొలాలు, కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు. తండా వాసులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు. అక్వెడక్ట్‌తోనే గ్రామం నాశనం! ఆకేరుపై నిర్మించిన సీతారామ ప్రాజెక్టు అక్వెడక్ట్‌తోనే తమ గ్రామం సర్వనాశనమైందని, పచ్చని పంటపొలాల్లో రాళ్లు, ఇసుక మేటలు వేశాయని స్థానికులు తెలిపారు. ఇక్కడ తాము ఉండే పరిస్థితి లేనందున మరోచోట స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఆదుకోవాలని వేడుకున్నారు. ఇళ్లు, ఆస్తులు కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన తమకు దిక్కెవరంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సమకూర్చిన గ్యాస్ స్టౌలు, రగ్గులను కిషన్‌రెడ్డి వారికి అందజేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలి: మంత్రి పొంగులేటి రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాలు జలమయమైనందున జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. రాకాసి తండాలో జరిగిన నష్టాన్ని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. కేంద్రమంత్రులు ముంపు ప్రాంతాల్లో పర్యటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాల్సిందిగా ఇప్పటికే కిషన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం నివేదిక పంపలేదు: కిషన్‌రెడ్డి ఖమ్మం వన్‌టౌన్: వరదలతో వాటిల్లిన నష్టంపై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నివేదిక పంపలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. 16వ డివిజన్ ధంసలాపురంలో వరద బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమయంలో ఓ జర్నలిస్టు ఏపీ ప్రభుత్వం నివేదిక పంపిందా అని అడగ్గా.. పంపలేదని జవాబిచ్చారు. గతంలో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ నిధులనే ప్రస్తుతం వాడుకుంటోందని చెప్పారు. -
ఖమ్మం పర్యటనలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
రాహుల్.. జైనూర్, కోల్‌కతా ఘటన కనిపించడం లేదా?: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు గురించి మాట్లాడాలని హితవు పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ జైనూరులో ఆదివాసి మహిళపై జరిగిన అఘాయిత్యం కనిపించలేదా?.. ఇదేనా మార్పు అని ప్రశ్నించారు.మహిళల భద్రత విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కిషన్‌రెడ్డి కౌంటరిచ్చారు. తాజాగా కిషన్ రెడ్డి..‘మహిళల భద్రతపై మొసలి కన్నీరు కాదు. కళ్లు తెరిచి చూడు రాహుల్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోజుకో అఘాయిత్యం, వేధింపుల పర్వం కొనసాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల భద్రతపై మాట్లాడటం హాస్యాస్పదం. మహిళల భద్రతపై కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వివక్ష తగదు. భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికారమెందుకు?.బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన గుర్తుకు రాగానే.. నిద్రలోంచి లేచి మహిళలపై అఘాయిత్యాలు దారుణం అని ప్రకటనలు గుప్పించే రాహుల్‌కు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై జరిగిన అమానవీయ ఘటన గుర్తుకు రాలేదా?. మైనారిటీ సంతుష్టికరణ విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, రాహుల్‌కు ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు?. అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ మైనార్టీ కావడంతోనే రాహుల్, కాంగ్రెస్ ఈ ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఘటన జరిగినా, తక్షణమే విచారణ జరిపి, నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, వారిలాగా మహిళలపై దాడులు నివారించడంలో వివక్ష చూపించడం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన, జైనూర్‌లో జరిగిన ఘటనను ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు . ఇప్పటికైనా రాహుల్ గాంధీ మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని మహిళలపై జరుగుతున్న దాడులు ఘటనల పట్ల వివక్ష చూపరాదని అన్నారుతెలంగాణలో గత మూడు నెలల్లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు..1) 13-జూన్-24 - పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.2) 22-జూన్-24 - నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక గిరిజన మహిళను వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, ఆమెను కాల్చి, కొట్టి, ఆమె కళ్లకు, ప్రైవేట్ భాగాలలో కారం పొడి చల్లారు.3) 21-జూలై-24 - నాగర్‌కర్నూల్ జిల్లా హాజీపూర్‌లో ఇద్దరు మహిళా కూలీలపై షాపు యజమానులు కారులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.4) 24-జూలై-24 - మలక్‌పేట అంధుల పాఠశాలలో 8 ఏళ్ల చూపులేని బాలికపై దాడి జరిగింది.5) 30-జూలై-24 - నిర్మల్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ ప్రయాణీకురాలు కదులుతున్న బస్సులో అత్యాచారానికి గురైంది.6) 30-జూలై-24 - వనస్థలిపురంలో 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.7) 4-ఆగస్టు-24 - దొంగతనం ఆరోపణతో దళిత మహిళ సునీతను షాద్‌నగర్ పోలీసులు దారుణంగా హింసించారు.8) 22-ఆగస్టు-24 - నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ మద్దతుదారులు దాడి చేశారు. -
హైడ్రా పేరుతో హైడ్రామా.. కూల్చివేతలపై కిషన్ రెడ్డి మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తోందని మండిపడ్డారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారని, అక్రమ నిర్మాణాలకు రోడ్డు, విద్యుత్ సదుపాయము, నీటి సదుపాయం ఎలా కల్పించారని ప్రశ్నించారు.ఈ మేరకు ఢిల్లీలో కిషన్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలకు రోడ్లను నిర్మించి సదుపాయాలు ఎలా కల్పించారని ప్రశ్నించారు. ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందేనని అన్నారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింప చేయాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదని హితవు పలికారు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘మంత్రరాశుల వెనుక 'శ్రీనివాస్'కి దైవబలం పుష్కలం’
హైదరాబాద్: అఖండ కాల స్వరూపాలైన మంత్రరాశుల్ని ఒక మహాసాధనగా అపురూప అఖండ గ్రంథాలుగా అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దైవీయ చైతన్య లక్ష్యం వెనుక ఉన్న అసాధారణ నిస్వార్ధ సేవ , అందమైన భాష, భక్తి తన్మయత్వం మామూలు విషయాలు కావని భారతదేశ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి . కిషన్ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి కె.గీతామూర్తి సమర్పణలో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా వినూత్న రీతిలో రూపుదిద్దుకున్న 'శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్' సుమారు మూడువందల యాభైపేజీల దివ్య గ్రంధాన్ని ఆయన ఆవిష్కరించి తొలిప్రతిని కేంద్ర హోమ్ శాఖామంత్రి బండి సంజయ్ కి అందించారు.ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖామంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ బలమైన సంకల్పాలతో పవిత్ర మార్గంలో ప్రయాణిస్తున్న పురాణపండ శ్రీనివాస్ అచ్చమైన భక్తి తత్వానికి దైవబలం మహాబలంగా మహా మంగళ కార్యాలు చేయిస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి కె.గీతామూర్తి మాట్లాడుతూ శ్రావణ పుణ్య మాసంలో ఈ పవిత్ర శ్రీ కార్యాన్ని తాను భుజాలకెత్తుకోవడానికి తన తల్లితండ్రుల పుణ్యం, చిన్న నాటి నుండీ సంస్కారప్రదమైన వాతావరణంలో జీవనం సాగుదామని పేర్కొంటూ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని స్పష్టం చేశారు.అనంతరం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సైత పాల్గొన్న అనేక మంది మహిళా శ్రేణులకు ఈ ' శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ ' గ్రంధాన్ని శ్రీమతి గీతామూర్తి స్వయం పంచడం విశేషంగా ఆకర్షించింది. సుమారు రెండు నెలలుగా తొమ్మిది పుణ్య క్షేత్రాలలో, ఏడు సాంస్కృతిక సభలలో, రెండు కళాశాలల్లో సుమారు ఇరవై ప్రచురణకు నోచుకున్న ఈ మంగళ గ్రంధం త్వరలో ఇరవై ఐదవ ప్రచురణకు సన్నాహమవుతుండటం ఈ రోజుల్లో కేవలం దైవానుగ్రహమేనని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు నల్లంధీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు మంగళాశాసనమ్ చెయ్యడం దైవబలంగానే పేర్కొనక తప్పదు. .ఇదిలా ఉండగా ... గత వారం రోజుల నుండీ శ్రీమతి గీతామూర్తి జంట నగరాల్లో ఏ ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొన్నా ఈ చక్కని బుక్స్ ని తానే స్వయంగా నాయకురాళ్లకు , కార్యకర్తలకు పవిత్రంగా అందించడం విశేషం. మరొక వైపు తూర్పు గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు లకు ప్రముఖ ధార్మిక గ్రంధాల ప్రచురణ సంస్థ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ అధినేత గొల్లపూడి నాగేంద్ర కుమార్ ఈ 'శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్' గ్రంధాన్ని బహూకరించారించడమే కాకుండా.. రాజమహేంద్రవరం నగరంలోని అనేక ఆలయాలకు సైతం నాగేంద్రకుమార్ దంపతులు వీటిని ఉచితంగా పంచడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమల మహాక్షేత్రం ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు నుంచీ యాదాద్రి వరకూ శ్రీనివాస్ నిస్వార్ధ సేవకు, రచనా సౌందర్యానికి పండిత వర్గాల నుంచి అనుగ్రహం వర్షిస్తూనే ఉండటం గమనార్హం. -
తెలంగాణ ఇంఛార్జిపై రచ్చ.. కిషన్ రెడ్డి క్లారిటీ
-
ఇంఛార్జి హోదాలో అభయ్ పాటిల్..కన్ఫ్యూజన్లో తెలంగాణ బీజేపీ శ్రేణులు
హైదరాబాద్,సాక్షి : తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్‌ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. కానీ నేతలు మాత్రం ఇంఛార్జి నియామకం జరగలేదని అంటున్నారు. దీంతో తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి ఎవరనే అంశం చర్చకు దారి తీసింది. హైదరాబాద్ వేదికగా తెలంగాణ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి హోదాలో అభయ్ పాటిల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చారు. అభయ్ పాటిల్ నియామకం జరగలేదని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.దీంతో రాష్ట్ర ఇంఛార్జిగా హోదాలో పార్టీ పంపితేనే తాను సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చానని సభా వేదికపై అభయ్ పాటిల్ తెలిపారు. పార్టీ ఎక్కడికి పంపినా తాను వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని..సొంతంగా తాను ఇక్కడికి రాలేదని అభయ్ పాటిల్ స్పష్టం చేశారు.మరోవైపు తెలంగాణ బీజేపీ అధికారిక వెబ్సైట్లో తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా అభయ్ పాటిల్ ఫోటోతో పేరు సైతం ఉండడంతో కమలం శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. స్పష్టత ఇచ్చిన కిషన్ రెడ్డిగత వారం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా తరుణ్ ఛుగ్ స్థానంలో కర్ణాటక బీజేపీ నేత అభయ్ పాటిల్‌ను అధిష్టానం నియమించిందని వార్తలు వచ్చాయి. దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా అభయ్ పాటిను నియమించినట్లుగా వార్తలు వస్తున్నాయని, కానీ కేంద్ర అధిష్టానం ఎవరిని నియమించలేదని స్పష్టం చేశారు. -
ఒక్కొక్కరు 100 మందిని చేర్చాలి 50 లక్షల సభ్యత్వాలు టార్గెట్...
-
జెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి
-
ఇళ్లులేని పేదలకు పీఎంఏవై ఫలాలు అందాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌కి లేఖ రాశారు. సొంతిల్లు అవసరమున్న ప్రజలు లక్షలాదిమంది ఉన్నా.. 2018లో కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించిన సర్వేలో గత ప్రభుత్వం భాగం కాలేదని, జాబితా కూడా పంపలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో పేద ప్రజలకు ఆశ చూపించి మభ్యపెట్టిందని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వ సహకారం తెలంగాణ ప్రజలకు అందకుండా అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తాను చేపట్టిన పర్యటనల్లో చాలా మంది ప్రజలు సొంతింటి నిర్మాణం కోసం అభ్యరి్థంచారని తెలిపారు. ఇదే విషయాన్ని ఈనెల 9న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే ఇళ్లను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారని కిషన్‌రెడ్డి వివరించారు.ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొనాలని కోరారు. గ్రామీణ తెలంగాణలో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను వీలయినంత త్వరగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ఆ మేరకు సంపూర్ణ సహకారం అందిస్తారని కోరుకుంటున్నట్లు రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యారంగంపై వాళ్లది నేరమయ నిర్లక్ష్యం కాంగ్రెస్, బీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగంపై కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు నేరమయ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి,, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) లో... రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల పనితీరు బయటపడిందని వివరించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉస్మానియాకు 70వ ర్యాంకా? ‘ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఓవరాల్ విభాగంలో.. ఉ స్మానియా వర్సిటీ 70వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. కొన్నేళ్లుగా ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవడం అ టుంచితే, ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవడంలోనూ విఫలమై మన యూనివర్సిటీలు దిగజారుతున్నా యి. కళాశాల విభాగంలో టాప్ 100లో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీకీ స్థానం దక్కలేదు.’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితైతే మరింత అధ్వానంగా ఉంది. ఐటీ క్యాపిటల్‌గా చెప్పుకునే తెలంగాణలో పాఠశాలల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేదు.. 24వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టారంటే పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై వీరికున్న ప్రేమేంటో అర్థమవుతోంది’’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
సుంకిశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి
సాక్షి, న్యూఢిల్లీ: సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలడంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వాల్ ధ్వంసం కావడానికి కారణమేంటో తెలియాల న్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ పిలుపు మేరకు శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో తన తల్లిపేరుతో మొక్కను నాటారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అమ్మ గౌరవానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కను నాటాలని ప్రముఖులకు, సెలబ్రి టీలకు, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ విలీనంపై చర్చలు జరగలేదుబీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై అటు కేంద్ర ఇటు రాష్ట్ర స్థాయిలోనూ చర్చలు జరగలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం వార్తలను మీడియాలోనే చూశానన్నారు.దానిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదుఎస్సీ, ఎస్టీల క్రీమీలేయర్‌పై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై ఆలోచించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, ఆదేశాలు ఇవ్వ లేదని గుర్తుచేశారు. ఈ విషయంలో ఇప్పుడు కొన సాగుతున్న పద్ధతే కొనసాగుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లపై సమాచారం ఇవ్వలేదుతెలంగాణలోని గత ప్రభుత్వం కేంద్రం ఇళ్లు ఇచ్చి నా తీసుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పాటై 8 నెలలు గడుస్తున్నా సమాచారం ఇవ్వలే దని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలే రాలేదని అధికారుల ద్వారా తనకు తెలిసిందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల తర్వాత ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం–మల్కా న్గిరి నూతన రైల్వేలైన్‌కు ఆమోదం తెలపడం పట్ల ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.సుంకిశాల ఘటనపై న్యాయవిచారణ జరపాలిబీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్సాక్షి, హైదరాబాద్: సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరిగినా గోప్యంగా ఉంచిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల న్నారు. ఈ ప్రమాదం ఈ నెల 2న జరిగినపుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నా దానిని ప్ర భుత్వం అప్పుడే ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఈ ఘటన జరిగినట్లు ప్రభుత్వా నికి సమాచారం ఉందా లేదా అని నిలదీశారు. -
"ఏక్ పేడ్ మా కే నామ్" తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి పిలుపు
-
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలే తప్ప, ఎన్ని కల తర్వాత అందరూ కలిసి రాష్ట్రాభివృద్ధికే పనిచే యాలని ఆయన సూచించారు. గురువారం సాయ ంత్రం ఢిల్లీలో సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవి చంద్ర, పార్థసారథి, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్‌లో టూరిజం, ఐటీ, ఎంటర్టైన్మెంట్ రంగాల అభివృద్ధిపై ఫోకస్ చేస్తు న్నామని, వీలైనంత త్వర గా వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపడతామని తెలిపారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వయబుల్ కాదని 3 కమిటీలు సిఫారసు చేశాయని.. ఫీజబుల్ కాదని చెప్పిన తర్వాత ప్రజల డబ్బు వృథా చేయకూడదని వ్యాఖ్యానించారు. నష్టం వస్తుందని తెలిసి ఎవరూ పరిశ్రమ పెట్టరని.. బయ్యారం ఫీజబుల్ అయితే తానే కేంద్రం నుంచి స్వయంగా నిధులు తీసుకొచ్చేవాడినని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడుస్తాం: మల్లు రవికాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, రాష్ట్ర అభి వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడుస్తా మనీ, కేంద్రంతో ఘర్షణ వాతావరణం లేకుండా పనిచేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మహబూబ్ నగర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై ఒక బుక్ తయారు చేయించామని, అది బీజేపీ ఎంపీలకు ఇస్తామని మల్లురవి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లా డుతూ, పెద్దపల్లిలో సీఐఐ కార్యాలయం ప్రారంభిస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, భద్రాచలం సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.50 కోట్లు సరిపోవని, ఈ మొత్తాన్ని ఇంకా పెంచాలని విజ్ఞప్తి చేశారు. -
కమలానికి కొత్త సారథి.. ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకపు అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర పార్టీలో సమన్వయ లేమి సమస్య, ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం, కేడర్‌లో నిరాసక్తత, నిస్తేజం పెరుగుతున్న నేపథ్యంలో... కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ఇంకా ఎప్పుడు నియమిస్తుందా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవితో పాటు, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన రాష్ట్ర పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించ లేకపోతున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. కిషన్‌రెడ్డి కూడా వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తప్పించాలని అధిష్టానానికి ఇప్పటికే విన్నవించినట్టు సమాచారం. దీంతో పాటు మరో మూడు నాలుగు నెలల్లో స్థానికసంస్థల ఎన్నికలు జరగొచ్చుననే రాజకీయవర్గాల అంచనాల నేపథ్యంలో గ్రామ, మండల ,జిల్లా స్థాయిల్లో పార్టీ పటిష్టతతో పాటు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచుకోవడమనేది బీజేపీకి తక్షణ అవసరంగా మారింది.స్థానిక ఎన్నికల్లో... జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అంతగా కేడర్, స్థానిక నాయకుల బలం లేని బీజేపీ.. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఎదుర్కొని గణనీయమైన సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎలా గెలిపించుకోగలుగుతుందనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నేతను కొత్త అధ్యక్షుడిని నియమిస్తే...ఎన్నికల్లోగా సంస్థాగతంగా పార్టీ బలం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.ఈటల వైపే మొగ్గు...?బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం..పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గట్టిగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, టి.రాజాసింగ్, ముఖ్యనేతలు ఎన్.రామచంద్రరావు, చింతల రామచంద్రా రెడ్డి, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు పోటీపడుతున్నారు.బీజేఎల్పీ నేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచ్చినందున, రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందినవారినే అధిష్టానం నియమిస్తుందని పార్టీలో పలువురు నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ వాదన రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన ఈటల రాజేందర్‌కు అడ్వాంటేజ్‌గా మారొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల వైపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ బన్సల్ వంటి వారు మొగ్గుచూపుతున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బీసీ వర్గాల నుంచే ఎంపికచేస్తే ఈటలతో పాటు అర్వింద్ ధర్మపురి, పాయల్‌శంకర్, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు పేర్లను సైతం పరిశీలిస్తారని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితమే పార్టీలో చేరిన ఈటలకు అధ్యక్ష పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచాక కొత్త, పాత అంటూ ఉండదని, రాష్ట్రంలో పార్టీ గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా విస్తరించి, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇది అడ్డంకి కాకూదని వాదిస్తున్న వారూ పార్టీలో ఉన్నారు.అలాగైతే రామచంద్రరావుకే.. సైద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యతని స్తే... మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని పార్టీ వర్గాలంటున్నాయి. కొత్త వారికి అధ్యక్ష పదవి వద్దన్న కొందరి అభ్యంతరాల నేపథ్యంలో సంఘ్ పరివార్ కూడా మద్దతిస్తే రామచంద్రరావుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని పార్టీ నాయకులు కోరుతున్నారు. మొత్తంగా చూస్తే పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. -
5 స్టార్ రేటింగ్ కంపెనీగా ‘భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్’
సాక్షి, న్యూఢిల్లీ: కడపలోని ‘భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్’కు ఆరోసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ రేటింగ్ లభించింది. పర్యావరణ పరిరక్షణ, విద్య, వైద్యం, పరిశుభ్రత, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో స్థానికంగా చేసిన కృషికి భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. గనుల రంగంలో సుస్థిరాభివృద్ధి విధానాలు అమలుచేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న 68 మైనింగ్ సంస్థలకు కేంద్రం 2022–23 సంవత్సరానికి ఈ అవార్డులు అందజేసింది.ఆంధ్రప్రదేశ్ నుంచి 5, తెలంగాణ నుంచి 5 సంస్థలు ఈ అవార్డులు అందుకున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది 7 ఉత్తమ సంస్థలకు 7 స్టార్ రేటింగ్స్ కూడా ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబే, గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, అదనపు కార్యదర్శి లోహియా, ఐబీఎం సెక్రటరీ జనరల్ పీఎన్ శర్మ, అవార్డులు సాధించిన సంస్థల ప్రతినిధులు, మైనింగ్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ నుంచి అవార్డు అందుకున్న సంస్థలుభారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్ – కడపజేఎస్డబ్ల్యూ సిమెంట్స్ లైమ్ స్టోన్ – నంద్యాలదాల్మియా సిమెంట్స్ నవాబ్‌పేట – తలమంచిపట్నంఅల్ట్రాటెక్ – తుమ్మలపెంటశ్రీ జయజ్యోతి (మైహోం) సిమెంట్స్ – కర్నూలుతెలంగాణ నుంచి అవార్డు అందుకున్న కంపెనీలుమైహోం – చౌటుపల్లి–1,టీఎస్ఎండీసీ– దేవాపూర్ (మంచిర్యాల), మైహోం – మెల్ల చెరువు,రైన్ సిమెంట్స్ – నల్గొండ సాగర్ సిమెంట్స్ – నల్గొండ -
ప్రజలిచ్చిన తీర్పును సవాలుగా తీసుకోవాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘ఆగస్టు 15న తెలంగాణలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు. రుణమాఫీపై రైతులకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశాం. దానికి రోజు వేల సంఖ్యలో రైతులు కాల్స్ చేస్తున్నారు. రుణమాఫీ కాలేదని.. ఎవరు సహాయం చేయట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేస్తున్నారో అర్థం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్స్ మాట్లాడటానికి మొదట్లో ఒక్కరినీ పెట్టాం.. పెరిగిన కాల్స్ చూసి ఇప్పుడు ఆరుగురిని పెట్టినా సరిపోట్లేదు. ప్రజలు బీజేపీపై ఆశతో తెలంగాణలో 36 శాతం ఓటు షేర్ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేద్దాం’అని అన్నారు. -
బీజేపీ పదాధికారుల సమావేశం
-
రైతులకు కాంగ్రెస్ దగా!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏవేవో ఆంక్షలు పెట్టి రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా రైతులను దగా చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. అధికారం కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని విమర్శించారు. రుణమాఫీ కాని రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభిస్తున్నట్టు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.‘‘రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దగా చేస్తోంది. రైతులకు ఏ ప్రతిపాదికన రుణమాఫీ చేస్తున్నారన్న అంశాన్ని స్పష్టం చేయాలి. చాలా మంది రైతులు రుణమాఫీ జరగక బ్యాంకుల్లో డీఫాల్టర్‌గా మారే దుస్థితి ఏర్పడింది’’అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మోసపూరిత హామీలిచి్చ, అధికారంలోకి వచ్చాక దగా చేయడంలో అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ ఒకటేనని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం.. గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి, రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరిస్తామని.. ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. రైతులు, యువత, బీసీలు, మైనారిటీలు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యారంగానికి 14 శాతానికిపైగా బడ్జెట్ కేటాయిస్తే.. అది తెలంగాణలో 7.60 శాతమేనన్నారు. మాటలు కోటలు దాటినా.. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దా టుతున్నా.. చేతలు సెక్రటేరియట్ దాటడం లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పంటలకు మద్దతు ధర పెంపు, నిరుద్యోగులకు జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీలు ఏమైపోయాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మ ద్యం అమ్మకాలు, భూముల అమ్మకాలతోనే ఆదాయం పెంచుకోవాలని ఆలోచిస్తోందే తప్ప.. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు.ఇదీ బీజేపీ హెల్ప్‌లైన్ నంబర్రుణమాఫీకాని రైతులకు అండగా నిలిచేలా, ‘రైతుల పక్షాన కాంగ్రెస్ సర్కారును ప్రశి్నస్తున్న తెలంగాణ’ పేరుతో బీజేపీ పోస్టర్‌ను కిషన్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం హెల్ప్‌లైన్ నంబర్ 8886 100 097ను ప్రారంభించారు. కాగా.. ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు విశేష స్పందన వస్తోందని బీజేపీ నేతలు చెప్తున్నారు. -
ఎన్టీపీసీ విద్యుత్తు తెలంగాణకు అక్కర్లేదా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వీలైనంత ఎక్కువ కరెంట్‌ను అందుబాటులో ఉంచాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట్ర సర్కారు సహకరించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన పలు దఫాలుగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు.పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆమోదముద్ర వేశారని గుర్తుచేశారు. ‘దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ఎస్టీపీపీ–2 ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తిని పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగా పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖలు రాసినా జవాబు రాలేదు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రం స్పందించని పక్షంలో ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. ‘గత మేనెల 30న దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. అలాగే మార్చి 2024లో తెలంగాణలో గరిష్టంగా (పీక్ పవర్ డిమాండ్) 15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది.దీనిని దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు.. రెండోదశ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముంది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు రాష్ట్ర ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా, దానిని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని మరోసారి నిరూపితమైంది’అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని సూచించారు. -
ఎన్టీపీసీ పవర్ తెలంగాణకు అక్కర్లేదా?: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా.. రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా.. ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘ఇందులో భాగంగా.. మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో.. మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 3 అక్టోబర్ 2023 తేదీన, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 4 మార్చి 2024 తేదీన ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో 85 శాతం విద్యుత్‌ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారు...ఈ 4 వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని.. రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు గానూ ఎన్టీపీసీతో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం మొదలైన అంశాలపై ఎన్టీపీసీ పని ప్రారంభిస్తుంది.ఒకవైపు, దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. STPP-II ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగానే.. పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి 4సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. 5 అక్టోబర్, 2023 తేదీన, 9 జనవరి, 2024 తేదీన, 29 జనవరి, 2024 తేదీన.. ఆ తర్వాత మొన్న 29 ఏప్రిల్, 2024 నాడు లేఖలు రాస్తే.. వీటికి ట్రాన్స్‌కో నుంచి సమాధానం లభించలేదు.ఇన్నిసార్లు లేఖలు రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రామగుండంలో కేంద్రం నిర్మించనున్న STPP-II ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్టీపీసీ లేఖలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో.. దీన్ని దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు అనుమతి ఉంటుందన్నది ఎన్టీపీసీ రాసిన లేఖల సారాంశం.30 మే 2024న దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మార్చి 2024లో తెలంగాణలో గరిష్ఠంగా (పీక్ పవర్ డిమాండ్)15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు.. రెండోదశ NTPC పవర్ ప్లాంట్ (2400 మెగావాట్లు)ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముంది.తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా.. దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతోందనేది మరోసారి నిరూపితమైంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం.. NTPC రాస్తున్న లేఖలపై స్పందించి.. PPA చేసుకుంటే అంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుంది. దీన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సానుకూల చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
ఢిల్లీ ఐఏఎస్ అకాడమీ ఓనర్ అరెస్ట్.. మృతుల్లో తెలంగాణ యువతి
ఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. తాజాగా రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఘటనా స్థలంలో ఇద్దరు విద్యార్థినులు, ఒక విద్యార్థి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.Delhi's Old Rajendra Nagar coaching centre incident | The owner and coordinator of the coaching centre arrested: Delhi Police— ANI (@ANI) July 28, 2024 చదవండి: Delhi Tragedy: ‘ముగ్గురు కాదు 10 మంది మృతి’‘‘ఈ ఘటనపై పలు సెక్షన్ల కింది రాజేంద్రనగర్ పోలీసు స్టేషనలో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ చేపట్టాం’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎం.హార్షవర్ధన్ తెలిపారు. మృతిచెందినవారిని తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా పోలీసులు గుర్తించారు. శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్, తాన్యా సోనిది తెలంగాణ, నవీన్ డాల్విన్ కేరళలోని ఎర్నాకులానికి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. కోచింగ్ సెంటర్లో మృతి చెందిన తానీయా సోని స్వస్థలం బీహార్. తానియా సోని తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్‌గా పని చేస్తున్నారు. చదవండి: వీడియో: ఢిల్లీ ప్రమాదం ఇలా జరిగింది.. అభ్యర్థి ఆవేదనకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా సికింద్రాబాద్ చేర్చేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు. ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి.. పెండింగ్‌లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తిచేయడంలో చొరవతీసుకోవాలని ఢిల్లీలోని తన కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఆదేశించారు. -
కేటీఆర్ యువరాజు అనుకుంటున్నారా? భయపడేది లేదు: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో విపక్షాలకు అన్యాయం జరిగిందని, అందుకే నిరసన తెలియజేసేందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ వ్యాప్తంగా చర్చ జరిగేందుకే నీతి ఆయోగ్ బహిష్కరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. టూరిజం మంత్రిగా ఉన్నా కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమి లేదని విమర్శించారు.కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదని, పైసా ఇవ్వకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం మూర్ఖత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.‘కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్‌కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అయినా సహకారం లేదు. గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరు.. కారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదు. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా?తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగింది. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా. మేడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారు. ఆయన హుకుంలకు, అల్టిమేటంకు బయపడేది లేదు. -
కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో కేసీఆర్ ఎలాగైతే వ్యవహరించారో, అదే తరహాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. నాటి సీఎం కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తుండటం.. తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. గతంలో తమ ప్రభుత్వ అసమర్థత కారణంగా కేంద్రంపై బీఆర్ఎస్ బురదజల్లిన విధంగానే నేడు కాంగ్రెస్ కూడా డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు.బుధవారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడమంటే బ్లాక్మెయిల్ చేయడమేనని అన్నారు. ఢిల్లీలో దీక్ష చేద్దాం.. ఆమరణ దీక్షలు చేద్దామనడంలోనే వాళ్ల ఆలోచన స్పష్టమైందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం చేయాలని గతంలో కోరిన బీఆర్ఎస్, కాంగ్రెస్.. నేడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నా యని మండిపడ్డారు. గత 8 నెలల్లో రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఎక్కువగా వచ్చింది కేవలం తమ పార్టీ నాయకులను, గాంధీ కుటుంబాన్ని కలవడానికేనని ఎద్దేవా చేశారు. రాజీనామా చేయాల్సింది తాను కాదని.. రేవంత్‌రెడ్డే చేయాలని చెప్పారు. కుర్చీ బచావో అనేది కాంగ్రెస్ నినాదమని.. డబ్బులిచ్చి సీఎం సీట్లు కొనుక్కోవడం ఆ పార్టీ సంస్కృతి అనే విషయం ప్రజలకు తెలుసునని విమర్శించారు. ఎవరి కోసం బహిష్కరిస్తున్నారు?నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎవరి ప్రయోజనాల కోసం బహిష్కరిస్తున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బహిష్కరించే సమయం ఎంతో దూరంలో లేదన్నారు. తెలంగాణ పదమే బహిష్కరించారని రేవంత్ అనడం హాస్యాస్పదమని.. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసునని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, పుదుచ్చేరి పదాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. వాళ్లు దీక్ష చేసినంత మాత్రాన.. తెలంగాణకు ఏం మేలు జరగదన్నారు. అమరావతికి నిధులిస్తే.. మీకు వచ్చిన ఇబ్బందేమిటి? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కేంద్రం పదేళ్లలో 10 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిందని... అయితే, కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన లేదుసింగరేణి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు లోక్‌సభ వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి విషయంలో తెలంగాణ ప్రజానీకానికి, సింగరేణి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరపున భరోసా కల్పించారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%, కేంద్ర ప్రభుత్వం వాటా 49%గా ఉందని... అలాంటి సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేనే లేదన్నారు. సింగరేణి బలోపేతానికి మోదీ ప్రభుత్వం కృషిచేస్తూనే ఉందని చెప్పారు. తెలంగాణ విద్యుత్ ప్రయోజనాలను కాపాడే ఆలోచనతో.. అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటోందన్నారు. -
కిషన్‌రెడ్డి.. హైదరాబాద్ గురించి ఆలోచించండి: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ విభజన హామీలకు సంబంధించి నిధులు కేటాయించేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.కాగా, సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రతీ రూపాయి అడుగుతున్నాము. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలి. గత పది సంవత్సరాలుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరిగింది. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ పెంచాలి. రాష్ట్రంలో నవోదయ, సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలి.గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చినా సీఎం కలిసే వారు కాదు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం పని చేస్తాం. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి. యూనివర్సిటీల అభివృద్ధి కోసం నిధులు తెచ్చేలా కిషన్ రెడ్డి కృషి చేయాలి. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా కృషి చేస్తున్నాం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి సానుకూలంగా పరిష్కరించుకునేలా ముందుకు పోతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఓడినా సంబురాలు చేసుకున్న పార్టీ కాంగ్రెస్
పంజగుట్ట (హైదరాబాద్): గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యతిరేక శక్తులు బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు కుట్రలు పన్నాయని, కానీ ప్రజలు ఆ శక్తుల కుట్రలను తిప్పికొట్టి బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజిగూడలోని జయాగార్డెన్స్లో బీజేపీ సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారం, ఎన్నికలతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లే పార్టీ బీజేపీ అని అన్నారు. నెహ్రూ తరువాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా సాధించలేదని, కానీ రాహుల్ గాంధీ ప్రధాని అయినట్లు ఆ పార్టీ నాయకులు ఊహాగానాల్లో తేలిపోయారని, ఎన్నికల్లో ఓడిపోయి కూడా సంబురాలు చేసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు.. రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తొలగిస్తారు అని తప్పుడు ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను పలు మార్లు అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని విమర్శించారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన వస్తుందని, ఉగ్రవాదం, అవినీతి పెరిగిపోతాయని ప్రజలు గ్రహించారని, అందుకే బీజేపీని మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు. లోక్‌సభ కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవడం, రాజ్యాంగం గురించి తప్పుడు ప్రచారం చెయ్యడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతంరావు, పార్టీ నేతలు ఆనంద్ గౌడ్, ఎన్.వి.సుభాష్, శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ ‘ప్రధాని’లా ఫీలయ్యారు.. కిషన్ రెడ్డి సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోయినా సంబురాలు చేసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అలాగే, మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, సోమాజీగూడ జయ గార్డెన్లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విసృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసింది. బీఆర్ అంబేద్కర్‌ను అనేకసార్లు అవమానించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించాలని కుట్ర చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాద శక్తులు చాపకింద నీరులా ఎన్నికల్లో ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా కుతంత్రాలు పన్నారు. మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించారు. దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే వారి ఉద్దేశం. ఎన్నికల్లో ఎంఐఎం తప్పుడు ప్రచారం చేసింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నిజస్వరూపం మరోసారి బయటపడుతుంది. లోక్‌సభ జరగకుండా అడ్డుపడటం.. రాజ్యాంగం గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా సాధించలేదు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం ప్రధాన మంత్రి అయినట్లు ఊహాగానాల్లో తేలిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయి సంబురాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో మొదటిసారిగా చూస్తున్నాం. ఎన్నికల్లో ఓడిపోయిన అసహనంతో పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అబద్ధాలు, తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మారు. ఎన్నికల్లో పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీ. కానీ, బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసింది మజ్లిస్ పార్టీ. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోతుందని దేశ ప్రజలు గ్రహించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణచివేసిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్‌లో బాంబుపేలుళ్లతో ప్రజలు వణికిపోయారు. -
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, ఈటల..
-
కాంగ్రెస్‌కు ఐదేళ్లూ పట్టదు: కిషన్ రెడ్డి సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ బుద్ధి చెప్పడానికివ పదేళ్ల కాలం పట్టింది కానీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి కనీసం ఐదేళ్లు కూడా పట్టదు అంటూ విమర్శలు చేశారు.కాగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం నిరుద్యోగుల మహాధర్నాలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత ఆత్మబలిదానం చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించింది. గత బీఆర్ఎస్ యువత ఆశలను నట్టేట ముంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యూత్ డిక్లరేషన్‌తో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక, రేవంత్ సభల్లో రెండు లక్షల ఉద్యోగాలు అంటూ ఉదరగొట్టారు. రుణమాఫీ కూడా రైతులను మభ్య పెట్టేలా చేశారు. ఇచ్చిన హామీ ప్రకరం అందరికీ చేయాలి కానీ.. కొంతమందికే రుణమాఫీ చేసి పాలాభిషేకం చేయించుకుంటున్నారు.జాబ్ కాలెండర్ ఎటు పోయింది రేవంత్ రెడ్డి?. 18 ఏళ్లు నిండిన కాలేజీ అమ్మాయిలకు స్కూటీ అన్నారు మర్చిపోయారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని నట్టెట ముంచారు. ప్రజాపాలనలో సెక్రటేరియట్‌లోకి సామాన్యులకు ఎంట్రీ లేదు. కాంగ్రెస్ పైరవీకారులకు మాత్రమే ఉంది. విద్యా భరోసా కార్డులు ఎటు పోయాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయి. కేసీఆర్‌కి బుద్ది చెప్పడానికి పదేళ్లు పట్టింది కానీ, కాంగ్రెస్‌కు బుద్ది చెప్పడానికి కనీసం ఐదేళ్లు కూడా పట్టదు.చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకెళ్ళి రేవంత్ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది తెలంగాణ పరిస్థితి. కేసీఆర్ పోయి రేవంత్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ కాంగ్రెస్‌కు, రేవంత్‌కు లాభం జరిగింది. నిజమైన మార్పు రాష్ట్రంలో రాలేదు. వచ్చిన మార్పు కేసీఆర్ కుటుంబం పోయి సోనియా కుటుంబం వచ్చింది. గులాబీ జెండా పోయి చెయ్యి గుర్తు జెండా వచ్చింది. ప్రజలను దోపిడీ చేసే స్వేచ్చ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. బీఆర్ఎస్ చేసినట్లే కాంగ్రెస్ చేస్తుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులు కాంగ్రెస్ చేస్తోంది. అవినీతి పాలనలో, దోపిడీలో, ఫిరాయింపుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుంది. బీజేవైం ద్వారా మా పోరాటాలు యువత కోసం కొనసాగుతాయి అంటూ కామెంట్స్ చేశారు. -
చర్లపల్లి టెర్మినల్ రెడీ!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రయాణికులకు సకల సదుపాయాలతో ఎయిర్‌పోర్టు తరహాలో చర్లపల్లి టెర్మినల్‌ను తీర్చిదిద్దారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైన ఒత్తిడిని తగ్గించేందుకు నాలుగో టెర్మినల్‌గా దక్షిణమధ్య రైల్వే చర్లపల్లి పునరి్నర్మాణం చేపట్టింది. సుమారు రూ.434 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 98 శాతం పూర్తయినట్లు స్వయంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల కంటే ముందే దీన్ని వినియోగంలోకి తేవాలని భావించినప్పటికీ అప్పట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడం వల్ల సాధ్యం కాలేదు. ఆ తరువాత ఎన్నికల కోడ్ వచ్చేసింది. ప్రస్తుతం దాదాపుగా పనులన్నీ పూర్తి కావడంతోనే త్వరలోనే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు.రోజుకి 50 రైళ్ల రాకపోకలకు అవకాశంసికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న దృష్ట్యా ప్రస్తుతం సికింద్రాబాద్ వరకు రాకపోకలు సాగిస్తున్న కొన్ని రైళ్లను త్వరలో చర్లపల్లి నుంచి నడుపనున్నారు. 9 ప్లాట్‌ఫామ్‌లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి నుంచి రోజుకు 50 రైళ్లు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 30 రైళ్లతో (15 జతలు) చర్లపల్లి స్టేషన్‌ను వినియోగంలోకి తేనున్నారు. మొదట 25 వేల మందికి పైగా చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నారు. రైళ్లు పెరిగే కొద్దీ ప్రయాణికుల సంఖ్య పెరగనుంది.ఔటర్‌కు చేరువలో...⇒ ఔటర్‌రింగ్ రోడ్డుకు చేరువలో ఉన్న చర్లపల్లి స్టేషన్‌కు నగరవాసులు వివిధ ప్రాంతాల నుంచి ఔటర్ మీదుగా చేరుకొనేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఎంఎంటీఎస్ రెండో దశలో విస్తరించిన సికింద్రాబాద్–ఘట్కేసర్ రూట్లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభం కానున్నాయి.⇒ దీంతో ప్రయాణికులు నగరానికి పడమటి నుంచి తూర్పు వైపు తేలిగ్గా రాకపోకలు సాగించవచ్చు. ⇒ ప్రయాణికుల సదుపాయాల్లో భాగంగా 5 లిఫ్టులు, 9 ఎస్కలేటర్లు ఉన్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సోలార్ పవర్ ప్రాజెక్టును చేపట్టారు. ⇒ ప్రయాణికుల రాకపోకల కోసం రెండు సబ్‌వేలను నిర్మించారు. అలాగే రహదారులను విస్తరించారు. సుమారు 4 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకర్లను సిద్ధం చేశారు.చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ⇒ షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045/18046),. ⇒ చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12603/12604) ⇒ గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్.. ⇒ హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), ⇒ గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్.. ⇒ విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్‌ప్రెస్, తదితర రైళ్లను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. ⇒ మొత్తంగా మొదట 15 జతల రైళ్లు చర్లపల్లి నుంచి ప్రారంభం కానున్నాయి.