Maha Kumbh Mela 2025
-
మహాకుంభ్‌తో నిండిన రైల్వే ఖజానా.. ఎంత ఆదాయమంటే..
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు కోట్లాది మంది జనం తరలివచ్చారు. ఫలితంగా యూపీ సర్కారుకు లెక్కలేనంత ఆదాయం సమకూరింది. కుంభమేళాకు వచ్చేందుకు జనం ప్రధానంగా రైళ్లను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది.నెలన్నర పాటు జరిగిన మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్(Prayagraj) లోని ఎనిమిది రైల్వే స్టేషన్ల నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లిన రైళ్ల ద్వారా రైల్వేశాఖకు టిక్కెట్ల విక్రయాల రూపంలో దాదాపు రూ.200 కోట్లు సమకూరాయి. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్‌కు చెందిన డీఆర్ఎం హిమాన్షు బదోనీ, సీనియర్ డీసీఎం హిమాన్షు శుక్లా తెలిపిన వివరాల ప్రకారం మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని నార్త్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని నాలుగు రైల్వే స్టేషన్లలో రూ.159.20 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అలాగే ఉత్తర రైల్వేలోని లక్నో డివిజన్లోని మూడు రైల్వే స్టేషన్ల నుండి రూ.21.79 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈశాన్య రైల్వేలోని వారణాసి డివిజన్లోని రెండు రైల్వే స్టేషన్ల నుండి రూ.6 కోట్ల విలువైన టిక్కెట్లను విక్రయించడం ద్వారా రైల్వేలు అధిక ఆదాయాన్ని ఆర్జించాయి. 2019 కుంభమేళాలో రైల్వేశాఖ 86 కోట్ల రూపాయల విలువైన టిక్కెట్లను విక్రయించింది.మహాకుంభమేళాకు ఊహించనంత సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని, అయితే రైల్వేశాఖ(Railways) గత మూడేళ్లుగా ముందస్తు చర్యలు చేపట్టిన కారణంగా ఎక్కడా ఎటువంటి సమస్య రాలేదని డిఆర్ఎం హిమాన్షు బదోనీ తెలిపారు. ఇదిలావుండగా రైల్వేశాఖ 2031లో జరగబోయే కుంభమేళా కోసం ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం మూడు రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయోధ్య, వారణాసి, మీర్జాపూర్, చిత్రకూట్‌లను కలుపుతూ రైళ్లను నడపాలని అధికారులు యోచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Hit and Run: కారు బీభత్సం.. నలుగురు మృతి -
హీరోయిన్ పవిత్ర స్నానం చేస్తుంటే.. నవ్వులాటగా ఉందా?
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు జనాలు ఎగబడిపోతున్నారు. కుదిరితే సెల్ఫీలు దిగుతున్నారు. లేదంటే తమ కెమెరాల్లో వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ పరితపించిపోతున్నారు. సమయం, సందర్భం కూడా లెక్క చేయకపోవడం శోచనీయం. హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) ఇటీవల మహాకుంభమేళాకు వెళ్లి స్నానమాచరించింది.కత్రినా పవిత్ర స్నానం చేస్తుండగా వీడియో..అయితే ఆమె కనబడగానే అందరు ఆమె చుట్టూ మూగారు. వీఐపీ ఘాట్ వద్ద పవిత్రస్నానం చేస్తుంటే వెంటనే ఫోన్లు తీసి వీడియోలు చిత్రీకరించడం మొదలుపెట్టారు. తనకంటూ ప్రైవసీ ఇవ్వకుండా చుట్టూ నిలబడి కత్రినాను తమ ఫోన్లలో చిత్రికరించారు. ఓ వ్యక్తి అయితే.. నేను, నా సోదరుడుతో పాటు ఎవరున్నారో చూడండి అంటూ కత్రినా కైఫ్ పవిత్ర స్నానం చేస్తుండగా ఆమెను తన వీడియోలో చూపించాడు. కుంభమేళా దర్శనాన్ని కత్రినా దర్శనంగా మార్చేశామని ఏదో గొప్ప పని చేసినట్లుగా తెగ నవ్వుతున్నారు. నవ్వులాటగా ఉందా?ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె కూడా మనిషేనని, తనను ఎందుకలా వేధిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. ఇదేమీ సరదాగా లేదని ఫైర్ అవుతున్నారు. నటి రవీనా టండన్ (Raveena Tandon) సైతం దీనిపై స్పందించింది. ఇది చాలా అసహ్యకరంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా చేసుకునే పనుల్ని ఇలాంటి జనాలు చెడగొడుతుంటారు అని మండిపడింది. -
కష్టం తీర్చిన కుంభమేళ.. ఆటో కుర్రాడి భావోద్వేగం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం... మహా కుంభమేళ ముగిసింది! త్రివేణీ సంగమ స్థలి ప్రయాగ్‌రాజ్‌లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్లమంది సందర్శించారు. పవిత్ర గంగలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవశ్యంలో మునిగితేలారు. వీరందరిది ఒక ఎత్తైతే.. కొందరు పరోపకారాన్ని కూడా అంతే శ్రద్ధాసక్తులతో చేసి ఆత్మానందం పొందారు. అలాంటి ఓ సంఘటన సాగిందిలా...కోట్లమందిలాగే.. స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధ పరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడం కోసం ఆమె కూడా కుంభమేళాకు వెళ్లారు. ఎక్కడో ఓ మూలనున్న రిసార్టులో మకాం. అక్కడి నుంచి సంగమ స్థలికి వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకున్నారు.. దాన్ని నడుపుతోంది ఓ నూనూగు మీసాల కుర్రాడు. మాట మాట కలిసింది. కుశల ప్రశ్నలయ్యాయి. బడికెందుకు వెళ్లడం లేదన్న ప్రశ్న వచ్చింది. అంత సౌలభ్యం లేదన్న సమాధానంతోపాటు తప్పనిసరి పరిస్థితుల్లోనే... బతుకు కోసం ఆటో నడపాల్సి వస్తుందని ఆ కుర్రాడు తన బాధను వెళ్లబోసుకున్నాడు. ఈ మాటలు ఆమెలో ఆసక్తిని పెంచాయి. మెల్లిగా మాటలతో అతడి నేపథ్యం గురించి ఆరా తీశారు.మేడమ్ జీ.. అంటూ మొదలుపెట్టి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడతను. చదువుకోవాల్సిన వయసులో తల్లిని పోషించాల్సిన భారం ఆ కుర్రాడిపై పడింది. అందుకే బాడుగకు ఆటోను నడిపిస్తున్నట్లు చెప్పాడతను. రోజుకు రూ.వెయ్యి కిరాయి చెల్లిస్తేనే ఆటో నడుపుకోవచ్చునని, చెల్లించని రోజు లేదా తక్కువ మాత్రమే ఇవ్వగలిగిన రోజు ఆటో యజమాని నానా ఇబ్బందులు పెడుతున్నాడని ఆ కుర్రాడు వాపోయాడు. అతని పరిస్థితి గురించి తెలుసుకుని ఆమె చలించిపోయారు. సొంత ఆటో ఉంటే బాగుంటుంది కదా? అని అన్నారామె. నిజమే.. కానీ నాకెవరు ఇస్తారు మేడమ్ జీ?. అంత స్థోమతెక్కడిది నాకు? అన్నాడా కుర్రాడు. అదంతా నేను చూసుకుంటా.. నీ వివరాలివ్వు అన్న ఆ మేడమ్ జీ.. మరుసటి రోజు ఆ కుర్రాడికి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఆటో కొనుగోలుకు సంబంధించిన డౌన్‌పేమెంట్ రసీదును వాట్సప్‌లో అందుకున్న ఆ కుర్రాడి కళ్లల్లో కచ్చితంగా నాలుగు చుక్కల ఆనందభాష్పాలు రాలే ఉంటాయి. అందుకేనేమో.. కష్టాల ఊబి నుంచి తనను బయటకు లాగేసేందుకు విచ్చేసిన ఇంకో తల్లికి కృతజ్ఞతలు చెప్పాడు. తనతోపాటు జన్మనిచ్చిన తల్లితోనూ ఆ మేడమ్ చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పించాడు. ఆడియో మెసేజీ ద్వారా.. ఆ మేడమ్ జీని దేవుడే పంపించాడని మురిసిపోయారు. మళ్లీ సంగం వస్తే తప్పకుండా తమకు ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానించారు. ఇంతకీ ఆ మేడమ్ ఎవరన్నదేనా మీ సందేహం. పేరు.. భారతి చంద్రశేఖర్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరిశ్ధోన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సతీమణి. ఎస్సీఎస్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలువురి విద్య, ఆరోగ్య అవసరాలకు సాయం చేసిన భారతీ చంద్రశేఖర్ తాజాగా తనకెంతో తృప్తిని కలిగించిన ఈ అనుభవాన్ని ‘సాక్షి.కాం’తో పంచుకున్నారు. -
రోజూ రెండు కోట్ల మంది భక్తులు.. అంతరాయంలేని కనెక్టివిటీ!
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళా 2025లో రోజూ దాదాపు 20 మిలియన్ల(రెండు కోట్లు) మంది భక్తులు పాల్గొన్నారని అంచనా. ఈ భారీ జన సమూహం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటడమే చేయడమే కాకుండా టెలికాం పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం, సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో లక్షలాది మంది భక్తులకు అంతరాయం లేని కనెక్టివిటీని అందించేందుకు డేటా ట్రాఫిక్‌ను నిశితంగా పర్యవేక్షించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.రంగంలోకి దిగిన టెలికాం దిగ్గజాలుమహా కుంభమేళా సమయంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు కొత్త సైట్లను, అదనంగా స్పెక్ట్రమ్‌ను జోడించి ముందస్తు చర్యలు చేపట్టాయి. పెరిగిన డేటా ట్రాఫిక్‌ను నిర్వహించడానికి, భక్తులకు అంతరాయం లేని సేవలను అందించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఎంతో అవసరమైంది. దాంతో డేటా ట్రాఫిక్ గణనీయంగా 55% పెరిగినట్లు కంపెనీ తెలిపాయి.కంపెనీలకు ఆదాయం పెంపుమహా కుంభమేళా 2025 సందర్భంగా డేటా వినియోగం పెరగడం టెలికాం కంపెనీలకు గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చినట్లు నిపుణులు తెలుపుతున్నారు. పెరిగిన డేటా ట్రాఫిక్ ప్రతి వినియోగదారుడి నుంచి సంస్థలకు వచ్చే సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) 4% నుంచి 6% వరకు పెంచుతుందని అంచనా. మిలియన్ల మంది ప్రజల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చేందుకు మెరుగైన టెలికాం మౌలిక సదుపాయాలను అందించడంతోనే ఇది సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండేపరస్పర సహకారంసర్వీస్ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ మహా కుంభమేళాలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. క్రౌడ్ మూవ్మెంట్, డేటా ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం ద్వారా నెట్వర్క్ స్థిరంగా, సమర్థవంతంగా ఉండేలా చూసుకున్నారు. టెలికాం విభాగం, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఈ సహకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించడంలో ఎంతో అవసరమనే విషయాన్ని హైలైట్ చేస్తుంది. -
భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనం
-
విఫలమైతే క్షమాపణలు: కుంభమేళా బ్లాగ్‌లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ:‘మహా కుంభమేళా(Maha Kumbh Mela) పరిపూర్ణమయ్యింది. ఏకత్వాన్ని చాటే ఈ మహాయజ్ఞం సుపంపన్నమయ్యింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా 140 కోట్ల దేశ ప్రజల ఆధ్యాత్మిక చింతనకు ఆలంబనగా నిలిచింది. ఇంతటి భారీ కార్యక్రమంలో తాము భక్తులకు సేవలు అందించడంలో విఫలమైతే క్షమాపణలు’ అని ప్రధాని మోదీ మహాకుంభ్ ముగిసిన సందర్భంగా తన బ్లాగ్‌లో రాశారు.ఐక్యతకు ప్రతీకమహాకుంభ్కు సంబంధించి మోదీ(PM Modi) ఈ బ్లాగ్‌లో పలు విషయాలు ప్రస్తావించారు. 2024, జనవరి 22న తాను అయోధ్యలోని రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేవుని భక్తితో కూడిన దేశభక్తి గురించి మాట్లాడానని బ్లాగ్ మొదట్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు దేవుళ్లు, దేవతలు తరలివచ్చారు. సాధువులు, మహాత్ములు, పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులా ఇలా అందరూ కలసివచ్చారు. కుంభమేళా నేపధ్యంలో దేశంలోని చైతన్యశక్తిని మనమంతా చూశాం. ఈ మహా కుంభమేళా ఐక్యతకు ప్రతీక. ఈ పండుగ 140 కోట్ల దేశవాసుల నమ్మకానికి ఆలంబనగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు.ఆశ్చర్యపోయిన ప్రపంచంగత 45 రోజులుగా ప్రతిరోజూ, దేశంలోని ప్రతి మూల నుండి లక్షలాది మంది సంగమతీరం వైపు ఎలా కదులుతున్నారో చూశాను. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తున్నప్పుడు ప్రతి భక్తునిలోనూ ఉత్సాహం శక్తి, విశ్వాసం తొణికిసలాడింది. ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరిగిన ఈ మహా కుంభమేళా ఆధునిక యుగంలోని విధాన నిపుణులకు ఒక కొత్త అధ్యయన అంశంగా మారింది. యావత్ ప్రపంచంలో ఇంత పెద్ద ఉత్సవం ఎక్కడా జరగనే లేదు. దీనికి సమానమైన ఉదాహరణ మరొకటి లేదు. ఒకే నది ఒడ్డున, త్రివేణి సంగమం తీరంలో కోట్లాది మంది స్నానం చేయడాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ కోట్లాది మందికి అధికారిక ఆహ్వానం లేదు.. ముందస్తు సమాచారం కూడా లేదు. అయినా మహా కుంభమేళాకు తరలివచ్చారు. పవిత్ర సంగమంలో స్నానం చేసి గంగామాత ఆశీర్వాదాలు అందుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలను ఎప్పటికీ మరిచిపోలేను. సంతృప్తితో నిండిన ఆ భక్తుల ముఖాలే నిత్యం కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.కొత్త రికార్డులుమహా కుంభమేళాలో స్నానం చేసేందుకు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నవారి సంఖ్య కొత్త రికార్డులను సృష్టించింది. కుంభమేళా నుండి తిరిగి వెళ్లినవారు వారితో పాటు ఈ పుణ్య జలాలను తమ ప్రాంతాలకు తీసుకువెళ్లి, లక్షలాది మంది చేత కుంభస్నానం చేయించారు. ఇది గత కొన్ని దశాబ్దాలలో ఇంతకు ముందెన్నడూ జరగని ఉదంతం. ప్రయాగ్‌రాజ్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అధికారులు మునుపటి కుంభమేళా అనుభవాల ఆధారంగా నూతన ప్రణాళికను రూపొందించారు. అమెరికా జనాభా(US population)కు దాదాపు రెట్టింపు జనాభా ఈ ఐక్యతా కుంభమేళాలో పాల్గొని స్నానాలు చేశారు.దేశంలోని ప్రతీ భక్తుడూ భాగస్వామిఈ మహా కుంభమేళా భారతదేశ జాతీయ చైతన్యాన్ని బలోపేతం చేసింది. 144 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మహా కుంభమేళా భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం అందించిన సందేశంగా నిలిచింది. దేశంలోని ప్రతి భక్తుడు ఈ మహా యాగంలో భాగస్వామి అయ్యాడు. భారతదేశం అందించిన ఈ మరపురాని దృశ్యం కోట్లాది మందిలో ఆధ్మాత్మికతను పెంపొందించింది. నాడు బాలుడి రూపంలో శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు తన నోటిలో విశ్వాన్ని చూపించాడు. అదేవిధంగా ఈ మహా కుంభ్ ప్రపంచానికి భారతీయులు అపార శక్తి రూపాన్ని చూపింది.ఉత్తరప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలుఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులభం కాదు. అయితే నేను గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థించాను. పూజలలో ఏదైనా లోపం ఉంటే, క్షమించమని కోరాను. భక్తులకు సేవ చేయడంలో విఫలమైతే, క్షమాపణలను కోరుతున్నాను. ఈ ఐక్యతా మహా కుంభమేళాలో కోట్లాది మందికి సేవ చేసే భాగ్యం భక్తి ద్వారానే సమకూరింది. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, నావికులు, డ్రైవర్లు.. ప్రతి ఒక్కరూ ఈ మహా కుంభ్‌ను విజయవంతం చేయడానికి నిరంతరం సేవలు అందించారు. ప్రయాగ్‌రాజ్ ప్రజలు ఈ 45 రోజుల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులను ఆదరించారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహా కుంభమేళా దృశ్యాలను చూసినప్పుడు నా మనసులో మెదిలిన భావాలు మరింత బలపడ్డాయి. దేశ ఉజ్వల భవిష్యత్తుపై నా నమ్మకం అనేక రెట్లు పెరిగిందని ప్రధాని మోదీ ఈ బ్లాగ్‌లో రాశారు.ఇది కూడా చదవండి: శివరాత్రి వేళ.. ‘మౌని అమావాస్య’ బాధితులు ఏమన్నారంటే.. -
శివరాత్రి వేళ.. ‘మౌని అమావాస్య’ బాధితులు ఏమన్నారంటే..
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాశివరాత్రి వేడుకలతో మహాకుంభమేళా(Mahakumbh Mela) పరిసమాప్తమయ్యింది. శివరాత్రి రోజున ఆఖరి పవిత్ర స్నానాలు కావడంతో లెక్కలేనంతమంది భక్తులు తరలివచ్చారు. మహాకుంభమేళాలో మొత్తం 66 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కాగా మౌని అమావాస్య నాటి రద్దీని చూసి, ఆనాడు వెనుదిరిగిన బీహార్‌కు చెందిన ఒక కుటుంబం తిరిగి శివరాత్రి నాడు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు మహాకుంభమేళాకు వచ్చింది. వీరు మౌని అమావాస్య రోజున జరిగిన విషాదాన్ని మీడియాకు వివరించారు.బీహార్(Bihar)లోని బక్సర్‌లో ఉంటున్న ఆ కుటుంబ సభ్యులలో ఒకరైన మహిళ మీడియాతో మాట్లాడుతూ మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాలో జనసమూహాన్ని చూసి, ఇక స్నానాలు చేయలేమని భావించి నిరాశగా ఇంటికి తిరుగుముఖం పట్టామన్నారు. ఇప్పుడు శివరాత్రి వేళ పుణ్యస్నానాలు ఆచరించేందుకు తిరిగి వచ్చామన్నారు. అదే కుంటుంబానికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ మౌని అమావాస్యనాడు విషాద ఘటన సంగమ్ నోస్ వద్ద జరగిందని అన్నారు. ఆ రోజున జనం ఎటువైపు వెళుతున్నామో తెలియనంతగా పరిగెట్టారన్నారు. దీనిని చూసిన మా అంటీ భయంతో రోదించసాగారని, దీంతో నేను ఆమెను ఇక్కడి నుంచి పంపించేందుకు ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వరకూ దిగబెట్టానని అన్నారు.ఇదే కుటుంబానికి చెందిన మరో మహిళ మాట్లాడుతూ ఆరోజున తొక్కిసలాట(Stampede) ఎంతగా జరిగిందంటే ఒకరిమీదకు మరొకరు ఎక్కిపోయారన్నారు. అలాగే అందరూ ఒకవైపుగా తోసుకుంటూ పరిగెట్టారని, అక్కడి పరిస్థితి చూసి తామంతా భయపడిపోయామని, పుణ్య స్నానాలు చేయకుండానే వెనుదిరిగామన్నారు. ఆరోజు 25 మంది వరకూ మృతి చెందడాన్ని చూశానని, తనను ఆ గుంపు నుంచి పోలీసులు కాపాడారని, ఊపిరి ఆడని స్థితిలో తనకు ఆక్సిజన్ అందించారని ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండటంతో తాము ఎంతో సంతృప్తికరంగా పుణ్య స్నానాలు చేశామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి -
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)లో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. దీంతో ఆమెకు అటు సినిమా అవకాశాలు, ఇటు ప్రకటనల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఒక బహిరంగ వేదికపై జరిగిన ప్రదర్శనలోనూ పాల్గొంది.మహాశివరాత్రి సందర్భంగా నేపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోనాలిసా భోంస్లే(Monalisa Bhosle) పాల్గొంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వేదికపై మోనాలిసా నృత్య ప్రదర్శన ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో షేర్ చేశారు. ‘నేపాల్‌లోని మైలాపూర్‌లో మహాశివరాత్రి ఉత్సవాల్లో తన లైవ్ ప్రదర్శన’ అని మోనాలిసా భోంస్లే ఈ వీడియో కింద రాశారు.ఈ వీడియో(Video)ను చూసిన యూజర్స్ తమ ప్రదిస్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ‘చాలా బాగుంది. దీనినే కంటిన్యూ చేయండి’ అని రాయగా మరొకరు ‘చాలా బాగుంది మోనాలిసా.. విజయం నిన్ను ముద్దాడుతుంది’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘అక్కకు ఇలాంటి సపోర్ట్ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. కాగా మోనాలిసా పాల్గొన్న ఈ కార్యక్రమంలో డైరెర్టర్ సనోజ్ మిశ్రా కూడా పాల్గొన్నారు. ఆయనే మోనాలిసాకు తొలి సినిమా అవకాశం ఇచ్చారు. ఈవెంట్ ప్రారంభానికి ముందు మోనాలిసా ‘అందరికీ ఐ లవ్యూ’ అంటూ తన నృత్యాన్ని ప్రదర్శించింది.ఇది కూడా చదవండి: Chandrashekhar Azad: ‘నా పేరు ఆజాద్.. స్వాతంత్ర్యం నా తండ్రి’ -
ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి
ప్రయాగ్‌రాజ్: మొన్నటి జనవరి 13న ప్రారంభమమై, ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగిన మహా కుంభమేళా(Maha Kumbh Mela) పరిసమాప్తమయ్యింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో అద్భుమైన రీతిలో హారతినిచ్చారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. #WATCH | Uttar Pradesh | Evening 'aarti' was performed in Prayagraj on the occasion of Maha Shivratri pic.twitter.com/iFyMguK1Fs— ANI (@ANI) February 26, 2025మహాకుంభమేళా పూర్తయిన నేపధ్యంలో డీఎం రవీంద్రకుమార్ మందర్ మాట్లాడుతూ ‘మహా కుంభ్‌కు కేవలం మనదేశం నుంచే కాకుండా యావత్ ప్రపంచం నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. ఇక్కడికి వచ్చినవారంతా మహాకుంభమేళా నియమనిబంధనలన్నింటినీ పాటించారు. వారందరికీ ధన్యవాదాలు. మహాకుంభమేళా పూర్తయిన తరుణంలో ఇక్కడికి వచ్చినవారు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం సంగమ ఘాట్లలో పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నాం. మహాశివరాత్రి(Mahashivratri) రోజున రాత్రి 8 గంటల వరకూ త్రివేణీ సంగమంలో 1.53 కోట్లమంది పవిత్రస్నానాలు చేశారు. కుంభమేళా జరిగిన 45 రోజుల్లో మొత్తం 66.30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు’ అని తెలిపారు.మహాకుంభ్ ముగిసిన తరుణంలో నేడు(గురువారం) యూపీ సీఎం యోగి ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు రానున్నారు. కుంభమేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుంభమేళా అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేయనున్నారు. అలాగే ఇక్కడి పారిశుద్ధ్య కార్మికులకు, ఆరోగ్య సేవలు అందించిన సిబ్బందికి, పడవ నడిపిన నావికులకు సన్మానం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.30కి సీఎం యోగి లక్నో చేరుకోనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రయాగరాజ్‌కు వచ్చి, కుంభమేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: మే 2 నుంచి కేదార్నాథ్ దర్శనం.. శివరాత్రి వేళ ప్రకటన -
కుంభమేళా నుంచి వస్తుండగా కారు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు
లతేహార్: ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు వచ్చారు. ఇక, తాజాగా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంపీకి గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ మహువా మాజీ కుంభమేళాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో జార్ఖండ్‌లోని లతేహర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హాట్‌వాగ్ గ్రామ సమీపంలోని NH-75పై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఆమె కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే ఆమెను రాంచీలోకి రిమ్స్‌కు తరలించారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంపీ కుమారుడు, కోడలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఆమె ఎడమ చేతికి బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. కొన్ని టెస్టులు కూడా చేశారు. కాసేపట్లో చేతికి సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె మాతో మాట్లాడుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. #WATCH | Jharkhand: JMM Rajya Sabha MP Mahua Maji's son Somvit Maji says "We were returning from Maha Kumbh, Prayagraj when this accident took place...My mother (Mahua Maji) and wife were in the back seat. I was driving the car, and around 3:45 AM, I fell asleep, and the car hit… https://t.co/Rz1MXP3tAZ pic.twitter.com/6yswYEnkuH— ANI (@ANI) February 26, 2025ఇదిలా ఉండగా.. ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది ఈక్రమంలో బుధవారం మహా శివరాత్రి (Maha siva rathri) పర్వదినం సందర్భంగా భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో నేడు చివరి అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు భక్తులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.శివరాత్రి రోజున భక్తులు ట్రాఫిక్‌లో చిక్కకుపోకుండా ఉండేందుకు కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ (No Vehicle Zone)గా అధికారులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి దీన్ని అమలుచేశారు. కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనం అయ్యేలా ప్రయాగ్‌రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక, ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. -
Mahashivratri: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు(బుధవారం) మహాశివరాత్రి సంబరాలు మిన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ‘ఈ దివ్యమైన ఉత్సవం మీ అందరికీ ఆనందం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని, అభివృద్ధి చెందుతున్న భారతదేశ సంకల్పాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. ఇదే నా ఆశ.. సర్వం శివమయం’ అని రాశారు. सभी देशवासियों को भगवान भोलेनाथ को समर्पित पावन-पर्व महाशिवरात्रि की असीम शुभकामनाएं। यह दिव्य अवसर आप सभी के लिए सुख-समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आए, साथ ही विकसित भारत के संकल्प को सुदृढ़ करे, यही कामना है। हर-हर महादेव! pic.twitter.com/4gYM5r4JnR— Narendra Modi (@narendramodi) February 26, 2025శివాలయాల్లో..ఈ రోజు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. అంతటా శివనామస్మరణలు వినిపిస్తున్నాయి. ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్నాయి. మహాశివుని దర్శనం కోసం భక్తులు ఆలయాల మందు బారులు తీరారు. మహాశివునికి పూజలు చేస్తూ, అభిషేకాలు అందిస్తున్నారు. మహాకుంభమేళాలో..మహా కుంభమేళాలో నేడు చివరి పుణ్య స్నాన ఉత్సవం కొనసాగుతోంది. అంతటా హరహర మహాదేవ మంత్రోచ్ఛారణలు వినిపిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుండే భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు చేస్తున్నారు. భక్తులపై కుంభమేళా నిర్వాహకులు హెలికాప్టర్ నుండి పూల వర్షం కురిపించారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికే 41 లక్షలకు పైగా భక్తులు సంగమంలో స్నానమాచరించారని అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు -
హర హర మహాదేవ్.. చివరిరోజు మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు
కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాలు సాధువుల ఆశీస్సులతో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Kumbh Mela) చివరి దశకు చేరుకుంది.మహాశివరాత్రి వేళ పవిత్ర స్నానం ఆచరించడానికి మహా కుంభమేళాకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మహా కుంభమేళాలో ఐక్యత, సామాజిక సామరస్యాల అద్భుతమైన సంగమం కనిపిస్తోంది.మహాశివరాత్రి(Mahashivratri) నాడు మహా కుంభమేళాలో భక్లులు స్నానాలు చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. సంగమం వద్ద జనం గుమిగూడకుండా సమీపంలోని ఘాట్లలో పవిత్ర స్నానం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 64 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాను సందర్శించారు. మహాశివరాత్రి నాడు ఈ సంఖ్య మరింత పెరగనుంది. మహాశివరాత్రికి ముందు రోజు సాయంత్రం నుంచే ఘాట్ల వద్దకు భక్తజనం చేరుకున్నారు.మహా శివరాత్రి రోజున మహా కుంభమేళాకు చేరుకున్న ప్రతి ఒక్కరూ గంగానదిలో స్నానం చేస్తున్నారు. అనంతరం గంగా మాతను పూజిస్తున్నారు.మహా కుంభ ప్రాంతంలో యాత్రికుల రాక రాత్రింబవళ్లు కొనసాగుతోంది. సంగమ స్థలిలో పూజా సామగ్రి విరివిగా విక్రయిస్తున్నారు. భద్రతా సిబ్బంది భక్తుల రద్దీని నియంత్రించడంలో బిజీగా ఉన్నారు.మహా కుంభమేళా సంప్రదాయాలు మహా శివరాత్రి పూజతో పూర్తవుతాయి. మహాశివరాత్రి సందర్భంగా సూర్యోదయానికి ముందే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం ప్రారంభించారు.మహాశివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో స్నానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోటి మందికి పైగా భక్తులు మహాకుంభ నగరంలో ఉన్నారు.భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు పూర్తి చేసింది. జనసమూహాన్ని నియంత్రించేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.మహా కుంభమేళాలో భద్రతా ఏర్పాట్ల కోసం 37,000 మంది పోలీసులను మోహరించారు. అలాగే 14,000 మంది హోమ్ గార్డులను నియమించారు.భక్తుల భద్రత కోసం 2,750 ఏఐ ఆధారిత సీసీటీవీలు, మూడు వాటర్ పోలీస్ స్టేషన్లు, 18 వాటర్ పోలీస్ కంట్రోల్ రూములు, 50 వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు.చివరి స్నానానికి భక్తుల రద్దీ(Crowd of devotees) ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నందున, మంగళవారం సాయంత్రం నాటికే కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. మహాశివరాత్రి నాడు సజావుగా పుణ్య స్నానాలు జరిగేలా చూసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: ఉప్పొంగుతున్న ఉత్సాహం.. శివభక్తుల పారవశ్యం -
Mahakumbh: ఉప్పొంగుతున్న ఉత్సాహం.. శివభక్తుల పారవశ్యం
నేడు (బుధవారం) మహాశివరాత్రి(Mahashivratri).. మహా కుంభమేళాకు చివరి రోజు.. సంగమ తీరంలో భక్తులు సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. మహా కుంభమేళాకు వచ్చిన భక్తుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. చివరి స్నాన ఉత్సవం వేళ భారీ సంఖ్యలో జనం ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. మహా కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని అధికారులు భారీగా సన్నాహాలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని ఇప్పటికే వాహన రహిత జోన్‌గా ప్రకటించారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రహదారులపై భారీగా జనసమూహం కనిపిస్తోంది. #WATCH | Prayagraj: "I cannot express my sentiments in words... We came here with a lot of excitement... We came here because it is the last day of the #MahaKumbh2025. We are fortunate to have the blessings of Maa Ganga...," says a devotee at the Maha Kumbh pic.twitter.com/UtkHStrcMc— ANI (@ANI) February 26, 2025మహాకుంభమేళా(Mahakumbh Mela)లో పుణ్యస్నానాలు ఆచరించేవారి సంఖ్య మొత్తంగా 67 కోట్లకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్యలలో, మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే జనం అటు వారణాసి, ఇటు అయోధ్యలను సందర్శిస్తున్నారు.#WATCH प्रयागराज: महाशिवरात्रि के अवसर पर श्रद्धालु पावन स्नान के लिए महाकुंभ में पहुंच रहे हैं। ड्रोन वीडियो त्रिवेणी संगम से है। #MahaKumbh2025 pic.twitter.com/h6DwRka6IS— ANI_HindiNews (@AHindinews) February 26, 2025మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌లో స్నానం చేయడానికి వచ్చే సాధువులు, భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం ప్రజలంతా సమాజ సంక్షేమానికి కట్టుబడి ఉండేందుకు ప్రేరణ కల్పిస్తుందని ఆయన అన్నారు.#WATCH | Uttar Pradesh: Devotees continue to arrive in large numbers at Triveni Sangam in Prayagraj to be a part of #MahaKumbh2025 on its last day. The Mela will conclude today, 26th February, on Maha Shivratri. pic.twitter.com/sTAs4XF2kD— ANI (@ANI) February 25, 2025మహా కుంభమేళాకు వచ్చిన ఒక భక్తురాలు మాట్లాడుతూ ‘నా భావాలను మాటల్లో వ్యక్తపరచలేను.మేము ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాం.. ఇది 2025 మహా కుంభమేళాలో చివరి రోజు.. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. గంగా మాత ఆశీస్సులు అందుకోవడం మా అదృష్టం’ అని అన్నారు.#WATCH वाराणसी: महाशिवरात्रि के अवसर पर पूजा करने के लिए काशी विश्वनाथ मंदिर में भक्तों की भीड़ उमड़ रही है। pic.twitter.com/R7GOmiWHTA— ANI_HindiNews (@AHindinews) February 26, 2025మహాశివరాత్రికి ముందే ప్రయాగ్‌రాజ్ మహాకుంభానికి చేరుకున్న భక్తుల సంఖ్య 65 కోట్లు దాటింది. మహాశివరాత్రి నాడు భక్తుల పవిత్ర స్నానాలు సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) స్థానిక అధికారులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. మరోవైపు ఈరోజు భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఘాట్లలో భక్తులు పవిత్ర స్నానాలను క్రమశిక్షణతో చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో నేటి శివరాత్రితో ముగియనుంది. VIDEO | Devotees in large numbers head towards Triveni Sangam to take holy dip on the occasion of Maha Shivratri. #Mahashivratri2025 #MahaKumbh2025 pic.twitter.com/teaCWZWh7x— Press Trust of India (@PTI_News) February 25, 2025ఇది కూడా చదవండి: Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే.. VIDEO | Devotees in large numbers head towards Triveni Sangam to take holy dip on the occasion of Maha Shivratri. #Mahashivratri2025 #MahaKumbh2025 pic.twitter.com/teaCWZWh7x— Press Trust of India (@PTI_News) February 25, 2025 -
నేడే ఆఖరి అమృత స్నానం
మహాకుంభ్ నగర్(యూపీ): కోట్లాది మంది భక్తుల శరణ ఘోష, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య భక్త జన కోటి పుణ్య స్నానాలు, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి కొనసాగింపుగా ‘మహా కుంభమేళా’గా వినతికెక్కిన మహత్తర ఆధ్యాత్మిక వేడుక ఎట్టకేలకు చిట్టచివరకు చేరుకుంది.గత 44 రోజులుగా త్రివేణి సంగమ క్షేత్రంలో అప్రతిహతంగా కొనసాగుతూ కోట్లాది మంది భక్తుల పవిత్ర స్నానాలతో కిక్కిరిసిన ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ఘాట్లు బుధవారం తుదిఅంకంలో భాగంగా మహాశివరాత్రితో మరోసారి ఇసుకేస్తే రాలనంత జనసంద్రంగా మారనున్నాయి. నేడు మహా శివరాత్రిని పురస్కరించుకుని కోటి మంది భక్తులు చిట్టచివరిదైన ‘అమృత్ స్నాన్’ క్రతువులో పాలుపంచుకోనున్నారని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఘాట్ల వద్దకు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అంతటా వాహనాలను నిషేధించారు.‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. ఇటీవల త్రివేణి సంగం ఘాట్‌లో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలుకోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం మరింతగా పోలీసు బలగాలను మొహరించింది. చిట్టచివరి రోజు కావడంతో భక్తులు తాకిడి అనూహ్యంగా ఉండొచ్చన్న అంచనాలతో ప్రభుత్వం అన్ని రకాలుగా సర్వసన్నద్ధమైంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో కుంభమేళా భక్తుల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఘాట్ల వద్ద ఒకేచోట జనం పోగుబడకుండా ప్రత్యేక పర్యవేక్షణా బలగాలను రంగంలోకి దింపారు. -
ఫోన్‌కు పుణ్యస్నానం..భర్తకు ప్రేమతో!
ప్రయాగ్ రాజ్: ఇప్పుడు ఏదైనా ఆన్ లైనే. ఆనాడు ఓ కవి.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. ఇప్పుడు ఆన్ లైన్ కు కాదు ఏదీ అనర్హం అన్న పరిస్థితులు దాదాపు వచ్చేశాయి. ఇప్పటికే ఆన్ లైన్ నిశ్చితార్థాలు, ఆన్ లైన్ పిండ ప్రదానాలు వంటివి ఎన్నో చూశాం. అయితే తాజాగా ఆన్ లైన్ పుణ్యస్నానం కూడా వచ్చేసింది. మహా కుంభమేళాలో కొందరు వ్యాపార కోణంలో ఆన్ లైన్ పుణ్యస్నానాలకు శ్రీకారం చుడితే. మరికొందరు తమ బంధువులు ఎవరైనా అక్కడకు రాలేని పరిస్థితి ఉంటే ఫోన్ తోనే పుణ్యస్నానం పూర్తి చేయిస్తున్నారు. ఫోన్ ను నీటిలో ముంచి భర్తకు పుణ్య స్నానం చేయించిన ఒక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బెడ్ పై ఉన్న భర్తకు వీడియో కాల్ చేసిన సదరు మహిళ.. ఫోన్ ను నీటిలో పలుమార్లు ముంచింది. ఇలా భర్త పుణ్యస్నానాన్ని పూర్తి చేయించింది ఆ మహిళ. దీనికి సంబంధించిన వీడియోను శిల్పా చౌహాన్ అనే మహిళ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేయగా, అది వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by ❣️Shilpa Chauhan Up54❣️ (@adityachauhan7338) మహా కుంభ్‌లో డిజిటల్ స్నానం రూ.1100 మాత్రమేనట.. ఏం బిజినెస్ ఐడియా గురూ..! -
Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే..
ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా పేరొందిన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది. మహా కుంభమేళా చివరి అమృత స్నానంలో కోటి మందికి పైగా భక్తులు పాల్గొంటారని స్థానిక అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసింది.జనవరి 13న మహా కుంభమేళా(Maha Kumbh) ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకు దాదాపు 64 కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. రైళ్లు, విమానాలు, రోడ్డు మార్గాలలో కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. శివరాత్రి( Mahashivratri) సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు నగరంలోనికి ఎటువంటి వాహనాలను అనుమతించరు. అయితే వాటి పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు.ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారులలో మోటార్‌బైక్‌లపై 40 పోలీసు బృందాలను మోహరించారు. కుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి ఒకరోజు అయినందున ప్రయాగ్‌రాజ్‌లోని శివాలయాలను సందర్శించేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నారు. ఆయా శివాలయాలలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇప్పుటికే అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు. కాగా మహా కుంభమేళా ప్రారంభంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP Chief Minister Yogi Adityanath) ఈ కార్యక్రమానికి 45 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఈ సంఖ్య ఫిబ్రవరి 11 నాటికే నమోదయ్యింది. తరువాతి మూడు రోజుల్లో ఆ సంఖ్య 50 కోట్లు దాటింది. తాజాగా.. 60 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని ప్రభుత్వం ప్రకటించింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం వలన జీవన్మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’ -
మహా కుంభమేళాకు వెళ్లి ముగ్గురు మృతి
న్యాల్కల్(జహీరాబాద్): మహా కుంభమేళా యాత్ర రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో మామిడ్గి, గంగ్వార్, మల్గి గ్రామాలు శోకసంద్రమయ్యాయి. రెండు రోజుల్లో తిరిగి వస్తామంటూ చిన్నారులను చెప్పి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మామిడ్గికి చెందిన వెంకట్రాంరెడ్డి, భార్య విలాసిని, వదిన విశాల, ఇటికెపల్లి చెందిన జ్ఞానేశ్వర్‌రెడ్డి, మల్గికి చెందిన మల్లారెడ్డి, సంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయుడు మోతిలాల్ కలిసి 22న కారులో మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్య స్నానాలు చేసి కాశీకి బయలు దేరగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకట్రాంరెడ్డి, విలాసిని, డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కాగా విశాల వారణాసి ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్నారు. వెంకట్రాంరెడ్డి సంగారెడ్డిలో ఉంటూ జహీరాబాద్ ఇరిగేషన్ డీఈఈగా, కోహీర్ ఇన్చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే.. మల్లారెడ్డి కొంత కాలంగా జహీరాబాద్‌లో ఉంటున్నాడు. కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు ప్రియాంశీ 5వ తరగతి, కుమారుడు సాయి స్లోక్ రెడ్డి 7వ తరగతి చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది. వెంకట్రాంరెడ్డి సౌమ్యుడు జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన నీటిపారుదల శాఖ డీఈఈ వెంకట్రాంరెడ్డి విధి నిర్వహణలో అందరికీ ఆదర్శంగా ఉండేవారు. తాను ఉన్నత ఉద్యోగిని అనేవిషయాన్ని పక్కన పెట్టి తానే స్వయంగా పనులు చూసేవారు. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా అన్నీ తానై చూసేవారు. పనుల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడేవాడు కారని, పని సంతృప్తి కరంగా ఉన్నట్లయితేనే బిల్లులు మంజురు సేచేవారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్‌లోని శ్రీసరస్వతీ శిశుమందిరంలో 1998లో 10వ తరగతి పూర్తి చేసుకున్నారు. అనంతరం ఉన్నత చదువులు హైదరాబాద్‌లో పూర్తి చేసుకుని 2007 జహీరాబాద్‌లో ఉద్యోగం పొందాడు. నీటిపారుదల శాఖలో ఏఈగా విధుల్లో చేరారు. అనంతరం పటాన్చెరు, నారాయణఖేడ్‌లో ఏఈగా పని చేశారు. డీఈఈగా పదోన్నతిపై తిరిగి జహీరాబాద్ వచ్చారు. తోటి ఉద్యోగులు, సిబ్బంది, స్నేహితులు, బంధువులతో మర్యాదగా మసలుకుంటూ సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్నారు. రోడ్డుప్రమాదంలో మరణించిన డీఈఈ వెంకట్రాంరెడ్డికి దైవభక్తి అధికం. ప్రతి ఏటా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లివచ్చే వారు. సడెన్‌గా యాత్రకు వెళ్లాలని నిర్ణయం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిరావాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నట్లుగా బంధువుల ద్వారా తెలుస్తోంది. యాత్రకు వెళుతున్న విషయం సన్నిహితులకు కూడా సమాచారం లేదు. కుంభమేళ ముగుస్తుండడంతో ఎలాగైనా వెళ్లిరావాలని బంధువులంతా నిర్ణయించి ప్రయాణమయినట్లు బంధువర్గాల సమాచారం. -
Mahakumbh: మహా శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో కొనసాగుతున్న మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 26న కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు జరగనున్నాయి. ఆరోజు మహాశివరాత్రి కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు భక్తుల రద్దీని నియంత్రించేందుకు, వారికి గట్టి భద్రత కల్పించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.మహాకుంభమేళాలో ఇప్పటివరకూ 63 కోట్ల మందికిపైగా జనం పుణ్యస్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి. మహాకుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. శివరాత్రి(Shivaratri) రోజున త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని చాలామంది భక్తులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపధ్యంలో జిల్లా యంత్రాంగం పలు ఏర్పాట్లు చేస్తోంది.మహాశివరాత్రి పుణ్య స్నానాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు డీఎం రవీంద్ర కుమార్ మందర్ తెలిపారు. ఈ రోజు(మంగళవారం) మహా కుంభమేళాలో 44వ రోజు. ఇప్పటివరకు 63 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు చేశారు. చివరి మహా కుంభ స్నానం ఫిబ్రవరి 26న జరగనుంది. సగటున ప్రతిరోజూ కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic jam) నెలకొంది. దానిని క్లియర్ చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు.ప్రత్యేక రోజుల్లో..పుష్య పూర్ణిమ రూ. 1.70 కోట్ల మంది పవిత్ర స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు 3.50 కోట్ల మంది, మౌని అమావాస్య నాడు 7.64 కోట్ల మంది, వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది, మాఘ పౌర్ణమి వేళ రెండు కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించారు.ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు -
Mahakumbh: ప్రధాని బాటలో సీఎం.. పారిశుద్ధ్య కార్యికుల కాళ్లు కడిగి..
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా(Kumbh Mela)కు భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఇప్పటివరకూ అంటే ఫిబ్రవరి 23 వరకూ మొత్తం 62 కోట్లకుపైగా జనం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజల మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలోనే గత నెలన్నర రోజులుగా కుంభమేళా ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న సిబ్బందిని సీఎం సత్కరించనున్నారు.కుంభమేళా ప్రాంతంలో పరిశుభ్రతా కార్యక్రమాలు(Sanitation) నిర్వహిస్తున్న సిబ్బంది సేవలను సీఎం కొనియాడారు. అలానే వారిని సన్మానించనున్నామని తెలిపారు. ఆయన త్రివేణీ సంగమ ప్రాంతంలో తిరుగాడుతూ స్వయంగా అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మహాకుంభమేళా ముగిసేందుకు ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది. మహాశిరాత్రి రోజున భక్తులు కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు. గడచిన నాలుగు రోజులుగా కుంభమేళా ప్రాంతానికి వస్తున్న సీఎం అక్కడి సాధువులను, అధికారులను కలుసుకుంటున్నారు. కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు పూర్తియిన మర్నాడు అంటే ఫిబ్రవరి 27న సీఎం యోగి మరోమారు ప్రయాగ్‌రాజ్ రానున్నారు. ఆరోజున ఆయన కుంభమేళాకు తరలివచ్చిన భక్తులకు సేవలు అందించిన వారిని సన్మానించనున్నారు. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులను, పడవలు నడిపినవారిని సీఎం సత్కరించనున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు(sanitation workers) సమాజంలో తగిన గౌరవ కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో ప్రధాని మోదీ వారణాసిలో పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగి, సమాజంలో వారి స్థానాన్ని గుర్తుచేశారు.ఇది కూడా చదవండి: విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. -
దయచేసి ప్రయాగ్‌రాజ్ రావొద్దు.. నెట్టింట పోస్టులు
ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళా ముగింపు వేళ ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ సంగమం వద్ద భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా శివరాత్రి పర్వదినాన పుణ్య స్నానాల కోసం ఇంకా కోట్ల మంది ఆధ్యాత్మిక నగరం(Devotional City Prayagraj) వైపు అడుగులేస్తున్నారు. ఈ తరుణంలో నగరవాసుల ప్రజల తరఫున ఓ విజ్ఞప్తి.. అక్కడ నెలకొన్న అధ్వాన్న పరిస్థితులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.‘‘మీకు దణ్ణం పెడతాం.. దయ చేసి ప్రయాగ్‌రాజ్ రావొద్దూ..’’ అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పోటెత్తుతున్న భక్తజనంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అలాగే నగర సందర్శన పేరిట కొందరు ఇప్పటికే ఇక్కడి పరిస్థితిని అధ్వాన్నంగా మార్చేశారని వాపోతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.‘నేను ఎక్కడినుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ప్రయాగ్‌రాజ్ పూర్తిగా విధ్వంసకర దశకు చేరుకుంది. గత సంవత్సరమేమో కుంభమేళా ఏర్పాట్లకు సరిపోయింది. ఇక్కడి రోడ్లన్నీ తవ్వేశారు. ఫ్లై ఓవర్లు వేశారు. అయితే ప్రస్తుతం మహాకుంభమేళా చివరి అమృత స్నానం కూడా ముగిసింది. అయినా జనం తగ్గకుండా రోజురోజుకు పెరుగుతున్నారు ఎందుకో తెలియడం లేదు. ఇక్కడికి రావడం ఇక ఆపండి. భారీ జనసందోహాన్ని భరించే శక్తి ప్రయాగ్‌రాజ్(Pyagraj)కు ఎంత మాత్రం లేదు. నగరంలోని చిన్న చిన్న సందులు కూడా ట్రాఫిక్‌తో నిండిపోయాయి. జనాలకు సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ ఉమ్మేస్తున్నారు. మలమూత్ర విసర్జన చేస్తున్నారు’ అని మండిపడ్డాడు.మహా కుంభమేళా నేపథ్యంలో ఆధునీకరణ పేరిట వేల కోట్ల రూపాయలు కేటాయించింది యూపీ ప్రభుత్వం. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లతో పాటు రకరకాల హంగుల నగరాన్ని ముస్తాబు చేసింది. అంతేకాకుండా.. భారీగా జనం వస్తారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది. అయితే.. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ఆరంభం అయ్యాక ఆ పరిస్థితి దారుణంగా మారింది.అందంగా అలంకరించిన నగరాన్ని.. భక్తుల్లో కొందరు అధ్వాన్నంగా తయారు చేశారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పాదాచారులు ఎక్కడపడితే అక్కడ చెత్తపడేయడం, మూత్రమలవిసర్జన చేసేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగినా ఆ పరిస్థితి మార్పు రాలేదని చెబుతున్నారు. మరోవైపు.. దారులన్నీ జనం, వాహనాలతో నిండిపోయాయి. ఆఖరికి.. ఇరుకు సందులను కూడా వదలకుండా ట్రాఫిక్‌తో నింపేస్తున్నారు.ఇక.. ప్రైవేట్ వాహనాల దోపిడీ దందా, రోడ్లపై ఇష్టానుసారం సంచరించం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటున్నారు మరికొందరు. కుంభమేళా ముగుస్తుందనగా.. రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎందుకు?. గంగానదీ.. త్రివేణి సంగమం ఎక్కడికి పోదు కదా.. తీరికగా వచ్చి పుణ్యస్నానాలు చేసుకోవచ్చు కదా అంటూ కొందరు.. ఇంకోసారి ప్రయాగ్‌రాజ్ వైపు రావొద్దంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. -
Mahakumbh: జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా..
మహాకుంభమేళా.. ప్రపంచం యావత్తూ తరలివచ్చి, కనులారా వీక్షిస్తున్న మహాద్భుత ఉత్సవం. ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా శివరాత్రి పర్వదినం అంటే ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమం వేదికగా ఈ మహోత్సవం జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కుంభమేళా భారత్‌కు పలు కొత్త రికార్డులను కూడా అందించింది. మహాకుంభమేళా ముగుస్తున్న తరుణంలో ఈ ఉత్సవంలో మహోన్నతంగా నిలిచిన కొన్ని అంశాలివే..విదేశీయుల భాగస్వామ్యంమహాకుంభమేళా(Mahakumbh Mela)కు భారీగా జనం తరలివచ్చారు. 183 దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకూ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించినవారి సంఖ్య 60 కోట్లను దాటింది. ఒక్క మౌని అమావాస్య నాడు ఏకంగా 10 కోట్లకుపైగా భక్తులు పవిత్ర స్నానం చేయడం విశేషం.ఆధునిక సాంకేతికతమహాకుంభమేళా డిజిటల్ మహా కుంభ్(Digital Maha Kumbh) దిశగా సాగింది. ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా ఈ ఉత్సవం నిలిచింది. మహాకుంభమేళాలో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిజిటల్ మోనిటరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఏఐ, వీఆర్, ఏఆర్, లిడార్, ఎల్ఈడీ డిస్ప్లే, హోలోగ్రామ్ల వంటి అత్యాధునిక సాంకేతికతలు వినియోగించారు. భక్తులకు కట్టుదిట్టమైన భద్రతను అందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగించారు.ఆకాశంలో అరుదైన దృశ్యంమహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఆ రోజున మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినం కావడం విశేషం. ఆనాడు కుంభమేళాలో చివరి రాజ స్నానం ఆచరిస్తారు. మహా కుంభమేళా ముగింపు రోజున ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించనుంది. సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు ఒకేసారి కనిపించనున్నాయి. మహా కుంభమేళా ముగింపు రోజున బుధుడు, శుక్రుడు, శని, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ మొదలైన ఏడు గ్రహాలు సూర్యునికి ఒక వైపున ఒకే వరుసలో కనిపించనున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సౌర వ్యవస్థలో ఇటువంటి అరుదైన దృశ్యం అత్యంత అరుదుగా కనిపిస్తుంది.ఆర్థిక భాగస్వామ్యంఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళాను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా ముందుకు సాగింది. యూపీ సర్కారు కుంభమేళా బడ్జెట్‌కు రూ. 6,382 కోట్లు కేటాయించింది. దీనిలో రూ. 5,600 కోట్లు ఈవెంట్ల నిర్వహణ , మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెచ్చించింది. మహాకుంభమేళా పూర్తయ్యేనాటికి యూపీ ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందనే అంచనాలున్నాయి. మహా కుంభమేళా కారణంగా స్థానికంగా ఉన్న చిన్న, పెద్ద వ్యాపారులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే.. -
Mahakumbh: భారత్-బంగ్లా ఉద్రిక్తతలకు ఉపశమనం
ప్రయాగ్‌రాజ్: గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మహాకుంభమేళా నేపధ్యంలో తగ్గుముఖం పట్టాయి. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన దరిమిలా ఆ దేశంలో అశాంతి చెలరేగింది. ఈ నేపథ్యంలో మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయి. ఈ ఘటనల నేపధ్యంలో భారత్- బంగ్లాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఈ ఉద్రిక్తతలకు పరిష్కార మార్గంగా మారింది.బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం మహాకుంభ్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు బంగ్లాదేశ్ కళాకారుల బృందానికి ఆర్థికసాయం అందించింది. గంగా వేదికపై జరిగిన 10వ ఇండియా ఇంటర్నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురు సభ్యుల నృత్య బృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) సంయుక్తంగా నిర్వహించాయి. బంగ్లాదేశ్ కొంతకాలంగా భారతదేశంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూవస్తోంది.అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శన, 30వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలైనవాటిలో బంగ్లాదేశ్ భాగస్వామ్యం వహించలేదు. అంతకుముందు ఈ కార్యక్రమాలలో బంగ్లాదేశ్ పాల్గొంటూ వచ్చింది. తాజాగా కుంభమేళాలో ప్రదర్శన నిర్వహించిన బంగ్లాదేశ్ కళాకారుల బృందానికి ఢాకా విశ్వవిద్యాలయ నృత్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాచెల్ ప్రియాంక పెర్సిస్ నాయకత్వం వహించారు. ఫిబ్రవరి 22,23లలో మహా కుంభ్‌లో రెండు రోజుల పాటు బంగ్లాదేశ్ కళాకారుల బృందం నృత్యప్రదర్శనలు నిర్వహించింది. ఈ నృత్య బృందం త్వరలో గుజరాత్, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, బీహార్, అస్సాం, మేఘాలయలలో ప్రదర్శనలు ఇవ్వనుంది. ఈ నెలాఖరులో ఢిల్లీలో బంగ్లాదేశ్ కళాకారులు ప్రదర్శన నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే.. -
Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే..
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ముగింపుదశకు చేరింది. మహాశివరాత్రి(ఫిబ్రవరి 26)తో ఈ మహోత్సవం ముగియనుంది. ఈ నేపధ్యంలో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శివరాత్రి రోజున మహాకుంభమేళాలో చివరి పవిత్ర స్నానాలు జరగనుండటంతో అధికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.మహాశివరాత్రి(Mahashivratri) రోజున ఇక్కడికి తరలివస్తున్న భక్తులందరికీ పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించే దిశగా అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా భక్తులు తరలివస్తున్న నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు చేరే అన్నిమార్గాల్లో ట్రాఫిక్‌జామ్ నెలకొంటోంది. దీనిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనం పెద్ద సంఖ్యలో రైళ్లలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు.మహా కుంభమేళా(Mahakumbh) దృష్ట్యా ప్రతిరోజూ 80 నుండి 100 రైళ్లను రైల్వేశాఖ ప్రయాగ్‌రాజ్ మీదుగా నడుపుతోంది. ఇప్పుడు మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని, ఫిబ్రవరి 26న 200 కి పైగా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో 18 నుండి 20 కోచ్‌లు ఉంటాయి. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా 50 కి పైగా సాధారణ రైళ్లను రద్దు చేశారు. మహా కుంభమేళా సమయంలో భక్తుల కోసం 14 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి.శనివారం (ఫిబ్రవరి 22) వరకు 60 కోట్లకు పైగా భక్తులు మహా కుంభ స్నానం చేశారని డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని మహాకుంభమేళా ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారని, సంగమ ప్రాంతానికి వచ్చే భక్తులు సురక్షితంగా స్నానం చేసి, వారి గమ్యస్థానానికి చేరుకునేలా పర్యవేక్షించేందుకు పలువురు అధికారులు ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్లులు ప్రయాగ్‌రాజ్‌కు ఏ మార్గం నుండి వచ్చినా, దానికి సమీపంలోని పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారని వైభవ్ కృష్ణ తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh: వామ్మో.. ఈ రైళ్లు ఇంతలేటా.. ఇక కుంభమేళాకు వెళ్లినట్లే! -
మహాకుంభమేళా ముగింపు.. ఆవిష్కృతం కానున్న మరో అద్భుత ఘట్టం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela 2025)లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో ఏడు గ్రహాలు బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శని, యూరేనస్, నెప్ట్యూన్లు ఒకే సరళరేఖపై రానున్నట్లు తెలుస్తోంది.ఈ గ్రహాల సమన్వయం నెగటివ్ గ్రహ ప్రభావాలను తగ్గించి, ప్రపంచంలో శాంతి, సమర్థత, సంపద తీసుకురానుందని ఆధ్యాత్మిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అసాధారణ ఖగోళ సంఘటన కుంభమేళా తుది పవిత్ర స్నానానికి మరింత ప్రత్యేకతను ఇవ్వనుంది.మహాశివరాత్రిపై గ్రహ ప్రభావంజ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ శుక్లా గ్రహాల కదలికల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో ఉండగా, శని కుంభ రాశిలో ఉండగా, బృహస్పతి వృషభ రాశిలో ఉండటం మహాకుంభమేళా ప్రారంభమైంది. కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26న గ్రహాల శక్తివంతమైన సమన్వయంతో జరగనుంది. ఆరోజు చంద్రుడు, బుధుడు, సూర్యుడు శని కుంభ రాశిలో ఉండగా, శుక్రుడు, రాహు మీన రాశిలో ఉండగానే బృహస్పతి వృషభ రాశిలో ఉండనుంది. ఈ గ్రహాల మార్పుతో ఫిబ్రవరి 28న గ్రహాలు ఒకే సరళరేఖ వైపు పయనిస్తాయని అన్నారు. ఫలితంగా ప్రతికూలతలు తొలిగి శుభపరిణామాలు జరుగుతాయని శుక్లా తెలిపారు. గ్లోబల్ మార్పుఫిబ్రవరి 26, 2025న గ్రహాల సమన్వయంతో ప్రపంచంలో ప్రతికూలతలు తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ మాట్లాడుతూ.. 2019 నుండి ప్రపంచాన్ని అనేక ప్రతికూల పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. కోవిడ్-19 ,ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం దేశాల్లో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే, గ్రహాల మార్పులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు. శాంతి, స్థిరత్వం కొనసాగే అవకాశం ఉందని అన్నారు. -
Mahakumbh: వామ్మో.. ఈ రైళ్లు ఇంతలేటా.. ఇక కుంభమేళాకు వెళ్లినట్లే!
యూపీలో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela) మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దీంతో బీహార్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాలనుకుంటున్న భక్తులు పలు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పట్నా జంక్షన్‌తోపాటు బీహార్‌లోని పలు రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైళ్లలోకి ఎలాగైనా ఎక్కాలని పలువురు ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిని నిలువరించడం రైల్వే పోలీసులకు కష్టంగా మారింది. కాగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే ఈ రైళ్లు ఊహకందనంత లేటుగా నడుస్తున్నాయి.బీహార్(Bihar)లోని పట్నా మీదుగా 10 రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ చాలా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్ నుంచి పట్నా వచ్చే ప్రత్యేక రైలు (23320) ఏకంగా 37 గంటలు లేటుగా గమ్యస్థానానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 12:30కు ప్రయాగ్‌రాజ్ నుంచి బయలుదేరిన ఈ రైలు శనివారం రాత్రి 10:18కి పట్నా జంక్షన్ చేరుకుంది. ఇదేవిధంగా సిక్కిం ఎక్స్‌ప్రెస్ కూడా శనివారం 20 గంటలు లేటుగా పట్నా చేరుకుంది. అనన్‌సోల్ మహాకుంభ్ రైలు 9 గంటలు ఆలస్యంగా నడిచింది. కామాఖ్య నుంచి బయలుదేరిన కుంభమేళా స్పెషల్ రైలు నాలుగు గంటలు లేటుగా గమ్యస్ణానానికి చేరుకుంది. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన -
Mahakumbh: వెలుపల లక్ష వాహనాలు.. 60 కోట్లు దాటిన పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు ఆఖరి ఆదివారం. దీంతో సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లెక్కకుమించిన రీతిలో భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ వెలుపల ఎంట్రీపాయింట్(Entry point)ల వద్ద లక్షకుపైగా వాహనాలు నిలిచివున్నట్లు సమాచారం.శనివారం సాయంత్రం నుంచే కుంభమేళా ప్రాంతంలో అత్యంత రద్దీ నెలకొంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనికితోడు రాబోయే మహాశివరాత్రికి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా స్థానిక అధికారులు ముందస్తు ఏర్పాట్లుపై దృష్టి సారించారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడు ఎంట్రీపాయింట్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం సంగమం మెయిన్ ఎంట్రీ పాయింట్‌లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ సేతు(Dr. Shyama Prasad Sethu) చౌరస్తా వద్ద ఐదు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో రీవా పరిధిలోని చాక్ఘాట్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడు ఎంట్రీపాయింట్లను మూసివేయడంతో భక్తులు ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం నడిచి సంగమస్థలికి చేరుకుంటున్నారు. శనివారం నాటికి కుంభమేళాలో పవిత్రస్నానాలు చేసినవారి సంఖ్య 60 కోట్లు దాటింది. మహాకుంభమేళాకు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాకు 45 కోట్లమంది వస్తారని అంచనా వేశారు. అయితే ఆ అంచనా ఇప్పటికే దాటిపోయింది. 73 దేశాల ప్రతినిధులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చి పుణ్యస్నానాలు చేయడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా చదవండి: Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు -
Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Mahakumbh) అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 26(శివరాత్రి)తో కుంభమేళా ముగియనుంది. ఈ నేపధ్యంలో భక్తులు త్రివేణీ సంగమానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి తొక్కిసలాట ఘటనలు లాంటివి చోటుచేసుకుండా ఉండేందుకు యూపీ సీఎం స్వయంగా కుంభమేళాను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన అరుదైన రికార్డును కూడా నెలకొల్పారు.జనవరిలో కుంభమేళా ప్రారంభం కావడానికి ముందు నుంచి ఫిబ్రవరి 22 వరకు గడచిన 45 రోజుల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) 12 సార్లు కుంభమేళాను సందర్శించారు. దీంతో అత్యధికంగా కుంభమేళాను సందర్శించిన సీఎంగా చరిత్ర సృష్టించారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి మహా కుంభమేళా 1954లో జనవరి 14 నుండి మార్చి 3 వరకు జరిగింది. ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ రెండుమూడు సార్లు సంగమ స్థలికి వచ్చి పరిస్థితులను పర్యవేక్షించారు. ఆ తరువాత మరే ముఖ్యమంత్రీ కుంభమేళాను పదేపదే సందర్శించలేదు.సీఎం యోగి కుంభమేళా సందర్శనలుజనవరి 09: 13 అఖాడాలు, దండిబారా, ఖాక్ చౌక్ మహాసభల శిబిరాలను సీఎం యోగి సందర్శించారు. డిజిటల్ మీడియా సెంటర్‌ను ప్రారంభించారు.జనవరి 10: ప్రసార భారతి ఛానల్ కుంభవాణిని ప్రారంభించి, రవాణా సంస్థ బస్సులకు పచ్చజెండా ఊపారు.జనవరి 19: పూజ్య శంకరాచార్య తదితర సాధువులతో సమావేశమయ్యారు. పోలీసు గ్యాలరీ, రాజ్యాంగ గ్యాలరీ, పర్యాటక గ్యాలరీలను ప్రారంభించారు.జనవరి 22: మంత్రివర్గంతో పవిత్ర సంగమ స్నానం చేశారు.జనవరి 25: గురు గోరక్షనాథ్ అఖారాలో, విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad) సమావేశంలో పన్నెండు శాఖల యోగి మహాసభలో అవధూత వేషధారణలో కనిపించారు.జనవరి 27: హోంమంత్రి అమిత్ షాను స్వాగతించారు. త్రివేణి సంగమంలో పూజలు చేశారు.ఫిబ్రవరి 01: భారత్ సేవాశ్రమ శిబిరాన్ని సందర్శించారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రపంచంలోని 73 దేశాల దౌత్యవేత్తలతో సంభాషించారు.ఫిబ్రవరి 04: బౌద్ధ మహా కుంభ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూటాన్ రాజుకు స్వాగతం పలికారు.ఫిబ్రవరి 05: ప్రధాని మోదీకి స్వాగతం పలికి, త్రివేణి సంగమంలో పూజలు చేశారు.ఫిబ్రవరి 10: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.ఫిబ్రవరి 16: ప్రదీప్ మిశ్రా కథాశ్రవణం, ప్రభు ప్రేమి సంఘ్ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఫిబ్రవరి 22: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు. మహాశివరాత్రి సన్నాహాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (ఆదివారం) మరోమారు మహాకుంభ్ నగర్ కు రానున్నారు. గత అక్టోబర్‌లో మహా కుంభ్ లోగో విడుదలైన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్ రావడం ఇది 18వ సారి అవుతుంది.ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. -
మహా కుంభ్‌కు 60 కోట్ల మంది..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు జన జాతర కొనసాగు తోంది. జనవరి 13వ తేదీన మే ళా అధికారికంగా ప్రారంభం కాక ముందు నుంచే మొదలైన భక్తుల రాకడ రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 45 కోట్ల మంది వరకు రావచ్చన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంచనా తలకిందులైంది. ఇప్పటికే 60 కోట్ల మార్కును దాటినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు. 26వ తేదీన కుంభమేళా ముగిసేసరికి ఇది 75 కోట్లకు చేరుకునే అవకాశముందని అధికార యంత్రాంగం చెబుతోంది. చివరి రోజైన 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినం, ఆఖరి షాహీ స్నాన్ ఉండటంతో త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తారని యంత్రాంగం అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఇలా ఉండగా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబసభ్యులతో పాటు శనివారం త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించారు. ఆయనతోపాటు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆయన మంత్రివర్గ సహచరులు కూడా స్నానాలు చేశారు. -
మహా ’కాసుల’ మేళా!
సాక్షి, బిజినెస్ బ్యూరో: మహా కుంభమేళా కాసులు కురిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ వేడుక.. వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు చేయనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఇది భారత్‌లో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందని సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపర, ఆధ్యాత్మిక సమావేశంగా గుర్తింపు పొందిన ఈ కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు పాల్గొన్నారు. అంచనాలను మించి..విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని ఈ కార్యక్రమం దృఢంగా నిర్వచించిందని ఖండేల్వాల్ అన్నారు. ‘డైరీలు, క్యాలెండర్లు, జనపనార సంచులు, స్టేషనరీ తదితర మహాకుంభ నేపథ్య ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. కచి్చతమైన బ్రాండింగ్ కారణంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మహా కుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు.అలాగే దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని భావించారు. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న అపూర్వ ఉత్సాహం కారణంగా.. ఉత్సవాలు ముగిసే నాటికి ఇంకా భారీ సంఖ్యలో ఈ మహా కుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు అయ్యే అవకాశం ఉందని ఖండేల్వాల్ చెప్పారు. భారీగా ఆర్థిక కార్యకలాపాలుఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ కార్యక్రమం గణనీయ ప్రోత్సాహాన్ని అందించిందని, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించిందని సీఏఐటీ వెల్లడించింది. ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, మతపర దుస్తులు, పూజా సామగ్రి, హస్తకళలు, వ్రస్తాలు, దుస్తు లు, వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సేవలు, మీడియా, ప్రకటనలు, వినోదం, పౌర సేవలు, టెలికం, మొబైల్, ఏఐ ఆధారిత సాంకేతికత, సీసీటీవీ కెమెరాలు, ఇతర పరికరాలు వంటి అనేక వ్యాపార విభాగాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు నమోదయ్యాయని వివరించింది. 150 కిలోమీటర్ల పరిధిలో లబ్ధిమహాకుంభ మేళా ఆర్థిక ప్రయోజనాలు ప్రయాగ్‌రాజ్‌కు మాత్రమే కాకుండా 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించాయి. అయోధ్య, వారణాసి, ఇతర మతపర ప్రదేశాలకు యాత్రికులు వెల్లువెత్తారు. మహాకుంభ మేళా భారత్‌లో వ్యాపారం, వాణిజ్యం, సాంస్కృతిక వ్యవస్థ రూపురేఖలను సానుకూలంగా మారుస్తుందని, ఏళ్ల తరబడి కొత్త రికార్డును సృష్టిస్తుందని భావిస్తున్నారు. -
జీవితంలో ఒక్కసారే ఇలాంటి చాన్స్ వస్తుంది: తమన్నా
‘‘మహా కుంభమేళా జీవితంలో ఒక్కసారే వస్తుంది. అలాగే ‘ఓదెల 2’ లాంటి సినిమాలో నటించే అవకాశం కూడా జీవితంలో ఒక్కసారే వస్తుంది’’ అని తమన్నా అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.ప్రయాగ్ రాజ్‌లోని మహా కుంభ మేళాలో త్రివేణి సంగమం వద్ద నాగ సాధువుల సమక్షంలో ‘ఓదెల 2’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘సంపత్ నంది విజన్‌ని దర్శకుడు అశోక్ తేజ అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చాడు. సంపత్ నందిగారితో నాలుగు సినిమాలు సైన్ చేశాను. కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత తమన్నా మాంసాహారం తినడాన్ని మానేశారు.‘అమ్మోరు’లో సౌందర్యగారిని, ‘అరుంధతి’ మూవీలో అనుష్కగారిని ఎంత ఆరాధించామో... అలా ఈ సినిమాతో తమన్నా కూడా ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన సంపత్ నందిగారికి, తమన్నా, డి. మధుగార్లకు ధన్యవాదాలు’’ అని తెలిపారు అశోక్‌తేజ. ‘‘ఇది థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రం’’ అన్నారు డి. మధు. -
Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్ సుమ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela) అత్యంత ఉత్సాహంగా కొన సాగుతోంది. ఇప్పటికే 60కోట్ల మంది భక్తులు తరలి వచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం త్వరలో ముగియనున్న నేపథ్యంలో భక్తుల సందడి మరింత పెరిగింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో స్నానాలు చేసిన తమభక్తిని చాటుకున్నారు. రాజకీయ, వ్యాపారం, క్రీడారంగ ప్రముఖులతోపాటు, పలువురు సినీ స్టార్లు మహాకుంభమేళాను దర్శించు కున్నారు. ఇపుడు ఈ కోవలో ప్రముఖ యాంకర్ సుమ (sumakanakala) నిలిచారు. మహాకుంభ మేళా సందర్శనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తొలిసారి మహాకుంభమేళాకు వచ్చాను అంటూ సంతోషాన్ని ప్రకటించారు. ఇదీ చదవండి:ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!కాగా ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా. ఈ మహా వేడుక జనవరి 13న కుంభమేళా ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 21 వరకు సాగనుంది. ఇప్పటిదాకా మొత్తం 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.ఓదెల -2 టీజర్ లాంచ్ సందర్బంగా మహాకుంభకు వెళ్లిన సుమ అక్కడ పవిత్న స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మూవీ టీంకు అభినందనలు తెలిపారు. మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేసారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ నటిస్తున్నారు. నాగ సాధు పాత్రలో ఆమె స్టన్నింగ్ లుక్ లో కనిపించింది. 2022లో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకి సీక్వెల్. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు
లక్నో: యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు పవిత్ర సంగమస్థలిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తాజాగా యూపీలోని 75 జైళ్లలో గల ఖైదీలు కూడా త్రివేణీ సంగమంలోని నీటితో పవిత్ర స్నానాలు చేశారు. యూపీ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాగ్‌రాజ్ నుంచి పవిత్ర జలాలను రాష్ట్రంలోని 75 జైళ్లకు తీసుకువచ్చారు. జైళశాఖ మంత్రి దారా సింగ్ నేతృత్వంలో ఖైదీల పుణ్యస్నానాల కార్యక్రమం సాగింది. లక్నో(Lucknow)లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ‘ప్రపంచంలోని ప్రజలంతా కుంభమేళాలో స్నానాలు చేయాలని ఉత్సాహం చూపిస్తుంటే, ఇక్కడి ఖైదీలకు ఎందుకు ఆ అవకాశం కల్పించకూడదని అనిపించింది. అందుకే ఖైదీలకు కూడా పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించాలని అనుకున్నాం’ అని అన్నారు. జైలు అధికారులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 75 జైళ్లలో మొత్తం 90 వేల మంది ఖైదీలున్నారన్నారు. జైళ్ల డైరెక్టర్ జనరల్(డీజీ) పీవీ రామశాస్త్రి మాట్లాడుతూ పవిత్ర సంగమం నుంచి తీసుకువచ్చిన జలాలను అన్ని జైళ్లకు పంపించామని, ఆ నీటిని స్నానాలకు ఉపయోగించే నీటిలో కలిపి, తరువాత డ్రమ్ములలో నింపారన్నారు. ఆ తరువాత ఖైదీలంతా ప్రార్థనలు చేసి, పుణ్యస్నానాలు చేశారన్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి తెచ్చిన అమృత కలశంతో పూజలు చేసిన తర్వాత ఖైదీలు పుణ్యస్నానాలు ఆచరించారని బాగ్పట్ జిల్లా(Baghpat District) జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఖైదీలు గంగామాతను కొనియాడుతూ ఎంతో ఉత్సాహంగా స్నానాలు చేశారని, ఈ అవకాశం కల్పించిన జిల్లా జైలు యంత్రాంగానికి ఖైదీలు కృతజ్ఞతలు తెలిపారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Sambhal: లౌడ్ స్పీకర్ బ్యాన్ చేశారని.. -
Mahakumb: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జనవరి 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. భక్తులు తండోపతండాలుగా త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో సంగమతీరం నిత్యం భక్తుల రద్దీతో ఉంటోంది. ఫిబ్రవరి 26తో కుంభమేళా ముగుస్తున్న తరుణంలో ఈ శనివారం, ఆదివారం (ఫిబ్రవరి 22, 23) రోజుల్లో భక్తులు మరింతగా పోటెత్తే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.కుంభమేళా చివరిదశకు చేరుకుంది. ఈరోజు, రేపు చాలామందికి సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు(Government officials) తగిన ఏర్పాట్లు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంగమతీరంతో పాటు హనుమాన్ మందిరం ప్రాంతాల్లో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ప్రయాగ్‌రాజ్‌లోనే ఉన్నారు. ఈయన కూడా కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉన్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని ప్రస్తుత పరిస్థితుల గురించి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) కుమార్ మందార్ మీడియాతో మాట్లాడుతూ ‘వారాంతంలో భక్తుల రద్దీ ఏర్పడనున్న తరుణంలో మరిన్ని ఏర్పాట్లు చేశాం. ఇక్కడికి వచ్చేవారికి పటిష్టమైన భద్రతను అందించేందుకు చర్యలు చేపట్టాం. సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశాం. ముందస్తుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీల సమీక్షా సమావేశం జరిగింది. ప్రవిత్ర స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షిస్తున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: స్నానపు దృశ్యాలు అప్లోడ్ చేసిన వారిపై చర్యలు -
మహా కుంభమేళాలో డిజిటల్ స్నానం! వీడియో వైరల్
మహా కుంభమేళాకు (Maha Kumbh) సంబంధించి ప్రతిరోజూ పలు వింత వార్తలు, కథనాలు వస్తున్నాయి. త్రివేణి సంగమంలో తమ పాపాలను కడుక్కోవడానికి కొందరు వస్తుంటే మరికొందరు ఎప్పుడో దూరమైన తమ కుటుంబాలతో తిరిగి కలుస్తున్నారు. కొందరికి మాత్రం పెద్ద జనసమూహాల మధ్య కొత్త వ్యాపార ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమానికి ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది యాత్రికులను ఆకర్షించింది. అయితే ప్రయాణం చేయలేని వారి కోసం, స్థానిక ఔత్సాహిక ఎంట్రాప్రెన్యూర్ దీపక్ గోయల్ 'డిజిటల్ స్నాన్' (Digital Snan) సర్వీస్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా భక్తులు సంగమంలో స్నానం కోసం వాట్సాప్ ద్వారా తమ ఫొటోలను పంపవచ్చు. ఇందుకోసం అతను ఒక్కొక్కరికి రూ.1,100 ధర నిర్ణయించాడు.సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలుమహా కుంభమేళాలో డిజిటల్ స్నానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమర్శలతోపాటు ఉత్సుకతనూ రేకెత్తించింది. కొంతమంది యూజర్లు ఈ ఆలోచనను విశ్వాస దోపిడీ అంటూ విమర్శిస్తూ ఉంటే.. మరికొందరు అక్కడికి వెళ్లలేని వారికి ఇది అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: ‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!ఆధునిక సాంకేతికతతో విశ్వాసం ముడిపడి ఉండటం ఇదే మొదటిసారి కాదు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఆన్లైన్లో దాని గురించి ఒక కరపత్రాన్ని పంచుకున్నప్పుడు ఇలాంటి 'వాట్సాప్ సాల్వేషన్' సర్వీస్ దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి సర్వీస్‌లు ఆధ్యాత్మికపరమైన ప్రామాణికతను పలుచన చేస్తాయని విమర్శకులు వాదిస్తున్నప్పటికీ, డిజిటల్ ప్రపంచంలోనూ సంప్రదాయానికి ప్రాధాన్యత ఎలా కొనసాగుతోందో కూడా అవి తెలియజేస్తున్నాయి.Digital Kumbh Snan 😭😭 and people are even paying him 👇pic.twitter.com/qGBr168p0f— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) February 21, 2025 -
‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh) అంతిమ దశకు వచ్చేసింది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు సంగమ తీరానికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా ఈ మహా కుంభమేళా వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్ల ( సుమారు 360 బిలియన్ డాలర్లు) విలువైన వ్యాపారాన్ని సృష్టిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT ) తాజాగా అంచనా వేసింది.ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా మారుతుందని భావిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ ఆధ్యాత్మిక సంరంభానికి 40 కోట్ల మంది తరలివస్తారని, దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని ప్రారంభంలో అంచనా వేశాయి. అయితే 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ అపూర్వమైన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహం కారణంగా ఇందులో పాల్గొన్నవారి సంఖ్య ఇప్పటికే 60 కోట్లు దాటి ఉంటుందని, రూ. 3 లక్షల కోట్లకు పైగా భారీ వ్యాపార టర్నోవర్ జరుగుతుందని తాజాగా అంచనాలను సవరించారు.సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ కూడలి అని, విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని దృఢంగా స్థాపించిందని అభివర్ణించారు. మహా కుంభ్ స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. మహా కుంభ్ థీమ్‌తో తీర్చిదిద్దిన డైరీలు, క్యాలెండర్లు , జనపనార సంచులు, స్టేషనరీ వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం కారణంగా అమ్మకాలు పెరిగాయి.150 కి.మీ విస్తరించిన వ్యాపారంమహా కుంభమేళా ఆర్థిక ప్రభావం ప్రయాగ్‌రాజ్‌కే పరిమితం కాలేదు. ఇక్కడికి 150 కి.మీ పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు కూడా గణనీయమైన వ్యాపార వృద్ధిని సాధించాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. మరోవైపు అయోధ్య, వారణాసి వంటి తీర్థ స్థలాలకు యాత్రికుల సందర్శనలు పెరిగాయి. ఈ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం లభించింది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్లు , రోడ్లు అండర్‌పాస్‌లతో సహా మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 7500 కోట్లు ఖర్చు చేసింది. ఈ పెట్టుబడి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగిస్తుందని భావిస్తున్నారు. -
Maha Kumbh : అయ్యో తల్లీ! పుణ్యానికి పోతూ ఇదేం పనిరా కొడకా!
మహాకుంభమేళా(Maha Kumbh Mela) పవిత్ర త్రివేణి సంగమంలో మూడు మునుగులు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా స్నానాన్ని రాజస్నానం (Holybath)గా పరిగణిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ, పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం. అందుకే ఎన్నికష్టాలకోర్చి అయినా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళతారు. అంతేకాదు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా తోడ్కొని వెడతారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇలాంటి దృశ్యాలెన్నింటినో మనం చూశాం కూడా. అయితే జార్ఖండ్‌లోని ఒక వ్యక్తి ఇందుకు భిన్నంగా, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. 65 ఏళ్ల తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో వదిలి మహాకుంభమేళాకు వెళ్లాడు. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేక, ఆ వృద్ధతల్లి నానా యాతన పడింది. మూడు రోజుల పాటు అటుకులను ఆహారంగా సేవించింది. ఆఖరికి అవి కూడా అయిపోవడంతో ప్లాస్టిక్‌ను తినేందుకు కూడా ప్రయత్నించింది. ఈ విషయం ఎలా బయటికి వచ్చింది.జన్మనిచ్చిన తల్లి, అనారోగ్యంతో బాధపడుతోందున్న కనికరం కూడా లేకుండా ఆమెను ఇంట్లో బంధించి భార్యా పిల్లలు, అత్తామామలను వెంటబెట్టుకొని మహా కుంభమేళాకు వెళ్లిపోయాడు. మూడు రోజులపాటు అటుకులతో కడుపు నింపుకుంది. ఉన్న కాసిన్ని అటుకులూ అయిపోవడంతో ఇక ఆకలి బాధకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. బిగ్గరగా రోదించడం మొదలు పెట్టింది. దీంతో ఇరుగుపొరుగు తక్షణమే స్పందించారు. చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో పోలీసులొచ్చి తాళం పగులగొట్టి బాధితురాలిని బయటకు తెచ్చారు. ఆమెకు ఆహారం ఇచ్చి, సేద తీరిన తరువాత, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుమార్తె చాందినీ దేవికి సమాచారం అందించారు.(వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)బాధితురాలు రామ్‌గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజూదేవి. ఆమె కుమారుడు అఖిలేశ్ కుమార్ ప్రజాపతి. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) ఉద్యోగి. అయితే తల్లికి ఇంట్లో భోజనం, తదితర ఏర్పాట్లన్నీ చేసే, తాము ప్రయాగ్ రాజ్ వెళ్లామని కుమారుడు అఖిలేశ్ వాదిస్తున్నాడు. అనారోగ్యంతో ఉందనే ఆమెను తమవెంట తీసుకెళ్లలేదని చెప్పాడు. మరోవైపు రామ్‌గఢ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) పరమేశ్వర్ ప్రసాద్ తల్లిని సీసీఎల్ క్వార్టర్ లోపల బంధించాడని ధృవీకరించారు. ఇదీ చదవండి: నీతా అంబానీ లుక్: వందేళ్లకు పైగా చరిత్ర, తయారీకి రెండేళ్లుకాగా మహా కుంభమేళా 40వ రోజు, సంగమంలో భక్తులు స్నానాలు ఉత్సాహంగా అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు జైలులో ఉన్న ఖైదీలు కూడా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ఇప్పటివరకు 58 కోట్లకు పైగా భక్తులు పవిత్ర గంగానదిలో స్నానం చేశారని జాతర నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీవరకు మహా కుంభమేళా జరగనుంది. -
మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా మరో ఐదురోజుల్లో ముగియనుంది. చివరి వారాంతం కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇవాళ 40వ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిట్లు అధికారులు ప్రకటించారు.కుంభమేళా ముగుస్తుండడంతో ప్రయాగ్‌రాజ్(Prayagraj) సంగమంకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మేలా ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. గురువారం సాయంత్రం గణాంకాల ప్రకారం.. మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. శని, ఆది వారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.గత వారంగా కుంభమేళా భక్తుల సంఖ్య👇ఫిబ్రవరి 13, గురువారం: 80 లక్షల 46 వేలుఫిబ్రవరి 14 శుక్రవారం: 94 లక్షల 98 వేలుఫిబ్రవరి 15 శనివారం: కోటి 36 లక్షల మందిఆదివారం: కోటి 49 లక్షల మందిసోమవారం: కోటి 35 లక్షల మందిమంగళవారం : కోటి 26 లక్షల మందిబుధవారం: కోటి 19 లక్షల మందిగురువారం: కోటి 55 లక్షల మంది..ఇక.. కుంభమేళా(KumbhmelaI నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి చివరి వారంలో మౌనీ అమవాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే రద్దీని నియంత్రించేలా అధిక సిబ్బందిని నియమించారు. మరోవైపు.. పరిసరాలను, సంగమ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే వీఐపీ పాస్‌లను రద్దు చేసిన అధికారులు.. వాహనాల రాకపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.రైల్వే శాఖ కీలక నిర్ణయంమహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రత్యేక హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించింది. సురక్షిత ప్రయాణం కోసం తాము సూచించే మార్గదర్శకాలను పాటించాలని అందులో విజ్ఞప్తి చేస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
మహాకుంభమేళాలో స్టాల్స్ : స్ట్రీట్ వెండర్లుగా అంబానీ, అదానీ, మస్క్.. (ఫొటోలు)
-
మహా కుంభమేళా వేళ మరో అద్భుతం
న్యూఢిల్లీ: కోట్లాది మంది భక్తుల రాకతో మహాకుంభమేళా ఘాట్లు, ప్రాంగణాలు కన్నుల పండువగా కనిపిస్తే ఆ కుంభమేళా ముగిసిన తర్వాత సైతం ఆ కన్నుల పండువ కొనసాగనుంది. అయితే ఈసారి నేలపై కాకుండా వినీలాకాశంలో ఓ అద్భుత దృశ్యం చూపరులకు కనువిందు చేయనుంది. అదే సౌరమండలంలోని ఏడు గ్రహాల సాక్షాత్కారం. యురేనస్, నెప్ట్యూన్ మినహా మిగతా అన్ని సౌరకుటుంబ గ్రహాలను నేరుగా మనం కంటితోనే చూడొచ్చు. ఫిబ్రవరి 28వ తేదీన ఇవి అత్యంత స్పష్టంగా కనిపించి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తనున్నాయి. కాస్తంత దూరంగా ఉండటంతో యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను మనం చూడలేము. టెలిస్కోప్, బైనాక్యులర్ సాయంతో ఈ రెండింటిని చూడొచ్చు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే సూర్యగమన పథమార్గంలోనే ఈ అన్ని గ్రహాలను మనం ఒకేసారి చూడొచ్చు. మహాకుంభమేళా వంటి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకుని పూర్తిచేసుకుంటున్న వేళ గ్రహాలన్నీ సాక్షాత్కారం కావడం అనిర్వచనీయ అనుభూతిని ఇస్తుందని కొందరు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హిందూ ఆచార సంప్రదాయాల్లో గ్రహకూటమిని విశేషమైనదిగా చెప్పుకుంటారు. భారత్‌లో రాత్రి వేళ బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని గ్రహాలను నేరుగా చూడొచ్చు. ఇలా ఎక్కువ గ్రహాలు ఒకేసారి మహాకుంభమేళా కాలంలో దర్శనమివ్వడంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శక్తి ప్రసరణ మరింత తేజోవంతమవుతుందని కొందరు భక్తులు విశ్వసిస్తున్నారు. -
అమ్మకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మోనాలిసా..వీడియో వైరల్
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అంటారు. మోనాలిసా అనే అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. మొన్నటి వరకు ఇళ్లిళ్లూ తిరిగి పూసలు అమ్ముకున్న ఈ యువతి.. మహాకుంభమేళా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. పూసలు అమ్ముకునేందుకు ఆమె కుంభమేళాకి వెళ్లడం..తన నీలికళ్లు, అందం, చిరునవ్వుకు ఫిదా అయిన ఓ వ్యక్తి ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం..అవికాస్త వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ‘స్టార్’ అయిపోయింది. ప్రస్తుతం ఈ నీలికళ్ల సుందరి తన వ్యాపారాన్ని వదిలేసి..సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.మణిపూర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు.. ఇక ఈ సినిమాకు పారితోషికంగా రూ.21 లక్షలు అందుకున్నట్లు సమాచారం. అయితే మొదటి సినిమాకు పారితోషికం తీసుకున్న అనంతరం మోనాలిసా అన అమ్మకి బంగారు గొలుసు కొనిపెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలుపుతూ చూడండి అమ్మకి ఏం కొనిచ్చానో అంటూ వీడియో పెట్టింది.ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.లుక్ మార్చేసిన బ్యూటీప్రస్తుతం తనకున్న క్రేజీని మోనాలిసా క్యాష్ చేసుకుంటుంది. సినిమాలతో పాటు షాప్ ఓపెనింగ్స్‌కి కూడా వెళ్తోంది. తాజాగా ఓ బంగారు ఆభరణాల దుకాణం ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా వెళ్లింది. మొన్నటి వరకు మేకప్ అంటే తెలియని మోనాలిసా..ముఖానికి మేకప్ వేసుకొని తన లుక్‌నే మార్చేసింది. జుట్టు కూడా చిన్నగా కత్తిరించుకుంది. మేకప్ తర్వాత ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. ఒక హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని మోసాలిసాలో ఉన్నాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
Mahakumbh: స్నానపు దృశ్యాలు అప్లోడ్ చేసిన వారిపై చర్యలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే మహా కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళలు, బట్టలు మార్చుకుంటున్న మహిళలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఉదంతం వెలుగుచూసింది దీనిని గమనించిన యూపీ పోలీసులు రంగంలోకి దిగి, నిందితులపై చర్యలకు ఉపక్రమించారు.ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు.. సోషల్ మీడియాలో మహా కుంభమేళాకు సంబంధించిన అభ్యంతరకరమైన పోస్టులు, వదంతులను వ్యాప్తి చేసే వారిపై నిరంతరం పోలీసులు దృష్టిసారిస్తున్నారు. అలాంటివారిని గుర్తించి, చర్యలు చేపడుతున్నారు. మహాకుంభ్‌లో మహిళలు స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు కొందరు వీడియోలు తీసి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్లోడ్ చేస్తున్నారని పోలీసులకు తెలియవచ్చింది. ఇది మహిళల గోప్యత, గౌరవాన్ని ఉల్లంఘించడమేనంటూ పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.యూపీ పోలీసుల ఈ తరహాలోని రెండు ఉదంతాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న @neha1224872024 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుంభమేళాకు వచ్చిన మహిళలు స్నానం చేస్తూ, బట్టలు మార్చుకుంటున్న వీడియోలను ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఖాతాను నిర్వహిస్తున్న వారిని గుర్తించేందుకు యూపీ పోలీసులు మెటా కంపెనీ నుండి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఇదేవిధంగా ఫిబ్రవరి 19న టెలిగ్రామ్ ఛానెల్లోని ఒక ఖాతాపై కేసు నమోదయ్యింది. మహా కుంభోత్సవంలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలను అందుబాటులో ఉంచుతామని టెలిగ్రామ్ ఛానల్ CCTV CHANNEL 11 పేర్కొంది. దీంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు -
స్నానం, ఆచమనం నిరభ్యంతరంగా ఆచరించవచ్చు
లక్నో: మహా కుంభమేళాపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, పవిత్రమైన కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. మహాకుంభమేళాను, సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కుంభమేళా కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదని చెప్పారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని స్పష్టంచేశారు. మన ప్రాచీన గ్రంథాల్లో కూడా కుంభమేళా ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. మహా కుంభమేళాలో ఇప్పటిదాకా 56 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వివరించారు. కుంభమేళా ప్రాధాన్యతను తగ్గించడానికి విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. భారతీయ ఆత్మ అయిన సనాతన ధర్మం గౌరవాన్ని మరింత పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలోని నీళ్లు స్నానానికి పనికిరావంటూ కొన్ని సంస్థలు, వ్యక్తులు చేస్తున్న వాదనను యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. త్రివేణి సంగమంలో నీళ్లు కలుషితమయ్యాయంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కుంభమేళా గురించి అసలేమీ తెలియని వాళ్లే ఇలాంటి దుష్ప్రచారానికి తెరతీశారని ధ్వజమెత్తారు. అక్కడి నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని స్పష్టంచేశారు. కేవలం స్నానాలకే కాదు, తాగడానికి సైతం ఆ నీళ్లు పనికొస్తాయని తేల్చిచెప్పారు. కుంభమేళాలో స్నానం, ఆచమనం నిరభ్యంతరంగా ఆచరించవచ్చని ఉద్ఘాటించారు. ఇటీవల కొన్ని అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని నిర్ధారించాయని గుర్తుచేశారు. గంగ, యమున నదుల్లో వ్యర్థాలు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. మృత్యుకుంభ్ అనడం దారుణం దేశం యావత్తూ ఘనంగా నిర్వహించుకుంటున్న పవిత్రమైన వేడుకపై ప్రతిపక్షాలు బురదజల్లడం హిందువుల మనోభావాలను గాయపరుస్తోందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మహాకుంభ్‌ను వ్యతిరేకిస్తున్న వాళ్లే రహస్యంగా త్రివేణి సంగమానికి వెళ్లి పవిత్ర స్నానాలు చేస్తున్నారని విపక్ష నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహాకుంభ్ కాదు...మృత్యుకుంభ్ అనడం దారుణమని విపక్ష నేతలపై మండిపడ్డారు. కుంభమేళాలో తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వెల్లడించారు. బాధ్యతల నుంచి తాము తప్పించుకోవడం లేదన్నారు. తొక్కిసలాట ఘటనలో 30 మంది మరణించగా, 36 మంది గాయపడినట్టు తెలియజేశారు. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి వస్తూ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన భక్తుల కుటుంబాలను కూడా ఆదుకుంటామని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. -
కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన మహాకుంభమేళా ముగియనున్న దృష్ట్యా.. చర్లపల్లి–దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–దానాపూర్ (07791) ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీ నుంచి 28 వరకు (9 సర్వీసులు) ఉదయం 9.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి రెండోరోజు తెల్లవారుజామున 1.30 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో దానాపూర్–చర్లపల్లి (07792) ప్రత్యేక రైలు ఈ నెల 20 నుంచి 28 వరకు (9 సర్వీసులు) ఉదయం 4.45 గంటలకు దానాపూర్ నుంచి బయలుదేరి.. మర్నాడు రాత్రి 9.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బర్హంపూర్ తదితర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. -
మమతా బెనర్జీపై యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహం
లక్నో: మహా కుంభమేళాపై వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడారాంటూ బుధవారం అసెంబ్లీ వేదికగా మండిపడ్డారాయన.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మహా కుంభమేళాను మృత్యు కుంభమేళాగా అభివర్ణించిన విషయం తెలిసిందే. కుంభమేళా నిర్వహణలో యూపీ ప్రభుత్వం(UP Government) ఘోరంగా విఫలమైందని తీవ్ర విమర్శలే గుప్పించారామె. అయితే ఆమె వ్యాఖ్యలపై అసెంబ్లీలోసీఎం యోగి ఇవాళ స్పందించారు. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 56 కోట్ల మంది సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. నిరాధారమైన ఆరోపణలతో ఆమె వాళ్లందరి విశ్వాసాలతో ఆటాడుకున్నారు అని సీఎం యోగి మండిపడ్డారు. జనవరి చివర్లో ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఘాట్ల వద్ద తొక్కిసలాట జరిగి 30 మంది మరణించారు. కుంభమేళా తొక్కిసలాట మృతులకు, వివిధ రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వచ్చి మృత్యువాత చెందిన వాళ్లకు అసెంబ్లీ వేదికగా సంతాపం ప్రకటించారాయన. ఈ క్రమంలో.. దీదీ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.#WATCH | Lucknow: In the UP assembly, CM Yogi Adityanath says, "While we are participating in the discussion here, at that time more than 56.25 crore devotees have already taken their holy dip in Prayagraj... When we make any baseless allegations or snow fake videos against… pic.twitter.com/VYNnzPn4w1— ANI (@ANI) February 19, 2025కుంభమేళా మృతులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుంది. కానీ, ఇలాంటి సున్నితమైన అంశాన్ని కూడా రాజకీయం చేయడం ఏంటి?. ఈ కుంభమేళాలో దేశం.. ప్రపంచమే పాల్గొంటోంది. అలాంటప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోవాల్సిన పనేముంది? అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. యోగి మాత్రమే కాదు పలువురు బీజేపీ నేతలు కూడా మమత వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైశ్వాల్ మాట్లాడుతూ.. మత విశ్వాసాలు లేనివాళ్లే అలాంటి సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తారంటూ మండిపడ్డారు. మరోవైపు హిందూ సంఘాలు కూడా దీదీపై విరుచుకుపడుతున్నాయి. దీదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ..మహా కుంభమేళాపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే.. దీదీ వ్యాఖ్యలకు ఓ అనూహ్య మద్దతు లభించింది. ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠ్ 46వ శంకారాచార్య అయిన స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి(సద్గురు) మమత వ్యాఖ్యలతో ఏకీభవించారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. భక్తులకు సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. ఇది నిర్వహణ లోపం కాకుంటే మరేమిటి?. మహా కుంభమేళా రాబోతోందని మీకు తెలియదా?. అలాంటప్పుడు మీరు చేసే ఏర్పాట్లు ఇవేనా? అంటూ యోగి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన.#WATCH | Bemetara, Chhattisgarh: On West Bengal CM Mamata Banerjee's 'Mrityu Kumbh' remark, Jagadguru Shankaracharya Swami Avimukteshwaranand Saraswati Maharaj says, "... There was a traffic jam of 300 kilometres, if this is not mismanagement then what is it? People had to walk… pic.twitter.com/pxDXWI5og7— ANI (@ANI) February 19, 2025 -
Maha Kumbh: వేల రూపాయలు తెచ్చిపెట్టిన ‘పర్సు చోరీ’
ప్రయాగ్‌రాజ్: కుంభమేళాలో స్నానం చేస్తే తాము చేసిన పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అయితే దీనికి విరుద్ధంగా కొందరు కుంభమేళా ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతూ పాపాలను మూటగట్టుకుంటున్నారు. మధురలోని బృందావనాన్ని సందర్శించి, అక్కడినుంచి కుంభమేళాకు వచ్చిన ఒక వ్యక్తికి చేదు అనుభం ఎదురయ్యింది. జనసమూహంలో అతని పర్సు చోరీకి గురయ్యింది. ఆ పర్సులో నగదు, విలువైన కాగితాలు ఉన్నాయి. దీంతో అతను కాసేపు బాధపడ్డాడు. తిరిగి తన స్వస్థలానికి చేరడం ఎలా అని ఆలోచించాడు. వెనువెంటనే ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు.జేబులో ఒక్కపైసా కూడా లేకపోవడంతో మరోమార్గం లేక అక్కడున్న కొందరు భక్తులకు తన పరిస్థితి చెప్పుకుని, డబ్బులు సాయం చేయాలని కోరాడు. వారిచ్చిన డబ్బుతో టీ తయారు చేసి విక్రయించసాగాడు. ఇలా కుంభమేళాలో రోజుకు రెండు, మూడు వేలు సంపాదిస్తూ రూ. 50 వేలు జమచేశాడు.పర్సుపోతే పోయిందిగానీ, అతనికి ఒక కొత్త ఉపాధి మార్గం దొరికింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను బృందావనం నుంచి మహాకుంభమేళాలో స్నానం చేసేందుకు వచ్చాను. ఇంతలో నా పర్సు ఎవరో చోరీ చేశారు. ఏం చేయాలో తెలియక టీ విక్రయిస్తూ, డబ్బులు కూడబెట్టాలని నిర్ణయించుకున్నాను. రాత్రనక, పగలనక ఇక్కడికి వచ్చే భక్తులకు టీ అమ్ముతూ వచ్చాను. రోజుకు మూడు వేల రూపాయల వరకూ సంపాదించాను. అలా ఇప్పటివరకూ రూ. 50 వేలు కూడబెట్టాను’ అని తెలిపాడు. ఇది కూడా చదవండి: శివాజీ జయంతి: చిన్న లక్ష్యంతో మొదలుపెట్టి.. -
పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్
న్యూఢిల్లీ: యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వెళుతున్న భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా అక్కడక్కడా ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాగ్‌రాజ్ వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.తాజాగా దుర్గ్(ఛత్తీస్‌గఢ్) నుండి చాప్రా(బీహార్) వరకూ, అలాగే చాప్రా నుండి దుర్గ్ వరకు నడిచే సారనాథ్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ దుర్గ్-చాప్రా సారనాథ్ ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 21 వరకు రద్దు చేశారు. ఈ రైలు ప్రయాగ్‌రాజ్ మీదుగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. దీంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళదామనుకున్న ప్రయాణికులు నిరాశకు గురవుతున్నారు. కాగా ఈ రైలు ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారి డబ్బును రైల్వేశాఖ వారి ఖాతాకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లో భారీ రద్దీని తగ్గించడానికి రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని సంబంధిత అధికారులు తెలిపారు.ఇదేవిధంగా రైలు నంబర్ 55098/55097 గోరఖ్‌పూర్-నర్కటియగంజ్ ప్యాసింజర్ రైలును ఫిబ్రవరి 23 వరకు రద్దుచేశారు. అలాగే రైలు నంబర్ 15080 గోరఖ్‌పూర్-పాటిలీపుత్ర ఎక్స్‌ప్రెస్ కూడా ఫిబ్రవరి 22 వరకు రద్దు చేశారు. మహాశివరాత్రికి ప్రయాగ్‌రాజ్ వెళ్లాలనుకున్న భక్తులకు ఈ వార్త షాక్‌లా తగిలింది. మరోవైపు జయనగర్ నుండి ప్రయాగ్‌రాజ్ మీదుగా న్యూఢిల్లీకి వెళ్లే స్వతంత్ర సేనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు రూట్‌ను మార్చారు. ఈ రైలు ఫిబ్రవరి 28 వరకు ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్ళదు. బీహార్, ఛత్తీస్‌గఢ్‌ల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళుతున్నారు. దీంతో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది.ఇది కూడా చదవండి: రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా? -
రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా?
యూపీలోని జరుగుతున్న కుంభమేళా నేపధ్యంలో చాలామంది వైరల్‌గా మారారు. అయితే వీరందరిలో ప్రయాగ్‌రాజ్‌కు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలినా భోంస్లే ప్రముఖంగా నిలిచారు. ఆమె రాత్రికిరాత్రే సోషల్ మీడియా క్వీన్‌గా మారిపోయారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ నీలికళ్ల సుందరి రిస్క్‌లో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై మోనాలిసా వివరణ ఇచ్చింది.కుంభమేళా మోనాలిసాను చూసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వచ్చి సినిమా ఆఫర్ ఇచ్చారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ పేరుతో కుంభమేళా మోనాలిసా హీరోయిన్గా సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. దీనిని విన్నవారంతా ఇక మోనాలిసా దశ తిరిపోయిందంటూ వ్యాఖ్యానించారు. ఇదే తరుణంలో ఆమె న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అలాగే ఆమె నటన నేర్చుకోవడంతో పాటు, చదువుకున్నదంటూ పలు వార్తలు వినిపించాయి. తాజాగా మోనాలిసా ఒక బ్రాండ్ ప్రమోషన్లో కూడా పాల్గొంది.తాజాగా ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ్ కుంభమేళా గర్ల్ మోనాలిసా రిస్క్‌లో పడిందంటూ వ్యాఖ్యానించారు. ఆమె దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్‌లో పడిందంటూ ఆరోపించారు. సనోజ్ దగ్గర సినిమాను నిర్మించేందుకు సరిపడినంత డబ్బులు లేవని, అయితే లైమ్ లైట్లో ఉండేందుకే ఆయన మోనాలిసాను తన వెంట తీసుకువెళుతున్నారని ఆరోపించారు. అయితే దీనిపై తాజాగా మోనాలిసా వివరణ ఇచ్చింది.ఇన్‌స్టాగ్రామ్‌లో మోనాలిసా షేర్ చేసిన ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ సనోజ్ మిశ్రాపై వస్తున్న విమర్శల్లో నిజం లేదని పేర్కొంది. తానేమీ అతని ట్రాప్‌లో పడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను మధ్యప్రదేశలో ఉన్నానని, యాక్టింగ్ నేర్చుకుంటున్నానని, తన సోదరి, తన పెదనాన్న తనతోనే ఉన్నారని, తానేమీ ఎవరి వలలోనూ పడలేదని పేర్కొంది. సనోజ్ మిశ్రా తనను కుమార్తెలా చూసుకుంటున్నారని, ఆయన చాలా మంచి మనిషి అని, మా సినిమా సవ్యంగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరింది. ఇది కూడా చదవండి: ‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత? -
మహా కుంభ్‌కు 55 కోట్ల మంది
మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ మేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో ఇప్పటి వరకు 55 కోట్ల మంద పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దేశంలోని 143 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది సనాతన ధర్మ పరాయణులు కాగా వీరిలో దాదాపు సగం మంది పుణ్నస్నానాలు ఆచరించినట్లయిందని తెలిపింది. మొత్తం జనాభాలో ఇది 38 శాతంతో సమానమని తెలిపింది.26వ తేదీకల్లా ఈ సంఖ్య 60 కోట్లకు మించిపోనుందని అంచనా వేసింది. జనవరి 13న ప్రారంభమైన కుంభ మేళా ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినంతో ముగియనుండటం తెలిసిందే. ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మత, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంగా నిలిచిపోనుందని యూపీ ప్రభుత్వం తెలిపింది. హోటల్ పరిశ్రమకు పెద్ద ఊతం మహాకుంభ మేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్ల పరిశ్రమ 20 నుంచి 30 వృద్ధి నమోదు చేసుకుందని ప్రభుత్వం తెలిపింది. అదాయ మార్జిన్లు కూడా 5 నుంచి 10 శాతం పెరిగాయంది. సందర్శకుల రాకతో టూర్, ట్రావెల్ పరిశ్రమ కూడా బాగా లబ్ధి పొందిందని వివరించింది. ఈ నెల 26వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్‌లోని మూడు, నాలుగు నక్షత్రాల హోటళ్లు, లాడ్జీలు, లగ్జరీ టెంట్ హౌస్‌లు పెద్ద సంఖ్యలో ముందుగానే బుక్కయ్యాయన్నారు.కుంభ మేళా పొడిగింపు అబద్ధం భక్తుల రద్దీ కొనసాగుతున్న దృష్ట్యా మహా కుంభ్ మేళాను మరికొద్ది రోజులు పొడిగించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజి్రస్టేట్ రవీంద్ర మందర్ స్పష్టతనిచ్చారు. పవిత్ర దినాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కుంభ మేళా 26వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ తేదీల్లో ఎలాంటి మార్పులూ ఉండవని కుండబద్దలు కొట్టారు. పొడిగింపు అంటూ వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. కుంభమేళా కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులెవరూ పరీక్షలను నష్టపోలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అనివార్య కారణాలతో ఎవరైనా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను మిస్సయినా వారి కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని కోరామన్నారు.కాశీకి 17 రోజుల్లో కోటి మంది ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరుగుతున్న వేళ ఫిబ్రవరి 1 నుంచి 17వ తేదీ వరకు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కోటి మంది భక్తులు దర్శించుకున్నారని మంగళవారం అధికారులు తెలిపారు. అత్యంత రద్దీ ఉండే శివరాత్రినాడు కూడా ఇంత రద్దీ లేదన్నారు. ఈ నేపథ్యంలో వారణాసిలోని స్కూళ్లలో 8వ తరగతి వరకు తరగతులను ఈ నెల 27వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. వారణాసిలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతోపాటు మైదాగిన్, గొడొవ్లియా, దశాశ్వమేథ వంటి ముఖ్య ప్రాంతాల్లో తీవ్రమైన రద్దీ నెలకొందని వివరించారు. ప్రాముఖ్యమున్న గంగా ఆరతి కార్యక్రమాన్ని నామమాత్రంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27 నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపడతామని వివరించారు. -
‘మహా కుంభ్‌కాదు.. మృత్యుకుంభ్’ : దీదీ
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం ‘మహాకుంభ మేళా’ను (Maha Kumbha Mela) మహా కుంభ్ కాదు.. మృత్యుకుంభ్ అని వ్యాఖ్యానించారు.పశ్చిమబెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మమతా బెనర్జీ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. ‘కుంభమేళాకు వెళ్లి భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు.. యూపీ సర్కార్ వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసింది. సామాన్యుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.నేను మహా కుంభమేళాను గంగామాతకు గౌరవ సూచికంగా భావిస్తున్నాను. కానీ పేదలకు కనీస సదుపాయాలు లేవు. వీఐపీల కోసం మాత్రమే ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా అందలేదు. పోస్ట్‌మార్టం చేయకుండా మృతదేహాల్ని వారి కుటుంబాలకు అప్పగించారు. పోస్టుమార్టం చేసి, డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తేనే కదా ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందేది. బాధిత కుటుంబాలు ఇప్పుడు ఎక్స్ గ్రేషియా ఎలా పొందుతారు’ అని ప్రశ్నించారు. కాగా, ప్రయాగ్‌రాజ్‌లో (Prayag Raj) జనవరి 13 ప్రారంభమైన మహాకుంభ మేళా 45 రోజులపాటు అంటే ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. -
ఐఐటీ బాబా ట్రాక్ రికార్డ్ : 10,12వ తరగతి మార్కులు వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో పాపులర్ అయిన 'ఐఐటీ బాబా' గుర్తున్నాడా? ఇంజనీర్ బాబాగా పేరొందిన అభయ్ సింగ్ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిష్టాత్మక ఐఐటీ (IIT)బాంబేలో తెలివైన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి, లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలి అభయ్ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టాడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో శాస్త్రీయ విజ్ఞానాన్ని మిళితం చేస్తూ తన విశిష్టమైన విధానంతో మహా కుంభ్‌లో భక్తులను కట్టిపడేశాడు.తాజాగా అభయ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. విద్యార్థి దశలో అభయ్ అద్భుతమైన ట్రాక్ రికార్డు వైరల్‌గా మారింది. 10వ తరగతి, 12వ తరగతి మార్కుల షీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ చక్కర్లు కొడుతోంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన అభయ్ తన 10వ తరగతిలో 93 శాతం, 12వ తరగతి పరీక్షలలో 92.4 శాతం మార్కులు సాధించాడట. ఈ స్కోర్లు అతని మేధో నైపుణ్యాన్ని మరింత హైలైట్ చేస్తున్నాయి. పలు మీడియా నివేదికలు వెలువడ్డాయి. అంతేకాదు 2008లో, అతను IIT-JEE పరీక్షలో 731 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించాడని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఈ టాలెంటే అతడిని దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ అభ్యర్థులలో ఒకటిగా నిలిపిందిఅంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: బెల్లీ ఫ్యాట్ కరగాలంటే, ఈ ఐదు ఆసనాలు చాలు!మహాకుంభ మేళా 2025ల దర్శనమిచ్చిన వివిధ సాధువులు , బాబాలలో ఆకర్షణీయంగా నిలిచిన వారిలో ఒకరు ఐఐటీయన్ బాబా అభయ్ సింగ్ ఒకరు. ఈయన హర్యానాకు చెందినవాడు. ఇంజనీర్ బాబా ఐఐటీ బాంబే నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత, కెనడాలో మూడు సంవత్సరాలు పనిచేశాడు. ఏడాది రూ. 36 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు.. అభయ్ డిజైన్‌లో మాస్టర్స్ (MDs) కూడా చేశాడు అయితే, బాబా ఆ ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఫోటోగ్రఫీలో కోర్సు చేశాడు. ట్రావెల్ ఫోటోగ్రఫీ చేస్తున్న క్రమంలో అతనిలో మార్పుమొదలైంది. కొంతకాలం తన సొంత కోచింగ్‌ను ప్రారంభించాడు. నాలుగేళ్లు డేటింగ్...కానీ నాలుగేళ్లు ఒక అమ్మాయితో డేటింగ్ కూడా చేశాడు. తల్లిదండ్రుల మధ్య ఉన్న వివాదాలు చూసిన తన సంబంధాన్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లలేదని వెల్లడించాడు. ఇక్కడి నుండి ఆయన ఇంజనీరింగ్ వదిలి పూర్తిగా ఆధ్యాత్మికతకు వైపు మళ్లి బాబాగా మారాలని నిర్ణయించుకున్నాడు.తన జీవితమంతా మహాదేవ్కు అంకితం చేశానని కూడా మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. -
కుంభమేళాకు వెళ్లిన హీరో విజయ్ దేవరకొండ ఫొటోలు వైరల్
-
‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సంగమ తీరంలో నిర్వహిస్తున్న కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వానికి పలు సవాళ్లు సంధిస్తున్నారు. వీటికి సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాధానమిచ్చారు. మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని, కోట్లాదిమంది తరలివస్తున్నారని, ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్, కాశీ, అయోధ్యలను కూడా దర్శిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.‘యువ పారిశ్రామికవేత్తలతో సంభాషణ’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మహాకుంభమేళాపై విమర్శలు గుప్పిస్తున్నవారు.. ఈ భారీ కార్యక్రమం కారణంగా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతున్నదని గ్రహించాలన్నారు. మహాకుంభమేళా నిర్వహణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 7,500 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రానికి మూడు లక్షల కోట్లకుపైగా ఆదాయం రానున్నదనే అంచనాలున్నాయన్నారు.కుంభమేళా సందర్భంగా అయోధ్య, ప్రయాగ్‌రాజ్, కాశీ, చిత్రకూట్, గోరఖ్‌పూర్, నైమిశారణ్యంలో పలు వసతులు కల్పించామని సీఎం అన్నారు. ఒక్క ఏడాదిలో అయోధ్యకు కానుకలు, విరాళాల రూపంలో రూ. 700 కోట్లు సమకూరాయన్నారు. మహాకుంభమేళాలో ఫిబ్రవరి 17 నాటికి మొత్తం రూ.54 కోట్ల 31 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారన్నారు. మహాకుంభమేళా ఫిబ్రవరి 26(శివరాత్రి) వరకూ కొనసాగనుంది. ఇది కూడా చదవండి: Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు -
శివరాత్రికి ‘మోనాలిసా’ సందడి.. ఎక్కడంటే..
కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మోనాలిసా ఇప్పుడు విదేశీయానం కూడా చేయబోతున్నారు. అది కూడా శివరాత్రి రోజున.. వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న మోనాలిసా ఖ్యాతి ఇప్పుడు విదేశాలను కూడా తాకింది. ఇంతకీ మోనాలిసా ఎక్కడికి వెళ్లబోతున్నారు? ఏ దేశం నుంచి ఆమెకు ఆహ్వానం అందింది?మారుమూల గ్రామం నుంచి మహానగరం ముంబైకి చేరుకున్న మోనాలిసా త్వరలో బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారు. అయితే ఇంతలోనే ఆమె విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. ఇటీవలి కాలంలో మోనాలిసా ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 26న మోనాలిసా నేపాల్‌లో జరిగే శివరాత్రి వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందుకు ఆమెకు ఇప్పటికే ప్రత్యేక ఆహ్వనం అందింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మోనాలిసా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సనోజ్ మిశ్రా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.ఈ కార్యక్రమ వివరాలను సనోజ్ మిశ్రా ఒక వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఈ వీడియోలో మోనాలిసా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ అందరినీ ఆహ్వానించారు. ప్రస్తుతం మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రా సహకారంతో నటనతో పాటు చదవడం, రాయడం కూడా నేర్చుకుంటున్నారు. తాజాగా ఆమె న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. కుంభమేళాకు వచ్చిన 16 ఏళ్ల మోనాలిసా తన తేనె కళ్లతో అందరి దృష్టిలో పడ్డారు. రాత్రికిరాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయారు.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
Delhi Stampede: రెండు రైళ్లు.. ఒకే పేరు
న్యూఢిల్లీ: రెండు రైళ్లకు ఒకేలాంటి పేరు. ఇరుకైన ఓవర్ బ్రిడ్జి. సమాచార లోపం. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటకు ఇవే ప్రధాన కారణాలని తేలింది. మహా కుంభమేళాకు బయల్దేరిన ప్రయాణికుల్లో చాలామంది 14వ నంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కోసం భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. ‘ప్రయాగ్‌రాజ్ స్పెషల్’ రైలు 12వ ప్లాట్‌ఫాంపైకి వచ్చినట్లు ప్రకటన రావడంతో తమ రైలే ఫ్లాట్‌ఫాం మారిందని భావించారు. భారీ జనసందోహం నడుమ ఏమాత్రం ఆలస్యమైనా రైలు అందదేమోనని భయపడ్డారు. 12వ ప్లాట్‌ఫాంకు చేరేందుకు ఉన్నపళంగా పరుగులు తీశారు. ఓవర్ బ్రిడ్జిపైకి దారితీసే మెట్ల మార్గంపైకి వేలాదిగా ఎగబడ్డారు. దానికి తోడు ఓవర్ బ్రిడ్జి కూడా సన్నగా ఉంది. వాటిపై ప్రయాణికులు పరస్పరం నెట్టేసుకుంటూ దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయారు. చాలామంది ఊపిరాడక కన్నుమూశారు. పోలీసులు హెచ్చరిస్తున్నా అరుపులు కేకలతో ఏమీ విన్పించలేదు. ఈ దారుణంలో మృతుల సంఖ్య ఆదివారం 18కి పెరిగింది. వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. 30 మంది గాయపడ్డారు. తొక్కిసలాట తర్వాత మెట్ల మార్గం, ఓవర్ బ్రిడ్జిపై ఎక్కడ చూసినా చెప్పులు, చిరిగిన బ్యాగులే కనిపించాయి. రెండు రైళ్లకు ప్రయాగ్‌రాజ్ పేరుండడం అయోమయానికి దారి తీసిందని పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే శాఖ కూడా విచారణకు ఆదేశించింది. వాస్తవానికి న్యూఢిల్లీ స్టేషన్ నుంచి శనివారం నాలుగు రైళ్లు ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరాల్సి ఉంది. వాటిలో మూడు ఆలస్యమయ్యాయి. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యమయ్యాయి. దాంతో ఆ ఐదు రైళ్లలో వెళ్లాల్సిన వారంతా ప్లాట్‌ఫాంలపైనే ఉండిపోవడంతో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఆదివారమూ అదే రద్దీ దుర్ఘటన జరిగినా న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆదివారం కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా కొనసాగింది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి వేలాది మంది తరలివచ్చారు. రైళ్లు ఎక్కడానికి పడరాని పాట్లు పడ్డారు. అధికారులు సైతం నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.సమాచార లోపానికి తోడు ప్రయాణికులు గందరగోళానికి గురికావడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. విచారణకు కమిటీ తొక్కిసలాటపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రిన్సిపల్ స్టేషన్‌లోని వీడియో ఫుటేజీ అందజేయాలని అధికారులను ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు,తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది. వైష్ణవ్ రాజీనామా చేయాలితొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ ఆదివారం డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రమే ఆయన్ను తొలగించాలన్నారు. రైల్వేస్టేషన్‌కు వేలాది మంది జనం తరలివచ్చినా భద్రతా ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ‘‘దేశంలో ఇప్పుడు రెండు హిందూస్తాన్లు ఉన్నాయి. ఒక హిందూస్తాన్లో పాలకులు తమ మిత్రులకు స్వయంగా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయిస్తున్నారు. మరో హిందూస్తాన్లో సామాన్యులు ఇలా రైల్వేస్టేషన్లలో బలైపోతున్నారు. కుంభమేళాలో వీఐపీ సంస్కృతి నడుస్తోంది’’ అని ఆక్షేపించారు.రాష్ట్రపతి, ప్రధాని సంతాపం ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటనపై పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. -
కుంభమేళాపై లాలూ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:మహాకుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహాకుంభమేళాకు అసలేమైనా అర్థం..పర్థం ఉందా..?అది ఓ అర్థం లేని వ్యవహారం’ అని లాలూ అన్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం చెందడం దురదృష్టకరమని వ్యాఖ్యానించే సందర్భంలో లాలూ మహా కుంభమేళాపై ఈ వ్యాఖ్యలు చేశారు.రైల్వేశాఖ విఫలమవడం వల్లే న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగిందన్నారు. రైల్వే మంత్రి దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందేనన్నారు.అయితే మహాకుంభమేళాపై లాలూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు హిందువులపై ఆర్జేడీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని బీహార్ బీజేపీ చీఫ్ మనోజ్శర్మ అన్నారు. బిహార్ ఎన్నికలు వస్తున్న వేళ ఓ వర్గం వారిని బుజ్జగించేందుకే లాలూ మహాకుంభమేళాను టార్గెట్ చేశారని శర్మ మండిపడ్డారు. -
‘మహా కుంభమేళాను పొడిగించండి’
ప్రపంచంలోనే అత్యంత భారీ ఆధ్యాత్మిక సమ్మేళనం మరో 11 రోజుల్లో ముగియనుంది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాను ఇప్పటిదాకా(శుక్రవారం సాయంత్రానికే) 50 కోట్ల మంది హాజరైనట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇది అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యల జనాభా కంటే అధికం. అయితే..మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇంకా కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో కుంభ మేళాను పొడిగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.గతంలో మహా కుంభమేళా, కుంభమేళాల రద్దీ దృష్ట్యా 75 రోజులపాటు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి!. కానీ, ఇప్పుడు నిర్వహిస్తున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela) తక్కువ రోజులు నిర్వహిస్తున్నారని అఖిలేష్ అంటున్నారు. మహా కుంభమేళా కోసం ఎంతో మంది ఆశగా ప్రయాగ్‌రాజ్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లను నిరాశపర్చడం సరికాదు. కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని అన్నారాయన.ఇదిలా ఉంటే.. ఈసారి మహా కుంభమేళాలో తొక్కిసలాట విషాదం నెలకొంది. జనవరి చివరి వారంలో మౌనీ అమావాస్య సందర్భంగా భక్తులు ప్రయాగ్‌రాజ్ ఘాట్ల వద్ద ఎగబడడంతో బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తోక్కిసలాట జరగ్గా ముప్ఫై మంది మరణించారు. అయితే.. మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాస్తోందని అఖిలేష్ ఆరోపించారు. అంతేకాదు.. నిర్వహణ విషయంలో యోగి సర్కార్ విఫలైమందని, భారత సైన్యానికి కుంభమేళా బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు కూడా. మహా కుంభమేళా కోసం క్యూ కడుతున్న భక్తుల సంఖ్య తగ్గడం లేదు. రైళ్లు, బస్సులు నిండిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కిందటి వారం ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రయాగ్ రాజ్(Prayag Raj) రూట్లో నెలకొనడం చూశాం. ఇంకోవైపు.. జనాల తాకిడితో ప్రయాగ్‌రాజ్ సంగమ రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసేశారు.ఇదిలా ఉంటే.. జనవరి 13వ తేదీన పౌష పూర్ణిమతో మహా కుంభమేళా ఆరంభమైంది. కుంభమేళా అయినా, మహా కుంభమేళా అయినా గ్రహాల స్థితిగతులు.. శాస్త్రాలను.. తదితరాలను అనుసరించి 45 రోజులపాటు కొనసాగుతాయి. ఈ ఏడాది మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది.ఇదీ చదవండి: స్టార్ హీరో భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యమా? -
కుంభమేళా మోనాలిసా స్టన్నింగ్ లుక్!
పూసల దండలు అమ్మేందుకు కుంభమేళాకు వచ్చిన మోనాలిసా వాటిని అమ్మిందో లేదోగానీ, తన నీలికళ్ల అందాలతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ఒకవైపు సినిమా అవకాశాలు, మరోవైపు ప్రకటనల్లో నటించే అవకాశాలు ఆమెకు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న మోసాలిసా ఫొటోలను చూస్తే ఈమె కుంభమేళాలో పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన మోనాలిసానేనా అనేలా ఉన్నాయి.మోనాలిసా ప్రస్తుతం తన తొలి బాలీవుడ్ డెబ్యూకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఆమె ఒకవైపు నటన నేర్చుకుంటూనే, మరోవైపు అక్షరాలు కూడా దిద్దుతోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ఆమె నటించనుంది. తాజాగా సనోజ్ మిశ్రా, మోనాలిసాలు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళ చేరుకున్నారు. ఈ నేపధ్యంలో బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.కేరళలో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్న ఆమె గులాబీరంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆమె కురులు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. కొద్దిపాటి మేకప్‌తో మోసాలిసా సహజ సౌందర్యరాశిలా నవ్వుతూ కనిపిస్తోంది. కోట్ల రూపాయల ఖరీదైన కారులో ఆమె ఈవెంట్‌కు హాజరయ్యింది. ఆ సమయంలో ఆమె అత్యంత ఖరీదైన వజ్రాల హారం కూడా ధరించింది. కార్యక్రమానికి హాజరైన అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు తెగ తాపత్రయపడ్డారు.ఇది కూడా చదవండి: రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు? -
Mahakumbh: 1,100 కి.మీ పరుగు.. కుంభమేళాకు అగ్నివీర్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భారీ ఎత్తున జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. కుంభమేళా నేపధ్యంలో పలు విషయాలు వైరల్‌గా మారుతున్నాయి. ఇదేవిధంగా కొందరు రాత్రికిరాత్రే ఫేమస్ అవుతున్నారు. మరోవైపు సాహసం చేసి, కుంభమేళాకు తరలివస్తున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రూపేష్.2024లో దేశరక్షణ విభాగంలో ‘అగ్నివీర్’గా ఎంపికైన రూపేష్ గత జనవరి 23న కుంభమేళాకు పరుగును ప్రారంభించాడు. సహరసా(బీహార్) నుంచి ప్రారంభమైన అతని పరుగు ప్రయాణం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు చేరుకునేందుకు 17 రోజులు పట్టింది. రోజుకు 10 గంటపాలు పరుగుపెడుతూ ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర త్రివేణీ సంగమానికి చేరుకున్నాడు. రూపేష్ ఈ సాహసోపేత పరుగులో పలు ఆటంకాలను ఎదుర్కొన్నాడు.కుంభమేళా ప్రాంతానికి పరుగు చేపట్టిన రూపేష్ ఫిబ్రవరి ఒకటిన అనారోగ్యానికి గురయ్యాడు. ఇదేవిధంగా మార్గం మధ్యలో అతని ఫోను, పర్సును దొంగలు లాక్కెళ్లిపోయారు. ఈ సమయంలో స్థానికులు అతనికి సహాయం అందించారు. ఐదారు వేల రూపాయల వరకూ ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. రూపేష్ చేపట్టిన ఈ పరుగు యాత్ర ప్రారంభంలో స్నేహితులిద్దరు అతని వెంట వచ్చారు. అయితే భక్తియార్పూర్ చేరుకోగానే వారిద్దరూ పూర్తిగా అలసిపోవడంతో వెనుదిరిగారు. అటువంటి పరిస్థితిలోనూ రూపేష్ ధైర్యాన్ని కోల్పోక 1,100 కిలోమీటర్ల తన పరుగుయాత్రను పూర్తిచేశాడు.రూపేష్ 2024లో ఇండియన్ ఆర్మీలో ‘అగ్నివీర్’గా ఎంపియ్యారు. ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాడు. మారథాన్‌లో భారత్ బంగారు పతకం తేవాలనేది రూపేష్ కల. ఈ సందర్భంగా రూపేష్ తండ్రి రామ్‌ప్రవేశ్ యాదవ్ మాట్లాడుతూ కుంభమేళాకు పరిగెడుతూ వెళ్లాలనుకున్న తన కుమారుని నిర్ణయాన్ని విని చాలామంది ఎగతాళి చేశారని, అయితే రూపేష్ ఇప్పుడు తన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉన్నదన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు -
Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని తీర్థరాజం ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో ఇప్పుడు కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసినవారి సంఖ్య 50 కోట్లు దాటింది. గతంలో కుంభమేళా స్నానాలపై ఉన్న అంచనాలను ఈ రికార్డు దాటేసింది.అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక అందించిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ (జనాభా 34,20,34,432), ఇండోనేషియా (జనాభా 28,35,87,097), పాకిస్తాన్ (జనాభా 25,70,47,044), నైజీరియా (జనాభా 24,27,94,751), బ్రెజిల్ (జనాభా 22,13,59,387), బంగ్లాదేశ్ (జనాభా 17,01,83,916), రష్యా (జనాభా 14,01,34,279), మెక్సికో (జనాభా 13,17,41,347)లలోని జనాభాను దాటినంతమంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.మహా కుంభమేళకు ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన అంచనాలను మించిన రీతిలో కుంభమేళాలో సరికొత్త రికార్డు నమోదయ్యింది. ప్రారంభంలో 45 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తారనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి 11 నాటికి ఆ అంచనా నిజమని రుజువైంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) నాటికి ఈ సంఖ్య 50 కోట్లను దాటింది. మహా కుంభమేళాలో ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలివున్నాయి. మరొక స్నాన ఉత్సవం ఫిబ్రవరి 26న శివరాత్ర సందర్భంగా ఉంది. అప్పటికి పుణ్యస్నానాలు చేసే వారి సంఖ్య 55 నుంచి 60 కోట్లు దాటవచ్చనే కొత్త అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటివరకు స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్యను విశ్లేషిస్తే మౌని అమావాస్య నాడు గరిష్టంగా 8 కోట్లు మంది భక్తులు స్నానం చేయగా, మకర సంక్రాంతినాడు 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానం చేశారు. ఫిబ్రవరి ఒకటి, జనవరి 30 తేదీలలో రెండు కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మాఘ పూర్ణిమ నాడు కూడా రెండు కోట్లకు పైగా భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించారు.ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా 2025 ఉత్సాహంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయి భక్తులతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో అనేక ఆసక్తికరమైన విషయాలకు కేంద్రంగా మారుతోంది. రుద్రాక్ష మాలలు అమ్ముకునే మోనాలీసా, వేపపుల్లలు అమ్ముకునే ప్రేమికుడు..ఇలా చిన్న వ్యాపారులకు కూడా ఆదాయమార్గాలను విస్తృతం చేసింది. తాజాగా ఈ కోవలో నిలిచాడు చాయ్ వాలా. కుంభ్ చాయ్‌వాలా టీ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందామా?మన చాయ్‌వాలా పేరు శుభం ప్రజాపత్. అతని కేవలం వయస్సు 20 ఏళ్లే. కానీ అతడి ఐడియా మాత్రం అదిరింది. మహాకుంభమేళాను సందర్శించే భక్తులుకు టీ , వాటర్ బాటిళ్లు టీ అమ్మడం ద్వారా చక్కటి ఉపాధిని వెదుక్కున్నాడు. అంతేకాదు రోజుకు రూ. 5 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. అంటే నెలకు లక్షా 50వేలు అన్నమాట. ఇది సంపాదన ఒక కార్పొరేట్ఉద్యోగి, ఐటీ ఉద్యోగి వేతనానికి ఏ మాత్రం తీసిపోదు.కుంభమేళా ప్రారంభానికి రెండు రోజుల ముందే టీ అమ్మడాన్ని మొదలు పెట్టాడు. ఒక్కో టీ 10 రూపాయలు చొప్పున విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఈ ఉత్సవం ముగియగానే తన పని తాను చేసుకుంటానని, ఈ నెల రోజుల వ్యాపారం బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నాడు శుభం ప్రజాపత్. తన చిన్న బిజినెస్ ఐడియా లక్షాధికారిని చేసిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి తనకు రెండు లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాడు. (టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్) View this post on Instagram A post shared by Shubham Prajapat (@madcap_alive)స్వయంగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రజాపత్ తాను టీ అమ్ముతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్‌లో ఒక చిన్న బండిపై చాయ్, వాటర్ బాటిళ్లు అమ్ముతున్నట్లు మనం చూడవచ్చు. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుందనీ మధ్యాహ్నం మాత్రం కాస్త విశ్రాంతి దొరుకు తుందని చెప్పుకొచ్చాడు. ప్రజాపత్ ఐడియాకు జనం ఫిదా అవుతున్నారు. మరో విధంగా చెప్పాలంటేకుంభ చాయ్‌వాలా ఇపుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ప్రపంచలోని అతిపెద్ద ఆ ఆధ్యాత్మిక సమావేశం కుంభమేళా కుంభమేళా. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కుంభమేళాకు రోజు కోట్లాది మంది భక్తులు ,పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్లకు మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానాలు చేసిన సంగతి విదితమే. -
మహాకుంభ్‌లో పుణ్య స్నానం చేసిన దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే
భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, తన సతీమణి చేతనతో కలిసి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా కుంబ్లే దంపతులు మహాకుంభ్ మేళాలో పాల్గొన్నారు. అమృత స్నానం ఆచరిస్తున్న దృశ్యంతో పాటు పౌర్ణమి చంద్రుడి ఫోటోను, బోటులో భార్య చేతనతో తీసుకున్న సెల్ఫీని కుంబ్లే ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇందుకు బ్లెస్డ్ అని క్యాప్షన్ పెట్టి, మహాకుంభ్, ప్రయాగ్‌రాజ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.Blessed 🙏🏽#MahaKumbh #Prayagraj pic.twitter.com/OFY6T3yF5F— Anil Kumble (@anilkumble1074) February 12, 2025కాగా, బుధవారం మాఘ పౌర్ణమి కావడంతో మహాకుంభ్‌కు జనం పోటెత్తారు. నిన్న ఒక్క రోజే రెండు కోట్ల మందికిపైగా పుణ్య స్నానం చేసినట్లు అధికారులు తెలిపారు. మహాకుంభ్‌ను నిన్నటి వరకు దాదాపుగా 50 కోట్ల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ పేర్కొన్నారు. మహాకుంభ్‌కు లెక్కలేని సంఖ్యలో జనం పోటెత్తుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోకి వాహనాల అనుమతిని నిషేధించారు. ఎక్కడో ఉన్న పార్కింగ్ స్థలం నుంచి ఘాట్ల వరకు జనం నడిచి వెళ్తున్నారు.అనిల్ కుంబ్లే విషయానికొస్తే.. 54 ఏళ్ల ఈ దిగ్గజ స్పిన్నర్ భారత్ తరఫున 132 టెస్ట్‌లు, 271 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసింది కుంబ్లేనే. టెస్ట్‌లు, వన్డేల్లో కలుపుకుని కుంబ్లే దాదాపుగా 1000 వికెట్లు తీశాడు. కుంబ్లేకు ఐపీఎల్లో కూడా ప్రవేశముంది. కుంబ్లే ఆర్సీబీ తరఫున 2008-10 మధ్యలో 42 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. ఆటగాడిగా రిటైరైన అనంతరం కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. కుంబ్లే ఆథ్వర్యంలో టీమిండియా చారిత్రక విజయాలు సాధించింది. కుంబ్లే ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. -
మహా కుంభ్‌కి 2 కోట్ల మంది
ప్రయాగ్‌రాజ్: మహా కుంభ మేళాలో మాఘి పూర్ణిమను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. జనవరి 29వ తేదీన పుణ్య స్నానాల సమయంలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో ఈసారి ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేశామని తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయం 4 గంటల నుంచే లక్నోలోని తన నివాసంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని వివరించింది. త్రివేణీ సంగమంతోపాటు ఇతర ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలవాన కురిపించామంది. మాఘి పూర్ణిమ స్నానంతో నెలపాటు కఠోర దీక్షలు చేసిన కల్పవాసీలు సుమారు 10 లక్షల మంది మహాకుంభ్‌ను వీడి వెళ్లనున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అనుసరిస్తూ, నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలను ఉపయోగించుకోవాలని వీరికి సూచించింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు కుంభ్ ఎస్ఎస్పీ రాజేశ్ ద్వివేదీ చెప్పారు. ఆపరేషన్ చతుర్భుజ్లో భాగంగా 2,750 హైటెక్ కెమెరాలు, డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఉపయోగించుకుని 24 గంటలూ నిఘా కొనసాగించినట్లు వివరించారు. మహాకుంభ్ ప్రాంతాన్ని మంగళవారం 4 గంటల నుంచే నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ నగరాన్ని సైతం నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. ఇందులో అత్యవసర, ఎమెర్జెన్సీ సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. పబ్లిక్, ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు. అన్ని టోల్‌ప్లాజాల వద్ద రాకపోకలను క్రమబద్ధీకరించారు. భక్తుల కోసం ప్రతి 10 నిమిషాలకొకటి చొప్పున అదనంగా 1,200 బస్సులను అందుబాటులోకి తెచ్చారు. 26వ తేదీ వరకు కొనసాగే మహాకుంభ్‌లో చిట్టచివరి అమృత్ స్నాన ఘట్టం మహాశివరాత్రి రోజున ఉంటుంది.పలువురు ప్రముఖుల రాకమాఘి పూర్ణిమ సందర్భంగా బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, తల్లి కోకిలా బెన్, కుమారులు, కోడళ్లు, మనవడు, మనవరాలు తదితరులతో కలిసి త్రివేణీ సంగమంలో స్నానాలు చేశారు. అదేవిధంగా, దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఆయన భార్య పుణ్యస్నానాలు చేశారు. వీఐపీ ప్రొటోకాల్స్‌ను బుధవారం నిలిపివేయడంతో కుంబ్లే దంపతులు మిగతా భక్తుల మాదిరిగానే పడవలో త్రివేణీ సంగమానికి పడవలో చేరుకుని, పూజలు చేశారు. -
మహాకుంభమేళాలో తదుపరి పవిత్ర స్నానం ఎప్పుడు?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు (బుధవారం) భక్తులు మాఘపౌర్ణమి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నాటికి 1.20 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి పుణ్య స్నానాల సందర్భంగా కుంభమేళా అధికారులు హెలికాప్టర్లో భక్తులపై పుష్పవర్షం కురిపించారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. ఈరోజు సుమారు రెండు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకూ మూడు అమృత స్నానాలు పూర్తయ్యాయి. దీంతో తదుపరి పుణ్య స్నానం ఎప్పుడనే సందేహం చాలామందిలో ఉంది. #WATCH | 'Pushp varsha' or showering of flower petals being done on devotees and ascetics as they take holy dip in Sangam waters on the auspicious occasion of Maghi Purnima during the ongoing #MahaKumbh2025 in Prayagraj. #KumbhOfTogetherness pic.twitter.com/FC1C2uetnb— ANI (@ANI) February 12, 2025కుంభమేళా నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 26న తదుపరి పవిత్ర స్నానాలు ఉండనున్నాయి. ఆరోజు మహాశివరాత్రి కావడం విశేషం. శివుని భక్తులు ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అదేరోజున కుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు శివభక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో శివరాత్రి రోజున కుంభమేళాకు లెక్కకుమించినంతమంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
#MahaKumbh2025 : మాఘ పూర్ణిమ స్నానాలు కుంభమేళాకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా
కుంభమేళాకు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా తన అందమైన తేనెకళ్ల కారణంగా రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఒక్కదెబ్బతో ఈమె ఖాతాలోకి లెక్కలేనంతమంది అభిమానులు చేరిపోయారు. ఇదే నేపధ్యంలో మోనాలిసా ఒక సినిమా అవకాశాన్ని, ఒక ప్రకటనలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నిరక్షరాస్యురాలైన మోనాలిసా ఇప్పుడు అక్షరాలు దిద్దేపనిలో పడింది. ఇంటర్నెట్ సస్సేషన్గా మారిన మోనాలిసా ఏనాడూ పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు. అయితే ఇప్పుడు ఆమెకు చదువు అవసరం ఏర్పడింది. దీనిని గుర్తించిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు చదువు నేర్పించే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఇటీవల ఆయన షేర్ చేసిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మోనాలిసా హిందీలో అక్షరాలు దిద్దుతున్నట్లు కనిపిస్తోంది. స్లేట్ పెన్సిల్ తీసుకుని, మోనాలిసా అక్షరాలు దిద్దటాన్ని మనం ఆ వీడియోలో చూడవచ్చు.ఎవరూ ఊహించని విధంగా మోనాలిసా జీవితం మారిపోయింది. ఒకవైపు సినిమా అవకాశాలు దక్కించుకుంటూనే, మరోవైపు అక్షర జ్ఞానాన్ని కూడా మోనాలిసా పెంపొందించుకుంటోంది. ఆమె నటిస్తున్న చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత -
మహా కుంభమేళాలో అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
Mahakumbh-2025: పోటెత్తిన జనం.. కొనసాగుతున్న మాఘ పూర్ణిమ స్నానాలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో నేడు మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ నేపధ్యంలో కుంభమేళా అధికారులు ప్రయాగ్‌రాజ్ నగరంలోనికి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మాఘపౌర్ణమి వేళ మూడు నుంచి కోట్ల నాలుగు కోట్లమంది భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు త్రివేణీ సంగమానికి తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. #WATCH प्रयागराज, यूपी: माघपूर्णिमा के अवसर पर चांद पूरा दिखा। पवित्र स्नान के लिए त्रिवेणी संगम पर श्रद्धालु पहुंच रहे हैं।#MahaKumbh2025 pic.twitter.com/W9s7csNnim— ANI_HindiNews (@AHindinews) February 12, 2025మాఘపౌర్ణమి ఏర్పాట్ల గురించి కుంభమేళా అధికారి వివేక్ చతుర్వేది మాట్లాడుతూ ఈరోజు(బుధవారం) మాఘపౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తరలివస్తున్నారు. భారీసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఈ స్నానాలు ఈ రోజంతా కొనసాగనున్నాయన్నారు. #WATCH प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर पवित्र डुबकी लगाने के लिए त्रिवेणी संगम पर महाकुंभ मेला क्षेत्र में श्रद्धालुओं की भारी भीड़ पहुंची। #MahaKumbh2025 pic.twitter.com/iA38Vex2Ta— ANI_HindiNews (@AHindinews) February 11, 2025మహాకుంభమేళాకు ఈరోజు 31వ రోజు. ఈరోజున ఐదవ పవిత్ర స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు కుంభమేళా ప్రాంతంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కుంభమేళాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ జనం ఎటువంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అడుగడునా ఉన్నారని, వారు ఎటువంటి వరిస్థితి తలెత్తినా వెంటనే నివారిస్తారన్నారు.కుంభమేళా ప్రాంతంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వైద్యశిబిరాలలోని సిబ్బంది మాట్లాడుతూ ఇక్కడ 30 మంది నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారని, 500కు పైగా నర్సింగ్ సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కుంభమేళా జరిగే ప్రాంతాన్నంతటినీ నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. దీంతో కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతులు కల్పించారు. బయటి నుంచి వచ్చే ఏ వాహనాలను కూడా నగరంలోనికి అనుమతించడం లేదు. #WATCH| #MahaKumbh2025 | प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर महाकुंभ में श्रद्धालु स्नान के लिए पहुंच रहे हैं। ड्रोन वीडियो त्रिवेणी संगम से है। pic.twitter.com/U0mD6gCp5m— ANI_HindiNews (@AHindinews) February 11, 2025ఇది కూడా చదవండి: Mahakumbh: చక్కెర, గోధుమలు, మైదా గోడౌన్లు ఖాళీ.. దొరకని పాలు, బ్రెడ్ #WATCH प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर पवित्र डुबकी लगाने के लिए श्रद्धालुओं की भारी भीड़ अरैल घाट पहुंची।#MahaKumbh2025 pic.twitter.com/3g08taJquH— ANI_HindiNews (@AHindinews) February 11, 2025 -
లక్షలాది జనం.. రవాణా ఘోరం
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక యాత్ర విషాదభరితంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాకు తరలి వెళ్తున్నారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. ఇటు తెలంగాణ ఆర్టీసీ కానీ, అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయలేదు. భక్తులు మధ్యతరగతి, సామాన్యప్రజలకు ఏ మాత్రం అందనంతగా విమానచార్జీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి రావాలని కోరుకుంటున్న జనం తోచిన మార్గంలో వెళ్తున్నారు. సామర్థ్యం లేని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. నాచారం (హైదరాబాద్) నుంచి యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు మినీబస్సులో వెళ్లిన ఏడుగురు భక్తులు తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొని మరణించిన ఉదంతం ఆందోళన రేపుతోంది. ప్రయాణికుల రద్దీ కారణంగా ఒకవైపు రహదారులు వందలకొద్దీ కిలోమీటర్లతో కిక్కిరిసిపోతుండగా, మరోవైపు మినీబస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి చిన్న వాహనాల్లో ఎక్కువమంది ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అరకొర రైళ్లు...: ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కానీ అరకొర రైళ్లు అందుబాటులో ఉన్నాయి. పైగా సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్, గోరఖ్‌పూర్, లక్నో, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో జనవరి నాటికే బుకింగ్ నిలిచిపోయింది. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు 200 దాటింది. మరిన్ని అదనపు రైళ్లు నడిపితే తప్ప తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణం చేయడం సాధ్యం కాదు. సాధారణంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలు, మేడారం వంటి జాతరలకు ఆర్టీసీ వేలకొద్దీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ కుంభమేళాకు లక్షలాది మంది తరలి వెళ్తున్నట్లు తెలిసి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీప్రతిసారీ పండుగ ప్రయాణాన్ని సొమ్ము చేసుకొనే ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ సంస్థలు మహాకుంభమేళా భక్తులను కూడా వదలకుండా నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫిట్నెస్ ఉన్నా లేకున్నా పెద్దఎత్తున వాహనాలను నడుపుతున్నాయి. 30 నుంచి 40 మంది ప్రయాణం చేసే ప్రైవేట్ బస్సులతోపాటు, 14 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఇతరత్రా వాహనాలను ఎడాపెడా రోడ్డెక్కిస్తున్నాయి. ప్యాకేజీల పేరుతో ఒక్కో ప్రయాణికుడి వద్ద రూ. 25,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి 8 గంటలకు ఒకసారి విధులు మార్చుకోవాలి. కానీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వాహనాలు చాలావరకు ఒక డ్రైవర్‌తోనే బయలుదేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు సుమారు 1,136 కి.మీ. దూరం నిరాటంకంగా వాహనాలను నడపడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. -
మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం
ప్రయాగ్‌రాజ్, 11 ఫిబ్రవరి 2025: మహా కుంభమేళా(Maha Kumbh Mela) సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తన తల్లి, కుమారులు, మనుమలు/మనుమరాళ్లతో కలిసి పవిత్ర స్నానం చేశారు.ముకేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాశ్, ఆనంత్, కోడళ్ళు శ్లోకా, రాధికా, మనుమలు పృథ్వి, వేద, అక్కలు దీప్తి సల్గావ్కర్, నీనా కోఠారి తదితరులతో కలిసి స్నానం చేశారు. వీరితో పాటు ముకేశ్ అంబానీ అత్త పూర్ణిమాబెన్ దలాల్ మరియు మరదలు మమతాబెన్ దలాల్ కూడా పాల్గొన్నారు.గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం వద్ద అనేకమంది యాత్రికులతో కలిసి అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రలో భాగమైంది. నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాషానంద గిరిజీ మహారాజ్ గంగా పూజను నిర్వహించారు. పూజ అనంతరం ముకేశ్ అంబానీ పరమార్థ్ నికేతన్ ఆశ్రమానికి చెందిన స్వామి చిదానంద సరస్వతీ మహారాజ్‌ను కలుసుకున్నారు. ఆశ్రమంలో అంబానీ కుటుంబం ప్రసాదం, లైఫ్ జాకెట్లను పంపిణీ చేసింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మహా కుంభమేళాలో యాత్రికుల సేవ కోసం ‘తీర్థ యాత్రి సేవ’ పేరిట వివిధ సేవలను అందిస్తోంది. ఈ యాత్రలో యాత్రికుల సంక్షేమం, సౌకర్యాలను మెరుగుపరచడానికి కంపెనీ ఈ ప్రత్యేక సేవలను చేపడుతోంది.‘వీ కేర్’ తత్వాన్ని ఆధారంగా తీసుకుని రిలయన్స్ యాత్రికులకు పౌష్టికమైన భోజనం (అన్న సేవ), పూర్తి వైద్యం, భద్రతా రవాణా, మెరుగైన కనెక్టివిటీ వంటి అనేక సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పవిత్ర నదీ జలాల్లో భద్రత, సౌకర్యవంతమైన విశ్రాంతి కేంద్రాలు, స్పష్టమైన మార్గదర్శక వ్యవస్థ, పరిపాలన, పోలీస్, మరియు లైఫ్ గార్డులకు మద్దతు వంటి ఇతర సేవలు కూడా అందిస్తోంది. -
Mahakumbh: చక్కెర, గోధుమలు, మైదా గోడౌన్లు ఖాళీ.. దొరకని పాలు, బ్రెడ్
ప్రయాగరాజ్: యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో గత ఐదు రోజులుగా కిలోమీటర్ల పొడవున భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతంలో రెండు గంటల్లో చేరుకునే దూరానికి ఇప్పుడు 10 గంటల సమయం పడుతున్నదని స్థానికులు వాపోతున్నారు. వాహనాల రద్దీ కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసర సరుకులను తరలించే రవాణా వాహనాలు ప్రయాగ్‌రాజ్‌లోనికి ప్రవేశించలేకపోతున్నాయి.ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీసులు పలుచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాణిజ్య వాహనాలు ప్రయాగ్‌రాజ్‌లోనికి ప్రవేశించేందుకు అనుమతి లేకపోవడంతో ప్రయాగ్‌రాజ్‌లో పాలు, బ్రెడ్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన మార్కెట్ అయిన ముత్తిగంజ్‌లోని పలు వ్యాపారులకు చెందిన గిడ్డంగులలో చక్కెర, గోధుమలు, మైదా నిల్వలు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కొద్దిపాటి స్టాక్ ఉన్న వ్యాపారులు రిటైల్ దుకాణాల డిమాండ్‌ను తీర్చలేకపోతున్నారు. జనవరి 26 నుంచి ప్రయాగ్‌రాజ్‌లోనికి వాణిజ్యవాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే వసంత పంచమి తరువాత కొన్ని వాహనాలకు అనుమతులిచ్చారు. దీంతో కొంతమేరకు సమస్య పరిష్కారమయ్యింది. ఇయితే ఇప్పుడు తిరిగి ఆ ఆహార నిల్వలు ఖాళీ అయిపోయాయి.ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రిటైల్ వ్యాపారి దీపక్ కేసర్వానీ మీడియాతో మాట్లాడుతూ తాను చక్కెర కొనడానికి హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లగా, అక్కడ చక్కెర నిల్వలు లేనట్లు తెలిసిందన్నారు. మరో వ్యాపారి మాట్లాడుతూ తాను 50 కిలోల చక్కెర కోసం ప్రయత్నించగా, 15 కిలోలు మాత్రమే దొరికిందన్నారు. పప్పుధాన్యాలతో నిండిన ట్రక్కులు గత కొన్ని రోజులుగా చక్‌ఘాట్ సరిహద్దు వద్దనే ఉండిపోయాయని, వాటిని ప్రయాగ్‌రాజ్‌లోనికి అనుమతించడం లేదని గ్రెయిన్ ఆయిల్ సీడ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ కేసర్వానీ తెలిపారు. నగరంలో ఆహారధాన్యాలు, నిత్యావసరాల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్? -
జబల్పూర్ వద్ద ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు
-
కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్?
యూపీలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా పలువురి తలరాతలను మార్చేసింది. అటువంటి వారిలో మోనాలిసా ఒకరు. కుంభమేళాకు పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన ఆమె రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయిపోయింది. జనం ఆమెను చూసేందుకు గుమిగూడుతుండటంతో ఆమె తండ్రి మోనాలిసాను మధ్యప్రదేశ్‌లోని తమ ఇంటికి తిరిగి పంపించేశాడు. అయితే అక్కడకు కూడా ఆమె అభిమానులు తరలివస్తున్నారు.కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా నటిస్తున్న తొలిచిత్రం షూటింగ్ ఫిబ్రవరి 12న ఢిల్లీలోని ఇండియాగేట్ దగ్గర ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. అయితే షూటింగ్ తేదీ విషయమై ఇంకా నిర్థారణ కాలేదని సమాచారం. ఇదిలావుండగా ఇంతలో ఆమెను ఒక ప్రముఖ జ్యూలయరీ కంపెనీ కలుసుకున్నదని, ఆమెను ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.మోనాలిసా నటిస్తున్న సినిమాకు చెందిన చిత్రబృందం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ జ్యూయలరీ కంపెనీ మోనాలిసాను సంప్రదించిందని, ఆమెతో వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. ఇందుకోసం వారు రూ.15 లక్షలకు కూడా ఇచ్చారని చిత్రబృందం పేర్కొంది. ఈ కంపెనీకి సంబంధించిన ప్రకటన షూటింగ్ ఫిబ్రవరి 14న మొదలుకానున్నదని, ఇందుకోసం మోనాలిసా కేరళ వెళ్లనున్నారని వివరించింది.ఇది కూడా చదవండి: Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి -
Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి
మహాకుంభమేళాకు నేడు (మంగళవారం) 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే మాఘపౌర్ణమి పుణ్య స్నానాలకు అధికారులు పకడందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో నూతన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. #WATCH प्रयागराज: त्रिवेणी संगम पर पवित्र डुबकी लगाने के लिए महाकुंभ मेला क्षेत्र में श्रद्धालुओं की भारी भीड़ पहुंची।#MahaKumbh2025 pic.twitter.com/Qp7OYkvCVA— ANI_HindiNews (@AHindinews) February 11, 2025ఫిబ్రవరి 10 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఈ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 13 రాత్రి 8 గంటల వరకూ కుంభమేళాకు ఎటువంటి వాహనాలనూ అనుమతించరు. కేవలం కుంభమేళాలో విధులు నిర్వహించే అధికారులు, వైద్య సిబ్బందికి సంబంధించిన వాహనాలను మాత్రమే ప్రయాగ్‌రాజ్‌లోకి అనుమతించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళాపై అధికారులతో సమీక్ష జరిపారు. మాఘపౌర్ణిమ నాడు ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్ మేనేజిమెంట్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.సంగమానికి ఎలా వెళ్లాలి?సంగమం చేరుకోవడానికి నడక మార్గం: భక్తులు జీటీ జవహర్ మార్గ్ నుండి త్రివేణీ సంగమానికి చేరుకోవచ్చు. ఈ నడకమార్గంలో భక్తులు కాళీ రాంప్, సంగమం అప్పర్ రోడ్ ద్వారా త్రివేణీ సంగమానికి రావాల్సివుంటుంది.తిరుగు నడక మార్గం: సంగమం ప్రాంతం నుండి అక్షయవత్ మార్గ్ మీదుగా తిరుగు మార్గంలో నడచివెళ్లాల్సివుంటుంది.#WATCH प्रयागराज, उत्तर प्रदेश: #MahaKumbh2025 के दौरान श्रद्धालु त्रिवेणी संगम घाट पर पावन स्नान के लिए पहुंच रहे हैं।वीडियो ड्रोन से ली गई है। pic.twitter.com/mXgJqnT7lg— ANI_HindiNews (@AHindinews) February 11, 2025అధికారులకు సీఎం ఆదిత్యనాథ్ సూచనలుమహా కుంభమేళాకు సంబంధించి అధికారులతో సీఎం యోగి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.1.మహా కుంభ్ మార్గ్‌లో ట్రాఫిక్ ఎక్కడా ఆగకూడదు. పార్కింగ్ స్థలాలను సక్రమంగా నిర్వహించాలి.2 ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు అన్ని దిశల నుండి వస్తున్నందున రోడ్లపై వాహనాల క్యూలు ఉండకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి.3. మాఘ పూర్ణిమ నాడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వసంత పంచమి నాడు అమలు చేసిన వ్యవస్థలను తిరిగి అమలు చేయాలి.4. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పార్కింగ్ ప్రాంతం నుండి జాతర ప్రాంగణానికి షటిల్ బస్సుల సంఖ్యను పెంచాలి.5. అనుమతి లేకుండా ఏ వాహనాన్ని కూడా కుంభమేళా జరిగే ప్రాంగణంలోకి అనుమతించకూడదు.6. ప్రతి భక్తుడిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చడమనేది అధికారుల బాధ్యత.7. మహాకుంభ్ ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. ఉత్సవం జరుగుతున్న ప్రాంతాలన్నింటినీ క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి.8 ప్రయాగ్‌రాజ్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల అధికారులు ప్రయాగ్‌రాజ్ అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండాలి. వాహనాల కదలికలను పరస్పర సమన్వయంతో పర్యవేక్షిస్తుండాలి.9. ప్రయాగ్‌రాజ్‌లోని ఏ రైల్వే స్టేషన్లోనూ అధిక జనసమూహం గుమిగూడకుండా చూసుకోవాలి. స్పెషల్ రైళ్లు, అదనపు బస్సులను నడపాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘అద్భుత స్వాగతం’.. పారిస్ నుంచి ప్రధాని మోదీ వీడియో -
Sonal Chauhan : మహా కుంభమేళాలో బాలయ్య హీరోయిన్ పవిత్ర స్నానం (ఫోటోలు)
-
Mahakumbh: స్టేషన్లో రద్దీ.. ఏసీ కోచ్ అద్దాలు బద్దలు కొట్టి..
సమస్తీపూర్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఈ మహోత్సవానికి ఇంకా కొద్దిరోజులే మిగిలివుండటంతో చాలామందిలో కుంభమేళాకు ఇప్పటికైనా వెళ్లాలన్న ఆలోచన తలెత్తింది. దీంతో ఏ వాహనం దొరికితో ఆ వాహనంలో కుంభమేళాకు చేరుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాగ్ రాజ్‌కు చేరుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీహార్‌లోని రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రైల్లో కూర్చొనేందుకు స్థలం దొరకకపోవడంతో ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో కుంభస్నానానికి వెళుతున్న యాత్రికులు రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతలో స్వతంత్ర సేనాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని అన్ని ఏసీ కోచ్‌ల అద్దాలను బద్దలు కొట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన నవాడా స్టేషన్లో జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్నవారు తెలిపిన వివరాల ప్రకారం జయనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు లెక్కకుమించినంతమంది ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే జనరల్ కంపార్ట్మెంట్ మొదలుకొని ఏసీ కోచ్ వరకూ దేనీలోని కాలు మోపేందుకు కూడా స్థలం లేకపోవడంతో స్టేషన్‌లోని ప్రయాణికుల్లో అసహనం మొదలయ్యింది.బయట స్టేషన్లో ఉన్న జనాన్ని చూసిన రైలులోని వారు కోచ్ తలుపులను మూసివేశారు. దీంతో ముధుబని స్టేషన్లో రైలు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు ఏసీ కోచ్ అద్దాలను బద్దలుకొట్టారు. ఆ సమయంలో రైల్వే పోలీసులు అక్కడే ఉన్నా వారు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన నేపధ్యంలో రైలు 25 నిముషాల పాటు నవాడా స్టేషన్లో నిలిచిపోయింది. ఇది కూడా చదవండి: Madhya Pradesh: మహిళలకు నెలకు రూ. 3000.. సీఎం ప్రకటన -
Mahakumbh-2025: పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్‌రాజ్ సంగమం స్టేషన్ మూసివేత
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు ఈరోజు(సోమవారం) భారీ సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎటువంటి ప్రమాదకర ఘటన జరగకుండా ఉండేందుకు ప్రయాగ్‌రాజ్ సంగమం రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రైలు ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నాక, సంగమం స్టేషన్‌ను తిరిగి తెరుస్తామని అధికారులు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రతిరోజూ భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోని రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది. ఇదేతరహాలో సంగమం రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల భారీ రద్దీ ఏర్పడుతోంది. దీనిని నివారించేందుకు ఈస్టేషన్‌ను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. అలాగే కుంభమేళాకు వచ్చే భక్తులకు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇది కూడా చదవండి: Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి.. -
Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి..
మహాకుంభమేళా.. ప్రపంచాన్నంతటినీ ఆకట్టుకుంటున్న మహోత్సవం. దీనిలో పలు అద్భుతాలు, వింతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం ఎంతో ఆసక్తిగొలుపుతోంది. 15 ఏళ్ల క్రితం కనుమరుగైన ఒక వ్యక్తి అత్యంత విచిత్ర పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ కథనం జార్ఖండ్‌లోని కోడర్మా జిల్లాకు చెందిన ప్రకాష్ మహతోకు సంబంధించినది.ఆ సమయంలో ప్రకాష్.. కోడర్మా మునిసిపల్ కార్పొరేషన్(Koderma Municipal Corporation)లో పనిచేసేవాడు. 2010లో ఒక రోజున డ్యూటీకి వెళ్లిన ప్రకాష్ ఇంటికి తిరిగి రాలేదు. మానసిక పరిస్థితి సరిగా లేనందున ఇంటికి వెళ్లే దారిని మరచిపోయాడు. ప్రకాష్ కుటుంబసభ్యులు తమకు తెలిసిన అన్నిచోట్లా వెదికినా ఫలితం లేకపోయింది. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎంత గాలించినా ప్రకాష్ ఆచూకీ తెలియరాలేదు.అయితే 15 ఏళ్ల తరువాత తాజాగా ప్రకాష్ మహతోను బీహార్‌లోని రాణిగంజ్(Raniganj in Bihar) ప్రాంతంలో హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆ హోటల్ యజమాని సుమిత్ అతనికి పహల్వాన్ అని పేరుపెట్టాడు. చాలాకాలంగా ప్రకాష్ అదే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల హోటల్లో కుంభమేళా ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రకాష్ తాను కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నానని, అదే దారిలో తమ ఇల్లు ఉందని హోటల్ యజమాని సుమిత్‌కు చెప్పాడు. దీంతో సుమిత్ ఈ విషయాన్ని కోడర్మా పోలీసులకు ఫోనులో తెలియజేశాడు. వారు ప్రకాష్ అతనేనని నిర్థారించాక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.దీంతో ఎంతో ఆనందంతో ప్రకాష్ భార్య గీతాదేవి, కుమారుడు సుజల్, కుమార్తె రాణీ తదితరులు రాణిగంజ్ చేరుకున్నారు. భర్తను చూసిన గీతాదేవి, తండ్రిని చూసిన సుజల్, రాణి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకాలం గీతాదేవి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. 15 ఏళ్ల తరువాత ఇంటిపెద్ద కనిపిస్తాడని, వారెవరూ ఊహించలేదు. వారంతా కోడర్మాలోని తమ ఇంటికి చేరుకుని, ఇదంతా కుంభమేళా మహత్మ్యమేనని అందరికీ చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి? -
మహాకుంభమేళాలో విజయ్.. గెటప్ కనిపించొద్దని...!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకుంభమేళా (Maha Kumbh 2025)కు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తల్లితో కలిసి వెళ్లాడు. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ కాషాయ వర్ణం ధోతీలో కనిపించాడు. మెడలో రుద్రాక్ష మాలలున్నాయి. ముఖానికి మాస్కుతో..అక్కడికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌తోనే కనిపించాడు. బహుశా తన కొత్త సినిమా మేకోవర్ లుక్ కనిపించకూడదని ఇలా మాస్కుతో కవర్ చేసినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సైతం తన స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్లింది. జనవరి 13న మొదలైన ఈ పవిత్ర ఉత్సవం.. ఈ నెల 26న శివరాత్రి నాడు ముగియనుంది.సినిమావిజయ్ దేవరకొండ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో అతిథి పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం ఇతడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది 12వ సినిమా. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లు భోగట్టా! ఈ మూవీ తర్వాత విజయ్.. రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా సినిమాల్లో నటించనున్నాడు.చదవండి: పెళ్లి సమయంలో భారీగా ట్రోల్స్.. ఇప్పుడు గుడ్‌న్యూస్‌తో సీరియల్ నటి -
కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పవిత్ర స్నానం
లక్నో: యూపీలోని ప్రయాగరాజ్‌లో ఎంతో వైభవంగా మహా కుంభమేళా జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డికి అక్కడి పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుంభమేళాకు వెళ్లారు. సోమవారం ఉదయం 5.10 గంటలకు ప్రయాగరాజ్‌లోని సంగం ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మంత్రి కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ క్రమంలో మంత్రికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజారులు.. ఆయనను ఆశీర్వదించారు. ఈ మేరకు తాను కుంభమేళాకు వెళ్లిన దృశ్యాలను మంత్రి కోమటిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇదిలా ఉండగా.. కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా లక్షలాదిగా పాల్గొంటున్నారు. మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు.ఈరోజు ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొని బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించడం జరిగింది.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం… pic.twitter.com/sZSvsV4tCd— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) February 10, 2025 -
Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఈ మహోత్సవానికి దేశవిదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో చూసినా పొడవైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది.కుంభమేళా(Kumbh Mela)కు వచ్చిన భక్తులు రాష్ట్రంలోని అయోధ్య, వారణాసి, మధుర తదితర ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో ఈ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ఆలయాల్లో కాలుమోపేందుకు కూడా స్థలం కనిపించని విధంగా ఉంది. ఆదివారం(ఫిబ్రవరి 9) సెలవు దినం కావడంతో లెక్కకుమించినంతమంది భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. కుంభమేళాకు వచ్చినవారిలో చాలామంది అయోధ్యను సందర్శిస్తున్నారు. దీంతో అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ ట్రస్ట్ పలు ఏర్పాట్లు చేసింది.భక్తుల రద్దీ కారణంగా అయోధ్యలో విపరీతమైన ట్రాఫిక్ జామ్(Traffic jam) ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ విభాగం వాహనాలను నియంత్రించేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ఈ నేపధ్యంలో పలు సమస్యలు తలెత్తాయి. ఇదేవిధంగా యూపీలోని సుల్తాన్‌పూర్‌లో కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడి నుంచి భారీసంఖ్యలో జనం కుంభమేళాకు తరలివెళుతుండటంతో నేషనల్ హైవే వాహనాలతో నిండిపోయింది. ట్రాఫిక్ ఏమాత్రం ముందుకు కదలకపోవడంతో పలుచోట్ల ప్రయాణికులు ఆందోళనకు దిగారు.మధురలోని బృందావనం(Vrindavan in Mathura) కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం నాడు మధురకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించినవారంతా నేరుగా మధురకు చేరుకుని, శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో మధురలో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. ఇదే తరహాలో వారణాసిలోనూ భక్తుల కోలాహలం కనిపించింది. కాశీలోని అన్ని గల్లీలు భక్తులతో నిండిపోయాయి. ఇక్కడి అన్ని ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇది కూడా చదవండి: భలే కుర్రాడు.. ఆన్సర్ షీట్లో ఆ ఒక్క ముక్క రాసి.. -
మేళా కిటకిట
ప్రయాగ్‌రాజ్ (యూపీ): మహా కుంభమేళాకు వేదికైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కనీవినీ ఎరగనంతగా వచ్చి పడుతున్న జనసందోహంతో కిటకిటలాడుతోంది. దాంతో కొద్ది రోజులుగా నగరానికి నాలుగు వైపులా ఎటు చూసినా పదుల కొద్దీ కిలోమీటర్లు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. జనం తాకిడిని తట్టుకోలేక ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే మూసేశారు. ప్రయాగ్‌రాజ్, లక్నో మధ్య 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి! వాహనదారులు గంటలపాటు పడిగాపులు కాస్తున్నారు. షాహీ స్నానాల వంటి విశేషమైన ప్రత్యేకత ఏదీ లేకున్నా ఆదివారం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. సాయంత్రం 6 గంటలకే 1.42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో కుంభమేళాలో ఇప్పటిదాకా పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 42 కోట్లు దాటినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ఇంతటి రద్దీని ఇప్పటిదాకా ఏ కుంభ మేళాలోనూ చూడలేదని అధికారులే విస్తుపోతున్నారు. ‘‘షాహీ స్నాన్, పర్వదినాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో భక్తుల రద్దీ తక్కువగానే ఉండేది. ఈసారి సాధారణ రోజుల్లోనూ విపరీతంగా వస్తున్నారు’’ అని చెబుతున్నారు. రద్దీని తట్టుకునేందుకు ప్రయాగ్‌రాజ్ స్టేషన్లో సింగిల్ డైరెక్షన్ ట్రాఫిక్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు. -
Mahakumbh-2025: పెట్టుబడి పిసరంత.. ఆదాయం కొండంత.. ఏం ఐడియాలు గురూ!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 26 వరకూ ఈ పవిత్ర ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఉత్సవం నేపధ్యంలో కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోగా, మరోవైపు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్నారు.టూత్ స్టిక్స్ విక్రయిస్తూ..మహా కుంభమేళా(Kumbh Mela)లో కొందరు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్న ఉదంతానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వీరిలో కొందరు టూత్ స్టిక్స్ విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తుండగా, మరికొందరు టీ విక్రయిస్తూ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇటీవల ఒక కుర్రాడు కుంభమేళాలో టూత్ స్టిక్స్ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆ కుర్రాడు ఈ ఐడియా తన గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాడు. టూత్ స్టిక్స్ అమ్ముతూ తాను రోజూ వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆ కుర్రాడు ఆ వీడియోలో తెలిపాడు.టీ అమ్ముతూ రోజుకు రూ. 15 వేలుమరోవ్యక్తి మహా కుంభ్‌లో టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని టీ తోపాటు భేల్ పూరి విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ కుర్రాడు తాను భేల్ పూరీలు తయారు చేస్తూ, టీ తయారు చేసే పనికోసం మరో కుర్రాడిని నియమించి, రోజుకు రూ. 15 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి మరో వీడియోలో ఒక కుర్రాడు తన చేతిలో కెటిల్ పట్టుకుని కుంభమేళా ప్రాంతమంతా కలియతిరుగుతూ టీ విక్రయిస్తున్నాడు. తాను టీ విక్రయిస్తూ(Selling tea) రోజుకు ఎనిమిది నుంచి 10 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.తిలకం దిద్దుతూ రోజుకు రూ. 20 వేలుమహా కుంభమేళాకు వచ్చిన భక్తులకు తిలకం దిద్దతూ ఒక వ్యాపారి రోజుకు పది వేల నుంచి 20 వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడంటే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది నిజం.. ఆ వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం అతను తాను తిలకం దిద్దిన ఒక్కో వ్యక్తి నుంచి రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నాడు. రోజుకు తాను రెండువేల మందికి తిలకం దిద్దుతున్నానని తెలిపాడు. ఈ మహా కుంభమేళా ముగిసేనాటికి తాను ఎనిమిది లక్షల రూపాయల వరకూ సంపాదించగలనని ఆ వ్యాపారి చెబుతున్నాడు.నాణేలు ఏరుతూ రోజుకు రూ. 4 వేలుకుంభమేళా వీడియోల్లో మరో వీడియో అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ వీడియోలో ఒక కుర్రాడు గంగానదిలో ఐస్కాంతం సాయంతో నాణేలను వెదుకుతున్నాడు. భక్తులు గంగానదిలో విసిరిన నాణేలను సేకరిస్తున్నట్లు ఆ కుర్రాడు చెప్పాడు. ఈ విధంగా తాను రోజుకు నాలుగు వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నట్లు తెలిపి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది కూడా చదవండి: Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష -
Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు
మహా కుంభమేళా 2025 (Maha KumbhMela2025) ఉత్తర ప్రదేశ్‌లోని మహాకుంభమేళా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశ,విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాల ఆచరిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు రాజకీయ నాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు కూడా కుటుంబ సమేతంగా ప్రయాగరాజ్‌కు తరలి వెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర రాజకీయ నాయకులు కూడా పవిత్ర స్నానం ఆచరించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెఖావత్ , అర్జున్ రామ్ మేఘ్వాల్ వంటి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇంకా నటి హేమా మాలిని, అనుపమ్ ఖేర్, భాగ్యశ్రీ, మిలింద్ సోమన్ వంటి నటులు, కవి కుమార్ విశ్వాస్, క్రికెటర్ సురేష్ రైనా, రెజ్లర్ ది గ్రేట్ ఖలీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కోవలో ఇపుడు బాలీవుడ్ నటి నీనా గుప్తా (Neena Gupta) చేరారు.బాలీవుడ్ స్టార్స్ నీనా గుప్తా , సంజయ్ మిశ్రా మహా కుంభమేళాను సందర్శించి సంగంలో పవిత్ర స్నానం చేశారు. 2022 చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న వారి ప్రాజెక్ట్ వాధ్ 2 కోసం ఇద్దరూ ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ఈ సందర్బంగా నీనా గుప్తా తన అనుభవాన్ని పంచుకున్నారు. తొలి సారి కుంభమేళాను సందర్శించాననీ, తనకు ఇంత తన జీవితంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చిందని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల ఇప్పటికి నెరవేరిందనీ, ఇది "విశిష్ట అనుభవం" అని అభివర్ణించారు."నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం... చివరకు, ఈ రోజు పుణ్య కుంభ స్నానం చేసాను" అని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వం ఇంత బాగా నిర్వహించడం కూడా తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది.#WATCH | Prayagraj, UP | At #MahaKumbhMela2025, actor Neena Gupta says, "I have been wanting to come here for years... It was a unique experience... Finally, I took a dip today... The atmosphere here is crazy. I have never seen a bigger gathering in my life... I am impressed by… pic.twitter.com/kLHwVCbAL9— ANI (@ANI) February 7, 2025మరోవైపు చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు, భద్రత, పారిశుధ్యం. సౌకర్యాలు అన్నీ చాలా బావున్నాయి అంటూ నటుడు సంజయ్ మిశ్రా ప్రశంసించారు. రద్దీ తక్కువగా ఉంటుంది అనుకున్నాను..కానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉందంటూ తన అనుభవాన్ని పంచు కున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే మహా కుంభమేళా అత్యంత ముఖ్యమైందిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ్2025 ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ విశిష్ట కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ముగియనున్న కారణంగా భక్తులసంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనాకాగా ఇటీవల పంచావత్ సిరీస్‌తో నటిగాతానేంటో నిరూపించుకున్ననటి నీనా గుప్తా. తనదైన నటనతో అనేక సినిమాల్లో ఆకట్టుకుంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ద్వారా కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఒంటరిగానే ఆమెను పెంచి పెద్దదాన్ని చేసింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న మసాబా రెండో పెళ్లి చేసుకుని ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. -
Mahakhumb 2025 : తండ్రితో కలిసి సైనా నెహ్వాల్ పడవ ప్రయాణం (ఫొటోలు)
-
మోదీ పుణ్య స్నానం
ఢిల్లీ: మహా కుంభమేళా సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్(Prayagraj త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. అనంతరం ఆయన గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ప్రధాని వెంట ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఉన్నారు. జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ వచ్చారు. హెలికాప్టర్లో అరైల్ ఘాట్ వద్దకు.. అక్కడి నుంచి బోట్లో సంగమం వద్దకు చేరుకున్నారు.ప్రధాని రాక నేపథ్యంలో అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు భారీ భద్రతా మోహరించారు. #WATCH | Prime Minister Narendra Modi to shortly take a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh(Source: ANI/DD) #KumbhOfTogetherness pic.twitter.com/3F2guB1ElQ— ANI (@ANI) February 5, 2025 -
Maha Kumbh: భూటాన్ రాజు పుణ్య స్నానం
మహాకుంభ్ నగర్: భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్‌చుక్ మంగళవారం మహాకుంభ్ నగర్‌ను సందర్శించారు. త్రివేణీ సంగంలో పుణ్య స్నానం చేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అంతకుమునుపు వీరు సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పణ తదితర పూజలు చేశారు. భూటాన్ సంప్రదాయ దుస్తుల్లో విమానాశ్రయంలో ల్యాండైన వాంగ్‌చుక్ కాషాయ రంగు కుర్తాపైజామా ధరించి పుణ్యస్నానాల్లో పాల్గొన్నారు. వాంగ్‌చుక్, యోగితోపాటు సతువా బాబాగా అందరూ పిలిచే జగద్గురు సంతోష్ దాస్ మహారాజ్ కూడా ఉన్నారు. అనంతరం భూటాన్ రాజు అక్షయ్‌వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. డిజిటల్ మహా కుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను కూడా సందర్శించారు. వాంగ్‌చుక్ సోమవారం థింపూ నుంచి లక్నోకు చేరుకున్నారు. -
కుంభమేళాలో అయోధ్య రాముని రెప్లికా
మహా కుంభమేళాకి వెళ్తున్నారా? వెళ్లట్లేదా! అయోధ్య నుంచి బాలరాముడు కూడా మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ (Prayagraj) చేరుకున్నాడు. నిజమా! అవును నిజమే. అయోధ్య వెళ్లలేని వాళ్ల కోసం రాముడే స్వయంగా త్రివేణి సంగమానికి (Triveni Sangam) తరలి వచ్చాడని సంబరపడుతున్నారు భక్తులు. అచ్చం అయోధ్యలోని బాలరాముడి ఆలయాన్ని పోలిన నిర్మాణాన్ని యూపీలోని కుంభమేళాలో ఆవిష్కరించాడు మన హైదరాబాదీ. ఆయన పేరు రమణ వంక (Ramana Vanka). సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా సొబగులద్దే రమణ ఈ మహాకుంభమేళా సందర్భంగా అయోధ్యరాముడి ఆలయాన్ని, బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‘భీమ సినిమాకు టెంపుల్ సెట్ వేసిన అనుభవం ఉంది. అది తెలిసి ఆద్యశ్రీ ఎన్ఫోటైన్మెంట్, శ్రీ గరుడ రామ్‌మందిర్ వారు పిలిచారు. ‘శతమానం భవతి’ సినిమా కోసం దాదాపు యాభై రోజులు నియమనిష్ఠలు పాటించాను. అలాగే రాముడి మందిరానికి భూమి పూజ చేసిన డిసెంబర్ 26 నుంచి నిష్ఠలో ఉన్నాను. ఫిబ్రవరి 26తో మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగుస్తుంది. కానీ శ్రీరామనవమి వేడుకల వరకూ (మార్చి 15) మందిరాన్ని ఉంచాలని అనుకుంటున్నారు. అప్పటి వరకూ నిష్ఠను కొనసాగిస్తాను’ అన్నారు రమణ వంక.అయోధ్య మందిరాన్ని చూడలేదు.. అయోధ్య మందిరానికి ప్రతిరూప నిర్మాణాన్ని 25 రోజుల్లో పూర్తి చేశారు రమణ. ఒక ఆలయానికి రూపకల్పన చేయాలంటే శాస్త్రాలను, మత విశ్వాసాలను, నిర్మాణశైలిని అధ్యయనం చేయాలి. ప్రతి చిన్న డీటెయిలింగ్ వెనుక ఒక అధ్యయనం ఉంటుంది. అప్పటికే ఉన్న ఆలయానికి రెప్లికా కాబట్టి రోజుల్లోనే చేయగలిగానని, ఇది నా అదృష్టమని రమణ చెబుతున్నారు. అయితే ‘అయోధ్య మందిరాన్ని సందర్శించలేదని, కానీ నిర్మాణాన్ని ఫొటోలో చూడగానే ఒక అవగాహన వచ్చిందని, ఈ నిర్మాణంలో వెదురు, ఫైబర్, ఫోమ్, క్లాత్ వాడామని, ఎనిమిది డిగ్రీల చలిలో, మంచుతో తడిసిన వెదురు కర్రల మీద 80 అడుగుల ఎత్తులో పని చేస్తున్నప్పుడు ఆందోళనగా ఉండేదని, ఎటువంటి చిన్న ప్రమాదం లేకుండా పని పూర్తి చేయగలిగామని, అవకాశం వచ్చినప్పుడే మనల్ని మనం నిరూపించుకోవాలి’ అని చెబుతున్నారు రమణ. కాగా కుంభమేళాలో అయోధ్య రాముడి నమూనా నిర్మాణం చేపట్టిన ఘనత హైదరాబాదీది, పైగా తెలుగువాడిది కావడం గర్వకారణం.అయోధ్యలో సగం! ప్రయాగ్‌రాజ్ రామ మందిరానికి అయోధ్య మందిరం కొలతల్లో యాభై శాతం తీసుకున్నారు. 161 అడుగుల ఎత్తును 81 చేశారు. 360 అడుగుల పొడవు, 161 అడుగుల వెడల్పు 140, 120గా తీసుకున్నారు. రాముడి విగ్రహాన్ని అసలు రూపం కంటే మూడు అంగుళాలు తక్కువగా తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ బదులు జల ప్రతిష్ఠ చేశారు. నిత్యపూజలు దర్శనాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఉంటాయి. రోజుకు 15 నుంచి 20 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు.చదవండి: ప్రత్యక్ష దైవమా.. ప్రణామంసర్వమతం.. శ్రీరామం.. ప్రయాగ్‌రాజ్ రామమందిరం రూపశిల్పి రమణ తెలుగు వాడు. అయితే హిందీ, బెంగాలీ వాళ్లు మొత్తం రెండు వందల మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు. నిత్యం ‘జై శ్రీరామ్’ అంటూ దీక్షగా పని చేసుకుపోయిన వారిలో వివిధ భాషలే కాదు, మతాలు కూడా ఉన్నాయి. ఈ 200 మందిలో హిందూ, క్రిస్టియన్, ముస్లింలు ఉన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో చుంగ్లీ అనే ప్రదేశంలో ఉంది. త్రివేణి సంగమం, సెక్టార్ 1, గ్రౌండ్ 17లో ఉంది.రాముడే పిలిచాడు! బీఎస్సీ చదివి 10–5 జాబ్ చేశాను. సంతృప్తినివ్వలేదు. దీంతో నాకిష్టమైన డ్రాయింగ్‌లో ఎమ్ఎఫ్ఏ చేశాను. ఆర్ట్ డైరెక్టర్‌గా పాతికకు పైగా సినిమాలకు పనిచేసి నేషనల్ అవార్డు అందుకున్నాను. నా కెరీర్లో ది బెస్ట్ టాస్క్ అయోధ్య ఆలయ రెప్లికా నిర్మాణం. వెనక్కి తిరిగి చూసుకుంటే నా చరిత్రలో రాముడున్నాడు. జీవితానికి ఇది చాలు. – రమణ వంక, సినీ ఆర్ట్ డైరెక్టర్ -
తొక్కిసలాట పెద్ద విషయమేమీ కాదు: హేమామాలిని
న్యూఢిల్లీ: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని మహా కుంభమేళా దుర్ఘటనపై చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలో అంత మంది చనిపోవడం పెద్ద విషయమేమీ కాదని అన్నారామె. మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. మరణాల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ అంశం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలనూ కుదిపేస్తోంది. అయితే ఈ విమర్శలపై హేమా మాలిని స్పందించారు. #WATCH | Delhi: BJP MP Hema Malini says "...We went to Kumbh, we had a very nice bath. It is right that an incident took place, but it was not a very big incident. I don't know how big it was. It is being exaggerated...It was very well-managed, and everything was done very… pic.twitter.com/qIuEZ045Um— ANI (@ANI) February 4, 2025‘‘మేమూ పుణ్య స్నానం కోసం అక్కడికి వెళ్లాం. జరిగిందేదో జరిగింది. అయినా అదేం అంత పెద్ద ఘటనేం కాదు. కేవలం ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న అతిశయోక్తి మాత్రమే. కుంభ మేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది. అంతా సజావుగానే జరుగుతోంది. అయితే అంత మంది వస్తుండడంతో.. నిర్వాహణ కాస్త కష్టతరమే. కాబట్టి తొక్కిసలాట పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అని అన్నారామె. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ తారీఖ్ అన్వర్ కౌంటర్ ఇచ్చారు. ఆమె నటి, పైగా అధికారంలో ఉన్నారు. అందుకే ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ దక్కి ఉంటుంది. తొక్కిసలాటకు దారి తీసే భయంకరమైన రద్దీ ఎలా ఉంటుందో బహుశా ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు అని అన్నారామె. ఒకవేళ అది(తొక్కిసలాట ఘటన) పెద్ద విషయం కాదని ఆమె అంటే.. అది నిజంగా దురదృష్టకరం. అది బాధిత కుటుంబాలను అవమానించడమే అని అన్నారాయన#WATCH | On BJP MP Hema Malini's statement on the Maha Kumbh Stampede, Congress MP Tariq Anwar says, "Hema Malini can never know what it was really like. When she visited, she was given VIP treatment. Things at Maha Kumbh went downhill because the police and administration were… pic.twitter.com/SnsQGfnIkA— ANI (@ANI) February 4, 2025ఇదిలా ఉంటే.. గత వారం పుణ్య స్నానానికి వెళ్లిన హేమా మాలిని.. గొప్ప అనుభూతిని పొందినట్లు ఆ టైంలో వ్యాఖ్యానించారు. ఆ టైంలో ఆమె వీవీఐపీ టట్రీట్మెంట్ గురించి చర్చ నడిచింది. మరోవైపు మహాకుంభమేళాలో సామాన్యులను పట్టించుకోవడం లేదని, కేవలం వీవీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు ఉంటున్నాయనే ఆరోపణలు మొదటి నుంచి వినవస్తున్నాయి. -
మోడీ కుంభమేళ షెడ్యూల్
-
తొక్కిసలాట మరణాలపై తప్పుడు లెక్కలు.. లోక్‌సభలో అఖిలేష్ ఫైర్
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది. ఈ దుర్ఘటనలో మరణాలు దాస్తున్నారంటూ.. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా సందర్భంగా యోగి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపైనా మండిపడ్డ ఆయన.. తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?.. అసలైన లెక్క బయటపెట్టండి.. అంటూ ప్రసంగించారు.రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు పార్లమెంట్ మంగళవారం కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలో.. కుంభమేళా దుర్ఘటనపై అఖిలేష్ యాదవ్ ప్రసంగించారు. ‘‘మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరం. యూపీ ప్రభుత్వం 30 మంది చనిపోయారని, 60 మందికి గాయాలయ్యాయని చెబుతోంది. కానీ, విపక్షాలు ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నాయని అంటున్నాయి. బడ్జెట్ విషయంలో సరైన లెక్కలు చెప్పే ఈ ప్రభుత్వం.. కుంభమేళా మరణాల సంఖ్యను మాత్రం ఎందుకు దాస్తోంది. అసలు ఈ దుర్ఘటనకు బాధ్యత ఎవరిది? ఇప్పటిదాకా ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు అని అఖిలేష్ ప్రశ్నించారు.#WATCH | Samajwadi Party Chief Akhilesh Yadav says "Uttar Pradesh Chief Minister did not express condolence. When the President and Prime Minister of the country expressed condolence, after 17 hours the (State) government accepted it. These are the people who cannot accept the… pic.twitter.com/4F3ONlYA0l— ANI (@ANI) February 4, 2025కుంభమేళా తొక్కిసలాట ఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించాలి. మరణాలు, గాయపడ్డవాళ్లు, వాళ్లకు అందుతున్న చికిత్స, అక్కడి వైద్య సిబ్బంది, రవాణా సదుపాయలు, వైద్యం.. ఇలా అన్నింటి గురించి చర్చ జరగాలి అని ఆయన డిమాండ్ చేశారాయన. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపేంతదాకా యోగి సర్కార్ సంతాపం ప్రకటించకపోవడంపైనా అఖిలేష్ విరుచుకుపడ్డారు. అలాగే.. పెట్టుబడుల విషయంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఇంజిన్లు మాత్రమే కాదు.. భోగీలు కూడా ఢీ కొట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి.. మౌని అమావాస్య పురస్కరించుకుని అమృత స్నానాల కోసం భక్తులు పోటెత్తారు. అఖాడా ఘాట్ల వద్ద ఒక్కసారిగా తోపులాట జరగడంతో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు మృతి చెందగా, గాయపడ్డవాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటలకు పరిస్థితి అదుపులోకి రావడంతో పుణ్య స్నానాలు యథాతధంగా కొనసాగాయి. చివరకు.. ఘటనలో 30 మంది మరణించినట్లు అక్కడి పోలీసు అధికారులు సాయంత్రం ప్రకటించారు. -
Maha Kumbh: మిగిలినవి అమృత స్నానాలు కాదు.. కారణమిదే
మహా కుంభమేళాలోని మూడవ, చివరి అమృత స్నానం వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాడు ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో మూడు ప్రముఖ రోజులలో అమృత స్నానాలు జరిగాయి. ఇంకో రెండు పుణ్యస్నానాలు కూడా ఉన్నాయి. అయితే పండితులు వాటిని అమృత స్నానాలుగా పరిగణించరు.మాఘ పూర్ణిమ(ఫిబ్రవరి 12), మహాశివరాత్రి(ఫిబ్రవరి 26) రోజులలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈ స్నానాల సమయంలో అమృత ఘడియలు లేవని చెబుతారు. మొఘలుల కాలం నుండి నాగ సాధువులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ, వారికి ప్రత్యేక రాజ స్నానాల హోదాను కల్పించారు. ఆది శంకరాచార్యులు(Adi Shankaracharya) ధర్మ సంరక్షకునిగా నాగ సాధువుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నాగ సాధువులకు మొదట స్నానం చేసే హోదాను కూడా శంకరాచార్యులే కల్పించారని చెబుతారు.నాగ సాధువులు వసంత పంచమి నాడు అమృత స్నానం చేశాక వారి నివాసస్థానాలకు వెళ్లిపోతారు. అమృత స్నానాల నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉంది. సూర్యుడు మకర రాశిలో.. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే రాజ స్నానాలు చేస్తారు. వీటినే అమృత స్నానాలు అని కూడా ఉంటారు. మాఘ పూర్ణిమ(Magha Purnima) నాడు, బృహస్పతి వృషభరాశిలో ఉంటాడు. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా శివరాత్రి రోజున కూడా సూర్యుడు కుంభ రాశిలోనే ఉంటాడు. ఫలితంగా అది పవిత్ర స్నానం అవుతుంది. కానీ దానికి అమృత స్నానం అనే స్థితి లభించదు.ఇది కూడా చదవండి: 5న ప్రధాని మోదీ కుంభస్నానం -
5న ప్రధాని మోదీ కుంభస్నానం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాను సందర్శించనున్నారు. అనంతరం పవిత్ర తివేణీ సంగమంలో పుణ్య స్నానం చేయనున్నారు. బుధవారం, మాఘ మాసం అష్టమి తిథి నాడు ప్రధాని మోదీ పవిత్ర స్నానం చేయనున్నారు. తరువాత త్రివేణీ సంగమం ఒడ్డున గంగామాతను పూజించి, దేశప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయనున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు మహాకుంభ్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అనంతరం అరయిల్ ఘాట్ నుండి పడవ ద్వారా సంగమ ప్రాంతానికి వెళ్తారు. ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు గంటసేపు ఉంటారు. కాగా 2024 డిసెంబర్ 13న ప్రధాని సంగమం ఒడ్డున గంగా నదికి హారతినిచ్చి, పూజలు నిర్వహించి, కుంభమేళా విజయవంతం కావాలని ప్రార్థించారు. బుధవారం కుంభమేళాకు వస్తున్న ప్రధాని మోదీ అక్కడ అఖాడాలను కలుసుకోనున్నారు.2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అర్థ కుంభమేళాలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగి, సామాజిక సామరస్య సందేశాన్ని అందించారు. ప్రధాని నుంచి అటువంటి గౌరవాన్ని పొందిన ఐదుగురు సిబ్బందికి నోటమాటరాలేదు. ఆ దృశ్యాన్ని చూసిన ఇతర పారిశుధ్య కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ కూడా దీనిని తన జీవితంలో అత్యంత మరపురాని క్షణంగా అభివర్ణించారు.ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో భేటీ? -
మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కుంభమేళా ఒక ప్రధానాంశంగా మారింది. దీనికితోడు కుంభమేళాలో పలు ఆసక్తికర అంశాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇదేవిధంగా ఈ మహాపర్వంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మహాకుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మౌని అమావాస్యనాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్(Samajwadi Party MP Jaya Bachchan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభ్‌లో నీరు అత్యంత కలుషితమైపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాలను నదిలోకి విసిరేయడం వల్ల నీరు కలుషితమయ్యిందని, ఇదే నీరు అక్కడి ప్రజలకు చేరుతోందని, దీనిపై ఎవరూ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని, దేశంలోని సమస్యలపై ఎటువంటి శ్రద్ధ లేదని ఆమె ఆరోపించారు.కుంభమేళాకు వచ్చే సామాన్యులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదని, వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆమె ఆరోపించారు. వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ, సామాన్యుల సౌకర్యాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కోట్లాది మంది జనం కుంభమేళా(Kumbh Mela)కు వచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని, అంత పెద్ద సంఖ్యలో జనం ఎలా చేరుకోగలరని ఆమె ప్రశ్నించారు. ఇంతకీ మహా కుంభమేళాలో ఏం జరిగింది? అనే విషయాన్ని ప్రపంచం ముందు ఉంచాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు. ప్రజలకు నిజం చెప్పాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు.మహా కుంభమేళా తొక్కిసలాట గురించి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi) మాట్లాడుతూ కుంభమేళాలో కొందరు మరణించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై ప్రత్యేక చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయం కోసం ఎవరు ప్రశ్నిస్తున్నా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బుల్డోజర్ను నడుపుతోందన్నారు. కుంభమేళాలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, తాము సభలో నోటీసు ఇచ్చినా, దానిని తిరస్కరించారన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా అంశాన్ని లేవనెత్తుతామని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్‌కు చుక్కలే.. -
కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరమే, కానీ..
న్యూఢిల్లీ: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ అంశం ప్రస్తుతానికి తమ పరిధిలో లేదని సీజేఐ బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేసింది.మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి అధికారులే బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్‌ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు జారీ చేయాలని విశాల్ తివారీ తన పిల్లో ప్రస్తావించారు.అయితే ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ.. ఉత్తర ప్రదేశ్ అధికారులపై చర్యలకు ఆదేశించలేమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. అలాగే.. ఈ పిల్‌పై విచారణ జరపలేం అని చెప్పారు. ఈ ఘటనపై జ్యూడీషియల్ కమిటీ ఏర్పాటైంది. కాబట్టి, అలహాబాద్ హైకోర్టును సంప్రదించండి అని పిటిషనర్ విశాల్ తివారీకి సీజేఐ సూచించారు. దీంతో ఆయన తన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు.. హైకోర్టులో ఇదే అంశంపై పిల్ దాఖలైన విషయాన్ని యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.కుంభమేళాలో భాగంగా.. మౌనీ అమావాస్య అమృత స్నానాలను పురస్కరించుకుని త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. -
Mahakumbh: అఖాడాల అమృతస్నానం.. హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. వార్ రూమ్‌లో సీఎం యోగి
యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు(సోమవారం) వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాటికి ఐదు కోట్లకు పైగా భక్తులు స్నానాలు ఆచరిస్తారని కుంభమేళా నిర్వాహకులు అంచనా వేశారు. జనసమూహాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వసంత పంచమి అమృత స్నానాల సందర్బంగా భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘వార్ రూమ్’లో కూర్చుని, కుంభమేళా పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు. #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: A woman devotee blows the conch shell at Sangam Ghat as saints and devotees gather for Amrit Snan on the occasion of Basant Panchami. pic.twitter.com/vXlIqmiVun— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్‌రాజ్‌లో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానానికి సిద్ధమైన సాధువులు, భక్తుల మధ్య సంగమ్ ఘాట్ వద్ద శంఖం పూరిస్తున్న ఒక మహిళా భక్తురాలు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Foreign devotees sing 'Hanuman Chalisa' as they head to Triveni Sangam for the 'Amrit Snan' on the occasion of Basant Panchami. pic.twitter.com/Fnmw9AhYP8— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్‌రాజ్‌లో వసంత పంచమి సందర్భంగా 'అమృత స్నానం' కోసం త్రివేణి సంగమం వైపు వెళుతున్న విదేశీ భక్తులు 'హనుమాన్ చాలీసా' పఠిస్తూ కనిపించారు.స్వామి కైలాసానంద గిరి మాట్లాడుతూ ‘13 అఖాడాలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తున్నారు. మేము గంగా మాతను, శివుడిని పూజించాం. నాగ సాధువులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది మా మూడవ 'అమృత స్నానం', నేను ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాను. 13 అఖాడాలకు అవసరమైన ఏర్పాట్లు చేసినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అభినందనలు’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | Spiritual leader Swami Kailashanand Giri says, "All the 13 Akhadas took a holy dip at Triveni Sangam...We offered prayers to Ganga Maa, Lord Shiva...All the Nagas are very excited...This was our third 'Amrit Snan'...I congratulate UP… pic.twitter.com/po5OtrAArf— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్‌రాజ్‌లోని ఒక నాగ సాధువు మాట్లాడుతూ ‘గత రెండు అమృత స్నానాల కంటే ఈరోజు ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు స్నానం మాకెంతో ముఖ్యమైనది’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A Naga sadhu says, "Arrangements today were better than the previous two Amrit Snans... Today's snan was the biggest for us saints..." pic.twitter.com/n1OPYfYw34— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్‌రాజ్‌లోని ఒక సాధువు మీడియాతో మాట్లాడుతూ ‘ఈరోజు అమృత స్నానం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అఖాడాలు, సాధువులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A saint says, "... The Amrit Snan was very good today... All akharas and saints took a holy dip. The arrangements were very nice." pic.twitter.com/Ebqvcv8oTG— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఒక విదేశీ భక్తుడు మాట్లాడుతూ ‘ఇది మాటల్లో చెప్పలేని మధుర అనుభవం. నేను చాలా ధన్యుడినయ్యానని భావిస్తున్నాను’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a foreign devotee says, "It is an experience beyond words and I feel very blessed..." pic.twitter.com/8N3o8DUjsl— ANI (@ANI) February 3, 2025ఆచార్య లక్ష్మీనారాయణ్ త్రిపాఠి మాట్లాడుతూ ‘ఈ పవిత్రమైన రోజున అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అఖాడాలు ఎల్లప్పుడూ ఐక్యంగానే ఉంటారు’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a foreign devotee says, "It is an experience beyond words and I feel very blessed..." pic.twitter.com/8N3o8DUjsl— ANI (@ANI) February 3, 2025జునా అఖారా స్నానం పూర్తయింది. మొదట మహానిర్వాణి, తరువాత శ్రీ నిరంజని, అనంతరం జునా అఖారా స్నానం చేశారు. జూనా అఖారాకు చెందిన నాగ సాధువులు వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం చేశారు. #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | Acharya Laxminarayan Tripathi of Kinnar Akhara says, "... We are all very happy on this auspicious day. The Kinnar Akhara was, is, and will always be united." pic.twitter.com/z867gPFecp— ANI (@ANI) February 3, 2025ఇది కూడా చదవండి: Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Naga sadhus of the Juna Akhara take a holy dip as part of the Amrit Snan on the occassion of Basant Panchami. pic.twitter.com/1WsR4Elltj— ANI (@ANI) February 3, 2025 -
Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు(సోమవారం) వసంతపంచమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే త్రివేణీ సంగమంలో అమృత స్నానాలు మొదలయ్యాయి. నాగ సాధువులు ఈరోజు తొలిస్నానం ఆచరిస్తున్నారు. #WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: The Juna Akhada reaches for the 'Amrit Snan' on the occassion of Basant Panchami. pic.twitter.com/CSVam6KdGJ— ANI (@ANI) February 3, 2025మహాకుంభమేళా ప్రాంతంలో వసంత పంచమి సందర్భంగా మూడవ అమృత స్నానానికి వేలాది మంది భక్తులు సిద్ధమయ్యారు. దీంతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది.Millions of pilgrims, saints, yogis, and visitors from around the world gathered at the sacred Triveni Sangam—the confluence of Maa Ganga, Yamuna, and Saraswati—seeking spiritual purification. They took a holy dip in the sacred waters during the Amrit Snan on the auspicious… pic.twitter.com/FahoAvrb0O— Mahakumbh (@MahaKumbh_2025) February 2, 2025గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో నిరంజని అఖాఢా అధిపతి కైలాశానంద గిరి మహారాజ్, నిరంజని అఖాఢాకు చెందిన ఇతర సాధువులు పవిత్ర స్నానాలు చేశారు. మహంత్ రవీంద్ర పూరి మాట్లాడుతూ తమ స్నానం ఎంతో సంతోషంగా జరిగిందని, అందరూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు. పవిత్ర స్నానాలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు.#WATCH | #MahaKumbh2025 | Prayagraj: Avigail from Austria says, "It is unbelievable and amazing. This is once in a lifetime experience...I have started understanding the people of India...I have never seen anything like this..." pic.twitter.com/3wXVj392J2— ANI (@ANI) February 3, 2025రష్యాకు చెందిన మహానిర్వాణి అఖాడాకు చెందిన మీనాక్షి గిరి మాట్లాడుతూ ‘ఇది నా జీవితంలో చాలా పవిత్రమైన క్షణం. నేను గత 17 సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాను’ అని అన్నారు.#WATCH | Prayagraj, UP | #MahaKumbhMela2025 | Drone visuals of Maha Kumbh Mela Kshetra, Triveni Sangam, as thousands of devotees gather for the third Amrit Snan on the occassion of Basant Panchami. pic.twitter.com/LtLjC083QP— ANI (@ANI) February 3, 2025నాగ అఖాడాలన్నింటిలో అతిపెద్దదైన జునా అఖాఢా సాధువులు అమృత స్నానం కోసం వేచిచూస్తున్నారు. ఇదేవిధంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఘాట్ వద్దకు చేరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు(వసంత పంచమి)ఇప్పటివరకు 16.58 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.VIDEO | Maha Kumbh 2025: Juna Akhara prepares to leave for Basant Panchami Amrit Snan. #MahaKumbh2025 #MahaKumbhWithPTI pic.twitter.com/c2Mq1AXipQ— Press Trust of India (@PTI_News) February 2, 2025వసంత పంచమి అమృత స్నానాల వేళ నాగ సాధువులు మాత్రమే కాకుండా అదృశ్య ఋషులు కూడా స్నానం చేయడానికి వస్తారని చెబుతుంటారు. ఈ రోజున స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని అఖాఢా మహానిర్వాణికి చెందిన ఒక సాధువు తెలిపారు.నిరంజని అఖాడా ఆచార్య మహామండలేశ్వర్, నిరంజన్ పీఠాధీశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహారాజ్ మాట్లాడుతూ ‘నేడు వసంత పంచమి. ఈరోజు సనాతనీయులంతా సరస్వతి మాతను పూజిస్తారని అన్నారు.VIDEO | Maha Kumbh 2025: A seer from Panchayati Akhara Mahanirvani speaks on the importance of Basant Panchami Amrit Snan and praises the administration for the arrangements. #MahaKumbh2025 #MahaKumbhWithPTI pic.twitter.com/dwaspnZrrC— Press Trust of India (@PTI_News) February 2, 2025శ్రీ పంచాయితీ అఖాడ మహానిర్వాణి 'అమృత స్నానం' కోసం త్రివేణి సంగమానికి చేరుకున్నారు. అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పురి మాట్లాడుతూ ‘ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం చేశాక, తాము తిరిగి వారణాసికి బయలుదేరుతామన్నారు. భక్తులంతా సంయమనం పాటిస్తూ అమృతస్నానం చేయాలి’ అని అన్నారు. #WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP | Akhadas head towards Triveni Sangam with their deities for the Amrit Snan on the occasion of Basant Panchami. pic.twitter.com/5pbNqS2eTa— ANI (@ANI) February 2, 2025ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
Mahakumbh: వసంత పంచమికి ముమ్మర ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల త్రివేణీ సంగమంలో కుంభమేళా పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆదివారం(ఫిబ్రవరి 2) కావడంతో ఉదయం నుంచే పవిత్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాలున్నాయి.వసంతపంచమి(Vasanta Panchami) నాడు స్నానాలు ఆచరించేందుకు రెండురోజుల ముందుగానే భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంనకు దారితీసే అన్ని మార్గాలు భక్తుల వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా రోడ్లపై జనసమూహం కనిపిస్తోంది. దీనిని గుర్తించిన అధికారులు ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.జనవరి 29 మౌని అమావాస్య రోజున దాదాపు ఎనిమిది కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరుసటి రోజు కూడా ఇదే తీరు కనిపించింది. తరువాత శుక్ర, శనివారాల్లో రద్దీ కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే ఈరోజు (ఆదివారం) ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు వస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాళీ మార్గ్, ఆనకట్ట, సంగమం వైపు వెళ్లే రహదారులలో భద్రతను మరింత కట్టిదిట్టం చేశారు. మరోవైపు మౌని అమావాస్య స్నానోత్సవంలో జరిగిన ప్రమాదం తర్వాత, ప్రభుత్వం నిఘాను మరింతగా పెంచింది.వసంత పంచమి రోజున సంగమ ఘాట్(Sangam Ghat) వద్ద జనం గుమిగూడకుండా చూసుకోవాలని పోలీసులకు, సైనికులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భక్తులు స్నానం చేసిన వెంటనే ఘాట్ నుంచి బయటకు వెళ్లేలా చూడాలని అధికారులు వారిని ఆదేశించారు. వసంత పంచమినాడు ఎవరూ కూడా బారికేడ్లను బద్దలు కొట్టకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లు దాటవద్దని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. కుంభమేళాలో కనిపించిన కొందరు వ్యక్తులు కూడా అందరి నోళ్లలో నానుతున్నారు. వారిలో ఒకరే కుంభమేళాలో పూసల దండలు అమ్మేందుకు వచ్చిన తేనెళ్ల మోనాలిసా. ఆమె తాజాగా మరో వీడియో విడుదల చేసింది.కుంభమేళా మోనాలిసా(Kumbh Mela Mona Lisa)కు సంబంధించిన పలు వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీంతో ఆమె విధిరాత మారిపోయిందంటున్నారు. త్వరలోనే ఆమె సినిమాల్లో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ‘డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో నటించనున్నదని, ఇందుకోసం ఆమె సంబంధిత ప్రాజెక్టుపై సంతకం చేసిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతలో, తాజాగా మోనాలిసా మరో వీడియోను వీడుదల చేశారు. దీనిలో ఆమె సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలకు, ఊహాగానాలకు వివరణ ఇచ్చారు.#monalisabhosle video #MahaKumbh2025 pic.twitter.com/OgosaBMXeg— Narinder Saini (@Narinder75) February 2, 2025ఆ వీడియోలో మోనాలిసా మాట్లాడుతూ ‘హలో.. నేను మోనాలిసా. నేను రుద్రాక్ష దండలు అమ్మడానికి మహా కుంభమేళాకు వెళ్లాను. మహాదేవుని అనుగ్రహంతో పాటు అందరి ఆశీస్సులతో నేను రాత్రికి రాత్రే ప్రసిద్ధి చెందాను. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి దయతోనే నాకు ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’(‘The Diary of Manipur’) అనే సినిమాలో అవకాశం వచ్చింది. దీనికి డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఆయన మా ఇంటికి వచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకుని వెళ్లారు. హీరోయిన్ కావాలనేది నా కోరిక. అది ఈరోజు నెరవేరబోతోంది. మీ అందరి ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ప్రస్తుతం నేను నటన నేర్చుకోబోతున్నాను. ఆ తరువాత సినిమాల్లో నటిస్తాను. మోనాలిసా లక్షలు సంపాదిస్తోందని సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఎవరో నాకు కారు ఇచ్చారని కూడా రాశారు. ఇవన్నీ అబద్దాలే. అయితే సనోజ్ మిశ్రా జీ ముంబై నుండి వచ్చి నాకు సినిమా ఆఫర్ ఇచ్చారు. ఇకపై నేను ముందుకు సాగడానికి మీరందరూ నన్ను ఆశీర్వదించండి’ అని మోనాలిసా కోరారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. కుంభమేళా సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలతో పాటు విషాదకర ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఉదంతం బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని మధుబని నాలుగు లేన్ల రోడ్డులో చోటుచేసుకుంది.బైక్ రైడర్లను కాపాడే ప్రయత్నంలో స్కార్పియో వాహనం(Scorpio vehicle) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో స్కార్పియోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్పీ విద్యా సాగర్ తన బృందంతోపాటు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఎస్‌కేఎంసీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నేపాల్‌లోని మొహతారికి చెందిన కొందరు ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ్‌లో స్నానం చేసి, స్కార్పియో వాహనంలో తిరిగి నేపాల్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి స్థానికులు మాట్లాడుతూ ఈ ఘటనకు ముందు కొంతమంది యువకులు నాలుగు లేన్లలో బైక్‌లపై విన్యాసాలు చేస్తుండగా, ఒక స్కార్పియో వాహనం చాలా వేగంగా వారికి ఎదురుగా వచ్చిందన్నారు. ఆ వాహనం బైక్ నడుపుతున్నవారిని తప్పించే ప్రయత్నంలో డివైడర్‌ను ఢీకొని, ఆపై బోల్తా పడిందన్నారు. ఇది చూసిన ఆ యువకులు బైక్‌లతో సహా అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. స్కార్పియో వాహనం మూడు సార్లు బోల్తా పడటంతో దానిలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని వివరించారు. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి -
యోగి సర్కారును మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి ధన్కర్
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వేడుకగా కొనసాగుతోంది. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పవిత్ర సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాకు ఘనమైన ఏర్పాట్లు చేశారని యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం గురించి మీడియా ఆయనను ప్రశ్నించినప్పుడు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పరిస్థితులు సద్దుమణిగాయని, దీనిని చూస్తుంటే యూపీ సర్కారు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నదో ఇట్టే గ్రహించవచ్చని అన్నారు. ఈ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మెచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి(Vice President) అన్నారు. ఈ భూమిపై ఎక్కడా ఇంతటి భారీ కార్యక్రమం జరిగివుండదు. కుంభమేళా నిర్వహణకు యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ధన్కర్ పేర్కొన్నారు.మహా కుంభమేళాలో లక్షకు పైగా మరుగుదొడ్లు నిర్మించారని, యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్(Maha Kumbh)కు వచ్చిన వారి సంఖ్య అమెరికా జనాభాకు సమానం అని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారని ఆయన అన్నారు. తాను కుంభ్ స్నానం కోసం నీటిలోకి దిగిన క్షణం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం అని ధన్కర్ పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశం లాంటి దేశం మరొకటి లేదని, అంకితభావం, సామర్థ్యం, సంస్కృతి పరిజ్ఞానం, దేశానికి సేవ చేసే స్ఫూర్తి ఇక్కడ ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. -
Mahakumbh-2025: యాత్రికులకు మమతా సర్కారు హెల్ఫ్‌డెస్క్
కోల్‌కతా: మౌని అమావాస్య నాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురు మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన మమతా సర్కారు పశ్చిమ బెంగాల్ నుంచి కుంభమేళాకు వెళ్లేవారికి పలు సూచనలు జారీ చేసింది. ఒక హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.కుంభమేళాకు పశ్చిమబెంగాల్ నుంచి వెళుతున్న యాత్రికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి(Emergency) తలెత్తినప్పుడు ఈ హెల్ప్‌డెస్క్ సాయం అందించనుంది. వారంలో ప్రతిరోజూ 24 గంటల పాటు సహాయం అందించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ, పౌర రక్షణ శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ హెల్ప్‌డెస్క్(Helpdesk) పర్యవేక్షణ జరగనుందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు మహా కుంభమేళాకు వెళ్తున్నారని, వారికి సహాయం చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు హెల్ప్‌లైన్ నంబర్ (033) 2214-3526, టోల్-ఫ్రీ నంబర్ 1070ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్(West Bengal)కు చెందిన నలుగురు యాత్రికులు మృతిచెందగా, తొమ్మిది మంది గల్లంతయ్యారు. ఇదిలావుండగా మహా కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల గణాంకాలను ప్రభుత్వం అందించాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరూ విశ్వసించడం లేదన్న అఖిలేష్ ఒక ప్రకటనలో ఈ ప్రభుత్వానికి దేశ ప్రజల విషయంలో ఎలాంటి దార్శనికత లేదు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, యువత, పేదలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ గణాంకాల కంటే, మహా కుంభ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన, గాయపడిన, తప్పిపోయిన వారి గణాంకాలు చాలా ముఖ్యమైనవని అఖిలేష్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి -
Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. అయితే జనవరి 29న మౌని అమావాస్య అమృత స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు.బాధితులు చికిత్స పొందుతున్న ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప రాణి నెహ్రూ ఆసుపత్రి(Swaroop Rani Nehru Hospital)కి చేరుకున్న ఆదిత్యనాథ్ బాధితులను పరామర్శించడంతో పాటు, వారి ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తుందని, వారికి అవసరమైన ఇతర ఏర్పాట్లలో ఎటువంటి లోటు ఉండదని సీఎం యోగి హామీనిచ్చారు. ఒక బాధితురాలితో సీఎం మాట్లాడుతూ దేనికీ ఆందోళన చెందవద్దని, వైద్యులు అంతా చూసుకుంటారని తెలిపారు. మరో బాధితురాలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్(Discharge) అవుతుండటాన్ని గమనించిన యోగి ఇలాంటివారిని వారిని ఇళ్లకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది సీఎంతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న ఏ బాధితుని పరిస్థితి విషమంగా లేదని, కొందరు బాధితులు కోలుకునేందుకు నాలుగువారాల సమయం పడుతుందని తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh: పట్నా నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బస్సులు.. చౌకలో ప్రయాణం -
Mahakumbh: పట్నా నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బస్సులు.. చౌకలో ప్రయాణం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివెళుతున్నారు. ఇప్పుడు బీహార్ నుండి మహా కుంభమేళాకు వెళ్లే వారికి బీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పట్నా నుండి ప్రయాగ్‌రాజ్‌కు బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సు సర్వీసు ఫిబ్రవరి 28 వరకు నడుపుతున్నట్లు పేర్కొంది. మహా కుంభమేళా(Great Kumbh Mela)కు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం ఈ కొత్త బస్సు సర్వీసును ప్రారంభించినట్లు తెలిపిన బీఎస్‌ఆర్టీసీ ఈ సర్వీసును రాత్రిపూట నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ బస్సు ఎక్కినవారు ఉదయానికల్లా గమ్యస్థానానికి చేరుకుంటారని వెల్లడించింది. మహాకుంభ్‌లో పెరుగుతున్న భక్తుల సంఖ్య దృష్ట్యా, రెండు కొత్త బస్సులను నడపాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బస్సులు బీహార్ రాజధాని పట్నా నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) వరకు నడుస్తాయి.బీహార్ రాష్ట్ర రవాణా కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ మహా కుంభమేళాకు వెళ్లే ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్సుల ద్వారా భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించి మహా కుంభమేళాకు చేరుకోవచ్చని తెలిపారు. పట్నా నుండి ప్రయాగ్‌రాజ్‌కు బస్సు ఛార్జీ రూ. 550. ఈ బస్సు పట్నాలో రాత్రి 8:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం(Return journey)లో ఈ బస్సులు ప్రయాగ్‌రాజ్ నుండి రాత్రి 10 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు పట్నా చేరుకుంటాయని సంజయ్‌కుమార్ తెలిపారు. ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం -
కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం
అయోధ్య: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. వీరిలోని చాలామంది అయోధ్యకు చేరుకుని, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. దీంతో అయోధ్యలోనూ జనప్రవాహం కనిపిస్తోంది. కుంభమేళా ప్రారంభమైనది మొదలు ప్రతిరోజూ రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. దీంతో గరిష్ట సంఖ్యలో భక్తులు రాంలల్లాను దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయాన్ని ప్రతిరోజూ 18 గంటల పాటు తెరిచి ఉంచుతున్నారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు శ్రీరాముణ్ణి దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఆలయానికి భక్తులు పోటెత్తుతుండటంతో కొన్ని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రెండవ అంతస్తుతో పాటు శిఖరంపై నిర్మాణ పనులు, సప్త మండపం, శేషావతార్ ఆలయం పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆలయ ప్రాకారాలు, స్తంభాలపై కుడ్యచిత్రాలను రూపొందించే పనులు కూడా మందకొడిగా కొనసాగుతున్నాయి. దర్శన్ మార్గ్ ప్రక్కనే ఉన్న యాత్రికుల సౌకర్యాల కేంద్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను కూడా నిలిపివేశారు.రామ్ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు కొన్ని పనులు నిలిపివేశామన్నారు. గడచిన 10 రోజుల్లో 70 లక్షలకు పైగా భక్తులు అయోధ్యను సందర్శించారని తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుండి సరయు నదిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. అయోధ్యకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. విదేశీ భక్తులు కూడా సరయు నదిలో స్నానం చేసిన తర్వాత రామ్‌లల్లా దర్శనం చేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు.. -
Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు..
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు 30 కోట్లకు పైగా భక్తులు స్నానాలు చేశారు. ఈ సంఖ్య పలు రికార్డులను నెలకొల్పుతోంది. ప్రపంచంలోని 195 దేశాలలోని 192 దేశాల జనాభా 30 కోట్ల కంటే తక్కువగా ఉంది. అంటే ఆ 192 దేశాలకు మించినంతటి జనాభా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి. జనాభా పరంగా చూస్తే ప్రపంచంలోని నాల్గవ, ఐదవ అతిపెద్ద దేశాలైన ఇండోనేషియా, పాకిస్తాన్లలో కూడా 30 కోట్ల కంటే తక్కువ జనాభా ఉంది. దీనిప్రకారం చూస్తే కేవలం 19 రోజుల్లో పాకిస్తాన్, ఇండోనేషియా జనాభాకు మించిన భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు. ఇండోనేషియా జనాభా(Indonesian population) 28 కోట్లు కాగా, పాక్ జనాభా 25.35 కోట్లు. కుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్యను చూస్తే వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాటికి సంగమంలో పుణ్య స్నానాలు చేసే వారి సంఖ్య 35 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి.మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 91,690 మంది విమాన ప్రయాణం(Air travel) ద్వారా ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. 650 కి పైగా విమానాలు ఇక్కడకు రాకపోకలు సాగించాయి. ఇప్పుడు ఫిబ్రవరి ఒకటిన ఇక్కడికి వచ్చే విమానాలు, ప్రయాణికుల సంఖ్య గరిష్టంగా ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుండి, తొలిసారిగా ప్రయాగ్‌రాజ్ నుండి చెన్నైతో సహా అనేక ప్రధాన నగరాలకు నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఢిల్లీకి 10 విమానాలు, ముంబైకి ఏడు విమానాలు ఉన్నాయి. ఇది సరికొత్త రికార్డు కానుంది. ఇది కూడా చదవండి: Jharkhand: జేఎంఎంలోకి తిరిగి సీతా సోరెన్? -
Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు మనదేశం నుంచి కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారంతా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే ఇక్కడి పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. వీటిలో ‘సరస్వతి బావి’ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమున, అదృశ్య సరస్వతి(Invisible Saraswati) నదుల త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. త్రివేణి సంగమానికి కొద్ది దూరంలోని సరస్వతి బావి ఇక్కడికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ సరస్వతి మాత జలాన్ని నేరుగా దర్శనం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్ కోటలో కనిపించే ఈ సరస్వతి బావి.. సరస్వతి నదికి రహస్య వనరు అని పండితులు చెబుతుంటారు. ఈ బావి నుంచి ఊరుతున్న నీటి ప్రవాహం నేరుగా త్రివేణి(Triveni) సంగమానికి అనుసంధానమై ఉంది. 2016లో శాస్త్రవేత్తలు, పరిశోధకులు సాగించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ఈ సరస్వతి బావికి ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్న సుబేదార్ మేజర్ రామ్ నారాయణ్ పాండే మాట్లాడుతూ ఇక్కడి నీటి ఊట బావి ఆకారంలో ఉన్నందున దీనికి సరస్వతి బావి అనే పేరు వచ్చిందన్నారు. సరస్వతి నది మానా గ్రామంలో ఉద్భవించిందని చెబుతుంటారు.పురాణాలలోని వివరాల ప్రకారం మహర్షి వేద వ్యాసుడు(Maharishi Veda Vyas) చెబుతుండగా గణేశుడు 18 పురాణాలను రాస్తున్నాడు. అయితే అదే సమయంలో సరస్వతి నది ప్రవాహ ధ్వని కారణంగా గణేశునికి వినికిడి సమస్య ఏర్పడిందట. దీంతో సరస్వతి మాత తన నీటి ప్రవాహాన్ని పాతాళం వైపు ప్రవహించాలని ఆదేశించిందట. సరస్వతి ప్రవాహం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న సమయంలో విష్ణువు ఆ నీటిని సంగమంలో విలీనం చేయమని సరస్వతి మాతను కోరాడట. దీనికి సర్వస్వతి మాత సమ్మతించిందట. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తులు సరస్వతి బావిని తప్పకుండా సందర్శిస్తుంటారు.ఇది కూడా చదవండి: Delhi Elections: ఆప్‌కు భారీ షాక్.. -
కుంభమేళా ఎఫెక్ట్.. గంగా హారతి నిలిపివేత
ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళాకు భక్తుల రద్దీ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. భక్తులు పోటెత్తుండుండటంతో ఫిబ్రవరి 5 వరకు కాశీలోని ఘాట్ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్లలో నిర్వహించే గంగా హారతి కారక్రమాన్ని ఆపేస్తున్నట్లు చెప్పారు.కుంభమేళా జరిగే ప్రాంతాల్లో ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించేందుకే గంగా హారతిని తాత్కాలికంగా ఆపేసినట్లు తెలిపారు.ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వచ్చిన భక్తులు వారణాసికి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో కొందరు ప్రయాణికులు వారణాసి, బనారస్ రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయినట్లు చెప్పారు.మౌని అమావాస్య నుంచి కాశీలో భక్తుల రద్దీ పెరిగిందని వారి సంఖ్య తగ్గేవరకు ఇతరులు ఎవరూ వారణాసికి రావద్దని విజ్ఞప్తి చేశారు.కాగా,మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రద్దీ నియంత్రణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసకుంది. ఈ క్రమంలోనే కుంభమేళా ప్రాంతంలోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. దీంతోపాటు వీవీఐపీ, స్పెషల్ పాసులను రద్దు చేశారు.ఇప్పటివరకు 29.64 కోట్లమంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. -
భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శనం : రాష్ట్రపతి
-
మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపు
మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ తరుణంలో కొన్ని విమాన సంస్థలు ఇప్పటికే ఛార్జీలు పెంచాయి. దాంతో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల సహేతుకమైన విమాన ఛార్జీలు ఉండాలనేలా ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు ఆకాసా ఎయిర్ స్పందించింది. విమాన ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు, ప్రయాగ్‌రాజ్‌కు విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.ఛార్జీల తగ్గింపు, విమానాల సంఖ్య పెంపుఆకాసా ఎయిర్ ప్రయాగ్‌రాజ్‌కు విమానాల టికెట్ ధరలను 30-45% తగ్గించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చింది. ముంబై, ఢిల్లీ నుంచి రోజువారీ డైరెక్ట్ సర్వీసులతో పాటు పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతుంది. మహా కుంభమేళా సందర్భంగా విమానాలను పెంచాలని, సహేతుకమైన ఛార్జీలను నిర్వహించాలని విమానయాన సంస్థలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో కంపెనీ ఈమేరకు స్పందించినట్లు తెలిపింది.ప్రభుత్వ జోక్యంవినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు గతంలో లేఖ రాశారు. ప్రయాగ్‌రాజ్ విమాన ప్రయాణానికి అధిక ఛార్జీలు ఉన్నాయనే ఫిర్యాదులను ఆ లేఖలో హైలైట్ చేశారు. తరువాత ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికపరమైన ప్రయాణ ఇబ్బందులు లేకుండా మహా కుంభమేళాకు భక్తులు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం జోక్యం చేసుకుంది.ప్రయాణికులపై ప్రభావం..ఛార్జీల తగ్గింపు, విమానాల పెంపు నిర్ణయం మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. గతంలో విమాన ఛార్జీలు 300-600% పెరగడంతో, చాలా మంది రోడ్డు లేదా రైలు రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ పీక్ పీరియడ్‌లో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఆకాసా ఎయిర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..ఇప్పటికే చాలా సంస్థలు..యాత్రికుల రాకపోకలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చేసే ప్రయత్నాల్లో ఆకాసా ఎయిర్ ఒక్కటే కాదు.. ఇండిగో, స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు కూడా ప్రయాగ్‌రాజ్‌కు తమ విమానాల సంఖ్యను పెంచాయి. విమానయాన పరిశ్రమ నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షల మంది భక్తుల ప్రయాణం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగుతుంది. -
కుంభమేళాలో మరో తొక్కిసలాట!
మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో పుణ్యస్నానాల కోసం వేచి ఉన్న భక్తులపై వెనకవైపు భక్తులు పడటంతో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారన్న వార్తలో కొంత నిగూఢార్థం ఉందని ఆలస్యంగా వెల్లడైంది. మరణాలన్నీ ఈ సంగం ఘాట్ వద్దే సంభవించలేదని కొన్ని సమీపంలోని ఝాసీ ఘాట్ వద్ద సంభవించాయన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగం ఘాట్‌లో భారీ తొక్కిసలాట జరిగిన కొద్దిసేపటి తర్వాత ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట జరిగిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంగం ఘాట్ విషాదం నుంచి భక్తులు తేరుకునేలోపే మరోచోట కూడా తొక్కిసలాట జరిగిందన్న వార్త తెలిస్తే భయంతో భక్తులు వెనుతిరగడమో, గందరగోళంతో పరుగెత్తడమో చేస్తే మళ్లీ సంగం ఘాట్‌లో మరో అపశృతి చోటుచేసుకుంటుందన్న అనుమానంతో అధికారులు ఈ విషయాన్ని వెంటనే బయటకు చెప్పలేదని తెలుస్తోంది. భక్తులను శాంతపరచడమే తమ ముఖ్య ఉద్దేశమని అక్కడి అధికారులు చెప్పారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంగం ఘాట్‌కు ఉత్తరాన కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంగ ఒడ్డుకు ఆవలివైపు ఈ ఘాసీ ఘాట్ ఉంది. సంగం ఘాట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఝాసీ ఘాట్‌లో దాదాపు ఉదయం ఆరు గంటలకు తొక్కిసలాట జరిగింది. మధ్యాహ్నం దాకా మృతదేహాలు అక్కడే! ‘‘ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిన భక్తుల మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. ఉదయం ఆరు గంటలకు తొక్కిసలాటలో చనిపోతే మధ్యాహ్నం 1.30 గంటలకు మృతదేహాలను ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. తొక్కిసలాట జరిగిన నాలుగు గంటల తర్వాత ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చింది. అప్పటికే అక్కడి భీతావహ పరిసరాలను తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధిస్తున్న జనాలను పోలీసులు వారించారు’’అని ఝాసీ ఘాట్‌లో హల్దీరామ్ దుకాణం నడుపుతున్న నేహా ఓఝా స్థానిక మీడియాతో చెప్పారు. ‘‘ఊహించనంతగా భక్తులు వచ్చారు. అడ్డుగా ఉన్న కర్ర బ్యారీకేడ్లను విరగ్గొట్టి ముందుకు రావడంతో ఘోరం జరిగింది. ఇదే అదనుగా అక్కడ నిద్రిస్తున్న వాళ్లకు చెందిన ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కొందరు కొట్టేశారు’’అని ప్రత్యక్ష సాక్షి హర్షిత్ అన్నారు. ‘‘మా దుకాణం చుట్టూతా ఒక్కసారిగా జనం పోగయ్యారు. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. మా దుకాణంలోకీ జనం చొచ్చుకొచ్చారు. ఇదే అదనుగా ఎవరో మా హల్దీరామ్ దుకాణం క్యాష్ కౌంటర్ నుంచి రూ.1,80,000 కొట్టేశారు. ఇక్కడ గుట్టలుగా పడి ఉన్న భక్తుల బ్యాగులు, చెప్పుల కుప్పల నుంచే కొందరు వృద్ధుల మృతదేహాలను బయటకు తీశారు. నా ముందే ఈ టెంట్లో ఇద్దరు చనిపోయారు’’అని నేహా ఓఝా చెప్పారు. ‘‘వెంటనే ఝాసీ ఘాట్‌కు అంబులెన్సు వచ్చే సౌకర్యం కూడా లేదు. ఏ సాయం అందాలన్నా నది ప్రవాహం మీదుగా పడవల్లో వచ్చి సాయపడాల్సిందే’’అని మరో ప్రత్యక్ష సాక్షి మెయిన్ బహదూర్ సింగ్ చెప్పారు. ‘‘బస్సులో వచి్చన ఒక 20 మంది యువకులు బ్యారీకేడ్లను విరగొట్టి, అందర్నీ తోసేసి ముందుకెళ్లారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది’’అని మరో ప్రత్యక్ష సాక్షి అయిన ఒక సాధువు చెప్పారు. ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట కారణంగా ఏర్పడిన చెత్తను తొలగించేసరికి సాయంత్రం ఆరు అయిందని ఒక కార్మికుడు చెప్పారు. అగ్నిప్రమాదంలో 15 టెంట్లు దగ్ధం మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరోసారి అగ్నప్రమాదం సంభవించింది. సెక్టార్ 22 సమీప ఛామన్గంజ్ చౌకీ వద్ద చెలరేగిన అగ్నికీలల్లో 15 టెంట్లు కాలిపోయాయని ప్రధాన అగ్నిమాపక దళ అధికారి(కుంభ్) ప్రమోద్ శర్మ చెప్పారు. విషయం తెలియగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటల్ని ఆర్పేశారు. సరైన రోడ్డు మార్గంలేకపోవడంతో త్వరగా ఘటనాస్థలికి చేరుకోవడం కష్టంగా మారింది. అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదని అధికారి స్పష్టంచేశారు. కలిపోయిన టెంట్లు కుంభమేళాలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినవి కాదని, అక్రమంగా వెలిశాయని వెల్లడించారు. అగ్నికీలలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు మొదలెట్టారు. -
మహా కుంభమేళాకు ఏపీటీడీసీ బస్
సాక్షి, అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని ‘మహా కుంభమేళా’కు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో రెండు రూట్లలో భక్తుల సౌకర్యార్థం సర్వీసులు నడుపుతోంది. దీన్లోభాగంగా 11వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి, 12వ తేదీ నెల్లూరు నుంచి సర్వీసులను ఏర్పాటు చేశారు. అయితే యాత్రల దర్శనం, టిఫిన్, భోజన ఖర్చులను ప్రయాణికులే భరించాలని ఏపీటీడీసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రిజర్వేషన్ కోసం www.aptdc.in, tourism.ap.gov.in వెబ్సైట్లను, ఏపీటీడీసీ సీఆర్వో కార్యాలయం, అధీకృత ఏజెంట్లను సంప్రదించాలని సూచించింది. రూట్–1: తిరుపతి, ఒంటిమిట్ట, కడప బైపాస్, ఓర్వకల్లు, కర్నూలు బైపాస్, హైదరాబాద్, జబల్పూర్, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, కాశీ, నాగపూర్, ధర్మపురి మీదుగా ఉంటుంది. రూట్–2: నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్, చంఢీపూర్, గయా, బుద్ధగయా, కాశీ, ప్రయాగ్‌రాజ్ వెళ్లి తిరుగు ప్రయాణంలో శ్రీకూర్మం, అరసవెల్లి, విజయవాడ మీదుగా నెల్లూరు. -
Maha Kumbh Mela 2025 : గర్ల్ ఫ్రెండ్ సలహాతోనే పెట్టుబడిలేని వ్యాపారం
ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా అశేష భక్తకోటితో ఉత్సాహంగా సాగుతోంది. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే సుదూర తీరాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (MahaKumbhMela 2025)కు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా హృదయాలను హత్తుకునే సంఘటనలు, కథనాలు ఆకర్షిస్తున్నాయి. మరోవైపు బడా వ్యాపరస్తులతోపాటు ఇక్కడ చిన్నా, చితకా వ్యాపారం చేసుకునేందుకు అనేకమంది ప్రయాగరాజ్‌కు వస్తున్నారు. వీరిలో రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముకునే మోనాలీసాలాగా పాపులర్ అవుతున్నారు. ఈ కోవలో ఒక ప్రేమికుడు నిలవడం విశేషం. స్నేహితురాలు ఇచ్చిన సలహాను తు.చ. తప్పకుండా పాటించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయింది. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. పెట్టుబడి లేని వ్యాపారంగా వేప పుల్లల్ని విక్రయిస్తూ ఆకర్షణీయమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ప్రియురాలిచ్చిన సలహా ఆధారంగా రంగంలోకి దిగిన అతగాడు రోజూ పొద్దున్నే అక్కడ వేపపుల్లల్ని విక్రయిస్తున్నాడు. తద్వారా గత ఐదు రోజుల్లో 40వేల రూపాయలు సంపాదించాడు. ఈ సందర్భంగా సంతోషం నిండిన కళ్లతో అతను చెబుతున్న మాటలు అనేకమంది హృదయాలను హత్తుకుంటున్నాయి.‘‘ఆమె(తన ప్రేయసి) కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. తానే మహాకుంభ మేళాకు వెళ్లమని చెప్పింది. పెట్టుబడి అవసరం లేదు కాబట్టి ఆ క్షేత్రంలో వేపపుల్లలు అమ్మమని సలహా ఇచ్చింది. నేను ఆమె కారణంగా ఇంత సంపాదించాను’’ అంటూ చెప్పుకొచ్చాడు సంతోషంగా.“నిజమైన బంధం” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో షేర్ అయిన ఈ కథనంపై నెటిజన్లు వారి ప్రేమను అభినందించారు. నిజమైన ప్రేమ, ఎంత హృద్యంగా ఉంది లాంటి కామెంట్లు వెల్లువెత్తాయి. "ఇంత అద్భుతమైన స్నేహితురాలిని ఎప్పుడూ వదులుకోవద్దు లేదా మోసం చేయవద్దు" అని ఒక ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు రాశారు."చాలా అమాయకత్వంతో నిజం మాట్లాడుతున్నాడు. మీరు జీవిత మార్గంలో విజయంలో అగ్రస్థానానికి చేరుకుంటారు" అని మూడవ వ్యక్తి వ్యాఖ్యానించాడు.ఒక్క క్షణం కూడా తన స్నేహితురాలికి క్రెడిట్ ఇవ్వడానికి వెనుకాడలేదు సూపర్ అని మరొకరన్నారు. చూశారా.. ప్రియురాలు గురించి చెప్పేటపుడు అతని ముఖంలో వెలుగు, మాటల్లో గర్వం, ఆ స్వరంలో ప్రేమ ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయో..ఇదే రా ప్రేమంటే అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత! View this post on Instagram A post shared by Adarsh Tiwari (@adarshtiwari20244) ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారంగా భావించే మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ పవిత్ర కార్యంలో సన్యాసులు, సాధువులు, సాధువులు, సాధ్విలు ప్రముఖంగా నిలుస్తుండగా, దేశ విదేశాలకు చెందిన పలువురు భక్తులతోపాటు, అన్ని వర్గాల ప్రజలు తరలివస్తున్నారు. గంగా, యమున ,సరస్వతిల పవిత్ర సంగమమైన సంగమంలో స్నానం చేసి తరలించాలని భక్తుల ఆకాంక్ష.ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! -
మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
ప్రయాగ్‌రాజ్: మహా కుంభామేళాలో మరో అపశృతి చోటుచేసుకుంది. కుంభామేళా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఎగసిపడుతున్న మంటల ధాటికి టెంట్లు కాలిపోతున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెలుస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే మరో ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం కుంభమేళా జరుగుతున్న సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటల ధాటికి అక్కుడున్న టెంట్లు కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, వరుస ప్రమాదాల నేపథ్యంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. प्रयागराज महाकुंभ महाकुंभ 2025 फिर से आग। झूसी छतनाग घाट नागेश्वर घाट सेक्टर 22 के पास महाकुंभ मेले में लगी भीषण आगमहाकुंभ के सेक्टर 22 में भीषण आग लगने से कई टेंट जलकर हुए राख pic.twitter.com/wvYZQWyIbC— Gaurav Shukla (@shuklaagaurav) January 30, 2025ఇదిలా ఉండగా.. కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 60 మంది భక్తులు త్రీవంగా గాయపడ్డారు. ఇక, కొద్దిరోజుల క్రితమే కుంభమేళా వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంట్లు ఆహుతయ్యాయని తెలిపారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.प्रयागराज महाकुंभ मेला क्षेत्र में लगी भीषण आग की घटना अत्यंत दुर्भाग्यपूर्ण है। प्रशासन से अपील है कि राहत और बचाव कार्य में तुरंत तेजी लाएं। #KumbhMelapic.twitter.com/sbp6bOeb1X— Hansraj Meena (@HansrajMeena) January 30, 2025సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మహా కుంభమేళాలోని సెక్టార్ 19 వద్ద గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఆ మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయి. కుంభమేళా (Kumbh Mela) వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా అప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశాయి. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పోలీసులు తెలిపారు. -
మోనాలిసా సరే.. వీళ్ల గ్లామర్ ఎందుకు నచ్చదు..?: కంగనా రనౌత్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వైరల్ అయిన 'మోనాలిసా'(16) గురించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేయంతో ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. చాలామంది ఆమెతో ఫోటోలు దిగాలిని, దగ్గరగా చూడాలని ఎగబడ్డారు కూడా.. అయితే తాజాగా మోనాలిసా గురించి కంగనా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.'కుంభమేళాలో మోనాలిసాతో చాలామంది ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వారి తీరును చూస్తుంటే చాలా బాధేస్తుంది. అక్కడి వారు ప్రవర్తించిన పద్ధతి ఎంతమాత్రం బాగాలేదు. అలాంటి వారిని ద్వేషించడం తప్ప ఏం చేయలేము. మన చిత్ర పరిశ్రమలో కూడా చాలామంది హీరోయిన్లు ఆమె రంగులోనే ఉన్నారు. వారందరిపై కూడా ఇలాంటి అభిమానమే చూపుతున్నారా..? బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన దీపికా పడుకోణె, కాజోల్ వంటి వారిపై చూపుతున్న అభిమానాన్నే కొత్తగా వచ్చే హీరోయిన్లపై చూపుతున్నారా..? మోనాలిసాను భారీగా వైరల్ చేస్తున్నట్లే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్లపై కూడా మీ ప్రేమాభిమానాలు చూపించగలరా..? కొత్త వారిని కూడా కాస్త గుర్తించండి.' అని ఆమె పోస్ట్ చేశారు. కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం తాజాగా థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ మూవీనే కంగనానే దర్శకత్వం వహించింది. మాధవన్‌తో కలిసి ఆమె మరో రెండు చిత్రాలలో నటిస్తుంది.సొంతూరు వెళ్లిపోయిన మోనాలిసామధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో ఉన్న మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ రుద్రాక్ష దండల అమ్ముతూ కనిపించిన ఆ యువతిని అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి. -
Mahakumbh-2025: కుంభ స్నానం కోసం 21 కి.మీ నడిచి.. బ్యాంకు ఉద్యోగి విషాదాంతం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మౌని అమావాస్య నాడు తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారు. ఒకరు కుమారుడిని కోల్పోగా, మరొకరు తల్లిని, ఇంకొకరు సోదరుడిని కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన 60 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటన అనంతరం మృతులకు సంబంధించిన విషాదగాథలు వెలుగు చూస్తున్నాయి. జార్ఖండ్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన ఒక వ్యక్తి త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు 21 కిలోమీటర్ల దూరం నడిచాడు. అయితే పుణ్య స్నానం చేయడానికి ముందే జీవితాన్ని ముగించాడు. వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని ఘట్శిల ప్రాంతం నుండి పలువురు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్ వచ్చారు. వారిలో ఒకరే బ్యాంకు ఉద్యోగి శివరాజ్ గుప్తా(58). బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు జరిగిన తొక్కిసలాటలో శివరాజ్ గుప్తా మరణించారు.శివరాజ్ గుప్తా 16 మంది భక్తుల బృందంతో కలిసి ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు వచ్చారు. తొక్కిసలాట జరగడానికి కొద్దిసేపటికి ముందే శివరాజ్ గుప్తా తన స్నేహితులతో కలిసి సంగమం తీరానికి చేరుకున్నాడు. అతను త్రివేణీ సంగమంలో స్నానం చేసేలోపే, మృత్యువు అతనిని చుట్టుముట్టింది. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు జనం పెరగడంతో శివరాజ్ గుప్తా తన స్నేహితుల బృందం నుండి విడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో జరిగిన తొక్కిసలాటలో శివరాజ్ గుప్తా జనసమూహం కాళ్ల కింద నలిగి, ఊపిరాడక మరణించాడు. ఈ తొక్కిసలాట(Stampede)లో అతని బృందంలోని ఇతర సభ్యులు కూడా గాయపడ్డారు. శివరాజ్ గుప్తా భార్య పూనమ్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం రాత్రే తన భర్తతో మాట్లాడానని తెలిపారు. తన భర్త సంగమతీరం చేరుకునేందుకు 21 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందన్నారు. మర్నాటి ఉదయం తొక్కిసలాట వార్త తెలియగానే పూనమ్ తన భర్తకు ఫోన్ చేశారు. కానీ ఎటువంటి స్పందన రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శివరాజ్ గుప్తా మృతి చెందినట్లు పూనమ్‌కు సమాచారం అందింది. శివరాజ్ గుప్తా జార్ఖండ్(Jharkhand) రాష్ట్ర సహకార బ్యాంకు ఉద్యోగి. అతని కుమార్తె స్వర్ణ ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు శివమ్ బెంగళూరులో ఉంటున్నాడు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు -
MahaKumbh Mela 2025 - కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు...
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025 ) అనేక విశేషాలతో చర్చల్లో నిలుస్తోంది. రికార్డు స్థాయిలో మహా కుంభమేళాకు భక్తులు హాజరవుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం, బుధవారం ఉదయం 6 గంటల వరకు 1.75 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వేదికగా హృదయాలను కదిలించే వీడియోలు అనేకం నెట్టింట విశేషంగా నిలుస్తున్నాయి. అటు భక్తులను, ఇటు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి.తాజాగా 65 ఏళ్ల వృద్ధుడు తన 92 ఏళ్ల తల్లిని ప్రతిరోజూ 50 కిలోమీటర్లు నడిచి ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కలియుగ్ శ్రవణ్ కుమార్’ అంటూ ఈ వీడియో సంచలనంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.పురాణ గాథలోలని శ్రవణ కుమారుడి (జన్మనిచ్చిన, అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి తన మరణం వరకు కూడా కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ కుమారుడు) నుంచి ప్రేరణ పొందాడో ఏమో గానీ, తన తల్లిని బండిమీద కూర్చోబెట్టి, స్వయంతా తాను లాగుతూ పవిత్ర మహాకుంభ మేళాకు తీసుకొని వచ్చాడు. యూపీలోని ముజఫర్ నగర్‌కు చెందినమాలిక్ (Malik) వయసు 65 ఏళ్లు కావడం విశేషం. ఆయన జబ్బీర్ దేవి వయసు 92 ఏళ్లు. తల్లి కోరిక నెరవేర్చాలన్న ధృఢ సంకల్పంతో బండిపై కూర్చోబెట్టి లాగుతూ కుంభమేళాకు తరలివచ్చాడు. ఇలా 13 రోజులు పాటు తల్లిని తీసుకెళ్లాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. ముజఫర్ నగర్ నుంచి ప్రయాగరాజ్‌కు 780 కిలోమీటర్లు. త్రివేణి సంగమంలో కుంభ్ స్నానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం తన బాధ్యత అని చెప్పాడు. అతని సంకల్పం, సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తల్లి పట్ల అతనికున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘‘కలియుగ్ కా శ్రవణ్ కుమార్' అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ యుగానికి గొప్పోడు అని కొందరు. "ప్రతీ తల్లి ఇలాంటి కొడుకును పొందాలని కోరుకుంటుంది"అని మరొకరు వ్యాఖ్యానించారు. ముసలి వయసులో తల్లిదండ్రుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న వారికి ఈయన కథ ఆదర్శనీయం, ఆచరణీయం అంటున్నారు.Watch: In Bulandshahr, Uttar Pradesh, A man is walking with a cart, taking his 92-year-old mother to the Maha Kumbh in Prayagraj. They started their journey from Muzaffarnagar, fulfilling her wish to bathe at the Kumbh pic.twitter.com/2IstKkqMXY— IANS (@ians_india) January 28, 2025 -
Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మౌని అమావాస్య నాడు తొక్కిసలాట చోటుచేసుకున్న దరిమిలా యూపీ ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. భక్తులకు మరింతగా భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. తొక్కిసలాట ఘటన మహాకుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో 30మంది వరకూ మరణించారని సమాచారం. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధిక సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించడంతో పాటు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసింది.ప్రత్యేక రైళ్లు కుంభమేళాకు తరలివచ్చే భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పుడు భక్తులకు సమర్థవంతమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు తాజాగా మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.భద్రతా చర్యలు మహాకుంభ మేళాలో భక్తుల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్ వంటి సహాయక వ్యవస్థలు ఏర్పాటు చేశారు.ఆరోగ్య సేవలు మహాకుంభ మేళాలో భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యసాయం అందించేందుకు పలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వైద్యులు, నర్సులు, ఆంబులెన్సులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. భక్తులకు అవసరమైన అన్ని ఆరోగ్య సేవలు సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.రవాణా- పార్కింగ్ ప్రయాగ్‌రాజ్‌లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. రవాణా నియంత్రణలో భాగంగా మార్గాల సూచికల బోర్డులను ఏర్పాటు చేశారు.ఆహార సౌకర్యాలు భక్తుల ఆహార అవసరాలను తీర్చేందుకు పలు ఫుడ్ స్టాల్స్, తాగునీటి సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాలలో ఏర్పాటు చేసి స్టాల్స్ భక్తులకు సౌకర్యాన్ని అందించేలా రూపొందించారు.సోషల్ మీడియా ద్వారా సమాచారం భక్తులకు ఎప్పటికప్పుడు కుంభమేళాకు సంబంధించిన సమాచారం అందించేందుకు అధికారిక యంత్రాంగం సోషల్ మీడియా వేదికలను ఉపయోగించింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కుంభమేళాకు సంబంధించిన మార్గదర్శకాలు, పరిస్థితులపై అప్డేట్స్ అందిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ప్రభుత్వ చొరవతో తగ్గిన విమానయాన ఛార్జీలు -
Mahakumbh 2025: ప్రభుత్వ చొరవతో తగ్గిన విమానయాన ఛార్జీలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలువురు విమానాల్లోనూ ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానయాన సంస్థలు విమానయాన ఛార్జీలను అమాంతం పెంచేశాయి.ప్రయాగ్‌రాజ్‌కు విమాన ఛార్జీల పెంపు పై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. మహా కుంభమేళా వేళ ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న విమానయాన సంస్థలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. విమానయాన సంస్థలు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను కొనసాగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ నేపధ్యంలో ఇండిగో విమానయాన సంస్థ ప్రయాగ్‌రాజ్‌కు విమాన ఛార్జీలను 30 నుంచి 50 శాతం మేరకు తగ్గించింది.మహా కుంభమేళా సమయంలో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు పలు విమానయాన సంస్థలతో సమన్వయ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశంలో, విమానయాన సంస్థల ప్రతినిధులు, డీజీసీఏ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి, దేశంలో వివిధ నగరాల నుంచి 132 విమానాలు ప్రయాగ్‌రాజ్‌కు సేవలు అందిస్తున్నాయి.ఇండిగో తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 16 వరకు ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ విమానాలకు టిక్కెట్ ధరలు రూ.13,500 కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని తెలిపింది. జనవరి 31న ధరలు రూ.21,200 పైగా ఉన్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 12కి ధరలు తగ్గి రూ.9 వేలకు చేరనున్నాయని తెలిపింది. అయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చొరవతో విమానయాన సంస్థలు టిక్కెట్ ఛార్జీలు తగ్గించనున్నట్లు ప్రకటించాయి. ఇది కూడా చదవండి; Mahakumbh 2025: ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి -
Mahakumbh 2025: ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి
ప్రయాగ్‌రాజ్: మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు జిల్లాల సీనియర్ పోలీసు అధికారులు, జిల్లా పరిపాలన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు.ప్రతి భక్తుని రక్షణ బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మహా కుంభమేళా ప్రాంతంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల భద్రత, సౌలభ్యం కోసం చేసిన ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి అయోధ్య, వారణాసి, మీర్జాపూర్, చిత్రకూట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అయోధ్య-ప్రయాగ్‌రాజ్, కాన్పూర్-ప్రయాగ్‌రాజ్, ఫతేపూర్-ప్రయాగ్‌రాజ్, లక్నో-ప్రతాప్‌గఢ్-ప్రయాగ్‌రాజ్, వారణాసి-ప్రయాగ్‌రాజ్ తదితర మార్గాల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ఇది కూడా చదవండి: mahakumbh: 27 ఏళ్ల క్రితం అదృశ్యం.. నేడు అఘోరిగా ప్రత్యక్షం -
mahakumbh: 27 ఏళ్ల క్రితం అదృశ్యం.. నేడు అఘోరిగా ప్రత్యక్షం
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వేడుకగా సాగుతోంది. ఈ కుంభమేళాలో పలు ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతమొకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.27 ఏళ్ల క్రితం తమ కుటుంబం నుంచి తప్పిపోయిన ఒక వ్యక్తిని కుంభమేళాలో కనుగొన్నామని జార్ఖండ్‌కు చెందిన ఒక కుటుంబం మీడియాకు తెలిపింది. దీంతో తమ 27 ఏళ్ల ఆవేదన ఇప్పుడు తీరిపోయిందని వారు ఆనందంగా చెబుతున్నారు. నాడు ఇంటి నుంచి తప్పిపోయిన గంగాసాగర్ యాదవ్ వయసు ఇప్పుడు 65 ఏళ్లు. ఇప్పుడాయన అఘోరి సాధువుగా కుటుంబ సభ్యులకు దర్శనమిచ్చారు. ఇప్పుడు అతని పేరు బాబా రాజ్ కుమార్.1998లో గంగాసాగర్ కుటుంబ సభ్యులంతా బీహార్‌లోని పట్నాకు వెళ్లారు. అప్పుడు గంగాసాగర్ అదృశ్యమయ్యాడు. దీంతో అతని భార్య ధన్వ దేవి ఇంటి బాధ్యతలను భుజానికెత్తుకుని వారి కుమారులు కమలేష్, విమలేష్‌లను పెంచిపెద్దచేసింది. గంగాసాగర్ తమ్ముడు మురళీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ‘తమ సోదరుడిని తాము మళ్లీ చూస్తామనే ఆశను కోల్పోయాం. అయితే కుంభమేళాకు వెళ్లిన మా బంధువులలో ఒకరు గంగాసాగర్ ఫోటో తీసి మాకు పంపారు. దీంతో నేను, ధన్వా దేవి, వారి ఇద్దరు కుమారులతో కలిసి కుంభమేళాకు వెళ్లాం.అక్కడ గంగాసాగర్‌ను గుర్తించాం. అయితే అతను తన పూర్వపు గుర్తింపును అంగీకరించేందుకు నిరాకరించారు. పైగా తాను బాబా రాజ్‌కుమార్‌ను అని చెబుతూ, వారణాసికి చెందిన సాధువును అని తెలిపాడు. అయితే తాము ఆయన నుదిటిపై, మోకాలిపై ఉన్న గాయాల గుర్తులును చూశాకనే ఆయనను గంగాసాగర్ యాదవ్‌గా గుర్తించాం. కుంభమేళా ముగిసే వరకు ఇక్కడే ఉంటాం. అవసరమైతే డీఎన్ఏ పరీక్షలు చేయిస్తాం. అవి సరిపోలకపోతే బాబా రాజ్‌కుమార్‌కు క్షమాపణలు చెబుతాం’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా -
మతసంబంధ ప్రాంతాల్లో గతంలో తొక్కిసలాటలు
న్యూఢిల్లీ: మహాకుంభమేళాలో తొక్కిసలాట తర్వాత చాలా మంది దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను గుర్తుచేసుకున్నారు. ఎక్కువ మరణాలు సంభవించిన ఘటనల్లో కొన్ని.. → 2015 జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి లో గోదావరి పుష్కరాల ప్రారం¿ోత్సవం వేళ జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. → 2005: మహారాష్ట్రలోని మంధార్దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది భక్తులు చనిపోయారు → 2008: రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్ సిటీలో ఛాముండీ దేవి ఆలయం వద్ద బాంబుపేలుతుందన్న పుకార్లతో తొక్కిసలాట జరిగి 250 మంది చనిపోయారు → 2008: హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవీ ఆలయంలో తొక్కిసలాటలో 162 మంది మృతిచెందారు → 2024 జూలై 2: యూపీలోని హాథ్రాస్‌లో స్వయంప్రకటిత గురువు భోలేబాబా సత్సంగ్‌లో ఆయన నడిచి వెళ్లిన నేలమీది మట్టిని ముట్టుకుంటే మంచిదని కొందరు మైకులో ప్రకటించడంతో బురదమయ ప్రాంగణంపై జనం ఎగబడ్డారు. ఈ ఘటనలో 121 మంది చనిపోయారు. → 2013 అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని రత్నగఢ్ ఆలయ నవరాత్రి వేడుకలో తొక్కిసలాట జరిగి 115 మంది చనిపోయారు → 2011 జనవరి 14: కేరళలోని పల్మేడులో జనం మీదకు జీపు దూసుకురావడంతో తొక్కిసలా ట జరిగి 104 మంది శబరిమల భక్తులు మృతిచెందారు → 2010 మార్చి 4: యూపీలోని క్రిపాలూ మహ రాజ్ సమీప రామజానకీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 63 మంది చనిపోయారు. -
ఏమిటీ సంగం నోస్?
మహాకుంభమేళాలో సంగం నోస్ అనే ఘాట్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరగడంతో ఈ ఘాట్ వద్దే జనం ఎందుకు ఎక్కువగా పోగుబడ్డారు? అసలు ఈ ఘాట్ విశేషాలు ఏంటీ? అనేవి ఇప్పుడు చర్చనీయాంశాలు అయ్యాయి. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమ స్థలిగా పేర్కొంటారు. పైన ఉత్తరం దిక్కు నుంచి గంగా నది, ఎడమ వైపు దక్షిణ దిక్కు నుంచి యమునా నది వచ్చి ఒక వంపు వద్ద కలుస్తాయి. ఈ ప్రాంతం ఆకాశం నుంచి చూస్తే దాదాపు మనిషి ముక్కులాగా కనిపిస్తుంది. అందుకే త్రిభుజాకారంలో ఉండే ఈ ప్రాంతానికి జనబాహూళ్యంలో ‘సంగం నోస్(ముక్కు)’అనే పేరు కూడా ఉంది. అంతర్వాహిణిగా సరస్వతి నదీ ప్రస్తావనను పక్కనబెడితే ప్రయాగ్‌రాజ్ నగర శివారులో రెండు నదులు కలవకముందు విస్తరించి ఉన్న సువిశాల నదీ తీరాల పొడవునా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో భాగంగా పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే నదులు కలవకముందు ప్రవాహాల తీరాల వెంట పుణ్యస్నానాలు ఆచరించడం కంటే మూడు నదులు కలిసే ఈ ‘సంగం నోస్’వద్ద పుణ్నస్నానం ఆచరిస్తేనే మోక్షం లభిస్తుందనే వాదనా బలంగా వినిపిస్తోంది. చాలా మంది భక్తులు సైతం దీనినే విశ్వసిస్తారు. సాధువుల స్నానాలు ఇక్కడే సాధారణ భక్తుల విషయం పక్కనబెడితే నాగ సాధువులు, అఖాడాల సభ్యులు, ప్రముఖులు అంతా దాదాపు ఈ సంగం నోస్ వద్దే స్నానాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. శతాబ్దాల క్రితం జనాభా తక్కువ, అందులోనూ ఇంతటి భక్తజనకోటి లేరుకాబట్టి ఆనాడు కుంభమేళాకు విచ్చేసిన భక్తులంతా కేవలం ఈ త్రివేణి సంగమ స్థలి వద్దే పవిత్ర స్నానాలు ఆచరించేవారని స్థానికులు చెబుతున్నారు. దీంతో తాము కూడా ఈ సంగం నోస్ వద్దే పుణ్నస్నానాలు ఆచరించాలని ఈ విషయం తెల్సిన చాలా మంది భక్తులు భావిస్తారు. సంగం నోస్ వద్ద వేర్వేరుగా వచ్చి గంగా, యమునా నదీ ప్రవాహాలు ఒక్కటిగా కలిసిపోయి ముందుకుసాగడం చూడొచ్చు. ఇక్కడ రెండు నదులు వేరువేరు రంగులలో కనిపిస్తాయి. యమునా నదీజలాలు లేత నీలం రంగులో, గంగాజలం కొద్దిగా బురదమయంగా కనిపిస్తుంది. యమునా నది ఇక్కడ గంగానదిలో కలిసి అంతర్థానమవుతుంది. అంతర్వాహిణిగా సరస్వతి నది సైతం సంగమించే ఈ ప్రాంతాన్నే కుంభమేళాలోని ప్రధాన సంగం ఘాట్‌గా చాలా మంది భావిస్తారు. వివిధ సంప్రదాయాలకు చెందిన అఖాడా సాధువులు తమ ఆచారాలు, అమృత స్నానాలను సంగం నోస్ వద్దే ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇరుకు ప్రాంతాన్ని విశాలంగా విస్తరించి.. సంగం నోస్ వాస్తవానికి ముక్కు చివరలాగా కాస్తంత ముందుకు సాగినట్లు ఉండే నదీతీర ప్రాంతం. ఇక్కడ ఎక్కువ మంది స్నానాలు ఆచరించడానికి వీలుపడదు. కానీ జనం ఇక్కడే ఎక్కువగా స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒడ్డు వెంట ఇసుక బస్తాలు వేసి, డ్రెడ్జింగ్ చేసి ఎక్కువ మంది కొనదాకా వచ్చి స్నానాలు చేసేలా దీనిని పెద్ద ఘాట్‌గా మార్చారు. ఇలా సంగం నోస్ వద్ద తూర్పువైపుగా శాస్త్రి వంతెన సమీపంలో 26 హెక్టార్ల భూభాగం అదనంగా అందుబాటులోకి తెచ్చారు. మరో కిలోమీటరున్నర పొడవునా ఇసుక బస్తాలు వేసి ఘాట్‌ను విస్తరించారు. దీంతో సంగం నోస్ ఘాట్ వద్ద ఒకేసారి ఎక్కువ మంది స్నానాలు చేసే వెసులుబాటు లభించింది. గతంలో 2019 ఏడాది కుంభమేళాలో ఈ ఘాట్‌లో ప్రతి గంటకు 50,000 మంది స్నానాలు చేశారు. విస్తరణ తర్వాత ఈసారి ఇక్కడ గంటకు ఏకంగా 2,00,000 మంది భక్తులు స్నానాలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. జనవరి 13, 14 తేదీల్లో ఇక్కడే గంటకు 3,00,000 మంది పుణ్యస్నానాలు చేశారు. అయితే సాధువులు హాజరయ్యే ’అమృత స్నానం’ రోజున సాధారణ భక్తులను ఈ సంగం నోస్ ఘాట్‌లోకి రాకుండా ఆపేస్తారు. ’అమృత స్నానం’ కాకుండా మిగతా రోజుల్లో ఆవలి వైపు ఒడ్డు నుంచి వేరే ఘాట్ల నుంచి పడవల్లో ఇక్కడికి చేరుకుని స్నానాలు చేస్తుంటారు. అయితే అమృత స్నానం వంటి రోజుల్లో మాత్రం సంగం నోస్ ఘాట్ల వద్దకు పడవలను అనుమతించబోరు. వాస్తవానికి 4,000 హెక్టార్లలో విస్తరించిన ఘాట్లలో సంగం నోస్ కూడా ఒకటి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Maha Kumbh Mela 2025: మహా విషాదం
తెల్లవారుజామున మూడు గంటల సమయం.. బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు చేసేందుకు ‘సంగమ్ నోస్’ ఘాట్ వద్ద వేచిచూస్తున్న లక్షలాది మంది భక్తులు.. ఒక్కసారిగా బారికేడ్లకు అటువైపు పెరిగిన భక్తుల రద్దీ.. వారంతా పక్కన కూర్చున్న వారిపై పడటంతో అంతా హాహాకారాలు.. ఏం జరిగిందో తెలియని పరిస్థితి.. పోలీసులు కిందపడినపోయిన 90 మందిని తాత్కాలిక సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో 30 మంది ప్రాణాలు వదిలారు. 60 మంది గాయపడ్డారు. అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మహాకుంభమేళాకు వచ్చిన కొందరు భక్తులు అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటకు బలవటం విషాదాన్ని మిగిల్చింది. స్నానఘట్టాల్లో భక్తకోటి శరణుఘోషకు బదులు మృత్యుఘోష వినిపించింది. మహాకుంభ్ నగర్: అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మహాకుంభమేళాకు వచ్చిన కొందరు భక్తులు అనూహ్యంగా జరిగిన తొక్కిసలాట(stampede)కు బలయ్యారు. గత కొద్దిరోజులుగా అశేష జనవాహినితో జనసంద్రమైన ప్రయాగ్‌రాజ్(Prayagraj) మహాకుంభమేళా(Maha Kumbh Mela) స్నానఘట్టంతో భక్తకోటి శరణఘోషకు బదులు మరణమృదంగం వినిపించింది. మంగళవారం అర్ధరాత్రిదాటాక 1–2 గంటల ప్రాంతంలో త్రివేణి సంగమ స్థలి సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. దీంతో కొద్దిసేపు పుణ్యస్నానాల క్రతువును మధ్యాహ్నందాకా ఆపేశారు. మృతుల్లో కర్ణాటక, అస్సాం, గుజరాత్ నుంచి వచ్చిన భక్తులున్నారు. మౌని అమావాస్య రోజు ఒక్కరోజే 10 కోట్లమంది భక్తులు రావొచ్చన్న ముందస్తు అంచనాతో యోగి ఆద్యిత్యనాథ్ ప్రభుత్వం అత్యంత పటిష్ట ఏర్పాట్లుచేసినా అపశృతి చోటుచేసుకోవడంతో అక్కడ అంతా విషాదం అలుముకుంది. 30 మంది మృతుల్లో 25 మందిని గుర్తించారు. వారిలో నలుగురు కర్ణాటక వాసులున్నారు. అస్సాం, గుజరాత్ నుంచి చెరో భక్తుడిని గుర్తించారు. గాయపడిన వారిలో 36 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. మిగతా వారిని డిశ్చార్జ్‌చేశారు.అంతా గందరగోళం, హాహాకారాలుతెల్లవారుజామున మూడుగంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయడానికి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమ స్థలిలోని సంగమ్ నోస్ ఘాట్ వద్ద కూర్చుని వేచి చూస్తుండగా ఒంటిగంట దాటాక బ్యారీకేడ్లకు అటువైపుగా ఉన్న భక్తులు కిటకిట ఎక్కువ కావడంతో ఇటువైపు దూకారు. ఎక్కివస్తున్న, నెడుతున్న జనం ధాటికి బ్యారీకేడ్లు విరిగిపోయాయి. దీంతో కూర్చున్న వారిపై అటువైపు నిల్చున్న భక్తులు పడ్డారు. వారిపై పక్కనున్న వాళ్లు పడటంతో కిందనున్న వాళ్లు ఊపిరాడక చనిపోయారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంచేసినా కోట్లాది జనం కావడంతో అది వెంటనే సాధ్యపడలేదు. కిందపడిన దాదాపు 90 మంది భక్తులను పోలీసులు ఆ జనం మధ్యే భుజాలపై ఎత్తుకుని, అంబులెన్సుల్లోకి ఎక్కించి మేళా ప్రాంగణంలోనే ఏర్పాటుచేసిన తాత్కాలిక సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు. అయినాసరే వారిలో 30 మంది చనిపోయారని మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ ప్రకటించారు. తొక్కిసలాట కారణంగా వెంటనే పుణ్నస్నానాలను పోలీసులు, సహాయక సిబ్బంది ఆపేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని నిర్ధారించుకున్నాక మధ్యాహ్నం రెండున్నర గంటలకు 13 అఖాడాల అమృత్ స్నాన్తోపాటు భక్తుల పుణ్యస్నానాలకు అనుమతి ఇచ్చారు.జనం మధ్య చిక్కుకున్న అంబులెన్సులుభయంతో భక్తులు చిందరవందరగా పరుగెత్తడంతో బ్యాగులను వెంటేసుకొచ్చిన కొందరు వాటిని అక్కడే పడేశారు. అవి తగిలి ఇంకొందరు పడ్డారు. చెత్త కోసం ఏర్పాటుచేసిన ఇనుప చెత్త డబ్బాలు తగిలి చాలా మంది పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తొక్కిసలాటలో కిందపడి స్పృహకోల్పోయిన భక్తులను వెంటనే అంబులెన్సుల్లో ఎక్కించినా జనం మధ్యలో ముందుకు కదల్లేక అవి చాలాసేపు అక్కడే ఆగిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ఎట్టకేలకు వాటికి దారి కల్పించారు. వీఐపీల కోసం కొంత మేర స్థలాన్ని వదిలేయడంతో పక్కన రద్దీ పెరుగుతోంది. ఇకపై వీఐపీ ప్రోటోకాల్ పేరిట జనాన్ని పక్కకు నెట్టేసే విధానాన్ని పాటించబోమని అక్కడి అధికారి ఒకరు చెప్పారు. సాధారణ భక్తులు, అఖాడాల కోసం వేర్వేరుగా ఏర్పాటుచేసిన వరసలు, బ్యారీకేడ్ల వద్ద ఘటన జరిగిందని అధికారి పేర్కొన్నారు. కుప్పలుగా భక్తుల దుస్తులు, దుప్పట్లు, బ్యాగులు, చెప్పులు పడి తొక్కిసలాట ప్రాంతం చిందరవందరగా తయారైంది. స్పృహ కోల్పోయిన తమ వారిని తట్టిలేపేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబ సభ్యులతో ఆప్రాంతంలో ఒక్కసారిగా నిర్వేదం నెలకొంది. ‘‘ కర్ణాటక నుంచి మేం 60 మంది బృందంగా వచ్చాం. అన్ని వైపుల నుంచి తోశారు. తప్పించుకునే ఆస్కారం లేకుండాపోయింది’’ అని కర్ణాటక నుంచి వచ్చిన సరోజిని అనే భక్తురాలు ఏడుస్తూ చెప్పారు. ‘‘ బ్రహ్మముహూర్తంలో స్నానం చేద్దామని కూర్చుని, పడుకుని వేచిచూస్తున్న వారిపైకి వెనక నుంచి ఒక్కసారిగా జనం మీదపడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది’’ అని అస్సాం నుంచి వచ్చిన బాదామా దేవి చెప్పారు. ఇలా జరగాలని గంగమ్మ తలచిందేమో అని జార్ఖండ్‌లోని పలాము నుంచి వచ్చిన రామ్ సుమిరాన్ అనే భక్తుడు అన్నాడు. తొక్కిసలాటకు ముందే ఏదైనా ఉపద్రవం జరగొచ్చని ఊహించిన ప్రయాగ్‌రాజ్ డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఘాట్ వద్ద కూర్చుని వేచిచూస్తున్న భక్తులకు ఆయన ‘‘ లేవండి. లేవండి. త్వరగా స్నానంచేసి వెళ్లపొండి. వెనక నుంచి ఊహించనంత మంది జనం వచ్చేస్తున్నారు’’ అని ఆయన అక్కడి భక్తులకు ముందే హెచ్చరిస్తుండటం ఆ వీడియోలో ఉంది. ‘‘ భక్తుల్లో పోకిరీలూ ఉన్నారు. చిన్నారులు ఉన్నారన్న ఇంగితజ్ఞానం లేకుండా నవ్వుతూ మమ్మల్ని తోసేశారు. తొక్కిసలాటలో మా పిల్లలు గాయపడ్డారు’’ అని ఆస్పత్రిలో ఉన్న ఒక మహిళ తెలిపింది. విచారం వ్యక్తం చేసిన ప్రముఖులుఘటన జరిగిన విషయం తెల్సి వెంటనే ప్రధాని మోదీ సీఎం యోగికి ఉదయం, మధ్యాహ్నం నాలుగైదు సార్లు ఫోన్‌చేసి తాజా పరిస్థితిపై వాకబు చేశారు. భక్తుల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’’ అని మోదీ అన్నారు. రాష్ట్రపతి ముర్ము సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బుధవారం ఒక్కరోజే 7.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు ప్రాథమిక సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లో బుధవారమే దాదాపు 10 కోట్ల మంది జనం వచ్చేశారని వారు బయటికెళ్లేదాకా కొత్తవారిని అనుమతించొద్దని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. సంగమ్ నోస్ ఘాట్ వైపు వెళ్లొద్దని భక్తులకు యోగి విజ్ఞప్తిచేశారు. ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే మార్గాలను మూసేసినట్లు తెలుస్తోంది. వెనక్కి వచ్చే భక్తుల కోసం రైల్వేశాఖ అదనపు రైళ్లను నడపనుంది.ముగ్గురు సభ్యులతో జుడీషియల్ కమిషన్ఘటనకు కారణాలను తెల్సుకునేందుకు జస్టిస్ హార్ష్ కుమార్, మాజీ డీజీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ వీకే సింగ్‌లతో యోగి ప్రభుత్వం ఒక జుడీషయల్ కమిషన్‌ను నియమించింది. మృతుల కుటుంబాలకు సీఎం యోగి తలో రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ఘటనాస్థలికి వచ్చి సమీక్ష జరపనున్నారు.దుమ్మెత్తి పోసిన విపక్షాలునిర్వహణ లోపాలు, వీఐపీల స్నానాల మీదే అధికారుల ధ్యాస, ఘనంగా నిర్వహిస్తున్నామని అతి ప్రచార ఆర్భాటాలతో తొక్కిసలాట జరిగిందని విపక్షాలు యోగి, మోదీ ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోశాయి. ‘‘ వీఐపీ సంస్కృతి వదిలేయండి. సాధారణ భక్తులను పట్టించుకోండి. ప్రచారంపై దృష్టిపెట్టి పటిష్ట భద్రతను గాలికొదిలేయడం వల్లే తొక్కిసలాట జరిగింది’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీ, టీఎంసీ, శివసేన(యూబీటీ), బీఎస్పీ పార్టీలు యోగి, మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించాయి. -
అధికారిక ప్రకటన.. కుంభామేళా తొక్కిసలాటలో మరణాలు ఎన్నంటే?
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాలో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది భక్తులు చనిపోయినట్టు మహాకుంభ డీఐజీ వైభవ్ కృష్ణా అధికారికంగా వెల్లడించారు. ఇదే సమయంలో 60మంది త్రీవంగా గాయపడినట్టు వెల్లడించారు. కాగా, మరణించిన వారిలో 25 మందిని గుర్తించినట్టు తెలిపారు. మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.తాజాగా డీఐజీ వైభవ్ కృష్ణా మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్యలో తొక్కిసలాట జరిగింది. అఖారా మార్గ్‌లో భారీగా భక్తులు గుమ్మిగూడారు. ఈ రద్దీ కారణంగానే తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన వారిలో 25 మందిని గుర్తించాం.. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై వివరాల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 1920ను సంప్రదించాలని సూచించారు. ఈ ఘటన తర్వాత దాదాపు 90 మందిని అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు భక్తులు అప్పటికే చనిపోయారు. 36 మంది స్థానిక వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. #WATCH | Prayagraj, UP: DIG Mahakumbh, Vaibhav Krishna says "Before Brahma Muhurta, between 1 am to 2 am, a huge crowd gathered on the Akhara Marg. Due to this crowd, the barricades on the other side broke and the crowd ran over the devotees waiting to take a holy dip of Brahma… pic.twitter.com/ZL6KlmMf9k— ANI (@ANI) January 29, 2025ఇదిలా ఉండగా.. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తారు. ఈక్రమంలోనే బుధవారం తెల్లవారుజామున రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీసినట్లు ప్రధాని వెల్లడించారు.आज के अमृत स्नान का विहंगम दृश्य...यह धरती है कल्पवास की, यह धरती है महाकुंभ की, यह धरती है तिर्थराज प्रयाग की...ॐ नमः पार्वती पतये हर हर महादेव#महाकुंभ2025 pic.twitter.com/oKsX0qJdOa— कर्वज्ञम् (@eternalroute) January 29, 2025ఇక, తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు. महाकुंभ में में मौनी अमावस्या पर लगभग 10 करोड़ श्रद्धालु पहुंचे हैंभगदड़ की सूचना अप्रिय है लेकिन स्थिति नियंत्रित है. लश्कर मीडिया अफ़वाह उड़ा रहा है, उस पर भरोसा न करेंप्रशासन की सूचना पर ही भरोसा करें. ये आपका अपना MahaKumbh है, आपको ही संभालना है#MahakumbhStampede pic.twitter.com/ND25xkgPt7— Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) January 29, 2025 ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.सरकार को पहले से ही पता था इतनी भीड़ आएगी तो फिर पूरा प्रबंध सरकार ने सेना को क्यों नहीं दे दिया... #MahakumbhStampede #MouniAmavasya #AmritSnan #MahaKumbh2025 #Prayagraj #Stampedepic.twitter.com/ZAF2zW0iov— Prerna Yadav (@prerna_yadav29) January 29, 2025 -
మహా కుంభమేళాలో అపశ్రుతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
-
Maha Kumbh 2025: ఈ జంట చేసిన పనికి నెటిజన్లు..!
జాతరలు, మేలాల సందర్భంగా కొంతమంది తప్పిపోవడం, కుటుంబం నుంచి విడిపోవడం లాంటి అనేక సంఘటనలు గతంలో చాలా చూశాం. ఇలాంటి ఉదంతాలపై అనేక సినిమాలు కూడా రూపొందాయి. లక్షల జనసమూహంతో ప్రజలు ఒకచోట చేరే మహాకుంభ్ మేళా ఉత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కుంభమేళాలో తప్పిపోకుండా ఉండేందుకు ఒక జంట స్పెషల్ సొల్యూషన్ వెదుక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025కు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తున్నారు. 144 సంవత్సరాల తర్వాత, పవిత్రమైన గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద ఈ ధార్మిక కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ పవిత్ర స్నానం చేస్తేతమ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.'లవ్ ఎట్ ఇట్స్ పీక్'కుంభమేళాకు వచ్చిన వీరు తాము తప్పిపోకుండా ఉండేందుకు ఒకరికొకరు తాడుతో కట్టేసుకున్నారు. భారీ జనసమూహం మధ్య, తాము కనెక్ట్ అయ్యేలా, విడిపోకుండా చూసుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ దృశ్యాలు పలువుర్ని విపరీతంగా ఆకర్షించాయి. మహిళ తన తలపై ఏదో బరువు మోస్తోంది. వెనక కాస్త పెద్దవాడిగా కనిపిస్తున్న పురుషుడు వెడుతున్నాడు. దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్‌మారింది.ఇన్స్టాగ్రామ్ పేజీ- @log.kya.sochenge లో ఇది షేర్ అయింది.మహా కుంభ్‌కు హాజరైన ఒక జంట ఐక్యంగా ఉండేలా చూసుకోవడానికి తమను తాము తాడుతో కట్టుకున్నారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ, భక్తి అందర్నీ ఆకర్షించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభ్‌లో ఇటువంటి హృదయపూర్వక దృశ్యాలు ఐక్యతాసారాన్ని ప్రతిబింబిస్తాయంటూ ఈ పేజ్ పేర్కొంది. ఇప్పటికే ఇది 40.1 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. View this post on Instagram A post shared by LOG KYA SOCHENGE (@log.kya.sochenge) సోషల్ మీడియా వినియోగదారులు ఈ జంట క్రియేటివిటికీ, ప్రేమకు ముగ్ధులై పోయారు. ‘‘పొద్దున్నలేస్తే సెలబ్రిటీల విడాకుల వార్తలతో విసిపోతున్న మనకు ఈ రకమైన క్లిప్‌లు నిజంగా హృదయపూర్వకంగా ఉన్నాయి” అని ఒకరు, "ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు’’ అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. -
‘చెల్లాచెదురైన’ బతుకులు.. కుంభమేళా ఘటనలో హృదయవిదారక దృశ్యాలు
లక్నో: చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. బ్యాగులు.. దుస్తులు.. దుప్పట్లు.. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన జరిగిన ప్రయాగ్‌రాజ్ సెక్టార్-2లో ప్రస్తుతం దృశ్యాలివే. మరోవైపు తమ వారి జాడ తెలియక వందల మంది ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ముందు కంటతడి పెడుతూ కనిపిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తగా.. బారికేడ్లు విరిగిపోవడంతో భక్తులు చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరోవైపు.. ఘటనకు అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప చెత్తకుండీలే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి గాయాలయ్యాయనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. सरकार को पहले से ही पता था इतनी भीड़ आएगी तो फिर पूरा प्रबंध सरकार ने सेना को क्यों नहीं दे दिया... #MahakumbhStampede #MouniAmavasya #AmritSnan #MahaKumbh2025 #Prayagraj #Stampedepic.twitter.com/ZAF2zW0iov— Prerna Yadav (@prerna_yadav29) January 29, 2025A daughter is hugging her father and crying because her mother has left this world💔But only those who have experienced such loss can truly understand the pain of a family.#MahakumbhStampede pic.twitter.com/2dGo0OQKxQ— هارون خان (@iamharunkhan) January 29, 2025CM Yogi Adityanath should watch this video and feel some shame 👇#MahakumbhStampede pic.twitter.com/t0l3aUldGc— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) January 29, 2025#MahakumbhStampede15 pilgrims have paid with thier lives in a stampede in #MahaKumbh2025 #Mahakumbh #MahaKumbhMela2025 pic.twitter.com/0f26oBgnMH— Sanghamitra Bandyopadhyay (@SanghamitraLIVE) January 29, 2025 -
Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈరోజు(బుధవారం) మౌని అమావాస్య కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు లెక్కలేనంతమంది భక్తులు సంగమ తీరానికి చేరుకున్నారు.మౌని అమావాస్యకు ఒక రోజు ముందు అంటే మంగళవారం నాటికే ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తండోపతండాలుగా చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం దాదాపు 5.5 కోట్ల మంది సంగమంలో స్నానమాచరించారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం 8 నుంచి 10 కోట్ల మంది జనాభా ఉన్నారని ముఖ్యమంత్రి స్వయంగా తెలిపారు.ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఇక్కడ ఇప్పుడున్న జనాభా.. ఢిల్లీలో ఉంటున్న జనాభాకు నాలుగు రెట్లు అధికంగా ఉంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతమంతా జనసంద్రంలా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ నగరంలో దాదాపు 10 కోట్ల మంది ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నాలుగు వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ అధికారులు 45 ఘాట్లను ఏర్పాటు చేసినప్పటికీ, భక్తులు త్రివేణీ సంగమంలోనే స్నానాలు చేయాలని భావిస్తున్నారు. దీంతో సంగమ ప్రాంతంలో విపరీతంగా భక్తుల రద్దీ నెలకొంది. కుంభమేళా ప్రాంతంలోని భూలా బిస్రా సెంటర్లో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్ నిఘా పెంపు -
Maha Kumbh Mela 2025 : ఏకంగా ఇంటినే వెంట తెచ్చుకున్న దంపతులు!
‘‘ఆలోచనల్లో పదును ఉండాలేగాని ఆవాసాలకు కొదవేముంది?’’ అన్నట్టుగా ఉంది ఆ దంపతలు తీరు. కాదేదీ నివాసానికి అనర్హం అంటూ వారు సృష్టించిన సరికొత్త కదిలే ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక యాత్రకు సృజనాత్మకత రంగరించిన వారి ప్రయాణం చూపరుల ప్రశంసలకు నోచుకుంటోంది.ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ ప్రస్తుతం ఓ జంటకు నివాసంగా మారింది. అక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకుని నివాసాలకు ఇబ్బందిని ముందే గ్రహించిన కర్ణాటకకు చెందిన దంపతులలు ఓ వినూత్న తరహా ఇంటికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ నివాసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు డబుల్ డెక్కర్ కారును ప్రదర్శించేలా ఉన్న వీరి ఇంటి వీడియో పారిశ్రామిక ప్రముఖులను కూడా ఆకర్షిస్తోంది. అదే విధంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని సైతం ఆకట్టుకుంది. విశిష్టమైన మార్పులు ఆవిష్కరణలతో వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మహీంద్రా ఈ క్రియేషన్ వెనుక ఉన్న చాతుర్యం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది, ‘అవును, నేను అలాంటి మార్పులు ఆవిష్కరణలకు నేను ఆకర్షితుడిని అవుతాను అనేది ఖచ్చితంగా నిజం. అయితే అది మహీంద్రా వాహనంపై ఆధారపడినప్పుడు, నేను మరింత ఆకర్షితుడని అవుతా‘ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఈ వీడియోను ఉద్దేశించి హిందీలో ఒక పోస్ట్‌లో తెలిపారు.ఇన్నోవాయే ఇల్లుగా మారింది...ఈ కారు పేరు టయోటా ఇన్నోవా కాగా అదే వీరి మొబైల్ హోమ్‌గా రూపాంతరం చెందింది.ఈ రకమైన మార్పు చేర్పులు, సవరణలకు దాదాపు రూ. 2 లక్షలు పైగానే ఖర్చయిందని ఆ ‘ఇంటికా’కారు యజమాను వెల్లడించారు. రూఫ్‌టాప్ టెంట్‌కు రూ. 1 లక్ష .. పూర్తిస్థాయి వంటగదికి రూ.1లక్ష పర్యావరణ హితమైన రీతిలో వారి విద్యుత్ అవసరాలను తీర్చడానికివాహనం సోలార్ ప్యానెల్‌ను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు.ఈ జంట తమ అనుకూలీకరించిన సెటప్‌ను పూర్తిగా ఉపయోగించుకుని, వీలైనంత ఎక్కువ కాలం కుంభమేళాలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమీ రాకపోవడం వల్లనో ఏమో... కుంభ్ మేళా అనంతరం కూడా తమ ఇంటికారులో షికారు కంటిన్యూ చేయాలని వీరు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.రోడ్ ట్రిప్‌కు సై...ఈవెంట్లో ఆథ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించిన తర్వాత, ఈ వాహనం మీద వారు ఆరు నెలల పాటు సుదీర్థమైన రోడ్ ట్రిప్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అందులో భాగంగా వీరు విదేశాల్లోకి అంటే... నేపాల్‌లోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ వాహనానికి అభిమాని అయిన భర్త తాను రాబోయే రోడ్ ట్రిప్ కోసం మరింత ఆసక్తిగా ఉన్నట్టుగా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భార్య తమ వంట అవసరాల కోసంఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సౌకర్యవంతంగా తాజా కూరగాయలను ఆర్డర్ చేస్తూన్నానని తెలిపారు.ఈ భార్యాభర్తల ఐడియాను చూపిస్తున్న వీడియో ఆన్లైన్లో అనేకమంది ప్రశంసలకు నోచుకుంది. ఈ జంట సృజనాత్మకత, సమయానుకూలతను నెటిజన్లు కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘జుగాద్‘ (వినూత్న పరిష్కారాలు)లో ఇటీవల భారతీయులు బాగా రాణిస్తున్నారనే విషయాన్ని పలువురు హైలైట్ చేస్తూ వారి వనరులను ప్రశంసిస్తూ చేసే కామెంట్స్ వెల్లువెత్తాయి. మరికొందరు ‘పర్ఫెక్ట్ క్యాంపింగ్ వ్యాన్‘ అనే భావనను మెచ్చుకున్నారు వినూత్న తరహాలో వాన్ లైఫ్ డ్రీమ్‌ను జీవించినందుకు జంటను అభినందించారు. ఓ అవసరం నుంచి పుట్టిన సృజనాత్మకత వాహనాలను చక్రాలపై అసాధారణ నివాసాలుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు నోచుకుంది.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని విచారం
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో ఈ ఉదయం ప్రయాగ్‌రాజ్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్(Prayagraj)లో జరిగిన ప్రమాదం బాధాకరం. ఘటనలో తమ వారిని కోల్పోయిన వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. క్షతగాత్రులకు సాయం అందించడంలో అధికారులు ఉన్నారు. ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నా. ముఖ్యమంత్రి యోగితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నా అని ప్రధాని మోదీ(PM Modi) ట్వీట్ చేశారాయన. ఘటనపై ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్ష జరుపుతున్నారని ఇటు యూపీ సీఎం యోగి, అటు పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…— Narendra Modi (@narendramodi) January 29, 2025మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రయాగ్‌రాజ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఘటనపై ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, ఇతర రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మహా కుంభమేళాలో మౌనీ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్ సెక్టార్-2 వద్ద అమృత స్నానాల కోసం వచ్చారు. ఈ క్రమంలో తోపులాటలో బారికేడ్లువిరిగిపడగా.. తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆంబులెన్స్‌లలో ఆస్పత్రలకు తరలించారు. అయితే మరణాలపై రకరకాల ప్రచారం జరిగినప్పటికీ అక్కడి అధికారులెవరూ దానిని ధృవీకరించలేదు. చివరకు ప్రధాని మోదీ ప్రకటనతో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. అయితే ఎంత మంది మరణించారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే అక్కడికి భారీగా భక్తులు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తం కాకూడదనే యూపీ ప్రభుత్వం మరణాల విషయంలో ప్రకటనేదీ చేయలేదని ఓ అధికారి జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. మరోవైపు ఈ ఘటనతో విపక్షాలు యూపీ సర్కార్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి.ఇదీ చదవండి: నిర్వహణ లోపాల వల్లే తొక్కిసలాట ఘటన.. యూపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు -
Mahakumbh-2025: యోగి ప్రభుత్వానిదే బాధ్యత: కాంగ్రెస్
మహా కుంభమేళాలో మౌని అమావాస్య వేళ జరిగిన తొక్కిసలాటకు యోగి ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. మహా కుంభమేళాకు ఏర్పాట్లు చేయడానికి బదులుగా, ప్రభుత్వం ప్రచారంలో బిజీగా ఉందని కాంగ్రెస్ ప్రతినిధి అన్షు అవస్థి ఆరోపించారు. భక్తులను పట్టించుకునేందుకు బదులుగా ప్రభుత్వం తన ఫోటో సెషన్లో బిజీగా ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం వీఐపీ సంస్కృతిని విడనాడి, భక్తులకు భద్రత కల్పించాలని కోరారు.కుంభమేళాలో నిర్వహణ లోపం, సన్నాహాలలో నిర్లక్ష్యం, తగిన ఏర్పాట్లు లేకపోవడం కారణంగానే తొక్కిసలాట జరిగిందని, దీనికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని అన్షు అవస్థి పేర్కొన్నారు. మహా కుంభమేళా బడ్జెట్ అంతా అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు. కుంభమేళా మొదటి రోజు నుండే తాము భక్తుల రద్దీ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం భక్తులకు తగిన విధంగా అవగాహన కల్పించి ఉంటే, ఈ తొక్కిసలాటను నివారించగలిగేదన్నారు. వీఐపీ స్వాగత సంస్కృతిని ఆపాలని, బడ్జెట్లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని యోగి సర్కార్‌కు అన్షు అవస్థీ విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే -
ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం మౌని అమావాస్య పుణ్యస్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.‘మహా కుంభమేళా సందర్భంగా తీర్థరాజ సంగమం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారనే వార్త వినడం హృదయ విదారకంగా ఉంది’ అని మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ లో రాశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. महाकुंभ के दौरान, तीर्थराज संगम के तट पर हुई भगदड़ से कई लोगों की जान गई है और अनेकों लोगों के घायल होने का समाचार बेहद हृदयविदारक है। श्रद्धालुओं के परिजनों के प्रति हमारी गहरी संवेदनाएँ और घायलों की शीघ्रातिशीघ्र स्वास्थ्य लाभ की हम कामना करते हैं। आधी अधूरी व्यवस्था,…— Mallikarjun Kharge (@kharge) January 29, 2025ఇదే పోస్టులో ఆయన మహా కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన నిలదీశారు. విస్తృత ఏర్పాట్లు, విఐపిల కదలిక, నిర్వహణ కంటే స్వీయ ప్రమోషన్‌పై అధికంగా దృష్టి పెట్టడం, నిర్వహణలో లోపాలే తొక్కిసలాటకు కారణమని ఆయన పేర్కొన్నారు.వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, అటువంటి బలహీన వ్యవస్థను కలిగి ఉండటం ఖండించదగినది. ఇంకా కొన్ని రాజ స్నానాలు మిగిలి ఉన్నాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడే మేల్కొని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏర్పాట్లను మెరుగుపరచాలని ఖర్గే సూచించారు. భక్తుల వసతి, ఆహారం, ప్రథమ చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లను మరింతగా విస్తరించాలని, సాధువులు కూడా ఇదేకోరుకుంటున్నారని అన్నారు. బాధితులకు సాధ్యమైనంత త్వరగా సహాయం అందించాలని మల్లిఖార్జున ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి -
తొక్కిసలాట ఘటన.. ప్రధాని నాలుగుసార్లు ఫోన్ చేశారు: సీఎం యోగి
లక్నో: మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ ఉదయం మీడియాతో స్పందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయని చెప్పారాయన. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని తెలిపారాయన. ‘‘నిన్న రాత్రి నుంచి మౌని అమావాస్య పుణ్య స్నానాలు మొదలయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా నెలకొంది. అయినా అమృత స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ తగ్గాక తాము స్నానాలకు వెళ్తామని అఖాడాలు తెలిపారు. ఈ ఉదయం 8గం. వరకే దాదాపు 3 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌కి ఇవాళ 8-10 కోట్ల మంది వస్తారని అంచనా. .. గత రాత్రి తొక్కిసలాట జరిగింది. అఖాడ మార్గం గుండా వెళ్లి స్నానాలు చేయాలని కొందరు భక్తులు ప్రయత్నించారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రధాని మోదీ ఇప్పటికే నాలుగుసార్లు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు, కేంద్ర మంత్రి అమిత్ షా,గవర్నర్ కూడా ఘటన గురించి చర్చించారు ’’ అని యోగి ప్రకటించారు. అలాగే.. త్రివేణి సంగం వద్దకు కాకుండా ఎక్కడికక్కడే ఘాట్లకు వెళ్లి స్నానం చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. #WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath says," The situation in Prayagraj is under control...""Around 8-10 crore devotees are present in Prayagraj today. There is continuous pressure due to the movement of devotees towards the Sangam Nose. A few devotees have… pic.twitter.com/lOc1OIraqm— ANI (@ANI) January 29, 2025ఇదిలా ఉంటే.. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. సుమారు 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా.. త్రివేణి సంగమానికి 30 కిలోమీటర్ల వరకే అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు కాలినడకన చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సెక్టార్ 2 వద్ద తొక్కిసలాటలో పలువురికి గాయాలు కాగా చికిత్స అందుతోంది. ఘాట్ వెంట కిక్కిరిసిన భక్తులతో కిలోమీటర్ మేర బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో ఊపిరాడని పరిస్థితుల నడుమ భక్తులు నలిగిపోయారు. తీవ్రంగా గాయపడిన 50 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పది నుంచి 15 మంది మరణించారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీనిని అధికారులు ధృవీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. జరిగింది ఇదే! -
కుంభమేళా తొక్కిసలాట ఘటన.. యోగికి మోదీ, అమిత్ షా కాల్
-
Mahakumbh-2025: నిర్వహణ లోపంతోనే ప్రమాదం: అఖిలేష్ యాదవ్
ప్రయాగ్‌రాజ్: మహాకుంభమేళాలో బుధవారం ఉదయం తొక్కిసలాట జరిగిన దరిమిలా యోగి సర్కార్‌పై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే యోగి ప్రభుత్వానికి ఐదు విజ్ఞప్తులు చేశారు. మహా కుంభ్‌లో నిర్వహణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లి తక్షణం వైద్య చికిత్స అందించాలని, మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయాలని అఖిలేష్ కోరారు. సహాయక చర్యలను కొనసాగిస్తూనే, సురక్షితమైన నిర్వహణ అందించాలని సూచించారు. ఈ క్లిష్ట సమయంలో భక్తులు సంయమనం పాటిస్తూ, సహనంతో వ్యవహరించాలని అఖిలేష్ విజ్ఞప్తి చేశారు. నేటి సంఘటన నుండి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని భక్తులకు తగిన రక్షణ వ్యవస్థ కల్పించాలన్నారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి -
Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు ఈరోజు(బుధవారం) సంగమ తీరానికి లేక్కలేనంతమంది భక్తులు వచ్చారు. ఈ నేపధ్యంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.ఈ ఘటన గురించి తెలియగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. దీనితో పాటు భక్తులకు ఒక విజ్ఞప్తి చేశారు. యూపీ సర్కారు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పలు ఘాట్లను నిర్మించిందని తెలిపారు. అక్కడ కూడా స్నానాలు చేయవచ్చని సూచించారు. పుణ్యస్నానాల సందర్భంగా ఎటువంటి వదంతులు వ్యాపించినా పట్టించుకోవద్దని కోరారు.మరోవైపు ఈరోజు ఉదయం తొక్కిసలాట చోటుచేసుకున్న కారణంగా అన్ని అఖాడాలు అమృత స్నానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీనిని నిరంజన్ కంటోన్మెంట్ అఖాడ పరిషత్ అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్ర గిరి మీడియాకు తెలిపారు. తొక్కిసలాటలో కొందరు మహిళలు, పిల్లలు గాయపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా.. -
కుంభమేళా తొక్కిసలాట.. అమృతస్నానం కోసం ఎగబడిన జనం
-
Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా..
ప్రయాగ్‌రాజ్: నేడు (బుధవారం) మౌని అమావాస్య. ఈ సందర్భంగా కుంభమేళాలో స్నానం చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపధ్యంలో కుంభమేళాకు దారితీసే మార్గాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.యూపీ-బీహార్ సరిహద్దు అయిన కర్మనాషా నుంచి బీహార్‌లోని రోహ్తాస్లోని శివసాగర్ ఖుర్మాబాద్ వరకు 70 కి.మీ మేరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచే జీటీ రోడ్డులోని రెండు లేన్లు పూర్తిగా జామ్ అయ్యాయి. దీని కారణంగా ద్విచక్రవాహనాలు వెళ్ళడం కూడా కష్టంగా మారింది.భారీ ట్రాఫిక్ జామ్ దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌లోకి భారీ వాహనాల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని అధికారులు సడలించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. మరోవైపు ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళ్లే ప్రయాణికులకు ఆధారమైన జీటీ రోడ్డు గత 12 గంటలుగా స్తంభించిపోయింది. కుద్ర, మోహానియా, కైమూర్ జిల్లాలోని టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ నెలకొంది. కోల్‌కతా, జార్ఖండ్‌తో పాటు ఇతర ప్రాంతాల నుండి ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్న భక్తుల వాహనాలు జాతీయ రహదారి- 19లో చిక్కుకుపోయాయి. భక్తులతో వెళ్తున్న ఒక బస్సు రాత్రంతా రద్దీలో చిక్కుకుపోయింది.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: నాలుగు నిముషాలకు ఒక రైలు.. మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు -
Mahakumbh-2025: నాలుగు నిముషాలకు ఒక రైలు.. మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈరోజు (జనవరి 29) మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో రెండవ అమృత స్నానం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భక్తులు ముందుగానే సంగమస్థలికి చేరుకుంటున్నారు. మహా కుంభమేళా పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుండి 190 ప్రత్యేక రైళ్లు, 110 సాధారణ రైళ్లు, 60 మెమూ రైళ్లు సహా 360 రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు.కుంభమేళాకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల ప్రయాణ అవసరాలను తీర్చడంపై భారత రైల్వేశాఖ దృష్టిసారించిందన్నారు. మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నామని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. ప్రతి స్టేషన్లో తాగునీరు, ఫుడ్ కోర్టులు, టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు.అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స బూత్‌లు, వైద్య పరిశీలన గదులను ఏర్పాటు చేశామని, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ ఛోకిలలో యాత్రి సువిధ కేంద్రాల్లో వీల్చైర్లు, లగేజ్ ట్రాలీలు మందులు మొదలైనవి అందిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
మౌని అమావాస్య.. త్రివేణి సంగమ స్థలిలో కీలక ఘట్టం
సాక్షి న్యూఢిల్లీ: మహా కుంభమేళా(Maha Kumbh)లో మరో కీలక ఘట్టానికి త్రివేణి సంగమ స్థలి సిద్ధమైంది. బుధవారం అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య(Mauni Amavasya) కావడంతో కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనకోటి మునుపెన్నడూలేనంత పెద్ద ఎత్తున తరలివస్తోంది. బుధవారం ఒక్కరోజే సుమారు పది కోట్ల మంది భక్తులు పవిత్రస్నానాలు ఆచరిస్తారని అంచనా. అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృతస్థాయిలో భారీ ఏర్పాట్లు చేసింది. రోజూ కోటి, కోటిన్నర మంది భక్తులు మేళాకు వస్తుండగా బుధవారం ఒక్కరోజే అత్యధిక స్థాయిలో వచ్చినాసరే తోపులాటల వంటి ఘటనలు సంభవించకుండా ప్రభుత్వం తగు ఏర్పాట్లుచేసింది.గంగానది ప్రవాహం పొడవునా ఎక్కడైనా స్నానం ఆచరించేలా మరిన్ని ఘాట్లను స్నానాలకు అనువుగా అందుబాటులోకి తెచ్చింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే సామాన్యులు, సన్యాసులు, సంతులు, సాధువులు, నాగ సాధువులు, కిన్నెరలు తరలివస్తున్నారు. నేడు శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య వస్తోంది. దీంతో ఈరోజుకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.ఈ శుభ ముహుర్తంలో పుణ్యస్నానం ఆచరించాలని కోట్లాది మంది ఆసక్తిగా కనబరుస్తున్నారు. అమృత స్నానం(రాజ స్నానం) తర్వాత దానధర్మాలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా శివుడిని స్మరించుకుంటూ భక్తులు తమ పూర్వీకులకు నీరాజనాలు అర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇప్పటి వరకు పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 15 కోట్లు దాటగా బుధవారం మౌని అమావాస్య సందర్భంగా ఒక్కరోజే పది కోట్లు భక్తులు వచ్చే అవకాశముంది. -
కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
ఝాన్సీ : మహాకుంభమేళాకు వెళుతున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని హర్పాల్పూర్లో ఝాన్సీ నుండి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న రైలుపై అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. ఈ రైలు మహా కుంభమేళాకు వెళుతోంది.ఝాన్సీ డివిజన్లోని హర్పాల్పూర్ స్టేషన్లో సోమవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అకస్మాత్తుగా రైలుపై దాడి జరిగిన నేపధ్యంలో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అల్లరిమూకలు రైలులోనికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో రాళ్లతో కిటికీలను పగులగొట్టారని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం.విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీసులతో పాటు రైల్వే రక్షణ దళం పరిస్థితిని అదుపులోనికి తెచ్చింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఛతర్పూర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వాల్మిక్ చౌబే మాట్లాడుతూ ఛతర్పూర్ రైల్వే స్టేషన్లో గేటు తెరవకపోవడంతో తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో కొందరు అల్లరిమూకలు రైలుపై రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ రైలు ఛతర్పూర్ నుండి ప్రయాగ్‌రాజ్ వెళుతోందని, దాడికి పాల్పడినవారంతా పరారయ్యారని తెలిపారు.ఇది కూడా చదవండి: Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి -
Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది. దేశ విదేశాల నుండి పర్యాటకులు, భక్తులు మహా కుంభమేళాకు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.మహాకుంభమేళాలో మూడవ పుణ్య స్నానం జనవరి 29న అంటే మౌని అమావాస్య రోజున జరగనుంది. ఆ రోజున పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు మహా కుంభ స్నానం చేసే వారి సంఖ్య 15 కోట్లు దాటింది. గడచిన 17 రోజుల్లో 15 కోట్లకు పైగా జనం మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారు. మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్ల మంది భక్తులు, సాధువులు స్నానమాచరించారు.రాబోయే మౌని అమావాస్య సందర్భంగా 8 నుండి 10 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వస్తారనే అంచనాలున్నాయి. 2025 మహా కుంభమేళాకు మొత్తంగా 40 కోట్ల మంది హాజరవుతారనే అంచనాలున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య అనంతరం ఫిబ్రవరిలో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం జరగనుంది. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26న అంటే మహాశివరాత్రి రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు -
Mahakumbh 2025: కుంభమేళా కవర్ చేస్తున్న రిపోర్టర్.. ఇంతలో ఊహించని విధంగా
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కుంభమేళాకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అటువంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ అలరిస్తోంది.ఒక మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ అత్యంత ఉత్సాహంగా కుంభమేళాపై వీడియో కవర్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చినవారిని పలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఆ రిపోర్టర్ ఒక వ్యక్తిని కుంభమేళా అనుభవాల గురించి అడుగుతుండగా, ఆ పక్కనే ఉన్న ఒక యువకుడు తాను మాట్లాడుతానని అడగడాన్ని వీడియోలో మనం గమనించవచ్చు. దీనికి సమాధానంగా ఆ రిపోర్టర్ కొంచెం దూరంగా ఉండు.. తరువాత నువ్వు మాటాడవచ్చు అని చెబుతాడు. కొద్దిసేపు అలానే నిలబడిన ఆ యువకుడు ఒక్కసారిగా ముందుకువచ్చి, ఆ రిపోర్టర్ నుంచి మైక్ తీసుకుని పారిపోవడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఇది జరిగిన వెంటనే ఆ రిపోర్టర్‌తో పాటు అక్కడున్నవారంతా ఆ యువకుడిని వెంబడిస్తారు. महाकुंभ मे माहौल पूरी तरह हंसी मजाक का बना रखा है लोगो ने.... अब रिपोर्टर साहब का माइक लेकर लड़का फरार 😅😃 pic.twitter.com/03ndTJvlxa— Ganesh Bhamu (@GaneshBhamu87) January 27, 2025ఈ వీడియో @GaneshBhamu87 అనే ఖాతా నుంచి ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 71 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసిన కొందరు యూజర్స్ ఇది రిపోర్టర్ ఆడిన గేమ్ అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు కుంభమేళాను రంగులమయం చేస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు -
ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తాజాగా జనవరి 27 (సోమవారం) రాత్రి 10 గంటల వరకు ఒక్కరోజులో 1.5 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకూ 14 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుంభమేళాలో పాల్గొని, పవిత్ర స్నానం చేశారు. ఈ సమయంలో ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బాబా రామ్‌దేవ్ తదితరులు ఉన్నారు.మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలివస్తున్నారు. ఇటాలియన్ భక్తుడైన ఆంటోనియో తాను భారతదేశంలో జరిగే కుంభమేళాను చూడాలనే తన కలను నెరవేర్చుకున్నానని తెలిపారు. 10 సంవత్సరాలుగా ఇక్కడికి రావాలనుకుంటున్నానని, ఇప్పుడు కుంభమేళా సమయంలో వచ్చానని మీడియాకు తెలిపారు. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాంటి 12 కుంభమేళాల తరువాత వచ్చిన మహా కుంభమేళా ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే -
మోదీ, అమిత్ షా, కుంభమేళాపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: బీజేపీ నేతలు, మహా కుంభమేళాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో తప్పులు చేసిన బీజేపీ నేతలు కుంభమేళాలోని గంగా నీటిలో మునిగితే విముక్తి కలగదు అన్నారు. ఇదే సమయంలో మోదీ, అమిత్ షా కచ్చితంగా నరకానికే వెళ్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘గంగా నదిలో స్నానం చేయడం వల్ల పేదరికం తొలగిపోతుందా?. అది ఆహారాన్ని అందిస్తుందా?. నేను ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయాలని అనుకోవడం లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ, పిల్లలు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, కార్మికులకు జీతం అందనప్పుడు, బీజేపీ నాయకులు గంగలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు. వారు టీవీల్లో పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల నుండి దేశం ప్రయోజనం పొందదు. అలాగే.. ప్రధాని మోదీ(Modi), అమిత్ షా(Amit Shah) ఎన్నో తప్పులు చేశారు. అలాంటి వ్యక్తులు కుంభమేళాలో స్నానాలు చేస్తే విముక్తి రాదు. మోదీ, అమిత్ షా కచ్చితంగా నరకానికి వెళ్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందిస్తూ ఖర్గే వ్యాఖ్యలను సనాతన ధర్మంపై దాడిగా అభివర్ణించారు. ఆయన మరే ఇతర మతం గురించి అలాంటివి చెప్పగలరా? అలాంటి ప్రకటనలు ఖండించదగినవి. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలి. ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Indore, MP | Congress National President Mallikarjun Kharge says, "On one hand Narendra Modi salutes the Constitution and on the other, he does everything against it... Don't be fooled by Narendra Modi's false promises. Does taking a dip in Ganga alleviate poverty?...… pic.twitter.com/lgCJW4HYtY— ANI (@ANI) January 27, 2025మరోవైపు.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ మాలవీయా స్పందిస్తూ.. కుంభమేళాపై ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆయనవి కాదు. ఆ మాటలు గాంధీ కుటుంబానికి చెందినవి. కాంగ్రెస్ హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తుంది?. మహా కుంభామేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రజల నమ్మకాలను కాంగ్రెస్ అవమానిస్తోంది. కాంగ్రెస్ నేతలు కావాలనే కుంభమేళాను అవమానిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. ఈరోజు కేంద్రహోం మంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులు మహా భమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి అమిత్ షా అర్చన చేసి గంగా హారతి ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో ఇది 15వ రోజు. ఇప్పటికే కుంభమేళాకు 13 కోట్లకుపైగా భక్తులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోడీ రాబోతున్నారు. దానికి ముందే ఇవాళ ప్రయాగ్‌రాజ్‌కు అమిత్ షా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, సహా 73 దేశాల దౌత్యవేత్తలు సైతం ఫిబ్రవరి 1న కుంభమేళాలకు వస్తున్నారు.बोल खड़गे जी रहे हैं, पर शब्द गांधी परिवार के हैं। आखिर कांग्रेस को हिंदुओं से इतनी नफरत क्यों है? 144 साल में एक बार महाकुंभ आता है, लेकिन कांग्रेस के नेता इस तरह बौखला गए हैं कि हिंदुओं को कोस रहे हैं। पहले कांग्रेस के हुसैन दलवी ने कुंभ को बुरा-भला कहा, और अब स्वयं कांग्रेस… pic.twitter.com/UAqLNMVLzZ— Amit Malviya (@amitmalviya) January 27, 2025 -
ఐఐటీ గ్రాడ్యుయేట్, టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం..కట్‌చేస్తే ఇవాళ..!
భౌతికంగా సాధించిన ప్రతి విజయం కొంతకాలం తర్వాత పెద్ద విజయాలుగా అనిపించవు కొందరికి. ఏదో అంతకుమించిన గొప్ప విజయం కోసం ఆరాటపడుతుంటారు. మనసుకు ఏదో తెలియని అశాంతి, వెలితి అనిపిస్తుంటుంది. అలా ఆధ్యాత్మికత వైపుకి ఆకర్ణితులై..అన్నింటిని పరిత్యజించే స్థాయికి చేరకుంటున్నారు ఎందరో ఉన్నత విద్యావంతులు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళ బాబాలుగా మారిన ఎందరో అపార మేధవులను పరిచయం చేసి ఇది మన భారతదేశ ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అని చాటుతోంది. ఎన్ని ఘనకార్యాలు చేసి గొప్ప విజయాల సాధించినా..ఆధ్యాత్మిక శక్తి ముందు దిగదుడుపే అని తేల్చి చెబుతోంది. అలానే భావించి అన్నింటిని పరిత్యజించి వేదాంత బోధనలు చేస్తున్నాడు ఈ ఐఐటీ గ్రాడ్యేయేట్. అతడిక కథ వింటే..అంతటి విలాసవంతమైన జీవితాన్ని అంత తృణప్రాయంగా ఎలా వదిలేయగలిగారని ఆశ్చర్యం కలగకమానదు..ఆ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ పేరు ఆచార్య జైశంకర్ నారాయణన్(IIT Graduate Shares How He Became A Monk). ఆయన 1992లో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తర్వాత కొంతకాలం టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఆయన 1993లో యూఎస్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న సమయంలోనే గురువు స్వామి దయానంద సరస్వతిని కలిశాడు. ఆయన వేదాంత బోధనలే ఆచార్య నారాయణన్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. అక్కడ తన గురూజీ చెప్పిన ప్రవనంతో వేదాంతంపై ఆసక్తి కలిగింది. దీంతో 1995లో అమెరికా నుంచి స్వదేశానికి రాగానే నేరుగా గురుకులంటో ఒక రెసిడెన్షియల్ కోర్సులో చేరాడు. అక్కడ వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. అలా అక్కడే గత 20 ఏళ్లుగా నారాయణన్ వేదాంతం, సంస్కృతాన్ని బోధిస్తున్నాడు. తాను ఐఐటీలో చేరినప్పుడు గొప్ప విజయం సాధించిన అనుభూతి కలిగింది. తనలాంటి వారెందరూ ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక ఎందుకనో ఇదేమంత గొప్ప విజయం కాదనే ఫీలింగ్ వచ్చింది. అన్ని విజయాలు ప్రస్తుతానికి మాత్రమే అనిపిస్తాయి. కానీ చివరికి అవన్నీ సాధారణమవుతాయి. తదుపరి లక్ష్యం కోసం ఏంటన్నప్పుడే తనకిదేదో మంచి ఆత్మానందాన్ని ఇవ్వగలదని అనిపించింది. అలా తాను అన్నింటిని త్యజించి సన్యాసిలా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ మహా కుంభమేళ(Maha Kumbh 2025) ఎందరో గొప్ప గొప్ప మేధావులైన సాధువులను(Monk) వెలుగులోకి తెచ్చింది. పైగా ఇది ఆచారం కాదు, మహాగొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం అని చెప్పకనే చెప్పింది. (చదవండి: -
కుంభమేళాలో అమిత్ షా పుణ్యస్నానం
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరగుతోంది. ఈరోజు (సోమవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇప్పటివరకూ 13.21 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని గణాంకాలు చెబుతున్నాయి. #WATCH | Union Home Minister Amit Shah arrives in Prayagraj. Uttar Pradesh CM Yogi Adityanath, along with his cabinet ministers, receives him at the airport. The HM will take a holy dip at #MahaKumbh2025 today. pic.twitter.com/pU6Xk9wByc— ANI (@ANI) January 27, 2025తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరైల్ ఘాట్‌కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గ మంత్రులు అమిత్‌షాకు ఘన స్వాగతం పలికారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..#WATCH | #MahaKumbh2025 | Union Home Minister Amit Shah arrives at Selfie Point Arail Ghat in Uttar Pradesh. He will take a holy dip at #MahaKumbh2025 in Prayagraj shortly.CM Yogi Adityanath, Deputy CMs KP Maurya and Brajesh Pathak, and others are with him. pic.twitter.com/cSiFJNvTMY— ANI (@ANI) January 27, 2025 -
మహా కుంభమేళా ఎఫెక్ట్.. పెరిగిన ఛార్జీలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025(Maha Kumbh 2025) ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా విమాన సంస్థలు ఛార్జీలను గణనీయంగా పెంచేశాయి. ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడానికి రౌండ్ ట్రిప్ టిక్కెట్లు(roundtrip tickets) రూ.50,000 వరకు చేరుకున్నాయి. డిమాండ్ పెరుగుదలకు అనుగుణంగా టికెట్ ధరలను నియంత్రించాలని, ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను పెంచాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలను ఆదేశించింది.ముందున్న శుభదినాలు..జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి, ఫిబ్రవరి 12న మాఘీ పూర్ణిమ, 26న మహా శివరాత్రి వంటి పుణ్యస్నానాల కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని చాలామంది భావిస్తున్నారు. ఇదే అదనుగా విమాన సంస్థలు భారీగా ఛార్జీలు పెంచుతున్నాయి. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడానికి రౌండ్ ట్రిప్ టికెట్ల ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. నగరాన్నిబట్టి సాధారణ టికెట్లు రూ.50,000 వరకు చేరుకున్నాయి.డీజీసీఏ స్పందన..పెరుగుతున్న ఛార్జీలకు ప్రతిస్పందనగా డీజీసీఏ 2025 జనవరి 23న విమానయాన ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఛార్జీల హేతుబద్ధీకరణ, విమానాల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు ప్రయాణించేందుకు డీజీసీఏ జనవరిలో 81 అదనపు విమానాలను ఆమోదించింది. దీనితో దేశవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్‌కు మొత్తం విమానాల సంఖ్య 132కు చేరుకుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే లక్ష్యంగా ఈ చర్యకు పూనుకుంది.ఇదీ చదవండి: స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు ప్రారంభంప్రయాణికులపై ప్రభావం..దేశవిదేశాల నుంచి యాత్రికులను ఆకర్షించే మహా కుంభమేళా ఉత్సవానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. అధిక రద్దీ కారణంగా విమాన ఛార్జీలు పెరిగాయి. స్థానికంగా వసతికి కూడా డిమాండ్ అధికమవుతుంది. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం మొదటిసారి రాత్రి సమయాల్లోనూ అంతర్జాతీయ విమానాలు నడుపుతూ రికార్డు స్థాయిలో ప్రయాణీకుల రద్దీని నిర్వహిస్తోంది. -
కుంభమేళా నుంచి వస్తుండగా ప్రమాదం.. కుటుంబమంతా దుర్మరణం
ఫతేహాబాద్: యూపీలోని ఆగ్రా పరిధిలో గల ఫతేహాబాద్‌లోని లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.కుంభమేళాకు వెళ్లి, పుణ్యస్నానాలు ఆచరించి, తిరిగి వస్తున్న ఒక కుటుంబం రోడ్డు ప్రమాదం బారినపడింది. ఈ కుటుంబ యజమాని హైకోర్టు న్యాయవాది అని తెలుస్తోంది. తొలుత వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి, మరో లేన్‌లోకి వెళ్లింది. తరువాత ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా అక్కడికక్కడే మృతిచెందారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు, కుమార్తె మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. వారిని గుర్తించిన అనంతరం మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం తరలించారు.ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసి ఓం ప్రకాష్ ఆర్య ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుంటారు. తన హ్యుందాయ్ కారులో తన కుటుంబంతో కలిసి ప్రయాగ్‌రాజ్ కుంభ స్నానం చేసేందుకు వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక భార్య పూర్ణిమ సింగ్ (34), కుమార్తె అహానా (12), కుమారుడు వినాయక్ (4)లతో పాటు తిరిగి కారులో ఢిల్లీకి బయలుదేరారు. ఈ వారు ప్రయాణిస్తున్న కారు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ముందుగా డివైడర్‌ను ఢీకొని ప్రమాదం బారినపడింది.ఈ ప్రమాదంలో ఓం ప్రకాష్‌తో పాటు అతని కుటుంబమంతా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. సమాచారం అందిన వెంటనే ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎస్ఎన్ హాస్పిటల్ అత్యవసర విభాగానికి తరలించారు. దెబ్బతిన్న వాహనాన్ని క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై కొద్దిసేపు ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..