kommineni Srinivasa Rao
-
సీనియర్-జూనియర్.. ఇంతకీ నష్టం ఎవరికో?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉన్నాయి. అంత అర్థవంతంగానూ కనిపించడం లేదు అవి. కేసీఆర్‌ను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా?. ప్రస్తుతానికి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్‌కు అనుభవం, జ్ఞానం లేదని, కామన్ సెన్స్ వాడరు అంటూ వ్యాఖ్యానించి సరిపెట్టుకున్నారు. అంతకుమించి రేవంత్ వ్యాఖ్యలకు నేరుగా స్పందించ లేదు. అయితే.. ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావులు మాత్రం రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగానే జవాబిస్తున్నారు. అయితే తెలంగాణలో మూడు పార్టీల రాజకీయం కొంత గందరగోళంగానే ఉందని చెప్పాలి. ఎవరు ఎవరికి రహస్యంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు అర్థం కాని రీతిలో రాజకీయం సాగుతోంది. ‘‘కేసీఆర్‌ను కొట్టింది నేనే.. గద్దె దింపింది నేనే’’ అంటూ మరీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాకపోవచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. అంతమాత్రాన వ్యక్తుల గౌరవాలను తగ్గించుకునేలా మాట్లాడుకుంటే రాజకీయాల విలువ కూడా తగ్గుతుంది. 👉ఎల్లకాలం ఎవరూ ఒకరే ముఖ్యమంత్రిగా ఉండరన్న వాస్తవాన్ని అంతా గుర్తుంచుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చింది తానేనని రేవంత్ అన్నారు. ఆ ఎన్నికలలో కారణం ఏమైనా బీఆర్ఎస్ ఓటమి అనేది వాస్తవం. కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా ఎనిమిది లోక్ సభ స్థానాలు వచ్చాయి. అది కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? అనేది ఆలోచించుకోవాలి. అప్పట్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేయడం వల్ల బీజేపీకి కొంత ఉపయోగం జరిగిందన్న భావన కూడా లేకపోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్‌కు ఇబ్బంది కావొచ్చు. కాని ఆ పరిణామం జరుగుతుందని ఇప్పటికైతే ఎవరూ చెప్పలేరు. రేవంత్ నిజంగానే తాను బాగా బలపడ్డాడనని భావిస్తుంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సవాల్ విసిరి గెలిస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుంది. కాని కేసీఆర్(KCR)ను విమర్శిస్తూ, ఆయన చేసిన తప్పులే రేవంత్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది?. తనది ముఖ్యమంత్రి స్థాయి అని, కేసీఆర్‌ది మాజీ ముఖ్యమంత్రి స్థాయి అని రేవంత్ అంటున్నారు. కాని కేసీఆర్ ప్రధాన కేసీఆర్ వయసు రీత్యా, అనుభవం రీత్యా తనకన్నా బాగా చిన్నవాడైన రేవంత్‌తో పోటీ పడడానికి చిన్నతనంగా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది కూడా కరెక్టు కాదు. 👉రాజకీయాలలో సీనియర్, జూనియర్ అని ఉండదు. ఎవరు అధికారంలోకి వస్తే వారిదే పవర్. కేసీఆర్‌ను ఉద్దేశించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? అనడం అంత మంచి సంప్రదాయం కాదు. ఎవరిని లక్ష్యంగా అన్నారో కాని, డ్రగ్స్ పెట్టుకుని పార్టీ చేసుకుంటే స్థాయి వస్తుందా? అనడంలో అంతర్యం ఏమిటో తెలియదు. తెలంగాణ సమాజాన్ని విలువల వైపు నడపవలసిన నేతలు ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడుకోవడం జనానికి రుచించదనే చెప్పాలి. కేసీఆర్ స్థాయి కాంగ్రెస్‌లో ఎవరికీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడంపైనే రేవంత్ స్పందించి ఉండవచ్చు. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడం తప్పుకాదు. ఆ సందర్భంలో వాడే భాష విషయంలో జాగ్రత్తగా లేకపోతే రేవంత్‌కే నష్టం. 👉బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి ఉందని రేవంత్ అంటున్నారు. అదే టైమ్‌లో కేటీఆర్, హరీష్ రావులు అప్పులపై సీఎం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ కొన్ని ఆధారాలు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలవడానికి చేసిన హామీలకు అయ్యే వ్యయం ఎంత? ఏ మేరకు హామీలు అమలు చేశారు? మొదలైన విషయాలు చెప్పగలిగితే అధికార పార్టీపై ప్రజలలో విశ్వాసం ఏర్పడుతుంది. రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రుణమాఫీ, రైతు బంధు, గ్యాస్ బండలు, గృహజ్యోతి వంటి స్కీముల అమలుకు కొంత ప్రయత్నం చేస్తున్న మాట నిజం. కానీ అమలు కానివి చాలానే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు సహజంగానే వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాయి. ఆ విషయాలను డైవర్ట్ చేయడానికి రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కేసీఆర్‌పై వ్యక్తిగత స్థాయిలో నిందలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. రేవంత్ తరచుగా ఢిల్లీకి వెళ్లడాన్ని బీఆర్ఎస్ తప్పు పడుతోంది. దానికి జవాబుగా 39 సార్లు కాదు.. 99 సార్లు వెళతానని రేవంత్ అన్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నేతలు తరచు ఢిల్లీ వెళ్లడమే పెద్ద అంశంగా.. అప్పుడే కొత్తగా వచ్చిన టీడీపీ మార్చింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దాన్ని ఆత్మగౌరవ సమస్యగా మార్చి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నారన్న సంగతిని రేవంత్ దృష్టిలో పెట్టుకుంటే మేలు. కేసీఆర్ గతంలో కంచి వెళుతూ తిరుపతి వద్ద అప్పటి మంత్రి రోజా ఇంటిలో విందు తీసుకున్నప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాయలసీమను రతనాల సీమను చేస్తానని చెప్పి రొయ్యల పులుసు తిన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రాంతీయ భావాలు అవసరమా? అంటే రాజకీయంలో ఇవి సాధారణంగానే జరుగుతుంటాయి. దానికి పోటీగా చంద్రబాబు(Chandrababu)కు ప్రజాభవన్‌లో విందు ఇచ్చి, ఆయన వద్ద రేవంత్ సాగిలపడ్డారని హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోవడంపై రేవంత్‌కు అసంతృప్తి ఉండవచ్చు. దానిని రాజకీయంగా విమర్శించవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఓడించాయని, హరీష్‌రావు డబ్బులు ఇచ్చి మరీ బీజేపీకి ఓట్లు వేయించారని ఆయన అన్నారు, ఈ రోజుల్లో ఎవరి వ్యూహం వారిది అనుకోవాలి. 👉బీఆర్ఎస్ తనకు ప్రత్యర్ధి కాంగ్రెస్ అని భావిస్తూ ప్రస్తుతం పరోక్షంగా బీజేపీకి సహకరించి ఉండొచ్చు!. అయితే భవిష్యత్తులో అది బీఆర్ఎస్కు ఉపయోగపడవచ్చు.. పడకపోవచ్చు!!. మరో వైపు ప్రధాని మోదీని మెచ్చుకునే రీతిలో మాట్లాడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని రేవంత్ అనడాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ‘‘యూజ్ లెస్ ఫెలో, హౌలే గాడు మాట్లాడే మాటలు పట్టించుకోనవసరం లేదు..’’ అంటూ బీఆర్ఎస్కు ఘాటైన రీతిలో సమాధానం చెప్పడం.. ఈ క్రమంలో అనుచిత భాష వాడడంలో సహేతుకత కనిపించదు. ఒకప్పుడు కేసీఆర్ అభ్యంతరక భాష వాడుతున్నారన్న విమర్శలు ఉండేవి.దానికి పోటీగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తీవ్రమైన విమర్శలే చేసేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్‌ను మించి దూషణల పర్వం వాడడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ వ్యక్తిత్వానికి, గౌరవానికి అంత హుందా కాకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబుగారూ.. భయపడుతున్నారా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో చెప్పిన విషయాలు గమనించదగినవే. తన సీనియారిటీని కూడా పక్కనబెట్టి ఆయన ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవలి ఎన్నికలకు ఎలాగోలా కష్టపడి మోదీని, అమిత్ షాలను ప్రసన్నం చేసుకుని పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. బీజేపీ వారి వద్ద భయం, భయంగా గడపాల్సిన పరిస్థితిలో బాబు ఉన్నారేమో అన్న అనుమానం రాజకీయ వర్గాలలో కలుగుతోంది. .. బీజేపీ అభ్యర్ధిగా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడడం ఒక ఉదాహరణ. బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా చంద్రబాబుకు షాక్ వంటిదేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను తానే నిర్ణయిస్తాననే దశ నుంచి.. తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారి ఎంపికను మౌనంగా ఆమోదించే దుస్థితిలో చంద్రబాబు పడ్డారని సొంత పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ జుట్టు బీజేపీ చేతిలో ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సందర్భం అయినా కాకపోయినా మోదీని పొగడడం, బీజేపీ విధానాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని పలువురు భావిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు పలుమార్లు బీజేపీని తీవ్రంగా విమర్శించారు. మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అందుకోసం ఆయన ఎన్ని పాట్లు పడింది తెలుసు. 1996, 1998 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని తీవ్రంగా విమర్శించారు ఈయన. ఆ రోజుల్లో వామపక్షాలతో పొత్తులో ఉన్నారు. 1998 లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీకి సరిగ్గా 12 సీట్లు తక్కువ అవడం, బీజేపీ వారు ఈయన్ని సంప్రదించడం, వెంటనే కనీసం మిత్రపక్షాలతో కూడా చెప్పకుండా ఎగిరి గంతేసినట్లు మద్దతు ఇచ్చేశారు. దాంతో 1999లో లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడానికి అవకాశం వచ్చింది. ఇక.. కార్గిల్ యుద్ద వాతావరణం, వాజ్‌పేయిపై ఏర్పడిన సానుభూతి చంద్రబాబుకు కలిసి వచ్చాయి. 👉తదుపరి ఒక దశలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడానికి సిద్దమైనట్లు కనిపించారు. గుజరాత్ మారణకాండ, మత హింసకు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు భావించారు. బీజేపీ నాయకత్వం మోదీని తప్పిస్తోందన్న సమాచారాన్ని నమ్మి ఆయనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మోదీని హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వనని హెచ్చరించారు. కానీ బీజేపీ తన వైఖరి మార్చుకునేసరికి ఈయన ఇరకాటంలో పడ్డారు. బీజేపీని వదలుకోవడానికి సిద్ద పడలేదు. పార్లమెంటులో ఓటింగ్ సమయానికి టీడీపీ ఎంపీలు లేకుండా వెళ్లిపోయారు. 2004లో బీజేపీతో కలిసి పోటీచేసినా ఓటమి చెందారు. ఆ తర్వాత జీవితంలో బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని ప్రకటించారు. 👉కట్ చేస్తే.. 2009లో వామపక్షాలతోపాటు బీీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకున్నారు. అయినా విజయం సాధించలేకపోయారు. దాంతో పంథా మార్చుకుని 2014 నాటికి మోదీకి దగ్గరవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆరోజుల్లో వైఎస్సార్సీపీతో పొత్తుకు బీజేపీ యత్నించినా, జగన్ ఒప్పుకోకపోవడం కూడా చంద్రబాబుకు ఉపయోగపడింది. మొత్తం మీద కలిసి పోటీ చేయడం, జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా మద్దతుఇవ్వడం, అధికారంలోకి రావడం జరిగింది. 2018 నాటికి బీజేపీతో మళ్లీ విబేధించారు. 👉 2019 ఎన్నికలలో బీజేపీ గెలవకపోవచ్చని, మోదీ మళ్లీ ప్రధాని కారని నమ్మినట్లు చెబుతారు. దాంతో ఆయన బీజేపీపైన, మోడీపైన చాలా తీవ్రమైన విమర్శలు చేసేవారు. మోదీని టెర్రరిస్టులతో పోల్చారు. వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తూ మోదీ భార్యను ఏలుకోలేని వాడని, ముస్లింలను బతకనివ్వడని ఇలా పలు ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. దాంతో ఏపీలో ఒంటరిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మోదీ తిరిగి ప్రధాని అవడంతో వెంటనే ప్లేట్ తిరగేశారు. బీజేపీకి దగ్గరవడానికి అన్ని వ్యూహాలు అమలు చేశారు. ముందుగా పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారని అంటారు. 👉పవన్ తొలుత బీజేపీకి దగ్గరై, తదుపరి టీడీపీని కలపడానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఆ విషయాన్ని ఆయన దాచుకోలేదు. బీజేపీతో టీడీపీని కలపడానికి తాను బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నానని కూడా ప్రకటించారు.ఈసారి కూడా వైసీపీతో స్నేహం చేయడానికి బీజేపీ ముందుకు వచ్చినా, జగన్ సిద్దపడలేదు.అది చంద్రబాబుకు కలిసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ అండ, ఎన్నికల కమిషన్ అనుకూల ధోరణి, సూపర్ సిక్స్ హామీలు తదితర కారణాలతో అధికారంలోకి రాగలిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోదీని పొగుడుతున్న తీరు కాస్త ఆశ్చర్యం అనిపించినా, గత చరిత్ర తెలిసిన వారెవ్వరూ ఇది మామూలే అని భావిస్తుంటారు. 👉ఒకప్పుడు తానే మోదీకన్నా సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్నానని అంటున్నారు. దానికి కారణం ఏమిటంటే మోదీ వరసగా గెలుస్తూ వస్తూ అధికారం నిలబెట్టుకున్నారట. గతంలో సీబీఐ, ఈడి వంటి వాటిని మోదీ ప్రయోగిస్తున్నారని ఆరోపించే వారు. బహుశా దాని ద్వారానే మోదీ అధికారం నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం కలిగిందేమో తెలియదు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఏపీలో పోలీసులతో వైసీపీ వారిపై అడ్డగోలు కేసులు పెట్టించడం, వేధింపులకు పాల్పడుతున్నారన్న అనుమానం కలిగేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి. మనం మంచి పనులు చేయడంతో పాటు ప్రజలకు సరిగా చెప్పాలని ఆయన అంటున్నారు. 1995 నుంచి చంద్రబాబు వాడుకుంటున్న విధంగా మీడియాను మరెవరైనా వాడుకోగలిగారా? అయినా తను ఓడిపోయినప్పుడు ప్రచారం సరిగా లేదని అంటున్నారు. చంద్రబాబు ప్రజలకు విపరీతమైన హామీలు ఇవ్వడంతో పాటు పొత్తుల వ్యూహాలలో సఫలం అయినప్పుడు గెలిచారు. హామీలు నెరవేర్చక ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడినప్పుడు ఓటమి చెందారు. కాకపోతే ఆ విషయం చెప్పరు. 2004, 2019లలో ఓటమికి ప్రచార లోపమే కారణం అంటున్న చంద్రబాబు 2009లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయారో చెప్పలేదు. 👉2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బాగా పనిచేయబట్టి,ఆయన ప్రజలకు బాగా చెప్పగలిగినందువల్లే గెలిచారని అనుకోవాలా? 2024లో జగన్ ఓటమికి కూడా అదే కారణం అని ఎందుకకు అనుకోరాదు? పైగా టీడీపీ జగన్ టైమ్ లో చెప్పినన్ని అబద్దాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేసిన అసత్య ప్రచారాలు, వదంతులు అన్ని చూస్తే అది ఒక ప్రపంచ రికార్డు అవుతుందేమో! ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఎగనామం పెట్టడం జరుగుతుంటున్నది సర్వత్రా ఉన్న భావన. 2014లో ఇచ్చిన రైతు రుణమాఫీ తదితర వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్ల టీడీపీకి బాగా అప్రతిష్ట వచ్చిందన్న సంగతి జనం మర్చిపోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. మోడీ వల్ల దేశం బాగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు తెలిపారు. మరి గతంలో అందుకు విరుద్ధంగా ఎందుకు మాట్లాడింది ఎప్పుడూ వివరణ కూడా ఇవ్వలేదన్నది వాస్తవం. జనాభా నియంత్రణ వద్దని చెబుతూ ఏకంగా యూపీ, బీహారు రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని అనడం మరీ విడ్డూరంగా ఉంది. గతంలో ఆ రెండు రాష్ట్రాలు సరిగా పనిచేయక దేశానికి నష్టం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాల ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకు పోతోందని వాదించిన చంద్రబాబు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు. 👉కొత్త డిలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతున్నప్పటికి ఆయన ఆ మాట అనలేకపోతున్నారు. వైసీపీ సభ్యులొకరు కేంద్రంలో టీడీపీపైనే ప్రభుత్వం ఆధారపడినప్పటికీ అని ఆయా అంశాలు ప్రస్తావిస్తుండగా, లోకేష్ జోక్యం చేసుకుని అలా చెప్పవద్దని, తాము బేషరతుగా కేంద్రంలోని ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నామని అన్నారు. లోకేష్ కూడా అలా మాట్లాడారంటే.. బీజేపీ అంటే వీరు భయపడుతున్నారని చెప్పడానికి ఇవన్ని సంకేతాలు అవుతాయి. ఒకప్పుడు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తాకట్టు పెట్టిందనే విమర్శను పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పెద్ద ఎత్తున చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం వైఖరి ఎలాంటి విమర్శలకు అవకాశం ఇస్తున్నదో ఊహించుకోవచ్చు. ఏది ఏమైనా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన వాగ్దానాల అమలుకన్నా, ప్రత్యర్ధులను వేధించి, జైళ్లలో పెట్టి అధికారాన్ని కొనసాగించాలన్న లక్ష్యం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు మరింత అప్రతిష్ట పాలవుతారు తప్ప ప్రయోజనం ఉండదు. అధికారం అనే పొర కళ్లను వాళ్లను కప్పేసి ఉంటుంది కనుక ఆ హితోక్తి వారి చెవికి ఎక్కకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మొత్తం చినబాబే చేశారు! రెడ్‌బుక్ ఎఫెక్ట్‌తో అంతా..
ఇచ్చిన మాటను గాలికి వదిలేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే.. శాసనమండలి ఎన్నికలు!. మొత్తం ఐదు సీట్లలో.. టీడీపీ మూడు స్థానాలు, జనసేన, బీజేపీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అయితే ఈ ఎంపికలన్నీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ సొంత టీమ్ కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీకి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ మాటకే పార్టీలో ఎక్కువ చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం. సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టి, గతంలో తాము చేసిన బాసలకు తిలోదకాలు ఇచ్చి ఈ ఎంపికలు జరిపారన్న భావన టీడీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ఉన్నవి మూడు సీట్లే. కాబట్టి అందరిని సంతృప్తి పరచడం కష్టమే. కాని ఎంపిక చేసిన వారిని ఇతర ఆశావహులతో పోల్చి చూసినప్పుడు విమర్శలు వస్తున్నాయా? ప్రశంసలు వస్తున్నాయా? అనేది పరిశీలనకు వస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ ఎంపికలు అంత సంతృప్తి కలిగించలేదని అంటున్నారు. 👉పార్టీలో 42 ఏళ్లు వేర్వేరు పదవులు నిర్వహించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు టీడీపీ రిటైర్మెంట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. 1995లో యనమల స్పీకర్‌గా ఉండడం వల్లే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేసి చంద్రబాబు తేలికగా సీఎం అయ్యారని అంటారు. చంద్రబాబుకు రాజకీయ సలహాలు ఇస్తుంటారని కూడా ప్రచారం ఉంది. లోకేష్ నాయకత్వం వచ్చాక ఈయనను మెల్లగా పక్కన పెట్టారు. అయితే యనమల కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఇంకో కూతురి భర్త ఎంపీ అయ్యారు. వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా మైనస్ కావచ్చు. అయితే.. టీడీపీలో ఆయా కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వలేదా అన్న చర్చ రావచ్చు. అది వేరే సంగతి. 👉ఇక అందరి దృష్టిని ఆకర్షించేది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలనుకున్నప్పుడు వర్మ సీటు వదలుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఆయన(వర్మ) ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. కాని వర్మకు అవకాశం ఇవ్వకుండా హామీని గాలికి వదలివేసి అవమాన భారం మిగిల్చారు. ఇప్పుడు వర్మ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్మకు పదవి ఇస్తే పిఠాపురంలో పోటీ కేంద్రం అవుతారన్నది పవన్ భయమట. ఏది ఏమైనా మాట ఇచ్చి ఎలా తప్పవచ్చో చెప్పడానికి వర్మ వ్యవహారం ఉదాహరణ అవుతుంది. కొంతకాలం క్రితం వరకు కనీసం తన వాయిస్ వినిపించే వారు. కాని ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ భయమో, మరేదైనా కారణంతోనో వర్మ కనీసం నిరసన కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో పడ్డారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. 👉వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఎలా ప్రలోభ పెట్టారో.. ఏకంగా ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అన్నారు. కాని ఆయనకు పదవి హుళక్కి అయింది. పలువురు ఇతర ప్రముఖులు దేవినేని ఉమ, ప్రభాకర చౌదరి, బుద్దా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ మొదలైన వారంతా గత ఎన్నికలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డారు. అప్పుడు వారిని ఓదార్చడానికి ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామన్నారు. కాని వారికి ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదు. వైఎస్సార్సీపీ నుంచి పార్టీ మారిన జంగా కృష్ణమూర్తి పరిస్థితి అంతే. 👉ఒక్క బీటీ నాయుడుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి తిరిగి వచ్చారు. చంద్రబాబుకు బాగా ఉపయోగపడ్డారని టీడీపీ మీడియా ఒక ప్రచారం చేస్తోంది కాని, ఆయనను మించి ఎవరూ లేరా? అనే సందేహం కూడా వస్తుంది. బీదా రవిచంద్రకు పదవి ఇవ్వడం మామూలుగా అయితే అభ్యంతరం ఉండదు. కాని, వైఎస్సార్సీపీ నుంచి ఆయన సోదరుడు టీడీపీలోకి వచ్చి మళ్లీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇప్పుడు రవిచంద్రకు కూడా పదవి దక్కింది. ఇక కావలి గ్రీష్మకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి ఉంది. ఆమెను ఎమ్మెల్సీ చేయడం విశేషం. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తెగా కన్నా, ఆమె మహానాడులో చంద్రబాబు సమక్షంలోనే వేలాది మంది చూస్తుండగా, తొడలు గొట్టడం, అభ్యంతరక భాషలో వైఎస్సార్సీపీ వారిని దూషించడం వంటి కారణాలే ప్రామాణికతగా పదవి వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమె మండలిలో ఇంకెలాంటి బూతులకు దిగుతారోనన్న వ్యాఖ్యలు టీడీపీలో వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులను ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబుతున్నారు. ఎల్లోమీడియా మాత్రం సహజంగానే ఈ టీడీపీ ఎమ్మెల్సీ ఎంపికలకు బిల్డప్ ఇస్తూ బలహీనవర్గాలకు పెద్ద పీట అని రాసి ప్రచారం చేశాయి. జనసేన అభ్యర్దిగా పవన్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేశారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. కాని ఎందువల్లో ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నందున ఇవ్వకతప్పదేమో!. 👉ఎల్లో మీడియా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని, కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే ఇస్తారంటూ కథనాలు రాసింది. అందుకు పవన్ కూడా ఓకే అన్నట్లు చెప్పాయి. కాని ఏమైందో కాని, మరుసటి రోజు నాగబాబు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయబోతున్నారని జనసేన ప్రకటించింది. విశేషం ఏమిటంటే గతంలో పవన్ తన బంధువులకు పదవులు ఇవ్వడం కోసం పార్టీని పెట్టడం లేదని గొంతెత్తి మరీ చెప్పారు. అంతేకాక కుల రాజకీయాలపై ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడారు. ఇప్పుడు జనసేన అంటే ఒక సామాజిక వర్గ పార్టీనే అన్న భావన కలిగించేలా పదవులు కేటాయిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా అదే వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకు ఇచ్చుకున్నారు. తనతో పాటు కందుల దుర్గేష్ కూడా అదే వర్గం వారు కావడం గమనార్హం. నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. దీంతో జనసేనలో ఇతర సామాజిక వర్గాలకు అసలు ప్రాధాన్యత లేదన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడడానికి ఆస్కారం కలిగింది. 👉గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ అవుతున్నారు. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై బీజేపీ లో ఆక్షేపణ ఉండకపోవచ్చు. కాని ఈ పదవిని ఆశిస్తున్న ఇతర సీనియర్ లు కొందరికి ఆశాభంగం అవుతుంది. వీర్రాజుకు పదవి రావడం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కాని బీజేపీ అధిష్టానాన్ని కాదనే పరిస్థితి వీరికి లేదు. వీర్రాజు నామినేషన్ చివరి క్షణంలో వేసిన తీరును బట్టి హైకమాండ్ కావాలనే ఆయనకు పదవి ఇచ్చిందని, తద్వారా టీడీపీకి, పురందేశ్వరికి చెక్ పెట్టే ఆలోచన చేసి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. గతంలో వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2014-19 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎక్కడకక్కడ కడిగి పారేసేవారు. నీరు-చెట్టు స్కీమ్ కింద తెలుగు తమ్ముళ్లు రూ.13 వేల కోట్లు దోచేశారని సంచలన ఆరోపణ కూడా చేశారు.ఇప్పుడు వాటన్నిటిని మరచి పోయి టీడీపీతో స్నేహం చేయకతప్పదు. ప్రధాని మోదీనే టీడీపీ పెద్దలు దారుణంగా దూషించినా పొత్తు పెట్టుకోగా లేనిది, వీర్రాజుది ఏముందిలే అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎంపికల వల్ల టీడీపీ, జనసేనలలో కొంతమేర అంతర్గతంగా లుకలుకలు రావచ్చు. తెలంగాణలో ప్రముఖ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అధిష్టానం ఆమెను ఎంపిక చేసిందని చెబుతున్నారు. మరో నేత అద్దంకి దయాకర్ గతసారి ఎన్నికలలో తన సీటును వదలుకుని ప్రచారానికి పరిమితం అయ్యారు. అయినా టిక్కెట్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు సాధించగలిగారు. మరో సీటును శంకర్ నాయక్ అనే నేతకు కేటాయించారు.ఇంకో స్థానం సిపిఐకి కేటాయించారు. కాగా బీఆర్ఎస్ పక్షాన దాసోజు శ్రావణ్ కు ఇవ్వడం ద్వారా గతంలో ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసినట్లయింది. అప్పట్లో కేసీఆర్ నామినేట్ చేసినా, గవర్నర్ ఆమోదం జాప్యం అవడం, ఇంతలో ఎన్నికలు రావడం ,కాంగ్రెస్ గెలవడం వంటి కారణాలతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇప్పటికి ఆయనకు పదవి లభించింది. తెలంగాణలో ఈ ఎంపికలు.. ఏపీతో పోల్చితే కాస్త బెటర్ గా ఉన్నట్లే కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వెంకయ్య నాయుడు గారూ.. అవేం మాటలు?
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు. మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాత్రం చర్చ జరగాల్సిందే. ఎన్నికల్లో గెలిచేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలివ్వడం.. ఆపై వాటిని విస్మరించడం వంటి అంశాలపై వెంకయ్య నాయుడు తన అభిప్రాయం చెప్పకుండా.. చేయగలిగిన పనులపైనే ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యకు అర్థమేమిటి?. ఎన్నికల హామీలు పట్టించుకోవద్దని చెప్పడమే అవుతుంది కదా?. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య నాయుడు(M Venkaiah Naidu).. రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటున్నారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యకలాపాల్లో భాగస్వామి అవుతుంటారు. ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని ప్రతీతి. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. అయితే.. కొన్ని దశాబ్దాలుగా మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయాలేవీ ఆయన చెప్పినట్లు కనిపించదు. 👉ఇటీవల వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు(Chandrababu)ను అభివృద్ది కాముకుడిగగా ప్రశంసించారు. అయితే సూపర్సిక్స్తోపాటు 150 ఇతర హామీలు ఇవ్వడంలో ఆయనకు ఏ అభివృద్ధి కాముకత కనిపించిందో తెలియదు. ఏదో రకంగా మిత్రుడు గెలిచారన్న ఆనందం ఉంటే ఉండవచ్చు??. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేస్తోందా? లేదా? అనేది ఆయనకు తెలియకుండా ఉంటుందా!. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హామీలు అమలు చేయాలని సూచించాల్సిన వెంకయ్య.. చేయగలిగిన పనులపైనే దృష్టి పెట్టాలని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది కదా. 👉చంద్రబాబు ఆలోచనలు మంచివని వెంకయ్య సర్టిఫికెట్ ఇస్తూ.. అవి చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అవి ఏరకంగా ఉంటాయి? సూపర్‌సిక్స్‌తో సహా అనేక వాగ్దానాలు చేయడంలో ఉన్న మంచి ఆలోచనలు ఏమిటో కాస్త వివరంగా చెప్పి ఉంటే జనానికి కూడా బాగా అర్థమయ్యేది కదా?. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని టీడీపీ, జనసేనలు ఎన్నికల హామీ ఇచ్చాయి. కాని తాజాగా ప్రవేశపెట్టన బడ్జెట్లో ఆ ఊసే ఎత్త లేదు. ఇది మంచి ఆలోచనా కాదా? అదే కాదు..నిరుద్యోగులకు రూ.3,000 భృతి ఇస్తామని,.. వలంటీర్లకు జీతం రూ.10,000 చేస్తామని రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, బలహీన వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని.. పలు వాగ్దానాలు చేశారు. ఇవన్నీ చంద్రబాబులో వచ్చిన మంచి ఆలోచనలే అని వెంకయ్య చెప్పదలిచారా?.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల వరకు ఉండొచ్చు. కేవలం సూపర్ సిక్స్ హామీలకే రూ.79,179 కోట్లు అవసరమవుతాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.17,179 కోట్లే కేటాయించడం మంచి ఆలోచనేనని వెంకయ్య చెబుతారా?. 👉విద్య సంగతి ఎలా ఉన్నా మద్యం బాగా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం తీరు చూసి వెంకయ్య నాయుడు పరవశిస్తున్నారా?. చంద్రబాబు మాతృబాషలోనే విద్యా బోధన జరగాలని అన్నందుకు వెంకయ్య సంతోషించారు. విద్యాబోధన పదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరగాలని అన్నారు. మరి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందో, లేదో వెంకయ్య అడిగి తెలుసుకుని ఉండాలి. అలాగే చంద్రబాబు మనుమడు కాని, ఆయన బంధుమిత్రులలో ఎందరు తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారో ఆరా తీసుకుని మెచ్చుకుని ఉంటే బాగుండేది కదా!. 👉ఇక్కడే సమస్య వస్తోంది. తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసే చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల కుటుంబాలలో ఎంతమంది దానిని పాటిస్తున్నారో ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు. కేవలం పేదలు, బలహీన వర్గాల వారు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియం ఉండాలని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. సోషల్ మీడియాను అదుపులో పెట్టకపోతే పరిణామాలేమిటో ఏపీలో చూశామని, దాని పరిణామాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు కూడా ఏదో తెలుగుదేశం నాయకుడు మాట్లాడినట్లే స్పీచ్ ఇవ్వడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా ఈయన ఎన్నడైనా నోరు తెరిచారా? అప్పుడేమో భావ వ్యక్తికరణ స్వేచ్చ అని చంద్రబాబు.. ఎల్లో మీడియా ప్రచారం చేశారే. సీఎంగా ఉన్న జగన్‌ను పట్టుకుని బూతులు తిట్టినా కేసులు పెట్టడానికి వీలులేదని వాదించారే. ఆ విషయాలు వెంకయ్య నాయుడుకు తెలియకుండా ఉంటాయా? 👉అధికారంలోకి వచ్చాక సైతం వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వారు ఎంత అరాచకంగా వ్యవహరిస్తునేది ఆయన తెలుసుకోలేక పోతున్నారు. కావాలంటే టీడీపీ వారు పెట్టిన బండబూతుల పోస్టింగులు చూడాలని ఆయన భావిస్తే.. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటివారు పంపిండానికి సిద్దంగా ఉంటారు. అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివి అవి రాసే పచ్చి అబద్దాలనే ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఉప రాష్ట్రపతి పదవి చేసిన పెద్దాయన ఎవరూ అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని అన్ని పార్టీల వారికి చెప్పాలి కాని, ఒకవైపే మాట్లాడడం సమంజసం అనిపించదు.👉అంతెందుకు జగన్ ప్రభుత్వం(Jagan Government)పై ఎన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తెలియదా?. వెంకయ్య నాయుడుకు అవి సూక్తి ముక్తావళిలా నిపించేవేమో తెలియదు. అప్పులపై చంద్రబాబు, పవన్, పురందేశ్వరి తదితరులు చేసిన పచ్చి అబద్దాలు ఇప్పుడు ఆధార సహితంగా కనిపిస్తున్నాయే. అసెంబ్లీ సాక్షిగానే స్వయంగా ఆర్థిక మంత్రి కేశవ్ అవి అబద్దాలని అంగీకరించారే. అలా ఆర్గనైజ్డ్గా మూడు పార్టీల నేతలు అబద్దాలు ప్రచారం చేయడం నేరమో, కాదో వెంకయ్య నాయుడు చెప్పగలిగి ఉంటే బాగుండేది. వైఎస్సార్సీపీ వారికి పనులు చేయవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడును అభివృద్ధి కాముకుడని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి?. కనీసం అలాంటి వివక్ష వద్దని చంద్రబాబుకు సలహా ఇవ్వలేక పోయారే! ఏది ఏమైనా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వెంకయ్య నాయుడు.. ఏపీలో ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీని సమర్థిస్తున్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అరాచక పరిస్థితులపై స్పందించ లేకపోవడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాలా వ్యాఖ్యాత. -
ఏంటి సీనియర్ మరీ ఇలా చేశారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు అవసరాన్ని బట్టి మారిపోతుంటాయి. ప్రజలకోసం ఇలా మాటమారిస్తే ఓకే కానీ.. ఆయనెప్పుడు రాజకీయాల కోసమే ఇలా చేస్తూంటారు. కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ఉపన్యాసాలను పరిశీలిస్తే.. పొంతన లేకుండా కనిపిస్తాయి. ఒకపక్క దేశం మొత్తమ్మీద నియోజకవర్గాల పునర్విభజన కోసం రంగం సిద్ధమవుతూంటే.. దానిపై ఆయన తన స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇదెలా ఉందంటే.. కడుపు నొప్పి అంటే తలనొప్పికి మందు ఇచ్చినట్లుగా ఉంది!. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సక్రమంగా చేపట్టని కారణంగా పెరుగుదల ఎక్కువ ఉందని.. ఫలితంగా వారికి అక్కడ ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు అందుబాటులోకి వస్తున్నాయన్న భావన చాలామందిలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలు అధిక జనాభాతో వచ్చే ముప్పును ముందుగానే గుర్తించి నియంత్రణ సమర్థంగా నిర్వహించినందుకు ఇక్కడి సీట్లలో పెద్దగా మార్పుల్లేకుండా పోనున్నాయి. 👉ఈ అంశంపై తమిళనాడు, కర్ణాటక, తలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేయగా.. చంద్రబాబు మాత్రం దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒకడుగు ముందుకేసి నియోజకవర్గాల పునర్విభజన ఇదే పంథాలో సాగితే దక్షిణాది తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఇప్పటికే ఎక్కువగా ఉందని.. సీట్లు పెరిగితే వారి ఆధిపత్యం మరింత పెరిగిపోతుంది. పార్లమెంటులోని ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లను 753కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దక్షిణాదిలో ప్రస్తుతం 129 సీట్లు ఉండగా.. డీలిమిటేషన్ తరువాత అత్యధికంగా 144 స్థాయికి చేరవచ్చు. ఏపీ, తెలంగాణల్లో చెరో మూడు సీట్లే పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో ఒక సీటు తగ్గుతుందట!. తమిళనాడులో రెండు సీట్లే పెరుగుతాయి. కర్ణాటకలో మాత్రం ఎనిమిది సీట్లు ఎక్కువ కావచ్చు. ఫలితంగా కొత్తగా ఏర్పాటయ్యే సీట్లను కలుపుకుని చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం ప్రస్తుతమున్న 24 శాతం నుంచి నుంచి 19 శాతానికి పడిపోనుంది. 👉డీలిమిటేషన్ పూర్తి అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 స్థానాలు పెరిగి మొత్తం సంఖ్య 128 స్థానాలకు చేరనుంది. బీహార్ పార్లమెంటరీ స్థానాలు కూడా 40 నుంచి 70కి చేరతాయి. మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 అవుతాయి. ఈ రకమైన పరిస్థితి వల్ల ఉత్తరాది గుత్తాధిపత్యం అధికం అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదిక కాకుండా 1971 నాటి లెక్కలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కొందరు మేధావులు విస్తీర్ణం ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే ఈ సమస్య కొంత తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులలో సీనియర్ చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం దీనిపై విభిన్నంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలు ఎక్కువమంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. 2026 డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ సీట్లలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు అంతా బాధ పడుతుంటే చంద్రబాబు జనాభాను పెంచండని చెప్పి అసలు సమస్య జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. 👉గతంలో.. ఇదే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉత్తరాది రాష్ట్రాలు సరిగా పనిచేయడం లేదని, అందువల్ల వాటికి అధిక నిధులు ఇవ్వరాదని చెప్పేవారు. బాగా పనిచేస్తున్న ఏపీ తదితర రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసేవారు. ఆ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ లేకపోవడాన్ని ఆక్షేపించేవారు. కాని అన్ని అంశాలలో మాదిరే చంద్రబాబు ఇక్కడ కూడా యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. 👉కేంద్రంలోని బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితిలో లేరు. ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం సీట్లపై ఆధారపడి ఉన్నా, చంద్రబాబు ఎందువల్లో ఎక్కువగా భయపడుతున్నారేమో అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అందుకే ధైర్యంగా డీలిమిటేషన్లో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై గొంతెత్తలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకంగా ఆంధ్రతో సహా దక్షిణాదిని అవమానించడమే కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 👉జనాభా పెంచే విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలట. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ఉంది కనుక, వారికి ఎక్కడ అసంతృప్తి వస్తుందో అని ఆయన మాట్లాడకపోగా అర్జంట్‌గా పిల్లలను కనండని చెబితే ఏమి చేయాలి? నిజంగానే ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా జనాభాను పెంచితే ఎవరు పోషించాలి? చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసే హామీలను నమ్మి ప్రజలు ఎలా మోసపోతున్నారో అంతా గమనిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ఓ పాతికేళ్లకు దక్షిణాదిలో జనాభాను పెంచినా, అప్పటికి ఉత్తరాదిలో ఇంకా జనాభా పెరిగిపోతుంది కదా!. అందువల్ల ఆయన చెబుతున్న తర్కంలో హేతుబద్దత కనిపించదు. ఉత్తరాది, దక్షిణాది మధ్య ఒక సమతుల్యత రావడం అవసరం కాదా? దానిని వదలి ఉత్తరాది రాష్ట్రాల వారు దేశాన్ని కాపాడుతున్నారట.. అంటే దక్షిణాది వారు కాపాడడం లేదని చెప్పడమా?. తమిళనాడు సీఎం డిమాండ్‌పై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. వచ్చే ఏడాది పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అంతా చెబుతుంటే, ఇప్పుడు పిల్లలను కని జనాభాను పెంచండి అని అనడంవల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో చంద్రబాబే చెప్పాలి. ఏది ఏమైనా.. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలకన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడడంలో చంద్రబాబు పాత్ర తీసుకోకపోతే చరిత్ర ఆయనను క్షమిస్తుందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కోడిగుడ్డుపై ఈకల కోసం.. షాడో సీఎం పాకులాట
తమకు గిట్టనివారిపై కక్ష ఎలా తీర్చుకోవాలో, తమకు కావల్సిన వారిని ఎలా అందలం ఎక్కించాలో తెలుసుకోవాలంటే ఏపీకి వెళ్లాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు కచ్చితంగా కేస్ స్టడీ అవుతాయి. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించే తీవ్రవాద పార్టీలు రాజ్యంపై దాడులు చేస్తుంటాయి. కానీ, చిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ కూటమి ప్రజలపై, ప్రతిపక్షంపైన ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, సినిమా కళాకారులను సైతం వదలడం లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వేధింపులకు దిగుతోంది.షాడో సీఎంగా భావిస్తున్న నారా లోకేష్ తీసుకు వచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో సీఐడీ అధిపతిగా పనిచేసిన దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం శోచనీయం. దానికి ప్రభుత్వం చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గత ప్రభుత్వ సమయంలో అనధికారికంగా విదేశాలకు వెళ్లి వచ్చారట. ఆయన అలా టూర్ చేసినప్పుడు సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందట. బహుశా ఇలాంటి పిచ్చి కారణంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ.. ఏ అధికారిపైనా ఇలాంటి చర్య తీసుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లడం, రావడం కూడా జరిగి కొన్నేళ్లు అయింది. ఎప్పుడూ ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆయన వల్ల దేశానికి, లేదా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం ఏదీ బయటకు వెళ్లినట్లు ఆరోపణలు రాలేదు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. నిజంగా మన దేశ ప్రముఖులు ఎవరైనా కీలక సమాచారం లీక్ చేసే అవకాశం ఉందనుకున్నా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం ఉంటే వెంటనే చర్య తీసుకుంటుంది. అలాంటిది ఏమీ జరగలేదు. పైగా రాష్ట్రాలలో అంత ప్రమాదకరమైన సున్నిత సమాచారం ఏదీ ఉండదు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న సునీల్ కుమార్‌కు ఆ మాత్రం తెలియకుండా ఉండదు. అసలు కారణం ఏమిటంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పలు స్కాంలను పరిశోధించి, సాక్ష్యాధారాలతో సహా పలు కేసులు పెట్టడంలో సునీల్ కుమార్ ముఖ్య భూమిక పోషించారన్నది టీడీపీ పెద్దలకు ఉన్న కోపం. ఆ కేసులలో పనిచేసిన అప్పటి అధికారులు పలువురిపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. అంతేకాక డీజీపీ ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేసి కూర్చోవాలని ఆదేశించింది. దీనిని రిటైర్డ్ ఐపీఎస్‌లు ఖండించారు కూడా. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.ఇక సునీల్ కుమార్‌పై ఏవైనా ఆరోపణలు చేసి కేసులు పెట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసి ఉంటుంది. ఇందుకోసం ఇద్దరు, ముగ్గురు రిటైర్డ్ పోలీసు అధికారులకు బాధ్యత అప్పగించిందని కూడా వార్తలు వచ్చాయి. అయినా సునీల్ కుమార్‌పై స్కాంల ఆరోపణలు చేయడానికి అవకాశం వచ్చినట్లు లేదు. దాంతో రెడ్ బుక్ సృష్టికర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి దళిత ఐపీఎస్ అధికారిని ఈ రకంగా సస్పెండ్ చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వస్తోంది. తీరా చూస్తే సునీల్ కుమార్ అనధికారంగా విదేశీ యాత్రలు చేయలేదని వెల్లడవుతోంది. ఆయన ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకునే విదేశీ టూర్‌కు వెళ్లారు. ఆయన వ్యక్తిగత హోదాలోనే వెళ్లారు. అందుకు సొంతంగానే ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం వద్ద ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉంటే దానికి సంబంధించి ముందుగా సునీల్ కుమార్‌కు నోటీసు ఇవ్వాలి. కానీ, ఆ పని చేయకుండా సస్పెండ్ చేశారంటేనే అందులోని దురుద్దేశం అవగతమవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.సీనియారిటీ, ట్రాక్ రికార్డు రీత్యా ఏపీకి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నందున, కేంద్రానికి తప్పుడు నివేదిక పంపేందుకు ఇలా సస్పెండ్ చేసి ఉండవచ్చని కొందరు రిటైర్డ్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వం, ఒక చిన్నస్థాయి అధికారి పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించిందో చూడండి. గతంలో చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిపై స్కిల్ స్కాం కేసులో అభియోగాలు వచ్చాయి. ఆయనను విచారించాలని అప్పట్లో సీఐడీ తలపెట్టింది. దానిని గమనించిన తెలుగుదేశం పెద్దలు అతనిని ఢిల్లీ నుంచి చెప్పా పెట్టకుండా అమెరికాకు పంపించేశారని అంటారు. దాంతో విచారణకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ, కూటమి అధికారంలోకి రావడంతోనే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా మొత్తం జీతభత్యాలను చెల్లించేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.అంతేకాదు, ఈయన ఇంటిపై కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నట్లు అప్పట్లో సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేసును విజయవంతంగా మేనేజ్ చేసుకున్నారు. అది వేరే సంగతి. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎలా ఎత్తివేస్తుందంటే ఏమి చెబుతాం. అదంతే.. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర భూషణ్ అనే అధికారి టీడీపీ హయాంలో 2018లో అనుమతులు లేకుండానే విదేశాలకు వెళ్లి వచ్చారట. తదుపరి ఏడాదికి ఆయన తిరిగి వస్తే, అప్పటి ప్రభుత్వం విదేశీ యాత్రలకు ఆమోదం తెలిపిందంట. దీనిపై ఎవరు వివరణ ఇవ్వాలి?. గతంలో ఒక డాక్టర్ రోడ్డుపై నానా రచ్చగా వ్యవహరించి, పోలీసుల మాట వినకుండా ప్రవర్తిస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ ఉదంతాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ, దళితులకు ఇంత అవమానం చేస్తారా అంటూ దుష్ప్రచారం చేశారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఆనాటి ప్రభుత్వంపై విష ప్రచారం సాగించింది.ఇప్పుడేమో ఒక దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై మాత్రం ఇంత దారుణంగా కక్ష కట్టారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మంచి పేరున్న ఒక దళిత అధికారిని విద్వేషపూరితంగా సస్పెండ్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇది కేవలం కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని అన్నారు. సునీల్ కుమార్ ఏమైనా గూఢచారి విభాగంలో ఉన్నారా, ఆయన ప్రతీ మూమెంట్ చెప్పడానికి అని ప్రశ్నించారు. ఆయనకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు. సునీల్ ప్రజల ధనంతో టూర్ కు వెళ్లలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రజల సొమ్ముతో ఎలా విదేశాలు తిరిగి వస్తున్నారని, వారిద్దరి టూర్ షెడ్యూల్ వెల్లడించాలని, ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో తెలుస్తుందని కూడా ప్రవీణ్ సవాల్ చేశారు.దళిత వర్గాల వారి పిల్లలు విదేశాలలో చదువుకోవద్దా?. ఆ పిల్లలను చూడడానికి దళితులు వెళ్లవద్దా?. ఆధిపత్య వర్గాలే విదేశాలకు వెళ్లాలా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు ఉండదు. గూఢచర్య పరికరాల కొనుగోలు కేసులో ఆరోపణలు ఉన్న ఒక అధికారిని గత ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, కూటమి ప్రభుత్వం దానిని ఎత్తివేయడమే కాకుండా, మొత్తం జీతం కూడా చెల్లించింది. అంత పెద్ద ఆరోపణ ఉన్నా తమకు మద్దతు ఇస్తున్నందున ఆ అధికారిపై కేసు ఎత్తివేయడం ఒకవైపు చేస్తూ, తమకు గిట్టని మరో అధికారిపై ఏదో ఒక పిచ్చి కారణం చూపి కేసులు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతోంది. దళిత సంఘాలు ఈ పరిణామాలపై మండిపడుతున్నాయి. తెలుగుదేశం నేతలకు గత హయాంలో తప్పుడు కేసులు పెట్టారన్న సందేహం వస్తే దానిపై విచారణ చేయవచ్చు. ఆ స్కాంల ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఇలా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారి కుంభకోణాలను సమర్ధంగా వెలుగులోకి తీసుకువస్తే ఇలాంటి కక్షలు ఎదుర్కోవలసి వస్తుందన్న భయం అధికారవర్గంలో ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి, సమాజానికి, అధికార వ్యవస్థకు ఎంత ప్రమాదమో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి పెద్దలు.. ష్.. గప్‌చుప్..!
ఏపీలో అధికార కూటమి అపరాధ భావనతో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన పక్షం.. విపక్ష వైఎస్సార్సీపీ ఆత్మస్థైర్యంతో సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు సైతం చెప్పలేకపోతోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజల తరపున వేస్తున్న ప్రశ్నలకు కూటమి పెద్దలు గుటకలు మింగుతున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఎన్నికలకు ముందు చెప్పిన అబద్దాలను ప్రజల ముందు ఉంచడంలో జగన్ సఫలమయ్యారు. జగన్ తాజా మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్‌ల అసత్యాల చిట్టాను బయటపెట్టిన తీరు ఆసక్తికరంగా ఉంది. ప్రతిదానికి ఆధార సహితంగా ఆయన మాట్లాడారు. గతంలో జగన్ సీఎంగా ఉండగా చంద్రబాబు, పవన్‌లు ఆధారాలతో నిమిత్తం లేకుండా నోటికి వచ్చిన అబద్దాలు ఆడారన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టమవుతోంది. జగన్ మాటలు వింటే వీరిద్దరు అపరాధ భావనతో కుంగిపోవాలి. అబద్దాలతో ప్రజలను మోసం చేశామన్న సంగతి తెలిసిపోతుందే అని సిగ్గుపడాలి. అయితే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కనుక వారు అలాంటివాటిని పట్టించు కోకపోవచ్చు!. అయితే..ఏపీ బడ్జెట్ ఎంత డొల్లగా ఉన్నది, టీడీపీ, జనసేనలు తాము చేసిన వాగ్దానాలకు ఎలా తూట్లు పొడిచింది కళ్లకు కట్టినట్లు జగన్ వివరించే యత్నం చేశారు. అప్పుల గురించి బడ్జెట్ పత్రాలలోను, సామాజిక, ఆర్ధిక సర్వేలోను ఇచ్చిన అంకెలను వివరించి కూటమిని నిలదీశారు. కూటమి ప్రతినిధులుగా పనిచేసే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కూడా జగన్ చేసిన వ్యాఖ్యలపై నోరు మెదపలేకపోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ఏపీ అప్పుల కుప్ప అయిపోయిందని, శ్రీలంక మాదిరి అవుతోందని టీడీపీ, జనసేనలతో పాటు ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేశాయి. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేసినా, రూపాయి ఆదాయం లేకపోయినా జగన్ సమర్థంగా పనిచేశారన్న సంగతి ప్రజలకు బాగా అర్ధమైంది. ఇక.. తెలుగుదేశం తన వెబ్సైట్లో జగన్ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసింది. చంద్రబాబు, పవన్ ,లోకేష్‌లు పది నుంచి రూ.14 లక్షల కోట్ల వరకు తమకు తోచిన అంకెలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అవకాశం ఉన్న ప్రతిసారి నీచమైన రీతిలో పిచ్చి లెక్కలు, నిపుణుల పేరుతో దిక్కుమాలిన వాళ్లందరిని పోగు చేసి విష ప్రచారం చేసింది. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు వాస్తవాలు ఒప్పుకోక తప్పలేదు. 👉ప్రభుత్వ గణాంకాల ప్రకారమే జగన్ ప్రభుత్వ టర్మ్ పూర్తి అయ్యేనాటికి అప్పు రూ.4.92 లక్షల కోట్లుగా వెల్లడైంది. ఇందులో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు సుమారు రెండు లక్షల కోట్లు, విభజన నాటికి ఉన్న అప్పు రూ.95 వేల కోట్లు కూడా ఉంది. అంటే జగన్ టైమ్ లో రెండు లక్షల కోట్ల మేరే బడ్జెట్ అప్పులు చేసినట్లు అర్థమవుతుంది. కాని ఈనాడు 2023 ఫిబ్రవరి 14న ఒక కథనాన్ని ఇస్తూ పార్లమెంటులో అప్పటికి రూ.4.24 లక్షల కోట్ల అప్పే అని చెప్పినా, ఏపీ అప్పు రూ.9.25 లక్షల కోట్లు అని, మిగిలిన అప్పులను జగన్ రహస్యంగా దాచేశారని పిచ్చి వాదన చేసింది. అది నిజమే అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది కదా! ఆ రహస్య అప్పులేవో బయటపెట్టి ఉండవచ్చు కదా! అంటే అప్పుడు కావాలని అబద్దాలు ప్రచారం చేసి పాఠకులను ఈనాడు ,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మోసం చేసినట్లే కదా! 👉ఈ విషయంపై జగన్ కాగ్, ఆర్థిక సర్వేలలోని అంకెలను చూపుతూ ప్రశ్నించారు. దానికి అటు టీడీపీ నుంచి కాని, ఇటు ఎల్లో మీడియా నుంచి కాని సౌండ్ లేదు. అంతేకాదు... ఇప్పుడు ఏ సంక్షోభం లేకపోయినా, అప్పుడే చంద్రబాబు సర్కార్ రూ.70 వేల కోట్ల అప్పు చేయగా, మరో రూ.డెబ్బైవేల కోట్ల అప్పు సమీకరిస్తోంంది. ఇక సూపర్ సిక్స్‌కు గుండుసున్నా అంటూ కూటమి ఇచ్చిన ఒక్కో హామీని చదివి వినిపిస్తూ జగన్ అస్త్రాలు సంధించారు. అయినా కూటమి నేతలు, ఎల్లో మీడియా కిక్కురుమనలేదు.ఇవే కాకుండా ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు, పవన్ లు కలిసి చేసిన 143 వాగ్దానాలకు సంబంధించి కూడా ప్రశ్నలు వేశారు. సూపర్ సిక్స్ హామీలకే రూ.79179 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం రూ.17,179 కోట్లు కేటాయించడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఆర్ధిక మంత్రి కేశవ్ వివరణ ఇవ్వలేకపోయారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ.18 వేలు ఇప్పటికే బాకీ పడ్డారని, వచ్చే ఏడాది కూడా ఇవ్వడం లేదని బడ్జెట్ ద్వారా తేలిపోయిందని, దాంతో అది రూ.36 వేలు అయిందని ఆయన చెప్పారు. అలాగే నిరుద్యోగులకు కూడా అదే ప్రకారం రూ.72 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున బాకీ పడ్డారని అంటూ ఆయా స్కీముల పరిస్థితి, ప్రజలు ఏ మేర కూటమి చేతిలో మోసపోయింది ఆయన విశ్లేషించి చెప్పారు. ఫించన్వెయ్యి రూపాయలు పెంచినా నాలుగు లక్షల పెన్షన్లలో కోత పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ హామీ ఏమైందని అడిగారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ చిన్నదే అయినా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదని, ఆయన కడుతున్న అమరావతిని రాయలసీమ నుంచి కూడా ఉచిత బస్‌లలో వచ్చి చూద్దామనుకున్న మహిళలకు నిరాశ మిగిల్చారని జగన్ ఎద్దేవ చేయడం ఆసక్తికరంగా ఉంది. అలాగే అమరావతి గురించి ప్రస్తావిస్తూ అధికారం వచ్చింది కనుక, వారు తాము అనుకున్న విధంగా నిర్మాణం చేసుకోవచ్చని, కాని అందులో కూడా అబద్దాలు చెప్పడం ఏమిటని అన్నారు. అమరావతి రాజధానికి ప్రభుత్వ డబ్బు రూపాయి వ్యయం చేయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు, అప్పుల కింద రూ.31 వేల కోట్లు ఎలా తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. దీని గురించి కూడా చంద్రబాబు కాని, మున్సిపల్ మంత్రి నారాయణ కాని నోరు విప్పడం లేదు. 👉వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దని చంద్రబాబు చెప్పడంపై జగన్ మండిపడ్డారు. అలా అన్నందుకు చంద్రబాబును తక్షణమే పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌కు సూచించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కలిసిపోయారట. తనకు చంద్రబాబుతో వైరం ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని దగ్గుబాటి అన్నారు. మరో వైపు చంద్రబాబు అసలు వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దని ఎలా చెబుతున్నారు. చివరికి వైఎస్సార్సీపీ వారికి టీడీపీ వారు ఎవరైనా బంధువులు ఉన్నా, వారు కలుసుకున్నా పార్టీలో ఒప్పుకోవడం లేదట. చంద్రబాబు, దగ్గుబాటి కలవవచ్చు కాని, వేర్వేరు పార్టీలలో ఉన్న బంధువులు కలిస్తే తప్పని టీడీపీ నాయకత్వం ప్రచారం చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. టీడీపీ క్యాడర్ ఈ పరిణామాన్ని గుర్తించి, వైఎస్సార్సీపీలో లేదా ఇతర పార్టీలలో ఉన్న తమ బంధువులతో గొడవలు పడవద్దని సలహా ఇవ్వాలి. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న డైలాగును జగన్ వాడుకుని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు బడ్జెట్లో ఉన్న అంకెల గారడీని విడమరిచి చెప్పగలిగారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఎక్కువగా ఉండడంతో వారు వీటిని ప్రస్తావిస్తుంటే మంత్రి లోకేష్తోసహా ఏ మంత్రి కూడా నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. దాంతో కూటమి సర్కార్ ప్రతిష్ట దెబ్బతింటుండడంతో ఎర్రబుక్ పేరుతో వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెడుతున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తమ వద్ద మంత్ర దండం లేదని చెబుతూ, చంద్రబాబు బ్రాండ్ ఉందని అన్నారు. చంద్రబాబు బ్రాండ్ అంటే అబద్దాలు చెప్పడమా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేరు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోయినా, అక్కడ మాట్లాడకపోయినా అవే విషయాలను మీడియా సమావేశం పెట్టి వివరించడం ద్వారా చంద్రబాబు, పవన్ ,లోకేష్ లను ఆత్మరక్షణలో పడేశారని చెప్పక తప్పదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అధికార పక్షాలకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు!
శాసనమండలికి ఇటీవల జరిగిన ఎన్నికలు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణల్లోని అధికార పక్షాలకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాయి! ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందినా కీలకమైన ఉపాధ్యాయ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం ముఖ్యమైన రాజకీయ పరిణామమే అవుతుంది. ఈ ఓటమి కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర టీచర్ల అసంతృప్తికి ప్రతీక.మరోవైపు ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు కూడా కాంగ్రెస్‌కు ఇబ్బంది పెట్టేదే. పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి ఆయా వర్గాలు దీనిని అవకాశంగా తీసుకోవచ్చు. టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన పోటీలో లేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నా, ఒక స్థానంలో బీజేపీ బహిరంగంగా బలపరిచిన వ్యక్తి గెలవడం మాత్రం అధికార పార్టీకి మంచి సంకేతం కాదు. మరో స్థానంలో పీఆర్టీయూ తెలంగాణలో అధికారంలోకి రావాలని యత్నిస్తున్న బీజేపీకి ఇది కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం, ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం వల్ల రాజకీయ సమీకరణలు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాయని చెప్పలేం.ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్ధి రఘువర్మకు బహిరంగంగానే మద్దతు ప్రకటించాయి. అధికారిక ప్రకటనలు కూడా చేశాయి. కాని బీజేపీ మద్దతివ్వకపోవడం గమనించవలసిన అంశమే. స్వతంత్ర అభ్యర్ధిగా పీఆర్టీయూ పక్షాన పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు వర్మను ఓడించడంతో కూటమికి దిమ్మదిరిగినంత పనైంది. ప్రభుత్వ ఉద్యోగులలో ఏర్పడిన అసమ్మతికి ఇది నిదర్శనమన్న భావన ఏర్పడింది. గత జగన్ ప్రభుత్వంలో టీడీపీ, జనసేనలు ప్రభుత్వ టీచర్లను విపరీతంగా రెచ్చగొట్టాయి.ప్రతి నెల మొదటి తేదీకల్లా జీతాలు ఇవ్వడం లేదని, స్కూళ్లలో విద్యార్థులకు అజమాయిషీ బాధ్యతలు అప్పగించి ఇబ్బంది పెడుతున్నారని దుష్ప్రచారం చేశాయి. సీపీఎస్ రద్దు పై పరిశీలన చేస్తామని, డీఏ బకాయిలు ఇస్తామని,.. ఇలా రకరకాల హామీలను గుప్పించారు. విద్యా వ్యవస్థకు జగన్ ప్రభుత్వం ఎంతో గుర్తింపు తెచ్చినా, ఒక ఐఏఎస్ అధికారి కొంత కఠినంగా వ్యవహరించారన్న భావన అప్పట్లో టీచర్లలో ఉండేది. దానివల్ల కూడా అప్పట్లో వైఎస్సార్సీపీకి కొంత నష్టం జరిగింది.శాసనసభ ఎన్నికలలో ఆ మేరకు కూటమి లబ్ది పొందింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఇచ్చిన హామీలు నెరవేరతాయని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆశించాయి. కాని ప్రభుత్వంలో వీరిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. పీఆర్సీ ఊసే ఎత్తలేదు. ఇక మధ్యంతర భృతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? సీపీఎస్ బదులు జగన్ ప్రభుత్వం జీపీఎస్ తీసుకు వస్తే విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు ప్రభుత్వంలోకి వచ్చాక దానినే కొనసాగిస్తున్నాయి. అంతేకాక సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారన్న భావన ఎటూ ఉంది.రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏపీలో కూటమి సాగిస్తున్న విధ్వంసాన్ని, అరాచక పరిస్థితులను టీచర్లు గమనించి కూడా ఈ ఫలితాన్ని ఇచ్చారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికలో టీచర్లు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని టీడీపీ నేతలు ఊహించలేకపోయారు. అందుకే బహిరంగంగా రఘువర్మకు మద్దతు ప్రకటించడమే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి ప్రచారం చేశారు. తీరా ఓటమి చవిచూసిన తర్వాత వెంటనే టీడీపీ గాత్రం మార్చేసింది. గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు కూడా తమ అభ్యర్ధేనని కొత్త వాదనను తెచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు తాము ఇద్దరు అభ్యర్ధులకు మద్దతు ఇచ్చామని చెప్పగా, శ్రీనివాసులు నాయుడు అలాగా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి గాలి తీశారు. మరో వైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వర్మకు మద్దతుగా చేసిన వీడియోని అంతా చూశారు. దాంతో అచ్చెన్న పరువు పోయినట్లయింది.ఇక ఎల్లో మీడియా కూడా తమ లైన్ మార్చుకున్నాయి. ఎన్నికలకు ముందు పీఆర్టీయూకు చెందిన గాదె, యుటిఎఫ్ అభ్యర్ధి గౌరి పరస్పరం సహకరించుకుని రెండో ప్రాధాన్య ఓటు విషయంలో అవగాహన పెట్టుకున్నారని రాశారు. వీరిద్దరూ కలిసినా తమకు ఎదురు ఉండదని అనుకుని బోల్తా పడ్డారు.అ క్కడికి డబ్బు, తదితర ప్రలోభాలకు తెరదీసినా, ఉత్తరాంధ్రలో టీచర్లు మాత్రం అధికార కూటమికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఫలితం తేల్చింది. రెండు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో కూటమి గెలిచినా, ఉత్తరాంధ్రలో ఓటమి చంద్రబాబును అధికంగా కుంగదీస్తుంది. తన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండగా టీచర్లు ఈ షాక్ ఇవ్వడం మరీ చికాకు కలిగిస్తుంది.కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్ధులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పి.రాజశేఖర్ లు గెలవడం కూటమి పాలనకు సర్టిఫికెట్టా అన్న చర్చ రావచ్చు. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ తీరుపై అభిప్రాయ వ్యక్తీకరణకన్నా, ఆయా అభ్యర్ధుల ప్రభావం. వారు చేసే కసరత్తు, కుల సమీకరణలు, డబ్బు వ్యయం చేసే వైనం, అధికార దుర్వినియోగం, గొడవలు సృష్టించడం, రిగ్గింగ్ వంటివి ప్రభావం చూపాయన్న భావన ఉంది. పీడీఎఫ్ అభ్యర్ధి కె.ఎస్.లక్ష్మణరావు మాచర్ల ప్రాంతంలో, మరికొన్ని చోట్ల ఎన్నికలలో అక్రమాలు ఎలా జరిగాయో సోదాహరణంగా వివరించారు.వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ ఫలితంపై వ్యాఖ్యానిస్తూ శాసనమండలి ఎన్నికలలో సైతం రిగ్గింగ్ చేయించి చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారని ఎద్దేవ చేశారు. అదే టీచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బు ఏ రకంగా పంచారో చెప్పడానికి పిఠాపురంలో బయటకు వచ్చిన వీడియోనే నిదర్శనం. ఆలపాటికి ఉన్నంత ఆర్ధిక వనరు లక్ష్మణరావుకు లేదు. పైగా ఆయన ఆ రకంగా ఖర్చు చేసే వ్యక్తి కూడా కాదు.మాచర్ల, మంగళగిరి వంటి ప్రాంతాలలో కూటమి నేతలు పోలింగ్ స్టేషన్ల వద్ద అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇది తమకు అనుకూల నిర్ణయమని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కాని వాస్తవం ఏమిటో అందరికి తెలుసు. టీడీపీ అభ్యర్ధులు గెలిచారు కనుక ఇక సూపర్ సిక్స్ ఇవ్వనవసరం లేదని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పగలుగుతారా? ఎన్నికల ప్రణాళికను అమలు చేసేశామని అంటే జనం ఒప్పుకుంటారా? ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కె.ఎస్.లక్ష్మణరావుకు మంచిపేరే ఉంది. వామపక్షాల మద్దతు ఉంది.వైఎస్సార్సీపీ నేరుగా మద్దతు ప్రకటించకపోవడం ఒక మైనస్. కానీ ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతిలో మాత్రం వైఎస్సార్సీపీ మద్దతు వల్లే లక్ష్మణరావు ఓడిపోయారని దిక్కుమాలిన రాతలు రాశారు. వైఎస్సార్సీపీ ముద్రతో విద్యావంతులు దూరం అయ్యారని పిచ్చి విశ్లేషణ చేసింది. లక్ష్మణరావుకు ఓటు వేసిన వారు విద్యావంతులు కాదని ఈ పత్రిక చెప్పదలచినట్లుగా ఉంది. పూర్తి స్వార్ధంతో ,పత్రికా విలువను గాలికి వదలి, జర్నలిజాన్ని పచ్చి వ్యాపారంగా మార్చి ఎల్లో మీడియా కథనాలు ఇస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.అలా పిచ్చి రాతలు రాసిన ఎల్లో మీడియా ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూటమి ఓటమిని మాత్రం కప్పిపుచ్చే యత్నం చేసింది. వారు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లలో కూటమి పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు ఒప్పుకుంటారా? టీడీపీ, జనసేనలు మద్దతు ఇచ్చినందునే రఘువర్మ ఓడిపోయారని కూడా విశ్లేషిస్తారా? గాదెని గెలిపించిన టీచర్లు విద్యావంతులు కాదని ఈ ఎల్లో మీడయా రాసినా ఆశ్చర్యం లేదు. మండలి ఎన్నికల ఫలితాలవల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంలో వచ్చే మార్పు పెద్దగా ఉండరు. కాని టీచర్లలో ఏర్పడిన వ్యతిరేకత సమజాంలో ఉన్న అశాంతికి అద్దం పడుతుందని చెప్పవచ్చు.ఉత్తర తెలంగాణలో టీచర్ల నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇద్దరు ముఖ్య అభ్యర్థులు బారీగా డబ్బు వ్యయం చేశారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఎన్నికలో నిజాయితీ గెలిచిందని, మోడీ నాయకత్వానికి మద్దతు లభించిందని చెబితే చెప్పవచ్చు.అది మాట వరసకే తప్ప, ఈ ఎన్నికలలో మోడీ ప్రభావంతోనే ఓట్లు వేయడం, వేయకపోవడం ఉండకపోవచ్చు.ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఉన్న బలం వారి అభ్యర్ధి మల్క కొమరయ్య, అంజిరెడ్డిల గెలుపునకు ఉపకరించి ఉండవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతంలోనే బీజేపీకి అధిక సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఇంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిథ్యంవహించారు. ఈసారి ఆయన పోటీ చేయలేదు.ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి ఓడిపోవడం, బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి గెలవడం కచ్చితంగా కాంగ్రెస్ కు షాక్ వంటిదే. ఇది ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని కనబరుస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. దీనిని సరిదిద్దుకోకపోతే రేవంత్ నాయకత్వానికి కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెడ్‌బుక్ రూల్స్‌లో పవన్ వాటా! తిలాపాపం.. తలా పిడికెడు
ఏపీలో ఎవరి మనోభావాలు ఎప్పుడు గాయపడతాయో తెలియడం లేదు. దారిన పోతున్న వాళ్లకు బుర్రలో ఓ ఆలోచన పుడుతుంది.. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదూ చేస్తారు. సదరు వ్యక్తి టీడీపీ, జనసేనలకు చెందిన వాడైతే.. యాక్షన్ తక్షణం మొదలవుతుంది కూడా. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు ఐపీఎస్ అధికారులుసహా అంతా వాయువేగంతో స్పందిస్తారు. అదే వైఎస్సార్సీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే.. దాన్ని పక్కన పడేయాల్నది రెడ్ బుక్(Red Book) ఆదేశం. ప్రముఖ నటుడు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని కృష్ణ మురళీ విషయంలో ఇదే జరిగింది. ఎప్పుడో 2017లో పోసాని తనకు ఇచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలలో ఒకటి, రెండు కులాల ప్రస్తావన ఉందట. దాన్ని ఆయన 2023లో గుర్తు చేశారట. ఆ విషయం జనసేన నేతగా చెప్పుకుంటున్న మణి అనే వ్యక్తికి సడన్‌గా గుర్తుకొచ్చింది. ఇంకేముంది.. ఫిర్యాదు రెడి.. పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లడం.. ఎవరో ఒక బందిపోటును, ఉగ్రవాదిని, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిపట్ల వ్యవహరించినట్లు ఆయన్ను అరెస్టు చేసి 15 గంటలు ప్రయాణించి మరీ తిరుపతి సమీపంలోని రైల్వేకోడూరు వద్ద ఒక పోలీస్ స్టేషన్‌కు తరలించడం... చకచకా జరిగిపోయాయి. అక్కడితో ఆగిపోయిందా.. ఊహూ లేదు. ఒక పెద్ద ఐపీఎస్ అధికారి మిగిలిన కేసులన్నిటిని పక్కన పడేసి మరీ పోసానిని తొమ్మిది గంటలపాటు విచారించారు. ఈ రకమైన ఫిర్యాదు.. వ్యవహారం రెండూ రికార్డు బుక్కులకు ఎక్కేస్తాయి. పక్కాగా! అరవై ఆరేళ్ల పోసానిని హింసించడం ద్వారా పోలీసులు రెడ్ బుక్ సృష్టికర్తలను సంతోషపెట్టి ఉండవచ్చు. కానీ.. ఆత్మ పరిశీలన చేసుకుంటే మాత్రం మనోవేదనకు గురి కాక తప్పదు. పోలీసు అధికారులందరిని తప్పు పట్టడం లేదు.పోసాని మీద పెట్టిన కేసులో సెక్షన్లు చూడండి.. సెక్షన్ 111ను న్యాయాధికారి ఆమోదిస్తే నిందితుడికి బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది. ఈ సెక్షన్ ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని పలుమార్లు ఉన్నత న్యాయ స్థానాలు హెచ్చరించాయి కూడా. పోసాని ఒక ప్రముఖ కళాకారుడు. వందకుపైగా సినిమాలకు కథలు, సంభాషణలు రాసి పేరు తెచ్చుకున్న వ్యక్తి. రాజకీయంగా కొంతకాలం ప్రజారాజ్యంలోను, ఆ తర్వాత వైఎస్సార్సీపీ లోనూ ఉన్నారు. కొంత ఆవేశపరుడు కూడా. రాజకీయ ప్రత్యర్థుల ఘాటు విమర్శలకు బదులిచ్చే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ.. చిత్రంగా ఆయన ఎవరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో వారి మనోభావాలు గాయపడినట్లు ఫిర్యాదులు రాలేదు. వారి అభిమానులో, పార్టీ కార్యకర్తలెవరికో మనోభావాలు గాయపడ్డాయట. దానిపై వారు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ గొడవలు ఎందుకులే.. అని పోసాని అసలు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి, ఇంటికే పరిమితం అయ్యారు. అయినా రెడ్ బుక్ టార్చర్ ఆగదట. ఆ విషయాన్ని ఆ బుక్ సృష్టికర్తలే చెప్పారు. పోసానిపై ఆ కేసులు కాకుండా, మరో కొత్త కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ కేసు వివరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2017లో నంది అవార్డును తిరస్కరించి తన అభిప్రాయాలు చెప్పడం ఏమిటి? దానిపై జనసేన నేత ఎవరికో ఇప్పుడు బాధ కలగడం ఏమిటి? అసలు ఆయనకు ఈ కేసుతో ఏమి సంబందం? అంతేకాదు.. వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి చెబితే ఆ భాష వాడారని ఎల్లో మీడియాకు లీక్. దీనిని ఎవరైనా నమ్ముతారా? కేవలం వైసీపీ ముఖ్యనేతలను వేధించాలన్న తలంపు కాకపోతే. టీడీపీ, జనసేన, బీజెపి కూటమి కొత్త ట్రెండ్ సృష్టించింది. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వస్తే కేసులు ఎలా పెట్టవచ్చు.. ఒకటికి పది పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎలా తిప్పవచ్చు? పిచ్చి కేసులనైనా ఎలా హ్యాండిల్ చేయవచ్చు? ఒక కేసులో బెయిల్ వస్తే, మరో కేసులో ఎలా అరెస్టు చేయవచ్చు? అన్నది నేర్పినట్లుగా ఉంది. రెడ్ బుక్ అంటే ఈ పిచ్చి యవారాలు చేయడమా అన్న భావన కలిగినా మనం చేయగలిగింది లేదు. ఎప్పుడో నంది అవార్డులపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం మీద ఒక ఐపీఎస్ అధికారి తొమ్మిది గంటలు విచారణ చేశారంటే ఏమని అనుకోవాలి. కేవలం పోసానిని హింసించడం తప్ప మరొకటి అవుతుందా? పోసాని రిమాండ్ పై తెల్లవారుజాము వరకు గౌరవ న్యాయాదికారి వద్ద వాదనలు జరిగాయి. న్యాయాధికారి ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదని చెప్పడం సమంజసంగానే ఉన్నా, ఆ తర్వాత రిమాండ్ కు పంపడం ఎందుకో అర్దం కాదు. ఏడేళ్ల శిక్ష పడే కేసులు అయితేనే రిమాండ్ కు పంపాలన్నది ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన గైడ్ లైన్ అని వైఎస్సార్సీపీ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు. దానిని గౌరవ కోర్టు పట్టించుకోలేదని ఆయన చెబుతున్నారు. దీనిపై పై ఏమి చేయాలో ఆలోచిస్తున్నామని అన్నారు. లీగల్ పండితుల సంగతేమో కాని, సాధారణ పౌరులకు మాత్రం ఇక్కడే కొన్ని విషయాలు అర్థం కాలేదు.గతంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన కుటుంబంపైన, మంత్రులపైన ఎవరైనా నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్టులు జరిగితే ఆ కేసుల్లో నిందితులలో కొందరిని రిమాండ్ కు పంపకుండా బెయిల్ ఇచ్చి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి అప్పటి మంత్రి రోజాను ఉద్దేశించి దారుణమైన అవమానకర వ్యాఖ్య చేస్తే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ఆయనకు వెంటనే బెయిల్ లభించింది. మరికొందరి విషయంలోను అలాగే జరిగింది. అంటే ఆనాటి పోలీస్ వ్యవస్థ గట్టి సెక్షన్ల కింద కేసులు పెట్టలేదా? పెట్టినా న్యాయ వ్యవస్థ సీరియస్ గా తీసుకోలేదా? లేక ఆనాటి ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రచారాల నేపథ్యంలో ఆయా వ్యవస్థలు ఉదాసీనంగా పనిచేశాయా? టీడీపీ లాయర్ల మాదిరి వైఎస్సార్సీపీ లాయర్లు న్యాయ వ్యవస్థను ఒప్పించలేకపోతున్నారా? ఇలా పలు సందేహాలు వస్తాయి. కాని వీటికి సమాధానం ఇప్పట్లో దొరకకపోవచ్చు. ఇదేకాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు లేదా మరెవరైనా టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెడుతున్న తీరు కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలకు మార్గదర్శకం అయ్యే అవకాశం ఉంది. వారు కూడా తమ నేతలను అవమానించడంతో మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రం అంతటా కేసులు పెట్టవచ్చు. ఒక కేసులో బెయిల్ వస్తే,వెంటనే అదుపులోకి తీసుకుని మరిన్ని స్టేషన్ ల చుట్టూ తిప్పవచ్చు. ఇప్పుడు పోసాని విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఆయనను రాజంపేట నుంచి నరసరావుపేటలో నమోదైన కేసులో అరెస్టు చేసి అక్కడకు తరలించారు. 16 కేసులు నమోదు చేసినందున ఇంకెన్ని జైళ్లకు తిప్పుతారో చూడాలి. ఆయనకు ఆరోగ్య సమస్య వస్తే దానిని అవహేళన చేసేలా ఒక సీఐ స్థాయి అదికారి మాట్లారంటే, ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయితే అప్పటి జగన్ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా చూసుకుంది? ఆయన అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఏఐజీ ఆస్పత్రి ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ వచ్చింది. కాని చిత్రంగా ఆయన బెయిల్ వచ్చిన వెంటనే గంటల తరబడి ఊరేగింపు చేయగలిగారు. ఇప్పుడు ఆ విషయాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించి పోసాని విషయంలో ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. పోసాని కులాల పేరుతో దూషించారట. ప్రజలలో వర్గ విభేదాలు సృష్టించారట.ఆ కేసు వివరాలు చదివితే ఎవరైనా నమ్ముతారా? ఫలానా కమిటీలో ఫలానా కులం వారే ఉన్నారని చెబితే దూషించడం ఎలా అవుతుందో పోలీసులకే తెలియాలి. దానివల్ల ప్రజలలో వర్గ విభేదాలు వచ్చి ఉంటే అప్పుడే గొడవలు అయి ఉండాలి కదా! ఒకాయన ఢిల్లీలో చెట్టు కింద కూర్చుని కులాలు, మతాల గురించి ప్రస్తావించి దూషణలకు దిగితే.. ఆయనపై కేసు పెడితే భావ స్వేఛ్చ అని, ఇంకేదో అని టీడీపీ, జనసేన వారు, ఎల్లో మీడియా గుండెలు బాదుకున్నారే. పైగా ఆయనకు అధికారంలోకి వచ్చాక మంచి పదవి కూడా ఇచ్చారే. అంతెందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు తమ సభలలో దూషణలతో పాటు కొన్నిసార్లు బూతు పదాలు వాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అప్పట్లో జగన్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం తప్పని ఈ అనుభవాలు చెబుతున్నట్లుగా ఉంది. అంతెందుకు.. ప్రధాని మోదీని టెర్రరిస్టు అని, దేశంలోనే ఉండడానికి అర్హుడు కాదని.. ఇంకా అంతకన్నా ఘాటైన వ్యాఖ్యలు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేస్తే బీజేపీ వారి మనోభావాలు ఎందుకు దెబ్బ తినలేదో తెలియదు! అసలు మోదీ మనోభావాలు గాయపడలేదా? ఇక పవన్ కల్యాణ్ తనను తెలుగుదేశం పార్టీవారు ఎన్ని రకాలుగా అవమానించింది స్వయంగా ఆయా సభలలో చెప్పారే. అప్పుడు కూడా జనసేన వారి మనోభావాలకు ఏమీ కాలేదా? మళ్లీ అంతా ఒకటయ్యారే! అలాంటిది నంది అవార్డులపై ఏడేళ్ల క్రితం పోసాని చేసిన వ్యాఖ్యలతో ఏదో జరిగిపోయిందా? కోర్టులలో ఏమవుతుందన్నది వేరే విషయం. కాని ప్రజల కోర్టులో మాత్రం కూటమి ప్రభుత్వం ఇలా అక్రమ కేసులు పెడుతున్నందుకు దోషిగానే ఎప్పటికైనా నిలబడుతుంది. మరో సంగతి చెప్పాలి. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీపై ఒక కల్పిత కేసు పెట్టి అరెస్టు చేయడమే కాకుండా, జైలులో మరో మనిషితో సంబంధం ఉండని సెల్లో పెట్టడం దారుణంగా ఉంది. ఇది కూడా కొత్తగా సృష్టించిన చెడు సంప్రదాయంగానే కనిపిస్తుంది. పోసాని, తదితర వైఎస్సార్సీపీ నేతలను ఈ తరహాలో వేధించడం చంద్రబాబు ప్రభుత్వ డైవర్షన్ రాజకీయాలలో భాగమా? లేక లోకేష్ రెడ్ బుక్ లో ఒక ఛాప్టరా? లేక పవన్ కూడా ఆ రెడ్ బుక్‌లో వాటా తీసుకున్నారా? అనేదానిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి.శాసనమండలిలో వైసీపీ అడిగిన ప్రశ్నలకు టీడీపీకి సౌండ్ లేకపోవడం, ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా ఉదంతం, పవన్‌ను సంతృప్తిపరచడం ,సూపర్ సిక్స్ హామీల గురించి జనం మాట్లాడుకోకుండా.. ఈ కేసుల గురించి చర్చించుకోవాలనుకోవడం, వైఎస్సార్సీపీని అణగతొక్కడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ రెడ్ బుక్ ను ప్రయోగిస్తోందన్న భావన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వంశీ, పోసాని తదితర బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నైతిక స్థైర్యం చెప్పడమే కాకుండా, న్యాయపరంగా పూర్తిగా అండగా నిలడడం సబబుగా ఉంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన పోసానిని రెడ్ బుక్ పేరుతో గిల్లీ మరీ తిరిగి రాజకీయ రంగంలోకి తీసుకు వస్తున్నారేమో! ఇప్పటికే వందలు, వేల సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు కూటమి రెడ్ బుక్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి సర్కార్ ప్రతీకార రాజకీయాలతో వారంతా రాటుతేలి పార్టీకి మరింత గట్టిగా పని చేసేవారుగా తయార అవుతున్నారనిపిస్తోంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీతో ఇలాగే ఉంటుంది మరి!
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అందరికీ ఉపయోగపడే పనులు చేయాలి. ఎన్నికలు ముగిసిన తరువాత రాజకీయాల వద్దని, అందరూ సమానమేనని అనాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటి? సీఎం హోదాలో ఉంటూనే.. వైఎస్సార్సీపీ వారికి ఎలాంటి పనులూ చేయవద్దని చెబుతున్నారంటే.. ఏంటి అర్థం?. ఈ రకమైన వ్యాఖ్యలకు బాధ పడాల్సింది... సిగ్గుపడాల్సింది వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు కాదు.. టీడీపీ మిత్రపక్షాల వారే. భవిష్యత్తులో ఏ కారణం వల్లనైనా బాబుతో పొత్తు లేకుండా పోతే.. ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఈ తాజా వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో.. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ అమలు గురించి బహిరంగంగానే ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం గద్దెనెక్కిందే తడవు.. తమది రాజకీయ పాలనేనని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. ఆపై రాక్షస పాలనకు శ్రీకారం చుట్టారు. చివరకు ఇందుకు ఆయన తన కుమారుడు లోకేష్ తాలూకూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం బాబుకొచ్చిన దుస్థితి అని అనుకోవాల్సిందే. అధికారులైనా.. పార్టీ నాయకులైనా సరే.. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వీసమెత్తు పని చేసినా ఊరుకోనని చంద్రబాబు హూంకరిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే పాముకు పాలు పోసినట్లేనని ఆయన దుర్మార్గంగా, బహిరంగంగా మాట్లాడుతున్నారు. మాటల విషం కక్కుతూ YSRCP వాళ్లను పాములతో పోల్చుతున్నారు. ఎన్నికలతోనే రాజకీయాలు మరచిపోవాలన్నది చాలామంది చెప్పే మాట. కానీ చంద్రబాబులా(Chandrababu) ఎవరూ ఇంత బరితెగించి మాట్లాడరు. సీఎం చెప్పినదాని ప్రకారం ఇకపై అధికారులు తమ వద్దకు వచ్చేవారు టీడీపీ వారా? లేక వైఎస్సార్సీపీ వారా? అన్నది తెలుసుకుని పనులు చేయాలా? చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అంతా ఒకసారి గత ముఖ్యమంత్రుల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు వైఎస్‌ను కలిసి నియోజకవర్గాలకు సంబంధించి పనులకు నిధులు పెద్ద ఎత్తున తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సీపీఎం నేత నోముల నరసింహయ్య ఒకసారి అసెంబ్లీలో వైఎస్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత నియోజకవర్గ పనులపై వైఎస్‌ను కలిశారు. ఆ సందర్భంలో అసెంబ్లీ చర్చను నోముల ప్రస్తావించినా, అదేమీ తప్పు కాదని చెప్పడమే కాకుండా ఆయన కోరినట్లు నిధులు మంజూరు చేసి పంపించారు. ఆ రకంగా వైఎస్సార్ పేరు తెచ్చుకుంటే, ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు, మతాలు వంటివాటి జోలికి వెళ్లకుండా తనకు ఓటు వేయని వారికి సైతం పనులు చేయాలని పథకాలు అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించి మరింత మంచి ఖ్యాతి సాధించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీలో ఉండడానికి భయం కల్పించి, టీడీపీలోకి వారిని లాక్కొవడానికి చేస్తున్న కుట్రలలో ఇదొకటని తెలుస్తూనే ఉంది. అంతమాత్రాన వైఎస్సార్సీపీ వారంతా భయపడరని పలు అనుభవాలు చెబుతున్నాయి. చివరికి బంధువులు, స్నేహితుల మధ్య కూడా విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలన్న యావకు వెళ్లినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు మాట వరసకు ఒకటి చెప్పేవారు. ‘‘ఎన్నికలయ్యాక రాజకీయాలు ఉండవద్దు.. అంతా అభివృద్దే ఉండాలి’’ అని సుద్దులు చెప్పేవారు. కాని చేసేది చేసేవారు. 2014 టర్మ్‌లో తన పార్టీలో చేరితేనే పనులు చేస్తానని బెదిరించి, ఇతర ప్రలోభాలు పెట్టి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇప్పుడు మరీ ఓపెన్ అయి ఇలా మాట్లాడారు కాని, ఆయన అసలు తత్వం అదేనని అంటారు. తెలుగుదేశం పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చారన్న విమర్శను ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేయలేదనే చెప్పాలి. వ్యూహాలు పన్నడం, వర్గాలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారానే రాజకీయాలు సాగించారన్న భావన ఉంది.పైకి మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకునేవారు. కాకపోతే ఈసారి మరీ బహిరంగం అయిపోయారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్‌లో గ్రూపులు నడిపారు. ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయినట్లు గుర్తు. 1983లో ఓటమి తర్వాత మామ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి పార్టీలో చేరిపోయారు. తదుపరి మళ్లీ వర్గ రాజకీయాలను జోరుగా నడిపారు. మామను మాయ చేసి కర్షక పరిషత్ చైర్మన్ పదవి తీసుకున్నారు. విశేషం ఏమిటంటే కర్షక పరిషత్ చైర్మన్ పదవి అంటే అదేదో సూపర్ సీఎం మాదిరి ఆయా శాఖల మంత్రులకన్నా తానే పవర్ పుల్ గా కనిపించే యత్నం చేసేవారు. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాబల్యాన్ని తగ్గించడానికి అన్ని వ్యూహాలు అమలు చేసేవారు. ట్విస్టు ఏమిటంటే దగ్గుబాటి వెంకటేశ్వర రావును కూడా అలాగే ప్రలోభపెట్టి తనవైపు లాక్కుని మామ ఎన్.టి.రామారావునే శంకరగిరి మాన్యాలు పట్టించగలిగారు. ఆ తర్వాత కొంతకాలం దగ్గుబాటి కుటుంబాన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది. చంద్రబాబును విమర్శిస్తూ అనేక సంచలన విషయాలను బయటపెట్టిన దగ్గుబాటి తాజాగా ఆయన ఇంటికి వెళ్లి తన మరో పుస్తకావిష్కరణ సభకు రావాలని ఆహ్వానించడం విశేషం. అది వేరే సంగతి.చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ప్రజలు కాదు. ఎమ్మెల్యేలలో తెచ్చిన చీలిక. అప్పట్లో ఎవరైనా ఎన్టీఆర్ వర్గంలో ఎమ్మెల్యేలు ఉంటే వారిని రకరకాలుగా ప్రలోభాలు పెట్టేవారని వార్తలు వచ్చేవి. లొంగకపోతే ఇతర మార్గాలు ఎటూ ఉంటాయి. పోలీసు వ్యవస్థతో బెదిరించడం, పనులు చేయకపోవడం వంటివి చేస్తుంటారు. అప్పటి నుంచే ఆయనకు ఈ వ్యూహం తెలుసు. టీడీపీ వారికే పనులు అయ్యేలా జాగ్రత్త పడేవారు. కొంతమంది కాంట్రాక్టర్లను కూడా తనతో ఉండేలా చేసుకునేవారు. వారికి ముఖ్యమైన కాంట్రాక్టులు ఇచ్చి పార్టీకి ఆర్థికంగాఅండగా ఉండేలా చేసుకుంటారు. 2004 ఎన్నికలకు ముందు కేంద్రం నుంచి ఏభైలక్షల టన్నుల బియ్యాన్ని పనికి ఆహారం పథకం కింద తీసుకు వచ్చారు. దానిలో అధిక భాగం టీడీపీ కార్యకర్తలే అమ్ముకున్నారన్న విమర్శలను అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేసేది. దాని ప్రభావం కూడా ఎన్నికలలో కనిపించింది. చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తితోపాటు, కార్యకర్తల దోపిడీని కూడా భరించలేక 2004లో టీడీపీని ఇంటికి పంపించారు. జన్మభూమి కమటీల వ్యవస్థను చంద్రబాబు తీసుకు వచ్చారు. మొదట అదేదో మంచి కార్యక్రమమేమో అనే భావన కల్పించారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అచ్చంగా అదే పనిలో ఉండేది. 2014-19 టర్మ్‌లో ప్రజలు దాని విశ్వరూపాన్ని చూడవలసి వచ్చింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా, ఏ స్కీమ్ కావాలన్నా ఆ కమిటీలలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని చెబుతారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ తదితర వందలాది హామీలుకు నోచుకోకపోవడం, టీడీపీ కార్యకర్తల ఆగడాలతో జనంలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాదు. కార్యకర్తల ఆర్థిక పుష్టి కోసమే కొన్ని స్కీములను వాడుతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు చెట్టు-నీరు పధకం కింద సుమారు రూ.13 వేల కోట్లు టీడీపీ కార్యకర్తలు దోచేశారని అప్పట్లో బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసి పలువురిపై కేసులు పెట్టడం, బిల్లులు నిలుపుదల చేసింది. ఈసారి అధికారంలోకి వచ్చాక వారి బిల్లలుకు ఈ మధ్యే రూ.900 కోట్లు విడుదల చేసేయడమే కాకుండా, కేసులు కూడా ఎత్తేవేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, నానా పాట్లు పడి ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం, పవన్ కల్యాణ్ ద్వారా ఒక సామాజికవర్గ ఓట్లుకు గాలమేసే ప్రయత్నం చేయడం.. ఈవీఎంల ప్రభావం తదితర కారణాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. మళ్లీ యథా ప్రకారం ఆయన పాత పాట మొదలు పెట్టారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను, హామీల అమలును ప్రశ్నించే సోషల్ మీడియా వారిని వేధిస్తుండడం ఒక సమస్యగా ఉంటే, ఇంకోవైపు చంద్రబాబు అసలు వైఎస్సార్సీపీ వారికి ఏ పని చేయవద్దని చెబుతున్నారు. ఇంతలా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మరొకటి ఉండకపోవచ్చు. అయినా వివిధ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడుగా పేరొందిన చంద్రబాబు జోలికి ఎవరు వెళ్లినా ఏమీ కాదనే ధైర్యం టీడీపీలో ఉందని చెబుతారు. ఈ నేపథ్యంలో యథేచ్ఛగా కార్యకర్తల అడ్డగోలు దోపిడీకి పచ్చజెండా ఊపారన్న భావన ఉంది. ఇప్పటికే ఇసుక దందాతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. మద్యం షాపులన్నీ తన వారికే కట్టబెట్టారు. జగన్ టైమ్ లో ఆయన వీటిని ప్రభుత్వపరం చేసి ఆదాయం పెంచడానికి ప్రయత్నించారు. దాంతో కార్యకర్తలకు పెద్దగా ఆదాయ వనరు లేకుండా పోయిందని భావిస్తారు. అలాగే జగన్ సర్కార్ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా స్కీములు, వివిధ సేవలను అందించడంతో కార్యకర్తలు, వైసీపీ నేతలకు పెద్దగా పని లేకుండా పోయింది. వలంటీర్ తెలిస్తే చాలు..వైసీపీ వారితో పని లేదన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. పైగా టీడీపీ వారికి కూడా అన్ని సదుపాయాలు సమకూరాయి. చంద్రబాబేమో కార్యకర్తల ఆర్జనకు అన్ని అవకాశాలు కల్పించి, ఆ తర్వాత వారితో ఎన్నికలలో ఖర్చు పెట్టించే వ్యూహంతో పని చేయిస్తుంటారని చెబుతారు. అంటే టీడీపీని గెలిపిస్తే, పెత్తనంతోపాటు తాము ఇష్టారాజ్యంగా సంపాదించుకోవచ్చనే ధైర్యాన్ని వారికి కల్పించారన్నమాట. టీడీపీ విజయానికి కార్యకర్తల దోపిడీ తోడ్పడదని పలుమార్లు రుజువైంది. టీడీపీ కార్యకర్తల వేధింపులు, ధనార్జనను భరించలేక ప్రజలంతా ఒక్కటై టీడీపీని పలుమార్లు ఓడించారు. ప్రస్తుతం కూడా రెడ్ బుక్ పేరుతో పోలీసులతో వైఎస్సార్సీపీ వారిని వేధిస్తుంటే, మరో వైపు టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు, అడ్డగోలు సంపాదనకు అదుపు, ఆపు లేకుండా పోయింది. ఈ దశలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే వారి అవినీతికి లైసెన్స్ ఇచ్చేసినట్లు, వైసీపీ వారిని వేధించండని పిలుపు ఇచ్చినట్లు మాట్లాడితే జనం వారికి గుణపాఠం చెప్పకుండా ఉంటారా?:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రభుత్వానికి డప్పు కొట్టే ఎల్లో మీడియాకు మాత్రమే అనుమతి
-
అరరే కేశవా.. ఎన్టీఆర్, బాబులను బద్నాం చేస్తే ఎలా?
గాలి కబుర్లు...సోది లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడండి! ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడేందుకు.. షాడో సీఎం లోకేష్‌ను సంతోషపెట్టేందుకు మంత్రిగారు రాష్ట్ర ఇమేజీని దెబ్బతీసేందుకూ వెనుకాడలేదు.. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడలేదు! బడ్జెట్ ప్రసంగం మొత్తం మ్మీద వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, గత ప్రభుత్వం అంటూ పదే పదే ప్రస్తావించి కేశవ్ తన లోపలి భయాన్ని బయటపెట్టేసుకున్నట్లు అనిపించింది. కాకపోతే ఈ క్రమంలో ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పాలనను కూడా విధ్వంసంతో పోల్చేశారు. ఒకపక్క రాష్ట్రానికి రుణాలు వచ్చే అవకాశం సున్నా అంటూనే.. ఇంకోపక్క లక్ష కోట్ల రూపాయల రుణం తీసుకోబోతున్నామని చెప్పడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి అవసరం లేదంటూనే బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు వ్యయం చేయబోతున్నామని అంటారు. అంతేకాదు.. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకువస్తూ ఆ మాటను ధైర్యంగా చెప్పలేని దుస్థితి కేశవ్‌ది. 👉సాధారణంగా ఎవరైనా తమ రాష్ట్రం అభివృద్ది పథంలో ఉంది. గొప్పగా పని చేస్తున్నామని చెప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో నడుస్తోంది. రాష్ట్రం నాశనమైపోయిందని, విధ్వంసమైందని.. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబు దాడికి బుగ్గయిన హిరోషిమాతో పోల్చడం ఎంత దుర్మార్గం!. ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమాభిమానాలు ఉన్నవారు ఎవరైనా ఇలాంటి దిక్కుమాలిన పోలికలు చేస్తారా?. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదా! ఈ మాటలను సీరియస్‌గా తీసుకుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?. అంతేకాదు.. 👉ఏకంగా ఏపీకి రుణం తీసుకునే సామర్ధ్యం సున్నా అని రాశారంటే ఏమనుకోవాలి? అది నిజమే అయితే కొత్త బడ్జెట్లో రూ.1.03 లక్షల కోట్ల రుణం తెచ్చుకుంటామని ఎలా చెప్పారు? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1.31 లక్షల కోట్ల రుణం ఎలా తీసుకువచ్చారు? ఎవరినో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికి ప్రయోజనం. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన వీరు.. YSRCP ప్రభుత్వ హయాంలో వచ్చినదానికంటే తక్కువ ఆదాయం వచ్చిన దానిపై మాత్రం కిమ్మనరు! రుణాలే సంపద అనుకోవాలనా?. ప్రతి వైఫల్యాన్ని గత జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే.. ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు చేస్తున్న విమర్శలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవే కదా! అయినా జగన్ కంటే మూడు రెట్లు అధికంగా హామీలు ఎలా ఇచ్చారంటే జవాబు చెప్పరు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్, తదితర హామీలన్నీ ఎగవేయడానికి వైఎస్సార్సీపీ ఆరోపణలు చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తారా?. ఇదేమైనా ధర్మమేనా!. అదే సమయంలో చంద్రబాబును పొగడడం కోసం ఎన్టీఆర్‌ను సైతం భ్రష్టు పట్టించేశారు. 1995లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదట. దానికి కారణం ఒక్క ఎన్టీఆరేనా? ఆయన తీసుకొచ్చిన పథకాలేనా? అలాంటప్పుడు అదే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్నదెవరు? చంద్రబాబే కదా?. పయ్యావుల కేశవ్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవం ఏమిటో ఈ బడ్జెట్ ప్రసంగంతో తేలిపోయింది. గత ఏడాది బడ్జెట్ లో ఏమి చెప్పాం..ఏమి చేశాం..అన్నదానితో నిమిత్తం లేకుండా ఒక ఉపన్యాసం తయారు చేసుకుని శాసనసభలో చదివితే సరిపోతుందా?. విచిత్రం ఏమిటంటే.. 2024-25 బడ్జెట్‌ను రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టినా అందులో ఎంత శాతం అమలైందన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో వేసిన బడ్జెట్ అది. అయితే జనవరి నాటికి వచ్ని ఆదాయం కేవలం ఒక లక్ష ఒక వెయ్యి కోట్లు మాత్రమే. అంటే సగం ఆదాయం కూడా లేకుండా పోయిందన్నమాట. పరిస్థితి ఇలా ఉంటే.. తాజా బడ్జెట్ కేటాయింపులు ఎకాఎకిన రూ.3.22 లక్షల కోట్లు అని ఎలా చెప్పారో అర్థం కాదు. కేవలం కాకి లెక్కలతో పుస్తకాలు నింపేసి ప్రజలను మభ్యపెట్టడం కాకపోతే? ఒకవైపు రాష్ట్రం ఆర్ధికంగా విధ్వంసమైందంటూనే.. మరోపక్క ఆదాయం పెరుగుతుందని ఎలా అంటారు?. సూపర్ సిక్స్ వంటి ఆచరణ కాని హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ఎలా అనేదానిపైనే అధికంగా దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ధైర్యం ఉంటే టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి అమలుకు బడ్జెట్లో జరిపిన కేటాయింపులు ఎంత? కేటాయించకపోతే ఎందుకు చేయలేకపోయారు అన్నవి మాటమాత్రం మాట్లడకుండా ఊకదంపుడు కబుర్లు చెబితే ఏమి ఉపయోగం?. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకం కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి వ్యయం చేయలేదు. అలాగే.. అన్నదాత సుఖీభవ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతుకు నయాపైసా ఇవ్వలేదు. అంటే..పేరుకు కేటాయింపులు జరపడం.. ఆ తర్వాత గాలికి వదలి వేయడం అనేకదా! ఆడపడుచుకుల నెలకు రూ.1,500 ఆడబిడ్డ నిధి పేరిట సాయంమహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం బీసీలకు యాభై ఏళ్లకే ఫించన్.. వీటి ఊసే లేదు. అలాగే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేశారు. 👉అమరావతి కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించారు కానీ.. అంతా ఖర్చు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఏమైపోయినా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన నెలకొంది. అంతేకాదు. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్న విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోకపోవడం గమనార్హం. అదేదో కేంద్రం ఊరికే ఇస్తున్న డబ్బు అన్నట్లు పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇదంతా ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలపై పడే భారమే అవుతుంది.వారు చెల్లించే పన్నులనే వాడుకోవాలి. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి స్కూళ్లు బాగు చేసి అనేక సంస్కరణలు తీసుకువస్తే కేశవ్ తన ప్రసంగంలో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని దుర్మార్గంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతలా దిగజారవలసిన అవసరం లేదు. చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోతుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. కాని తీరా చూస్తే జగన్ టైమ్‌లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వస్తే, చంద్రబాబు సర్కార్ పది నెలల పాలనలో అది రూ. తొమ్మిది వేల కోట్లకు కూడా చేరలేదు!. కేటాయింపుల గురించి చూస్తే ఫించన్లకు రూ.33 వేల కోట్లు అవసరమని గవర్నర్ ప్రసంగంలో చెబుతారు. బడ్జెట్లో మాత్రం రూ.27 వేల కోట్లే చూపుతారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామన్న ఎన్నికల హామీపై మాటమార్చిన చంద్రబాబు ఒక ఏడాది ఎగ్గొటడమే కాకుండా.. తాజా బడ్జెట్లో సరిపడా కేటాయింపులూ చేయలేదు. తల్లికి వందనం కింద విద్యార్ధులు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.12 వేల కోట్లు అవసరం కాగా.. కేటాయించింది రూ. ఎనిమిది వేల కోట్లే. పైగా స్పీచ్ లో ఎక్కడా ప్రతి విద్యార్థికీ అని చెప్పకుండా ప్రతి తల్లికీ అని తెలివిగా చెప్పారు. దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి. కేశవ్ బడ్జెట్ ప్రసంగం మొత్తమ్మీద 22 సార్లు విమర్శలు చేయడం ద్వారా జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి కూటమి సర్కారు ఎంత భయపడుతున్నది బయటపెట్టుకున్నారు. మొత్తం మీద బడ్జెట్ ద్వారా ప్రజలను మళ్లీ మభ్య పెట్టే యత్నం చేసే క్రమంలో వారి డొల్లతనాన్ని వారే బయట పెట్టుకున్నారు. కాకపోతే ఈనాడు ,ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు మాత్రం ఇది బాహుబలిగా.. పండంటి ప్రగతికి పది సూత్రాలుగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రజలకంటే ఈ ఎల్లో మీడియా వారికే వారికే ఈ ప్రభుత్వం వల్ల అధిక గిట్టుబాటు కనుక.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవనూ.. మరీ ఇంతకు దిగజారాలా!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీ అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమాషాగా ఉన్నాయి. ‘‘కింద పడతాం.. మీద పడతాం.. అవి మా ఇంటి విషయాలు.. కూటమి విషయాలు. ఒక మాట అనవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలో అడుగు పెట్టకూడదు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొంతన లేని అంశాలను బలవంతంగా అతికినట్టుగా అనిపిస్తుంది. ‘‘ఇది తన గురించో, చంద్రబాబుల గురించి కాదని, ప్రజల కోసం నిలబడి ఉన్నామని, కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతామని, అందుకే మాటిస్తున్నానని అంటూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమనించి మరో పదిహేనేళ్లు కలిసి ఉంటాము’’ అని పవన్ అనడం దేనికి సంకేతం?.. తెలుగుదేశంతో పొత్తు పుణ్యమా అని పవన్ కల్యాణ్ ఎలాగోలా శాసనసభలోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అది సంతోషమే. కానీ ఆయన సమస్యలపై ప్రశ్నించకుండా.. ప్రభుత్వంలో జరిగే తప్పులపై గొంతెత్తకుండా ఆత్మపరిశీలన చేసుకోకుండా, చేసిన బాసలను గాలికి వదలి పలాయన వాదంతో ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యల కన్నా ఉదాహరణ అవసరం లేదేమో!.👉ఇంతకీ పవన్ చేసిన ఆ వ్యాఖ్యల సారాంశం ఏమిటి? తమలో తాము ఎన్ని గొడవలు పడ్డా కలిసే ఉంటామని చెప్పడమే కదా! ఈ మాట అంటున్నారంటేనే ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది. ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని హామీ ఇవ్వకుండా వీరిద్దరూ తిట్టుకుంటే ఎవరికి కావాలి? కిందపడితే ఏంటి? మీద పడితే ఎవరికి ఆసక్తి? ఆయన అన్నట్టే అది వారి అంతర్గత వ్యవహారం. ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అయితే... శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలేమిటి? చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిన వైనం ఏమిటి? వీటిని ప్రశ్నించకుండా ఎవరూనా ఎలా ఉండగలరు? సుగాలి ప్రీతి మృతి కేసు నుంచి 31 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ సంచలనం కోసం పిచ్చి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. తీరా పదవి వచ్చాక వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ పరిణామాలలో పవన్ పలు అవమానాలకు గురయ్యారని జనసేన కార్యకర్తలు బాధ పడ్డారు. కానీ పవన్ తన మాటల ద్వారా ఆ అవమానాలను పట్టించుకోబోనని చెప్పినట్లు అయ్యింది. ఎంత పదవిలో ఉంటే మాత్రం పవన్ టీడీపీకి ఇంతగా లొంగి ఉండాలా అన్నది జనసేన కార్యకర్తల ఆవేదన. తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirumala Stampede Incident) తర్వాత పవన్ కల్యాణ్ ఓవరాక్షన్ చేశారని టీడీపీ ముఖ్యనేతలే వ్యాఖ్యానించిన సంగతిని ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ ఆత్మాభిమానం కలిగిన జనసేన క్యాడర్ సహించలేక సోషల్ మీడియాలో టీడీపీ వారికి పోటీగా ఎలా పోస్టులు పెట్టిందో తెలియదా! ఇవన్ని ఎవరి ఇంటి విషయాలు..? అంటే జనసేన కూడా టీడీపీలో భాగమని చెబుతున్నారా? కూటమి విషయాలైతే ఎన్నడైనా చర్చించుకున్నారా? అంత దాకా ఎందుకు.. పిఠాపురంలో పోలీసులు తన మాట వినడం లేదని ఎందుకు చెప్పారు? నెల రోజుల పాటు ఎవరి మీద అలిగి ఫైళ్ల జోలికి వెళ్లకుండా ఉన్నారు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? సనాతని వేషధారణ వేసుకున్నాక, ధర్మ బద్దంగా ఉండాలి కదా! అసత్య వచనాలు పలకరాదని కదా ఆ ధర్మం చెబుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కదా ఏ ధర్మం అయినా చెప్పేది. కాని పవన్ కల్యాణ్ వాటిని పాటిస్తున్నారా?. తిరుమల లడ్డూ విషయంలో(Tirumala Laddu Row) ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి అపచారం కాదా? వలంటీర్ల పొట్టకొట్టబోనని పవన్ హామీ ఇచ్చారా? లేదా? అధికారం ఎంజాయ్ చేస్తూ వారి గురించి మాట్లాడకపోగా.. అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని వ్యాఖ్యానించడం పొట్ట కొట్టడం అవుతుందా? లేదా? ఇదేనా సనాతన ధర్మం చెప్పేది? శాసనసభలో ఆయన మాట్లాడిన విషయాలలో సత్యదూరమైనవి ఎన్ని ఉన్నాయి? వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు నినాదాలు చేసినందుకే... గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి అడుగు పెట్టకూడదని ఆయన కొత్త సూత్రం చెబుతున్నారే..! మరి గవర్నర్ వ్యవస్థే వద్దన్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? గతంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుంటే.. తెలుగుదేశం సభ్యులు ఆయన కుర్చీని కూడా లాగి పారేశారు. అలా చేసిన వారిలో ఒకరైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. గత టర్మ్‌లో గవర్నర్ హరిచందన్ స్పీచ్ సమయంలో కానీ, స్పీకర్ పై కానీ టీడీపీ సభ్యులు ఎన్ని అల్లర్లు చేశారో ఒకసారి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది. తన సహ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక విజిల్ పట్టుకువచ్చి సభలో ఈల వేస్తూ తిరిగారే. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి, స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను బెదిరించేవారే! కొందరు టీడీపీ నేతలు ఎలా దూషించారో ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇవన్ని మంచి పద్దతులేనా? అలాంటి పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబితే సరిపోతుందా?. ఏమిటో కొత్తగా స్టేట్ రికన్సిలియేషన్ కేబినెట్ (Reconciliation Cabinet) అని అంటున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నికలకు ముందు ఏదో జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే ఉందని అనడం ఏమిటో?. బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా నెహ్రూ కేబినెట్ లో ఉన్నా ఆయా అంశాలపై విబేధించేవారని అన్నారు. అంటే ఏపీలో కూడా అలాగే చంద్రబాబును నిలదీస్తారా? ఆ ధైర్యం పవన్‌కు నిజంగా ఉందా? అలా ఉంటే ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలలో ఒక్కసారైనా ప్రజల పక్షాన మాట్లాడారా? శాంతిభద్రతల విషయంలో మాట్లాడినట్లే మాట్లాడి వెంటనే ఎందుకు జారిపోయారు? ప్రతిపక్షం ముఖం చాటేస్తే తామే ఆ బాధ్యత నిర్వహిస్తామని అన్నారు. 👉పవన్ ఆ పని చేసినా, చేయకపోయినా, ముందుగా సూపర్ సిక్స్ గురించి చంద్రబాబును ప్రశ్నించి ఉంటే, తన బాధ్యత ఏమిటో చెప్పి ఉంటే అప్పుడు ఆయన ఏమి చెప్పినా జనం నమ్మవచ్చు. తన శాఖకు సంబంధించి ఆయన గ్రామ సభలు, గోకులాలు అంటూ ఏవేవో చెప్పుకున్నారు. కాని వాటిని టీడీసీ వారే ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి ఆయనకు కూడా తెలిసి ఉండాలి. ఆంధ్రులకు కుల భావన ఉందని శాసనసభలో బాధ పడినట్లు నటించారు. మరీ ఇదే పవన్ కల్యాణ్ గతంలో కనీసం కుల భావన అయినా తెచ్చుకోండని అన్నారే! తనకైనా ఫలానా కులం వారు ఓట్లు వేయాలని అన్నది వాస్తవం కాదా! దీనికి సంబంధించి అప్పట్లో వీడియోలు వచ్చాయే! ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలు?. 👉విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని అంటున్నారు. సంతోషమే కానీ.. భవిష్యత్తులో కూడా జరగదని చెప్పగలిగితే బాగుంటుంది. ఒకపక్క అక్కడ అనేక మందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తుంటే, మరోపక్క పవన్ ఇలా మాట్లాడుతున్నారు. బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. కాని టీడీపీ, జనసేనల దూషణలకు, పెట్టిన బూతు పోస్టింగ్‌లకు ఆయన ఎలా మద్దతు ఇస్తున్నారు?. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక నేతపై మహిళల వేధింపు ఆరోపణలు వస్తే కనీసం పార్టీ నుంచి సస్సెండ్ కూడా చేయలేక పోయారే! ఆ మాటకు వస్తే ఎన్నికల సమయంలో పవన్ ఎన్ని దూషణలకు పాల్పడింది ఆధార సహితంగా ఉన్నాయి కదా! 2009లోనే యువరాజ్యం అధ్యక్షుడుగా ఉండి కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొడతానని అన్నది ఈయనే గదా అని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబును జైలులో ఎందుకు పెట్టింది తెలియదా? స్కిల్ స్కామ్‌లో తొలుత కేసు పెట్టింది ఈడి కాదా? గతంలో కులాలు, మతాల మధ్య గొడవలు వచ్చేలా రోజుల తరబడి మీడియా సమావేశాలు పెట్టి లైవ్ లో మాట్లాడిన ఒక నేతను ఇప్పుడు పెద్ద పదవిలో కూటమి కూర్చోపెట్టుకుందే!. చంద్రబాబు, లోకేష్‌లతో ఏదో జిగిరి దోస్తి ఉన్నట్లు ఇప్పుడు చెబుతున్నారు కాని, 2018లో ఇదే పవన్ వారిని ఉద్దేశించి ఎన్ని తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది తెలియదా? రాజకీయాలలోకి వచ్చి చెగువేరా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, మోదీ అన్నారు. తదుపరి వారిని కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి, వామపక్షాలతో కలిసి జట్టుకట్టారు. ఆ తర్వాత మళ్లీ మోదీ, చంద్రబాబు అన్నారు. .. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెబుతారు? నిజంగానే కిందా, మీద పడి పదవిలోకి వచ్చిన పవన్.. ఆ పదవి మీద మోజు పెంచుకోవడం తప్పు కాదు. కానీ అదే ప్రధానమన్నట్లుగా వ్యవహన్నారనే భావన ఏర్పడుతోంది. ప్రజల కోసం నిలబడకుండా చంద్రబాబు, లోకేష్ ల మెప్పు కోసం పనిచేస్తూ, సనాతని వేషం ధరించి కూడా అబద్దాలు, అర్ధ సత్యాలు చెప్పడం ఏ ధర్మం అవుతుందో ఆయనకే తెలియాలి!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆ మాటలు నిజంగా మనసులోంచే వచ్చాయా?
కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలన్నది ఒక థియరీ. దీన్ని బాగా వంటబట్టించుకున్న వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో ఉంటారు. రాజకీయ చరిత్ర మొత్తం ప్రజలను గందరగోళం పరచడం ద్వారా లేదంటే మాయ చేయడం ద్వారానే సాగిందని ఇట్టే అర్థమైపోతుంది. ఈ కారణం వల్లనే ప్రజలకు ఆయనపై అంత విశ్వాసలేమి!. కొన్ని ఇతర కారణాల వల్ల ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్నైతే సంపాదించుకోగలిగారు. కానీ ఆ స్థాయిలోనే ప్రజల నుంచి గౌరవం, ఆదరణ, మన్నన పొందుతున్నారా? సందేహమే. ఈ చర్చ ఇప్పుడెందుకు వస్తోందంటే.. తాజాగా ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అవి నిజంగానే చంద్రబాబు(Chandrababu) మనసులోంచి వచ్చాయా? లేక ఇంకోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే బదులుండదు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంలోనూ బాబు గారు దిట్టే. తద్వారా పరిస్థితి ఏదైనా క్రెడిట్ మాత్రం తన ఖాతాలోనే పడేలా వ్యవహరిస్తూంటారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే తీసుకుందాం.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా వాటి అమలు ఊసేలేదు. కానీ మాటలు మాత్రం బోలెడన్నిసార్లు మార్చేశారు. ఒకసారేమో.. బటన్ నొక్కితే సరిపోతుందా? అంటారు.. ఇంకోసారి సూపర్ సిక్స్ అమలు చేస్తామని అంటారు. మరోపక్క ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో జగన్ మోడల్ సంక్షేమం విఫలమయ్యాయి అనేస్తారు. అలాగే.. సంపద సృష్టించకుండా ప్రజలకు డబ్బు పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడ? అని ప్రశ్నిస్తారు!. ఎన్నికల ముందు సంపద తాను సృష్టించగలనని గంభీర ఉపన్యాసాలు చేసేదీ ఈయనే.. అధికారంలోకి వచ్చాక సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పండని జనాన్ని అడిగేదీ ఈయనే కావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో చంద్రబాబు ఒక మాట చెప్పించారు. అదేమిటంటే 'ఒక వ్యక్తికి చేపలు ఇవ్వడం కాదని, చేపల వల ఇవ్వాలి" అనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తారని తెలిపారు. ఏమిటి దాని అర్థం? సంక్షేమ పథకాల వల్ల డబ్బు వృథా అవుతుందనా? ప్రజలకు నగదు పంపిణీ వల్ల నష్టమనే కదా? వీటిని సమర్థించే వారు కూడా ఉండవచ్చు. కానీ.. వారికి షాక్ ఇచ్చే తీరులో ఆ మరుసటి రోజే చంద్రబాబు అందరికన్నా తానే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని ప్రకటించారు. సూపర్‌సిక్స్ సహా హామీలన్నీ అమలు చేస్తానని కూడా ఆయన ప్రకటించేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చువుతుందని అంచనా. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఏటా రూ.70 వేల కోట్లు అవుతూంటేనే విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు రెట్టింపు మొత్తాన్ని ఇస్తానంటే నమ్మగలమా?. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించిందని అంటారు. మరి అలాంటప్పుడు అవే విధానాలను కొనసాగిస్తానని చెప్పడమే కాకుండా, జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అనేవారా? కాదా? నాలుగుసార్లు సీఎం అయినా ఈ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేదని అంటారు. ఒకసారి పాత రికార్డులు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయి! 👉1994లో తొలిసారి ఆర్దిక మంత్రి అయిన వెంటనే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాశనం చేసేసిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఆ తరువాత ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి లాగి పడేశాక కూడా అదే మాట. 👉1996 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టైమ్‌లో ఉన్న మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం మొదలైన వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నడిపి మొత్తం మార్చేశారు. లోక్ సభ ఎన్నికలలో మాత్రం మద్య నిషేధాన్ని కఠినతరం చేస్తామని ప్రచారం చేశారు. 👉2004 ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహారం. అప్పటి వరకు విద్యుత్ సంస్కరణల పేరుతో ఛార్జీల పెంపు, 56 ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, జన్మభూమి కింద ప్రజల నుంచి ఆయా పనులకు డబ్బులు వసూలు చేయడం వంటివి చేశారు. ఎన్నికలు వచ్చాక కోటి వరాలు అంటూ ప్రజలకు స్కీములు ప్రకటించారు. 👉2009లో సైతం నగదు బదిలీతోసహా అనేక వాగ్దానాలు చేశారు. టీడీపీ వాగ్దానాల డొల్లతనాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎండగట్టిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. 2004 నుంచి 2024 వరకు ఎన్ని విన్యాసాలు చేసింది తెలిసిన చరిత్రే. తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలంతా కష్టాలలో ఉన్నట్లు చెబుతారు. రైతుల రుణమాఫీతో సహా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంటారు. అధికారంలోకి రాగానే అవన్ని వృధా ఖర్చు అని సూక్తులు చెబుతారు. తాజాగా తొమ్మిది నెలల పాలనలో కన్నా, అంతకుముందు ఏడాది జగన్ పాలన(YS Jagan Term)లో ఆర్థికాభివృద్ది రేటు, జీఎస్టీ, జీఎస్డీపీ వంటివి అధికంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నా, ఆయన మాత్రం తన పంథాలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తారు. అలాగని ఆ విధ్వంసం ఏమిటో వివరిసారా? ఊహూ లేదు!పడికట్టు పదాలతో, కొత్త కొటేషన్లతో జనాన్ని మాయ చేయగలిగితే చాలన్నది ఆయన విధానంగా కనిపిస్తుంది. తాజాగా తల్లికి వందనం(Thalliki Vandanam) పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ప్రకటించారు. చేస్తారో లేదో ఇంకేమి మతలబు పెడతారో తెలియదు. కానీ.. ఏడాది కాలం ఈ పథకాన్ని ఎగవేసిన సంగతి దాచేస్తారు. పైగా మే నెలలో స్కూళ్లు తెరవరు. మరి ఏ ప్రాతిపదికన ఈ పథకానికి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తారో చూడాలి మరి!. అదే కాదు. ఒక్క ఫించన్లు, అన్న క్యాంటిన్లు, అరకొర ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తప్ప, మిగిలిన ఏ పథకం కూడా అమలు కాలేదు. వాటికి ఇంతవరకు షెడ్యూలే ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, రైతు భరోసా రూ.20 వేలు, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తుంగలో తొక్కేశారు. చంద్రబాబు భావన ప్రకారం.. గవర్నర్ స్పీచ్‌లో చెప్పించినట్లుగా అయితే ఈ స్కీములన్నీ చేపలే అవుతాయి. కాని, చేపలు పట్టే వలలు కావు కదా! వాటి మీద క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేయరు. ఒకప్పుడు అసలు భారీ ప్రాజెక్టులంటేనే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. అవి వెంటనే పూర్తి కావని, ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని ఎన్నికలకు ముందు భారీ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం జోరుగా శంకుస్థాపనలు చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదలివేస్తే, అప్పటి విపక్షనేత రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాలకు వెళ్లి పూలు పెట్టి వచ్చారు. తన హయాంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా సుముఖత చూపని చంద్రబాబు... వైఎస్ చొరవతో ముందుకు వెళ్లిన తరువాత పోలవరం తన కల అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా రూ. 85 వేల కోట్లతో ‘జల్ జీవన్’ మిషన్ కింద స్కీమును, రూ.80వేల కోట్లతో పోలవరం-బనకచర్ల స్కీమును అమలు చేస్తామని చెబుతున్నారు. వీటిలో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందంటున్నారు. అవి ఎలా ముందుకు వెళుతాయన్నది ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు. సామాన్యుడికి మద్యం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచవలసిన సీఎం అలా మాట్లాడితే ఎలా? అని విమర్శిస్తున్నారు. ఇక స్వర్ణాంధ్ర, విజన్ 2047, కొత్తగా పీ-4 వంటి అంశాలతో ప్రజలను ఊహాలోకాలలోకి తీసుకువెళ్లడానికి తన ప్రసగంలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సోషల్ మీడియా యుగం వచ్చాక చంద్రబాబు మాయలన్ని తెలిసిసోతున్నాయి. అదే ఆయనకు సమస్యగా ఉంది. దాంతో సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో హామీలు అమలు చేస్తూ, నిర్మాణాత్మకంగా ప్రగతి వైపు ప్రభుత్వాన్ని నడిపితే సంతోషమే. కానీ ఆయన చేసే మాటల గారడీ రీత్యా ఆ పరిస్థితి కనబడడం లేదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు, పవన్‌తో పోటీ పడుతున్న లోకేష్?
కాకి లెక్కలు చెప్పడంలో తండ్రిని మించిపోవాలని ఆంధ్రప్రదేశ్ షాడో సీఎం, విద్యాశాఖ మంత్రి లోకేష్ తహతహలాడుతున్నట్లు అనిపిస్తోంది. సర్వ మంత్రిత్వ శాఖలపై పెత్తనం చెలాయిస్తున్న ఈయన ఇటీవలే ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్ ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఏమిటా ట్వీట్ అంటే.. ‘వైఎస్ జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీనే రూ. 24,944 కోట్లు’ అని!. దీంతో, అవకాశం దొరికిందనుకుందేమో.. ‘ఈనాడు’ మరింత రెచ్చిపోయింది. తప్పుడు కథనాల వండి వార్చేసింది. నిజానిజాలను నిర్ధారించుకుని మరీ వార్తలు రాయాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని గాలికి వదిగేసింది. యాభై ఏళ్లపాటు మనుగడలో ఉన్న ఈనాడు ఈ స్థాయికి దిగజారుతుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి?.లోకేష్ ట్వీట్‌కు సంబంధించిన కథనానికి ఈనాడు పెట్టిన శీర్షిక చదివితే జగన్ హయాంలో తెచ్చిన అప్పులకే రూ.24,944 కోట్ల వడ్డీ కట్టాలనేమో కదా! అయితే వాస్తవం ఇది కాదు. 1953 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ ఇది. అంత మొత్తాన్నీ వైఎస్ జగన్ ఖాతాలోకి వేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది ఈనాడు కుత్సిత వ్యూహం!.లోకేష్ తన ట్వీట్లో 2019 వరకు ఉన్న అప్పులపై వడ్డీని, జగన్ హయాంలో తెచ్చిన అప్పులపై వడ్డీని పోల్చుతూ కొంత మిస్ లీడ్ చేసే యత్నం చేస్తే.. ఈనాడు మీడియా అబద్ధపు హెడ్డింగ్ పెట్టి మొదటి లైన్లో ఇలా రాసింది. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన అప్పులపై కడుతున్న వడ్డీ రూ.24,944 కోట్లకు చేరుకుందని మంత్రి లోకేష్ తెలిపారు’ అని! ఆ వెంటనే ‘2019 నాటికి మొత్తం అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీ రూ.14,155 కోట్లు. దీని కంటే జగన్ పాలనలో చేసిన అప్పులపై కడుతున్న వడ్డీనే అధికం అని లోకేష్ పేర్కొన్నారు’ అని రాసింది. మొదటి వాక్యంలో మొత్తం వడ్డీ అంతా జగన్ ఖాతాలో వేసేసింది?. అదంతే.. ఈనాడు బుద్దే అలా చెడిపోయిందని అనుకోవాలి.ఇక లోకేష్ విషయానికి వద్దాం. ఆయన ఏమంటున్నారంటే 2019 వరకు అందరు ముఖ్యమంత్రులు కలిసి తెచ్చిన అప్పులపై రూ.14,155 కోట్ల వడ్డీ చెల్లిస్తుండగా, జగన్ హయాంలో రూ.24 వేల కోట్లకు చేరిందీ అని చెప్పారు. అదే టైమ్‌లో ఆయన పోల్చవలసింది చంద్రబాబు ఉమ్మడి ఏపీతోపాటు విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అప్పులెంత? అన్నది విభజిత ఏపీలో 2014-19 మధ్య ఎంత అప్పు తీసుకు వచ్చారన్నది కదా!. అదేమీ చెప్పకుండా లోకేష్ అతి తెలివిని ప్రదర్శించారు.ఈ అంశంపై నెటిజన్లు లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేష్ బాబూ.. అసలు నిజం చెబుదామా? అంటూ వాయిస్ ఆంధ్ర పేరుతో ఒక ట్వీట్ వచ్చింది. అందులో ఇలా ప్రస్తావించారు. 2014-19 చంద్రబాబు హయాంలో అప్పుల భారం ₹97,000 కోట్ల నుంచి ₹3,46,529 కోట్లకు పెరిగింది! (సోర్స్: CAG & RBI).అప్పుల భారం మూడింతలు చేసిన చంద్రబాబు, వడ్డీ పెరిగింది అని జగన్‌పై బురదజల్లడం కామెడీ కాదా?. 2019 నాటికి అప్పులపై కట్టిన వడ్డీ ₹14,154 కోట్లు. అదే 2024 నాటికి ₹24,944 కోట్లు. వడ్డీ పెరగడానికి కారణం 2014-19 మధ్య టీడీపీ చేసిన భారీ అప్పులే కదా?. జగన్ పాలనలో అప్పులు వచ్చాయి కానీ, సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. కానీ టీడీపీ హయాంలో అప్పు చేసి.. కమీషన్లు, కాంట్రాక్టర్లు, సింగపూర్ ట్రిప్పులకే ఖర్చు పెట్టారు. అని ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.జగన్ హయాంలో 'అమ్మ ఒడి, విద్యా కానుక ఇచ్చారు.. మరి మీ సూపర్ సిక్స్ ఏది మరి? అని ఇంకొకరు ప్రశ్నించారు. వాస్తవాలు చెబితే మైండ్ బ్లాంక్ అవుతుందా బాబూ? అంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నలు సంధించింది. 'YSRCP హయాంలో ప్రజల జీవితం మెరుగుపడింది. కానీ టీడీపీ హయాంలో మాత్రం అప్పులూ, అవినీతీ తప్ప మిగలలేదు! అని ఆ పోస్టులో వ్యాఖ్యానించింది.ఉమ్మడి ఏపీ విడిపోయేనాటికి విభజిత ఏపీ అప్పు పై ఏడాదికి రూ.7488 కోట్లు చెల్లిస్తుండగా, 2019 నాటికి చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు కూడా కలిపి కట్టవలసిన వడ్డీ రూ.15,342 కోట్లు. అంటే అంతకుముందు ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పుకన్నా మూడు రెట్లు అధికంగా రుణాన్ని తీసుకురావడమే కాకుండా, డబుల్ మొత్తాన్ని వడ్డీగా చెల్లించవలసి వచ్చిన లెక్కలను వైఎస్సార్సీపీ నేతలు తమ సమాధానాలలో వివరించారు. 2019లో అప్పును మూడున్నర లక్షల కోట్లకు తీసుకువెళ్లి కూడా చివరకు జగన్ పదవిలోకి వచ్చే నాటికి వంద కోట్లు మిగిల్చి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.అప్పుడు జగన్ జీతాలు కూడా ఇవ్వలేరని టీడీపీ నేతలు భావించి ప్రకటనలు కూడా చేశారు. దానిని కదా ఆర్థిక విధ్వంసం అనాల్సింది? ఆ తర్వాత రెండేళ్ల పాటు కరోనా ఉన్నా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు అమలు చేసిన చరిత్ర జగన్‌ది. అంతేకాదు.. జగన్ దిగిపోయే నాటికి ఏడువేల కోట్లు ఖజానాలో ఉంచి వెళ్లారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్క హామీ అమలు చేయకుండా, అప్పులు మాత్రం రూ.1.30 లక్షల కోట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు సర్కార్‌ది అని వైఎస్సార్సీపీ నేతలు వాదించారు. ఇది నిజమే.జగన్ టైమ్‌లో అన్ని పథకాలు అమలై, పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఊరూరా భవనాలు నిర్మించినా ఆర్థిక విధ్వంసం అని టీడీపీ కూటమి దుష్ప్రచారం చేస్తుంటుంది. మరి ఈ ఎనిమిది నెలల కాలంలో కాని, అంతకుముందు 2014 టర్మ్‌లో ఐదేళ్లలో కాని నిర్దిష్టంగా ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకోలేని పరిస్థితి టీడీపీది. అప్పుడు రుణమాఫీతో సహా వందల హామీలు అమలు చేయకుండా కాలం గడిపారు. ఇప్పుడు సూపర్ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం గల్లాపెట్టె ఖాళీ అంటూ కథలు చెబుతూ, మరోవైపు ధారాళంగా అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తోంది.2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని ప్రచారం చేశారు. తీరా చూస్తే అది రూ.ఏడు లక్షల కోట్లు కూడా లేదు. అందులో చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో వచ్చిందే సుమారు రూ.మూడు లక్షల కోట్లు ఉంది. అయినా దాని గురించి చెప్పకుండా మొత్తం జగన్ అకౌంట్లోవేసి ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తుంటారు. అదేకాదు. ఇటీవలి కాలంలో కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం జగన్ టైమ్‌లో జీఎస్డీపీ, జీఎస్టీలలో ఏపీలో వృద్దిలో ఉంటే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో మైనస్‌లోకి వెళ్లింది.జగన్ టైమ్ లో మైనింగ్ శాఖలో 2023-24లో ఆదాయం రూ.4800 కోట్లు కాగా, అది చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.మూడు వేల కోట్ల వరకే ఉందట. చంద్రబాబు 2014 టర్మ్‌లో మైనింగ్ శాఖ ఆదాయం రూ.8161 కోట్లు ఉంటే, జగన్ ఐదేళ్లలో రూ.17,732 కోట్ల ఆదాయం సాధించింది. అయినా కూటమి నేతలు జగన్ టైమ్ లో ఆర్థిక విధ్వంసం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తారు. దానివల్లే తాము సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక పోతున్నామని ప్రజలను ఏమార్చే యత్నం చేస్తున్నారు.అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు మొనగాడు అని దేశవ్యాప్తంగా ఆయా పార్టీల వారు భావిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అచ్చంగా అదే బాటలో నడుస్తున్నారు. వారిద్దరితో పోటీ పడి లోకేష్ కూడా తనకు తోచిన అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజలలో ఉండాలని తలపెట్టినట్లు అనిపిస్తుంది. ఒకవైపు కుంభమేళాలో పుణ్యస్నానాలకు కుటుంబ సమేతంగా వెళ్లి వచ్చిన లోకేష్ ఇలాంటి అసత్యాలను చెబితే పాపం అనిపించదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మొత్తానికి ‘సూపర్ సిక్స్ వేస్ట్’ అని గవర్నర్‌తో చెప్పించారే!
ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చే గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల అమలు, ప్రగతి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి భిన్నం. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల ప్రణాళిక, హామీల ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) ముగించేసింది. ఏమిటి దీనర్థం? వాగ్ధానాలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Syed Abdul Nazeer) ప్రసంగం మొత్తాన్ని తరచి చూసినా సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించిన విషయం పెద్దగా కనపడదు. ఎన్నికల ప్రచారంలో ఈ ఆరు హామీలపైనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రమంతా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎలాగోలా అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ , లోకేష్‌లు ఈ హామీల ఎగవేతకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హామీల అమలుకు బదులు ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడంపైనే పాలకపక్షం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తల, నేతల ఆస్తుల విధ్వంసం, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రం ఇప్పటికే అరాచక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు!. జగన్ అధికారంలో ఉండగా ప్రశంసించిన మంత్రివర్గాన్నే ఇప్పుడు గవర్నర్ విమర్శించాల్సిన పరిస్థితి. ప్రసంగాన్ని గవర్నర్ స్వయంగా కాకుండా.. పాలకపక్షం తయారు చేసి ఆయన చేత చదివిస్తుంది మరి! భారత రాజ్యాంగంలోని ఒకానొక వైరుద్ధ్యమిది. 👉గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ టాప్ 25 హామీలు అంటూ ప్రత్యేక పత్రాలను విడుదల చేసింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్నారు. సంతకమైతే పెట్టారు కానీ.. గడువులోగా అమలు చేయలేదు. గవర్నర్ ప్రసంగంలో దీని గురించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు. వృద్ధాప్య ఫించన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిన విషయాన్ని చెప్పారు. కానీ, లక్షల సంఖ్యలో ఫించన్ల కోతకు కారణమేమిటో వివరించలేదు. అలాగే పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలందరికీ రూ.1500, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున చెల్లింపు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు, వలంటీర్ల గౌరవ వేతనం రూ.పది వేలకు పెంపు, అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పూర్ టు రిచ్, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ వర్తింపు, పెళ్లికానుక కింద రూ.లక్ష, పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిల్లో.. గ్యాస్ సిలిండర్లు పథకం అరకొరగా అమలు అవుతోంది. ఇసుక ఉచితం అనేది ఉత్తుత్తి మాటగానే మిగిలిపోయింది. వీటితోపాటు మిగిలిన హామీల పురోగతి, అమలుకు ఉన్న అడ్డంకులను గవర్నర్‌తో చెప్పించి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు తెలిసేది. కానీ సూపర్ సిక్స్ హామీలను ఇవ్వనట్లు గవర్నర్ ప్రసంగం సాగిందనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం ఏటా ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలును గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు నివేదించేది. టీడీపీ ప్రభుత్వం(TDP Government) మాత్రం అలవికాని హామీలను ఇవ్వడమే కాకుండా.. ఆచరణ ప్రశ్నార్థకంగా ఉన్న పలు అంశాలను చెప్పుకుని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందట. కుల వృత్తుల ద్వారా ఆత్మగౌరవం, ఆర్థిక స్ధిరత్వం వస్తుందట. గీత కార్మికులకు పదిశాతం మద్యం షాపులను కేటాయించడం ప్రభుత్వ ప్రగతి అట. ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోందని, విప్లవానికి నాయకత్వం వహిస్తోందని చెబితే జనం చెవిలో పూలు పెడుతున్నట్లు అనిపించదా!. 👉యథా ప్రకారం స్వర్ణాంధ్ర -2047 సాధనకు పది సూత్రాలను రూపొందించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. విశేషం ఏమిటంటే ఆ పది సూత్రాలు తమకే అర్థం కాలేదని తెలుగుదేశం మీడియా అంటోంది. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్నట్లుగా గవర్నర్‌తో చెప్పిస్తే ఏమి ప్రయోజనం?. అది నిజమో ,కాదో ప్రజలకు తెలియదా? తాము ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చెప్పలేదని, అవకాశాలు కల్పించామని అన్నామని మంత్రి లోకేష్ శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. కానీ వారి పత్రిక ఈనాడులో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేసినట్లే రాశారు. వారికి కూడా తెలుగు అర్థం కాలేదా!. కేంద్ర పధకాలను పునరుద్దరించారట. తొమ్మిదివేల కోట్ల అప్పు తీర్చారట. విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వ టైమ్ లోనే కేంద్రం ఆయా స్కీముల కింద నిధులు ఎక్కువ ఇచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు(Chandrababu)కు కొద్ది రోజుల క్రితం వివరించారు. అయినా గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. 👉ఇక రోడ్లు, ఇతర పనుల బిల్లులు రూ.పది వేల కోట్లు చెల్లించామని అంటున్నారు. మంచిదే. కాని దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని అనడమే ఒకింత ఆశ్చర్యం!!. ఒక పక్క జనం వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి ఆశించిన స్థాయిలో లేక, జీఎస్టీ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. మరోపక్క గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. గూగుల్, మిట్టల్, టాటా పవర్, బీపీసీఎల్, ,గ్రీన్ కో వంటి దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వీటిలో బీపీసీఎల్, గ్రీన్ కోలు జగన్ ప్రభుత్వ టైమ్‌లోనే ప్రతిపాదనలు పెట్టాయి. గ్రీన్ కో కర్నూలు జిల్లాలో రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. కూటమి సర్కార్ వీటిని తన ఖాతాలో వేసుకుంటోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వలంటీర్లు లక్షన్నర మందిని తొలగించారు. ఇతరత్రా కొన్నివేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు ఎక్కడ వచ్చాయో ప్రభుత్వం వివరంగా చెబితే బాగుండేది. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలందరిని స్కీమ్‌లు, డబ్బులతో ముంచి లేపుతానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పాత కొటేషన్ ను అందుకుంది. ఎవరికైనా చేపను ఇస్తే అది అతని ఆకలిని ఒక్క రోజే తీర్చగలదు. అదే కనుక మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి లభిస్తుందనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. అంటే అర్థమైంది కదా? సూపర్ సిక్స్, ఇతర హామీలు వేస్ట్ అని చెప్పడమే ఇది! ఇక మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ రవాణా కేంద్రాలు.. ప్రపంచ మార్కెట్లో అనుబంధంగా కొత్త వాణిజ్య కారిడార్లు.. ఇలా ఏవేవో చెప్పి ప్రజలను మభ్య పెట్టేయత్నం సాగించారు. రోడ్లను బాగు చేసేసినట్లు, కొత్త రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే రూ.15వేల కోట్ల మేర బాదిన ప్రభుత్వం ఇప్పుడు పెంచడం లేదని చెప్పుకుంటోంది. తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామని చెప్పారు. కాని ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేదో వెల్లడించలేదు. అన్నా క్యాంటిన్లు హామీ అమలు నిజమే కాని, దానితోనే పేదరికం పోయేటట్లయితే, పేదల ఆకలి తీరేటట్లయితే వాటినే రాష్ట్రం అంతటా వీధి, వీధిన పెడితే సరిపోతుంది కదా? మరి ఇది చేపల వల అవుతుందా? లేక చేపలు ఇచ్చినట్లు అవుతుందో వివరిస్తే బాగుంటుంది. మొత్తం మీద గవర్నర్ స్పీచ్‌లో ఏదో జరిగిపోతోందన్న పిక్చర్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో తెలియకుండానే సూపర్ సిక్స్ హామీలు మోసపూరితమైనవని, ప్రజలను సోమరిపోతులను చేసేవి అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు జస్ట్ బిల్డప్ బాబాయ్ అంతే!
విపక్షంలో ఉన్నప్పుడు.. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే.. ఎక్కడా లేని నీతులు చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విద్యలో ఆరితేరారు. దానికి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి.. లాంటి ఎల్లో మీడియా భజన ఎటూ ఉంటుంది. ఈమధ్య.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్న తరుణంలో జగన్ అక్కడకు వెళితే.. ఆ పర్యటనను చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు!. రైతులు కష్టాలలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాని పరామర్శ చేసి.. వారిని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకునేది చెప్పలేదు. పైగా జగనే ఏదో తప్పు చేశాడని చంద్రబాబు పదే పదే అంటున్నారు. శాసనమండలి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయట!. కోడ్ అమలులోకి వచ్చిందట!. అందుకే రైతులను ఎవరూ పలకరించి వారి కన్నీరు తుడవరాదట!. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలట!. ఏమైనా అర్ధం ఉందా?.. అసలు మిర్చియార్డులో పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎన్నికల కమిషన్ ఎక్కడైనా చెప్పిందా?. విచిత్రం ఏంటంటే.. ఇదే ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రిగా ఉండి 2019లో చంద్రబాబు(Chandrababu) ఎన్ని విమర్శలు చేశారో తెలియదా?. ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్‌కు వెళ్లి దబాయించి గొడవ చేశారు. మరి ఇప్పుడేమో సుద్దులు చెబుతున్నారు. కరోనా సమయంలో ర్యాలీల మాదిరి వెళ్లవద్దని, సభలు జరపవద్దని దేశ వ్యాప్తంగా నిబంధనలు వస్తేనే పట్టించుకోని పెద్దమనిషి చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిభద్రత ల సమస్యలు వస్తాయని ,ఫలానా చోటకు వెళ్లవద్దని పోలీసులు వారించినా, వారిని తోసుకుని మరీ వెళ్లిన చరిత్ర చంద్రబాబుది. 👉అనపర్తి వద్ద అప్పట్లో ఏమి చేశారో గుర్తు లేదేమో!. మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద వైఎస్సార్సీపీవాళ్లను చూపిస్తూ.. తన్నండి.. అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ఫిర్యాదుదారుని బెదిరించి ఆ కేసు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు చట్టం గురించి చెబుతున్నారు. 👉పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్‌ను తగలబెట్టి, రాళ్లతో పోలీసులపై దాడి చేస్తే ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. ఆ ఘటనలో కనీసం సానుభూతి తెలపని చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఎక్కడాలేని చట్టాలు, నీతులు చెబుతుంటారు. పోనీ ఆయన ఏమైనా కోడ్ ఉందని ఏ కార్యక్రమం ప్రచారం చేయకుండా ఉంటున్నారా?. విజయవాడలో ఏకంగా మ్యూజిక్ నైట్ పెట్టుకుని ఎంజాయ్ చేశారే! అప్పుడు కోడ్ అడ్డం రాలేదా? రైతులను పరామర్శ చేస్తేనే కోడ్ వచ్చిందా?.. .. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినందుకు జగన్‌తో సహా ఎనిమిదిమందిపై కేసులు పెట్టారు. మరి అక్కడలేని మాజీ మంత్రి పేర్నినానిపై కూడా కేసు పెట్టాలని ఏ చట్టం చెబుతోంది?. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళితే భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా?. అయితే సీఎంగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా.. ఎదురు ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది మరి. ఆయన మరికొన్ని చిత్రమైన ప్రకటనలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రైతులకు ఏమీ చేయలేదట..! రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఏమైనా ఉంటాయా?. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తెచ్చి వాటి ద్వారా వాళ్లకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు పంటల సలహలు, పంట కొనుగోళ్లు.. అన్నీ చేసిందే జగన్. అలాంటి నాయకుడిపై ఇలాంటి విమర్శ చేయడానికి చంద్రబాబు మనసు ఎలా వచ్చిందో అర్ధం కాదు. గతంలో ఎరువుల షాపుల వద్ద రైతులు తమ చెప్పులు క్యూలలో ఎట్టుకుని పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితిని తప్పించి రైతులకు గౌరవం తెచ్చిన వ్యక్తి జగన్. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పధకాన్ని ప్రకటించిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల్లా హామీలను ఎగ్గొట్టకుండా.. దానిని అమలు చేసి చూపారాయన. ఏడాదికి రూ13,500 చొప్పున సాయం అందించడం ఒక ఎత్తు అయితే.. ఆయా పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది జగన్ కాదా?టమోటా తదితర పంటలకు ధర తగ్గినప్పుడు వెంటనే జోక్యం చేసుకుని మార్కెట్ పెంచింది జగన్ ప్రభుత్వం కాదా?ఇప్పుడేమో కనీసం రైతులను పలకరించని చంద్రబాబేమో.. చాలా చేసేస్తున్నారని ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తే సరిపోతుందా?పాపం!గత ఏడాది 21 వేల నుంచి 27 వేల రూపాయల వరకు మిర్చి ధర పలికితే ,ఈసారి అందులో సగం కూడా ఇప్పుడు రావడం లేదని రైతుల ఆక్రోశం. కేంద్రం కూడా దీనిపై తూతూమంత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మిర్చి రైతులకు ఊరట అని ఈనాడు బిల్డప్. అవును డబ్బులు ఊరికే రావు.. అన్నట్లుగా ఈనాడుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో లాభం ఉంటోంది కదా!👉కొందరు రైతులు ఇప్పుడు ఓపెన్‌గానే చెబుతున్నారు.. 20వేల రూపాయల పెట్టుబడిసాయం ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేస్తే నమ్మి ఓట్లు వేశామని.. తీరా చూస్తే ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు విజయ్ కేసరి చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. 👉పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కోసం ఎంతలా మాట్లాడారు?. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఎలా పెరిగింది?.. తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చారు. ఈ పాయింట్‌నే విజయ్ కేసరి ప్రముఖంగా ప్రస్తావించారు 👉సినిమా టిక్కెట్ల ధరలు , మద్యం ధరలు పెంచుకోవడానికి చూపిన శ్రద్ద.. రైతుల ఉత్పత్తుల ధరలకు చూపరా? అని విజయ్ కేసరి ప్రశ్నించారు. అలాగే.. రైతులకు పెట్టుబడి వ్యయం పెరగలేదా? అని ఆయన అడిగారు. ఇవి వాస్తవాలు. 👉మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొనుగోళ్లకు రంగంలో దిగాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా.. జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి ఆయన ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. 👉చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ జగన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ జరుపుకోవడానికి కోడ్ అడ్డం కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లి.. రైతుల సమస్యలపై వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వడమేమిటని చంద్రబాబును జగన్ నిలదీశారు. 👉ధాన్యం కొనుగోళ్లకు తమ హయాంలో 65వేల కోట్లు వ్యయం చేశామని, ఇతర పంటలకు స్థిరీకరణ నిధి ద్వారా సుమారు రూ.7,800 కోట్ల వ్యయం చేశామని కూడా జగన్ చెప్పారు. మిర్చియార్డులో ఓట్ల ప్రస్తావన తేకపోయినా, మైక్ వాడకపోయినా,అసలు ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయకపోయినా కేసులు పెట్టారని, దీనికి భయపడేది లేదని.. రైతుల తరపున పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా రైతుల సమస్యలపై పనిచేసిన రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక వంకతో మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం.. పైగా తప్పుడు కేసులు పెట్టడం అంతా రెడ్ బుక్ పిచ్చి కుక్క ప్రభావంగానే వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే.. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ అవ్వడానికి రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. తాకట్టులో ఉన్న బంగారంతో సహా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన నేతగా చంద్రబాబు చరిత్రకెక్కారు. అలాగే.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత జగన్. అదే.. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయల సాయం చేస్తామని చెప్పి.. ఏడాది గడిచినా ఆ హామీని గాలికొదిలేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. అయినా ఎల్లో మీడియా ద్వారా రైతన్నపై ఫోకస్ పెట్టారంటూ, మిర్చి రైతుకు ఊరట వచ్చేసిందంటూ బిల్డప్ ఇచ్చుకుని చంద్రబాబు అండ్ కో సంతోషపడవచ్చు. కాని దానివల్ల రైతులకు ఒరిగేది ఏమి ఉంటుంది?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది!
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజకీయ నేతలు సిద్దహస్తులుగా ఉంటారు. వారిలో మొదటి పేరు ఎవరిదైనా చెప్పవలసి వస్తే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అవుతుంది. అలాగే అడ్డగోలు చెత్త కథనాలు ప్రచారం చేయడంలో ఈనాడు, ఆధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకు మొదటి ర్యాంకు ఇవ్వవలసిందే. ఈ విషయం పలుమార్లు రుజువు అవుతూనే ఉంది. తాజాగా సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సెకీ ) నుంచి ఏపీకి విద్యుత్ కొనుగోలు చేయడానికి గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విషం చిమ్మడానికి టీడీపీతో పాటు, ఎల్లో మీడియా పోటీ పడ్డాయి. సాధారణంగా.. నిజం నిలకడమీద తెలుస్తుందంటారు. కాకపోతే వాస్తవం బయటపడే లోపు అబద్దాలు లోకం అంతా చుట్టేస్తుంటాయి. సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి జగన్ తీరని నష్టం చేశారని ఎల్లో మీడియా అసత్యాన్ని ఒకటికి పదిసార్లు ప్రచారం చేసింది. లక్ష కోట్ల భారం ఏపీపై జగన్ వల్ల పడిందని కూడా ఆ మీడియా సంస్థలు ఆరోపించాయి. వాస్తవం ఏమిటంటే జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల రూపాయల మేర ఏపీ ప్రజలకు ఆదా అయింది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ వల్ల ఏపీకి లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లన్నమాట.👉సెకీ(SECI)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్ 2.49 రూపాయలకు ఏపీకి సరఫరా అవుతుంది. ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడూ ఒప్పందం జరగలేదు. అయినా అది చాలా ఎక్కువ ధర అని, దీనికి ట్రాన్సిమిషన్ చార్జీలు అదనంగా చెల్లించాలంటూ ఇష్టం వచ్చినట్లు ఆ మీడియా ప్రచారం చేయడం, దానిని చంద్రబాబు తలకు ఎత్తుకుని విమర్శలు చేయడం.. కొద్ది నెలల క్రితం నిత్యకృత్యంగా సాగింది. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు..పెట్టుబడులపై ప్రభావం చూపినా ఫర్వాలేదన్నట్లుగా జగన్ పై దుష్ప్రచారం చేశాయి.అర్ధరాత్రి టైమ్ లో ఫైల్ పై సంతకం పెట్టించారని జనసేనలోకి వెళ్లిన మాజీ విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించారు. అయినా జగన్ చేసింది రాష్ట్రానికి మంచి అని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదు. 👉తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు(Super Six Promises), ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అదాని,జగన్ మద్య లింక్ అని, అదాని నుంచి జగన్ లంచం తీసుకున్నారని, అమెరికాలో కేసు అయిందని విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఏపీ ప్రభుత్వంతో నేరుగా అదానీ ఒప్పందమే జరగనప్పుడు లంచాల ప్రస్తావన ఎలా వస్తుందని వైఎస్సార్సీపీ వారు చెప్పినా.. తమ దుర్మార్గపు మీడియాతో పదే పదే ప్రచారం చేయించారు. సరే.. వారు చెబుతున్నారు కదా! సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి లక్ష కోట్ల భారం పడుతుందని అంటున్నారు కదా! దానిని రద్దు చేసుకోండని ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం దానికి జవాబు చెప్పేవారు కారు. వైఎస్ జగన్‌పై ఈ విద్యుత్ ఒప్పందంపై ఏసీబీతో విచారణ చేయిస్తున్నామని కూడా బిల్డప్ ఇచ్చారు. అవన్నీ ఉత్తిత్తివేనని అందరికి తెలుస్తూనే ఉంది. కాకపోతే జగన్ పై ప్రజలలో ఒక అపనమ్మకం కలిగించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు నానా చెత్త అంతా ప్రచారం చేసేవి. దానికి అనుగుణంగా చంద్రబాబు మాట్లాడడమో,లీక్ ఇవ్వడమో చేస్తుండేవారు. విశేషం ఏమిటంటే దేశం బీజెపీయేతర రాజకీయ పక్షాలు అదానీపై, ప్రధాని మోదీపైన విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం వారిని పల్లెత్తి అనకుండా, జగన్ పై మాత్రం ఆరోపణలు గుప్పిస్తుండేవారు. ఇలా ఉంటుంది చంద్రబాబు రాజకీయం. ఇప్పుడు ఏపీలో విద్యుత్ నియంత్రణ మండలి(AP ERC) సెకీ ఒప్పందం సక్రమమని, దానివల్ల ఎపికి మేలు జరుగుతుందని, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సి లో చైర్మన్ ను చంద్రబాబు ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ మండలి సాధారణంగా నిర్ణయాలు తీసుకోదు. మండలి ఒప్పుకున్నా.. కోకున్నా చంద్రబాబు ప్రభుత్వం తాము సెకీతో ఒప్పదం ప్రకారం విద్యుత్ సరఫరా చేసుకోబోమని కూడా చెప్పి ఉండవచ్చు. ఆ పని చేయలేదు. అంటే చంద్రబాబు అండ్ కో(Chandrababu & Co) ఎప్పటిమాదిరే డబుల్ గేమ్ ఆడారన్నమాట. 👉జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం వారు పొందాలి. అదే టైమ్ లో జగన్ ను బదనాం చేయాలి..ఇది వారి వ్యూహం. అదానీ వివాదం చెలరేగినప్పుడు చాలా స్పష్టంగా ఏ విచారణకు అయినా సిద్దం అని జగన్ చాలెంజ్ చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.4.50 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. దానిని టీడీపీ, ఎల్లో మీడియా వ్యతిరేకించి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రచారం చేశాయి. అదే జగన్ రూ.2.49 ఒప్పందం అయితే మాత్రం ఏదో ఘోరం జరిగినట్లు అబద్దాలు సృష్టించారు. ఇప్పుడు ఏపీఈఆర్సీ నిర్ణయంతో చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని ఎంత తప్పుడు ప్రచారం చేసింది జనానికి పూర్తిగా అర్దం అవుతుంది. 👉ఈనాడు మీడియాలో వచ్చిన హెడింగ్‌లు చూస్తే.. జర్నలిజం ఇంత నీచంగా మారిందా? అనే బాధ కలుగుతుంది. అదానీ కేసులో జగన్ పేరు లేకపోయినా, పనికట్టుకుని ఒకటికి రెండుసార్లు ఆయన పేరు రాసేవారు. నేరుగా అదానీ నుంచి జగన్‌కు రూ. 1,750 కోట్ల లంచం అందిందని అచ్చేశారు. ఇప్పుడు అదే ఒప్పందాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నందున ఆయనకు రూ.2,750 కోట్ల ముడుపులు ముట్టాయా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.👉అబద్దాల ఆంధ్రజ్యోతి ఇప్పటికీ ఏదో రూపంలో వైఎస్సార్సీపీ బురదచల్లడానికి నిస్సిగ్గుగా యత్నిస్తోంది. ఈనాడు పెట్టిన కొన్ని శీర్షికలు చూడండి..⇒నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతిచ్చేశారుఅసలు అదానీతో ఒప్పందమే లేదని ఈఆర్సీ నివేదిక ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. జగన్ ఈ అంశంపై తన వాదన తెలిపితే.. ⇒అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్ధనా? అని ఈనాడు విషం కక్కింది. ఇప్పుడు ఈనాడు ఎవరి నుంచి ముడుపులు తీసుకుని ఇలాంటి అవినీతి కధనాలు రాసిందో అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.'రాష్ట్రానికి నష్టం..రాజస్తాన్ కు లాభం" అంటూ మరో వార్త ఇచ్చారు. రాజస్తాన్ కు ఇందులో ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమి ఉండదు. అదానీ లేదంటే ఇతర పారిశ్రామికవేత్తలు ఆయా చోట్ల నెలకొప్పిన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. పైగా అక్కడ నుంచి ఏపీకి ట్రాన్సిమిషన్ చార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసినా.. జగన్ పై బురదచల్లుడు కధనాలు ఇచ్చి తన కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంది.అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ చంద్రబాబు ,ఈనాడు,ఆంధ్రజ్యోతి దారుణాతిదారుణంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకున్నది చంద్రబాబు, ఎల్లో మీడియా కాదా?. అదానీ స్కామ్ నిజంగా జరిగి ఉంటే.. అందులో చంద్రబాబు, ఎల్లో మీడియాకు వాటా ఉన్నట్లు అనుకోవాల్సిందేగా! ఏది ఏమైనా ద్వేషంతో జర్నలిజం ప్రాధమిక సూత్రాలను విస్మరించి ఈనాడు చేస్తున్నది పచ్చి పాపం అని చెప్పాలి. అందుకే జగన్ ఈ మీడియాపై పరువు నష్టం దావా వేశారు.అది ఎప్పటికి తేలుతుందో కాని,కచ్చితంగా న్యాయం నిలబడి వారికి శిక్షపడడానికి ఇప్పుడు ఈఆర్సీ చేసిన నిర్ణయం ఒకటే సరిపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గులాబీ బాస్.. ఇంక వ్యూహం మార్చాల్సిందేనా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సెంటిమెంట్‌తో మరోసారి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన తన తొమ్మిదిన్నరేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్దిని ప్రస్తావిస్తూనే, తన సహజశైలిలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయితే తాము అధికారంలో ఉండగా జరిగిన తప్పులను సమీక్షించుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు. ప్రత్యేకించి.. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను తేలికగా తీసుకుంటున్న అభిప్రాయం కలుగుతుంది. శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు కాని లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం బీఆర్ఎస్(BRS)కు పెద్ద షాకే. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత ఘోరమైన ఫలితాన్ని చవిచూడలేదు. ఈ పరిస్థితి ఎందుకు అనేదానిపై ఆయన దృష్టి పెట్టారో, లేదో తెలియదు. కేసీఆర్(KCR) పార్టీ కంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కే ఎక్కువగా పరిమితమవుతున్నారు అని పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆయనను కలవాలంటే అంత దూరం వెళ్లాల్సి వస్తోంది. కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావులు యాక్టివ్ గా ఉండడం బాగానే ఉన్నా.. ప్రధాన నాయకుడిగా కేసీఆర్ కూడా అందుబాటులో ఉండవలసిన అవసరముంది. తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పుకున్నా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ టీఆర్ఎస్ నుంచి పేరు మారిన బీఆర్ఎస్ అని ప్రకటించినా.. పార్టీకి కొత్తగా వచ్చేదేమీ ఉండదు. తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన మాట నిజం. ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్దిలో విశేష కృషి ఉంది. అందువల్లే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో బీఆర్ఎస్ పూర్తి మెజార్టీని సాధించింది. తెలంగాణ రూరల్ ప్రాంతంలో మాత్రం పార్టీ బాగా దెబ్బతింది. ఫలితంగా అనూహ్యమైన ఓటమిని చవిచూడవలసి వచ్చింది. ఇందుకు.. కాంగ్రెస్ ప్రకటించిన హామీల ప్రభావం కొంత ఉండవచ్చు. కాని అదే టైమ్ లో కెసిఆర్ యాటిట్యూడ్ , అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్లు, మొదలైన కారణాల వల్ల కూడా పార్టీకి నష్టం జరిగింది. శాసనసభ ఎన్నికలలో 38 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్లోక్ సభ ఎన్నికలలో దారుణ పరాజయం ఎదుర్కొనప్పటికీ.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్న మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తప్పులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి.. ఇందుకు ఉపకరిస్తున్నాయి. కాంగ్రెస్ వాగ్దానాల అమలుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అవి అలవి కావడం లేదు. ఈ అంశాల ఆధారంగా బీఆర్ఎస్లో జోష్ నింపడానికి కేసీఆర్ యత్నించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. కేసీఆర్ కేవలం ప్రసంగం చేసి తిరిగి ఫామ్ హౌస్‌కే పరిమితమైతే అంత ఉపయోగపడకపోవచ్చు. ఈ విషయాన్ని పక్కనబెడితే కేసీఆర్ ఉపన్యాసంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలను ప్రస్తావించారు. తద్వారా తెలంగాణ ఫీలింగ్‌ను పెంచడం ద్వారా రాజకీయం చేయడం అంత తేలిక కాకపోవచ్చు. కేసీఆర్‌తో పోటీగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా దానిని రెచ్చగొట్టగలరు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోరాదు. తామే రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకోవడం వరకు ఓకే. దానిని జనం నమ్ముతారు కూడా. కాని చరిత్రను తనకు అనుకూలంగా మలచుకుని మాట్లాడుతున్న వైనం ఎంతవరకు ప్రయోజనమన్నది ప్రశ్న. కేసీఆర్ ఏమన్నారో చూడండి.. 'తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ , తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్" అన్నారు. 'తెలంగాణ కన్నీళ్లు తెలిసిన పార్టీగా.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్థిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను, తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పదంలో తెలంగాణ సెంటిమెంట్ ను చొప్పించడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఇదే ప్రసంగంలో ఆయన ఒక మాట అన్నారు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల ఓటమి గురించి మాట్లాడుతూ రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, కొత్తతరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. ఇందులో వాస్తవం ఉందా? లేదా? అనేదాని కన్నా, ఆయన ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రేకెత్తించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్నదే ఆయన లక్ష్యం అనే విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. తన పదవీకాలంలో ఎప్పుడైనా ఒకసారి సెంటిమెంట్ గురించి మాట్లాడినా, సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారైనా తెలంగాణ ప్రజలగానే చూడాలని అనేవారు. అది ఆయనకు కలిసి వచ్చింది కూడా. అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్న వారిలో మెజార్టీ బీఆర్ఎస్కే మద్దతు ఇచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆనాటి టీఆర్ఎస్ ఉనికే పెద్దగా లేదన్నది వాస్తవం. కాని అధికారంలోకి వచ్చాక ఎలాంటి గొడవలు లేకుండా, ఉద్యమం వివాదాలు కనిపించకుండా కేసీఆర్ ప్రభుత్వం సాగింది. కనుకే వారి మన్ననలు పొందగలిగారు. అయితే.. నిజాం సంస్థానాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం సర్దార్ పటేల్ నేతృత్వంలో భారత్‌లో విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు అంత సబబు కాదేమో!. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి తెలంగాణకు ద్రోహం చేసిందని వాదించడానికి ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్నారు. 'దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదని, తెలంగాణ ఇంకా నిజాం పాలనలో ఉంటే భారత మిలటరీ సైనిక ఆక్రమణకు పాల్పడిందని కేసీఆర్ వివరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో 20-30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో కొంత మంది రజాకార్లు ఉన్నా మరికొంత మంది సామాన్యులు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారని, మాజీ హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి తండ్రి వంటివారు ఎందరో మరణించారని గుర్తు చేశారు. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణను ఆంధ్రాలో అన్యాయంగా విలీనం చేయడం వల్ల యువత, ప్రజల్లో అలజడి పెరిగిందని తెలిపారు. ‘ఆత్మగౌరవ పోరాటాలు చేసిండ్రు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ వంటి అనేక ఉద్యమాలు మొదలైనయి." అంటూ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీని విమర్శించదలచుకుంటే ప్రస్తుత పరిణామాలలో చాలా దొరుకుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. కాని భారత మిలటరీ సైనిక ఆక్రమణలకు పాల్పడిందని అనడం చరిత్రాత్మకంగా ఎంత వరకు కరెక్టు? ఆనాడు భారత మిలటరీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు స్వాగతం పలికిన సన్నివేశాలు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులను విమర్శించడానికి, అప్పట్లో తెలంగాణలో పెద్దగా అభివృద్ది సాగలేదని చెప్పడానికి కేసీఆర్ యత్నించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇప్పుడు సమైక్య రాష్ట్ర ఊసు అంత అవసరమా?. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. ఎన్డీయే రూపంలో చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాలలోకి వస్తున్నారన్న సంశయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశేషం ఏమిటంటే 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తెలుగుదేశంతో స్నేహం చేసి ఓటమి చవి చూసింది. ఏపీలో 2024లో బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీతో భాగస్వామిగా ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు. తెలంగాణ వరకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు. కాని రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు(Chandrababu)కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది అందరి భావన. అందువల్ల తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ఏమి అవుతుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును విమర్శించి, జాతీయ పార్టీ అయిన బీజేపీ జోలికి కేసీఆర్ పెద్దగా వెళ్లినట్లు కనబడదు. దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయవచ్చు. ఇక ఫిరాయింపులు, ఉప ఎన్నికల గురించి కేసీఆర్ బాగానే మాట్లాడారు. కాని ఆయన కూడా తను అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను పెద్ద ఎత్తునే ప్రోత్సహించారు. దానివల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే.. తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించడానికి పాత తరం వ్యూహరచన చేస్తున్నట్లుగా ఉంది. కాని కేసీఆర్ చెబుతున్నట్లే కాలం మారింది. తరం మారింది. దానికి తగినట్లుగా ఆయన వ్యూహం మార్చుకోరా? అనేదే ప్రశ్న.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసలు ఇంతకీ తప్పు ఎవరిది?
ఐఏఎస్, ఐపీఎస్, అఖిలభారత సర్వీసు అధికారుల తీరుతెన్నులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. అధికారులు తమతో తప్పులు చేయించరాదని, నిస్పక్షపాతంగా ఉండాలని రేవంత్ రెడ్డి అనడం ఆహ్వానించదగ్గ పరిణామం. యాదృచ్ఛికమైన అంశం ఇంకోటి ఉందిక్కడ. రేవంత్‌రెడ్డికి రాజకీయ గురువుగా భావించే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం!. రెడ్‌బుక్ పేరుతో ఇప్పటికే ఏపీలో అరాచకం సృష్టిస్తున్న ఆయన తమది రాజకీయ పాలనేనని మొహమాటం లేకుండా పచ్చిగా... బహిరంగంగానే మాట్లాడుతుంటారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రాసిన పుస్తకావిష్కరణ సభలో రేవంత్ అఖిలభారత సర్వీసు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఒక తప్పు చేయాలంటే.. అధికారులు మూడు తప్పులు చేద్దామంటున్నారని వ్యాఖ్యానించారు. తద్వారా రాజకీయ నేతలు అధికారులతో తప్పులు చేయిస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ పాయింట్ ఆధారంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు విమర్శలు చేశారు. విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లు నేతల కారణంగా అధికారులు తప్పులు చేస్తున్నారా? లేక అధికారులు నేతలతో తప్పులు చేయిస్తున్నారా? చర్చనీయాంశం. నిజానికి ఇది రెండువైపుల నుంచి జరుగుతున్న తప్పే. రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చేంత వరకూ ఒకలా.. ఆ తరువాత అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకోలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో గెలుపునకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. అధికారం దక్కితే పెట్టిన ఖర్చును ఎలాగోలా చక్రవడ్డీలతో రాబట్టుకోవాలని నేతలు యత్నిస్తూంటారు. ఈ క్రమంలో అధికారులు తమ మాట వినేలా చేసుకునేందుకు నేతలు అన్ని పన్నాగాలు పన్నుతూంటారు. చెప్పినట్లు వినని అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకూ వెనుకాడరు. ఇదిలా ఉంటే ఇంకోవైపు కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తెగ పొగుడుతూంటే.. కొందరు మంత్రులతో గిల్లికజ్జాలకు దిగుతుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి ఎవరైనా సమర్థులైన అధికారులను విసృ్తత ప్రజా ప్రయోజనాల కోసం వాడుకోగలుగుతున్నారా? అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. రాజకీయ నేతల్లో మాదిరిగానే అధికార యంత్రాంగంలోనూ రాజకీయాలు, వర్గాలు ఉన్నాయన్నది నిజం. ఉత్తరాది, దక్షిణాది, కులం, ఒకే రాష్ట్రంలోని ప్రాంతం వంటి అంశాల ఆధారంగా అధికారులు ఒకరినొకరు విభేదించుకున్న సందర్భాలు బోలెడు. అఖిలభారత సర్వీసు అధికారులంటే పదవుల్లో ఉన్నవారు చాలా గౌరవం ఇచ్చేవారు. అధికారులు కూడా ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో వచ్చిన వారే ఎక్కువగా ఉండేవారు. కాని రాను, రాను నేతల్లో, అధికారుల్లోనూ మార్పు వచ్చింది. జనాన్ని నేతలు కరప్ట్ చేస్తున్నారా? లేక జనమే నేతలు కరప్ట్ అయ్యేలా చేస్తున్నారా? అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు అధికారులతోపాటు న్యాయ వ్యవస్థలోనూ సమాజంలోని అన్ని అవలక్షణాలు వచ్చి చేరుతూందన్న బాధ చాలామందిలో ఉంది. అది వేరే విషయం. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు నిబంధనల ప్రకారమే నిర్ణయాలు చేయాలని చెప్పేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రజల ఆకాంక్షలలో మార్పులు రావడం వల్ల ,వారిలో స్వార్ధచింతన పెరగడం వల్ల నిబంధనలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యంకాదు.. అవసరమైతే వాటిని మార్చండి.. మేము చెప్పే పనులు చేయండి అని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో అధికారుల్లోనూ మార్పులు వచ్చాయి. పలువురు అధికారులు తమ సంగతేమిటి? అనే ఆలోచనకు వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో కొందరు ముఖ్యమంత్రుల అనుభవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే సీనియర్ అధికారుల సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ రాను, రాను సీఎం ఆఫీసులోనే అధికారం కేంద్రీకృతమవుతోంది. దాంతో తమకు కావల్సిన అధికారులనే వీరు నియమించుకుంటున్నారు. ఎస్వీ ప్రసాద్ వంటి అధికారులు కొద్ది మంది మాత్రం పార్టీ, ముఖ్యమంత్రి ఎవరన్న దానితో సంబంధం లేకుండా పలువురు సీఎంల వద్ద కీలకమైన బాధ్యతలలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మారితే ఆయన పేషీలోని అధికారులు, సీఎస్ పోస్టులో ఉన్నవారు సైతం తిరిగి పోస్టు కోసం ఇబ్బంది పడవలసి వస్తోంది. ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం కొంత బెటర్ అని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సీఎస్ శాంతికుమారినే కొనసాగించారు. కానీ.. ఏపీలో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్ వద్ద పనిచేసిన అధికారులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. సీఎస్ జవహర్ రెడ్డి వంటి సీనియర్ అధికారుల పట్ల కూడా అవమానకర తీరులో వ్యవహరించింది. అంతెందుకు! రేవంత్ ఐసీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించారన్న ఆరోపణ ఒక్కటి లేదు. కానీ చంద్రబాబు గత హయాంలో జరిగిన స్కామ్‌లపై విచారించారన్న కారణంగా కొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇలా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని కులపరంగా కూడా చీల్చే యత్నం కనిపించదు. ఏపీలో మాత్రం కులం ఆధారంగా పోస్టింగ్‌లు, పార్టీ ఆధారంగా నియామకాలు జరుగుతున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు ఒక కుల సమావేశంలో పాల్గొని గత ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి ఆ కులం వారంతా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. అలాంటి అధికారికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు పెద్ద పీట వేసి ఒక పెద్ద పదవి కూడా ఇచ్చేశారు. దీనిని బట్టే ఆ ప్రభుత్వ వ్యవహార శైలి అర్థమవుతుంది. ఆ అధికారి తన సర్వీసులో ఏ రకంగా వ్యవహరించింది చెప్పకనే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ల ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటే ఐపీఎస్ అధికారులు వారికి మద్దతు ఇస్తున్నారు. కేసులు పెట్డడంలోనూ వివక్ష చూపుతున్నారు. చివరికి కొందరు ఐపీఎస్‌లే ముందస్తు బెయిల్ తెచ్చుకోవలసి వచ్చింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ గొడవ తక్కువ. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులకు స్వేచ్చ ఉండేది. వారు తమ అభిప్రాయాలు చెబితే వాటిని విని అవసరమైతే నిర్ణయాలలో మార్పు చేసుకునే వారు. ఒకవేళ అధికారులతో విభేధిస్తే, ‘‘మీరు మీ అభిప్రాయాలు రాయండి.. దానిపై నా అభిప్రాయం నేను రాస్తాను..’’ అని చెప్పేవారట. తద్వారా అధికారులకు ఇబ్బంది లేకుండా చూసేవారని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్ కుమారుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించే ప్రక్రియలో భాగంగా కొంతమంది ఐఎఎస్ అధికారులను కూడా ఇరికించారు. ఉదాహరణకు బీపీ ఆచార్య అనే ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ది చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ కేసులో ఇరికించి జైలులో పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆయనపై కేసును కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల విషయంలో అధికార యంత్రాంగం తలొగ్గక తప్పలేదని అంటారు. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు పై ఏర్పడిన విచారణ కమిషన్ ను ఎదుర్కోవలసి వస్తోంది.ఇదే టైమ్‌లో ఇంకో సంగతి చెప్పాలి. కొంతమంది అధికారులు తమ తరపున ఏజెంట్లను పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లడం లేదని రేవంత్ అంటున్నారు. అది రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే నిధుల వినియోగంలో ఉండే ప్రాధాన్యత క్రమాలు కూడా ముఖ్యం అని భావించాలి. డబ్బులు లేకుండా జనంలోకి వెళ్ళినా వారితో తిట్లు తినడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. ఉదాహరణకు.. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అధికారులు ఏ రకంగా తీసుకోగలుగుతారు?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య అధికారులు ఇన్నోవేటివ్ ఆలోచనలు చేయాలని పదే,పదే చెబుతున్నారు. ఆ ఇన్నోవేటివ్ పద్దతి ఏమిటో చెప్పకుండా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అని కొందరు వ్యాఖ్యానించారు.పైగా చంద్రబాబు ఈ మధ్య ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. గంటల తరబడి సమీక్షలు పెట్టడం వల్ల అధికారులకు విసుగు వస్తోందని ఆయన అనుకూల మీడియానే పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ టైంలో స్పందన కార్యక్రమం పెట్టి అనేక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రయత్నించారు. అలాగే వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్.. ఇలాంటి కొత్త వ్యవస్థలు తీసుకు వస్తే వాటిని విధ్వంసం చేసే పనిలో చంద్రబాబు సర్కార్ ఉంది. మరి ఆ వ్యవస్థలను తీసుకురావడం కోసం పనిచేసిన అధికారులది తప్పవుతుందా? లేక ఇప్పుడు విధ్వంసంలో భాగస్వాములవుతున్న అధికారులది తప్పు అవుతుందా?. ఏది ఏమైనా నిబద్దత కలిగిన అధికారులకు ప్రోత్సాహం ఉంటుందని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని ముందుగా రాజకీయ నేతలలో ఆ నిబద్దత ఉంటే ఆటోమేటిక్ గా అధికార యంత్రాంగం కూడా చాలా వరకు సర్దుకుంటుందని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లు
వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఎక్కడకు వెళుతున్నా.. ఆయనను చూడడానికి ,మద్దతు ఇవ్వడానికి తరలివస్తున్న జనతరంగాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఎనిమిది నెలలకే ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇంతగా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోందా? అనే ప్రశ్న సహజంగానే కలగనమానదు. కృష్ణా, గుంటూరు జిల్లాలను తమ గుండెకాయగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంటుంది. అలాంటి జిల్లాలలో ఒక సునామీలా వచ్చిన ప్రజలు.. జగన్‌కు జేజేలు కొట్టడం టీడీపీ కూటమి ప్రభుత్వంలో రైళ్లు పరిగెత్తిస్తుందేమో!. తప్పుడు కేసులో విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆ మరుసటి రోజు గుంటూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతాంగం కష్టాలను ఆయన విన్నారు. ప్రత్యేక రవాణా ఏర్పాట్లు ఏమీ లేకుండానే ప్రజలు వారంతట వారే జగన్ కోసం వస్తున్న తీరును గమనిస్తే.. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజలలో వెల్లువెత్తుతున్న నిరసనే అని స్పష్టమవుతోంది. కూటమి సర్కార్ అమలు చేస్తున్న రెడ్ బుక్ పిచ్చికుక్క రాజ్యాంగంపై ప్రజల తిరుగుబాటా? అనే భావన కలుగుతోంది. గుంటూరులో పోలీసులు సరైన భద్రత కల్పించకపోయినా, జగన్ ప్రజల మధ్యనుంచే రైతుల వద్దకు వెళ్లి వారి బాధల గాధలు విన్నారు. విజయవాడలో జగన్ మీడియాతో చెప్పిన విషయాలు చూస్తే ఆయనలో ధైర్యం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని జగన్ నిర్ణయించుకున్నారని అనిపిస్తోంది. అలాగే పార్టీ క్యాడర్ లో కాని, లీడర్లలోకాని జగన్ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. చచ్చేంతవరకు జగన్ తోనే అని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఒక రకంగా.. ఇందుకు లోకేష్ పిచ్చి రెడ్ బుక్, చంద్రబాబు అబద్దాల సూపర్ సిక్స్, పవన్ కల్యాణ్ ఫెయిల్ కావడం.. ఇలా అన్ని కలిసి జగన్ పై ప్రజలలో మరింత ఆదరణ పెంచాయనిపిస్తోంది. వంశీని పలకరించి బయటకు వచ్చాక జగన్ మాట్లాడుతూ కూటమి సర్కార్ పైన, పోలీసు యంత్రాంగం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కమ్మ సామాజికవర్గంలో నాయకులుగా ఎదుగుతున్న కొడాలి నాని, వంశీ, దేవినేని అవినాశ్, శంకరరావు ,బ్రహ్మనాయుడు వంటి వారిని అణచివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా తమకు పోటీ వస్తారనుకునేవారిని దెబ్బతీయడానికి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారన్నది వాస్తవం. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు లేకపోలేదు. 👉చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు 1986 ప్రాంతంలో మంత్రిగా ఉండేవారు. అప్పట్లో చంద్రబాబు కర్షక పరిషత్ ఛైర్మన్ గా ఉండేవారు. వీరిద్దరూ కలిసి జిల్లాలో ఏదైనా సభలో పాల్గొన్నప్పుడు ముద్దు కృష్ణమకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తే చంద్రబాబు సహించేవారు కాదట. ఈ విషయాన్ని ముద్దే చెప్పేవారు. 👉అంతెందుకు.. ఎన్.టి.రామారావును పదవి నుంచి దించేసినప్పుడు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. తీరా పని పూర్తి అయి తాను ముఖ్యమంత్రి అవ్వగానే దగ్గుబాటికి మొండిచేయి చూపించి ఆయన పార్టీలోనే ఉండలేని స్థితి కల్పించారు. 👉జూనియర్ ఎన్.టి.ఆర్.ను 2009 లో ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. తదుపరి ఆయన లోకేష్‌కు పోటీ అవుతారని తలచి పక్కనబెట్టేశారు. ఇలా.. చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. కమ్మ సామాజికవర్గాన్ని తన రాజకీయం కోసం పూర్తిగా వాడుకుంటారు. అదే టైంలో తన సామాజిక వర్గంలో ఎవరికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. పేరు రాకుండా జాగ్రత్తపడతారు. టీడీపీలో ఇప్పుడు ఎందరో సీనియర్లు ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర తదితరుల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇక.. పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవి ఇచ్చినా ఆయనకు ఉన్న అధికారాలు అంతంతమాత్రమే అని చెప్పాలి. ఇది ఒక కోణం అయితే వంశీ కేసును ప్రస్తావించి ప్రభుత్వాన్ని జగన్ ఎండగట్టారు. వంశీపై ఏ రకంగా తప్పుడు కేసు పెట్టారో ఆయన సాక్ష్యాధారాలతో సహా వివరించారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్దన్ అనే వ్యక్తి పదో తేదీన కోర్టులో తనకు ఫిర్యాదుకు సంబంధం లేదని చెబితే.. ఆ మరుసటి రోజు వంశీ అతనిని కిడ్నాప్ చేశారని పోలీసులు కేసుపెట్టారట. దీనికి మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కడో ఒక లిఫ్ట్ లో వీరిద్దరు ఉన్న ఏదో వీడియోని చూపించి మభ్య పెట్టే యత్నం చేసినట్లుగా ఉంది. వంశీని జగన్ కలవడం, అక్కడకు వేలాదిగా అభిమానులు తరలిరావడం తో రెడ్ బుక్ బాధితులందరికి నైతిక స్థైర్యం ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా పోలీసులను ఆయన తప్పు పట్టిన తీరుపై కొందరు ఆక్షేపణ చెబుతున్నారు. విశేషం ఏమిటంటే గత కొద్ది రోజులుగా హైకోర్టు కూడా ఆయా కేసులలో విచారణ చేస్తూ ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. కేసు పెట్టడం, లోపల వేయడం, కొట్టడం తప్ప ఏమైనా చేస్తున్నారా? అని పోలీసు అధికారులను ప్రశ్నించిన తీరుకు నిజంగా ఆ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. జగన్ ప్రభుత్వ టైమ్ లో చంద్రబాబు,లోకేష్ లు అప్పటి ప్రభుత్వంలోని వారిపైనే కాకుండా, పోలీసు అధికారులపై కూడా ఇష్టం వచ్చినట్లు దూషణలు చేసేవారు. రెడ్ బుక్ లో పేరు రాసుకున్నామని.. వారి సంగతి చూస్తామని బెదిరించేవారు. అయినా అప్పట్లో పోలీసు అదికారుల సంఘం కాని, ఐపీఎస్ అధికారుల సంఘం వారుకాని తప్పు పట్టలేదు. పుంగనూరు వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోయేలా టిడిపి వారు దాడి చేశారు. అయినా ఆ ఘటనపై పోలీస్ సంఘం గట్టిగా స్పందించలేదు. ఆ తర్వాత ఈ ఎనిమిది నెలల్లో పోలీసుల కళ్లెదుటే టీడీపీ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతుంటే.. కర్రలు,కత్తులతో దాడులు చూస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఘట్టాలను చూసినవారంతా పోలీసు శాఖ అసమర్ధతను చూసి అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. అంతదాకా ఎందుకు?.. తునిలో కౌన్సిలర్లను టీడీపీవారు వెంబడిస్తే పోలీసులు ఏమి చేస్తున్నారు?. తిరుపతిలో బస్ లో వెళుతున్న కార్పొరేటర్లపై దాడి చేసి కొంతమందిని బలవంతంగా కిడ్నాప్ చేస్తే పోలీసులు చేష్టలుడిగి నిలబడిపోయారే!. కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఈ అంశాలను ప్రస్తావించి ఢిల్లీలో సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. మరో వైపు వేధింపులకు గురైన వైఎస్సార్సీపీ పైనే ఎదురు కేసులు పెట్టడానికి ఏ రాజ్యాంగం అవకాశం ఇస్తుంది? అందుకే వారు ఖాకీ బట్టలు తీసేసి.. పచ్చ బట్టలు వేసుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తీయించివేస్తామని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించవలసి వచ్చింది. గతంలో పోలీసులు అకృత్యాలకు పాల్పడితే.. జనంలో తిరగుబాటు వస్తుండేది. 1978-83 మధ్య హైదరాబాద్ లో రమీజాబి అనే మహిళ పోలీస్ స్టేషన్లో మానభంగానికి గురై మరణిస్తే, ఆ విషయం తెలిసిన రాష్ట్ర ప్రజలంతా భగ్గుమన్నారు. రోజుల తరబడి కర్ఫ్యూ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే గుంటూరు జిల్లాలో షకీలా అనే మహిళ కూడా పోలీస్ స్టేషన్ లో మరణించినప్పుడు కూడా ప్రజలు తీవ్రంగా స్పందించారు. గన్నవరంలో అప్పట్లో ఒక మహిళను హింసించారన్న సమాచారంతో ప్రజలు పోలీస్ స్టేషన్ లోకి చొరబడ్డారు. ఆ మహిళను పోలీసులు స్టేషన్ బయట ఉన్న వంటగదిలో దాచిన విషయం కూడా కనిపెట్టారు. ఆ రోజుల్లో ప్రజలలో ఉన్న చైతన్యంతో పోల్చితే ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలు స్పందిస్తున్నట్లు లేదు. అలాగని వారిలో నిరసన లేదని కాదు.కాని మారిన రాజకీయాలు,ఇతర కారణాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక నాయకుడు జనం తరపున ముందుకు వస్తే ఎలా తిరుగుబాటుకు సిద్దం అవుతారో జగన్ పర్యటనలు తెలియచేస్తున్నాయి. గుంటూరు మిర్చియార్డులో గిట్టుబాటు ధరలు రాక ఆవేదనలో ఉన్న రైతులను పరామర్శకు జగన్ వెళితే అక్కడ పోలీసులు సహకరించకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. పైగా కేసులు కూడా పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెబుతున్నారు. అసలు అక్కడ వైఎస్సార్సీపీనే పోటీలో లేదు. ఎన్నికల ప్రచారం చేయలేదు. ర్యాలీలు తీయలేదు. మీటింగులు పెట్టలేదు. కేవలం మిర్చి యార్డులో రైతుల వద్దకు వెళితే ఏ రకంగా కోడ్ కు ఇబ్బంది కలిగిందో చంద్రబాబు పోలీసులే చెప్పాలి. రైతులు ఎన్ని కష్టాలలో ఉన్నా ఎవరూ పలకరించకూడదా?. జగన్ టూర్ చేయబట్టే కదా? కనీసం చంద్రబాబు కేంద్రానికి మిర్చి ధరల పతనంపై లేఖ రాశారు. కాని అది కంటితుడుపు చర్య. రాష్ట్రప్రభుత్వం మిర్చి కొనుగోలుకు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోకుండా ఈ లేఖల వల్ల ఏమి జరుగుతుందో తెలియదు.గుంటూరు యార్డుకు వెళ్లినప్పుడు జగన్‌కు పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదు?అది వారి వైఫల్యం కాదా! పోలీసులు ఈ విధంగా చేయవచ్చా? అనేదానికి ఆ శాఖ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష పార్టీవారు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే కలవకుండా వెళ్లిపోయిన డీజీపీ నాయకత్వంలో ఇంతకన్నా భిన్నమైన పరి్స్థితిని ఆశించడం తప్పవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నప్పటికీ నోరు మెదపలేని స్థితిలో పోలీసు అధికారుల సంఘాలు ఉన్నాయి. రైతుల సమస్యలకన్నా టీడీపీ భజనే తమకు ముఖ్యమన్నట్లుగా ఎల్లో మీడియా వ్యవహరించడం దురదృష్టకరం. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం జనంలో పెల్లుబుకుతున్న అసమ్మతిని తొక్కిపెట్టాలని చూస్తోంది. అయినా అణచేకొద్ది పైకి లేచి తిరగబడతామని ప్రజలు బ్యారికేడ్లు తోసేసి మరీ జగన్ పర్యటనలో పాల్గొన్నారు. కొసమెరుపు ఏమిటంటే ఒక పదేళ్ల వయసున్న బాలిక జగన్ ను కలవడానికి పడిన తాపత్రయం, ఆ బాలికను ఆ జనంలో తనవద్దకు తీసుకుని ఆశీర్వదించిన తీరు మొత్తం టూర్ లో హైలైట్ గా మారింది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేంద్రంలో చంద్రబాబు పరపతి బండారం ఇది!
‘ఐఏఎస్ అధికారులను పంపండి మహాప్రభో!’. డిప్యుటేషన్‌పై ఇవ్వాలని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం వినతులు. అధికారుల కొరత ఉందని రెండుసార్లు లేఖలు రాసిన సీఎం చంద్రబాబు.. అయినా స్పందించని కేంద్రం.. ఇది కొన్నాళ్ల క్రితం తెలుగుదేశం అధికార మీడియా ‘ఈనాడు’లో ప్రముఖంగా వచ్చిన వార్త.‘ఏపీ కేడర్‌పై కక్ష.. నాన్ ఏపీ కేడర్‌పై ఆపేక్ష’.. ఐదుగురు ఐఎఎస్, తొమ్మిది మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వని కూటమి ప్రభుత్వం.. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం.ఈ రెండు వార్తలు చదివితే ఏం అర్థమవుతోంది?. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వద్ద ఉన్న సీనియర్ అధికారులను వాడుకోకపోగా.. కొత్తగా అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని అడుగుతున్నారూ అని!. అంతేకాదు.. కేంద్రంలో కాని, ఆయా రాష్ట్రాలలో కాని పని చేస్తున్న నాన్ కేడర్ అంటే అఖిల భారత సర్వీస్ కానీ తమ వాళ్లను ఏపీకి తీసుకురావాలని ప్రయత్నించడమే కదా! ఇందులో మతలబు ఏమిటి? ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏ ప్రభుత్వం ఉన్నా, విధానాలకు అనుగుణంగా పని చేయవలసి ఉంటుంది. నిబంధనలు, రాజ్యాంగంలోని అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది.అయితే, ఏపీలో ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి బదులు సొంత రెడ్ బుక్ అమలుకే ప్రాధాన్యత ఇస్తోంది. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసిన అధికారులపై కక్ష తీర్చు కోవడం, ఇష్టం లేని అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించడం చేస్తోంది. ఒక వైపు ఉన్న అధికారులను వాడుకోకపోగా మరోవైపు కేంద్రం తమకు కావల్సిన అధికారులను ఇవ్వడం లేదని వార్తలు రాయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 239 మంది ఉన్నతాధికారులు అవసరమైతే ప్రస్తుతం 191 మందే ఉన్నారని ఈనాడు కథనం. నలుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్, నలుగురు ఐఆర్ఎస్లు కలిపి పది మందిని డిప్యుటేషన్‌పై పంపాలని చంద్రబాబు ఇప్పటికీ రెండుసార్లు లేఖలు రాసినా కేంద్రం నుంచి జవాబు రాలేదట. చిత్రం ఏమిటంటే ఏదైనా అనుకూల నిర్ణయం జరిగితే అదంతా చంద్రబాబు విజయం, గొప్పదనం అని డబ్బా కొట్టే ఈనాడు, కేంద్రం డిప్యుటేషన్‌పై అధికారులను పంపకపోవడాన్ని మాత్రం ఉన్నతాధికారుల వైఫల్యమని చెబుతోంది.ఉన్నతాధికారులను కేటాయించగల స్థాయి ఉన్న వారి వద్దకు అధికారుల కంటే ముఖ్యమంత్రే వెళ్లగలరన్నది అందరికీ తెలిసిన విషయం. అయినా సరే తమ బాబును వెనకేసుకొచ్చేందుకు ఈనాడు ఈ రకమైన కథనాలు రాస్తూంటుంది. నైపుణ్యమున్న అధికారుల కొరత ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ఈ నైపుణ్యం తమ సామాజిక వర్గం వారు లేదా రాజకీయంగా తమకు ఉపయోగపడగలిగే వారు అని సీఎం అర్థం?. ఈ నియామకాలు ప్రతిభ ఆధారంగా జరుగుతాయా అని ప్రశ్నిస్తే.. ఎక్కువ సందర్భాలలో వ్యక్తిగత ఇష్టాఇష్టాలపైనే జరుగుతుంటాయన్నది వాస్తవం.ఏపీలో కూటమి సర్కార్ తీరు మరీ ఘోరం. గత టర్మ్‌లో ఆదాయపన్ను శాఖలో పనిచేసే ఒక అధికారిని డిప్యుటేషన్‌పై తెచ్చుకుని ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డులో నియమించుకున్నారు. దానికి కారణం ఆయనలో ఉన్న నైపుణ్యం కంటే, ఐటి శాఖలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌ను ఇబ్బంది పెట్టే నివేదికలు తయారు చేశారన్న అభిమానమే కారణమని అప్పట్లో చెప్పుకునేవారు. అలాగే ఇదే సంస్థలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి కుమార్తెను కూడా భారీ జీతానికి నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది 2014 టర్మ్‌లో జరిగిన సంగతి. తాజాగా జరిగిన ఒక డిప్యుటేషన్‌ను పరిశీలిద్దాం.గత టర్మ్‌లో డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన వెంకయ్య చౌదరి అనే అధికారిని ఈసారి ప్రభుత్వం రావడంతోనే టీటీడీ అదనపు ఈవోగా నియమించారు. గనుల శాఖ నైపుణ్యానికి, టీటీడీలో అవసరమైన నైపుణ్యానికి సంబంధం ఉంటుందా అంటే ఎవరూ చెప్పలేరు. జగన్ ప్రభుత్వం ధర్మారెడ్డి అనే రక్షణ శాఖ అధికారిని డిప్యుటేషన్‌పై టీటీడీకి తెచ్చి నియమిస్తే ఇదే తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసేది. మరి ఇప్పుడు వెంకన్న చౌదరిని ఎందుకు పెట్టుకున్నారు? తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడును తిరుపతి జిల్లా ఎస్పీగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటన నేపథ్యంలో వీరిద్దరిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. సుబ్బరాయుడిని మాత్రం బదిలీ చేసినట్లు చేసి, తిరిగి తిరుపతిలోనే ఎర్ర చందనం టాస్క్‌ఫోర్స్ అధికారిగా నియమించారు. ఈయనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో సిట్‌లో కూడా సభ్యుడిని చేశారు.అంటే ప్రభుత్వ పెద్దలు కోరినట్లుగా రెడ్ బుక్ అమలు బాధ్యతను పెడుతున్నారన్నమాట. తిరుమలలో పెత్తనం చేయడానికి వెంకయ్యకు పోస్టింగ్ ఇచ్చారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి రాజమౌళిని తెచ్చుకుని సీఎంవోలో పెట్టుకున్నారట. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏపీలో శ్రీలక్ష్మి, మురళీధర్ రెడ్డి, ముత్యాల రాజు, నీలకంఠా రెడ్డి, మాధవీలత వంటి ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లే ఇవ్వకపోవడం. ఇష్టం లేని అధికారులు అనుకుంటే వారికి ప్రాధాన్యంలేని పోస్టులు ఇస్తుంటారు. వీరికి మాత్రం ఏ పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. అలాగే ఐపీఎస్ అధికారులు నలుగురిని కొన్ని పిచ్చి కేసులలో సస్పెండ్ చేశారు. స్కిల్ స్కామ్ కేసు, మార్గదర్శి డిపాజిట్లు, ఇతర అక్రమాల కేసులను దర్యాప్తు చేసి పలు అంశాలను వెలుగులోకి తెచ్చారన్న కోపంతో మరికొందరు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ ఇవ్వలేదు.వీరిలో కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, సునీల్ కుమార్, జాషువా అనేవారు ఉన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ ఐపీఎస్‌లు రోజూ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి అటెండెన్స్ వేసుకుని, సాయంత్రం వరకు అక్కడే ఖాళీగా కూర్చోవాలట. బహుశా గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన నడపలేదు. ఒకవైపు ఇలా సీనియర్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా, లేదా వారిపై స్పష్టమైన అభియోగాలు మోపకుండా చేస్తున్న తీరు సహజంగానే కేంద్రం దృష్టికి కూడా వెళ్లే అవకాశం ఉంది. మరి అడ్డగోలుగా రాజకీయ పాలనే కేంద్ర ప్రభుత్వంలో కూడా జరుగుతున్న సందర్భాలలో చంద్రబాబు వంటివారు ఏం అడిగితే అది ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాకాకుండా నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పాలన ఉంటే ఎలాంటి లేఖలు వచ్చినా స్పందించకుండా ఉంటారా?.అయినా కేంద్రంలో తమ పార్టీ ఎంపీల సంఖ్యతోనే చక్రం తిప్పుతున్నామని టీడీపీ చెబుతుంది. చంద్రబాబుకు ఉన్న పరపతిపై ఈనాడు మీడియా హోరెత్తిస్తుంటుంది. అయినా చంద్రబాబు రెండు లేఖలు రాసినా ఆయన కోరిన విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రం పంపించలేదంటే, డిప్యుటేషన్లు ఇవ్వలేదంటే ఏమనుకోవాలి?. చంద్రబాబు ప్రభుత్వం మరీ అధ్వాన్నంగా పాలన సాగిస్తుందని పరోక్షంగా చెప్పడమే అవుతుంది!. అయినా ఏదో రకంగా ప్రధాని మోదీనో, హోం మంత్రి అమిత్ షానో పట్టుకుని తమకు కావాల్సిన వారిని ఏపీకి తెచ్చుకుంటారేమో చూడాలి. కానీ, ఉన్న అధికారులను వాడుకోకుండా వేరే వారిని పంపించాలని అనడంలో హేతుబద్దత ఏమిటో తెలియదు. అదీకాక ఇప్పుడు రెడ్ బుక్ అంటూ సీనియర్ అధికారులను వేటాడుతున్న తీరు ఐఏఎస్, ఐపీఎస్ సర్కిల్స్‌లో తెలియకుండా ఉండదు.గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది తిరిగి డిప్యుటేషన్‌ను రద్దు చేసుకుని వెళ్లిపోతామంటే కూడా ఏదో రకంగా కూటమి ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఎవరైనా డిప్యుటేషన్ పూర్తి చేసుకుని వెళ్లిపోతుంటే వారిపై కూడా కక్ష పూరితంగా ఆటంకాలు సృష్టిస్తోందట. అదే సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఒక పోలీసు అధికారిని జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయనకు ఒక కార్పొరేషన్ పదవి కూడా కట్టబెట్టింది. మరోవైపు తమ అవినీతి కేసులలో తప్పుడు సాక్ష్యాలు ఇవ్వకపోతే రెడ్ బుక్ ప్రయోగిస్తామన్న హెచ్చరికలు పంపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇంకో మాట చెప్పాలి. కూటమి ప్రభుత్వం రావడంతోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి మరింతగా చెలరేగిపోతూ అధికారులు అందరిపై తమదే పెత్తనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. వారు ఎవరి మీద ఆరోపణలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలట.తెలుగుదేశం ప్రభుత్వం కక్షతో పాటు ఈ మీడియా కక్ష కూడా అధికంగానే ఉంటున్నట్లుగా కనిపిస్తుంది. ఈనాడు పెత్తనం ఏ స్థాయికి వెళ్లిదంటే చివరికి ఒక జిల్లా కలెక్టర్, ఒక ఎస్పీనే ఈనాడు విలేకరిపై మండిపడాల్సినంతగా పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఈనాడు ఏదో కథనం వండి వార్చుతోంది. దానిపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఒక కమిటీని నియమించుకుంది. ఆ కమిటీ అధికారులు విచారణకు వెళితే ఈనాడు విలేకరి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులకు చికాకు తెప్పించారు. దానిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తే, తెల్లవారేసరికల్లా ఆ కలెక్టర్, ఎస్పీలపై మొదటి పేజీలో పెద్ద వార్త రాసేశారు. ఒకప్పుడు మీడియాకు స్వీయ నియంత్రణ ఉండేది. ఇప్పుడేమో స్వీయ బ్లాక్ మెయిలింగ్తో మీడియా అధికార యంత్రాంగాన్ని తానే నడపాలని ప్రయత్నిస్తోంది. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పాలన సాగిస్తున్నది చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెడ్‌బుక్‌పై కన్నెర్ర.. కూటమికి ఇక బ్యాడ్ టైం!
ఆంధ్రప్రదేశ్‌లో భారత రాజ్యాంగం కాకుండా... తెలుగుదేశం నేతల రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోందని హైకోర్టు సాక్షిగా మరోసారి స్పష్టమైంది. పోలీసుల శాఖ పనితీరును చూసి హైకోర్టే నిర్ఘాంతపోయిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు.. ఆంధ్రప్రదేశ్‌లో హింస, విధ్వంసం, అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్న తీరును.. రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలే లక్ష్యంగా కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. వీరిపైకి పోలీసులను ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నట్లు విమర్శలున్నాయి. పోలీసులు కేసులు పెట్టకుండా ఇష్టారాజ్యం అరెస్టులు చేసి పౌర హక్కులు, మానవహక్కులను హరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ గొప్పగా చెప్పుకుంటున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ ‘పిచ్చికుక్క’తో పోలుస్తున్నది! ఈ తరహా పాలన వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అర్థం చేసుకోవడం లేదు. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న వారిపై కేసులు పెట్టడం లేదు. నిబంధనల ప్రకారం కోర్టుల్లోనూ ప్రవేశపెట్టడం లేదు. దీంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఎనిమిది నెలల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా, న్యాయ వ్యవస్థ సైతం ఆశించిన స్థాయిలో స్పందించినట్లు కనబడదు. సోషల్ మీడియా కార్యకర్తలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్య తీసుకున్నా ఫర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్న తీరును న్యాయ వ్యవస్థ గమనిస్తే బాగుంటుంది. కొంతమందిపై పది, ఇరవై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న సంగతిని గౌరవ న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ(Judicial System) దృఢంగా ఉండకపోతే పోలీసు శాఖ ఎలా ధమ్కీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందో హైకోర్టు వారికి స్వయంగా అనుభవం అవడం విశేషం. పల్నాడు జిల్లా మాచవరం పోలీసులు చేసిన అక్రమ అరెస్టులపై కొద్దిరోజుల క్రితం వచ్చిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్య చేసింది. పోలీసులకు తమ ఆదేశాలంటే గౌరవం లేదని, సీసీటీవీ ఫుటేజి సమర్పించాలని కోరినప్పుడే అది మాయమవడం ఏమిటి? అని గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ ఫుటేజీ ఎలా మిస్టీరియస్‌గా కనిపించకుండా పోతోందని హైకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన గౌరవ న్యాయమూర్తులకు ప్రజలు ధన్యవాదాలు తెలపాలి. ఈ మాత్రం అన్నా స్పందించకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం మరింతగా పెట్రేగిపోతుంది. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీ మిస్ అవుతుంటే ఉన్నతాధికారులు ఏమి చర్య తీసుకున్నారని కూడా హైకోర్టు అడిగింది. చిత్రమేమిటంటే కోతుల కారణంగా సీసీటీవీ సర్క్యూట్ కాలిపోయిందని పోలీసులు చెప్పడం.. ‘ఇది మేం నమ్మాలా?’ అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కాలిపోయిన సీసీటీవీ పరికరాలను తామే చూస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. విశేషం ఏమిటంటే ఈ కేసులో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లాయర్ చెప్పగా, పిటిషనర్‌కు ఏమైనా హాని ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇందులో చాలా వాస్తవం ఉందని చెప్పాలి. అనేక చోట్ల బాధితులు కోర్టులకు వెళ్లకుండా పోలీసులు వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో రోజుల తరబడి నిందితులను ఉంచి వేధిస్తున్నారు. ఈ కేసులో గత ఏడాది నవంబర్ 3వ తేదీన ఒక వ్యక్తిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 7వ తేదీన కాని అతని అరెస్టు చూపలేదు. ఈ నాలుగు రోజులు అతని పట్ల ఎలా వ్యవహరించారో తెలుసుకోవడానికి సీసీటీవీ పుటేజీ కోరుతూ అతని సోదరులు కోర్టుకు ఎక్కారు. ఈ కేసులో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి ఇంక్రిమెంట్లు కట్ చేశారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? అతను తప్పు చేసినట్లు అంగీకరించినట్లే కదా! చేసే అరాచకం చేసి, సీసీటీవీ ఫుటేజి మిస్ చేస్తే ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యం పోలీసు శాఖలో ఏర్పడిందని భావించాలి. దీనికి కారణం పోలీసు శాఖ నిబంధనలు కాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతల రెడ్‌బుక్ ఫాలో అవడమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు. కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్సీపీ వారిని భయపెట్టి లొంగదీసుకోవడానికి యత్నిస్తున్నారని చెబుతున్నారు. 👉ఈ మధ్య సోషల్ మీడియాలో పనిచేసే మిత్రుడు ఒకరిపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన ఎప్పుడూ అసభ్య పోస్టులు పెట్టలేదు. కోర్టును ఆశ్రయించగా, బెయిల్ వచ్చింది కాని, వారం, వారం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు హాజరవ్యాలని షరతు పెట్టింది. దాంతో ఆ మిత్రుడు నిత్యం అక్కడికి వెళ్లవలసి వస్తోంది. తీరా అక్కడకు వెళ్లాక పోలీసు అధికారులు అందుబాటులో ఉండకుండా గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారట!. అదేమని అడిగితే పైనుంచి ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారట. రెడ్ బుక్(Red Book) పేరుతో యాతనలకు గురి చేస్తున్నారన్నమాట. 👉కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)ను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారణ చేశారని వార్తలు వచ్చాయి. ఆయన ఎప్పుడో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఏదో పోస్టు పెట్టారని చెప్పి, ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని అంటూ ఎవరో టీడీపీ కార్యకర్త కేసు పెట్టగానే పోలీసులు వాయువేగంతో స్పందించి విచారణకు పిలిచారు. వర్మకు ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనను ఈపాటికి జైలులో ఉంచేవారేమో తెలియదు. 👉రఘురామ కృష్ణరాజు(Raghurama Krishna Raju) పెట్టిన మరో కేసులో గుంటూరు ప్రభుత్వ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా అలాగే తొమ్మిది గంటలు విచారించారు. రఘురామ కృష్ణంరాజు కులాలు, మతాల మధ్య ద్వేషం రెచ్చగొట్టేలా నిత్యం మాట్లాడారన్న కేసు ఎటు పోయిందో కాని, తనను హింసించారన్న ఆయన చేసిన ఆరోపణపైనే పోలీసులు ఇప్పుడు శ్రద్ధ పెట్టారని అనుకోవాలి. 👉ముంబైకి చెందిన జత్వాని అనే నటికి పట్టుకువచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. జిందాల్ అనే పారిశ్రామిక వేత్తపై కూడా అక్రమ కేసు పెట్టడంతో ఏపీకి రావల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 👉మరో ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై ఇరవైకి పైగా కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. 👉మరో వైపు తమ కుటుంబాలపై అసభ్య పోస్టింగ్‌లు పెట్టారని పలువురు YSRCP నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా అతిగతీ లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై ఎంత నీచంగా పోస్టులు పెట్టారో తెలిసిందే!. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుమార్తెలపై దారుణంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి తన కేసును వాదించుకుంటున్నారు. 👉గన్నవరం లో జరిగిన ఒక ఘటనలో పోలీసులు తనతో బలవంతంగా వైఎస్సార్సీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని టీడీసీ ఆఫీస్‌లో పనిచేసే సత్యవర్దన్ అనే వ్యక్తి కోర్టులో చెప్పి కేసును ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రతిగా సత్యవర్ధన్ సోదరుడితో బలవంతంగా కేసు పెట్టించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలులో పెట్టి వేధిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎంత విధ్వంసానికి పాల్పడుతున్నా పోలీసులు వారి జోలికే వెళ్లడం లేదు. కూటమికి చెందిన పార్టీల వారు ఎన్ని అరాచకాలకు పాల్పడినా, చివరికి మహిళలను వేధింపులకు గురి చేసినా, పోలీసులు వారిపై కేసులు పెట్టడానికి వెనుకాడుతున్నారు. ఉదాహరణకు.. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక జనసేన నాయకుడుపై ఒక మహిళ కేసు పెడితే ఇంతవరకు ఆయనపై చర్యే తీసుకోలేదు. పైగా ఆ మహిళపైనే ఎదురు కేసు పెట్టి రెడ్ బుక్‌ను రాజస్థాన్‌కు కూడా పంపించి, హడావుడిగా ఆమెను అరెస్టు చేయించిన తీరు ఏపీలో మహిళలకు ఉన్న భద్రత ఏమిటో తెలియచేస్తుంది. అనేక చోట్ల మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సుగాలి ప్రీతి మృతి విషయమై సీబీఐ దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీలో మహిళలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితిపై వార్తలు వచ్చాయి. గతంలో ప్రసంగాలు చేస్తూ మహిళల జోలికి ఎవరైనా వెళితే తోలు తీస్తామని భారీ ప్రకటనలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు నోరు విప్పడం లేదు. మరో వైపు మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం ఈ మాత్రం గట్టిగా ఉండడం సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఏది ఏమైనా ఏపీలో ప్రజల హక్కులకు ఏ స్థాయిలో విఘాతం కలుగుతున్నదో వివరించడానికి ఇవే పెద్ద నిదర్శనం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అంతా రామోజీ ఊహించినట్టే జరుగుతోందా?
ఇది ఊహించని పరిణామమే!. ఎంతటి బలాఢ్యుడైనా ఏదో ఒక రోజు తన తప్పునకు మూల్యం చెల్లించాల్సిందే. డిపాజిట్ల వ్యవహారంలో మార్గదర్శి సంస్థ ఇంతకాలం ఎంతగా బుకాయించినా చివరకు వాస్తవాన్ని పరోక్షంగానైనా అంగీకరించక తప్పలేదు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను మేనేజ్ చేసినా.. మార్గదర్శి అక్రమాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అండగా నిలిచినా చివరికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వాదనే సరైందని తేలింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా రూ.2610 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ధారించింది. దీనితో ఇంతకాలం ఆ సంస్థ అసలు తప్పు చేయలేదని, తప్పు చేయదని, ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావుపైనే నిందలు మోపుతారా అని గుండెలు బాదుకుంటూ మాట్లాడిన వారికి జవాబు వచ్చినట్లయింది. కొద్ది రోజుల క్రితం లోక్ సభలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసుపై చర్య తీసుకోవాలని YSRCP ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా టీడీపీ ఎంపీలు మార్గదర్శి అధికార ప్రతినిధుల్లా ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను వెనకేసుకొచ్చారు. అంతేకాదు.. సేకరించిన డిపాజిట్లను దాదాపు అందరికి తిరిగి చెల్లించిందని వాదించారు. మిథున్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారానికి ఈనాడు మీడియా ‘‘వార్త రాస్తే విషం చిమ్ముతారా’’ అంటూ టీడీపీ ఎంపీలు ధ్వజమెత్తారని ప్రముఖంగా ప్రచురించారు. నిజానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఆరోపణలు వస్తే ఈనాడు మీడియాను అడ్డం పెట్టుకుని దబాయించడమే తప్పు. పైగా.. ఈనాడేమో.. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులపై ఇష్టారీతిన అసత్యాలతో కథనాలు వండివార్చవచ్చు. ఈనాడు గ్రూపులోని సంస్థ అవకతవకలకు పాల్పడిందని కూడా ఎవరూ విమర్శించకూడదన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. మార్గదర్శి డిపాజిట్ల అక్రమ సేకరణపై ఇంతకాలం మీడియా బలంతో బుకాయించినప్పటికీ ఆర్బీఐ నివేదిక వచ్చాక టీడీపీ ఎంపీలు ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు చెప్పాలి. మార్గదర్శి చిట్స్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, డిపాజిట్ల సేకరణను రసీదుల రూపంలో కొనసాగించారని, చిట్స్‌లో వందల కోట్ల రూపాయల నల్లధనం ఉందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ సాక్ష్యాధారాలతో సహా కేసు పెడితే, కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటిని నీరుకార్చడం ఆరంభించింది. అందులో భాగంగా జప్తు అయిన వేయి కోట్ల మొత్తాన్ని కూడా విడుదల చేశారు. ఇదంతా చూస్తే.. పరస్పర రాజకీయ,వ్యాపార ప్రయోజనాల కోసం టీడీపీ ఈనాడు మీడియాను వాడుకున్నారని పలుమార్లు స్పష్టం అయింది. ఆర్బీఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని స్పష్టం చేయడంతోపాటు ఈ సంస్థపై తమకు పలువురు ఫిర్యాదు చేశారని కూడా తెలిపింది. రామోజీరావు మరణించినప్పటికీ, ఆ కేసు మూతపడదని, విచారణ కొనసాగించాలన్నదే నిబంధన అని వివరించింది. మరి ఈనాడు మీడియా ఎందుకు దీన్ని ప్రజలకు తెలియజేయడం లేదు. ఆర్బీఐ కూడా తమపై విషం చిమ్ముతోందని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎందుకు చెప్పించలేకపోతోంది?. ఆర్బీఐకి ఈనాడు మీడియాకు ఏ శత్రుత్వం ఉందని ఆ నివేదిక ఇచ్చింది?. నిజానికి అఫిడవిట్ ఫైల్ చేయడం వీలైనంత ఆలస్యం చేసేందుకు ఈనాడు మీడియా తనకు ఉన్న పరపతిని వాడి ఉండవచ్చు. తెలంగాణ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చిన తరువాతే ఆర్బీఐ కూడా చట్టంలోని సెక్షన్ 45(ఎస్) గురించి వివరించాల్సి వచ్చింది. దాని ప్రకారం మార్గదర్శి చట్ట విరుద్ద చర్యలకు పాల్పడిందని తేలుతోంది. నేరం నిర్ధారణ అయితే సేకరించిన డిపాజిట్ల మొత్తానికి రెట్టింపు జరిమానా చెల్లించాలి. దీంతో మార్గదర్శి కొత్త వాదన తీసుకువచ్చింది. రామోజీరావు నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా అని అంటోంది. ఈ వాదన రామోజీ నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకరించడమే అని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రామోజీ తర్వాత హెచ్ యుఫ్ (అవిభాజ్య హిందూ కుటుంబ కర్త)గా ఆయన కుమారుడు కిరణ్ నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన బాధ్యత వహించాలా? లేదా? సంస్థ తరపున జరిమానా చెల్లించవలసిన బాధ్యత ఆయనపై ఉంటుందా? లేదా?అనేది చర్చనీయాంశం అయింది. ఇక్కడ ఇంకో సంగతి గుర్తు చేయాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన కుమారుడిపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి అక్రమ కేసులు పెట్టాయి. వైఎస్సార్ చనిపోయిన తరువాత ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అప్పట్లో ఈనాడు మీడియా ఇది కరెక్టేనని ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం భిన్నంగా వాదిస్తోంది. రామోజీ లేరు కనుక, ఆయన కర్తగా ఉన్న సంస్థ ఆక్రమ డిపాజిట్లతో కొడుకుకు సంబంధం లేదంటోంది. కాని ఆ డిపాజిట్ల ద్వారా సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రం అనుభవించవచ్చట. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఒక సంస్థ అని, దాని కర్త మరణించినా, చట్టపరంగా సంస్థ బాధ్యత పోదని, వారసులు సైతం తీసుకోవల్సిందేనని చట్టం చెబుతోంది. రామోజీ ఆస్తులకు కిరణ్, ఇతర కుటుంబ సభ్యులు వారసులైనప్పుడు ఆయన చేసిన ఆర్థిక అక్రమాలకు వీరికి బాధ్యత ఉండదా? రామోజీరావు మరణించినందున ఈ కేసు విచారణ కొనసాగించాలా? లేదా? అనేది ఆలోచించాలని ఏపీ ప్రభుత్వం తరపున వేసిన అఫిడవిట్లో కోరారు. దానిని అంగీకరిస్తే ఈ కేసు నుంచి బయటపడవచ్చని ప్లాన్ చేశారు. కానీ.. ఆర్బీఐ ఇచ్చిన అఫిడవిట్ తో మార్గదర్శి సంస్థ పరిస్థితి కుడితిలో పడ్డయినట్లయిందని అంటున్నారు. అంతకుముందు అసలు డిపాజిట్ల వసూలులో తప్పు చేయలేదని కొంతకాలం, డిపాజిట్లు తీసుకున్నా తిరిగి చెల్లించేశామని మరికొంతకాలం చెప్పింది ఈనాడు. ఉండవల్లికి తెలియకుండానే ఉమ్మడి ఏపీ హైకోర్టులో కేసు కొట్టివేయించుకున్నారు. కానీ ఆరు నెలల తర్వాత ఆయనకు తెలిసి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ కేసు ఈ దశకు చేరింది. జగన్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయిందన్న కోపంతో ఈనాడు మీడియా పచ్చి అబద్ధాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసింది. ఉండవల్లికి డిపాజిట్ దారుల వివరాలు ఇవ్వకుండా అడ్డుపడడానికి పెద్ద, పెద్ద లాయర్లను నియోగించింది. మొత్తం మీద 18 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఒక రూపానికి వచ్చినట్లనిపిస్తుంది. ఆర్థికంగా ,రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంత శక్తిమంతుడైనా న్యాయ వ్యవస్థ కొంత గట్టిగా ఉంటే చట్టానికి ఎవరూ అతీతులుగా ఉండలేరని ఈ ఉదంతం రుజువు చేసింది. గతంలో సహారా డిపాజిట్ల కేసులో ఆ సంస్థ యజమానిని సుప్రీంకోర్టు జైలులో పెట్టింది. రామోజీరావు ఆ గండం నుంచి తప్పించుకున్నా.. ఆయన మరణం తర్వాత అయినా సత్యం బయటపడిందని అనుకోవాలి. అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు, ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ అండతో ఈ కేసు ముందుకు సాగకుండా చేసే ప్రయత్నాలు జరగవచ్చన్న అభిప్రాయం లేకపోలేదు. కాగా ఉండవల్లికి డిపాజిటర్ల వివరాలు ఇవ్వక తప్పలేదు. వాటిని పరిశీలించిన తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావొచ్చు. రామోజీకి అసలు డిపాజిట్లు ఎలా వచ్చాయి? అందరి వివరాలు ఉన్నాయా? అందరికి తిరిగి చెల్లించారా? లేదా? ఆ మొత్తాలకు వడ్డీని కూడా చెల్లించారా? లేదా? ఇలాంటి విషయాలు అన్ని తేలితే అప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం. రామోజీరావు గతంలో ఒక మాట అనేవారు. ‘‘వయలేట్ ద లా లాఫుల్లీ’’ అని. చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని చట్టాన్ని ఉల్లంఘించవచ్చన్నది ఆయన ఫిలాసఫి. అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించకూడదన్న సిద్దాంతం కాదన్నమాట. ఆ క్రమంలో ఇలా ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోయే అవకాశం ఉందని ఈ అనుభవం చెబుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!
ఎలాగైతేనేం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు.. మంత్రి అయిన లోకేష్‌లు తమ కక్ష తీర్చుకున్నారు. కాకపోతే వారు ధైర్యంగా కాకుండా చాటుమాటు కేసులు పెట్టి ప్రత్యర్ధులను దెబ్బతీసే యత్నం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించి వారు ఆనందపడుతుండొచ్చు. దావోస్‌లో తాను చెప్పినట్లు రెడ్ బుక్ చాప్టర్ మూడును ప్రయోగించానని లోకేష్ సంతోషపడుతుండొచ్చు. కానీ ఆయన ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. రాజకీయాలలో ఇది ఏ మాత్రం పనికిరాదు. చంద్రబాబు ఇంతకాలం ఇలాంటి ఆటలు ఎన్ని ఆడినా.. తనకేమీ సంబంధం లేదన్నట్లు నటించేవారు. లోకేష్ అలాకాకుండా పచ్చిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనను తాను రక్షించుకోలేని పరిస్థితి రావచ్చు. ఆ సంగతిని గుర్తు పెట్టుకోవడం మంచిదని హితవు చెప్పినా.. అధికార కైపులో ఉన్న ఆయనకు వినిపించకపోవచ్చు. రెచ్చగొట్టే మీడియా, భజంత్రీగాళ్ల మాటలు సమ్మగా ఉంటాయి. కాని అవి ఎక్కువకాలం ఉపయోగపడవు. వల్లభనేని వంశీ తప్పు చేశాడా? లేదా? అనేది ఇక్కడ చర్చకాదు. తప్పు చేసి ఉంటే అరెస్టు చేయడం, జైలులో పెట్టడం సాధారణంగా జరిగేవి. కాని అసాధారణమైన రీతిలో ఏపీ పోలీసులు స్పందిస్తున్న తీరు, డీజీపీ స్థాయిలో ఉన్నవారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వైనం మాత్రం ఏపీ సమాజానికి మంచిది కాదు. ఇలాంటి వాటివల్ల జనంలో ఫస్ట్రేషన్ పెరిగితే అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ సంగతిని అంతా గుర్తుంచుకోవాలి. వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్(Gannavaram TDP Office)పై దాడి చేయించారన్నది అభియోగం కావొచ్చు. అంతవరకు కేసు పెడితే పెట్టవచ్చు. కాని అంతకుముందు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?. వంశీనికాని, గన్నవరం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాని టీడీపీ నేతలు రెచ్చగొట్టారా? లేదా?. వంశీని అనరాని మాటలు అన్నారా? లేదా?. అయినా టీడీపీ ఆఫీస్ పై దాడి చేయాలని ఎవరూ చెప్పరు. అప్పట్లో విజయవాడ నుంచి ఒక టీడీపీ నేత గన్నవరం దండెత్తివెళ్లారా? లేదా?. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయా? లేదా?. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభ్యంతరకర భాషలో ఆ టీడీపీ నేత దూషించారా? లేదా?. చివరికి ఈ గొడవలు చిలికి, చిలికివానగా మారి వంశీ కుటుంబ సభ్యులను టీడీపీ సోషల్ మీడియాలో అనరాని మాటలతో వేధించారు. ఆ క్రమంలో చంద్రబాబు(Chandrababu) కుటుంబ సభ్యులపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రియలైజ్ అయి క్షమాపణ కూడా చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఆయనను వెంటాడుతూనే ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే.. టీడీపీ ముఖ్యనేతల కుటుంబాలలోని వారిని ఎవరైనా ఏమైనా అంటే గోలగోలగా ప్రచారం చేసే ఆ పార్టీవారు.. ఎదుటివారి కుటుంబాలపై నీచంగా కామెంట్స్ పెడుతుంటారు. టీడీపీ చంద్రబాబు కబ్జాలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని వ్యక్తిగత హననం చేయడం ఒక లక్షణంగా మార్చుకుంది. చంద్రబాబు తాను సత్యసంధుడనైనట్లు, ప్రత్యర్దులు విలువలు లేని వ్యక్తులన్నట్లు మాట్లాడుతూ మీడియాలో వార్తలు వచ్చేలా చేసుకోవడంలో నేర్పరి అని చెప్పాలి. తొలుత ఆయనే రెచ్చగొడతారు. లేదా ఆయన పార్టీవారితో రెచ్చగొట్టిస్తారు. దానికి ప్రతిస్పందనగా ప్రత్యర్ధి పార్టీవారు తీవ్ర స్థాయిలో స్పందిస్తే.. దానినే విస్తారంగా వ్యాప్తి చేసి.. ‘చూశారా!నన్ను అంత మాట అన్నారో?’ అంటూ సానుభూతి పొందే యత్నం చేస్తుంటారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా తాన అంటే తందానా అంటాయి. గత సీఎం జగన్‌ను చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎన్నేసి మాటలు అన్నారు!. ‘సైకో’ అనే పదంతో మొదలు పెడితే.. అనేక అభ్యంతరకర పదాలు వాడడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అయినా అప్పటి ప్రభుత్వం వారి జోలికి వెళ్లలేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆరోజుల్లో రెడ్ బుక్ పేరుతో అనేక చోట్ల పోలీసు అధికారులను, ఆయా నేతలను లోకేష్ బెదిరించిన వైనంపైనే ఎన్నో కేసులు పెట్టి ఉండవచ్చు. కాని అప్పుడు దానికి సంబంధించిన కేసులే పెట్టలేదు. పోలీసు అధికారులు కోర్టులో దీనిపై పిటిషన్ వేసినా అది విచారణకే వచ్చినట్లు లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్(Lokesh) పేరుతో సాగుతున్న ఈ అరాచకం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. వచ్చేసారి టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందంటే ఇంతకన్నా ఎక్కువగా రెడ్ బుక్ టీడీపీవారికి చుట్టుకుంటుందన్న సంగతి మర్చిపోకూడదు. దీనిని వైఎస్సార్సీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అన్యాయంగా ,అక్రమంగా తమ పార్టీవారిని వేధించేవారందరి సంగతి తేల్చుతామని జగన్ చెబుతున్నారు. చట్టబద్దంగానే చేస్తామని ఆయన కూడా అన్నారు. చంద్రబాబుకు ఈ విషయాలు తెలియనివి కావు. కాని ఆయన చేతిలో ఏమి ఉన్నట్లు లేదు. లోకేష్ బ్యాచ్ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నా.. వారించలేకపోతున్నారు. ఫలితంగా ఆయన కూడా బాధ్యత వహించవలసి వస్తోంది. తద్వారా ఏపీ ఇమేజీనే చంద్రబాబు, లోకేష్‌లు నాశనం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. వీరి కక్షలకు తోడు ఎల్లో మీడియా పనిలో పనిగా తమ కక్షలు తీర్చుకుని టీడీపీని మరింత గబ్బు పట్టిస్తోంది. ఎల్లో మీడియా రాసే చెత్త వార్తలకు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అందులో వాస్తవం ఉంటే తప్పు లేదు. కాని వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా.. కూటమి ప్రభుత్వం నిస్సహాయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు లేదంటే ఆ ప్రతినిధులు ఆడించినట్లు ఆడక తప్పడం లేదు. వంశీ విషయానికి వస్తే ఆయనపై ఏ కేసు పెట్టాలి. చంద్రబాబు,లోకేష్ లు నిజంగానే తమ మనోభావాలు గాయపడ్డాయని అనుకుంటే తమ కుటుంబంలోని వారిపై చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆ పాయింట్‌ను తమ రాజకీయ అవసరాల కోసం అదే పనిగా వాడుకున్నారు కనుక. ఆ క్రమంలో తమ కుటుంబానికి ఇబ్బంది అని తెలిసినా పదే,పదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయం జోలికి వెళ్లలేదు. చంద్రబాబు, లోకేష్‌లను ఎవరో ఏదో అన్నారని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు కుటుంబానికి జరిగిన పరువు నష్టంపై మనోభావాలు దెబ్బతిన్నాయా, లేదా? దీనిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. నిజంగానే ఆ పాయింట్‌ను పైకి తీసుకువస్తే.. వంశీ కుటుంబ సభ్యులపై టీడీపీవారు చేసిన అసభ్యకర, అసహ్యకర పోస్టింగ్‌లు, మాజీ సీఎం జగన్ కుటుంబంపై పెట్టిన నీచాతినీచ పోస్టింగులు అన్ని జనం దృష్టికి వస్తాయని సందేహించారా?. చంద్రబాబు,లోకేష్ లకు చిత్తశుద్ది ఉంటే తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టి ఉండాలి. అలాగే వంశీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కూడా తీసుకోవాలని చెప్పగలగాలి. ఆ పని చేయకుండా ఏదో ఒక పిచ్చి కేసులో వంశిని ఇరికించాలని చూడడం పిరికితనంగా కనిపిస్తుంది. టీడీపీ ఆఫీస్(TDP Office) పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మీదట కారణం ఏమైనా కాని దాడి కేసు ఫిర్యాదుదారు అసలు తనకు సంబంధం లేదని, తనను ఎవరూ దూషించలేదని కోర్టులో అఫిడవిట్ వేయడంతో ప్రభుత్వం పరువు పోయింది. నిజానికి చాలా కేసులలో రెడ్ బుక్ ఆదేశాల ప్రకారం ఎవరో ఒకరితో బలవంతంగా కేసులు పెట్టించి విపక్షంవారిని అరెస్టులు చేస్తుంటారు. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎదురుతిరిగారు. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు-లోకేష్ రెడ్‌బుక్ సర్కార్ హుటాహుటిన పోలీసులపై గుడ్లురిమి, ఫిర్యాదుదారు సోదరుడు ఒకరిని పట్టుకుని వంశీపై కిడ్నాప్ తదితర కేసులు పెట్టించి ఆగమేఘాలపై అరెస్టు చేసింది. తద్వారా తన అహాన్ని లోకేష్ తీర్చుకుని ఉండవచ్చు. కాని అది చట్టబద్దంగా చేయాలి తప్ప మొరటుగా ఇలా చేస్తే అది ఫ్యాక్షన్ రాజకీయంగా మారుతుంది. రాయలసీమలోనే ఈ తరహా ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుందని అనుకుంటారు. కాని దానిని ప్రభుత్వమే కృష్ణా జిల్లాకు కూడా తీసుకు వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో రాశారట. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వ ఓటమి వరకు ఆయన ఆ పార్టీ తరపునే పని చేశారు కదా!. ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా.. తదుపరి రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ పక్షాన గెలిచారు కదా?. మరి అన్ని కేసుల వ్యక్తిని ఎందుకు టీడీపీ ప్రోత్సహించింది?.. అంటే దానికి జవాబు ఉండదు. టీడీపీ నేతలు కొందరు ఆయనను పశువు అని, అదని తిడుతున్నారు. మరి అదే నిజమైతే ఆ పశువుతో పాటు సుమారు రెండు దశాబ్దాలు కలిసి నడిచినవారు ఏమవుతారు!. అసలు దాడి కేసు ఏమిటి?. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఏమిటి?ఈ చట్టం కింద అయితే వెంటనే బెయిల్ రాకుండా చేయవచ్చన్నది వ్యూహం. ఇందుకోసం పనికట్టుకుని ఆ వర్గానికి చెందినవారిని తీసుకు వచ్చి కేసులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక టీడీపీ-జనసేన కూటమికి నేతలు ఎన్ని అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టకపోవచ్చు. కానీ అది పోయిన రోజు వారిపై కూడా ఇలాంటి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కదా!. పోలీసులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని వంశీ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టువారు ఎలా స్పందిస్తారో తెలియదు. ఏది ఏమైనా వంశీని ఇప్పుడు అరెస్టు చేసినా.. రేపు కొడాలి నాని ,పేర్ని నాని వంటివారిపై రెడ్ బుక్ ప్రయోగించినా అది తాత్కాలికమే అవుతుంది. మరి జగన్ ప్రభుత్వం(Jagan Government) కూడా టీడీపీ నేతలపై కేసులు పెట్టింది కదా? అని అనవచ్చు. వాటిలో మెజార్టీ కేసులు పూర్తి ఆధారాలతో పెట్టినవే. దర్యాప్తులో వాస్తవం అని తేలిన తర్వాతే ఆ కేసులు పెట్టారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధులు అక్రమ మార్గాల ద్వారా టిడిపి ఆఫీస్ అక్కౌంట్ కు చేరాయని సిఐడి విచారణలో తేలిందా?లేదా?. ఆ విషయంపై ఇంతవరకు టీడీపీ సమాధానం ఎందుకు ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పీఎస్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి.. రూ.2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రకటించిందా? లేదా?. దానిపై ఇంతవరకు నోరు తెరిచారా?. అలాగే రాజధానికి సంబంధించిన అనేక కేసులలో సాక్ష్యాలు సేకరించడానికే కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. ఆ తర్వాతే చర్యలు చేపట్టారు. అంతే తప్ప ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎవరినిపడితే వారిని అరెస్టు చేయలేదు. అయినా ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారే. ఇప్పుడు అసలు వాస్తవాలు,విచారణలతో నిమిత్తం లేకుండా.. ఏదో రకంగా కేసులు పెట్టడం, విధ్వంసాలకు పాల్పడడం, వేధింపులకు గురి చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారే. పైగా రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రారంభించామని ఏ మాత్రం భీతి లేకుండా చెప్పుకున్నారే!. ఇదేనా ప్రజాస్వామ్యం. సూపర్ సిక్స్,ఇతర హామీలు నెరవేర్చలేక.. ఇలాంటి రాజకీయాలు చేయడం శోచనీయం. అసలు పని మానేసి ప్రభుత్వం ఈ విధంగా రాజకీయ రాక్షసపాలన సాగిస్తే ఏదో ఒక రోజు అదేవారి పతనానికి హేతువు అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ -
నచ్చినట్లు పాలిస్తే.. ఎవరికి నష్టం?
ఆంధ్రప్రదేలో కూటమి సర్కార్ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ప్రభుత్వ నిధులను తమకిష్టమైన వారికి పందేరం పెట్టేందుకు టీడీపీ, జనసేనలు తామిచ్చిన హామీను కూడా పక్కనబెట్టేస్తున్నాయి. దీనికి మంత్రివర్గ ఆమోద ముద్ర కూడా పడింది. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ కోసం అప్పులు చేసి మరీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. అదేకాకుండా నీరు-చెట్టు స్కీమ్ పెండింగ్ బకాయిల పేరుతో ప్రభుత్వం నిధుల గోల్‌మాల్‌కు పాల్పడతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పైగా అప్పట్లో జరిగిన భారీ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు పెట్టిన కేసులను సైతం ఎత్తివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటే, అవినీతికి ఏ స్థాయిలో మద్దతు ఇస్తున్నది అర్థమవుతుంది. 2014-19లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు పనులు చేయకుండానే పెద్ద ఎత్తున బిల్లులు క్లెయిమ్ చేశారని అంచనా. అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు కూడా ఈ పథకంలోనే రూ.13 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చిన నిధులను కూడా టీడీపీ వారు కైంకర్యం చేసేశారని కూడా ఆయన విమర్శించారు. నీరు-చెట్టు కింద ఆ స్థాయిలో అవినీతి జరిగితే ఇప్పుడు ఆ స్కీమ్ లో ఖర్చు చేశామని చెబుతూ వచ్చిన బిల్లులన్నిటిని చెల్లించాలని నిర్ణయించారట. సుమారు రూ.900 కోట్ల బిల్లులు ఇచ్చేస్తున్నారట. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకంలో అవినీతిని నిగ్గుతేల్చి పనులు చేసిన వారికే నిధులు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా.. విజిలెన్స్ శాఖ అవినీతిపై నివేదికలు సిద్ధం చేశారు. కొందరిపై కేసులూ పెట్టారు. అప్పట్లో కొంత మంది తమకు చెల్లించాల్సిన బిల్లులపై కోర్టుకెల్లి సానుకూల తీర్పులు పొందగలిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నీరు-చెట్టు పథకం కాంట్రాక్టులు పొందిన వారి పంట పండింది. గత ప్రభుత్వపు విజిలెన్స్ నివేదికలు కూడా పక్కనబెట్ట కేసులన్నిటిని ఎత్తివేసి మరీ బిల్లులు చెల్లించాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కేడర్, నేతలు, అప్పట్లో పనులు చేసిన వారిపై కక్ష కట్టి వేధిస్తోంది. బిల్లులు నిలిపి వేస్తోంది. టీడీపీ, జనసేన ,బీజేపీలకు చెందిన వారిపై మాత్రం ఎన్ని అవకతవకలు జరిగినా అవాజ్య ప్రేమ కనబరుస్తోంది. సూపర్ సిక్స్ హామీలకు డబ్బులు లేవని చెప్పే ఈ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల బిల్లులకు మాత్రం వందల కోట్లు చెల్లించడానికి సిద్దమైన తీరు ‘ఔరా’ అనిపిస్తోంది. జనం ఏమైపోయినా ఫర్వాలేదు..తమ కార్యకర్తలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే చాలన్నట్లుగా కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఆ రోజుల్లో విజిలెన్స్ అధికారులు కేసులు పెడితే అక్రమం అని అంటున్న కూటమి నేతలు, ఇప్పుడు YSRCP వారిపై పెడుతున్న విజిలెన్స్, ఇతర శాఖల కేసులు మాత్రం సక్రమమని చెబుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సైతం వేధిస్తూ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజా చర్యతో ఎవరిపైన అయినా కేసులు పెట్టాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. ఇప్పుడు కక్షపూరితంగా పెడుతున్న కేసులను ఒకవేళ మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ఎత్తివేయదా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. జగన్ టైమ్‌లో గ్రామాలలో నిర్మాణమైన అనేక భవనాలకు బిల్లులు పెండింగులో ఉన్న వాటిని మంజూరు చేయడం లేదని చెబుతున్నారు. YSRCP వారు ఎవరైనా పార్టీ మారి కూటమికి మద్దతు ఇచ్చి, ఎవరైనా కూటమి ఎమ్మెల్యేనో, లేక మంత్రినో ప్రసన్నం చేసుకుంటేనే అవి వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎదురుగా కనబడుతున్న పనులకు బిల్లులు ఇవ్వకుండా, అసలు జరిగాయో లేదో తెలియని, కనిపించని నీరు చెట్టు పనులకు మాత్రం కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకో సంగతి చెప్పాలి. ఏపీ ప్రభుత్వంలో కోటి రూపాయల మించి జరిగే పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయించారట. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తే తీవ్ర స్థాయిలో తప్పు పట్టిన చంద్రబాబు, తెలుగుదేశం ఇతర నాయకులు, ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలకు పైగా పనులు చేపడితే చాలు.. అడ్వాన్స్ మొత్తం పొందవచ్చు. నిధులు తీసుకున్న తర్వాత ఎంతమేర కాంట్రాక్టులు సజావుగా జరుగుతాయో తెలియదు. ఆ రోజుల్లో భారీ ప్రాజెక్టులను ఈపీసీ (ఎస్టిమేషన్ ,ప్రొక్యూర్ మెంట్, కనస్ట్రక్షన్ ) పద్ధతిలో నిర్మించడం కోసం అడ్బాన్స్ లు ఇవ్వాలని తలపెట్టారని, ఇప్పుడు అన్ని పనులకు ఇలా చేస్తే పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ ఒకరు అన్నారు. సూపర్ సిక్స్ అమలుకు డబ్బులు లేవని చెప్పే ప్రభుత్వం,ఇలా నీరు-చెట్టు స్కీమ్ బకాయిలు, మొబిలైజేషన్ అడ్వాన్స్ లకు మాత్రం ఉదారంగా డబ్బులు ఇస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక విషయంలో కాదు.. అనేక అంశాలలో ప్రభుత్వ తీరు ఇలాగే ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో చూడండి.. రాజకీయంగా తమకు సవాల్ విసురుతున్న ప్రముఖులను ఆ కేసులో ఎలాగొలా ఇరికించాలని టీడీపీ నేతలు విశ్వయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తానే వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరి అనే నిందితుడిని అడ్డం పెట్టుకుని రకరకాల పన్నాగాలు చేస్తున్నారు. ఈ కేసును సీబీఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్నా, కొత్త కేసులు పెట్టి వైఎస్సార్సీపీ అధినేత జగన్ బంధువులు, సన్నిహితులు కొందరిని ఇరికించడానికి కుట్ర జరుగుతున్నట్లుగా ఉంది. తను జైలులో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ఇరవై కోట్లు తెచ్చి ప్రలోభపెట్టాడని దస్తగిరి గతంలో ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదు చేసి విచారణ చేసి, అలాంటిది ఏమీ జరగలేదని గత నవంబర్‌లో అధికారులు తేల్చారు. దానిని కోర్టు కూడా ఓకే చేసింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. మరోసారి కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించిందన్న వార్త చూస్తే రెడ్ బుక్ పాలన ఇలా ఉంటుందన్న మాట అనిపిస్తుంది. తెలంగాణ హైకోర్టు మాత్రం నిందితుడైన దస్తగిరిని సాక్షిగా ఎలా మార్చారని సీబీఐ ప్రశ్నించడం గమనార్హం. మరో వైపు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, సినీ నిర్మాత రాంగోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారించిన తీరు కూడా రెడ్ బుక్ వ్యవహారంగానే కనిపిస్తుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం తీసిన ఒక సినిమాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచితంగా సన్నివేశాలు పెట్టారని, మార్పింగ్ జరిగిందని అందువల్ల తమ మనోభావాలు గాయపడ్డాయని ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త కేసు పెట్టారు.అంతే! పోలీసులు వాయు వేగంతో స్పందించి వర్మను విచారణకు పిలిచారు. మరో కేసులో ఆయనను అరెస్టు చేయాలని ప్రయత్నించారు కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆ పని చేయలేక పోయారు. అయినా రెడ్ బుక్ వేధింపుల పర్వంలో భాగంగా ఆయనను అన్ని గంటలు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు తనను పోలీసులు హింసించారని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ సాగిస్తున్నారు.. ఆయనపై హింస జరగలేదని నివేదిక ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్ ప్రభావతిని కూడా తొమ్మిది గంటలు ప్రశ్నించారట. ఆమె కూడా ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. విశేషం ఏమిటంటే కులాలు, మతాల మధ్య ద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పెట్టిన కేసేమో పక్కకు పోయింది. ఆయన తనను హింసించారంటూ చేసిన ఫిర్యాదుకేమో హడావుడి చేస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన కేసు అంటూ అనేకమంది వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేశారు. తనతో బలవంతంగా కేసు పెట్టించారని పిటిషన్ దారుడు ఉపసంహరించుకోవడం సంచలమైంది. అయినా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏదోరకంగా రెడ్ బుక్ ప్రయోగించాలని నిర్ణయించుకుని అరెస్టు చేశారు. తమకు కావల్సినవారు నేరాలు చేసినా కేసులు ఎత్తివేయడం, తమ ప్రత్యర్థులు నేరాలు చేసినా, చేయకపోయినా, ఏదో ఒక సాకు చూపుతూ కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పడం చేస్తున్నారు. నిజంగానే రెడ్ బుక్కు పిచ్చి కుక్క మాదిరి వాడుతున్నారన్న వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్య మాదిరిగానే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తుంది. భారత రాజ్యాంగం బదులు రెడ్ బుక్ పాలనను కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వైనం ఏపీకి తీరని నష్టం చేస్తోంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు కొత్తరాగం.. మర్మం ఇదేనా?
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎన్నికల పలితాలను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలను జనం నమ్ముతారా? ఢిల్లీ, ఏపీ మోడళ్లు ఫెయిల్ అని చంద్రబాబు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఈ అంశాలను పరిశీలిస్తే అనేక వాస్తవాలు బోధపడతాయి. ఏ పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మలచుకుని ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. నిజాలకు పాతరేసి, తనకు కావాల్సిన వాదనను తెరపైకి తెస్తుంటారు. దీన్ని ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుని అనేక వ్యూహాలను పన్నింది. కేంద్రంలోని తన ప్రభుత్వాన్ని పూర్తిగా వాడుకుంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులూ తోడు కావడంతో ఆ పార్టీ ఓడిపోయింది. లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ బృందాన్ని బదనాం చేయడంలో బీజేపీ సఫలం అయింది. దీంతో అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్‌పై మరక పడింది. విశేషం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వాస్తవంగా ఎంత నష్టం జరిగిందన్నది ఇప్పటికీ మిథ్యే. అయినా కేజ్రీవాల్‌తో సహా ఆప్ నేతలు పలువురు మాత్రం నెలల తరబడి జైలులో ఉండవలసి వచ్చింది. అయినా బీజేపీకి తన విజయంపై నమ్మకం కలగలేదు.అందుకే తన ఎన్నికల మానిఫెస్టోలో అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించింది. అన్నిటికి మించి పిభ్రవరి ఒకటో తేదీన ప్రకటించిన బడ్జెట్లో.. పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి ఐదున పోలింగ్ తేదీని ప్రకటించడంలోని ఆంతర్యం కూడా ఇదే అయి ఉండవచ్చన్న సందేహం కలుగుతుంది. ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగవర్గాలు, మధ్యతరగతి వారు ఉంటారు. వారందరికి ఇన్ కమ్ టాక్స్ రాయితీ ద్వారా గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలిగింది. ఒకరకంగా చెప్పాలంటే డిల్లీ ఎన్నికల పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను మదింపుదారులకు ఊరట కలిగిందని అనుకోవచ్చు. అంతేకాదు. ఒకప్పుడు ఉచిత పథకాలకు తాము వ్యతిరేకం అని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ ముసుగు తొలగించింది. ఆప్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మించి కొత్త వాగ్దానాలు చేసింది. వాటిలో ప్రధానమైనది పేద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఇది కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వంటిది. ఏపీలో తన భాగస్వామి టీడీపీ రూ.1500 చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం వంటిది. ఈ మూడు రాష్ట్రాలలో ఈ హామీని ఎలా అమలు చేయాలో తెలియక ఆ పార్టీల ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. ఆ తరుణంలో బీజేపీ ఇలాంటి హామీ ఇచ్చింది. ఆప్ నెలకు రూ.2,100 రూపాయలు ఇస్తామని చెబితే బీజేపీ అంతకన్నా ఎక్కువ ఇస్తామని ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఊరించింది. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని స్కీములను కొనసాగిస్తూ కొత్తవాటిని ఇస్తామని బీజేపీ తెలిపింది. ప్రతి గర్భిణీకి రూ.21 వేలు ఇస్తామని, ఐదు రూపాయలకే భోజనం పెట్టే అటల్ క్యాంటీన్లు నెలకొల్పుతామని, పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీలిచ్చింది. ఆప్ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్తు, నీరు ఉచితంగా అందిస్తూండటం గమనార్హం. బీజేపీ ఇంకా పలు హామీలు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు విస్మరించి, బీజేపీ అభివృద్ది మోడల్‌తో గెలిచిందని సత్యదూరమైన ప్రకటన చేశారు. నిజంగానే కేవలం అభివృద్ది ఆధారంగానే ఎన్నికల ప్రణాళిక ప్రకటించి ఉంటే, ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ స్కీములను తాము కొనసాగిస్తామని బీజేపీ ఎందుకు చెబుతుంది? దీనర్థం ఆప్ మోడల్ ఢిల్లీలో సఫలమైంది కనుక దానిని అనుసరిస్తామని చెప్పడమే కదా! ఆప్‌ను దెబ్బతీయడానికి అంతకన్నా ఎక్కువ హమీలు ఇవ్వాలని అనుకోవడంలో అభివృద్ది మోడల్ ఏమి ఉంటుంది? ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో కేంద్రం పెత్తనం అధికంగా ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఆప్‌ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారనే చెప్పాలి. ఆప్ వైపు నుంచి కొన్ని తప్పులు ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉండేది. ఆప్, కాంగ్రెస్‌కు కలిసి సుమారు 49 శాతం ఓట్లు వస్తే బీజేపీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా.. కాంగ్రెస్‌కు వచ్చిన ఆరుశాతం ఓట్లు ఆప్‌ను దెబ్బకొట్టినట్లు అనిపిస్తుంది. కేజ్రీవాల్ తాము గెలుస్తామనే ధీమాతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బోల్తా పడ్డారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆప్ ప్రభుత్వం స్కూళ్లు మెరుగుపరచింది. ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ స్కూళ్లకు అక్కడ డిమాండ్ వచ్చేలా చేసిందన్నది వాస్తవం. అలాగే ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.చంద్రబాబు ఈ రెండు పాయింట్లను సైతం విమర్శించారు. స్కూళ్లు బాగు చేశామంటున్నారు కాని కాలేజీలు పెట్టలేదని, ప్రజల ఇళ్లవద్దకు డాక్టర్లను పంపించారని ఒప్పుకుంటూనే సూపర్ స్పెషాలిటి ఆస్పత్రులు నెలకొల్పలేదని అన్నారు. ఢిల్లిలో లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు అదే స్కామ్‌లో అభియోగానికి గురైన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎందుకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారో చెప్పరు. ఢిల్లీ ఆప్ ఓటమిని ఏపీలో వైఎస్సార్సీపీ పరాజయానికి పోల్చుతూ తాము కూటమి పక్షాన ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సంక్షేమం కాదని అభివృద్ధి ముఖ్యమని ఢిల్లీ ఓటర్లు అభిప్రాయపడ్డట్లుగా ఆయన అంటున్నారు. దీనిని ఏపీకి వర్తింపచేసే యత్నం చేశారు. నిజంగానే ఏపీలో YSRCP ప్రభుత్వం అమలు చేసిన మోడల్ సక్సెస్ అయిందన్న భావన.. భయం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు లేకుంటే జగన్ స్కీములన్నిటిని కొనసాగిస్తామని ఎందుకు ప్రకటించారో వివరించాలి కదా!. అమ్మ ఒడి కింద జగన్ ప్రభుత్వం తల్లికి రూ.15 వేలు చొప్పున ఇస్తుంటే, తాము అధికారంలోకి రాగానే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని ఎందుకు చంద్రబాబు హామీ ఇచ్చారు? సూపర్ సిక్స్ అంటూ ఎందుకు ఊదరగొట్టారు? నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, మహిళలకు నెల నెలా రూ.1500, బలహీన వర్గాలకు 50 ఏళ్లకే ఫించన్, రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎలా ప్రకటించారు?. ఏపీలో జగన్ టైమ్‌లో స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడితే అది అభివృద్ది కాదట. పోనీ చంద్రబాబు 15 ఏళ్లు ఇప్పటికే సీఎంగా పని చేశారు కదా! ఎందుకు స్కూళ్లను బాగు చేసి పేదలకు మంచి విద్య అందించలేదు. అసలు విద్య అనేది ప్రైవేటు రంగ బాధ్యత అని గతంలో అనేవారే! చంద్రబాబు తన పాలనలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయలేపోయారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే అభివృద్ధి కాదట. నాలుగు పోర్టులు నిర్మించడం అభివృద్ది కాదట. వచ్చిన మెడికల్ సీట్లను వెనక్కి ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం అభివృద్ది మోడల్ అట. పోర్టులను ప్రవేటు పరం చేయాలని యోచించడం ప్రగతి అట. జగన్ ఎన్నికల మానిఫెస్టోని చిత్తశుద్దితో అమలు చేస్తే, చంద్రబాబు అండ్ కో ప్రజలను మాయ చేయడానికి వాడుకున్నారు. గెలిచిన తర్వాత సంక్షేమం కాదు.. అభివృద్ది అంటూ కొత్తరాగం తీస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2019 లో టీడీపీకి మద్దతుగా కేజ్రీవాల్ ఏపీలో ప్రచారం చేశారు. అప్పుడు ఆయన చాలా గొప్ప వ్యక్తిగా, ఢిల్లీ అభివృద్ది ప్రదాతగా, పాలనదక్షుడిగా చంద్రబాబుకు కనిపించారు. ఇప్పుడేమో అదే కేజ్రీవాల్‌ను రాజకీయ కాలుష్యం సృష్టించిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే ఉండడానికి అనర్హుడుగా, టెర్రరిస్టుగా, భార్యనే ఏలుకో లేని వ్యక్తిగా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇప్పుడేమో మోదీది అభివృద్ది మోడల్ అని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ ఫలితాలను విశ్లేషిస్తూ మీడియా తో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మీడియా ప్రతినిధి ఈ విషయాలు అడుగుతారేమోనని అనుకుంటే అలా జరిగినట్లు లేదు. ఆ ప్రశ్నలే రాకుండా ఆయన జాగ్రత్త పడతారేమో తెలియదు. చంద్రబాబు ఏది చెబితే అదే కరెక్ట్ అని మీడియా ప్రచారం చేయాలి. అదే ఆయన వ్యూహం కూడా. ఏది ఏమైనా ఢిల్లీ ఫలితాల పేరుతో సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు మంగళం పలకడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారనే భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుది చీటింగ్ మోడల్ అని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుంటారు. మాటలు మార్చడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును మించి రాజకీయ కాలుష్య కాసారాన్ని సృష్టించగల నేత ఇంకెవరైనా ఉన్నారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
CBN: మాటలు స్వీటు.. చేతలు చేటు!
వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని ఒకప్పుడు అనేవారు. దీంట్లో వాస్తవం మాటెలా ఉన్నా... రాజకీయాల్లో చంద్రబాబు వంటి వారు చేసే ప్రకటనలకు మాత్రం ఈ సామెతను వర్తింపజేసుకోవచ్చు. ఎందుకంటారా? బాబుగారి ప్రకటనలు ఎప్పుడు ఎలా ఉంటాయో కనిపెట్టడం కష్టమే మరి!. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఆయన చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేస్తూంటారు. వినేవారి మతిపోతుంది ఈ ప్రకటనలు వింటే. కొందరు వీటిని మతిలేని ప్రకటనలని కూడా అంటుంటారు. కాని, ఆయన తెలివిగానే ఎప్పటికి ఏది అవసరమో ఆ మాటలే మాట్లాడుతుంటారు. కొద్ది రోజుల క్రితం ఆయన రెండు ప్రకటనలు చేశారు. సంపద సృష్టి ఎలాగో తనకు చెవిలో చెప్పమన్న ప్రకటన కూడా అలాంటిదే. ఎన్నికలకు ముందు తానే సంపద సృష్టికర్తనని వీర బిల్డప్ ఇచ్చిన ఆయన అకస్మాత్తుగా.. బేలగా.. అదెలా చేయాలో నాకు చెవిలో చెప్పండి అని అడుగుతారని ఎవరైనా ఊహించగలరా?. ఇదొక్కటే కాదు... ఢిల్లీలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నేతలు సంపద సృష్టించకుండా దాన్ని పంచే అధికారం లేదని అన్నారు. అంటే ఏమిటి దీని అర్థం? సబ్సిడీ పథకాలు అమలు చేయరాదని చెప్పడమే కదా!. ప్రజలకు నగదు బదిలీని వ్యతిరేకించడమే కదా! మరి ఇదే చంద్రబాబు(Chandrababu) ఎన్నికల సమయంలో బోలెడన్ని ఉచిత వరాల వర్షం ఎందుకు కురిపిస్తారు? ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా పోతారు?సోషల్ మీడియా యుగంలో అవన్ని వెలుగులోకి వస్తుండడంతో ఆయన ప్రభుత్వం చికాకు పడుతూ ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ ప్రయోగిస్తుంటుంది. మాట మార్చడంలో దేశంలోనే ఒక రికార్డు సాధించిన చంద్రబాబు ఇప్పుడు అసలుకే ఎసరు పెడుతున్నట్లు అనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో సూపర్‌సిక్స్ అని, ఎన్నికల ప్రణాళిక అని తెగ ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు పలు గందరగోళ ప్రకటనలు చేస్తూ ప్రజలకు పిచ్చెక్కెస్తున్నారనే చెప్పాలి. ఎన్నికలకు ముందేమో సంపద గురించి చెప్పకుండా తాము వస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించే వారు. తెలుగుదేశం మహానాడు(TDP Mahanadu)లో సూపర్ సిక్స్ హామీల ప్రకటన చేసి 'తమ్ముళ్లూ అదిరిపోయిందా" అంటూ సంబరపడితే ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆహా.. ఓహో అంటూ శరభ.. శరభ అని గంతులేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై శరాలు వదిలారని ప్రచారం చేశాయి. అంతవరకు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల హామీలు అమలులో భాగంగా వివిధ స్కీములలో లబ్దిదారులకు ఆర్థిక సాయం చేస్తుంటే.. బటన్ నొక్కడం తప్ప ఏమి చేస్తున్నారని తప్పుడు కథనాలు ఇచ్చేవారు. మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని, అదేమంత పెద్ద పనా అని వ్యాఖ్యానించారు. తాను ఇంకా ఎక్కువ చేయగలనన్నట్లు బిల్డప్ ఇచ్చేవారు. అంతేకాదు.. రూ.70 వేల కోట్ల మేర స్కీములను అమలు చేస్తేనే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పిన చంద్రబాబు అంతకు రెండు రెట్లు అధికంగా అంటే రూ.1.5 లక్షల కోట్ల విలువైన స్కీములను బటన్ నొక్కడం ద్వారా పేదలకు అమలు చేస్తామని అనేవారు. అదెలా సాధ్యమైని ఎవరికైనా అనుమానం వస్తుందని, ముందుగానే తనకు సంపద సృష్టించే అనుభవం ఉందని దబాయించేవారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి మాటేమో కాని, అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే రూ.80 వేల కోట్ల బడ్జెట్ అప్పులు చేస్తే, బడ్జెట్ తో సంబంధం లేకుండా మరో రూ.40 వేల కోట్లకు పైగా అప్పు చేశారు. పోనీ వీటినేమైనా పేదల కోసం ఖర్చు చేస్తున్నారా? ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి వ్యయం చేస్తున్నారా అంటే అదేమీ లేదు. అభివృద్ది పనులకైనా ఖర్చు పెడుతున్నారా? అంటే అదీ కనపడదు. జగన్ టైంలో వచ్చిన ఓడరేవులు, మెడికల్ కాలేజీల వంటివాటిని ప్రైవేటు పరం చేస్తానంటున్నారు. రాయచోటి వద్ద జరిగిన ఫించన్ల పంపిణీ కార్యక్రమ సభలో ఒక రైతు.. తమకు అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. వర్కవుటు చేస్తున్నామని చెబుతూ, అవి ఇవ్వాలంటే ముందు డబ్బులు సంపాదించాలని, లేదంటే డబ్బు సంపాదించే మార్గం తనకు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు తెలివితేటలతో ఆర్థికంగా ఎదగాలని కూడా ఒక సలహా పారేశారు. ఈ మాత్రం దానికి సూపర్ సిక్స్ అని, ఎంతమంది పిల్లలనైనా కనండి.. వారందరి చదువు కోసం తాను తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున డబ్బు ఇస్తానని ఎందుకు చెప్పారు?.. అని ఎవరికైనా ఒక సందేహం వస్తే అది వారి ఖర్మ అనుకోవాలన్నమాట. ఆ వెంటనే రైతు భరోసా కూడా మూడు విడతలుగా అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండిటిలో ప్రజలు ఏది నమ్మాలి? ఇక ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 'నాకు దేశ అభివృద్ధి, భవిష్యత్తు ముఖ్యం. సరైన అభివృద్ధే సరైన రాజకీయం.., దేశంలో సంపద పెంచకుండా పంచడం సరైనది కాదు" అని సందేశం ఇచ్చారు. దీనిపై చర్చ జరగాలని అంటూ, సంపద సృష్టించకుండా దానిని పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఢిల్లీలో ఆప్ పాలనను విమర్శించి వారి పాలన విఫల ప్రయోగం అని వ్యాఖ్యానించారు. ఇదే చంద్రబాబు 2019లో కేజ్రీవాల్‌ను గొప్ప పాలకుడని, విద్యావంతుడు అని అభివర్ణించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు సంపద సృష్టించకుండా పంచే హక్కు నేతలకు లేదని అంటున్నారంటే, ఏపీలో ఇప్పట్లో సూపర్ సిక్స్ అమలు చేయలేమని చెప్పడమే అవుతుంది కదా అనే విశ్లేషణ వస్తుంది. ఒకసారేమో తాను చెప్పినదాని కన్నా ఎక్కువే ఇస్తానని అంటారు. మరో సారి డబ్బు ఎక్కడ ఉందని అంటారు. ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలను పెంచబోనని, తగ్గిస్తానని చెబుతారు. అధికారంలోకి రాగానే రూ.15 వేల కోట్ల భారం మోపారు. తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువలను పెంచడం ద్వారా వేల కోట్ల అదనపు ఆదాయం పొందే యత్నం చేశారు. ప్రజలకు సంపద పంచుతానని చెప్పిన చంద్రబాబు వారేదో కాస్తో, కూస్తో సంపాదించుకున్న దానిని ఇలా లాక్కుంటున్నారేమిటని సందేహం రావచ్చు. అదే సంపద సృష్టి అన్న అభిప్రాయం వస్తుందన్న మాట. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష జరిపి.. ప్రజలపై అదనపు భారం మోపలేం అని అన్నారట. మరి ఇప్పటి వరకు వేసిన భారం సంగతేమిటి? అని అడిగే అవకాశం ప్రజలకు ఉండదు. ఏ ఒక్కరు పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని అధికారులకు చెప్పారు. వేధింపులు వద్దని పైకి చెప్పడం బాగానే ఉన్నా, ప్రభుత్వ సిబ్బంది ఏమి చేస్తారో ఊహించుకోవడం కష్టం కాదు. గత ఏడాది జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది చంద్రబాబు పాలనలో ఆదాయం తగ్గింది. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని చంద్రబాబు అంటారు. ప్రజలపై అదనపు భారం మోపలేమని ఆయన అన్నారట. ఇంతకన్నా కపటత్వం ఏమి ఉంటుంది? జగన్ టైంలో తలసరి ఆదాయం పెరిగినా, జీఎస్డీపీ, జీఎస్టీ గణనీయంగా అభివృద్ది చెందినా.. అసలేమీ జరగలేదని చెబుతారు. అదే చంద్రబాబు గొప్పదనం. రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసుకుంటే ఇప్పుడేమో లక్ష రెండువేల కోట్ల దగ్గరే ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే చంద్రబాబు అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్లే ఈ పరిస్తితి ఏర్పడిందనే కదా అర్థం? అయినా భజంత్రి మీడియా ఉంది కనుక ఏమి చెప్పినా చెల్లుబాటు అయిపోతోంది!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు విధ్వంసాన్ని కళ్లకు కట్టిన జగన్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి సర్కార్ పనితీరును ఉతికి ఆరేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు అరటి పండు ఒలిచి పెట్టినట్లు వివరించారు. పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలకు సమాధానమే లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి కాకి లెక్కలతో కాకుండా.. పక్కా సమాచారంతో, అంకెలతో తన వాదన వినిపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబును ఆర్థిక విధ్వంసకారుడిగా ప్రజల ముందు నిలబెట్టారు.దాదాపు రెండు గంటలపాటు సాగిన మీడియా సమావేశంలో జగన్ అనేక అంశాలపై మాట్లాడారు. స్థూలంగా వీటిని నాలుగు విడతలుగా చెప్పవచ్చు కానీ.. అన్నింటినీ ఒకేసారి విడమరచి చెప్పడం ద్వారా ఆయన ప్రజలపై ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉండగా చేసిన దావోస్ యాత్ర.. తరువాతి పరిణామాలు, ఆ టూర్‌కు ఎల్లోమీడియా ఇచ్చిన బిల్డప్ వంటి అంశాలన్నింటినీ ఈనాడు పత్రిక పాత క్లిప్పింగ్స్ సాయంతోనే వివరించిన తీరు ఆసక్తికరం. ఆనాటి ఈనాడు కథనాలు చూస్తే.. ఏపీకి పరిశ్రమలు వెల్లువలా వచ్చేస్తున్న భ్రమ కలుగుతుంది. వీటిపై వైఎస్ జగన్ వివరిస్తూ ‘2016లో చంద్రబాబు దావోస్ సమ్మిట్‌కు వెళ్లి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. ఆ సందర్భంగా ప్రముఖ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఏపీకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. అది రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ. ఆ తర్వాత చంద్రబాబు మూడేళ్లపాటు సీఎంగా ఉన్నారు. అయినా ఆ కంపెనీ ఏపీకి వచ్చింది లేదు.అలాగే, 2017లో హైస్పీడ్ రైళ్ల కర్మాగారం ఏపీకి రాబోతోందని, 2018లో హైబ్రిడ్ క్లౌడ్ వస్తోందని, 2019లో జెన్‌ప్యాక్ట్ సంస్థ ఏర్పాటు కాబోతోంది అని ఎల్లోమీడియా గొంతు చించుకుందని ఆధారసహితంగా వివరించారు. ఇవే కాదు.. అప్పట్లో ఏపీకి ఏకంగా 150 సంస్థలు వచ్చేస్తున్నాయని ఈనాడు దినపత్రిక కథనాన్ని ఇచ్చింది. మరో పెద్ద సంస్థ అలీబాబా, ఎయిర్ బస్ తయారీ ప్లాంట్ మొదలైనవి ఏపీ వైపు చూస్తున్నాయని ఎల్లో మీడియాలో కథనాలు వండి వార్చారు. దావోస్‌లో ఎవరైనా పారిశ్రామికవేత్తతో చంద్రబాబు బృందం భేటీ అయితే చాలు.. ఆ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు కావడమే తరువాయి అన్న చందంగా ఊదరగొట్టేవారు. కానీ, వాటిలో 90 శాతం కంపెనీలు రానేలేదు. ఒకటి, అరా వచ్చాయేమో చెప్పలేం.ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రిక, టీవీలు చూసేవారికి చంద్రబాబు అధికారంలో ఉంటే ఏపీ భూతల స్వర్గం కాబోతున్నట్లు అనిపించేలా వార్తలు వస్తుంటాయి. అదే వైఎస్ జగన్ అధికారంలో ఉంటే అంతా చీకటే కనిపిస్తుంది. జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వచ్చినా అవేవీ వీరికి కనిపించేవి కావు. ఎల్లో మీడియా సరిగ్గా అదే పద్దతిని చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుత టర్మ్‌లో కూడా కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్‌ల రెడ్‌బుక్.. పారిశ్రామివేత్తలను భయపెడుతోందని, జిందాల్ అంతటి పెద్ద పారిశ్రామికవేత్తపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే, తరిమేస్తే, ఇక్కడ వేరే వారు పరిశ్రమలు పెట్టాలంటే భయపడరా? అని జగన్ ప్రశ్నించడం కరెక్ట్. ఇక చంద్రబాబును ఆర్థిక విధ్వంసకారుడుగా జగన్ అభివర్ణించిన తీరు వింటే ఏపీ ప్రజలను మోసం చేసి కూటమి పాలన చేస్తోందా అన్న భావన కలగక మానదు.వైఎస్ జగన్ తన హయాంలో చేసిన అప్పులు, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులను పోల్చి చెప్పారు. తాను పలు సంక్షేమ పథకాలు అమలు చేసినా, అభివృద్ది కూడా జరిగిందని పోర్టులు, వైద్య కళాశాలలు, గ్రామగ్రామాన ప్రభుత్వ భవనాలు నిర్మించానని జగన్ చెప్పారు. మరి ఈ ఎనిమిది నెలల కూటమి పాలనలో ఏకంగా రూ.80 వేల కోట్ల మేర బడ్జెట్లో అనుమతించిన అప్పులు చేశారని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా మరో రూ.50వేల కోట్ల అప్పు తెస్తున్నారని జగన్ విడమరిచి చెప్పారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్ లేదా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌లు ఎవరైనా సమాధానం ఇచ్చే పరిస్థితి కనబడదు. సూటిగా జవాబు ఇవ్వకుండా ఏదో ఒక పిచ్చి ఆరోపణ చేసి డైవర్షన్ రాజకీయాలు సాగించడమే కూటమి నేతలు తమ వైఖరిగా పెట్టుకున్నారు. కేశవ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిధుల మంజూరులో ఆయనది నామమాత్రపు పాత్రే. ఢిల్లీ వెళ్లి నిధులను టాప్ చేసే అవకాశం ఆయనకు లేదు.వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సూచన మేరకు ఆనాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ వెళ్లి నిధులు సంపాదించుకు వచ్చిన తీరును ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. గత ఏడాది జగన్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పోల్చితే ఈ ఏడాది కూటమి సర్కార్‌కు తక్కువ నిధులు అందాయని, అలాగే ఆర్థిక సంఘం నిధులు కూడా సరిగా రావడం లేదని అధికారులు చంద్రబాబుకు వివరించారట. ఇది ఒక కోణం అయితే, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నీతి ఆయోగ్ నివేదిక అంటూ తనకు అనుకూలమైన అంకెలను చెప్పి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దానికి జగన్ దిమ్మదిరిగే జవాబు ఇచ్చారు.మొత్తం ఐదేళ్ల పాలనలో ఆర్థిక నిర్వహణకు, 2014-19 టర్మ్‌లో ఆర్థిక వ్యవహారాల తీరుతెన్నులకు పోల్చుకుందామా అని సవాల్ చేశారు. పోనీ ఈ ఏడాది చేసిన అప్పులపై చంద్రబాబు వివరణ ఇచ్చే పరిస్థితి ఉందా? అన్న ప్రశ్న వేశారు. నిజంగానే చంద్రబాబు గత టర్మ్‌లో దాదాపు రూ.3.5 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. చిత్రమేమిటంటే ఆ అప్పులను కూడా కలిపి జగన్ ఖాతాలో వేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా వారు దుష్ప్రచారం చేశారు. ఏకంగా రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ దుర్మార్గంగా ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈ విషయాన్ని జగన్ ప్రస్తావించి అప్పుడేమో కాని, ఇప్పుడు మాత్రం అప్పుల్ని రూ.14 లక్షల కోట్లకు తీసుకు వెళ్లేలా ఉన్నారని విమర్శించారు.రాష్ట్రంలో ఒక్క పథకం అమలు చేయకుండా ఏడాదిలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నారన్న జగన్ ప్రశ్నకు ప్రభుత్వం శ్వేతపత్రం ఇస్తుందా? అంటే అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. జగన్ హయాంలో రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్న సంగతిని చంద్రబాబు ఎప్పుడూ ప్రస్తావించకుండా విమర్శలు చేస్తుంటారు. చంద్రబాబు టైమ్‌లో అలాంటి సమస్యలు లేకపోయినా ఎందుకు అధ్వాన్నంగా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు అన్నదానికి ఆన్సర్ దొరకదు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని అంటూ ఒక్కో పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఎగవేసింది జగన్ వివరించారు. అందుకే బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జగన్ అందుకున్నారు.ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని, ఒక్క నెల తప్ప, మిగిలిన ఏ నెలలో అయినా మొదటి రోజు జీతాలు చెల్లించారా అని జగన్ అడిగారు. ఇది ఆశ్చర్యకరమే. అటు స్కీములలో ఒక్కటీ అమలు చేయక, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తీర్చకుండా, జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఎందుకు తయారైందో అర్థం కాదు. జనం సంగతి పక్కనపెట్టి, టీడీపీ కార్యకర్తలకు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో మాత్రం శ్రద్ద వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం ఒక్కటి ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు 2.5 లక్షల లక్షల ఉద్యోగాలు తొలగించారని జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం షాపులలో సుమారు 18వేల మంది ఉద్యోగులు ఉండేవారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటినీ ప్రైవేటు పరం చేసి కొత్త షాపులు ఇవ్వడంతో వీరికి ఉద్యోగాలు పోయాయి.రెండున్నర లక్షల మంది వలంటీర్లకు పది వేల చొప్పున జీతాలు ఇస్తామని ఉగాది నాడు దేవుడి సాక్షిగా చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వారి ఉద్యోగాలకే ఎసరు పెట్టారు. అందుకే చంద్రబాబు చీటింగ్‌లో పీహెచ్డీ చేశారని జగన్ ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఉప ఎన్నికలలో టీడీపీ చేసిన అరాచకాలపై కూడా వైఎస్ జగన్ నిలదీశారు. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామ్య విధ్వంసం, పారిశ్రామిక విధ్వంసం, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, హింసతో కూడిన విధ్వంసం మొదలైనవి చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రక్రియలో ఉందని వైఎస్ జగన్ స్పష్టంగా వివరించగలిగారు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కార్యకర్తలకు ఊపునిస్తున్న జగన్ 2.0!
నాయకుడంటే మాటకు కట్టుబడిన వాడై ఉండాలి. విశ్వసనీయతకు నిలువుటద్దం కావాలి. కార్యకర్తలకు ధీమా ఇవ్వగలగాలి. ప్రజలను ఆదుకునే విధానాల రూపకర్త కావాలి. అప్పుడే ఎవరైనా ఆ నేతను నమ్ముతారు. గెలుపు, ఓటముల్లోనూ వెంట నిలుస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ విషయంలోనూ జరుగుతున్నది ఇదే..వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలి ప్రసంగాన్ని గమనిస్తే.. పైన మనం చెప్పుకున్న అన్ని లక్షణాలూ స్పష్టంగా కనిపిస్తాయి. ఆ కారణం చేతనే రాష్ట్రంలో ఇతర పార్టీలకు లేని.. బలమైన, విశ్వసనీయమైన కార్యకర్తల వర్గం వైఎస్సార్సీపీని అన్నివేళలా అండగా నిలుస్తోందని చెప్పవచ్చు. వైఎస్ జగన్ ప్రసంగం వీరందరిలో కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా.. తాము ఆశించినట్టుగానే తమ నేత మాటలు ఉన్నాయన్న ప్రశంసా వినిపిస్తోంది.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పదవీకాలంలో ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడటమే కాదు.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాల్లో 98 శాతం విజయవంతంగా అమలు చేశారు కూడా. అలాగే రాష్ట్రంలో కనివినీ ఎరుగని రీతిలో సరికొత్త వ్యవస్థలను తేవడం ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేశారు. మెడికల్ కాలేజీలు, నౌకాశ్రయాలు, అన్ని ఆధునిక హంగులతో పాఠశాలలు.. ఇలా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు.అయితే, ఇన్ని చేసినా వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందన్న ప్రశ్న అందరి మనసులను తొలుస్తూనే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల మాయ ఉందన్న అంచనాలున్నా.. ఇతర కారణాలపై కూడా బాగానే చర్చ నడిచింది. ఈ కారణాల్లో ఒకటి.. జగన్ ప్రభుత్వం విషయంలో చూపినంత శ్రద్ధ కార్యకర్తల విషయంలో చూపలేదూ అన్నది! వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగినా కార్యకర్తలకు ప్రాధాన్యత తగ్గిందన్న వాదన కూడా ఉంది. జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థల కారణంగా ప్రజలు స్థానిక నేతలు, కార్యకర్తల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని, ఇది పార్టీకి కొంత నష్టం చేసిందన్న విశ్లేషణ కూడా జరిగింది.నిజానికి స్థానిక సంస్థలలో పదవుల మొదలు, వివిధ నామినేటెడ్ పోస్టులలో వేలాది కార్యకర్తలకు అవకాశాలు కల్పించిన చరిత్ర వైఎస్ జగన్‌ది. అయినప్పటికీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కొంత తగ్గడం కార్యకర్తలకు అంతగా నచ్చలేదని అంటారు. ఈ నేపథ్యంలో జగన్ ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలను తరచూ కలుస్తుండటం వారితో మాటలు కలుపుతుండటం అడిగిన వారికి లేదనకుండా సెల్ఫీలు ఇవ్వడం కార్యకర్తల్లో కొత్త జోష్, ఆనందం కలిగిస్తోంది. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమా కూడా వారిలో వ్యక్తమవుతోంది. కేడర్ కూడా జగన్‌ను సెల్ఫీలు, కరచాలనాల విషయంలో మరీ ఇబ్బందికి గురి చేయకుండా ఉంటే మంచిది.చంద్రబాబు ఏమో జన్మభూమి కమిటీల పేరుతో కార్యకర్తలను నియమించి ప్రజలను నానా పాట్లకు గురి చేశారు. దానివల్ల ఆయన ఓడిపోయినా, కార్యకర్తలు అంతవరకు చేసిన అక్రమ సంపాదన వల్ల ఆర్థికంగా బలంగా ఉండగలిగారు. జగన్ మాత్రం ప్రజలకు నేరుగా ఎలాంటి వివక్ష, వేధింపులు, అవినీతి లేకుండా పథకాలను అందించారు. వాటిలో కార్యకర్తల ప్రమేయం తక్కువగా ఉండడంతో రాజకీయంగా నష్టపోయారు. కేడర్‌కు ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా దక్కలేదని చెబుతారు.టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సూపర్ సిక్స్ పేరుతో చేసిన అసత్య ప్రచారం ప్రభావానికి ప్రజలు కొంతవరకు గురయ్యారని ఎల్లో మీడియా అసత్య కథనాలూ తోడైన కారణంగానే వైఎస్సార్సీపీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఇచ్చిన మాటను గూట్లో పెట్టేసిన కూటమి నేతల అసలు స్వరూపం ప్రజలకూ అర్థమవుతోంది. వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడారు. తొమ్మిది నెలల కాలంలోనే రూ.80 వేల కోట్ల అప్పులు చేసి కూడా ప్రజలకు పైసా విదల్చకపోవడం వారికి తెలుస్తూనే ఉంది. సూపర్ సిక్స్‌కు మంగళం పాడేయగా.. రెడ్‌బుక్ రాజ్యాంగం కాస్తా రాష్ట్రంలో పరిస్థితులను అరాచకంగా చేసేశాయి. పేరుకే కూటమి కానీ.. పెత్తనమంతా టీడీపీ, మంత్రి లోకేషలదేనని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, బీజేపీలు పేరుకు మాత్రమే అన్నట్టుగా అయ్యింది.ఈ వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన మీడియాలో ఒక వర్గం.. ప్రతిపక్షంపై బురదజల్లడమే పనిగా పని చేస్తోంది. అయినా కూటమిపై ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం కారణంగా స్థానిక వైఎస్సార్సీపీ నేతలు అన్ని రకాల వేధింపులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో జగన్ విజయవాడలో చేసిన ప్రసంగాన్ని చూడాల్సి ఉంటుంది. ఇది వారిలో ఆత్మ స్థైర్యాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వ వాగ్ధాన భంగాన్ని ప్రజలు గమనిస్తున్నారని, విధ్వంసకాండ, కక్ష రాజకీయాలు కూడా వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయని వివరించి, వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేది ఖాయమని చెప్పడం కార్యకర్తలకు పెద్ద భరోసానిచ్చింది.కాంగ్రెస్, టీడీపీలు కలిసి తనను వ్యక్తిగతంగా అక్రమ కేసులతో వేధించినా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని తాను సీఎం పీఠాన్ని అధిరోహించిన విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. తద్వారా కష్టాలు వస్తూంటాయి.. పోతూంటాయన్న సందేశం ఇచ్చి కార్యకర్తలలో ధైర్యం నింపారు. విజయవాడ వంటి చోట్ల కార్పొరేటర్లు టీడీపీ ప్రలోభాలు, దౌర్జన్యాలను ఎదుర్కుని పార్టీ కోసం నిలబడ్డ తీరును అభినందించిన జగన్ చేసిన ఒక వ్యాఖ్య చాలా ఆసక్తికరమైంది. ఓడిపోయినా ప్రజల వద్దకు గర్వంగా వెళ్లగలుగుతున్నామని, గెలిచిన కూటమి నేతలు తొమ్మిది నెలలు తిరగకుండానే ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ప్రజలు నిలదీస్తారన్న భయం కూటమి నేతల్లో ఉందని జగన్ చెప్పడం వాస్తవం.అన్నమయ్య జిల్లాలో స్వయంగా చంద్రబాబే రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఆ ప్రశ్నలకు ఏం జవాబు ఇవ్వాలో తెలియక, తనకు సంపాదించే మార్గం చెప్పాలని, ఐడియాలు చెవిలో చెప్పాలని చంద్రబాబు చెప్పుకోవాల్సిన వచ్చింది. ఈ పరిణామాలన్నీ వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారుతున్నాయి. జనంలోకి వెళ్లి వాస్తవాలను వివరించేందుకు అవకాశం కల్పిస్తోంది. జగన్ ఇస్తున్న సందేశం కూడా ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పాలి. జగన్ మరో మాట అన్నారు. చంద్రబాబు అండ్ కో ఎన్నికల వేళ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, తాను అలా చేయలేనని చెప్పానని, ఓడిపోవడానికి అయినా సిద్దపడ్డాను కాని ప్రజలను మోసం చేయలేదని అన్నారు. ఇది సత్యం. వైఎస్ జగన్ కూడా కూటమికి పోటీగా వాగ్ధానాలు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.వైఎస్ జగన్ రూ.70 వేల కోట్ల విలువైన హామీలు అమలు చేయడానికి చాలా శ్రమించవలసి వచ్చింది. అయినా అధికారం కోసం చంద్రబాబు లక్షన్నర కోట్ల విలువైన బూటకపు హామీలు ఇచ్చారు. అధికారం అయితే వచ్చింది కాని, కూటమిలో ఆ సంతోషం కనిపించడం లేదు. ఎంతసేపు వారు జగన్ ఫోబియాతో మాట్లాడుతున్నారు తప్ప, సూపర్ సిక్స్ గురించి మాట్లాడలేకపోతున్నారు. ఒక ఏడాది మొత్తంలో ఒక్క స్కీము కూడా అమలు చేయని విఫల ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తానని జగన్ కేడర్‌కు భరోసా ఇవ్వడం ఒక నమ్మకాన్ని కలిగిస్తుందని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎల్లో మీడియా కొంపముంచిన చంద్రబాబు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేమిటి ఇలా అన్నారు.. అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన అలా అనకపోతేనే వింత అవుతుంది. సంపద సృష్టించే మార్గం ఏదైనా ఉంటే ఒక ఐడియా ఇవ్వండి అని ప్రజలనే అడుగుతున్నారు. అది కూడా ఆయన చెవిలో చెప్పాలట. ఈ మాట వినగానే ఎల్లో మీడియా నిర్ఖాంతపోయినట్లు ఉంది. తామేదో బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తుంటే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి కొంప ముంచారే అనుకుంటోంది. అందుకే అంత కీలకమైన వ్యాఖ్యలను ఎల్లో మీడియా దాచేసే యత్నం చేసింది.అన్నమయ్య జిల్లా సంబేపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎదురైన ఒక చేదు అనుభవం రీత్యా చంద్రబాబు ఈ విషయం చెప్పేశారు. ఒక రైతు తమకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అడిగారు. దానికి కాస్త చికాకుపడిన చంద్రబాబు డబ్బులు వస్తే ఇస్తామని, దీనికి వర్క్ అవుట్ చేస్తున్నామని, అయినా మీకు ఇవ్వాలంటే ముందుగా డబ్బు సంపాదించాలిగా అని అన్నారు. అక్కడితో ఆగలేదు. డబ్బు సంపాదించే మార్గం ఉంటే తనకు చెవిలో చెప్పాలని చంద్రబాబు అనడంతో అక్కడ ఉన్నవారికి మతిపోయినంత పని అయింది. నిజానికి చంద్రబాబు ఇలాంటి ప్రశ్నలను ఊహించి ఉండరు. తన కుమారుడు, మంత్రి లోకేష్ ఎన్నికలకు ముందు హామీలను నెరవేర్చకపోతే చొక్కా కాలర్ పట్టుకుని నిలదీయండని అన్నారు. అయినా తాము సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికలోని మరో 175 హామీలను ఎగవేస్తే మాత్రం ఎవరు అడుగుతారులే అన్న ధీమాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఉంటారు.కానీ, లోకేష్ కాలర్ డైలాగ్ బాగా వైరల్ అవుతుండటంతో ధైర్యం వచ్చిందేమో తెలియదు.. ఒక రైతు తమకు రావాల్సిన భరోసా మొత్తం రూ.20వేల గురించి ప్రశ్నించారు. దానికి ఏం చెప్పాలో అర్ధం కాని చంద్రబాబు చివరికి డబ్బులు లేవు పొమ్మంటూ, మీరే ఐడియా ఇవ్వండి అని చెప్పి చేతులెత్తేశారు. కేంద్రం గత ఏడాదికి గాను రైతు భరోసా కింద ఆరువేల రూపాయల చొప్పున మంజూరు చేసి ఉండాలి. అది పోను మిగిలిన మొత్తాన్ని ఇవ్వడానికి అయినా చంద్రబాబు ప్రభుత్వం సిద్దపడి ఉండాల్సింది. ఎన్నికల ప్రణాళిక ప్రకారం ప్రతీ రైతుకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో అందిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారం వచ్చాక అసలుకే మోసం తెచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆరువేల రూపాయలను కూడా ప్రభుత్వం ఎగవేయడం విశేషం. ఈ ఏడాది నుంచి కేంద్రం పదివేల చొప్పున ఇస్తుంది. దానినైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి. ప్రతీ ఒక్కరూ తెలివితేటలతో ఆర్ధికంగా ఎదగాలని కూడా సలహా ఇచ్చారు.ఇంతకాలం తన తెలివితేటలతో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు అభివృద్ది చెందుతారని హోరెత్తించిన చంద్రబాబు ఇప్పుడు ఎవరి బతుకు వారే చూసుకోవాలని అంటున్నారు. ఆయన చెప్పేది వాస్తవమే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకుని మోసపోకుమా అన్న శ్రీశ్రీ గేయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈయనేమీ వైఎస్ జగన్ కాదు కదా!. చెప్పినవి చెప్పినట్లు చేయడానికి అని ఇప్పుడు జనం భావిస్తున్నారు. మరో ఘటన కూడా జరిగింది. కొందరు యువకులు మదనపల్లె వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయరాదని కోరుతూ నినాదాలు చేశారు. వారికి సమాధానం ఇవ్వకపోగా, ఒకరిద్దరు వచ్చి ఇలా చేస్తారని, వారు అవుట్ డేటెడ్ అని కొట్టిపడేశారు. వామపక్షాలు చంద్రబాబుతో కలిసి ఉంటే కమ్యూనిజం గొప్పదని చెబుతారు. ఆయన బీజేపీతో కలిస్తే కమ్యూనిజం కాదు.. టూరిజం ముఖ్యమని అంటారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వపరంగా చేపట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయినట్లే అని అర్ధం అవుతోంది. ఇప్పటికే 750 మెడికల్ సీట్లను ఈ ప్రభుత్వం వదులుకుని విద్యార్ధులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి రాగానే మరో మాట చెప్పడం చంద్రబాబుకు అలవాటైన విద్యే. మదనపల్లె మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయవద్దని కోరిన విద్యార్ధులను పోలీసులతో బయటకు నెట్టేయించారు. నారా లోకేష్ ఎన్నికలకు ముందు చొక్కా కాలర్ పట్టుకోమన్నారు కదా అని ఎవరైనా ప్రయత్నిస్తే, పోలీసులతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని తేలిపోయింది. తల్లికి వందనంతో సహా ఆయా పథకాలను జూన్‌లో ఇస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం తర్వాత చెప్పారు. అప్పుడు ఏం ఇస్తారో తెలియదు కానీ, ఈ సభలో మాత్రం తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఒకసారి ఇవ్వాలా?రెండు దఫాలుగా ఇవ్వాలా అన్నది నిర్ణయం తీసుకుని అందిస్తామని అన్నారట. ఈ పాయింట్ ఆధారంగా ఎల్లో మీడియా మళ్లీ వెంటనే ఆ స్కీమ్ అమలు అయిపోతుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చి కథనాలు వండి వార్చాయి. తాము చెప్పినదానికన్నా ఎక్కువే చేసి చూపిస్తామని చంద్రబాబు అన్నారని కూడా రాసేశారు.హామీలు ఇచ్చినవాటికే దిక్కు లేదు కానీ.. ఎల్లో మీడియా బిల్డప్ ఏమిటా అని అంతా అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. తల్లికి వందనం పథకాన్ని ఒక ఏడాది ఎగవేసిన విషయాన్ని మాత్రం జనం మర్చిపోవాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఎల్లో మీడియా కోరికగా ఉంది. అధికారం రావడమే ఆలస్యం అన్నీ జరిగిపోతాయని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇన్ని రకాలుగా పిల్లిమొగ్గలు వేస్తున్నారు. వలంటీర్లను కొనసాగిస్తామని గతంలో ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు వాట్సాప్ పాలన లోకేష్ ఆలోచన అని కుమారుడిని ప్రమోట్ చేసేపనిలో ఉన్నారు. చంద్రబాబు తన ప్రచారం కోసం నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెల ఇచ్చే పెన్షన్ల పంపిణీకి స్వయంగా చంద్రబాబు వెళ్లవలసిన అవసరం ఏముందని అంటున్నారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో వృద్దులకు పెన్షన్‌గా మూడువేల రూపాయలు ఇచ్చేవారు. దానికి మరో వెయ్యి అదనంగా ఇస్తున్నారు. అంతవరకు ఓకే. మరోవైపు పెన్షన్లను ప్రతీ నెలా కోత పెడుతున్నారని చెబుతున్నారు. ఈ పెన్షన్లను గతంలో వలంటీర్లు అందచేసేవారు. ఆ వలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి వారి ఉద్యోగాలకే మంగళం పలికారు.ఒక వలంటీర్ చేయగలిగిన పనిని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకంగా సభ పెట్టి పంపిణీ చేసి, ప్రసంగం చేసి ప్రచారం జరిగేలా చూసుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాకపోతే, ఆయన స్టైలే అది. పావలా కోడికి రూపాయి మసాలా అన్నట్లుగా ఆయన యావ ఎప్పుడూ ప్రచారంపైనే ఉంటుంది. చంద్రబాబు ఏపీలోనే కాదు.. ఢిల్లీ వెళ్లి సైతం అక్కడ జరుగుతున్న ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న సందర్భంగా కూడా పలు అసత్యాలు చెప్పి వచ్చారు. 2019లో చంద్రబాబుకు మద్దతుగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విశాఖపట్నం వచ్చి ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు అదే కేజ్రీవాల్‌ను ఓడించాలని చంద్రబాబు ప్రచారానికి దిగారు. గతంలో మోదీని నానా రకాలుగా దూషించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతున్నారు. అలాగే 2019లో కేజ్రీవాల్ విద్యావంతుడు, నిజాయితీపరుడు, ఢిల్లీని బాగా అభివృద్ది చేశారని చంద్రబాబు ప్రశంసించారు. 2024 వచ్చేసరికి ఆయన దృష్టిలో కేజ్రీవాల్ అవినీతిపరుడయ్యారు. ఢిల్లీని నాశనం చేశారు అని చంద్రబాబు అనగలిగారంటే ఏమనుకోవాలి?. కేజ్రీవాల్‌పై వచ్చిన లిక్కర్ స్కామ్ గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. కానీ, అదే స్కాంలో భాగస్వామి అన్న ఆరోపణలు ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎంపీ టిక్కెట్‌ను ఇదే చంద్రబాబు ఇచ్చారు.ఏపీకి ఏడు నెలల్లో ఏడు లక్షల పెట్టుబడులు వచ్చేసినట్లు కూడా చంద్రబాబు ఆ సభలలో చెప్పుకోవడం విశేషం. దావోస్ వెళ్లి ఒక్క ఎంవోయూ కుదుర్చుకోకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చారన్న విమర్శలను ఎదుర్కోవడానికి కొత్త గాత్రం అందుకుని ఆల్రెడీ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని అబద్దపు ప్రచారం ఆరంభించారు. దానిని ఢిల్లీ వరకు తీసుకువెళ్లారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి బడ్జెట్లో ప్రత్యేకంగా ఏమీ రాకపోయినా కేంద్ర బడ్జెట్‌ను మెచ్చుకోవాల్సిన నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎల్లో మీడియా యథాప్రకారం విశాఖ స్టీల్, పోలవరం ప్యాకేజీలు కొత్తవి అయినట్లు, అమరావతి అప్పును కేంద్రం సాయం కింద అబద్దపు ప్రచారం చేశారు. కేంద్రం రాష్ట్రానికి దన్నుగా నిలబడిందని కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ప్రభుత్వపరంగా ఒక ప్రకటన చేస్తూ ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరారు. సరిగ్గా అదే పద్దతిలో ఇప్పుడు ఐడియాలను చెవిలో చెప్పాలని అంటున్నారు.ఇంతకాలం చంద్రబాబు తన ఐడియాలతో స్కీములు అమలు చేస్తారనుకుంటే, జనమే ఆ ఐడియాలు ఇవ్వాలని కోరుతున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లు కొండను తాను ఒక్కడినే మోస్తానని ప్రజలందరితో నమ్మబలికి.. తీరా కొండను మోసే సమయం వచ్చేసరికి, జనం అంతా వచ్చి కొండను తన భుజాలపై పెడితే మోసి చూపిస్తానన్నారట. ఆ సినిమా సన్నివేశం హాస్యం కోసం అయితే, చంద్రబాబు ప్రకటన జనాన్ని మోసం చేయడం కోసం కాదా!. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దేవాలయాలకు పాకుతున్న ‘రెడ్‌బుక్’ సంస్కృతి!
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగ విష సంస్కృతి కోరలు చాస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకూ పాకుతోంది. ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల, తిరుపతి దేవస్థానంలోనూ ఈ రకమైన నీచ రాజకీయాలు ప్రవేశించాయి. తమకు గిట్టనివారిపై మాత్రమే సాగుతున్న రెడ్‌బుక్ కుట్రలతో పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట ఏర్పడుతోంది. సాటి అధికారులపైనే కుట్రలకు దిగుతుండటం బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారి కావచ్చు.టీటీడీ ఇటీవల కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కేసులు పెట్టింది. ప్రభుత్వ సలహాదారు.. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరుమల సందర్శించిన సందర్భంగా ఆయనకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదని, అధికారులు ప్రోటోకాల్‌ను కూడా ఉల్లంఘించారని ఈ ఛానళ్లలో కొన్ని కథనాలు ప్రసారం కావడమే నిర్వాహకులు చేసిన ఘోర తప్పిదం. ఈ కథనాల కారణంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని, వారి మనోభావాలు గాయపడ్డాయని ఆరోపణలు చేసి జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ నిర్వాహకుడు వైఎన్ఆర్తోపాటు ఇతరులపై కేసులు నమోదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఓ శాటిలైట్ ఛానెల్ యజమానే. ఆ ఛానెల్లో ఎన్ని అసత్య కథనాలు ప్రసారమయ్యాయో ప్రజలకు, విమర్శకులు అనేకులకు తెలిసిన విషయమే.టీడీపీ భజంత్రీ ఛానెల్‌గా మాత్రమే ఉండాలని అనుకుంటున్న బీఆర్ నాయుడు వీటిని పట్టించుకోకపోవచ్చు. అది వారి ఇష్టం కానీ.. అందరూ తనలానే అధికార పార్టీకి అణిగిమణిగి ఉండాలని కోరుకోవడమే అభ్యంతరకరం. టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని అంటున్నారు. ఎవరివల్ల? దాని గురించి చెప్పగలిగే ధైర్యం టీటీడీకి ఉందా?. దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దిక్కుమాలిన రాజకీయం చేసిందెవరు?. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని అసత్య ఆరోపణలు చేయడం వల్ల కదా టీటీడీ ప్రతిష్ట మసకబారలేదా?. సీఎం వంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా ఆయన చేసిన ఆరోపణలతో టీటీడీ పరువు ఏపీలోనే కాదు.. ప్రపంచం అంతటా పోయింది వాస్తవం కాదా?కోట్లాది హిందువులు ఏ దేశంలో ఉన్నా అంతా బాధపడ్డారా? లేదా? తీరా చూస్తే ఆయనే మళ్లీ మాటమార్చారు. సిట్ అని, సీబీఐ అని రకరకాలుగా విచారణలు చేయించారు. వాటి సంగతి ఏమైందో తెలియదు.టీటీడీ ఈవో శ్యామలరావు లడ్డూలో కల్తీ జరగలేదని తొలుత చెప్పి, ఆ తర్వాత చంద్రబాబుకు వంత పాడేలా మాట్లాడినప్పుడు పరువు పోలేదా? వారిపై టీటీడీ కేసులు పెట్టిందా?. అధికారం అంతా వారి చేతిలోనే ఉంది కనుక ఎవరూ వారి జోలికి వెళ్లలేరు. ఎవరైనా తమ మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోరు. ఎప్పుడో మూడు, నాలుగేళ్ల క్రితం తమ నేత చంద్రబాబు, తదితరులను దూషించారని, దానివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ వారు ఎవరైనా కేసు పెడితే మాత్రం పోలీసులు ఆగమేఘాల మీద హైదరాబాద్ వెళ్లి మరి ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వంటివారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తారు. దీనినే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. పలుకుబడి లేనివారినైతే అరెస్టు చేసి వేధిస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చూద్దాం. చంద్రబాబు తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేయడమే దారుణం అనుకుంటే పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి సనాతని వేషం కట్టి అయోధ్యకు పంపిన లడ్డూలలో సైతం కల్తీ నెయ్యి కలిపారని టీటీడీ పరువు మంట కలిపారు. తీరా చూస్తే అయోధ్యకు పంపిన లడ్డూలను బోర్డు సభ్యులు ఇద్దరు స్వచ్ఛమైన నెయ్యితో వ్యక్తిగతంగా తయారు చేయించారని వెల్లడైంది. అంటే పవన్ తప్పుడు ఆరోపణ చేసినట్లే కదా!. మరి టీటీడీ ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తే ఒకప్పుడు ఎంత హోదాలో ఉన్నా కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్ల కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణిస్తే టీటీడీకి మచ్చ రాలేదు. దీనికి సంబంధించిన అధికారులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని ముఖ్యమైన అధికారుల జోలికి వెళ్లలేదు.ఇదే సమయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పడానికి కూడా తొలుత మొరాయించారు. క్షమాపణతో సరి పెట్టుకున్నారే తప్ప.. తను చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇది జరిగింది కనుక నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మాత్రం ప్రకటించలేదు. నిజంగా టీటీడీ ప్రతిష్ట దారుణంగా దెబ్బతీసిన వారిపై ఎలాంటి చర్యలు లేవు కానీ, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై మాత్రం కేసులు పెట్టేశారట. వారు నిజంగానే పొరపాటు మాట్లాడి ఉంటే ఖండన ఇచ్చి అదే రకంగా వార్తలు ప్రసారం చేయాలని కోరి ఉంటే సరిపోయేది. అలా కాకుండా కేసులు పెట్టారంటే అది కక్ష కాక మరేమిటి?. టీటీడీలో రెడ్‌బుక్ పాలన ఇంకేమిటి? అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ రెడ్‌బుక్‌ను పిచ్చి కుక్కలతో పోల్చి అవి ఎవరి మీద ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు.టీటీడీలోనే కాదు.. వైఎస్సార్సీపీ నేతలు అనేక మందిపై రెడ్‌బుక్ పేరుతో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై దారుణమైన రీతిలో కేసులు పెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయడమే వీరి లక్ష్యం. తాజాగా మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ అంటూ ఓ కథ సృష్టించి ఏదోలా కేసు పెట్టాలని చూస్తున్నారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు ఇచ్చిన వివరణ చూస్తే అది ఎప్పుడో పాతికేళ్ల క్రితం కొన్న భూములు. వాస్తవం ఉన్నా, లేకపోయినా రెడ్‌బుక్ ప్రకారం కేసులు పెట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిత్యం ప్రభుత్వాన్ని ఉసికొల్పుతున్నాయి. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ అయినా మర్చిపోతారేమో కానీ, ఈ ఎల్లో మీడియా మాత్రం తమ కక్షలు తీర్చుకోవాడానికి మాత్రం పూర్తిగా వాడుకునే పనిలో ఉంది. వీరి వ్యవహార శైలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నంగా ఒక వైపు కనిపిస్తుంది.మరోవైపు ప్రభుత్వాన్ని వీరే నడుతున్నట్లుగా ఇష్టారాజ్యంగా వైఎస్సార్సీపీ వారిపై, తమకు గిట్టనివారిపై కథనాలు ఇస్తున్నారు. దీనివల్ల కూటమికి కూడా భవిష్యత్తులో నష్టమే తప్ప మరొకటికాదు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై రెడ్‌బుక్‌ను ప్రయోగించారు. పలువురికి పోస్టింగ్‌లు నెలల తరబడి ఇవ్వడం లేదు. కొందరిని అరెస్టు చేయడానికి యత్నిస్తున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అభియోగంపై విచారణకు వేసిన సిట్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్‌ను కూటమి పెద్దలు ఆదేశించినట్లుగా నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారట. ఆయన అలా కుదరదని, వాస్తవ పరిస్థితిని నివేదిస్తానని చెప్పారట. కాదు.. కూడదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అన్నారట. దాంతో డీజీపీ, మరో ఉన్నతాధికారి ఆయనను బదిలీ చేయాలని నిర్ణయించారట. ఇదంతా మీడియాలో వచ్చిన సమాచారమే.ఇలా పోలీసు శాఖలోని వారు కూడా తమ పదవులు, పోస్టింగ్‌ల కోసం అధికారంలో ఉన్నవారికి వంతపాడే పనిలో ఉంటే అది వ్యవస్థకు ఎంతవరకు ప్రయోజనమో ఆలోచించాలి. ఇలా తప్పుడు కేసులు పెట్టించడం కొనసాగిస్తే, అదే రెడ్‌బుక్ కూటమి నేతల మెడలకు కూడా ఎప్పుడో ఒకప్పుడు చుట్టుకునే అవకాశం ఉంటుంది. పామును పెంచితే ఎంత ప్రమాదమో, రెడ్‌బుక్ అంటూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తే కూడా అంతే ప్రమాదం అన్న సంగతిని నేతలు ఎప్పటికి గుర్తిస్తారో !.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ!
1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన సందర్భంగా ఎన్టీ రామారావు ఒక స్పష్టమైన షరతు పెట్టారు. టీడీపీలో చేరాలనుకుంటే ఇతర పార్టీల వారెవరైనా అక్కడి తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ షరతుతో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఆయారాం, గయారాం పరిస్థితి టీడీపీలో ఉండదని ప్రజలూ హర్షించారు. మేధావులు కూడా ఎన్టీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. టీడీపీలోకి చేరేందుకు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమైనా.. ముగ్గురు తమ పదవులు వదులుకోవడానికి సిద్ధపడలేదు. నాదెండ్ల భాస్కరరావు మాత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరారు. తరువాతి కాలంలోనూ ఎన్టీఆర్ ఇదే పంథాను కొనసాగించారు. 1991లో పీవీ నరసింహరావు కేంద్రంలో తన పదవిని కాపాడుకునేందుకు జేఎంఎంతోపాటు టీడీపీ ఎంపీలనూ చీల్చారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఒకప్పటి చరిత్ర.. ఇప్పుడు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ, అల్లుడు చంద్రబాబు నాయుడులు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు చూస్తే ‘‘ఛీ.. ఇది ఒకప్పటి టీడీపీనేనా?’’ అనిపిస్తుంది. చంద్రబాబు పెద్దగా విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలు పట్టించుకోరు. పూర్తి అవకాశవాది. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి అప్రతిష్టపాలయ్యారు. విశేషం ఏమిటంటే ఈయన ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని విమర్శిస్తారు. అధికారంలోకి రాగానే యథా ప్రకారం పార్టీ ఫిరాయింపులు, బేరసారాలు చేయిస్తుంటారు. ఆయన ఎన్టీఆర్ అల్లుడు, కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీని కబ్జా చేసిన నేత కనుక అంతేలే అని అనుకుంటారు. కానీ.. స్వయాన ఎన్టీఆర్ వారసుడైన నందమూరి బాలకృష్ణ సైతం టీడీపీ మూల సిద్దాంతాలను గాలికి వదలివేసి తన తండ్రి ఆశయాలను మంటగలిపారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందుపూర్ మున్సిపాల్టీని టీడీపీ పరం చేయడానికి అనుసరించిన దిక్కుమాలిన రాజకీయాలు ఎన్టీఆర్ ఆత్మకు క్షోభను మిగుల్చుతాయని చెప్పాలి. బాలకృష్ణకు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదును ప్రకటించింది. ఆడపిల్లలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడి పలువురి విమర్శలకు గురైన బాలకృష్ణకు ఈ బిరుదు ఎలా ఇచ్చారో తెలియదు. అంతేకాక గతంలో ఆయన తన ఇంటిలో సినిమా రంగం వారు ఇద్దరిపై కాల్పులు జరిపిన ఘట్టం ఉండనే ఉంది. సినీ పరిశ్రమలో ఏభై ఏళ్ల చరిత్ర అని చెబుతారు కాని, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది కావడం ఒక ప్రధాన అర్హతగా తీసుకుని పద్మభూషణ్ బిరుదును కేంద్రం ప్రకటించిందన్న భావన ఏర్పడింది. ఎలాగోలా బిరుదు వచ్చింది.. దానికి తగ్గట్లు పద్దతిగా ఉంటారులే అనుకుంటే బాలకృష్ణ మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరించి పరువు పోగొట్టుకున్నారు. గత ఎన్నికల్లో హిందుపూర్ మున్సిపాలిటీలోని 38 వార్డులలో 30 వార్డులు వైసీపీ గెలుచుకుంది. అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారం సాధించడంతో ఆ పార్టీల దృష్టి స్థానిక సంస్థలపై పడింది. వీలైన చోట్ల ఇప్పటికే కొందరు మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చంద్రబాబు, లోకేష్‌లు ఎమ్మెల్యేల ద్వారా ప్రలోభపెట్టి ఆకర్షించారు. ఈ తరుణంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని టీడీపీ తలపెట్టింది. దీనికి మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగపడింది. చంద్రబాబు తీసుకు వచ్చిన రాజకీయ రాక్షస పాలన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉన్న చోట కూడా తాము గెలవడం కోసం రెడ్ బుక్ ను ప్రయోగించడం ఆరంభించారు. కార్పొరేటర్లను, కౌన్సిలర్లను భయపెట్టడం, కిడ్నాప్ లు చేయడం, పోలీసులే ఇందుకు నాయకత్వం వహించడం, దాడులు చేసి కౌన్సిలర్ల కుటుంబాలను భయభ్రాంతులకు లోను చేయడం వంటి నీచమైన చర్యల ద్వారా టీడీపీ, జనసేనలు స్థానిక ఎన్నికలలో గెలిచే యత్నం చేశాయి. హిందుపూర్లో స్వయాన బాలకృష్ణ ప్రలోభాలు, బెదిరింపులకు తెరదీసి అక్కడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తిరుపతిలో మరీ ఘోరం. టీడీపీకి ఒక్క కార్పొరేటరే ఉన్నప్పటికీ, ఉప మేయర్ పదవిని కైవసం చేసుకుంది. వైసీపీ పక్షాన పోటీ చేయడానికి సిద్దపడ్డ ఒక కార్పొరేటర్ ఇల్లును కూల్చడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు అధికారులు తరలివెళ్లారు. అక్కడ మేయర్ అభ్యంతరం చెప్పినా వారు ఆమె మాట వినకపోవడం స్థానిక సంస్థల ఛైర్ పర్సన్ లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఏమిటో అర్థమవుతుంది. బస్‌లో వెళుతున్న వైసీపీ కార్పొరేటర్లను కిడ్పాప్ చేయడం, బస్ పై దాడి చేసి అద్దాలు పగులకొట్టడం, తిరుపతి ప్రజలను భయభ్రాంతులను చేయడం వంటి ఘట్టాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. మరుసటి రోజు అధికారులు, పోలీసుల అండతో టీడీపీ అభ్యర్ది ఉప మేయర్ ఎన్నికలో విజయం సాధించిన తీరు స్థానిక ఎన్నికల అధ్వాన్న నిర్వహణకు అద్దం పడుతుంది. టీడీపీ భయపెట్టి ఓట్లు వేయించుకున్న కొందరు కార్పొరేటర్లు, ఆ వెంటనే తిరిగి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని కలిసి తమను టీడీపీ ఎలా వేధించింది వివరిస్తూ రోదించిన సన్నివేశం ఒక్కటి చాలు.. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సర్కార్ సిగ్గుపడడానికి. నూజివీడులో మంత్రి పార్థసారథి వైసీపీ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి బెదిరించి మరీ టీడీపీని గెలిపించుకున్నారట. ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పి.నారాయణ తన వంతు పాత్ర పోషించారనుకోవాలి. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీకి బలం లేకపోయినా, డిప్యూటి మేయర్ పదవిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఫిరాయింపులను ప్రోత్సహించి గెలిపించుకున్నారు. స్థానిక సంస్థలలో ఫిరాయింపులను నిరోధించవలసిన మంత్రి నారాయణే ఇలా అరాచకంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వ నాసిరకం పాలనకు నిదర్శనంగా కనిపిస్తుంది. పిడుగురాళ్లలో సైతం ఇదే తరహా పరిస్థితి. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికే జరిగే హాలును టీడీపీ గూండాలు ఆక్రమించుకున్నారట. ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతుంటే, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఈ ఘటలను రిపోర్టు చేయకుండా పురపాలికల్లో కూటమి జెండా అని నిస్సిగ్గుగా కథనాలు ఇచ్చాయి. ఈనాడు మీడియా అయితే టీడీపీ, జనసేన గూండాలు చేసిన విధ్వంసం గురించి విస్మరించడమే కాకుండా, గతంలో ప్రలోభాలు, బెదిరింపులతో వైసీపీ గెలిచిందని రాయడం ద్వారా తాను ఎలా దిగజారింది అడుగడుగునా రుజువు చేసుకుంటోంది. గత ఎన్నికలలో నిజంగానే ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగాయా అన్నది చూస్తే అలాంటిది పెద్దగా ఏమీ లేదు. టీడీపీ గెలిచిన తాడిపత్రి, దర్శి మున్సిపాల్టీలలో ఎక్కడా వైఎస్సార్సీపీ ఇబ్బంది పెట్టలేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఒకవేళ నిజంగానే అప్పుడు ఏవైనా కొన్ని ఘటనలు జరిగాయని అనుకున్నా, ఇప్పుడు కూడా అలా చేయడం తప్పు కాదన్నట్లు ఎల్లో మీడియా రాస్తే వీరిది జర్నలిజం అంటామా? ఆ పేరుతో చేస్తున్న ఇంకేదో వ్యాపారం అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. కేరళ హైకోర్టు కొద్ది రోజుల క్రితం పార్టీ మారే కౌన్సిలర్ లు అనర్హులు కావాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఏపీలో ఇలా ఫిరాయించిన వీరంతా అనర్హులు అవుతారు. కాని వ్యవస్థలు అన్నీ చోట్ల ఒకేరకంగా వ్యవహరించడం లేదు. చిత్రమేమిటంటే లేస్తే మనిషిని కాదు అంటే బెదిరించే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి అక్రమాలు ఎన్ని జరుగుతున్నా, తన పార్టీ వారి పాత్ర కూడా కనిపిస్తున్నా, నోరు మెదపడం లేదు. బీజేపీ ఎంపీ సి.ఎమ్.రమేష్ జమ్మలమడుగు క్లబ్లో అదే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో సాగుతున్న జూదం గురించి జిల్లా అధికారులకు లేఖ రాయడం ఏపీలో ఏ రకమైన పాలన జరుగుతోంది చెప్పకనే చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలో ఈ విచ్చలవిడిగా జూద కార్యకలాపాలు సాగుతున్నాయన్నది వాస్తవం. అయినా బాగా పాలన చేస్తున్నామని చంద్రబాబు, పవన్‌లు వారి భుజాలు వారే చరచుకుంటారు. ఈ క్లబ్ లు, లిక్కర్ దందాలపై ఉపయోగించవలసిన రెడ్ బుక్ ను లోకేష్ ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ నేతలపై ప్రయోగిస్తారు. మరో వైపు పవన్ సోదరుడు నాగబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కుక్కలతో పోల్చుతున్నారు. అధికారం తలకు ఎక్కితే ఎలా మాట్లాడతారో చెప్పడానికి నాగబాబు వ్యాఖ్యలే నిదర్శనంగా ఉంటాయి. గతంలో తాను ప్రశ్నిస్తానంటూ పవన్ స్థాపించిన జనసేన అసలు స్వరూపం ఇది అన్నమాట. ఏది ఏమైనా ఏపీలో రోజు, రోజుకు పరిస్థితి ఎంతగా దిగజారుతోంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూటమి పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పకుండా ఉంటారా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చట్టం.. కొందరికి చుట్టమైంది మరోసారి!
‘‘చట్టం తన పని తాను చేసుకు పోతూంటుంది’’.. రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు తరచూ చెప్ప మాటిది. అయితే ఇది అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్న వస్తే..! జవాబు కోసం తడుముకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ కావాలా?.. మీడియా సామ్రాజ్యం ముసుగులో రామోజీరావు అనే వ్యక్తి చేసిన చట్ట ఉల్లంఘనలు. తప్పు చేశాడో లేదో తెలియదు కానీ.. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఒక మహిళ మృతి ఘటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే చెప్పారు. రామోజీ గ్రూప్‌నకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అవకతవకల విషయంలోనూ ఇదే రీతిన వ్యవహరించి ఉంటే బాగుండేది. మార్గదర్శి ఫైనాన్స్ వేల కోట్ల రూపాలయను అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వమే చట్టం తన పని తాను చేసుకుపోకుండా అడ్డుకున్నట్లు స్పష్టమవుతుంది. అఫిడవిట్ వేసేందుకే ఆసక్తి చూపని ప్రభుత్వం.. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో మొక్కుబడిగా ఒక పత్రాన్ని దాఖలు చేసి మమ అనిపించినట్లు కనిపిస్తోంది. వ్యవస్థల మేనేజ్మెంట్లో రామోజీరావు దిట్ట అంటారు. అందుకు తగ్గట్టే తన మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చాలామంది రాజకీయ నేతలను తన దారికి తెచ్చుకున్నారన్నది తెలిసిన విషయమే. తన పత్రిక కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రమాణపూర్వకంగా కోర్టుకు తెలిపిన ఘనత రామోజీరావుది. అయినాసరే.. కాంగ్రెస్ నేతలు చాలామంది ఆయనకు జీ హుజూర్ అంటూంటారు. సన్నిహిత సంబంధాలు నెరిపేవారు కూడా. ఈ జాబితాలో కేంద్ర మంత్రి దివంగత ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు తన దగ్గరి మనిషి అని రామోజీ భావించే వారట. ఇక టీడీపీ నేత చంద్రబాబు నాయుడి సంగతి సరేసరి. గతంలో వారం వారం హాజరీ వేయించుకుని మరీ చంద్రబాబు ఆయన వద్ద సలహా సూచనలు తీసుకునేవారు. తెలంగాణ ఉద్యమకాలంలో రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నేస్తానన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తరువాతి కాలంలో చప్పబడిపోయారు.. రామోజీరావుతో సత్సంబంధాలు నెరిపారు. రామోజీకి ఎదురైన చట్టపరమైన ఇబ్బందులకు కేసీఆర్ కాపు కాసిన సందర్భాలూ ఉన్నాయి. వీరితోపాటు పలువురు ఇతర నేతలనూ మచ్చిక చేసుకున్న రామోజీరావు తన వ్యాపారాలకు ఇబ్బందిలేకుండా వ్యూహాత్మకంగా పనిచేసేవారు. అయితే సన్నిహితులందరిలోనూ చంద్రబాబుకే అగ్రతాంబూలం. బాబు ముఖ్యమంత్రి అయితే అధికారం తనదే అన్న ధీమా రామోజీరావుది. అందుకే చంద్రబాబుకు ప్రధాన పోటీదారులపై ఆయన నిత్యం అడ్డగోలు వార్తలు రాయించేవారు. తన పత్రిక ద్వారా విషం చిమ్మేవారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కావచ్చు... ఆయన తనయుడు వై.ఎస్. జగన్ కావచ్చు. ఎవరూ తన సన్నిహితుడు బాబు మాదిరిగా ముఖ్యమంత్రి గద్దెను ఎక్కకూడదన్నట్టుగా ఉండేది ఆయన తీరు. అయితే.. చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా ఉన్నా, హామీలను తుంగలో తొక్కినా రామోజీకి చెందిన ఈనాడు మీడియా బాండ్ బాజా వాయించడం అలవాటు చేసుకుంది. అదే వైఎస్సార్ ఎంత మంచిగా పాలన చేసినా ఎదో ఒక తొండి పెట్టుకునేది. వైఎస్ ప్రభుత్వంలో జరిగే తప్పులను భూతద్దంలో చూపుతుండేది. ఆయన కుమారుడు జగన్ సాక్షి మీడియాను ఆరంబించడం అసలు నచ్చలేదు. సహజంగానే తన వ్యాపారాలకు పోటీ వచ్చే వారిని ఎలా అణచివేయాలన్న ధోరణి రామోజీది. సీనియర్ నేత, అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైదరాబాద్ శివార్లలో రామోజీ ఫిలిం సిటీకి అవసరమైన సుమారు పదెకరాల భూమిని మరో పారిశ్రామికవేత్త సంఘీ నుంచి వెనక్కి తీసుకుని ఇచ్చారు. కోట్ల సీఎంగా ఉన్నప్పుడు పరోక్షంగా మద్దతు ఇచ్చినా, ఆ తర్వాత కాలంలో రామోజీ అనుసరించిన శైలిపై ఆయన బాధ పడేవారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో కొంతమేర సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేయడం ద్వారా తనపై ఏ అభియోగం వచ్చినా ఇబ్బంది లేకుండా రామోజీ చేసుకునేవారు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డినే ఆయన మేనేజ్ చేయలేకపోయారు. వైఎస్సార్ కూడా తొలుత చూసి, చూడనట్లు వ్యవహరించినా, రామోజీ కొన్నిసార్లు రెచ్చిపోయి ఇష్టానుసారం వార్తలు, సంపాదకీయాలు రాయించేవారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు రామోజీ కుటుంబానికి చెందిన కొంత భూమి కూడా భూ సేకరణలో పోయిందని చెబుతారు. ఆ కోపం కూడా ఆయనకు ఉండేదట. ఒకసారి ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే అంటూ వైఎస్ పై మొదటి పేజీలో సంపాదకీయం రాయించారు. అది తీవ్ర విమర్శలకు గురైంది. అదే కాలంలో మార్గదర్శి సంస్థ అక్రమంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేస్తుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన ఫిర్యాదుతో మార్గదర్శి డొంక కదిలింది. వైఎస్ ప్రభుత్వం దీనిపై రంగాచారి అనే ఐఎఎస్ అఫీసర్ తో ఒక కమిటీ వేసి విచారణ చేయించింది. ఆ తర్వాత కృష్ణరాజు అనే పోలీసు అధికారికి ఆ కేసును అప్పగించింది. అంతవరకు తనను ఏమీ చేయలేరన్న నమ్మకంతో ఉన్న రామోజీరావుకు షాక్ తగిలినట్లయింది. రిజర్వు బ్యాంక్ చట్టం లోని 45 ఎస్ ను అతిక్రమించి డిపాజిట్లు వసూలు చేశారన్న విషయం బహిర్గతం అయింది. రిజర్వు బ్యాంక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దాంతో రామోజీ తనకు ఉన్న పరపతిని వినియోగించారు. తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేక వర్గం, బీజేపీ, వామపక్షాలలో తనకు అనుకూలమైన వారిని మేనేజ్ చేస్తుండేవారు. అయినప్పటికీ మార్గదర్శి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి చెల్లించడానికి గాను రిలయన్స్ సంస్థ సహకారం తీసుకుని బయటపడ్డారు. అందుకోసం ఆయన స్థాపించిన కొన్ని టీవీ చానళ్లను విక్రయించారు. ఇదంతా రామోజీకి మరింత కోప కారణం అయింది. చట్టం ప్రకారం డిపాజిట్లు తిరిగి చెల్లించినా అక్రమ వసూళ్ల నేరాభియోగం పోదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. అంతలో వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్ద నాయకులు కొందరిని, అలాగే ముఖ్యమంత్రులుగా బాధ్యత చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను మేనేజ్ చేయగలిగారు. ఆ దశలో రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. ఆయన టీడీపీకి, చంద్రబాబుకు థ్రెట్ అవుతారని భావించారు. కాంగ్రెస్ అధిష్టానం మాటకు అంగీకరించకుండా జగన్ ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. అప్పుడు ఆయనపై టీడీపీ,కాంగ్రెస్ లు కలిసి అక్రమ కేసులు పెట్టించాయి. వైఎస్ పై ఉన్న ద్వేషంతో రామోజీరావు ఆ రోజుల్లో జగన్ పై కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు ప్రచారం చేసేవారు. జగన్ ను జైలులో అక్రమంగా నిర్భంధించినా ఈనాడు మీడియా దారుణమైన స్టోరీలు ఇచ్చేది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడంతో 2014 శాసనసభ ఎన్నికలలో జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుకు పూర్తి కొమ్ముకాసింది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాగా, విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే విచారణలో ఉన్న మార్గదర్శి డిపాజిట్ల కేసులో ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు వేయలేదు. దానికి కారణం రామోజీకి ఉన్న పలుకుబడే అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఉమ్మడి హైకోర్టు 2018లో విభజన జరిగి, ఏపీకి తరలివెళుతున్న సమయంలో చివరి రోజున హైకోర్టులో తన కేసు కొట్టివేసేలా రామోజీ జాగ్రత్తపడ్డారని అంటారు. కేసు వేసిన ఉండవల్లి అరుణకుమార్ కు ఆరు నెలలు ఆలస్యంగా ఈ విషయం తెలియడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. రామోజీ డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసినందుకు గాను చట్టం ప్రకారం డబుల్ మొత్తం పెనాల్టి చెల్లించవలసి ఉంటుంది. ఇతర శిక్షలు కూడా ఉంటాయి. రామోజీకి శిక్షపడడం తన లక్ష్యం కాదని, ఆయన తప్పు చేశారా? లేదా? అన్నది తేల్చాలన్నది తన పట్టుదల అని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతుంటారు. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు దాఖలు చేయవలసి ఉన్నప్పటికి ఆ పని చేయలేదు. అప్పట్లో కేసీఆర్, చంద్రబాబులు సీఎం లుగా ఉండడంతో వారిని మేనేజ్ చేయడం కష్టం కాలేదు. 2019లో కూడా జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేసినా, జనం వైసీపీకి పట్టం కట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అయినా ఈనాడు మీడియా తన పంథా మార్చుకోలేదు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నుంచే వైఎస్సార్సీపీ వ్యతిరేక వైఖరితో సాగింది. జగన్ పై విపరీతమైన ద్వేషంతో వ్యవహరించింది. దారుణమైన అసత్య కథనాలు ఇవ్వడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఈ దశలో జగన్ ప్రభుత్వానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు. సీఐడీ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మొత్తం విచారణ చేసి మార్గదర్శి చిట్స్ ఫండ్స్ లో బ్లాక్ మనీ రొటేట్ అవుతున్నట్లు గుర్తించారు. చిట్స్ నిర్వహణలో జరిగిన అనేక అవకతవకలను కనిపెట్టారు. వాటిపై కేసులు పట్టారు. చివరికి రామోజీని సైతం సీఐడీ విచారణ చేయడం అప్పట్లో సంచలనమైంది. జగన్ ధైర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ కేసులన్నిటిని నీరుకార్చుతున్నారు. అది వేరే సంగతి. ఇక మార్గదర్శి డిపాజిట్ల కేసులో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. దాంతో కేసు విచారణ ముందుకు సాగింది.తదుపరి సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు తిరిగి విచారణ నిమిత్తం బదలాయించింది. ఉండవల్లి పోరాటం కొనసాగి ఉండకపోతే ఎప్పుడో ఈ కేసు హుష్ కాకి అయి ఉండేదని లాయర్లు చెబుతుంటారు. మామూలు గా అయితే మరొకరి విషయంలో ఉండవల్లి మాదిరి ఎవరైనా పోరాటం సాగిస్తే, ఈనాడుతో సహా మీడియా మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. ఉండవల్లిని పోరాట యోధుడుగా గుర్తించేవి. కాని మార్గదర్శి ఈనాడు మీడియాకు సంబంధించిన సంస్థ కావడంతో సాక్షి తప్ప ఇతర మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నాయి. అలాగే వైఎస్సార్సీపీ తప్ప ఇతర రాజకీయ పార్టీలు ఏవీ రామోజీపై విమర్శలు చేయడానికి భయపడుతుంటాయి. కాగా రామోజీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ డిపాజిట్లు వసూలు చేసిన హెయుఎఫ్ కర్త మరణించినా, సంబంధిత సంస్థ కొనసాగుతోంది కనుక కేసు ముగియదు. పెనాల్టీ క్లాజ్ వర్తిస్తుందన్నది ఒక అభిప్రాయం. రామోజీకి వ్యక్తిగత శిక్ష గురించి విచారణ జరగదు తప్ప మిగిలిన కేసు యథాతథంగా ఉంటుదని ప్రముఖ లాయర్ ఒకరు చెప్పారు. రామోజీ తదుపరి ఆయన కుమారుడు కిరణ్ ఆ సంస్థ కర్తగా ఉన్నారు. కిరణ్ కూడా వైఎస్సార్సీపీ తప్ప మిగిలిన రాజకీయ పక్షాల వారితో అదే విధమైన సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఈ డిపాజిట్ల మీద వారి అభిప్రాయాలు తెలియచేయాలని కోరినా, చాలాకాలం ప్రభుత్వాలు స్పందించకపోవడం విశేషం. దాంతో మరోసారి హైకోర్టు అసంతృప్తి చెందింది. గతంలో కేసీఆర్ మాదిరే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. అంటే ఈనాడు మీడియా యాజమాన్యం రేవంత్ ప్రభుత్వాన్ని ఇంతకాలం సక్సెస్ ఫుల్ గా మేనేజ్ చేసింది. కాని తప్పనిసరి పరిస్థితిలో అఫిడవిట్ వేసినా, అందులో స్పష్టత ఇవ్వకుండా కోర్టు నిర్ణయానికే వదలి వేసినట్లు పేర్కొనడం ద్వారా మార్గదర్శికి మేలు చేయడానికి సన్నద్ధమైనట్లు కనబడుతోంది. రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా అఫిడవిట్ వేసి ఉంటే ఆశ్చర్యపోవాలన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. అల్లు అర్జున్ విషయంలో చట్టం పనిచేసిందని చెబుతున్న రేవంత్ మార్గదర్శి కేసులో మాత్రం చట్టం ముందుకు వెళ్లకుండా చూశారనుకోవాలి. 45 ఎస్ సెక్షన్ కింద డిపాజిట్లు వసూలు చేయడం నేరమా? కాదా?అన్నదానిపై అభిప్రాయం చెప్పలేదు. అది నేరమని అంగీకరిస్తే మార్గదర్శి భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుందా? ఉండదా? ఆ ఇబ్బంది నుంచి కాపాడే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం మొక్కుబడి అఫిడవిట్ వేసినట్లు కనబడుతోంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణకు కమిషన్ నే నియమించిన రేవంత్ ప్రభుత్వం, కెటిఆర్ పై ఈ ఫార్ములా రేస్ కేసు పెట్టిన ప్రభుత్వం మార్గదర్శి కేసులో మాత్రం ఉదాసీనంగా ఎందుకు ఉందన్నది అందరికి తెలిసిన రహస్యమే. చంద్రబాబు, రేవంత్ లను గురు శిష్యులుగా భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ ఈనాడు మీడియాను కాదనే పరిస్థితి లేదు. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం దారుణమైన కేసులు పెడుతోంది. వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని పై రేషన్ బియ్యం కేసు పెట్టి వేధిస్తోంది. ఆయన ఈ కేసులో రెండున్నర కోట్లు చెల్లించినా వదలి పెట్టడం లేదు. పేర్ని నాని మహాపరాధం చేసేసినట్లు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఘోరమైన నేరాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చే ఈనాడు మీడియా గురివింద గింజ సామెత మాదిరి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి మాత్రం నోరెత్తడం లేదు. రామోజీ మరణించారు కనుక ఆ కేసు విచారణ అవసరమా అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. అల్లు అర్జున్ విషయంలో అతిగా వ్యవహరించడమే కాకుండా, శాసనసభలో సైతం రేవంత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ పేరుతో పలు చోట్ల అక్రమిత స్థలాలలో నిర్మాణాలను కూల్చుతున్నామంటూ హైడ్రా హడావుడి చేస్తుంటుంది. ఇలాంటి ఘటనలలో చట్టం తన పని చేసుకుని పోతుందని చెప్పే రేవంత్ ప్రభుత్వం మార్గదర్శి కేసు లో మాత్రం ఉదారంగా ఉందన్నమాట. అందుకే చట్టం కొందరికి చుట్టం అని,అందులో రామోజీ కుటుంబానికి మరింత దగ్గర చుట్టం అని భావించాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమి సర్కార్‌కు లోకేష్ రెడ్‌బుక్‌తో ముప్పు!
సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలను అమలు చేసే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నట్ట? లేనట్టా?. హామీలైతే ఇచ్చాను కానీ.. అమలు చేయలేని పరిస్థితి ఉందని ఆయన పదే పదే చెబుతున్నా టీడీపీ జాకీ మీడియా మాత్రం ‘‘అబ్బెబ్బే.. బాబు అలా అనలేదు... ఇలా అనలేదు’’ అని గొంతు సవరించుకుంటోంది. ఎందుకు మరి? ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా.. ప్రజల దృష్టిని హామీల నుంచి మళ్లించేందుకు నానా తంటాలూ పడుతన్నాయెందుకు?. ఇటీవల చంద్రబాబు ఒక మీడియా సమావేశం పెట్టారు. నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు కొన్నింటిని వక్రీకరించి.. గత ప్రభుత్వాన్ని నిందించాలన్నది ఈ సమావేశం ఉద్దేశం. ఇందులోనే ఆయన ‘సూపర్ సిక్స్’పై ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. డబ్బులున్నా ఇవ్వడం లేదని, నమ్మకం పెట్టుకున్నామని ఫీలింగ్స్‌తో ఉంటున్నారని అన్న బాబు.. కేంద్రం ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన నిధులను సంక్షేమానికి పెట్టలేనని తేల్చేశారు. ఆర్థిక పరిస్థితి రీత్యా ప్రభుత్వమైనా అవస్థలు పడాలని లేదంటే రైతులైనా అవస్థలు పడాలని తన మనసులోని మాట చెప్పేశారు. అంటే.. రైతు భరోసా ఇవ్వలేనని అర్థమన్నమాట. తల్లికి వందనం ఈ ఏడాది కాదని ఇప్పటికే టీడీపీ నాయకత్వం తేల్చేసింది. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000ల ఊసు అస్సలు ఎత్తడం లేదు. ఇవి కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల్లోని వారికి యాభై ఏళ్లకే ఇస్తామన్న పింఛన్, ఇతర ఎన్నికల హామీల సంగతి సరేసరి. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయమయ్యే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీల అమలు సాధ్యం కాదని ఎన్నికల సమయంలోనే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విస్పష్టంగా చెప్పినా.. తాము సంపద సృష్టిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని కూడా కూటమి నమ్మబలికింది. కానీ ఈ మాటలన్నీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్క వరకే! ఆ తరువాత స్వరం మారింది. రోజుకో డైవర్షన్ రాజకీయాలతో అసలు సంగతిని నెమ్మదిగా ప్రజల మనసుల్లోంచి చెరిపేసేందుకు తలో సన్నాయి నొక్కు నొక్కడం మొదలుపెట్టారు. పైగా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్నింటికీ జగన్‌దే బాధ్యతన్నట్టుగా తలకూ.. మోకాలికి ముడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్ర్రజ్యోతి వంటి వార్తా పత్రికలు ప్రజల పక్షాన నిలవాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని ఎప్పుడో గాలికి వదిలేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికే పనిలో బిజీ అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తాయని, సాక్షి మీడియాలో వచ్చిన వార్తల్లో తప్పులున్నాయని అనుకుందాం. అలాంటప్పుడు ఫలానా తేదీ నుంచి ఫలానా హామీ అమలవుతుందని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? కారణం ఒక్కటే. ఎల్లో మీడియా పైరవీలు, వ్యాపారాలు సాగాలంటే ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేయాలి. వారికి గిట్టుబాటు అయితే ప్రజలందరికి స్కీములు వచ్చినట్లే అన్నమాట. చంద్రబాబు చెప్పిన విషయాలు కొన్నిటిని గమనించండి. కేంద్రం విశాఖ స్టీల్ కు రూ.11 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ.. ఆ డబ్బును తాను సంక్షేమ పథకాలకు వాడలేనని బాబు అంటున్నారు. విశాఖ స్టీల్ ఇచ్చిన డబ్బుతో ఈయనకు ఏమి సంబంధం? పోలవరం ప్రాజెక్టు నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి ఎలా వస్తాయి? అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది అప్పు తప్ప గ్రాంట్ కాదు. అయినా బాబు ఈ మాటలన్నారంటే.. ఆయన అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమైపోతుంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా ఆసాములకు ఉపయోగపడేలా నిధులు తీసుకు వచ్చి ఖర్చు చేస్తాం కాని, పేదలకు ఇస్తామన్న స్కీములకు మాత్రం డబ్బు తేలేమని చెప్పినట్లే కదా! దానికి తగినట్లే ఒక్క అమరావతి మినహా మిగిలిన చోట్ల మాత్రమే భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా ఛార్జీల రూపంలో ప్రజలను మరోసారి బాదుతారన్నమాట. ఇదెంత వరకూ న్యాయం?. మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి ఏడు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి వెళ్లారు. దానిని చంద్రబాబు కాదనలేదు. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? అయినా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారు? ఏపీలో ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించడానికి తొమ్మిది, పదేళ్లు పడుతుందట.. అంటే దాని అర్దం అప్పటివరకు ఈ స్కీములు అమలు చేయలేమని చెప్పడమే! పోలవరం, అమరావతి వంటి వాటిని అభివృద్ది చేసి అప్పుడు ఆదాయం సంపాదించి ఖర్చు చేస్తారట. అసలు సంపద సృష్టి అన్నది తన తర్వాతేనని, పీ-4 అంటే పేదలను భాగ్యవంతులను చేసే స్కీములన్నీ తన వద్ద ఉన్నాయని, తన మంత్రజాలంతో అన్నిటిని మార్చి వేస్తానని చంద్రబాబు చెబితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాన, తందానా అన్నారా? లేదా? ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏమి చెప్పారు. తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయని, అన్ని స్కీములు అధికారం వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఒకవేళ అమలు చేయలేకపోతే చొక్కా కాలర్ పట్టుకోండని ఓపెన్ గా చెప్పారా? లేదా? ఇప్పుడేమో ఎవరైనా హామీలను గుర్తు చేసినా, ప్రశ్నించినా, వారిపై రెడ్ బుక్ అంటూ కేసులతో వేధిస్తున్నారే! అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ ‘రెడ్ బుక్’ను పిచ్చి కుక్కలతో పోల్చుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిని కరుస్తాయో చెప్పలేం. లోకేష్ అర్థం చేసుకోవల్సింది ఏమిటంటే.. ఆ పిచ్చికుక్క ప్రమాదం టీడీపీకి కూడా పొంచి ఉంది. జీఎస్డీపీ 15 శాతం చొప్పున పెరిగితేనే స్కీములు అమలు చేస్తారట. ప్రజలు అర్థం చేసుకోవాలట. గత ప్రభుత్వం అప్పులు చేసిందని పదే, పదే గోబెల్స్ ప్రచారం కొనసాగించారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, దానికి వైసీపీ కారణమని తప్పుడు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ లో రూ.ఏడు లక్షల కోట్లు అని వారే చెప్పారు. అందులో కూడా విభజన నాటి అప్పు, చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పు కలిపి మూడున్నర లక్షల కోట్లు ఉన్న సంగతిని దాచేస్తారు. జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచం అంతటిని గడగడలాడించిన కరోనా విషయాన్ని ఏమార్చి అప్పులు అని ఊదరగొడతారు. ఏపీ శ్రీలంక మాదిరి మారిందని ఆరోజుల్లోనే ప్రచారం చేశారు. కానీ ఎన్నికల హామీలు ,సూపర్ సిక్స్ ప్రకటించడానికి మాత్రం చంద్రబాబుకు ఇవేవి అడ్డు కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించి హామీలు అమలు చేస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా తమ అంత మొనగాళ్లే లేరని డబ్బా కొట్టుకున్నారు. 2014లో విభజిత ఏపీ అప్పులపై వడ్డీ కింద ఏడాదికి రూ.7488 కోట్లు వ్యయం చేస్తే, చంద్రబాబు టరమ్ పూర్తి అయ్యే 2018 నాటికి వడ్డీ చెల్లింపులు రూ.15342 కోట్లకు చేరింది. అంటే టీడీపీ హయాంలో ఎంత అప్పు తెచ్చింది తెలియడం లేదా? అయినా దాన్నంతటినీ వైసీపీ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తుంటారు. తాజాగా చంద్రబాబు సర్కార్ మరో రూ. 6,000 వేల కోట్ల అప్పు సేకరిస్తోంది. పోనీ ఆదాయపరంగా పరిశీలించినా జగన్ పాలనలోనే అధికంగా కనిపిస్తుంది. జగన్ పాలన కాలంలో జీఎస్డీపీ, జీఎస్టీ వంటి వాటిలో ఏపీ దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉంది. అప్పట్లో 12 శాతం వృద్ది కనిపిస్తే, చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో ఆదాయం - ఆరు శాతంగా ఉంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నమాట. కాగ్ గణాంకాల ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర ఆదాయంలో ఏకంగా 185 శాతం లోటు నమోదైందని మీడియాలో వార్తలు వచ్చాయి. టీడీపీ బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, డిసెంబర్ వరకు 1.13 లక్షల కోట్లే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు,అమ్మకం పన్ను ఇలా అన్ని అంశాలలో నెగిటివ్ గ్రోత్ నమోదు చేసుకుంది. సంపద సృష్టిస్తానని హోరెత్తించిన చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమిటంటే ఉన్న సంపదను కూడా కోల్పోవడం అన్నమాట. పోనీ అప్పులు ఏమైనా తగ్గాయా అంటే లేదు. డిసెంబర్ వరకు రూ.డెబ్బై వేల కోట్లకు పైగా తీసుకు వచ్చారు. అది కాకుండా ఇతరత్రా మరో రూ.ఏభై వేల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అమరావతికే రూ.31వేల కోట్ల అప్పు సమకూర్చుకోవడానికి సన్నద్దం అవుతున్నారు. ఇదంతా ఏపీ ప్రజలు తీర్చవలసిన రుణాలే. పోనీ పరిశ్రమలు ఏమైనా కొత్తగా వస్తున్నాయా అంటే అదీ లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్లి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే, చంద్రబాబు అండ్ కో భారీ బృందంతో వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. దీనికి కారణం రెడ్ బుక్ పేరుతో పారిశ్రామికవేత్తలను వేధించడం, జిందాల్ వంటివారిని టీడీపీ ప్రభుత్వం తరిమేయడం కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు స్కీములు అమలు చేయలేమని ఇంత ఓపెన్ గా చెబుతున్నా, జనసేన పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ నోరు విప్పకపోవడం. సీజ్ ద షిప్ అని, తోలు తీస్తామని అంటూ డంబాలు పలుకుతూ ఇన్ని రోజులు తిరిగిన పవన్.. సూపర్ సిక్స్ , ఎన్నికల ప్రణాళిక హామీల గురించి చంద్రబాబు చేతులెత్తేసినట్లుగా మాట్లాడినా ప్రశ్నించలేకపోతున్నారు. రెడ్ బుక్ గురించి సదే,పదే మాట్లాడే లోకేష్ కూడా.. తండ్రి మాదిరే బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కీములు అమలు చేయకపోతే చొక్కా కాలర్ పట్టుకోవచ్చన్న ఆయన హామీ ప్రకారం.. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ లను నిలదీయవచ్చా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ -
కేసీఆర్‌కు ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే..
చాలాకాలం తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పులిలా గాండ్రించారా?. ఆ పులిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదరగొట్టే ప్రయత్నం చేశారా?. రేవంత్‌కు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. కేసీఆర్‌ను ముగ్గులోకి దించి ఆయనతో విమర్శలలో సైతం తలపడి పైచేయి సాధించాలన్నది వాంఛగా కనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ పదిహేను నెలల కాలంలో పలుమార్లు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శాసనసభలో సైతం ఘాటుగా మాట్లాడారు. ఎలాగైనా కేసీఆర్‌ను రెచ్చగొట్టాలన్నది ఆయన వ్యూహంగా కనిపించేది. ఇప్పటికైతే రేవంత్ ఆశించినట్లు జరిగిందని చెప్పాలి. కానీ, వాదోపవాదాలలో ఆయన ఎంత వరకు సఫలం అయ్యారన్నదే ప్రశ్న..కేసీఆర్ ఇంతకాలం దాదాపు పూర్తి మౌనం పాటించారు. కారణం ఏదైనా ఒక కార్యక్రమంలో బీఆర్ఎస్కు ఉత్తేజం తెచ్చేలా ప్రసంగం చేశారు. తెలుగు రాష్ట్రాలలో మంచి భాషలో పదునైన పదాలు వాడే శక్తి కేసీఆర్ సొంతం అని చెప్పాలి. ఆయనకు ధీటుగా తెలంగాణలో కాంగ్రెస్ గతంలో స్పందించలేకపోయేది. రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ లోటు కొంత తగ్గిందని చెప్పాలి. రేవంత్ చాలా దూకుడుగా కేసీఆర్‌పైన, ఆయన కుటుంబంపైన విమర్శలు చేసేవారు. కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదాలు, ఈగో సమస్యతో పాటు గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్పై ఏర్పడిన వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది.ఆరు గ్యారంటీలు, తదితర హామీలు కూడా కాంగ్రెస్‌కు ఉపయోగపడ్డాయి. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కేసీఆర్ ముందున్న సవాలు అయితే, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం రేవంత్‌కు ఉన్న ఛాలెంజ్. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరో చిన్న నేత ఎక్స్‌లో పెట్టిన పోల్ కేసీఆర్‌కు ప్రయోజనకరంగా మారింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కావాలా?. ఫాం హౌస్ ప్రభుత్వం కావాలా? అని పోల్ పెడితే 67 శాతం మంది ఫాం హౌస్ పాలనే బెటర్ అని, మిగిలిన 33 శాతం కాంగ్రెస్‌కు అనుకూలంగా అభిప్రాయం తెలిపారు. ఇది సహజంగానే రేవంత్‌కు కాస్త చికాకు తెప్పిస్తుంది. కేసీఆర్ తన ప్రసంగంలో ఆ పాయింట్‌ను అడ్వాంటేజ్ చేసుకోవడానికి గాను ప్రజాభిప్రాయం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణ శక్తి ఏమిటో మళ్లీ చూపిస్తామని, తాను కొడితే వట్టిగా ఉండదు అంటూ సీరియస్ వ్యాఖ్య చేశారు. ఇంతకాలం గంభీరంగా, మౌనంగా చూస్తూ వచ్చానని, ఏడాదిలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ దివాళా తీయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే జనం కొట్టేలా ఉన్నారని కూడా ఆయన అన్నారు.ఈ ఊపులో ఆయన ఫిబ్రవరిలో ఒక భారీ బహిరంగ సభ పెడతామని ప్రకటించారు. కేసీఆర్ వ్యాఖ్యలు సహజంగానే బీఆర్ఎస్ నేతలలో, కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. కాంగ్రెస్‌లో కాకను పెంచుతాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు పార్టీని గట్టిగానే నడుపుతున్నప్పటికీ అసలు నేత కేసీఆర్ కావడంతో ఆయన ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారా అని కేడర్ ఎదురు చూసింది. కేసీఆర్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ పులి లేచింది అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏడాదిపాటు సైలెంట్‌గా ఉన్నారు. కానీ, ఇకపై నిజంగానే జనంలోకి వచ్చి తిరుగుతారా? లేక అప్పుడప్పుడు ఇలా స్పెషల్ షోలకు పరిమితం అవుతారా? అన్నది అప్పుడే చెప్పలేం. నగరానికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ లోనే ఆయన ఎక్కువకాలం గడపడం బలహీనతగానే చెప్పాలి. కేటీఆర్, హరీష్ రావులు ఇంత గట్టిగా పనిచేయడం కష్టం అవుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ, ఆయన కార్యకర్తలకు అంతగా అందుబాటులో లేరని చెబుతారు. శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ బాగా డీలా పడ్డారు. తాను బాగా పని చేశానని, అయినా ఓటమి పాలయ్యాయని బాధపడుతుండవచ్చు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు దీనికి కారణమని ఆయన అభిప్రాయపడుతున్నారు. దీనిని కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని వీక్ పాయింట్స్‌ను పట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. కానీ, ముందుగా బీఆర్ఎస్లో ఉన్న బలహీనతలను ఆయన గుర్తించగలగాలి. భారతీయ జనతా పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోంది. దానికి తగినట్లుగానే ఆ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలలో ఎనిమిది స్థానాలు సంపాదించి సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోవడం బాగా ఇబ్బంది కలిగించే అంశమే.బీజేపీ గెలుపునకు పరోక్షంగా బీఆర్ఎస్ సహాయపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కేసీఆర్ అంత యాక్టివ్ కాకపోయినా, కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేకపోవడం, ప్రభుత్వపరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీఆర్ఎస్కు ప్రయోజనం కలిగించాయి. పార్లమెంటు ఎన్నికలలో ఓటమి పాలైనా, అసెంబ్లీ ఎన్నికలలో ఆ పరిస్థితి ఉండదని బీఆర్ఎస్ భావన. కాకపోతే ఇంకా దాదాపు నాలుగేళ్లు పోరాటాలు సాగించాలి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అధికంగా మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ కనుక గణనీయమైన స్థానాలు సాధించగలిగితే అప్పుడు కాంగ్రెస్ భయపడే పరిస్థితి వస్తుంది. కానీ, అది అంత తేలికకాదు. అంతేకాక కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ తలనొప్పి కాకుండా ఉండాలి. ఇకపై రేవంత్ మరింతగా కవ్విస్తుంటారు. దానిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు? అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే అవుతుంది.మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చూసుకోగలగాలి. దానివల్ల పార్టీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇక రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వ్యూహాలను ఎలా ఎదుర్కుంటారన్న దానిపై కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అనాలోచితంగా ఏదో మంచి జరుగుతుందనుకుని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో పోల్ పెట్టి నాలుక కరచుకోవాల్సి వచ్చింది. ఈ పోల్ నిజంగానే ప్రజలలో ఉన్న అభిప్రాయానికి దర్పణం పడుతోందా? లేదా? అన్నదానిపై రేవంత్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హైడ్రా దూకుడు, ఆరు గ్యారంటీల అమలులో ఉన్న ఇబ్బందులు, అవి కాక ఎన్నికల ప్రణాళికలోని ఇతర హామీలు, వివిధ వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్లు .. ఇవన్నీ కూడా కాంగ్రెస్‌కు ఇరకాటమైనవే అని చెప్పాలి. హామీలను నెరవేర్చాలన్న తాపత్రయం ఉన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అందుకు అవకాశం ఇవ్వడం లేదు. తెలంగాణాకు ఆదాయం బాగానే ఉన్నా, ఈ హామీలకు అది సరిపోవడం లేదు. అందుకే పైలట్ ప్రాజెక్టు పేరుతో మండలానికి ఒక గ్రామం చొప్పున తీసుకుని స్కీముల అమలుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల కూడా కొంత నష్టం జరగవచ్చు.గతంలో కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టి అందరికీ ఇవ్వలేక సతమతమయ్యారు. దాని ఫలితంగా బీఆర్ఎస్కు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు అలాంటి వాతావరణమే కాంగ్రెస్‌కు ఎదురవుతోంది. ఈ నేపధ్యంలో పోల్ లో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏర్పడిన అభిప్రాయం కలిగింది. దీనిపై రేవంత్ స్పందన అంత బాగోలేదని చెప్పాలి. కేసీఆర్‌ను రాకీ సావంత్ తో పోల్చడం సరికాకపోవచ్చు. కేసీఆర్ తాను కొడితే వట్టిగా ఉండదన్న వ్యాఖ్య కేవలం హైప్ కోసమే చేసింది అయినా, రేవంత్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే వ్యక్తిగతంగానే మాట్లాడారనిపిస్తుంది. ముందు సరిగా నిలబడడం నేర్చుకో అని ఆయన అన్నారు. కేసీఆర్‌ను చెల్లని వెయ్యి రూపాయల నోటుతో పోల్చారు. దమ్ముంటే అసెంబ్లీకి రా అని సవాల్ చేయడం సరైనదే అని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్‌కు ప్రతిపక్షనేత హోదా ఉందన్న సంగతి మర్చిపోకూడదు.ఈ విషయంలో బీఆర్ఎస్కు కొంత ఇబ్బందే. అయితే, కేసీఆర్ నిత్యం ప్రజలకు, ముఖ్యంగా కేడర్‌కు అందుబాటులోకి వచ్చి, టూర్లు మొదలు పెడితే వచ్చే స్పందనపై బీఆర్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజలలో కొంత వ్యతిరేకత ఎదుర్కుంటున్న మాట నిజం. దానిని అధిగమించడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రేవంత్ ఏ చర్యలు తీసుకుంటారన్నదానిపై, ప్రజలలో సానుకూల అభిప్రాయం ఎలా కలిగిస్తారన్న దానిపై కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ను బలహీనపరచాలన్న లక్ష్యంతో ఆ పార్టీ వారిని కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చినంత మాత్రాన పూర్తి ఫలితాన్ని ఇవ్వదన్న సంగతి ఆ పార్టీ నేతలకు అర్దం అయి ఉండాలి.కేసీఆర్ చేస్తున్న మరో ముఖ్యమైన విమర్శ రియల్ ఎస్టేట్ బలహీనంగా ఉండడం. అది దేశవ్యాప్తంగా ఉన్న విషయమే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా చేసిన కూల్చివేతలు కూడా కొంత నష్టం చేశాయి. దానిని కవర్ చేసుకోవడానికి ప్రభుత్వం కొంత యత్నం చేస్తోంది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు బాగా జరిగితే రేవంత్ ప్రభుత్వం అడ్వాంటేజ్లోకి వెళుతుంది. కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని వినియోగించుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్లను దెబ్బకొట్టడానికి బీజేపీ సహజంగానే యత్నిస్తుంది. రాష్ట్రంలోని అధికారంతో పట్టు బిగించాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. పులిగా మారతారో లేదో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవడం కేసీఆర్ ముందున్న అతి పెద్ద సవాల్ అని చెప్పక తప్పదు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి!
దావోస్ పెట్టుబడుల విషయంలో తెలుగుదేశం, ఎల్లోమీడియాలు కలిసికట్టుగా ప్రజలను మోసం చేస్తూ దొరికిపోయారు. దావోస్‌కు వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తను చెప్పే మాటలన్నీ మిథ్యేనని తేల్చేశారు. దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకు రాలేక పోయినందుకు కారణాలు విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకోవల్సిన చంద్రబాబు, ఈ ఏడు నెలల్లోనే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి పారిశ్రామికవేత్తలను, ఆశ్చర్యపరిచారు!!. తమకు ఎవరికి కనపడకుండా ఎప్పుడు ఈ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చేశాయో తెలియక జనం విస్తుపోవాల్సి వస్తోంది ఇప్పుడు.. పోనీ.. నాలుగు లక్షల కోట్ల రూపాయల మొత్తానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయలేదు. మరుసటి రోజు టీడీపీ జాకీ మీడియా ఆంధ్రజ్యోతిలో ఏడు నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని రాశారు. అంటే ఇది కూడా చంద్రబాబు ప్రకటనగానే చూడాలి!. రెండు రోజుల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెంచేశారు. అంతేకాదు.. నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేశాయని బోగస్ వార్తలు రాసేశారు. దీనిని బట్టే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత బాహాటంగా ప్రజలను చీట్ చేస్తోందో అర్దం అవుతోందని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఉంటే,ఇంకా కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లవలసిన అవసరం ఏమి ఉంటుంది? చంద్రబాబు తన మీడియా సమావేశంలోకాని, గవర్నర్ ప్రసంగంలో కాని మరో మాట చెప్పారు. ఏపీ బ్రాండ్ కు ఊపు వచ్చిందని, దావోస్ లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఏపీ బ్రాండ్ ఏమిటి? రెడ్ బుక్ బ్రాండా?లేక చేసిన హామీలు అమలులో వైఫల్యం చెందిన బ్రాండా? దావోస్ కు వెళ్తే పెట్టుబడులు రావని, పెట్టుబడులు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది నెగిటివ్ ఆలోచన అట.మీడియా ఆ భావన నుంచి బయటకు రావాలని కూడా ఆయన హితబోద చెబుతున్నారు. దావోస్ లో నెట్ వర్క్ కోసం వెళ్లారట. దావోస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోయినా, ఆ కంపెనీల సీఈవోలు ఏపీకి భవిష్యత్తులో వస్తారట. అంటే చంద్రబాబు ,మంత్రి లోకేష్ లు దావోస్ లో చేసిన ప్రకటనలను పారిశ్రామికవేత్లలు నమ్మలేదని ఒప్పుకున్నట్లే కదా!. ఇంతకుముందు పలుమార్లు దావోస్ వెళ్లారు కదా!ఆ రోజుల్లో ఏమని ప్రచారం చేశారు.తాను కాబట్టి దావోస్ వెళ్లి పెట్టుబడులు సాధించుకుని వస్తున్నానని చెప్పేవారా? కాదా?వాటిలో ఎన్ని వచ్చాయి?ఎన్ని రాలేదు?అన్నది వేరే సంగతి. కనీసం ఇన్వెస్టర్లకు కొంతైన నమ్మకం కుదిరితేనే కదా వారు MoUలు చేసుకోవడానికి ముందుకు వచ్చేది. అది కూడా లేకపోబట్టే కదా ఈసారి పెట్టుబడులు తేలేకపోయారు. మహారాష్ట్రకు 15 లక్షల కోట్ల మేర, తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.వాటిని మాత్రం చంద్రబాబు స్వాగతిస్తున్నారట.ఆ ఎంవోయూలే మిథ్య అయితే ఆ రాష్ట్రాలకు కూడా అదే వర్తించాలి కదా!. పైగా ఇప్పుడు దావోస్ భేటీకి ముందే పెట్టుబడులు వచ్చాయని జాకీ మీడియాతో వార్తలు రాయించడం ఆత్మ వంచన కాదా!పైగా చంద్రబాబు ఎదురుదాడి చేశారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులుపెట్టి వేధించారని ఆయన తప్పుడు ఆరోపణ చేశారు. ఎక్కడ ఎవరిపై కేసు పెట్టారో చెప్పాలి కదా!ఆయన మిత్రుడు సింగపూర్ లో మంత్రిగా ఉన్న ఈశ్వరన్ ను ఆ దేశ ప్రభుత్వం పదవినుంచి తొలగించడమే కాదు.. ఏకంగా జైలులో పెట్టింది.దానికి వైసిపి కారణమా?లేక ఆయన అవినీతి కారణమా?. అమరావతిలో కూడా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందటూ అబద్దపు ప్రచారం చేసి ,అక్కడి ప్రైవేటు కంపెనీలు కొన్నిటికి వందల ఎకరాల భూములు కట్టబెట్టింది అవాస్తవమా?. కాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేదని భావించిన సింగపూర్ కంపెనీలు జారుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా!. మళ్లీ పిలిచి వారికి భూములు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు?వారు పెట్టిన దారుణమైన షరతులకు అంగీకరిస్తామని కూడా చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా?. జగన్ టైంలో రాష్ట్ర ఇమేజీ కోల్పోయిందట. ఇప్పుడు పునరుద్దరిస్తున్నారట. జగన్ పోర్టులు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, ఊరూరా సచివాలయ, ఆస్పత్రుల ,రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తే ఏపీ ఇమేజీ దెబ్బతిందా?లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక,కొత్తగా జగన్ టైమ్ లో వచ్చిన మెడికల్ కాలేజీలు,సీట్లు తమకుఅక్కర్లేదని కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఇమేజీ పోయిందా?జగన్ ప్రభుత్వపరంగా నిర్మించిన పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సన్నద్దం అవడం వల్ల రాష్ట్రానికి నష్టం రావడం లేదా?. ఏపీ బ్రాండ్ సత్తా అంటూ కొన్ని పెట్టుబడులను ఎల్లో మీడియా ఉదహరించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయట.వీటిలో మెజార్టీ పెట్టుబడులు జగన్ టైమ్ లో వచ్చినవి కాదా?. అయినా నిస్సిగ్గుగా కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.NTPC సంస్థ జగన్ టైమ్ లోనే రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? ఇక ఆర్సెనర్ మిట్టలో స్టీల్ ప్లాంట్ ద్వారా 1.35 లక్షల కోట్లు వచ్చేసినట్లు చెబుతున్నారు.ఇంతకన్నా పచ్చి అబద్దం ఉందా?అసలు ఇంతవరకు ఎమ్.ఓ.యు అయినా కుదిరిందా?చంద్రబాబు కోరినట్లు ఆ కంపెనీకి ఇనుప ఖనిజం రవాణాకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఇచ్చిందా?బిపిసిఎల్ కంపెనీ ప్రతిపాదన కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. అయినా ఇప్పుడు కూడా రావడం మంచిదే.కాని అసలు మొదలే కాకముందే 95 వేల కోట్లు వచ్చేసినట్లు కలరింగ్ ఇవ్వడం ఏమిటి?. ఒకవైపు ప్రభుత్వపరంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ, మరోవైపు ప్రైవేటు రంగంలో రాని ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేస్తే ఏపీ ప్రజలకు ఏమి లాభం జరుగుతుంంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం, పెట్టుబడుల విషయంలోను తమ వైఫల్యాలను జగన్ ప్రభుత్వంపై నెట్టేసి కాలక్షేపం చేస్తోంది. మైక్రోసాప్ట్ భాగస్వామి బిల్ గేట్స్ తో సమావేశం గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ వచ్చింది. పదేళ్ల క్రితం కూడా బిల్ గేట్స్ తో భేటీ అయినప్పుడు ఏ అంశాలు మాట్లాడారో,దాదాపు అలాంటి వాటినే ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారట. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని అప్పుడు కోరారు. ఇప్పుడు మళ్లీ కోరారు.అంటే చంద్రబాబు ఎప్పుడో కోరినా మైక్రోసాఫ్ట్ ఎందుకు ఏపీకి రాలేదు?. హైదరాబాద్ లో తనను చూసే వచ్చిందని చెప్పారు కదా?ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు?. బిల్ గేట్స్‌ను ఏపీలో ఐటీ సలహామండలికి నాయకత్వం వహించాలని, లేదా సభ్యుడిగా ఉండాలని కోరారట. దానికి గేట్స్ స్పందించలేదట!. అయినా ఏపీ గురించే వారిద్దరూ మాట్లాడుకున్నట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఏదో చేద్దామని అనుకున్నట్లు కబుర్లు చెప్పుకున్నారట. డ్రోన్ ల ద్వారా వ్యవసాయం ఇప్పటికే జరుగుతుంటే దాని గురించి చర్చించుకున్నారట.ఆరోగ్య రంగంలో ఏదో చేస్తారట. అసలు ఏమి చేస్తారో చెప్పకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఎవరైనా నమ్ముతారా?. చివరికి జగన్ టైమ్ లో నిర్మించిన విశాఖ ఐటీ ఐకానిక్ భవనాన్ని, జగన్ ప్రభుత్వం చేపట్టిన పోర్టులను చూపించి అదేదో తమ ఘనతగా చెప్పుకోవడం మినహా తాము సాధించింది ఏమిటన్నది మాత్రం చంద్రబాబు,లోకేష్ లు చెప్పుకోలేకపోయారు. కాకపోతే రెండు రోజులలోనే నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు పెట్టుబడులను పెంచేసి కాగితాలపై రాసేసుకున్న ఘనత మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాలయ్య, జూనియర్, లోకేష్.. అంతా చంద్రబాబు మిథ్య!
‘‘అందరినీ అన్నిసార్లూ నమ్మించ లేం’’ అంటుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పుడు అదే రుజువు అవుతోంది. దావోస్‌లో వారసత్వం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కుమారుడు, మంత్రి లోకేష్‌కు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘వారసత్వం అనేది ఒక మిథ్య’’ అని, ‘‘వారసత్వం ఒక్కటే అన్నీ ఇవ్వలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను సొంతంగా దావోస్ తీసుకెళ్లిన మీడియాతో ఆయన ఈ మాట అంటున్నారంటే.. ఆ వ్యాఖ్యల మర్మం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘‘ఎవరికైనా మెరుగైన అవకాశాలు రావచ్చు. వారు వాటిని ఎలా అందిపుచ్చుకుంటారన్నది ముఖ్యం. వ్యాపారంలో ఉండి ఉంటే లోకేష్‌కు సులభంగా ఉండేది. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చారు. ఇందులో వారసత్వం లేదు’’ అని ఆయన చెబుతున్నారు. బాగానే ఉంది కానీ దీన్ని నమ్మేదెవరు? రెండు దశాబ్దాలుగా కుమారుడిని వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబేనాయె! ఏదో మాట వరసకు వారసత్వం అన్నీ ఇవ్వదని అంటున్నా... అనేక ఇతర నేతల మాదిరిగానే లోకేష్‌కూ అదే పునాది అన్నది అందరికీ తెలిసిన విషయమే. లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొస్తారా?.. అనే ప్రశ్నకు ఆయన గతంలో చాలా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు లోకేష్‌కు ప్రజాసేవ చేయాలనుంది అని ఆయనే అంటున్నారు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని ఆయన్ను పక్కకు తప్పించిన విషయం మరీ పాత విషయమైతే కాదు. ఆ తరువాతి ఏడాది జరిగిన మహానాడులో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని బట్టే లోకేష్ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైందని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు.. నగదు బదిలీ పథకాలను తన కొడుకే ఆవిష్కరించినట్లు బిల్డప్‌లు ఇవ్వడమూ మొదలుపెట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఎందుకో మరి పోటీ మాత్రం చేయలేదు. అయితే టీడీపీ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో లోకేష్‌కు ప్రాధాన్యత వచ్చింది. మంత్రిని చేయాలని కుటుంబం నుంచే ఒత్తిడి రావడం మొదలైంది. కాదనలేక చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి ఆ తరువాత మంత్రిపదవి కట్టబెట్టారు. ఇదంతా వారసత్వ రాజకీయం కాదంటే ఎవరైనా నమ్ముతారా? ఎలాంటి కష్టం, ఎదురుచూపు, నిరాశల్లేకుండా అనాయసంగా ఎమ్మెల్సీ, మంత్రి పదవులు రావడం ఆషామాషీ ఏమీ కాదన్నది ఎవరిని అడిగినా చెబుతారు. లోకేష్‌కు ఈ పదవులు మాత్రమే కాదు... తండ్రి పేరుతో లేదంటే ఆయన తరఫున పెత్తనాలు చేసే స్థాయి కూడా వచ్చిందన్నది బహిరంగ రహస్యం. లోకేష్‌ను కలిసేందుకు టీడీపీ నేతలు క్యూ కడితే.. బాబును కలిసి వచ్చారా? అంటూ అప్పుడప్పుడూ చంద్రబాబు కూడా వాకబు చేసేవారని చెబుతారు. 2019 శాసనసభ ఎన్నికలలో లోకేష్ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు రాజకీయాలు సరిపడవని, వ్యాపారం చేసుకోవాలని లోకేష్‌కు సూచించలేదు. బదులుగా పార్టీలో ప్రాధాన్యం మరింత పెరిగింది. పాదయాత్ర చేసి రెడ్ బుక్ అంటూ ప్రచారం చేసి లోకేష్ సొంత గుర్తింపు కోసం ప్రయత్నించి ఉండవచ్చు. అది వేరే విషయం.2024 ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీలో కీలకంగా ఉండడం, తండ్రికి సంబంధం లేకుండా పలు హామీలు ఇచ్చారు కూడా. వారసత్వ అధికారం లేకుండానే అవన్ని చేయగలుగుతారా? రెడ్ బుక్ అంటూ కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నా, అన్ని శాఖలలో జోక్యం చేసుకుంటున్నా, చంద్రబాబు కన్నా లోకేషే పవర్ పుల్ అన్న భావన ఏర్పడినా అదంతా వారసత్వం ఇచ్చిన బలమే. దానిని అడ్డుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరు. నిజానికి చంద్రబాబు ధైర్యంగా లోకేష్ తన వారసుడని చెప్పి ఉండవచ్చు. కానీ అలా అంటే ప్రజలలో ఏమైనా నెగిటివ్ వస్తుందేమోనని అనుమానంతో ఇలా ఫీలర్లు వదులుతూంటారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో తదుపరి టీడీపీ అధినేత లోకేష్ అన్న భావన బలపడేలా చేస్తారన్నమాట. ఎల్లో మీడియా ఈ మాటలకు రకరకాల కలరింగ్ ఇస్తూంటుంది. పని తీరు, ప్రతిభ ఆధారంగానే లోకేష్ వారసుడిగా ఎదగాలి తప్ప తన కొడుకు అన్న ఒక్క కారణంతో వారసుడు కాలేడని చెప్పడం చంద్రబాబు అభిప్రాయమని జాకీ మీడియా విశ్లేషణ చేసింది. అలాగైతే ఎవరు కాదంటారు. ఇంకెవరైనా ఇలాగే రాజకీయాలలోకి వస్తే ఇదే జాకీ మీడియా అడ్డమైన నీచపు రాతలు రాస్తుంటుంది. లోకేష్ సొంత ప్రతిభతో రాజకీయాలలోకి వచ్చారా? లేక వారసత్వంతో వచ్చారా అన్నది అందరికి తెలిసిన సత్యం. దీనికి ఇంత నాటకీయత పులమడం అవసరమా? అన్నదే ప్రశ్న. ఒకప్పుడు ఎన్.టి.రామారావు తన కుమారుడు బాలకృష్ణను రాజకీయ వారసుడని ప్రకటించినప్పుడు.. దాని వల్ల నష్టం జరుగుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్టీఆర్ ఆ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరూ వారసులు కాకుండా తానే చక్రం తిప్పేలా ఆయన వ్యూహ రచన చేసుకున్నారని చెబుతారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరాక కొంతకాలానికి కర్షక్ పరిషత్ ఛైర్మన్‌గా ,ఇతరత్రా అధికారం చెలాయించడం ఆరంభించగలిగారు. దానికి కారణం మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే కదా! కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ నాయకుడిని, ఈ నాయకుడిని ప్రసన్నం చేసుకుని మంత్రి పొందిన చంద్రబాబుకు టీడీపీలో చేరాక ఆ ఇబ్బంది లేకుండా పోయింది. రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారన్న విమర్శలు కూడా వచ్చేవి. 1994లో టీడీపీ మళ్లీ గెలిచిన తర్వాత రెండు కీలకమైన శాఖలు రెవెన్యూ, ఫైనాన్స్ పొందగలిగారంటే మామ అండ ఉండబట్టే కదా.. దీనిని వారసత్వం అని నేరుగా అనకపోవచ్చు. కానీ అల్లుడు గిల్లుడు అని చమత్కరిస్తుంటారు. ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి కూడా బంధుత్వమే ఉపయోగపడింది కదా! అల్లుడు తన పదవి ఎందుకు లాక్కొంటారని ఎన్టీఆర్ అమాయకంగా ఉండిపోయారు. దానిని అడ్వాంటేజ్ చేసుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తనవైపు లాక్కొని సీఎం సీటు ఎక్కుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలంతా అదంతా కుటుంబ వ్యవహారం అనుకున్నారు. ఇందులో చంద్రబాబు కుట్ర రాజకీయాలు కూడా ఉండవచ్చు. అది వేరే విషయం. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు ఎవరూ తనకు పోటీకి రాకుండా జాగ్రత్తపడ్డారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశపెట్టి ఈనాడు రామోజీరావు సాయంతో బయటకు గెంటేశారు. ఇది వారసత్వ గొడవ కాదా? లక్ష్మీపార్వతిని సాకుగా చూపించడంలో ఉన్న మతలబు తెలియదా! హరికృష్ణ పరిస్థితి అంతే. టీడీపీ అధ్యక్షుడిని చేస్తానని వాగ్దానం చేసి, ఆ తర్వాత తాత్కాలికంగా మంత్రిని చేసి, ఆ పదవి కూడా పోయేలా చేశారు. దాంతో హరికృష్ణ పార్టీ వీడిపోయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బాలకృష్ణతో సత్సంధాలు ఉండేలా చేసుకుని వియ్యంకుడిగా మార్చుకుని ఆయనను పూర్తిగా వారసత్వ పోటీ నుంచి తప్పించగలిగారు. ఇవన్ని రాజకీయంగా చంద్రబాబు తెలివిగానే చేశారు. తద్వారా ఎన్టీఆర్ వారసులు కాకుండా, ఇప్పుడు తన వారసుడు లోకేష్ సీఎం అయ్యేందుకు బాట వేసుకున్నారు. అందులో బాగంగానే ప్రభుత్వ ప్రచారం ప్రకటనలలో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా ప్రచురించారు. లోకేష్ డిప్యూటి సీఎంగా ను చేయాలని తన సమక్షంలోనే టీడీపీ నేతలు డిమాండ్ చేసినా ఆయన ఏమీ మాట్లాడలేదు. మరెవరికైనా ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఎదుట అనగలరా? అంటే ఆయన ఊరుకుంటారా? ఇదంతా వారసత్వం కాకపోతే ఏమిటి? చేసేది చేస్తూనే ఏమి తెలియనట్లు నటించడమే చంద్రబాబు రాజకీయం. దానికి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుంటారు. పవన్ కల్యాణ్ వైపు నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ పెద్ద వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు. పవన్ ఒకరకంగా ఇప్పటికే మానసికంగా సిద్దపడ్డారని విశ్లేషణలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల కుమారులు రాజకీయాలలోకి వచ్చారు. సీఎంలు అయ్యారు. అదేదో జరగకూడని సంగతేమీ కాదు.లోకేష్ ను సీఎం పదవి ఇవ్వాలని కుటుంబపరంగా డిమాండ్ వస్తున్నదంటే అది వారసత్వం వల్ల కాక మరేమిటి? ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సరిపెట్టాలని చూస్తున్నది నిజం కాదా? అంతెందుకు! తన తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి కాబోడని, పార్టీ అధినేత కాజాలరని ఇంటకానీ, బయటకానీ చెప్పగలరా? ఉప ముఖ్యమంత్రిని చేయబోవడం లేదని ఇంతవరకు చెప్పలేదు. పైగా కూటమిలో చర్చించుకుంటామని చెప్పి పరోక్షంగా ధృవీకరించారు. అవన్ని కప్పిపుచ్చి, వారసత్వం మిథ్య అని, మరొకటని కబుర్లు చెప్పి, ఆయనేదో వారసత్వానికి వ్యతిరేకమైనట్లు, లోకేష్ ప్రజాసేవకుడు అయిపోయినట్లు పిక్చర్ ఇచ్చుకునే ప్రయత్నమే బాగోలేదు. దానినే హిపోక్రసీ అని అంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్‌ల దావోస్ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులేవీ తేకపోయినప్పటికీ ఒక రకంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే అంతటి ముఖ్యమైన కార్యక్రమాలనూ రాజకీయాలకు వేదికగా చేసుకోవచ్చునని, తమకు కావాల్సిన విధంగా ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చునని టీడీపీ ప్రభుత్వం నిరూపించింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా, ఏపీ బ్రాండ్ అంటూ కొత్త డైలాగుతో మీడియా మేనేజ్మెంట్లో తమకు తామే సాటి అని చెప్పుకోవడం హైలైట్!. దావోస్‌లో చంద్రబాబు, లోకేష్‌లు చాలా కష్టపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాత్రం లోకేషే భావి ముఖ్యమంత్రి అని పొగడటంలో బిజీ అయిపోయారు. ఏపీలో లోకేష్‌లాగా చదువుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడగడం ఒక హైలైట్ అయితే.. ఆ మిషతో భావి ఉప ముఖ్యమంత్రి ఆయనే అని జనసేన అధినేత పవన్‌కు సిగ్నల్స్ ఇవ్వడం ఇంకో హైలైట్. అయితే దావోస్ పర్యటనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఇచ్చిన కవరేజీ బహుశా బాబు, లోకేష్‌లను ఇరకాటంలో పెట్టేసి ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి రావడమే తరువాయి అన్నట్టుగా సాగింది ఈ మీడియా బ్యాండ్ బాజా. తీరా పర్యటన ముగిసిన తరువాత చూస్తే.. సున్నకు సున్నా.. హళ్లికి హళ్లి!! ప్రతిపక్షంలో ఉండగా పవన్.. 'దావోస్ వెళ్లి సాధించే పెట్టుబడులు ఏముంటాయి? సూటు,బూటు వేసుకువెళ్లి హడావుడి చేయడం తప్ప.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటే పారిశ్రామికవేత్తలే ఏపీకి వస్తారు’ అని చెప్పినట్లే.. ఇప్పుడు రెడ్‌బుక్ రాజ్యాంగం పుణ్యమా అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అనుకోవాలి. మహారాష్ట్రకు రూ. 15 లక్షల కోట్లు, తెలంగాణకు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడమేమిటి.. ఏపీకి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదరక పోవడం ఏమిటి? కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి బాబు, లోకేష్‌లు సాధించింది ఏమిటీ అంటే.. ‘‘ఏపీ బ్రాండ్’’ను ప్రచారం చేసి వచ్చారట! మరి.. చంద్రబాబు గతంలోనూ చాలాసార్లు దావోస్ వెళ్లివచ్చారే? అప్పట్లో ఏపీకి బ్రాండ్ ఇమేజీ రానట్టేనా? పైగా అప్పట్లో దావోస్ వెళ్లిన ప్రతిసారి అదిగో పెట్టుబడులు.. ఇదిగో ఇన్వెస్ట్మెంట్లు అని ఎల్లోమీడియా భలే బాకాలూదేదే? బాబు స్వయంగా తనను చూసి బోలెడన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు కదా? ఈసారి ఏమైంది? విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినప్పుడు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రచారం జరిగింది. అయితే.. వీటిల్లో అధికమొత్తం బోగస్ ఒప్పందాలన్న విమర్శ వచ్చింది. దారిన పోయేవారిని కూడా కంపెనీ సీఈవోలుగా ముస్తాబు చేసి ఫొటోలు దిగారు అని ససాక్ష్యంగా నిరూపితమైంది. ఇప్పుడు ఆ డ్రామా కూడా ఆడలేకపోయారు. చంద్రబాబు, లోకేష్‌లు కంపెనీలతో చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. మంచిదే. కానీ అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం గురించి, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి కంపెనీల్లో అనుమానాలు రేకెత్తించారా? ఈ అనుమానం ఎందుకొస్తుందంటే.. జగన్ మళ్లీ వస్తాడేమో అని పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు లోకేష్ చాలాసార్లు వ్యాఖ్యానించారు మరి!. అలాగే ‘జగన్ రాడు’ అని బాండ్ రాసి ఇమ్మంటున్నారని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతుంటారు. పారిశ్రామికవేత్తలు ఆ బాండ్లను నమ్మలేదా? జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్లు నమ్మారని అనుకోవాలా?.. ఇదీ చదవండి: దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్యమూడేళ్ల క్రితం జగన్ దావోస్ వెళ్లినప్పుడు రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఈ పారిశ్రామికవేత్తలే. విశాఖలో సదస్సు పెడితే అంబానీ, అదాని వంటివారూ వచ్చి జగన్‌ను అభినందించి వెళ్లారే? ఆ తరువాత అదానీ పెద్ద ఎత్తున సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో విద్యుత్ ఉత్తత్తి ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యారే? కూటమి అధికారంలోకి వచ్చాక అదానీ సిబ్బంది పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లాలో దాడులు చేశారే? ఆ విషయం ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయేందేమో!. ఇక లోకేష్ రెడ్ బుక్ ఉండనే ఉంది. ఏపీలో కూటమి అదికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ వారు వైసీపీ వారిపై చేసిన దాడులు, హింసాకాండ, అరాచకాల సమాచారం కూడా వారికి అందిందేమో! ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జగన్ టైమ్ లో ముందుకు వచ్చారు. కాని కూటమి అధికారంలోకి రావడంతోనే ఎవరో మోసకారి నటిని పట్టుకొచ్చి ఏపీలో పోలీసు అధికారులపైనే కాకుండా, జిందాల్ పై కూడా కేసుపెట్టి అరెస్టు చేసే ఆలోచనవరకు వెళ్లారే..సహజంగానే ఒక పారిశ్రామికవేత్తను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా హింసించే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా?. అందువల్లే పైకి కబుర్లు చెప్పినా, పెట్టుబడి కింద వందల, వేల కోట్లు వ్యయం చేయడానికి ఏపీకి రావడానికి భయపడ్డారేమో! దాని ఫలితంగానే ఏపీకి జిందాల్ గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. జిందాల్‌ను ఇబ్బందిపెట్టకపోయి ఉంటే ఆయన ఇక్కడ కొన్ని వేల కోట్లు అయినా పెట్టుబడి పెట్టడానికి సిద్దమై ఉండేవారేమో కదా? ఆ రకంగా ఏపీకి పెట్టుబడి రాకుండా ఒక పారిశ్రామికవేత్తను తరిమేశారన్న అపఖ్యాతిని చంద్రబాబు, లోకేష్‌లు మూటకట్టుకున్నట్లయింది కదా! ఎల్లో మీడియా ఇప్పటికి జగన్ పై తప్పుడు రాతలు రాస్తుంటుంది. ఆయన టైమ్‌లో పరిశ్రమలను తరిమేశారని పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేశాయి. కాని ఫలానా పరిశ్రమ వెళ్లిపోయిందని మాత్రం చెప్పలేదు. కేవలం వదంతులు సృష్టించి ప్రజలలో అనుమానాలు రేకిత్తించడంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా బాగా కృషి చేసింది. ఇదీ చదవండి: దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారుదావోస్లో యూరప్ లోని టీడీపీ అభిమానులుగా ఉన్న ఏపీ ప్రవాసులతో సమావేశం అయి కూడా రెడ్ బుక్, అందులో రాసుకున్నవారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ స్వయంగా చెప్పినట్లు వీడియోలు వచ్చాయి కదా!. కక్ష సాధింపు లేదంటూనే ఈ మాట చెప్పాక, ఎవరైనా పరిశ్రమలవారు భయపడకుండా ముందుకు వస్తారా? పోనీ వచ్చిన తెలుగువారిలో ఎవరైనా పరిశ్రమలు పెడతామని ఎందుకు ఆసక్తి చూపలేదు? అమరావతి ప్రపంచం అంతా ఆకర్షితమవుతోందని చెబుతారు కదా. అక్కడ కూడా ఏమైనా పెట్టుబడులు పెడతామని ఎవరూ చెప్పలేదే?. ఇప్పుడేమో దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయని అనడం మిథ్య అని బాబు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. అంతకాడికి కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి వెళ్లడం ఎందుకు! అక్కడేదో అద్భుతం జరగబోతోందని బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నట్లు? ఎవరూ ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఏపీ పరువును అంతర్జాతీయంగా నడిబజారులో తీసేసినట్లు కాలేదా! చంద్రబాబు మాటలు ఎప్పటికీ మిథ్య అన్నది మరోసారి తేలినట్లే కదా!!!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Vijaysai Reddy: అందుకే గుడ్‌బై చెప్పారా?
వైఎస్సార్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం సంచలనమైనదే. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన నేత, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన. రాజీనామా చేసినప్పటికీ వైఎస్ కుటుంబంతో అనుబంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడం ఆసక్తికరమైందే. రాజీనామా సందర్భంగా ఆయన జగన్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, అభిమానంగా మాట్లాడటం ఆ తర్వాత వైసీపీ స్పందన రాజకీయాలలో కొత్త ఒరవడిగా ఉన్నాయి. వైఎస్సార్సీపీపై కానీ, జగన్‌పై కానీ ఆయన వీసమెత్తు విమర్శ చేయకుండా గౌరవంగా బయటకు వెళ్లడం మంచి పరిణామం. మరోవైపు..ఆమోదయోగ్యం కానప్పటికీ తాము విజయసాయి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వైఎస్సార్‌షీపీ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇక విజయసాయి రాజీనామా సరైన నిర్ణయమేనా?. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా?. ఏదో బలమైన కారణం లేకుండానే ఇలా చేసి ఉంటారా?. అనే ప్రశ్నలు తలెత్తడమూ సహజమే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సంయమనంగానే వ్యవహరించారు. తెలుగుదేశం జాకీ మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆవేశపడలేదు. తాను అబద్దాలు చెప్పడం లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. అంతేకాక తనపై అసత్య కథనాలు రాసిన టీడీపీ మీడియాపై పరువు నష్టం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ సీపోర్టు వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, దానిపై కూడా పరువు నష్టం కేసు ఉంటుందని తెలిపారు. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు. దానికోసం పార్లమెంటు సభ్యత్వాన్ని వదలుకోనవసరం లేదు.ఈ మధ్యకాలంలోనే ఆయన ఒకటి, రెండు పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. అంటే ఆయన యాక్టివ్‌గా ఉండదలిచే ఆ పదవులను తీసుకున్నట్లే కదా! మరి ఇంతలోనే ఏమైంది?. ఇంతకుముందు ముగ్గురు ఎంపీలు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి అదే సీటు పొందగలిగారు. బీదా, మోపిదేవిలు టీడీపీ ప్రలోభాలకు ఆకర్షతులయ్యో, రెడ్‌బుక్‌కు భయపడో ఆ పార్టీ చెప్పినట్లు విన్నారు. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం ఈయన రాజీనామా చేసినట్లు కనబడుతుంది. ఒరిజినల్‌గా మొదటి నుంచి వైఎస్సార్సీపీలోఉన్నది మోపిదేవే. ఆయనకు రాష్ట్రంలో ఏదో పదవి ఇస్తామని టీడీపీ ఆశ చూపిందని అంటారు. మరో సీటు లోకేష్‌కు సన్నిహితుడని చెబుతున్న వివాదాస్పద వ్యక్తి సానా సతీష్ కు దక్కింది. ఈ రాజీనామాల ద్వారా రాజ్యసభలో టీడీపీ తిరిగి ఎంటర్ కాగలిగింది. బహుశా టీడీపీ రాజకీయ వ్యూహాన్ని గమనించిన బీజేపీ తను అడ్వాంటేజ్ పొందాలని అనుకుని ఉండాలి. మొత్తం 11 సీట్లు వైఎస్సార్సీపీ(YSRCP) ఖాతాలో ఉండగా, ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో నాలుగు సీట్లను వైసీపీ కోల్పోయినట్లయింది. మరో ఎంపీ అయోద్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయవచ్చని వదంతులు వచ్చినా, ఆయన ఖండించారు. వర్తమాన రాజకీయాలలో అధికారం లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో, అధికారం ఉంటే ఎలా పెత్తనం చేయవచ్చన్న దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. విజయసాయి మీడియా సమావేశంలో చేసిన రెండు వ్యాఖ్యలు గమనించదగినవి. గవర్నర్ పదవికి ఆశపడి తాను రాజీనామా చేయలేదని తొలుత చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. భవిష్యత్తులో ఏ పదవి చేపట్టబోనని ప్రకటించినట్లుగా లేదు. అలాగే తనకంటే శక్తి కలిగిన వ్యక్తికి ఈ పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే దాని అర్ధం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎవరైనా ప్రముఖుడు ఈ సీటు పొందబోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇది ఒక ఆపరేషన్ అయి ఉంటుందని, బీజేపీ పాత్ర ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రత్యేకించి.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపిన వైనం ఇందుకు ఆధారంగా నిలుస్తుంది. అలాగే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని, పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ దాడులు, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం అవ్వాలని భావించారా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం. గతంలో జగన్‌తో పాటు ఇంతకన్నా పెద్ద కేసులనే ఆయన ఎదుర్కొన్నారు. ఏడాదిపాటు జైలులో ఉండడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో ప్రముఖ నేతగా ఉండి రెండుసార్లు ఎంపీ అయ్యారు. టీడీపీ నేతలు కాని, టీడీపీ మీడియా కాని ఆయనపై ఇప్పటికీ విమర్శలు కొనసాగించాయంటే ఆ పార్టీలోని వారితో కాంటాక్ట్ ఏర్పడ లేదనుకోవచ్చు!. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ స్నేహ హస్తం అందించినట్లు అనిపిస్తుంది. బీజేపీ, జనసేన పార్టీలు ఈయనపై విమర్శలు చేయడం లేదు. టీడీపీకి తెలియకుండానే ఈ కధ నడించిందని అంటున్నారు. బీజేపీలో చేరడానికి తెలుగుదేశం అనుమతి తీసుకోవాలన్నట్లు ఆ పార్టీ జాకీ మీడియా అధినేత ఒకరు చెబుతున్నా, బీజేపీ అంత బలహీనంగా లేదేమో అనిపిస్తోంది. ఆ మాటకు వస్తే చంద్రబాబే పదే, పదే మోదీ, అమిత్ షాలను ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తే ఆయనకు ఏదో భయం పట్టుకుందన్న అనుమానం కలుగుతోంది. మరో వైపు ఎల్లో మీడియాలోని ఒక భాగం విజయసాయికి అనుకూలంగా కథనాలు ఇస్తోంది. ఆయనపై సానుభూతి కురిపిస్తోంది. విజయసాయి వైసీపీలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నా, వాటి గురించే రాజకీయాలనుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చే భీరువు ఆయన కాదు. ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్నవో, పెద్దవో సమస్యలు ఉంటాయి.అయినా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉండదు. కాకపోతే ఎవరైనా పార్టీని వీడడానికి అలాంటివాటిని సాకులుగా చూపుతారు. ఆ మాట కూడా విజయసాయి చెప్పలేదు. టీడీపీ జాకీ మీడియా అధినేత చేసిన కొన్ని ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆ మీడియా అధినేతను విజయసాయి కలిసింది వాస్తవమా? కాదా? బీజేపీలో చేరాలని యత్నించారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వగలగాలి. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఇప్పుడు కూడా విజయసాయిపై ఆరోపణలు చేయడం ద్వారా ఒక సంకేతం ఇచ్చింది. విజయసాయి పై టీడీపీ అదే కక్షతో ఉందని, ఆయన ఇలా రాజీనామా చేస్తారని టీడీపీ కూడా ఊహించలేకపోయిందన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఒకవేళ బీజేపీ పెద్దలు ఈ సీటు తమదే అన్నప్పుడు చంద్రబాబు కాదనగలుగుతారా? అనేది ప్రశ్న. అలాకాక టీడీపీనే ఈ సీటు తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉండవచ్చు. గతంలో 2019లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబే వారిని పంపించి తన దూతలుగా పెట్టుకున్నారని అంటారు. కాని జగన్ అలాంటి దొంగ రాజకీయాలు చేయరని మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ఎంపీలను ఎవరిని ఆయన బీజేపీలోకి పంపలేదు. పార్టీ వీడిన వారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లారు. వారిలో ఇద్దరు టీడీపీలో చేరారు. దీనిని బట్టి అర్థం అయ్యేదేమిటంటే, అలాంటి కుట్ర రాజకీయాలు, లొంగుబాటు రాజకీయాలు జగన్ చేయరని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చని, ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పాత్ర ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్న నేపద్యంలో వాటినుంచి కాస్త ఉపశమనం పొందడానికి విజయసాయి ఇలా చేసి ఉండవచ్చా? అనేది పలువురి డౌటుగా ఉంది. కాని అలాంటివాటికి తాను భయపడనని ఆయన చెబుతున్నారు. విజయసాయి ఏ కారణంతో రాజకీయాలకు దూరం అయినట్లు చెబుతున్నా, భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తారో చెప్పలేం. ఈ రాజీనామా ప్రభావం వైఎస్సార్సీపీ(YSRCP)పై ఏ మేరకు ఉండవచ్చన్నది చర్చ. తొలుత కొంత దిగ్భాంతికి గురవుతారు. ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. విజయసాయి మీడియా సమావేశంలో జగన్ బలం గురించి చెప్పిన తీరు విన్నాక పార్టీ క్యాడర్ లో యథా ప్రకారం ఆత్మస్థైర్యం వచ్చింది. తనలాంటి వారిని వెయ్యిమందిని జగన్ తయారు చేయగలరని ఆయన అనడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాక విజయసాయి ప్రత్యక్షంగా ప్రజలతో నిత్యం సంబంధాలు నెరపే వ్యక్తికాదు. 2024లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తప్పనిసరి స్థితిలోనే పోటీ చేశారు. ఓటమి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆ రకంగా చూస్తే ప్రజల కోణంలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కార్యకర్తలు అప్పుడే విజయసాయి వెళ్లిపోయినా పార్టీకి ఏమీ కాదని ధైర్యంగా చెప్పడం ఆరంభించారు. కొద్దిరోజుల పాటు చర్చించుకుని ఈ విషయాన్ని వదలివేయడం సహజంగానే జరుగుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వంటివారు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీ కేబినెట్ లో పనిచేసిన జగ్ జీవన్ రామ్,కాసుబ్రహ్మానందరెడ్డి,సి.ఎమ్.లుగా చేసిన దేవరాజ్ అర్స్, మర్రి చెన్నారెడ్డి వంటి వారు కొంతకాలం ఆమెకు రాజకీయంగా దూరం అయ్యారు. తిరిగి ఆమెకు ఉన్న ప్రజాదరణను గమనించి ఆమె పార్టీలోనే చేరారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.పక్కనే కూర్చుని ఉన్న ఉప నేత రఘుమారెడ్డి 1994 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్(YS Jagan) ఒంటరిగానే రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద పార్టీని తయారు చేసుకుని గెలుపు,ఓటములను చవిచూశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, ఇప్పటికీ జగన్ అంటే భయపడే పరిస్థితిలోనే ఆ పార్టీలు ఉన్నాయి. చదవండి: దటీజ్ జగన్.. పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!మళ్లీ వచ్చే ఎన్నికలలో జగనే గెలుస్తారేమోనని ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే ఎలాగొలా వైఎస్సార్సీపీని, జగన్ ను బలహీనపర్చాలని టీడీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది. వాటిలో ఎక్కువ భాగం కుటిల రాజకీయాలే అనే సంగతి తెలిసిందే. ఈలోగా బీజేపీ తన గేమ్ తాను ఆడుతోంది. అయినా జగన్ తొణకలేదు.బెణకలేదు. ఎందరు ఎదురు నిలబడ్డా తనదారిలోనే వెళ్లే నేత ఆయన. సోనియాగాంధీ అత్యంత శక్తిమంతంగా ఉన్న రోజులలోనే తనకు రిస్క్ ఉందని తెలిసినా, ఆమె కక్ష సాధింపుతో జైలు ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరించినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కున్నారే తప్ప తలవంచలేదు. ఈ పదిహేనేళ్ల రాజకీయంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఎదుర్కున్న జగన్.. వచ్చే నాలుగున్నరేళ్లు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడడానికి సన్నద్దమవుతున్నారు. అదే ఆయన బలం అని చెప్పాలి. ఆ గుండె ధైర్యాన్ని చూసే కార్యకర్తలు స్పూర్తి పొందుతుంటారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు, రేవంత్‌ల స్ఫూర్తితో అలా ముందుకు..!
కాంగ్రెస్ పార్టీని నిత్యం విమర్శించే భారతీయ జనతా పార్టీ హామీల విషయంలో ఇప్పుడు ఆ పార్టీ బాటనే పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఇచ్చిన కొన్ని హామీలు కాంగ్రెస్ పలు రాష్ట్రాలలో చేసినవి కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలను ఎలా అమలు చేయాలో తెలియక అవస్థలు పడుతుంటే.. బీజేపీ కూడా అదే తరహా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి ప్రజలను ఆకరర్షించడానికి నానా పాట్లు పడుతోంది. కాంగ్రెస్ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేస్తూ చెప్పిన సంగతులు కూడా చిత్రంగానే ఉన్నాయి!. వరుస విజయాలతో ఢిల్లీలో బలంగా నాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండు జాతీయ పార్టీలకు సవాల్‌గా మారింది. ఆశ్చర్యకరంగా.. పొరుగున ఉన్న పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో ఈసారి గెలిస్తే అది తమ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చని బీజేపీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయినప్పటికీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా బెయిల్‌పై విడుదలై పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళుతున్నారు. విద్య, వైద్యం వంటివాటిలో, సంక్షేమ స్కీముల అమలులో కేజ్రీవాల్ బలమైన ముద్ర వేసుకున్నారు. దానిని నిలబెట్టుకోవడానికి ఆప్ కృషి చేస్తుంటే, ఆ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ పలు ఆకర్షణీయమైన స్కీములతో మానిఫెస్టోని విడుదల చేసింది. వాటిలో ముఖ్యమైనది.. మహిళా సమృద్ధి యోజన. దీని ప్రకారం ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తారట. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఒక్క ఢిల్లీకే ఈ హామీని పరిమితం చేయడమేమిటి?. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి దేశమంతటా అలాగే చేస్తామని చెబుతారేమో తెలియదు. ఈ హామీ కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టిందే అనిపిస్తుంది. బీజేపీ గతంలో ఇలాంటి హామీలకు విరుద్దమని చెబుతుండేది. మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉచితాలు, రుణమాఫీల వంటి హామీలను బీజేపీ ఒప్పుకోదని పలు సభలలో బహిరంగంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల బృందం దేశ రాజకీయాలను శాసించడం ఆరంభమయ్యాక, ప్రతి రాష్ట్రంలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో పని చేయడం ఆరంభించారు. అందులోనూ దేశ రాజధాని కావడంతో ఢిల్లీకి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ స్కీమును అమలు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఏడాది గడిచినా అమలు చేయలేకపోయింది. అలాగే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కాని ఆ ఊసే ఎత్తడం లేదు. బీజేపీ నేరుగా టీడీపీ, జనసేనల మానిఫెస్టోలో భాగస్వామి కాకపోయినా, ఆ ప్రణాళిక విడుదలలో భాగస్వామి అయింది. ఏపీలో ఈ హామీ అమలు చేయడానికి ఏడాదికి సుమారు రూ.36 వేల కోట్లు అవసరమవుతాయి. అవి ఎక్కడ నుంచి వస్తాయో ఇంతవరకు చెప్పలేకపోయారు. ఇక.. ఢిల్లీలో గర్భిణులకు రూ.21 వేలు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, హోళీ, దీపావళి పండగలకు ఉచితంగా ఒక్క గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ స్కీములను కొనసాగిస్తామని కూడా ఆయన అన్నారు. వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీలు ఇచ్చారు. రెండో విడత మరికొన్ని హామీలు ఇచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని అందులో తెలిపారు. ఎన్నికలు జరిగే లోపు మరికొన్ని ప్రజాకర్షక వాగ్దానాలు చేస్తారట. సిద్దాంతంతో సంబంధం లేకుండా బీజేపీ ఇలా దిగజారి పోయిందా? అనే ప్రశ్నకు జవాబు దొరకదు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు పరస్పరం దారుణమైన విమర్శలు చేసుకున్న తర్వాత, తిరిగి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. అప్పుడే బీజేపీ విలువలు ఏమిటో అర్ధమైపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఆ పార్టీ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేశారు. ఆయనకు జాతీయ స్థాయి ఎలివేషన్ రావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడి ఉండవచ్చు. కానీ ఆయన పేర్కొన్న హామీలు ఎంతవరకు అమలు అవుతాయో గ్యారంటీ లేదు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసేస్తున్నామని చెప్పడం చిత్రంగానే ఉంటుంది. మహిళలకు రూ.1500 రూపాయల చొప్పున ఇచ్చే హామీని ఎందుకు అమలు చేయలేకపోయారు?. రైతు భరోసా స్కీమ్ పరిస్థితి ఏమిటి? పూర్తిగా అయినట్లు చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు రూ.22 వేల కోట్ల మేర మాఫీ చేశామని చెప్పారు. కాగా ఢిల్లీలో 300 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని ప్రకటించారు. అలాగే రూ.500లకే గ్యాస్ సరఫరా చేస్తామని డిల్లీ కాంగ్రెస్ పక్షాన ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించి ఆ స్కాం అసలు పార్టనర్ ను ఓడిస్తే ఢిల్లీలో మంచిరోజులు వస్తాయని అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ నేత కవిత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరికొందరు ఆప్ నేతలు ఈ కేసులో జైలుకు వెళ్లారు. కవిత అరెస్టును స్వాగతించిన కాంగ్రెస్, కేజ్రీవాల్ అరెస్టు అయినప్పుడు మాత్రం బీజేపీని విమర్శిస్తూ ధర్నాలు చేసింది. ఈ ద్వంద్వ వైఖరిపై ఇంతవరకు వివరణ ఇచ్చినట్లు కనిపించదు. పొత్తు కుదరలేదు కనుక లిక్కర్ స్కామ్ పార్టనర్ అని రేవంత్ చెబుతున్నారు. కేసీఆర్ టైమ్ లో ఉన్న అవినీతి నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని రేవంత్ ప్రచారం చేసి వచ్చారు. దీనిలో ఎంత నిజం ఉందన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. కొన్ని హామీలు అమలు చేశామని చెబితే ఫర్వాలేదు కాని, అన్నింటిని చేసేసినట్లు ప్రచారం చేస్తే విమర్శలు వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తన హామీలలో కొత్తగా విద్యార్ధులందరికి ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటికే విద్యార్దినులకు ఉచిత బస్ అమలు చేస్తుండగా.. ఇకపై బాలురకు కూడా ఫ్రీ బస్ సదుపాయం అని హామీ ఇచ్చారు. విద్యార్ధులకు మెట్రో చార్జీలలో ఏభై శాతం భరిస్తామని మరో హామీ ఇచ్చారు. యువతను ఆకర్షించడానికి ఆప్ వేసిన గాలం ఇది. ఢిల్లీలో ఉచిత విద్యుత్, ఉచిత నీరు తదితర హామీలను ఆప్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో గవర్నర్ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్‌ను, ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక వ్యూహాలను అమలు చేసింది. అందులో భాగంగా ఈడీని కూడా ప్రయోగించిందన్న రాజకీయ విమర్శలు వచ్చాయి. మొత్తంగా.. బీజేపీ ఇన్ని వ్యూహాలు పన్నుతూ డిల్లీలో ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందన్నది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలు తేల్చుతాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నారా లోకేష్ రెడ్‌బుక్ అమలులో ముఖ్య పాత్ర ఆయనదే?
ఏబీ వెంకటేశ్వరరావు.. ఐపీఎస్! పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వార్తల్లోకి ఎక్కిన వివాదాస్పద అధికారి. రిటైర్ అయిన తరువాత కూడా తన వ్యాఖ్యలు, వైఖరితో మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్న వ్యక్తి కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌ల అండతో ఆయన ఈ మధ్య కాలంలో మరింత చెలరేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.తాజాగా ఆయన తన ‘కమ్మ’ కులం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, హితబోధ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎవరేమనుకుంటే తనకేమన్నట్టుగా ఆయన మాట్లాడటం.. తన మాటల వల్ల ఇతర కులాల వారి మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయో ఆలోచించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కులం వారు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోగలరా?. కులమతాలకు అతీతంగా అందరూ ఓట్లేస్తేనే ఒక పార్టీ ఎన్నికవుతుంది కదా?. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా కమ్మ కులం వాళ్లు అన్ని రకాలుగా అడ్డుకోవాలన్నది ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన పిలుపు! ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని, అహర్నిశలు కష్టపడాలని కూడా ఆయన తన కులం వారిని కోరుకున్నారు. కమ్మ వారికి ఏదో పెద్ద సందేశం ఇచ్చానని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు కానీ, దీనివల్ల కమ్మ వారిపై మిగిలిన వారికి మరింత వ్యతిరేకత వస్తుంది. అసహ్యం ఏర్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన లాంటి వ్యక్తులు కమ్మ కులం వారిని భ్రష్టు పట్టిస్తున్నట్లుగా ఉంది.ఈ క్రమంలోనే ఆయన వైఎస్ జగన్‌పై పరుష పదాలతో విమర్శించారు కూడా. సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించని విమర్శలివి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన రెడ్డి, ఇతర కులాల వారిని ఏకం చేస్తున్నారని, వైఎస్ జగన్‌ను అభిమానించే బలహీన వర్గాల వారందరూ ఒక్కతాటిపైకి వచ్చేలా చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పనితీరుకు ఏబీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కూడా అంటున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను చూస్తే అసలు ఆయన ఐపీఎస్ అధికారేనా? అన్న అనుమానం వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు వెనుక కీలక పాత్రధారి ఈయనే అన్న అనుమానమూ వస్తోంది.వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు ఒకప్పుడు ఇంత వివాదాస్పదుడు కానేకాదు. ఇంత చెడ్డ పేరూ లేదు. తెలుగుదేశంతో జత కట్టిన తర్వాతే ఇలా తయారయ్యారు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ కనుసన్నలలో పనిచేస్తూ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కమ్మ వర్గం వారు ఇతర సామాజికవర్గాల దృష్టిలో విలన్ల మాదిరి కనిపించేవారు. తత్ఫలితంగా మిగిలిన కులాలన్నీ ఏకమై తెలుగుదేశం పార్టీని ఓడించాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇదే ధోరణి ఆరంభమైనట్లుగా ఉంది.వీరి రెడ్‌బుక్‌లో ఉన్న పేర్లలో ఎక్కువ భాగం రెడ్డి లేదా షెడ్యూల్ కులాల వారే. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారన్న కారణంగా ఈ వర్గాల అధికారులు కొందరికి ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ముత్యాలరాజు వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగల అవకాశం ఉన్న మహిళా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లను బయటకు తీశారన్న కోపంతో ఏదో ఒక నెపం పెట్టి కొంతమంది ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం, కేసు పెట్టి అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని ఏబీ వెంకటేశ్వరరావు ఫీల్ అవుతుండవచ్చు.కానీ, ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపికై సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించిన ఈయనకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పేషీ, మంత్రులు ఎలా పనిచేస్తారో తెలిసి ఉండాలి. లోకేష్ వంటి అనుభవం లేని వారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే, వారించవలసిన ఈయనే స్వయంగా కుల ప్రస్తావన తెచ్చి ప్రసంగాలు చేయడం శోచనీయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుకునేందుకు దేనికైనా సిద్ధపడాలన్న ఏబీ వ్యాఖ్య వెనుక ఉద్దేశం ఏమిటన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. హింసకు కూడా వెనుకాడవద్దని పరోక్షంగా పిలుపునిస్తున్నారా? అంటూ మీడియాలో కథనాలూ వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల మ్యానిప్యులేషన్ జరిగిందన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ అదే పద్ధతి అవలంబించాలన్నది ఆయన చేస్తున్న సూచనా?. సమాజంలో కులాల కొట్లాటలు ఉంటే ఉండవచ్చు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో పనిచేసే వాళ్లు కూడా ఇంత తక్కువ స్థాయి ఆలోచనలు చేయడం, చెత్త ప్రకటనలు చేయడం ఎంత వరకూ సబబు?. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ శాంతి భద్రతల విషయాన్ని పక్కనబెట్టి రాజకీయంగా వైఎస్సార్సీపీని ఎలా దెబ్బ తీయడమన్న విషయంపైనే దృష్టిపెట్టేవారని చాలా మంది టీడీపీ నేతలు చెబుతారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ సమావేశంలో ఒకసారి మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్ష పదవిని పొందడానికి ఏబీ వెంకటేశ్వర రావు క్లియరెన్స్ తీసుకోవాలని ఆశావహులకు సూచించిన వీడియో అప్పట్లో కలకలం రేపింది.వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రలోభాలు పెట్టడంలో ఏబీతో పాటు ఒక మీడియా అధినేత విశేష పాత్ర పోషించారని చెబుతారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఇజ్రాయిల్ నుంచి గూఢచర్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై కేసు పెట్టి సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఓకే చేసింది. తనపై ఆ కేసు పెట్టినందుకు ఏబీకి ఆగ్రహం ఉండవచ్చు. కానీ, ఆ కేసులో తాను సచ్ఛీలుడినని రుజువు చేసుకోవచ్చు. ఎటూ ప్రభుత్వం వారిదే కనుక తమకు కావల్సిన జీవోలను తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. కోర్టు ద్వారా రిటైర్మెంట్ రోజున సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వు పొందారు. దాన్ని గౌరవించి గత ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఏబీ తన వ్యాఖ్యల్లో వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా విమర్శించారు.అయితే, వైఎస్సార్ హాయంలో ఈయనకు వచ్చినవన్నీ దాదాపు మంచి పోస్టులేనని సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చిన వివరాలను బట్టి అర్ధం అవుతుంది. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు కర్నూలు రేంజి డీఐజీ పోస్టు ఇచ్చింది. వైఎస్సార్ సొంత జిల్లా అయిన కడప కూడా ఈ రేంజ్‌లోనే ఉంది. మరి ప్రాముఖ్యత లభించినట్లా? కాదా? హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిక్రూటింగ్, వైజాగ్ రేంజ్ ఐజీ వంటి బాధ్యతలను కూడా అప్పట్లో అప్పగించారు. వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఈయనను అంతగా ప్రాధాన్యం లేని ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. అయినా వైఎస్సార్‌పై ఈయన విమర్శలు చేయడం ధర్మమా? అన్నది కొందరి ప్రశ్న.ఇక్కడ మరో మాట చెప్పాలి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి అవమానించినప్పుడు కమ్మవారికి అవమానం జరిగినట్లు కాదా?. చంద్రబాబుకో, ఏబీ వంటివారికో ఏదైనా ఇబ్బంది వస్తే, వారిపై ఆరోపణలు వస్తే కమ్మ వారందరికీ వచ్చినట్లా? ఏ కులంలో అయినా లాభం కొందరికే లభిస్తూంటుంది. సంపాదన, పెత్తనం కూడా కొందరికే దక్కుతుంది. అలాంటివారు ఆ కులంలోని ఇతరులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. ఏబీ కూడా సరిగ్గా అదే పని చేసినట్లుగా కనిపిస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు, లోకేష్ వంటివారి ధోరణి వల్ల రెడ్లతో సహా మిగిలిన పలు కులాల వారిలో అభద్రతాభావం ఏర్పడుతుంది. పైకి కాపులను కలుపుకున్నట్లు కనిపిస్తున్నా వారికి క్షేత్రస్థాయిలో అనేక అవమానాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎదుటే ఒక జనసేన నేత ఆత్మహత్యాయత్నం చేయడం. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎంగా ఉంటే, ఆయనకు పోటీగా లోకేష్‌ను కూడా ఆ హోదాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు కాపులలో కాక రేపుతోంది.జనసేన, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ఈ తరహా అసందర్భ ప్రసంగాలు చేసి సమాజంలో మరింత అశాంతికి దోహదపడడం ఐపీఎస్ హోదాకే అవమానం కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చిన ఈయన రిటైరయ్యాక వ్యవహరిస్తున్న తీరు చూశాక, పదవి బాధ్యతలలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నారని ఎవరైనా అనుకోగలరా?. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దటీజ్ జగన్..పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల మధ్య ఓ తేడా ఉంది. ఇద్దరూ పోటాపోటీగా రాష్ట్రం చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేస్తూంటారు. జరిగిన ప్రతి మంచిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూంటారు. కారణమేమిటో తెలియదు కానీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచిని అనివార్యంగానైనా గుర్తిస్తున్నారు. ఏదో మాటవరసకు బాబుగారిని పొగుడుతూన్నట్టు కనిపిస్తాడేగానీ పవన్ ఆంతర్యం మొత్తం గత ప్రభుత్వం తాలూకేనని తేలికగానే అర్థమైపోతుంది.పవన్ ఈ మధ్యే కర్నూలు జిల్లా పెన్నాపురం వద్ద ‘గ్రీన్ కో’ సంస్థ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్తు ప్లాంట్లను పరిశీలించారు. వెళ్లకముందు ఆ కంపెనీ అటవీ భూములను ఆక్రమించిందని, విచారించాలని అధికారులకు సూచించారు. కానీ.. ఆ తరువాత మాత్రం ప్రాజెక్టు ఒక అద్భుతమని కొనియాడారు. బహుశా వ్యతిరేక వ్యాఖ్యలు ఎల్లో మీడియా ఈ ప్రాజెక్టుపై రాసిన తప్పుడు కథనాల ఫలితం కావొచ్చు. సుమారు రూ.28 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేసింది అందరికీ తెలిసిందే. అంతెందుకు అప్పట్లో టీడీపీ నేతలు కొందరు ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై విమర్శలు చేసినా జగన్ వాటిని పట్టించుకోలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న కృత నిశ్చయంతో కంపెనీకి అవసరమైన వనరులను సమకూర్చారు. ఈ గ్రీన్ కో కంపెనీలో ముఖ్యుడు చలమలశెట్టి సునీల్ 2024లో వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. ఈ కారణంగా ఆ కంపెనీపై టీడీపీ, జనసేన ముఖ్యనేతలకు గుర్రుగా ఉండేది. ఆ క్రమంలోనే గ్రీన్ కో రిజర్వు ఫారెస్ట్ పరిధిలో అటవీభూముల ఆక్రమణకు పాల్పడిందని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిందని, అటవీశాఖ మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఆరా కూడా తీశారని ఎల్లో మీడియా ఈనాడు ఒక వార్తను రాసింది. గతంలో సునీల్‌కు ప్రజారాజ్యం, టీడీపీ పక్షాలతో కూడా అనుబంధం ఉంది. అయినా గతసారి వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేశారు కాబట్టి ఎలాగోలా ఇబ్బంది పెట్టాలని ఎల్లో మీడియా ప్రయత్నించింది. అందులో భాగంగానే గత మార్చిలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడు పత్రిక ఎంత ఘోరంగా రాసిందో చూడండి..'అస్మదీయుడికి అదిరేటి ఆఫర్" అంటూ సునీల్ కుటుంబ కంపెనీకి భారీ భూ సంతర్పణ చేశారని, అది కూడా ఎకరా రూ.ఐదు లక్షలకే అని ప్రచారం చేసింది. సుమారు 1500 ఎకరాల భూమిని పరిశ్రమకు ఇవ్వడంపై విషం కక్కింది. అక్కడ విలువ రూ.కోటి ఉంటే తక్కువ ధరకు ఇచ్చారని ఏడ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో కొంతకాలం గ్రీన్ కో పై తప్పుడు రాతలు రాసిందని చెప్పవచ్చు. ఉదాహరణకు 2024 జూలై 18 న ఒక కథనాన్ని వారి టీవీలో ప్రసారం చేస్తూ ‘అడవి తల్లికి గాయం’ అని కంపెనీని ఇబ్బంది పెట్టే యత్నం చేసింది. అదే నెలలో అంతకుముందు వారి పత్రికలో కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అని దుర్మార్గంగా రాసింది. ఆ తర్వాత ఏమైందో కాని మొత్తం ప్లేట్ మార్చేసింది. వారి పత్రికలో 'జల కిరణాలు" అనే శీర్షికన ఈ ప్రాజెక్టును ఆకాశానికి ఎత్తేసింది. ఎత్తైన కొండలు, కశ్మీర్ అందాలు తలపించే లోయలు, జల హోయలు, సౌర ఫలకలు, గాలిమరలు, అబ్బుర పరుస్తున్నాయని ఇదే పత్రిక తెలిపింది. ఎండ, నీరు, గాలి ఆధారంగా చేసే విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ లేని విధంగా నిర్మిస్తున్నారని పేర్కొంది.ఆ కంపెనీతో ఈనాడుకు లాలూచీ అయిందా? లేక బుద్ది తెచ్చుకుని వాస్తవాలు రాసే యత్నం చేసిందా? అన్న ప్రశ్నకు ఎవరు జవాబు ఇస్తారు? ఈ ప్రక్రియలో ఎక్కడా జగన్‌కు క్రెడిట్ ఇవ్వకుండా మాత్రం జాగ్రత్తపడింది. పవన్‌కు ఆ కంపెనీ వారితో ఉన్న పరిచయాలు లేదా సంబంధ బాంధవ్యాల రీత్యా ప్రత్యేకంగా అక్కడకు వెళ్లారు. దానిని పూర్తిగా తిలకించిన తర్వాత ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమని మెచ్చుకున్నారు.ఇది పూర్తి అయితే విదేశాలకు కూడా కరెంటు అమ్మవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగాను, మరో 40 వేల మందికి పరోక్షంగాను ఉపాధి వస్తుందని కూడా ఆయన తెలిపారు. ఈ మాట విన్న తర్వాత ‘‘హమ్మయ్యా.. ఇప్పటికే ఏపీలో పలు విధ్వంసాలు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదలి వేసిందిలే!’’ అనే భావన ఏర్పడింది. ఇది జగన్ ప్రభుత్వ కృషి అని పవన్ ప్రశంసించకపోయినా, ప్రజలందరికి అర్థమైపోయింది. జగన్ ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు ఈ రూపు సంతరించుకుందని.. ఆ రకంగా సోషల్ మీడియాలో విస్తారంగా వీడియోలు వచ్చాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లి ఇది ప్రైవేటు స్కూలేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న బల్లలు, కుర్చీలు, డిజిటల్ బోర్డులు అన్నిటిని గమనించిన ఆయన స్కూల్ ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అంతకుముందు లోకేష్ కూడా ఒక స్కూల్ కు వెళ్లినప్పుడు అదే అనుభవం ఎదురైంది. అంటే ప్రతిపకక్షంలో ఉన్నప్పుడు ఎంత విష ప్రచారం చేసినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తరువాతైనా జగన్ చేసిన మంచిని, అభివృద్దిని ఏదో రకంగా ఒప్పుకోక తప్పలేదు. జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలు, గ్రామ, గ్రామాన నిర్మించిన సచివాలయ భవనాలు, పోర్టులు మొదలైన వాటిని అప్పుడు ప్రజలు గుర్తించారో లేదో కాని, ఇప్పుడు కూటమి నేతలు పర్యటించినప్పుడు జనానికి అర్థమవుతున్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తన శైలిలోనే ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తన గొప్పతనమని, వైఎస్సార్సీపీ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శలు చేస్తుంటారు. దావోస్ పర్యటనలో కూడా ఏపీలో నిర్మాణం చేస్తున్న పది ఓడరేవుల గురించి చంద్రబాబు చెప్పక తప్పలేదు. అవన్నీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నారన్నది తెలిసిన సంగతే. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ హరిత ఇంధన హబ్ గా అవుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకుంటే చెప్పుకున్నారు కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. జగన్ తన హయాంలో సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలోకి తీసుకు వచ్చారు. అప్పుడేమో ఎల్లో మీడియా ‘అదానీ వంటి కంపెనీలకు ఏపీని రాసిచ్చేస్తున్నారు’ అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేసింది. భూములను లీజుకు ఇప్పించడాన్ని కూడా తప్పు పట్టింది. ఇప్పుడు అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తోంది. మరి దీనిని ఏమనాలి?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుతోందా? టీడీపీ వర్గాల్లో కొందరు మంత్రి లోకేష్ భావి సీఎం అంటుంటే.. డిప్యూటీ సీఎం అని మరికొందరు వ్యాఖ్యలు చేయడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు పదవుల్లో ఏది దక్కినా.. ఇప్పటివరకూ కూటమి భాగస్వామి, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోదాకు భంగం కలిగినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీతో కొనసాగితే పవన్ ఎప్పటికీ సీఎం కాలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ నేతను అడ్డుకునేందుకే టీడీపీ లోకేష్‌ను తెరపైకి తెచ్చిందన్న ఆలోచన కూడా జనసేనలో ఉన్నట్లు చెబుతున్నారు.తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పదోన్నతిపై దావోస్ పర్యటన సందర్భంగా చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే చాలని టీడీపీ నేతలు పలువురు బహిరంగంగా కోరుతూంటే.. వీలైనంత తొందరగా సీఎంను చేయాలని చంద్రబాబు నాయుడిపై ఆయన కుటుంబం నుంచే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ చాలా స్పష్టంగా భావి ముఖ్యమంత్రి లోకేష్ అని ప్రకటించగా టీడీపీ నేతలు మాత్రం ఏదైనా ఉంటే కూటమి పక్షాలతో కలిసి మాట్లాడుకుంటామని అంటున్నారు. భరత్ ప్రకటన ఏదో మొక్కుబడి వ్యవహారమని అంటున్నారే కానీ.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసే ప్రతిపాదన ఏదీ లేదని మాత్రం వారు ఖండించకపోవడం గమనార్హం.కొద్దికాలం క్రితం పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ మరో పదేళ్లపాటు చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. లోకేష్‌కు చెక్ పెట్టేందుకు ఆయన ఆ మాట మాట్లాడారా? లేక చంద్రబాబే కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు పవన్ చేత అలా మాట్లాడించారా? అన్నది చెప్పలేము. ఎందుకంటే.. సీఎం పదవిని ఇప్పుడిప్పుడే వదులుకునే ఆలోచన బాబు చేయరు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తే జనసేన నుంచి సమస్యలు రావచ్చునని కూడా బాబుకు తెలుసు. అందుకే ఆయన మధ్యే మార్గంగా ప్రస్తుతానికి లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చు. కాకపోతే ఈ ప్రతిపాదనకు లోకేష్ మద్దతుదారులు, బాబుగారి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాలి.నారా లోకేష్‌కు పదోన్నతిపై ప్రచారం మొదలుపెట్టడం ఒక రకంగా రాజకీయ వ్యూహం. ఇతరుల ద్వారా కొన్ని అంశాలను ప్రచారంలో పెట్టడం.. వ్యతిరేకించే వారిని మానసికంగా సిద్ధం చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. అంగీకరించేవారు ఉండవచ్చు లేనివారు వారి దోవన వారు వెళ్లవచ్చునని సంకేతం ఇవ్వడం కూడా. ఇలాంటి విషయాలలో చంద్రబాబుది ఘనాపాటే. గతంలో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేయడానికి ముందు కూడా ఇలాంటి వ్యూహాన్నే ఆయన అమలు చేశారు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిపై దుష్ప్రచారం చేయించడం, ఆమె పెత్తనం పెరిగిపోవడం వల్ల పార్టీకి నష్టమంటూ వంత మీడియా ఈనాడులో కథనాలు రాయించడం చేసేవారు. ఆ టైమ్‌లోనే అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష్మీపార్వతిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.దీంతో, చంద్రబాబు వర్గం ఈ పాయింట్‌ను అడ్డం పెట్టుకుని కథ నడిపింది. అదే జరిగితే మీ పరిస్థితి ఏమిటన్న ఆందోళనను ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కల్పించడంతోపాటు వారిని తనవైపు తిప్పుకునేందుకు వరాల జల్లు కురిపించారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ చూపారు. పార్టీ అధ్యక్ష పదవిని ఎన్టీఆర్ పెద్దకుమారుడు హరికృష్ణకు ఎరవేశారు. మొత్తమ్మీద ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేశారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే వర్గపోరు వస్తుందని, కుటుంబ పెత్తనం అంటారని ప్రచారం చేయించారు. దగ్గుబాటికి డిప్యూటీ సీఎం, హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి రెండూ దక్కకుండా చూశారు. హరికృష్ణకు మంత్రి పదవి మాత్రమే విదిల్చారు.అయితే మంత్రి పదవి వచ్చేటప్పటికి హరికృష్ణ ఎమ్మెల్యే కాదు. ఆరునెలల్లోపు ఎన్నికై ఉంటే పదవి దక్కేది కానీ.. కాలేకపోయారు. దీంతో మంత్రి పదవి కూడా పోయింది. తరువాతి కాలంలో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైనా హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాబు మార్కు రాజకీయం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గాన్ని నడిపిన చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వర్గాలను సహించనంటూ హెచ్చరికలు చేస్తుండే వారు. ఇప్పటికీ అదే తరహా రాజకీయం చేస్తున్నారు. నిజంగానే లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా లేకపోతే, ప్రకటనలు చేస్తున్న టీడీపీ నేతలను వారించే వారు. కానీ, పార్టీ నేత శ్రీనివాసరెడ్డి ఆయన సమక్షంలోనే లోకేష్ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, ఎన్నికలలో చాలా కష్టపడ్డారని, అందువల్ల ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. చంద్రబాబు దీన్ని వారించలేదు.ఇదే సమయంలో మరికొందరు టీడీపీ నేతలు దాన్ని ఒక డిమాండ్‌గా మార్చారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ లోకేష్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడం కూడా గమనించాలి. పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవని తేలుతుంది. లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించినట్లవుతుందని తెలిసినా కూడా వీరంతా ఇలా మాట్లాడుతున్నారంటే అందులో మతలబు అర్థమవుతూనే ఉంది.మరోవైపు లోకేష్ కూడా తన పార్టీ నేతల ప్రకటనలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నా, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అతిగా వ్యవహరిస్తున్నారన్న భావనతో ఉప ముఖ్యమంత్రి పదవి కోరుకుంటుండవచ్చు. లోకేష్, పవన్ కళ్యాణ్‌ల మధ్య ప్రచ్ఛన్న పోటీకి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ ఇరువురి మధ్య సంబంధాలు గొప్పగా ఏమీ లేవని స్పష్టం చేశాయి. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ చెబితే లోకేష్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తోసిపుచ్చడం.. ఎన్నికలకు ముందు కూడా సీఎం పదవిని జనసేన అధినేతతో పంచుకోవాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చడం మచ్చుకు రెండు ఉదాహరణలు.ఎన్నికల్లో పొత్తు కావాలని టీడీపీ కోరుకుంటూంటే జనసేనకు యాభై సీట్లు ఇవ్వాలని తమకు పాతికి సీట్లు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఈ మాట అనేందుకు కూడా జంకారు. ఇలాంటి షరతులే పెట్టి ఉంటే రాజకీయం ఇంకోలా ఉండేది. పవన్ కళ్యాణ్, బీజేపీలకు కూటమిలో ఎంతో కొంత పట్టు దొరికేది. ఎన్నికలకు ముందు తాను, చంద్రబాబు సమానం అనుకుని పవన్ మాట్లాడేవారు. కొంతకాలం అలాగే నడిచింది. చంద్రబాబు కూడా పవన్‌ను అదే భ్రమలో ఉంచుతూ వచ్చారు. కానీ, కాలం మారుతుంది కదా.. ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుతో సమానంగా పవన్ ఎలా ఉంటారన్న ప్రశ్న టీడీపీలో వచ్చింది.ఇక, సీఎం పదవి లోకేష్‌కు ఇవ్వాలన్న వాదన కూడా వస్తుండడంతో లాభం లేదని ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయనను తీసుకురావడానికి వ్యూహరచన మొదలైంది. అందులో భాగంగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చంద్రబాబుకు చెరో వైపు పవన్ కళ్యాణ్, లోకేష్‌ల బొమ్మలు కూడా ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ముద్రించారు. నిబంధనలకు విరుద్ధమైనా లోకేష్ ఫోటో వేయడం చంద్రబాబు మనసులో మాటను చెప్పడమే అవుతుంది. ఆ తర్వాత స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ ప్రకటనలో కూడా పవన్, లోకేష్‌ల ఫోటోలు వేశారు. దీని ద్వారా పవన్‌కు స్పష్టమైన సందేశం పంపించారు. తద్వారా చంద్రబాబుతో సమానం అనుకుంటున్న పవన్ స్థాయిని సక్సెస్ ఫుల్‌గా తగ్గించారు. ఇక లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే, పూర్తి ఆధిపత్యం వచ్చేసినట్లే అవుతుంది. తనకు సీఎం పదవి రాకుండా అడ్డుకుంటున్న పవన్‌కు చెక్ పెట్టినట్లు కూడా ఉంటుంది.ఈ వ్యవహారంలో బీజేపీ నేరుగా వేలు పెట్టకుండా వేచి చూస్తోంది. తెలుగుదేశంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌ను బహిరంగంగా లేవనెత్తడం గమనార్హం. దానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు, నేతలు పవన్‌ను ముఖ్యమంత్రిని చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో రెండు పార్టీల వారు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఎవరి వల్ల ఎవరు పవర్లోకి వచ్చారన్నదానిపై చర్చిస్తున్నారు. అది శ్రుతి మించి బూతులు తిట్టుకునే దశకు వెళ్లారు. అయినా పవన్, లోకేష్‌లు నోరు విప్పలేదు. ఇది పవన్, లోకేష్‌ల మధ్య రాజకీయ వార్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గం కాపులు ఎక్కువ మంది ఉన్నచోట పోటీచేసి గెలిచారని, లోకేష్ మాత్రం ఇటీవలి కాలంలో ఎన్నడూ గెలవని మంగళగిరి నుంచి విజయం సాధించారని, పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే ఎక్కువ అని టీడీపీ అభిమాని ఒకరు పోస్టు పెట్టారు. పవన్ లేకపోతే టీడీపీకి అధికారం ఎక్కడ వచ్చేది.. ఇలాగే చేయండి. మళ్లీ జగన్ సీఎం అవుతారు.. అప్పుడు మీ సంగతి చూస్తారు.. అంటూ కొన్ని అభ్యంతర పదాలతో జనసేన కార్యకర్త ఒకరు పోస్టు పెట్టారు.ఇలా ఇరువైపులా పలువురు విమర్శలు, తిట్ల పురాణం సాగిస్తున్నారు. చంద్రబాబుకు వయసు పెద్దదైందని, అందువల్ల పవన్‌ను సీఎంగా చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని జనసేన వారు కోరుతున్నారు. విశేషం ఏమిటంటే చంద్రబాబుకు వయసు మళ్లిందని జనసేన అంటుంటే, దానిని టీడీపీ వారు కూడా ధృవీకరిస్తున్నట్లుగా మాట్లాడుతూ లోకేష్‌ను సీఎం చేయాలని చెబుతున్నారు. మంత్రి టీజీ భరత్ సీఎం సమక్షంలోనే లోకేష్ ముఖ్యమంత్రి కావాలని అన్నారంటే అర్ధం అదే అన్న భావన కలుగుతుంది. లోకేష్, పవన్‌ల మధ్య సాగుతున్న ఈ గొడవతో చంద్రబాబు నిస్సహాయంగా మిగిలిపోతున్నట్లుగా ఉంది. అటు కొడుకు ఇటు పవన్ కళ్యాణ్ అయిపోయారు మరి. దానికితోడు ఈ మధ్య కాలంలో ఆయన చేసిన వివిధ వ్యాఖ్యలలో అసంబద్ధత ఎక్కువగా ఉంటుండటంతో అంతా వయసును గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్నది ఒప్పందం అని, దానిని ఎలా కాదంటారన్నది జనసేన బాధగా ఉంది. కానీ అధికారం రుచి చూసిన పవన్ కళ్యాణ్ అవమానాలనైనా భరిస్తారు కానీ ఇప్పటికైతే టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతారన్నది ఎక్కువమంది భావన. నిజంగానే లోకేష్ ఈ టర్మ్‌లోనే ముఖ్యమంత్రి అయితే పవన్ తగ్గి ఉంటారా? లేక ఎదిరిస్తారా? అన్నది అప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవడానికి రంగం సిద్ధం అవుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం వంటి డైలాగుల జోలికి వెళ్లకుండా సర్దుకుపోక తప్పదేమో!. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తనది రాక్షసపాలనే అని చెప్పడమే బాబు ఆంతర్యమా?
‘‘రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమ తరహాలో ఒకరి పోస్టుమార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్ మార్టమ్ తప్పదు. ఒకరిని చంపితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ వ్యక్తిని కూడా చంపుతారు. సూపర్ సిక్స్ హామీలను ప్రచారం చేసింది కార్యకర్తలే. బ్యూరోక్రసి కాదు. కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది" ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ప్రకటన ఇది. చాలా ప్రమాదకరమైన, బాబు వయసు, హోదాలు రెండింటికీ తగని ప్రకటన ఇది.రాష్ట్రంలో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదని, శాంతి భద్రతల పరిరక్షణ ఏకపక్షంగానే కొనసాగనుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్లు ఉంది. ఒకప్పుడు మాజీ మంత్రి పరిటాల రవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఇలాంటి ప్రకటనే ఒకటి చేశారు. కొంతకాలం తీవ్రవాదిగా ఉండి ఆ తరువాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన పరిటాల రవి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీయార్ కేబినెట్లో మంత్రి అయిన విషయం తెలిసిందే. ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నేతలకు, ప్రత్యర్థి వర్గాలకు రవి అంటే హడల్! తాడిపత్రి కేంద్రంగా రాజకీయం నడుపుతున్న జేసీ సోదరులకు, రవికి అస్సలు పడేది కూడా కాదు. పెనుకొండ ప్రాంతంలో పరిటాల రవి, ఆయన ప్రత్యర్ది మద్దెలచెరువు సూరి వర్గానికి మధ్య పెద్ద ఎత్తున వర్గపోరు నడుస్తూండేది.ఇందులో ఇరుపక్షాల్లోనూ చాలామంది హత్యకు గురయ్యారు. వీరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చివరకు రవి కూడా అనంతపురంలో టీడీపీ ఆఫీసు వద్ద జరిగిన కాల్పుల్లో హతమైన వైనమూ తెలిసిందే. ఫ్యాక్షన్ గొడవలపై ఒకసారి ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది.. ‘‘నాకు తెలుసన్నా.. ఎప్పటికైనా బల్ల ఎక్కాల్సిందే’’ అన్నారాయన. బల్ల ఎక్కడమేమిటి? అంటే.. ‘‘పోస్టమార్టమ్ టేబుల్’ అని సమాధానమిచ్చారు ఆయన. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. జేసీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తాడిపత్రి మున్సిపాలిటీ కాస్తా టీడీపీ తేలికగా స్వాధీనం చేసుకోగలిగింది.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాజాగా ‘పోస్ట్ మార్టమ్’ మాట ఎత్తడానికి ప్రాముఖ్యత ఏర్పడుతోంది. రాయలసీమలోనే కాకుండా.. రాష్ట్రమంతా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామని చెబుతున్నట్లుగా ఉందీ మాటలు వింటే. మంత్రి లోకేశ్ ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న నేపథ్యంలో బాబు ఇలా మాట్లాడటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ను లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో అదంత తేలిక కాదు కానీ.. 74 ఏళ్ల వయసులో, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి కేవలం తన కుమారుడికి అధికారం కట్టబెట్టేందుకు ఇంత దారుణంగా మాట్లాడతారా? అన్న విమర్శలు వస్తున్నాయి.2014లో కూడా చంద్రబాబు అధికారంలోకి రాగానే, తమ పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పారు. కానీ 2019లో జగన్ అధికారం చేపట్టిన తరువాత పార్టీలకు, కులమతాలకు అతీతంగా పాలన సాగించాలని అధికారులకు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎలాగైతేనే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించారు. విధ్వంసాలకు పాల్పడుతున్నారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లను దగ్దం చేయడం, హత్యలకు పాల్పడడం, వేధింపులు మొదలైన చర్యలతో రాజకీయ పాలన దుర్మార్గం మొత్తాన్ని ప్రదర్శించారు.ఇదీ చదవండి: బాబూ.. ఇందులో ఒక్కటైనా వచ్చిందా?అయినా చంద్రబాబుకు తృప్తి కలిగినట్లు లేదు. ఇప్పుడు ఏకంగా పోస్టుమార్టమ్ పాలన అంటున్నారు. ఎంత దారుణం! చంద్రబాబు తన పార్టీవారికి అక్రమాలకు లైసెన్స్ ఇచ్చేశారు. అందువల్లే ఇలాంటి ఘోర కృత్యాలు జరుగుతున్నట్లు ఇప్పుడు తేటతెల్లమవుతోంది. చంద్రబాబు గతంలోనూ రాయలసీమలో ఒకపక్క ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఇంకోపక్క వాటిని అదుపు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తూండేవారు. ఈ సారి మాత్రం నేరుగానే సూచనలిస్తున్నారు. అందుకే టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పాలన పడకేసింది. అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని అనేక మంది చెబుతున్నారు.ఈ మద్య ఏపీకి వెళ్లి వచ్చిన తెలంగాణ సీనియర్ అధికారి ఒకరు ఆసక్తికర పరిశీలన చేశారు. 'చంద్రబాబు పాలన ఇంత వీక్ గా ఉంటుందని ఊహించలేదు. ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరింది" అని ఆయన అన్నారు. అది నిజమేనని పలు ఉదంతాలు తెలియచేస్తున్నాయి. అధికారంలోకి రాగానే వైసీపీ వారిపై దాడులు చేయడమే కాదు.. యూనివర్భిటీలపై టీడీపీ చెందిన అసాంఘిక శక్తులు దాడులు చేసి వైస్ చాన్సలర్ లను దూషించి వారితో రాజీనామాలు చేయించి కొత్త ట్రెండ్ సృష్టించారు. ఆ తర్వాత ప్రభుత్వపరంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇసుక దోపిడీకి గేట్లు ఎత్తివేశారు. సుమారు 40 లక్షల టన్నుల ఇసుకను ఊదేశారు.తదుపరి రాష్ట్రవ్యాప్తంగా మద్యం కొత్త పాలసీని తెచ్చి పార్టీవారే షాపులన్నీ పొందేలా చేశారు.వేరే ఎవరైనా షాపులు ఒందితే అందులో బలవంతంగా 30 శాతం వాటాను, టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు లాక్కున్నారు. యథేచ్ఛగా బెల్ట్ షాపులు పెట్టుకునేందుకు గ్రామాల్లో వేలంపాటలు జరిగే స్థాయికి పరిస్థితి వెళ్లింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన కోడిపందాలు, గుండాట, జూదం ,బెట్టింగ్ వంటివాటిని కూడా టీడీపీ నేతలే నిర్వహించుకున్నారు. ఈ వ్యవహారంలో కొన్నిచోట్ల జనసేన, టీడీపీ బాహాబాహీకి దిగడం, కొన్ని చోట్ల ఘర్షణలు జరగడం ఇటీవలి పరిణామాలే.మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటివి విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల టీడీపీ వారే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, అరాచకాలపై టీడీపీ జాకీ మీడియాలోనే కథనాలు వచ్చాయి. వీటన్నింటిని అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి ఒకటి అర మాటలతో వదిలిపెట్టడమే కాకుండా.. ఇప్పుడు నేరుగా ఆయనే పోస్ట్‌మార్టమ్ మాటలు మాట్లాడుతున్నారు.ఇలా మాట్లాడితే టీడీపీ వాళ్లు పెట్రేగిపోరా? ఈ రాజకీయ పాలన ద్వారా ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలన్నది చంద్రబాబు వ్యూహం కావచ్చు కానీ.. చరిత్ర అలా ఉండదు. ఆయన చెప్పిన సిద్ధాంతాన్నే ఎదుటి పార్టీలు, ప్రత్యర్ధులు కూడా పాటించే అవకాశం ఉంటుంది. అధికారం ఉన్నా, లేకపోయినా ఇలాంటివాటిని ప్రోత్సహించకూడదు. వచ్చేసారి ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే అప్పుడు ఆ పార్టీ వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఊహించుకోవాలి. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రెచ్చగొట్టారు కదా అని టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతే వారికే నష్టం. ఎల్లకాలం తమకు విధేయులుగా ఉంచుకోవాలనే ఫ్యూడల్ ధోరణిలో చంద్రబాబు మాట్లాడారనిపిస్తుంది. ఇది రాజకీయపాలనగా ఉండదు. రాక్షస పాలన మాత్రమే అవుతుందన్న సంగతి గుర్తిస్తే మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వాట్సాప్ పాలన.. అలాంటి విజన్ కాదుగా!
ఎప్పటికి ఎయ్యేది ప్రస్తుతమో అప్పటికి.. ప్రజలను మాయ చేయడమనేది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిత్యకృత్యంలా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలు తయారు చేసి ప్రజలపైకి వదులుతూంటారు ఈయన. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఆత్మ పరిశీలనను ఏమాత్రం చేసుకోరు. సరికదా.. తాను చేసిందే రైట్ అన్నట్టుగా వ్యవహరిస్తూంటారు. ఏ రోజుకు ఆ రోజు మీడియాలో కనిపించామా లేదా? అన్నదే ఆయన ఆలోచనగా ఉంటుంది. ఇలా బాబు గారి బుర్రకు తట్టిన సరికొత్త నినాదం ‘వాట్సప్ పాలన’!!!. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మాల చెంతకు చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎనిమిది నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచి మరీ ఈ వ్యవస్థకు మంగళం పాడేశారు. ఇప్పుడు కొత్తగా వాట్సప్ పాలన రాగం అందుకున్నారు. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు గారు గతంలోనూ ఇలాంటి గిమ్మిక్కులు చాలానే చేశారు. ఒకసారి సుపరిపాలన అంటారు ఇంకోసారి కంప్యూటర్ పాలన అంటారు. జన్మభూమి కమిటీలతో పాలన అని రకరకాల పేర్లతో ప్రజల్లో ఏదో ఒక భ్రమ నిత్యం ఉండేలా చూస్తారన్నది తెలిసిందే. వాట్సప్ పాలన కూడా ఇదే కోవకు చెందిందా? ప్రజలకు ఏమైనా ప్రయోజనం లభిస్తుందా? లేక బాబుగారి ప్రచార ఆర్భాటాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోతుందా?.... వాట్సప్ పాలన ఆలోచన నిజాయితీతో కూడినదైతే తప్పు లేకపోవచ్చు. అయితే కొంచెం తరచి చూస్తే దీని లక్ష్యం ఇంకోటి ఏదో అని అనిపించకమానదు. ఎందుకంటే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని, గౌరవ వేతనాన్ని రూ.ఐదు నుంచి రూ.పది వేలకు పెంచుతామని చంద్రబాబు గత ఏడాది ఉగాది పర్వదినం రోజున దైవసాక్షిగా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనికి ‘ఊ’ కొట్టారు. పెంచిన జీతం పక్కా అని ఊదరగొట్టారు. కానీ పాత లక్షణాలు అంత తొందరగా పోవంటారు. మాట ఇచ్చి తప్పడమనే బాబుగారి పాత లక్షణం కూడా మాసిపోలేదు. ఎన్నికలయ్యాక యథా ప్రకారం క్రమ పద్ధతిలో వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ బాబు ఒకడుగు ముందుకేసి ‘‘వలంటీర్ల వ్యవస్థ ఎక్కడుంది?’’ అని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని, అందువల్ల అసలు వ్యవస్థే లేనప్పుడు జీతాలు ఇస్తామని వీరు అమానవీయ ప్రకటనలు చేశారు. అప్పటికి గాని వలంటీర్లకు చంద్రబాబు, పవన్ అసలు స్వరూపం తెలియరాలేదు. రెండు లక్షల మంది వరకూ ఉన్న వలంటీర్లకు ఉన్న కాస్తా అదరువు కూడా లేకుండా పోయింది. ప్రజలకు అందాల్సిన సేవలూ నిలిచిపోయాయి. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి వ్యాధి నియంత్రణకు ఈ వ్యవస్థ చేసిన కృషిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. గ్రామాల్లో ఎవరికి ఏ అవసరమొచ్చినా వలంటీర్‌కు చెబితే చాలు అన్నీ జరిగిపోతాయన్న భరోసా ఉండేది. కులం, నివాస, ఆదాయం.. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా గంటల వ్వవధిలో ఇంటికి చేర్చేవారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇళ్ల వద్దే వృద్దులకు ఫించన్లు అందచేసేవారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ప్రజల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ప్రభుత్వం వాట్సప్ పాలన ఆలోచన!. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను వాట్పప్ ద్వారా అందివ్వాలన్నది ఈ వాట్సప్ పాలన ప్రాథమిక ఆలోచన. దీంతోపాటే మరో 150 రకాల ప్రభుత్వ సేవలూ అందిస్తామని చెబుతున్నారు. బాగానే ఉంది కానీ.. అంత సులువుగా అంతా జరిగిపోతుందా? ప్రజలు ఆఫీసులకు వెళ్లకుండానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయా? ప్రజలు వాట్సప్ ద్వారా తమ అవసరాలు తెలియజేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారా? ఆ స్థాయిలో యంత్రాంగం ఉంటుందా? వాట్సప్‌లో నకిలీ సర్టిఫికెట్లు వస్తే ఏమి చేయాలి? ఎవరైనా వాట్పప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చా? అనేది చూడాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా ఈ వాట్సప్ పాలన అదిరిపోతుందని ఇకపై ప్రచారం చేయవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ప్రజలు మర్చిపోవడానికి దీనిని ప్లాన్ చేసి ఉండవచ్చు. ఇది డైవర్షన్ టాక్టిస్లలో ఒకటని చెప్పవచ్చు. ఇదే టైమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన ప్రచారానికి కూడా ఈ వ్యవస్థను వాడుకునే అవకాశం ఉంది. గతంలో సుపరిపాలన ,కంప్యూటర్ పాలన అంటూ రకరకాల విన్యాసాలు చేశారు. కాని అవేవీ ప్రజలకు సంతృప్తి కలిగించలేదు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి ప్రతి పనికి ఏభై శాతం వాటా చెల్లించాలని కండిషన్ పెట్టేవారు. ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తే, ఆయనను దించేసి ప్రజల వద్దకు ప్రభుత్వం అంటూ కొంతకాలం హడావుడి చేశారు. అవన్ని ఆయన తన పబ్లిసిటీ కోసమే వాడుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయం. తత్ఫలితంగా 2004లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2014 టరమ్‌లో జన్మభూమి కమిటీల పాలన చేశారు. అది ప్రజలను మరింతగా వేధించింది. దాంతో 2019లో మళ్లీ పరాజయం చెందారు. ఈసారి వాట్సప్ పాలన. ఇది ఏ ఫలితాన్ని ఇస్తుందో?. ఇక.. మరోవైపు ప్రతి కుటుంబం నలుగురు పిల్లలు కలిగి ఉండాలని ఆయన ప్రచారం ఆరంభించారు. కుటుంబ నియంత్రణను తానే గతంలో ప్రచారం చేశానని, ఇప్పుడు పిల్లలను అధికంగా కనమని చెబుతున్నానని అంటున్నారు. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్లే అని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. నిజంగానే 400 ఎకరాలు ఉన్నట్లే అయితే చంద్రబాబు చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వారే తమ కుటుంబంలో ఎందరు పిల్లలు ఉండాలన్నది డిసైడ్ చేసుకుంటారు. చంద్రబాబు ముందుగా తన కుటుంబం, బంధు మిత్రులు, తెలుగుదేశం నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ నలుగురు పిల్లల సిద్ధాంతం చెప్పి ఆచరింపచేయాలని కొందరు సూచిస్తున్నారు. ఉన్నతాదాయ వర్గాల వారు నలుగురు పిల్లలు ఉన్నా బాగానే పోషించుకోగలుగుతారు. ప్రస్తుత సమాజంలో వారేమో ఒక్కరు లేదా ఇద్దరికి పరిమితం అవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటే ఎవరు పోషిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికే అధిక సంతానం ఉన్న పేద కుటుంబాలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో అందరికి తెలుసు. చంద్రబాబును నమ్మి పిల్లలను కంటే కొంప మునుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ఇంటిలో స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎందరు ఉంటే వారందరికి రూ.15 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని టీడీపీ, జనసేన జాయింట్ మేనిఫెస్టోలో ప్రకటించాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదికి తల్లికి వందనం స్కీమ్‌కు ఎగనామం పెట్టారు.అలాగే మహిళలు చంద్రబాబును నమ్మెదెలా? అనే మరో చర్చ నడుస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పోనీ యువత అయినా విశ్వసిస్తారా? అంటే అదీ కనబడడం లేదు. నిరుద్యోగులపై యువకులు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసి తుస్సుమనిపించారు. ఎప్పుడు ఈ స్కీములు అమలు అవుతాయో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు లేదా అంతకుమించి పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత నిబంధన తెస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఎవరికైనా పిల్లలు కలగకపోతే వారు స్థానిక ఎన్నికలకు అర్హులు కారని ప్రభుత్వం చెబితే దారుణంగా ఉంటుంది. అది కేవలం స్థానిక ఎన్నికలకే ఎందుకు? ముందుగా శాసనసభ ఎన్నికలలో నిబంధన పెట్టేలా కేంద్రానికి చెప్పి చేయించవచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలను కనడం కరెక్టా ? కాదా? అన్నది ప్రశ్న కాదు. నిజంగానే ప్రతి కుటుంబం అలా చేస్తే ప్రత్యేకించి, పేద, మధ్య తరగతి కుటుంబాలు వారందరికి సరైన విద్య చెప్పించగలుగుతాయా? వైద్యం అందించగలుగుతాయా? ప్రభుత్వాలు వారందరికి ఉపాధి అవకాశాలు చూపగలుగుతాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఎప్పుడో ఏదో ఒక కొత్త సంగతి చెబుతూ ప్రజలను ఏమార్చుతూ, వేరే అంశాలపై చర్చ జరిగేలా చేస్తే సూపర్ సిక్స్ వంటివాటిని జనం మర్చిపోతారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతా బాగానే ఉందా? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం గంటల తరబడి వేచి ఉండి, చివరికి తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణించినా... ప్రభుత్వం, టీటీడీ పెద్దలు అదేదో చాలా చిన్న అంశమైనట్లు వ్యవహరిస్తున్నారా? టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి తమ మధ్య విభేదాలు లేవు.. కలసి పని చేస్తున్నామని చెబితే జనం నమ్మాల్సిందేనా?.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు బీఆర్ నాయుడు ఇతర ఉన్నతాధికారులంతా ఎవరిని మోసం చేస్తున్నారు?. ప్రజలనే కాదు.. తమను తాము మోసం చేసుకుంటూ తిరుమలేశుడిని కూడా మోసం చేయడం కాదా!. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు సూక్తి ముక్తావళి చెబుతున్నారు. తిరుమల లడ్డూ ఉదంతం నుంచి వరసగా జరుగుతున్న అనేక సంఘటనలలో అపచారానికి పాల్పడుతున్నది ఎవరు?. హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నది ఎవరు?. కచ్చితంగా చంద్రబాబు, పవన్‌తో పాటు బీఆర్ నాయుడు కూడా బాధ్యత వహించవలసిందే. 👉బీఆర్ నాయుడు(BR Naidu)కు నిజంగా హిందూ సెంటిమెంట్, దైవభక్తి ఉంటే పదవి నుంచి తప్పుకుని దైవ సన్నిధిలో క్షమాపణ కోరి ఉండాల్సింది. ఒకవేళ రాజీనామాకు మొండికేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవి నుంచి తొలగించి ఉండాలి. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు, టీటీడీ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఉప ముఖ్యమంత్రి పవన్ తిరుపతిలో సనాతన హైందవ ధర్మం సక్రమంగా నడవడం లేదని, తిరుమల పుణ్యక్షేత్రానికి అపచారం జరిగిందని ప్రకటించి కూటమి నుంచి వైదొలగి ఉండాల్సింది. బీజేపీ హిందూ మతానికి తానే ప్రతినిధి అన్నట్లు నటించడం కాకుండా, తాము ఈ పాపానికి బాధ్యత తీసుకోలేమని ప్రకటించి ఉండాలి. వీరెవ్వరూ ఆ పని చేయలేదు. క్షమాపణల డ్రామా నడిపి, ఛైర్మన్, ఇద్దరు ఉన్నతాధికారులను బలవంతంగా కూర్చోబెట్టి అతా బాగున్నట్లు కలరింగ్ ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేశారు. దీంతో మరణించినవారి ప్రాణాలు తిరిగి వచ్చేసినంతగా పిక్చర్ ఇస్తున్నట్లుగా ఉంది. ఇదంతా చంద్రబాబు స్టైలే. పైకి సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తూ, లోపల మాత్రం తుతు మంత్రంగా కథ నడిపిస్తుంటారు. ఇలాంటి తొక్కిసలాటలు(Stampede) జరిగితే పదవుల నుంచి తప్పుకోవడం అనేది నైతిక బాధ్యత. అలా విలువలు పాటిస్తారనుకోవడం అత్యాశే కావచ్చు!. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట వల్ల 29 మంది మరణిస్తేనే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోలేదు. ఇప్పుడు బీఆర్ నాయుడు పదవి ఎందుకు వదలుకుంటారు?. పుష్కరాల తొక్కిసలాట కేసులో ఎవరిపైన అయినా చర్య తీసుకుంటే అది తన వరకు వస్తుందని భయపడ్డ చంద్రబాబు ఒక్కరిపై కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. తిరుపతి ఘటనలో కూడా ఒక ఐదుగురు చిన్న స్థాయి అధికారులపై చర్య చేపట్టి, తనకు కావల్సిన అధికారి ఒక్కరిని మాత్రం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ డ్రామాలో పవన్ తన వంతు పాత్ర పోషించి రక్తి కట్టించారు. కాకపోతే మధ్యలో బీఆర్ నాయుడు చేతిలో పరువు పోగొట్టుకున్నారు. బీఆర్ నాయుడుతో సహా అధికారులంతా అంతా క్షమాపణ చెప్పాలని అన్నారు. కాని టీటీడీ చైర్మన్ మాత్రం పవన్ ఎవరు తనకు చెప్పడానికి అని తీసిపారేశారు. చివరికి ముఖ్యమంత్రి ఒత్తిడితో క్షమాపణ చెప్పినా పవన్ మాత్రం ఏ మాత్రం ఫీల్ కాకుండా సరిపెట్టుకున్నారు. బీఆర్ నాయుడి దెబ్బకు భయపడి ఆయన ఇతర అధికారుల జోలికి వెళ్లలేదు. ఇక చంద్రబాబు ఎదుటే బీఆర్ నాయుడు, శ్యామలరావులు ఘర్షణ పడ్డారు. దీన్ని తెలుగుదేశం జాకీ మీడియానే ప్రముఖంగా వార్త ఇచ్చింది. ‘నువ్వంటే.. నవ్వు...’ అనుకున్నారని కూడా రాశారు. అసలు తమకు ఏమీ చెప్పడం లేదని చైర్మన్ అంటే.. తాను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నానని ఈవో అన్నారు. మధ్యలో రెవెన్యూ మంత్రి జోక్యం చేసుకోవడం, చంద్రబాబు వారించడం వంటి సన్నివేశాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ రోజున వీరెవరూ ఖండించలేదు. కానీ.. తదుపరి బి.ఆర్.నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరిలు ఏమీ తెలియనట్లు నటించారు. ఇక నుంచి కలిసి పనిచేస్తామని చెబితే అది వేరే సంగతి. కాని అసలు గొడవలే లేవన్నట్లుగా మాట్లాడి ఎవరిని ఫూల్స్‌ను చేస్తారు?. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని నాయుడు అనడం మరీ విడ్డూరం. కొద్ది నెలలుగా ఈ అపచారానికి పాల్పడుతున్నది కూటమి పెద్దలు కాదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని అబద్దం చెప్పడం అపచారం కాదా? అలాంటిది ఏమీ లేదని శ్యామలరావు తొలుత చెప్పగా, ఆయనతో మాట మార్పించ లేదా? అది అప్రతిష్ట కాదా? ఆ మీదట పవన్ రెచ్చిపోయి సనాతని అంటూ వేషం కట్టి మరింత పరువు తీయలేదా? ఐదేళ్లుగా అసలు తిరుమలనే దర్శించని బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవికి నియమించడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? ఇప్పుడు లోకేష్ మనిషిగా ఉన్నందున బీఆర్ నాయుడును కనీసం పదవి నుంచి తప్పుకో అని చెప్పలేకపోతున్న చంద్రబాబు నిస్సహాయత వల్ల ఇమేజీ దెబ్బతినడం లేదా? జరగని కల్తీకి సంప్రోక్షణ చేయించిన చంద్రబాబు ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు మరణిస్తే ఎందుకు అలా ప్రత్యేక పూజలు చేయించలేదు? ఇది అపచారం కాదా? ఈ ఘటన కారణంగా భక్తుల సంఖ్య తగ్గిందని అంకెలతో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా అబ్బే అదేమీ లేదని బుకాయించడం అవసరమా?. టీటీడీ బోర్డులో ఛైర్మన్‌తో సహా పలువురు బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావుపై ధ్వజమెత్తడం అసత్యమా? ఆయన గుడికి వెళ్తే ఇతర అధికారులు సైతం పలకరించడానికి భయపడ్డారట!. అది ఎందుకు జరిగింది అంటే ఆయనకంటే వెంకయ్య చౌదరే పవర్ ఫుల్ అనే భావం కాదా? టీటీడీలో టెక్నాలజీని వాడుతున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ద్వారా క్రౌడ్, క్యూలైన్ మేనేజ్ మెంట్ గురించి గూగుల్ అధికారితో సలహాలు తీసుకున్నామని వెంకయ్య చెబుతున్నారు. అది నిజమైతే ఆ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారు?. పెద్ద ఘనకార్యం చేయబోతున్నట్లుగా చెప్పేవారు కదా?. ఇక.. అధికారిక సమావేశంలో కూడా కొందరు అనధికారులను ఎలా కూర్చోబెట్టారు.లక్ష్మణ్ అనే వ్యక్తి లోకేష్ సన్నిహితుడని చెబుతున్నారు. ఆయన, మరికొందరు తిరుమలలో పెత్తనం చేస్తున్న వార్తలను ఎందుకు ఖండించలేకపోయారు? తిరుపతిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు చెప్పినట్లుగానే టీటీడీ అధికారులు వ్యవహరించారని, ఒక డీఎస్పీ వల్ల తొక్కిసలాట జరిగిందని శ్యామలరావు అంటున్నారు. అంటే టీటీడీ అధికారుల తప్పు లేకపోయినా ఒక మహిళా జేఈవో పై చంద్రబాబు ఎందుకు చర్య తీసుకున్నారు?. ఎస్పీపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదు? ఇవన్ని పక్షపాతంతో చేసిన నిర్ణయాలుగానే కనిపిస్తాయి. ఇదేనా దైవభక్తి ఉన్నవారు చేసేది?. గతంలో జగన్ టైమ్‌లో ఉన్నవి, లేనివి సృష్టించి తిరుమలకు అపచారం జరిగిందంటూ చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దారుణ విష ప్రచారం చేసేవి. మరి ఇప్పుడు ఇంత ఘోరం జరిగినా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? కేవలం టీటీడీ ఛైర్మన్ నిర్వాకంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మనోభావాలు దెబ్బతింటాయా? తిరుమలకు అప్రతిష్ట వస్తుందా? గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై పదమూడు మంది మరణించిన ఘటనలో విదేశాలలో ఉన్న యాజమాన్యం వారిని కూడా అరెస్టు చేయాలని చంద్రబాబు, పవన్ లు డిమాండ్ చేశారా? లేదా?. ఆ ప్రకారమే జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించిందా? లేదా?. మరి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు దెబ్బతగిలేనా తొక్కిసలాటలో ఆరుగురు మరణిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఎందుకు కనీసం ఎవరిపైన కేసు పెట్టలేదు?. కేవలం పదవులు అంటిపెట్టుకుని హిందూ మతానికి తీరని పాపం చేస్తున్నది వీరే అని వేరే చెప్పనవసరం లేదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అబద్ధాలను అందంగా అల్లటంలో ఆరితేరారే!
ఆంధ్రప్రదేశ్‌లో పాలన రోజు రోజుకూ అధ్వాన్నమవుతోంది. ఈ మాట ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అధికార పక్షానికి వత్తాసుగా నిలుస్తున్న పచ్చమీడియానే అప్పుడప్పుడూ తన కథనాల ద్వారా చెబుతోంది. చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు కొందరు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతికి హద్దుల్లేకుండా పోయాయని టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు తమ కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వారు తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే.. రింగ్ మాస్టర్లు అదేనండి.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లకు ఎక్కడ మకిలి అంటకుండా నెపం ఇతరులపైకి నెట్టేయడం!. కిందటేడాది ఆగస్టు 28న చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ మాట్లాడుతూ ఒక మాటన్నారు.. ‘‘ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు తాను ఇటుక ఇటుక పేరుస్తూంటే.. ఎమ్మెల్యేలు కొందరు జేసీబీలతో కూలగొడుతున్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నా ఒకరిద్దరి తప్పుల వల్ల పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. బాబుగారి నేర్పరితనం ఏమిటంటే తన వైఫల్యాలు మొత్తాన్ని దారిమళ్లించేందుకు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులను మందలించినట్లు పోజ్ పెట్టారు. సరే అనుకుందాం కాసేపు. మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చిందా? ఊహూ అదేమీ కనబడదు. చంద్రబాబు కూడా ఏ చర్య తీసకోకుండా కథ నడుపుతూంటారు. ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు అధికారుల బదిలీలు, పొస్టింగ్లలో భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు... ఒక మంత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో మకాం వేసి మరీ ఈ దందా చేస్తున్నారని టీడీపీ పత్రిక తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలియ చేసిందని కూడా ఆ మీడియా పేర్కొంది. బ్లాక్‌మెయిలింగ్‌లో దిట్టగా పేరొందిన ఆ మీడియా బహుశా ఆ మంత్రిని బెదిరించడానికి ఏమైనా రాశారా? లేక నిజంగానే మంత్రి అలా చేశారా? అన్నది ఇంతవరకు అటు ఏపీ ప్రభుత్వం కాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాని వెల్లడించలేదు. ఈ రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పార్టీలకు అతీతంగా సాగుతున్న బంధాన్ని ఈ విషయం తెలియ చెబుతుంది. సదరు మంత్రి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని సోషల్ మీడియాలో ప్రచారమైంది. సీపీఎం నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ మంత్రి ఖండించలేదు. చంద్రబాబు కాని, ఆయన పేషీ కానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా ఈ మధ్య తిరుపతి సందర్శనలో కూడా చంద్రబాబు ఆ మంత్రిని పక్కన పెట్టుకుని తిరగడం విశేషం. మరో కథనం ప్రకారం.. ఆ మంత్రికి హైదరాబాద్ శివార్లలో ఉన్న భూమి విషయంలో ఏర్పడిన వివాదం రీత్యా తరచు ఇక్కడకు వచ్చి పంచాయతీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తున్నది చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా?. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి అధికారి అంటూ మరో జాకీ పత్రిక ఈ మధ్య ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే అచ్చెన్నాయుడుకు సంబంధం లేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చినట్లు కనిపించినా, కేవలం ఒక అధికారి సొంతంగా అవినీతికి పాల్పడతారా? అలాగైతే ఆ మంత్రి అంత అసమర్థుడా అన్న ప్రశ్న వస్తుంది. ఈ కథనం ఇచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా స్పందించినట్లు కనబడదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పీఏపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ పీఏ ని తొలగించానని, తను ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తి అని అనిత వివరణ ఇచ్చినప్పటికీ, ఆ ఆరోపణలకు మంత్రికి సంబంధం లేదని అంటే ఎలా నమ్ముతారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఈ విషయమై బీజేపీ పెద్దలకు ఢిల్లీలో ఫిర్యాదు చేసి వచ్చారని అంటారు. ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితుడునని చెప్పుకుంటూ ఒక ప్రముఖుడు మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగ్ లలో హవా సాగిస్తున్నారని, తనకు కావల్సింది తనకు ఇచ్చి, మీకు కావల్సింది మీరు తీసుకోండని ఓపెన్ గా చెబుతున్నారంటూ జాకీ పత్రిక చానా ముదురు శీర్షికన కథనాన్ని ఇచ్చింది. 'చానా" అనగానే అది సానా సతీష్ గురించే అని, అతను లోకేష్ తరపున వ్యవహారాలు చక్కదిద్దుతుంటారని టీడీపీలో ప్రచారం అయింది. అది రాజ్యసభ ఎన్నికల సమయం కావడంతో అతనికి టిక్కెట్ రాకుండా ఉండడానికి ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలింగ్ వార్త రాసిందని కూడా టీడీపీ వర్గాలు భావించాయి. ఈ వార్త లోకేష్ కు తీవ్ర అప్రతిష్ట తెచ్చింది. దాంతో లోకేష్ కు, ఆంధ్రజ్యోతి యజమానికి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీని నడిపే శక్తి ఇంకా రాలేదని వ్యాఖ్యానిస్తూ ఆ ఓనర్ తన వ్యాసంలో రాసి ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమి నుంచి విడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆందోళన చెందారు. విశేషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సానా సతీష్ పై అంత దారుణమైన కథనం ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసినందునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ పేషీ గురించి నేరుగా రాయకపోయినా, అక్కడ జరిగేవి ఇతర మంత్రులకు తెలియవా? అందుకే ఏ మంత్రిని మందలించే పరిస్థితి చంద్రబాబుకు లేదని కొందరి వాదనగా ఉంది. మరికొందరు మంత్రులపై కూడా పలు అభియోగాలు వస్తున్నాయి. చంద్రబాబు స్టైల్ ఏమిటంటే రహస్యంగా ఎవరు ఏమి చేసినా వారి జోలికి పద్దగా వెళ్లరు. అదే మరీ అల్లరైతే, తాను మందలించనట్లు ప్రచారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు, కూటమి నేతలు మద్యం, ఇసుకలలో ఎలా దండుకుంది బహిరంగమే. నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైపోయినా ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పెదవి కదపలేదు. మద్యం వ్యాపారంలో అనేక మంది ఎమ్మెల్యేలు 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి ఏ మాత్రం భయం లేకుండా తనకు నిర్దిష్ట శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మద్యం షాపులకు హెచ్చరిక పంపించారు. అఅంతేకాదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ మధ్య పవర్ ప్లాంట్ బూడిద రవాణాపై చెలరేగిన గొడవ తెలిసిందే. చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేయడానికి యత్నించారు. ఇక ప్రభాకర రెడ్డి కొందరు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి లేదు. కాకపోతే జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మైనింగ్ లీజుల దందాపై సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు వినాల్సిందేనని టీడీపీ ముఖ్యనేత ఆదేశించడంపై కూడా మైనింగ్ యజమానులు మండిపడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అరాచకంపై నిత్యం కథలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్టీ కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి. చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టిన రోజు వేడుకకు పోలీసులు హాజరై కేక్ కట్ చేయించడం పై విమర్శలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కూడా పోలీసు అధికారులపై రుసురుసలాడిన తీరు అందరికి బహిరంగ రహస్యమే. మదనపల్లె నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే ఒకరికి నెలకు 30 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక మహిళా తహశీల్దార్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన విషయం సంచలనమైంది. సదరు ఎమ్మెల్యే ఖండించినా నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా అంతా భావించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి దౌర్జన్యాలపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడలో ఒక దళిత ఫ్రొఫెసర్ ను ఆయన తన అనుయాయులతో కలిసి వెళ్లి బెదిరించారు. అలాగే ఒక టీషాపు ను కూల్చి వేయించిన విషయం వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ కడపలో ఒక మండల అధికారిపై వైసీపీ నేత ఎవరో దౌర్జన్యం చేశారంటూ అక్కడకు వెళ్లి హడావుడి చేసి వచ్చారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేనని, రేషన్ షాపుల వారిని, మధ్యాహ్న భోజనం ఏజెన్సిల, ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించారు. ఇక కాంట్రాక్టర్ లను బెదిరించడం వంటివి నిత్య కృత్యమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఏకంగా అదానీ కంపెనీ సిబ్బందిపైనే దాడి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళా టీడీపీ నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. వారి మధ్య టీడీపీ నేతలు రాజీ చేశారు తప్ప ఆయనపై చర్య తీసుకోకపోవడం విశేషం. కృష్ణపట్నం ఓడరేవు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మద్యం దుకాణాలలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వలేదని నరసరావుపేటలో ఆయన అనుచరులు రెస్టారెంట్ పై దాడి చేసి వధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మట్టి దందాకు పాలపడుతున్నాడని కథనాలు వచ్చాయి. రోజూ ఇలాంటి స్టోరీలు పుంఖానుపుంఖాలు గా వస్తున్నా కూటమి అధినేతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. మరో వైపు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు ఐదువేల ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చారంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కంపెనీ యజమాని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్డర్ ఇవ్వరాదట. ఆ ఆర్డర్ చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారని ఈ పత్రిక చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. అంత పెద్ద ఆర్డర్ ముఖ్యమంత్రికి తెలియకుండా వెళుతుందా? ఇవన్ని చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన సాగిస్తోందన్న అభిప్రాయం రాదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు డ్రామాలో పవన్ బకరా!
తిరుపతిలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం ‘సారీ’లతో ముగించేస్తోందా?. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించి పరువు పోగొట్టుకుంటే.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఏకంగా పవన్ గాలి తీసేందుకే ప్రాధాన్యమిచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగినట్లు అయ్యింది. చివరకు బీఆర్ నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి. అయితే..స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓ సారీ చెప్పించాల్సి వచ్చింది. మొత్తమ్మీద చూస్తే.. ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పూ లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు.. ఇటు టీటీడీ ఉన్నతాధికారులూ జారుకున్నారు. స్వామివారిపై భక్తితో భక్తులు తిరుమతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి!!.వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకన్ల జారీ కాస్తా తొక్కిసలాటకు దారితీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ, పోలీసుల వైఫల్యం, అలసత్వం సుస్పష్టం. పైరవీలతో టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్‌ల బాధ్యతారాహిత్యం కూడా కనపడతూనే ఉంది. అంత పెద్ద ఘోరం జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకూ చూశారు. సహకరించే మీడియా ఉండనే ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్టపాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆటలో అరటి పండు చందంగా ఎవరూ పట్టించుకోనిది.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి!. అందుకేనేమో.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు.గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు. కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ విడిగా వెళ్లి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు. జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేయడమే కాకుండా, ప్రభుత్వం తరుఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్.. తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందా? అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్లీ అదే డిమాండ్ చేశారు. అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును, టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేహం కలిగింది. కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్ నాయుడు పవన్ కల్యాణ్ ఎవరో అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు. ఎవరో ఏదో చెప్పారని తానెందుకు స్పందిస్తానని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇది కాస్తా పవన్ వర్గానికి చిర్రెత్తించింది. చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి. ఆ వెంటనే చంద్రబాబు రంగంలో దిగి బీఆర్ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారీ చెప్పి, తన వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించి కాదని బుకాయించే యత్నం చేశారు.నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రుల మాదిరే ఒక మంత్రి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి. ఈయనకేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇతర మంత్రులపై, తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటలలోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది.చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది. లేకుంటే పవన్ తిరుపతి ఆస్పత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యులో వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనాలి. అవేవి చేయకుండా క్షమాపణల డ్రామా ఆరంభించారు. దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ అసలు విషయం బయటపడ్డాక, పవన్ కల్యాణ్ మళ్లీ భక్తులను, ప్రజలను మోసం చేశారని తేటతెల్లమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు. అప్పుడు వేసుకున్న సనాతని వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు.గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు. ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరగని దారుణ ఘటన జరిగితే, దానిని సైడ్ ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా హడావుడి చేసి చివరికి సారీలతో తుస్సుమనిపించారు. విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై, ప్రచార ప్రకటనలలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కు కొంత అసంతృప్తి ఉందని, దానిని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్లి తొక్కిసలాటకు తానే బాధ్యుడిని అన్నట్లు క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు. పవన్ చర్య కొంత మంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పవన్ లు కలిసే ఈ కథ నడిపించారన్న అభిప్రాయం చివరికి కలుగుతుంది. కాకపోతే బీఆర్ నాయుడు తెలివితక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది. ఈ మొత్తం వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే. కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకుని మిగిలిన వారిని బలి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు ఛైర్మన్, సభ్యులు మాటల దాడి చేశారట. అంతేకాక ,శ్యామలరావు దేవాలయానికి వెళ్లినా అధికారులు ఎవరూ ఆయనతో మాట కలపలేదట!. దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్నారన్న ప్రచారం ఆరంభమైంది. బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను, అల్లు అర్జున్ వంటివారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలేదు. వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట. పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు మంటూ ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట. అయినా అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. దాంతో బాధిత కుటుంబాలు తమవాళ్లు పోయారన్న విషాదంతో పాటు, ఈ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది.ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్ర ప్రజలకు సినిమా వైబ్ అనండి.. పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు. వారివల్లే పవన్ వంటివారు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తప్పు ఒప్పుకోకుంటే పాపం తగలదా?
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రంగులు మార్చే బుద్ధి చూపిస్తే... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి కొంత స్వతంత్ర ధోరణి, మరికొంత స్వామి భక్తి చూపే ప్రయత్నం చేశారు. దుర్ఘటన జరిగినందుకు ప్రజలకు, భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా పవన్ ఆ పని చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించారు. చంద్రబాబు నాయుడు అధికారులుపై చిర్రుబుర్రులాడినట్లు, వేటు వేసినట్లు కనిపించారు. కానీ.. తనకు కావాల్సిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారన్న సంగతి అర్థమైపోతుంది. ..ఇంతటి ఘోరమైన దుర్ఘటన జరిగినా అందులోనూ రాజకీయం చేస్తూ ఎలాగోలా నెపం వైఎస్సార్సీపీ(YSRCP)పైన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రుద్దాలన్న తాపత్రయం స్పష్టంగా కనిపించింది. అదే టైమ్‌లో టీటీడీ పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉందో, ఉన్నతస్థాయిలో ఉన్నవారి మధ్య గొడవలు ఏ రకంగా ఉన్నాయో బట్టబయలయ్యాయి. చంద్రబాబు నాయుడు ఎదుటే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), కార్యనిర్వాహణాధికారి శ్యామలరావు తీవ్ర స్థాయిలో ఏకవచనంతో దాడి చేసుకున్న వైనం, ఆరోపణలు గుప్పించుకున్న తీరును టీడీపీ జాకీ పత్రికే బహిర్గతం చేయడం విశేషం. టీటీడీ అధ్యక్ష పదవికి బీఆర్ నాయుడును నియామకాన్ని ఆ జాకీ పత్రిక యజమాని వ్యతిరేకించారు. అయినా మంత్రి లోకేష్ పట్టుబట్టి నియమించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్‌లో భూ దందాలు చేస్తున్నారంటూ ఈ పత్రిక కొద్ది రోజుల క్రితం ఒక కథనాన్ని ఇచ్చింది. అయినా చంద్రబాబు స్పందించకపోగా, తన వెంటే తిప్పుకుంటున్నారు. తిరుపతికి వెళ్లిన సందర్భంలో కూడా చంద్రబాబు వెంటే ఆయన ఉన్నారు. బహుశా ఈ కోపంతోనే గొడవ సమాచారాన్ని ఈ పత్రిక బయట పెట్టి ఉండవచ్చు. ఉద్దేశం ఏమైనా, రాజకీయాలు ఎలా ఉన్నా, ప్రజలకు కొన్ని వాస్తవాలను చెప్పిందని ఒప్పుకోవచ్చు. ఇక్కడ సంగతి ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఒక ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ లేదా బదిలీ వేటు వేశారు. కానీ వారిలో కీలకమైన అధికారులు లేరు. తిరుపతి ఎస్పీ సుబ్బనాయుడును బదిలీ చేయాల్సి రావడం ఆయనకు ఇబ్బంది కలిగించేదే. సాధారణంగా ఇంతమంది మరణానికి బాధ్యుడుగా ఎస్పీని సస్పెండ్ చేయాల్సి ఉండిందని చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడు కావడం, రెడ బుక్ రాజ్యాంగం అమలుకు ఏరి కోరి తెలంగాణ నుంచి తెచ్చుకోవడం వల్ల బదిలీతో సరి పెట్టారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈవో శ్యామలరావును, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని టచ్ చేయలేదు. కాకపోతే వారిపట్ల ఆగ్రహం ప్రదర్శించినట్లు వీడియో లీక్ అయ్యేలా చూసుకున్నారు. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిపిన నెయ్యి వాడారని పిచ్చి ఆరోపణను చంద్రబాబు చేసిన అంశంలో వాస్తవాలు శ్యామలరావుకు తెలుసు. పొరపాటున ఆయన అప్పుడు జరిగిన విషయాలపై నోరు తెరిస్తే అది చంద్రబాబుకు ఇరకాటం అవుతుంది. వెంకయ్య చౌదరి చాలాకాలం నుంచి చంద్రబాబుకు సన్నిహితుడు. ఇతర సామాజిక వర్గాల అధికారులపై వేటు వేసి తన సామాజికవర్గం అధికారిని మాత్రం చంద్రబాబు రక్షించుకుంటున్నారని కొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమల కొండపై ఈవో కన్నా ,వెంకయ్య చౌదరి పెత్తనమే అధికంగా ఉందని చెబుతున్నారు. చంద్రబాబుతో నేరుగా మాట్లాడే చనువు ఉండడమే కారణమట. ఈవో, ఏఈవోల మధ్య సఖ్యత లేదు. వీరిద్దరికి, ఛైర్మన్‌కు సత్సంబంధాలు లేవు. బిఆర్ నాయుడు తనకు పదవి రావడంతో చేయవలసింది ఏమిటో తెలియని పరిస్థితిలో పెత్తనం చేయబోతే అధికారులు సహకరించడం లేదు. లోకేష్‌కు ఆప్తుడనైన తననే అవమానిస్తున్నారని ఆయన మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీలో అధ్వాన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తొక్కిసలాట కారణంగా ఆరు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో జన సమూహాలను సమర్థంగా నిర్వహించగల టీటీడీ అప్రతిష్ట పాలైంది. ఇక్కడ ఇంకో కారణం కూడా చెబుతున్నారు. జనసేనకు నాయకుడు టోకెన్లు ఇచ్చే చోట ఏభై మంది కార్యకర్తలను లోపలికి పంపించడం కూడా తొక్కిసలాటకు ఒక కారణమైందని ఒక పత్రిక రాసింది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణంటూ చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. గత అనుభవాలను చూస్తే ఆయన ఫలితం ఏమంత గొప్పగా ఉండదని ముందగానే చెప్పేయవచ్చు. గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మరణించినప్పుడు కూడా ఇలాగే విచారణ కమిషన్ వేశారు. ఉన్నతాధికారుల మాట అటుంచండి.. కనీసం ఒక్క కానిస్టేబుల్‌పై కూడా చర్య తీసుకోలేదు. పైగా ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు చేసిన ఫొటోషూట్ కళ్లెదుటే ఉన్నప్పటికీ ఆయన తప్పేమీ లేదన్నట్టు కమిషన్ నివేదిక ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుపతి తొక్కిసలాట ఘటన కూడా ఇలాగే అవడం గ్యారెంటీ! చంద్రబాబు ఇప్పటివరకూ బి.ఆర్.నాయుడు రాజీనామా కోరలేదు. టీవీ ఛానల్ యజమాని అని ఊరుకున్నారో.. లోకేశ్ మనిషి కాబట్టి చూడనట్లు వ్యవహరిస్తున్నారో తెలియదు మరి! నైతిక బాధ్యత వహించి బీఆర్ నాయుడే రాజీనామా చేసి ఉంటే బాగుండేది కానీ పదవి, అధికారం రుచి మరగిన తరువాత వదులుకోవడం కష్టమని అనుకుని ఉండాలి.ఇక చంద్రబాబు మాట్లాడిన కొన్ని అంశాలు చూడండి. దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని అన్యాపదేశంగా ఆయన వ్యాఖ్యానించడం ఎంత దుర్మార్గం?. ప్రభుత్వ, టీటీడీ అధికారుల, పోలీసు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంటే, ఆయన నెపం వైసీపీపై రుద్దడానిక ప్లాన్ చేశారు. ఎల్లో మీడియా ఇప్పటికే ఈ ప్రయత్నం ఆరంభించింది. ఏటా తిరుపతి వాసుల కోసం ఇలా కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు ఇస్తుంటే, ‘‘అసలు టోకెన్లు ఇవ్వడం ఏమిటి? తనకు తెలియనే తెలియదు’ అని చంద్రబాబు అంటున్నారు. అయితే ఇది బుకాయింపు అవ్వాలి లేదంటే అవగాహన రాహిత్యం కావాలి. ‘‘వైకుంఠ ఏకాదశికి పది రోజుల పాటు టోకెన్లు ఇచ్చి ప్రత్యేక దర్శనం కల్పించడం ఏమిట’’ని ఆయన అంటున్నారు. దాని ద్వారా లక్షలాది మంది భక్తుల కోరిక ను గత ప్రభుత్వం తీర్చిన విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. అసలు తిరుమలకు సంబంధించి తనకు తెలియని విషయం ఉండదని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఇది గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అంటూ నిస్సిగ్గుగా ఆరోపించారు. అదే కరెక్టు అయితే అధికారంలోకి వచ్చి ఏడు నెలల తర్వాత, కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టిన ఇన్ని నెలల తర్వాత కూడా దానినే ఎందుకు కొనసాగించారు?. మరోవైపు.. పవన్ కల్యాణ్ కొంత సొంత వ్యక్తిత్వంతో మాట్లాడినట్లు అనిపిస్తోంది. నాలుగు లక్షల మంది వచ్చిన ప్పుడు కూడా గతంలో జరగని దుర్గటన ఇప్పుడెలా జరిగిందని ఆయన ప్రశ్నించారట. దీనికి చంద్రబాబు, బిఆర్ నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరి బదులు ఇవ్వాలి. అంతేకాదు. భక్తులు, ప్రజలు క్షమించాలని కోరారు. ఈ మాట చంద్రబాబు చెప్పలేకపోయారు. గతంలో చంద్రబాబు లడ్డూ కల్తీ అనగానే గుడ్డిగా పవన్ కళ్యాణ్ సనాతని వేషం దాల్చి నానా రచ్చగా మాట్లాడి పరువు పోగొట్టుకున్నారు. ఈసారి అలా కాకుండా కాస్త జాగ్రత్త పడ్డారన్నమాట. అయితే.. ఆనాడు లడ్డూ విషయంలో అపచారం చేసినందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్షమాపణ చెప్పవలసి వచ్చిందని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఈవో,అదనపు ఈవో, ఛైర్మన్లను బాధ్యులను చేస్తే చంద్రబాబు మాత్రం వారిని రక్షించే యత్నం చేశారు. టీటీడీలో ఉన్న విబేధాలను ఆయన అంగీకరించారు. చంద్రబాబు ఆ విభేధాల ఆధారంగా విమర్శలు తనపైకి రాకుండా కథ నడిపించారు. నిజానికి వారందరిని నియమించింది చంద్రబాబే, వారితో శ్రద్దగా పని చేయించకపోగా, రెడ్ బుక్ రాజ్యంగం అంటూ, టీటీడీని ఆసరాగా చేసుకుని వైఎస్సార్సీపీ ఎలాంటి ఆరోపణలు చేయవచ్చో అనేవాటిపైనే పని చేయించారు. ఇప్పుడు వాటి ఫలితం జనం అనుభవించవలసి వచ్చింది. అసలు పనులు మాని చిల్లర వ్యవహారాలకే టిటిడి బాధ్యులంతా పరిమితం అయ్యారని అంటున్నారు. అధికారులపై, ఛైర్మన్ పై చర్య తీసుకోవాలని, వారిపై కేసులు పెట్టాలని మాత్రం పవన్ చెప్పలేదు. హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అర్జున్‌తోపాటు యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దానిని పవన్ సమర్థించారు. మరి ఇప్పుడు టీటీడీ యాజమాన్యంపై కేసు పెట్టాలని పవన్ ఎందుకు కోరలేదు. వారిని అరెస్టు చేయాలని ఎందుకు చెప్పలేదు. పైగా కొత్తగా కుట్ర కోణం ఉండవచ్చని పవన్ అన్నారు. అంటే ఇక్కడే చంద్రబాబు పట్ల స్వామి భక్తి ప్రదర్శించారా? సందేహం వస్తోంది.ఇది చంద్రబాబు, పవన్ కలిసి ఆడిన కొత్త డ్రామా అని, ఇందుకు బాధ్యులపై చర్య తీసుకోకుండా, మొత్తం డైవర్ట్ చేయడానికి జరుగుతున్న యత్నం అనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబే తొలి ముద్దాయి అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అన్నారు. దానికి కారణం బీఆర్ నాయుడును ఛైర్మన్‌గా నియమించడంతో పాటు, అంతవరకు సమర్థంగా పనిచేసిన అధికారులను తప్పించి, తనకు కావల్సిన అధికారులను పోస్టు చేసి ఈ తొక్కిసలాటకు కారణం అవడమే అనేది విశ్లేషణ. తన పబ్లిసిటీ పిచ్చి కారణంగా పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణిస్తేనే బాధ్యత తీసుకోని చంద్రబాబు ఇప్పుడు ఈ ఘటనలో బాధ్యత వహిస్తారా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు భయం, భక్తి లేవని కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తిరుపతి దేవుడును సైతం తన రాజకీయాలకు వాడుకోవడానికి చంద్రబాబు ఎప్పుడు వెనుకాడలేదు. అలిపిరి వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చితే అదృష్టవశాత్తు ఆయన బయటపడ్డారు. ఆ ఘటన జరిగింది తన ప్రభుత్వ వైఫల్యం వల్ల, పోలీసుల అజాగ్రత్త వల్ల అని చెప్పకుండా చంద్రబాబు తనకు సానుభూతి వస్తుందన్న ఆశతో 2003లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఓటమి పాలయ్యారు. 2024లో తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌ను బద్నాం చేసేందుకు తిరుమల లడ్డూతోసహా అనేక అపచారపు ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఈ ఉదంతంలో దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని దారుణమైన వ్యాఖ్య చేసి మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయడానికి పన్నాగాలు పన్నుతున్నట్లుగా ఉంది. ఇది కూడా తిరుమల పట్ల అపచారంగానే భావించాలి. ఏది ఏమైనా ఒక విశ్లేషకుడు అన్నట్లు పాలకుల పాపాలు ప్రజలకు శాపాలవుతుంటాయట. ఇవన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుందా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా?
తిరుమల... ఎంత ప్రతిష్టాత్మక, పవిత్రమైన దేవాలయం..? ఎంత గొప్ప పేరు ఉన్న పుణ్య క్షేత్రం..? కానీ ఈ రోజు జరుగుతున్నదేమిటి? ఆంధ్ర ప్రదేశ్‌కే కాదు.. దేశానికే గర్వకారణమైన దేవస్థానంలో వైకుంఠ ద్వార ప్రవేశ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఉదంతం ప్రపంచ వ్యాప్త హిందువులను కలచి వేస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక , చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో ఘోరాలు జరగుతున్నాయి. అకృత్యాలు, విధ్వంసాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. చివరికి తిరుమలేశుని కూడా వదలిపెట్టలేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడానికి కూడా వెనుకాడని నాయకత్వం ఇప్పుడు ఏపీలో పాలన చేస్తోంది. హిందూ మత ఉద్దారకులుగా పైకి ఫోజు పెట్టడం, లోపల మాత్రం ఎన్ని దందాలు చేయాలో అన్నీ చేయడం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినా వారిని అసౌకర్యం లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించే వారు. అయోధ్య ఆలయ నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదెలాగో నేర్చుకోవడానికీ టీటీడీ అధికారులను ఆయోధ్యకు ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. అది జగన్ జమానా.. మరి ఇప్పుడు...??? అంతటి ఖ్యాతి వహించిన టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్లో విఫలమైంది. వేలల్లో వచ్చిన జనాన్నే నియంత్రించలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. యాభై మంది వరకూ గాయపడ్డారు. ఇంతటి విషాదం... దశాబ్దాలలో ఎన్నడూ జరగలేదు. ఈ ఘటన తిరుపతి గొప్పదనాన్ని దెబ్బ తీసిందని చెప్పక తప్పదు. తిరుమలను పరిరక్షించేందుకు, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి, జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ పలు సంస్కరణలు తెచ్చింది. ఇప్పుడు ఆ పని మాని గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల కాలంలో ఏమైనా తప్పులు జరిగాయా? అని భూతద్దం పెట్టి అన్వేషించి వైఎస్సార్సీపీ రాజకీయ కక్ష సాధించడానికి, జగన్ ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో టీటీడీ పరువును పణంగా పెడుతోంది. కొత్తగా టీటీడీ ఛైర్మన్ అయిన ఒక టీవీ సంస్థ యజమాని బీఆర్ నాయుడు పూర్తి అసమర్థంగా వ్యవహరించారనిపిస్తుంది. గొడవ జరుగుతుందని ముందుగానే తనకు తెలుసునని ఆయన చెప్పడం గమనార్హం. గొడవ జరుగుతుందని తెలిస్తే ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేకపోయారన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేక మళ్లీ మాట మార్చారు. ఈ మొత్తం ఘటనను బాధ్యతను అధికారులపైకి నెట్టి తప్పించుకునేందుకు చంద్రబాబు, బీఆర్ నాయుడులు చూస్తున్నారు. మరో ఘట్టం గురించి కూడా మాట్లాడుకోవాలి. తిరుమల ప్రసాదం లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ లడ్డూను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. అలాంటి లడ్డూపై తీవ్రమైన అనుచిత ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘోర అపచారానికి పాల్పడ్డారని భక్తులు భావిస్తారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ని వాడారంటూ చంద్రబాబు నీచమైన ఆరోపణ చేసి గత ముఖ్యమంత్రి జగన్ కు రుద్దాలని ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ సడన్ గా సనాతని వేషం కట్టి బాండ్ బాజా వాయించారు. దానికి జగన్ మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకోండి... కాని స్వామి వారికి అపచారం చేస్తున్నారు సుమా! అని హెచ్చరించారు. అయినా టీడీపీ, జనసేన, బీజేపీలు ఇష్టారీతిన దుర్మార్గపు ప్రచారం చేసి తిరుమల ఔన్నత్యాన్ని దెబ్బతీశాయి. ఒకవేళ లడ్డూకు సంబంధించి నిజంగానే ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే వాటిని సరిచేసి బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రే తన రాజకీయ స్వార్థం కోసం ఒక వదంతిని ప్రచారం చేశారు. చివరికి దానిపై సీబీఐ విచారణ వేస్తే ఏమైందో అతీగతీ లేదు. అనంతరం చంద్రబాబే మాట మార్చారు. దీనివల్ల స్వామి వారి ఆలయానికి అపవిత్రత తెచ్చిన అపఖ్యాతిని చంద్రబాబు, పవన్ లు పొందారు. కేవలం జగన్‌పై ద్వేషంతో ఆయన పాలనలో వీరు తిరుమలపై అనేక విమర్శలు చేసేవారు. దానివల్ల తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఎన్నడూ ఫీల్ అయ్యేవారు కారు. జగన్ పై మతపరమైన ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలన్న యావ తప్ప మరొకటి ఉండేది కాదు. చంద్రబాబు ,పవన్ లు నిజాలు చెప్పరులే అని ప్రజలు భావించారు కాబట్టి సరిపోయింది కాని, లేకుంటే కూటమి పెద్దలు తిరుమలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించడానికి యత్నించారు. తిరుమలలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంక్రాంతి పర్వదినాల నుంచి వారం రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం జరిగింది. దీనిని చాలా పవిత్రంగా భక్తులు పరిగణిస్తారు. దానికి అధికారులు కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కానీ ఈసారి తిరుపతిలో తొమ్మిది చోట్ల 90 కౌంటర్లు ఏర్పాటు చేసినా, ఈ తొక్కిసలాట జరిగిందంటే పర్యవేక్షణ లోపం తప్ప ఇంకొకటి కాదు. కారణం ఏమైనా బైరాగి పట్టెడ అనే చోట అకస్మాత్తుగా గేటు తెరవడంతో టిక్కెట్లు ఇస్తున్నారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా తోసుకు వచ్చారు. అంటే అక్కడ అలా తోపులాట లేకుండా ముందుగానే అధికారులు చర్య తీసుకోలేదన్నమాట. గురువారం ఉదయం నుంచి ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక మొదలైన రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బుధవారం మధ్యాహ్నమే తరలివచ్చారు. అధికారులు ఈ విషయాన్ని గమనించినా వారి నియంత్రణకు తగిన ప్రణాళిక రూపొందించలేదు. అందరిని ఒక పార్కులో పెట్టేశారు. మంచినీటి వసతి కూడా కల్పించలేకపోయారు. మరో రెండు చోట్ల కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఇలాంటి వాటిపై కదా.. టీటీడీ ఛైర్మన్ ,పాలక మండలి, ఉన్నతాధికారులు దృష్టి పెట్టవలసింది?. గతంలో సమర్థంగా పనిచేసిన అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి, వారిని తొలగించి తమ అంతేవాసులను నియమించుకున్నారు. తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ఒక పోలీసు అధికారిని ప్రత్యేకంగా పోస్టు చేశారట. వారు ఆ పనిలో ఉంటారు కాని, ప్రజల అవసరాలను ఎందుకు పట్టించుకుంటారు? పైరవీ చేసుకుని టీటీడీ ఛైర్మన్ అయిన బిఆర్ నాయుడుకు అసలు ఇలాంటి విషయాలలో ఏమి అనుభవం ఉంది? లేకపోయినా ఫర్వాలేదు. ఆయన నిబద్ధత ఏమిటి? కేవలం ఒక టీవీ సంస్థ ద్వారా తనకు బాజా వాయిస్తే పదవి ఇచ్చేశారు. పదవి తీసుకున్న తర్వాత అయినా టీటీడీ ఉద్దరణకు కృషి చేశారా? పోసుకోలు ఇంటర్వ్యూలు, ప్రకటనలు చేస్తూ కాలం గడిపి అసలు భక్తులను ఇక్కట్ల పాలు చేశారు. టెక్నాలజీని తానే కనిపెట్టినట్లు చంద్రబాబు మాట్లాడుతుంటారు. అయినా ఆన్ లైన్ లో కాకుండా ఇన్ని వేల మందిని, అది కూడా గంటల తరబడి వేచి ఉండేలా చేయడం అంటే ఈ ప్రభుత్వ చేతకాని తనమే కాదా? చంద్రబాబు నాయుడు గతంలో పుష్కరాల సమయంలో పబ్లిసిటీ కోసం, సినిమా షూటింగ్ కోసం సామాన్య భక్తుల స్నాన ఘట్టంలో స్నానం చేసి నప్పుడు కూడా ఇలాగే గేట్లు సడన్ గా తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. ఆ విషయంలో ఒక్క కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోలేదు. సీసీటీవీ ఫుటేజీ సైతం మాయమైంది. ఆయన టైమ్ లో కేసును నీరుకార్చేసినా, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కూడా దానిపై దృష్టి పెట్టలేదు. తదుపరి కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభలలో పదకుండు మంది మరణించినా, చంద్రబాబుపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. అయినా చంద్రబాబు పోలీసులదే వైఫల్యం అని దబాయించి, రోడ్లపై సభలు వద్దన్నందుకు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఇటీవల హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే, దానికి నటుడు అల్లు అర్జున్ కారణమని ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అలా చేసినందుకు, టీడీపీ, జనసేన శ్రేణులు సమర్థించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టాయి. అదే కొలమానంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరిపై చర్య తీసుకోవాలి. ఎవరిని అరెస్టు చేయాలి? టీటీడీ ఈవో, జాయింట్ ఈవో, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ మొదలైనవారిని బాధ్యులు చేస్తారా? లేదా? ఎలాంటి చర్య తీసుకుంటారు? అసలు ఈ ఘటనకు నైతిక బాధ్యతగా బిఆర్ నాయుడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? ఒకవేళ ఆయన చేయకపోతే చంద్రబాబు ఆ మేరకు ఆదేశిస్తారా? అంటే అది జరిగే పని కాకపోవచ్చు. ఎందుకంటే బిఆర్ నాయుడుని నియమించిన చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.అలాగే పనికట్టుకుని తనకు కావల్సిన అధికారులను నియమించి ,వారిని తన అడుగులకు మడుగులు ఒత్తేవారిగా మార్చుకున్న ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికి చంద్రబాబు, పవన్ లు రెచ్చిపోయి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవారు. ఎల్లో మీడియా గోల,గోల చేసేది. ఇప్పుడు మాత్రం అంత గప్ చిప్ అయ్యారు. అదేదో అధికారులదే తప్పన్నట్లుగా కథ నడపాలని చూస్తున్నారు. మొత్తం తిరుమలకు అపవిత్రత వచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మోక్షం పొందవచ్చన్న కొండంత ఆశతో వెళ్లిన భక్తులకు చంద్రబాబు ప్రభుత్వం నరకం సృష్టించడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బిల్డప్ బాబు.. తగ్గేదే లే అంటున్న రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబు స్టైల్లోనే ప్రవర్తిస్తున్నారా? జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రాంతీయ పార్టీ తరహాలో నడిపే ప్రయత్నం చేస్తున్నారా?. కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును గమనిస్తే ఈ అనుమానాలు రాకపోవు. ‘‘నేను మారా.. మీరూ మారాలి.. మంత్రులు, ఎమ్మెల్యేల జాతకాలు నా వద్ద ఉన్నాయి’’. ‘‘ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయించా..నా ప్రొగ్రెస్ రిపోర్టు కూడా తెప్పించుకున్నా..దానిని అందరికి అందచేస్తా..’’, ‘‘హైదరాబాద్‌లో ఉంటున్న నాకు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియదని ఎవరైనా అనుకుంటే పొరపాటు. నాకు అన్నీ తెలుసు. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వంలో తప్పులు ఏమీ జరగలేదు..పొరపాట్లు జరిగాయని ఎవరైనా భావిస్తే నా దృష్టికి తీసుకు వస్తే సరిదిద్దుకునేందుకు వెనుకాడను. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పని చేశా.. మంత్రులు కూడా అలాగే పని చేశారు.. రేషన్ డీలర్లు, అంగన్వాడీల ఎంపిక జోలికి వెళితే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళతాయి.. వచ్చే పంచాయతీ ఎన్నికలలో అన్ని చోట్ల గెలవాలి. అవి కీలకం. పదవుల గురించి తొందరపడవద్దు..అన్నీ జరుగుతాయి.." అని రేవంత్ అన్నట్లు వార్తా పత్రికలలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అంతేకాక.. ‘‘మొదటి సారి గెలవడం ఓకే .. రెండో సారి గెలవడమే గొప్ప.., సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్ లు వస్తాయి..’’ అని కూడా అన్నారంటూ కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ ప్రసంగం అంతా పరిశీలించిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీని నడుపుతున్న స్టైల్లోనే, అందులోను చంద్రబాబు నాయుడు సరళిలోనే రేవంత్(Revanth) వ్యవహార శైలి ఉన్నట్లు కనిపిస్తుంది. 1995లో తన మామ ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసేవరకు తన వర్గ ప్రయోజనాల కోసం, ఆధిపత్యం కోసం పనిచేసిన చంద్రబాబు సీఎం అయ్యాక మొత్తం సీన్ మార్చేశారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి మొదట్లో కొన్ని ట్రిక్స్ అమలు చేసినా, వారిపై పట్టు వచ్చాక స్టైల్ మార్చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలకు ఆయన టైమ్ లోనే ప్రాధాన్యత వచ్చింది. మీడియాను తన గుప్పెట్లో పెట్టుకుని లీకులు ఇప్పించే వారు. అవసరమైతే ఆయనే ఆయా మీడియా సంస్థలలోని కాస్త కీలకమైన జర్నలిస్టులకు కూడా ఫోన్ చేసి మాట్లాడేవారు. .. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరు కలిసినా, 'అలా అన్నారు..ఇలా అన్నారు.."అంటూ పూర్తిగా పాజిటివ్ యాంగిల్ లోనే కవరేజీ వచ్చేలా చేసుకునే వారు. కేబినెట్ సమావేశాలలో సైతం అదే ధోరణి. తాను మారానని, మీరూ మారాలని చెబుతుండే వారు. కాకపోతే ఆయన ఏమి మారారో, తాము ఎక్కడ మారాలో అర్థ అయ్యేది కాదు. తాను అవినీతి లేకుండా పనిచేస్తున్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు. కానీ పార్టీలోని ఇతర నేతలకు వాస్తవాలు తెలుసు. అయినా ఎవరికి వారు తమ అవసరాల రీత్యా ఆయన వద్ద మాత్రం తలూపి వచ్చేవారు. అక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ అక్రమం చేసినా బయట పడకుండా జరగాలన్నది చంద్రబాబు సిద్దాంతం అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, మంత్రులు కూడా పనిచేయాలని, అందరి జాతకాలు తనవద్ద ఉన్నాయని చెప్పేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు ఇటీవల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తద్వారా తాను ఒక్కడినే కష్టపడుతున్నానన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించే వారు. అదే ప్రకారం ప్రచారం చేయించుకునేవారు. విశేషం ఏమిటంటే గత టరమ్ లో మొదటి ర్యాంకు వచ్చిందని ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరికి ఆ తర్వాత టిక్కెట్లు ఇవ్వలేదు. అది వేరే సంగతి. రేవంత్ వ్యాఖ్యలు చదివితే అచ్చం తన గురువు దారిలోనే ఉన్నట్లు కనబడుతుంది. కాంగ్రెస్ హై కమాండ్ బలహీనంగా ఉండడం రేవంత్ కు కలిసి వచ్చిన పాయింట్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మంత్రుల, ఎమ్మెల్యేల జాతకాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ లో మినహాయించి మిగిలిన సీఎంలకు అంత స్వేచ్చ ఉండేది కాదు. పైగా వర్గపోరు ఉండేది. వైఎస్ కు కూడా వర్గాల తలనొప్పి ఉన్నా, అందరిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేసేవారు. రేవంత్ కూడా ఇప్పటికైతే వర్గపోరు లేకుండా పాలన సాగిస్తున్నారు. కాని అవకాశం వస్తే ఆయనపై అధిష్టానంపై ఫిర్యాదు చేయడానికి పలువురు సిద్దంగానే ఉంటారు. ఇంతకీ రేవంత్ ఏమి మారారో ఎవరికి తెలియదు. నిజానికి పీసీసీ(PCC) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న తీరుకు చాలా తేడా ఉందన్నది పలువురు కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది. రుణమాఫీ విషయంలో కొంతవరకు సఫలమైనా, బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కొన్ని వాగ్దానాలను నెరవేర్చినప్పటికి ఆరు గ్యారంటీలలో కీలకమైన హామీల సంగతి ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలకు రూ.2500 చొప్పున ఇచ్చే స్కీమ్ గురించి ప్రజలు అడిగితే జవాబు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలలో ఆశించిన రీతిలో రియల్ ఎస్టేట్ సాగడం లేదు.హైడ్రా కూల్చివేతలు, మూసి హడావుడి వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ పార్టీ ఏడాదిపాటు విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా, వాటిపై నిర్దిష్ట కార్యాచరణ అంతంతమాత్రంగానే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసినా, దాని వల్ల ఎంత ఫలితం వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో.. తన ప్రభుత్వంలో తప్పులే జరగలేదని, ఏవైనా జరిగితే అవి పొరపాట్లేనని రేవంత్ అంటే పైకి అవునవును అని చెప్పవచ్చు. కాని కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి వ్యంగ్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విషయాన్ని మరీ తెగేదాక లాగడం చాలామంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. సినిమా పరిశ్రమను నష్టపరిచేలా గతంలో ఏ ప్రభుత్వం వ్యవహరించలేదు. కాని ఇప్పుడు రేవంత్ వారిపైకి దూకుడుగా వెళ్లారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదని అంటున్నారు. భాష విషయంలో కూడా రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన తీరులోనే ఉండడం కొంతమందికి రుచించడం లేదు. సాధారణ ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురవుతోందని, దానిని గుర్తించి సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు. చంద్రబాబు మాదిరి 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే నమ్మడం కష్టమే నని ఒక నేత అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు సి.ఎమ్.లు ఉదయం పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి విధానపరమైన నిర్ణయాలు చేసి,ఫైళ్లు ఏమైనా ఉంటే చూసి ఇంటికి వెళ్లిపోయేవారు. అక్కడనుంచి ఏవైనా అత్యవసర పనులకు అటెండ్ అయ్యేవారు.ప్రజలను, పార్టీ వారిని కలిసేవారు. చంద్రబాబు వచ్చాక ఈ ధోరణి మార్చుకున్నారు. పని ఉన్నా, లేకపోయినా ఆఫీస్ లో గడపడం అలవాటు చేసుకున్నారు. ఎన్.టి.ఆర్. తెల్లవారు జామున అధికారులతో భేటీ అవుతుండేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వంటివారు తెల్లవారేసరికల్లా ప్రజలను గడవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అలాగే పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి సాయంత్రం వరకు ఉండేవారు. కేసీఆర్ ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ లోనే ఉండేవారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. నిజానికి ఏ సీఎం అన్ని గంటలు పనిచేయవలసిన అవసరం ఉండదు. అంత పని కూడా ఉండదు. చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా ఇతర పార్టీల నేతలతో అంతరంగికంగా సంబంధాలు పెట్టుకున్నారన్నది కొందరి భావనగా ఉంది. ముఖ్యంగా బీజేపీ ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని భావిస్తున్నారు. అందువల్లే ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటివారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగిడారని చెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్డీయే, ఐఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని ఒక కాంగ్రెస్ నేత చమత్కరించారు. అంతేకాదు. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పాత సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని, చంద్రబాబు, రేవంత్ లు రాజకీయంగా సహకరించుకుంటున్నారని ఎక్కువమంది కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. ఏది ఏమైనా రేవంత్ లో నిజంగా ప్రజలకు ,పార్టీకి ఉపయోగపడేలా మార్పు వస్తే మంచిదే. కాని ఆయన కూడా అధికార దర్పంతో ఉంటే అందరికి నష్టం అనే అభిప్రాయం నెలకొంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘తల్లికి వందనం’.. బాబు సర్కార్‌కు ఎల్లో మీడియా జాకీలు!
‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు.వైఎస్ జగన్ విజయవంతంగా అమలు చేసిన ‘అమ్మ ఒడి’కి నకలుగా టీడీపీ ‘తల్లికి వందనం’ పేరుతో ఓ పథకాన్ని ఎన్నికల హామీగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ కుటుంబంలో తల్లికి మాత్రమే నగదు ఇచ్చేవాడని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ప్రతీ బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికింది కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతోపాటు నిమ్మల రామానాయుడు వంటి టీడీపీ నేతలు ఈ హామీకి విస్తృతంగా ప్రచారం చేశారు.చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని ఊదరగొట్టారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నలుగురుంటే రూ.60 వేలు అంటూ పేద కుటుంబాలను ఊరించారు. చివరకు కూటమి అధికారంలోకి వచ్చింది కానీ.. పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఎక్కాలు చెప్పుకోవడమే తప్ప, లెక్క (డబ్బు) అందలేదు. ఈ మార్చిలోగా ఇస్తారేమోలే అని పలువురి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇప్పుడు తల్లికి వందనం పెట్టడం లేదని తేల్చేసింది. వచ్చే జూన్‌లో చేస్తామని ప్రకటించింది. అంటే జనం అమాయకులు, పిచ్చోళ్లు, వారికి ఏమీ తెలియదు.. తాము ఏ అబద్దం చెబితే దానిని నమ్ముతారన్నది కూటమి పెద్దల విశ్వాసం. అందుకే ధైర్యంగా ఈ ప్రకటన చేశారనుకోవాలి.తల్లికి వందనం స్కీమ్ దేని కోసం ప్రకటించారు?. పేద పిల్లలు స్కూల్ మానకుండా, విద్యను ఎంకరేజ్ చేయడం కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మ ఒడి స్కీమ్ తెచ్చారు. దీనికి ప్రజలలో విపరీతమైన ఆదరణ లభించింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లను బాగా అభివృద్ది చేయడం, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తీర్చి దిద్దడం, డిజిటల్ విద్య, గోరుముద్ద తదితర కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. దాంతో ఈ స్కీమ్‌ను కాపీ కొట్టి, తామైతే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సాధారణంగా ప్రతీ ఏడాది జూన్ నెలలో ఈ మొత్తాలను తల్లుల ఖాతాలోకి వేయవలసి ఉంది.వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు సుమారు రూ.6000 కోట్ల వ్యయం అయితే.. టీడీపీ, జనసేనలు చెప్పిన వాగ్దానం ప్రకారం సుమారు రూ.13 వేల కోట్ల వరకు వ్యయం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు గడిచినా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయలేదు. ఏదో రకంగా ఈ పథకాన్ని ఎగవేయడమో లేక బాగా కోత పెట్టి అమలు చేయడానికో కసరత్తులు చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కాని అదీ లేదు.. ఇదీ లేదు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పినట్లు తాము పలావు పెడుతుంటే, బిర్యానీ తినిపిస్తామని చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు పలావు పోయే.. బిర్యానీ రాకపోయే.. అని పిల్లలు, తల్లులు ఉసూరుమంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2024 జూన్‌లోనే అమ్మ ఒడి డబ్బులు అందేవి కదా అన్నది ప్రజల భావన.తల్లికి వందనం మాత్రమే కాదు.. మరి కొన్ని స్కీములను కూడా ఇలాగే నీరు కార్చే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రివర్గ నిర్ణయాలు తెలియచేస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20వేల చొప్పున ఇస్తామన్నది ఎన్నికల హామీ అయితే, ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.10 వేలకు మరో రూ.10వేలు జత చేసి ఇస్తామని చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఆ ప్రకారం ఏటా అందించింది. నాలుగేళ్లు ఇస్తామని అన్నా, ఐదేళ్లు చెల్లించింది. అప్పట్లో కూడా కేంద్రం ఇచ్చిన ఆరు వేలతో కలిపి ఈ మొత్తాన్ని ఇస్తే ఇదే చంద్రబాబు, పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం కేంద్రం ఇచ్చే పది వేలతో కలిపి ఇస్తామంటున్నారు. అంటే వారు గతంలో చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకుంటే రైతులకు పది వేల రూపాయలు ఎగవేస్తున్నారన్నమాట. ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని అన్నారే తప్ప స్పష్టంగా నిర్దిష్ట తేదీని చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఈ పంటల సీజన్లో రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉచిత బీమా సదుపాయాన్ని కూడా ఎగవేసింది.తల్లికి వందనం, రైతు భరోసా తర్వాతే మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పించనున్నారని కొత్త లింక్ పెడుతున్నారు. అంటే ఆ రెండు స్కీమ్‌లు ఎప్పుడు ఇస్తారో, ఈ బస్ స్కీమ్ ఎప్పటికి అమలు అవుతుందో దేవుడికే ఎరుక. కాకపోతే ఈలోగా ప్రజలను మాయ చేసే పనిలో బిల్డప్ బాబాయిలు, జాకీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దూసుకెళ్తోంది. జూన్‌లోగా తల్లికి వందనం అని శీర్షికను ఈనాడు పెడితే, తల్లికే తొలి వందనం అంటూ ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇచ్చింది. అంతే తప్ప ఈ ఏడాదికి ఎగనామం పెట్టారని రాయలేదు. పైగా ఈనాడు వారు ఏం బిల్డప్ ఇచ్చారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మరో రెండు పధకాలను అమలు చేయబోతోందని నిస్సిగ్గుగా రాసింది. ఇప్పటికీ ఒక్క పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలినవి ఏవీ అమలు చేయలేదని జనం గగ్గోలు పెడుతుంటే, ఈనాడు మీడియా రాతలు ఇలా ఉన్నాయి.ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెడుతోంది. డీఎస్సీని ఆరు నెలల్లో అమలు చేస్తామని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు తాజాగా వచ్చే జూన్‌కు డీఎస్సీ పూర్తి చేస్తామని అంటున్నారు. నిజానికి అప్పటికి కూడా అది జరగకపోవచ్చని టీడీపీ మీడియానే కథనాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ తదితర సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా శక్తి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. నిరుద్యోగ భృతి అతీగతి లేదు.ఎన్నికల మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని జాకీ మీడియా ఏయే హామీలు అమలు చేసింది చెప్పగలిగితే విశ్వసనీయత వస్తుంది. అంతే తప్ప కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని జాకీ పెట్టి లేపడం కోసం కథనాలు ఇస్తే ప్రజలకు ప్రయోజనం ఏంటి?. ఇప్పటికే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన ఎల్లో మీడియా రోజురోజుకు అధఃపాతాళానికి పడిపోతోంది. ఆ సంగతి పక్కనబెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తల్లికి వందనం గురించి నోరెత్తకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. దీని ద్వారా తల్లిని వారు గౌరవించినట్లా? మోసం చేసినట్లా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్‌లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్‌లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్‌గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్‌లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్‌ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు వైఫల్యాలు.. ఒప్పేసుకున్న ఎల్లో మీడియా!
ఏడంటే ఏడు నెలలు.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఏపీ ప్రజలకు అర్థమయ్యేందుకు పట్టిన సమయం ఇది!. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం పెట్టేస్తామన్నట్టుగా సాగిన కూటమి నేతల ప్రచారం ఆచరణకు వచ్చేసరికి పాతాళానికి చేరిన సంగతి తెలిసిందే. ఇదేదో వైసీపీ అనుకూల మీడియా చెబుతున్న విషయం కాదు.. అక్షరాలా టీడీపీ అనుకూల పచ్చ పత్రిక ‘ఈనాడు’ నిగ్గుదేల్చిన వాస్తవం. ఈ కథనంలోనే వైఎస్ జగన్ సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతున్నా.. ఆ మాట నేరుగా చెప్పేందుకు మాత్రం ఈనాడు వారికి నోరు రాకపోయింది!వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. మరో శ్రీలంక అవుతోందని ఈనాడు తన కథనాల ద్వారా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. మా బాబు అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తారని కూడా ఈ మీడియా ఊదరగొట్టింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోంది. సంక్షేమ పథకాల అమలు సంగతి అలా ఉంచండి.. చేసిన అప్పులే కొండంతయ్యాయి!. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేరకు ఆదాయం రాకపోవడం వల్లనే అని కలరింగ్ ఇచ్చేందుకు ఈనాడు ప్రయత్నించి ఉండవచ్చు కానీ.. బాబు నిర్వాకాల పుణ్యమా అని ఏపీ ఇప్పుడు నిజంగానే శ్రీలంక స్థాయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? అన్న అనుమానాలైతే చాలామందిలో వ్యక్తమవుతున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకు ఆదాయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి హయాంలో ఆదాయం తగ్గడమే కాకుండా.. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ అంకెలకు మధ్య తేడా కూడా ఎక్కువైంది. అయితే, ఈనాడు తన కథనంలో వైఎస్ జగన్ హయంలోని అంకెలను ప్రస్తావించకుండా బాబుకు జాకీలేసే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేనలు రెండూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు. రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికార భాగస్వామి. ఇన్ని అనుకూలతలున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు జగన్ కాలం కంటే (రూ.22,213 కోట్లు) తక్కువగా (రూ.9703 కోట్లు) ఉండటం గమనార్హం. దీన్ని బట్టే బాబు కేంద్రంలో తిప్పుతున్న చక్రం వేగం ఏపాటిదో అర్థమైపోతుంది.రాష్ట్రంలో భూముల విలువలు తగిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, తాను అధికారంలోకి వస్తే భూముల విలువలు అమాంతం పెరిగిపోతాయని బాబు ఎన్నికలకు ముందు చెప్పేవారు. టీడీపీ మీడియా, పార్టీ నేతలు ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. జనం చాలా వరకూ నమ్మారు కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత చూస్తే.. ఈ ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అమ్మకాల ద్వారా వచ్చిన రాబడి రూ.5,438 కోట్లు మాత్రమే. గత ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం రూ.6306 కోట్లుగా ఉంది.చంద్రబాబు కలల రాజధాని అమరావతిలోనూ భూమి ధరలు పెరగలేదు. దాంతో కంగారుపడుతున్న చంద్రబాబు అండ్ కో.. హైప్ క్రియేట్ చేయడానికి ఏకంగా రూ.31 వేల కోట్ల మేర అప్పులు తెచ్చి ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం అప్పులు కూడా సమీకరిస్తున్నారు. అమ్మకం పన్ను రాబడి కూడా గత ఏడాది కన్నా సుమారు వెయ్యి కోట్లు తగ్గింది. తాజాగా వచ్చిన జీఎస్టీ లెక్కలు చూస్తే 2023 డిసెంబర్లో 12 శాతం వృద్ధి ఉంటే, 2024 డిసెంబర్లో అంటే కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ మైనస్ ఆరు శాతంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం సమయంలో మూలధన వ్యయం నవంబర్ నాటికి రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, చంద్రబాబు పాలనలో అది కేవలం రూ.8329 కోట్లు ఉంది. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఏం సంపద సృష్టించారో అర్థం కాదు.ఇలా ఏ రంగం చూసుకున్నా వైఎస్ జగన్ ప్రభుత్వంతో పోల్చితే చంద్రబాబు హయంలో ఆర్థిక నిర్వహణ నాసిరకంగా ఉందని అంకెలు చెబుతున్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని టీడీపీ కూటమి ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అవే అబద్దాలను వల్లె వేస్తుంటుంది. ఈనాడు కథనంలో ఇచ్చిన బడ్జెట్ అంకెలను పరిశీలిద్దాం.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13,500 కోట్ల రాబడి అంచనా వేస్తే కేవలం రూ.5438 కోట్లే వచ్చాయి. మిగిలిన నాలుగు నెలల్లో రూ.8వేల కోట్ల ఆదాయం రావడం కష్టమే. అమ్మకం పన్ను ద్వారా రూ.24,500 కోట్లు వస్తాయని లెక్కేస్తే ఇప్పటివరకూ వచ్చింది ఇందులో సగం కంటే తక్కువగా రూ.11303 కోట్లే మాత్రమే. అలాగే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.25,587 కోట్ల ఆదాయాన్ని బడ్జెట్ అంచనాగా చూపారు. ఇప్పటివరకూ వసూలైంది రూ.13154 కోట్లు!. కేంద్ర పన్నులలో వాటా రూ.35 వేల కోట్లని చెప్పారు. వాస్తవంగా అందింది.. రూ.22వేల కోట్లు. ఇతర పన్నులు, సుంకాలు రూ.8645 కోట్లు అంచనా ఆదాయమైతే, నికరంగా లభించింది రూ.3483 కోట్లు మాత్రమే. భూమి శిస్తు మాత్రం రూ.57 కోట్ల అంచనాలకు రూ.194 కోట్లు వచ్చాయి. ఈ కథనం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. అప్పట్లో రూ.47 వేల కోట్లు ఉంటే, అది 2024 నవంబర్ నాటికి రూ.56 వేల కోట్లకు చేరుకుంది. ఇదన్నమాట చంద్రబాబు సృష్టించిన సంపద.రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికి రూ.1.12 లక్షల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం మినహా సూపర్ సిక్స్ హామీల జోలికి వెళ్లకపోయినా, ఈ ప్రభుత్వం ఎందుకింత అప్పులు చేసిందీ ఇంతవరకు వివరించ లేదు. నిజానికి ఇలాంటి వాటిపై శ్వేతపత్రాలు వేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.మరో వైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం రూ.15 వేలు కోట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్దిష్టంగా స్కీములు అమలు చేయడమే కాకుండా, పోర్టులు, మెడికల్ కాలేజీలు, తదితర అభివృద్ది పనులు చేపట్టింది. ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంది. అలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా, స్కీములు అమలు చేయకపోయినా, అభివృద్ది ప్రాజెక్టులు లేకపోయినా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్న కూటమి సర్కార్‌ను ఏమనాలి? ఆర్ధిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్తూ, తమది ‘విజన్-2047’ అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు అండ్ కో వారికే చెల్లిందని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబుకది షరా మామూలే!
బాబుకది షరా మామూలే! ‘‘చంద్రబాబూ..కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో నీకు నీవే సాటి’’ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడిని ఉద్దేశించి తరచూ చేసిన వ్యాఖ్య ఇది. 1999-2004 మధ్యకాలంలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ విపక్ష నేత అన్నది తెలిసిన విషయమే. ఆ తర్వాత ఐదేళ్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు విపక్ష నేతగా బాబు ఉన్నారు. ఈ సమయంలో ఆయా సందర్భాలలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్నిసార్లు టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను, బాబు చేసిన ప్రకటనల్లోని అబద్ధాలను వేలెత్తి చూపుతూండేవారు. ‘‘అబద్దాలు చెప్పకపోతే తల వెయ్యి ముక్కలవుతుంది అని శాపం ఉంది’’ అని కూడా వైఎస్సార్ ఎద్దేవ చేసేవారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైన ధోరణిలోనే ప్రసంగాలు సాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అసత్యమైనా తన అవసరానికి తగ్గట్టు మాట్లాడేవారని చెప్పాలి.ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు ఎక్కువసార్లు సఫలమయ్యారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆ తరువాత ఇంకో మాట మాట్లాడటం విషయంలో ముప్పై ఏళ్ల క్రితం మాదిరిగానే ఇప్పుడూ బాబు ఉన్నారు. అబద్దాల విషయంలో స్థిరత్వం పాటించిన నేత అన్నమాట! చంద్రబాబు తాజా ప్రసంగం ఒకటి వింటే ఔరా అనిపిస్తుంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను తెగ ఊరించిన ఆయన వీటితోపాటు మేనిఫెస్టోలో మరో 175 హామీలు ఇచ్చారు. అధికారంలోకి రావడంతోనే అమలు చేస్తామని, సంపద సృష్టించడం తనకు తెలుసు అంటూ నమ్మబలికారు. లోకేష్, పవన్కళ్యాణలు కూడా బాబు వాగ్ధానాలను ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు అవుతాయా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు... ‘‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’’ అని ప్రకటించేశారు. అరె... తమకు తెలియకుండా అన్ని హామీలెప్పుడు అమలు చేశారబ్బా అని ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతైంది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలు బాగా పనిచేశాయంటే అర్థం చేసుకోవచ్చు. అవి ఉత్తుతివే అని అందరూ అనుకుంటున్నప్పుడు ఎన్నికల సంగతి ఎవరూ ప్రస్తావించరు. అందుకే హామీలన్నీ అమలు చేసేశామన్న భ్రమ కల్పించేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారని అనుకోవాలి. అయితే వృద్ధుల ఫించన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం మినహా మరే ఇతర హామీ అమలు కాలేదన్నది వాస్తవం. పైగా... లక్షల మంది ఫించన్లకు కోత పెట్టిన తరువాత కానీ మొత్తం పెంపు జరగలేదు.ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. ఎంతమందికి నిజంగా అందిందన్నది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారనుకున్నా, మరో నాలుగు నెలల వరకు ఆ ఊసే ఎత్తడానికి వీలు లేదు. అంటే నెలకు రూ. 200ల చొప్పున రాయితీ మాత్రమే ఇచ్చారన్నమాట. ఇతర వాగ్దానాలు అమలు చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని అడిగితే సమాధానం మాత్రం బాబూ అండ్ కో నుంచి ఉండదు. ఇదేం న్యాయమని అడిగితే వారి గొంతు నొక్కేందుకు పోలీసులు కేసులు బనాయించేస్తారు. కేసులు వస్తాయి. జైలుపాలు కావాల్సి ఉంటుంది. మహిళా శక్తి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికీ రూ.1500 చొప్పున ఇస్తామని అప్పట్లో ప్రచారమైతే చేశారు కానీ.. ఇచ్చింది సున్నా! తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని.. గతంలో జగన్ కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఇస్తే తాము ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామని ఊదరగొట్టారు. ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు వస్తాయని, ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని కూడా చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చిన విషయం ఎవరూ మరచిపోలేదు కానీ అధికారంలోకి వచ్చాక ఒక విద్యార్ధికి ఈ పథకం అంది ఉంటే ఒట్టు! రైతు భరోసా కింద ప్రతి రైతుకు జగన్ హయాంలో ఇచ్చిన రూ.13500 కాకుండా రూ.20 వేల చొప్పున ఇస్తామన్న హామీ గురించి అసలు మాట్లాడటమే లేదిప్పుడు. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ప్రజలు బిత్తరపోవడం తప్ప చేసేది ఏముంటుంది. ఇక నిరుద్యోగుల సంగతి సరేసరి.ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని, అంతవరకు నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామన్న భృతి కూడా ఇప్పటివరకూ అమలు కాలేదు. ఇవి కాకుండా మానిఫెస్టోలో వలంటీర్ల కొనసాగింపు, వారి జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం, బీసీ, ఎస్సీఎస్టీ వర్గాల వారికి యాభై ఏళ్లకే రూ.4 వేల చొప్పున ఫించన్, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న హామీ కూడా అమలు కాకపోగా.. అసలుకే మోసం వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వలంటీర్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు పోగా.. ప్రజలపై రూ.15 వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం పడింది. బహుశా చంద్రబాబు సృష్టిస్తానన్న సంపద ఇలా జనాలపై బాదడం ద్వారానే అనుకోవడం ప్రజల వంతైంది. ఒకపక్క ప్రజలకు పైసా విదల్చని ప్రభుత్వం ఇంకోపక్క వారానికి వారం కొత్త కొత్త అప్పులు తెచ్చుకుంటున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏడు నెలల వ్యవధిలోనే లక్ష కోట్ల రూపాయల అప్పులు తేవడం ఆర్థిక వేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 1996 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాగే అలివికానీ హామీలు బోలెడన్ని చేసి ఎన్నికల తరువాత అన్నీ తూచ్ అనేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014లో హామీ ఇచ్చిన బాబు తరువాత ఎన్ని పిల్లిమొగ్గలు వేసింది ఇటీవలి అనుభవమే. ప్రత్యేక తెలంగాణ అంశంలో చూసుకున్నా, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్, బీజేపీలతో జత కట్టే అంశంలో గమనించినా, ఎన్నికల పొత్తులలో పలు భిన్నమైన విధానాలు కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా, అన్ని అవకాశవాద రాజకీయాలు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విశాఖ ఉక్కుకు.. కూటమి సర్కార్ తుప్పు!
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ కూడా అటకెక్కిందా? ఎన్నికల సమయంలో ఈ అంశం ఆధారంగా విశాఖ ప్రజలను అడ్డంగా రెచ్చగొట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. అధికారం చేతికొచ్చాక నాలుక మడతేస్తున్నారా?. కేంద్రం తీసుకున్న నిర్ణయానికీ జగన్ బాధ్యుడిని చేస్తూ అభాండాలు మోపిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూండటం వెనుక కారణం ఏమి?. ఈ అనుమానాలకు, ప్రశ్నలకు కారణం ఒక్కటే.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ని కలిసి రాష్ట్ర సమస్యలంటూ వినతిపత్రాలు సమర్పించిన బాబుగారు.. వాటిల్లో మచ్చుకైనా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకపోవడం. అదే సమయంలో వస్తుందో రాదో కూడా తెలియని ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని ప్రధానిని కోరడం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అక్కడ తాను కలిసే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర సమస్యలు, కీలకాంశాలను కచ్చితంగా వినతిపత్రం ద్వారా వారి దృష్టికి తీసుకొచ్చేవారు. కానీ తన కేసుల కోసమే ఢిల్లీ వెళతాడని బాబు అండ్ కో అబద్ధపు ప్రచారానికి దిగేది. మరి.. ప్రస్తుతం కేంద్రంలోనూ కీలకంగా ఉన్న టీడీపీ ప్రజా సమస్యల కోసం ప్రధానిని కలిసిందా? లేక ఇంకేదైనా లోగుట్టు ఉందా?. విశాఖ ప్లాంట్ మూతకు గనులు లేకపోవడమే కారణమంటున్నప్పుడు ఓ ప్రైవేట్ కంపెనీ ప్రయోజనాల కోసం గనులు కేటాయించమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కోరడం ఏమిటి? ఈ నెపంతో ఆయన తనపై ఉన్న కేసులు ముందుకు రాకుండా మేనేజ్ చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా, ఏపీ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు మణిహారం వంటి విశాఖ స్టీల్ విషయంలో కూటమి డ్రామా ఆడుతున్న విషయం తేటతెల్లం అవుతోంది. ఎన్నికలకు ముందు ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)లు చేసిన గంభీర ప్రసంగాలు ఒకసారి చూడండి. ఆ తర్వాత వీరి వ్యవహారం ఏమిటో గమనించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని, ఆ సెంటిమెంట్ కాపాడతామని చంద్రబాబు అప్పట్లో పదే, పదే ప్రచారం చేశారు. పవన్ అయితే తనకు ఇద్దరు ఎంపీలను ఇచ్చినా ప్రైవేటీకరణపై పార్లమెంటులో బలంగా గొంతెత్తుతానని కూడా చెప్పుకున్నారు. శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను నివారించలేని జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన గగ్గోలు పెట్టారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. స్టీల్ ప్లాంట్ ఒక్కో యూనిట్‌ను నిర్వీర్యం చేస్తున్నా వీరు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నందున తమకు సమస్యపై స్పష్టమైన అవగాహన లేకపోయిందని, అఖిలపక్షం వేసినా విమర్శలు తప్ప ప్రయోజం ఏమీ ఉండదని తేల్చేశారు. సెయిల్‌లో విలీనం చేయబోతున్నారంటూ ఎన్నికల సమయంలో వచ్చిన ఎల్లో కథనాలు కూడా వట్టివేనని స్పష్టమైపోయింది. టీడీపీ, జనసేనలకు ఉమ్మడిగా 18 మంది ఎంపీలతో కేంద్రంలో కీలకంగా ఉన్నా ప్రైవెటీకరణను నిలిపివేతకు మోడీ ఒప్పుకోరా అని కార్మిక సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాని చంద్రబాబు అసలు ఆ ఊసే లేకుండా ఢిల్లీ టూర్ చేసి వస్తున్నారు. మరో వైపు కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్స్ పునరుద్ధరణకు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) ఏకంగా రూ.15 వేల కోట్లు మంజూరు చేసుకున్నారు. విశాఖకు కూడా అదేరీతిలో సాయం చేయవచ్చు కదా! అని అడిగే నాథుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితం విశాఖ కూటమి నేతలను శిక్షించాలని జన జాగరణ సమితి పేరుతో ప్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలు విశాఖ స్టీల్ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తున్నారని, ఈ ముగ్గురు మోసగాళ్లను శిక్షించాలని సింహాచలం అప్పన్న స్వామిని వేడుకుంటున్నట్లు ప్లెక్సీలలో రాశారు. అయినా కూటమి నేతలలో ఉలుకు, పలుకు లేకుండా పోయింది. విశాఖ స్టీల్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పట్లో సీఎంగా ఉన్న టైంలో వైఎస్ జగన్ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న విశాఖ సభలో ప్లాంట్‌ను కాపాడాలని వేలాది మంది సమక్షంలో కోరారు. విశాఖ స్టీల్‌కు ఉన్న వేల ఎకరాల భూమిలో కొంత అమ్మి రక్షించాలని సూచించారు. దీనిపై కూడా టీడీపీతో పాటు ఎల్లో మీడియా నీచమైన కథనాలను ప్రచారం చేసింది. జగన్ విశాఖ స్టీల్ భూములను ఎవరికో కట్టబెడుతున్నారని వక్రీకరించింది. ఇప్పుడేమో భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని కూటమి మంత్రులు అంటుండడం విశేషం. CM YS Jagan wrote a letter to PM Modi on “Vizag Steel Plant Privatisation” CM Jagan requested to refrain the process of Vizag Steel Plant Privatisation and continue to invest on Esteemed organization which is producing profits recently.#VizagSteelPlant #YSJaganCares pic.twitter.com/Qe6ibOahV6— Latha (@LathaReddy704) February 6, 2021ఎన్నికల సమయంలో జగన్ చాలా స్పష్టంగా.. కూటమికి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని హెచ్చరించారు. అయినా కూటమి నేతల మాయ మాటలు నమ్మో, మరే కారణమో తెలియదు కాని ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ది పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారి అసలు రంగు బయటపడింది. ప్లాంట్ ను అమ్మివేయడానికి కేంద్రం ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి ఒకసారి విశాఖ వచ్చి ప్రైవేటైజ్ చేయబోమని చెప్పినా, అది మాటవరసకే అని అర్థమైపోయింది. శాసనమండలిలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విశాఖ స్టీల్ లో రెండు యూనిట్లను నిలిపివేశారని, రెగ్యులర్ ఉద్యోగులకు 30 శాతం జీతాలే ఇస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సభ దృష్టికి తెచ్చారు. జగన్ వల్లే ఐదేళ్లపాటు ప్రైవేటీకరణ ఆగిందని వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు, పవన్‌లు విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా విశాఖలో కూటమి తీరుపై నిరసనలు వస్తున్నా, ఇంకా అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాలేదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దాల్చే అవకాశం లేకపోలేదు. అయితే.. స్టీల్ ప్రైవేటైజైషన్ సమస్యను డైవర్ట్ చేయడానికి విశాఖకు టీసీఎస్ వస్తోందని, అనకాపల్లిలో మిట్టల్ ప్లాంట్ వస్తుందని, ఇలా రకరకాల ప్రచారాలు ఆరంభించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సెంటిమెంట్లు గుర్తుకు వస్తాయి. అధికారంలోకి రాగానే ఇంకేం సెంటిమెంట్ అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు పవన్ కూడా ఆయనకు తోడయ్యారు. అలా మాట మార్చడం వారికి మాత్రమే సాధ్యమైన కళ!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీన్ మారిందని ఎల్లోమీడియాకూ స్పష్టమైనట్లుంది!
అంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల తిరుగుబాటు వేడి బాగానే తగులుతున్నట్లుంది. టీడీపీ జాకీమీడియా ‘ఆంధ్రజ్యోతి’ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పెడుతున్న శోకండాలే దీనికి నిదర్శనం. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు, ర్యాలీలు విజయవంతం కావడంతో టీడీపీ, దాని తోకమీడియాలిప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ప్రభుత్వంపై ఆరునెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అంచనాలను వైఎస్సార్సీపీ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరు దాన్ని ధ్రువీకరించింది. తమ కోడి కూయనిదే తెల్లవారదనుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఈ వార్తలను కప్పిపుచ్చేందుకు, గత ప్రభుత్వం పాలనే ఛార్జీల పెంపునకు కారణమంటూ బుకాయించే యత్నం చేసింది. కాకపోతే ప్రజలు తమకు కలిగిన నొప్పిని కూడా మరచిపోతారని అనుకుందీ ఎల్లో మీడియా! చంద్రబాబు మాకిచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అన్న ఆలోచన, విచక్షణ లేకుండా ప్రజలుంటారా? ప్రజల చెవుల్లో పూలు పెట్టి అధికారమైతే కొట్టేశామని టీడీపీ, జనసేన, బీజేపీలు సంతోషించవచ్చు. తమ వంచన చాతుర్యానికి ఈనాడు, ఆంధ్రజ్యోతులు మురిసి పోతూండవచ్చు. అయితే ఇది ఎంతో కాలం నిలవదన్న విషయం ఈపాటికి వీరికి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా స్వర్గంగా మారిందన్న భ్రమ కల్పించడానికి కూటమి, ఎల్లో మీడియా తంటాలు పడుతున్నాయి. తమ ఈ తాజా పాచిక పారడం లేదన్న విషయమూ వారికి స్పష్టమవుతోంది. మనసులోని ఆందోళనను మరింత పెంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై ఏకంగా రూ. 15 వేల కోట్ల భారం పెట్టింది ప్రభుత్వం. దీంతో సహజంగానే ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పంతా జగన్‌దే అని జాకీ పత్రిక నీచమైన కథనం ఇచ్చింది. ‘‘నాడు షాకులు ..నేడు శోకాలు’’ అంటూ హెడింగ్ పెట్టి, విద్యుత్ చార్జీల బాదుడు జగన్ దే అని నిస్సిగ్గుగా రాసింది. ఇది నిజమే అయితే చంద్రబాబుకు తాను విద్యుత్ చార్జీలు పెంచవలసిన అవసరం ఏమి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదని, వచ్చే ఏడాది సర్దుపోటు ఉందని ఎల్లో మీడియా చెబుతోంది. దానిని ఎవరైనా నమ్ముతారా? ఇది ఏ రకంగా జరుగుతుందో ఎక్కడైనా చెప్పారా? అంటే ఇప్పటికైతే నోరుమూసుకుని ఈ రూ.15 వేల కోట్లు చెల్లించాలని చెప్పడమే కదా? చంద్రబాబు టైమ్ లో పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.47 వేల కోట్ల బిల్లులను జగన్ పాలనలో చెల్లించారా?లేదా? అప్పుడు జగన్ ఏమైనా చంద్రబాబు నిర్వాకం గురించి ఏనాడైనా శోకించారా? మరి ఇప్పుడు ఎందుకు ఈ జాకీ మీడియా గుక్కపెట్టి రోదిస్తోంది?విద్యుత్తు సంస్కరణలకు తానే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు కాలం నుంచే సర్దుబాటు ఛార్జీల విధానం ఉందన్న విషయాన్ని మరచిపోయింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలుసు. ఇందుకు తగ్గట్టుగానే.. అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని, 30 శాతం మేర తగ్గిస్తానని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఆయన ఆ తరువాత యాభై నుంచి వంద శాతం పెంచేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా ఈ పెంపునూ సమర్థించేందుకు జగన్‌పై నిందలేసే పనిలో పడ్డాయి. ఇచ్చిన హామీ ఎందుకు తప్పుతున్నారని మాత్రం ప్రశ్నించవీ పత్రికలు! ఆర్థిక, రాజకీయ సంబంధాల కారణంగానే ఎల్లో మీడియాకు ప్రజావసరాల కంటే సొంత ప్రయోజనాలే ఇలాంటి కథనాలు రాస్తున్నారని అనుకోవాలి. చంద్రబాబు టైమ్‌లో అధిక రేట్లకు చేసుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించేందుకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రయత్నిస్తే... చంద్రబాబు, ఆయన జాకీ మీడియా కాని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని యాగీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా చౌకగా అంటే యూనిట్‌కు రూ.2.49లకే కొనుగోలు చేసినా దాన్ని ఈ మంద మెచ్చుకోలేదు సరికదా అభాండాలేసింది. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరుందంటూ తప్పుడు కథనాలు రాసింది. కేంద్రం సూచనల మేరకు రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు జగన్ చేసిన ప్రయత్నాన్ని ఉరితాళ్లుగా అభివర్ణించిన ఎల్లోమీడియా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని కొనసాగిస్తూండటం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. మీడియా ఇంత దుర్మార్గంగా మారితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఆలోచించాలి.విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపునకు స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉండింది. కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు ఆరు నెలలకే రోడ్లపైకి రావడమేంటని ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు కూడా. టీడీపీ కూటమి కేసులు పెడుతుందన్న భయం దీనికి ఒక కారణమైంది. కానీ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం ఈ సమస్యపై ప్రజల గొంతుకయ్యారు. పార్టీకి కట్టుబడి ఉన్న నేతలు ధైర్యంగా బయటకు రావడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్లయింది.ఆరు నెలలుగా వైఎస్సార్సీపీని అణచి వేసేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీకి ఇది అశనిపాతమే. ఎల్లోమీడియా మాత్రం తనదైన శైలిలో వాస్తవాలను వక్రీకరించేందుకు తన వంతు ప్రయత్నం మానలేదు. ఈ నేపధ్యంలోనే జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వెళ్లి స్వాగతం పలుకుతున్నారు.ఎవరు నిజాయితీగా పాలన చేసింది ప్రజలు అర్దం చేసుకుంటున్నారనిపిస్తుంది. ధర్మవరం మీదుగా బెంగుళూరు వెళుతున్నప్పుడు ఆయా గ్రామాల వద్ద పార్టీ కార్యకర్తలు, ప్రజలు అభివాదం పలికి ఆయనతో సెల్పీలు దిగడానికి పోటీపడిన వైనం, జయ జయ ధ్వానాలు చేసిన తీరు ఆయన క్రేజ్ ను తెలియచేస్తున్నాయి. పార్టీ కార్యకర్తల్లో పెరిగిన విశ్వాసానికి ఇవన్ని దర్పణం పడుతున్నాయని చెప్పవచ్చు. ‘‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ అన్న చంద్రబాబు నినాదం అసలు అర్థం కాస్తా.. ‘బాబు ష్యూరిటీబాదుడు గ్యారంటీ’గా మారిపోయిందన్నమాట.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పాయె.. ఇంకో హామీకి కూడా బాబు మంగళం!
ఆంధ్రప్రదేశ్‌లో మరో వంచన పర్వానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం అనుకూల పత్రిక ఈనాడులో వచ్చిన ఒక కథనం చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాకమానదు. ఆర్టీసీకి ఎన్నో సమస్యలున్నాయని చెప్పే ఈ కథనాన్ని బట్టి చూస్తే.. టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఇక అమలు జరగదనే అనిపిస్తుంది. జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలోని 25 హామీల్లో ఇది ప్రముఖమైంది. తెలంగాణలో ఎన్నికల హామీకి తగ్గట్టుగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏడు నెలలవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాష్ట్రంలోని మహిళలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా తెలుగుదేశం సహా కూటమి పార్టీలన్నీ వాగ్ధానాల అమలుపై నానా రచ్చ చేసేవి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చినా ప్రతిపక్షాలు దాని అనుకూల మీడియా నానా వంకలూ పెట్టేవి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేసేవి. ఇప్పుడు మాత్రం.. ఇచ్చిన ఆరంటే ఆరు హామీలకూ మంగళం పాడుతున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతులకు గొంతు పెగలడం లేదు. పైపెచ్చూ జగన్ కారణంగా ఇప్పుడు చంద్రబాబు హామీలను నెరవేర్చలేకపోతున్నారన్న కలరింగ్ ఒకటి! ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు అనకుండా.. వారిపై జనాల్లో సానుభూతి పెంచేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ఎన్నికలప్పుడు కూటమి ఇచ్చిన హామీల్లో వృద్ధాప్య ఫించన్ల మొత్తం పెంపు ఒక్కటే ప్రస్తుతానికి అమలైన హామీగా కనిపిస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లకు పరిమితి పెట్టారు. ఇస్తామన్న మూడూ ఎంతమందికి అందుతోందన్న స్పష్టత లేదు. దీన్ని అమలు చేశారని అనుకున్నప్పటికీ మిగిలిన వాటి సంగతేమిటి? రాష్ట్రం పరిస్థితి చూస్తూంటే భయమేస్తోందని అనడంతోనే చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని పచ్చమీడియా తన బొంకులతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఏమిటన్నది ఈ మాటలతోనే స్పష్టమైపోతోంది కదా?ఎన్నికలకు ముందు... జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు వార్తలు సృష్టించారు. సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసునని బడాయికి పోయారు. మ్యానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కూడా. తీరా అధికారం చేతికొచ్చిన తరువాత చేసిందేమిటి? జగన్ చేసిన అప్పులు బాబు చెప్పిన సంఖ్యలో సగమేనని స్పష్టమైంది. పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ రూ.70 వేల కోట్ల అప్పూ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇంకో రూ.15 వేల కోట్ల భారం ప్రజల నెత్తిన రుద్దారు. ఇంతింత అప్పులెందుకు అని అడిగితే మాత్రం విషాద రాగం ఎత్తుకుంటారు బాబుగారు. ఈ క్రమంలోనే తాజాగా మహిళల ఉచిత బస్ ప్రయాణం హామీకి మంగళం పలకడమో, తూతూ మంత్రంగా అమలు చేయడమో చేసేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రివర్గ ఉప సంఘం, ఆ తర్వాత అధికారిక కమిటీలతో నివేదికలు తయారు చేయిస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం ఉచిత బస్ స్కీమ్ అమలుకు 2000 బస్సులు కావాలి. ఇప్పుడున్న వారికి తోడు మరో 11500 మంది సిబ్బంది అవసరం. మహిళా ప్రయాణికుల సంఖ్య పది లక్షలు పైగా పెరుగుతుందని. ఆర్టీసికి నెలకు రూ.ఆరు కోట్ల నష్టం రావచ్చని అధికారులు అంచనా వేశారని రాసుకొచ్చింది ఈనాడు! అన్ని కలిపి ప్రభుత్వానికి నెలకు రూ.200 కోట్లు, ఏటా రూ.2400 కోట్లూ నష్టమని లెక్కకట్టారు.ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది జీతాలపై నెలకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి విలీనం చేసిన తరువాత కూడా జీతాలు ఈ స్థాయిలో ఎందుకున్నాయో ఎల్లో మీడియా చెప్పడం లేదు. అదనపు సిబ్బంది పేరు చెప్పి.. వీరి నియామకానికి సమయం పడుతుందని.. వీరి జీతభత్యాలు అదనమని చెప్పేందుకు ఈనాడు తన కథనం ద్వారా ప్రయత్నిస్తోందన్నమాట. అయితే.. రాజకీయాల్లో తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే చంద్రబాబుకు హామీ ఇచ్చే నాటికి ఈ విషయాలన్నీ తెలియవని అనుకోవాలా? అంటే.. గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు ఇచ్చారనేగా అర్థం ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేస్తే తీవ్రంగా నష్టపోయేది ఆటోవారు. కాబట్టి వీరికి పరిహారం సంగతి కూడా చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో కొన్ని లోటుపాట్లతో ఈ పథకం అమల్లో ఉంది. కొత్త బస్సులు కొనలేదు.. అదనపు సిబ్బంది నియామకమూ జరగలేదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. ఎగొట్టడానికే అన్నది సామాన్యుడిని అడిగినా వచ్చే సమాధానం. చంద్రబాబు ఎన్నికల హామీల అమలుకు ఏటా రూ.1.5 లక్షల కోట్లు కావాలని వైసీపీ ఎప్పుడో స్పష్టం చేసినా టీడీపీ తమకు అనుభవముందని చెప్పేవాళ్లు. అచ్చంగా 2014లో రైతు రుణమాఫీ హామీ మాదిరిగా అన్నమాట! అప్పట్లో బాబు తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని కూడా విడిపిస్తానని పదే, పదే ప్రచారం చేశారు. దానిని రైతులు చాలా మంది నమ్మి ఓట్లు వేశారు.ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపెట్టింది. రకరకాల కండిషన్లు పెట్టడం, సర్టిఫికెట్ల పేరుతో ఆఫీస్‌ల చుట్టూ తిప్పడం వంటి ఇబ్బందులు పడ్డారు. అయినా రుణమాఫీ కేవలం రూ.15 వేల కోట్ల మేరే చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వం రుణమాఫీ కొనసాగించాలని కూడా టీడీపీ డిమాండ్ చేసేది. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆనాటి రుణమాఫీ బాకీల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే పాత రుణమాఫీ బాకీ గురించి రైతులు అడిగే ప్రశ్న రాదు. ఈ సారి ఇచ్చిన రైతుల పెట్టుబడి సాయం రూ.20 వేలు హామీ ఎప్పుడు నెరవేర్చేది చెప్పడం లేదు. ఈ దశలో ఒక్కో హామీకి సంబంధించి ఇబ్బందులపై ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించి దాటవేయడానికి ప్రయత్నాలు ఆరంభం అయినట్లు అర్ధం చేసుకోవచ్చు. అందులో భాగంగానే మహిళల ఉచిత బస్ హామీకి గుడ్ బై చెప్పడానికి లేదా, గతంలో రుణమాఫీ మాదిరి అరకొరగా చేయడానికి ఒక ప్రాతిపదికను తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రేవంత్‌ను కలిసిన సినీ పెద్దలు.. రాజీ కుదిరినట్టేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలు జరిపిన భేటీ పెద్దగా ఫలితమిచ్చినట్లు లేదు. బెనిఫిట్ షోలతోపాటు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవంత్ రెడ్డి తన వాదనకు కట్టుబడి ఉండటంతో సినీ రంగం పెద్దలకు పాలుపోని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని, టిక్కెట్ ధరలు విచ్చలవిడిగా పెంచుకోవడమూ సాధ్యం కాదని సీఎం కుండబద్ధలు కొట్టారు. పైగా తెలంగాణలో ఏర్పాటు చేయనున్న గురుకులాల కోసం సినిమా పరిశ్రమ నుంచి ఒక శాతం సెస్ వసూలు చేస్తామని కూడా సీఎం స్పష్టం చేయడంతో వారు నిస్సహాయులై, నిట్టూర్పులతో సమావేశం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం ఒక మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం మాత్రం కొంత ఉపశమనమిచ్చే అంశం. ఈ ఉప సంఘం ద్వారా సినీ నిర్మాతలకు, ప్రభుత్వానికి మధ్య రాజీకి ప్రయత్నమేదైనా జరుగుతుందా? అల్లూ అర్జున్ విషయంలో ఏదైనా రాజీ కుదిరిందా? లేదా? అన్నది వేచి చూడాల్సిన అంశాలు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండగా కూడా సినీ పరిశ్రమతో సత్సంబంధాల కోసం గట్టి ప్రయత్నమే జరిగింది. వైఎస్ జగన్.. సీనీ రంగ ప్రముఖులందరినీ సాదరంగా ఆహ్వానించి, గౌరవించారు. పరిశ్రమను ఆంధ్రకు తరలించాలని, ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలిస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఈ విషయంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దుష్ప్రచారం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా అబద్దపు ఆరోపణలు చేశారు. మురళీ మోహన్ వంటి వారు ఎల్లో మీడియాతో మాట్లాడుతూ తమ కార్లను వైఎస్ జగన్ ఇంటి గుమ్మం వరకు రానివ్వలేదని తప్పుడు మాటలు మాట్లాడారు.చిన్న సినిమాలకూ రక్షణ ఉండాలని, ఏపీలో 30 శాతం షూటింగ్ చేయాలని, పెట్టుబడి వంద కోట్లు ఉంటే జీఎస్టీ వివరాలు ఇచ్చి ప్రోత్సాహాలు తీసుకుని, ధరలు కూడా పెంచుకోవచ్చని జగన్ చెబితే ఎల్లో మీడియా నానా రకాల అసత్యాలు ప్రచారం చేసింది. వైఎస్ జగన్‌కు కక్ష అని అన్నారు. టీడీపీ అనుకూల పత్రిక యజమాని జగన్‌కు సినిమా వాళ్లంటే పడదా అన్న ప్రశ్న వేస్తే ఖండించాల్సిన మురళీ మోహన్ సమర్థిస్తూ మాట్లాడారు. ఇప్పుడు అదే మురళీ మోహన్ తెలంగాణ సీఎంతో సమావేశమైనప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చాలని కనీసం గట్టిగా అడగనైనా అడగలేకపోయారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే గిట్టుబాటు కాదని మాత్రం గొంతు పెగల్చగలిగారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు వంటి వారు కూడా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ తదితర అంశాల గురించి మాట్లాడారే తప్ప అసలు సమస్యను మాత్రం వివరించలేకపోయారు.ఇక, అల్లు అర్జున్‌పై కేసు విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి ఈ చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. అయినా సరే.. ఆయన తప్పు లేదని చెప్పే సాహసం సినీ రంగ పెద్దలకు లేకపోయింది. ఆస్తులు, వ్యాపారాలన్నీ హైదరాబాద్‌లోనే ఉండటంతో వాళ్లు ఏమీ మాట్లాడలేకపోయారని, చివరకు బౌన్సర్లతో సమస్యలేమి వస్తాయని కూడా అడగలేకపోయారని అనిపిస్తోంది. రేవంత్ ఒక విషయం తేల్చి చెప్పారు. అల్లు అర్జున్‌పై తనకు కోపం ఏమీ లేదంటూనే.. ఆయన ఏదో ఫంక్షన్లో తన పేరు మరచిపోయినందుకు కేసు పెట్టానన్న ప్రచారాన్ని సినీ ప్రముఖులు ఖండించకపోవడాన్ని మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఈగో ఇక్కడే దెబ్బతిందన్న విషయాన్ని ఆయన కూడా నిర్దారించారన్నమాట.బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలను సినిమా వాళ్లు ఖండించలేదని కూడా ఆయన బాధపడ్డారు. ఒకవేళ అలాంటి రాజకీయ అంశాలలో జోక్యం చేసుకుంటే ఇతర పార్టీలకు ఆగ్రహం రావచ్చు. అయినా ఆ మాట చెప్పలేకపోయారు. సినిమా పరిశ్రమకు కూడా సామాజిక బాధ్యత ఉంటుందని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు మద్దతివ్వాలని రేవంత్ కోరడం తప్పు కాదు కానీ అలాంటి సినిమాలు తీస్తే వచ్చే నష్టాన్ని భరించేదెవరు. అలాగే ముఖ్యమంత్రి పిలుపు మేరకు అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీయాలన్నా భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. ప్రేక్షకులకు థియేటర్లకు రావడమే గగనమైన ఈ కాలంలో విడుదలైన వారం రోజుల్లో పెట్టుబడులు రాబట్టుకోలేకపోతే వారి పరిస్థితి ఏమిటి? ఈ విషయాలన్నీ రేవంత్‌కు తెలియనివి కావు. కానీ శాసనసభలో బెనిఫిట్ షోలు, ధరల పెంపు లేవని ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలో వాటికే ఆయన కట్టుబడి ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ హయాంలో టిక్కెట్ల పెంపుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే పవన్ ఒంటి కాలుపై లేచిన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అప్పట్లో మాదిరిగా సీఎంకు, టిక్కెట్ల ధరలతో సంబంధం ఏమిటని ఇప్పుడు కూడా ప్రశ్నించి ఉండాలి కదా? పది రోజులుగా కిక్కురుమంటే ఒట్టు!. బహుశా ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్ అక్కరకు రాలేదనుకుంటా. లేదా రేవంత్ ఇచ్చిన షాక్‌కు దిమ్మతిరిగి ఉండాలి. జగన్ సినీనటుడు చిరంజీవిని ఇంటికి పిలిచి విందు ఇచ్చి పంపిస్తే.. ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు.. ‘చిరంజీవితో దండం పెట్టించుకుంటారా’ అని ప్రశ్నించారు. అబద్ధమని వారికీ తెలుసు. చిరంజీవి ఈ మధ్యే రేవంత్‌ను కలిసినప్పుడు కూడా రెండు చేతులతో నమస్కారం చేశారు. విశేషం ఏమిటంటే.. చిరంజీవితోపాటు బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు కూడా రేవంత్ భేటీకి రాలేదు. బెనిఫిట్ షోలకు అనుమతించడం లేదు కనుక, వారు హాజరైతే అది అసౌకర్యంగా ఉంటుందని, అందువల్లే రాలేదని కొందరు చెబుతున్నారు.తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది సంస్థ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు సమావేశం తర్వాత అసలు బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల పెంపులు చిన్న విషయాలని, చర్చించలేదని, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడామని వివరణ ఇచ్చారంటేనే రేవంత్‌ను ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమావేశం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్దిష్ట ఎజెండా లేకుండా వీరంతా భేటీ అయ్యారన్నమాట. అయితే, బయట మాత్రం రేవంత్.. సినీ పరిశ్రమను తన దారిలోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. అలాంటిదేదీ లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా, చూడడానికి మాత్రం అది నిజమే అనిపించకమానదు.చెరువును ఆక్రమించుకున్నారన్న ఆరోపణలపై హైడ్రా తన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన తరువాత కూడా ప్రముఖ నటుడు నాగార్జున సైతం రేవంత్‌కు శాలువ కప్పడం ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదన్నది వీరి విశ్లేషణ. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖపై నాగార్జున పరవు నష్టం దావా అయితే వేయగలిగారు కానీ.. కాంగ్రెస్ పార్టీ ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదు. మందలించినట్లు కూడా లేదు. అయినా కూడా నాగార్జున సీఎంను కలిసి మాట కలపాల్సిన సందర్భం వచ్చిందన్నమాట.సినీ నటులకు రాజకీయ సంబంధాలు ఎందుకు అని రేవంత్ ప్రశ్నించడం విడ్డూరమే. రేవంత్‌కు నిజంగానే తెలియవని అనుకోవాలా?. సినీ నటుడే స్థాపించిన పార్టీ నుంచే ఆయన వచ్చారు కదా?. పైగా సినీ నటులను అడ్డం పెట్టుకుని రాజకీయం నడిపిన పార్టీలోనే ఆయనా ఉన్నారు. మురళీ మోహన్ లాంటి వారు టీడీపీ తరఫున ప్రచారం చేశారు.. ఎంపీ అయ్యారు. ఇతర పార్టీల విషయానికి వస్తే కృష్ణ.. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. జనసేనతో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం చేస్తున్నారు...నాగబాబు జనసేన నేతగా ఉంటూ చంద్రబాబు కేబినెట్లో చేరడానికి సిద్దం అవుతున్నారు. వీరు రాజకీయాలలో ఎలాంటి పాత్ర అయినా పోషించవచ్చు. కానీ, అల్లు అర్జున్ మాత్రం వైఎస్సార్సీపీ నేత రవిచంద్ర కిషోర్‌ను నంద్యాలలో కలవడం పెద్ద తప్పు అట. ఇలాంటి విషయాలలో సినీ పరిశ్రమ ఒక మాట మీద ఉండదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అన్న సూత్రం అందరికీ వర్తిస్తుంది. పెద్ద సినీ నిర్మాతలు నిజంగానే భయపడ్డారా? లేక ప్రస్తుతానికి నటిస్తున్నారా? రేవంత్ కోపం తగ్గాక తమ డిమాండ్లను నెరవేర్చుకుంటారా? లేక రేవంత్ ప్రభుత్వంపై పోరుబాటకు దిగుతారా? అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్. రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్‌కు మరొకటా?
బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది. కేటీఆర్‌పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. కేటీఆర్‌పై అనూహ్యమైన రీతిలో స్పందించిన ఈడీ, అదే ఏపీలో గతంలో చంద్రబాబుపై వచ్చిన కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదన్నది పలువురి ప్రశ్నగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా బలపడాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను వీక్ చేయడానికి చేస్తున్న ప్లాన్ లో ఇవన్ని భాగమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పార్లమెంటులో సైతం ఈడీ,సీబీఐ అనుసరిస్తున్న పద్దతుల గురించి విపక్ష సభ్యులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఈడీ,సీబీఐలను ఆయా నేతలపైకి ఉసికల్పడం, వారు భయపడి బీజేపీలోకి రాగానే కేసులు మూలపడడం జరిగిపోతోందన్నది వారి విమర్శ. దీనినే వాషింగ్ మిషన్ ట్రీట్ మెంట్ అంటే బీజేపీలో చేరగానే పరిశుభ్రం అయిపోతున్నారని ఎద్దేవ చేస్తుంటారు. దానికి తగినట్లుగానే ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరగానే వారిలో ఇద్దరిపై ఉన్న బ్యాంకు రుణాల ఎగవేత కేసులు చప్పబడిపోయాయని అంటారు.మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది.కేటీఆర్ పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించగానే, ఎన్‌సిపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ కు క్లీన్ చిట్ వచ్చేసిందని చెబుతారుఇప్పుడు తెలంగాణలో ఈ ఫార్ములా కేసులో కూడా అలాగే బీజేపీ వ్యవహరిస్తోందా? అన్నదానికి అప్పుడే అవునని చెప్పలేకపోయినా, ఈడీ వాయు వేగంతో వ్యవహరించిన తీరుపై డౌట్లు వస్తాయి.హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి ఆ సంస్థకు సుమారు 55 కోట్ల మేర నిధులు విడుదల చేయడం తప్పన్నది ప్రభుత్వ వాదన.ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ఏసీబీ కేసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇంకేదో ఉందని, 600 కోట్ల అవినీతి అని కొత్త విషయం శాసనసభలో చెప్పారు. ఆ విషయం ఫార్ములా రేస్ సంస్థవారే వెల్లడించారని,కేటీఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారని,ఆయన చెవిలో చెప్పారట.ఇందులో నిజం ఉందో లేదో కాని,వినడానికి మాత్రం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే తన ఆధ్వర్యంలోని ఏసీబీ 55 కోట్లు నిధుల దుర్వినియోగం అని చెబుతుంటే, ఏకంగా ముఖ్యమంత్రి అది 600 కోట్లు అని అనడం కేవలం ప్రచారం కోసమే అన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లయింది.దీనిపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు.అక్కడ వారు ఈ నెలాఖరువరకు అరెస్టు చేయవద్దని, అయితే కేసు దర్యాప్తు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు.అది వేరే సంగతి. ఈ దశలో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఏసీబీకి లేఖ రాయడం, కేటీఆర్ ,ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయడం జరిగిపోయింది.ఇది ఏసీబీ కేసు ఆధారంగానే జరిగింది.ఇదంతా రేవంత్ రెడ్డి, బీజేపీ కుమ్మక్కు వల్లేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.కేటీఆర్ పై కేసు పెట్టడానికి గవర్నర్ ఓకే చేసిన తర్వాత వేగంగా ఈ పరిణామాలు సంభవించాయి.కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి కేటీఆర్ వెళితే ఈ కేసులో గవర్నర్ అనుమతి రాకుండా చేసుకోవడానికే అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. తీరా చూస్తే గవర్నర్ పర్మిషన్ ఇవ్వడమే కాదు.. ఈడీ కూడా వచ్చేసింది.ఇప్పుడు కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు నేపధ్యం ఇలా ఉంటే గతంలో జరిగిన కొన్ని విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 2019 లో చంద్రబాబు ప్రభుత్వంఓడిపోయిన తర్వాత కొద్ది నెలలకు ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబు పిఎస్ ఇంటిపై దాడి చేసి పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ప్రకటించారు. ఏకంగా రెండువేల కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని సిబిటిడి సాధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పటికి ఐదేళ్లు అయినా ఆ వ్యవహారంపై అతీగతీ లేదు.అంటే ప్రధానమంత్రినో,హోం మంత్రినో, ఆర్ధిక మంత్రినో మేనేజ్ చేసుకుంటే ఎలాంటి కేసు అయినా విచారణ లేకుండా ఆగిపోతుందా అని సామాన్యుడు ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెప్పగలం.దేశంలో చట్టాలు కొందరికి చుట్టాలు అన్న నానుడిని నిజం చేసినట్లే కదా? గతంలో జగన్ ప్రభుత్వ టైమ్ లో అమరావతి భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది.దానిని పట్టించుకోలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు 350 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులలో సింహభాగం షెల్ కంపెనీలకు, చివరికి టిడిపి బ్యాంక్ ఖాతాకు చేరాయని అప్పట్లో సిఐడి ఆధార సహితంగా చూపుతూ ఈడీకి కూడా తెలియచేసింది. నిజానికి తొలుత ఈ కేసును జిఎస్టి అదికారులు గుర్తించారు.దానిని ఈడీ టేకప్ చేసి కొందరిని అరెస్టు కూడా చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు అది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది.ఆయన ప్రమేయంతోనే రూల్స్ తో నిమిత్తం లేకుండా నిధులు విడుదల అయ్యాయని అభియోగం చేసింది.ఈ కేసులో చంద్రబాబును సిఐడి రిమాండ్ కు తీసుకుంది.ఏభైమూడు రోజుల పాటు జైలులో ఉండి ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పై బయటకు వచ్చారు.ఆ తర్వాత పరిణామాలలో బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కాగలిగారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.అంతే! ఈడీ ఈ కేసులో వేరేవారి ఆస్తులు జప్తు చేసింది తప్ప , చంద్రబాబు ఊసే ఎత్తలేదు. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని కేంద్రం చెబుతున్నా,కేసు ఎందుకు ముందుకు కదలడం లేదన్నదానికి జవాబు దొరకదు.ఇప్పుడు చంద్రబాబు అదికారంలోకి రాగానే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి అన్ని వ్యూహాలను పన్నుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.ఆ కేసులను నీరుకార్చడానికి ఢిల్లీ నుంచి తమ లాయర్ సిద్దార్ధ్ లూధ్రాను రంగంలోకి తెచ్చి, ఏకంగా పోలీసు ఉన్నతాధికారులనే ఆయన వద్దకు పంపి సమాలోచనలు జరిపించారట.ఈ క్రమంలోనే గతంలో ఈ కేసులు పెట్టిన సిఐడి అదికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.వారిప వేర్వేరు కేసులు పెట్టి , సస్పెండ్ చేస్తున్నారు.ఇది మంచి పరిణామం అవుతుందా?అన్నది చర్చ. ఒకవేళ ఈ ప్రభుత్వం మారి భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగితే, ఇప్పుడు ఈప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహించారని అనేక మంది పోలీసు లేదా,ఇతర శాఖల అధికారులపై చర్యలు ఉండవా?అంటే కచ్చితంగా ఉంటాయని చెప్పాలి. రాజకీయాలలో టిట్ ఫర్ టాట్ అన్నది ఒక నానుడి. కాని ఈలోగా వ్యవస్థకు జరగాల్సి డామేజి జరిగిపోతుంది. అంతేకాదు.ఏకంగా ఏపీలో అయితే చంద్రబాబు కేసులు ఉన్న ఒక న్యాయమూర్తి ఇంటి వద్ద ఇంటెలెజెన్స్ అదికారులు కొందరు నిఘా పెట్టారట.ఈ విషయాన్ని ఆ జడ్జిగారే స్వయంగా కోర్టులో పోలీస అధికారులను ప్రశ్నించారు.ఇది చాలా సంచలన విషయం. అయినా ఎల్లో మీడియా ఇలాంటివాటిని కప్పిపెడుతోంది.గతంలో జయలలితపై కేసులు వచ్చాయి. అంతలో ఆమె ముఖ్యమమంత్రి అయ్యారు.తదుపరి ఆ కేసులను కర్నాటక రాష్ట్ర హైకోర్టుకు బదలీ చేశారు.చంద్రబాబు పై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ కూడా పడింది. కాని అది ఇంకా విచారణకు వచ్చినట్లు లేదు.పెద్ద నాయకులపై అవినీతి కేసులు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా వ్యవస్థలు తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది. తమకు ఇష్టం లేని నేతలపై కేసులు పెట్టడం, తమకు సరెండర్ అయిపోతే వాటిని పక్కనవేయడం, లేదా వారి మెడపై కత్తిమాదిరి వేలాడదీసినట్లు ఉంచడం.. ఇవి ఆయా వ్యవస్థల జవాబుదారితనాన్ని దెబ్బతీస్తాయి. గతంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారని ఆయనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టింది చూశాం. ఆ విషయాన్ని అప్పటి బీజేపీ నేత సుష్మ స్వరాజ్ పార్లమెంటులోనే వెల్లడించారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే మాదిరి వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కేసుల విషయంలో ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ ఎందుకు స్పందించలేదు? కేటీఆర్ కేసులోనే ఈడీ ఎందుకు అతిగా రియాక్ట్ అయింది? తాజాగా కాకినాడ సీపోర్టు షేర్ల బదలాయింపు విషయంలో కూడా ఈడీ ఇలాగే వేగంగా స్పందించడం గమనార్హం. ఈడీ తన బాద్యత నిర్వహిస్తే తప్పుకాదు. కాని కొందరి విషయంలోనే చేస్తే అది సంస్థ నిష్పక్షపాతం పై మరక పడుతుంది. పలుకుబడి, పరపతితో పాటు, మేనేజ్ మెంట్ స్కిల్ లేకపోతే నేతలకు ఇలాంటి చిక్కులు వస్తాయా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సంక్షోభం.. సినీ రంగానికా? రాజకీయానికా?
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప -2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయం చిలికి,చిలికి గాలివానగా మార్చడానికి రాజకీయ నేతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. సినీ పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం చూపించేలా పరిస్థితులు ఏర్పడుతుండడం దురదృష్టకరం. వేలాది మందికి ఆధారంగా ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి.. కొత్త సంవత్సరంలో సంక్రాంతి(Sankranti) సందర్భంగా విడుదల కావల్సి ఉన్న సినిమాలపై ఈ ఉదంతం.. పరిణామాల ప్రభావం పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. దానికి కారణం వీరిలో కొందరు భారీ వ్యయంతో సినిమాలు తీయగా, ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షో లు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించం అని ప్రకటించడమే అని చెబుతున్నారు. వినోద మాద్యమ రంగంలో వచ్చిన అనేక మార్పుల ప్రభావం ఆ పరిశ్రమను అతలాకుతలం చేస్తోందని చెప్పవచ్చు. ఆ దశలో అల్లు అర్జున్ ఘటన వ్యవహారాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది రేవంత్ ఈగో సమస్యగా మారినట్లుగా ఉంది. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ ప్రముఖులను తప్పుపట్టారు. అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండి ఇంటికి వస్తే సినీ ప్రముఖులు, ఇతరులు క్యూ కట్టి పరామర్శిస్తారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. తొక్కిసాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ఆస్పత్రిలో ఉంటే ఎందుకు పరామర్శించ లేదని ఆయన అన్నారు. నిజమే!ఆ బాలుడిని పరామర్శించాలని చెప్పడం తప్పు లేదు.కాని ఆ కారణంగా అర్జున్ ఇంటి వద్దకు వెళ్లడం తప్పన్నట్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అంత సముచితంగా లేదు.పైగా కాలు పోయిందా?చేయి పోయిందా? కిడ్నీ పోయిందా?ఏమి జరిగిందని అర్జున్ వద్దకు వెళ్లారని ప్రశ్నించడం మరీ తప్పు అని చెప్పకతప్పదు. తమకు సంబంధించిన వ్యక్తి తప్పు చేసినా, చేయకపోయినా, ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన సన్నిహితులు,అదే రంగానికి చెందినవారు వెళ్లి పలకరించి వస్తుంటారు.అంతెందుకు! ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి బెయిల్ పై జైలు నుంచి విడుదల అయినప్పుడు జైలువద్దకు వచ్చినవారితో కలిసి ఆయన ర్యాలీనే తీశారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ పై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేసి పశ్చాత్తాప్తం ప్రకటించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోరు పారేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. అల్లు అర్జున్ ఆంధ్రా వెళ్లిపోవాలట..! ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యాపారాలు చేయాలట!. ఇలాంటి వ్యాఖ్యలను రేవంత్ సమర్దిస్తారా? సమర్దించరు. ఎందుకంటే స్వయానా ఆయన అల్లుడు ఆంధ్రకు చెందినవారన్న సంగతి తెలిసిందే. ఈ మాత్రం సోయ లేకుండా భూపాల్ రెడ్డి వంటి వారు వ్యర్ద ప్రసంగాలు చేస్తే అది కాంగ్రెస్ కు మరింత చేటు తెస్తుంది. మంత్రి సీతక్క అయితే.. పుష్ప సినిమాకుగానూ అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. అది తప్పయితే.. రేవంత్ ప్రభుత్వం ఆ సినిమాకు బెనిఫిట్ షోలు, ధరల పెంపుదలకు ఎందుకు అనుమతి ఇచ్చింది?. ఆ మాటకు వస్తే నక్సల్స్ కు సానుభూతిగా కొన్ని సినిమాలు వచ్చాయి.వాటిలో కొన్నిటికి అవార్డులు కూడా లభించాయి. కాని నక్సల్స్ ను ఏ ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా?. సీతక్క(Seethakka) ఎందుకు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చారు?. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే సరిపోదని గుర్తించాలి. ఇదే టైంలో.. 👉బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, రఘునందన్ తదితరులు అల్లు అర్జున్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని,పగ పట్టినట్లు వ్యవహరిస్తోందని కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నా.. బీజేపీ వాళ్లే దీనిని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు కస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యత్నిస్తోంది. భవిష్యత్తులో అల్లు కుటుంబాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది చూడాలి. ఇక.. అర్జున్ పై కాంగ్రెస్ కాక తగ్గించకపోతే.. ఆ దిశగా అడుగులు పడ్డా ఆశ్చర్యం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అర్జున్ దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వానికి మంటపుట్టించింది. అది అర్జున్ కు ఉన్న స్వేచ్చ అని ప్రభుత్వం భావించలేదు. పోలీసు ఉన్నతాధికారులంతా రంగంలో దిగి అర్జున్ ఏదో ఘోరమైన నేరం చేశారని చెప్పడానికి యత్నించారు. లేకుంటే ఈ కేసులో పదివేల వీడియోలు సేకరించవలసినంత అవసరం ఏముంది?. ఎక్కడో చోట అర్జున్ తప్పు దొరకకపోదా? అని వెతికారన్నమాట. దీనిని ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టగా భావించారన్నమాట!. ఇదే సందర్భంలో.. 👉పోలీసులు సంధ్య థియేటర్ వద్ద అర్జున్ కు స్వాగతం చెప్పిన రీతిలో వ్యవహరించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఒక సస్పెండెడ్ పోలీస్ అధికారి అయితే మరీ రెచ్చిపోయి ఆంధ్ర-తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం, అర్జున్ నటన గురించి వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమవారికి ఇచ్చిన భూముల ప్రస్తావన తేవడం, ఏకంగా తాటతీస్తాం,తోలు తీస్తాం అని హెచ్చరించడం శోచనీయంగా ఉంది. అర్జున్ కు పోలీసులు నోటీసు ఇచ్చి మూడున్నర గంటలు విచారించడం కూడా వేధింపులో భాగమే అనే అభిప్రాయం కలుగుతుంది. పైగా అర్జున్ ‘‘అలా జవాబిచ్చారు..ఇలా సమాధానం ఇచ్చారు..’’ అంటూ లీకులు ఇచ్చిన తీరు కూడా దీనిని ధృవపరుస్తుంది. ఏపీలో రెడ్ బుక్(Red Book) రాజ్యాంగం మాదిరి తెలంగాణలో కూడా పోలీసులు ప్రజల తోలు తీసే రాజ్యాంగం వచ్చిందేమో తెలియదు.మరో వైపు కొందరు ఓయూ జేఏసీ పేరుతో అర్జున్ ఇంటిపై దాడి చేయడం మరింత దారుణం. పేరుకు జేఏసీ అయినా.. అక్కడకు వెళ్లినవారంతా కాంగ్రెస్ వారేనని సోషల్ మీడియాలో ఆధార సహితంగా వీడియోలు వచ్చాయి. దీనిని ఖండించి , ఏకోన్ముఖంగా నిరసన చెప్పవలసిన సినిమా పరిశ్రమ పెద్దలు జడిసిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ శాసనసభలో చేసిన విమర్శలతో వీరంతా భయపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే.. 👉అర్జున్ ఇంటిపై దాడి చేసినవారు అరాచకంగా రాళ్లు వేసి,పూలకుండీలు మొదలైనవాటిని ధ్వంసం చేసినా ఇంటిలో పనిచేసేవారిపై దౌర్జన్యానికి దిగినా సినీ ప్రముఖులు మాత్రం నోరు మెదపలేదు. అర్జున్ కు ,ఆయన తండ్రి అరవింద్ కు సంఘీబావం తెలపలేదు. ఇది పరిశ్రమ బలహీనతగా ఉంది. రేవంత్ కూడా అర్జున్ ఇంటిపై దాడిని నేరుగా ఖండించకుండా, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నానని ప్రకటన ఇవ్వడం ద్వారా ఆయనలో ఇంకా కోపం తగ్గలేదని చెప్పకనే చెప్పారనుకోవాలి.. ఇదే సందర్భంలో సడన్ గా బెనిఫిట్ షో లు రద్దు చేస్తామని సీఎం చెప్పడం సినీ పరిశ్రమ ప్రముఖులలో గుబులు రేపుతోంది. వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో ప్రముఖ నటుడు వెంకటేష్ తదితరుల సినిమాలు విడుదల కావల్సి ఉంది. వీటిలో ఒక సినిమాకు ఐదువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయిందట!. అలాగే మరో సినిమాకు 150 కోట్లు ఖర్చు పెట్టారట!. ఈ భారీ బడ్జెట్ సినిమాలకు స్పెషల్ షో లు, ధరల పెంపు,బెనిఫిట్ షో లు వంటివి లేకపోతే.. సత్వరమే వారు పెట్టిన పెట్టుబడి రావడం కష్టం అయిపోతుంది. 👉ప్రముఖ నిర్మాత ,తెలంగాణ చలనచిత్రాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రేవంత్ ను ఒప్పించి మళ్లీ బెనిఫిట్ షో లు, ధరల పెంపుదలకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకువస్తారన్న ఆశతో ఉన్నారట!. అందుకే ఇప్పుడు అర్జున్ తప్పుచేసినా, చేయకపోయినా.. ఆ ఘటన జోలికి వెళ్లకపోవడం బెటర్ అని భావిస్తున్నారట!. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ ధరల గురించి చర్చించి, షూటింగ్ లు కూడా జరిపేలా షరతులు పెడితే.. ఇంకేముంది సినిమావారిపై దాడి చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటివారు కాని, ఇటు ఎల్లో మీడియా కాని ఇప్పుడు నోరు మెదపడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించి విందు ఇచ్చి పంపితే, ఆయనకు ఏదో అవమానం జరిగిందంటూ కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు స్వయానా చిరంజీవి మేనల్లుడు ఇంటిపైనే దాడి జరిగితే పవన్ కల్యాణ్‌తో సహా ఎవరూ నోరు విప్పడం లేదు. ఎందుకంటే.. పవన్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే ఉంటాయి కాబట్టి.👉నిజంగానే రేవంత్ తననిర్ణయానికి కట్టుబడి ఉంటే ఒకరకంగా ప్రయోజనం, మరో రకంగా నష్టం వాటిల్లవచ్చు. నిర్మాతలు చిన్న బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్దం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెంచాలని కోరవలసిన అవసరం ఉండదు. కానీ అగ్ర నిర్మాతలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ ఇది ముదిరితే సినీ పెద్దలు రేవంత్ ప్రభుత్వంపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు చేయవచ్చు!. అంతేకాక తాము ఇక్కడ షూటింగ్ లు చేయలేమని,వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని ప్రకటించినా, రేవంత్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందువల్ల పరిశ్రమకు ఇబ్బంది రాకుండా, అలాగే ప్రేక్షకులకు సౌలభ్యంగా రాజీ కుదుర్చుకోవడం మంచిదని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇది సీఎం రేవంత్ వ్యూహంలో భాగమా?
రాజకీయ నేతలు తమకు లాభం ఉందనుకుంటేనే ఏదైనా వివాదాన్ని రేకెత్తిస్తుంటారు. తమకు నష్టం చేస్తుందని భావిస్తే కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.కాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కావాలని కయ్యానికి దువ్వుతున్నట్లుగా అనిపిస్తుంది.ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను ఉద్దేశించి శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఆయనలోని ఆక్రోశాన్ని బయటపెట్టాయనిపిస్తుంది.రేవంత్ ను తెలివైన రాజకీయ నేతగానే అంతా చూస్తారు.కాని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో వచ్చిన అధికార దర్పమో,లేక ఎవరైనా సలహాదారుల ప్రభావమో కాని,అనవసర వివాదాలను తెచ్చి పెట్టుకుంటున్నారనిపిస్తుంది. బహుశా ఇది ఆయన వ్యూహం కావచ్చు.లేక సినిమావారిని తన దారిలో పెట్టుకోవాలన్న లక్ష్యం కావచ్చు. లేదా అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు అయి బెయిల్ పై విడుదలైన తర్వాత పెద్ద సంఖ్యలో సినీ పరిశ్రమవారు, ఇతర ప్రముఖులు కలవడం పై ఆయనకు కలిగిన ఉక్రోశం కావచ్చు..ఏదైనా కావచ్చు.రాజకీయంగా చూస్తే ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఉన్న కష్టాలు కూడా ఒక కారణం అనుకోవచ్చు.ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదో ప్రయత్నమా అన్న భావన కలగవచ్చు. లేదా తాను ఎవరిపైన అయినా దూకుడుగా వెళ్లగలనని నిరూపించుకోవాలన్న తాపత్రయం కూడా ఇందులో ఉండవచ్చు. సంధ్యా ధియేటర్(Sandhya theater Incident) వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటనపై అల్లు అర్జున్ను బాధ్యుడిని చేస్తూ రేవంత్ ప్రభుత్వం కేసు పెట్టింది. అక్కడితో ఆగకుండా ఆయనను అరెస్టు చేసింది.ఈ క్రమంలో ఎక్కడా అర్జున్ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వెళ్లింది.సాధారణంగా పోలీసులు ఇలాంటి కేసులలో ముఖ్యమంత్రి ఏమి చెబితే అది చేస్తుంటారు. దానిని నిర్దారిస్తూ శాసనసభలో రేవంత్ ప్రసంగించినట్లు అనిపిస్తుంది.నిజానికి ఈ కేసు కోర్టు పరిధిలోకి వెళ్లింది.అలాంటప్పుడు ప్రభుత్వంలోని వారు కోర్టులో కేసు ఉంది కాబట్టి అని చెప్పి దాని గురించి మాట్లాడకుండా తప్పించుకుంటారు.కాని రేవంత్ మాత్రం పనికట్టుకుని అర్జున్ ను తిట్టడానికే అవకాశం కల్పించుకున్నట్లుగా ఉంది.శాసనసభ జరిగిన ఈ ఐదు రోజులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం, చివరి రోజు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తడం,దానిపై రేవంత్ ఘాటుగా మాట్లాడడం చూస్తే అంతా ప్లాన్ ప్రకారమే సాగిందన్న అభిప్రాయం కలుగుతుంది.ఈ సందర్భంలో రేవంత్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కు ఏమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా?కిడ్ని పోయిందా?అంతమంది ఎందుకు పరామర్శించారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు?అంటూ వితండ వాదన తీసుకు వచ్చారు.నిజానికి ఎవరిని ఇలా అనరాదు.అందులోను సెలబ్రెటిగా ఉన్న వ్యక్తి పట్ల ఇంత అమర్యాదగా మాట్లాడవలసిన అవసరం ఏమిటో తెలియదు. అంటే అర్జున్ కు ఏదైనా జరగాలని కోరుకున్నట్లుగా ఉందన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారు.ఇక్కడే అసలు విషయం బోధ పడిందనిపిస్తుంది.తన ప్రభుత్వం అర్జున్ను అరెస్టు చేస్తే, ఆయనను పలకరించడానికి ఇంత మంది సినీ పెద్దలు ఆయన వద్దకు వెళతారా?అన్న భావన ఏదో ఏర్పడి ఉండాలి. చిరంజీవితో సహా అనేక మంది బంధువులు, రాఘవేంద్రరావు తదితర సినిమా పెద్దలు ఇలా కలిసినవారిలో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఫోన్ చేసి పరామర్శించారని వార్తలు వచ్చాయి.ఈ పరామర్శల వల్ల అర్జున్ పట్ల ప్రజలలో సానుభూతి ఏర్పడిందని అనిపించి ఉండాలి. అలాగే ప్రభుత్వంపై నెగిటివ్ వచ్చిందని ఫీడ్ బ్యాక్ ఉండి ఉండాలి.అందుకే ఈ ఉదంతం జరిగిన పది రోజుల తర్వాత మళ్లీ తనది పైచేయి అనిపించుకోవడానికి రేవంత్ మాట్లాడినట్లుగా ఉంది.ఈ క్రమంలో అర్జున్ రోడ్ షో చేశారని, పోలీసులు అనుమతి ఇవ్వలేదని,తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిందని తెలిసినా ,పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మరో వైపు అల్లు అర్జున్ దీనిపై మీడియా సమావేశం పెట్టి తన వాదన తెలిపారు.అయితే ఆయన కాస్త జాగ్రత్తగా ముఖ్యమంత్రి రేవంత్ పై నేరుగా ఎక్కడా విమర్శలు చేయకుండా మాట్లాడారు.తాను రోడ్ షో చేయలేదని, పోలీసుల సూచన మేరకే చేతులు ఊపుతూ అబిమానులకు ఇబ్బంది లేకుండా చేయడానికి యత్నించానని వివరించారు.తనపై చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.అర్జున్ ఈ తొక్కిసలాటకు తాను ఎలా కారణం అవుతానని చెప్పడానికి యత్నించారు.అలాగే మరణించిన మహిళ కుటుంబాన్ని, గాయపడ్డ వారి కుమారుడు శ్రీ తేజ్ ను పరామర్శించడానికి వెళ్లాలని అనుకుంటే తనపై కేసు పెట్టినందున అలా వెళ్లడం లీగల్‌గా కుదరదని చెప్పారని ఆయన వివరించారు.రేవంత్ చేసిన వాదనలో హేతుబద్దత కనిపించదు. ఒక సినిమా నటుడు సినిమా ధియేటర్ కు వెళ్లకూడదన్నట్లుగా ఆయన మాట్లాడారు. అదే సూత్రం కరెక్టు అని అనుకుంటే ఆయా ఉత్సవాలలో తొక్కిసలాటలు జరిగి కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి.మరి ఆ ఉత్సవాలను పూర్తిగా నిలిపివేస్తున్నారా?ప్రముఖ రాజకీయ నేతలు మీటింగ్‌లు పెట్టినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చేపమందు పంపిణీలో , నాంపల్లి ఎక్జిబిషన్ గ్రౌండ్ లో గతంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి.అయినా వాటి నిర్వాహకులపై కేసులు పెట్టలేదే!అరెస్టులు చేయలేదే! మరి నేతలు రోడ్ షో లను ,సభలను ఆపివేస్తున్నారా.ఇక అర్జున్ ఎవరూ పరామర్శించకూడదని అనుకుంటే ఎలా? ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి కొన్నాళ్లు జైలులో ఉన్నారు.ఆయన బెయిల్ పై విడుదలయ్యాక చర్లపల్లి జైలు నుంచి ఊరేగింపుగా ఎందుకు వచ్చారు? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.అర్జున్ను టార్గెట్ చేయడం సరికాదని బిజెపి నేతలు,కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వ్యాఖ్యానించారు. రేవంత్ గురువుగా భావించే చంద్రబాబు నాయుడు సభలలో తొక్కిసలాటలు జరిగి పదకొండు మంది మరణించారు. అయినా అప్పుడు అది పోలీసుల వైఫల్యం అని ఆయన డబాయించారు.పు ష్కరాలలో ఆయన కుటుంబం స్నానాలు చేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే ఆయన ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోండి.కుంభమేళాలలో చనిపోవడం లేదా?రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా?పూరి జగన్నాధ్ రథం వద్ద తొక్కిసలాట జరగలేదా అని ప్రశ్నించారు.హైదరాబాద్ లో రేవంత్ మాత్రం అర్జున్ దే పెద్ద తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు.అర్జున్ ఒక్కరే కాదు..సినీ నటులంతా మొదటి షో కు వెళ్లి అబిమానులను ఉత్సాహపరుస్తుంటారు. బెనిఫిట్ షో లకుఅనుమతి ఇవ్వబోనని చెబుతున్నారు. తొలుత అధిక ధరలకు టిక్కెట్ అమ్ముకోవచ్చని అనుమతి ఇవ్వడానికి, ఇప్పుడు ఆ పర్మిషన్ ఇవ్వనని అనడానికి కారణాలు ఉండాలి కదా? సినీ పరిశ్రమవారిని తనకు సరెండర్ అయ్యేలా చూసుకోవడానికి ఏమైనా రేవంత్ ఈప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.రేవంత్‌కు ఇక్కడ టీడీపీ మీడియా మద్దతు ఇస్తోంది కాబట్టి సరిపోయింది.లేకుంటే ఈ పాటికి సినిమా పరిశ్రమపై రేవంత్ దాడి చేశారని పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ల రేట్లు పెంపుదలకు కొన్ని షరతులు పెడితేనే నానా యాగీ చేశాయి. పవన్ కళ్యాణ్ వంటివారు ఎన్ని ఆరోపణలు చేశారో చూశాం. ఇప్పుడు తెలంగాణలో ఏకంగా ప్రముఖ హీరోని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాటీడీపీ మీడియా కాని, పవన్ కళ్యాణ్ వంటివారు కాని నోరు విప్పడం లేదు.వ్యతిరేకంగా ఎవరూ ట్వీట్లు కూడా చేయడం లేదు. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీతో సహా సినీ పరిశ్రమ ఎక్కువగా ఇక్కడే ఉంది కనుక.రేవంత్ ఇంకేదైనా చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని భయపడుతుండవచ్చు.కాని సినీ పరిశ్రమకు రేవంత్ తెలియకుండానే నష్టం చేస్తున్నారు.ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఆయనకు అంత కలిసివచ్చేది కాకపోవచ్చు. ఒకసారి కేసు పెట్టాక దాని మానాన దానిని వదలివేయకుండా ఇలా కెలకవలసిన అవసరం ఏమిటో తెలియదు.ఆయన మెప్పు కోసం కొందరు అబ్బో అదిరింది అని పొగడవచ్చు. రేవంత్ ఫైర్ మాదిరి వ్యవహరిస్తున్నారని డబ్బా కొట్టవచ్చు.కాని తేడా వస్తే వీళ్లే ఘోరంగా ప్రచారం చేస్తారు. రేవంత్ సరళి ఫైర్ మాదిరి ఉంటే ఉపయోగమో,లేదో కాని, ఫైర్‌తో గేమ్ ఆడితే చేతులు కాలతాయన్న సంగతి గ్రహించడం మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘విజన్’ల పేరుతో ఏం సాధించారో కాస్త చెప్పండి చంద్రబాబు..!
ఏపీలో ఎవరు విజనరి? తాను విజనరీని అని నిత్యం ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న విజన్ ఏమిటి? ఎలాంటి పబ్లిసిటీ లేకుండా పలు వ్యవస్థలను తీసుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు ఉన్న విజన్ ఏమిటి అన్నది పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది. విజన్ -2047 డాక్యుమెంట్ ను ఒక డొల్ల పత్రంగా, చంద్రబాబుది మోసపూరిత విజన్‌గా జగన్ అభివర్ణించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని గమనించి ఆలోచించవలసిన అవసరం ఏపీ ప్రజలపై ఉంటుంది.ఆయన ప్రకటన చూస్తే ఎవరు ఏపీకి మేలు చేసే విధంగా విజన్ తో పనిచేశారో తెలుస్తోంది.చంద్రబాబు మొత్తం విజన్ల పేరుతో కథ నడపడమే కాని, చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా?అని జగన్ ప్రశ్నించారు. ఇది అర్దవంతమైన ప్రశ్నే. ఎందుకంటే విభజిత ఏపీలో ఐదేళ్లు, అంతకుముందు ఉమ్మడి ఏపీకి సుమారు ఎనిమిదిన్నరేళ్లు సీఎంగా ఉన్న ఆయన మళ్లీ గత ఆరు నెలలుగా ఆ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.విజన్ 2020 అని ,విజన్ 2029 అని, విజన్ 2047 లని ఇలా రకరకాల విజన్లు పెట్టడమే తప్ప,వాటి ద్వారా ఏమి సాధించింది చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు హైదరాబాద్ లో అది చేశా..ఇది చేశా..అని అనడమేకాని ,విభజిత ఏపీలో తన హయాంలో ఫలానా గొప్ప పని చేశానని వివరించలేకపోతున్నారు.నిజంగానే ఆయనకు అంత మంచి విజన్ ఉంటే,హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అయిన విశాఖపట్నానికి ఐటి రంగాన్ని ఎందుకు తీసుకు రాలేకపోయారు?హైదరాబాద్‌లో ఒక హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం నిర్మించిన మాట నిజం.కాని అంతకుముందే నేదురుమల్లి జనార్ధనరెడ్డి హయాంలో రాజీవ్ గాంధీ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేశారు.మరి ఆయనది విజన్ కాదా?చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హైటెక్ సిటీ ప్రాంతంకాని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంగాని అబివృద్ది చెందాయి ఆ రోజుల్లో దానికి ఎలా అడ్డుపడాలా అన్న ఆలోచనతో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పనిచేసింది. ఈ విధంగా తాము అధికారంలో లేనప్పుడు పలు అభివృద్ది పనులకు ఆటంకాలు కల్పించడంలో మాత్రం చంద్రబాబు టీమ్ కు చాలా విజన్ ఉందని చెప్పవచ్చు.మరో సంగతి కూడా చెప్పాలి. రాజకీయాలలో వైఎస్ కుమారుడు జగన్ దూసుకు వస్తారని ఊహించిన చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి అక్రమ కేసులలో ఇరికించి జైలుపాలు చేశారు.ఈ విజన్ మాత్రం బాగానే ఉందని చెప్పాలి.జగన్ పై ద్వేషంతో చీరాల ప్రాంతంలో అప్పట్లో తీసుకురాదలిచిన వాన్ పిక్ కు అడ్డుపడ్డారు.ఆ పారిశ్రామికవాడ వచ్చి ఉంటే ,ఇప్పుడుతడ వద్ద ఉన్న శ్రీసిటీ మాదిరి అభివృద్ది చెంది ఉండేది.విభజిత ఏపీకి అది పెద్ద ఆభరణంగా ఉండేది. వైఎస్ టైమ్ లో శ్రీసిటీ భూమి సేకరణకు కూడా టీడీపీ,అలాగే ఈనాడు వంటి ఎల్లో మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. అయినా వైఎస్ ఆగలేదు కనుక అది ఒక రూపానికి వచ్చింది. ఇప్పుడేమో శ్రీ సిటీ అభివృద్దిలో తమకు వాటా ఉన్నట్లుగా చంద్రబాబు పిక్చర్ ఇస్తుంటారు.విభజిత ఏపీలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఎంతసేపు సోనియాగాంధీని దూషించడం ,తదుపరి ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిపోయడం, వీటికోసం నవనిర్మాణ దీక్షలని, ధర్మపోరాట దీక్షలని డ్రామాలు ఆడారు. ఆ తర్వాత కాలంలో సోనియాను, మోడీని పొగుడుతూ వారితోనే రాజకీయంగా జత కట్టారు.అది ఆయన విజన్.తన పాలనలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు.ఆ కమిటీలలో టీడీపీ నేతలను పెట్టి గ్రామాలలో అరాచకం సృష్టించారు.అది అప్పటి విజన్ అనుకోవాలి.అదే జగన్ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను తెచ్చి, గ్రామ,వార్డు సచివాలయాలను పెట్టి పాలనను ప్రజల చెంతకు చేర్చారు.దీనిని కదా విజన్ అనాల్సింది.చంద్రబాబు తన టైమ్ లో ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వరంగంలో తీసుకురాలేదు. జగన్ తన టైమ్‌లో పదిహేడు మెడికల్ కాలేజీలను తెచ్చి, వాటిలో ఐదు నిర్మాణం పూర్తి చేశారు.అది విజన్ కాదా? చంద్రబాబు ఏమి చేశారు. కూటమి అదికారంలోకి రాగానే పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం మంజూరు చేసిన మెడికల్ సీట్లను అక్కర్లేదని లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీలను ప్రవేటు రంగంలోకి మళ్లించాలని చూస్తున్నారు.జగన్ నాలుగుపోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు.వాటిలో కొన్ని ఇప్పటికే పూర్తి అయ్యాయి.చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో ఒక్క ఓడరేవు అయినా నిర్మించారా?ఇప్పుడేమో జగన్ తీసుకు వచ్చిన పోర్టులను ప్రైవటైజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది చంద్రబాబు విజన్.వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి ,వారికి తాము నెలకు పదివేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారు.అది చంద్రబాబు విజన్ అనుకోవాలి. గత జగన్ పాలనలో ఇళ్ల వద్దకే ఏ సర్టిఫికెట్ అయినా తెచ్చి ఇచ్చేవారు.చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే ఆ పద్దతి ఆగిపోయింది.మళ్లీ ఆఫీస్ ల చుట్టూ తిరిగేలా చేసిన విజన్ కూటమిది.వృద్దులకు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచింది నిజమే అయినా,ఇప్పుడు అర్హత పేరుతో లక్షల సంఖ్యలో తొలగిస్తున్నారు.స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్ దారులలో దొంగలున్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తాము పెన్షన్ దారులలో అనర్హులను ఏరివేస్తామని చెప్పకపోగా, ఎక్కడైనా ఒకటి,అరా పెన్షన్ దారులలో కోత పడితే జగన్ పై విరుచుకుపడేవారు. ఇప్పుడేమో గెలిచాక టీడీపీ వారు కొత్త రాగం అందుకున్నారు. జగన్ స్కూళ్లు బాగు చేసి ,అందులో ఆంగ్ల మీడియంతో సహా పలు అంతర్జాతీయ కోర్సులను తీసుకు వస్తే చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేస్తోంది.వీరిద్దరిలో ఎవరు విజనరీ అనుకోవాలి.పిల్లలకు టాబ్ లు ఇచ్చి వారి చదువులకు జగన్ ఉపయోగపడితే, వాటిపై దుష్ప్రచారం చేసినవిజన్ టీడీపీది,ఎల్లో మీడియా ఈనాడు ది.ప్రస్తుతం పిల్లలకు టాబ్ లు ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదు. జగన్ పిల్లలకు విద్యే సంపద అని పదే,పదే చెప్పేవారు.చంద్రబాబు గతంలో అసలు విద్య అన్నది ప్రభుత్వ బాధ్యతే కాదని అనేవారు.చంద్రబాబు తన హయాంలో మిగులు రెవెన్యూ చూపారా? అని జగన్ ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే కదా!ఆ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడూ రెవెన్యూలోటే ఎందుకు ఉందని ఆయన అడుగుతున్నారు.జగన్ పాలనలో పేదల చేతిలో డబ్బులు ఉండేవి. దాని ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ కరోనా వంటి సంక్షోభంలో కూడా సజావుగా సాగింది.తత్ఫలితంగా జిఎస్టి దేశంలోనే అత్యధికంగా వచ్చిన రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే అది ఎందుకు తగ్గిపోయింది. గత నెలలో ఏకంగా ఐదువందల కోట్ల జిఎస్టి తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. జగన్ గ్రీన్ ఎనర్జీమీద కేంద్రీకరించి, రైతులకు మంచి కౌలు వచ్చేలా పారిశ్రామికవేత్తలకు భూములు ఇప్పిస్తే చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని తీవ్రమైన విమర్శలు చేసేవారు.కాని ఇప్పుడు అదే పద్దతిని కూటమి ప్రభుత్వం చేపడుతోంది.జగన్ టైమ్ లో రైతులకు కేంద్రం సూచన మేరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలుగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని ఉరితాళ్లుగా ప్రచారం చేసిన విజన్ చంద్రబాబుది. తాము అధికారంలోకి రాగానే యధాప్రకారం స్మార్ట్ మీటర్లను పెడుతున్న విజన్ కూటమి ప్రభుత్వానిది అని చెప్పాలి.జగన్ ప్రజల ఇళ్లవద్దకే వైద్య సదుపాయం కల్పించడానికి ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చారు.అది ఆయనవిజన్ అయితే,ఇప్పుడు ఆస్పత్రులలో దూది కూడా లభించకుండా చేసిన విజన్ ఈ ప్రభుత్వానిదని అనుకోవాలి.కరెంటు చార్జీలు పెంచబోనని,తగ్గిస్తామని పదే,పదే ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిరాగానే పదిహేనువేల కోట్ల మేర భారం వేసిన విజన్ ఆయన సొంతం అని చెప్పాలి.ఇసుక, మద్యం వంటి వాటి ద్వారా కూటమి నేతలు బాగా సంపాదించుకునేలా మాత్రం చంద్రబాబు ప్రభుత్వం విజన్ తో పనిచేసిందని చెప్పాలి.పేదలకు ప్రభుత్వమే అండగా ఉండాలన్నది జగన్ విజన్ అయితే, పేదలను ధనికులు దత్తత తీసుకోవాలన్న ఆచరణ సాధ్యం కాని విజన్ చంద్రబాబుది. అయితే అమరావతిలో ఒక రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టనక్కర్లలేదని చెప్పి, పవర్ లోకి రాగానే ఏభైవేల కోట్ల అప్పు తీసుకువస్తున్న చంద్రబాబుది ఏమి విజన్ అని అడిగితే ఏమి చెబుతాం. ఆయనది రియల్ ఎస్టేట్ విజన్ మాత్రం చెప్పక తప్పదు. జగన్ ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంభించి ప్రజలకు ఉపయోగపడేలా ప్రయత్నించారు.కాకపోతే తనది విజన్ అని ,వంకాయ అని ప్రచారం చేసుకోలేదు.అదే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వంటివారు ఎల్లో మీడియా అండతో స్వర్ణాంధ్ర-2047 అంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజలకు తామిచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేయడానికి విజన్ తో పని చేస్తున్నారని చెప్పవచ్చేమో! ఇచ్చిన వాగ్దానాలను ఎలా అమలు చేయాలా అన్నవిజన్ తో జగన్ పనిచేస్తే, చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు తాము చేసిన ప్రామిస్‌లను ఎలా ఎగవేయాలా అన్న విజన్ తో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ అటు సంక్షేమ రంగంలో కాని,ఇటు అభివృద్ది, పారిశ్రామిక రంగలో కాని, లేదా పరిపాలనను ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడంలో కాని కచ్చితంగా విజన్ తో పనిచేశారని సోదాహరణంగా చెప్పవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ సుద్దులన్నీ బీసీ నేతలకు మాత్రమేనా?
తెలుగుదేశం పార్టీ రాను రాను మరీ సంకుచితమైన రాజకీయ పార్టీగా మారిపోతోంది. రాజకీయాలన్నీ ఎన్నికల సమయానికి మాత్రమేనని ఆ తరువాత అందరూ కలిసి పని చేయాలని సుద్దులు చెప్పిన చంద్రబాబు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా గౌడ సంఘం నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఒకే వేదికను పంచుకోవడాన్ని ఆ పార్టీ నేతలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. నూజివీడులో జరిగిన ఈ కార్యక్రమానికి సొంత నియోజకవర్గం కావడంతో పార్థసారథి, లచ్చన్న మనవరాలిగా శిరీష వెళ్లారు. వైఎస్సార్సీపీ నేతలు జోగి రమేశ్ కూడా హాజరయ్యారు. అంతే.. టీడీపీ నేతలు జోగి రమేష్ వేదిక పంచుకోవడమే తప్పని, పార్ధసారథిలో వైఎస్సార్సీపీ వాసనలు పోలేదని, శిరీష తప్పు చేశారని టీడీపీ కులోన్మాదులు, లోకేష్ మెప్పుకోసం తాపత్రాయ పడుతున్న నేతలు పెద్ద ఇష్యూ చేసేశారు. అక్కడితో ఆగనూ లేదు. అదేదో పెద్ద నేరం అన్నట్లు టీడీపీ నాయకత్వం పార్ధసారథి, శిరీష్ లతో క్షమాపణ చెప్పించింది. ఎంత దారుణం! వారు కూడా తమ ఆత్మగౌరవాన్ని వదలుకుని చంద్రబాబుకు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లకు క్షమాపణ చెప్పేశారు. అయినా సరే టీడీపీ నేతలు కొందరు పార్దసారథిని విమర్శలతో ట్రోల్ చేశారు. దీంతో ఆయన తాను ఎంత చిత్తశుద్దితో పని చేస్తున్నా టార్గెట్ బాధపడడం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్మాదం ఈ స్థాయికి చేరిందా? అన్న ప్రశ్న వస్తుంది. దీన్ని కులోన్మాదం అనాలా? లేక ఇంకేమైనానా? బీసీ వర్గానికి చెందిన నేతలు మాత్రమే ఇలా కలవకూడదని ఏమైనా టీడీపీ ఆంక్షలు పెట్టిందా? ఎందుకంటే.. కమ్మ, కాపు, రెడ్డి తదితర అగ్రవర్ణాలలోని టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ వారితో, ఇతర పార్టీల నేతలతో కలిసి తిరిగినా, సభలలో మాట్లాడినా, వ్యాపారాలు చేసినా అభ్యంతరం వ్యక్తం కావడం లేదు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌ను ఆహ్వానిస్తారా? అంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటి వారు విరుచుకుపడ్డారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అప్పట్లో ఆనాటి సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం చెబుతానంటూ నాటి మంత్రి జోగి రమేష్ చంద్రబాబుకు ఇంటికి వెళ్లారు. టీడీపీ నేతలు దీన్నే ఒక పెద్ద దాడిగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక జోగిపై కేసు కూడా పెట్టేశారు. అంతమాత్రాన ఆయన ఇలాంటి సభలలో పాల్గొనకూడదని అంటే దానిని ఉన్మాదం అనక ఏమంటాం? విశేషం ఏమిటంటే టీడీపీకి మద్దతు ఇచ్చే కొందరు విశ్లేషకులు కూడా చాలా పెద్ద ఘోరం జరిగిందని టీవీలలో ఇంగితం లేకుండా మాట్లాడారు. ఈనాడు పత్రిక అయితే నీచాతినీచంగా పార్థసారథి, శిరీషల ఫోటోలు వేసి ‘ఇంగితం ఉందా’ అని, కనీస ఇంగితం లేకుండా వార్త రాసింది. ఈనాడు మీడియా స్థాయి అబద్ధాలు చెబుతోందని ఇంతకాలం విమర్శించుకున్నాం కానీ.. దాని స్థాయి అట్టడుగుకు చేరిందనేందుకు ఇదో నిదర్శనంగా నిలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. ఎన్.టిఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీలోకి రాలేదు. సినిమాలలో నటించే వారికి రాజకీయం ఏమి తెలుసు అని విమర్శలు కూడా చేశారు. కాని 1983లో టీడీపీ అధికారంలోకి రావడంతోనే బాబు పార్టీ మారిపోయారు. టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబుకు పార్టీ సభ్యత్వం ఇవ్వద్దని కొందరు సీనియర్ నేతలు అన్నా, ఎన్.టి.ఆర్. వారికేదో చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. తాజా పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎన్.టి.ఆర్కు ఇంగితం లేదనుకోవాలా? పార్టీలో గ్రూపు నడిపి, చివరికి ఎన్.టి.ఆర్.పదవికే ఎసరు పెట్టిన చంద్రబాబును ఏమనాలి? ఆ సమయంలో చంద్రబాబును ఎన్.టి.ఆర్. పలురకాలుగా దూషించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. ఎన్టీఆర్‌కు విలువల్లేవని విమర్శించిన నోటితోనే చంద్రబాబు తాము ఆయన వారసులమని కూడా ప్రకటించుకున్నారు. ఇంగితం లేనిది ఎవరికి?ఎన్.టి.ఆర్. బతికున్నంత కాలంలో అసభ్యకరమైన కార్టూన్లూ, నగ్న కేరికేచర్లు ప్రచురించిన ఈనాడు మరణానంతరం అవసరమైనప్పుడల్లా ఆయన్ను యుగపురుషుడని కొనియాడుతూ కథనాలు రాసింది. ఇక్కడ కూడా ఇంగితం లేనిది ఎవరికి? తన రాజకీయ జీవితం మొత్తం కప్పగెంతులేసిన చంద్రబాబు ఎవరెవరిని ఎప్పుడు దూషించింది.. అదే నోటితో ఎలా పొగిడిందీ తెలియందెవరికి? అందులో ఎవరికీ ఇంగితం జ్ఞాపకం రాకపోవడమే రాజకీయ వైచిత్రి! ఇవన్నీ మరచి కేవలం జోగి రమేష్‌తో ఒక వేదిక పంచుకున్నందుకు పార్థసారథి, శిరీషలకు ఇంగితం లేదని ధ్వజమెత్తుతున్నారు. లచ్చన్న ఒక కుల నాయకుడా అని వీరు తెలివిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాణం అన్ని కుల సంఘాలకూ వర్తింపజేస్తున్నారా మరి? కమ్మ కుల సంఘం మీటింగ్‌లో ఎన్.టి.ఆర్. విగ్రహాన్ని మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు? చంద్రబాబునే ఎందుకు పొగుడుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఆ కుల మీటింగ్‌లోకి హాజరైతే తప్పు లేదా? అంతెందుకు మాజీ మంత్రి పుల్లారావు, మరి కొందరు టీడీపీ నేతలు గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తుండే వారు అంటారు. వంగవీటి రంగ హత్య గురించి బాబుకు ముందే తెలుసన్న తీవ్ర విమర్శలతో చేగొండి హరిరామయ్య పుస్తకం రాస్తే దాని ఆవిష్కరణ సభకు టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ పక్షాల నేతలందరూ హాజరయ్యారే.... టీడీపీ అప్పుడు ఎవరితోనూ క్షమాపణ చెప్పించ లేదే! మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడకులకు రష్యా వెళ్లిన వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారంటారు అంతేకాదు... టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కొందరు కలిసి జూదమాడతారట. వీటికి రాని అభ్యంతరం లచ్చన్న విగ్రహావిష్కరణ సభకు వైఎస్సార్సీపీ నేత హాజరైతే వచ్చిందా? రెడ్డి జన సంఘం సభలకు కూడా వివిధ పార్టీల వారు హాజరవుతుంటారు. అంతెందుకు! లచ్చన్న మరణం తర్వాత జరిగిన ఒక కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, బీవీ రాఘవులుతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అంటే చంద్రబాబు తప్పు చేసినట్లేనా? ఎన్నికల తర్వాత అంతా రాష్ట్రం కోసమే ఆలోచించాలని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని చంద్రబాబు తరచుగా ప్రచారం చేసేవారు.ఇప్పుడు ఇలా ఎందుకు వ్యవహరించినట్లు? అంటే తన కుమారుడు, మంత్రి లోకేష్ కేవలం అవగాహన రాహిత్యంతో పార్థసారథి, శిరీషలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే, దానిని ఆమోదించి చంద్రబాబు కూడా మాట్లాడారా? తెలిసో, తెలియకో లోకేష్ మాట్లాడి ఉంటే సరిచేయాల్సిన పెద్దరికం చంద్రబాబుదే అవుతుంది కదా? అది కూడా చేయలేక పోయారంటే బాబు ఎంత నిస్సహాయంగా ఉంటున్నది అర్థం చేసుకోవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ఖజానాకు మేలు చేసే లక్ష్యంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా నవయుగ సంస్థను తప్పించి మెగా సంస్థను ఎంపిక చేశారు. దీన్ని చంద్రబాబుసహా పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. కానీ ఇప్పుడు అదే మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డితో కలిసి చంద్రబాబు టూర్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి స్వస్థలమైన డోకిపర్రులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చంద్రబాబు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కృష్ణారెడ్డి మంచివాడైపోయారా? మామూలుగా అయితే ఎవరూ వెళ్లవద్దని అనరు. కాని నూజివీడు ఘటన తర్వాత ఇవన్ని ప్రశ్నలు అవుతాయి. 2019 కి ముందు ఎన్ని ఘటనలు జరిగాయి. ప్రస్తుతం అలయ్ బలయ్ అంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అప్పట్లో ఎన్ని మాటలు అనుకున్నారు. మళ్లీ అదే పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు ఎంత తాపత్రయపడింది తెలుసు కదా? అలాగే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు, లోకేష్ లను ఎన్నేసి మాటలు అన్నారు. అసలు తన తల్లినే దూషించారని టీడీపీపై ఆరోపించారు. కాని ఏ ఇంగితం పెట్టుకుని మళ్లీ కలిశారని అంటే ఏమి చెబుతాం. బీజేపీతో తేడా వచ్చాక బీజేపీ అధ్యక్ష హోదాలో తిరుపతి వచ్చిన అమిత్ షాపై టీడీపీ వారు రాళ్లు వేశారు. ప్రధాని మోడీని చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు దూషించారు. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు, పెళ్లాన్ని ఏలుకోలేని వాడు అంటూ పరుష పదాలతో మాట్లాడిన వీరు, తర్వాత కాలంలో మోడీ అంత గొప్పవాడు లేడని చెబుతున్నారు. అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి డిల్లీలో ఎదురు చూశారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్ డిల్లీ వెళ్లి, తన పెద్దమ్మ సాయంతో అమిత్ షాను కలిసి వచ్చారే! ఇందులో ఎవరికి ఇంగితం ఉన్నట్లు?ఎవరికి లేనట్లు? చంద్రబాబు ఎవరినైనా ఏమైనా అనవచ్చు. ఎవరితోనైనా జట్టు కట్టవచ్చు? అది గొప్పతనం. ఆయన తిడితే అంతా తిట్టాలి. ఆయన పొగిడితే అంతా పొగడాలి. ఎటు తిరిగి ఆయన చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి భజన మీడియా ఉంది కనుక ఏమి చేసినా చెల్లిపోతోంది.పార్థసారథి తండ్రి కెపి రెడ్డయ్య గతంలో కాంగ్రెస్, టీడీపీలలో పనిచేశారు. ఎంపీగా పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని కాపాడడానికి మరి కొందరితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో రెడ్డయ్యపై టీడీపీ వారు ఆరోపణలు చేసేవారు. అయినా రెడ్డయ్య వాటన్నిటిని ధీటుగా ఎదుర్కునేవారు. రెడ్డయ్య నోటికి అంతా భయపడే పరిస్థితి ఉండేదని చెబుతారు. ఇప్పుడు ఆయన కుమారుడు పార్థసారథి కూడా ఒకరకంగా అదే ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కుంటున్నారు. కాంగ్రెస్ లోను, ఇప్పుడు టీడీపీలోను మంత్రిగా ఉన్నారు. శిరీష తండ్రి గౌతు శివాజి కూడా ఆరుసార్లు టీడీపీ ఎమ్మెల్యే. అలాంటి కుటుంబానికి చెందిన శిరీషను టీడీపీ నాయకత్వం అవమానించి క్షమాపణ కోరుతుందా?ఒకప్పుడు సమరసింహా రెడ్డి మంత్రిగా ఏదో కాకతాళీయంగా మరో మంత్రి కటారి ఈశ్వరకుమార్తో మాట్లాడుతూ బీసీలా..వంకాయలా అని అన్నారు. అది కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపింది. చంద్రబాబు నాయుడు గత టరమ్ లో బీసీ నేతలు కొందరు సచివాలయానికి వస్తే దేవాలయంవంటి ఇక్కడకు వచ్చి ప్రశ్నిస్తారా? అని మండిపడ్డారు. మరో సందర్భంలో మత్యకారులను ఉద్దేశించి తోకలు కట్ చేస్తానని అనడం వివాదాస్పదమైంది. ఈ మధ్యనే కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావు పై అభియోగాలు చేస్తూ లేఖ రాసిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా టీడీపీ కులోన్మాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నారు. అవమానాలకు గురి కావల్సి వచ్చింది. టీడీపీ బీసీ నేతలు ఇలాంటి వాటిని భరిస్తుండడం విశేషం. కనీసం ధైర్యంగా తాము తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు. మరో వైపు జగన్ బీసీలకు అత్యంత గౌరవం ఇచ్చి ఎన్నడూ లేని విధంగా వారికి నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించారు. వారిలో ముగ్గురు పార్టీని వీడడం దురదృష్టకరం. తమను గౌరవించేవారు కావాలో, లేక అవమానించేవారు కావాలో బీసీ నేతలే నిర్ణయించుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబును మించిపోయేలా పవన్!
పవన్ కళ్యాణ్ తన నటనా కౌశలాన్ని వెండితెరపై నుంచి రాజకీయాలకు కూడా విస్తరించినట్లుంది. రాజకీయాల్లో నటన, వంచనా చాతుర్యం వంటివి జనాలకు పరిచయం చేసిన ఘనత చంద్రబాబుదైతే.. పవన్ ఆయన అడుగుజాడల్లో.. అతని కంటే ఘనుడు అనిపించుకునేలా నడుస్తున్నాడు. ‘స్వర్ణాంధ్ర2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగాన్ని గమనిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. గతంలో ఆయన ఉపన్యాసాలకు, ఇప్పుడు చెబుతున్న సుద్దులకు ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. పదవి వస్తే అంతా సుభిక్షంగా ఉందని నేతలు ఫీల్ అవుతారట. పవన్ ప్రస్తుతం ఆ దశలో ఉన్నారు. పాతికేళ్లపాటు ఏపీలో రాజకీయ స్థిరత్వం ఉండాలని చంద్రబాబు నేతృత్వంలో పని చేస్తానని ఆయన చెప్పుకున్నారు. బాబును ఆకాశానికి ఎత్తేశారు. రాజకీయ అవసరాల కోసం పొగిడితే తప్పులేదు కానీ.. అతిగా చేస్తేనే వెగటు పుడుతుంది. 2019లో చంద్రబాబును ఉద్దేశించి పవన్ మాట్లాడిందేమిటో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ’2020 విజన్ అంట.. రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు..అవి ఇచ్చారా? ఆ ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం సాగుతోంది. చంద్రబాబు దృతరాష్ట్రుడి మాదిరిగా కొడుకు లోకేష్ కోసమే పనిచేస్తున్నారు.‘ అని ఆయన అప్పట్లో ధ్వజమెత్తారు ఇప్పుడు మాత్రం.. ’2020 విజన్ అంటే ఆనాడు అర్థం చేసుకోలేక పోయారు..వెటకారం చేశారు. ఇప్పుడు వారికి అదే భిక్ష పెడుతోంది. చంద్రబాబు గారి అనుభవం, అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీస్ అమోఘం...‘ అంటున్నారు. చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టారని పవన్ అనుకుంటూ ఉండవచ్చు కానీ.. ‘విజన్2020’తో ఒరిగిందేమిటో చెప్పకుండా ఒట్టిగా పొగిడితే చెవిలో పూలు పెడుతున్నారని జనం అనుకోరా? పవన్ కళ్యాణ్ విజన్2020 డాక్యుమెంట్‌ను అసలు చూశారా? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈ డాక్యుమెంట్‌తో ప్రచారం నిర్వహించారు. అందులోని అంశాలు పరిశీలించిన వారు ఇదేదో కాలక్షేపం వ్యవహారమని, హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు. ప్రజలు ఈ డాక్యుమెంట్‌ను అస్సలు పట్టించుకోలేదు అనేందుకు ఆ తరువాతి రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడమే నిదర్శనం. ఈ సమయంలో కానీ.. రాష్ట్ర విభజన తరువాత 201419 మధ్యకాలంలో కానీ చంద్రబాబు ఈ విజన్ పేరెత్తితే ఒట్టు! ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ పేరుతో 2047 విజన్ అన్నారో.. బాబుగారికి ఠక్కున గుర్తొచ్చింది. తాను వెనుకబడకూడదన్నట్టు ‘స్వర్ణాంధ్ర2047’ను వదిలారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.. ’కులాలు, మతాలు, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు పోయాయి. 21వ శతాబ్దంలో కూడా కులాలేమిటి..మతాలేమిటి ప్రాంతాలేమిటి?‘ అని ప్రశ్నించారు. ఆయన నిజంగానే ఇలా అనుకుంటూంటే... జనసేన తరపున తీసుకున్న మూడు మంత్రి పదవులలో ఇద్దరు కాపులు ఎందుకు ఉన్నారో చెప్పాలి కదా? మరో మంత్రి పదవిని కూడా కాపు వర్గానికి చెందిన తన సోదరుడు నాగబాబుకే ఎందుకు కట్టబెడుతున్నారు? కమ్మ వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌కు ఒక మంత్రి పదవి ఇచ్చారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఇతర వర్గాల వారికి పదవి ఇప్పించ లేకపోయారే అన్న ప్రశ్న వస్తే ఏం జవాబు ఇస్తారు? కొద్ది నెలల క్రితం వరకు కులం కావాలని, అందులోను కాపులు, బలిజలు అంతా ముందుకు రాకపోతే రాష్ట్రంలో మార్పు రాదని రెచ్చగొట్టే రీతిలో ఉపన్యాసాలు ఈయనే చేయడం విశేషం. కాపులు తనకు ఓటు వేసి ఉంటే భీమవరం, గాజువాకల్లో ఎందుకు ఓడిపోతానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కుల భావన అన్నా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని కూడా అప్పట్లో సెలవిచ్చారు. పవన్ తమ కులం వాడని నమ్మి మద్దతిచ్చిన కాపులు, బలిజలు ఇప్పుడు కుల భావాన్ని వదులుకోవాలా? అందుకు వారు సిద్దం అవుతారా? లేక పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలు చేయడంలో నైపుణ్యం సాధించారని సరిపెట్టుకుంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు ఏది అవసరమైతే అది చెప్పి ప్రజలను మభ్య పెట్టడంలో ఆరితేరుతున్నారు. కొద్ది నెలల క్రితమే కదా! ‘‘ఐయామ్ సనాతన్ హిందూ’’ అంటూ పెద్ద గొంతు పెట్టుకుని పవన్ అరిచింది? ఆ సందర్భంలో ముస్లింలతో పోల్చి హిందువులను రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ సడన్‌గా ఇంకా మత భావన ఏమిటని అంటే ఏపీ జనం నోట్లో వేలేసుకుని వినాలన్నమాట. పవన్ అసలు మతం గురించి ఎప్పుడు ఏమి మాట్లాడారో వివరించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవి వింటే ఇన్ని రకాలుగా మాటలు మార్చవచ్చా? అన్న భావన కలుగుతుంది. వాటి గురించి వివరణ ఇవ్వకుండా ఎప్పటికి ఏది అవసరమైతే అది మాట్లాడితే సరిపోతుందా?మరో వ్యాఖ్య చూద్దాం. పార్టీ పెట్టి నలిగిన తర్వాత చంద్రబాబుపై గౌరవం అపారంగా పెరిగిందని పవన్ అన్నారు. చంద్రబాబు తనకు చాలా గౌరవం ఇస్తున్నారని, కలిసే పని చేస్తామని కూడా పవన్ అన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అలాగే కలిసి ఉండాలని, చిన్ని, చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చని అన్నారు. తను కోరిన విధంగా సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించినందుకు కృతజ్ఞతగా పవన్ ఈ మాట చెప్పినట్లుగా ఉంది. చంద్రబాబుపై నిజంగానే అంత నమ్మకం ఉంటే నాగబాబు పదవి గురించి ఎందుకు లిఖిత పూర్వక హామీ తీసుకున్నారో కూడా చెప్పగలగాలి. విభజన నాటి నుంచి చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకున్నారట పవన్. మరి 2018లో చంద్రబాబుతో విడిపోయి, వేరే కూటమి ఎందుకు పెట్టుకున్నారు? అప్పట్లో చంద్రబాబు, లోకేష్ లు అత్యంత అవినీతిపరులని గుంటూరులో సభ పెట్టి మరీ గొంతు అరిగేలా చెప్పింది పవన్ కళ్యాణే కదా? ఈ విషయంలో ఈయన కచ్చితంగా చంద్రబాబునే ఫాలో అవుతున్నారు.చంద్రబాబు కూడా ఎవరినైనా పొగడగలరు.. తేడా వస్తే అంతకన్నా తీవ్రంగా తిట్టగలరు. పరిస్థితి బాగోలేదనుకుంటే తగ్గిపోయి ఎంతకైనా పొగడుతారు. ప్రధాని నరేంద్ర మోడీని గతంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా విమర్శించింది.. దూషణలు చేసింది.. గుర్తు చేసుకోండి. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. టీడీపీ ఓటమి తర్వాత పూర్తిగా రివర్స్ లో మోడి అంత గొప్పవాడు లేడని మెచ్చుకున్నది కూడా ఆయనే. పవన్ ఇప్పుడు అదే దారిలో ఉన్నారు. లోకేష్ సీఎం కావడం ఇష్టం లేకే చంద్రబాబు మరో పాతికేళ్లు అధికారంలో ఉండాలని పవన్ అభిలషిస్తున్నట్లు ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.ఇంతకుముందు మరో సదేళ్లు సీఎంగా ఉండాలని చెప్పిన ఈయన ఈసారి పాతికేళ్లు అని అంటున్నారు. అప్పటికి చంద్రబాబుకు 99 ఏళ్లు వస్తాయి. అంటే పవన్ తాను సి.ఎమ్. కావాలన్న ఆశను వదలుకున్నట్లేనా? ఇది వ్యూహాత్మక వ్యాఖ్యా? లేక టీడీపీతో లేకపోతే తనకు రాజకీయ భవితవ్యం ఉండదని భయపడుతున్నారా? ఇది అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజన్-2020 పోయే... స్వర్ణాంధ్ర-2047 వచ్చే ఢాం.. ఢాం.. ఢాం!
ఆరు నెలల పాటు రకరకాల డైవర్షన్లతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇంకో నాలుగున్నరేళ్లు కాలం గడిపేందుకు కొత్త ఆయుధం చేతికి చిక్కింది! సూపర్‌సిక్స్ వాగ్ధానాల గురించి కాకుండా... తన ‘స్వర్ణాంధ్ర 2047’వైపునకు ప్రజల దృష్టి మరల్చేందుకు ప్లాన్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది! దీన్ని తయారు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపునకే అమలు పర్యవేక్షణ బాధ్యతలూ అప్పగిస్తారట. ఇదే బోస్టన్ గ్రూప్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అధికార వికేంద్రీకరణపై ఒక దార్శనిక పత్రం తయారు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. అందులో భాగంగా ఏపీకి మూడు రాజధానులతో మేలని ఈ కంపెనీ తేలిస్తే అప్పట్లో తెలుగుదేశం, ఇతర రాజకీయ పక్షాలు తీవ్రంగా విమర్శించాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అంకెలంటే మహా మోజు. ఏ విషయంలోనైనా పెద్ద పెద్ద అంకెలు చెప్పి చెప్పడం ఆయనకు రివాజు. తాజా డాక్యుమెంట్లోనూ ఈ అంకెల గారడీ కనిపిస్తుంది. ‘ఈనాడు’ వంటి అనుకూల మీడియానైతే.. స్వర్ణాంధ్ర-2047తో ఆంధ్రప్రదేశ్ సమూలంగా మారిపోతోందన్న కలరింగ్ ఇచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లయిన సందర్భంగా ప్రధాని మోడీ వికసిత్ భారత్ పేరుతో నిర్దిష్ట లక్ష్యాలను నిర్ధేశించుకున్నట్లు చంద్రబాబు కూడా చేస్తే తప్పేమీ కాకపోవచ్చు కానీ.. కేవలం ప్రచారం యావతోనే, ప్రజల దృష్టిని ఏమార్చడమే ధ్యేయంగా పనిచేస్తే ఎన్ని విజన్లు రూపొందించినా ప్రయోజనం ఉండదు. 1995-2004 మధ్యకాలంలో చంద్రబాబు విజన్-202 డాక్యుమెంటే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అప్పట్లో ఆయన దక్షిణ కొరియాలో అమలు అవుతున్న ఒక డాక్యుమెంట్ తీసుకు వచ్చి, ఏపీలో కూడా అలాంటి పద్ధతులు అమలు చేస్తామని అనేవారు. ఆ తర్వాత విజన్ అన్నారు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి కొన్ని చిన్ని, చిన్న పనులు చేయించే వారు. ‘ఈనాడు’ మద్దతుతో ఆయన ఏమి చేసినా సాగిపోయింది. విజన్-2020లోనూ వివిధ శాఖలకు సంబంధించిన లక్ష్యాలు రాసుకున్నారు. కానీ అవి వాస్తవానికి, దూరంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. ఉన్న అంచనాలు కొని రెట్లు ఎక్కువ చేసి లక్ష్యాలను నిర్దేశించేలా చంద్రబాబే ఆదేశించేవారని అధికారులు చెప్పేవారు.ఇలా వాస్తవికతకు దూరంగా ఉండటంతో ఆ విజన్ డాక్యుమెంట్ ఉత్తుత్తి కార్యక్రమంగా మిగిలిపోయింది. విజన్ 2020 డాక్యుమెంట్ విడుదల చేసిన నాలుగేళ్లకు ఉమ్మడి టీడీపీ ఓటమితో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ రెండు దఫాలు అధికారంలో కొనసాగింది. 2014 నాటికి ఉమ్మడి ఏపీ కాస్తా రెండు రాష్ట్రాలుగా చీలిపోయింది. తదుపరి ఆయన విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పదేళ్లు బాబు చెప్పిన విజన్ 2020ని ఎవరూ ప్రస్తావించే వారు కారు. చంద్రబాబును ఎద్దేవ చేయాలనుకుంటే మాత్రమే దీని గురించి మాట్లాడేవారు. 2014 టరమ్‌లో 2029 నాటికి ఏపీ దేశంలోనే నంబర్ ఒన్ అవుతుందని పబ్లిసిటీ చేసేవారు. అందుకోసం ఏవేవో చేస్తున్నట్లు అనేవారు. అవేవి జరగలేదు. 2019లో టీడీపీ ఓటమి పాలైంది. ఇప్పుడు 2047 నాటికి స్వర్ణాంధ్ర అంటున్నారు. ఏ ప్రభుత్వమైనా తమ ఎజెండాల ప్రకారం పాలన చేస్తాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకుడు గుంతలు, చెరువుల బాగు చేత తదితర చిన్న ,చిన్న కార్యక్రమాలకు పరిమితమైతే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భారీ నీటిపారుదల స్కీములకు ప్రాధాన్యమిచ్చింది. ఫలితమే పులిచింతల, మల్యాల లిఫ్ట్, గుండికోట ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టులు. వై.ఎస్. చాలా దూరదృష్టితో పోలవరం ప్రాజెక్టు కింద కాల్వలు తవ్వించారు. విజన్ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో కాల్వల తవ్వకాన్ని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కుడి కాల్వ, పట్టిసీమ లిఫ్్టల ద్వారా కృష్ణానదిలోకి నీటిని తీసుకువెళ్లి, నదుల అనుసంధానించినట్లు చెప్పుకున్నారు. తెలుగుదేశంకు చిత్తశుద్ది, ఆ డాక్యుమెంట్ లోని అంశాలపై నమ్మకం లేదూ అనేందుకు వీటిపై ఏరోజూ కనీస సమీక్షలు జరపకపోవడమే నిదర్శనం. ప్రచారం కోసం మాత్రం తన విజన్-2020 వల్లే హైదరాబాద్ అభివృద్ది అయినట్లు చెప్పుకుంటూంటారు. స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్‌లోని దశ సూత్రాలను చదివితే వాటిల్లో కొత్తేమిటి? అన్న సందేహం రాకమానదు. ‘అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం’ కాదనేది ఎవరు? కానీ ఇవన్నీ ఎలా వస్తాయి? పేదరిక నిర్మూలన వీటిల్లో ఒకటిగా చెప్పుకున్నారు. బాగానే ఉంది. కానీ ఇందుకు సంపన్నులు ముందుకు రావాలని పిలుపివ్వడం ఏమిటి? ఎంతమంది సంపన్నులు ఎందరు పేదలను ఉద్ధరిస్తారు? ఇంకో సంగతి. పూర్తిస్థాయి అక్షరాస్యతకు కూడా 2047నే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఇంకో పాతికేళ్లు ఏపీలో నిరక్షరాస్యులు ఉంటారని చెప్పడమే కదా!ఇప్పుడు విజన్ 2047 అంటున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారం చేసిన సూపర్ సిక్స్ మాటేమిటి? వాటివల్ల వెల్త్, హెల్త్, హాపీనెస్ సమకూరవని తీర్మానించేసుకున్నారా? వాటిపై శాసనసభలో ఎలాంటి వివరణ ఇవ్వకుండా కొత్తగా ఈ నినాదాలు ఇవ్వడాన్ని జనం నమ్ముతారా? సూపర్ సిక్స్ లో ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీ దశ సూత్రాలలో ఎందుకు భాగం కాలేదు? రెండో పాయింట్ ఉద్యోగ, ఉపాధి కల్పన. సూపర్ సిక్స్‌లో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అంతవరకు నిరుద్యోగ భృతిగా నెలకు రూ.మూడు వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. కాని బడ్జెట్లో ఆ ఊసే లేదు. పైగా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు.నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ది మూడో అంశంగా ఉన్న దశ సూత్రాల్లో స్కిల్ స్కామ్ వంటివి జరక్కుండా జాగ్రత్త పడితే బాబుకే మేలు. నీటి భద్రత, రైతులకు వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ , ఇంధన వనరులు, నాణ్యమైన ఉత్పత్తులతో అంతర్జాతీయ బ్రాండింగ్, స్వచ్ఛ ఆంధ్ర మొదలైన వాటిని ప్రస్తావించారు. వీటి ద్వారానే ఏపీ అభివృద్ది చెందితే, తలసరి ఆదాయం 3200 పౌండ్ల నుంచి 42 వేల పౌండ్లకు పెరిగితే అంతకంటే కావల్సింది ఏమి ఉంటుంది? కాని వచ్చే ఇరవై ఏళ్లలో ప్రజల ఆదాయం 14 రెట్లు, అది కూడా పౌండ్లలో పెరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అంబానీ, అదాని తదితర భారీ పెట్టుబడిదారుల ఆదాయం పెరగవచ్చు. వారికి ఏపీకి సంబంధం ఉండదు. పేదవాడి ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడుతుదన్నది కీలకం.ఇదీ చదవండి: నాటి మంచికి కీడు చేయకుంటే అదే పదివేలు!ఒకవైపు జగన్ టైమ్ లో నిర్మాణం ఆరంభించిన పోర్టులను ప్రైవేటు పరం చేయాలని ఆలోచిస్తూ, ఇంకో వైపు కొత్తగా మెగా పోర్టులు ప్లాన్ చేస్తామని చంద్రబాబు అంటున్నారు. ఇలాంటి అతిశయోక్తులు చాలానే ఉన్నాయి. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని, ఇది రాసి పెట్టుకోండని చంద్రబాబు చెబుతున్నారు.అప్పటికి ఈయనకు 99 ఏళ్లు వస్తాయి. గత ముఖ్యమంత్రి జగన్ పేదలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపడితే అదంతా విధ్వంసం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఆ తర్వాత జగన్ స్కీములకు మూడు రెట్లు అదనంగా సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు.తీరా అధికారంలోకి వచ్చాక వాటికి మంగళం పాడే విధంగా ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా దాట వేస్తున్నారు.వాటికి బదులు స్వర్ణాంధ్ర 2047 అంటూ కొత్త రాగం తీస్తున్నారు.అంతేకాదు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని చెబుతున్నారు. అవి ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు. ఈ నేపథ్యంలోనే ఈ స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్ ఒక డొల్ల అని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి డాక్యుమెంట్ల పేరుతో అబద్దాలాడితే తమ దేశంలో జైలుకో, ఆస్పత్రికో పంపుతారని ఏపీకి గతంలో వచ్చిన స్విస్ మంత్రి పాస్కల్ వ్యాఖ్యలను జగన్ గుర్తు చేశారు. ఒకవైపు అప్పులు అని ప్రచారం చేస్తూ, ఇంకో వైపు కొత్త, కొత్త వాగ్దానాలు, భారీ అంచనాలతో ప్రణాళికలు, విజన్ లు తయారు చేస్తే వినడానికి బాగానే ఉంటుంది కాని, సామాన్యుడికి ఏమి ఒరుగుతుంది?ఏది ఏమైనా స్వర్ణాంధ్ర 2047 పేరుతో వస్తున్న కొత్త సినిమాతో ఇక జనం తమకు సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని సుమారు 200 వాగ్దానాలు అమలు చేయనవసరం లేదని చంద్రబాబు చెబుతారా! ఎందుకంటే ప్రజల అభిప్రాయాలను తీసుకుని దీనిని రూపొందిచామని అంటున్నారు కనుక. వారెవరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాగ్దానాల గురించి ప్రశ్నించలేదా? మొత్తం మీద సూపర్ సిక్స్ పోయే ఢాం... ఢాం.. ఢాం! కొత్త విజన్ 2047 వచ్చే ఢాం... ఢాం.. ఢాం! అన్నమాట!!- కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నాటి మంచికి కీడు చేయకుంటే అదే పదివేలు!
కొందరు మోసపూరిత ధోరణి అనవచ్చు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మాత్రం ఇది నేర్పరితనమే. చేసిన వాగ్ధానాలతో నిమిత్తం లేకుండా ఆయన ప్రభుత్వ స్కూళ్లకే వెళ్లి విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు సుద్దులు చెప్పి తిరిగి వచ్చారు. మెగా పేరెంట్స్, టీచర్స్ కమిటీల సమావేశాలతో రికార్డు సృష్టించామని ప్రకటించుకున్నారు కూడా. సహజంగానే ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఈ గొప్పలకు గొంతు కలిపారు. తామేం చేయబోతున్నామో చెప్పి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తే బాగుంటుంది కానీ.. ప్రచారం కోసం ఉత్తుత్తి మీటింగ్‌లు పెడితే ఏం లాభం? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే కొన్ని రోజుల క్రితం ఒక్కరోజు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు గొప్పలు చెప్పుకున్నారు. బహుశా వీటికి పోటీగానే లోకేష్ పేరెంట్స్ మీటింగ్స్ పెట్టినట్లుంది. ఒకరికొకరు పోటాపోటీ సమావేశాలు నిర్వహించారన్నమాట!! పవన్ ,లోకేష్‌కు మధ్య సాగుతున్న ఈ అంతర్గత పోరు రాజకీయంలో చంద్రబాబు కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్న చంద్రబాబు ఈ సారి మాత్రం ప్రభుత్వ స్కూళ్ల ఉద్ధరణకు సంకల్పం చెప్పుకున్నారు. కానీ ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఊరకే సమావేశాలు పెట్టామని చెబితే వచ్చే ప్రయోజనం ఏమిటి? పైగా ఇవే సమావేశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని తప్పుడు ఆరోపణలు సైతం గుప్పించారు. బాపట్లలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్, పేరెంట్స్‌తో భేటీ అయిన చంద్రబాబు, లోకేష్‌లకు అక్కడి పరిస్థితులను చూసిన వెంటనే జగన్ ప్రభుత్వం చేసిన మంచి కనిపించి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌బోర్డులు, మంచి బల్లలు, ఫ్యాన్లు, మంచినీటి వసతి, శుభ్రమైన మరుగుదొడ్లను చూసే ఉంటారు. స్కూల్ భవనాలు బాగుపడ్డ సంగతీ అర్థమై ఉంటుంది. అప్పటికే పవన్‌కళ్యాణ్ కూడా కొన్ని స్కూళ్లలో వచ్చిన మార్పులను ప్రత్యక్షంగా గమనించి ఆశ్చర్యపోయిన విషయం సోషల్‌మీడియాలోనూ విస్తృతంగా వ్యాప్తి చెందింది. అధికారం చేపట్టిన తరువాత ఈ ఆరునెలల్లో స్కూళ్లను ఉద్ధరించేందుకు చేసిందేమీ లేకపోయినా తామూ ఏదో చేస్తున్నామని అనిపించుకునేందుకు మాత్రమే ఈ సమావేశాలను నిర్హించినట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఎదుట ఒక విద్యార్ధి తల్లి స్కూళ్లలో సమస్యలను వివరించిన ఉదంతమే అందుకు ఉదాహరణ అని చెప్పాలి. పారిశుద్ద్యం ఎలా కొరవడిందో, పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆమె చెబుతుంటే మంత్రి ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తమ ప్రచారం కోసం స్కూళ్లకు వెళ్లినా, వారు ఏమి తప్పు చేస్తున్నది వారికి తెలియకుండా ఉంటుందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్య, వైద్య రంగంలో చేపట్టిన సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాడునేడు పేరుతో అనేక కార్యక్రమాలు ప్లాన్ చేశారు. స్కూళ్ల రూపురేఖలను మార్చేశారు. ఇలా విద్యార్థులు, తల్లిదండ్రుల మనసుల్లో జగన్ వేసిన ముద్రను చెరిపేసేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. జగన్ కంటే ఎక్కువ మంచి చేస్తే బాగుండేది కానీ.. ఒకపక్క ప్రభుత్వ స్కూళ్ల గురించి మాట్లాడుతూ, ఇంకోపక్క ప్రైవేటు స్కూళ్లకు ఉపయోగపడేలా వ్యవహరించడంతోనే వస్తుంది సమస్య. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో స్కూల్ తెరిచే జూన్ నెలలోనే తల్లుల ఖాతాలో రూ.15 వేల చొప్పున వేసేది. పిల్లలు స్కూళ్లు మానివేయకుండా ఉండడానికి చేసిన ఈ ప్రయత్నం జగన్‌కు పేరు తేవడంతో చంద్రబాబు అండ్ కో తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని, ప్రతి విద్యార్దికి రూ.15 వేల చొప్పున వేస్తామని నమ్మబలికారు. ‘‘ఓపిక ఉంటే ఎంతమంది పిల్లలనైనా కనండి’’ అని వారి బాధ్యత తనదని బొంకిన నేత ఇప్పుడు అసలు తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదు. అమ్మ ఒడి వల్ల జగన్ విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించి ఉంటే, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం పేరుతో పిల్లలందరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎందుకు చెప్పారో వివరించాలి కదా? రానున్న రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు తెస్తామని చంద్రబాబు అన్నారు. అవేమిటో చెప్పాలి కదా? జగన్ ప్రభుత్వం పిల్లలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో ఏపీ ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే వరకు వెళ్లారు. విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడమంటే ఇదే అని చంద్రబాబు చెబుతున్నారా? జగన్ టైమ్ లో పిల్లలు ఆంగ్ల మీడియంలో చదువుకుంటూ చక్కగా ఇంగ్లీష్‌లో మాట్లాడేలా ఎదిగారు. అందువల్ల విద్యా వ్యవస్థ భ్రస్టు పట్టిందని చంద్రబాబు అంటారా? అప్పట్లో ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా కూటమి నేతలంతా ప్రచారం చేశారు. వారి ప్రభుత్వం రాగానే ఆంగ్ల మీడియం ను నిరుత్సాహపరచే చర్యలు చేపట్టారు. తద్వారా ప్రైవేటు స్కూళ్లకు మేలు చేయడానికి చంద్రబాబు తనదైన శైలిలో ప్రయత్నించారని అంటారు. ఇది కదా ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడం అంటే! అలాగే సీబీఎస్ఈ, ఐబి కోర్స్, టోఫెల్ వంటి విన్నూత్నమైన, ఖరీదైన కోర్సులను పేదలకు ఉచితంగా అందేలా జగన్ చేశారు. చంద్రబాబు భావనలో ఇది విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడమేమో చెప్పాలి. ప్రతి ఏటా పిల్లలకు టాబ్ లు అందచేయడం తప్పని అనుకుంటున్నారా? ఈనాడు మీడియా అప్పట్లో నీచంగా పిల్లల ట్యాబ్ లపై ప్రచారం చేసి తన ఫ్యూడల్ ధోరణిని బయటపెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతోందేమో తెలియదు. స్కూళ్లలో పారిశుద్ద్యం, పిల్లకు భోజనం వంటి వాటిపై జగన్ ప్రభుత్వం అత్యంత శ్రద్ద వహించిందన్నది వాస్తవం.ఫైవ్ స్టార్ హెటల్ స్థాయిలో టాయిలెట్లను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ఇప్పుడు అవేమి అయిపోయాయో తెలియదు కాని, కర్నూలులో ఒక విద్యార్ధి తల్లి టాయిలెట్ల అధ్వాన్న పరిస్థితిపై వివరించడం వింటే ఎవరికైనా ఆవేదన కలుగుతుంది. జగన్ ఎన్ని సంస్కరణలు తీసుకు వచ్చినా వ్యతిరేకిస్తూ వికృతమైన కధనాలు రాసిన ఎల్లో మీడియా ఇప్పుడు విద్యా శాఖ నాలుగైదు రకాల బడులను ఏర్పాటు చేయబోతోందని చెబుతోంది. అంటే గత ప్రభుత్వ వ్యవస్థను దెబ్బ తీయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వ తీరుతో రెండు లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లిపోయారని కొన్ని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ విషయాలన్నిటిని జగన్ ప్రస్తావించి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఆయనకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు.పైగా బుకాయిస్తున్నారు. ఈ జనవరి నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వచ్చే జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారని చెబుతున్నారు. మంత్రి లోకేష్ ఒక మాట అన్నారు. పిల్లలంతా తన కుమారుడు దేవాన్ష్ లానే అనిపిస్తారని చెప్పారు. మంచి మాటే. కానీ దేవాన్ష్‌కు వస్తున్న చదువు స్టాండర్ట్ తను మంత్రిగా బాధ్యత వహిస్తున్న ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు తీసుకు రావడం లేదు. జగన్ పై ఉన్న ద్వేషంతో ఉన్న కోర్సులను ఎందుకు తీసివేశారు.? ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం?విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నాం అని చెబుతున్న లోకేష్ ఎన్నికలకు ముందు టీచర్లను ఎలా రెచ్చగొట్టింది తెలియదా? ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో పిల్లలకు నైతిక విలువల గురించి బోధిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.మంచిదే! కానీ ముందుగా ప్రభుత్వానికి నైతిక విలువలు ఉండేలా ఏమి చర్యలు తీసుకుంటున్నారో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. నైతిక విలువలు నేర్పడం వరకు బాగానే ఉంటుంది. అదే సమయంలో మూఢ విశ్వాసాలు పెరిగేలా ఉపన్యాసాలు చెప్పకుండా ఉండడం కూడా అవసరమే. చాగంటి నియామకాన్ని జనవిజ్ఞాన వేదికకు చెందిన పలువురు మేధావులు తప్పు పట్టారు. ఏది ఏమైనా జగన్ తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పులను ఒక వైపు ధ్వంసం చేస్తూ, మరో వైపు మెగా సమావేశాలు అంటూ కోటి ఇరవై లక్షల మందితో జరిగాయని చెబితే పిల్లలకు వచ్చే లాభం ఏమిటి? మీటింగ్ లతో తల్లికి వందనం చేసినట్లు అయిపోతుందా? అదేదో సామెత ఉంది. ఉత్తుత్తిగానే అన్నం పెట్టాం, కూర వేశాం.. మజ్జిగ వేశాం.. అంటూ పిల్లల ఆట మాదిరిగా విద్యావ్యవస్థను మేడిపండు చందంగా మార్చకుండా ఉంటే అదే పదివేలు!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం?
‘‘పాలనలో వేగం పెంచండి’’, ‘‘జనం మెచ్చేలా, మనం నచ్చేలా పాలన’’ అధికారుల వల్లే అసంతృప్తి’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలివి. ఎన్నికల హామీ అమలుపై చర్చ కాదు కదా.. కనీస ప్రస్తావన కూడా లేకుండా సాగిన ఈ సమావేశాన్ని గమనిస్తే దీనికో లక్ష్యమంటూ ఉందా? అన్న సందేహం రాకమానదు. నిర్దిష్ట సూచన, సలహాలు లేకుండా కలెక్టర్లదే బాధ్యతంతా అన్నట్టు చంద్రబాబు వ్యవహరించడం ఎవరిని మభ్యపెట్టేందుకు? వైసీపీ అధికారంలో ఉండగా జగన్ కలెక్టర్ల సమావేశం పెడితే ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీ పత్రాలను దగ్గర పెట్టుకుని వాటి అమలుపై సమీక్ష జరిగేది. అమలులో ఎదురవుతున్న సమస్యలపై చర్చ జరిగేది. ఇప్పుడు అవేవీ లేవు. చంద్రబాబు తమ సూపర్ సిక్స్ హామీల గురించి కలెక్టర్లతో మాట్లాడే ధైర్యమూ చేయలేకపోతున్నారు. బాబే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతో సంబంధం లేని మాటలు నాలుగు మాట్లాడి సమావేశాలను మమ అనిపిస్తున్నారు.ఎస్పీలతో సమావేశాలు కానీ.. కలెక్టర్లతోనైనా కూడా తమ అధికారాన్ని ప్రదర్శించడం తప్ప వీరు చేసిందేమిటన్న ప్రశ్న వస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే కదా.. జనం మెచ్చేది.. పాలకులు నచ్చేది? బదులుగా బాధ్యతంతా అధికారులదే అని చేతులు దులిపేసుకుంటే.. వారి వల్లే తాము ప్రజలకు నచ్చడం లేదూ అంటే ఎలా? రాష్ట్రస్థాయి కలెక్టర్ల సమావేశం ఎజెండాలో సూపర్ సిక్స్ లేకపోవడం గమనించాల్సిన విషయం. వీటి అమలుకు నిధులెన్ని కేటాయిస్తున్నారో చెప్పకుండా కలెక్టర్లు బాగా పనిచేయాలని అంటారు. ప్రజా ప్రతినిధులు చెప్పినట్లు నడుచుకోవాలని కూడా చెబుతున్నారు. ఇవి చేస్తే అది జనం మెచ్చే పాలన ఎలా అవుతుంది? ఈ నేపథ్యంలోనే జనంలో తిరుగుబాటు వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. అయితే ఈయన ఒకసారి అంతా బాగున్నట్టు.. అప్పుడప్పుడూ ఇలా బాలేనట్లు పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ప్రసంగాల్లోని వైరుద్ధ్యాలు ఎంతో ఆసక్తికరం. చంద్రబాబేమో... ప్రజలతో గౌరవంగా ఉండండని అంటారు. అంతవరకూ ఓకే కానీ ఇది ఐఏఎస్‌లకే కాకుండా ఐపీఎస్‌లకూ వర్తిస్తుంది. టీడీపీ, జనసేన కూటమి నేతలు పోలీసులను తమ ఇష్టానురీతిలో వాడుకుంటూ పౌరులపై దాడులు చేయిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ వీటిని సమర్థిస్తూ.. ఇంకోపక్క సుభాషితాలు చెబుతూండటం విని కలెక్టర్లు నవ్వుకోవడం మినహా ఏమి చేస్తారు! రాష్ట్రం గాడిలో పడుతోందట..చీకట్లు తొలగిపోతున్నాయట. ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి వచ్చిందట.. చంద్రబాబు ఇలాంటి మాటలు ఎవరిని మాయ చేయడానికి చెబుతున్నారు? వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల హింస, అత్యాచారాలు, వేధింపులు జరుగుతుంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అనడం అంటే ఎంత దారుణం! గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా.. అధికారులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు.ఇదే కలెక్టర్ ల సమావేశంలో పవన్ కళ్యాణ్ శ్రీసత్యసాయి జిల్లాలో కొందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని చెప్పారు. సీఎంను అడిగి రూ.30 కోట్ల నిధులు తీసుకుని జీతాలు ఇప్పించామని అన్నారు. మున్సిపాల్టీలలో పారిశుద్ద్య కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. పది లక్షల కోట్ల అప్పులు పేరుకున్నాయని చంద్రబాబు అన్నారు. కొద్దికాలం క్రితమే ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని శాసనసభలో చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం, మళ్లీ పాత పాటే పాడుతోంది. కొత్త అప్పులు చేద్దామంటే ఎఫ్ ఆర్ బిఎమ్ అనుమతించడం లేదట. ఇప్పటికి సుమారు డెబ్బై వేల కోట్ల అప్పు చేసి మరీ ఇంకా రుణాలు రావడం లేదని అంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా గతంలో ఎప్పుడూ తాను చూడలేదని పచ్చి అబద్దం చెబుతున్నారు.ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలనలో 1999 2004లో పనికి ఆహారం బియ్యం పథకం కింద కేంద్రం నుంచి వచ్చిన ఏభై లక్షల టన్నుల బియ్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన విషయం శాసనసభలోనే పెద్ద రగడ జరిగింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఆ పార్టీ, ఈ పార్టీ అని ఉండదు. అది తెలిసినా, వైఎస్సార్సీపీ పై బురద చల్లడం కోసం ఇలాంటి అసత్యాలు చెబుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమ రవాణా ఆగడం లేదని పవన్ కళ్యాణ్ అనడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పకనే చెప్పారు కదా! మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు ఎగుమతి చేసిన బియ్యంలో రేషన్ బియ్యం ఉన్నాయా? లేవా? అన్నది ఎందుకు తనిఖీ చేయలేదు? రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలలోను ఉందని కేశవ్ అన్న విషయంపై చంద్రబాబు ఏమి చెబుతారు? వైసీపీ ప్రభుత్వంలో పోర్టులు, సెజ్ లు కబ్జాకు గురయ్యాయట. జగన్ ప్రభుత్వపరంగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తుంటే వాటిని నిలిపి ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించాలని చూస్తున్న చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారు.కాకినాడ సెజ్ లో చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావు చేసిన భూ దందాపై సీనియర్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖకు చంద్రబాబు సమాధానం చెప్పాలి కదా! అధికార యంత్రాంగంలో పాత వాసనలు పోవడం లేదట. ఆయనకు తెలియకుండా వారు పనులు చేస్తున్నారట. కుమారుడు లోకేష్ కనుసన్నలలో అన్నీ జరగుతున్నాయని టీడీపీలో టాక్. కాని తనకు చెప్పడం లేదని ముఖ్యమంత్రి అనడంలో ఆయన బలహీనత తెలుస్తూనే ఉంది కదా! అమరావతి ప్రారంభ దశలో రూ.ఏభై వేల కోట్ల అవసరం అని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఒక్క రూపాయి ఖర్చు చేయనవసరం లేదని, అది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పిన విషయాన్ని మాత్రం చంద్రబాబు ప్రస్తావించరు. చంద్రబాబు ఒక్క నిజం చెప్పినట్లుగా ఉంది. ఇంతవరకు కేవలం నలభైవేల మందికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాయని తెలిపారు. ఎల్లో మీడియా ఇప్పటికే లక్షల మంది గ్యాస్ సిలిండర్లు పొందినట్లు ప్రచారం చేస్తుంటే, చంద్రబాబు పొరపాటున వాస్తవం చెప్పేసినట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలలో జగన్ పాలనలో జీఎస్డీపీ సుమారు 12.5 పెరిగిందని పార్లమెంటులో ప్రకటిస్తే, చంద్రబాబు మాత్రం ఆదాయం తగ్గిందని చెబుతున్నారు.జగన్ టైమ్ లో కరోనా రెండేళ్లు సంక్షోభాన్ని సృష్టించినా, దానిని తట్టుకుని నిలబడితే ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ ఎందుకు తగ్గిందో చెబితే ఒట్టు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం,తదితర సమస్యలపై మాత్రం నిర్దిష్ట హామీ ఇవ్వలేకపోయారు. వచ్చే సీజన్ లో చూద్దామని చెప్పి వదలి వేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా యథాప్రకారం తెలిసి, తెలియనట్లు మాట్లాడారనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు కనుక అక్రమాలను అడ్డుకుంటే మంత్రులు వెళ్లనవసరం లేదట. అదేమిటో అర్థం కాదు. ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్లు చేయాలని ముఖ్యమంత్రి చెబుతారు. ఇంకోవైపు అధికారులు నిస్సహాయంగా ఉండవద్దని అంటారు. వ్యవస్థ మూలాలను గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని, పాత సినిమా డైలాగులనే ఆయన వల్లిస్తున్నారు.కాకపోతే ఒక్క వాస్తవం చెప్పారు. ప్రజలు ఆశలను నెరవేర్చలేకపోతున్నామని, తిరగబడే ప్రమాదం ఉందని, శ్రీలంక, బంగ్లాదేశ్ ల పరిస్థితి ఏపీలో ఉందని చెప్పడం మాత్రం విశేషమే. ఇదే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా అంటున్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కదానిని కూడా సరిగా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, దానివల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతోందని జగన్ అంటున్నారు. చంద్రబాబు అబద్దాలు మోసాలుగా మారాయని, అదే ప్రజలలో కోపంగా మారుతున్నాయని, తమకు హామీ ఇచ్చిన విధంగా పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నెలకో రకంగా గోబెల్స్ ప్రచారం చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చిత్తశుద్ది ఉంటే, వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళికను దగ్గర పెట్టుకుని, ఎన్నికల సమయంలో ఏమి చెప్పాం? ఏమి చేస్తున్నామన్న దానిపై ఎన్నడైనా సమీక్ష చేసుకున్నారా? ఆ పని చేయకుండా కలెక్టర్ల సమావేశాలు పెట్టి డ్రామాల మాదిరి కబుర్లు చెబితే ప్రజలకు అర్థం కాదా? ఐఎఎస్ పాసై వచ్చిన కలెక్టర్లు, సెక్రటరీలకు ఇందులోని మోసం తెలియదా?. ఎన్నికలలో గెలవడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి, ఇప్పుడు డబ్బులు లేవని కథలు చెబుతూ తమను ప్రజలు మెచ్చుకోవాలని ఉపన్యాసాలు ఇస్తే మెచ్చుకోవడానికి ప్రజలు పిచ్చివాళ్లా? కొసమెరుపు ఏమిటంటే ఈ సమావేశంలో కలెక్టర్లు సోది చెబుతున్నారని ఎల్లో మీడియా ఒక స్టోరీ ఇచ్చింది. ప్రభుత్వంలో విషయం లేకపోతే సోది చెప్పక ఏమి చేస్తారు? అందులోను నేతల సోది విన్న తర్వాత వారు మాత్రం అందుకు బిన్నంగా వెళతారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
యనమల గతి ఇక అంతేనా?
అవమానభారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు తెలిసివస్తూంటుంది. స్వపక్షం నుంచే వస్తున్న విమర్శల జడిని నేరుగా తిప్పికొట్టలేక, అలాగని జవాబు కూడా ఇవ్వలేని స్థితిలో యనమల ఉన్నట్లు స్పష్టమవుతోంది. తెలుగుదేశం వాళ్లే ఆయనను బ్లాక్‌మెయిలర్‌గా అభివర్ణిస్తూండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు యనమల. గతంలో యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉండగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు జరిగిన పరాభవాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎక్కింది మొదలు యనమలకు పార్టీలో గుర్తింపు లేకుండా పోతోందన్న అంచనాలకు బలం పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆశించిన రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడం ఒక అవమానమైతే.. కాకినాడ పోర్టు యజమాని కేవీరావుపై చంద్రబాబుకు రాసిన లేఖ సొంత పార్టీలో ఆయన్ను పరాయివాణ్ణి చేసింది. పదవి ఇవ్వలేదన్న అక్కసుతో యనమల నేరుగా బాబునే బ్లాక్మెయిల్ చేసేందుకు ఆ లేఖ రాశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులే దూషణలకు దిగుతారని బహశా ఆయన కూడా ఊహించి ఉండరు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన యనమల 1994లో టీడీపీ హయాంలో స్పీకర్‌గానూ పనిచేశారు. రాజకీయ జీవితంలో ఇదే ఆయనకు మేలిమలుపు అంటారు. నిజానికి అప్పట్లో ఎన్టీఆర్ కూడా యనమలకు మంత్రి పదవి కానీ, ఇతర పదవి ఏదైనా కూడా ఇచ్చేందుకు సుముఖత చూపలేదని అంటారు. తనకు విశ్వాసపాత్రుడైన గాలి ముద్దు కృష్ణమనాయుడికి స్పీకర్ పదవి ఇవ్వాలన్నది ఎన్టీఆర్ ఆలోచన. అయితే ముద్దుకృష్ణమ ఇష్టం మేరకు మంత్రిని చేశారు. ఈ అవకాశాన్ని వాడుకున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా స్పీకర్ పదవికి యనమల పేరును తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ ను ఒప్పించారు. బాబు కుట్రల గురించి పెద్దగా ఆలోచించని ఎన్టీఆర్అంగీకరించడం.. ఆ తరువాత తొమ్మిది నెలలకే యనమల సహకారంతో ఎన్టీఆర్ పదవీచ్చుతి చకచకా జరిగిపోయాయి... బాబు డైరెక్షన్లో! ఆంధ్రప్రదేశ్‌లో వందలాది మందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్టీఆర్ ది.యనమల కూడా వారిలో ఒకరు. అయినాసరే.. రాజకీయాల్లో విశ్వాసానికి తావులేదనట్టుగా చంద్రబాబు, యనమల వంటి వారు రుజువు చేశారు. వాస్తవానికి 1994 ప్రాంతంలో చంద్రబాబు వర్గం ప్రధాని పీవీ నరసింహరావును కూడా బుట్టలో వేసుకోగలిగిందని, అందుకే పార్టీ రాష్ట శాఖ ఆలోచనలకు భిన్నంగా పీవీ బాబుకు సాయం చేశాడని అంటారు. శాసనసభ రద్దుకు ఎన్టీఆర్ చేసిన సిఫారసును గవర్నర్ కృష్ణకాంత్ పట్టించుకోకపోవడం, మంత్రిపదవి నుంచి బర్తరఫ్ అయిన చంద్రబాబుకు ప్రాధాన్యం ఇవ్వడం, శాసనసభలో జరగాల్సిన బలపరీక్షను స్పీకర్ యనమల చేతిలో పెట్టడం వంటివన్నీ ఇందుకు నిదర్శనాలు. యనమల స్థానంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పీకర్‌గా ఉండి ఉన్నట్లైతే ఎన్టీఆర్ పదవి అంత తేలికగా పోయేది కాదు. చంద్రబాబు తన వర్గం ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో ఉంచినప్పుడు ఎన్టీఆర్ స్వయంగా తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి అక్కడకు వెళితే, టీడీపీ వారే చెప్పులు విసిరారు. సినీ రంగంలోను, రాజకీయ రంగంలోను ఎదురులేని మొనగాడిగా అందరి ప్రశంసలు పొందిన ఎన్టీఆర్ కు ఎదురైన దుర్గతి అది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు గవర్నర్ స్వయంగా వెళ్లి ఆయన నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. పిమ్మట అసెంబ్లీ సమావేశంలో తన వాదన వినిపించడానికి ఎన్టీఆర్ పలుమార్లు ప్రయత్నించారు. చంద్రబాబుపై కుట్రలను వివరించే ప్రయత్నం చేసిన ప్రతిసారి స్పీకర్ యనమల మైక్ కట్ చేసేవారు. ఆ అవమానం భరించలేక ఎన్టీఆర్ తన వర్గం ఎమ్మెల్యేలతో వాకౌట్ చేశారు. పదవి కోల్పోయాక ఎన్టీఆర్ మీడియా సమావేశం పెట్టి సొంతపార్టీ వారి చేతిలో, సొంత కుటుంబం చేతిలో పరాభవానికి గురైన తీరు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రాజకీయాలలో ఎంత పెద్ద నాయకుడైనా ఒక్కోసారి ఇలా అవమానాలకు గురి అవుతారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు యనమల వంతు. 2019 వరకు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న యనమల, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. 1983 నుంచి 2004 వరకు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన 2019లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి పొందగలిగారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు. అశోక్ గజపతి రాజు వంటి నేతలను తోసిరాజని పార్టీలో చంద్రబాబు తర్వాత సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. అందుకే ఆయన తాను కోరితే రాజ్యసభ సభ్యత్వం కష్టం కాదని అనుకున్నారు. భంగపడ్డారు. పార్టీలో బాబుకంటే లోకేష్ ప్రాభవమే ఎక్కువ అవుతూండటం దీనికి కారణంగా చెబుతున్నారు. సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలను బాబు కూడా ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. ఈ నేపథ్యంలోనే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయంగా యనమలను పక్కన పెట్టేశారన్న అభిప్రాయం పార్టీలో ఏర్పడింది. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేనట్లుగా యనమల ఏపీ రాజకీయాల నుంచి వైదొలగి పార్లమెంటుకు వెళ్లాలని అనుకున్నా... చంద్రబాబు, లోకేష్‌లు ఆయనకు కాకుండా వైసీపీ నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావుకు, పలు అక్రమాల ఆరోపణలు ఉన్న సానా సతీష్ వైపు మొగ్గు చూపారు.నిజానికి ముగ్గురు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులను ప్రలోభ పెట్టి రాజీనామా చేయించిన టీడీపీ తన సొంత పార్టీ నేతలకు ఈ పదవులు ఇవ్వలేకపోయింది. పోనీ ఖాళీగా ఉన్న మంత్రి పదవి అయినా ఇస్తారా అని ఎదురుచూస్తే, దానిని నాగబాబుకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంత్రి పదవి, రాజ్యసభ సీటు రెండూ రావడం లేదని స్పష్టమైందన్నమాట. ఎమ్మెల్సీగానే కొనసాగాలన్న మాట. సానా సతీష్ తో పోల్చితే యనమల కచ్చితంగా మెరుగైన రాజ్యసభ అభ్యర్ధి. పార్టీ వాదనను బలంగా చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవారు. అయితే ఈయన వల్ల ఢిల్లీలో పెద్దగా ఉపయోగం ఉండదని, సానా సతీష్ లాబీయింగ్‌లో దిట్ట అని చంద్రబాబు, లోకేష్‌లు భావించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సెజ్ భూములను కేవీరావు చౌదరి ఎలా దోచేసింది వివరిస్తూ యనమల లేఖ రాయడం సంచలనమైంది. కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా కేవీరావు నుంచి లాక్కున్నారంటూ కొందరు వైఎస్సార్సీపీ నేతలపై, ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అధినేతపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు వేసిన ప్లాన్‌కు ఈ లేఖ గండి కొట్టింది. టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయే పరిస్తితి ఏర్పడింది. దాంతో యనమల లేఖలోని అంశాల జోలికి వెళ్లకుండా, ఆయనను తిట్టడానికే టీడీపీలోని కొన్ని వర్గాలు పనికట్టుకున్నాయి. రాజ్యసభ సీటు ఇవ్వలేదనే ఈ లేఖ రాశారని టీడీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. యనమలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేవీరావు చివర చౌదరి అని కులం పేరు తగిలిస్తారా అని మండిపడ్డారు. కమ్మ కులం మద్దతు లేకుండానే యనమల ఈ స్థాయికి వచ్చారా అని వారు ప్రశ్నించారు. అయితే యనమల వెనక్కి తగ్గకుండా ఒక ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ తన చర్యలను సమర్థించుకోవడం గమనార్హం. తన పేరు చివర యాదవ అని లేనంత మాత్రాన కులం పోదు కదా? అని ప్రశ్నించారు ఆయన. యనమల కుటుంబానికి నాలుగు పదవులు ఉన్నా సంతృప్తి లేదని, అసలు పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవ ఏముందని కూడా కొందరు వ్యాఖ్యానించారు. యనమల తమ్ముడు అసెంబ్లీ టిక్కెట్ అడిగినా, ఆయనను కాదని ఈయన ఒక కుమార్తెకు తుని టీడీపీ టిక్కెట్ ఇచ్చిన మాట నిజమే. అలాగే వియ్యంకుడు పుట్టా సుధాకర్ కు రాయలసీమలోని మైదుకూరు అసెంబ్లీ సీటును, ఈయన కుమారుడు, యనమల మరో అల్లుడు పుట్టా మహేష్ కుమార్‌కు ఏలూరు లోక్ సభ సీటు ఇచ్చారు.అయితే సుధాకర్, ఆయన కుమారుడికి టిక్కెట్లు రావడంలో యనమల పాత్ర పెద్దగా లేదని, పార్టీకి చేసిన సేవల రీత్యా లభించాయని కొందరి అభిప్రాయం. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ప్రత్యర్ది పార్టీలు విమర్శిస్తుంటాయని, కాని ఆ వెన్నుపోటు పొడిచింది యనమల అవుతారు కదా అని టీడీపీ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈయనకు ఇచ్చిన ప్రాధాన్యత గతంలో ఎవరిరీ లభించలేదని, ఈయన పార్టీలో ఇతరనేతలు ఎవరిని ఎదగనివ్వలేదని కూడా ఆయన అబిప్రాయపడ్డారు. టీడీపీ నేత, శాసనమండలి మాజీ డిప్యూటి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నేరుగా యనమలపై వ్యాఖ్యానిస్తూ ఆయన వల్ల పార్టీకి కలిగిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. యనమల బీసీ నేతలను పెరగనివ్వకుండా అణగదొక్కి, తాను మాత్రమే లాభపడ్డారని విమర్శించారు. టీడీపీ అధినాయకత్వం సూచన లేకుండానే సుబ్రహ్మణ్యం ఈ విమర్శలు చేశారా అన్న సందేహం ఏర్పడుతోంది. గతంలో యనమలను ఇంత నేరుగా విమర్శించే సాహసం పార్టీలో ఎవరూ చేసేవారు కాదు. కాని కాలచక్రం మారుతుంది కదా! ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సర్దుకుపోయి అవమానం భరించడం తప్ప యనమల చేయగలిగింది కూడా ఏమీ లేదేమో! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమి చక్రం.. బాబు చేయిజారుతోందా?
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలహీనపడుతున్నారా? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలోనూ బాబు స్థానాన్ని క్రమేపీ కుమారుడు లోకేష్ ఆక్రమిస్తున్నట్లు అర్థమవుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా బాబును ఇరకాటంలో పెడుతున్నాయి.రాజ్యసభకు పార్టీ ఎంపికలు, పవన్ అన్న నాగబాబుకు మంత్రి పదవి వంటి నిర్ణయాలు ఆ ఇబ్బందికి నిదర్శనమంటున్నారు. టీడీపీకి రాజ్యసభలో అసలు బలం లేని నేపథ్యంలో ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీలను ప్రలోభ పెట్టి రాజీనామా చేయించిన బాబు ఆ స్థానాలకు ఇతర పార్టీల వారికి కట్టబెట్టడం ఆయన పరిస్థితిని సూచిస్తోంది. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ తాను వారసత్వ, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమంటూనే.. అన్న నాగబాబుకు ముందు టీటీడీ ఛైర్మన్ పదవి ఆ తరువాత రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నించారని పలు వదంతులు వచ్చాయి. అయితే, లోకేష్ ఒత్తిడితో టీటీడీ ఛైర్మన్ పదవి కాస్తా టీవీ-5 ఛైర్మన్ బీఆర్.నాయుడికి దక్కిందని, రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనూ లోకేష్ తన మాట నెగ్గించుకున్నారని సమాచారం.ఇక, నాగబాబుకు రాజకీయాలపై ఉన్న ఆసక్తి రహస్యమేమీ కాదు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి ఆయన తన ఆసక్తిని పలు రూపాల్లో వ్యక్తం చేశారు కూడా. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత కూడా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రచారంలోనే ఉన్నారు ఆయన. సినిమాల్లో బాగా నష్టపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నను ఆదుకున్నట్లు చెబుతారు. కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు నాగబాబు ‘‘తాము పిలిచినా రాకపోతే ఏం చేయాలి’’ అని పవన్‌ను ఉద్దేశించి బహిరంగంగా వ్యాఖ్యానించినా.. తరువాతి కాలంలో ఆయనతోనే రాజకీయ పయనం సాగించడం గమనార్హం. ఇందులో భాగంగా 2019లో నరసాపురం నుంచి లోక్‌సభకు జనసేన తరఫున పోటీ చేసినా వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు ఆయన. తరువాతి కాలంలో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో నాగబాబు కూడా ఆయన వెంట నడిచారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని టాక్ వచ్చినా.. పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని బీజేపికి వదులుకోవాల్సి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడంతోనే టీటీడీ ఛైర్మన్ ఆయనకు ఇప్పించేందుకు పవన్ ప్రయత్నించినా లోకేష్ ప్రాభవం ముందు నిలవలేకపోయారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ తన కుటుంబ సభ్యులకు పదవి అడగలేదని పవన్ చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట. ఆ తరువాత రాజ్యసభ సీటైనా నాగబాబుకు ఇప్పించాలని పవన్ నానా ప్రయత్నాలూ చేశారు. బీజేపీ ఈ స్థానాన్ని ఆశించకపోతే అన్నకు దక్కుతుందన్న అంచనాతో ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ మంతనాల వెనుక బాబు ఉండి ఉండవచ్చు. అయితే, బీజేపీ అనూహ్యంగా ఏపీ నుంచి ఒక సీటు ఆశించడంతో నాగబాబుకు మళ్లీ ఆశాభంగమైంది. మూడు రాజ్యసభ స్థానాల్లో తమ పార్టీ ఒకటే తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్న అంచనాతో నాగబాబును సీటు వదులుకోమని చంద్రబాబే నచ్చజెప్పి ఉండాలి. అదే సమయంలో పవన్ అసంతృప్తికి గురి కాకుండా మంత్రి పదవి ఆఫర్ చేసి ఉండవచ్చు.అయితే, దీనిపై టీడీపీ, జనసేనలో కూడా కొంత అసంతృప్తి ఏర్పడింది. జనసేన కోసం పనిచేస్తున్న పలువురు నేతలను కాదని, సోదరుడి పదవి కోసం పవన్ పట్టు పట్టారన్న విషయం విమర్శలకు దారి తీసింది. జనసేన కూడా కుటుంబ పార్టీయేనని తేలిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోనూ జనసేన నుంచి నలుగురు మంత్రులు ఉంటే ముగ్గురు కాపు, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పదవులు వద్దంటూనే పవన్, నాగబాబులు వాటి కోసం పాకులాడారని భావిస్తున్నారు. పవన్‌కు ఆర్థికంగా అండదండలు అందించిన లింగమనేని రమేష్‌కు రాజ్యసభ స్థానం దక్కుతుందని కథనాలు వచ్చినా, పవన్, చంద్రబాబులిద్దరూ ఇప్పటికైతే మొగ్గు చూపలేదు.మరోవైపు.. టీడీపీలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్ తదితరులు రాజ్యసభ స్థానం ఆశించి భంగపడ్డారు. మంత్రిపదవి కూడా దక్కని నేపథ్యంలో యనమల చిరకాల వాంఛ రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ఆశించినా ఫలితం లేకపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెను ఎక్కడంలో యనమలది కీలక భూమిక అన్నది తెలిసిందే. గతంలో స్పీకర్‌గా ఉండి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం సులువైన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కంభంపాటి రామ్మోహన్ రావు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను సమన్వయం చేస్తూ చంద్రబాబుకు ఉపయోగపడుతుంటారు. గతంలో ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండేవారు. మళ్లీ అదే పదవి అయినా ఇస్తారో, లేదో చూడాలి.2018లో దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దాదాపు ఇచ్చినట్లే ఇచ్చి, చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకు కేటాయించారు. ఈసారి రామయ్య పేరును పరిశీలనకు తీసుకోలేదు. గల్లా జయదేవ్ కూడా ఆశించినా అవకాశం ఇవ్వలేదు. మరో నేత అశోక్ గజపతిరాజు ప్రస్తావన వచ్చినా, ఈ పోటీలో ఆయన వెనుకబడిపోయారు. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావుకు, లోకేష్‌కు సన్నిహితుడైన సానా సతీష్‌కు చెరో సీటు లభించింది. సానా సతీష్ కాకినాడ నుంచి జనసేన తరఫున లేదంటే టీడీపీ తరపున పోటీ చేయాలని భావించారు. అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ పదవి పొందారు. ఈయన ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరపడంలో పేరు గాంచడంతోపాటు ఆర్థికంగా బలవంతుడు అవడం, అన్నిటికి మించి లోకేష్ అండదండలతో పదవి పొందారని అనుకోవాలి. బీదా మస్తాన్ రావు ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేనే. నెల్లూరు జిల్లాలో రొయ్యల సీడ్ ప్లాంట్లు తదితర వ్యాపారాలు ఉన్నాయి.2019 ఎన్నికలలో టీడీపీ పక్షాన లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. తరువాత వైఎస్సార్సీపీలో రాజ్యసభ సీటు సంపాదించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రాజ్యసభకు రాజీనామా చేసి మళ్లీ అదే స్థానాన్ని టీడీపీ నుంచి పొందడం విశేషం. ఈయన సోదరుడు రవిచంద్ర కూడా లోకేష్ కు సన్నిహితుడుగా చెబుతారు. టీడీపీలో కాకలు తీరిన నేతలను కాదని, వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఈయనకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తికి తావిచ్చారని చెప్పాలి. మరో సీటును బీజేపీకి కేటాయించారు. ఈ సీటు కూడా మొన్నటి వరకు వైఎస్సార్సీపీ పక్షాన రాజ్యసభ సభ్యుడుగా ఉండి రాజీనామా చేసి వచ్చిన ఆర్.కృష్ణయ్యకు ఇచ్చారు. బీజేపీకి వేరే నేతలు ఎవరూ లేనట్లు తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు మళ్లీ ఇదే సీటు ఇవ్వడంపై ఆ పార్టీలోనే అసమ్మతి ఉంది.గతంలో ప్రధాని మోడీని అసలు బీసీ నాయకుడే కాదని, పలు విమర్శలు చేసిన కృష్ణయ్యకు ఈ పదవి ఇవ్వడం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణయ్య తనకు సీటు ఇచ్చిన రోజునే బీజేపీలో చేరడం కొసమెరుపుగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా వాడుకోవాలని ఇలా చేసి ఉండవచ్చని అంటున్నా, టీబీజేపీ నేతలు ఈయనపట్ల పెద్దగా ఆసక్తిగా లేరు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈయనకు విశేష ప్రాధాన్యం ఇచ్చి పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇస్తే ఇప్పుడు ఇలా చేశారు. రాజ్యసభ నుంచి బీసీ వర్గానికి చెందిన ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులను టీడీపీ ఆకర్షించింది. వారిలో ఇద్దరు మళ్లీ టికెట్లు పొందితే, మరో నేత మోపిదేవి వెంకట రమణకు దక్కలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారేమో చూడాలి. ఈ ఎంపికలకు సంబంధించి మరో విశేషం చెప్పుకోవాలి.చంద్రబాబుకు తానే ప్రధాన సలహాదారుడనని, టీడీపీ ప్రభుత్వం తనవల్లే నడుస్తోందని భావించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు లోకేష్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీవీ-5 యజమాని బీఆర్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడాన్ని రాధాకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారట. అయినా లోకేష్ పట్టుబట్టి ఈ పదవి ఇప్పించడం ద్వారా రాధాకృష్ణకు ఝలక్ ఇచ్చారన్న విశ్లేషణలు వచ్చాయి. ఆ వార్తకు బలం చేకూర్చే విధంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక తీరు కూడా ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికలో అక్టోబర్‌లోనే సానా సతీష్‌కు వ్యతిరేకంగా రాధాకృష్ణ పెద్ద కథనం రాయించారు. అందులో సతీష్‌పై పలు ఆరోపణలు చేశారు. కాకపోతే సానా అన్న పదం బదులు చానా అని రాసి పరోక్షంగా రాసి హెడ్డింగ్ కూడా చానా ముదురు అని ఇస్తూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. లోకేష్ పేరుతో దందాలు చేస్తున్నారని, ఉత్తరాంధ్రలో మైనింగ్ తదితర రంగాలలో అక్రమాలకు పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని, సీబీఐలో సైతం చిచ్చు పెట్టిన వ్యక్తి, అనేక స్కామ్‌లతో సంబంధం ఉన్నవాడని ఆంధ్రజ్యోతి రాసింది. అయినా లోకేష్ దానిని లెక్క చేయలేదు. తండ్రిపై ఒత్తిడి తెచ్చి సతీష్‌కే రాజ్యసభ పదవి ఇప్పించారు. రాధాకృష్ణను లోకేష్ నమ్ముతుండకపోవచ్చు. లేదా తన తండ్రి మాదిరి రాధాకృష్ణ బ్లాక్ మెయిలింగ్‌కు తాను లొంగనన్న సంకేతం ఇచ్చి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.అంతేకాక, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీని మోయడం తప్ప గత్యంతరం లేదని, అందువల్ల ఆయన మాటకు అంత విలువ ఇవ్వనవసరం లేదని భావించి ఉండవచ్చని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. ప్రతిసారీ రాజ్యసభ సభ్యుల ఎంపికలో డబ్బు, సిఫారసులు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినా, నాటకీయత కోసమైనా టీడీపీ కోసం పని చేసేవారు ఒకరిద్దరికైనా ఈ పదవులు దక్కుతుండేవి. కానీ, ఈసారి అసలు పార్టీతో సంబంధం లేని ముగ్గురు ఈ పదవులు దక్కించుకున్నారు. తద్వారా టీడీపీపై కార్యకర్తలలో అపనమ్మకం ఏర్పడడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు చేతిలో నిర్ణయాధికారం పెద్దగా లేదన్న భావన కూడా ఏర్పడుతోంది.ఈ ఎంపికలపై వ్యతిరేకత ఉన్నా ఎల్లో మీడియా కూడా నోరు మూసుకు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించినట్లు కూటమి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంగా మారింది. తండ్రి, కొడుకులు చంద్రబాబు, లోకేష్, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబులు మంత్రివర్గంలో ప్రముఖంగా ఉన్నారు. రెండు కుటుంబాల వారు ఇలా మంత్రివర్గంలో ఉండటం ఇదే ప్రథమం కావచ్చు. అటు కొడుకును కాదనలేక, ఇటు పవన్ కళ్యాణ్‌ను వదలుకోలేక, వారిద్దరి మధ్య అంతర్గత పెనుగులాటలో చంద్రబాబు బలహీనపడుతున్నారా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విశాఖ డ్రగ్స్ కేసుపై పచ్చ మంద కిక్కురు మనదేం?
నిజం నిలకడ మీద కానీ తెలియదంటారు. రాజకీయ నాయకులు కొంతమందికి ఈ విషయం బాగా తెలిసినట్టు ఉంది. ఈ ధైర్యంతోనే వాళ్లు వదంతులు, అసత్యాలు, అర్ధ సత్యాలు ప్రచారం చేసి సఫలం అవుతుంటారు. ఎక్కువసార్లు జరిగేది ఇదే. అబద్ధాలు వ్యాప్తి చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సరితూగ గలిగే వాళ్లు ఇంకొకరు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతోనే పోటీపడుతున్నారు. ఏ ఘటనలోనైనా తమవారి తప్పుందని తెలిస్తే దాన్ని వెంటనే ప్రత్యర్దిపైకి నెట్టేయడం వీరి శైలి. అనుకూల మీడియా ఒకటి వీరికి అండగా నిలుస్తోది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండనే చందమీ పచ్చ మీడియా. వందల అబద్దాలు వ్యాప్తి చేయడంలో వీరిదో రికార్డు. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు అబద్దాల విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని కూడా ఆయన అసత్యాల ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా తీర్చిదిద్దినట్లున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం 2024 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఓడరేవులో ఒక నౌకలో మాదక ద్రవ్యాలు వచ్చాయన్న వార్త వచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీ బ్రెజిల్ నుంచి వీటిని దిగుమతి చేసుకుందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది కూడా. ఈ వార్త వచ్చిందో లేదో.. టీడీపీ వెంటనే రంగంలో దిగిపోయింది ఆ డ్రగ్స్ వైసీపీ వారివేనని ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై టీడీపీ చేసిన ట్వీట్లు చూస్తే... ఇంత నీచంగా కూడా ప్రచారం చేయవచ్చా? అనిపించకతప్పదు. వైసీపీ పేరును వక్రీకరిస్తూ ‘యువజన కొకైన్ పార్టీ’ రాసింది. అక్కడితో ఆగలేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన సమీప బంధువులు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జీ సజ్జల భార్గవ రెడ్డిల ఫోటోలు పెట్టి మరీ దుష్ప్రచారం చేసింది. ‘‘దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా తాడేపల్లి ప్యాలెస్ లింకులే బయటపడుతున్నాయి’’ అని, ‘‘నాడు తాలిబన్ టు తాడేపల్లి. 2021 విజయవాడలో రూ.21 వేల కోట్ల హెరాయిన్, నేడు బ్రెజిల్ తాడేపల్లి.. 2024విశాఖలో రూ.1.60 లక్ష కోట్ల కొకెన్’’ అంటూ ఆరోపించింది. అసత్యాలు ప్రచారం చేసింది. ఇదంతా అవాస్తవమని టీడీపీకి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు కూడా తెలుసు. రాజకీయం కోసం ఏమైనా చేయాలన్నది వారి థియరీ. ఎన్ని అబద్దాలైనా ఆడవచ్చన్నది వారి అభిమతం. అదే ప్రకారం వారితోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిని ఎల్లో మీడియాగా మార్చేసి, ఎలాంటి నీతి,విలువలు లేకుండా తెలుగుదేశం పక్షాన పని చేయించారు. పచ్చి అబద్దాలైనా, ఏమో నిజం ఉందేమో! అన్నట్లుగా వీరు కథలు ఇచ్చేస్తుంటారు. ఇవి చాలవన్నట్లుగా సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తుంటారు.ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా వీరి ట్రెండ్ ఇదే. విశాఖ డ్రగ్స్ పై చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కూడా పోటీ పడి అబద్దపు ప్రసంగాలు చేశారు. పవన్ కళ్యాణ్ దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి విశాఖకు హెరాయిన్ వచ్చిందని ఉపన్యాసం చేస్తే, బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిందని చెప్పేశారు. తీరా సీబీఐ విచారణలో తేలింది ఏమిటంటే సంబంధిత కంటైనర్‌లో డ్రగ్స్ లేవని!! దీనిపై టీడీపీ ఎల్లో మీడియా కానీ, సోషల్ మీడియా కానీ కిక్కురుమంటే ఒట్టు. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. సీబీఐ కూడా ఎన్నికలకు ముందు మౌనం పాటించి, ఎన్నికలైన ఆరు నెలలకు తాపీగా విశాఖ పోర్టులోకి వచ్చింది డ్రగ్స్ కాదని తెలిపింది. ఈ విషయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా నిలిచి ఒక ప్లాన్ ప్రకారం ఇలాంటి కుట్రలు చేసి ఉండవచ్చన్న డౌట్ చాలా మందిలో ఉంది. అదే క్రమంలో సీబీఐ కూడా పని చేసిందేమో అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు వాస్తవం వెలుగులోకి వచ్చాక అయినా, ఇంత నీచమైన ఆరోపణలు చేశాం కదా..వాటిని ఉపసంహరించుకుంటున్నాం..అని కూటమి నేతలు ఎక్కడా చెప్పరు.అప్పట్లో ఈ కంటైనర్ ను దిగుమతి చేసుకున్న సంస్థ టీడీపీకి సంబంధించిన వారిదని వార్తలు వచ్చాయి. దాన్ని తోసిపుచ్చడానికి ఆ కంపెనీ యజమాని సోదరుడు వైసీపీ వాడంటూ మరో వాదనను టీడీపీ మీడియా వారు తెరపైకి తెచ్చారు. అంతేకాదు. సీబీఐ కోరిక మేరకు వారికి సహకరించడానికి అక్కడకు రాష్ట్ర పోలీసు అధికారులు వెళ్లారు. వెంటనే ఎల్లో మీడియా డ్రగ్స్ కేసును మేనేజ్ చేయడానికే వెళ్లారని కల్పిత కథనాలు వండేశారు. ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో అబద్దపు ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారిపై పెడుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో టీడీపీ, జనసేనలు చేసిన దారుణమైన అసత్యాలపై ఎంత తీవ్రమైన కేసులు పెట్టి ఉండాలో! కాని అప్పట్లో అలా చేయలేదు. మరీ అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎవరిపైన అయినా ఒకటి, అరా కేసులు పెడితే, వెంటనే మీడియాపై దాడి అంటూ విపరీతమైన ప్రచారం చేసేవారు. అదే ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై జరుగుతున్న దాడిని సమర్థిస్తూ, వారిని సైకోలుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఘోరమైన పోస్టులు పెట్టిందని వైసీపీ వారు ఆధార సహితంగా పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు తాము కోర్టులలో ప్రైవేటు కేసులు వేస్తున్నామని చెప్పారు. రాజకీయాలలో అసత్యాలే ప్రామాణికంగా పని చేసుకుంటూ రాజకీయ నేతలు వెళితే సమాజం కూడా అలాగే తయారవుతుంది. ప్రస్తుతం ఏపీలో సమాజం అటువైపు పయనిస్తోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి ప్రభుత్వం తాజా టార్గెట్ దళిత నేతలు, అధికారులు!
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజకూ అరాచకత్వం పెరిగిపోతోంది. టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన అధికార కూటమి తాజాగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న దళిత వర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అరడజను మంది దళిత నేతలతోపాటు ఇదే వర్గానికి చెందిన ఐదుగురు ఆలిండియా సర్వీసు అధికారులను ఈ ప్రభుత్వం వేధిస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా...పలువురు సామాన్య దళితులు సైతం వివక్ష, అవమానాలకు గురవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు రాష్ట్రంలో పౌర హక్కులు అనేవి ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న వస్తోంది. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఈ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడటం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఒకసారి గతంలోకి వెళదాం... టీడీపీ నేతల ప్రోద్బలంతో నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు సుధాకర్ మాస్క్‌లు లేవంటూ అప్పట్లో రచ్చ చేశారు. ఆస్సత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. సుధాకర్ ఆ పని చేయకుండా టీడీపీ అండతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారు. దీంతో దీనిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్ చేశారు. దీనిపై టీడీపీ అగ్గిమీద గుగ్గిలమైంది. దళిత డాక్టర్‌ను సస్పెండ్ చేస్తారా? అని, అతడి క్రమశిక్షణ రాహిత్యాన్ని వదలివేసి దుర్మార్గపు ప్రచారం చేశారు. ఆ తర్వాత కొద్ది నెలలకు డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో ఒక రోడ్డుపై తాగి గొడవ చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించారు. పోలీస్ కానిస్టేబుల్ వారించినా వినిపించుకోలేదు.పోలీస్ స్టేషన్ కు రాకుండా గొడవ చేయడంతో, ఆ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి తీసుకువెళ్లారు. ఆ పోటోలు, వీడియోలు తీసి చాలా ఘోరం జరిగిందని దుష్ప్రచారం చేశారు. అంతే తప్ప బాధ్యత కలిగిన ఆ డాక్టర్ అసభ్యంగా వ్యవహరించారని మాత్రం చెప్పకుండా అబద్దాలు వండి వార్చారు. అక్కడితో ఆగలేదు. వెంటనే ఆయన పేరుతో హైకోర్టులో పిల్ వేయడం, గౌరవ న్యాయ స్థానం దానిపై సీబీఐ విచారణకు ఆదేశించడం జరిగిపోయింది. కానిస్టేబుల్ పై సీబీఐ విచారణ ఏమిటా అని అంతా నివ్వెరపోయారు. కానీ అప్పట్లో చంద్రబాబు తన న్యాయవాదుల ద్వారా అలా చేయించగలిగారని అంటారు. ఆ తర్వాత సీబీఐ ఏమి నివేదిక ఇచ్చిందో ఎవరికి తెలియదు. మరికొంత కాలానికి సుధాకర్ అనారోగ్యానికి గురై చనిపోయారు. దానికి కూడావైఎస్సార్సీపీనే కారణమని టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. ఇదంతా దళితుడు అన్న పేరుతో సాగించిన కుట్రగా అర్థమైంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సుధాకర్ ఊసే లేదు. ఆ కుటుంబాన్ని పట్టించుకున్నట్లు కూడా వార్తలు కనిపించ లేదు. ఇలా ఉంటుంది టీడీపీ రాజకీయం, ఎల్లో మీడియా దుర్మారపు ప్రచారం!!! కారణం ఒకటే! దళిత వర్గాలలోవైఎస్సార్సీపీ పట్ల వ్యతిరేకత పెంచాలన్న ప్రయత్నం. కూటమి నాయకత్వానికి దళితులపై నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కానీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది దళితులపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై హత్య కేసుతో సహా పలు కేసులు పెట్టి నెలల తరబడి జలులో ఉంచుతున్నారు. 201419 మధ్యకాలంఓనూ నందిగం సురేష్ పై చంద్రబాబు ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. అమరావతిలో పంటల దగ్ధమైన ఘటనలో జగన్ పేరు చెప్పాలని ఆయనపై పోలీసులు తీవ్ర ఒత్తిడి చేసి హింసించారు. అయినా ఆయన లొంగలేదు. ఆ విషయం తెలిసిన జగన్ తదుపరి సురేష్ కు ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన కేసులు ఎదుర్కోవలసి వస్తోంది. మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై ఒక మహిళతో కేసు పెట్టించారు. ఆసక్తికరంగా ఆ మహిళ తనతో అధికార పార్టీ నేతలు కొందరు ఒత్తిడి చేసి తప్పుడు కేసు పెట్టించారని అఫిడవిట్ దాఖలు చేశారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఏపీలో ఉన్న పేకాట క్లబ్‌లు నడుస్తున్న తీరును విమర్శిస్తూ మంత్రి లోకేష్ పై ఆరోపణలు చేశారు. లోకేష్ దీనిని ఖండించి ఉండవచ్చు. అలా కాకుండా ఏకంగా ఆయనపై పోలీసులు కేసు పెట్టేశారు. ఇదే ప్రామాణికంగా తీసుకుంటే లోకేష్ అప్పటి సీఎం. జగన్ పైతో సహా పలువురు వైఎస్సార్సీపీ వారిపై తీవ్రమైన ఆరోపణలు అనేకం చేసేవారని, అప్పట్లో తాము ఇలా కేసులు పెట్టలేదనివైఎస్సార్సీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే నందిగామలో ఎప్పుడో చంద్రబాబు టూర్ లో జరిగిన చిన్న గొడవ మీద మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు , ఎమ్మెల్సీ అరుణకుమార్ లపై కేసులు పెట్టారు. మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై కూడా హత్య కేసు బనాయించారనివైఎస్సార్సీపీ ఆరోపించింది. వీరంతా దళిత నేతలే. దళిత నాయకత్వాన్ని దెబ్బతీయడానికే టీడీపీ ఇలా చేస్తోందనివైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. గతంలో ఒక కానిస్టేబుల్ పైనే సీబీఐ విచారణకు ఆదేశించిన న్యాయ వ్యవస్థ, ఇంతమంది దళిత నేతల విషయాలలో కూడా న్యాయం చేయాలని, తద్వారా పౌర హక్కులను కాపాడాలని పలువురు కోరుతున్నారు. అధికార వ్యవస్థపై కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష కట్టి పలు వేధింపులకు పాల్పడుతోంది. వీరిలో ఎక్కువమంది దళిత అధికారులు ఉండడం గమనించదగ్గ అంశం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 201419 మధ్య జరిగిన స్కిల్ స్కామ్‌తోసహా పలు కుంభకోణాలలోవైఎస్సార్సీపీ టైమ్‌లో ఆధార సహితంగా కేసులు పెట్టడమే వారు చేసిన తప్పు. దీన్ని మనసులో ఉంచుకుని వారిలో పలువురిని వేధిస్తున్నారు. సీనియర్ ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్‌ను రకరకాలుగా వేధిస్తుండగా, పాల్ రాజు, జాషువా అనే ఇద్దరు అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం లేదట. మరో సీనియర్ అధికారి విజయపాల్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఇందులో విశేషం ఏమిటంటే కుల, మత విధ్వేషాలు రెచ్చగొడుతూ నిత్యం టీవీలలో మాట్లాడిన అప్పటివైఎస్సార్సీపీ అసమ్మతి నేతపై కేసు పెడితే, దానిని డైవర్ట్ చేసి, ఆయనను విచారణలో హింసించారంటూ కొత్త కేసును ముందుకు తీసుకురావడం. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఎలాంటి హింస లేదని సర్టిఫికెట్ ఇచ్చినా, కూటమి అదికారంలోకి వచ్చాక, మొత్తం కేసును తిరగతోడి, ఐపిఎస్ అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. వారిని లొంగదీసుకునివైఎస్సార్సీపీ నేతలపై కూడా కక్ష సాధించాలన్నది వీరి ప్లాన్ గా చెబుతున్నారు. అలాగే ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ మార్గదర్శి కేసును విచారించి పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. మార్గదర్శిలో రూ. 800 కోట్ల నల్లధనం ఉందని, మార్గదర్శి చిట్స్ లో పలు అక్రమాలు జరుగుతున్నాయని ఆధారాలు చూపుతూ ఫిర్యాదు చేయడమే ఆయన చెసిన తప్పు. ఇప్పుడు దానికి ప్రతిగా ఏదో రకంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వ దౌర్జన్యాలకు గురి అవుతున్నవారిలో పలువురు దళిత కార్యకర్తలు కూడా ఉన్నారు. రాజమండ్రిలో ఒక దళిత సోషల్ మీడియా యాక్టివిస్ట్ ను స్టేషన్ కు తీసుకువెళ్లి అర్ధనగ్నంగా నిలబెట్టి అవమానించారట. ఆ విషయాన్ని అతనే మాజీ ఎంపీ భరత్ సమక్షంలో వివరించారు. జగన్ పాలన సమయంలో ఒక దళిత డాక్టర్ సస్పెన్షన్ నే అంతగా రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తదితరులు ఇప్పుడు ఇంతమంది దళితులపై ఈ స్థాయిలో జరుగుతున్న దాష్టికాలకు బాధ్యత వహించరా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మంచి చెడుల మేళవింపు.. రేవంత్ ఏడాది పాలన!
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు ఏడాది. గత ఏడాది అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది మొదలు రేవంత్ పెద్ద ఒడిదుడుకులు లేకుండానే పాలన సాగించడం ప్రధాన విజయమని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడి పాలనతో పోలిస్తే రేవంత్ చాలా మెరుగున్న భావన ఏర్పడుతుంది. అక్కడలా ఇక్కడ మరీ అరాచక పరిస్థితులు లేవు. ప్రత్యర్థులపై ఇష్టారీతి దాడుల్లేవు. అధికారంలో ఉన్న నేతల మాదిరిగా పచ్చి అబద్దాలు చెప్పడం లేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎలాగొలా అమలు చేయాలన్న తాపత్రయం తెలంగాణలో కనిపిస్తోంటే.. ఏపీలో సూపర్‌సిక్స్ హామీలను ఎలా ఎగవేయాలా అన్న మోసపూరిత ధోరణి కనిపిస్తోంది. అలాఅని రేవంత్ ప్రభుత్వం అంతా సక్రమంగా చేస్తోందని చెప్పలేము. లోటుపాట్లు ఇక్కడా ఉన్నాయి. ప్రజల్లో కొంత అసంతృప్తి కూడా వాస్తవమే. హైదరాబాద్ వంటి కీలకమైన ప్రాంతంలో రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడినట్లే కనిపిస్తోంది.ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని పాజిటివ్ పాయింట్లు, కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉంటాయి. రేవంత్ ప్రభుత్వం సాధించిన విజయాలు ఎక్కువా? లేక అపజయాలు ఎక్కువా అన్న పోలికకు అప్పుడే వెళ్లజాలం. కానీ ప్రజలు అంచనా కట్టడం సహజం. కేసీఆర్ పాలనతో పోల్చి చూసుకోవడం కూడా మామూలే. ముందుగా రేవంత్ కు సానుకూలంగా ఉన్న అంశాల గురించి చూద్దాం...గ్రూపు కుమ్ములాటలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలో ఏడాది కాలంలో అలాంటివి జరక్కుండా రేవంత్ ప్రభుత్వాన్ని నడిపారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు కూడా ప్రస్తుతానికి రేవంత్‌తో కలిసి నడుస్తున్నారు. సందర్భానుసారంగా రేవంత్ వారి మాటకు విలువిస్తూ కలుపుకుని పోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో రేవంత్ పై విమర్శలు చేసిన కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుండడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోటోకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనలలో ఎక్కువసార్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడాన్ని చాలామంది బహిరంగంగానే చర్చిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో గతంలో మాదిరి సీఎంలను మార్చడానికి అధిష్టానం సిద్దంగా లేకపోవడం రేవంత్‌కు కలిసి వచ్చే అంశం. రేవంత్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఒకప్పుడు వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ నేత కేటీఆరే.. ఇప్పుడు ఐదేళ్లు ఉంటే ఉండవచ్చని అంటూండటం గమనార్హం.ప్రజలలో కూడా ప్రభుత్వానికి అదే రీతిలో సానుకూలత ఉందా? దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హైదరాబాద్ కు దక్షిణాన ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్దికి సంకల్పించడం, స్కిల్ యూనివర్శిటీ, చెరువుల సంరక్షణకు చర్యలు, మూసి నదీతీర అభవృద్ది, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కొనసాగించడం మొదలైనవి ప్రభుత్వపరంగా చెప్పుకోదగిన అంశాలు. అదే టైమ్‌లో హైడ్రా కూల్చివేతలు, మూసీ వివాదం, లగచర్లలో జిల్లా కలెక్టర్‌పై ప్రజల దాడి, ఫార్మా హబ్ భూ సేకరణ నోటిఫికేషన్ వంటివి ప్రభుత్వానికి చికాకు తెచ్చిపెట్టాయి.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొన్నిటిని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. పూర్తయ్యాయా? లేదా? అన్నది ఇంకో చర్చ. రైతులకు రూ.రెండు లక్షల వరకూ రుణమాఫీ చాలావరకు చేసినట్లే కనబడుతోంది. ఇంకా కొంతమందికి కాకపోయినా, ప్రభుత్వపరంగా ఈ లక్ష్యాన్ని నెరవేర్చాలన్న సంకల్పం కనబడుతుంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణం హామీని నెరవేర్చారు. వంట గ్యాస్ సిలిండర్లను రూ.500లకే ఇస్తామన్న హామీ అమలుకూ శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ బీమాను రూ.పది లక్షలకు పెంచారు. విద్యుత్తు వినియోగం నెలకు 200 యూనిట్లు వినియగించే కుటుంబాలకు ఉచిత కరెంట్ హామీని కూడా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వీటన్నింటిలో మహిళల ఉచిత బస్ ప్రయాణమినహా మిగిలినవి ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదని అనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేసినట్లు చెబుతున్న హామీలకన్నా, అమలు చేయని హామీలే ఎక్కువగా ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కరమైన అంశం. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, మరో విపక్షమైన బీజేపీలు పదే,పదే ఆ హామీలను గుర్తు చేస్తుంటాయి. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చేసిన వాగ్దానం గురించి! రైతుబంధు పథకం కింద గత ప్రభుత్వం రూ.పది వేలు ఇవ్వడానికి సిద్దపడితే ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. ఆ సందర్భంలో తాము అధికారంలోకి రాగానే దానికి మరో ఐదువేలు జత చేసి ఇస్తామని రేవంత్ చెప్పారు. అది ఎంతవరకు అమలు అయింది చెప్పలేని పరిస్థితి. వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల చొప్పున ఇస్తామని అన్నారు. వరి ధాన్యానికి బస్తాకు రూ.500ల బోనస్ ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు సన్న రకానికే ఇస్తామని అంటున్నారన్నది విపక్షాల విమర్శ. పేదలకు ఇళ్ల స్థలాల, రూ.ఐదు లక్షల సాయంపై త్వరలో లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రులు చెబుతున్నారు.ఇతర అంశాలను చూస్తే రేవంత్ కొన్ని కొత్త ఆలోచన లు చేశారు. వాటిలో ఫ్యూచర్ సిటీ ముఖ్యమైనది. హైదరాబాద్ కు దక్షిణాన అంటే శ్రీశైలం రోడ్డులో కొత్త నగరం అభివృద్ది చేస్తామని చెప్పారు. తద్వారా హైదరాబాద్ ను నలువైపులా అభవృద్దికి చర్యలు తీసుకుంటామని ప్రయత్నాలు ఆరంభించారు .అంతవరకు బాగానే ఉంది. అయితే ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరి కాకుండా వాస్తవ అభివృద్ది జరగవలసి ఉంది. స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు మంచిదే. కాకపోతే కొన్ని పారిశ్రామిక సంస్థల నుంచి విరాళాలు తీసుకోవడం వివాదం అవుతోంది. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిచ్చిన విరాళాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు.హైదరాబాద్‌లో వరదలకు కారణం అవుతున్న చెరువుల కబ్జాలను తొలగించాలని ప్రత్యేకంగా హైడ్రా అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. అది మంచి ఉద్దేశం అయినప్పటికీ, అనాలోచితంగా ఎక్కడబడితే అక్కడ కోట్ల రూపాయల విలువైన భవనాలను కూల్చివేయడం పెను వివాదమైంది. దీనిపై ప్రజలలో మొదట ఆసక్తి కలిగినా, ఆ తర్వాత జరిగిన కూల్చివేతలతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. పేదల ఇళ్లు పోవడంతో వారు రోడ్డున పడవలసి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం కూల్చివేతల వేగం తగ్గించినా, జరగవలసిన నష్టం జరిగిపోయిందని చెప్పాలి. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ పై కూడా పడింది. స్థలం లేదా అపార్ట్మెంట్ కొనాలంటేనే జనం భయపడుతున్నారని ఈ రంగంలోని వారు చెబుతున్నారు. కేటీఆర్ జన్వాడ జన్వాడ్ ఫార్మ్ హౌస కూల్చాలన్న తలంపుతో ఈ పర్వం ప్రారంభం అయిందన్న అభిప్రాయం ఉంది. కాని అది చివరికి ప్రభుత్వానికే ఇబ్బందిగా మారింది.మూసీ సుందరీకరణ అంశాన్ని రాజకీయ పక్షాలన్నీ సమర్థించినా, తదుపరి ఇళ్ల కూల్చివేతల సర్వే జరిగే సరికి, తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆశయం మంచిదే అయినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ప్రభుత్వంపై ప్రజలలో అనుమానాలు రేకెత్తాయి. తన నియోజకవర్గం కొడంగల్ లోని లగచర్ల వద్ద ఫార్మా కంపెనీలకు స్థలం ఇవ్వాలని తలపెట్టగా, అక్కడ స్థానికంగా వ్యతిరేకత వచ్చింది. ఆ క్రమంలో జిల్లా కలెక్టర్ పై కూడా దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డిని, కొతమంది ఆందోళనకారులను అరెస్టు చేసినా, అంతిమంగా వారి డిమాండ్ ప్రకారం ప్రభుత్వ భూ సేకరణ నోటిఫికేషన్ ను మార్చేసుకుంది. ఇతర పరిశ్రమల స్థాపనకు ప్రయత్నాలు ఆరంభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ నోటి దురుసుతో మాట్లాడుతూ రెచ్చగొట్టే యత్నం చేశారు. అయినా కేసీఆర్ ఒకటి, రెండుసార్లు మినహా అసలు స్పందించడం లేదు. విపక్షంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే దూకుడుగా ఉన్నారని అంటారు. అదే ప్రభుత్వంలోకి వచ్చాక కూడా చేస్తే దుందుడుకు స్వభావం పోలేదని అంటారు. ఈ విషయాన్ని రేవంత్ గుర్తు ఉంచుకుంటే మంచిది.కేసీఆర్ ప్రభుత్వం ఎంతకాదన్నా తెలంగాణపై గట్టి ప్రభావాన్ని చూపింది. హైదరాబాద్ ను విశేషంగా అభివృద్ది చేయడం కాని, విద్యుత్ సమస్యను తీర్చడం కాని, కొత్త సచివాలయం, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కాళేశ్వరం వంటి ప్రాజెట్టులు చేపట్టడం కాని నిర్దిష్ట కార్చారణ చేశారన్నది నిజం. వీటిలో కొన్ని లోటుపాట్లు, ఆరోపణలు ఉండవచ్చు. అయినా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు.కాళేశ్వరం, విద్యుత్ ప్లాంట్ల విషయంలో న్యాయ విచారణ కమిషన్ లు వేశారు. వాటివల్ల ఎంత పలితం ఉంటుందో చెప్పలేం. రేవంత్ కూడా ఒక ముద్ర వేసుకోవాలని చూస్తున్నప్పటికీ అది అంత సులువుగా లేదు. అలవికాని హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయలేక, కొత్త స్కీములు తెస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని రేవంత్ సర్కార్ యత్నాలు చేస్తోందా అన్న భావన ఉంది.. ఇక్కడ ఒక్కమాట చెప్పాలి.తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షం బలంగా ఉండడం వల్ల ప్రజాస్వామిక వాతావరణం మరీ ఎక్కువగా దెబ్బతినలేదు. సోషల్ మీడియాపై ఏపీలో మాదిరి తీవ్ర స్థాయిలో దాడులు జరగడం లేదు. అయినా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, హరీష్ రావులను అరెస్టు చేసిన తీరు, పిచ్చి కేసులు పెడుతున్న వైనం విమర్శలకు గురి అవుతోంది. అందుకే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యమా? ఇందిరమ్మ ఎమర్జన్సీనా అని బీఆర్ఎస్ ధ్వజమెత్తుతోంది. ఇటీవలి కాలంలో మాటలు తూటలు ఎక్కువగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే పేలుతున్నాయి. తద్వారా బీజేపీకి స్పేస్ దొరకడం కష్టం అవుతోంది. రేవంత్ తన ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు పెరుగుతోందో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. లేకుంటే అంతా బాగుందని భ్రమ పడితే ఏమవుతుందో చెప్పడానికి పలు ఉదంతాలు ఉన్నాయి. రేవంత్ కు అయినా, మరెవ్వరికైనా ఒక్క సలహా ఇవ్వాలి.ద్వేషంతో రాజకీయం చేస్తే వారికే నష్టం వస్తుంది. తమకు ఉపయోగమా? కాదా?అన్నది ఆలోచించాలి తప్ప కక్షతో ఉన్న వ్యవస్థలను చెడగొట్టి, పగ, ప్రతీకారాలతో రాజకీయాలకు పాల్పడితే ప్రజలకు మేలు జరగదు సరికదా పాలకులు కూడా అప్రతిష్టపాలవుతారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును రేవంత్ గురువుగా అంతా చెప్పుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వం మాదిరి మరీ చెడ్డపరు తెచ్చుకోకుండా ఉంటే మంచిది.ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కనుక రేవంత్ కు ఆల్ ద బెస్ట్ చెబుదాం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వినేవాడుంటే... కథలు చెప్పేది కూటమి ప్రభుత్వమని..
ఆంధ్రప్రదేశ్‌లో నెలకో కొత్త డ్రామా మొదలవుతోంది. సూపర్‌సిక్స్ హామీలను ఎప్పుడో గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నెలకో కొత్త కథ చెబుతోందనుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గద్దెనెక్కగానే వైఎస్సార్సీపీ నేతలపై దౌర్జన్యం, దాడులతో తొలి నెల కథ మొదలు కాగా.. ఆ తరువాత ముంబై నటి జత్వానీతో వైఎస్సార్సీపీ నేతలను, తమకు అనుకూలంగా లేని అధికారులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఈ తంతు ముగుస్తోంది అనుకునేంతలోపే తిరుపతి లడ్డూ వివాదాన్ని ప్రజల నెత్తిన రుద్దారు. ఆపై.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు, కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రి అల్లిన కథ.. ఇలా సాగిపోతోంది కూటమి రాజకీయ డ్రామా!ఇప్పటికే పలు వ్యవస్థలను ద్వంసం చేసిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తాజాగా ఆర్థిక విధ్వంసానికి పూనుకున్నట్లు కనిపిస్తోంది. సామాజిక కోణమూ ఇందులో ఉందంటున్నారు. రెడ్డి సామాజికవర్గ పారిశ్రామిక వేత్తలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రభుత్వం దాష్టికాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. కాకినాడ డీప్ పోర్టు కంపెనీలో బలవంతంగా షేర్లు పొందారని అంటూ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రావుతో ఒక ఫిర్యాదు చేయించి అందులో గత ముఖ్యమంత్రి జగన్ ను కూడా ఎలాగైనా ఇరికించాలన్న ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. తెలుగుదేశం పత్రిక ఈనాడులో వచ్చిన ఆ కథనం చదివితే అచ్చంగా ఒక కాల్పనిక కథను తయారు చేసేందుకు విఫలయత్నం చేసినట్లు స్పష్టమవుతుంది. చాలాచోట్ల తర్కం అసలు కనిపించకుండా పోయింది మరి!గతంలో మాజీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీ కాలుష్యానికి కారణమవుతోందని ప్రభుత్వం నోటీసిస్తేనే.. రాష్ట్రంలోంచి పరిశ్రమలను తరిమికొడుతున్నారని తెలుగుదేశం, ఆ పార్టీ మీడియా పచ్చి అబద్దాలను ప్రచారం చేశాయి. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కేంద్ర ప్రభుత్వ సంస్థతో జరిగినా, జగన్‌పై ద్వేషంతో అదానీ కంపెనీలపై బురద చల్లారు. ఈ పరిణామాలు అదానీ కంపెనీ ఏపీలో పెట్టాలనుకున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు. తాజాగా కూటమి ప్రభుత్వం అరబిందో గ్రూప్‌పై దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. అరబిందో మందుల తయారీతో సహా పలు రంగాలలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నిర్వహిస్తున్న సంస్థ. దాదాపు రూ.72 వేల కోట్ల పెట్టుబడులతో 150 దేశాల్లో యూనిట్లు నడుపుతోంది. కంపెనీ యజమానులు వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డికి దగ్గర బంధువులు కావడంతో వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం జరిగిన లావాదేవీలపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఇందులో భాగమే అనిపించక మానదు. పోనీ దానికి ముందు అరబిందో కి లీగల్ నోటీసులు ఇచ్చారా? లేదు. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేయడం, వెంటనే కేసు నమోదు కావడం సందేహాలకు తావిస్తోంది. కాకినాడ డీప్ పోర్టు లిమిటెడ్ లోని రూ.2500 కోట్ల విలువైన వాటాలను రూ.494 కోట్లకు, కాకినాడ సెజ్ లోని రూ.1109 కోట్ల విలువైన వాటాలను రూ.12 కోట్లకే బలవంతంగా బదలాయించుకున్నారని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో నిజం ఏమాత్రం ఉన్నా చర్య తీసుకోవచ్చు కానీ ఆ వార్తను చూస్తే ఏదో కల్పిత గాథ చదువుతున్నట్లు అనిపిస్తుంది.ఎందుకంటే కేవీరావు చిన్న వ్యక్తేమీ కాదు.1997లోనే ప్రభుత్వ అధీనంలోని కాకినాడ పోర్టును అతి తక్కువ పెట్టుబడితో తన కంట్రోల్ కు తెచ్చుకున్న వ్యక్తి. చంద్రబాబు సన్నిహితుడు కావడం వల్లనే పోర్టు ఆయనకు చౌకగా దక్కిందని అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది కూడా. ఈ అంశంపై అసెంబ్లీలో చాలా రచ్చ జరిగింది. అంత ఫవర్ ఫుల్ వ్యక్తి, కేవలం ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి బెదిరిస్తే లొంగిపోతారా? అన్న అనుమానం రాకమానదు. పనిలో పని ఈనాడు మీడియా జగన్‌ను కుట్రదారుడిగా ప్రొజెక్టు చేయడానికి గట్టి ప్రయత్నమే చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆడిట్లో కాకినాడ సీ పోర్ట్ సంస్థ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.965 కోట్ల నష్టం కలిగించిందని తేల్చిందట. అది తప్పుడు నివేదిక అని ఇప్పుడు కేవీ రావు అంటున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే, సంస్థ ఎండీగా ఆయనే ఉన్నారు కదా? మరో ఆడిటింగ్ సంస్థతో ఆడిట్ చేయించి ప్రభుత్వ వాదనను తప్పు అని రుజువు చేసి ఆ పత్రాలు తన వద్దకు ఎందుకు ఉంచుకోలేదో తెలియదు. లేదా ప్రభుత్వంపై దావా వేసే అవకాశం ఎందుకు వదులుకున్నారు? విక్రాంత్ రెడ్డి రమ్మనగానే హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లవలసిన అవసరం కేవీ రావుకు ఏమిటి? ఒప్పంద పత్రాలు సిద్దమవుతున్నప్పుడు కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ వాటాలు అరబిందోకి అమ్ముతున్నట్లు తెలిసిందని ఆయన అన్నదానిలో నిజం ఉండే అవకాశం ఉందా? ఈ కంపెనీ మొత్తాన్ని నిజంగానే అరబిందో స్వాధీనం చేసుకోదలచుకుంటే 41.12 శాతం మాత్రమే ఎందుకు తీసుకుంటుంది? అన్నదానికి జవాబు రావల్సి ఉంది. అరబిందో కి ఇచ్చిన వాటాల విలువ రూ.494 కోట్లుగా లెక్కవేశారని, నిజానికి అది రూ.2500 కోట్ల పై మాటే అని, దానిపై నిరసన తెలిపానని ఆయన చెబుతున్నారు. అదే వాస్తవమైతే ఆ మేరకు నిరసన లేఖ కూడా ఉండాలి కదా!వాటాలు అమ్మకపోతే తనను, తన కుటుంబ సభ్యులను జైలులో పెడతామని బెదిరించారని, ఇతర వ్యాపారాలు నిలిపివేస్తామని భయపెట్టారని కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు. కొన్ని వేల కోట్ల రూఏపాయల వ్యాపారానికి అధిపతి అయిన కేవీ రావును అంత తేలికగా భయపెట్టే పరిస్థితి ఉంటుందా? ఈ డీల్ అయ్యాక విక్రాంత్ రెడ్డి తదితరులు ఆయనను జగన్ వద్దకు తీసుకువెళ్లారట. అప్పుడు నిరసన చెప్పడానికి ప్రయత్నించినా జగన్ మాట్లాడనివ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇష్టం లేకపోతే డీల్ పూర్తి అయ్యాక జగన్ వద్దకు వెళ్లవలసిన అవసరం ఏమిటి? ఇదంతా జగన్ కోసమే జరుగుతోందని ఆయనకు అనిపించిందట. అంతే! ఐదేళ్ల తర్వాత ఫిర్యాదులో ఆ విషయం చెబుతున్నారు. నిజంగానే జగన్‌కు ఈ కంపెనీలో వాటా ఉంటే వేరే వారి పేరుతో ఎందుకు తీసుకుంటారు? గత అనుభవం చూస్తే జగన్ అలా చేయరన్న భావన కలుగుతుంది. సాక్షి మీడియా, పవర్ ప్రాజెక్టులు,సిమెంట్ కంపెనీ వంటివాటిని స్థాపించినప్పుడు ఆయన బినామీ పేర్లను వాడలేదు కదా? అలా వాడి ఉంటే అసలు కేసులే ఉండేవి కావు కదా! వాటాల బదిలీ తర్వాత ఆడిట్ నివేదికలో నష్టం రూ.తొమ్మిది కోట్లకు తగ్గించుకున్నారని అంటున్నారు. అందులో నిజం ఉంటే అప్పుడే ప్రొటెస్ట్ చెప్పాలి కదా. కాకినాడ సీపోర్టు లిమిటెడ్ యాజమాన్యం ఆయన చేతిలో ఉంటే, అలా ఎందుకు చేయలేదో అర్థం కాదు. విక్రాంత్ రెడ్డి వాటాలు బదిలీ చేయకపోతే ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇస్తుందని అన్నారట. ఈ మాటకే కేవీ రావు వణికి పోతారా? అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే వాటాలను ఎంతకు అమ్ముతున్నది, ఎంతకు కొంటున్నది ఒప్పందంలో లేదని, మర్చంట్ బ్యాంకర్లు నిర్ణయిస్తారని అంటే ఈయన ఎందుకు అంగీకరించింది తెలియదు. ఇలా కేవీ రావు ఫిర్యాదులో అనేక లొసుగులు కనిపిస్తాయి. ఈ వ్యవహారం అంతా చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ కథ నడిపిస్తున్టన్లు అనిపిస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇదే కేవీరావు, చంద్రబాబు నాయుడులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు మెప్పుకోసమో, మరెందుకోసమో గాని పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు వద్ద డ్రామా నడిపారు. రేషన్ బియ్యం అక్రమంగాఎగుమతి అవుతున్నాయంటూ యాంకరేజీ పోర్టు వద్ద గొడవ చేశారు. దీనికి, డీప్ సీ పోర్టుకు తేడా తెలియకుండా ఆరోపణలు చేశారు. తదుపరి మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం పెట్టి అరబిందో సంస్థ చేతికి వెళ్లాకే పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. తీరా చూస్తే రేషన్ బియ్యం పట్టుబడింది ప్రభుత్వ అధీనంలోని యాంకరేజి పోర్టులో. ఆ తర్వాత రోజు కాకినాడ పోర్టు వాటాల మార్పిడిపై వివాదం ఉందంటూ, సీఐడీకి ఫిర్యాదు చేశారని ఎల్లో మీడియా కథనం. అరబిందో సంస్థను, విక్రాంత్ రెడ్డి తదితరులను టార్గెట్ చేస్తూ, అందులో జగన్‌ను ఇరికిస్తూ కేవీరావుతో ఫిర్యాదు ఇప్పించారు. నిజంగానే కేవీరావుకు వాటాల అమ్మకం ఇష్టం లేకపోతే అప్పుడే ప్రొటెస్ట్ చెప్పి ఉండవచ్చు. కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసి ఉండవచ్చు. అప్పట్లో ప్రతిపక్ష నేత గా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా దీనిని వివాదం చేసి ఉండవచ్చు. ఎల్లో మీడియా జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్న నేపధ్యంలో కేవీరావు 2020లోనే కనుక ఈ ఆరోపణలు చేసి ఉంటే ఆ మీడియా పండగ చేసుకునేదే కదా! ఎవరైనా తమ ఆస్తిని అమ్ముకుని, ఐదేళ్ల తర్వాత దాని విలువ పెరిగిందనో, మరో కారణంతోనో కేసులు పెట్టడం మొదలైతే పరిస్థితి ఏ దశకు వెళుతుందో అర్థం చేసుకోవచ్చు.దీనిపై అరంబిందో కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కేవీరావు ఇవేవి తెలియని అమాయకుడని, నోట్లో వేలు పెడితే కొరకలేని భయస్తుడని చెబితే ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు వ్యవహారాలలో ప్రముఖ పారిశ్రామిక సంస్థలపై, పెట్టుబడిదారులపై కేసులు పెట్టుకుంటే వెళితే అది అత్యంత ప్రమాదకరం అవుతుంది. అంతేకాక ప్రత్యేకంగా రెడ్డి సామాజిక వర్గం వారిపై ఒక వైపు సోషల్ మీడియా కేసులు, మరో వైపు రెడ్డి పారిశ్రామికవేత్తలపై వేధింపులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.ఇవన్ని చూస్తుంటే తమ రాజకీయాలకోసమో, కక్ష సాధింపుల కోసమో ఏపీలో ఆర్థిక విధ్వంసానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడడం లేదన్న అభిప్రాయం కలుగుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తీరుతెన్నూ లేని చందంగా ఏపీ!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, పోలీసులు ఎంత ఘోరంగా పని చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదేమో! మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పెట్టిన దుర్మార్గపు కేసు ఒక ఉదాహరణైతే, ప్రముఖ సినీ దర్శకుడు వర్మకు సంబంధించి పోలీసులు ప్రవర్తించిన తీరు మరొకటి. ఇంకోపక్క తెలుగుదేశం సోషల్ మీడియా సీనియర్ ఐఎఎస్ అధికారులను కూడా వదలకుండా ఇష్టారీతిలో బురదవేసి అవమానిస్తున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లాలో ఎర్రావారిపాలెం అనే గ్రామం వద్ద ఒక బాలిక పై అఘాయిత్యం జరిగింది.ఆ బాలిక తండ్రి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెవిరెడ్డికి వివరిస్తే, ఆయన ఆ కుటుంబానికి సాయపడడానికి ఆ గ్రామానికి వెళ్లారు.ఆ క్రమంలో ఆ బాలిక తండ్రి రమణను పరామర్శించి బాలికకు ధైర్యం చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం ఏలికలకు కోపం తెప్పించింది. ఎలాగైనా చెవిరెడ్డిపై కేసు పెట్టాలని పోలీసులు భావించినట్లు ఉన్నారు. ఇలాంటి కేసులలో బాలికల ఐడెంటిటిని ఎవరూ బయటపెట్టకూడదు. చెవిరెడ్డి కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో కాని ఘటన జరిగిన కొద్ది రోజులకు చెవిరెడ్డిపై పోక్సో కేసుతోపాటు మరికొన్ని పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆశ్చర్యపోవడం లాయర్ కూడా అయిన చెవిరెడ్డి వంతైంది. బాలిక తండ్రిని బెదిరించి ఫిర్యాదు తీసుకున్నారా అన్న అనుమానం అప్పట్లో వచ్చింది.చెవిరెడ్డి ఈ కేసును ఎదుర్కోవడానికి సిద్ధపడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత తండ్రి మీడియా సమావేశం పెట్టి తానసలు చెవిరెడ్డిపై కేసు పెట్టలేదని, తమకు సాయపడడానికి వచ్చిన వారిపై కేసు ఎలా పెడతామని ప్రశ్నించారు. పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డిని పిలిచామని ఆయన చెప్పారు. తాను చదువుకోలేదని, పోలీసులు సంతకం చేయమంటే చేశానని ,దానిని వాడుకుని చెవిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పోలీసులు స్పందించలేకపోయారు. ఇది కేవలం చిత్తూరు పోలీసులకే కాదు..రాష్ట్ర పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట తెచ్చిందని చెప్పాలి. రాష్ట్రంలో వైసిపివారిపై జరుగుతున్న దాడులు, హింసాకాండకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చినా పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా, అసభ్య పోస్టులు ప్రచారం చేసినా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు. వీటికి తోడు ఇప్పుడు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న తీరు ఎపిలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూనీ అవుతుందో చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లారు. బాధిత కుటుంబం పిలవకపోయినా ఆయన వెళ్లారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఆనాడు ఎంత వారించినా వినలేదు. చంద్రబాబు వెళ్లి పరామర్శ చేస్తే రైటు, చెవిరెడ్డి వెళితే తప్పా అన్నదానికి బదులు దొరకదు. అప్పట్లో చంద్రబాబు పై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కేసు పెట్టలేదు. మహిళా కమిషన్ చంద్రబాబుకు నోటీసు పంపించినా, ఆయన పట్టించుకోలేదు. చెవిరెడ్డి విషయంలో మాత్రం తప్పుడు ఫిర్యాదు తీసుకుని మరీ దారుణమైన చట్టాన్ని ప్రయోగించారు. పోక్సో కేసు అంటే మైనర్లపై అత్యాచారం వంటి నేరాలకు పాల్పడ్డ వారి మీద పెట్టే కేసు అన్నమాట. చెవిరెడ్డిపై అలాంటి కేసు పెట్టడం పోలీసులు ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెబుతోంది. ప్రమఖ దర్శకుడు వర్మపై టీడీపీ వారితో సోషల్ మీడియా కేసులు పెట్టించి, ఆయనను అరెస్టు చేయడానికి జరిగిన ప్రయత్నాలు శోచనీయం. ఆయన ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు.ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించారు. తాను ఎప్పుడో పెట్టిన పోస్టింగ్‌లకు తాను ఎవరిపైన కార్టూన్లు పోస్టు చేశానో వారికి కాకుండా ఇంతకాలం తర్వాత ఎవరివో మనో భావాలు దెబ్బతినడం ఏమిటని ఆయన అడిగారు. తొమ్మిది మందికి ఏడాది తర్వాత ఒకేసారి మనోభావాలు దెబ్బ తిన్నాయా అని అన్నారు. తాను పారిపోయినట్లు ఎల్లో మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని, తన ఆఫీస్‌లోకి పోలీసులు రాకుండానే వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ఇలాంటి పోస్టింగులు లక్షల కొద్ది వస్తున్నాయని, వాటి సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. చట్టంలో దీనికి సంబంధించి ఉన్న అంశాలకు, తనపై పెట్టిన సెక్షన్లలకు లింకు కనిపించడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏ ఏ సందర్భాలలో సోషల్ మీడియా కేసులు పెట్టవచ్చో కూడా వివరించారు. ఆయన వేసిన ప్రశ్నలకు పోలీసుల నుంచి జవాబు వచ్చినట్లు లేదు. నిజానికి వర్మ తరహాలో అనేక మంది పోస్టులు పెడుతుంటారు. ఆ మాటకు వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఈనాడు వంటి ఎల్లో మీడియా ఎంత నీచమైన కార్టూన్లు వేసిందో గుర్తు చేసుకుంటేనే భయానకంగా ఉంటుందని, వాటిపై ఎన్నడూ కేసులు పెట్టకపోవడం తప్పు అయినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు ఎన్.టి.రామారావుకు దుస్తులు లేకుండా వేసిన కార్టూన్లను వారు ప్రస్తావిస్తున్నారు. ఎవరైనా బూతులు పెడితే చర్య తీసుకోవచ్చు. అలాగే కుల, మతాల మధ్య విద్వేషాలు నింపేలా వ్యవహరిస్తే కేసు పెట్టవచ్చు. విచిత్రం ఏమిటంటే రోజుల తరబడి ఎల్లో మీడియా టివి ఛానళ్లలో కూర్చుని కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తిపై అప్పటి ప్రభుత్వం కేసు పెడితే దానిని వేరే విధంగా డైవర్ట్ చేశారు. పైగా ఆయనకు మంచి పదవిని కూడా చంద్రబాబు ఇచ్చారు. తాజాగా ఐటీడీపీకి చెందిన విజయ్ సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబుపై పెట్టిన పోస్టింగ్ మాటేమిటి? కృష్ణబాబుకు ఏ ప్రభుత్వం ఉన్నా మంచి పేరు ఉంది.ఇప్పటికి ప్రధాన శాఖలలోనే పని చేస్తున్నారు. కానీ ఆయనపై నిందలు మోపుతూ, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని, పులివెందులకు చెందిన ఒక కంపెనీకి బిల్లులు చెల్లించారని ఆరోపిస్తూ పోస్టు పెట్టారు. దీనిపై కృష్ణబాబు ఆవేదన చెందిన ముఖ్యమంత్రికి పిర్యాదు చేశారట. అసలు తాను కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరికి బిల్లులు చెల్లించ లేదని ఆయన చెబుతున్నారు. అయినా చట్టప్రకారం బిల్లులు ఒక అధికారి చెల్లిస్తే అది ఎలా తప్పు అవుతుంది? విజయ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు. అయ్యన్న కూడా విపక్షంలో ఉండగా, ఆ తర్వాత కూడా కొందరు అధికారులను తూలనాడుతూ మాట్లాడిన వీడియోలు వచ్చాయి. ఆయన మహిళ అధికారులను కూడా దూషించినట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలు కొందరిపై అనేక కేసులు పెట్టి ఊరూరా తిప్పుతూ దారుణంగా వేధిస్తున్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదలివేసిన చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇదే అనుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఈవీఎంలపై మరిన్ని అనుమానపు మబ్బులు!
దేశ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)పై మరోసారి గట్టిగా గొంతెత్తింది. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ఈవీఎంలపై సందేహాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయని, వాటిని తీసేసి అహ్మదాబాద్ గోడౌన్లో పెట్టాలని విమర్శించారు. బీజేపీ ఈవీఎంల సాయంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.ఇటీవలి కాలంలో ఈవీఎంలపై ఆరోపణలు పెరిగిపోతున్న మాటైతే నిజం. వాటి పనితీరు, ట్యాంపరింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాలు ఈవీఎంలను నియంత్రించవచ్చునని అంటున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖండించాల్సిన, సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం ఆ పని సమర్థంగా చేయలేకపోతోంది. దీంతో అందరి అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.ఆంధ్రప్రదేశ్, ఒడిశాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వచ్చాయి. ఆ తర్వాత హర్యానా, తాజాగా మహారాష్ట్రలోనూ ఈవీఎమ్‌లతో ఏదో మోసం జరిగిందన్న అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేశాయి. ఇందుకు పలు ఆధారాలను చూపుతున్నా ఎన్నికల కమిషన్ మాత్రం కిమ్మనడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా నిర్దిష్ట సమాధానాలు ఇవ్వకుండా దబాయింపునకే పరిమితం అవుతోంది.అభ్యర్థులు కోరితే వీవీప్యాట్ స్లిప్‌లలో ఐదు శాతం ఈవీఎంలతో సరిపోల్చాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చినా ఎన్నికల సంఘం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరి అంచనాలను తారుమారు చేస్తూ వైఎస్సార్సీపీకి కేవలం11 స్థానాలే దక్కడం కూడా ఈవీఎంలపై అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పించాయి. ఒంగోలు, విజయనగరం వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీవీప్యాట్ స్లిప్‌లను, ఈవీఎంలలోని సమాచారంతో సరిపోల్చి చూడాలని ఫీజులు చెల్లించి మరీ ఎన్నికల సంఘాన్ని కోరినా ఎన్నికల సంఘం దాటవేయడం ఇంకో అనుమానాస్పద చర్య. పైగా ఏపీలో అప్పటి ఎన్నికల ముఖ్య అధికారి పోలింగ్ అయిన పది రోజులకే వీవీపాట్ స్లిప్‌లను దగ్ధం చేయాలని ఆదేశాలు పంపడం వాటిని మరింత పెంచింది. ఆశ్చర్యకరంగా కొన్ని బూత్ లలో వైఎస్సార్సీపీకి ఒక్క ఓటే నమోదైంది.హిందుపూర్లోని ఒక వార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఇంట్లోనే ఏడు ఓట్లు ఉంటే, సంబంధిత బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఒక్క ఓటు వైఎస్సార్సీపీకి నమదైంది. ఇదే బూత్‌లో వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థికి మాత్రం 475 ఓట్లు రావడం విశేషం. క్రాస్ ఓటింగ్ జరిగినా అది ఈ స్థాయిలో ఉండటం అసాధ్యం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్, కౌంటింగ్ల మధ్యలో సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా నమోదై ఉండటం, ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో తేడాలు ఉండటం మనం ఇప్పటికే చూశాం. పోలింగ్ నాడు ఏబై శాతం మాత్రమే ఉన్న బాటరీ ఛార్జింగ్, కౌంటింగ్ నాటికి 90 శాతానికి చేరడం పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.మాజీ మంత్రి రోజా వైఎస్సార్సీపీకి అత్యధిక బలం ఉన్న వడమాల పేట మండలంలో టీడీపీకి మెజార్టీ రావడంపై సంశయాలు వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండు, మూడువేల ఓట్ల ఆధిక్యతతోనే గెలుపొందగా, ఆయన కుమారుడు టీడీపీ పక్షాన పోటీచేయగా ఏకంగా నలభైవేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇంతటి ఆధిక్యత టీడీపీకి రావడం ఎలా సాధ్యమైందని రోజా ప్రశ్నిస్తున్నారు. ఏదో మతలబు ఉందన్నది ఆమె అనుమానం. వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని కోరిన అప్పటి ఒంగోలు వైఎస్సార్సీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత కాలంలో జనసేన పార్టీలో చేరి దీని గురించి మాట్లాడకపోవడం కూడా గమనించాల్సిన అంశమే. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభ ఎన్నికలలో మోసం జరిగిందని అభిప్రాయపడ్డారు.ఆ తర్వాత ఆయన ఈవీఎంల ద్వారా కాకుండా బాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగడం మంచిదని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు ఆయన ఒక సందేశం ఇస్తూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిజాయితీగా జరగడమే కాకుండా.. అలా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కూడా కలిగించాలని అన్నారు.అంతేకాదు.. ఒకప్పుడు ఈవీఎంలపై పలు విమర్వలు చేయడమే కాకుండా.. బ్యాలెట్ల పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని జాతీయ స్థాయిలో డిమాండ్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఈ ఆరోపణలపై స్పందించక పోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా దీనిపై తగిర రీతిలో స్పందించినట్లు కనిపించడం లేదు.ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో ఏభై సీట్లు గెలుచుకున్న బీజేపీ అదేరోజు జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు గెలవకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీ, ఒడిశాల తర్వాత హర్యానా ఎన్నికలలో కూడా దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి. ఫలితాల ట్రెండ్ కూడా తొలుత దానికి అనుగుణంగానే కనిపించింది. కానీ ఆ తర్వాత వాతావరణం మొత్తం బీజేపీకి అనుకూలంగా మారింది. ఇదంతా ఈవీఎమ్‌ల మహిమే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అక్కడ వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించాలని కోరినా, ఎన్నికల సంఘం స్పందించినట్లు లేదు. తాజాగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి అనూహ్యమైన రీతిలో విజయం సాధించడంతో ఈవీఎంల టాంపరింగ్ పై కాంగ్రెస్ తో సహా వివిధ పక్షాలు ఆరోపణలు చేశాయి. అక్కడ కూడా పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య లక్షల ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక నియోజకవర్గంలో 1170 ఓట్లు అధికంగా నమోదు అయ్యాయని తేలిందట. అక్కడ బీజేపీ అభ్యర్ది సుమారు 1100 ఓట్లతో గెలిచారట. నాందేడ్‌లో కూడా ఓట్ల శాతంలో మార్పులు కనిపించాయి.అక్కడ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే, ఆరు సెగ్మెంట్ లలో బీజేపీ గెలించింది. ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే శివసేన నేత సంజయ్ రౌత్ ఇదంతా ఈవీఎంల టాంపరింగ్ మహిమే అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి 30 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో దారుణంగా 288 సీట్లకుగాను, ఏభై సీట్లు కూడా సాధించ లేకపోయింది. వీటిని దృష్టిలో ఉంచుకునే మల్లిఖార్జున్ ఖర్గే ఈవీఎంలు వద్దు..బాలెట్ పత్రాలే ముద్దు అని అంటున్నారు. దీని కోసం దేశ వ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమే అయితే.. జమ్ము-కశ్మీర్, జార్ఖండ్‌లలో కాంగ్రెస్ కూటమి ఎలా గెలిచిందన్నది బీజేపీ ప్రశ్నిస్తోంది. సీనియర్ నేత శరద్ పవార్ సమాధానం దీనికి ఇస్తూ పెద్ద రాష్ట్రాలలో ఈవీఎంలను మేనేజ్ చేస్తూ, చిన్న రాష్ట్రాలను వదలి పెడుతున్నారని, అందువల్ల ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ కూడా ఈ అంశంపై దీనిపై ఆసక్తికర విశ్లేషణ చేశారు.మహారాష్ట్ర మ్యాజిక్ ఏమిటీ అని అంటూ, ఎన్నికలు జరిగిన నవంబర్ ఇరవయ్యో తేదీ సాయంత్రం ఐదు గంటలకు పోలైన ఓట్ల శాతం 58.22 గా ఉందని, ఆ తర్వాత రాత్రి 11.30 గంటలకు అది 65.02 శాతంగా తేల్చారని, కాని కౌంటింగ్ కు ముందు ఆ శాతం 66.05 శాతం ఈ రకంగా మొత్తం 7.83 శాతం పెరిగిందని, అదే మహారాష్ట్ర మేజిక్ అని వ్యాఖ్యానించారు. అదే మ్యాజిక్ జార్ఖండ్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు ఆయన. జార్ఖండ్‌లో తొలిదశలో పోలింగ్ సాయంత్రానికి 64.66 శాతం నమోదైతే, రాత్రి 11.30 గంటలకు 66.48 శాతంగా ప్రకటించారు.అంటే తేడా కేవలం 1.79 శాతమేనని, రెండో దశ పోలింగ్ లో సాయంత్రానికి, రాత్రికి ప్రకటించిన ఓట్ల శాతాలలో తేడా 0.86 శాతమేనని, అంటే ఇక్కడ మాజిక్ తక్కువగా జరిగిందని ప్రభాకర్ సెటైర్ గా వ్యాఖ్యానించారు. మహరాష్ట్రలోని కొన్ని గ్రామాలు ఈవీఎంల పలితాలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం మాజీ ముఖ్య కమిషనర్ ఖురేషి కూడా మహారాష్ట్రలో పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓట్ల తేడా 7 శాతంపైగా ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యినికి మంచిది కాదని ఆయన అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో బాలెట్ పత్రాల వైపు ఎన్నికల సంఘం మొగ్గు చూపకపోయినా, లేదా ఈవీఎంలలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని నిరూపించకపోయినా, దేశంలో ఎన్నికలపై నీలి నీడలు అలుముకునే అవకాశం ఉంది. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ చేష్ట.. ఓవరాక్షనా? కక్ష సాధింపా? అనుభవ రాహిత్యమా?
సినిమాల్లో హీరో ఎన్ని విన్యాసాలైనా చేయవచ్చు కానీ.. నిజజీవితంలో మాత్రం అలా చేయడం సాధ్యం కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సినిమా, నిజజీవితాల మధ్య తేడా పెద్దగా తెలిసినట్లు కనిపించడం లేదు. లేదంటే అతడిది ఓవర్‌యాక్షన్ అయినా అయిఉండాలి. కాదంటే అనుభవ రాహిత్యమా? కక్ష సాధింపా? ఈ మాటలన్నీ అనాల్సి వచ్చేందుకు కారణం.. పవన్‌కళ్యాణ్ ఇటీవలి ఢిల్లీ పర్యటన! ఇందులో ఆయన ప్రధాని నరేంద్రమోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. మర్యాదపూర్వకంగానో.. తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించిన వారితోనో కలిస్తే సమస్య లేదు. కానీ రాజకీయ విశ్లేషకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యేలా ఆయన ఎవరెవరినో కలిసివచ్చారు. పవన్ తన ఢిల్లీ పర్యటన ద్వారా తానూ చంద్రబాబు ఒకటేనని చెప్పదలచినట్టుగా కనిపిస్తోంది. ఢిల్లో బాబు కంటే తనమాటకే ఎక్కువ విలువ, పలుకుబడి ఉన్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నమూ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కాకినాడ పోర్టును సందర్శించిన వైనం, అక్కడ ఆయన చేసిన షో కూడా అందులో ఒక భాగం కావచ్చు. బీజేపీ పెద్దలు చేసిన సూచనల మేరకే పవన్ కళ్యాణ్ తనకు పవర్ ఉందని ప్రజలను నమ్మించేందుకు పోర్టు వద్దకు వెళ్లారని, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, తనకంటే సీనియర్ అయిన టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును కూడా కొంత కించపరిచేలా వ్యవహరించారని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఆయన ఏపీలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆయన చెప్పకనే చెప్పేశారు కూడా. ఆ రకంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని గబ్బు పట్టిస్తూనే, మరో వైపు ఆ గబ్బుతో తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ నటిస్తున్నారా అన్న సందేహం వస్తోంది. చంద్రబాబు సమక్షంలో అతి వినయం, అతి విధేయత చూపుతూ, అవసరానికి మించి ఆయనను పొగిడే పవన్ కళ్యాణ్ బయట మాత్రం తానే సూపర్ సీఎం అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారా అన్న సంశయం వస్తోంది. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ప్రభుత్వంలో మొత్తం పెత్తనం చేస్తున్నారని అంతా అనుకుంటున్న సమయంలో తనకు కూడా పవర్ ఉందని చెప్పుకోవడానికి పవన్ తంటాలు పడ్డారా అన్న ప్రశ్న వస్తుది. మరో సంగతి కూడా చెబుతున్నారు. పోర్టు యాజమన్యంపై ఉన్న కక్ష తీర్చుకోవడానికి అక్కడకు వెళ్లి ఉండవచ్చని అంటున్నారు. మరుసటి రోజు పోర్టును నిర్వహిస్తున్న అరబిందో సంస్థపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేయడమే ఇందుకు నిదర్శనం. కాకినాడ పోర్టు వద్ద సుమారు 640 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతోందని జిల్లా కలెక్టర్ గుర్తించి స్వాధీనం చేసుకుంటే, వపన్ కళ్యాణ్ వెళ్లాక మళ్లీ సీజ్ చేసినట్లు చూపే యత్నం చేశారట. జనసేనకే చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడ పవన్ కళ్యాణ్ నటన చూసి బిత్తరపోవడం మినహా ఏమీ చేయలేక పోయారు. నిజానికి పవన్ కన్నా రాజకీయాలలో మనోహర్‌కు చాలా అనుభవం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మనోహర్ 2004లోనే ఎమ్మెల్యే. ఆ తర్వాత ఉప సభాపతిగా, సభాపతిగా బాధ్యతలు నిర్వహించారు. అనూహ్య పరిణామాలలో జనసేనలో చేరారు. ఇప్పుడు మంత్రి అయ్యారు. కానీ పవన్ తీరుతో ఆయన బిక్కచచ్చినట్లు నిలబడిపోయారా అన్న భావన కలుగుతోంది. మనోహర్ ఇప్పటికి పలుమార్లు కాకినాడ వెళ్లి పోర్టు ద్వారా అక్రమంగా ఎగుమతి అయ్యే రేషన్ బియ్యం గురించి పలుమార్లు మాట్లాడారు. అధికారులను అప్రమత్తం చేశారు. ఎంత మంత్రి ఆదేశాలు ఇచ్చినా, ఇలాంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి. వాటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ.పవన్ పౌరసరఫరాల శాఖలో వేలుపెట్టి ఇలా కెలకడం అంటే నాదెండ్లను ఒకరకంగా అవమానించినట్లే అవుతుందేమో! వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై ఉన్న ద్వేషంతో కూడా పవన్ కళ్యాణ్ ఇదంతా చేస్తున్నారని అందరికి తెలుసు. పవన్ ఈగోని సంతృప్తిపరచడానికి మంత్రి మనోహర్ తన వంతు ప్రయత్నం చేశారు.కాని ద్వారంపూడి అసలు బియ్యం ఎగుమతి వ్యాపారం నుంచే తప్పుకోవడంతో వీరికి దొరకడం లేదని అంటారు. ఆ ఫ్రస్టేషన్ లో నేరుగా ఆ విషయం చెప్పలేక పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు అనిపిస్తుంది. కాకినాడ పోర్టులో కొన్ని దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగుతున్నాయి. అక్కడ ఎప్పుడూ తీవ్రమైన నేరాలు జరిగిన ఫిర్యాదులు లేవు. ఆ మాటకు వస్తే విశాఖ ఓడరేవుకు శాసనసభ ఎన్నికలకు ముందు పాతిక వేల క్వింటాళ్ల మేర మాదకద్రవ్యాలు వచ్చాయన్న వార్త పెద్ద కలకలం రేపింది. ఆ కేసును సీబీఐ టేకప్ చేస్తుందని అన్నారు. ఆ కేసు ఏమైందో తెలియదు. దీనిపై పవన్ ఎన్నడూ నోరు విప్పలేదు. అక్కడకు వెళ్లలేదు.ప్రశాంతంగా ఉండే కాకినాడ వెళ్లి రచ్చ చేసి వచ్చారు. తత్ఫలితంగా కాకినాడ పవన్ ఓడరేవు విశ్వసనీయతను దెబ్బతీశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పిచ్చి ఆరోపణలు చేసి ఆ దేవాలయం పవిత్రతను దెబ్బతీశారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి.ఇప్పుడు కాకినాడ ఓడరేవు వంతు వచ్చింది. పవన్.. కాకినాడ పోర్టు స్మగ్లర్ల అడ్డాగా ఉందని, బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా? అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి, ప్రధాని కార్యాలయ దృష్టికి తీసుకెళతానని చెప్పారు ఆయన. కీలకమైన సమాచారం ఏదైనా ఉంటే నేరుగా కేంద్రానికి తెలియచేసి చర్యలు తీసుకోవాలి తప్ప, ఇలా బాధ్యత లేకుండా మాట్లాడడం ఏమిటో? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోర్టుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ దళాలు సముద్రంలో నిరంతరం కాపలా కాస్తుంటాయి. ఈ విషయం పవన్‌కు తెలియదా? బియ్యం లేదా మరో సామగ్రి అక్రమంగా ఎగుమతి అవడం వేరు.. ఏకంగా ఆయుధాలు రావడం, ఉగ్రవాదులు చొరబడడం వేరు. ఈ సంగతులు ఏమీ కేంద్రానికి తెలియవన్నట్లుగా పవన్ మాట్లాడి, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల పరువు తీసినట్లు అనిపిస్తుంది. ఓడరేవులలో కొన్ని అక్రమ కార్యకలాపాలు జరుగుతుండవచ్చు.నిర్దిష్ట సమాచారంతో సంబంధిత నేరగాళ్లను పట్టుకుంటారు. ఉదాహరణకు గుజరాత్ లోని ముంద్రా రేవులో పలుమార్లు డ్రగ్స్ పట్టుబడ్డాయి. కస్టమ్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ మాటకు వస్తే దేశంలోని పలు విమానాశ్రయాలలో కూడా బంగారం, ఇతర వస్తువులు కొన్ని అక్రమంగా దిగుమతి అవుతుంటే అధికారులు పట్టుకుంటుంటారు. అయినా జాగ్రత్తలు చెప్పడం వేరు. మన ప్రతిష్టను మనమే దెబ్బ తీసుకోవడం వేరు. పవన్ చెప్పింది ఎలా ఉందంటే కాకినాడ వద్ద అంతా ఫ్రీ గా ఉనట్లు, రక్షణే లేనట్లు ,ఉగ్రవాదులు ఎవరైనా చొరబడే అవకాశం ఉందన్న సమాచారం ఇచ్చినట్లు ఉంది. ఇలా మాట్లాడడం అంత తెలివైన చర్య కాదని చెప్పాలి. ఆర్డీఎక్స్ వంటివి కూడా దిగుమతి కావచ్చని చెప్పడం అంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వ శాఖల సమర్థతను డైరెక్టుగా అనుమానించడమే.ఎన్నికల ముందు ఏపీలో 31వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ అబద్దపు ఆరోపణ చేసి, ఆ తర్వాత దాని గురించే మాట్లాడకుండా పవన్ తన నిజస్వరూపం తెలియచేశారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారా? లారీల ద్వారా అక్రమ బియ్యం కాకినాడ పోర్టుకు చేరుతున్నదంటే ఏమిటి దాని అర్థం? రాష్ట్రంలోని ఆయా రహదారులలో ఉండే సివిల్ సప్లై చెక్ పోస్టులు లేదా వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులు సరిగా పనిచేయడం లేదనే కదా! అధికారులు నిద్రపోతున్నట్లో, లేక కుమ్మక్కు అయినట్లు చెప్పడమే కదా! కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు బియ్యం స్మగ్లింగ్ జరగబోదని చెప్పినా, ఇలా ఎందుకు జరుగుతోంది.అంటే చంద్రబాబు ప్రభుత్వం, మంత్రి నాదెండ్ల మనోహర్, పోలీసు శాఖ విఫలం అయిందని పవన్ ఒప్పుకున్నట్లేనా? జిల్లా మంత్రిగా ఉన్న ఆయన కూడా విఫలమైనట్లేనా? తను వస్తున్నానని తెలిసి ఎస్పీ సెలవు పెట్టి వెళ్లారని పవన్ అన్నారట. ఆయన ఎందుకు అలా చేశారో తెలుసుకోవాలి. ఏదైనా సొంత పని ఉండి వెళ్లారా? లేక తెలిసి, తెలియక పవన్ మాట్లాడే వాటికి సమాధానం ఇవ్వడం కష్టం అని వెళ్లారో చూడాలి. ఏపీలో సాగుతున్న విధ్వంసకాండ, హత్యలు, అత్యాచారాలపై స్పందించలేని పవన్ కళ్యాణ్, పోర్టులో ఏదో జరిగిపోతుందని మాట్లాడడం విడ్డూరమే. తాడిపత్రి, జమ్మలమడుగు కూటమి నేతలు చేస్తున్న బూడిద దందా గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది కదా! కొద్ది కాలం క్రితం ప్రజలు ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారని, హోం మంత్రి అనిత ఏమి చేస్తున్నారని అడుగుతూ, తానే ఆ శాఖ తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎలా మాట మార్చేసింది చూశాం. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును అధికారుల సమక్షంలోనే మందలించినట్లు మాట్లాడి చిన్నబుచ్చారు. వీటన్నిటి ద్వారా తాను చంద్రబాబు సమానమే అన్నట్లుగా పవన్ ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఆ ధైర్యం ఉంటే మంచిదే. తప్పు లేదు. కానీ ఆ వెంటనే చంద్రబాబు దగ్గకు వెళ్లగానే జారిపోతున్నారు. అది అసలు సమస్య. ప్రభుత్వ వైఫల్యాలతో తనకు నిమిత్తం లేనట్లుగా, సూపర్ సిక్స్ హామీల ఊసే ఎత్తకుండా కథ నడుపుతూ ప్రజలను మభ్య పెట్టడానికి ఇలాంటి వేషాలన్నీ వేస్తే సరిపోతుందా? అక్రమాలు ఎక్కడా జరిగినా నిరోధించాల్సిందే. కానీ పవన్ ఒక్క కాకినాడ పోర్టులోనే అంతా జరిగిపోతున్నట్లు మాట్లాడి రాష్ట్రం పరువును, ముఖ్యంగా కాకినాడ ప్రతిష్టను దెబ్బతీయడం అభ్యంతరకరం.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ తీరుతో మోదీకి మకిలి!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుతోపాటు ఎల్లోమీడియా మొత్తానికి అక్కసు ఉందన్నది జగమెరిగిన సత్యం. అయితే ఈ అక్కసు, ద్వేషాల్లో వారు ప్రధాని మోదీని భ్రష్టుపట్టించేందుకూ వెనుకాడటం లేదు. ఎలాగంటారా? అదానీపై అమెరికా కోర్టు పెట్టిన ముడుపుల కేసే ఉదాహరణ. ఒకపక్క చంద్రబాబేమో ఈ కేసులు ఆంధ్రప్రదేశ్‌కు అప్రతిష్ట తీసకొచ్చాయని వ్యాఖ్యానిస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మోదీని నిందిస్తోంది. ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ కూడా కాంగ్రెస్ మాటలకు వత్తాసు పలుకుతున్నట్లుగా జగన్‌పై ఆరోపణలు గుప్పించడం మోదీని భ్రష్టుపట్టించడమే అవుతుంది. అదానీపై వచ్చిన ఆరోపణలలో నిజమని నమ్మితే చంద్రబాబు కూడా మోదీని నేరుగా తప్పు పట్టాలి కదా! ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పాలి కదా! అలా కాకుండా జగన్‌పై విమర్శలు చేస్తూ మోదీకి చికాకు కలిగించారు. ఈ విషయం కేంద్రంలోని బీజేపీ పెద్దలకు అర్థమవుతోందో లేదో!ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సెకి) చేసుకున్న ఒప్పందానికి సంబంధించి అవినీతి జరిగిందన్నది టీడీపీ, ఎల్లో మీడియా ఆరోపణ. తన సోలార్ పవర్‌కు ఆర్డర్లు పొందడానికి అదానీ ఆయా రాష్ట్రాలలో లంచాలు ఇచ్చారని అమెరికా పోలీసులు పెట్టిన అభియోగాల ఆధారంగా వీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపినట్లు కనిపించలేదు.ప్రముఖ న్యాయ కోవిదులు ముకుల్ రోహ్తగి, మహేష్ జెఠ్మలానీలు ఇదే వ్యాఖ్య చేశారు. అదే టైమ్ లో ఐదు రాష్ట్రాలు సెకీతో ఒప్పందం కుదుర్చుకుని విద్యుత్ తీసుకోవడానికి సిద్ధపడితే, ఆ రాష్ట్రాలలో కూడా ముడుపులు ఇచ్చారని అంటూనే అమెరికా పోలీసులు ఒక్క ఏపీ పేరునే ప్రస్తావించడం అనుమానాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రాలు అసలు అదానీతో ఒప్పందమే చేసుకోలేదు. ఏపీకి సంబంధించిన జగన్ ప్రత్యర్థులు ఎవరైనా అమెరికా పోలీసులను కూడా ప్రభావితం చేశారా అన్న సందేహం వస్తుంది. అదానీ ప్రధాని మోదీకి సన్నిహితుడు కావడంంతో అంతర్జాతీయ సంస్థలు ఏమైనా దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇలాంటి కుట్రలు చేశాయా? అన్న డౌటు కొందరు వ్యక్తం చేస్తున్నారు.జగన్‌పై విమర్శలు చేస్తే అవి మోదీకి, అదానీకి తగులుతాయన్న సంగతి చంద్రబాబు నాయుడు తెలియదా! సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఏమైనా ప్రైవేటు సంస్థా? కాదు కదా! కేంద్రానిది. వారు దానీ కంపెనీ నుంచో, మరో కంపెనీ నుంచో పవర్ కొని ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తే వీరికి వచ్చిన కష్టం ఏమిటి? రాష్ట్రానికి విద్యుత్ యూనిట్ రూ.2.49లకే రావడం మేలా? కాదా? అన్నది చెప్పకుండా జగన్ పై బురద వేయడం వల్ల అది ఆయనపైనే పడుతుందా? ఆటోమాటిక్ గా అదానీతోపాటు, మోదీపై కూడా పడుతుంది కదా! చంద్రబాబు ఉద్దేశం అదే అయినా, లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా భావన అదే అయినా, ధైర్యంగా నేరుగానే ఆ మాట చెప్పి ఉండవచ్చు. జగన్‌తోపాటు వారిద్దరిపై కూడా ధ్వజమెత్తి ఉండవచ్చు.అలా ఎందుకు చేయడం లేదు? ఈ నేపథ్యంలో జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు క్షమాపణ డిమాండ్‌తో రూ.వంద కోట్ల పరువు నష్టం పరిహారం కోరుతూ నోటీసు పంపించారు. అయినా ఈ మీడియా అడ్డగోలు కథనాలు ఆపకపోవడం గమనార్హం. ప్రస్తుతం థేపీలో పెరుగుతున్న విద్యుత్ ఛార్జీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవి ఈ యాగీ చేస్తున్నాయి. తన ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల ఏడాదికి రూ.నాలుగు వేల కోట్ల చొప్పున పాతికేళ్లకు ఏపీకి రూ.లక్ష కోట్లు ఆదా అయిందని, అదంతా సంపదేనని జగన్ అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రూ.ఐదు నుంచి రూ.ఆరులకు సౌర, పవన విద్యుత్తును కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఏపీకి రూ.85 వేల కోట్ల భారం పడిందని జగన్ చెప్పారు.ఈ విషయాలకు ఈనాడు నేరుగా సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు టైమ్ లో చేసిన ఒప్పందాలను ఈ ఒప్పందంతో పోల్చరాదనే పిచ్చి వాదన చేసింది. ఇందులోనే వారి డొల్లతనం బయటపడింది. అంత అధిక ధరలకు చంద్రబాబు ప్రభుత్వం పాతికేళ్లకు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఈనాడు రామోజీరావుకు తెలుసు కదా! అయినా అప్పట్లో ఈనాడు ఎందుకు ఆ ఒప్పందాలను వ్యతిరేకించలేదు.రూ.2.49లకే యూనిట్ విద్యుత్ కొంటేనే రూ.1750 కోట్ల లంచం ఇచ్చే అవకాశం ఉంటే అంతకు రెట్టింపు ధరకు పాతికేళ్లపాటు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉంటే ఇంకెంత ముడుపులకు అవకాశం ఉండి ఉండాలి? పైగా జగన్ ప్రభుత్వం ఆ పీపీఏలను రద్దు చేయాలని తలపెడితే అప్పుడు ఇదే ఎల్లో మీడియా, చంద్రబాబు రద్దు చేయరాదని, పెట్టుబడులు రావంటూ ఎందుకు వాదించారు? దీంట్లో వారి ఇంటరెస్టు ఏమిటి? వారు ప్రచారం చేసినదాని ప్రకారం సెకీతో జగన్ ప్రభుత్వం ఒప్పందం వల్ల లక్ష కోట్ల భారం పడాలి.అది నిజమే అనుకుంటే అది ఎవరు చేస్తున్నట్లు. కేంద్ర ప్రభుత్వమే కదా! అంటే మోదీ ప్రభుత్వ చర్య వల్ల ఏపీకి లక్ష కోట్ల నష్టం వస్తోందని ఎందుకు రాయలేదు! సెకీ అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ ఛార్జీలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ గురించి ఎందుకు ఈనాడు మీడియా సమాధానం ఇవ్వలేకపోయింది. అది నిజమా? కాదా? దానివల్ల ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకు కేంద్రం ఏపీకి విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చిందన్న వాస్తవాన్ని ఎందుకు కప్పిపుచ్చారు. అలాగే గుజరాత్లో రూ.1.99లకే యూనిట్ విద్యుత్ వస్తోందని ఈనాడు ప్రచారం చేసింది.ఇక్కడ మాత్రం అతి తెలివిగా అక్కడ నుంచి ఏపీకి తరలించడానికి అయ్యే వీలింగ్ ఛార్జీల ఖర్చు మరో రెండు రూపాయల గురించి మాత్రం కప్పిపుచ్చింది. ఇది వీళ్ల దిక్కుమాలిన జర్నలిజం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారనో, లేక తానే కనిపెట్టినట్లో ఏడు గంటలలోనే సెకీతో ఒప్పందం చేసుకున్నారని ఈనాడు పచ్చి అబద్దం ప్రచారం చేసినట్లు జగన్ డాక్యుమెంట్ల సహితంగా వివరిస్తే, దాని మీద తేలుకట్టిన దొంగ మాదిరి వ్యవహరించింది. తమిళనాడు, ఒడిషా, చత్తీస్గడ్, జమ్ము-కశ్మీర్ రాష్ట్రాలు సెకి నుంచి రూ.2.61లకు కొనుగోలు చేస్తే, దానిని ఎందుకు ఈ మీడియా చెప్పడం లేదు! పోనీ సెకితో కాకుండా అదానితో జగన్ ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకుందని చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని ఆధారాలతో చూపించాయా? తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ.2800 కోట్ల ప్రోత్సహానికి గండి పడుతుందట. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చెప్పారని ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. అంటే ఈ ఒప్పందం మంచిది అనే కదా!తమ చేతిలో మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు రాసేసి బురద చల్లితే సరిపోతుందని అనుకుంటే సరిపోదు. వీరు జగన్ మీద బురద చల్లామని అనుకుంటున్నారు కాని, అది పడుతోంది మోదీపైన.ఎల్లో మీడియా కాని, టీడీపీ నేతలు పార్టీ ఆపీస్లో కూర్చుని ఎలాంటి వికృత ప్రచారం చేశారు! అమెరికా కేసులో జగన్ పేరు ఉన్నట్లు, ఆ పోలీసులు ఇండియాకు వచ్చి అరెస్టు చేసేస్తున్నట్లు, చివరికి అక్కడ జైలు కూడా రెడీ చేసినట్లు ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు. ఇలా చేసినందుకు వారు సిగ్గు పడడం లేదు.అందులో ఏమాత్రం నిజం ఉన్నా అదానీ ముందుగా జైలుకు వెళతారని కదా? అని టీడీపీ వారు చెప్పాల్సింది.విచిత్రం ఏమిటంటే ఏపీ బీజేపీ నేతలు కొందరు చంద్రబాబుకే ప్రధాన్యత ఇస్తూ, మోదీపై బురద వేస్తున్నా కనీసం ఖండించ లేదు. గతంలో జగన్ పై సీబీఐ అక్రమ కేసులు పెట్టినట్లుగానే ఇప్పుడు అమెరికాలో కూడా పోలీసులు పిచ్చి అభియోగాలు మోపారా అన్న సందేహాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో సిమెంట్ కంపెనీకి నీరు ఇస్తే అది క్విడ్ ప్రోకో అని, పరిశ్రమకు భూమి ఇస్తే, అందులో నేరం ఉందని.. ఇలా జగన్ పై తప్పుడు కేసులు పెట్టారు.ఆ కేసుల వల్ల ఎపికి తీరని నష్టం జరిగింది. కొత్త పరిశ్రమలు రాకుండా పోయాయి.సోనియా గాంధీ, చంద్రబాబులతో పాటు అప్పటి సీబీఐ అధికారులు దీనికి కారణం అని భావిస్తారు. ఇప్పుడు కూడా సెకీ ఒప్పందంపై అనవసర వివాదం సృష్టించి దేశానికి, అందులోను ఏపీకి నష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒప్పందాన్ని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీపై కేసు పెట్టే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వం చేయవచ్చు కదా!అలా ఎందుకు చేయడం లేదు. పరోక్షంగా మోదీని గబ్బు పట్టిస్తూ, ఇంకో వైపు ఆ అగ్రిమెంట్ ను ఎందుకు కొనసాగిస్తున్నారన్న దానికి సమాధానం దొరకదు. ఈనాడు అధినేత దివంగత రామోజీకి పద్మ విభూషణ్ బిరుదు ఇప్పిస్తే, దానికి రిటర్న్ గిఫ్ట్ గా ప్రధాని మోదీకి ఆయన కుమారుడు కిరణ్ బురద రాస్తున్నట్లు అనిపిస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నేతదేమో రెడ్‌బుక్.. ఎమ్మెల్యేలదేమో సొంత రాజ్యాంగం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ఏమన్నారు? ‘‘ప్రజలు గమనిస్తున్నారు.. జాగ్రత్త’’ అని! ప్రజలు మాత్రం కూటమి ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న అరాచకాలతోపాటు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని చంద్రబాబు వైఖరిని కూడా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కఠినమైన చట్టాల కింద తప్పుడు నేరాలు మోపడం మొదలుకొని రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసుల వేధింపులు, కూటమి నేతల జోలికి అస్సలు వెళ్లని వైనం.. అక్రమార్కులకు రక్షణ కల్పిస్తూండటం వంటి వన్నీ ప్రజల దృష్టిని మీరి పోలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా జమ్మలమడుగుల్లో కూటమి నేతలు సృష్టించిన రభస ఇంకో ప్రత్యక్ష నిదర్శనం.వైఎస్ జగన్ పాలనలో చీమ చిటుక్కుమన్నా భూతద్దంలో చూపిస్తూ అభూత కల్పనలు ప్రచారం చేసిన ఎల్లో మీడియా, కూటమి నేతల ఆగడాల విషయానికి వచ్చేసరికి.. వీలైనంత కప్పిపెట్టేందుకే ప్రయత్నిస్తోంది. అక్కడితో ఆగకుండా చంద్రబాబు పేరు వాడుకుంటూ ఆయన ఆగ్రహం చెందారన్న లీకులిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇవి. రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడే ఫ్లైయాష్ రవాణాకు సంబంధించి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తండ్రి, మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకరరెడ్డిల మధ్య వివాదం ఏర్పడింది.సిమెంట్ కంపెనీలు వాడే ఆ బూడిదను రవాణా చేసే వ్యాపారం ఎవరిదన్న అంశంపై గొడవ. ప్లాంట్‌లో రోజూ ఉత్పత్తి అయ్యే నాలుగువేల టన్నుల ఫ్లైయాష్ రవాణా తమకే ఉండాలని ఇద్దరు నాయకులు బహిరంగంగానే బాహాబాహీకి దిగాయి. ఆదినారాయణరెడ్డి వర్గం తమ వాహనాలను అడ్డుకుంటోందని, దాన్ని సహించేది లేదని జేసీ ప్రభాకరరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై కడప ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. అవసరమైతే తానే రంగంలో దిగుతానని కూడా ఆయన బెదిరించారు. మరోవైపు థర్మల్ ప్లాంట్ తమ నియోజకవర్గంలో ఉన్నందున ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నలలోనే జరగాలని, ఆ వ్యాపారం తనవారికే దక్కాలన్నది ఆదినారాయణ రెడ్డి పట్టుదల.ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావడంంతోనే ఈ వివాదం మొదలైంది. ఇందులో పవర్ ప్లాంట్ అధికారుల పాత్ర ఏమిటో తెలియదు. ఇద్దరు నేతల మధ్య సతమతమవుతున్నారు. ఇరువర్గాలను బుజ్జగించడానికి పోలీసు అధికారులు కూడా నానా తంటాలూ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీకు వార్తలు ఎల్లోమీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ నేతలకు చంద్రబాబు అంటే నిజంగానే భయం ఉంటే.. బహిరంగంగా రచ్చ చేస్తారా? అన్నది అసలు ప్రశ్న.నిజానికి దౌర్జన్యం చేసేవారు ఎవరైనా సరే.. వారిపై పోలీసులు కేసులు పెట్టాలి. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలి. కానీ.. కేవలం నిషేధాజ్ఞలు విధించి.. పోలీసు బలగాలను మోహరించి.. ఇరువురు నేతలు ఎప్పుడు రాజీపడతారా? అన్నట్టుగా పోలీసులు ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. గొడవలకు కారణమైన వారిపై మాత్రం కేసులు పెట్టడం లేదు. ఫ్లైయాష్ రవాణా వ్యాపారాన్ని చెరిసగం పంచుకోవాలని కొందరు సూచిస్తున్నట్లు సమాచారం.శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఒకపక్క సుద్దులు చెబుతూ ఇంకోపక్క వర్గపోరుకు దిగుతున్న నేతలపై కేసులూ పెట్టకపోవడం కూటమి ప్రభుత్వపు ద్వంద్వవైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఫ్లైయాష్ రవాణాలో కోట్ల రూపాయల సంపాదన కోసమే నేతలు దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. కూటమి ప్రభుత్వం పోలీసులను కేవలం ప్రతిపక్షాలను అణచివేసేందుకు మినహా ఇలాంటి ముఠాల నియంత్రణకు మాత్రం ఉపయోగించడం లేదు. గతంలో ఇదే జమ్మలమడుగు ప్రాంతంలో మరో గొడవ జరిగింది. అదానీ కంపెనీ ఇక్కడ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ నిర్మిస్తోంది.ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకుంది. అయితే తమకు వాటా ఇవ్వలేదన్న కోపంతో ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందిన వారు అదానీ సంస్థ సిబ్బందిపై దాడికి దిగారు. సి.ఎం. రమేశ్ వర్గం దీనిపై ఈనాడు మీడియాలో ఒక వార్త రాయించింది. దీన్నిబట్టే అక్కడ పరిస్థితులు ఏమిటన్నది అర్థమవుతాయి. ఇద్దరూ బీజేపీ వారే అయినా.. ఎవరి గ్రూపు వారిదే అన్నమాట. తాజాగా ఆదినారాయణ వర్గం జేసీ ప్రభాకరరెడ్డి తో గొడవకు దిగింది.ఈ నేపథ్యంలో తాను అదానీలా ఊరుకోబనని హెచ్చరించడం ఎస్పీకి రాసిన లేఖలోనూ లోడింగ్‌కు పంపుతున్న తన లారీలను అడ్డుకోండి చూద్దామంటూ సవాలు కూడా విసిరారు. ఎస్పీకే ధైర్యంగా తాను హింసకు దిగుతానని పరోక్షంగా హెచ్చరించారంటే జేసీ ఎంతకు తెగించారో... చంద్రబాబుపై వీరికి ఎంతమాత్రం భయం ఉందో అర్థం కావడం లేదా? ఈ ఘటనలో ఎస్పీ ఏమైనా ఇరు వర్గాలను పిలిచి చర్చించడం కానీ.. శాంతి భద్రతల పరిరక్షణ కసం వార్నింగ్ ఇవ్వడం కానీ చేయకపోవడం ఇంకో విశేషం. పైగా వీరి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు సాగాయి.ఈ పద్దతి అనుసరించడం చంద్రబాబుకు కొత్తకాదు.గతంలో జమ్మలమడుగు లో ఆదినారాయణ రెడ్డి వర్గం, ఆయన ప్రత్యర్ధి వర్గం కాంట్రాక్టు పనులను ఎలా పంచుకోవాలో చెబుతూ ఆనాటి జిల్లా కలెక్టర్‌తోనే పంచాయితీ చేయించిన చరిత్ర ఉంది. ఆది నారాయణ రెడ్డి, జేసీల మధ్య ప్రస్తుతానికి రాజీ కుదరకపోవడంతో ప్రభాకరరెడ్డికి చెందిన ఆరు లారీలను పోలీసులు అడ్డుకున్నారట. జేసీ స్వయంగా అక్కడకు రాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారట. ఇలా ఉంది ఏపీలో పోలీసుల దయనీయ పరిస్థతి.చట్టం ప్రకారం అయితే ఏమి చేయాలో పోలీసులకు తెలియదా! ఇప్పుడు జేసీ లారీలను అనుమతించాలంటే, ఎల్.అండ్ టి సిమెంట్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ సరఫరాకు సంబంధించిన బకాయిలతో పాటు, యాభై శాతం వాటా ఇవ్వాలని ఆది వర్గం డిమాండ్ చేస్తోందట. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ తాడిపత్రిలో ఉంది. అక్కడ పెత్తనం అంతా జేసీదే. కావడంతో ఆది వర్గం మండిపడుతోంది. ఆది నారాయణరెడ్డి వర్గీయులు జమ్మలమడుగులో జేసీ వర్గీయుల వాహనాలను అడ్డుకుంటే, తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి వర్గం లారీలను తిరగనివ్వబోమని చెబుతున్నారు. ఈ రకంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు సామంత రాజులుగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నాయి.2014-19 టరమ్ లో వైఎస్సార్సీపీ పక్షాన ఎన్నికై, ఆ తర్వాత టీడీపీలో చేరి కొంతకాలం మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి 2019లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. ఈసారి ఆ పార్టీ పక్షాన పోటీచేసి గెలుపొందారు. ఈ కారణంగానే ఆది నారాయణ రెడ్డిని పిరికివాడని కూడా జేసీ ధ్వజమెత్తారు. ఓడిపోగానే టీడీపీ నుంచి బీజేపీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. అలాగే ఒకప్పుడు వీర కాంగ్రెస్ నేతలుగా ఉన్న జేసీ సోదరులు తదనంతర పరిణామాలలో టీడీపీలో చేరారు. జేసీ ప్రభాకరరెడ్డి 2014లో తాడిపత్రి నుంచి టీడీపీ పక్షాన విజయం సాధించారు. 2019లో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలలో ప్రభాకరరెడ్డి గెలిచి మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. 2024లో అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అస్మిత్ రెడ్డి పేరుకే ఎమ్మెల్యే. రాజకీయం, పెత్తనం మొత్తం ప్రభాకరరెడ్డిదే. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిలోకి రానివ్వకుండా పోలీసులను ప్రయోగించగలుగుతున్నారు. ఇసుక గొడవలో అస్మిత్ రెడ్డి ఒక పోలీసు అధికారిని దూషించిన ఘటన కలకలం రేపింది. తాడిపత్రిలో మద్యం షాపులు పొందినవారు కచ్చితంగా తమకు ఇరవై శాతం కమిషన్ చెల్లించాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకాలకు పాల్పడుతుంటే, జమ్మలమడుగు, తాడిపత్రిలలో మాత్రం ఆది, జేసీలు సొంత రాజ్యాంగం అమలు చేస్తామని ప్రజలను భయపెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత సమర్థంగా.. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఒట్టేసి ఒకమాట.. ఒట్టేయకుండా ఇంకో మాట!
2019 - 2024 మధ్యకాలంలో అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఉద్యోగాలే లేవని, పరిశ్రమలూ స్థాపించలేదని, ఉపాధి కోసం వలస వెళ్లిన వారూ ఎక్కువంటూ నిన్నమొన్నటివరకూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు చేసిన విమర్శలు ఇవే కదా? కానీ ఇవే పార్టీలకూటమితో ఈ ఏడాది ఏర్పడ్డ ప్రభుత్వం ఏపీ శాసన సభకు ఇచ్చిన సమాధానం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఎందుకిలా?రాష్ట్రంలో కేవలం నాలుగు లక్షల మంది నిరుద్యోగులు మాత్రమే ఉన్నారని, నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని కూడా కూటమి ప్రభుత్వం ఈ మధ్యే లిఖితపూర్వకంగా అసెంబ్లీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నట్లు ఓ వార్తా కథనం వచ్చింది! అంటే.. గత ఐదేళ్లలో నిరుద్యోగం గణనీయంగా తగ్గిందనేగా అర్థం. అంటే.. కూటమి పార్టీలు ఇంతకాలం చేసిన ప్రచారం అసత్యమనేగా? ఇదే విషయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు అంగీకరిస్తారా? అసలు అంగీకరించరు. వెంటనే మాట మార్చేస్తారు.ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీని నిరుద్యోగం విషయంలో నిత్యం విమర్శించేవన్నది కొత్త విషయం కాదు. పైగా తాము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు రూ.మూడు వేల భృతి ఇస్తామని కూడా కూటమి నేతలు తమ సూపర్ సిక్స్ ఎన్నికల వాగ్ధానంలో భాగంగా చెప్పారు కూడా. అప్పుడలా అన్నారు... ఇప్పుడెందుకు ఇలా నిరుద్యోగులు నాలుగు లక్షల మందే ఉన్నారు.. భృతి గట్రా ఏమీ లేదంటున్నారు? అని అడిగామనుకోండి.. వెంటనే మీపై ఏదో ఒక కేసు పడే అవకాశం ఉంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగం పరిస్థితి ఏమిటా? అని విచారిస్తే.. కొత్త ఉద్యోగాల మాటెలా ఉన్నా.. ఉన్నవి మాత్రం లక్షల్లో ఊడుతున్నాయి అని తెలుస్తోంది. అయినాసరే.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దబాయించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మందే నిరుద్యోగులున్నారని ప్రభుత్వం ఏ ఆధారంతో సమాధానమిచ్చిందో కానీ అది ఒకరకంగా జగన్ ప్రభుత్వానికి కితాబు ఇచ్చినట్లు అవుతుంది. జగన్ ప్రభుత్వం టైమ్ లో పరిశ్రమలే లేవని, డీఎస్సీ వేయలేదని, ఉద్యోగాలే రాలేదని, వలసలు అధికమని అప్పుడు చెప్పారు. మరి వీటిలో ఏది నమ్మాలి? అన్న సందేహం వచ్చినా తీరదు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే జగన్ ప్రభుత్వం బాగా పనిచేసిందన్న భావన కలుగుతుంది.జగన్ టైమ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు అనేక రూపాలుగా వచ్చాయి. ఒక్క ఆరోగ్య శాఖలోనే సుమారు ఏభై వేల ఉద్యోగాలు కల్పించారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ప్రైవేటు రంగంలో పలు పరిశ్రమలు తేవడం ద్వారా, చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీల బకాయిలు చెల్లించడం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించగలిగారు. చంద్రబాబు టైమ్‌లో 2014-2019 మధ్య ఆయా రంగాలలో ఎనిమిది లక్షల మంది ఉపాధి పొందితే, 2019-2024 మధ్య 32 లక్షల మందికి ఉపాధ కల్పించగలిగారని లెక్కలు చెబుతున్నాయి. ఒకేసారి గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల ద్వారా సుమారు లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా జగన్ ఒక రికార్డు సృష్టించారు. వీరు కాకుండా వలంటీర్ల రూపంలో రెండున్నర లక్షల మందికి అవకాశం కల్పించారు. వారికి నెలకు రూ.ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించడంతో ఆ షాపులలో 15 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. టీచర్ల ఉద్యోగాలకు డీఎస్సీ ప్రకటించినా, ఎన్నికల కోడ్ రావడంతో అది పూర్తి కాలేదు.ఇన్ని జరిగినా, రాష్ట్రంలో అసలు ఏమీ జరగనట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వారికి తోడుగా పచ్చి అబద్దాలను జనంపై రుద్దాయి. ఇప్పుడు మాత్రం ఏపీలో నాలుగు లక్షల మందే నిరుద్యోగులు ఉన్నారని లెక్కలు చెబుతున్నారట. ఇది కేవలం నిరుద్యోగ భృతి ఎగవేత కోసమే అన్న అనుమానం వస్తోంది. కూటమి ప్రకటనల ప్రకారం కనీసం ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటికే ఉన్నారు. వారికి భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కాని దానికి ప్రస్తుతానికి మంగళం పలికారు. ఇది నిరుద్యోగులను మోసం చేసినట్లే కదా అన్నది వైఎస్సార్సీపీ విమర్శ.కూటమి ప్రభుత్వం రాగానే, ఉన్న వలంటీర్ల ఉద్యోగాలు ఊడాయి. జూన్ నుంచి వారికి గౌరవ వేతనాలూ ఇవ్వలేదు. అదేమిటి అని అడిగితే అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని మంత్రులు నిస్సిగ్గుగా ప్రశ్నిస్తున్నారు. గత ఉగాది నాడు చంద్రబాబు స్వయంగా వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా వారికి నెలకు రూ.పది వేల చొప్పున ఇస్తామని పూజలు చేసి మరీ చెప్పారు. అది నిజం కాదా! ఆ విషయాన్ని చంద్రబాబు ఇప్పుడు ప్రస్తావిస్తే ఒట్టు. పవన్ కళ్యాణ్ కూడా తాము వలంటీర్ల కడుపు కొట్టబోమని, ప్రచారం చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు పాలకొల్లులో ప్రతి ఇంటికి వెళ్లి వలంటీర్‌కూ పారితోషికం పెంపు ఖాయమని, వైఎస్సార్సీపీని నమ్మవద్దని, అధికారం రాగానే తాము పెంచి తీరతామని, అప్పుడు తనకు స్వీట్ బాక్స్ లు తెచ్చి ఇవ్వాలని వలంటీర్లను కోరారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. వీరందరికి మంచి, మంచి పదవులు వచ్చాయి. నిమ్మల కూడా మంత్రి అయ్యారు. స్వీట్ బాక్స్ లు కూడా కొదవలేకుండానే వచ్చాయి. ఇక వలంటీర్ల స్వీట్ బాక్స్ లతో వీరికి పనేముంది. వలంటీర్లకు ఉన్న ఉద్యోగాలను ఊడపీకేశారు. వారి జీవితాలు చేదుగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా చోట్ల వలంటీర్లు నిరసనలు చెబుతున్నారు. ప్రభుత్వ మద్యం షాపులు ఎత్తేయడంతో 15 వేల మంది రోడ్డున పడ్డారు.జనవరికల్లా టీచర్ల నియామకాలు చేస్తారని అనుకుంటే అది వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మరో వైపు పుండు మీద కారం చల్లినట్లు జగన్ ప్రభుత్వం బటన్ నొక్కిన డబ్బులతో జనం మందు, గంజాయికి అలవాటు పడ్డారని స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. మహిళలను కూడా అవమానించడానికి వీరు వెనుకాడలేదు. దీనిని బట్టి కూటమి నేతల వైఖరి ఏమిటో అర్థం అవుతుంది. జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల కన్నా...మూడు రెట్లు అధికంగా అమలు చేసి డబ్బులు పంచుతామని ఎన్నికల ముందు చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే వారి అసలు స్వరూపం ఇదన్నమాట అని ప్రజలు విస్తుపోతున్నారు.ఇక మంత్రి లోకేష్ గత జగన్ పాలనలో అసలు పరిశ్రమలే రానట్లు, పారిశ్రామిక వేత్తలు ఎవరితోనూ మాట్లాడనట్లు వ్యాఖ్యలు చేయడం బాగోలేదు. చిన్న వయసులో వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిజాలు చెప్పవలసిన లోకేష్ ,తండ్రి మాదిరి అబద్దాలు ఆడతారన్న విమర్శలకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారో అర్థం కాదు. లోకేష్ ప్రకటనకు బదులుగా మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్ తమ పాలన టైమ్ లో వచ్చిన పరిశ్రమలకు సంబంధించి పెద్ద జాబితానే చదివారు. అదానీ కంపెనీలు పెద్ద ఎత్తున వస్తుంటే, ఏపీని అదానీకి రాసిచ్చేశారని ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేసింది. ఇప్పుడు అదే అదానీ గ్రూపు పెద్దలు చంద్రబాబును కలిస్తే భారీ పెట్టుబడులు వస్తున్నాయని ఇదే మీడియా చెబుతోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎన్ని మాటలు చెప్పారు? ఇప్పుడు ఏమి చెబుతున్నారు?పైగా లోకేష్ దీని గురించి మాట్లాడకుండా రూ.1.5 లక్షల కోట్లతో అనకాపల్లి వద్ద కొత్త స్టీల్ ప్లాంట్ రాబోతోందంటున్నారు. నిజంగా వస్తే మంచిదే. కాని దానిని నమ్మేదెలా!ఇది జనాన్ని మాయ చేయడానికే అన్న భావన ఏర్పడింది. విశాఖ స్టీల్ లో అనేక మంది ఉద్యోగాలు ఏమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆరు నెలల్లో ఇన్నిలక్షల మంది ఉపాధి కోల్పోవడం కూడా ఒక చరిత్రే అవుతుందేమో! చంద్రబాబు 1995-2004 మద్యలో సంస్కరణల పేరుతో ఏభైకి పైగా కార్పొరేషన్ లను మూసివేశారు. దాని వల్ల వేలాది మంది నిరుద్యోగులు అయ్యారు. ఇప్పుడు అదే తీరులో ఉన్న ఉద్యోగాలు పీకేయడానికి వెనుకాడడం లేదు. ఎన్నికల ముందు కనుక తమ విధానం ఇది అని, వలంటీర్లను తీసివేస్తామని, మద్యం షాపులు ఎత్తివేసి ఆ ఉద్యోగాలను పీకేస్తామని చెప్పి ఉంటే తప్పు లేదు. అలా కాకుండా అడగని వరాలు సైతం ఇస్తామని హోరెత్తించి, ఇప్పుడు విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరు కూటమి ప్రభుత్వానికి మంచిదేనా? ఉగాది పండగ నాడు పవిత్రంగా పూజలు చేసి ఇచ్చిన వాగ్దానానికే దిక్కు లేకపోతే ప్రజలు ఏమని అనుకోవాలి? సనాతన ధర్మం అంటూ ప్రచారం చేసిన వీరికి అసలు నిజంగా మతంపై విశ్వాసం ఉన్నట్లా? లేనట్లా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అదానీ వ్యవహారంలో తెలంగాణలో పోటాపోటీ రాజకీయం!
అదానీ స్కామ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.. ఇంకోపక్క బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు వ్యూహాలు రచిస్తున్నారు. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ప్రకటించిన రూ.వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు రేవంత్ ప్రకటించి తొలి అస్త్రం సంధించగా అదే అదానీతో రేవంత్ కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, హరీశ్‌లు ఆరోపణలకు దిగారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ఉలుకు, పలుకూ లేకుండా ఉండటం. బహుశా మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉన్నట్టుంది బాబు గారి పరిస్థితి!సౌర విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీపై కూడా కాంగ్రెస్ తనదైన శైలిలో విరుచుకుపడింది. అయితే ఈ అంశం తెలంగాణలో రేవంత్‌కు కొంత ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తూంటే.. రేవంత్ మాత్రం కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, రేవంత్‌లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీతో సంబంధాలు, పెట్టుబడులపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు రాహుల్ కొంత తడబడాల్సి వచ్చింది.ఆ తర్వాత ఏమైందో కాని తెలంగాణ సీఎం స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా దావోస్‌లో అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటని, రేవంత్ స్వస్థలం కొడంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ సంగతేమిటి? అని కూడా కేటీఆర్, హరీశ్‌కు ప్రశ్నిస్తున్నారు. అదానీకి తాము గతంలో రెడ్‌లైట్ చూపామని, రేవంత్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేస్తున్నారు.కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై రేవంత్ ప్రభుత్వం కమిషన్లు వేయడం, ఈ-ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్ల దుర్వినియోగం ఆరోపణతోపాటు కొన్ని ఇతర అంశాల విషయంలోనూ కేటీఆర్‌పై కేసులు పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా రేవంత్ బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల హామీల అమలు వైఫల్యంతోపాటు హైడ్రా వ్యవహారాలు, మూసీ నదీగర్భంలో ఇళ్ల కూల్చివేత, లగచర్ల భూసేకరణ వివాదం వంటి అంశాలతో బీఆర్ఎస్ జనాల్లోకి వెళుతోంది. వీటన్నింటి మధ్యలో వచ్చిన అదానీ కేసును కూడా అందిపుచ్చుకునేందుకు ఇరు పక్షాలూ ప్రయత్నిస్తున్నాయి. నిజానికి అదాని విరాళానికి, ఆయనపై వచ్చిన కేసుకు సంబంధం ఉండకూడదు. కానీ.. రాజకీయాలలో పరిస్థితి అలా ఉండదు. అదానీ ప్రధాని మోడీకి సన్నిహితుడని, అతడిని రక్షిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు ఆరోపిస్తున్న విషయం కొన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు, నేతలకూ ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌తో చత్తీస్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. దీన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళనాడులోని డీఎంకే ఆధ్వర్యంలోని కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి. జమ్ము-కశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉండగా ఒప్పందం కుదిరింది. అంటే బీజేపీ ఆధ్వర్యంలోని రాష్ట్రంలలో ఒప్పందం కుదురిందన్నమాట. ఇందులో అవినీతి జరిగి ఉంటే ఆ మకిలీ కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ అంటుకుంటున్నట్లు అవుతుంది కదా! బీజేపీ ఇదే వాదన చేసి కాంగ్రెస్ పై ద్వజమెత్తింది. ఈ క్రమంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇరుకునపడినట్లయింది.ఇదీ చదవండి: కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణతో జరగక పోయినా ఆ ప్రభావం పెట్టుబడులపై పడుతోంది. రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న వార్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై రేవంత్ వివరణ ఇస్తూ తానేదో అప్పనంగా వంద కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడం తనకు ఇష్టం లేదని, స్కిల్ యూనివర్శిటీ వివాదాలలో చిక్కుకోరాదన్న భావనతో అదానీ విరాళాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. అయితే తొలుత రేవంత్ ప్రభుత్వం సంతోషంగానే ఈ మొత్తాన్ని స్వీకరించడానికి సిద్దపడింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనివర్శిటీకి ఉపయోగపడుతుందని భావించింది. కానీ రాజకీయ విమర్శల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు.గతంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం కష్టమన్న భావను రేవంత్ వ్యక్తపరిచారు. వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అదానీతో డేటా సెంటర్ తదితర అగ్రిమెంట్లు చేసుకుందని రేవంత్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై బీఆర్ఎస్ విధానం ఏమిటని ప్రశ్నించారు. నిజమే! ఏ పారిశ్రామిక వేత్త అయినా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానిని స్వీకరించకుండా ఉండడం కష్టమే. ఎందుకంటే రేవంత్ అన్నట్లు పరిశ్రమలు రాకపోతే తేలేదని అంటారు. తీరా ఏవైనా పరిశ్రమలు వస్తే ఆరోపణలు చేస్తుంటారని ఆయన అన్నారు.అనుభవమైంది కనుక రేవంత్ ఈ మాటలు చెబుతున్నారు. అదే తెలంగాణలో కాంగ్రెస్ విపక్షంలో ఉంటే ఆయన కూడా ఇదే తరహా రచ్చ చేసేవారు. అంతెందుకు...గతంలో వైఎస్ జగన్ పై పెట్టిన ఆక్రమ కేసులలో అనేక పరిశ్రమలకు తెలుగుదేశంతో కలిసి కాంగ్రెస్ అడ్డుపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల ఉమ్మడి ఏపీకి చాలా నష్టం జరిగింది. అమెరికాలో అదానీ కేసు తేలకముందే ఇక్కడ రాజకీయ దుమారాన్ని సృష్టించుకుని పెట్టుబడులపై ప్రభావం పడేలా చేస్తారా అన్న చర్చ వస్తుంది.మరో వైపు చంద్రబాబు నాయుడు ఏపీలో జగన్ టైమ్ లో ఏదో ఘోరం జరిగిపోయినట్లు ప్రచారం చేస్తూ, అదే టైమ్‌లో అదానితో మాత్రం స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. జగన్ లేనిపోని ఆరోపణలు చేసే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదిరిన ఒప్పందం గురించి మాట్లాడదు. ఈ ఒప్పందం వల్ల రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోంది. ఈనాడు రాసింది నిజమే అయితే చంద్రబాబు వెంటనే సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి కదా! అదానితో జగన్ ప్రభుత్వం అసలు ఒప్పందమే చేసుకోకపోయినా, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వార్చుతోంది. అదానీ పై తన వైఖరి ఏమిటో చంద్రబాబు చెప్పరు.జగన్ టైమ్ లో సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన సౌర, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను చేపట్టడానికి అదాని ముందుకు వచ్చారు. వాటిని కాదనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అదానిని ఏమైనా అంటే అది మోడీకే తగులుతుందన్న భయంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తెలియడం లేదా? పోనీ జగన్ టైమ్ లో కుదిరిన అగ్రిమెంట్లను వదలివేసి కొత్తగా అదానితో ఎలాంటి ఒప్పందాలు ఉండబోవని చంద్రబాబు ప్రభుత్వం చెప్పగలుగుతుందా? అలాంటిది ఏమీ లేదు. పైగా అదానికి స్వయంగా ఎదురేగి స్వాగతం పలికి అనేక రంగాలతో పాటు అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆ గ్రూపు ముందుకు వచ్చిందని చంద్రబాబు ఆనందంగా ప్రకటించారు. అంటే అదానితో స్నేహం ఉండాలి. కాని జగన్ ను మాత్రం అప్రతిష్టపాలు చేయాలన్నమాట. చంద్రబాబు వ్యూహంలోని డొల్లతనం ఇక్కడే బహిర్గతం అయిపోతోంది. అదానీ, అంబాని వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పెట్టుబడి తెస్తూంటే ఎవరూ వద్దనలేని పరిస్థితి ఉంది. కాకపోతే పారిశ్రామికవేత్తలపై వచ్చే ఆరోపణలను తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మాత్రం వాడుకుంటున్నారు.ఇక్కడ ఒక సంగతి గమనంలోకి తీసుకోవాలి. అంబానీ, అదాని తదితర బడా పారిశ్రామికవేత్తలను కాదని కాంగ్రెస్, బీజేపీలు ఏమీ చేయడానికి సిద్దపడవన్నది వాస్తవం. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అంబానీకి వ్యతిరేకంగా అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం నేపథ్యంలో ఆయన శాఖే మారిపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.ఈనాడు మీడియా ఇన్ని నీతులు వల్లిస్తుంటుంది కదా.. అంబానీకి వ్యతిరేకంగా ఒక్క వార్త ఇవ్వగలుగుతుందా? మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీకి అంబానీ సాయపడ్డారని చెబుతారు. ఇప్పుడు కూడా అంబానీ, అదానీలు బీజేపీకి సన్నిహితులే.కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదానీపై విమర్శలు చేస్తున్నా, అధికారంలోకి వస్తే వారూ ఏమీ చేయరన్నది బహిరంగ రహస్యమే. అంబానీ, అదానీలను కాదంటే దాని ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. రాజకీయ దుమారం వేరు. వాస్తవ పరిస్థితి వేరు. ఇలాంటి పారిశ్రామికవేత్తలు రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. దీనికి రేవంత్ అయినా, చంద్రబాబు అయినా, మరెవరైనా అతీతం కాదన్నది నిజం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరందని చెప్పకతప్పదు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏకపక్షంగా పోలీసులను ప్రయోగిస్తున్న తీరు దారుణం. ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియా స్వేచ్చ గురించి నీతులు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పోలీసులు హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హడావుడి చేయడం చూస్తే ఏపీ పోలీసుల ప్రాధాన్యత క్రమం మారిపోయినట్లు అనిపిస్తుంది. ఒక సినిమా విడుదల సందర్భంగా వర్మ ఎప్పుడో ఏవో ఫోటోలు పెట్టారట. దానిపై ఇప్పుడు ఎవరో ఫిర్యాదు చేశారట. పోలీసులు వాయు వేగంతో వర్మకు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల ముందు హాజరయ్యేందుకు వర్మ కారణాలు చూపుతూ సమయం కోరారు. పైగా అంతేకాక కొత్త చట్టం ప్రకారం వర్చువల్ విచారణకు సిద్దపడ్డారు. వర్మ ప్రత్యక్ష విచారణకు హాజరు కాబోరని కనిపెట్టిన పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలివచ్చారు.వర్మ కొన్నేళ్ల క్రితం తప్పు చేసి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కేవలం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఆయనను ఇబ్బంది పెట్టే లక్ష్యంతో కక్షకట్టి పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయాలతో సంబంధం లేని ఒక సినీ ప్రముఖుడిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది. వర్మ తప్పు చేసి ఉంటే చర్య తీసుకోరాదని ఎవరూ చెప్పరు. కానీ కావాలని దురుద్దేశంతో వ్యవహరిస్తున్న తీరే విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ఇది సినీ పరిశ్రమపై దాడిగా కనిపిస్తుంది. వర్మ ఒకవేళ ఒంగోలుకు వెళ్లి కేసు విచారణకు హాజరై ఉంటే ,అక్కడ నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పేవారో ఊహించుకోవడం కష్టం కాదు. వర్మపై వచ్చిన అభియోగం ఏమిటో చెప్పకుండా పోలీసులు విచారణకు పిలవడం, హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద సీన్ క్రియేట్ చేయడం శోచనీయం.అలాగే మరో నటుడు పోసాని కృష్ణ మురళీ మీద అనేక పోలీస్ స్టేషన్లలో టీడీపీ, జనసేన వారు ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయన ఈ రకమైన వేధింపులకు తట్టుకోలేమని భావించి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా వదలిపెట్టబోమని టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి హెచ్చరిస్తున్నారు.ఏపీలో ఇవన్ని కొత్త ట్రెండ్ లో భాగంగానే కనిపిస్తాయి. నిజంగానే ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయడం ఒక పద్దతి. అలా కాకుండా టీడీపీ నుంచి ఎవరుపడితే వారు ఫిర్యాదులు చేస్తే, వెంటనే టేకప్ చేసి ఆరోపణలకు గురైనవారిని అదుపులోకి తీసుకుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిప్పుతూ, కొన్ని చోట్ల రిమాండ్‌కు పంపుతూ, మరికొన్ని చోట్ల విచారణ చేసి, మళ్లీ వేరే స్టేషన్‌కు తరలించడం, తద్వారా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్న తీరు కచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్దం. ఇంటూరి రవికిరణ్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయనపై ద్వేషంతో ఇప్పటికి పదిహేను కేసులు పెట్టారట. అటు ఉత్తరాంద్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఈ కేసులు పెట్టడంలోనే దురుద్దేశం ఉంది. ఇంటూరి భార్య ఆవేదనతో ఈ విషయాలు చెబుతూ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను సీఎం. ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాపై కేసులు పెడతామని చెప్పిన వెంటనే టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది రంగంలోకి దిగి ఫిర్యాదుల పరంపర సాగిస్తున్న తీరు చూస్తే ఇదంతా కుట్ర అని, ఆర్గనైజ్డ్గా చేస్తున్నారని అర్థమవుతుంది.మాజీ మంత్రి కొడాలి నాని పై మరీ చిత్రంగా ఒక లా విద్యార్ది ఫిర్యాదు చేస్తే రాత్రి 11 గంటల సమయంలో కేసు నమోదు చేశారట. అంత ఆకస్మికంగా కేసు కట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు. నాని మీడియా సమావేశాలలో, అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ తదితరులపై చేసిన వ్యాఖ్యల వల్ల ఆ విద్యార్ది మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేయడం విచిత్రంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి మనో భావాలు అయినా దెబ్బతింటే ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే ఫిర్యాదులు చేయాలి. అలా కాకుండా ఎప్పుడో చేసిన విమర్శలు వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకు ఫిర్యాదు చేయడం ఏమిటో తెలియదు. పవన్ కళ్యాణ్ ఏపీలో 31 వేల మంది మహిళలు మిస్ అయిపోయారని, మహిళల అక్రమ రవాణా జరిగిందని ఆరోపిస్తే మహిళల మనోభావాలు దెబ్బ తినలేదా? లోకేష్ రెడ్‌బుక్ అంటూ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బెదిరిస్తే వారి మనోభావాలు దెబ్బ తినలేదా? జగన్‌ను సైకో అని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడితే వైఎస్సార్సీపీ వారి మనోభావాలు దెబ్బ తినలేదా? అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎంత దారుణంగా మాట్లాడినా, వారిపై ఎవరూ కేసులు పెట్టలేదు.రాజకీయంగానే చూశారు.కానీ ఇప్పుడు వీరు పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు వ్యవహరిస్తున్నారు. కొడాలి నాని ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో, అంతకన్నా ఘాటుగా టీడీపీ నేతలు పలువురు మాట్లాడారు. మరి వారిపై ఎందుకు కేసులు రావడం లేదు?శాసనసభలో జరిగే ప్రసంగాలు, చర్చలు, వాదోపవాదాలపై కోర్టులే జోక్యం చేసుకోవు. అలాంటిది ఏకంగా పోలీసులు ఎలా చర్య తీసుకుంటారంటే, అది ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ స్పెషాలిటీ అని భావించాలి. వైఎస్సార్సీపీ నేతలు పలువురు టీడీపీ సోషల్ మీడియా చేసిన దారుణమైన పోస్టింగ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? మాజీ మంత్రి రోజా మీడియాలో ఈ విషయమై కన్నీరు పెట్టుకున్నారు.అయినా కూటమి ప్రభుత్వం ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించడం లేదు. అలాగే మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుటుంబంపై పెట్టిన అసభ్య పోస్టింగ్‌లకు సంబంధించి ఫిర్యాదు చేస్తూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై పెట్టిన నీచమైన పోస్టింగ్‌ల మాటేమిటని అడిగినా స్పందించే నాథుడు లేకుండా పోయారు. ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేష్ లపై ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోరా? వైఎస్సార్సీపీ వారిపై మాత్రం ఏదో ఒక కేసు పెడతారా? ఏమిటి ఏపీని ఇలా మార్చుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీని పోలీసు రాజ్యంగా చేయడం ద్వారా శాశ్వతంగా ఏలవచ్చని పాలకులు భ్రమ పడుతున్నట్లుగా ఉంది. కానీ చరిత్రలో అది ఎల్లవేళలా సాధ్యపడదని అనేకమార్లు రుజువైంది. టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసం ఇలాంటి టెక్నిక్స్ ను వాడవచ్చు. తమ పాతకక్షలను తీర్చుకోవడానికి పోలీసులను టూల్స్ గా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్ర రెడ్డి మొదలైన వారితో బలవంతంగా స్టేట్ మెంట్స్ పై సంతకాలు పెట్టించుకుంటున్నారట. సోషల్ మీడియా కేసులు పెట్టడం కుదరకపోతే ఏదో ఒక క్రిమినల్ కేసులో ఇరికించడానికి యత్నిస్తున్నారు. అర్ధరాత్రి వేళ పోలీసులు కొంతమంది నాయకుల ఇళ్లలోకి చొరబడి ఆడవాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేత గౌతం రెడ్డి ఇంటిపై దాడి చేసి పోలీసులు సృష్టించిన గలభానే ఇందుకు నిదర్శనం. ఇలాంటివి వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడైనా ఒకటి,అరా జరిగితే టీడీపీ కానీ, ఎల్లో మీడియా కానీ నానా రచ్చ చేసేవి. కానీ ఇప్పుడు టీడీపీతోపాటు అదే ఎల్లో మీడియా పోలీసుల అరాచకాలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ తరహాలో పోలీసులను ఉపయోగిస్తే, వచ్చే కాలంలో ప్రభుత్వాలు మారితే, ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అప్పుడు టీడీపీ, జనసేనలకు చెందిన ముఖ్యనేతలపై కూడా ఇలాగే ఎక్కడపడితే అక్కడ కేసులు పెట్టే ప్రమాదం ఉంటుంది. గత టరమ్‌లో టీడీపీ ముఖ్యనేతలకు సంబంధించి కేసులు వచ్చినా ఇంత అరాచకంగా వారి పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు ప్రవర్తించలేదు. నిబంధనల ప్రకారం చర్య తీసుకోవడానికి యత్నించారు.అయినా ఆ రోజుల్లో మీడియా అండతో టీడీపీ నేతలు గందరగోళం సృష్టించే వారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని కావాలని కోర్టులో ప్రవేశపెట్టడంలో జాప్యం చేసిన వైనం కూడా అభ్యంతరకరమే. గతంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న సందర్భంలో నందిగామ వద్ద ఏదో గొడవ జరిగింది.ఇప్పుడు దానిని హత్యయత్నం కుట్ర కేసుగా మార్చి అక్కడి వైఎస్సార్సీపీ ముఖ్యనేతలపై కేసులు పెడుతున్నారట.మాజీ ఎంపీనందిగం సురేష్ ను ఎలా వేధిస్తున్నది అంతా గమనిస్తున్నారు. ఎవరు తప్పు చేశారన్న ఫిర్యాదులు వచ్చినా పోలీసులు చర్య తీసుకోవచ్చు. కానీ చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే ఎవరైనా చెబుతారు. అలా కాకుండా ఇష్టారీతిన పోలీసులతో చట్టవిరుద్దమైన పనులు చేయిస్తున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ పరిస్థితి అంత తీవ్రంగా లేదు. అయినా బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఇప్పటికి ఆయా పోలీస్ స్టేషన్ లలో ఆరు కేసులు నమోదు చేశారట.వాటిని గమనిస్తే ఏదో కావాలని కేసులు పెట్టారన్న భావన కలుగుతుంది. చిన్న, చిన్న ఉదంతాలను కూడా కేసులుగా మార్చి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలను వేధించాలన్న దోరణి మంచిది కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు గా ఉన్న రేవంత్ రెడ్డి ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు పరుష భాషతో చేసింది తెలిసిందే. అలాగే కేసీఆర్ కూడా చేసి ఉండవచ్చు. అయినా ఎక్కడా ఈ కేసుల గొడవ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా ఈ ట్రెండ్ కు వెళితే కాంగ్రెస్ పార్టీకి నష్టం. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా అంతా చెప్పుకుంటారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తే అది ఆయనకే అప్రతిష్ట.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘పచ్చ’ ముదురు రాతలు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఉన్న ద్వేషాన్ని ఎల్లో మీడియా ఇంకోసారి భళ్లున కక్కినట్లు కనిపిస్తుంది. కొన్ని రోజులుగా ఎల్లో మీడియా చిమ్ముతున్న విషం చూస్తే వారికి జగన్‌పై ఉన్న అక్కసో ఏ స్థాయిదో సామాన్యుడికీ తెలిసిపోతుంది. పిచ్చి ముదిరిందంటే.. రోకటికి చుట్టమన్నట్లు.. ఇప్పుడు వారు అమెరికా కోర్టుల తరఫున కూడా తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోర్టులు ఏ రకమైన తీర్పులు ఇవ్వాలో ఈ మీడియా చెబుతూంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు ఇంకో అడుగు ముందుకేసి అమెరికా స్థాయికి ఎదిగారన్నమాట. ప్రజలను మోసం చేసేందుకు వీరు కల్లుతాగిన కోతుల్లా అర్థంపర్థం లేని కథనాలు వండి వార్చారు.అదానీ కంపెనీలకు చెందిన ఏడుగురిపై అమెరికా కోర్టులో ఒక కేసు నమోదైంది. సౌర విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల్లో ముడుపులు చేతులు మారాయన్నది కేసులో మోపిన అభియోగం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో కొన్ని భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాల వెనుక లంచాలు ఉన్నాయని ఆరోపణ. అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదానీతో నేరుగా ఒప్పందం చేసుకోలేదు. సెకీ ద్వారా తక్కువ ధరకే విద్యుత్తు కొనుగోలు చేస్తూంటే అధికారులకు ముడుపులు ఎలా చెల్లిస్తారన్న ప్రశ్న వస్తుంది. దీనికి సరైన సమాధానం ఈ పచ్చమీడియా ఇవ్వదు. పైగా.. అదాని కంపెనీ ఉద్యోగులపై మోపిన అభియోగాలను మాజీ సీఎం జగన్‌కు అంటకడుతూ ఎల్లోమీడియా చిందులు తొక్కింది. లంచాల ఆరోపణలే నిజమైతే అది ఏ రూపంలో జరిగిందో కూడా ఎల్లోమీడియా కథనాలు చెప్పాలి. అది మాత్రం వాటిల్లో ఉండదు. దీంతో ఈ కథనాల్లో వాస్తవికతపై సందేహాలు వస్తున్నాయి.ఈ తాజా పరిణామాల నేపథ్యంలో భారత దర్యాప్తు సంస్థలపై మాదిరిగానే అమెరికాలోనూ విమర్శలు వస్తూంటాయేమో అన్న ఆలోచన వస్తోంది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అమెరికాలోని చాలా కోర్టుల్లో ఆయనపై నమోదైన కేసుల్లో శిక్షల తీర్పులను నిరవధికంగా వాయిదా వేసుకోవడం ఇందుకు పెద్ద ఉదాహరణగా కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరూ అదానీపై లేదా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీలను పల్లెత్తు విమర్శ కూడా చేయలేదు. అన్ని ఆరోపణలూ జగన్‌పైనే మోపుతూండటంలోనే వారి డొల్లతనం స్పష్టమవుతోంది.ఈనాడు వంటి ఎల్లో మీడియా అశ్శరభ శరభ అంటూ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతోంది. ఇదే సంస్థ తన మార్గదర్శి కంపెనీలోకి రూ.800 కోట్ల నల్ల ధనం వచ్చి చేరిందని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చెప్పినప్పుడు మాత్రం మాటమాత్రపు సమాధానమైనా ఇవ్వకుండా జారుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఈనాడు సోదర సంస్థ మార్గదర్శి చట్టాలతో సంబంధం లేకుండా రూ.2600 కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేయడం తప్పా? కాదా? అని హైకోర్టు స్వయంగా ప్రశ్నించినా నిమ్మకు నీరెత్తినట్లు నీళ్లు నమిలిందే కానీ మాట పెగిల్చే ధైర్యం చేయలేదు. ఇతరుల విషయానికి వచ్చేసరికి మాత్రం పత్తిత్తు కబుర్లన్నీ చెబుతోంది. విలువలతో నిమిత్తం లేకుండా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చందంగా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్కిల్ స్కామ్ ఆరోపణలు చేస్తూ, సూట్‌కేస్ కంపెనీల ద్వారా అవినీతి సొమ్ము నేరుగా టీడీపీ ఆఫీసు ఖాతాలోకే చేరిందని సీఐడీ ఆధార సహితంగా చెప్పినా.. అది అక్రమ కేసంటారు చంద్రబాబు. ఎల్లో మీడియా ఇదే ప్రచారం చేస్తుంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినా.. చంద్రబాబు జోలికి వస్తే ఊరుకోబోమని వీరు శివాలూగి పోతూంటారు. అంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని దర్యాప్తు సంస్థలనైతే మేము నమ్మమూ.. అమెరికా పోలీసులు చెబితే అదే వేదం మాకు అన్నట్టుగా ఉంది ఈ పచ్చమూక వ్యవహారం.అదానీ కంపెనీపై మోపిన కేసు విషయానికి వస్తే.. అదానీ కంపెనీ ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను రాష్ట్రాలు సెకి ద్వారా తీసుకోని నేపథ్యంలో అదానీ గ్రూపు నేరుగా సంప్రదింపులు జరిపిందన్నది ఆరోపణ. ఇందులో తప్పేమిటి? ఇలా చేయడం వల్ల రాష్ట్రాలకు లాభం కలిగిందా లేదా? అన్నది ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌తోపాటు చత్తీస్‌గఢ్, ఒడిశా, జమ్మూ కశ్మీర్లు కూడా సెకితో మాత్రమే ఒప్పందాలు చేసుకున్నాయి అదానీతో కాదు. ఈ రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒప్పందాలు కుదిరే సమయానికి కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. ఆంధ్రప్రదేశ్‌కు సెకీ ఒప్పందం కారణంగా రూ.2.49లకే ఒక యూనిట్ సౌర విద్యుత్తు లభిస్తుంది. ఇంతే మొత్తం విద్యుత్తుకు అప్పటివరకూ ఐదు రూపాయల కంటే ఎక్కువ చెల్లిస్తూండేవారు. రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా అందించే విద్యుత్తు కోసం తక్కువ ధరకే విద్యుత్తు లభిస్తూండటంతో ఆంధ్రప్రదేశ్ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇంకోలా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నమాట. ఒకవేళ ఈ ఒప్పందాల్లో ఏదైనా మతలబు ఉంటే అందుకు కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది!ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటివారు ప్రధాని మోడీపై విమర్శలు చేయగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను బాధ్యుడిని చేస్తూ, అవినీతి అవినీతి అంటూ పేజీలకు పేజీలు వార్తలిచ్చేశాయి. వీరి కథనాలే నిజమైతే.. ఇతర రాష్ట్రాల విషయంలోనూ కథనాలు ఇవ్వాలి కదా? కానీ వాటి గురించి పిసరంతైనా రాయలేదు.దీన్నిబట్టే తెలిసిపోతుంది వారి కథనాలు అవాస్తవమూ అని. ఇక పార్టీ మారగానే స్వరమూ మార్చసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గురించి.... ఒకప్పుడు ఈనాడు మీడియా బాలినేని దారుణాతి దారుణంగా కథనాలు ప్రచురించింది. కానీ.. ఇప్పుడు వారికి బాలినేనిలో గొప్ప నిజాయితీ పరుడు కనిపిస్తున్నాడు. బాలినేని అసత్యాలు చెబుతున్న సంగతిని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎండగట్టారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడన్న ప్రచారం ఉన్న అదాని నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వంలోని వారైనా ముడుపులు తీసుకునే అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అంతర్జాతీయ వ్యవహారలేవీ జరగవన్న విషయం పచ్చమీడియాకు తెలియదా?అమెరికాలో సెక్యూరిటీల ద్వారా నిధులు సమీకరించడానికి అదానీ గ్రూప్ ఈ అవినీతికి పాల్పడిందన్నది ఆరోపణ. అమెరికా అధికారులు సైతం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా కేవలం రాజకీయ లక్ష్యంతోనే ఈ అభియోగాలు కూడా మోపి ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీతో ఏ ఒప్పందమూ చేసుకోనప్పుడు ముడుపుల అంశం ఎక్కడి నుంచి వస్తుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్‌పై ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవమున్నా ఆయన ప్రధాన ప్రత్యర్ది చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనపై విరుచుకుపడి ఉండేవారు. ఏదో మాట మాత్రంగా ఎల్లోమీడియా ప్రచారం కోసం జగన్‌పై నింద మోపారు. ప్రభుత్వ పరంగా అదానీ, జగన్‌లపై విచారణ చేస్తామని చంద్రబాబు ఎందుకు ప్రకటించలేదో ఎల్లో మీడియా తెలపాలి!.అదానీ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే కొన్నిటి పనులు ఆరంభించింది. జమ్మలమడుగు వద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు కూడా వీటిల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ సిబ్బందిపై లంచాలకోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మనుషులు అప్పట్లో దాడి కూడా చేశారన్న వార్తలు వచ్చాయి. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకూ అదానీ సంస్థ ముందుకు వచ్చింది. 2014-19 టర్మ్‌లో రూ.70 వేల కోట్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటే.. జగన్ ప్రభుత్వం దాన్ని రూ.14 వేల కోట్లకు తగ్గించిందని ఇదే ఈనాడు మీడియా విమర్శించింది. అంటే ఒక్క కంపెనీ ఏర్పాటుకు చంద్రబాబు రూ.70 వేల కోట్లకు ఓకే చేస్తే అది విజన్. గొప్ప విషయం. అదే జగన్ టైమ్‌లో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడితో పది చోట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు అంగీకరిస్తే అదంతా అదానీకి రాసిచ్చినట్లు!!!అదానీ తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిస్తే అది ముడుపుల చర్చకు.. చంద్రబాబు కలిస్తే మాత్రం రాష్ట్రం కోసమన్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతులు ప్రచారం చేస్తూంటాయి. అంతెందుకు... అదానీ గ్రూప్ ఎండీ రాజేశ్ అదానీ తదితరులు ఈ మధ్యే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఓడరేవులు, మైనింగ్, రింగ్ రోడ్డు,ఐటీ, టూరిజమ్, కృత్రిమ మేధ రంగాలతోపాటు అమరావతి నిర్మాణానికి అదానీ గ్రూప్ ఆసక్తి కనబరుస్తోందని చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులన్నిటికి కలిపి ఎన్ని లక్షల కోట్ల వ్యయం అవుతుంది..? తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వీటిని తిరస్కరించే ధైర్యం చేస్తుందా? అక్కడిదాకా కూడా అవసరం లేదు. అవినీతి ఆరోపణలు వచ్చిన సౌర విద్యుత్తు కొనుగోళ్ల అంశం తాలూకూ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఎల్లో మీడియా బాబును ఎందుకు కోరలేకపోయింది?సౌర విద్యుత్తు యూనిట్ రూ.1.99కే దొరుకుతుంటే, జగన్ ప్రభుత్వం సెకీతో రూ.2.49లకు ఒప్పందం చేసుకుందని ఈనాడు మీడియా ఆరోపణ. అందులో ఏ మాత్రం నిజం ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేయడానికి లేదా, ధర తగ్గించడానికి సెకీకి నోటీసు ఇవ్వవచ్చు కదా?గతంలో చంద్రబాబు యూనిట్ విద్యుత్తుకు ఏకంగా రూ.5 ఇచ్చి కొనుగోలు చేస్తే, జగన్ సెకీ ఒప్పందం ద్వారా యూనిట్ ధర 2.49 రూపాయలకు తగ్గిందంటే అది తప్పని ఎల్లో మీడియా ప్రచారం చేసింది.పోనీ అదానీ నుంచి జగన్ ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలో సత్యం ఉందని భావిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం వీరిపై, అలాగే మోడీ ప్రభుత్వంపై విచారణకు ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు కదా! ఆయన ఎక్కడా అదానీని కానీ, మోడీని కానీ ఒక్క మాట అనకుండా జగన్ వల్ల రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందని చెబుతుంటే ఎవరైనా నమ్ముతారా? మరి స్కిల్ స్కామ్‌లో జర్మనీ కంపెనీ సీమెన్స్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన స్కామ్ వల్ల అప్రతిష్ట రాలేదా? చంద్రబాబుకు ముఖ్య స్నేహితుడు ఈశ్వరన్ తో అమరావతిని ప్రమోట్ చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. తీరా చూస్తే ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కుకుని జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీనివల్ల ఏపీ పరువుకు నష్టం జరగలేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలకు ఎవరు జవాబివ్వాలి? కేవలం జగన్ పై ద్వేషంతో మాట్లాడితే సరిపోతుందా? జగన్ పై దుష్ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ఎల్లో మీడియా ద్వారా టీడీపీ రాజకీయం చేస్తున్నదన్నది అర్ధం కావడం లేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నారు పోస్తే.. నీరు ‘నారా’వారు పోస్తారా?
సంతానోత్పత్తికి సంబంధించి ఏపీ శాసనసభ చేసిన చట్ట సవరణ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలంగా చేస్తున్న ప్రచారానికి అనుగుణంగా ఉంది. దీని ప్రకారం ఇద్దరు మించి పిల్లలు ఉన్నవారూ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అర్హులవుతారు. దీంతో మూడు దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణ కోసం అప్పటి ప్రభుత్వం చేసిన చట్టం కాస్తా లేకుండా పోయింది. అయితే దీనివల్ల ప్రయోజనం ఎంత మేరకన్నది మాత్రం చర్చనీయంశమే. ఇద్దరి కంటే ఎక్కువమంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనువుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టాన్ని ఆమోదించింది కానీ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రం ఇది వర్తించదు. టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అరకొరగా చేసిన ఈ చట్టం వల్ల ప్రయోజనం ఏమిటన్న సందేహమూ ఆయన వ్యక్తం చేశారు. ఇది వాస్తవమే. చంద్రబాబు నాయుడు కొన్నేళ్లుగా ‘‘పిల్లలను కనండి..వారి భవిష్యత్తు నేను చూసుకుంటా‘ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. అందులో భాగంగా కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ.15 వేల చొప్పు ఇస్తామన్న ‘తల్లికి వందనం’ పథకాన్ని తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా హామీ కూడా ఇచ్చారు. అదే సందర్భంలో ఏపీలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును పెంచాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ప్రోత్సహాకాలు ఇవ్వాలని కూడా సూచించారు. చైనా, జపాన్ వంటి దేశాలలో వృద్దుల సంఖ్య పెరుగుతుండడం, అక్కడ యువత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటుండడం వంటి కారణాల రీత్యా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు చైనా తన చట్టాలను కూడా మార్చుకుంది. ఒకే సంతానం అన్న పరిమితిని ఎత్తేసింది. జపాన్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. రష్యా తదితర దేశాలు కూడా ఇదే మార్గంలో ఉన్నాయి. అయితే ఈ దేశాలకు, భారత్‌కు అసలు పోలికే లేదు. భారత్‌లో నిరక్షరాస్యత ఎఉక్కవ, పేదరికమూ తగ్గలేదు. అధిక జనాభా కారణంగా సంక్షేమ పథకాల అమలు కూడా కష్టమవుతోందన్న ఆలోచనతో అప్పట్లో భారత్‌లో జనాభా నియంత్రణకు ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చింది. 1960లలో కేంద్రం కుటుంబ నియంత్రణను ఒక ఉద్యమంలా అమలు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారన్న అంశం పెద్ద వివాదమైన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ అకృత్యాలతోపాటు నిర్భంధ ఆపరేషన్లూ కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణమయ్యాయి.1990లలో జనాభా నియంత్రణ లక్ష్యంతో ప్రభుత్వాలు స్థానిక ఎన్నికలలో పోటీ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఉమ్మడి ఏపీలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులను చేస్తూ చట్టం తెచ్చారు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాభా తగ్గుదల ఆవశ్యకతపై శాసనసభలో చర్చలు జరిపారు. తీర్మానాలు చేశారు. నిరోధ్ వంటి బొమ్మలను అసెంబ్లీ ఆవరణలో ప్రదర్శించడం పై కొన్ని అభ్యంతరాలు వచ్చినా, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత కాలంలో ఈ అంశానికి అంత ప్రాధాన్యత రాలేదు. దానికి కారణం ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఒకరిద్దరు పిల్లలను కంటున్నారు. వారికి విద్య, ఆరోగ్యం వంటి వాటిపై శ్రద్ద చూపుతున్నారు. మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాలు ఎప్పటి నుంచో ఈ విధంగా ఒకరిద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నాయి. ఒకప్పుడు అంటే పూర్వకాలంలో జనాభా నియంత్రణ పద్దతులు అంతగా వ్యాప్తిలోకి రాకముందు అధిక సంఖ్యలో సంతానాన్ని కనేవారు. ఉదాహరణకు అందరికి తెలిసిన ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు పదకుండు మంది పిల్లలు ఉన్నారు. ఇలా ఒకరని కాదు..అనేకమంది పరిస్థితి ఇలాగే ఉండేది. కాని కాలం మారుతూ వచ్చింది. ప్రజల ఆచార వ్యవహారాలు, అలవాట్లు, కుటుంబ పద్దతులు అన్నిటిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన వెంటనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహాకాలతో నిమిత్తం లేకుండా ఎవరికి వారు అలా చేస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చంద్రబాబు అధిక సంతానం కోసం ప్రచారం ఆరంభించే దశ వచ్చింది. దీనిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి వంటి ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరూ స్వాగతించలేదు. దానికి కారణం పిల్లలను కంటే ఎవరు పోషిస్తారు? దానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? అన్న మీమాంస ఉండడమే. ఈ రోజుల్లో పిల్లల విద్యకు ప్రైవేటు స్కూళ్లలో వేల రూపాయల చొప్పున ఫీజులు కట్టాల్సి వస్తోంది. జగన్ ప్రభుత్వం పేద పిల్లలకు ఉపయోగపడేలా ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడంతో పాటు ,అమ్మ ఒడి పేరుతో పిల్లలను స్కూళ్లకు పంపించే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చింది. ఆ స్కీమ్ సఫలం అవడంతో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేస్తూ ప్రతి తల్లికి కాదు.. బడికి వెళ్లే ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దీనిని అమలు చేయలేదు. దాంతో ఏపీలో పేద కుటుంబాలు మోసపోయామని భావిస్తున్నాయి. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని కూడా టీడీపీ, జనసేన కూటమి సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చాయి. ఆ విషయాన్ని చంద్రబాబుతో పాటు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక అవన్ని ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి నిజంగానే పిల్లలను ఎక్కువగా కంటే ఎవరు పోషిస్తారని జనం అడుగుతున్నారు. పోనీ ఈ ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ముందుగా తమ కుటుంబాలలో దానిని అమలు చేసి చూపిస్తున్నారా? అంటే అదేమీ లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బీజేపీతో మళ్లీ స్నేహం పెట్టుకున్నాక, వారి మెప్పు పొందేందుకు ఇలాంటి కొత్త, కొత్త ప్రచారాలు ఆరంభించారన్న అభిప్రాయం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ కొత్త అవతారం ఎత్తే యత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలపై హిందూవాదులు పెద్దగా స్పందించలేదు కాని, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. నిజానికి ఎవరి కుటుంబం వారిది. వారి ఆర్థిక స్థోమతను బట్టి పిల్లల సంఖ్యను నిర్ణయించుకుంటారు. అంతే తప్ప చంద్రబాబు చెప్పారనో, మరెవరో అన్నారనో, లేక కేవలం ఏదో స్థానిక ఎన్నికల నిమిత్తమో ఇద్దరిని మించి పిల్లలను కంటారని ఎవరూ అనుకోవడం లేదు. టీడీపీ సభ్యుడు అన్నట్లు నిజంగానే అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కంటే ఆయా సంక్షేమ పథకాలు పిల్లలందరికి వర్తిస్తాయని కూడా ప్రభుత్వం తీర్మానించాలి కదా! అలా చేయలేదు సరికదా, ఇస్తామన్న తల్లికి వందనం స్కీమును హుళక్కి చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలను బాగా కనండి అని చంద్రబాబు ప్రచారం చేస్తే నమ్మి ఎవరైనా అలా చేస్తారా? :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘లోకేష్ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పొగడ్తలు అతిగా మారుతున్నాయి. వీటి వెనుక ఉన్న నిజాయితీ ఎంత? వ్యూహమెంత? అన్నదిప్పుడు రాజకీయ వర్గాల చర్చ. చంద్రబాబు ఈ ఐదేళ్లు మాత్రమే కాకుండా.. మరో పదేళ్లపాటు సీఎంగా కొనసాగాలన్నది పవన్ పొగడ్తల్లో ఒకటి. అంటే.. సీఎం కావాలన్న ఆకాంక్ష తనకు లేదని చెప్పకనే చెప్పడమన్నమాట. ఇంకోలా చూస్తూ,, లోకేష్ సీఎం కాకూడదన్న ఆలోచనతో పవన్ ఈ మాట అన్నారేమో అనే చర్చ కూడా నడుస్తోంది. .. ఈ ప్రకటనతో పవన్ సీఎం పదవిపై ఆశ వదలుకున్నారని సందేశమూ తన సామాజిక వర్గమైన కాపులకు పంపినట్లు కనిపిస్తోంది. అయితే కాపుల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి కావాలన్నది వారి చిరకాల ఆకాంక్ష. సినీనటుడు చిరంజీవి ద్వారా ఆ కోరిక తీరుతుందని వారు ఆశించినా ఫలితం లేకపోయింది. ప్రజారాజ్యం పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. కేంద్రంలో కొంతకాలం పాటు మంత్రి పదవి అనుభవించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ జనసేన పేరుతో పార్టీ పెట్టి తొలుత టీడీపీకి ఆ తరువాత వామపక్షాలు, బీఎస్పీలతో జట్టు కట్టి పోటీచేశారు అప్పట్లో పవన్ ఎక్కడకెళ్లినా అభిమానులు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ యువత సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేసేది. దానికి ఆయన కూడా సంబరపడేవారు. కానీ.. 2019 ఎన్నికలలో ఆయన రెండుచోట్ల పోటీచేసి ఓడిపోవడం, పార్టీ ఒక్క సీటుకే పరిమితమైపోయాయి. ఆ వెంటనే పవన్ ప్లేటు మార్చి బతిమలాడకుని మరీ మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. ఆ ఎన్నికలలో టీడీపీ కూడా ఓటమి పాలవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరంగా ఉంటే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పవన్ ను ముందుగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలోకి ప్రవేశింప చేసి, తన తరపున రాయబారం చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారని అంటారు. .. ఆ తర్వాత కాలంలో పవన్‌ను చంద్రబాబు తన వెంట తిప్పుకున్నారు. చివరికి స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో పవన్ ఆయనను పరామర్శించడానికి వెళ్లి పొత్తులపై మాట్లాడారు.అప్పటికే పవన్ కల్యాణ్ కు ఒక భయం పట్టుకుంది. తాను టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే మళ్లీ ఓడిపోతానని సందేహించారు. పవన్ కల్యాణ్, జనసేన మద్దతు లేనిదే టీడీపీ అధికారంలోకి రాలేదని చంద్రబాబూ భావించారు. ఎన్నికల కమిషన్ తమకు అనుకూలంగా పని చేయాలంటే కేంద్రంలోని బీజేపీతో స్నేహం అవసరమని కిందా, మీద పడి ఆ పార్టీని ఒప్పించారు. నిజానికి జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేయడం ద్వారా ఏపీలో తమ బలాన్ని పెంచుకోవచ్చని బీజేపీ అనుకుంది. పవన్‌ను సీఎం అభ్యర్ధిగా కూడా బీజేపీ కేంద్ర నేతలు కొందరు ప్రచారం చేశారు. టీడీపీతో పొత్తు చర్చల సమయంలో పవన్‌కు ముఖ్యమంత్రి పదవిని ప్రతిపాదించి రెండేళ్లపాటు అవకాశం ఇవ్వాలని బీజేపీ సూచించింది. .. అలాగే సీట్ల పంపిణీ టీడీపీకి సగం, జనసేన, బీజేపీలకు సగంగా జరగాలని బీజేపీ పెద్దలు అభిప్రాయపడినా, పవన్ దానికి కూడా పట్టుబట్టకుండా జారిపోయారు. పవన్ కల్యాణ్ అసలు తాను గెలుస్తానో, లేదో అన్న భయంతో షరతులు లేకుండా టీడీపీతో పొత్తుకు ముందుకు వెళ్లారన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. బీజేపీని కూడా ఒప్పించారు!. ఈవీఎంల మేనేజ్ మెంటా? లేక ప్రజలు ఓట్లు వేశారా? అనేదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ, ఎన్నికలలో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి పదవితో సంతృప్తి చెందారు. ఆ తర్వాత ఎన్ని అరాచకాలు జరుగుతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పవన్ తొలుత నోరు మెదపలేదు. కారణం తెలియదు కానీ, సడన్ గా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారన్న వాస్తవాన్ని పవన్ ప్రకటించారు. ఆ సందర్భగా హోం మంత్రి అనిత సమర్థతను ప్రశ్నిస్తూ, తానే హోం మంత్రి అవుతానని హెచ్చరించారు. అది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసింది. .. ఆ మీదట చంద్రబాబు ఏమి చెప్పారో కానీ, వెంటనే స్వరం మార్చి మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల గురించి కాకుండా సోషల్ మీడియా లో అసభ్య పోస్టింగ్లపైకి దారి మళ్లించారు. పోలీసుల ద్వారా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాడులు చేయిస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలోని సూపర్ సిక్స్ తదితర అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం బాగా పని చేస్తోందని ప్రచారం ఆరంభించారు. అదే సందర్భంలో చంద్రబాబు అనుభవం.. అంటూ పవన్ తెగ పొగుడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిజంగానే అమలు చేస్తుంటే ప్రశంసించవచ్చు. నిత్యం అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం ఏమి సాధించిందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలని పవన్ అనడంలో ఆంతర్యం ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే ఆయన సనాతన ధర్మం అంటూ బీజేపీ ఎజెండా ప్రకారం రాజకీయం చేస్తూ ,మరో వైపు చంద్రబాబును పొగడడం ద్వారా టీడీపీతో సత్సంబంధాలు ఉంచుకునేలా జాగ్రత్త పడుతున్నారు. సినీ నటుడు కూడా అయిన పవన్ కల్యాణ్ గ్లామర్ ను ఉపయోగించుకుని ఏపీలో ఎదగాలని బీజేపీ భావనగా ఉందని అంటున్నారు. భవిష్యత్తులో టీడీపీతో తేడా వస్తే ఈ వ్యూహంలోకి బీజేపీ వెళ్లవచ్చన్నది కొందరి అనుమానం. ఈలోగా చంద్రబాబుతో గొడవ లేకుండా పవన్ పొగుడుతుండవచ్చు. మరో విషయం ఏమిటంటే.. చంద్రబాబు కుమారుడు లోకేష్ సీఎం స్థానంలో ఎప్పుడు కూర్చుంటారా అని లోకేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అమెరికా వెళ్లి వచ్చిన సందర్భంగా టీడీపీకి చెందిన 18 మంది మంత్రులు స్వాగతం చెప్పడమే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. కుటుంబ పరంగా లోకేష్‌కు సీఎం పదవి సాధ్యమైనంత త్వరగా కట్టబెట్టాలన్న ఒత్తిడి కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ లోకేష్ కు సీఎం పదవి అప్పగిస్తే పవన్ ఆయన క్యాబినెట్ లో ఉంటారా? లేదా? అన్నది చెప్పలేం. పవన్ కల్యాణ్ కు అది పెద్ద సమస్య కాదని, ఆయన పదవికి అలవాటు పడ్డాక దానిని వదులు కోలేరన్నది కొంతమంది వాదన. అయితే బీజేపీతో స్నేహం నడుపుతున్న పవన్ వ్యూహాత్మకంగా లోకేష్ కు సీఎం పదవి ఈ టరమ్‌లో రాకుండా చూడడానికే ఈ ప్రకటన చేశారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. అంతే కాకుండా, పదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని అన్నారంటే, ఆ పదవి తనకే కాకుండా లోకేష్ కు కూడా రాదని చెప్పడమే అవుతుంది. ఇది ఒకరకంగా చంద్రబాబుకు కూడా కొంత ప్రయోజనకరం కావచ్చ. లోకేష్‌ను ఈ టరమ్‌లో సీఎంగా చేస్తే పవన్ ఒప్పుకోరని, ఆయన పొత్తు వీడిపోతే టీడీపీకి ఇబ్బంది అవుతుందని కుటుంబానికి నచ్చ చెప్పడానికి ఇది ఉపయోగపడవచ్చన్నది మరో అభిప్రాయం. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు ఈ టరమ్ పూర్తి అయ్యేసరికి 79 ఏళ్లకు చేరతారు. ఆ తర్వాత పదేళ్లు అంటే 89 ఏళ్లు వస్తాయి. వచ్చే టరమ్‌లో తిరిగి కూటమి గెలుస్తుందా? లేదా? అన్నది వేరే విషయం. ఆ పరిస్థితి ఎలా ఉన్నా 90 ఏళ్లు వచ్చే వరకు చంద్రబాబు సీఎం గా ఉండాలని పవన్ అంటున్నారంటే, అది ముఖస్తుతి కోసం, లోకేష్ సీఎం కాకుండా అడ్డుకోవడానికే కావచ్చన్నది జనసేనలో జరుగుతున్న చర్చ. నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో లోకేష్ మాటే నడుస్తోందని, మంత్రులు ఎవరూ ఏమీ చేయడానికి లేదని అంటున్నారు. చివరికి పవన్ కల్యాణ్ శాఖలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు లోకేష్ ద్వారానే జరుగుతున్నాయని అంటారు. లోకేష్‌ను నేరుగా ఎదిరించే ధైర్యం పవన్ ప్రస్తుతం చేయడం లేదని చెబుతున్నారు. కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారులను ఒక టీమ్‌గా పెట్టుకుని లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఒకరినొకరు పొగుడుకుంటూ కాలం గడుపుతుంటే, అసలు పెత్తనం అంతా లోకేష్ చేస్తున్నారన్నది సచివాలయ వర్గాల సమాచారం.ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ నిస్సహాయ స్థితిలోనో, లేక వ్యూహాత్మకం గానో లోకేష్ సీఎం కాకుండా అడ్డుపడే లక్ష్యంతో ఈ ప్రకటన చేశారేమో అనే విశ్లేషణలు సోషల్ మీడియాలో కూడా విస్తారంగా వస్తున్నాయి. రాజకీయాలలో అతిగా పొగిడితే కూడా పలు సందేహాలు వస్తుంటాయి. ఏది ఏమైనా పవన్ కల్యాణ్‌కు సీఎం అయ్యే యోగం ఎప్పటికైనా ఉంటుందా? అన్నది ఆయన అభిమానులకు లక్ష డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
CBNlies: ‘మాట మార్చడంలో డాక్టరేట్ ఇవ్వాలేమో!’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సభ్యులు చేస్తున్న ప్రకటనలపై శాస్త్రీయంగా ఒక అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఎన్నికల ముందు చేసిన ప్రకటనలు.. ఆ తరువాత ఇస్తున్న సందేశాలు అంత ఆసక్తికరంగా ఉన్నాయి మరి! మాటలు మార్చడం ఇంత తేలికా అన్నట్టుగా ఉన్నాయి ఇటీవలి కాలంలో వీరు చేస్తున్న ప్రకటనలు. ఏమాత్రం జంకు గొంకూ లేకుండా అసత్యాలెలా చెప్పగలుగుతున్నారు? అసలు వీరి మాటలను ప్రజలు పట్టించుకుంటున్నారా? అన్న అనుమానాలూ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమన్నారు..? తన రాజకీయ అనుభవంతో ప్రజలపై భారం పడకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాననే కదా? ఈ మాటలన్నింటికీ పవన్ కళ్యాణ్ ఊకొట్టడమే కాకుండా నిజం నిజం అంటూ బాబును ఆకాశానికి ఎత్తేశారా లేదా? వందిమాగధుల చందంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు పొడగ్తలతో బాబుకు ఎలివేషన్ కూడా ఇచ్చాయే..!! జగన్ సంక్షేమ కార్యక్రమాలను వృథా ఖర్చులంటూ, బటన్ నొక్కడం తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ విమర్శించిన ఈ మీడియా సంస్థలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రెండు, మూడు రెట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించాయి కూడా. జగన్ చేస్తే తప్పట. అదే చంద్రబాబు ఇంకా అధికంగా చేస్తానని చెబితే సూపర్ అట. ఇలా సాగిపోయింది వారి ప్రచారం. కానీ... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తం ఒక్కసారిగా అందరి గొంతు మారిపోయింది. వారి అసలు స్వరూపాన్ని బయటబెట్టుకుంటున్నారు. ఇచ్చిన హామీలు అన్నింటిలోనూ యూటర్న్ తీసేసుకున్నారు. ఇందుకు ఏమాత్రం సిగ్గుపడటమూ లేదు సరికదా.. దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు పిసరంత పెంచినా బాదుడే, బాదుడు.. విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెరిగాయి అంటూ టీడీపీ, ఎల్లో మీడియా గొంతు చించుకునేవి. ఈ ప్రభావం ప్రజలపై కూడా కొంత పడింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అదే ట్రూ అప్ ఛార్జీలను మరింత అధికంగా బాదుతున్నారు. ఏకంగా రూ.17 వేల కోట్ల భారం మోపడానికి ఆమోదం పొంది, రూ.ఆరు వేల కోట్లకు పైగా మొత్తాన్ని తక్షణం వసూలు చేయడం ఆరంభించారు. అదేమిటంటే జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల పెంచాల్సి వస్తోందని కొత్త రాగం అందుకున్నారు. దీంతో సంపద సృష్టి అంటే జగన్ టైమ్‌లో కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడమా? అని ప్రజలు నివ్వెర పోతున్నారు. ఇంకో ఉదాహరణ... రోడ్లపై గోతులు పూడ్చి, రోడ్ల నిర్వహణకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటన చూడండి. జగన్ టైమ్‌లో రహదారులను బాగు చేసినప్పటికీ రాష్ట్రంలో రోడ్లన్ని పాడైపోయినట్లు ఈనాడు మీడియా ప్రచారం చేసింది. వర్షాల వల్ల గోతులు పడినా, అదంతా జగన్ ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రచారం ఎంత స్థాయికి చేరుకుందంటే.. చంద్రబాబు, పవన్‌లు అధికారంలోకి రాగానే రహదారులపై గోతులు ఆమాంతం మాయమైపోతాయని, అద్దాల్లా మెరిసిపోతాయని ప్రజలు అనుకున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా మారింతి వీసమెత్తు కూడా లేదు. చంద్రబాబు నాయుడు అట్టహాసంగా హెలీకాప్టర్ వేసుకుని ఓ గ్రామం వద్ద రహదారి గోతిపై మట్టిపోసి రావడం తప్ప! తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మళ్లీ గొంతు మార్చేశారు. రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామన్నారు. వాహనదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసి ప్రైవేట్ సంస్థలే రహదారులను మరమ్మతు చేస్తాయని, ఉభయ గోదావరి జిల్లాల్లోనే తొలి పైలట్ ప్రాజెక్టు మొదలు పెడాతమని ప్రకటించారు. పైగా ప్రజలను ఈ పద్ధతికి ఒప్పించే బాధ్యతను ఆయన ఎమ్మెల్యేలపై నెట్టడం.. వారు ఒప్పుకోకుండా గుంతల్లోనే తిరుగుతామని అంటే తనకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పడం కొసమెరుపు!! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ పన్ను వేసినా, ఏ ఆదాయ వనరు పెంచినా, ప్రభుత్వ దోపిడీ అని అభివర్ణించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు కాకుండా, అన్నిటిపై ముక్కు పిండి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని అనుకుంటున్నారన్నమాట. నిజానికి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టారు. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మండల స్థాయి రోడ్లకు కూడా యూజర్ ఛార్జీలు అంటున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఈ పద్దతి అమలు చేస్తామని చెబితే తప్పు కాదు. అప్పుడేమో అంతా ఫ్రీ అని, ఆ తర్వాత ఏదీ ఉచితం కాదని, డబ్బులు మీరే ఇవ్వాలని జనాన్ని అంటుంటే వారు నిశ్చేష్టులవడం తప్ప చేసేది ఏమి ఉంటుంది? ఇక్కడ మరో సంగతి చెప్పాలి. రోడ్లు,భవనాల శాఖ మంత్రి జనార్ధనరెడ్డి మాత్రం రహదారులపై టోల్ గేట్లు ఉత్తదే అని ప్రకటన చేశారు. కాని మంత్రి గాలి తీస్తూ చంద్రబాబు యూజర్ చార్జీల ప్రకటన చేసేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం స్థానిక సంస్థలు పారిశుద్ద్యం నిర్వహణకు నెలకు ఏభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తే జగన్ ప్రభుత్వం చెత్తపన్ను వేశారని, ఇది చెత్త ప్రభుత్వం అని దుర్మార్గపు ప్రచారం చేశారు. ఇప్పుడేమో వేల రూపాయల చొప్పున యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు. లేకుంటే గోతులే మీకు గతి అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు దీనిని రోడ్లపై గుంతలకు కూడా జనం నుంచి డబ్బు వసూలు చేసే రోత ప్రభుత్వం అని ఎవరైనా విమర్శిస్తే తప్పులేదేమో! ఒకవైపు అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు తెస్తున్నారు. ఆ అప్పులు రాష్ట్రం అంతా కట్టాల్సిందే. అమరావతిలో మాత్రం కొత్త రోడ్లపై టోల్ గేట్లు పెట్టి డబ్బలు వసూలు చేస్తామని చెప్పడం లేదు. అమరావతిలో విలాసవంతమైన కార్లలో తిరిగే ఖరీదైన షరాబులే అధికంగా ఉంటారు. వారు తిరిగే రోడ్లపై అంతా ఫ్రీ. పేదలు, మధ్య తరగతి వారు ఎక్కువగా తిరిగే గ్రామీణ రోడ్లపై మాత్ర టోల్ వసూళ్లు. ఇసుక ,మద్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇసుక మొత్తం ఉచితం అనుకున్న ప్రజలకు గతంలో కన్నా అధిక రేట్లు పెట్టి కొనాల్సి రావడం అనుభవం అయింది. మద్యం ధరలు తగ్గిస్తారనుకుంటే ఎమ్.ఆర్.పి కన్నా ఎక్కువ రేట్లే వసూలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలలో భాగంగా గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను పెడితే చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్‌లు నానా యాగీ చేశారు. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్లుగా దుర్మార్గపు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటినే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. అప్పట్లో స్మార్ట్ మీటర్లపై వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఈనాడు మీడియా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయి.. అని హెడింగ్ పెట్టి ప్రజలను పండగ చేసుకోమన్నట్లుగా స్టోరీలు ఇస్తోంది. వివిధ కారణాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. వాటిని అదుపు చేసే యంత్రాంగం లేకుండా పోయింది. అప్పట్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా సరుకుల రేట్లు పెరిగిపోయాయని యాగీ చేసిన టీడీపీ, ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఇప్పుడు అంతకు రెట్టింపు ధరలు పెరిగినా నోరు మెదిపితే ఒట్టు. ప్రజలకు జగన్ టైమ్ లో వచ్చిన స్కీముల డబ్బుతో పేదల జీవితం చాలావరకు సాఫీగా సాగేది. ఆయన ఇచ్చిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని కూటమి నేతలు అబద్దాలు చెప్పి, ఇప్పుడు దాదాపు అన్నిటిని ఎగవేసే పనిలో ఉన్నారు.దాంతో మండుతున్న ధరలతో జనం అల్లాడుతున్నారు. ప్రస్తుతం పిండుతున్న అదనపు వసూళ్లు చాలవన్నట్లు జీఎస్టీపై ఒక శాతం సర్ఛార్జ్ వసూలు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు కోరారు. అది కూడా వస్తే ఏపీలో పన్నులు మరింతగా పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు మండుతాయి. ప్రజల జీవితం మరింత భారంగా మారుతుంది. చేసిన బాసలకు, చేస్తున్న పనులకు సంబంధం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరిశోధనార్హమే అవుతుందేమో! బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని టీడీపీ సూపర్ సిక్స్ నినాదం. కాని అది ఇప్పుడు బాబు ష్యూరిటీబాదుడే, బాదుడుకు గ్యారంటీగా మారిందా! ఇప్పుడు జనం రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని అనుకోరా! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తాగు.. ఊగు.. జోగు... బాబు మార్కు ప్రగతి!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విచ్చలవిడి వ్యాపారం సమాజానికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయని సమాచారం. ఇవి చాలవన్నట్టు వ్యాపారులు మద్యం డోర్ డెలివరీ కూడా మొదలుపెట్టారు. విజయవాడ పటమట ప్రాంతంలో ఒక షాపు యజమాని ఈ మేరకు కరపత్రాలు కూడా పంచారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంగతి ఏమోకానీ మద్యం ప్రోగ్రెస్ మాత్రం బాగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ప్రభుత్వం డబ్బులు దండుకోవడానికి ఉపయోగపడుతూంటే.. సామాన్యుడి జేబు, ఒళ్లూ రెండూ హూనమైపోతున్నాయి. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మద్యం విధానం ప్రజలకు మేలు చేసేదా? కీడు చేసేదా అన్న చర్చ సాగుతోంది. ప్రజలు తమకు అధికారమిస్తే మద్యం సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీ ఇచ్చిన పార్టీ దేశం మొత్తమ్మీద ఒక్క తెలుగుదేశం మాత్రమే కావచ్చు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తీవ్రంగా తప్పు పడుతూండేవారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని, నాణ్యత లేని బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయని అనేవారు. కూలీనాలీ చేసుకునే సామాన్యుడు సాయంకాలం ఒక పెగ్గు మందేసుకుంటామంటే ధరలు ఆకాశాన్ని అంటేలా చేశారని ధ్వజమెత్తేవారు. ఈ మాటలు, విమర్శలు అన్నీ ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ నుంచి వస్తూండటం ఒక వైచిత్రి. ఏదైతేనేం.. బాబు గారి మాటలకు మందుబాబులు పడిపోయారు. ఎన్నికల్లో సుమారు పాతిక లక్షల మంది మందురాయుళ్లు టీడీపీ కూటమివైపు మొగ్గారని ఒక అంచనా. సామాన్యుడిని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే, సామాజికంగానూ అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే మద్యం జనానికి దూరంగా ఉంచాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకు తగ్గట్టుగానే జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ దుకాణాల వారు లాభాపేక్షతో పేదలను పిండుకుంటారన్న ఆలోచనతో సొంతంగా దుకాణాలు నడిపింది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచేలా చేయడంతోపాటు ధరలు పెంచింది. బెల్ట్ షాపులు దాదాపుగా లేకుండా చేసింది. సామాజిక హితం కోసం చేపట్టిన ఈ చర్యలేవీ ఎల్లోమీడియాకు నచ్చలేదు. ఎప్పటికప్పుడు మద్యం విధానాన్ని విమర్శిస్తూ కథనాలు వండి వార్చేది. కానీ బెల్ట్‌షాపులున్నట్లు మాత్రం ప్రచారం చేయలేకపోయింది. ఈ వ్యతిరేక ప్రచారం ప్రభావంలో పడ్డ జనాలు జగన్‌పై వ్యతిరేకత పెంచుకుంటే.. చంద్రబాబు, పవన్, లోకేశ్ వంటివారు దానికి ఆజ్యం పోశారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే.. అధికారం వచ్చిన వెంటనే కూటమి నేతల వైఖరి పూర్తిగా మారిపోయింది. మద్యం ప్రియులకు ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ పరమయ్యాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.రెండు లక్షలు వసూలు చేసి, లాటరీ వేసి మరీ కేటాయింపులు జరిపారు. ఈ లాటరీల ద్వారానే ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్లు వచ్చింది. కొంతమంది దుకాణాల కోసం ఎగబడి.. యాభై నుంచి వంద వరకూ దరఖాస్తులు వేసినట్లు సమాచారం. ఇలా రూ.కోటి వరకూ ఖర్చు పెట్టినా వారికి ఒకట్రెండు షాపులూ దక్కలేదు. లాటరీలో దుకాణం కేటాయింపు జరిగిన తరువాత లైసెన్స్ ఫీజు కింద కూటమి ప్రభుత్వం మళ్లీ బాదుడు మొదలుపెట్టింది. దీనికింద రూ.60 లక్షల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్లు కూటమి ఎమ్మెల్యేలకు షాపులలో వాటా లేదంటే ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. విశేషం ఏమిటంటే టీడీపీ వారే ఎక్కువ దుకాణాలు పొందినా సొంతపార్టీ వారికే లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఇక్కడితో ఆగిందా? లేదు. ప్రభుత్వం ఎకాఎకిన మార్జిన్‌ను 20 నుంచి పది శాతానికి తగ్గించింది. షాపుల ఏర్పాటు, నిర్వహణలు అదనం. వీటన్నింటి కారణంగా మద్యం దుకాణాల ద్వారా నష్టాలే ఎక్కువ అవుతున్నాయని ఇప్పుడు దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ఇది ఒక కోణం. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటైన లిక్కర్ సిండికేట్లు మందుబాబులను పిండేస్తున్న వైనం ఇంకోటి. రాష్ట్రం నలుమూలల ఈ సిండికేట్ విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు తెరిచేసింది. కొన్నిచోట్ల ఆయా గ్రామాల నేతలే కొందరు వేలం ద్వారా బెల్ట్‌షాపులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డి.కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ వేలంలో ఒక బెల్ట్ షాపు రూ.లక్ష ధర పలికిందని తెలిసింది. వైసీపీ వారు, మద్యం వ్యతిరేకులు బెల్ట్ షాపులను వ్యతిరేకించినా, టీడీపీ నేతల ఆధ్వర్యంలో వేలం పాటలు యధేచ్చగా సాగినట్లు సోషల్ మీడియా వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. తణుకు వద్ద మద్యం సీసాలు సంతలో బల్ల మీద పెట్టుకుని తండ్రులు అమ్ముతుంటే వారి పిల్లలు అక్కడే కూర్చున్న వీడియో తీవ్ర కలకలం రేపింది. పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర హోం శాఖ మంత్రి మాత్రం బెల్ట్‌షాపులు అస్సలు లేనేలేవని అంటున్నారు. ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ధరలు పెంచి అమ్మినా, బెల్ట్ షాపులు పెట్టినా రూ.5 లక్షల వరకూ జరిమానా అంటూ బెదరగొడుతున్నారు కానీ.. ఆచరణలో ఇది ఏమాత్రం అమలు కావడం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజులు, లైసెన్స్ ఫీజులు, మామూళ్లు, దుకాణాల ఏర్పాటు, నిర్వహణ వంటి అనేక ఖర్చులు ఉండటంతో తాము నష్టాలను పూడ్చుకునేందుకు అధిక ధరలకు మద్యం అమ్మాల్సి వస్తోందని దుకాణందారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రూ.99కే క్వార్టర్ మద్యం అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ వాస్తవానికి రూ.120 నుంచి రూ.130 వరకూ పెట్టాల్సి వస్తోందని మద్యం ప్రియులే చెబుతూండటం గమనార్హం. పైగా గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని అదనంగా కొన్ని వచ్చి చేరాయని నాణ్యతలో ఏమీ తేడా లేదని వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మందు తాగి మరీ చెబుతున్నారు.మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య దుకాణాల ఏర్పాటును ప్రజలు పలుచోట్ల నిరసించారు. కానీ వారి గోడు పట్టించుకున్న వారు లేకపోయారు. గత ఏడాది మద్యం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం రాగా దాన్ని ఈ ఏడాది రూ.25 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం తన బడ్జెట్లోనే పేర్కొంది. మద్యం ధరలు తగ్గించామని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం ఆదాయం ఎలా పెరుగుతోందంటే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. 201419 మధ్య కూడా చంద్రబాబు బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నామని, చర్య తీసుకుంటామని పలుమార్లు చెప్పేవారు. కానీ 45 వేలకు పైగా బెల్ట్ షాపులు నడిచాయని ఒక అంచనా. అంతేకాదు. గోరుచుట్టపై రోకటిపోటు చందంగా ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి తోటల పెంపకం విస్తారంగా సాగిపోతోంది. ఈ మధ్య జరిగిన పోలీసుల దాడిలో 15 ఎకరాలలో గంజాయి పెంచుతున్నట్లు గుర్తించారు. నగర ప్రాంతాలలో కూడా గంజాయి విక్రయాలు పెరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పినదానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి పూర్తిగా విరుద్దంగా పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారన్న ఆరోపణలు విరివిగా వినిపిస్తున్నాయి. ఏపీ సమాజం ఇదే కోరుకుంటోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
AP: అలా చేస్తే ప్రాంతీయ విద్వేషాలు రాజుకోవా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాయలసీమకు మోసం చేసే పనులు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనూహ్య విజయాలు అందించిన రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎదుర్కోక తప్పదు. కర్నూలు నుంచి న్యాయవ్యవస్థకు చెందిన పలు కార్యాలయాలు, కడప నుంచి కేంద్ర ప్రబుత్వానికి చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు చర్యలు చేపట్టడం ఆ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే. సీమ ప్రజల మనసులను గాయపరిచినట్లే. కర్నూలులో హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టింది. జ్యుడిషియల్ సిటీ నిర్మాణానికి సుమారు 273 ఎకరాల స్థలమూ కేటాయించింది. నేషనల్ లా యూనివర్శిటీ కోసం వంద ఎకరాలు ఇవ్వడమే కాకుండా రూ.వెయ్యి కోట్లు మంజూరు కూడా చేశారు. అయితే ఇప్పుడు వివిధ ఆఫీసులతోపాటు లా యూనివర్శిటీని కూడా తరలించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అన్న సందేహం వస్తోంది. 201419 మధ్యకాలంలోనే అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్‌ను చంద్రబాబు అండ్ కో మంగళగిరి తరలించింది. తాజాగా పులివెందులలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు మంజూరైన యాభై ఎంబీబీఎస్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వదులుకుంది. ఇవన్నీ ఆయన రాయలసీమకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నట్లుగానే చూడాలి. రాయలసీమ, ప్రత్యేకంగా కర్నూలు అన్నది ఒక సెంటిమెంట్. మద్రాస్ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం అంతా భాగంగా ఉండేది. ఆ రోజులలో తెలుగు వారిని కూడా ఢిల్లీలో మదరాసీలు అనేవారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఆకాంక్షతో కోస్తా ప్రాంత నాయకులు ఇందుకోసం ప్రజలను సమీకరించడం ఆరంభించి పలు చోట్ల సభలను పెట్టేవారు. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన రాజకీయ పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళ్లాలని తలపెట్టారు. కానీ అప్పటికే కృష్ణా, గోదావరి నదులపై కొన్ని ప్రాజెక్టులు కోస్తాలో ఉండడం, తద్వారా రైతులు ఆర్థికంగా ముందంజలో ఉండటం తదితర కారణాలను చూపుతూ రాయలసీమ నేతలు పలు సందేహాలను లేవనెత్తారు. ఆ దశలో ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్దారక నాగేశ్వరరావు పంతులు తన శ్రీబాగ్ నివాసంలో ఇరు ప్రాంతాల నేతలతో సమావేశం జరిపి ఒక అవగాహన కుదిరేందుకు కృషి చేశారు. అప్పుడు వివిధ అంశాలతో ఇరుప్రాంత నేతలు చేసుకున్న ఒప్పందమే శ్రీ బాగ్ ఒప్పందం. దాని ప్రకారం రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలి. తదుపరి రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో ఆంధ్ర ఉద్యమం ఉదృతం అయింది. చివరికి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో జవహర్ లాల్ ప్రభుత్వం దిగివచ్చి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించింది. ఆ సమయంలో ఎక్కడ రాజధాని చేయాలన్న చర్చ మళ్లీ ఏర్పడింది. గుంటూరువిజయవాడతో పాటు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు వంటి నగరాలపై ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. అప్పటికే తెలుగు వారంతా ఒక్కటి కావాలన్న భావన ఉండడంతో, భవిష్యత్తులో తెలంగాణతో కూడిన ఉమ్మడి ఏపీ ఏర్పాటైతే హైదరాబాద్ రాజధాని అవుతుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఆ దశలో సీమాంధ్రకు కర్నూలును రాజధాని చేయాలని, గుంటూరు వద్ద హైకోర్టు పెట్టాలని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారం కర్నూలులో శాసనసభను ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరులో హైకోర్టు నిర్వహించారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ లోనే స్థాపితమయ్యాయి. అదృష్టమో, దురదృష్టమో అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి సాగుతూ వచ్చింది. అయినా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ఆరంభించారు. దానికి రాజకీయ కారణాల కూడా తోడయ్యాయి.1969లో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడిచింది.తదుపరి 1973 ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడే రాష్ట్రం విడిపోయి ఉంటే ఎలా ఉండేదో కాని, అప్పట్లో ఆరుసూత్రాల పథకాన్ని కేంద్రం ప్రకటించింది. విశేషం ఏమిటంటే దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆరు జోన్ లు ఏర్పాడడం మినహా, మళ్లీ అభివృద్ది అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. సెంట్రల్ యూనివర్శిటీతో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ చుట్టూరానే ఏర్పాటయ్యాయి. అంతకుముందు వచ్చిన ఉక్కు ఉద్యమం కారణంగా విశాఖపట్నంలో స్టీల్ ప్యాక్టరీ మాత్రం వచ్చింది. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ కు వలస వెళ్లడం ఆరంభం అయింది. 2001నుంచి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం రకరకాల రూపాలు దాల్చుతూ 2014 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యత వరకు వెళ్లింది. కాంగ్రెస్, బీజేపీలతోపాటు చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంతో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల అధిక నష్టం జరిగింది సీమాంధ్ర ప్రాంతానికే అని అంతా అంగీకరిస్తుంటారు. అప్పుడు మళ్లీ రాజధాని సమస్య మొదటికి వచ్చింది. ఉమ్మడి హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉండాల్సి ఉన్నా, ఓటుకు నోటు కేసు కారణంగా చంద్రబాబు ప్రభుత్వం ఆకస్మికంగా ఏపీకి తరలివెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రీబాగ్ ఒడంబడిక అంశం తిరిగి తెరపైకి వచ్చింది. విజయవాడగుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నందున కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. అయినా అప్పట్లో ప్రభుత్వం అంగీకరించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేయడం, అక్కడే అన్ని ఆఫీస్ లు నెలకొల్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. తదుపరి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ,కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల విధానానికి శ్రీకారం చుట్టింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే అంతర్జాతీయంగా కూడా రాష్ట్రానికి గుర్తింపు తేవచ్చని అప్పటి ముఖ్యమంత్రి జగన్ భావించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. ఆ విషయంలో చట్టం కూడా చేయడానికి సంకల్పించినా తెలుగుదేశం పార్టీ పలు చిక్కులు కల్పించగలిగింది. దాంతో ఆ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, 2024 ఎన్నికల తర్వాత ఆ ప్రణాళిక అమలు చేయవచ్చని భావించింది. కానీ వైఎస్సార్సీపీ ఓటమిపాలై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విశాఖలో కార్యనిర్వవహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మంగళం పలికినట్లయింది. అమరావతి రాజధానికి ఏభైవేల ఎకరాలకు పైగా సేకరించాలని తలపెట్టడం, తదితర అంశాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తొలుత వ్యతిరేకించినా, ఆ తర్వాత కాలంలో అవి తమ వైఖరి మార్చుకున్నాయి. బీజేపీ అయితే రాయలసీమలో హైకోర్టుతోపాటు, సచివాలయం కూడా ఏర్పాటు చేయాలని ప్రత్యేక డిక్లరేషన్ కూడా ప్రకటించి, తదుపరి ప్లేట్ మార్చేసింది. జగన్ మాత్రం కర్నూలులో న్యాయ రాజధానిలో భాగంగా లోకాయుక్త, హెచ్ఆర్సీ, సీబై కోర్టు, లా యూనివర్శిటీ వంటివి కొన్నింటిని స్థాపించే ప్రయత్నం చేశారు. అమరావతిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కొన్ని ఆఫీసుల ఏర్పాటుపై టీడీపీతోపాటు ఈనాడు, జ్యోతి వంటి మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే అమరావతితోపాటు విశాఖ, కర్నూలు లకు జగన్ ప్రాధాన్యత ఇస్తే, మూడు ప్రాంతాలలో వైఎస్సార్సీపీ పరాజయం చవిచూసింది. ఈవీఎంల మహిమో, ప్రజల ఓట్లో కారణం తెలియదు కాని టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, కర్నూలు నుంచి వివిధ ఆఫీసులకు రంగం సిద్ధమవుతూండటం జరిగిపోయింది. ఇప్పుడు రాయలసీమ ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమలోని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు దీనిపై బహిరంగంగా తమ అభిప్రాయాలను చెప్పలేకపోతున్నా, వారికి భయం పట్టుకుంటుంది. వైఎస్సార్సీపీ నేతలైతే కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆఫీసుల తరలింపుపై మండి పడుతున్నారు. లాయర్లు కూడా తమకు అన్యాయం జరుగుతోందని ప్రకటించి వారం రోజుల పాటు కోర్టుల బహిష్కరణ పాటించారు కూడా. ఈ ఆందోళనలు కాస్తా ఉద్యమరూపం దాల్చితే, మళ్లీ ప్రాంతాల మధ్య వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర వాసులు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ స్టీల్‌ను రక్షిస్తామని చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే ఒకసారి విశాఖ నుంచి ఒక రైల్వే ఆఫీస్ ను విజయవాడకు తరలించాలని ప్రతిపాదనలు వస్తే ఆ ప్రాంత ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. దాంతో అది ఆగింది. మరి ఇప్పుడు కర్నూలు నుంచి ఆఫీస్ లను తరలిస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో స్పందిస్తారో అప్పుడే చెప్పలేం. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్దికి కేంద్రం రూ.250 కోట్లతో మంజూరు చేసిన కార్యాలయాన్ని కూడా తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టింది. ఇది కూడా రాయలసీమ వ్యతిరేక సెంటిమెంట్ కు దారి తీయవచ్చు. జగన్ కొప్పర్తి వద్ద పారిశ్రామికవాడను అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దానికి విఘాతం కలుగుతుందా అన్నది కొందరి అనుమానం. అమరావతిలో కొత్త సంస్థలను తీసుకు రాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని కార్యాలయాలను అక్కడకు తీసుకువెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న కూడా ఉంది. హైదరాబాద్ లో మాదిరి అన్నీ అమరావతిలోనే కేంద్రీకరిస్తే నష్టం జరుగుతుందేమోనన్న భయం కూడా లేకపోలేదు. అయినప్పటికి టీడీపీ ప్రభుత్వం కేంద్రీకరణవైపే మొగ్గు చూపుతోంది. పేరుకు విశాఖను ఆర్థిక రాజధానిని చేస్తామని అంటున్నా అదెలాగో ప్రభుత్వం వివరించలేకపోతోంది.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా, ఈలోగా లోకాయుక్త తదితర ఆఫీసులను తీసుకుపోవడం ఏమిటన్నది పలువురి ప్రశ్నగా ఉంది. అసాధారణ మాండేట్ వచ్చినందున తాము ఏమి చేసినా ఎదురు ఉండదని, రాయలసీమ ప్రజలు ఆందోళనలకు సిద్దమయ్యే పరిస్థితి లేదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. అలా ఆ ప్రాంత ప్రజలు ఎదిరించకపోతే కూటమికి ఇబ్బంది ఉండదు. కాని రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత చేతులు కాల్చుకోవడం కన్నా, ముందుగానే చంద్రబాబు నాయుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకుని దీనిపై నిర్ణయం చేస్తే మంచిదని చెప్పాలి. లేకుంటే ప్రాంతీయ విద్వేషాలు రాజుకునే ప్రమాదం ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తోచిన అంకెలతో చంద్రబాబు గారడి.. ఈ ఐదేళ్లు ఇలాగే పాలన సాగిస్తారా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సవాల్ చేస్తున్నదేమిటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నది ఏమిటి? ప్రజలను అసలు విషయాల నుంచి తప్పుదారి పట్టించడంలో చంద్రబాబు ఘనాపాటియే అని అంగీకరించాలి. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, అలాంటి వారిని అరెస్టు చేస్తే,తొలుత తనను అరెస్టు చేయండని జగన్ సవాల్ చేశారు. బాబు మోసాలపై తాను ట్వీట్ చేస్తున్నానని, తన పార్టీ నేతలు, క్యాడర్ కూడా ట్వీట్ చేస్తారని, ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టండని, ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దాం అని జగన్ అన్నారు. బడ్జెట్లో చంద్రబాబు మోసాలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియచేస్తామని, సోషల్ మీడియాలో ఎండగడతామని ఆయన అన్నారు. దీనికి చంద్రబాబు ఏమని జవాబు ఇవ్వాలి? తానుమోసం చేయలేదని చెప్పగలగాలి. జగన్ చేస్తున్న వాదన సరికాదని నిరూపించగలగాలి. అలా కాకుండా ఆయన ఏమంటున్నారో గమనించండి..ఎల్లో మీడియాలో వచ్చిన కధనం ప్రకారం శాసనసభలో ఆయన ప్రసంగిస్తూ' కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులా!పశువులా!తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసేవారికి మనమో లెక్క?అని అన్నారట.ఇది చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రజలను తప్పుదారిటీడీపీ పట్టించే యత్నమా?కాదా?ఎవరు ఎవరి తల్లికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు?ఎంత అన్యాయంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు!పోనీ ఫలానా వ్యక్తి అని చెప్పకుండా, ఏదో పత్రికలలో ఎవరిమీదనో అన్యాపదేశంగా వార్తలు రాసినట్లు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయవచ్చా?అన్నది ఆలోచించుకోవాలి.చంద్రబాబు మరో వ్యాఖ్య చూడండి.. కూటమిలోని నేతలు , కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరని, ఒకవేళ పెడితే శిక్షిస్తామని ఆయన అన్నారు. ఇందులో లేశమంతమైనా వాస్తవం ఉందా? ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా టీడీపీ ప్రత్యేకించి ఐటీడీపీ పేరుతోనో,మరో పేరుతోనో కొంతమంది కార్యకర్తను సోషల్ మీడియా కోసం వినియోగించింది..అందులో ఎందరు దారుణమైన వికృత పోస్టింగ్ లు పెట్టింది తెలియదా?వారికి స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లే మద్దతు ఇచ్చింది అవాస్తవమా?సీఎంగా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా జగన్ ను ,ఆయన కుటుంబ సభ్యులను దూషించి, అసభ్యకర పోస్టింగ్ లు పెట్టినవారిపై ఒక్కరి మీద అయినా కేసులు పెట్టారా?కనీసం ఖండించారా?పైగా ఇప్పుడు తమవాళ్లు ఎవరూ పెట్టరని సూక్తులు చెబుతున్నారు.అంతెందుకు జగన్ అధికార టీడీపీ వెబ్ సైట్ లో తన తల్లిపైన పెట్టిన ఒక అబద్దపు పోస్టు గురించి ప్రస్తావించి చంద్రబాబు, లోకేష్‌లను అరెస్టు చేస్తారా?అని డీజీపీని ప్రశ్నించారు.అందులో రెండేళ్ల క్రిం విజయమ్మ ప్రయాణిస్తున్న ఒక వాహనం టైర్ పంక్చర్ అయితే ఆమె రోడ్డుపక్క నిలబడి ఉన్న ఫోటోని తీసి, ఈ మధ్యే జరిగినట్లు, జగన్ ఆమెను చంపడానికి ఇలాంటి కుట్ర చేశారని టీడీపీ వెబ్ సైట్ లో పెటిన విషయాన్ని ఆధారాలతో సహా తెలిపితే, చంద్రబాబు అది నిజమా?కాదా? అన్నది ఎందుకు చెప్పలేదు?అంతే!అదే చంద్రబాబు స్టైల్. తను చేసే తప్పులను కూడా ఎదుటివారిపై పెట్టడంలో ఆయన నేర్పరి అని అంటారు.మరో వైపు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా శాసనమండలిలో మాట్లాడుతూ తన అమ్మను అవమానించారు..వారిని సహించాలా అని ప్రశ్నించారు. ఎవరూ సహించాలని చెప్పరు.అసెంబ్లీలో ఎవరూ అలా మాట్లాడకపోయినా,నెపం నెట్టి ప్రచారం చేశారన్నది వైఎస్సార్సీపీవారి వాదన. ఆ వంకతో రాజకీయాల కోసం పదే,పదే అదే విషయాన్ని ప్రస్తావించడం అమ్మకు గౌరవమా?అన్నది ఆలోచించాలి.అదే టైమ్ లో జగన్ భార్య భారతి మీద, వారి కుటుంబ సభ్యులపైన పెట్టిన దారుణమైన అనుచిత పోస్టింగ్‌ల మాటేమిటి?మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు కొడాలి నాని తదితరుల కుటుంబ సభ్యులపై ఎంత అసభ్యకర పోస్టింగ్ లు పెట్టారో సాక్ష్యాలతో సహా చెప్పినా, అసలుఏమీ జరగనట్లు చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీసులు వ్యవహరిస్తున్నారే! వీటిపై చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎక్కడా నోరు విప్పరు.జగన్ ఏపీ బడ్జెట్ పై వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు వచ్చాక 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేశారు..15వేల మంది బెవరేజెస్ ఉద్యోగులను తీసేశారు..నిరుద్యోగులకు మూడువేల భృతి ఎగవేస్తున్నారు.తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి పదిహేను వేల చొప్పున ఇవ్వడానికి 13 వేల కోట్లు అవసరమైతే,ఎంత మొత్తం పెట్టారని ప్రశ్నించారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు..అలా చేయలేదు..ఇవన్ని మోసాలా?కాదా?అని జగన్ అడిగారు.వీటిలో ఒక్కదానికి కూడా చంద్రబాబుకాని, ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కాని నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు.చంద్రబాబు మాత్రం యధాప్రకారం గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, విధ్వంసం చేసిందని ఆరోపించారు. రాత్రికి రాత్రే అధ్బుతాలు జరుగుతాయని అనుకోవడం లేదని చేతులెత్తేశారు.ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అన్నీ అద్బుతాలే చేస్తామని,సంపద సృష్టిస్తామని చెప్పడం అబద్దాలాడినట్లే కదా?అప్పుడు చెప్పినవాటి గురించి , హామీల గురించి ప్రశ్నిస్తే వారిమీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం తప్పుకాదా?జగన్ బడ్జెట్ పుస్తకాలలో ఉన్న అప్పుల లెక్కల గురించి ప్రస్తావించి, తన హయాంలో అప్పులు 14 లక్షల కోట్లకు వెళ్లాయని అబద్దాలు చెప్పినట్లు కూటమి బడ్జెట్ లోనే తేలింది కదా అని అన్నారు. మొత్తం అప్పు ఏడు లక్షల కోట్ల లోపే ఉన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం అంగీకరించింది కదా అని అన్నారు. అందులోను విభజన నాటికి ఉన్న అప్పు, తదుపరి చంద్రబాు ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు పోను అంతా కలిపి తమ హయాంలో మూడు లక్షల కోట్ల అప్పే కదా అని అడిగారు.అందులో కూడా రెండేళ్లు కరోనా సమస్య ఉందన్న సంగతి గుర్తు చేశారు.దీనికి చంద్రబాబు ఆన్సర్ ఇవ్వలేదు సరికదా..మళ్లీ పాత విమర్శలనే చేశారు.తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనేమో ఆరున్నర లక్షల కోట్లు అని చెబుతారు. ఉపన్యాసంలో మాత్రం జగన్ పాలన పూర్తి అయ్యేసరికి 9.74 లక్షల కోట్లు అని అంటారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పద్నాలుగు లక్షల కోట్లు అనడంపై ఎక్కడా వివరణ ఇవ్వరు. అదే చంద్రబాబు విలక్షణ సరళి అని చెప్పుకోవాలి. జగన్ టైమ్ లో జిఎస్టి, జిఎస్‌డిపి,తలసరి ఆదాయం అన్నీ పెరుగుదల చూపినా, వాటినన్నిటిని తోసిపుచ్చుతూ తనకు తోచిన అంకెలతో చంద్రబాబు గారడి చేశారు. జగన్ టైమ్ లో విద్యుత్ చార్జీలు కొద్దిగా పెరిగినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు గగ్గోలుగా ప్రచారం చేసేవారు. ఎల్లో మీడియా పూనకం వచ్చినట్లు ఘీబెట్టేది. అదే చంద్రబాబు టైమ్ లో ఏకంగా యూనిట్ కు రూపాయిన్నర వరకు పెరిగినా, అందుకూ జగన్ ప్రభుత్వమే కారణమని ప్రచారం చేస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెరగవని, పైగా తగ్గిస్తానని చెప్పారుగా అని ఎవరైనా అడిగితే,ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా?అని కేసులు పెట్టే పరస్థితి ఏర్పడింది.వీటిపై జగన్ నిలదీసినా చంద్రబాబు కాని ఆయన మంత్రులు కాని నోరుపారేసుకోవడం తప్ప సమాధానం ఇవ్వడం లేదు.జగన్ అసెంబ్లీలో తనకు ఎలాగూ అవకాశం ఇవ్వరని, సవివరంగా తన ఆఫీస్ నుంచే బడ్జెట్ పై మాట్లాడి అనేక ప్రశ్నలు సంధించారు .చంద్రబాబువి అన్నీ మోసాలేనని ,సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, జగన్ స్పష్టం చేస్తూ అదే ప్రకారం చేశారు. ఆయనతో పాటు పార్టీ నేతలు,కార్యకర్తలు కూడా అలాగే పోస్టు చేశారు.దానిపై మాత్రం చంద్రబాబు మాట్లాడరు.కాని అసభ్య పోస్టులు అంటూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారు.చంద్రబాబు ఈ ఐదేళ్లు ఇలాగే పాలన సాగిస్తారా?ఏమో పరిస్థితి చూస్తే అలాగే ఉంది.జగన్ అడిగేవాటికి జవాబులు చెప్పలేనప్పుడు చంద్రబాబుకు ఇదొక్కటే మార్గమా!కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం?
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుకు ఏదో శాపం ఉన్నట్లుంది. దేశంలో ఇంతలా జాప్యం జరిగిన ప్రాజెక్టు ఇంకోటి ఉండదేమో. ఇన్నేళ్ల తరువాతైనా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ముహూర్తం దగ్గరపడిందని అనుకుంటూ ఉండగానే పిడుగులాంటి వార్త ఇంకోటి వచ్చిపడింది. ప్రాజెక్టు ఎత్తును నాలుగున్నర మీటర్ల మేర తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్న ఈ వార్త ఆందోళన కలిగించేదే. తొలిదశలో నీటిని నిలబెట్టడానికి నిర్దేశించిన ఎత్తునే పూర్తి స్థాయి మట్టంగా కేంద్రం నిర్ణయిస్తే, ఈ ప్రాజెక్టు నుంచి ఆశించిన ఫలితం ఉండదన్న భయం ఏర్పడుతోంది. అలాగే.. డీపీఆర్‌లోని తప్పుల కారణంగా కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ముందుగా ఈ రెండు కాల్వల ద్వారా 17500 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు ప్రవహించాలని అనుకున్నారు. కానీ 2017లో డీపీఆర్ తయారీ సమయంలో జరిగిన తప్పుల కారణంగా కుడి కాల్వలో 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వలో ఎనిమిది వేల క్యూసెక్కుల వరకు పారేందుకు అయ్యే నిర్మాణ ఖర్చును మాత్రమే కేంద్రం ఇస్తానందట. దీంతో ఇప్పుడు కాలువల సామర్థ్యం తగ్గించుకోవడం లేదంటే.. రూ.4500 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కాల్వలను ముందనుకున్న ఆలోచనల ప్రకారం కట్టుకోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఇప్పటిది కాదు. వందేళ్ల క్రితమే బ్రిటిష్ పాలనలోనే ఆరంభమైంది. పలుమార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఎన్.టి.రామారావు, టంగుటూరి, అంజయ్య వంటివారు ఈ ప్రాజక్టు పురోగతికి ప్రయత్నించారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇది వేగంగా ముందుకెళ్లిందనేది వాస్తవం. నిర్వివాదాంశం. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల సాధన, ముంపు ప్రాంతాల్లో భూ సేకరణ, కుడి, ఎడమ కాల్వల నిర్మాణాల్లో ఆయన చూపిన చొరవ మర్చిపోలేనిది. అప్పట్లో ప్రాజెక్టు పూర్తయితే భూ సేకరణ కష్టమవుతుందన్న అంచనాతో ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలలో భూ సేకరణ చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ తెలుగుదేశం దీన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం వారితో కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించారు. ప్రాజెక్టు లేకుండా కాల్వలు ఏమిటని ఎద్దేవ చేసేవారు. అయినా వైఎస్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దాదాపు అన్ని అనుమతులు వచ్చి, ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే టైమ్‌కు ఆయన మరణించడం ఆంధ్రప్రజల దురదృష్టం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడానికే ఐదేళ్లు తీసుకున్నాయి. అంతలో రాష్ట్ర విభజన సమస్య ముందుకు వచ్చింది. ఆ టైమ్ లో ఆంధ్ర ప్రజలలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అంటే దాని అర్థం మొత్తం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు, భూ సేకరణ చేసి, నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చి వారికి ప్రత్యామ్నాయ వసతులు సమకూర్చి పూర్తి చేయడం అన్నమాట. కానీ 2014లో విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాంతో మరింత గందరగోళం ఏర్పడింది. అంతకు ముందు ఎంపికైన కాంట్రాక్టర్‌ను మార్చడం, తమకు కావల్సిన వారితో పనులు చేయించడం, అవి కాస్తా అవినీతి అభియోగాలకు గురి కావడం తదితర పరిణామాలు సంభవించాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీనే ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ మాదిరి మారిపోయిందని వ్యాఖ్యానించడం ఇక్కడ మనం గుర్తుకు చేసుకోవాలి. నిజానికి చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై నమ్మకం లేదు. అవి సకాలంలో పూర్తి కావని, ఎన్నికల సమయానికి ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే ఆయన మైనర్ ఇరిగేషన్, ఇంకుడు గుంతలు వంటివాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే భారీ ప్రాజెక్టులు చేపట్టకపోతే ప్రజలలో అప్రతిష్టపాలు అవుతామని భావించి, వారిని నమ్మించడానికి ఎన్నికలకు కొద్దికాలం ముందు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేవారు.ఆ తర్వాత వాటిని వదలి వేశారు.1999 ఎన్నికలకు ముందు ఇలా ఆయన శంకుస్థాపన చేసి, అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టిన ప్రాజెక్టుల శిలాఫలకాల వద్ద అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూలు పెట్టి వచ్చిన ఘట్టాలు కూడా జరిగాయి. 2014 లో మరోసారి సీఎం. అయిన తర్వాత సోమవారం పోలవారం అంటూ కథ నడిపారు. ఈ ప్రాజెక్టు తన కల అని ప్రచారం చేసుకునే వారు. జయము, జయము చంద్రన్న అంటూ పాటలు పాడించడం, వేలాది మందిని ప్రాజెక్టు సందర్శనకు తీసుకు వచ్చామని చెబుతూ కోట్ల రూపాయల బిల్లులను మాత్రం చెల్లించడం ప్రత్యేకతగా తీసుకోవాలి. స్పిల్ వే పూర్తి కాకుండా, ఒక గేట్ మాత్రం అమర్చి, అప్పర్, లోయర్ కాఫర్ డామ్ ల నిర్మాణం కంప్లీట్ చేయకుండా, డయాఫ్రం వాల్ నిర్మించి కొత్త సమస్యలు తీసుకొచ్చారు. కీలకమైన డామ్ ,రిజర్వాయిర్ మాత్రం పూర్తి కాలేదు. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో సుమారు రూ.800 కోట్ల మేర ఆదా చేసి పనులు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. స్పిల్ వేని పూర్తి చేసి, 48 గేట్లను అమర్చేందుకు చర్యలు తీసుకున్నారు. అంతలో భారీ ఎత్తున వరదలు రావడంతో చంద్రబాబు టైమ్‌లో కాపర్ డామ్ కోసం వదలిపెట్టిన గ్యాప్‌ల గుండా నీరు ప్రవహించి, డయాఫ్రం వాల్ ను దెబ్బ తీసింది. దానిపై కేంద్ర సంస్థలు కొత్త వాల్ కట్టాలా? లేక పాతదాన్ని పునరుద్దరించాలా అన్న దానిపై తేల్చడానికి ఏళ్ల సమయం పట్టింది. కాఫర్ డామ్ పూర్తిగా కడితే, వెనుక ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతాయి. వారికి పరిహారం చెల్లించలేదు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం జరగలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం గాప్ లను వదలి పెద్ద తప్పు చేసిందని నిపుణులు తేల్చారు. కానీ ఈ మొత్తం నెపాన్ని జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రయత్నించాయి. జగన్ టైమ్ లో తొలిదశలో 41.15 మీటర్ల వద్ద నీరు నిలిపి ప్రాజెక్టును ఒక దశకు తీసుకు రావాలని తలపెడితే, చంద్రబాబు, ఎల్లో మీడియా నానా రచ్చ చేశాయి. ఏపీకి జగన్ అన్యాయం చేస్తున్నారని దుష్ప్రచారం చేశారు. నిర్వాసితులను వేరే ప్రదేశాలకు తరలించడం, వారిని ఆర్థికంగా ఆదుకోవడం వంటివి చేశాక 45.72 మీటర్ల వద్ద నీటిని నిల్వచేసే విధంగా రిజర్వాయిర్ పనులు సంకల్పించారు. అదే టైమ్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు కూడా వేగంగా సాగాయి. కరోనా రెండేళ్ల కాలంలో కూడా పోలవరం పనులు జరిగేలా కృషి చేశారు. అయినా డయాఫ్రం వాల్ కారణంగా జాప్యం అయింది. ఈ లోగా మళ్లీ ప్రభుత్వం మారింది. అదే టైమ్ లో ఒడిషా, చత్తీస్గడ్ లలో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కేంద్రంలో ఎటూ బిజెపినే అధికారంలో ఉంది. ఆ కూటమిలో టీడీపీ, జనసేన కూడా భాగస్వాములు అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిర్మాణం జరిగితే ఒడిషా, చత్తీస్ గడ్, తెలంగాణలలోని కొన్ని భూ భాగాలు ముంపునకు గురి అవుతాయి. అక్కడ వారికి కూడా పరిహారం ఇవ్వడానికి గతంలోనే అంగీకారం కుదిరింది. చత్తీస్ గడ్ ప్రాంతంలో ముంపు బారిన పడకుండా గోడలు నిర్మించాలని కూడా ప్రతిపాదించారు.అయినా పూర్తి మట్టం ఒప్పుకుంటే రాజకీయంగా ఆ రాష్ట్రాలలో విపక్షాలు విమర్శలు చేస్తాయని, ఏపీకి సహకరిస్తే రాజకీయంగా తమకు నష్టమని భావించాయి. తెలంగాణలో కూడా దీనిపై కొంత రాజకీయం నడుస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కూటమిలోని టీడీపీ, జనసేనలను లోబరుచుకుని 41.15 మీటర్లకే ప్రాజెక్టును పరిమితం చేయడానికి ఒప్పించాయని భావిస్తున్నారు. అందువల్లే కేంద్ర క్యాబినెట్ ఎత్తు తగ్గించడంపై ఆగస్టు 28 నే తీర్మానం చేసినా, అందులో టీడీపీ క్యాబినెట్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సభ్యుడుగా ఉన్నా, ఆయన నోరు మెదపలేదట. దీనిని టీడీపీ,బీజేపీలు అత్యంత రహస్యంగా ఉంచాయి. ఎలాగైతేనేం అక్టోబర్ ఆఖరు నాటికి ఈ విషయం బయటకు వచ్చింది. దానిపై సమాధానం ఇవ్వడానికి మంత్రి నిమ్మల రామానాయుడు నీళ్లు నమిలారు. మామూలుగా అయితే సుదీర్ఘంగా ఉపన్యాసాలు, మీడియా సమావేశాలు పెట్టే చంద్రబాబు ఈ అంశం జోలికి వెళ్లినట్లు లేరు. దీనిని బట్టే ఎంత గుట్టుగా ఈ వ్యహారాన్ని సాగించాలని అనుకున్నది అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఎత్తు తగ్గించడం వల్ల వరద వస్తేనే ఈ ప్రాజెక్టు నీటిని విశాఖ వరకు తీసుకు వెళ్లడం కష్టసాధ్యం అవుతుందని చెబుతున్నారు. 195 టీఎంసీల బదులు 115 టీఎంసీల నీటి నిల్వకే అవకాశం ఉంటుంది. కేవలం ఒక రిజర్వాయిర్ గానే ఇది మిగిలిపోతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఏపీ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతింటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా స్పందించే సీఎం కాని, మంత్రులు కాని, దీనిపై నోరు మెదపడం లేదు. ఓవరాల్ గా చూస్తే ఏపీకి సుమారు పాతిక వేల కోట్ల మేర కేంద్రం ఎగవేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు సందేహాలు వస్తున్నాయి. దానికి తోడు పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అంతటికి మేలు జరగాలన్న లక్ష్యం నెరవేరడం కష్టం కావచ్చు. ఇదంతా చూస్తే బీజేపీకి పొరుగు రాష్ట్రాలలో ఇబ్బంది లేకుండా చూడడానికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారన్న విమర్శలకు ఆస్తారం ఇస్తున్నారనిపిస్తుంది. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబుగారి మాటలకు అర్థాలే వేరులే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రతి మాట వెనుక వ్యూహమేదో ఉండే ఉంటుంది. ప్రత్యేకించి ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు ఆయన ఉపయోగించేవి. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అందులో ఆయన ‘‘ప్రజలు గమనిస్తూంటారు.. జాగ్రత్త’’ అని హెచ్చరించినట్లు ఎల్లోమీడియా ఒక కథనం ప్రచురించింది. మంచిదే! కానీ.. ప్రజలు కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే కాకుండా.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పాలన, మాటలను కూడా గమనిస్తూంటారు. ఏ ఏ ప్రకటనలు చేసింది. ఇచ్చిన వాగ్ధానాలు.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు ఏం చేశారన్నది కూడా ప్రజల గమనంలోనే ఉంటుంది. ఈ విషయాలేవీ చంద్రబాబుకు తెలియవని కాదుక ఆనీ.. మీడియాలో వచ్చిన ఆ కథనం చూస్తే మరిన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ కోసం ఏం మాట్లాడుతున్నారో ఆయా నియోజకవర్గాల ప్రజలు గమనిస్తూంటారని చెబుతూ... సభ బయట ఇసుక, మద్యం వంటి వ్యవహారాల్లో, ప్రైవేట్ పంచాయితీల్లోనూ ప్రజా ప్రతినిధులు ఎవరూ తలదూర్చరాదని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారట. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన నిజంగానే చిత్తశుద్దితో ఈ హితబోధ చేసి ఉంటే అభినందించాల్సిందే. కానీ ఈ ఐదున్నర నెలలు జరిగిందేమిటి? అసలు ప్రభుత్వం ఉందా?లేదా? అన్న అనుమానం కలిగేలా పాలన సాగితే ప్రజలు గమనించరా?ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూటమి అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 80 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. కానీ.. ఇందులో సగం అంటే దాదాపు 40 లక్షల టన్నుల ఇసుక మొదటి పది రోజులలోనే టీడీపీ, జనసేన నేతలు ఇష్టారీతిన అమ్మేసుకున్నారు! అలాగే.. రాష్ట్రంలో ఇసుక ఉచితమన్నది పేరుకే పరిమితమైంది. వాస్తవానికి గతంలో కంటే ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తోంది. పోనీ ఇలా కట్టిన మొత్తాలేమైనా ప్రభుత్వానికి పన్నుల రూపంలో జమ అయ్యాయా? అదీ లేదు. కూటమి నేతల జేబుల్లోకి చేరుతున్నాయి.ఈ అవ్యవహారాలన్నీ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలియకుండానే జరిగాయంటే నమ్మలేము. తొలి పది రోజుల్లో అమ్ముకున్నట్టుగానే మిగిలిన సగం ఇసుక కూడా అయిపు, అజా లేకుండా మాయమైపోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్‌లు ఇద్దరూ ఈ అంశాలపై చూసిచూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలూ వచ్చాయి.అవసరమైన వారికైనా ఇసుక ఉచితంగా ఇప్పించేందుకు ఏమైనా ఏర్పాట్లు చేశారా? లేదు. పైగా ఇసుకకు జీఎస్టీ, సీవరేజీ ఛార్జి అని ప్రభుత్వం పేరు చెప్పి వసూలు చేశారు. దీంతో ప్రజలు గగ్గోలు పెట్టారు. కొంత సమయం తరువాత ఇసుక రీచ్‌లన్నింటినీ పైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రెండు ,మూడు నెలల్లోనే బోలెడన్నిసార్లు ఇసుక పాలసీని మార్చారు. ఇంత చేసిన తరువాతైన ఇసుక సక్రమంగా లభిస్తోందా? ఊహూ..! పైగా.. బాట ఛార్జిలనీ, లోడింగ్ ఛార్జీలంటూ కలిపి బాదుతున్నారని సమాచారం. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా... ఇసుక అమ్మకాల ద్వారా సుమారు నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కానీ అప్పట్లో టీడీపీ, జనసేన బీజేపీ నేతలు ప్రజలపై ఇంత భారం మోపుతారా? అని దుష్ప్రచారానికి దిగారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం మంచిదా? లేక ప్రస్తుతం జరుగుతున్నట్లు ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లడం కరెక్టా? ఇవన్నీ ప్రజలు గమనించరా?తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి బహిరంగంగానే తనకు రావాల్సిన కమిషన్ 30 శాతం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినా ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదన్నది అక్కడి ఎమ్మెల్యేకు, ప్రజలకు తెలియకుండా పోతుందా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. చంద్రబాబు స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎమ్మెల్యేలు అవినీతి అనండి..ఇంకొకటి అనండి..ఏమి చేసినా, అది జనానికి తెలియకుండా ఉంటే ఫర్వాలేదు. వారి గురించి జనం మరీ ఎక్కువగా తిట్టుకుంటున్నట్లు సమాచారం వస్తే, అప్పుడు ఆయన ఆగ్రహం చెందినట్లు ఎల్లో మీడియాకు లీకులిస్తూంటారు.ఎమ్మెల్యే పదవికి పోటీచేసినప్పుడు వారితో ఎంత ఖర్చు పెట్టించింది ఆయనకు తెలుసు కదా! దానికి తగ్గట్లుగా ఇప్పుడు ఇసుక, మద్యంలలో ఆదాయం వచ్చేలా చేసిందే చంద్రబాబు అని చాలామంది అభిప్రాయం. చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఉత్తిపుణ్యానికి పార్టీ నేతలు వందల, వేల కోట్ల విలువైన ఇసుకను సొమ్ము చేసుకుంటూటే చూస్తూ ఉరకుంటాడా? పోలీసులతో కనీసం కేసులైనా పెట్టించి ఉండాల్సింది కదా? అలా ఏం చేయలేదంటే అర్థమేమిటి? చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఇసుక విధానం బాగోలేదని అన్నప్పుడు చంద్రబాబు వివరాలు కోరాలి కదా! కానీ బాబు ఆయన్ను చివాట్లు పెట్టేలా మాట్లాడినట్లు అనిపిస్తుంది."ముందు మీరు ఇసుక పాలసీలో ఏముందో తెలుసుకుని మాట్లాడండి..ఎక్కడైనా సమస్య ఉంటే చెప్పండి’’ అని చంద్రబాబు అన్నారట. ఇది ఎల్లో మీడియాలో వచ్చిన విషయమే. చంద్రబాబు ఈ మాట అన్న తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా నోరు తెరవడానికి సాహసిస్తారా? ఇలాంటి వాటిని ప్రజలు గమనించరా? ఇక ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయే విషయాలు కూడా చంద్రబాబు చెప్పినట్లు అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన 150 రోజులలోనే అనేక హామీలు అమలు చేశామని ఆయన అన్నారట. ఏ రాష్ట్రంలోను ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని అన్నారట.అన్నా క్యాంటీన్లు, దీపం పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆయన చెప్పేవి నిజమో, కాదో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలియదా! 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం సుమారు 45 లక్షల పెన్షన్లు ఇస్తే, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఆ పెన్షన్లను పార్టీలకు అతీతంగా 64 లక్షలకు పెంచింది. ఆ సంఖ్యను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారన్న మాట. అయితే పెన్షన్‌ను రూ. వెయ్యి పెంచి ఇచ్చింది వాస్తవం. ఆ హామీని నెరవేర్చినా, ఈ కొద్ది నెలల్లో కొన్ని లక్షల మందికి పెన్షన్లు కట్ అయ్యాయన్న సంగతిని ఎమ్మెల్యేలు మర్చిపోవాలన్నమాట. అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు కానీ భోజనం నాణ్యత గురించి వస్తున్న విమర్శలు తెలిసినవే.దీపం స్కీమ్‌లో కోటిన్నర కుటుంబాలకు ఉచిత సిలిండర్లు ఇస్తారనుకుంటే ఇప్పటికి కేవలం ఐదు లక్షల మందికే ఇచ్చారు. అయినా ఈ హామీ అమలు చేసినట్లు భావించాలన్నమాట. ఈ రకమైన ప్రచారమే చేయాలని ఆయన శాసనసభ్యులకు సూచిస్తున్నారు. ఎక్కడన్నా సూపర్ సిక్స్ అంశాలను, ప్రత్యేకించి తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు, ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ప్రతి నెల రూ.1500 నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల రూ.మూడు వేలు మొదలైనవాటి గురించి ఎమ్మెల్యేలకు ప్రశ్నించాలని ఉన్నా, వారు నోరు తెరవక ముందుగానే తాళం వేసేశారన్న సంగతి అర్థం చేసుకోవాలి.ప్రజలు వీటిని గ్రహించకుండా ఉంటారా? ఇక మద్యం విషయం కూడా చెప్పుకోవాలి. గతంలో ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేసి, మద్యాన్ని నియంత్రించే యత్నం జరిగింది. ఎక్కడో ఊరుబయట షాపులు ఉండేవి.అక్కడకు వెళ్లాలంటేనే కాస్త సిగ్గుపడే పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ షాపులు వచ్చేశాయి. ప్రైవేటు సిండికేట్లు రాజ్యం ఏలుతున్నాయి. బెల్ట్ షాపుల సంగతి సరేసరి. కొన్నిచోట్ల ఆ బెల్ట్ షాపుల వద్ద బడులకు వెళ్ళే పిల్లలు కూర్చుని కనిపిస్తున్నారు. ఇదంతా సంక్షేమం, అభివృద్దిని జోడు గుర్రాల్రా పరుగెత్తులించడమేనని ఎమ్మెల్యేలు అనుకోవాలన్నమాట. ఎందుకంటే చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ మద్యం షాపులలో వాటాలు పొందారట.ఎవరైనా వాటా ఇవ్వకపోతే వారిని బెదరించారన్న వార్తలు టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియాలో కూడా వచ్చాయి. అంతా అయిపోయాక చంద్రబాబు ఎమ్మెల్యేలను ఇసుక, మద్యం విషయాల్లో జోక్యం చేసుకోకండని నీతి వచనాలు చెప్పారనుకోవాలి. దానివల్ల ఉపయోగం ఏమి ఉంటుంది? మద్యం షాపులలో ఏ టీడీపీ నేతకు ఎంత వాటా ఉందో ప్రజలకు తెలియదా? పోలీసు యంత్రాంగానికి తెలియదా? వారి ద్వారా చంద్రబాబుకు సమాచారం ఉండదా? ఉంటుంది. అయినా ఉపన్యాసం చెప్పేటప్పుడు అలాగే మాట్లాడాలి. అది ఆయన తెలివితేటలకు నిదర్శనమని వేరే చెప్పనవసరం లేదు. ఇక మరికొన్ని అంశాలు చూడండి.ప్రతి నియోజకవర్గానికి పర్యాటక హబ్ అట. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు ఏర్పాటు అట. దానికి ఎమ్మెల్యే ఛైర్మన్ అట. అయితే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలే తీసుకోవాలట. ఇవన్ని జరిగే పనులే అయితే పద్నాలుగేళ్లు సీఎంగా ఇప్పటికే అనుభవం ఉన్న చంద్రబాబు ఈ పాటికే అమలు చేసి ఉండేవారు కదా అని ఎవరికైనా సందేహం వస్తే, అది వారి మనసులోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటనే వారికి క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా! శాసనసభలో ఎమ్మెల్యేలు అన్ని విషయాలు చర్చించాలని చెబుతూనే గత ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నట్లుగా సంకేతాలు ఇవ్వడం ఆయన విశిష్టతగా భావించాలి.ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వ తీరును, ఎమ్మెల్యేలు, కూటమి నేతల ప్రవర్థనను ప్రజలు ఇప్పటికే గమనించారు. ప్రజలలో గూడు కట్టుకున్న అసంతృప్తిని డైవర్ట్ చేయడానికే ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులతో దాడులు చేయిస్తున్న సంగతిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అయినా తన ప్రచార వ్యూహాలతో జనాన్ని మాయ చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్ అని వేరే చెప్పనవసరం లేదుగా! అది చంద్రబాబు నాయుడి తెలివి అనుకోవాలో, మరేమనుకోవాలో!::: కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అధికారంతోనే పచ్చ బ్యాచ్ స్వరం మారింది!
రాజకీయం అంటే నాలుక మడతేయడమేనా? బాబు మార్కు రాజకీయాలు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం.. అధికారంలోకి రాగానే అవన్నీ మరచిపోయి సుద్దులు చెప్పడం! ఈ విషయంలో ఇప్పుడు బాబుకు పవన్ తోడైనట్టు కనిపిస్తోంది. నేనంటే నేను అన్న చందంగా మాటమార్చే విషయంలో ఇరువురూ పోటీ పడుతున్నారు కూడా. రాష్ట్రంలో అరాచకాలను కట్టడి చేయాల్సిన వీరే వాటిని ఉసిగొలుపుతున్నట్లుగా ఉందీ ప్రస్తుతం పరిస్థితి.ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు, అరెస్ట్‌లు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోలీసు అధికారులను తమ చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్న బాబు అండ్ కో చట్టాలను అతిక్రమిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేసులు, అరెస్ట్‌లను దాటి పోలీసులు వీరిపై నీచాతినీచంగా బూతులు తిడుతున్నారన్న వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబుల వ్యాఖ్యలకు ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత జగన్ తాము మళ్లీ అధికారంలోకి వస్తామని అప్పుడు ఇలా అకృత్యాలకు పాల్పడ్డ పోలీసు అధికారులు చట్ట ప్రకారం శిక్షకు గురవుతారని హెచ్చరించారు. కానీ.. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వక్రీకరించి వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఐపీఎస్ అధికారులనే బెదిరిస్తున్నారా? అంటూ పవన్ జగన్‌ను విమర్శించే ప్రయత్నం చేశారు. సూమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు కూడా.సినీ నటుడిగా పవన్ పౌరుల హక్కుల కోసం పోరాడే హీరో పాత్రలో బోలెడు పోషించారు పవన్. రాజకీయ జీవితంలో మాత్రం వాటిని హరించేలా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు అల్లర్లు చేసినా, దొమ్మీలకు పాల్పడ్డ అసలు ఎలాంటి చర్యలూ తీసుకోరాదన్నట్టు వపన్ మాట్లాడిన విషయం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి మంత్రి రోజాపై జనసేన కార్యకర్తల దాటికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకుంటే పవన్ చేసిన హడావుడిని అందరూ చూసే ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పవన్‌కు మద్దతుగా నిలిచారు.మంత్రిపై దాడి జరగడం ప్రభుత్వ తప్పు అన్నట్లు ప్రచారం చేశారు. ఇక స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బాబుకు పవన్ వత్తాసు పలకడం.. శాంతి భద్రతల సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ఆయన్ను అడ్డుకుంటే రోడ్డుపై పడుకుని యాగీ చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఉండే ఉంటుంది. ఒక దశలో చంద్రబాబు పోలీసులనే నేరుగా సంఘ విద్రోహశక్తులన్నట్టు చిత్రీకరించారు. వారిని బెదిరించిన సందర్భాలైతే లెక్కలేనన్ని. తండ్రి తీరు ఇలా ఉంటే.. ఆయన కుమారుడు లోకేష్ రెడ్‌బుక్ అంటూ పోలీసు అధికారులను పేర్లు చెప్పి మరీ బెదిరించిన వైనం చూశాం. పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు దొమ్మీకి దిగి పోలీసు వాహనాన్ని దగ్ధం చేయడమే కాకుండా.. వారిపై రాళ్లూ విసిరారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. అంత జరిగినా అప్పట్లో పవన్ పోలీసులపై కనీస సానుభూతి చూపలేదు. అప్పట్లో ఈనాడు వంటి మీడియా సంస్థలు ఏ చిన్న గొడవ జరిగినా చిలువలు పలువలుగా చేసి కథనాలు రాయడం.. వాటిని అందుకుని టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోవడం మనం చూశాం. ఎక్కడైనా మానభంగాలు జరిగితే ప్రభుత్వంపై వారు అప్పట్లో దారుణమైన విమర్శలు చేసేవారు.2017లో జరిగిన సుగాలి ప్రీతి హత్యోదంతం ఇందుకు ఒక ఉదాహరణ. తాము అధికారంలోకి వస్తే ఈ కేసురె మొదటగా తీసుకుంటామని నాటకీయంగా చెప్పారు. పవర్లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ కేసును ఏమి చేశారో తెలియదు. రాష్ట్రంలో 35 వేల మంది మహిళలు తప్పిపోయినా ప్రభుత్వం ఏం చేస్తోందని, పోలీసులు ఏమయ్యారని కూడా అప్పట్లో పవన్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఊసే ఎత్తడం లేదు. మంగళిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో రోడ్ల ఆక్రమణలు తొలగింపుపై నిరసన తెలిపేందుకు పవన్ వెళుతూండగా పోలీసులు వారించారు. అయినాసరే ఆయన కారుపై కూర్చుని మరీ నాటకీయ ఫక్కీలో అలజడి సృష్టించారు. అయినా ఆనాటి ప్రభుత్వం పవన్ పై ఎప్పుడూ కేసులు పెట్టలేదు. అలాగే పోలీసులను పలుమార్లు దూషించిన చంద్రబాబు, లోకేష్‌లను కూడా ఏమీ చేయలేదు. ప్రస్తుత మంత్రి అచ్చన్నాయుడు గతంలో పోలీసులను ఎంత నీచంగా దూషించారో వినాలన్నా ఇప్పుడు సిగ్గేస్తుంది.ఇప్పుడు వీరందరికి అధికారం దక్కిందో లేదో.. స్వరం మార్చారు. పోలీసు శాఖలో ఎవరైనా రూల్ ప్రకారం వెళితే ఊరుకోవడం లేదు. వెంటనే బదిలీ చేస్తున్నారు. కడప ఎస్పి బదిలీనే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు నెల రోజులలో పోలీసులను సెట్ చేస్తానంటే ఇదా అని అంతా విస్తుపోతున్నారు. ఇప్పటికి 680 మందికి నోటీసులు ఇవ్వడం, 147 మందిపై కేసులు పెట్టడం, 49 మందిని అరెస్టు చేయడం అసాధారణ చర్యగా కనిపిస్తుంది. మరి వైసీపీ నేతలను దూషిస్తూ కామెంట్లు పెట్టిన ఒక్కరిపై కూడా కేసు రాలేదు. అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చని ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని, విద్యార్ధినులు, మహిళలపై దాడులను సమాజమే ఎదుర్కోవాలని ఆయన సూక్తి ముక్తావళి వల్లిస్తున్నారు. ఒకపక్క వైసీపీ వారిపై ఇంత అక్రమ కేసులు పెడుతూ, అత్యాచారాలు చేసిన వారిని పట్టుకోలేమన్న సంకేతం ఇచ్చే విధంగా పవన్ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈయన హోం మంత్రి అయితే మాత్రం ఒరిగేది ఉంటుంది? వైసీపీ పాలన అయితే ఏమి జరిగినా జగన్ బాధ్యత వహించాలి. కూటమి పాలనలో మాత్రం సమాజమే రక్షించుకోవాలన్న మాట. అధికారులను బెదిరిస్తే కేసులు అని అంటున్న పవన్ కళ్యాణ్ ముందుగా గతంలో తనతోసహా చంద్రబాబు, లోకేష్‌లు చేసిన దూషణలకు సుమోటోగా కేసు పెట్టించుకుంటారా? అంతెందుకు ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని చెప్పిన సందర్భంలో పోలీసులను ఉద్దేశించి ఆయన ఏమన్నారో మర్చిపోతే ఎలా? చిన్నపిల్లలపై అత్యాచారం కేసులో పోలీసులు కులం చూసి చర్య తీసుకోవడం లేదని అన్నారంటే ఆ పోలీసు అధికారికి ఎంత అవమానం? కూటమి ప్రభుత్వానిది ఎంత అసమర్థత?వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి పచ్చ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు చేస్తోంది అన్నది వాస్తవం. తప్పు ఎవరు చేసినా తప్పే అన్నట్లు కాకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎదురయ్యే పరిణామాలకు ఆ శాఖ బాధ్యత కూడా వహించదా? ఒక మోసకారి నటి వ్యవహారంలో తప్పుడు కేసులు పెట్టారంటూ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా పోలీసు అధికారులు ఇష్టారీతిన దౌర్జన్యాలకు దిగుతుంటే, బూతులు తిడుతుంటే, దానిపై ప్రతిపక్షంగా వైసీపీ అధినేత జగన్ స్పందించకుండా ఎలా ఉంటారు? మాట్లాడకపోతే ఆ పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం నిలబడుతుంందా? వైసీపీ నేత పేర్నినాని ఓపెన్ గా తుళ్లూరు డీఎస్పీ పేరు చెప్పి మరీ ఆయన చేస్తున్న ఘాతుకాలను మీడియాకు తెలిపారు.దానికి ఆ అధికారి ఏమి జవాబు ఇస్తారు? అలాగే ఆరబ్ దేశాలలో ఫలానా శిక్ష వేస్తారని చెబుతూ రాజును మించిన రాజభక్తి ప్రదర్శించిన మరో ఐపీఎస్ అధికారికి నాని సవాల్ విసిరారు. చట్ట ఉల్లంఘన చేసే పోలీసు అధికారులకు కూడా ఆయా దేశాలలో ఉరి శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ సోషల్ మీడియాను అంతం చేయడానికి, వారిని భయభ్రాంతులను చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతాయని మరో నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు.గతంలో ఒక నాయకుడు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ టీవీలలో రోజూ మాట్లాడుతుంటే పోలీసులు కేసు పెట్టారు. ఆయనను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో తనను పోలీసులు హింసించారని ఆయన ఆరోపించి, అసలు కేసును పక్కదారి పట్టించారు. నిజంగానే అప్పుడైనా ఆయనపై పోలీసులు దౌర్జన్యం చేసి ఉంటే ఎవరూ సమర్థించరాదు. అప్పట్లో ఒక నాయకుడికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టి నానా అల్లరి చేసిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఇన్ని వందల మంది మీద పోలీసులతో ఎలా దౌర్జన్యాలు చేయిస్తారు? దూషణలు చేయిస్తారు? అంటే ఈ దేశంలో పలుకుబడి, డబ్బు ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యుడికి మరో న్యాయం అన్నది మరోసారి రుజువు కావవడం లేదా? ఆయా వ్యవస్థల్లో ఇంతగా వివక్ష ఉంటే ఈ సమాజంలో అశాంతి ప్రబలకుండా ఉంటుందా? విద్వేషాలు మరింతగా పెరగవా? వాటి పరిణామాలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించవా? ఒక్కసారి కట్టు తప్పితే ఎంత ప్రమాదమో సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడుకు తెలియకుండా ఉంటుందా? బహుశా ఈ పరిణామాలు, ఇన్ని విషయాలు సినీ నటుడు కూడా అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియకపోవచ్చు. అందుకే ఆయన తన అధికారంతో ఎవరిని ఏమైనా చేయవచ్చని భ్రమపడుతున్నారు.నిజంగానే పవన్ అలా అరాచకంగా ప్రవర్తిస్తే, భవిష్యత్తులో తన మెడకే గుదిబండలు అవుతాయని గ్రహిస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హామీలకు కోతలు.. పచ్చమీడియా పైపూతలు!
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొత్తగా మంత్రి అయిన పయ్యావుల కేశర్ చాలా సంతోషంగా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఉండవచ్చు. టీడీపీ ప్రభుత్వ భజంత్రీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు కూడా బడ్జెట్‌ను ఆహా..ఓహో అని యథా ప్రకారం ఆకాశానికి ఎత్తేశాయి. స్వామిభక్తిని చాటుకున్నాయని అనుకుందాం. మరి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడికీ కొద్దోగొప్పో ఉపయోగపడాల్సిన ఈ ఆర్థిక ప్రణాళిక వారిని మెప్పించిందా?. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తాము చేసిన వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్ పెట్టి ఉంటే లెక్కలు అదే రీతిలో చూపించేవారు. అలాకాకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. సూపర్ సిక్స్ గాని, టీడీపీ, జనసేనల సంయుక్త మానిఫెస్టోలోని ఇతర అంశాలను కాని ప్రస్తావిస్తూ ఒక్కోదానికి ఇంత వ్యయం అవుతుంది. ఇంత ఖర్చు చేయబోతున్నాం అని చెప్పగలిగేవారు. కానీ సాధారణ రాజకీయ స్పీచ్ మాదిరి, కల్లబొల్లి మాటలతో, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలతో బడ్జెట్ ప్రసంగాన్ని మమ అనిపించారు. చంద్రబాబు తరచూ మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఒక మాట అనేవారు.. సంపద సృష్టించి ప్రజలకు పంచుతానూ అని. అదెలాగో అర్థం కాక అంతా తలబాదుకుంటూ ఉంటే.. అది మద్యం అమ్మకాల ద్వారా అన్న విషయం బడ్జెట్ చూశాక అర్థమైంది. ఒక్క మద్యం ద్వారానే రూ.10,000 కోట్లు ఆశిస్తోంది ప్రభుత్వం మరి!బడ్జెట్ ద్వారా కూటమి ప్రభుత్వం సాధించిన తొలి విజయం ఇదే అనుకోవాలి. గత ఏడాది మద్యం ద్వారా సుమారు రూ.16 వేల కోట్లు వస్తే, ఈసారి అది దాదాపు రూ.26 వేల కోట్లు కావచ్చని అంచనా. ఇది సంపద సృష్టి అవుతుందా? లేక ప్రజలను ప్రత్యేకించి పేద వర్గాల బలహీనత మీద సంపాదించడం అవుతుందా? అన్నది ఆలోచించుకోవాలి. ఏపీలో మాఫియాగా మారిన ఈనాడు మీడియా గతంలో జగన్ ప్రభుత్వం నిర్దిష్ట హామీల ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టి అమలు చేసినా, ఏదో విధ్వంసం జరిగిపోయినట్లు, అప్పుల కుప్ప చేయబోతున్నట్లు నానా అరాచకంగా కథనాలు ఇచ్చేది. ఇప్పుడు టీడీపీ బడ్జెట్ గొప్పదనం ఏమిటో చెప్పలేక సతమతమైనట్లు వారిచ్చిన కథనాల తీరును బట్టి అర్థమవుతోంది. ప్రతి బడ్జెట్లో మూలధన వ్యయం ఖాతాను ఈనాడు మీడియా ఆస్తుల సృష్టిగా పేర్కొనడాన్ని బట్టే వారు పాఠకులను ఎంత మోసం చేయదలిచిందీ అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం రూ.30 వేల కోట్లకు పైగా మూలధన వ్యయం చేయాలని ప్రతిపాదిస్తే, అప్పుడు దానిని ఆస్తుల సృష్టిగా ప్రస్తావించలేదు.ఈ సారి మరో రెండువేల కోట్లు అదనంగా చేర్చి రూ.32 వేల కోట్లుగా తెలిపారు. ఇదే ఆస్తుల సృష్టి అనండి,సంపద సృష్టి అనండి.. ఆ రకంగా ప్రజలను నమ్మించే యత్నం చేశారు. అలాగే సూపర్ సిక్స్ హామీలు అమలు జరిగిపోతున్నట్లుగా రంగుపూసే ప్రయత్నం బడ్జెట్లో జరిగితే, అదే మహద్బాగ్యం అన్నట్లు ఎల్లో మీడియా మభ్య పెట్టే యత్నం చేసింది. వాటిలో కొన్నిటి ఊసేలేదు. మరికొన్నిటికి చాలీచాలని నిధులు కేటాయించి మమ అనిపించారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ సూపర్ సిక్స్ హామీలలో మొదటిది యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నెలకు మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కాని దాని గురించి బడ్జెట్ లో మెన్షన్ చేయలేదు. నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించలేదు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా కూడా కప్పిపుచ్చే యత్నం చేసింది. నిరుద్యోగ భృతి ఎగవేతనే మాత్రం కాదు. గత ప్రభుత్వ హయాంలో వలంటీర్ల రూపంలో సుమారు రెండున్నర లక్షల మందికి నెలకు రూ.ఐదు వేల చొప్పున ఇస్తే, తాము అధికారంలోకి వస్తే రూ.పది వేలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,లోకేష్ లు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ సంగతే లేదు..అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించే నిజాయితీ వారిది. రెండోది ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు ఇవ్వగలమని వాగ్దానం చేశారు. దీనికి తల్లి వందనం అని పేరు పెట్టారు. ఈ స్కీము అమలు కావాలంటే రూ.12,600 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేవలం రూ.5387 కోట్లు పెట్టి సరిపెట్టుకోమన్నారు. ఎనభై లక్షల మందికి పైగా పిల్లలు ఉంటే ఈ కాస్త మొత్తంతో ఎందకి ఇస్తారో వివరించలేదు. మూడోది ప్రతి రైతుకు ఏటా రూ.ఇరవై వేలు చెల్లిస్తామన్న హామీకి సుమారు రూ.పదివేల కోట్లకు పైగా కావాలి. కాని కేవలం వెయ్యి కోట్లు రూపాయలు ఇచ్చి రైతులను పండగ చేసుకోమన్నారు. ఇది ఎలా సరిపోతుందో బడ్జెట్ లో వివరించలేదు. ఎల్లో మీడియా చెప్పలేదు. నాలుగో అంశం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు. దీనికి కేవలం 800 కోట్ల పైచిలుకు మాత్రమే ఇచ్చారు. ఇది ఒక సిలిండర్ ఇవ్వడానికి సరిపోవచ్చు. కోటిన్నర కుటుంబాలు ఉంటే ఇప్పటికి ఐదు లక్షలు మించి ఇవ్వలేదట. ఐదో సూపర్ సిక్స్ హామీ ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇవ్వాలి. అధికారంలోకి రావడమే ఆలస్యం అన్నట్లుగా అప్పట్లో కూటమి నేతలు ప్రచారం చేశారు. తీరా చూస్తే అంతా హుళ్లక్కే అని తేలింది. నిజంగా చిత్తశుద్దితో దీనిని అమలు చేస్తే సుమారు 30వేల కోట్లుపైగా అవసరమవుతాయి. మరి దాని సంగతి ఎందుకు చెప్పలేదో తెలియదు. ఆరవ సూపర్ సిక్స్ ఏమిటంటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. వాస్తవంగా అమలు చేయాలని అనుకుంటే ఆర్టీసీకి పరిహారంగా వచ్చే మార్చి వరకు లెక్కిస్తే, సుమారు 1500 కోట్లు చెల్లించడానికి బడ్జెట్లో పేర్కొనాలి. ఆ విషయం హుష్ కాకి అయినట్లేనా అన్నది ఆర్థిక మంత్రి చెబితే బాగుంటుంది. వీటి పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన 175 వాగ్దానాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. బీసీలకు చెందిన వారికి ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని అన్నారు. లెక్కలేసుకుంటే ఇలాంటివి చాలానే ఉన్నాయి. అమరావతికి బడ్జెట్లో రూ.3445 కోట్లు కేటాయించగా, రూ10 - 15 వేల కోట్లు రుణాలుగా వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో వరదల నియంత్రణకే రూ.ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రపంచబ్యాంక్ చెబుతోందట. రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టించడమేమోకాని, మిగిలిన ప్రాంతాల ప్రజలు పన్నుల రూపంలో కట్టే సంపద అంతటిని ఒక్క అమరావతిలో ఖర్చు చేయబోతున్నారని అనుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు రూ.5445 కోట్లు కేటాయించడంం బాగానే ఉన్నా, కేంద్రం నుంచి రావల్సిన డబ్బును సకాలంలో తెచ్చుకోకపోతే, ఇదంతా ఏపీ ప్రజలపై భారం మోపినట్లు అవుతుంది. ఎల్లో మీడియా అత్యంత రహస్యంగా ఉంచేసిన మరో కీలక అంశం అప్పుల గురించి ఈ బడ్జెట్ లో సుమారు రూ.91 వేల కోట్ల రుణాలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందులో సుమారు అరవై వేల కోట్లు అప్పు చేసేశారు. ఈ స్థాయిలో అప్పు చేయడం పునర్నిర్మాణానికి ఎలా పునాది అవుతుందో చంద్రబాబు, కేశవ్ లే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో అప్పులు పధ్నాలుగు లక్షల కోట్లకు చేరిందన్నది పచ్చి అబద్దమని కూటమి ప్రభుత్వ బడ్జెట్ ఒప్పుకోక తప్పలేదు. అప్పట్లో రుణాలపై ఎల్లో మీడియా ఎంత దారుణంగా అసత్యాలు ప్రచారం చేసింది, దానిని చంద్రబాబు ఎలా అందిపుచ్చుకుని ప్రజలను మోసం చేసింది మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి సమగ్రంగా వివరించారు. జగన్ టైమ్‌లో అప్పులు చేస్తే శ్రీలంక అయిపోయినట్లు, ఇప్పుడు చంద్రబాబు ప్రబుత్వం అంతకన్నా అధిక మోతాదులో రుణాలు తెస్తే ఎక్కువ సంపద సృష్టి అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఈనాడు మీడియా పులకరింతలు గమనించండి. గత జగన్ ప్రభుత్వం చీకట్లు నింపిందట. ఈ ప్రభుత్వం వేగుచుక్కగా వచ్చిందట. పోర్టులకు, వైద్య కళాశాలలకు, గ్రామాలలో భవనాల నిర్మాణం తదితర అభివృద్ది కార్యక్రమాలకు జగన్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే చీకట్లు, ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ కు డబ్బులు ఇస్తే వేగుచుక్క అయిందని ఈనాడు మీడియా సూత్రీకరణలాగా ఉంది. కేశవ్ తన తొలి బడ్జెట్ లోనే సూపర్ సిక్స్ బాదారని కూడా ఈనాడు సర్టిఫికెట్ ఇచ్చింది. అది నిజమే అయితే ఏ హామీకి ఎంత అవుతుంది? బడ్జెట్లో ఎంత కేటాయించింది ఈనాడు మీడియా అయినా వివరించి ఉండవచ్చు కదా? ప్రజలను మోసం చేయలేదని ధైర్యంగా తెలిపి ఉండవచ్చు. అవేమీ చేయకుండా కూటమి ప్రభుత్వం డకౌట్ అవుతుందన్న భయంతో సిక్స్ కొట్టేసినట్లు ప్రజలను భ్రమలలో పెట్టాలన్నదే ఎల్లో మీడియా తాపత్రయం. విద్యుత్ చార్జీలు,భూముల విలువ పెంపు ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు మొదలైనవి ఉండబోతున్నాయని బడ్జెట్‌ను బట్టి అర్థమవుతుంది. ఏతావాతా కూటమి అసలు మోసపూరిత స్వరూపం బడ్జెట్ లో చాలావరకు బహిర్గతం అయిందని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత. -
ప్రభుత్వాలనే కూలదోసిన ‘నిప్పు’తో బాబు చెలగాటం!
సామాన్యులు.. శక్తిమంతమైన ప్రభుత్వాలను సైతం గడగడలాడించిన ఘటనలు చరిత్రలో కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిణామాలు తాజా నిదర్శనం. ఎందుకంటే.. ఇప్పుడు ఇంటూరి రవికిరణ్ అనే పేరు రాష్ట్రమంతటా మార్మోగిపోతోంది. చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రభుత్వం అతడిపై అకారణంగా విరుచుకుపడుతూండటం ఇందుకు కారణం. సామాజిక మీడియా కార్యకర్తగా ప్రజలందరికీ చిరపరిచితుడైన ఇంటూరి రవికిరణ్‌పై అక్రమ కేసులు పెట్టి రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారంటే.. ఆయనంటే బాబుగారికి, లోకేశ్, పవన్ కల్యాణ్‌లకు ఎంత భయమో ఇట్టే అర్థమవుతోంది. తన వైఫల్యాలలను ఎవరూ ప్రశ్నించరాదన్న చందంగా చంద్రబాబు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను భయపెట్టేందుకు విఫలయత్నం చేస్తున్నారు. అయితే రవికిరణ్సహా కార్యకర్తలు ఎవరూ పోలీసుల ఒత్తిళకు తలొగ్గలేదు సరికదా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూండటంతో ప్రభుత్వ డొల్లతనం, పిరికితనం క్షణక్షణం బయటపడిపోతున్నాయి. అసమర్థత, చేతకానితనం, వైఫల్యాలు, అసత్యాలు చెప్పడానికి అలవాటుపడడం వంటి లక్షణాలన్న ప్రభుత్వాలే సామాన్యుల గొంతును నొక్కివేయాలని ప్రయత్నిస్తాయని నానుడి. సామాన్యుల ప్రశ్నలకు జవాబులు లేనప్పుడే ఏదో ఒక రకంగా ప్రశ్నిస్తున్న ఆ గొంతుకలను నొక్కేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. చంద్రబాబు ప్రభుత్వమిప్పుడు ఈ రెండింటినీ అక్షర సత్యం చేస్తోంది. అయితే.. రవికిరణ్ వంటి వారి నుంచి ప్రతిఘటన కూడా ఎదుర్కొంటూంటారు కూడా. తమతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని, పోలీసులు అధికార పార్టీకి అమ్ముడుపోయారని పోలీసుల సమక్షంలోనే చెప్పడం రవికిరణ్ ధీమా, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ రవికిరణ్ నిజంగానే తప్పు చేసి ఉంటే... .. పోలీసులు అతడిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదు? వేర్వేరు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఇలా చేయడం ద్వారా పోలీసులు చట్టాలను ఉల్లంఘించడం లేదా? కుటుంబ సభ్యులకు వివరాలు కూడా ఇవ్వకపోవడం ఎంత వరకూ సబబు?. తిరుగుబాటును అణచివేయడం అంత తేలికకాదని ఎన్నోసార్లు రుజువైంది. అమెరికా వంటి అగ్రరాజ్యంలోనూ ఇంతే. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ ఆందోళన ఇందుకు ఒక ఉదాహరణ నల్లజాతీయుడు ఒకరిని ట్రాఫిక్ కేసులో పట్టుకున్న పోలీసులు గొంతుపై కాలుపెట్టి కూర్చోవడంతో అతడు మరణించిన ఘటనపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున స్పందించింది. ఆ అకృత్యానికి పాల్పడ్డ పోలీసుకు శిక్ష పడేంతవరకూ పలు రూపాల్లో ఆందోళన కూడా చెలరేగింది. అంతెందుకు మధ్యప్రాచ్య దేశాలైన ఈజిప్ట్, లిబియా, యెమెన్, సిరియా, బహ్రెయిన్లలో ప్రభుత్వాలపై ప్రజల తిరుగుబాటు వెనుక సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించిన విషయమూ ఇటీవలి పరిణామమే.. ‘అరబ్ స్ప్రింగ్’ అని పిలిచే ఈ ఉద్యమం ధాటికి పలు దేశాల ప్రభుత్వాలు ప్రజల డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చింది. దేశంలో వచ్చిన తిరుగుబాటుతో లిబియా నియంత గఢాఫీ ఒక చిన్న కల్వర్టుల్లో నక్కి,నక్కి దాక్కున్నా ఫలితం దక్కలేదు. శ్రీలంకలో వచ్చిన ప్రజా తిరుగుబాటుకు భయపడి ఆ దేశాధ్యక్షుడు పాలెస్ వదలి పారిపోయాడు. బంగ్లాదేశ్ సంక్షోభంలో ఆ దేశ ప్రధాని హసీనాను దేశం విడిచి పోయేలా చేసింది. భారత్‌లోనూ సోషల్ మీడియా చాలాసార్లు తన సత్తా చాటింది. 2013కు ముందు దేశానికి పెద్దగా పరిచయం లేని అరవింద్ కేజ్రీవాల్ లోక్‌పాల్ ఉద్యమం నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా పాప్యులర్ అయ్యాడు. తరువాతి కాలంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించడం, ఢిల్లీతోపాటు పంజాబ్‌లోనూ అధికారం చేపట్టడం తెలిసిన విషయాలే. నిన్నమొన్నటివరకూ ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగానూ పనిచేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. దేశంలో అత్యాయిక పరిస్థితిని విధించినప్పుడు సోషల్‌మీడియా లేదు కానీ.. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరిగాంధీ ప్రతిపక్షనేతలు కార్యకర్తలు వేలాది మందిని జైలులో పెట్టించారు. మీడియాపై ఆంక్షులు విధించారు. అయినా సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారు పార్లమెంటులో ఆకస్మికంగా ప్రత్యక్షమై తమ నిరసన గళం విప్పడం అప్పట్లో సంచలనం. అణచివేతపై గొంతెత్తే పోరాట యోధులు అన్నిచోట్లా ఉంటారు. సమయం, సందర్భం కుదరితే చాలు.వెలుగులోకి వస్తారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు. ఏపీలో తలెత్తుతున్న తిరుగుబాట్లు ఇప్పటికిప్పుడు జరిగిపోతాయని చెప్పలేము. కాని తెగేదాకా లాగకూడదనడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ఇన్ని అనుభవాలు ఉన్నా, కొందరు నేతలు తమ అధికార అహంకారంతో ప్రవర్తించి తమను ప్రశ్నించే వారి స్వరాన్ని నులిమి వేయాలని చూస్తుంటారు. కొన్నిసార్లు వారి ప్రయత్నాలు ఫలించవచ్చు. ఒక వర్గం మీడియాను మాఫియాగా మార్చి ప్రజలను ఏమార్చవచ్చు. కాని అంతిమంగా ఏదో ఒక రోజు వాస్తవాలు బయట పడతాయన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఇంటూరి రవికిరణ్ చేసిన తప్పేమిటి? ఆయన ఏమైనా అసభ్య పోస్టులు పెట్టారా? లేదే? చంద్రబాబు ఐదు నెలల పాలనలో జరిగిన హింసాకాండ, అత్యాచారాలు, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయని అంశాలపై కామెంట్లు పెట్టి ఉండవచ్చు. కార్టూన్లో, బొమ్మలో వేసి ఉండవచ్చు. అంతమాత్రాన అతనిని పోలీసుల ద్వారా ఇంతగా వేధిస్తారా? ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్.. అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ పని చేయడం మానివేసి ఉండవచ్చు. మిగిలిన వారెవ్వరూ ప్రశ్నించరాదని అనుకుంటే ఎలా?. .. ఆ మాటకు వస్తే కూటమి ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని చెప్పింది పవన్ కళ్యాణ్ కాదా? పోలీసులను అవమానించేలా మాట్లాడింది ఆయనే కదా? ఆ తర్వాత కారణం ఏమైనా కాని రాజీలో భాగంగా మాట మార్చి తన కుమార్తెలపై ఏదో పోస్టు పెట్టారని కోపం వచ్చి మాట్లాడానని అన్నారట. అది నిజమే అయితే ఆ పోస్టు పెట్టినవారిపై కేసులు పెట్టాలి కదా? ఆ పని ఎందుకు చేయలేదు? దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరా? రాంబాబు కుమార్తెలపై ఎంత నీచమైన కామెంట్ లు పెట్టిన తెలుగుదేశం సోషల్ మీడియాను ఆయన ఎలా సమర్థిస్తారో అర్ధం కాదు. ఆ పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్య తీసుకుంటారా? ఇక్కడే ఇంకో సంగతి కూడా చెప్పాలి. తెలుగుదేశం మీడియాగా పూర్తిగా బట్టలు విప్పేసి తిరుగుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్ పాలన కాలంలో ఎంత అరాచకంగా, ఎంత అసభ్యకరంగా వార్తలు రాశాయో, ఫోటోలు వేశాయో చూడలేదా? అప్పట్లో టీడీపీ సోషల్ మీడియా దారుణమైన బూతులతో వైఎస్సార్సీపీ ముఖ్యనేతల కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టినా వారికి కొమ్ము కాసింది. ఇప్పుడేమో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైకోలు అంటూ ప్రభుత్వ అకృత్యాలకు మద్దతుగా నిస్సిగ్గుగా వార్తలు రాస్తోంది. పోలీసులు ఈ కేసుల్లో వేగంగా చర్యలు తీసుకోవడం లేదని తెగ వాపోయింది. అంటే ఎల్లో మీడియా ఏమి చెబితే పోలీసులు అది చేయాలన్నమాట. లేకుంటే వీరు పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తారన్నమాట. ఎవరు అసభ్యకర పోస్టులు పెట్టినా తప్పే.వారిపై చర్య తీసుకోవల్సిందే.చట్టబద్దంగా అరెస్టు చేయాలి కాని వారిని హింసించే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు? వర్రా రవీంద్ర రెడ్డి తనను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్‌కు తెలిపారు. అలాగే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను సైతం నాలుగు రోజులపాటు పోలీసులు హింసించి తిప్పారట. ఆమె కూడా తనను ఎలా హింసించింది ఆమె న్యాయస్థానానికి వివరించారు. ఇదేనా అడబిడ్డలకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే గౌరవం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా కూడా సమాజానికి అవసరం. లేకుంటే అధికారంలో ఉన్నవారు చెలరేగిపోతుంటారు.అలా ప్రశ్నిస్తే వారి గొంతులను నొక్కే ప్రయత్నం కూడా గట్టిగానే జరుగుతుంది. అయినా రవికిరణ్ వంటివారు ఇలాంటి సమస్యలను ఎదుర్కుని నిలబడుతున్నారు. వారిని చూసి చంద్రబాబు ప్రభుత్వమే భయపడే పరిస్థితి తెచ్చారు. 2014-19 లో కూడా రవికిరణ్ పై అప్పటి టీడీపీ ప్రభుత్వం దాడి చేసింది. ఈ వేధింపులు అప్పటికన్నా ఇప్పుడు మరింత పెరిగాయి. ఈయన మీదే కాదు. వందమందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారంటేనే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ప్రభుత్వం వణికిపోతోందన్న భావన కలుగుతుంది. ఉదాహరణకు అమ్మ ఒడి కింద జగన్ టైమ్ లో పిల్లలను స్కూల్ కు పంపిన ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చేవారు. టీడీపీ, జనసేన వారు ఏమి చెప్పారు? ప్రతి విద్యార్ధికి రూ.పదిహేను వేలు ఇస్తామని అన్నారు. కాని ఇప్పుడు అమలు చేయడం లేదు. ఎప్పటి నుంచి చేస్తారో చెప్పడం లేదు. దీని గురించి ప్రత్యర్ధి పార్టీ కాని, సోషల్ మీడియా కాని ప్రశ్నించకుండా ఎలా ఉంటుంది?. ఇలాంటి అనేక అంశాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా? వీటిలో ఏమైనా అసత్యాలు ఉంటే వాటిని ప్రకటించాలి. అంతే తప్ప నిజాలు చెబితే ఊరుకోం అని పోలీసుల ద్వారా బెదిరించడమే ప్రజాస్వామ్యమా? ఏపీలో జరుగుతున్న, హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు, అరాచకాల నిందితులను పట్టుకోవడం మాని పోలీసులు అచ్చంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను అణచి వేయడమే పనిగా పెట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదంతా డైవర్షన్ రాజకీయమే!.టీడీపీ సోషల్ మీడియా వారు కొందరు పరమ నీచంగా పోస్టులు పెట్టిన విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా చూపుతున్నారు కదా! వారిపై కూడా చర్య తీసుకుంటే అప్పుడు ప్రభుత్వం, పోలీసులు నిష్పక్షపాతంగా ఉన్నారని చెప్పగలుగుతాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా ఎంత నీచమైన పోస్టింగ్‌లు పెట్టినా వారిపై చర్యే తీసుకోరాదని టీడీపీ గొడవ చేసిందే. చివరికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ను పట్టుకుని దూషించిన వ్యక్తిని సమర్థించిందే. అంతేకాదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తమ స్పీచ్‌లలో అభ్యంతరకర పదాలు వాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడేమో తమ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తేనే నేరం అంటూ కొత్త రాజ్యాంగం..అదే రెడ్ బుక్ రాజ్యంగాన్ని తీసుకు వచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకరిని అణచివేస్తే వేలమంది గొంతు విప్పుతారన్న సంగతిని పాలకులు గుర్తు పెట్టుకుంటే మంచిది. ::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు ప్రభుత్వం అరాచకం ఎప్పటికి ముగుస్తుందో..?
ఏపీలో అమలు అవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం గురించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా గట్టిగానే ప్రశ్నించారు. ఆయన వేసిన పలు ప్రశ్నలలో ఒక్కదానికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు సమాధానం ఇవ్వలేకపోయారు. పైగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మహిళలపైన, టీడీపీ, జనసేన ముఖ్యనేతల కుటుంబ సభ్యులపైన అసభ్య పోస్టింగ్ లు పెడుతున్నారని డబాయించే పని చేశారు. ఇది కూడా డైవర్షన్ రాజకీయమే. సూపర్ సిక్స్ హామీలు, ఏపీలో సాగుతున్న అరాచకాన్ని, విధ్వంసకాండనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తమకుఉన్న మీడియా మాఫియా బలంతో వికృత ప్రచారం చేస్తున్నారని చెప్పాలి.నాయకుల కుటుంబాల గురించికాని, సామాన్యుల కుటుంబాల గురించి కాని, ముఖ్యంగా మహిళలకు ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరు ఎలాంటి పోస్ట్ పెట్టినా చర్య తీసుకోవల్సిందే. అందులో సందేహం లేదు. ఇది పార్టీలకు అతీతంగా జరగాలి. కాని దురదృష్టవశాత్తు టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు నీచమైన పోస్టింగ్ లు పెడితే వారిది వీరపోరాటమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ప్రచారం చేశారు. అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ లు పెట్టినవారిపై చర్య తీసుకుంటే ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వాటిని అక్రమ కేసులుగా పోలీసులపై ఆరోపించేవారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ఆశ్యర్యం కలిగిస్తుంది. మదమెక్కి మాట్లాడేవారిని వదలి పెట్టాలా అని ఆయన అన్నారని ఈనాడు పెద్ద హెడింగ్ తో వార్త ఇచ్చింది. తప్పు లేదు. నిజంగానే మదమెక్కి మాట్లాడేవారిపై చర్య తీసుకోవలసిందే.కాని అలా మదమెక్కినవారు టీడీపీ, జనసేనలో ఉంటేమాత్రం ఫర్వాలేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలోనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కాని, పార్టీ నేఏపీలో అమలు అవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం గురించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా గట్టిగానే ప్రశ్నించారు. ఆయన వేసిన పలు ప్రశ్నలలో ఒక్కదానికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు సమాధానం ఇవ్వలేకపోయారు. పైగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మహిళలపైన, టీడీపీ, జనసేన ముఖ్యనేతల కుటుంబ సభ్యులపైన అసభ్య పోస్టింగ్ లు పెడుతున్నారని డబాయించే పని చేశారు.ఇది కూడా డైవర్షన్ రాజకీయమే.సూపర్ సిక్స్ హామీలు, ఏపీలో సాగుతున్న అరాచకాన్ని, విధ్వంసకాండనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తమకుఉన్న మీడియా మాఫియా బలంతో వికృత ప్రచారం చేస్తున్నారని చెప్పాలి. నాయకుల కుటుంబాల గురించికాని, సామాన్యుల కుటుంబాల గురించి కాని, ముఖ్యంగా మహిళలకు ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరు ఎలాంటి పోస్ట్ పెట్టినా చర్య తీసుకోవల్సిందే. అందులో సందేహం లేదు. ఇది పార్టీలకు అతీతంగా జరగాలి. కాని దురదృష్టవశాత్తు టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు నీచమైన పోస్టింగ్ లు పెడితే వారిది వీరపోరాటమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ప్రచారం చేశారు. అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ లు పెట్టినవారిపై చర్య తీసుకుంటే ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వాటిని అక్రమ కేసులుగా పోలీసులపై ఆరోపించేవారు.అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ఆశ్యర్యం కలిగిస్తుంది. మదమెక్కి మాట్లాడేవారిని వదలి పెట్టాలా అని ఆయన అన్నారని ఈనాడు పెద్ద హెడింగ్ తో వార్త ఇచ్చింది. తప్పు లేదు. నిజంగానే మదమెక్కి మాట్లాడేవారిపై చర్య తీసుకోవలసిందే.కాని అలా మదమెక్కినవారు టీడీపీ, జనసేనలో ఉంటేమాత్రం ఫర్వాలేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలోనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కాని, పార్టీ నేతలు కాని కొందరు ఇష్టారీతిన మహిళలను కించపరుస్తూ మాట్లాడారే, పోస్టులు పెట్టారే. వారికి మదం ఎక్కి నట్లా?కాదా? అప్పుడు ఇదే చంద్రబాబు వారికి మద్దతుగా ఎందుకు ఉన్నారు? ఉదాహరణకు అందరికి తెలిసిన ప్రముఖ మహిళా నేత రోజా ను ఉద్దేశించి టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఎంత అసభ్యకరంగా మాట్లాడారు.దానికి ఆమె ఎంతగానో రోదించారే. అప్పుడు బండారును పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేస్తే టీడీపీ యంత్రాంగం అంతా ఆయనకు అండగా ఉందే తప్ప రోజాపై ఎందుకు సానుభూతి చూపలేదు? చంద్రబాబు ఆయనకు ఏకంగా మళ్లీ టీడీపీ టిక్కెట్ ఇస్తే ఎమ్మెల్యే కూడా అయ్యారు కదా! దానిని ఏ రకంగా చంద్రబాబు చూస్తారు? నర్సీపట్నంలో మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఎన్నిసార్లు మహిళా అధికారుల పట్ల దారుణంగా మాట్లాడారన్న అభియోగాలు వచ్చాయి కదా!ఆయనను ఎప్పుడైనా మందలించారా? అలా చేయకపోగా ఆయనను స్పీకర్ సీటులో కూర్చో పెట్టారు కదా! అప్పటి ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన సతీమణి భారతిపైన, అలాగే ఇతర కుటుంబ సభ్యులపైన టీడీపీవారు ఎంత ఘోరంగా పోస్టులు పెట్టారో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు తెలియదా? అలాంటి వారిపై కేసులు వస్తే అప్పుడు వారికి మద్దతు ఇచ్చింది ఇదే టీడీపీ, జనసేనలు కాదా? ఆ మాటకు వస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు పదే,పదే సైకో అని దుర్మార్గంగా విమర్శలు చేశారే. అది అభ్యంతరకర భాష కాదా? ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే చంద్రబాబు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసులు పెడుతున్నారెందుకు?అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చన్న ధీమాతోనా? మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ సోషల్ మీడియా వారు కొంతమంది పెట్టిన దారుణమైన వికృత పోస్టింగుల గురించి సోదాహరణంగా వివరించారు.వాటిని డిజిపి పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మరెవరి కుటుంబ సభ్యులపైన ఎవరైనా అభ్యంతర పోస్టింగ్ లు పెడితే ఎవరూ ఒప్పుకోరు. అదే రూల్ జగన్ కుటుంబానికికాని,వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలోని మహిళలకు వర్తించదని వీరు చెప్పదలిచారా? అసలు ఇప్పుడు సమస్య ఏమిటి? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు లో వైఫల్యం చెందుతోంది.వాటి గురించి సోషల్ మీడియాలో పలువురు నిలదీస్తున్నారు.ఆ విషయం చెప్పకుండా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.వాటిపై జగన్ అనేక ప్రశ్నలు సంధించారు.తన అమ్మ విజయమ్మ ను చంపడానికి ప్రయత్నించానంటూ టీడీపీ అధికార వెబ్ సైట్ లో తప్పుడు పోస్టు పెట్టారని, దీనికి గాను చంద్రబాబును, లోకేష్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తన భార్య కడప ఎస్పికి ఫోన్ చేశారంటూ ఆంధ్రజ్యోతి తప్పుడు వార్త రాసిందని, దానిపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ఎందుకు లోపల వేయలేదు? విజయవాడ వరద బాధితులకు సహాయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కేవలం అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు కొనుగోలుకే 23 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారని, దీనిపై ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు ఎలా పెడతారని ఆయన అడిగారు.మహిళలు, చిన్నారులులపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు రౌడియిజం చేస్తుండడంపై ప్రశ్నిస్తే అక్రమంగా నిర్భంధం చేస్తున్నారని ఆయన అన్నారు. వందకు పైగా ఎఫ్ ఐ ఆర్ లు పోలీసులు నమోదు చేశారు. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్ని ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించినవారిపై పెట్టిన కేసులే కావడం గమనార్హం. ఈ పరిస్థితి కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుండడంతో ,దానిని డైవర్ట్ చేయడానికి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కూటమి పెద్దలు ప్రచారం చేస్తున్నారు. అందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి బాకా ఊదుతున్నాయి.విద్య వద్దు - మద్యం ముద్దు అన్నట్లుగా ఏపీలో పరిస్థితి ఉందని, ఒక కార్యకర్త పోస్టింగ్ పెడితే కేసు పెట్టారట.అమ్మ ఒడి ఇవ్వడం లేదు.విద్యాదీవెన ఇవ్వడం లేదని.. నాన్నకు ఫుల్-అమ్మకు నిల్ అని మరో కార్యకర్త పోస్ట్ పెడితే కేసు నమోదు చేశారు.ఇందులో చంద్రబాబు మనోభావాలు దెబ్బతిన్నదేమిటి? అని జగన్ ప్రశ్నించారు. విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడే అమ్మ ఒడి.. నాన్న బుడ్డి అంటూ విమర్శలు చేసేవారు. అవి తప్పు కానప్పుడు ఇప్పుడు అదే మాట ఎవరైనా అంటే నేరం ఎలా అవుతుందన్నది చర్చ అవుతోంది.జనసేన నేతలతో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకుంటున్నారని ఒక వార్త అన్ని టీవీలలో వచ్చింది. దానికి సంబంధించిన పోస్టును ఫార్వర్డ్ చేస్తే కేసు పెట్టారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలు దేవుడికి నచ్చడం లేదని మరో కార్యకర్త పోస్టు పెడితే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.నందిగామ నియోజకవర్గంలో ఒక గ్రామంలో వాట్సప్ లో ఒక గ్రూపు ఉన్నవాందరికి నోటీసులు ఇచ్చారు. ఇలా అనేక అంశాలను జగన్ ప్రస్తావించి ప్రశ్నిస్తే వాటికి మాత్రం సమాధానం ఇవ్వకుండా ఏవేవో ఆరోపణలు చేసే పనిలో ప్రభుత్వ నేతలు ఉండడం శోచనీయమని చెప్పాలి.ఈ సందర్భంలోనే డిజిపి ద్వారకా తిరుమలరావును, ఇతర పోలీసు అధికారులపై జగన్ విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తల్లా మారవద్దని, ధర్మంగా ,న్యాయంగా ఉండాలని ఆయన కోరారు. అలాకాని పక్షంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు అలాంటివారిపై చర్య తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. జగన్ ఇలా సోదాహరణంగా ఆయా ఘటనలను ప్రస్తావిస్తే, వాటిపై చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయారు. అందుకే డబాయింపు అలవాటుతో ఉండే చంద్రబాబు దీనికి అసభ్యకర పోస్టులు అంటూ డైవర్షన్ రాజకీయం చేశారు. దీని అంతటికి ఒకటే కారణం కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకుండా ఉండాలన్నదే వారి ఉద్దేశం. ఇందుకోసం పోలీసుల ద్వారా వైఎస్సార్సీపీ వారిని, ప్రభుత్వ వ్యతిరేక స్వరాన్ని అణచివేస్తూ, భయభ్రాంతులను చేస్తూ, అరాచకం సృష్టించాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ ఘాతుకాలకు ఎల్లో మీడియా మద్దతు ఇవ్వడం మరీ నీచంగా ఉంది. జర్నలిజం ప్రాధమిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చి ఒక మాఫియాగా మారడం దురదృష్టకరం. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం అరాచకానికి ఎప్పటికి ముగింపు వస్తుందో!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మరీ ఇంత ఘోరమా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా.. ఇప్పుడేమో ఇలా!
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సోషల్ మీడియా గురించి చంద్రబాబు నాయుడు చాలా సుభాషితాలు చెప్పారు. అదే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా ఆ నీతి వచనాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేమీ కొత్త సంగతి కాకపోయినా, చంద్రబాబు స్టైల్ అదే అయినా, ఎప్పటికప్పుడు వాటిని ప్రస్తావించక తప్పడం లేదు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు కొందరు నీచంగా పోస్టింగ్‌లు పెట్టేవారు . కొంతమంది మరీ దారుణంగా ప్రవర్తించేవారు. చట్టం ప్రకారం అలాంటి వారికి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణకు పిలిచినా, చంద్రబాబు కాని, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా కాని నానా యాగీ చేసేవి. చాలా ఘోరం జరిగిపోయినట్లు , భావ ప్రకటన స్వేచ్చకు విఘాతం కలిగినట్లు ఆరోపించేవి. సంబంధిత వార్తలను వారి పత్రికలలోమొదటి పేజీలో ప్రచురించి ఏపీలో ఏదో ప్రమాదకరంగా మారినట్లు మభ్యపెట్టేది.చంద్రబాబుకాని, ఆయన కుమారుడు లోకేష్ కాని జగన్ ప్రభుత్వంపై పూర్తి అసత్య పోస్టింగ్ లు పెట్టేవారికి విపరీతమైన ప్రోత్సాహం ఇచ్చేవారని టీడీపీవారే చెబుతుంటారు. కొన్ని వందల మందిని ఇందుకు నియమించుకున్నారని అంటారు. అలాగే ఎవరిపైన అయినా కేసులు వస్తే ప్రభుత్వంపైన, పోలీసులపైన తీవ్రమైన విమర్శలు కురిపించేవారు. లోకేష్ అయితే ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి అంత పెద్ద పదవి అంటూ ప్రచారం చేసేవారు. అదే టైమ్ లో పోలీసు అధికారులను చంద్రబాబు, లోకేష్ లు బెదిరించేవారు.ఒకసారి సోషల్ మీడియా గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సుప్రింకోర్టు గైడ్ లైన్స్ ను వివరించారు. 41 ఎ సెక్షన్ కింద నోటీసు ఇచ్చే సోషల్ మీడియా కార్యకర్తలపై విచారణ జరపాలని, ఎప్పుడు పడితే వారి ఇళ్లకు వెళ్లడాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సోషల్ మీడియా గురించి చంద్రబాబు నాయుడు చాలా సుభాషితాలు చెప్పారు. అదే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా ఆ నీతి వచనాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేమీ కొత్త సంగతి కాకపోయినా, చంద్రబాబు స్టైల్ అదే అయినా, ఎప్పటికప్పుడు వాటిని ప్రస్తావించక తప్పడం లేదు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు కొందరు నీచంగా పోస్టింగ్‌లు పెట్టేవారు . కొంతమంది మరీ దారుణంగా ప్రవర్తించేవారు. చట్టం ప్రకారం అలాంటి వారికి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణకు పిలిచినా, చంద్రబాబు కాని, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా కాని నానా యాగీ చేసేవి. చాలా ఘోరం జరిగిపోయినట్లు ,భావ ప్రకటన స్వేచ్చకు విఘాతం కలిగినట్లు ఆరోపించేవి. సంబంధిత వార్తలను వారి పత్రికలలోమొదటి పేజీలో ప్రచురించి ఏపీలో ఏదో ప్రమాదకరంగా మారినట్లు మభ్యపెట్టేది. చంద్రబాబుకాని, ఆయన కుమారుడు లోకేష్ కాని జగన్ ప్రభుత్వంపై పూర్తి అసత్య పోస్టింగ్ లు పెట్టేవారికి విపరీతమైన ప్రోత్సాహం ఇచ్చేవారని టీడీపీ వారే చెబుతుంటారు.కొన్ని వందల మందిని ఇందుకు నియమించుకున్నారని అంటారు. అలాగే ఎవరిపైన అయినా కేసులు వస్తే ప్రభుత్వంపైన, పోలీసులపైన తీవ్రమైన విమర్శలు కురిపించేవారు. లోకేష్ అయితే ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి అంత పెద్ద పదవి అంటూ ప్రచారం చేసేవారు. అదే టైమ్ లో పోలీసు అధికారులను చంద్రబాబు, లోకేష్ లు బెదిరించేవారు.ఒకసారి సోషల్ మీడియా గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సుప్రింకోర్టు గైడ్ లైన్స్ ను వివరించారు. 41 ఎ సెక్షన్ కింద నోటీసు ఇచ్చే సోషల్ మీడియా కార్యకర్తలపై విచారణ జరపాలని, ఎప్పుడు పడితే వారి ఇళ్లకు వెళ్లడానికి లేదని అన్నారు. వాస్తవమే. ఎప్పుడైనా నిర్దిష్ట నిబంధనలు పాటించే పోలీసులు ప్రవర్తించాలి.ఆ రోజులలో ఎవరైనా మరీ కొరుకుడు పడకుండా, ఎన్నిసార్లు అభ్యంతరకర పోస్టింగ్ పెట్టవద్దని చెప్పినా వినని వారి పట్ల పోలీసులు అలా వ్యవహరించారేమో తెలియదు. ఇక టీడీపీ లీగల్ టీమ్ ఎంత యాక్టివ్ గా ఉండేదంటే ఎంత ఘోరమైన పోస్టింగ్ పెట్టినవారినైనా వెంటనే బయటకు వచ్చేలా చూడడానికి గట్టిగా యత్నించేది. చిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్నప్పటికి ఆ రోజుల్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారే ఎక్కువగా ఇబ్బందులు పడవలసి వచ్చింది. చంద్రబాబు వ్యవస్థల మేనేజ్ మెంట్ ఆ స్థాయిలో ఉంటుందని చెబుతుంటారు. ఈవిఎమ్ ల మహిమో, లేక ప్రజలు ఓట్లు వేశారో కాని, చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అప్పటి సుద్దులు అన్నీ ఒక్కసారిగా హుష్ కాకి అయ్యాయి.సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారిని భయపెట్టడానికి అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు టీడీపీవారైనా, జనసేనవారైనా, వైఎస్సార్సీపీ వారైనా అసభ్య పోస్టింగ్ లు పెడితే కచ్చితంగా చర్య తీసుకోవచ్చు. కాని ఆ ముసుగులో సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని, వ్యంగ్య కామెంట్లు పెట్టేవారిని అణచివేయాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. ఉదాహరణకు ఇంటూరి రవికిరణ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తుంటారు కాని, అసభ్య పోస్టింగ్ లు పెట్టరు. కాని ఆయన చురకలను తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి వరసగా కేసులు పెడుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు, మూడు రోజులలోనే వందమందికి పైగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారంటే ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.ఎక్కడో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని విజయవాడ తీసుకువచ్చి ఆయనతో ఫిర్యాదు చేయించి ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్చ అన్ని గుర్తుకు వస్తాయి. అప్పట్లో చంద్రబాబు మొదలు అనేక మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు జగన్‌ను దూషించేవారు. వైఎస్సార్సీపీ అసమ్మతి ఎంపీ ఒకరు రోజూ టీవీ చానళ్లలో కూర్చుని కులాల మధ్య ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే, ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తే టీడీపీవారు ఎంతలా గొడవ చేశారో అంందరూ చూశారు. ఇప్పుడు అదే తాము అధికారంలోకి రాగానే అన్ని నిబంధనలను గాలికి వదలివేసి వైఎస్సార్సీపీ వారిపై అరాచకంగా కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి వారి ఇళ్లకు వెళ్లి బలవంతంగా పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు.ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్ కు తిప్పుతున్నారు. ఎప్పుడో ఐదారేళ్ల క్రితం పోస్టులు పెట్టారంటూ కొందరికి పోలీసులు ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. వెంకటేష్ యాదవ్, రమణారెడ్డి అనే కార్యకర్తలను ఇలాగే వేధిస్తున్నారట. కొంతమంది కార్యకర్తలపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విజయసాయిరెడ్డి, పొన్నవోలు సుధాకరరెడ్డి, జూపూడి ప్రభాకరరావు తదితరులు చెబుతున్నారు. తమ కుటుంబంపైన, కుమార్తెపైన టీడీపీవారు అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్నా పోలీసులు చర్య తీసుకోవడం లేదని మాజీ మంత్రి రోజా వాపోయారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ విజయమ్మ కు సంబంధించి టీడీపీ అధికారిక వెబ్ సైట్ లో ఒక తప్పుడు పోస్టింగ్ పెడితే,దానిని ఖండిస్తూ ఆమె స్వయంగా వీడియా విడుదల చేయవలసి వచ్చింది. పలువురు కార్యకర్తలు ఎక్కడ ఉన్నారో తెలియక వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అమెరికాలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ చాప్టర్ 3 ఆరంభిస్తున్నామని చెప్పిన తర్వాతే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. నిజానికి రెడ్ బుక్ అంటూ ప్రచారం చేయడమే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. కక్షపూరిత రాజకీయాలు చేస్తామని బహిరంగంగా బరితెగించి చెబుతున్నట్లు అన్నమాట.ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు.పైగా ఒక బాలిక హత్య కేసులో చర్య తీసుకోవడానికి పోలీసులు వెనుకాడుతున్నారని, కులం అడ్డం వస్తోందని చెబుతున్నారని ఆయన వెల్లడించారు. ఇది ప్రభుత్వపరువు తీసినట్లా కాదా? ఆయన చెప్పింది నిజమే అయితే సంబంధిత పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలి కదా! అదేమీ లేకుండా వైఎస్సార్సీపీ పోలీసులు అని, టీడీపీ పోలీసులు అని ఒక పిచ్చి విభజన తీసుకు వచ్చి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు మాట్లాడుతుంటే ఏపీ ఎటువైపు వెళుతోందో అన్న భయం వేస్తోంది. పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడవచ్చుకాని, ఆ మాటలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తే తప్పు అన్నట్లుగా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. కడప జిల్లాలో పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరిస్తే వారికి వైఎస్సార్సీపీ ముద్ర వేయడం, జిల్లా ఎస్పిని బదలీ చేయడం, ఒక సిఐ ని సస్పెండ్ చేయడం శోచనీయం. చిత్రమేమిటంటే ఆ అదికారులను అక్కడ నియమించింది చంద్రబాబే. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పవలసిన చంద్రబాబు తెలివిగా దానినంతా వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపైకి నెట్టేసి, పోలీసు అధికారులపై ఆరోపణలు చేసేసి తప్పించుకున్నారు. దానినే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తప్ప, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల ప్రభుత్వపరువు పోయిందన్నదానిపై క్యాబినెట్ లో చర్చించలేకపోయారని మాత్రం రాయలేదు.నిజానికి ప్రభుత్వం పై జనం బూతులు తిడుతున్నారని పవన్ కళ్యాణ్ చెబితే, దానిని చంద్రబాబు ఖండించలేకపోయారు. సూపర్ సిక్స్ హామీలు అంటూ జనాన్ని మభ్య పెట్టిన విషయాలపై సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తుంటే మాత్రం వారిపై విరుచుకుపడుతున్నారు. విజయవాడ వరదల సమయంలో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు ఇరవైమూడు కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపడం తీవ్ర విమర్శలకు గురైంది.ఆ విషయాన్ని తొలుత బయటపెట్టింది సిపిఎం నేత బాబూరావు.దాని వల్ల పరువు పోయిందని ప్రభుత్వం భావిస్తే ఆయనకు నోటీసు ఇవ్వాలి కదా! అలాకాకుండా ఆయన వీడియోలను పోస్టు చేసినవారికి నోటీసులు ఇచ్చారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిది అవుతు శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఇలా ఉంది ఏపీలో పోలీసుల తీరు. ఈ నేపధ్యంలోనే వైఎస్సార్సీపీ అలెర్ట్ అయింది. ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని వైఎస్సార్సీపీ సోషల్ మీడియావారిపై అక్రమ కేసులు పెడుతున్నవారికి అండగా లాయర్లను నియమించుకుంది. పోలీసులు అక్రమ కేసులు పెట్టినా,వారిపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించినా, ప్రైవేటు కేసులు వేయడానికి సిద్దం అవుతున్నారు. పోలీసు అధికారులు కూటమి నేతల ఒత్తిడి భరించలేకపోతున్నారు. డిజిపి ఇలాంటివాటిని నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చేసిన హెచ్చరిక గమనించదగిందే. జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ కలిసి చేస్తున్న ఈ పాపాలు ,ఘోరాలు వారికి శాపాలుగా మారతాయని, నాగుపాములా వారిని వెంటాడతాయని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, ఇప్పుడు టీడీపీ వారు చేస్తున్న వేధింపులకు పదిరెట్లు అనుభవించవలసి వస్తుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. ఈ పెద్ద వయసులో చంద్రబాబు ఇంతగా అప్రతిష్ట కావడం ఆయనకు ఏ విధంగా ఉపయోగమో అర్దం కాదు. అలాగే కాబోయే సీఎం అని ప్రచారం అవుతున్న లోకేష్ ఇప్పుడే ఇలా ఉంటే నిజంగానే ఆ పదవి వస్తే పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అన్న భయం ప్రజలకు కలగదా!ఇప్పటికైనా వీరిద్దరు తమ పంథా మార్చుకుని ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మంచిది. లేని పక్షంలో కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నట్లు ప్రజలలోనే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుందని వారు ఎంత త్వరగా గమనిస్తే వారికే అంత మంచిది.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అప్పుడు తప్పుబట్టి.. ఇప్పుడేమో ఆకాశానికెత్తి మరీ!
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ పలు పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఓకే చేయడం, దానికి అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగింది. డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో జగన్ ప్రభుత్వ విధానాల ప్రకారం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించింది. అందుకోసం ప్రభుత్వం భూముల కేటాయింపు చేసింది. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న ఎనిమిది శాతం వాటాను అదాని గ్రూప్ కొనుగోలు చేసింది. అలాగే ప్రైవేటు రంగంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు కూడా అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చింది. ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఏమని ప్రచారం చేసిందో గుర్తుందా?జగన్ ఏపీని అదానీకి రాసిచ్చేస్తున్నారని.. అదానీకి జగన్ రెడ్ కార్పెట్ వేస్తున్నారని.. ఏపీ అంతా దోపిడీ జరిగిపోతోందని వదంతులు సృష్టించారు. అదానీ పెట్టుబడులను జగన్ స్వాగతిస్తే దారుణమైన వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఎల్లో మీడియా.. ఏదో రకంగా విమర్శలు చేసిన తెలుగుదేశం ఇప్పుడు మొత్తం ప్లేట్ మార్చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంంతోనే అదానీ ఇప్పుడు మంచి పెట్టుబడిదారుడు అయిపోయారు. అదానీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవ్వగానే మొత్తం ఏపీ ముఖచిత్రం మారిపోయినట్లు తెలుగుదేశం మీడియా డాన్స్ చేస్తోంది.ఇక తెలుగుదేశం పరిశ్రమలు పెట్టేసినంతగా ఊదరగొడుతుంది. అదానీ అప్పుడైనా, ఎప్పుడైనా పరిశ్రమలు పెట్టి ఏపీకి ఉపయోగపడితే మంచిదే. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు రాకుండా, వచ్చిన వాటిని భయపెట్టేలా అటు తెలుగుదేశం ప్రచారం చేసింది. ఇటు ఎల్లో మీడియా అడ్డంగా దుష్ప్రచారం చేసింది.అప్పుడు పరిశ్రమల స్థాపనకు భూములిచ్చినా, నీళ్లిచ్చినా, రాయితీలిచ్చినా దోచుకోవడమన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విధానం తయారు చేస్తేనే వరాల వర్షం కురుస్తోందని , స్వర్ణాంధ్ర సాకారం అవుతోందని బాకా వూదుతున్నారు. జగన్ టైంలో షిరిడీ సాయి సంస్థ కొత్త ప్రాజెక్టును చేపట్టడానికి వీలుగా ప్రభుత్వంనుంచి భూమిని తీసుకుంది. అలాగే నెల్లూరు జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు భూమి తీసుకుంది. రామాయపట్నంవద్ద ఇండోసోల్ అనే సంస్థ సోలార్ ప్యానెల్స్ తయారీకి పూనుకుంటే.. ఈనాడు మీడియా ఎంత విష ప్రచారం చేసిందో చెప్పలేం.కొద్ది రోజుల క్రితం అదానీతో భేటీ సందర్భంగా వచ్చిన కథనాలను గమనిస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్ ను రాసిచ్చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతోందా? అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఒకటేమిటి !అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలు చేస్తోందని ఈనాడు మీడియా బాజా వాయించింది.ఇవేగాదు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా అదానీ కంపెనీయే నిర్మిస్తుందట. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ప్రాజెక్టులు పెడుతుంటే.. పచ్చి అబద్ధాలను వండివార్చిన ఎల్లో మీడియా ఇప్పుడు మొత్తం ఏపీలో అన్నిరకాల పెట్టుబడులను గుజరాత్ కు చెందిన అదానీ తెస్తే బాగుందన్నట్టుగా రాస్తున్నారు. వారు అడిగినంత మేర వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందట. టెండర్లు లేకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం అదానీకి ఎలా అప్పగిస్తారో తెలియదు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి నీచమైన రాజకీయం జరుగుతున్నదో ప్రజలు ఆలోచించుకోవచ్చు.తమకు నచ్చని పారిశ్రామికవేత్తలపై బురద చల్లడం, తమకు ఇష్టం లేని పార్టీ అధికారంలో ఉంటే వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని అసత్య ప్రచారాలను చేయడం ఇవ్వన్నీ చూస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద మాఫియా గుప్పిట్లో చిక్కుకున్నదనే అభిప్రాయం కలుగుతోంది.జగన్ ప్రభుత్వం రామాయపట్నం , మచిలీపట్నం, మూలపేట పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వపరంగా నిర్మాణం సాగించింది. ఆ పోర్టులను కూడా అదానీకే అప్పజెప్పాలన్న ఆలోచన జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కృష్ణపట్నం, గంగవరం పోర్టులలో అదానీ పెట్టుబడులను పెడితేనే ఏదో ఘోరం జరిగిపోయినట్టు ప్రచారం చేసిన వీళ్లు.. ప్రస్తుతం ఆ పోర్టుల విస్తరణకు అవసరమైన వందల వేల ఎకరాల భూములను కట్టబెట్టి ఆ కంపెనీపోర్టుల విస్తరణకు ప్రతిపాదించింది అని ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు.ఇక మంత్రి లోకేష్ అమెరికాలో ఆయా కంపెనీల సీఈవోలను కలవడాన్ని హైలైట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. టెస్లా కార్ల కంపెనీకి లోకేష్ ఆహ్వానం పలికారని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో భాగస్వాములు కావాలని కోరారని రాశారు. వీటిలో నిజంగా ఏదైనా జరిగితే మంచిదే. కానీ ఇదే లోకేష్ కొద్ది సంవత్సరాల క్రితం టెస్లా కంపెనీ ఏపీకి వచ్చేస్తున్నదన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు నిజంగానే దాన్ని సాధించగలిగితే స్వాగతించవచ్చు. అలా కాకుండా ప్రచార ఆర్భాటానికి సూపర్ సిక్స్ హామీల అమలు వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి యాత్రలు చేస్తుంటే అది ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది.ఎల్లో మీడియాలో మరో మోసపూరిత కథనం ఇచ్చింది. స్కిల్ హబ్ గా ఏపీ మారుతోందని నైపుణ్య శిక్షణతో ఏడాదికి 1.24 లక్షల ఉద్యోగాలు వస్తాయని 92వేల మందికి స్వయం ఉపాధి కలుగుతుంది సిడాప్ వార్షిక ప్రణాళిక తెలిపిందంటూ ఆహా,ఓహో అంటూ భజనం చేసింది. ఒక వైపు ఉన్న ఉద్యోగాలను ఊడగొడతూ ఇంకోవైపు లక్షల ఉద్యోగాలు వస్తాయని నివేదికలు తయారు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు గమనించలేరా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్... నువ్వు చెలరేగిపోవచ్చా?.. మరి ఆ నాయకుడి కీళ్లు ఎందుకు విరగొట్టలేదో?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , మంత్రి లోకేష్‌లు ప్రజలను భయపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో తాము కక్షరాజకీయాలు చేయబోమని, అదే టైమ్ లో తప్పు చేస్తే వదలబోమని తన అనుభవాన్ని రంగరించి తెలివిగా మాట్లాడుతున్నారు.పవన్ కల్యాణ్ తనే కొత్త రాజ్యాంగం రాసినట్లు వైఎస్సార్సీపీ నేతలు నోరెత్తితే ఊరుకోరట. టివీలలో మాట్లాడితే వాళ్ల సంగతి చూస్తారట. వాటిని రికార్డ్ కూడా చేస్తున్నారట. మహిళల జోలికి వస్తే కాళ్లు కీళ్లు విరగ్గొడతారట. ఇలా పవన్ కల్యాణ్ ఏదేదో ప్రసంగం చేస్తూ సినిమా డైలాగులు చెబుతున్నారు.ఒకపక్క రాష్ట్రంలో మహిళలపై ఘోరమైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, హింసాకాండ జరుగుతుంటే నిన్నటివరకు నోరు విప్పకుండా కళ్లు మూసుకు కూర్చున్న మూడు రోజుల క్రితం ఒక సభలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్, వైకాపా నాయకులు వాళ్ల మద్దతుదార్లు మహిళల జోలికి వస్తే కాళ్లు కీళ్లు విరగ్గొడతామనడంలోని ఆంతర్యం అర్థమవుతోంది. కేవలం టీవీల్లోగానీ ఇతరత్రాగానీ ,తన అసలు రూపాన్ని రంగును బయటపెడుతున్నవారిని భయపెట్టడానికే పవన్ కల్యాణ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మహిళలజోలికి ఎవరు వెళ్లినా చర్య తీసుకోవాల్సిందే. ఆయనకు నిజంగానే అంత దమ్ముంటే పిఠాపురంలో అత్యాచారానికి పాల్పడిన టీడీపీ నాయకుడి కాళ్లు కీళ్లు ఎందుకు విరగ్గొట్టలేదో చెప్పాలి.తూర్పు గోదావరి జిల్లాలో మహిళలపై కొందరు వ్యక్తులు అరాచకాలు చేస్తే వాళ్ల జోలికి ఎందుకు వెళ్లలేదో తెలియదు.కాకినాడ రూరల్ లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పై జనసేన కార్యకర్తలే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ముందుగా వాళ్ల కాళ్లు విరగ్గొట్టే పని పవన్ చేయాలి కదా. జనసేన ఎమ్మెల్యే నానాజి ఒక దళిత ఫ్రొఫెసర్ పై దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఏమి చేశారు? అంటే ఇలాంటి దారుణమైన పనులు టీడీపీ, జనసేనవారు ఎవరైనా చేస్తే పట్టించుకోరా? వైఎస్సార్సీపీకి 11 సీట్లే వచ్చినా నాయకుల నోళ్లు మాత్రం మూత పడలేదట.భవిష్యత్తులో నోటినుండి మాట రాకుండా పవన్ చేస్తారట. 2019లో ఈయన రెండు చోట్ల ఓడిపోయినా ఐదేళ్లపాటు ఇష్టారీతిన చెలరేగిపోయారు కదా. ఇప్పటం వద్ద కారుమీద కూర్చొని అల్లరి చేశారు కదా. మంత్రులను పట్టుకొని చెప్పుతో కొడతా అన్నారు కదా. చంద్రబాబు అరెస్టయితే రోడ్డు మీద పడుకొని నానా యాగీ చేశారు కదా. అంటే జగన్ ప్రభుత్వంలో అంత స్వేచ్ఛ ఆయనకు వచ్చినట్టే కదా. ఇప్పుడు మాత్రం వైఎస్సార్సీపీ వారు నోరు విప్పకూడదట.జగన్ టైమ్‌లో సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనలు ఎంత దారుణమైన పోస్టులను పెట్టారో అందరికీ తెలుసు. వారికి చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లు ఎంతగానో అండగా నిలబడ్డారు. నిజానికి సోషల్ మీడియాలో ఏ రాజకీయపార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా అభ్యంతరకర పోస్ట్ పెట్టకూడదు. అంతెందుకు తాజాగా టీడీపీ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి చూడండి 2022లో వైఎస్ విజయమ్మ వాహనం టైర్ ఫంక్చర్ అయిన ఘటనను ఇటీవలే జరిగినట్టు పేర్కొంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో టీడీపీ సోషల్ మీడియా అప్ లోడ్ చేసింది.మరి దీన్ని పవన్ కల్యాణ్ సమర్థిస్తారా? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. తమది మంచి ప్రభుత్వమని ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు. అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నా తమది మంచి ప్రభుత్వమని పవన్ కల్యాణ్ బాజా వాయించుకోవడాన్ని తప్పుపట్టలేం. వైసీపీ ఇంకా వేషాలు వేస్తే తొక్కి నార తీస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించడమంటే ఆయనేదో సొంత రాజ్యాంగం రాసుకున్నట్టుంది. ముందుగా ఆయన రాష్ట్రంలో పలు చోట్ల జనసేన నేతలు,కార్యకర్తలు టీడీపీవారి చేతిలో అవమానాలకు గురవ్వుతున్నారు. దెబ్బలు తింటున్నారు.అలా జనసేనపై దాడులు చేస్తున్న టీడీపీవారిని తొక్కి నారతీస్తే ఆ తర్వాత వైసీపీ గురించి మాట్లాడవచ్చు. చంద్రబాబును పొగడడానికే తెగ ఆరాటపడుతున్న పవన్ కల్యాణ్ పోలీసు ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? పవన్ కల్యాణ్ గ్యాస్ బండ్ల కార్యక్రమంలో పాల్గొని వెళుతున్నప్పుడు కొందరు మహిళలు తమకు అన్యాయం జరిగిందని రోదిస్తూ ఆయన్ని కలవడానికి ప్రయత్నిస్తే ఆగి కనీసం పలకరించకుండా వెళ్లిపోయిన పవన్ కల్యాణ్ డైలాగులకు ఏ పాటి విలువ వుంటుంది. గతంలో 35 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని కథలు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఎంతమంది నిందితులను పట్టుకొని తాటతీశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఆయన పేటెంట్గా మార్చుకున్నట్టున్నారు. ఆ ధర్మమంటే ఏమిటో తెలియకపోయినా మతాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.ఇదే టీడీపీ, జనసేన, బీజేపీ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది కదా.ఇక రెడ్ బుక్ రాజ్యాంగ కర్త అయిన లోకేష్ అమెరికా వెళ్లి మరీ రెడ్ బుక్ ఛాప్టర్ 3 తెరుస్తామని అంటున్నారు. ఒక పక్క పెట్టుబడులు ఆహ్వానిస్తామంటున్నారు.. ఇంకొక పక్క రెడ్ బుక్ ఛాప్టర్ 3 పేరుతో తమ ఇష్టారాజ్యంగా అరాచకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన హింసాకాండ, దౌర్జన్యాలు, విధ్వంసాలతో లోకేష్ కు సంతృప్తి కలిగినట్టు లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలను రెడ్ బుక్ అంటూ భయపెడుతు తిరుగుతున్న లోకేష్ ను, ఆయన్ని మంత్రిగా పెట్టుకొని నిస్సహాయుడిగా మిగిలిపోయిన చంద్రబాబును చూసి జనం విస్తుపోతున్నారు. వీరిద్దరికి భిన్నంగా చంద్రబాబు మాత్రం కక్షలకు దూరమని చెబుతూనే తాము పగ తీర్చుకోబోతున్నామని పరోక్ష సంకేతాలు ఇస్తుంటారు. చంద్రబాబేమో తెలివిగా కక్ష రాజకీయాల గురించి మాట్లాడుతుంటే పవన్, లోకేష్‌లు మాత్రం పచ్చిగా దారుణంగా మాట్లాడి ప్రత్యర్థి రాజకీయ నాయకులను, తమకు గిట్టనివారిని భయాందోళనలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు.కాకపోతే దీనికి చట్టాన్ని ఉల్లంఘించినవారు అని ఒక ముసుగు వేస్తున్నారు. టీడీపీ , జనసేనలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలుగానీ, సుమారు రెండువందల వాగ్ధానాలనుగానీ అమలు చేయలేక, చేతులు ఎత్తేస్తున్నామని చెప్పలేక వాటి గురించి ప్రశ్నించేవారిని వేధించాలని నోళ్లు మూయించాలని అనుకుంటే అది సాధ్యమయ్యేది కాదని చరిత్ర చెబుతోంది. తమ నియంతృత్వంతో ఎల్లకాలం అధికారంలో ఉంటామని వారు భావిస్తుంటే అది భ్రమే అవుతుంది. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవడం మాని అబద్ధాలతో మోసం చేస్తూ, రెడ్ బుక్కులతో భయపెడుతూ పాలన సాగిస్తే ప్రజలు ఎంతకాలం సహించగలుగుతారు?::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘బాగున్నాయంటూనే’ లాజిక్ లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు..!
ఏపీమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్దతను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు తెలియకుండానే మెచ్చుకున్నారు..అవును!వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కాని అది నిజమే!అఫ్ కోర్స్ ..వెంటనే బహుశా తేరుకుని తన ఒరిజినల్ స్టైల్ లో జగన్ ను విమర్శించడం, అబద్దాలు చెప్పడం జరిగిపోయిందనుకోండి..విశాఖలో రిషికొండ పై జగన్ టైమ్ లో నిర్మించిన అత్యంత ఆధునిక భవనాలను చంద్రబాబు పరిశీలించారు. వాటిని చూసినప్పుడు మనసులో ఒక భావన కలిగి ఉండాలి.అలాంటి భవనం ఒక్కదానినైనా తాను అమరావతిలో నిర్మించలేకపోయానే అని!ఆ ఝలసీతోనే తదుపరి మాట్లాడారనిపిస్తుంది. తానేమో సుమారు రెండవేల కోట్లకుపైగా వ్యయం చేసి అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, కోర్టు భవనాలు నిర్మిస్తే, అవి చాలీ,చాలనివి కావడం, వర్షం వస్తే నీరు కారడం, వరద వస్తే ఏమవుతుందోనని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడింది. అదే జగన్ విశాఖలో కార్యనిర్వాహక రాజధాని చేసే ఉద్దేశంతో రిషికొండపై ఆకర్షణీయమైన భవనాలు నిర్మిస్తే వాటిని చంద్రబాబు సైతం ప్రశంసించకుండా ఉండలేని పరిస్థితి. మరో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెల్ఫీలు దిగి ముచ్చటపడిన తీరు .పైకి వారు జగన్‌ను దూషించినా, లోపల మాత్రం ..భలేగా ఉన్నాయి భవనాలు అని అనుకునే ఉండాలి.రిషికొండ విశాఖకు ప్రతిష్టాత్మకంగా ఉండే ప్రదేశం. అక్కడ కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలన్న తలంపుతో సముద్రతీరంలో ఉన్న ఆ కొండపై అప్పటికేఉన్న టూరిజం భవనాలు కొన్నిటిని తొలగించి ,కొత్త భవనాలు నిర్మించి విశాఖకే మకుటాయమానంగా జగన్ తీర్చిదిద్దారు.రాష్ట్రపతి, ప్రధానమంత్రి,కేంద్ర మంత్రులు, విదేశీ ప్రముఖులు ఎవరైనా వస్తే, అక్కడ బస చేస్తే రాష్ట్ర ప్రతిష్ట పెరిగేలా వాటిని రూపొందించారు.వాటి నిర్మాణం సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఎన్ని రకాలుగా ఆటంకాలు క్రియేట్ చేయాలో అన్నీ చేశాయి. వాటిని తట్టుకుని జగన్ ప్రభుత్వం ఆ భవనాలను పూర్తి చేసింది.కాని అనూహ్యంగా ఈవిఎమ్ ల మహిమో,మరే కారణమో తెలియదు కాని ఆయన ప్రభుత్వం ఓడిపోయి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రిషికొండకు వెళ్లాలా?వద్దా ?అని ఇన్ని నెలలు తటపటాయించి ఎలాగైతేనేం వాటిని చూడకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉండలేకపోయారు. ఆ సందర్భంగా ఆయన మాటలు చూడండి..భవనాలు అద్భుతంగా ఉన్నాయని, కొండ చరియలు విరిగి పడకుండా జపాన్ టెక్నాలజీని వినియోగించారని, నాలుగు బ్లాక్ లు కూడా అలాగే లేటెస్ట్ సాంకేతికతతో కట్టారని ఆయన చెప్పారు. వీటిని చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిందని అన్నారు. ఎన్నో దేశాలలో పాలెస్ లు చూశాను కాని ఇలాంటి కట్టడాలు చూడలేదని అన్నారు. రాష్ట్రపతి భవన్ కన్నా అధ్బుతంగా నిర్మించారని, అమెరికాలో వైట్ హౌస్ కూడా ఇలా ఉండదని అన్నారు. అయితే ఇదంతా ఆయన జగన్ సమర్ధతను పొగుడుతున్నానని తెలియకుండానే మాట్లాడి, ఆ వెంటనే ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని ముక్తాయించారు. భవనంలో ఆ రూమ్ ఇలా ఉంది..అలా ఉంది..టాయలెట్ అంత ఖరీదైనదా?జగన్ పాలెస్ కట్టుకున్నారు..ఆయన ఏమైనా రాజా?చక్రవర్తా?ప్రజలకు కూడా చూసే అవకాశం కల్పించి ఆ భవనాలను ఏమి చేయాలో ఆలోచిస్తానని ప్రకటించారు.ఈ బిల్డంగ్ కట్టినందుకు జగన్ రాజకీయాలకు పనికి వస్తారో, రారో జనం నిర్ణయించుకోవాలట.ఇంత గొప్పగా ఒక నిర్మాణం చేయగలిగిన జగన్‌ది గొప్పతనం అవుతుందా?కాదా?ఇతర దేశాలలో కూడా లేని విధంగా విశాఖలో ఒక భవన సముదాయం వచ్చినందుకు సంతోషించాలి కాని, అసూయతో కుళ్లితే ఏమి లాభం? ఒకవైపు విశాఖలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తూ, వేలాది మంది ఉద్యోగాలు పోతున్నాయని వారంతా ఆందోళనకు దిగుతుంటే పట్టని చంద్రబాబు నాయుడు,డైవర్షన్ రాజకీయంలో భాగంగా మళ్లీ విశాఖ రిషికొండ భవనాలను తెరపైకి తెచ్చి దుష్ప్రచారంచేస్తున్నారు.వాటి వల్ల పర్యావరణం దెబ్బతిందని మరో ఆరోపణ చేశారు.అది నిజమే అయితే, గతంలో టిడిపి హయాంలోనే రిసార్ట్స్ కట్టారు కదా అన్నదానికి ఆయన జవాబు ఇవ్వరు. ఒక వైపు అది జగన్ సొంత పాలెస్ అని ప్రచారం చేస్తారు..ఇంకో వైపు టూరిజం శాఖ సీఎం అధికారిక కార్యక్రమంలో ప్రభుత్వ భవనాల సందర్శన అని చెబుతుంది. దీనిని బట్టే చంద్రబాబు ఎంత పచ్చిగా అబద్దాలు చెప్పగలరో కనిపించడం లేదా!ఆ కొండపై అంతా కలిపి అరవై ఎకరాల భూమి లేదు.అక్కడ మళ్లీ పచ్చదనం అప్పుడే మొదలైంది. పైగా రాష్ట్రానికే అదంతా ప్రతిష్టాత్మకంగా మారింది.అది ప్రొజెక్టు చేస్తే జగన్‌కు మంచి పేరు వస్తుందన్న దుగ్దతో ఉన్నవీ,లేనివి కల్పించి,డబ్బు వృధా అయిందంటూ అసత్యాలు ప్రచారం చేశారు. ఒక చిన్న కొండపైన నాలుగు భవనాలు నిర్మిస్తేనే పర్యావరణం దెబ్బతింటే, చంద్రబాబు అమరావతిలో మూడు పంటలు పండే భూములు ముప్పైమూడువేల ఎకరాలు ఎందుకు రాజధాని పేరుతో తీసుకున్నారు? పచ్చటి పొలాలను బీడు భూములుగా ఎందుకు మార్చారు?ఏడేనిమిదేళ్లుగా అక్కడ పర్యావరణం అంతా దెబ్బతినిపోలేదా?అవన్ని ఎందుకు? కృష్ణానది కరకట్టపై సరైన అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నారే.దాని వల్ల పర్యావరణానికి నష్టం కలగడం లేదా?కరకట్ట వెంట ఉన్న భవనాల నుంచి వ్యర్ధాలు నదిలో కలుస్తున్నాయని జనం గగ్గోలు పెడుతున్నా ఆయన అక్కడ నుంచి ఖాళీ చేయడం లేదే!పైగా కోట్ల రూపాయల వ్యయంతో సిసి టీవీ కెమెరాలు, ఫెన్సింగ్‌లు మొదలైనవి ఏర్పాటు చేసుకుంటున్నారే. జగన్ 450 కోట్లు ఖర్చు చేసి విశాఖకు ఒక అందాన్ని తీసుకు వచ్చారు. అది తమ విధానం కాదని, తాము సింపుల్ గా ఉంటామని చంద్రబాబు ఎన్నడైనా చెబుతారా?తాను నిర్మిస్తే అది చాలా గొప్ప విషయం.ఎదుటివారు కడితే ధనం వృధా..ఆయనేమైనా రాజా?చక్రవర్తా?అని వ్యాఖ్యలు. ఏ ప్రజాస్వామ్యంలో చెప్పారు.. లక్ష కోట్ల వ్యయం చేసి రాజధాని కోసం భవనాలు కట్టమని?తెలంగాణలో సచివాలయ కొత్త భవనానికి అంతా కలిపి వెయ్యి కోట్లు కాలేదు.కాని అమరావతిలో కేవలం తాత్కాలిక సచివాలయ, అసెంబ్లీ భవనాలకే సుమారు 1500 కోట్లు చంద్రబాబు ఎలా ఖర్చు చేశారు?అవి పనికి రావని మళ్లీ నాలుగువేల కోట్లో ,ఇంకా ఎక్కువ మొత్తంతోనో సచివాలయ భవనం నిర్మిస్తామని ఎందుకు చెబుతున్నారు.ఏకంగా ఏభై అంతస్తుల భారీ భవంతిని, పైన హెలికాఫ్టర్ దిగేలా ప్లాన్ చేస్తున్నారే. అదంతా డబ్బు వేస్ట్ చేయడం కాదా?అక్కడ భూమి బహుళ అంతస్థుల భవనాలకు అనుకూలమైనది కాదని నిపుణులు చెబుతున్నా, వేల కోట్లు కేవలం పునాదులకే వ్యయం చేయబోతున్నారే! రకరకాల డిజైన్లు అంటూ ఎన్ని వందల కోట్లు వృధా చేశారు. ఒకసారి ఇడ్లీపాత్ర షేప్ అని, ఇంకోసారి ఇంకేదో అని చెబుతూ గ్రాఫిక్స్ చూపుతూ ప్రజలను మభ్య పెడుతున్నారే! రిషికొండ భవనాలు జగన్ సొంత నివాసమైతే చంద్రబాబు ఆ భవనాల వద్దకు ఎందుకు వెళ్లారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.నిజంగానే చంద్రబాబు అంత పొదుపరి అయితే గత టరమ్ లో హైదరాబాద్ లో ఎన్ని నివాసాలకు ఆయన ప్రభుత్వ ధనం వెచ్చించారు?ఏకంగా స్టార్ హోటల్ పార్క్ హయత్ లో ఒక ప్లోర్ తీసుకుని ఎన్ని కోట్ల వ్యయం చేశారు?అంతెందుకు వరదలలో తన కరకట్ట ఇల్లు మునిగిపోతే , కలెక్టరేట్ ఆవరణలో ఐదు కోట్ల రూపాయల విలువైన బస్ లో ఎందుకు ఉన్నారు. ప్రభుత్వానికి విజయవాడలో పలు అతిధి గృహాలు ఉన్నాయి కదా!అక్కడ ఎందుకు దిగడం లేదు? అంతేకాదు.విజయవాడ వరద బాధితులకు సాయం అంటూ కేవలం అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల కొనుగోలు చేశామంటూ ఇరవైమూడు కోట్లు ఖర్చు రాసిన ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం రికార్డులలో నిలిచిపోతుంది. విశాఖలో సర్క్యూట్ అతిధి గృహం విఐపిలకు కేంద్రంగా ఉండేది.గతంలో ముఖ్యమంత్రులు వస్తే అక్కడే బస చేసేవారు. మరి చంద్రబాబు అక్కడకు వెళుతున్నారా?ఒకప్పుడు ముఖ్యమంత్రులు రైళ్లలో ప్రయాణించేవారు.మరి చంద్రబాబు సీఎం అయ్యాక ఎన్నడైనా రైలు ఎక్కారా?ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ లలో ఎందుకు తిరుగుతున్నారు.ప్రజాస్వామ్యంలో రారాజు మాదిరి చిన్న పనికి, పెద్ద పనికి ఇలా ప్రత్యేక విమానాలలో వెళ్లడం డబ్బు దుర్వినియోగం కాదా? చివరికి చంద్రబాబు ఇచ్చాపురం వద్ద ఒక పల్లెలో ఒక గ్యాస్ బండ ఇచ్చి, ఒక ఇంటిలో టీ కాయడానికి వెళ్లడానికి గాను ప్రత్యేక విమానం, హెలికాఫ్టర్ ను వాడాలా?ఎక్కడైనా రోడ్డుపైన ఉండే గోతిని పూడ్చడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎన్నడైనా వెళ్లడం చూశామా?అది ఆర్.అండ్ బి శాఖలో చిన్న స్థాయి ఉద్యోగులు చేసే పని.దానికి ఎందుకు లక్షలు వ్యయంతో ఆర్భాటం చేశారో చెప్పగలరా? అంతా ప్రచార యావ తప్ప ఇంకొకటి ఉందా?తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేక, ప్రజలలో ఎదురవుతున్న వ్యతిరేకతను, నిరసనను తప్పించుకోవడానికి ప్రజలను తప్పుదారి పట్టించి, మాయ చేయడానికి ప్రయత్నించడంలో చంద్రబాబు దిట్ట. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు.రిషికొండపై భవనాలు బాగానే ఉన్నాయట. వాటిని నిర్మించిన జగన్ ప్రభుత్వం మాత్రం తప్పు చేసిందట. లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు.ఆ భవనాలలో బస చేయాలని చంద్రబాబుకు కోరిక ఉన్నా, కేవలం జగన్ పై ద్వేషంతో ఆ పని చేయలేకపోతున్నారు. చంద్రబాబుకు ఒక సలహా! ప్రభుత్వపరంగా వాటిని వాడుకోవడం ఇష్టం లేకపోతే,అక్కడ తాను కాని, ప్రధాని,రాష్ట్రపతి,విదేశీ ప్రముఖులు వంటివారు విడిది చేస్తే జగన్ కు పేరు వస్తుందన్న భయం ఉంటే ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. దానిని టూరిస్ట్ ప్రదేశంగా అభివృద్ది చేయండి.నిత్యం వేలాది మందితో కళకళలాడుతుంది. లేదా అక్కడ చక్కని మ్యూజియం ,లేదా ప్రజలకు ఉపయోగమైన గ్రంధాలయం గా మార్చి అందులో కంప్యూటర్లతో సహా అన్ని సదుపాయాలు సమకూర్చి మంచి విద్యా కేంద్రంగా తయారు చేయండి. అంతేకాని జగన్ పై ద్వేషంతో,అక్కసుతో ఆ భవనాలను పాడు చేయకండి.చంద్రబాబు ప్రభుత్వానికి అలాంటి విజ్ఞత వస్తుందని ఆశించవచ్చా!::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ కన్నా హీనంగా.. డైవర్షన్ పాలిటిక్స్ కోసం నానా తంటాలు
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రూ. 6 వేలకోట్లకుపైగా భారం!’’, ‘‘అభివృద్ధికి రోడ్ మ్యాప్’’.. ఈ రెండింట్లో ఏది ప్రజలకు సంబంధించిన వార్త? ఏది భజంత్రీ వాయించే వార్త? ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించవలసిన సమయం ఆసన్నమైంది. ప్రజలను తప్పుదారి పట్టించడానికి, మోసం చేయడానికి ఈనాడు , ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ,ప్రజలు అసలు సమస్యపై దృష్టిపెట్టకుండా ఉండడంకోసం పచ్చి మోసపూరితంగా కథనాలు ఇస్తున్నాయి. .. నిజంగానే ఏపీ అభివృద్ధికి రోడ్ మ్యాప్ ఉంటే రాయడం తప్పని ఎవరూ చెప్పరు. కానీ ఏపీలోని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన ఒక వర్గం మీడియా ఓ రాజకీయపార్టీకన్నా హీనంగా మారి పచ్చి అబద్ధాలను రాస్తోంది.ఏపీలో వచ్చే ఐదేళ్లపాటు కరెంట్ చార్జీలు పెంచబోమని, పైగా అవసరమైతే 30శాతం చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు రూ.6వేలకోట్లకుపైగా చార్జీలను సర్దుబాటు పేరుతోనో, మరో పేరుతోనో పెంచుతున్నారంటే అది వాగ్ధానభంగం అవుతుందా? కాదా? దీనిపై ప్రజల్లో నిరసన వస్తుంటే దాన్ని కప్పిపుచ్చడానికి ఓ రాజకీయ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు కుట్రలకు పన్నవచ్చు. అందులోను అది ఆయన సహజ లక్షణంకూడా. ఉదాహరణకు కరెంటు చార్జీల పెరుగుదలను డైవర్ట్ చేయడం కోసం సరిగ్గా ఇదే టైమ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ కింద ఒక బండ ఇచ్చి పండగ చేసుకోమని చెబుతున్నారు.ఇందులో చాలా మతలబులు ఉన్నాయి.అరకోటిమందికి ఎగనామం పెట్టడం, ముందుగానే ప్రజలు డబ్బు కట్టాలని చెప్పడం తదితర అంశాలుఉన్నాయి.విషయం ఏమిటంటే గ్యాస్ బండ ద్వారా నెలకు వచ్చే రాయితీ సుమారు రెండువందల రూపాయలు. అయితే..కరెంటు చార్జీల బాదుడు వల్ల ప్రజలపై పడే భారం సుమారు 400 రూపాయలుగా ఉంటుంది. ఇక నిత్యావసర సరుకుల ధరలు,వంట నూనెల ధరల పెరుగుదలపై జనం గగ్గోలు పెడుతున్నారు. ఇవన్ని లెక్క వేస్తే జనంపై కనీసం ఏడు, ఎనిమిది వందల రూపాయల అదనపు భారం పడుతోంది.ఇతర హామీల సంగతి సరేసరి. టీడీపీ కన్నా దారుణంగా ఎల్లో మీడియా పన్నాగాలు పన్నుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈఆర్సీ సిఫార్సులమేరకు కొద్దిపాటి సర్దుబాటు చార్జీలు పెంచినా ఇంకేముంది అంటూ గగ్గోలు పెట్టిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇప్పుడు వేలకోట్ల భారం వేస్తున్నా కనిపించడం లేదు. చార్జీలు పెంచడం కూడా అభివృద్ధికి రోడ్ మ్యాప్ అని ప్రజలు అనుకోవాలని అన్నట్టుగా అభూతకల్పనలు సృష్టించి కథనాలు వండుతున్నారు.అలాగే జగన్ సోదరి షర్మిలను అడ్డం పెట్టుకొని ఆమెతో పిచ్చిప్రకటనలు చేయించి, అదేదో ప్రజా సమస్య అన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ, షర్మిల అంశానికి ముగింపు పలికి ప్రజాసమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ,కూటమి నయవంచనలను బహిర్గతం చేయాలని నిర్ణయించింది. నెలకొక అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ చెబుతోంది. అందులో భాగంగానే జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి కూడా టీడీపీ పూనుకుందని ఆ పార్టీ పేర్కొంది.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కలిసిందన్న ఆరోపణ, ముంబాయి నటి జత్వానీ వ్యవహారం, ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల కుట్ర, మదనపల్లె ఫైల్స్..ఇలా రకరకరాల అంశాలను ప్రచారం చేస్తూ చంద్రబాబు కాలం గడుపుతున్నారు. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు తలుచుకోకుండా చూడాలనేది వారి ప్రయత్నం. షర్మిల ఇష్యూకు సంబంధించి అసలు స్పందించకుండా ఉంటే వైఎస్సార్సీపీకి ఇబ్బందిగా ఉండేది. అందువల్ల ఆమె చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వక తప్పదు.ఇక దాన్ని ముగించి జనంలోకి కీలకమైన అంశాలను తీసుకుపోయే లక్ష్యంతో జగన్ కూడా కరెంట్ చార్జీల పెంపు దీపావళి కానుకా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమని, 30 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారని అందుకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తూ తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని ప్రజలు క్షమించరని రాజకీయ పార్టీగా తాము చూస్తూ వూరుకోబోమని జగన్ హెచ్చరించారు. పైగా ఈ ప్రభుత్వంలో పెంచుతున్న చార్జీలకు కూడా వైఎస్సార్సీపీ కారణమని ప్రచారం చేయడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఈ కరెంటు చార్జీల పెంపు విషయంగానీ, జగన్ వ్యాఖ్యలుగానీ ఎల్లోమీడియాకు అసలు వార్తలే కాదు. అభివృద్ధికి రోడ్డు మ్యాప్ అంటూ మోసపూరిత కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఇది కూడా డైవర్షన్ లో భాగమని అర్థం చేసుకోవచ్చు.లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ అతి పెద్ద సవాళ్లు అని వీటిని అధిగమించడం ఆషామాషీ కాదని ఈ మీడియాకు ఇప్పుడు తెలిసింది.నిరుద్యోగులకు నెలకు మూడువేల రూపాయల భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీని విస్మరించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది అంటూ బ్యాండ్ వాయించింది. మరి ఇదే మీడియా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమల గురించిగానీ, పెట్టుబడులగురించిగానీ ఎన్నడూ ఒక్క మంచిమాట రాయలేదు. జగన్ తీసుకొచ్చిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల గురించి ఎప్పుడూ వ్యతిరేక వార్తలే రాసింది. జగన్ టైమ్‌లో మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రంగంలో వస్తుంటే దాన్ని ఎలా చెడగొట్లాలా అని తెగ ఆరాటపడింది.ఆ కంపెనీలకు భూములు ఇవ్వడమే తప్పన్నట్టుగా రాసింది.ఇప్పుడేమో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తోంది అని, వరాల వర్షం కురిపిస్తోంది అని బాకా ఊదుతోంది. తాజాగా వచ్చిన కథనం ప్రకారం రామాయంపేట, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లను కూడా ప్రైవేట్ పరం చేయాలని తలపెట్టి వీటన్నిటికీ బిడ్లు పిలిచారు. గతంలో గంగవరం పోర్టులో కొద్దిపాటి ప్రభుత్వవాటాను విక్రయిస్తేనే నానాయాగీ చేసిన ఎల్లో మీడియా తెలుగుదేశం, జనసేన కూటమి ఇప్పుడు మొత్తం రూ. వేలకోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రైవేట్ కు అప్పగించడానికి సిద్దపడుతోంది. టీడీపీ,జనసేన మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్లను ప్రభుత్వమే నడుపుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఛారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి కంపెనీలనుంచి, జనంనుంచి విరాళాలు సేకరిస్తారట. మరి ఇది వాగ్ధానభంగమో లేక ఇంకేమనాలో ఆలోచించుకోవచ్చు. దీనికి ఆదాయపన్ను మినహాయిస్తారంటూ ఈనాడు బిల్డప్ ఇచ్చింది. అన్నా క్యాంటీన్లలో నాసిరకం ఆహారం పెడుతున్నారని సామాన్యులు వాపోతున్న విషయాన్ని మాత్రం చెప్పరు. వరద పడగొట్టింది, పరిహారం నిలబెట్టింది అంటూ ఈనాడు మీడియా రైతులకు వరద సాయం చేయడంతో, వారంతా విత్తనాలు వేశారని ,దాంతో మళ్లీ పచ్చదనం వచ్చేసిందంటూ మొదటి పేజీలో ప్రచారం చేసింది. చంద్రబాబు అధికారంలో ఉంటే జనం సంగతేమోగానీ, ఈనాడుకు అంతా పచ్చగా కనిపిస్తుందని,అదేదో ఇప్పుడే జరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చింది. ఇవన్నీ ఉదాహరణలే అవుతాయి.మరో పత్రిక ఆంధ్రజ్యోతి అయితే జగన్ ఆస్తులు పెరిగాయంటూ ఒక కథనాన్ని జనంమీదకు వదిలింది. ఇదేదో ఇప్పుడు కొత్తగా రాసిన వార్త కాదు. ఇప్పటికి పలు సార్లు రాసిన వార్త. మళ్లీ మళ్లీ రాస్తున్నారంటే చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి అని అర్థం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు 1989లో తన ఆదాయం ఎంతని ప్రకటించారు.. మరి ఆయనదిగానీ, ఆయన కుటుంబ ఆస్తిగానీ ప్రస్తుతం ఎన్ని రెట్లు పెరిగిందో ఎందుకు రాయడం లేదు? ఇవన్నీ చూస్తే ఒకటి మాత్రం స్పష్టం. కరెంట్ చార్జీలు విపరీతంగా పెరుగుదల , హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపెట్టడానికి కూటమి ప్రభుత్వ నేతలకన్నా, ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పడుతున్న తంటాలే ఎక్కువగా ఉన్నాయని అర్ధం అవడం లేదూ!.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దేవుడితో మళ్లీ రాజకీయాలా?
‘‘ఐదేళ్లపాటు నేను తిరుమల శ్రీ వారిని దర్శించుకోవడానికి వెళ్లలేదు’’.. టీటీడీ చైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు చేసిన ప్రకటన ఇది. అప్పట్లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటం వల్ల.. ఏదో అపవిత్రమైపోయిందని అందుకే తాను శ్రీవారి దర్శనానికి వెళ్లలేదంటూ నాయుడుగారు ఓ కారణమూ చెప్పుకున్నారు. బాగానే ఉంది. కానీ.. ఏదో పార్టీ మీద అలిగి ఆ అక్కసు కాస్తా దేవుడిపై తీర్చుకున్నానని చెప్పిన ధర్మకర్త ఈయన ఒక్కడే కాబోలు!పంతం కొద్దీ పోలేదనే అనుకుందాం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నాలుగున్నర నెలలవుతోంది కదా.. ఈ కాలంలోనైనా వెళ్లారా? ఆ మాట మాత్రం ఆయన మాట్లాడలేదు. బహుశా ఈ ధర్మకర్త పదవి దక్కేవరకూ వెళ్లకూడదని ఒట్టేసుకున్నట్లుంది. ఈ కారణంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వ్యక్తి ఈ పదవికి అర్హులా అన్న చర్చ జరుగుతోంది.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ బోర్డు నియామకాలపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. టీటీడీ బోర్డును రాజకీయ నిరుద్యోగులకు ఉపాధినిచ్చేదిగా మార్చేశారని, దాన్ని వెంటనే రద్దు చేయాలని విరుచుకు పడిపోయేవారు. కానీ అధికారం చేపట్టడంతోనే ఆయన అదే బోర్డును రాజకీయమయం చేసేశారు. మంత్రి పదవులు దక్కని వారు, టిక్కెట్లు ఆశించి భంగపడ్డవారు, వ్యాపారవేత్తలు.. ఎవరినైతే అవినీతిపరులని విమర్శించారో వారు అందరికీ బోర్డులో స్థానం కల్పించారు. పనిలో పనిగా ఒక రౌడీషీటర్‌కు కూడా బోర్డులో చోటు దక్కిందట.టీటీడీ ఛైర్మన్ పదవి పొందడానికి బీఆర్ నాయుడుకు ఉన్న ఏకైక అర్హత మీడియా సంస్థను నడుపుతూండటమే. ఆ ఛానెల్లోనూ టీడీపీ వకాల్తా పుచ్చుకుని మరీ పచ్చి అబద్దాలు ప్రచారం చేయడమే. బహుశా ఇంకో అర్హత.. ముఖ్యమంత్రి చంద్రబాబు, కుమారుడు లోకేశ్‌లను ప్రసన్నం చేసుకోవడంలో విజయం సాధించడం కావచ్చు. ఆసక్తికరమైన అంశం ఒకటి చెప్పుకోవాలిక్కడ. టీటీడీ ధర్మకర్త పదవి బీఆర్ నాయుడికి దక్కడం ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణకు ఇష్టం లేదట. ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నించడం వల్లనే ఇంతకాలం ఆగిందని, చివరకు లోకేష్ పట్టుబట్టిన కారణంగానే దక్కిందని చర్చ నడుస్తోంది. బాబు తన జేబులో మనిషి అనుకునే రాధాకృష్ణకు ఇది పరాభవమే మరి!కాలం మారుతోంది కదా! టీడీపీ హయాంలో ఇప్పుడు చక్రం తిప్పుతున్నది లోకేష్ అన్న విషయాన్ని ఆయన గుర్తించినట్లు లేదు.బీఆర్ నాయుడు పదవి రాగానే సూక్తి ముక్తావళి మొదలుపెట్టేశారు. అంతవరకూ ఫర్వాలేదు కానీ.. ఆ క్రమంలో తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టేసుకుంటూ ఉండటమే సమస్య. పదవి ఇచ్చినందుకు చంద్రబాబు, లోకేష్‌లకు ధన్యవాదాలు చెబితే తప్పు లేదు. మీడియా తెలివితో వైఎస్సార్సీపీని దూషించడం కూడా తన బాధ్యత అనుకుని మాట్లాడి గోతిలో పడ్డారు. దేవస్థానం ధర్మకర్తగా భక్తులకు మెరుగైన సేవలందిస్తానని, సదుపాయాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని కొత్తగా అధికారం చేపట్టిన ఏ ధర్మకర్త అయినా చెబుతూంటారు. భక్తులకు రాజకీయ పార్టీలను అంటకట్టరు. నాయుడు గారు మాత్రం... వైఎస్సార్సీపీ పాలనతో తిరుమల అపవిత్రమైందంటూ వ్యాఖ్యానించారు. మీడియా నిజాలు రాయాలని ఒకపక్క సలహా ఇస్తూనే ఇంకో పక్క తానే అబద్దాలు చెప్పడం ఆయనకే చెల్లిందేమో! ఎవరైనా ఆ దేవదేవుడికి అపవిత్రత ఆపాదిస్తారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పాలనపరంగా ఒకవేళ తప్పులు జరిగి ఉన్నా దేవుడు అపవిత్రమెలా అవుతాడు? బిఆర్ నాయుడు తన టీవీ ఛానెల్లో అర్దరాత్రి వేళ మసాలా పాటలు వేసే వారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బట్టతల మీద జుట్టు మొలిపిస్తామంటూ ఆయన గతంలో తన టీవీ ద్వారా ఒక నూనెను ప్రచారం చేసుకుని పెద్ద ఎత్తున సంపాదించిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తికి పవిత్రమైన ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని టీడీపీలోనూ గుసగుసలు నడుస్తున్నాయి!జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో పలు మార్పులు చేశారు. భక్తులకు మేలైన వసతులు కల్పించే ప్రయత్నం జరిగింది. తనమీద రాకూడదన్న బాధ్యతతో జగన్ ఒకటికి, రెండుసార్లు జాగ్రత్తలు చెప్పేవారు. జగన్ టీటీడీ ధర్మకర్తగా నియమించిన తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి 44 సార్లు అయ్యప్ప మాల వేసుకుని దర్శనానికి వెళ్లిన భక్తుడు. సొంతంగా ఇంట్లో గోశాలను నిర్వహిస్తున్న వ్యక్తి. ఈయన హయాంలో అమెరికాలో సైతం శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవాలు నడిచాయి. భక్తులు ఎంతో సంతృప్తి చెందారు కూడా. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా పిలుస్తున్న అమరావతి, జమ్మూ వంటి నగరాల్లో వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. వై.ఎస్. జగన్ హయాంలో టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన కరుణాకర రెడ్డి వేలాది గ్రామాలలో దళిత గోవిందం కార్యక్రమాన్ని నిర్వహించి బలహీన వర్గాల వారికి కూడా వేంకటేశ్వరుడి దర్శనం చేయించింది. ఇన్ని మంచి పనులు చేసినా అప్పట్లో ఇదే బీఆర్ నాయుడికి చెందిన టీవీ5తోపాటు తెలుగుదేశం మీడియా దుర్మార్గంగా అసత్య కథనాలు ప్రసారం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అన్యమత ప్రచారం జరిగిందంటూ దారుణమైన అసత్యాలతో అభాండాలు మోపింది. ఒక లైట్ శిలువ రూపంలో ఉందంటూ వదంతులు సృష్టించారు. వైఎస్సార్సీపీపై, జగన్ ప్రభుత్వంపై అక్కసు, ద్వేషంతో ఎల్లో మీడియా దేవుడికే అపచారం చేసింది.ఇదీ చదవండి: TTD కొత్త చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలువైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ తాను దైవ దర్శనానికి వెళ్లలేదని అంటున్న బీఆర్ నాయుడు భక్తి వెంకటేశ్వరుడిపైనా లేక టీడీపీపైనా అన్నది ఇక్కడే స్పష్టమవుతోంది. ఆయన చెబుతున్నట్లు నిజంగానే అపవిత్రం అయింది కనుక వెళ్లరాదని అనుకుంటే ఆయనకు పదవి ఇచ్చిన చంద్రబాబు, లోకేష్‌లు వైఎస్సార్సీపీ పాలనలో పలు మార్లు దైవ దర్శనానికి వెళ్లారే! బీఆర్ నాయుడి ప్రకారం.. వారు తప్పు చేసినట్లేనా? కాదూ అంటే.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు కూడా దైవదర్శనం చేసుకున్నప్పుడు పవిత్రంగానే ఉందని ఒప్పుకున్నట్లే కదా? వారికి లేని అపవిత్రత నాయుడుకే ఎందుకు వచ్చింది? వైఎస్సార్సీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్లు.. టీడీపీ పాలనైతే వైఎస్సార్సీపీ వాళ్లు తిరుమల వెళ్లకూడదని పరోక్షంగా చెబుతున్నారా?స్వామి వారిపై ఉన్న భక్తి ఇదేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అన్నిటికి మించి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు నెయ్యి కలిసిందన్న పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ చెబితే టీవీ5తోపాటు టీడీపీ మీడియా వందసార్లు అదే అబద్దాన్ని ప్రచారం చేశాయి కదా! అది స్వామివారి పట్ల అపచారం చేసినట్లు కాదా! కోట్లాది మంది హిందువుల మనో బావాలను దెబ్బ తీసినట్లు కాదా! ఆ పాపంలో బీఆర్ నాయుడు వాటా ఎంత? చంద్రబాబు సైతం ఈ విషయంలో నాలుక మడత వేసి కల్తీ జరిగింది కానీ ఎక్కడో అప్రస్తుతమని చెప్పి జారుకున్నారు. సుప్రీంకోర్టు సైతం రాజకీయాలలోకి దేవుడిని లాగవద్దని చెప్పింది కదా! అయినా నాయుడు ఇంకా పదవి చేపట్టక ముందే తిరుమలను రాజకీయం చేస్తున్నారే?ఇంకో సంగతి... తిరుమల వైఎస్సార్సీపీ హయాంలో అపవిత్రమైందనుకుంటే అప్పట్లు జగన్ నియమించిన బోర్డు సభ్యులు నలుగురిని ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నారు?. వైఎస్సార్సీపీలోంచి టీడీపీలోకి వెళ్లిన వేమిరెడ్డి ప్రశాంతి, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, బీజేపీ నేతల సిఫారస్ మేరకు నియమితులైన కృష్ణమూర్తి వైద్యనాధన్, బోరాలకు ఎందుకు మళ్లీ పదవులు ఇచ్చారు. కల్తీ నెయ్యి అని చంద్రబాబు ఆరోపించిన కొనుగోలు కమిటీలో ముగ్గురు సభ్యులుగా ఉన్నారే! వైఎస్సార్సీపీ వాళ్లు అపచారం చేసి ఉంటే, తిరుమల అపవిత్రమై ఉంటే వీరందరినీ తన కమిటీలో వేస్తూంటే బీఆర్ నాయుడు ఎందుకు అంగీకరించారు? వారిని తీసుకుంటే తాను పదవి చేపట్టనని చెప్పిఉండవచ్చు కదా?టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఏడుగురి చొప్పున సభ్యులను తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఎంపిక చేసిన టీడీపీ నేత నర్సిరెడ్డి గతంలో జగన్‌ను విమర్శించేందుకు శ్రీ వెంకటేశ్వరుడు, బీబీ నాంచారమ్మలపై జోకులేసి అపచారం చేసిన వ్యక్తే. అలాగే చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి భోజన, వసతి సదుపాయాలు సమకూర్చిన వ్యక్తికి కూడా బోర్డు సభ్యత్వం దొరికింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఎన్.ఆర్.ఐ.కి, మరికొందరు ఆర్ధికంగా స్థితిమంతులకు ఈ పదవులు దక్కాయి. ఈనాడు గ్రూప్ అధినేత కిరణ్ కోటాలో ఆయన బందువు సుచిత్ర ఎల్లాకు పదవి ఇచ్చారని చెబుతున్నారు. ఒక బ్రాహ్మణ అగ్రనాయకుడు లేదా వైశ్య నాయకుడికి స్థానం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా నెరవేరక పోవడంతో ఆయా వర్గాల వారు బాబుపై ఆగ్రహంగా ఉన్నారు.వైఎస్సార్సీపీ టైమ్‌లో గొడవలు చేసి ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని చెబుతూ వచ్చిన పార్టీ నాయకత్వం, అలాంటి వారెవ్వరికి టీటీడీ సభ్యత్వం ఇచ్చినట్లు లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో ఉండే ముఖ్యమైన జనసేన నేతలకు ఈ పదవులు కేటాయించలేదు. తన కోటాలో వచ్చిన మూడు పదవులను ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణకు చెందిన ఇద్దరు జనసేన నేతలకు, ఒక వ్యక్తిగత స్నేహితుడికి ఇచ్చారట. మాటలు చెప్పడం వేరు.చేతలు వేరు అనడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరమా?.చంద్రబాబు రాజకీయ నిరుద్యోగులతో, పారిశ్రామికవేత్తలతో, పైరవీకారులతో టీటీడీ బోర్డును నింపేశారని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.ఇదే చంద్రబాబు స్టైల్ అని అంటున్నారు. ఏది ఏమైనా ఇక నుంచి అయినా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వామివారి భక్తులకు పార్టీలు ఆపాదించకుండా ఉంటే మంంచిది. అంతేకాదు.ఇంతకాలం స్వామి వారికి అపచారం కలిగేలా అసత్య ప్రచారం చేసినందుకు క్షమాపణ చెబితే భక్తులు సంతోషిస్తారు.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్ విజయమ్మ వాస్తవాలు చూడలేని స్థితిలో ఉన్నారా?
మహా భారతం గాథలో ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. ఆయన అంధత్వాన్ని గౌరవిస్తూ భార్య గాంధారి కూడా ఆజన్మాంతం కళ్లకు గంతలు కట్టుకునే జీవిస్తుంది. కళ్లుండి కూడా ప్రపంచాన్ని చూడలేకపోయిందన్నమాట. గాంధారి, ధృతరాష్ట్రులకు పెద్దకొడుకు దుర్యోధనుడంటే విపరీతమైన ప్రేమ. ఈ అతి గారబం కారణంగా దుర్యోధనుడు అహంకారిగా, దుష్ట లక్షణాలు కలిగిన వ్యక్తిగా మారతాడు. తత్ఫలితంగా యుద్దానికి కాలుదువ్వి ఘోర పరాజయం చెందడం, కురు వంశ నాశనం జరిగాయని మహాభారతం చెబుతోంది. ఇది పురాణమో! లేక ఇతిహాసమో! మరేదైనా కానీ ఇందులో నేర్చుకోగలిగినవారికి నేర్చుకున్నంత జ్ఞానం ఉంది.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో, సోదరి షర్మిల మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఆస్తి తగాదా చూస్తుంటే, తల్లి విజయమ్మ తాజాగా విడుదల చేసిన బహిరంగ లేఖ చూసిన తరువాత ఎవరికైనా మహాభారతం గుర్తుకు రాకమానదు. తల్లిదండ్రులకు పిల్లలంటే ప్రేమ ఉంటుంది. అది అందరిపై సమానంగానే ఉండాలి. కానీ ఎందువల్లో కొన్నిసార్లు కొందరు అనూహ్యంగా ఒకరిపైనే ప్రేమ చూపుతుంటారు. ఇప్పుడు విజయమ్మ కూడా అచ్చం అలాగే వ్యవహరించినట్లు అనిపిస్తుంది. షర్మిలపై గుడ్డి ప్రేమో, లేక బెదిరించడం వల్ల అలా ప్రకటన చేశారో తెలియదు కాని, వైఎస్ఆర్ కుటుంబానికి ఇంతకాలం ఉన్న ప్రతిష్ట దెబ్బతినడానికి ఆమె కూడా కారణం అవడం విషాదమే. కుమారుడు, కుమార్తె మధ్య వివాదం వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేయాల్సిన ఆమె ఏకపక్షంగా షర్మిలకు అనుకూలంగా ప్రకటన చేయడం పద్దతి అనిపించుకోదు. తన ప్రకటన మొదటి భాగంలో ఇద్దరూ పరిష్కరించుకుంటారు అని చెప్పినప్పుడు, అంతటితో ముగించి ఉంటే బాగుండేది. అలాకాకుండా ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు చేసిన ప్రకటనలను ఖండిస్తూ అంతా ఉమ్మడి కుటుంబ ఆస్తి అని, ఇతర అంశాలు ప్రస్తావించడం ద్వారా ఆమె తప్పు చేశారనిపిస్తుంది.విజయ సాయి కుటుంబ ఆడిటర్ అయితే, విజయమ్మ చెల్లిలి భర్త వైవి సుబ్బారెడ్డి. విజయ సాయిరెడ్డి తన ప్రకటనలో షర్మిలకు వైఎస్ ఏ ఏ ఆస్తులు ఇచ్చింది సవివరంగా చెప్పడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతవరకు నిజంగానే షర్మిలకు తండ్రి ఆస్తి నుంచి ఏ వాటా దక్కలేదేమో అని భావించిన వారికి పరిస్థితి అర్థమైంది. అంతేకాకుండా షర్మిలకు గత పదేళ్లలో జగన్ నుంచి రూ.200 కోట్లు అందితే కూడా ఆ కృతజ్ఞత చూపకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని విజయమ్మ తప్పు పట్టకపోవడం ఘోరంగా ఉంది. కొడుకుని విషనాగు అని, జైలుకెళ్లినా ఫర్వాలేదు అని, చివరకు మరణం గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన ప్రకటనలో విజయమ్మ మాట మాత్రం తప్పుపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ లేఖ ఆమె రాశారా? లేదా? అనే సందేహం కలుగుతోంది. గతంలో జగన్ పై ఆమె చూపిన ప్రేమ ఆప్యాయతలన్నీ ఏమైపోయాయన్న సందేహం కలుగుతోంది.జగన్ పేరుతో ఉన్న ఆస్తుల్లో ఏవి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రిగా ఇచ్చినవి, జగన్ సొంతంగా సంపాదించుకున్నవి ఏమిటీ అనేదానిపై విజయమ్మకు క్లారిటీ లేకుండా ఉంటుందా? 1996 నుంచే పవర్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో జగన్ ఉన్న సంగతి ఆమెకు తెలుసు కదా! తన పవర్ ప్రాజెక్ట్ అమ్మి 2004 ఎన్నికల్లో తండ్రికి నిధులు సమకూర్చిన మాట అవాస్తవమా? అదే సమయంలో షర్మిల గానీ, ఆమె భర్త అనిల్ గానీ ఏ వ్యాపారాలు చేశారు? ఎంత సంపాదించారు? నిజంగా షర్మిలకు సొంత ఆస్తులు ఉంటే సోదరుడు ఇచ్చిన డబ్బులు ఎందుకు తీసుకునేవారు? జగన్ ఆస్తులపై ఎందుకు ఆశపడేవారు? ఎందుకు ఇంత రచ్చ చేసేవారు? జగన్ ప్రేమతో ఎంఓయు చేస్తే ఆయనకు తెలియకుండానే సరస్వతి పవర్ షేర్లను బదలాయించుకోవడాన్ని విజయమ్మ ఎలా సమర్థించుకుంటారు?అందుకే ఆ విషయాలేవీ చెప్పకుండా షర్మిలకు విజయమ్మ ఏకపక్షంగా మద్దతు ఇచ్చి వైఎస్ అభిమానులకు ఆవేదన కలిగించారు. జగన్ ఎప్పుడు తన చెల్లి గురించి ఒక్క మాట అనకపోయినా షర్మిల మాత్రం అన్నను దూషిస్తున్నా, రాజకీయ ప్రత్యర్థులతో మిలాఖత్ అయినా, విజయమ్మ ఎందుకు ఆమెను మందలించలేదో అర్థం కావడం లేదు. ఏ కాంగ్రెస్ అయితే జగన్ ను జైలు పాలు చేసిందో ఆ కాంగ్రెస్ కే ఇప్పుడు షర్మిల అధ్యక్షురాలు అవ్వడం, ఆ పార్టీ పక్షాన కడప నుంచి పోటీ చేయడం విజయమ్మ ఎలా జీర్ణించుకోగలిగారు?పైగా కడపలో ఆమెను గెలిపించాలని ప్రజలకు ఎలా విజ్ఞప్తి చేశారు? అయినా షర్మిలకు డిపాజిట్ రాలేదు. దీన్నిబట్టి ఏం అర్థమవుతోంది? అటు వ్యాపారపరంగానైనా, ఇటు రాజకీయంగానైనా జగన్ చేసిన కృషి వల్లనే ఆయన పైకి వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యారు. అలా అని 2019 ఎన్నికల్లో అంతకు ముందు జగన్ కు వీళ్లిద్దరూ సాయపడలేదని ఎవరూ అనరు. అంతవరకూ ఉన్న ప్రేమ అభిమానాల కారణంగానే జగన్ కూడా షర్మిల కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చారు. కానీ షర్మిల రాజకీయంగా పెడదారిపట్టి చివరకు తనకే చికాకుగా మారితే ఆ విషయం విజయమ్మ అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరం.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. షర్మిల, విజయమ్మల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి సడన్ గా ప్రేమ నటిస్తుండడంలో ఆంతర్యాన్ని విజయమ్మ పసిగట్టలేకపోవడం బాధాకరం. చంద్రబాబుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారితో షర్మిల చేతులు కలపడాన్ని విజయమ్మ ఎలా సహిస్తున్నారోగానీ వైఎస్సార్ అభిమానులు ఎవ్వరూ భరించలేకపోతున్నారు! ఒకప్పుడు విజయమ్మ చేతిలో బైబిల్ ఉంటేనే ఫోటోలు వేసి మరీ నానారకాలుగా ప్రజల్లో అప్రతిష్టపాలు చేయడానికి కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు అమ్మ.. ఆవేదన అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం షర్మిల చేస్తున్న పిచ్చి పనులను విజయమ్మ నియంత్రించలేక చివరకు గుడ్డి ప్రేమ వల్లనో, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కారణమో గానీ షర్మిలకు మద్దతిచ్చే దయనీయ పరిస్థుతుల్లో పడ్డారు. ఒకవైపు షర్మిల, విజయమ్మలకు అనుకూలంగా రాస్తున్నట్టు డ్రామా ఆడుతూనే, ఇంకోవైపు షర్మిల కోరుతున్న ఆస్తులన్నీ అక్రమాస్తులనీ ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా శకుని పాత్రను వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. చివరగా ఒక మాట! జరగకూడనివి అన్నీ తన కళ్ల ముందే జరుగుతున్నాయని విజయమ్మ ఆవేదన చెందారు. నిజమే! కళ్లముందు జరుగుతున్నవాటిలో వాస్తవం ఏదో, అవాస్తవం ఏదో తెలుసుకోకుండా కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా గాంధారి పాత్ర పోషిస్తే ఎవరు సానుభూతి చూపుతారు? -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు గారి పొగడ్తలు.. అన్‌స్టాపబుల్!
ఆంధప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయం ఎలా సాగిపోతోందో తెలుసా? హిందూపురం ఎమ్మెల్యే, బాబుగారి బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ ఇంటర్వ్యూ మాదిరిగా సాగుతోందని అనవచ్చు. ఎందుకంటారా? ఆ ఇంటర్వ్యూలో మాదిరిగానే బాబుగారిని పచ్చమీడియా ఓ పొగిడేస్తోంది కాబట్టి.. భారీగా బిల్డప్ ఇచ్చి నిలబెడుతోంది కాబట్టి!! అన్‌స్టాపబుల్ అంటే నిరాఘాటంగా అని తెలుగు అర్థం. మామూలుగానైతే ఓ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ అంటే అందులో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజా సమస్యలు వంటివి చర్చకు వస్తూంటాయి. అధికారం చేపట్టి నాలుగు నెలలైన నేపథ్యంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, చేపట్టిన కార్యక్రమాల గురించి మాట్లాడతారని ఆశిస్తాం. కానీ.. అలాంటివేవీ ఇందులో కనిపించవు. సానుకూల దృక్పథంతో మాట్లాడుకోవడం వరకూ ఓకే కానీ.. అచ్చంగా భజన కోసమన్నట్టుగా ముఖాముఖి నిర్వహిస్తేనే సమస్య. బాలకృష్ణ సినీ నటుడు కనుక, ఆయనకు ఏదో గ్లామర్ ఉంటుంది కనుక దానిని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. చంద్రబాబు ప్రజలను మాయ చేయడానికి ఈ గ్లామర్‌తోపాటు తన అధికారాన్ని కూడా వాడుకుంటున్నారు. ఏతావాతా ఎల్లో మీడియాలో వచ్చిన స్టోరీ అంతటిని చదివితే ఏమని అనిపిస్తుందంటే చంద్రబాబు, బాలకృష్ణలు, అన్ స్టాపబుల్‌గా అబద్దాలు చెప్పుకున్నారూ అని! తనకు, తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడంలో చంద్రబాబు దిట్ట. తనపై వచ్చిన స్కిల్ స్కామ్ తదితర కేసులను నీరు కార్చడానికి ఈ ప్రోగ్రాం వేదికగా చంద్రబాబు ఒక ప్రాతిపదికను సిద్దం చేసుకుంటున్నారని అనిపించింది. ఇప్పటికే తనపై వచ్చిన అవినీతి కేసులను నీరుకార్చడానికి సన్నాహాలు ఆరంభించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన జీవితంలో ఏనాడు కక్ష రాజకీయాలకు పాల్పడలేదని ఆయన చెప్పారట. తనకు రాజకీయంగా పోటీ వస్తారని భావించి కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్ పై అక్రమ కేసులు పెట్టడం కక్ష రాజకీయం కాదన్నమాట. జగన్ టైమ్‌లో పలు స్కీములకు, ప్రాజెక్టులకు ఆయా ప్రముఖుల పేర్లు పెడితే వాటిని తాను అధికారంలోకి రాగానే తొలగించడం కక్ష రాజకీయం కాదట. ఉదాహరణకు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు దివంగత నేతలు గౌతంరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డిల పేర్లు పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం వాటిని తొలగించి వేసింది. తనను అరెస్టు చేయడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. అంతవరకు ఒప్పుకోవచ్చు. తప్పు చేసినా, చేయకపోయినా, అరెస్టు కావాలని ఎవరూ కోరుకోరు కదా! కానీ అదే సందర్భంలో తాను చట్ట ధిక్కరణ చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏపీ సీఐడీ ఆధారాలతో ప్రభుత్వ డబ్బు రూ.300 కోట్లు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ అయిందని కేసు పెట్టింది కదా? దానిని ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు నిర్దారించారు కదా? ఈ కేసులో పలువురిని అరెస్టు కూడా చేశారు కదా? టీడీపీ ఖాతాలోకి సుమారు రూ.అరవై కోట్లు వచ్చిందని సీఐడీ వివరాలు ఇచ్చింది కదా? అలా జరగలేదని టీడీపీ ఎందుకు చెప్పలేకపోయింది? అసలు ఆ కేసు విచారణకు పిలుస్తారని భావించి, తన పీఏ శ్రీనివాస్‌ను అకస్మాత్తుగా అమెరికా పంపించడం అవాస్తవమా? నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు హెలికాఫ్టర్‌లో విజయవాడకు తీసుకు వెళతామని చెబితే ఒప్పుకోకుండా బస్‌లో ప్రయాణించింది దేని కోసం?. రాజమండ్రి జైలులో ఈయన ఏసీ కావాలని అడిగితే ప్రభుత్వం సమకూర్చలేదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే,వాటినే తాను వాడుకుంటూ అప్పుడేదో అనుమానస్పద ఘటనలు జరిగాయని చెప్పడం ఇన్నేళ్ల సీనియర్ నేతకు తగునా?... ఇక బావమరిది బాలకృష్ణ ఇచ్చిన ఎలివేషన్ చూడండి. చంద్రబాబు అరెస్టుతో భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు అదిరిపోయారట. కన్నీళ్లు పెట్టుకున్నారట. ‘‘ఆయన అసలు గీత దాటని మనిషి. ప్రజలే ఆయన కోసం గీత దాటారు’’ అని మాట్లాడారు ఆయన. మీడియా చేతిలో ఉంటే ఎలా బాజా బజాయించుకోవచ్చో ఈ ఇంటర్వ్యూ తెలియ చేస్తుంది. జైలులో మొదటి రాత్రి అనుభవాలు ఏమిటని బాలకృష్ణ అడగడం, చంద్రబాబేమో దానికి వైనవైనాల వర్ణనలతో సమాధానం ఇవ్వడం భలేగా ఉంది. ఏ వ్యక్తిని అయినా పోలీసులు అరెస్టు చేస్తే, ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో, దానినే అప్పుడు కూడా అనుసరించారన్న వాస్తవాన్ని కప్పిపుచ్చి, తనను రాత్రి తిప్పారని, విచారించారని చెబుతున్న తీరు ఇప్పటికీ దాని ద్వారా సానుభూతి పొందాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి కాదు. తన సోదరి భువనేశ్వరి, తదితర కుటుంబ సభ్యులు అప్పట్లో చేసిన ఆందోళనలను కూడా బాలకృష్ణ ప్రస్తావించుకున్నారు. మరో హైలైట్ ఏమిటంటే ఆకాశంలో సూర్యచంద్రులు, ఆంధ్రాలో బాబు, కళ్యాణ్ బాబు అని అంటున్నారట.నిజమా? మరి ఇదే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వారిని అలగా జనం అని బాలకృష్ణ ఎందుకు గతంలో సంబోధించారో? పవన్ కళ్యాణ్ ,చంద్రబాబులు కలిసి పోటీ చేయాలని అనుకోవడం చారిత్రక సన్నివేశంగా చూపించడానికి బాలకృష్ణ యత్నించారు. విజయవాడలో వరదలలో చంద్రబాబు చాలా కష్టపడ్డారని ప్రొజెక్షన్ ఇవ్వడానికి బాలకృష్ణ తంటాలు పడ్డారు. చంద్రబాబు కలెక్టరేట్లో బస్‌లో బస చేయడం, పడవ ఎక్కడం అన్ని ఎవరూ చేయలేని పనులు అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. మరి అసలు వరదలు రావల్సిన అవసరం ఏమిటి? పది రోజులపాటు లక్షల మంది ఎందుకు నానా పాట్లు పడ్డారు? చంద్రబాబు కృష్ణ నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో నివసిస్తున్నారా?లేదా? ఆ ఇంటిలోకి వరద నీరు చేరడంతోనే ఆయన బస మార్చింది అవాస్తవమా? అసలు వరదలే రాని ప్రాంతంలో వరదలు వచ్చినందుకు వారు బాధపడినట్లు లేదు. పది రోజుల్లో సాధారణ పరిస్థితి తెచ్చామని జబ్బలు చరుచుకున్నారు.మరో కీలక అంశం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసి నెయ్యి వాడారన్న ఆరోపణ గురించి బాలకృష్ణ ప్రశ్నించినా ,చంద్రబాబు జవాబు దాటవేశారనే అనుకోవాలి. సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పి వదలివేశారు. మరి అంతకుముందు జగన్ పై అన్యాయమైన ఆరోపణలు ఎందుకు చేసినట్లు? అది కక్ష రాజకీయం కాదా? యథా ప్రకారం అమరావతి కల గురించి కూడా ప్రశ్నించారు. ఆయన ఎప్పటి మాదిరి సైబరాబాద్ తనదేనని, హైదరాబాద్ ను తానే అభివృద్ది చేశానని చెప్పుకున్నారు. ఇంతకీ అసలు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల గురించి ఒక్క మాట అడిగితే ఒట్టు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు, బాలకృష్ణలు కలిసి ఆడిన మరో అన్ స్టాపబుల్ డ్రామాగా దీనిని అభివర్ణించుకోవచ్చేమో!. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సమస్యలు కొని తెచ్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పెద్ద ప్రకటనే చేశారు. హైదరాబాద్‌ను ఫినిష్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్రమైన ఆరోపణ సంధించారు. అయితే దాన్ని వివరించిన తీరు అంత సంతృప్తికరంగా లేదు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఈ పార్టీలు అడ్డు తగులుతున్నాయని స్థూల అర్థం. కానీ.. ఒక పక్క ప్రధాని మోడీని విమర్శిస్తూనే.. ఇంకో పక్క ఇక్కడ గుజరాత్ మోడల్ వద్దా? అని రేవంత్ ప్రశ్నించడం ఆసక్తికరంగా ఉంది.ఇదిలా ఉంటే... దీపావళికి ముందో వెనకో రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యపై కూడా మాట మాట పెరుగుతోంది. ఆ పేలే బాంబులు కాంగ్రెస్‌వేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు కౌంటర్ ఇస్తున్నారు. మరోపక్క బీజేపీ నేతలు కూడా తాము వెనుకబడకూడదనుకున్నారో ఏమో.. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల ఇళ్లు కూల్చొద్దంటూ నిరసనలకు దిగుతున్నారు.రాజకీయ బాంబుల విషయానికి వస్తే.. ఇప్పటివరకూ అయితే పెద్దగా పేలలేదు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి, మధుయాష్కీలు నిరసనలు వ్యక్తం చేసినా వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన సమయం ఇంకా రాలేదు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ బావమరింది ఇంటిపై ఎక్సైజ్, పోలీసు సిబ్బంది దాడి కూడా పెద్ద బాంబేమీ కాదు. ఈ సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగానే ఉన్నాయి అనిపిస్తుంది. పైగా కుటుంబ కార్యక్రమాలు జరుపుకోవాలనాన భయపడే విధంగా ఇవి ఉండటం అంత మంచిదేమీ కాదు. పోనీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సంచలన విషయాలు ఏవైనా బయటపడతాయా? ఘటనలు చోటు చేసుకుంటాయా? అని చూస్తే అది ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇంతలోనే బీఆర్ఎస్ కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం లేదు.రేవంత్ రెడ్డి ప్రకటన విషయానికి వద్దాం... మూసి పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్లు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అయితే తెలంగాణ గుజరాత్ తో పోటీపడుతుందనే ఉద్దేశంతో తమ ప్రయత్నాలకు బీజేపీ, బీఆర్ఎస్ు అడ్డు తగులుతున్నాయని రేవంత్ ఆరోపించారు. ఆశ లావు, పీక సన్నం అన్న చందాన అన్నీ ఒకేసారి మొదలుపెట్టి ఏదీ ముందుకు వెళ్లలేని పరిస్థితి కల్పించుకుంటే.. గుజరాత్ తో పోటీ పడే సంగతేమోకాని, తెలంగాణ ఆర్థికంగా కుదేలు అవుతుందేమో ఆలోచించుకోవాలి.దేశంలో గుజరాత్ బాగా అభివృద్ది చెందిందని ముఖ్యమంత్రి ఈ ప్రకటన ద్వారా చెప్పకనే చెబుతున్నారు.ఒకపక్క ప్రధాని మోడీ దేశానికి ఏమి చేశారని ప్రశ్నిస్తూనే, గుజరాత్ లో సబర్మతి రివర్ ప్రంట్ అభివృద్ధి మొదలైనవాటి గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. గుజరాత్ పరిస్థితి వేరు, తెలంగాణ సమస్యలు వేరు. మూసి సుందరీకరణ ప్రాజెక్టుకు.. సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి పోలిక ఎంత వరకూ అన్నది రేవంత్ పరిశీలించుకోవాలి. ప్రధాని ఆ రాష్ట్రానికి చెందినవారు కావడం వల్ల కొంత అడ్వాంటేజ్ కచ్చితంగా ఉంటుంది. అంతమాత్రాన దానికి పోటీ అవుతుందని హైదరాబాద్ ను ఫినిష్ చేయాలని విపక్షాలు చూస్తున్నాయని అనడం మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టడమే అవుతుందేమో!మూసి నది ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందనగానే ఎవరికైనా గుండె గుబిల్లుమంటుంది. అంత మొత్తం ఎలా సమకూరుతుంది? ఇందులో ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఎంత ఇస్తుంది? అప్పులు ఎంత తెస్తారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఎనభై వేల కోట్ల అప్పు చేసిన తీరుపై ఇదే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారు.అదే టైమ్ లో దానికి రెట్టింపు వ్యయం మూసికి చేస్తామని చెబుతున్నారు.అధికారులు మూసీ బఫర్ జోన్ఉన్న ఇళ్ల సర్వేకి వెళితేనే ఎంత పెద్ద గొడవైన వైనాన్ని చూశాం. వేలాది మంది నిర్వాసితులయ్యే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. సహజంగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు ప్రజల ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తాయి. వారు ఒప్పుకోనంత మాత్రాన ప్రాజెక్టును నిలిపివేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగని ప్రభుత్వం సవాల్ గా తీసుకుని హడావుడి పడనక్కర్లేదు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మూసి సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారు కాని,నామమాత్రంగానే చేయగలిగారు. హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్లమాదిరి చేస్తామని కేసీఆర్ భారీ డైలాగులు చెప్పారు. కానీ అడుగు ముందుకు పడలేదు. హుస్సేన్ సాగర్ శుద్ధి పథకం గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి టైమ్‌లో కొంత అమలైంది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేశాయి. కానీ దీంట్లోని పరిమితులను దృష్టిలో ఉంచుకుని ముందు వెళ్లలేకపోయాయి.దక్షిణ కొరియాలోని రెండు నదులను బాగు చేసిన వైనం తెలుసుకోవడానికి ప్రతినిధి బృందాలు వెళ్లివచ్చాయి.అయితే అక్కడికి, ఇక్కడికి పోలిక పెట్టలేమన్న అభిప్రాయానికి వచ్చారట. ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్లు ఉంది. అందులో భాగంగా మూసి నదిలో ఇబ్బంది లేని బాపూ ఘాట్ ప్రదేశం వరకు అభివృద్ది చేయాలని సంకల్పించినట్లు కథనాలు వచ్చాయి. అలాగే ముందుగా మూసిలోకి వస్తున్న మురుగు నీటిని ఎలా అరికట్టాలన్న దానిపై ప్రభుత్వం దృష్టి పెడితే ప్రయోజనం ఉండవచ్చు. ప్రజల ఇళ్లు తొలగించాల్సిన చోట వారికి కల్పించాల్సిన సదుపాయాలు, ప్రత్యామ్నాయాలను నిర్ణయించుకోవాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చివేసింది. కేసీఆర్ ప్రభుత్వం పలు ప్లైఓవర్లను నిర్మించడం ద్వారా సదుపాయాలను మెరుగుపరిచే యత్నం చేసింది. వివిధ ప్రభుత్వాలు మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేసినా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు.హైదరాబాద్‌ను ఒక్కసారిగా మార్చివేస్తామని చెబుతూ హైడ్రా పేరుతో ప్రభుత్వం చేసిన హడావుడి వల్ల కొంత నష్టం జరిగింది. ప్రజా వ్యతిరేకతతో దూకుడు కొంత తగ్గినా...ప్రజలలో ఏర్పడిన భయాలు పోలేదని అంటున్నారు. తాజాగా వచ్చిన ఒక కథనాన్ని గమనిస్తే జనం ఇప్పుడు అపార్టుమెంట్లు, విల్లాలు కొనాలంటే భయపడుతున్నారట. ఫలితంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం సుమారు పాతిక శాతం తగ్గిందట. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గింది. అసలే మాంద్య పరిస్థతులు ఏర్పడుతున్న తరుణంలో రేవంత్ ప్రభుత్వం దుందుడుకుగా చేసిన చర్య హైదరాబాద్ కు కొంత నష్టం చేసిందన్న అభిప్రాయం ఏర్పడింది.గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని మించి గాంధీజీ విగ్రహం పెడతామని రేవంత్ ప్రకటించారు. బాగానే ఉంది. ఏదో పోటీ కోసం కాకుండా, అది ఒక టూరిస్ట్ స్పాట్ గా, విజ్ఞాన కేంద్రంగా మార్చితేనే ఉపయోగం ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కాని అక్కడకు రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని వెళుతున్నట్లు లేరు. ఇలాంటి వైఖరులు కూడా అంత మేలు చేయవని చెప్పాలి. రేవంత్ తన స్పీచ్ లో కేసీఆర్ బయటకు రాకపోవడాన్ని తప్పు పట్టారు. ఆ వ్యాఖ్యలు చూస్తే,తాను చేస్తున్న విమర్శలకు కేసీఆర్ సమాధానం ఇవ్వడం లేదన్న అసహనం ఉన్నట్లుగా అనిపిస్తుంది.హైదరాబాద్‌కు చాలా చేయాలని ఆయన అనుకుంటూ ఉండవచ్చు కానీ ఆచరణ సాధ్యం కానివైతే మాత్రం అది రాజకీయంగా ఆయనకు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఫోర్త్ సిటీ ప్రస్తావన వీటిల్లో ఒకటి. మామూలుగా ఏవరూ నగరాలను నిర్మించలేరు. మౌలిక వసతులు కల్పిస్తే, కొత్త పరిశ్రమలు లేదా సంస్థలు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లో జనావాసాలు వాటంతట అవే ఏర్పడుతూంటాయి. వ్యాపారాలు పెరుగుతాయి. తద్వారా అభివృద్ది జరుగుతుంది. ఫోర్త్ సిటీ ఎలా ఉంటుందో తెలియదు కాని, దాని పేరుతో ఇప్పటికే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్న వార్తలు వస్తున్నాయి. నగరానికి దక్షిణం వైపు అభివృద్దికి శ్రీకారం చుట్టడం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి మోడల్లో రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేఏ్త మాత్రం ప్రయోజనమెంతో ఆలోచించాయి.ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్‌కు బీఆర్ఎస్ బీజేపీలు పెద్ద సవాల్ కాదు. ఆయనకు ఆయనే సమస్యలను సృష్టించుకుంటున్నారు. సూపర్ సిక్స్ హామీలు అన్నిటిని అమలు చేయలేకపోవడం సహజంగానే ఇబ్బందిగా ఉంటుంది. అయినా హైదరాబాద్ కు నష్టం కలిగించే పనులు కాకుండా, వీలైనంత మేర సదుపాయాలు మెరుగుపరుస్తూ ముందుకు వెళితే ఎక్కువ లాభం ఉంటుంది.అంతే తప్ప, అన్నీ ఒకేసారి చేసేయాలన్న తాపత్రయంతో వెళితే, అదే ఆయనకు ముందరికాళ్లకు బంధం వేసుకున్నట్లు అవుతుందని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆస్తుల కోసం పరువు పోగొట్టుకుంటున్న షర్మిల!
ఆస్తుల కోసం ఇంతలా ఆరాటపడతారా? అది కూడా వందల కోట్లు పొందిన తరువాత మరింత కావాలని? అది కూడా సొదరుడు జైలుకెళ్లే ప్రమాదాన్ని పణంగా పెట్టిమరీ ఒక చెల్లి ఇలా ఆస్తి కోరుకుంటుందా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల తీరు అందరిని నివ్వెరపోయేలా చేస్తుంది. నిజంగానే ఆమెకు రావాల్సిన ఆస్తి ఏదైనా ఉంటే అడగడం తప్పు కాదు కానీ.. అడగాల్సిన అవసరమే లేకుండా అన్న జగన్ స్పష్టంగా సరస్వతి పవర్ లో వాటాలు రాసివ్వడానికి సిద్దపడినా, నానా రచ్చ చేయడంతో షర్మిల సాధించేది ఏమిటో ఆమెకే తెలియాలి. పేదరికంలో ఉన్నవారు కూడా సోదరుడి ఆస్తిలో వాటా కోసం ఇలా గుక్కపెట్టి రోదించరేమో!ఏం తక్కువైందని షర్మిల ఇంతలా గొడవ చేస్తున్నారు. ప్రమాణాలు చేస్తానంటున్నారు? అయితే ఈ ప్రమాణాలకు, ప్రతిజ్ఞలకు విలువెంతో ఆమె చరిత్రే చెబుతుంది. తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుదిర్చి చేసిన పెళ్లినాటి ప్రమాణాలకే తిలోదకాలిచ్చిన విషయం షర్మిల మరచిపోయి ఉండవచ్చు.అయితే అందులో తప్పు ఒప్పుల గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. కానీ అలాంటి నిర్ణయాలు ఒకరి వ్యక్తిత్వాన్ని సూచిస్తూంటాయి అని మాత్రం చెప్పక తప్పదు. తెలంగాణ బిడ్డనంటూ అక్కడ రాజకీయాలు మొదలుపెట్టి.. పాలేరు నియోజకవర్గంలో మట్టిపై ప్రమాణం చేసి ఇక్కడే ఉంటానని, పోటీచేస్తానని కూడా షర్మిల ప్రతిజ్ఞ చేసిన విషయం ఇక్కడ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్నకు పోటీగా రాజకీయాలు చేయనని చెప్పిన ఆమె తెలుగుదేశం ట్రాప్‌లో పడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టారు? సోదరుడు జగన్‌కు విరోధిగా ఎలా మారారు? ఒకప్పుడు తీవ్రంగా దూషించిన కాంగ్రెస్ పంచనే మళ్లీ ఎలా చేరారు? ఆ పార్టీని తానే ఉద్దరిస్తానని చెప్పుకుంటూ ఎలా తిరుగుతున్నారు? తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా రేవంత్‌ను ఉద్దేశించి షర్మిల అనుచితంగా దొంగ అని అన్ననోటితోనే ఆయన ముఖ్యమంత్రి కాగానే పొగిడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల ఆయనతో కార్యక్రమాలూ పెట్టించారు. తన సోదరుడు అంటే తనకు ప్రాణం అన్న స్వరంతోనే ఇప్పుడు విషనాగు అంటూ విషం చిమ్ముతున్నారు.మీడియా సమావేశం పెట్టి షర్మిల ఏడుపులకు దిగడం ఏమిటో, సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డిని పట్టుకుని జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని వ్యాఖ్యానించి అవమానించడం ఏమిటో! అంతేకాదు..ఆమె తల్లి ప్రస్తావన తెస్తూ, ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా? చిన్నప్పుడే చంపేస్తే బాగుండు అని తల్లి విజయమ్మ అనడం లేదంటూ చివరికి సోదరుడి మరణాన్ని కూడా పరోక్షంగా కోరుకుంటున్న వైనం బహుశా ఏ సోదరి ఇంత నీచంగా మాట్లాడదేమో! ఇలాంటివి చూడడానికే బతికి ఉన్నానా అని విజయమ్మ బాధ పడుతోందని ఆమె చెప్పారు.నిజమే ఇంటిలో ఏ వివాదం వచ్చినా బాధపడేది అమ్మే. అయినా ఇప్పుడు షర్మిల మాటలు ఆమెకు ముల్లు మాదిరి గుచ్చుకుని ఉండాలి.అన్నంటే ప్రాణం అని చెప్పే వారేవరైనా ఇలా అరాచకంగా వ్యవహరిస్తారా? తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, సోదరుడు జగన్ కు ప్రత్యర్దులైన చంద్రబాబు నాయుడు కళ్లలోను, పగబట్టినట్లు దారుణమైన అసత్య కథనాలు రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతిల కళ్లలోను ఆనందం చూడడానికి అన్నట్లు షర్మిల వ్యవహరిస్తున్న తీరుతో ఎవరికి ఇలాంటి చెల్లి ఉండకూడదురా బాబు అనిపించదా! పోనీ ఇంత సానుభూతి నటిస్తున్న ఎల్లో మీడియా మరో వైపు జగన్‌వి అక్రమ ఆస్తులని ఎందుకు ప్రచారం చేస్తున్నాయి? ఇక్కడే వారి కుట్ర అర్ధం కావడం లేదా? ఏ కుటుంబంలో అయినా గొడవలు వచ్చినప్పుడు ఎక్కడో చోట రాజీ కుదురుతుంది. ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తారు.కానీ షర్మిల సరళి అంతా అన్ని దారులు మూసుకుపోవడానికే అన్నట్లుగా ఉంది. తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా, జగన్ నుంచి 200 కోట్లు పొందిన మాట నిజమేనని ఒప్పుకుంటూ, అదేదో డివిడెండ్ అని చెబితే ఎలా కుదురుతుంది. ఆయా సంస్థలలో వాటాలు ఉంటేనే కదా డివిడెండ్ వచ్చేది. అదేమీ లేకుండానే షర్మిలకు అంత భారీ మొత్తం ఎలా ముట్టింది? చట్టం ప్రకరం ఆ డబ్బు కూడా ఇవ్వనవసరం లేదన్న సంగతి ఆమెకు తెలియదా! అయినా జగన్ ఇచ్చారంటే అది ఆమె మీద ఉన్న అభిమానం కాదా? తన తండ్రి జీవించి ఉన్నప్పుడు మనుమరాళ్లు, మనుమడు సమానం అని అన్నారని, కనుక తనకు జగన్ ఆస్తిలో వాటా రావాలనే ఎలా డిమాండ్ చేస్తున్నారు? సాక్షి, భారతి సిమెంట్ కంపెనీలలో తనకు వాటా ఉందని దబాయిస్తున్న తీరు చూస్తే దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందనిపిస్తుంది.జగన్, భారతిలు ఈ కంపెనీల వృద్దికి విశేష కృషి చేశారు. వాటిని దెబ్బతీస్తే, జగన్ ఆర్థికంగా దెబ్బతింటారన్న కుట్ర ఉండి ఉండవచ్చు. రాజకీయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదతర ఎల్లో మీడియా సాక్షి మీడియానాశనం అవ్వాలని కోరుకుంటుంది. అందుకోసం షర్మిలను రెచ్చగొడుతుంటారు. అలాగే చంద్రబాబుకు సాక్షి తప్ప, మిగిలిన మీడియాలో అత్యధిక భాగం భజన చేసేవే. సాక్షి మీడియా లేకపోతే తన ప్రభుత్వంలో జరిగే అక్రమాలు ఏవీ బయటకు రావన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఈ నేపథ్యంలో షర్మిల వారికి ఒక ఆయుధంగా మారినట్లుగా ఉంది. షర్మిలను రాజకీయంగా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు ఉపయోగించుకుని వదలివేస్తారు. అంతెందుకు! ఈనాడు మీడియా ఇదే సరస్వతి పవర్‌పై ఎన్ని దారుణమైన కథనాలు రాస్తోంది. ఆ కంపెనీ వాటాలన్నీ తనకే రావాలని కోరుతున్న షర్మిల ఈనాడు స్టోరీలను కనీసం ఖండించడం లేదేమి? తన తండ్రి పేరును పనిగట్టుకుని లాయర్ పొన్నవోలు సధాకరరెడ్డి ఛార్జిషీట్లో చేర్పించారని పిచ్చి ఆరోపణ చేశారుఒక లాయర్ కోరితే కోర్టులు వైఎస్ పేరును ఛార్జ్షీటులో చేర్చుతాయా? లేక దర్యాప్తు సంస్థ కోరితే చేర్చుతాయా? అసలు అన్నపై పెట్టింది అక్రమ కేసులేనని ఆమె చెప్పారు కదా? ఆ కేసులను పెట్టించింది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యేనని పలుమార్లు షర్మిలే చెప్పారు కదా? అన్న వదలిన బాణం అంటూ పాదయాత్ర చేశారు కదా? జగన్ కోరకపోయినా ఈమె పాదయాత్ర చేశారన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు ఆమె చేస్తున్న కుట్రలు చూస్తుంటే జగన్ జైలులోనే ఉండాలని కోరుకున్నట్లుగా లేదా? జగన్ పై పెట్టిన కేసులు వంటి వాటిని మరెవరిపై పెట్టి ఉంటే, మూడు రోజులలో బెయిల్ వచ్చేదని ప్రముఖ న్యాయవాది ఎస్.రామచంద్రరావు అనేవారు. తన బెయిల్ రద్దు అవుతుందని తల్లి, చెల్లిపై కేసు పెడతారా అని అడగడంలోనే ఆమె విషపు ఆలోచనలు కనిపిస్తాయి. అంటే ఏమిటి దాని అర్థంఝ జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదు కాని, తనకు మాత్రం వందల కోట్ల ఆస్తి అప్పనంగా రావాలని కోరుకోవడమే కదా!నిజానికి వారిపై జగన్ కేసే పెట్టలేదు. కేవలం తన వైపు వాదనను ఎన్.సి.ఎల్.టి కి తెలియచేశారు. గతంలో తానే బైబై బాబు అని నినాదం ఇచ్చానని చెప్పారు. బాగానే ఉంది.కాని ఇప్పుడు జైజై బాబు అన్నట్లుగా ఎలా మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. చంద్రబాబు ఎలాగైతే డబుల్ టాక్ చేస్తారో, అచ్చం అలాగే షర్మిల కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు జగన్ సోదరిగా షర్మిలపై ఎలాంటి విమర్శలు చేయడానికి అయినా వైసీపీ నేతలు వెనుకాడేవారు. ఎప్పుడైతే షర్మిల హద్దులు దాటారో, అప్పటి నుంచి వైసీపీ వారు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉదాహరణకు ఆమె వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ,దానికి స్పందించిన మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్, ఆమె చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారా అని ప్రశ్నించారు.ఆ పరిస్థితి తెచ్చుకోవడం దురదృష్టకరం.ఇంకో విషయం చెప్పుకోవాలి. చట్టపరంగా షర్మిలకు ఈ ఆస్తులలో వాటా వచ్చే అవకాశం ఉంటే, ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండేవారు కదా? అలా కాకుండా తండ్రి ఏదో అన్నారని చెబుతూ దానికి జగన్ బైండింగ్ కావాలని అనడం చట్టరీత్యా ఎలా కుదురుతుంది? అసలు తండ్రి ఏమన్నారో, ఏమి అనలేదో ఎవరికి తెలుసు. నిజంగానే వైఎస్ కు అలాంటి ఆలోనలు ఉంటే ఆమెను ఏదో కంపెనీలో డైరెక్టర్ గా చేసేవారు కదా అన్న ప్రశ్నకు బదులు దొరకదు.ఇక్కడే షర్మిల వాదనలో బలహీనత కనిపిస్తుంది. షర్మిల తానేదో సోదరుడిని రచ్చ చేయగలిగానని సంతోషిస్తుండవచ్చు. చంద్రబాబో, ఎల్లో మీడియానో ఏదో సాయపడతారని ఆమె భ్రమపడుతుండవచ్చు.వాళ్ల లక్ష్యం జగనే తప్ప, షర్మిలకు ఉపయోగపడదామని కాదన్న సంగతి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఈ పరిణామాలవల్ల జగన్ కు కొద్దికాలం చికాకు కలగవచ్చు. కాని షర్మిల తిరిగి కోలుకోలేని విధంగా పూర్తిగా ప్రతిష్టను కోల్పోయారు. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Chandrababu: ఏమిటో.. అవన్నీ సిగ్గుపడాల్సిన విషయాలు కావట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరే వేరుగా ఉంటుంది. అసత్యాలను సమర్ధంగా, అలవోకగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అని ఎవరైనా ఒప్పుకోవల్సిందే. 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను మాయ చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అత్యాచారాలు, హత్యలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నా, వాటి గురించి ప్రస్తావించడం లేదు .పలు గ్రామాలలో డయేరియా వ్యాపిస్తున్నా, దానిపై ఆయన సీరియస్‌గా స్పందించడం లేదు. ప్రస్తుతం ఆయనకు మెయిన్ సబ్జెక్ట్ ఏమిటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన సోదరి షర్మిల మధ్య జరుగుతున్న పరిణామాలు వివాదంగా కనిపిస్తుంది. తనకు సంబంధం లేదంటూనే ఆయన చేయవలసిన విమర్శలన్నీ చేశారు. పైగా అన్నిటిని మించి జగన్‌కు సమాధానం చెప్పవలసి రావడం ఆయనకు సిగ్గు అనిపిస్తోందట. తల్లి, చెల్లిని జగన్ రోడ్డుపైకి లాగారట. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో చూడండి. షర్మిల తన సోదరుడు జగన్ బెయిల్ రద్దు అయినా ఫర్వాలదన్నట్లుగా వ్యవహరిస్తుంటే, ఆమెకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు. సడన్‌గా షర్మిల మీద ఆయనకు సానుభూతి ఏర్పడింది. ఆమె తన రాజకీయ ట్రాప్‌లో నుంచి జారి పోకుండా, ఆమెను అడ్డం పెట్టుకుని కధ నడిపిస్తూ, ఇతర ముఖ్యమైన అంశాలను డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. మాజీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాదానాలు చెప్పగలిగితే , అవి కన్విన్సింగ్‌గా ఉంటే కచ్చితంగా చంద్రబాబు ఎవరికి సిగ్గుపడనవసరం లేదు. ఒకవైపు జగన్‌పై కుట్రలు చేస్తూ, ఇంకో వైపు ఏమీ ఎరగనట్లుగా నటించడం చంద్రబాబు అర్ట్గా చెప్పాలి. ఆయన చేసిన ఒక వ్యాఖ్యను గమనించండి. ఆస్తి ఇవ్వడానికి తల్లి, చెల్లికి కండిషన్లు పెట్టే జగన్, ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి షరతులు పెడతారో అని ఆయన అన్నారని టీడీపీ మీడియా పేర్కొంది. ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తానని ఊహించలేదు. ఇవేం చిల్లర రాజకీయాలు? అలాంటి వారికి సమాధానం చెప్పడానికి సిగ్గు అనిపిస్తోందని ఆయన అంటున్నారు.సిగ్గుపడాల్సిన విషయం కాదటఅసలు ఎవరికి అర్దం కాని విషయం ఏమిటంటే సొంత కుటుంబంలో గత నాలుగు దశాబ్దాలుగా సాగిన ఉదంతాలపై సిగ్గు పడకుండా, జగన్ కుటుంబంలో వివాదాలపై చంద్రబాబు సిగ్గుపడడం ఏమిటో ఎవరికి అర్దం కాదు. సూపర్ సిక్స్ హామీలు అంటూ చేసిన హామీలను అమలు చేయలేకపోవడం సిగ్గుపడాల్సిన పని కాదట. మహిళాశక్తి అంటూ ప్రతి మహిళకు 1500 ఇస్తానని చెప్పి మహిళా లోకానికి ఆశపెట్టి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం విషయమే కాదట. తల్లికి వందనం పేరుతో, నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ చిన్నపిల్ల్ని సైతం చాక్లెట్ల మాదిరి ఊరించి చివరకు ఇవ్వకుండా మోసం చేయడం సిగ్గుపడాల్సిన విషయం కాదట. షర్మిలకు జగన్ అదనంగా ఇస్తానని చెప్పిన ఆస్తులు ఇవ్వలేదని చంద్రబాబు సిగ్గుపడతారట. ఒక పక్క తానిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు షరతులు పెడుతూ ప్రజలకు సేవ చేయడానికి జగన్ ఎలాంటి షరతులు పెడతారో అంటూ ఈయన సిగ్గు పడుతున్నారట. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను జగన్ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేసిన విషయాన్ని కప్పిపుచ్చడానికి బాబు ఎలాంటి డ్రామా ఆడుతున్నారో. చంద్రబాబు సుద్దులు చెబుతున్నారు..జగన్‌వి చిల్లర రాజకీయాలట. ప్రతిపక్షంలో ఉన్నా , అధికారపక్షంలో ఉన్నా చిల్లర విషయాల్ని సైతం తన రాజకీయాలకు వాడుకునే చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. సరే! జగన్, షర్మిల మధ్య ఏదో వివాదం నడుస్తోంది. మరి చంద్రబాబు కుటుంబంలో అసలు వివాదాలే జరగలేదా! ఆయన చేసినవి చాలా నాణ్యమైన రాజకీయాలా? లేక నాసిరకం రాజకీయాలా? అన్నవి ఆయన గత చరిత్ర చూస్తేనే తెలిసిపోతుంది కదా. 1978 కాంగ్రెస్ టికెట్ పొంది గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు నడపడం, పార్టీనుంచి సస్పెండ్ అవ్వడం, మామ ఎన్టీఆర్ మీదనే పోటీచేస్తానని తొడకొట్టి సవాల్ చేయడం, ఆ తర్వాత తుస్సుమని జారుకోవడం ఆయన దృష్టిలో ఇవేవీ చిల్లర రాజకీయాలు కాకపోవచ్చు. 1983లో కాంగ్రెస్ అభ్యర్దిగా ఘోర పరాజయం తర్వాత తన భార్యను అడ్డంపెట్టుకొని మామ ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చి టీడీపీలో చేరడానికి నానా తంటాలు పడడం, విలువలతో కూడిన రాజకీయమని చంద్రబాబు భావన కావచ్చు. పార్టీలోకి వచ్చాక టీడీపీలో ఒక వర్గాన్ని నడిపి చివరకు తన మామ ఎన్టీఆర్ సీఎం కుర్చీకే ఎసరు పెట్టడం అత్యంత విలువైన రాజకీయమని ఆయన ఉద్దేశ్యం. ఇందుకోసం వైస్రాయ్ హోటల్‌ను వేదికగా చేసుకోవడం, అక్కడకు తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం చాలా ఆప్యాయతతో కూడిన రాజకీయమన్నమాట. ఇలాంటి అల్లుడిని రాజకీయంగా ఆదరిస్తానని ఎన్టీఆర్ ఊహించలేకపోయారు. ఆ విషయాన్ని ఆయనే వెల్లడిస్తూ చంద్రబాబును ఎంత ఘోరంగా దూషించారో వినడానికి సిగ్గేసింది కానీ, చంద్రబాబు రాజకీయం ప్రకారం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అప్పట్లో లక్ష్మీపార్వతిపై అభూత కల్పనలు, వదంతులు సృష్టించడం, ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని చెప్పడం ఆయన మరణం తర్వాత తానే ఎన్టీఆర్ కు అసలైన వారసుడినని అంటూ చెప్పుకొని తిరగడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన భావించి ఉండాలి. తన బావమరిది హరికృష్ణతో జరిగిన గొడవలేవీ కుటుంబ తగాదా కాదు. హరికృష్ణను ఈయన రోడ్డు పైకి లాగలేదు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని చంద్రబాబును విమర్శించలేదు. ఇన్ని జరిగినా చంద్రబాబు మాత్రం నీతులు చెప్పగల సమర్థుడు. చెత్త రాజకీయాలు ప్రజలను కాపాడలేవని చంద్రబాబు సెలవిచ్చారు. నాలుగు నెలల్లో ఎన్ని ఘోరాలు!మంచిదే! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ చెత్తరాజకీయాలు చేయడానికి ఎక్కడా సిగ్గుపడకపోయినా ఇప్పుడు జగన్ కేవలం ప్రజాసమస్యలనే మాట్లాడుతున్నా, వాటిని చెత్త రాజకీయాలు అని ప్రచారం చేస్తున్నారు. విలువల్లేని మనుషులు సమాజానికి చేటు, కనీసం విలువలు ఉండాలి, ''బురద వేస్తాను. మీరు తుడుచుకోండి అన్నట్టుగా'' జగన్ వ్యవహరిస్తున్నారట. ఇంతకంటే అన్యాయమైన ఆరోపణ ఏమైనా ఉంటుందా? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ఈవీఎంల మాయో, మరో విధంగానో అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని ఘోరాలు ఇంకెప్పుడైనా జరిగాయా? తిరుమల లడ్డూలో వాడిన నేతిలో జంతుకొవ్వు కలిసిందని దారుణైమన అబద్దపు ఆరోపణ చేయడం, ఆ తర్వాత నాలుక కరుచుకోవడం మంచి రాజకీయమవుతుందా? విలువలతో కూడిన రాజకీయమవుతుందా? చెత్త రాజకీయమవుతుందా? వరదల సమయంలో సమర్థంగా పని చేయలేక ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చిన బోట్లను కుట్రగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం విలువలతో కూడిన రాజకీయం అవుతుందా? చెత్త రాజకీయం అవుతుందా? ఈ అంశాల్లో జగన్‌పై చంద్రబాబు వేసింది బురదగా చూడాలా? పన్నీరుగా చూడాలా? గాజు అద్దాల మేడలో కూర్చొని ఎదుటివాళ్లపై రాళ్లు వేసి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిని అడ్డం పెట్టుకొని ఎంతసేపూ రాజకీయ ప్రత్యర్ధులపై బురద చల్లడం , డైవర్షన్ రాజకీయాలు చేయడం ఇవన్నీ నీచ రాజకీయాల కిందకు వస్తాయా? లేక స్వచ్ఛమైన రాజకీయాల కిందకు వస్తాయా ? అనేది చంద్రబాబే ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. కానీ ఆత్మతో సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయాలనైనా నడపగలిగిన చంద్రబాబునుంచి విలువలతో కూడిన రాజకీయాలను ఆశించడమంటే ఇసుకనుంచి తైలం తీసినట్టే అవతుందేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ, ఎల్లోమీడియాల పావుగా షర్మిల..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజకీయ కుట్రలు పెద్ద ఎత్తునే సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరి షర్మిలను పావుగా మార్చుకున్న టీడీపీ నేతలు, ఎల్లోమీడియా జగన్‌పై అభాండాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ కుట్ర చేస్తోందంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. మీడియా సంస్థలు నడుపుతున్నవారు ఇందులో భాగస్వాములు కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో మెట్టు పతనమయ్యాయి అనేందుకు నిదర్శనం. రాజకీయంగా జగన్‌ను పూర్తిగా దెబ్బతీయకపోతే తమ మనుగడకే ప్రమాదం అన్నంత కసితో వీరంతా కుమ్మక్కై నైతిక, మానవీయ విలువలకు కూడా తిలోదకాలిస్తున్నారు.అక్టోబరు 21న పచ్చమీడియాలో భాగమైన ఆంధ్రజ్యోతి ఒక కథనం వండింది. దిక్కుతోచని పరిస్థితిలో జగన్ తన చెల్లి షర్మిలతో కాళ్లబేరానికి దిగారన్నది ఆ కథనం సారాంశం. ఆస్తుల పంపకంపై బెంగళూరు వేదికగా చర్చలు జరిగాయని, ఒప్పందం దాదాపుగా కుదిరిందని కూడా ఈ కథనంలో చెప్పేశారు. కాంగ్రెస్‌తో దోస్తీ కోసం జగన్ ఇలా చేశాడని కూడా ఆ పత్రిక కనిపెట్టేసింది. ప్రత్యక్ష సాక్షులం తామే అన్నట్టుగా ఈ కథనాన్ని అల్లారు. పైగా షర్మిలపై ఎనలేని సానుభూతి వ్యక్తమైంది దీంట్లో. మూడు రోజులు కూడా గడవకముందే.. అంటే అక్టోబరు 24న అదే పత్రికల్లో ఇంకో కథనం ప్రత్యక్షమైంది. మునుపటి దానికి పూర్తి వ్యతిరేకమైన వాదనతో ఈ కథనం ఉండటం గమనార్హం. జగన్ సొంత చెల్లిపైనే కేసులు వేశారని, అసలు ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని 'మమకారం మాయం" శీర్షికతో సదరు పత్రిక మొసలి కన్నీరు కార్చింది కూడా. ఆస్తుల పంపకంపై అన్నా చెల్లెళ్ల మధ్య రాజీ అని రాసిన మూడు రోజులకే ఈ రకమైన కథనం రాయడంలోనే కుట్ర ఉంది. జగన్‌పై ఏదో ఒకలా నిత్యం అబద్ధాలు ప్రచారం చేయకపోతే జనంలోకి దూసుకెళుతున్న ఆయన్ను రాజకీయంగా ఆపడం కష్టమని వారికి అర్థమైనట్టుంది. అందుకే ఎక్కడలేని దుగ్ధతో వాళ్లు ఈ రకమైన కథనాలు వండి వారుస్తునే ఉన్నారు. జగన్, షర్మిలల మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్న మాట వాస్తవం. షర్మిల... సోదరుడు అని కూడా చూడకుండా జగన్ రాజకీయ ప్రత్యర్ధులతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి దుర్మార్గులతో కుమ్మక్కై ఇష్టారీతిన జగన్ వ్యతిరేక ప్రచారం చేసింది నిజం. అయినప్పటికీ గత పదేళ్లలో జగన్ నుంచి ప్రత్యక్షంగా లేదా, పరోక్షంగా సుమారు రూ.200 కోట్ల మొత్తం పొందిన తర్వాత కూడా ఆశ తీరక షర్మిల తన అన్నను అప్రతిష్టపాలు చేయబోయి తానే పరువు పోగొట్టుకుంటున్నారన్న సంగతి తెలుసుకోలేక పోతున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ సమర్పించిన అఫిడవిట్లోనే జగన్ నుంచి రూ.80 కోట్లు పొందినట్లు షర్మిల పేర్కొనడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఎంత అభిమానం లేకపోతే జగన్ జగన్ అంత మొత్తం చెల్లికి ఇస్తారు? చివరికి అన్న బెయిల్ రద్దుకు కొందరు చేస్తున్న కుట్రలో ఆమె ఒక పాత్ర పోషించడం హేయమైన చర్యగా కనిపిస్తుంది. షర్మిల రాజకీయంగా అంత పరిపక్వత లేని వ్యక్తి కావడం ఎల్లో మీడియా ఆడింది ఆటగా, పాడింది పాటగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ వేసి తాను గతంలో చెల్లెలికి ఇవ్వదలచిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసుకుంటున్నానని, తనకు తెలియకుండా జరిగిన షేర్ల బదిలీని ఆమోదించవద్దని కోరారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసినట్లు ఇది కేసు కాదు. కేవలం ఒక అభ్యర్థన మాత్రమే. కోర్టు ధిక్కారం జరగకుండా ఉండేందుకు తీసుకున్న ఒక జాగ్రత్త మాత్రమే. ఈ విషయాలపై జగన్, షర్మిల మధ్య లేఖలు నడిచాయి. వాటిని చదివితే జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద కుట్రే జరిగిందని అర్థమవుతుంది. గిఫ్ట్‌డీడ్ తాను ఎందుకు రద్దు చేసుకోదలించింది కూడా జగన్ ఆ లేఖల్లో స్పష్టంగా రాశారు. తన వాదనను ఆయన బలంగా వినిపించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వీరిద్దరికి ఆస్తులు పంచి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో షర్మిలకు తన స్వార్జితమైన ఆస్తుల నుంచి కూడా కొంత వాటా ఇవ్వాలని జగన్ అనుకున్నారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. కేవలం చెల్లిపై అభిమానంతోనే ఆయన ఇలా చేయాలని అనుకున్నారు. పైగా దీన్ని లిఖితపూర్వకంగా ఒక అవగాహన పత్రం రూపంలో 2019 ఆగస్టు 31న ఇచ్చారు. తనపై వచ్చిన కోర్టు కేసుల పరిష్కారం ఆ గిఫ్ట్ డీడ్ తర్వాతే అమలు అవుతుందని చాలా స్పష్టంగా పేర్కొన్నారు కూడా. సరస్వతి పవర్ కంపెనీలో జగన్, ఆయన సతీమణి భారతిలకు ఉన్న వాటాలలో కొంత భాగాన్ని షర్మిలకు ఇవ్వాలని భావించి, ఆమె సంతృప్తి కోసం తల్లి విజయమ్మ ను ట్రస్టీగా పెట్టుకుని డీడ్ రాశారు. షేర్ల బదిలీకి తమ అనుమతి అవసరమని స్పష్టం చేశారు. అయితే షర్మిల తన తల్లిపై ఒత్తిడి తెచ్చి వాటిని జగన్ కు తెలియకుండా తన పేర బదిలీ చేసుకునే యత్నం చేసింది. ఈ సంగతి తెలిసిన వెంటనే జగన్ లాయర్లు స్పందించి, అలా చేయడం చెల్లదని చెబుతూ పిటిఫన్ వేశారు. ఎల్లో మీడియా దీనిని వక్రీకరిస్తూ, జగన్ తన తల్లి, చెల్లిపై కేసు పెట్టారని తప్పుడు ప్రచారం చేసింది. కేసుకు, పిటిషన్‌కు మధ్య ఉన్న తేడాను ప్రజలకు తెలియకుండా ఇలా రాశారన్నమాట. జగన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేయకపోతే, ఆయన గతంలో తనకు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లవుతుంది. షర్మిల పాత్ర ముగిసిన వెంటనే టీడీపీ వారు మరో పాత్రను ప్రవేశపెట్టి, జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. ఆ మేరకు టీడీపీ ఎల్లో మీడియా కుట్ర నుంచి జగన్ బయటపడ్డారు. ఇదే సందర్భంలో షర్మిలకు జగన్ రాసిన లేఖలో తనపట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరుపై కూడా అభ్యంతరం చెప్పారు. ఎల్లో మీడియా కొత్త, కొత్త సూత్రీకరణలు చేస్తోంది. జగన్ తన స్వార్జితమైన ఆస్తిలో షర్మిలకు వాటా ఇవ్వకపోతే అది అన్యాయమట. నిజానికి మన సమాజంలో ఎక్కడైనా ఒక కుటుంబంలో పిల్లల మధ్య ఆస్తుల పంపకం జరిగిన తర్వాత, సోదరుడు మళ్లీ తోడబుట్టిన వారికి తన ఆస్తిలో వాటా ఇవ్వడానికి సిద్దపడే పరిస్థితి ఉంటుందా? అయినా జగన్ సోదరిపై ఆప్యాయతతో అలా తన ఆస్తిని కూడా కొంత ఇవ్వాలని తలపెట్టారు. షర్మిల మొత్తం వ్యవహారాన్ని గందరగోళం చేసి, వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకు ఈడ్చారు. తమ కుటుంబానికి శత్రువు వంటి ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో చేతులు కలిపి ఇలాంటి కుట్రలకు తెరదీశారు. రాధాకృష్ణ వెనుక ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యమే. దీనిని గుర్తించిన జగన్ ఆ కుట్రలను చేధించారు. విజయనగరం పర్యటనలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, కేవలం చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఇలాంటి ఉదంతాలను వాడుకుంటున్నారని, ఏ కుటుంబంలో గొడవలు ఉండవని ప్రశ్నిస్తూ, రాష్ట సమస్యలకు దీనికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆయన చెప్పింది నిజమే. ఇప్పుడు షర్మిలకు మద్దతుదారుగా నటిస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో తన సొంత మామ ఎన్.టి.రామారావును సీఎం. సీటు నుంచి నిర్దాక్షిణ్యంగా కిందకు లాగిపారేస్తే ఆయన కుమిలి ,కుమిలి ఏడ్చారు. ఆ తర్వాత ఎన్.టి.రామారావుకు పార్టీ తరపున ఉన్న రూ.75 లక్షల డబ్బు కూడా ఆయనకు అందకుండా కోర్టు ద్వారా చంద్రబాబు లాగేసుకున్నారు. దాంతో తీవ్ర అవమాన భారంతో ఎన్.టి.ఆర్. మరణించారు. మరణానికి కొద్ది రోజుల ముందు ఎన్.టి.ఆర్ ఒక వీడియోలో మాట్లాడుతూ చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చి, పెద్ద మోసగాడని ధ్వజమెత్తారు. అంతేకాదు. ఎన్.టి.ఆర్. రెండో భార్య లక్ష్మీపార్వతికి ఆయన ఆస్తిలో సరైన వాటా దక్కకుండా ఆమెను రోడ్డుకు ఈడ్చారా? లేదా? చివరికి ఆమె తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయవలసి వచ్చింది. ఇది మామ పట్ల చంద్రబాబు వ్యవహరించిన అమానుష ధోరణి అయితే, సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు తో కూడా ఆయనకు తగాదా వచ్చింది. రామ్మూర్తి చివరికి అన్నపై కోపంతో కాంగ్రెస్ లో కూడా చేరారు. ఇదంతా చంద్రబాబు కుటుంబ తగాదాల కింద రావా? చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలతో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారే. చంద్రబాబు తీరును తప్పుపడుతూ ఆయన బావమరిది హరికృష్ణ సొంత పార్టీ పెట్టుకుని పెద్ద ఎత్తున దూషణలు చేశారు. హరికృష్ణకు అప్పట్లో ప్రస్తుత ఎమ్.పి దగ్గుబాటి పురందేశ్వరి మద్దతు ఇచ్చేవారు. చంద్రబాబు తల్లి అమ్మాణమ్మకు హైదరాబాద్‌లోఉన్న అత్యంత విలువైన ఐదెకరాల భూమిని ఇతర సంతానానికి గాని, ఇతర మనుమళ్లకు కాని ఇవ్వకుండా చంద్రబాబు కుమారుడు లోకేష్ కు మాత్రమే ఆమె ఎందుకు ఇచ్చారన్న దానిపై జవాబు దొరుకుతుందా? జగన్, షర్మిల మధ్య వివాదంతో రాష్ట్రం అంతా ఏదో అయిందన్న భ్రాంతి కల్పించాలని చూస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలలో ఇలాంటివి జరగలేదా? ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావుపై ఆయన రెండో కుమారుడు సుమన్ ఎంత తీవ్రమైన ఆరోపణలు చేశారో తెలియదా? నిజమో, కాదో కాని కొంతకాలం క్రితం ఆస్తుల పంపిణీపై రామోజీ కుటుంబంలో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఆంధ్రజ్యోతి పునరుద్దరణలో కీలక భూమిక పోషించి పెట్టుబడి పెట్టిన విజయ ఎలక్ట్రికల్స్ దాసరి జయరమేష్, నూజివీడు సీడ్స్ ప్రభాకర్ రావు ల వాటా ఎలా తగ్గిపోయింది? రాధాకృష్ణ వాటా ఎలా పెరిగింది? మొత్తం పెత్తనం అంతా ఈయన చేతికే ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తుంటారు. మరికొన్ని ప్రముఖుల కుటుంబాల గొడవలకు సంబంధించి పాత విషయాలు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పై ఆయన మొదటి భార్య నందిని ఏకంగా కేసు పెడితే, రెండో భార్య రేణు దేశాయ్ ఆయన గురించి ఏమి చెప్పారో గుర్తు చేస్తున్నారు. తనకు రాజకీయంగా ఉపయోగపడుతున్నారు కనుక పవన్ కళ్యాణ్ ను ఆయన గొప్పవాడని ప్రచారం చేస్తారు. తేడా వస్తే ఇంతకన్నా ఘోరంగా చంద్రబాబు అవమానిస్తారు. ప్రధాని మోడీ పెళ్లాన్ని ఏలుకోలేని వాడని చంద్రబాబు అన్నారా? లేదా? తదుపరి తన అవసరార్థం ప్లేట్ మార్చి మోడీ చాలా గ్రేట్ అని ఉపన్యాసాలు చెబుతున్నారు కదా! రిలయన్స్ అంబానీ సోదరులు ఇద్దరూ ఆస్తుల విషయంలో కొంతకాలంం గొడవ పడ్డారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై ఆమె రెండో కోడలు మేనకా గాందీ కొన్ని ఆరోపణలు చేస్తూ తనకు ఎలా అన్యాయం చేశారో వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు వస్తాయి. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే షర్మిలపట్ల జగన్ అతి ప్రేమ చూపి అనవసరంగా చికాకు కొని తెచ్చుకున్నారని అనిపిస్తుంది. అయినా ఆయన ఇప్పటికీ కూడా తన అభిమానాన్ని కనబరుస్తూనే ఉన్నారు. షర్మిల తప్పు సరిదిద్దుకుంటే మళ్లీ ఆస్తులు ఇవ్వడానికి ఆలోచిస్తామని చెప్పడం కొసమెరుపు. కాని ఆమె ఇప్పటికే టీడీపీ ఎల్లో మీడియా వేసిన చక్రబంధంలో ఇరుక్కున్నారు.ఆమెను అడ్డు పెట్టుకుని వారు ఆడుతున్న ఈ డ్రామాకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది. ‘‘కేసులను నీరుగార్చే కుట్ర’’ శీర్షికతో వచ్చిన ఈ వార్త ఆసక్తికరంగా ఉంది కానీ.. ఆశ్చర్యకరంగా ఏమీ లేదు. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తనకు తానే సాటి అని బాబు ఇప్పటికే చాలాసార్లు రుజువు చేసుకున్నారు మరి! ఈ తాజా కథనంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే...గతంలో సీఐడీ అధికారులు ఎవరినైతే అవినీతి కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారో.. వారికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నదట! ఇది అత్యంత అరుదైన ఘటనే. అప్పట్లో స్కామ్‌లకు పాల్పడిన వారు ఇప్పుడు అధికారంలో ఉండటం దీనికి కారణమవుతోంది. అయితే నైతిక విలువలు పాటించేవారైతే.. తప్పు చేయలేదని నమ్మేవారైతే తామే నిందితులుగా ఉన్న కేసుల జోలికి అధికారంలోకి వచ్చినా అస్సలు పోరు. నిజం కోర్టులు నిగ్గుతేలుస్తాయని వదిలేస్తారు. ఈ కాలంలో ఇంతటి ఉదాత్త స్వభావాన్ని ఆశించలేము కానీ నిందితులే కేసు సమీక్షకు దిగడం దేశ చరిత్రలో సరికొత సంప్రదాయానికి తెరతీస్తుందన్నది మాత్రం సత్యం. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు, స్కామ్ లపై, 2019-24 వరకు ప్రభుత్వాన్ని నడిపించిన వైసీపీ విచారించింది. సీఐడీ, సిట్ వంటి సంస్థలు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిర్దిష్ట అభియోగాలతో చంద్రబాబు, తదితరులపై కేసులు పెట్టింది. ఆ కేసులలో ఛార్జ్షీట్లు వేసేందుకు సమయం బాగా అవసరమైంది. అయితే ఈలోగా ప్రభుత్వం మారి టీడీసీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలా చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ కేసులను నీరుకార్చడానికి, వీలైతే వాటి నుంచి తప్పించుకోవడానికి సన్నద్దం అవుతున్నారని వార్తలు సూచిస్తున్నాయి బాబు ఇలా చేయకపోతేనే ఆశ్చర్యపోవాలి. కాకపోతే ఇక్కడ విశేషం ఏమిటంటే తనపై కేసులు పెట్టిన సీఐడీ, సిట్లే ఇప్పుడు బాబుకు ప్రెజెంటేషన్ ఇస్తూండటం మాత్రం హైలైట్. ఇంకో విషయం ఈ కేసుల్లో విచారణ చేసిన అధికారులతో కాకుండా.. చంద్రబాబు నియమించుకున్న అధికారులు ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అంటే అవన్నీ తప్పుడు కేసులని, వాస్తవాలు లేవని, గత ప్రభుత్వంలోని అధికారులు కక్షకట్టి కేసులు పెట్టారని ఇప్పటి అధికారులతో చెప్పించుకునే ప్రయత్నం అన్నమాట! ఒక కేసు నిందితుడే అధికారం అడ్డుపెట్టుకుని తీర్పునిచ్చే విధంగా తన అభిప్రాయాలను ఈ ప్రెజెంటేషన్ సాకుతో వెల్లడించబోతున్నారన్నమాట. చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసు విషయంలో కొన్ని చర్యలు తీసుకుంది. సుమారు 54 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులు చంద్రబాబు లేదా, ఇతర ముఖ్యులవి కావు. నిధులను మళ్లించిన డిజిటెక్ సంస్థవి. ఈడీ ఈ సంస్థ అధికారులతోపాటు కొందరు ప్రభుత్వ అధికారులను కూడా గతంలోనే అరెస్ట్ చేసిన విషయం ఇక్కడ ఒకసారి చెప్పుకోవాలి. ప్రధాన నిందితుల్లో ఒకరైన చంద్రబాబును అప్పట్లో ఏపీ సీఐడి అరెస్ట్ చేసినా ఆయనపై ఈడీ ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదు. కారణం ఊహించదగినదే. ప్రస్తుతం ఆయన పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉంది. తదుపరి చర్య తీసుకోవడానికి కేంద్రంలోని సంబంధిత మంత్రులు ఆమోదం ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. పైడి ఎప్పుడు అవకాశం ఉన్నా దేశ ప్రధాని మోడీతో భేటీ అయిన ఫోటోలు కనిపిస్తుంటాయి. అలాంటి వ్యక్తిపై ఈడి చర్య తీసుకోవడం కష్టమే.గతంలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిన వెంటనే వారిలో ఇద్దరిపై ఉన్న కేసుల విచారణ వేగం మందగించింది. ఆ నలుగురు ప్రధానితో కలిసి కూర్చున్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. వారికే అంతటి సదుపాయం కలిగినప్పుడు ఇప్పడు చంద్రబాబు మరింత పవర్ ఫుల్ గా ఉన్నందున కేసు నీరుకారిపోకుండా ఉంటుందా అన్నది చర్చనీయాంశం. స్కిల్ స్కామ్‌లో సుమారు రూ.300 కోట్ల అవ్యవహారాలు జరిగాయన్నది అభియోగం. డొల్ల కంపెనీలకు భారీ ఎత్తున డబ్బు చేరితే అందులో కొంత మనీ లాండరింగ్ మార్గాల్లో నేరుగా టీడీపీ ఆఫీసు ఖాతాల్లోకి వచ్చిందని సీఐడీ అభియోగాలు మోపింది. కానీ అప్పట్లో కేసు విచారించిన అధికారులు ఇప్పుడు టీడీపీ కారణంగా శంకరగిరి మాన్యాలు పట్టారు. పోస్టింగ్‌లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారిని వేధిస్తోంది. ఏదో కేసులో ఇరికించి సస్పెన్షన్ వేటు వేసేందుకూ వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. వలపు వల విసిరి మోసగించే నటి ఒకరిని రంగంలోకి దింపి ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బాబు ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురు ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై తదుపరి చర్యల కోసం అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్ అనుమతి కోరాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అనుమతి రావడం కల్లే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసులో ఆడియో వాయిస్ తో సహా దొరికిపోయారు. దానిని ఆయన ఎంత సమర్థంగా మేనేజ్ చేసుకున్నారో తెలిసిందే. ఛార్జ్‌షీట్‌లో సుమారు 30 సార్లు చంద్రబాబు పేరు ఉన్నా, ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆయన పేరు చేర్చకుండా అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై కొందరు ప్రముఖుల ద్వారా ప్రభావితం చేయగలిగారని అంటారు. అంతేకాదు. 2019 ఎన్నికల తర్వాత ఆయన కార్యదర్శి ఇంటిపై సీబీటీడీ అధికారులు దాడి చేసి, సుమారు రూ. రెండు వేల కోట్ల విలెవూర అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన ఆ కేసునే ఆయన ముందుకు సాగకుండా కేంద్రంలోని బీజేపీ పెద్దలను సమర్థంగా మేనేజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు వారితో మళ్లీ స్నేహం పెట్టుకున్నాక ఎవరు ఆ కేసు జోలికి వెళతారు?.ఈడీ అధికారులు నిజంగానే ఈ కేసు లోతుపాతులను విచారించాలని అనుకుంటే ముందుగా షెల్ కంపెనీలకు వచ్చిన డబ్బు, టీడీపీ ఆఫీస్ ఖాతాకు చేరిన డబ్బు గురించి ఆరా తీయాలి. ఆ విషయాన్ని వెల్లడి చేయాలి. కేసు అక్కడదాకా వెళితే అది గొప్ప విషయమే అవుతుంది. కేంద్రంలోని బీజేపీతో ఏదైనా గొడవ వస్తే జరుగుతుందేమో కానీ, అంతవరకు కదలకపోవచ్చు. స్కిల్ స్కామ్‌ను నీరుగార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆంధ్రప్రదేశ్ మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి డిజిపికి లేఖ రాశారు. కాని ఆయన మాత్రం ఏమి చేస్తారు? ఆయన కూడా టీడీపీ ప్రభుత్వం నియమించిన వారే కదా! చంద్రబాబు ఏమి చెబితే అది చేయవలసిందే కదా? చంద్రబాబు, తదితర టీడీపీ నేతలపై వచ్చిన స్కామ్ కేసులను సీబీఐకి అప్పగించాలని ఒక పాత్రికేయుడు, సామాజిక వేత్త కెబిజి తిలక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేం. గతంలో చంద్రబాబు తనపై కేసు పెట్టడానికి ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకోలేదంటూ సుప్రీం కోర్టులో వాదించారు. సెక్షన్ 17 వర్తిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కానీ సుప్రీం కోర్టు ఆ కేసులో ఇప్పటికీ తీర్పు ఇవ్వకుండా ఉండిపోయింది. అంతేకాదు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్నప్పుడు కింది కోర్టు బెయిల్ ఇవ్వలేదు. కాని గౌరవ హైకోర్టు మాత్రం బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఒక ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన ఆరోగ్య నివేదిక ఆధారంగా బెయిల్ ఇవ్వడం ఏమిటా అని పలువురు విస్తుపోయారు. తనకు రకరకాల వ్యాధులు ఉన్నాయని చెప్పిన ఆయన, విడుదల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా టూర్లు చేశారు.కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదని కోర్టు ఆంక్షలు పెట్టింది. అయినా తన బావమరిది బాలకృష్ణ నిర్వహించే అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో పాల్గొని కేసు గురించి ప్రస్తావించి, తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారట. ఈ పరిస్థితిలో ఏ అధికారి ఈ కేసులను ముందుకు తీసుకువెళతారు? ఏ విధంగా చంద్రబాబు, ఇతర ముఖ్య నిందితులు కోర్టుకు వరకు వెళ్లకుండా చూడవచ్చో అన్నదానిపైనే అధికారులు గురిపెడతారు. ఈ కేసుల రికార్డులను తారుమారు చేయవచ్చని పొన్నవోలు అన్నారు. ఆయన ఎంత వాపోయినా అది వృథా ప్రయాసగానే మిగిలిపోవచ్చు. దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసుల విషయంలో ఒక నిర్దిష్ట విధానం రూపొందించుకోకపోతే , అసలు స్కాములు జరిగినట్లా? కాదా? అన్నదానిపై ప్రజలకు స్పష్టత రాకుండా పోతుంది. అధికారంలో ఉంటే ఎలాంటి కేసు నుంచైనా తప్పించుకోవచ్చన్న భావన మరింతగా ప్రబలుతుంది.ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కొత్త పుంతలు
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల రెడ్ బుక్ రాజ్యాంగం కొత్తపుంతలు తొక్కుతోంది. అధికారంలోకి వచ్చింది మొదలు.. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలపై కక్షసాధింపులతో మొదలైన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం.. క్రమేపీ పార్టీ అభిమానుల ఇళ్లు, ఆస్తుల విధ్వంసం, అక్రమ కేసుల బనాయింపులకు విస్తరించింది. ఆపై రాష్ట్రంలోని ఓ మోస్తరు అధికారి నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌లనూ వేధించడం మొదలుపెట్టారు. ఓ మోసకారి నటితో ఫిర్యాదు చేయించి.. దాని ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం, ఇంకో పాతిక మంది సీనియర్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా సతాయించడం చేశారు.ఇప్పుడు.. తాజాగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీడియాకూ, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలకూ అమలు చేయాలని బాబు, లోకేష్‌లు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. సాక్షి మీడియాపై కేసులు పెట్టడం, ఎడిటర్ మురళిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అలాగే టీడీపీ ఆఫీసుపై దాడి అంటూ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని వేధించడం వంటి చర్యలకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ ఆరోపణలు గుప్పించడం, ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లతో ఢీకొట్టారన్న ఆరోపణలను కూడా వైఎస్సార్సీపీపై నెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించాలని చూశారు. కానీ, ఆ ప్రయత్నాలు కాస్తా బెడిసికొట్టాయి. ఇక లాభం లేదనుకున్నారేమో.. వరద ముంపులో అవినీతి కంపుపై వార్తలు ఇస్తారా అంటూ చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర చేసింది.మీడియాను ప్రభావితం చేయడం, తనకు గిట్టకపోతే అణచివేసే యత్నం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు. 1995లో తన మామ ఎన్టీఆర్‌ను కూలదోసి అధికారంలో వచ్చిందే మీడియా అండతో కదా. అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటికి పెద్దగా పోటీ లేకపోవడంతో వాళ్లు రాసిందే వేదం అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత రోజుల్లో ‘వార్త’ మీడియా వచ్చినా అంత ప్రభావం చూపలేదు. అయినా దాన్ని తమ వ్యతిరేకిగా భావించి చంద్రబాబు దూరంగా పెట్టారు. ఆ తర్వాత కాలంలో టీవీ ఛానెళ్లు మొదలయ్యాయి. వాటిని కూడా ఆయన చాలావరకు ప్రభావితం చేయగలిగారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టారీతిలో కథనాలు ఇచ్చేవి. సంపాదకీయాలు రాసేవి. వైఎస్ ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేస్తుండేవారు. అయినా పెద్దగా ఫలితం వుండడం లేదని భావించి సాక్షి మీడియాను తేవడానికి సహకరించారు.అప్పట్లో వ్యాపారరంగంలో ఉన్న ఆయన కుమారుడు వైఎస్ జగన్.. సాక్షి పత్రికను, ఆ తర్వాత సాక్షి ఛానెల్‌ను తీసుకొచ్చి ప్రజల్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు. వైఎస్ జగన్ భవిష్యత్తులో కీలక నాయకుడు అవుతారనే భావనతో చంద్రబాబు, తమ మీడియా వ్యాపారానికి గట్టి పోటీదారుడు అవుతారన్న భయంతో రామోజీరావు వంటి వారు కాంగ్రెస్‌తో కుమ్మకై అక్రమ కేసులు పెట్టించి వైఎస్ జగన్‌ను జైలుకు కూడా పంపారు. అయినా ఆయన పట్టు వీడకుండా ఇటు సాక్షి మీడియాను, అటు రాజకీయాన్ని కొనసాగించి ప్రజల్లో తనదైన ముద్రను వేసుకున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి ఎల్లో మీడియా వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఎన్ని దారుణమైన అసత్య కథనాలు రాసినా ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మలేదు. అలాగని అసలు ప్రభావం పడలేదని చెప్పలేం. అందువల్లే 2014లో ఆయన అధికారానికి కొద్దిలో దూరమయ్యారు. ఐనా ఆయన జనంలో తిరగడం మానలేదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను 23 మందిని టీడీపీ కొనుగోలు చేసినా వెనక్కి తగ్గకుండా పాదయాత్ర చేశారు. ప్రజల్లో విశ్వసనీయత తెచ్చుకున్నారు. ఆ టైమ్‌లో సైతం ఎల్లో మీడియా జగన్‌పై ఏదో రకంగా విరుచుకుపడుతుండేది. జనం వాటిని నమ్మలేదు. 2019లో జగన్ అధికారంలోకి రాగలిగారు.రాజకీయ పార్టీగా తెలుగుదేశానికి అది సహజంగానే నచ్చదు. ఎల్లో మీడియాకు గిట్టలేదు. దాంతో మళ్లీ చంద్రబాబు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు కుమ్మకై ఉన్నవి లేనివి కలిపి సృష్టించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. వారికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడయ్యారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా వైఎస్ జగన్ వారిపై కేసులు పెట్టలేదు. ఒక వేళ కేసులు పెట్టాల్సి వచ్చినా అబద్దపు వార్తలపై ఖండన ఇచ్చి, ప్రచురించకపోతే లేదా ప్రసారం చేయకపోతేనే చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తే రైతుల భూములన్నీ జగన్ లాగేసుకుంటారంటూ ఘోరమైన అబద్ధాన్ని రాసి, అసత్య ప్రచారాన్ని ఎల్లో మీడియా పతాక స్థాయికి తీసుకెళ్లింది.జగన్ ఏ పని చేసినా ఏదో రకంగా వంకలు పెట్టడం, జనంలో అపోహలు సృష్టించడం వంటివి భారీ ఎత్తున చేసేవారు. వాటికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవడానికి యత్నిస్తే చంద్రబాబు నానా యాగీ చేసేవారు. జగన్ పాలనలో పత్రికా స్వేచ్ఛ దెబ్బతినిపోయిందని గోల గోలగా ఆరోపించేవారు. ఆ తర్వాత ఎలాగైతేనేం ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంతే తనకు నచ్చని మీడియాపై, అలాగే సోషల్ మీడియాపై తన అసలు స్వరూపం చూపించడం ప్రారంభించారు.సాక్షి టీవీతోపాటు ఎన్టీవీ, టీవీ 9 ఛానెల్‌ను ఏపీలో పలు చోట్ల రాకుండా కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. మంత్రి గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో ఇందుకోసం ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారట. ఇక సాక్షి పత్రికకు అయితే ఎలాగూ ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం లేదు. తమకు బాకాలు ఊదే మీడియాతోటి మాత్రమే సఖ్యతగా ఉంటూ మిగిలిన మీడియాను తొక్కేయాలని, తద్వారా తమకు ఎదురు లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా సాక్షి ఎడిటర్‌పై కేసు పెట్టారు.విజయవాడ వరదల్లో బాధితులను ఆదుకునే క్రమంలో స్కామ్‌లు జరిగాయన్న కథనం ఇచ్చినందుకు, ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి కేసు పెడితే దాన్ని విజయవాడ పోలీసులు నమోదు చేశారు. ఆ వార్తలో నిజం లేకపోతే ప్రభుత్వం ఖండన ఇవ్వొచ్చు. లేదా వివరణ చెప్పవచ్చు. వాటిని కవర్ చేయకపోతే అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవడం సహజంగా జరగాలి. కానీ, అవేమీ లేకుండా ఒక ప్రధాన పత్రిక ఎడిటర్‌పైనే కేసు పెట్టడమంటే పత్రికాస్వామ్యాన్ని హరించి వేయడమనేది వేరే చెప్పనవసరం లేదు. విశేషమేమిటంటే వరద సహాయంలో 5నుంచి 10శాతం అవకతవకలు జరిగి ఉండవచ్చని చంద్రబాబే చెప్పారు. మరి దానివల్ల ప్రభుత్వ ప్రతిష్ట పోలేదా?. ఆయనపై కూడా కేసు పెట్టాలి కదా.సీపీఎం నేత బాబూరావు మొదట ఈ స్కాంను బయట పెట్టారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు పెట్టారని ప్రభుత్వ లెక్కల్లో రాసిన సంగతిని ఆయన బయట పెడితే ప్రజల్లో అది సంచలనం అయింది. సంబంధిత మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ లు కూడా దీనిపై గందరగోళంగా మాట్లాడారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక ప్రభుత్వ పరపతిని పునరుద్ధరించుకునేందుకుగాను సాక్షి ఎడిటర్ పై తప్పుడు కేసు పెట్టారని అర్థమవుతోంది. వచ్చే నాలుగేళ్లు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఎటూ తమది రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు కాబట్టి టీడీపీ వారు దేశ రాజ్యాంగాన్ని వదిలి రెడ్ బుక్‌నే ఫాలో అవుతారు.ఇక వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విదేశాల నుంచి తిరిగి వస్తున్నప్పుడు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి ఏపీ ప్రభుత్వం తన డొల్లతనాన్ని ప్రదర్శించుకుంది. అంతటితో ఆగకుండా ఆయన్ను పోలీసు విచారణకు పిలిచారు. ఇంతకు కేసు ఏంటయ్యా అంటే టీడీపీ ఆఫీసుపై కొందరు దాడి చేయడం. దాడిని ఎవరూ సమర్థించరు. జగన్ ప్రభుత్వంలోనే దీనిపై కేసు పెట్టారు. అసలు ఈ దాడికి కారణం ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు జగన్‌ను నోటికొచ్చినట్టు దూషించడం. ఆ సంగతిని మాత్రం బయటకు చెప్పరు. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి అలాగే సజ్జల వంటి వారిని ఇరికించి కక్ష తీర్చుకోవాలనేది వాళ్ల లక్ష్యంగా కనిపిస్తోంది. పైకి నీతులు చెబుతూ లోపల మాత్రం ఇలా పగ ప్రతీకారాలకు పాల్పడడం చంద్రబాబు నైజమే.ఇదేమీ కొత్త కాదు. 2014-19 మధ్య కూడా సాక్షి మీడియాతో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై టీడీపీ ప్రభుత్వం దాడి చేసింది. కాపుల ఆందోళన వార్తలు కవర్ కాకుండా చూడాలని ప్రయత్నించింది. తమ చెప్పు చేతల్లో ఉండని జర్నలిస్టులను వేధించారు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటివి కొత్త కాదు. వీటిని ఎదుర్కోవడం జర్నలిస్టులకు కొత్త కాదు. కాకపోతే మీడియాను అణచివేయడం ద్వారానే తాము అధికారంలోకి కొనసాగగలమని చంద్రబాబు వంటి సీనియర్ నేత ఇప్పటికీ భ్రమ పడుతుండడం ఓ చారిత్రక విషాదం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎదుర్కొన్న జర్నలిస్టులు చంద్రబాబును ఎదుర్కోలేరా?. - కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పాతది పోయే.. కొత్తది వచ్చే... ఢాం.. ఢాం ఢాం!!!
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త సూపర్ సిక్స్! ఇక అభివృద్ధే అభివృద్ధి! ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి మాత్రం అస్సలు మాట్లాడొద్దు! ఇదీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తీరు! తాజా మంత్రివర్గ సమావేశంలో కొత్త సూపర్ సిక్స్‌కు ఆమోదం తెలిపినట్లు వార్తలొచ్చాయి. అన్నీ గేమ్ ఛేంజర్లని బాబు గారు ప్రకటించడం.. అవును అవును అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతులు బాకాలూదడం మొదలైపోయింది.బాబు గారి కొత్త మాట నిజంగానే గేమ్ఛేంజర్లతే తప్పమీ లేదు. రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కానీ గతానుభవాలను చూస్తే, తెలుగుదేశం హయాంలో కాగితాలకే పరిమితమైన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను పరిశీలించినా కొత్త సూపర్ సిక్స్ భవిష్యత్తు ఇట్టే అర్థమైపోతుంది. ఇంతకీ ఈ కొత్త సూపర్ సిక్స్‌లో ఉన్న అంశాలేమిటి?1. పారిశ్రామిక అభివృద్ధి 2. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఎంట్రప్రన్యూర్షిప్ డెవలప్మెంట్, 3. ఆహార శుద్ధి 4. ఎలక్ట్రానిక్స్ 5. ప్రైవేట్ పార్క్‌ల విధానం 6. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ.!! వీటిల్లో కొత్తదేమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించి చూడండి మీకే అర్థమైపోతుంది. ఎలాగంటే.. పారిశ్రామిక అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వమేదైనా ఎంతో కొంత కృషి జరుగుతుంది. ఈ ప్రక్రియకు బాబు తన ప్రచారాన్ని మాత్రమే ఇప్పుడు తాజాగా జోడిస్తున్నారు.2019 - 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు వచ్చినా.. అసలేమీ అభివృద్ధి జరగలేదని, ఉన్నవి కూడా తరలివెళుతున్నాయని ప్రతిపక్షాలు, పచ్చ మీడియా దుష్ప్రచారం చేశాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే.. జగన్ హయాంలో వచ్చిన 16 పరిశ్రమలనే మరోసారి ప్రారంభించి అంతా తమ ఘనతని డప్పు కొట్టుకునే ప్రయత్నం జరిగింది. ఇప్పుడిక.. ప్రతి కుటుంబంలోను పారిశ్రామికవేత్తను, వ్యాపారవేత్తను తయారు చేస్తారట. అప్పట్లో ఇంటికో ఉద్యోగమిస్తామని ఇచ్చిన బూటకపు హామీ మాదిరిగా ఇప్పుడు పారిశ్రామికవేత్తల తయారీ చేపడతారన్నమాట!!రెండో అంశం...చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి. ముఖ్యమంత్రిగా ఉండగా.. జగన్ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టి ఈ రంగం అభివృద్ధికి కృషి చేశారు. ఈ క్రమంలోనే జగన్ 2014-19 టర్మ్‌లో బాబు పెట్టిన బాకీ పడ్డ వేయి కోట్ల రూపాయిలను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. మూడో అంశంగా ఆహార శుద్ధి పేరు చెబుతున్నారుగానీ, చంద్రబాబు 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే ఇలాంటి పరిశ్రమలు ఎన్ని వచ్చాయో ఆయన చెప్పగలిగివుంటే బాగుండేది. ఎలక్ట్రానిక్స్‌ను నాలుగో అంశంగా చెబుతున్నారు. కొత్తదనం మాత్రం ఏమీ లేదు.వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఉన్న ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌ను అమరావతికి తరలించడం ఎలాంటి అభివృద్ధో తెలియడం లేదు. ఇంతకు ముందు ఈయన ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఎందుకు తేలేకపోయారో తెలియదు. ఐదో అంశం... ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ విధానం తెస్తారట. బహుశా ఇది గతంలో ఆయన వ్యతిరేకించిన ఎస్ఈజెడ్ లాంటివేమో చూడాలి. చివరగా... ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ అని అదేదో కొత్తగా కనిపెట్టినట్టు ప్రకటించారు. జగన్ హయాంలో రూ.3.5 లక్షల కోట్లు పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రంగంలో వస్తుంటే అప్పట్లో ఈనాడు మీడియా ఎన్నిరకాలుగా అడ్డుపడిందో చూశాం.అదానీ కంపెనీ వస్తుంటే మొత్తం అదానీకి రాసి ఇచ్చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి గగ్గోలు పెట్టింది. అసలు అన్ని లక్షల మెగావాట్ల ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించారు. ఆయా పరిశ్రలకు వేల ఎకరాల భూములు ఎందుకు ఇవ్వాలని యాగీ చేశారు. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమకు రాయితీల వర్షం కురిపించబోతున్నారని ఈనాడు మీడియా చెబుతోంది. జగన్ టైమ్ లో రాయితీలు, భూమి వంటివి సమకూర్చితే దోపిడీ అని నీచంగా రాసిన ఈనాడు మీడియా ఇప్పుడు రాయితీలు ఇస్తే వర్షం కురిపించి వారిని సంతోషపెట్టినట్లు చెబుతోంది. ఆ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. 2047 నాటికి రూ.30 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తారట. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు అమరావతిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరికొన్ని ఇన్నోవేషన్ జోన్లు వస్తాయని అన్నారు. నిజంగానే ఈ జోన్లు వచ్చి కొత్త పరిశ్రమలు వస్తే ఎవరూ కాదనరు. కానీ చంద్రబాబు మాటలు కోటలు దాటుతుంటాయి. చేతలు గడప దాటతాయని చెప్పలేం. తాజాగా జాబ్ ఫస్ట్ అనే నినాదం కూడా ఆయన ఇచ్చారు. కొత్త కొత్త విధానాలు, నినాదాలు ఇచ్చేస్తే మొత్తం గేమ్ ఛేంజెర్ అవుతుందని జనాన్ని నమ్మించాలని ఆయన భావిస్తున్నట్టు వుంది.ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కూడా అదే బాటలో ఉంటుంటారు. కానీ ఈసారి జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టీడీపీ డొల్లతనమేంటో తెలిసిపోయింది. వీరి పెట్టుబడుల బాగోతం బయటపడిపోయింది. టైమ్స్ నౌ ఆంగ్ల మీడియా ఛానెల్ నిర్వహించిన ఫ్రాంక్లీ స్పీకింగ్ కార్యక్రమంలో యాంకర్ ఒక ప్రశ్న వేశారు. అది టెస్లా కార్ల ప్లాంట్లకు సంబంధించినది. 2024 ఏప్రిల్‌లో లోకేష్ ఒక ట్వీట్ చేస్తూ ''2017లో అప్పటి సీఎం చంద్రబాబుతో కలిసి మీతో (టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో) చర్చలు చేశామని మీరు ఇండియాకు వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మా బృందంలో దీనిపై చర్చించుకున్నామని పెట్టుబడులు ఏపీ ఒక ముఖద్వారమ''ని ఎలాన్ మస్క్‌కు ట్యాగ్ చేస్తూ పేర్కొన్నారు.అంతే కాకుండా రెండు నెలల్లో టెస్లా ఏపీ నుంచి ఉత్పత్తి చేస్తుందని కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని యాంకర్ గుర్తు చేస్తూ ఎలాన్ మస్క్‌తో సంప్రదింపులు చేశారా అని లోకేష్‌ను అడిగారు. దీంతో షాక్ తిన్న లోకేష్ తేరుకొని ఆయన ఎప్పుడు ఇండియాకు వస్తే అప్పుడు చర్చలు చేస్తామని సమాధానం చెప్పారు. అలా అయితే టెస్లాను ఎప్పటికి సాధిస్తారు? అన్నట్టుగా యాంకర్ ప్రశ్నించగా తాము 2015 నుంచే ఎలాన్ మస్క్‌తో చర్చలు జరుపుతున్నామని అన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చి వంద రోజులు అయిపోయింది కదా మీరేమైనా చర్చలు జరిపారా? లేదా? అని యాంకర్ మరోసారి అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా లోకేష్ దాట వేశారు.సో చంద్రబాబు, లోకేష్ ల మాటలు ఇలా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. పైగా టీసీఎస్ ఏపీకి వచ్చేసిందని, లులూ కంపెనీ వచ్చేస్తుందని, ఇంకా అనేక రకాల పరిశ్రమలు రాబోతున్నాయని ఆయన చెప్పేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన ప్రకటించిన సూపర్ సిక్స్ గురించి ఒక ముక్క ప్రస్తావించకపోవడం. ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు మళ్లీ చెబుతున్నారు. 2014-19 మధ్యకాలంలోనూ ఇలాగే ప్రచారం చేసుకున్నారుగానీ ఆ పెట్టుబడులు ఎవరికీ కనిపించలేదు. పరిశ్రమల సంగతేమోగానీ ఉద్యోగాలు వచ్చేంత వరకూ నిరుద్యోగులకు రూ.మూడు వేల చొప్పున భృతి ఇస్తామన్న హామీ ఏమైందో ఎవరికీ తెలియదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలు అమలైపోతాయని ఆశించజాలం. కానీ చంద్రబాబు పవన్ కల్యాణ్‌లు ఎన్నికలు అవ్వడమే ఆలస్యం తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, ప్రతి రైతుకు రూ. 20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, నిరుద్యోగ భృతి మూడు వేలు మొదలైన వాటిని బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీగా ప్రకటించారు.ఇదీ చదవండి: బాబు మాటలు నేతి బీర చందమే!ఇప్పటికైతే ఈ ఆరు అమలు కాలేదు. ఎప్పటికి ఆరంభిస్తారో చెప్పడం లేదు. దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అంటున్నారు. ఇవికాక సుమారు 200 ఇతర వాగ్ధానాలున్నాయి. మరి వాటిని అన్నిటినీ జనం మరిచిపోవాలా? మరోసారి చెబుతారా? అప్పుడు సూపర్ సిక్స్ అని ఇప్పుడు సూపర్ సిక్స్ అంటే జనం ఎట్లా నమ్మాలి? ఇవి అసలు గేమ్ ఛేంజెర్ ఎలా అవుతాయి? ఒక్క రూ.200 కోట్ల పరిశ్రమ పెట్టాలంటేనే రెండు మూడేళ్లు పడుతుంది. అలాంటిది ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అని చెబుతున్నారు.ఇన్ని లక్షల ఉద్యోగాల సంగతేమోగానీ లక్షన్నర వాలంటీర్ల ఉద్యోగాలు ఇప్పటికే పోయాయి. ప్రభుత్వ మద్యం షాపుల్లో పని చేసిన 15 వేల మంది ఉద్యోగాలు ఊడాయి. కాకపోతే ఇంకో ఏడాది నుంచే అన్ని లక్షలు వచ్చాయని, ఇన్ని లక్షలు వచ్చాయని ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రకంగా ఏపీ ప్రజలతో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం గేమ్ ఆడుకుంటున్నదన్నమాట.ఈ నేపథ్యంలోనే పాత సూపర్ సిక్స్ మాటేమిటని జనం అడుగుతున్నారని, దాన్ని కవర్ చేయడానికి ఆంధ్రజ్యోతి పాత సూపర్ సిక్స్ లోని రెండు అంశాలు తల్లికి వందనం, రైతు భరోసాలు వచ్చే ఏడాది ఇస్తారని ఊరించింది.మరి ఈ ఏడాది సంగతేమిటో చెప్పలేదు. అప్పట్లో పీ4 విధానమని పేదరికం పోవడానికి ధనికులంతా దత్తత తీసుకోవాలని చంద్రబాబు ఏవేవో ప్రకటించారు. అసలు పీ4 విధానంతో ఏపీ మారిపోతుందని చెప్పేవారు. ఇప్పుడా విధానం ఏమైందో తెలియదు. తాజాగా సూపర్ సిక్స్ గేమ్ చేంజర్ అంటున్నారు. ఏడాదికి ఒకరకంగా కొత్త కొత్త విధానాలు తీసుకొస్తూ ఐదేళ్లు గడిపేస్తే సరిపోతుందేమో.- కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దేశవ్యాప్త ప్రజా ఉద్యమంతోనే ఈవీఎంల అసలు గుట్టు సాధ్యం!
హమ్మయ్యా.. ఎట్టకేలకు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఎన్నికల కమిషన్ నోరు విప్పింది. అయితే ఈ వివరణ మొత్తం ఏదో బుకాయిస్తున్నట్లు మాత్రమే ఉంది. ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఒక పత్రిక విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంల మ్యానిప్యులేషన్పై ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. అయితే ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లు కానీ ఈ అనుమానాలను సంతృప్తికరమైన సమాధానం ఇచ్చినట్లు కనిపించలేదు. పైగా ప్రశ్నలు వేసినవాళ్లు అధికులు ఉత్తరాది వారు కావడం వల్లనేమో లేక సమాచారం లేమి కారణంగానో తెలియదు కానీ.. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన తంతుపై ఎక్కువ ప్రశ్నలు రాలేదు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఉండటంపైనే ప్రశ్నలు కొనసాగాయి. అలాగే ఒక కాంగ్రెస్ ఎంపీ ఈవీఎంలను హిజ్బొల్లా వాడిన పేజర్లతో పోల్చి.. ఇజ్రాయెల్ సైన్యం వాటిని పేల్చివేసిన వైనం గురించి ప్రస్తావించిన సంగతిని కోట్ చేసి అడిగారు. సహజంగానే ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషనర్లు ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై అనుమానాలు రేకెత్తించేలా సమాధానమిచ్చారు. మొదటి గంటలోనే ఫలితాలు ఎలా వస్తాయని ఈసీ ప్రశ్నించింది. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కాదు సమస్య. హరియాణాలో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే అధికారం అన్న అంచనాకు వచ్చాయి. కొన్నిసార్లు ఈ అంచనాలు తప్పవచ్చు కానీ.. అన్ని సర్వేలూ తప్పు కావడం ఇదే మొదటిసారి కావచ్చు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలకు భిన్నంగా ఈవీఎం ఓట్ల లెక్కలు ఉండటం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. భారత్ వాడే ఈవీఎంలు హిజ్బొల్లా వాడే పేజర్ల కన్నా సమర్థమైనవని, ఎవరూ హ్యాక్ చేయలేరని ఈసీ అన్నప్పటికీ, దానిని సహేతుకంగా నిరూపిస్తామని చెప్పలేకపోవడం గమనార్హం. ఈవీఎంల బాటరీ ఛార్జింగ్ పోలింగ్ నాటి కన్నా, కౌంటింగ్ నాటికి ఎలా పెరుగుతుందన్న దానికి వీరు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం గమనార్హం. ఇజ్రాయిల్ హ్యాకింగ్ దిట్ట అని పేరు. పెగసస్ గూఢచర్య పరికరాలు, సాఫ్ట్వేర్లు అక్కడ తయారవుతున్నాయి. హిజ్బొల్లా వాడిన పేజర్లను తయారు చేసే తైవాన్ కంపెనీనే మేనేజ్ చేసి టాంపరింగ్ చేసి, వాటిని పేల్చివేయగలిగిందని వార్తలు వచ్చాయి. అలాంటి ఇజ్రాయిల్ నుంచి ఈవీఎం టాంపరింగ్ పరిజ్ఞానాన్ని ఎవరైనా ఇండియాకు తెచ్చారా అన్న సంశయం కొందరిలో ఉంది. దీన్ని మనం నిర్ధారించలేము కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు, వెల్లడైన ఫలితాలు, ఆ తర్వాత ఈసీ అధికారులు ప్రవర్తించిన తీరులను గమనిస్తే పలు సందేహాలు రాక మానవు. ప్రముఖ సర్వే నిపుణుడు ఆరా మస్తాన్ కొద్ది రోజుల క్రితం చాలా స్పష్టంగా ఈవీఎంలను హాక్ చేయవచ్చని, ఈ విషయాన్ని పలుమార్లు నిపుణులు రుజువు చేశారని అన్నారు. ఎలాన్ మస్క్ వంటివారు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా భారత ఎన్నికల సంఘం సరైన తీరులో స్పందించకపోవడం సందేహాలకు తావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో అత్యధిక సర్వే సంస్థలు పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఫలితాలు కూడా అలాగే ఉంటాయని, ఇరుపక్షాల మధ్య తేడా ఉంటే ఐదు లేదా పది సీట్లు ఉండవచ్చని అంచనా వేశాయి. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ వైఎస్సార్సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోసం జరిగిందని స్పష్టం చేశారు. కాకపోతే ఆధారాలు లేవని అన్నారు. కానీ ఆ తర్వాత పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఆరా మస్తాన్ వంటివారు మొత్తం స్టడీ చేసి ఈవీఎంల మానిప్యులేషన్ జరిగిందన్న భావనకు వచ్చారు. అన్నిటిని మించి ఎన్నికల కమిషన్ ఎన్ని అరోపణలు వచ్చినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే మోసం జరిగిందన్న దానికి పెద్ద ఎవిడెన్స్ అన్న భావన ఉంది. ఎన్నికల నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓట్ల శాతం ఎలా పెరిగిందన్న ప్రశ్నకు ఈసీ నుంచి జవాబు లేదు. ఏపీలో సుమారు 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా వచ్చాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం చేసిన ఆరోపణపై సరైన సమాధానం రాలేదు. ఒంగోలు, విజయనగరంలలో వీవీప్యాట్ స్లిప్ లను లెక్కించాలని, ఈవీఎంలతో పోల్చాలని చేసిన అభ్యర్థనను పక్కదారి పట్టించడం, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా, దానిని అమలు చేయకపోవడం మరో డౌటు. ఈ ఒక్క విషయాన్ని ఎన్నికల సంఘం క్లియర్ చేసి ఉంటే ఈవీఎంలపై సందేహాలు వచ్చే అవకాశం ఉండదు. అలా చేయకపోవడంతో ఈవీఎంలను మేనేజ్ చేశారని అందువల్లే ఏపీలో జగన్ ప్రభుత్వం ఓటమికి గురైందని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది. వీవీప్యాట్ స్లిప్ లను పది రోజులలోనే దగ్ధం చేయాలని అప్పటి ఎన్నికల ముఖ్య అధికారి జిల్లా అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇచ్చారన్నది ఇంతవరకు తేలలేదు. వీటన్నిటిపై అప్పటి వైసీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టుకు వెళితే, రెండు నెలలు దాటినా తీర్పు రాకపోవడం మరో చిత్రంగా భావిస్తున్నారు. ఇక ఫారం 20లో ఆయా పార్టీలు, అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు నమోదు చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉన్నా, ఏపీలో 108 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? వాటిని పరిశీలిస్తే అనేక ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని నియోజకవర్గాలలోని పోలింగ్ బూత్‌లలో వైసీపీకి ఒక్క ఓటు మాత్రమే రావడమేమిటో అర్థం కాదు. పైగా అసలు అంతగా ఉనికిలో లేని కాంగ్రెస్‌కు అదే బూత్ లో 470 ఓట్లు వచ్చాయని నమోదు కావడం మరో వింతగా చెబుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత, వీటిపై ఎన్నికల సంఘం ప్రజల ముందుకు వచ్చి ఈ అనుమానాలను నివృత్తి చేయకపోవడంపై అంతా విస్తుపోతున్నారు. మీడియా సమావేశంలో ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం ద్వారా ప్రజాస్వామ్య రక్షణకు గొడుగుగా ఉండవలసిన ఈ సంస్థకు ఏదో అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. పోనీ ఏపీ, ఒడిషా, హరియాణలలో గెలిచిన టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలైనా ఈవీఎంలపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న డౌట్ల ను క్లియర్ చేయాలని ఎన్నికల సంఘానికి సూచించకపోవడం మరో సంశయంగా ఉంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వంటివారు ఎన్నికలలో ఈవీఎంలను ఎలా టాంపర్ చేయవచ్చో, పలుమార్లు వివరించారు. ప్రస్తుతం ఆయన గెలిచారు కనుక ఆ అంశాల జోలికి వెళ్లడం లేదు. ఏపీలో కూటమి ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తీరు అంతా ఏకపక్షంగానే సాగిందన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో దేశ ప్రజల కర్తవ్యం ఏమిటి? అయితే ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలి. అలా చేయకపోతే ప్రజాబాహుళ్యం నుంచి ఒత్తిడి మొదలు కావాలి. అది ఉద్యమ రూపం దాల్చాలి. ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారిన ఈవీఎంల వ్యవస్థను తొలగించే వరకు అంతా ఉద్యమించాలి. దీనిపై దేశ వ్యాప్తంగా కదలిక రాకపోతే భవిష్యత్తులో ఇది మరింత అపాయంగా మారుతుంది. ఎవరికి వీలైతే వారు ఈవీఎం లను హాక్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వైఎస్సార్సీపీ అధినేత జగన్ దీనిపై ప్రజా ఉద్యమం తీసుకురావడానికి పూనుకోవాలని అంతా భావిస్తున్నారు. ముందుగా ఆయా సర్వే నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రముఖులతో సమావేశం జరిపి, దేశ స్థాయిలో వివిధ ప్రాంతాలలో సెమినార్లు కండక్ట్ చేసి అందరిలోను ఒక కదలిక తీసుకు రాగలిగితే ఆయన దేశానికి ఒక మార్గదర్శకుడు అవుతారు. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదని, ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయరని ఎక్కువమంది నమ్ముతారు. తొలుత ఆయన పార్టీ పరంగా తనకు ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడికరించి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలి. వారు స్పందిస్తారా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. ఈవీఎంలపై అందరిని సంతృప్తిపరిచేలా ఈసీ జవాబు ఇవ్వగలిగితే ఓకే. అలా కాకుండా జగన్ గతంలోనే చెప్పినట్లు పేపర్ బాలెట్ ద్వారానే ఎన్నికలు జరిగేలా ఈ నాలుగేళ్లు ఉద్యమం చేపట్టడం అవసరం అనిపిస్తుంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ హరియాణ ఎన్నికల ఫలితాల ద్వారా ఈసీకి పలు ఫిర్యాదులు చేసింది. వాటిలో వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కూడా ఉంది. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఈవీఎంల వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దానికి కేంద్రం, ఈసీ ఎటూ అంగీకరించవు. కాబట్టి.. ప్రజా ఉద్యమమే ఈ సమస్య పరిష్కారానికి మేలైన మార్గం కాగలదు! కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు మాటలు నేతి బీర చందమే!
బీరాలు పలకడం ఎలాగో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటే బెదిరించడం, అధికారంలో ఉంటే దబాయించడం ఈయనగారికి బాగా ఒంటబట్టిన విద్య. ఓటేస్తే అది చేస్తా ఇది చేస్తామని సూపర్ సిక్స్ పేరుతో హామీలు గుప్పించిన బాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని సాంతం మరచిపోయారు. పైగా హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి బాబు విషయం బాగానే తెలిసినట్లు ఉంది. అందుకే కొన్నేళ్ల క్రితమే ‘యూ టర్న్’ బాబు అని పేరు పెట్టారు. చంద్రబాబు కూడా ఆ పేరును ఎప్పటికప్పుడు సార్థకం చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గమనించండి.. ప్రజలు ఆనందంగా ఉంటే వైఎస్సార్సీపీ నేతలు భరించలేకపోతున్నారట! కక్ష్యలు కార్పణ్యాలు తనకు అసలే తెలియవట! హద్దుమీరితే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసట! వైఎస్సార్సీపీ తన పాలన కాలంలో వందకు 70 మంది అధికారులను భ్రష్టు పట్టించిందట! అవినీతి కేసులో జైల్లో ఉండగా ఆయన్ను చంపే ఆలోచన చేశారట! ఇవీ బాబుగారి వాక్కులు. వీటితోపాటు.. ‘‘రాష్ట్రానికి వీళ్లు అరిష్టం’’ అంటూ బాబు వైఎస్సార్సీపీని ఉద్దేశించి మాట్లాడారని అనుకూల మీడియా ఓ భారీ కథనాన్ని వండి వార్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడం అరిష్టమా? లేక అన్నీ ఎగ్గొట్టడమా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ఈ నాలుగు నెలల కాలంలో ఎప్పుడైనా బాబు చెప్పాడా? కనీసం షెడ్యూలైనా ఇచ్చారా? ఇవ్వలేదే!. వాస్తవాలిలా ఉంటే.. ఆయనేమో.. ప్రభుత్వం చాలా మంచిదని తనకుతాను కితాబిచ్చుకుంటున్నారు. హామీలన్నింటినీ ఉట్టికెక్కించినా తన హయాంలో ప్రజలు ఆనందంగా ఉన్నారట! దబాయించడం అంటే ఇదే మరి!విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బాబు తీరు ఇంతే. ప్రతిపక్షంలో ఉండగా.. తామైతే ప్రైవేట్‌పరం కాకుండా రక్షిస్తామని గొప్పలు చెప్పారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక మాత్రం చేతులెత్తేశారు. కుంటిసాకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేశానని తరచూ చెప్పుకునే బాబు ప్రతిపక్షంలో ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అవగాహన లేకపోయిందని చెప్పడంతోనే తెలిసిపోయింది ఆయన మాటల్లో డొల్లతనం ఎంత అన్నది! విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తుతం బాబు చేస్తున్న వ్యాఖ్యల్ని గమనిస్తే అది ప్రైవేట్ పరం కావడం తథ్యమని అనిపించకమానదు. అదే జరిగితే విశాఖకే కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే అరిష్టం అవుతుంది!తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం విషయం.. లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఒకసారి.. ఎక్కడ వాడారో అప్రస్తుతమని ఇంకోసారి!! ఇది కదా అరిష్టం! విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల విషయంలోనూ ఇంతే. మునుపెన్నడూ లేనంత విధంగా ఉత్సవాలు జరిగాయని ఆయనకు ఆయన కితాబిచ్చుకున్నారు కానీ.. ప్రత్యేక దర్శనం కోసం రూ.500 లు పెట్టి టికెట్ కొన్నవారు కూడా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చిందని, వీఐపీలు, జత్వానీ వంటి మోసకారి నటీమణులు నేరుగా, దర్జాగా దర్శనానికి వెళ్లారని భక్తులు ఆరోపించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆహా, ఓహో అని పొగుడుకుంటున్నారు. తాను అధికారంలో ఉండగా జరిగిన అవినీతి కార్యకలాపాలను ఎండగట్టారని, కేసులు పెట్టి, జైలుకు పంపారన్న అక్కసుతో ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడమే కాకుండా దాదాపు పాతికమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తనకు కక్షంటే ఏమిటో తెలియదని అమాయకపు మాటలు చెబుతున్నారు. వరద సాయం జరిగేటప్పుడు 5 - 10 శాతం దుబారా కావచ్చని ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చెప్పడం రాష్ట్రానికి అరిష్టమో కాదో తేల్చుకోవాలి. రాజమండ్రి జైలులో తనను చంపాలనుకున్నారని ప్రచారం జరిగిందని ఒక సీఎం అంటున్నారంటే అంతకన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉంటుందా? నిజంగా అలాంటిదేమైనా జరిగి ఉంటే ప్రస్తుతం ఆయనే సీఎంగా ఉన్నారు కదా, నిజానిజాలు నిగ్గుదేల్చవచ్చు కదా? జైలులో ఏసీ కూడా పెట్టించుకున్న ఈ నాయకుడు తనకు తగు సదుపాయాలు కల్పించ లేదని చెబుతున్నారంటే ఏమి అనుకోవాలి! ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ అనుకూల మీడియాలో రాసిన పచ్చి అబద్ధాలను ఇప్పటికీ ఆయన వాడుకుంటూనే ఉన్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ. 23 కోట్లు ఖర్చుపెట్టినదానికి సమాధానం ఇవ్వకపోగా ఐతే ఏంటట? అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీన్ని కదా అరిష్టపు పాలన అనాల్సింది. ఈవీఎంలు, జమలి ఎన్నికలపై చంద్రబాబు పలు మార్లు మాటమార్చిన సంగతి కొత్తేమీ కాదు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెప్పిందే ఆయన. ఒంగోలులో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి అక్రమాలు జరగలేదని ఎందుకు ఎన్నికల సంఘం ఎందుకు తేల్చలేదో చంద్రబాబు వివరించి ఉంటే అప్పుడు ఆయన మాటను నమ్మవచ్చు.ఈవీఎం బ్యాటరీ ఛార్జింగులో ఎందుకు తేడా వచ్చిందో చంద్రబాబైనా తెలిపి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకుండా 2019లో వైఎస్సార్ సీపీ ఎలా గెలిచిందని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన ఈవీంలపై సుప్రీం కోర్టు దాకా ఎందుకు వెళ్లారో చెప్పరు. ఈ సంగతులు పక్కన పెడితే ‘‘నీకు 15 వేలు, నీకు 15 వేలు’’ అంటూ పిల్లలనూ, ‘‘నీకు 18 వేలు’’ అంటూ తల్లుల్ని, ‘‘నీకు 48 వేలు’’ అంటూ యాభై ఏళ్లలోపు ఉన్న బీసీలను ఊరించి వారికి మొండి చేయి చూపడం అరిష్టపాలన అవుతుందా కాదా? నిరద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఇస్తామని ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం, వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆశపెట్టి, అలా చేయకుండా, వారి బతుకులను రోడ్డు పాలు చేస్తే అది మంచి ప్రభుత్వం అవుతుందా? లేక అరిష్టపు ప్రభుత్వమవుతుందా? కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై మాత్రం చంద్రబాబు ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తుంటారు.జగన్ తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేస్తే అది అరిష్టమట. టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన దాదాపు అన్ని హామీల ఊసే ఎత్తకుండా, జనాన్ని మోసం చేయడం అరిష్టం కాదట? జగన్ సచివాలయాలు, హెల్త్ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అనేక వ్యవస్థలను తీసుకురావడం అరిష్ట పాలన అవుతుందా? వాటిని అన్నిటినీ ప్రస్తుతం ధ్వసం చేయడం అరిష్టపాలన అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం లోటుపాట్లు లెక్కకు మిక్కిలి. చంద్రబాబు ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా ఎల్లో మీడియా అండతో జనాన్ని మభ్య పెట్టాలని చూడడం అన్నిటికన్నా పెద్ద అరిష్టం కాదా?- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’
''ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై క్లియర్ పిక్చర్ లేదు’’... నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నాదని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చూస్తే చాలా అమాయకుడని అనిపించవచ్చు. కానీ.. మాటల మార్చడంలో, ప్రగల్భాలు పలకడంలో, యూటర్న్ తీసుకోవడంలో ఈయన్ను మించిన వారు ఇంకొకరు ఉండరంటే అతిశయోక్తి కానే కాదు. బహుశా దేశం మొత్తమ్మీద ఇంకొకరు లేరనడానికి ఇది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బాబు వ్యాఖ్య ఒక నిదర్శనమనే చెప్పవచ్చు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గురించి మీడియాతో మాట్లాడుతూ వారు ఏ ప్రశ్న అడిగినా అది సాధ్యం కాదన్న సమాధానం వచ్చేలా చెప్పారు. కేంద్రం ప్యాకేజీ ఇవ్వొచ్చుకదా అంటే ''అవును ఇవ్వొచ్చుగానీ అంతటితో అయిపోదు కదా, గనుల్లేవు అని ముక్తాయిస్తారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయొచ్చుకదా అంటే ''అలా చేయవచ్చుగానీ, అందుకు వారు అంగీకరించాలి. ఆర్థిక సమస్యలు ఉంటాయి'' అంటూ జవాబా ఇస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవటీకరణ కాకుండా నిలబెడతామన్నారు కదా అని ప్రశ్నిస్తే ''ప్రతిపక్షంలో ఉనప్పుడు మాకు క్లియర్ పిక్చర్ లేదు'' కదా అని నిస్సిగ్గుగా బదులిస్తారు.వీటన్నిటి సారాంశం ఒకటే..స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా అపలేమని చెప్పడమే. ఇక్కడే ఆయన తన తెలివితేటలన్నీ ఉపయోగిస్తుంటారు. ఇంకో అనుమానం కూడా వస్తోంది. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నదని, పది వేల మందికి ఉపాధి వస్తుందని తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి బ్యానర్ కథనాలు వండివార్చాయి. ఇందులో లోకేష్‌ను పైకెత్తడం ఒక పాయింట్ అయితే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జనంలో ఉన్న ఆందోళనను డైవర్ట్ చేయడం కూడా మరో అంశం అనిపిస్తోంది. నిజానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇన్ఫోసిస్, టీసీఎస్ మొదలైన సంస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను జగన్ స్వయంగా ఆరంభించారు. బీచ్ ఐటీ పేరుతో విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మార్చాలని జగన్ ప్రయత్నిస్తే ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతివంటివి ఎల్లో మీడియా రకరకాలుగా విమర్శిస్తూ అడ్డుకునేంత పనిచేశాయి. కానీ ఇప్పుడు ఆ సెంటర్ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఆ సెంటర్ వస్తే మంచిదే. కానీ అంతా అయిపోయినట్టు, పదివేల మందికి ఉపాధి వచ్చేసినట్టు ప్రచారం చేయడమంటే జనాన్ని మభ్యపెట్టడమే.ఇదంతా విశాఖలో స్టీలప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి మీద జనంలో ఉన్న నిరసనను తగ్గించడానికే అని అనుకోవచ్చు.ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఏమని చెప్పారో గుర్తు చేసుకుందాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దానికోసం ఎందాకైనా వెళ్లి పోరాడతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు శపథాల మీద శపథాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి కొన్ని ప్రత్యామ్నాయాలు సూచిస్తే ఇంకేముంది భూములు కాజేయడానికే అని దుష్ప్రచారం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసినా జగన్ ప్రైవేటీకరణను ఆపడం లేదని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తేనే దాన్ని నిలబెడతామని గొప్పలకు పోయారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా తామే ఫ్యాక్టరీని నిలబెట్టామని చెప్పుకున్నారు. విశాఖ ఉక్కు రక్షణకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అన్ని పార్టీల వారిని ఢిల్లీ తీసుకువెళతామని చంద్రబాబు, పవన్ లు తమ ప్రసంగాల్లో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిద్దరూ చేతులెత్తేయడం, నాలుక మడతేయడం చేస్తున్నారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుకాదు.. కాదన్నట్లు పరిస్థితి ఏర్పడుతున్నా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిమ్మకు నీరెత్తితనట్లు వ్యవహరిస్తున్నది. ఎన్నికల ముందే తాము ప్రైవేటీకరణకు అనుకూలం అని చెప్పి ఉంటే, ఇప్పుడు తప్పు పట్టజాలం. అలా కాకుండా, జనాన్ని మభ్య పెట్టడానికి అప్పుడు కబుర్లు చెప్పి, ఇప్పుడు నాలుక మడతేయడం అంటే ఆంధ్రులను అవమానించడమే. ప్రధాని నరేంద్ర మోదీ తన జేబులో ఉన్నట్టు మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. కొద్ది రోజులక్రితం తెలుగుదేశం మీడియా ఈనాడులో విశాఖ స్టీల్‌ను విలీనం చేసుకోవడానికి సెయిల్ అంగీకరించింది అంటూ ఒక పెద్ద కథనాన్ని ఇచ్చారు. అంటే అప్పుడు కార్మికులను మభ్యపెట్టడం కోసం రాశారన్నమాట. అసలు వాస్తవం ఏంటంటే సెయిల్ లో విలీనం అంత తేలిక కాదు అని చంద్రబాబే చెబుతున్నారు. జనసేన నేతలైతే కార్మిక సంఘాల వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే పరిస్థితి వచ్చిందని ఎదురు దాడి కూడా చేస్తున్నారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అంశంపై నంగినంగిగా మాట్లాడినప్పుడు ఎవరికైనా అనుమానం వచ్చింది. స్టీల్ ప్లాంట్ ను కేంద్రం విక్రయించడానికి సిద్ధమైందని, దానికి ఆయన ఓకే చేశారనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అఖిలపక్షం వేస్తే ప్రయోజనం ఏముంటుంది? రాజకీయ విమర్శలు తప్ప అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు క్లియర్ పికచ్చర్ లేదని బుకాయిస్తున్నారు. తానే విశాఖ స్టీల్ ను కాపాడానని ప్రచారం చేసుకుంటూ ఇంకో వైపు క్లియర్ పిక్చర్ లేదని చంద్రబాబు చెబుతుండడం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును, ఆయనే ప్రైవేట్ వారికి అమ్మేస్తున్నట్టుగా అనుకోవాలన్న మాట.పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబకు స్టీల్ ప్లాంట్ గురించి తెలియదంటే ఆయన విజన్ ఏమైనట్టు? ఆయన చేసిన వాగ్ధానాలు ఏమైనట్టు? ఎన్నికలకు ముందు కార్మికుల ఆందోళనలో భాగస్వామ్యమై వారిని నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇప్పుడు నట్టేట ముంచుతున్నారని అనుకోవాలి. కేంద్రంలోను, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీరు పూర్తిగా యూటర్న్ తీసుకోవడమంటే విశాఖ ప్రజలనే కాకుండా ఆంధ్ర ప్రజలందరినీ పచ్చిగా మోసం చేసినట్టు అవుతుంది కదా.విశాఖ ఉక్కు ప్లాంట్ కోసం వేలాది మంది రైతులు తమ భూములను ఇచ్చారు. స్లీల్ ప్లాంట్ వచ్చాక విశాఖలో పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. అది ప్రభుత్వపరంగా ఉండడంతో ఉద్యోగులకు ప్రయోజనాలు చేకూరాయి. ఆ ప్లాంట్‌కు ఇప్పటికైనా ఐరన్ ఓర్ గనిని కేటాయించి, ఒక ప్యాకేజీ ఇస్తే అది నిలబడుతుందని, కానీ కావాలనే ఈ ప్లాంట్‌ను నష్టాల పాలు చేస్తున్నారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వివిధ హామీల విషయంలో జనాన్ని మాయ చేసినట్లుగానే, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మరోసారి మాట తప్పుతున్నారు. తద్వారా రాష్ట్రానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమే తీరని ద్రోహం చేస్తోందన్న అభిప్రాయానికి అవకాశం ఇస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వలస నేతల బాధ.. టీడీపీ వేధింపులొక్కటే!
రాజకీయాల్లో మనగలగాలంటే.. ధైర్యంతోపాటు పోరాటపటిమ, వేధింపులను సైతం భరించాల్సిన ఓరిమి అవసరం. ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు? అంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులని చెప్పాలి. ఏదో ఒకలా గద్దెనెక్కిన టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి నేతలు.. ఒకపక్క ప్రభుత్వం వైపు నుంచి, ఇంకోవైపు పోలీసుల ద్వారా వైఎస్సార్సీపీ నేతలు, మద్దతుదారులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. తద్వారా పార్టీని వీలైనంత మేర బలహీనం చేయాలన్నది వారి ఉద్దేశంలా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు తమ ‘రెడ్ బుక్’ ద్వారా ఈ కుట్రకు తెరలేపారు. చంద్రబాబు కంటే.. లోకేశే ఈ విషయంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, కొంతమంది విశ్రాంత పోలీసు ఉన్నతాధికారుల సలహా సూచనల మేరకు దాడులు, వేధింపులు, తప్పుడు కేసులు, సస్పెన్షన్ల వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చాలామంది అంచనా. ఈ పరిణామాలతో బాగా ఇబ్బంది పడ్డ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలేలు, రాజ్యసభ ఎంపీలు, జెడ్ పీ ఛైర్పర్సన్లు, మేయర్లు, కార్పొరేటర్లే చేతులెత్తేసి పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వీర విధేయులుగా ఉన్నవారు, టీడీపీ అంటే అసలు గిట్టనివారు కూడా వెళుతూండట వేధింపులను బలపరిచేవిగా కనిపిస్తున్నాయి. విశేషమేమిటంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న గ్యారంటీ ఏదీ లేకపోయినా వీరిలో కొందరు జనసేనలో చేరడం. దీనిపై కూటమిలో కొన్ని అసంతృప్తులున్నా ప్రస్తుతానికి బయట పడకుండా ఉంటున్నారు.. కొన్ని చోట్ల తప్ప. రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇదంతా చంద్రబాబు కొనుగోళ్ల రాజకీయమేనని వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైఎస్సార్ సీపీని వీడి జనసేనలో చేరారు.ముందుగా ఎంపీల విషయాన్ని పరిశీలిస్తే మోపిదేవి వెంకటరమణ మొదట కాంగ్రెస్ లోను, ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో వైఎస్ జగన్ వెంట నడిచారు. జగన్ ను కేసుల్లో ఇరికించడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి ఆడిన కుట్రలో మోపిదేవి కూడా బలయ్యారు. జైలులో ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయన జగన్ పార్టీలో కొనసాగి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా కూడా గౌరవం పొందారు. 2019లో ఆయన ఓటమి పాలైనా జగన్ ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత కౌన్సిల్ రద్దవుతుందన్న భావనతో ఆయన్ను రాజ్యసభకు పంపారు. వైఎస్సార్సీపీలో అంత గౌరవ మర్యాదలు పొందిన మోపిదేవి టీడీపీలో చేరతారని ఎవ్వరూ ఊహించరు. జగన్ కేసుల్లో ఉన్న మోపిదేవితో సహా అందర్ని తీవ్రంగా విమర్శిస్తుండే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన్ను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం జగన్ రేపల్లె పార్టీ సమావేశంలో మోపిదేవి అంశం ప్రస్తావనకు తెస్తూ, ఆయనకు ఎంత గౌరవం ఇచ్చింది వివరించారు. మోపిదేవిని ఒక్క మాట అనకుండా, రాజకీయ విమర్శ చేయకుండా జగన్ తన సంస్కారాన్ని ప్రదర్శించారు.బీద మస్తాన్ రావు తెలుగుదేశం నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. అనతికాలంలోనే ఎంపీ అయ్యారు. వ్యాపారవేత్త అయిన ఈయన విశ్వాసంతో సంబంధం లేకుండా తిరిగి టీడీపీలోకి వెళుతున్నారు. బీసీ నేతగా పేరొందిన తెలంగాణ నేత ఆర్. కృష్ణయ్యను జగన్ అనూహ్య రీతిలో రాజ్యసభ సభ్యుడిని చేస్తే ఇప్పుడు అధికారం పోగానే ఆయన జారుకున్నారు. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది మరొక కథ. వైఎస్సార్ సీపీలో ఉండగా ప్రకాశం జిల్లాలో ఆయన చక్రం తిప్పారు. అప్పుడప్పుడు అలిగినా పార్టీ అధిష్టానం బుజ్జగిస్తుండేది. ఆయన తెలుగుదేశానికి చెందిన ఒక మీడియా వారితో సన్నిహిత సంబంధాలు నెరపినా పార్టీ నాయకత్వం తప్పు పట్టలేదు. మరో సీనియర్ నేత, బాలినేని సమీప బంధవు వైవీ సుబ్బారెడ్డితో వర్గ గొడవ ఉన్నా పార్టీ నాయకత్వం భరించింది. సుబ్బారెడ్డి ద్వారా జగన్ కు కూడా ఈయన బంధువు అవుతారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు ఈయన తన పదవులకు రాజీనామా చేసి ఆయన వెంట నడిచారు. కమిటెడ్ నేతగానే చాలా కాలం ఉన్నారు. దానికి తగ్గ గుర్తింపు కూడా పొందారు. కానీ ఆసక్తికరంగా ఆయన ఇప్పుడు జనసేనలో చేరారు. దానికి కారణం ఒక్కటే. టీడీపీ వారి దాడులు, వేధింపులు, కేసుల భయం. వాటి నుంచి తప్పించుకోవడానికి ఇదొక్కటే మార్గమని అనుకొని ఉన్నట్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఈయన కుమారుడు, కోడలిని కూడా టీడీపీ వారు ఇబ్బంది పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్ధన్ పలుమార్లు ఈయనతో గొడవ పడ్డారు. బాలినేని జనసేనలో చేరడాన్ని కూడా ఆయన ఒప్పుకోలేదు. బాలినేనిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఆయన సంగతి చూస్తామని దామచర్ల హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ తాకిడిని తట్టుకోవడానికి గతంలో తనకు పవన్ కల్యాణ్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలను ఉపయోగించుకొని జనసేనలో చేరారని అనుకోవాలి.జగ్గయ్యపేటకు చెందిన సామినేని ఉదయభాను కడా జగన్ ను ఫాలో అయి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన వారే. ఇన్నేళ్లు పోరాటాలు చేసినవారే. కారణం ఏమైనా టీడీపీ వేధింపులు తట్టుకోవాలంటే జనసేనలో చేరడమే బెటర్ అనుకొని ఆ పార్టీలో చేరారు. మరో నాయకుడు కిలారి రోశయ్యకు వ్యాపారవేత్త. సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడవుతారు. 2019లో పొన్నూరు టికెట్ మీద ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్సార్ సీపీ తరపున అనేక డిబేట్లలో పాల్గొనేవారు. గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. గుంటూరు జిల్లాలో స్థానిక రాజకీయాలు, దాడులు, వేధింపులను దృష్టిలో పెట్టుకొని జనసేన అయితే టీడీపీ వారుగానీ, పోలీసులు గానీ తమపైకి రారనే అభిప్రాయంతో పార్టీ మారినట్టుగా కనపడుతోంది.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. అదే కూటమి పార్టీల్లో చేరితే ఆ తలనొప్పి ఉండదు. నేరగా టీడీపీలో చేరలేని వారు కొంతమంది ఈ రకంగా జనసేనను ఆశ్రయిస్తున్నారని అనుకోవచ్చు. టీడీపీలోకి వెళ్లిన హిందుపూర్ కౌన్సిలర్లు తిరిగి వైసీపీలోకి రావడం కూడా గమనించదగ్గ పరిణామమే. బాలినేని, సామినేని, కిలారి ఈ ముగ్గురిలో ఎవరికీ వచ్చే ఎన్నికల్లో జనసేన టికెట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సంగతి తెలిసినా వీరు జనసేనలో చేరడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చు.వైఎస్సార్ సీపీ అధినేత జగన్ కు ఇలాంటి పరిణామాలు కొత్త కావు. నిజానికి ఆయన ఒంటరిగానే తన పోరాటాన్ని ఆరంభించారు. అప్పట్లో ఆయనపట్ల జనంలో ఉన్న ఆదరణను గమనించి గానీ, వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో గానీ సుమారు 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనతోపాటు నడిచారు. 2014 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా జగన్ ఎక్కడా నిరుత్సాహపడలేదు. చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా నిర్భయంగా జనంలోకి వెళ్లి తన ఎజెండాను తెలియజేసి 2019లో అధికారంలోకి వచ్చారు. టీడీపీని బలహీన పరచడానికి, ఆ పార్టీ నేతలను వేధించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నించ లేదు. వివిధ హామీలను, స్కీములను అమలు చేసి ప్రజాదరణ చూరగొన్నారు. అయినా ఈవీఎంల మాయాజాలంతో కూటమి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో కూటమి అలవికాని హామీలిచ్చి జనాల్ని మోసం చేసింది. ప్రస్తుతం వంద రోజులకే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ఆ పరిస్థితిని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు మత రాజకీయాలు, ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్సార్ సీపీ వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. అయినా జగన్ వీటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు కూడా తనను వీడేవారిని ఒక్కరిని కూడా ఒక్క మాట అనకుండా తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. అదే ఆయనలోని విశేష లక్షణం. అందువల్ల ఇప్పుడు పార్టీనుంచి కొంతమంది వైదొలగినా వైఎస్సార్ సీపీకి నష్టం పెద్దగా ఉండదు. ఎందుకంటే జగన్ జనాన్ని నమ్ముకోవడమే కారణం.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పగ ప్రతీకారాల ‘రెడ్ బుక్’ బదులుగా ప్రేమ, ఆప్యాయతల ‘గుడ్ బుక్’
రాజకీయాలకు.. నినాదాలకు అవినాభావ సంబంధం ఉంది. సందర్భాన్నిబట్టి రాజకీయ నేతలు చేసే నినాదాల్లో కొన్ని హిట్ కొట్టవచ్చు.. కొన్ని ఫట్ కూడా కావచ్చు. కానీ.. ఒక్కోసారి ఒక్క నినాదంతోనే క్లిష్టమైన ఎన్నికల గండం గట్టెక్కనూ వచ్చు. 1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన ‘గరీబీ హఠావో’ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దేశం మొత్తం పెను సంచలనం సృష్టించిందీ నినాదం. కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం తెచ్చిపెట్టింది కూడా. 1999లో బీజేపీ నేత, అప్పటి ప్రధాని ఏబీ వాజ్‌పేయి ‘ఇస్ బార్.. అటల్ బిహారీ వాజ్‌పేయి’ అన్న నినాదమూ బాగానే పనిచేసింది. ఒకే ఒక్క ఓటుతో వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోవడంతో ప్రజల్లో ఏర్పడ్డ సానుభూతి, కార్గిల్ యుద్ధం వంటివి కూడా అప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడ్డాయి. కానీ.. 2004లో ‘ఇండియా షైనింగ్’ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి అంత సానుకూల ఫలితాలు దక్కలేదన్నది తెలిసిన విషయమే.ఉమ్మడి ఆంధప్రదేశ్ విషయానికి వస్తే.. 1983లో ఎన్నికలకు ముందు ఎన్టీ రామారావు ఇచ్చిన ‘తెలుగు ఆత్మగౌరవం’ నినాదం బాగా పనిచేసింది. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చింది. 2019లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇచ్చిన 'ఒక్క చాన్స్" పిలుపు కూడా బాగా పనిచేసింది. చంద్రబాబు పాలనతో అప్పటికే విసుగెత్తిన ప్రజలు జగన్‌కు సై అన్నారు. నినాదాల శక్తి గురించి ఇంకా పలు ఉదాహరణలు ఇవ్వొచ్చు. తాజాగా జగన్ ఇంకో కొత్త కాన్సెప్ట్‌ను ప్రజల్లోకి తీసుకొచ్చారు. అది.. ‘గుడ్‌బుక్’!ప్రస్తుతం ఆంధప్రదేశ్ ప్రజలను ప్రజలను తీవ్రంగా భయపెడుతున్న తెలుగుదేశం ప్రభుత్వ ‘రెడ్ బుక్’కు ఇది ప్రత్యామ్నాయమన్నమాట. సహజంగానే ఇది జనాన్ని ఆకట్టుకుంటుంది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి లోకేశ్‌కు ఎవరు ఐడియా ఇచ్చారో కానీ.. ప్రతిపక్షంలో ఉండగా.. రెడ్‌బుక్ అంటూ ఒక పుస్తకాన్ని చేతపట్టుకుని ప్రభుత్వ అధికారులను ,ప్రత్యేకించి పోలీసులను బెదిరించేవారు. వైసీపీ నేతలకూ హెచ్చరికలు చేసేవారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న, వ్యాఖ్యానిస్తున్న అధికారులు, నేతల పేర్లు ఈ ‘రెడ్ బుక్’లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చాక వారందరి సంగతీ చూస్తామని బెదిరించేవారు. స్కామ్‌లలో చికుక్కున్న టీడీపీ అగ్రనేతల కేసులు విచారణకు వచ్చిన సందర్భంలోనూ లోకేశ్ రెడ్‌బుక్ పేరుతో బెదిరించడంతో అధికారులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఆ కేసు ఏమైందో తెలియదు. వీరిని మినహాయిస్తే మిగిలిన వాళ్లు ఈ రెడ్‌బుక్‌ను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. లోకేశ్.. ఏదో అనుభవరాహిత్యంతో చేస్తున్న పనే అని సర్దుకున్నారు. పైగా టీడీపీ అధికారంలోకి వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు.అయితే 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. ఈవీఎంల మహిమే ఇది అన్నది చాలామంది నమ్మకం. అది వేరే సంగతి. అధికారం వచ్చాక టీడీపీ వారు రెడ్ బుక్‌ను అమలు చేయాలని నిర్ణయించుకుని చెలరేగిపోవడం మొదలైంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల కంటే ఈ రెడ్ బుక్‌పైనే వాళ్లు ఎక్కువ దృష్టి పెట్టినట్లు స్పష్టమైంది. లోకేష్ రెడ్ బుక్ అంటూ రాష్ట్రంలో ఆయా చోట్ల హోర్డింగ్ లు కూడా వెలిశాయి. ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. అలాగే బాధ్యతలివ్వకుండా సుమారు పాతిక మంది ఐపీఎస్, ఐఎఎస్ అధికారులను వేధిస్తున్నారు. పలు నియోజకవర్గాలలో తమకూ రెడ్ బుక్ లు ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్థానిక అధికారులను, తమకు ఓటు వేయని ప్రజలను భయ పెట్టడమూ మొదలైంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన బుక్ లో వంద మంది పేర్లు ఉన్నాయని ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ. పల్నాడు, తదితర అనేక ప్రాంతాలలో టీడీపీ వారి దౌర్జన్యాలకు అంతు లేకుండా పోయింది. అలాగే వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. టీడీపీ వారు పోలీసుల సమక్షంలో దౌర్జన్యాలకు పాల్పడుతున్నా, ఇళ్లను ధ్వంసం చేస్తున్నా వారించే నాథుడు లేకుండా పోయాడు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం మహిమేనని జనానికి అర్థమైంది.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం పార్టీలకు అతీతంగా వివిధ స్కీములు అమలు చేసింది. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వరద సహాయ చర్యల్లోనూ బాధితులు తమ మద్దతుదారులా? వైసీపీ మద్దతుదారులా? అన్నది ఆరా తీసి మరీ తమ వారైతేనే సాయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో వైసీపీ కార్యకర్తలలో ఆత్మ విశ్వాసం నింపేందుకు, ప్రజలకు అండగా ఉండేందుకు , అలాగే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నవారికి ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు జగన్ వ్యూహాత్మకంగా గుడ్ బుక్ కాన్సెప్ట్ తీసుకువచ్చారు.రెడ్ బుక్ వర్సెస్ గుడ్ బుక్ అన్న పోటీ వస్తే సహజంగానే ఎవరైనా గుడ్ బుక్‌నే కోరుకుంటారు. రెడ్ బుక్‌లోని కక్షలు, కార్పణ్యాలు, పగ, ప్రతీకారం, అకృత్యాలు వంటివాటిని సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలు చేయలేక, రెడ్ బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి అంటే ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. వారు తమకు గత్యంతరం ఏమిటా అని ఆలోచిస్తున్న తరుణంలో గుడ్ బుక్ తెస్తామని జగన్ ప్రకటించడంతో ప్రజలలో ఆశలు చిగురించే అవకాశం ఉంది. దీంతో టీడీపీ ప్రభుత్వం అరాచకాలు కాస్త తగ్గే అవకాశం ఉండవచ్చు. పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ జగన్ రెడ్ బుక్ అన్నది పెద్ద విషయం కాదని, దానివల్ల కక్షలే తప్ప ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.తన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మంచి చేయడానికి ప్రయత్నిస్తే, టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రెడ్ బుక్ పాలన సాగిస్తోందని విమర్శించారు. ఇది నిజమే అని ఒప్పుకోవాలి.జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక స్కీములతో రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలు ప్రయోజనం పొందారు. అమ్మ ఒడి, ఆసరా, కాపు నేస్తం, చేనేత నేస్తం, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ.. ఇలా సుమారు 35 స్కీములను ఆయన వలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే పంపించారు.అర్హత ఉండి ఎవరికైనా ఏదైనా స్కీమ్ అందకపోతే,మానవత్వంతో అందచేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అవన్నీ ఆగిపోయాయి. ఇళ్ల వద్దకు సేవలు నిలిచిపోయాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేసిన వాగ్దానాలన్ని గాలికి పోయాయి. ప్రతిదానికి ఏదో సాకు వెదుకుతున్నారు.డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారు. వీటన్నిటిని గుర్తు చేస్తూ జగన్ తాను గుడ్ బుక్ తీసుకు వస్తానని అన్నారు. ఈ పుస్తకంలో మంచిచేసే అధికారుల పేర్లు రాస్తామని, అలాగే పార్టీ కోసం పని చేసేవారి పేర్లు నమోదు చేసుకుంటామని ఆయన చెప్పారు. అంటే టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌లది నెగిటివ్ ఆలోచనైతే, వైసీపీ జగన్‌లది పాజిటివ్ ధోరణి అన్నమాట. రెడ్ బుక్ వల్ల టీడీపీకి టీడీపీ ఇప్పటికే అప్రతిష్ట పాలైంది. జగన్ గుడ్ బుక్ గురించి ప్రకటించగానే సమావేశంలో ఉన్నవారంతా హర్షద్వానాలు చేశారు.అంటే వైసీపీ వారినే కాకుండా, ప్రజలందరికి ఈ గుడ్ బుక్ ఉపయోగపడుతుందని వారు భావించారన్నమాట. దీనిపై జనంలో సానుకూల స్పందన వస్తోంది. గుడ్ బుక్ కాన్సెప్ట్‌ను నిలబెట్టుకుంటూ జగన్ ప్రజలలోకి వెళితే రాజకీయంగా కూడా ఉపయోగం ఉండవచ్చు. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘టీడీపీ అభిమానులు కూడా ఛీ అంటున్నారు’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ఈ విషయం ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ చెప్పాల్సిన అవసరమూ లేదు. అధికార తెలుగుదేశం పార్టీ వారే నిర్మొహమాటంగా ప్రకటిస్తున్నారు. కొంతమంది టీడీపీ నేతలు ప్రస్తుత పరిణామాల గురించి లోలోపల మథనపడుతూంటే కొందరు మాత్రం బహిరంగంగా తమ అసంతృప్తిని, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వీరాభిమాని, సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఓ వ్యక్తి పెట్టిన పోస్టు చూసిన ఇతరులు వాస్తవాలు మాట్లాడారని కొనియాడుతున్నారు. ఆ టీడీపీ వీరాభిమాని పేరు ప్రస్తావించడం సబబు కాదు కానీ... ఆయన అన్నమాటలు మాత్రం పరిశీలించదగ్గవి. ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన 5200 రోజులలో వరస్ట్ వంద రోజుల పరిపాలన (చెత్త పాలన), గత మూడున్నర నెలలలో చూశాం’’ అని కుండబద్దలు కొట్టారు. జపాన్‌కు చెందిన మాకీ అనే సంస్థ 2014-2019 టర్మ్‌లో ఏపీలో చెత్తపాలన సాగుతోందని ఏకంగా కేంద్రానికే ఫిర్యాదు చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలిక్కడ. అప్పట్లో ఈ మాకీ సంస్థే అమరావతికి డిజైన్లు ఇచ్చింది. తరువాతి కాలంలో టీడీపీ ప్రభుత్వంతో వేగలేక వెనకు వెళ్లిపోయారు. ఆ టర్మ్‌లో పాలన చెత్తగా తయారైంది అనేందుకు మూడేళ్ల సమయం పడితే.. ఈ సారి మూడున్నర నెలల్లోనే టీడీపీ అభిమాని స్వయంగా చెత్తపాలన అని కామెంట్ చేసే స్థాయికి పాలన దిగజారిందన్నమాట. వీరి మాట ఇలా ఉంటే... నిత్యం టీడీపీకి భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కూడా ఒకపక్క బాబును కొంత పొగుడుతూనే ఇంకోవపక్క వాస్తవ పరిస్థితుల గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.ముందుగా టీడీపీ వీరాభిమానుల ఫీలింగ్ ఏమిటో చూద్దాం. ‘‘మీరు చేస్తున్న తప్పులను కవర్ చేయలేకపోతున్నాం.. అడ్మినిస్ట్రేషన్‌లో తోపు, తురుము అని ఇప్పటిదాకా మీకు బిల్డప్ ఇచ్చాం..మీరు అడ్మినిస్ట్రేషన్‌లో ఫెయిల్ అవుతున్నారు" అని వారు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబుకు బిల్డప్ ఇచ్చామని నిజాయితీగా ఒప్పుకున్నారనుకోవాలి. అంటే అసలు సరుకు ఏమిటో ఇప్పుడు అర్థం అవుతున్నదనేగా అర్థం? బాబు చెత్త పాలనకు ఉదాహరణగా ఆ టీడీపీ వీరాభిమాని ఇసుక సమస్యను ప్రస్తావించారు. ‘‘జగన్ టైమ్ లోనే ఇసుక చౌకగా దొరికిందన్నది పబ్లిక్ టాక్ అని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చెబుతున్నారు. ఒక సంవత్సరంపాటు టీడీపీ నేతలకు ఇసుక మీద దోచుకోండని లైసెన్స్ ఇచ్చారా’’ అని ఆయన ప్రశ్నించారు. ఏదో తప్పు జరుగుతోందని అంటూ, దీనిపై చంద్రబాబు, లోకేష్ లు కూర్చుని సమీక్షించుకోవాలని సలహా కూడా ఇచ్చారు. కానీ ఈ సలహాను వినే పరిస్థితి ఇప్పుడుందా? సందేహమే! పైగా ఈ వ్యాఖ్య చేసిన టీడీపీ వీరాభిమాని సంగతి చూడాలని ఆదేశాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు నడుస్తున్నది దేశ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరిపైన అయినా కేసులు పెట్టవచ్చు. ఎవరినైనా వేధించవచ్చు. తమ వారిపై ఎలాంటి కేసులు ఉన్నా ఎత్తి వేసుకోవచ్చు. చివరికి ఐపిఎస్ లను కూడా తమ ఇష్టం వచ్చినట్లు సస్పెండ్ చేయవచ్చు.టీడీపీ అభిమానులు, కార్యకర్తలలో ఉన్న ఈ భావాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా కొంతైనా కవర్ చేయక తప్పడం లేదు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు అంతు ఉండడం లేదు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. టీడీపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఇసుక.మద్యం దందాలలో ఎమ్మెల్యే భాగస్వామి అవుతున్నారని వారు చెబుతున్నారు.ఆ విషయాన్ని ధృవీకరిస్తూ ఎల్లో మీడియా కూడా కథనాలు రాయక తప్పడం లేదు. ఈనాడులో మద్యం దందాపై ఒక కథనం వచ్చింది. దాని ప్రకారం అన్ని జిల్లాలలో పలువురు ఎమ్మెల్యేలు మద్యం టెండర్లు వేరే వారు వేయనివ్వకుండా అడ్డుపడుతున్నారట. దాంతో మద్యం షాపుల టెండర్లకు అప్లికేషన్ లు కేవలం ఎనిమిదివేల పైచిలుకు మాత్రమే వచ్చాయి. ఏపీలో 3400 షాపులు ఉంటే, తెలంగాణలో 2600 షాపులకే లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎమ్మెల్యేల అక్రమాలపై ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది. ఈ మీడియా లక్ష్యం చంద్రబాబుకు చెడ్డపేరు రాకుండా ఎమ్మెల్యేలపై నెపం నెట్టేసి విషయాన్ని దారి మళ్లించాలని కూడా కావచ్చు. ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా బ్లాక్ మెయిలింగ్ లో భాగంగా కూడా రాస్తుండవచ్చు. సాక్షి మీడియాలో చంద్రబాబు ప్రభుత్వంలోని అకృత్యాలు, స్కామ్ లపై ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అవేమీ లేవని దబాయిస్తుంటారు. కానీ ఇప్పుడు వారి పత్రికలలో ఆ తరహా కథనాలు వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు అందరిని కలవర పరుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఒక మైనర్ బాలికపై రేప్ జరిగితే అది జాతీయ పత్రికలలో ప్రధాన కథనం అయింది. ఏపీలో అలాంటివి పది జరిగినా, ప్రజలందరికి తెలియకుండా కప్పి పెడుతూ మేనేజ్ చేస్తున్నారు. మరో వైపు కూటమి చేసిన వాగ్దానాలు ఒకటి,అరా తప్ప మిగిలిన వాటిని నెరవేర్చడం లేదు. దానిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడంలో పెద్ద స్కామ్ లు జరిగినట్లు సీపీఎం నేత బాబూరావు వెల్లడించారు. కేవలం అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకే రూ. 23 కోట్ల వ్యయం అయినట్లు లెక్కలు రాశారట. పది రోజులు జనం సరిగా భోజనం అందక నానాపాట్లు పడితే ప్లేట్ ఒక్కటికి రూ.264 వెచ్చించినట్లు ప్రభుత్వం లెక్కలు రాసిందట. ఇలా ఒకటి కాదు..అన్ని రంగాలలోను చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందడం, జరుగుతున్న స్కామ్ లతో టిడిపి కార్యకర్తలు, అభిమానులలో తీవ్ర నిర్వేదం కలిగిస్తోంది. అసలు చంద్రబాబు పాలన ఏమీ లేదని, ఆయన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని, మొత్తం నిర్ణయాలన్ని లోకేషే ,ఆయన సన్నిహితులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇవన్ని చూశాక ఒక విషయం అర్థం అవుతుంది. అదేమిటంటే మాజీ సీఎం జగన్ చెబుతున్నవి పచ్చి నిజాలూ అని. కొద్ది రోజుల క్రితం జగన్ ఒక వ్యాఖ్య చేశారు. 'కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు.ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, అమ్మ ఒడి, రైతు భరోసా, స్కూళ్లు, ఆస్పత్రులు అభివృద్ది అన్నీ పోయాయి. మూడున్నర నెల్లో లక్షన్నర పించన్లు తగ్గించారు.నాణ్యమైన చదువులు లేవు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందడం లేదు. ఆర్‌బికెలలో సేవలు లేవు.ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ లేదు.అన్ని విషయాలలో ఈ ప్రభుత్వం విఫలం అయింది.చంద్రబాబు అబద్దాలు, మోసాల పట్ల ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోంంది.ప్రజల కోపాగ్నిలో కూటమి ప్రభుత్వం దహించుకుపోవడం ఖాయం" అని అభిప్రాయపడ్డారు. బహుశా ఈ డెబ్బై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ప్రస్తుతం అరాచక, అధ్వాన్న పాలన సాగుతున్నదన్నది వాస్తవం. దానిని టీడీపీ అభిమానులే సోషల్ మీడియాలో అంగీకరిస్తున్నారు. ఏపీ ప్రజలకు ఈ పరిస్థితి నుంచి ఎప్పటికి విముక్తి కలుగుతుందో!- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ తన్ను తాను మోసం చేసుకుంటున్నారా!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వింత, విచిత్ర ధోరణి అంతుపట్టకుండా పోతోంది. మాటలు మార్చే విషయంలో ఘనాపాఠిగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడినే మించిపోయేలా ఉన్నాయి వపన్ చర్యలు. ఈ క్రమంలోనే ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూ.. తనను తాను మోసగించుకుంటున్నారా? లేక పార్టీ కార్యకర్తలు లేదా ప్రజలందరినీ మూర్ఖులను చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు. ఈ ప్రస్తావనంతా ఎందుకిప్పుడు అంటే...తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం, ఆ వెంటనే పవన్ రంగంలో దిగి దీక్ష డ్రామాకు తెర తీయడం మనం చూశాం. అయితే ఈలోపుగానే.. లడ్డూ తయారీలో జంతువు కొవ్వు కలిసిన నెయ్యి వాడారు అనేందుకు ఆధారాల్లేనట్లు అందరికీ తెలిసిపోయింది. ఈ పరిణామంతో చంద్రబాబైనా కొంత తగ్గాడేమో కానీ.. పవన్ మాత్రం మరింత రెచ్చిపోయాడు. తానే అసలు సిసలైన హిందువు అని జనాన్ని నమ్మించేందుకు ముందు తిరుమల యాత్ర అని ఆ తరువాత వారాహి డిక్లరేషన్ అని నానా డ్రామాలూ ఆడేశారు. ఆయా సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా రంకెలేసినట్లుగా అరుపులతోనే సాగాయి. మత విద్వేషాన్ని ఎగదోయడమే లక్ష్యమన్నట్టుగా పవన్ మాట్లాడారని ప్రజలు చాలా మంది అభిప్రాయపడ్డారు.సనాతన ధర్మమంటూ మాట్లాడి, అదేమిటో చెప్పకుండా, హిందూ మతాన్ని తానే ఉద్దరిస్తున్నట్లు ఫోజు పెట్టారు. తిరుమలేశుని భక్తుణ్ణి అని చెప్పుకుంటూనే ఆయనకు అపచారం జరిగేలా లడ్డూ పై ప్రజలలో విశ్వాసం పోయేలా మళ్లీ మాట్లాడారు.అధికారంలో ఉన్నప్పుడు మన మాటలు, చేష్టలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఎన్నికల ముందు ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది కదా అని, ఇప్పుడు కూడా అదే ధోరణిలో వెళితే జనానికే కాదు.. జనసేన కార్యకర్తలకు సైతం విసుగొచ్చే ప్రమాదముంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలోనే లడ్డూ కల్తీ ప్రస్తావనను టీటీడీ తీసుకురాకపోతే.. ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్న పవన్ లేనిపోని ఆరోపణలను వల్లెవేయడంలో ఆంతర్యమేమిటో ఆయనకే తెలియాలి.ఎర్ర కండువా నుంచి కాషాయానికి మారడం తప్పు కాదు కానీ తాను గతంలో ఏం మాట్లాడింది? ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటి? అన్నది కూడా ఆలోచించుకుని ఉండాల్సింది. ఆ విజ్ఞతతో ప్రసంగించాలి. అంతే తప్ప సనాతన ధర్మ పరిరక్షకుడిని తానే అన్నట్టుగా మాట్లాడినా, పోజు పెట్టినా ప్రజల్ని తక్కువ అంచనా వేయడమే అవుతుంది.2014లో అసలు జనసేన సిద్దాంతాలుగా ఆయన ప్రకటించిందేమిటి? చెప్పిన ఏడు పాయింట్లలో మొదటిది కులాలను కలిపే ఆలోచనా విధానం అనే కదా ఉంది? ఆ తరువాత కులాల గురించి మాటలు ఎన్ని మార్చారో అందరికి తెలుసు. ఎన్నికల సందర్భంగా ఆయన చివరకు తన కులపు వాళ్లయినా తనకు మద్దతివ్వాలని అడిగిన వైనం ప్రజల మనసుల్లో తాజాగానే ఉంది. జనసేన పార్టీ సిద్ధాంతాలుగా పవన్ ప్రకటించిన వాటిల్లో రెండోది మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈ సిద్ధాంతం కూడా ఇప్పుడు అధికారం వచ్చాక మారిపోయింది. తాను హిందూమతం కోసం పాటు పడతానని, సనాతన ధర్మం కోసం పని చేస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వీటినిబట్టే కులం, మతం విషయాలలో పవన్ వైఖరి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతుంది. ఆయన నిజంగా స్వామి అవతారం ఎత్తదలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీ రాజకీయాలను వదలిపెట్టి అలాగే చేసుకోవచ్చు. అలా కాకుండా వేషం మాత్రం మార్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే దొంగ బాబాగా మిగిలిపోతారు.పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటల్ని ఒకసారి గుర్తుకు చేసుకుందాం.... ఒకసారి తాను బాప్టిజం తీసుకున్నానని, ఇంకోసారి తన భార్య, కుమార్తె క్రైస్తవులని ఒకసారి చెప్పుకొచ్చారు ఆయన. పరస్పర విరుద్ధమైన ప్రకటనలకు కొదవేలేదు. వీడియోలు అనేకం కనిపిస్తున్నాయి. సనాతన దర్మంలో తండ్రి మతం కాకుండా తల్లి మతం కుమార్తెకు ఎలా వస్తుందన్న ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వగలరా? ఏదో పబ్లిసిటీ కోసం తన కుమార్తెతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి తన పరువు తాను తీసుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్లితే సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు చెబుతున్న ఈయన చేసిన నిర్వాకాలేమిటో అందరికీ తెలుసు.అయినా ఎలాంటి భేషజం లేకుండా పవన్ కళ్యాణ్ ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే, ఆయన మోసపూరిత రాజకీయం చేస్తున్నారని తెలిసిపోతుంది. రాజకీయంగా మాటలు మార్చితే ఒక పద్దతి.అలా కాకుండా మతాల మధ్య చిచ్చుపెట్టేలా అధికారంలో ఉన్న పెద్ద మనిషి వ్యవహరిస్తే అది సమాజానికి ప్రమాదం అవుతుంది. సనాతన ధర్మం అంటే తోచిన అబద్దం చెప్పడమా? తిరుపతి సభలో ఆయన మాట్లాడుతూ సనాతన దర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా తుడిచిపెట్టుకు పోతారని హెచ్చరించారు. సనాతన ధర్మం ప్రకారం విడాకుల ప్రసక్తి ఉండదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు చెబుతున్నారు.మరి పవన్ ఏమి చేశారు. రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. రెండుసార్లు హిందూ స్త్రీలకు విడాకులు ఇచ్చి మూడోసారి క్రైస్తవ మహిళను వివాహమాడారు. అంటే హిందూ ధర్మంపై దాడి చేసింది పవనే అవుతారు కదా! చట్టం ప్రకారం ఆయన చేసింది తప్పు కాకపోవచ్చు.కానీ ఆయన చెబుతున్న సనాతనం ప్రకారం అయితే అది నేరం కాదా?ఇందులో ఇతర అంశాల జోలికి వెళితే బాగుండదు. అవన్ని కూడా సనాతన ధర్మానికే కాదు..హిందూ మత విధానాలకే వ్యతిరేకంగా చేశారు. ఆయన ఇప్పుడు వచ్చి ఈ ధర్మం గురించి బోధిస్తుంటే ఏళ్ల తరబడి హైందవ ధర్మం కోసం పనిచేస్తున్న స్వామీజిలు బిత్తరపోతున్నారు.తాము ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్నదానిపై పవన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారట. ఎన్నికల ముందు ఆలోచించకుండా ఇష్టారీతిలో అబద్దపు వాగ్దానాలు చేయడం సనాతన ధర్మంలో ఉందా? హిందూ మతంలో ఉందా? కలియుగ దైవానికి అపచారం చేస్తే ఎందుకు ఊరుకుంటాం అని పవన్ ప్రశ్నించారు. అపచారం చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే కదా? జంతు కొవ్వు కలిసిన నేతిని లడ్డూ తయారీలో వాడారని ఆధారం లేని సంగతి చెప్పింది వారే కదా? అది నిజమే అయితే రెండు నెలలపాటు మౌనంగా ఉండడం నేరం కాదా? అయోధ్యకు పంపిన లడ్డూలు కల్తీ అయ్యాయని పవన్ చేసిన ఆరోపణకు నిదర్శనం చూపించాలి కదా? ఈయన స్వయంగా అక్కడకు వెళ్లారు కదా.అప్పుడు ఎవరైనా ఈయనకు ఫిర్యాదు చేశారా? చేస్తే వెంటనే ప్రకటన ఇచ్చేవారు కదా? అంటే అసత్యం చెప్పారనే కదా!'ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. అల్లా అంటే ఆగిపోతారు. అదే గోవిందా అంటే మనం ఆగిపోం.." అని అంటారు. ఇది మతాలను రెచ్చగొట్టడం కాదా? హైందవ ధర్మంలో ఇదేనా ఉంది? సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అని పవన్ అన్నారు. గొడవలు సృష్టించడానికే ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారా? అసలు ఎవరైనా సనాతన ధర్మం గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడారా? కేవలం పవన్ కళ్యాణ్ లేని వివాదం తెచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. జగన్ పాలనలో ఏదో జరిగిందని పచ్చి అబద్దాలు చెప్పి హిందూ మతానికి ఈయన మరింత అప్రతిష్ట తెస్తున్నారు.టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని చోట్ల రధం దగ్దం చేయడం వంటివి కొన్ని జరిగాయి. అలాగే మహిళలపై ఈ నాలుగు నెల్లోనే జరిగినన్ని అత్యాచారాలు,ప్రత్యేకించి చిన్న పిల్లలపై జరిగిన ఘోరాలు సమాజాన్ని కలచివేస్తున్నాయి.వాటి గురించి మాట్లాడే ధైర్యం లేని పవన్ ఎంతసేపు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, సనాతన ధర్మం అంటూ కొత్తపాట ఎత్తుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. నిజానికి ఆయనకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియదనేదే విద్యాధికుల స్పష్టమైన భావన. ఏపీ ప్రజలలో మత భావాలను పెంచి బీజేపీ ఎజెండా ప్రకారం ఇలాంటి కుట్రలకు పవన్ పాల్పడుతున్నారన్నది మరికొందరి అనుమానం. చంద్రబాబే అవకాశ వాదంతో రకరకాల వర్గాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారంటే, ఆయనను దాటి పోవాలని ఏమైనా అనుకుంటున్నారా? అన్నది తెలియదు. కానీ హనుమంతుని ముందు కుప్పి గంతులా అన్నట్లు చంద్రబాబు ఈయన తోక కట్ చేయగలరు. తన మీడియా బలంతో భ్రష్టు పట్టించగలరు. చంద్రబాబు, లోకేష్ లు తెలివిగా పవన్ కళ్యాణ్ ను ఇరికించి పరువు తీస్తున్నారా? అన్నది మరికొందరి సందేహం. ప్రస్తుతానికి ఇద్దరూ కలిసి జనాన్ని మోసం చేయడానికి ఈ గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ కల్తీ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గదే అయినప్పటికీ విచారణ నిస్పక్షపాతంగా సాగుతుందా? లేదా? అన్నదానిపై అప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము. ఎందుకంటే.. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై కొత్త ఎత్తులు వేస్తారా? అన్న సందేహం అందరిలోనూ ఉంది కాబట్టి! లడ్డూ వ్యవహారంలో తమకు సహకరించమని సుప్రీంకోర్టు కోరిన సోలిసిటర్ జనరల్ ఒకపక్క స్వతంత్ర సిట్‌కు ఓకే అంటూనే.. ఇంకోపక్క రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌కూ సర్టిఫికెట్ ఇస్తూ వారి అర్హతలు బాగానే ఉన్నాయనడం బాబు కేంద్రాన్ని ఏ మేరకు ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి అన్నది ఇక్కడ మరచిపోరాదు.ప్రపంచం మొత్తమ్మీద కోట్లాది మందికి ఇష్టదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలో ఒక అర్థం పర్థం లేని ఆరోపణ చేయడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సాగిన ఈ అసత్యపు ఆరోపణలపై నిజాలు నిగ్గుదేల్చేందుకు విషయం సుప్రీంకోర్టుకు ఎక్కింది. అయినా సరే.. టీటీడీ పవిత్రతను కాపాడవలసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రే దానిని దెబ్బతీసేలా వ్యవహరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి దీనిపై దీక్ష పేరుతో ఒక డ్రామా కూడా ఆడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తోసిరాజని బహిరంగ సభపెట్టి మరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకే ఆదేశాలు ఇస్తున్న రీతిలో, మతాల మధ్య ద్వేషాలు పెంచేలా పవన్ మాట్లాడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజకీయ డ్రామాలు ఆపండని ఘాటుగా స్పందించడం విశేషం.ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏ విచారణకు అయినా సిద్దం అని చెప్పలేకపోవడం ద్వారా చంద్రబాబు ఎంత ఆత్మరక్షణలో పడింది అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం, టీటీడీల తరఫు న్యాయవాదులు అఫిడవిట్లలో జంతు కొవ్వు కల్తీ ప్రస్తావనే తేలేదట. సుప్రీంకోర్టు మాత్రం తుషార్ మెహతా సూచనను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ నియమించే ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఎలా పనిచేస్తుంది? దాని ఎజెండా ఏమిటి? కాల పరిమితి ఏమిటి? ఏ అంశాలపై విచారణ జరుపుతుంది? మొదలైన విషయాలపై స్పష్టత రావల్సి ఉంది.చంద్రబాబు, పవన్ లు అధికారంలోకి వచ్చాక జరిగిన ఈ ఘటనలను గత జగన్ ప్రభుత్వానికి పులిమి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం జరిగింది. మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి విచారణ కోరి ఉండకపోతే, చంద్రబాబు తన అరాచక ఆరోపణలు కొనసాగించే వారు. తాను చెప్పిన విధంగా నివేదిక తయారు చేసేందుకే సొంత సిట్ ను నియమించుకున్నారు. ఈ విషయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంతవరకు గమనించినట్లే అనుకోవాలి. అందుకే వారు పలు ప్రశ్నలు సంధించారు. ఏ ఆధారంతో లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని చెప్పారని సూటిగానే అడిగింది. విచారణ జరగకుండా సీఎం మీడియాకు ఎక్కడమేమిటని అసహనం వ్యక్తం చేసింది.సుప్రీం వేసిన ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ ల వద్ద జవాబు లేదు. టీటీడీ తరపున వాదించిన లాయర్ సిద్దార్ధ్ లూద్రా కల్తీ నెయ్యి తో లడ్డూ తయారు కాలేదని చెప్పారు. ఇది ప్రభుత్వం తరపున చెప్పినట్లే. అలాంటప్పుడు లడ్డూ విషయంలో స్పష్టత వచ్చినట్లయింది. ఇక విచారణ జరపవలసింది ఈ లడ్డూ వివాదంలో ఎవరి పాత్ర ఏమిటనేదే? చంద్రబాబు నాయుడు ఏ ఆధారంతో జంతుకొవ్వు కలిసిందని అన్నారు? తనతో శ్రీ వెంకటేశ్వర స్వామే నిజాలు చెప్పించారని అంటూ, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలలో నిజం ఎంత? అబద్దం ఎంత?పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో సాగించిన తంతు ఏమిటి? ఈ ఓ శ్యామలరావు తొలుత వెజిటబుల్ ఫాట్ (వనస్పతి) కలిసిందని, ఆ టాంకర్లను వాడలేదని ఎలా చెప్పారు. తదుపరి జంతు కొవ్వు ప్రసావన ఎందుకు చేశారు. చంద్రబాబు ప్రభావంతోనే ఆయన అలా చేశారా? లడ్డూని పరీక్షకు పంపకుండా సీఎం స్థాయిలోని వ్యక్తి రెండు నెలల తర్వాత ఏ ఆరోపణ అయినా చేయవచ్చా? మైసూరులోని సంబంధిత పుడ్ టెస్టింగ్ లాబ్ కు తిరస్కరించిన నెయ్యి శాంపిల్స్ పంపించారా? లేదా? పంపిస్తే ఆ లాబ్ ఏమి రిపోర్టు ఇచ్చింది.పనికట్టుకుని గుజరాత్ లోని ఎన్.డి.డి.బి లాబ్ కు పంపడంలో ఏమైనా కుట్ర ఉందా? ఆ సంస్థ చైర్మన్ సరిగ్గా అంతకు ఒకటి, రెండు రోజుల ముందే టీటీడీ ఈఓని, మరికొందరు ప్రముఖులను ఎందుకు కలిసి వెళ్లారు? గతంలో చంద్రబాబు హయాంలో కాని, జగన్ హయాంలో కాని ఇలా నాణ్యత ప్రమాణాలు లేని నేయి ట్యాంకర్లను తిరస్కరించినప్పుడు, వేరే లాబ్ లకు పరీక్ష నిమిత్తం పంపించారా? లేదా? లేకుంటే ఎందుకు చేయలేదు. సుప్రీంకోర్టు విచారణలో పలు సందేహాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ యధాప్రకారం లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించడంలో ఉద్దేశం ఏమిటి? అయోధ్యకు కూడా కల్తీ నెయ్యి కలిసిన లడ్డూలు పంపారని పవన్ చెప్పడానికి ఆధారం ఏమిటి? అప్పట్లో అయోధ్యలో ఈ ప్రసాదం లడ్డూలను తిన్నవారెవరు ఎలాంటి పిర్యాదు చేయలేదు కదా? ఎన్.డి.డి.బి రహస్య నివేదిక ఇస్తే దానిని టీడీపీ ఆఫీస్ నుంచి ఎలా విడుదల చేశారు?ఇలాంటి అంశాలన్నిటిపైన కొత్త కమిటీ దర్యాప్తు చేస్తే మంచిదే. కమిటీ కూర్పులో సీబీఐ నుంచి ఇద్దరు, పుడ్ సేఫ్టి టెస్టింగ్ లాబ్ నుంచి ఒకరిని నియమించడం వరకు ఫర్వాలేదు.రాష్ట్రం నుంచి ఇద్దరు సిట్ సభ్యులను నియమించడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది. వారు చంద్రబాబు పక్షాన ఆయనకు అనుకూలంగా ప్రభావితం చేయరన్న గ్యారంటీ ఉంటుందా.? కేంద్రంలోని సీబీఐపై కూడా విపక్షాలు పలు విమర్శలు చేస్తుంటాయి. అలాంటప్పుడు సుప్రీంకోర్టు నేరుగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తే బాగుండేదేమో! లేక ఒక న్యాయమూర్తిని లేదా రిటైర్డ్ జడ్జిని నియమించి విచారణ చేయిస్తే ఎక్కువ ఉపయోగం ఉండేదేమో ఆలోచించాలి. తొలుత విచారణ జరిపినప్పుడు న్యాయమూర్తులు చేసిన ఘాటైన వ్యాఖ్యలకు తగినట్లుగా ఈ విచారణ సంఘం ఏర్పాటు కాలేదేమో అన్న అభిప్రాయం ప్రబల వచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేయాల్సిన అపచారం అంతా చేసి, కేవలం రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు చేసి ఇంత గందరగోళం సృష్టించారన్న భావన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడం , అందులో వివాదాస్పద ,పక్షపాతంతో పనిచేసే అధికారులను నియమించిన వైనంపై రాజకీయ పార్టీలు తప్పు పట్టాయి. ఇన్ని పరిణామాలు జరిగిన ఈ ఉదంతంలో తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లనే విచారించాలి. అలాగే టీడీపీ ఆఫీస్ లో టెస్ట్ రిపోర్టు అంటూ విడుదల చేసిన టీడీపీ ప్రతినిధులను ప్రశ్నించాలి.తదుపరి ఈ ఓ శ్యామలరావును ప్రకటనలపై దర్యాప్తు చేయాలి.టెస్ట్ రిపోర్టు వచ్చిన రెండు నెలల తర్వాత దానిని ముఖ్యమంత్రి ఎందుకు బహిర్గతం చేశారో తెలుసుకోవాలి. ఎలాగూ ఏఆర్ సంస్థకు టెండర్ వచ్చిన దానిపై విచారణ జరుగుతుంది? అయితే వారు నెయ్యి సరఫరా చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. మాజీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలను, మాజీ ఈఓ ధర్మారెడ్డిని ఎలాగూ కమిటీ విచారిస్తుంది! ఏది ఏమైనా మొత్తం హైందవ సమాజం అంతటిని గందరగోళంలోకి నెట్టిన ఈ అంశంలో, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు సృష్టించిన ఈ వివాదంలో నిష్పక్షపాతంగా కమిటీ విచారణ జరగాలి.అప్పుడే తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి జరిగిన అపచారానికి పరిహారం అయినట్లు అవుతుంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మంత్రి సురేఖ వ్యాఖ్యలు స్థాయికి తగ్గవి కాదు
‘‘ఒక మహిళా మంత్రి దుష్టశక్తిగా మారి తప్పుడు ఆరోపణలు చేస్తారా? రాజకీయ ప్రయోజనాలకోసం పరువు ప్రతిష్టలతో బతుకుతున్న పౌరులపై బురద చల్లుతారా? సభ్యత లేని వారెవరో నా భర్తపై మీకు పచ్చి అబద్ధాలు చెబితే ఆవగింజంత వాస్తవం లేకపోయినా ఆరోపణలు చేస్తారా? ఇది నిజంగా సిగ్గు చేటైన విషయం’’ - ఇదీ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అమల ఆవేదనతో చేసిన వ్యాఖ్య. నాగార్జునపైన పిచ్చి ఆరోపణలు , కేటీఆర్ కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని మంత్రి కొండా సురేఖ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై అమల ఘాటుగా స్పందించారు.అనేక మంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ విషయంలో కొండా సురేఖ తీరును ఖండించిన ప్రకటనలు ఎలా వున్నా.. అమల ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆమె కొండా సురేఖ వైనాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికి ఎక్కడా వెనుకాడ లేదు. నాయకులు తమ స్థాయిని తామే తగ్గించుకొని క్రిమినల్స్ మాదిరి వ్యవహరిస్తే ఈ దేశం ఏమైపోతుంది అంటూ అమల ఆవేశంగా ప్రశ్నించారు. మీ రాజకీయాల కోసం బలి చేస్తారా అని అమల అన్నారు. ఆమె ఏఐసిసి నేత రాహుల్ గాంధీకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ప్రజల గౌరవ మర్యాదలపై ఏమాత్రం నమ్మకమున్నా ఇలాంటి నేతలను నియంత్రించాలని, దేశ పౌరులను రక్షించాలని కోరారు.అమల ఆవేదనలో నిజంగానే అర్థముంది. భర్త నాగార్జునను టార్గెట్ చేశారన్న బాధ కనిపించింది. ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అనండి, లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనండి, అవసరం, అర్జెన్సీ లేక పోయినా నాగార్జున ఎన్ కన్వన్షన్ ను కూల్చి వేసింది. ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వంలోని మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియాలో విస్తారంగా రావడంతో అవన్ని నాగార్జున కుటుంబానికి తీవ్రమైన ఆవేదన మిగిల్చాయి. ఆ తర్వాత కొండా సురేఖ సారీ చెప్పి వివరణ ఇచ్చినా అదంత సంతృప్తికరంగా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై వెంటనే స్పందించి ఉంటే బాగుండేది.అసలు స్పందించకపోవడం ఇంకా అధ్వాన్నం.నాగార్జున తన ప్రకటనలో ప్రత్యర్థులను విమర్శించేందుకు, రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని కోరారు. సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధమని స్పష్టం చేశారు. నాగచైతన్య తన ప్రకటనలో కేవలం మీడియాలో హెడ్‌లైన్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలపై మాట్లాడడం సిగ్గుచేటని, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని అన్నారు. సమంతతో విడాకుల నిర్ణయం పూర్తిగా పరస్పర అవగాహనతో జరిగిందని తమకు వేరు, వేరు జీవిత లక్ష్యాలు ఉండడంవల్లే పరిపూర్ణత కలిగిన వ్యక్తులుగా తామిద్దరం గౌరవించుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాగార్జున మరొక కుమారుడు అఖిల్ తన ప్రకటనలో తల్లి అమల చేసిన వ్యాఖ్యలో ప్రతి పదాన్ని సమర్థిస్తున్నట్టు తెలిపారు.ఇక ఈ ఘటనలో బాధిత మహిళ అయిన ప్రముఖ నటి సమంత ఓ ప్రకటన చేస్తూ, విడాకులు తన వ్యక్తిగత విషయమని, సినీ పరిశ్రమలో ఉండడానికి, బైటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలని, సురేఖ ఆ విషయాన్ని గుర్తించాలని అన్నారు. దయచేసి చిన్నచూపు చూడవద్దని విజ్ఞప్తి చేశారు. తమ విడాకుల విషయంలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని, తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని స్పష్టం చేశారు.అంటే దీనర్థం సమంతపై కేవలం కొందరు ప్రచారం చేసే అసత్యపు గాసిప్స్‌నే మంత్రి వాడారని అర్థమవుతోంది. ఒకప్పుడు హిందూ నేషన్ అనే ఒక పత్రిక ఉండేది. అందులో సినిమావాళ్లకు సంబంధించిన పిచ్చి పిచ్చి గాసిప్స్ రాసేవారు. వాటిని జనం చదివి నవ్వుకొని వదిలేసేవారు. కొందరు తిట్టేవారు. అంతవరకే అవి పనికొచ్చేవి. కాలక్రమంలో సమాజం నుంచి నిరాదరణ రావడంతో ఆ పత్రిక నిలిచిపోయింది. ఇప్పుడు ఆ గాసిప్ప్ పత్రిక పాత్రను సురేఖవంటి రాజకీయ నేతలు తీసుకున్నట్టయింది.నాగార్జున కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. వారిలో కొందరు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రకాష్ రాజ్ ''ఏంటీ ఈ సిగ్గులేని రాజకీయాలు ...సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా'' అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే సినీ పరిశ్రమలోని వారిపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోజాలమని అన్నారు. ఎలాంటి చెత్త మాట్లాడినా చెల్లిపోతుందని రాజకీయ నేతలు కొందరు భావిస్తున్నారని మరొక నటుడు నాని ధ్వజమెత్తారు.మెగాస్టర్ చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్ ,మహేశ్ బాబు తదితరులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి పదవిలో ఉండి నీచ స్థాయికి దిగజారడం సిగ్గుచేటని చిరంజీవి అన్నారు. అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడినట్లు కనిపించలేదు.ఒకవైపు హైడ్రా వ్యవహారంలో చికాకుపడుతున్న రేవంత్ ప్రభుత్వానికి కొండా సురేఖ కొత్త చిక్కులను తెచ్చిపెట్టారు. సురేఖ దీనిపై వివరణ ఇస్తూ తన వ్యాఖ్యల ఉద్దేశం, ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని, ఆమెపై అభిమానం ఉందని, ఆమె తనకు ఆదర్శమని వ్యాఖ్యానించారు. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్థాపానికి గురయితే బేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహించుకుంటున్నానని ప్రకటించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కోపంతో సురేఖ ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక ప్రతిష్ట కలిగిన కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చినట్టయింది. పైగా సమంత మనస్థాపానికి గురయితే.. అని ముక్తాయించి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాను అనడంలో కూడా కచ్చితంగా అధికార అహంకారం కనిపిస్తోంది. సురేఖ బేషరతుగా, బహిరంగంగా క్షమాపణలు కోరి ఉండాల్సింది. సినిమా వారికి, రాజకీయాల్లోని వారికి మధ్య సంబంధ, బాంధవ్యాలు ఉండడం ఈనాటిది కాదు. ఎన్నికల సమయంలో సినీ నటుల ప్రచారాన్ని నేతలు కోరుకుంటుంటారు. కొందరు సినీ ప్రముఖులు రాజకీయాల్లో కూడా రాణించారు.కాని ఒక సినీమా స్టార్ పై ఈ రకమైన నీచవ్యాఖ్య చేయడం మాత్రం దారుణం.సినీ రంగంలో మహిళలు ఎన్నో కష్టనష్టాలకు, అపవాదులను ఓర్చుకునే పరిస్థితి సభ్య సమాజానికే అవమానం. సురేఖ అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం ద్వారా ఆమె నాగార్జున కుటుంబానికి, సమంతకు తీరని నష్టం చేశారు. సినీ పరిశ్రమకు అక్కినేని నాగాశ్వరరావు గానీ, ఆయన కుమారుడు నాగార్జున గానీ ఎనలేని సేవలు అందించారు.కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డిలాంటివారు అక్కినేనిని చాలా గౌరవించి ఆయన్ని హైదరాబాద్ కు రప్పించి సినీ పరిశ్రమ ఇక్కడకు రావడానికి సహకారం తీసుకున్నారు. ఎన్టీఆర్ సమకాలీనుడైన నాగేశ్వరరావును రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు గౌరవిస్తారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కాకుండా ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్, వైఎస్ జగన్ ల కు కూడా అక్కినేని కుటుంబంతో సత్ సంబంధాలున్నాయి. అక్కినేని కుటుంబం వారెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ కారణం ఏమో తెలయదు గానీ నాగార్జునను గురి పెట్టినట్టుగా ఇటీవలి కాలంలో రేవంత్ ప్రభుత్వంలోని వారు వ్యవహరిస్తున్నారు.కొండా సురేఖ విషయానికి వస్తే ఆమె దుందుడుకుగా మాట్లాడడం కొత్త కాదు. ఆమె కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. . వైఎస్ఆర్ టైమ్‌లో మంత్రిగా ఉన్నారు. తిరిగి ఇప్పుడు మంత్రి కాగలిగారు. గతంలో జగన్‌కు మద్దతిచ్చి రోశయ్య ప్రభుత్వంపై అనవసరమైన కొన్ని వ్యాఖ్యలు చేసి మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో వైఎస్సార్ సీపీకి దూరమై జగన్ పై అభ్యంతకరమైన రీతిలో మాట్లాడారు. కేసీఆర్‌ను ఉద్దేశించి కూడా ఆమె తీవ్రమైన భాషనే ప్రయోగించారు.సినీ ప్రముఖుల జీవితాల సంగతి ఎలా ఉన్నా అనేక మంది రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించి కూడా ఎన్నో కల్పిత కథలు ప్రచారం అవుతుంటాయి. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే చాలా మంది నేతలు రాజకీయాలకు అర్హులే కాకుండా పోతారు. ఇక్కడ కొండా సురేఖ వ్యక్తిగత జీవితం జోలికి వెళ్లజాలం.ఆమెపై బీఆర్ఎస్ వారు గానీ, మరెవరో గానీ చేసిన ట్రోలింగ్స్‌ను సమర్థించజాలం. బీజేపీ ఎంపీ రఘునందన్ ఆమెకు నూలు దండ వేస్తే దానిపై పిచ్చివాళ్లు కొందరు అభ్యంతరకర పోస్టింగులు పెట్టారు. దానిపై కేటీఆర్ స్పందించిన తీరు కూడా బాగాలేదు.ఆమెను ఉద్దేశించి దొంగ ఏడుపులు అనడం పద్ధతిగా లేదు. తదుపరి సురేఖ మరింత జుగుప్సాకరంగా , మంత్రి హోదాను మర్చిపోయి అక్కినేని నాగార్జున కుటుంబాన్ని వాళ్ల రొంపిలోకి లాగడం ఏమాత్రం సభ్యత కాదు. కేటీఆర్ పై రాజకీయ విమర్శలు చేసుకోవచ్చుగానీ మధ్యలో నాగార్జున, నాగచైతన్య, సమంత ఏం చేశారు? వారిని అన్యాయంగా సమాజంలో బలి చేయడం తప్ప, సాధించింది ఏముంది? నిజానికి ఇంత తీవ్రమైన హేయమైన వ్యాఖ్యలు చేసిన సురేఖ మంత్రి పదవిలో కొనసాగడానికి అర్హులవుతారా? కాదా? అనేది ఆలోచించుకోవాలి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని అనడం సులువే కానీ, అక్కినేని నాగార్జునకు జరిగిన డ్యామేజీని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పలేకపోయారు. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన అనంతకుమార్ హెగ్డే వివాదస్పద వ్యాఖ్యలు చేసి మంత్రి పదవి కోల్పోయారు.గతంలో చెన్నారెడ్డి ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకే చెందిన అప్పటి మంత్రి గోకా రామస్వామి రాజకీయంగా కొన్ని విమర్శలు చేసి పదవి కోల్పోయారు. ప్రముఖ నటి జయప్రద యూపీలో కొందరు రాజకీయ నేతల వల్ల ఇబ్బంది పడ్డారు. నాగార్జున కుటుంబానికి ఆవేదన మిగిలి ఉండవచ్చు కాని, ఈ మొత్తం ఉదంతంలో కొండా సురేఖే సమాజం దృష్టిలో దోషిగా నిలబడ్డారని చెప్పాలి. ఈ నేపథ్యంలో నాగార్జున మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు పెట్టి పరువు నష్టం దావా వేయడం సముచితమే. సురేఖపై అభ్యంతర ట్రోలింగ్స్ చేయించారని కేటీఆర్, హరీష్ రావులపై కేసులు పెట్టారట. ఒకే. కానీ మరి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి పై కేసులు ఎందుకు పెట్టలేదు?నాగార్జున మంత్రిపై కేసు పెట్టించడానికి ఎంతగా కష్టపడాల్సి ఉంటుందో తెలియదు.మహిళానేత సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో, ఒక మహిళా మంత్రి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తప్పుడు సంకేతాన్ని ఇచ్చినట్టవుతుంది. ఏపీలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా లడ్డూ రాజకీయాన్ని తీసుకొచ్చినట్టుగా ఇక్కడ తెలంగాణలో హైడ్రాతో వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి సురేఖ వంటివారు ఇలాంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కు, రేవంత్ కు ఎలాంటి ప్రయోజనం వుండకపోగా మరింత నష్టమన్న సంగతి తెలుసుకోవాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పల్టీలు కొట్టే.. పరువు పాయే!
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపడితే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం సుప్రీంకోర్టును తప్పు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టిన తీరు గమనించారా? తాను అర్ధవంతంగా మాట్లాడడం లేదని ఆమెకు తెలుసు. అందుకే కొంత తడబాటుగా, మరికొంత పొడి, పొడిగా మాట్లాడారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సమర్థించడానికి ఆమె తంటాలు పడ్డారు. నిజానికి ఇలాంటి సందర్భాలలో నిజాయితీగా మాట్లాడితే వారి విలువ పెరుగుతుంది. ఎంత మిత్రపక్షమైనా, వారు ఏమి చేసినా సమర్థిచే దశకు వెళితే ఆ మరక వీరికి కూడా అంటుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు.ఇప్పటికే కూటమిలో మరో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ వెనుకబడి పోతానో అని ఏదో దీక్ష అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి గబ్బు అయ్యారు. చివరికి తాను లడ్డూ కల్తీ గురించి తిరుమల యాత్ర చేయలేదని, గత ఐదేళ్లలో పాపాలు జరిగాయని అందుకు ప్రాయశ్చితంగా వెళ్లానని చెప్పవలసి వచ్చింది. పవన్ కళ్యాణ్‌కు అబద్దాలు ఆడడం, మాట మార్చడం కొత్తకాదు. కాని ఈసారి మరీ గట్టిగా బుక్ అయ్యారు. చంద్రబాబును గుడ్డిగా బలపరచబోయి పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ లు అప్రతిష్టపాలయ్యారు.తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అయిన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ సంచలన వ్యాఖ్య చేసి, దానికి ఆధారాలు చూపించలేక, పల్టీలు కొట్టిన చంద్రబాబు దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నారు. హిందువుల దృష్టిలో ఆయన దేవుడి పట్ల తీరని అపచారం చేశారు. అలాంటి వ్యక్తిని సమర్థించిన వీరిద్దరూ కూడా అపచారం చేసినట్లే అవుతుంది. తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి, రాజ్యసభ సభ్యుడు, మాజీ టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు వేసిన పిటిషన్ పై విచారణ చేస్తున్న సందర్భంలో పలు ప్రశ్నలను న్యాయమూర్తులు సంధించారు.ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టులడ్డూ కల్తీ అయిందనడానికి ఆధారాలు ఏమిటి? లడ్డూని ఎందుకు పరీక్షకు పంపించలేదు. ఎన్.డి.డి.బి రిపోర్టు వచ్చిన రెండు నెలల తర్వాత ఎందుకు వెల్లడి చేశారు. అందులో ఎక్కడా నిర్దిష్టంగా జంతు కొవ్వు కలిసిందని లేదే? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడవచ్చా? దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూ పలు వ్యాఖ్యలను గౌరవ న్యాయమూర్తులు చేశారు. ఈ వ్యాఖ్యలపై బిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చు. అవి అర్ధవంతంగా ఉండాలి. అంతే తప్ప, కోర్టు ధిక్కార ధోరణిలోనో, న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించే రీతిలో ఉండకూడదు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబే ఇంతవరకు స్పందించలేకపోయారు! దానికి కారణం కేవలం తాను తప్పు చేశానన్న సంగతి తెలుసు కనుక. జంతుకొవ్వు లడ్డూలో కలిసిందని తప్పుడు ఆరోపణ చేసి దొరికిపోయానన్న విషయం తెలుసు కనుక.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!అంతేకాదు.. సెప్టెంబర్ ఇరవై ఒక్కటో తేదీన తనతో శ్రీవెంకటేశ్వరస్వామే నిజాలు చెప్పిస్తున్నారంటూ ప్రసాదం లడ్డూపై అబద్దాలు ఆడారని తేలిపోయింది. చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో లడ్డూలో జంతునెయ్యి కలిసిందని చెప్పగానే, అలా మాట్లాడడం తప్పు అని పురందేశ్వరి ఆయనను వారించి ఉంటే మంచి పేరు వచ్చేది. ముఖ్యమంత్రి రాజ్యాంగపరంగా అధినేత స్థానంలో ఉన్నారని అంటున్నారు. అయితే రాజ్యాంగానికి అతీతంగా అబద్దాలు చెప్పవచ్చా అన్నదానికి ఆమె సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి పోస్టు రాజ్యాంగ పదవి అయితే, న్యాయమూర్తుల పదవులు రాజ్యాంగ పదవులు కావా? సీఎంకు ఉన్న పరిస్థితులు సమీక్షించుకుని మాట్లాడాలా? వద్దా అనేది ఆయన ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందని పురందేశ్వరి అంటున్నారు.ఎంత సీఎం అయినా ఇష్టం వచ్చినట్లు స్పీచ్ ఇవ్వవచ్చా?. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీయవచ్చా?. గతంలో కూడా పలు సందర్భాలలో న్యాయస్థానాలు పలువురి ప్రకటనలు రాజ్యాంగ స్పూర్తిగా విరుద్దంగా ఉంటే తప్పు పట్టాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా అమలు అవుతుందా?లేదా అనేది కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలని ఏదో అర్థం లేని మాట చెప్పారు. ఇందులో నిర్ణయం ఏముంది? ఒక అబద్దం చెప్పడానికి సీఎంకు అధికారం ఉంటుందని ఆమె వాదించదలిచారా?. ఈ మధ్యనే ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కొంత అతిగా స్పందించారు. వెంటనే న్యాయమూర్తులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆ మీదట రేవంత్ కోర్టువారిని క్షమాపణ కోరారు.అయినా చంద్రబాబు ఇలాంటివాటన్నిటికి అతీతుడని పురందేశ్వరి అనుకుంటే ఎవరూ ఏమి చేయలేరు. ముఖ్యమంత్రి గారు.. మీరు ఎందుకు మాట్లాడారు అనే అధికారం కోర్టుకు ఉందా అనేది ఆలోచించాలి అని ముక్తాయించారు. విద్యాధికురాలైన ఆమెకు, సుమారు తొమ్మిదేళ్లపాటు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఆమెకు కోర్టుకు ఉన్న అధికారం ఏమిటో తెలియదా?. గతంలో ముఖ్యమంత్రి హోదాలో నేదురుమల్లి జనార్దనరెడ్డి పన్నెండు వైద్య కాలేజీలను మంజూరు చేశారు. అందులో అక్రమాలు జరిగాయని కొందరు కేసు వేశారు. ఆ క్రమంలో ఆయనపై సుప్రీంకోర్టు కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను తొలగించాలని నేదురుమల్లి కోర్టును కోరినా అందుకు అంగీకరించలేదు.చంద్రబాబుతో నిజానికి గతంలో దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి అంత సత్సంబంధాలు ఏవీ లేదు. 2014లో కూడా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంది. అప్పట్లో ఒంగోలు లేదా మరో సేఫ్ సీటును ఆమె ఆశించారు. కాని కుట్రపూరితంగా ఆమె గెలవలేని రాజంపేట లోక్ సభ స్థానాన్ని చంద్రబాబు, వెంకయ్యనాయుడులు కలిసి కేటాయించారని అనేవారు. తన భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఎగవేయడంతో సహా పలుమార్లు చంద్రబాబు తీవ్రంగా అవమానించారనే బాధ పురందేశ్వరికి ఉండేది. ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు రాగానే ఆమె వేదికపైనుంచి దిగి వెళ్లిపోయారు. పలు చేదు అనుభవాలు ఉన్నప్పటికీ ఎక్కడ రాజీ కుదిరిందో కాని ఆమె పూర్తిగా మద్దతురాలైపోయారు.తన చెల్లి కళ్లల్లో ఆనందం చూడడానికి గాను పురందేశ్వరి తన పరపతిని తగ్గించుకున్నట్లయిందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నారో అందరికి తెలుసు. కొందరు న్యాయమూర్తులు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేవారు. ఒక జడ్జి అయితే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నంతగా తనకు సంబంధం లేని అంశాలపై కామెంట్లు చేశారు. అయినా అప్పట్లో పురందేశ్వరికి కోర్టులు అలా మాట్లాడవచ్చా అన్న సందేహం రాలేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు ఈమె కూడా ఆనందం చెందారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే మొత్తం మాట మార్చేశారు. నాలుక మడతేశారు. తను ఎందుకు దీక్ష చేసింది తొలుత చెప్పినదానికి, ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చినదానికి సంబంధం లేదు. ఆపసోపాలు పడుతూ పవన్ కళ్యాణ్ కాలినడకను తిరుమల వెళ్లినా, చంద్రబాబు పాపంలో ఆయనకు కూడా వాటా ఉండక తప్పదని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ఇంక పండగే పండగ! చౌక మద్యం.. అడిగినోళ్లకు అడిగినంత. ఐదేళ్లుగా జనావాసాలకు దూరంగా.. ఊరిబయట ఉన్న మద్యం దుకాణాలిప్పుడు వీధి వీధికి రానున్నాయి! ఇప్పటివరకూ మద్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వమే రీటెయిల్ మద్యం షాపులు నిర్వహిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్రైవేట్ వాళ్లు రంగంలోకి దిగబోతున్నారు. అయినకాడికి దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త మద్యం పాలసీ విపరిణామాలు ఇవి. లిక్కర్ సిండికేట్ల దాదాగిరీ.. గతంలో చంద్రబాబు కాలంలో మాదిరిగా లిక్కర్ సిండికేట్లు, అధికార పార్టీ నేతల మధ్య అక్రమ సంబంధాలు మళ్లీ జోరందుకోనున్నాయి. కొత్త మద్యం పాలసీ దోచుకున్నోడికి దోచుకున్నంత చందంగా ఉపయోగపడవచ్చు.మద్య నిషేధమే లక్ష్యంగా ఉద్యమించి 1994లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో మద్యం ఏరుల్లా పారించేందుకు భూమికను సిద్ధం చేసిందన్నమాట. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచి 1996లోనే చంద్రబాబు రకరకాల సాకులు చెప్పి మద్యనిషేధాన్ని ఎత్తివేసిన సంగతి కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. చంద్రాబాబు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కింది కూడా మద్యం లాబీ పెద్దల అండతోనే అన్న చర్చ కూడా అప్పట్లో జోరుగానే నడిచింది. బాబు హయాంలో లిక్కర్ స్కాములు కూడా బోలెడన్ని చోటు చేసుకోవడం వార్తల్లోకి ఎక్కిన అంశాలే.ఇక మద్య నిషేధ ఉద్యమానికి ఛాంపియన్లమని ప్రచారం చేసుకున్న ఈనాడు మీడియా ప్రస్తుతం వారి పత్రికలో పెట్టిన హెడ్డింగ్ ఏమిటంటే ఇక నాణ్యమైన మద్యం రాబోతోందని. ప్రపంచ దేశాల సంగతి తెలియకపోయినా, బహుశా దేశంలో ఎక్కడా తాము తక్కువ ధరకే మద్యం అందిస్తామని ప్రచారం చేసిన ఏకైక నేత చంద్రబాబు నాయుడే కావచ్చు. ఈ సంద్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు విసిరిన సెటైర్ ఆసక్తికరంగా ఉంది. ఇంతకాలం ''మద్యం తాగడం హానికరం" అని మద్యం బాటిళ్లపై రాస్తున్నారు. ఇక దాన్ని తొలగించి చంద్రబాబు ప్రభుత్వం 'నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇస్తున్నాం ఎంతైనా తాగండి" అని స్టిక్కర్ అంటిస్తారేమోనని చమత్కరించారు.ఇదీ చదవండి: తప్పతాగండిక!.. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుకనిజంగానే మద్యం నిత్యం తాగడం ప్రమాదకరం. సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు ప్రజలకు మద్యం తాగవద్దని చెప్పాల్సింది పోయి సాయంత్రం వేళ ఒక పెగ్గేసుకోండని ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం రావడం లేదని ఆరోపించారు. నిజానికి జగన్ ప్రభుత్వం కొత్త బ్రాండ్లేమి తేకపోయినా చంద్రబాబు టైమ్‌లో ఇచ్చిన పది పదిహేను బ్రాండ్లను కొనసాగించినా అవన్నీ జగన్ బ్రాండ్లుగానే ప్రచారం చేయడంలో చంద్రబాబుతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కృషి చేసిన సంగతి తెలిసిందే. అవి నాణ్యత లేనివని అప్పట్లో ఆరోపించారు. ఈ వందరోజుల పాలనలో ఆ బ్రాండ్లను రద్దు చేసినట్టు కనిపించలేదు. ఈ మూడు నెలల్లో మందుబాబుల ఆరోగ్యం దెబ్బ తినలేదని చంద్రబాబు సర్టిఫికెట్ ఇస్తున్నారా? తాజాగా మద్యం మానిపించే బాధ్యత ఆయన మందుబాబుల భార్యల మీద పెట్టారు. తానేమో షాపులు పెంచి, వారికి మార్జిన్లు పెంచి, ఇళ్ల మద్య షాపులు ,బార్లు, ఎలైట్ షాపులు పెడతారట. కాని మద్యం తాగవద్దని భార్యలే చెప్పాలట. జగన్ తాను హామీ ఇచ్చినట్టు మద్య నిషేధం చేయలేకపోయి ఉండవచ్చు. మద్య నియంత్రణ ద్వారా ఆ దిశగా కృషి చేశారనేది వాస్తవం. అంతకుముందు నాలుగు వేలకు పైగా ఉన్న షాపులను 2,600కు తగ్గించడం, బార్లను తగ్గించడం, అమ్మకం వేళల్ని కుదించడం, ధర పెంచడం, బెల్టు షాపుల నిర్మూలన లాంటి చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం రాకుండా ప్రత్యేక దళాల్ని నియమించారు. సిండికేట్లు లేకుండా, మద్యం మాఫియాలు లేకుండా జగన్ చేయగలిగారు. అయినా చంద్రబాబు అండ్ కో విపరీతమైన దుష్ఫ్రచారం చేసింది. ఇప్పుడు సహజంగానే మద్యం మాఫియాల అండ టీడీపీకి లభిస్తుంది. ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతమున్న పలు బార్ల యజమానులను బెదిరించి వాటిని స్వాధీనం చేసుకున్నారట.స్థూలంగా చూస్తే కొత్త మద్యం విధానం ప్రైవేట్ సిండికేట్లు, అధికార కూటమి నేతలకు ఎంత వీలైతే అంత దోపిడి చేసుకునే అవకాశం కల్పించవచ్చు. ఇప్పటికే పలు చోట్ల షాపుల టెండర్లలో తమకు పోటీ రావద్దని టీడీపీ కూటమి నేతలు ఇతర మద్యం వ్యాపారులను హెచ్చరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మద్యం క్వార్టర్ రూ.99లకే ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. మరీ అంత తక్కువ ధరకు నాణ్యమైన మద్యం వస్తుందా అన్న సందేహం కొందరిలో ఉంది. భక్తితో తిరుమలకు కొన్ని సంస్థలు తక్కువ ధరకే నేతిని సరఫరా చేస్తే అందులో నాణ్యత ఉండదంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఇప్పుడు మద్యంలో మాత్రం తక్కువ ధరకు ఇస్తే నాణ్యత ఉంటుందని చెబుతున్నారు.రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలు రాబోతున్నాయి. అంటే సుమారు వేయి పెరుగుతాయి. పన్నెండు ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేస్తారట. వాకిన్ లిక్కర్ స్టోర్లు రాబోతున్నాయని అంటున్నారు. యథాప్రకారం బెల్ట్ షాపులను నిరోధించే పరిస్థితి ఉండకపోవచ్చు. 2014-19 మద్య మద్యం ఎంత అరాచకంగా ఏపీలో పారిందో అది తిరిగి రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారనేది కూటమి నేతల అభిప్రాయం కావచ్చు. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి పత్రికలు చాలా సంతోషపడుతూ నాణ్యమైన మద్యం రాబోతున్నదని ప్రచారం చేస్తున్నాయి. ఈ మద్యం తక్కువ ధరకే వస్తుంది కదా అని అధికంగా తాగితే ప్రజలు అనారోగ్యం పాలు కారా అన్న వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నకు సమాధానం దొరకదు.రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న చంద్రబాబు నాయుడు మద్యాన్ని విపరీతంగా తాగించి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటారేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళా సంఘాలు సైతం ఈ మద్యం విధానంపై పెద్దగా స్పందిస్తున్నట్టు కనపడ్డం లేదు. కాకపోతే అక్కడక్కడ కొద్ది పాటి నిరసనలు జరిగాయి. ఇంతకాలం ఊళ్లకు దూరంగా వున్న లిక్కర్ షాపులు ఇకపై నివాసాల మధ్యలోనే ఏర్పాటైతే వచ్చే దుష్ప్రరిణామాలపట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. బెల్టు షాపులు యథేచ్ఛగా వచ్చే అవకాశం ఉండడంతో రోజులో ఏ సమయంలోనైనా మద్యం సరఫరా ఉండవచ్చు.జగన్ ప్రభుత్వం ఇంటింటికీ పౌరసేవలు అందిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ మద్యం సరఫరా చేసేటట్టు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాలల్ని బాగు చేసి సీబీఎస్ఈ, ఆంగ్ల మీడియం, ట్యాబులు వంటి సంస్కరణలు ప్రవేశపెడితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. విద్య కన్నా మద్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందేమో చూడాలి. మద్యం విషయంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పోటీపడేలా ఉన్నారు. చంద్రబాబు అనుభవం చిట్టచివరికి ఆంధప్రదేశ్ ప్రజలు మద్యానికి బానిసలు అయ్యేలా చేసేలా ఉంది.- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బొంకిన బాబు నోటికి ‘సుప్రీం’ తాళం!
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి పేరుతోనూ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య వచనాలు పలికి అపచారం చేశారా? సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని మిడి మిడి జ్ఞానంతో వ్యాఖ్యానించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరువు పోగొట్టుకున్నారా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈ విషయం నిర్ధారణ అయినట్లేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వీరిద్దరూ అపభ్రంశపు వ్యాఖ్యలు చేసి వారి ప్రతిష్టను వారే తీసుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా హిందు భక్తుల ఛీత్కారాలకు గురయ్యే పరిస్థితి తెచ్చుకున్నారా? శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న చంద్రబాబు ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇవన్నీ నిజమేనని స్పష్టమవుతోంది.రాజకీయాల్లో ఉన్నవారు అబద్ధాలు ఆడడం అన్నది పెద్ద విషయం కాకపోవచ్చు. చంద్రబాబు వంటివారు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులూ కావచ్చు. కానీ ఏ నాయకుడైనా దైవాన్ని అడ్డం పెట్టుకొని అసత్యాలు చెప్పడానికి భయపడతాడు. కానీ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల చెంతనే తాను జన్మించానని, ఆయన్ను స్మరించుకోకుండా ఏ పనీ చేయనని చెప్పుకునే అత్యంత సీనియర్ రాజకీయ నేత, చంద్రబాబు ఎంత తప్పు చేశారో చూడండి... తిరుమల లడ్డులో జంతు కొవ్వును కలిపారనే తన వాదనను సమర్థించుకోవడానకి చంద్రబాబు సెప్టెంబర్ 21న ఒక సంచలన వ్యాఖ్య చేశారు.’’వెంకటేశ్వరస్వామే నాతో నిజాలు చెప్పించారు’’ అని చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అది విన్న ప్రతి హిందువు, తిరుమలేశుని భక్తుడు చంద్రబాబు సత్యమే చెబుతున్నారేమో అన్న భ్రమ పడ్డారు. స్వామివారి మీద భక్తి ఉండే ఎవరూ ఇంతటి సాహసం చేయరు.కానీ చంద్రబాబు మాత్రం అంతకు తెగించారు. నిజానికి కొందరు మతోన్మాదులు, పూనకం వచ్చేవారు, జాతరవంటి కార్యక్రమాల్లో భవిష్యవాణి అంటూ తెలిసీ తెలియని మాటలు చెప్పేవారు మాత్రమే తనతో దేవుడే పలికిస్తున్నారని అంటారు. కానీ చంద్రబాబు కూడా వారి తరహాలోనే మాట్లాడారు. వీటిని దృష్టిలో ఉంచుకునే స్వామి వారే సుప్రీంకోర్టు రూపంలో చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయించారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను, వైఎస్సార్ సీపీ వారిని ఉద్దేశించి ’’తప్పులు, పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా? ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతోంది’’ అని తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో చంద్రబాబు మాటల దాడి చేశారు. సీన్ కట్ చేస్తే సెప్టెంబర్ 27న మళ్లీ మీడియాతో మాట్లాడుతూ కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు? అనేది అప్రస్తుతం అని ముక్తాయించారు. అంటే దాని అర్థం అప్పటివరకూ తాను ప్రచారం చేసినట్టుగా జంతు కొవ్వుతో కలిసిన నేతితో లడ్డూ తయారు చేశారన్న తన మాటలు తప్పనే కదా. నిజంగానే ఆయన మొదట చెప్పిన అబిప్రాయంతోనే ఉంటే జంతు కొవ్వు వ్యవహారంపై తన వాదనకు కట్టుబడి ఉండాలి. అలా కాకుండా ’’కల్తీ జరిగిన నెయ్యిని ఎక్కడ వాడారనేది అప్రస్తుతం‘ అని చెప్పి తప్పించుకున్నారు. తమిళనాడుకు చెందిన ఏ ఆర్ డెయిరీ మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి పంపితే నాలుగు ట్యాంకర్లు వినియోగించామని మరో నాలుగు ట్యాంకర్ల నేతి శాంపిల్స్ ఎన్డీడీబికి పంపితే ఆ నివేదిక ఆధారంగా వాటిని తిరస్కరించామని అన్నారు. తొలుత వినియోగించిన ట్యాంకర్లలో నేతిలో కల్తీ జరిగిందా అని అడిగితే ఆ తర్వాత నాలుగు ట్యాంకర్లలో జరిగింది కదా అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. తిరుమలలో ఎటువంటి ల్యాబులు లేవని అప్పటివరకూ ప్రచారం చేసిన చంద్రబాబు ఆ తర్వాత కేవలం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించే ల్యాబులే ఉన్నాయని, కల్తీ జరిగిందా లేదా అని నిర్దేశించే అడల్ట్రేషన్ ల్యాబులు లేవని చెప్పుకొచ్చారు.ఆపైన ఇంక ఏవేవో మాట్లాడారు. అంతే తప్ప జంతు కొవ్వు నేతిలో కలిసిందన్న తన వ్యాఖ్యను నేరుగా ఉపసంహరించుకోకుండా అలవాటు ప్రకారం మాటమార్చే యత్నం చేశారు. ఇక్కడే ఆయనకు శ్రీ వెంకటేశ్వరస్వామి మీద నిజంగానే భక్తి ఉందా? అనే సందేహం వస్తుంది. దానికి తగినట్లుగానే సుప్రీం కోర్టు సామాన్యులకు వచ్చిన అన్ని సందేహాలను ప్రశ్నల రూపంలో సంధించింది. వాటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. అందుకే దేవుళ్లను రాజకీయాలలోకి లాగవద్దని న్యాయమూర్తులు ఆయనకు హితవు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రితం మాట్లాడినప్పుడు, స్వామివారి సాక్షిగా చంద్రబాబు అబద్ధాలాడారని స్పష్టం చేశారు. ఒక వైపు ప్రమాణాలు లేని నేతి ట్యాంకర్లను వెనక్కి పంపామని ఈవో శ్యామలరావు కూడా చెప్పినా, ఒకటికి రెండుసార్లు జంతు కొవ్వు ప్రస్తావన తెచ్చి చంద్రబాబు స్వామివారి పట్ల అపచారం చేశారనేది భక్తుల ఆవేదన. తెలిసో తెలియక ఒక అబద్ధం ఆడితే, పొరపాటున అన్నానని సర్దుకుంటే ఒక మాటతో పోతుంది. అలా కాకుండా మరిన్ని అబద్ధాలు ఆడి తప్పుమీద తప్పు చేయడం సరైనదా? కాదా? అన్నది ఆయనే తేల్చుకోవాలి. అంటే వెంకటేశ్వరస్వామి తనతో నిజాలు చెప్పించారని అన్నారు గానీ, ఇప్పుడవన్నీ అబద్ధాలని తేలడంతో మొదట అసత్యాల్ని దేవుడే పలికించాడా? అన్న ప్రశ్న వస్తే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఇదేనా ఆయనకు స్వామివారి మీద ఉన్న భక్తి, నమ్మకం? ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు చంద్రబాబును ఎండగట్టింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనడానికి ఆధారాలు ఏవి అని ప్రశ్నించింది. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కథ మరింత ఆశ్చర్యంగా ఉంటుంది. బీజేపీ వారి మెప్పు కోసమో లేక చంద్రబాబు కన్నా తానే పెద్ద హిందువు అని చెప్పుకోవడానికో, ఏ కారణం వల్లనన్నా కానీ ఆయన కాషాయం దుస్తులు ధరించి మరీ హడావిడీ చేశారు. జరగకూడనిది ఏదో జరిగిందన్నట్టుగా చంద్రబాబు మాదిరే అబద్ధాలాడేశారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదంటూ అదే చర్చిలోనో, మసీదులోనో ఇలా జరిగితే ఊరుకుంటారా ? అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు సోషల్ మీడియా ప్రముఖులుగానీ వైఎస్సార్ సీపీ నేత పేర్నినాని వంటి వారు గానీ అనేక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి పవన్ కల్యాణ్ గాలి తీసేశారు. సనాతన ధర్మమంటే ఏంటో తెలియక పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడేశారు. సనాతన ధర్మం ప్రకారం నాలుగు వర్ణాలుంటాయి. అందులో బ్రాహ్మణులు మొదటిస్థానంలో, క్షత్రియులు రెండో స్థానంలో, వైశ్యులు మూడో స్థానంలో ఉంటారని మను ధర్మం చెబుతుంది. నాలుగో స్థానంలో ఉన్న శూద్రులు పై మూడు వర్ణాలకు విధిగా సేవ చేయాల్సి ఉంటుందట. శూద్రులకు ఆస్తి హక్తు, వేదజ్ఞానం ఉండొద్దట. ఉద్యోగం, వ్యాపారం చేయకూడదట. శూద్ర మహిళల్ని పై మూడు వర్ణాలవారు లైంగికంగా అనుభవించవచ్చట. ఇలా అనేక అశాస్త్రీయమైన అంశాలతో కూడిన సనాతన ధర్మాన్ని పవన్ ఇప్పుడు జనం మీద రుద్దుతారా? పోనీ నిజంగానే ఈయన అచ్చమైన హిందువు అయితే వ్యక్తిగత జీవితంలో అన్ని అధర్మ వ్యవహారాలు చేస్తారా? అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు అసలు విడాకులు తీసుకోవడమనేది సనాతన ధర్మంలో ఉండనే ఉండదని చెప్పిన వీడియో ఇప్పుడు విస్తారంగా తిరుగుతోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఎన్నిసార్ల విడాకులు తీసుకున్నది తెలిసిందే కదా. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అయితే నేరుగా ఒక భార్య ఉండగా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం సనాతన ధర్మం అవుతుందా? అని ప్రశ్నించారు. క్రైస్తవ సమావేశంలో తాను బాప్టిజం తీసుకున్నానని, తన భార్య క్రైస్తవురాలని, తన పిల్లలు క్రైస్తవులని చెప్పిన పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారు? జనం చెవిలో పువ్వులు పెట్టడానికి ఇలాంటి వేషాలు వేస్తే సరిపోతుందా? దీక్ష పేరుతో కాషాయ వస్త్రాలు, ఆ వెంటనే షూటింగుల పేరుతో అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం ఏ పాటి హిందూ ధర్మం? సనాతన ధర్మం? అని పేర్నినాని ప్రశ్నించారు. తన తండ్రి దీపారాధన జ్యోతితో సిగరెట్ట వెలిగించారని పవన్ కళ్యాణే చెప్పారు. బీఫ్ తింటే మంచిదే అంటారు. అయినా సనాతన ధర్మాన్ని తానే పరిరక్షిస్తా అని అంటారు. చెప్పులేసుకొని దీక్ష చేస్తారు, అంటూ రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు సోషల్ మీడయాలో వచ్చాయి. మరి వీటన్నటికీ సమాధానం చెప్పే ధైర్యం, నైతిక ధర్మం పవన్ కల్యాణ్ కు వున్నాయా?సుప్రింకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబుకు అతి విధేయత ప్రదర్శించబోయి తాను కూడా గబ్బు పట్టినట్లయిందన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారో?లేదో? రాజకీయాలకోసం హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూపట్ల అపచారం చేయడమే కాకుండా స్వామివారిని కూడా ఇందులోకి లాగారు. స్వామివారే తనతో మాట్లాడించారంటూ పచ్చి అబద్దాన్ని చంద్రబాబు చెప్పడం పాపమో ?కాదో? ఆయనే తేల్చుకోవాలి.ఆయన పాపంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వాటా ఎంతో అవే తేల్చుకోవాలి. తనది అజ్ఞానమో ?కాదో పవన్ కళ్యాణే నిర్ణయించుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కొమ్మినేని రియాక్షన్..
-
ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా?
తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన చేస్తున్నామని, లండన్ స్థాయికి చేరుస్తున్నామని ప్రభుత్వం చెబుతూంటే.. కాపురముంటున్న ఇళ్లను కూల్చి తమ జీవితాలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొస్తే ముంపు సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాదనడం లేదు. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలకూ అభ్యంతరం లేదు. చెరువుల్లాంటి జల వనరుల పరిరక్షణే లక్ష్యంగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్త హైడ్రా దూకుడుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి ముందుగా సానుకూలతే వ్యక్తమైంది.అయితే ధనికుల ఇళ్ల మాట ఎలా ఉన్నా.. హైడ్రా పేద, మధ్య తరగతి వర్గాలకే కేంద్రంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూండటంతో గగ్గోలూ ప్రారంభమైంది. నోటీసులివ్వకుండా, అకస్మాత్తుగా.. ఇంట్లోని సామాన్లు రక్షించుకునేందుకూ సమయం ఇవ్వకుండా నేరుగా జేసీబీలతో హైడ్రా విరుచుకుపడుతూండటం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారు దిక్కులేని స్థితిలో పడిపోతున్నారు. అందుకే వారు అంతలా శాపనార్థాలు పెడుతున్నారు.ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారు ఎవరికైనా ఆవేదన కలక్క మానదు. పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా తాముంటున్న ఇల్లు కూల్చేశారని ఐదేళ్ల పసిపాప ఏడుస్తూ చెప్పిన వైనం అందరినీ కలచివేసింది. ఇంకో మహిళ తాము రూ.కోటి పెట్టుబడి పెట్టి వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకున్నామని, యంత్రాలు తరలించుకునేందుకు అవసరమైన సమయమూ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని వాపోతూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసింది. కొందరు మధ్యతరగతి వారు తాము పది- పదిహేనేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కష్టపడి ఇల్లో, అపార్ట్మెంటో సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వ అకస్మాత్తుగా వాటిని కూల్చేస్తే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.గృహప్రవేశం చేసిన వారం కూడా కాక ముందే తమ ఇల్లు కూల్చేశారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సోదరుడితోపాటు ధనికులు ఎక్కువగా ఉన్న చోట్ల నోటీసులిచ్చారని.. వారు కోర్టుకు వెళితే కొంత గడువూ ఇచ్చారని.. పేద, మధ్య తరగతికి చెందిన తమకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఎందుకు లేవని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకుని, రిజిస్ట్రేషన్లూ జరిగిన తమ ఇళ్లకు పన్నులు కూడా కడుతున్నామని, ప్రభుత్వాలు విద్యుత్తు, మురుగునీటి సౌకర్యాలు కల్పించిందని, అయినా.. చెరువు సమీపంలో ఉందనో, ఇంకేదో కారణం చేతనో కూల్చివేతలకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ భవనాల మాటేమిటి?మూసి పరివాహక ప్రాంతంలో కాని, హుస్సేన్ సాగర్ తదితర చోట్ల ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. వాటి సంగతేమిటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.. వరదలలో ఉండాలని ఎవరూ కోరుకోరు. అదే టైమ్ లో ఇల్లు లేకుండా రోడ్డు మీద పడిపోయే పరిస్థితిని కూడా కోరుకోరు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతూ, మరో వైపు వేల సంఖ్యలో పేదల ఇళ్లను పడవేస్తుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఏది అతి కాకూడదు. మూసి నది మధ్యలో ఉన్న ఇళ్లను తొలగించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. అయితే ఇక్కడ వారిని మాత్రం బుజ్జగిస్తారట. వారికి మాత్రమే పునరావాసం కల్పించాకే కూల్చుతామని అధికారులు చెబుతున్నారు. కూల్చి వేయవలసిన ఇళ్ల సర్వేకి సిబ్బంది వస్తే ప్రజలు అడ్డుకున్నారు.మూసి నది బెడ్ లో ఉన్న వారికే ఇళ్లు ఇస్తే, మిగిలిన ప్రాంతాల పేదలు ఏమి చేయాలి. రోడ్డు మీదనే నివసించాలా? కూల్చివేతలకు ఇప్పుడు ఉన్న హైడ్రా సిబ్బంది చాలదట. మరో 169 మంది సిబ్బందిని తీసుకుంటారట. ఈ ఫుల్ ఫోర్స్ తో కూల్చివేతలకు దిగుతారట. అన్ని చెరువులకు ఫుల్ టాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటివి నిర్ధారణ అయిందా? లేక ఏదో ఒఒక అంచనా ప్రకారం ఇళ్లను తొలగిస్తున్నారా? ఎక్కడైనా వరదలకు కారణం అవుతున్న ఇళ్లను తీయడానికి ప్రయత్నిస్తే అదో పద్దతి. అంతేకాక తగు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయడానికి అవకాశం కల్పించాలి. అవేమీ అవసరం లేదని అనుకుంటే అది మానవత్వం కాదు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. అర్థం, పర్థం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కాని, ఇతర మంత్రులు కాని ప్రభుత్వ చర్యలను సమర్థించుకుంటున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, వరదల వంటి సమస్యలు రాకుండా చేయడానికే తమ ప్రయత్నమని అంటున్నారు. కానీ ప్రభుత్వాలే లాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు పెట్టి వేల కోట్లు వసూలు చేసుకున్నాయని, కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.మరో కోణం ఏమిటంటే ప్రస్తుత హైడ్రా కూల్చివేస్తున్న ఇళ్లు, అపార్ట్ మెంట్లు చాలావాటికి బ్యాంకులు, ప్రైవేటు ఆర్దిక సంస్థలు రుణాలు ఇచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలే రూ.రెండు వేల కోట్లు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల ఆ బకాయిలు వసూలు కావని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై బ్యాంకులు కేద్రానికి, ఆర్బీఐకి లేఖలు రాస్తాయట. ఈ పరిణామాలను ఆలోచించిన తర్వాత, వివిధ పరిష్కార మార్గాలను చూపి ఇళ్ల కూల్చివేతలు చేస్తే ఫర్వాలేదు. అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వం, హైడ్రా, తమకు తోచిన రీతిలో ఇళ్లు కూల్చితే దాని ప్రభావం లక్షల మందిపై పడుతుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.లక్ష్యం, ఉద్దేశం మంచిదే అయినా, అమలు తీరు సరిగా లేకపోతే కూడా నష్టం జరుగుతుంది.ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీ సుందరీకరణ లో భాగంగా తుర్కుమాన్ గేట్ వద్ద ఇళ్లు కూల్పించారు. దానితో వేలాది మంది నష్టపోయారు. అలాంటి చర్యల ఫలితంగా ఎమర్జెన్సీ ఎత్తివేసి 1977లో ఎన్నికలకు వెళితే డిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయింది. అలాంటి అనుభవాలను నేతలు గ్రహించాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో బాధిత ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు.ఇందిరాగాంధీ పేరుతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శ కూడా మంచిది కాదు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పధకం తో సహా, పలు కార్యక్రమాలను అమలు చేసి వారి పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ పేదల వ్యతిరేక పార్టీ అని పేరు తెచ్చుకోవడం మంచిది కాదు.నిరసనలు తీవ్రమవుతున్నాయని గమనించిన రేవంత్ ప్రభుత్వం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రజామోదం లేకుండా రేవంత్ కూల్చివేతలపై ముందుకు వెళితే, తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు..కాంగ్రెస్ లో ప్రత్యర్ధి వర్గాలు దీనిని అవకాశంగా తీసుకుని రేవంత్ పదవికి ఎసరు పెట్టవచ్చు.కనుక రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబుది నీచ రాజకీయం.. జగన్‌ది రాజనీతిజ్ఞత!
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నిర్ణయం రాజకీయాల్లో చంద్రబాబు... జగన్‌ల మధ్య తేడాను మరోసారి స్పష్టం చేస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ ఆరోపణలపై ప్రభుత్వం తిరుపతిలో సృష్టిస్తున్న అరాచకాన్ని పరిగణలోకి తీసుకున్న జగన్ అత్యంత వివేచనతో రాజనీతిజ్ఞతన ప్రదర్శిస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తాను చేసిన నీచ రాజకీయం నుంచి ఎలా బయటపడాలా? అని నానా పాట్లూ పడుతున్నట్లు స్పష్టమైంది. జగన్ తిరుమల రావడం చట్ట విరుద్ధమన్నట్టు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి రెండు రోజులుగా నానా రభస చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పర్యటనలో పాల్గొనొద్దని జగన్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల వైఎస్సార్సీపీ నేతలకూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పార్టీ ప్రముఖుల గృహ నిర్బంధాలకూ పాల్పడ్డారు. అంతటితో ఆగారా? లేదు. డిక్లరేషన్ పేరుతో జగన్‌ను ఇరుకున పెట్టాలని కుట్ర పన్నారు. ప్రత్యేక బోర్డులు పెట్టి మరోసారి స్వామి వారికి అపచారం చేశారు. ఈ బోర్డులు పెట్టడం ద్వారా భక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే వారిని కూడా అడ్డుకున్నట్లు అయ్యింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించిన జగన్ ఆలయ సందర్శనను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించడంతో కూటమి నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారి శ్యామలరావు బాబు ఆడమన్నట్టల్లా ఆడుతూండటం కూడా ప్రజలు గమనిస్తునే ఉన్నారు. తప్పులమీద తప్పులు చేస్తున్నారు. తొలుత తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండకుండా, మాటలు మార్చే దుస్తితిని తెచ్చుకోవడం దురదృష్టకరం. అయితే లడ్డూ కల్తీపై చివరికి చంద్రబాబే తన మాటలను తానే మింగాల్సి వచ్చింది. మాట తప్పడం, అవకాశవాదంతో మాట్లాడడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే కానీ.. ఈ సారి ఇంతటి సెంటిమెంట్ విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకోవలసి వచ్చింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని, నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నారో చూశారు కదా!ల డ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న మాటను తప్పించి, ఎక్కడో చోట కల్తీ నెయ్యి వాడారని గాత్రం మార్చారు. లడ్డూను అడ్డం పెట్టుకుని మత రాజకీయం చేయాలని, జగన్ ను దెబ్బకొట్టాలని చంద్రబాబు చేసిన కుట్ర భగ్నమైంది. ఎప్పుడైతే మాజీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు ప్రమాణం చేసి మరీ సవాలు విసిరారో.. అప్పుడే బాబు అబద్ధాలాడుతున్నట్లు స్పష్టమైంది. భూమన తిరుమలకు వెళ్లి పుష్కరిణిలో స్నానమాచరించి, ఆలయం ఎదుట ప్రమాణం చేశారు. ఆ సమయంలో ఆయనను అడ్డుకోవడానికి పోలీసులు యత్నించినప్పుడే చంద్రబాబు భయపడుతున్నారని అర్థమైంది. తిరుమలకు సరఫరా అయిన నేతిలో నాలుగు టాంకర్లు నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని టీటీడీ పరీక్షలలో నిర్దారించుకుని వాటిని వెనక్కి పంపించి వేశామని ఈవో శ్యామలరావు స్వయంగా చెప్పారు. అయినా చంద్రబాబు కోట్లాది మంది ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరగించే లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ప్రకటించి వారి విశ్వాసాలకు విఘాతం కలిగించారు. ఒక అబద్దాన్ని నిజం చేయడానికి వంద అబద్దాలాడుతారన్నట్లుగా చంద్రబాబు తాను చెప్పినదానిని నమ్మించడానికి విశ్వయత్నం చేశారు. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వగైరాలతో అసత్యాలు ప్రచారం చేయించారు. కొన్ని రోజులు సిట్ డ్రామా నడిపారు. అంతిమంగా ఆయనే దిగిరాక తప్పలేదు. తాను తీసిన గోతిలో తానే పడ్డారన్నమాట. సెల్ఫ్ గోల్ వేసుకున్నారని అర్థం. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందన్న వాదన నుంచి చంద్రబాబే తప్పుకున్న తర్వాత సిట్ వేసి ఎవరిని వేధిస్తారో తెలియదు. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు ఏమి చెబుతారో అర్థం కాదు. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ రాజకీయం చేశారు. జగన్ తిరుమలకు వచ్చి డిక్లరేషన్ పై సంతకం చేస్తే ఒక రకంగా, సంతకం చేయకపోతే మరో రకంగా మత విద్వేషాలను నింపాలని యోచించారు. తిరుపతిలో అల్లర్లకు కూడా ప్లాన్ చేశారు. వారినెవ్వరిని పోలీసులు గృహ నిర్భందం చేయలేదు. వారికి నోటీసులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యూహాత్మకంగా తన వాదనను బలంగా వినిపించి తాత్కాలికంగా పర్యటనను వాయిదా వేసుకుంటున్నానని విజ్ఞతను, పరిపక్వతను ప్రదర్శించారు.చంద్రబాబు రాష్ట్రాన్ని ఇప్పటికే రావణాకాష్టంగా మార్చారని అలాంటప్పుడు అక్కడకు వెళ్లడం ద్వారా చంద్రబాబుకు మరింత అవకాశం ఇవ్వకుండా జగన్ జాగ్రత్తపడ్డారు. కొంతమందికి జగన్ వెళ్లి డిక్లరేషన్ పై సంతకం చేసి ఉండవచ్చు కదా అని అనిపించవచ్చు. కాని అలా చేస్తే అక్కడ జరిగే గొడవలన్నిటికి జగన్ నే బాద్యుడిని చేసి ఉండేవారు. పని కట్టుకుని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులను నియమించి జగన్ పై రాళ్లు, టమోటాలు, గుడ్లు వంటివి వేయించి, ఇదంతా భక్తుల నిరసనగా చిత్రీకరించేవారని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. అది నిజమనిపిస్తుంది.ఈ అరాచకాలన్నిటి నుంచి జగన్ తప్పించుకోగలిగారనిపిస్తుంది. డిక్లరేషన్ పై సంతకం చేస్తే, ఇంతకాలం అలా చేయకుండా నిబంధనలు ఉల్లంఘించారని, అది అపచారం అని నిస్సిగ్గుగా ప్రచారం చేసేవారు. డిక్లరేషన్ పై సంతకం చేయకపోవడంతో, జగన్‌కు ఇష్టం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.టీటీడీ డిక్లరేషన్ బోర్డులు పెట్టి భక్తితో కొండకు వచ్చేవారిని అవమానించింది. జగన్ టూర్ వాయిదా పడగానే ఆ బోర్డులను తొలగించడంలోనే వారు తప్పు చేసినట్లు అంగీకరించినట్లయింది. నిజానికి ఇష్టం లేకుండానే, దైవ భక్తి లేకుండానే జగన్ ఇన్నిసార్లు తిరుమలకు వెళతారా? స్వామి వారి తిరునామాలు పెట్టుకుంటారా? సంప్రదాయాలను పాటిస్తూ పూజలలో పాల్గొంటారా? పవిత్ర స్నానంతో సహా పలు హిందూ సంప్రదాయాలను గౌరవించేవారా? చంద్రబాబు తన తండ్రి మరణించినప్పుడు తల వెంట్రుకలు తీయించుకోలేదేమో కాని, పిండ ప్రదానం చేశారో, లేదో కాని, జగన్ మాత్రం తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడిగా కృష్ణా నదిలో పిండ ప్రదానం చేశారు. అయినా ఈ ఉదంతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు దుర్మార్గపు రీతిలో వ్యవహరించారు. పైగా తిరుమలకు వెళ్లొద్దని తాము చెప్పామా అని చంద్రబాబు తన సహజ శైలిలో దబాయించే యత్నం చేశారు. కాని మనసులో అరేరే...తన కుట్ర సఫలం కాలేదే అన్న భావన ఉండి ఉంటుంది. చంద్రబాబు మతం పూనిన వ్యక్తిగా నటిస్తూ జనాన్ని సూపర్ సిక్స్ హామీల నుంచి డైవర్ట్ చేయడానికి ఈ డిక్లరేషన్ తంతును వాడుకోచూశారు. ఈ విషయం ప్రజలకు అర్థం అవుతోంది. అదే సమయంలో జగన్ చాలా హుందాగా మత విశ్వాసాల గురించి మాట్లాడారు. తన మతమేమిటో చెప్పడానికి, ఇతర మతాలను ఎలా గౌరవించేది చెప్పడానికి వెనుకాడలేదు. డిక్లరేషన్ లో తనది మానవత్వ మతం అని రాసుకోండని చెప్పి ప్రజలలో ఒక ఆలోచన తెప్పించారు. ఒక మాజీ ముఖ్యమంత్రినే ఆలయానికి రానివ్వకుండా అడ్డుకుంటే, దళితుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. తద్వారా కూటమి నేతలు చేస్తున్న దరిద్రపు రాజకీయాన్ని జగన్ ఎండగట్టారు. టీటీడీ ప్రతిష్టను నిలబెట్టే విధంగా జగన్ మాట్లాడుతుంటే చంద్రబాబు మాత్రం పవిత్ర లడ్డూకు అపచారం చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు. దీనిని బట్టే జగన్ ఎంత రాజనీతిజ్ఞతతో వ్యవహరించింది, చంద్రబాబు నీచ రాజకీయం చేసింది తేట తెల్లమైంది. జగన్ ఇంత జాగ్రత్తగా ఉన్నా, చంద్రబాబు బాకా పత్రిక ఆంధ్రజ్యోతి ఎంత దారుణంగా అబద్దాలు రాసిందో చూడండి.. ’ఏమైంది జగనా‘ అంటూ ఒక హెడింగ్ పెట్టి దేశాన్ని, మతాన్ని తప్పు పడుతున్నారంటూ తప్పుడు విశ్లేషణ ఇచ్చింది. పైగా జగన్ ’ఇదేం దేశం..ఇదేం హిందూయిజం‘ అని అన్నారంటూ పచ్చి అవాస్తవాన్ని రాయడానికి ఆంద్రజ్యోతి సిగ్గుడలేదు. జగన్ నిజానికి ఈ వ్యవహారంలో టీడీపీపైన, చంద్రబాబుపైన బాగా అఫెన్స్ వెళ్లాలని అనుకున్నవారు చాలామంది ఉన్నారు.అయినా జగన్ చాలా సంయమనంతో తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్ట, లడ్డూకు ఉన్న విశిష్టత దెబ్బ తినకూడదని మాట్లాడారు. హిందువులమని చెప్పుకునే చంద్రబాబు, ఆంద్రజ్యోతి ప్రతినిధులు, పవన్ కళ్యాణ్ వంటివారు మాత్రం మతానికి, స్వామివారికి ఎంత అప్రతిష్ట వచ్చినా ఫర్వాలేదు కాని తమకు రాజకీయ లబ్ది చేకూరాలన్న దురుద్దేశంతో ప్రచారం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ నెయ్యి వ్యవహారం జరిగినా, దానిని జగన్ పై తోసేసి దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు భావించినట్లు కనబడుతోంది. డైవర్షన్ పాలిటిక్స్ తో పాటు, తన సొంత కంపెనీ హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల లక్ష్యంగా కూడా ఆయన ఈ పని చేసి ఉండవచ్చన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు. తన కుతంత్రపు వ్యూహాలేవి ఫలించకపోవడంతో చంద్రబాబు జారిపోయి, కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం అని చెబుతూ తప్పించుకోచూస్తున్నారు. అలాగే సూపర్ సిక్స్ హామీల గురించి ఇప్పుడు వద్దు అని అనడం ద్వారా డొల్లతనాన్ని బహిరంగపరచుకున్నారు. చివరిగా ఒక మాట. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్న కామెంట్ ఒకటి అందరూ పరిగణనలోకి తీసుకోవాలి.’ ఏ దేవుడు చెప్పాడు..నా మతం వాడే నన్ను పూజించాలని.. పరమతం వాడు నన్ను దర్శించరాదు అని‘.. జస్ట్ ఆస్కింగ్ అంటూ అర్థవంతమైన వ్యాఖ్య చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తాను చేసిన తప్పుకు చెంపలు వాయించుకుంటే మంచిది. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తిమ్మిని బమ్మిని చేసే యత్నం.. బాబు పాత టెక్నిక్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక విశిష్టత ఉంది. చెప్పదలుచుకున్న అబద్ధాన్ని నిజం అనిపించడానికి అన్ని అవకాశాలూ వాడుకుంటారు. రాజకీయ ప్రత్యర్థులపై బురద వేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. మొహమాటపడరు కూడా. శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఒక తప్పుడు ఆరోపణ చేసి దాన్ని నిజం చేసేందుకు ఇప్పుడు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు చంద్రబాబు నైజానికి తాజా నిదర్శనం. సీబీఐ విచారణకు ససేమిరా అంటూ తనకు కావాల్సిన అధికారులతో ఏర్పాటు చేసుకున్న సిట్‌తో కొత్త డ్రామా కూడా అదే. ఈ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కావడంతో తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు హైరానా పడుతోంది. నెపాన్ని వైఎస్సార్సీపీపై నెట్టేందుకు కనిపించిన చెత్తా చెదారమంతా పోగేసి ప్రచారం చేస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపేశామని ముందు చెప్పిన టీటీడీ అధికారులు ఇప్పుడు మాట మారుస్తూండటం! కల్తీ గురించి తెలియక నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీలో వాడేశామంటున్నారు వాళ్లిప్పుడు! ఈ కథనం కూడా ఈనాడులోనే ప్రచురితమైంది. అంతేకాదు... ఏఆర్ డెయిరీ ఫుడ్స్ జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని మాకు సరఫరా చేసిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు.. అంటే రెండు నెలల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యమైంది ఎందుకు అన్న ప్రశ్నకు వారిస్తున్న సమాధానం మరీ విచిత్రంగా ఉంది. సరఫరా అయిన తరువాత అనుమానం కొద్దీ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని అంటున్నారు! కొందరు స్వార్థపూరిత శక్తులతో చేతులు కలిపిన ఏఆర్ డెయిరీ కుట్రపూరితంగా ఇలా చేసిందని టీటీడీ జీఎం మురళీ కృష్ణ తన ఫిర్యాదులో చెప్పుకొచ్చారని సమాచారం. ఈ ఫిర్యాదులోని అంశాల్లో నిజానిజాలను కాసేపు పక్కన బెడదాం. టీటీడీ అధికారులు స్వయంగా.. కల్తీ గురించి తెలియక లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యిని వాడేశామంటే.. అది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసినట్లు ఒప్పుకోవడమే కదా? అంటే... ప్రభుత్వం ఇంతకూ తెగించిందన్నమాట. ప్రజలన్ని మోసం చేసినా ఫర్వాలేదు కానీ.. తమ రాజకీయ లక్ష్యాలు మాత్రం నెరవేరాలని అనుకుంటున్నట్లే. కల్తీ జరిగిన నెయ్యిని భక్తులు తిన్నారని చెప్పడం దుర్మార్గం. ఇదంతా చంద్రబాబు కుత్సిత రాజకీయ నాటకంలో రెండో అంకమని అనుకోవాలి. ఈవో అబద్ధం చెప్పాడా? లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీపై బాబు అసత్య ప్రచారం మొదలైన సమయంలో ఆయన స్వయంగా నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు ఏమన్నాడన్నది ఒకసారి గుర్తు చేసుకోవాలిప్పుడు. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించి వెనక్కు పంపామని ఆయన ఎందుకు చెప్పారు? అందుకు భిన్నంగా నెయ్యిని వాడేసి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలి కదా? ఎందుకు బాబు ప్రభుత్వం వెనకాడుతోంది? కల్తీ జరిగిందని గుర్తించక వాటిని వాడేశామని టీటీడీ అధికారులు నిస్సిగ్గుగా చెబుతుంటే మూడు నెలలైనా వారిపై చర్యలేవి? కేసు వివరాలు ఇప్పుడు ఈనాడులో ప్రముఖంగా వచ్చాయి. ఆ పత్రిక ఎక్కడా ఇలాంటి సందేహాలను లేవనెత్తక పోవడం.. ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లుగా కథనం ప్రచురించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అదే సమయంలో లడ్డూ తయారీకి వాడుతున్న జీడిపప్పు, యాలకులు నాసిరకం అంటూ మరో కథనాన్ని ఈనాడు అచ్చుగుద్దింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో అడుగడుగునా అవకతవకలు జరిగాయని విజిలెన్స్ వారు ఇప్పుడు కనిపెట్టారట. ఎంత హాస్యాస్పదం. నిజానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీటీడీకి సంబంధించిన వివిధ సమస్యలపై వార్తలు వస్తునే ఉంటాయి. తిరుమల భక్తుల అగచాట్లపై ఇదే ఈనాడు మూడు దశాబ్దాల క్రితం కూడా కథనాలు ప్రచురించింది. విశేషమేమిటంటే మతం, దైవం అంటే అంత విశ్వాసం లేని సీనియర్ పాత్రికేయుడు, ఏడు తరాల పేరుతో రూట్స్ గ్రంథానిన అనువదించిన ప్రముఖుడు అయిన ఉమా మహేశ్వర రావును ఇందుకోసం ఈనాడు యాజమాన్యం ప్రత్యేకంగా తిరుమలకు పంపి మరీ కథనాలు సిద్ధం చేయించింది. మరి... ఇందుకు అప్పుడు తిరుమలకు అపచారం జరిగిందని అప్పుడెవరూ గొడవ చేయలేదే! కానీ ఇప్పుడు వైఎస్సార్ సీపీపై ఏదో ఒక బురద చల్లడం కోసం రకరకాల దిక్కుమాలిన రిపోర్టులు తయారు చేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తోంది ఈనాడు! ఇక ఆంధ్రజ్యోతి ఒక కథనం రాస్తూ లడ్డూ ప్రసాదం అపవిత్రం అవడం పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉందని రాశారు. అంటే చంద్రబాబు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా వీరు భజన చేస్తున్నారన్న మాట. ఈ విషయమై డిజిపి సిట్ అధికారులకు దిశా నిర్దేశం చేశారట. కల్తీ నెయ్యిపై శ్రీ వైష్ణవులు అభ్యంతరం చెబితే వారిని బెదిరించారని కొత్త కథలు అల్లుతున్నారు. ఈ రకంగా చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చి వైఎస్సార్సీపీపై ఆరోపణ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. జంతు కొవ్వు కలిసిన నెయ్యి తమ చేతికి అంటిందని భావించి ఉంటే శ్రీవైష్ణవులు అప్పుడే కచ్చితంగా నిరసన తెలిపేవారు. అసలు అలాంటి కల్తీ జరిగితే ఆ వాసనను వీరు భరించడమే కష్టమయ్యేది. శ్రీవారిని నమ్మే వారు ఎవరో చేసిన బెదిరింపులకు ఎందుకు భయపడతారు? టీటీడీ మీడియా కట్టు కథలు రాస్తున్నది అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? ఈ మీడియా చెప్పేవాటిలో నిజముంటే చంద్రబాబు ప్రభుత్వం ఇంతకాలం చర్య తీసుకోకుపోవడంలో మతలబు ఏంటో వివరించాలి కదా! మొత్తం ఇదంతా కూడా బ్లాక్ మెయిల్ వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ జరిగితే తాము చేసిన ఘోర అపచారం బయటకు వస్తుందేమోనని భయపడి చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే మీడియా ముందస్తుగా కొత్త కథలు అల్లి జనంపై రుద్దుతున్నట్టుగా వుంది. వైఎస్సార్సీపీ హయాంలో దేవాలయాలకు సంబంధించి ఏ చిన్న ఘటన జరిగినా దాని వెనక పలుచోట్ల జనసేన, తెలుగుదేశం వారి హస్తముందని పోలీసుల విచారణలో వెల్లడైనా అదంతా వైఎస్సార్సీపీవారి పనేననంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వారు అసత్య ప్రచారం చేసేవారు. మత రాజకీయం చేయడానికి ఎక్కడా వెనకాడేవారు కాదు. ప్రస్తుతం తిరుమల లడ్డూ విషయంలో కూడా అదే తరహా మత రాజకీయం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రెండు రోజుల క్రితం ఒక రథాన్ని కొందరు దుండగులు దగ్ధం చేశారు. మరి ఇది టీడీపీ ప్రభుత్వానికి మచ్చ కాదా? ఈ దుశ్చర్యను వైసీపీకి పులమడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాత్రం ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయం ఇలా ఉంటుందన్నమాట. అంతే కాకుండా ఇలాంటి నేరాలు చేస్తే మక్కెలిరగ్గొడతామని సీఎం చెబుతున్నారు.ఇంతకాలం జరిగిన హింసాకాండను ఆయన ఎలా సమర్థించారో చెప్పాలి. దౌర్జన్యాలకు పాల్పడ్డ ఎంతమంది టీడీపీ శ్రేణుల మక్కెలు విరగ్గొట్టారు? కబుర్లు ఆకాశానికి అంటుతాయి. చర్యలు మాత్రం పాతాళంలో ఉంటాయి.! వైఎస్ జగన్ హయాంలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు ,పవన్ కల్యాణ్ లు ఎన్నిరకాలుగా రెచ్చగొట్టేవారో చూశాం. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక కూడా అదే రకంగా మత రాజకీయాలు చేస్తూ ఉసిగొలుపుతూ, పైగా ఎదురు దాడి చేస్తున్నారు. అదే కాదు విజయవాడ వరదల్లో చాలా సాయం చేశామంటూ ఒక సమావేశం పెట్టుకొని అందులో కూడా తన కుట్ర రాజకీయాలను వదలి పెట్టలేదు. బోట్లను నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి వైఎస్సార్సీపీ కుట్ర పన్నిందని ఆయన మరోసారి ఆరోపించారు. ఆ బోట్లు తెలుగు దేశం వారివి అని తెలిసినా ఆయన ఇలా మాట్లాడుతూనే ఉంటారు. వరదల్లో ఆయనకు ఆయనే సర్టిపికెట్ ఇచ్చుకుంటారు. మంచి చేస్తే ఫర్వాలేదు. కానీ వరద బాధితులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు. వరద సాయం అందడంలో కొన్ని సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. రేషన్ కార్డులు లేవని సాయం అందని భవానీ పురం కరకట్ట వాసులు ఆందోళనకు దిగితే వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ విషయాన్ని కూడా మరిచిపోవద్దు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో, చంద్రబాబు పాలన గతంలో ఎన్నడూ లేని విధంగా నాసిరకంగా, మత రాజీకాయలు చేయాలన్న లక్ష్యంతో, అబద్దాల పాలన సాగుతుండడం అత్యంత దురదృష్టకరం. వీటితో సూపర్ సిక్స్ హామీలను జనం మరిచిపోతారని ప్రభుత్వ నేతలు భ్రమపడుతున్నారేమో!-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!!
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ మీద దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ జరగాలని కోరుతుంటే, ఆయన మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించడం చర్చనీయాంశమైంది. చేసిన తప్పు నుంచి బయటపడడానికి చంద్రబాబు ఈ ప్లాన్ వేశారన్న ఆరోపణలూ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సిట్లను సాధారణంగా ముఖ్యమంత్రితో ముడిపడని అంశాల మీదే ఏర్పాటు చేస్తుంటారు. కానీ శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణను స్వయంగా ముఖ్యమంత్రే చేశారు. విచారణ జరిగితే ముందుగా ఆయన వద్ద నుంచే సమాచారం సేకరించాల్సి ఉంటుంది.అందువల్ల సిట్ దర్యాప్తుతో పెద్దగా ప్రయోజనం ఉండదనేది ఎక్కువమంది భావన. పైగా వివాదస్పద, పక్షపాతంతో వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని పనిగట్టుకొని సిట్ సారథిగా నియమించడం కచ్చితంగా దురుద్దేశంతో చేస్తున్న ప్రక్రియగానే అనిపిస్తోంది. గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పనిచేసిన గోపీనాధ్ జెట్టీని సిట్ సభ్యునిగా నియమించారు. ఇందులో హేతుబద్దత ఏమిటో తెలియదు. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం ఉండి ఉంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పని చేసిన వ్యక్తిగా కూడా ఆ తప్పుతో సంబంధం ఉండే అవకాశముంది.సిట్ విధి విధానాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ అందులో కీలకమైన అంశాలకు ఎంతమేరకు తావు ఉంటుందనే సందేహమే. ఉదాహరణకు లడ్డూలో కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో శ్యామలరావు, మంత్రి లోకేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబేమో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని చెబుతున్నారు. ఇందులో ఎవరిది సత్యమన్నదన్న విషయాన్నిన్ని ఈ సిట్ నిర్ధారిస్తుందా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలుగానీ ,ఇతర ఆహార పదార్థాలుగానీ విపరీతమైన దుర్వాసన వస్తాయని రుచి శ్రీవాస్తవ లాంటి ఆహార పరిశోధకులు చెబుతున్నారు. ఆవు నెయ్యి కంటే ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ ఖరీదు ఎక్కువేనని అందువల్ల వాటిని కలిపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నిపుణులను సిట్ అన్ని కోణాల్లో విచారణ చేస్తుందా? లేకపోతే చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తారా? వేచి చూడాలి. ఇప్పటికే చంద్రబాబు తన తీర్పు ఇచ్చేసినందున, దానికి విరుద్దంగా నివేదిక వస్తుందా? టీటీడీ ఈవో మొదట ఒక రకంగా, తరువాత చంద్రబాబు చెప్పినట్లుగాను మాట మార్చడమే ఒక నిదర్శనం. జున్, జులై నెలల్లో కొత్త ప్రభుత్వం ఆధీనంలోనే టీటీడీ పని చేసింది. ఏఆర్ కంపెనీ నుంచి పది ట్యాంకర్ల నెయ్యి వస్తే నాలుగు ట్యాంకర్లను తిరస్కరించారు. తిరస్కరించిన నెయ్యిని లడ్డూల్లో వాడే అవకాశమే లేదు. అటువంటపప్పుడు అనుమతించిన నెయ్యిలో కల్తీ ఉందని చంద్రబాబు భావిస్తున్నారా? ఒక వేళ కల్తీ నెయ్యిని అనుమతించి ఉంటే చంద్రబాబు నియమించిన ఈవో శ్యామలరావే బాధ్యుడు అవుతారు కదా? ఆయన్ను విచారిస్తారా? గతంలో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లకు మరోసారి పరీక్షలు నిర్వహించిన సందర్భం లేదు. కానీ ఈ సారి ఏఆర్ కంపెనీ నెయ్యి శాంపిల్స్ నే ఎందుకు ఎన్డీడీబీకి పంపించారు. ఇందులో ఏమైనా కుట్ర ఉందా? చంద్రబాబు హయాంలో 14 సార్లు, జగన్ సమయంలో 18 సార్లు టీటీడీ నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినప్పుడు ఎందుకు ఇలా శాంపిల్స్ వేర్వేరు ప్రయోగశాలలకు పంపలేదు? కేవలం ఏదో విధంగా జగన్ ప్రభుత్వానికి, వైఎస్సార్ సీపీకి అంటగట్టడానికే ఈ సిట్ ను వేశారనే అభియోగం వస్తోంది. పోనీ సిట్ ఉన్నతాధికారి త్రిపాఠి ట్రాక్ రికార్డ్ ఏమైనా బాగా ఉందా? అని చూస్తే.. ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశానికి పూర్తిగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నేతలపై టీడీపీ విధ్వసకాండ జరిపినా చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఒక అక్రమ కేసులో ఇరికించడం తదితర ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.చంద్రబాబు నియమించిన సిట్ చీఫ్ త్రిపాఠి ఆయనకు వ్యతిరేకంగా తన రిపోర్ట్ లో ఏమైనా రాసే పరిస్థితి ఉంటుందా? ఇంత సున్నితమైన అంశాన్ని చంద్రబాబు ఎందుకు ఇంత ఘోరంగా ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు? ఆయన టైమ్‌లో జరిగిన కల్తీని వైఎస్సార్సీపీకి అంటగట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయా సందర్భాల్లో కొన్ని కమిటీలు, కమిషన్లు వేసినా అవి తూతూ మంత్రంగానే సాగాయి. ఉదాహరణకు రాజమండ్రిలో పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. అది కూడా చంద్రబాబు కుటుంబం స్నానాల ఘట్టం షూటింగ్ తీసే సందర్భంలో అయితే ,ఆయన నియమించిన విచారణ కమిషన్ మాత్రం క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. తప్పు భక్తులది, మీడియాది ఫలానా టైమ్ మంచి ముహూర్తమని ప్రచారం చేయడంవల్లే తొక్కిసలాట జరిగిందని ఆ కమిషన్ చెప్పిందే తప్ప, చంద్రబాబు ఆ స్నానాల ఘట్టానికి వెళ్లడం తప్పని చెప్పలేకపోయింది. అంత పెద్ద ఘటనలో ఒక్క పోలీస్ కానిస్టేబుల మీద కూడా చర్య తీసుకోలేదు. పైగా సీసీ టీవీ పుటేజిని మాయం చేసినా ఎవరికీ ఇబ్బంది రాలేదు. అలాగే కాపుల రిజర్వేషన్ అంశంపై మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. తీరా మంజునాథ్ తన ఆలోచనలకు భిన్నంగా నివేదిక ఇస్తారని తెలిసిన చంద్రబాబు ఆ కమిటీ సభ్యులతో వేరే నివేదిక తెప్పించి శాసన సభలో పెట్టారు.ఇలా పలు విషయాల్లో చంద్రబాబు టైమ్ లో వేసిన కమిటీలు ఉత్తుత్తి కమిటీలుగానే మిగిలిపోయాయి. శ్రీవారి ప్రసాదం మీద వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు, సుప్రీంకోర్ట్ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తుంటే చంద్రబాబు మాత్రం సింపుల్ గా సిట్ వేసి చేతులు దులుపుకున్నారు. మొదట తాను చేసిన రభస వల్ల తనకే నష్టం జరిగిందని, తన ప్రభుత్వమే ఆత్మరక్షణలో పడిందన్న భయంతోటి ఇలా చేస్తుండవచ్చు. లేదంటే అందరూ కోరుకున్న విధంగా సిబిఐ లేదా ఒక జడ్జి నేతృత్వంలో విచారణకు అంగీకరించేవారు. అలా చేయకపోవడంతో అందరి వేళ్లు ఆయనవైపే చూపెడుతున్నాయి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.ఇదీ చదవండి: Tirupati Laddu Controversy: బాబూ మీరు కొన్నది రూ. 276కే -
తాము తీసుకున్న గోతిలోనే.. బాబు అండ్ కో!
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం సృష్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు వంత పాడిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అదే భజన చేసిన ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి మొదలైనవి తాము తీసిన గొయ్యిలో తామే పడ్డట్టుగా అయింది. మాజీ ముఖ్యమంత్రిపైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పైనా బురద చల్లాలన్న తాపత్రయంతో, దురుద్దేశంతో వీరంతా కలిసి చేసిన కుట్ర బహిర్గతమవుతోంది. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చర్చను వేరే అంశాలపైకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.ఈనాడు, ఆంధ్రజ్యోతిలు స్వరం మార్చి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న వార్తల బదులు ఇంకేవేవో కథనాలు ఇస్తూ పాఠకుల్ని దారి మళ్లించాలని ప్రయత్నిస్తోంది. వివాదం మొదలైన మొదటి రెండు రోజులపాటు రెచ్చిపోయి కథనాలు గుప్పించిన వీరు సోమవారం నుంచి రివర్స్‌లో వెళుతున్నారు. ఇందుకు కొన్ని స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలించిన 2014-19 టైమ్‌లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం రూ.300 కంటే తక్కువ ధరకే నెయ్యి కొనుగోలు చేసినట్లు స్పష్టం కావడం ఒకటైతే.. నేతికన్నా ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ వంటివి అధిక ఖరీదు కలిగినవని వెల్లడి కావడం ఇంకో కారణం.ఈ ఏడాది జులైలో ఏఆర్ కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో నాలుగు ట్యాంకర్లను తిరస్కరించి మిగతావి అనుమతించారు. ఈవో శ్యామలరావు ఏమో కల్తీ నెయ్యిని వాడలేదని చెబితే, వాడేశారని చంద్రబాబు వాదించారు. ఇదే నిజమైతే ఆయన నియమించిన ఈవో శ్యామలరావే బాధ్యులవుతారు కదా. ఆయన్ను వెంటనే పదవి నుంచి తప్పించాలి కదా? సస్పెండ్ చేయాలి కదా? అలాగే నెయ్యిలో కల్తీ ఉన్నప్పటికీ లోపలికి అనుమతించిన ఇతర అధికారులపై వేటు వేయాలి కదా? ఏఆర్ కంపెనీపై కేసు వేయాలి. ఇవేవీ చేయకుండా రెండు నెలలపాటు కథ నడిపి వందరోజుల పాలన సందర్భంగా ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని నీచమైన ఆరోపణ చేయడమేంటి? చంద్రబాబు ఇక్కడే దొరికిపోయారు. కాకపోతే తన మీడియా మద్దతుతో రెండు మూడు రోజులు దబాయించగలిగారు అంతే. ఒక అబద్ధాన్ని చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి మరిన్ని అబద్ధాలు ఆడారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు అంగీకరిస్తున్నట్టు చెప్పకపోవడం, సిట్ అంటూ కొత్త నాటకానికి తెరతీయడం, మరోవైపు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేయడం, అందులో చంద్రబాబుపై నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వతంత్ర విచారణ కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరో మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆలయం ఎదుట ప్రమాణం చేస్తుంటే పోలీసులు అడ్డుపడిన తీరు కూడా సందేహాలకు తావిస్తోంది. సుబ్బారెడ్డి విసిరిన సవాలుకు చంద్రబాబు ముందుకొచ్చి ప్రమాణం చేయకపోవడం అనుమానం కలిగించే అంశమే. పదకొండు రోజులు దీక్ష చేస్తానన్న పవన్ కల్యాణ్ రెండో రోజే తన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్లో పాల్గొనడం గమనార్హం. అంటే ఆయన కూడా ఇందులో నిజం లేదన్న భావనకు వచ్చి ఉండాలి. వీటన్నిటి రీత్యా చంద్రబాబు అండ్ కో తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టయిందన్న భావన కలుగుతోంది. కోట్లాది మంది హిందువుల, తిరుమలలేశుని భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే దెబ్బతీశారన్న విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం ఎన్డీడీబీకి తిరస్కృత నెయ్యి శాంపిల్స్ పంపినప్పుడు దాన్ని సరఫరా చేసిన కంపెనీ వారికి కూడా ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా చేసినట్టు కనిపించడం లేదు. అలాంటప్పుడు టెస్టింగ్‌కు ఆ కంపెనీ నమూనాలే పంపారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించవచ్చట. ఏఆర్ కంపెనీకి టీటీడీ ఇచ్చిన నోటీసులో విజిటబుల్ ఫాట్ ఉందని చెప్పడం గమనార్హం. చంద్రబాబు చెబుతున్నట్లు జంతువుల కొవ్వు కల్తీ జరిగి ఉంటే అదే విషయాన్ని నోటీసులో ప్రస్తావించాలి కదా!. అంటే చంద్రబాబు చెప్పింది తప్పే అవుతుంది కదా!. గతంలో చంద్రబాబులో టైమ్‌లోగానీ, ఆ తర్వాత వైఎస్ జగన్ సమయంలోగానీ ఇలా నెయ్యి ట్యాంకర్లను నాణ్యత సరిగా లేదని తిరుపతిలో జరిగే పరీక్షల్లో తేలితే వెనక్కి పంపించే వారు. ప్రత్యేకంగా ఏ ఎన్డీడీబీకో, మరొక సంస్థకో పంపి పరీక్షలు జరిపేవారు కాదు. అలాంటప్పుడు ఏఆర్ కంపెనీకి సంబంధించి శాంపిల్స్‌నే ఎందుకు గుజరాత్ దాకా పంపించారనే ప్రశ్న వస్తోంది. పోనీ ఎన్డీడీబీ వారైనా నిర్దిష్టంగా ఫలానా కల్తీ జరిగిందని చెప్పారా? లేదు. అటువంటప్పుడు జంతు కొవ్వు కల్తీ జరిగిందని, దానిని లడ్డూలలో వాడారని చంద్రబాబుకు ఎవరు చెప్పారు?.మంత్రి లోకేష్ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదని చెబుతుంటే తండ్రి చంద్రబాబు వాడారని చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజం? గతంలో రివర్స్ టెండర్లు ఎందుకు అని ప్రశ్నించిన చంద్రబాబు తాజాగా అదే పద్ధతిలో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ను ఎందుకు కేటాయించరన్న ప్రశ్న కూడా వస్తోంది. అందుకే ఈ కంపెనీకి ఫేవర్ చేయడం కోసం, ఏఆర్ కంపెనీని తప్పించడానికి నెయ్యిలో జంతువు కొవ్వు అవశేషాలున్నాయనే ఆరోపణ తెరమీదకు తెచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. గత నెలలో పిలిచిన టెండర్లలో నందిని సంస్థ కిలో నెయ్యి రూ. 470కి కోట్ చేయగా ఢిల్లీలోని ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ రూ. 530కు కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. ఆ తర్వాత కారణమేమైనాగానీ రివర్స్ టెండర్ లోకి వెళ్లారు. నిజానికి ఈ సిస్టమ్‌లో రివర్స్ టెండర్ కు అవకాశం లేదట. ఈ సారి ఆల్ఫా కంపెనీ రూ. 450, నందిని రూ. 470 కోట్ల చేశాయి. ఈ టెండర్లో ఆల్ఫాకు 65 శాతం నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు. నందిని సంస్థ వివాదం లేవనెత్తకుండా ఉండాలనే వారికి కూడా కేటాయించారు. ఇక్కడ విషయం ఏమిటంటే కిలో నెయ్యి రూ. 1000 నుంచి రూ. 1500 లదాకా ఉంటే మరిప్పుడు ఆ రెండు సంస్థలు చంద్రబాబు చెబుతున్న థియరీ ప్రకారం ఇంత తక్కువ ధరకే ఎలా కోట్ చేశారన్నదానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని, ఆయన అసత్యాలకు ఒక చరిత్ర వుందని కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. మతపరమైన వివాదాలను సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధికి చంద్రబాబు ప్రయత్నించారనే విషయం స్పష్టంగా కనపడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్న చంద్రబాబు ఐదేళ్లు పాలించలేడని సుబ్రహ్మణ్యంస్వామి అంటున్నారు. మామూలుగానైతే ఇంత ఘోరమైన అపచారానికి పాల్పడ్డ వ్యక్తి పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్ వస్తుంది. చంద్రబాబు తాను సృష్టించుకున్న సుడిగుండం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజులుగా రెచ్చిపోతూ ఉన్నవి లేనివి అన్నీ కలిపి విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో తన గురించి తాను పొగుడుకుంటూ ఏకంగా తాను దేవుడి ప్రతినిధిని అన్నట్టుగా మాట్లాడుతుండడం సంచలనంగా ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ నెయ్యితో తయారవుతోందని దారుణంగా వ్యాఖ్యానించారు. విశేషమేమిటంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కల్తీ వ్యవహారం జరిగినప్పటికీ ఆయన వ్యూహాత్మకంగా వైఎస్సార్సీపీపైనా, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామే తనతో నిజాలు చెప్పించారని ఆయన వెల్లడించడం పరాకాష్టగా భావించాలి. మామూలుగా కొంతమంది అతితో ఉండే భక్తులు, పూనకం వచ్చినవారు, భవిష్యత్తు వాణి చెబుతామనేవారు.. అటువంటివాళ్లే తాము దేవునికి ప్రతినిధులుగా, దేవుడే మాట్లాడిస్తున్నామని చెబుతుంటారు. చంద్రబాబును ఆ మాట అనలేముగానీ, ఆయన మాట్లాడిన తీరు చూస్తే అలా అనిపించే అవకాశముంది.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, వైఎస్సార్సీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్న తాపత్రయంలో తానేమి మాట్లాడుతన్నారో ఆయన తెలుసుకోలేకపోతున్నారు. అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న ఈయన, తిరుమలకు అపచారం కలిగించేలా తిరుమలేశుడిపై అపనమ్మకం పెరిగేలా దుష్ప్రచారం చేశారు. పైగా ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతున్నదని ఇంత పెద్ద అపచారం జరిగిన నేపథ్యంలో సంప్రోక్షణ గురించి మఠాధిపతులతో మాట్లాడతానని చెబుతున్నారు. హిందువులను రెచ్చగొట్టడంతో పాటు, తిరుమల ప్రసాదం లడ్డూ వివాదాన్ని మరి కొంతకాలం కొనసాగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది ఆయన దురుద్దేశంగా కనిపిస్తోంది.జూన్ 4న ఆయన అధికారంలోకి వచ్చారు. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మొత్తం అధికార యంత్రాంగమంతా 4వ తేదీ నుంచే ఆయన అధీనంలోకి వెళ్లింది. జులై నెలలో నాణ్యతలేని ట్యాంకర్లను వెనక్కి పంపించడం ఆ తర్వాత నివేదిక తెప్పించడంవంటివి జరిగాయి. నాణ్యత లేని టాంకర్లను వెనక్కి పంపించామని, ఈఓ చెబితే, అబ్బేబ్బే.. లేదు.. ఆ నెయ్యిని లడ్డూలలో వాడారని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే ఇలాంటి చర్యకు పాల్పడ్డ ఈఓని, ఇతర సంబంధిత అధికారులను చంద్రబాబు సస్పెండ్ చేయాలి కదా?. కేసులు పెట్టాలి కదా? ఏదో మతలబు లేనిదే చెన్నైలో ల్యాబ్‌లు అందుబాటులో వుంటే గుజరాత్‌కు పనిగట్టుకొని ఎందుకు పంపించారు? ఎన్డీడీబీ ఎండీ తిరుమల ఈవోను, మరికొంత మంది ప్రముఖులను ఎందుకు కలిశారు? ఆ తర్వాతనే ఈ టెస్టుల తతంగం జరగడంలోని ఆంతర్యం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.విశేషమేమిటంటే చంద్రబాబు నిజాలు చెబుతారా లేదా అన్నదానిపై గత మూడున్నరదశాబ్దాలుగా ప్రజల్లోగానీ, రాజకీయవర్గాల్లో గానీ చర్చజరుగుతోంది. చంద్రబాబుతో స్వామివారు సైతం నిజం చెప్పించలేరని కొంతమంది చమత్కరిస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, విభజిత ఏపీ అసెంబ్లీలోగానీ పలువురు ఈ అంశం గురించి మాట్లాడుతూ చంద్రబాబు అలవోకగా అబద్ధాలు ఆడుతుంటారని వ్యాఖ్యానిస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో శాసనసభలో మాట్లాడుతూ చంద్రబాబు కన్నార్పకుండా అబద్ధాలు చెప్పగలరని, నిజం మాట్లాడితే తల వక్కలవుతుందనే మునిశాపం ఆయనకు వుందని ఎద్దేవా చేసేవారు. అప్పటినుంచీ ఈ డైలాగు బాగా ప్రసిద్ధిగాంచింది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు రాజకీయంగా గానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల విషయంలోగాన మాట మార్చడం, అబద్ధాలు చెప్పడం సర్వసాధారణం అన్న అభిప్రాయం నెలకొంది.ఉదాహరణకు ఉమ్మడి అసెంబ్లీలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టెండర్‌కు సంబంధించి వైఎస్సార్ హయాంలో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. చర్చకు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులో మొదట వేయికోట్లని రాసి, పదమూడు వందల కోట్లుగా మార్చారు. ఆ విషయాన్ని చీఫ్ విప్‌గా వున్న కిరణ్ కుమార్‌రెడ్డి లేవనెత్తారు. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఇచ్చిన ఏంటంటే తాము కావాలనే సంఖ్యను మార్చామని చెప్పారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా చంద్రబాబుపై విరుచుకుపడి ఆయన గుణమే అంత అని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బాగా రభస అయింది. చంద్రబాబు చేసిన తప్పునకు టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పక్షాల సభ్యులు తల పట్టుకున్నారు.డెయిరీ రంగంలో సొంతంగా హెరిటేజ్ పరిశ్రమను కలిగిన చంద్రబాబు 320కే నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పాల నుంచి కేవలం నెయ్యే కాకుండా పాలను ఇతర ఉత్పత్తుల అమ్మకం ద్వారా లోటును కవర్ చేసుకుంటారన్న సంగతి ఈయనకు తెలియదా? పోనీ ఇది తక్కువ ధర అనుకున్నా ఆయన పాలించిన 2014-19 మధ్య కిలో నెయ్యి 276కే మహారాష్ట్రలోని గోవిందా పాల ఉత్పత్తుల కంపెనీకి ఎలా టెండర్ ఖరారు చేశారు? అంటే అప్పుడు కూడా కల్తీ జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా!ఆనాడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు ( నందిని) ఎందుకు టెండర్‌ను ఇవ్వలేదు. ఇలాంటివాటికి ఏమీ సమాధానం ఇవ్వకుండా తనతో వెంకటేశ్వరస్వామి నిజాలు చెప్పించారని బుకాయిస్తే సరిపోతుందా?. తీరా చూస్తే ఆయన చెప్పినవి అసత్యాలేనని తేలుతోంది. ఆయన కుమారుడు లోకేషే కల్తీ నెయ్యితో ఉన్న టాంకర్లలోని సరుకు వాడలేదని ట్వీట్ చేశారు. దీంతో చంద్రబాబు నిజం చెప్పలేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆనాడు టిటిడి ఏర్పాటు చేసిన ధరల కమిటీలో ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా వున్న పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డి వున్నారు. వీరిద్దరూ ఆ రోజుల్లో వైఎస్సార్సీపీకి చెందినవారు. తదుపరి అంటే 2024లో టీడీపీలోకి వచ్చారు. మరి వీరిని ఇప్పుడు టీటీడీలో అవకతవకలకు బాధ్యులని చెప్పి తప్పించగలరా?అలాగే బీజేపీకి చెందని నేత వైద్యనాధన్ కూడా కమిటీలో వున్నారు. టీటీడీలో బీజేపీ సభ్యులుకూడా వున్నారని వైఎస్సార్సీపీ ప్రస్తావిస్తే దాన్ని బ్లాక్ మెయిల్ అని ఎల్లో మీడియా భాష్యం చెప్పడం విచిత్రంగా వుంది. అసలు విశేషం ఏమిటంటే నెయ్యి కన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతున్న పిష్ ఆయిల్, పిగ్ ఫాట్ వంటివాటి ఖరీదు చాలా ఎక్కువట. ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి ఆ వివరాలు చెబుతూ జంతు కొవ్వు వెయ్యి నుంచి 1400 రూపాయలు ఉంటే 320 రూపాయల ఖరీదుఉన్న నేతిలో ఎవరైనా కలుపుతారా? అని ప్రశ్నించారు. రాగిలో బంగారం కలుపుతారా?. బంగారంలో రాగి కలుపుతారా? పాలలో నీళ్లు కలుపుతారా . నీళ్లలో పాలు కలుపుతారా? అన్న అర్ధవంతమైన ప్రశ్న వేశారు. దీనికి చంద్రబాబు అండ్ కో ఏమి చెబుతారో చూడాలి.ఆ విషయానికి వస్తే 1995లో ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్ని రకాలుగా మాటలు మార్చారో అందరికీ తెలిసిందే. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మసీదులు కూల్చేపార్టీగా అభివర్ణించారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బిజెపితో పొత్తుపెట్టుకోనని అన్నారు. నరేంద్ర మోదీని నర హంతకునిగా ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోదీని హైదరాబాద్ రానీయనని హెచ్చరించేవారు. అయినా మళ్లీ 2014లో మోదీ ఎక్కడుంటే అక్కడకు వెళ్లి బతిమలాడుకొని మరీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. 2018లో బీజేపీ నుంచి విడిపోయి మోదీని టెర్రరిస్టు, ముస్లింలను బతకనీయడు, పెళ్లాన్ని ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఏలుతాడు అని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. తిరిగి 2024 నాటికి మోదీ అంతటి గొప్పవాడు లేడని ప్రకటించాడు. మరి వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అంటే ఏం చెప్పగలం.సోనియా గాంధీని దెయ్యం , భూతం అని తిట్టారు. కానీ ఆ తర్వాత ఆమెతో కలిసి రాజకీయ సభల్లో పాల్గొని పొగిడారు. లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని వాగ్ధానం చేసి ఆ తర్వాత దాన్ని నెరవేర్చకపోగా మొత్తం రుణమాఫీ చేశామని దబాయించేవారు. తమ రాజకీయ అవసరాల కోసం మాట్లాడే చంద్రబాబు మాటలు నిజాలా అబద్ధాలా అనేది పక్కన పెడితే, ఎలాగైనా మాట మార్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు వైఎస్ జగన్ పై ఎదురు దాడి చేస్తూ ప్రధానికి లేఖ రాయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించడం చిత్రంగా వుంది. వైవీ సుబ్బారెడ్డి భార్య పక్కా హిందువు అయితే ఆమెకు క్రైస్తవ మతం అంటగట్టి స్టేట్మెంట్ ఇచ్చారు.మరో వైపు తన క్యాబినెట్లోనే హోంమంత్రిగా వున్న వ్యక్తి ఒకసారి తను క్రిస్టియన్ అని, మరొకసారి హిందూమతం అని చెప్పుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారని చంద్రబాబు ఆరోపిస్తారు. మరో వైపు ఒక క్రిస్టియన్‌ను వివాహమాడి, పిల్లలకు సైతం క్రిస్టియన్ పేర్లనే పెట్టిన పవన్ కల్యాణ్ చాలా గొప్ప హిందువు అని సర్టిఫికెట్ ఇస్తుంటారు. చంద్రబాబు స్వయంగా క్రైస్తవ సమావేశానికి వెళ్లి ఏసుక్రీస్తును నమ్మినవారికి అపజయం లేదని సూక్తులు చెప్పారు. కానీ ఇప్పుడేమో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నిజానికి మతమన్నది వ్యక్తిగతం. కానీ చంద్రబాబు లాంటివారు తమ స్వార్ధ రాజకీయాల కోసం కులం, మతం, నిజాలతో సంబంధం లేకుండా వాడేసుకోగలరని అనిపిస్తుంది.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
డైవర్షన్ బాబుకి దెబ్బపడింది అక్కడే!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి పార్టీ అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయి. ‘‘సూపర్ సిక్స్’’ అంటూ అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి పాలన ఈ వందరోజుల్లో ఎలా ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగానే తానిచ్చిన హామీల అమలుకు ప్రయత్నించారా? లేదా... గతంలో మాదిరిగానే ఈ సారి కూడా వాటిని ఎలా ఎగవేయాలన్న ఆలోచనల్లోనే ఉండిపోయారా?... ఇవీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల్లో మెదలుతున్న సందేహాలు, సంశయాలు! హామీల అమలులో తన వైఫల్యం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చేందుకు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయాన్ని తెరపైకి తెచ్చిన తన తుచ్ఛ రాజకీయ నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని అనాలి.తాను అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఘటనకు కూడా జగన్ ప్రభుత్వంపై తోసివేయడంలో బాబుకు మించిన వారు ఇంకోకరు ఉండరేమో. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి సూపర్ సిక్స్ తదితర హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. తన అనుభవాన్నంతా ఉపయోగించి సంపద సృష్టిస్తానని.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఊదరగొట్టారు. ఈవీఎంల మాయాజాలమో.. ప్రజలు నిజంగానే బాబు మాటలను నమ్మి ఓటేశారో స్పష్టంగా తెలియదు కానీ.. అధికారమైతే కూటమికి దక్కింది. దురదృష్టం ఏమిటంటే.. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలా అన్న ప్రయాసే బాబు, కూటమి నేతల్లో కనపడింది. అసెంబ్లీ వేదికగా బాబు మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉందని.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేందుకు భయమేస్తోందని మాట్లాడటమే ఇందుకు ఒక నిదర్శనం. వంద రోజులలో చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వాగ్దాన భంగం కాకుండా జరిగిందేమిటని ఒకసారి తరచి చూస్తే... విధ్వంసం, విద్వేషం, వక్రభాష్యాలు, హింస, దౌర్జన్యకాండ, అత్యాచారాలు, రెడ్ బుక్ రాజ్యంగం, పగ, ప్రతీకారాలే కనిపిస్తాయి. వీటన్నింటితో ఈ వందరోజుల్లో ప్రజలు ఏనాడూ ప్రశాంతంగా ఉండలేకపోయారు. అయినా సరే.. ఈ ప్రభుత్వం చాలా మంచిదని భాగస్వాములతో కలిపి కూటమి ప్రకటించుకుంది. నిర్భీతిగా ప్రచారం చేసుకుంటోంది. చంద్రబాబు ఒకపక్క ఖజానా ఖాళీ అంటూనే.. ఈ రకమైన తప్పుడు ప్రచారాలకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూండటం ఆశ్చర్యకరం. సూపర్ సిక్స్ హామీల్లో వృద్ధుల ఫింఛన్‌ను వెయ్యి రూపాయల చొప్పున పెంచడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు మినహా మిగిలిన వాటినేవీ అమలు చేసినట్లు కూటమి సైతం చెప్పుకోలేకపోయింది. ప్రచార ప్రకటనల్లోనూ మొక్కుబడిగా వీటిని ప్రస్తావించారు.విజయవాడలో వరద బాధితుల కష్టాలు ఇప్పటికీ తీరకపోయినా, చంద్రబాబు వరదలపై విజయం సాధించారని చెప్పుకుంటున్నారు. అసలు వరదలు వచ్చిందే బాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల అని, బుడమేరు రెగ్యులేటర్‌ను ముందస్తు హెచ్చరికల్లేకుండా అకస్మాత్తుగా విజయవాడ మీదకు వదలి ప్రజలను నానా యాతనకు గురిచేసి, ఇప్పుడు విజయం సాధించామని అంటున్నారు. కరకట్ట మీద తన అక్రమ నివాసం పూర్తిగా మునిగిపోకుండా, అమరావతిలోనే పలు ఇతర ప్రాంతాలు వరద మయం కాకుండా ఉండడానికి ఈ వరదలను సృష్టించారన్న విమర్శలను కప్పిపుచ్చడానికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేసిందన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కుట్రలు,కుతంత్రాలు చేయడం తప్ప, తాము చెప్పినవాటిలో ఫలానా స్కీము అమలు చేశామని చెప్పుకోలేని దుస్థితి కూటమి ప్రభుత్వానిది. పోనీ ఫలానా అభివృద్ది కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కూడా ఆ ప్రకటనల్లో తెలపలేకపోయారు. వృద్దాప్య పెన్షన్లు ఒక వెయ్యి పెంచినా, లక్షలాది మందికి కోత పెడుతున్నారు.అన్నా క్యాంటీన్ లలో ఐదు రూపాయలకు భోజనం పెడుతూ లక్షల మంది ఆకలి తీర్చుతున్నామని చెప్పుకున్నారు. రోజూ ఒక క్యాంటీన్ లో వంద నుంచి మూడు వందల మంది తింటే.. లక్షల ప్రజల ఆకలి ఎలా తీరుతుందో తెలియదు. చంద్రబాబు ప్రకటించిన వాటిలో కీలకమైన తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు భరోసా వంటి వాటి గురించి ప్రస్తావనే లేదు. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు, రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 20 వేలు ఇస్తామని ఇచ్చిన హామీలపై నోరెత్తితే ఒట్టు. అందుకే సోషల్ మీడియాలో వాటిపై జోకులే జోకులు!! ఇవన్నీ ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి ప్రజల గొంతు నొక్కడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఇంకో ఎత్తు. గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అద్వాన్నపాలనను సాగిస్తూ చంద్రబాబు అప్రతిష్ట పాలవుతున్నారు.కాకపోతే పవన్ కళ్యాణ్‌ను, బీజేపీని పూర్తిగా లోబరచుకుని అటువైపు నుంచి ఎలాంటి ప్రశ్నలు రాకుండా చేసుకుంటున్నారు. చంద్రబాబు ఇంతకుముందు చేసిన పద్నాలుగేళ్ల పాలన లో అన్యాయాలు, అక్రమాలు జరిగాయి కానీ మరీ ఇంత నీచంగా లేదు. జగన్ తీసుకువచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, ఇంటి వద్దకే రేషన్..తదితర వ్యవస్థలను రద్దు చేసి ప్రభుత్వాన్ని తిరోగమనం వైపు నడుపుతున్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం పదివేలకు పెంచుతామని చెప్పి, ఇప్పుడు అసలుకే మోసం తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఏమవుతుందో తెలియదు సీబీఎస్ఈ, టోఫెల్ వంటి వాటిని ఎత్తివేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాజకీయ ప్రత్యర్ధులపై దమనకాండ సాగించారు.ఎన్నడూ లేని రీతిలో కొన్ని వేల దాడులు, దౌర్జనాలు ఈ వంద రోజులలో జరిగాయి. శాంతిభద్రతలు ఏపీలో ఇంత ఘోరంగా ఎన్నడూ లేవు. కాకపోతే ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ చేయడానికి మాత్రం గట్టిగానే పూనుకున్నారు. ఇక ఏపీలో ఊరువాడ మద్యం షాపులు రాబోతున్నాయి. తాగినోడికి తాగినంత అన్నట్లుగా తయారు చేస్తున్నారు. తన ప్రభుత్వ వైఫల్యాలను,హామీల ఎగవేతను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు మాత్రం కొనసాగిస్తున్నారు.అందులో అత్యంత నీచమైంది తిరుమల ప్రసాదం లడ్డు వివాదం. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా తిరుమల లడ్డూపై కామెంట్ చేసి ఉండరు. లడ్డూలో వాడిన నేతిలో జంతువుల కొవ్వు కలుస్తోందని ఆరోపిస్తూ, జగన్ ప్రభుత్వంపై నెట్టే యత్నం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై అయిన నేయి క్వాలిటీపై అనుమానాలు వస్తే దానిని గత ప్రభుత్వానికి ఆపాదించడం చంద్రబాబు తెలివితేటలకు అద్దం పడుతుంది. తిరుమలకు అపచారం చేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోతారేమో! అందుకే చంద్రబాబుది ఎప్పుడూ దుర్బుద్దే అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఒకవైపు జగన్ పై ఈ విషయాలలో ఆరోపణలు చేస్తూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తుండగా, జగన్ మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా టిటిడిలో ఉన్న ప్రమాణాలు, నాణ్యతకు సంబంధించిన పరీక్షల తీరు మొదలైనవాటిని వివరించారు. చంద్రబాబు 20142019 మధ్య టరమ్ లో ఇలా నాణ్యతమీద సందేహాలు వచ్చినప్పుడు పద్నాలుగుసార్లు నేతి టాంకర్లను వెనక్కి పంపారని, తన హాయంలో ఇది పద్దెనిమిదిసార్లు జరిగిందని,అయినా లడ్డూలో ఏదో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్యమైన తిరుమల శ్రీవెంకటేశ్వుడి పట్ల పాపం చేయవద్దని జగన్ కోరారు. చంద్రబాబు ,పవన్ లు కలిపి సుమారు 200 హామీలు ఇచ్చారు.వాటిని అమలు చేయడానికి వారికి చిత్తశుద్ది లేదు.అవి ఆచరణ సాధ్యం కానివని తెలిసినా,జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా దెబ్బతీయాలని లక్ష్యంతో ఇచ్చిన హామీలవి.ఈ మూడునెలల కాలంలోనే సుమారు 27వేల కోట్ల అప్పుచేసి, అమరావతి పేరుతో మరో పదిహేనువేల కోట్ల అప్పునకు సిద్దం అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం నిత్యం కుట్రలు,కుతంత్రాలతో కాలం గడుపుతూ ,అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ,ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది.అందువల్లే ప్రజలలో వంద రోజుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం అని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నా,ప్రజలు మాత్రం ఇది మహా వంచన ప్రభుత్వంగా పరిగణిస్తున్నారని చెప్పాలి.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం
లడ్డూ ప్రసాదంపై బాబు మతిలేని ప్రేలాపనలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా మతి ఉండే మాట్లాడుతున్నారా?. ఈ అనుమానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల్లో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఉత్తిపుణ్యానికి ఎలాంటి పుకార్లు సృష్టిస్తారో అస్సలు తెలియకుండా పోతోంది. తెలుగువాళ్లకు మాత్రమే కాదు.. దేశ ప్రజలందరికీ ఆరాధ్యదైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఈ కోవకే చెందుతాయి. నిజానికి ఈ వ్యాఖ్యలు ఆయన నీచత్వానికి పరాకాష్ట అని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న బాబు.. తన హోదాను కూడా మరచిపోతున్నారని, అట్టడుగు స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని ప్రజలు.. ముఖ్యంగా శ్రీవారి భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ కులదైవాన్ని కించపరుస్తున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ఎన్డీయే కూటమి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడారని అనడం సర్వత్రా సంచలనమైన చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఇంతటి తీవ్రమైన ఆరోపణ చేసే ముందు చంద్రబాబు వాస్తవాలను ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకుని ఉండాల్సింది. ఒకవేళ నిజంగానే అలా జరిగి ఉంటే బాధ్యులపై తీసుకున్న చర్యలను చెప్పి ఉండవచ్చు. తగిన ఆధారాలు చూపడం ద్వారా తన వ్యాఖ్యలకు బలం చేకూర్చి ఉండవచ్చు. బాబు గారు ఇవేవీ చేయలేదు సరికదా.. ఇష్టారీతిన మాట్లాడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సమావేశంలోనే ఉన్న బీజేపీ, జనసేన నేతలు కూడా చంద్రబాబు వ్యాఖ్యలపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం!. నోరెత్తలేని దయనీయ స్థితిలో ఉన్నారన్నమాట కూటమి భాగస్వాములు!. దేశంలో హిందూ మతానికి తామే హక్కుదార్లు అన్నట్టు వ్యవహరించే బీజేపీ నేతలు కూడా చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. జన సేనాధిపతి పవన్ కళ్యాణ్ సరేసరి! ప్రతిపక్ష నేతగానూ టీటీడీపై నిత్యారోపణలు.. చంద్రబాబు టీటీడీపై ఆరోపణలు చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు రకరకాల ఆరోపణలు చేసేవారు. అబద్ధాలని పదే పదే స్పష్టమైనా ఆరోపణల పర్వం మాత్రం ఆగేది కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రజల్లో లేనిపోని అనుమానాలను రేకెత్తించేందుకు టీటీడీని వాడుకునే వారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్నారంటూ వ్యాఖ్యానించేవారు. కానీ ఇప్పుడు అంటే బాబు గారు అధికారం చేపట్టిన తరువాత అక్కడ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి.తిరుమల కాటేజీల్లో పారిశుద్ధ్య సమస్యలను ఎత్తిచూపుతూ ఓ భక్తుడు ఇటీవలే ఒక వీడియో పంపిన విషయం ప్రజలకు తెలిసే ఉంటుందది. జగన్ హయాంలో తిరుమల్లో చీమ చిటుక్కు మన్నా ఉన్నవి లేనివీ కల్పించి మరీ అసత్యాలను ప్రచారం చేసిన తెలుగుదేశం ‘ఎల్లో’ మిత్రులు ఈనాడు, ఆంధ్రజ్యోతుల నోళ్లిప్పుడు మాత్రం మూగబోయాయి. అప్పట్లో దేవాలయాలపై దాడులు అంటూ టీడీపీ వర్గాలు కొన్ని కల్పిత గాధలను సృష్టిస్తే.. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఈ పత్రికలు వాటికి విపరీతమైన ప్రచారం కల్పించేవి. అయితే ఇలాంటి కొన్ని ఘటనల్లో టీడీపీ వాళ్లే దేవుడి బొమ్మలు ధ్వంసం చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవడం గమనార్హం. ఇప్పుడు కూడా టీడీపీ వర్గాలు చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోతూండటాన్ని కప్పిపుచ్చేందుకు లడ్డూ ప్రసాదంపై అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారని అనిపిస్తోంది. తగ్గట్టుగానే అనుకూల మీడియా కూడా అస్తవ్యస్త పరిస్థితులు ఎన్ని ఉన్నా.. అంతా బాగా ఉందన్న కలరింగ్ ఇచ్చేందుకు ఆపసోపాలూ పడుతున్నాయి. విశేషం ఏమేమిటంటే లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని వ్యాఖ్యానించిన రోజు చంద్రబాబు అనుకూల మీడియా కూడా అంతగా నమ్మినట్లు లేదు. ఆ వ్యాఖ్యలను హైలైట్ చేయకపోవడం ఇందుకు నిదర్శనం. చంద్రబాబు మాటల్ని ప్రస్తావించకుండా, ప్రచారం కాకుండా జాగ్రత్త పడినట్లున్నారు. అయితే నా వ్యాఖ్యలను ఎందుకు హైలైట్ చేయలేదని బాబు గారికి కోపం వచ్చిందో ఏమో.. ఓ దిక్కుమాలిన రిపోర్టు అంటూ ఎవరో అనామకుడు చేసిన వ్యాఖ్యలను తమ పత్రికలో బ్యానర్లుగా ప్రచురించి ‘బాబు’ భక్తిని నిరూపించుకున్నాయి ఆ ఎల్లో పత్రికలు!. టీటీడీ అధికారులు పరీక్షలు నిర్వహించి తగు ప్రమాణాలు లేని, వెజిటబుల్ ఫ్యాట్ అని సందేహం వచ్చిన నేతి టాంకర్లను వెనక్కి పంపిస్తే, మరి లడ్డూలలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అనడం ఏమిటి? తిరుమలలో నిజంగా జంతువుల కొవ్వు వాడి ఉంటే లడ్డూలు పాడు వాసన కొడతాయి. వంటశాల ‘పోటు’లో పనిచేసే వైష్ణవ సంప్రదాయ బ్రాహ్మణులు ఇట్టే కనిపెట్టే వారు. తన వ్యాఖ్యలతో బాబు వారిని కూడా శంకించినట్లు అయ్యింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రెండు నెలల క్రితం అంటే జూలైలోనే వెజిటబుల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్లు గుర్తించి సరఫరాదారులపై చర్య తీసుకున్నామని ఆలయ ఎగ్జిక్యుటివ్ అధికారి శ్యామలరావు ప్రకటించడం. అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే తప్పు జరిగిందన్నమాట!. నీచ రాజకీయాలకు పరాకాష్ట... లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు నీచ రాజకీయాలకు పరాకాష్ట అని టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు హిందువుల విశ్వాసాలను, తిరుమల పవిత్రతను దారుణంగా దెబ్బతీశారని, అతిపెద్ద పాపానికి ఒడిగట్టారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మనిషి పుట్టుక పుట్టినవారు ఎవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరంటూ ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి కుటుంబంతోసహా తాను సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు కూడా తన కుటుంబంతో కలిసి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి సవాల్‌కు చంద్రబాబు స్పందించలేదు. కానీ, ఆయన కుమారుడు లోకేష్ రియాక్ట్ అయ్యారు. అయితే అది డబాయింపు మాదిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది..చంద్రబాబు సెంటిమెంట్ అనే పదాన్ని తరచు వాడినా.. ఆయనకు ఏ సెంటిమెంట్ లేదని కొందరు విమర్శిస్తారు. ఈనాడు రామోజీరావు, రాధాకృష్ణలకు వ్యాపారం తప్ప సెంటిమెంట్ అనే పదం తెలియదని చెబుతారు. కాని రామోజీ కుమారుడు కిరణ్‌కు దైవభక్తి మెండు అని అంటారు. మరి ఆయన సైతం తన పత్రిక ద్వారా స్వామి వారి లడ్డూలపై విష ప్రచారం చేయడానికి పూనుకోవడానికి కారణం చంద్రబాబుకు బానిసత్వం చేయవలసిన పరిస్థితి ఏర్పడడమేనని కొంతమంది విశ్లేషిస్తున్నారు. టీటీడీలో అధికారులు, సిబ్బంది కొన్నిసార్లు అవకతవకలకు పాల్పడితే పాల్పడవచ్చేమోగానీ... కాంట్రాక్టర్లు లడ్డూ ప్రసాదానికి జంతువుల కొవ్వు సరఫరా చేసినా సహిస్తారని అనుకోలేము. పరకామణిలో ముడుపుగా వచ్చిన డబ్బుల లెక్కింపులో అవకతవకలకు పాల్పడుతూ పట్టుబడ్డ ఘటనలున్నాయి. సరఫరా చేసే కంపెనీలు కూడా ఇంతటి ఘోరానికి పాల్పడ్డాయి అనేందుకు ఆధారాలూ లేవు. 2015లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కల్తీ నెయ్యిపై ఆరోపణలు రావడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వైఎస్ జగన్ గానీ, వైసీపీ నేతలు గానీ ఇలాంటి ఛండాలపు ఆరోపణలు చేయలేదు. చంద్రబాబు మాత్రం ఉచ్ఛ నీచాలు మరిచి తన హయాంలో జరిగిన వాటిని కూడా జగన్‌కి, వైఎస్సార్సీపికి అంటగట్టి బురద చల్లడంకోసం ఇలా మాట్లాడారని అర్థమవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చాక కొత్త ఈవో శ్యామలరావు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ప్రైవేట్ కంపెని టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్‌ను కలిపినట్టు గుర్తించామని వెల్లడించారు. అలాంటి నెయ్యి టాంకర్లను తిరస్కరిస్తూంటారు. చంద్రబాబుకు వెజిటబుల్ ఫ్యాట్ కు, యానిమల్ ఫ్యాట్ కు తేడా తెలియకుండా మాట్లాడారా? లేక కావాలనే వైఎస్సార్ సీపీపై రాయి వేయాలన్న ఉద్దేశంతో మాట్లాడారా అనేది తెలియదు. అలాగే మరొక వీడియో కూడా సోషల్ మీడియాలో వచ్చింది. గతంలో టీటీడీ అధికారిణి ఒకరు మీడియాతో మాట్లాడుతూ తమకు సరఫరా అయ్యే నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసి రెండుసార్లు పరీక్షించిన తర్వాతనే తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు సీఎం కాగానే గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఏమైనా అక్రమాలు జరిగివుంటే అవి దొరుకుతాయేమోననే ఆలోచనతో విచారణ చేయమని అధికారులకు ఆదేశాలిచ్చారు. అయినా ఏమీ దొరకక పోయేసరికి ఈ పిచ్చి ఆరోపణ చేశారేమోననే అనుమానం కలుగుతోంది. 2014- 2019 టర్మ్‌లో విజయవాడలో నకిలీ నెయ్యి తయారు చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. టీటీడీ ఉద్యోగి ఒకరితో సంబంధం పెట్టుకొని ఒక వ్యక్తి ఈ నేతిని సరఫరా చేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలాంటివాటన్నటినీ ముఖ్యమంత్రికో, ప్రభుత్వానికో అంటగట్టడం భావ్యంకాదు. కానీ ఎంతసేపూ ఎదుటివారిపై ఏదో ఒకటి రుద్దాలన్న ధోరణితో చంద్రబాబు వ్యవహరిస్తుంటారు. దీంతోపాటు ఆయనకు వేరే ప్రయోజనాలు ఏమైనా వున్నాయా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వున్న నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లను రద్దు చేసి మళ్లీ కర్ణాటకకు చెందిన నందిని సంస్థకు నెయ్యి కాంట్రాక్టును అప్పగించాలని నిర్ణయించారట. తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ తయారు చేసే నెయ్యిని ఈ సంస్థ ద్వారా సరఫరా చేయించే లక్ష్యంతో ఏమైనా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారా అనే ప్రశ్నను వైఎస్సార్ సీపీ నేతలు వేస్తున్నారు. ఏది ఏమైనా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ,మతం పేరుతో వైఎస్ఆర్ సీపీపై అభాండాలు వేయడానికి లేదా తన వ్యాపార సంస్థ ప్రయోజనాలకోసం వృద్దాప్య వయసులో ఉన్న చంద్రబాబు ఇలాంటి కుట్ర వ్యూహాలను పన్నడం దారుణంగా కనిపిస్తోంది. ఒక వేళ ఆయన పొరపాటున యానిమల్ ఫ్యాట్ అనే పదం వాడి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించి క్షమాపణ చెప్పడం మంచిది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పూనమ్ కౌర్ ట్వీట్ పై కొమ్మినేని కామెంట్స్..
-
ఏపీలో విద్యకు ‘నారా’ వారి గ్రహణం
కొద్ది కాలం క్రితం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొన్ని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఏలా సాగుతున్నాయో చూశారు. పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోవడం, డిజిటల్ బోర్డులు, పిల్లల చేతిలో ట్యాబ్‌లు, అడిగిన వెంటనే కొంత మంది విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం వంటి సన్నివేశాలు కనిపించాయి. దాంతో లోకేష్ కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు ఏమీ చేయకుండా వెళ్లిపోయారు.అయితే, ఆ స్కూల్లో లోటు పాట్లు కనిపించి ఉంటే మంత్రి హోదాలో ఆయన ఎంత గందరగోళం సృష్టించే వారో. విద్యా రంగానికి సంబంధించి వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు ఏలా ఉన్నాయో స్వయంగా గమనించినా, మొత్తం విద్యా వ్యవస్థను వెనక్కు నడిపించేందుకు లోకేశ్, సీఎం చంద్రబాబులు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. సీబీఎస్ఈ సిలబస్‌ను రద్దు చేయాలన్న నిర్ణయమే ఇందుకు తాజా సాక్ష్యం. కొన్ని సందర్బాల్లో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య లేకుండా చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఒక వైపు తెలంగాణలో ప్రభుత్వం సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టాలని, ఎయిడెడ్ స్కూల్లో కూడా అదే విధానం అమలు చేయాలని తలపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ప్రపంచంతో పోటీ పడాలని సీబీఎస్ఈ విధానం తీసుకువస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే అమలు అవుతున్న విధానాలకు మంగళం పాడుతున్నారు. అంతర్జాతీయ స్కూళ్లతో పాటు తెలంగాణలోని కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా సిలబస్‌లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూంటే ఏపీలో ఇప్పటికే అమలు అవుతున్న ఆ సిలబస్‌ను, ఇతర సంస్కరణలను ఎత్తివేయాలని సంకల్పించడం అత్యంత శోచనీయం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరి తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రయత్నాలు సాగిస్తోంది.స్టేట్ సిలబస్ వల్ల ప్రభుత్వ స్కూల్స్ పిల్లలు రాణించ లేకపోతున్నారని తెలంగాణ మార్పులు తీసుకువస్తుంటే ఏపీలో ఇప్పటికే దేశం అంతటిని ఆకర్షించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరు గార్చే ప్రయత్నం జరగడం అత్యంత దురదృష్టకరం. ఆంగ్ల మీడియంలో మిషనరీ స్కూళ్లు, ప్రతిష్టాత్మకమైన కాలేజీ, అమెరికాలో ఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ ఏపీలో కూడా అదే స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లను మరింతగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాల్సింది పోయి, ఉన్న పేద విద్యార్ధులకు ఉపయెగపడే వ్యవస్థలను ధ్వంసం చేస్తూ కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించేలా చర్యలు చేపట్టం అంతా బాగలేదు.వైఎస్ జగన్ హయంలో ప్రభుత్వ స్కూల్స్ కళకళలాడాయి. చదువుతో పాటు పిల్లలు తీసుకునే ఆహారం, వారు ధరించే దుస్తులు, బూట్లు, మొదలైన అన్నింటిపై చాలా శ్రద్ద తీసుకునే వారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యా విధానంతోపాటు పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడే టోఫెల్, ఇంటర్నేషనల్ బాకులరేట్(ఐబి) బోధనకు కూడా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వాటి అన్నింటి ఫలితంగానే వైఎస్సార్సీపీ హయంలో విద్యా వ్యవస్థకు మంచిపేరు వచ్చింది. పలు రాష్ట్రాల బృందాలు వచ్చి పరిశీలించి వెళ్లాయి. ఏపీ నుంచి ప్రభుత్వ స్కూల్ పిల్లలు ఐక్యరాజ్యసమితి కూడా వెళ్లి మాట్లాడి వచ్చారు. అందుకే ప్రభుత్వ స్కూల్లో విద్యార్ధులు జగన్ మామయ్య అంటూ అప్యాయంగా పిలుచుకునేవారు. ఆయా కార్యక్రమాల్లో వారు ఆంగ్లంలో ప్రసంగించిన తీరు అందరిని ఆకట్టుకునేది. బహుశా ఆ గుర్తులు అన్నింటినీ చెరిపేయాలని భావనతోనే చంద్రబాబు, లోకేష్‌ల ప్రభుత్వం పేద పిల్లలకు ఉపయోగపడే సిలబస్ మార్చివేస్తున్నట్టుగా ఉంది.ఇదే సమయంలో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో మాత్రం ఆంగ్ల మీడియం, సీబీఎస్ఈ సిలబస్‌లు మాత్రం యథా ప్రకారం కొనసాగుతాయి. తత్ఫలితంగా పేద పిల్లలు సైతం ప్రైవేట్ బడుల వైపు చూసే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించిందని అనుకోవాలి. ఇప్పటికే రెండు లక్షల మంది ప్రభుత్వ స్కూల్ పిల్లలు ప్రైవేట్ వైపు మళ్లారని మీడియాలో కథనాలు వచ్చాయి. సీబీఎస్ఈ విద్యను అందించడం కోసం తొలుత వెయ్యి ప్రభుత్వ స్కూల్‌ను జగన్ ప్రభుత్వం ఎంపిక చేసి అమలు చేసింది. కానీ, ఇప్పుడు దాన్ని ఎత్తి వేస్తుండటంతో సుమారు 84వేల మంది విద్యార్ధులు నష్టపోతున్నారని అంచనా.ఒక యూనిట్ పరీక్షలు ముగిసిన తర్వాత ఇలాంటి గందరగోళం ఎందుకు సృష్టించారో అర్థం కాదు. ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం సాధించేందుకు వీలుగా జగన్ ప్రభుత్వం టోఫెల్ శిక్షణను తీసుకువచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో దాదాపు 11.75 లక్షల మంది, ప్రైమరీ విభాగంలో 4.17 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్ధులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ అనే సంస్థ సర్టిఫికెట్లను ఇస్తుంది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం పరీక్ష ఫలితాలను ప్రకటించకపోగా ఈ విద్యా సంవత్సరంలో మొత్తం టోఫెల్‌ను రద్దు చేసింది. ఇలాగే అంతర్జాతీయ స్థాయిలోని ఐబీ కోర్సును కూడా రద్దు చేశారు. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు పిల్లల దగ్గర లక్షల ఫీజులు వసూలు చేసి ఐబీ సిలబస్‌ను అందిస్తున్నాయి. అలాంటిది పేద పిల్లలకు ఉచితంగా అందించడం కోసం వైఎస్ జగన్ తీసుకువచ్చిన ఈ కోర్స్‌ను ఎత్తివేయడం దురదృష్టకరం.పెద్దగా చదువుకోని పవన్ కళ్యాణ్ వంటి వారు వీటికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్ధం చేసుకోవచ్చు కానీ, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన లోకేష్ ఇలాంటి నిర్ణయాలు చేయడం ఏపీలోని పేద విద్యార్ధులకు అశనిపాతమే. కార్పొరేట్ స్కూల్స్ వ్యాపారంలో సిద్దహస్తుడు అయిన నారాయణ.. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన లాంటి బడా బాబులకు మేలు చేసేందుకు పేద పిల్లల చదువుపై దెబ్బకొడుతున్నారన్న విమర్శలకు మంత్రి లోకేష్ అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిదని చెప్పాలి. తల్లికి వందనం పథకాన్ని పెట్టి ప్రతీ విద్యార్ధికి పదిహేను వేలు ఇస్తామన్న హామీ సంగతి దేవుడెరుగు కానీ, గత ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు అన్నింటినీ ఎత్తివేయడం ద్వారా వైఎస్ జగన్ పేరు తుడిచి వేయాలన్న వికృతమైన ఆలోచన ఏపీలో పేద పిల్లలకు శాపంగా మారేలా ఉంది.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అలా చెప్పి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేది!
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన కూడదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అధికారం కోల్పోయామన్న అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ... బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించడం కూడా ఎంత వరకూ సబబో ఆయన ఆలోచించుకోవాలి. పీఏసీ పదవి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం దీనిపై బీఆర్ఎస్ విమర్శలకు దిగడం.. పరిస్థితి మరింత ముదిరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్), గాంధీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు అరికెపూడి గాంధీ వైపునే ఉన్నప్పటికీ సీఎం ఆయన్ను వెనకేసుకుని వచ్చినట్లుగా అనిపిస్తుంది.సెప్టెంబరు 12 కౌశిక్, గాంధీల మధ్య జరిగిన ఘటనల్లో పోలీసులతోపాటు ప్రభుత్వ వైఫల్యమూ స్పష్టంగా కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో పెట్టిన పోలీసులు గాంధీపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. దీన్నే సాకుగా తీసుకున్నారో ఏమో కానీ.. గాంధీ తన అనుచరులతో కౌశిక్ ఇంటిపై దాడికి దిగారు. కౌశిక్ ఇంటి ముందు కూర్చుని ‘‘మీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటకు రా’’ అంటూ రెచ్చగొట్టే, సినిమా డైలాగులు, ఇతర పరుష పదజాలం ఉపయోగించారు. గాంధీ అనుచరులు మరింత రెచ్చిపోయి కౌశిక్ ఇంటి అద్దాలు పగులగొట్టడమే కాకుండా.. టమోటాలు, కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. తప్పు ఎవరిదన్నది అందరికీ స్పష్టంగా తెలుస్తున్నా పోలీసులు గాంధీని ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచలేదో స్పష్టం చేయలేదు.ముఖ్యమంత్రి బీఆర్ఎస్పై చేసే ఆరోపణ రాజకీయం అనుకోవచ్చు కానీ.. గురువారం నాటి ఘటనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది. కాంగ్రెస్‌లో చేరిన గాంధీ అనుచరులే. అంతా అయిపోయిన తరువాత పోలీసులు గాంధీపై నామమాత్రంగా కేసులు పెట్టారన్న అభిప్రాయం కూడా ప్రజల్లో నెలకొంది. బీఆర్ఎస్ నేత ఎవరైనా కాంగ్రెస్ నేత ఇంటిపై దాడి చేసి ఉంటే కూడా ఇలాగే వ్యవహరించే వారా? లేక... దాడులకు ఎవరు పాల్పడ్డా కఠినంగా వ్యవహరించాని సీఎం చెప్పేవారా? ఇలా చెప్పి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరిగి ఉండేది.ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నాడని సీఎం స్వయంగా చెప్పడం ఇంకో ఎత్తు. గతంలో పీఏసీ పదవిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ఎలా ఇచ్చారని రేవంత్ రెడ్డే ప్రశ్నించారు. మరి ఇప్పుడు అదే తీరులో గాంధీకి పదవి కట్టబెట్టడం ఎంత వరకూ సబబు అవుతుంది?. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, త్వరలో ఆ పార్టీ ఖాళీ అవుతుందని రేవంత్ స్వయంగా విమర్శించారు కదా? అలాగైతే ఆయన ధైర్యంగా వీరందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమై ఉండాల్సింది. ఇలా చేసి ఉంటే ఆయనపై గౌరవం మరింత పెరిగేది. ఇలా చేయలేదు సరికదా.. పార్టీ మారిన దానం నాగేందర్‌ను ఏకంగా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడుతూంటే రేవంత్ వాటినే ప్రోత్సహించడం, పైగా గాంధీ బీఆర్ఎస్ వాడేనని వ్యాఖ్యానించడం, దబాయించడం ఏమంత సముచితంగా అనిపించదు.సెప్టెంబరు 12 నాటి ఘటనకు ముందు కౌశిక్ రెడ్డి చేసిన కొన్ని పనులు, వ్యాఖ్యలు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారేందుకు కారణమైందన్నది స్పష్టం. ఎందుకంటే.. గాంధీతోపాటు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి గాజులు, చీర ప్రదర్శించడం రెచ్చకొట్టడమే అవుతుంది. అంతేకాదు.. ఈ చర్య మహిళలను కించపరచడం కూడా. రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది... ఇదే అంశంపై గాంధీ, కౌశిక్ రెడ్డిలు పరస్పర ఘాటు విమర్శలకూ దిగారు. అయితే ఒకరింటికి ఒకరు వెళతామని సవాళ్లు విసురుకోవడమే రచ్చగా మారింది. అప్పటికిగానీ ఇది శాంతి భద్రత సమస్య అని గుర్తించలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి స్థానికుడు కాదని బతకడానికి వచ్చిన వాడు వ్యాఖ్యానించడం కూడా సరైంది కాదు. తెలంగాణ వచ్చి పదేళ్ల తర్వాత కూడా ఈ రకమైన వాదన చేయడం బీఆర్ఎస్కు నష్టం చేసేదని ఆ పార్టీ నేతలు గుర్తించాలి.హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ స్వీప్ చేయడంలో ఆంధ్రా నుంచి స్థిరపడిన వారి ఓట్లు, ఇతర రాష్ట్రాల వారు ఉన్నారని రేవంత్ స్వయంగా చెప్పిన విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో కౌశిక్ వ్యాఖ్యలను ప్రస్తావించి ముఖ్యమంత్రి కూడా అదే పదం వాడడం అభ్యంతరకరం. బతకడానికి వచ్చిన వారి ఓట్లు కావాలి గానీ, వాళ్లు వద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ అనడం ద్వారా ఆయన కూడా కౌశిక్ లాగానే మాట్లాడారనే భావన కలుగుతుంది. ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వుంటే మళ్లీ ప్రజల మధ్య అనవసరమైన వివాదాలు రాకుండా వుంటాయని చెప్పాలి.ఫిరాయింపులపై హైకోర్ట్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యానిస్తూ బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోందని కాంగ్రెస్ ప్రచారం చేయడం కూడా అలాంటి సైకలాజిక్ గేమే కదా?. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. ఆ ఆరోపణ నిజం కాకపోతే వారు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి లేదని కోర్టుల నుంచి ఆర్డర్ తీసుకు రావాలని విపక్షాలకు సలహా ఇవ్వడం విడ్డూరంగా ఉంది.ఏ ఎమ్మెల్యే అయినా అటూ ఇటూ దిక్కులు చూస్తే అనర్హత వేటు పడుతుందంటే తన ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. ఒక పక్క పదిమందిని చేర్చుకొని వారిపై వేటు వేయని రేవంత్ తమాషాగా మాట్లాడుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ , బీజేపీలు కలిసినా రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి లేదు. అలాంటి అవకాశముంటే ఎన్నికలైన వెంటనే అక్రమమైనా ఒక పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనైనా లాగి ఉండేవారు. ఆ పని చేసే అవకాశం లేదు కాబట్టే రేవంత్ ప్రభుత్వం సేఫ్‌గా వుంది. ఇప్పుడేమో ఆయన పదిమందిని లాగడమే కాకుండా, ఏదో కుట్ర జరుగుతోందని వైరి పక్షాలపై ఆరోపణలు చేస్తున్నారు.ఏది ఏమైనా ఫిరాయింపుల విషయంలో రేవంత్ తన గురువైన చంద్రబాబునాయుడిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుసరిస్తున్నట్టే వుంది. కొసమెరుపు ఏమంటే కేసీఆర్ లక్కీ నెంబర్ తమ దగ్గర వుందంటూ రేవంత్ రెడ్డి తమకు 66 మంది సభ్యులు వున్నారని గుర్తు చేయడం. కేసీఆర్ లక్కీ నెంబర్ 6గా చెప్పుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలున్నారు. కాబట్టి రెండు 6 సంఖ్యతో వున్నాయి కాబట్టి అలా అని వుండవచ్చుగానీ నిజానికి ఇలాంటి నమ్మకాలున్నవారు అన్ని అంకెల్ని కలిపి ఫైనల్ గా వచ్చిన సింగిల్ డిజిట్ నే లక్కీ నెంబర్ గా చూస్తారు. ఐతే రేవంత్ లక్కీ నెంబర్ తొమ్మిది!!!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత ఇదీ చదవండి: నా ప్రాణాలకు హాని జరిగితే రేవంత్‌దే బాధ్యత!! -
‘‘మెడికల్ కాలేజీ సీట్లు వదులుకోవడం ఆంధ్రకు దోహం చేయడమే’’
‘‘ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యానికి ఉరితాడు వేస్తున్నారు’’ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే చంద్రబాబు ప్రభుత్వం కచ్చితంగా ఇదే పనిలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ఘోరంగా వ్యవహరించి ఉండదు. జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు పులివెందులపై కక్షా? లేక రాయలసీమపై వ్యతిరేకతో తెలియదు కానీ.. బాబు ప్రభుత్వం బంగారం లాంటి మెడికల్ కాలేజీ సీట్లను వదులుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాబు చేసిన ద్రోహమే అవుతుంది.జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు కూడా ఆయన హయాంలోనే వచ్చాయి. విజయవాడ వద్ద కృష్ణా నదికి రీటెయినింగ్ వాల్ కట్టడం వల్ల ఇటీవలి వరదల్లో వేలాది మంది ముంపునకు గురయ్యే ప్రమాదం తప్పింది కూడా. ఇన్ని చేసినా చంద్రబాబు నాయుడు ఎల్లోమీడియా సాయంతో ఆంధ్రలో అభివృద్ధి లేకుండా పోయిందని నిత్యం దుష్ప్రచారం చేసేవారు. విధ్వంసం తప్ప మరేమీ లేదని అభాండాలు మోపేవారు.జనం ఓట్లు వేశారో, లేక ఈవీఎంల మహిమో గానీ.. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం, బాబు ముఖ్యమంత్రి అవడం అయిపోయింది. అంతే! ఏపీలో హింస, విధ్వంసం చెలరేగిపోయింది. కరోనా మహమ్మారి పెచ్చరిల్లిన సమయంలోనూ చక్కగా పనిచేసిన వలంటీర్ల వ్యవస్థతో మొదలుపెట్టి అనేక ఇతర వ్యవస్థలను నిర్వీర్యం చేసే పనికీ దిగజారారు. జగన్ మొదలుపెట్టిన అనేక ప్రజోపయోగ పథకాలను నీరుగార్చేందుకే ప్రభుత్వం తన శక్తియుక్తులన్నింటినీ ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే... ప్రజారోగ్యం కూడా చేరింది!వైఎస్ జగన్ పాలనలో ప్రజలందరికీ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటింటికీ వైద్యుడిని పంపే ఆలోచన చేశారు. ప్రస్తుతం బాబు ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు. విద్యార్థులకు ఇంట్లోనే కంటి పరీక్షలు చేసి కళ్ల జోళ్లు పంపిణీ చేయడాన్ని నిలిపివేయమని ఆదేశించినట్లు సమాచారం. ఇక తాజాగా బాబు గారి దృష్టి జగన్ సృష్టించిన వైద్య విద్య వ్యవస్థపై పడింది. వైద్యాన్ని సామాన్యుడికి కూడా చేరువ చేసే లక్ష్యంతో జగన్ ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ సంకల్పానికి బాబు ప్రభుత్వం తన తప్పుడు నిర్ణయాలతో తూట్లు పొడుస్తోంది.ఇదీ చదవండి: కాలేజీలపై 'చంద్రబాబు' కత్తి!తెలంగాణలో అదనంగా నాలుగు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఫలితంగా ఈ ఏడాది కొత్తగా 8 కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ కాలేజీలే. వీటన్నింటితో తెలంగాణలో మొత్తం వైద్యవిద్య సీట్ల సంఖ్య 4090కి చేరబోతుంది. అయితే తెలంగాణతో పోటీపడి ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ గతంలో జగన్ హయాంలోనే తీసుకొచ్చిన కాలేజీలను వదులుకునేందుకు లేదా ప్రైవేట్ వారికి అప్పగించే దిశగా సాగుతూండటం దురదృష్టకరం.జగన్ ప్రభుత్వ హయాంలోనే 2023-24లో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్త మెడికల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. మొత్తం 750 సీట్లు అందుబాటులోకి రావడంతో మెరిట్ కలిగిన పేద విద్యార్థులకు మేలు జరిగింది. 2024-25లో పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలల్లో కొత్త కాలేజీలు ప్రారంభం కావాలి. వీటికి భవనాల నిర్మాణం కూడా జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వీటన్నిటినీ ప్రైవేటు పరం చేయాలన్న ఉద్దేశంతో ఆరంభించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. లితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండా పోయాయి. మరో వైపు కేంద్రం పులివెందుల వైద్య కళాశాలకు ఇస్తానన్న యాభై సీట్లను కూడా తమకు వద్దంటూ చంద్రబాబు సర్కార్ లేఖ రాయడం రాయలసీమకు అన్యాయం చేయడమే. మౌలిక వసతులు సిద్దంగా లేవని ప్రభుత్వం చెప్పడం అంటే విధ్వంసానికి పాల్పడుతున్నట్లే.జగన్ ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశాన్ని చర్చించి గుజరాత్ మోడల్ లో ప్రైవేటు రంగానికి అప్పగించాలన్న ఆలోచనలో ప్రభుత్వముంది. దీనివల్ల సామాన్య విద్యార్థులు సైతం అధిక ఫీజుల్ని చెల్లించాల్సి వస్తుంది. మెరిట్ ఉన్నా పేదలు వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు కూడా అటకెక్కినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని కాలేజీల నిర్మాణం నత్తనడక సాగుతుండడంతో అందులోని వస్తువులు చోరీకి గురవుతున్నాయి.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి ఈ కాలేజీలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసం సెల్ఫ ఫైనాన్స్ స్కీమ్ కింద యాభై శాతం సీట్లను అధిక ఫీజుకు కేటాయించాలని జగన్ నిర్ణయిస్తే ఇదే చంద్రబాబు, పవన్, లోకేష్‌లు నానా గగ్గోలు చేశారు. సంబంధిత 107, 108 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు కన్వీనర్ కోటాలోనే అంటే ప్రభుత్వపరంగానే కేటాయిస్తామని బడాయి మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక సెల్ఫ్ ఫైనాన్స్ విధానం మార్చుకోవడంలేదని హైకోర్టులో వేసిన అఫిడవిట్లో తేల్చేశారు. ఈ నేపథ్యంలో కొత్త మెడికల్ కాలేజీల్లో అన్ని సీట్లను కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తామని చంద్రబాబు, పవన్, లోకేష్‌లు ఇచ్చిన హామీని గాలి కొదిలేశారని జగన్ విమర్శించడం ఎంతైనా సహేతుకం. బీజేపీతో పొత్తులో ఉన్నా, ఐదు కాలేజీలకు అనుమతులు తెచ్చుకోలేకపోవడం చంద్రబాబు వైఫల్యమని కూడా జగన్ సరైన వ్యాఖ్యే చేశారు.గతంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో ప్రైవేటు రంగంలో 12 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే విద్యను వ్యాపారం చేస్తారా అంటూ తెలుగుదేశం నానా యాగీ చేసిన విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని ప్రైవేటు వారే చేయాలని అప్పట్లోనూ చెప్పారు. ఈ ఒక్కరంగంలోనే కాదు అన్నిటిలో ఆయన ధోరణి ఇలాగే ఉంటుంది. తన రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవైనా చేపడితే వంకలు పెట్టి ఎలా పాడు చేయాలనే దృష్టితో చంద్రబాబు, తెలుగుదేశంసర్వదా కృషి చేస్తుంది.దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా వంతపాడతాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఒక విధంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం అభివృద్ధి నిరోధకంగా మారింది. తానే అభివృద్ధి చేస్తున్నట్టు ముసుగు వేసుకోవడంలో మాత్రం గొప్ప ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఇప్పుడు చేజేతులా ప్రభుత్వ రంగంలో రావాల్సిన మెడికల్ కాలేజీలను వదులుకుంటున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆయా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు స్పందిస్తున్నట్టు కనపడడం లేదు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరనడానికి ఇదొక ఉదాహరణ.ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత జరిగిన హింసాకాండ, విధ్వంసం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు జగన్ తెచ్చిన వ్యవస్థలను, అభివృద్ధిని, విధ్వంసం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ విధ్వంసంలో పవన్ కల్యాణ్ కూడా భాగస్వాములవుతున్నారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు సూపర్ సిక్స్ అంటూ ఎక్కడలేని హామీలను ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారు. అందులో మెడికల్ కాలేజీలు కూడా సమిధలవుతున్నాయి.ఇది ఆంధ్ర ప్రజలు చేసుకున్న ఖర్మ అనుకోవాలా! - కొమ్మినేని శ్రీనివాస రావు,సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఫిరాయింపులు.. పార్టీలన్నీ దొందు దొందే!
ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు తమ ఇష్టానుసారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూనే ఉన్నారు. రాజ్యాంగంలో మార్పులు తెచ్చినా.. చట్టాలను కఠినతరం చేసినా... దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. అనైతిక చర్యలకు ప్రోత్సాహమిస్తున్నాయి. ప్రజలందరికీ చట్టాలు చేసే నేతలే ఈ రకమైన చట్ట వ్యతిరేకమైన పనులకు దిగడం సమాజం సిగ్గుపడేలా చేయడమే అవుతుంది. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన నేపథ్యంలో దాఖలైన కేసుపై ఇటీవలే జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఇచ్చిన తీర్పు ఎంతైనా స్వాగతించదగింది. ఈ అడ్డగోలు ఫిరాయింపులకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయకపోతే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉంది.తెలంగాణలో గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన దానం నాగేందర్ ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం మనకు తెలిసిన విషయమే. ఫిరాయింపు స్పష్టంగా తెలుస్తున్నా.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్... దానం నాగేందర్‌పై వేటు వేయకపోవడం వివాదాస్పదమైంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు కూడా ఫిరాయింపులకు పాల్పడ్డారని వారిపై వేటు వేయాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసినా స్పీకర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు.దీంతో బీఆర్ఎస్ శాసన సభ్యులు ఇద్దరు, బీజేపీ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సుప్రీంకోర్టు గత తీర్పులను ఉదహరిస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నాలుగు వారాల్లోగా అనర్హత పిటిషన్లపై తన వైఖరిని తెలియజేయాలని ఆదేశించారు. అంతే కాదు... సాంకేతిక కారణాలతో ఇలాంటి పిటిషన్లను కొట్టేయడం సహేతుకం కాదని కూడా న్యాయమూర్తి అభిప్రాయపడటం విశేషం. అసెంబ్లీ కాలావధి ముగిసేంత వరకూ స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఉంటే కోర్టులు ఊరుకోజాలవని, అలా చేయడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని కూడా ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులతోపాటు ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన మరో ఏడుగురిపై కూడా వేటు వేయాల్సి ఉంది.ఫిరాయింపులపై ఫిర్యాదు అందిన మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కానీ అధికార పక్షానికి చెందిన స్పీకర్లు తమ పార్టీ వారిపై చర్యలు తీసుకోకుండా ఉంటున్నారు. అదే సమయంలో అధికార పార్టీ నుంచి ఎవరైనా వేరే పార్టీలోకి మారితే మాత్రం వెంటనే చర్యలు ఉంటున్నాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ అంశాలపై కోర్టులు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూండటం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయాన్నే ఉదాహరణగా తీసుకుందాం. అప్పట్లో పార్టీ మారిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్లు చర్యలు తీసుకోలేదు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్రిక్తత..బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హౌస్ అరెస్టుసీనియన్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ ఫిరాయింపుపై ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసినా సాంకేతిక కారణాలతో కేసు వీగిపోయింది. తాజా కేసులో కూడా ప్రభుత్వ న్యాయవాది సుదర్శన్ రెడ్డి సాంకేతిక అంశాలను ప్రస్తావించినా కొట్టివేసేందుకు న్యాయమూర్తి అంగీకరించకపోవడం గమనార్హం. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి స్పీకర్‌దే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. అయినా ఫలితం లేకపోయింది.తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు ఈ ఫిరాయింపు సమస్యను భరించింది. కేసీఆర్ ప్రభుత్వంపై ఫిరాయింపుల అంశంపై తీవ్ర విమర్శలు చేసింది. కేసిఆర్ వ్యూహత్మకంగా ఆయా శాసనసభ పక్షాలను మొదట టీఆర్ఎస్, ఆ తరువాత బీఆర్ఎస్ విలీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. నిజానికి అది కూడా అనైతికమే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరిగ్గా ఇదే వ్యూహంతో వెళ్లాలని అనుకుంది కానీ.. అవసరమైనంత మందిని తనవైపు తిప్పుకోలేక పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం 38 మందిలో పది మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్ ఒకానొక సందర్భంలో ఇంకో పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకే అనర్హుడిని చేశారు. బీజేపీ వ్యతిరేకి కావడం వల్లనే అప్పటి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు శరద్ యాదవ్‌పై చర్య తీసుకున్నారన్న విమర్శ కూడా ఉంది.జాతీయ పార్టీలైన బీజేపీ కావచ్చు.. కాంగ్రెస్ కావచ్చు.. రెండూ ఫిరాయింపులను దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ రాజీనామాల వ్యూహాన్ని అమలు చేసింది. సభ్యులు ఎవరైనా పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరితే చట్ట విరుద్ధం కాదు. కానీ తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇలాంటి నిబంధనలు పట్టించుకోకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఎలాంటి జంకూ లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి చేర్చుకోవడాన్ని చూసి చూడకుండా వదిలేశారు. తరువాతి కాలంలో ఆయనే ఫిరాయింపుల చట్టాని ఉల్లంఘించి మరీ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ సలహదారు పదవి కూడా ఇచ్చేశారు.అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీని ఖతం చేయాలని ఇరు పక్షాలూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ను బలహీన పరిచే లక్ష్యంతోనే ప్రస్తుత సీఎం ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారన్న విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఇందులో భాగమనే అనుకోవాలి. అయితే తనకు ఎవరూ కాంగ్రెస్ కండువా కప్పలేదని గాంధీ చెప్పడం సిగ్గు చేటైన విషయం. గాంధీ అని పేరు పెట్టుకున్నందుకైనా ఆయన కొంచెం నిజాయితీతో మాట్లాడి ఉంటే బాగుండేది.బీఆర్ఎస్ శాసనసభ పక్షం నేత కేసిఆర్ లేఖకు అనుగుణంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ను నియమించాల్సి ఉండగా కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన గాంధీకి పదవి కట్టబెట్టారు. హరీష్ రావును పీఏసీ చైర్మన్ చేయాలని ప్రతిపాదిస్తే... కనీసం ఆయనను సభ్యుడిగా కూడా చేయలేదు. ఇది ఖచ్చితంగా స్పీకర్ వైపు నుంచి జరుగుతున్న తప్పులే. గతంలో కేసిఆర్ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చి విమర్శల పాలయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన గాంధీల మధ్య వివాదం మరో ట్విస్ట్. పోలీసులు కౌశిక్ ను హౌస్ అరెస్టు చేసి, గాంధీని చేయకపోవడం,ఆ తర్వాత ఆయన కౌశిక్ ఇంటిపైకి అనుచరులతో కలిసి దాడి చేయడం వంటివి జరిగాయి. ఇందులో పోలీసుల వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. ఏపిలో చంద్రబాబు నాయుడు సైతం 2014 -19 లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల వారిపై కాని ...పార్టీ మారిన మొత్తం 23 మంది ఎమ్మెల్యేలపై కాని చర్యలు తీసుకోలేదు. అలాగే తెలంగాణలో స్పీకర్ లుగా పనిచేసిన పోచారం ,మధుసుధనాచారిలు ఆనాటి సీఎం కేసిఆర్ ఏం చెబితే అదే చేశారు. స్వత్రంతంగా వ్యవహరించలేదు. ఒకప్పుడు అయ్యదేవర కాళేశ్వర రావు, బి.వి.సుబ్బారెడ్డి, జి.నారాయణ రావు మొదలైన వారు స్పీకర్లుగా ముఖ్యమంత్రిని సైతం వ్యతిరేకించిన ఘట్టాలు చరిత్రలో ఉన్నాయి. ప్రస్తుత తెలంగాణ శాసనసభ వ్యవహరాల మంత్రి డి. శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు స్పీకర్ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి కొంత ప్రాధాన్యత ఇవ్వడం అప్పటి అధికార కాంగ్రెస్ కు రుచించేది కాదు. స్పీకర్ గా పనిచేసిన మరోనేత కేఆర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కొంత ఆలస్యంగానైనా అనర్హత వేటు వేయడం సంచలనంగా మారింది.ఒక్కోసారి సభ్యులు రాజీనామాలు చేసినా స్పీకర్లు వాటిని రాజకీయ కారణాలతో పెండింగులో ఉంచిన ఘట్టాలు ఉమ్మడి ఏపీలో జరిగాయి. తెలంగాణ ఉద్యమం కోసం కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వాటిని ఆమోదించడం ఆలస్యం చేస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటన చేసినప్పుడు ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామాల డ్రామాకు కిరణ్ కుమార్ ఆధ్వర్యం వహించారు. ఇంకో స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లుగా జగన్ కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని బాగా ఆలస్యం చేశారు.అసెంబ్లీ టరమ్ ఏడాది లోపు ఉంటే ఉప ఎన్నికలు రావు. ఆ రకంగా మనోహర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించలేదన్న విమర్శలు వచ్చాయి. ఏపీలో తమ్మినేని సీతరాం గత టరమ్ లో ఆనాటి అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై కొంత ఆలస్యంగానైనా అనర్హత వేటు వేశారు. లోక్ సభ, రాజ్యసభలో కూడా ఎక్కువ సందర్భాలలో ఇదే జరుగుతోంది. ఏపీకి చెందిన అప్పటి ఎమ్.పి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరినా స్పీకర్ ఓం బిర్లా ఏదో సాకు చూపుతూ కాలం గడిపేశారు. ఏది ఏమైనా ఫిరాయింపుల విషయంలో బీజేపీ కాంగ్రెస్‌తోసహ వివిధ రాజకీయ పక్షాలు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయన్నది నిజం. స్పీకర్లు ముఖ్యమంత్రులు చెప్పినట్లు నడుచుకోక తప్పని స్థితి ఉంటోంది. అందువల్ల కనీసం న్యాయవ్యవస్థలోని వారైనా ఇలాంటి తీర్పులు ఇవ్వడమే కాకుండా స్పీకర్ చర్య తీసుకోలేని పక్షంలో వారే అనర్హత వేటు వేసేలా చోరవ చూపడం అవశ్యం అని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మచ్చ లేని మహా నాయకుడు అతని మృతి దేశానికే తీరని లోటు
-
ఎందుకీ సుద్దపూస కబుర్లు.. ఆ విషయం మర్చిపోయావా రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదంగా ఉంది. ఆయన కొంతమంది జర్నలిస్టులను ఉన్మాదులుగా పోల్చడం బాగోలేదు. రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలలో పనిచేస్తున్నకొందరు పాత్రికేయులు ఉన్మాదంగా మారి ప్రెస్ మీట్లలో లేదా జరుగుతున్న కార్యక్రమాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన పత్రికలలో పనిచేసే వారు మంత్రుల కార్యాలయాలు, మరికొన్ని చోట్లకు వెళ్లి కూర్చోవడంతో పాటు కొన్ని విషయాలలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని సృష్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బహుశా కొందరు పాత్రికేయులు అడిగే ప్రశ్నలు, ఇచ్చే కథనాలు ఆయనకు నచ్చకపోవచ్చు. లేదా కొన్ని పత్రికలపట్ల ఆయనకు వ్యతిరేకత ఉండవచ్చు. అంతమాత్రాన వారిని ఉన్మాదులతో ఎలా పోల్చారో అర్ధం కాదు.రాజకీయ నేతల భాష గురించి పక్కనబెట్టి, పాత్రికేయుల భాష గురించి హితవు చెప్పిన రేవంత్ ఇలా మాట్లాడడం సమంజసమేనా అన్నది చూడాలి. అలా అని మీడియా అంతా వృత్తి ప్రమాణాలు పాటిస్తోందని చెప్పడం లేదు. ఏ రంగంలో అయినా అన్ని రకాలవారు ఉంటారు. అలాగే జర్నలిజంలో కూడా ఉండవచ్చు. రాజకీయ పార్టీలు పత్రికలు స్థాపించడం గురించి రేవంత్ ప్రస్తావించారు. గతంలో వామపక్షాలు పత్రికలు పెట్టుకున్న విషయాన్ని చెప్పి వాటిలో పనిచేసే జర్నలిస్టులను గౌరవంగానే మాట్లాడారు. బహుశా ఒక వామపక్షం తమకు మిత్రపక్షంగా ఉన్నందున ఆయన జాగ్రత్తపడి ఉండవచ్చు. పైగా ఒక సిపిఐ నేతకు పదవి కూడా ఇచ్చారు.మిగిలిన మీడియా సంస్థలలో ఏవి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నవో ఆయన వివరించలేదు కాని, ప్రధానంగా ఆయన ఆగ్రహం అంతా బీఆర్ఎస్కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక గురించి అయి ఉండాలి. అలాగే బీఆర్ఎస్కు కాస్త అనుకూలంగా ఉన్న యూట్యూబ్ చానళ్ల గురించి అయి ఉండాలి.బీజేపీ మీద కంటే ఆయన దృష్టి అధికంగా బీఆర్ఎస్ మీదే ఉన్న నేపథ్యంలో ఈ ప్రస్తావన వచ్చి ఉండాలి. రాజకీయ నాయకులకు సహజంగానే తమపై నెగిటివ్ వార్తలు రాసే పత్రికలన్నా, సంబంధిత జర్నలిస్టులన్నా కాస్త కోపమే ఉంటుంది. విశేషం ఏమిటంటే కాంగ్రెస్‌కు ఎప్పుడూ మీడియానే లేదనట్లుగా ఆయన మాట్లాడడం. నిజానికి ఇప్పుడు తెలంగాణలో ఉన్న అధిక మీడియా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లే లెక్క. వెలుగు దినపత్రిక యజమాని ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కాంగ్రెస్ ఎంపీ ఆయన సోదరుడు కూడా ఎమ్మెల్యేనే. ఆ యజమాని కుటుంబం తొలుత కాంగ్రెస్ తదుపరి బీఆర్ఎస్, ఆ పిమ్మట బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంది. వారు ఎటు ఉంటే దానికి అనుగుణంగా మీడియాలో కొంతవరకు వార్తలు ఇచ్చే మాట నిజమే.అలాగే ఇతర పార్టీలకు కొంత వ్యతిరేకం అనిపించే స్టోరీలు ఇస్తుండవచ్చు. అంతమాత్రాన అది ఉన్మాదం అయిపోతుందా?. ఏ మీడియా అయినా వాస్తవాలు రాయాలని చెప్పాలి. ఒకవేళ పనికట్టుకుని అసత్యాలు రాస్తే ఖండనలు ఇస్తారు. మరీ తీవ్రమైన స్థాయిలో కల్పిత గాధలు రాస్తే వాటిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టుకోవడం కొత్త కాదు. కొందరు మీడియా యజమానులు కొన్ని పార్టీలకు కొమ్ముకాయడం, ఆ పార్టీల ద్వారా ప్రయోజనాలు పొందడం, వారు ఆశించిన పని జరగకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.ఇదీ చదవండి: మరకే మంచిదంటున్న చంద్రబాబు!వారిలో ఒకరిద్దరితో ఈయనకు సత్సంబంధాలే ఉన్నాయని అంటారు. అందరూ అలా చేస్తున్నారని కాదు. మీడియా రంగంలో ఒకప్పుడు కొంతైనా నిష్పక్షపాతంగా ఉండాలన్న అభిప్రాయం ఉండేది. కాని రానురాను, అవి తమకు నచ్చిన పార్టీలను భుజాన వేసుకుంటుండంతో రాజకీయ పార్టీలు, లేదా నేతలు సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకోవలసి వస్తోంది. వామపక్షాలైన సిపిఐ, సిపిఎం లకు ఎప్పటి నుంచో పత్రికలు ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించింది. తెలుగులో కూడా కాంగ్రెస్ పక్షాన మొదటి నుంచి కొన్ని పత్రికలు ఉండేవి. కాంగ్రెస్ మాజీ ఎంపీ కెఎల్ ఎన్ ప్రసాద్ ఆంధ్రజ్యోతి పత్రికను స్థాపించారు. మరో కాంగ్రెస్ మాజీ ఎంపీ టి.చంద్రశేఖరరెడ్డి డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలను నిర్వహించారు. ఆయన కుమారుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి క్రానికల్ పత్రికకు సారధ్యం వహిస్తున్నారు. ఉదయం పత్రికను స్థాపించిన దాసరి నారాయణరావు తదుపరి కాంగ్రెస్ ఎంపీ అయి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. "వార్త పత్రిక యజమాని గిరీష్ సంఘీ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులు అయ్యారు. ఈనాడు దినపత్రికను జలగం వెంగళరావు సహకారంతో ఆరంభించారు. ఆ తర్వాత కాలంలో ఆయన తనది కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక అని చెప్పడం విశేషం. తొలుత తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన ఆయన ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో విభేదాలు వచ్చాక చంద్రబాబును భుజాన వేసుకున్నారు.దీనితో పాటు మరో పత్రిక ఆంధ్రజ్యోతి కూడా కొత్త యాజమాన్యంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చంద్రబాబు అనుకూల పత్రికగా మారింది. ఈ రెండు పత్రికల ఎజెండాను అర్థం చేసుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమకు కూడా పత్రిక ఉండాలని భావించి తన కుమారుడు జగన్‌తో సాక్షి పత్రిక, టివిలను ఆరంభించారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్ బొమ్మను సాక్షి పత్రిక, టివిలలో ప్రముఖంగా వేసుకుని నడుపుతున్నారు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం తెలుగు దేశం జెండా గుర్తు వేసుకోకుండా లేదా చంద్రబాబు మద్దతు దారులమని ప్రకటించకుండా పూర్తి స్థాయిలో ఆయనకు సపోర్టు ఇస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు వ్యతిరేకులపై ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పై నీచమైన స్థాయిలో పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తుంటాయి.చంద్రబాబుకు భజన చేసుకుంటే పర్వాలేదు కాని వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఉన్మాదంగా వైఎస్సార్సీపీపై అధికారంలో ఉన్నప్పుడే కాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కూడా అదే ధోరణిలో వెళుతున్నాయి. చిత్రం ఏమిటంటే ఈ రెండు మీడియాలు మరికొన్ని ఎల్లో మీడియా సంస్థలు తెలంగాణలో కాంగ్రెస్‌కు, ఏపీలో టీడీపీ జనసేన, బీజేపీ కూటమిని భుజాన వేసుకుని ప్రచారం చేస్తుంటాయి. ఈ మీడియాల యజమానులతో రేవంత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక మీడియా అధిపతి వద్దకు స్వయంగా రేవంత్ వెళ్లి వినయంగా వ్యవహరించిన ఘట్టం విమర్శలకు గురి అయ్యింది. ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ఒక టివి, చానల్ రేవంత్ అనుచరుడిది అని చెబుతారు. నిజానికి రేవంత్ పైకి వచ్చింది మీడియా సహకారంతో అన్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు ఆయన మీడియాకు సుద్దులు చెప్పే దశకు చేరుకున్నారు .ఆలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక యూ ట్యూబ్ చానల్ లు నిర్వహించడం ...అప్పట్లో కేసిఆర్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కధనాలు నడపించడంతో పోలీసులు దాడులు చేసి కేసులు పెట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పై రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు .ప్రధాన మీడియా అయినా, యూ ట్యూబ్ చానల్ లు అయినా తమ పరిధులలో ఉండాలని చెప్పడంలో ఏలాంటి సందేహం అవసరం లేదు.కాని చంద్రబాబు ,రేవంత్ రెడ్డి వంటి నేతలు తాము అధికారంలో ఉంటే మీడియా ఒక రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ఉండాలని కోరుకోవడంతోనే సమస్యలు వస్తాయి.గత కేసిఆర్ ప్రభుత్వం సచివాలయంలో జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టిన మాట నిజమే. అందువల్ల ఆయనకు అప్రతిష్ట వచ్చింది. ఇప్పుడు రేవంత్ అలాంటి అంక్షలు లేవని అనడం ఆహ్వనించదగ్గదే. కాని కొంత మంది జర్నలిస్టులపై ఉన్మాద ముద్ర వేయడం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ ఉన్మాద పత్రికల యజమానులతో ఆయన స్నేహ సంబంధాలు నడుపుతున్న విషయం మర్చిపోవద్దు.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మరకే మంచిదంటున్న చంద్రబాబు!
కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మంత్రుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటోందని, తాను ఇటుక,ఇటుక పేర్చి ప్రభుత్వ పరువు పెంచుతుంటే.. వీరు బుల్ డోజర్ పెట్టి కూల్చుతున్నారని కూడా పేర్కొన్నారు. నిజంగా కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల వల్లే పరువు పోతోందా? లేదా? అన్నది పక్కన బెడితే.. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే టీడీపీ దండులో ఒకరిద్దరేమైనా అరాచకాలకు పాల్పడకుండా ఉంటున్నారేమో అనే భావన కలిగేలా పరిస్థితి ఏర్పడినట్లుగా ఉంది.ఏపీలో టీడీపీ, బీజేపీ,జనసేన కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన హింసాకాండ, విధ్వంసం ఇంతా అంతా కాదు. ఇసుక దోపిడీ వంటి దందాలకు అడ్డు ఆపూ లేకుండా పోయింది. కొన్నిసార్లు తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఎంతో కొంత అలాంటి వార్తలను కవర్ చేయక తప్పడం లేదు. కాకపోతే టీడీపీ మరీ డామేజ్ కాకుండా కాపాడేలా కథనాలు ఇస్తుంటారు. అది వేరే కథ.ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ మహిళా నేత మానభంగం ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం అయింది. సంబంధిత వీడియోలు కూడా వెలుగుచూడడంతో పార్టీ పరువు గంగలో కలిసినట్లయింది. ఆయన గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నాడంటూ ఎదురు ఆరోపణ చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత.. చట్టపరంగా చర్యతీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం చూపలేదు. కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఉత్త ప్రకటన ఒకటి చేశారు. ఆ తర్వాత ఒత్తిడికి గురై కేసు పెట్టారు.అదే వేరే పార్టీ వ్యక్తి అయి ఉంటే ఎంత హడావుడిగా అరెస్టు చేసి ఉండేవారో. ఇంత ఘోరమైన మానభంగం ఆరోపణ వచ్చినా అరెస్టు చేయకపోవడం వల్ల కేవలం ఎమ్మెల్యేకే చెడ్డపేరు వచ్చిందా ?లేక కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చిందా అనేది కూడా ఆలోచించుకోవాలి. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న ఆదిమూలం అంతకు ముందు టీడీపీలోనే పదవులు నిర్వహించారు మరి. అలాంటి వ్యక్తిని తిరిగి టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నట్లు?. ఆ విషయాన్ని కప్పిపుచ్చి టీడీపీ నేతలు.. దిక్కుమాలిన ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ ఏ పార్టీలో ఎప్పుడు ఉన్నారన్నది కాదు. తప్పు చేశాడా?లేదా? అనేది ముఖ్యం.ఎప్పుడో టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారంటూ వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేసి వచ్చిన పోలీసులు.. లైంగిక దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక.. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తన దౌర్జన్యాలను ఆపడం లేదు. కొంతకాలం క్రితం వైఎస్సార్సీపీకి చెందిన ఓ లీడర్‌కు చెందిన భవనాన్ని స్వయంగా బుల్ డోజర్ తీసుకువెళ్లి కూల్చేశారు.అది తప్పే అని టీడీపీ మీడియానే అప్పట్లో వార్తలు రాసింది. ఇప్పుడు కొందరు మహిళలను ఉద్దేశించి ఆయన బూతులు తిట్టారట. వారేదో సమస్యపై వస్తే దానిని చేయగలిగితే చేయాలి. లేదా కుదరదని చెప్పాలి. అలాకాకుండా ఫలానా గ్రామం నుంచి వచ్చారా? అని ప్రశ్నించి మరీ బూతులు తిట్టారని ఆ మహిళలు వాపోయారు. ఇది ఇక్కడితో ఆగలేదు. పోలీస్ ఎస్.ఐ.ని పిలిచి వారందరిని అరెస్టు చేయాలని ఆదేశించారట. విధేయుడైన ఆ పోలీసు అధికారి వారందరిని స్టేషన్ కు తరలించారట. ఇలా ఉంది ఏపీలో ప్రజాస్వామ్యపాలన.ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరిస్తే టీడీపీ కార్యకర్తలు ఇంకెంతగా పెట్రోగిపోతుంటారో ఊహించుకోవచ్చు. తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి.. పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ తో దురుసుగా వ్యవహరించి క్షమాపణ చెప్పించడం కలకలం రేపింది. ఆయన తండ్రి,మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి దూషణల సంగతి సరేసరి. తన బస్ లను పట్టుకున్న అధికారుల పని పడతానంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. ఇక.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన స్వగృహానికి వస్తుంటే జెసి అనుచరులు దౌర్జన్యానికి దిగి అడ్డుకున్నారు. స్థానిక వైఎస్సార్సీపీ నేత ఇంటిని ఏకంగా దగ్దం చేశారు. అయినా వీటిపై చంద్రబాబు కిమ్మనలేదు.వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టడానికి అనుమతులు తీసుకోవాలన్న పోలీసులపై జేసీ మండిపడ్డారు. ఎవరూ పోలీసుల వద్దకు వెళ్లనక్కర్లేదని హుకుం జారీ చేశారు. ఒకపక్క హోం మంత్రి అనిత ఏమో విగ్రహాల పండాల్స్ ఏర్పాటు చేసేవారు నిర్దిష్ట రుసుము చెల్లించి అనుమతులు తీసుకోవాలని చెబుతుంటే.. తాడిపత్రి టీడీపీ నేతలు కుదరదు పొమ్మంటున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాను కూడా ఒక రెడ్ బుక్ పెట్టుకున్నానని, అందులో వందమంది పేర్లు ఉన్నాయని అధికారులను బెదిరించారు. వారిని ఇబ్బంది పెట్టి తీరుతానని చెబుతున్నారంటే.. ఏపీలో టీడీపీ అరాచకం ఎంతగా వర్ధిల్లుతోందో తెలుస్తోంది. అఖిలప్రియపై హైదరాబాద్ లో కూడా కొంతకాలం క్రితం కొన్ని సీరియస్ కేసులు నమోదు అయ్యాయి. అయినా చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. ఎదుటి పార్టీలో ఉంటే ఏమైనా అంటారు. తన పార్టీలోకి రాగానే వారు ప్రక్షాళన అయిపోయినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తుంటారు.సంబంధిత వార్త: ఆళ్లగడ్డలో వంద మంది నా టార్గెట్చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు భార్య వెంకాయమ్మ కు పోలీసులు జన్మదినోత్సవం జరపడం వివాదాస్పదం అయింది. మంత్రి రామ్ ప్రసాదరెడ్డి సతీమణి ఒక పోలీస్ ఎస్.ఐ.పై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు కోడలు, మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణికి పోలీసులు వందన సమర్పించిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ నిమిత్తం రూ. 82 లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడంపై ఆక్షేపణ వచ్చింది. ఇలా ఒకటి కాదు.. అనేకం ఉన్నాయి.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పచ్చబిళ్లతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వ అధికారులంతా విధేయులుగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. వీటిని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరిగాయని, అప్పుడేమి చర్య తీసుకున్నారని టీడీపీ వాళ్లు ప్రశ్నిస్తుంటారు. నిజానికి ఏ ప్రభుత్వం ఉన్నా.. కొన్ని ఘటనలు జరగొచ్చు. వాటిపై ప్రభుత్వం స్పందిస్తే తప్పు పట్టనక్కర్లేదు.ఆనాటి ముఖ్యమంత్రి జగన్ పలు చర్యలు తీసుకున్నా.. చంద్రబాబు,పవన్‌లు మాత్రం అప్పట్లో ఘోరాలు జరిగిపోయినట్లు దుష్ప్రచారం చేశారు. తీరా అలా ఆరోపణలకు గురైనవారిలో కొందరిని టీడీపీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చేశారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు.. చంద్రబాబు,లోకేష్ లు ఆయనపై చేయని ఆరోపణలు లేవు. పేకాట శిబిరాలు నిర్వహిస్తారని, భూములు కబ్జా చేస్తారని ఇలా ఎన్నో చెప్పారు. ఎన్నికల సమయానికి ఆయనను సగౌరవంగా టిక్కెట్ ఇచ్చి టీడీపీ పక్షాన నిలబెట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎం.పీ.డీ.వో.పై దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగా,ఆయన అరెస్టుకు జగన్ ఆదేశించారు. అప్పట్లో శ్రీధర్ రెడ్డిపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసేది. ఆ తర్వాత కాలంలో ఆయన్ని టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. అంటే ఆ పార్టీలో చేరగానే శ్రీధర్ రెడ్డి పవిత్రుడు అయిపోయారా? అంటే ఏమి చెబుతాం.మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన సమీప బంధువులపై ఇసుక,మట్టి తవ్వకం తదితర ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా పలు ఆందోళనలు చేపట్టారు. కానీ గత ఎన్నికలలో వసంతను టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చి, దేవినేని ఉమాకు మాత్రం మొండి చేయి చూపారు. దీనిని ఏమనాలి?. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఆ టైంలో ఈనాడు మీడియా ఎన్ని వ్యతిరేక కధనాలు ఇచ్చిందో చెప్పలేం. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కానీ టీడీపీ ఆహ్వానించి మరీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో సంగతి కూడా చెప్పాలి.టీడీపీ నేతలు ఎవరిపైన అయినా అభియోగాలు వచ్చి పోలీసులు అరెస్టు చేస్తే.. వైఎస్సార్సీపీ టైమ్ లో చంద్రబాబు నానా యాగీ చేసేవారు. హత్య కేసులో ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు అయితే.. ఇంకేముంది బీసీ నేతను అరెస్టు చేస్తారా? అని గోల చేశారు. ఇప్పుడేమో దళిత నేత నందిగం సురేష్‌ను మాత్రం కక్ష కట్టి చంద్రబాబు అరెస్టు చేయించారు. ఇవన్నీ చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతున్న అరాచకాలా? లేదంటే ఆయన కుమారుడు లోకేష్ నేతృత్వంలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాలా?. పరిశీలిస్తే.. ఎక్కువ శాతం లోకేష్ దుందుడుకు వ్యవహారాలు ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి.సూపర్ సిక్స్ హామీలను పక్కనబెట్టి ఈ దందాలు, హింసాకాండ ద్వారా నియంతృత్వపాలన సాగించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ఎల్లకాలం సాగుతుందా?ప్రజాస్వామ్యాన్ని హరించివేయాలని అనుకున్న చాలామంది నేతలు గతంలో కాలగర్భంలో కలిసిపోయారు. ఆ సంగతి అధికారంలో ఉన్నవారు మర్చిపోకుండా ఉంటే మంచిది.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు మరో మాయ.. ముందే లీకులు కూడా!
ఆంధ్రప్రదేశ్ ప్రగతికి రోడ్ మ్యాప్ తయారు చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త. ఇది నిజమే అయితే సంతోషించాల్సిన విషయమే. ఆ మొత్తం కథనం చదివితే ఎక్కడా సూపర్ సిక్స్ కానీ.. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు కనిపించలేదు. వాటికి రోడ్ మ్యాప్ ఎందుకు తయారు చేయడం లేదో చెప్పలేదు.కొత్త రోడ్ మ్యాప్‌లో ప్రధానంగా జనాభా మేనేజ్మెంట్(డెమోగ్రాఫ్ మేనేజ్మెంట్) గురించి ప్రస్తావించడం ఒక విశేషమైతే.. పీ-4(పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్) పాలసీ మీద కేంద్రీకరించారు. చంద్రబాబు గత కొంతకాలంగా చేస్తున్న ప్రచారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్దికి ఇంతకు మించి మార్గం లేదని చంద్రబాబు నాయుడు అన్నారని ఈ ప్రతిక వెల్లడించింది. ఈ ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో ప్రయోజనాలు సాధించి తద్వారా సంపాదించే డబ్బును సంక్షేమానికి ఖర్చు పెట్టవచ్చని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలు ఇప్పట్లో అయ్యేవికావని చెప్పడమేనా?.ప్రతీ మహిళకు నెలకు 15 వందలు, స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి ఏడాదికి 15వేలు, ప్రతీ ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా మూడు వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వీటికి బాబు సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రచురించారు. దీనికి బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ అని టైటిల్ పెట్టారు. ఇందులో ఎక్కడా పీ-4 విధానాన్ని అమలు చేసి.. అంటే ప్రైవేటు రంగంతో కలిసి వ్యాపారాలు చేసి లేదా అభివృద్ది సాధించి అటు పిమ్మట వచ్చే డబ్బుతో ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఎక్కడా రాయలేదు.ఇవి కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అనేక హమీలు ఉన్నాయి. ఉదాహరణకు వాలంటీర్లను కొనసాగిస్తానని, వారికి గౌరవ వేతనం ఐదు వేల నుంచి 10వేలకు పెంచుతామని అప్పట్లో ప్రకటించారు. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ఈ ష్యూరిటీలు.. భవిష్యత్ గ్యారంటీలు ఏమై పోయాయో కానీ ఇప్పుడు తాజాగా పీ-4 విజయవంతం అయితేనే సంక్షేమం మీద అధిక డబ్బులు ఖర్చు పెట్టగలుగుతామని సెలవిస్తున్నారు. సో.. మీడియా మేనేజ్మెంట్లో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు ఇదే ఏపీ గ్రోత్ అని.. దీనికి ఒక రోడ్ మ్యాప్ అని కథనాలు ఇప్పిస్తున్నారు.పరిశ్రమల అభివృద్ది, ఉపాధి, అమరావతి, పోలవరం, ఇంధన రంగం మొదలైన వాటి మీద ఫోకస్ చేస్తారట. అందులోనూ నైపుణ్య గణన వచ్చే రోజుల్లో గేమ్ చేంజర్ అవుతుందట. అన్న క్యాంటీన్లు, మౌళిక వసతులు అభివృద్ది, పోలవరం ప్రభుత్వ ప్రధాన ఎజెండా అట. వాటిపై డాక్యుమెంట్ తయారు చేయడానికి సీనియర్ అధికారులతో చర్చ జరిపారట. ఈ ఫలితాలు సాధించడానికి చంద్రబాబు.. అధికారులకు సలహాలు ఇచ్చారట. ఈ మొత్తం వార్త చూస్తే ఏమనిపిస్తుంది. సూపర్ సిక్స్‌లోని అంశాలు ఏవీ ప్రధాన ఎజెండాలో లేవని కొంత ప్రత్యక్షంగా.. కొంత పరోక్షంగా చెప్పేస్తున్నట్టే కదా?. ఆ సూపర్ సిక్స్ రాష్ట్ర భవిష్యత్‌కు గ్యారంటీ అని కదా ఎన్నికలకు ముందు చెప్పింది. చంద్రబాబు ష్యూరిటీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారు.పరిశ్రమల అభివృద్ది, పోలవరం నిర్మాణాన్ని ఎవరు వద్దు అంటారు?. అది నిరంతర ప్రక్రియ. పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసేది ఏమి లేదు. ఈయన టైంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ముందుగా పునరుద్దరణ జరగాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయ అంచనాలను ఆమోదించాలి. ఆ తర్వాత డబ్బు కూడా కేంద్రమే ఇస్తుంది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తాను చేపట్టి దానిని గందరగోళంలోకి నెట్టిన ఘనత చంద్రబాబుదే. అయినా ఇప్పుడు ఆ నెపాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇరవై లక్షల ఉద్యోగాలు ఏలా ఇచ్చేది ఈ రోడ్ మ్యాప్‌లో చెప్పలేదు. తన స్పీచ్‌లలో కూడా చంద్రబాబు ఎక్కడా ఇది చెప్పడం లేదు. వైఎస్ జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలను మరోసారి ప్రారంభించి అది తన ఘనత అని ప్రచారం చేసుకుంటున్నారు.ఇక అమరావతి చూస్తే ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ ఫైనాన్స్‌గా తనే సమకూర్చుకుంటుందని ఇంత కాలం చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 15వేల కోట్ల రూపాయల అప్పును తీసుకువచ్చి అది ఏదో ఒక గొప్ప విషయంగా ఊదరగొడుతున్నారు. ఇక అక్కడే నాలుగేళ్లలో రూ. 60వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో ‘అన్న క్యాంటీన్లు’ పెట్టడం పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చెప్పుకుంటున్నారు. సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచారు. ఇవి తప్ప మిగతా వాటిన్నింటికీ ఆయన పీ-4 విధానం కింద సంపాదించడం ద్వారానే అధిక ఖర్చు చేయగలుగుతామని జనానికి చెబుతున్నట్టుగా ఉంది. 2014-2019 మధ్య ఇలాంటి డాక్యుమెంట్లు తయారు చేయలేకపోలేదు. ప్రతీ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రోచర్ వేసి ప్రచారం చేసుకున్నట్టుగా ప్రభుత్వం అది చేస్తుంది.. ఇది చేస్తుంది అంటూ విమానాశ్రయాలు మొదలు అనేక హమీలు గుప్పించారు. కానీ, ఆచరణలో ఒక్కటి కూడా చేయలేకపోయారు.రుణ మాఫీ తదితర హామీలు సైతం అరకొరగా అమలు చేసి హుష్ కాకి అన్నారు. ఇప్పుడు ఏపాటి చేస్తారో కానీ.. పీ-4 విజన్ డాక్యుమెంట్, రోడ్ మ్యాప్ అంటూ జనాన్ని మాయ చేయడానికి వీలుగా మీడియాకు లీక్‌లు ఇస్తున్నారు. వీటికి తోడుగా ఇప్పుడు ఏపీలో జనాభాను పెంచుతారట. ఇప్పటికే జనాభా అధికమై దేశం అనేక సమస్యలు ఎదుర్కుంటుంటే ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలను అధికంగా కనమని చంద్రబాబు సలహా ఇస్తున్నారు. తన కుటుంబంలో అమలు చేయని విధానాన్ని ఇతరులు అంతా చేయాలని చెప్పడమే హైలెట్. పిల్లలను ఎంత మందిని కంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని ప్రచారం చేసిన ఈయన ఇంతవరకు ఆ స్కీమ్ అమలు గురించే మాట్లాడడం లేదు. ఈ ఏడాది దానిని అమలుచేయడం లేదని ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అంటే చంద్రబాబును నమ్మి పిల్లలను కనేపనిలో ఉంటే ఏమవుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదా!.పంచాయతీ, మున్సిపాలిటీ పదవుల కోసం ఆశపడి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటారని చంద్రబాబు ప్రభుత్వం కనిపెట్టడం మరో విడ్డూరం. గతంలో ఇద్దరు పిల్లలను మించి పిల్లలను కంటే స్థానిక ఎన్నికల్లో అనర్హులు అవుతారని తెచ్చిన చట్టాన్ని ఈయన తీసేశారు. ఒక పక్క జనాభా పెంచాలని అంటారు. ఇంకో పక్క భవిష్యత్ గ్యారంటీ అన్నారు. మరి వీటికి డబ్బులు ఎక్కడివీ అంటే పీ-4 అంటారు. ధనికులు పేదలను దత్తత తీసుకోవాలంట. ప్రభుత్వం, ప్రైవేట్ కలిసి వ్యాపారాలు చేయాలట. తద్వారా లాభాలు సంపాదించాలట. తదుపరి ఆ డబ్బును సంక్షేమంపై ఖర్చు చేయాలట. ఇది అంతా ఆయన విజన్ అంట. ఏం చేస్తాం అధికారంలో ఉన్న వాళ్లు ఏం చెప్పిన గొప్ప విషయంగా జనం తీసుకోవాలి. లేదంటే ఏలిన వారికి కోపం రావచ్చు. ఇదే క్రమంలో ఇప్పటికే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగు మీడియా చంద్రబాబుకు భజన చేసే పనిలో ఉంటే.. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా కూడా తన పాత్రను పోషిస్తున్నట్టుగా ఉంది. ఏం చేసినా, చేయకపోయినా ఇలా బిల్డప్ ఇచ్చుకోవడంలో చంద్రబాబును మించిన మొనగాడు లేడేమో!.- కొమ్మినేని శ్రీనివాస రావు.సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సాయం సున్నా.. ప్రచార ఆర్భాటం వంద!
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం విజయవాడను ముంచేసిన వరదల విషయంలో సాయం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వరద బాధితులు పడుతున్న కష్టాలు, నష్టాల తీవ్రతను తగ్గించడం సంగతి ఎలా ఉన్నా మూడు నాలుగు రోజుల నిష్క్రియాపరత్వంతో దెబ్బతిన్న ప్రభుత్వ ప్రతిష్టను పునరుద్ధరించుకునేందుకే తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.వాస్తవానికి ప్రచారం చేసుకునే విషయంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరు. కానీ.. ఆచంట మల్లన్న టైపు నేతలకు కూటమి ప్రభుత్వంలో లోటేమీ లేనట్టు స్పష్టమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంతి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్లు కూడా బాబును పొగడ్డమే తమ కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ భజన కాస్తా వికటించి ఆయన పరువే తీసినట్టుగా కనిపిస్తోంది.ఐదు రోజుల క్రితం విజయవాడను వరద చుట్టేసిన తరువాత చంద్రబాబు చేయని విన్యాసమంటూ లేదు. రోజూ రెండు మూడు సార్లు మీడియాతో మాట్లాడటం, జేసీబీపై ఎక్కి ఒకసారి.. పడవలో వెళ్లి ఇంకోసారి, మోకాలి లోతు నీళ్లలో మరోసారి వెళ్లి తాను జనంలోనే ఉన్నట్లు.. వారి కోసమే పని చేస్తున్నట్లు గట్టి కృషే చేశారు. ఏదో ఒక పేరుతో వరద ప్రాంతాల్లో తిరుగుతూండటంతో అధికారులే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బాబు గారు మాత్రం మీడియా కవరేజీ కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.భజన మీడియా కూడా తనవంతుగా బాబుగారి ప్రచారానికి పోటాపోటీలు పడుతున్నాయి. అదేదో సినిమాలో ఉన్నట్లు.. ‘‘అన్న నడిచొస్తే మాస్.. అన్న మడతేస్తే.. మాస్.. మ మ మాస్’’ అనేలా ఉంది వీరి రాతలు. వరదలొచ్చిన ఐదు రోజులకు ఈనాడు ఓ కథనంలో... బుడమేరు వరదకు చంద్రబాబు చలించిపోయారని, బాధితులు, రైతుల కష్టాలు విన్నప్పుడు ఆయన కళ్లు చెమ్మగిల్లాయని, రాసుకొచ్చింది. విజయవాడలో వరదల కారణంగా ఇప్పటి వరకూ యాభై మంది మరణించారన్న సమాచారానికి మాత్రం అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు. మొక్కుబడిగా కొన్ని వార్తలు రాసి చేతులు దులుపుకుంది.వరద సహాయ చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి తీసుకునే చర్యల గురించి రాయడం తప్పు కాదు. కానీ ప్రజల బాధల కన్నా చంద్రబాబు గురించే ఈనాడు, తదితర మీడియాలు కొన్ని తెగ దుఃఖిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అతిగా చేసే ప్రచారం ఒక్కోసారి నష్టం కూడా చేయవచ్చు. కేంద్ర మంత్రి చౌహాన్ వరద బాధితుల దగ్గరకు వెళ్లి పరామర్శ చేశారో, లేదో కాని, టీడీపీ ప్రభుత్వానికి సర్టిఫికెట్ మాత్రం ఇచ్చేశారు. వరద సహాయ చర్యలు బాగానే చేసిందని తేల్చేశారు. మిత్రపక్షం కనుక మర్యాద కోసం ఒక మాట అంటే ఫర్వాలేదు కాని, డబ్బా కొట్టినట్లు మాట్లాడితే ప్రజలలో బీజేపీ నవ్వులపాలు కాదా? చంద్రబాబు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని చౌహాన్ కితాబు ఇచ్చారు. ఇల్లు మునిగిపోయి చంద్రబాబు తన బస కలెక్టరేట్‌కు మార్చిన విషయాన్ని చెప్పకుండా చెప్పకుండా, ఆయన సారథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని చేస్తోందని వ్యాఖ్యానించడం విశేషం.వరదల వల్ల ఆస్తి నష్టం భారీగా జరిగినా ప్రాణ నష్టం మాత్రం స్వల్పంగా ఉందని కేంద్ర మంత్రి స్వయంగా చెబితే ఏమని అనుకోవాలి? వరదల కారణంగా యాభై మంది మరణిస్తే అది తక్కువ సంఖ్య అవుతుందా? మృతులు ఎందరో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేని స్థితిలో ఉంటే... చౌహాన్ మాత్రం ఇలా విడ్డూరంగా మాట్లాడారు. పైగా తొలిసారి డ్రోన్ల ద్వారా బాధితులకు సాయం అందించారన్న చౌహాన్ మెచ్చుకోలు కూడా ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఉత్తరాఖండ్, కేరళల్లోనూ వరద సహాయక చర్యలకు డ్రోన్లను వాడిన విషయం కేంద్ర మంత్రికి తెలియదా? అని నెటిజన్లు ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర మంత్రి వరద నీటిలో అల్లాడుతున్న ప్రజలను పలకరిస్తే వారి బాధలు తెలుస్తాయి.పైపైన తిరిగి, ఎగ్జిబిషన్ పోటోలు చూసి, చంద్రబాబును పొగిడి, తన బాధ్యత తీరిపోయిందని అయిందని అనుకున్నట్లుగా ఉంది చౌహాన్ వ్యవహారం. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. ఈయనతై బాధితులను స్వయంగా చూడలేదు కానీ చంద్రబాబును మాత్రం ఆకాశానికి ఎత్తుతూ పొగిడేస్తున్నారు. పవన్ ఈ స్థాయిలో బాబుకు లొంగిపోతారని ఊహించ లేదు. గతంలో నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం ఎమ్మెల్యే ఒకరు ఉండేవారు. పవన్ కళ్యాణ్‌లా లొంగిపోయే వారిపై సామెతలు కొన్ని చెబుతుండేవారు.. ‘‘పొగడరా, పొగడరా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత’’ అని చెప్పాడని ఎద్దేవ చేసేవారు. పవన్ కళ్యాణ్ తీరు కూడా అలాగే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సృష్టించిన ఫోటోలను ఎక్స్‌లో పవన్ పెట్టి చంద్రబాబుకు బాకా ఊది ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు.ఒక వృద్దురాలు డ్రోన్ ద్వారా నడుం లోతు నీళ్లలో ఆహారపొట్లం అందుకున్నట్లు ఉన్న పోటోను పోస్టు చేశారు. ఇది తనకు సంతృప్తి ఇచ్చిందని, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కానీ అది కృత్రిమ ఫోటో కావడంతో ఆయన నవ్వుల పాలవయ్యారు. సోషల్ మీడియాలో దానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో పవన్ తన వ్యాఖ్యను మార్చేశారు. చంద్రబాబుతోపాటు తిరగకుండా ఈయన ఏమి నేర్చుకున్నారో అర్ధం కాదు. చంద్రబాబే అధికార యంత్రాంగం విఫలం అయిందని ఒప్పుకుంటే ఈయన మాత్రం ప్రభుత్వం బాగా పనిచేసిందని గొప్పలు చెబుతున్నారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా వరదల్లాంటి విపత్తులు వచ్చినప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చి.. అవి అమలయ్యాక జనం వద్దకు వెళ్లడాన్ని కూడా పవన్ తప్పుపట్టిన విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నాడు. వరదపీడిత ప్రాంతాలకు వెళితే అధికారుల విధులకు ఆటంకం అవుతుందని అంటున్నారు. మరి చంద్రబాబు పదే,పదే తిరుగుతూ అధికారులకు ఇబ్బంది కలిగించడం లేదా అని అంటే మాత్రం బాజా వాయిస్తారు.మీడియా తలచుకుంటే ఎలా ప్రచారం చేయవచ్చనడానికి ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు బుడమేరు వంతెనపై నిలబడి ఉంటే ,ఆ పక్కగుండా రైలు వెళ్లింది. దానికి ఏమని ప్రచారం చేశారో తెలుసా! చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పిందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి. అదేమిటా అని పరిశీలిస్తే ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటే రైలు వెళ్లింది. ఆ టైమ్ లో ఆయన చుట్టూరా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఆయన రైలు వస్తున్న విషయం గమనించి ,అటువైపు తిరిగి చూస్తూ నిలబడ్డారు. మరి ఇందులో ప్రమాదం ఏమిటో అర్థం కాదు. ఇలా రాయమని చంద్రబాబు చెప్పి ఉండకపోవచ్చు.అయినా అతి భక్తి కల మీడియా ఇలా ప్రచారం చేసిందన్నమాట. ఈ నేపధ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం మీడియాలో ప్రచారం కోసమే తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరుగుతున్నది లేదని వ్యాఖ్యానించారు. పత్రికలు చేతిలో ఉండడంతో ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నాయని ఎద్దేవ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ బుడమేరు ఆక్రమణల గురించి మాట్లాడడాన్ని ప్రస్తావించి, చంద్రబాబుతో మాట్లాడి కృష్ణా కరకట్టే మీద ఉన్న అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయించాలని రాంబాబు సూచించారు. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ ధైర్యంగా ఆ విషయం మాట్లాడగలరా? ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యవహార శైలి చూస్తుంటే అది అయ్యే పని కాదనిపిస్తుంది.తెలుగుదేశం నేతలకన్నా ఎక్కువగా పోటీపడి చంద్రబాబును పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. వరద ప్రాంతాలవారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలోను, వరద బాధితులను ఆదుకోవడంలోను విఫలం అవడంతో నాలుగైదు రోజులపాటు ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్లలోని సామానంతా పాడైపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వారుంటే చంద్రబాబు, ప్రభుత్వ నేతలు తమ జబ్బలు తామే చరుచుకుని మురిసిపోతున్నారు.వరద బాధితులు అందరికి రేషన్ ఇవ్వలేకపోయామని అంటారు. వారి ఇళ్లకు రేషన్ చేర్చకుండా రేషన్ షాపుల వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలని చంద్రబాబు చెప్పడం మాత్రం శోచనీయం. ఇది పెద్ద వైఫల్యం కాదా! అయినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నేతలు ఒకరినొకరు పొగుడుకుని ఆత్మవంచన చేసుకుంటున్నారు. అనుకూల మీడియా ప్రచారం ద్వారా బాధితుల కష్టాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. జనం ఈ ప్రచారానికే అన్నీ బాధలు మర్చిపోతారా!- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఉక్రోషంతోనే బాబు గారి విపరీత వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎందుకు అంత అసహనం? విజయవాడ వరదల విషయంలో తన ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిసి పోయిందన్న కోపమా? వరద బాధితుల శాపనార్థాలు రాష్ట్రమంతా మారుమోగిపోతున్నాయన్న ఉక్రోషమా? కేవలం రాజధాని ప్రాంతంలో వరద సమస్యల గురించి మాట్లాడితేనే.. ఆయన వారిని పూడ్చేయాలి అనడం సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ఇది భావ్యమా? అక్కడితో ఆగినా బాగుండేది.. కానీ బాబుగారు తన అసహనం, ఉక్రోషం అన్నింటినీ వెళ్లగక్కేలా ‘‘వారిని సంఘ బహిష్కరణ’’ చేయాలని కూడా అనేశారు.నలభై ఏళ్లకుపైగా ప్రజా జీవితంలో ఉన్న బాబు లాంటి వ్యక్తి ఇంత ఘోరంగా మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని పూడ్చి పెడుతుండడం ధర్మమేనా? మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వేసిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక... ఎదురుదాడికి దిగితే ప్రజలకు సంతృప్తి చెందుతారా? వరద సహాయ చర్యల్లో విఫలమైన విషయాన్ని కప్పిపుచ్చేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు అధికార వర్గం వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం ఆరంభించిందని అనుకోవాలా?ఆంధ్రప్రదేశ్ పరిణామాలు ప్రజలను కలవరపరుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యవహార సరళి పూర్తి అభ్యంతరకరంగా ఉందని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ వరద ప్రాంతాలలో పర్యటించినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం, తమ బాధలు వెళ్లబోసుకోవడం.. గతంలో వైసీపీ ప్రభుత్వం తమను సమర్థంగా ఆదుకున్న విషయాలను గుర్తు చేసుకోవడం బాబుకు అస్సలు నచ్చడం లేదని అనిపిస్తోంది.ప్రజలు తమ కష్టాలు కన్నీళ్లతో జగన్‌కు వివరిస్తూంటే ప్రభుత్వ క్రియా రాహిత్యం బయటపడిపోతుంది మరి. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు తమ విమర్శలకు పదును పెడుతున్నారు. విజయవాడకు వరద ముప్పు మొత్తానికి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లే కారణమన్నట్టుగా వారు చేస్తున్న వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివి. ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చి బాబు తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఆయన దగ్గర లేవు. బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ షట్టర్లను ఆకస్మికంగా ఎత్తివేయడం వల్లే విజయవాడ ప్రజలు వరదలలో మునిగిపోవలసి వచ్చిందా? లేదా? అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు జవాబు ఇవ్వడం లేదు. కేవలం కృష్ణా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండడానికే ఇలా రెగ్యులేటర్ గేట్లు ఎత్తారన్నది జగన్ అభియోగం.అయితే బుడమేరుకు పడిన గండ్ల వల్ల వరద వచ్చిందని ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే పత్రికలోనే ముంపునకు కారణం రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వేయడమేనని కథనాలు రావడంతో చంద్రబాబుకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అయినా సరే.. జగన్ పైనే విమర్శలు ఎక్కుపెట్టి మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు.ప్రజలకు వరద గురించి ముందుగా హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అయిందన్న జగన్ మరో ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి జవాబు రావడం లేదు. ప్రజల కోసమే తాను అమరావతిలోని తన ఇంటి నుంచి కలెక్టరేట్‌కు బస మార్చానని చెప్పేందుకు బాబు ముందు ప్రయత్నించారు కానీ.. ముంపునకు గురవడం వల్ల మార్చాల్సి వచ్చిందని వైసీపీ చెప్పడంతో బాబు గారు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఈ సందర్భంలోనూ... ‘‘అందరి ఇ్లళ్లలోకి నీరు వచ్చాయి..నా ఇంట్లోకి నీరు వచ్చింది ..అయితే ఏంటట?’’ ఆయన దబాయించే కార్యక్రమమే చేశారు. అదే క్రమంలో అమరావతి మునిగిందని కొందరు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని కూడా చెప్పుకోచ్చారు.పైగా అలా అన్నవారిని అక్కడే ముంచాలని, అమరావతిలో పూడ్చాలని, గతంలో స్మశానం అన్నారని, వారిని సంఘ బహిష్కరణ చేయాలని ముఖ్యమంత్రి అనడం ఏ మాత్రం పద్దతిగా లేదు. ఎవరినైనా పూడ్చి పెట్టడం అంటే పరోక్షంగా చంపమని చెప్పడమే అవుతుంది కదా! సంఘ బహిష్కరణ చేయాలని చెప్పడం నేరం కాదా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తపరుచుకునే అధికారం ఉంటుంది. వాటిలో ఏమైనా అసత్యాలు ఉంటే ఖండింవచ్చు. వారిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అలా అని వారిని చంపి పూడ్చేసే హక్కు ఎవరికి ఉండదు.అమరావతి రాజధానిలో పలు ప్రాంతాలు భారీ వర్షాల వల్ల నీట మునిగిన మాట వాస్తవం కాదా? హైకోర్టు, సచివాలయం ఎందుకు పూర్తి స్థాయిలో పని చేయలేకపోయాయి? అవన్ని ఎందుకు! చంద్రబాబు ఇల్లు ఉన్నది అమరావతి రాజధానిలో కాదా? ఆయన ఇంటిలోకి వరద చేరిందని ఆయనే అంగీకరించారు కదా? అయినా ఎందుకు బుకాయిస్తున్నారు? అమరావతి గురించి మాట్లాడితేనే పూడ్చి పెడతారా? దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.అమరావతిలో మునిగిన వివిధ ప్రాంతాలను చూపుతూ వీడియోలు పెడుతున్నారు. ఎంతమందిని పూడ్చిపెడతారు? సంఘ బహిష్కరణ చేస్తారూ? మరి సూపర్ సిక్స్ పేరుతో అబద్దపు హామీలు ఇవ్వడాన్ని ఏమనాలి? అని కొంతమంది అడుగుతున్నారు.జగన్ ప్రభుత్వంపై తమకు మద్దతు ఇచ్చే మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి అరాచకంగా అనేక అసత్య కథనాలు ప్రచురించినప్పుడు వారిని సమర్ధిస్తూ చంద్రబాబు ఎలా మాట్లాడారు? అప్పుడు ఎవరైనా ఆ అబద్దాల గురించి ప్రస్తావించి ఈనాడు, ఆంధ్రజ్యోతి లను విమర్శిస్తే అమ్మో పత్రికా స్వేచ్చను అడ్డుకుంటారా? అని చంద్రబాబు ప్రశ్నించేవారు. ఆ రోజుల్లో భూమి టైటిలింగ్ యాక్ట్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేశారా? లేదా? ఒకటి కాదు.. ఎన్ని రకాలుగా జగన్ ప్రభుత్వాన్ని ఆ మీడియా వేధించింది? అప్పుడు వాటన్నిటి సమర్ధించిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే అలవాటు ప్రకారం మాట మార్చేశారు. సాక్షి మీడియాపై విరుచుకుపడుతున్నారు.ఈనాడు, జ్యోతి వంటి మీడియాల ద్వారా వరదలపై కూడా తనకు అనుకూలంగా అధిక శాతం ప్రచారం చేయించుకున్న చంద్రబాబు జాతీయ మీడియాను కూడా మేనేజ్ చేయగలిగారు. అయినా సాక్షి మీడియా మాత్రం ప్రజల పక్షాన నిలబడి కథనాలు ఇస్తుండడంతో, టీవీలలో ప్రజల ఆర్తనాదాలు ప్రసారం చేస్తుండడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. సాక్షి మీడియా కనుక లేకపోతే వరదలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు బయట ప్రపంచానికి తెలియకుండా పోయేవి. ఇంత మంది మరణించిన సంగతి కూడా తెలిసేది కాదు. అందువల్లే చంద్రబాబులో ఈ ప్రస్టేషన్ అన్న విశ్లేషణలు వస్తున్నాయి.వరదలలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గాను సడన్ గా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎప్పుడో టిడిపి ఆఫీస్ పై జరిగిన దాడికి సంబంధించి, ఇప్పుడు కేసులు పెట్టి దళిత నేతను అరెస్టు చేసింది. గతంలో హత్య కేసులో ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేస్తే, బీసీ నేతను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు దళిత నేతను ఒక చిన్న కేసులో అరెస్టు చేశారు.పెద్ద సంఖ్యలో పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేశారు. విజయవాడలో వరదలలో పోలీసుల సేవలను వినియోగించుకోకుండా దళిత నేతను అరెస్టు చేసి కక్ష సాధిపు చర్యలకు దిగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పనికట్టుకుని వరదల సమస్య ఉన్నప్పుడే ఈ అరెస్టు జరగడం గమనార్హం.చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరకంగాను, అధికారంలోకి రాగానే మరో రకంగాను వ్యవహరించడం,మాట్లాడడం అలవాటే.ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ను ఆయన కొనసాగిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘సాక్షి’ ఓ పక్క.. మరోపక్క మొత్తం పచ్చమంద
నిజం నిప్పులాంటిది అంటారు. ఆ నిప్పును ఎంత దాచిపెట్టాలన్నా అది సాధ్యం కాదు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందిన విషయాన్ని సాధ్యమైనంత మేర బయట ప్రజలకు తెలియకుండా చేయాలని టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి విశ్వ ప్రయత్నం చేశాయి.కానీ, జనం నుంచి వచ్చిన ఆగ్రహావేశాల నేపధ్యంలో ఆ మీడియా సైతం ఎంతో కొంతమేర ప్రజల కష్టాలను కవర్ చేసి తమ మీడియాలో ఇవ్వక తప్పలేదు. వరద బాధితులు పడుతున్న బాధలు, కష్టాలను సాక్షి మీడియా విస్తారంగా ఇవ్వడంపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మిగిలిన మీడియాలో చాలా భాగం వరకు ఆయన మేనేజ్ చేయగలిగారు. అందువల్లే ఏపీలో ముఖ్య నగరం అయిన విజయవాడలో ప్రజలు వరదకు గురై తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమాచారాన్ని ఆంగ్ల పత్రికలు సైతం అంతంత మాత్రంగానే ఇచ్చాయి. హైదరాబాద్ ఎడిషన్లలో ఏపీ ప్రభుత్వ వైఫల్యంపై వార్తలు రావడం లేదు.సాధారణంగా ఇలాంటి పరిస్థితులను జాతీయ స్థాయిలో కవర్ అయితే కేంద్రం కూడా బాగా స్పందించే అవకాశం ఉంటుంది. కానీ, దేశ స్థాయిలో చంద్రబాబు పరువు పోతుందన్న భావనతో ఈ వార్తలు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. సాక్షి మీడియా కనుక లేకపోతే విజయవాడ వరద బాధితుల కష్టాలు వెలుగులోకి వచ్చేవి కావు. చంద్రబాబు ఆగ్రహావేశాలు, టీడీపీకి చెందిన కొందరు చేసిన దాడులను తట్టుకుని ‘సాక్షి’ మీడియా విస్తారంగా వార్తలు కవర్ చేసింది. దాని ఫలితంగానే ప్రభుత్వం కొంత దిగి వచ్చింది. బాధితులకు సాయం చేయడానికి చివరికి గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో వలంటీర్లుగా పనిచేసినవారి సేవలను వినియోగించుకోక తప్పలేదు.వైఎస్ జగన్ అప్పట్లో ప్రతీ బాధితుడికి ఇంటి వద్దే సాయం అందించాలని స్పష్టంగా ఆదేశించేవారు. ఆ ప్రకారమే వలంటీర్లు, సిబ్బంది పనిచేసేవారు. కానీ, ఇప్పుడు పాల ప్యాకెట్ల కోసం, ఆహార పొట్లాల కోసం ప్రజలు వాహనాల వద్ద ఎగబడే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. అయినా అనేక ప్రాంతాలలో ప్రజలకు ఆహారం అందలేదు. పాలు దొరకలేదు. నీటి సమస్య అయితే అంతా ఇంతా కాదు. పారిశుద్ద్యం క్షీణించడంతో వరద ప్రాంతాలలో ప్రజలు నివసించడమే గండంగా ఉంది. ఎక్కడ అంటు రోగాలు వస్తాయోనని అంతా భయపడుతున్నారు. ఇప్పటికైనా వలంటీర్లను వాడుకోవాలన్న ఆలోచన రావడం గుడ్డిలో మెల్ల.ప్రజలకు అలాగే గత ప్రభుత్వం ప్రజలకు రేషన్ అందించడానికి వేల సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేసి వారి ఇళ్ల వద్దకే సరఫరా చేసేది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ వాహనాలను ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. అవన్ని వృథా అని భావించారు. కానీ, ఇప్పుడు అవే వాహనాల ద్వారా బాధితులకు సరుకులు సరఫరా చేస్తున్నారు. బుడమేరు వరద కారణంగా విజయవాడలో మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఎంత మంది మరణించారో ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం లేదు. అస్వస్థతకు గురైన వారిని కానీ, మరణించిన వారి శవాలను కానీ తరలించడానికి అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. దాంతో ఒక వ్యక్తి తన భార్య మృతదేహాన్ని తోపుడు బండిపై తోసుకువెళుతూ కనిపించిన దృశ్యం అందరిని కలచివేసింది. పద్నాలుగు మంది కుటుంబం ఒక ఇంటిలో నిలబడిపోతే ఒక్క ఆహార పొట్లాన్ని మాత్రమే ఇచ్చారని, దీనిని ఎలా సర్దుకోవాలని ఒక మహిళ ప్రశ్నించింది.ఈ కథనాలను అత్యధికంగా సాక్షి మీడియానే ఇస్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తోంది. ఇతర ప్రాంతాల ప్రజలకు తెలియ చేస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లోమీడియా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ కాకూడదన్న లక్ష్యంతో పనిచేస్తూ ప్రజల బాధలను విస్మరించాయి. దాంతో విజయవాడ ప్రాంతంలో ప్రజలలో ఈ మీడియా పత్రికలు, టీవీలపై అసంతృప్తి ఏర్పడింది. ఆ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. తెలుగుదేశం యువగళంలో పనిచేసిన ఒక కార్యకర్త సాక్షి టీవీ రిపోర్టర్ వద్దకు వచ్చి వరద పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం అసలు పనిచేస్తున్నట్లు లేదని, తాను టీడీపీ వ్యక్తిని అయినా ఈ విషయం చెప్పడానికి వచ్చానని కెమెరా ముందు తెలిపారు.గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు జాగ్రత్తలు తీసుకున్నా, బాధితులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా వలంటీర్ల మొదలు, అధికార యంత్రాంగం అంతా వేగంగా పనిచేసేలా చర్యలు చేపట్టినా, ఈనాడు, జ్యోతి తదితర టీడీపీ మీడియా విపరీతమైన ద్వేషంతో వ్యతిరేక వార్తలు ఇచ్చేవి. అత్యధిక భాగం అవాస్తవాలను వండివార్చేవి. వాటి ఆధారంగా చంద్రబాబు అప్పట్లో తీవ్రంగా విమర్శలు చేసేవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు వ్యతిరేక వార్తలు రాకూడదని శాసించాలని చూస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా అదంతా అధికారుల తప్పే కాని తనది కాదని ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే రీతిలో వార్తలను ఇస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సుమారు పాతిక మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు వైఎస్సార్సీపీ అని ముద్రవేసి పక్కనబెట్టారు. మిగిలిన వారంతా తమకు అనుకూలమైన వారిగా భావించి పోస్టింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు వీరు కూడా వైఎస్సార్సీపీ భక్తులని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అసలు ముఖ్యమంత్రి చేయవలసిన విధులను నిర్వర్తించకుండా, అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వకుండా, తనతో పాటు వరదలలో తిప్పుకుని, ఇప్పుడేమో వారిపైన విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగులు సరిగా పనిచేయలేదని అంటున్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ కుట్రలు అన్నట్లుగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు తీరుతో అధికారులు, ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమపై ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీడీపీ మీడియా కూడా రెండు రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను కొంతమేర అయినా కవర్ చేయక తప్పలేదు. ఆంధ్రజ్యోతి పత్రిక 'కష్టాలు కన్నీళ్లు’ హెడింగ్తో బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. హాహాకారాలు, ఆర్తనాదాలు, ప్రధాన ప్రాంతాలకే పరిమితం అయినా సాయం అంటూ కొన్ని వాస్తవాలను రాయకతప్పలేదు. ఈనాడు పత్రిక బుధవారం నాడు 'మూడో రోజూ ముంపులోనే’ అన్న హెడ్డింగ్ పెట్టింది. అదే సమయంలో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు అని సబ్ హెడింగ్ పెట్టింది. పునరావాస శిబిరాలకు వేల మందిని తరలించారని, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యవేక్షిస్తున్నారని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు శనివారం రాత్రికి రాత్రే ఎత్తడంతో విజయవాడ మునిగిపోయిందని ఈనాడులో స్థానికంగా ఒక వార్త ఇచ్చారు. బుడమేరు వరద కృష్ణాలో అధికంగా కలిస్తే నీరు వెనక్కి తన్నుతుందన్న భావనతో షట్టర్లు ఎత్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇల్లు ముంపునకు గురి కాకుండా ఉండడానికి అని మాత్రం రాయకుండా వీటీపీఎస్‌కు ఇబ్బంది రాకూడదని గేట్లు ఎత్తారని పేర్కొంది. ఈనాడుకు, చంద్రబాబుకు మధ్య ఉన్న లింక్ అందరికి తెలిసిందే. మార్గదర్శి అక్రమాలకు సంబంధించి హైకోర్టులో ఉన్న అప్పీళ్లను ప్రభుత్వం ఉపసంహరించుకుని ఆ సంస్థ యాజమాన్యానికి గిప్ట్ ఇచ్చింది. దీనిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. ఏది ఏమైనా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కొన్న వైనాన్ని ప్రజలంతా గుర్తు చేసుకోవడమే కాకుండా , ఈ ఐదేళ్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనలో తమకు ఈ బాధలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు ‘బురద’ రాజకీయం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన రెండు ప్రకటనలు గమనించారా! విజయవాడ వరద బాధితులందరికి ఆహార పదార్థాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన చెప్పారు. కరకట్టలోని తన అక్రమ నివాసంలోకి నీరు వచ్చిన సంగతిని ఆయన ఒప్పుకున్నారు. కానీ.. ఈ రెండు విషయాలను ఆయన ఒప్పుకున్న తీరు మాత్రం విమర్శలకు తావిచ్చేదే. తప్పంతా ఇతరులదే కానీ తనది ఏమాత్రం కాదన్న రీతిలో మాట్లాడే ప్రయత్నం చేశారాయన. పైగా.. వరద బాధితులకు ఆహారం అందకపోవడం వారి తప్పే అన్నట్లు ప్రత్యారోపణ చేసేశారు. కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లోకి నీళ్లు రావడంపై కూడా ఆయన తనదైన వ్యాఖ్య చేశారు. తన ఇంట్లోకి నీళ్లు వస్తే ఏమిటట? అని ఎదురు ప్రశ్నించి అక్కడ ఉన్న మీడియాను ఆశ్చర్యపరిచారు. విజయవాడను వరద ముంచెత్తిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి బాగా పొద్దు పోయాక ప్రభుత్వ వైఫల్యం, తనింట్లోకి నీళ్లు చేరడాన్ని ఒప్పుకుంటూనే తనకే సాధ్యమైన శైలిలో బుకాయింపులకు దిగారు.చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే వయసులో పెద్దవాడైనందుకైనా ఆయనకు గౌరవం దక్కేది. కానీ ఈ సందర్భాన్ని కూడా ప్రతిపక్ష వైసీపీపై, జగన్‌పై విమర్శలకు వాడుకోవడం, బురద రాజకీయాలకు దిగడం చేశారు. బాబు మాటలకు తందాన పలిక ఈనాడు, ఆంధ్రజ్యోతులు యథా ప్రకారం వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.వైఫల్యం ఉందని బాబు స్వయంగానైనా ఒప్పుకున్నారేమో కానీ.. ఆయనకు వంతపాడే మీడియా మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. పునాదులు, భవంతులు నీట మునిగి ఉన్నది ప్రత్యక్షంగా కనిపిస్తున్నా సరే.. రాజధాని ప్రాంతం అమరావతికి ఏం కాలేదని అబద్ధాలు రాసేశాయి. ఇదే నిజమని అనుకుంటే చంద్రబాబు ఇల్లు ఉన్నదెక్కడ? రాజధాని ప్రాంతంలోనే కదా? ఈ విషయంపై మాత్రం సదరు పత్రికలు నోరు విప్పవు. కరకట్ట నివాసంలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరిందన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ మీడియా నానా ప్రయత్నాలూ చేసింది. ఆంగ్ల పత్రికలు కొన్ని మాత్రమే ఈ సమాచారాన్ని అందించాయి.చంద్రబాబు వరద బాధితుల పరామర్శకు పలుమార్లు వెళ్లారు. కానీ ఈ పర్యటనల వల్ల ప్రజల కష్టాలు మరిన్ని పెరిగాయే కానీ తగ్గింది లేదు. ఆయన బోటు ‘షికార్ల’కు ఏడెనిమిది మంది అధికారులు వెంట రావడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇబ్బంది అయ్యిందని కొందరు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జేసీపీ పొక్లెయిన్ ఎక్కి ఏదో ఊరేగింపుగా వరద ప్రాంతాల్లో పర్యటించడం కూడా విమర్శలకు గురైంది. ప్రచారం కోసం ఇలాంటి గిమ్మిక్కులు మామూలు రోజుల్లో చేస్తే ఓకేనేమో కానీ.. ఒక పక్క ప్రజలు పీకల్లోతు నీటి కష్టాల్లో ఉండగా... వీడియో షూట్ల కోసమో, ఫోటోల కోసమో ఇలా చేయడం వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలే ఎక్కువ.బాధితులకు ఆహారం అందించే విషయంలో తాను ఎంత సిద్ధం చేసినా అధికారులు అందరికీ అందించడంలో విఫలమయ్యారని.. ముందున్న కాలనీల్లోని బాధితులు ఎక్కువ ప్యాకెట్లు తీసుకోవడంతో అందరికీ అందలేదని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడవచ్చా! సరిపడినన్ని వాహనాలు రెడీ చేసి, ఆయా ప్రాంతాలకు పంపించి ఉంటే జనం ఎందుకు ఎగబడతారు? మూడు రోజులుగా భోజనం, నీరు, పాలు వంటివి సరిగా అందక ప్రజలు అల్లాడుతున్నారు. వీరిని రక్షించేందుకు తగినన్ని పడవలూ ఏర్పాటు చేయలేదు. దాంతో ప్రైవేటు బోట్ల వారు ప్రజలను అప్పనంగా దోచుకున్నారని కూడా సమాచారం. ఈ విషయాలన్నిటిలో ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా చంద్రబాబు మాత్రం అదేదో అధికారుల వైఫల్యంగా చిత్రించి తప్పుకునే యత్నం చేశారు.తుఫాను, వాయుగుండం వంటివి వస్తున్నప్పుడు వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు చేస్తుంది. ఆ వెంటనే ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులను, అధికారులను అప్రమత్తం చేసి చేసి సమీక్షలు నిర్వహించి తగు భద్రతా చర్యలు తీసుకోవాలి. ముందస్తుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను తరలించాలి. వీటిలో ఒక్కటి కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించలేదన్నది వాస్తవం. బుడమేరుకు వెలగలేరు గేట్లను ఎత్తడానికి ముందు ప్రజలను ఎందుకు హెచ్చరించలేదు? గతంలో వలంటీర్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం పంపేవారు. చంద్రబాబు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దాని ప్రభావం ఇప్పుడు తెలిసింది. తీరా సమస్య తీవ్రమైన తర్వాత చంద్రబాబు వరద పీడిత ప్రాంతాలలో తిరిగితే ఏమి ప్రయోజనం? సరిగ్గా అదే జరిగింది. ముఖ్యమంత్రి తిరిగినా, ప్రజల కష్టాలు తీరలేదని అంటున్నారు. అధికారులు సీఎం చుట్టూరా తిరగడానికే టైమ్ కేటాయించాల్సి వచ్చింది. తెలుగుదేశం మీడియా ఇదంతా జిల్లా స్థాయి అధికారుల వైఫల్యంగా చిత్రీకరించింది. నిజానికి ఇప్పుడు ఉన్న అధికారులంతా టీడీపీ ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న వారే. గతంలో కలెక్టర్లు, ఎస్పీలుగా ఉన్న పలువురిని రెడ్ బుక్ పేరుతో బదిలీ చేశారు. పలువురికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇప్పుడేమో కొత్తగా వచ్చిన అధికారులు సరిగా పని చేయలేదని వీరే అంటున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి?‘‘కరకట్ట లోపల ఉన్న ఇంటిలోకి నీరు వస్తే ఏంటట? అందరి ఇళ్లలోకి వచ్చాయి’’ అని చంద్రబాబు అనడం విడ్డూరమే. ఆయన అక్రమ కట్టడంలో ఉంటున్నారా? లేదా? నది తీరంలో నిషేధిత జోన్లో నివసిస్తున్నారా లేదా? వీటి గురించి మాట్లడకుండా ప్రజలను ప్రశ్నించడం ద్వారా ఏమి చెప్పదలచుకున్నారు? సీఎం వరద బాధితుడిగా మారి కలెక్టరేట్ కు వెళ్లి పోతే సాధారణ ప్రజలను ఏలా రక్షిస్తారు అన్న ప్రశ్న రాదా ? బుడమేరు రెగ్యూలేటర్ గేట్లను ఎత్తివేయడం గురించి జగన్ చేసిన ఆరోపణలు తోసి పుచ్చడానికి యత్నించారు .ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకువచ్చిన పడవల గురించి మాట్లడుతూ ఒక వైపు ప్రమాదం అంటూ, మరోవైపు కుట్ర అంటూ అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం. అన్ని చోట్ల ఆవు కథలు చెప్పినట్టు... ఇక్కడ కూడా మాజీ మంత్రి వివేక హత్య కేసును ప్రస్తావించడం ఏ మాత్రం బాధ్యతగా లేదు. అలాగే గుడ్లవెల్లెరు కాలేజీ విషయం కూడా ఇక్కడ మాట్లాడడం ఎందుకో అర్ధం కాలేదు.బుడమేరు వరదలపై ముందస్తు హెచ్చరికల గురించి అడిగితే ...గత ప్రభుత్వం టైంలో గండ్లు పూడ్చకపోవడం వల్ల వరదలు వచ్చాయని సంబంధం లేని సమాధానం చెబుతారు. అమరావతి రాజధాని ప్రాంతం వరదకు గురి అవుతోందని చెప్పడంపై ఆయన మండిపడుతున్నారు. దాన్ని దుష్పప్రచారం అంటున్నారు. అక్కడ వర్షం వల్లే నీరు వచ్చింది అని... వరద కాదని ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ప్రచారం చేసింది.దీన్ని బట్టి వారు ఎంత కంగారు పడుతుందన్నది చెప్పవచ్చు. ఎంత సేపూ అమరావతి రియల్ ఎస్టేట్ గొడవ తప్ప.. అక్కడ వరద రాకుండా ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టలేకపోతున్నారు.రాజధాని ప్రాంతం అంతా బాగుంటే సచివాలయ ఉద్యోగులను ముందుగా ఎందుకు ఇంటికి పంపించారు? అలాగే హైకోర్టు మధ్యాహ్న రెండు గంటలకే ఎందుకు వాయిదా పడింది? నది ఒడ్డున ఉన్న భవనాలకు నీరు ఏలా చేరింది? అదంతా రాజధాని ప్రాంతం కాదా? కృష్ణ లంక వద్ద వరద నీరు రాకుండా జగన్ నిర్మించిన భారీ గోడను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. తెలుగు దేశం మీడియా కూడా అలాంటి ప్రచారం చేయడానికి తంటాలు పడింది. కానీ స్థానికులకు వాస్తవం తెలుసు కనుక జగన్ ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో జగన్ పర్యటించి ప్రజల సమస్యలను వాకబు చేసినప్పుడు వారు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారని, అర్ధరాత్రి వేళ వెలగలేరు లాక్‌లు ఎత్తివేయడంతోనే ఈ సమస్య వచ్చిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రజలకు క్షమపణ చెప్పి... బాధితులను అదుకోవాలన్నారు. జగన్ టూర్ ఎఫెక్ట్ కొంత పనిచేయ బట్టి, చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున రంగంలోకి దించుతున్నట్టు ప్రకటించారన్న అభిప్రాయం ఏర్పడింది. అయినా మంగళవారం, బుధవారం సైతం ప్రజలు తగు రీతిలో సదుపాయాలు అందక అల్లాడుతూనే ఉన్నారు.రెడ్ బుక్ రాజ్యంగం అంటూ పెద్ద ఎత్తున హింసాకాండకు దిగిన తెలుగు దేశం ప్రభుత్వం ఇలాంటి సంక్షోభాల్లో ప్రజలకు వరదల రెడ్ అలెర్ట్ ఇవ్వడంలో విఫలం అయ్యింది. అందువల్లే ప్రజలు గతంలో జగన్ టైంలో వరద సహయ చర్యలను భాదితులను అదుకున్న తీరును గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం యథా ప్రకారం వైసీపీని విమర్శిస్తూ ఇలాంటి సమయంలో కూడా తన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా, విమర్శలు కురిపించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో కీలక మంత్రి లోకేష్ వంటివారు ఈ వరదల సమయంలో ఎక్కడ ఉన్నారో తెలియదు. అదే కొసమెరుపు. తాను పర్యటిస్తే అధికారుల విధులకు ఆటంకం కలుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే వరద ప్రాంతాలలో తిరుగుతూ చంద్రబాబు తప్పు చేస్తున్నారని ఆయన అంటున్నారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చీకటి వ్యవహారాలు టీడీపీకి కొత్తేమీ కాదుగా..!
రాజకీయాల్లో కృతజ్ఞత, విధేయత అనే పదాలకు పెద్దగా విలువ ఉండదన్న సంగతి మరోసారి రుజువైంది. వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకట రమణరావు, బీదా మస్తాన్ రావులు జెండా ఫిరాయించేశారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన పాత పద్దతులకు పదును పెడుతోందని, పదవుల అమ్మకాలు, కొనుగోళ్లు బేరసారాల పర్వం ఆరంభమైందన్న చర్చ మొదలైంది. కానీ ఈ తాజా పర్వంలో కొత్త ట్రెండ్ ఏంటంటే తెలుగుదేశానికి చెందిన కొందరు నేతలు తమకు ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవి కావాలనుకుంటే వైఎస్సార్సీపీలో ఆ పదవుల్లో ఉన్న వారిని ప్రలోభపెట్టి నేరుగా బేరం కుదుర్చుకుని రాజీనామాలు చేయిస్తుండటం! వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీకి టీడీపీ నేత ఒకరు రూ.పది కోట్లు ఆశపెట్టి రాజీనామా చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల పదవి కాలం ఉన్నవారు రాజీనామా చేస్తే రూ. ఇరవై కోట్లు, నాలుగేళ్ల పదవి కాలం ఉన్న వారు రాజీనామా చేస్తే 40 కోట్లను ఆఫర్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఇద్దరు ఎంపీలలో విషయంలోనూ ఇదే రకమైన వ్యవహారం నడించిందా? అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.ఈ బేరసారాలన్నీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మొత్తాన్ని శాసిస్తున్న మంత్రి, బాబు గారి పుత్రుడు లోకేశ్ అనుమతితోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావుల రాజీనామాలకు రాజ్యసభ అధ్యక్షుడు ఇప్పటికే ఆమోదం కూడా తెలిపారు. టీడీపీలో చేరి తరువాత వారికే ఆ పదవులు ఇస్తే బేరసారాల వ్యవహారం నిజం కాదని అనుకోవచ్చు. వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరినందుకు వేరే ఏదో ఒకటి గిట్టుబాటు అయి ఉంటుందని అంచనా వేయవచ్చు. అలా కాకుండా.. ఈ పదవులకు ఇతరులకు దక్కితే మాత్రం అనుమానాలు రావడం సహజం.వాస్తవానికి టీడీపీ నాయకత్వానికి ఈ రకమైన చీకటి వ్యవహారాలు, కొనుగోళ్లూ కొత్తేమీ కాదు. గతంలోనూ 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి అసలు ప్రాతినిథ్యమే లేదు. అందుకే వారు ఈ కొనుగోళ్లు, బేరసారాలకు తెరతీశారు. ఇందుకు డబ్బు, పదవులు ఆశపెడుతున్నారు. అయితే ఇది పార్టీ నేరుగా చేస్తున్న పనా? లేక పదవులు ఆశిస్తున్న నేతలతో పార్టీ కొనుగోలు చేయిస్తోందా? అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.రాజీనామా చేసిన ఎంపీల్లో ఒకరైన మోపిదేవి మాత్రం చాలా స్పష్టంగా స్థానిక రాజకీయల్లో ఉండడం కోసమే రాజ్యసభ పదవిని వదులుకుంటున్నట్టు, టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కానీ ఈ వాదనలో తర్కమేమిటో ఆయనకే తెలియాలి! అందుకే తామూ ఇదంతా బేరాసారాల వ్యవహారమంటున్నామని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు.మోపిదేవి స్వస్థలం రేపల్లె. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు అక్కడి ప్రతినిధి. సత్యప్రసాద్‌ను కాదని మోపిదేవికి రేపల్లెలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. మహ అయితే ఒక ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టవచ్చు. 2026లో నియెజకవర్గాల పునర్విభజన జరిగితే... మోపిదేవి లేదా అయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వవచ్చని కొందరు అంటున్నారు. రెండేళ్ల పదవి కాలం ఉన్నవారు రాజీనామా చేస్తే రూ. ఇరవై కోట్లు, రూ.నాలుగేళ్ల పదవి కాలం ఉన్న వారు రాజీనామా చేస్తే రూ.40 కోట్లను ఆఫర్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. సరే డబ్బు సంగతి నేరుగా ఎవరు అంగీకరించరు. మొత్తమ్మీద చూస్తే మోపిదేవి పార్టీ మారడం వల్ల స్వస్థలం రేపల్లెలో పరపతి ఏమీ పెరగదు సరికదా.. తగ్గే అవకాశాలే ఎక్కువ. మోపిదేవి వరుసగా రెండుసార్లు ఓడిపోయినా వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆయనను గౌరవించి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడమే కాకుండా... మంత్రిని కూడా చేశారు. విధాన పరిషత్‌ను రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా మోపిదేవితోపాటు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు నష్టం జరక్కూడదన్న ఆలోచనతో వారిని రాజ్యసభకు పంపించారు. ఈ విషయాలను గుర్తు చేసుకుంటూనే పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు జగన్ ఎప్పుడూ అన్యాయం చేయలేదని, పార్టీ కూడా గౌరవంగా చూసిందని, తాను పార్టీకి విధేయుడినని స్పష్టం చేశారు. రాజీనామా చేయనున్నారన్న ప్రచారం చేసిన ఎల్లో మీడియాను తప్పుపట్టారు మోపిదేవి మాత్రం అందరని అశ్చర్య పరుస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. మోపిదేవి మొదట మండల అధ్యక్షుడిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చింది. తరువాతి కాలంలో ఆయన 1999, 2004లలో కూచినపూడి నుంచి, 2009లో రేపల్లె నుంచి గెలుపోంది వైఎస్సార్ కేబినెట్లో మంత్రి అయ్యారు. రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లోనూ కొనసాగారు.వైఎస్సార్ అనుహ్య మరణం, తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి రావడం.. కాంగ్రెస్ అధిష్టానం అక్రమ కేసులు బనాయించడం జరిగాయి. మోపిదేవిని కూడా కాంగ్రెస్ పార్టీ కేసుల్లో ఇరికించింది. కొంతకాలం జైలు జీవితమూ అనుభవించారు. ఈ విషయాలన్నీ తెలిసిన జగన్ పార్టీలో ఆ తరువాత అధికారం వచ్చిన తరువాత కూడా మోపిదేవికి మంచి ప్రాధన్యత ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో రేపల్లెలో పోటి చేయాలని అనుకున్నా గెలుపు అవకాశం లేదని సర్వేలు తేల్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ మోపిదేవికి టిక్కెట్ ఇవ్వలేదు. అయితే ఆ సంగతిని మోపిదేవి ఇప్పుడు ప్రస్తావించడం ఇప్పుడు సముచితంగా లేదు. ఒక వేళ టిక్కెట్ ఇచ్చిన తరువాత ఓడిపోయి ఉంటే ఏం చేసేవారు?రాజకీయాల్లో విధేయత అన్నది శాశ్వతం కాదు అన్నది ఈయన కూడా రుజువు చేశారు. జగన్ కేసుల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని చంద్రబాబు తీవ్రంగా విమర్శించేవారు. కానీ ఇప్పుడు మోపిదేవిని తన పార్టీలోకి తీసుకోవడం ద్వారా జగన్ పై పెట్టినవి అక్రమ కేసులే అని చంద్రబాబు ఒప్పుకున్నట్లు అయ్యింది.రాజీనామా చేసిన మరో ఎంపీ బీద మస్తాన్ రావు గతంలో కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే. కాని రెండు సార్లు వరుసగా ఓడిపోయారు. దీంతో ఆయన వైఎస్సార్సీపీ వైపు వచ్చేశారు. పార్టీ నాయకత్వం కూడా ఈయనను గుర్తించి ఎంపీ పదవి ఇచ్చింది. మస్తాన్ రావుకు రొయ్యల ఫీడ్ వ్యాపారంతోపాటు పలు వ్యాపారాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో తన వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు పార్టీ మారుతూండవచ్చని అంటున్నారు.అయితే వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైన వెళతారా అన్నది చూడాలి. ఎల్లో మీడియా అయితే ఇద్దరు ముగ్గురిని మినహాయించి అందరూ పార్టీ వీడతారని ప్రచారం చేసింది ఎల్లో మీడియా. అది వాస్తవం కాదని ఇప్పటికైతే స్పష్టం. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మిగిలిన వారు అందరూ ఖండించారు. ఎంపీలు లేదా ఎమ్మెల్సీలు పార్టీలు ఫిరాయించినంత మాత్రాన వైఎస్సార్సీపీకి నష్టం జరుగుతుందని అనుకుంటే అది టీడీపీ పొరబాటే అవుతుంది. ఎందుకంటే 2014 - 2019 మధ్యకాలంలో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతరుల ప్రభావాలను లోనై పార్టీని వీడారు. అయినప్పటికీ జగన్ ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదని 2019 నాటి ఎన్నికలు రుజువు చేశాయి. ఎంపీలు వెళ్లిపోతే పార్టీ మళ్లీ గెలవలేదని అనుకుంటే.. తాజా ఎన్నికల్లో టీడీపీ కూడా గెలిచి ఉండకూడదు. ఎందుకంటే.. ఆ పార్టీ ఎంపీలు నలుగురు బీజేపీలోకి చేరారు మరి! కాకపోతే వారు చంద్రబాబు అనుమతి తీసుకుని పార్టీ మారారు అన్నది బహిరంగ రహస్యం. పీవీ నరసింహ రావు ప్రధానిగా ఉన్నప్పుడు టీడీపీ లోకసభ సభ్యులు అరడజను మందిని కాంగ్రెస్‌లోకి లాక్కొచ్చారు. కానీ ఆ తర్వాత 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ వారికి క్యారెక్టర్ లేదు అంటూనే ఆ పార్టీ వారిని టీడీపీలోకి చేర్చుకుంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరారని చెబుతున్న ఈయన ఒంగోలు, ఏలూరు కార్పోరేషన్ ఛైర్మన్లను, మరికొన్ని చోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లను నేరుగా పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారో కూడా చెప్పాలి. ఏది ఏమైనా... ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అయారాం.. గయారామ్‌ల వ్యవహారాలు మాత్రం ఆగడం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
#CBNworstrule: అయితే బుకాయింపు, కాదంటే దబాయింపు
రాజకీయాలలో బుకాయించడం, దబాయించడం, తన వైఫల్యాలను ఎదుటి వారిపైకి నెట్టేయడం వంటి లక్షణాలు బాగా తెలిసి ఉండాలంటారు. ఈ లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వాళ్లు లేరనే చెప్పాలి. ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈయన చేసే ప్రయత్నాలను అధ్యయనం చేయడం కూడా చాలా ఆసక్తికరం. అయితే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మాత్రం బాబుతో ఈ లక్షణాల విషయంలో ఏమాత్రం పోటీ పడలేరు అనిపిస్తుంది. చంద్రబాబు ఏ అంశంతోనైనా నాటకాన్ని ఆడించగలరు. రక్తికట్టించగలరు కూడా. జగన్ కు ఈ డ్రామాలేవీ అలవాటు లేదు. తాను చేయాలనుకున్నది అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు చేయడం.. పనులు సజావుగా సాగేలా చూడటం వరకే జగన్ వ్యవహరిస్తూంటార. చంద్రబాబు మాత్రం అన్నీ తానే దగ్గరుండి మరీ చేయిస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తూంటారు. చేసే చిన్న పనికైనా పెద్ద ఎత్తున ప్రచారం జరిగేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. ఇందుకు తాజా నిదర్శనం విజయవాడను ముంచెత్తిన వరదలు!రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు విజయవాడ జలమయమై పోయింది. లక్షల మంది వరదల్లో చిక్కుకుని నానా యాతనా పడుతున్నారు. బాబు కలల రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం వరదనీటిలో మునిగిపోయింది. చివరికి చంద్రబాబు కరకట్ట అక్రమ కట్టడంతోపాటు కృష్ణానది తీరంలో ఉన్న పలు భవనాలలోకి కూడా నీరు చేరింది. అయినా సరే.. బాబుగారు అందరి దృష్టి మళ్లించేందుకు ఏం చేశారో చూడండి.విజయవాడ వరద బాధితుల రక్షణ చర్యలను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్లో బస చేస్తానని చెప్పాడు. ఇందుకు తగ్గట్టుగా అక్కడ ఆయనకు ఓ బస్‌లో ఏర్పాట్లూ జరిగిపోయాయట. తానున్న అక్రమ కట్టడంలోకే నీళ్లు చేరాయని చెబితే నగుబాటని బాబుకు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా ప్రజల కోసం కలెక్టరేట్లో బస చేస్తున్నట్లు చెప్పారన్నమాట. పర్యవేక్షణ కలెక్టరేట్ నుంచి చేసినా.. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఇంట్లోంచి చేసినా పెద్ద తేడా ఏమీ ఉండదు.పైగా... ఈ పర్యవేక్షణేదో రెండ్రోజుల ముందు చేసి ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావు. ఇదే మాట ఎవరైనా అంటే మాత్రం వారిపై ఒంటికాలిపై లేస్తారు. అర్ధరాత్రిళ్లు కూడా బాధితులను ఆదుకునేందుకు పర్యటించానని.. అయినా తనను ఇలా అంటారా? అలా అంటారా? అని చెబుతారే గానీ.. అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు.భారీ వర్షాలు రానున్నాయన్న వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను బాబు అండ్ కో ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదో సమాధానం లేదు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను ముందుగానే ఎందుకు ఖాళీ చేయించలేదో చెప్పరు. వందల మందినైతే తరలించగలం కానీ.. జనాలు లక్షల్లో ఉంటే ఏం చేయగలమని బుకాయిస్తారు. సాధారణంగా వరద వస్తోందని చెబితే ప్రజలే ఇళ్లు ఖాళీ చేసి వేర్వేరు చోట్లకు వెళ్లిపోతారు. ఎందుకంటే బుడమేరు వరదకు గురైన ప్రాంతాల్లోని వారు ఎక్కువగా మధ్య తరగతి వారే. ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాల కోసం వారు ఎదురు చూడరు. తమంతట తామే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటారు. ఇళ్లలోని సామాను పాడు కాకుండా జాగ్రత్త పడతారు. అయితే తాజా వరద తీవ్రత ఏమిటో తెలియక చాలామంది డాబాలపైకి వెళ్లిపోయారట. వీరిలో చాలామందికి నీళ్లు, తిండి కూడా లభించని స్థితి. ప్రభుత్వం సహయా సిబ్బందిని ముందుగానే అప్రమత్తం చేయకపోవడంతో వచ్చిన ఇబ్బంఇ ఇది. సకాలంలో పడవలనూ సమకూర్చుకోలేకపోవడంతో వరద బాధితులను తరలించడం కూడా సాధ్యం కాలేదు. కానీ... చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బాబు ప్రభుత్వం ఆర్భాటమైతే బాగానే చేసింది. వరదల్లాంటి విపత్కర పరిస్థితుల్లో గతంలో మాదిరిగా వలంటీర్ల వ్యవస్థ ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఇప్పుడు వరద ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వరదలొచ్చినప్పుడు వలంటీర్లు బాగా పని చేశారని ప్రజలు కొందరు గుర్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో లంకలు వరదకు గురైనప్పుడు వలంటీర్ల సేవలు అందరి ప్రశంసలు పొందిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. వరద ముప్పు గురించి ముందుగానే హెచ్చరించడం, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సకాలంలో ఆహారం, నీళ్లు అందించడం వంటివి వలంటీర్లు చక్కగా చేశారు. అంతేకాదు.. గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది, తాలూకా కార్యలయ సిబ్బంది కూడా వలంటీర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా అన్ని జాగ్రత్తలూ తీసుకోగలిగారు కాబట్టి నష్టం, ఇబ్బందులు నామమాత్రమయ్యాయి. ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్ ఆదేశించిన రీతిలో పిల్లలు, పెద్దలందరికీ తగిన సాయం చేయడమే కాకుండా.. సహాయ శిబిరాల్లోంచి బాధితులు తిరిగి వెళ్లేటప్పుడు ఒకొక్కరికీ రూ.రెండు వేల రూపాయల నగదు కూడా అందించి పంపారు. వరద నష్టం తాలూకూ సమాచారం పూర్తిగా అందిన వెంటనే నష్టపరిహారం చెల్లింపు జరిగేలా ఏర్పాట్లు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చి పనులు చేయించారు. ఇవన్నీ పూర్తి అయ్యాక సీఎంగా జగన్ ఆ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అన్ని అందాయా లేదా? అన్నది వాకబు చేసేవారు. అంతేకానీ.. వరదల సమయంలోనే వెళ్లి హడావుడి చేసి అధికారుల విధులకు ఆటంకం కలిగించలేదు. కాని చంద్రబాబు స్టైల్ అందుకు భిన్నం. ఇప్పటికే వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. ఫలితంగా ఎక్కడ ఏమి జరుగుతోందో అధికారులకు తెలియజేసే అప్రమత్తం చేసే వ్యవస్థ లేకుండా పోయింది. ప్రజలకు తగు సమాచారం ఇచ్చేవారు లేరు. బుడమేరు వరద కట్ట తెగుతుంటే అధికారులు చర్యలు తీసుకోని దైన్యస్థితి. స్థానికులు కొందరు ఆయా ఆఫీస్ లకు పోన్ చేసినా పలికే నాధుడు లేకుండా పోయాడని పలువురు వాపోయారు. పడవలు అరకొర ఏర్పాటు చేసినా ,మెయిన్ రోడ్డులోని వరద నీటిలోనే అవి తిరగాయట. అందులోనూ సిఫారస్ ల మేరకే తరలింపులు సాగాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ప్రైవేటు బోట్లు మాత్రం వరదలను అడ్డుపెట్టుకుని దందా చేశాయట. చేయవలసిన పనులు చేయకుండా ,ప్రజలు నడుం లోతు నీటిలో ఉన్నప్పుడు సీఎం స్థాయి వ్యక్తో, మంత్రులో బోట్లలో తిరుగుతూ తాము చాలా బాధ పడుతున్నామని చెబితే ఏంటి ప్రయోజనం? చేయగలిగినవాటిని చేసిన తర్వాత, అప్పటికీ ఏవైనా చేయలేకపోతే జనం అర్థం చేసుకుంటారు. అంతే తప్ప, అర్ధరాత్రి వచ్చా, మధ్యాహ్నం వచ్చా అని నేతలు చెబితే జనం ..అయితే ఏంటట? అని మాత్రమే అనుకుంటారు. తమకు ఏమి ఒరిగిందని అడుగుతారు. ముంబై నటి, మాయలేడి కాదంబరి జత్వానీని పనికట్టుకుని తీసుకువచ్చి కొందరు ఐపిఎస్‌లపై కేసులు పెట్టడానికి చూపిన శ్రద్ద వరద బాధితులపై చూప లేదు. అమరావతి రాజధాని ప్రాంత అంతా మునిగిపోయిందని మీడియాలో వార్తలు వస్తే చంద్రబాబు ఊరుకోరట. అది దుష్ప్రచారమని ఆయన దబాయిస్తున్నారు. రాజధాని స్మశానం కావాలనుకునేవారే మునిగి పోయిందని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అనడం ఎంత దారుణం! ఎవరు అలా కోరుకుంటారు! ఒక పక్క మొత్తం రాజధాని ప్రాంతం అంతా వరద నీటిలో తేలియాడుతుంటే, అదేమి జరగలేదని బుకాయిస్తే జనానికి వాస్తవ పరిస్థితి తెలియదా!. ఇవన్నీ ఎందుకు..? అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించి అసలు వరద నీరే లేదని మీడియాకు చెప్పగలరా! హైకోర్టులోకి నీరు ఎలా వచ్చిందో వివరించగలరా!సోమవారం హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు ఆన్ లైన్ లోనే పని చేయడానికి ఏర్పాటు చేసుకున్నది అవాస్తవమా! తన కరకట్ట ఇంటిలోకి నీరు రాలేదని, నది ఒడ్డున ఇసుక బస్తాలు వేసి నీరు రాకుండా ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదని మీడియాకు చెబుతారా? అసలు అక్కడకు మీడియాకు ఎందుకు అనుమతించలేదు? ఆయన ఇంటికి ఇసుక లారీలు ఎందుకు వెళ్లాయి? గతంలో ఓటుకు నోటు కేసు సమయంలో కూడా రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిపోయి, ప్రజల కోసమే తాను మకాం మార్చానని చెప్పుకున్న చరిత్ర బాబుది. ఇప్పుడు కూడా జనం కోసమే విజయవాడలోని కలెక్టరేట్ ఆఫీస్ వద్ద బస చేస్తున్నానని మీడియాలో వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వం వల్ల బుడమేరు కట్ట తెగిందని చంద్రబాబు ఆరోపించారు తప్ప, గేట్లు ఎందుకు ఆకస్మికంగా ఎత్తి వేసింది వివరించలేదు. అంతేకాక ఒక ప్రైవేటు హైడల్ ప్లాంట్‌కు గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఫలితంగానే డైవర్షన్ కాల్వ ద్వారా కృష్ణలోకి నీరు వేగంగా వెళ్లడం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.అది వాస్తవమా? కాదా?అమరావతి రాజధాని ప్రాంతం మూడు పంటలు పండే ప్రాంతాన్ని విధ్వంసం చేసి భవంతులు కట్టాలని తలపెట్టడం వల్లే సమస్యలు రావడం లేదా? అదే నాగార్జున యూనివర్శిటీ సమీపంలోని ప్రభుత్వ భూమిలో ఈ భవనాలు నిర్మించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవా? శివరామకృష్ణ కమిటీ కూడా పంటలు పండే భూమిలో రాజధాని నిర్మాణం వద్దని చెప్పిందా? లేదా?. తాను చాలా విజనరీని అని ఆయనకు ఆయనే ప్రచారం చేసుకుంటారు కదా! అంత పెద్ద దార్శనికుడు అయితే విజయవాడలో కృష్ణానది వరదల వల్ల తరచుగా దెబ్బతింటున్న కృష్ణలంక తదితర ప్రాంతాల వారిని రక్షించడానికి అవసరమైన గోడను తన పద్నాలుగేళ్ల పాలనలో ఎందుకు చంద్రబాబు కట్టలేకపోయారు? జగన్ ఐదేళ్లలోనే నిర్మించి చూపించారు కదా! దానివల్లే ఇప్పుడు ఆ ప్రాంతం వరద బారిన పడకుండా ఉందా? లేదా? దీనిని అంగీకరించడానికి మనసు రాని చంద్రబాబు గత ప్రభుత్వంపై బురద చల్లడం సరైనదేనా?.ఇలా ఆయా ప్రశ్నలకు చంద్రబాబు నుంచి వచ్చేది దబాయింపు, బుకాయింపే!!.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
అవును.. చంద్రబాబే ఆ విషయాన్ని ఒప్పుకున్నారు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారిగా తన ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందన్న సంగతిని అంగీకరించారు. కాకపోతే ఆయన తెలివిగా దానిని కొద్దిమంది ఎమ్మెల్యేలపైన, మంత్రులపైనతోసేసి, తను మాత్రం ఆ చెడుతో సంబంధం లేని వ్యక్తిగా ఫోకస్ చేసుకుంటారు. లీకులు ఇవ్వడంలో చంద్రబాబు నేర్పరితనం బహుశా దేశంలోనే మరే నేతకు లేదేమో! అయితే ఆ లీకులు పూర్తిగా తనకు పాజిటివ్‌గా ఉండడానికి, తనకు గిట్టని వారిపై బురద వేయడానికి వాడుతుంటారు.ఈ విషయంలో తన మామ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావును సైతం వదలిపెట్టలేదు. తను ముఖ్యమంత్రి పదవిలోకి రావడానికి గాను ఎన్టీఆర్‌పై చంద్రబాబు అనండి, ఆయన అనుచరులు అనండి.. మద్దతు ఇచ్చే కొన్ని మీడియా సంస్థల ద్వారా ఉన్నవి, లేనివి వదంతులు ప్రచారం చేయించారన్న భావన అప్పట్లో రాజకీయవర్గాలలో ఉండేది. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి కేంద్రంగా ఈ ప్రచారాలు సాగుతుండేవి.ఈ క్రమంలో ఎన్టీఆర్‌ను అప్రతిష్ట పాలుచేయడం, తనే పార్టీని రక్షిస్తున్నట్లుగా పిక్చర్ ఇవ్వడం జరిగేది. ఆ ప్లాన్ సఫలం అవడంతో అదే వ్యూహాన్ని గత మూడు దశాబ్దాలుగా ఆయన కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కామెంట్స్ తమాషాగా ఉన్నాయి. గతంలో కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కేబినెట్ సమావేశాల్లో ఇలాగే మాట్లాడేవారు. ఆ తర్వాత అవి లీకులుగా బయటకు వస్తాయి. తద్వారా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు బాగా భాదపడుతున్నట్టుగా అలాగే కొంత మంది వల్ల పార్టీ నష్టపోతున్నట్టుగా దానిని నివారించడానికి తాను కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా లీకులు వస్తాయి. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే.నిజానికి గత మూడు నెలలుగా ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. ఒకటి రెండు హమీలు తప్ప మిగిలిన హమీల ఊసు ఎత్తడం లేదు. మరోవైపు హింసాకాండ, దౌర్జన్యలు పెచ్చుమీరి ఆరాచకం రాజ్యం ఏలుతుంది. విధ్య, వైద్యంతో సహ పలు రంగాలు కుంటుపడ్డాయి. గత ఐయిదేళ్లలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక విప్లవాత్మక సంస్కరణలు, వ్యవస్థలు అన్నింటిని చంద్రబాబు కుప్పకూలుస్తున్నారు. ప్రజలకే ఏలాంటి అసౌకర్యం లేకుండా ప్రజలకు పౌర సేవలను అందించే ఏర్పాట్లు చేస్తే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటన్నింటిని తొంగలో తొక్కింది. ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు కొత్త ఉద్యోగాల ఎంగతి ఏమో కాని ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నార .లక్షన్నర మంది వలంటీర్లను ఊడబెరికే పనిలో ఉన్నారు. ఇలాంటివి చెప్పుకుంట పోతే చాలానే ఉన్నాయి. ఇవన్ని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేలేదా! ఇలాంటివి కప్పిపుచ్చే కొనే పనిలో ఎమ్మెల్యేలు, మంత్రులపై తనే విమర్శలు చేస్తుంటారు. ఆ తర్వాత వారిని మందలించినట్టు కూడా ప్రచారం చేస్తారు. కాని జరిగేది జరిగిపోతూనే ఉంటుంది. ఆయన ఒకరిద్దరు ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు వస్తుందని చెప్పారు. నిజానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చెడ్డపేరు తెస్తున్నారనది పార్టీలో పలువురి అభిప్రాయం అవి ఆయనకు తెలుసు. దానిని గట్టిగా చెబితే ఎక్కడ చికాకు వస్తుందో అని ఇలా వ్యూహత్మకంగా వ్యవహరిస్తుంటారు.మొత్తం ప్రభుత్వ తీరు వల్ల వచ్చే చెడ్డపేరును ఎమ్మెల్యేలు, మంత్రులపై నెట్టేసి తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. తద్వారా తన ప్రభుత్వంకు వస్తున్న అప్రతిష్టను డైవర్ట్ చేస్తారన్నమాట. ఈ విషయంలో ఆయనకు ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి అనుకూల మీడియా చాలా పాజిటివ్‌గా కవర్ చేస్తుంటుంది. క్యాబినేట్లో చేసిన కామెంట్స్‌పై ఈ పత్రికల్లో వచ్చిన ఒక వార్త చూడండి. "ఎంతో కష్టపడి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు బుల్ డోజర్లు, ప్రోక్లెయినర్లతో కూల్చి వేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేసారట" కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన భాద్యత మంత్రులదే అని చెప్పారట.మనం చేస్తున్న మంచిపై ప్రజల్లో చర్చ జరగాలి తప్ప... చెడుపై కాదని చంద్రబాబు.. అన్నట్లు ఈ మీడియా రాసింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఆయన అలోచన సరళి ఏంటో. చెడ్డపనులు, స్కామ్‌లు రహస్యంగా జరగాలి తప్ప ఓపెన్‌గా జరగకూడదన్న విశ్లేషణ వస్తుంది. నిజానికి ఈ మూడు నెలలుగా ఏ రకంగా ప్రభుత్వ ప్రతిష్ట పెరిగిందో చెప్పలేని పరిస్థితి ఆయనకు ఉంది. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హమీల గురించి ప్రజల్లో చర్చ జరగకూడదన్నది ఆయన ఉద్దేశ్యం కావచ్చు.నిత్యం మాజీ సీఎం జగన్‌పై ఆయన వేస్తున్న బురదను ప్రజలంతా గమనించి దాని గురించే మాట్లడాకోవలన్నది ఆయన లక్ష్యం. కాని ఇటివలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఒపెన్‌గా చేస్తున్న పనులు ప్రజల్లో మరింత నష్టం చేస్తుండవచ్చు. ఉదాహరణకు చిలకలూరి పేట ఎమ్మెల్యే భార్య వెంకయామ్మ పుట్టిన రోజుకు పోలీసులు వెళ్లి కేక్ కట్ చేయించడం, శ్రీకాకుళంలో ఒక రౌడి షీటర్ పుట్టిన రోజుకు టీడీపీ ఎమ్మెల్యే వెళ్లడం, తాడిపత్రిలో పోలీసులపై ఆస్మిత్ రెడ్డి దురుసుగా వ్యవహరించడం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులపై దర్పం ప్రదర్శించిన వైనం వంటివి కొన్ని వెలుగులోకి వచ్చాయి.లోకేష్ సతిమణి బ్రాహ్మణికి పోలీసులు వందనం చేయడం వివాదాస్పదం అయ్యింది. అయితే ఆ విషయంను మాత్రం పెద్దగా ప్రచారం కాకుండా జాగ్రత్తపడ్డారు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు రాష్ట వ్యాప్తంగా సాగుతున్నాయి. దానికి కారణం చంద్రబాబు వ్యవహర సరళి కూడా అని చెప్పకతప్పదు. పోలీసుల పట్ల చంద్రబాబు అనుసరించి వైఖరి గాని, వైఎస్సార్సీపీ వారిపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నప్పుడు పోలీసులను చూసి చూడనట్టు వెళ్లాలని సంకేతాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా వారు వ్యవహరిస్తూ రావడం జరిగింది. దీనితో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. దీనిని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యేలు మంత్రులు రెచ్చిపోతున్నారు.ఇవన్నీ గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వంకు చెడ్డపేరు రావడానికి కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు కాదని చంద్రబాబు ప్రభుత్వ తీరు కూడా అని అర్ధం అవుతుంది. మళ్లీ గతంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అప్రతిష్టపాలు అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే వైఖరితో ముందుకు వెళుతున్నారు. కాకపోతే ఈ సారి తెలివిగా పార్టీలో చేరే ఎంపీలతో రాజీనామా చేయిస్తున్నారు. అయితే ఇలా రాజీనామా చేసి వచ్చే నేతలకు టీడీపీ ప్యాకేజీలు ఇస్తుందని కధనాలు వస్తున్నాయి. చంద్రబాబు మీడియాతో మాట్లడుతూ వైఎస్సార్సీపీ నేతల క్యారెక్టర్ గురించి వింటుంటే షేమ్ అనిపిస్తుంది అని అన్నారట.ఆ తర్వాత వైఎస్సార్సీపీ నేతలు ఏవరైన రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని చెప్పారట. మరి ఇది పార్టీకి ప్రభుత్వంకు చెడ్డపేరు తెచ్చేది కాదా? అదే టైమ్‌లో ఆయా చోట్ల నగర మేయర్లు, కార్పొరేటర్లు రాజీనామాలు చేయకుండానే టీడీపీలో చేరుతున్నారు. ఇలా డబుల్ స్టాండర్స్ టీడీపీకి బాగా అలవాటైందని చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన ఇటుకలు పేర్చారో లేదో కాని... ప్రజలపై మాత్రం రకరకాల రూపాల్లో బుల్ డోజర్లను నడుపుతున్నారు. కనుక కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల వల్లే పార్టీకి అప్రతిష్ట రావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల వల్ల చెడ్డపేరు వచ్చింది. ఈ విషయంను ఎంత కప్పిపుచ్చుకుందాం అన్నా అది బయటపడుతోంది. కాకపోతే ఎట్టకేలకు తన ప్రభుత్వంకు చెడ్డపేరు వచ్చిందని మాత్రం చంద్రబాబు అంగీకరించక తప్పలేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు