land grabbing
-
పార్వతీపురంలో అక్రమంగా భూములు లాగేసుకుని.. టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలు
-
త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలవుతోందని, దాని అమలును ఏపీలో కూడా అనుమతించాలని కోరినట్లు చెప్పారు. డీలిమిటేషన్ నిరంతర ప్రక్రియనియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపునిస్తున్నట్లు చెప్పారు.పోలవరం 2027 కల్లా పూర్తిగత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ఎనిమిది లైన్లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరావతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్‌లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. -
జనసేన కార్యకర్తపై టీడీపీ దౌర్జన్యం.. పురుగుల మందుతో బెదిరింపు
-
గుర్రం విజయలక్ష్మి అరెస్ట్..
దుండిగల్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడమేగాక, వినియోగదారులను మోసం చేసి రూ.కోట్లు సంపాదించింది. పోలీసు కేసులు నమోదు కావడంతో దేశం విడిచి పారిపోయేందుకు యత్నించిన ఓ నిర్మాణ సంస్థ యజమానురాలిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేటలోని సర్వే నెంబర్ 170/3, 170/4, 170/5లోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత సదరు భూమి పలువురి చేతులు మారి చివరికి కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థకు చేరింది. సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం 3.20 ఎకరాల్లో 65 విల్లాల నిర్మాణం కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత సదరు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న కత్వ చెరువుకు సంబంధించిన 16 గుంటల ఎఫ్టీఎల్, మూడు ఎకరాల బఫర్ జోన్‌ను ఆక్రమించి ఏకంగా 300కు పైగా విల్లాలను నిరి్మంచింది. దీనిపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని 11 అక్రమ విల్లాలను గత సెప్టెంబరులో అధికారులు కూల్చివేశారు. అంతేగాక ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తమకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని, రిజి్రస్టేషన్లు సైతం చేసుకుని బ్యాంకుల్లో రుణాల్లో తీసుకుని రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లను కొనుగోలు చేశామని, చివరికి తమ విల్లాలను కూల్చివేశారని, సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని బాధితులు దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. విజయలక్ష్మిపై ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా గురువారం తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు అప్పగించారు. వారు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ఆలూరు చెరువును కబ్జా చేసిన పచ్చ పార్టీ నేతలు
-
అనంతపురం జిల్లాలో బరితెగించిన పచ్చ పార్టీ నేతలు
-
మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. మా జీవనాధారమైన భూముల్ని ఇవ్వలేమని తెగేసి చెబుతున్నవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు. కలెక్టర్‌పై దాడి జరిగిందనే సాకుతో పోలీసులు అర్ధరాత్రి మా ఇళ్లపై దాడులు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మా గొంతులు పిసికి, కళ్లకు బట్టలు కట్టి కొట్టారు. మాతో అనుచితంగా ప్రవర్తించారు. పిల్లలు ఏడుస్తున్నా విన్పించుకోకుండా మా భర్తల్ని కొడుతూ తీసుకెళ్లారు. కొందర్ని జైళ్లలో వేశారు. మరికొందరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. గత మూడ్రోజులుగా అన్నం తినలేదు. నిద్ర కూడా పోవడం లేదు. ఊళ్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చాం..’ అంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. సోమవారం ఆయా కమిషన్లను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు పేరుతో కేవలం గిరిజనుల భూముల లాక్కుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. మూడు పంటలు పండే భూములివ్వలేమని తొమ్మిది నెలలుగా అనేక అర్జీలు ఇస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. సీఎం బంధువులకు కంపెనీలు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. మంచి చేస్తడని రేవంత్‌కు ఓటేసినం: కిష్టిబాయి‘మాకు మంచి చేస్తడని రేవంత్‌రెడ్డికి ఓటేసినం. కానీ మమ్మల్ని రోడ్డుమీద కూర్చునేలా చేసిండు. మేము చావనికైనా సిద్ధం కానీ గుంటెడు భూమి కూడా ఇవ్వం. మా దగ్గరికొస్తే బాగుండదు. తొమ్మిది నెలల నుంచి దీనిపై కొట్లాడుతున్నాం. ఎన్నోమార్లు కలెక్టర్‌కు లేఖలిచ్చి కాళ్ల మీద పడ్డాం. ఎంతోమందిని వేడుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రైనా, ఆయన అన్న తిరుపతిరెడ్డి అయినా రాలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి 500 మంది పోలీసోళ్లను పంపి మా గొంతుక పిసుకుతాడా?, మా ఆడోళ్ల దాడిమీద చేపిస్తవా? ఇదేనా మీ తీరు? మా కొడంగల్ ముఖ్యమంత్రివి అనుకుంటే పూర్తిగా కొడంగల్ పేరునే కరాబ్ చేశావ్. అరెస్టు అయిన మా పిల్లలను బయటకు తేవాలే. మా భూముల జోలికి రావొద్దు..’ అని గిరిజన మహిళ కిష్టిబాయి డిమాండ్ చేసింది.గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమంటున్నారు?: జ్యోతి‘ఆ భూములు మా ముత్తాతల నుంచి మాకు వచ్చాయి. అవన్నీ పట్టా భూములే. వాటిని గుంజుకుందామని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మంచిగా పండే పంట పొలాలను లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది. అక్కడ ఫార్మా కంపెనీ వద్దని చెబుతున్నా వినడం లేదు. చావనైనా చస్తాం కానీ భూములివ్వం. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతున్నా రైతులపై ఎందుకు కేసులు పెడుతున్నారు? గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమని అంటున్నారు. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఊళ్లోకి వస్తే ఇద్దరు పోలీసులు కూడా రాలేదు కానీ ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి వస్తే రెండు బస్సుల పోలీసులు ఎందుకు వచ్చారు? తిరుపతిరెడ్డి వచ్చి భూములివ్వకుంటే బాగుండదని ఆడవాళ్లని బెదిరిస్తున్నాడు. కలెక్టర్‌పై దాడి జరిగిందని చెబుతూ తాగొచ్చి ఆడపిల్లలు అని కూడా చూడకుండా తప్పుగా ప్రవర్తించారు. మహిళలను కొట్టిన, తప్పుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జైల్లో ఉన్న నా భర్తను విపరీతంగా కొట్టారు. ఆయన్ను కొట్టిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అని తొమ్మిది నెలల గర్భిణి జ్యోతి విజ్ఞప్తి చేసింది.మూడ్రోజుల నుంచీ ఏడుస్తూనే ఉన్నాం: దేవీబాయి‘తొమ్మిది నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు పోతున్నాయని మేము బాధపడుతుంటే రాత్రిళ్లు వచ్చి మా ఇంటోళ్లని, పిల్లలను పట్టుకెళ్లారు. వారెక్కడున్నారో కూడా తెలియదు. మూడ్రోజుల నుంచి తిండీతిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నాం. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం..’ అని దేవీబాయి ఆశాభావం వ్యక్తం చేసింది.దాడి జరగలేదని కలెక్టర్ చెప్పినా అరెస్టులు చేశారు: సుశీల‘భూములు పోతున్నాయని తిండికూడా పోతలేదు. నిద్రపోవడం లేదు. చిన్నచిన్న భూములున్న మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కలెక్టర్ స్వయంగా దాడి జరగలేదని చెప్పినా రాత్రి 12 గంటలప్పుడు కరెంట్ ఆపేసి ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. జైల్లో ఉన్న మా వాళ్లను కలవకుండా చేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే భూములు మాత్రం ఇవ్వం..’ అని సుశీల తెగేసి చెప్పింది. -
పీవీ సింధు అకాడమీ కబ్జా.. ?
-
అమరావతి పార్టనర్.. ఈశ్వరన్‌కు జైలు శిక్ష
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట జరిగిన భూ దోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్వదేశంలో అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు తెగబడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం ‘కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (సీపీఐబీ) విచారణలో నిగ్గు తేలింది. ఈశ్వరన్ అవినీతికి పాల్పడినట్టు న్యాయ విచారణలో కూడా నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. జూనియర్ అధికారి నుంచి మంత్రిగా.. 2008లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీసర్‌గా ఉన్న ఈశ్వరన్ అనతి కాలంలో ఉన్నత స్థానానికి ఎగబాకారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్ నుంచి ఈశ్వరన్ భారీగా ముడుపులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేల్చింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ – సింగపూర్ పర్యాటక విభాగాల మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీ పోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గత ఏడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పదవికి రాజీనామా చేసిన ఈశ్వరన్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్ïÙట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించినట్లు ఒక అభియోగం నమోదైంది. బాబు భూ దోపిడీలో పార్టనర్ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం రాజధాని పేరిట యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఈశ్వరన్ ప్రధాన భూమిక పోషించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు, ఈశ్వరన్ ద్వయం కుట్రపూరితంగా తెరపైకి తెచ్చింది. ఒప్పందం సమయంలో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియంను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవీ పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2న కట్టబెట్టేశారు. దీనికి నాటి చంద్రబాబు కేబినెట్ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా హడావిడి చేసింది. స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులోనూ చంద్రబాబు గోల్మాల్ చేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటా కల్పించారు. రూ.306.4 కోట్లు మాత్రమే వెచ్చించే అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి ఏకంగా 58 శాతం వాటా కట్టబెట్టేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదట విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం వాటా దక్కనుండగా అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి మాత్రం 91.3 శాతం వాటా దక్కుతుందన్నది స్పష్టమైంది. ఆ కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్ సహకరించారు. తద్వారా స్టార్టప్ ఏరియాలో రూ.లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్ ఏరియాను ఆనుకుని ఉన్న 1,400 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బృందం బినామీ పేర్లతో కొల్లగొట్టింది. ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది. సింగపూర్‌లో చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్ హోటళ్లు, ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ ఈశ్వరన్ కీలక పాత్ర పోషించినట్లు అధికారిక, పారిశ్రామిక వర్గాలు చెబుతుండటం గమనార్హం. -
ఆళ్లగడ్డలో అఖిలప్రియ అనుచరుడి అరాచకాలు..
-
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేతల బరితెగింపు
-
సాధారణ ప్రజల భూములు కబ్జా చేసేందుకు టీడీపీ మూకల కుట్రలు
-
ఏపీలో కొనసాగుతున్న కూటమి నేతల భూ దందా
-
కబ్జా చేసి.. పట్టా భూమిలో కలిపేసి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో విలువైన భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మహేశ్వరం మండలంలోని రూ.180 కోట్ల విలువ చేసే భూదాన్ భూమి మాయమైంది. బోర్డు పేరున భూమి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో భూమి కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిలో బోర్డులు నాటి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఏళ్ల తరబడి అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో విలువైన ఈ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. భూదాన్ భూమి...మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 435లో 12.17 ఎకరాల భూమి ఉంది. 1955–58 పహాణీ ప్రకారం ఈ భూమి ఫకీర్ మహ్మద్ పేరున ఉంది. ఆయన దీనిని 3/1/1979న (ప్రొసీడింగ్ నంబరు: 1585/79 ) భూదాన్ బోర్డుకు దానం చేశారు. 1979–80 నుంచి 1985–86 వరకు భూదాన్ సమితి పేరున ఈ భూమి రికార్డుల్లో ఉంది.ఆ తర్వాత ఈ భూమిని ప్రభుత్వం స్థానికంగా ఉన్న ఐదుగురు పేదలకు దానం చేసింది. ఆ తర్వాత ఈ భూమి పక్కనే ఉన్న ఓ పట్టాదారు ఆధీనంలోకి వెళ్లింది. సదరు రైతు ఈ భూదాన్ భూమిని తన పట్టా భూమిలో కలిపేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పంట సాగు చేస్తున్నాడు. నివేదికతో సరి...అసైన్‌దారుల ప్రమేయం లేకుండా రికార్డుల్లో పేర్లు మారడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిని అప్పట్లో ఏపీ లోకాయుక్త సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని సుమోటో (కేసు నంబరు: 2585/2011)గా స్వీకరించింది. రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో మహేశ్వరం తహసీల్దార్ సదరు కబ్జాదారుకు రికార్డులు చూపించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇందుకు ఆయన నిరాకరించడంతో 14/2/2012లో ఈ భూమిని తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశాన్ని లోకాయుక్తకు కూడా నివేదించింది. ఈ భూమిలో హెచ్చరికల బోర్డు కూడా ఏర్పాటు చేసింది. అయితే కబ్జాదారు దీనిని కూలి్చవేయగా, తహసీల్దార్ ఫిర్యాదుతో మహేశ్వరం పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. కానీ ఇప్పటివరకు ఆ భూమిని స్వా«దీనం చేసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోరంబోకు..పట్టాగా మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609, 610లలో 33.8 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. నిన్నమొన్నటి వరకు పేదల చేతుల్లో ఉన్న ఈ భూములు ఇటీవల పెద్దల చేతుల్లోకి వెళ్లాయి. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ రూ.300 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. 1996 నుంచి ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూములు పోరంబోకు/గైర్హాన్ సర్కారివిగా నమోదై ఉన్నాయి. 2012లో ప్రభుత్వం వీటిని నిషేధిత జాబితా (22ఎ)లో చేర్చింది. ఆ మేరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. విలువైన ఈ భూములపై కన్నేసిన కొంతమంది బడానేతలు రికార్డులు మాయం చేసి గుట్టుగా వీటిని కాజేశారు. అసలు సర్వే నంబర్లకు అనేక బై నంబర్లు సృష్టించగా, పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. ఏడాదిక్రితం వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములు ఇటీవల పట్టా భూములుగా మారడంపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందగా, ఆయన విచారణకు ఆదేశించడం కొసమెరుపు. -
‘రింగ్’లో మింగారు!
సాక్షి, అమరావతి: రాజధాని.. ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ పెద్దలు చెలరేగిపోయారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేసి తమ భూముల విలువ భారీగా పెంచుకున్నారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో సీఆర్డీఏ చైర్మన్ హోదాలో చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా ఉన్న పొంగూరు నారాయణ బరితెగించి వ్యవహరించారు.లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో నారా లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. సీఐడీ దర్యాప్తులో ఈ కుంభకోణం పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. ‘హెరిటేజ్ ఫుడ్స్’కు కానుక..లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా కరకట్ట మీద ఉన్న తన అక్రమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఆ ఇంటిని ఉచితంగా ఇచ్చినట్లు ఆయన చెబుతుండగా నాడు చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు.తమ భూముల విలువ పెరిగేలా..ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించగా మార్కెట్ ధర రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. మార్కెట్ ధర ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. తద్వారా హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ అమరావతి పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని లెక్కతేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ రూ.24 కోట్లకు చేరుతుంది. సీఆర్డీఏ తొలి అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో నారాయణ అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్పించారు. పవన్ కళ్యాణ్‌కు 2.40 ఎకరాలుజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతిలో వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలో ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. ఏ1 చంద్రబాబు.. ఏ2 నారాయణ.. ఏ14 లోకేశ్ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం కేసు నమోదు చేసింది. అలైన్మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీదిఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు తొలుత 94 కి.మీ. పొడవుతో ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే దానివల్ల తమ భూముల విలువ పెరగదని గుర్తించిన టీడీపీ పెద్దలు అలైన్‌మెంట్‌ను మార్చేశారు. 3 కి.మీ. దక్షిణం వైపు జరిపేసి తాడికొండ, కంతేరు, కాజాలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని వెళ్లేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌ను ఆమోదించుకున్నారు.ఐఆర్ఆర్ కేసులో నిందితులుఏ–1: చంద్రబాబుఏ–2: నారాయణఏ–3: లింగమనేని రమేశ్ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్)ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్ఏ–7: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ఏ–14: నారా లోకేశ్ -
‘అసైన్డ్’ ఆక్రమణ.. బడుగుల భూముల్లో వాలిన పచ్చ గద్దలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రాజధాని పేరిట చంద్రబాబు సొంత సంస్థానాన్ని సృష్టించుకున్నారు. స్వతంత్య్ర దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని భూదోపిడీకి బాటలు వేశారు. ఆధునిక జమీందారులా మారిపోయి బడుగుల భూములకు ఎసరు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్ భూములను లాక్కున్నారు. రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూములను చెరబట్టారు. ప్రైవేట్ భూములను హస్తగతం చేసుకున్నారు. అధికారం అండతో భూ దందాలకు మార్గదర్శిగా నిలిచారు. 2014 – 19 మధ్య అధికారంలో ఉండగా భూసమీకరణ ప్యాకేజీ మార్కెట్ విలువ ప్రకారం ఏకంగా రూ.5,500 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టడం దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీగా రికార్డులకు ఎక్కింది. చంద్రబాబు బృందం అరాచకాలు సీఐడీ విచారణలో పూర్తి ఆధారాలతో నిగ్గు తేలాయి. దీనిపై సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.బెదిరించి లాక్కుని తాపీగా ప్యాకేజీ..అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు టీడీపీ పెద్దలు పక్కా వ్యూహం రచించారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమంటూ బెదిరించి 814 మంది బినామీల ముసుగులో కాజేశారు. అనంతరం అసైన్డ్ భూములకు ప్యాకేజీని ప్రకటించడం వారి కుతంత్రానికి నిదర్శనంగా నిలుస్తోంది. భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015 జనవరి 1న టీడీపీ సర్కారు జీవో నంబరు 1 జారీ చేసింది. ఆ జీవోలో ప్రైవేట్ భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను హడలగొట్టారు. దీంతో గత్యంతరం లేక కారు చౌకగా ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్ డీడ్ల ద్వారా విక్రయించే పరిస్థితి కల్పించారు. ఆ తరువాత అసైన్డ్ భూములకు కూడా భూసమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న తాపీగా జీవో నంబరు 41 జారీ చేశారు. అప్పటికే అసైన్డ్ భూములు టీడీపీ పెద్దల బినామీల పరం కావడంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా స్కెచ్ వేశారు.ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతర్ చట్ట ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఆ తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం. ఈమేరకు నాటి కలెక్టర్, సీఆర్డీయే, రెవెన్యూ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ తమ అభ్యంతరాలను జీవో 41 నోట్ ఫైళ్లలో ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా వెల్లడించారు. వీటిని లెక్క చేయకుండా బినామీల ద్వారా హస్తగతం చేసుకున్న భూములకు చంద్రబాబు ప్యాకేజీని ప్రకటించారు.అసైన్డ్ భూ దోపిడీదారులు..ఏ–1: చంద్రబాబు నాయుడుఏ–2 : పొంగూరు నారాయణఏ–3 : అన్నే సుధీర్‌బాబు (అప్పటి తుళ్లూరు మండల తహసీల్దార్)ఏ–4 : కేపీవీ అంజనీకుమార్ (ఎండీ, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్)1,100 ఎకరాలు.. 1,336 మంది బినామీలుచంద్రబాబు బృందం అమరావతి పరిధిలో ఏకంగా 1,100 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టింది. మొత్తం 1,336 మంది బినామీల పేరిట ఆ భూములను హస్తగతం చేసుకున్నారు. భూ సమీకరణ ప్యాకేజీ ప్రకారం ఆ భూముల విలువ ఏకంగా రూ.5,500 కోట్లు కావడం చంద్రబాబు భారీ భూదోపిడీకి నిదర్శనం.కోర్టును మోసం చేసి మరీ...అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేయడం విస్మయపరుస్తోంది. ఈ కుట్రను అమలు చేసేందుకు రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు. 1954 తరువాత భూ పంపిణీ రికార్డులేవీ లేవంటూ మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు. వాస్తవానికి 1954 తరువాత పలుదఫాలు పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ జరిగింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004–05లో అసైన్డ్ భూములను పంపిణీ చేశారు. అమరావతి అసైన్డ్ భూములలో 1954 తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నట్లు రుజువు చేసే రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1987, 2004–05లో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు ఉన్నట్లు వెల్లడైంది. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమగ్ర విచారణలో మొత్తం భూబాగోతం బట్టబయలైంది.ఉన్నతాధికారుల వాంగ్మూలంటీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు చేసినట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్‌గా పరిగణించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఏ 1 బాబు, ఏ 2 నారాయణఅమరావతి భూ దోపిడీ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్‌విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. -
బాబు భూ దోపిడీ ఖజానా!
సాక్షి, అమరావతి: ‘‘ఏ’’ అంటే.. అమరావతి అని వక్కాణిస్తున్న సీఎం చంద్రబాబు.. రాజధాని ముసుగులో తన అవినీతి, అరాచకాలకు కేంద్రంగా చేసుకున్నారు! బరితెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయపాత్రలా మార్చారు! నాటి తెల్ల దొరలే తెల్లబోయేలా వ్యవహరించారు! బ్రిటిష్ పాలకుల సామ్రాజ్యవాద దోపిడీని మరిపిస్తూ టీడీపీ పెద్దలు సాగించిన భూ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం అమరావతి... బడుగులు, పేదలకు స్థానం లేకుండా చంద్రబాబు సృష్టించుకున్న నయా జమిందారీ వ్యవస్థకు నిదర్శనం అమరావతి! పచ్చ రాబందులు గుప్పిట పట్టిన రూ.లక్షల కోట్ల విలువైన భూ ఖజానా అమరావతి! దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీకి మౌనసాక్షి అమరావతి!! ఈ భూ బాగోతాలు, తన నిర్వాకాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకే తాజాగా అమరావతిపై శ్వేతపత్రం అంటూ మరో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు.మోయలేని భారం మోపుతూ...రాజధానిగా అమరావతి ఎంపిక చేసిన ప్రాంతం ఇటు విజయవాడ కాదు.. అటు గుంటూరూ కాదు. మూడు పంటలు పండే సారవంతమైన పంట పొలాల్లో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుందని చంద్రబాబు అండ్ కో కట్టిన లెక్కలే చెబుతున్నాయి. ఒక్క ఎకరాలో కనీస మౌలిక వసతుల కల్పనకు (బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) రూ.2 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయడానికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చువుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. ఏటా ఆ వ్యయం పెరగడమే కానీ తగ్గదు. విభజన అనంతరం రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీగా నిధులు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పని కాదని నిపుణులు చేసిన హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదు. తాజాగా భారీగా నిధులు అవసరమంటూనే.. వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే రూ.7 వేల కోట్లు అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం.. సంపదను ఎలా సృష్టించి రాజధాని నిర్మాణం చేస్తుందనే ప్రశ్నకు జవాబు లేదు.భూములు లాక్కుని గాలి మేడలు..!అమరావతి వేదికగా చంద్రబాబు సాగించిన భూ దందాను అప్పట్లోనే నిపుణుల నుంచి సామాన్యుల వరకూ అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే భూములను నాశనం చేయవద్దని పర్యావరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. జీవనాధారమైన తమ భూములను కొల్లగొట్టవద్దని బడుగు, బలహీనవర్గాలు, పేద రైతులు వేడుకున్నారు. వారి విన్నపాలను బేఖాతర్ చేస్తూ చంద్రబాబు భారీ భూదోపిడీకి తెరతీశారు. అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకుని పరిహారం ప్రకటించుకున్నారు. 2014–19 మధ్య రాజధాని పేరిట అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం చేయని దురాగతం లేదు. అదిగో రాజధాని.. అల్లదిగో అమరావతి..! అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతకుముందు పక్కా పన్నాగంతో రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ పలు ప్రాంతాల పేర్లను తెరపైకి తెచ్చి సామాన్యులను బురిడీ కొట్టించారు. మరోవైపు ముందస్తుగా తాము భూముల కొనుగోలు చేసిన అమరావతిలో బినామీ మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. ఆకాశ హరŠామ్యల నగరం అంటూ గాలిలో మేడలు కట్టి రైతుల కాళ్ల కిందున్న భూమిని కాజేశారు.పచ్చ దండు దురాక్రమణ..దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీకి చంద్రబాబు బరి తెగించారు. రాజధాని ప్రచారంతో మాయాజాలం... భూసమీకరణ ముసుగులో దోపిడీ... అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లంక భూముల స్వాహా... ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి మలుపులు... అస్మదీయులకు యథేచ్ఛగా భూ పందేరాలు... ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా భూదోపిడీకి పాల్పడవచ్చో అన్ని విద్యలూ ప్రయోగించారు. అమరావతిపై చంద్రబాబు ‘పచ్చ దండు’ దండయ్రాత చేసి రూ.లక్షల కోట్ల విలువైన భూముల దురాక్రమణకు పాల్పడింది. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై వాలిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌తోపాటు నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగుంట మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు.. ఇలా పచ్చ దండు అంతా అమరావతిలో భూములను కొల్లగొట్టింది. అన్యాయంగా, ఏకపక్షంగా విభజనకు గురై కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆదిలోనే హంసపాదులా అభివృద్ధికి గండి కొట్టారు. తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో కనికట్టు చేశారు.మభ్యపుచ్చే యత్నాలు..నాడు ఐదేళ్లలో భూముల దోపిడీకి పాల్పడటం మినహా టీడీపీ పెద్దలు రాజధాని కట్టిందీ లేదు.. అభివృద్ధి చేసిందీ లేదు. చంద్రబాబు బృందం సాగించిన భూ దోపిడీ ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతోసహా బట్టబయలైంది. సీఐడీ న్యాయస్థానాల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఇక న్యాయ విచారణ ప్రక్రియ కొనసాగితే చంద్రబాబుకు యావజ్జీవ ఖైదు ఖాయమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సరికొత్త కుట్రలకు పన్నాగం పన్నుతున్నారు. అమరావతిలో తన భూ బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు శ్వేతపత్రం పేరుతో డ్రామాకు తెరతీశారు. రాజధాని నిర్మాణానికి తాను ఏం చేస్తానో చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసంతో ఊదరగొట్టారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ అమరావతి పేరిట చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన దోపిడీ దాచేస్తే దాగేది కాదు. ఇప్పటికే పూర్తి ఆధారాలతో సహా చార్జిషీట్ల రూపంలో నిక్షిప్తమైందన్నది నిఖార్సైన నిజం. -
సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
అమరావతి కలిపింది ఇద్దరినీ..
సాక్షి, అమరావతి : ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్‌ది ఐదో స్థానం.. అలాంటి దేశానికి మంత్రిగా ఉండి భారీ అవినీతికి బరితెగించి సింగపూర్ ప్రతిష్టకు మాయని మచ్చ తీసుకొచి్చన అమాత్యుడు ఈశ్వరన్.. అతనికి మన అమరావతి రింగ్ మాస్టర్ బినామీ బాబు జతకలిశారు. ఇంకేముంది రాజధాని పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి అందినంత దోచేశారు. తోడుదొంగలు ఇద్దరూ కలిసి అమరావతిలో స్టార్టప్ ఏరియా అంటూ ఏకంగా 1,400 ఎకరాలను కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. పాపం పండి ఇద్దరి బాగోతం బట్టబయలైంది. స్కిల్ స్కామ్ కేసులో ‘రాజధాని ఫైల్స్’ సూత్రధారి చంద్రబాబు, సింగపూర్‌లో అవినీతి అభియోగాలతో ఈశ్వరన్ అరెస్టయ్యారు. వీరిద్దరి అవినీతి లింకులు కలిసింది మాత్రం అమరావతిలోనే.. అవినీతి ‘ఆట’లో ఈశ్వరన్ వాటా.. సింగపూర్‌లో భారీ ఎత్తున అవినీతికి బరితెగించిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ ఆట కట్టింది. ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు పాల్పడ్డారని సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(సీపీఐబీ) నిగ్గు తేలి్చంది. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం ఏడేళ్లు శిక్ష పడవచ్చు. సింగపూర్‌కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించారని ఆ దేశ అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీపోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్షిట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒకటి ఉంది. చంద్రబాబు ‘స్కిల్’తో కటకటాలకు ఈశ్వరన్ తోడు దొంగ చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రూ.66 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆ«దీనంలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు నియమించిన మేనేజ్మెంట్ కమిటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బినామీలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఏమైనా న్యాయ వివాదాలుంటే లండన్ కోర్టును ఆశ్రయించాలన్నారు. స్టార్టప్ ఏరియాలో ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా తేల్చారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి తరువాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా రూ.25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. 20 ఏళ్లలో ఎకరా విలువ రూ.50 కోట్లకు చేరుతుందని చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం ...సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో 1,320 ఎకరాలు (1,070 + 250) ఉంటాయి. ఆ 1,320 ఎకరాలను రూ.50 కోట్ల చొప్పున విక్రయిస్తే రూ.66 వేల కోట్లు ఆర్జించే అవకాశముంది. బాబుతో కలిసి అభాసుపాలు కృష్ణా నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ రూ.66 వేల కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు, ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కలి్పంచి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి, తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్‌ను తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. ఆ 1,691 ఎకరాల్లోని 371 ఎకరాల్లో ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. సింగపూర్ కన్సార్షియం అసెండాస్‌కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు. 1,070 ఎకరాల విలువ రూ.4,280 కోట్లుగా లెక్కతేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. -
అవినీతిలో మేటి ప్రత్తిపాటి
ఆయన అవినీతిలో ఘనాపాఠి. పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలేపారు.కుంభకోణాలకు కేంద్రబిందువుగా నిలిచారు. భూ ఆక్రమణల నుంచి గ్రావెల్ తవ్వకాల వరకు అంతా దోపిడీ పర్వమే. రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన సీసీఐ స్కామ్‌కు సూత్రధారుడు. అగ్రిగోల్డ్ భూముల అక్రమ కొనుగోళ్ల వ్యవహారాల్లో అడ్డంగా దోచేశాడు. బడుగుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ఘనుడు. ఇదీ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు అవినీతి బాగోతం. చిలకలూరిపేట: గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రత్తిపాటి పుల్లారావు 2014–15 కాలంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో సీసీఐ కుంభకోణం జరిగింది. దాదాపు రూ.650 కోట్లు అక్రమాలు జరిగినట్లు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మంత్రి పాత్ర ఉన్నట్టు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కుంభకోణం అప్పటి ప్రభుత్వాన్ని కుదిపేసింది. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించిన అప్పటి ప్రభుత్వం అనంతరం 2016 నవంబర్‌లో చిలకలూరిపేట మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి కె.నాగవేణి సహా మొత్తం 26 మంది మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపేసుకుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో అగ్రిగోల్డ్ వెంచర్లలో 14.81 ఎకరాల భూమిని విడతలవారీగా ప్రత్తిపాటి పుల్లారావు తన సతీమణి ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ(ప్రత్తిపాటి వెంకట కుమారి) పేరుతో కారుచౌకగా కొన్నారు. అప్పటికే అగ్రిగోల్డ్ సంస్థ వివాదాల్లో ఇరుక్కోవడంతో ఆ సంస్థ భాగస్వాములను అధికారం అడ్డంపెట్టుకుని బెదిరించి ఈ భూములను చౌకగా కొట్టేశారనే ఆరోపణలు పుల్లారావుపై వెల్లువెత్తాయి. ఈ మొత్తం భూమిని ఆ తర్వాత గుంటూరుకు చెందిన కామేపల్లి వెంకటేశ్వరరావుకు, పెదకాకాని మండలం, ఉప్పలపాడుకు చెందిన చెరుకూరి నరసింహారావులకు దాదా పు 30 లక్షలు ఎక్కువకు విక్ర యించారు. ఈ భూమిని ఎకరా రూ. 20 లక్షలలోపు ధరకు కొన్న ప్రత్తిపాటి ఆ తర్వాత ఎకరా రూ.52 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. గ్రావెల్, రేషన్ మాఫియా యడ్లపాడు మండలంలోని అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి ప్రత్తిపాటి, ఆయన అనుచరులు రూ.కోట్లాది రూపాయలు గడించారు. చారిత్రాత్మక కొండవీడు కొండలనూ పిండి చేశారు. ప్రత్తిపాటిపై అప్పట్లో అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు బహిరంగ విమర్శలు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు రేషన్ మాఫియాను ప్రోత్సహించి రూ.కోట్లు వెనుకేశారు. అప్పట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో ఈయన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నీరు–చెట్టు పథకంలోనూ ప్రత్తిపాటి అనుచరులు రూ.కోట్లు కొల్లగొట్టారు. యడవల్లి దళిత భూములు కాజేసే కుట్ర చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో 1975లో సర్వే నెంబర్ 381లో ఉన్న 416.5 ఎకరాల భూమిని 250 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఏకపట్టాగా అందజేశారు. 1976లో యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కమిటీ పేరుతో లబ్దిదారులైన ఎస్సీ, ఎస్టీలు ఓ సొసైటీగా ఏర్పడి సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూముల్లో విలువైన బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉన్నట్టు తెలుసుకున్న ప్రత్తిపాటి సొసైటీనే రద్దు చేయించారు. ప్రభుత్వ భూములుగా ప్రకటింపజేశారు. బినామీలతో అక్రమ మైనింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో వైఎస్సార్ సీపీ, దళిత సంఘాల పోరాటానికి దిగాయి. దళితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వెళ్లారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక యడవల్లి దళితులకు న్యాయం జరిగింది. జర్నలిస్టులపై కక్ష చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎంవీఎన్ శంకర్ 2014 నవంబర్ 25వ తేదీ విధులు ముగించుకుని రాత్రి వేళ ఇంటి బయట బైక్ పార్క్ చేస్తుండగా ఇద్దరు దాడి చేశారు. అతను గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ కేసులో ప్రత్తిపాటి పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారన్న అక్కసుతో యడ్లపాడుకు చెందిన మాజీ విలేకరి మానుకొండ సురేంద్రనాథ్‌కు సంబంధించిన భూమిలో మంత్రి అనుచరులు భారీగా గ్రావెల్ తవ్వకాలు జరిపి విక్రయించారు. అదే భూమిని గతంలో ఇతరులకు అమ్మేందుకు సురేంద్ర అడ్వాన్సులు తీసుకున్నాడు. ఆ భూమి వివాదంలోకి వెళ్లడంతో తీసుకున్న అడ్వాన్సులు ఇవ్వలేక సురేంద్ర 2017 డిసెంబర్ 18న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుల్లా రావు సతీమణి పెత్తనం పుల్లారావు తన అధికారాన్ని రాష్ట్ర స్థాయిలో విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తే ఆయన సతీమణి వెంకాయమ్మ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇంటికి వచ్చి తనకు సలాం కొట్టలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.జ్యోతిర్మయితోపాటు ముగ్గురు వైద్యులు, ఓ హెడ్‌నర్సు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక సీనియర్ అసిస్టెంట్‌ను బదిలీ చేయించారు. ఏ కార్యాలయంలోనైనా ఫైల్ కదలాలంటే ముందు మేడమ్‌కు కప్పం కట్టాల్సిందే అన్నంతగా అవినీతికి పాల్పడ్డారు. పుల్లారావుపై కేసులివే.. ♦ ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పిల్లి కోటిని అరెస్టు చేసినప్పుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ప్రత్తిపాటి పుల్లారావుపై చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 45/2020 యూ/ ఎస్ 341.18855/ కింద కేసు నమోదు చేశారు. ♦ మంచినీటి చెరువువద్ద ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ అనుమతులు లేకుండా ప్రారంభించేందుకు యత్నించి విధుల్లో ఉన్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కోడిరెక్క సునీతపై దాడి చేసినందుకు క్రైమ్ నంబర్ 136/2022 యూ/ఎస్ 353, 509, 506,323 ఆర్/డబ్ల్యూ, 34 ఐపీసీ – సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్),3(2)(వీఏ) ఆఫ్ ఎస్సీ/ఎస్టీ పీఓఏ యాక్ట్ కింద ప్రత్తిపాటిపై కేసు నమోదైంది. ♦ చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టయినప్పుడు చిలకలూరిపేట జాతీయ రహదారి దిగ్బంధనం చేసి పోలీసు విధులకు ఆటంకపరిచినందుకు క్రైమ్ నంబర్ 238/2023 యూ/ఎస్ 341, 353, 120(బి), 144, 148 ఆర్/డబ్ల్యూ 143 ఐపీసీ – సెక్షన్ 129–149, క్రైమ్ నంబర్ 240/2023 యూ/ఎస్ 435, 353, 120–బి ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కింద, క్రైమ్ నంబర్ 125/2023 యూ/ఎస్ 353, 341, 147, 143, 120–బి. ఆర్/డబ్ల్యూ 149 కింద మూడు కేసులు నమోదయ్యాయి. ♦ చట్టప్రకారం జరుగుతున్న ఇసుక రవాణాను అడ్డు కుని పోలీసు విధులను అడ్డుకోవడంతో అమరా వతి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 93/2023 యూ/ఎస్ 143, 341, 230 ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కి ంద కేసు నమోదైంది. -
భూ బకాసురుడు!
తమ సొమ్ము సోమవారం.. ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం... ముప్పొద్దుల తింటారు..అనే నానుడి చంద్రబాబు నాయుడికి అక్షరాలా సరిపోతుంది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు విశాఖపట్నం, దొనకొండ, తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ఎక్కడో ఒక చోట రాజధానిని ఏర్పాటు చేస్తే తనకు మిగిలేదేముండదనే దురాలోచన బాబు మెదడులో మొలకెత్తింది. ఇంకేముంది.. ఆ 29 గ్రామాల ప్రాంతంలో మూడు పంటలు పండే జరీ భూములపై కన్నేశారు. ఈ క్రమంలో తన సహచరుడు పొంగూరు నారాయణను ముందు పెట్టి సరికొత్త డ్రామాకు తెరలేపారు. తన పరివారం చెవిలో అసలు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పేశారు. వారి ద్వారా ఆ ప్రాంతంలో భూములు కొనిపించి, ఆ భూములకు కోట్ల విలువ వచ్చేలా కుట్ర పన్నారు. బాబు అమరావతి నాటకంలో అసైన్డ్ భూముల్ని కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు సమిధలయ్యారు. బాబు అండ్ కో మాత్రం లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడింది. సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి... భూముల లభ్యత, వ్యవసాయ అవసరాలు, భవిష్యత్తు ప్రయోజనాలను శాస్త్రీయంగా విశ్లేషించి సహేతుకమైన సిఫార్సులు చేసింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, రాయలసీమలోని తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయవచ్చని సూచించింది. 2014లో అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేశారు. తన బినామీ, సన్నిహితుడైన మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలో మరో కమిటీని నియమించి.. పలు నాటకీయ పరిణామాల మధ్య రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు. సామాన్య రియల్టర్లను ముంచిన బాబు... అమరావతిలో భూ దోపిడీకి పాల్పడటానికి ముందు రాజధాని లీక్స్ పేరిట చంద్రబాబు రాష్ట్రంలోని సామాన్య రియల్టర్లు, సాధారణ ప్రజలను బురిడీ కొట్టించారు. రాజధానిగా ఏలూరు అని ఓసారి... నూజివీడు అని మరోసారి... కాదు కాదు... నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అని ఇంకోసారి ప్రచారంలోకి తీసుకువచ్చారు. తన ఎల్లో మీడియా ద్వారా ఉద్దేశ పూర్వకంగా లీకులు ఇప్పించి వార్తలు రాయించారు. ఆ పచ్చమాటలు నమ్మి సాధారణ రియల్టర్లు అప్పులు చేసి మరీ ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కొద్దికొద్దిగా పొదుపు చేసిన మొత్తాలతో అక్కడ స్థలాలు కొన్నారు. చివరికి చంద్రబాబు ఆ మూడు ప్రాంతాల్లో కాకుండా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి అమరావతి అని నామకరణం చేశారు. చంద్రబాబు కుట్రను గ్రహించలేక ఏలూరు, నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ సమీప ప్రాంతాల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసిన రియల్టర్లు వందల కోట్ల రూపాయలు నష్టపోయి నిండా మునిగారు. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం అందరినీ కలచివేసింది. ముందస్తు పన్నాగంతోనే... ► చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల చుట్టుపక్కల ఆయన, తన సన్నిహితులు, బినామీలు అతి తక్కువ ధరలకు వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. అనంతరం ఆ ప్రాంతాన్ని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించే సరికి ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. తద్వారా కేవలం రాజధాని ప్రకటనతోనే చంద్రబాబు రూ.లక్ష కోట్ల భూ దోపిడీకి పాల్పడ్డారు. ► రాజధాని కోసం భూ సమీకరణ పేరిట చంద్రబాబు బరితెగించి రైతుల భూములపై దండయాత్రకు పాల్పడ్డారు. రైతులను మభ్య పెట్టి వారి భూములు కొల్లగొట్టడం... అసైన్డ్ భూముల దోపిడీ... ప్రభుత్వ భూముల కబ్జా... లంక భూముల ఆక్రమణ... ఇలా యథేచ్ఛగా దోపిడీకి బరితెగించారు. తద్వారా మరో రూ.లక్ష కోట్ల భూకుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు తానొక భూబకాసురుడినని నిరూపించుకున్నారు. ► అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి, వారి అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. భూ సమీకరణ కింద అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని బెదిరించి.. వాటినీ చెరబట్టింది. తర్వాత ఆ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ అధినేత హోదాలోనే దాదాపు 1,500 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ, లంక భూముల దోపిడీకి పాల్పడ్డారు. సింగపూర్ ముసుగులో స్విస్ చాలెంజ్ ► రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి పేరిట చంద్రబాబు అంతర్జాతీయ భూ కుంభకోణానికి తెరతీశారు. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన స్విస్ చాలెంజ్ విధానం ద్వారా భారీ కుంభకోణానికి తెగబడ్డారు. ► సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెబుతూ... తన సన్నిహితుడైన సింగపూర్ మంత్రికి చెందిన ప్రైవేటు కంపెనీతో వ్యవహారం నడిపారు. రైతుల నుంచి సేకరించిన భూమిని సింగపూర్ కంపెనీకి అప్పగించి ప్రభుత్వమే రూ.5 వేల కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తే.. సింగపూర్ కంపెనీ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేస్తుందనే ఓ మాయామోహ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ► భూములు, నిధులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి 48 శాతం వాటా... సింగపూర్ కంపెనీకి 52 శాతం వాటా కల్పించేలా ఒప్పందాన్ని ఖరారు చేశారు. సింగపూర్ కంపెనీ ముసుగులో తమ కుటుంబం గుప్పిట్లోనే స్టార్టప్ ఏరియా ఉండేలా చంద్రబాబు కుతంత్రం రచించి రూ.66 వేల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నారు. ► కట్టని రాజధాని... అమరావతిలో నిరి్మంచని ఇన్నర్ రింగ్ (ఐఆర్ఆర్) రోడ్డు పేరిట చంద్రబాబు, నారాయణ ద్వయం తమ భూముల ధరలను అమాంతం పెంచేలా కుట్ర పన్నింది. ఇందుకు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. ► లింగమనేని, చంద్రబాబు, నారాయణ కుటుంబాలకు చెందిన భూములను ఆనుకుని నిరి్మంచేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను అష్ట వంకర్లు తిప్పింది. తద్వారా కృష్ణా నదికి అటు వైపు, ఇటువైపు ఉన్న తమ భూముల విలువ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగేలా స్కెచ్ వేసింది. లింగమనేని కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం కలి్పంచినందుకు ప్రతిఫలంగా ఆ కుటుంబం నుంచి చంద్రబాబుకు కరకట్ట నివాసం, హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను పొంది క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. నిర్మాణాలు తాత్కాలికం.. దోపిడీ శాశ్వతం ► మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. ► అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల ముసుగులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడ్డారు. శాసన మండలి, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, ఇతర నిర్మాణాల పేరిట అస్మదీయులకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంచనా వ్యయం కంటే భారీగా అధిక శాతానికి టెండర్లు ఖరారు చేసి భారీగా కమిషన్లు దండుకున్నారు. కాంట్రాక్టు సంస్థలు అత్యంత నాసిరకంగా తాత్కాలిక రాజధాని భవనాలను నిర్మించి చేతులు దులుపుకున్నాయి. చిన్నపాటి చినుకులకే కారిపోయేలా.. ఎక్కడికక్కడ పెచ్చులు, ఫ్లోరింగ్ ఊడిపోతూ ఉన్న ఆ భవనాలు చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతున్నాయి. ► రైతులను మభ్యపెట్టి తీసుకున్న అమరావతిలోని భూములను చంద్రబాబు తన అస్మదీయులకు అడ్డగోలుగా కేటాయించేశారు. ప్రభుత్వ రంగ సంస్థల భవనాలకు అధిక ధరలకు భూములు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఆ పారీ్టకి సన్నిహితులైన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు మాత్రం కారుచౌకగా భూములు కేటాయించడం చంద్రబాబు వంటి కుంభకోణాల సామ్రాట్‌కే సాధ్యమైంది. -
భూకబ్జా కేసులో కన్నారావు అరెస్టు
ఇబ్రహీంపట్నం రూరల్: భూకబ్జా వవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు తేజేశ్వర్రావు అలియాస్ కన్నారావును మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. మన్నెగూడలో రెండు ఎకరాల స్థలం సెటిల్మెంట్ వ్యవహారంలో మార్చి 3న కన్నారావుపై ఆదిబట్ల పోలీసులు కేసు (క్రైం నంబరు 123/2024) నమోదు చేశారు. మన్నెగూడకు చెందిన జక్కిడి సురేందర్‌రెడ్డి అవసరం నిమిత్తం చావ సురేష్ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడు. ఇందుకోసం తన భూమిని ఏజీపీఏ చేశాడు. చావ సురేష్ సేల్‌డీడ్ చేసుకొని ఓఎస్ఆర్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఎలాగైనా భూమిని చావ సురేష్ కు దక్కకుండా చూడాలని జక్కిడి సురేందర్‌రెడ్డి అతని బంధువుల ద్వారా కన్నారావును ఆశ్రయించాడు. దీంతో రూ. 3 కోట్లు ఇస్తే సెటిల్ చేస్తానని కన్నారావు చెప్పడంతో రూ. 2.30 కోట్లను సురేందర్‌రెడ్డి కన్నారావుకు ఇచ్చాడు. రోజులు గడిచినా ఆయన ఎలాంటి పని చేయకపోవడం, ఓఎస్ఆర్ కంపెనీ యాజమాన్యం స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టి హద్దులు పెట్టుకోవడంతో ఇదేమిటని సురేందర్‌రెడ్డి కన్నారావును ప్రశ్నించాడు. దీంతో మార్చి 3న కన్నారావు మనుషులు వచ్చి ఆ భూమిని కబ్జా చేసి అందులోని సామగ్రి ధ్వంసం చేశారు. దీనిపై అదే రోజు ఆదిబట్ల పోలీసులకు ఓఎస్ఆర్ కంపెనీ యజమాని ఫిర్యాదు చేయడంతో కన్నారావుతోపాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌కు ప్రయత్నిస్తూ పట్టుబడి.. తనపై కేసు నమోదైనప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా బెంగళూరు, ఢిల్లీలో తలదాచుకున్న కన్నారావు.. తనపై కేసును తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను కోర్టు కోట్టేయడంతో బెయిల్ కోసం మరో పిటిషన్ వేశాడు. దాన్ని కూడా న్యాయస్థానం కొట్టేయడంతో హైదరాబాద్ మాదాపూర్‌లోని తన అడ్వకేట్‌ను కలవడానికి కన్నారావు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సోమవారం రాత్రి 12:30 గంటలకు బాలాపూర్‌లో ఆదిబట్ల పోలీసులకు కన్నారావు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్నాడు. కన్నారావుపై 307, 436, 447, 427, 148 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఇబ్రహీంపట్నం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. నేనే ఫోన్ చేసి లొంగిపోయా: కన్నారావు ఇది ఒక భూ వివాద సమస్య. ఇందులో కొద్దిగా నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్లకు ముందస్తు బెయిల్ లభించనందున ఆదిబట్ల ఎస్సై రాజు, సీఐ రాఘవేందర్‌రెడ్డికి ఫోన్ చేసి ఫలానా చోట ఉన్నానని చెప్పి సరెండర్ అయ్యాను. నాకు కచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. -
బొక్కడం తప్ప.. 'వెలగ'బెట్టిందేంటి?
విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఈ పేరంటే హడల్. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలే గుర్తొసాయి. నియోజకవర్గంలో ‘వెలగ’బెట్టింది మాత్రం శూన్యం. 2009, 2014, 2019 జరిగిన సాధారణ ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైనా సొంత వ్యాపారాలు, దందాలుపైనే దృష్టి పెట్టారు. అనుచరులతో భూ కబ్జాలకు పాల్పడటం, మద్యం వ్యాపారం, కోడి పందాలు నిర్వహించి సొమ్ము చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. – ఆరిలోవ నగర వాసులకు విష సంస్కృతి పరిచయం చేసిన ఘనుడు కోడిపందేలు, జూదాలతో రూ. కోట్లు వెనకేసుకున్న వైనం ఎంవీపీ కాలనీలో రూ.కోట్ల విలువైన భూముల ఆక్రమణ కన్ను పడితే కబ్జా చేయాల్సిందే మద్యం దుకాణాల ఏర్పాటుతో మహిళల ఆక్రందన కోడి పందేలు, మద్యం షాపులు విశాఖ ప్రజలకు తెలియన కోడి పందేలు సంస్కృతిని ఎమ్మెల్యే వెలగపూడి రుచి చూపించారు. ఇది విష సంస్కృతి అని తెలియక ఇక్కడ ప్రజలు సుమారు నాలుగేళ్లు పాటు వరుసగా సంక్రాంతి సమయంలో జేబులు గుల్ల చేసుకొన్నారు. ఈ పందేలను స్వయంగా ఎమ్మెల్యే వెలగపూడే ముడసర్లోవ రిజర్యాయరు వెనుక జీవీఎంసీకి చెందిన 10 ఎకరాల ఖాళీ స్థలంలో 2016, నుంచి 2020 వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించి రూ. కోట్లలో సొమ్ముచేసుకున్నారు. దీంతో పాటు ఆరిలోవ, జోడుగుళ్లుపాలెం, అప్పూఘర్, జాలరిపేట ప్రాంతాలలో మద్యం దుకాణాలను 2015 నుంచి ప్రారంభించారు. 2015లో ఆరిలోవలో నిర్వహించిన మద్యం దుకాణం తొలగించాలని స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఐద్వా మహిళలు ధర్నాలు చేపట్టినా ఆయన పట్టించుకోలేదు. ► టీడీపీ నుంచి 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు రుషికొండ ప్రాంతంపై కన్నుపడింది. అక్కడ రెవెన్యూకి చెందిన భూమిలో గెడ్డ భాగాన్ని ఆక్రమించి ఆ స్థలం రోడ్డు నిర్మాణంలో తొలగించినట్లు చూపించారు. అతని స్థలం పోయినందుకు వేరేచోట ప్రత్యామ్నాయంగా స్థలం పొందారు. ► 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన దందాలపై మరింత దృష్టి సారించారు. జోడుగుళ్లుపాలెం వద్ద సుమారు ఎకరం స్థలాన్ని తన బంధువుల పేరుతో ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రయత్నానికి బ్రేక్ పడింది. ► నియోజకవర్గానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఎంవీపీ కాలనీలో సెక్టార్–2లో గెడ్డ స్థలాన్ని ఆక్రమించి ఓ బిల్డర్‌కు అపార్టుమెంట్ నిర్మాణం కోసం కట్టబెట్టారు. ఆ అపార్టుమెంట్లో కొన్ని ప్లాట్లు తనకు ఇవ్వడానికి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అప్పట్లో నియోజకవర్గంలో సంచలనమైంది. దీంతో జీవీఎంసీ అధికారులు ఆ అపార్టుమెంట్ నిర్మాణాన్ని నిలిపేశారు. దీనిపై అప్పట్లో వైఎస్సార్సీపీ నాయకుడు(ప్రస్తుతం జనసేన కార్పొరేటర్) పీతల మూర్తియాదవ్ ఈ ఆక్రమణపై కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు వ్యవహారం కోర్టులో ఉంది. రామకృష్ణాపురాన్ని ఆనుకొని ముడసర్లోవ రిజర్యాయరు వెనుక 2017లో పెగదిలికి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు ఆనుచరులు కొందరు సర్వే నంబర్లు 26, 27ల్లో సుమారు ఎకరం ప్రభుత్వ స్థలం ఆక్రమించి 18 కమ్మల పాకలు వేశారు. దీనిపై వెలగపూడికి వ్యతిరేకంగా అప్పట్లో ఫిర్యాదులు వెళ్లడంతో జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించారు. ఇలా మూడుసార్లు అధికారులు తొలగించాల్సి వచ్చింది. దీంతో వెలగపూడి అనుచరులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. -
భూ కబ్జాలపై ఉక్కుపాదం
-
సందేశ్‌ఖాలీలో పెల్లుబికిన నిరసనలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, సోదరుడు సిరాజ్, వారి అనుచరులు తమపై లైంగిక దాడులకు పాల్పడి భూములను లాక్కున్నారంటూ పశి్చమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో కొద్దిరోజులుగా మహిళలు చేస్తున్న నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. సందేశ్‌ఖాలీలోని ఝుప్‌ఖాలీ ప్రాంతంలోకి పోలీసులు రాకుండా ఆందోళనకారులు రోడ్లుపై దుంగలతో నిప్పుపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆస్తులను తగలబెట్టారు. ఇన్నిరోజులైనా షాజహాన్, అతని అనుచరులను అరెస్ట్‌చేయకపోవడంపై పోలీసుల నిర్లిప్త వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. బెల్మాజూర్ దగ్గరి ఫిషింగ్‌యార్డ్ నిర్మాణాలను తగలబెట్టారు. పోగొట్టుకున్న భూములు, గౌరవాన్ని తిరిగి పొందేందుకు, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టామని స్థానికులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్‌చేసి తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా మహిళలు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ‘షాజహాన్‌ను అరెస్ట్‌చేసే దమ్ములేని మీరు మా వాళ్లను ఎలా తీసుకెళ్తారు? మా మనుషుల అండలేకుండా మాకు రక్షణ ఎలా ఉంటుంది?’ అని ఒక మహిళ పోలీసులను నిలదీసింది. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. -
అడ్డంగా దొరికిన ‘రింగ్’ మాస్టర్
సాక్షి, అమరావతి: కట్టని రాజధాని.. నిర్మించని ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు చెలరేగిపోయారు. రాజధాని అమరావతి ముసుగులో యథేచ్ఛగా భూ దందా సాగించారు. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తనకే సాధ్యమని నిరూపించారు. గత ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది. అందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కు కూడా వాటా ఇవ్వడం కొసమెరుపు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తి ఆధారాలతో సహా వెలికి తీసి కేసు నమోదు చేసింది. అలైన్మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీది అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్‌లో పొందు పరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ‘హెరిటేజ్ ఫుడ్స్’కు భూములు ► ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు. ► 2014 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకునే లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. ► క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసి పూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. ► తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ ప్రో కో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. పవన్ కల్యాణ్‌కూ 2.40 ఎకరాల ప్యాకేజీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే ► సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. ► దీంతో ఈ అలైన్‌మెంట్‌పై నారాయణ సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఐఆర్ఆర్ కేసులో నిందితులు ఏ–1: చంద్రబాబు ఏ–2: నారాయణ ఏ–3: లింగమనేని రమేశ్ ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్ ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్) ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్ ఏ–7: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ ఏ–14: లోకేశ్ బాబు, నారాయణ ఆస్తుల అటాచ్మెంట్ క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్‌లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
పోలిపల్లి భూ బాధితుల ఆందోళన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో టీడీపీ కబ్జాదారుల చేతుల్లో మోసపోయిన బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ నేతలు కబ్జా చేసిన తమ భూముల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఇదే ప్రాంతంలో బుధవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర ముగింపు సభ జరుగుతోంది. ‘అయ్యా చంద్రబాబు, లోకేశ్.. మీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తప్పుడు పత్రాలు, ఫోర్జీరీ సంతకాలతో మా భూములు కాజేశారు. ప్రశ్నిస్తే అధికార బలంతో అప్పట్లో మారణాయుధాలతో దాడిచేశారు. మమ్మల్ని భయపెట్టారు. ఇప్పుడు అక్కడే పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నారు. ప్రజలకు మేలు చేసే వారే అయితే తక్షణమే మా భూములను అప్పగించండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి’ అంటూ బాధితులు ఆందోళన చేశారు. ప్రశ్నిస్తాను అంటూ చెప్పే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ సమస్యపై టీడీపీ నాయకులను ప్రశ్నించాలని కోరారు. పోలిపల్లికి చెందిన భూమి యజమాని తిరుమారెడ్డి ఆదినారాయణ వారసులు సుమారు 30 మంది మంగళవారం ఉదయం ఆ భూమిలోకి వెళ్లి నిరసన తెలిపారు. టీడీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు, మద్దతుదారులు తమకు వారసత్వంగా చెందాల్సిన సుమారు 73.58 ఎకరాలను ఫేక్ పట్టాదారు పుస్తకాలు, అధికారుల ఫోర్జరీ సంతకాలు, అక్రమ రిజిస్ట్రేషన్లతో కబ్జా చేశారని ఆరోపించారు. తమకే చెందిన మరో 1.74 ఎకరాల భూమి 2000 సంవత్సరంలో జాతీయ రహదారి విస్తరణలో పోయిందని, ఆ పరిహారం సుమారు రూ.18 లక్షలు కూడా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు సోదరుడు, భోగాపురం మండల టీడీపీ అధ్యక్షుడైన కర్రోతు సత్యనారాయణ తప్పుడు పత్రాలతో కాజేశారని వాపోయారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలతో 3.02 ఎకరాల భూమిని సైతం సత్యనారాయణ ఆక్రమించాడని చెప్పారు. ఇదే అదనుగా మరికొందరు టీడీపీ నాయకులు కొందరు బినామీల పేర్లతో 10 ఎకరాలు, మరికొందరు బినామీల పేర్లతో 60.55 ఎకరాల భూమిని ఆక్రమించారన్నారు. తమ భూమిని తమకిచ్చేయాలని కోరిన తమపై మారణాయుధాలతో దాడి చేశారని తెలిపారు. అప్పటి టీడీపీ పాలనలో ఓ పోలీస్ అధికారి ఆక్రమణదారులకే సహకరించారని ఆరోపించారు. పొలిపల్లిలో యువగళం ముగింపు సభకు ఏర్పాట్లు తర్వాత ఆయన భార్య, బావమరిది పేర్లతో దాదాపు నాలుగు ఎకరాలు బదలాయించుకోవడమే అందుకు సాక్ష్యమని చెప్పారు. ఆ పెత్తందారులు ఇన్నాళ్లూ తమను భయపెట్టారని, న్యాయం కోసం ఇప్పుడు ధైర్యంగా బయటకొచ్చి పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. యువగళం సభ కోసం పోలిపల్లి వస్తున్న చంద్రబాబు, లోకేశ్ టీడీపీ కబ్జాదారులకు చెప్పి తమ భూమి తమకు తిరిగి ఇప్పించాలని కోరారు. పవన్ కళ్యాణ్ కూడా తమ సమస్యపై స్పందించాలన్నారు. తమకు న్యాయం జరిగేవరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నేడు యువగళం ముగింపు సభ బుధవారం లోకేశ్ పాదయాత్ర ముగింపు సభ కోసం పోలిపల్లిలో ఓ ప్రవేట్ సంస్థ లేఅవుట్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ భారీ వేదిక నిర్మిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు, వాహనాల్లో జనాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం కోసం లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు రిసార్ట్స్‌కు చేరుకున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. భూకబ్జాలపై తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసు నమోదైన విషయం వాస్తవమేనని.. తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్ పగబట్టి ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారు -
అసైన్డ్ భూదోపిడీలో కొత్త కోణం.. గుట్టుగా జీఓ–41 జారీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అమరావతి భూదోపిడీలో కొత్త కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు చెందిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించారన్నది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టానికి విరుద్ధంగా జీఓ–41 జారీకి ఆ ద్వయం బరితెగించి మరీ వ్యవహరించింది. అందుకోసం ఏకంగా కేబినెట్‌కు తెలియకుండా.. సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ దోపిడీకి వారిద్దరూ కుట్ర పన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా.. సీఆర్డీఏ చట్టానికి విరుద్ధంగా జీఓ–41ను జారీచేశారని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో వెల్లడైంది. ముందుగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వరని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి.. ఆ తర్వాత తమ బినామీల ద్వారా వాటిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయిస్తూ సేల్డీడ్ల ద్వారా రిజిస్టర్ చేయించుకునేందుకు దరఖాస్తు చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని తెలిసికూడా దరఖాస్తు చేయడం వెనుక పెద్ద గూడుపుఠాణి ఉంది. సబ్‌రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తూ నెంబర్ కేటాయించిన తర్వాత ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని బుకాయిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు.. టీడీపీ నేతల ఒత్తిడితో ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని సీఆర్డీఏ అధికారులు గుర్తించి టీడీపీ నేతలు, వారి బినామీ పేర్లను సీఆర్టీఏ రికార్డుల్లో నమోదుచేసి ప్యాకేజీ ప్రకటించారు. భూములన్నీ తమ హస్తగతమయ్యాక అసైన్డ్ భూములకూ భూసమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ జీఓ–41ను టీడీపీ ప్రభుత్వం జారీచేసింది. ఈ కుట్ర ద్వారా 950 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ భూదోపిడీకి మూలమైన జీఓ–41 జారీ వెనుక అసలు కుట్ర తాజాగా బయటపడింది. కేబినెట్ ఆమోదం లేకుండానే జీఓ.. అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు ఈ జీఓ–41 జారీచేయడం వెనుకనున్న కుట్ర కోణం సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి.. రాజధాని అమరావతి ఏర్పాటుకోసం చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం సీఆర్డీఏ పరిధిలో భూవ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కానీ, అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టం–1977కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం జీఓ–41ను తీసుకొచ్చింది. అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. కేబినెట్లో చర్చించకుండానే ఏకపక్షంగా జీఓ–41ను అడ్డదారిలో జారీచేసేసింది. ఎందుకంటే కేబినెట్లో తీర్మానం చేయాలంటే అందుకు నిబంధనలు అంగీకరించవు. అందుకే కేబినెట్‌ను బైపాస్ చేసి జీఓ జారీచేసింది. తద్వారా.. మంత్రివర్గం ఆమోదంతోనే భూవ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న సీఆర్డీఏ చట్టాన్ని సైతం ఉల్లంఘించింది. నారా, నారాయణే కుట్రదారులు.. ఇక నిబంధనలకు విరుద్ధంగా జీఓ–41ను అప్పటి పురపాలక–సీఆర్డీఏ శాఖ మంత్రి పి.నారాయణ 2016, ఫిబ్రవరి 29న ఆమోదించారు. అనంతరం 2016, మార్చి 22న సీఎం హోదాలో చంద్రబాబు పోస్ట్–ఫాక్టో–రాటిఫికేషన్ చేసి మరీ ఆమోదించారు. అంటే.. అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు జీఓ–41 కుట్ర పూర్తిగా చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే సాగింది. ఈ కీలక అంశాలను అప్పటి ఉన్నతాధికారులు సిట్ దర్యాప్తులో వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, సీఆర్డీఏ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. అసైన్డ్ చట్టానికి విరుద్ధమైనప్పటికీ చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే జీఓ–41 జారీచేయాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. అలా జారీచేసిన జీఓ–41తో అమరావతి పరిధిలోని 950 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. తమ భూదాహం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల పొట్టకొట్టింది. Follow the Sakshi Telugu News channel on WhatsApp -
అంగుళం కూడా చైనా ఆక్రమించలేదనడం అబద్ధం
న్యూఢిల్లీ/లేహ్: లద్దాఖ్‌లోని అంగుళం భూమిని కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. చైనా సైన్యం అక్కడి పచ్చిక బయళ్లను ఆక్రమించుకోవడంపై లద్దాఖ్ వాసులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులరి్పంచేందుకు శనివారం రాహుల్ లద్దాఖ్‌కు చేరుకున్నారు. ‘చైనా సైన్యం చొచ్చుకువచ్చి పచి్చక బయళ్లను లాగేసుకుందని ఇక్కడి వారంతా చెబుతున్నారు. భూమి ఆక్రమణకు గురి కాలేదంటూ ప్రధాని చెబుతున్నది నిజం కాదని వాళ్లు స్పష్టంగా చెబుతున్నారు’అని రాహుల్ అన్నారు. కాగా, రాహుల్∙చైనా తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్లుగా ఉందని బీజేపీ మండిపడింది. ఇటువంటి ప్రకటనలతో రాహుల్ దేశం పరువు తీస్తున్నారని ఆరోపించింది. -
‘మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణహాని ఉంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఇవాళ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందుకు వచ్చారు. దాదాపు 30 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసే కుట్ర జరుగుతోందని.. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బామ్మర్ది శ్రీనివాస్‌రెడ్డి తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని.. తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్లు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి కాలేజీ ఎదురుగా ఉన్న భూమిని మర్రి వెంకట్‌రెడ్డి, దయాసాగర్‌రెడ్డి అనే ఇద్దరు.. సుంకరి అనే కుటుంబం నుంచి భూమిని కొనుగోలు చేశారు. మొత్తం ఎనిమిది ఎకరాల్లో.. 4.5 ఎకరాలు కొన్నారు వీళ్లు. అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి తన భార్య పేరు మీద 2 ఎకరాలు కొన్నారు. అయితే మొత్తం భూమిని కాజేసేందుకు మంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వీళ్లు. భూమి వద్దకు వెళ్లిన మాపై మంత్రి, ఆయన అనుచరులు దాడి చేశారు. మంత్రి బామర్ది శ్రీనివాస్ రెడ్డి అయితే ఏకంగా గన్‌తో షూట్ చేస్తానంటూ బెదిరించాడు. భూమిని వదిలి వేళ్లాలని మమ్మల్ని బెదిరించారు. పోలీసులకు పిర్యాదు చేసినా.. రాజకీయ ఒత్తిడి ఉందంటూ పట్టించుకోవడం లేదు. భూ రికార్డుల నుండి మా పేరు తొలగించి.. అక్రమంగా మంత్రి వారి పేరు పై మార్చుకున్నారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేస్తున్నాం అని బాధితులు మీడియా ముందు వాపోయారు. మంత్రి మల్లారెడ్డి చాలా మంది రైతులను మోసం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాం అని బాధితులు మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డిలు మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డిగానీ, శ్రీనివాసరెడ్డిగానీ స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: మేం తిరగబడితే.. మీరెక్కడా తిరగలేరు! -
రఘునందన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రఘునందన్ ఆరోపణలు ఖండిస్తున్నానని అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఆర్డిఎస్ భూములను కబ్జా చేశానని రఘునందన్ చెప్తున్నాడు. ఆర్డిఎస్ ఎక్కడుంది ఆయనకు తెలుసా? సర్వే నంబర్ 60 లో శ్రీశైలం ముంపు లో పోయింది. 2020 లో సర్వే చేయించిన తరవాతే మేము వాటిని ఖరీదు చేశాం. ఎవరు అప్లికేషన్ పెట్టినా సర్వే చేస్తారు. న్యాయవాదిగా ఉన్న రఘునందన్ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా? ఇప్పుడు సర్వే చేసినా ఎంత భూమి ఉందో తెలుస్తుంది కదా? నేను విదేశాల్లో ఉన్నప్పుడే రిప్లై పంపించాను. ఆయన ఎప్పుడు వస్తారో చెప్పండి. మేము మళ్ళీ సర్వే చేయిస్తాం. మీరు తప్పు చేసినట్టు రుజువైతే తప్పయింది అని ఒప్పుకోవాలి. (ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా.. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లేనా?) నాకంటే చిన్న వాడివి. అపర మేధావి అని నాకు తెలుసు. పక్క నియోజకవర్గంలో వేలు పెట్టేపెట్టడం మానుకోవాలి. మా దగ్గర ఉన్న భూములకు రికార్డ్స్ ఉన్నాయి. మాకు భూమి అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
అఖిల ప్రియ అండ.. భార్గవ రామ్ దందా!
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండతో ఆమె భర్త భార్గవ రామ్ భూ దందాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆళ్లగడ్డలో ఓ మహిళ స్థలాన్ని తమ ఇంట్లో పని చేసే వ్యక్తుల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ చింతకుంటకు చెందిన గూడా నరసింహుడు ఆళ్లగడ్డ శివారులో (కీర్తన స్కూల్ పక్కన) ఉన్న అదే గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్, నూర్ అహమ్మద్ కుటుంబ సభ్యులకు చెందిన 25 సెంట్లు స్థలాన్ని కొని, 1995 మార్చి 27న భార్య గూడా వెంకటలక్ష్మమ్మ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ 1.50 కోట్లు ఉంటుందని అంచనా. స్థలం ఖాళీగా ఉన్న విషయం అఖిలప్రియ దృష్టికి వెళ్లడంతో ఆమె భర్త భార్గవరామ్ రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా ఇక్కడి రెవెన్యూ శాఖలో తిష్ట వేసిన ఓ అధికారి ఆ స్థలం రికార్డులను తారుమారు చేశారు. ప్రస్తుత యజమాని పేరు రికార్డుల్లో లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పథకం వేశారు. ఇందులో భాగంగా 1952లో అల్లిసా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఆధారంగా వారి మనువడు నూర్‌బాషాకు వారసత్వంగా వచ్చినట్లుగా రికార్డులు సృష్టించారు. 1952 నుంచి 1985 వరకు అనేక మార్లు రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ ఈసీలో ఒక్క ఎంట్రీ కూడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటి ద్వారా నూర్‌బాషాతో అఖిలప్రియ ఇంట్లో పనిచేసే నంద్యాల హుస్సేన్‌రెడ్డి పేరు మీద 9 సెంట్లు, అనుచరుడు మిద్దె నాగార్జున పేరు మీద 9 సెంట్లు, బుట్టగాళ్ల రమణ పేరు మీద 7 సెంట్లు 2022 డిసెంబర్ 1న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఆ స్థలం కంచె తీసే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన వెంకటలక్ష్మమ్మ, ఆమె భర్త నరసింహులు అధికారులను ఆశ్రయించారు. అధికారులు న్యాయం చేయాలి: బాధితురాలు 1995లో కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. కొన్నేళ్లు పొలం సాగు చేసుకున్నాం. చుట్టూ ఇళ్లు పడటంతో మేము కూడా సాగు ఆపేసి కంచె వేసుకున్నాం. ఇప్పుడు ఎవరో వచ్చి తాము కొనుక్కున్నామని బెదిరిస్తున్నారు. అధికారులు న్యాయం చేయాలి. కాగా ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని సబ్ రిజిస్ట్రార్ నాయబ్ అబ్దుల్ సత్తార్ తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. -
సొంతపార్టీ వాళ్లకే చెమటలు పట్టించిన ఉమా! మాకొద్దు బాబోయ్ అంటున్న తమ్ముళ్లు
ఎన్టీఆర్ జిల్లా: తెలుగుదేశం పార్టీలో జనం నెత్తిన చేతులు పెట్టే నేతలకు కరువేమీ లేదు. అదే కోవలోకి వస్తారు మాజీ మంత్రి..సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. ఇప్పుడాయన పేరు చెబితే పార్టీలోను, మైలవరం నియోజకవర్గంలోనూ అందరూ మండిపడుతున్నారట. నోటి దురుసు, అహంభావానికి కేరాఫ్ అడ్రస్ అయిన దేవినేని వ్యవహారంతో కార్యకర్తలు ఎప్పట్నుంచో విసిగిపోయి ఉన్నారట. ఇటీవల ఉమా తీరు మరింత వరస్ట్‌గా మారడంతో క్యాడర్ కు అస్సలు రుచించడం లేదని టాక్. దీంతో అతనికి వ్యతిరేకంగా మైలవరంలో గ్రూపులు మొదలయ్యాయట. దేవినేని ఉమా తాజాగా వెలగబెట్టిన నిర్వాకం కారణంగా సైకిల్ పార్టీ శ్రేణులు ఉమా అంటే ఆమడ దూరంలో ఉంటున్నారట. గొల్లపూడి వన్ సెంటర్ లో ఆలూరి చిన్నారావుకు చెందిన స్థలంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ స్థలం ఆలూరి చిన్నారావుకు అతని తల్లి శేషారత్నం గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు. ఆ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తన ఆస్థిని కాపాడుకునేందుకు శేషారత్నం జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు. ఏడాది పాటు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు కలెక్టర్ గిఫ్ట్ డీడ్ రద్దుచేసి ఆ స్థలాన్ని ఆమెకు ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలూరి శేషారత్నం ఆ స్థలంపై కన్నేశారు కలెక్టర్ ఆదేశాలతో శేషారత్నంకు స్థలం అప్పగించేందుకు అధికారులు అక్కడకు వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో దేవినేని ఉమా జోక్యం చేసుకుని కుటుంబ వ్యవహారాన్ని రాజకీయంగా మార్చేశారని టాక్. వాస్తవానికి టీడీపీ కార్యాలయం పేరిట ఆ స్థలాన్ని పర్మినెంట్ గా కొట్టేయాలనేది దేవినేని ఉమా ప్లాన్ అని చెబుతున్నారు. ఇందులో భాగంగానే దేవినేని ఉమా ఓ రేంజ్ లో డ్రామా నడిపించాడు. కానీ అతని బెదిరింపులకు వెరవకుండా శేషారత్నం ధైర్యంగా నిలబడ్డారు. తల్లీ కొడుకుల మధ్య ఉమా చిచ్చు పెట్టాలని ఎంత ప్రయత్నించినా వ్యూహం ఫలించలేదట. దీంతో అధికారులు ఎట్టకేలకు ఆ స్థలాన్ని ఆమెకు ఇప్పించడంతో పాటు అక్కడున్న టీడీపీ కార్యాలయాన్ని కూడా తరలించారు. ఐతే పార్టీ కార్యాలయం ముసుగులో శేషారత్నం స్థలం కొట్టేయాలన్న దేవినేని ప్లాన్ దారుణంగా ఫెయిలవ్వడంతో పాటు పార్టీకి తీరని నష్టం వాటిల్లేలా చేసిందట. పార్టీ కార్యకర్తకే వెన్నుపోటా? శేషారత్నం కుటుంబం అంతా టీడీపీ పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం వివాదానికి కారణమైన స్థలానికి నెలకు లక్షరూపాయలు అద్దె వస్తుందని తెలిసినా పార్టీ కోసమే అయాచితంగా ఇచ్చేశారు. ఇలాంటి సమయంలో దేవినేని పన్నాగం తెలుసుకుని స్థలాన్ని కాపాడుకునేందుకు శేషారత్నం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. సొంత పార్టీకి చెందిన వారి స్థలాన్నే కబ్జా చేయాలని దేవినేని ఉమా వేసిన ప్లాన్ సక్సెస్ కాకపోగా...రచ్చ రచ్చగా మారి పచ్చ పార్టీ అభాసుపాలైందట. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుందట. అసలే మైలవరం టీడీపీలో లోకల్ నాన్ లోకల్ వార్ నడుస్తున్న సమయంలో ఈ పంచాయతీ ఏంటంటూ మండిపడుతున్నారట చినబాబు, చంద్రబాబు. ఇప్పటికే వేరుకుంపటి పెట్టుకున్న మైలవరం తమ్ముళ్లంతా..అదే అదనుగా కట్టకట్టుకుని ఉమాపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేశారట. ఈసారి ఉమా మాకొద్దంటున్నాం కాబట్టి... ఈసారి ఆ సీటేదో మాకే ఇచ్చేయండి బాబు అంటూ అధినేత ముందు క్యూ కట్టేస్తున్నారట. మాకొద్దు బాబు.. మీకో దండం మైలవరం నుంచి దేవినేని ఉమాను బయటికి పంపించేయాలనుకుంటున్న బొమ్మసాని సుబ్బారావు, జంపాల సీత రామయ్య, కాజా రాజ్ కుమార్, జువ్వ రాంబాబు తదితర ఆశావాహులంతా హై కమాండ్ వద్ద ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారట. ఈ మొత్తం వ్యవహారాన్ని బయటి నుంచి గమనిస్తున్న క్యాడర్ మాత్రం 2024లో ఉమాకు మైలవరం టిక్కెట్టు ఇస్తే పార్టీ మూసేసుకోవడం ఖాయమని బాహాటంగానే చర్చించుకుంటున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మాజీ మంత్రి నారాయణను ఆయన ఇంటి వద్దే విచారించండి
సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల మార్పు ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి పొంగూరు నారాయణను ఆయన ఇంటి వద్దే న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఎప్పుడు విచారించాలనుకుంటున్నారో నిర్ణయించాక 24 గంటల ముందు ఆ విషయాన్ని నారాయణకు తెలియచేయాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల మార్పు ముసుగులో సాగిన భూ దోపిడీపై సీఐడీ ఇటీవల కేసు నమోదు చేసింది. సీఐడీ ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆ నోటీసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ శస్త్ర చికిత్స చేయించుకున్నారని, వైద్యుల సూచన మేర మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి న అవసరం ఉందన్నారు. నిబంధనల ప్రకారం 60 ఏళ్లు నిండిన వారిని వారి ఇంటి వద్దే విచారించాల్సి ఉంటుందని తెలిపారు. -
రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..
సాక్షి, ఇబ్రహీంపట్నం రూరల్: నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను కాజేసి, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రామోజీ ఫిలింసిటీ యజమాని రామోజీరావుపై భూ కబ్జా కేసు నమోదు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధి నాగన్‌పల్లి సర్వే నంబరు 189లో 2007లో దివంగత సీఎండాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలకు పంపిణీ చేసిన ఫిలింసిటీలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాలను, హద్దు రాళ్లను సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవా రం పరిశీలించింది. అనంతరం జాన్‌వెస్లీ విలేకరులతో మాట్లాడారు. పోరాటాల ద్వారా సాధించుకున్న భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని కబ్జా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఫిలింసిటీలోని ప్రభుత్వ భూముల్లో 650మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేదల స్థలాలు కబ్జా చేసి..సెట్టింగులా? స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తే వాటిని నిర్మించకుండా రామోజీరావు అడ్డుకుంటున్నారని జాన్‌వెస్లీ మండిపడ్డారు. పేదల ఇళ్ల స్థలాల్లో సినిమా షూటింగ్ షెడ్లు, సెట్టింగులు అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. పాలకులు, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రామోజీకి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం వెంటనే రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రామోజీతో ఏం లాలూచీ ఉందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోరారు. లేదంటే ఆయా భూములను తామే ఆక్రమించి వాటిలో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు. ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డుతో పాటు 70 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్నారు. 60 గజాల్లో గుడిసెలు వేస్తే పేదలపై కేసులు పెట్టే ప్రభుత్వాలు రామోజీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. డబ్బులు ఉన్నవాడికి ఊడిగం చేయడం తగదనీ, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోకపోతే గుడిసెలు వేసి ఆక్రమిస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే: సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్ అక్రమ నిర్మా ణాలను వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే భూములను ఆక్రమించి పొజిషన్ తీసుకుంటామని హెచ్చరించారు. నడకబాటలో ఉన్న రోడ్డు వెంట ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడం తగదన్నారు. రామోజీ పలుకుబడి ఉపయోగించి కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సామేలు, డి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
Ongole: నా వెనకుంది దామచర్ల.. నన్నేమీ చేయలేరు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు సాగించిన భూదందా నేటికీ కొనసాగుతోంది. అమాయక పేద ప్రజలకు స్థలాల ఆశ చూపి గతంలో డబ్బు గుంజిన టీడీపీ నాయకులు నేడు అదే పంథాను అనుసరిస్తున్నారు. ఒంగోలు నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కోర్టులో కేసులు వేసి రాక్షసానందం పొందుతున్న టీడీపీ నేతలు.. అదే ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో భూదందా సాగిస్తుండటం సంచలనంగా మారింది. చదవండి: విభేదాలతో సై’కిల్’.. టీడీపీలో కుంపట్ల కుమ్ములాట పెళ్లూరు. చెరువుకొమ్ముపాలెం మధ్య ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి బిట్లు బిట్లుగా విక్రయించిన మహిళా నాయకురాలు.. తాజాగా మరికొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమ్మేసే యత్నం చేస్తోంది. దీనిపై అభ్యంతరం తెలిపిన స్థానికులను చంపేస్తామంటూ రౌడీలతో బెదిరిస్తుండటంతో వారు ప్రాణ భయంతో బుధవారం ఎస్పీ మలికాగర్గ్ వద్దకు వెళ్లి రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని చెరువుకొమ్ముపాలెం–పెళ్లూరు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమి గత టీడీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైంది. ఈ అక్రమాల దందాకు ప్రధాన సూత్రధారురాలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచర వర్గానికి చెందిన పాలేటి అమృత. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఆమె.. దానికి ఏకంగా అమృత నగర్‌గా పేరుపెట్టింది. అందులో గుడిసెలు వేసి పట్టాలిప్పిస్తానని చెప్పడంతో సుమారు 55 మంది వరకు ఆశపడ్డారు. ఒక్కొక్కరికి 10 గదుల చొప్పున స్థలం కేటాయించిన అమృత రూ.లక్ష చొప్పున అప్పనంగా దండుకుంది. రౌడీ మూకలతో బెదిరింపులు.. చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో 55 మంది గుడిసెలు వేసుకోగా ప్రస్తుతం అక్కడ 30 కుటుంబాలే కాపురముంటున్నాయి. సుమారు 25 మంది అమృత బెదిరింపులకు భయపడి గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మామిడిపాలేనికి చెందిన కొందరు రౌడీïÙటర్లను పంపి తరచూ బెదిరిస్తుండటంతో చేసేదేమీ లేక వారంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. అలా ఖాళీ చేసి వెళ్లిన వారి గుడిసెలను కూడా అమృత రూ.లక్ష చొప్పున మళ్లీ బేరానికి పెట్టి అమ్మేసింది. అమృత నగర్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల కాలంలో ప్రభుదాస్ అనే వ్యక్తితో కలిసి ప్లాట్లు వేసి 15 మందికి విక్రయించడంతో స్థానికులు తమకు ఇబ్బందులొస్తాయని ఎదురుచెప్పడం అమృతకు కంటగింపుగా మారింది. బుధవారం రాత్రి పది గంటల సమయంలో అమృతతోపాటు 10 మంది వ్యక్తులు గుడిసెల వద్దకు వచ్చి బెదిరించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అమ్మో ఆ వేధింపులు తాళలేం... సుబానీ బ్యాచ్, ప్రభుదాస్ బ్యాచ్ పేరుతో కొందరు రౌడీలు అర్ధరాత్రి పూట వచ్చి ఇళ్ల వద్ద నానాయాగీ చేస్తున్నారని కాలనీ వాసులు వాపోయారు. ఇళ్ల మధ్యలో మద్యం తాగి సీసాలు పగలగొట్టడంతో పాటు రాళ్లు వేస్తున్నారని, తలుపులు కొట్టి బెదిరిస్తుండటంతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ భూమిని చదును చేస్తుండగా అడ్డుకోవడానికి వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతోపాటు సచివాలయ సిబ్బందిని కూడా అమృత బెదిరించిందని స్థానికులు ఆరోపించారు. ‘‘మీరు ఎక్కడికెళ్లినా నాకేమీ కాదు. నాకు దామచర్ల జనార్దన్ సపోర్ట్ ఉంది’’ అంటూ పాలేటి అమృత బహిరంగంగా బెదిరిస్తోందని చెప్పారు. ‘కుక్క జోలికెళ్లి చక్కదనం పోగొట్టుకోవడం ఎందుకని వదిలేశాం’ అంటూ గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిన బాధితులు అమృత వ్యవహార శైలిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్పీగారూ మీరే కాపాడాలి.. చెరువుకొమ్ముపాలెం కాలనీ వాసుల మొర ‘ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ అమృత అనే మహిళ తమ వద్ద నుంచి లక్ష రూపాయల చొప్పున తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని చూపింది. గతంలో ఆమె మీద కేసు కూడా నమోదైంది. మళ్లీ రూ.50 వేలు డబ్బు ఇవ్వాలంటూ రౌడీలను పంపించి బెదిరిస్తోంది. రెండు రోజుల నుంచి రాత్రిపూట ఇళ్ల వద్దకు రౌడీలు వచ్చి రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రశి్నస్తే దాడి చేస్తున్నారు. మంగళవారం తాలూకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. అమృత బారి నుంచి మాకు రక్షణ కలి్పంచండి’ అని కాలనీ వాసులు బుధవారం ఎస్పీని వేడుకున్నారు. -
Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ
సాక్షి, పుట్టపర్తి: భారీ భూ కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వరదాపురం సూరిపై ఏసీబీ విచారణ మొదలైంది. అనంతపురం జిల్లాలో భారీగా భూ అక్రమాలకు పాల్పడటంతో పాటు టీడీపీ హయాంలో అధికార బలంతో ప్రభుత్వ భూములను అక్రమంగా కొనుగోలు చేశారు. 2014–19 మధ్య కాలంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి...ఆ సమయంలోనే రూ.కోట్లు విలువైన భూములను అక్రమంగా తీసుకున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం ముక్తాపురం పంచాయతీ పరిధిలోని చండ్రాయునిపల్లి గ్రామంలో 155 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా కొనుగోలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. గ్రామం చుట్టూ వరదాపురం సూరి భూములు కొనుగోలు చేయడం వల్ల చండ్రాయునిపల్లి గ్రామ వాసులు దారిలేక ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈ ఆక్రమణలపై ఆర్డీఓ, తహసీల్దార్లకు గ్రామస్తులు పలుసార్లు మొరపెట్టుకున్నారు. చివరకు డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేయగా, సూరి అక్రమంగా భూములు కొనుగోలు చేశారని, వాటిని రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతేకాకుండా క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. కారుచౌకగా రూ.130 కోట్ల భూమిని కొట్టేసిన వైనం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వంద గజాల సమీపంలోనే రూ.130 కోట్ల విలువైన భూమిని వరదాపురం సూరి అక్రమంగా కొనుగోలు చేశారు. అన్‌రిజిస్టర్డ్ డాక్యుమెంటు సృష్టించి కారుచౌకగా తన కుమారుడు గోనుగుంట్ల నితిన్ సాయితో పాటు అతని అనుచరుడి పేరుతో కొనుగోలు చేశారు. దీనిపై కూడా బాధితులు జిల్లా రిజిస్ట్రార్, సబ్‌రిజిస్ట్రార్, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సూరి భూ కుంభకోణాలపై పలువురు కలెక్టర్‌కు, ఎస్పీకి, ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) రంగంలోకి దిగింది. చదవండి: (బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి) సూరి కొనుగోలు చేసిన భూములు, అప్పట్లో జరిపిన లావాదేవీలు, ఆ సొమ్ములు ఎక్కడనుంచి వచ్చాయి తదితర వాటిని ఆరా తీస్తున్నారు. వరదాపురం సూరితో పాటు ఇందులో ఇంకా ఎవరైనా పాత్రధారులు ఉన్నారా... అన్న కోణంలోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భూముల కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించడంతో పాటు అధికారుల స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. మరోవైపు సివిల్ పోలీసులు కూడా తమకు అందిన ఫిర్యాదుల మేరకు వరదాపురం సూరి అక్రమాలపై దర్యాప్తు చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి అనంతపురం జిల్లా పోలీసులే దర్యాప్తు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో భూఆక్రమణలపై ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ కూడా చేశారు. ఫిర్యాదుల మేరకే దర్యాప్తు వరదాపురం సూరి భూ ఆక్రమణలపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆ మేరకే దర్యాప్తు చేస్తున్నాం. ఏసీబీ దర్యాప్తు మొదలైంది. ఏసీబీ తర్వాత మాకు వచ్చిన ఫిర్యాదులపై కూడా పూర్తిస్తాయిలో విచారణ చేస్తాం. అక్రమాలున్నట్టు తేలితే ఎంత పెద్ద వారున్నా చర్యలు తీసుకుంటాం. – డా.ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ, అనంతపురం -
Varadapuram Suri: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!
ఆయనో ‘భూ’చోడు. ఫోర్జరీలు చేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. వాటి ఆధారంగా భూదందాలకు పాల్పడి రూ.కోట్లకు పడగలెత్తాడు. ఆయన అక్రమాలు అధికారిక విచారణల్లోనూ వెల్లడయ్యాయి. అయినా చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. ఆయన పట్ల అధికారులు ఎందుకింత ప్రేమ కనబరుస్తున్నారో ఎవరికీ అంతుపట్టని విషయం. సాక్షి, పుట్టపర్తి: అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుంచి జేఎన్టీయూకు వెళ్లే దారిలో నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఉన్న 6.35 ఎకరాల భూమిని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి కాజేశారు. సుమారు రూ.129 కోట్ల విలువ చేసే ఈ భూమిని నకిలీ డాక్యుమెంట్లతో అత్యంత చాకచక్యంగా తన ఖాతాలో వేసుకున్నారు. అక్రమ పద్ధతుల్లో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ మినహా క్రిమినల్ చర్యలు చేపట్టకుండా రిజిస్ట్రేషన్ అధికారులు తాత్సారం చేస్తుండగా...కలెక్టర్ నియమించిన ఉన్నతాధికారుల కమిటీ కూడా నివేదిక సమర్పణలో జాప్యం చేస్తోంది. మోసం చేశారిలా.. రాళ్లపల్లి నారాయణప్ప అనే వ్యక్తి 1929లో అప్పటికే పింఛన్ తీసుకుంటున్న గుండూరావు నుంచి జేఎన్టీయూకు వెళ్లే దారిలోని సర్వే నంబర్ 301లో 7.77 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. నారాయణప్ప పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు విడుదల చేశారు. ఆయన 1935లో బ్యాంకులో మార్ట్గేజ్ చేసి రుణం కూడా పొందారు. రాళ్లపల్లి నారాయణప్ప నుంచి తర్వాత నాలుగు తరాల వారికి భూమి మారుతూ వచ్చింది. అయితే, దొడ్డమనేని మాలతేష్ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అని పేర్కొంటూ నవంబర్ 19, 1985 తారీఖుతో అన్ రిజిస్టర్డ్ వీలునామా పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా 2018లో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 301–3 సర్వే నంబరులో 6.35 ఎకరాల భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. చదవండి: (శ్రీరస్తు.. కల్యాణమస్తు: 23 దాటితే డిసెంబర్ వరకు ఆగాల్సిందే!) అనంతరం డిసెంబర్ 23, 2021లో మాలతేష్ నుంచి 6.35 ఎకరాలను వరదాపురం సూరి కుమారుడు నితిన్ సాయి, ధర్మవరానికి చెందిన యంగలశెట్టిరాజు (సూరి అనుచరుడు) కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాస్తవానికి గుండూరావు 1929 నాటికే ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే ఆయనకు 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయసు 116 ఏళ్లు! అంతటి వయస్సు ఉన్న వ్యక్తి అన్‌రిజిస్టర్డ్ వీలునామా ఎలా రాయిస్తారో అర్థం కాని విషయం. ఈ అన్ రిజిస్టర్డ్ వీలునామా ఫోర్జరీ అని ఆర్డీఓ కోర్టు సైతం నిర్ధారించింది. అయినప్పటికీ వరదాపురం సూరి తన గ్రామానికే చెందిన సబ్రిజి్రస్టార్ను లోబర్చుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్‌తో సరి.. బాధితుల ఫిర్యాదు మేరకు మూడు నెలల క్రితం విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు ఫోర్టరీ డాక్యుమెంట్లతో రిజి్రస్టేషన్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంపై అనంతపురం సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నితిన్ సాయి, యంగలశెట్టి రాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ..జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటిదాకా నితిన్ సాయి, యంగలశెట్టి రాజా, అక్రమాల సూత్రధారి అయిన వరదాపురం సూరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. వారి మీద కేసులు నమోదు చేయకుండా భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారా? లేదా తప్పుదోవ పట్టించే ఎత్తుగడ వేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చదవండి: (హిందూపురం వాసుల చిరకాల వాంఛ.. సాకారం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం) నివేదిక సమర్పించడంలోనూ జాప్యమే.. సూరి చేసిన అక్రమ వ్యవహారంపై విచారణకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) ఆధ్వర్యంలో హంద్రీ–నీవా సుజల స్రవంతి సబ్ కలెక్టర్, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సభ్యులుగా కలెక్టర్ నాగలక్ష్మి అప్పట్లోనే విచారణ కమిటీని నియమించారు. ఇందులో ఒక సభ్యుడు నివేదిక సమర్పించినా, మరొక సభ్యుడు మాత్రం కాలయాపన చేస్తున్నారు. ఇంతటి భారీ అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సి ఉన్నా.. మరొక అధికారి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ‘భూచోళ్ల’పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చేయడానికే అధికారులందరూ కలిసి కొత్త నాటకాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరాం అన్‌రిజిస్టర్డ్ వీలునామా ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం అనైతికమని పలువురు ఫిర్యాదు చేశారు. రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశాం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా రిజి్రస్టార్‌కు ఉత్తర్వులు జారీ చేశాం. – మాధవి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ -
రేవంత్ రెడ్డి ఓ దొంగ: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ దివాలా తీసిన దరిద్రపు పార్టీ అని, రేవంత్ రెడ్డి ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. రేవంత్ తనపై చేసిన కామెంట్లకు కౌంటర్‌గా.. టీఆర్ఎస్ఎల్పీ నుంచి మంగళవారం ఆయన మీడియా ద్వారా మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లోని భట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి అమాయకులు. రేవంత్ మాత్రం లుచ్చా పనులు చేస్తున్నాడు. పదే పదే కేసీఆర్, కేటీఆర్‌లను తిడుతున్నాడు. అది రచ్చబండ కాదు.. లుచ్చా బండ. పెళ్లి పెటాకులు లేకుండా నైట్ క్లబ్‌ల చుట్టూ తిరిగే రాహుల్ గాంధీ ఓ తోపు.. ఈ పీసీసీ చీఫ్(రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి..) ఓ తోపు. అప్పుడే సీఎం అయిపోయినట్లు మాట్లాడుతున్నాడు. సీఎం కాదు కదా.. కనీసం అటెండర్ కూడా కాలేడంటూ రేవంత్‌పై మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి తమ మధ్య గొడవలు జరుగుతుండేవని పేర్కొన్న మల్లారెడ్డి.. టీడీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే రేవంత్ తనపై బెదిరింపులకు దిగాడని చెప్పారు. ‘నా కాలేజీలు మూయిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి ఎవరి డబ్బుతో చేశాడు.. నా డబ్బుతో చేశాను’ అంటూ సంచలన కామెంట్లు చేశాడు మల్లారెడ్డి. కాదని యాదగిరిగుట్టపై ప్రమాణం చెప్పాలని రేవంత్‌కు సవాల్ విసిరాడు మల్లారెడ్డి. రేవంత్ వ్యాఖ్యలపై సొంత సామాజిక వర్గమే అసంతృప్తితో ఉందని పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డిది అంతా డ్రామా అని, మూడేళ్లలో ఎంపీగా ఏం చేశాడని, చివరికు రాహుల్ గాంధీని సైతం బ్లాక్మెయిల్ చేసే రకం అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబును పట్టుకుని పీసీసీ తెచ్చుకున్నాడంటూ సెటైర్ సంధించారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని, ఆయన అల్లుడికి అందులో హస్తం ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఇద్దరినీ జైలుకు పంపి తీరతానంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే కౌంటర్‌గానే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఇలా మీడియా ముందుకు వచ్చారు. తాను ప్రభుత్వ భూమిని ఎక్కడా కొనలేదని.. మార్కెట్ రేటు కంటే ఎక్కువకే కొన్నానని, అందులో తప్పేముందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం భూములు కొంటున్నారు కదా అని ప్రశ్నించారు. కోర్టు సైతం తనకు అనుకూల తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మల్లారెడ్డి గుర్తు చేశారు. -
పోరు జెండా: మల్లు స్వరాజ్యం
మల్లు స్వరాజ్యం... పోరాటానికి పర్యాయ పదం భూమికోసం.. భుక్తికోసం... పేద ప్రజల విముక్తికోసం సొంత జీవితాన్ని వదిలిపెట్టిన స్ఫూర్తి చరిత పట్టుకుంటే పదివేల బహుమానమన్న నిజాం సర్కార్‌పై బరిగీసి ఎక్కు పెట్టిన బందూక్ చావుకు వెరవని గెరిల్లా యోధురాలు అసెంబ్లీలో ఆమె మాట తూటా పదవి లేకపోయినా ప్రజా సమస్యలే ఎజెండా ఆమె పోరాటాల ఎర్రజెండా.. అన్నం పెట్టి... ఆలోచన మార్చుకుని.. బాల్యంలో ఓ ఘటన మల్లు స్వరాజ్యం ఆలోచనను మార్చేసింది. అప్పట్లో వడ్లను కూలోల్లే దంచేటోళ్లు. ముఖ్యంగా ఆడవాళ్లు. పుట్లకొద్ది దంచినా కూలీ ఉండదు. రోజుల తరబడి పని జరిగేది. అలా దంచుతున్న ఎల్లమ్మ అనే కూలీ కళ్లు తిరిగి పడిపోయింది. అక్కడే కాపలాగా ఉన్న స్వరాజ్యం నీళ్లు తీస్కపోయి తాగించారు. అన్నం తినలేదని చెబితే.. అన్నం తీసుకొచ్చి తినిపించారు. మిగిలిన కూలీలు తినలేదంటే... చూస్తే అన్నం లేదు. బియ్యం నానబెట్టుకుని తింటామంటే వాళ్లకు సాయం చేశారు. అట్లా సాయపడ్డందుకు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. స్వరాజ్యం చిన్నాయనలు తప్పుబట్టి తిట్టిండ్రు. అప్పుడు వాళ్లమ్మ చొక్కమ్మ అండగా నిలబడ్డది. ‘చిన్న పిల్ల ఏమనకండి’ అని వెనకేసుకొచ్చింది. కష్టం చేసే వ్యక్తికి తినే హక్కెందుకు లేదోనన్న ఆలోచన ఆనాడే స్వరాజ్యం మనసులో అంకురించింది. అక్కడినుంచే ఆమె తిరుగుబాటు నేర్చుకున్నారు. మనుసులో ముద్రించుకుపోయిన ‘అమ్మ’ స్వరాజ్యంపై వాళ్లమ్మ చొక్కమ్మ ప్రభావం ఎక్కువ. బిడ్డను రాణీరుద్రమలా పెంచాలి అనుకునేవారామె. స్వరాజ్యం ఎనిమిదో ఏట తండ్రి మరణించాడు. అప్పటికే అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్)ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆయన ప్రోత్సాహంతో బాలల సంఘం పెట్టారు స్వరాజ్యం. అన్న తెచ్చిచ్చిన మాక్సీం గోర్కీ ‘అమ్మ’ పుస్తకాన్ని వాళ్లమ్మతో కలిసి చదివారు. రాత్రి దాలిలో పాలు కాగబెట్టి.. తోడెయ్యడం కోసం వాటిని ఆరబెట్టినప్పుడు కూర్చుని చదివిన ఆ పుస్తకంలోని అక్షరం అక్షరం ఆమె మనసులో ముద్రించుకుపోయింది. ఆ పుస్తకంలోని అమ్మ పాత్ర వాళ్లమ్మను, ఆమెను ప్రభావితం చేసింది. అందుకే బీఎన్ని సాషా అని పిలుచుకునేవారామె. కొడుకుతోపాటు కూతురు స్వరాజ్యం పోరాటంలోకి వెళ్తానంటే అడ్డుపడలేదు సరికదా... ప్రోత్సహించి ఉద్యమాల్లోకి పంపించిందా అమ్మ. తన 11వ ఏట గెరిల్లా యుద్ధంలో శిక్షణ, ఆత్మరక్షణా పద్ధతులు నేర్చుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే ఆంధ్రమహాసభలో చేరారామె. ఆ తరువాత వారిల్లు ఆంధ్ర మహాసభకు కేంద్రమయ్యింది. కూలీరేట్ల పెంపు... పెద్ద మలుపు.. తెలంగాణలో వెట్టిచాకిరీ, భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కూలీ పెంచాలని ఉద్యమం మొదలైంది. తమది దొరల కుటుం» మే అయినా... ఊళ్లో ఉన్న జీతగాళ్లు, కూలోళ్లందరినీ కూడగట్టి సమ్మె చేద్దామని ప్లాన్. అప్పటికే పోలీస్ పటేల్ అయిన స్వరాజ్యం చిన్నాయన తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో బీఎన్ని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. తల్లి పోలీసులను దర్వాజ కాడనే అడ్డుకుంటే... అన్నను ఊరుదాటించారు స్వరాజ్యం. ఆయన వెళ్తూ ‘నేను పోతున్న... సమ్మె జరిగేట్టు చూడాలె’ అంటూ బాధ్యతను పెట్టాడు. తెల్లారి వాడలన్ని తిరిగి పనికి పోవద్దని చెప్పారామె. అయినా వినలేదు... తన చిన్నాన్న పనిలోకే పోతున్నరని తెలిసి, వాగులో వాళ్లకడ్డం పడుకున్నది. ‘మీరు కూలికి పోవాలంటే.. నన్ను దాటుకుపోండి’ అని పట్టుబట్టారామె. భూస్వాముల పిల్ల కనుక ఆమెను దాటి వెళ్లలేకపోయారు. ఆరోజుకు వెనుదిరిగిండ్రు. మరునాడు పనిలోకి రానందుకు వాళ్ల చిన్నాయన కూలోళ్లను పిలిచి పంచాయతీపెట్టిండ్రు. అది తెలిసిన స్వరాజ్యం.. ‘దెబ్బ నామీద పడ్డంకనే వాళ్ల మీద పడాలి’ అంటూ బాబాయి దౌర్జన్యాన్ని అడ్డుకున్నారు. రేటు పెంచితే తప్ప పనిలోకి రాలేమన్నరు కూలీలు. అప్పటిదాకా సోలెడున్న కూలీ... మూడు సోలెలు అయ్యింది. సమ్మె జయప్రదమైంది. అది స్వరాజ్యం ఉద్యమ జీవితంలో తొలి అడుగు. ఆమె గొంతెత్తితే స్వరాజ్యం... గొంతెత్తితే తెలంగాణ నేల ఊగింది ఉయ్యాల. చిన్నప్పటినుంచే ఆమెకు పాటంటే ప్రాణం. బాగా పాడుతోందని ఆంధ్రమహాసభ సమావేశాల్లో పాడించేవాళ్లు. పాలకుర్తి ఐలమ్మ పోరాటానికి మద్దతుగా సంఘం నిలబడాలనుకున్నది. పాలకుర్తిలో మీటింగ్ పెట్టారు. ఆ సభలో పాటలు పాడేందుకు స్వరాజ్యంను తీసుకెళ్లారు బీఎన్. సభ సక్సెస్ అయ్యింది. ఐలమ్మ పోరాటం ఫలించింది. ‘విస్నూరు దొర చేతిలో సచ్చినా సరే... భూమిని వదలను’ అని పోరు జేసిన ఐలమ్మ తనకు స్ఫూర్తి’ అని చెప్పేవారామె.. ‘ఏనాడు గడీలనొదిలి వాడల్లో జొరబడ్డానో... ఆ వాడలే నా ఉద్యమ జన్మస్థానాలు. నా ఉపన్యాసాలకు విషయాన్ని, నా పాటలకు బాణీలని, నా జీవితానికొక చరిత్రను ఇచ్చింది వాళ్లే’ అన్న స్వరాజ్యం 13 ఏళ్ల వయసులోనే విప్లవగీతమయ్యారు. విసునూరు దేశ్‌ముఖ్ దురాగతాలను ఎండగట్టే ఉయ్యాల పాటలను ప్రచారానికి ఆయుధంగా చేసుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమె ఉపన్యాసాలు విని జనం ఉర్రూతలూగారు. 16 ఏళ్లకే గెరిల్లా... భూస్వాముల దగ్గరున్న ఆయుధాల స్వాధీనంతో మొదలైన పోరు.. పోలీసు క్యాంపుల దాకా కొనసాగింది. గ్రామాల మీద దాడి చేసిన పోలీసుల దగ్గర్నుంచి ఆయుధాలు గుంజుకోవడంలో మహిళలకు శిక్షణ నిచ్చారు స్వరాజ్యం. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి, సూర్యాపేట, మల్లారెడ్డిగూడెం, పోరాటాల్లో్ల కీలక పాత్ర పోషించారు స్వరాజ్యం. కడివెండి పోరాటంలో మహిళలను కూడగట్టడంలో ఆమెది ప్రధాన భూమిక. నల్గొండ, వరంగల్జిల్లాల్లో దాదాపు పదిహేను సాయుధ పోరాటాలు ఆమె నాయకత్వంలో జరిగాయి. తాడి, ఈత చెట్లపై నిజాం సర్కార్పెత్తనాన్ని సవాలు చేస్తూ... ‘గీసేవాడిదే చెట్టు.. దున్నేవాడిదే భూమి’ నినాదానికి పార్టీ పిలుపునిచ్చింది. సూర్యాపేట తాలూకాలో నిర్వహణ బాధ్యతలు స్వరాజ్యానికి అప్పగించారు. గ్రామరాజ్యాలు, గ్రామ రక్షణ మహిళా దళాలు ఏరా>్పటు చేయడం, తాళ్ల పంపకం, భూ పంపకం సమర్థవంతంగా నిర్వహించారు స్వరాజ్యం. ఎన్నటికీ మరవని సంఘటన... ఓ కోయగూడెంలో షెల్టర్ తీసుకున్నది దళం. ఆ ఇంట్లో బాలింత, ఆమె తల్లిద్రండులు ఉన్నారు. ఎట్ల తెలిసిందో ఏమో పోలీసులు గుడిసెను చుట్టుముట్టిన్రు. లోపలికి వస్తే స్వరాజ్యంను చూస్తారని దర్వాజ దగ్గరకెళ్లింది ఇంటి యజమాని సమ్మక్క. చంటిపిల్లను తీసుకుని స్వరాజ్యం బయటపడ్డది. కానీ ఆ కోయ స్త్రీని స్వరాజ్యం అనుకుని అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసులు. వెంటనే వెనక్కి వచ్చి ఆ పసిబిడ్డను వెనక్కి ఇచ్చేయడానికి లేదు. రెండు మూడు రోజులు దళంతో ఉంచుకోవాల్సి వచ్చింది. పాలు సరిగ్గా దొరక్క శిశువు మరణించింది. తాను స్వరాజ్యం కాదని పోలీసులకూ చెప్పలేదు. వారం రోజుల తరువాత నిజం తెలుసుకున్న పోలీసులు ఆమెను వదిలిపెట్టారు. ఆమె గ్రామానికి వచ్చాక వెళ్లి కలిసింది దళం. ఆ తల్లిని చూసి కన్నీల్లు పెట్టుకున్నారు స్వరాజ్యం. ‘నీ బిడ్డను ఎత్తుకునిపోయి తప్పు చేశాను. వదిలిపెట్టినా బాగుండేదేమో’ అని పశ్చాత్తాప పడ్డారు. ‘నా బిడ్డ కోసం నువ్వు ఏడుస్తున్నవు... కానీ ప్రజలకోసం నిన్ను వదులుకున్నది కదా మీ అమ్మ’ అని ఓదార్పు మాటలు పలికిందట ఆమె. ఆ ఇద్దరు తల్లుల త్యాగాన్ని నేనెప్పటికీ మరవను అని చెప్పేవారామె. బియ్యం బుక్కి... సాయుధ పోరాట విరమణ తరువాత.. 1954లో ఆమె పేరు మీద ఉన్న పదివేల రివార్డును ఎత్తివేసింది ప్రభుత్వం. అదే ఏడు హైదరాబాద్‌లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. ఏడేళ్ల అజ్ఞాతవాసం తరువాత వేదికనెక్కిన ఆమెను చూడగానే ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఆమె ప్రసంగం విన్న జనం ఉర్రూతలూగారు. ఆ సభ అనంతరం మల్లు వెంకటనర్సింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. భూస్వామ్య కుటుంబంనుంచి వచ్చినా... తల్లిద్రండుల నుంచి నుంచి గుంటెడు జాగ కూడా తీసుకోలేదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తిండి సరిగ్గా లేని రోజులు. ఎప్పుడూ జొన్న గటక, జొన్నరొట్టెలే అన్నట్టుగా ఉండేది. దొరకక ఓసారి బియ్యం దొరికినయ్. అప్పుడు స్వరాజ్యం పచ్చి బాలింత. ఆకలైతుంటే... అవి వండి తినేసరికి ఆలస్యమైతదని పచ్చిబియ్యం బుక్కి కడుపు నింపుకొన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా... ఎంచుకున్న మార్గంలో కష్టాలుంటయి మధ్యలో కంగారు పడితే లాభం లేదని బలంగా నమ్మారామె. ఏనాడూ తన మార్గం తప్పలేదు. నిజాయితీని వీడలేదు. ఎమ్మెల్యేగా మాటల తూటాలు.. సాయుధ పోరాట విరమణ తరువాత... 1978లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు స్వరాజ్యం. 5వేల ఓట్ల తేడాతో విజయం సాధించారామె. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆమె అసెంబ్లీకి వెళ్తే... బంట్రోతు లోపలికి వెళ్లనివ్వలేదు. ‘నేను ఎమ్మెల్యేను’ అని ఆమె చెప్పుకున్నా నమ్మలేదు. అంత సాదాసీదాగా అసెంబ్లీకి వెళ్లేవారామె. చట్టసభల్లో తన బాధ్యతనూ ఉద్యమంలాగే భావించారు. ఆమె సమస్యలపై స్వరాజ్యం మాట్లాడితే...అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ‘మాటలు తూటాల లెక్కన పేలుస్తున్నవ్... ఇది బహిరంగసభ కాదు. అసెంబ్లీ’ అన్నారు. ఒక్కసారి మైక్ పట్టుకున్నారంటే అంతలా ఉండేది ఆమె వాగ్ధాటి. పోరాటం చేయని సమస్య లేదు... భూదానోద్యమంలో ఇచ్చినవి, పోరాటకాలంలో కమ్యూనిస్టులు పంచిన భూములు యూనియన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ ఆక్రమించుకున్నరు దొరలు. ఎమ్మెల్యేగా ఉండి తిరిగి వాటిని ప్రజలకు అప్పగించడానికి రాజీలేని పోరాటం చేశారు. 900 ఎకరాల భూమిని తిరిగి ప్రజలకు అందజేశారు. ఎమ్మెల్యే పదవీ వీడాక కూడా ఆమె పోరాట పంథాను వీడలేదు. 1993లో సంపూర్ణ మద్యనిషేధంలో ఆమెది చురుకైన పాత్ర. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు సమానహక్కు, వరకట్న వ్యతిరేక చట్టం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళల పేరిట భూ పంపిణీ... స్వరాజ్యం పోరాటం చేయని సమస్యే లేదు. గ్రామాల్లో తిరిగి పనిచేసినా.. తుపాకీ పట్టి గెరిల్లాగా ఉన్నా, అసెంబ్లీలో నిలబడినా ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమెది పోరాటమే. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. పోరాటాలు ఉన్నంత కాలం.. మల్లు స్వరాజ్యం పేరు ఉంటుంది. -
ఈడీ దాడుల భయంతోనే నాటకాలు: రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ శివారులోని భూముల అక్రమ కేటా యింపులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడు లు, కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలతో ఆందోళన చేయించారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ భూముల వ్యవహారానికి సంబంధించి మంత్రి కేటీఆర్‌ను ఈడీ పిలిపించాలని చూసిందని, చివరి నిమిషంలో అది వాయిదా పడిందని తెలిపారు. తాత్కాలికంగా వాయిదా వేశారనే కృతజ్ఞతతోనే ఆ పార్టీ ఎంపీలు సభాకార్య క్రమాలకు ఆటంకం కలిగించి బీజేపీ ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిం చారన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ‘వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వా లని ప్రతిపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తుంటే, దానిని పక్కదోవ పట్టించేందుకు టీఆర్ఎస్ ఎంపీలు పోడియం చుట్టుముట్టి ఆందోళన చేశారు. హైదరాబాద్ శివార్లలో రూ.3 వేల కోట్ల విలువైన భూముల విషయంలో కేసీఆర్ సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. వారందరినీ పిలిచి విచారించింది. ఉమ్మడి ఏపీలో 15 ఏళ్ల క్రితం విదేశీ కంపెనీ లకు రూ.450 కోట్లకు ఈ భూములను అప్పటి ప్రభుత్వం కట్టబెడితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి నుంచి బలవంతంగా రూ.350 కోట్లకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు చెందిన పెద్ద రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్, టీవీ చానల్ యజమానికి కట్టబెట్టారు. ఈ భూముల అక్రమాల ఫైలుపై మంత్రి కేటీఆర్ సంతకం చేశారు’అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. -
నేనే డెబ్బై ఎకరాలు కబ్జా చేస్తే..సీఎం ఎన్నెకరాలు చేసి ఉంటారు?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ‘‘ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేనే రైతులను బెదిరించి 70 ఎకరాల అసైన్డ్ భూములను తీసుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ఇంక ఎంత మందిని భయపెట్టి హైదరాబాద్ కొండాపూర్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో ఎన్ని వేల ఎకరాలు తీసుకుని ఉంటారు.. నాదైతే తొండలు కూడా గుడ్లు పెట్టని భూమి’’అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో బీజేపీ పదాధికారుల రెండు రోజుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన సోమవారం హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. జమునా హేచరీస్ సంస్థలో ఒక్క ఎకరం కబ్జాలో ఉన్నట్టు తేలినా ముక్కు నేలకు రాస్తానని తన భార్య జమున చెప్పినమాటకు కట్టుబడి ఉంటానని రాజేందర్ తెలిపారు. సిస్టం అంటూ ఒకటి ఉంటుందని, అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. తాను భూములు కబ్జా చేశానని అనడం మతిలేని చర్యగా అభివర్ణించారు. ‘స్థానిక’ఓటర్లు అంతరాత్మ సాక్షిగా ఓటేయాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారి అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాలని ఈటల రాజేందర్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే.. కేసీఆర్‌కు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు కనబడుతున్నారని, కానీ ఇన్నా ళ్లుగా చేసిన నిర్లక్ష్యం గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని ఈటల దుయ్యబట్టారు. చిన్న లొసుగును ఆధారం చేసుకుని 2014 లో ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలందరిని టీఆర్ఎస్లో చేర్చుకున్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నూ మింగేశారని ఆయన ఆరోపించారు. -
జమునా హేచరీస్.. 70.33 ఎకరాలు కబ్జా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి, మెదక్ జోన్: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకులకు సంబంధించిన జమునా హేచరీస్ సంస్థ భూఆక్రమణలకు పాల్పడటం వాస్తవమేనని మెదక్ జిల్లా అధికార యంత్రాంగం మరోమారు నిర్ధారించింది. మొత్తం 70 ఎకరాల 33 గుంటల అసైన్డ్, సీలింగ్ భూములను ఆ సంస్థ కబ్జా చేసినట్లు రీ సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం ప్రకారం జమునా హేచరీస్‌పై సివిల్, క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. మొత్తం 56 మంది లబ్ధిదారులకు చెందిన 61 ఎకరాల 13.5 గుంటల అసైన్డ్ భూములతోపాటు 9 ఎకరాల 19.5 గుంటల ప్రభుత్వ భూమిని జమునా హేచరీస్ ఆక్రమించిందన్నారు. అచ్చంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 77, 78, 79, 80, 82, 130లతోపాటు హకీంపేట పరిధిలోని 97 సర్వే నంబర్లోని అసైన్డ్ భూముల్లో రోడ్లు వేసి రైతులను భూముల్లోకి వెళ్లకుండా సంస్థ యాజమాన్యం అడ్డుకుంటోందని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు.. జమునా హేచరీస్ స్థానిక గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా మూడు నిర్మాణాలు చేపట్టిందని తేలినట్లు కలెక్టర్ హరీశ్ వివరించారు. ఫౌల్ట్రీ ఫీడ్ నిల్వ చేసేందుకు హకీంపేట్ గ్రామ పరిధిలో గాదెలను, అచ్చంపేట్ గ్రామ పరిధిలో ఫౌల్ట్రీ షెడ్లను నిర్మించిందని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలకు విరుద్ధంగా జమునా హేచరీస్ డంప్ చేస్తున్న కోళ్ల వ్యర్థాల వల్ల సమీపంలోని హల్దీ వాగుకు అనుసంధానంగా ఉన్న ఎల్క చెరువులో నీరు కలుషితమవుతోందని, స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వానికి పంపిన నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల ఆ సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అసైనీలకు భూములు తిరిగిస్తాం... జమునా హేచరీస్ కబ్జా చేసిన భూములపై తిరిగి తమకు హక్కులు కల్పించాలని అసైన్డ్ భూముల లబ్ధిదారులు కోరుతున్నారని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ భూముల్లో రోడ్ల నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకొని వాటిని అసైనీలకు అప్పగించాల్సి ఉందన్నారు. అలాగే అచ్చంపేట గ్రామ సర్వే నంబర్ 81, 130లలోని అసైన్డ్, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ జమునా హేచరీస్ రిజిస్ట్రేషన్లు చేసుకుందనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరినట్లు చెప్పారు. -
జమున హేచరీస్‌పై రీసర్వే షురూ
వెల్దుర్తి/మెదక్‌జోన్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సంబంధించి జమున హేచరీస్ భూముల రీసర్వే ప్రారంభమైంది. తొలిరో జు మంగళవారం మెదక్ జిల్లా మాసాయి పే ట్ మండలం అచ్చంపేట శివారులో సర్వే నం.130లో 18.35 ఎకరాల భూమిని సర్వే చేశారు. తూప్రాన్ ఆర్డీఓ శ్యాంప్రకాశ్ పర్యవేక్షణలో ఆరు బృందాలు సర్వే నిర్వహించా యి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే కొనసాగింది. సర్వే చేస్తున్న ప్రదేశానికి మీడియాకు అనుమతి నిరాకరించారు. నోటీసులు అందుకున్న రైతులను మాత్రమే అనుమతించారు. రాజేందర్ భార్య జమున, ఆయన కుమారుడు నితిన్‌రెడ్డిలతో మొత్తం 17 మంది రైతులకు ఈనెల 8న సర్వే నోటీసులు జారీచేసిన రెవెన్యూ అధికారులు మంగళవారం సర్వే నం.130లోని భూ సర్వే నిర్వహించారు. ఈ సర్వేకు జమున, నితిన్‌రెడ్డి హాజరుకాలేదని అధికారులు తెలిపారు. కోవిడ్ కారణంగా సర్వే వాయిదా... టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఈటలపై భూఆక్రమణ ఆరోపణలు 6 నెలల క్రితం సంచలనం సృష్టించిన విష యం విదితమే. తమ భూములను ఈటల కుటుంబీకులు బలవంతంగా లాక్కున్నారని పలువురు రైతులు కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడం.. ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం.. ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించడం చకచకాగా జరిగిపోయాయి. అప్పట్లో ఆగమేఘాల మీద సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు జమున హేచరీస్‌లో 66.01 ఎకరాలు కబ్జాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై హేచరీస్ సంస్థ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అప్పట్లో కోవిడ్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో సర్వే వాయిదా వేసిన అధికారులు తాజాగా ఈనెల 8న సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సర్వే నిర్వహించారు. తొలి రోజు 18.35 ఎకరాలు సర్వే.. జమున హేచరీస్‌కు సంబంధించి అచ్చంపేట, హకీంపేట శివారుల్లోని సర్వే నం.77లో 8.32 ఎకరాలు, సర్వే నం.78లో 14.02 ఎకరాలు, సర్వే నం.79లో 13.36 ఎకరాలు, సర్వే నం.80లో 17.25 ఎకరాలు, సర్వే నం.81లో 16.19 ఎకరాలు, సర్వే నం.82లో 13.09 ఎకరాలు, సర్వే నం.130లో 18.35 ఎకరాలు, సర్వే నం.97లో 11.27 ఎకరాల చొప్పున.. 115 ఎకరాల పైచిలుకు భూములను సర్వే చేయాల్సి ఉంది. మొదటి రోజు 18.35 ఎకరాలు సర్వే చేశారు. నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తాం.. మూడు రోజులపాటు సర్వే నిర్వహించి సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ నివేదిక వచ్చాక వివరాలను వెల్లడిస్తామని తూప్రాన్ ఆర్డీఓ శ్యాంప్రకాశ్ పేర్కొన్నారు. కాగా, కబ్జాలకు గురైన భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
వెబ్ ల్యాండ్ దోపిడి.. వేల ఎకరాలను కాజేసిన వైనం
మాజీ వీఆర్ఓ మోహన్‌గణేష్ పిళ్లై భూ దోపిడీ రెవెన్యూశాఖలోని లొసుగులను బట్టబయలు చేసింది. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయడంలో పలువురు అధికారుల పాత్ర ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. రికార్డుల డిజిటలైజేషన్ పేరుతో ప్రారంభించిన వెబ్ ల్యాండ్ విధానమే అక్రమాలకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఉద్యోగ విరమణ పొందే సమయంలోనే ఈ కొత్త పద్ధతి మొదలవడంతో అప్పనంగా భూకబ్జాలకు పాల్పడేందుకు పిళ్లైకు అవకాశం చిక్కింది. తన భూబాగోతాన్ని ఎవరూ కనిపెట్టలేరనే నమ్మకంతోనే యథేచ్ఛగా దందా సాగించినట్లు వెల్లడవుతోంది. కలెక్టరేట్ సిబ్బంది ప్రమేయం లేకుండా భారీస్థాయిలో వెబ్‌ల్యాండ్ నమోదు సాధ్యం కాదని స్పష్టమవుతోంది. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక పోయిందన్నట్లు తయారైంది వెబ్ ల్యాండ్ పరిస్థితి. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పేరుతో కిరణ్ సర్కార్ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇదే మాజీ వీఆర్ఓ మోహన్‌గణేష్ పిళ్లైకు వరంగా మారింది. తప్పుడు పత్రాలను సృష్టించి వాటిని డిజిటలైజేషన్లో భాగంగా రికార్డుల్లో నమోదు చేయించాడు. 2010లో పిళ్లై ఉద్యోగ విరమణ పొందే సమయంలోనే ఆయా భూములను నొక్కేశాడు. జిల్లాలోని 13 మండలాలు.. 18 గ్రామాల పరిధిలో సుమారు 2,320 ఎకరాల భూకుంభకోణం 11 ఏళ్ల తర్వాత వెలుగులోకి రావడం గమనార్హం. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు నిందితులైన మోహన్‌గణేష్ పిళ్లై, మధుసూదన్, రాజన్, కోమల, అడవి రమణలను అరెస్ట్ చేశారు. అయితే పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ఇలాంటి ఘటనలు మరిన్ని బయటపడే అవకాశముందని రెవెన్యూశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోగస్ పట్టాలతో వేల ఎకరాలను వెబ్‌ల్యాండ్‌కు ఎక్కించారంటే అందులో కలెక్టరేట్ సిబ్బంది పాత్ర కచ్చితంగా ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్‌ల్యాండ్ నమోదుకు వినియోగించిన నకిలీ పత్రాలు తప్పుల తడకగా రెవెన్యూ రికార్డులు వెబ్‌ల్యాండ్ రాకముందు రికార్డులన్నీ మాన్యువల్‌గానే నిర్వహించారు. అడంగళ్, 1(బి), ఆర్ఎస్ఆర్ వంటివి రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో ఉండేవి. ఈ రికార్డులను డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా వెబ్‌ల్యాండ్‌ను రూపొందించారు. అయితే వీఆర్ఓల చేతుల మీదుగా ప్రక్రియ మొత్తం కొనసాగడంతో అప్పడు విధులు నిర్వర్తిస్తున్న మోహన్‌గణేష్ పిళ్లై మోసాలకు పాల్పడ్డాడు. దీనికితోడు వెబ్‌ల్యాండ్ ప్రక్రియను పర్యవేక్షించిన అప్పటి జాయింట్ కలెక్టర్లు సురేష్‌కుమార్, ప్రద్యుమ్న అలసత్వం కూడా సదరు మోహన్‌గణేష్ పిళ్లైకు అవకాశంగా మారింది. చదవండి: (చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణం.. రూ.500 కోట్లు..!) అందుకే భూముల రీసర్వే భూ సమస్యల కారణంగా నిత్యం వందలాది మంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఇలాంటి సమస్యలకు ఫుల్స్టాప్ పెట్టేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ సమస్యలకు చరమగీతం పాడేందుకు రీసర్వేను పకడ్బందీగా జరిపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రీసర్వే వేగవంతంగా జరుగుతోంది. దీంతో భూ సమస్యలకు శాశ్వతంగా చెక్ పడనుంది. రెవెన్యూ రికార్డులు పరిశీలించండి: తహసీల్దార్ యాదమరి: మండలంలోని 184 గొల్లపల్లె మాజీ వీఆర్ఓ మోహన్‌గణేష్ పిళ్లై అక్రమాలను పూర్తిస్థాయిలో బయటపెట్టేందుకు రికార్డులను పకడ్బందీగా పరిశీలించాలని తహసీల్దార్ చిట్టిబాబు ఆదేశించారు. బోదగుట్టపల్లె రెవెన్యూ పరిధిలో పిళ్లై 200 ఎకరాలకు పైగా కాజేసినట్లు సమాచారం అందిందన్నారు. ముఖ్యంగా కొటాల, నడింపల్లె, వరదరాజులపల్లె, యాదమరి, దాసరాపల్లె, ఓటివారిపల్లె గ్రామాల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి పరుల పాలైనట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. రెవెన్యూ రికార్డుల పరిశీలన అనంతరం వాస్తవాలు తెలుస్తాయని వెల్లడించారు. -
కాపాడాల్సిన రక్షకులే భక్షకులు
-
విశాఖ టీడీపీ భూకబ్జాదారుల గుండెల్లో గుబులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ టీడీపీ భూకబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది. టీడీపీ నేతల భూబాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీను ఆక్రమణలో 49 ఎకరాలు ఉండగా, నిన్న ఒక్కరోజే రూ.790 కోట్లకుపైగా విలువైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కబ్జాకు గురైన 430.81 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తుంగ్లాంలో 12.5 ఎకరాల భూమి, కాపు జగ్గరాజుపేటలో 7 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు రూ.5,080 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేతల భూకబ్జాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. టీడీపీ నేతల భూకబ్జాలు మరికొన్ని బయటపడే అవకాశం ఉంది. చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన -
ఈటలపై ఆరోపణలు.. దేవరయాంజాల్‌లో చురుగ్గా విచారణ
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారులోని దేవరయాంజాల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణపై ఐఏఎస్ ఉన్నత స్థాయి కమిటీ విచారణ చురుగ్గా సాగుతోంది. మూడో రోజైన బుధవారం ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలున్న నిర్మాణాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలోని ఐఏఎస్ అధికారుల కమిటీ పరిశీలించింది. ఆలయ భూముల కబ్జాలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు పలువురి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీని నియమించింది. దీంతో మూడు రోజులుగా ఆలయ భూము ల్లో వెలసిన నిర్మాణాలతోపాటు భూముల వివరాలను కమిటీ బృందం సేకరిస్తోంది. కష్టంగా వివరాల సేకరణ దేవరయాంజాల్‌లోని ఆలయ భూములకు సంబంధించి 91 సర్వే నంబర్ల పరిధిలో 39 మందికి సంబంధించి 178కి పైగా వాణిజ్య కట్టడాలు ఉన్నాయి. అయితే, ఇందులో 129కి మాత్రమే ఏడాదికి రూ.1.02 కోట్ల ఆస్తి వన్ను రూపేణా తూముకుంట మున్సిపాలిటికి చెల్లిస్తున్నట్లు తేలింది. ఆలయానికి సంబంధించి దాదాపు 200 ఎకరాల్లో కమర్షియల్ షెడ్లు ఉండగా, మరో 800 ఎకరాల భూములు వ్యవసాయ భూమిగా ఉన్నట్లు తెలుస్తోంది. గోదాములు, కమర్షియల్ షెడ్లతోపాటు ప్రహరీతో నిర్మించిన భూములు వందలాది ఎకరాలుగా ఉండ టం వల్ల వీటికి సంబంధించిన యజమానుల వివరాలు తెలుసుకునేందుకు సమ యం పడుతోంది. బినామీలతోపాటు 2, 3 తరాలకు చెందిన వారు యజమానులుగా ఉన్నట్లు వెల్లడవుతుండటం.. పైగా కొందరు మరణించటం వంటి వాటి వల్ల ఆ వివరాల సేకరణ కష్టంగా మారుతోంది. డీజీపీఎస్ టెక్నాలజీతో సర్వే ఆలయ భూములు, అందులోని నిర్మాణాలకు సంబంధించిన వివరాలు పక్కాగా సేకరించేందుకు కమిటీ బృందం అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తోంది. గోదాములు, స్థలం (భూమి) లోకేషన్ ఆధారంగా డీజీపీఎస్ సర్వే చేస్తోంది. దీంతో అంగుళం కూడా తప్పిపోకుండా వివరాలు పక్కాగా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఆలయానికి సంబంధించిన 1,531ఎకరాలల్లో 178కి పైగా నిర్మాణాలు ఉండటం వల్ల సర్వే పూర్తి కావడానికి రెండు రోజులు పట్టవచ్చునని సమాచారం. పత్రాలు చూపుతున్న రైతులు ఆలయ భూముల్లో సర్వే చేస్తున్న తహసీల్దార్ల బృందాలకు రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు పాత రికార్డులు, పత్రాలు చూపిస్తున్నారు. సర్వే నంబర్లు 671, 674, 676, 714లలో పలు నిర్మాణాలు చేపట్టిన రైతులు 25 ఎకరాలకు సంబంధించిన రికార్డులను విచారణ బృందం అధికారి రఘునందన్‌రావుకు చూపించారు. 715, 717, 718 సర్వే నంబర్లలో 16 ఎకరాలున్న యాజమాని కూడా పత్రాలను అందజేశారు. చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్ Etela Rajender: ఈటలకు షాకిచ్చేందుకు ‘కెప్టెన్’ రెడీ! -
ఈటలపై భూకబ్జా ఆరోపణలపై విచారణ
-
ఈటలపై భూకబ్జా ఆరోపణలు: అసైన్డ్ భూములను పరిశీలించిన కలెక్టర్ హరీష్
-
ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్
సాక్షి, మెదక్: అసైన్డ్ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ హరీష్ తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి.. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు శనివారం ఉదయం నుంచి విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. వివాదాస్పద అసైన్డ్ భూములను పరిశీలించిన కలెక్టర్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పౌల్ట్రీ ఫామ్ కోసం రోడ్డు, హ్యాచరీ కోసం షెడ్లు నిర్మించారని ఆయన పేర్కొన్నారు. బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. భూముల్లో డిజిటల్ సర్వే కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాత సీఎస్‌కు నివేదిక అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. మంత్రి ఈటల రాజేందర్ భూ వివాదంపై విచారణ కొనసాగుతోంది. హకీంపేట, అచ్చంపేటలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారుల విచారణ చేపట్టారు. బాధితుల నుంచి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన రైతుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అసైన్డ్‌దారులను పిలిచి రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. హకీంపేట, అచ్చంపేట శివారు 170 ఎకరాల భూముల్లో డిజిటల్ సర్వే చేపట్టారు. ఈటలకు చెందిన హ్యాచరీతో పాటు అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే చేస్తున్నారు. మూడు టీమ్‌లుగా రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు డిజిటల్ సర్వే చేపట్టారు. ఈటల రాజేందర్‌పై భూముల కబ్జా ఆరోపణలు టీఆర్ఎస్ సర్కారులో ప్రకంపనలు సృష్టించాయి. మంత్రి ఈటల రాజేందర్ తమ భూములను కబ్జా చేశారంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్‌కు నేరుగా లేఖ రాయడం.. సీఎం కేసీఆర్ వెంటనే ఈ విషయంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడం.. తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి ఈటల ఘాటుగా స్పందించడం సంచలనంగా మారింది. చదవండి: ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..? 100 ఎకరాలు లాక్కున్నారు: ఈటలపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు -
పీలా చెరలో రూ. 300 కోట్లు ప్రభుత్వ భూమి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర పరిసరాల్లో భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే ఈ డ్రైవ్‌లో టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు చేసిన భూకబ్జాలు, చేసిన అక్రమ నిర్మాణాలే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గతంలో ‘గీతం’, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువుల ఆక్రమణలు బయటపడగా.. తాజాగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా భూ కబ్జాకు పాల్పడి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు నిర్ధారించి చర్యలు చేపట్టారు. భీమన్నదొరపాలెంలో.. ఆనందపురం మండలంలోని భీమన్నదొరపాలెం పరిధి సర్వే నంబర్ 156లో పీలా ఆక్రమణలో ఉన్న సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆదివారం విశాఖ ఆర్డీవో పెంచల కిషోర్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం ఆ భూమి విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఆ భూమిని ఆనుకొని ఉన్న డీ పట్టా భూములను కొనుగోలు చేయడంతో పాటు మరో 100 ఎకరాల వరకు ఆక్రమించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు రెవిన్యూ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. డీ పట్టా భూములపై కన్ను పీలా గోవిందు తండ్రి మహాలక్ష్మి నాయుడు టీడీపీ నాయకుడే. ఆయన పెందుర్తి మండలాధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచే భీమన్నదొరపాలెంలో డీ పట్టా భూములపై కన్నేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ఆ భూములను సక్రమం చేసుకునేందుకు గోవిందు 2014 సంవత్సరంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. విశాఖలో భూఆక్రమణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలోనూ ఈ అక్రమాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిగాక ఆనందపురం మండలంలోనే రామవరం గ్రామంలో 99.89 ఎకరాల ప్రభుత్వ భూమి చేతులు మారిన వ్యవహారంలో గోవిందుతో పాటు మరో 11 మందిపై పోలీసులు గతంలో క్రిమినల్ కేసు నమోదు చేశారు. బొత్స బంధువుల అక్రమ నిర్మాణం తొలగింపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బంధువులకు చెందిన రేకుల షెడ్డును ఆదివారం రెవెన్యూ అధికారులు తొలగించారు. విశాఖ శివారు రుషికొండ పరిధిలో సర్వే నంబర్ 19లో ఏడు సెంట్ల విస్తీర్ణంలో ఒక షెడ్డు, రెండు సెంట్ల విస్తీర్ణంలో మరొక రేకుల షెడ్డు గెడ్డ పోరంబోకు భూమిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేశారు. అయితే ఆ నిర్మాణాల్లో రెండు సెంట్ల విస్తీర్ణంలో ఉన్నది మాత్రమే తమ బంధువులకు చెందినదని మంత్రి బొత్స ఫోన్లో ‘సాక్షి’కి వివరించారు. విశాఖలో అక్రమ నిర్మాణాలు ఏవైనా తొలగించాలని, తన బంధువులదైనా ఉపేక్షించవద్దని తాను ఆదివారం స్వయంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వెలగపూడి కబ్జా పర్వం ఎమ్మెల్యే వెలగపూడి రుషికొండ ప్రధాన రహదారిని ఆనుకొనే కబ్జా పర్వం నడిపించారు. జీవీఎంసీ 8వ వార్డు పరిధిలో సర్వే నంబర్ 21లోని సుమారు రూ.2 కోట్ల విలువైన 6 సెంట్ల స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలగపూడి ఆక్రమించారు. అందులో రేకుల షెడ్డు, ప్రహరీ నిర్మించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది గెడ్డ పోరంబోకు స్థలంగా గుర్తించిన అధికారులు ఆదివారం ఉదయం ఆయా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అది ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. -
శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని ఆయన అన్నారు. మంత్రి మల్లారెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆ శ్యామలదేవి ఎవరో కూడా తెలియదు. నా భూమి పక్క భూమి ఆమెది అని తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా భూమి ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ఒక మహిళకు మంత్రిగా సహాయం చేయడానికి సిద్ధం. శ్యామల అనే మహిళ ... నన్ను ఇప్పటివరకూ కలవలేదు. నేను ఎవరినీ బెదిరించలేదు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే’ అని స్పష్టం చేశారు. (మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు) కాగా భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఈ నెల 6వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుమారుడిపై కూడా కేసు నమోదు అయింది. -
విశాఖ: భీమిలీ రోడ్డులో ప్రభుత్వ భూమి కబ్జా
-
విశాఖపట్నం: 70 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న బడాబాబులు
-
విశాఖలో భారీగా ప్రభుత్వ భూమి స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో భారీ ఎత్తున ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అడవివరం నుంచి శోత్యాం వెళ్లే మార్గంలో రామ అగ్రహారం వద్ద దాదాపు 110 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి మొక్కలను పెంచుతున్నారు. ఇందులో పది ఎకరాల భూమిని మినహాయిస్తే మిగతా భూమి అంతా ప్రభుత్వానిది. టీడీపీ హయాంలో కొందరు బడా బాబులు ఈ భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ దశలో రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి ప్రహరీ గోడను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70 ఎకరాల ఖరీదైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం) -
‘భూ కబ్జాలపై చట్టం తన పని తను చేసుకుంటుంది’
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ భూ కబ్జాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని మడుగుల ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ ముత్యాల నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి ఆక్షేపణ వస్తే కోర్టులకు వెళ్ళడం పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వ భూములు అక్రమించుకున్న వారిని ఉపేక్షించేది లేదని, టీడీపీ నాయుకులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల వ్యవహారం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. టీడీపీ నాయుకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తన అనుయులకు దోచిపెట్టారని ఆయన పేర్కొన్నారు. -
భూకబ్జాపై 'సాక్షి' కథనానికి స్పందించిన అధికారులు
సాక్షి, సిద్ధిపేట : కోమురవేల్లి మల్లికార్జున స్వామి దేవాలయ భూ కబ్జాపై 'సాక్షి'లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజీవ్ రహదారికి అనుకొని ఉన్న 7ఎకరాల దేవాలయ స్థలాన్ని భూ భకాసురులు కబ్జా చేసిన తీరును సాక్షి టీవీ ప్రసారం చేసింది. దీంతో భూ కబ్జాదారులపై చర్యలకు ఉపక్రమించారు. అయితే దీని వెనుక రాజకీయనేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే దేవాదాయశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 100కోట్ల విలువ చేసే స్థలాన్ని ఆక్రమించేసి ఇల్లు నిర్మాణం చేపట్టినా దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు చూస్తూ ఉండిపోయారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా దీని వెనుక రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉందేమో అని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని విఙ్ఞప్తి చేస్తున్నారు. (అరకొరగానే సహకారం: రూ.25లక్షలు అవసరం) -
హైదరాబాద్‌లో మరో భారీ భూ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. ఫోర్జరీ పత్రాలతో రూ.300 కోట్ల విలువైన స్థలం ఆక్రమించినట్టు వెల్లడైంది. కబ్జాకోరుల ఆగడాలతో బంజారాహిల్స్ రోడ్‌నంబర్-12లోని నాలుగున్నర ఎకరాలు వివాద స్థలంగా మారింది. కొనుగోలు చేసింది 2 ఎకరాల 21 గుంటలైతే నకిలీ పత్రాలతో 7 ఎకరాల కొన్నట్లు పత్రాలు సృష్టించారు అక్రమార్కులు. పక్కనున్న స్థలం కూడా తమదేనంటూ భవన నిర్మాణ అనుమతులు కూడా తెచ్చుకున్నారు. దీంతో ఆ స్థలం యజమాని శ్రీధర్ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నజీబ్ అహ్మద్‌తోపాటు ఆయా సంస్థలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. (చదవండి: బంజారాహిల్స్‌లో గుట్టలుగా హవాలా సొమ్ము) -
ఉస్మానియా వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ భూముల పరిశీలన ఆదివారం ఉద్రికత్తకు దారితీసింది. ఓయూ భూములను పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ పీసీసీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డీడీ కాలనీలో కబ్జా అయిన భూమి దగ్గరకు వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని అడ్డుకోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, వంశీచంద్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. (ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ ‘పోరుబాట’) కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఓయూ భూములను పరిశీలించింది. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలతో పీసీసీ నేతలు ఉస్మానియాకు వెళ్లారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో, ఉస్మానియా భూములు, విద్యారంగాలపై మాజీ ఎంపీ పొన్నం నేతృత్వంలో, నూతన వ్యవసాయ విధానంపై అధ్యయనానికి చిన్నారెడ్డి, కోదండరెడ్డి, గోదావరి పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వం ఏం చేస్తుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
పోలీసుల అదుపులో కోడెల బినామీ!
సాక్షి, నరసరావుపేట: కేట్యాక్స్ కేసుల్లో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గత టీడీపీ పాలనలో కోడెల కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించి సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో పరారయ్యాడు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరాంలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారాక తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివరాం, ప్రసాద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివరాం కబ్జా చేసిన ఆస్తులను ప్రసాద్ పేరిట రాయించినట్లు తెలిసింది. భూ కబ్జా కేసులో టీడీపీ నేత పోతినేని అరెస్టు మంగళగిరి: భూకబ్జా కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని లక్ష్మీనరసింహపురం కాలనీలో బీసీలకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిని పోతినేని శ్రీనివాసరావు కబ్జా చేయడంతో పాటు రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. భూ యజమాని పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం అంతా పోతినేనికి అండగా నిలవడంతో భూయజమానినిబెదిరించి ఆ భూమిని ఆక్రమించుకుని భూమికి ఫెన్సింగ్ వేసి నిర్మాణం చేపట్టాడు. అయితే పోతినేని శ్రీనివాసరావు భూ కబ్జాపై భూయజమానురాలు కుంచాల మంగేశ్వరి మళ్లీ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
మరోసారి బయటపడ్డ టీడీపీ భూకబ్జా బాగోతం
సాక్షి, మంగళగిరి : తెలుగుదేశం పార్టీ నేతల భూ కబ్జా బాగోతం మరోసారి బయటపడింది. మంగళగిరిలోని ఆత్మకూరులో తన స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని రైతు ఉమమహేశ్వర్రెడ్డి ఆరోపించారు. 45 ఏళ్ల నుంచి ఆ భూమి తమ ఆధీనంలో ఉందని, రెవెన్యూ అధికారులు పట్టా కూడా ఇచ్చారని చెప్పారు. తన స్థలాన్ని కబ్బా చేసి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని కోర్టు ఆశ్రయిస్తే.. స్టే ఇచ్చిందన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కబ్జా చేసిన స్థలంలో టీడీపీ ఆఫీసును నిర్మిస్తున్నారని మండిపడ్డారు. తన పొలంలోకి రానివ్వకుండా రేకులు అడ్డు పెట్టారని ఆరోపించారు. -
సమగ్ర భూ సర్వేకు కసరత్తు!
సాక్షి, మచిలీపట్నం: గజం భూమి కన్పిస్తే చాలు పాగా వేసేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గడిచిన ఐదేళ్లుగా వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములను చెరబట్టారు. అధికారుల అండ దండలతో రికార్డులను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ, ప్రైౖవేటుభూముల కబ్జాలకు తెగపడ్డారు. సామా న్య, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చలగాట మాడారు. సెంటు భూమి కోసం కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. భూ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం చూపే దిశగా సమగ్ర భూ పరిరక్షణా చట్టాన్ని తీసుకు వస్తోంది. ఈ మేరకు రూపొందించిన ల్యాండ్ టైటిల్ యాక్టు–2019 ముసాయిదా బిల్లుకు ఇటీవలే రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. భూముల యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడంతో పాటు ప్రస్తుతం నెలకొన్న భూ తగాదాలకు పరిష్కారం చూపడం, భవిష్యత్‌లో పత్రాలు, భూ రికార్డులు ట్యాంపరింగ్ కాకుండా నిరోధించేందుకు వీలుగా ఈ చట్టాన్ని రూపొందించనున్నారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం కూడా కసరత్తు మొదలు పెట్టింది. బ్రిటీష్ హయాంలోనే సమగ్ర సర్వే భూముల సర్వేకు పెద్ద చరిత్రే ఉంది. బ్రిటీష్ పాలనకు ముందు అక్బర్ హయాంలో పన్నులు వేసేం దుకు తొలిసారి బ్లాక్ సర్వే జరిగింది. ఆ తర్వాత బ్రిటీష్ హయాంలో 1900లో చేపట్టిన సమగ్ర భూ సర్వే 1923 వరకు సాగింది. చేర్పులు, మార్పుల అనంతరం 1932లో పూర్తిస్థాయిలో రీ సెటిల్ మెంట్ రిజిస్ట్రర్ (ఆర్ఎస్ఆర్) రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎస్టేట్ ఎబాలిష్‌మెంట్ యాక్టు–1956ను తీసుకొచ్చారు. విలేజ్ మ్యాప్స్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ (ఎఫ్ఎంబీ),రీ సెటిల్మెంట్ రిజిస్ట్రర్స్ (ఆర్ఎస్ ఆర్), సెటిల్మెంట్ కాని భూములను ఫెయిర్ ల్యాండ్ రిజిస్ట్రర్స్ (ఎఫ్ ఎల్ఆర్) ఆధారంగానే భూములను గుర్తిస్తారు. వీటి ఆధారంగానే రెవెన్యూ రికార్డ్స్ రూపొందిస్తారు. గడిచిన ఐదేళ్లలో వెలుగు చూసిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జా వివా దాలను దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి రాగానే సమగ్ర భూ పరిరక్షణ చట్టం తీసుకొస్తానని, రీ సర్వే జరిపిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజా సంకల్ప పాదయాత్ర సభల్లో స్పష్టమైన హామీ ఇచ్చారు. నాలుగు గ్రామాల ఎంపిక ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సమగ్ర భూ సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో భూముల సమగ్ర సర్వేకు జిల్లా యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వాదేశాల మేరకు ప్రయోగాత్మకంగా సర్వే చేసేందుకు డివిజన్ కో గ్రామాన్ని ఎంపిక చేసింది. విజయవాడ డివిజన్లో కంకిపాడు మండలం కొణతనపాడు, గుడివాడ డివిజన్లో పామర్రు మండలం పోలవరం, మచిలీపట్నం డివిజన్ గూడూరు మండలం గురిజేపల్లి, నూజివీడు మండలం మర్రిబందు గ్రామాలను ఎంపిక చేశారు. కొణతనపాడులో 127, పోలవరంలో 55, గురిజేపల్లిలో 51, మర్రిబందులో 81 సర్వే నెంబర్లున్నాయి. పైగా ఈ గ్రామాలన్నీ 500 ఎకరాల విస్తీర్ణం లోపలే ఉన్నాయి. జియోట్యాగింగ్ ద్వారా సరిహద్దుల గుర్తింపు సమగ్ర సర్వేలో సర్వే విభాగంతో పాటు రెవెన్యూ, పంచాయతీ ఇతర శాఖలు కూడా భాగస్వాములను చేయనున్నారు. అందుబాటులో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డిజిటల్ గ్లోబల్ పొజిషన్ సిస్టం ద్వారా సరిహద్దులను గుర్తించి జియో ట్యాగింగ్ చేస్తారు. ప్రయోగాత్మక సర్వేనంతరం సాధక బాధకాలపై అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత జిల్లాస్థాయిలో సర్వేకు ఎంత సమయం పడుతుంది? ఎన్ని బృం దాలు కావాలి? ఎంత వ్యయం అవుతుంది? అనే దానిపై కసరత్తు జరుగుతుంది. ఆ తర్వాత ఈ సమగ్ర సర్వేను మన యంత్రాంగంతోనే చేసేం దుకు ఏ మేరకు అవకాశాలున్నాయి లేదంటే ఏదైనాప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలా? అనే అంశం పై కసరత్తు చేపడతారు. జిల్లాస్థాయిలో సమగ్ర సర్వే జరపాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లాలో భూముల వివరాలు డివిజన్లు 4 మండలాలు 50 పంచాయతీలు 980 రెవెన్యూ గ్రామాలు 1005 మున్సిపాల్టీలు 9 జిల్లా భౌగోళిక విస్తీర్ణం 8727 చదరపు కిలోమీటర్లు జిల్లా విస్తీర్ణం 8,34,159 హెక్టార్లు గ్రామ పటాలు (విలేజ్ మ్యాప్స్) 1005 సర్వే నెంబర్లు 3,15,153 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ (ఎఫ్ఎంబీ) 3,15,153 సబ్ డివిజన్స్ 10,08,552 భూ ఖాతాలు 7,02,649 ఇనాం భూములు 26,214.49 ఎకరాలు ఎస్టేట్ భూములు 11,28,188.73 ఎకరాలు ప్రభుత్వ భూములు 9,05,971.23 ఎకరాలు వ్యవసాయ భూములు 13,36,241.60 ఎకరాలు వ్యవసాయేతర భూములు 1,17,160.80 ఎకరాలు ఎస్సెస్డ్ వేస్ట్‌ల్యాండ్స్ 43,768.76 ఎకరాలు అన్ ఎస్సెస్డ్ వేస్ట్ ల్యాండ్స్ 35,171.11 ఎకరాలు దేవాదాయ భూములు 24,197.73 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములు 1810.73 ఎకరాలు అటవీ భూములు 1,03,158.13 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ భూములు 8334.98 ఎకరాలు ఎసైన్మెంట్ ల్యాండ్స్ 86,449.83 ఎకరాలు సోషల్ వెల్ఫేర్ ల్యాండ్స్ 3800.79 ఎకరాలు -
కోడెల కుమార్తెపై మరో కేసు
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మీపై మరో కేసు నమోదైంది. నరసరావుపేటలో ఓ లేఔట్ అనుమతి కోసం రూ. 15 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగారని బాధితుడు, రియల ఎస్టేట్ వ్యాపారి కోటిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. మొదటగా రూ. 10 లక్షలకు సెటిల్మెంట్ అయిందని, మళ్లీ ఇప్పుడు మిగతా ఐదు లక్షలు కూడా ఇవ్వాలని విజయలక్ష్మీ బెదిరిస్తున్నారని కోటిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా విజయలక్ష్మీపై గతంలో కూడా ఒక కేసు నమోదైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. (చదవండి : కోడెల ట్యాక్స్ వెనక్కి ఇప్పించండి) -
కోడెల కుమార్తెపై ఫిర్యాదు
-
కోడెల కుమార్తెపై కేసు
నరసరావుపేట టౌన్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం సాగించిన అరాచక పర్వం మరొకటి వెలుగు చూసింది. సోదరుడిని మించిన సోదరిగా కోడెల కుమార్తె అవినీతి వ్యవహారం బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డాక్టర్ పూనాటి విజయలక్ష్మి విలువైన భూమి కబ్జాకు అనుచరులతో కలసి ప్రయత్నం చేశారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. ఆ భూమిని 2002లో రావిపాడుకి చెందిన పూదోట మారయ్య వద్ద కొనుగోలు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన ఆస్తులు, అమాయకుల భూములపై కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కన్నేసి.. లేని వివాదాలను సృష్టించి ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. కేసానుపల్లిలో రోడ్డు వెంట పద్మావతికి ఉన్న విలువైన ఎకరా భూమిపై కోడెల కుమార్తె విజయలక్ష్మి కన్నుపడింది. చదవండి: (కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు) రెండేళ్ల కిందట ఆమె ఆంతరంగికుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ముఖ్య అనుచరుడు కళ్యాణం రాంబాబు ఆ పొలం వద్దకు వెళ్లి భూ యజమానులను బెదిరించారు. ముందుగానే సృష్టించిన నకిలీ పత్రాలను చూపించి ఆ పొలాన్ని కోడెల కుమార్తె విజయలక్ష్మి కొనుగోలు చేసిందని, మరోమారు భూమి వద్దకు వస్తే హతమారుస్తామని బెదిరించారు. విజయలక్ష్మి వద్దకు వెళ్లి ముడుపులు (కే ట్యాక్స్) చెల్లించి వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని, లేకుంటే పొలానికి ఫెన్సింగ్ వేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు, కుమారుడు గోళ్లపాడులోని సేఫ్ కంపెనీ వద్దకు వెళ్లి విజయలక్ష్మిని కలిశారు. ఆమెను పొలం విడిచి వెళ్లాలని, లేకుంటే తమకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రూ.15 లక్షలు ఇస్తామని, అవి కూడా విడతల వారీగా కడతామని ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం రూ.15 లక్షల్ని 3 విడతలుగా చెల్లించారు. గత ఏడాది జనవరిలో పొలంలో ఉన్న సుబాబుల్ తోటను నరికించేందుకు పొలం యజమాని పద్మావతి, ఆమె భర్త వెళ్లగా రాంబాబు, శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని మరో రూ.5 లక్షలు చెల్లిస్తేనే పొలంలోకి అడుగు పెట్టనిస్తామని, లేకుంటే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన భూ యజమానులు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల కిందట పొలం వద్దకు వెళ్లిన పద్మావతి, ఆమె భర్తపై శ్రీనివాసరావు, రాంబాబు మరో ముగ్గురు కలసి దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి, ఆమె అనుచరులు కళ్యాణం రాంబాబు, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై షేక్ మహ్మద్ షఫీ తెలిపారు. -
వీరు సీపీని ఆశ్రయించారు...అతడు మేనేజ్ చేశాడు...
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్ ఆర్టీసీ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సూరం ఇంద్రారెడ్డి కొంతమంది పోలీసుల అండ చూసుకొని రెచ్చిపోతున్నాడు. పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 88,89,94 ప్లాట్ నంబర్ 929లోని 300 గజాల స్థలంలోని కొంత భూమిని అక్రమించి ప్రహరీ నిర్మించడమే కాకుండా తిరిగి వారిపైనే ట్రెస్పాస్ కింద నార్సింగ్ ఠాణాలో కేసు నమోదు చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అంతకుముందే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆదేశాల ప్రకారం నార్సింగ్ ఠాణా పోలీసులు హెడ్‌కానిస్టేబుల్ సూరం ఇంద్రారెడ్డిపై భూకబ్జా కేసు నమోదుచేసి రెండు రోజులు గడవకముందే తిరిగి వారిపైనే అదే ట్రెస్పాస్ కింద కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. వీరు సీపీని ఆశ్రయించారు...అతడు మేనేజ్ చేశాడు... అమీర్‌పేటలో నివాసముంటున్న అచ్యుతవల్లి పుప్పలగూడలో సర్వే నంబర్ 88,89,94 ప్లాట్ నంబర్ 929లోని 300 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇల్లు కట్టుకునేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ నుంచి బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకున్నారు. అయితే ఈ పనులు ప్రారంభిద్దామని ఆ ప్లాట్‌కు వెళ్లేసరికి కొలతలు చేయగా అచ్యుతవల్లిలోని కొంత భూమిని పక్కనే ప్లాట్ యజమాని సూరం ఇంద్రారెడ్డి ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని తేలింది. అయితే పుప్పాలగూడ కేపీఆర్ కాలనీ ప్లాట్ నంబర్ 54, 55లో ఉంటున్న హెడ్‌కానిస్టేబుల్ ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్లి అచ్యుతవల్లి బంధువులు మాట్లాడితే ఆ అక్రమం వాస్తవమేనని, అయితే పాత యజమానికి తాను రూ.రెండు లక్షల అదనంగా అప్పగించనట్టు, ఆ డబ్బులిస్తేనే ప్రహరీ తీసేస్తానంటూ సమాధానం చెప్పడంతో అచ్యుతవల్లి కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. వెంటనే నార్సింగ్ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళితే ఇదీ సివిల్ మ్యాటర్ అంటూ పిటిషన్ ఐడీ 140319/00665 ఇచ్చి పక్కనబెట్టారు. దీంతో బాధితులు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను కలిసి వివరించడంతో ఇది అక్రమ కబ్జా కిందకే వస్తుందంటూ నార్సింగ్ ఠాణా ఎస్‌హెచ్‌వోకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మార్చి 28న ఐపీసీ 447, 427 సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసుల కేసు నమోదు చేశారు. ఆ ప్లాట్ వద్దకు వెళ్లి సంబంధిత ఎస్ఐ చుట్టుపక్కల వారితో మాట్లాడి ఆ ప్లాట్ కొలతలు తీసుకుని సాక్షుల సంతకాలు కూడా తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన సూరం ఇంద్రారెడ్డి తనకున్న పరిచయాలను ఉపయోగించి అదే పోలీసు స్టేషన్లో అచ్యుతవల్లి భర్త లక్ష్మీనారాయణపైనే ట్రెస్పాస్ కింద తప్పుడు కేసు నమోదు చేయించారు. లక్ష్మీనారాయణ తన ప్లాట్‌లో మట్టిపోసుకుంటే తమ ప్లాట్‌లోకి వచ్చి చేరి బోరు మూతపడిందని సూరం ఇంద్రారెడ్డి ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. కనీసం లక్ష్మీనారాయణను పిలిపించి మాట్లాడకుండానే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంలో ఉద్దేశమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలాఉండగా ఇంద్రారెడ్డి పనిచేసే మియాపూర్ ఆర్టీసీ విజిలెన్స్ విభాగంలోనూఅతని అవినీతి తీవ్రస్థాయిలో ఉందని, లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ ప్లాట్ ఆది నుంచీ వివాదాస్పదమే.. ఇంకో విషయం ఏమిటంటే కొంత భూమి కబ్జా చేసి గోడకట్టిన ఇంద్రారెడ్డి ప్లాట్‌లో ఉన్న ఓ పరిశ్రమలో కొన్ని నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంతో ఏకంగా పక్కనే ఉన్న బాబానివాస్ అపార్ట్మెంట్లోకి మంటలు చొరబడ్డాయి. దీంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. కొంతకాలం పాటు ఖాళీగానే ఉంచిన ఈ ప్లాట్‌లో ఇప్పుడూ వెల్డింగ్ షాప్ కోసం ఏర్పాట్లు చేస్తుండటంతో ఆ అపార్ట్మెంట్ వాసులు వద్దని వారిస్తున్నా స్థానిక పోలీసుల అండతో ముందుకెళుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. రెసిడెన్సీ ప్రాంతంలో మళ్లీ వెల్డింగ్ పరిశ్రమ నెలకొల్పుతుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. -
మంగళగిరిలో వృద్ధురాలి ఆవేదన
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో టీడీపీ నేతల మరో భూ దందా వెలుగుచూసింది. ఓ వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రముఖ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్‌బాబు, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే దృష్టికి తీసుకవచ్చారు. తనకు జరిగిన అన్యాయం ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన వృద్ధురాలి భూమిని కబ్జా చేసిన టీడీపీ నేతలు.. ఆమెను బలవంతంగా గెంటివేశారు. తనకు జరిగిన అన్యాయంపై సదురు వృద్ధురాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆయన కుమారుడు లోకేశ్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని తెలిపారు. దీనిపై అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయకుండా పనులు సాగిస్తున్నారని ఆరోపించారు. -
జేసీ కబ్జాపై కన్నెర్ర
అనంతపురం సెంట్రల్: తమ షాపును కబ్జా చేసి.. బెదిరింపులకు దిగుతున్న జేసీ ప్రబాకర్‌రెడ్డి తీరుపై బాధితులు కన్నెర్రజేశారు. అనంతపురంలోని కమలానగర్లో కబ్జా చేసిన తమ షాపును తక్షణమే ఖాళీ చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన దిగారు. ప్రజాప్రతినిధే కబ్జాకు పాల్పడితే ఎలా అంటూ మండిపడ్డారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులు అడ్డుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ మల్లికార్జున ఆచారి తనకు తండ్రి నుంచి వంశపారంపర్యంగా వచ్చిన కమలానగర్‌లోని ఓ చిన్న షాపును 2000 సంవత్సరంలో బాబయ్య అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడన్నారు. అయితే ఆ బాబయ్య యజమానికి తెలీకుండా షాపును జేసీ సోదరుల(ఎంపీ దివాకర్‌రెడ్డి – ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి)కు చెందిన ‘దివాకర్ రోడ్‌లైన్స్’ కార్యాలయానికి ఇచ్చారన్నారు. అప్పటి నుంచి వీరు షాపు యజమానికి నరకం చూపుతున్నారన్నారు. రూ. 2వేలు మాత్రమే అద్దె ఇస్తున్నారని, బాడుగ పెంచాలని యజమానులు కోరితే దురుసుగా మాట్లాడుతున్నారన్నారు. బాడుగ పెంచేది లేదని, షాపు ఖాళీ చేసేది లేదని, ఏమి చేస్తావో చేసుకోపో అంటూ బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించినా బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. జేసీ సోదరులు తాడిపత్రిలో సాగిస్తున్న విషసంస్కృతిని అనంతపురంలో కూడా అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితునికి న్యాయం జరిగే వరకూ ఆందోళన చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శులు రమణ, అల్లీపీరా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్, సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు నారాయణస్వామి, నాయకులు రజాక్, సుందర్రాజు, బాలయ్య, నారాయణస్వామి, హుస్సేన్, రమేష్, శ్రీనివాసులు, రామాంజనేయులు, ఖాజా, రామకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మాస్టర్‌ప్లాన్ రక్తసిక్తం
కర్ణాటక, బనశంకరి: ఖరీదైన 8 గుంటల భూమి ఎంత పనిచేసింది? నకిలీ వ్యక్తులు, నకిలీ పత్రాలకు తోడు హత్యలతో రక్తసిక్తమైంది. తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ కొద్ది రోజుల క్రితం వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన బెంగళూరు గ్రామీణ పోలీసులకు విచారణలో అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. బుధవారంబెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హొసకోటె తాలూకా నింబెకాయిపుర గ్రామంలో ఓ పొలానికి కాపలాదారుడిగా పని చేస్తున్న వెంకటస్వామి అనే వ్యక్తి తన భార్య సుధారాణి ఆత్మహత్య చేసుకుందంటూ ఈనెల 18వ తేదీన హొసకోటె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన హొసకోటె పోలీసులకు మృతురాలు భర్త వెంకటస్వామి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా, నిజాలు బయటపెట్టాడు. 8 గుంటల భూమితో ఆరంభం బెంగళూరు తూర్పు తాలూకా బెళతూరు గ్రామంలో సర్వే నంబర్ 81లో ఎనిమిది గుంటల స్థలానికి హక్కు దారులు ఎవరూ లేకపోవడం స్థలం రూ.18 కోట్ల విలువ చేస్తుందని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి భూ కబ్జాకు కుట్ర పన్నాడు. ఈ క్రమంలో స్థలం పూర్వపరాలను పరిశీలించిన రమేశ్‌కు నంజప్ప అనే వ్యక్తి పేరుతో స్థలం ఉన్నట్లు గుర్తించాడు. నంజప్పతో పాటు అతడి వారసుల జాడ కూడా తెలియకపోవడంతో పథకానికి పదును పెట్టాడు. ఈ క్రమంలో మాదిగ దండోర రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకరప్ప సూచన మేరకు వెంకట రమణప్ప అనే 95 ఏళ్ల వృద్ధుడిని తీసుకొచ్చి నంజప్పగా నమ్మించడానికి నకిలీ ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు, చిరునామా పత్రాలు తయారు చేయించాడు. దీంతోపాటు స్థలానికి కాపలాగా వెంకటస్వామి, సుధారాణి అనే దంపతులను నియమించుకున్నాడు. కాపలాదారు దంపతుల మధ్య ఘర్షణ ఈ వ్యవహారాలన్నింటిలో స్థలం కాపలాదారుడు వెంకటస్వామి కూడా పాలు పంచుకోవడంతో ప్రతీరోజూ ఇంటికి ఆలస్యంగా వెళుతుండేవాడు. దీంతో ఎందుకు ఆలస్యంగా వస్తున్నావంటూ భార్య సుధారాణి తరచూ ప్రశ్నిస్తుండడంతో ఒకరోజు జరిగిన విషయం మొత్తం భార్యకు చెప్పేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 18వ తేదీన మళ్లీ గొడవ జరగ్గా మద్యం మత్తులో ఉన్న వెంకటస్వామి భార్య సుధారాణిని బలంగా కొట్టడంతో ఆమె మరణించింది. వెంకటస్వామి కిరోసిన్ పోసి ఆమె మృతదేహాన్ని కాల్చివేసి తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అందులో భాగంగా వెంకటస్వామిని ప్రశ్నించగా పొంతన లేకుండా మాట్లాడడంతో తమదైన శైలిలో అసలు విషయాన్ని లాగారు. హత్యలకు తెరలేచిందిలా అయితే నంజప్ప అలియాస్ వెంకటరమణప్పను చంపేస్తే ఇక స్థలం సొంతమవుతుందని అనుకున్నారు. కిందుకు వెంటకరమణప్ప కుమారుడు వెంకటేశ్ అందుకు ససేమిరా అనడంతో చేసేదేమి లేక రమేశ్, శంకరప్పలు మరొక వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఈ క్రమంలో కోలారు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ముళబాగిలకు చెందిన కృష్ణప్పపై వీరి కన్ను పడింది. అతన్ని పిల్చుకెళ్లి విరేచనాలు కలిగించే మాత్రలు కలిపిన మద్యం తాగించడంతో కృష్ణప్ప మృతి చెందాడు. అనంతరం కృష్ణప్పను నంజప్పగా నమ్మిస్తూ సిద్ధం చేసిన నకిలీ ధృవపత్రాలతో అమృత్ మెడికల్ సెంటర్ వైద్యుడు కులకర్ణి సహాయంతో నంజప్ప పేరుతో మరణధృవ పత్రాన్ని తీసుకున్నారు. అనంతరం కృష్ణప్ప మృతదేహాన్ని దహనం చేసి చితాభస్మాన్ని మండ్య జిల్లా శ్రీరంగపట్టణంలో నిమజ్జనం చేశారు. డాక్టర్ సహా వరుస అరెస్టులు దీంతో సుధారాణి హత్యతో పాటు ఆస్తి కోసం కృష్ణప్ప అనే వృద్ధుడి హత్య ఉదంతం కూడా వెలుగు చూసింది. దీంతో రమేశ్, శంకరప్ప, వెంకటస్వామిలతో పాటు నకిలీ ధృవపత్రాలకు సహకరించిన వైద్యుడు కులకర్ణి, మాజీ ప్రొఫెసర్ ధనంజయ, స్టాంప్ వెండర్ కృష్ణప్ప, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కృష్ణమూర్తి, వెంకటరమణప్ప కుమారుడు వెంకటేశ్, హక్కుదారులు లేని స్థలాలు చూపించే కేశవమూర్తిలను అరెస్ట్ చేశారు. -
భ్రమలు మిగిల్చిన అమరావతి!
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ నమ్మిన సిద్ధాంతం.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివి అని. కానీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఆగిపోయింది. సంక్షేమం మాయమైపోయింది అన్నది ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రహిస్తున్న కఠోర వాస్తవం. అంతర్జాతీయమూ లేదు, మహా నగరాలు లేవు... అమరావతి అంటే.. కొందరు మాత్రమే లాభపడుతున్న ఉద్దేశపూర్వకమైన ఓ కుట్ర. ఎందరో సామాన్యులు మోసపోయిన ఓ చట్రం. ఒకవేళ నిర్మించినా ప్రజా సంక్షేమాన్ని కాలరాసిన ప్రభుత్వం ప్రజారహిత అమరావతి నిర్మించాలనుకుంటుందా? సమాధానం చెప్పాలి. అమరావతి. ప్రపంచస్థాయి రాజధాని... ఆధునిక నగరాలను తలదన్నే రాజధాని.. ప్రపంచ పారిశ్రామికవేత్తలదరూ దృష్టి సారి స్తున్న అద్భుత రాజధాని. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాడిందే పాటలాగా పాడుతున్న ఒకేపాట.. రూపురేఖలు లేని బీడు భూముల్లో రాజధాని స్వర్గం గురించి డిజిటల్ రూపంలో సాగిస్తున్న వంచనాత్మక ప్రచారగీతం. పాలకుడి విజన్.. ఇంకా కట్టని 45 అంతస్తుల పాలనా సౌథం గురించి కలలు కంటూండగా.. రైతుల చెమట చుక్కల ఫలితమైన అమరావతి వాస్తవరూపం ఏమిటంటే చిన్నాభిన్నమైన జీవితాలు. భూములివ్వమన్న రైతులపై అక్రమ కేసులు, వేధింపులు. లక్షలు మాత్రమే ఇచ్చి కోట్లు కొల్లగొడుతున్న భారీ భూ దందా చేదు గుర్తులు, వ్యవసాయానికి ద్రోహం బడా కంపెనీలకు మోదం.. తమ భూమిని తీసుకుని బీడుగా ఉంచిన భూముల్లో ఎవరిని ఉద్ధరిస్తున్నారో అంతు చిక్కని రైతుల నిర్వేదం. వ్రయ్యలైన హామీలు, చెల్లని హెల్త్ కార్డులు, పడిపోయిన జీవన ప్రమాణాలు, వ్యవసాయానికి దూరమైన పదివేల మంది కౌలురైతుల కుటుంబాల తీరని వ్యథ. ఇదీ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత ప్రజలకు ఇన్నేళ్లుగా చూపిన మహామాయ. శంకుస్థాపనలు, బాహుబలి లాంటి ఫాంటసీ బొమ్మలు తప్ప తెలుగువారి రాజధాని విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందో నరమానవులకు అర్థం కాని స్థితి. ఇది భూ సేకరణా.. లేక అపహరణా అంటూ ఉద్యమకారులు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ ఆంద్రప్రదేశ్‌కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి, నాలుగేళ్లు గడిచిపోయాయి. అమరావతి పేరిట అప్పుడప్పుడూ జరుగుతున్న ఆర్భాటానికి గడుస్తున్న కాలం మౌన సాక్షిగా నిలిచింది. కానీ.. అమరావతిలో ఇప్పుడు అడుగుపెడితే.. కంటిచూపు పరిధిలో ఉండే భూమి బీడువారిపోయి, దుమ్ముపట్టిన శిలాఫలకాలు కలుపుమొక్కల చాటునుండి తొంగిచూస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా దిక్కుతోచని ముఖాలు, కూలిపోయిన ఆశలు, అక్కడక్కడా గొంతు చించుకుంటున్న ఉద్యమ నినాదాలు, చితికిపోతున్న బతుకులు దర్శనమిస్తాయన్నది అక్షర సత్యం. అందరికన్నా ఎక్కువగా చిన్నాభిన్నమైంది రైతు జీవితం. అగాధంలో కూరుకుపోయిన భవిష్యత్తుతో సతమతమై, స్థిరత్వం కోల్పోయిన వర్తమానంతో, సంధి కుదుర్చుకోలేక తల్లడిల్లిపోతున్నాడు రైతన్న. అన్నింటికీ మించిన దుర్భరమైన అంశం ఏమిటంటే.. ఇష్టపడో, కష్టపడో భూములను ధారాదత్తం చేసిన అన్నదాత నమ్మకాన్ని టీడీపీ ప్రభుత్వం వమ్ము చేసిన విధానం. రైతన్న ఊహకందని చందంగా వంచించి గాలికొదిలేసింది ఏపీ ప్రభుత్వం. అసలు ఆది నుండే ఈ భూసేకరణ, సమీకరణ ఒక ప్రహసనంగా స్వలాభాల కోసం కొందరు అస్మదీయులు సొమ్ము చేసుకోవడం కోసం సామాన్యులపై ప్రయోగించిన ఒక పిడుగులా పరిణమిస్తూ వచ్చింది. సీఆర్డీఏ నిబంధనలను కాలరాస్తూ, బాధ్యతా రాహిత్యం, స్వార్థం తాండవిస్తూ కొనసాగిన ఈ తంతు సామాన్యుడిపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇంతకీ ఎవరిపై ఈ దెబ్బ.. ? భూములిచ్చిన రైతుకి ఇచ్చిన హామీలు, కేజీ–పీజీ ఉచిత విద్య, హెల్త్ కార్డులు, అభివృద్ధి చేసిన ప్రత్యేక ఫ్లాట్లూ.. ఇంకా ఏవేవో. కానీ.. భూములిచ్చాక చేతికి చిక్కినవి పనిచేయని ఆరోగ్య కార్డులు, శ్మశానాల్లో సెల్ టవర్ల కింద బోరు బావుల్లో ఫ్లాట్లూ. జరీబ్ భూములకు బదులుగా వారికిచ్చినవి విలువ తక్కువుండే మెట్ట భూములు. జరిగింది అన్యా యం, మోసం అంటూ రైతు బోరుమంటున్నాడు. పైపెచ్చు లక్షలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం కాజేసిన ఈ భూముల విలువ చూస్తూండగానే కోట్లకు చేరింది. ఎవరైనా హెల్ట్ కార్డులు ఎందుకు కోరుకుం టారు..? అనుకోని ఆర్థిక సమస్య వస్తే భరించలేరు కనుక అవసరానికి ఆదుకోవాలని ఆశిస్తారు. కానీ అలా జరగటం లేదు. ‘మా నాన్నకి గుండె ఆపరేషన్ చేయించుకోడానికి ఈ కార్డు చెల్లదని చెప్పారు. నాలుగు లక్షలు నేను ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు ఓ రైతు. మరొక రైతుది ఇంకో దీనగాథ. కాన్వెంట్ స్కూల్స్‌కు వెళుతున్న పిల్లల్ని అరకొర వసతుల ప్రభుత్వ పాఠశాలలకి మార్చాల్సి వచ్చింది. అందుకు కారణం దిగజారిన అతని ఆర్థిక పరిస్థితి. ఇదీ భూములిచ్చిన రైతుల దుస్థితి. ఇక పెనుమాకలో రైతులు నిత్య పోరాటంతో సావాసం చేస్తున్నారు. పచ్చగా సస్యశ్యామలంగా నాలుగైదు పంటలు పండించే జరీబు భూములు ఇవ్వనందుకు వారిపై అక్రమ కేసులు, వేధింపులు ప్రయోగిస్తూ.. మెడలు వంచే ప్రయత్నం చేసింది టీడీపీ సర్కార్. రాత్రికి రాత్రి చెయ్యని నేరానికి తప్పుడు కేసులు పెట్టి, మానవ హక్కులను బేఖాతరు చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఆదుకునేవారే కరువయ్యారు. పైగా ‘చక్కగా పండించే భూములన్నీ బడా కంపెనీలకు అమ్మేసి వ్యవసాయానికి ద్రోహం చేసే ఈ ప్రభుత్వం ఎవరిని ఉద్ధరించాలనుకుంటుందో అంతుచిక్కడం లేదు’ అంటాడు ఓ రైతు. ఆలోచిస్తే అన్నీ అంతుచిక్కుతాయి. జరిగిన కుట్ర తేటతెల్లమవుతుంది. ఇక అధికారుల పెడసరి సమాధానాలు, కంప్యూటర్ రికార్డుల్లో అకస్మాత్తుగా జరుగుతున్న మార్పులు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. అసైన్డ్ లంక భూముల రైతులది మరో తరహా పోరాటం. బలహీన వర్గాలుగా భావించి వ్యవస్థ నుంచి వారికి సంక్రమించిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హక్కు చాటుకుంటోంది. స్థానికంగా లేనిపోని భయాలతో రైతుల్ని బెదిరించి, కారుచౌకగా భూముల్ని స్వాహా చేసి మంత్రిగారి బినామీల పేరిట రిజిష్టర్ చేయించారు. ఇప్పుడు అవే భూముల విలువ కోట్లలో ఉంది. అంతర్గత వ్యాపార దురాశతో దళిత భూములతో దందా చేసి సొమ్ము చేసుకున్న ప్రభుత్వ కుట్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జీఓ 41 రద్దు చెయ్యాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పి సంవత్సరం గడిచిపోయింది కానీ, ఉద్దండరాయపాలెం చుట్టు పక్క గ్రామాల దళిత రైతులకు ఇంకా న్యాయం జరగలేదు. ఉన్న ఏకైక ఆసరా కోల్పోయిన రైతులు కుటుంబాన్నే సాకుతారా? బెదిరిస్తున్న ప్రభుత్వంతో దైనందిన పోరాటమే చేస్తారా? ఇదేనా ముఖ్యమంత్రి చేసే న్యాయం.. ? ఇవన్నీ ఒక ఎత్తయితే.. కౌలు రైతుల గురించి అసలు ప్రభుత్వం ఆలోచించలేదా.. అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పదివేల దిక్కుతోచని కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. పండించడానికి పొలాలు లేక, సంపాదన కరువై పూట గడవక అల్లాడిపోతున్న ఈ జీవితాలు సీఎంకి కనపడవా? తరతరాల వృత్తి ఇప్పుడు సాయం రాక, ఇతర పనులు చేతకాక పస్తులుంటున్న అన్నదాతలకి ఏమిటి దిక్కు? అటు రైతుకూలీలదీ ఇదే పరిస్థితి. ఒక్కో కుటుంబానికీ ప్రభుత్వం ఇచ్చేది రెండు వేల ఐదు వందలు మాత్రమే. పనికి వెళదామంటే పొలాలు లేక పనులు లేవు. అంతకు ముందు పనులు దొరికినప్పుడు కుటుంబ ఆదాయం 15 నుంచి 20 వేలదాకా ఉండేది. ఇప్పుడు పని దొరికినా కానీ పాతిక మందితో కలసి కుక్కిన ఆటోలో 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే.. చేతికొచ్చేది వంద రూపాయలు కూడా ఉండదు. ప్రభుత్వం ఇచ్చే కోటా బియ్యం మరీ నాసిరకంగా ఉండి, ఆరోగ్యాలు పాడవుతూ ఉంటే అక్కరకు జేబులో డబ్బులు లేక విలపిస్తున్నారు పిల్లల తల్లులు. పోనీ.. అయ్యవారు చెప్పినట్లు స్థానిక సచివాలయంలో పని కల్పిస్తారా అంటే, మధ్య దళారుల వేధింపులు మరో కోణం. ఎర్రగా, పొడుగ్గా వయసు మీరకుండా ఉంటేనే పనుల్లో పెట్టుకుంటారు. ఇక మా పరిస్థితి ఏమిటంటూ కంటతడి పెడుతున్నారు ఆడపడుచులు. వాస్తవంగా ప్రభుత్వం 35 వేల ఎకరాలు సేకరించింది. ఇవి అధికారిక లెక్కలు. ప్రభుత్వం చేతిలో సుమారు 80 వేల ఎకరాల భూమి ఉంది అన్నది నమ్మలేని నిజం. కానీ.. ఇంకా శంకుస్థాపనలు, బాహుబలి లాంటి బొమ్మలు మినహా తెలుగువారి రాజధాని విషయంలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలి. బిల్డింగ్లు, ఒకవేళ అవి కట్టినా ప్రజా సంక్షేమాన్ని కాలరాసిన ప్రభుత్వం ప్రజా రహిత అమరావతి నిర్మించాలనుకుంటుందా.. సమాధానం చెప్పాలి. ఇక బట్టతలకి మల్లెపూలు అన్నట్లు చుట్టూ బార్లూ, రెస్టారెంట్లూ వెలసి ఇంతో అంతో డబ్బులు చేసుకున్న రైతన్నల జీవితాలపై నీలినీడలు కమ్ముతున్న విషయం ఎవరూ ఊహించని విపరిణామం. పాలకులకు మొదట ఉండవలసింది ప్రజల పట్ల బాధ్యత. రెండవది జవాబుదారీతనం. ఇవేవీ లేకపోగా.. ముఖ్యమంత్రి చంద్రబాబుకి పుష్కలంగా ఉన్నవి నియంతృత్వ ధోరణి, పూర్తి దాటవేత వైఖరి. నాలుగేళ్లలో ప్రజల్ని ఎన్నిసార్లు కలిశారు. ఎన్నిమార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ నమ్మిన సిద్ధాంతం.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివి అని. కానీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఆగిపోయింది. సంక్షేమం మాయమైపోయింది అన్నది ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రహిస్తున్న కఠోర వాస్తవం. అంతర్జాతీయమూ లేదు, మహా నగరాలు లేవు... అమరావతి అంటే.. కొందరు మాత్రమే లాభపడుతున్న ఉద్దేశపూర్వకమైన ఓ కుట్ర. ఎందరో సామాన్యులు మోసపోయిన ఓ చట్రం. స్వప్న అశోక్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాక్షి టీవీ ఈ–మెయిల్: swapnatvhost@gmail.com -
టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై భూకబ్జా ఆరోపణలు
సాక్షి, తిరుపతి : టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేణిగుంట మండలం కరకంబాడిలో కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఎంపీ శివప్రసాద్ పేరు చెప్పి టీడీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారు. కాగా బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవటం గమనార్హం. -
భూమంతర్... ఖాళీ
ఖాళీ జాగా కనిపిస్తే చాలు అధికార పార్టీ నాయకులు కబ్జాచేస్తున్నారు. ప్రభుత్వ, అటవీ, బంజరు, చెరువు, ఈనాం ఇలా భూములు ఏవైనా సరే హాంఫట్ చేసేస్తున్నారు. పేదల భూములను సైతం హస్తగతం చేసుకుంటున్నారు. ఎకరాలకొద్దీ స్వాధీనం చేసుకుని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. కొందరైతే అటవీ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అడ్డొచ్చిన అధికారులను అడ్డగోలుగా బదిలీ చేయిస్తున్నారు. రికార్డుల్లో ఏమాత్రం లొసుగులు ఉన్నా ప్రైవేటు భూములను సైతం ఆక్రమించేస్తున్నారు. ఇచ్చింది తీసుకుని స్థలం ఖాళీచేయాలంటూ హెచ్చరిస్తున్నారు. మాట వినకుంటే రౌడీమూకలు, పోలీసులను రంగంలోకి దింపి బెదిరిస్తున్నారు. కొత్త రికార్డులను సృష్టించి కోర్టులపాలు చేస్తున్నారు. కేసులు కోర్టుల్లో ఉండగానే ఆ భూములను అడ్డగోలుగా విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థాయి ప్రజాప్రజాప్రతినిధుల వరకూ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి భూ రాబందులుగా మారుతున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో: ఈనాం.. పోరంబోకు.. చెరువు భూములైనా, శ్మశాన స్థలమైనా, అటవీ భూములైనా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా భూకబ్జాలకు తెరలేపారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అధికారపార్టీ అండతో ఆక్రమణదారులు పాగావేసినా అధికారులెవరూ అటువైపు చూసిన పాపాన పోలేదంటే జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. బాధితులు ఎవరైనా ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. పైగా పోలీసు ఉన్నతాధికారులే ఎంతో కొంతకు విక్రయించాలంటూ బాధితులను బెదిరిస్తున్నారు. కుదరకపోతే మధ్యవర్తులుగా మారి రాజీకి యత్నానికి దిగుతున్నారు. దీంతో ఖాళీ స్థలం ఉన్న యాజమానులు హడలిపోతున్న దుస్థితి జిల్లావ్యాప్తంగా నెలకొంది. అన్ని ప్రాంతాల్లో భూ దందా... జిల్లాలోని మచిలీపట్నం, పెడన, కైకలూరు, నందిగామ, పెనమలూరు, జగ్గయ్యపేట, పామర్రు, తిరువూరు, విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్ తదితర నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల కబ్జాల పర్వం కొనసాగుతోంది. అధికార అండతో స్థానిక నాయకులు భూ కబ్జాలకు బరితెగించారు. ప్రభుత్వ భూములుకానీ, పేదలకు పంచిన భూములుకానీ దేనిని వదలడం లేదు. ఖాళీగా కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయి కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్థలం జోలికి ఎవరు రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. తరువాత నకిలీ పత్రాలతో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. విజయవాడ నగర శివారైన గొల్లపూడిలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త శంకర్‌యాదవ్‌కు చెందిన 873 చదరపు గజాల స్థలాన్ని స్థానిక గ్రామ సర్పంచ్, టీడీపీ నేత చిరుగుపాటి నాగరాజు ఆక్రమించాడు. రూ. 4 కోట్ల విలువైన ఆ స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు చూపించి ఇది తనదే అనడంతో అసలైన యజమాని అవాక్కయ్యారు. పాయకాపురం లక్ష్మీనగర్లోనూ తప్పుడు వీలునామా సృష్టించి రూ. 10 కోట్లపైనే విలువచేసే భూమిని టీడీపీ కార్పొరేటర్ నందెపు జగదీష్ కబ్జా చేశాడు. కంచికకచర్లలోని కంచలమ్మ చెరువు స్థలాన్ని ఆక్రమించిన టీడీపీ నేతలు ఆ భూమిని లక్షల రూపాయలకు విక్రయించేశారు. పెడన పట్టణంలో టీడీపీ నాయకుడు పురపాలక సంఘానికి చెందిన 18 సెంట్లు ఆక్రమించి అనధికార లేఅవుట్ వేశాడు. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని మొగల్రాజపురం బాపనయ్యవీధి చివరకొండ అంచున కొండపోరం బోకు స్థలాలను సైతం స్థానిక అధికార పార్టీ అక్రమార్కులు ఆక్రమించి విక్రయించుకున్నారు. తిరువూరు మండలంలోని ఆంజనేయపురం, చిట్టేల, కాకర్ల, చౌటపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ రిజర్వే అటవీ భూమి సుమారు 200 ఎకరాలను టీడీపీ నేతలు స్వాహా చేశారు. మచిలీపట్నంలో సైతం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో చెరువు కబ్జా చేసి ప్లాట్లుగా వేసి విక్రయించుకున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి శివారు వెంకటనరసింహాపురంలో సామాజిక ప్లాట్లను స్థానిక టీడీపీ నేత కబ్జా చేశాడు. 2.96 ఎకరాలు స్వాహా చేశారు. కలిదిండి మండలం భాస్కరరావుపేట శివారు పొలి మేర వద్ద 3.50 ఎకరాల పోరంబోకు భూమి విలువ రూ.2 కోట్లకుపైగానే ధర ఉంటుంది. ఈ భూమిని స్థానిక టీడీపీ నేతలు ఆక్రమించారు. ఇలా జిల్లాలో టీడీపీ నేతల కబ్జా పర్వానికి అంతేలేకుండా పోయింది. కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది. -
అధికార నేత భూమేత
విశాఖ పెను భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. ఇది ప్రకృతి సృష్టించిన విపత్తు కాదు.. ఆ ప్రకృతిలో భాగమైన భూమాతను చెరబట్టేందుకు రాజకీయ బేహారాలు సృష్టించిన భూదందాల విలయం. డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన, దేవాదాయ భూములు, మాజీ సైనికులకు ఇచ్చే స్థలాలు.. ఇలా దేన్నీ వదల్లేదు. వాటి అనుభవదారులు, యజమానులపై సకల మాయోపాయాలు ప్రయోగించారు. అధికారులనూ పావులను చేసేశారు. అడ్డగోలుగా.. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. గ్రామ సచివాలయం మొదలుకొని తహసీల్దార్ కార్యాలయం వరకు అంతా కుమ్మకై కబ్జాకాండ కొనసాగించారు. రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని భూదోపిడీకి పాల్పడ్డారు. ఈ దారుణాలతో మహా విశాఖ ప్రతిష్ట మసకబారింది. టీడీపీ అధికారంలోకొచ్చిన దరిమిలా భూదోపిడీకి బీజం పడింది. విభజన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళతామని బీరాలు పలికిన అధికార పార్టీ ప్రముఖులు.. భూ మాఫియాకు ద్వారాలు తెరిచి పాతాళానికి నెట్టేశారు. ముఖ్యనేత సహకారం.. చినబాబు ప్రత్యక్ష ప్రమేయంతో నగరానికి ఈ చివర.. ఆ చివరే కాదు.. జిల్లాలో ఖాళీ భూములున్న చోటల్లా పాగా వేశారు. రికార్డులు తారుమారు చేయడం.. సాధ్యం కాకపోతే బలవంతంగా లాక్కోవడం.. ఇదీ వారి దందా.. ల్యాండ్ పూలింగ్ ముసుగు కూడా ఈ మాఫియా ఆగడాలను బాగా కవర్ చేసింది. పూలింగ్ భూములు పోతాయని బడుగు జనాలను బెదిరించడం.. కారుచౌకగా వారి భూములను లాక్కోవడం.. తిరిగి వాటినే ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇవ్వడం ద్వారా వందల కోట్ల రూపాయలు దండుకున్నారు. ప్రధానంగా భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్, పెందుర్తి మండలాల్లో ఇలాంటి భూ మాఫియా అక్రమాలు కోకొల్లలు.. ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బు బదిలీ అయినంత ఈజీగా భూ రికార్డులు మారిపోయాయి. పచ్చిగా చెప్పాలంటే..రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే..అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో ఆ భూమి వేరొకరికి ధారాదత్తం అయిపోయింది. సొంతదారు భూమిలో ఉండగానే మరొకరు వచ్చి.. ఇది నాది అని దబాయించే దారుణ పరిస్థితులు నగర శివార్లలో రాజ్యమేలుతున్నాయి. సాక్షి వరుస కధనాలతో వెలుగులోకి వచ్చిన తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం భూకుంభకోణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో భూ బకాసురులందరూ టీడీపీనేతలేనని తేలింది. వేల కోట్ల విలువైన భూములను బొక్కేశారని నిర్థారణైంది.. అందుకే ఆ నివేదిక వెలుగు చూడలేదు. ప్రభుత్వం సిట్ నివేదికను తొక్కిపెట్టేయొచ్చు.. కబ్జారాయుళ్ళను కాపాడేయొచ్చు.. కానీ సాక్షి పట్టువీడకుండా జిల్లావ్యాప్తంగా భూమాఫియా దందాలపై మరింత లోతుగా పరిశీలించి.. అందిస్తున్న సమగ్ర కథనాలు.. సాక్షి, విశాఖపట్నం :రాష్ట్రవిభజన తర్వాత నవ్యాంధ్రకు రెండోరాజధానిగా విశాఖ నగరం గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న మహానగరం. సువిశాలమైన సాగరతీరం..ఎటు చూసినా కొండలు..లోయలు..పర్యాటక ప్రాంతాలతో విరాజిల్లుతున్న ఉత్తరాంధ్ర ముఖ ద్వారం. అలాంటి ఈ జిల్లా భూకబ్జా రాయుళ్లకు అడ్డాగా మారిపోయింది. పచ్చతోలు కప్పుకున్న అధికార పార్టీ నేతలు..గత నాలుగేళ్లుగా మేకవన్నె పులుల్లా.. తెగబడి పోయారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తూ.. వేల ఎకరాలను స్వాహా చేశారు. ఓటేసిన వారికి వెన్నుపోటు పొడిచి వారి ఆస్తులను లాక్కొన్నారు..అందిన కాడకు దోచుకున్నారు. ముదపాక రైతును మభ్యపెట్టి... ‘త్వరలో ప్రభుత్వం మీ భూములను లాక్కుంటుంది. అప్పుడు ఎకరాకు రూ.2 లక్షలకు మించి ఇవ్వరు. అదే మా సార్‌కి ఆ భూములు ఇచ్చేస్తే రూ.10లక్షలు ఇస్తారని’ పెందుర్తి మండలం ముదపాక రైతులను మభ్యపెట్టారు. దీంతో అయోమయానికి గురైన రైతులు బినామీలు చెప్పినట్లే అడ్వాన్స్ కింద రూ.లక్ష, రెండు లక్షల చొప్పున తీసుకుని వారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేశారు. దాదాపు 320 పట్టాలను ఇలా తెగనమ్ముకున్నారు. ఇంకా రైతుల వద్ద మిగిలిపోయిన పట్టాలను చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉండగా కుట్రను పసిగట్టిన గోవిందపురం రైతులు ఒక్కసారిగా తిరగబడడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఇందులో రాష్ట్రస్థాయి ప్రభుత్వ పెద్దలతో పాటు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు బడాబాబులకు సాయం చేసినట్టు నేటికీ బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. బండారు వారిపైనే కేసులు పెట్టించడంతో రైతులు చేస్తున్న ఆరోపణలు నిజమే అని స్పష్టం అవుతుంది. మాజీ సైనికుల పేరిటదోచేశారు మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులు,రాజకీయ బాధితుల పేరిట జిల్లాలో గతపదిహేనేళ్లలో పంపిణీ చేసిన 312 ఎకరాల్లో సుమారు 250 ఎకరాలు నకిలీ ఎన్వోసీలను అడ్డంపెట్టుకుని అనర్హులకు కేటాయింపులు జరిపినట్టు అంచనా వేస్తున్నారు. జారీ చేసిన 69 ఎన్‌వోసీల్లో 75 శాతం నకిలీవేనని తేలింది. సుమారు 50కు పైగా అనర్హులకే భూ కేటాయింపులు జరిపినట్టుగా సిట్ దర్యాప్తులో సైతం గుర్తించింది. మధురవాడ సర్వే నెం.331/3లో 5ఎకరాల భూమిని నగరానికి చెందిన ఓరుగంటి సీతారత్నం 2001లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా రికార్డుల్లో చూపించి పట్టాదారు పాస్ పుస్తకాలను, టైటిల్ డీడ్‌ను పొందారు. సర్వే నెం.331/4 లో ఓరుగంటి నరేష్ కూడా 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా రెవెన్యూనుంచి హక్కు పత్రాలు పొందారు. కానీ 2004లో జారీ చేసిన ఎసైన్మెంట్లో సర్వే నెం. 331/3, 331/4లో ఒక్క సెంటు కూడా స్వాతంత్య్ర సమర యోధులకు కానీ, పొలిటికల్ సఫరర్స్ కానీ జారీ చేసినట్టుగా పేర్కొనలేదు. దిగుమర్తి కుటుంబీకుల నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుని హక్కులు పొందినట్టుగా పేర్కొన్న డాక్యుమెంట్లు సరైనవి కావనీ అప్పటి కలెక్టర్ సంజయ్ కుమార్ ప్రాథమికంగా గుర్తించారు. కానీ రాజకీయంగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని తమపై జరిపిన దర్యాప్తు నివేదికను బయటకు రానీయకుండా ఓరుగంటి కుటుంబీకులు జాగ్రత్త పడ్డారని విమర్శలు విన్పించాయి. సంస్థాన భూములనూ వదల్లేదు గోడే సంస్థాన భూములను చుక్కల భూముల పేరిట స్వాహా చేస్తున్నారు. గాజువాక, అనకాపల్లి, మునగపాక, భరణికం, కారుప్రోలు, గోడిచెర్ల, నక్కపల్లి, శ్రీరాంపురం, చీపురుపల్లి, షేర్ మహ్మద్‌పురం ప్రాంతాలు ప్రొప్రైటరీ ఏస్టేట్లుగా గుర్తింపుపొందాయి. చుక్కల భూములుగా నమోదైన గోడేవారి సంస్థాన భూములను ప్రభుత్వం తమవిగా రికార్డుల్లో నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ భూములపై జిల్లాకు చెందిన ఓ మంత్రి, కర్నూలుకు చెందిన మరో మంత్రి కన్నేశారు. వక్ఫ్ భూములూ కాజేశారు జిల్లాలో 7,860 ఎకరాల్లో 2,558.20 ఎకరాల భూములను ఎన్టీపీసీ కోసం ప్రభుత్వం వక్ఫ్ బోర్డు నుంచి సేకరించింది. మరో 40.05 ఎకరాలను ఏలేరు లె‹ఫ్ట్ కెనాల్ విస్తరణ కోసం తీసుకున్నారు. 5,261.75 ఎకరాల్లో 2072 ఎకరాల భూములు ప్రభుత్వం వివిధ అవసరాల కోసం కాజేయగా, 2,226 ఎకరాల భూములు భూబకాసురులు కబ్జా చేశారు. ఆక్రమణకు గురైన భూముల విలువ రూ.2వేల కోట్లకు పైమాటే. వీటిలో సగానికి పైగా భూములు టీడీపీ నాయకులు కబ్జా చేసినవే. ప్రస్తుతం వక్ఫ్‌బోర్డు అధీనంలో కేవలం 802.54ఎకరాలు మాత్రమే ఉన్నాయి. తాజాగా భీమిలి మండలం టి.నగరపాలెంలో 6.50 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. 2.36 ఎకరాల రికార్డులు టాంపరింగ్‌కు గురికాగా, 4 ఎకరాలకు çసస్పెండ్‌కు గురైన తహశీల్దార్ రామారావు స్థానిక టీడీపీ నేతల ప్రోద్భలంతో కొంతమంది పేరిట పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేశారు. కశింకోట, పెదగంట్యాడ ప్రాంతాల్లో కూడా మరో 15 ఎకరాల వరకు రికార్డులు టాంపర్ అయినట్టుగా చెబుతున్నారు. ఈ భూముల విలువ రూ.125 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఎసైన్డ్ భూములకు ఎసరు ఎన్‌ఏవోబీ, ఐఐఎం, పెట్రో,మెరైన్ యూనివర్సిటీలు, పీసీపీఐఆర్, ఇండస్ట్రియల్ పార్కులు, పరిశ్రమలు ఇతర అవసరాల కోసం గడిచిన పదేళ్లలో 10వేల ఎకరాలకు పైగా ప్రభుత్వమే సేకరించగా.. ఐదు వేల ఎకరాల ఎసైన్డ్ భూములు గడిచిన నాలుగేళ్లలో కబ్జా చేశారని తెలుస్తోంది. పెందుర్తి మండలం ముదుపాక,నక్కపల్లి మండలం పెదగొడ్డుపల్లిలో 700ఎకరాలకుపైగా ఎసైన్డ్ భూములను చంద్రబాబు తనయుడు లోకేష్ జిల్లా మంత్రి తనయుడు, ఓ ఎమ్మెల్యేతో కలిసి కాజేసేందుకు పక్కా స్కెచ్ వేసి సర్వే చేయిస్తున్నారు. భూదాన భూములు చాపచుట్టేశారు జిల్లావ్యాప్తంగా రికార్డుల ప్రకారం 264.90 ఎకరాల భూదాన భూముల్లో 20.91 ఎకరాలు వెట్, 243.99 ఎకరాలు డ్రై ల్యాండ్స్‌గా రికార్డుల్లో ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 65ఎకరాలు మాత్రమే ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. సబ్బవరం మండలం దొంగలమర్రి సీతారాంపురంలో సర్వే నెంబర్ 1549లో 52.38 ఎకరాలు వివాదంలో కోర్టులో నలుగుతోంది. ఇక మిగిలిన భూముల్లో విశాఖ రూరల్ మండలం పరదేశిపాలెంలో సర్వే నెంబర్ 132లో 50.56 ఎకరాలతో పాటు విశాఖపట్నం అర్బన్ మండల పరిధిలోని మాధవదారలో సర్వేనెం: 66/1లో ఉన్న 15.45 ఎకరాల్లో 10 ఎకరాలు, గాజువాక మండలం అగనంపూడిలో సర్వే నెం:56/ఏ, బిలలో ఉన్న 20 ఎకరాల్లో నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. మిగిలిన భూములన్నీ టీడీపీ నేతల ప్రోద్భలంతో కబ్జాకు గురైనవే. ఇనాం భూములను మడతెట్టేశారు ఇనాం భూములను మడతెట్టేశారు. ఈ భూములన్నీ విజయనగరం సంస్థానం రైతులు, వివిధ వర్గాలకు నజరానాగా రాసిచ్చినవే. సింహాచలం దేవస్థానం పరిధిలోనివి మినహాయిస్తే విశాఖ పరిసర మండలాల్లో సుమారు 1500 ఎకరాలకు పైగా ఇనాం భూములు ఉన్నట్టు అంచనా. రైతుల చేతుల్లో ఉన్న ఈ భూములు గడిచిన పదేళ్లలో చేతులు మారిపోయాయి. వివాదం ఆర్డీవో కోర్టులో ఉండగానే 2015లో వెబ్‌ల్యాండ్‌లో పేర్లు సైతం మార్చేశారు. ఇనాం వారసులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఆర్డీవో వెంకటేశ్వర్లు ఆర్నెళ్లు తిరక్కుండానే వారి అప్పీల్‌ను తిరస్కరించినట్టుగా ఆదేశాలు ఇచ్చారు. దేవుళ్లకు శఠగోపం దేవదాయ, ధర్మాదాయ శాఖ భూములను కూడా వదల్లేదు. జిల్లాలో 6ఏ పరిధిలోకి వచ్చే ఆలయాలు 976 ఉన్నాయి. దాతల ఉదారత కారణంగా 23,920.77 ఎకరాలుంటే.. వాటిలో 5350.24 ఎకరాలు పల్లం, 18,570.53 ఎకరాల మెట్ట భూములున్నాయి. వీటిలో అర్చక, సర్వీసుదారుల అధీనంలో 702.21 కోట్లుండగా, కొండ, అటవీ ప్రాంతాల్లో 5996.70 ఎకరాలున్నాయి. లీజులో 5179.37 ఎకరాలుంటే..ఆక్రమణల్లో 8041.58 ఎకరాలున్నాయి. వీటిలో టీడీపీ నేతల కబందహస్తాల్లో ఉన్నవే అత్యధికం. సింహాచలంతో పాటు ఆనందపురం, పద్మనాభం, అనకాపల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో దేవాదాయ శాఖ భూములు వందల ఎకరాలు అన్యాక్రాంతమమైపోయాయి. మంత్రులు, వారి అనుచరులభూ దందాలు మంత్రిగంటా శ్రీనివాసరావు సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా భీమిలి సాగరతీరంలో ప్యాలస్ నిర్మించుకున్నాడు. గంటా సమీప బంధువైన పరుచూరి భాస్కరరావు పద్మనాభం మండలం కృష్ణాపురంలో 20 ఎకరాల డీ పట్టా భూములతో పాటు ఆనందపురంలో 11.34 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేశారు. గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ భీమిలిలో ఎస్సీలకు ఇచ్చిన 50 ఎకరాల ఎసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేశాడు. మరో అనుచరుడు ఎన్.స్వామి సర్వే నెం.294లో 3.76 ఎకరాలు, సర్వే నెం.294/2లో 4.40 ఎకరాలు ఆక్రమించుకుని షెడ్లు వేయిస్తున్నాడు. మరో అనుచరుడు పద్మనాభం మండల టీడీపీ అధ్యక్షుడు సూరిశెట్టి అప్పారావు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి 130 ఎకరాల ఇనాం భూములను చక్కబెట్టేశాడు. అరకులోయ పోలీస్ స్టేషన్ ఎదురుగా బ్లాక్ డిలో ప్లాట్ నెంబర్ 38లో 1.86 ఎకరాల ఆర్అండ్బీ విశాఖకు చెందిన భూమిలో 30 సెంట్ల స్థలాన్ని రాజులమ్మ అనే బినామీ పేరిట రాష్ట్ర ఉపముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తి చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్యేల భూకబ్జాలు అనకాపల్లి ఆవకండంలో 55 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీని వెనుక అనకాపల్లి పీలా గోవింద్ ఉన్నారని చెబుతున్నారు. అనకాపల్లి మండలం శారదా కాలనీలో చిన్నంనాయుడు అనే దివ్యాంగుడికి చెందిన 1.12 ఎకరాల స్థలాన్ని వివాదంలో పడేశారు. న్యాయం చేయమని కోరితే..రూ.8కోట్ల విలువైన ఆ భూమిని కేవలం రూ.1.50కోట్ల ఒప్పందంతో సొంతం చేసుకున్నారు. కనీసం ఆ మొత్తం కూడా ఇవ్వకుండా బా«ధితుడ్ని మూడేళ్లుగా తిప్పించుకోవడమే కాదు.. బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. భీమిలి బీచ్‌రోడ్‌లో రామానాయుడు స్టూడియో దిగువన మాజీ సైనికులకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే మీసాల గీత భర్త శ్రీనివాసరావు, మంత్రిగంటా అల్లుడి పేర్లతో కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సర్వే నెం.9లో 15 ఎకరాల సింగరాయమెట్ట చెరువు పూర్తిగా ఆక్రమించేశారు. విశాఖ తూర్పు పరిధిలో ఉన్న సర్వే నెం.19/2లో ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న సాధుమఠంపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరుల ద్వారా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ భూముల విలువ రూ.100కోట్ల పైమాటే. గాజువాకలో రికార్డుల టాంపరింగ్ పేరుతో 42 సెంట్ల భూమిని 1బీలో జిరాయితీగా మార్చి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు అనుచరులు సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు. అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు అరుకులోయలోని ఐటీడీఏ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న 10 సెంట్ల భూమి ప్రభుత్వ భూమని కాజేశారు. ఇక నిన్నగాక మొన్న పాడేరు ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న 4 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని కూడా లీజుపద్ధతిన చేజిక్కించుకున్నారు. పేదలను తొలగించి 30 సెంట్ల ఆక్రమణ పేదలకు పక్కా ఇళ్ల కేటాయింపు పేరుతో ఖాళీ చేయించిన టీడీపీ నాయకులు ఆ భూమిని కబ్జా చేసేశారు. సుమారు రూ.4.50 కోట్ల విలువైన 30 సెంట్ల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే తన స్నేహితులకు అప్పగించారు. గాజువాక భానోజీతోట సర్వే నంబర్ 86లో నివాసముంటున్న 38 కుటుంబాలకు చెందిన షెడ్లను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. షెడ్లు కూల్చేసిన అనంతరం ఖాళీ జాగాను గృహ నిర్మాణ సంస్థ (టిడ్కో)కు అప్పగించారు. అందులో గృహాల నిర్మాణాలకు అధికారులు ప్రణాళిక వేసినప్పటికీ పేదలు అక్కడ్నుంచి కదలకపోవడంతో వారిలో 80 గజాల చొప్పున మళ్లీ స్థలాలను అప్పగించారు. ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తన మిత్రుల్లో ఇద్దరికి వాటా కల్పించారు. అందరిలాగా కాకుండా శ్రీను అనే వ్యక్తికి 20 సెంట్లు, మరో వ్యక్తికి 10 సెంట్లు కట్టబెట్టారు. అంతస్తులుగా అక్రమాలు ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించి అంతస్తుల మీద అంతస్తులు కట్టేస్తుంటే జీవీఎంసీ అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నది కూడా జీవీఎంసీ జోన్–2 కార్యాలయానికి వెనుక రోడ్డులోనే. దాని నిర్మాత టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్. అధికార దర్పంతో దాన్ని నిర్మించుకున్నారు. ఆశీలమెట్టలోని జీవీఎంసీ జోనల్ కార్యాలయం వెనుక నిర్మాణం పూర్తి చేసుకున్న జీప్లస్–4 బిల్డింగ్ తీరును చూస్తే.. అన్నీ అతిక్రమణలే కనిపిస్తాయి. జీ ప్లస్ 4 బిల్డింగ్ నిర్మించాలంటే కనీసం 400 చదరపు మీటర్ల స్థలం కావాలి. కానీ వాసుపల్లివారు 222.83 చదరపు మీటర్ల స్థలంలోనే జీప్లస్ 4 బిల్డింగ్ కట్టేశారు. ఆ భవనం కూడా 20 అడుగులకు మించని చిన్నపాటి రోడ్డులో ఉంది. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి జీప్లస్ 2 నిర్మాణానికే అనుమతి పొందారు. -
దేవుడికి దిక్కెవరు?
వీరఘట్టం: అందరికీ ఆపద్బాంధవుడు భగవంతుడు. ఎవరికి కష్టం వచ్చినా అతనికే మొక్కుకుంటారు. అయితే ఆ దేవుడికే నేడు కష్టం వచ్చింది. తనకు చెందిన విలువైన భూములు ఆక్రమణకు గురవుతుంటే ఏం చేయాలో.. ఎవరికి మొక్కుకోవాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. తనకు ప్రతినిధులుగా ఉన్న దేవాదాయశాఖ అధికారుల్లో కొంతమంది దేవుడు కళ్లకు గంతలు కట్టి ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారనే అపవాదును సైతం ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు వారికి అండగా ఉంటున్నారనడంలో సందేహం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏళ్ల తరబడి తనకు చెందిన భూములకు కౌలు రాక, తనకు నిత్యం ధూపదీపాలతో నైవేద్యం పెడుతున్న అర్చకులకు వేతనాలు లేవని తెలిసి భగవంతుడు బాధపడుతున్నాడు. దేవుడు భూమే కదా అని.. మన పొలంలో సెంటు భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించినా వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సర్వే నంబర్ల వారీగా హద్దులు వేసి ఎన్ని అడ్డంకులు ఎదురైనా భూమిని మన చేతిలోకి తీసుకుంటాం. సెంటు స్థలం కోసం ఇలా చేస్తే ఆక్రమణలో ఉన్న వేలాది ఎకరాల ఆలయ భూముల కోసం మరెంత చేయాలి. కాని ఆ పరిస్థితి పాలకుల్లో..సంబంధిత శాఖలో కనిపించడం లేదు. దేవుడి భూమే కదాని చిన్నచూపే దీనికి కారణంగా పలువురుభావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలు గు వేల ఎకరాల దేవదాయ భూములు ఆక్రమణ ల్లో ఉన్నట్లు అధికారులే గుర్తించారు. దీనిపై పలు చోట్ల కోర్టులు దేవదాయ శాఖకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ భూములు మాత్రం ఇంకా ఆక్రమణదారుల చేతిల్లోనే ఉండిపోయావి. మరి కొన్ని చోట్ల కేవలం నామమాత్రపు లీజులు చెల్లిస్తున్నారు. ఫలితంగా ఆస్తులు ఉన్నా ఆదాయం లేక దేవాలయాల నిర్వహణ సక్రమంగా లేకుండాపోయిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. దేవుడి భూములు లీజుకు తీసుకున్న కొంతమంది రైతులు ఏటా పంటలను సాగు చేసుకుంటూ ఫలసాయం పొందుతున్నారు. అయితే ఏళ్ల తరబడి దేవాదాయ శాఖకు లీజులు చెల్లించడం మానేశారు. లీజులు చెల్లించని భూములను వదిలేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ రైతులు అంగీకరించడం లేదు. మరికొన్ని చోట్ల సొంత భూములుగా భావించి పంటలను చేసుకుంటున్నారు. దీంతో ఈ భూములు ఆక్రమణల్లో ఉన్నట్లు నిర్ధారించుకొచ్చిన దేవదాయ శాఖాధికారులు జిల్లా వ్యాప్తంగా సర్వే చేసి మొత్తం 4 వేలు ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నట్లు గుర్తించారు. సోంపేట, రాజాం, సంతకవిటి, టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాల్లో దేవాలయ భూములు ఎక్కువగా ఆక్రమణల్లో ఉన్నాయి. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు.. ఆక్రమణలకు గురైన దేవుడు భూములపై కొన్ని చోట్ల దేవదాయశాఖాధికారులు కోర్టులను ఆశ్రయించారు. ఈ భూములు దేవదాయ శాఖకు చెందినవిగా చాలాచోట్ల రుజువయ్యాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా వీటిని స్వాధీనం చేసుకోవడానికి వెళుతున్న అధికారులకు రాజకీయ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆక్రమణదారులకు మద్దతుగా నాయకులు మాట్లాడుతుండడంతో దేవా దాయశాఖ అధికారులు ఏమి చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన భూములు ఆక్రమణకు గురయ్యే పరిస్థితి ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ తామై నడిపిస్తున్న సిబ్బంది! భూముల లీజు విషయంలో కొంతమంది దేవాదాయశాఖ సిబ్బంది చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. అన్నీ తామై రైతులతో జత కట్టి వారి దగ్గర నుంచి ఎకరాకు 5 బస్తాల వరకు లీజు తీసుకుంటున్నప్పటికీ.. దేవ దాయ శాఖకు మాత్రం రెండు బస్తాలకు మించి లెక్కలు చూపడం లేదని పలువురు అంటున్నారు. లీజు చెల్లించని రైతుల నుంచి భూములు తీసుకోవాలని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది మాత్రం తమకు అనుకూలంగా ఉన్న రైతుల వద్దనే భూములను ఉంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్వహణ భారం దేవాలయాలకు భూముల రూపంలో ఆస్తులు ఉన్నాయి. అయితే కొన్ని ఆక్రమణల్లో ఉండటం, మరికొన్నిచోట్ల నామమాత్రంగా లీజు వసూలు అవుతుండడంతో ఆదాయం అరకొరగా లభిస్తోం ది. ఫలితంగా అనేక చోట్ల దేవాలయాల నిర్వహణ భారంగా మారుతోంది. ఈ కారణంగా అనేక దేవాలయాలు అభివద్ధికి దూరమవుతున్నాయి. ధూపదీపనైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదు. కనీసస్థాయిలో లీజు వసూలు చేసేందుకు కూడా అధికారులు గట్టిగా ప్రయత్నం చేయడం లేదు. బహిరంగ వేలం వేయకపోవడంతో ... ఒకరైతు వద్ద కేవలం మూడేళ్లు మాత్రమే భూములను లీజుకు ఉంచాలి. అనంతరం మరో రైతుకు మార్చాలి. అధికారులు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా ఆలయాల పరిధిలోని అధికారుల లోపాయికారి సహకారంతో ఒకే రైతు వద్ద ఏళ్ల తరబడి భూములను వదిలేయడంతో ఆక్రమణకు గురవుతున్నాయి. ఆలయ భూములను బహిరంగ వేలం వేయకపోవడంలో సిబ్బంది ప్రమేయం కూడా ఉండడమే కారణమే విమర్శలు వస్తున్నాయి. లోపాయికారి ఒప్పందాలు.. సాధారణంగా ఒక రైతు నుంచి మరో వ్యకి ఎకరా భూమిని కౌలు తీసుకుంటే అక్కడ నీటి సౌకర్యం ఆధారంగా ఏడాదికి 8 నుంచి 10 బస్తాల ధాన్యం లీజు చెల్లిస్తారు. ప్రస్తుతం దేవాదాయ శాఖకు 6,250 ఎకరాల నుంచి లీజులు వస్తున్నాయి. పైన చెప్పిన లెక్క ప్రకారం ఎకరాకు 8 బస్తాలు వంతున వచ్చినా సుమారు 50 వేల బస్తాల ధాన్యం రావాల్సి ఉంది. ఎక్కడా ఈ పరిస్థితి కని పించడం లేదు. లీజులు తీసుకున్నవారితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని ఎకరానికి రెండుబస్తాలకు మించి లీజు ఇవ్వడం లేదు. చర్యలు చేపడతాం దేవాదాయశాఖ భూముల అన్యాక్రాంతం.. నామమాత్రపు లీజు విషయాన్ని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ డి.వి.వి. ప్రసాదరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించింది. దీనికి ఆయన స్పందిస్తూ ఆక్రమణలో ఉన్న దేవుడి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. పాలకొండ జగన్నాథస్వామి ఆలయానికి కూడా సుమారు 80 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఇవిఎక్కడ ఉన్నాయో, ఎవరు కౌలుకు చేస్తున్నారో, ఆదాయం ఎంత వస్తుందో తెలియదు. ఇలా జిల్లా వ్యాప్తంగా 11,200 ఎకరాల ఆలయ భూముల్లో 4 వేల ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
ఆ కబ్జారాయుళ్లపై ఏం చర్యలు తీసుకున్నారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలోని సర్వే నంబర్లు 308, 332, 333ల్లోని 184 ఎకరాల భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలంటూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, మేడ్చల్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక నేత కొలన్ శ్రీనివాస్‌రెడ్డికీ నోటీసులిచ్చింది. విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. నిజాం పేట గ్రామంలో సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి 184 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని కొలన్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని దేవస్థానం కమిటీ, స్థానిక సర్పంచ్, స్థానిక నేతలు కలసి ప్లాట్లు చేసి అమ్మేసి కోట్ల రూపాయలు గడించారంటూ కూకట్పల్లి, హైదర్‌నగర్‌కు చెందిన అరుంధతమ్మ హైకోర్టుకు లేఖ రాశారు. ఏసీజే ఆదేశాలతో హైకోర్టు రిజిస్ట్రీ ఆ లేఖను పిల్‌గా పరిగణించింది. ఈ పిల్‌పై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి..
సాక్షి, అమరావతి : భూమి కోసం కన్నకొడుకులే కనికరం లేకుండా ప్రవర్తించారు. తల్లి బతికుండగానే.. ఆమె చనిపోయిందంటూ డెత్ సర్టిఫికేట్ తీసుకొని.. భూమి తమ పరం చేసుకున్నారు. భూమి లాక్కున్న విషయం తెలియడంతో ఆ తల్లి తల్లిడిల్లిపోయింది. కన్నకొడుకుల చర్యకు దిగ్భ్రాంతి చెందింది. తనకు న్యాయం చేయాలంటూ అమరావతిలో ఏపీ సచివాలయం ఎదుట నడిరోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపింది. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆమెను పోలీసులు బలవంతంగా అక్కడ నుంచి తరలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామానికి చెందిన నరసమ్మ తన పేరిట ఉన్న 90 సెంట్ల భూమిని తన ఇద్దరు కొడుకులు లాక్కున్నారని ఏపీ సచివాలయం ఎదుట ఆందోళన దిగారు. తను బతికుండగానే.. అక్రమంగా బూకటపు డెత్ సర్టిఫికెట్ సృష్టించి.. వీఆర్వో వద్ద భూమిని తమ పేరిట బదలాయించుకున్నారని ఆమె వెల్లడించారు. అధికారులకు విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చానని, గతంలో పలుమార్లు అధికారులను కలిసినా తనకు న్యాయం జరగలేదని ఆమె తెలిపారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించిన ఆమెను బలవంతంగా పోలీసులు అక్కడికి నుంచి బయటకు పంపేశారు. -
కన్నకొడుకుల చర్యకు తల్లి దిగ్భ్రాంతి
-
ఆక్రమించి.. ఆపై దౌర్జన్యం
నంద్యాల: అధికారం ఉందన్న అహంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దందాలు, దౌర్జన్యాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా వారి భూ దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. విలువైన స్థలం కనిపిస్తే చాలు అది తమదే అన్నట్లుగా కబ్జాలకు దిగుతున్నారు. ఓ పేదరాలి భూమి ఆక్రమణకు గురికావడంతో న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో విసిగి వేజారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. నంద్యాల మండల పరిధిలోని చాపిరేవుల గ్రామంలో పెద్దరంగయ్య, వెంకటలక్ష్మి దంపతులు 25, 26 సర్వేనెంబర్లో ఉన్న 3.20 ఎకరాల పొలాన్ని 1985 నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా వారి వద్ద ఉన్నాయి. ఈ పొలాన్ని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు భూపాల్‌రెడ్డి కబ్జా చేశారు. దీంతో బాధితులు మూడేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ భూమి కర్నూలు, కడప జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో మంచి డిమాండ్ ఉంది. దీంతో వారు దిక్కుతోచక నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణను కలిసి సమస్య పరిష్కరించాలని కోరారు. డీఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో సంప్రదించగా.. పొలానికి చెందిన డాక్యుమెంట్ తీసుకు రావాలని సూచించారు. అయితే.. సమస్య ఆర్డీఓకు వివరిస్తేనే న్యాయం జరుగుతుందని భావించిన బాధితురాలు మంగళవారం ఆర్డీఓ కార్యాయానికి చేరుకుంది. అధికారులు ఎంతకు రాకపోవడంతో తనవెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన భూపాల్‌రెడ్డి వైపే అధికారులు, పోలీసులు మాట్లాడుతున్నారని, తమకు న్యాయం జరగదనే ఉద్దేశంతోనే పురుగు మందు తాగానని బాధితురాలు చెప్పింది. తాను మరణించాకైనా కుటుంబ సభ్యులకైనా పొలం దక్కేలా చూడాలని, తన ఇద్దరు కుమారులు పాండురంగ, స్వాములు అవిటితనంతో బాధపడుతున్నారని, అధికారులు న్యాయం చేయాలని కోరింది. వెంకటలక్ష్మిని అధికారులు, స్థానికులు వెంటనే ఆటోలో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతోంది. కుమారుడు, అల్లుడిపై దాడి.. బాధితురాలు కుమారుడు పాండురంగ, అల్లుడు భరత్ మంగళవారం పొలం వద్దకు వెళ్లగా అక్కడే నీరు–చెట్టు పనులు చేస్తున్న టీడీపీ నాయకుడు భూపాల్‌రెడ్డి వారి అనుచరులతో ఎదురుపడ్డారు. తమ స్థలం ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించినందుకు భూపాల్‌రెడ్డి తన అనుచరులు ఏడుగురితో కలిసి తీవ్రంగా కొట్టారని బాధితులు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్ఐ రమేష్‌బాబు తెలిపారు. అధికారం ఉందనే కబ్జాలు చేస్తున్నారు గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి అధికారం ఉందని మా స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా, అర్జీలు ఇచ్చినా ఎవరూ న్యాయం చేయలేదు. అధికార పార్టీ నాయకుడి వైపే అందరూ మాట్లాడుతున్నారు. మాకు న్యాయం జరగదని మా అమ్మ వెంకటలక్ష్మి పురుగు మందు తాగింది. నా తమ్ముళ్లు ఇద్దరూ అవిటివాళ్లు. అధికారులు స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలి. – లక్ష్మీదేవి, బాధితురాలి కుమార్తె -
కేశవ్ ఇలాకాలో భూ దందా
దుక్కి చేసిన భూమిని చూపుతున్న రైతు పేరు పద్మావతి. నరసాపురం రెవెన్యూ పరిధిలోని రమణేపల్లి గ్రామం. సదరు రైతుకు సర్వే నం.334లో 4.50 ఎకరాలకు (ఎస్ఎస్ఐడీ నం–121640000900 56907) పేరుతో 2007 నవంబర్ 2వ తేదీ డీ పట్టా ఇచ్చారు. ఇందులో రైతు 3 బోర్లు డ్రిల్లింగ్ చేయించింది. ఈమెకు కూడా సాగులో లేవంటూ నోటీసులు జారీ చేశారు. కళ్యాణదుర్గం: టీడీపీ ప్రభుత్వం పేదలకు జానెడు భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. నాలుగేళ్లుగా మాటల గారడీతో కాలం వెల్లదీశారు. ఎక్కడా ఒక ఎకరం కొని పేదలకు పంచిన పాపాన పోలేదు. పైపెచ్చు పేద రైతులపై టీడీపీ నేతలు కన్నేశారు. డీ పట్టాలు పొంది దశాబ్దాల కాలంగా పంటలు సాగు చేసుకుంటున్న కొందరు, పెట్టుబడులు పెట్టి నష్టపోయి పంట సాగు చేయడానికి ఇబ్బంది పడుతున్న మరికొంత మంది రైతుల భూములను లాక్కునేందుకు బెళుగుప్ప మండలం నరసాపురం టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. టీడీపీ పెద్దల ఒత్తిడితో పేద రైతులు సాగులో లేరంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి స్వామి భక్తి చాటుకున్నారు. 50 మంది రైతుల్లో 36 మందికి నోటీసులు ఇవ్వగా టీడీపీ సానుభూతి పరులైన 14 మందికి నోటీసులు జారీ చేయకపోవడం గమనార్హం. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఇలాకా ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం నరసాపురం రెవెన్యూ పరిధిలో టీడీపీ నాయకులు భూ అక్రమాలకు తెరలేపారు. కాంగ్రెస్ హయాంలో 2006 నుంచి 2009 వరకు పలు విడతల భూ పంపిణీలో అప్పటి ప్రభుత్వం నరసాపురం రెవెన్యూ పరిధిలోని రమణేపల్లి, యలగలవంక, యలగలవంక తండా, నరసాపురం రైతులకు 50 మందికి భూ పంపిణీ చేపట్టింది. సుమారు 76 ఎకరాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం సాగులో లేరంటూ సర్వే నంబర్లు 186–4ఏ లో నాగమణి, 186–4ఏ, 186–7ఏలలో రాధమ్మ, సర్వే నం.57–2బీలో రామాంజినమ్మ, సర్వే నం. 186–6లో హంపమ్మ, సర్వే నం. 186–7సీ, – 9లలో టి.అనంతమ్మ, సర్వే నం.186–10లో అలివేలమ్మకు, భూలక్ష్మి, అనుసూయమ్మ, లక్ష్మిదేవి, నారాయణ, నాగమ్మ, డి.కిష్టప్పతో పాటు 36 మందికి సాగులో లేరని, ఇతర గ్రామాల్లో ఉన్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీ నాయకులకు కట్టబెట్టేందుకు ఎత్తుగడ ప్రస్తుతం 36 మందికి సంబంధించిన 50 ఎకరాల భూమిని టీడీపీ నాయకులకు కట్టబెట్టేందుకు ఎత్తుగడ వేశారు. టీడీపీ నాయకుడు ఉమా మహేశ్వర నాయుడు, ప్రసాద్, మురళి తదితరులు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తో ఒత్తిడి చేయించి, బెళుగుప్ప రెవెన్యూ అధికారులను అక్రమ మార్గంలో వెళ్లేలా చేస్తున్నారనే విమర్శలున్నాయి. త్వరలో నిర్వహించే అసైన్మెంట్ కమిటీలో సదరు టీడీపీ నేతలు తయారు చేసిన జాబితాల ఆధారంగా ఇప్పటికే పేదలు అనుభవిస్తున్న భూముల్లో పట్టాలివ్వడానికి కుట్ర జరుగుతోంది. బాధిత రైతులు శుక్రవారం కళ్యాణదుర్గం ఆర్డీఓ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. కేశవ్ ఇలాకాలో భూ అక్రమాలకు తెర ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ సానుభూతిపరులకు అక్రమ మార్గాన భూ పట్టాలు ఇప్పించేందుకు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ ఇలాకాలోని బెళుగుప్ప మండలం నరసాపురం రెవెన్యూ పరిధిలో భూ అక్రమాలకు తెర లేపారు. ఎక్కడా ప్రభుత్వం డబ్బు వెచ్చించి భూమి కొనుగోలు చేయకుండానే నరసాపురం గ్రామం రెవెన్యూ పరిధిలో ఎన్నికల్లో సహకరించని పేద రైతులను టార్గెట్ చేస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. మాట వినని వారికి నోటీసులు జారీ చేయించి టీడీపీ సానుభూతి పరులకు సంబంధించిన పూర్యానాయక్, ఉలుగూరి హనుమంతప్పతో పాటు మరికొంతమందికి నోటీసులు జారీ చేయకపోవడం అనుమానాలకు బలం చేకూరుతోంది. పరిహారం, పంట రుణం పొందినా లాక్కునేందుకు.. నరసాపురం రెవెన్యూ పరిధిలో డీ పట్టాలు పొందిన 50 మంది రైతులు కళ్యాణదుర్గం సిండికేట్ బ్యాంకులో దశాబ్దాల కాలంగా పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వాల నుంచి అందే రాయితీలను కూడా పొందారు. అంతేకాదు పెద్ద క్రిష్ణానాయక్, టి.అనంతమ్మ, టి.నారాయణ, అనుసూయమ్మల పొలాలు రాయదుర్గం– తుమకూరు రైల్వే లైన్ ఏర్పాటు సందర్భంగా కొంత పొలాన్ని కోల్పోవడంతో పరిహారం కూడా అందింది. -
కొండవాలు ఫర్ సేల్!
సాక్షి, విశాఖపట్నం: క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేకున్నప్పటికీ ఎక్కడైనా కొండవాలు ప్రాంతం కనిపిస్తే చాలు కబ్జా చేయడం... ప్లాట్లు వేసి అమ్మేయడం... సొమ్ము చేసుకోవడం అధికార టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. గడిచిన మూడేళ్లలో 296, 118జీవోల ప్రకారం క్రమబద్ధీకరించిన వాటిలో అత్యధికం కొండవాలు ప్రాంతాల్లోని ఆక్రమణలే. ఇవన్నీ అభ్యంతరకర భూముల్లో ఉన్నవే. వీటిని క్రమబద్ధీకరించే అవకాశం లేకున్నప్పటికీ అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేసేశారు. అంతటితో ఆగకుండా సిటీ పరిధిలోని కొండలపై నిర్మాణానికి అనువుగా ఉండే ప్రాంతాలను కబ్జా చేయడం.. అమ్మేసుకోవడం.. ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించేసుకోవడం అధికార పార్టీ నేతలకు అలవాటుగా మారి పోయింది. ఎవరైనా పొరపాటున పొరుగు జిల్లాల నుంచి వలస వచ్చి కొండవాలు ప్రాంతాల్లో కాసింత జాగాలో పూరిపాక వేసుకుంటే చాలు అధికారుల ద్వారా వాటిని పునాదులతో సహా కూలగొట్టే వరకు వదలడం లేదు. ఈ తరహా కబ్జాలు.. ఆక్రమణలు విశాఖ తూర్పు, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. గాజువాక పరిధిలో... గాజువాక నియోజకవర్గ పరిధిలోని పెదగంట్యాడ ప్రాంతంలోని రెవెన్యూ కొండపై ఏకంగా ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిని స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో టీడీపీ నేతలు కబ్జా చేసి గుట్టుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఆ స్థలాల్లో అనుమతుల్లేకున్నప్పటికీ దగ్గరుండి మరీ నిర్మాణాలు సాగిస్తున్నారు. అశోక్‌నగర్‌లో సర్వే నంబర్ 274లో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు, అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక్కడ సాగుతున్న ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై స్థానికులు ఫిర్యాదు చేయగా లోకాయుక్తలో సైతం 2016 సెప్టెంబర్ 22న కేసు నమోదైంది. లోకాయుక్త ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కొంతమేర ఆక్రమణలు తొలగించారు. తాజాగా టీడీపీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు, పెద గంట్యాడ తహసీల్దార్ ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులు మళ్లీ ఆక్రమణలు... అక్రమ కట్టడాలకు తెరతీశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి మరీ అమ్మేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపిస్తున్నారు. ఇటీవల ఈ నిర్మాణాలకు అనుమతులున్నాయా? లేదో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే కనీస సమాచారం ఇచ్చిన పాపన పోలేదు. దీంతో స్థానికులతో కలిసి ఈ ఆక్రమణలు, అక్రమకట్టడాలపై గడిచిన మూడు నెలల్లో మూడుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఉన్నప్పుడు ఫిర్యాదు చేయగా.. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశించారు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను జీవో నంబర్ 388 ద్వారా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉండడం అధికార టీడీపీ నేతలకు వరంగా మారింది. ఈ జీవో ద్వారా క్రమబద్ధీకరిస్తామని నమ్మజూపుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇదే తరహాలో సర్వే నంబర్ 274లో సుమారు 1.50ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా వేసి అమ్మేస్తున్నారు. 388 జీవో ప్రకారం క్రమబద్ధీకరించేస్తామంటూ నమ్మ జూపుతున్నారు. పైగా అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేసుకునేందుకు నేతలే అధికారిక అనుమతులు ఇచ్చేస్తు న్నారు. తహసీల్దార్ అండదండలతోనే అమ్మకాలు సర్వే నంబర్ 274లో ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా వేసి అమ్మేయడంతోపాటు అక్రమ నిర్మాణాల వెనుక రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. స్థానిక తహసీల్దార్ ప్రోద్భలంతోనే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. తక్షణమే నిర్మాణాలను నిలుపుదుల చేసి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. – కింతాడి రాజశేఖర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అక్రమ నిర్మాణాలు నా దృష్టికి రాలేదు అవి ప్రభుత్వ భూములే..కానీ అక్కడ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నా దృష్టికి రాలేదు. ఎవరు తీసుకురాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. –పార్వతీశ్వరరావు, తహసీల్దార్, పెదగంట్యాడ -
టీడీపీ నేత దౌర్జన్యం
తాడేపల్లిరూరల్, మంగళగిరిరూరల్: రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఓ వృద్ధురాలి స్థలంపై కన్నేసిన టీడీపీ నేత ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. నిర్మిస్తున్న ఇంటిని కూలదోయించి.. వృద్ధురాలు, ఆమె కుమార్తె దాడి చేయించాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణంలో నివసించే కుంచాల మంగేశ్వరికి తన పూర్వీకుల నుంచి సర్వే నంబర్లో 142లో కొంత భూమి వచ్చింది. ఆ భూమి వెనుక మంగళగిరి పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు పోతినేని స్థలం ఉండటం, మంగేశ్వరి స్థలం కూడా కావాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో గొడవ ప్రారంభమైంది. మంగేశ్వరి స్థలం అమ్మడానికి ఇష్టపడకపోవడంతో రాజకీయంగా తన పలుకుబడి ఉపయోగించి నకిలీ పాస్ పుస్తకాలు పుట్టించారు. దీంతో ఆమె కోర్టుకెళ్లింది. కోర్టు మంగేశ్వరికి అనుకూలంగా తీర్పునివ్వడంతో గురువారం ఇంటి నిర్మాణం చేపట్టింది. దీంతో 50 మంది పోతినేని శ్రీను అనుచరులు వచ్చి ఇంటి నిర్మాణాలను పడగొట్టారు. వృద్ధురాలు, ఆమె కూతురు శివపార్వతిపై దాడి చేశారు. చివరకు కొనుగోలు చేసిన ఇంటి సామానును ఏపీ 07 టీహెచ్ 4788 ట్రాక్టరులో తీసుకెళ్లారు. జరిగిన సంఘటనపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రెండు గంటల తర్వాత తీరిగ్గా వచ్చారు. తనకు, తన కూతురికి పోతినేని శ్రీను నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నట్లు మంగేశ్వరి తెలిపారు. -
విశాఖలో మరో భూసంతర్పణ
భూమి చదును, మౌలిక సదుపాయాల బాధ్యత ప్రభుత్వానిదే.. నిబంధనలకు అతీతంగా కోరిన రాయితీలన్నీ మంజూరు 30 శాతం స్థలం వాణిజ్య అవసరాలకు.. ఐటీ స్పేస్ ఖాళీగా ఉంటే ప్రభుత్వమే అద్దె చెల్లించాలట! సాక్షి, అమరావతి: వంద రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఏదైనా సంస్థ ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మరో వంద రూపాయలు రాయితీ ఇస్తుందా? అంటే ఎవరైనా సాధ్యం కాదనే చెబుతారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ మంత్రిత్వ శాఖ ఐటీలో సాధ్యమై పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(ఐఐటీ) విధానానికి విరుద్ధంగా ఈ రాయితీలు ఇవ్వడం గమనార్హం. అత్యంత విలువైన భూమిని ఐటీ కంపెనీలకు కారుచౌకగా ఇచ్చేయడమే కాకుండా, ఆ భూమిని చదును చేసి, రహదారులు, డ్రైనేజీ, నీటి వసతిని కల్పించేందుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా రాష్ట్ర సర్కారు ఖజానా నుంచే భరించేందుకు ప్రభుత్వ పెద్దలు అంగీకారం తెలిపారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ కంపెనీల పెట్టుబడి రూ.455 కోట్లే విశాఖ జిల్లా మధురవాడ, రుషికొండలో సర్వే నంబర్ 409లోని 40 ఎకరాల భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవా సొల్యూషన్స్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రుషికొండలో మార్కెట్ ధర ఎకరం రూ.10.16 కోట్లు ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే 40 ఎకరాల విలువ రూ.406.40 కోట్ల పైమాటే. అంత విలువైన భూమిని రెండు ఐటీ కంపెనీలకు తక్కువ ధరకే రాసిచ్చేశారు. ఎకరం రూ.32.50 లక్షల చొప్పున ఇవ్వాలని ఆ కంపెనీలు కోరగా, అందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అంగీకారం తెలిపింది. అంటే రూ.406.40 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని కేవలం రూ.13 కోట్లకే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఆ భూమిని చదును చేసి, రహదారి, డ్రైనేజీ సౌకర్యం, నీటి వసతి కల్పించడానికి మరో రూ.100 కోట్లు వ్యయం కానుంది. ఇంత చేస్తే ఆ రెండు కంపెనీలు పెట్టుబడి పెట్టేది కేవలం రూ.455 కోట్లేనట! 2,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందట! రాయితీలే రాయితీలు ప్రైవేట్ కంపెనీలు కోరినట్లే తక్కువ ధరకు భూమి కేటాయించడంతోపాటు రాయితీలు కూడా ప్రకటించారు. 40 ఎకరాల్లో 30 శాతం స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకోవచ్చు. కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించుకోవచ్చు. ఇక్కడ నిర్మించే ఐటీ సంస్థల్లో స్థలం ఖాళీగా ఉంటే 10,000 చదరపు అడుగులకు నెలకు రూ.3.90 లక్షల చొప్పున రెండేళ్ల పాటు ప్రభుత్వమే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల తరువాత కూడా అదే పరిస్థితి ఉంటే అద్దె చెల్లింపు గడువును మరో 18 నెలలు పొడిగిస్తారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి 25 ఎకరాలు, ఇన్నోవా సొల్యూషన్ కంపెనీకి 15 ఎకరాలను పంచేశారు. ఇన్నోవా సొల్యూషన్ కంపెనీ లీడర్షిప్ టీమ్‌లో మంత్రి సన్నిహితులే ఉండడం గమనార్హం. 10 ఎకరాలు చాలు: సీఎస్ విశాఖలో రెండు కంపెనీలకు భూకేటాయింపు ప్రతిపాదనలను గత ఏడాది డిసెంబర్ 20న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలోని రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎస్ఐపీసీ)కి పంపించారు. ఈ ప్రతిపాదనలను చూసి సీఎస్ ఆశ్యర్యానికి గురయ్యారు. ఇంత పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత 10 ఎకరాలు మాత్రమే కేటాయించాలని సూచించారు. కేబినెట్లో ఆమోదముద్ర సీఎస్ నేతృత్వంలోని కమిటీ చేసిన సూచనలు, అభ్యంతరాలను ముఖ్యమంత్రి నేతృత్వంలోని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ఐపీబీ) లెక్కచేయలేదు. ఎకరం రూ.32.50 లక్షల చొప్పున 40 ఎకరాలను కేటాయిస్తూ, కంపెనీలు కోరిన రాయితీలన్నీ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఐటీ విధానానికి విరుద్ధంగా ఉండటంతో భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవన్న భయంతో ప్రభుత్వ పెద్దలు జనవరి 20న కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయించారు. -
భూకాయింపులేల ‘బోండా’
సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూత్రధారిగా, పార్టీ నేత మాగంటి బాబు పాత్రధారిగా యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడ్డారని బాధితులు సాక్ష్యాధారాలతో సహా వెల్లడించారు. విజయవాడలో స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబానికి చెందిన రూ.50 కోట్ల విలువైన భూమిని చిన్నా చితకా పనులు చేసుకునే రామిరెడ్డి కోటేశ్వరరావు, అబ్దుల్ మస్తాన్ పేరుతో ఎమ్మెల్యే బొండా భార్య సుజాత, మాగంటి బాబు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద సొంతం చేసుకోవటం తెలిసిందే. తీరా వ్యవహారం బయటపడ్డాక అసలు మాగంటి బాబు ఎవరో తనకు తెలియదని బొండా కొత్త పల్లవి అందుకున్నారు. నేనే బొండా సుజాత పేరిట రిజిస్ట్రేషన్ చేయించా : మాగంటి బాబు సోమవారం జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఎదుట విచారణకు హాజరైన అనంతరం మాగంటి బాబు మీడియాతో మాట్లాడుతూ 5.16 ఎకరాల్లో 1.50 ఎకరాలను తానే ఎమ్మెల్యే బొండా భార్య సుజాత పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు చెప్పడం గమనార్హం. మరికొంత భూమిని మాగంటి బాబు పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అంటే స్వాతం త్య్ర సమరయోధుడి 5.16 ఎకరాలను ఎమ్మెల్యే బొండా కుటుంబం, మాగంటి బాబు కలిసే కాజేశారని స్పష్టమవుతోంది. బొండా అండతోనే భూదందాలు అజిత్‌సింగ్‌నగర్‌లో 21 మందికి చెందిన మరో రూ.15 కోట్ల విలువైన భూమిని మాగంటి బాబు తన ఆధీనంలో పెట్టుకున్నారు. పెనమలూరులో రూ.4 కోట్ల విలువైన 80 సెంట్ల స్థలం ఆ వర్గం ఆధీనంలోనే ఉంది. రాజరాజేశ్వరిపేటలో రూ.2.50 కోట్ల విలువైన 1,200 గజాల స్థలం ఆ వర్గం ఆక్రమణలోనే ఉంది. బొండా ఉమా అండతోనే మాగంటి బాబు అడ్డగోలుగా భూవ్యవహారాలు సాగిస్తున్నట్లు బోధపడుతోంది. అధికార యంత్రాంగం రక్షాకవచం ఎమ్మెల్యే బొండా ఉమా, మాగంటి బాబు జోడీ బరితెగించి భూబాగోతాలు సాగిస్తున్నా అధికార యంత్రాంగం కిమ్మనడం లేదు. రూ.50 కోట్ల విలువైన స్వాతంత్య్ర సమరయోధుడి భూమి కబ్జాపై కూడా అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది. అసలు ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసింది అధి కారులే. ఇప్పుడు విచారణ పేరుతో అధికారులే కథ నడిపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్ సుమోటోగా స్వీకరించి జేసీ విజయ్కృష్ణన్తో పాటు మరో నలుగురు అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీకి అధికారిక గుర్తింపు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ‘బొండా’గిరిపై కొనసాగుతున్న విచారణ విజయవాడ: ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచురుల భూకబ్జాలపై కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఏర్పాటుచేసిన ఐదుగురు సభ్యుల అధికారుల కమిటీ విచారణ సోమవారం కొనసాగింది. జేసీ కార్యాలయంలో నిర్వహించిన విచారణలో కమిటీ సభ్యులు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేష్, జిల్లా రిజిస్ట్రార్ జి. శ్రీనివాస్ పాల్గొన్నారు. జేసీ విజయకృష్ణన్ ఇచ్చిన నోటీసుల ప్రకారం బొండా ఉమా భార్య సుజాత తరఫు న్యాయవాది.. కమిటీ సభ్యులకు లిఖితపూర్వకంగా తమ వాదనలు వినిపించారు. తాము స్వాతంత్య్రసమరయెధుడి భూమి అని తెలియక వేరొకరి నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకున్నామని పేర్కొన్నారు. ఆ భూమి వివాదంలో ఉందని తెలుసుకుని అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నామని చెప్పారు. ఇప్పటికీ కబ్జాలోనే 5.16 ఎకరాలు రూ.50 కోట్ల విలువైన భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్నామని ఎమ్మెల్యే బొండా ఉమా చెబుతున్నారు. అయితే, ఇప్పటికీ ఆ భూమి స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబం ఆధీనంలో లేదు. ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి వెళితే టీడీపీ వర్గీయులు అడ్డుకుంటున్నారు. మరోవైపు మాగంటి బాబు ఆ భూమిని అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావు నుంచి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. చిన్నాచితకా పనులు చేసుకునే అబ్దుల్ మస్తాన్, కోటేశ్వరరావుకు అంత విలువైన భూమిని విక్రయించే స్థాయి ఉందా? అని ప్రశ్నిస్తే ఆ విషయం తనకు అనవసరమంటూ తప్పించుకుంటున్నారు. అప్పటిదాకా ఆ 5.16 ఎకరాలు తమ గుప్పిట్లోనే ఉంటాయని తేల్చి చెబుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. దీన్నిబట్టి మాగంటి బాబు, అధికారుల ద్వారా ఎమ్మెల్యే బొండా ఉమా కథ నడిపిస్తూ భూమి చేజారకుండా జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టమవుతోంది. డెవలప్మెంట్ అగ్రిమెంట్‌పై భూమి స్వాధీనం అబ్డుల్ సత్తార్ నుంచి నేను 1.57 సెంట్ల భూమిని డెవలప్మెంట్ అగ్రిమెంట్‌పై స్వాధీనం చేసుకున్నాను. అబ్దుల్ సత్తార్ కనుక తనకు తప్పుడు కాగితాలతో భూమిని అగ్రిమెంట్ చేసినట్లు విచారణలో తేలితే భూమిని వదిలేస్తా. అబ్దుల్ సత్తార్‌పై న్యాయపోరాటం చేస్తా. నేను ఎవరి భూమిని కబ్జా చేయలేదు. స్వాతంత్య్ర సమరయోధుడి మనవడు సురేష్‌బాబే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడు. ఆధారాలు ఉన్నాయి. బొండా ఉమాతో నాకు వ్యాపార లావాదేవీలు లేవు. కేవలం పార్టీ సంబంధాలు ఉన్నాయి. బొండా సుజాతకు కొంత భూమిని డెవలప్మెంట్పై కొనుగోలు చేయించాను. వివాదంలో ఉందని తెలుసుకుని ఆమె ఆ డీల్‌ను రద్దు చేసుకున్నారు. – మాగంటి బాబు, రియల్టర్, బొండా ఉమా అనుచరుడు నాపై అన్నీ తప్పుడు ఆరోపణలు నాపై రామిరెడ్డి కోటేశ్వరరావు, ఆయన కుమారుడు సురేంద్ర తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేవు. కోటేశ్వరరావు కుమారుడు సురేంద్ర, నేను చిన్ననాటి నుంచి చదువుకున్నాం. ఆ పరిచయంతో నా పార్టీ ఆఫీసులో కొంతకాలం పనిచేశాడు. గత ఏడాది ఇళ్లు తనఖా పెట్టించి కొంత డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు. అందుకు నేను అంగీకరించలేదు. అందుకు నాపై కక్షతో మాట్లాడుతున్నారు. మాగంటి బాబుతో నాకు పార్టీ సంబంధాలు తప్ప వ్యాపార లావాదేవీలు లేవు. నేను ఎవరినీ మోసగించలేదు. – దండూరి మహేష్, టీడీపీ కార్పొరేటర్ మాకు సంబంధం లేదు స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని కబ్జా చేసిన మాగంటి బాబుతో మాకు సంబంధమే లేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వాన్ని కోరతా.. – టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా నాపై అన్నీ తప్పుడు ఆరోపణలు నాపై రామిరెడ్డి కోటేశ్వరరావు, ఆయన కుమారుడు సురేంద్ర తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేవు. కోటేశ్వరరావు కుమారుడు సురేంద్ర, నేను చిన్ననాటి నుంచి చదువుకున్నాం. ఆ పరిచయంతో నా పార్టీ ఆఫీసులో కొంతకాలం పనిచేశాడు. గత ఏడాది ఇళ్లు తనఖా పెట్టించి కొంత డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు. అందుకు నేను అంగీకరించలేదు. అందుకు నాపై కక్షతో మాట్లాడుతున్నారు. మాగంటి బాబుతో నాకు పార్టీ సంబంధాలు తప్ప వ్యాపార లావాదేవీలు లేవు. నేను ఎవరినీ మోసగించలేదు. – దండూరి మహేష్, టీడీపీ కార్పొరేటర్ న్యాయం గెలుస్తుందనుకుంటున్నా.. రెండు, మూడు నెలల్లో మోసం బయటపడి న్యాయం గెలుస్తుంది. మాగంటి బాబు తదితరులు ఫోర్జరీ సంతకాల గుట్టురట్టవుతుంది. అధికారుల విచారణలో రెండు మూడు నెలల్లో పూర్తి విషయాలు వెల్లడవుతాయి. ఇప్పటికే వారికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చినట్లు చెబుతున్న రామిరెడ్డి కోటేశ్వరరావు నేను అగ్రిమెంట్ చేయలేదని లిఖిత పూర్వకంగా ఇచ్చారు. మాగంటి బాబు, బొండా సుజాత మా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు కోటేశ్వరరావు పూర్తి ఆధారాలతో విచారణాధికారులకు వివరించారు. తప్పు కప్పి పుచ్చుకునేందుకు మాగంటి బాబు, ఎమ్మెల్యే బొండా ఉమా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. – కేసిరెడ్డి సురేష్‌బాబు, స్వాతంత్య్ర సమరయోధుడి మనవడు -
వెలగపూడి అండ..పాతేశారు జెండా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భీమునిపట్నం మండలం కాపులుప్పాడ పంచాయతీ పరిధిలోని సోమన్నపాలెం గ్రామంలో రైతులు మరుపిళ్ల అప్పలనాయుడు, సూరిబాబు, అప్పలస్వామి. పోతిన పాపాయమ్మ, మరుపిళ్ల రాంబాబు, మరుపిళ్ల అప్పలనరసయ్య, మరుపిళ్ల నరసయ్య, నరసాయమ్మ, మరుపిళ్ల తాతయ్యలుకు ఐదు ఎకరాల 90 సెంట్ల భూమి ఉంది. పూర్వీకుల నుంచి పిత్రార్జితంగా వచ్చిన భూమి 624/1981గా సర్వే నంబర్ 268/3లో 1.36 సెంట్లు, 269/2లో 1.90 సెంట్లు, 269/10లో 1.96 సెంట్లు, 269/11లో 0.36 సెంట్లు, 269/13లో 0.02 సెంట్లు మొత్తం 5.90 సెంట్లుగా నమోదై ఉంది. ఇరవై ఏళ్ల కిందట విశ్వసౌజన్య రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నిమ్మలకూడి వీర వెంకట(ఎన్వివి) సత్యనారాయణ ఆ రైతులను కలిశారు. భూమి తీసుకుని లే అవుట్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. నమ్మిన రైతులు 73 సెంట్ల భూమి తమ వద్ద ఉంచుకుని... 1996లో కొంత భూమి, 1998లో మరికొంత భూమి మొత్తంగా 5ఎకరాల 17సెంట్ల భూమిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ)గా అతనికి రాసిచ్చి బతుకు దెరువుకోసం విజయవాడ పాతబస్తీకి వలస వెళ్లిపోయారు. సదరు రియల్టరు మాత్రం ఆ భూమి ఇక్కడ అభివృద్ధి చేయకుండా కొన్నాళ్లు.. కొన్నేళ్లు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. 2010లో విజయవాడ నుంచి తిరిగి సోమన్నపాలెం వచ్చేసిన ఆ రైతు కుటుంబాల సభ్యులు ఎన్వివి సత్యనారాయణను కలిశారు. ఆ భూమి తీసుకుని మాకేమీ ఇవ్వలేదు.. అలాగని ఆ భూమి కూడా అభివృద్ధి చేయలేదు.. అని ప్రశ్నిస్తే.. అసలు మీరెవరని ఎదురుతిరిగాడు. ఒక్కసారిగా షాక్ తిన్న సదరు రైతులు తేరుకుని కాస్త గట్టిగా అడిగితే... ఆ భూమే తనదేనని, కొనుగోలు చేసుకున్నట్టు పత్రాలు కూడా ఉన్నాయని, మీరేం చేసుకుంటారో చేసుకోండని అడ్డం తిరిగాడు. అవి తప్పుడు పత్రాలే.. పెద్దగా చదువుకోని ఆ రైతులు న్యాయవాదిని సంప్రదించి మొత్తం భూ వివరాలు తీయిస్తే అసలు మోసం బయటపడింది. 35/1996 జీపీఏగా 1016 చదరపు గజాల భూమిని జనరల్ పవర్ రాస్తే 3332.66 చదరపు గజాల భూమికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని, 1426/1988 జీపీఏగా 2032 చదరపు గజాలకు జీపీఏ రాస్తే 4466.66 చదరపు గజాలకు పోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని మరుపిళ్ల అప్పలస్వామి, మరుపిళ్ల సూరి బాబు, అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ విషయమై విశాఖపట్నం 7వ సీనియర్ సివిల్‌జడ్జి కోర్టులో పిటిషన్ వేయగా, ఒ.ఎస్.నంబర్.1352/2015, ఐ.ఎ.నంబర్ 612/2015గా మొత్తం 5.17 సెంట్ల భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. సత్యనారాయణగాని, అతని అనుచరులుగాని, అతని ఏజెంట్లగాని ఎవరూ ఆ భూమిలోకి ప్రవేశించరాదని కోర్టు ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. కాని సత్యనారాయణ అతని అనుచరులు భూమిలోకి పదే పదే చొరబడటంపై మరుపిళ్ల కుటుంబసభ్యులు భీమిలి పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు అది సివిల్ వ్యవహారమని పట్టించుకోకపోవడంతో చివరికి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 172/2017, 238/2017గా సదరు సత్యనారాయణపై 420 కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. కోర్టు ఉత్తర్వులున్నా లెక్కచేయక :దౌర్జన్యంతో భూ ఆక్రమణ.. అప్పలస్వామి ఈ ఏడాది జనవరి 6న సత్యనారాయణ అనుచరులు పెద్దసంఖ్యలో భూముల్లోకి చొరబడి సోలార్పంపుసెట్లు, కొబ్బరితోటలు ధ్వంసం చేసి నానా బీభత్సం చేశారంటూ మరుపిళ్ల కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కానీ పోలీసులు అది సివిల్ మేటర్ అంటూ పట్టించుకోలేదని బాధిత రైతులు చెబుతున్నారు. కోర్టు ఉత్తర్వులున్నా.. స్థలంలో రోడ్డు వేసేందుకు రంగం సిద్ధం చేశారని మరుపిళ్ల అప్పలస్వామి చెప్పుకొచ్చారు. వెలగపూడి పేరు చెప్పి బెదిరిస్తున్నారు: మరుపిళ్ల రామారావు సత్యనారాయణకు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. మేము ఎంత చెబితే ఆయన అంత.. నడుస్తోం ది మా రాజ్యం.. మమ్మల్ని ఏమీ చే యలేరంటూ సత్యనారాయణ, అతని అనుచరులు మ మ్మల్ని ఎన్నోసార్లు బెదిరించారు. వాళ్లు అన్నట్టుగానే పోలీసులు మా ఫిర్యాదులేమీ పట్టించుకోవడం లే దు.. పైగా తనపై అన్యాయంగా రౌడీషీట్ ఓపెన్ చేశా రు.. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ భూముల్లో చొరబడుతున్నారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.. అని మరుపిళ్ల అప్పలనరసయ్య కుమారుడు రామారావు చెప్పుకొచ్చా రు. వారి అరాచకాలకు సీసీ ఫుటేజీ రూపంలో తమ వద్ద సాక్ష్యాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. -
‘ఆ నివేదికతో బ్లాక్మెయిల్ చేయడానికే’
విశాఖపట్నం : విశాఖ భూదందా విషయంలో సిట్ ఇచ్చిన నివేదికతో చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తారని వైఎస్సార్సీపీ అనకాపల్లి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పెద్దలను పక్కన పెట్టి..సిట్ ఎవ్వరి పేర్లు వెల్లడించకుండా నివేదికను సీపీకి ఇచ్చారని, ప్రభుత్వ ప్రతినిధిలుగా విచారణ చేపట్టినప్పడు.. ఎందుకు పేర్లు వెల్లడించలేదని ప్రశ్నించారు. టీడీపీ నాయుకుల హస్త ఉంది కాబట్టే పేర్లు బయట పెట్టలేదని వ్యాఖ్యానించారు. విజయవాడలో బోండా ఉమా భూదందాలకు పాల్పడుతుంటే చంద్రబాబు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో మంత్రులు, అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినరీతిలో భూదందాలకు పాల్లడుతున్నారని ఆరోపించారు. సిట్ విచారణ చేస్తున్న నేపధ్యంలో తాము కోర్టుకు వెళ్లలేకపోయామని, ఇప్పడు కోర్టుకు వెళ్లడానికి సిద్దమముతున్నామని చెప్పారు. విశాఖలో భూదందాలపై సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ చేయాలని తొలి నుంచి వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. కానీ తమ వారిని కాపాడుకోడానికే సిట్ వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కేవలం రాయపాటి, అవంతి తప్ప మరెవ్వరూ రైల్వే జోన్ కోసం లేఖ ఇవ్వలేదని ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నామని, విశాఖ ఎంపీ హరిబాబు కేవలం వైఎస్ఆర్సీపీ మద్దతు కోరుతు ఇచ్చిన లేఖను మాత్రమే పంపించారని చెప్పారు. రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విశాఖలో ఫిబ్రవరి ఒకటిన దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. -
పచ్చని చేనును దున్నేశారు!
కట్టుబడివారిపాలెం(చిలకలూరిపేటరూరల్): అన్ని ఆధారాలు ఉన్నా సర్వే నిర్వహించి ఆన్లైన్లో పేరు నమోదు చేయాలని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అర్జీలు అందించినా ప్రయోజనం కలగలేదు. ఎటువంటి పత్రాలు లేకుండా మరొకరిపేరును సర్వేయర్ రికార్డుల్లో చేర్చారు. స్వార్జితంగా లభించిన భూమిలో కరివేపాకు సాగు చేసుకుంటున్న తరుణంలో పచ్చని పంటపొలాన్ని టీడీపీ నేతలు దున్నివేశారు. ప్రశ్నిస్తే మిమ్మల్ని సైతం పాతరేస్తామని హెచ్చరిస్తున్నారని తల్లికుమారుడు కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్యంతో మంచంలో ఉన్న తల్లి, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక మూడేళ్ల నుంచి పడుతున్న కష్టాలు వెల్లడించారు. అసలు విషయం ఇదీ.. తల్లీ కుమారుడైన భూలక్ష్మి, శ్రీమంతరావు పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని యడవల్లి రెవిన్యూ పరిధిలోని కట్టుబడివారిపాలెం గ్రామంలో చామకూరి భూలక్ష్మి భర్త చిన పుల్లయ్య మరణించటంతో అనారోగ్యంతో మంచంలో ఉంది. దివ్యాంగుడైన కుమారుడు శ్రీమంతరావు తమకు చెందిన సర్వే నెంబర్ 482–1ఎలోని 2 ఎకరాలు, 482–3లోని 0.53 ఎకరాలు, 447–బిలో 1.60 ఎకరాలు, 454–బిలో 1.70 ఎకరాలు సర్వేలు నిర్వహించి ఆన్లైన్లో 1బి రిజిస్టర్, అడంగల్ రికార్డుల్లో నమోదు చేయాలని 2015లో మండల సర్వేయర్‌కు అర్జీను అందించారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు, పట్టాదార్ పాస్‌పుస్తకాల నకలు కాపీలు జత చేశారు. నాటి నుంచి నేటి వరకు సర్వే నిర్వహించలేదు. అనంతరం మండల తహసీల్దార్, డివిజన్ ఆర్డీవో, గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్, మండల లీగల్ సెల్ అధారిటీలకు అర్జీలు అందించారు. తనకు చెందిన భూమిలో కరివేపాకును సాగు చేసుకుంటూ దివ్యాంగుడిగా ఉండి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు. సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించకపోగా సర్వేనెంబర్ 482–1ఎలోని 1.50 ఎకరాలు, 447–బి1లోని 0.32 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చామకూర లక్ష్మీనారాయణకు ఎటువంటి ఆధారాలు లేకుండా పొజిషన్ సర్టిఫికెట్‌ను మంజూరు చేశారు. సర్వేయర్‌ను ప్రశ్నిస్తే మా ఇష్టం గట్టిగా మాట్లాడితే మిగిలిన భూమిని సైతం మరొకరి పేరుతో సర్టిఫికెట్లు మంజూరు చేసి రికార్డుల్లో నమోదు చేస్తామని తెలిపారన్నారు. పచ్చని పంట పొలాన్ని దున్నేసిన టీడీపీ నేత సంబంధిత భూమిలో కరివేపాకు సాగు చేసుకుంటున్న తరుణంలో టీడీపీ నాయకుడు లక్ష్మీనారాయణ ఆదివారం రొటేవేటర్‌తో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకువచ్చి బలవంతంగా పంట పొలాన్ని దున్నివేశారు. పొలాన్ని దున్నివేయటమే కాకుండా అసభ్యకరంగా దూషించారని తల్లికుమారుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సంబంధిత పొలాన్ని క్షేత్రస్ధాయిలో పరిశీలించి ఆన్లైన్లతో పేర్లు నమోదు చేయాలని కోరుతున్నారు. కరివేపాకు పొలాన్ని దున్నివేసి, తనకు నష్టాన్ని కలిగించటంతో సమస్యను పరిష్కరించాలని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై రూరల్ పోలీసులు కేసును విచారిస్తున్నామని పేర్కొన్నారు. -
ఆక్రమణలో ‘కందుకూరి’ ఆస్తులు
తుంగపాడు వద్ద స్థానికులు ఆక్రమించిన కందుకూరి వీరేశలింగం పంతులు భూమిఅరుస్తాడు.. ఏడుస్తాడు.. తిరగబడతాడు అని తెలిసినా పక్కవాడి ఆస్తులు కొట్టేసే మానుష రూపంలో ఉన్న రాబందులకు ఉలకని, పలకని దేవుడి ఆస్తులు ఒక లెక్కా? హుండీలో డబ్బులు నొక్కేసినా అడగడు.. ఆయన నిత్య ధూప, దీప, నైవేద్యాల కోసం ధార్మికులు రాసిచ్చిన మాన్యాలు కొల్లగొడుతున్నా అడగడు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాల ఆస్తులు ఎన్నో అన్యాక్రాంతమవుతున్నాయి. సాక్షి, తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం: సమాజ హితం కోసం యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. వితంతు వివాహాలు, స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కందుకూరి 1906 డిసెంబర్ 15న ‘హితకారిణి’ సమాజాన్ని ఏర్పాటు చేసి, నిర్వహణకు తన యావదాస్తిని బదలాయించారు. రాజమహేంద్రవరం నగరంలో 30.37 ఏకరాల్లో కందుకూరి వీరేశలింగం ఆస్తిక స్కూల్, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, కందుకూరి రాజ్యలక్ష్మి పేరుతో మహిళా కళాశాలలు ఉన్నాయి. ఇందులో మహిళా కళాశాల ప్రాంగణంలో రాజేంద్రనగర్ వైపు సర్వే నంబర్ 255లో 400 గజాలు ఆక్రమణకు గురైంది. కళాశాలలో అటెండర్‌గా పని చేసిన వ్యక్తే ఆ స్థలాన్ని ఆక్రమించారు. దీనిపై హితకారిణి సమాజం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఆ స్థలం హితకారిణికే చెందుతుందని తీర్పునిచ్చింది. అయితే సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణలో ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజం సుమారు రూ.40 వేలు పలుకుతోంది. రాజానగరంలో 4.70 ఎకరాల ఆక్రమణ కందుకూరి తన 20.60 ఎకరాల వ్యవసాయ భూములనూ హితకారిణికి బదలాయించారు. తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో సర్వే నంబర్ 93/2లో 4.30 ఎకరాలు, ఇంజవరం గ్రామం సర్వే నంబర్ 42/3లో 3.20 ఎకరాలు, రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామం సర్వే నంబర్ 850లో 4.70 ఎకరాలు, అదే గ్రామంలోని సర్వే నంబర్ 866లో 2.52 ఎకరాలు, ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో సర్వే నంబర్ 84/3లో 3.08 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం మాధవయ్యపాలెంలో సర్వే నంబర్ 3/1బిలో 2.52 ఎకరాలను కందుకూరి వీరేశలింగం పంతులు హితకారిణి సమాజానికి బదలాయించారు. అయితే రాజానగరం మండలం తుంగపాడు వద్ద సర్వే నంబర్ 850లో ఉన్న 4.70 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమి ఎకరం విలువ దాదాపు రూ.30 లక్షలు ఉంది. స్థానికులు కొందరు ఆ పొలాన్ని ఆక్రమించడంపై హితకారిణి సమాజం అధికారులు కోర్టుల్లో వేసిన కేసులు విచారణలో ఉన్నాయి. మిగతా పొలాలు అన్నీ లీజుకు ఇచ్చారు. ఇప్పటికే రాజమహేంద్రవరం నగరంలో ఉన్న అత్యంత విలువైన భూములు కొన్ని గతంలో అతి తక్కువ ధరకే పెద్దలకు కేటాయించారని, ఇక మిగిలి ఉన్న భూములనైనా దేవాదాయశాఖ అధికారులు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
మీ'కోదండం' బాబూ..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోరిన కోరికలు తీర్చే కోదండ రాముడికే నిలువ నీడ కరువైంది. కోట్లాది రూపాయల విలువైన భూములున్నా.. అవి అన్యాక్రాంతమై.. ఆలయం శిథిలమైంది. వీటిని భూసేకరణలో అమ్ముకోవడానికి ఆక్రమణదారులు యత్నిస్తున్నారు. సుమారు పది కోట్ల విలువైన ఈ ఆస్తులను కాపాడుకునేందుకు గ్రామస్తులు, దేవాదాయ శాఖ నడుం బిగించింది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలోని చల్లావారిగూడెంలో శ్రీకోదండ రామాలయం దీనస్థితిలో ఉంది. ఇక్కడ ఆక్రమణదారులకు టీడీపీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను కాజేశారు. భూసేకరణలో కట్టబెట్టేందుకు యత్నం! అంతేకాక పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఈ భూములను కట్టబెట్టి పరిహారం హరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ భూముల వ్యవహారంపై దేవాదాయ శాఖ స్పందించి కోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం కోర్టులో ఉన్నా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ భూములను సేకరిస్తున్నట్లు అధికారులు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే అవార్డు విచారణలో గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాస్ కాలేదు. 1942లో ప్రతిష్ఠ చల్లావారిగూడెంలో 1942లో గ్రామపెద్ద, భూస్వామి పెండ్యాల వెంకట రామారావు ఒక పెంకిటింట్లో పంచలోహ విగ్రహాలతో శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ఠించారు. ఆలయ నిర్వహణ కోసం గ్రామంలో ఉన్న తన భూమిలో 42.71 ఎకరాలను ఆలయానికి రాశారు. చాలాకాలం అయనే ఆ భూమిని సేద్యం చేసి వచ్చిన ఆదాయాన్ని ఆలయ నిర్వహణకు ఖర్చు చేశారు. అయితే 1977లో ఆ భూమిని సేద్యం చేసేందుకు తాడువాయికి చెందిన ఒకరికి కౌలుకు ఇచ్చారు. ఇది అవకాశంగా తీసుకుని ఆ భూమిని తమ కుటుంబంలోని వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి భూమి వారి స్వాధీనంలోకి వెళ్లింది. పెండ్యాల వెంకట రామారావుకు వారసులు లేకపోవడంతో పురుషోత్తంను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం పురుషోత్తం ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. అయితే 2010లో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ గుర్తించి సింగిల్ ట్రస్టీగా, కార్యనిర్వహణాధికారిగా పెన్మెత్స విశ్వనాథరాజును నియమించింది. దీంతో ఆలయ ఆస్తులు గుర్తించి భూముల కోసం కోర్టులో కేసు వేశారు. తాజాగా చల్లావారిగూడెంలో ఉన్న 42.71 ఎకరాల భూమిని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సుమారు 10 ఎకరాలు, పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి 32 ఎకరాలు సేకరిస్తున్నట్లు ప్రకటన రావడంతో దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చింతలపూడి పథకంలో సేకరించిన భూమికి నష్టపరిహారం దేవాదాయ శాఖకు చెల్లించాలని ట్రస్టీ విశ్వనాథరాజు భూసేకరణ అధికారులను కోరారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో సేకరించిన భూమికి కూడా చెల్లించే నష్టపరిహారం దేవాదాయ శాఖకు చెల్లించాలని కోరారు. ఇదిలా ఉంటే అవార్డు విచారణలో కూడా గ్రామస్తులు 42.71 ఎకరాల భూమి శ్రీకోదండ రామాలయానికి చెందినదని, నష్టపరిహారం ఆలయానికే చెల్లించాలంటూ తమ వాదన వినిపించారు. ఆలయానికి వందల ఎకరాలు చల్లావారిగూడెం శ్రీకోదండ రామాలయానికి వందల ఎకరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. చల్లావారిగూడెం, జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం, టి.నరసాపురం మండంలం బొర్రంపాలెంలో ఇంకా ఇతర ప్రాంతాల్లోనూ సుమారు 500 ఎకరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భూములన్నీ వెలికితీస్తే శ్రీకోదండరాముడు అపర కోటీశ్వరుడే..! -
దేవుళ్లకే శఠగోపం!
దేవాదాయ భూములు... దేవాలయాల పోషణకు, ధూపదీప నైవేద్యాల నిర్వహణకు ఒకప్పుడు దాతలు, భూస్వాములు, జమీందారులు, రాజులు దానమిచ్చిన భూములు! కానీ ఇప్పుడు అవంటే అందరికీ అలుసే! శిస్తు లేకుండానే ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా అడిగేవారే కరువయ్యారు! ఈ భూముల సంరక్షణకు ఆ శాఖలో ప్రత్యేక విభాగమూ లేదు! ఒకవేళ రెవెన్యూ శాఖ సహాయంతోనో, లేదా ఆక్రమణదారులపై కోర్టులో కేసులు వేసినా పోరాడితేనో పెద్దగా మార్పు ఉండట్లేదు. ఒకవేళ సాగులోనున్న రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నా మళ్లీ మరో రైతులకు అప్పగించాల్సిందే మరి! మరోవైపు దేవాదాయశాఖ రికార్డుల ప్రకారం జిల్లాలోని పలు దేవాలయాలకు భూమి ఉన్నట్లున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అందుకు భిన్నంగా పరిస్థితి ఉంటోంది! ఇలాంటి స్థితిలో కాస్త రక్షణగా ఉండాల్సినవి ట్రస్టు బోర్డులే. కానీ ఇప్పటికీ వాటి నియామకం జరగలేదంటే రాజకీయ జోక్యం ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతోంది! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో 823 ఆలయాలు ఉన్నాయి. వీటిలో సగానికి సగం ఆలయాలకు వివిధ రకాల భూములు ఉన్నాయి. అందులో వ్యవసాయానికి అనువుగా ఉండే మాగాణి 7,855.21 ఎకరాలు, మెట్ట భూమి 6,386.44 ఎకరాలు ఉన్నాయి. ఈ మొత్తం 14,241.65 ఎకరాలు దేవాదాయశాఖ రికార్డుల ప్రకారం ఉన్నప్పటికీ ఇదంతా స్వాధీనంలో లేదు. దాదాపు 6,298 ఎకరాల భూమి ఆక్రమణల్లో ఉంది. దీని నుంచి పైసా కూడా ఆలయాలకు శిస్తు రావట్లేదు. జిల్లా కేంద్రంలోని కోదండరామ ఆలయానికి మాగాణి, మెట్ట కలిపి 485.72 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఎక్కువ భాగం శ్రీకాకుళం, నరసన్నపేట మండలాల్లో ఉంది. ఆ భూమిని పలువురు రైతులు దీర్ఘకాలికంగా సాగు చేసుకుంటున్నారు. దీనిపై తమకు రెవెన్యూ శాఖ పట్టాలు ఇచ్చిందని వారెవ్వరూ శిస్తు చెల్లించడం మానేశారు. అలాగని ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోలేని పరిస్థితిలో దేవాదాయశాఖ ఉంది. ఈ ఒక్కటే కాదు జిల్లాకేంద్రంలోని జగన్నాథస్వామి ఆలయంతో పాటు గార, శ్రీముఖలింగం, నరసన్నపేట, టెక్కలి, వీరఘట్టం, రాజాం, సంతకవిటి, ఇచ్ఛాపురం, కంచిలి తదితర పలు ప్రాంతాల్లో దేవాలయాల పరిస్థితి ఇలాగే ఉంది. సొంత భూములపై ఆదాయం రాక, మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు లేక నిర్వహణపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విలువైన స్థలాలకు రక్షణ కరువు... జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని అరసవల్లి దేవస్థానానికి చెందిన సుమారు రెండున్నర ఎకరాల భూమిని గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బడ్జెట్ హోటల్, టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి కేటాయించారు. దీనిలో దేవాదాయ శాఖ నుంచి లీజు ఒప్పందం కింద 1.28 ఎకరాలు భూమిని తీసుకున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బడ్జెట్ హోటల్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ బడ్జెట్ హోటల్ ఆదాయంలో కొంత శాతం అరసవల్లి ఆలయానికి ఇవ్వాల్సి ఉంది. కానీ బడ్జెట్ హోటల్‌ను లీజుకిచ్చిన ఏపీటీడీసీ... ఆ పక్కనే కన్వెన్షన్‌హాల్, స్విమ్మింగ్ పూల్ వంటి నిర్మాణాలు చేసుకోవచ్చని లీజుదారులకు అనుమతులు ఇచ్చేసింది. తీరా నిర్మాణాలు ఒప్పందాలకు, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ దేవాదాయశాఖ అభ్యంతరం తెలియజేసింది. టౌన్‌ప్లానింగ్ అప్రూవల్ సహా ఇతరత్రా అనుమతులేవీ లేకుండా మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించదలచిన కల్యాణ మండపం ఉనికినే ప్రశ్నార్థం చేసేలా ఈ నిర్మాణాలు సాగుతున్నాయి. ఆ అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలనే డిమాండుతో వైఎస్సార్సీపీ నాయకులు ఇటీవల భారీ నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. ఇలా అరసవల్లి భూములకే రక్షణ లేకపోతే ఇక మిగతా ఆలయాలకు చెందిన విలువైన స్థలాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తున్న నేపథ్యంలో గత పదీపదిహేనేళ్లుగా అసలు ఆలయాలకు భూములు, స్థలాలు ఇచ్చే దాతలే కనిపించట్లేదు. ఇలాంటి విలువైన భూములను కబ్జాదారుల చేజిక్కకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. కానీ అధికార పార్టీ నాయకులు ఆక్రమణదారులకే వంతపాడుతుండటం వల్లే సమస్య మరింత క్లిష్టమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రస్టుబోర్డుల్లోనూ రాజకీయమే... దేవాలయాల నిర్వహణకు ట్రస్టు బోర్డు చాలా కీలకం. కానీ వాటి గడువు ముగిసి ఏళ్లు గడిచిపోతున్నా నియామకమే జరగట్లేదు. ఆలయాల పాలన తమ కనుసన్నల్లో నడవాలని టీడీపీ నాయకులు కోవడం, తమ అనుయాయులకు బోర్డులో స్థానం కల్పించడం అనే ఉద్దేశాలతో పనిచేస్తుండటంతో నియామకాల ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడుతోంది. జిల్లాలో రూ.25 లక్షలకు పైగా ఆదాయం వస్తున్న ‘ఎ’ గ్రేడ్ ఆలయాలు మూడే ఉన్నాయి. వాటిలో కేవలం ఒక్క పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయానికి మాత్రమే ట్రస్టుబోర్డు నియామకం జరిగింది. మిగతా రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం కూర్మనాథస్వామి ఆలయాలకు ఇప్పటివరకూ ట్రస్టుబోర్డు నియామకంపై దృష్టి పెట్టలేదు. ఈ రెండూ శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. అలాగే ‘బి’ గ్రేడు ఆలయాలు 16 ఉంటే వాటిలో నాలుగింటికి, ‘సి’ గ్రేడు ఆలయాలు 786 ఉంటే వాటిలో ఒక్క గుడికి మాత్రమే ఇప్పటివరకూ ట్రస్టుబోర్డును నియమించారు. టీడీపీ పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యమే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. -
సీఎం సొంత జిల్లాలో భూబకాసురులు
-
కలెక్టరే నేను చెప్పింది చేస్తాడు..
సంబేపల్లె : మండలకేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన దళిత మహిళ రమాదేవి భూమిలో అక్రమంగా రోడ్డు వేస్తున్న అధికారపార్టీ సర్పంచ్ నేను ఏమి చెపితే కలెక్టర్ అలాగే చేస్తాడు అంటూ అధికార దర్పం చూపిస్తున్నాడని దళిత మహిళ వాపోతోంది. బుధవారం ఇక్కడ ఆమె మాట్లాడుతూ నా భూమి ఆక్రమించొద్దని ప్రాధేయపడినా స్థానిక సర్పంచ్ నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ దుర్భాషలాడుతున్నారని వాపోయారు. భూమి ఆన్‌లైన్‌కోసం తహసీల్దారు కార్యాలయ చుట్టూ తిరిగినా రెవెన్యూఅధికారులు స్పందించలేదన్నారు. గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడైన సర్పంచే ఎస్సీ భూములు కాజేసేందుకు కంకణం కట్టుకుంటే మాకు న్యాయం ఎలా జరుగుతుందని అంటున్నారు. అధికారులు స్పందించి భూమిని ఆన్లైన్ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిర్యాదు చేసినా ఫలితం లేదు తన భూమి ఆక్రమణకు గురవుతోందని పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశా. న్యాయం జరగక పోవడంతో ఈ నెల 21న ప్రజావాణి ద్వారా కలెక్టర్‌కు తెలియజేశానా వినతిని స్వీకరించి వారు ఇచ్చిన రసీదును బుధవారం తహసీల్దారు చంద్రమ్మకు అందజేయబోగా ఆమె తిరస్కరించింది. నిన్ను కలెక్టర్ దగ్గరకు ఎవరు వెళ్లమన్నారని, నీసమస్యను కలోక్టర్ దగ్గరే పరిష్కరించుకో అన్నారు. – రమాదేవి,ఎస్సీకాలనీ -
అసలు నాయినికి టికెట్ వస్తుందా..
న్యూశాయంపేట: కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జాపై ఫైలును తిరగతోడి కలెక్టర్, జేసీ, ఏడీ ల్యాండ్ సర్వే, ఆర్డీఓలతో ప్రత్యేక కమిటీవేసి కబ్జాకోరుల భరతం పడుతామని గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.హన్మకొండ నయింనగర్‌లోని అర్బన్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల కళ్లు కుట్టి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటిఆర్ కార్టూన్ కాదని కడిగిన ముత్యం అని అభివర్ణించారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్పై నాయిని లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. 2019లో అసలు నాయిని రాజేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా లేదా తెలుసుకొని వినయ్‌భాస్కర్ గురించి మాట్లాడాలన్నారు. కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజల కష్టాలను తెలుసుకొని ముందుకు సాగుతున్న వినయ్భాష్కర్పై ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ తరపున టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిస్తే తాను రాజకీయాల్లోంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. విలేకరుల సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మహ్మద్ అజీజ్‌ఖాన్, తాడు గౌరవ అధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్, కార్పొరేటర్లు వద్దిరాజు గణేష్,వీరగంటి రవిందర్,జోరిక రమేష్, టిఆర్ఎస్వి నేతలు కంచర్ల మనోజ్,ప్రవీణ్,చాగంటి రమేష్, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు. కమిటీని స్వాగతిస్తాం : నాయిని కాకతీయ యూనివర్సిటీ భూముల కుంభకోణంపై వేయబోతున్న కమిటీని స్వాగతిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కేయూ భూముల కుంభకోణంపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ ప్రకటించడంపై ఆయన స్పందిం చారు. ఈ మేరకు ‘సాక్షి’కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పా రు. కాకతీయ యూనివర్సిటీ భూముల కుంభకోణంపై వేయబోతున్న కమిటీకి స్వాగతిస్తున్నాం. కమిటీలో ఇద్దరు విద్యార్థి సంఘ నాయకులు, ఇద్దరు అధ్యాపకులను సభ్యులుగా చేర్చాలి. విచారణ జరిగేంత వరకు కేయూ ఆర్చి గేటుదగ్గర చెప్పుల దండ ఉంచాలి..దోషులుగా తేలిన వారి మెడలో ఆ దండ వేసి ఊరేగించాలని పేర్కొన్నారు. -
భూలోకం
జిల్లాలో ఈ రెండు ఉదాహరణలే కాదు. ఒక్కో మండలంలో ఒక్కో భూబాగోతం.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడిన కొందరు రెవెన్యూ అధికారులను మంచి చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ జాగా కన్పిస్తే..పాగా వేసేస్తున్నారు. అందిన కాడికి అడ్డంగా ఆక్రమించేస్తున్నారు. ఇంత జరుగుతు న్నా రెవెన్యూ యంత్రాం గం మొద్దునిద్ర వీడకపోవడం గమనార్హం. ఆ భూమితో మాకు సంబంధంలేదు నా భార్య రేణుక పేరుతో నాలుగు ఎకరాలు, నా పేరుతో 2.3 ఎకరాలు ఉన్నమాట వాస్తవం. ఈ భూములు చాలా ఏళ్ల నుంచి నా ఆదీనంలో లేవు. మా ఊరి ప్రజలే వాటిని అనుభవిస్తున్నా రు. కావాలంటే ఈ భూములను ప్రభుత్వానికి అప్పగిస్తాను. ఎఫ్ఎంబీ, 1–బీ, మీ భూమి పట్టాల్లో భూమి విస్తీర్ణం ఒక్కో రకంగా ఉందన్న విషయం నాకు తెలియదు. – లోక్‌నాథ్‌నాయుడు, టీడీపీ నాయకుడు, ఎస్ఆర్పురం చిత్తూరు, సాక్షి: జిల్లాలో భూకబ్జాల పరంపర కొనసాగుతోంది. ఖాళీ స్థలాలు కన్పిస్తే అధికార పార్టీ నేతలు అక్కడ వాలిపోతున్నారు. అడ్డదిడ్డంగా ఆక్రమించి పట్టాలు సృష్టించుకుంటున్నారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం. దాసోహమయ్యారా? శ్రీరంగరాజపురం మండలంలోని కొందరు రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలకు దాసోహమయ్యారనే విమర్శలు విన్పిస్తున్నాయి. మండల పరిధిలోని 56 కన్నికాపురంలో టీడీపీ నాయకుడు లోక్‌నాథ్‌నాయుడు భార్య రేణుక పేరుమీద సర్వే నం.136/3బీ, 136/3ఏ, 135/11లో 4.4 ఎకరాల భూమిని కట్టబెట్టారు. ఈ భూమిని కూడా ఎఫ్ఎంబీ (ఫీల్డ్‌మెజర్‌మెంట్ బుక్)లో 10.45 ఎకరాలు, 1బీలో4.4 ఎకరాలు, ఆన్లైన్లో 14.4 ఎకరాలుగా నమోదు చేశారు. ఇది చట్టవిరుద్ధమైనా సంబంధిత అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ లేవు. పప్పూ..బెల్లంలా.. డీకేటీ భూముల పంపకంపై 2009లో ప్రభుత్వం నిషేధం విధించినా జిల్లాలో మాత్రం కావాల్సిన వారికి పప్పూబెల్లంలా రెవెన్యూ అధికారులు పంచేస్తున్నారు. లోకనాథ్నాయుడుకి కొన్ని నెలల క్రితమే సర్వే నెంబర్ 135/7లో 2.17 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. ఆ ప్రాంతంలో ఎకరా సుమారు రూ.25 లక్షల పైమాటే. సీజేఎఫ్ భూములూ కబ్జా.. టీడీపీ నాయకుడు లోకనాథ్‌నాయుడు భార్యకు కట్టబెట్టిన భూముల పక్కనే అటవీ భూములున్నాయి. ఈ భూములకు ఆనుకుని కేంద్ర ప్రభుత్వం డీఆర్డీఏ ప్రాజెక్టు చేపడుతోంది. ఆ ప్రాంతంలో భూముల ధరలు రెక్కలొచ్చాయి. టీడీపీ నాయకుడి కన్ను అటవీ భూములపై పడింది. ఎంచక్కా ఆక్రమించి కంచె నాటడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మామిడి చెట్లు పెంచడానికి గుంతల తవ్వకాన్ని పూర్తిచేశాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. నజరానా ఇందుకేనా? ఎస్సార్‌పురం మండల కేంద్రంలో టీడీపీకి రూ.30 లక్షల వ్యయంతో అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇచ్చారు లోక్‌నాథ్‌నాయుడు. దీనికి ప్రతిగానే డీకేటీ భూములు కేటాయిం చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీజేఎఫ్ భూములు ఆక్రమించుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కార ణం కూడా పార్టీకి భవనాన్ని నిర్మించి ఇవ్వడమేనని ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని, మండల టీడీపీ అధ్యక్షుడు రుద్రప్పనాయుడు చొరవతోనే లోకనాథ్‌నాయుడు కబ్జాలకు ఒడిగడుతున్నట్లు ఆ పార్టీ నాయకులే బాహాటకంగా చెబు తుండడం గమనార్హం. -
అంతా కృష్ణార్పణం..
చింతలపూడి: పరిహారం, భూ సేకరణ విషయంలో జిల్లాలోని చింతలపూడి పథకం వివాదస్పదమవుతోంది. ఈ పథకం పూర్వాపరాలు ఇలా.. 2003లో పాదయాత్ర సమయంలో మెట్ట ప్రాంత రైతుల సాగునీటి కష్టాలను ప్రత్యక్షంగా తిలకించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.1701 కోట్ల అంచనా వ్యయంతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. అంతేకాకుండా 2008 అక్టోబరు 30వ తేదీన కామవరపుకోటలో స్వయంగా ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మెట్ట ప్రాంత మండలాలకు సాగునీరు అందించడం ఈ పథకం ఉద్దేశం. జలయజ్ఞంలో 75వ ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనున్న ఈ ఎత్తిపోతల పథకం వల్ల 2 లక్షల మూడు వందల అరవై ఆరు ఎకరాలకు సాగునీరు అందనున్నది. గుడ్డిగూడెం ఎత్తిపోతల ప్రతిపాదన ఇదిలా ఉండగా ప్రభుత్వం తాజాగా రూపొందిస్తోన్న గుడ్డిగూడెం ఎత్తిపోతల పథకాన్ని మరింత విస్తరించి చింతలపూడి ఎత్తిపోతల కోసం తవ్వుతున్న కాల్వకు అనుసంధానం చేయడం ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో 2.80 లక్షల ఎకరాలకు సాగు నీరు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రెండు జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ కాల్వను విస్తరించడం ద్వార చింతలపూడి మేజర్ కాల్వ నుంచి వేంపాడు మేజర్ కాల్వకు గోదావరి నీటిని మళ్లించడానికి పథకం రూపొందించారు. మొదటి దశ పనులు 25 శాతం కూడా పూర్తి కాలేదు. అయినా సరే ప్రభుత్వం చింతలపూడి పథకాన్ని విస్తరించి కృష్ణా జిల్లాకు లబ్ధి చేకూరే విధంగా రెండో దశకు రూ.3,200 కోట్లు కేటాయించారు. దీంతో ప్రాజెక్టు వ్యయం 4,909 కోట్లకు చేరుకుంది. తొలి దశలో 2 వేల క్యూసెక్కులు ప్రవహించేలా కాల్వ తవ్వకం పనులు చేపట్టారు. ఇప్పుడు 6,875 క్యూసెక్కులు ప్రవహించేలా భూసేకరణ చేస్తున్నారు. గతంలో 24 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల లోతు చొప్పున కాల్వను తవ్వారు. రెండోదశ చేర్చడంతో కాల్వ ఎత్తును మరో 3 మీటర్లు పెంచనున్నారు. ఎక్కడికక్కడ వ్యతిరేకత ఈ క్రమంలో అధికారులు చేపట్టిన సర్వే పనులను ఎక్కడికక్కడ రైతులు అడ్డుకుంటున్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం విషయం తేల్చకుండా అడ్డగోలుగా భూములను సేకరించేందుకు బలవంతంగా సర్వే పనులు మొదలు పెట్టారు. ఇక్కడ బహిరంగ మార్కెట్లో రూ.20 లక్షల విలువ చేసే భూములకు పన్నెండున్నర లక్షలు చెల్లించి లాక్కోవాలని ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోంది. రైతులకు సమాచారం ఇవ్వకుండా ప్రజా ప్రయోజనాల పేరుతో అడ్డగోలు భూ సేకరణకు తెరలేపింది. దీంతో ప్రభుత్వ తీరుపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది. పట్టిసీమ తరహాలో ఎకరానికి రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలని రెండున్నర ఏళ్ల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 8న చింతలపూడి మండలం కాంతంపాలెం వద్ద పోలీసు బందోబస్తుతో సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను రైతులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు 10 మంది రైతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి సర్వే పనులు కొనసాగిస్తున్నారు. ఒకే ప్యాకేజీ అమలు చేయాలి చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ ఒకే ప్యాకేజీ అందించాలి. జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ప్యాకేజీ అమలు చేయడం రైతులను మోసగించడమే అవుతుంది. పరిహారం విషయం తేల్చకుండా బలవంతంగా సర్వే పనులు చేస్తున్నారు. -అలవాల ఖాదర్‌బాబురెడ్డి, చింతలపూడి భూ నిర్వాసితుల కమిటీ, చింతలపూడి బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారు ప్రభుత్వం బలవంతంగా మా భూములను లాక్కోవాలని చూస్తోంది. రైతులకు జరుగుతోన్న అన్యాయంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. మొదటి దశ పూర్తి చేయకుండా రెండో దశకు సర్వే చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన చింతలపూడి మొదటి దశను తొలుత పూర్తి చేసి జిల్లాలోని మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలి. పిడపర్తి ముత్తారెడ్డి, రైతు, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నష్ట పరిహారం విషయం తేల్చండి చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం ఎంత ఇస్తారో ప్రభుత్వం ముందుగా తేల్చాలి. పట్టిసీమ తరహాలో ఎకరానికి రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలి. అప్పటి వరకు ఎత్తిపోతల కాలువ తవ్వకం పనులు జరగనివ్వం. –కె.రాఘవేంద్రరెడ్డి, చింతలపూడి రైతుల సంక్షేమ సంఘం ప్రతినిధి -
ఈ భూములు పెద్దలకు మాత్రమే
సాక్షి, చిత్తూరు, తిరుపతి : తిరుపతి అర్బన్, రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలాల పరిధిలో సామాన్యుడికి ఇల్లు కష్టమే. ఈ ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ భూములపై దృష్టి సారించింది. వివరాలు సేకరించింది. రాజధాని పేరుతో అమరావతిలో 34వేల ఎకరాలను ప్రైవేటు భూములను లాక్కున్న ప్రభుత్వం అదే తరహాలో ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకుంటోంది. తమ అనుమతి లేకుండా సెంటు భూమి కూడా ఇవ్వటానికి వీల్లేదని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. విలువైన భూములున్న ప్రాంతా ల్లో ఇళ్ల స్థలాలు, భూ పంపిణీపై నిషేధం విధించింది. నాలుగు మండలాల్లో 46,500 మంది నివాస స్థలాలు లేని నిరుపేదలు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక హామీని తుంగలో తొక్కింది. నాలుగు మండలాల్లో ఒక్క సెంటు స్థలం కూడా పంపిణీ చేయటానికి వీల్లేదని ప్రభుత్వ పెద్దలు రెవెన్యూ అధికారులకు గట్టిగా చెప్పేశారు. దీంతో పేదలు ఇళ్ల స్థలాల కోసం ప్రదక్షిణ చేస్తున్నా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ఉత్తర్వులు లేకపోయినా ఇళ్ల స్థలాల పంపిణీపై నిషేధం విధించటం ప్రభుత్వ చరిత్రలో ఇదే తొలిసారని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇళ్ల స్థలాల పేరుతో రెవెన్యూ అధికారులు అమ్మి సొమ్ము చేసుకుంటారనే అనుమానంతో ప్రభుత్వ పెద్దలు ఈ రకమైన నిషేధం విధించినట్లు చెబుతున్నారు. కారుచౌకగా భూములు కోట్ల రూపాయలు విలువచేసే భూములను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతోంది. ఎకరం కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు విలువ ఉన్న భూములను ప్రైవేటు సంస్థలకు రూ.50 లక్షలకే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రైతులు సాగు చేసుకుంటున్న భూములను సైతం ఎకరా రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు చొప్పున నామమాత్రపు పరిహారం చెల్లించి బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏర్పేడు మండలం మేర్లపాక, రాజులపాలెం, జంగాపల్లి, పంగూరు, పాగాలి తదితర గ్రామాల పరిధిలో రైతులు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం బలవం తంగా స్వాధీనం చేసుకుని నామమాత్రపు పరిహారం చేతిలో పెట్టి చేతులు దులుపుకోవటం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఇప్పటి వరకు కేటాయింపులు జరిగిన భూముల్లో ఎక్కువ శాతం ప్రైవేటు సంస్థలకే కట్టబెట్టడం గమనార్హం. తిరుపతి పరిసరాల్లో సర్కారు పరంగా ఇంటి స్థలం కేటాయించరని తెలుసుకుని నిరుపేదలు సర్కారుకు శాపనార్థాలు పెడుతున్నారు. -
మనోడైతేనే..
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి , ఏలూరు: భూసేకరణలో అక్రమాలు పెద్ద ఎత్తున జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో సేకరించిన భూమి విషయంలో అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారని, వీరికి అధికారులు ఊతం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురయ్యే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం మండలం దొరమామడి గ్రామంలో ప్రభుత్వం భూసేకరణ చేసింది. ఈ భూసేకరణ అధికార పార్టీకి చెందిన నేతలకు కల్పతరువుగా మారింది. తమ పార్టీ వారైతే ఒక రకంగా కానివారికి మరో రకంగా పరిహారం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ వారైతే లేని పంటలు ఉన్నట్లుగా చూపించి అప్పనంగా ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నట్టు తెలుస్తోంది. భూ సేకరణలో భూములతో పాటు మొక్కలు, చెట్లు, షెడ్లు, బోర్లు ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన వారి భూములకు ఏ గ్రేడ్ మొక్కలకు ఇచ్చే రేట్లు ఇవ్వగా, ఇతరులకు నామమాత్రంగా చెల్లింపులు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవకతవకలు ఎక్కువగా బుట్టాయగూడెం మండలంలోని దొరమామిడి, కోటనాగవరం భూముల్లో జరిగినట్టు సమాచారం. దొరమామిడి ప్రాంతంలో ఎనిమిది ఎకరాల చెరువు, పోరంబోకు భూమిని కూడా భూ సేకరణలో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నారు. అదేవిధంగా టేకు, వేప, తాడి, బూరుగ చెట్లతో పాటు లేని జామాయిల్ మొక్కలు కూడా ఉన్నట్లు రాసి సొమ్ములు తమ ఖాతాలో పడేలా చేసుకుని ప్రభుత్వ సొమ్ము దండుకున్నారు. అడవిలోనే అంతగా కనిపించని వెదురు పంటను దొరమామిడిలోని ఒక రైతు పొలంలో 9,250 వెదురు గెడలు ఉన్నట్లు రికార్డుల్లో రాయించి సొమ్ములు తీసుకున్నారు. దొరమామిడి ప్రాంతంలో నిర్వాసితుల కోసం సేకరించిన 774 ఎకరాల భూమి నిర్వాసితులకే కౌలుకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలోని కొందరు కౌలు సొమ్ముగా ఇప్పటికే రూ.7.77 లక్షలు చెల్లించారు. అయితే ఇంకో వర్గం గిరిజనులు ఇవి ఎల్టీఆర్ భూములు అంటూ అడ్డం తిరిగారు. ఇవి మొదటి నుంచీ వివాదాస్పద భూములని చెప్పినప్పటికీ అధికార పార్టీకి చెందిన నాయకులే వాటిని అమ్మకాలకు పెట్టారని ఇప్పుడు గిరిజనుల మధ్య కొట్లాటకు ఆ భూములు దారి తీస్తున్నాయని గిరిజన సంఘాలు విమర్శిస్తున్నాయి. భూ సేకరణే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు నిర్వాసితుల సమస్యలపై సరైన శ్రద్ధ చూపలేదు. ఇప్పటికైనా ఈ భూసేకరణపై పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని బాధితులు చెబుతున్నారు. భారీగా అక్రమాలు జరిగాయి భూ సేకరణలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి చెందిన వారు అందినంత వరకూ దోచుకునే ప్రయత్నం చేశారు. గిరిజనులకు సేకరించిన భూములు కూడా ఎవరికి ఎక్కడ ఇచ్చారో తెలియని పరిస్థితి నెలకొంది. భూములు సేకరించి సొమ్ములు గిరిజనేతర రైతుల ఖాతాలో పడేందుకు అధికారులు సహకరించారు. నిర్వాసిత గిరిజనులను గాలికి వదిలేశారు. దీనిపై ఉద్యమిస్తాం.- ధర్ముల సురేష్, ఏఐకేఎమ్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దొరమామిడి తక్కువ డబ్బులు ఇచ్చారు అధికార పార్టీకి చెందిన వ్యక్తిని కాకపోవడంతో నా పొగాకు బ్యారన్‌కు తక్కువ డబ్బులు ఇచ్చారు. ఎందుకూ పనికిరాని పొగాకు బ్యారన్లకు అధిక సొమ్ములు వచ్చాయి. నా పొలంలో దొండ సాగు చేస్తే దానికి పరిహారం ఇవ్వకపోగా అధికారుల చుట్టూ తిరిగేటట్లు చేస్తున్నారు. నాకు న్యాయం చేయాలి. –మద్దిపాటి సూరిబాబు, రైతు, దొరమామిడి -
మూడేళ్లుగా కబ్జాలు
విశాఖ భూబాగోతాలపై ‘సిట్’కు అయ్యన్న చిట్టా! - 1700 ఎకరాల భూముల కబ్జాలపై ఫిర్యాదు - మరిన్ని ఆధారాలతో 19న మళ్లీ ఫిర్యాదు చేస్తానని వెల్లడి - పరోక్షంగా గంటా, ఆయన అనుచరులపై ఆరోపణలు సాక్షి, విశాఖపట్నం: ‘2014 నుంచే విశాఖలో భూకబ్జాలు, దందాలు మొదలయ్యాయి. అవి ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి.. నెల్లూ రు, ప్రకాశం జిల్లాలతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలు ఇక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాదు.. పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని రికార్డుల ట్యాంపరింగ్ చేసి వారి భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. ఈ భూ దందాలపై నేనేమీ నిన్నా మొన్నా ఆరోపించలేదు. 2014లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా.. త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించమని సీఎం చంద్రబాబుకు, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడులకు లేఖలు రాశాను’ అని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇతర జిల్లాలకు చెందిన వారు ఇక్కడ ప్రైవేటు భూములను లిటిగేషన్లో పడేటట్టు చేయడం.. కొట్టేయడం లేదా తక్కువ ధరకు కాజేయడం.. ఆ తర్వాత ప్రభుత్వం వద్ద తమకున్న పలుకుబడిని ఉపయోగించి తమ పరం చేసుకుంటున్నారని పరోక్షంగా మంత్రి గంటా ఆయన అనుచరులపై ధ్వజమెత్తారు. విశాఖ సిటీ, జిల్లాలో జరిగిన భూ కబ్జాలు, దందాలపై తన వద్దనున్న ఆధారాలను ‘సిట్’ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌కు మంత్రి అయ్యన్నపాత్రుడు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రికార్డుల ట్యాంపరింగ్‌పై ఆధారాలుంటే ఫిర్యాదు చేయాలని సీపీ నుంచి నిన్ననే తనకు లేఖ అందిందని, ఆమేరకు తన వద్దనున్న ఆధారాలు.. గడిచిన రెండేళ్లుగా ప్రముఖ దినపత్రికల్లో భూ కబ్జాలు, దందాలపై వచ్చిన కథనాల క్లిప్పిం గ్స్‌తో సహా ఫిర్యాదు చేశానన్నారు. సుమారు 1700 ఎకరాలకు సంబంధించిన అవకతవకలు.. కబ్జాలపై పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశానన్నారు. మెడ్‌టెక్ పరిహారం .. ఓ కుంభకోణం పెదగంట్యాడ మండలంలో ఏర్పాటు చేస్తున్న మెడ్‌టెక్ పార్కుకు భూసేకరణ కోసం జరిపిన పరిహారం చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని..రూ.2 కోట్లకు పైగా బినామీల మాటున కాజేశారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. జిరాయితీ, డి పట్టా రైతులతోపాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న వారికి పరిహారం ఇస్తే తప్పు లేదన్నారు. కానీ, ప్రభుత్వ భూముల్లో సాగుబడి లేకపోయినా కొంతమంది పేర్లు సృష్టించి మరీ ఎకరాకు రూ.12 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారని.. అంటే ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే అమ్మేశారని ఆరోపించారు. రూ.2 కోట్లకు పైగా బినామీల పేరిట స్వాహా చేసిన విషయాన్ని ‘సిట్’ దృష్టికి తీసుకెళ్లానన్నారు. తనఖా పెట్టిన ప్రభుత్వ భూముల చిట్టా 19న ఇస్తా.. రికార్డులను ట్యాంపర్ చేసి ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఓ బ్యాంకులో రూ.190 కోట్ల రుణం తీసుకుని ఎగనామం పెట్టిన వారి పేర్లు త్వరలోనే చెబుతానని మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తులు, సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్టు బ్యాంకు వాళ్లు ప్రకటన కూడా చేశారన్నారు. ఇవేకాకుండా.. మరికొన్ని కబ్జాలు..దందాలపై ఆధారాలతో ఈనెల 19న ‘సిట్’ను మరోసారి కలసి ఫిర్యాదు చేస్తానన్నారు. ‘సిట్’ చీఫ్‌పై తనకు విశ్వాసం ఉందని, విశాఖలో జరిగిన భూ కుంభకోణంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. -
భూ కుంభకోణం ఆరోపణలపై కేకే వివరణ
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఖండించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 38 ఎకరాల భూమి విషయంలో తన కూతురు, కోడలుపై వచ్చిన ఆరోపణలపై ఆయన శనివారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ భూముల వ్యవహారంపై ఏ అధికారిని సస్పెండ్ చేయలేదని అన్నారు. 2013లో అగ్రిమెంట్ చేసుకుని 2015లో రిజిస్ట్రేషన్ చేసుకుని దండు మైలారంలో భూములు కొన్నామని, అయితే తాము వివాదంలో ఉన్న భూములు కొనలేదని తెలిపారు. భూముల కొనుగోలు పూర్తిగా చట్టప్రకారమే జరిగిందన్నారు. తమ కుటుంబం 50 ఎకరాలు కొన్న మాట వాస్తవమేనని, రెవెన్యూ పత్రాలు కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆ భూములు కొన్నట్లు కేకే తెలిపారు. చట్టప్రకారమే భూములు కొన్నానని, తాను దొంగను కాదని అన్నారు. ఆ భూములు ప్రభుత్వ భూములు కావని హైకోర్టు ఆర్డర్ కూడా ఉందన్నారు. హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టడం సరికాదని అన్నారు. ఎవరి దగ్గర భూములు కొన్నానో తనకు తెలుసునని కేకే తెలిపారు. తాను పార్లమెంట్ సభ్యుడినని, చట్టాలు చేసేది తామేనని, వాటిపై గౌరవం ఉందని అన్నారు. కాగా సర్వే నెంబర్ 36లో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు మీద కొన్న 50 ఎకరాల్లో 38 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. గోల్డ్ స్టోన్ కంపెనీ ఈ భూములను కేకే కుమార్తెకు అమ్మినట్లు సమాచారం. ఈ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అధికారి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. -
విశాఖనూ మేసేశారు...
►పెను ‘భూ’కంపంతో విశాఖ వణికిపోతోంది. ►ప్రకృతిలో భాగమైన భూమాతను చెరబట్టేందుకు ►రాజకీయ బేహారులు సృష్టించిన భూదందాల విలయమిది. ►డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా దేన్నీ వదల్లేదు. ►వాటి అనుభవదారులు, యజమానులపై సకల మాయోపాయాలు ప్రయోగించారు. ►రూ.లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణాలు... చరిత్రలో కనీవినీ ఎరుగని దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు ► అధికారులను పావులు చేసి వేల ఎకరాలు కబ్జా ► ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణాలు, ఎగవేతలు ► లక్ష ఎకరాల భూముల రికార్డులు గల్లంతు ► హుద్‌హుద్‌లో కొట్టుకుపోయాయని మాయమాటలు ► సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే ► పాత్రధారులు జిల్లా నేతలు ► బుధవారం నాటి విశాఖ పర్యటనలో ► ఓ మంత్రి ఆద్యంతం కలెక్టర్‌తో మంతనాలు ► ఆనక భూ కుంభకోణాలే జరగలేదని కలెక్టర్ ప్రకటన ► నిండా ముంచేశారని బాధిత రైతుల ఆవేదన అడ్డగోలుగా.. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. ఓటేసిన వారిని వెన్నుపోటు పొడిచారు. బడుగుల పొట్ట కొట్టి తమ బొక్కసాలు నింపుకొన్నారు. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగింది. వారే స్కెచ్ వేశారు.. అధికారుల మెడపై కత్తి పెట్టి అమలు చేయించారు. సామాన్యుడు నెత్తీనోరూ బాదుకున్నా వినలేదు. తరతరాలుగా ఆదరువుగా ఉన్న భూముల నుంచి వారిని ఈడ్చి పారేశారు. వీఆర్వో మొదలు తహసీల్దార్ వరకు అందరినీగుప్పిట పెట్టుకుని కబ్జాకాండ సాగించారు. రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని భూదోపిడీకి పాల్పడ్డారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఇంత భారీ కుంభకోణం జరగడం అసంభవం అని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విశాఖపట్నం : టీడీపీ అధికారంలోకి రావడంతోనే విశాఖలో భూ దోపిడీకి బీజం పడింది. విభజన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళతామని బీరాలు పలికిన అధికార పార్టీ ప్రముఖులు.. భూ మాఫియాకు ద్వారాలు తెరిచి పాతాళానికి నెట్టేశారు. ముఖ్యనేత సహకారం, చినబాబు ప్రత్యక్ష ప్రమేయంతో కబ్జాకు రాచబాట వేసుకున్నారు. నగరానికి ఈ చివర.. ఆ చివర పాగా వేశారు. రికార్డులు తారుమారు చేయడం.. సాధ్యం కాకపోతే బలవంతంగా లాక్కోవడం.. ఇదీ వారి దందా.. ల్యాండ్ పూలింగ్ ముసుగు కూడా ఈ మాఫియా ఆగడాలను బాగా కవర్ చేసింది. పూలింగ్‌లో భూములు పోతాయని బడుగు జనాలను బెదిరించడం.. కారుచౌకగా వారి భూములను లాక్కోవడం.. తిరిగి వాటినే ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇవ్వడం ద్వారా వందల కోట్ల రూపాయలు దండుకున్నారు. భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్, పెందుర్తి మండలాల్లో ఇలాంటి భూ మాఫియా అక్రమాలు కోకొల్లలు. ‘సాక్షి’ ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బాధితులు వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయినంత ఈజీగా భూ రికార్డులు మారిపోయాయి. పచ్చిగా చెప్పాలంటే.. రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే.. అక్కడ తహశీల్దార్ కార్యాలయాల్లో ఆ భూమి వేరొకరికి ధారాదత్తం అయిపోయింది. సొంతదారు భూమిలో ఉండగానే మరొకరు వచ్చి.. ఇది తనదని దబాయించే దారుణ పరిస్థితులు విశాఖ శివార్లలో రాజ్యమేలుతున్నాయి. తిమ్మిని బమ్మి చేసిన గంటా బంధువు విశాఖ భూముల కుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు పరుచూరి వెంకట భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. ప్రత్యూష కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన భాస్కరరావు రుణం కోసం ఇండియన్ బ్యాంకుకు భూములు కుదవ పెట్టాడు. ఆనందపురం మండలం వేములవలస గ్రామంలో 122 – 11లో 726 చదరపు గజాల భూమి, సర్వే నంబర్122–8, 9, 10, 11, 12, 13, 14, 15లలో 4.33 ఎకరాల భూములు, సర్వే నంబర్ 124–1, 2, 3, 4లలో 0.271 ఎకరాలు భూములు భాస్కరరావు కుదవపెట్టిన వాటిలో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సర్వే నంబర్ 122/9ని పరిశీలిస్తే మొత్తం 59 సెంట్ల భూమిని జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం తీసుకునే సమయానికి ముందు ఇక్కడ కేవలం 7 సెంట్ల భూమి మాత్రమే పరుచూరి భాస్కరరావు పేరిట నమోదై ఉంది. మిగిలిన భూమి పూర్వం నుంచి ప్రభుత్వ భూమిగానే ఉంది. రోడ్డు విస్తీర్ణం కోసం సేకరించిన తర్వాత ప్రస్తుతం రికార్డుల్లో ఇది ప్రభుత్వ భూమిగానే నమోదై ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా భాస్కరరావు పేరిట లేదు. ► సర్వే నంబర్ 122/10లో 47 సెంట్ల జిరాయితీ భూమి ఉండేది. ఈ భూమిని పూర్తిగా ఎన్‌హెచ్ విస్తరణలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రికార్డుల్లో ప్రస్తుతం ప్రభుత్వ భూమిగానే నమోదై ఉంది. ఇక్కడ కూడా భాస్కరరావు పేరిట ఒక్క గజం భూమి కూడా లేదు. ► సర్వే నంబర్ 122 – 11లో 66 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో కూడా 60 సెంట్ల భూమి కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్నట్టుగా రికార్డుల్లో స్పష్టంగా ఉంది. మిగిలిన ఆరు సెంట్ల భూమి కూడా ప్రభుత్వ మిగులు భూమిగానే చూపిస్తున్నారు. కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్న 60 సెంట్ల భూమిలో ప్రస్తుతం బలహీన వర్గాల కాలనీ ఉంది. అంటే ఇక్కడ ఒక్క సెంట్ భూమి కూడా పరుచూరి భాస్కరరావు పేరిట లేదని అర్థమవుతోంది. ► సర్వే నంబర్..122/12లో 1.04 ఎకరాల భూమిలో భాస్కరరావు పేరిట 30 సెంట్ల భూమి నమోదై ఉంది. మిగిలిన భూమి ప్రభుత్వానిది. కాగా, భాస్కరరావుకు చెందిన 30 సెంట్లలో 8 సెంట్ల భూమి ఎన్‌హెచ్ విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో ఉంది. కానీ ఇక్కడ ఉన్న 1.04 ఎకరాల భూమిని కూడా తనదిగానే చూపించి బ్యాంకుకు కుదవపెట్టారు. ఇలా తనవి కాని భూములనే కాదు.. ప్రభుత్వం సేకరించిన భూములను కూడా గ్యారెంటీ కింద బ్యాంకుల్లో కుదవపెట్టి రూ. కోట్ల రుణం పొందారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఎన్‌హెచ్ విస్తరణ కోసం భూసేకరణ చేసిన సంవత్సరం 2003. ప్రత్యూష కంపెనీ ఏర్పడిన సంవత్సరం 2005. రుణం పొందిన సంవత్సరం 2006. అంటే 2003 భూసేకరణలో కోల్పోయిన భూములను 2006లో రుణం కోసం కుదవపెట్టిన ఆస్తుల్లో చూపడం గమనార్హం. ఇక్కడ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. 2003లో భూసేకరణ తర్వాత రికార్డుల్లో ప్రభుత్వం ఎంత భూమి సేకరించింది. మిగిలిన భూమిలో ఎవరి పేరిట ఎంత భూమి ఉందన్న వివరాలు అడంగల్, ఎఫ్‌ఎంబీలలో నమోదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. రెవెన్యూ అధికారుల నిర్లిప్తత భాస్కరరావుకు కలిసొచ్చింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకొని భూసేకరణలో కోల్పోయిన భూములను సైతం భాస్కరరావు తెలివిగా బ్యాంకులో కుదవపెట్టి రుణాలు పొందారు. మరో పక్క ప్రభుత్వ భూములను కూడా తనవిగా ఏమార్చి రుణాలు పొందడం గమనార్హం. కాగా, మంత్రి గంటా, ఆయన బంధువు భాస్కరరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి 1100 ఎకరాలు కబ్జా చేసినట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో మంత్రి లోకేశ్‌కూ వాటా ఉండబట్టే ఈ వ్యవహారం పెద్దది కాకుండా చక్రం తిప్పుతుండటం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. బుధవారం విశాఖలో ఓ చిన్న కార్యక్రమానికి హాజరైన లోకేశ్ ఆద్యంతం కలెక్టర్‌తో మంతనాలు సాగిస్తూ భూ కుంభకోణాన్ని ఎలా పక్కదారి పట్టించారో మార్గనిర్దేశం చేశారు. లోకేశ్ అక్కడి నుంచి బయలు దేరిన వెంటనే.. విశాఖలో ఎలాంటి భూకుంభకోణాలు జరగలేదని కలెక్టర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. సీఎం, మంత్రులు సూత్రధారులు విశాఖ జిల్లాలో భూ దందాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా అధికార టీడీపీ వారే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అయన తనయుడు, మంత్రి లోకేశ్, మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీకే చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వ్యవహారంపై ఆరోపణలను గుప్పిస్తున్నారు. మంత్రి గంటా బంధువులు, అనుచరులపై వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులకు ఎగనామం పెట్టిన వ్యవహారంలో గంటా సమీప బంధువు పరుచూరి భాస్కరరావు వ్యవహారం ఇటీవలే రచ్చకెక్కింది. భీమిలి ప్రాంతంలో ఏ రైతునడిగినా.. భాస్కరరావుపై ఆరోపణలు చేస్తున్నారు. అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకొని తమ పొట్టకొట్టారని, టీడీపీకి ఓటు వేసిన వారినే దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో అధికారులు.. అడ్డగోలుగా దందాలు టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగా దృష్టి పెట్టింది రెవెన్యూ శాఖపైనే. ఆర్డీవో, తహసీల్దార్ల పోస్టుల్లో తాము చెప్పింది చెప్పినట్లు చేసే వారిని నియమించుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చే నాటికి విశాఖ ఆర్డీవోగా ఉన్న మురళిని కొనసాగించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు గట్టి పట్టుపట్టారు. మరో మంత్రి అయ్యన్న పాత్రుడు మాత్రం ఆయన్ను బదిలీ చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దల వద్ద డిమాండ్ చేశారు. అయ్యన్న మంత్రాంగమే ఫలించి మురళి బదలీ అయినప్పటికీ గంటా మరో విధంగా చక్రం తిప్పారు. కొన్ని రోజులపాటు పోస్టు ఖాళీగా ఉండే విధంగా తన పరపతి ఉపయోగించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఇప్పుడున్న వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది. ఆ తర్వాత గంటా వర్గానికి రెవెన్యూ యంత్రాగం సాగిలపడిందనే వాదనలు ఉన్నాయి. అనుకున్నదే తడవుగా రికార్డులు పుట్టించడం, అవసరమైతే వాటిని తారుమారు చేయడం, కావాల్సిన పేరు మీద పట్టాలు పుట్టించడం.. ఇలా ఒకటేమిటి జరగని అక్రమమంటూ లేదని సాక్ష్యాలతో సహా బట్టబయలవుతున్నాయి. ఆ సీట్లు .. అక్రమాల పుట్టలు భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్ తహశీల్దార్ కార్యాలయాలు మూడేళ్లుగా పచ్చనేతల పాలిట కల్పవృక్షాలుగా మారిపోయాయి. అక్రమాల పుట్టలుగా తయారయ్యాయి. వీటి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వీటికి ఏమాత్రం తీసిపోవు. ప్రధానంగా భీమిలి తహసీల్దార్ కార్యాలయంలో మూడేళ్లలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ పని చేసిన వారు, బదిలీపై వెళ్లిన వారిలో చాలా మంది ఏసీబీ కేసుల్లో, అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పని చేస్తున్న కాలంలో ఓ తహసీల్దార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తర్వాత వచ్చిన ఇద్దరు తహసీల్దార్లు ఎక్కువకాలం కొనసాగలేదు. ఆ తర్వాత వచ్చిన బీటీవీ రామారావు అవినీతి, అక్రమాల్లో రికార్డులు సృష్టించారని చెప్పొచ్చు. దాదాపు రూ.100 కోట్ల మేర అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఏసీబీ సోదాల్లో బయటపడింది. రికార్డుల్లో యజమాని ఫొటో తొలగించి ఇంకుపోసిన సంఘటనలు రామారావు హయాంలోనే జరిగాయి. భీమిలి సమీపంలోని చిప్పాడకు చెందిన 37 ఎకరాల వ్యవహారంలో జరిగిన అవకతవకలు ఎవరినైనా షాక్‌కు గురి చేస్తాయి. పూసపాటి సీతారామారాజు అనే వ్యక్తి తన హక్కుల కోసం విజయనగరం మన్సాస్ ట్రస్ట్‌తో దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్న సమయంలోనే.. ఈ భూమి కలిదిండి రమాదేవి పేరిట బదిలీ అయిపోయింది. ఈమె వెంటనే మరొకరికి విక్రయించేశారు. మన్సాస్ ట్రస్టు ఇచ్చినట్లుగా చెబుతున్న ఎన్వోసీ ఆధారంగా ఈ భూముల రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. రాష్ట్రంలో ఎన్వోసీ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసిన ఘటన ఇదేనని స్వయంగా రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. ఈ ఒక్క స్కాం విలువే సుమారు రూ.40 కోట్లుపైగా ఉంటుంది. ఇది తహసీల్దార్ రామారావు హయాంలో జరిగిన ఓ కుంభకోణం మాత్రమే. 59 రోజులపాటు చార్జి ఇవ్వని తహసీల్దార్ విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం కూడా అక్రమాల గని. ఇక్కడ తహసీల్దార్‌గా పని చేసిన లాలం సుధాకర్ నాయుడు విశాఖ జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీకి స్వయాన మరిది. టీడీపీ నేత లాలం భాస్కరరావుకు స్వయాన సోదరుడు. మంత్రి గంటాకు, అతని వర్గానికి అత్యంత అనుకూలంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకున్నారనే అభియోగాలు సుధాకర్ నాయుడుపై ఉన్నాయి. ఆయన ఆస్తులపై దాడులు చేయాలన్న డిమాండ్లు చాలా కాలంగా వివిధ రాజకీయ, ప్రజాపక్షాల నుంచి వస్తున్నాయి. ఇంతటి ఘనుడైన సుధాకర్ నాయుడును విశాఖ రూరల్ తహసీల్దారుగా బదిలీ చేసిన తర్వాత దాదాపు 59 రోజులపాటు ‘కీ’ అప్పగించలేదు. రెవెన్యూ రికార్డులు, డిజిటల్ సిగ్నేచర్‌కు సంబంధించి ఈ కంప్యూటర్ కీ ఉంటేనే పని సాధ్యం. కొత్త తహసీల్దార్ వచ్చినా 59 రోజులపాటు కీ అప్పగించకపోవడం వెనక చాలా వ్యవహారాలు నడిచాయన్న విమర్శలు గట్టిగా వినిపించాయి. ఈయన తరువాత వచ్చిన శంకర్రావు అనే తహశీల్దార్‌కు కూడా గతంలో సస్పెండ్ అయిన చరిత్ర ఉంది. ఇలాంటి వ్యక్తిని మళ్లీ విశాఖకు తీసుకురావడం విమర్శలకు దారి తీయడంతో తిరిగి ఆయన్ను శ్రీకాకుళం జిల్లాకు పంపారు. ఆ తర్వాత సుధాకర్ నాయుడే ఇన్చార్జిగా వ్యవహరించారు. పది రోజుల కిందట జరిగిన బదిలీల్లో సదరు సుధాకర్‌నాయుడును విశాఖకు ఆనుకునే ఉన్న పెందుర్తి తహసీల్దార్‌గా నియమించడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయాలు అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయనడానికి సుధాకర్ నాయుడు వ్యవహారమే ఉదాహరణ. వీరే ఇంత సంపాదిస్తే.. ఇక వారు? ఏసీబీ దాడిలో ఓ తాహసీల్దార్ 100 కోట్ల రూపాయల ఆస్తులతో పట్టుబడ్డారంటే అంతా నివ్వెరపోయారు. వీరే ఇంతగా సంపాదిస్తే వీరి వెనుక ఉండి దందాలు నడిపించిన ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల కోట్లు.. కాదు.. కాదు.. లక్షల కోట్లు వెనకేసుకుని ఉంటారో స్పష్టమవుతోంది. ఒక్క విశాఖ జిల్లాలోనే వ్యవహారం లక్షల కోట్లలో ఉంటే, ఇంకా బయట పడని వ్యవహారాలు ఇతర జిల్లాల్లో ఇంకెన్ని ఉన్నాయో అని జనం చర్చించుకుంటున్నారు. అధికారులను పావుగా వాడుకుంటూ.. వారితో తప్పులు చేయిస్తూ.. వందల కోట్లు వెనకేసుకోవడమే ‘పెద్దలు’ పనిగా పెట్టుకున్నారు. విశాఖలో ఈ పెద్దలకు పావుగా మారిన తహసీల్దార్ల వివరాలు ఇలా ఉన్నాయి.. 1. ఎస్.సిద్ధయ్య (2014 – 15) : ఓ ప్రజాప్రతినిధికి రూ.12 లక్షలు ఇచ్చి భీమిలిలో పోస్టింగ్ ఇప్పించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలోనే భీమిలి మండలం లక్ష్మీపురంలో ఒక రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. 2.ఎం.ఎ.మనోరంజని (ఆరు నెలలే పని చేశారు) : ఈమె విజయనగరం జిల్లా సాలూరు కోర్టులో నక్సలైట్ల చేతిలో హతమైన ఎస్ఐ ముద్దాడ గాంధీ భార్య. ఆ తర్వాత భీమిలి నుంచి బదలీపై వెళ్లిపోయారు. 3. బి.టి.వి.రామారావు(2015 – 17) : భీమిలి మండలంలోని పలువురు రైతులకు చెందిన భూములను వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మార్చడం, డి.పట్టా భూములు, ఎండోమెంట్ భూములు, మాజీ సైనికుల భూముల రికార్డులు మార్చి మంత్రి అనుచరుడైన పరుచూరి భాస్కరరావు తదితరులకు కట్టబెట్టడంలో వివాదాస్పదుడయ్యారు. ఈయన ఏడాదిన్నర కాలంలోనే రూ.100 కోట్లు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంతో ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. 4. సుమతీబాయి (పద్మనాభం మండలం – 2014 నుంచి ఇప్పటి వరకు) : గతంలో ఒకసారి లంచం తీసుకున్న కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. 2015లో మండలంలోని బి.తాళ్లవలస పంచాయతీలో ఉన్న 427 ఎకరాల నీలయమ్మ సత్రం భూములను బినామీ రైతుల పేర్లతో వన్–బిలు, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. అనంతరం పట్టాల ద్వారా ఈ భూములను మంత్రి గంటా అండ్ కో కొనుగోలు చేసేందుకు స్కెచ్ వేశారు. ఈలోగానే ఎండోమెంట్ అధికారులు మేలుకుని ఎండోమెంట్ భూములను రైతులకు పట్టాలుగా ఇవ్వకూడదని కోర్టును ఆశ్రయించారు. 5.ఎస్వీ అంబేద్కర్ (ఆనందపురం మండలం – 2014 నుంచి ) : మంత్రి గంటాకు నమ్మినబంటు అనే ప్రచారం ఉంది. టీడీపీ భీమిలి నియోజకవర్గ కన్వీనర్, మంత్రి గంటా బంధువు పరుచూరి భాస్కరరావు, ఆ పార్టీ నేతలు కోరాడ రాజబాబు, కోరాడ నాగభూషణరావు, బంటుపల్లి మణిశంకరనాయుడుల కనుసన్నల్లోనే ఈయన పనిచేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో యథేచ్ఛగా భూకబ్జాలు, బంజరు, డి.పట్టా భూముల ఆక్రమణలు జరిగిపోతున్నా నిద్ర నటిస్తున్నారన్న అపవాదును మూట కట్టుకున్నాడు. -
దీపక్‌రెడ్డి కబ్జాల్లో ఎన్నో కథలు..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి కబ్జా దందాల్లో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. కబ్జాలపై నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు కీలక నిందితుడు ఒకర్ని అరెస్టు చేయడంతో.. న్యాయవాది శైలేష్ సక్సేనాతో కలసి దీపక్‌రెడ్డి చేసిన దందాలు బయటకు వస్తున్నాయి. ఎంజే మార్కెట్లోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వివిధ రకాల పత్రాలు విక్రయించే శివభూషణంతో శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డి బోగస్ సంతకాలు చేయించేవారని వెల్లడైంది. దీనికి ప్రతిఫలంగా శివభూషణం కుమార్తె, కుమారుడి వివాహం జరిపిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2004లో భోజగుట్టలో ఉన్న రూ. 300 కోట్లకు పైగా ఖరీదైన 78 ఎకరాల స్థలానికి సంబంధించి న్యాయ వివాదాలు సృష్టించారు. ఆ స్థలం యజమాని ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌లాగా న్యాయస్థానంలో శివభూషణంతో సంతకాలు చేయించారు. వాయిదాలు ఉన్నప్పుడల్లా శివభూషణాన్నే.. ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా కోర్టుకు తీసుకెళ్లేవారు. 2006 మార్చ్‌లో మరోసారి శివభూషణాన్ని శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డి బోగస్ సంతకాలకు వాడుకున్నారు. గుడిమల్కాపూర్‌లో ఉన్న 78 ఎకరాలు 22 గుంటలు, మాదాపూర్‌లోని ఎకరం స్థలాన్ని శివభూషణంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఎన్‌హెచ్ శైలజ, బి.ప్రకాష్ చంద్ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. వివిధ సందర్భాల్లో వినియోగించడానికి శివభూషణానికి రాధాకృషన్ ఠాకూర్ పేరుతో బోగస్ ఓటర్ ఐడీ సృష్టించారు. ఆ బోగస్ ఓటర్ ఐడీని బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.12లో ఉన్న రూ.100 కోట్ల విలువైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’ వాడారు. ఇదే తరహాలో జరిగిన మరిన్ని దందాలు సీసీఎస్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పొందిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. దీపక్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అల్లుడనే విషయం తెలిసిందే. -
100 కోట్ల స్థలంపై తమ్ముడి కర్ఛీఫ్
రాజమహేంద్రవరం నడిబొడ్డున ‘అధికారిక’ కబ్జా పేదలను ఖాళీ చేయించి కంచె వేసిన టీడీపీ నేత ‘సాక్షి’ వద్ద పక్కా ఆధారాలు రాజమండ్రి: వివాదంలో ఉన్న స్థలం లేదా ఖాళీగా ప్రభుత్వం స్థలం కనపడితే చాలు తెలుగు తమ్ముళ్లు కర్చీఫ్ వేసేస్తున్నారు. ఆక్రమించిన స్థలానికి కంచె వేసి ఈ స్థలం తాము కొన్నామంటూ దొంగ ఆధారాలు సృష్టించేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన అధికారులు రాజకీయ ఒ›త్తిళ్ల వల్ల చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున అత్యంత విలువైన నగరపాలక సంస్థ స్థలాన్ని అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా చేశాడు. ఆ స్థలాన్ని తాను కొనుగోలు చేశాని చెబుతూ అక్కడ 50 ఏళ్లుగా గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్న 110 మంది పేద కుటుంబాలను ఖాళీ చేయించి కంచె వేశాడు. ఆ స్థలం విలువ రూ. 100 కోట్ల పైనే ఉంటుందని అంచనా. పేదలు నిరాశ్రయులు కావడంతో ఆ స్థలం గురించిన పూర్వాపరాలను ’సాక్షి’ శోధించింది. తీరా అది ప్రభుత్వ స్థలమని ఆధారాలతో సహా నిర్థారణ అయింది. ఈ ‘అధికారిక’ కబ్జాకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఆదెమ్మ దిబ్బ అసలు కథ ఇదీ... రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున కంబాల చెరువు సమీపంలో 36,38 డివిజన్ల పరిధిలో కొందరు ప్రైవేటు వ్యక్తుల స్థలం ఉంది. దీనిని ఆదెమ్మ దిబ్బ ప్రాంతంగా పిలిస్తున్నారు. నగరపాలక సంస్థ పాఠశాల నిర్మాణం కోసం అప్పటి రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ 1978 నవంబర్ 8వ తేదీన సర్వే నంబర్లు 724/1డీలో 25 సెంట్లు, 725/3ఏలో ఎకరా 81 సెంట్లు, 725/3ఈలో ఒక సెంటు, 730/2సీ2లో 3 ఎకరాల 69 సెంట్లు, 731/2లో 11 సెంట్లు వెరసి మొత్తం 5 ఎకరాల 87 సెంట్ల స్థలం సేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 28.05.1980లో ఈ సేకరణకు సంబంధించి డ్రాఫ్ట్ డిక్లరేషన్ జారీ చేసి 12.06.1981లో ఆమోదించారు. ఆయా స్థలాల యజమానులకు 30.07.1985లో సబ్‌కలెక్టర్ ప్రదీప్‌చంద్ర అవార్డు (నంబర్ 6/85) ప్రకటించారు. అవార్డు ఇచ్చిన సర్వే నంబర్ల స్థలాలు, యజమానులు వీరే.. ఐదు సర్వే నంబర్లలో మొత్తం 5 ఎకరాలు 87 సెంట్లకు అప్పటి కలెక్టర్ ప్రదీప్ చంద్ర (30.07.1985లో) అవార్డు (నంబర్6/85) ప్రకటించగా.. తర్వాత ప్రభుత్వం కొంత స్థలం సేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. మరి కొందరు న్యాయస్థానానికి వెళ్లి తమ స్థలం సేకరణపై స్టే తెచ్చుకున్నారు. వీరు పోగా మిగిలిన వారికి అవార్డు(నగదు) అందజేశారు. అవార్డు అందుకున్న వారిలో ఈపు అప్పలస్వామి (సర్వే నంబర్ 724/1డీలో 25 సెంట్లు), కందుల సత్యానందం, కందుల మదన మోహనరావు, కందుల రాజేంద్రప్రసాద్ (సర్వే నంబర్ 725/ 3ఏ1లో ఎకరా 63 సెంట్లు), కందుల సంజీవరావు (çసర్వే నంబర్ 730/2సీ2పీలో సెంటు), సత్యవోలు పాపారావు అతని కుమారులు నలుగురు (సర్వే నంబర్ 730/2సీ2పీలో ఎకరా 81 సెంట్లు), వాడరేవు వీరభద్రరావు (సర్వే నంబర్ 731/2లో 9 సెంట్లు) ఉన్నారు. సర్వే నంబర్ 725/3ఏ2లో 7800 చదరపు అడుగులకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డు వర్తించలేదు. అదే విధంగా సర్వే నంబర్ 730/2సీ2పీలో సత్యవోలు సత్యవతి(పాపారావు తమ్ముడు లింగమూర్తి సతీమణి)కి చెందిన ఎకరా 88 సెంట్ల స్థలానికి కూడా అవార్డు వర్తించలేదు. వీరు తమ స్థల సేకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు స్టే(యథాతథ స్థితి) విధించింది. ఇంకా సర్వే నంబర్ 725/3ఏ2, సర్వే నంబర్ 731/2పీలోని 1083 చదరపు అడుగుల స్థలాన్ని సేకరణ ప్రతిపాదన నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నాలుగు సర్వే నంబర్లపై కోర్టులో ఆరు కేసులు నడిచాయి. సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానంటూ... తెలుగుదేశం పార్టీ నేత, కోలమూరు గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు తాను ఈ స్థలం సత్యవోలు పాపారావు(లేట్) రెండో కుమారుడు సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని చెబుతున్నారు. ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలో సత్యవోలు కుటుంబానికి సర్వే నంబర్ 730/2సీ2లో 3 ఎకరాల 69 సెంట్ల స్థలం ఉంది. ఇందులో సత్యవోలు పాపారావు ఎకరా 81 సెంట్లు, అతని తమ్ముడు సత్యవోలు లింగమూర్తి సతీమణి సత్యవతి ఎకరా 89 సెంట్లు సేకరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే సత్యవోలు లింగమూర్తి సతీమణి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో వారికి ప్రభుత్వం వారికి అవార్డు ఇవ్వకుండా సేకరణ నుంచి ఆ స్థలం ఉపసంహరించుకుంది. సత్యవోలు పాపారావు అతని కుమారులకు మాత్రం ఎకరా 81 సెంట్ల స్థలానికి అవార్డు(రూ. 2, 30, 260)ను ప్రకటించింది. దీనిని బట్టి తేలిందేమిటంటే అక్కడ ఇక సత్యవోలు పాపారావు అతని కుమారులకు సెంటు స్థలం కూడా లేదు. అయితే టీడీపీ నేత పిన్నమరెడ్డి ఈశ్వరుడు తాను సత్యవోలు పాపారావు రెండో కుమారుడు శేషగిరిరావు వద్ద ఈ స్థలం కొనుగోలు చేశానని చెబుతూ కంచె వేయడం గమనార్హం. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు, నగరపాలక సంస్థ అధికారులు విచారణ జరిపాలని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఖాళీ చేయించిన ఆ స్థలంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని గూడులేని పేదలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 70 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం.. మాకు పెళ్లి అయినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. మా అత్త, వాళ్ల అత్త కూడా ఇక్కడే ఉన్నారని మా ఆయన చెబుతున్నారు. దాదాపు 70 ఏళ్లు నుంచి ఇక్కడే ఉన్నాం. ఆవ(మడగు)ను పూడ్చి ఇళ్లు కట్టుకున్నాం. మా తర్వాత చాలా మంది పేదలు వచ్చారు. ఇప్పుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి ఈ స్థలం కొన్నామంటూ ఖాళీ చేయాలంటున్నారు. అందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారు. మా గుడిసెను కూడా కలుపుతూ కంచె వేశారు. మా గుడిసెను కూడా తీసేయాలని బెదిరిస్తున్నారు. మాకు ఏ ఆధారం లేదు. న్యాయం చేయండయ్యా. – కొయ్య నాగమణి, ఆదెమ్మదిబ్బ ప్రాంత నివాసి -
మీ పని మీది.. మా పని మాది..
ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. అది చెరువైనా... ప్రభుత్వ స్థలమైనా... ఏమాత్రం వెనుకాడటంలేదు. అధికారం వారికి వరంగా మారింది. అధికారులను సైతం ఎలాగైనా కట్టడి చేయొచ్చన్న ధైర్యం పెరిగింది. స్థలాలకు ప్రస్తుతం పలుకుతున్న ధర వారిని అక్రమాలకు పాల్పడేలా చేస్తోంది. ఏదో రకంగా భూమిని కొట్టేసి... దానిని అమ్ముకుని తక్కువ వ్యవధిలో కోట్లాదిరూపాయలు ఆర్జించే ఈ వ్యవహారమే వారికి ఉత్తమంగా తోస్తోంది. కొత్తవలస మండలం మంగళపాలెం పీతల చెరువును దర్జాగా కబ్జాచేస్తే... దానిని పీకేయించి అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. దానిని తొలగించి ఏకంగా మళ్లీ షెడ్ నిర్మాణం చేపట్టడం వారు ఎంతకు తెగిస్తున్నారన్నది చెప్పకనే చెబుతోంది. ► దర్జాగా చెరువులు కబ్జా చేస్తున్న అక్రమార్కులు ► అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు తొలగించి మరీ ఆక్రమణ ► దర్జాగా ఆ స్థలంలో షెడ్ నిర్మాణం ► కొత్తవలస పీతల బంద చెరువు దురాక్రమణ ► తెరవెనుక సూత్రధారిగా టీడీపీ నేత సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొత్తవలస మండలంలోని భూములకు విపరీత డిమాండ్ ఉంది. విశాఖపట్నానికి ఆనుకుని ఉండటంతో అక్కడి స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం విలువ రూ. 3కోట్ల మేర పలుకుతోంది. సెంటు స్థలం దొరికితే చాలు లక్షాధికారి అయిపోవచ్చనే ఆలోచన అందరికీ వచ్చేసింది. దీంతో ప్రభుత్వ భూములను ఏదో ఒకరకంగా దక్కించునేందుకు యత్నిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కనుసన్నల్లో దర్జాగా ఆక్రమణలు జరిగిపోతున్నాయి. ఖాళీగా స్థలం కన్పిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా లేని విధంగా కొత్తవలస మండలంలో భూఆక్రమణలు జరుగుతున్నాయి. పీతలబంద చెరువులో అనధికార నిర్మాణం కొత్తవలస మండలం మంగళపాలెంలోని సర్వే నంబర్ 54–3లో గల పీతలబంద చెరువులో కొంత స్థలాన్ని ఆక్రమించి, అనధికార నిర్మాణాన్ని చేపడుతున్నారు. టీడీపీ నేతల అండదండలున్న వ్యక్తులే ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఆ««ధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసే నెపంతో చేపట్టిన ఈ ఆక్రమణను అధికారులు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలనుకున్నా తప్పని సరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. అదంతా అధికారికంగా జరగాలి. నిబంధనల మేరకు చేపడితే ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ మంగళపాలెంలో ఎవరి అనుమతీ లేకుండానే పీతలబంద చెరువును దర్జాగా ఆక్రమించి అనధికార నిర్మాణం చేపడుతున్నారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీని వెనక టీడీపీ నేతల హస్తం ఉండటంతో చొరవ తీసుకోలేదు. ఆ తర్వాత స్థానికులు ఫిర్యాదు చేయడంతో తప్పని పరిస్థితుల్లో వెళ్లి అనధికార నిర్మాణాలను తొలగించి అక్కడ హెచ్చరిక బోర్డు పాతారు. యథేచ్ఛగా హెచ్చరిక బోర్డు తొలగింపు ఆక్రమణ ప్రదేశాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు అప్పటికే వేసి ఉన్న షెడ్‌ను తొలగించారు. అక్కడే ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ స్థలమని.. సర్వే నంబర్..54–03లో గల పీతబంద అని....ఆక్రమణదారులు శిక్షార్హులు అని బోర్డులో పేర్కొన్నారు. అధికారులు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే అక్రమార్కులు బోర్డును తీసేశారు. అంతేకాకుండా అక్కడొక తాత్కాలిక షెడ్‌ను నిర్మించేశారు. ఎవరేం చేస్తారో చూద్దామనే ధోరణితో ఆక్రమణదారులు ఇష్టారీతిన వ్యవహరించారు. వీరికి టీడీపీ కీలక నేత అండదండలు ఉన్నాయి. దీంతో అడిగే వారు లేకుండా పోయారు. స్థానికంగా స్పందన లేకపోవడంతో స్థానికులు కొందరు ఏకంగా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం ఆక్రమణ ప్రదేశంలో పాతిన బోర్డును పీకేసిన సంఘటనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. స్థానిక పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ కలిసి ఫిర్యాదు ఇచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా అధికారులు పెట్టిన బోర్డును తీసేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాం. – తిరుపతిరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, కొత్తవలస -
అధికారి.. అడ్డదారి
⇒ బినామీ పేర్లతో భూకబ్జాకు పాల్పడుతున్న రెవెన్యూ యంత్రాంగం ⇒ ఇటీవల పుల్లంపేటలో బయటపడిన వ్యవహారమే నిదర్శనం ⇒ మరి కొన్నిచోట్ల భూఆక్రమణల్లో వీఆర్వోలు, ఇతర అధికారులు ⇒ వివాదాస్పదమవుతున్న ఆక్రమణల వ్యవహారం ⇒ పలుచోట్ల భూములు, స్థలాలు లాగేసుకుంటున్న తమ్ముళ్లు ⇒ ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తేనే ఫలితం సాక్షి, కడప/ పుల్లంపేట: ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఒకపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భూకబ్జాలకు పా ల్పడుతుండగా, వారికి తామేమీ తక్కువ కాదన్నట్లు జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఏకంగా కొంతమంది అధికారులు బినామీ పేర్లతో భూములను పోగుచేసుకోవడం వివాదాస్పదమవుతోంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇలాంటి వ్యవహారాలు అక్కడక్కడా వెలుగుచూస్తున్నా ఉన్నతాధికారులు కొరఢా ఝళిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బినామీల పేరుతో అక్రమణలు జిల్లాలో ఒకప్పుడు ఎక్కడచూసినా బంజరు భూమి కనిపించేది. పెరిగిపోయిన ప్రజావసరాల దృష్ట్యా రానురాను భూమి తరిగిపోయింది. అయితే ఇదే అదునుగా కొంతమంది అక్రమాలకు తెరలేపారు. బినామీలుగా బంధువులను, అనుకూలమైన వారిని ఎంపిక చేసుకుని ఏదో ఒకచోట పాగా వేస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి ఇలా చేస్తుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పుల్లంపేట, పోరుమామిళ్ల, కాశినాయన, మైలవరం ఇలా అనేకచోట్ల రెవెన్యూ యంత్రాంగం అందినకాడికి ఆక్రమించుకునే పనిలో పడినట్లు ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. ఆన్లైన్ పేరుతో దోపిడీ జిల్లాలో విలువైన భూములున్న ప్రాంతాల్లో తహసీల్దార్లు ఆన్లైన్ దోపిడీకి తెరలేపుతున్నారు. ఎంతోకొంత ముట్టజెప్పందే భూములను ఆన్లైన్లో ఎక్కించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బద్వేలు నియోజకవర్గంతోపాటు కమలాపురం, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఆన్లైన్ పేరుతో దోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏది ఏమైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే తప్ప అనేక అంశాలు బయటపడవు. కొత్తగా వచ్చిన డీఆర్వోనైనా ఆక్రమణలు, భూకబ్జాలాంటి వ్యవహారాలపై ప్రత్యేక పరిశీలన జరిపితే కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
తూర్పులో ఓ ‘నయీం’ ముఠా
► తప్పుడు డాక్యుమెంట్లతో రూ.4 కోట్ల స్థలం రిజిస్ట్రేషన్ ► పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థల యజమాని ► దందాలో భాగస్వాములుగా టీడీపీ నేతలు ► 20 రోజులుగా అజ్ఞాతంలో నిందితులు ► ముందస్తు బెయిల్ వచ్చిందనుకుని బయటకు వచ్చిన కొందరు ► ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి, మరొకరి అరెస్టు సాక్షి, రాజమహేంద్రవరం : చారిత్రక నగరం రాజమహేంద్రవరంలోనూ ఆస్తులను కుతంత్రంతో కబ్జా చేసే నయీం తరహా ముఠా ఓ ఒకటి వెలుగులోకి వచ్చింది. యజమానికి తెలియకుండా తప్పుడు డాక్యుమెంట్లలో రాజమహేంద్రవరం రంభ, ఊర్వశి, మేనక థియేటర్ కాంప్లెక్స్‌కు సమీపంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఇంటి పక్కన రూ.4 కోట్ల విలువైన స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన స్థల యజమాని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇద్దరిని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దందాలోటీడీపీ నేతలు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నేతలు, నగరంలో వ్యాపార సంఘాల నేతలు భాగస్వాములుగా ఉన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వీరందరిపై సెక్షన్ 420, 120–బి, రెడ్‌విత్ 34 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులో ఉంటున్న బండారు వెంకటరమణ కుటుంబానికి సూరాబత్తుల వీధి ( కూరగాయల మార్కెట్ నుంచి టౌన్‌హాల్‌కు వెళ్లేదారి)లో 356 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో 1995 వరకు ఇల్లు ఉంది. పూర్వం ఆ ఇల్లు బ్రహ్మముడి సుబ్బయ్య, ఆయన సతీమణి లక్ష్మమ్మల స్వార్జిత ఆస్తి. వీరి పేరుపై 1904 ఏప్రిల్ 8న రిజిస్టరైన డాక్యుమెంట్ ఉంది. వీరి నలుగురు కుమారులు వరదరాజులనాయుడు, సత్యనారాయణ, కృష్ణమూర్తి, వీరాస్వామిలకు ఈ ఆస్తిపై 1/4 వంతున హక్కు ఉన్నట్టు సంయుక్త డాక్యుమెంట్ ఉంది. కాగా, వెంకటరమణ తల్లిదండ్రులు బండారు సుబ్బారావు, సత్యవతి 1977కు పూర్వం వారికి వివాహం జరిగినప్పటి నుంచి ఆ ఇంటిలో నివాసం ఉంటూ అద్దెను నలుగురు హక్కుదారులకు చెల్లించేవారు. మూడు వాటాలు కొనుగోలు చేసిన సత్యవతి హక్కుదారుల్లో సత్యనారాయణ సతీమణి సీతాబాయి, వీరాస్వామి కుమారులు సుబ్బయ్య, బాలాజీరావులు, మూడో హక్కుదారుడు కృష్ణమూర్తి తమకున్న 1/4 వాటాలను కలపి 3/4 వాటా ఆస్తిని 1978 జూన్ 22న రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బండారు వెంకటరమణ తల్లి సరస్వతి పేరుమీద రిజిస్టర్ చేశారు. మిగతా 1/4 వాటాకు హక్కుదారైన వరదరాజులనాయుడు సతీమణి తాయారమ్మ, కుమారులు పార్థసారథి, రామచంద్రన్, ఆదికేశవులనాయుడు, పద్మనాభంలు 1980 ఆగస్ట్ 23న తమ వాటాను కూడా సత్యవతికి విక్రయిస్తామని చెప్పి రూ.1000 అడ్వాన్స్ తీసుకుని ఒప్పందపత్రం రాయించుకున్నారు. అయితే తదుపరి ఆ పక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచీ ఈ ఇంటికి సంబంధించిన మొత్తం ఆస్తిపన్నును సత్యవతి పేరుమీద నగరపాలక సంస్థకు వెంకటరమణ చెల్లిస్తున్నారు. ఈ ఏడాది మార్చి వరకు కూడా పన్నులు చెల్లించారు. పలుమార్లు రిజిస్ట్రేషన్ విషయమై వరదరాజులనాయుడు కుమారులను సంప్రదించారు. అయినా ఫలితం లేకపోవడంతో లాయర్ ద్వారా నోటీసులు కూడా పంపారు. 1995లో భవనం శిథిలమైపోవడంతో ఆ ఇంటిని ఖాళీ చేశారు. 2014లో నగరపాలక సంస్థ ఆదేశాల మేరకు దానిని కూల్చివేయించారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ... ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజం విలువ రూ.లక్షకు పైగా పలుకుతోంది. 356 గజాల విలువ దాదాపు రూ.4 కోట్లు ఉంటుంది. దీంతో 1/4 వాటా హక్కుదారుడైన వరదరాజులనాయుడు కుమారుల్లో ఆదికేశవులనాయుడు, పద్మనాభంల తరఫున పద్మనాభం వియ్యంకుడు పుచ్చకాయల త్రిమూర్తులుతో కలసి పద్మనాభం 2015లో రంగంలోకి రు. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరువర్గాలు రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు వద్దకు చేరారు. అందరు కలసి రౌతు నివాసంలో సమావేశమైయ్యారు. 1980లో చేసిన అగ్రిమెంట్ ధర కాకుండా, ప్రస్తుత మార్కెట్ ధర కాకుండా మధ్యస్తంగా రౌతు, ఆకుల నిర్ణయించిన రేటుకు 1/4 వాటాను విక్రయించేందుకు నిర్ణయించగా ఇరు వర్గాలు సమ్మతించాయి. పదిరోజుల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి పద్మనాభం, ఆయన వియ్యంకుడు వెళ్లిపోయారు. కుట్ర ఇలా చేశారు.. పెద్దమనుషులు చెప్పిన రేటుకు ఒప్పుకుని వెళ్లిపోయిన పద్మనాభం, ఆయన వియ్యంకుడు పుచ్చకాయల త్రిమూర్తులు అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ చేయలేదు. తమ వాటాను ఇతరులకు విక్రయించేందుకు వారు రాజమహేంద్రవరానికి చెందిన లంకా వెంకట అప్పారావు, కె.బ్రహ్మాజీరావు, ధవళ్వేరానికి చెందిన కాంగ్రెస్ నేత దంగుడుబియ్యం నారాయణ, రావులపాలేనికి చెందిన సత్తార్ కలసి మొత్తం ఆస్తిని కాజేసేందుకు తప్పుడు డాక్యుమెంట్ల సృష్టించారు. 2016 అక్టోబర్ 6న వెంకటరమణ తల్లి సత్యవతి పేరుపై ఉన్న మూడు భాగాల ఆస్తితో కలిపి మొత్తం నాలుగువాటాల ఆస్తిని ఆకుల సాయిబాబా, షేక్ మీరాసాహెబ్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావు, తలశెట్ల నాగరాజు, మట్టా నరసింహరాజు, మద్దు శ్రీనివాస్, లంకా వెంకట అప్పారావు, దంగుడుబియ్యం నారాయణ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇందుకు పద్మనాభం కోడలు పుచ్చకాయల త్రిమూర్తులు కుమార్తె బ్రహ్మముడి ప్రభావతి, కె.బ్రహ్మాజీరావు సాక్షి సంతకాలు చేశారు. ఆస్తిలో 1/4 వాటా మాత్రమే పద్మనాభంకు చెందిందని, మిగతా మూడూ వెంకటరమణకు చెందినదని డాక్యుమెంట్లు సృష్టించిన వారికి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికీ తెలుసు. అయినా కుట్రపూరితంగా ఆస్తిని కాజేసేందుకు వ్యూహం పన్నారు. -
భూదాహం
భూదందాలు, కబ్జాల్లో మునిగితేలుతున్న అధికారపార్టీ నేతలు రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, శ్రీరాం పేరుతో ఆగడాలు మండలాలను విభజించుకుని దందాలు సాగిస్తోన్న అనుచరులు రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం ఇళ్లస్థలాల పేరుతో పేదలకు వంచన పూర్తిగా సహకరిస్తున్న అధికార యంత్రాంగం – ఇది ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టం కాదు! అధికార పార్టీ నేతల భూదాహానికి నిరుపేద కుటుంబాలు బలైన దృశ్యమిది. అనంతపురం శివారులోని కక్కలపల్లిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసముండేవి. వీరికి ఇళ్లపట్టాలు ఇప్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ఇప్పటి మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత మొత్తం గుడిసెలను పోలీసుల అండతో గత ఏడాది కూల్చేశారు. మంత్రి సోదరుడు మురళి, బంధువు మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో గుడిసెలను కూల్చేసి నిలువ నీడ లేకుండా చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఒక్కచోటే కాదు..అనంతపురం రూరల్ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్భూములు కన్పించినా.. కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ఉపక్రమిస్తున్నారు. ఖాళీ స్థలం కన్పిస్తే ‘పరిటాల’ పేరుతో పచ్చజెండాలు పాతేస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత రెండున్నరేళ్లుగా ఇది రివాజుగా మారింది. పైగా వారు కన్నేస్తోన్న స్థలాలు ఎక్కడో మారుమూల ఉన్నవి కావు. అనంతపురం నగరానికి అతి దగ్గరగా ఉన్నవే! ఇవి రూ.కోట్ల విలువ చేస్తాయి. నిత్యం ఎక్కడో ఒకచోట భూదందాలు సాగుతోన్న అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. అడ్డు చెబితే బదిలీలు..అవసరమైతే భౌతికదాడులకు దిగుతారనే భయంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు అధికారులు మాత్రం మెప్పుకోసం వారికి సహకరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ నేతలు ప్రతి అంశంలోనూ ఆదాయమార్గాన్ని అన్వేషిస్తూ, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఖాళీగా ఉన్న అసైన్డ్ భూములు, పేదలు పూరి గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్నారు. అధికారుల అండతో వీటిని కబ్జా చేస్తున్నారు. వీరిలో ‘పరిటాల’ పేరుతో కబ్జాలు చేసేవారి సంఖ్యే అధికంగా ఉంది. మొదట ఎంతోకొంత చిల్లర విదిల్చి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. కుదరకపోతే కబ్జాలకు తెగిస్తున్నారు. ఆత్మకూరు మండలం బి.యాలేరులో 4.40 ఎకరాల అసైన్డ్‌భూమిని ఈ గ్రామ దళితులు దాదాపు 200 మంది ఇళ్లస్థలాల కోసం తులశమ్మ అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. ఈ భూమిని తహశీల్దార్‌కు స్వాధీనం చేసి.. ఇళ్ల పట్టాలు తీసుకోవాలని భావించారు. ఈ తంతు 2014కు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత పట్టాలివ్వకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. పైగా భూమిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఇందులో పట్టాలివ్వాలని భావిస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించి భూమి కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. సొంతిల్లు, ఇంటి స్థలం లేనివారికే పట్టాలివ్వాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ బి.యాలేరులో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఇక్కడ టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. దీంతో ఇళ్ల పట్టాలిప్పిస్తామంటూ గ్రామస్తుల్లో చిచ్చురేపి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కక్కలపల్లిలో ఐదెకరాల ప్రభుత్వస్థలంలో ఏడాది కిందట కొంతమంది టీడీపీ నేతలు ‘పరిటాల రవీంద్ర కాలనీ’ పేరుతో బోర్డుపెట్టారు. దాదాపు 200 గుడిసెలు వేయించారు. ఇక్కడ పట్టాలిప్పిస్తామని కొందరు భారీగా దండుకున్నారు. ఇందులో రెండెకరాలు పేదలకు ఇచ్చి, మిగిలిన మూడెకరాలను స్వాధీనం చేసుకోవాలనే కుట్రతోనే 'తమ్ముళ్లు' వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏర్పాటైన బోర్డుతో తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏడాది కిందట అనంతపురంలోని హౌసింగ్‌బోర్డులో ఓ స్థల వివాదంలో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకున్నారు. ఏ అండా లేని ఓ వ్యక్తికి సంబంధించిన రూ.కోటి విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని భావించారు. దీనికి అడ్డొచ్చిన ఓ సీఐని లూప్ లైన్‌కు పంపారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం సమీపంలో సర్వే నంబర్ 777లో పదెకరాల చెరువు పొరంబోకు స్థలం ఉంది. ఇందులో చెట్లు పెంచుకునేందుకు స్థానికులైన ఐదుగురికి లీజుకిచ్చారు. అయితే ఇక్కడి టీడీపీ నేతలు ‘ఎన్టీఆర్ కాలనీ’ పేరుతో గుడిసెలు వేశారు. పట్టాలిప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.2వేలు వసూలు చేశారు. నిజానికి పట్టాల పేరుతో ఆ స్థలాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతోనే ఈ పన్నాగం పన్నారు. జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి ‘నారా లోకేశ్‌బాబు కాలనీ’ అని పేరు పెట్టారు. ఈ స్థలం కూడా రూ.కోట్లు విలువ చేస్తుంది. -
భూమా బంధువుల దౌర్జన్యం
బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ - జేసీ2కు ఫిర్యాదు – మీకోసంకు వెల్లువెత్తిన వినతులు కల్లూరు (రూరల్): ఆళ్లగడ్డ మండలం పి. చింతకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1562, 1564లో దళితులు సాగుచేసుకుంటున్న ఏడబ్ల్యూ ల్యాండ్‌ను అధికారపార్టీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బంధువులు భూమా రుద్రారెడ్డి, గనిశ్రీను మరికొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సైతం తీసుకెళా్లను. మీరైనా స్పందించి రెవెన్యూ రికార్డులోని ఆర్ఓఆర్లో ఉన్న దళితుల భూములను కాపాడి బాధితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి డాలు రత్నమయ్య జిల్లా అధికారులకు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి జేసీ సి. హరికిరణ్, జేసీ2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ వినతులు స్వీకరించారు. అందులో.. – సర్వే నంబర్ 367/ఏ లోని ఎకరన్నర పొలాన్ని సర్వే చేయాలని ఏడు నెలలుగా వెల్దుర్తి తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వి. తిమ్మయ్య శెట్టి జేసీకి ఫిర్యాదు చేశారు. – డోన్ మండలం కమలాపురం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ ఆర్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్ఎస్ రామకృష్ణారెడ్డి తదితరులు అధికారులకు విన్నవించారు. – కొర్రబియ్యం విక్రయానికి కలెక్టరేట్ ఆవరణం, సీ క్యాంపు రైతు బజార్లో షాపు కేటాయించాలని తెర్నేకల్లు వాసులు నాగభూషణం, జనార్దన్ కోరారు. – పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని తమదంటూ చాకలి శేషన్న కుమారుడు చిన్న నరసింహులు దౌర్జన్యం చేస్తున్నాడని మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన నల్లబోతుల బోడెన్న తెలిపారు. – పగిడ్యాల మండలం ప్రాతకోట, వనములపాడు, నందికొట్కూరు మండలం 10 బొల్లవరంలో డీలర్ల నియామకానికి నిర్వహించిన రాతపరీక్షలో ముగ్గురు ఎంపికయ్యారని. అయితే వారిని కాదని ఇతరులకు రేషన్‌షాపులు కట్టబెట్టారని కొందరు జేసీని కలిసి ఫిర్యాదు చేశారు. – గ్రూపు 2, 3 పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్య వేదిక నాయకులు తగ్గుపర్తి రామన్న, మహరాజ్, రాము, మల్లేష్, దివాకర్, వలి, సోము, ప్రసాద్, రాజేష్, దాసు జేసీకి ఫిర్యాదు చేశారు. పరిహారం ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండి – రక్షణ శాఖకు కేటాయించనున్న ఓర్వకల్లు మండలం పాలకొలనులోని సర్వే నంబర్లు 99, 232,235, 250,252, 250లలోని 186 ఎకరాల భూమికి ఎకరాకు రూ.1.80లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని జేసీ హరికిరణ్ బాధిత రైతులకు వెల్లడించారు. తాము అందుకు అంగీకరించమని భూములు కోల్పోయే రైతులు సుధాకర్‌రెడ్డి మరికొందరు మీకోసం కార్యక్రమంలో జేసీని విన్నవించారు. ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని అరెస్ట్ చేసి లోపలేయండని స్థానిక పోలీసులకు ఆదేశించారు. దీంతో బాధితులు, జేసీ మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్పమాలలో ఉన్న తనను కనీస మర్యాద లేకుండా జేసీ మాట్లాడుతున్నారని, వారికి భయపడి భూములు అప్పగించే ప్రసక్తే లేదని సుధాకర్‌రెడ్డి చెప్పారు. -
'టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల భూ కబ్జాలు'
–సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బయ్య నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీ నేతల భూ కబ్జాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరులు విడవలూరు వెంకటేశ్వర్లునాయుడు మరి కొంత మంది దళితుల భూములను ఆక్రమించుకున్నారని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందిటి సుబ్బయ్య పేర్కొన్నారు. అలాగే ఈ విషయంలో కలుగజేసుకోవద్దంటూ తనపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. నెల్లూరులోని అంబేడ్కర్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధిత వ్యక్తితో కలసి సుబ్బయ్య మాట్లాడారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని నాగాయగుంట గ్రామానికి చెందిన పోలూరు మాధవి, పోలూరు జయమ్మకు సర్వే నంబరు 835–1లో య.4.91 సెంట్లు భూమిని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ భూమిని అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే పోలంరెడ్డి అనుచరులు అక్రమంగా గ్రావెల్ తవ్వకం జరుపుతూ ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. బాధితుల నుంచి బలవంతంగా ఇటీవల పలు పేపర్లమీద సంతకాలు కూడా తీసుకున్నారన్నారు. ఈ విషయంపై బుచ్చిరెడ్డిపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అలాగే అక్కడ ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎమ్మార్వో స్పందిస్తూ ఆక్రమించుకున్న భూమిని తిరిగి బాధితులకు ఇచ్చే విధంగా చూడాలని స్థానిక పోలీసులకు లిఖిత పూర్వకంగా రాశారన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా ఎమ్మెల్యే ఒత్తిడితో పట్టించుకోలేదని వాపోయారు. తక్షణమే మా మాదిగలకు రావాల్సిన భూమిని ఆక్రమణదారుల నుంచి ఇప్పించక పోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
ఏపీ రాజధానిలో యధేచ్చగా భూకబ్జాలు
-
విశాఖలో పచ్చనేతల భూ కుంభకోణం
-
'భూ దందాలకు పాల్పడుతున్న లోకేష్'
-
'భూ దందాలకు పాల్పడుతున్న లోకేష్'
విశాఖపట్నం : ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. బుధవారం విశాఖపట్నంలో గుడివాడ అమర్నానాథ్ విలేకర్లతో మాట్లాడుతూ... జిల్లాలో నారా లోకేష్ భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సర్క్యూట్ హౌస్ సమీపంలో వెయ్యి కోట్ల విలువైన భూములు నారా లోకేష్ కబ్జా చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. -
భూదాన్’ పేరుతో మోసం
- 8 మంది అరెస్టు హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుట్లూరులో భూదాన్ భూమి పేరుతో పేదలను మోసం చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని సర్వే నంబర్- 215 నుంచి 224 మధ్యగల భూమి భూదాన్ ట్రస్టుకు సంబంధించినదంటూ కొందరు వ్యక్తులు పేదలను ముగ్గులోకి దించారు. అందుకుగాను కేసీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే పేరు పెట్టి ఒక్కో వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేశారు. వారికి నకిలీ పట్టాలు ఇచ్చి.. ఆ స్థలంలో గుడిసెలు వేయించారు. ఈ తతంగం అంతా తెలుసుకున్న అసలు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూత్రధారులైన 8మందిని శనివారం అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
టీడీపీ ఎమ్మెల్యే బొండా కబ్జా బాగోతం!
-
రెవెన్యూలో కలకలం
ఆ శాఖ మెడకు ‘వాగ్దేవి’ ఉచ్చు తప్పును గర్తించిన ఉన్నతాధికారులు భూ సంతర్పణపై క్రమశిక్షణ చర్యలు ఆర్డీవో, తహసీల్దార్లకు చార్జ్ మెమోలు స్థానికుల ఫిర్యాదుతో వెల్లడైన అక్రమాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ నిబంధనలను, మార్గదర్శకాలను పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని ఓ బడా విద్యా సంస్థకు అప్పగించిన అంశం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై ఉన్నతాధికారులు చర్యలు మొదలుపెట్టారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్లపై చర్యలు మొదలయ్యాయి. హన్మకొండ మండలం మామునూరులోని విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ(వాగ్దేవీ విద్యా సంస్థలు)కి రెవెన్యూ అధికారులు 16 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించారు. వేల కొద్ది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోకుండా వాగ్దేవి విద్యా సంస్థలకు భారీగా భూమిని ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారనే ఆరోపణలపై...వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావుకు, హన్మకొండ తహసీల్దారు రాంకుమార్‌కు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ చార్జ్ మెమోలు జారీ చేశారు. కోట్ల విలువైన 16 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపులో అప్పిలేట్ అధికారి నివేదిక ఆధారంగా గత నెలలో ఆర్డీవోకు, తహసీల్దారుకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన వివరణల ఆధారంగా చార్జ్ మొమోలు జారీ చేశారు. భూ కేటాయింపుల విషయంలో ఈ స్థాయి అధికారులపై చర్యలు మొదలు కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. దీంతో వాగ్దేవి విద్యా సంస్థల భూ కేటాయింపుల అంశం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఇంకెందరు అధికారులపై చర్యలు ఉంటాయోననే ఆసక్తి నెలకొంది. రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి... విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీకి 16 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై మామునూరు, బొల్లికుంట గ్రామాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో భూముల కేటాయింపులో అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ మండలం మామునూరు శివారులోని 509 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు... నిబంధనలకు విరుద్ధంగా 59 జీవో కింద రిజిస్రే్టషన్ చేశారని, పూర్తి స్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణకు కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. రెండు గ్రామాల వారు, బాధిత రైతులు వచ్చి జేసీ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ పాటిల్ 509 సర్వేనెంబర్లో భూములను పరిశీలించి నివేదిక రూపొందించారు. నిబంధనలు గాలికి.. 59 జీవోను అడ్డు పెట్టుకుని వాగ్దేవి విద్యా సంస్థలకు భూములు కేటాయించిన వ్యవహారంలో తప్పులు జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. 59 జీవో ప్రకారం ప్రభుత్వం స్థలంలో నివాసాలు ఉన్న ప్రాంతాలనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆట స్థలాలు, పార్కుల వంటి నిర్మిణాల పేరుతో ఎకరాల కొద్ది ఖాళీ భూములను రెవెన్యూ అధికారులు ధారాదత్తం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాగ్దేవికి కేటాయించిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయంపై వాగ్దేవి విద్యా సంస్థల వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విద్యా సంస్థలకు అనుకూలంగా తాత్కాలిక తీర్పు వచ్చింది. కోర్టు తుది ఉత్తర్వులు ఎలా ఉన్నా... రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో ఈ వ్యవహారంలో రెవెన్యూ పరంగా తప్పు జరిగిందని అంగీకరించినట్లయింది. అయితే ఈ తప్పు విషయంలో చర్యల పరంగా వేగం కనిపించడంలేదని ఫిర్యాదు చేసిన వారు అంటున్నారు. దీంతో స్థానికుల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. చివరికి చార్జ్ మెమోలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూమి కేటాయింపు విషయంలో ఆరోపణలపై చార్జీ మెమోలు అందుకున్న ఆర్డీవో, తహసీల్దార్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. మరోవైపు ఈ వ్యవహారంలో సమగ్ర విచారణకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. -
'టీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తున్నారు'
డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్‌టౌన్ : నిర్మల్ పట్టణంలో, పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆయన నివాస భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ నేతలను అడ్డుకునే వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిర్మల్‌లోని పురాతన చారిత్రక కట్టడాలు, గొలుసు కట్టు చెరువులు, కోట బురుజులను మంత్రి తన సోదరులతో కలిసి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలోని ధర్మసాగర్ చెరువును సైతం మంత్రి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోనే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. అవసర మయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నుట్ల తెలిపారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. -
టాలీవుడ్ నిర్మాత అరెస్ట్
విశాఖపట్నం: భూ ఆక్రమణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రముఖ గృహ నిర్మాణ సంస్థ ఎంవీవీ బిల్డర్స్ అధినేత, టాలీవుడ్ సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణను పీఎం పాలెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీసీ సీహెచ్ వెంకటేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 357/1, 357/2 మధురవాడలో గతంలో పంచాయతీ అనుమతి పొందిన లే అవుట్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 88 మందికి స్థలాలున్నాయి. అందులో 38 మంది నుంచి స్థలాలు సేకరించి ఎంవీవీ అధినేత సత్యనారాయణ ‘విశాఖపట్నం సీటీ’ పేరిట గృహనిర్మాణ ప్రాజెక్ట్‌ను భారీ ఎత్తున ప్రారంభించారు. ఇందుకోసం భారీ ఎత్తున ప్రకటన బోర్డులు, హోర్డింగ్లేర్పాటు చేసి ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలో లే-అవుట్లో ఉన్న ఇతరుల భూముల్ని కూడా ఆక్రమించి రోడ్డు నిర్మించారన్నది ఆరోపణ. ఆక్రమించిన భూముల్లో వివిధ నిర్మాణాలు చేపట్టారు. అయితే తమ స్థలాన్ని ఎంవీవీ బిల్డర్ ఆక్రమించారని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జడ్డు విష్ణుమూర్తి పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ లక్ష్మణమూర్తి ప్రాథమికంగా ఆరోపణ రుజువు కావడంతో శుక్రవారం ఎంవీవీ బిల్డర్‌ను లాసన్స్‌బే కాలనీలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో కూడా పలు ఆక్రమణలకు సంబంధించి ఎంవీవీ అధినేతపై కేసు నమోదైందని డీసీపీ స్పష్టం చేశారు. కాగా, ఎంవీవీ అధినేత అరెస్ట్ నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలొస్తున్నాయి. కాగా తనకు గుండె నెప్పిగా ఉందని బిల్డర్ చెప్పడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను కేజీహెచ్‌కు తరలించామని పీఎం పాలెం పోలీసులు స్పష్టం చేశారు. కళా వెంకటరావు కుట్ర నిందితుడు ఎంవీవీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఇదంతా టీడీపీ నాయకుడు కళా వెంకటరావు, కుటుంబ సభ్యుల కుట్రగా ఆరోపించారు. తనపై లేని పోని నిందలు మోపి తనను అభాసుపాలు చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. నిబంధనల ప్రకారమే తాను విశాఖ సిటీ ప్రాజెక్ట్ పనులు ప్రారింభించానన్నారు. రౌడీషీట్ తెరుస్తాం మధురవాడ ప్రాంతంలో గతం కంటే ప్రస్తుతం భూ ఆక్రమణ కేసులు తగ్గాయని, ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులొస్తే కఠినంగా వ్యవహరిస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు. ఆక్రమణలపై ఫిర్యాదులొస్తే రౌడీ షీట్లు తెరవడానికైనా వెనుకాడేది లేదని చెప్పారు. -
బలవంతపు భూ సేకరణ ఆపాలి
కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా సంగారెడ్డి టౌన్: మల్లన్న సాగర్ కోసం బలవంతపు భూ సేకరణ ఆపాలని సీపీఎం డిమాండ్ చేసింది. 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా ముంపు గ్రామాల్లో 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీపీఎం నాయకులు జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజయ్య, జయరాజు, సాయిలు, యాదవరెడ్డి, ప్రవీణ్, మల్లేశ్వరీ, నర్సమ్మ, అశోక్, యాదగిరి, కృష్ణ, దశరత్ తదితరులు పాల్గొన్నారు. -
నయీం కేసులో మరో వ్యక్తి అరెస్ట్
రామన్నపేట: ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరొ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన బాలకృష్ణను ఆదివారం యాదగిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నయీంతో కలిసి పలు సెటిల్మెంట్లలో పాలు పంచుకున్న బాలకృష్ణ నుంచి కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. -
ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ఆక్రమణలకు గురైన సముద్రతీర భూమి పరిశీలన కాకినాడ రూరల్ : తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం కరప మండలం ఉప్పలంక సమీపంలో సముద్రపు పెరుగుభూముల్లో ఆక్రమణలకు గురైన స్థలాలను పార్టీ శ్రేణులతో కలసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలోని 180 ఎకరాల స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తించామన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ఈ ప్రాంతంలో ఫిషరీష్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపాదలను పంపినట్టు కన్నబాబు తెలిపారు. అదే సమయంలో కాకినాడ నగరానికి డంపింగ్ యార్డు సమస్య తలెత్తగా∙ఈ ప్రాంతంలో 50 నుంచి 70 ఎకరాల భూమిని డంపింగ్ యార్డుగా చేయాలనే ప్రతిపాదనలు పరిశీలించామన్నారు. ఈ భూములను మత్స్యకార సొసైటీలకు ఇచ్చి వారు ఈ స్థలాలను మత్స్యసంపద కోసం వినియోగించుకునేందుకు అందజేయాలని అప్పట్లో ప్రభుత్వానికి నివేదించామన్నారు. తరువాత ఈ భూమి మరికొంత పెరిగిందన్నారు. ఇది సుమారు 200 ఎకరాల భూమి ఉంటుందన్నారు. దీనిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకొని వాటిల్లో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి తీరప్రాంత మత్స్యకారుల సంక్షేమానికి ఈ భూమిని ఉపయోగించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను తప్పుడుపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు, రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను మత్స్యకారులతో కలసి కోరతామని కన్నబాబు తెలిపారు. ఆయన వెంట మత్స్యకార నాయకులు గరికిన అప్పన్న, బొమ్మిడి శ్రీనివాస్, పెనుగుదురు సొసైటీ మాజీ అధ్యక్షుడు కర్నాశుల సీతా రామాంజనేయులు, బొడ్డు సత్యనారాయణ, సిద్దాంతపు రాజు తదితరులు ఉన్నారు. -
నయీంతో ఎలాంటి సంబంధాలు లేవు: శ్రీహరి
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని నయీం అనుచరుడు శ్రీహరి తెలిపాడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో బుధవారం లొంగిపోయిన అతడు.. సాక్షి టీవీతో మాట్లాడాడు. రియల్ ఎస్టేట్ పరంగానే నయీంతో తనకు పరిచయం ఏర్పడిందని శ్రీహరి తెలిపాడు. నయీం కేవలం న్యాయపరమైన సలహాలకు మాత్రమే తనను సంప్రదించేవాడని చెప్పాడు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన పేర్కొన్నాడు. తామిద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు లేవన్నాడు. నయీమే తనపై 2013లో దాడి చేసినట్లు శ్రీహరి వెల్లడించాడు. 2006వ సంవత్సరంలో ఆదిభట్లలో 4 ఎకరాల భూమి కొనుకున్నానని...ఆ సమయంలో పక్కపొలం వారు భూమి కబ్జాకు యత్నించడంతో వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నాడు. -
నయీమ్... మహా పిసినారి
-
నయీమ్... మహా పిసినారి
* సొంత మనుషులకూ సరిగా డబ్బులివ్వని వైనం * దాంతో బంగారం కుదువ పెట్టిన కుటుంబీకులు * ట్యూబ్‌లైట్ మార్చినా, ఉప్పు పొట్లం కొన్నా... * ప్రతిదానికీ డైరీలో ‘మిలిటెంట్’ లెక్కలు * తనను కలిసిన వారందరి వివరాలూ డైరీలో * ఫొటోలు, సీసీ కెమెరాల రికార్డింగులు కూడా * లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చే యోచన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలు, అరాచకాలతో లెక్కలేనన్ని ఆస్తులు, నగదు పోగేసుకున్న గ్యాంగ్‌స్టర్ నయీమ్, వ్యవహారంలో మాత్రం చాలా పిసినారట. చివరికి తన సొంత కుటుంబసభ్యులకు కూడా సరిపడా డబ్బులిచ్చేవాడు కాదని విచారణలో వెల్లడవుతున్న పలు అంశాలను బట్టి తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో ఉన్న నయీమ్ కుటుంబసభ్యులు కొందరు అతను చేసిన పలు నేరాల్లో పాలుపంచుకున్నారు. అ యినప్పటికీ, కుటుంబం గడవడానికి బంగా రం కుదువ పెట్టుకుని డబ్బులు తెచ్చుకున్నామని పోలీసు విచారణలో వారు వెల్లడించారు!! బంగారం కుదువ పెట్టిన రసీదులు కూడా వారింట్లో లభ్యమవడం విశేషం!! మావోయిస్టుల తరహాలో నయీమ్ పక్కాగా ‘మిలిటెంట్ డైరీ’ రాసుకునేవాడట. అదెంత పకడ్బందీగా ఉంటుందంటే... తాను ప్రతి రూపాయికీ అందులో లెక్కలు రాసుకునేవాడట. చివరికి ట్యూబ్‌లైట్ మార్చినా, ఉప్పు ప్యాకెట్ కొన్నా వాటికీ లెక్కలు రాసుకునేవాడని పోలీసు వర్గాలంటున్నాయి. ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని కలిసిందీ, ఏం పని చేసిందీ కూడా విధిగా డైరీలో నమోదు చేసుకునేవాడు. అంతేగాక తనను కలిసిన ప్రతి ఒక్కరి ఫొటో దాచి ఉంచుకునేవాడట. ఇందుకోసం తానున్న చోట తప్పనిసరిగా సీసీ కెమెరా నిఘా ఉంచేవాడని విచారణలో తేలింది. పలు వివరాలు వెల్లడించిన హరి నల్లగొండ జిల్లాకు చెందిన హరిప్రసాద్‌రెడ్డి అనే జర్నలిస్టును సీఈవోగా పెట్టి వెబ్ చానల్ ఏర్పాటు చేయించిన నయీమ్, త్వరలోనే శాటిలైట్ చానల్ పెట్టే ఆలోచన కూడా చేసినట్టు వెల్లడైంది. ‘వెబ్ చానల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ చేయాలి. తర్వాత శాటిలైట్ చానల్ పెడదాం. దానికీ నిన్నే సీఈవో చేస్తా’నని హరిప్రసాద్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. విచారణలో హరిప్రసాద్‌రెడ్డి ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలిసింది. నయీమ్ నుంచి తాను డబ్బులు ఎలా, ఎవరి ద్వారా తీసుకున్నదీ, నయీమ్‌కు సెల్ఫోన్లు, సిమ్ కార్డులు ఎలా పంపిందీ, గతేడాది వినాయక ఉత్సవాల్లో తన పాత్ర, ఆ సమయంలో ఎవరెవరికి ఏమేం ఇచ్చిందీ, నయీమ్‌ను ఎప్పుడు కలిసిందీ హరి వెల్లడించినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాలో ఎంతమంది మావోయిస్టు సానుభూతిపరులున్నారో తెలుసుకుని తనకు చెప్పాలని కూడా ఆయనకు నయీమ్ సూచించినట్టు సమాచారం. జిల్లా రాజకీయాలపైనా ఆరా తీసేవాడట. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలనే భావించాడని, చానళ్ల ద్వారా జనానికి దగ్గరై, తర్వాత లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చే యోచన చేశాడనితెలుస్తోంది. ‘నయీమ్‌ను కలిసేందుకు అతని అల్లుడు తబ్రేజ్ కారులో వెళ్లాను.నా కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నాకు ఎంతోమంది ఫోన్లు చేసి ఆరా తీశారు. నయీమ్ పోయాడు గనుక అందరి ఇళ్లపైనా దాడులు జరుగుతాయని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించా’నని హరి వెల్లడించినట్టు సమాచారం. సిట్ అధికారుల విచారణ చౌటుప్పల్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బాధితులను నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు శనివారం విచారించినట్టు తెలిసింది. మండలంలోని తూఫ్రాన్‌పేట శివారులోని సర్వే నంబరు 12లో 50 ఎకరాల భూమిని తమను బెదిరించి నయీమ్ తన భార్య, బినామీల పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడని బాధిత రైతులు సిట్‌కు వివరించారు. ‘‘తమను బెదిరించి ఎకరా రూ.లక్షకే నయీమ్ లాక్కున్నాడు. తప్పనిసరై విక్రయించాం. నయీమ్ అనుచరుడు పాశం శ్రీను వచ్చి నయీమ్ అనుచరుల పేరిట మా భూములు రిజిస్టర్ చేయించుకున్నాడు’’ అని చెప్పినట్టు సమాచారం. -
దళితుల భూములు కబ్జా..!
జోగిపేట : అందోలు మండలం చింతకుంటలో దళితులకు పంపిణీ చేసిన భూములు కబ్జాపరమయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో గురువారం సీఐ వెంకటయ్య, తహసీల్దార్ నాగేశ్వరరావు సిబ్బందితో వెళ్లి భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో ఉన్న పెసర పంటను రెవెన్యూ శాఖ పరిధిలోని గ్రామ సేవకులతో కోయించారు. మూడెకరాల పొలంలో కోసిన పెసర పంటను స్థానిక పోలీసు స్టేషలో భద్రపరిచారు. గ్రామంలో 572, 634,635,636, 637,638 సర్వే నంబర్లలో సుమారుగా 302 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని నిరుపేదలైన దళితులకు పంపిణీ చేయగా 39 ఎకరాలు పంపిణీ చేయకుండా మిగిలి ఉంది. గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానిక ఎస్సీలు తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. రోజు రోజుకు ఎస్సీల ఆందోళన ఉధృతం కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 638 సర్వే నంబరులోని మూడెకరాలలో ఉన్న పెసర పంటను గురువారం గ్రామ సేవకులు కోశారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మొహ¯ŒSసింగ్ గ్రామానికి చెందిన దళితులకు ఈ భూములను పంపిణీ చేశారని, ఈభూములు ఇతరులు పేర్లపై ఎలా మారాయంటూ దళిత సంఘాల నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వివాదస్పద భూమి వద్దకు పోలీసులు, రెవెన్యూ అధికారులు రావడంతో గ్రామంలోని దళిత కుటుంబాలకు చెందిన వారు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టేక్మాల్ ఎస్ఐ రమేశ్, అల్లాదుర్గం ఎస్ఐ గౌస్‌తో పాటు జోగిపేట ఏఎస్ఐ, డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, ఆర్ఐ సతీష్, వీర్‌ఓలు, వీఆర్ఏలు అక్కడికి చేరుకున్నారు. 2, 3 రోజుల్లో సర్వే చేస్తాం : తహసీల్దారు నాగేశ్వర్రావు వివాదస్పద సర్వే నంబరు 638లోని భూమిని 2,3 రోజుల్లో సర్వే చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారని తహసీల్దార్ నాగేశ్వరరావు తెలిపారు. సర్వే నివేదిక వచ్చేంతవరకు ఇతరులు ఈ భూమిలోకి ప్రవేశించకూడదన్నారు. ఈ భూమిని సర్వే చేసేందుకు ఐదుగురు సర్వేయర్లను నియమించామన్నారు. సర్వేలో భూమి ఎవరిదని తేలితే వారికే అప్పగిస్తామని ఒక్కరొక్కరి పేర ఎంత భూమి ఉండాలో నిబంధనల ప్రకారం అంతే ఉండాలని ఎక్కువగా ఉంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందన్నారు. చింతకుంట భూములకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడడం వల్ల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ వెంకటయ్య తెలిపారు. -
వో కౌన్ హై మాలూమ్..?
* ఖమ్మంలోని డాక్టర్‌కు సీఐ బెదిరింపులు * 2012లో భూమిని కబ్జా చేసిన ‘నయీమ్ గ్యాంగ్’ సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘సీఐ గారూ.. నా భూమి కబ్జా చేశారు. వాళ్లెవరో తెలియదు. కొంచెం పట్టించుకోండి’. అంటూ ఖమ్మానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడు సీఐకి ఫిర్యాదు చేశాడు. ‘కబ్జా చేసిన వారి వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..? పట్టించుకోకండి.. మీకే ఇబ్బంది అవుతుంది.. అంటూ డాక్టర్‌కు సీఐ బెదిరింపులు’. ఇది 2012 డిసెంబర్లో నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి భూమిని కబ్జా చేసినందుకు.. సదరు వైద్యుడు ఫిర్యాదు చేసేందుకు వెళితే.. సీఐకి.. అతడికి మధ్య జరిగిన చర్చ. అయితే, ఈ భూమిపై కన్నేసింది నయీమ్ గ్యాంగ్ అని.. ఆ గ్యాంగ్‌కు ఓ సీఐ వత్తాసు పలికాడని తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ నయీమ్ ఖమ్మం జిల్లా కేంద్రంలోనూ భూముల కబ్జాకు యత్నించి.. ప్రయత్నం సఫలం కాకపోవడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నట్లు తెలుస్తోంది. 2012లోనే ఓ భూమిపై కన్నెసిన గ్యాంగ్ అక్కడ 15 రోజుల పాటు టెంట్ వేసుకుని కూర్చొగా.. ఈ గ్యాంగ్‌కు ఓ సీఐ సైతం వత్తాసు పలికినట్లు తెలుస్తోంది. నగరంలోని వైరా రోడ్డులో రూ.కోట్ల విలువ చేసే భూమిపై గ్యాంగ్‌స్టర్ నయీమ్ కన్ను పడింది. దీంతో ఆ భూమిలో 15 రోజులపాటు టెంట్ వేయించి.. తన గ్యాంగ్ ను ఇక్కడే ఉంచాడు. ఈ భూమి తనదని, ఎవరో కబ్జా చేశారని అప్పట్లో ప్రముఖ డాక్టర్ సీఐకి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాల్సిన సీఐనే వైద్యుడిని బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో సీఐపై వరంగల్ డీఐజీకి సదరు డాక్టర్ ఫిర్యాదు చేశాడు. డీఐజీ ఆగ్రహించడంతో సీఐ ఎట్టకేలకు ఆక్రమించిన స్థలంలో టెంట్లను తీయించాడు. ఇదంతా నయీమ్ గ్యాంగే చేసిందని, అప్పట్లో నయీమ్‌కు సీఐ మద్దతు పలికాడని తెలుస్తోంది. డాక్టర్ కూడా ధైర్యంతో భూమి కబ్జా చేసింది నయీమ్ గ్యాంగ్ అని తెలియకున్నా.. డీఐజీ దాకా వెళ్లడం గమనార్హం. ఆ తర్వాత సదరు డాక్టర్ భూమిని కబ్జా చేసింది నయీమ్ అని తెలిసి.. తనకు సన్నిహితంగా వారి వద్ద ఈ విషయం చెప్పినట్లు సమాచారం. అంతేకాక నగరంలో పలువురు ప్రముఖ డాక్టర్లకు నయీమ్ గ్యాంగ్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందని, అలాగే కొందరు నయీమ్ గ్యాంగ్ సభ్యులు బెదిరించి చికిత్స చేయించుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గాంధీనగర్ కాలనీలో ఉన్న నయీమ్ గ్యాంగ్ ఖమ్మంలో ఉన్న విలువైన స్థలాలపై దృష్టి పెట్టి.. అందులో భాగంగానే వైరా రోడ్డులో భూమిని ఆక్రమించిందని సమాచారం. గ్యాంగ్‌లో ఓ సర్వేయర్ వైరా రోడ్డులోని ఓ కాలనీలో టెంట్ వేసి.. 15 రోజులపాటు నయీమ్ గ్యాంగ్ జల్సా చేసింది. అయితే భూ కబ్జా విషయంలో అప్పట్లో నగరానికి చెందిన ఓ సర్వేయర్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక నగరంలో విలువైన స్థలాలు ఎవరి చేతిలో ఉన్నాయి.. వివాదాస్పదంగా ఉన్నవేమిటని ఈ సర్వేయర్ ద్వారా నయీమ్ గ్యాంగ్ పూర్తి సమాచారం సేకరించి నయీమ్‌కు పంపినట్లు సమాచారం. -
రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు
బెంగళూరు: భూ కబ్జాలు, బెదిరించి డబ్బు వసూలు చేయడం తదితర అభియోగాలతో కర్ణాటకలోని ధార్వాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న యూసఫ్ బచ్చాఖాన్.. సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు పంపారు. గతంలో డాన్‌గా ముద్రపడి ప్రస్తుతం జయ కర్ణాటక సంఘం అధ్యక్షుడిగా ఉన్న ముత్తప్ప రై జీవిత కథను ఆధారంగా చేసుకొని రామ్‌గోపాల్ వర్మ ‘రై’ పేరుతో సినిమా తీస్తున్నారు. గతంలో ముత్తప్ప రైకు స్నేహితుడిగా ఉన్న యూసఫ్ బచ్చాఖాన్ తన లాయర్ ద్వారా వర్మకు నోటీసులు పంపించారు. ‘రై సినిమాలో నా పాత్రను విలన్ (నెగిటివ్ రోల్)గా చిత్రీకరిస్తున్నావు. మొత్తం కథను నాకు వినిపించిన తర్వాతే సినిమా తీయాల’ని అందులో పేర్కొన్నాడు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా బెదిరించినట్లు సమాచారం. కాగా, ఈ విషయమై రామ్‌గోపాల్ వర్మ న్యాయస్థానం ద్వారానే సమాధానమివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
విచారణాధికారిగా ఆర్డీఓను తొలగించాలి
ఐఏఎస్ అధికారితో విచారణ జరపాలి వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీసీఆర్ నార్తురాజుపాలెం(కొడవలూరు): కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి భూకబ్జా విచారణాధికారిగా ఉన్న ఆర్డీఓను తొలగించి, ఆ స్థానంలో నిజాయితీ గల ఐఏఎస్ అధికారిని నియమించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు కలెక్టర్‌ను కోరారు. నార్తురాజుపాలెంలోని వీసీఆర్ అతిథి గహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేకు పట్టాదారుపాసుపుస్తకాలు మంజూరుచేసింది ఆర్డీఓ అయిన నేపథ్యంలో ఆయననే విచారణాధికారిగా నియమించడం సబబుకాదన్నారు. పీఓబీలో ఉన్న భూములకు పట్టాలు పొందిన ఎమ్మెల్యే పోలంరెడ్డి ఆ భూములు నిషిద్ధ భూములు కాదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ భూములు పీఓబీలో లేనపుడు 2004 నుంచి 2016 దాకా ఎందుకు పాసు పుస్తకాలు తీసుకోలేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. తహసీల్దారుపై ఒత్తిడి తెచ్చి ఈ ఏడాది ఏప్రిల్‌లో పాసు పుస్తకాలు పొందారన్నారు. గత నెల్లో కూడా సబ్‌రిజిస్ట్రారు అవి నిషిద్ధ భూములని రాత పూర్వకంగా ఇచ్చారని తెలిపారు. 2011లో కలెక్టర్‌గా ఉన్న రాంగోపాల్ ఆ భూములను రిజర్వు చేశారని పోలంరెడ్డి శనివారం మాట్లాడారన్నారు. అలాంటప్పుడు 2016లో ఎలా పాసు పుస్తకాలు పొందారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొడవలూరు పార్టీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య మాట్లాడుతూ పీఓబీ భూములపై అబద్ధాలతో వక్రీకరించిన ఎమ్మెల్యే నార్తురాజుపాలెంలో తన తల్లి సమాధి కోసం ఆక్రమించిన 60 సెంట్ల కాలువ పోరంబోకు స్థలం విషయంపై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా రైతు విభాగం కోశాధికారి మాతూరు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ 2004 కి ముందు ప్రసన్నకుమార్‌రెడ్డికి మంత్రి పదవి వస్తే చాలని మాట్లాడిన పోలంరెడ్డి ఆయనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు దువ్వూరు కల్యాణ్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కలువ బాలశంకర్‌రెడ్డి, ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు మండలాల కన్వీనర్లు మావులూరి శ్రీనివాసులురెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కొండా శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్ నాగిరెడ్డి రమేష్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పొలం మింగిన టీడీపీ ఎమ్మెల్యే
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అవినీతి, అక్రమాలకు చిరునామాగా మారాడు. ఏకంగా నిషిద్ధ భూమిని తండ్రి, అత్తల పేరిట కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డులో నమోదు చేయించాడు. తండ్రి, అత్త పేరిట 21 ఎకరాలు భూ ఆక్రమణకు పాల్పడ్డాడు. ఇద్దరినీ బినామీగా చేసి కొడవలూరు మండలంలోని బొడ్డువారిపాళెం మజరా కమ్మపాళెం పంచాయతీ పైడేరు కట్ట పక్కనే ఉన్న నిషిద్ధ భూమిని ఆక్రమించాడు. గెజిట్‌లో నిషిద్ధ భూమి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం కమ్మపాళెం పంచాయతీ బొడ్డువారిపాళెం మజరాలోని పైడేరు కట్ట పక్కన దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ నిషిద్ధ భూమి ఉంది. దీనికి సంబంధించి ఆర్సీ నంబరు బీ.119/2007 పేరిట మార్చి 14వ తేదీన 2007లో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. అయితే అందులో 20.76 ఎకరాల నిషిద్ధ భూమి కబ్జాకు గురైంది. ఆక్రమణదారులు పోలంరెడ్డి తండ్రి, అత్తలే ప్రభుత్వ నిషిద్ధ భూమిని కబ్జా చేసింది సాక్షాత్తు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి పోలంరెడ్డి వెంకురెడ్డి, అత్త కోటంరెడ్డి పద్మావతి. ఆక్రమణ చేసిన భూమిలో 664–2ఏలో 1.51 ఎకరాలు , 658–2ఏలో 0.50 ఎకరా , 651–1లో 7.0 ఎకరాలు, 656–1ఏలో 1.55 ఎకరాలు భూమి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి వెంకురెడ్డి పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. అలాగే 664–2బీలో 0.40 ఎకరా, 664–1లో 1.90 ఎకరా, 657–2లో 2.07 ఎకరాలు , 656–3లో 2.13 ఎకరాలు, 656–2లో 2.57 ఎకరాలు, 656–1బీలో 0.93 ఎకరా భూమి ఇందుకూరుపేట మండలం లేబూరులో నివాసముంటున్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అత్త కోటంరెడ్డి పద్మావతి( శ్రీనివాసులు రెడ్డి భార్య అరుణ తల్లి ) పేరిట రెవెన్యూ రికార్డు 1బీలో నమోదు చేసి ఉంది. నిషిద్ధ భూమిని ఇరువురూ కొనుగోలు చేసినట్లుగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు ధవీకరిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన 1బీలో పొందుపరిచారు. భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు ఆక్రమణదారులకు 1బీ కూడా తహసీల్దార్ వెంకటేశ్వర్లు మంజూరు చేశారు. 2004లో వీటిని కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసినా ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేసిందీ సమాచారం లేదు. అయితే ఈ భూముల కొనుగోలు నిషిద్ధమని సబ్–రిజిస్ట్రార్ రెవెన్యూ కార్యాలయానికి లేఖ పంపి ఉండటం గమనార్హం. తల్లి సమాధికి మరో 60 సెంట్లు భూఆక్రమణ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తన తల్లి సమాధి కోసం నార్తురాజు పాళెం వద్ద 60 సెంట్ల భూమిని ఆక్రమించాడు. సర్వే నంబరు 324/3 కాలువ పోరంబోకు స్థలంలో మొత్తం విస్తీర్ణం రెండున్నర ఎకరా ఉండగా, అందులో 60 సెంట్ల భూమిని ఆక్రమించి తల్లి కష్ణమ్మ సమాధిని అందులో ఏర్పాటు చేశాడు. అంతటితో ఆగక చిన్నాన్న సమాధిని కూడా అందులో ఉంచాడు. పోలంరెడ్డి ఘాట్ అనుకునే తరహాలో కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించడంపై నార్తురాజుపాళెం ప్రజలు మండిపడుతున్నారు. 2004 నుంచి ప్రయత్నం ప్రభుత్వ నిషిద్ధ భూమి 20.70 ఎకరాల స్థలాన్ని తన కుటుంబ సభ్యుల పేరిట మార్చుకునేందుకు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 2004 నుంచి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు తమ ఉద్యోగాలకు సమస్య వస్తుందని మౌనం వహించారు. అయితే ప్రస్తుత తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఈ నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఈ తంతు పూర్తిచేశారు. వీఆర్వో మొదలు డిప్యూటీ తహసీల్దార్ వరకు ఎవరూ ఈ వ్యవహారంలో వేలు పెట్టేందుకు సాహసించలేదు. సంతకం పెట్టేందుకు నిరాకరించారు. అయితే తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాత్రం ఏకంగా అన్నీ తానై 20.70 ఎకరాల నిషిద్ధ భూమిని పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి, అత్తలకు ధారాధత్తం చేశాడు. దీనిపై కలెక్టర్ జానకి ఏ మేరకు స్పందిస్తారో వేచిచూడాల్సిందే. -
ఎం.ఎల్.ఎ. మైనింగ్.. ల్యాండ్స్.. అధికారం..
అరకులోయ ఎమ్మెల్యే సరికొత్త భాష్యం {పజాప్రతినిధి ముసుగులో దందాలే.. దందాలు.. ఓ పక్క డీ ఫారం భూముల కబ్జా మరో వైపు యథేచ్ఛగా అక్రమ మైనింగ్ ఇంకోవైపు సర్కారు నిధులతో క్యాంపు కార్యాలయాలు మన్యంలో అడ్డూఅదుపూ లేని కిడారి అరాచకాలు ప్రజాతీర్పును పక్కన పెట్టి పార్టీ ఫిరాయించడం ద్వారా ప్రజలకు నమ్మకద్రోహం చేశారు.. పేదలను మాటలతో మభ్యపెట్టి జీవనాధారమైన వారి భూములను లాక్కున్నారు.. ఇవి చాలవన్నట్లు అక్రమ మైనింగ్‌తో ప్రకృతి సంపదను.. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు.. గిరిజన ప్రజాప్రతినిధి ముసుగులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్రమాలను తవ్వినకొద్దీ విస్మయకర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.. ఈ దందాల కోసమే ఆయన పార్టీ ఫిరాయించి.. అధికార పార్టీలోకి జంప్ చేశారన్న వాదనలను తాజా విషయాలు బలపరుస్తున్నాయి. ఏజెన్సీలో ఇక తనను అడిగేవారు గానీ.. అడ్డుచెప్పేవారు గానీ లేరన్న ధీమాతో అంతులేని అక్రమాలకు పాల్పడుతూ.. ఎమ్మెల్యే అన్న పదానికే కొత్త భాష్యం చెబుతున్నారు. అదేదో సినిమాలో ఎమ్మెల్యే అంటే నువ్వనుకున్నది కాదే.. అంటూ హీరో హీరోయిన్ను ఉద్దేశించి పాడిన పాట తరహాలోనే.. ఎం.ఎల్.ఎ. పదంలోని ఎం.. అంటే మైనింగ్, ఎల్.. అంటే ల్యాండ్, ఏ.. అధికార దాహం.. అనే సరికొత్త నిర్వచనం ఇస్తూ చెలరేగిపోతున్నారు. విశాఖపట్నం: ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి ఇటీవల పార్టీకి ద్రోహం చేసి అధికార టీడీపీలోకి ఫిరాయించారు. అధికార పార్టీ ఆశ చూపిన ఆఫర్లే కారణమన్న వాదనలు అప్పట్లో వెల్లువెత్తాయి. అరకు నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండలంలో తాజాగా వెలుగు చూస్తున్న అక్రమ మైనింగ్, భూదందాల పర్వం వాటిని నిజం చేస్తున్నాయి. అనంతగిరి మండలం గరుగుబిల్లి పంచాయతీ పరిధిలో సుమారు 136 ఎకరాల ఢీ ఫారం భూములను పేద రైతులను మాయచేసి కాజేసిన ఎమ్మెల్యే కిడారి.. వాలాసి పంచాయతీలో కాల్సైట్ మైనింగ్ నిర్వహిస్తున్న విషయం బయటపడింది. శివలింగపురం గ్రామానికి చెందిన భీమవరపు ముత్యాలు పేరిట వాలాసి పంచాయతీ తూబుర్తి గ్రామంలో సుమారు పదెకరాల కాల్సైట్ మైనింగ్ లీజు ఉంది. మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు శెట్టి గంగాధరస్వామి మేనల్లుడైన ముత్యాలు పేరిట ఈ లెసైన్స్ ఉన్నప్పటికీ అక్కడ గత ఐదేళ్లుగా మైనింగ్ నిర్వహించడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ముత్యాలు మైనింగ్ నిలిపివేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కిడారి దానిపై కన్నేశారు. మైనింగ్ చేపట్టేందుకు ప్రయత్నించినా లీజుదారు అందుకు అంగీకరించలేదు. ఇటీవలే అధికార పార్టీలో చేరి మళ్లీ మైనింగ్‌పై పడ్డారు. చక్రం తిప్పి లీజుదారునితో ఒప్పందం కుదుర్చుకొని తవ్వకాలు ప్రారంభించారు. గత నెలరోజులుగా ఇక్కడ విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 24 టన్నుల మేరకు కాల్సైట్ ఖనిజం తరలించినట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో కాల్సైట్ మైనింగ్ నిర్వహిస్తున్న దుర్గా సొసైటీకి బినామీగా ఖమ్మం జిల్లాకు చెందిన అప్పారావు అనే వ్యాపారి వ్యవహరిస్తున్నారు. సదరు అప్పారావుతో కలిసి కిడారి పదెకరాల్లో మైనింగ్ చేపట్టినట్టు తెలుస్తోంది. పనిలోపనిగా నిమ్మలపాడులోని మూడు బ్లాకుల్లో ఉన్న సుమారు 50 ఎకరాల కాల్సైట్ గనులను కూడా నెలరోజుల క్రితంలీజుదారులపై ఒత్తిడి తెచ్చి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక అనంతగిరి మండలంలో ఎక్కడైనా మైనింగ్ భూములు కేటాయించాలని కోరుతూ విశాఖలోని మైనింగ్ శాఖ అధికారులపై కిడారి ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పట! హుకుంపేట మండలం జోగులపుట్టు, గూడ గ్రామాల సరిహద్దులోని నల్లరాయి(బ్లాక్ స్టోన్) క్వారీలో మైనింగ్‌పై మూడేళ్ల కిందట విమర్శలు వెల్లువెత్తాయి. కిడారి పేరిట లెసైన్స్ ఉన్న ఆ క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతోందంటూ అప్పటి మంత్రి బాలరాజు హయాంలో రూ.60 లక్షల జరిమానా కూడా విధించారు. అప్పటి నుంచి తెరచుకోని ఆ క్వారీ సరిగ్గా కిడారి టీడీపీలోకి జంప్ చేయడానికి కొద్దిరోజుల ముందే మళ్లీ తెరచుకుంది. కిడారి ఒత్తిడి మేరకు అప్పటి జరిమానా విషయాన్ని కూడా గాలికొదిలేసి అధికారులు మైనింగ్‌కు అనుమతులిచ్చేశారు. దాంతో అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగించేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో క్యాంపు కార్యాలయాలకు సోకులు : అరకులోయలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఐటీడీఏ నిధులతో నిర్మించిన రెంటల్ హౌసింగ్ కాలనీలోని ఒక భవనంలో కిడారి పాగా వేశారు. సుమారు రూ.పది లక్షల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి మరమ్మతులు చేపట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దారు. ఆయన వ్యక్తిగత కార్యాలయానికి ప్రభుత్వ నిధులతో సోకులు చేయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తగా, ఇప్పుడు పాడేరులో కూడా ఇదే మాదిరి రెంటల్ హౌసింగ్ కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తీర్దిదిద్దారు. -
యువనేత కక్కుర్తి
► వేంకటేశ్వరస్వామి వారి పనుల్లోనూ కమీషన్ డిమాండ్ ► సొమ్ము ఇవ్వలేదని నిర్మాణ పనులు నిలిపివేత ► కూలీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కాంట్రాక్టర్‌కు బెదిరింపు ► నరసరావుపేటలో పెచ్చుమీరిన టీడీపీ యువనేత ఆగడాలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత చందంగా ఉంది ఆ యువనేత తీరు. దశాబ్ద కాలం తర్వాత అధికారం రావడంతో తనివి తీరా దోచుకోవాలనే ప్రణాళికలో భాగంగా ఇప్పటికే తన హవా సాగిస్తున్నారు. రెండేళ్లుగా రెండు నియోజకవర్గాల్లో అన్నీ తానై నడిపిస్తున్నారు. భూ కబ్జాలు, దౌర్జన్యాలు, పంచాయితీలు చేస్తూ అందినకాడికి దోపిడీ చేస్తున్నారు. తాజాగా దేవుడి సొమ్ముపై కూడా ఆ నేత కన్ను పడింది. ఇంకేముంది అనుకున్నదే తడవుగా వ్యూహాన్ని రచించాడు. కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వలేదనే సాకుతో పనులు నిలిపివేసి తన ప్రతాపాన్ని చూపించాడు. సాక్షాత్తూ వేంకటేశ్వరుని నిధులతో చేపట్టిన పనుల్లోనూ వాటా కోరటం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. - సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు : నరసరావుపేటలో యువనేత ఆగడాలకు అంతులేకుండా పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కోటప్పకొండ దిగువన దాదాపు రూ.6 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం, వేదపాఠశాలను నిర్మిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. కోట్లాది రూపాయల పనులు జరుగుతుండడంతో టీడీపీ యువనేత తనదైన శైలిలో కాంట్రాక్టర్లను కమీషన్ డిమాండ్ చేశారు. కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఆసక్తి చూపించినా యువనేత వైఖరి కారణంగా ముందుకు రాలేదు. పనులు నిలిపివేత..... కొన్ని నెలల తర్వాత గుంటూరుకు చెందిన కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టారు. కొద్ది రోజులకే అధికార పార్టీ యువనేత పనులను నిలిపి వేయించాడు. తన కమీషన్ ఇచ్చిన తరువాతే పనులు చేయాలని స్పష్టం చేశాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కాంట్రాక్టర్‌ను బెదిరించారు. యాత్రికుల వసతి గృహం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ నుంచే రూ.25 లక్షలు డిమాండ్ చేయగా ఆ సమయంలో రూ.5 లక్షలు కాంట్రాక్టర్ చెల్లించినట్టు తెలిసింది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. నెల రోజుల్లో పూర్తికావస్తుండటంతో తనకు రావాల్సిన కమీషన్ కోసం యువనేత మరోసారి బెదరింపులకు దిగాడు. పోలీసుస్టేషన్‌కు కూలీల తరలింపు... శనివారం నిర్మాణ పనుల్లో ఉన్న 9మంది కూలీలను పోలీసులు తీసుకెళ్లారు. కాంట్రాక్టర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆదివారం మధ్నాహ్నం వరకు స్టేషన్లోనే వారిని ఉంచినట్టు సమాచారం. భోజనాలకు బయటకు పంపగా వారు పరారైనట్టు తెలిసింది. సాక్షాత్తూ త్రికోటేశ్వర స్వామి సన్నిదిలో శ్రీ వేంకటేశ్వరుని నిధులతో జరుగుతున్న పనుల్లో కూడా కమీషన్ కోసం యువనేత కక్కుర్తిపడటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. కూలీలను తీసుకొచ్చిన దానిపై రూరల్ ఎస్ఐ జేసీహెచ్ వెంకటేశ్వర్లను వివరణ అడగ్గా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా వారిని స్టేషన్‌కు తీసుకువచ్చినట్టు చెప్పడం విశేషం. -
ఖాళీ కనిపిస్తే కబ్జానే
♦ అధికారం అండతో కొందరు... అక్రమమార్గాల్లో మరికొందరు ♦ వెలుగులోకి తెచ్చేంతవరకు పట్టించుకోని అధికారులు ♦ బైపాస్‌లో ఎకరం స్థలం తాజాగా స్వాహా ♦ ప్లాట్లువేసి విక్రయిస్తున్నా.. కన్నెత్తి చూడని యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కడప: ఖాళీ స్థలం కన్పిస్తే చాలు అక్రమార్కులు పాగా వేస్తున్నారు. అధికారం అండతో కొందరు, అక్రమమార్గాల్లో మరికొందరు కబ్జాలకు పాల్పడుతున్నారు. జిల్లాకేంద్రంలో ఇలాంటి తంతు ఇటీవల కాలంలో అధికమైంది. ప్రభుత్వ స్థలాన్ని వశపర్చుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతుంటే, అందుకు కొందరు అధికారులు సైతం తెరవెనుక వత్తాసుగా నిలుస్తున్నారు. తాజాగా రాజంపేట బైపాస్‌లో వైఎస్సార్ సర్కిల్ సమీపంలోని రాజరాజేశ్వరీ కళ్యాణ మండపం పక్కనున్న రోడ్డు, రోడ్డు పోరంబోకును కొందరు ఆక్రమించారు. ఈ స్థలం తమదేనంటూ రాళ్లు పాతి ఏకంగా ప్లాట్లు కూడా వేశారు. గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు, కార్యకర్త నుంచి ఓ మోస్తారు నేత వరకు, ఎవరి స్థాయిలో వారు ఖాళీ కన్పిస్తే కబ్జా చేస్తున్నారు. వాగులు, పొరంబోకు స్థలాలు, శ్మశానాలను సైతం వదలడం లేదు. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగానికి నిద్రమత్తు వదలడం లేదు. వెలుగులోకి వచ్చాక కూడా కట్టడి చేసే సాహసం చేయడం లేదు. యంత్రాంగం సహకారంతోనే.. మూడు దశాబ్దాలుగా రోడ్డు వినియోగంలో ఉంది. దానికి ఇరువైపులా పోరంబోకు స్థలం సైతం ఉంది. ఇదంతా స్థానికులకు తెలిసిన విషయమే. తాజాగా అధికారపార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సమీప బంధువునంటూ ఓ వ్యక్తి అక్కడ తిష్టవేశారు. వాహనాలు తిరగకుండా ఇరువైపులా రోడ్డును తవ్వేశారు. రోడ్డు పక్కనే ఉన్న పోరంబోకును సైతం ఆక్రమించి ఏకంగా ప్లాట్లు వేశారు. సుమారు ఎకరం స్థలాన్ని ఆక్రమించి విక్రయాలకు పెట్టారు. సెంటు రూ.4 లక్షలు చొప్పున విక్రయించేందుకు సన్నద్ధమయ్యారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలియకుండా జరిగిందనుకుంటే పొరపాటే. వారి కనుసన్నల్లోనే పక్కా స్కెచ్‌తోనే అక్రమార్కులు రంగంలోకి దిగుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. నూతన కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమార్కులు పంచుకునే ఎత్తుగడలో ఉంటే తెరవెనుక రెవెన్యూ అధికారుల సహకారం అందుతోంది. అదే పరిస్థితి బైపాస్‌రోడ్డు పరిధిలో కూడా ఉందని పలువురు చెప్పుకొస్తున్నారు. కడపలో చెలరేగుతున్నారు జిల్లా కేంద్రంలో భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. కాలనీలు, చెరువులు, వంకపోరంబోకులు వీరికి కల్పతరువుగా మారాయి. మునుపు ఏకంగా పాతకడప చెరువులో సుమారు పదెకరాల భూమి అన్యాక్రాంతమైంది. స్థానిక నాయకుడొకరు ఎస్సీల పేరుతో స్వాహాకు యత్నించారు. ప్రకాష్‌నగర్, రామాంజనేయపురం, బాలాజీనగర్, చిన్నచౌకు, అక్కాయపల్లిలో భూకబ్జాదారులకు హద్దు లేకుండాపోయింది. ఓమోస్తారు తిరకాసుదారులంతా కబ్జా వీరులయ్యారు. కబ్జాలతో అనతికాలంలో కోటీశ్వరుల అవతారం ఎత్తుతున్నారు. ఇలాంటి వారిని నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదంతా ఒక ఎత్తై హౌస్ బిల్డింగ్ సొసైటీలు, ట్రస్టులు పేరుతో సైతం ప్రభుత్వ స్థలాలు స్వాహా అవుతున్నాయి. కడపలోని టెలికాం ఎంప్లాయీస్ హౌస్‌బిల్డింగ్ సొసైటీ పరిధిలోని 16సెంట్లు, వంకపొరంబోకు మరో 20సెంట్లు స్థలానికి కలిపి రూ.కోటి విలువ చేసే భూమికి ఓట్రస్టు పేరుతో ప్రహరీ ఏర్పాటైంది. సభ్యులందరికీ చెందిన స్థలాన్ని ఒకవ్యక్తి మాత్రమే సొంతం చేసుకున్నారు. అటు సొసైటీ, ఇటు ప్రభుత్వ భూమి స్వాహా చేసినప్పటికీ అధికారులు మిన్నకుండిపోయారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు నగరంలో ఇటీవల కాలంలో అధికమయ్యాయి. కలెక్టర్ కేవీ సత్యనారాయణ చొరవ తీసుకొని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
భూకబ్జాల నిరోధానికి పటిష్ట చర్యలు
హోం మంత్రి చినరాజప్ప టనకరికల్లు : ఎర్రచందనం, ఇసుక మాఫియా, భూకబ్జాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రూ.ఎనిమిది లక్షలో ఆధునికీకరించిన స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సోమవారం పునఃప్రారంభించారు. ముందుగా మొక్కలు నాటారు. శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. చినరాజప్ప మాట్లాడుతూ 27 నుంచి అన్ని శాఖలను నవ్యాంధ్ర రాజధానికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌శాఖను బలోపేతం చేసేందుకు నూతనంగా ఆరు వేల పోస్టుల మంజూరుకు కేబినేట్ ఆమోదం లభించిందని తెలిపారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తుని ఘటనను సీఐడీకి అప్పగించామన్నారు. అదనపు పోలీస్స్టేషన్ల ఏర్పాటుపై దృష్టి ప్రత్యేక అవసరాల దృష్ట్యా అదనపు పోలీస్స్టేషన్ల ఏర్పాటుపై దృష్టిసారిస్తున్నట్లు వివరించారు. ప్రజాసేవలో భాగంగా ప్రజల వద్దకు పోలీసింగ్‌ను అమలు చేస్తామన్నారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ఆర్డీవో జి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కబ్జా స్థలంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం
► లీజు వెయ్యి గజాలు.. ఆక్రమణ 1,637 గజాలు ► 17 ఏళ్లుగా టీడీపీ ఆక్రమణలోనే ప్రభుత్వ స్థలం ► 1999 నుంచి ఆ స్థలానికి పైసా కూడా చెల్లించని వైనం ► ‘సాక్షి’ కథనంతో హడావుడిగా కదిలిన లీజు ఫైల్ ► పెండింగ్‌లో ఉండగానే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ► కబ్జా స్థలాన్ని క్రమబద్ధీకరించాలంటూ ఒత్తిళ్లు సాక్షి, గుంటూరు: అక్రమాన్ని సక్రమం చేయడంలో అధికార టీడీపీ నేతలు ఆరితేరారు. అనుమతుల్లేని కట్టడమైన ముఖ్యమంత్రి రెస్ట్‌హౌస్‌పై ఇప్పటికే సక్రమ ముద్ర వేసిన సంగతి తెలిసిందే. కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యాలయంగా మార్చి దాన్ని సక్రమం చేసే పనిలో పడ్డారు. టీడీపీ కార్యాల యం కోసం గుంటూరు నగర పాలక సంస్థకు చెందిన 1,667 గజాల స్థలా న్ని ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించారు. దీనిపై సాక్షి ‘అధికార పార్టీ కార్యాలయానికి అక్రమ పునాది’ శీర్షికన గతేడాది ఆగస్టులో కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆక్రమణ స్థలాన్ని తమకు లీజుకివ్వాలంటూ టీడీపీ నాయకులు హడావుడిగా నగర పాలక సంస్థకు దరఖాస్తు చేశారు. అధికారులు ఆ ఫైల్‌ను జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేకు పంపగా ఆయన దాన్ని ఆమోదించి నిర్ణయం కోసం రాష్ట్ర పురపాలక శాఖకు పంపారు. దీనిపై పురపాలక శాఖ అధికారులు ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. అయినా టీడీపీ పెద్దలు మాత్రం ఆక్రమిత స్థలంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకొనేందుకు పార్టీ పెద్దలు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కార్పొరేషన్ ఆదాయానికి గండి టీడీపీ అధికారంలో ఉండగా 1999లో గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం నగరంలో ఖరీదైన ప్రాంతమైన అరండల్‌పేట పిచుకలగుంటను ఎంపిక చేశారు. టీఎస్ నంబర్ 826లో వెయ్యి చదరపు గజాల(20 సెంట్ల) స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ స్థలాన్ని 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం 1999 జూలై 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి కేవలం రూ.25 వేల చొప్పున నగర పాలక సంస్థకు అద్దె చెల్లించాలని, ప్రతి మూడేళ్లకోసారి లీజును రెన్యూవల్ చేస్తూ 33 శాతం అద్దె పెంచాలని పేర్కొంది. ఇక్కడివరకు సవ్యంగానే కనిపిస్తున్నప్పటికీ టీడీపీ నేతలు లీజుకు తీసుకున్న స్థలం పక్కనే ఉన్న మరో 1,637 చదరపు గజాల(34 సెంట్లు) స్థలాన్ని సైతం ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మిం చారు. అప్పట్లో ఈ విషయాన్ని నగర పాలక సంస్థ అధికారులు గుర్తించినప్పటికీ అధికార పార్టీకి చెందిన కార్యాలయం కావడంతో దాని జోలికి వెళ్లలేదు. 2008లో దీనిపై ఫిర్యాదులు రావడంతో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు కదిలారు. భూ ఆక్రమణ జరిగినట్లు తేలడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తమ కార్యాలయం పక్కన గుంతలుగా ఉన్న స్థలాన్ని చదును చేసి పార్కింగ్ కోసం ఆక్రమించామని ఒప్పుకుంటూ అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరణ ఇచ్చారు. ఆక్రమించిన స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నగర పాలక సంస్థకు లేఖ రాశారు. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలపలేదు. అయినా ఆ స్థలం టీడీపీ కార్యాలయం ఆక్రమణలోనే ఉండిపోయింది. లీజుకు తీసుకున్న స్థలానికి ప్రస్తుతం ఏడాదికి రూ.89,881 చొప్పున చెల్లిస్తున్నారు. కానీ 17 ఏళ్లుగా టీడీపీ కబ్జాలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఒక్కపైసా కూడా చెల్లించలేదు. లీజుకు అనుమతి లేకపోవడంతో డబ్బు చెల్లించలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండిపడింది. నేడు టీడీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్ ప్రారంభించనున్నారు. -
జర్నలిస్టుల భూమి కబ్జాకు యత్నం
తెరచాటున యూనియన్ నాయకులు? పాత హద్దులు మాయం.. కొత్తవి ఏర్పాటు భీమారం : సొంతింటి కలను నిజం చేసుకోవాలన్న ఆశతో దాచుకున్న సొమ్ముతో జర్నలిస్టులు కొనుగో లు చేసి భూమి కబ్జాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ పట్టాదారుడి నుంచి ఖరీదు చేసిన ఈ భూమి కబ్జాకు యత్నాలు జరుగుతుండడంతో జర్నలిస్టుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీని వెనుక కొందరు యూనియన్ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండ డం వారి ఆందోళనను రెట్టింపు చేస్తోంది. భీమారం శివారులోని(చింతగట్టు క్యాంప్ సమీపం) 2002లో జర్నలిస్టులు సుమారు ఏడు ఎకరాల భూమి కొనుగోలు చేశారు. వివిధ దినపత్రికల్లో పనిచేస్తున్న విలేకరులు(కంట్రిబ్యూటర్, స్టాపర్లు, సబ్ఎడిటర్లు) 171 మంది వీరిలో ఉండగా.. 2006లో ఒక్కొక్కరికి 150గజాల చొప్పున కేటాయించారు. తాజాగా ఇం దులో రెండున్నర ఎకరాల భూమికి సంబంధించిన హద్దులు తొలగింపునకు గురయ్యాయి. దీంతో విలేకరులు ఆరాతీయగా దీని వెనుక శంకర్‌రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్లు తేలింది. ఆయనతో ఫోన్లో మాట్లాడగా... యూనియన్‌కు చెందిన ఇద్దరు పేర్లను ప్రస్తావిం చాడు. ఆ నాయకులకు సమాచారం ఇచ్చే భూమిని చదును చేశానని ఆయన చెప్పడంతో విలేకరులు కంగుతిన్నారు. అయితే, స్థలాన్ని చదును చేయడం పక్కన పెడితే.. పాత హద్దులు తొలగించి కొత్తగా రాళ్లు పాతించడం గమనార్హం. అయితే, యూనియన్ నేతల పేర్లను శంకర్‌రెడ్డి చెబుతుండడంతో... వారు ఈయనకు సహకరించారా, వెనుక ఉన్న భూమిలో జర్నలిస్టుల భూమి కలుపుకునేందుకు యత్నాలు జరుగుతున్నాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. హద్దులు తొలగించారన్న సమాచారంతో శనివారం పెద్దసంఖ్యలో విలేకరులు పరిశీలించారు. ఈ విషయంలో శంకర్‌రెడ్డిపై వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయాలని నిర్ణయించుకున్నారు. -
డీల్ కుదిరింది!
► ఇక కేసులు లేనట్టే! ► 467 సర్వే నంబర్ భూమి వ్యవహారం ► చక్రం తిప్పిన అధికార పార్టీ నాయకులు జమ్మికుంట మండలం కొత్తపల్లి సర్వేనంబర్ 467 భూమి కబ్జా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొలతలు వేసిన అధికారులు ఆరు గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించి అందులో నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇళ్లు కోల్పోయిన వారు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటుందని ప్రచారమైనా... అధికార పార్టీ నాయకుల జోక్యంతో సయోధ్య కుదిరినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమి అని గుర్తించిన దాంట్లో నిర్మాణాలకు పరిహారం ఇచ్చేలా ఈ డీల్ కుదరడం గమనార్హం. కొత్తపల్లి (జమ్మికుంట రూరల్) : కొత్తపల్లిలోని సర్వేనంబర్ 467లో ప్రభుత్వ భూమిలో కొందరికి భూ పంపిణీ చేయగా, మిగతా భూమి కబ్జా అవుతోందనే అధికారులకు గతంలో ఫిర్యాదులందాయి. ఎరుకల సంఘం వారు తమ సంఘ భవన నిర్మాణానికి 467లో స్థలం కేటాయించాలని కోరడంతో సర్వే అధికారులు కొద్ది రోజుల క్రితం కొలతలు వేశారు. 19 గుంటలు ప్రభుత్వ భూమి ఉంటుందని భావించగా, ఆరు గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి మిగిలి ఉందని లెక్కలు తేల్చారు. ఈ ఆరు గుంటల స్థలంలో నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇళ్లు కోల్పోయిన దళితులు స్థానిక దళిత నాయకుల సహకారంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు హుజూరాబాద్ డీఎస్పీ 467 సర్వేనంబర్ భూమి వ్యవహారంపై విచారణ జరిపారు.ఒక దశలో ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మిన వారిపై, దళితులకు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు ఆస్తినష్టం కేసులు నమోదవుతాయని ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రియల్ వ్యాపారులు ఇళ్లు కోల్పోయినవారి సన్నిహితులు, బంధువుల వివరాలు సేకరించి సయోధ్య కుదర్చాలని అధికార పార్టీ నాయకులను రంగంలోకి దింపారు. ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు ఇస్తూ, తిరిగి ఇళ్లు నిర్మించి, ఖర్చుల కోసం కొంత నగదు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. దీంతో ఇక పోలీసు కేసులు లేనట్టేననే ప్రచారం జరుగుతోంది. 467 భూమి వ్యవహారం పలు మలుపులు తిరుగుతుందని భావించిన తరుణంలో అందరి అంచనాలు తారుమారయ్యేలా సయోధ్య కుదిరినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినవారిలో ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఓ నాయకుడు, ఓ ఫోరం అధ్యక్షుడు మానేరు సమీప గ్రామ ఎంపీటీసీ సభ్యురాలి భర్తతోపాటు మరికొంత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. అయితే 6 గుంటల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, బాధితులకు తిరిగి స్థలాన్ని ఎక్కడ నుంచి అప్పగిస్తారన్న సందిగ్ధం పలువురిలో నెలకొంది. -
కబ్జాకు కంచె
స్టీల్‌ప్లాంట్ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఆదేశాలు స్థలాన్ని పరిశీలించిన ఉక్కు కర్మాగారం డెరైక్టర్ కాపలాకు ఇద్దరు హోంగార్డుల ఏర్పాటు ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూమిని కాపాడుకునేందుకు కర్మాగారం యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. ప్లాంట్‌కు చెందిన రూ.70కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ‘సాక్షి’ ప్రచుంరించిన కథనంపై యాజమాన్యం వెంటనే స్పందించింది. అగనంపూడి వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఏడు ఎకరాలను పరిరక్షించేందుకు ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించింది. ‘బరితెగింపు... ఆపై బెదిరింపు’ అనే శీర్షికతో ఈ నెల 27న సాక్షి ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. అగనంపూడి వద్ద సర్వే నంబర్లు 226, 227లలో ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు చెందిన భూమిని ఫోర్జరీ పత్రాలతో ఓ ఎమ్మెల్యే సన్నిహితులు కబ్జా చేయడానికి ప్రయత్నించడం.. అందులో భాగంగా పునాదుల పనులు చేపట్టడమే కాకుండా.. కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన స్టీల్‌ప్లాంట్ అధికారులపై కబ్జాదారులు ఎమ్మెల్యే పేరుతో బెదిరింపులకు దిగారు. ఈ బాగోతాన్ని ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించడంతో అధికారులు స్పందించారు. స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్(పర్సనల్) డాక్టర్ జి.బి.ఎస్. ప్రసాద్ ఆ భూమిని సోమవారం పరిశీలించారు. భూమి పత్రాలు, మ్యాప్‌లు పరిశీలించారు. ఈడీ ఆర్పీ శ్రీవాత్సవ, టౌన్ అడ్మిన్ విభాగాధిపతి ఎం.వి.ఆర్. ప్రసాద్, విభాగం అధికారులు పి.ఎల్. రాముడు, సూరి అప్పారావులతో భూమి రక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. వెంటనే ఈ ఏడు ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. అంతవరకు అక్కడ నిరంతరం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కబ్జా ప్రయత్నాలపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని కూడా ఆయన తమ అధికారులకు సూచించారు. దాంతో పోలీసు అధికారులు వెంటనే ఇద్దరు హోం గార్డులను ఏర్పాటు చేశారు. -
దబాయింపుల రూటు కలంపై వేటు!
డేట్లైన్ హైదరాబాద్ రాజధాని భూముల అక్రమాల గురించి రాసిన మీడియా మీద కూడా కేసులు పెడతామని ఏపీ సీఎం పత్రికా గోష్టిలోనే బెదిరించారు. సోమవారం పోలీసులు కృష్ణా, గుంటూరు జిల్లాల సాక్షి విలేకరులను పిలిపించి, భూకుంభకోణం కథనాలకు ఆధారాలను తెలపాలని కోరారు. ఇది జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నమే. ఇంతకంటే ఏదైనా మంచి మార్గంలో ప్రభుత్వం ఈ వ్యవహారంలో తమకంటిన కళంకాన్ని తొలగించుకుంటే మంచిది. మీడియా స్వేచ్ఛ జోలికి పోతే ఏం జరుగుతుందో చెప్పే గత అనుభవాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ ప్రాంతంలో వస్తుందో అధికారికంగా నిర్ణయం కాక ముందే, ఆ రాష్ర్ట ప్రజలకు ఎవరికీ తెలియక ముందే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, వారి సన్నిహితులు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, వారిలో కొందరు మంత్రులు, శాసన సభ్యులు సహా ఇతర ప్రముఖులు ఉన్నారని సాక్షి మీడియా కొద్ది రోజుల క్రితం కొన్ని వార్తా కథనాలను ప్రచురించింది. అవి సాక్షి టీవీలోనూ ప్రసార మయ్యాయి. ఆ భూములను కొన్నారని ఎవరెవరి పేర్లు బయటికొచ్చాయో వారు... ఇదంతా పచ్చి అబద్ధం, సాక్షి మీడియా అభూత కల్పన అని ఖండించ లేదు. పైగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎందుకు కొన్నారో చెప్పు కునే ప్రయత్నం చేశారు. తాము చేసిన దానిలో ఏ తప్పూ లేదని, అధికార పక్షానికి దగ్గరగా ఉన్నామనే తమను అప్రతిష్టపాలు చెయ్యడానికి ప్రయత్ని స్తున్నదని నిందించారు. దబాయింపులే సమాధానాలా? అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తే దాని చుట్టు పక్కల ఏ భూముల ధరలు తక్షణం రెక్కలు కట్టుకుని నింగికి ఎగరగలవో అలాంటి భూములనే ఈ పెద్దలు కొన్నారన్నది సాక్షి వాదన. అందుకు ఆధారాలు తన వద్ద ఉన్నా యని కూడా సాక్షి పేర్కొంది. ఇటువంటప్పుడు ఏం జరగాలి? నిజంగానే ఇందులో తమ ప్రమేయమేమీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఆరోప ణలు ఎదుర్కొంటున్న వారు నిజంగా ఈ కొనుగోళ్ళు చెయ్యలేదా లేక రాజ ధాని ప్రకటన తరువాతనే వాటిని కొనుక్కున్నారా? అనేది విచారణలో తేలు తుంది. కాబట్టి వారంతా పులు కడిగిన ముత్యాల్లా ఈ వివాదం నుంచి బయ టికి రావొచ్చు. నిరాధారమైన కథనాలను ప్రచురించి ఉంటే, సాక్షి విశ్వ సనీయతకే భంగం వాటిల్లి ఉండేది. కానీ ఏపీ ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు. శాసనసభ లోపలా వెలుపలా కూడా దబాయింపునే అస్త్రంగా ఎంచుకున్నది. ఇదంతా ప్రతిపక్షం కుట్రనీ, పెట్టుబడులు రాకుండా అడ్డుకోడానికి ప్రతిపక్ష నాయకుడు ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించడానికే పరిమితం అయ్యింది. అసలు ఇప్పుడు ఏం జరిగినా దాని వెనక ప్రతిపక్ష నాయకుడి హస్తమే కనిపి స్తున్నది ఏపీ పాలక పక్షానికి. ఒక ఏపీ మంత్రి కుమారుడిని తెలంగాణ పోలీసులు ఒక మహిళను వేధించిన కేసులో అరెస్ట్ చేస్తే... ఆ మంత్రి పత్రికా సమావేశం పెట్టి ఇదంతా జగన్మోహన్రెడ్డి చేయించారని ఆరోపించారు! కలంపై కత్తి దూసే నేత... తోక ఊపే మర్కటం సాక్షి మీడియా గ్రూప్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి కుటుంబానికి సంబంధించినదే, అందులో దాపరికం ఏమీ లేదు. ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పత్రికను, టీవీ చానల్‌ను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. నిష్పక్షపాతంగా నిజాలే రాస్తాం, మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదంటూ... ఆ ముసు గులో తమ కుల, వర్గ రాజకీయాలను ప్రచారం చేసే, ప్రయోజనాలను రక్షించుకునే మేక వన్నె పులి వంటి యాజమాన్యాల కంటే ఇది ఎలా చూసినా మెరుగే. అయితే సాక్షి మీడియాలో పని చేస్తున్న వారంతా, ముఖ్యంగా జర్న లిస్టులు ప్రతిపక్ష నాయకుడి పార్టీ కార్యకర్తలనే అభిప్రాయాన్ని కలిగించగలి గితే చాలు... అది బయట పెట్టే అధికారపార్టీ అవకతవకలు, తప్పులన్నీ ఒప్పులయి పోతాయనుకుంటే పొరపాటు. సాక్షిలో పని చేసే జర్నలిస్టులే కాదు, మొత్తంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం (ఏపీయూడబ్ల్యూజే) కూడా ప్రతిపక్ష నాయకుడి పక్షం వహించిందని బాహాటంగా విమర్శించే దుస్సాహసం ఏపీ సీఎం, మంత్రులు, నాయకులూ చేస్తున్నారు. సాక్షి సహా రాష్ర్టంలోని అన్ని మీడియా సంస్థల జర్నలిస్టులందరి సమస్యల మీద 60 ఏళ్ళుగా రాజీలేని పోరాటాలు చేస్తూ సమరశీల ఉద్యమ సంస్థగా అపార విశ్వ సనీయతను సంపాదించుకున్న జర్నలిస్టుల సంఘంపైనే విరుచుకుపడటం వారి అసహనానికి పరాకాష్ట. అది చాలదని... మేమే ఓకే సంఘం పెట్టాం అందులో చేరండి మీకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం అని సాక్షాత్తూ సీఎం బహిరంగ వేదికల మీద జర్నలిస్టులను కోరడాన్ని మించిన దిగజారుడు ఇంకే ముంటుంది? రాజకీయాల్లో ఉన్న వారిలో కొందరు స్వతంత్ర వ్యవస్థల విశ్వ సనీయతను దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో ఏపీ సీఎం సిద్ధహస్తులు. ఆయన ఏం మాట్లాడినా తోకాడించే పత్రికాధిపత మర్కటం ఒకటి జర్నలిస్టుల ఉద్యమ నాయకుడు సాక్షిలో ఉద్యోగం చేస్తున్నాడనే (‘జగన్ కొలువులో’) వెక్కిరింతతో తన ప్రభుభక్తిని చాటుకుంది. దాదాపు రెండేళ్ళు తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తే ఆ నాయకుడే, అదే జగన్ కొలువు నుంచి నడిచొచ్చి పోరాటం ముందు భాగాన నిలిచిన విషయం ఆ మర్కటానికి ఇప్పుడు గుర్తుకు రాదు. మీడియా సంస్థల మీద దాడి జరిగిన ప్రతిసారీ జర్నలిస్టు ఉద్యమం ముందు నిలిచింది. సరే, మర్కటాల గొడవ అలా వదిలేద్దాం. అవి ఎప్పుడెలాటి చేష్టలు చేస్తాయో చెప్పలేం కదా? ముఖ్యమంత్రి తీరు విస్మయకరం రాజధాని భూముల వ్యవహారానికే వస్తే, ముందే చెప్పినట్టు ప్రభుత్వ పక్షం దబాయింపునే ఎంచుకున్నది. శాసన సభ్యులు, మంత్రులు, నాయకులు సహా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఇదే పద్ధతిని ఎంచుకున్నారు. శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరిగి నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఈ భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తే సీఎం ఊగిపోయారు, సంయమనం కోల్పోయారు. తన ఇద్దరు మంత్రుల మీద వచ్చిన ఆరోపణలకు ఆధారాలను అందించనంత వరకు సభ సాగే ప్రసక్తే లేదని భీష్మించారు. మా వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, కొనుక్కున్నారు. వ్యాపారం చేసుకోవడం తప్పా? అని ఎదురు తిరిగారు. వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఏ వ్యాపారం ఎట్లా చేస్తున్నారన్నది ముఖ్యం. సీఎం, ఆయన కుమారుడూ, కొందరు అధికార పక్ష పెద్దలకు బినామీలుగా ఉన్న వారు ముందే ఉప్పందుకుని ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారన్న సాక్షి వార్తా కథనాల్లో నిజానిజాలు తేల్చడానికి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించ కుండా, ఆధారాలు ఇవ్వందే సభ నడవడానికి వీల్లేదని సీఎం భీష్మించుకు కూర్చోవడం ఆశ్చర్యపరిచింది, ఎబ్బెట్టుగా అనిపించింది. దర్యాప్తునకు అంగీ కరించకపోగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను అర్ధంతరంగా క్లోజర్ మోషన్‌తో ముగించారు. మన శాసన సభ చరిత్రలో 35 ఏళ్ళ తరువాత మొదటిసారి జరిగిందిలా. పాత్రికేయ స్వేచ్ఛ జోలికి వస్తే.... శాసనసభ వెలుపల సైతం ముఖ్యమంత్రి నిజాలు నిగ్గుతేల్చుతామనే భరోసా ఇవ్వలేదు. రాజధాని భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని రాసిన మీడియా మీద కూడా కేసులు పెడతాం అని ఆయన పత్రికా గోష్టిలోనే బెదిరించారు. నేరం చేసిన వాడి మీదనే ఎందుకు, మీ మీద కూడా కేసు పెట్టాలి అని ఆయన అన్న మాటలు రికార్డయి ఉన్నాయి. ప్రభుత్వం రచించిన ఈ పథకంలో భాగంగానే సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సాక్షి విలేకరులు కొందరిని మంగళగిరి పోలీసులు పిలిపించి తమకు అందిన కొన్ని ఫిర్యాదుల దృష్ట్యా ఈ భూకుంభకోణానికి సంబంధించిన వార్తలకు ఆధారాలను తెలపాలని కోరారు. వార్తలకు ఆధారాలను (న్యూస్ సోర్సెస్) అడిగే అధికారం పోలీసులకు ఎంత మాత్రం లేదు. తమ సోర్స్‌ను రక్షించుకోడం కోసం జైలుకు వెళ్ళడానికి సైతం సిద్ధపడ్డ జర్నలిస్టుల ఉదాహ రణలు ఎన్నో ఉన్నాయి. జర్నలిస్ట్‌లు తమ సోర్స్‌ను వెల్లడించడానికి ఇష్టపడక పోతే, వారిని బలవంత పెట్టకూడదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం లోనే ఉంది. అంతే కాదు, జస్టిస్ పీబీ సావంత్ ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన జర్నలిస్టులను సోర్స్ బయటపెట్టాలని వత్తిడి చెయ్యొ ద్దని న్యాయస్థానాలకు సలహా పూర్వక నోట్లను కూడా పంపారు. మరి మంగళగిరి డీఎస్పీ జర్నలిస్టులను సోర్స్ చెప్పండని ఏ అధికారాలతో అడుగు తున్నారు? ఇది కేవలం ఖాకీ బలం చూపించి జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నమే. ఇటువంటి ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఇంత కంటే మంచి మార్గం ఏదయినా ఎంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని భూముల వ్యవహారంలో తమ వారికి వచ్చిన కళంకాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. మీడియా స్వేచ్ఛ జోలికి పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి పాలకులకు గత అనుభవాలు చాలానే ఉన్నాయి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
యథేచ్ఛగా భూ కబ్జాలు
సామాన్యులు అల్లాడుతున్నారని సభ్యుల ఆవేదన నాదే 3 ఎకరాలు కబ్జా చేశారు: బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నాయని, రెండుసార్లు రిజి స్ట్రేషన్లు చేయడం వల్ల ఎవరి భూములేంటో తెలుసుకోలేని స్థితిలో జనం ఉన్నారని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ప్రశ్నోత్తరాలసమయం ప్రారంభంలోనే భూ కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు తదితరాలపై పలువురు సభ్యులు మాట్లాడారు. నా భూమే మూడెకరాలు కబ్జా చేశారు.. ‘నా భూమినే 3 ఎకరాలు కబ్జా చేశారు. శాసనసభ్యుడినైన నా భూమే కబ్జా చేశారంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితేంటో ఊహించుకోవచ్చు’ అని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? రెవెన్యూ విభాగంలో జరుగుతున్న పరిణామాలతో పలువురు సామాన్య భూమి హక్కుదారు లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, దీనిపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. 22బీ సవరణ చట్టాన్ని తెస్తున్నాం ఇప్పటికే భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తదితర వాటిపై ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ప్రవేశపెట్టామని, భూముల వివరాలన్నీ ఈ పోర్టల్ పెట్టామని రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సమాధానమిచ్చారు. త్వరలోనే రెవెన్యూ చట్టంలో 22బీకి సవరణ తీసుకొస్తామన్నారు. పాస్‌బుక్కులు రైతుల హక్కు: వైఎస్ జగన్ పాస్‌బుక్కులు రైతుల హక్కు అని, వీటిని తొలగించి ఈ-బుక్‌లు, ఈ-పోర్టల్‌లో పెట్టామనడం మంచిది కాదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ అన్నీ కంప్యూటరైజ్డ్ అంటే రేపు ఏదైనా రెవెన్యూ విభాగం ఎవరితోనైనా కొల్యూడ్ అయినా, హ్యాకింగ్ జరిగినా మొత్తం వివరాలన్నీ పోతాయని, అప్పుడిక చేసేదేమీ ఉండదన్నారు. అదే రైతుల దగ్గర పాస్‌బుక్కులు ఉంటే మేలు భరోసా ఉంటుందని, ఆ భూమిపై పాస్బుక్కులనే హక్కుగా భావిస్తారని చెప్పారు. పాస్‌బుక్కులు మొదటి ఆప్షన్‌గా ఉంటే కంప్యూటర్ విధానాన్ని రెండో ఆప్షన్‌గా పెట్టుకోవాలని సూచించారు. దీనికి మంత్రి కేఈ సమాధానమిస్తూ.. పాస్‌బుక్కులు తొలగించబోమని స్పష్టం చేశారు. -
మంత్రి రావెలను ఆంధ్రాలో తిరగనివ్వం
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావు గుంటూరు వెస్ట్ : రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబును ఆంధ్రాలోని 13 జిల్లాల్లో ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావు మాదిగ తెలిపారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ సహకారంతోనే కిశోర్‌బాబు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం వెనుక ఎమ్మార్పీఎస్ సహకారం ఉందన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. భూకబ్జాదారులు, దళారులను ప్రోత్సహిస్తున్న మంత్రి రావెల నేడు కృష్ణమాదిగను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏటుకూరి విజయ్‌కుమార్, నాయకులు వర్ల అగస్టీన్, కూచిపూడి సుందర్‌బాబు, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గాలిముట్టి కిరణ్ పాల్గొన్నారు. -
హోంశాఖ జాగాయే... భూంఫట్
అధికార పార్టీ కీలకనేత బంధువు బరితెగింపు ఒంటిమామిడిలో రూ.10 కోట్ల విలువైన స్థలం దురాక్రమణ అందులో రెండెకరాలు పోలీస్ స్టేషన్, క్వార్టర్లకు గతంలో కేటాయించిన ప్రభుత్వం అయినా అణుమాత్రం ఖాతరు లేకుండా కబ్జా కొనుగోలు చేశామంటూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తుని : రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు అసెన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసిన కుతంత్రాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. స్వార్థం కోసం విలువలను పాతరేసిన అధికార పార్టీ పెద్దలను చీదరించుకుంటున్నారు. ఇంతకన్నా బరితెగింపు తుని నియోజకవర్గంలో జరిగింది. ఏదైనా అన్యాయం జరిగితే పోలీసుల్ని ఆశ్రయిస్తాం. అయితే అధికార పార్టీకి చెందిన కీలక నేత బంధువు పోలీస్ శాఖకు చెందిన విలువైన స్థలం దురాక్రమణకే సిద్ధమయ్యారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఆ స్థలం విలువ రూ.పది కోట్లు పైనే ఉంటుంది. హోం మంత్రి సొంత జిల్లాలోనే పోలీసు శాఖ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మండల వ్యవస్థ మొదలయ్యాక ప్రతి మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో తొండంగి మండలం పోలీస్‌స్టేషన్‌ను 1996లో ఒంటిమామిడిలో ప్రారంభించారు. కాకినాడ నుంచి అద్దరిపేట వరకు బీచ్ రోడ్లో ఒంటి మామిడి ప్రధాన జంక్షన్. పోలీస్‌స్టేషన్, సిబ్బంది క్వార్టర్స్ కోసం రెండు ఎకరాల స్థలం కావాలని పోలీసు శాఖ అధికారులు రెవెన్యూ శాఖను కోరారు. సర్వే నంబరు 843లో 7.32 ఎకరాల స్థలం మందబయలుగా ఉంది. ఈ సర్వే నంబర్లో పోలీస్‌స్టేషన్, క్వార్టర్ల నిర్మాణానికి రెండు ఎకరాలు కేటాయిస్తూ అప్పటి కలెక్టర్ సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దాపురం ఆర్డీవో, తొండంగి రెవెన్యూ అధికారులు సర్వే చేసి స్థలాన్ని పోలీస్ శాఖకు అప్పగించారు. పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు భవనం లేక సర్వే నంబరు 843కు ఎదురుగా ఉన్న గ్రామ చావిడినే తాత్కాలికంగా వినియోగించారు. గ్రామ చావిడి స్థలంలోనే స్టేషన్ నిర్మాణం గ్రామ చావిడికి సర్వే నంబరు 842లో 0-11 సెంట్లు ఉండేది. ఇందులో తాత్కాలికంగా పోలీస్‌స్టేషన్ నిర్వహించిన తర్వాత 1998 నవంబర్ 26న అప్పటి కలెక్టర్ సతీష్ చంద్ర ఉత్తర్య్వుల మేరకు ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖకు బదలాయించారు. అక్కడే పోలీస్‌స్టేషన్‌కు పక్కా భవనం నిర్మించారు. సర్వేనంబరు 843 లో కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో క్వార్టర్స్ నిర్మించక పోవడంతో ఖాళీగా ఉండేది. మూడు రోడ్లు జంక్షన్లో ఉన్న ఆ స్థలంపై అధికార పార్టీకి చెందిన కీలక నేత బంధువు కన్ను పడింది. ఏం చేసినా అడగగల వారు ఉండరన్న అధికార మదంతో మందబయలు స్థలంలో పాకలు, బడ్డీకొట్లను బలవంతంగా ఖాళీ చేయించారు. ఇవీ రెవెన్యూ రికార్డుల్లోని వివరాలు ఒంటి మామిడిలో 1996లో పోలీస్‌స్టేషన్‌కు స్థలం కేటాయించిన సమయంలో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన వివరాల ప్రకారం సర్వే నంబరు 843లో 7.32 ఎకరాల స్థలం మందబయలుగా ఉంది. ఇందులో పోలీస్‌స్టేషన్, సిబ్బంది క్వార్టర్ల కోసం రెవెన్యూ శాఖ రెండు ఎకరాల స్థలాన్ని 1996 నవంబర్ 29న పోలీస్‌శాఖకు కేటాయించింది. సర్వే నంబరు 843 బై 2 లో 0.89 సెంట్లు పోలీస్‌స్టేషన్‌కు, 843 బై 5 లో 1.11 ఎకరాలు పోలీసు సిబ్బంది క్వార్టర్స్ కోసం అప్పటి కలెక్టర్ కేటాయించారు. ఇదే సర్వే నంబరు 843 బై 4 లో 1.73 ఎకరాలు బీచ్ రోడ్డుకు ఇచ్చారు. మిగిలిన స్థలం మంద బయలు కింద ఖాళీగా ఉండేది. ఏడాది క్రితమే బడ్డీ కొట్ల తొలగింపు పోలీస్‌స్టేషన్‌కు కేటారుుంచిన స్థలం, మంద బయలు స్థలం కలిపి సుమారు ఐదు ఎకరాలు ఉంటుంది. దీని విలువ ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం రూ.పది కోట్లు ఉంటుంది. దీనిపై కన్నేసిన అధికార పార్టీ కీలకనేత బంధువు ఆ స్థలాన్ని కొనుగోలు చేశామంటూ ఏడాది క్రితమే అందులో ఉన్న పలువురిని ఖాళీ చేయించారు. అందులోనే పోలీస్‌స్టేషన్‌కు కేటారుుంచిన స్థలం ఉన్న విషయాన్ని ఎంత మాత్రం ఖాతరు చేయకుండా ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. బలమైన రాజకీయ నేత కావడంతో పోలీసుల సైతం నోరు మెదపలేక పోతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. దీనిని బట్టే సదరు బంధువు వెనకున్న నేతది ఏ స్థాయో అర్థం చేసుకోవచ్చు. ఆక్రమిస్తే ఉన్నతాధికారుల దృష్టిలో పెడతా పోలీస్‌స్టేషన్‌కు, సిబ్బంది క్వార్టర్స్‌కు ప్రభుత్వం కేటాయించిన స్థలం మా ఆధీనంలో ఉంది. ఎవరూ ఆక్రమించలేదు. అలా జరిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతాను. - బి. కృష్ణమాచారి, ఎస్సై, తొండంగి ఆక్రమణకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి హోంశాఖకు సంబంధించిన ఆస్తులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? కలెక్టర్ ఇచ్చిన స్ధలాన్ని కాపాడుకోలేని స్థితి లో పోలీసులున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి . - దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని -
ఆ భూమిని నేనేమీ కబ్జా చేయలేదు: నటి
ముంబై: ముంబై నగరంలోని అత్యంత ఖరీదైన భూమిని కారుచౌక ధరకు తన నాట్య సంస్థకు కట్టబెట్టడంపై చెలరేగుతున్న రాజకీయ దుమారం మీద బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమామాలిని స్పందించారు. తానేమీ ఆ భూమిని కబ్జా చేయలేదని, దాని కొనుగోలు విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తానని వివరణ ఇచ్చారు. అంధేరి పరిసర ప్రాంతాల్లోని అంబివాలిలో రెండు వేల చదరపు మీటర్ల స్థలాన్ని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం హేమామాలినికి రూ. 70 వేలకే కట్టబెట్టింది. మాలిని నేతృత్వంలోని నాట్యవిహార్ కళాకేంద్ర చారిటీ ట్రస్ట్ ఈ ప్రదేశంలో ఓ నృత్య కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రాజకీయ వేడిని ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో హేమ స్పందిస్తూ.. ఈ భూమికి ఇప్పటివరకు తానేమీ చెల్లించలేదని, ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం ధరను చెల్లించి భూమిని కొనుగోలు చేస్తానని అన్నారు. ఈ వివాదంతో తన డ్యాన్స్ ఇన్ స్టిట్యూట్ కు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పేరు వచ్చిందని, అయినా ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదని ఆమె పేర్కొన్నారు. -
శ్మశానవాటికలూ కబ్జా..!
‘కాదేది కబ్జాలకు అనర్హం’ అన్నట్లుగా భూ కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. చెరువులు, కుంటలు, కాల్వలు, కత్వలు, ప్రభుత్వ స్థలాలనూ వదలని కబ్జాదారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ‘ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేస్తాం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మనిషి మరణిస్తే ఆరు అడుగుల జాగాను కూడా వదిలిపెట్టడం లేదంటే భూ కబ్జాలు ఏ తరహాలో చేస్తున్నారో ఇట్టే తెలుస్తోంది. - ఇబ్రహీంపట్నం రూరల్ ఇబ్రహీంపట్నం మండలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ప్రతి ఒక్కరూ భూమినే నమ్ముకొని జీవితాలు గడుపుతున్నారు. ఏంచేసినా తొందరగా అభివృద్ధి సాధించలేమని భూములు కొనడం, అమ్మడంవల్ల అభివృద్ధిని గమనించి రియల్ వ్యాపారులు, భూస్వాములు శ్మశానవాటికలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇచ్చినవీ లాక్కుంటున్నారు... ఇబ్రహీంపట్నం మండలంలోని కప్పహాడ్, తుర్కగూడ, రాందాసుపల్లి అనుబంధ గ్రామమైన మల్సెట్టిగూడ, ఎంపీ పటేల్‌గూడ, ఆదిబట్ల, కొంగరకలాన్ గ్రామాల్లో ఇప్పటికే శ్మశానవాటికలను కబ్జా చేశారు. అదే గ్రామానికి చెందిన పెద్దరైతులు గతంలో శ్మశానవాటికల కోసం స్థలాలు ఇచ్చి మళ్లీ లాక్కుంటున్నారు. ఇటీవలికాలంలో మండలంలోని కప్పపహాడ్ గ్రామంలో ఎస్సీ, బీసీల శ్మశానవాటిక భూములు ఆక్రమించారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తుర్కగూడ గ్రామస్తులు, మల్సెట్టిగూడ గ్రామాస్తులు కూడా కబ్జాకు గురైందని కలెక్టర్‌కు ఫిర్యాదు ఇచ్చారు. కప్పపహాడ్ గ్రామంలో నెలరోజుల క్రితం శ్మశానవాటిక వద్దకు తీసుకొచ్చిన మృతదేహాన్ని దహన సంస్కరాలు నిర్వహించకుండా కబ్జాదారులు అడ్డుకున్నారు. దీంతో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగి దహన సంస్కారాలు చేశారు. కొనసాగుతున్న ఆందోళనలు.. మనిషి మరణిస్తే దహన సంస్కారాలు నిర్వహించుకునే స్థలాల పరిరక్షించుకోవడం కోసం ప్రజలు ఆందోళనబాట పడుతున్నారు. రెండు వారాల క్రితం ఎంపీ పటేల్‌గూడ గ్రామానికి చెందిన దళితులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. చింతపల్లిగూడ, మల్సెట్టిగూడ ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా అప్పటి ఆర్టీఓ యాదగిరిరెడ్డి మల్సిట్టిగూడలో జరిగిన ఆక్రమణలపై స్పందించారు. మిగతా గ్రామాల్లో జరుగుతున్న సమస్యలపై రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. శ్మశానవాటికలను కబ్జా చేస్తు న్న వారిపై చర్యలు తీసుకోవాలి. పాలకుల నిర్లక్ష్యం ఆక్రమణలు జరుగుతున్నాయి. అ ధికారులు స్పందించాలి. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపితే ఇలాంటి చర్యలకు పాల్పడరు. కబ్జాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. - మహేందర్, కేవీపీఎస్ నాయకుడు కఠినంగా వ్యవహరించాలి.. శ్మశానవాటికలు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని పర్యవేక్షించాలి. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాలకు పాల్పడుతున్నారు. వాటిని నివారించాలి. - మొగిలి గణేష్, బీజేపీ మండల అధ్యక్షుడు -
'దేవాలయ భూములను కాపాడుకుంటాం'
వైఎస్సార్ జిల్లా: అన్యాక్రాంతమైన దేవాలయ భూములను కాపాడుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన... బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రవీంద్రరావు స్వగ్రామమైన ఎర్రవారిపాలెంకు విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ... సుమారు 20 వేల ఎకరాల భూ ఆక్రమణల అంశం ఇప్పటికే కోర్టుల్లో ఉందని మాణిక్యాలరావు తెలిపారు. 'మీ ఇంటికి - మీ భూమి' కార్యక్రమంలో భాగంగా దేవాలయ భూములకు సంబంధించి 30వేల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టు లెక్క తేలిందన్నారు. ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, భూములను స్వాధీనం చేసుకుంటామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. -
మూడేళ్ల బుడ్డోడు భూమిని కబ్జా చేశాడు!
ఇస్లామాబాద్: బుడిబుడి అడుగులతో తప్పటడుగులు వేసే మూడేళ్ల బాలుడు ఓ ప్లాజాకు చెందిన భూమిని కబ్జా చేశాడు! ఆస్తిని కూడా దొంగలించాడు! నిజమా? అని విస్తుపోకండి. పాకిస్థాన్ పోలీసులు పెట్టిన వికృత కేసు ఇది. మూడేళ్ల బాలుడుపై వారు భూకబ్జా, ఆస్తి దోపిడీ కేసు పెట్టారు. ఇస్లామాబాద్‌లోని సెక్టర్ 10కు సంబంధించిన ప్లాజా భూమిని కబ్జాచేసి, ఆస్తిని దొంగలించినట్టు అతనిపై షాలిమార్ పోలీసు స్టేషన్ పోలీసులు అభియోగాలు మోపారు. పోలీసుల చర్యతో బిత్తరపోయిన ఆ చిన్నారి కుటుంబసభ్యులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. తమ చిన్నారి అరెస్టు కాకుండా చూడాలని అభ్యర్థించారు. కోర్టు కూడా పోలీసులు చేసిన బండతప్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అసలు మూడేళ్ల బాలుడికి ముందస్తు బెయిల్ తీసుకోవాల్సిన అవసరముందా? అని ఆ చిన్నారి తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్లో చిన్నారి పేరును కూడా చేర్చడంతో బెయిల్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని లాయర్ వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఒక వ్యవస్థ తప్పు చేస్తే, కోర్టు కూడా కళ్లు మూసుకొని ఉండాలా? అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో స్టెషన్ హౌస్ ఆఫీసర్, దర్యాప్తు అధికారి తమ ముందు హాజరై వాదన వినిపించాలని ఆదేశించారు. పాకిస్థాన్‌లో చిన్నారులపై కేసులు పెట్టడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది లాహోర్‌లో తొమ్మిది నెలల బాలుడిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఇప్పటికీ బ్రిటిష్ కాలపు చట్టాలు, నిబంధనలు అనుసరిస్తున్న పాకిస్థాన్ పోలీసులు తీవ్ర అవినీతిలో కూరుకుపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
ఆక్రమణలతో నగరాలకు ముప్పు
- అప్రమత్తం కాకుంటే అన్ని సిటీలకూ చెన్నై తరహా ప్రమదం - కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హెచ్చరికలు - చెన్నైలోని ముంపు ప్రాంతాల సందర్శన, బాధితులకు పరామర్శ చెన్నై: పట్టణ ప్రాంతాల్లో మురుగు, వరద నీరు పారే నాలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, అలాంటి ఆక్రమణల తొలగింపుపై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే అన్ని పట్టణాలకు ఇటీవలి చెన్నై విపత్తు తరహా ముప్పు తప్పదని హెచ్చరించారు. ఆదివారం చెన్నైలోని వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ తరపున బాధితులకు బియ్యం తదితర వస్తువులను పంపిణీ చేశారు. వరద ప్రాంతాల సందర్శన అనంతరం వెంకయ్య.. తమిళనాడు సీఎం జయలలితతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆక్రమణ వల్ల ఎంతటి అరిష్టం వాటిల్లుతుందో ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసి వచ్చిందన్నారు. ఈ దారుణ విపత్తు నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలని కోరారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు ఇటీవలే ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని, ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. -
'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తిస్తాం'
కడప : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాలకు చెందిన 20 వేల ఎకరాల ఆలయ భూములు కబ్జాకు గురైనవని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు తెలిపారు. సదరు భూములును కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దూటూరు శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాణిక్యాలరావు విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తించి... అక్కడివారికి శిక్షణ ఇచ్చి పూజారిగా నియమిస్తామని పి.మాణిక్యాలరావు వెల్లడించారు. -
ఆ స్థలం ఎంపీకి కట్టబెట్టేందుకు సన్నాహాలు!
నిత్యం ఆకలి కేకలతో పోరాటం చేసే జీవితాలు.. పని దొరికితే చాలు పండగ చేసుకునే బతుకులు..కాస్తంత ఖాళీ స్థలం కనిపిస్తే తలదాచుకోవడానికి గూడు ఏర్పాటు చేసుకున్నారు..రాజధాని ప్రకటన రావడంతో భూముల ధరలు రెక్కలు తొడిగాయి.. బడుగుల నివాసముంటున్న స్థలంపై పెద్దల కన్ను పడింది..ఎలాగైనా పేదల గూడు కూల్చేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు..ఈ తతంగమంతా ఓ ఎంపీకి సదరు స్థలాన్ని కట్టబెట్టటేందుకేనని విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలను రోడ్డు పాలు చేసే ఈ ప్రయత్నాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. సీతానగరంలో మత్స్యకారుల నివాస స్థలాలను ఖాళీ చేయించేందుకు ముమ్మర ప్రయత్నాలు ఈ స్థలం ఓ ఎంపీకి కట్టబెట్టేందుకు సన్నాహాలు ? తాడేపల్లి రూరల్ : పట్టణంలోని సీతానగరంలో పాఠశాల ఏర్పాటు చేస్తామంటూ 1983లో రామకృష్ణ సమితి వారు అతి తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి ఆరెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే చేశాం... చేస్తున్నాం.. అన్న చందాన ఓ ప్రభుత్వ పాఠశాల నిర్మించారు. అది అంచెలంచెలుగా ఎదుగుతూ 1500 మంది విద్యార్థులకు బోధనశాలగా మారింది. ఈ క్రమంలో పాఠశాలను మేము నడపలేకపోతున్నామంటూ సమితి వారు రామకృష్ణ మిషన్‌కు అప్పగించారు. అప్పటి నుంచి విద్యార్థుల దగ్గర వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. అప్పటిలోనే రామకృష్ణ మిషన్‌కు సమితి వారు ఆరెకరాల స్థలాన్ని అమ్మేశారు. ఈ స్థలం పక్కనే ఉన్న 90 సెంట్ల భూమిలో మత్స్యకారులు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడా స్థలం తమదని సమితి వారు మత్స్యకారులను ఖాళీ చేరుుంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారులూ వత్తాసు పలుకున్నారు. ఈ స్థలాన్ని రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీకి కట్టబెట్టేందుకే వారు హడావుడి చేస్తున్నారని సమాచారం. సదరు ఎంపీ సారు రాజధాని ప్రాంతంలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు మత్స్యకారుల స్థలాన్ని ఖాళీ చేరుుస్తున్న తెలిసింది. అందులో భాగంగానే వారి నివాసాలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ తెలుగుదేశం నాయకుడు చెబుతున్నారు. మత్స్యకారుల పరిస్థితి ఏమిటి ? మత్స్యకారులకు ఎక్కడైనా నివాస గృహాలు ఇస్తారా? లేక వారిని రోడ్డుకీడుస్తారా? అనే విషయం ఇంత వరకు తేల్చ లేదు. ప్రతి రోజూ అధికారుల హడావుడి చూసి మత్స్యకారులు తమ పరిస్థితి ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయపెడుతున్నారు 50 ఏళ్ల నుంచి కృష్ణమ్మ తల్లిని నమ్ముకుని ఇక్కడే నివసిస్తున్నాం. కాయకష్టం చేసుకుంటూ రేకుల షెడ్డు నిర్మించుకున్నాం. ఈ స్థలం తమదంటూ ఎవరెవరో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. - నడికుదిటి పార్వతి ఎక్కడికెళ్లాలి ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నాం. ఇప్పుడొచ్చి తమను ఖాళీ చేయమంటే ఎక్కడికెళ్లాలి. రామకృష్ణ సమితి వారు ప్రజలకు ప్రతి ఏడాది ఏదో సేవ చేస్తుంటారని తెలిసింది. దానిలో భాగంగానే మా కుటుంబాలకు ఈ స్థలం కేటాయించాలని ప్రాధేయపడుతున్నాం. - గాడి భారతి -
కడప జిల్లాలో తెలుగుతమ్ముళ్ల భూకబ్జాలు