kurasala kannababu
-
చంద్రబాబుపై కురసాల కన్నబాబు ఫైర్
-
బడ్జెట్ ప్రసంగమంతా చంద్రబాబు, లోకేష్ పొగడ్తలకే సరిపోయింది
-
‘చంద్రబాబు లక్ష 20 వేల కోట్లు అప్పు చేస్తే గొప్పగా రాస్తున్నారు’
విశాఖ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో నవ్వాలో జాలి పడాలో తెలియని పరిస్థితి కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో వైఎస్ జగన్ మరో 10 మెట్లు పైకి ఎక్కారన్నారు కురసాల. బడ్జెట్ ప్రసంగమంతా చంద్రబాబు లోకేష్ పొగడ్తలకే సరిపోయిందని, బడ్జెట్ ను మసి పూసి మారేడు కాయ చేశారన్నారు.బడ్జెట్ గురించి ఎల్లో మీడియాలో రాసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదని ధ్వజమెత్తారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొరగా నిధులు కేటాయించారు. వైఎస్ జగన్ కరోనా సమయంలో అప్పు చేస్తే రాష్ట్రం దివాలా అని వార్తల రాశారు. చంద్రబాబు లక్ష 20 వేల కోట్లు అప్పు చేస్తే గొప్పగా రాస్తున్నారు’ అని మండిపడ్డారు. పోసాని అరెస్టు ద్వారా కొత్త సంస్కృతికి తెర తీశారు. ఆరోగ్యం బాగో లేకపోయినా జైల్లో పెట్టారు. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ పై, వైఎస్సార్ సీపీ నేతలపై దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు ఇదే సాంస్కృతిని కొనసాగిస్తే వచ్చే ప్రభుత్వం ఈ సంస్కృతిని కొనసాగించదా? అని కురసాల కన్నబాబు హెచ్చరించారు. -
‘ ప్రశ్నించే మీడియా అంటే ఎందుకంత భయం?’
కాకినాడ: ఏపీ అసెంబ్లీ సమావేశా(AP Assembly Sessions)ల్లో భాగంగా కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీతో పాటు కొన్ని ఇతర మీడియా చానెళ్లను అడ్డుకోవడంపై ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్ సీపీ ఇంచార్జి కురసాల కన్నబాబు(Kurasala Kannababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రశ్నించే మీడియా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు.‘నోటీసులు ఇవ్వకుండా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయ్యడం లేదు. ఆయన కుమారుడు లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) కు ప్రతిపక్ష హోదా ఇవ్వనంటారు. కూటమీలో భాగస్వాములైన పార్టీకి పబ్లిక్ ఎకౌంట్స్ ఛైర్మన్ పదవి ఇస్తారు. చంద్రబాబుకు అనుకూల ఎల్లో మీడియా ఉన్నప్పుడు..ప్రశ్నించే మీడియా అంటే ఎందుకు భయం?, ఎంతకాలం మీడియా గొంతు నొక్కుతారు. చేతకాని అసమర్ధ ప్రభుత్వం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ‘సాక్షి’తో సహా నాలుగ చానెళ్లపై ఆంక్షలువిజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ లో నూ ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలను కవరేజ్ అంశానికి సంబంధించి ‘సాక్షి’తో సహా నాలుగు చానెళ్లపై ఆంక్షలు విధించింది. దేశంలో ఏ అసెంబ్లీ చరిత్రలో లేని మీడియాపై నిషేధ ఆజ్ఞలు అములు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీడియాపై ఆంక్షలు విధించింది. కూటమి కుట్రలు బయటపడతాయని ‘సాక్షి’తో పాటు నాలుగు చానెళ్లను నిషేధించింది. అసెంబ్లీలో జరుగుతున్నది ప్రజలకు చూపించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కుట్రలు తెరలేపింది. చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది! -
ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం
-
నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జగన్ కు ధన్యవాదాలు
-
కూటమి.. చంద్రన్న పగ, దగ పథకాన్ని అమలు చేస్తోంది: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్.. ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. చంద్రబాబులాగా మోసం చేయడం వైఎస్ జగన్‌కు తెలియదని కన్నబాబు చెప్పుకొచ్చారు. గ్రూప్-2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కురుసాల కన్నబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణ దాస్, ఎంపీ తనూజ రాణి, గుడివాడ అమర్నాథ్, వరుదు కళ్యాణి, ధర్మశ్రీ, కేకే రాజు, పండుల రవీంద్ర బాబు సహా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘నాకు బాధ్యత అప్పగించిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ వైఎస్సార్సీపీ ఎంతో బలంగా ఉంది. ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటి గడ్డ. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని చూశారు.ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్. సినిమా హీరోలను మించి వైఎస్ జగన్‌కు జనాలు వస్తున్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదు.. సూపర్ 60 ఇచ్చేవారు. రాష్ట్రంలో చంద్రన్న పగ, చంద్రన్న దగ అనే పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. వైఎస్ జగన్ చెప్పిందే చేస్తారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుంది. ప్రజల కోసం పోరాడుతుంది. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు, నేతలు ఎందరో ఉన్నారు. రాజకీయ పార్టీల్లో వలసలు సాధారణం. జగన్ సేన అన్ని పార్టీల సేనల కంటే బలంగా ఉంది. లక్షా 20వేల కోట్లు అప్పు చేసి చంద్రబాబు ఏమి చేశారో తెలియదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
వైఎస్ జగన్ కు ఉన్న ప్రజాదారణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు
-
‘వైఎస్ జగన్‌కు ఏ విధంగా భద్రత తొలగిస్తారు?’
విశాఖ. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న భద్రతను ఏ విధంగా తొలగిస్తారని ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ భద్రతపై తామంతా ఆందోళన చెందుతున్నామని, ఆయనకు యధావిధిగా భద్రత కొనసాగించాలని కన్నబాబు కోరారు. వైఎస్ జగన్ జడ్ ప్లస్ భద్రత అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాల్సిన అవసరం ఉందన్నారు.వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. జగన్ పై తన కడుపు మంటను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రైతులను వైఎస్ జగన్ పరామర్శిస్తే తప్పుడు కేసులు పెడతారా అంటూ నిలదీశారు కురసాల కన్నబాబు. మీ మ్యూజికల్ నైట్ కి ఎన్నికల కోడ్ అడ్డంకి రాలేదా అని ప్రశ్నించారు. మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శిస్తే గానీ చంద్రబాబులో చలనం రాలేదని ధ్వజమెత్తారు.మోదీ, అమిత్ షాలకు మిథున్‌రెడ్డి లేఖప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి వివరించారు.జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీ దౌర్జన్యం.. రేపు చలో తునికి పిలుపునిచ్చిన దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల అరాచకం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రేపు చలో తునికి పిలుపునిచ్చారు వైఎస్సార్సీపీ నాయకులు దాడిశెట్టి రాజా. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రేపు తుని రావాలని కోరారు. తుని మున్సిపాలిటీ వైఎస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈరోజు టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తునిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరింపులకు గురిచేశారు. అలాగే, ఎన్నిక సందర్భంగా అక్కడికి వెళ్లిన దాడిశెట్టి రాజాపై టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. అనంతరం, ఎన్నికల్లో కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు.ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ..‘మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ దౌర్జన్యంగా అడ్డుకుంటోంది. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు కౌన్సిలర్లను బెదిరిస్తున్నాడు. కలెకక్టర్, ఎస్పీ వచ్చి మా కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌కు తీసుకువెళ్ళాలి. గతంలో నాపై కేసు నమోదు చేశానని సీఐ చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవడం లేదు. రేపు చలో తునికి పిలుపునిస్తున్నాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రేపు తునికి రావాలని కోరుతున్నట్టు’ తెలిపారు.మరోవైపు.. తునిలో టీడీపీ గుండాల దౌర్జన్యాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కురసాల కన్నబాబు ఖండించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘తునిలో టీడీపీ దుర్మార్గంగా ప్రవర్తించి వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకుంది. పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయాలనుకున్నారు. యనమల రామకృష్ణుడు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారో లేదో చెప్పాలి. టీడీపీకి సహకారం అందిస్తున్న పోలీసులపై అధికారులు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. తునిలో శాంతియుత వాతావరణం కల్పించి..హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా జరిపించాలి. రేపు మేమంతా తుని వెళ్తాం’ అని చెప్పారు. -
వైఎస్ఆర్సీపీలో నూతన నియామకాలు
-
రాజకీయ అవసరాల కోసం ఊసరవెళ్లి సిగ్గుపడేలా చంద్రబాబు రాజకీయాలు
-
చంద్రబాబు కొత్త పల్లవి.. గతం గుర్తుందా?: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్మెంట్ ఆశ్చర్యం కలిగించిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతం చంద్రబాబుకు గుర్తుకు రాదా?.. కేజ్రీవాల్ ఓడిపోగానే చంద్రబాబు కొత్త పల్లవి, కొత్త కీర్తనలు పాడటం మొదలు పెట్టాడంటూ దుయ్యబట్టారు.‘‘మోదీ రైట్ టైం రైట్ లీడర్ షిప్ అని మోదీని చంద్రబాబు ఎప్పుడు గుర్తించారు. చంద్రబాబే పెద్ద దిక్సూచి అని గతంలో కేజ్రీవాల్ కీర్తించారు. మోదీ సరైనా నాయకుడు కాదని 2017, 18, 19లో చెప్పింది చంద్రబాబే. మోదీ డిక్టేటర్ అని.. అలాంటి మోదీని తలదన్నుతున్నాని చంద్రబాబు చెప్పాడు. అవినీతి కుడితిలో మోదీ పడి విలవిల లాడుతున్నాడని చంద్రబాబు అన్నారు. మోదీ మీద చంద్రబాబు చేసిన వాఖ్యలన్ని రికార్డ్ కాబడినవే’’ అని కన్నబాబు గుర్తు చేశారు.‘‘మోదీని నమ్మి మోసపోయామని చంద్రబాబు అన్నారు. మోదీ హటావో.. దేశ్ బచావో అని ఐదేళ్ల క్రిందట విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం ఊసరవెల్లిని మించిపోతారు. చంద్రబాబు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే మీడియా ఉంది. అందుకే ఆయన ఆటలు సాగుతున్నాయి. సంక్షేమ ఇస్తున్నామని బటన్ నొక్కితే ప్రజలు విశ్వసించడం లేదని చంద్రబాబు చెప్పారు. సంపద సృష్టితో సంక్షేమం ఇవ్వాలని చెప్పారు. ఏపీ, ఢిల్లీలో ఉచితాలు ఫెల్యూర్ అయ్యాయని అన్నారు. ఉచితాలు ఫెల్యూర్ అయితే.. సూపర్ సిక్స్ ఇస్తానని ఏ రకమైన హమీలు చంద్రబాబు ఇచ్చారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అని విధంగా చంద్రబాబు తీరు ఉంది’’ అని కన్నబాబు దుయ్యబట్టారు.‘‘సంక్షేమం ముఖ్యం కాదు రాష్ట్ర గ్రోత్‌ను పెంచడం అని తనకి నచ్చినట్లు పాలన చేస్తానని చెబుతున్నాడు. సంక్షేమం తన ప్రాముఖ్యత కాదని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? పచ్చిగా తన హామీలను తుంగలోకి తొక్కడానికి చంద్రబాబు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రజల మైండ్‌ను సెట్ చేస్తున్నాడు. ఆడిన ఆబద్ధం ఆడకుండా. ఎంత కాలం విశ్వసనీయత లేకుండా పాలన చేస్తారు. సంపద సృష్టి కర్త ఈ ఎనిమిది నెలలో ఏం చేశారు?. ఎవరి కోసం సంపద సృష్టి చేశారు. తన వాళ్లు.. పార్టీ నాయకుల కోసం చంద్రబాబు సంపద సృష్టిస్తున్నారు. పేకాట క్లబ్‌ల కోసం కూటమి నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చివరికి బూడిద కోసం కూడా కూటమి నేతల మధ్య గొడవలు జరిగాయి...విద్యుత్ ఛార్జీలు రూ.15 వేలకోట్లు సంపద సృష్టి అనుకోవాలా?. ఉచిత ఇసుక ద్వారా ఎవరేవరికి సంపద సృష్టి జరుగుతుందో తెలుసుకోండి. చంద్రబాబు ఎప్పటికప్పుడు మనస్సు మార్చుకుంటారా?. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది?. 2019లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించారు. దానికి కట్టుబడి ముందుకు వెళ్తారా?. విభజన చట్టంలో హమీలు ఎంత వరకు వచ్చాయి?. ప్రజల ఎకౌంట్లో డబ్బులు వేయనని చంద్రబాబు చెబుతున్నట్లు ఉంది.కొన్ని పెద్ద శాఖలకు ఎక్కువ ఫైల్స్ వస్తాయి. అలాగే చిన్న శాఖలకు తక్కువ ఫైల్స్ వస్తాయి. మంత్రుల ర్యాంకుల విషయంలో అందరిని ఒక గాడిన పెట్టడం సరికాదు. ఆర్థిక శాఖకు 24 ఇచ్చారంటా.. మీ పాలనలో ఆర్థిక పరిస్థితి బాగోలేదనేగా?. ర్యాంకుల కోసం కూటమి నేతల మధ్య విబేధాల నెలకొన్నాయి. మీ ర్యాంకులకు పాస్ మార్కులు కూడా రాలేదు. అమరావతి కోసం కలలు కనడం తప్పా... మీరు చేసింది ఏమిటీ?. చంద్రన్న పగ.. చంద్రన్న దగా ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి’’ కన్నబాబు దుయ్యబట్టారు. -
8 నెలలకే ప్రజలకు 70MM సినిమా.. ప్రజలే మీ కాలర్ పట్టుకుని...!
-
’బాబు’ ష్యూరిటీ.. ప్రజలపై బాదుడు గ్యారెంటీ: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెను భారాలను మోపడమేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు (Kurasala Kannababu) మండిపడ్డారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం ద్వారా ప్రజల నుంచి ఏటా రూ.13000 కోట్లు ముక్కుపిండి వసూలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో మాత్రం తన బినామీలపై భారం పడకూడదని రిజిస్ట్రేషన్ చార్జీల పెంపును మినహాయించారని ఆరోపించారు.కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..‘‘రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అమలు చేయడం అని చంద్రబాబు అనుకుంటున్నారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదేనా? ఒక వస్తువుకు ఎలా మార్కెటింగ్ చేస్తారో అలాగే తనను తాను మార్కెటింగ్ చేసుకునేలా సంపద సృష్టి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దానిని నమ్మిన ప్రజలు ఈ రోజు అవస్థలకు గురవుతున్నారు. స్థిరాస్థి విలువలను అడ్డగోలుగా పెంచడం, భూములు, నిర్మాణాలు, చివరికి తాత్కలిక నివాసం ఉండే షెడ్లు, పూరిళ్ళను కూడా ఈ చార్జీల పెంపు కిందకు తీసుకువచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబుకు తనకు కావాల్సిన వారికి అనుకూలంగా ఈ రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచారు.చంద్రబాబు, ఆయన బినామీల చేతుల్లో అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు వున్నాయి. ఈ చార్జీల పెంపుదల నుంచి వీటికి మినహాయింపు కల్పించారు. రాష్ట్రమంతా పెంచిన చార్జీలు ఇక్కడ మాత్రం పెరగవు. అంటే తన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మినహాయింపులు కల్పించారు. అమరావతిలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచితే, కొనుగోళ్ళు ఇబ్బంది కలుగుతాయని అక్కడ మార్కెటింగ్ పెరిగేందుకు వీలుగా, భూములను అమ్ముకుని తన బినామీలు లాభం పొందేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుదల నుంచి మినహాయింపు ఇచ్చారు. చాలా చిత్రంగా లేయర్లు, గ్రిడ్స్ పేరుతో తమకు అనుకూలమైన ప్రాంతంలో చార్జీలను పెంచడం, మినహాయించడం పై నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక అపార్ట్ మెంట్ కొనుగోలుచేస్తే లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ చార్జీలును చెల్లించాల్సిన పరిస్థితిని కల్పించారు.అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని దివాలా తీయించారు:గత ఎనిమిది నెలల పాలన చూస్తూ చంద్రబాబు అసమర్థత, వైఫల్యం కనిపిస్తోంది. నీతిఅయోగ్ పై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా దివాలా తీసింది, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదు అంటూ మాట్లాడారు. అభివృద్ది ద్వారా సంపద సృష్టిస్తాం, దానితో సంక్షేమం చేస్తానంటూ ఒక కొత్త వాదనను వినిపించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ’పూర్ టు రిచ్’ అనే ఒక నినాదం ఇచ్చారు. పేదలన కుబేరులను చేస్తానంటూ మభ్యపెట్టారు. సూపర్ సిక్స్ ఏమయ్యాయి? వాగ్దానాల అమలు ఏదీ అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అధికారాన్ని వినియోగించుకుని కేసులు నమోదు చేస్తున్నారు.చివరికి సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపైన కూడా కేసులు నమోదు చేసి తమ నిరంకుశత్వాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికలకు మందు మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలదు అంటూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు మా పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు.చంద్రబాబు ఇచ్చిన హామీలను నిజంగా అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు అవసరం అవుతాయని. మేం అమలు చేస్తున్న పథకాలకే ఏడాదికి రూ.70వేల కోట్లు ఖర్చు అవుతోంది, ఇంతకు మించి ఇచ్చే సామర్థ్యం ఈ రాష్ట్ర ఖజానాకు లేదు అని చాలా క్లియర్ గా వాస్తవాలను వెల్లడించారు. చంద్రబాబులా అబద్దాలు చెప్పి, తరువాత ప్రజలను మోసం చేయలేను అని కూడా చెప్పారు. కానీ ప్రజలు దీనిని అర్థం చేసుకోలేదు. నిజం కంటే అబద్దం అందంగా కనిపించింది. చంద్రబాబు అబద్దాలను నమ్మారు. నడిచి వచ్చే అబద్దంగా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.8 నెలల్లో తెచ్చిన అప్పులను ఎలా ఖర్చు చేశారు?అమిత్ షా ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏపీకి రూ.3 లక్షల కోట్లు కేంద్రం ద్వారా సాయం అందించామని ప్రకటించారు. చంద్రబాబు ఇప్పటివరకు రూ.1.19 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పారు. అంటే ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి అందిన నిధులు మొత్తం రూ.4.19 లక్షల కోట్లు. నెలకు దాదాపు రూ.50 వేల కోట్లు. ఈ నిధులు ఏం చేశారు? ఏ పథకం కింద ప్రజలకు ఎంత సొమ్ము అందించారు? వీటికి సంబంధించిన లెక్కలు వెల్లడించండి.ఆర్థిక అరాచకత్వం ఈ రాష్ట్రంలో నడుస్తోంది. ఒకవైపు అభివద్ధి లేదు, మరోవైపు సంక్షేమం కనిపించడం లేదు. నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్నారు. చివరికి జగన్ సీఎంగా ఉండగా వాట్సాప్ లో గవర్నెన్స్ ను తీసుకువచ్చారు. పదిహేను రోజుల కాలంలో కోటి సర్టిఫికేట్ లను ఇంటింటికీ తీసుకువెళ్ళి అందించారు. దానిని కాపీ చేసి నేడు లోకేష్ వాట్సప్ గవర్నెన్స్ ను తానే కనిపెట్టినట్లు, ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.ఇదీ చదవండి: అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి జగన్ పాలన సింప్లిసిటీ అయితే చంద్రబాబు పాలన పబ్లిసిటీ. 2022లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతోంది, అప్పుల ఊబిలోకి వెడుతోందంటూ గుండెలు బాదుకున్నారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ మాట్లాడుతూ మేం ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని అడగాలని అన్నారు. ఇప్పుడు హామీలను అమలు చేయడం కుదరదంటున్న మీ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏం చేయాలి? ఏం చేస్తే హామీలను అమలు చేయడానికి సిద్దమవుతారు?కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలను వెల్లడించాలిజగన్ పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం నా ప్రాధాన్యతలు అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతలు ఏమిటీ? ఏ రంగాన్ని తమ ప్రయారిటీలో పెట్టారో వెల్లడించాలి. దావోస్ వెళ్ళడమే అద్భుతమైన ఘట్టంగా ప్రచారం చేసుకున్నారు. ఒక్క ఎంఓయు చేసుకోకుండా రాష్ట్రానికి తిరిగి వచ్చి, దావోస్‌లో ఎంఓయులు గొప్పకాదు అంటూ మాట మార్చేశారు. జగన్ ఆర్థిక విధ్వంసం సష్టించారు, అప్పుల పాలు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. పారిశ్రామికవేత్తలు రావాలంటే జగన్ గారు మళ్లీ అధికారంలోకి రారు అని రాసివ్వమని అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు.పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను కేసులతో భయపెట్టి పారిపోయేలా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు ఏ ధైర్యంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు? ప్రతి సందర్భంలోనూ వైయస్ జగన్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నామనే భ్రమతో చంద్రబాబు, లోకేష్ లు చేసిన వ్యాఖ్యల వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ దెబ్బతిన్నది. తమ రాజకీయం కోసం ఏపీ ఇమేజ్ ను దెబ్బతీయడం వల్ల కొత్త పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా పరిశ్రమ పెడదామని భూముల కోసం సర్వే చేస్తుంటేనే గద్దాల వారిపై పడి వేధిస్తున్నారు. లోకేష్ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ రెడ్ బుక్‌ను అమలు చేస్తామని చెప్పారు. దావోస్ కు వెళ్ళి వేధింపులు కొనసాగిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతలు మా చేతుల్లో ఉన్నాయని చెబుతుంటే, ఐఎఎస్, ఐపీఎస్ లపై తప్పుడు కేసులు పెట్టి పాలనను దిగాజారుస్తుంటే ఏ నమ్మకంతో పెట్టుబడులు పెడతారు?కాకినాడ బియ్యం నివేదికపైనా ఒత్తిళ్ళు సిగ్గుచేటు:కాకినాడ పోర్ట్‌లో బియ్యం మాఫియాకు సంబంధించి వాస్తవంగా ఉన్న పరిస్థితికి భిన్నంగా తాము చెప్పిన వారి పేర్లను ఇరికించి, వారికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ఒక ఐపీఎస్ అధికారిని బెదరించిన ఘటనపై పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇటువంటి తప్పుడు పనులు చేయను, అవసరమైతే రాజీనామా చేస్తానంటూ సదరు ఐపీఎస్ అధికారి తెగించి చెప్పడంతో ఆయనతో సెలవు పెట్టించారు.ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక మిగిలిన అధికారులు ఎలా నిస్పక్షపాతంగా పనిచేయగలరు? ఐఎఎస్, ఐపీఎస్ లు తమ ఉద్యోగాలనే వదులుకునే స్థాయిలో వారితో తప్పులు చేయించాలనే విధంగా పాలన సాగుతోంది. రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందనేందుకు ఇంతకంటే నిదర్శనం కావాలా? ఈ రాష్ట్రంలో లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రజలు జీవించాలని, అధికార యంత్రాంగం పనిచేయాలని నిర్ధేశిస్తున్నారు.చంద్రబాబుకు ఉపయోగపడే వాటికే ప్రాధాన్యతచంద్రబాబుకు తన బినామీల ప్రయోజనాల కోసం అమరావతి, తన సంపాధనకు ఏటీఎంగా ఉన్న పోలవరం, స్పెషల్ ప్యాకేజీ కోసం విశాఖ ఉక్కు. ఇవే చంద్రబాబు ప్రాధన్యతలు. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసినట్లు పత్రికల్లో చూశాం. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు చెబితే జ్యుడీషియల్ క్యాపిటల్ వల్ల ఏం వస్తుందీ, నాలుగు జిరాక్స్ షాప్ వస్తుందని చంద్రబాబు ఎద్దేవా చేశాడు.మరి ఈరోజు హైకోర్ట్ బెంచ్ పెడితే ఏం వస్తుందో చంద్రబాబు చెప్పాలి? జగన్ గారు చేస్తే అది తప్పు, చంద్రబాబు చేస్తే చాలా గొప్ప కార్యక్రమం. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నారంటే దానికి మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలే కారణం అంటూ కేంద్రమంత్రి కుమారస్వామితో మాట్లాడించడం చూస్తుంటే వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నారా లోకేష్ ను జాకీలు పెట్టి మరీ పైకి లేపుతున్నారు. పోలవరం ఎత్తు తగ్గించారంటే దీనిపై ఎవరూ నోరు విప్పరు.విద్యా వ్యవస్థ నివేదికలను వక్రీకరిస్తున్నారు:ఈ రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడిందీ అంటే దానికి కారణం వైఎస్ జగన్. కానీ మొన్న అసర్ నివేదికలో జగన్ గారి హయాంలో విద్యారంగ స్థాయి పడిపోయిందంటూ ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరి హాయాంలో ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడ్డాయో తేల్చుకునేందుకు ఏ గ్రామానికైనా వెళ్ళి పరిశీలించేందుకు సిద్దం. జగన్ గారు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా మారుస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. 2023 డిసెంబర్ 1వ తేదీన కేంద్రం ఇచ్చిన నివేదికలో స్వచ్చా విద్యాలయం ఇనిషియేటీవ్ కింద ఏపీలో ప్రతి పాఠశాలకు రక్షిత మంచినీటి వసతిని కల్పించారని చాలా స్పష్టంగా చెప్పింది. 49,293 టాయిలెట్లను నిర్మించినట్లు పేర్కొంది.దీనిలో బాలురకు 83.55శాతం, బాలికలకు 96.9 శాతం ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఈ నివేదిక తప్పేనని చెబుతారా? వైయస్ జగన్ గారి ప్రభుత్వం జరిగిన ప్రగతిపై కేంద్ర నివేదికలను కూడా వక్రీకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో జరిగిన మంచిని కూడా అంగీకరించ లేకపోతున్నారు. రాష్ట్రంలో పెన్షన్లు కూడా భారీ ఎత్తున తొలగించే ప్రయత్నం ప్రారంభించారు. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.3900 కోట్లు చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కురసాల కన్నబాబు ఆక్షేపించారు. -
8నెలలకే అసలు రంగు బయటపడింది బాబుపై కన్నబాబు సెటైర్లు
-
ఈ సంక్రాంతికి చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు
-
ఈ సంక్రాంతి.. పచ్చ నేతలకే పండగ.. ప్రజలకు కాదు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: గత సంక్రాంతికి ఈ ఏడాది పండగకు చాలా వ్యత్యాసం ఉందని.. గత ఏడాది సంక్రాంతికి ప్రతి కుటుంబాన్ని వైఎస్ జగన్ చేయి పట్టుకుని నడిపించారని.. ఈ సంక్రాంతికి చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పేదల పండగ కాదు.. పచ్చ నేతల పండగ అంటూ దుయ్యబట్టారు. పేదల జేబుల్లో డబ్బుల్లేవు.. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలు తరిమేసినవారు పండక్కి రావడానికి భయపడుతున్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం లేదు’’ అని కన్నబాబు చెప్పారు. ఈ సంక్రాంతికి చంద్రన్న కానుక పథకం ఏమైంది?. కూటమి నేతలకే పండగ.. ప్రజలకు కాదు. ఇష్యూ వస్తే డెవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌ను తిట్టడమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారు. తిరుపతి తొక్కిసలాట చూసి కూటమి నేతలు సిగ్గుపడాలి. తిరుపతి తొక్కిసలాట కూటమి ప్రభుత్వ వైఫల్యం కాదా?. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్లు బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాటపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. తిరుమల ప్రసాదంపై కూడా దుష్ప్రచారం చేశారు. వెంకన్న స్వామిని రాజకీయాల్లోకి లాగితే ఫలితాలు ఇలానే ఉంటాయి’’ అని కన్నబాబు వ్యాఖ్యానించారు.‘‘భక్తుల ఫోన్ నంబర్లతో కూటమి ప్రభుత్వానికి ఏం పని?. చంద్రబాబు మనుషులు చేసే తప్పులకు భక్తులు బలైపోతున్నారు. టీటీడీ సమావేశంలో ప్రైవేట్ వ్యక్తులకు ఏం పని?. సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలు ప్రైవేట్ వ్యక్తులపై ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..! -
టీటీడీ ఛైర్మన్ వాఖ్యలు బాధ్యతారాహిత్యం అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు.
-
‘చంద్రబాబు అసమర్థ పాలనకు తిరుపతి ఘటన నిదర్శనం’
సాక్షి, కాకినాడ జిల్లా: టీటీడీ ఛైర్మన్ వాఖ్యలు బాధ్యతారాహిత్యం అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని.. టీటీడీ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయాలు, ప్రచార ఆర్భాటాలు తప్పా దేన్ని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.‘‘లడ్డూలో కల్తీ జరిగిందని సాక్షాత్తూ వెంటేశ్వరస్వామిని రాజకీయానికి వాడుకున్నారు. టీటీడీ నిర్లక్ష్యానికి ఏడుగురు భక్తుల నిండు ప్రాణాలు బలైపోయాయి. పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోతే.. కనీసం ఒక్క నిముషం మృతుల కోసం చంద్రబాబు బాధపడిన సందర్భం లేదు. టీడీడీ ఛైర్మన్ వాఖ్యలు బాధ్యతారాహిత్యం. తొక్కిసలాటకు తప్పు వెంకటేశ్వర స్వామీదా?..తొక్కిసలాటకు బాధ్యత ఎవరూ తీసుకుంటారు.?. ఇప్పటికైన ప్రజల ముందుకు వచ్చి.. దేవుడు ముందు తప్పు తమదేనని లెంపలేసుకోండి. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎంతసేపూ జగన్‌పై విష ప్రచారం.. రెడ్ బుక్ రాజ్యంగం అంటూ పాలనను గాలికి వదిలేశారు’’ అని కన్నబాబు ధ్వజమెత్తారు. -
కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న బాబు.. కన్నబాబు సెటైర్లు
-
‘చంద్రబాబు సూపర్ సిక్స్ కాదు.. సూపర్ షాక్‌లిచ్చారు’
సాక్షి, కాకినాడ: గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్ ఇస్తున్నారని.. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అనే పరిస్ధితికి తీసుకువచ్చారంటూ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్సులిన్ కూడా లేని పరిస్ధితి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని.. కొందర్ని తొలగించారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.సూపర్ సిక్స్ కాదు.. సూపర్ షాక్ అన్నట్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. భుజాలపై మోసే సొంత మీడియా ఉండడమే చంద్రబాబు అదృష్టం. పేరులో ఉచితం తప్పా.. ఉచిత ఇసుక ఎక్కడా?. చంద్రబాబుకు ఇస్తున్న షాకులకు ఎవరూ మినహయింపు కాదు. బాబు వస్తే తమకు స్వర్గం అనుకున్న మద్యం ప్రియులకు కూడా షాక్ ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు.‘‘ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఇవాళ వైఎస్సార్సీపీ పోరుబాట దిగ్విజయంగా జరిగింది. విద్యుత్ భారం, మూడు డిమాండ్లను అధికారులకు వినతిపత్రం ద్వారా అందించాం. ఒక్క నెలలోనే ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎంత కాలం జగన్ నామ స్మరణం చేస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. పచ్చి అబద్దాలను కూటమి ప్రభుత్వం మానిఫెస్టోలో పెట్టింది. చంద్రబాబు సర్కార్ ఎన్ని కుట్రలు చేసిన ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరు ఆపదు.’’ అని కన్నబాబు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కరెంట్ కోత.. చార్జీల మోత‘‘ఉచిత విద్యుత్ అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. తొమ్మిది గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. రైతుల ఉచిత విద్యుత్ కోసం ఫీడర్లను ఆధునీకరించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పట్ల ప్రజల ఆగ్రహం బయటకు వచ్చింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాలి’ అని చంద్రబాబు సర్కార్‌ను కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. -
తరాలు మారుతున్నా చంద్రబాబు విజన్ లో ఎటువంటి మార్పు లేదు: కన్నబాబు
-
జనాలను మభ్యపెట్టేందుకే బాబు ‘విజన్’
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన విజన్–2047 జనాలను మభ్యపెట్టేందుకేనని, ఆ విషయంలో ఆయన ఘనుడని మాజీమంత్రి వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన విజన్–2047 పేదల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. గతంలో విజన్–2020 ప్రవేశపెట్టినప్పుడే కమ్యూనిస్టులు ‘విజన్–2020.. చంద్రబాబు 420’గా.. వరల్డ్ బ్యాంకు జీతగాడుగా పిలిచేవారు. ఇప్పటికీ ఆయన విజన్‌లో ఎలాంటి మార్పూలేదు. విజన్–2047 గురించి మాట్లాడే ముందు 2024 పరిపాలన విధానంపై ఆయన ఆలోచించాలి. విజన్ అనేది పేదవాడికి సహాయం చేయడానికి ఉండాలి.కానీ.. చంద్రబాబు ఒక్క రూపాయి అయినా సహాయం చేశారా? రైతులకు రూ.20 వేలు పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా ఊసేలేదు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆయన 2014లో రుణమాపీ చేయకుండా రైతులను మోసం చేశారు. చంద్రబాబు 1998లో రూ.2 కోట్ల 50 లక్షలతో మెకాన్సీ సంస్థ ద్వారా విజన్ డాక్యుమెంట్ తయారుచేయించారు. అందులో.. అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేసి యూజర్ ఛార్జీలు వసూలుచేయమని ఉంది. మెడికల్ సీట్లు వద్దనడమే బాబు విజన్..జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలకు అనుమతిచ్చి ఐదింటిని పూర్తిచేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్‌పరం చేస్తున్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాయడం చంద్రబాబు విజన్. అలాగే, వలంటీర్లు, బేవరేజ్ కార్పొరేషన్ సిబ్బందినీ తొలగించి వారిని రోడ్డున పడేశారు. సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నా కొంతమందికే సంపద కలుగుతోంది. అమరావతికి రూ.15వేల కోట్ల అప్పు దొరకిందన్న అనందం తప్ప పేదవాడికి పది రూపాయలు సహాయం చేశామన్న సంతోషంలేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి కిందస్థాయి అధికారుల వరకు అందరినీ వేధిస్తున్నారు.ఈ ఏడు నెలల కాలంలో రూ.70 వేల కోట్ల అప్పుచేయగా.. ప్రజలకు ఏంచేశామో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులతో రిమాండ్‌కు తరలిస్తున్నారు. కానీ, జగన్మోహాన్రెడ్డి మీద మీరు ఎన్ని పోస్టులైన పెట్టొచ్చా? మీ మాటలకు, చేతలకు పొంతనలేదు. ఉచిత ఇసుక ఎక్కడా అమలుకావడంలేదు. ఇలా ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు?ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ అరెస్టు..అల్లు అర్జున్ అరెస్టు నూటికి నూరుశాతం ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సా«ధింపులా ఉంది. నాలుగు రోజులు జైలులో ఉంచాలని చూసినట్లుగా ఉంది. తొక్కిసలాట సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదా? ఈ విషయంలో ఏపీలో ఒక చట్టం, తెలంగాణాలో ఒక చట్టం అమలవుతోంది. గత గోదావరి పుష్కరాల్లో 29 మంది తొక్కిసలాటలో చనిపోతే ఆనాడు చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం కనబడలేదు. అప్పుడాయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి. -
చంద్రబాబు విజన్ పేదల పాలిట శాపం: కన్నబాబు
సాక్షి, కాకినాడ: సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన తాజా విజన్-2047 ఆచరణకు పనికి రాని ఒక డ్రామా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఒక స్వయం ప్రకటిత విజనరీ అని, గతంలో ఆయన ప్రకటించిన రెండు విజన్లలోని లక్ష్యాలను ఏ మేరకు సాకారం చేశారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విజన్ అంటేనే పేదవారి విధ్వంసంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కొత్తసీసాలో... పాతసారాగతంలో చంద్రబాబు రెండుసార్లు విజన్ డాక్యుమెంట్లను రిలీజ్ చేశాడు. ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశాడు. ఈ దేశంలో తానే ఒక గొప్ప విజనరీగా భ్రమపడే చంద్రబాబు, ప్రజలను కూడా తన పబ్లిసిటీ స్టంట్లతో భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగానే ఈ తాజా విజన్ 2047 డాక్యుమెంట్. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కొత్త సీసాలో పాత సారా.1995-2004 మధ్య, 2014-19 మధ్య సీఎంగా చంద్రబాబు ప్రకటించిన రెండు విజన్లలో ఒక్క లక్ష్యాన్ని అయినా సాధించిన దాఖలాలే లేవు. చంద్రబాబు తాజాగా విజన్-2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. రెండు మూడు రోజుల నుంచి మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైనే ప్రచారం చేసుకుంటున్నాడు. జనాలను మభ్యపెట్టడం ఎలా అనే అంశంపై చంద్రబాబు పుస్తకం రాస్తే, ఈ ప్రపంచంలోనే అత్యధికంగా అది అమ్ముడు పోతుంది. ప్రజలకు ఏం కావాలనేది ఆయనకు అక్కరలేదు. కానీ వారిని భ్రమల్లో ఉంచడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం ఎవరికీ లేదు. దానిలో భాగమే ఈ తాజా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ'విజన్-2020 చంద్రబాబు-420'చంద్రబాబు గతంలో రిలీజ్ చేసిన విజన్-2020, విజన్-2029 అనే డాక్యుమెంట్ డ్రామాలు ప్రజలను ఎలా మోసం చేశాయో కమ్యూనిస్ట్‌లు ఆనాడే ప్రజలకు గుర్తు చేశారు. గతంలో ఆయన ప్రకటించిన డాక్యుమెంట్లను అధ్యయనం చేసిన కమ్యూనిస్ట్ లు విజన్-2020 చంద్రబాబు-420 అనే నినాదం కూడా చేసేవారు. అప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు విజన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఆనాడు ఎలా ఆలోచించాడో, నేడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు విజన్-2047 అంటూ కొత్త రాగాన్ని ఆలపిస్తే, కూటమిలోని భాగస్వాములు దానికి తప్పెట్లు, తాళాలతో ఆయన చాలా గొప్పనాయకుడు, వంద ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించాలని కీర్తిస్తున్నారు.ప్రజాశ్రేయస్సుకు దూరంగా చంద్రబాబు విజన్2024లో ప్రజలు చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేయాలి, వారి అవసరాలు ఏమిటీ అని ఆలోచించకుండా విజన్ 2020లో ఏం చెప్పారో ఇప్పుడు 2047 విజన్లోనూ అవే చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. కానీ ఈ రాష్ట్రంలో నేటికీ తాగునీరు అందని గ్రామాలు, విద్య, వైద్యం, రహదారులు, కరెంట్, కనీస సదుపాయాలు లేని పల్లెలు ఉన్నాయంటే అత్యధిక కాలం సీఎంగా చేసిన చంద్రబాబుకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇది ఎలాంటి విజన్? కనీస అవసరాలు తీర్చే విజన్ లేకుండా, తనకు తానే భ్రమల్లోకి వెళ్ళి ప్రజలను కూడా భ్రమల్లోకి నెట్టడం సమంజసమా? విజన్ 2020 తరువాత రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి 2.4 శాతం నుంచి 0.29 శాతానికి పడిపోయింది, రాష్ట్ర జీడీపీ ఏకంగా 5 శాతం లోపే నమోదు అయిన విషయం వాస్తవం కాదా?సూపర్ సిక్స్ హామీల అమలుపై మీ ప్రణాళిక ఏదీ?వరుసగా విజన్ లను ప్రకటిస్తున్న చంద్రబాబుకు ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు మాత్రం గుర్తుకు రావడం లేదు. సూపర్ సిక్స్ అని ఇచ్చిన హామీల్లో ఒక్క పథకంలోనూ ఒక్క రూపాయి పేదలకు సాయం చేయకుండా గాలికి వదిలేశారు. రైతులను ఆదుకోవాలనే విజన్ అంతకన్నా లేదు. 2014 కి ముందు మీరు ఇచ్చిన రైతు రుణమాఫీని అమలు చేయకుండా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. వ్యవసాయమే దండుగ అనే విధంగా పాలన సాగించారు. నేడు మళ్ళీ సీఎంగా అధికారంలోకి రావడానికి రైతులకు రూ.20 వేల సాయం అంటూ హామీ ఇచ్చారు. దానిని కూడా ఆరునెలలైన అమలు చేయడం లేదు. ఉన్న ఉచిత పంటల బీమాను కూడా ఎత్తేశారు ధాన్యం కొనుగోళ్ళు చేయడం లేదు, గిట్టుబాటు ధర కల్పించడం లేదు. నిలువునా రైతులను దగా చేస్తున్న మీరు విజన్ 2047లో రైతులను ఉద్దరిస్తానని చెబుతుంటే, ప్రజలు నవ్వుకుంటున్నారు.విద్య-వైద్య రంగాలపై చంద్రబాబు విజన్ అధ్వాన్నంఈ రోజు మాకు కడుపు నిండా అన్నం పెట్టాలని పేదలు కోరుతుంటే... 2047లో పరవాణ్ణం పెడతానని చంద్రబాబు ఊరిస్తున్నాడు. పేదరికం వల్ల ఇబ్బంది పడకూడదని ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ సీఎంగా ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలను తీసుకువచ్చారు. విద్యా, వైద్యరంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించారు. అదే ఒరవడిని సీఎంగా వైఎస్ జగన్ మరింత ముందుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఫీజురీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయడం లేదు. జగన్ సీఎం అయ్యే వరకు పాఠశాలలకు సరిపడిన భవనాలు లేవు, పిల్లలు కూర్చునేందుకు బెంచీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడుకునేందుకు టాయిలెట్లు లేవు, కనీసం చాక్ పీస్ లు కూడా లేవు.పాఠశాలలను తీర్చిదిద్దాలనే విజన్ ఏనాడైనా చంద్రబాబుకు ఉందా? విద్యను, వైద్య రంగాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే ప్రాజెక్ట్‌లను తీసుకు రాకుండా, తాను విజనరీని అని చంద్రబాబు ఎలా చెప్పుకుంటారు? కాకినాడ జనరల్ ఆసుపత్రిలో సరిపడా ఇన్సులిన్ లేదు. ఇది మీ ప్రభుత్వ పరిస్థితి. మేం వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో గ్రామస్థాయిలో సరిపడినన్ని మందులతో ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తే, చంద్రబాబు సీఎం కాగానే దానికి మంగళం పాడారు. అటువంటి మీరు విజన్ ద్వారా అభివృద్ధిని, సంతోషాన్ని ఇస్తానని చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.విజన్-2020 ద్వారా ప్రైవేటీకరణకు పెద్దపీట వేశారు1998లో చంద్రబాబు ప్రభుత్వం మెకన్సీ అనే విదేశీ కన్సల్టెన్సీకి దాదాపు రూ.2.5 కోట్లు చెల్లించి విజన్ 2020 రూపొందించుకున్నారు. దీనిని చూసి ప్రపంచంలోని నిపుణులు ఆశ్చర్య పోయారు. చంద్రబాబు ప్రపంచంలోని ప్రముఖుల ప్రశంసలు కావాలనే ఆలోచనతో నేను సీఎంను కాదు, సీఈఓను అని ప్రకటించుకున్నారు. మెకన్సీ చేసిన విజన్-2020 డాక్యుమెంట్ చూస్తే విద్యా, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేసి, ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని ప్రతిపాదించారు. అంటే ప్రజలకు ఉచితంగా విద్యా, వైద్యంను అందించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుని, ప్రైవేటువారికి ఇవ్వాలనే లక్ష్యం మీకు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ఇదేనా మీ విజన్? స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి మెరుగైన వైద్యాన్ని ఉచితంగా పేదలకు చేరువ చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ ద్వారా పేదలకు కూడా ఉన్నత విద్యను అందించారు. ఇది కాదా నిజమైన విజన్ అంటే?ప్రజాభాగస్వామ్యం లేని విజన్ ఇదిచంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్ లో ప్రజాభాగస్వామ్యం ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలోని మేధావులు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారా? రైతులు, ప్రజల ముందు పెట్టి వారి అభిప్రాయాలు కోరారా? దీనిపై ఎక్కడైనా చర్చకు పెట్టారా? చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులకు చెందిన ఎన్జీఓ సంస్థలతో ఈ విజన్ తయారు చేయించారు. అంతేకానీ నిజంగా ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఎటువంటి లక్ష్యాలు ఉండాలి అనే ఆలోచనలు దీనిలో లేవు. గతంలో విజన్ 2020 ప్రకటించిన తరువాత 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు.విద్యుత్ రేట్లను పెంచడం, అడిగిన రైతులపై కాల్పులు చేయించారు. ఆనాడే కమ్యూనిస్ట్ లు చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ ఒక బిరుదు ఇచ్చారు. ఇప్పుడ మళ్ళీ విజన్ 2047 అంటున్నాడు. పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి ఒక్క పోర్ట్ అయినా కట్టాడా? ఒక ఫిషింగ్ హార్బర్ కట్టాడా? తెచ్చిన ఒక కాకినాడ సీపోర్ట్ ఎడిబి రుణంతో నిర్మించి, తర్వాత తనకు కావాల్సిన వారికి దారాదత్తం చేశారు. జగన్ గారు 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి, అందులో 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు పన్నాగాలు పన్నుతున్నాడు. మాకు మెడికల్ కాలేజీ సీట్లువద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబుది విజనా? వైద్యవిద్య ఈ రాష్ట్రంలో బలపడాలన్న లక్ష్యంతో పనిచేసిన వైఎస్ జగన్‌ది విజనా?చంద్రబాబు విజన్ పేదవారి పాలిట శాపంవైఎస్ జగన్ గ్రామస్థాయిలోకి పాలన వెళ్ళాలని వాలంటీర్లు, సచివాలయాలను తీసుకువస్తే, వాటిని నిర్వీర్యం చేసిన చంద్రబాబుది ఎటువంటి విజన్? 2020 డాక్యుమెంట్ లో ఏ లక్ష్యాలను సాధించారు? 2047లో పదిసూత్రాలు అంటున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకువెడితే నవ్వుతారు. పండిన ధాన్యానికి గిట్టుబాటుధర కల్పించలేని మీరు సెకండరీ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నారు. పేదరికాన్ని తగ్గించడానికా, పెంచడానికా మీ విజన్? జగన్ గారు అమ్మ ఒడి, ఆసరా, చేయూత ఇలా సంక్షేమ పథకాలను అయలు చేస్తే, మీరు మాత్రం వాటిని పక్కకుపెట్టారు.వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం, ఉన్న ఉద్యోగాలను తీసేయడం ఇది చంద్రబాబు విజన్. సంపద సృష్టి ఎవరికోసం చేస్తున్నారు. మీ కోసం సంపదను మీరే సృష్టించుకుంటున్నారు. అంతేకానీ ప్రజలకు సంపదను సృష్టించే ప్రయత్నం చేయడం లేదు. పైగా వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా రూ.15వేల కోట్లు ప్రజలపై భారం వేయడాన్ని సంపద సృష్టి అంటారా? ఈ రోజు పంచాయతీల్లో పన్నులను పెంచి ప్రజలపై భారం వేయబోతున్నారు.14 ఏళ్లు చంద్రబాబు పాలనలో రెవెన్యూ లోటుఎంతో విజన్ ఉన్న చంద్రబాబు తన పాలన 14 ఏళ్ళలో ప్రతిఏటా రెవెన్యూ లోటుతోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ఇన్ని సంవత్సరాల పాటు రెవెన్యూ లోటు మరే ప్రభుత్వంలోనూ లేదు. ఇదేనా మీ పాలనా సామర్థ్యం? కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒక ఐఎఎస్ అధికారి వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15వేల కోట్లు రుణం మంజూరయ్యింది. దీనిలో 3700 కోట్లు ముందే వచ్చేస్తుంది, దీనితో అమరావతిలో పనులు వెంటనే ప్రారంభించవచ్చు అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. రూ.15 వేల కోట్ల అప్పు దొరికిందని ఆనందిస్తున్నారే కానీ, పేదలకు పదిరూపాయలు ఖర్చు చేయడంలో ఉన్న ఆనందాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులను సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు. మీ ప్రభుత్వంలో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులపై బెదరింపులు, వేధింపులే. కలెక్టర్ లను బెదిరిస్తున్నారు. సెన్సేషనలిజంను ఈ ప్రభుత్వం నమ్ముకుంది. తిరుపతి లడ్డూ, కాకినాడ పోర్ట్, రేషన్ బియ్యం ఇలా ఏదో ఒక అంశాన్ని తీసుకుని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువెళ్లడం, దానిపై ప్రజలకు అబద్దాలు చెబుతూ మభ్య పెట్టడంను ఒక వ్యూహంగా అమలు చేస్తున్నారు. మంచి జరిగితే మాదే అంటున్నారు. సరిగా జరగకపోతే అధికారుల వైఫల్యం అంటారా?చంద్రబాబు మాటలకు.. చేతలకు పొంతన లేదుఅధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల్లో రూ.70 వేల కోట్లు అప్పులు తెచ్చారు. దానిలో కనీసం ఇంత మొత్తం మా హామీల కోసం ప్రజలకు ఖర్చు చేశామని చెప్పుకునే పరిస్థితి లేదు. వైయస్ఆర్ సిపి కార్యకర్తలపైనా, సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపైనా తప్పుడు కేసులు పెడుతున్నారు. జగన్ గారిని విమర్శించే వారిపై ఫిర్యాదు చేసినా మీ ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం కేసు కూడా రిజిస్టర్ చేయడం లేదు. ఇదేనా మీ రూల్ ఆఫ్ లా. కూటమి ప్రభుత్వంలో తప్పు చేసే నాయకులపై చర్యలు తీసుకోకుండా, వారిని కాపాడుకుంటున్నారు. స్టేజీపై మీ మాటలకు, చేతలకు పొంతన లేదు. అలాంటి మీరు ప్రకటించే విజన్ ఎంత వరకు ఆచరణాత్మకంగా ఉంటుంది?2047 వరకు మీరే అధికారంలో ఉంటారా?విజన్ 2047 వరకు అధికారంలో మీరు ఉంటారా? ఈ రోజు ప్రజలకు ఏం కావాలో చూడండి. తరువాత కలలు కనండి. ప్రణాళికలతోనే సరిపెట్టకూడదు, అమలు కూడా చూడాలి. అయిదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. దీనిపై మీ ప్రణాళిక ఏమిటో బయటపెట్టండి. కనీసం మీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వార్షికోత్సవంలో అయినా వెల్లడించండి. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీకి దిక్కులేదు, విజన్ 2047 అంటున్నారు. ఇదంతా డ్రామా కాదా?సినీహీరో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్రసినీహీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపులో భాగంగానే జరిగింది. శుక్రవారంనాడు అరెస్ట్ చేసి జైలుకు పంపి కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా ఉండే కుట్ర దీనిలో ఉంది. ఆయన వెళ్ళిన థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, మరో బాలుడు గాయపడటం బాధాకరం. అయితే ఈ సంఘటనకు తెలంగాణ పోలీస్ వైఫల్యం లేదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం లేదా? అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంలో మీరు చూపించిన శ్రద్ద మీ యంత్రాంగం వైఫల్యంపైఎందుకు చూపడం లేదని ప్రశ్నిస్తున్నాం.రాజమండ్రి తొక్కిసలాటకు చంద్రబాబును బాధ్యుడిని చేయలేదేగతంలో ప్రమాదవశాత్తు జరిగిన తొక్కిసలాటల్లో చాలా ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటనలను అడ్డం పెట్టుకుని కక్షసాధించే విధంగా చర్యలు తీసుకుంటే ఆనాడు రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన ఘటనలో చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండేవారు కాదా? ఆ ఘటనలో 27 మంది చనిపోయారు. కనీసం నా వల్ల తప్పు జరిగిందనే పశ్చాత్తాపం కూడా చంద్రబాబు వెల్లడించలేదు. ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదు.అసలు ఆ సంఘటనకు ఎవరూ బాధ్యులే లేరా? అంతేకాదు గత ఎన్నికల్లో గుంటూరులో చంద్రబాబు సభలో చీరెలు పంచడానికి వెడితే తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. కందుకూరులో ఒక ఇరుకు సందులో జనం కనిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సభ పెడితే కాలువలో పడి ఎనిమిది మంది మరణించారు. దీనికి బాధ్యుడిని చేస్తూ చంద్రబాబును అరెస్ట్ చేయలేదు. దేశ వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. ఈ ఘటనల్లో ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? ఇవి ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలు, వీటిని తమకు గిట్టని వారికి వ్యతిరేకంగా తప్పుడు కేసులు బనాయించే సందర్భాలుగా మలుచుకోవడం బాధాకరం.తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే ఇదిఅల్లు అర్జున్ హీరో నటించిన సినిమా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకుంది. ఆయన ఒక థియేటర్ కు వస్తున్నాడు అంటే పోలీసులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. మామూలు వస్త్రాలయాల ప్రారంభోత్సవాలకు సినిమా నటులు వస్తున్నారంటేనే రోడ్లు బ్లాక్ అయిపోతుంటాయి. సినీ నటులపై ప్రజల్లో క్రేజ్ ఉంది. అటువంటి సందర్భంలో ముందు జాగ్రత్తగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావాలి. తొక్కిసలాట జరగకుండా బందోబస్త్ ఏర్పాటు చేయాలి.దానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించినట్లు కనిపిస్తోంది. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. చట్ట ప్రకారం అరెస్ట్ చేసే ముందు అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారా, ముందస్తు విచారణకు పిలిచారా? ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేసినట్లు కాదా? దీనిని మాజీ సీఎం జగన్ గారు తీవ్రంగా ఖండించారు. జాతీయ మీడియా కూడా ఇది తప్పు అని చెబుతోంది. కేంద్రంలోని మంత్రులు కూడా దీనిని ఖండించారు.సెన్సెషనలిజం కోసమే పాలకుల చర్యలుఅల్లు అర్జున్ అరెస్ట్ ను సెన్సేషనలిజం కోసమే చేసినట్లు కనిపిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు. అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్, ఇక్కడ సోషల్ మీడియా యాక్టివీస్ట్ ల అరెస్ట్ లు ఒకేరకంగా సాగుతున్నాయి. ఈ విధానాలు సరైనవి కావు. -
తరాలు మారుతున్న చంద్రబాబు విజన్‌లో ఎలాంటి మార్పు లేదు
-
బాబుని ఏకిపారేసిన కన్నబాబు
-
యనమల లేఖ పై విచారణ జరిపించండి.. సెజ్ రైతుల పక్షాన మేము నిలబడతాం
-
బాబును బాహుబలిగా చూపించేందుకు ఎల్లో మీడియా తాపత్రయం
-
కేవీ రావుపై పవన్ చేసిన ఆరోపణలు మరిచిపోయారా?: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: పాలనలో తన వైఫల్యాలను, బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాకినాడ ఎస్ఇజెడ్ భూములపై ఈనాడు పత్రిక దిగజారిపోయి రోత రాతలు రాసిందని ధ్వజమెత్తారు.కాకినాడ ఎస్ఇజెడ్ భూములపై కుట్రపూరితంగా చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న ఈనాడు పత్రిక అసత్యాలు, అభూతకల్పనలతో వైఎస్ జగన్‌పైన బుదరచల్లేందుకు ప్రయత్నించాయని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్ఇజెడ్ కు భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులకు, వారి భూములను తిరిగి ఇప్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని కన్నబాబు అన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..2003లో తొండింగి మండలంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కొంత ప్రభుత్వ, మరికొంత అసైన్డ్ భూములను ఎపిఐఐసికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. తర్వాత కాలంలో ఎస్ఇజెడ్ కు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు వ్యతిరేకించారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో కాలుష్య కారక పరిశ్రమలను ఇక్కడకు రానివ్వను, రైతుల భూములను తిరిగి వారికి అప్పగిస్తానంటూ హామీలు గుప్పించారు. భూపోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా 2012లో ఏకంగా ఏరువాకలో సైతం పాల్గొన్నారు.ప్రతిపక్ష నేతగా వ్యతిరేకించారు.. సీఎం కాగానే రైతులపై దాష్టీకం2014లో అధికారంలోకి రాగానే గతంలో తాను ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరిచిపోయారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించారు. తమ భూములను దున్నుకునేందుకు వెళ్ళిన రైతులపై చంద్రబాబు పోలీసులను ప్రయోగించారు. పలువురిని అరెస్ట్ చేసి, రాజమండ్రి జైలుకు తరించారు. వారితో బాత్రూంలు కడిగించి, పలు రకాలుగా వేధించారు. కనీసం 2013 నాటి భూసేకరణ చట్టం కింద అయినా పరిహారం ఇవ్వాలన్న రైతుల కోరికను చంద్రబాబు నిరాకరించారు.తొమ్మిది గ్రామాలను కబళించేందుకు తెగబడిన చంద్రబాబు సర్కార్ ఎస్ఇజెడ్ కు భూములను బలవంతంగా కట్టబెట్టేందుకు ఏకంగా తొమ్మిది గ్రామాలను ఖాళీ చేయించాలని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామాల్లో గ్రామసభల ద్వారా ఎస్ఇజెడ్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తారనే భయంతో ఆనాడు పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న నారా లోకేష్ 73, 74 అధికారణ కింద పంచాయతీలకు ఉన్న హక్కులను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతులు వేరే వారికి భూములు అమ్ముకోకుండా ఉండేందుకు ఏకంగా వారి భూములను చంద్రబాబు ప్రభుత్వం నిషేద భూముల జాబితాలో పెట్టి పైశాచిక ఆనందం పొందింది.పాదయాత్రలో వైఎస్ జగన్‌కు తమ గోడు వెళ్లబోసుకున్న రైతులుపాదయాత్రలో భాగంగా జగన్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎస్ఇజెడ్ భూముల బాధిత రైతులు ఆయనను కలిశారు. ఆనాడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాను. వారి బాధలను విన్న జగన్ గారు ప్రతిపక్ష నేతగా పిఠాపురం సభలో ఒక హామీ ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు సంబంధించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని వాగ్ధానం చేశారు. అధికారంలోకి రాగానే దీనిపై నా నేతృత్వంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులతో పలుసార్లు చర్చలు జరిపింది. అనంతరం 2021లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాం. దాని ప్రకారం ఎస్ఇజెడ్కు రిజిస్టర్ చేయకుండా ఉన్న 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చేయాలని, స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆరు గ్రామాలను తరలించాలనే ప్రతిపాదనను విరమించాలని, శ్రీరాంపురం, బండిపేట, ఉమ్మడివారికోడు, రావివారికోడు, రామరాఘవాపురం, తాటివారిపాలెం గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని కమిటీ సిఫార్స్ చేసింది. అంతకు ముందు భూసేకరణలో భాగంగా స్మశానాలు, పాఠశాలలు, సామాజిక స్థలాలను కూడా తీసుకున్నారు. సేకరించిన శ్మశాన భూములను అప్పగించాలని, 2180 ఎకరాల రైతుల భూమిని నిషేదిత జాబితా 22ఎ నుంచి తొలగించాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిఫార్స్ చేశాం. వీటిని జగన్ గారి నేతృత్వంలో కేబినెట్ ఆమోదించింది.వేగంగా రైతులకు తిరిగి భూములు ఇప్పించేందుకు కృషిసీఎంగా వైఎస్ జగన్ ఎస్ఇజెడ్ బాధిత రైతుల కష్టాలను తీర్చేందుకు సత్వర చర్యలు తీసుకున్నారు. ఎసిఇజెడ్ కోసం కోనా గ్రామానికి సంబంధించి 657 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఇచ్చిన రైతులకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, దివీస్ కోసం కేటాయించిన భూములకు కూడా అదనంగా అయిదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానికంగా ఉన్న హెచరీలకు భద్రత కల్పించాలని, స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రభుత్వం సూచించింది. కేంద్ర నోటిఫికేషన్ పరిధిలో ఎస్ఇజెడ్ అనేది ఉంటుంది. దీనిని కేంద్రం నోటిఫికేషన్ నుంచి తొలగించాలనే ఉద్దేశంతో అధికారులు కేంద్రంతో సంప్రదించి సర్వే నెంబర్ల వారీగా భూములను ఉపసంహరింపచేశారు. దాదాపు నాలుగు వందల ఎకరాల వరకు విత్ డ్రా చేయించారు. భూ యాజమాన్య, వారసత్వ సమస్యలను కూడా సమగ్రంగా పరిశీలించి రైతులకు రిజిస్టర్ చేయించాలని కూడా సిఫారస్ చేశాం.రైతులకు మేలు చేసిన వైఎస్ జగన్‌పై ఈనాడు బురదదేశంలోనే మరెవ్వరూ రైతుల కోసం ఇంతగా చేయలేదు. ఎస్ఇజెడ్ కోసం బలవంతంగా చేస్తున్న భూసేకరణను నిలువరించి, రైతులకు భూములను తిరిగి ఇప్పించిన ఘనత సీఎంగా ఆనాడు వైఎస్ జగన్‌కే దక్కుతుంది. బాధిత రైతుల బాధలు తీర్చేందుకు ఆనాడు కన్నబాబు కమిటీ ఇంత కృషి చేస్తే.. రైతులను మోసం చేశారు అంటూ ఈనాడు పత్రిక తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటు. రైతులు తమకు తిరిగి దక్కిన భూమిని వారి అవసరాల కోసం ఇతరులకు అమ్ముకున్నారు.దాడిశెట్టి రాజా, పిఠాపురంకు చెందిన కొందరు ఈ భూములను కొనుగోలు చేసి ఉంటారు. అంతమాత్రాన రైతులను బెదిరించి భూములను లాక్కున్నారంటూ బుదరచల్లుతారా? రైతులకు మార్కెట్ రేటు ప్రకారం డబ్బు ఇచ్చిన తరువాత కొనుగోలు చేయడం కూడా అక్రమమే అవుతుందా? రైతుల భూములను బలవంతంగా గుంజుకున్న చంద్రబాబు ఈనాడు దృష్టిలో గొప్ప నాయకుడు. రైతుల బాధను చూసి వారికి అండగా నిలిచిన జగన్ గారు మాత్రం రైతులకు అన్యాయం చేసినట్లుగా ఈనాడు చిత్రీకరించడం వారి దిగజారుడుతనంకు నిదర్శనం.కాకినాడ డీప్ సీ పోర్ట్ పైనా చంద్రబాబు మార్క్ కుటిల రాజకీయంకాకినాడ సీ పోర్ట్ లో రెండు కంపెనీల మధ్య వాటాల కొనుగోలును చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి లావేదేవీలు ఎప్పుడూ జరగలేదా? కేవీ రావును బెదరించి వాటాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అలా అయితే మొత్తం వాటాలు తీసుకునేవారు కాదా? కేవలం 41 శాతం తీసుకుని, మిగిలినవి కెవి రావు చేతుల్లోనే ఉంచుతారా? నేటికీ కేవీ రావు చేతుల్లోనే సీపోర్ట్ యాజమాన్యం ఉంది. అజమాయిషీ వారిదే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటప్పుడు బలవంతంగా వాటాలు గుంజుకున్నారని ఎందుకు కేవీరావు ఆనాడు ఫిర్యాదు చేయలేదు.కేవీరావుకు సీపోర్ట్ కట్టబెట్టడంలో చంద్రబాబు కుట్రకాకినాడ సీపోర్ట్ ను సైతం చంద్రబాబు కుట్రపూరితంగానే కేవీ రావుకు దక్కేలా చేశాడు. 1997లో ప్రభుత్వ సొమ్ముతో నిర్మించి దాన్ని బ్యాక్ డోర్ ద్వారా కేవీరావుకు చంద్రబాబు అప్పనంగా అప్పగించేశారు. సీపోర్ట్ నిర్వహణకు ముందుగా విదేశీ కంపెనీలను తీసుకువచ్చి, కేవీరావు సంస్థలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత విదేశీ సంస్థలను వెళ్ళగొట్టి, మొత్తం కేవీ రావు సంస్థలకే దారాదత్తం చేశారు.యాంకరేజీ పోర్ట్ ను మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తుంటే, సీపోర్ట్ మాత్రం కేవీరావు సంస్థకు ఇవ్వడం వెనుక చంద్రబాబు స్వప్రయోజనాలు ఉన్నాయి. సినిమా రంగానికి చెందిన కేవీ రావుకు పోర్ట్ వ్యాపారాల్లో ఎటువంటి అనుభవం లేదు. అటువంటి వ్యక్తితో ఇప్పుడు చంద్రబాబు బలవంతంగా వాటాలు తీసుకున్నారు అని ఫిర్యాదు చేయిస్తున్నాడు. బలవంతగా తీసుకుంటే… మైనర్ వాటా తీసుకుంటారా? పైగా వాటాలు అమ్ముకుని, దానికి డబ్బులు తీసుకుని, ఆడబ్బును వేరేచోట పెట్టబుడి దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు కట్టుకథ అల్లి, తప్పుడు కేసులు పెడితే ప్రజలు నమ్ముతారా? పోర్టును కొట్టేయడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది.పెట్టబడులకు, కట్టుకథలకు పుట్టిన విష పుత్రికలు అన్న శ్రీశ్రీ మాటలను ఈనాడు పత్రిక గుర్తు చేస్తోంది. కాకినాడ యాంకరేజీ పోర్ట్ నుంచి ఎక్కువగా బియ్యం ఎగుమతి అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్‌లు ఈ పోర్ట్ ను తనిఖీ చేసిన తరువాత అరబిందో సంస్థ డీప్ సీ పోర్ట్ లో వాటాలు తీసుకున్న తరువాత నుంచే పీడీఎస్ బియ్యంను ఇక్కడి నుంచి అక్రమంగా రవాణా చేయడం ఎక్కువైందని ప్రకటనలు చేశారు. డీప్ సీ పోర్ట్ యాజమాన్యం కేవీ రావు చేతుల్లోనే ఉంది. ఆయన సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు.రాష్ట్రంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు తెలుగుదేశం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు. ఇవ్వన్నీనిజాలు అయితే, వైఎస్ఆర్ సిపిపై బుదరచల్లేలా వారు అబద్దాలు మాట్లాడటం, దానికి ఈనాడు పత్రిక బాకా ఊదడం దారుణం. 2019లో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఏం మాట్లాడారో మరిచిపోయారా? కేవీ రావు అనే వ్యక్తి వచ్చిన తరువాతే కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ బియ్యం రవాణా పెరిగిపోయిందని ఆనాడు పవన్ ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉండటం వల్ల అరబిందో వాటాలు తీసుకున్న తరువాత అంటూ మాట మారుస్తున్నాడు. -
సీజ్ చేసిన బియ్యం మళ్ళీ బయటకు ఎలా వచ్చాయి.. పవన్ బండారం బయటపెట్టిన కన్నబాబు
-
‘కలెక్టర్ వెళ్లిన షిప్‌లోకి పవన్‌ను ఎందుకు వెళ్లనివ్వలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: దొంగ సొత్తు దొరికినప్పుడు ఎందుకు ఆపలేదు?.. సీజ్ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ చేశారంటూ కూటమి సర్కార్‌ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘పవన్ ఆవేదన గమనించాను. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతోంది. పోర్టుకు వస్తానంటే ఆరు నెలలు నుంచి ఆపేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టారు. సివిల్ సప్లయి శాఖ మంత్రి తనిఖీలు చేసి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు...సివిల్ సప్లయి శాఖ నుండి పోర్డు వద్ద రెండు చెక్ పోస్టులు పెట్టారు. సివిల్ సప్లయి ఛైర్మన్ తోట సుధీర్ కూడా రేషన్ బియ్యం లారీలను పట్టుకున్నట్లు చూశాను. గతంలో మంత్రి మనోహర్ పట్టుకున్న బియ్యమే.. మళ్లీ బిజీ ఇచ్చి బియ్యాన్ని విడుదల చేశారు. బియ్యాన్ని విడుదల చేసినప్పుడు సివిల్ సప్లయి శాఖ షరతులు ఏంటి అని అడుగుతున్నాను. సివిల్ సప్లయి చెక్ పోస్టులు దాటి ఈ బియ్యం పోర్టులోకి ఎలా వెళ్లాయి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘బియ్యం ఉన్న షిప్‌లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనీయడం లేదని పవన్ అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ను ఎవరూ ఆపి ఉంటారని సామాన్యులలో ప్రశ్నలు తలెత్తున్నాయి. డిప్యూటీ సీఎం పై స్ధాయిలో వ్యక్తే పవన్‌ను షిప్పులోకి ఎక్కకుండా ఆపారా?. అక్రమాలు జరుగుతున్న పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనిదే?. కాకినాడ పోర్టు దేశ భద్రతకు ముప్పు ఉందని పవన్ ఆందోళన చెందారు. ఒకవేళ కసాబ్ లాంటి వాళ్లు వస్తే తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదే కదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘కలెక్టర్ వెళ్లిన షిప్పులోకి డిప్యూటీ సీఎంను ఎందుకు ఆపారు? ఎవరూ ఆదేశాల మేరకు ఆపి ఉంటారు. ఇప్పటీకి రేషన్ బియ్యం దందా జరుగుతుందని ఎల్లో మీడియాలోనే వస్తుంది? దానిని అడ్డుకోవాలి. సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పవన్ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పవన్ దేశ భద్రత కోసం మాట్లాడారు.. దానికి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. సివిల్ సప్లయి శాఖ చాలా పటిష్టం అవ్వాల్సిన అవసరం ఉంది. ..ఇవాళ పేపర్ చూస్తే షాక్ కొట్టింది.. బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ. విద్యుత్ ఛార్జీలతో చంద్రబాబు ప్రజలను బాదేశారు. యూనిట్ మీద రూ.2.19 పైసలు అదనపు భారాన్ని వేశారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రజల మీద భారం వేసి జగన్ సంపద సృష్టించలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికలకు మందు అనేక సభల్లో చంద్రబాబు చెప్పారు. ఇది చంద్రబాబు పర్మినెట్ స్టేట్మెంట్. ఐదు నెలల్లో మాట మార్చేశారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
అధికారం శాశ్వతం కాదు.. కూటమికి వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక
తూర్పుగోదావరి: ఏపీలో కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు వైఎస్సార్సీపీ నేతలు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు బెయిల్ మంజూరైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శ్రీకాంత్ విడుదలయ్యారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కోసం వైఎస్సార్సీపీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఇప్పటి కంటే వడ్డీతో సహా కూటమి నేతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు. పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో నాయకులు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అడిగినందుకే కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ పేరుతో ఎన్నికల ముందు బెదిరించి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయటం దారుణం. ఒకవైపు హింసాత్మక చర్యలు ఉండవంటూనే మరోవైపు హింసాత్మక చర్యలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు.రామచంద్రపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ..‘మాజీ మంత్రి పైన అతని కుమారుడి పైన కేసులు పెడతామని మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో మంత్రి బహిరంగంగా చెప్పాలి. ఎన్నికల అఫిడవిట్లో మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అడగడం తప్పా?. ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో ఆలోచించండి అంటూ హితవు పలికారు. -
గ్రామీణ రోడ్లకు టోల్ టాక్స్ వసూలు చేయడం సంపద సృష్టినా..?
-
చంద్రబాబు వాలంటీర్లను మోసం చేశాడు: Kannababu
-
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు
-
చంద్రబాబు మంత్రం దండం..కన్నబాబు సెటైర్లు
-
మంత్రి పయ్యావుల కేశవ్ కి కన్నబాబు అదిరిపోయే కౌంటర్
-
అబద్ధాలు ఆపు చంద్రబాబూ..అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారు
-
అబద్ధాలు ఆపండి.. అసలు నిజాలివే చంద్రబాబూ: కన్నబాబు
సాక్షి తాడేపల్లి: మేము ఏదో విధ్వంసం చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని.. చంద్రబాబు అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ హయాంలో రిసోర్స్ ఫండ్ 10,500 కోట్లు సాధించామని తెలిపారు. పయ్యావుల కేశవ్ సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్ కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని జగన్ ఆపలేదు. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించారు. రాష్ట్రాన్ని వైఎస్ జగన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో జీడీపీ వృద్ధి చెందింది. రాష్ట్ర జీడీపీ 4.83 శాతానికి వృద్ధి చెందింది.ఆనాడు చంద్రబాబు దాదాపు రూ.41 వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ కట్టారు.’’ అని కన్నబాబు వివరించారు.చంద్రబాబు మార్కెటింగ్ స్కిల్స్ ఊహకందని రీతిలో పెరిగిపోయాయి. ప్రజల మెదళ్లోకి విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తే దాన్ని ఆర్థిక ఉగ్రవాదం అంటున్నారు. వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తే తన సొంత పనుల కోసం వెళ్లినట్టు అంట. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే రాష్ట్ర అభివృద్ధి కోసమట. చంద్రబాబుకు అధిష్టానం ఢిల్లీలో ఉంది. అందుకే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. విభజన చట్టం ప్రకారం రూ.17 వేల కోట్లు ఏపీకి రావాలి. కానీ చంద్రబాబు తెచ్చింది రూ.3,900 వేల కోట్లు మాత్రమే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రూ.10,500 వేల కోట్లు నిధులు తెచ్చారు. మరి చంద్రబాబు గొప్పా? వైఎస్ జగన్ గొప్పా?. కరోనాని సమర్థవంతంగా జగన్ ఎదుర్కొన్నారు..ప్రజలకు సంక్షేమ పథకాలను ఆపకుండా అందించారు. జీడీపీలో మన రాష్ట్ర షేర్ 4.47 నుంచి 4.83కు పెరిగింది. మెరుగైన ఫలితాలు వైఎస్ జగన్ సాధించగలిగారు. చంద్రబాబు రూ.42,183 వేల కోట్ల బకాయి పెట్టి పోతే జగన్ ఆ అప్పులన్నీ తీర్చారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని కూడా జగన్ పర్యవేక్షణ చేశారు. రక్తహీనత రాకుండా చూసేందుకు మంచి భోజనం పెట్టారు. చంద్రబాబు అంతకుమించి పెడితే సంతోషిస్తాం. ఎఫ్.ఆర్.బీఎం. లిమిట్స్ దాటి అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆయన చేసిన ఆ అధిక అప్పులను కూడా జగన్ చెల్లించాల్సి వచ్చింది. చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఒక బ్రహ్మపదార్థం. రూ. 14 లక్షల కోట్లు మా హయాంలో అప్పులు చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారు...బడ్జెట్లో రూ.6 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు చెప్పారు. ఇప్పుడు రూ.9 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు చంద్రబాబు చెప్తున్నారు. అంటే అసెంబ్లీలో చెప్పిన రూ.6 లక్షల కోట్ల అప్పుల మాట అబద్ధమా?. ఈ ఐదు నెలల కాలంలో చంద్రబాబు రూ.50 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఆ సొమ్ముతో ఏ ఒక్క సంక్షేమ పథకాన్నైనా ఎందుకు అమలు చేయలేదు?. ఆ నిధులన్నీ ఏం చేశారు?. 2014-19 మధ్యలో రైతురుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశారు. రూ.83 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా రూ.13 వేల కోట్లు విదిల్చారు. చంద్రబాబు ఏం చేయకుండా చేసినట్టు గొప్పగా చెప్పుకుంటారు. మేము ఎన్నో చేసినా చెప్పుకోలేకపోయాం..సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి వారి ఎఫ్ఐఆర్లను ఆన్లైన్లో ఎందుకు పెట్టటం లేదు?. ఈ ఐదు నెలల్లోనే చంద్రబాబు అనేక జీవోలను రహస్యంగా ఎందుకు ఉంచారు?. విజయమ్మ రాసిన లేఖను సైతం ఫేక్ లెటర్ అంటూ టీడీపీ అధికార ట్విట్టర్లో పెట్టారు. పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలి. వారు నిజాయితీగా ఉంటే వైఎస్సార్సీపీ మహిళా నేతలపై పోస్టులు పెట్టినవారిని అరెస్టు చేయాలి. గోదావరి జిల్లాలో రూ.6 వేలకు దొరికే ఇసుక ఇప్పుడు రూ.16 వేలకు చేరింది. పోలవరం ఎత్తు తగ్గించటానికి కారణ ఏంటో ప్రజలకు చెప్పాలి. ఆ ప్రాజెక్టును బ్యారేజీలాగా మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. పోలవరం అనగానే గుర్తొచ్చేది వైఎస్సార్. ఆయన లెగసీని జగన్ కంటిన్యూ చేశారు...చంద్రబాబు తెచ్చిన లిక్కర్‌ను చూసి మందుబాబులు తిడుతున్నారు. రూ.99 లకు ఇస్తున్న లిక్కర్ ఇతర రాష్ట్రాల్లో రూ.80లకే దొరుకుతుంది. వైన్ షాపులు తీసుకున్నవారు సైతం ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు మోసం చేయని వర్గం అంటూ ఏమీ లేదు. కక్షసాధింపునకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ మారిపోయింది. శాంతిభద్రతలు ఫెయిల్ అయ్యాయని కూటమి పెద్దలే అంటున్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి కూడా ఇలాగే అక్రమ కేసులు పెట్టారు. మహిళలను సైతం వేధింపులకు గురి చేశారు. జగన్ వచ్చాకే ఆ కేసులను రద్దు చేశారు. వైఎస్ జగన్‌పై నీచంగా పోస్టులు పెడితే పోలీసులకు కనపడటం లేదా?. ఎన్ని పన్నాగాలు వేసినా, ఎత్తుగడలు వేసినా ఫలించవు. ప్రజల మైండ్‌ను డైవర్ట్ చేయలేరు. ఈ డైవర్షన్ రాజకీయాలు మానేసి ప్రజలకు మేలు చేయాలి’’ అని కన్నబాబు డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు సిక్సర్ కొడితే లబ్ధిదారులు డకౌట్ అయినట్లుగా బడ్జెట్’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు సిక్సర్ కొడితే లబ్ధిదారులు డకౌట్ అయినట్లుగా బడ్జెట్ ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అలవిగాని అంకెలతో బడ్జెట్ నింపారన్నారు.సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలుకాని అంకెల గారెడీ. సూపర్ సిక్స్, సంక్షేమానికి కేటాయింపులు లేవు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లా ఉంది. వాస్తవ బడ్జెట్ కాదు.. గ్రాఫిక్ బడ్జెట్. అమరావతి ఊపిరి పీల్చుకో అని ఓ పత్రిక రాసింది. అమరావతి ఊపిరి పీల్చుకో అని రాశారు కాని.. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో అని రాయలేదు. దీని కన్నా దిగజారుడు ఇంకోకటి ఉంటుందా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.సూపర్ సిక్స్ క్లీన్ బౌల్డ్: వెల్లంపల్లివిజయవాడ: సూపర్ సిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఒక పాచిపోయిన లడ్డూ బడ్జెట్.. వైఎస్ జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేశాడని కూటమి నేతలు పదే పదే మాట్లాడారు. కానీ వాస్తవం ఏంటో బడ్జెట్లో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.. అప్పులు 6 లక్షల కోట్లు కూడా లేవు. తల్లికి వందనం, రైతు భరోసాకు అరకొర కేటాయింపులే చేశారు. దేశ చరిత్రలో 5 నెలలు తర్వాత బడ్జెట్ పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది’’ అని వెల్లంపల్లి అన్నారు. -
బాబు పబ్లిసిటీ ఈవెంట్
సాక్షి, అమరావతి: విజయవాడ – శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసుల వ్యవహారం చూస్తుంటే అమరావతి చుట్టూ అద్భుతాలు జరిగిపోతున్నాయని ప్రజలను నమ్మించడానికే తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. దేశంలో పలు చోట్ల విఫలమైన ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు సరికొత్త ‘షో’కు తెర తీశారన్నారు.‘అసలు ఆవ గింజంత అయితే కొసరు గుమ్మడికాయంత’ అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార పిచ్చి పీక్‌లోకి వెళ్లిందని దెప్పి పొడిచారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని గ్రాఫిక్స్ లాగే సీప్లేన్ ప్రాజెక్టు కూడా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే ప్రభుత్వం తెరపైకి తెచి్చందని స్పష్టమవుతోందన్నారు. శ్రీశైలంకు సీప్లేన్ సర్వీసుల సాధ్యాసాధ్యాలపై ఎటువంటి సర్వే నిర్వహించలేదని, ఎటువంటి పర్యావరణ అనుమతులూ లేవని చెప్పారు. కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా సీప్లేన్ సేవలు విఫలమయ్యాయని తెలిపారు. -
పచ్చ పార్టీలో పచ్చి అబద్ధాలు
-
ఆత్మహత్యకు యత్నించిన మహిళను పరామర్శించిన కన్నబాబు
-
టీడీపీ అరాచకాలపై కన్నబాబు ఫైర్
-
సాక్షిపై కేసు.. కన్నబాబు రియాక్షన్
-
‘పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా?’
సాక్షి, కాకినాడ జిల్లా: పత్రికా స్వేచ్చ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా? అంటూ మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీకి మద్దతు పలికే పత్రికలకే స్వేచ్చ ఉంటుందా? అని ప్రశ్నించారు.రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్ర్యంలో మీడియా కూడా ఉంది. సాక్షిలో రాసింది ఏమైనా కట్టుకథనా?. సీఎం చంద్రబాబు సమీక్షలో అధికారులు ఇచ్చిన నివేదిక మీదనే వార్త రాశారు. సాక్షి ఎడిటర్‌పై కేసు కచ్చితంగా కల్పితమే. కూటమీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాక్షి టీవితో పాటుగా మరికొన్ని ఛానెల్ ప్రసారాలను నిలిపివేశారు. సాక్షి ప్రసారాలు ఆపేసి.. సాక్షి పత్రికపై కేసులు పెట్టి ఏలాంటి సందేశం ఇస్తున్నారు.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.మీ పథకాలను అమలు చేయడం మాని.. కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. మీ ప్రజాప్రతినిధులు ఏలా ప్రవర్తిస్తున్నారో చూశారా?. చంద్రబాబుకు ఇవేమి కనిపించవు. తక్షణమే సాక్షి పత్రికపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలి’’ అని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.‘సాక్షి’పై తప్పుడు కేసులు ఖండిస్తున్నాం: సీపీఎంవిశాఖపట్నం: సాక్షి ఎడిటర్ మురళిపై పెట్టిన తప్పుడు కేసులను సీపీఎం నేతలు ఖండించారు. వెంటనే తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నియంతృత్వం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మీడియా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని.. మీడియాలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం సమీక్ష చేసుకోవాలన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం మంచి పద్ధతి కాదని సీపీఎం నేతలు హితవు పలికారు. -
సీఐ తల్లికే రక్షణ లేదు.. సామాన్యులు ఎలా బతకాలి.. చంద్రబాబు పై కన్నబాబు ఫైర్..
-
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు
-
కట్టుకథల బాబూ.. విష ప్రచారం ఆపు: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు,. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం స్పష్టం చేసింది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు శ్రీవారిని వాడుకున్నారన్నారు.‘‘ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు.. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేశారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగింది. గత ప్రభుత్వంపై బురద చల్లి రాద్ధాంతం చేశారు. చంద్రబాబు అండ్ కో ఇంకా కట్టుకథలను ప్రచారం చేస్తున్నారు. జగన్‌ను తగ్గిస్తున్నామని అనుకుంటూ.. టీటీడీ విశిష్టతను దెబ్బతీస్తున్నారు.’’ అని కన్నబాబు మండిపడ్డారు.‘‘ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. ఒక వైపు వరదలు, పంట నష్టపోయిన రైతులను పట్టించుకోవడం లేదు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారు. స్టీల్ ప్లాంట్‌లో 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. పుంగనూరులో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. యువతులను రకరకాలుగా వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను గాలికి వదిలేసి మంచి ప్రభుత్వం అంటూ చెప్పుకుంటున్నారు’’ అని కన్నబాబు నిలదీశారు.ఇదీ చదవండి: సుప్రీంకోర్టు తప్పుపట్టినా మారవా బాబూ.. వైఎస్ జగన్ ఆగ్రహం‘‘ప్రజా సమస్యలపై నిబద్ధతతో వైఎస్సార్సీపీ ముందుకెళ్తోంది. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతోంది. మా ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలు పెరిగితే.. మార్కెట్ స్థిరీకరణ నిధులతో తక్కువగా ప్రజలకు అందించాం. కూటమి ప్రభుత్వంలో ధరలను ఎక్కడైనా తగ్గించారా.?. ఇసుక దొరకకపోవడంతో భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. గతంలో ట్రక్కు ఇసుక రూ.16 వేలకు దొరికితే.. ఇప్పుడు రూ.30 వేలకు దొరకే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ హయాంలో స్టాక్ యార్డ్‌లలో నిల్వ చేసిన ఇసుక ఏమైపోయింది’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.విశాఖ ఉక్కును కాపాడేందుకు ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు. మెడికల్ సీట్లను వదులుకునేలా చేశారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. వరదలకు.. అనావృష్టికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయింది. ఈ క్రాప్ లేదు.. ఈకేవైసీ జరగడం లేదు. అసలు సమస్యలను వదిలేశారు. ఏడేళ్ల బాలిక శవమై తేలితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. టీటీడీ దేవస్థానం చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడ చంద్రబాబు నామస్మరణ జరుగుతోంది. తిరుమల పవిత్రతను కాపాడటం లేదు. జగన్‌ను లక్ష్యంగా చేసుకునే విష ప్రచారం చేస్తున్నారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
వైఎస్ జగన్ పై చంద్రబాబు విషగక్కుతున్నారు: కన్నబాబు
-
వైద్యులపై దాడి ఘటన.. పంతం నానాజీపై కన్నబాబు ఫైర్
-
ఆ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోండి అని జగన్ ఫోన్ చేసి చెప్పారు
-
కూటమి ప్రభుత్వంపై కన్నబాబు ఫైర్
-
ఇప్పటికీ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్
-
జగన్ మాటలతో కూటమిలో వణుకు..చంద్రబాబును ప్రజలు నమ్మలేదు
-
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
-
గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!
-
చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు
-
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
-
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కన్నబాబు ఫైర్
-
కాకినాడ బహిరంగ సభకు భారీగా తరలివస్తున్న జనం
-
నీచ రాజకీయాలలో దేశంలో నెం 1 స్థానంలో బాబు
-
బాబు మళ్లీ మభ్యపెడుతున్నారు
కాకినాడ రూరల్: ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొత్త హామీలతో గ్యారంటీలు, వారంటీలంటూ వస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మబోరని మాజీమంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన టీడీపీ–జనసేన–బీజేపీలు 2014లో కూడా కలిసే ఉన్నాయన్నారు. నాటి మేనిఫెస్టోలో చంద్రబాబు సుమారు 650 హామీలిచ్చారని కన్నబాబు గుర్తుచేశారు. ఇందులో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. అప్పట్లో రైతు రుణమాఫీ చేస్తామన్నారని, అక్కచెల్లెమ్మల బంగారం తానే విడిపిస్తానన్నారని.. అలాగే, అప్పట్లో ఆయనిచ్చిన హామీ ప్రకారం సుమారు రూ.87,612 కోట్ల రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా రూ.15 వేల కోట్లు మాత్రమే చేశారని కన్నబాబు చెప్పారు. ఇక రూ.14,502 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని.. ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.25 వేలు జమ చేస్తామన్నారని, ఏ ఒక్కరికైనా చేశారా అని కన్నబాబు ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి 2014 నుంచి ఐదేళ్ల కాలంలో రూ.1.20 లక్షలు ఇచ్చి ఉండాలని.. కానీ ఎక్కడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కన్నబాబు చెప్పారు. వలంటీర్ వ్యవస్థపై బాబు, పవన్‌ల అవహేళన.. ఇక వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ గతంలో చులకనగా మాట్లాడారని, ఇప్పుడు మాటమార్చి వారికి హామీలిస్తున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించి, వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని ఆపించి ఏం సాధించారని ప్రశ్నించారు. ఇంటింటికీ పింఛన్లు అందక సుమారు 35 మంది చనిపోయారన్నారు. పింఛన్ల లబి్ధదారుల బాధలను గుర్తించే సీఎం జగన్మోహన్రెడ్డి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రానికి దిక్సూచిలా జగన్ పనిచేస్తున్నారని, చంద్రబాబు, ఆయన కూటమి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకులేదని కన్నబాబు స్పష్టంచేశారు. బాబు సెంటు స్థలమైనా ఇచ్చారా మరోవైపు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 32 లక్షల ఇళ్ల స్థలాలిచ్చారని, ఐదేళ్ల కాలంలో చంద్రబాబు సెంటు స్థలమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అసలు నాటి మేనిఫెస్టోనే టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించారని చెప్పారు. ఆ రోజులేని నిబద్ధత, నైతికత ఈరోజు ఎలా వస్తుందని..రూ.4 వేల పింఛను ఏవిధంగా ఇస్తారని ప్రశ్నించారు. అలాగే, నాడు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయించలేని వారు ఇప్పుడెలా చేయించగలరని కూటమి పారీ్టలను ప్రశ్నించారు. చంద్రబాబు కేవలం మీడియా బలంతో వ్యవహారం నడుపుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు,పవన్ కి కన్నబాబు స్ట్రాంగ్ కౌంటర్
-
చంద్రబాబు, లోకేష్ కు కన్నబాబు మాస్ వార్నింగ్..
-
లోకేష్ కి జనాలు బలి..బాహుబలి డైలాగ్ తో కన్నబాబు పంచులే పంచులు
-
చంద్రబాబుకే గ్యారెంటీ లేదు..6 గ్యారెంటీలు లాంట..
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నబాబు
-
బాబుకు దృష్టిలోపం ఇప్పుడు కాదు ఎప్పుడో ఉంది..
-
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి ఇదే నా సవాల్: కురసాల కన్నబాబు
-
సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి
కాకినాడ రూరల్: సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తోందని, సామాజిక న్యాయంలో ఆయన దేశంలోనే ఆదర్శంగా నిలిచారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కన్నబాబు బుధవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. చంద్రబాబు పాలనతో పోలిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోందని తెలిపారు. బాబు హయాంలో తలసరి ఆదాయంలో రాష్ట్రం 17వ స్థానంలో ఉండేదని, సీఎం జగన్ పాలనలో తొమ్మిదో స్థానానికి వచ్చిందని తెలిపారు. జాబు గ్యారెంటీ అని చెప్పుకుని పదవిలోకి వచ్చిన చంద్రబాబు 34,108 ఉద్యోగాలే ఇచ్చారని, జగనన్న వచ్చాక 4.93 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. వ్యవసాయ రంగంలో 27వ స్థానం నుంచి నంబర్ వన్ స్థానానికి రాష్ట్రం చేరుకుందన్నారు. బాబు హయాంలో పరిశ్రమల వృద్ధి రేటులో రాష్ట్రం 22వ స్థానంలో ఉండగా ఎల్లో మీడియా మాత్రం రెండో స్థానమన్నట్టు బిల్డప్ ఇచ్చేదని తెలిపారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత పరిశ్రమల స్థాపన, వృద్ధి రేటులో రాష్ట్రం మూడో స్థానానికి ఎదిగిందని తెలిపారు. ఎక్కడ 22, ఎక్కడ 3వ స్థానమని ప్రశ్నించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2.5 లక్షలకు పెరిగాయని, అంతకుముందు 37,936 మాత్రమే ఉండేవని అన్నారు. బాబు హయాంలో తీసుకున్న రుణాలకన్నా ఇప్పుడు తీసుకున్నవి తక్కువేనని చెప్పారు. అప్పుడు తీసుకున్న రుణాలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ఇప్పుడు తీసుకున్న రుణాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేస్తున్న సంగతి అందరికీ తెలుసునన్నారు. సంక్షేమ పథకాలతో శ్రీలంకను చేస్తారా అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆయన అధికారంలోకి వస్తే గ్యారెంటీ, షూరిటీ అంటున్నారని, ఆయనకే గ్యారెంటీ, షూరిటీ లేదని వ్యాఖ్యానించారు. ఎవరికెంత మేలు చేశామో వివరిస్తాం ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం గురువారం ప్రారంభమవుతుందన్నారు. సచివాలయాల స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో ఎవరెవరికి ఎంత మేలు చేశామో వివరిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఫిషర్మెన్ మహిళకు, మాల వర్గానికి, బీసీలో శెట్టిబలిజ వర్గానికి, ఎస్సీలో మాదిగ సామాజిక వర్గానికి సీఎం జగన్ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారని, బీసీకి రాజ్యసభ స్థానం ఇచ్చారని చెప్పారు. అందుకనే సామాజిక సాధికార బస్సు యాత్ర జిల్లాలో విజయవంతమైందన్నారు. -
చెప్పాడంతే చేస్తాడంతే అనే నమ్మకాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు: కన్నబాబు
-
కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా సీఎం జగన్ పాలన
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం తపించే వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం ప్రతి కార్యకర్త గొప్ప అదృష్టంగా భావిస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు జగనే మళ్లీ ఎందుకు సీఎం కావాలనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. భవిష్యత్తులో పార్టీ, ప్రభుత్వం నిరంతరం ప్రజల్లోనే పని చేసేలా రూపొందించిన నాలుగు ప్రధాన కార్యక్రమాలను సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ‘జగనన్న ఆరోగ్య సురక్ష, ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే.. జగనే మళ్లీ ఎందుకు రావాలంటే, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాల ద్వారా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాలన్నారు. ప్రతి కార్యకర్తా ఓ సైనికుడిగా సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచిని వివరించాలని కోరారు. అంతకు ముందు పలువురు ప్రజా ప్రతినిధులు మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను గెలిపించుకునే ఆవశ్యకతపై ప్రసంగించారు. వారు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే.. జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాలి కుల, మతాలకు అతీతంగా పని చేస్తున్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, దత్తపుత్రుడు కూటములు కడుతుంటే.. సీఎం జగన్ ఒంటరిగానే పేదలకు మేలు చేస్తున్నారు. గత ఎన్నికలకు 2 నెలల ముందు పింఛన్ల ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఇప్పుడు నెలకు రూ.2 వేల కోట్లు. ఇంత మంచి చేస్తున్న జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాలని గ్రామాల్లోని అవ్వతాతలకు, అక్క చెల్లెమ్మలకు చెప్పాలి. – మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ సంక్షేమ రాజ్యానికి ఏపీ ప్రతీక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ రాజ్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రతీకగా నిలుస్తోంది. పేదల అభ్యున్నతే లక్ష్యంగా వాడవాడలా అంబేడ్కర్ భావజాలం విరాజిల్లుతోంది. ఎందరో మహానుభావులు కలలుగన్న సామాజిక అసమానతలు తొలగించి సామాన్యుల స్థితిగతుల్లో మార్పు తెచ్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో మనోధైర్యం పెరిగింది. ఏ ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు ఇన్ని రాజకీయ పదవులు దక్కాయి? ఇంత గౌరవం వచ్చింది? జగన్ నాయకత్వంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక సమతుల్యత ప్రజ్వరిల్లుతోంది. అందుకే జగనే మళ్లీ కావాలి.. మళ్లీ అధికారంలోకి రావాలి. – మేరుగు నాగార్జున, రాష్ట్ర మంత్రి ఓటర్లకు జవాబుదారీగా ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి ఇంటి ముంగిటకు చేర్చారు సీఎం జగన్. దశాబ్దాలుగా గిరిజన ప్రజలు ఎరుగని సామాజిక చైతన్యం ఇప్పుడు ప్రజ్వరిల్లుతోంది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కింది. దేశంలో తొలిసారిగా ప్రభుత్వం ఓటు వేసిన ప్రజలకు జవాబుదారీగా పని చేస్తోంది. అందుకే రాష్ట్రంలోమళ్లీ సీఎంగా జగన్ ఉండాలి.. పేదలకు మరింత మేలు జరగాలి. – కె.భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే జగన్‌తోనే సామాజిక న్యాయం స్వాతంత్య్రం తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. అందరూ పేదల గురించే, సామాజిక న్యాయం గురించే మాట్లాడేవారు. కానీ తొలిసారిగా సామాజిక న్యాయం నినాదం కాదని, అది అమలు చేయాల్సిన విధానమని నిరూపించిన నాయకుడు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ పేదవాడి గుండె చప్పుడుగా నిలబడితే.. చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. ఈ యుద్ధంలో పేదలు గెలవాలంటే, వారి జీవితాలు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్‌కి మళ్లీ జగనే సీఎం కావాలి. – మోపిదేవి వెంకట రమణ, రాజ్యసభ సభ్యుడు నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ సీఎం జగన్ అనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్. వైనాట్ 175 ధీమా వెనకాల నాలుగున్నరేళ్ల ప్రభుత్వ సంక్షేమం ఉంది. నిస్వార్థంగా పేదల కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే. అందుకే త్వరలో మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు నిర్వహిస్తున్నాం. ఇది సామాజిక న్యాయ యాత్ర. పేదవాడికి జరిగే మంచిని వివరించే యాత్ర. దాదాపు 175 నియోజకవర్గాల్లో మీటింగులు పెడతాం. ఒక్కో టీంలో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన సీనియర్ నాయకులు ఉంటారు. ప్రతిరోజూ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లో మూడు మీటింగులు ఉంటాయి. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదవాడికి, పెత్తందారుకీ మధ్య జరిగే యుద్ధంలో గెలవడానికి వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు సన్నద్ధం కావాలి. – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ పేదల సంతోషం కోసమే జగన్ పేదలు సంతోషంగా బతకాలంటే సీఎంగా జగన్ ఉండాలి. పేద గడప నుంచి వచ్చిన మన పిల్లలను అంతర్జాతీయ మెట్లు ఎక్కిస్తున్నారు. అనారోగ్యం వస్తే ఇంటికే డాక్టర్ వస్తున్నారు. రైతన్నకు తోడుగా భరోసా ఇస్తున్నారు. వలంటీర్ల సైన్యంతో కరోనాను ఎదిరించడమే కాదు.. ప్రజా సంక్షేమాన్ని గడపగడపకు చేరుస్తున్నారు. సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగాలన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన జగన్ ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. అందుకే ప్రజలకు గత మాఫియా పాలనను, ప్రస్తుత సంక్షేమ సారథ్యాన్ని వివరించాలి. – విడదల రజిని, రాష్ట్ర మంత్రి ధనిక, పేదల మధ్య అంతరంపై పోరు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉండాలంటే 2024లోనూ మళ్లీ జగన్‌ను సీఎంగా చేసుకోవాలి. ధనిక, పేద అనే తారతమ్యాలను తొలగించే లక్ష్యంతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. అందుకే ప్రతి రంగంలోనూ ఏపీ సత్తా చాటుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తే.. సీఎం జగన్ గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్, డిజిటల్ లెర్నింగ్ విధానాలను ప్రోత్సహిస్తున్నారు. 3257 ప్రొసీజర్లలో ఆరోగ్యశ్రీ వైద్యం అందిస్తున్నారు. 17 కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ఆరోగ్య ఆసరా, ఇంటి వద్దకే వైద్యం దక్కుతోంది. ఇవన్నీ ఉండాలంటే మళ్లీ సీఎంగా జగన్ రావాల్సిందే. – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి బాబును నమ్మి బాగుపడింది లేదు చంద్రబాబు పెత్తందారులతో కలిసి పేదలకు విద్య, వైద్యం దూరం చేస్తే.. అదే పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్య సౌకర్యాలు అందిస్తున్న మనసున్న వ్యక్తి జగన్. దేశంలో చంద్రబాబును నమ్మి బాగుపడిన వాళ్లు లేరు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆనందపడని వాళ్లూ ఉండరు. రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తే.. దానిని సీఎం జగన్ సమర్థవంతంగా గాడిన పెట్టారు. స్కాముల్లో తన స్కిల్ చూపించి రూ.కోట్లు కొట్టేసిన ఘనుడు చంద్రబాబు. స్కిల్ కేసులో తండ్రి అడ్డంగా దొరికిపోయి జైలులో ఉంటే.. కొడుకు లోకేశ్ ఢిల్లీ పారిపోయి తలదాచుకుంటున్నాడు. ఇలాంటి దుష్టశక్తులు ఏం చెప్పినా మన జీవితాలతో మళ్లీ ఆటలు ఆడుకోవడానికేనని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. – నందిగం సురేష్, బాపట్ల ఎంపీ వై ఏపీ నీడ్స్ జగన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం పేదలు గుడిసెల్లోనే ఉండాలని, కాలనీల్లో ఉండకూడదనుకునే మనస్తత్వం చంద్రబాబుది. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని అవమానించారు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కించపరిచిన కుసంస్కారం చంద్రబాబుది. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మేనిఫెస్టో కూడా కనపడకుండా చేశారు. కానీ, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను నెరవేర్చి పేదల గుండెల్లో నిలిచిపోయారు. ఏకంగా చట్టం తెచ్చి నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇచ్చారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని అందరమూ ప్రజల్లోకి తీసుకెళ్దాం.– పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి బాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రజలను చైతన్య పరచాలి దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేనంతగా ఏపీలో సంక్షేమ ఫలాలు నిజమైన పేదలకు దక్కుతున్నాయి. గ్రాఫిక్స్ బొమ్మల మాయలేదు. పథకం పేరుతో దోపీడీ లేదు. స్కాంలు లేవు. అందువల్లే రాష్ట్ర పేద ప్రజలందరికీ నేరుగా రూ.2.60 లక్షల కోట్లు లబ్ధి జరిగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బలహీనులైన పేదలను బలవంతులుగా మార్చిన నాయకత్వం ఇది. మహానేత వైఎస్సార్ ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఇస్తే.. జగన్ ముస్లిం పిల్లలను కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే జగన్ ఏపీకి కావాలి. చంద్రబాబు అధికారం కోసం చెప్పే అబద్ధాలు నమ్మొద్దని ప్రజలను చైతన్యపరచాలి. – హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే సంక్షేమ పథకాల విప్లవం సీఎం జగన్ అంటేనే ఒక సంకల్పం. పేదరికాన్ని రూపుమాపడమే ఆయన లక్ష్యం. అందుకే సంక్షేమ పథకాల విప్లవాన్ని సృష్టించారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణాల్లోని పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా పౌర సేవలను డోర్ డెలివరీ చేయడంతో పాటు మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానులను ప్రకటించారు. ఇది గతంలో ఏ పాలకుడికీ సాధ్యం కాలేదు. గత పాలకులకు భిన్నంగా చెప్పిన వాగ్దానాల్లో 99 శాతం అమలు చేశారు. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడని నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మళ్లీ జగనే రావాలి.. పేదలకు మరింత న్యాయం జరగాలి. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి -
నాయకుడు ఎలా ఉండాలో అదే మన జగనన్న
-
టీడీపీ నేతలపై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు
-
‘టీడీపీ నేతలు మర్చిపోయారా?.. కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా?’
సాక్షి, కాకినాడ: టీడీపీ నేతలపై సెటైరికట్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆల్ రెడీ మోత మోగింది కదా అని ఎద్దేవా చేశారు. ఈరోజు టీడీపీ నేతలు కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా? అని కామెంట్స్ చేశారు. కాగా, కన్నబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో ఆకలి కేక పేరుతో కంచాలు కొట్టాలి అని పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు మేరకు రోడ్డు మీదకు వచ్చి కంచాలు కొట్టిన వందలాది మందిపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. ఆ కేసులన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎత్తివేశారు. మరి ఈరోజు టీడీడీ నేతలు కంచాలు కొట్టాలని పిలుపునిచ్చారు.. మరీ వీరి మీద కూడా కేసులు పెట్టాలి కదా?. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే నన్ను కలవనివ్వారా అని నారా లోకేష్ అంటున్నాడు. ఆనాడు ముద్రగడను అరెస్ట్ చేస్తే ఆయన కుమారుడిని పోలీసులతో దారుణంగా కొట్టించారు. కాపులు కంచాలు కొడితే తప్పని చెప్పారు.. ఇవాళ టీడీపీ నేతలు కంచాలు కొడతాం అంటున్నారు. చంద్రబాబు చేసిన స్కిల్ స్కామ్ కేసు రాష్ట్రమంతా మోతెక్కిపోతుందన్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు మరో షాక్.. శ్రీనివాస్‌పై సస్పెన్షన్ -
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై క్లియర్ కట్ విశ్లేషణ
-
చట్టాలు చంద్రబాబు చుట్టాలు కాదు
కాకినాడ రూరల్:‘ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేశాను. నేను చాలా నీతిమంతుడిని. నాకన్నా గొప్ప నాయకుడు ఎవరూ లేరని తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుని సొంత మీడియా బలంతో పేట్రేగిపోతున్న చంద్రబాబు పాపం పండింది. అయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళేరు. చట్టాలు చంద్రబాబు చుట్టాలు కాదని చంద్రబాబు అరెస్ట్‌తో రుజువైంది’ అని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నాటి పరిణామాలను చూసినప్పుడు 2014–19 మధ్య ఎంత దుర్మార్గమైన అవినీతి జరిగిందో, చంద్రబాబు తన సొంత మనుషులకు ఏ విధంగా దోచుపెట్టారో అర్థమైందన్నారు. గాలిలో విభూది సృష్టించినట్టు స్కిల్ స్కామ్‌లో రూ.371 కోట్లు లాగేశారన్నారు. 15 రోజులుగా చంద్రబాబు, లోకేశ్ కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వాడుతున్న భాషను చూస్తే ఎంతగా ఫ్రస్టేషన్లో ఉన్నారో అర్థమయ్యిందన్నారు. ఢిల్లీ లూథ్రాను రప్పించి.. పవన్ సీన్ క్రియేట్ చేసినా.. ‘నన్ను ఎవరూ ఏమీ పీకలేరు. మీ నాన్నే ఏమీ చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావ్’ అని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారని కన్నబాబు గుర్తు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూథ్రా అనే లాయర్‌ను తీసుకొచ్చి సినిమా తరహాలో సీన్ క్రియేట్ చేశారన్నారు. ఆయన సరిపోలేదని మరో సినీ వకీల్ సాబ్ వచ్చి రోడ్డుపై పడుకున్నారన్నారు. చంద్రబాబు స్కిల్ స్కామ్‌తో పాటు రాజధానిలో భవన నిర్మాణాల పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు తినేశారన్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రూ.118 కోట్లు లాగేసిన కేసుతోపాటు ఈఎస్ఐ కుంభకోణం ద్వారా రూ.150 కోట్లతో మందుకు బదులుగా కొబ్బరి నూనెలు, ఫేస్ క్రీమ్‌లు కొన్నారన్నారు. ఫైబర్ గ్రిడ్, పండుగలకు చంద్రన్న కానుక పేరిట బెల్లం స్కామ్, హెరిటేజ్ నుంచి నెయ్యి కొనుగోలు పేరిట భారీ స్కామ్‌లు చేశారన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేసవిలో మజ్జగ సరఫరా పేరిట హెరిటేజ్ సంస్థకు నిధులు మళ్లించారన్నారు. చంద్రబాబు ఏది ముట్టుకున్నా అవినీతి పారిందని, అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎల్లోమీడియా చంద్రబాబు అన్నాహజరే అన్నట్టుగా.. దేశంలోనే అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరిగా రాశాయన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయనతో ఫెవికాల్ బంధం ఉన్న పవన్ కల్యాణ్ ఎంత బాధపడ్డారో రోడ్డుపై పడుకోవడంతో తెలిసిందన్నారు. చంద్రబాబు వదిన పురందేశ్వరి బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావడంతో ఆయన అరెస్ట్‌ను ఆక్రమం అంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని మోడల్‌గా పాలిస్తుంటే ఇవేవీ ఎల్లో మీడియాకు కనిపించవన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. -
స్కిల్ నుంచి సంక్రాంతి బెల్లం వరకూ అంతా స్కామే
కాకినాడ : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన ప్రధాన నిందితుడు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయి రాజకీయ కక్ష సాధింపు అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో స్కిల్ నుంచి సంక్రాతి బెల్లం వరకు అంతా స్కామేనని అన్నారు. కక్ష సాధింపు.. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి ఇది రాజకీయ కక్ష సాధింపని అదేపనిగా విమర్శిస్తున్నారు ప్రభుత్వానికి ఆ అవసరసం ఏ మాత్రం లేదన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించిన కన్నబాబు మాట్లాడుతూ.. చాలా నీతిమంతుడినని తనకు తానే భుజకీర్తులు తగిలించుకుని మీడియా బలంతో పేట్రేగిపోయే చంద్రబాబు పాపం పండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారన్నారు. సహజ న్యాయం అంటూ ఒకటి ఉంటుందని అహంకారంతో విర్రవీగిపోతుంటే దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసే వ్యవస్థలూ ఉంటాయని అన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీగా అవినీతి జరిగిందని అధికారాన్నిఅడ్డం పెట్టుకుని సొంత మనుషులకు ఏ విధంగా దోచిపెట్టారో అర్థమౌతుందన్నారు. ఈ స్కిల్ స్కామ్‌ను మొదట వెలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర సంస్థలని గుర్తుచేశారు. ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా? చంద్రబాబును జైల్లో పెట్టకుండా, ఇంట్లో పెట్టి హౌస్ అరెస్టు చేస్తే కావాల్సిన వారితో మాట్లాడుకుంటూ ఉంటారట.. సపర్యలు అన్నీ అక్కడే చేయాలంట. మరి, దాన్ని అరెస్టు అంటారా? చంద్రబాబుకు వర్తించేది మిగతావారికి వర్తించదా? చంద్రబాబుకేమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? అని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా పట్టుబడిన తర్వాత కూడా ఆయన జిత్తులు చూస్తే ఎంత పెద్ద మ్యానిపులేటరో అర్థం చేసుకోవచ్చు. పెద్ద మ్యానిపులేటర్.. రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలైన సొంత వదిన గారు పురంధేశ్వరి చంద్రబాబు అరెస్టు అక్రమం అంటారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాల్లో చంద్రబాబు నిర్వాకాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు చూసి జనసేన అధినేత మధన పడిపోతున్నాడు. ఇక కమ్యూనిస్టులైతే చంద్రబాబుకు ఆప్తుల్లా వ్యవహరిస్తూ ఉంటారు. అదేంటో ఆయనపై మమకారాన్ని చూపకుండా ఉండలేరు. ఇంతకాలం చంద్రబాబు స్కిల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో అందరం చూశాం. బ్యాక్‌డోర్‌లో వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబును కొట్టేవాడు రాష్ట్రంలోనే లేడు. ఓటుకు నోటు కేసులోనే ఆయనను ఎప్పుడో అరెస్టు చేసి ఉండాలన్నారు. . గాల్లో విభూది సృష్టించినట్లే.. రాష్ట్రంలో చూస్తే ఎక్కడా స్కిల్ లేదు.. ఒక ఇన్స్టిట్యూట్ లేదు. చూస్తుండగానే మాయ చేసి రూ. 371 కోట్లు లాగేశారు. సీమెన్స్ సంస్థ రూ.3500 కోట్లతో వచ్చిందని 10% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని కాగితాలపై చూపించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే దోపిడీ మొదలుపెట్టారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఏం జరగలేదన్నట్లు ఎప్పటికప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇవాళ కూడా అయాన్ అదే తీరులో వ్యవహరించారు. గాల్లో విభూది సృష్టించినట్లు రూ.371 కోట్లు కొట్టేశారు. మొదటగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాంను జీఎస్టీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలికితీశాయి. సీఐడీ కూడా దర్యాప్తు చేసి ఏడుగురిని అరెస్టు చేసింది. పాపం పండింది.. ఎల్లో మీడియా బలాన్ని చూసుకుని చంద్రబాబు- తనను ఎవ్వరూ ఏమీ పీకలేరని అనేవారు. నిన్నటి తీర్పుతో చట్టం చంద్రబాబు చుట్టం కాదని తేలిపోయింది. తప్పుచేస్తే ఒకరోజు కాకపోయినా మరో రోజు పాపం పండుతుందని నిన్న అర్థమైంది. 15 రోజులుగా లోకేశ్, చంద్రబాబు వాడుతున్న భాషతో వారు ఎంత ఫ్రస్టేషన్‌తో ఉన్నారో అర్థమౌతోంది. ఎవ్వరూ ఏమీ పీకలేరని అంటారు. మీ నాన్నే ఏమీ చేయలేదు. నువ్వు ఏమి చేస్తావని పదే పదే అన్నారు. అన్ని మాటలు మాట్లాడతారు కానీ ఎక్కడా అవినీతి జరగలేదని మాత్రం చెప్పరు. > మరో వకీల్ సాబ్.. నిన్న ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూథ్రాను తీసుకువచ్చారు. ఆయన కోర్టులో వచ్చి నిలబడితే చాలు క్లయింట్ గెలుస్తారని ప్రచారం. సినిమాల్లోనూ లేనంత సీన్ కోర్టులో క్రియేట్ చేశారు. ఇంతమంది వకీల్‌లకు తోడు.. ఇంకో వకీల్‌సాబ్ వచ్చి రోడ్డు మీద పడుకున్నారు. ఎంతమంది వకీల్‌సాబ్‌లు వచ్చినా చివరకు న్యాయమే గెలిచిందని బాబును రిమాండ్ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోయారన్నారు. ఎంతసేపూ టెక్నికల్‌గా మాట్లాడతారు తప్ప అవినీతి చేయలేదన్న మాట మాత్రం ఎవ్వరూ అనరు. ప్రతిదీ స్కామే.. చంద్రబాబు స్కాంల లిస్టు చూస్తే.. స్కిల్ డెవలప్మెంట్, రాజధాని భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు, సెక్రటేరియట్ నిర్మాణాల ద్వారా షెల్ కంపెనీలకు రూ.118 కోట్లపై ఐటీ నోటీసులు, ఏపీ ఫైబర్ గ్రిడ్, రూ.150 కోట్ల ఈఎస్ఐ కుంభకోణం జరిగాయి. ఇలా టీడీపీ హయాంలో అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీని వేశారు సీఎం జగన్ గారు. అందులో నేను కూడా ఒక సభ్యుడిని. చంద్రన్న సంక్రాంతి కానుకలోనూ బెల్లం స్కాం చేశారు. అందులో అనకాపల్లి వ్యాపారులు, రైతులు పాల్గొనకుండా నిబంధనలు పెట్టారు. వేరే రాష్ట్రాల నుంచి బెల్లం కొనుగోలు చేశారు. టెండర్లు లేకుండా హెరిటేజ్ నుంచి నెయ్యి కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో మజ్జిగ కూడా హెరిటేజ్ నుంచి కోట్లలో కొనుగోలు చేయమని జీఓ ఇచ్చారు. ఏ ఒక్కటైనా వదిలారా? ముట్టుకుంటే అవినీతి. మీ స్కాంలు.. స్కీంలు ఎవరికీ తెలియని బాగోతాలు అనుకుంటున్నారా? టీడీపీ నాయకులు అర్థం చేసుకుంటే మంచిది. ఎలివేషన్స్ తగ్గిస్తే మంచిది.. ఎల్లో మీడియాలో చంద్రబాబును అన్నాహజారేకి బ్రదర్‌లా చూపిస్తారు. దేశంలో గొప్ప ప్రతిభావంతమైన నాయకుల్లో ఒకడిగా రాస్తారు. చంద్రబాబుకే అన్యాయం జరిగినట్లు రాస్తారు. చంద్రబాబును ఓ హీరోగా. ఆయన కొడుకు ఎదిగొస్తున్న హీరోగా. మా పార్టీని, మా నాయకుడిని విలన్లా చూపిస్తారు. నువ్వు అక్రమాలకూ పాల్పడ్డావు అంటే ఒప్పుకోరు. ఎదుటివాడే దొంగ అన్నట్లు విమర్శలు చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ భ్రమల్లోనే.. మిగతావారి సంగతెలా ఉన్నా చంద్రబాబు కోసం పవన్ మాత్రం బాగా బాధపడ్డాడు. రోడ్ల మీద పడుకున్న ఫొటోలూ చూశాం. ఈ సందర్భంగా టీడీపీ, జనసేనలు బలపడ్డాయని పవన్ అన్నట్లు ఈనాడులో రాశారు. కోనసీమ వారాహి యాత్రలో ఏదో దుర్ఘటన చేయాలని కుట్ర పన్నారని పవన్ విమర్శిస్తారు. అసలు సినిమాల మాదిరిగా బయట కూడా పవన్ భ్రమలో బతుకుతున్నారు. ప్రభుత్వం మారగానే జగన్ గారిని అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పిస్తామని పవన్ చెబుతున్నారు. ఇన్నాళ్లు రాష్ట్రం, కేంద్రం అనేవారు.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయం అంటున్నాడు. జాతీయమో, అంతర్జాతీయమో చంద్రబాబుకు ఉన్న ఖ్యాతి భవిష్యత్తులో తెలుస్తుంది. చంద్రబాబుకు రిమాండ్ నెంబర్ ఖైదీగా 7691 నెంబర్ ఇచ్చారట. అడ్డంగా దొరికిపోయి.. గతంలో కూడా చంద్రబాబుపై ఎన్నో కేసులు నమోదైనా మ్యానిప్యులేట్ చేస్తుకుంటూ కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ, ఏ కేసులోనూ దర్యాప్తు జరగకుండా చూసుకుంటున్న చంద్రబాబు, ఇప్పుడు అడ్డంగా దొరికిపోవడంతో అక్రమ అరెస్టు.. రాజకీయ కక్ష అని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. చంద్రబాబును ప్రేమిస్తున్న వారి బాధ వర్ణణాతీతం. అచ్చెన్నాయుడు ఫోన్లో కార్యకర్తలను రోడ్ల మీదకు రమ్మని బ్రతిమిలాడుకుంటున్నాడు. ఎందుకంటే, టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు నొక్కేసి ఉంటాడనే నమ్ముతున్నారు. అవినీతితో సానుభూతి రాదు.. ఈ అవినీతి దెబ్బతో చంద్రబాబుకు సానుభూతిగానీ, విజయంగానీ దక్కదు. 2004-05 ముందు అలిపిరి ఘటన జరిగినా ఎలాంటి విజయం దక్కిందో చూశాం. గతంలో సోషల్ మీడియా లేనప్పుడు ఆ మీడియా చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ ప్రజలకు వాస్తవాలు అర్థమౌతున్నాయి. ఎన్ని కుంభకోణాలు.. అవినీతి మేత పెట్టుకుని అబద్ధాలు చెప్పుకుంటూ గ్యారెంటీ ఇస్తానంటూ చంద్రబాబు రోడ్డు మీదకు రావటానికి ఎంత ధైర్యం ఉండాలి. జగన్ గారిది జన బలం.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి పథకాన్ని దేశంలోనే ఒక మోడల్‌గా అందిస్తుంటే అది టీడీపీ వాళ్లకు, ఎల్లో మీడియాకు కనిపించదు. లోకేశ్ పాదయాత్ర చూస్తే అంతా ఫాస్ట్ ఫార్వార్డ్లోనే జరుగుతోంది తెల్లవారే సరికి జిల్లాలు మారిపోతున్నాడు. ఎంత ఫిట్నెస్ ఉంటే మాత్రం అంతంత దూరం ఎలా నడుస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. కవర్ చేసే మీడియా బలం, ధనబలం ఉంది. అన్ని పార్టీల చెవులు కొరికే నాయకులు ఉన్నారనే ధైర్యం. వీరంతా ఒక ఎత్తు అయితే.. జగన్ గారు ఒక్కరే మరో ఎత్తు. జగన్ గారి వైపు జనం ఉంటే.. చంద్రబాబు వైపు ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయం మాత్రమే ఉందని జగన్ గారు ఏదైనా చేయాలని పట్టుపడితే ఆయన సంకల్పమే ఆయనకు బలమవుతుందన్నారు. వాటి గురించి వారే చెప్పాలి.. ఇది యుద్ధమని అంటారు పవన్ కళ్యాణ్. నిజానికిది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని జగన్ గారు ఎప్పుడో చెప్పారు. మీ కుట్రలు ఎదుర్కోవటానికి మేము సిద్ధంగానే ఉన్నామని ప్రజల మా పక్షాన ఉన్నారన్నారు. అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పుతామంటున్నారు. సీఎం పిల్లల చదువుల కోసం లండన్ వెళ్తే.. లోకేశ్, భజన బృందాలు స్పెషల్ ఫ్లైట్ అని పచ్చిగా మాట్లాడుతున్నారు. నిన్న ఒక్కరోజే నాలుగైదు స్పెషల్ జెట్లు టీడీపీ వారే వాడారు. లాయర్‌కు ఒకటి, ఆయన పార్టీ మద్దతు ఇచ్చే నాయకుడికి ఒకటి, కుటుంబ సభ్యులకు ఒకటి, పైన వాళ్లకి, కింద వాళ్లకి ఒకటి మొత్తంగా ఐదో, ఆరో ఫ్లైట్లు వాడారు. ఈ డబ్బులు ఏ స్కిల్ వాడితే టీడీపీకి వచ్చాయో వారే చెప్పాలన్నారు. పక్కా సాక్ష్యాధారాలున్నాయి.. ప్రభుత్వం అనుకుంటే ఎవ్వరినీ జైలుకు పంపలేదు. సాక్ష్యాధారాలు చూసి తప్పు జరిగిందని కోర్టు నమ్మింది కాబట్టే చంద్రబాబును రిమాండ్‌కు పంపింది. రాజకీయ కక్షతో సీఎం జగన్ గారు చంద్రబాబును జైలుకు పంపినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని న్యాయ నిపుణులంతా చంద్రబాబు పక్షాన వాదించారు. అయినా స్కిల్‌లో తప్పు జరిగిందని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికైనా రాజకీయ వైరంగా ప్రచారం చేయటం మానుకోవాలని అన్నారు. ఇది కూడా చదవండి: స్కిల్ స్కాం ఆరంభం మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి -
తనను ఎవరూ ఏం చేయలేరని చంద్రబాబు అనుకున్నారు
-
లోకేశ్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు: కన్నబాబు పొలిటికల్ పంచ్
సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడినా ఎల్లో మీడియా ఆణిముత్యాలు ఏరుకుంటోంది. పచ్చి అబద్దాలను వండి వారుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురుసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన జాతీయ మీడియాపై నారా లోకేశ్ ఎందుకు పరువు నష్టం దావా వేయలేదు అని ప్రశ్నించారు. లోకేశ్ పరువు నష్టం దావా ఎందుకు వేయలేదు? కాగా, కురుసాల కన్నబాబు ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆధీనంలో నడిచే సంస్థ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు ఓ గజదొంగ. అవినీతిలో పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయాడు. కోర్టులను అడ్డుపెట్టుకుని దర్యాప్తులను ఆపుకోవడం బాబుకు అలవాటే. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు ముడుపులు చేరాయి. చిన్న చిన్న ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన లోకేశ్.. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా ఎందుకు వేయలేదు?. స్పందించే దమ్ము లేకుంటే దొరికిపోయినట్టే.. అమరావతి లంచాల కోసం నిర్మించింది. అమరావతి పేరుతో అవినీతివతిని నిర్మించాలనుకున్నాడు. చంద్రబాబు తన పాలనలో ఆర్టీసీని నాశనం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారు. చంద్రబాబు గ్యారెంటీలు, ష్యూరిటీలను ప్రజలు ఎప్పుడో చూసేశారు. ఇంతా జరుగుతున్నా ఎల్లో మీడియా మాత్రం స్పందించడం లేదు. ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు. చెప్పే దమ్ము లేకుంటే దొరికిపోయినట్లు అర్థం. 2014లో ఇచ్చిన 600 హమీలకు దిక్కు లేదు. ఇప్పుడు మేం మీ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తాం అంటున్నాడు. మూడు లేక నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నాడు. దానిని హమీ అంటారా? అంటూ ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: ఐటీ నోటీసులతో చంద్రబాబుకు హైటెన్షన్ -
ప్రాజెక్టుల యాత్రల పేరుతో బాబు విధ్వంస యాత్రలు చేస్తున్నాడు: కన్నబాబు
-
‘స్పృహ లేకుండా మాట్లాడటం..బురద చల్లేయడం పవన్‌కు అలవాటు’
సాక్షి, కాకినాడ : పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. అవగాహనలేమితోనే వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని, ప్రజల్లో ఏం జరుగుతుందో పవన్‌కు తెలియడం లేదని విమర్శించారు. స్పృహ లేకుండా మాట్లాడటం, బురద చల్లేయడం పవన్‌కు అలవాటైందని, సీఎం జగన్‌పై కక్ష, ద్వేషం, అసూయతోనే పవన్ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు కురసాల కన్నబాబు. వాలంటీర్లతో మంగళవారం సమావేశమైన కురసాల.. అనంతరం మాట్లాడుతూ ‘ప్రజల్లో వాలంటీర్లకు, ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పవన్‌కు కడుపు మంట.పవన్ కు కొంచెమైన ఆలోచన.. సభ్యత ఉందా?, సభ్యత సంస్కారం లేకుండా ఎవరిని పడితే వాళ్ళను దూషిస్తున్నాడు. వాలంటీర్ల వ్యవస్ధను సిఎం జగన్ తీసుకువచ్చారాని తప్పుడుగా చిత్రికరించాలని కోరిక. 2021 నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నివేధిక ప్రకారం మహిళల అదృశ్యంలో ఎపీ 11 వ స్ధానం లో ఉంది. రికవరీలో 2 వ స్ధానం లో ఉంది. మరీ మనకన్న ముందున్న 10 రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్ధ లేదు కదా?, ఆ రాష్ట్రాల్లో మహిళల అదృశ్యానికి కారణం ఎవరూ?, స్పృహ లేకుండా మాట్లాడడం.. బురద చల్లేయడం పవన్‌కు అలవాటు అయ్యింది. దీని మీద చర్చలు జరగాలి.. మనం వెళ్ళి షూటింగ్ లు చేసుకోవాలి అన్న తీరులో పవన్ ఉన్నాడు. 2.80 లక్షల మంది మనోభావాలు దెబ్బ తీశానన్న ఆలోచన పవన్‌కు లేదు’ అని కురసాల పేర్కొన్నారు. -
పవన్ కళ్యాణ్ కి ఆ స్థాయి లేదు దమ్ముంటే ద్వారంపూడి మీద పోటీ చెయ్
-
ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: ఏపీలో ధాన్యం కొనుగోళ్లు, ఆర్బీకేపై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్‌లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు కన్నబాబు. కాగా, ఎమ్మెల్యే కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలో 6.45లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఖరీఫ్‌లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 99 శాతం చెల్లింపులు జరిగాయి. రైతులు ఇబ్బంది పడకూడదనే వెంటనే చెల్లింపులు చేశాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: భారత్ సహా పలు దేశాల నుంచి బ్రిటన్ ఎత్తుకెళ్లిన వస్తువులు.. సంపద ఎంతంటే? -
‘రాజకీయ రాబంధులా చంద్రబాబు వాలిపోయాడు’
సాక్షి, కాకినాడ జిల్లా: టీడీపీని డ్రామా కంపెనీలా చంద్రబాబు నడుపుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు దిగజారుడు భాష వాడుతున్నారు. సీఎం జగన్‌పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం కరువుతో అల్లాడిపోయిందని కన్నబాబు అన్నారు. ‘‘అకాల వర్షాలకు పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈలోపే రాజకీయ రాబంధులా చంద్రబాబు వాలిపోయాడు. రైతు బాంధువుడిలా ఫోజులు కొడుతూ సిఎం జగన్‌కు శాపనార్ధాలు పెట్టుకుని తిరుగుతున్నాడు. చంద్రబాబు దరిద్రం వల్లే రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. చంద్రబాబు పూర్తి ఒత్తిడిలో ఉన్నాడు. జగన్ సీఎం అయ్యాక రైతులు సంతోషంగా ఉన్నారు. పరామర్శల పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను విస్మరించారు’’ కన్నబాబు దుయ్యబట్టారు. చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! -
ముద్రగడ కుటుంబం పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు: కన్నబాబు
-
తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం హర్షణీయం: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం హర్షణీయం అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారని దుష్ప్రచారం చేయించిన బాబు.. కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం సృష్టించి ముద్రగడ కుటుంబం పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. ‘సీఎం జగన్ ఒక వాస్తవిక వాది.. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే నాయకుడు’ అని కన్నబాబు అన్నారు. ‘‘తన రాజకీయ అవసరాల కోసం తుని రైలు దగ్ధం కేసును చంద్రబాబు వాడుకున్నాడు. కాపులను సంఘ విద్రోహ శక్తులగా చూపించే ప్రయత్నం చేశాడు. సంబంధం లేని వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేశారు. ఆకలి కేకల పేరుతో రోడ్లు మీదకు వచ్చి కంచాలు కొట్టిన మహిళలపైనా కేసులు పెట్టారు.’’ అని ఆయన ధ్వజమెత్తారు. చదవండి: రైతులెవరో తెలియదా రామోజీ?.. ఇంకెన్నాళ్లు ఈ మొద్దునిద్ర? ‘‘ముద్రగడను చూసేందుకు వచ్చిన చిరంజీవిని రాజమండ్రి ఎయిపోర్టులో నిర్భంధించి వెనక్కి పంపారు. వేలాది మంది కాపులపై చంద్రబాబు బనాయించిన అక్రమ కేసులను ఎత్తేసిన చరిత్ర సీఎం జగన్‌ది. కాపు నేస్తం పథకం ద్వారా కాపులలో ఉన్న పేదలకు ఆర్థిక సాయం చేస్తున్నారు’’ అని కురసాల కన్నబాబు అన్నారు. చదవండి: బాలకృష్ణ అల్లుడి పాదయాత్ర.. టీడీపీలో చిచ్చు రాజేస్తోందా? -
చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కన్నబాబు ఆగ్రహం
-
‘పెత్తందార్లకు కొమ్ము కాసే వ్యాధి చంద్రబాబుకు పట్టింది’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా ఫ్రస్టేషన్లో ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్లో మీడియాను చూసుకుని బలుపుతో ప్రవర్తిసున్నారని దుయ్యబట్టారు. తండ్రీకొడుకులు తిరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ‘‘జగన్ ప్రతి ఇంటి ముద్దు బిడ్డ అని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. పెత్తందార్లకు కొమ్ము కాసే వ్యాధి చంద్రబాబుకు పట్టింది. బాబుకు తన సొంత మనుషులకు ఆస్తులు కట్టబెట్టాలనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధులతోనే అమరావతి రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నాడు’’ అని చంద్రబాబుపై కన్నబాబు మండిపడ్డారు. చదవండి: చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు.. -
‘కేసులే లేవని కథనాలు రాశారు.. నేర చరిత్ర ఉందని విచారణలో తేలింది’
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గతంలో జరిగిన హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని తాము భావిస్తుంటే, ఎల్లో మీడియాకు బాధ ఎందుకో అర్థం కావడం లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. శనివారం మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. ‘కుట్ర కోణం ఉందని మేం అంటుంటే మీరు భుజాలెందుకు తడుముకుంటున్నారు. ఎన్ఐఏ లోతుగా విచారించాలని మేం కోరితే తప్పేంటి?, కోర్టులు ఏం చెప్పకుండానే ఎల్లో మీడియా తీర్పులు ఇస్తోంది. దాడి చేసిన వ్యక్తిపై కేసులు లేవంటూ కథనాలు రాశారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని విచారణలో తేలింది. ఘటన వెనుక నిజాలను తేల్చమంటుంటే మీకెందుకు బాధ?, సీఎం జగన్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఎగతాళిగా మాట్లాడారు. ఘటన వెనుక కుట్న కోణం ఉందని మేం భావిస్తున్నాం. డీఎల్ రవీంద్రారెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. సీఎం సతీమణి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కనీసం సంస్కారం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదు’ అని మండిపడ్డారు. -
చంద్రబాబు మార్క్ పథకం ఒక్కటి చెప్పగలరా?: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు, లోకేష్ ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని, చంద్రబాబు తన మార్క్ పథకం ఒక్కటి చెప్పగలరా అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 స్థానాల్లో పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నాడు. ఎల్లో మీడియా మోసినంత కాలం చంద్రబాబు ఆటలు సాగుతాయి. చంద్రబాబు మీడియాను నమ్మితే జగన్ ప్రజలను నమ్ముకున్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో మద్య నిషేధంపై ఈనాడే ఉద్యమం చేయించింది. చంద్రబాబు సీఎం అయిన వెంటనే మద్య నిషేధం ఎత్తివేశారు. దీనికి కర్త, కర్మ రామోజీనే’’ అంటూ దుయ్యబట్టారు. పవన్ చెప్పినట్లు ప్రజలు వైఎస్సార్సీపీ విముక్తి ఏపీని కోరుకోవడం లేదు. వైఎస్సార్సీపీ సహిత ఏపీని కోరుకుంటున్నారు. 2019 లో వైఎస్ జగన్ సీఎం ఎప్పటికి కాడని పవన్ వ్యాఖ్యలు చేశారు. కానీ ఏపీ సీఎం జగనే అని ప్రజలు 151 స్ధానాల్లో గెలిపించారు’’ అని కన్నబాబు అన్నారు. చదవండి: పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే.. అక్కడ ఏం జరిగింది? -
ఎల్లో మీడియా రోజులు కాదు.. సోషల్ మీడియా కాలమిది: కన్నబాబు ఫైర్
సాక్షి, కాకినాడ: టీడీపీ, ఎల్లో మీడియాపై మాజీ మంత్రి కన్నబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. విష ప్రచారమే అజెండాగా ఎల్లోమీడియా పనిచేస్తోందన్నారు. గన్నవరంలో పథకం ప్రకారమే పట్టాభి డ్రామా క్రియేట్ చేశాడని ఘాటు విమర్శలు చేశారు. కాగా, కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లోమీడియా రోజురోజుకూ దిగజారుతోంది. చంద్రబాబు కోసమే ఎల్లో మీడియా పనిచేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు బరితెగించి విష ప్రచారం చేస్తున్నారు. గన్నవరంలో పట్టాభి డ్రామా క్రియేట్ చేశాడు. ఈనాడులో తప్పుడు ఫొటోలు వేసి దుష్ప్రచారం చేశారు. పట్టాభిని కొట్టారంటూ అబద్ధపు రాతలు రాశారు. తప్పుడు వార్తలు రాసి సవరణ మాత్రం సింగిల్ కాలమ్‌లో వేశారు. ఇవి ఎల్లో మీడియాలో రోజులు కావు.. సోషల్ మీడియా రోజులు అని అన్నారు. జాకీలు పెట్టి లేపినా లేవలేని పరిస్థితి టీడీపీది. ఈనాడు చంద్రబాబు కరపత్రిక అని మరోసారి రుజువైంది. పట్టాభిని ఎవరూ కొట్టలేదని వైద్యులే ధృవీకరించారు. ఈనాడు విషపురాతలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక భాగం కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక విప్లవానికి తెరతీశారు. దేశంలో ఎవరూ చేయని సాహసం సీఎం జగన్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదు. ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వంపై ఈనాడు కుట్ర చేస్తోంది. అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితిలో టీడీపీ ఉంది. -
చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి.. లోకేష్‌ను బాహుబలి చేయాలని ఈనాడు తపన: కన్నబాబు
-
హిందువులంటే మీరేనా? మేం కాదా!
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ‘మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా, అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వర ఆరాధన అని చెబుతూ.. మా పార్టీ అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ శివయ్య చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పింది. ఇందులో హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బ తిన్నాయో అర్థం కావడం లేదు. ఆ ట్వీట్లో పరమ శివుడిని కించ పర్చినట్లు ఎక్కడ ఉందో చెప్పండి? బీజేపీ పూర్తిగా దిగజారి వక్రీకరిస్తోంది. శివరాత్రి రోజు బీజేపీ వాళ్లు శివాలయాలకు వెళ్లడం మర్చిపోయినట్లు ఉన్నారు. అందుకే ఈరోజు కోవెలకు వెళ్దాం అంటూ ధర్నాలు చేపట్టారు’ అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఈ విషయమై ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో వారు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హిందుత్వానికి మీరు పేటెంటా? మతాన్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు? హిందుత్వంపై బీజేపీకి పేటెంట్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. మీకన్నా హిందుత్వంపై ఎక్కువ ప్రేమ ఉన్నవారు, హిందూ సంప్రదాయాలు పాటించే వారు వైఎస్సార్సీపీలో కోట్లాది మంది ఉన్నారు. బీజేపీ నేత సునీల్ దేవ్‌ధర్ ట్వీట్ ఇన్సల్టింగ్గా ఉంది. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రి మత రాజకీయం ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడుతున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఆయన ప్రతి ఒక్క పేదవాడికి అండగా నిలుస్తున్నారు. దాన్ని ఫొటో రూపంలో ఒక అభిమాని చిత్రించాడు. పెత్తందారులైన బీజేపీ నాయకులు దాన్ని మత రాజకీయాలకు వాడుకోవడం దారుణం. అసలు ఇది మానవత్వమేనా? – కొడాలి నాని, మాజీ మంత్రి ఇందులో తప్పేముంది? రాష్ట్రంలో బీజేపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. మేమంతా హిందువులమే. ఆ ట్వీట్ ద్వారా మా మనోభావాలు ఏమీ దెబ్బతిన లేదు. బీజేపీ వాళ్లకు ఏం ఇబ్బంది కలిగిందో మాకు అర్థం కావటం లేదు. ఆకలి అంటే దేవుడిని తలుచుకోవడం అందరికీ సహజం. రాష్ట్రంలో మనుగడ కోసం ఏమీ లేని చోట బీజేపీ మసిపూసి మారిడికాయ చేస్తోంది. గతంలో వారే దేవాలయాలు కూల్పించి వారే ధర్నాలు, నిరసనలు చేశారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. బీజేపీ విమర్శలను ఏకకంఠంతో ఖండిస్తున్నాం. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి నాడు గుడులు కూల్చినప్పుడు ఏమయ్యారు? హిందూ మతాన్ని, దేవుళ్లను రాజకీయంగా వాడుకోవడం బీజేపీకి ఒక క్రీడగా మారింది. మతానికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బీజేపీ మాత్రమే. సీఎం జగన్ సూచనల మేరకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లతో రాష్ట్రమంతా శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న తరుణంలో ఓ సదుద్దేశంతో ట్విట్టర్లో వచ్చిన ఒక చిన్న క్యారికేచర్‌ను పట్టుకుని వక్రభాష్యాలు వల్లిస్తూ రెచ్చిపోవడం బీజేపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనం. మీరు టీడీపీతో అంటకాగినప్పుడు రాష్ట్రంలో 40 గుళ్లు కూల్చారు. అప్పుడు దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత, ఇతర నేతలంతా ఎక్కడ నిద్రపోయారు? టీడీపీ కూల్చితే మేం పునరుద్ధరించాం. ఆకాశంపై ఉమ్మితే ఏమవుతుందో తెలుసుకోండి. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) -
సోము వీర్రాజుకు ఇలాంటి రాజకీయాలు పద్దతి కాదు: కన్నబాబు ఫైర్
సాక్షి, కాకినాడ: బీజేపీ రాజకీయాలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయంలో ఆలయాలను కూలిస్తే బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. కాగా, కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను గౌరవిస్తారు. తిరుమలలో తొలి దర్శనం యాదవులకు కలిగేలా పునరుద్ధరణ చేశారు. మానవసేవే.. మాధవసేవ అని చెప్పే పార్టీ మాది. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజీయం చేస్తోంది. సునీల్ ధియోధర్ ట్వీట్ చాలా అవమానకరంగా ఉంది. చంద్రబాబు హయంలో 40 ఆలయాలను కూల్చివేశారు. అప్పుడు బీజేపీ నేతలు ఏం చేశారు?. ప్యాబ్రికేటెడ్ ఉద్యమాలు చేద్దామనుకుంటే బీజేపీకి వర్క్ అవుట్ కాదు. సీఎం జగన్.. అర్చకులకు ఆర్ధిక సహయం అందించడం నుండి దూపదీప నైవేద్యాలు సమర్పించి ఆలయాల్లో వైభవం తీసుకువచ్చారు. మీ ఒక్కరికే హిందుత్వం మీద ప్రేమ ఉందా?. సోము వీర్రాజుకు రాజకీయాలు చేయాలను కుంటే ఇది పద్దతి కాదు. సునీల్ ధియోధర్ వంటి నాయకులను పెట్టుకుని ఏపీ రాజకీయాలు చేస్తే ఇంకా దిగిజారిపోతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘చంద్రబాబు, లోకేష్ ప్రవాసాంధ్రులు’
సాక్షి, కృష్ణా: నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన కరువైందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తేల్చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక అజెండా లేకుండా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోందన్నారు. చంద్రబాబు తాను లేస్తే మనిషిని కాదంటాడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. బాబు హయాం నుంచి చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు కన్నబాబు. చివరికి కుప్పం నుంచి గెలవలేని పరిస్థితి చంద్రబాబుదని కన్నబాబు తేల్చేశారు. ‘‘బాబు పాలనలో కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి. చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ కరువు, కష్టాలే!.రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే’’ అని కురసాల పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రవాసాంధ్రులని ఎద్దేవా చేసిన కురసాల కన్నబాబు.. దరిద్రానికి డెఫినిషన్ చంద్రబాబు అని అభివర్ణించారు. తనను మించిన మహానటుడు చంద్రబాబు అని స్వయానా ఎన్టీఆరే అన్నారని, చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని కన్నబాబు పేర్కొన్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అని, సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి లోకేష్ ఉందా? అని ఎమ్మెల్యే కన్నబాబు ప్రశ్నించారు. ‘అన్న ఎవరో.. దున్న ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. పాదయాత్రలో లోకేష్ భాష, బాడీలాంగ్వేజ్ అసభ్యకరంగా ఉంది. ఓర్వలేనితనంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లోకేష్ తన భాషను అదుపులో పెట్టుకుంటే మంచిద’ని కన్నబాబు టీడీపీ జాతీయ కార్యదర్శికి సూచించారు. -
చంద్రబాబు అంటేనే దరిద్రమని ప్రజలే చెబుతున్నారు
-
బాబే పెద్ద దరిద్రం
-
చంద్రబాబుపై కన్నబాబు సంచలన కామెంట్స్
సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. కాగా, కన్నబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే. దేవుడు.. చంద్రబాబుకు మతిమరుపు అనే వరం ఇచ్చాడు. నారా లోకేష్.. పెద్ద ఐరన్ లెగ్ అని ప్రజలు అనుకుంటున్నారు. గుంటూరు, కందుకూరులో అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. ప్రతీ పేదవాడి గుండె చప్పుడు సీఎం జగన్ వింటున్నారు. పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు చనిపోయారు. 2019 తర్వాత ఏ ఒక్క ఎన్నికల్లోనైనా టీడీపీ గెలిచిందా?. టీడీపీకి బలం లేకనే మిగిలిన పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు.. పోలవరం నేను కట్టేస్తానంటూ కేంద్రం దగ్గరం అనుమతి తెచ్చుకున్నావు. ముందు స్పిల్ వే కట్టాలి.. తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణం. పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. నిర్వాసితులను గాలికి వదిలేసి కాలక్షేపం చేశారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము. చంద్రబాబును మించిన సైకో ఎవరూ లేరు. ప్రభుత్వం మీద బురద చల్లడమే టీడీపీ ఎజెండా. టీడీపీ తప్పుడు ప్రచారాలకు ఎల్లోమీడియా సపోర్ట్ చేస్తోంది. సీఎం వైఎస్ జగన్నే గెలిపిస్తామని ప్రజలే చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ మీదపడి టీడీపీ ఏడుస్తోంది. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా?. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాము’ అని వెల్లడించారు. -
వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు చెప్పగలరా..?: కన్నబాబు
-
వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు చులకన చేసి మాట్లాడారు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటర్ వ్యవస్థపై చంద్రబాబు, ఈనాడు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. కాగా, ఎమ్మెల్యే కన్నబాబు శుక్రవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. వాలంటీర్, సచివాలయ వ్యవస్థల వల్లే ప్రజలకు నేరుగా పథకాలు అందుతున్నాయి. జన్మభూమి కమిటీల వంటి దళారీ వ్యవస్థను నిర్మూలించింది ఈ వ్యవస్థలే. వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు చాలా చులకన చేసి మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. -
జీవో నెంబర్ 1లో ఏముందో తెలుసుకుని ప్రతిపక్షాలు మాట్లాడాలి
-
చంద్రబాబు.. జీవో నెం1లో ఏముందో అసలు చదివావా?
కాకినాడ: ప్రజల భద్రత, సంరక్షణ కోసం తీసుకొచ్చిన జీవో నెం1ను చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్యగా చిత్రీకరించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. అసలు జీవో నెం1లో ఏముందో పూర్తిగా చదివావా అంటూ ప్రశ్నించారు. ఒకసారి జీవో నెం1ను చదవమని చంద్రబాబుకు విజ్తప్తి చేస్తున్న అని ప్రెస్‌మీట్ ద్వారా కురసాల పేర్కొన్నారు. ‘కేవలం ఇరుకు రోడ్లు మీద సభలు నిర్వహించుకోవద్దని, అవి చేయాలంటే వేరే ప్రదేశాల్లో నిర్వహించుకోవాలి జీవోలో చెప్పారు. ర్యాలీలు వద్దని జీవో నెం1 లో ఎక్కడైన పేర్కోన్నారా?, 1861 యాక్ట్ అనేది ఇవాళే పుట్టి కొచ్చినట్లు చెబుతున్నారు.చంద్రబాబు ప్రచార చీప్ ట్రిక్ వల్లప్రాణ నష్టం జరగకూడదని జీవో నెం 1 అమలు చేస్తున్నాం. చంద్రబాబు అంటిస్తున్న రక్తపు మరకలను తుడవడానికే జీవో నెం1 ను అమలు చేశారు. చంద్రబాబు నాయుడిని తొక్కేయడం కోసం జీవో నెం 1 ఇవ్వలేదు. రోడ్డు షోలు, ర్యాలీలు నిషేధిస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు మన దేశంలో..రాష్ట్రంలో అమలు చేస్తున్న చట్టాలు బ్రిటిష్ నాటి చట్టాలే. 2014 తరువాత సెక్షన్ 30ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ళ పాటు అమలు చేసిన చరిత్ర టీడీపీ ప్రభుత్వానిది. ఎల్లో మీడియా చంద్రబాబు భజన కోసమే పుట్టినట్లు ఉంది. మీ పరిపాలనలో ముద్రగడను ఏ చట్టం ఉందని నిర్భందించారు. ముద్రగడను పరామర్శించేందుకు వస్తే చిరంజీని రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ఎందుకు నిర్భంధించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో వైఎస్ జగన్ ను ఎందుకు నిర్భంధించారు.’ అని కురసాల నిలదీశారు. -
చంద్రబాబు పై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శలు
-
ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సీఎం చెప్పారు : కురసాల కన్నబాబు
-
సీఎం జగన్ సమీక్ష.. మాజీ మంత్రి కన్నబాబు ఏమన్నారంటే?
సాక్షి, తాడేపల్లి: Gadapa Gadapaki Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సీఎం చెప్పారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలకు వివరించాలని, సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారని కన్నబాబు అన్నారు. ‘‘గృహ సారధుల నియామకం కూడా జరగాలి. దాని వ్యవస్థీకృతం చేయాలని సీఎం చెప్పారు. గడప గడపకు కార్యక్రమంపై నిర్లక్ష్యం వద్దని సీఎం చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తక్కువ రోజులు గడప గడప చేశారు. మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే మార్చిలో వర్క్‌షాప్ ఉంటుందని చెప్పారు. ఈలోగా వెనుకబడిన వారి పనితీరు మార్చుకోవాలని సూచించారు.’’ అని కన్నబాబు పేర్కొన్నారు. చదవండి: మద్యం బ్రాండ్లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్ కింగ్ చంద్రబాబే..! -
మేము మొదట నుంచి ఇదే చెప్తున్నాం: కన్నబాబు
కాకినాడ: పరిపాలన వికేంద్రీకరణ అంశానికి సంబంధించి ఈరోజు(సోమవారం) సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాన్ని సమర్థించేలా ఉన్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రజాస్వామ్య వాదులంతా హర్షిస్తున్నారని స్పష్టం చేశారు కన్నబాబు. మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని మొదటి నుంచి చెప్తున్నాం. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో చంద్రబాబు భూములు కొనిపించారు.భావి తరాలకు అన్యాయం చేసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.రియల్టర్లతో చంద్రబాబు అమరావతి యాత్ర చేయించారు’ అని అన్నారు. -
‘చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది’
సాక్షి, కాకినాడ: అధికారంలో లేనప్పుడే చంద్రబాబుకు రాజ్యాంగం గుర్తుకు వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు స్వప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారని చంద్రబాబుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీరియస్ అయ్యారు. కాగా, కన్నబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ దేశానికి బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివి. ఆయన లేకుంటే దేశం ఈ స్థాయిలో ఉండేది కాదు. రాజ్యాంగాన్ని కూడా కొంత మంది రాజకీయం చేస్తున్నారు. రాజ్యాంగంపై చంద్రబాబు లేఖ రాయడం హాస్యాస్పదం. చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అబద్ధాలను అలవోకగా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎవరు వ్యవహరిస్తున్నారో చర్చకు చంద్రబాబు సిద్ధమా?. కళ్లబొల్లి కబుర్లతో ఎంతకాలం ప్రజలను మోసగిస్తారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజ్యాంగ పరిరక్షణా?. వెన్నుపోటుతో ఎన్టీఆర్‌ను కూలదోయడం రాజ్యాంగ పరిరక్షణా?. రాజ్యాంగ స్ఫూర్తి, పరిరక్షణ గురించి చంద్రాబాబా మాట్లాడేది?’ అంటూ కామెంట్స్ చేశారు. -
అబద్దాలను అలవోకగా చెప్పే వ్యక్తి చంద్రబాబు : కురసాల కన్నబాబు
-
'అవి రోజు కలలోకి వస్తున్నట్లున్నాయి.. అందుకే బాబుకు ఆ ఫ్రస్టేషన్'
సాక్షి, కాకినాడ: గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపాత్రాభినయం చేస్తున్నాడు అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. రాజకీయాలు దిగజారిపోయేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లేనిపోని కోపాన్ని ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల్ని రెచ్చగొట్టి టీడీపీ క్యాడర్‌ను కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు కన్నబాబు మాట్లాడుతూ.. 'చంద్రబాబు తన్నితే తన్నించుకోవడానికి వైఎస్సార్సీపీలో ఎవరూ సిద్దంగా లేరు. 14 ఏళ్ళు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడల్సిన భాషేనా ఇది అని ప్రశ్నించారు. ప్రధాని వచ్చి వెళ్లిన తర్వాత చంద్రబాబులో మార్పు వచ్చింది. తిట్లు తిడితే ఓట్లు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నాడేమో. మీ తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడే వారు లేరు. 2024 ఫలితాలు ప్రతిరోజూ చంద్రబాబుకు కలలోకి వస్తున్నట్లు ఉన్నాయి. అందుకే ఆ ఫ్రస్టేషన్. చంద్రబాబు మాట్లాడిన మాటలే.. రేపు వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే ఒప్పుకుంటారా?' అని ప్రశ్నించారు. చదవండి: (వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే: స్పీకర్ తమ్మినేని) చంద్రబాబు మాటలు, చేష్టలు ఆయన్ని పాతాళానికి పడేశాయి. ఆయనకు వచ్చే ఎన్నికలే ఆఖరువి. తర్వాత టిడిపికి మనుగడ ఉండదు. అసెంబ్లీకి రాను అని మంగమ్మ శపధంలా.. చంద్రన్న శపధం చేశాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం.. అనంతరం సీఎం జగన్ సంక్షేమ పాలనతో చంద్రబాబుకు ఫ్రస్టేషన్ పట్టుకుంది. ఆయనకు ఎంత ఫ్రస్టేషన్ వచ్చినా మేము మూడు రాజధానులును ఏర్పాటు చేసి తీరతాం అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. చదవండి: (మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా?: సజ్జల) -
బాబూ.. తథాస్తు
-
‘చంద్రబాబు కోరిక తప్పక తీరుతుంది.. దేవుడు తథాస్తు అంటాడు’
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకి చివరి ఎన్నికలు అన్నాడు. ఆయన కోరిక తప్పక తీరుతుంది. దేవుడు తథాస్తు అంటాడు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. మూడుసార్లు ప్రజలు అవకాశం ఇస్తే మోసం చేశాడు. అసెంబ్లీలో ఆయన భార్యను ఎవరూ కించపరచలేదు. సానుభూతి కోసమే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. చంద్రబాబు కోరుకున్నట్టే ప్రజలు తీర్పు ఇస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. ఇక, చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు సైతం స్పందించారు. కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు. ఆ విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసు. చంద్రబాబుకే ఆలస్యంగా తెలిసింది. ఇప్పటికే కుప్పం చేజారిపోయింది’ అని కామెంట్స్ చేశారు. -
‘పాచిపోయిన లడ్డు.. పవన్‌కల్యాణ్ మాటలు జనం మర్చిపోలేదు’
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని మోదీ పర్యటనలో విభజన హామీలు నెరవేరుతాయని ఆశిస్తున్నానని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, రెండు పొత్తులున్న పార్టీ నాయకులు కలవడంలో ప్రాధాన్యత ఏముందని ప్రశ్నిస్తూ.. ప్రధానితో పవన్ భేటీకి ఏ మాత్రం కూడా ప్రాధాన్యత లేదని తేల్చి చెప్పారు. కేంద్రం ఏమిచ్చింది.. పాచిపోయిన లడ్డు అన్న పవన్ కల్యాణ్ మాటలు జనం మర్చిపోలేదన్నారు. మూడేళ్లలో ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కోసం సీఎం జగన్.. ప్రధానిని నేరుగా కలిసి విజ్ఞప్తి చేశారని కన్నబాబు గుర్తు చేశారు. చదవండి: సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు -
కలిసి కాపురం చేయడానికి ఇంత సీన్ సృష్టించాలా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు, పవన్ కల్యాణ్లది ఇంతకాలం రహస్య ప్రేమ అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇద్దరూ కలిసి కాపురం చేయడానికి ఇంత సీన్ సృష్టించాలా అని నిలదీశారు. బాబును సీఎంగా చేయడానికే రాజకీయాలు చేస్తున్నారు తప్పించి పవన్ సీఎం కావడానికి చేయడం లేదనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. ఆయన మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణ, మూడు రాజధానులు ఉండాలి, ఎంతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలనే మహదాశయంతో విశాఖ గర్జన ద్వారా ప్రజలు వారి ఆకాంక్షలు ప్రతిబింబింపచేశారని చెప్పారు. శాంతిభద్రతల సమస్య వచ్చినప్పుడు, మంత్రులపై దాడి జరిగితే ఏ విధంగా స్పందించాలో తమ ప్రభుత్వం అదే చేసిందని పేర్కొన్నారు. కన్నబాబు ఇంకా ఏమన్నారంటే... రాజకీయాలంటే సినిమాలు కాదు విశాఖ గర్జన రోజున చంద్రబాబు అండ్ కో తప్పెటగుళ్లతో రాద్ధాంతం చేయడం మొదలుపెట్టారు. ఈ రోజు ఉదయం నుంచి టీవీల్లో పవన్ ఏకపాత్రాభినయం చూస్తున్నాం. సినిమాల్లో క్లైమాక్స్ సీన్ల మాదిరిగా చాలా ఉద్రేకంగా, హుషారుగా ఎదుటి వారంతా విలన్లు అన్నట్టుగా ఊహించుకుని పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారు. పవన్ ఇదేమీ సినిమా కాదు. ఇది వాస్తవం. సినిమాలో మీ డైలాగులు చూస్తే చప్పట్లు కొడతాం. కానీ, వాస్తవంలో ఆ సీన్లు రిపీట్ చేస్తే చూస్తూ ఊరుకోం. సినిమాలో డైలాగులు కొట్టడం, మీరు చెయ్యి విసిరితే విలన్లు గాలిలో ఎగిరిపోవడం, డైరెక్టర్ కట్ చెబితే మీకు టచ్అప్లు ఇచ్చేవారు ఇక్కడ ఉండరని తెలుసుకోవాలి. కుమ్మేస్తా, పొడిచేస్తా... వంటి డైలాగులు సినిమాలో బాగుంటాయి. నిజజీవితంలో, రాజకీయాల్లో ఇవేమీ పనిచేయవు. ఇంతకాలం రహస్యంగా ప్రేమించుకుని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇప్పుడు పెద్దల ముందు ఆ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయడానికి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇకముందు కలిసి కాపురం చేస్తున్నామని చెప్పడానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? ఇప్పుడు కొత్తగా స్టేజీపైకి వచ్చి మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. మీ ముసుగు తొలగిపోయింది. 2014లో పార్టీ పెట్టి పోటీచేశారా? చివరకు ప్రజాశాంతి పార్టీ కూడా పోటీచేసిందే. 2019 వచ్చేసరికి చంద్రబాబు అధికారంలో ఉండటంతో వ్యతిరేక ఓటు చీలిపోకుండా విడిగా పోటీచేసి బాబుకు దాసోహం అనిపించుకున్నారు. జనసేన పార్టీ బీ ఫారాలు తెలుగుదేశం అభ్యర్థుల చేతుల్లో పెట్టి మీకు నచ్చినవారి పేర్లు రాసుకోండని చెప్పిన చరిత్ర తరవాత బయటకు వచ్చింది. 2024కు వచ్చేసరికి కలిసే పోటీచేస్తారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇందుకోసం ఒక డయాస్ సృష్టించడం. వైఎస్సార్సీపీని విలన్‌గా చూపించి తానేమో పెద్ద హీరో మాదిరిగా అనుకోవడం సిగ్గుచేటు. వైఎస్సార్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలంతా విలన్లు.. వారితో పోరాటం చేస్తోన్న హీరో పవన్అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు. జనం మిమ్మల్ని రాజకీయాల్లో జీరో అనుకున్నారు. కాబట్టే ఆ ఫలితాలు వచ్చాయి. కానీ వైఎస్ జగన్‌ను రాష్ట్ర ప్రజలు హీరో అనుకున్నారు కాబట్టే 151 సీట్లు ఇచ్చారు. కాపులకు బ్రహ్మనాయుడు..నీకు చంద్రబాబు ఆదర్శం కాపులంతా బ్రహ్మనాయుడును ఆదర్శంగా తీసుకోమని చెబుతున్నావ్. మేము బ్రహ్మనాయుడును ఆదర్శంగా తీసుకుంటాం.. నువ్వు మాత్రం చంద్రబాబును ఆదర్శంగా తీసుకో. ఈ రోజు బ్రహ్మనాయుడు చరిత్ర తెలిసిందా పవన్. 2019లోనే అధికారంలోకి వచ్చి తొలి కేబినెట్లోనే జగన్మోహన్రెడ్డి దళిత మహిళను హోం మంత్రిని చేశారు. మంత్రివర్గ మార్పుల్లో మాదిగ సామాజికవర్గం నుంచి మరో మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చారు. కేబినెట్లో ఉన్న 25 మందిలో ఐదుగురు కాపులున్నారు. నీ పక్కన కూర్చునే అర్హత కాపులకు లేదా? రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి తిడుతూనే ఉన్నావు కదా. ఒక్కరోజు అయినా కాపుల సంక్షేమం కోసం మాట్లాడావా? కాపులను నేను రమ్మన్నానా, మద్దతు ఇవ్వమన్నానా.. అని ప్రశ్నించిన పెద్దమనిషి ఈ రోజు కాపుల కోసం అంటూ మాట్లాడటం సిగ్గు చేటు. తన పక్కన కుర్చీ వేసి కమ్మ సామాజికవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌ను కూర్చోబెట్టావే తప్ప ఏ ఒక్క కాపు నాయకుడిని అయినా కూర్చోబెట్టావా? మీ పక్కన కూర్చోబెట్టుకునేందుకు కాపులకు అర్హత లేదా? మీరు ఉపన్యాసాలు దంచుతుంటే చెవిలో పువ్వులు పెట్టుకుని మేము వినాలా. మీ పార్టీని ఎవరు నడిపిస్తున్నారో, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత ఎవరెవరో అందరికీ తెలుసు. వంగవీటి రంగా హత్య గురించి మాట్లాడుతున్నారు. రంగా హత్య జరిగినప్పుడు నాటి హోం మంత్రి హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో టీడీపీ అధినేత చంద్రబాబే సూత్రదారి అని రాసిన విషయం తెలియదా. అటువంటి చంద్రబాబు చంకలో కూర్చుని రంగా హత్యపై కన్నీరు కార్చడం చూస్తుంటే బాధేస్తోంది. ముద్రగడను కాపులు ఒక ఐకాన్‌గా చూస్తారు. ఆ కుటుంబాన్ని తప్పుగా మాట్లాడి హింసించి క్షోభకు గురిచేసిన చంద్రబాబు సర్కార్‌పై ఒక్క రోజైనా స్పందించి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చావా? ఎప్పుడూ చంద్రబాబు చంకలోనే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆయన చంకలోనే ఉన్నారు. పైకి పోరాటం, పటిమ అనే మాటలు తప్ప చంద్రబాబు కబంధ హస్తాల నుంచి బయటకు రాలేరని ప్రజలు భావిస్తున్నారు. లేకపోతే ఇంత రాజీపడిపోయి, సాగిలపడిపోయి చంద్రబాబు బూట్లు నాకే పరిస్థితికి ఎందుకు రావాలి? అంత చెంచాగిరి ఎందుకు చేయాలి? నాడు 33 వేల ఎకరాలు ఎవరి కోసం సేకరిస్తున్నారు? ఇది ఒక కులానికి రాజధానిలా ఉంది అని చెప్పిన మీరే ఇప్పుడు మాట మార్చారు. అసలు విశాఖపట్నంలో గర్జన జరిగిన రోజే మీరు అక్కడికి రావలసిన అవసరం ఏముంది? హోటల్‌కు ర్యాలీగా వెళ్లాల్సిన పని ఏమిటి? డైవర్షన్ పాలిటిక్సే కదా? జోగి రమేష్, రోజాపై దాడి నేపథ్యంలో పోలీసులు మిమ్మల్ని నియంత్రిస్తే.. ఆ విషయాన్ని వదిలేసి కాపు ఎమ్మెల్యేలు అంటూ మమ్మల్ని బూతులు తిట్టడం ఏమిటి? దాడిచేసింది నీ పార్టీవాళ్లే. నీ మద్దతుదారులే. అక్కడ అల్లరి చేసింది మీరే.. ఒక మహిళా మంత్రిమీద, ఒక బీసీ మంత్రిమీద దాడిచేసినా కనీసం క్షమాపణ చెబుదామన్న జ్ఞానం కూడా లేదు. పైగా వైఎస్సార్సీపీలో ఉన్న కాపు నాయకులను బూతులు తిట్టడం. సంస్కారానికి సంబంధించిన విషయం ఇది. -
పవన్ కల్యాణ్ , చంద్రబాబుది ఫెవికాల్ బంధం : కన్నబాబు
-
టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది: కన్నబాబు
-
‘టీడీపీ, ఎల్లో మీడియా చెప్పినట్టు మేం ఆడాలా?’
సాక్షి, కాకినాడ జిల్లా: ఉన్నది ఉన్నట్లు చెప్పే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయనకు నాటకాలు తెలియదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కన్నబాబు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘అమరావతిలో రాజధాని కొనసాగుతుందా.. లేదా?.. మీరు కోరుకునే రాజధాని రావడం లేదని ఎందుకంత బాధ? అన్ని ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అందుకే మూడు రాజధానులు కావాలని మేం కోరుతున్నాం. రాజధానికి 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని వైఎస్ జగన్ అంటే, చంద్రబాబు రైతుల నుంచి బలవంతంగా ప్రైవేట్ భూములను లాక్కున్నారు’’ అని కన్నబాబు మండిపడ్డారు. చదవండి: విశాఖ గర్జన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు అమరావతే బాగుండాలని మీరు అనుకున్నప్పుడు, మేం బాగుండాలని కోరుకునే హక్కు ఉత్తరాంధ్ర, రాయలసీమకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని కుట్ర చేస్తున్నారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అమరావతి మాత్రమే బాగుండాలని టీడీపీ, ఎల్లో మీడియా కోరుకుంటోంది. అందుకే దుష్ఫ్రచారం చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా చెప్పినట్టు మేం ఆడాలా’’ అంటూ కన్నబాబు ధ్వజమెత్తారు. -
దేవిక కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి/కరప : కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల కూరాడ గ్రామంలో హత్యకు గురైన దేవిక కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. దేవిక హత్య ఘటనపై ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్.. దిశ చట్టంలో పేర్కొన్న విధంగా త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేసి, నిర్ణీత సమయంలోగా ఛార్జిషీటు దాఖలు చేయాలని చెప్పారు. దోషి రెడ్ హేండెడ్‌గా పట్టుబడ్డ కేసుల విషయంలో దిశ చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని, తద్వారా నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రూ.10 లక్షల సాయాన్ని దేవిక కుటుంబ సభ్యులకు రెండు రోజుల్లో అందజేస్తారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం కరపలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని కూరాడ సర్పంచ్ వాసంశెట్టి వెంకటరమణ, పీఏసీఎస్ అధ్యక్షుడు రావుల ప్రసాద్, ఇతర నాయకులకు వివరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరు ప్రేమను నిరాకరించిందన్న కక్షతో యువతి కాదా దేవికను హత్య చేసిన నిందితుడు గుబ్బల వెంకట సూర్యనారాయణను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరు పరచి, రిమాండ్‌కు తరలించారు. కాకినాడ రూరల్ సీఐ కె.శ్రీనివాస్ కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన కాదా రాంబాబు కుమార్తె దేవిక.. కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ డిగ్రీ చదువుకుంటోంది. అదే గ్రామంలో మేనమామ ఇంటి వద్ద ఉండే గుబ్బల వెంకట సూర్యనారాయణ అనే యువకుడు తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఏడాది కాలంగా దేవికను వేధిస్తున్నాడు. అందుకు నిరాకరించిందన్న అక్కసుతో శనివారం ఆమెను పెదపూడి మండలం కాండ్రేగుల–కూరాడ గ్రామాల మధ్య కత్తితో అతి దారుణంగా నరికి హతమార్చిన విషయం విదితమే. నిందితుడు వెంకట సూర్యనారాయణను కాకినాడ రూరల్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో కాకినాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం.ప్రసన్నలక్ష్మి నివాసంలో ఆమె ఎదుట హాజరు పరిచారు. నిందితుడికి ఈ నెల 21వ తేదీ వరకూ రిమాండ్ విధించగా, అతడిని కాకినాడ సబ్ జైలుకు తరలించారు. చదవండి: (కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమను నిరాకరించిందని..) -
అన్ని ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టండి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): వికేంద్రీకరణను ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో ప్రతిఒక్కరూ విజయదశమి రోజున కుల, మతాలకు అతీతంగా అన్ని ఆలయాల్లోను ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఇంతకంటే మంచి రోజు మరొకటి రాదన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు ఏ రోజూ ప్రజల కోసం ఆలోచించని చంద్రబాబుకు సద్బుద్ధి వచ్చేటట్లు, వికేంద్రీకరణకు మద్దతిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కొబ్బరికాయలు కొట్టాలన్నారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతుల ముసుగులో బూటకపు పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు బృందానికి ఆ దేవుడే సరైన బుద్ధి చెబుతారని వారన్నారు. పాదయాత్రతో అరసవిల్లి వెళ్లే వారు సూర్యభగవానుడ్ని ఏమని కోరుకుంటారని.. అమరావతి మాత్రమే బాగుండాలని కోరుకుంటారా.. లేక, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారా.. అని వేణు, కన్నబాబు ప్రశ్నించారు. అందుకే పాదయాత్ర చేస్తూ అరసవల్లి వెళ్లే వారు ఏమి కోరుకున్నా సూర్యభగవానుడు మాత్రం మెజార్టీ ప్రజల అభీష్టమైన వికేంద్రీకరణకే ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. -
వైఎస్సార్ విగ్రహాన్ని తాకే దమ్ముందా?
కాకినాడ రూరల్: తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్ విగ్రహాలన్నింటినీ బంగాళాఖాతంలో పడేస్తామంటున్న టీడీపీ నేతలకు దమ్ముంటే మహానేత విగ్రహాన్ని తాకి చూడాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు సవాల్ చేశారు. ప్రజలు 2019లోనే టీడీపీని బంగాళాఖాతంలోకి విసిరేశారని వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఆ పార్టీ నాయకులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులతో కలసి కన్నబాబు సోమవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► టీడీపీ అధికారంలో ఉండగా విజయవాడలో కుట్రపూరితంగా కంట్రోల్ రూమ్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహాన్ని క్రేన్లతో తొలగించడంతో మీ బతుకు 23 సీట్లకే పరిమితమైంది. మేం అధికారంలోకి వచ్చాక అక్కడ అద్భుతమైన విగ్రహాన్ని ఆవిష్కరించాం. ► వైఎస్సార్ అంటే వ్యక్తి కాదు.. ఈ రాష్ట్రంలో ఒక శక్తి. వైఎస్సార్ పుణ్యమాని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పొందామని, పిల్లల్ని ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదివించగలిగామని ఇవాళి్టకీ ప్రజలు గడప గడపకూ కార్యక్రమంలో చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఏం ఒరిగిందో ఒక్కటైనా చెప్పుకునే దమ్ము ఉందా? సాక్షాత్తూ ఎన్టీఆర్‌నే పార్టీ నుంచి తొలగించిన ఘనత మీది. ► ఎన్టీఆర్‌పై నిజంగానే అభిమానం ఉంటే 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క జిల్లాకైనా ఆయన పేరు పెట్టారా? వెన్నుపోటుకు ప్రాయశి్చత్తంగా ఎన్టీఆర్‌కు కనీసం భారతరత్న ఇవ్వాలని అడిగారా? హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చారని మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు పోలవరం, ఆరోగ్యశ్రీ పేర్లను మార్చలేదా? ► పాదయాత్ర పేరుతో ప్రాంతీయ విద్వేషాలను చంద్రబాబు రేకెత్తిస్తున్నారు. మహిళలు తొడ కొట్టడం ఏమిటి? -
ఆ కుట్రలో బాలకృష్ణ కూడా భాగమే
కాకినాడ రూరల్: ఎన్టీ రామారావును పదవీచ్యుతుడ్ని చేసి ఆయనపై రాళ్లు, చెప్పులు వేసి.. ఆయన మరణానికి కారకులైన వారు ఈ రోజు ప్రగల్భాలు పలుకుతున్నారని.. అలాగే, తండ్రి కన్నీళ్లకు కరగని తనయుడిగా బాలకృష్ణ చరిత్రలో నిలిచిపోయారని మాజీమంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నతండ్రి కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోని కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు. ఆ రోజు ఎన్టీఆర్ ఎంత ఆత్మక్షోభతో చనిపోయారో చెప్పడానికి ఈ రాష్ట్రమే సాక్ష్యమన్నారు. ఆ కుట్రలో బాలకృష్ణ కూడా ఒక భాగమని.. అటువంటి వ్యక్తి ఇప్పుడు పంచ్ డైలాగులు కొడుతున్నారని కన్నబాబు విమర్శించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పడానికి నోరుపెగలని నాయకులందరూ ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు అండ్ కోకు ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలుసని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాసాగర్ అనే పేరును రాజశేఖరరెడ్డి పెట్టారని, ఆ తర్వాత చంద్రబాబు ఆ పేరును ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పెడితే ఎన్టీఆర్ పేరు పెట్టారని.. దానిని కూడా ఉంచాలా.. వద్దా.. అని వాడు.. వీడు.. అంటూ ఎన్టీఆర్‌ను సంబోధించారని కన్నబాబు గుర్తుచేశారు. ప్రజలు చరిత్రను మరచిపోరని, బాలకృష్ణ ఆత్మపరిశీలన చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. డైలాగులు, పంచ్‌లు సినిమాల్లోనే పేలుతాయని, రాజకీయాల్లో పేలవన్నారు. -
AP: పాలనా వికేంద్రీకరణకు సర్వత్రా స్వాగతం
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఐదు కోట్ల మంది వికేంద్రీకరణను కోరుకుంటుంటే చంద్రబాబు ఒక్కరే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. గురువారం అసెంబ్లీలో వికేంద్రీకరణ–పరిపాలనా సంస్కరణలపై జరిగిన చర్చలో భూమనతోపాటు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి: భూమన సీఎం జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా తెచ్చారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను గడప వద్దకే చేరవేస్తున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకు పాలనను చేరువ చేశారు. జిల్లాలను పునర్వ్యవస్థీకరించి రెవెన్యూ డివిజన్లు పెంచారు. అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ పేరుతో జిల్లాలను ఏర్పాటు చేసి తెలుగు వారి గొప్ప తనాన్ని ఇతర ప్రాంతాలకు తెలిసేలా చేశారు. ఇప్పటికే 98 శాతానికిపైగా హామీలను నెరవేర్చారు. రాయలసీమను గతంలో అవమానకరంగా దత్త మండలాలుగా పిలిచేవారు. 1928లో జరిగిన ఆంధ్ర మహాసభలో రాయలసీమగా నామకరణం చేశారు. కొప్పూరు రామాచార్యులు ప్రతిపాదించిన మద్రాస్, నెల్లూరు, రాయలసీమతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఉంటే సీమ దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా ఉండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక మొదటిసారిగా రాయలసీమ వాసుల కడగండ్లు, కన్నీరు తుడిచారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను చేపడితే చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ప్రకాశం బ్యారేజీపై ఆందోళన చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేయాలని ప్రయత్నించారు. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ శాసన సభలో తీర్మానం చేశారు. దీని వెనుక సామాజిక ప్రయోజనాలు దాగున్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రిటైర్డ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో విభిన్న ఆలోచనలు, అభివృద్ధిలో తేడాలున్నాయి. తెలుగువారిగా అందరం కలిసి ఉండాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష. కేంద్రాన్ని కాదని నారాయణ కమిటీ: కన్నబాబు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏర్పాటుపై కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే చంద్రబాబు స్వప్రయోజనాలకోసం నారాయణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేసి రామోజీరావు సూచనల మేరకు అమరావతి పేరు పెట్టారని ఈనాడులో వార్త రాశారు. రాజధాని ఎక్కడ ఉండాలో బాబు తనవర్గం వారితో చర్చించి ముందుగానే భూములు కొనుగోలు చేయించారు. హైదరాబాద్ తరహా ప్లాన్‌నే అమరావతిలోనూ అమలు చేశారు. అమరావతిలో మౌలిక సదుపాయాలు, ఇతర పనులకు రూ.1.80 లక్షల కోట్లతో ప్రణాళిక ప్రకటించారు. రూ.14 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్నప్పుడు ఒకే దగ్గర రూ.లక్షల కోట్లు ఎలా వెచ్చిస్తారు? రాజధాని విషయంలో జరిగిన ఈ లోపాలను సీఎం వైఎస్ జగన్ సరిదిద్దుతున్నారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్రకు బాబు వెన్నుపోటు.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు విశాఖకు ఏం చేశారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. హిందూస్థాన్ జింక్‌ను ప్రైవేటు పరం చేసిన ఘనత వారిది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన అభివృద్ధే విశాఖను గొప్ప నగరంగా నిలబెట్టింది. అచ్యుతాపురం సెజ్‌లో వేల మందికి ఉపాధి దొరుకుతుందంటే వైఎస్సార్ చలవే. విశాఖ విశిష్టతను గుర్తించిన సీఎం జగన్ పరిపాలన రాజధానిగా నిర్ణయిస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఉత్తరాంధ్ర ఓట్లు వేయించుకుని మోసం చేసింది. వెన్నుపోటు పొడిచి ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రాగా మిగిల్చారు. రియల్ ఎస్టేట్, క్యాపిటలిస్టుల పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు కచ్చితంగా అడ్డుకుంటారు. సమైక్య ఉద్యమంపైనా ఇలా స్పందించలేదు.. అమరావతి పాదయాత్ర చంద్రబాబు డైరెక్షన్లో, ఆయన పెట్టుబడితో సాగుతోంది. రైతులు చేపట్టిన యాత్రపై ఏదో జరిగిపోతోందన్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. సమైక్య రాష్ట్ర ఉద్యమంపై కూడా ఈనాడు ఇంతగా ప్రచారం చేయలేదు. నారా హమారా.. అమరావతి హమారా అనే నినాదాలే అసలు విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నేను కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరిని విమర్శిస్తే టీడీపీకి చెందిన బుచ్చయ్య చౌదరికి కోపం వచ్చింది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని కథనాలు రాస్తున్న ఈనాడు.. రాజధాని ఒకేదగ్గర కేంద్రీకృతమైతే మిగతా ప్రాంతాల వారికి జరిగే నష్టం గురించి రాయడం లేదు. అమరావతిని పార్టీలన్నీ అంగీకరించాయి: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల అన్ని పార్టీల ఆమోదంతోనే రాజధాని ఎంపిక జరిగింది. 175 నియోజకవర్గాలకు ఆదాయాన్ని సమకూర్చేలా అమరావతి నిర్మించాలని తలపెట్టాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పాలన చేస్తోందంటే టీడీపీ సర్కారు అమరావతిలో చేసిన అభివృద్ధి వల్లే. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి కానీ పాలనా వికేంద్రీకరణ కాదు. అమరావతి దేవతల రాజధాని. దాన్ని ఎందుకు మార్చాలని చూస్తున్నారు. ఇక్కడ కమ్మ, రెడ్డి కులస్తులు సమానంగా ఉన్నారు. 75 శాతం మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలున్నారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను కాదనడం సరికాదు. రాజధానిని మార్చడం కుదరదని పార్లమెంట్ సైతం చెప్పింది. భ్రమరావతిగా మార్చింది బాబే: కొడాలి నాని చంద్రబాబే అమరావతిని గ్రాఫిక్స్‌తో భ్రమరావతిగా మార్చారు. 29 గ్రామాలు కలిగిన ప్రాంతాన్ని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా లాంటి మహానగరాలతో పాటు సింగపూర్, మలేషియాతో పోలుస్తూ రియల్ ఎస్టేట్ దందా చేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. విశాఖలో తక్కువ ఖర్చుతో వేగంగా రాజధాని అభివృద్ధి చెందుతుంది. సీఎం జగన్ ఎన్నడూ కులాలు, మతాలను చూడలేదు. అలా చూసి ఉంటే రాయలసీమలోనే పరిపాలన రాజధాని పెట్టేవారు. అమరావతిలో కమ్మవారిని దెబ్బతీసేందుకు రాజధానిని తరలిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. పరిపాలన రాజధానిగా నిర్ణయించిన విశాఖలోనూ కమ్మవారి డామినేషనే ఉంది. అమరావతిలో అనేక కుంభకోణాలు, అవకతవకలు జరిగాయి. సంపద మొత్తాన్ని ఇక్కడే వెచ్చిస్తే మిగిలిన ప్రాంతాలు ఎప్పటికి అభివృద్ధి చెందుతాయి? అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తామంటే రూ.లక్షల కోట్లతో నిర్మిస్తానని బాబు ప్రచారం చేశారు. ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను బినామీల పేర్లతో కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి 800 ఎకరాలు భూసేకరణ చేస్తే 200 ఎకరాలు కలిగిన పేద రైతులకు కాలువకట్టలు, లోతట్టు ప్రాంతాల్లో భూములిచ్చి మిగిలిన 600 ఎకరాలకు సంబంధించి తన వర్గానికి చెందిన వారికి రాజధానిలో రూ.3,600 కోట్లు విలువైన భూమిని కట్టబెట్టి అమరావతిని కమ్మరావతిగా మార్చేశారు. ఇందులో సినీ ప్రముఖులు అశ్వినీదత్, రాఘవేంద్రరావు, కేవీ రావు, శ్రీధర్ లాంటి వారున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. భూములు కొన్న బుచ్చయ్య అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరికీ రాజధాని ప్రాంతంలో ఎకరం నుంచి ఐదెకరాల వరకు భూములున్నాయి. బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలో స్థలాలను అమ్మేసి రూ.3 కోట్లతో అమరావతిలో మూడెకరాలు కొన్నారు. ఇప్పడు వాటికి ధర లేదు. ఆయన అమ్మేసిన భూముల ధర రూ.11 కోట్లకు చేరింది. తమ భూముల ధరలు పెరగాలంటే బాబును గద్దెనెక్కించాలని కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన అమాయకులను రెచ్చగొట్టి పాదయాత్రలు చేయిస్తున్నారు. 500 కిలోమీటర్ల దూరాన్ని 50 రోజుల్లో పూర్తి చేస్తారు. నా నియోజకవర్గంలో మాత్రం 45 రోజుల పాటు యాత్ర చేస్తారట. పాదయాత్ర ప్రారంభించగానే రామోజీరావు మీడియాలో మహా ఉద్యమం కలరింగ్ ఇస్తున్నారు. రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, ఖమ్మంలో కార్పొరేటర్‌గా కూడా గెలవలేని రేణుకా చౌదరి సైతం డాంబికాలు పలుకుతున్నారు. -
ఎక్కడా వాళ్ల మనోభావాలు దాచుకోలేదు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: అమరావతి-అరసవిల్లి యాత్రను ఒక మహా ఉద్యమంగా ఈనాడు దిన పత్రిక చిత్రీకరించడాన్ని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తప్పుపట్టారు. ఇది నారా వారి కథ.. స్క్రీన్ ప్లే అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. అందుకు అనుగుణంగానే వారు కూడా వాళ్ల మనోభావాలను ఎక్కడా దాచుకోలేదు. పైగా నారా హమారా.. అమరావతి హమారా నినాదాలు ఇచ్చినటు ఈనాడులో రాశారు. టీడీపీ సభ్యులకు దమ్ముంటే అమరావతిపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలి. చంద్రబాబు బయట, సభ్యులు అసెంబ్లీ లోపల ఉండటం కాదు. ఆయన్ను కూడా అసెంబ్లీకి తీసుకురావాలి. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా వద్దనే హక్కు మీకెక్కడదని ప్రశ్నించారు. అమరావతిపై విమర్శలు చేస్తే బుచ్చయ్య చౌదరికి కోపం రావడంలో తప్పు లేదు. అయితే అమరావతిపై బుచ్చయ్య చౌదరి చెప్పే పెదరాశి పెద్దమ్మ కబుర్లు ఆపాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. చదవండి: (రాజధాని అమరావతి అసైన్డ్ భూముల స్కామ్‌లో ఐదుగురు అరెస్ట్) -
‘కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం.. చంద్రబాబు’
సాక్షి, కాకినాడ: తన స్వార్థ రాజకీయాలే చంద్రబాబుకు ముఖ్యమని.. రాష్ట్రం ఏమైపోయినా ఆయనకు అవసరం లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు లాంటి వ్యక్తి ఏపీలో ఉండటం ప్రజల దురదృష్టమన్నారు. చదవండి: మా ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలా? చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైర్ ‘‘చంద్రబాబు డైరెక్షన్లోనే అమరావతి ఉద్యమం. ఆయనకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. అమరావతి ఉద్యమానికి చంద్రబాబే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. అన్ని ప్రాంతాల ప్రజలూ సమానమైన భావన ఉండాలి. చంద్రబాబుకు రాజకీయం, రియల్ ఎస్టేట్ ముఖ్యం.. అమరావతి యాత్ర పూర్తిగా రాజకీయ యాత్ర’’ అంటూ కన్నబాబు నిప్పులు చెరిగారు. ‘‘మీ ఆస్తులు పెంచుకునేందుకే యాత్ర పేరుతో డ్రామాలు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆత్మగౌరవం లేదా?. దుష్ట చతుష్టయం పన్నాంగం పన్నుతోంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో ఏం చెప్పారో తెలీదా?. టీడీపీ సొంత అజెండాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయదు. చంద్రబాబు లాంటి స్వార్థపరుడి చేతికి రాష్ట్రం వెళ్లకూడదు. టీడీపీ తప్పుడు ప్రచారాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు’’ అని కన్నబాబు అన్నారు. -
18 మంది విద్యార్థులకు అస్వస్థత
కాకినాడ రూరల్: ఊపిరి ఆడక 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటన మంగళవారం కాకినాడలోని కేంద్రీయ విద్యాలయలో చోటు చేసుకుంది. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో ఉన్న కేంద్రీయ విద్యాలయలో 473 మంది చదువుకుంటున్నారు. మంగళవారం మొదటి పీరియడ్ 9.30 గంటలకు ప్రారంభం కాగా, 6వ తరగతి విద్యార్థి ఒకరు తనకు ఊపిరి ఆడడం లేదని.. కళ్లు మండుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత వరుసగా మరో 17 మంది ఇదే సమస్యతో తరగతి గదుల నుంచి బయటకు వచ్చేశారు. వీరిలో 11 మంది అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరందరినీ సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. వీరిలో ముగ్గురు విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. మిగతా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వారందరినీ పరిశీలనలో ఉంచామని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీ బుద్ధా తెలిపారు. విద్యార్థులను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్లా పరామర్శించారు. పాఠశాలను పరిశీలించిన అధికారుల బృందం డీఎంఅండ్‌హెచ్‌వో రమేష్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, పొల్యూషన్ కంట్రోల్ అధికారి వెంకటాచలం, డీఎస్పీ భీమారావు, ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ నాగూర్ మీరా, తహశీల్దార్ మురార్జీ తదితరులు స్కూల్‌ను పరిశీలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణం తరగతి గదుల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటమేనని భావిస్తున్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు నురుగు వచ్చే పోమ్తో కూడిన స్ప్రే టిన్లను వినియోగించినట్టు తెలిసింది. రాత్రి కిటికీలు మూసి ఉండటంతో స్ప్రేలో ఉండే ఐసోసైనెట్, పాలియాల్ రసాయనాలు గదుల్లో వ్యాపించి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. కలెక్టర్ చైర్మన్‌గా విచారణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. -
సీఎం జగన్ మోహన్ రెడ్డి వెంటే ప్రజలంతా ఉన్నారు : కన్నబాబు
-
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. పది స్థానాలకు గాను పదీ గెల్చుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు పార్టీకి ఉన్న అభ్యర్థులకంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇలా ఇతర పార్టీల సభ్యులు కూడా వైఎస్సార్సీపీకి ఓటేయడం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలనకు నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జీవీఎంసీలో వైఎస్సార్సీపీకి 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు. నలుగురు స్వతంత్రుల మద్దతు తోడవడంతో మొత్తంగా 62 మంది ఉన్నారు. స్థాయీ సంఘానికి పోటీ చేసిన 10 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లలలో నలుగురికి 67 ఓట్లు చొప్పున పోలయ్యాయి. ఇద్దరికి 66, ముగ్గురుకి 65, ఒక కార్పొరేటర్‌కు 64 చొప్పున ఓట్లు వచ్చాయి. టీడీపీ, సీపీఐ, బీజేపీల నుంచి కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, ప్రధానంగా టీడీపీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లు వేశారు. జగన్ ప్రభుత్వానికి టీడీపీ కార్పొరేటర్ల మద్దతు : కన్నబాబు ఈ సందర్భగా మాజీ మంత్రి, జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల ఇన్చార్జి కురసాల కన్నబాబు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కార్పొరేటర్లు కూడా సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతు పలకడం విశేషమన్నారు. విశాఖ మహానగరాన్ని పరిపాలన రాజధానిగా చేయడానికి సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తుంటే చంద్రబాబు అడ్డు తగులుతున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి సూచనలు, సలహాలతో ఈ విజయం సాధించామని చెప్పారు. అలాగే మంత్రి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నగర మేయర్, పార్టీ నగర అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా కాకినాడ జిల్లా ప్లీనరీ
కాకినాడ రూరల్/కరప: వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా ప్లీనరీ మంగళవారం సాయంత్రం కాకినాడ రూరల్ పరిధిలోని నడకుదురులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్లీనరీకి భారీఎత్తున వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకాగా.. ఆరు అంశాలపై తీర్మానాలు చేశారు. ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి సీదిరి అప్పలరాజు, మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ పిల్లి సుభాష్‌చంద్రబోస్, పరిశీలకురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎంపీ వంగా గీత, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. -
రైతు సంక్షేమానికి జగన్ నిరంతర కృషి
కాకినాడ రూరల్: రైతుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వడం లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయంగా నాలుగు విడతలుగా ఏడాదికి రూ.12,500 చొప్పున రూ.50 వేలు ఇస్తామని చెప్పి అంతకంటే ఎక్కువగా ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్ళ పాటు రూ.67,500 అందిస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా ఇవ్వదని చెప్పారు. కౌలు రైతులకు, గిరిజన రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులు, దేవదాయ సాగుదారులకు కేంద్రం పీఎం కిసాన్ పథకం వర్తింపజేయదని చెప్పారు. కానీ సీఎం జగన్ రైతు పక్షపాతిగా అందరికీ సాయం అందిస్తున్నారని తెలిపారు. పెట్టుబడి సాయం కింద ఇప్పటివరకు రూ.20,117.58 కోట్లు రైతుల అకౌంట్లో వేశారని, దాదాపు 52.38 లక్షల కుటుంబాలు లబ్ధిపొందాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీతో స్నేహం చేస్తున్న పవన్.. పీఎం కిసాన్‌లో కౌలు రైతులకూ సాయం చేయాలని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు రైతులతో రాజకీయం చేస్తారని, జనసేన కూడా అదే బాటలో వెళ్తోందని కన్నబాబు ఎద్దేవా చేశారు. -
కొత్త జిల్లాలతో రైతులకు మరింత మెరుగైన సేవలు
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: కొత్త జిల్లాలతో రైతులకు మరింత వేగంగా మెరుగైన సేవలందే అవకాశం ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు సైతం ఏపీలో అమలు చేస్తున్న సంస్కరణలు, విధానాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని తెలిపారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులతో బుధవారం మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత వేగంగా నాణ్యమైన సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిందని చెప్పారు. దీనికి తగినట్లుగా రైతులకు సేవలందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. రైతుల ప్రతి అవసరాన్ని.. వారి వద్దకే వచ్చి తీర్చేందుకు ప్రభుత్వం ఆర్బీకేలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆర్బీకే వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయం అందరికే తెలిసిందేనన్నారు. పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ తదితరాల రూపంలో ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులు అధిక దిగుబడులు, మంచి ధరలు పొందుతున్నారని పేర్కొన్నారు. గత మూడేళ్లలో రాష్ట్ర రైతులకు 1.10 లక్షల కోట్ల లబ్ధిని చేకూర్చామని వివరించారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ జానకిరామ్ పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయంపై సర్టిఫికెట్ కోర్సు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి ‘ఉద్యాన పంటల్లో సేంద్రియ వ్యవసాయం’పై సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. కోర్సు కరదీపికను విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి కన్నబాబు తదితరులు ఆవిష్కరించారు. -
పవన్ కల్యాణ్ ఆ రోడ్ మ్యాప్‌లోనే వెళ్తున్నారు: మంత్రి కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలు మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని సీఎం జగన్ చెప్పారు. ఇటీవలే గుడ్ గవర్నెన్స్‌లో మేము మొదటి స్థానంలో నిలిచాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే మాకు ఆ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా జగన్‌పైనే.. నేడు అధికారంలో ఉన్నా జగన్ పైనే ఆయన విమర్శలు చేస్తున్నారు. చదవండి: (ఏపీలో 5 గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్‌లు) పవన్ బీజేపీ రోడ్ మ్యాప్ కాదు.. టీడీపీ రోడ్ మ్యాప్‌లో వెళ్లున్నారు. కౌలు రైతులు అంటూ టీడీపీ ఇచ్చిన మ్యాప్‌లో వెళ్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలపై పవన్ ఎందుకు స్పందించలేదు. మా పెట్టుబడి సాయం పథకమే రైతు భరోసా.. మీరు భరోసా ఇచ్చేదేంటి..?. విత్తనం నుంచి విక్రయం వరకూ మా ప్రభత్వుం రైతు వెన్నంటే ఉంది. ఇప్పటివరకు 12 లక్షలకు పైగా కౌలు రైతుల కార్డులు ఇచ్చాం. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు సాయం చేయలేదు. కౌలు రైతులకు పీఎం కిసాన్ ఇవ్వాలని ఏనాడైనా కేంద్రానికి లేఖ రాశారా?. పవన్‌ది ఆవేశపూరిత రాజకీయం.. జగన్‌ది అర్థవంతమైన రాజకీయం' అని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. చదవండి: (కొత్త జిల్లాలకు కోడ్లను కేటాయించిన కేంద్రం) -
రాజకీయ లబ్ధికే పవన్ పాకులాట
తిరుపతి రూరల్: కౌలు రైతుల ఆత్మహత్యల పేరుతో పవన్‌కల్యాణ్ రాజకీయ స్వలాభం కోసం పాకులాడుతున్నారని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గతంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. తిరుపతిలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులను చెయ్యిపట్టి నడిపిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనన్నారు. రైతులకు ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనే రాకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి అందిస్తున్నారన్నారు. దురదృష్టవశాత్తు ఎక్కడైనా సంఘటన జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు అ«ధికారంలోకి వచ్చిన రోజునే ఎక్స్‌గ్రేషియాను రూ.7 లక్షలకు పెంచినట్లు కన్నబాబు తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చేవారని.. కానీ, అందులో రూ.1.5 లక్షలు అప్పు చెల్లించడానికి జమచేసే వారని గుర్తుచేశారు. 2014–18 వరకు రైతు ఆత్మహత్యలుగా నమోదై, ప్రభుత్వం నిర్ధారించకుండా వదలేసిన 469 మంది రైతు కుటుంబాలకు జగన్ ప్రభుత్వం రూ.23.45 కోట్లు పరిహారాన్ని చెల్లించిందన్నారు. అప్పుడు పవన్ దీనిపై ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కౌలు రైతులను ఆదుకోవడానికి నాడు టీడీపీ ప్రభుత్వం కాని, కేంద్రంలో వున్న బీజేపీ ప్రభుత్వం కానీ ఏమాత్రం ప్రయత్నించలేదని మండిపడ్డారు. రైతులకు సమానంగా వారికీ పథకాలు.. ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకూ ఏటా రూ.13,500లను పెట్టుబడి సాయంగా అందిస్తున్న విషయం పవన్‌కల్యాణ్ తెలుసుకోవాలని కన్నబాబు తెలిపారు. వారికీ పంట బీమా, పంట నష్టపరిహారం అందిస్తున్నామన్నారు. వైఎస్సార్ రైతుభరోసాలో భూ యజమానికి పెట్టుబడి సాయం అందిస్తూ అదే రైతు కొంత భూమి కౌలుకు ఇస్తే ఆ కౌలుదారునికి కూడా పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. కౌలు రైతులకు పీఎం కిసాన్ పథకం ఎందుకు అమలుచేయడంలేదో కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించాలన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు 12.11 లక్షల మంది కౌలురైతులకు సీసీఆర్సి కార్డులను అందించామన్నారు. జాయింట్ లయబులిటీ గ్రూప్స్ (జేఎల్‌జీ) కింద వారిని 26,523 గ్రూపులుగా చేసి ఇప్పటివరకు వారికి రూ.5,162 కోట్ల పంట రుణాలను అందించామన్నారు. కౌలు రైతులకూ వందశాతం రుణాలు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలను ఆర్బీకేలతో సమన్వయం చేసి భూమిలేని కౌలు రైతులకు వందశాతం రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామని కన్నబాబు వెల్లడించారు. ఏప్రిల్ ఒకటి నుంచి నెల రోజులపాటు ఆర్బీకే స్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న కౌలురైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించడం.. సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, పంటల బీమాలతో పాటు వారి పంటలను కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రైతుల ఆత్మహత్యల నిర్ధారణకు.. తక్షణం సాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద రూ.కోటి చొప్పున నిధులను ఏర్పాటుచేశామన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యలంటూ పవన్ మాట్లాడడం మంచిపద్ధతి కాదన్నారు. -
'మే'లో తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి విడత పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో అందించే ఏర్పాటు చేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈసారి మరింత మందికి లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. తొలి విడతలో రూ.7,500 సాయం అందిస్తుంది. రెండో విడతలో రూ. 4 వేలు, మూడో విడతలో రూ.2 వేలు సాయం అందిస్తుంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ భూ సాగుదారులకు పెట్టుబడి సాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 2019–20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు, 2020–21లో 51.59 లక్షల కుటుంబాలకు రూ.6,928 కోట్లు, 2021–22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,016.59 కోట్ల సాయమందించింది. ఇలా గత మూడేళ్లలో రూ.20,117.59 కోట్ల సాయం అందించింది. ఈ పథకం కోసం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.7,020 కోట్లు కేటాయించింది. గత మూడేళ్లలో లబ్ధి పొందని వారికీ అవకాశం గతేడాది లబ్ధి పొందిన అందరూ ఈ ఏడాదీ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. చనిపోయిన, అనర్హులైన వారిని జాబితా నుంచి తొలగిస్తారు. అర్హులై ఉండి గతంలో లబ్ధి పొందని వారు రైతు భరోసా పోర్టల్‌లోని ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‘ మాడ్యూల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఆర్బీకేల్లోని వ్యవసాయ సహాయకులను (వీఏఏలను) సంప్రదించి పోర్టల్‌లో వివరాలు నమోదుచేయించాలి. అటవీ భూమి సాగు చేస్తున్న రైతుల వివరాలను ఐటీడీఏ పీవోల నుంచి సేకరిస్తున్నారు. వీరి జాబితాలను కూడా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. అనర్హుల తొలగింపు, అర్హుల నమోదు ప్రక్రియను ఏప్రిల్ 15వ తేదీకల్లా పూర్తి చేసి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆమోదానికి పంపిస్తారు. ఏప్రిల్ 30వ తేదీలోగా అర్హులను ఖరారు చేసి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. సీసీఆర్సీ కార్డులున్న కౌలుదారులకు ‘భరోసా’ కౌలు రైతులు రైతు భరోసా లబ్ధి పొందడానికి కచ్చితంగా సీసీఆర్సీ కలిగి ఉండాలని నిబంధన విధించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ కార్డుల జారీ కోసం ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో అవగాహన కల్పిస్తారు. వాస్తవ సాగుదారులు విధిగా వ్యవసాయాధికారులను సంప్రదించి తమ వివరాలు సీసీఆర్సీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అర్హతనుబట్టి మే 1నుంచి సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తారు. వీరు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ క్రాప్‌లో నమోదు చేయాలి. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హులను గుర్తిస్తారు. వారికి ‘వైఎస్సార్ రైతు భరోసా’ అందుతుంది. అర్హత పొందని వారికి అవకాశం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకాన్ని ఈ ఏడాది మరింత పగడ్బందీగా అమలు చేస్తున్నాం. గతేడాది లబ్ధి పొందిన వారి జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. అనర్హులను తొలగించడంతో పాటు గడిచిన మూడేళ్లలో అర్హత పొందని వారు పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించాం. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తాం. –హెచ్ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా అన్నదాతకు అండగా నిలిచే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత మూడేళ్లుగా పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనం. – కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి -
ప్రతి పార్లమెంటు స్థానంలో నైపుణ్య కాలేజీ
సాక్షి, అమరావతి: ఆయా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో శుక్రవారం నైపుణ్య శిక్షణకు సంబంధించిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. స్థానికంగా ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అవసరాలకు సరిపోయేలా ఈ కార్యక్రమాలు రూపొందించినట్లు చెప్పారు. వివిధ రంగాల నిపుణులు, విద్యా సంస్థలు పేరుగాంచిన శిక్షణా భాగస్వాముల ద్వారా యువతలో నైపుణ్యాలు, నైపుణ్యాల స్థాయిని పెంచుతున్నట్లు తెలిపారు. అత్యాధునిక నైపుణ్య కోర్సులను అందించడానికి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కళాశాలలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. తిరుపతి వద్ద స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు. విజ్ఞాన కేంద్రాలుగా ఆర్బీకేలు మరో ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 10,778 రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయన్నారు. ఆ కేంద్రాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటుచేస్తున్నామని, శాస్త్రవేత్తల సూచనలు అక్కడి నుంచే అందించే ఏర్పాటు చేశామన్నారు. పొలం బడుల్ని వాటికి అనుసంధానం చేశామన్నారు. అంతేకాక.. రైతులకు సంబంధించిన అన్ని సేవల్ని ఈ కేంద్రాల ద్వారా అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇవి అన్ని రకాల పంటలకు సేకరణ కేంద్రాలుగా కూడా ఉన్నాయన్నారు. -
త్వరలో మిల్లెట్ మిషన్ పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలోనే ‘మిల్లెట్ మిషన్ పాలసీ’ని తీసుకొస్తామని, దీనిద్వారా చిరుధాన్యాల సాగుకు మరింత ఊతమిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించిన రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) వ్యవస్థ ఒక విప్లవమని, దీని ద్వారా ప్రతి గ్రామంలోను రైతుకు సొంత కార్యాలయం ఉందనే ధీమా కలిగిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై శాసన మండలిలో గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రైతులకు కావాల్సిన ప్రతి సేవా ఆర్బీకేల్లో అందుతోందన్నారు. ఎమ్మెల్సీలు సైతం తమతమ గ్రామాల్లో వీటిని సందర్శించాలని కన్నబాబు విజ్ఞప్తిచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రేటింగ్‌లో వ్యవసాయ రంగంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని.. స్కోచ్ తదితర అవార్డులు మన వ్యవసాయ రంగానికి దక్కాయని కన్నబాబు తెలిపారు. ఇక.. రాష్ట్రంలో ప్రతి పంటకూ ఈ–క్రాప్ బుకింగ్ సిస్టమ్ ద్వారా బీమాను వర్తింపజేస్తున్నామని, వచ్చే సీజన్ నుంచి బీమా నమోదుకు సంబంధించి రశీదులిచ్చే విధానాన్ని అమలుచేస్తామని కూడా ఆయన వెల్లడించారు. భూ యజమాని అనుమతితో సంబంధంలేకుండానే ఈ–క్రాప్‌లో కౌలురైతులనూ నమోదు చేసి వారికి మేలు చేస్తున్నామని.. పెట్టుబడి సాయం అందించేలాకూడా వారికి సీసీఆర్సీ కార్డులను జారీచేస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా సుబాబుల్, సరుగుడు కొనుగోలు సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు పంటనూ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు చెప్పారు. పేపర్ పరిశ్రమకు ముడిసరుకుగా ఉపయోగపడే సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడుకు ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ధర దక్కడంలేదన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే వాటి కటింగ్ ఆర్డర్ కోసం ఆర్బీకేల ద్వారా నమోదు చేసే పద్ధతిని చేపట్టామన్నారు. క్షేత్రస్థాయిలో కొత్తగా ఉద్యోగ నియామకాలు అయ్యే వరకు ఎంపీఈఓలను కొనసాగిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో స్మశాన వాటికల ఆక్రమణ, కొరత తదితర ఇబ్బందులపై చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బదులిచ్చారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా రాష్ట్రంలో అంగన్వాడీల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తీçసుకుంటున్న ప్రత్యేక చర్యలతో మాత, శిశు మరణాల రేటు తగ్గిందని మరో మంత్రి తానేటి వనిత బదులిచ్చారు. వచ్చే నెలలో ఆర్బీకేను సందర్శించనున్న గవర్నర్ రాష్ట్రంలో ఏదో ఒక రైతుభరోసా కేంద్రాన్ని స్వయంగా పరిశీలించేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అంగీకరించారని మంత్రి కన్నబాబు గురువారం ‘మండలి’లో తెలిపారు. ఏప్రిల్‌లో ఆయన సందర్శించే అవకాశముందని.. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారన్నారు. -
టీడీపీ సభ్యులకు కన్నబాబు అదిరిపోయే సమాధానం..
-
పెగసస్ వ్యవహారంలో దొరికిపోవడం ఖాయం
సాక్షి, అమరావతి: పెగసస్ వ్యవహారంలో ఉత్తరకుమార ప్రగల్భాలు మాని కేసును ఎదుర్కొనేందుకు లోకేశ్ సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. హౌస్ కమిటీ విచారణలో పెగసస్ వినియోగంపై పూర్తి వాస్తవాలు బయటకొస్తాయన్నారు. కోర్టులో స్టే కూడా రాదని.. పూర్తి ఆధారాలతో దొరికిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల్లో గెలవాలనే కుట్రతో వైఎస్సార్సీపీ నాయకులు, ఐఏఎస్ అధికారులు, సామాన్య ప్రజలు, సినిమా యాక్టర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేస్తూ దుర్మార్గమైన పాలన సాగించారని విమర్శించారు. దీనిపై అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూడా చాలా ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. చంద్రబాబు రోడ్లపైన, కొడుకు లోకేశ్ శాసనమండలిలో సవాళ్లను విసరడం అలవాటుగా పెట్టుకున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏ కేసులోనైనా స్టే తెచ్చుకోవచ్చనే ధైర్యంతో బతుకుతున్నారు తప్ప.. తప్పు చేయలేదనే ధైర్యం వారిలో లేదని ప్రజలందరికీ అర్థమైందన్నారు. జాతీయ భద్రత, ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశంలో చిన్నపిల్లాడిలా సవాళ్లు విసరడం సరికాదని లోకేశ్‌కు హితవుపలికారు. -
హౌస్ కమిటీ అంటే టీడీపీకి భయమెందుకు?: మంత్రి కన్నబాబు
-
హౌస్ కమిటీ అంటే టీడీపీకి భయమెందుకు?
తాడేపల్లి: పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తే టీడీపీకి భయమెందుకని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. ‘తప్పు చేశాం.. ప్రాయశ్చిత్తం చేసుకుందాం’ అని కూడా టీడీపీకి లేదని కన్నబాబు విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడిన కన్నబాబు పెగాసస్ వ్యవహారంపై కమిటీ వేయడం శుభపరిణామం అని అన్నారు. కాగా, పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం మాట్లాడుతూ.. పెగాసస్‌పై హౌస్‌కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ హౌస్ కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు. దీనికీ సంబంధించి కమిటీ సభ్యులను రేపు(మంగళవారం) కానీ, ఎల్లుండి(బుధవారం)కానీ ప్రకటిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందనేది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం కలకలం సృష్టిస్తుండగా, దీనిపై హౌస్ కమిటీ వేస్తున్నట్లు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో ప్రకటించారు. ‘అనధికార సంఘటనలకు ఈనాడు మద్దతు పలుకుతుందా?’ -
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో ఇంటర్వ్యూ
-
అబద్ధాలపై చర్చకు పట్టు
సాక్షి, అమరావతి: ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి టీడీపీ ఎంతకైనా తెగిస్తుందనడానికి గత సంఘటనలు ఎన్నో నిదర్శనంగా నిలిచాయి. ఈ కోవలో తాజాగా జంగారెడ్డిగూడెం అంశాన్ని తీసుకొని అబద్ధాన్ని ఎలాగైనా నిజం చేయాలని టీడీపీ పదేపదే ప్రయత్నిస్తోంది. ఇటు అసెంబ్లీలో, అటు బయట గందరగోళం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆ పార్టీ శ్రేణులు వ్యూహం రూపొందించాయి. బుధవారం కూడా శాసనసభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు సభను అడ్డుకోజూశారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని, సీఎం అసెంబ్లీలో అసత్యాలు మాట్లాడారంటూ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి అడ్డుతగిలారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంత వారించినా వినలేదు. దీంతో సభ ప్రారంభమైన 20 నిమిషాలకే స్వీకర్ అయిదు నిమిషాల విరామం ప్రకటించారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వారు అదే ధోరణి కొనసాగించారు. దీంతో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం ఎటువంటి పదాలు వాడాలో తెలియడం లేదని అన్నారు. ఇలాంటి సభ్యులు ఉండటం ఖర్మ అని, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిని కావడంతో సహనంతో ఉన్నానని, ఇంకొకరైతే ఈ పాటికి చర్యలు తీసుకునేవారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జోక్యం చేసుకుంటూ.. టీడీపీ బండారాన్ని గురువారం సభలో బయట పెడతానని అన్నారు. అప్పుడేం సమాధానం చెబుతారో చూద్దామంటూ సవాల్ విసిరారు. స్పీకర్ పదేపదే చెప్పినా తీరు మారకపోవడంతో ఇతర సభ్యుల హక్కుల పరిరక్షణ కోసం 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయిన అనంతరం సభ సజావుగా నడిచింది. అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ.. వాస్తవాలను అంగీకరించడానికి ప్రతిపక్షం సిద్ధంగా లేదన్నారు. ప్రభుత్వం మీద బురదజల్లి రాజకీయ ప్రయోజనం పొందాలనే తాపత్రయమే వారిలో కనిపిస్తోందని చెప్పారు. వాస్తవాలను విస్మరించి, అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి నిస్సిగ్గుగా ప్రయత్నించడం జుగుప్స కలిగిస్తోందన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై సభలో చర్చించకుండా, అల్లరి చేసి బురదజల్లడం మీదే ప్రతిపక్షం ఎక్కువ ఆసక్తి చూపిస్తోందని ఆయన విమర్శించారు. వాయిదా తీర్మానం తిరస్కరణ శాసన మండలిలో టీడీపీ సభ్యులు ముగ్గురిపై వైఎస్సార్సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. దీనిని సభా హక్కుల కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం జగన్ అసత్య ప్రకటనలు చేశారని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలంటూ అంతకుముందు టీడీపీ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు. అసెంబ్లీలో జరిగిన విషయంపై మండలిలో చర్య కోరడం సరికాదని చైర్మన్ చెప్పారు. అయినా టీడీపీ సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమావేశాలను టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై మంత్రి కన్నబాబు తీవ్రంగా స్పందించారు. జంగారెడ్డిగూడెంలో పైడేటి సత్యనారాయణ (73) అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగానే చనిపోయారని, మద్యం వల్ల కాదని, ఒక్క రోజు కూడా మద్యం తాగని తమ తండ్రిని తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారని ఆయన కుమారుడు శ్రీనివాస్, కుమార్తె నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ టీడీపీ శవ రాజకీయాలు మానడంలేదని కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో కల్తీ నారా రాజకీయానికి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికీ సభా హక్కుల ఉల్లంఘన అని చెప్పారు. అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంపైన, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంపైన చర్చించే సమయంలో టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేయడం చూస్తే వారికి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందని మంత్రులు కన్నబాబు, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ తప్పుపట్టారు. పెద్దల సభకు కొత్తగా ఎన్నికైన తమ హక్కులకు టీడీపీ సభ్యుల తీరుతో భంగం కలుగుతోందని వరుదు కళ్యాణి, దువ్వాడ శ్రీనివాసరావు, మొండితోక అరుణ్‌కుమార్, వంశీకృష్ణ, భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను టీడీపీ సభ్యులు మండలిలో వక్రీకరించి చెప్పారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. టీడీపీ సభ్యులు అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, అంగర రామ్మోహన్‌లపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును మండలి చైర్మన్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసన మండలి బుధవారం ఆమోదం తెలిపింది. చంద్రబాబే కల్తీ: కన్నబాబు సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా సృష్టిస్తున్న చంద్రబాబే కల్తీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వివర్శించారు. బుధవారం సచివాలయం ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను కల్తీ సారా మరణాలంటూ జ్యుడిషియల్ విచారణ అడుగుతున్న లోకేష్‌కు సిగ్గుందా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి, వారి తప్పేమీ లేదని నివేదిక రాయించుకున్నారని చెప్పారు. ఏర్పేడులో ఇసుక మాఫియా లారీ ప్రమాదం జరిగి 22 మంది చనిపోయారన్నారు. ఈ రెండు సంఘటనల్లో చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పలేదని, బాధితులను ఓదార్చ లేదని, ఆర్థిక సాయం చేయలేదని, ఇప్పుడు మాత్రం రాజకీయ ర్యాలీలా జంగారెడ్డిగూడెం వెళ్లారని విమర్శించారు. బాధిత కుటుంబాలను సైతం టీడీపీ వారు బాధ పెడుతున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలతో సీఎం జగన్ మనోధైర్యాన్ని అంగుళం కూడా సడలించలేరని మంత్రి స్పష్టం చేశారు. ఎస్ఈబీని నాటుసారా, అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకే తెచ్చామన్నారు. -
మంచి బడ్జెట్.. అందుకే టీడీపీకి కడుపుమంట: కన్నబాబు
సాక్షి, అమరావతి: బడ్జెట్లో అన్ని రంగాలకు కేటాయింపులు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బడ్జెట్ అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వ్యవసాయానికే బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. మంచి బడ్జెట్ ప్రవేశపెడితే టీడీపీకి వాళ్లకు కడపుమంట అని దుయ్యబట్టారు. వనరులు, వసతులను సమకూర్పు సహా ఆదాయం పెంపుపై దృష్టి పెట్టామన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. చదవండి: ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు వ్యవసాయం, రైతుల సంక్షేమానికి సీఎం ప్రాధాన్యత ఇచ్చారు. టీడీపీ నేతల ఊహకు అందరాని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రతి జిల్లాల్లో వైఎస్సార్ రైతు భవన్ నిర్మించనున్నాం. రైతులకు విశ్రాంతి గృహాలు అందుబాటులో ఉంటాయి. అబద్ధాలను ప్రచారం చేయడంలో టీడీపీని మించిన వారు లేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.11వేల కోట్లకు పైనే కేటాయింపులు చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. -
భారతదేశంలో ఉత్తమ ఉద్యానవనంగా మన రాష్ట్రమే..!!
-
రూ. 40 వేలకోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం..!!
-
ఈ ఏడాది అందుబాటులోకి 30 కర్మాగారాలు..!!
-
ఆంధ్రప్రదేశ్‌లో పాలన జగన్మోహనం అయింది..
-
ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు
AP Minister Kannababu introduced Agriculture Budget 2022: ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్న మంత్రి కన్నబాబు.. రాయితీలతో పాటు నాణ్యత అందించే విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం కోసం వార్షిక బడ్జెట్లో రూ. 11,387.69 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి 614.23 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే సహకార శాఖకు రూ. 248.45 కోట్లు, ఆహార శుద్ధి విభాగానికి 146.41 కోట్లు, ఉద్యానశాఖకు 554 కోట్లు, పట్టు పరిశ్రమకు 98.99 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 421.15 కోట్లు, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 59.91 కోట్లు, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 122.50 కోట్లు కేటాయించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. పశు సంవర్ధక శాఖకు 1027.82 కోట్లు, మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ. 337.23 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు. వైఎస్సార్ జలకళకు 50 కోట్ల కేటాయింపులతో పాటు నీటి పారుదల రంగానికి 11450.94 కోట్ల ప్రతిపాదన ఉంచింది ఏపీ ప్రభుత్వం. -
బిందు సేద్యం బకాయిలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(ఏపీఎంఐపీ)కు సంబంధించి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ. 437.95 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఆయా కంపెనీలకు ఒకటి రెండ్రోజుల్లో నేరుగా ఈ మొత్తం చెల్లిస్తామన్నారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో బకాయిల విడుదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు అమలు కోసం షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,200 కోట్లతో 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టును అమలు చేయబోతున్నట్టు మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆర్బీకేల ద్వారా అవసరమున్న ప్రతి రైతుకు బిందు సేద్య పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. రాయలసీమ, ప్రకాశం తదితర జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. సబ్సిడీపై పెద్దఎత్తున డ్రిప్, స్ప్రింక్లర్ల పరికరాలను సమకూర్చనున్నట్టు ఆయన తెలిపారు.